నమ్మువారికి సమస్తమును సాధ్యమే

నమ్మువారికి సమస్తమును సాధ్యమే

1

సహోదరుడు బాక్స్టర్, బిల్లీ, నాకు సహాయము చేయమని నిన్ను నేను కోరుచున్నాను... లేక, మీలో కొంతమంది, ఇక్కడ. అది సరియే. J-35 నుండి 50, మొదటిగా దానిని ప్రయత్నించెదము.

ఇప్పుడు, ఎవరైనా మీ కార్డును త్రిప్పండి. మీ కార్డుకు అవతలివైపు చూచుకొనండి. మరియు ఇప్పుడు, మీ పొరుగువాని యొక్క కార్డును చూడండి. వారు చెవిటివారై మరియు వినలేకయుండవచ్చు. ఒకవేళ వారు చెవిటివారైతే వారు లేవలేరు; వారు వారియొక్క నెంబరును వినలేరు. మరియు మేము మిమ్ములను కోరుచున్నాము... లేక, వారు ఒక నెంబరును పిలిచినప్పుడు ఒకవేళ ఎవరైనా కదలలేకయున్నట్లయితే, కేవలము చేయి పైకెత్తండి. అంతే. కేవలం మీ చేయి ఎత్తండి, మరియు ఎవరైనా మిమ్ములను బయటకు తీసుకొని వచ్చుటను మేము చూచెదము... మిమ్ములను తీసుకొని వచ్చెదరు కాబట్టి మేము పట్టుకొనగలిగెదము.

ప్రేక్షకులు వరుసలలో సర్దుకొనుచుండగా మనమందరము దానిని పాడెదము. ఇప్పుడు మనము ఎక్కువసేపు ఉండము. మనము ప్రార్ధించుచూ ఉందుము. అది సరియే. అది సరియే. అది సరియే.

కేవలం నమ్ముము, కేవలం నమ్ముము,

సమస్తము సాధ్యము, కేవలం నమ్ముము;

కేవలం నమ్ముము, కేవలం నమ్ముము,

సమస్తము సాధ్యము, కేవలం నమ్ముము.

2

మనము ఊహించెదము, ఒక వెచ్చని ఏప్రిల్ ఉదయాన్న, కొండ దిగుచూ ఒక ప్రియమైనవాడు వచ్చియున్నాడు, అతడి చుట్టూ అతని వస్త్రములతో, అతని చుట్టు ప్రక్కకు ఎగురుచు. అక్కడ అతనితో పాటు ముగ్గురు వ్యక్తులు నడుచుచున్నారు. మరియు మూర్ఛ వ్యాధి కలిగిన ఒక బిడ్డతో ఒక తండ్రి ఇక్కడకు వచ్చియున్నాడు. మరియు అతడు చెప్పాడు, “ప్రభువా, నా బిడ్డపై దయ చూపుము, అతడు ఒక దెయ్యంతో తీవ్రంగా విసుగు చెందాడు. కొన్నిసార్లు అతడు నీటిలోను, అగ్నిలోను పడుతుంటాడు. దెయ్యం అతడిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నది.”

ఆయన చెప్పెను, “ఒకవేళ మీరు నమ్మినటైతే నేను చేయగలను, నమ్ము వానికి సమస్తము సాధ్యమే.” అది నిజమేనా? “సమస్తము సాధ్యమే.”

మీరు చెప్పండి, “దేవునికి సమస్తము సాధ్యము.”

నీకు సమస్తము సాధ్యమే! — నమ్మువారికి. దానిని మీరు నమ్ముచున్నారా? అది సరియే. తిరిగి పాడెదము.

కేవలం నమ్ముము, కేవలం నమ్ముము,

సమస్తము సాధ్యము, కేవలం నమ్ముము;

కేవలం నమ్ముము, కేవలం నమ్ముము,

సమస్తము సాధ్యము, కేవలం నమ్ముము.

3

ఇప్పుడు, క్రైస్తవ స్నేహితులారా, ఒకవేళ ఇప్పుడే నా కొరకు చేసినట్లైతే, నేను ఒక సంగతి అడగబోవుచున్నాను. మీరు నిజముగా భక్తితో ఉండాలని కోరుచున్నాను. ఇప్పుడు, ఒకవేళ మన దేవుడు ఏదైనా చేయాలంటే, అప్పుడు మీరు ఆయనను స్తుతించండి. కాని ఇప్పుడు... చూడండి, అది కష్టము. సహోదరుడు బాక్సటర్ కి తెలుసు. అది నిజమేనా, సహోదరుడా? ఇటువంటి స్థానములో వుండుట చాలా అరుదు, చుట్టూ ఆత్మలతో, ప్రతి చోటా వ్యాధిగ్రస్తులు మరియు అక్కడ మానవులూ వున్నారు. మరియు ప్రతి వ్యక్తి ఒక ఆత్మతో పట్టబడ్డాడు. మరియు ఆ ఆత్మలు: ఒకటి ఇటు వైపు కదులుతున్నది, మరియు ఒకటి అటువైపు కదులుచున్నది. అది కూటము నుంచి బయటకు వెళ్ళును, తిరిగి ఇక్కడకు వచ్చును, మరియు ప్రతి చోటా, ప్రజలను పిలచుటకు వెళ్ళును, తప్పు ఏమిటో వారికి చెప్పును, మీరు చూడండి, మరియు వారి పరిస్థితి, మీరు దానిని గమనించెదరు.

ఇప్పుడు, యేసు ఇక్కడ ఉండినయెడల, మీ అవిశ్వాసములో ఆయన నిన్ను స్వస్థపరచగలడా? ఇప్పటికే చేయబడిన దానికన్నా మీ స్వస్థత కొరకు ఏదైనా చేయబడునా? ఒక్క సంగతి కూడా చేయబడదు. మిమ్మల్ని స్వస్థపరచగలిగేది నాలో ఏమియూ లేదు; ఒక్క సంగతి కూడా లేదు. సహోదరుడు జాక్సన్, అతడు ఎంతగా రోగులకు ప్రార్ధించినా కూడా, స్వస్థపరచగలిగేది నీలో ఏదియూ లేదు; ఉన్నదా, సహోదరుడా జాక్సన్? ఒక్కటి కూడా లేదు. రోగులకు ప్రార్ధించు సేవకులలో ఒక్కరు కూడా —ఒక్కటి కూడా కలిగిలేరు. మీరు చేయగలిగిన ఒకే ఒక్క సంగతి, వారిని యేసు వైపు త్రిప్పుటయే, వారిని అప్పటికే ఆయన స్వస్థపరిచియున్నాడు, చూచారా. ఆయన వారిని స్వస్థపరిచాడు.

ఇప్పుడు, ఎవ్వరూ... ఇక్కడ ఉన్న ఏ సేవకులు కూడా, వారు మిమ్ములను రక్షించారు అని వారు చెప్పలేరు. వారు మిమ్ములను రక్షించలేరు. కాని పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితము కల్వరిపై మీ రక్షణ ఎక్కడైతే కొనబడినదో, అక్కడకు మిమ్ములను త్రిప్పెదరు. కేవలము మీరు దానిని అంగీకరించండి. ఆయన కల్వరిలో మరణించినప్పుడు రక్షణ యొక్క తండ్రితో యేసు దానిని పరిష్కరించుకొనెను. అది నిజమేనా? అది దానిని పరిష్కరించినది. ప్రపంచమంతా పాపము నుండి క్షమించబడినది, కానీ దానిని నీవు అంగీకరించేంత వరకు అది మీకు ఏ మంచియూ చేయదు. మరియు ప్రతీ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు, కాని దానిని నీవు అంగీకరించేంతవరకు అది నీకు ఏ మంచియూ చేయదు.

తరువాత సేవకులుగా మనము వాక్యమును ప్రసంగించెదము. మరియు వినుట వలన విశ్వాసము కలుగును, మరియు ఏమి వినుట? — దేవుని యొక్క వాక్యము. మరియు అప్పుడు, వాటి అన్నిటి తరువాత, అది సరిపోవలసియున్నది. అది కాదా?

కాని, వాటన్నిటి తరువాత, దేవుడు క్రిందికి దిగి వచ్చి మరియు సంఘములో వరములను పెట్టెను.

4

ఈ రాత్రి, ఉదాహరణకు, చెప్పినట్లయితే, బహుశా అక్కడ కూర్చొన్న ఆ స్త్రీ భాషలతో మాట్లాడవచ్చు. ఇక్కడ అనువాదము ఇచ్చు ఈ వ్యక్తి దానిని చెప్పును. అది ఆ స్త్రీ ఇక్కడ ఒక చక్రాల కుర్చీలో కూర్చొనియున్నది, ఆమె చేసియున్న ఒక ఖచ్చితమైన కార్యమేదో ఆ రోగమును తీసుకొని వచ్చినది లేక ఆమెతో జరిగిన తప్పు ఏదైనా; లేక ఇక్కడ ఈ వ్యక్తి, లేక మరెవరైనా. మరియు అది ఖచ్చితముగా అలాగే ఉండును. ఏమి జరుగబోవుచున్నదో అతడికి చెప్పును. అది దేవుని యొక్క ఒక వరము అని నేను నమ్ముచున్నాను. మీరు నమ్ముట లేదా? తరువాత ఆయన దానిని వుంచెను. ఆయన ప్రవక్తలను వుంచెను. మీరు దానిని నమ్మెదరా? ఆయన జ్ఞానము, బుద్ధి, భాషల యొక్క వరములు, భాషల యొక్క అనువాదములు. ఇవన్ని సంగతులన్నియు శరీరములో ఉన్నవి — అన్నీ శరీరములో ఉన్నవి.

ఇప్పుడు, ఆయన వాక్యము తరువాత, ఆయన ఇక్కడ క్రిందికి వచ్చి మరియు అటువంటి దేనినో తీసుకొనుట - ఎంత ఆలోచనతో ఆయన చేసెను చూడండి, మరియు దానిని పైకి తీసుకొని, వాక్యములో ఇంకనూ అవిశ్వాసము ఉండునని ఎరిగియుండియు — ప్రశ్న గురుతు. ఆయన ప్రియమైనవాడు కాదా? ఓ, మై. ఆయన ఎంత ఆశ్చర్యకరుడు.

5

ఇప్పుడు, ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నయెడల, మీలో ఏమి తప్పు ఉన్నదో ఆయన మీకు చెప్పగలడు, మీ పరిస్థితులను చెప్పి, ఏమి చేయాలో చెబుతాడు; కాని ఆయన నిన్ను స్వస్థపరచలేడు. ఒకవేళ స్వయముగా, ఈ సూటును ధరించి ఆయనే ఇక్కడ నిలబడియుంటే, ఆయన నిన్ను స్వస్థపరచలేడు, ఎందుకనగా ఆయన ఇప్పటికే దానిని చేసియున్నాడు. ఆయన రెండవసారి దానిని చేయలేడు. ఆయన, “నేను క్రీస్తును, మరియు నేను నీ యొక్క రక్షణను కొనియున్నాను... దీనిని నమ్మెదవా?” అని చెప్పును.

ఒకవేళ నీవు చెప్పినట్లయితే, “అవును, ప్రభువా, నేను దానిని నమ్మెదను. అది ముగించబడినది.” మంచిది, ఇది ఆయన వాక్యము; అదే సంగతి చెప్పును. ఆయన తన మాట కన్నా మరి ఎక్కువవాడు కాదు. అది నిజమేనా?

అది సరియే.

6

ఓ, మీరు ఒక చిన్న బాలికను కలిగియున్నారు... మంచిది అది ఎంతో మధురము. అంతా సరియే. కొంచెము ఆమెను ఇక్కడ కూర్చొండబెట్టుము. చూడండి, ఆమె వెనుక ఉన్నది. నీవు అక్కడే కూర్చొనుము. నీవు ఆమెతోనే నిలచియుండుము, ఒకవేళ నీకు అవసరమైతే, సహోదరుడా; కొంచెము ఇక్కడ నుండి వెళ్ళుము. [ఎవరో సహోదరుడు బ్రెన్హాంతో మాట్లాడుచున్నారు.] ఆ శిశువు? మంచిది, అది బహుబాగున్నది. నీ పేరేమిటి? నా సహోదరుడా, నిన్ను తెలుసుకొనుట నాకు సంతోషము. నీవు ఆ బిడ్డ యొక్క తండ్రివి కదా? అది మంచిది, అయ్యా. ఇపుడు, ఆ బిడ్డతో మాట్లాడుటకు బదులుగా నీతో మాట్లాడతాను, ఎందుకనగా అతడు కేవలము ఒక శిశువు.

ఇది మన మొదటి కలయిక అని నేను నమ్ముచున్నాను. నేను నిన్ను నా జీవితములో ఎన్నడు చూడలేదు. నాకు తెలిసినంత వరకు, ఇది మన మొదటిసారి కలయిక. ఇపుడు నేను నీతో ఒక్క క్షణము మాట్లాడవలసియున్నది... చూడండి. కొంచెము మీ చుట్టూ చూడండి, ప్రతీ చోటా: ప్రతీ చోటా ఆత్మలు, చూచారా — మానవులు. మంచిది, ఇపుడు, ఒంటరిగా అది దర్శనము అవ్వవలసియున్నది. గుర్తుంచుకొనండి, కొన్నిసార్లు మన ప్రభువైన యేసు వారితో మాట్లాడుటకు ప్రజలను ప్రక్కకు తీసుకొని వెళ్ళడా? ఆయన వారిని తీసుకొని వెళ్ళును. చూడండి, అది ఒక ఉద్దేశ్యము కొరకు: ఆత్మతో సంబంధం కలిగియుండుటకు.

గుర్తుంచుకొనండి, ఈ సంగతులు నాకు చెప్పిన ఆ ప్రభువు యొక్క దూత వచ్చియున్న కథను మీరు ఎప్పుడైనా విన్నారా? — నేను ఏమి చేయాలి? అది సత్యమని మీరు నమ్మెదరా? మంచిది, ఆయన నాకు చెప్పెను, ఒకవేళ నేను మిమ్ములను దానిని నమ్మునట్లుగా చేయగలిగితే, మరియు నేను ప్రార్ధించినపుడు యదార్ధముగా ఉన్నట్లయితే అది జరుగును. ఇపుడు, మీకు తెలుసు, ఆ చిన్న బాలికను నేను స్వస్థపరచలేను. ఆమెను స్వస్థపరచుటకు నా దగ్గర ఏమియూ లేదు. నేను వైద్యుడను కాను. నేను వైద్యుడనైనయెడల, ఆమెను నేను స్వస్థపరచలేను. బహుశా నేను కొంత చికిత్స సహాయం చేయగలను, కాని స్వస్థపరచువాడు దేవుడే. మరియు ఆయన ఇప్పటికే స్వస్థతను చేసియున్నాడు; దానిని నమ్ముటకు కేవలము మన విశ్వాసము అవసరమైయున్నది, మీరు చూడండి. అది నిజము.

7

మంచిది, ఇపుడు, మన ప్రభువు ఇక్కడ ఉండినయెడల... మరియు నేను అనుభూతి చెందు విధము... ఆ బాలిక ఆ వ్యాధితోయున్నయెడల... అటువంటి ఒక మధురమైన చిన్నది రోగముతో ఉండుట చూచుట. అటువంటి దానినే నేను గృహము యొద్ద ఒకటి కలిగియున్నాను. నా హృదయము దాని కొరకు ఏ విధముగా వెళ్ళినదో మీకు తెలుసు. ఆయన ఇక్కడ ఉన్నయెడల, ఆయన నిలబడి మీతో మాట్లాడును, బహుశా ఇలాగే: ఆయన మీకు చెప్పును, “మంచిది ఒక ఫలానా సయములో నీ బిడ్డ ఫలానా జ్వరము కలిగియున్నది,” లేక అది ఏమైనను. మరియు, “చాలా కాలము నుండి రోగముతో ఉన్నది,” లేక అటువంటిది ఏదో.

మంచిది, అది మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది, “అవును, అది ఆయనే అని నాకు తెలుసు, ఎందుకనగా అదే ఆ బిడ్డతో ఉన్న సంగతి.”

మరియు బహుశా నీ గురించి ఏదో ఆయన నీకు చెప్పును: నీవేమి చేశావో, లేక జరిగినదేదో జ్వరమునకు లేక రోగము బిడ్డ పైకి వచ్చుటకు కారణమైనది. ఒకవేళ ఆయన నీకు చెప్పినయెడల, అప్పుడు, మంచిది, దాని పైన ఆయన తన దానిని వుంచును, చెప్పండి, “మీరు నమ్మెదరా?”

మీరు చెప్పెదరు, “అవునయ్యా.” మరియు మీరు వెళ్ళిపోవుదురు. అప్పుడు ఆ శిశువు బాగుపడునని మీరు నమ్మండి. మీరు నమ్మరా? మంచిది, ఇపుడు ఇక్కడ తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు, అయితే ఆయన యొక్క వరములను ఆయన పంపించెను. మరియు పరిశుద్ధాత్మయే ఆయన వరము. మరియు పరిశుద్ధాత్మ ప్రజల యొద్దకు వచ్చు వరముల యొక్క లక్షణములను కలిగియున్నది.

మరియు ఇప్పుడు, ఆయన ఇక్కడ ఉన్నయెడల, మరియు నేను సత్యమే చెప్పియున్నాను, ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నయెడల ఆయన తన సొంత శరీరముతో చేసినట్లుగా ఇక్కడ తన సేవకుల ద్వారా అదే రీతిగా ఆయన స్వయముగా తననుతాను ప్రత్యక్షపరచుకొనును. అది నిజమేనా?

8

అయ్యా, నీవొక యదార్ధమైన విశ్వాసివని నేను నమ్ముచున్నాను. నీకుగా, నీవు అంతయు సరిగాలేవు. అది నీకు తెలుసు. కానీ నీ శిశువు, ఇక్కడ... అది ఒక జ్వరము కాదు. అది నీ శిశువునకు జరిగిన ఒక ప్రమాదము. అది నిజమేనా? ఆ శిశువు పడిపోయెనా, అది పడిపోయినటువంటిది? మరియు, ఓ, దానియొక్క మలాశయములోనికి ఒక చిన్నదేదో దూరినది. అది నిజమేనా? అది సత్యమేనా? మరియు అదియే అన్ని రకములైన లక్షణములు వచ్చుటకు కారణమైనది. దాని నుండి ఒక స్రావము కారుతుంది. అది నిజమేనా? మరియు నీవు నీ ప్రొస్టేట్ సమస్యతో ఉన్నావు. అది నిజమేనా, నా సహోదరుడా? [“అది నిజము”] మన తలలు వంచెదము.

మా పరలోకపు తండ్రీ, ప్రభువైన యేసును మరణములో నుండి తిరిగి తీసుకొని వచ్చినవాడా, నీ ఆత్మ ఇక్కడ వున్నది. ఈ చిన్న అమాయకమైన, మధురమైన చిన్న బిడ్డ ఒక ప్రమాదముతో ఇక్కడ పడియున్నది - దాని చిన్న శరీరమును చిధ్రము చేసినది. కానీ నీవు దేవుడవు. నీవు మాత్రమే దానిని స్వస్థపరచువాడవు. ఇప్పుడు, నీవు చెప్పిన దానిని బట్టి, నీవు సత్యము అని రుజువు చేశావు. మరియు నీ నామములో నా చేతులు ఉంచుచున్నప్పుడు నీవు ఆ బిడ్డను స్వస్థపరచెదవని నేను ప్రార్ధిస్తున్నాను, మరియు దానిని స్వస్థపరచమని అడుగుచున్నాను, ప్రభువా, ఆ బిడ్డ ఇక్కడ నుండి వెళ్ళి మరియు బాగవును గాక.

నీ సేవకునిగా, ఇప్పుడు... ఇప్పుడు, దురాత్మల సమూహము పైన నేను అధికారమును తీసుకొనుచున్నాను. దేవుని యొక్క సేవకునిగా, నా ప్రభువు యొక్క నామములో చేతులుంచుచు, మరియు ఎటువంటి హాని లేకుండా ఈ యొక్క బాధనుండి ఈ బిడ్డ ఆయన నామములో విడుదల చేయబడునని అడుగుచున్నాను, యేసుక్రీస్తు యొక్క నామములో. ఆమెన్.

దేవుడు నిన్ను దీవించును గాక.

9

ఇప్పుడు, వెళ్ళుము. ఇక్కడ ఒక్క క్షణము చూడుము. ఇప్పుడు, అది సరిగ్గా వున్నది. ఏదో సమయంలో ఆ బిడ్డకు ఏదో జరిగింది, కానీ అది ఏమిటో నాకు గుర్తులేదు. అది సత్యమేనా, అది ఏమి చెప్పినప్పటికి? [“అది సత్యమే.”] ప్రతీ విషయము సత్యమేనా? (“అవునయ్యా.”) ప్రతీ విషయమూ సత్యమే.

ఇప్పుడు, ఆయన చెప్పెను, “ఒకవేళ ఆ ప్రజలను నిన్ను నమ్మునట్లుగా నీవు చేసుకొనగలిగినట్లయితే, మరియు యదార్ధముగా ఉంటే, నీ ప్రార్ధన ముందు ఏదియు నిలబడదు.”

ఇప్పుడు, ఆయన చెప్పెను... నేను చెప్పాను, “ వారు నన్ను నమ్మరు, ఎందుకనగా నేను చదువులేనివాడను.”

ఆయన చెప్పెను, “ఈ ఉద్దేశ్యము కొరకే అతడు పంపబడియున్నాడు అని రుజువు చేయుటకు (చూచారా) ఏ విధముగా మోషేకు రెండు సూచనలు ఇవ్వబడినట్లుగా.” చెప్పెను, “అలాగే నీకు కూడా ఇవ్వబడును.” మరియు ఈ సంగతి నాకు చెప్పెను: “నీవు హృదయము యొక్క రహస్యములను తెలుసుకొని మరియు ప్రజలకు వారి సమస్యను చెప్పెదవు.”

గడచిన దినములలో ఆత్మ చేసినట్లుగా. దానిని చూచుటకు నాకు కష్టమైనది, కాని ఇప్పుడు నాకు అర్ధమగుచున్నది.

ఇప్పుడు, భయపడవద్దు. నీ బిడ్డ బాగవును. నీవు భయపడవద్దు.

ఇప్పుడు, ఒకవేళ పరలోకపు దేవుడు జీవితములోని వెనుక ఆ మార్గములో ఏమియున్నదో చూచుటకు నన్ను అనుమతించినయెడల... మరియు అదియే సత్యము. అదియే సత్యమని మీకు తెలుసు. మరియు ఒకవేళ ఆ బిడ్డ బాగవబోవుచున్నాడు అని నేను మీకు చెప్పినయెడల, మీరు ఆ విధముగానే మీ మార్గములో కొనసాగిపోవుడి. అది ఎంత సత్యమైయున్నదో, అంత సత్యమై వుండును. అది నిజమేనా? దేవుడు నిన్ను దీవించును. తరువాత బిడ్డను తీసుకొనండి. నీవు తీవ్రమైన నరాల బలహీనతతో (ఆందోళన) ఉన్నావు, నీవు లేవా? నీవు ఆమెను పట్టుకొని ప్రయత్నించినపుడు నేను ఆమెను చూచాను. మరియు ఆమె అరుస్తూ మరియు ఆ విధముగా కొనసాగినది. చింతించవదు. అది ఆమెను విడిచిపెట్టబోవుచున్నది. దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, మరియు నమ్ముతూ, కేవలము కొనసాగుము. మరియు నీ సమస్య పోయినది.

“దేవునికే కృతజ్ఞతలు,” అని చెప్పెదము.

ఇప్పుడు, ఆ శిశువును నేను స్వస్థపరిచానా? లేదయ్యా. దేవునిపై ఆ వ్యక్తి కలిగియున్న విశ్వాసమే ఆ బిడ్డను స్వస్థపరచినది, చూడండి. దేవుడు తన ఆశీర్వాదములను పలుకుచున్నాడు; అవి ఆ విధముగానే ఉండును, చూడండి.

10

ఇప్పుడు, అమ్మా, రండి. ఇప్పుడు నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు, ఇప్పుడు ఏదో జరుగుతున్నది అని మీరు ఎరిగియున్నారు. చూడండి, అతడే మొదటి రోగి; కేవలము అభిషేకము పొందుకొనుటకు. టెక్సాస్లోని, హూస్టన్ లో తీయబడి ఇక్కడకు తీసుకొనిరాబడిన ప్రభువు యొక్క దూత యొక్క చిత్రమును మీరు ఎప్పుడైనా చూశారా? మీరు ఎన్నడూ దానిని చూడలేదు. ఇంకొన్ని రాత్రులలో వారు దానిని ఇక్కడ కలిగియుండెదరు. అవి మరికొన్ని ఎక్కువగా మేము కలిగియున్నాము అని నేను నమ్ముచున్నాను. కానీ ఇప్పుడు మీరు అనుభవించుచున్న ఆ అనుభూతి, అది అదే అయియున్నది. అది ఆయన సన్నిధి.

ఇప్పుడు, ఒక్క క్షణము. మీకు ముందు... అమ్మా, నీవు ఒక రకమైన మూర్ఛ వ్యాధితో బాధపడుచున్నావు, లేక వెళ్ళుచున్న... మూర్ఛ వ్యాధి. అది నిజమేనా? అది భయంకరమైన సంగతి. ఆ నల్లనిదేదో మన మధ్యకు రావడం నేను చూసియున్నాను. ఇప్పుడు అది ఏమిటో నాకు తెలుసు. అంతా సరియే. మీరు మీ శిరస్సులు వంచండి, ప్రతీ చోటా, మరియు స్త్రీలు తమ పిల్లలను తమకు దగ్గరగా ఉంచుకొనును గాక.

ఇప్పుడు, ఈ ఒక్క సంగతి నిజముగా నన్ను ఇబ్బంది పెట్టుచున్నది: మూర్ఛ వ్యాధి.

11

ఇప్పుడు, దయచేసి, స్త్రీలారా, ప్రతీ ఒక్కరూ మీ పిల్లలను దగ్గరగా ఉంచుకొనండి. మరియు ప్రతీ ఒక్కరూ విశ్వాసములో ఉండండి.

ఇప్పుడు, అమ్మా, నా సహోదరీ, నేను నీకు సహాయము చేయుటకు సమర్ధుడను కాను. నేను నీ కొరకు ప్రార్ధించబోవుచున్నాను. నీవు విశ్వసించాలని నేను కోరుచున్నాను.

ప్రభువైన యేసూ, ఆ స్త్రీకి సహాయము చేయుము. దానిని నీవు. అనుగ్రహించెదవని నేను ప్రార్ధిస్తున్నాను. ఈ రాత్రి ఆమె ఇక్కడ నుండి వెళ్ళి మరియు బాగవును గాక. ప్రభువా, దానిని అనుగ్రహించండి. యేసుక్రీస్తు యొక్క నామములో నేను ఆమెపై చేతులుంచుచున్నాను, మరియు ఆమె స్వస్థత కొరకు అడుగుచున్నాను.

ఓ నిత్యుడైన దేవా, జీవాధిపతీ, నీ సేవకుని యొక్క ప్రార్ధనను ఆలకించుము. మరియు నీ ఆజ్ఞకు లోబడి, నేను ఆమెపై చేతులుంచుచున్నాను, మరియు ఆ మూర్ఛ వ్యాధి యొక్క దయ్యము విడిచిపెట్టునని అడుగుచున్నాను. దానిని అనుగ్రహించండి. యేసుక్రీస్తు యొక్క నామములో, అది వెళ్ళిపోవును గాక. యేసు యొక్క నామములో, అది వెళ్ళిపోవునట్లు నీవు అనుగ్రహించుము. ఆమెన్.

ఇప్పుడు, అమ్మా, ఒక్క క్షణం. నేను కొంచెము నీతో మాట్లాడగోరుచున్నాను, ఒక్క క్షణం. ఒకవేళ నీవు చూడగలిగితే, నీవు ఇక్కడ నన్ను చూడాలని నేను కోరుచున్నాను, ఒక్క క్షణం, ఇప్పుడు, అది చాలాకాలము నుండి ఉన్నది. అవును కదా? నేను నిన్ను చూడాలనుకొనుచున్నాను, ఒక్క క్షణం, కేవలము నీతో మాట్లాడుటకు. ఇప్పుడు, నేను నీ మనస్సును చదువుట లేదు. అది దేవుడికి తెలుసు. కానీ, దానిని మీరు ఎలా పిలుచుకోవాలనుకున్నా, చూడండి. అక్కడ ఒక....

దేవుడు కలిగియున్న ప్రతీ సంగతికి ఒక బోగస్ కలిగియున్నది. మీరు దానిని నమ్మెదరా? ఆయన ఇక్కడ వీధిలో ఈ చిన్న పాత మానసికవేత్తలను (మనస్సులను చదివేవారు) కలిగియున్నాడు, ఒకటి ఊహించి చెప్పుదురు, లేక ఏదో. అది ఒక దెయ్యము. కానీ యేసుక్రీస్తు, వారి ఆలోచనలను గ్రహించియుండెను. అది నిజమేనా? అది సరియే. దేవుడు కలిగియున్న ప్రతీదానికి, అతడు ఒక బోగస్ (నకిలీ)ని కలిగియుండెను. ఆయన ఒక నిజమైన స్వచ్ఛమైన పరిశుద్ధాత్మను కలిగియుండెను. దెయ్యము కూడా అలాగే కనిపించే దేనినో కలిగియున్నది. అది అందులో లేదు.

కానీ ఇక్కడ, నీతో ఏమి తప్పు ఉన్నదో ఇప్పుడే చెప్పబడెను. కానీ ఇక్కడ మరొకటి ఉన్నది. నీ జీవితములో నీవు అనుభూతి చెందుచున్నావు, మరియు క్రీస్తు యొక్క పరిచర్యలో నీవు పిలుపును కలిగియున్నావని చాలా కాలము నుండి దానిని కలిగియున్నావు. అది నిజమేనా? మరియు ఈ సంగతి అడ్డగించుచున్నది. అది సత్యమేనా? జనులతో దానిని గూర్చి నీవు మాట్లాడియున్నావు. అది సత్యమని ఈ భవనములో ఎవరైనా దానిని ఎరిగియున్నారా? ఒకవేళ అయితే, మీ చేయి ఎత్తండి. ఇప్పుడు, వెళ్ళుము. మరియు ప్రభువు నిన్ను దీవించును గాక. నీవు నమ్మినట్లుగానే, అది నీకు జరుగును.

12

అమ్మా, నీవు ఎలా ఉన్నావు? అవును, నేను నిన్ను ఎరుగను. నా జీవితములో ఎన్నడూ నిన్ను చూడలేదు. కానీ దేవుడు నిన్ను ఎరిగియున్నాడు, ఆయన ఎరిగిలేడా. ఆయన ఎరిగియున్నాడని మరియు ఆయనను వెదుకువారికి ఆయన ఫలము దయ చేయువాడని నీవు నమ్మెదవా? నీవు నమ్మెదవు. ఆయన నిన్ను విడుదల చేయుటకు సమర్థుడని నమ్మెదవా? [“నేను నిశ్చయముగా నమ్మెదను.”] ఒకవేళ ఆయన దీనిని చేసినయెడల, నీ హృదయమంతటితో ఆయనను నీవు వెదకెదవా, నీ జీవితమును ఆయనకు ఇచ్చి, నీ తక్కిన దినములన్నిటిలో ఆయన కొరకు తెలిసినంత ఉత్తమముగా జీవించెదవా? నీవు దానిని చేయవలెను. ఆ పరిస్తితితో, నీకు తెలుసు, నీవు ఆ విధముగా ఎక్కువ కాలము జీవించలేవు. అది కేన్సరుగా మారినది, మంచిది తరువాత, నీవు నీరసించావు. ఏ విధముగానైనా, నీవు ఒక శస్త్రచికిత్స చేయించుకొన్నావు. అది నిజమేనా? మరియు ఇప్పుడు నీవు ఒక కణితిని కలిగియున్నావు. అది నిజము. రొమ్ములో.

ఇప్పుడు, ఆయన నిన్ను స్వస్థపరచి మరియు నిన్ను బాగుచేయునని నీవు నమ్మెదవా? మరియు నీ జీవితమును ఇప్పుడు ఆయనకు ఇచ్చెదవా? ఇప్పుడే, ఆయనకు, ఆయన యొక్క ఆశీర్వాద చిత్తమునకు నీ జీవితమును నీవు సమర్పించుము. ఆయనను అంగీకరించెదను అని నీవు చెప్పుము, ఇప్పుడే, రక్షకునిగా మరియు ప్రభువుగా, మరియు స్వస్థపరచువాడిగా. ఇప్పుడే, నీవు చేసెదవా? ఒక సాక్షిగా నీ చేయి పైకి ఎత్తుము. ఇప్పుడు, ఇక్కడకు రమ్ము.

సర్వశక్తుడగు దేవా, జీవాధిపతీ, ప్రతీ మంచి వరమును ఇచ్చువాడా, ఆశీర్వాదములను ఇచ్చువాడా, ఆశీర్వాదములను మరియు సమాధానమును పంపుము. ప్రభువా, ఆ స్త్రీని క్షమించుము. ఇప్పుడు, ఆమెను తీసికొని, ఆమె స్థితి తీవ్రముగా ఉన్నదని ఎరిగి, ఆమె దేహమును స్వస్థపరచుము. ఆమె ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో ఆనందముతోను సంతోషముతోను ఇక్కడ నుండి వెళ్ళును, ఆమె స్వస్థపడాలి అని నేను అడుగుచున్నాను, మరియు రక్షింపబడి, నీ ఆత్మతో నింపబడి, యేసుక్రీస్తు యొక్క నామములో. ఆమెన్.

ఇప్పుడు, నీ యొక్క వ్యక్తిగత స్వస్థపరచువాడిగా, రక్షకునిగా, సమస్తముగా ఆయనను నీవు అంగీకరించుము. దేవుడు నిన్ను దీవించును. వెళ్ళుము, మరియు నీవు పరిశుద్ధాత్మను పొందుకొని, మరియు స్వస్థపడెదవు గాక. దేవుడు నిన్ను దీవించును. అంతా సరియే.

13

అమ్మా, నీవు నమ్మెదవా? అంతా సరియే. ఒకవేళ నీ హృదయమంతటితో నీవు నమ్మినయెడల, నిన్ను స్వస్థపరచి మరియు బాగుచేయుటకు దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీవు దానిని నవ్మెదవా? అంతా సరియే. ఆయనయందు విశ్వాసముంచుము. సందేహించవద్దు.

అక్కడ వున్న మీ అందరిని గూర్చి ఏమిటి? మీ హృదయమంతటితో ఆయనను నమ్మెదరా? దేవునిలో విశ్వాసముంచుము. మీరు దేనినైతే అడిగెదరో, దేవుడు దానిని నెరవేర్పులోనికి తీసికొనివచ్చును. ఇప్పుడు, ఈ వేదికపైనున్న ప్రజలు మాత్రమే కాదు, కానీ అక్కడ ప్రేక్షకులలో ఉన్న మీరు కూడా మీరు ఎక్కడ ఉన్నా. ఈ రాత్రి దీనిని మీకు ఇచ్చుచున్నాను. ఎవరైతే ప్రార్ధనా వరుసలో ఉండరో, ఎవరైతే అక్కడ ప్రార్ధనా కార్డులను కలిగిలేరో, ఏమియు లేకుండా, అక్కడ కూర్చొన్నవారు మరియు వరుసలోనికి వెళ్ళుటకు అవకాశము లేనివారు; మీరు దేవునిని నమ్మడము ప్రారంభించండి. మీ హృదయమంతటితో ఆయనను నమ్ముము, మరియు దేవునిని ప్రార్ధిస్తూ, మరియు కేవలము ఆయనను అంగీకరించుము. కేవలము ఆయనను అంగీకరించుము. చెప్పండి, “ప్రభువా, ఇప్పుడు నేను నమ్ముచున్నాను. ఇప్పుడు నేను నమ్ముచున్నాను. నేను దానిని నమ్మెదను, మొదటిగా, ఎందుకనగా నీ వాక్యము అలాగు చెప్పినది. నేను దానిని నమ్ముచున్నాను, రెండవదిగా, ఎందుకనగా నీవు ఈ రాత్రి గడిచిన దినములలో వలె పరిపూర్ణముగా నిన్నునీవు రుజువు చేసుకొనుచున్నావు, కనుకనే ఈ రాత్రి నీవు ఇక్కడ వున్నావు. మరియు నా హృదయమంతటితో నేను నమ్ముచున్నాను.”

మరియు, స్నేహితులారా, చూడండి, ఇది కేవలము తల్లాహస్సీ మాత్రమే కాదు. ఇది ప్రపంచమంతా వెళ్ళినది, చూడండి ప్రతీచోటా. వాస్తవముగా వేలాదిగా, మరియు వేలల్లో మరియు వేలకొలది వేలాదిగా ప్రజలు స్వస్థపడియున్నారు, మరియు రక్షింపబడియున్నారు, మరియు పరిశుద్ధాత్మతో నింపబడియున్నారు, చూడండి. ఇది ఏదో కాదు. ఇది ప్రతీ అగ్ని శోధనల గుండా పరీక్షింపబడినది, అది మీ ముందు పెట్టబడవలెను, మరియు అంతటా, అని నేను నమ్ముచున్నాను.

ఇక్కడ నా మేనేజరు ఉన్నాడు. అది నిజమేనా, సహోదరుడు బాక్స్టర్? ప్రతీ దానిగుండా, మరియు ఎల్లప్పుడూ, దేవుడే విజయము సాధించెను. ఒక్కసారి కూడా విఫలమవ్వలేదు, మరియు విఫలమవ్వడు, ఎందుకనగా ఆయన దేవుడు. ఇప్పుడు, ఒకవేళ అది నేను అయితే, అది ఇప్పటికే... నా ప్రారంభమే వైఫల్యము, చూడండి, కానీ ఆయన ఎన్నడూ విఫలమవ్వడు.

14

ఒక్క క్షణం. [సహోదరుడు ప్రక్కగా మాట్లాడుతున్నాడు, “కొద్ది నిమిషముల క్రితం నేను ఒక మూర్ఛ వ్యాధి కలిగినవానికి ప్రార్ధన చేయలేదా? అది ఒక స్త్రీయా లేక పురుషుడా?”] ఆ స్త్రీ ఎక్కడ - మూర్ఛ వ్యాధి గలది - ప్రార్దించబడినది? ఓ, అక్కడ. అది మాత్రమే కాదు. ఈ ప్రేక్షకులలో అది మళ్ళీ దాడి చేసినది. అది ఇక్కడే కూర్చొన్నది, ఇక్కడే. సహోదరి, దానిని నీవు నీ యొక్క స్వస్థతగా అంగీకరించవా?

సర్వశక్తుడవగు దేవా, ఇప్పుడు నీవు దయ కలిగియుందువని మరియు ఆమెను స్వస్థపరచుదువని నేను ప్రార్ధించుచున్నాను. మరియు ఈ ఘడియ నుండే ఆమె బాగుపడును గాక.

సాతానా, ఆ స్త్రీని విడిచిపెట్టుము. దేవుని కుమారుడైన, యేసు నామములో ఆమె నుండి బయటకు రమ్ము.

సహోదరి, దేవుడు నిన్ను దీవించును. ఆయన దయ నీపైన ఉండును గాక.

విశ్వాసమును కలిగియుండుము. దేవుని యందు నమ్మకముంచుము. దేవుడు దానిని నెరవేర్పులోనికి తీసుకొని వచ్చును, చూడండి. ఆ ఆత్మ రహస్యముగా లోనికి జొరబడుచున్నది, ఏదో చేయుటకు ప్రయత్నించుచున్నది.

15

ఇప్పుడు, ఇక్కడ ఏదో ఉన్నది. [అస్పష్టమైన పదము]. అది నిజమేనా? నా జీవితమంతటిలో నిన్ను ఎన్నడూ నేను చూడలేదు. అది నిజమేనా? నీవు ఒక ఇబ్బందుల జీవితము, చాలా నిరుత్సాహములు కలిగియున్నావు, ఒక చిన్న పిల్లవానిగా, ఒక చిన్న బాలికగా. నీవు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, ఒక బాలికగా, ఒకటి కలిగియున్నావు - అది నిజమేనా? నీవు పాఠశాలలో ఉన్నప్పుడు. అది నిజమేనా? నీవు ఒక చిన్న గడుల దుస్తులు ధరించియున్నావు. అది నిజమేనా? మరియు ఇప్పుడు, నీవు ఒక గడ్డను కలిగియున్నావు. ఆ గడ్డ వెనుక ఉన్నది. అది నిజమేనా? ఇప్పుడు, ఆ సంగతులు సత్యమేనా? [“అవునయ్యా. అది నిజం.”] దాని యొక్క ప్రతీ మాట సత్యమేనా?

ఇప్పుడు, మాట్లాడునది నేను కాదు; అది ఏదో మాట్లాడుచున్నది, చూడండి. [“అది నిజము. అది నీకు తెలియదు.”] నేను ఎన్నడూ... నీవు చిన్న బాలికగా ఉన్నప్పుడు ఏమి చేసియున్నావో, మరియు పాఠశాలలో ఎటువంటి దుస్తులు ధరించావో, మరియు ఏమి జరిగియున్నదో, నేను ఏలాగు ఎరుగుదును? నేను ఎన్నడూ... దానిని గూర్చి నేను ఎన్నడూ ఏమియు ఎరుగను, కానీ అది సత్యము. [“అది సత్యము.”] మరియు అది చెప్పిన ప్రతీదీ సత్యమును బలపరచినది. అది నిజమేనా? అది ప్రభువు యొక్క దూత ఇక్కడ నిలబడి దానిని చేయుచూ మాట్లాడుచున్నది. నేను కేవలము... నేను ఏమి చెప్పబోవుచున్నానో దాని పైన నేను ఎటువంటి నియంత్రణను కలిగిలేను.

ఇప్పుడు, మీరు బాగవబోవుచున్నారా? ఆయనను మీ స్వస్థపరచువానిగా అంగీకరించేదరా? [“అవునయ్యా.”]

సర్వశక్తుడగు దేవా, మరణము నుండి యేసుక్రీస్తుని లేపినవాడా, మా సహోదరిపై నేను నా చేతులుంచి మరియు ఆమె ఇక్కడ నుండి వెళ్ళి మరియు ఒక బాగైన స్త్రీగా ఉండునని అడుగుచున్నాను, నీ యొక్క నామములో... యేసుక్రీస్తు, దేవుని కుమారుడు. ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఈ స్త్రీ యొక్క శరీరములో ఉన్న వ్యాధి శపించబడును గాక.

సహోదరి, దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు, చూడండి. వెళ్ళి ఒక మంచి ధైర్యమును కలిగి ఉండుము. అరచుచూ వెళ్ళుము, సంతోషిస్తూ వెళ్ళుము, నీ స్వస్థత కొరకు దేవున్ని స్తుతిస్తూ, దాని కొరకు దేవుడిని నమ్ముతూ వెళ్ళుము.

16

సహోదరి, ఎలా ఉన్నావు? నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? ఒక ఉదయకాలమున, నీవు మంచము పై నుండి కదులుతున్నప్పుడు, నీవు దానిని చేయలేకున్నావు. ఆ వెన్ను అంతటి సమస్యలో ఉన్నది. అది నిజమేనా? ఆ మెట్టు నుండి దిగుచున్నప్పుడు, ఆ మెట్టు నుండి సులువుగా నీవు దూరముగా వెళ్ళుచున్నావు. అది నిజమేనా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో, వెళ్ళుము.

“దేవునికే స్తోత్రము,” అని చెప్పెదము.

సహోదరీ, నీవు నమ్ముచున్నావా? ఆమె వైపు చూచుటకు, ఆమె చాలా ఆరోగ్యవంతమైన స్త్రీ అని తలంచెదరు, కానీ అలాగు కాదు. నీవు ఒక గుండె సమస్యను కలిగియున్నావు. అది నిజమేనా? మరొక సంగతి: నీకు చాలా పిచ్చి... మీరు చూడండి, అది ఋతుస్రావం ఆగిపోవుట, అది అదే, జీవన కాలము. నీవు నిరుత్సాహకరమైన అనుభూతిని పొందుచున్నావు. అది నిజమేనా? అది నిజమేనా? నీవొక స్త్రీ సమస్యను కలిగియున్నావు, కూడా. అది నిజమేనా? ఒకానొక సమయమున [అస్పష్టమైన పదములు], దాదాపుగా ఎడమ ప్రక్కనే నీవు నొప్పిని కలిగియున్నావు. ప్రత్యేకించి బాత్-రూమ్ నుండి, నీకు నీవుగా ప్రక్కన పట్టుకొనడం నేను చూశాను. అది నిజమేనా? దానియొక్క ప్రతీ మాట అది సత్యమేనా? అప్పుడు ప్రపంచములో ఎవ్వరికీ ఏమీ తెలియని ఆ రహస్య స్థలముల గుండా అక్కడకు వెళ్ళినది ఏమిటి? అయితే నీ జీవితములో నీవు ఏమి చేసియున్నావో, దేవుడు మాత్రమే దానిని నీకు బయలుపరచును. అది నిజమేనా? ఇప్పుడు, దేవుని యొక్క ప్రవక్తగా నీవు నన్ను నమ్మెదవా? ప్రభువైన యేసు ఇప్పుడే నిన్ను స్వస్థపరిచెను. సంతోషిస్తూ, నీ మార్గములో వెళ్ళుము.

“దేవునికే వందనములు,” అని చెప్పెదము.

17

రండి. అమ్మా, నీవు ఎలా ఉన్నావు? దేవుని యొక్క ప్రవక్తగా — ఆయన సేవకుడిగా — పరిశుద్ధాత్మతో అభిషేకించబడినవానిగా, మరియు...? నన్ను నమ్మెదవా? ఒకవేళ ఈ ఆత్మ యేసుక్రీస్తుదైన యెడల, అది యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చును. అది నిజమేనా? చేయుటకు నేను ఏమియూ కలిగిలేను... నేను కేవలము అటువంటి వెలుగునై యున్నాను, అక్కడ. అది ఆ వెలుగు కాదు; అది ఆ వెలుగులో ఉన్న విద్యుత్ (శక్తి) అయి ఉన్నది. అది నిజమేనా? అది నిజము.

అప్పుడు యేసు బావి దగ్గర ఆ స్త్రీతో మాటలాడినప్పుడు, ఆయన తిన్నగా ఆమె సమస్య దగ్గరకు వెళ్ళెను, మరియు అదేమిటో ఆమెకు చెప్పెను. అది నిజమేనా? తరువాత ఆమె నమ్మినది, మరియు వెళ్ళి, చెప్పెను, “నేను చేసినది నాకు చెప్పిన ఒక మనుష్యుని చూచుటకు రండి.” అది నిజమేనా? ఆమె చేసినదంతయూ ఎన్నడు ఆయనకు చెప్పలేదు. ఆమె యొక్క సమస్య ఏమిటో ఒకవేళ దేవుడు నాకు బయలుపరచినయెడల, ఆయనను మీ రక్షకునిగా మరియు స్వస్థపరచువానిగా అంగీకరించెదరా? నా అర్ధము, స్వస్థపరచువాడు. నీవొక క్రైస్తవురాలవు. నీవు అంగీకరించెదవా...? నీవు చేసెదవా? నీవొక స్త్రీ సమస్యను కలిగియున్నావు. అది నిజమేనా? అది నిజము. ఇప్పుడు నీకు చెప్పబడినట్లుగా వెళ్ళి చేయుము, మరియు ఇప్పుడే దానిని నీవు జయించెదవు; అది గర్భాశయము పై ఒక గడ్డ. దేవుడు నిన్ను దీవించును. వెళ్ళుము, మరియు దేవుడు నిన్ను దీవించును గాక.

అంతా సరియే. అమ్మా, రమ్ము.

18

నీ హృదయమంతటితో నీవు నమ్మెదవా? ఇప్పుడు దానిని నమ్ముము... నీ సహోదరుడు కాదు. నేను నీ సహోదరుడను. నేను కేవలం నీ సహోదరుడను, కానీ దేవుడే నీ రక్షకుడు. నీవు ఆయన సన్నిధిలో ఉన్నావని నమ్మెదవా? నీవువున్నావు. నేను ఇక్కడ ఉన్నందుకు కాదు, కానీ నేను కేవలము ఆయనకు ప్రతినిధిగా ఉన్నాను. అది నిజమేనా? ఆయనకు మరియు నీకు మధ్య వచ్చుచున్నాను... అవును, నీవు ఉదరపు సమస్యను కలిగియున్నావు — ఖచ్చితముగా. మరియు నీవు నమ్ముము, ఇప్పుడు, దాని నుండి ఆయన నిన్ను స్వస్థపరచును. దానిని నీవు ఇప్పుడు అంగీకరించెదవా?

సర్వశక్తుడగు దేవా, నీవు ఆ స్త్రీని స్వస్థపరిచెదవని నేను ప్రార్ధిస్తున్నాను. మరియు యేసు నామములో ఆమే ఒక బాగైన వ్యక్తిగా ఇక్కడ నుండి వెళ్ళును గాక. ఆమేన్.

అది ఒక నరాల బలహీనత కలిగియున్న స్థితి. అది ఒక జీర్ణాశయ సమస్యను తీసికొని వచ్చుటకు కారణము: పుల్లగా, మరియు అది లోపల ఉన్నది. అది నిజము. ఇప్పుడు, నీవు కొనసాగుము మరియు కేవలం నమ్ముము. ఒకవేళ నీతో ఏమి తప్పు ఉన్నదో ఆయన ఎరిగిన యెడల, నీవు ఏమి చేసితివో, ఆ ఫలితము ఏమై యుండబోవుచున్నదో ఆయనకు తెలుసు. ఆయన నాకు సత్యమే చెప్పుచున్నాడని నీవు తలంచెదవా? ఒకవేళ ఆయన అలా చేయనట్లైతే, ఏది తప్పో తెలుసుకొనులాగున ఆయన నాకు ఎలాగు అనుమతించును? అది నిజమేనా?

19

నీకు ఆ స్త్రీ తెలుసు. ఆమె జీవితం నీకు తెలుసు. మరియు, అది ఖచ్చితముగా నిజమేనా? దానియొక్క ప్రతీ మాట? ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుండి, అప్పటి నుండి. అది నిజమేనా? ఆమె ఎన్నడూ, బహుశా, ఈ సంగతులలో కొన్నిటిని చెప్పియుండకపోవచ్చు? మరియు ఆమె ఒక సరియైన స్త్రీ అని మీకు తెలుసు.

ఇప్పుడు, అది ఆమెతో ఉన్నట్లుగా, అది మీతోను ఉన్నది. వెళ్ళుము, మరియు దేవుడు మీతో ఉండును. ఇప్పుడు, సంతోషముగా ఉండుడి, ఆనందించుడి. మిమ్ములను మీరు ఒక స్థితికి తెచ్చుకొనియున్నారు. అంతకు మునుపు మీరు ప్రార్ధించబడ్డారు, చాలాసార్లు, చూడండి — అది నిజము — కూడికలలో. కాని, మీరు ఏమి పట్టుకొన ప్రయత్నించుచున్నారు. అది ఇప్పుడే మీ దగ్గర ఉన్నది. ఇదే మీ పట్టు.

మీరు ఇక్కడ ఉన్నప్పుడు, చూడండి, అప్పుడు మీరు ఇక్కడకు రండి. మరియు మీరు ఇక్కడకు వచ్చినప్పుడు, మీరు బాధగా, మరియు తక్కువగా, మరియు నరాల వణుకుతో, మరియు నిరుత్సాహము. మీరు నిజమైన నిరుత్సాహ సమయములను కలిగియున్నారు. ఆ విధంగా, మీకు తెలుసు, మానసిక పరిస్థితులు, మీకు తెలుసు. అంతా గాయములతో ఉన్నప్పుడు ఏది మిమ్ములను బాగుగా ఉండునట్లు చేయును. ఇప్పుడు, చూడండి, మరియు మీరు పొందు... మొదటిగా, “నా స్వస్థతను నేను పొందుకున్నాను,” అని మీరు తలంచండి. తరువాత మీరు ఇక్కడకు వచ్చి మరియు మీరు చెప్పెదరు, “ఓ, నేను దానిని కోల్పోయాను.” ఖచ్చితముగా, ఎందుకనగా మిమ్ములను మీరు ఇక్కడే వదులుకున్నారు, చూడండి. ఇక్కడే వుండండి. అక్కడ దానిపైన ఇక రింగు వేసేంతవరకు (స్వాధీనపరచుకొను) అక్కడే వుండండి. కొనసాగుతూ వుండండి. దేవుడు నిన్ను దీవించును, ఇప్పుడు, ప్రభువైన యేసు నామములో.

20

రండి. మీరు ఎలా వున్నారు? దేవుడు నిన్ను దీవించును. మీరు చూచుచున్న మరియు వినుచున్న ఈ సంగతులు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దనుండే వచ్చుచున్నవని మీరు నమ్మెదరా? అవును. అయినప్పటికీ, ఒక సంగతి ఉన్నది... నీవు వణకుటను చూస్తూ, సహోదరుడా. దర్శనము లేకుండా లేక మరేమియు లేకుండా, నీకు పక్షవాతమున్నదని నాకు తెలుసు; నీవు వణుకుచుండుటను నేను చూచాను. అది ఒక నరాల బలహీనత.

మంచిది, ఇప్పుడు, నీవు మరియు నేను ఒక్క క్షణము మాట్లాడుకొనెదము. మరియు బహుశా, ప్రభువైన యేసు నిన్ను గూర్చి నాకు ఏదో చూపించును... మరియు అయినప్పటికీ, నీవు అద్దాలను ధరించియున్నావు. అయినప్పటికి అది నీ కళ్ళతో ఏదో లోపమైయున్నది. ఎవరైనా దానిని చూడగలరు, చూడండి. కానీ, బహుశా ఒక... అవునయ్యా. నీకును మరియు నాకును మధ్య రక్తము కారుచున్నది. అది రక్తహీనత స్థితి. అది నిజమేనా? ఒకవేళ అది నిజమైతే, నీ చేయి పైకెత్తుము. నా సహోదరీ, దేవుడు నిన్ను దీవించును. మరియు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను బాగుపరచును గాక. దేవుడు నిన్ను దీవించును. నీ హృదయమంతటిలో నమ్ముచూ వెళ్ళుము.

21

అమ్మా, రమ్ము. నీవు ఎలా వున్నావు? ఒక్క క్షణం ఇక్కడకు రమ్ము. లేదు, తల్లి, నీవు లేచి నిలువుమని నేను కోరుచున్నాను. ఆమెను లేపుము. అక్కడ పడియుండవద్దు. ఇక్కడ నా వైపు చూడుము. నేను దేవుని యొక్క ప్రవక్తనని నీవు నమ్మెదవా? నీవు వినుచున్నది సత్యమని నీవు నమ్మెదవా? నీవు తీవ్రముగా బలహీనమగుచున్నావు, అవును కదా? నీవు దానిని చేయుటకు కారణము, సాతాను దొంగిలించుటకు ప్రయత్నించుచున్నది. ఒకవేళ నేను ఆయన సేవకుడనని నీవు నన్ను నమ్మినయెడల, ఈ రాత్రే నీ యొక్క విడుదల.

నీవు ఎంతో దూరము నుండి ఇక్కడకు వచ్చియున్నావు, నీవు రాలేదా? అది నిజము. మరియు నీవు కీళ్ళ నొప్పులతో, లేక అటువంటి దానితో బాధపడుచున్నావు, అది నిజము... అది నీ వెన్ను, మరియు పైన మరియు క్రింది. అది నిజమేనా?

ఈ స్త్రీ తన వెన్ను గూర్చి బాధపడుచున్నది. అమ్మా, అది నిజమేనా? ఇప్పుడు, ఇక్కడ, అది మూత్రపిండములలో ఉన్నది. కానీ నీకైతే కీళ్ళ నొప్పులు. నీకు క్షయ కూడా ఉన్నది. అది నీకు తెలుసా? అది నీకు తెలుసా? అమ్మా, ఇందులో... ఆమె చుట్టూ నీ చేతులు ఉంచుము, తండ్రీ.

సర్వశక్తుడైన దేవా, అక్కడ కూర్చొన్న ఆ వృద్ధ జంటను చూడుము. ప్రభువా, వృద్ధ తల్లిదండ్రులుగా వున్నారు. అమాయక ప్రాణి, రోగముతో, బాధపడుచున్నారు.

సాతానా, ఆమెలో నుండి బయటకు రమ్ము! నీవు బహిర్గతం చేయబడ్డావు! యేసుక్రీస్తు నామములో ఆ స్త్రీని విడిచిపెట్టుము! ఆమెలో నుండి బయటకు రమ్ము!

“అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. నీ మూత్రపిండము సమస్య పోయినది అని నమ్ముచున్నావా? నీవు నమ్మెదవా? చెప్పుము, దేవునిని సేవించాలన్న కోరికను కలిగియున్నావు, ఇంకనూ, ఆయనతో నడచిన దానికన్నా ఇంకా దగ్గరగా. అది నిజమేనా? [”అవునయ్యా. అది నిజము.“] గత కొద్ది దినముల నుండి దానిని గూర్చి నీవు ప్రార్ధించుచున్నావు. అది నిజమేనా?

మరియు నీవు అక్కడ వరుసలో నిలబడియున్నప్పుడు, నేను ఇక్కడకు వచ్చినప్పుడు నేను దానిని నీకు చెప్పబోవుచున్నానని నీవు భయపడ్డావు. తరువాత, ఇక్కడకు రమ్ము. ఇప్పుడు, నీవు కేవలము వెళ్ళి మరియు హృదయమంతటితో నమ్ముము. అది సత్యమేనా? అది సత్యము. ఇప్పుడు, నీవు ఏమి ప్రార్ధించుచున్నావో నాకు ఎలా తెలియును, మరియు నీ హృదయములో నీవు ఏమి చేయుచున్నావో? ఇప్పుడు, నీవు వెళ్ళుము, నీవు ఒక బాగవబోవుతున్న వ్యక్తివని నీ హృదయమంతటితో నమ్ముము. నీ హృదయమంతటితో నమ్ముము..

22

ఆమె చేసిన అదే సంగతి నీవు కలిగియున్నావు, మూత్రపిండములలో. నీపు వేదికను దాటుకొని వెళ్ళుచుండగా మీరిద్దరూ ఒకే సమయములో స్వస్థత పొందియున్నారు.

“దేవునికే స్తోత్రము!” అని చెప్పెదము.

సహోదరీ, నమ్ముము.

ప్రభువైన యేసు, నీవు ఆమెను బాగుచేయుదువని నేను ప్రార్ధించుచున్నాను, మరియు యేసుక్రీస్తు నామములో ఆమెను స్వస్థపరచుము. ఆమేన్.

నీవు నమ్ముచున్నావా?

నీవు కేన్సరును కలిగియున్నావు, కలిగిలేవా? నీవు దానిని జయించాలనుకుంటున్నావా? ఇప్పుడు నీవు దేవునిని నమ్మవలెను, లేక ఇక ఎప్పటికీ జయించలేవు. ఆయన నిన్ను బాగుపరుచునని నీవు నమ్ముచున్నావా? నీ పాదములపై లేచి నిలబడి, నీ స్వస్థతను అంగీకరించుము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో.

సహోదరి, నీ హృదయమంతటితో నమ్ముచూ, నీవు కూడా వెళ్ళుము.

దేవుని యందు విశ్వాసముంచుము! దేవుడు దానిని నెరవేర్పులోనికి తీసికొనివచ్చును.

అయ్యా, నీవు ఎలా వున్నావు? నేను నీకు తెలుసా? [“లేదయ్యా.”] నేను నిన్ను ఎరుగను. [“లేదు.”] నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్మెదవా? అంటే, ఆయన తన సంఘములో పెట్టునని ఆయన చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రవక్త? నీవు దానిని నమ్మెదవా? [నేను ఖచ్చితముగా నమ్మెదను.] నీవు సాధారణముగా తినుచున్నట్లుగా ఇంటికి వెళ్ళి తినవలెనని ఇష్టపడుచున్నావా? [నేను ఖచ్చితముగా తినగోరుచున్నాను.] ఒక మంచి, బలమైన ఆహారమును తినుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ఒకవేళ దీనిని నమ్మినట్లయితే, వెళ్ళి, నీకు ఏమి కావలెనో దానిని తినుము.

దేవుని యందు విశ్వాసముంచుము!

23

అమ్మా, నీకు దేవుని యందు నమ్మకమున్నదా? నిన్ను బాగుపరచుటకే ఆయన ఇక్కడ వున్నాడని నీవు నమ్మెదవా? అది సరియే. ఒకవేళ నీవు దానిని నమ్మినయెడల, ఒకవేళ దేవుడు నీకు సహాయము చేస్తే, మరియు నీ యొక్క విశ్వాసము ఇప్పుడే ఒక స్థానమునకు లేచును, ఆ గుండె సమస్య నిన్ను విడిచిపెట్టును. నీవు దానిని పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నీ చేయి ఎత్తుము, చెప్పుము, “ప్రభువైన యేసూ, నేను దానిని అంగీకరించుచున్నాను.” [“ప్రభువైన యేసూ, నేను దానిని అంగీకరించుచున్నాను.”] దేవుడు నిన్ను దీవించును. ప్రభువైన యేసు నామములో వెళ్ళుము. నీవు బాగుపడుదువు గాక.

హల్లెలూయా! దేవునికి స్తోత్రము! నీవు నమ్మెదవా? ప్రేక్షకులలో, మీరు నమ్మెదరా? కొంతమంది ఇలా చూసి మరియు నమ్మండి.

అమ్మా, నీ సంగతి ఏమిటి, అక్కడ కూర్చొని... అయినప్పటికీ, నీ కళ్ళు వంకర పోయినవని (మెల్లకన్ను) నేను చూచుచున్నాను. నీ హృదయమంతటితో నమ్మొదవా? చెప్పుము, తిరిగి ఇటు వైపు చూడుము. ఇది దానికన్నా ఎక్కువ. దానిని నీవు ఎరిగియున్నావో లేదో నాకు తెలియదు, కానీ నీవు కేన్సరుతో కూడా బాధపడుచున్నావు. అది నీకు తెలుసా? ఒకవేళ నీవు దానిని ఎరిగియుంటే, నీ పాదములపై లేచి నిలబడి మరియు నీ స్వస్థతను అంగీకరించుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థపడుము.

24

ఆ ప్రేక్షకులలో నీవు ఏమి చేయుచున్నావు? నీవు నమ్ముచున్నావా? ప్రార్ధించుము, నమ్ముము!

ఆ అమ్మా, నీ సంగతి ఏమిటి, నీ యొక్క... ఎత్తిన చేతితో ఆ పెద్ద వయస్సులో ఉన్న స్త్రీ. దేవుని యొక్క ప్రవక్తనని నన్ను నీవు నమ్మెదవా? అవును. నీ హృదయమంతటితో నమ్మెదవా? ఒకవేళ దేవుడు ఇక్కడ వుంటే, ఇక్కడే, నీతో ఏ తప్పిదమున్నదో నాకు బయలుపరిస్తే, దానిని నీవు అంగీకరించెదవా? నీవు ఉబ్బసం స్థితిలో ఉన్నావు. అది నిజమేనా? అది నిజమేనా? నీ చేయి ఎత్తుము, మరియు చెప్పు... అంతా సరియే. లేచి నిలబడి మరియు స్వస్థత పొందుకొనుము, అప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో. నీ స్వస్థతను అంగీకరించుము.

ఎంతమంది ఇప్పుడే వారి యొక్క స్వస్థతను అంగీకరించగోరుచున్నారు? చెప్పుము, “నేను నా స్వస్థతను అంగీకరించగోరుచున్నాను.” ఇక్కడ వెనుక, మీరు మీ స్వస్థతను అంగీకరించగోరుచున్నారా? భవనములో ఎక్కడైనా, మీ స్వస్థతను మీరు అంగీకరించగోరుచున్నారా? అప్పుడు, యేసుక్రీస్తు యొక్క నామములో, సజీవ దేవుని యొక్క కుమారుడు, ప్రతీ దెయ్యమును నేను అడుగుచున్నాను, గదిలో ఉన్న ప్రతీ సందేహపు ఆత్మను, విరగగొట్టి, మరియు యేసు నామములో పారద్రోలుచున్నాను! లేచి నిలబడుము! మీ స్వస్థతను అంగీకరించుము! స్వస్థపడుము! హల్లెలూయా! మీ పాదములపై నిలబడుము! ఆయనను నమ్ముము!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...