నాయకత్వము

నాయకత్వము

1విలియమ్స్ సోదరుడా, వందనములు. సోదరుడు స్లుగ్ మరియు ఆయన భార్య, ఈ రాత్రి ఈ విందుకు విచ్చేసిన ప్రతినిధులందరకు అభివందనములు. ఇక్కడుండుట నిశ్చయముగా గొప్ప భాగ్యము. ఈ విధముగా కూడుకొననుద్దేశించిక పూర్వమే నేనీ ఘడియ కొరకు ఎదురు చూచాను.

మరియు నేను ఆమెకు వందనములు చెప్పగోరుచున్నాను. ఆమె పేరును నేను జ్ఞాపకము చేసికొనలేను. క్రిస్మస్ కాండీ యొక్క పెట్టెను వారు యిచ్చారని బిల్లీ ఇప్పుడే నాకు చెప్పాడు. కొద్ది క్షణాల క్రితమే దానిని కారు నొద్దకు తెచ్చిరి. ఆ సోదరి, ఆమె పేరును నేను గుర్తుచేసుకోలేకపోవుచున్నాను. ఆమె ఇక్కడే కాలిఫోర్నియా నుండి వచ్చినది. అదే నా తొలి క్రిస్మస్ బహుమతి. కాబట్టి నేను దానికై వందనములు తెలుపుచున్నాను.

ఇప్పుడు, ఈ రాత్రి టుసాన్లో తొమ్మిది గంటల పది నిమిషాలు కావస్తున్నది, కాని ఇక్కడిప్పుడు ఎనిమిది గంటల పది నిమిషాలవుతోంది. కాబట్టి మనము… జనుల మధ్య నాకో విధమగు అనుభూతి కలుగును, నేనొక విధంగా దీర్ఘ ప్రసంగీకునిగా ఉన్నాను. కాబట్టి నేను ఈలాగు ఆశించుచున్నాను… [జనసమూహము అభినందించుచున్నారు.] వందనములు. అటువంటి … కొందరు చక్కని వ్యక్తులిచ్చటున్నారు… వందనములు చెల్లించుచున్నాను.

2కాని నేను దరిదాపుగా ఇప్పటికే ఈ రాత్రి కొద్దిగా ప్రసంగించాను. చాలా దూరం నుండి నేను వస్తున్నాను - అంటే ష్రీవ్-పోర్టు నుండి కరుకు మార్గం గుండా (ఇటు వైపు వచ్చాను) రాత్రి ఎంబండి రాత్రి దూరం నుండి వచ్చుచున్నాను. మీరు కొద్దిగా - చిన్నగా వణుకుచుందురు. ఈ చలి వీటి వలన గొంతు బొంగురు పోవునని మీరెరుగుదురు. నేను ష్రీవ్-పోర్టులో బయలుదేరాను. నా జుట్టును కొద్ది సంవత్సరాల క్రితమే పోగొట్టుకొన్నాను. చలినుండి కాపాడుకొనుటకు ఉత్తర ప్రాతంలో బోధించేటప్పుడు ధరించే ఒక చిన్న విగ్గు లాంటిది యున్నది. నేను ష్రీవ్-పోర్టు వెళ్ళి అది మరచిపోగా నిజంగా నాకు జలుబు చేసినది. ఆ గాలీ ఆలాగు వీచుచూ యుండుట మీకు నిజంగా తెలియదు. హఠాత్తుగా అది సంభవించినది, చర్మము ఇంకా మెత్తగానే యున్నది, కొంత చెమటగానే ఉండినది అయితే అది నిజంగా నా గొంతులోనికి పోయినది. చాలా కూటములు మానుకోవలసివచ్చెను. కాబట్టి ఈ రాత్రి కొద్దిగా బొంగురు గొంతుతో యున్నాను.

3కూటముల పిదప కొండ దాటి వస్తున్నప్పుడు మాకు అద్భుతనుగు సమయం దొరికినదని మేము చెప్పగోరుచున్నాము. మరో అధ్యాయం వద్ద సోదరులతో … గత రాత్రి అద్బుతమగు సమయం మాకు దొరికినది ఆలాగే బయట గొప్ప జనము ఆశ్చర్యమగు హాజరు, భక్తి మర్యాదలతో జనులు కూడుకొనిరి. పుల్-గాస్పీల్ బిజినెస్-మెన్ లో భాగముగా నుండుట నాకు మంచి అనుభూతిని కలుగ జేసినది.

నా వద్ద ఒక వర్తమానమున్నది. దేవుని నుండి వచ్చినదిగా భావించుచున్నాను. అది కొందరికి విడ్డూరంగా కనబడవచ్చును. నేనేమై యున్నానో ఆలాగే కనబడుదును. ఆ విధముగా లేనిచో నేను సహాయము చేయలేను… భిన్నంగా ఉండాలని నా భావము కాదు; మార్పు జరుగుచున్నకాలంలో నేను జీవించుచున్నాను …

4మీరు గోడను తిన్నగా కట్టుచున్నంత సేపు ఏమీ ఇబ్బంది లేదు — ఇటుక వరుసలు క్రింద వరుసననునసరించే పోవును, కాని నీవు మూలకు త్రిప్పేటప్పుడు … అదే సమయము … మనం ఒక గోడను నిర్మించుట లేదు; ఒక గృహాన్ని కట్టుచున్నాము. ఈ మలుపులు రావలసి యున్నవని గమనించండి. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, మరియు పెంతికోస్తు కాలంలో అవి వచ్చినవి; ఇప్పుడు మరల అది వచ్చినది. కాబట్టి మనము … మూలలను త్రిప్పుట చాలా కష్టము. కాని … నేను దేవునికి ఎంతో కృతజ్ఞుడను. అదెంత కఠినముగా నున్నప్పటికిని నూటికి నూరు పాళ్ళు జనులు స్పందించి యున్నారు. కాబట్టి మనమెంతో కృతజ్ఞలము, మీ ఒక్కొక్కరికి వందనములు.

ఇప్పుడు గ్రంథమును తెరచుటకు ముందుగా, మీకిష్టమైతే ఒక్క క్షణము మన తలలు వంచి గ్రంథకర్తతో మాట్లాడుదము.

HEB 8:12•

HEB 10:17

 

5ప్రియదేవా, నీ కుమారుడును, మా రక్షకుడునైన యేసుక్రీస్తును ఎరిగియుండుట మహా భాగ్యమని మేము కృతజ్ఞత చెల్లించుచున్నాము. మా పాపములకు ఉచిత క్షమాపణ, మా సమస్త దోషములు మరియు పాపములు కప్పివేయుటకు ఆయన రక్తము చాలునని ఎరిగియున్నాము. అవి పూర్తిగా తుడిచి వేయబడి దేవుని యొక్క మరపు సముద్రములో పడవేయబడియున్నవి. ఆయన వధువు పవిత్రమైనది గాను, కల్తీ లేనిదిగాను పెండ్లి విందునొద్ద దేవుని కుమారుని వివాహము చేసికొనుటకు నిలబడును. అన్నింటికీ సరిపోయిన నీకు ఏలాగు వందనములు చెల్లింతుము. మా ప్రతిభలందు మేము నమ్మికయుంచక, ఆయన ప్రతిభనందు మాత్రమే. ఆయన మా కొరకేమి చేసెనో దానియందే విశ్వాసముంచుచున్నామని తెలిసికొనియున్నాము. మేమెంతో కృతజ్ఞులము.

దేవుని కొరకు ఆకలిదప్పులు గలిగియున్న ఆ దేశ విదేశాలలో సోదరులకు కలిగిన జయమును బట్టి నీకు వందనములు. ప్రభువా, వారు మరల తిరిగి వెళ్ళినచో వారి ద్వారా నీ రాజ్యములోనికి వచ్చు ఈ పిల్లలు, వారు తీసికొని వచ్చు పిల్లలకు పితరులుగా నుందురు గాక. తండ్రీ, దీని అనుగ్రహించుము.

ఈ రాత్రి మా అందరిని దీవించుము, మాకు అవసరమగునవి పరిశుద్ధాత్మ మాకిచ్చును గాక! మేము చెప్పకూడని వాటికి మా నోళ్ళు మూసికొని, నీవు చెప్పనైయున్న వాటిని పొందుటకు మా హృదయములు తెరచుదుము గాక! తండ్రీ, దానిననుగ్రహించుము. యేసు నామములో మేము ప్రార్ధించుచున్నాము. ఆమేన్.

6ఈ రాత్రి కొద్దిసేపు నేను మాట్లాడగోరు ఒక చిన్న అంశము కొరకు పరిశుద్ధ గ్రంథమును తెరచుదము. అది మార్కు 10వ అధ్యాయములో ఉండును.

కొద్ది సంవత్సరాల క్రితం నేను ఏమీ వ్రాసికోకుండానే జ్ఞాపకముంచుకొని మాట్లాడెడి వాడిని. బైబిలులో నుండి చదువుటకు కండ్లజోడు నాకు అవసరమయ్యేది కాదు. కాని ఇప్పటికి నేను రెండు ఇరవై ఐదులు దాటిపోయాను కనుక మామూలుగా నేను చేయకలిగిన రీతిగా ఇప్పుడు చేయుట ఒక విధంగా కష్టము, అరిగిపోయిన కారువలె నుండును. కాని ఇంకా నేను పరుగిడుచున్నాను. వుహ్-హ్, ఇనుప ముక్కల గుట్టలోనికి వెళ్ళి తిరిగి పోతపోయబడే వరకు పరుగును తుదముట్టించ గోరుచున్నాను. అదే వాగ్దానము.

పరి. లూకా 10వ అధ్యాయ ప్రారంభమునుండి … 21 వచనమని చెప్పాననుకొంటాను. ఇక్కడే ఒకచోట దాని కనుగొనెదను. నేను పొరపాటు చెప్పాను, ఉది. పరి. మార్కు, క్షమించండి.

MARK 10:17-22

 

7పరిశుద్ధ మార్కు 10వ అధ్యాయము 21 వచనారంభము నుండి నేను చదువగోరెదను. లేక 17వ వచనము నుండి చూద్దాం.

"ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొని వచ్చి ఆయన యెదుట మోకాళ్ళూని - సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను.

యేసు - నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు.

నరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలింప వద్దు, అబద్ద సాక్ష్యము పలుకవ వద్దు, మోసపుచ్చ వద్దు, నీ తల్లి తండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో

చెప్పెను.

అందుకతడు - బోధకుడిగా బాల్యము నుండి ఇవన్నియూ అనుసరించుచునే యుంటినని చెప్పెను.

యేసు అతని చూచి, అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా నున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నియూ అమ్మి, బీదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను.

అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను."

చదువబడిన ఆయన వాక్యమును ప్రభువు దీవించును గాక!

ఒక అంశము పై ఈ రాత్రి మనము మాట్లాడుకోనై యున్నాము. "నన్ను వెంబడించు," అను సందర్బము: నా అంశము "నాయకత్వము."

8అది వింతగా నున్నది, కాని నేననుకొన్నాను, నేటి ప్రార్ధనలో… నేను చాలా దీర్ఘముగా ఉంటున్నాను. నా కియ్యబడిన వర్తమానము మీదనే ప్రతి రాత్రి నేను ప్రభువు చెప్పిన రీతిగా మాట్లాడుచున్నాను. ఈ కొత్త అధ్యాయములో ఒక భిన్న భావముతో ఈ రాత్రి సమీపించవలెనని నేను తలంచాను. చాలాసార్లు దీనిపై మనము మాట్లాడుకొన్నాము. దీనిని "ధనికుడగు యవ్వన అధికారి," అని పిలిచాము. ఇక్కడుండిన చాలామంది సేవకులు, నా సోదరులు నిస్సందేహముగా విభిన్న రీతులలో దీనిని విశదీకరించారు. ఈ రాత్రి ముందెన్నడూ లేని ప్రత్యేకమైన రీతిలో ఈ నాయకత్వము, అను అంశమును సమీపించుటకు ప్రయత్నించనైయున్నాను.

9దీనిని గుర్తుంచుకొనవలెను, మనలో ప్రతిఒక్కరము యవ్వనము లేదా ముసలితనములో నున్ననూ, జీవితములో మనము వేసిన మొదటి అడుగు ఎవరో నడిపించినదే. అది నిజము. నీవు వేసే చివరి అడుగును కూడా ఎవరో వేయించు చుందురు. ఎవరో ఒకరు నడపవలసియున్నారు.

దేవుడు మనలను గొర్రెలనుగా పోల్చెను. గొర్రెల పెంపకము నెరిగిన వారెవరైనాగాని గొర్రెల యొక్క స్వభావము నెరుగుదురు. గొర్రె తప్పిపోయినచో దారి కనుగొనలేదు, ఎవరో మార్గము చూపించాలి. వధించే స్థలాల్లో కూడా ఒక మేక ద్వారా కోసే స్థలానికి గొర్రెను నడిపించవలయును. మేక పైకి నడిపించి వధించే చోటు చివరకు రాగానే ఆ మేక దూకిపోవును, గొర్రె వధకు వెళ్ళిపోవును. ఒక గొర్రె తన త్రోవను కనుగోలేదని మనము తెలిసికోగలము.

10ఒకసారి నాకు జరిగిన అనుభవము గుర్తున్నది. అప్పుడు నేను ఇండియానాలో రాష్ట్ర గేమ్-వార్డెన్ గా ఉన్నాను. నేను బయట పొలంలో ఉన్నాను. నేను ఏదో అతి దీనముగా కేక వేయుట విన్నాను. అది తల్లిని పోగొట్టుకొన్న ఒక చిన్న గొర్రెపిల్ల. తల్లియొద్దకు మార్గాన్ని ఇది తెలిసికొనలేకపోవుచున్నది, ఆ చిన్న గొర్రెపిల్ల యొక్క మార్గాన్ని తల్లి తెలిసికోలేకపోయినది. నేనా చిన్న పిల్లను ఎత్తుకొన్నాను. అది నాకు మెల్లగా హత్తుకు పోయినది. నా చేతుల్లో చిన్న గొర్రెను పట్టుకొని ఆ వైపు వెళ్ళాను. ఆ కేకలను నేను విన్నాను… అది తన చిన్న తలను హాయిగా నాకు ఆనించి, నేను దానికి సహాయము చేయుదునని తెలిసినట్లుగా ప్రవర్తించినది.

నేనిట్లు తలంచాను. "ఓ నాకై చీల్చబడిన యుగముల బండా, ప్రభువైన యేసు హస్తాల్లో నన్ను ఎత్తుకొనుము, నా ప్రియులతో నేను నా గృహానికి వెళ్ళుచున్నానని తెలిసిన సంతృప్తితో ఉన్నాను." మరలా నేనిట్లు అనుకొన్నాను, ''నా జీవిత యాత్ర అంతములో ఆ విధంగానే ప్రభువా, నీ హస్తాల్లోకి తెమ్ము; అప్పుడు నేను నదిని దాటుటకు కొనిపోబడుదునని ఎరుగుదును. అక్కడ ఆవలి దరిని ఏ విధమైన దుఃఖము మరియు వ్యాధి, మొదలగునవి ఏవీ ఉండవు. నేను ప్రేమించిన నా ప్రియులతో నేనుందును."

11మీరు ప్రకృతిని అధ్యయనం చేసినచో, సృష్టిలో గొప్ప సంగతి తెలియును. నేను చూచే ప్రతిది దేవుడు చేసినదే. ఆయన ప్రకృతికి కర్త. ప్రకృతి ఎడతెగక కొనసాగుతున్నది. ప్రకృతి అంతయూ ఆలాగే కొనసాగుచున్నది. ప్రతిది గమనించండి… గత సాయంకాలమనుకొంటాను నేను ఈలాగు చెప్పాను కదా, ప్రకృతి దేవుని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది." మీకు బైబిలు ఎన్నడూ లేకపోయినా గాని, ప్రకృతిని పరిశీలించి ఈ బైబిలు సత్యమని తెలిసికోగలరు.

ప్రపంచమును చాలాసార్లు చుట్టివచ్చే భాగ్యము నాకు కలిగినది. వివిధ దశలు నేను అధ్యయనం చేశాను. విభిన్న మతములు చూచాను — మహమ్మదీయులను చూచాను, ఖురాను చదివాను, షియాలు, జైనులు, మహమ్మదీయులు, బౌద్ధులు మరెందరినో చూచాను. కాని ఇంకనూ వారిలో ప్రతి ఒక్కరికి ఒక వేదాంతము మరియు ఒక విశ్వాస గ్రంథము, ధర్మశాస్త్రము మొదలగునవి ఉన్నవి. కాని మన బైబిలు సత్యము, మన దేవుడొక్కడే సత్యవంతుడు. ఎందుకనగా వారిలో ప్రతివారు ఎక్కడో ఒక చోట ఒక సమాధిని చూపించి అక్కడ తమ నాయకుడు ఇంకా సమాధిలో పడియున్నాడని చెప్పుచున్నారు. కాని క్రైస్తవ్యము ఒక తెరువబడిన సమాధిని చూపించుచున్నది, దానిలో ఉంచబడినవాని సజీవ సన్నిధిలో జీవించగలుగుచున్నది. ఆయన సజీవుడు! ఉండెను అన్న దేవుడు కాదు గాని, ఉన్నావాడను అను దేవుడు. నేను "ఉంటిని" లేదా "ఉందును" కాదు గాని, "నేను ఉన్నావాడను," అను దేవుడు.

12ప్రకృతి మొత్తము ఎడతెగక కొనసాగుతున్నది. సంఘ కాలముల గూర్చి మాట్లాడుచూ నేను చెప్పిన రీతిగానే, (ఆ పుస్తకములు బయటకు ఇప్పుడు వచ్చుచున్నవి. సంఘ కాలములను గూర్చిన నా వ్రాతలు) సంఘము ఎట్లున్నదో, ఎట్లు పరిపక్వతకు వచ్చుచున్నదో, చూచాము. సమస్త ప్రకృతి వలెనే ఖచ్చితంగా పైకి వచ్చుచున్నది.

ఒక రోజున మనము ఉదయాన సూర్యుడెట్లు ఉదయించునో మాట్లాడుకొన్నాము. ఉదయాన అది చిన్నపిల్లవలే బలహీనంగా, ఎక్కువ బలమేమీ లేకుండానే యుండును. దినము ముందుకు పోతున్నకొలది అది బలాభివృద్ధిని పొందును. ఒక యవ్వన బాలిక, బాలునివలె ఎనిమిది గంటలకు అది బడిలో ప్రవేశించును. తరువాత పదకొండు గంటలకు అది బడినుండి బయటకు వచ్చి - తన సేవలందించుటకు సిద్ధమగును. సుమారు మూడు గంటల వరకు అది మార్పు నొందుచూ, నడి-వయస్సు నుండి వృద్ధాప్యము లోనికి వచ్చును. మధ్యాహ్నము అది మరణించును. అది సూర్యునికి అంతమా? కాదు. జీవము, మరణము, సమాధి, పునరుత్థానము అనునవి అక్కడ ఉన్నవని సాక్ష్యమిచ్చుటకు మరుసటి ఉదయాన అది తిరిగి వచ్చును, చూచారా.

13చెట్లు ఎలాగు కదలుచున్నవో, అవేమి చేయునో గమనించుదము. కొంత కాలము క్రితం నేను కెంటకీలో ఉన్నాను. నాకు ఉడుతల వేట ఇష్టము. నేను నా స్నేహితునితో కలిసి సంవత్సరపు చివరలో అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలా ఎండిపోయి ఉన్నది.

బూడిద రంగు ఉడుతను ఎప్పుడైనా వేటాడిన వారికెవరికైనా వాటిని పట్టుకొనుట ఎంత కష్టమో తెలియును. ఆకుల ధ్వనిలో అది జారిపోవును. అవెట్లు పారిపోయి తప్పించుకొనునో హుడిని అనే ఒక వినోద కళాకారుడు చక్కగా వీటిని చిత్రించును! ఏబది గజాలలో కంటి చూపుతో తుపాకీ పేల్చుటకు ప్రయత్నించుట సామాన్యము కాదు. ఒక దినములో నీ హద్దును పొందాలంటే మంచి వేట నైపుణ్యము కావలెను.

14యెహోవా సాక్షి గుంపు నుండి మార్పునొందిన నా స్నేహితుడగు ఉడ్ నాతో ఉండెను. అతడిట్లు చెప్పెను, "ఇవి చాలా ఉన్న పొలముగల ఒకాయనను నేనెరుగుదును, అక్కడ మేము వాటిని హోలర్స్ (hollers) అని పిలుచుదుము.

హోలర్ అంటే ఎంతమందికి తెలియును? మంచిది, నీవు కెంటకీలో ఏ భాగము నుండి వచ్చావు? ఏమైనప్పటికిని? చూచారా? నేను అక్కడ నుండే వచ్చాను.

కొద్దికాలము క్రిందట ఇక్కడ మన అధ్యాయములలోని ఒకదానివలెనే ఉన్నది … (దీనిగూర్చి, సహో. విలియమ్స్ తదితరులకు చెప్పెదను.) వారు ఇట్లనిరి, "ఇప్పుడు మనము లేచి జాతీయ గీతము పాడుదము."

"నా పాత కెంటకీ గృహానికి" అని నేను అన్నాను. కాబట్టి ఎవరూ నన్ను అనుసరించలేరు…. నాకు తెలిసిన జాతీయ గీతము అదొక్కటే. మేము అప్పుడు ఎలా ఉన్నామో, ఇప్పుడు ఆలాగే ఉన్నాము…

15[బ్రెన్హాం సోదరుని చేతికి ఒక విజ్ఞప్తి ఇవ్వబడినది.] "ఇప్పుడు ఇక్కడ ముక్కు నుండి రక్తము కారుచున్న ఒకామెకు ప్రార్ధన చేయమని కోరుచున్నారు.'' మంచిది, అయ్యా. మనము ప్రార్ధించుదము.

ప్రియ దేవా, నిన్ను అడుగుచున్నాను, ప్రభువా, నీవే గొప్ప వైద్యుడవు. నీ కృప, కరుణ ఈ ప్రియ సోదరిని ఇప్పుడే తాకి ఆ స్రావమును ఆపవలెనని నిన్ను అడుగుచున్నాను. మేము విశ్వాసులముగా ఇక్కడ కూడికొనియున్నాము. ప్రభుని వాక్యమును, ప్రజల సహవాసమును అనుభవించుటకు ఆమె ఇచ్చటకు వచ్చియున్నది. ఇప్పుడే శత్రువును గద్దించి రక్తమును ఆపమని ప్రభువా, నిన్ను అడుగుచున్నాను. యేసుక్రీస్తు నామమున. ఆమేన్. (మేము దానిని నమ్ముచున్నాము. మేము దానిని నమ్ముచున్నాము.)

16నేనిక్కడ వ్రాసియుంచిన కొన్ని సంగతులు, కొన్ని లేఖనములు వివరించుటకు ముందుగా ఒక విధమగు భావన పొందుటకు చిన్న కథతో ముందుకు వెళ్ళుదము.

ఇప్పుడాయన ఇట్లు చెప్పెను, "సరే, వెళ్ళి ఈ ముసలాయనను చూద్దాం. అతని స్థలంలో చాలా ఉడతలున్నవి, కాని అతడు నాస్తికుడు. అక్కడికి వెళ్ళితే మనలను దాదాపుగా శపించును."

"కాని రెండు వారాల నుండి ఇక్కడున్నా ఉడుతలేమీ దొరుకుట లేదు. మురికిగా ఉన్నాము. గడ్డం పెరిగిపోయింది," అని అన్నాను.

"సరే, అక్కడికి వెళ్ళుదం," అని అతడు అన్నాడు.

17దాదాపు ఇరవై మైళ్ళు మేము క్రిందికి వెళ్ళాము. ఇంతకు ముందు ఒకసారి నేను ఆ ప్రాంతంలో మూడు రాత్రులు ఒక మెథడిస్టు నివాస మైదానంలో ఉన్నాను. అక్కడ ప్రభువు చేసిన కొన్ని గొప్ప కార్యములున్నవి. మెథడిస్టు వారిమధ్య గొప్ప స్వస్థతా కూటములు జరిగినవి. అప్పుడు మేము వెనక్కి కొన్ని కొండలు, మిట్టలు, గుట్టలు దాటి వెళ్ళాము. నీవు ఎటువంటి చోటుకు వెళ్ళాలో నిర్ణయించుకొనుటకు కెంటకీ నీకు తెలిసియుండాలి. మేము ఆ వెనక్కి వెళ్ళుచుండగా, ఒక ఇంటి యొద్దకు వచ్చాము. అక్కడ ఒక ముసలి వ్యక్తి కూర్చొనియుండెను. ఇద్దరు ముసలివారు తమ పాత టోపీలు ముఖములపై నుండి క్రిందికి జార్చి కూర్చొని యున్నారు. "అదిగో, ఆ కరకు మనిషి, అతడు బోధకుని మాటను అసహ్యించుకొనును," అని నా స్నేహితుడు చెప్పెను.

''సరే, నేను ఆ కారులో కూర్చొనియుండుట మంచిది, లేనిచో అసలు వేటాడలేము, మనము వేటాడ వచ్చునేమో నీవు వెళ్ళి అడిగిరా," అని నేను అన్నాను.

కాబట్టి ఆయన లేచి వెళ్ళి, వారితో మాట్లాడసాగెను. కెంటకీలో ఎప్పుడూ "లోనికి రా," లేదా అటువంటి పదాలే వాడుచుందురు. అలాగే అతడచ్చటికి, వెళ్ళి, "మీ స్థలంలో కొద్దిసేపు మేము వేటాడుకోవచ్చునా?" అనడిగాడు.

18సుమారు డెబ్బది-ఐదేళ్ళ వృద్ధాప్యంలోనున్న ఆ ముసలాయన నోటినుండి పొగాకు కార్చుకొంటూ, ఊస్తూ, "నీ పేరేమి?" అనడిగాడు.

"నా పేరు ఉడ్," అన్నాడు.

"ఇక్కడ జీవిస్తుండే జిమ్ అనే ముసలాయనకు బంధువువా?" అనడిగాడు.

"అవును, నేను జిమ్ కుమారుడ్ని. నేను బాంక్స్ ని," అని చెప్పాడు.

"మంచిది, ఆ ముసలాయన జిమ్ యధార్థపరుడు. తప్పకుండా వేటాడుకో. నీవొక్కడివేనా?'' అనడిగాడు.

"కాదు, మా సంఘ కాపరి అక్కడున్నారు,'' అని చెప్పెను.

"ఏమిటి?" అనడిగాడు.

"మా పాస్టరుగారు కారులో కూర్చొనియున్నారు. ఆయన నాతో పాటు వేటకు వచ్చారు," అని చెప్పాడు.

"వుడ్, నీవు వెళ్ళిన చోటకల్లా ఒక బోధకుడ్ని కలుపుకొనేటంతగా దిగజారి పోయావు, నీకు అర్ధమగుట లేదా?'' అనడిగాడు.

19అతడు అలాంటి కరుకైన ముసలి వ్యక్తి కనుక నేను కారులో నుండి బయటకు వెళ్ళిపోదామనుకొన్నాను. కాబట్టి నేను బయటకు వచ్చి అటుగా వెళ్ళాను. నన్ను చూచి, "మంచిది, నీవొక బోధకుడివా? హూ?" అని అడిగాడు.

"అవునండీ" అన్నాను. నన్ను క్రిందికి పైకి చూచాడు, (ఉడుతల రక్తము, మురికీతో ఉన్నాను) నేను …. "అలాగు కనిపించుట లేదు కదా,'' అని అన్నాను.

"సరే, నాకు ఒక విధముగా నచ్చినది," అన్నాడు. ''నీకు ఒక్క మాట చెప్పవలెను, నన్ను ఒక నాస్తికుడిగా భావిస్తారు," అని చెప్పెను.

"అవునండీ, అది నాకు అర్ధమైనది. అయినా గాని దానిగూర్చి అంత గొప్పగా చెప్పుకోనవసరం లేదనుకొంటాను కదా?'' అని అన్నాను.

"మంచిది. నాకు తెలియదు, మీలాంటి వారిని గూర్చి నేనేమనుకొంటున్నానో చెప్తాను," అని పలికాడు.

నేను "సరే," అన్నాను.

''నీవు కాని చెట్టు మీద మొరుగుతున్నావు," అని చెప్పాడు. దాని భావము ఎందరికి తెలియును? చూచారా? పరుండిన కుక్క అని దాని అర్ధము, చూచారా; అయితే అది అక్కడ లేనేలేదు, చూచారా? "మీరు కాని చెట్టు మీద మొరుగుతున్నారు" అని చెప్పాడు.

"అది మీ అభిప్రాయము," అని నేనన్నాను.

"మంచిది, చూడు, అక్కడున్న ఆ పాత పొగగొట్టము కనబడుచున్నదా?" అనడిగాడు.

"అవును," అని అన్నాను.

డెబ్బది-ఐదేళ్ళ క్రితం నేను అక్కడ పుట్టాను. ఈ సంవత్సరములన్నీ ఈ కొండల్లో ఇక్కడే నేను జీవించాను. ఆకాశముల వైపు చూచాను ఇటు అటు చూచాను. నిశ్చయంగా, ఈ డెబ్బది-ఐదేండ్లలోను దేవునివలె కనిపించిన దానిని నేను చూచియుండవలసింది, నీవాలాగు అనుకోవటము లేదా?" అనడిగాడు.

"సరే, దేనికొరకు మీరు చూస్తున్నారో, మీరు చూచే పద్దతి బట్టి అది ఆధారపడియుండును," అనడిగాను.

20''మంచిది, కాని నేను నిశ్చయంగా అట్టి జీవి ఉన్నదని నమ్మను. మీరు ఊరకనే, తేలికగా ప్రజలను మభ్యపరచి వారి డబ్బు సమస్తం తీసికొందురు. అది ఆ విధముగా జరుగుతుంది," అని అన్నాడు.

"మంచిది, మీరు ఒక అమెరికా పౌరునిగా ఉన్నారు, కాబట్టి మీ స్వంత ఆలోచనకు హక్కున్నది," అని అన్నాను.

"ఒక సమయంలో ఒక వ్యక్తిని గూర్చి విన్నాను. కాని నిశ్చయంగా, ఎప్పుడైనా అతనితో మాట్లాడే వీలు కుదిరినచో కొన్ని ప్రశ్నలడుగగోరుదును," అని చెప్పెను.

నేను, "సరేనండి," అని చెప్పాను.

"అతడొక బోధకుడు; నీవు ఎరిగియుండవచ్చు." కొద్దికాలం క్రితం ఆ ఆవరణలోని చర్చిలో ఈ కాంప్-బెల్స్-విల్లో కూటములేర్పాటు చేశారు. అతని పేరు మరచిపోయాను. ఇండియానా నుండి వచ్చాడు," అని చెప్పెను.

నేనన్నాను, "ఓ? అవునయ్యా."

సహో. ఉడ్ చెప్పనారంభించెను. "అయితే నేను…"

("దానిని చెప్పవద్దు.") అతడీలాగు పలికెను, "ఆయన గూర్చి ఏమి చెప్పబోతున్నారు?" అనడిగాను.

21ఇట్లు చెప్పసాగాడు, " [ఎవరో] ఒక వృద్ద స్త్రీ ఆ కొండపై నున్నది, ఆమె కాన్సరుతో చనిపోతున్నది. ఆమె పడక మార్చుటకు నేను నా భార్య ఒక ఉదయాన వెళ్ళాము. పడక క్రిందనున్న పాత్రయొద్దకు కూడా ఆమెను లేపి తెచ్చుటకు వీలుపడుట లేదు. పడక వస్త్రము మాత్రమే మార్చుచున్నారు. ఆమె చనిపోతున్నది. ఆమె లూయిస్విల్ వెళ్ళినది. కాని వైద్యులు ఆశ వదలి ఆమె చనిపోవునని చెప్పారు.

ఆమె సోదరి ఆ కూటమునకు వెళ్ళినది. ఆ బోధకుడు వేదిక మీద నిలబడి, జనసమూహములోనికి చూచి ఈ స్త్రీని పేరు పెట్టి పిలిచెను. ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఒక చేతి రుమాలును తీసికొని తన పర్సులో పెట్టుకొనినదట. ఇరవై మైళ్ళు క్రింది భాగాన గల ఆ స్త్రీ పేరును ఆయన చెప్పెను, ఆమె కాన్సరుతో బాధపడుచున్నదనియు, ఆమె పరిస్థితి యావత్తు, పేరు చెప్పి, "ఆ చేతి రుమాలును తీసికొని వెళ్ళి, ఆ స్త్రీ పై ఉంచుము, ఆ స్త్రీ కాన్సరు నుండి స్వస్థత పొందును," అని పలికెను.

22ఇంకా ఇట్లు చెప్పసాగెను. "ఆ రాత్రి వారు ఇచ్చటకు వచ్చిరి. యదార్థంగా, భయంకరమగు కేకను నేను అక్కడ విన్నాను. ఆ కొండ పైభాగాన సాల్వేషన్ ఆర్మీ వారు కాబోలు, విచ్చలవిడిగా అరుస్తున్నారనిపించినది. మరల నాకు ఆ వృద్ద సోదరి చనిపోయినదేమోనని తోచినది, రేపు మనము వెళ్ళి బండిని తెచ్చి ఏదో విధంగా ప్రధాన రహదారి నొద్దకు తీసికొని రావలేను. అప్పుడు వారు ఆమెను సంరక్షించే వాని దగ్గరకు తీసికొని పోవచ్చునని మేము నిరీక్షించాము. ఆ రాత్రి సమయములో అక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఇక్కడ నుండి ఆ కొండపైకి ఒక మైలు ఉంటుంది. మరుసటి ఉదయాన మేము వెళ్ళాము. ఏమి జరిగినదో తెలుసునా?"

"తెలియదండీ,'' అని అన్నాను.

వేపిన యాపిలు వంటకము తింటూ, తన భర్తతో కాఫీ త్రాగుతూ ఆమె అక్కడ కూర్చున్నది," అని చెప్పెను.

''నిజంగానా?" అనడిగాను.

"అవునండీ," అని చెప్పెను.

"ఓ, మీకు నిజంగా అర్ధం కాలేదు. అలాగు జరిగి ఉండదు," అన్నాను.

ఆ వ్యక్తి ఈ ప్రాంతంలో ఎన్నడూ లేడు, కాని తెలిసినది. ఏలాగు? అదే నన్ను తొందర పెట్టుచున్నది," అని అన్నాడు.

"ఓ, నీవు అది నమ్మవు కదా?" అని అన్నాను.

"అది సత్యము,'' అని చెప్పెను.

"నీవది నమ్ముచున్నావా?" అని నేను అడిగాను.

23"మంచిది, ఆ కొండ మీదికి వెళ్ళుము. నీకది నేను నిరూపిస్తాను," అని చెప్పెను. ఇప్పుడతడు తిరిగి నాకే బోధించుచున్నాడు, చూచారా.

కాబట్టి నేను, ''హుమ్-హుమ్," అన్నాను. నేను ఒక యాపిలు తీసికొని, "ఈ యాపిలు పండ్లలో ఒక దానిని నేను తీసికొనవచ్చునా?'' అని అడిగి, నా బట్టలమీద దానిని రుద్దుకొన్నాను.

"పసుపు చీడ దానిని తినివేస్తున్నవి, కాబట్టి నీ వొకటి తీసికోవచ్చు," అని చెప్పెను. ఆ తరువాత … నేనిట్లు పలికాను "మంచిది…" నేను దాన్ని కొరికాను. "మంచి యాపిలు'' అని చెప్పాను.

"ఓ, అవును" అని అంటూ, "నీకు తెలుసునా? నలుబది సంవత్సరముల క్రితం ఆ ప్రాతంలో నేనా చెట్టును అక్కడ నాటాను," అని చెప్పెను.

"ఓ, అది నిజమా?" అని నేనన్నాను.

"అవునండీ" అని చెప్పెను.

నేనిట్లు చెప్పాను, "సరే, ప్రతి సంవత్సరము… ఇంకా మంచు మనకు పడుట లేదు, ఇది ఆగష్టు ప్రారంభము, చెట్ల మీద నుండి ఆకులు రాలిపోవుచున్నవి."

"అవునండీ, అది వాస్తవము. ఆకురాలు కాలములో అది జరుగును. ఈ సారి ముందే ప్రారంభమైనది.''

24"అవునండీ" అని అంశము మార్చాను, చూచారా. అతడన్నాడు… నేను చెప్పసాగాను, "అది వింత తెలుసునా, ఆ చెట్టులో నుండి సారము బయటకు ఎటుపోతున్నదో! ఆకులు రాలిపోవుచున్నవి. అయినా గాని … ఆకును చంపే మంచు లేదు.''

"సరే" గాని మనం మాట్లాడుకొనేదానికి ఈ సంభాషణకు సంబంధ మేమిటి?" అని ప్రశ్నించాడు.

"నేను ఆశ్చర్యపడుచున్నాను," అని నేనన్నాను. (ఆవుకు కావలసినంత త్రాడు నిచ్చినచో దానికదే ఉరివేసికొంటుంది. తెలుసునా?" అని అమ్మ ఎప్పుడూ చెప్తుండేది." కాబట్టి అతనికి కావలసినంత త్రాడు ఇచ్చాను).

అతడు బయటకు వెళ్ళి, "సరే, అవును, దానితో దీనికి సంబంధము ఏమిటి?" అనడిగాడు.

"దేవుడు ఆ యాపిలు పండ్లు తీసికొని వచ్చుచున్నాడు తెలుసా? నీవు ఆ యాపిల్సు అనుభవిస్తూ, ఆకుల నీడను విశ్రాంతి పొందుచూ ఉన్నావు. సంవత్సరాంతములో అది అడుగుకు వెళ్ళిపోతూ, తిరిగి యాపిల్సు, ఆకులతో బయటకు వచ్చుచున్నది," అని చెప్పాను.

"ఓ, అది కేవలము ప్రకృతి, సృష్టి స్వభావము,'' అని ఆయన చెప్పెను.

25"అవును, అది ప్రకృతి. దాని స్వభావమే కాని ఎవరో ఆ ప్రకృతిని అదుపులో ఉంచుచున్నారు… ఎవరు దీనిని చేయుచున్నారో నాకు చెప్పుము,'' అని నేనడిగాను.

"సరే, అది అంతే - స్వభావ సిద్ధమైన ప్రకృతి," అని అన్నాడు.

నేనన్నాను, "ఆ చిన్న ఆకుకు ఇప్పుడు ఎవరు చెప్పుచున్నారు….?" వేరు లోనికి సారము వెళ్ళిపోవుచున్నది గనుక ఆకు రాలుచున్నది. చలికాలమంతయూ ఆ సారమంతయూ చెట్టులో నిలిచియున్నచో ఏమవును? ఏమి జరుగును?

"అది చెట్టును చంపును," అని అన్నాను.

"సరే" "ఇప్పుడు, ఆ వేరులలోనికి వెళ్ళిపొమ్మని ఏ జ్ఞానము సారమునకు, చెప్పుచున్నది? ఇక్కడి నుండి పొమ్ము, ఆకురాలు కాలము వచ్చుచున్నది, వేరులలోనికి వెళ్ళి దాగుకొనుము. సమాధిలో నున్నట్లుగా వేర్లలో దాగియుండు? తిరిగి మరల వసంతకాలము వచ్చును. అప్పుడు ఎన్నో యాపిల్సు, ఎన్నో ఆకులు పైకి తీసికొని రమ్ము."

"అది ప్రకృతి సహజము. దానిని అదే చేయును. వాతావరణము మార్పు వలన ఆకురాలు కాలము వచ్చును నీకు తెలియును గదా?" అని జవాబిచ్చెను.

"ఒక కర్ర స్తంభముపై నీళ్ళ బక్కెటు పెట్టి, ప్రకృతి వలన ఆ నీరు ఆ స్తంభము అడుగు భాగానికి వెళ్ళి తిరిగి పైకి వచ్చునేమో చూడు అని నేనడిగాను."

"మంచిది, నీవు దేనినో కలిగియున్నట్లు కనబడుచున్నావు," అని అన్నాడు.

"మేము వేటాడుటకు వెళ్ళుచుండగా దానిగూర్చి ఆలోచించు," అనడిగాను.

"సరే, మీకు ఇష్టమొచ్చినచోట వేటాడుకొనండి," అని చెప్పాడు.

"నేను తిరిగి వచ్చినప్పుడు, ఏ జ్ఞానము వలన సారము వేరుల లోనికి వెళ్ళి చలికాలమంతా దాగి మరుసటి శీతాకాలమునకు తిరిగి వచ్చుచున్నదో నాకు చెప్పినచో, అదే జ్ఞానము అక్కడున్న స్త్రీ గురించి నాకు చెప్పినదని నేను నీకు చెప్పగలను," అని నేనన్నాను.

"నీకు చెప్పినా?" అనడిగాడు.

"అవునండీ," అన్నాను.

"నీవు ఆ బోధకునివి కాదు కదా!" అన్నాడు.

అందుకు నేను, "నీవాయన పేరు ఎరుగుదువా?'' అనడిగాను.

"అవును," అన్నాడు.

"బ్రెన్హాం?" అని అన్నాను.

"ఆ ఆయనే," అని అతడు పలికాడు.

"అవును, అది నిజం," అన్నాను. చూశారా?

" ఏమిటో మీరెరుగుదురా? ఆ వృద్దుడ్ని అతని స్వంత సాక్ష్యమును బట్టియే, అక్కడే క్రీస్తునొద్దకు నడిపించాను.

LUKE 19:40

 

26ఒక సంవత్సరము తరువాత నేనక్కడికి వెళ్ళాను. ఆవరణలో కారు (దానిపై ఇండియానా లైసెన్సు ఉన్నది) ఉంచాను. వారు అక్కడ నుండి వెళ్ళిపోయారు; అతడు చనిపోయాడు. నేను తిరిగి వచ్చేసరికి అతని భార్య అక్కడ నిలబడి, నన్ను మిక్కిలి చిత్రవధ పెట్టేటట్లున్నది. నాకు వేటాడే అనుమతి ఉందనుకొన్నాను. ఆమె అక్కడకు వచ్చి, ''నీవు చదవలేవా?" అని ప్రశ్నించినది.

"చదవగలనమ్మా," అన్నాను.

"వేటాడరాదు,'' అనే సూచన నీవు చూడలేదా?" అనడిగినది.

"అవునమ్మా, కాని నాకు అనుమతి ఉన్నది," అని చెప్పాను.

"నీకు అనుమతి ఉండదు! ఇది మా స్థలము - చాలా సంవత్సరాల నుండి ఇది మాకు చెందినది," అని చెప్పినది.

"అయితే సోదరీ, నేను తప్పు చేశాను. క్షమించు," అన్నాను.

"క్షమాపణ లేదు! ఇండియానా లైసెన్సు వేసికొని ఇక్కడికి వచ్చి కూర్చున్నావా! మీరు చాలా ధైర్యవంతులు!'' అని అన్నది.

"నన్ను కొద్దిగా వివరించనిస్తారా," అనడిగాను…

"ఎవరు నీకు అనుమతి ఇచ్చారు?" అని అన్నది.

"సరిగ్గా నాకు తెలియదు… గత సంవత్సరం నేనిక్కడికి వచ్చినప్పుడు, ఆ మంటపము దగ్గర ఒక ముసలాయన పెద్ద మనిషి కూర్చొనియున్నాడు. మేము దేవుని గూర్చి మాట్లాడుకొన్నాము," అని చెప్పాను. చూచారా?

ఆమె చూచి, "నీవు సహోదరుడు బ్రెన్హాంవా?" అనడిగినది.

"అవునమ్మా," అని అన్నాను.

"నన్ను క్షమించండి. మీరు ఎవరో నేను గుర్తించలేదు. నేను నా భర్త సాక్ష్యము చెప్పగోరుచున్నాను. అతడు చనిపోవుచున్న చివరి ఘడియల్లో తన చేతులెత్తి దేవుని స్తుతించాడు. అతడు క్రైస్తవ విశ్వాసంలో మృతిచెంది, దేవుని యొద్దకు కొనిపోబడెను," అని ఆమె అన్నది. చూచారా?

"వారు మౌనంగా ఉంటే, రాళ్ళు వెంటనే కేకలు వేయును." ప్రకృతిలో ఏదో ఉన్నది.

27పక్షులను గమనించండి, జంతువులను గమనించండి, ప్రతిదానిని గమనించండి, ప్రకృతిని మీరు గమనించండి.

ఆ చిన్న పావురము ఏలాగు ఎగురునో గమనించండి. అదెంత భిన్నమగు పక్షియో చూడండి. దానికి ఎట్టి చేదు లేదు. కాకివలే అది తినజాలదు, చూచారా. దానిలో చేదు లేదు. నీటిలో అది స్నానము చేయనవసరము లేదు, ఎందుకనగా దాని లోపల ఏదో వున్నది; అది దానిని లోపల నుండి శుభ్రము చేయును, చూచారా.

క్రైస్తవుడూ అంతే. దేవుడు తన్ను కనుపరచుకొన్న విధమదియే — ఒక పావురమువలెనే. యేసు గొర్రెపిల్లగా సూచించుకొనెను. నిత్యమూ ప్రకృతిలో నీవు దేవుని కనుగొందువు. దేవుడు మనలను నడిపించబడు గొర్రెపిల్లలనుగా పోల్చెను. కొంతకాలము క్రిందట దానిపై ఒక వర్తమానము అందించాను. మీరెప్పుడైనా గమనించారా? గొర్రెపిల్ల మీదికి పావురము దిగి వచ్చుట. గొర్రెపిల్లను నడిపించుటకు, అది దానిని వధకు నడిపించెను, ఆ పావురము! ఆ పావురము మరే విధమగు జంతువు మీదికి దిగిరాజాలదు, ఎందుకనగా ఆ రెండునూ ఒకే స్వభావము కలిగినవిగా ఉండవలెను, చూచారా. పావురము ఒక తోడేలుపై కూర్చున్నచో, ఆ తోడేలు గుర్తుపెట్టును లేదా అరచును అప్పుడు పావురము ఎగిరిపోవలసియుండును.

ఇప్పుడునూ అంతే. మన చెడు మార్గముల వలన పరిశుద్ధాత్మ ఎగిరిపోవును. ఒకే స్వభావము కలిగియుండవలెను. పావురము ఆకాశ పక్షి; భూమిపై సాత్వికమైన జంతువు గొర్రెపిల్ల, అవి రెండూ ఏకీభవించగలవు. పరిశుద్ధాత్మ మన పైకి వచ్చి మనలను నూతన సృష్టిగా చేసినప్పుడు ఆయన మనలను నడిపించగలడు. కాని మనము ఆ పాత జీవితమే జీవించినచో అది పని చేయదు. అది పని చేయజాలదు.

28నాయకత్వము గూర్చి మాట్లాడు సందర్భములో, నీ జీవితములో నీవు వేసే మొదటి అడుగు బహుశా దయగల నీ ముసలి తల్లి చేతుల ద్వారా కావచ్చును. ఆ చేతులు ఇంకా ఈ రాత్రికి కూడా ఎక్కడో ఉన్న సమాధిలో ఉండియుండును, కాని మీ మొదటి అడుగును వేయించినది ఆ హస్తమే.

ఎట్లు నడువవలెనో నీ తల్లి నేర్పిన పిదప, నీవు కొద్ది అడుగులు వేసి, క్రింద పడెదవు. నీవు ఏదో గొప్ప కార్యము చేయుచున్నట్లు తలంచుదువు, అప్పుడామె నిన్ను బడిలో ఉపాధ్యాయునికి అప్పగించును. ఆమె నిన్ను విద్య వైపుకు నడిపించును. ఏమి చేయవలెనో, తప్పకుండా నీవెట్లు నేర్చుకోవలెనో - మొదలగునవి నేర్పించును.

బడిలో ఉపాధ్యాయుడు నిన్ను నడిపించిన తరువాత నీవు తిరిగి వచ్చినప్పుడు నీ తండ్రి నిన్ను పట్టుకొనును. నీ తండ్రి చేతిలోనికి నీవు వచ్చినప్పుడు, నీ పనిని అతడు బహుశా నేర్పించును. లాభము పొందు వ్యాపారివి ఎట్లు కావలెనో, పనులు సరిగ్గా ఎట్లు చేయవలెనో నీకు నేర్పును. నీవొక గృహిణిగా ఎట్లు తయారుకావలెనో - వంట, మొదలగునవి, నీ తల్లి నేర్పించును.

వారు నిన్ను నడిపించిన తరువాత నీ సేవకుడు లేదా బోధకుడు నిన్ను పట్టుకొనును.

29కాని ఇప్పుడు ఎవరు నిన్ను నడిపించుచున్నారు? అదే ఇప్పుడు ప్రశ్న. ఏదో ఒకదాని ద్వారా మనందరము ఈ రాత్రి నడిపించబడుచున్నాము. నడువవలసి యున్నాము. మనము నడిపించబడినాము. గమనించండి.

ఇప్పుడీ యువకులను చూద్దాం. అతనిపై ఏది ప్రభావము చూపినదో చూద్దాం. ఇతనిని యువ వ్యాపారి అని పిలుస్తాం, ఎందుకనగా అతడొక వ్యాపారి. అతడు గొప్ప విజయము పొందిన వ్యక్తి. అతని నాయకులవైపు మనము చూచుదము.

బహుశా మొదట అతని తల్లి అతడు బాలునిగా నున్నప్పుడు అతడు చేయవలసిన పనులు నేర్పియుండును. అతని తండ్రి మంచి విజయవంతునిగా తయారుచేసి - ఒక స్వాస్థ్యమును అతనికి వదిలియుండును, ఎందుకనగా అతడు ఒక అధికారిగా యుండెను. అతని తండ్రి పోయి యుండును గాని అతడొక వ్యాపారి. అతడొక … నేడు అతన్ని ఒక క్రైస్తవ వ్యాపారిగా పిలుద్దాం; లేక, అతడొక భక్తిగల వ్యాపారి, అదే ఉత్తమ బిరుదు అని నేననుకొంటాను.

MARK 10:21

 

30ఇతడు మతనిష్ఠగలవాడు; ఏ విధంగానూ నాస్తికుడు కాడు. మంచిని ఎట్లు చేయవలెనో, ఎట్లు నడువవలెనో, ఎట్లు దుస్తులు ధరించుకొనవలెనో అతని తల్లి ద్వారా నేర్చుకొనెను. అతని తండ్రి ద్వారా ఒక గొప్ప వ్యాపారిగా విజయవంతునిగా ఎట్లు కాగలడో నేర్చుకొనెను. అతని వ్యాపారము విజయము పొందెను. తల్లి దండ్రులు సంఘములో పెంచబడిన ఇతనిని యాజకునికి అప్పగించిరి. యాజకుడు ఇతనిని వాస్తవమగు మంచి వ్యక్తిగా తయారుచేసెను. కనుక ఇతడు చక్కని సంస్కృతిగల వ్యక్తి, మంచి యువకుడు, సత్ప్రవర్తనగలవాడు.

యేసుక్రీస్తు అతని వైపు చూచి, అతని ప్రేమించెను గనుక ఆ యువకుని గూర్చి నిజమైనదేదో యున్నది. అది నిజము, బైబిలు ఇక్కడ చెప్పినది, మార్కులో కనుకోగలము. "యేసు అతని వైపు చూచి అతనిని ప్రేమించెను. కాబట్టి ఈ యవ్వనుని విషయంలో నిజమైన ప్రతిభ ఏదో తప్పక యుండియుండును. అతడు … మంచి గుణశీలమును కలిగియుండెను. సత్ప్రవర్తన అమితముగా కలిగిన వ్యక్తి, సరిగ్గా పెంచబడిన వ్యక్తి ఇతడు. జ్ఞానము, చురుకుదనము, విద్య, వ్యాపార విజయము, భక్తి ప్రవత్తులు కలిగిన వ్యక్తి, ఎందరికో లేని ఎన్నో మంచి గుణ లక్షణములు అతడు కలిగియుండి, అది రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దృష్టిని కూడా ఆకర్షించినది. ఈ సంగతులన్నింటిలో జయశీలుడై యుండియు, యేసుక్రీస్తును ఎదుర్కొనినప్పుడు …

31ఏ తప్పు దోర్లలేదు. ఖచ్చితంగా మంచివాడు, సరియైనవానిగా కొలవబడెను. తెలివి, మంచి చదువు, విజయము, చురుకుదనము, మంచి వ్యాపార దక్షత కలిగి బహుశా, పాలస్తీనాలోని ఏదో ఒక మంచి వ్యాపారస్తుల గుంపుకు చెందియుండును. ఇక్కడ ఈ రాత్రి వ్యాపారస్తుల సహవాసమునకు చెందిన మనవలే అతడును చెందియుండును. నిస్సందేహముగా చెందియుండెను, ఎందుకనగా వ్యాపారులు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పరస్పర సహవాసము కలిగియుందురు. "ఒకే గూటి పక్షుల," వలె వారు విషయములు చర్చించుకొందురు.

మతనిష్టగల వ్యక్తి, మధ్యపుశాలను నడిపించు వ్యక్తిని గూర్చి వారు మాట్లాడ ఇష్టపడరు… వారంతా కలిసియున్నారు, ఎందుకనగా వారందరూ సామాన్యంగా ఒకే దానిని కలిగియుండలేదు. మనము అన్నిటిని సమిష్టిగా కలిగివుండాలి. కాబట్టి క్రైస్తవులు అన్నిటిలో తక్కిన క్రైస్తవులతో సమిష్టిగా యుండవలెను. పాపులు అన్ని విషయాలలో - పాపులతో సమిష్టిగా యుందురు - సమాజములు - అవి ఏవయినప్పటికిని సామాన్యముగా అన్నిటిని సమిష్టిగా కలిగియుంటాయి. ఈ యువకుడు బహశా - ఒక వ్యాపార సహవాసమునకు చెందియుండును.

MATT 19:20•

MARK 10:20•

LUKE 18:21

 

32ఉండ కలిగినంత మతనిష్టతో యున్నాడు, ఎందుకనగా యేసు ప్రశ్నించినప్పుడు ఇట్లు చెప్పెను, "నా బాల్యము నుండి వీటన్నిటిని నేను అనుసరించుచునే యున్నాను." ఆది వాస్తవము.

అతడు సరిగా పెంచబడెను, సరిగా నేర్పించబడెను, అన్నీ సరిగానే యున్నవి. కాని అతడు - నిత్యజీవమను ఆలోచనను ఎదుర్కొనినప్పుడు… మీరిది గమనించవలెనని కోరుచున్నాను. అతడు ఎన్నో మంచి గుణలక్షణములు కలిగియుండినను, నిత్యజీవము ఇంకా లేదని ఎరిగియుండెను.

MATT 15:9•

MARK 7:7

 

33ఇప్పుడు, మన సమాజములన్నియూ, మన సంఘములు, మన సభ్యత్వములు, మనమెంతో ప్రియముగా ఎంచుచున్న విషయాలు, మన అమెరికా సమాజములు, సమస్తము చాలా చక్కనివి. వానికి విరోధముగా ఏది చెప్పుట లేదు. ఇక్కడున్న మన క్రైస్తవ పనివారల సమాఖ్య చాలా గొప్పది. నాకిది ఒక తెరువబడిన ద్వారము… నా అంతర్ శాఖ అభిప్రాయమును బట్టి "మనము క్రైస్తవులము.''

మనలను (ఏ ఒక్క సంఘ శాఖ) ఏ ఒక్కరూ కూడా నిజ క్రైస్తవులమని చెప్పలేరు, ఎందుకనగా మనము దేవునికి చెందినవారము. శాఖలు మానవ-నిర్మితములు. కాని క్రైస్తవ్యము పరము నుండి పంపబడినది. మనకున్న ఇవన్నీ చాలా మంచివే, మనము ఒక్క చోట చేరుట చాలా మనోహరము, మనకున్న కూటములు చాలా చక్కనివి, మనకున్న సాంఘిక అవగాహన చాలా మంచిది, ఇవన్ని ఉండినప్పటికిని, మనలో ప్రతి ఒక్కరము నిత్యజీవము అను ప్రశ్నను ఎదుర్కొనవలసియున్నాము. వ్యాపారములో మన విజయము లెక్కకు రాదు. ఎంత గొప్ప సంఘ సభ్యత్వము కలిగియున్నామన్నది కాదు. ఎట్లు పనిచేయుచున్నాము, సంగతులు సరిగ్గా చక్కబెట్టుటకు. ఎంతగా ప్రయత్నించుచున్నాము అన్నది కాదు, ఇంకా అవన్నీ మనము సరయిన రీతిలో చేయనిచో, అది దేవుని వ్యర్థముగా ఆరాధించుటయే అగును.

(నేనిక్కడ ఒక్క క్షణము ఆగినట్లే), యేసు వాటిని అదే రీతిగా వర్గీకరించెను. ఆయనట్లు చెప్పెను, ''మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దైవోపదేశములకు బదులుగా మానన పద్ధతులు బోధించుచున్నారు." ఇప్పుడు యోచించుడి! యధార్థమగు, నిజ ఆరాధన, నీ హృదయమందు యధార్థతతో దేవునికి చేసినను ఇంకా వ్యర్థముగానే కావచ్చును. కయీనుతో అది ఆలాగే ఏదేను తోటలో ఆరంభమాయెను. యధార్థ ఆరాధన, కాని తిరస్కరించబడెను! చాలా మతనిష్టతో జరిగెను, గాని విసర్జించబడెను!

1CH 13:3

 

34గత వారంలో లేక గత వారానికి ముందు వారంలో ష్రీవ్-పోర్టులోని పనివారల కూటమునందు కొన్ని వందలమంది జనులు అల్పాహారమునకు కూడికొని యున్నారు, నేను రెండున్నర గంటలు "దేవుని చిత్తము లేకుండా దేవునికి సేవచేయుట," అను అంశం మీద మాట్లాడాననుకొంటున్నాను. ఇప్పుడది క్రొత్తగా వినబడవచ్చును గాని మనము దేవుడేర్పాటు చేసిన మార్గములోనికి, మరియు దేవుడు పనిచేయు విధానము లోనికి మనలను మనము మళ్ళించుకోవలెను. అదెంతో సరియైనది అని మనము ఆలోచించుట కాదు, అది ప్రభుని యొక్క వాక్య ప్రకారమైయుండవలెను, లేనిచో అది వ్యర్ధము. కయీను ఆరాధించెను గాని అది ప్రభుని వాక్య ప్రకారముగా లేదు. పరిసయ్యులు ఆరాధించిరి గాని, ప్రభుని వాక్య ప్రకారముగా లేదు. ఈ వర్తమానము వ్యాపారస్తుల కూటములో దీనిని నేను నేర్పించాను.

1CH 13:1

 

35దావీదు, యెహోవాకు ఒక సేవచేయగోరెను. అతడు తాను చెప్పిన దానిని బట్టి సరిగానే ఉండెను. "యెహోవా మందసము అక్కడుండుట తగునా? దానిని ఇక్కడకు తీసికొనివద్దము," అని చెప్పెను. తనకు ముందుండిన రాజు కాలములో అది జరిగెను. ''అది సరి కాదు, వారు యెహోవాను మందసమును బట్టి ఆలోచన చేయలేదు, కాని మనము తప్పక చేయవలెను," అని అతడు పలికెను. అది నిజమే. వారు అది చేసియుండవలసినది. "మనము వెళ్ళి మందసమును తీసికొని వచ్చుదము, యెహోవాను సంప్రదించుదము,'' అని పలికెను. అది నిజమే. ఎందుకనగా, అది మరో దేశములో యున్నది. "దానిని మనము ఇచ్చటకు తేవలెను. దానిని ఇక్కడకు తెచ్చి, ఇక్కడ మన గృహములో ఉంచి యెహోవాను ఆరాధించుదము," అని పలికెను.

ఇప్పుడు గమనించండి, దానిని చేయుటకు అతడు తప్పు మార్గములో వెళ్ళెను. అతడు దళాధిపతులను, శతాధిపతులను, సహస్రాధిపతులను సంప్రదించెను. వారందరూ, ప్రతి ఒక్కరూ, ఆలోచన చేసిరి. అది దేవుని చిత్తమని చూచి, అది యెహోవా వాక్కు అని భావించసాగిరి.

MATT 7:16,20,23

 

36ప్రభుని వాక్కును కొన్నిసార్లు నీవు సరైన స్థానములో ఉంచవలెను, లేనిచో అది దేవుని చిత్తము కాదు. ఇప్పుడు దీనిని లోతుగా గ్రహించండి, అప్పుడు నేను చెప్ప యత్నించు దాని భావమును కనుగొందురు.

ఇంగ్లాండులో మీరు కనుగొన్న అడుగుజాడలలో సంఘము పడకూడదని నేను కోరుచున్నాను. పొడుగు జుట్టు, ముఖానికి రంగు పూసుకొనిన పురుషుడు, వంకర చేయబడినవాడు. అది మనకు వద్దు! అదెంత మతనిష్టగా వినబడినా సరే, అక్కర లేదు. ఎల్విస్ ప్రెస్లీ ఎంతగా భక్తి పాటలు పాడినా గాని, అతడు దయ్యమే, నేను తీర్పరిని కాను గాని, వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు. అతడు వెంతెకోస్తువాడు, కాని అది చిన్న భేదమును కూడా కలుగచేయదు, చూచారా. నీవేమైయున్నావో నీ ఫలములు సాక్ష్యమిచ్చును.

ఆత్మ అతని పైకి వచ్చి, భాషలలో అతడు మాట్లాడ కలిగినప్పటికిని, లెక్క లేదు. అతడు కేకలు వేయవచ్చు, రోగులను బాగుచేయవచ్చు; యేసు చెప్పెను, "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా మేము ఇది, అది చేయలేదా?" అని పలుకుదురు. అప్పుడు నేను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలిగిపోవుడి, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను." చూచారా?

మనము నిజమగు, అసలయిన క్రైస్తవులముగా ఉండవలసియున్నాము. ఆ విధముగా ఉండుటకు మనము చేయవలసినది, ఇక్కడ వేయబడిన "నిత్యజీవము," అను ప్రశ్నను ఎదుర్కొనుట ఒక్కటే.

JOHN 6:37•

EPH 1:4•

EPH 2:6

 

37ఒకే ఒక విధమగు నిత్యజీవమున్నది, అది దేవుని నుండి వచ్చును. ఎప్పటికిని దానిని కలిగియుండు ప్రతివారిని ఆయన ముందుగానే ఏర్పరచుకొనెను. నీ తండ్రిలో నీవు ఒక జీవకణముగా ఉన్న ప్రకారమే దేవునిలో కూడా ఒక జీవ కణముగా ఉన్నావు. ఆదినుండే ఆయనలోని గుణలక్షణములను కలిగియుండనిచో ఎన్నడూ నీవు అచ్చట ఉండజాలవు. నీవు నీ తల్లియొక్క దాగిన స్థలములో నుండి వచ్చితివి. నీ తండ్రి నిన్ను ఎరుగడు గాని, నీవు అతని నడుములోనే యున్నావు, నీవు నీ తల్లియొక్క దాగు చోటునుండి బయటకు వచ్చినప్పుడు నీవొక మానవునివైనావు. నీవు నీ తండ్రి రూపములో తయారుకాబడినావు. ఇప్పుడు నీవాయనతో సహవాసము చేయగలవు. నీవు నిత్యజీవము పొందినచో దేవుని ద్వారా నీవు ఆలాగే చేయగలవు.

నీకు వచ్చిన జీవము - ప్రకృతి జీవము, భౌతిక జీవము, అది నీ తండ్రి ద్వారా కలిగినది. మరియు నీవు రాగలిగిన ఒకే మార్గము, తిరిగి జన్మించుట… అది ఒక్కటే మార్గము. అది నీ పరలోకపు తండ్రి నుండియు, ఆయన గుణలక్షణముల నుండియే రావలెను. "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు." చూచారా?

జగత్తు పునాది వేయబడక మునుపే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నది గనుకనే నీవిక్కడ ఉన్నావు. అది అక్షరాలా నిజం. నీవొక జీవకణానివి. దేవుని వాక్యములో ఒక భాగమైయున్నావు. నీ పరలోకపు తండ్రిలో నుండి బయటకు వచ్చిన ఒక ఆత్మీయ జీవకణానివి. నేను చెప్పినట్లే అది ఉండును. యేసు ఇక్కడుండినప్పుడు నీవు ఆయనతో ఉంటివి, ఎందుకనగా ఆయన వాక్యముగా ఉండెను. నీవాయనతో శ్రమనొందితివి, ఆయనతో మృతిపొందినావు, ఆయనతో సమాధి చేయబడితివి, ఆయనతో తిరిగి లేచినావు, ఇప్పుడు ఆయనలో ఉన్నత స్థలములందు కూర్చొనియున్నావు.

MAL 4:5

 

38గమనించండి, ఎంతో చక్కగా ఉన్నదని దావీదు అనుకొనెను. అతడు ఈ జనులందరితో ఆలోచించెను. వారు ప్రతి ఒక్కరూ నాట్యమాడుచూ, చప్పట్లు కొట్టుచూ, కేకలు వేయనారంభించిరి. అక్కడ వారు ఉండవలసిన మత కదలికలన్నీ కలిగియున్నారు గాని, ఇంకనూ అక్కడికి వెళ్ళి దేవుని వాక్యమును తీసికొనివచ్చి దేవుని గృహములో నుండుట దేవుని చిత్తము కాదు. అయితే మీరు చూడండీ, దేవుడు ఎల్లప్పుడూ, అన్ని కాలములలో, ఒకే మార్గము ద్వారా పని చేయును. ఆయన మొదటి నిర్ణయమే ఆయన ఆఖరి నిర్ణయము, ఎందుకనగా ఆయన తన నిర్ణయములో ఖచ్చితమైనవాడు. ప్రవక్తలగు తన దాసులకు మొదట బయలుపరచకుండా ఆయన ఏదీ చేయడు. అది ఖచ్చితము.

ఇది అందుకే, మనము జీవించుచున్న సంఘ కాలములలో ఏ సంఘము లేదు, మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు, మరే ఇతర సంఘము వధువులో ఉంచబడదు. అది మలాకీ 4నకు, జవాబుగా నుండవలసియున్నది, ఏలయనగా బయలుపరచబడుటకు దేవుడు ఒక ప్రవక్తను పంపించును, ఎందుకనగా అది మాత్రమే మార్గము. మన సంఘములు శాఖలై ఒక గందరగోళము, అడ్డంకులలోనికి ఎప్పుడూ చేయుచున్నట్లుగానే అంతటిని త్రోసివేయును, మరియు దేవుడెల్లప్పుడూ ప్రవక్తను పంపును.

1CH 13:7

 

39ఈ దేశములో దేవుని ఎదుట బయలుపరచబడిన ఒక ప్రవక్తయగు నాతాను నిలబడియున్నాడు. అతనిని ఎవరూ సంప్రదించలేదు.

వారు పోయి ఒక యధార్థవంతుని జీవితము నశించిపోవుటకు కారకులయిరి, మందసమును ఏలాగో తీసుకొనిరి. లేవీయుల భుజముల మీద దానిని ఉంచుటకు బదులుగా దానిని మోయుటకు ఒక బండిని ఏర్పాటు చేసిరి. అంతా కలిసి గలిబిలి అయినది.

నీవు దేవుని చిత్త ప్రకారము వెళ్ళనిచో, దేవుడు వెళ్ళమని మనకిచ్చు మార్గములో వెళ్ళనిచో, అంతా గందరగోళములు, చివరకు వారు దానిని ఏదో సంస్థ, శాఖ, ఏదో వర్తమానములోనికి తీసికొనిపోవుట ఎప్పుడు జరుగును, చూచారా. ఎల్లప్పుడూ ఆలాగే అది జరుగుచున్నది.

MATT 19:16,20•

MARK 10:17,20,21•

LUKE 18:18,21

 

40ఈ యువకుడు ఎదుర్కొనినది కూడా ఆ రకమైనదే. అతడు వచ్చెను. అతడు బహుశా - పరిసయ్యుల, సద్దూకయ్యుల, లేదా ఆనాటి ఏదో గొప్ప సంస్థలో సభ్యుడుగా ఉండియుండును. ఉండకలిగినంత అతనిలో ఉండెను. "నీ ఆజ్ఞలు నేర్పించబడి బాల్యము నుండి అనుసరించుచునే యున్నాను," అని చెప్పెను. చూచారా. దానినిబట్టి యేసు అతనిని ప్రేమించెను. కాని నడిపించబడుటకు, అతనికి నిత్యజీవము ననుగ్రహించు యేసుక్రీస్తు యొక్క నిజ నాయకత్వమును అంగీకరించుటకు తిరస్కరించెను.

గమనించండి, తాను కలిగియున్న దానికంటే వేరైనది ఏదో ఉన్నదని అతడు నమ్మియుండెను, లేనిచో, "సద్బోధకుడా, నేనిప్పుడేమి చేయవలెను?" అని ఎన్నడూ చెప్పియుండెడివాడు కాడు.

చూడండి, అతడు తనంతట తానే ఏదో చేయగోరెను. మనము కూడా అలాగే చేయుదుము. మనంతట మనమే ఏదో చేయగోరుదుము. దేవుని యొక్క కానుక ఉచిత కానుక. దేవుడు దానిని నీకిచ్చును. దానికై నీవు ఏ ఒక్కటి చేయనవసరము లేదు. దానిని దేవుడు నీకు నియమించెను. దానిని నీవు కలిగియుందువు, చూచారా.

MATT 19:21•

MARK 10:21•

LUKE 18:22

 

41గమనించండి, అది అక్కడుండెనని అతనికి తెలియును. దానియందు అతడు విశ్వసించెను మరియు దానిని కోరెను. అతడు దానిని ఏలాగు చేయవలెనో పేర్కొనబడినప్పుడు, అది అతని సంప్రదాయమునకు వేరుగా ఉండెను. అది భేదముగా నుండెను. అతడు తన డబ్బును పట్టుకొనియే తాను ఏ సంఘమునకు చెందియున్నాడో దానికి చెందియుండవచ్చును, అని అనుకొనెను. కాని యేసు అది ఎరిగి, ఈ డబ్బును కూడబెట్టి యున్నాడని ఎరిగి ఇట్లు చెప్పెను, "నీకు కలిగియున్నదంతయూ అమ్మి, బీదలకిమ్ము. అప్పుడు నీవు వచ్చి నీ సిలువనెత్తికొని నన్ను వెంబడించుము. నీకు పరలోకమందు ధనము కలుగును." కాని అతడు ఆలాగు చేయలేకపోయెను.

నిత్యజీవమును కలిగిన ఒకే ఒకాయన, దానిని నీకు ఇవ్వకలిగిన ఒకే ఒక వ్యక్తి, దేవుడేర్పాటు చేసిన మార్గమగు యేసుక్రీస్తును నిరాకరించునంతటి ప్రభావమును అతని యవ్వన దినములలో అతనికుండిన నాయకులు కలిగియుండిరి. సంఘము నీకు నిత్యజీవమును ఇవ్వనేరదు; నీ పొరుగువాడు కాడు, నీ సంఘ కాపరి కాదు, నీ యాజకుడు కాదు, నీ మత విశ్వాసము కాదు. కేవలము యేసుక్రీస్తు మాత్రమే నీకు నిత్యజీవమును ఇవ్వగలడు.

నీవెంత మంచివానివైనా, నీవేమి మానివేసినా, నీవేమి చేయనారంభించినా, లెక్క లేదు. నీవు ప్రభువైన యేసుక్రీస్తు అను వ్యక్తిని అంగీకరించవలెను. నీవది చేసినప్పుడు, ఆయనే వాక్యము, అప్పుడు నీ జీవితము వాక్యములో సరిగా అమర్చబడి నీవు జీవించుచున్న కాలమునకు దానికదే ప్రత్యక్షపరచుకొనును.

42నోవహు తన కాలములో వాక్యము బయలుపరచబడుటకు దానిని చేయవలసియుండెను. ఇప్పుడు, మోషే వచ్చి, "నోవహు ఏమి చేసెనో మనకు తెలియును, మనము నోవహు మాటను తీసికొందాము. నోవహు చేసినట్లే మనమును చేయుదుము. మనము ఒక ఓడను నిర్మించి నైలు నదిలో తేలునట్లు చేసి ఐగుప్తు నుండి బయట పడుదము?" అని చెప్పినచో పని జరుగదు. చూడండి, అది మరో కాలము.

యేసు మోషే వర్తమానముతో రాలేదు; లూథర్ కాథలిక్కు వర్తమానముతో రాలేదు. వెస్లీ లూథర్ వర్తమానముతో రాలేదు. పెంతెకోస్తు వెస్లీ కాల వర్తమానముతో రాలేదు. వధువు వెంతెకోస్తు శాఖతో రూపొందజాలదు, ఆలాగు పనిచేయుట జరుగదు. అది అక్షరాలా సత్యము. అది సంస్థగా మారి ఇక్కడకు వెళ్ళినది. అక్కడ కూర్చొన్నది. తక్కినవాటన్నిటివలెనే అయినది. అది ఒక తొక్క. జీవము కొనసాగు రీతిలోనే…

43(ఒక రాత్రి నేను చెప్పినట్లుగా) ఈ పుస్తకమును వ్రాసిన ఆ రచయిత… నన్ను విపరీతంగా విమర్శించినందున కాదు - దయ్యమనునది ఉన్నచో అది నేనే,'' అని అన్నాడు. దేవునియందు నమ్మకము లేదని చెప్పెను. ఇంకా ఇట్లు పలికెను, "ఆది కాలములలో హతసాక్షులను చూచుకొంటూ చేతులు ముడుచుకొని కూర్చొనిన దేవుడు, ఎర్ర సముద్రమును చీల్చుటకు శక్తి కలదని ప్రకటించుకొని, ఆ పిల్లలు మరియు స్త్రీలు సింహములు మొదలగువాని ద్వారా ముక్కలుగా చీల్చబడుచున్నది చూస్తూ, తాను ప్రేమ కలిగిన దేవుడినని అప్పుడు చెప్పుకొనెను." "అటువంటి జీవి అసలు లేదు." అతనిని చూడండి. వాక్య ప్రేరణ లేకుండా, దానిని చూచుటలో విఫలమాయెను.

44ఆ మొదటి గోధుమ గింజ, పెండ్లి కుమారుడు, తిరిగి లేచుటకుగాను భూమిలో పడవలసియుండెను. వెంతికోస్తు వద్ద పుట్టిన మొదటి వధువు కూడా ఆలాగే తక్కిన విత్తనములవలె అంధకార యుగముల గుండా వెళ్ళి, పాతిపెట్టబడవలసియున్నది. వారు చావవలసియుండిరి, దానిని వాడు తప్పక చేయవలెను. కాని అది తిరిగి లూథర్ కాలములో అంకురించసాగెను. మొదటి సంస్కరణలో ఆలాగు జరిగెను. లోనికి వెళ్ళిన విత్తనమువలె అది కనిపించలేదు కాని, అది ఆనాటి వెలుగు. కాండము ఎదిగి వెస్లీ అను కుచ్చుగా అయినది. మరియు ఆ కుచ్చు నుండి పెంతెకోస్తు అను తొక్కలోనికి వెళ్ళెను.

గోధుమ గింజలోనికి నీవు చూచినప్పుడు, అది పైకి వచ్చినప్పుడు, (గోధుమను పెంచిన వ్యక్తి, అక్కడున్న గోధుమ పొలములోకి వెళ్ళి చూడండి) అది నిజంగా గింజవలె కనిపించును. కాని మీరు ఒక పట్టుకర్ర తీసికొని కూర్చొని ఆ గోధుమ గింజను చీల్చినచో దానిలో అసలు విత్తనము ఉండదు. అది కేవలము పొట్టు. అప్పుడు ఏమిటి? గింజను పట్టుకొనుటకు అది అక్కడ రూపొందును, చూచారా. అప్పుడు మొదటి సంగతి మీకు తెలియునా? ఆ వెన్నులోనికి వెళ్ళుటకు ఆ జీవము కాండమును వదలును; ఆ తొక్కలోనికి వెళ్ళుటకు కుచ్చును వీడును; పొట్టును విడిచి గోధుమ గింజలోనికి వెళ్ళును. మూడు దశలు దానికున్నవి, చూచారా, మూడు దశలకు వేలుపల గోధుమ గింజ రూపొందును. (లూథర్, వెస్లీ, వెంతెకోస్తు) సరిగా అంతే, చూడండి. సందేహము లేదు. మీరు ప్రకృతిని అటంకపరచలేరు.

45ఇప్పుడు చూడండి. దేవుని నుండి వర్తమానము బయలు వెళ్ళిన ప్రతి మూడు సంవత్సరముల తదుపరి వారు సంస్థగా మార్చబడును. ఇప్పటికీ ఇరవై సంవత్సరముల నుండి ఏ సంస్థయూ లేదు. అది ఉండదు, చూచారా. ఇప్పుడు పొట్టు ఊడిపోయి, గోధుమ గింజ కుమారుని యెదుట పడియుండి. వర్తమానముపై పరిపక్వత చెందుటకు అవకాశము ఇవ్వబడవలెను. భూమిలోనికి వెళ్ళిన ఆ అసలు ఆయన వలెను, యేసుక్రీస్తు శరీరమును రూపొందించుకొని తిరిగి సంఘములోనికి వచ్చుచున్నది.

MATT 24:24•

MARK 13:22

 

46ఇప్పుడు చూడండి, నిత్యజీవము, జీవము… నిశ్చయము, వెనుక ఇక్కడున్న కాండము నిశ్చయంగా జీవమును మోసికొనిపోయెను, కాని చూడండి. అది కాండము అయిన వెంటనే సమాప్తమయినది. అదే సంస్థ. జీవము ఆలాగే వెస్లీ లోనికి వెళ్ళినది. తిరిగి బయటకు వచ్చెను. ఎందుకు… వారిలో ప్రతివారిని గమనించండి. ఎందుకని ఒక పెద్ద పోచ గింజవలె కనిపించదు! కాని ఆ చిన్న పుప్పొడి వచ్చినప్పుడు… ఆ తొక్కపైన… లేదా ఆ కాండము మీద కుచ్చు యొక్క పుప్పొడి, దాదాపుగా గింజవలె కనిపించును. కాని అది తొక్కలోనికి వచ్చినప్పుడు, అది దాదాపుగా అక్కడే ఉండును.

చివరి దినములలో [మత్తయి 24:24] ఆ రెండు బహు దగ్గరగా ఉండి, అసలు జీవాణువులనే, ముందుగా నిర్ణయించబడిన వారినే, ఏర్పాటు చేయబడిన వారినే, సాధ్యమయితే మోసపుచ్చును,'' అని యేసు చెప్పలేదా? దరిదాపుగా అసలు దానివలెనే ఉండును. చూడండి, ఆలాగే చివరి దినములలో ఉండును. ఇప్పుడు, మీరు చూడండి. ఇది గోధుమల కాలము, కోతకాలము సమీపమగుచున్నది. ఇది లూథర్ కాలము కాదు, ఇది పెంతికోస్తు కాలము కాదు — ఇది వధువు కాలము.

మోషే ఒక జనములో నుండి మరొక జనమును పిలచినట్లుగానే, క్రీస్తు నేడు సంఘములో నుండి ఒక సంఘమును పిలచుచున్నాడు. మీరు చూడండి — అదే విధమైన మాదిరి — వాటిని మహిమకరమగు నిత్య వాగ్దాన భూమికి తీసికొనిపోవుచున్నాడు.

JOHN 1:1,14•

HEB 13:8

 

47పిలుపు నిచ్చుచున్న ఆ వ్యక్తియగు క్రీస్తును ఇప్పుడు నిరాకరించుట, నీవు పెంతికోస్తు, మెథడిస్టు, లూథరు, ఏమైనాగాని, నీవు ఈ కాలమునకు రావలసి యున్నావు — వారికి విరోధంగా ఏమీ చెప్పుట లేదు, కానే కాదు — కాని ఈ యుగములో ఇప్పుడు వాక్యమైయున్న క్రీస్తు యొక్క వ్యక్తిని అంగీకరించవలసియున్నావు. (వారు ఆ కాలములో చేసిన ప్రకారమే) "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను." "నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు." హెబ్రీ 13:8. చూచారా, మీరు తప్పక ఆ నిత్యజీవమైయున్న వ్యక్తిని అంగీకరించవలెను.

48లూథర్ కలిగియున్న జీవము నీతీకరణము. దానికి అదనంగా వెస్లీ పవిత్రీకరణమును కలిగియుండెను. దానికి అదనంగా పెంతెకోస్తు వరముల పునరుద్ధరణను తిరిగి పొందెను. కాని ఇప్పుడు అది శరీరములో పూర్తి అవుచున్నది. దాని మూడు దశలను మీరిప్పుడు చూచారా, దానిలోనుండి… ఇప్పుడు, పునరుత్థానము వచ్చినప్పుడు లూథరన్లలో జీవించిన జీవము వెడలిపోయినది, మెథడిస్టులలో జీవించిన జీవము వెడలిపోయినది, పెంతెకోస్తులోనికి వెళ్ళిన జీవమంతా భూమి నుండి పైకెత్తబడి వధువు శరీరములోనికి వెళ్ళి యేసుక్రీస్తు ఎదుటకు కొనిపోబడును. ఓ, ఎంత పురికొల్పు! అది సత్యము.

49మనము ఒక మలుపు తిరిగాము: రాకడ కొరకు కనిపెట్టుచూ మనము ఆకాశము వైపు చూస్తున్నాము, పిరమిడ్ మీది కప్పు మనము చెప్పుచున్నట్లుగా, ఆయన తిరిగి వచ్చుటయే. సంఘము త్వరగా పునరుత్థానము చెందవలసియున్నది. మనము తప్పక సిద్ధపడవలెను.

''నేను ఫలాని కూడికకు చెందినవాడను. నేను ఏకత్వమునకు చెందినవాడిని, ద్విత్వమునకు చెందాను, [లేక అది ఏమైనా, అందరూ] చర్చ్-ఆఫ్-గాడ్ కు చెందియున్నాను," అని నీవు చెప్పకుండా ఉండుట ఒక్కటే నీకు మార్గము. వాటివలన ఏమి ప్రయోజనము లేదు. "మా తండ్రులు కేకలు వేసి నాట్యమాడారు.'' వారు చేసినది అక్షరాలా నిజమే; అది వారి దినము. కాని నేడు వారు చేసిన సంస్థను ఎదుర్కొనుట కాదు కాని, బయలు వెళ్ళుచున్న జీవమును ఎదుర్కొనవలెను, ఆ జీవము యేసుక్రీస్తే.

DEUT 18:15

 

50ఈ యువకుడు అదే చేసెను. మోషే ఆజ్ఞలను వ్రాసేను. కాని, మీరు చూడండి, తన ప్రవక్త ద్వారా ఆజ్ఞలను వ్రాయించిన ఆ దేవుడే రాబోవు దినమున ఈలాగు జరుగునని ప్రవచించెను. "నా వంటి ప్రవక్తను మీలో పుట్టించెదను. ఆయన మాట విననివారందరూ జనులలో నుండి కొట్టివేయబడుదురు." వెనుకటి శాఖల యొక్క తొక్కలు, కుచ్చులు, వారు తప్పక జీవముతో పాటు వెళ్ళవలెను. ఈ విధంగా చెప్పవద్దు, ''నేను పెంతెకోస్తును, నేను దీనికి, దానికి చెందియున్నాను," అది అర్ధరహితము. నిత్యజీవమైయున్న క్రీస్తు వ్యక్తిని నీవు అంగీకరించవలసియున్నావు, మనమందరము ఎదుర్కొనవలెను! అది మరువవద్దు.

అతని పై అటువంటి పట్టు కలిగిన నాయకులచ్చటున్నారని గ్రహించండి. సంభాషించేవారున్నారు, "మేము దీనికి చెందినవారము, మేము దానికి చెందినవారము,'' అటువంటి పట్టు అతనిపై వారు కలిగియున్నారు. కాని నిత్యజీవ నాయకుని త్రోసిపుచ్చుట ఎంత మరణకరమైన విషయము!

MATT 28:20•

JOHN 14:19

 

51ఆ జీవము ఈ రాత్రి సిద్ధముగా నున్నది. అది నిజము. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. అది ఆత్మ రూపములోనున్న క్రీస్తే. ఆయనాత్మ, అభిషేకము ఇక్కడున్నది. "ఇక కొద్దికాలమైన తరువాత లోకము నన్ను చూడదు. అయిననూ మీరు నన్ను చూతురు… ఏలయనగా నేను మీతోను, మీలోను, సదాకాలము, లోకాంతము వరకు ఉందును."

యేసుక్రీస్తు మాత్రమే నిత్యజీవమునకు నిన్ను నడిపించును, ఏ సంఘము, ఏ శాఖ, ఏ యాజకుడు, ఏదీ కూడా నిన్ను దానియొద్దకు నడిపించజాలదు. నీవు తప్పక ఆయన ద్వారానే నడిపించబడవలసియున్నావు, ఆయన ఒక్కడే నిన్ను నడిపించగలడు.

52వాక్యమైయున్న ఆయన, తన వాక్యములో నుండి నిన్ను వెలుపలకు నడిపించునని తలంచుచున్నావా? ఆయన వాక్యమైయున్నచో, నీవాయనలో భాగమైయున్నావు, అప్పుడు నీవు వాక్యములో భాగముగా ఉండవా? దేవుడు కుమ్మరించనై యున్న వాక్యము నేటి రక్షణ జలములు, అది నేడు ఆయనను గుర్తింప చేయుటకే; అపొస్తలులు ఆయనను గుర్తింపచేసినట్లుగా, లూథర్, వెస్లీ, ఇంకా తదితరులు తమ దినములలో ఆయనను గుర్తింపచేసిరి. ఇది మరో యుగము. అది వాక్యము! నేడు మనము చూచుచున్న సంగతులు జరుగునని వాక్యము చెప్పెను, ఈ ఘడియలో సంభవించునని ముందుగా చెప్పబడెను. కనుక యేసుక్రీస్తును అంగీకరించి, నిత్యజీవము నొద్దకు ఆయనే నిన్ను నడిపించనిమ్ము.

53ఈ యువకుడు సాధించినప్పటికిని… అతడు అన్ని మంచివి సాధించెను, బడిలో చక్కగా ఉండెను. మంచి బాలునిగా ఉండెను. సందేహము లేదు, మంచిగా నుండెను. నిజమగు తండ్రిగా … వ్యాపార విషయములో తండ్రి మాట వినుటలో అతడు మంచి బాలునిగా నుండెను, తల్లిదండ్రులకు మంచిగా నుండెను, తన యాజకునికి విధేయునిగా నుండెను, తన సంఘమునకు విధేయునిగా ఉండెను. దేవుని ఆజ్ఞలకు అతడు విధేయునిగా ఉండెను. కాని అతడు అతి గొప్పదానిని పోగొట్టుకొనెను. యేసుక్రీస్తు అను నిత్యజీవము యొక్క నాయకత్వమును అతడు త్రోసివేసినప్పుడు, తక్కినవన్నీ అతనికి అర్ధము లేనివైపోయెను.

గమనించండి. ఈ నాయకత్వమును, నేడు మనందరమును ఆ యువకునివలె ఎదుర్కొనుచున్నాము. మనము ఎంత మతనిష్ట కలిగినవారమైననూ లాభము లేదు. నీవు కాథలిక్కు, బాప్టిస్టు, మెథడిస్టు, లేదా పెంతెకోస్తు, లేదా మరేదైయుండినను — అదే సంగతి నిన్ను ఈ రాత్రి ఎదుర్కొనుచున్నది: నిత్యజీవము — అనగా యేసుక్రీస్తును స్వీకరించుట. మనకు ఈ అవకాశము ఇవ్వబడినది.

54ఈ యువకుని వలే మనమును ఏదో ఒక సమయములో దీనిని ఎదుర్కొనవలెను, ఎందుకనగా నీవు మర్త్యుడవు. ఎన్నిక చేసికొను అవకాశము నీకు ఇవ్వబడెను. నీకొక ఎన్నిక చేసికొను తరుణమున్నది. దేవుడాలాగు చేసెను గనుక నీవు ఎన్నిక చేసికోవచ్చును. ఆయన ఆదామవ్వలను స్వేచ్చా నైతిక ప్రవృత్తి గలవారినిగా ఉంచెను. కాబట్టి వారు ఎన్నిక చేసికోగలరు. అయితే వారు తప్పు ఎన్నిక చేసికొనిరి. చూడండి, వారికి చేసిన దానికంటే ఎక్కువగా ఆయన మీకు మరేమీ చేయలేడు. నీవు ఎన్నిక చేసికొనుటకు లేదా తిరస్కరించుటకు వీలుగా ఆయన అదే సంగతిని నీ ముందుంచెను.

నీకొక ఎన్నిక అవకాశమున్నది. వాటిలో కొన్నింటిని చూద్దాం.

యువకునిగా నీకు చదువు కావలెనో, వద్దా ఎన్నిక చేసికొను అవకాశమున్నది. నీకా అవకాశమున్నది. "అది నాకు వద్దు" అని నీవు కోరుకోవచ్చును. దానిని నీవు త్రోసిపుచ్చవచ్చును.

నీ ప్రవర్తనను నీవు ఎన్నిక చేసికోవచ్చును. ఇక్కడ కొద్దిగా నొప్పి కలిగించుచున్నాను అనుకొంటాను, చూచారా. మీరు బయటకు వెళ్ళి జుట్టు క్రిందికి పెంచుకొన్న గిరజాలవానివలె లేక కొందరు వెర్రివారివలే ఉండవచ్చును.

స్త్రీలగు మీరు - చక్కని మనుష్యులవలె కనిపించవచ్చును లేదా వింత జంతువులవలె అనగా రోడ్డు మీద ఉన్నవారివలె నీలిరంగు కండ్లతో కనిపించవచ్చును. ఆ నీటి - తల కత్తిరింపులు మొదలగునవి దేవుని వాక్యమునకు పూర్తిగా విరోధము. అంగీకరించదగు ప్రార్ధన కూడా అర్పించజాలరు. అది సత్యము. అక్షరాలా నిజము. అదే బైబిలు చెప్పెను.

కాని సంఘమా, నీకేమి సంభవించినది? మీరు ఎంతో టెలివిజను చూస్తున్నారు, ఎన్నో లోక సంగతులు చూస్తున్నారు. మీ పాత ఆదాము స్వభావము తక్కినవారివలె ప్రవర్తించుటకు బహు తేలికగా లాక్కొనిపోవును.

EXOD 12:15,19•

EXOD 13:7•

EXOD 34:25•

1JN 2:15

 

55నేను తిరిగి దీని చెప్పవచ్చునా? కోషెరులో, మోషే దినములలోని పరిహారార్ధ బలిలో, మోషే వారిని బయటకు తెచ్చినప్పుడు, జనుల మధ్య ఏడు దినములు పులిసినదేదియూ ఉండకూడదు. ఎవరికైనా అది తెలియును. నిర్గమకాండములో, "ఏడు దినములు మీ పాళెములో పులిసినదేదియూ కనబడరాదు." ఆ ఏడు దినములు, ఏడు సంఘ కాలములను" పూర్తిగా సూచించుచున్నవి, చూచారా.

పులియ రాదు. ఇప్పుడు, అదేమిటి? మత సిద్ధాంతము, లోకము ఉండరాదు. యేసు చెప్పెను, "మీరు లోకమును గాని లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించినచో దేవుని ప్రేమ మీలో లేదని తెలిసికొనుడి," చూచారా. మనము దానిని మిశ్రమము చేయ యత్నించుచున్నాము. నీవది చేయజాలవు! విశ్వసించుటకు నీవు ఒక్కదాని యొద్దకే రావలెను, నీవు దేవునినయినా నమ్మవలెను, లేదా నీ సంఘమునయినా నమ్మవలెను లేదా నీవు లోకమునయినా నమ్మవలెను. నీవు వాటిని కలుపజాలవు. నీవింతకు ముందు చేసిన ఆ ఇతర సంఘపు పాత పనులను పట్టుకొని యుండలేవు. నీవు ఘడియ వర్తమానమును స్వీకరించవలసియున్నావు.

EXOD 12:10•

EXOD 29:34•

LEV 8:32

 

56ఆయనిట్లు చెప్పెను, "మిగిలిపోయిన దానిని ఉదయము వరకు ఉండనీయరాదు. [ఈ మరో కాలములో ప్రవేశించుటకు]. దానిని అగ్నితో దహించవలెను, నాశనము చేయబడవలెను." నీవు జీవించుచున్న కాలము, ఈ కాలపు వర్తమానము, లేఖనములలో నుండి వెలుపలకు తీసికొని రాబడవలసియున్నది. దానిని దేవుడు ఆ విధంగా చేయుచున్నాడని దేవునిచే బయలుపరచి, రుజువుపరచవలెను. అప్పుడు నీవు దానిని స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అదే నిత్యజీవము, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము, తన సంఘమును నడిపించుచున్నది.

దానిపై ఎంతోసేపు మనము మాట్లాడుకోవచ్చును, కాని కదలి ముందుకు వెళ్ళిపోవుదము.

57నీ ప్రవర్తన ఎన్నిక చేసికొను అవకాశమున్నది… దానినిప్పుడు నీవు మిశ్రమం చేయజాలవు. నీవు దేవుని పక్షానగాని లేదా దేవునికి విరుద్దంగా గాని ఉండవలసి యున్నావు. అంతరంగములో ఏమున్నదో బహిరంగముగా వ్యక్తమగును. ఆ గురుగు. మనమిలా మాత్రమే అనుకొంటాము, "నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాను, పరలోకానికి వెళ్ళుచున్నాను." నీవు పరలోకానికి వెళ్తున్నావనుటకు ఏ మాత్రము దాని భావం కాదు. కాదండీ. నీ జీవితములోని ప్రతి గంటలో నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుచుండవచ్చును, అయిననూ తప్పిపోయి, నరకానికి పోవచ్చును. బైబిలు ఆలాగు చెప్పుచున్నది. అది ఖచ్చితంగా నిజము.

58ఇటు చూడండి, నీవొక బయట వ్యక్తి. ఆ బయట శరీరమును స్పందించు అయిదు జ్ఞానేంద్రియములున్నవి. దేవుడు నీకు అయిదు జ్ఞానేంద్రియములిచ్చెను — ఆయనను సంధించుటకు కాదు — నీ భూసంబంధమైన గృహము: చూచుట, రుచి, తాకుట, వాసన, వినుట.

దాని లోపల నీవొక ఆత్మను కలిగియున్నావు, మరియు దానికి అయిదు బయట ద్వారములు కలవు — మనసాక్షి, ప్రేమ, మొదలగునవి — ఆత్మీయ ప్రపంచమును నీవు ఆ అయిదు బయటి ద్వారములతో సంధించుదువు, కాని నీ ఆత్మతో అది చేసెదవు.

భౌతికము భౌతికమునే తాకును. నీ ఆత్మీయము ఆత్మీయమును తాకును. కాని వాటి లోపల నీవొక ప్రాణమును కలిగియున్నావు. ఆ ప్రాణమే దేవుని నుండి వచ్చు జీవాణువు.

JOHN 1:1,14

 

59తల్లి గర్భములో బిడ్డ రూపొందినట్లుగానే ఉండును. బిడ్డ తల్లి గర్భములోనికి వచ్చినప్పుడు, ఆ చిన్న జీవాణువు, అండములోనికి ప్రాకుచూ పోవును. ఒక కణము మానవుడు, మరొకటి ఒక కుక్క, మరొకటి ఒక పిల్లి, మరొకటి ఒక గుర్రముగా రూపొందదు. అదంతయూ ఒక మానవ కణమే కాబట్టి అది ఒక అసలైన మానవ కణమునే నిర్మించును.

దేవుని వాక్యము ద్వారా ఒక మానవుడు తిరిగి జన్మించినప్పుడు, నిత్యజీవమునకు ముందే నిర్ణయించబడి, "ఏర్పరచబడినవానిగా," పిలువబడును, అది వాక్యముపై వాక్యము పేర్చుకొంటూ పోగా ఏర్పడిన దేవుని వాక్యముగా నుండును! ఒక శాఖ ఆచారము, ఆ తరువాత వాక్యము, మరియు ఆచారము — ఆలాగు పనిచేయదు! దానిలో నీవు ఆ పులిసిన దానిని కలిగియుండజాలవు! ఒకే ఒక నిత్యజీవము, వాక్యమైయున్న యేసుక్రీస్తు. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను."

REV 3:16,19,20

 

60స్నేహితులారా, మీరు నా పిల్లలను పోషించుచున్నారు. లోకములోని వర్తమానము అందించుటకు మీషను పొలములకు, నన్ను పంపించుచున్నారు. నేను మీ పట్ల యధార్థంగా ఉండవలెను. నేను చూచుచున్న దానిని మీరు చూడక యుండవచ్చును. అందుకే నేనిచ్చట ఉన్నాను, మీకు చెప్ప ప్రయత్నించుచున్నాను. నేను ప్రజలను ప్రేమించనందున ఈలాగు చెప్పుట లేదు, ప్రజలను ప్రేమించుచున్నందున ఈలాగు చెప్పుచున్నాను. సరిదిద్దుచున్నాను. సంఘము జారిపోవుట నేను చూస్తున్నప్పుడు, ''మేమిది చేశాము మరియు అది చేశాము," అని చెప్పుచూ తొట్రిల్లిపోవుట చూస్తున్నప్పుడు, చుట్టూ సంఘమును చూచినప్పుడు, వారిని చూచినప్పుడు… అది పనిచేయదు.

అప్పుడు ఇక్కడ బైబిలులో చూచి, చివరలో ఆలాగుండెనని గ్రహించుడి. ఆ నులివెచ్చని లవోదికయ సంఘము, యేసును బయట పెట్టినది. (వాక్యమును). ఆయనెన్నడును… సంఘమును పిలువలేదు. ఆయనిట్లు చెప్పెను, "నేనెందరిని ప్రేమించుచున్నానో వారిని గద్దించి బుద్ధి చెప్పుచున్నాను.'' నేను మిమ్మును ప్రేమించుటకు అదే కారణము. "ఎవడైనను తలుపు తీసి నన్ను లోనికి రానిచ్చినయెడల, నేను అతనితో కలిసి భోజనము చేయుదును." ఒక సంఘముగా కాదు; ఆయన దానిలోనుండి బయటకు నెట్టబడెను.

NUM 14:30•

NUM 26:65•

NUM 32:12•

JOHN 6:31,49,58•

REV 3:20

 

61ఆమె విశ్వ సంఘ సమితిగా ఏర్పడుటకు పయనించుచున్నది. అక్కడికే ఆమె వెళ్ళినది. ఎక్కడి నుండి వచ్చినదో తిరిగి ఆ రోమ్ కే వెళ్ళుచున్నది. అది నిజము. ఇరవై-ఐదు లేదా ముప్పయి-మూడు సంవత్సరాల క్రితమే నేను దానిని కాగితముపై వ్రాసియుంచాను. అదిగో ఇప్పుడది. అంతే కాదు, దర్శనముల ద్వారా బైబిలులో అది వ్రాయబడెను. ఆమె వెనక్కు పోయినది. దానిని రక్షించు ఏ మార్గము లేదు, అయిపోయినది! అది ఆ విధముగానే ఉండును.

దేవుడు వ్యక్తులను పిలచుచున్నాడు. "నేను ద్వారమునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను, ఏ మన్యుష్యుడు, ఏ వ్యక్తి అయినను… "వేయి మందిలో నుండి ఒక వ్యక్తి, ఒక మిలియను నుండి ఒక్కడు కావచ్చును.

కొద్ది రాత్రుల క్రితం నేను చెప్పిన రీతిగానే, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వెలుపటకు వచ్చినప్పుడు అక్కడ రెండు మిలియనుల జనులుండిరి. కేవలము రెండు మిలియనులు. ఒక్కడు … కేవలము ఇద్దరే లోనికి వెళ్ళిరి — మిలియను నుండి ఒక్కడు. మీకది తెలుసా? కాలేబు, యెహోషువాలు.

యేసు భూమి మీద నుండినప్పుడు, వారనసాగిరి, "మా పితరులు అరణ్యములో మన్నాను తినిరి. మేము ఆచారములను పాటించుచున్నాము. మేము ఇది చేయుచున్నాము. మేము ఎక్కడ నిలబడియున్నామో మాకు తెలియును."

ఆయనిట్లు పలికెను, "మీ పితరులు అరణ్యములో మన్నాను భుజించిన సంగతి నాకు తెలియును. వారందరూ శాశ్వతముగా కొట్టివేయబడిరి. వారు మృతిపొందిరి!"

MATT 7:13,14•

LUKE 13:24

 

62ఆడ లేదా మగ నుండి వీర్యము వచ్చినప్పుడు మిలియను అండములు వచ్చును, మిలియను జీవాణువులు వచ్చును, ఆ చిన్న జీవాణువులన్నింటిలో నుండి… అదొకవేళ మగ ఆవు లేదా పురుషుని నుండి లేదా ఏదైనాగాని, అందులో మిలియనుల కొలది జీవాణువులు, లేదా మిలియను జన్యువులు పనిచేయుచుండును. వాటన్నింటిలో ఒకే ఒక్క జన్యువు జీవమునకు నిర్ణయించబడును, ఎందుకనగా కలిసికొనుటకు, పక్వము చెందుటకు అక్కడ ఒకే ఒక అండముండును. అది నిజము. ఒకే ఒక్క అండమును అది కలిసికొనును. ఈ శరీరమిక్కడ కూర్చుని ఉన్నంత ఖచ్చితంగానే, ఆ జన్యువు దేవుని నుండి వచ్చును. ఆ అన్ని జన్యువులలో నుండి ఒక్క చిన్న జన్యువు వచ్చుట గమనించండి. వాని చుట్టూ తిరుగుచుండును. వాటిని వేగంగా దాటును. ఇక్కడకు వచ్చి ఆ పక్వ అండమును కనుగొనును - మరియు దానిలోనికి ప్రాకి వెళ్ళును; తక్కినవన్నియూ చనిపోవును.

ఒక మిలియను నుండి ఒకరు వచ్చినట్టుగా నేటి సంఘములో కూడా ఆ రీతిగానే జరిగినచో ఎట్లుండును? అదెక్కడుండునో ఆలోచించండి? ''ఇరుకు మార్గమున ప్రవేశించుడి. అందులో ప్రవేశించువారు కొందరే, నాశమునకు పోవు మార్గము విశాలముగాను, వెడల్పుగాను ఉన్నది గనుక అందులో అనేకులు ప్రవేశించుదురు." "అది నిజమా, సహోదరుడా బ్రెన్హాం?" నాకు తెలియదు, అయితే నేను కేవలము వాక్యమును చూపించుచున్నాను, చూచారా.

63ఇప్పుడు, నీవు జీవమునకు నిర్ణయించబడినావు. దానిని చూచుటకు నీవు నిర్ణయించబడినచో, నీవు చూస్తావు. దానిని చూచుటకు నీవు నిర్ణయించబడనచో, నీవు చూడవు. "వారు కన్నులుండియు చూడరు, చెవులుండియు వినరు," అని చెప్పెను. సంఘమా! నీవెంత కృతజ్ఞత కలిగియుండవలెను! వీటి నుండి నీవు ఎంతగా సరిదిద్దుకోవలసియున్నావు! దేవుని కొరకు నీవెంత మండవలసియున్నావు! నీవు చూచు దానిని నీ కన్నులు పట్టుకొనును, నీవు చూచు సంగతులను నీ చెవులు వినును, నాయకత్వము! ఇట్టి వర్తమానము వినుటకు ఈ రాత్రి నీవెందుకు వచ్చితివి? లోకమంతటిలోను, సంఘముల ద్వారా నేను ఒక మూఢభక్తి గలవానిగా ముద్రను పొందాను. మీరెందుకొచ్చారు? వినుటకు పరిశుద్ధాత్మ ఇక్కడకు మిమ్మును నడిపించినది. సున్నతి! మీ లోక విషయములను తెగవేయండి. యేసుక్రీస్తు యొక్క నాయకత్వమును అంగీకరించండి, లేనిచో మీరు లోకమంత ఖచ్చితంగా నశించెదరు.

64ప్రవర్తనను ఎన్నుకొను అవకాశము నీకున్నది. నీవెట్లు ప్రవర్తించుచున్నావో, అది నీదే బాధ్యత.

భార్యను ఎన్నుకొను అవకాశము నీకున్నది. నీవు బయటకు వెళ్ళి భార్యను తెచ్చుకొందువు, నీవొక భార్యను తీసికోగోరుదువు. నీకు అభినందనీయమైన ఒకామెను నీవు కోరుదువు… నీవు కోరునది … నీ భవిష్యత్తు గృహ ప్రణాళికను బట్టి కోరుకొందువు. ఒక క్రైస్తవుడు బయటకు వెళ్ళి, ఈ ఆధునిక యువతులను భార్యగా స్వీకరించగలడని భావించుచున్నావా? నీవది ఊహించగలవా? ఆ పురుషుడు ఏమి ఆలోచించుచున్నాడు? ఒక వీధి వేశ్యను లేదా అక్కడి వీధుల్లో ఉన్న నగ్నమైన డంబమైన వారిని భార్యగా స్వీకరించితే, అతని భవిష్యత్తు గృహము ఎట్లుండగలదు? "ఓ, ఒక్క నిమిషముండు,'' అని నీవు అనవచ్చును. ఆమె ఎట్లు దుస్తులు ధరించును? షర్టులు మొదలగునవి ధరించుచున్నది. ఆమె ఒక వీధి వేశ్య. "ఓ, బ్రెన్హాం సోదరుడా!" అని నీవు అనవచ్చు. ఓ, ఆ చిన్న ఇరుకైన పాత స్కర్టులు, నీవు ధరించి, అందులో పారబోయబడినట్లున్నావు: వీధి వేశ్య.

MATT 5:28

 

65యేసు చెప్పెను, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆ స్త్రీతో వ్యభిచరించినవాడగును." దానికి అతడు జవాబు చెప్పవలెను. అయితే ఆమె ఏమి చేసింది? ఆమె తన్ను ఆలాగు కనుపరచుకొనెను. ఎవరు దోషులు? దానిగూర్చి ఆలోచించు.

"వారు మరెటువంటి బట్టలు తయారు చేయుట లేదు," అని నీవనవచ్చును. వారికి వస్తువులు, కుట్టు మిషనులు ఉన్నవి. చూడండి. సాకులు చెప్ప వీలులేదు. అది ఖచ్చితము.

నేను మిమ్మును బాధపరచగోరను. "ఇది హాస్యోక్తి కాదు; ఇది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" లేఖనములో నుండి తీయబడినది. స్నేహితుడా, ఇది ఖచ్చితంగా నిజము. నేను ఒక వృద్ధుడను. నాకుండుటకు ఎక్కువ కాలము లేదు, కాని నేను మీకు సత్యము చెప్పవలసియున్నాను. ఇదే నా చివరి వర్తమానయితే, ఇది సత్యము, చూచారా. వద్దు సోదరీ. వద్దు సోదరుడా.

66దేవుని వాక్యము మీ యెదుటనే బయలుపరచబడినదని తెలుసుకొనుచూ మీరు ఒక మత సిద్ధాంతమును పట్టుకొని వ్రేలాడుచున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరియు నేటి ఈ వాస్తవములు మనకున్నవి — కాని మీ మత ఆచారము బట్టి దానినుండి తిరిగిపోవుచున్నారా? నీవు దేవుని కుమారునిగా ఉండి, ఏలాగు నేడు మనము జీవించుచున్న ఈ చివరి దినములకు ముందే చెప్పబడిన దేవుని వాక్యమును నిరాకరించుదువు? నీవది ఏలాగు చేయగలవు? దీనిని బైబిలు ఏలాగు పిలచును…?

గత రాత్రి నేను దక్షిణాన ఉండిన ఒకనాటి రాజు గూర్చి చెప్పినట్లుగానే… బానిసలకు ఒక నల్ల రంగు వ్యక్తి అమ్మబడెను. ఎందుకనగా, వాడిన కార్ల బజారు కంటే వారు ఇంకేమి కాదు. అమ్మకపు చీటి కూడా నీవు పొందవచ్చును. ఒక చిన్న స్థలమునొద్ద నేను ఆశ్చర్యపడ్డాను… కొందరిని కొనుటకు ఒకనాడు ఒక దళారి వచ్చి, "మంచిది, ఇప్పుడు నేను…" ఒక రోజున నేను చదువుచున్నాను. వారు దుఖఃములో నుండిరి. వారిని నీవు కోరడాలతో కొట్టవలెను. వారు ఇంటినుండి దూరముగా ఉన్నారు. కాబట్టి ఆలాగు చేసి వారితో పని చేయించాలి, అమ్మబడిన బానిసలు వారు. వారు పరదేశములో ఏమి తెలియక ఉన్నారు. వారెన్నడూ తిరిగి ఇంటికి వెళ్ళరు. వారు విచారముగా నుండిరి. వారితో పని చేయుంచుటకు కొరడాలతో కొట్టవలెను. కాని ఈ దళారి ఫలానా తోట నుండి వచ్చినవాడు.

67అక్కడ ఒక యువకుడు తన ఛాతి బయటకు పెట్టి, గడ్డమును పైకి చాచి ఉన్నాడు, అతనిని కొరడాతో నీవు కొట్టలేవు. అతడు సరిగ్గా నిలబడెను, తక్కినవారి నైతిక విలువలను కూడా నిలబెట్టెను.

"నేను ఇతన్ని కొందును," అని దళారి అనెను.

"అతడు అమ్మబడడు. అమ్మకానికి కాదు, నీవతనిని కొనలేవు, ఎందుకనగా అతడు అమ్మకానికి కాదు."

"మంచిది, మరి ఎందువలన అతడు ఇంత భిన్నంగా తయారైనాడు? ఆ తక్కిన వారిమీద అతడు యజమానియా?" అనడిగాడు.

"కాదు," అనెను.

''నీవతనికి వేరుగా భోజనము పెట్టుచున్నావా?" అనడిగెను.

"లేదు, అతడు ఒక బానిస; అందరి బానిసలతో పాటే అతడు కూడా భోజనము చేయును,'' అని చెప్పెను.

"అయితే ఎందువలన అతడంత వేరుగా నున్నాడు?" అని అడిగెను.

"కనుగోనేసరికి నాకే ఆశ్చర్యమేసినది. ఆఫ్రికాలో (వారక్కడనుండే వచ్చారు. బోయర్లు వారిని కొని ఇక్కడికి తెచ్చి బానిసలుగా అమ్ముచుండిరి), అతని తండ్రి ఒక తెగకు రాజు, అన్య దేశములో నుండినను, ఇంటికి దూరములో నున్ననూ, తాను రాజు కుమారుడనని ఎరిగియుండెను. అందుకే అతడు ఆ విధముగా ప్రవర్తించుచుండెను," అని చెప్పెను.

68క్రైస్తవ్యమునకు ఎంత గద్దింపు! మనము దేవునిని, నిత్యజీవమును ప్రతిబింబించవలసియున్నాము. ఒకే ఒక విధమగు నిత్యజీవమున్నది, అది దేవుడే. ఆయనొక్కడే నిత్యజీవము గలవాడు. మనమాయన ఉత్పత్తులము, ఎందుకనగా మనమాయన పరిశుద్ధాత్మ జీవకణములము. అప్పుడు స్త్రీ పురుషులమైన మనము ఏ విధముగా ఉండమని బైబిలు చెప్పినదో, ఆ రీతిగానే ప్రవర్తించుదుము. వీధుల్లోని యెజెబెలులవలే కాదు. సంస్థల్లోని ఆధునిక స్త్రీలవలె కాదు — కాని క్రైస్తవ పెద్ద మనుష్యులము, దేవుని కుమారులు, కుమార్తెలము, దేవుని ఆత్మ మూలముగా పుట్టినవారము. మన దినములలో వెలుగును ప్రచురపరచుచు, దానిని వెదజల్లుచుండవలెను. అది అక్షరాలా నిజం.

69కాని దానినుండి ఎంత దూరము మనము వెళ్ళిపోయాము. ఎందుకని? ఇక్కడ ఈ బాలుడు దానినే చేసెను. అతడు నిరాకరించాడు, నిత్యజీవమును తిరస్కరించాడు, ఎందుకనగా అది అతని సాంఘిక హోదాకు వెల చెల్లించవలసి వచ్చెను. అది అతని డబ్బు విలాసమునకు వెల చెల్లించవలసియుండును. సంఘములో సహవాసమునకు అది వెలయగును. అనేకమైనవి వెలగా ఇవ్వవలసియుండును. తాను ఎంత వెల చెల్లించవలసియుండునో అతడు ఎరిగియుండును. అతడు జ్ఞానముగలవాడు. ఆ వెలను తాను చెల్లించజాలనని భావించుకొనెను. అయినను ఇట్లు తలంచెను, "నేను నా మతమును నమ్మి సాగిపోదును.'' కాని అతని హృదయములో యేసుక్రీస్తు ఆనాటి యాజకులందరికంటే భిన్నమైనవాడని ఎరిగియుండెను.

JOHN 3:2•

JOHN 6:53•

JOHN 10:30

 

70ఒక అసలైన, జన్మించిన దేవుని వర్తమానము ఏదయిననూ పాత ధోరణికి వేరుగా నుండును. కొద్దికాలం క్రిందట ఒక దైవిక స్వస్థత బయలు వెళ్ళినప్పుడు దానిని అనుకరణ చేయువారు ఎట్లు వెంబడించారో మీరు గుర్తించారా? వారిలో ప్రతి ఒక్కరు ఆ సంస్థలలోనికి వెళ్ళిపోయిరి, అక్కడే ఉన్నారు. దానిని వెంబడించవలసిన వర్తమానమొకటి ఉండెనని ఎవరైనా తెలిసికొన్నారా? ఎందుకు, దేవుడు మనలను వినోదపరచడు! ఏదో ఒకదానితో ఆయన మన దృష్టిని ఆకర్షించును, ఆయన మన దృష్టిని ఆకర్షించినప్పుడు, ఆయన తన వర్తమానమును ఇచ్చును.

మొదట ఆయన భూమి మీదకు వచ్చి తన సేవను ఆరంభించినప్పుడు చూడండి. "ఓ యవ్వన రబ్బీ, నిన్ను మా సంఘములో కోరుకొనుచున్నాము. ఇక్కడికి రమ్ము." యవ్వన ప్రవక్త: "ఓ, నిన్ను మేము ఇక్కడ కోరుకొనుచున్నాము. రమ్ము."

కాని ఒక రోజున ఆయన నిలబడి ఇట్లనెను, "నేను నా తండ్రి ఏకమైయున్నాము."

ఓ, మై! "అతడు తన్ను తాను దేవునిగా చేసికొనుచున్నాడు."

''మనుష్యకుమారుని శరీరము తిని, ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో జీవము ఉండదు."

"ఇతడు రక్త పిశాచి! సరే, మనకు దానితో పనిలేదు."

అపోస్తలులు అక్కడే కూర్చొనియుండిరి. వేలాదిమంది ఆయనను విడిచి పెట్టిరి, కాని అపోస్తలులు జీవమునకు నిర్ణయింపబడినవారు. ఆయనాలాగు చెప్పెను. దానిని వారు వివరించలేకపోయిరి; దానిని వారు నమ్మిరి. దానితోనే వారు నిలచియుండిరి, ఎందుకనగా ''ఏ మనుష్యుడును ఈ క్రియలు చేయలేడని" చెప్పిరి.

JOHN 3:2•

JOHN 5:39,46•

ACTS 2:22

 

71యూజకులు కూడా దానిని ఎరుగుదురు. నీకోదేము అనెను, "మేమెరుగుదుము" [సన్హెద్రిను సమితి] దేవునియొద్ద నుండి పంపబడితేనే గాని ఏ మనుష్యుడును ఈ కార్యములు చేయజాలడు," చూచారా.

పేతురు, పెంతెకోస్తు దినమున చెప్పెను, "నజరేయుడైన యేసు మీ మధ్య దేవునిచే నిరూపించబడినవాడు. దేవుడాయనతో నుండెను."

లేఖనములు చూడండి, ఏమి చేయునని లేఖనములు చెప్పెను? యేసు ఇట్లనెను, "లేఖనములను పరిశోధించుడి, వాటిలో మీకు నిత్యజీవము దొరకును. అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు మోషేను ఎరిగియుంటే, నన్నును ఎరిగియుందురు, ఎందుకనగా నేను రావలసిన రూపములో నేను వచ్చెదనని మోషే వ్రాసెను." ఆయన మనుష్యకుమారునిగా వచ్చెను.

72దేవునిగా ఆయన మూడు నామములతో వచ్చెను. మూడు — తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఒకే దేవుడు; అవి మూడు గుణలక్షణములు.

అప్పుడు కూడా నీతీకరణము, శుద్ధీకరణము. లూథర్, మార్టిన్, మరియు పెంతెకోస్తు — అదే రీతిగా: మూడు గుణలక్షణములు, మూడు దశలు, మూడు సంఘ కాలములు.

అదే విషయము: నీరు, రక్తము మరియు ఆత్మ. ఓ, ఆలాగు మీరు వెళ్ళుచుండగా… మూడు మూల పదార్థములు దేహములోనికి తిరిగి తీసికోనును — అది నీ స్వాభావిక జన్మ నుండి నిన్ను తెచ్చిన మాదిరిగా నీ ఆత్మీయ జన్మను తెచ్చును. బిడ్డ జన్మించినప్పుడు మొదటిది నీరు, రెండవది రక్తము, తరువాత జీవము. అదే రీతిగా ఆ మార్గములోనే నీవు దేవుని రాజ్యములోనికి వచ్చెదవు, చూచారా. సంఘము వచ్చు మార్గము అదే, అదే మాదిరి. ఈ మూడు విషయములపై ధ్యానముంచండి, దేవుడు తనయొక్క…. శరీరమును రూపొందించెను.

MATT 19:20•

MARK 10:20•

LUKE 18:21

 

73నీ ఎన్నికలో నీకు హక్కున్నదని ఇక్కడ మనము కనుగొందుము. నీవు వివాహమాడగోరు స్త్రీని నీవు ఎన్నుకొనవచ్చును. ఆమె నిన్ను స్వీకరించును, మంచిది.

మరో సంగతి: జీవించ కోరుటకు, జీవించకుండా ఉండుటకు నీకొక ఎన్నిక ఉన్నది. ఇప్పుడు నీవు జీవ - మరణములలో ఒకటి ఎన్నుకొంటావు. నీవు జీవించగలవు.

ఆ యువకునికి ఆ అవకాశముండెను. అన్నింటిలోను విజయము పొందెను. మతనిష్టగలవాడు, కాని అతనికి తెలిసినదేమనగా… దానిని అతడు తనలోతాను అనుకొనెను. నేను బాల్యము నుండి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించుచునే యున్నాను," కాని తనకు నిత్యజీవము లేదని ఎరిగియుండెను, చూచారా. దానిని అంగీకరించుటకు లేదా దానిని కాదనుటకు అతనికి అవకాశమున్నది, మరియు అతడు దానిని త్రోసివేసెను. అతను ఎన్నడైనా తప్పు చేస్తే ప్రాణమునకు నాశనము తెచ్చు తప్పు అది. తక్కినవన్నీ లెక్కలోకి రావు. ఆ ఎన్నిక నీవు చేసికొనినచో అవి లెక్క లోనికి రాదు.

74అతని ఎన్నికను బట్టి మనము అతనిని వెంబడించి, అది అతనిని ఎక్కడికీ నడిపించినచో చూద్దాం. ఇప్పుడు ఎక్కడ ఎన్నుకొనెనో చూద్దాం. ఇప్పుడు, చూడండి, అతడు ఒక ధనికుడు, ఒక వ్యాపారి, ఒక అధికారి, ఒక మతనిష్టగల వ్యక్తి. అంతా అదే!

నేడు మనమిట్లు పలుకుదుము, "ఆ కుర్రాడు అసలైన మెథడిస్టు, లేదా బాప్టిస్టు, లేదా ఒక పెంతెకోస్తు. అతడు చాలా నిజమైన వ్యక్తి. నిజంగా మంచి బాలుడు. చక్కనివాడు!" అతని గూర్చి నీవేమీ చెప్పకలిగింది లేదు; స్నేహపూర్వకంగా, చక్కగా, సాంఘికంగా, అంతా చక్కగా ఉన్నది. అతని గూర్చి అవినీతి అరోపణలు లేవు. బహుశా పొగ త్రాగడు, మద్యపానము చేయడు, సినిమాలకు, డాన్సులకు వెళ్ళడు. ఈ రోజు మనం ఏది చెప్పుకొంటున్నామో ఒక క్రైస్తవుని గూర్చి, అది అతనిలో ఉన్నది. కాని ఇంకా అది నిత్యజీవము కాదు! మనము మాట్లాడుకొనుచున్నది అది ఇంకా కాదు. అతడు ఉండిన సంఘమునకు బహుశా చాలా విధేయుడుగా ఉండియుండవచ్చును. కాని, చూడండి… అది ఎక్కడికి అతనిని నడిపించినది? గొప్ప పేరు ప్రతిష్టలకు. ఒకవేళ అతడు బోధకుడయి ఉంటే ఒక మంచి సంఘమును… బహుశా కలిగియుండేవాడని మనలో మనము అనుకొందము. రాష్ట్రానికి పెద్దగానో లేక బిషప్పుగానో ఉండేవాడు, చూచారా. అది నిన్ను పేరుప్రతిష్టల వైపుకు నడిపించును, అది అతనిని ధనము మరియు కీర్తి వైపుకు నడిపించెను.

75పాడుటకు గొప్ప తలాంతు నీకు ఉండినచో ఈనాడు నీకు ఆలాగే జరుగ వచ్చును, ఇక్కడ ఆ పాట పాడిన ఆ యువకుని గూర్చి కొద్దిసేపటి క్రితం ఆలోచించాను. దానిని దయ్యమునకు ఎట్లు ఇచ్చెనో ఇప్పుడు తిరిగి ఎట్లు పొందెనో… అతనికి, ఎల్విస్ ప్రిస్లే తదితరులకు మధ్య ఎంత భేదము! పాట్ బూన్ మరియు అట్టి గుంపు, ఎర్నీ ఫోర్డు మొదలగువారు, గొప్ప గాయకులు; వారి తలాంతులు దేవుడిచ్చిన తలాంతులు, వాటిని తీసికెళ్ళి - సాతాను క్రియలను ప్రేరేపించుటకు వాడుచున్నారు. అది నిజం. కొందరు గొప్ప నాయకులు తమకు దేవుడిచ్చిన తలాంతులను ఈ లోక కీర్తి కొరకు, ఏదో అయిపోవుట కొరకు అమ్ముకొనుచున్నారు. నీకున్న "శరీరము" కంటే ఎక్కువైన మరో ఏదో శరీరముగా ఎట్లు కాగలవు… దేవుని కుమారునిగా కాకుండా ఏమి కాగలవు?

ఈ పట్టణమంతా, ఈ లోకమంతా నీవు కలిగియున్నా నాకక్కరలేదు, పరిశుద్ధాత్మ ద్వారా (క్రీస్తు), నిత్యజీవము యొక్క నాయకత్వమును నీవు అంగీకరించనిచో నీవెట్లుందువు… ఏమైనాగాని నీ వెవరవు? నీవు చచ్చిన వ్యక్తివి. పాపములోను అతిక్రమములోను చచ్చినవాడవు! కోరినంత మతనిష్ట కలిగియుండ వచ్చును. సంఘమునకు నీవనుకొన్నంత నమ్మకముగా ఉండవచ్చును. వేదికపై నుండగోరిన బోధకునిగా ఉండవచ్చును; కాని తోసిపుచ్చినచో, నీవు చనిపోదువు!

76అతడు గొప్ప జయశీలుడుగా నుండెను. ఇక్కడి ఈ జీవితములో అతడు గొప్ప జయము పొందెను. మనము గమనించి కనుగొనునదేమనగా… ఇతడు ఆ పిదప వెళ్ళి… కొద్దిగా అతన్ని మనం వెంబడించి మనము చూచినచో గొప్ప జయము పొందెనని కనుగొందుము. బైబిలు ద్వారా అతన్ని వెంబడించుదము, ఇట్లు కనుగొందుము అతడు… ఒక ధనికునిగా అతని కనుగొందుము. అతడు అటువంటి గొప్ప పెద్ద స్థానములు పొందియుండెను. ఆ పట్టణపు మేయరును, న్యాయాధిపతిని, ఎందరెందరినో అతడు సంతోషపరచుచుండెను. అతడు తన ఇంటి పై అంతస్తులో వున్నాడు. గొప్ప విందులు అతను కలిగియుండెను. సమృద్ధిగా అతిధ్యమిచ్చు యువతులు, స్త్రీలు, బాలికలు సమస్తమూ అతని చుట్టూ ఉండిరి, ఒక దరిద్రుడు అతని గుమ్మమునొద్ద పడియుండెను. అతని పేరు లాజరు, ముక్కలు తుడిచి అతనికి విసరుచుండెను. ఆ కథ మనకు తెలియును. ఆ తరువాత విషయమేమనగా, అతడు ఈనాటి సంఘములవలె జయశీలునిగా కొనసాగుచుండెను.

ఇక్కడ కూర్చొనియున్న ఒక వ్యాపారి నాతో ఇట్లనుచుండెను, "ఈ కాలిఫోర్నియాలోని సంఘము శ్రామిక సమాఖ్యకు ఏమి చేయాలో చెప్పవలసి యున్నది." చూచారా, సంఘము, రాజ్యము తిరిగి ఏకమవుచున్నది. అది మీ మధ్యనే యున్నది. మీరు చూడండి, మీరక్కడే ఉన్నారు, అది తెలియకుండానే మృగపు ముద్రను తీసికొనుచున్నారు.

77నా టేపులెప్పుడైనా మీరు కొంటే దానిని నేను ముగించినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు తప్పక ఈ టేపు తీసికొనండి: "సర్పము యొక్క జాడ." అదెక్కడున్నదో మీరు చూతురు. ఇదెక్కడ పరిసమాప్తమగునో చూడండి. ప్రభుని చిత్తమయినచో, మాట్లాడుటకు ఇంటికి వెళ్ళుచున్నాను. అది దాదాపు నాలుగు గంటలుండును కనుక ఇట్టి కూటముల వంటి కూటములో దానిని చెప్పజాలను. ఎంతసేపయినా, ఓపికగా సంఘము నన్ను సహించును. అక్కడికి నేను వెళ్ళవలెను. గమనించండి, కాని ఇప్పుడు… మీరు మీ గృహములలో టేపును కొంతసేపు వినవచ్చును.

LUKE 12:20•

LUKE 16:23

 

78దీనిని గమనించండి: అతడు గొప్ప జయము పొందెనని ఇప్పుడు మనము చూచాము. ఆ తరువాత అతడు ఎంత గొప్ప జయశాలి అయెనో, ఆ మాటలలో కనుగొందుము. ''నేనెంతో సంపాదించాను!" బాలుడా, ఈనాడు అతడు ఒక నిజమైన యువకునిగా తయారయి యుండేవాడు, కాడా? "నా కొట్లు నిండిపోయియున్నవి. అవి పిగిలిపోతున్నవి! ఓ, నా, ప్రాణమా విశ్రాంతి పొందుము" అని చెప్పునంతగా నేను సంపాదించాను."

కాని ఆదిలో అతడు ఏమి చేసెను, యేసుక్రీస్తు యొక్క నాయకత్వమును అతడు నిరాకరించెను. అతని సంఘము, అతని తెలివి, అతని విద్య, సమస్తము అతనికి గొప్ప జయమునకు నడిపించెను. యూదులందరూ అతని ప్రేమించిరి. అతడు వారికి ఇచ్చెను, వారికి సహాయము చేసెను, ఇది, అది, మరేదో అతడు చేసియుండును. కాని మీరు చూడండి, నిత్యజీవమైన యేసుక్రీస్తు యొక్క నాయకత్వమును అతడు నిరాకరించెను. బైబిలు చెప్పెను, "ఓ, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను," అని ఆయన చెప్పెను.

ఇప్పుడతనిని నరకములో కనుగొందుము, (తరువాత స్థలము) కన్నులెత్తి, ఆ భిక్షకుని, అనగా తాను వీధిలోనికి త్రోసివేసినవాడు అబ్రాహాము రొమ్మున ఆనుకొనియుండుట చూచెను. ఎంత పెద్ద మరణకరమైన తప్పు! సంఘములు వెళ్ళుచుండిన, వెళ్ళిన మార్గము ఎంత చక్కగా నున్నది, కాని వాటికింకా నిత్యజీవము లేదు.

79ఇప్పుడు కొద్దికాలము క్రిందట నేను బోధించిన వర్తమానమును అది నాకు గుర్తుచేయుచున్నది, "ఒక ఆలోచనాపరుని వడపోత సాధనము." మీ వద్ద అది ఉండియుండును. నేను అడవులగుండా నడిచి వెళ్ళిపోవుచున్నాను. నేను ఉడుతలు వేటాడుచున్నాను. (ఈ ఆకురాలు కాలములోనే) నేను క్రిందికి చూచాను. ఆ సిగరెట్లు కంపెనీ పేరు నేను చెప్పలేను. అది మీకు తెలుసు. అక్కడ ఒక సిగరెట్టు పెట్టె పడియున్నది. అడవులలో చూచుకొంటూ దాన్ని దాటి నేను వెళ్ళాను. ఆ పెట్టె అక్కడ పడియుండుట చూచి తిరిగి వెళ్ళి, దానిని చూచాను. దానిపై ఇట్లున్నది, "ఒక ఆలోచనాపరుని వడపోత, పొగత్రాగే వాని రుచి." నేను అడవుల్లో నడువసాగాను.

"వెళ్ళి దానిని తీసుకొనుము," అని పరిశుద్ధాత్మ చెప్పెను.

నేను వెళ్ళి క్రింద నుండి దానిని తీశాను. "ఒక ఆలోచనాపరుని వడపోత, పొగ త్రాగే వాని రుచి." నేను తలంచాను, "ఇక్కడొక అమెరికా కంపెని, తన సొంత అమెరికా పౌరులకు మారువేషములో మృత్యువును అమ్ముచున్నది.'' ఆలోచనాపరుని వడపోత? మరియు పొగ త్రాగే వాని రుచి?

80యూల్ బ్రియాన్ … బ్రిన్నర్, మొదలగు వారితో నేనొక ప్రపంచ వస్తు ప్రదర్శనకు వెళ్ళాను. ఆ పరీక్షనంతటిని అప్పుడతడు ఇచ్చుచున్నాడు. ఒక సిగరెట్టును అతడు పట్టుకొని… ఆ చలువరాళ్ళ మీదుగా ఈడ్చినప్పుడు ఎట్లున్నదో … నికొటైనును తీసి ఒక ఎలుక వీపు మీద నుంచినప్పుడు, ఆ తెల్ల ఎలుక ఏడు దినములలో కాన్సరుతో నిండిపోయి నడువలేకపోయినది.

అప్పుడు వారిట్లు చెప్పిరి. వారు, "వడకట్టినది (Filter) అని చెప్పెదరు, కాని అదంతా ఎక్కువ సిగరెట్లు అమ్ముకొనుటకు ఎత్తుగడ." ఆ దయ్యమును సంతృప్తిపరచుటకు ఎక్కువ నికొటైన్ కావలెను. అది నిజము. నీవొక ఫిల్టర్ సిగరెట్టును తీసికొనినప్పుడు, ఒకదానికి బదులుగా నాలుగు సిగరెట్లు కావలెను. నీకు ఎక్కువ సిగరెట్లు అమ్ముటకు అది ఒక ఎత్తుగడ, ఆ తారు ఉంటేనే కాని నీవు పొగ పీల్చజాలవు. ఆ తారు వలన కాన్సరు వచ్చును. చూచారా ఎట్లున్నదో? ఈ గ్రుడ్డి అమెరికనులు ఎక్కడో ఉన్న టోపిలో నుండి కుందేలు రావలెనని చుస్తూ దానికి దాసులగుచున్నారు. నీవది ముట్టరాదు; అది మరణము. నీవు ఏ మార్గంలో వెళ్తున్నావో నేను లెక్క చేయను. నీవెటు వెళ్ళినా సరే, అది మరణమే. "ఒక ఆలోచనాపరుని ఫిల్టర్." ఆలోచనాపరుడు అసలు పొగ త్రాగడు (అది నిజము) అసలు ఎట్టి ఆలోచన ఉన్నాగాని దానిని త్రాగడు.

1COR 5:6•

GAL 5:9•

REV 22:19

 

81మంచిది, అది సంఘములకు చక్కగా వర్తించునని నేననుకొన్నాను. దేవునికి ఒక వడపోత యున్నదని నేను అనుకొనుచున్నాను? అవును.

ప్రతి సంఘము ఒక వడపోతను కలిగియున్నది. అది నిజము. లోనికి వచ్చే వారిని వారు వడకట్టుదురు, చాలా మరణమును కూడా వారు లోనికి పోనిచ్చుచున్నారు.

దేవుని వడకట్టు సాధనములో నుండి నీవెప్పుడైనా ఎలాగు ఒక శాఖను ఎలా లాగగలవు? అది నీవేట్లు చేయగలవు? ఆ వడపోత సాధనములో నుండి జుట్టు కత్తిరించుకొనిన స్త్రీని ఎట్లు లాగగలవు? నాకు చెప్పండి, పురుషునికి చెందిన వస్త్రము స్త్రీ ధరించుట హేయము కదా. మరి అటువంటప్పుడు షర్టులు ధరించిన స్త్రీని అందులో నుండి నీవెట్లు లాగగలవు? చూడండి, దేవుని వడపోత సాధనము అక్కడ ఆమెను పట్టుకొనును. అది ఆమెను లోనికి రానీయదు. కాని సంఘమునకు తన స్వంత వడపోత సాధనమున్నది. అందుకే నేను అక్కడొక ఆలోచనాపరుని వడపోత సాధనమున్నదని చెప్పుచున్నాను. అది దేవుని వాక్యము. అది పరిశుద్ధుని రుచికి సరిపోవును. అది నిజము, ఒక పరిశుద్ధునికి. ఒక సంఘ మనిషికి కాదు, కాని ఒక పవిత్ర వ్యక్తి రుచి, ఎందుకనగా అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కల్తీ లేని దేవుని వాక్యమది. అక్కడొక ఆలోచనాపరుని వడపోత సాధనమున్నది. సంఘ సభ్యుడా, దానిని వాడుమని నీకు సలహా ఇచ్చుచున్నాను.

ఎందుకనగా అది లోకమును లోనికి తెచ్చును. దాని ఒక్క ముద్దయిననూ మరణమే. ఒక పులిసిన ముద్ద, చిన్న పులిసిన ముద్ద ముద్దనంతటినీ పులియచేయును. "దీనిలో నుండి ఒక్క మాటను తీసివేయువాడు, దీనికి ఒక్క మాటను కలుపువాడు జీవగ్రంథములో నుండి పాలులేకుండా కొట్టివేయబడును."

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4•

REV 22:19

 

82ఏదేను తోటలో మరణమునకు, ఈ దుఃఖమంతటికి, ప్రతి గుండెపోటుకు, చనిపోవుచున్న ప్రతి చిన్న బిడ్డకు, కంఠములోని ప్రతి శోకమునకు, ప్రతి అంబులెన్స్ కేకలకు, ప్రతి వైద్యశాలకు, ప్రతి సమాధి దొడ్డికి ఏది కారణము? హవ్వ ఒక్క మాటకు సందేహించుట కాదా? అంతా కాదు; అది అంతటిని చిందరవందర చేసెను. ఇప్పుడు, దేవుడిట్లు చెప్పెను "మనిషి దేవుని యొక్క ప్రతి వాక్యమును పాటించవలసియున్నాడు. ఇప్పుడు, అదే బైబిలునకు ప్రధమము.

బైబిలు మధ్యలో యేసు వచ్చి ఇట్లు పలికెను, "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును." వాటిలోని ఒక్క భాగము వలన కాదు; ప్రతి మాట వలన.

బైబిలు చివరలో, (ప్రకటన 22) యేసు తన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చెను, బైబిలు యొక్క ప్రత్యక్షత - యేసు క్రీస్తే. మరియు ఆయన చెప్పెను, "ఎవడైననూ, దీనిలో నుండి ఒక్క మాట తీసివేసినను, దీనికి ఒక్క మాట కలిపినను అట్టివానికి జీవగ్రంథములో పాలులేకుండా చేయును."

ఇప్పుడు, మీరు ఆ ఆలోచనాపరుని వడపోత సాధనము గుండా వెళ్ళండి. అక్కడ నుండి బయటకు మీరు వచ్చునప్పుడు పరిశుద్ధుని రుచి నీవు కలిగియుందువు. నిజము. నీవు పరిశుద్ధ రుచిని కలిగియుందువు.

MATT 5:28

 

83ఆ దుస్తులు ధరించుచున్న ఓ సోదరి, దానిగూర్చి ఆలోచించు. నీవు వెళ్ళుచున్నావు … నీవు, ''నేను నా భర్తకు సద్గుణముగలదానిగా," ఉన్నానని చెప్పవచ్చును.

"నా మగ స్నేహితునికి నేను సద్గుణము గలదానిగా ఉన్నాను."

''నేను సద్గుణ వంతురాలను." కాని నీవైపు చూస్తున్న ఆ పాపి సంగతేమిటి? వ్యభిచారమును బట్టి జవాబు చెప్పనప్పుడు, ఎవరు దానిని చేశారని చెప్పును? నీవే దోషివి. అది వాక్యములో వ్రాయబడినదని చూడుము. కాబట్టి అది … చూచారా? ఓ, ఆలోచనాపరురాలిగా ఉండు, ఆలోచనగా ఉండు…

''అది జరుగవచ్చు …" మంచిది, ఆ విధంగా నుండుట జరిగితే ఏమవుతుంది? అని నీవనవచ్చు. ఆయనాలాగు చెప్పెను, ఒక్క మాటయు తప్పిపోదు, చూచారా.

MATT 20:16•

MATT 22:14

 

84కొద్దికాలము క్రితం ఒక గొప్ప వ్యక్తి నన్ను తన గదిలోనికి పిలచి ఇట్లు చెప్పెను, ''సహోదరుడా బ్రెన్హాం, నేను నీపై చేతులుంచగోరుచున్నాను. అటువంటి సంగతులు బోధించి నీ సేవను నాశనం చేసికొనుచున్నావు."

"నాశనము కావలసిన ఏ సేవనయినా సరే, దేవుని వాక్యము నాశనము చేయును," అని నేను పలికాను. చూచారా.

"నేను నీపై చేతులుంచుదును. నీవు రోగులకు ప్రార్ధించుటకు పంపబడితివి," అని అనెను.

''సోదరుడా, ఆ సంగతులు నీవు నమ్ముచున్నావా?'' అనడిగాను.

''లేదు. కాని అది మా పని కాదు," అని అనెను.

"అయితే, అదెవరి పని?" అన్నాను.

"మంచిది, అది సంఘ కాపరి పని," అని అనెను.

''సమూహము వైపు చూడు," అని అన్నాను. అది నిజము, చూచారా.

ప్రతి సంవత్సరము ఈ సంగతులు బోధించుచూ వస్తున్నాను. "దాన్ని తప్పక వారు పొందుదురు," అని నేను తలంచుదును. మరుసటి సంవత్సరము వచ్చుసరికి ఎప్పటికంటే ఎక్కువ అక్కడ ఉంటున్నది. "పిలువబడిన వారనేకులు, ఏర్పరచబడినవారు కొందరే,'' అని ఇది చూపించుచున్నది.

LUKE 16:23

 

85స్నేహితుడా, పరిశుద్ధాత్మయే నాయకత్వము. ఆయన, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి అది మిమ్మును నడిపించును. ఇప్పుడు దానిగూర్చి ఆలోచించు. ఆలోచనాపరుని వడపోత సాధనమును తీసికొనుము — అది బైబిలే. నీ మత సిద్ధాంతము కాదు, నీ సంఘము కాదు — నీవు నశించెదవు. ఆలోచనాపరుని వడపోత సాధనమును తీసికొనుము.

అక్కడే ఆ కుర్రాడు ఆలోచించలేదు. సంఘ వడపోత సాధనమును (Filter) అతడు తీసికొనెను. అతడు కీర్తిని పొంది, గొప్పవాడాయెను. "కాని నరకములో అతడు యాతనపడుచు, కన్నులెత్తి చూచెను."

వాక్యమైయున్న యేసుక్రీస్తు అను ఆలోచనాపరుని వడపోత సాధనమును ఇప్పుడు తీసికొనుము. అప్పుడు నీవు పరిశుద్ధుని రుచిని కోరుకొందువు, ఎందుకనగా అది దానిని తృప్తిపరచును. నీవు నీలో పరిశుద్ధాత్మను కలిగియున్నచో, ఇది దానిని తృప్తిపరచును.

పరిశుద్ధాత్మ అక్కడ లేనట్లయితే, "ఓ, సరే, దానివలన ఏమి తేడా లేదు,'' అని నీవందువు. అక్కడే నీవు ఏమి చేశావో చూడుము! హవ్వ చేసినదే, నీవు తిరిగి అదే స్థానములోనికి వెళ్ళితివి.

86ఇప్పుడు, మనము మరికొంత ముందుకు వెళ్ళుదం. ఇప్పుడు మనము… ఆలోచనాపరుని వడపోత సాధనమును ఉపయోగించని వ్యక్తిని అక్కడ విడిచి పెట్టుదము. అతడు యేసుక్రీస్తు యొక్క నాయకత్వమును, మరియు నిత్యజీవమును అంగీకరించక, తిరస్కరించెను.

ఇతనికుండిన అవకాశమునే కలిగియుండిన మరొక ధనిక యువ వ్యాపారిని, అధికారిని తీసికొందము, దానిని అతడు స్వీకరించి, క్రీస్తు నాయకత్వమును అంగీకరించెను. ఇప్పుడు మనము మాట్లాడుకోనైయున్నవారు బైబిలులో ఇద్దరున్నారు, ఒకరు దానిని నిరాకరించినట్లుగా చూశాము. ఇప్పుడీ వ్యక్తిని తీసికొందము, మరొక ధనిక, యువ వ్యాపారి, అధికారిని చూద్దాం, అతడు నాయకత్వమును అంగీకరించెను.

HEB 11:24-26

 

87ఈ వ్యక్తిని గూర్చి వాక్యము మనకు చెప్పుచున్నది. దానిని గమనించవలెనన్నచో, హెబ్రీ 11:23-29 చూడండి,

"… విశ్వాసమును బట్టి మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు నిరాకరించెను.

దేవుని శ్రమలను అనుభవించుటకు ఎన్నుకొనెను …

ఐగుప్తు ధనము కంటే క్రీస్తుతో నిందను భరించుట మహా భాగ్యమని ఎంచి:…"

చూచారా, అతడు నిత్యజీవమును అంగీకరించెను. లోకములోనున్న ఐశ్వర్యమంతటికంటే, క్రీస్తు కొరకు నిందననుభవించుట మహా భాగ్యముని ఎంచుకొనెను. మోషే దానిని గొప్పగా ఎంచుకొనెను. ఇప్పుడీ ధనికుడు అనుకోలేదు.

88మోషే ఒక ధనిక, యువ అధికారి, ఫరో కావలసినవాడు. అతడు ఫరో కుమారుడు. సింహాసనమునకు వారసుడు. అతడు అసాధ్యము వైపునకు, మట్టి తొక్కువారి గుంపు వైపునకు, బానిసల గుంపు వైపునకు చూచెను. "నాలుగు వందల సంవత్సరములు తన జనులు ఒక అన్యదేశములో పరదేశులుగా ఉందురు, గాని ఒక బలమగు హస్తము ద్వారా బయటకు తేబడుదురు," అను వాక్యము ద్వారా దేవుని వాగ్దానమును విశ్వాసమును బట్టి చూచెను. మరియు అతడు దానిని ఐగుప్తు ధనమంతటికంటే గొప్ప భాగ్యముగా ఎంచుకొనెను. (హల్లేలూయా) అందువలన తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో తెలియకనే ఐగుప్తును విడిచిపెట్టెను, అతడు క్రీస్తు ద్వారా నడిపించబడెను. అతడు విడిచిపెట్టెను!

అతడు తన అడుగును సింహాసనముపై నుంచెను. అతడు ఐగుప్తులో తరువాత ఫరో కాగలడు, కాని అతడు క్రీస్తు నిందను ఎంచుకొనెను. నింద! వింత మనిషిగాను, మూఢునిగాను పిలువబడుటకు, అడుసు తొక్కు వారిలో నుండి మూఢభక్తిగలవానిగా పిలువబడుటకు ఎంచుకొనెను — ఎందుకనగా వాగ్దానము చేయబడిన లేఖనము అప్పుడు, అక్కడ, ఆ ఘడియకు వచ్చెనని చూచెను.

ఓ సంఘమా, మేల్కొనుము! నీవును అదే విషయమును ఈ రాత్రి చూడవా? వాగ్దానము చేయబడిన ఘడియ మనపై నున్నది. ఏ సహవాసముకంటెను, యేసుక్రీస్తు యొక్క నింద గొప్ప ధనమని ఎంచుకొనుము. అది తండ్రి, తల్లి సంఘము, మరి దేనికంటెను మిన్నయైనది. ఆత్మ యొక్క నాయకత్వమును వెంబడించుము!

89ఈ క్రీస్తును కొద్దిగా అనుసరించుదము… ఈ మోషేను కొద్దిసేపు అనుసరించుదము, నేను అది చేశాను. అతని జీవితము గమనించుదము. క్రీస్తు యొక్క నిందను అనుభవించుటకు అంగీకరించినప్పుడు, మొదటగా అతడు తన విద్యను, తన సర్వజ్ఞానమును విడిచిపెట్టెను… ఐగుప్తీయుల జ్ఞానమంతయు అతనికి నేర్పించబడెను. అతని యొక్క కీర్తి యావత్తు సింహాసనము, రాజదండము, రాజకత్వము, కిరీటము, తనకున్న సమస్తమును అతడు తిరస్కరించెను.

ఈ మరో వ్యక్తి దానిని కోరుకొనెను, క్రీస్తును నిరాకరించెను; ఈ వ్యక్తి దానిని నిరాకరించి, క్రీస్తును అంగీకరించెను. వెంటనే ఏమి జరిగెను? అతడు తన్ను వేరుచేసికోవలసి వచ్చెను.

హల్లెలూయ! ఆ మాటకు, "మన దేవుని స్తుతించు" అను దాని భావము మనము మరచిపోవుట చాలా విచారకరము.

90అతడు సింహాసనములను, కీర్తిని తిరస్కరించెను. అతడు వందలాదిమంది యువ బాలికలను … భార్యలుగా పొందగలడు. అతడు రాజదండములను కలిగియుండి… ఐగుప్తు లోకమును ఏలియుండెడివాడు! లోకము అతని పాదముల యొద్ద పెట్టబడెను. దానిలో ప్రతిదానికి అతడు వారసుడు. కాని వాక్యమును చూచుటను బట్టి, తాను జీవించుచున్న దినమును చూచుట ద్వారా, తనలో ఏదో ఉన్నదని ఎరిగి ఆ ముందుగా నిర్ణయించబడిన విత్తనము పనికుపక్రమించెను!

నీవెంత కీర్తి నార్జించుదువో నాకక్కరలేదు, లేదా ఇది నీవేలాగు కాగలవో అక్కర్లేదు. నీవు పెద్దవు కావచ్చును. ఒక సంఘ కాపరివి కావచ్చును. నీవు ఇది, అది మరేదో కాగలవు; కాని నీలోనికి దేవుని వాక్యము ద్వారా ఆ నిత్యజీవము ముందుగా అభిషేకించబడినచో, అది సమీపములోనే ఉన్నదని నీవు చూచి, అది పనిచేయనారంభమై ఆ విధంగా కదలును — బయటకు రానారంభించు! దానిని పొందుటకు ఆరంభించు.

తాను ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొనుటకు తిరస్కరించెను, ఎందుకనగా ఐగుప్తు లేదా లోక ధనమంతటికంటే క్రీస్తు కొరకైన నింద మహా భాగ్యమని ఎంచుకొనెను. దానిని అతడు ఎంచుకొనెను. అతడేమి చేసినో గమనించు, దానిని అతడు వెంబడించెను. ఒకప్పుడు అతనిని ప్రేమించిన జనులే, తన ప్రజల ద్వారానే అతడు బయటకు గెంటివేయబడెను.

91నీవు సంపాదించినదంతయూ వెలచెల్లించవలసి రావచ్చును. నీ ఇల్లును వెలగా చెల్లించవలసియుండునేమో. నీ స్నేహమును నీవు వెలగా ఇవ్వవలసి యుండునేమో. అది నీ అల్లరి విందులను వెలగా కోరవచ్చునేమో, సంగీత కచేరీలలో నీ స్థానమును అది వెలగా కోరునేమో; కావచ్చును… ఏమి చెల్లించవలసి యుందువో నాకు తెలియదు, కాని లోకయుక్తమైనది, లేదా లోకమునకు సంబంధించినది ప్రతిదీ, అది వెలగా కోరును. లోక సంబంధమైనది ప్రతిదాని నుండి నిన్ను నీవు వేరుచేసికోవలసియుందువు. నీవాలాగు చేయవలసియుందువు.

మోషే సమస్తమును ప్రక్కకు పెట్టి, తన చేతిలో ఒక కర్రతో ఎడారిలోనికి వెళ్ళెను. ఆమేన్! దినముల వెంబడి దినములు గతించినవి, తాను తప్పు చేశానేమోనని అతడు ఆలోచించియుండునని అనుకొంటాను? లేదు.

చాలాసార్లు ప్రజలు ప్రారంభించి, ఇట్లు పలికెదరు, "ఓ, నేను దాని చేసెదను. దేవునికి మహిమ, నేను దానిని చూచుచున్నాను!" ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వనీయండి. మిమ్మల్ని హేళన చేయనీయండి. "బహుశా నాది తప్పయి ఉంటుంది."

"శిక్షను తృణీకరించువారు దుర్బీజులు మరియు వారు దేవుని బిడ్డలు కారు,'' అని ఆయన చెప్పెను. చూడండి, వారు ఉద్రేకముతో పనిచేసిరి. చూడండి, కొద్దిసేపటి క్రితం నేను మాట్లాడిన ఆ విత్తనము అసలు ప్రారంభించుటకు ఆక్కడ అది లేనేలేదు. అది ఆత్మచే అభిషేకించబడెను. మరియు అతడు అన్ని రకములు చేసెను. ఓ, నీవు… వారు… నీ ఆత్మ అభిషేకించబడినప్పుడు, నీవు చేయగలవు. అది నిజమైన, అసలైన పరిశుద్ధాత్మ మరియు నీవు ఇంకా దయ్యముగానే ఉండగలవు.

MATT 24:24•

MARK 13:22

 

92"ఓ, సహోదరుడా బ్రెన్హాం" అని నీవనవచ్చును.

అబద్ద ప్రవక్తలు! బైబిలు చెప్పెను, "కడవరి దినములలో అబద్ధ ప్రవక్తలు లేచెదరు." యేసు చెప్పెను, "అబద్ధ క్రీస్తులు లేచెదరు.'' "అబద్ధ యేసులు,'' కాదు. ఇప్పుడు, ఎవరూ ఆ విషయంలో ఇంకా నిలబడలేదు - కాని "అబద్ద క్రీస్తులు." క్రీస్తు అనగా "అభిషిక్తుడు," అని భావము. అబద్ధముగా అభిషేకించబడినవారు. వారభిషేకించబడిరి గాని దాని అడుగున వారు అబద్ధికులు, గొప్ప సూచక క్రియలు, అద్భుతములు, భాషలతో మాట్లాడుట, ఆత్మతో నాట్యమాడుట, సునార్త ప్రకటించుట చేయుదురు.

ఇస్కరియోతు యూదా దానిని చేసెసు! సుమెయోను… కాదు, క్షమించండి… కయప ప్రవచించెను! వేషధారియగు బిలాము! నిశ్చయంగా అన్ని సూచక క్రియలు, సమస్తమూ! సమస్త మత కదలికలు జరిగించిరి.

MATT 5:45•

MATT 7:23•

LUKE 13:27

 

93అయితే, మీరు చూడండి, ఒక గురుగు విత్తనమును, ఒక గోధును. గింజను ఒకే పొలములో పాతిపెట్టి, దానిపై నీరు పోసినచో, వాటిని తడిపినచో అవి రెండూ ఆనందించును, అదే నీటి ద్వారా రెండునూ ఎదుగును, ''సూర్యుడు నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను ఉదయించును. వర్షము నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను కురియును, కాని వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు." వాక్యమునకు సరిపడకుండా నీవెట్లు తప్పించుకోగలవు? ఆమేన్! నా భావము ఏమిటో చూచారా? "నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను పడుచున్నది. దానిని అభిషేకించుచున్నది.

యేసు చెప్పెను, "ఆ దినమున వారు నా యొద్దకు వచ్చి, ప్రభువా, ప్రభువా, నేను దయ్యములను వెళ్ళగొట్టలేదా? నేను ప్రవచించలేదా? నీ నామములో కార్యములు చేయలేదా?" అని అందురు. అందుకాయన, "అక్రమము చేయు వారలారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి, నేను మిమ్మును ఎరుగను. అపవాదికిని వాని దూతలకును ఏర్పరచిన నిత్య నరకమునకు వెళ్ళుడి," అని చెప్పును. మీరు చూశారా? ఎట్టి మాట! అబద్ధంగా వ్యర్థముగా ఆరాధించుట, వ్యర్థముగా పాటుపడుట. అది నీవు చేయవలసిలేనప్పుడు దానిని నీవెందుకు చేయవలెను? పరలోకమంతా నిజమైనవారితో నిండియుండగా, ప్రత్యామ్నాయమునెందుకు తీసికొనెదవు? మీరది చేయకూడదు.

EXOD 3:2,5,10•

ACTS 7:30,33,34

 

94ఇప్పుడు, మనము మోషే అభిషేకించబడుట చూశాము. ఏదియూ అతనిని వెనుకకు త్రిప్పలేకపోయెను. అతని సొంత సోదరులు క్రిందికి త్రోసివేసిరి. అది అతనిని ఆపలేదు. అతడు తిన్నగా అరణ్యములోనికి వెళ్ళెను. అక్కడ ఒక రోజున ఒక పొదలో అగ్నిస్తంభము వ్రేలాడుచుండగా దేవునిని ముఖాముఖిగా కలిసికొనెను. "మోషే నీ చెప్పులు విడువుము, నీవు నిలబడియున్న స్థలము పవిత్రమైనది. నేను నా జనుల మొరను, వారి మూలుగులను వినియున్నాను. వాక్యములోని నా వాగ్దానమును జ్ఞాపకము చేసికొనియున్నాను. నేను వచ్చుచున్నాను, వారిని నీవు బయటకు తోడుకొని వచ్చుటకు నిన్ను నేను పంపనైయున్నాను.'' నిశ్చయంగా, అతడు దేవునిని ముఖాముఖిగా కలిసికొని ఆయనతో మాట్లాడెను. అతడు దేవునిచే ఆజ్ఞాపించబడెను.

2TIM 3:8

 

95దేవుడు వెనుకటివలెనె అదే అగ్నిస్తంభముగా వచ్చి ఆ ప్రవక్తను అక్కడ కొండపై నిలబడియుండగా అదియేనని అతనిని రుజువుపరచెను, అతడు తన స్వహస్తములతో అన్ని విధముల అద్భుతములు మొదలగునవి జరిగించెను. ఓ, అక్కడ అనుకరణ చేయువారును ఉండిరి. ఓ, నిశ్చయంగా. అక్కడే యన్నే, యంబ్రే అను వారును నిలబడి అవే కార్యములను జరిగించిరి. కాని అసలు వ్యక్తి ఎవరు, చూచారా? అదెక్కడ నుండి ప్రారంభమాయెను? అది వాక్యమునుండి కలిగినదా? అది ఆ ఘడియయేనా?

అదే ఈ చివరి దినములలోను తిరిగి వాగ్దానము చేయబడెనని మీకు తెలుసునా? "యన్నే మరియు యంబ్రేలు మోషేను ఎదిరించినట్లుగానే, ఈ మనుష్యులును భ్రష్ట మనస్సులతో సత్యమును ఎదిరించుదురు." చూడండి, ఈ చివరి దినములలో, అది చేయుదురు, (ప్రతిది అనుకరించుట), అదే రీతిగా ప్రవర్తింతురు, "కుక్క తన వాంతికి తిరిగినట్లును, పంది తిరిగి బురదలోనికి పోయినట్లుండును.''

96కొన్ని సంవత్సరాల క్రితం మీ పెంతెకోస్తువారు ఆ సంస్థల నుండి వెలుపలకు వచ్చి, వారిని శపించారు. మీ తల్లిదండ్రులు ఆలాగు చేసిరి, అయితే మీరు తిరిగి దానివైపుననే తిరిగి సరిగ్గా వారు చేసినదే చేయుచున్నారు, ఇప్పుడు మరల అదే వాంతికి, బురదకు తిరిగి యున్నారు. ఆ ప్రారంభ పెంతెకోస్తు కాలములో సంఘము దానిని వాంతి చేసినట్లయితే నేడును తిరిగి సంఘము దానిని వాంతి చేయును. అది ఆలాగు ఉండవలసియున్నది, అయినను అది పొట్టుయే. రావలసియున్నది. కుచ్చు ఒక్కటి మాత్రమే ఉండదు. తొక్క తప్పక రావలసియున్నది, చూచారా, మోసికొనిపోవునది అదే. ఇప్పుడు, మనము చివరి దినములలో జీవించుచున్నాము; ఈ ఘడియలో వాగ్దానము చేయబడిన కార్యములను గమనించుడి.

NUM 16:3,21,32

 

97ఈ మోషే స్థిరపరచబడుటను గమనించండి. తెలిసికొనుడి. అతడు అక్కడికి వచ్చినప్పుడు, కొందరతని స్వంత సోదరులే తిరుగుబాటు చేసిరి. ఒక సంస్థ తయారు చేయగోరిరి. "నీవేదో నీవు మాత్రమే పరిశుద్దుడువన్నట్లుగా ప్రవర్తించుచున్నావు," అని వారన్నారు. "సమాజమంతయూ పరిశుద్ధమైనదే," అని కోరహు, దాతానులు అన్నారు. "మనము మనిషిని ఎన్నుకొని ఏదో చేయుదము," అన్నారు.

మోషే, నేనతని చూచి విచారించుచున్నాను. అతడు వెళ్ళి ఇట్లనెను, "ప్రభువా…" బలిపీఠము యెదుట సాగిలపడి ఇట్లనెను, "యెహోవా…"

దేవుడిట్లు చెప్పెను, "నీవు వారిలో నుండి ప్రత్యేకించబడుము. ఇంక నాకింతకన్న ఎక్కువ అక్కర్లేదు.'' భూమి తెరువబడి వారిని మ్రింగివేసెను. ఆయన తన పనినెరుగును.

JOHN 6:37•

JOHN 10:3,5

 

98దేవుడు సంస్థలతో వ్యవహరించడు. ఆయన గుంపులతో పనిచేయడు. ఆయన వ్యక్తులతోనే పనిచేయును. అది నిజము. ఎల్లప్పుడూ గుంపులలో కాదు; వ్యక్తులు. ఒక వ్యక్తి. చివరి దీనములలో, ఆయనట్లు చెప్పెను, "నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను [ఏదైనా గుంపూ కాదు], ఎవడైననూ నా స్వరము వినినచో, మరియు నా స్వరము వినిన వానియొద్దకు వచ్చి మరియు అతనితో భోజనము చేయుదును." చూచారా, "ఎవడైనను వినినచో…"

ఏలాగు ఈ మైక్రోఫోను ఇప్పుడు ఆలాగు తయారు చేయబడనిచో, నా స్వరమును ఏలాగు ఉత్పత్తి చేయగలదు? నేను నా బలమంతటితో ఆ బల్ల ముందు నిలబడి అరచిననూ, అదేమీ చేయజాలదు. ఎందుకనగా ఇది దానికొరకు నియమింపబడి, తయారుచేయబడి, సృజింపబడిన మైక్రోఫోను. దేవుని యొక్క ముందు నిర్ణయమునుబట్టి దేవుని యొక్క వాక్యము నీలో యున్నచో, ''నా గొర్రెలు నా స్వరము వినును. అవి నా కేక తెలిసికొనును. కొత్తవానిని అవి వెంబడించవు." అది మొదటగా ఉండియుండవలెను. "తండ్రి నాకనుగ్రహించిన వారందరు, నా యొద్దకు వత్తురు," — వారిలో ప్రతియొక్కరు, చూచారా.

ACTS 20:9,10

 

99ఇప్పుడాయన జీవిత చివరి దశలో ఇక్కడ వెళ్ళుచున్నాడు. ఆయన జరిగిపోయాడు… ఆయన తన మార్గములో అంతమునకు వచ్చినప్పుడు గమనించండి.

ఆలస్యమవుచున్నది గనుక మనము ఇప్పుడు ముగించుదము. ఇరవై అయిదు నిమిషముల తక్కువ పది అయినది. గమనించండి. ఇప్పుడు, ఇంటియొద్దనయితే అది పెందలకండనే. సుమారు రెండు లేదా మూడు గంటలప్పుడు మేము, "కొద్దిగా ఆలస్యమయింది," అని చెప్పుచుందుము, చూచారా. కాని ఇప్పుడు నేను చాలా రాత్రులు, రాత్రంతా బోధించాను.

ఇదే సువార్తను పౌలు తన దినములలో బోధించెను. ఒక యువకుడు - గోడపై నుండి పడిపోయి చనిపోయెను. పౌలు అదే అభిషేకముతో, అదే సువార్తతో, అతని శరీరముపై తన శరీరము నుంచినప్పుడు, చనిపోయినవాడు బ్రతికెను. వారు ఆసక్తి చూపించిరి. సంఘము రూపొందుచుండినది. ఏదో జరుగుచున్నది. ఇక్కడ ఏమి జరిగినదో గమనించండి.

మోషే, దిగివచ్చినప్పుడు …

HEB 11:26

 

100ఈ ధనికుడు వచ్చినప్పుడు, మనము మాట్లాడుకొనుచున్న ఈ యువ అధికారి, చాలా మతనిష్ట కలిగియుండి, సంఘమునకు చెందియుండి, అంతో చక్కగా, విద్యనభ్యసించి, ఒక మంచి వ్యాపారిగా అంతా బాగున్నది. కాని అతడు మార్గంతమునకు వచ్చినప్పుడు కేకలు వేయ మొదలుపెట్టేను. "ఇంకా ఎక్కడ అడుగుపెట్ట వీలు లేదు." అతని నాయకత్వము ఏది? అతడు చనిపోయిన తన సంఘము ద్వారా నడిపించబడెను. అతడు చచ్చిన లోకము ద్వారా నడిపించబడెను. లోకము దేనికొరకు సిద్దపరచబడినదో దానిలోనికి అడుగు వేయుటకు తప్ప ఇంకేమీ లేదు! నరకము.

కాని ఇక్కడ మోషే వచ్చుచున్నాడు, ఒక నమ్మకనుగు సేవకుడు. ఐగుప్తు ధనముకంటే క్రీస్తు కొరకైన నింద మహా భాగ్యమని ఎంచుకొనెను. అతడు మార్గంతమునకు వచ్చుచున్నాడు. ఒక వృద్ధుడాయెను. నూట-ఇరువది సంవత్సరముల వాడాయెను. ఆ కొండ మీదికి నడిచి వచ్చెను. తన ఎదుట మరణము ఉంచబడి యున్నదని ఎరిగియుండెను. ఆ వాగ్దాన దేశము వైపునకు చూచెను. అతడు చూచెను. అతని ప్రక్కన అతని నాయకుడగు బండ పడియుండెను. ఆ బండపైకి ఎక్కెను. అతనిని దేవుని దూతలు మహిమలోనికి ఎత్తుకొనిపోయెను - దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క రొమ్మునకు కొనిపోబడెను. ఎందుకు? ఎనిమిది వందల సంవత్సరముల తరువాత, అతడు ఇంకను తన నాయకుని చేత నడిపించబడుచునే యుండెను.

101రూపాంతరపు కొండపైన ఏలియాతో నిలబడి యేసు సిలువనెక్కుటకు ముందుగా ఆయనతో మాట్లాడెనని మనము కనుగొందుము. చనిపోయిన ఎనిమిది వందల సంవత్సరముల తరువాత… లోక కీర్తి అంతటికంటెను, లోక డబ్బు అంతటికంటెను తన సేవ యొక్క నింద మహా భాగ్యమని ఎంచుకొనిన అతనిని ఇంకా ఆ నాయకుడు నడిపించుచునే యుండును. ఓ, మై! అతడు నడిపించబడెను. అతడు మరణము గుండా మరణ ఛాయలలో నడిపించబడెను. సమాధి నొద్దకు అతడు నడిపించబడెను. వందలాది సంవత్సరముల తరువాత అతడక్కడ మరల నిలబడెను, ఎందుకనగా యవ్వస్తునిగా నున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమును ఆయన ఎన్నుకొనెను. ఐగుప్తుగాని, ఆ ధనముగాని మరుగైపోయిననూ అతని పేరు గొప్పగా నుండును. పిరమిడ్లు మట్టి అయినప్పుడు, ఐగుప్తు ఏ మాత్రము ఇక ఆ ఐగుప్తువలె ఉండనప్పుడు, మానవుల మధ్య మోషే అమర్త్యుడుగా నుండును, ఎందుకనగా అతడు తన సంఘము పోవుచుండిన మార్గమునకు బదులుగా క్రీస్తు నాయకత్వమును స్వీకరించెను.

GEN 5:22,23•

2KGS 2:8,11•

HEB 11:5

 

102ఆ విధంగానే చేసిన ఇతరులు ఇంకా ఉన్నారు. హనోకును చూడండి. ఐందు వందల సంవత్సరములు అతడు దేవునితో నడిచెను, అప్పుడు అతడు, "దేవుని సంతోషపరచెను," అని సాక్ష్యము పొందెను. దేవుడు దానిని తనిఖీ చేసెను. "నీవు చనిపోనవసరము లేదు. ఈ మధ్యాహ్నమే ఆ పైనున్న గృహానికి రా," అని చెప్పెను. అతడు వెళ్ళిపోయెను.

ఆలాగే ఏలియా జుట్టు కత్తిరించుకొనిన స్త్రీలను దుయ్యబట్టిన తరువాత, తన దినమున చేయవలసినవన్నీ చేసిన పిదప, రంగులు పూసికొనిన యెజెబెలులను పూర్తిగా ఖండించి, తాను చేయకలిగినదంతా చేసిన తరువాత, అతనిని ఆ యాజకులంతా హేళన చేసినప్పుడు, అంతా అయిపోయిన తరువాత, ఒక రోజున నదియొద్దకు నడిచి వెళ్ళెను. నదికి అవతల ఒడ్డున అక్కడున్న ఒక పొదకు గుర్రములు కట్టబడియుండెను. అగ్నిరథము, అగ్నిగుర్రములు ఉన్నవి. వెంటనే అతడు దానిపై అడుగుపెట్టి తన తదుపరి రావలసిన ప్రవక్తపై తన దుప్పటిని పడవేసి, పరలోకమునకు ఎక్కిపోయేను. నిత్యజీవపు నాయకత్వమును అతడు అంగీకరించెను, ఎందుకనగా ఏలీయాలో నున్నది క్రీస్తే. ఓ! అవునండీ!

ఏమిటది? "నన్ను వెంబడించుము!" ఇప్పుడు తప్పక నీవు నీ నాయకుని ఎన్నుకొనవలెను. స్నేహితుడా, నీవే అది ఎన్నుకొనవలెను. బైబిలు అను దేవుని అద్దములోనికి చూచి ఈ రాత్రి నీవెక్కడున్నావో గుర్తించుకొనుము.

103ఓ చిన్న గాధ… ఒకసారి ఓ చిన్న బిడ్డ గ్రామ సీమలో జీవించెను. అతడెన్నడూ అద్దమును చూడలేదు, తన తల్లి సోదరిని చూచుటకు పట్టణమునకు వచ్చెను. ఆమెకొక ఇల్లున్నది …. ఆ పాతకాలపు ఇండ్లలో తలుపువైన అద్దముండెడిది. అది మీకు జ్ఞాపకమున్నదో లేదో నాకు తెలియదు. కాని ఈ చిన్న కుర్రాడు ఎన్నడూ అద్దం చూడలేదు. అతడు ఇంటిలో ఆడుకుంటూ దానిలోనికి చూచాడు … "హూ?'' అందులో చిన్న బాబుని చూచెను. ఇతడు చేయి ఊపెను. ఈ చిన్న బాబు కూడా చేతిని ఊపెను. ఇతడు తన చెవిని లాగుకొనగా, అందులోని బాబు చెవి లాగుకొనెను. ఆ విధంగా జరిగింది. అతడు దగ్గరగా నడువనారంభించెను. వెనక్కి తిరిగి చూచి, "అమ్మా, అది నేనే!" అని చెప్పెను. అది నేనే.

MATT 4:19•

MATT 8:22•

MATT 9:9•

MARK 2:14•

LUKE 5:27•

ROM 3:4

 

104నీవెట్లు కనబడుచున్నావు? దేనిని నీవు వెంబడించుచున్నావు? మనమేమి చేశాము? నీ నాయకుని నీవు తప్పక ఎన్నుకోవలెను. నేడే ఎన్నుకో, మరణము లేదా జీవమును నీవు ఎన్నుకో. నీవు ఏమి ఎన్నుకొందువో, దాని మీదనే నీ నిత్య గమ్యము నిర్ణయింపబడును. యేసు చెప్పినది జ్ఞాపక వుంచుకొనువు. "నన్ను వెంబడించుము.'' ఆలాగు చేయుటకే ఈ రాత్రి నీవు ఆహ్వానించబడితివి. వాక్యము అను ఆయన షరతుల మీదనే నీవు నిత్యజీవమునకు ఆయనను వెంబడించవలసి యున్నావు. అది నిజము, ఒక మత సిద్ధాంతముపైన కాదు, ప్రజా ఉద్దేశ్యమును బట్టి కాదు, దానిగురించి ఎవరికో కలిగిన ఆలోచన బట్టి కాదు, కాని దానిగూర్చి దేవుడేమి చెప్పెనో, దానిపైన రావలెను.

"మంచిది, సహోదరుడా బ్రెన్హాం, ఉండవలసినంత మంచిగా ఉన్న ఒక స్త్రీని నేనెరుగుదును, ఆమె దీనిని చేయును; దీనిగుండా వెళ్ళిన ఒక వ్యక్తిని నేనెరుగుదును," అని నీవు చెప్పెదవు.

వారు చేసినదానికి నేనేమి సహాయము చేయలేను, దేవుని వాక్యము, ఆయన ఇట్లు చెప్పెను, "ప్రతి మనుష్యుని మాట అబద్ధమే, నాది మాత్రమే సత్యము.'' నీవు ఆయన షరతులపైన, వాక్యము అను ఆయన షరతుల మీదనే రావలసియున్నావు. నీవు ఒక మత సిద్ధాంతము ద్వారా రాజాలవు. శాఖ ద్వారా నీవు రాజాలవు. దానిని ఆ విధంగా నీవు మిశ్రమము చేజాలవు. నీవు చేయకలిగినది ఒక్కటే యున్నది: నీ సమస్త ఆలోచనలు, నీ స్వార్ధము చంపివేయుటకు ఇష్టపడి, ఆయనను వెంబడించుము, ఆయన షరతుల మీదనే దానిని అంగీకరించవలెను. "ఆ లోక క్రియలన్నిటిని వదిలించుకొని నన్ను వెంబడించుము."

MATT 4:19

 

105అది ఒక కఠినమగు కోసే వర్తమానమని నాకు తెలియును సోదరుడా, కాని నేను ఇక్కడికి, ప్రజలను పాడించి, కేకలు వేయించి, అరిపించే ప్రయత్నములో ఒక వర్తమానమును అందించుటకు ఎన్నుకొని రాలేదు. ఆలాగు చేసే అన్యుల కూటములలో నేనున్నాను. నేను మీ జీవితముల పట్ల శ్రద్ద కలిగియున్నాను. నేను ఒక దైవ సేవకుడ్ని. ఒక దినమున దేవునికి నేను జవాబు ఇవ్వవలసియున్నాను. దేవుడు నాకిచ్చిన సేవ వేలాదిసార్లు మీ యెదుట దానిని తేటపరచియున్నది.

గుర్తుంచుకొనండి, యేసు చెప్పెను, "నన్ను వెంబడించుము. నన్ను వెంబడించుము. నీవు పొందిన దానిని వదిలించుకొని, నన్ను వెంబడించుము." అదొక్కటే నిత్యజీవము కలిగియుండుటకు మార్గము. ఇతనికి ఆయనిచ్చిన ఒక పరిహారము అదే, ఈ వ్యాపారికి ఆయనిచ్చిన పరిహారము అదొక్కటే. ఎవరికైనా గాని ఆయనిచ్చే విరుగుడు అదే. అతని ఎన్నిక, అతని తీర్మానము అతడు చేసికోవలెను. అది అన్నివిధాలా ఖచ్చితమైనది. నిత్యజీవమును కలిగియుండుటకు ఆయనను వెంబడించుట ఒక్కటే మార్గము. కాబట్టి దేవుని యొక్క నాయకత్వము ఏమనగా, ఆ ఘడియ యొక్క బయలుపరచబడిన వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా వెంబడించుటయే.

మన తలలు వంచుదము.

106మిమ్మునొక ప్రశ్న అడుగగోరుచున్నాను, మీరు నిజంగా యధార్థంగా ఉండవలెనని నేను కోరుచున్నాను. నా రక్షకుని పిలుపును నేను వినకలుగుచున్నాను, అను పాటను ఆ సోదరి వాయించవలెనని కోరుచున్నాను. పాత-కాలపు వేదిక పిలుపును నేను కోరుచున్నాను. సోదరీ, సోదరులారా, మనము చూస్తున్నట్లుగా నేడు జరుగుచున్నదానిని పరికించండి. ఇప్పుడు మీరు తలలు వంచి, ఒక్క నిమిషము ఆలోచించి, ఏది జరుగుచున్నదో దృష్టించండి.

ఇంగ్లాండులోని ఒక వ్యక్తి ఏమి చెప్పెనో మీరు గతవారపు వార్తా పత్రికలో చూశారా? "యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము ఒక బూటగము, అది కేవలము పిలాతుకు, ఆయనకు మధ్య మాత్రమే అమర్చబడినది," అని చెప్పెను.

ఈ అమెరికా వేదాంతి ఏమి చెప్పినో చూశారా? ''యేసు ఒక మత్తుమందు చెట్టు ద్వారా నిద్రపుచ్చబడెను," అని చెప్పెను. మీలోని చాలామంది వేదాంతజ్ఞులకు ఆ వెనక ఆదికాండములోని పుత్రదాత వృక్షము గూర్చి తెలియును. అది నీవు చనిపోయినట్లనిపించునంతగా నిద్రలో ముంచును. నీ గుండె రెండు మూడు రోజులకు ఒకసారి బహు కష్టము మీద కొట్టుకొనును. "వారాయనకు చేదు కలిపిన చిరకను ఇచ్చినప్పుడు," వారేమి చేప్పిరనగా, "అది ఆ పుత్రదాత చెట్టు; వారాయనను సమాధిలో నుంచిరి, మూడు రోజులు ఆయన నిద్రపోయెను. వారు అక్కడికి వెళ్ళి చూసేసరికి, ఆయన చుట్టూ తిరుగుట కనుగొనిరి." నీవది ఊహించగలవా? వేదాంత పండితులు, సెమినరీలు, చూడండి, నటించు-విశ్వాసము. ఏలాగు…? ఆయన నోటిలో వారు చేదులో ముంచిన చిరక నుంచినప్పుడు ఆయన దానిని నిరాకరించెనని బైబిలు చెప్పుచున్నది.

మరో సంగతి, ఒకవేళ అది నిజమైనచో ఆ శిష్యులు ఎందుకు "ఎవరు వచ్చి ఆయనను ఎత్తుకొనిపోయిరి?" అనిరి. ఆయన కొరకు తమ జీవితములను వారు ఎందుకు హతసాక్షులుగా చేసిరి? పడిపోయి, ఆయన మరణించినట్లుగా తాము మరణించుటకు కూడా యోగ్యత లేదని వారు లెక్కించుకొనిరి. సిలువల మీద, తదితర స్థలములందు వారిని తల క్రిందులుగాను, ప్రక్కగా నుంచియు చంపిరి. వారు… ఆయన వేషధారి అనియు, తామును అలాగే వేషధారులమనియు ఎరిగియుంటే, ఆ విధంగా వారు ఆయన కొరకు తమ జీవితములను ఎందుకు ఇచ్చియుందురు?

107ఓ, మీరు చూడండి, మనము జీవించుచున్నది తెలివి అధికమైన దినము, విద్య, నాగరికత, ఈనాటి అధునిక పోకడ, ఇదంతయూ దయ్యము నుండి కలిగినదే. "దయ్యపు నాగరికత?" అవునండీ! అది అలా వున్నదని బైబిలు చెప్పెను. ఈ నాగరికతలో మరణమున్నది. "మరో లోకంలో మనము ఇటువంటి నాగరికతను కలిగియుందుమా? లేదండీ! మనము వేరైన నాగరికతను కలిగియుందుము. విద్య, ఇవన్నియూ దయ్యమునకు సంబంధించినవి. స్వాభావిక సంగతులను విజ్ఞానము వంకరచేసి మరేదో చేయుచున్నది.

మీకు వారిప్పుడు ఏమి చేసిరో చూడండి. యవ్వన స్త్రీలు … రీడర్స్ డైజస్ట్ చెప్పెను, వారం తరువాత … గత నెలకంటే ముందు అని నేననుకొంటాను. రీడర్స్ డైజస్ట్ చెప్పినదేమనగా, "యవ్వన స్త్రీలు, పురుషులు తమ మధ్య వయస్సును దాటుచుండగా, స్త్రీలు ఇరవై, ఇరవై-అయిదు సంవత్సరముల మధ్య రుతుక్రమము ఆగిపోవుచున్నది. మరో తరము, వారేమీ కారు కాని … అది భయంకర దృశ్యము, చూచారా, ఎలాటి మెత్తబడిన మురికి జీవులు? ఆత్మ మరియు ప్రాణముల వైపు చూడండి. సంఘములోనున్న ఆత్మ ఎట్లు సంకరమై, లోకముతో మిశ్రజాతీ వివాహము చేసికొన్నదో చూడండి. ఓ, ఎటువంటి ఘడియ! పారిపోవుడి! చిన్న పిల్లలారా! పారిపోవుడి! పారిపోవుడి! సిలువ నొద్దకు పారిపోవుడి. క్రీస్తు నొద్దకు రండి; ఆయనే మిమ్మును నడిపించనీయండి.

MATT 17:10,12•

MARK 9:11,13

 

108మన తలలు వంచియుండగా, మన కండ్లు మూయుదవు. అదే సమయములో దయచేసి మీ హృదయములు వంచండి, ఆలాగు చేసెదరా? మిమ్మునొక్క ప్రశ్న అడుగ గోరుదును. నిజంగా నీవు నీవైపు చూచుకోనుచున్నావా, దేవుని వైపు? ఈ ఘడియలో నీవు ఎక్కడుండవలసియున్నావో అక్కడ లేవని నీవు భావించుచున్నావా? ఎందుకనగా ఎత్తబడుట ఏ సమయములోనైననూ జరుగును. చూచారా, అది వచ్చును.

అక్కడ అది మాత్రమే ఉండును… నేను కొద్దిసేపటి క్రితం ఆలాగు చెప్పానంటే అది సత్యము. బ్రతికియుండువారిలో రాకడలో ఐదువందలమంది మాత్రమే ఎత్తబడుదురేమో, వారే మార్పునొందుదురు, ఎందుకనగా, కాథలిక్కులు, తదితరులు, క్రైస్తవ్యము నంతటిని అనగా క్రైస్తవులమని చెప్పుకొనుచున్న వారందరూ ఐదువందల మిలియనుల మంది ప్రజలున్నారు. మిలియనులో నుండి ఒక్కరిని తీసికొనినచో, అయిదు వందలమంది ఉందురు. ప్రపంచమంతటిలోను ప్రతిరోజూ వేలాదిమంది కనబడకుండా పోవుచున్నారు. వారిగూర్చి కనీసం లెక్క కూడా చెప్పలేము. చూచారా, అది వచ్చును దానిని అసలు మీరు ఎరుగక యుందురు. ప్రజలు ఇంకా బోధించుచునే, చెప్పుకొంటునే యుందురు… చూచారా, అంతా జరిగిపోవును.

యేసు చెప్పినట్లు… వారన్నారు… శిష్యులు చెప్పారు, ''ఏలీయా మొదట రావలెనని శాస్త్రులు ఏల చెప్పుచున్నారు?"

అందుకాయన, ''అతడు ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయెను మీరు ఎరుగకయుండిరి. అతనికి ఏమి చేయుదురని చెప్పబడెనో ఆలాగుననే వారతనికి చేసిరి,'' అని చెప్పెను.

109దేవునితో సరిగా లేవని నీకు తెలియును. నీవు దేవునికి జ్ఞాపకము చేసికోబడ గోరినచో … నీ హృదయమును దేవునితో దేవుడే సరిచేయును. నీవీ నిశ్శబ్ద క్షణములో, ఇప్పుడే, దీనముగా నీ చేతులను ఎత్తైదవా? నీ వెవరైనా నేను లెక్క చేయను. నీవును ఆలాగే చేసెదవా? ''నేను నా హస్తములు దేవుని తట్టునకు ఎత్తెదను," అని నీవు చెప్పుము. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును.

నీవు అద్దములోనికి చూస్తున్నావా? క్రీస్తు నామమున నిన్ను అడుగుచున్నాను, "దేవుని అద్దములో నీవు చూచుకొనుచున్నవా?" [ఒక సోదరుడు మరో భాషలో మాట్లాడుచున్నాడు. మరో సోదరుడు అర్ధము చెప్పుచున్నాడు. "ఓ నా జనులారా, ఘడియలో నా వాక్యము మీ హృదయములపై కదలుచుండగా, ఈ ఘడియలో మిమ్ములను మీరు తీర్పుతీర్చుకొందురా? మిమ్ములను మీరు తీర్పు తీర్చుకొందురా? ప్రభువు మిమ్ములను తీర్పు తీర్చడు లేక మిమ్ములను గద్దించడు. ఇదిగో, ప్రభువు మిమ్ములను ఉన్నతమైన మరియు పరిశుద్ధ పిలుపును పిలచియున్నాడు. అవును, ఇప్పుడును ప్రభువు మీపై ప్రేమ మరియు కనికరముతో ఉన్నాడు. అవును, మీ పాపములు ఒప్పుకోనిన యెడల, అవును, ప్రభువు మిమ్మును శుద్ధి చేసి మరియు క్షమించును, మరియు ఆయన మిమ్ము పక్షిరాజు వలె ఎగురునట్లు చేయును, మరియు నీవు ఆయన శక్తితో నింపబడుదువు, మరియు ఆయన వాక్య జలముల చేత మిమ్ములను కడుగును. ఆయన మిమ్ములను నూతన పరచును. ఆయన నీ హృదయమును మార్చును మరియు మాంసపు హృదయమును ఇచ్చును. ఇదిగో, ప్రభువు దినము సమీపముగా ఉన్నది. నా ప్రసంగీకుడైన నోవాహుపై ఈ సమస్త లోకము వారి దృష్టిని నిలుపలేదు, మీరును ఆలాగు చేయుచున్నారు, అయితే వారు పట్టించుకోక మరియు స్వీయ తృప్తి పొందినవారై, వారు దేవుని అగౌరవపరచిరి, అవును, మరియు పరిశుద్ధాత్మను దూషించిరి, ఆలాగు ప్రతిదినము జరిగెను. ఆయన చెప్పినది చేయుదును అని ప్రభువు సెలవియ్యలేదా. ఇదిగో, ప్రభువు యొక్క వాక్యము వారిని చెరపట్టి, ఇదిగో, వారందరూ నశించిరి. అందువలన, నేను మీతో చెప్పుచున్నాను, ఇది చెడ్డ ఘడియ, ఇది చెడ్డ దినము; మీరు నా ఆత్మ ద్వారా నడిపింపబడి మరియు నా వాక్యమును అనుసరించినయెడల, మీరు మోసగింపబడరు. ఇదిగో, నేను మిమ్ములను కాపాడుదును మరియు సంరక్షించెదను, మరియు మిమ్ములను సత్యముతో నిలిపి మరియు నా రాకడ దినమున మిమ్ములను పునరుద్ధరించెదను."] ఆమేన్.

ఒక సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను. ఇక్కడున్న వారిలో పెంతెకోస్తు వారెందరు? పెంతెకోస్తువారు చేతులెత్తండి. ఆచరణలో మీరందరునూ, ఇప్పుడు, ఇక్కడున్న వారిలో ఎందరు క్రైస్తవులుగా చెప్పుకొనుచున్నారు? ఎక్కడున్నప్పటికిని క్రైస్తవులమన్నవారు మీ చేతులెత్తండి. ఇది జరుగునని దీనిగూర్చి బైబిలు చెప్పెనని, మీకు తెలియునా?

రానున్న ముట్టడి నుండి ఏలాగు తప్పించుకోవలెనో, మీరేమి చేయవలెనో అని వారు పాత నిబంధన కాలములో బాధపడుచుండినప్పుడు ఇది జరిగెను. ఆత్మ ఒకతని మీదికి దిగి శత్రువునెచ్చట కలిసికొనవలెనో, ఏలాగు, దేనితో శత్రువును జయించవలెనో అతడు ప్రవచించి వారికి చెప్పెను. అది పాత నిబంధన, క్రొత్తదానివలెనే ఉండెను.

110"అతడా, ఓ, ఆలాగుండలేదు," అని ఇప్పుడు ఎవరైనా చెప్పవచ్చును. కాని అది ఆలాగున్నచో ఏమిటీ? ''నేను ముందే ఇది విన్నాను," అని మీరనవచ్చు. కాని ఇది ఆలాగుండినచో నీ మాటేమిటి? మీరు చూడండి. అది పరిశుద్ధాత్మ చెప్పుచున్నదే గనుక అయితే ఇక్కడున్న వారిలో చాలామంది హృదయ పరివర్తన అవసరతలో నున్నారు. జరుగవలసిన కార్యములున్నవి. కనుక ఇప్పుడు మీతోనే జరుగవలెను.

ఉన్నట్లు నేను వచ్చెదను, ఒక్క సాకు చెప్పకుండా,

నా కొరకు నీవు రక్తము చిందించితివి,

నీవు నీ యొద్దకు…

(అదే అప్పుడాయన నిన్ను పిలచెను)

… నీ యొద్దకు,

ఓ దేవుని గొర్రెపిల్లా…..

"నేనా మొండి హృదయములను తీసివేసెదను. నాకు లోబడునట్లు చేయు ఒక మాంసపు గుండెను నేనుంచెదను.''

….. నేను వచ్చుచున్నాను!

ఉన్నట్టు నేను వచ్చెదన్, నీవు నన్ను చేర్చుకొనుము,

నీవు నీ ఎన్నికను ఈ రాత్రి చేసికొందువా? రెంటిలో నీవు కోరునది చేయవచ్చును. నేనది ఇంతకు ముందే విన్నానని నీ వనవచ్చును. కాని ఇది నీవు చివరిసారి వినుట కావచ్చును.

ఎందుకనగా నీ వాగ్దానము నేను నమ్ముచున్నాను,

ఆ పాత-కాలపు వేదిక పిలుపులు, ఈనాడు పనికి రావటము లేదు, కాని దేవుడు ఇంకనూ వాటిలో సంచరించుచున్నాడు. సంఘమా, అది నీపై సంచరించుచున్నట్లుగా భావించుట లేదా?

… నేను వచ్చుచున్నాను!

REV 3:20

 

111ఓ, ఆలోచించు, నేడు హృదయములు బండలుగా తయారగుచున్నవి, లోకముతో, భేదములతో, సంఘ సభ్యులతో, నులివెచ్చనితనముతో, ఆ యువ, ధనిక అధికారివలె నిండిపోవుచున్నవి. ఈ లవోదికయ సంఘ కాలములో ఆ గొప్ప పరిశుద్ధాత్మ తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నదని తెలియదు. ''నా స్వరము [వాక్యము] వినువాడు తన హృదయమును తెరచును. నేనతనిలోనికి వచ్చి అతనితో భోజనము చేయుదును."

కొద్ది నిమిషాల క్రితం ఈ సోదరుని ద్వారా ఆత్మ మాట్లాడి ఇట్లు చెప్పాను, "నేను మీలో నుండి ఆ రాతి హృదయమును తీసివేసి, మాంసపు హృదయమును ఇచ్చెదను. దేవుని పట్ల మృదువుగా నుండునట్లుగా." చూడండి ఇప్పుడది ఎట్లు తయారయినదో: కేవలము ఒక మేధాశక్తితో కూడిన ఉద్రేకము, చూచారా; క్రీస్తు పట్ల మాధుర్యము మరియు ప్రేమతో నిండిన ఒక మృదువైన హృదయము కాదు.

ఆ విధమగు హృదయము నీవు కోరుట లేదా? ఆయనను గూర్చిన బాహ్యజ్ఞాన భావనతో క్రీస్తును ఏలాగు నీవు ఎదుర్కోనైయున్నావు? నీవు నిత్యజీవమును పొందవలసియున్నావు.

….. చిందించబడెను

(రక్తము ద్వారా సిద్ధపాటు జరిగినది)

నీవు పిలచుచున్నావు

(ఆయనేమి చేసెను? ఆయన రక్తము చిందించెను, మరియు ఇప్పుడు నిన్ను రమ్మని ఆహ్వానించుచున్నాడు.)

….. నీ యొద్దకు

ఓ దేవుని గొర్రెపిల్లా, నేను వచ్చుదును! నేను వచ్చుదును!

112ప్రతి క్రైస్తవుడు, మనము నెమ్మదిగా చేతులెత్తి ఇప్పుడు ప్రార్ధించుదము:

ఓ, దేవా, దయయుంచి, ప్రభువా, మేము జీవించుచున్న దినమును పట్టుకొనుము, ఓ, ఇది చాలా కఠినముగా నున్నది తండ్రీ. సాతాను ఇప్పుడు జనులకు చాలా చేసినది. వారి హృదయములు బండలైపోయినవి. నీ ఆత్మ సూటిగా మాట్లాడుచున్నది. నీ వాక్యము ముందుకు వచ్చుచున్నది, బయలుపరచుము. కాని ఆ పాత-కాలపు తిరిగి-జన్మించు అనుభవము; అది ఒక శాఖా పూర్వకముగా, బాహ్యజ్ఞాన భావనగా, ఎంతో సంగీతము, ఎంతో కేకలు, ఎంతో అల్లరిగా మార్చిరి. కాని నిజంగా ఆ మాంసపు గుండె, ఆ ఆత్మ, ఆ నిత్యజీవము, నిశ్చయంగా సంఘమునకు తెలియనివి అయినవి.

దేవా, అది నా స్వంత హృదయమును బద్దలు చేయుచున్నది. నేను - నీ కృప ద్వారా రక్షించబడిన ఒక పాపిని. తండ్రీ, నీవు ఏ సంఘము కొరకు చనిపోయి, సంఘమును విడిపించ యత్నించుచున్నావో దీనిని చూచి నేనెంతో విచారించుచున్నాను. ఇతర దేశములలోను, అమెరికాలోను ఉన్న సంఘము గూర్చి నీవిచ్చిన దర్శనమును నేను ఆలోచించుకొనుచున్నాను. ఎంత భయంకరమగు రాకెన్-రోల్ నగ్న నృత్యమది. కాని ఎక్కడో మరొకరు ఆశీర్వదించబడినవారు వచ్చుట నేను చూచుచున్నాను.

తండ్రి, ఈ రాత్రి ఇక్కడ జీవమునకు నిర్ణయించబడిన వారున్నచో, లేదా దానిని స్వీకరించగోరు వారున్నచో, వారది చేయుటకు ఘడియ ఇదేనని నేను ప్రార్ధించుచున్హ్నాను. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఇప్పుడు రాతి హృదయమును బ్రద్దలు చేయుము, లోకము యొక్క పాత హృదయము చీల్చుము, వారొకవేళ శాంతిని కోరినచో, వారు సంతృప్తిపరచగోరు దానిని కోరుచున్నచో, నిశ్చయతను ఇచ్చునదేదో కోరుచున్నచో, వారి సమస్త తలంపులను మించిన శాంతి వైపునకు, చెప్పనాశక్యము గాని ఒక సంతోషమును మరియు సర్వ మహిమను లేదా మరణము కూడా హాని చేయజాలని దాని వైపునకు నడిపించు క్రీస్తు యొక్క నాయకత్వము వారు ఈ రాత్రి అంగీకరించుదురు గాక. తండ్రీ, దానిని అనుగ్రహించుము.

113ఇప్పుడు, మనము చేతులెత్తి, ఈ భవనములో నున్నవారిలో ఎందరు, "నేను నిలబడుదును," అని చెప్పగలరు? ఇప్పుడు, నీ ప్రక్కనున్న వారిని నేను పట్టించుకొనుట లేదు. దేవుడే నీతో మాట్లాడుచున్నాడు. నిజంగా నీవు అసలైన క్రైస్తవునిగా నుండగోరినచో, చూడుము, ఏదైనా గానీ … దానికన్న తక్కువైనది. అనుకరణయే. ఓ, దానికన్న నేను బయటకు వెళ్ళి లోకములో నుండెదను. మీరు కూడా అంతేనని నేను నమ్ముచున్నాను.

ఇప్పుడు, మీరు వాక్యము ద్వారా, వర్తమానము ద్వారా మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. నిజ క్రైస్తవుడనగా ఎట్లుండవలెనో పరీక్షించుము: కరుకైనది, ఈ ఆధునిక క్రైస్తవ్యములో ఏదియూ కాదు, ప్రేమించునది. ఎందువలన, అది మృదువైనది, సున్నితమైనది, సగము చచ్చినది, క్రుళ్ళినది, ప్రత్యుత్పత్తి కానిది. చూచారా, అది నిజమైన క్రైస్తవ్యము కాదు. ఏలాగయినా జీవించు గాని, సంఘానికి చెందియుండు అనునది క్రైస్తవ్యము కాదు, క్రీస్తుతోను, పరిశుద్ధాత్మతోను మాధుర్య సహవాసము నీవు కోరుచున్నావా? … నీ స్వంత హృదయము వాక్యము పట్ల నిశ్చయతను కలిగియున్నదా? క్రీస్తులోనికి కదిలి రమ్ము! నీవది కోరినచో, ఈ జనుల గుంపు మధ్య ఈ రాత్రే నీ స్థానమును దేవుడు చూడవలెనని కోరుచున్నచో దానిని చేయుము.

''సహోదరుడు బ్రెన్హాం, అది ఏమైనా అర్ధవంతమైనదా?" అని నీవనవచ్చును.

ఓ, అవును, నిశ్చయంగా, అది అర్ధవంతమైనది. "నీవు మనుష్యుల యెదుట నా గూర్చి సిగ్గుపడినచో, నీ గూర్చి నేను తండ్రి యెదుట, పరిశుద్ధ దూతల యెదుట సిగ్గుపడెదను. ఈ భూమి మీద నన్ను ఒప్పుకొని, నా కొరకు నిలబడు వానికొరకు నేను ఆ దేశములో వాని కొరకు నిలబడెదను. వానిని నా తండ్రి యెదుట నేను ఒప్పుకొందును."

MATT 24:24•

MARK 13:22•

1COR 13:1

 

114నీవు స్త్రీ, పురుషుడు, బాలుడు, లేదా బాలిక ఎవరివైనను, క్రైస్తవునివైనా కాకపోయినా, సేవకునివైనా, పెద్దవైనా, మరెవరివైనా ఏమి పరవాలేదు, నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించినచో, ఒక్క క్షణము పాటు, నీవు యదార్థతతో నున్నావని ఈ రాత్రి దేవుడు తెలిసికొనునట్లుగా ఈ మాత్రము చేయుము.

"ఇప్పుడు చూడు, నేను పెంతెకోస్తును," అని నీవనవచ్చు, "నేను ఇది," లేదా ఏదో కావచ్చును. "నేను ఆత్మలో నాట్యమాడుటను ఒప్పుకొనుచున్నాను. కాని సోదరుడా, బ్రెన్హాం, అది ఉన్నంతకాలము మాకది ఉన్నట్లే," అని నీవందువేమో, నీకు లేదు.

దేవుని ప్రవక్తవని నీవు నన్ను నమ్మినచో, నీవు నా మాటలు వినుము, చూచారా. అది ఈ రోజున ఒక మోసము. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చునంత దగ్గరగా నుండునని బైబిలు చెప్పలేదా? ఏర్పరచబడిన వారు, "ఆత్మను సహితము."

లోకపు క్రియలు ఇంకా నీలో ఉండి కూడా నీవు ఆత్మతో నాట్యము చేయుచున్నావంటే, ఏదో తప్పు జరిగినది. నీవు భాషలతో మాట్లాడవచ్చును. పౌలు చెప్పెను, "నేను మనుష్యుల భాషతోను దేవదూతల భాషతోను మాట్లాడవచ్చును, కాని ఇంకా రక్షింపబడి యుండకపోవచ్చును." హూ-హూ రెండు రకములు, చూచారా. "నేను అన్ని ఉద్రేకములు చూపవచ్చును. విశ్వాసము కలిగియుండవచ్చును. నేను సువార్త ప్రకటించవచ్చును. బీదలను పోషించుటకు నా ఆస్తినంతయూ ఇవ్వవచ్చును. లోకమంతటికి మిషను పొలములలోనికి నేను వాక్యమును మోసికొని పోవచ్చును — కాని నేను వట్టివాడనే." చూచారా? సోదరుడా, అది అంతరంగములోని అంతరంగము. నీవు చనిపోయినప్పుడు నీ ఆత్మ బ్రద్దలగును — అది ఎగిరిపోవును — కాని నీ ప్రాణము జీవించును, చూచారా.

EZEK 9:4

 

115ఇప్పుడు, నీవైపు చూచుకొనుము. నీవు నిజంగా ఒక అసలైన బైబిలు క్రైస్తవునిగా, నిండుగా దేవుని ప్రేమ కలదా? గుర్తుంచుకొనుము, బైబిలు చెప్పుచున్నది, ఈ సమయము వచ్చినప్పుడు చివరి దినములలో, ఒక ముద్రవేయు దూత సంఘముల గుండా వెళ్ళినది, పట్టణముల గుండా వెళ్ళినది, ఆ పట్టణములో జరుగుచున్న హేయ కృత్యమును చూచి నిట్టూర్చి, మొరపెట్టిన వారికే కేవలము ముద్రవేసినది," అని ఆయన చెప్పెను. అది నిజమా? యెహెజ్కేలు 9. అది సత్యమని మనమెరుగుదుము. ముద్రవేయు దూత బయలు వెళ్ళి, వారి తల, నొసటి మీద ముద్రవేసెను, "నిట్టూర్చి, మొరపెట్టిన వారినే," ముద్రించెను.

ఆ తరువాత భూమిని నాలుగు దిక్కులలో వధించు దూతలు వచ్చును, ఇప్పుడు అవే వచ్చుచున్నవి. అది వచ్చుట మనము చూస్తున్నాము. సర్వభూమిని చంపు యుద్ధములు కదిలి వచ్చుచున్నవి. ఆ ముద్ర ఉన్నవారిని తప్ప, అది అంటుకొనజాలనిది ఏదీలేదు.

ఇప్పుడు ఎన్నుకొనుము …. నీ హృదయము పాపులయెడల, మరియు సంఘము, జనులు చేయుచున్న దానిని చూచి దివా రాత్రులు నీవు నిట్టూర్చి మొరపెట్టునంత వింత కలిగియున్నావా? ఆలాగు లేనిచో, నేను ఆశ్చర్యపడుచున్నాను. అది లేఖనము.

116నీవు నిలబడి ఇట్లు పలుకగలవా, "ప్రియ దేవా, సహోదరుడు బ్రెన్హాం చెప్పెను గనుక నేను నిలబడలేదు కాని, ఆయన వాక్యము దానిని చెప్పుట విన్నాను. మరియు నేను ఇది చేయదలచుకొన్నాను. నీ కొరకే, ప్రభువా, నేను నిలబడ్డాను. ప్రభువా, నేను అక్కరలోనున్నాను. ఈ స్థలములో నీవు నా అక్కరను తీర్చుదువా? నేను నిలబడితిని." దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. ''నేను అవసరతలో నున్నాను. నాపై కృప చూపమని నిన్ను కోరుచున్నాను." దేవుడు నిన్ను దీవించును. "నేను అలాంటి క్రైస్తవునిగా ఉండగోరుచున్నాను…"

నీ ప్రక్కన నిలబడిన వ్యక్తి కూడా నీవలెనే ఉన్నాడని ఇప్పుడు జ్ఞప్తి చేసికొనుము. వారిని సమీపించి వారి చేతిని పట్టుకొని, ''సోదరుడా, సోదరీ, ఇప్పుడు నా కొరకు ప్రార్ధించుము. నీవు నా కొరకు ప్రార్ధించుము. "నేను…" అని చెప్పుము. క్రైస్తవ యధార్థమంతటితో దానిని పలుకుము. "నా కొరకు ప్రార్ధించుము. నేను దేవునితో సరిచేసికొనగోరుచున్నాను. నా కొరకు నీవు ప్రార్ధించుము. నీకు అవకాశ మిచ్చునట్లు నేను ప్రార్ధించుదును.''

నాకు తెలియును మనము… ఇక్కడ ఎక్కువ కాలము మనముండము. మీరది చూడుడి, మనము అంత్యకాలములో నున్నాము. దానిని నమ్ము వారందరూ, "ఆమేన్." చెప్పండి. ఏది ఇక మిగిలిపోలేదు. అంతా అయిపోయినది. విశ్వ ఐక్య సంఘ సమితిగా ఏర్పడుటకు సంఘములు సంఘటితమగుచున్నవి. ప్రపంచము, దాని…

117ఇటు చూడండి. ఇక్కడున్న లాస్-ఏంజలస్ తదితర స్థలములను గూర్చి ప్రభువు ఏమి చెప్పెనో మీరెరుగుదురా? "అది వెళ్ళిపోయెను," కెనడాలోను, ఇక్కడి అలాస్కాలోను ఆ భూకంపము ఏలాగు వచ్చునో రెండు సంవత్సరముల క్రితం నేనేమి చెప్పానో గుర్తున్నదా? ''హాలీవుడ్, లాస్-ఏంజలస్ సముద్రములోనికి జారిపోతున్నది. కాలిఫోర్నియా, నీకు తీర్పు జరుగనైయున్నది! కాలిఫోర్నియా మాత్రమే కాదు, కాని లోకమా, నీకును తీర్పు జరుగనైయున్నది! సంఘమా, నీవు దేవునితో సరిచేసికొననిచో నీకు తీర్పు జరుగును." పరిశుద్ధాత్మ ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

ఆలాగు జరగనిచో నేనెప్పుడైనా ఆ నామము ఉపయోగించుట మీరు విన్నారా? నీకు నీవే అడుగుకొనుము! ఇరవై సంవత్సరముల నుండి మీరు నన్నెరుగుదురు. జరుగునదే తప్ప మరేదైనా నేను ఎన్నడైనా ప్రభువు యొక్క నామములో చెప్పితినా? నేనెప్పుడైనా జరుగునని చెప్పినది జరిగినచో "ఆమేన్." చెప్పండి. నేను మీకు చెప్పుచున్నాను, ఇదే ఆ ఘడియ, మీరు సరిచేసికొనుట మంచిది, , మనందరము.

ఇప్పుడు, ప్రతి ఒక్కరము మరొకరి కొరకు ప్రార్ధింతుము:

118ప్రియ దేవా, ఒక మృత జనాంగముగా, ఈ రాత్రి ఇక్కడ మేము నిలబడి మా ముఖములు నేల వైపునకు, ధూళి వైపుకు త్రిప్పియున్నాము. మేము కేవలము … ఈ కత్తిరించు ప్రసంగము నీవు మాకిచ్చియున్నావు ప్రభువా! ఇద్దరు మనుష్యుల యొక్క ఉదాహరణను మేము చూశాము. అందులో ఒకరు మతనిష్టగలవానిగా ఉండి, సంఘమునకు వెళ్ళెను గాని నిత్యజీవము యొక్క నాయకత్వమును తిరస్కరించెను. మరొకరు లోక కీర్తిని తిరస్కరించి, నిత్యజీవము వైపు తిరిగెను. వారిద్దరి స్థితిని బట్టి ఈ రాత్రి బైబిలు ప్రకారము చూచుచున్నాము. ధనవంతుడు యాతనలో నుండెను, మోషే మహిమలో నుండెను.

తండ్రీ, మేము మోషేవలె ఉండగోరుచున్నాము. మేము నీ పరిశుద్ద కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవమునకు నడిపించబడగోరుచున్నాము. ప్రభువా, దానిని ఈ రాత్రి మా హృదయములకు ఇమ్ము. ఆ పాత రాతి హృదయమును పగులగొట్టుము. దానితో నీవు మాట్లాడు, వ్యవహరించు మాంసపు గుండెను, క్రొత్త హృదయమును పెట్టుము. మేము గర్విష్టులముగా, భేద భావముతో నుండము. ప్రభువా, పరిశుద్ధాత్మ ఎన్నడూ విడిచిపెట్టకుండు గాక! ఈ జనులను ఆయన వచ్చి ముద్రించును గాక! వారితో మాట్లాడుము. రాతి చిత్తమును వారిలో నుండి చించివేయుము, దైవ చిత్తమును దానిలో నుంచుము. తండ్రి, ప్రతి ఒక్కరిని రక్షించుము. మాకు నీ ప్రేమను ఇమ్ము, సమస్త - ఉద్రేక భాగము నుండి దూరము కాబడి, నిజమైన బలమైన అనుభూతి భాగము నొద్దకు, ఆ స్థలము నొద్దకు ప్రభువా నడిపించుము, హృదయ తాకిడి భాగము, ఆత్మ యొక్క గంభీరత, దేవుని యొక్క ఐశ్వర్యత, ఆత్మ యొక్క రాజ్యము మా హృదయాలలో నుంచుము. ఓ, గొప్ప నాయకుడా, గొప్ప పరిశుద్ధాత్మా, నీ సంఘముతో మేఘముల లోనికి నీవు ఎగిరిపోవుటకు ముందుగా దానిని అనుగ్రహించుము.

119ఓ దేవా, నన్ను పోనిమ్ము, ప్రభువా. యేసు, నన్ను వెనుక ఉండనీయకుము. తండ్రీ, నీతో నన్ను కొనిపొమ్ము, వచ్చుచున్న శ్రమలను ఈ భూమిమీద చూచుటకు ఇక్కడ నేను ఉండగోరుట లేదు. ఇక్కడి ఈ పిచ్చిలో నేనుండగోరుట లేదు, నీచమగు దృశ్యములు … ఇక్కడ నేను ఉండగోరుట లేదు. ప్రజలు వారి మతిని పోగొట్టుకొనుచున్నారు. మనిషి మృగమువలె ప్రవర్తించుటకు, మృగములవలె కనబడుటకు ప్రయత్నించుట మేము చూచుచున్నాము. స్త్రీలు ముఖములపై రంగులు పూసికొని జంతువులవలె కనబడుటకు ప్రయత్నించుచున్నారు. ఈ సంగతులు జరుగునని ముందే తెలిసికొనియున్నాము. స్త్రీలను తరుముటకు స్త్రీల వంటి జుట్టుతో మిడుతలు లేచువరకు వారు ఆలాగే మతిపోయి పిచ్చిగా ప్రవర్తించుదురు, సింహముల వంటి పండ్లు, మొదలగు సంగతుల గూర్చి నీవు చెప్పినావు. మనుష్యుల యొక్క మానసిక స్థితి పూర్తిగా దిగజారిపోయినది. ప్రభువా, ఇప్పుడు సరిచేయుటలో మేము దానిని చూచుచున్నాము. సహాయము చేయుము, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సును కలిగియుండునట్లు పునరుద్ధరించుము.

నిత్యజీవము యొక్క ఓ గొప్ప నాయకుడా, ఈ రాత్రి నీ వాగ్దానమును మేము అంగీకరించుచున్నాము, తండ్రీ. నేను ఈ ప్రజల కొరకు బ్రతిమలాడుచున్నాను. ప్రభువా, యేసుక్రీస్తు నామములో వారందరి నిమిత్తము బ్రతిమలాడుచున్నాను. దేవుని కుమారుడగు క్రీస్తు మాలోని ప్రతి ఒక్కరి హృదయములోనికి వచ్చునట్లుగాను, ప్రభువా, యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మమ్మును మలచి తయారు చేయునట్లుగాను నేను ప్రార్ధించుచున్నాను. ప్రభువా దేవా, దీని అనుగ్రహించుము.

మేము నిన్ను ప్రేమించుచున్నాము. మేము మా… మార్పు మాలోనికి వచ్చి మేము నీ బిడ్డలమగునట్లుగాను, నీ ఆత్మ సంచారమును మా హృదయాలలో అనుభవించునట్లుగాను, ప్రభువా, మేము జీవించుచున్న ఈ పిచ్చి యుగమును గూర్చిన అవగాహనను మాలోనికి తెచ్చి నిలబెట్టుము. దేవా, దానిని అనుగ్రహించును. యవ్వన స్త్రీలు దయ్యము యొక్క గూడులో అంతగా పట్టుబడుట, యవ్వన పురుషులు వంకర బుద్ధులతో, పిల్లలు మత్తు మందులతో, సిగరెట్లు త్రాగుచూ, మద్యము సేవించుచూ అవినీతికరంగా జీవించుట చూస్తున్నాము. సాతానుని ఏదేను…

దేవా, బైబిలు ప్రకారము ఏదేను నిర్మించుటకు అది ఆరువేల సంవత్సరములు తీసుకొన్నది. దానిని ఏలుటకు నీవు నీ కుమారుని, అతని భార్యను అక్కడ ఉంచావు. (అతని వధువు) సాతాను వచ్చి దానిని వంకరగా చేసినది. వాడికి ఆరువేల సంవత్సరములున్నవి. వాడు తన స్వంత బాహ్యజ్ఞాన ఏదేనును విజ్ఞానము, మరియు విద్య, నామకార్ధ తెలివి వలన నిర్మించెను. వాడు దానిని ఒక మరణ గందర గోళముగా నిర్మించెను.

ఓ, దేవా, తిరిగి మమ్ము ఏదెను నొద్దకు తీసికొనిపొమ్ము, ప్రభువా, అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు. ప్రభువా, దానిని అనుగ్రహించుము. రెండవ ఆదాము తన వధువు కొరకు వచ్చునని మేము దీనముగా నిలబడి, ఎదురు చూస్తున్నాము. ఆయనలో మమ్ము భాగముగా చేయుము తండ్రి, యేసు నామమున ప్రార్ధించుచున్నాము. ఆమేన్.

120మీరు దేవుని ప్రేమించుచున్నారా? మీరు తాకగలరా…? నేనేమి చెప్ప ప్రయత్నించుచున్నానో మీరు గ్రహించారా? మీరిది అర్ధము చేసికోకలిగినచో చేతులెత్తి, "నీవేమి చెప్ప ప్రయత్నించుచున్నావో నాకు అర్ధమయినది," అని చెప్పుము. ఈ యుగము యొక్క పిచ్చితనమును నీవు చూశావా? చూడు … అదేట్లు అయిపోయినదో, ఇక ప్రజల మధ్య సరయిన వివేచనలు కూడా లేవు. అన్నీ పోయినవి!

ఎక్కడ మన… నాయకుల సహితము? మన దేశాధ్యక్షుని చూడండి! ''వారికి కమ్యూనిజము కావాలంటే, పొందనీయండీ. ప్రజలు దేనిని కోరుచున్నారో దానినే పొందనీయండి." మన పాట్రిక్ హెన్రీలు, జార్జి వాషింగ్టన్లు ఎక్కడ? ఒక నియమము కొరకు నిలబడగలిగిన మన నాయకులు ఎక్కడ? ఇక అట్టివారు మనకు లేరు.

మన సంఘములు, మన సేవకులు ఎక్కడ? ప్రజలను అధికారపూర్వక నిషేధముతో, లేక … సంఘములో చేరి దీనిని చేయి లేదా ఒక చిన్న ఉద్రేకము లేదా మరేదో కలిగియుంటున్నారా? లోకము యొక్క సంగతులన్నింటిని ఎదిరించి బయట నిలబడకలిగిన ఆ దైవజనులు, ప్రవక్తలు ఎక్కడ?

ఆ యధార్థత కలిగిన మనుష్యులెక్కడ? వారెక్కడున్నారు? వారెంతో మెత్తగా యున్నారు. మరియు బాహ్య జ్ఞాన భావనలు మొదలగువాని ద్వారా, వారిక ఇక్కడ లేకుండా పోయి యున్నారు. ఓ, దేవా, మాపై కృప చూపుము.

121ఆ నీచకరమగు దృశ్యములు భూమి మీదకు వచ్చుచున్నవి… దానిలోనికి జనులు ఏలాగు కదిలి వెళ్ళిపోవుచున్నారో మీరు చూడగలరు. అది ఒక పిచ్చితనము. కాని ఆ సంగతులు జరిగినప్పుడు, సంఘము ఎత్తబడును.

దేవా, మమ్ములను అక్కడ ఉండనిమ్ము. ఈ రాత్రి ఈ భవనములో ఉండిన ఆ గొప్ప సహజాతీత వ్యక్తియగు, నిత్యజీవమును ఇంకా కలిగియుండిన ఆ గొప్ప యేసుక్రీస్తుకు అదే నా ప్రార్ధన. నేనిక్కడ ఉండి, నా కండ్లు తెరచి, నీవు నీ రక్తముతో విమోచించిన సంఘమును చూస్తూ, క్రీస్తూ, నీకు ప్రార్ధించుచున్నాను. దేవా, మాలో ఏ ఒక్కరిని నశించిపోనీయకుము. మేము నీతో సరిగ్గా నుండగోరుచున్నాము. కనుక ఓ దేవా, మమ్మును మా అపవిత్రత అంతటి నుండి శుద్దీకరించుము. మా పాపములను, క్రియలను తీసివేయుము.

మాలోని రోగులను నీవు లేపుట, మాలోని మృతులను సహితము నీవు లేపుట మేము చూచాము (ప్రార్ధన ద్వారా తిరిగి జీవమునకు వచ్చుట), తండ్రీ. ఇవన్నీ జరుగుట మేము చూచియున్నాము. ఇప్పుడు మమ్మును తిరిగి ఆత్మీయముగా జీవములోనికి తెమ్ము; క్రీస్తు యేసు ద్వారా నిత్యజీవము యొక్క గ్రహింపులోనికి తీసికొనిరమ్ము. తండ్రీ, దీనిని అనుగ్రహించుము. ఇదంతయూ నీకు సమర్పించుచున్నాను. యేసుక్రీస్తు నామమున.

మనము కలిసికొను వరకు!

మనము కలిసికొను వరకు

యేసు పాదముల నొద్ద తిరిగి మనము కలిసికొను వరకు;

మనము కలిసికొను వరకు!

(ఆయన వైపు చూడుము, మనలను ఆయనే మృదువుగా చేయనీయండి)

… మనము కలిసికొందుము!

తిరిగి మనము కలిసికొనువరకు దేవుడు మీతో నుండును గాక

ఇప్పుడు మన చేతులు ఎత్తుదము:

మనము కలిసికొను వరకు! మనము కలిసికొను వరకు!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...