తుయతైర సంఘ కాలము

తుయతైర సంఘ కాలము

ప్రకటన 2:18-29

"తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము; అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా,నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరి యొక్కువైనవని యెరుగుదును.అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసియున్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యొజెబెలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములను బలి యిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును.దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను; అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియూ తెలిసికొనును; మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా — మీ పైని మరి ఏ భారమును పెట్టను.నేను వచ్చువరకు మీకు కలిగయున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు వానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుము దండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రలవలె పగుల గొట్టబడుదురు.మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక!"

తుయతైర

చారిత్రకంగా, ప్రకటనలోని ఏడు పట్టణములలో తుయతైర పట్టణము తక్కువ ప్రాముఖ్యత గలదియై యున్నది. అది మైసియా ఆయోనియా ప్రాంతముల మధ్యలో యున్నది. దాని చుట్టూ చాలా నదులున్నవి, కాని వాటి నిండా జలగలే. దానియొక్క కొనియాడదగిన ముఖ్యాంశమేదనగా కుమ్మరివారు, చర్మకారులు, నేతగాండ్రు, అద్దకపు పనివారు, దుస్తులు తయారు చేయువారు ఇంకా చాలా వర్తకముల వారు అందులో ఉన్నందున వారి ఆర్థిక పరిస్థితి బాగుండెను. ఈ పట్టణము నుండియే ఉదా రంగు అమ్మెడి లూదియా వచ్చినది. పౌలు ద్వారా ఐరోపాలో మొదటగా ప్రభువు యొద్దకు నడిపించబడిన స్త్రీ ఆమెయే.

ఆత్మ ఈ పట్టణమును ఎన్నుకొనుటకు కారణము నాలుగవ సంఘ కాలము యొక్క ఆత్మ సంబంధమగు క్రియలు ముందే దీనిలో ఉన్నాయి, దీనికి కారణము దాని మతమే. తుయతైర యొక్క ప్రధాన మతము అపోల్లో టయిరిమ్నాయాస్ ను ఆరాధించుట. ఇది చక్రవర్తిని ఆరాధించు తెగతో చేరియున్నది. అపోల్లో సూర్య దేవుడు, వాని తండ్రియగు జియాస్ తరువాత అతడిదే అధికారము. కీడును నిరోధించు వానిగా అతడు పేరు పొందెను. మత సంబంధమగు చట్టము మరియు శాసనముల (పరిహారపు విధానములు, తప్పులు చేసిన వారిని లేదా దోషులను సరిచేయు పద్ధతులు) పై అతడు ఆధిపత్యము కలిగి ఉండెను. ప్లాటో అతని గూర్చి చెప్పెను, "దేవాలయములు, బల్యర్పణలు, దేవతలకు పూజలు ఎట్లు స్థాపించవలెనో అతడు వివరించి మరియు మరణమయిన వారికి కర్మకాండలు ఎట్లు నిర్వహించవలెనో కూడా చెప్పెను." భవిష్యత్తును గూర్చి అతనికి గల జ్ఞానమును ఇతరులకు అందించి ప్రవక్తలు మరియు ప్రవచనముల ద్వారా తన తండ్రి యొక్క చిత్తమును జనులకు విశదపరిచెను. ఒక ప్రవక్తిని ద్వారా ఈ కర్మకాండలు తుయతైరలో జరుగుచుండెడివి. ఆమె మూడు కాళ్ళ కుర్చీలో కూర్చొని యుండి, ధ్యానము ద్వారా వర్తమానములను అందించుచుండెడిది.

ఈ మతము యొక్క పట్టు చాలా గమనించ దగ్గది. దాని యొక్క సమ్మోహన శక్తి పూర్తిగా ఆ మర్మయుక్తమైన పరిధిలో దాగియుండలేదు గాని, వాస్తవముగా ఎవరూ కూడా అపాల్లో దేవాలయ ఆరాధనకు చెందనివారు కాకుండా ఆ పట్టణ వర్తక సంస్థలలో జనులకు జీవానాధారము చూపెడి భాగస్వాములు కానేరరు. విగ్రహముల యొక్క పండుగలు మరియు మత ధర్మములకు చెందిన వ్యాపకములలో పాలుపొందనివారిని లేదా వాటితో చేరుటకు నిరాకరించిన వారిని ఆ మొదటి శతాబ్దపు యూనియనులలో నుండి బహిష్కరించెడివారు. సాంఘిక మరియు వ్యాపారపు జీవితములలో భాగము కలిగియుండ వలెనన్నచో అన్య విగ్రహారాధనలో పాలు పొందుట తప్పనిసరియైనది.

గమనించవలెను, తుయతైర అను పేరు యొక్క అర్ధము "స్త్రీ పెత్తనము." ఆ విధముగా ఈ కాలము ఒక పెత్తనము చెలాయించు శక్తిద్వారా రూపమును పొందియున్నది. ఈ శక్తి దయ లేకుండా అందరి మీదను దండెత్తి అందరినీ జయించెను, విచక్షణ లేకుండా అదుపులో ఉంచుకొనెను. పెత్తనము చేయు స్త్రీ లోకములోని అన్ని శాపములకన్న గొప్ప శాపము. ప్రపంచములో సొలోమోను అంతటి జ్ఞాని మరెవరూ లేరు. అతడు ఇట్లు చెప్పెను,

"వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలిసికొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు, బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢిచేసికొని నా మనస్సు నిలిపితిని.మరణముకంటె ఎక్కువ దు:ఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని, పాపాత్ములు దానివలన పట్టబడుదురు.సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగి నైననేను చెప్పుచున్నాను.అయితే నేను తరచి చూచినను నాకు కనబడని ఒకటి యున్నది. అదేదనగా వెయ్యి మంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు."

ప్రసంగి 7:25-28.

పౌలు ఇట్లు చెప్పెను,

"స్త్రీ ఉపదేశించుటకైనను, లేదా పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను."

ఏదెను తోట నుండి కూడా, స్త్రీ తరచుగా మరియు విజయవంతముగా ప్రయత్నించి పురుషుని మీద పెత్తనము చెలాయించుచున్నది మరియు ఈనాడు ఒక నగ్న స్త్రీ అమెరికా యొక్క దేవతగా ఉండి దీనిని స్త్రీ ప్రపంచము చేసినది. ఆకాశములో నుండి పడుచున్న స్త్రీ విగ్రహము మొదటి కాలము లేదా ఎఫెసు కాలమునకు సాదృశ్యముగా యుండినది. (ఆమె యొక్క చేతులు ఇనుప ఊచలని గుర్తుంచుకొనండి) ఆమె యొక్క శక్తి పెరిగి చివరకు ఆమె సంపూర్ణాధికారమును సంపాదించుకొన్నది, ఆమె యొక్క ఇనుప చేతులు అట్టి అధికారమునకు సాదృశ్యముగా యున్నవి.

ఇనుప దండముతో ఏలు అధికారము స్త్రీకి లేదు. పరిశుద్ధ లేఖనము ప్రకారము ఆమె పురుషునికి లోబడి యుండవలసియున్నది. అది ఆమెకివ్వబడిన ఆజ్ఞ. నిజంగా స్త్రీగా నున్న ప్రతి స్త్రీయు అటువంటి రీతిగానే ఉండవలసియున్నది. గుమ్మము నొద్ద తీవాచివలె ఉండుట కాదు. నిజమగు పురుషుడు ఎవడును స్త్రీని గుమ్మపు తీవాచీగా చేయడు. కానీ ఆమె అతని అధికారము క్రింద ఉండ గోరును, పురుషుని మీద ఏలుబడి చేయదు, ఎందుకనగా అతడు గృహమునకు శిరస్సు. దేవుడామె కొరకు తయారుచేసిన ఆ స్వరూపమును ఆమె బ్రద్దలు చేసిన యెడల ఆమె అతిక్రమము చేసినదగును. స్త్రీని అధికారము చెలాయించనిచ్చు ఏ పురుషుడయినా గాని ఆ స్వరూపమును బ్రద్దలుగొట్టినవాడగును. అతడునూ అతిక్రమమును చేసినవాడుగును. ఆ కారణము చేతనే స్త్రీ, పురుషుని వస్త్రము ధరించకూడదు, జుట్టు కత్తిరించుకొనకూడదు. ఆమె ఎన్నడును పురుష వేషము ధరించరాదు. ఆమె జట్టు కత్తిరించుకొనరాదు. ఆ విధముగా ఆమె చేసినప్పుడు పురుషుని యొక్క అధికారము లోనికి ఆమె చొరబడుచున్నది. అధికారమును అందుకొనుచూ ఆమె అక్రమ కారురాలగుచున్నది. ఆమె ఎట్టి పరిస్థితి లోను వేదికను ఎక్కకూడదు, ఒకవేళ ఆ విధముగా ఆమె చేయుచున్నయెడల ఆమె యొక్క ఆత్మ ఎట్టిదో కనబడుచున్నది. పెత్తనము చేయు స్త్రీ, క్రీస్తువిరోధియై యున్నది. రోమను కాథలిక్కు సంఘము యొక్క విత్తనములు ఆమెలో యున్నవి, దీనిని ఆమె కాదనవచ్చును. కాని ఇది పూర్తిగా సత్యము. అయితే వాక్యము యొద్దకు వచ్చినచో, దేవుడొక్కడే సత్యవంతుడు ప్రతి మనిషియు అబద్ధికుడే. ఆమేన్.

ఆరంభమునకు మనము వెళ్ళినచో. అసలు ఆదిలోని శారీరక సృష్టిలో దేవుడు ప్రతిదానిని స్త్రీని గాను, పురుషునిగాను అనగా జతలుజతలుగా సృజించెనని మనమెరుగుదుము. రెండు కోడెలున్నవి, ఒకటి పుంజు, ఒకటి పెట్ట. రెండు పశువులున్నవి, ఒకటి ఆవు, ఒకటి ఎద్దు. అన్నీ ఆ విధంగానే యుండినవి. కాని మానవుని దగ్గరకు వచ్చుసరికి ఒక్కడే యుండెను, జతలేదు. ఆదాము దేవుని యొక్క స్వరూపమందు సృజింపబడెను. అతడు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు గనుక శోధనకు గురికాడు మరియు పతనము కాడు. అది అసాధ్యము. కాబట్టి దేవుడు మానవునిలో నుండి ఒక ఉపఉత్పత్తిని తీసికొనుట ద్వారా పతనము జరిగెను. స్త్రీ తాజాగా దేవుని చేతిలో నుండి వచ్చినది కాదు. అనగా దేవుని చేత నిజంగా తయారయినది కాదు, ఆమె పురుషుని లో నుండి వచ్చినది. ఆమెను దేవుడు పురుషుని లో నుండి వచ్చునట్లుగా చేసెను కనుక ఆమె దేవుని చేత సృజింపబడిన ఇతర ఆడ జాతికి చాలా భిన్నముగా యుండెను. మోసపరచబడు గుణము ఆమెకు ఉండెను. సృష్టిలోని ఏ ఇతర ఆడ జాతి నీతి బాహ్యముగా ఉండలేదు గాని, మానవ స్త్రీ మానవుడు ఏ సమయములోనయినా తాకబడునట్లుగా ఉండెను.

ఆమెలోనున్న ఆ బలహీనతయే సాతానుకు ఆసరగా దొరికి, సర్పము ద్వారా ఆమెను మోసము చేసెను. అందువలన దేవుని ఎదుటను, ఆయన వాక్యము ఎదుటను, ఆమె ఒక వింతయగు స్థానమును పొందునట్లు చేసెను. ఒక వైపుచూచినప్పుడు ఆమె అసభ్యమగు, నీతి బాహ్యమగు, కలుషితమగు ప్రతిదానికిని సాదృశ్యముగా యున్నది, మరియొక వైపు ఆమె పవిత్రమగు, అందమగు, పరిశుద్ధమగు సమస్తమునకును సాదృశ్యముగా యున్నది. దేవుని యొక్క ఆత్మను దేవుని యొక్క ఆశీర్వచనమును పొందునట్లుగా ఆమె ఉన్నది. ఒక ప్రక్క ఆమె వేశ్యగా తన జారత్వపు మద్యమును త్రాగించిన దానిగా పిలువబడెను. మరియొక వైపు ఆమె క్రీస్తు యొక్క వధువుగా పిలువబడెను. ఒకవైపు ఆమె మర్మమై యున్న బబులోనుగా ఉండి, దేవుని యెదుట హేయమైనదిగా పిలువబడెను. మరొక వైపు ఆమె మన తల్లియగు నూతన యొరూషలేముగా పిలువబడెను. ఒకవైపు ఆమె దుష్టురాలుగాను, చెడ్డ దానిగాను, చెడిపోయిన దానిగాను ఆమె పూర్తిగా అగ్నిగుండములోనికి త్రోయబడుటకును, ఆ చోటికి మాత్రమే తగినట్లుగాను కనబడును. మరియొక్క వైపు ఆమె పరలోకమునకు హెచ్చింపబడి దేవుని యొక్క సింహాసనమును పంచుకొనుదానిగా అటువంటి చోట ఉండదగిన రాణిగా కనిపించును.

ఈ తుయతైర సంఘ కాలములో ఆమె పెత్తనము చేయు స్త్రీగా యున్నది. ఆమె మర్మమైయున్న బబులోను, ఆమె మహావేశ్య. ఆమె అబద్ధ ప్రవక్తిణియగు యొజెబెలు. ఎందుకని? ఎందుకనగా నిజమగు స్త్రీ దేవునికి లోబడి యుండును. క్రీస్తే ఆమె యొక్క శిరస్సు. ఆమెకు ఆయన మాట తప్ప మరేదియూ ఉండదు, ఆయన యొక్క ఆలోచన తప్ప మరొకటి లేదు. ఆయన తప్ప మరొక నాయకుడు లేడు. కాని ఈ సంఘము మాట ఏమిటి? ఆమె వాక్యమును త్రోసివేసినది, బైబిలును నాశనము చేసినది. భక్తుల యొక్క యోగ్యమగు వ్రాతలను నాశనము చేసినది. సత్యమును బోధించు వారిని ఆమె హతము చేసినది. ఆమె రాజులను, అధికారులను మరియు జనములను తన అదుపులోనికి తెచ్చుకొనినది — సైన్యములను నియంత్రించుచున్నది. తానే క్రీస్తు యొక్క శరీరమైయున్నాననియు, తన యొక్క పోపులు క్రీస్తుకు ప్రతినిధులనియు చెప్పుకొనుచున్నది. ఆమె పూర్తిగా అపవాది చేత మోసము చేయబడినది. చివరకు ఆమె ఇతరులను మోసము చేయుదానిగా మారిపోయినది. ఆమె సాతాను యొక్క పెండ్లికుమార్తెగా అతనికి అక్రమపిల్లల మతములు కనినది.

అంధకార యుగములన్నిటనూ ఆమె పెత్తనము చేసినది. తొమ్మిది వందల సంవత్సరములకు పైగా ఆమె విచ్ఛిన్నము చేసి నాశనము చేసినది. కళలను ఆమె చంపినది, సైన్సును నాశనము చేసినది, మరణమును తప్ప మరి దేనినీ ఉత్పత్తి చేయలేదు. చివరకు సత్యము యొక్క వెలుగు దాదాపుగా అంతరించినది. మిణుకు మిణుకుమను గ్రుడ్డి వెలుగు మాత్రమే నిలచి యున్నది. నూనె మరియు ద్రాక్షారసము ప్రవహించుట దాదాపుగా ఆగిపోయెను. ఆమె ప్రపంచ రాజ్యములపై పెత్తనము చేసినా గాని, తనలోనే మనుష్యులందరూ పౌరసత్వమును పొందవలెనని హెచ్చరించినా గాని, ఒక చిన్న గుంపు దేవునికి చెంది యున్నది. వారియొక్క పౌరత్వము పరలోకమందున్నది. ఆమె వారిని నాశనము చేయలేక పోయెను. దేవుడు తన చిన్న మందను కాపాడును; వారు నాశనము కారు. ఈ రోమ్ సంఘము బహు అన్యత్వములోనికి పోయి అతల్యా రాణివలె దుర్మార్గురాలయినది. రాజ సంతానము వారినందరినీ ఆమె నాశనము చేయవలెనని ప్రయత్నించి దాదాపుగా విజయవంతమయినది, కాని ఒకరిని దేవుడు కాపాడెను మరియు అతని మూలముగా నమ్మకస్తులు చాలా మంది వచ్చిరి. ఆ సుదీర్ఘమగు చీకటి రాత్రిలో దేవుడు చిన్న మందను కాపాడెను మరియు వారి యొక్క సత్యము వలన చివరిగా ఒక లూథరు లేచెను.

రోమను కాథలిక్కు సంఘము గూర్చియు, దానియొక్క ఆరాధన విధానము గూర్చియు తెలిసినవారెవరైనా వారికి ఈ తుయతైర పట్టణమును ఆత్మ ఎందుకు ఎన్నుకొనెనో అర్థమగును. అంధకార యుగములలో సంఘమునకు సాదృశ్యముగా నిలబడినది. అది మన కన్నుల యెదుటనే యున్నది.

కాలము

తుయుత్తెర కాలము అన్ని కాలములలోను దీర్ఘమైనదిగా, దాదాపు 900 సంవత్సరములు, 606 నుండి 1520 వరకు ఉన్నది.

వర్తమానికుడు

సంఘము ఎప్పుడో రెండు గుంపులుగా చీలిపోయినది. పశ్చిమ మరియు తూర్పు సంఘములుగా మారినది. ఏదో ఒక సంఘములో గాని, లేక రెండు సంఘములలో గాని ఆయా సమయములలో ఒక సంస్కర్త లేచెడి వాడు. సంఘములోని ఒక భాగము వారిని కొంతకాలము అతడు నడిపించి, వారిని దేవునితో లోతయిన సంబంధమునకు పురికొల్పెడివాడు. పశ్చిమమున అటువంటి వ్యక్తి అస్సిసి వాసియగు ఫ్రాన్సిస్. నిజంగా కొంతకాలము పాటు జయమును పొందెను, అతని పని చివరికి రోమ్ యొక్క అధీనము లోనికి జారిపోయినది. లయన్సు వాసియగు పీటర్ వాల్లో ఒక వర్తకుడు, అతడు తన పౌరజీవనమును పరిత్యజించి, ప్రభువును సేవించుటలో బహు చొరవగా పనిచేసెను. చాలా మందిని ఆయన వైపుకు త్రిప్పెను, కాని అతడు తన యొక్క పనిలో ముందుకు సాగకుండా ఆటంకములు కలిగించి పోపు ద్వారా బహిష్కరించబడెను. వాక్యము యొక్క వెలుగులో పరీక్షించినప్పుడు ఈ కాలమునకు వర్తమానికుడు పశ్చిమ గుంపులో గాని, తూర్పు గుంపులో గాని లేకుండాపోయెను. ఏది ఏమైనా బ్రిటీష్ ద్వీపములలో ఇద్దరు వ్యక్తులుండిరి, వారియొక్క పరిచర్య క్రియలోను, వాక్యములోను సత్య పరీక్షకు నిలబడును. వారు పరిశుద్ధ పాట్రిక్ మరియు పరిశుద్ధ కొలంబా పరిశుద్ధ కొలంబాకు వర్తమానికునిగా ఎంచబడు చాలా అర్హతలున్నవి.

తుయతైర సంఘమునకు పరిశుద్ధ కొలంబా వర్తమానికుడయినా గాని, నేను పరిశుద్ధ పాట్రిక్ జీవితము గూర్చి కొద్దిగా చెప్పగోరుచున్నాను. అది మనందరికి ఒక మాదిరిగా యుండును. మరియు రోమ్ యొక్క అబద్ధమును అతని జీవితము ఎత్తి చూపును, ఎందుకనగా జోన్ ఆఫ్ ఆర్క్ వలె, పరిశుద్ధ పాట్రిక్ కూడా మా వాడేనని వారనుచున్నారు. క్లయితే నదియొడ్డున గల బొనావెర్న్ అను చిన్న పట్టణములో పరిశుద్ధ మార్టిన్ సోదరికి పాట్రిక్ జన్మించెను.

ఒక రోజున తన ఇద్దరు సోదరీలతో నదీ తీరమున ఆడుకొనుచుండగా సముద్రపు దొంగలు వచ్చి ఆ ముగ్గురిని ఎత్తికొనిపోయిరి. ఆ సోదరీలు ఎక్కడికి వెళ్ళిరో ఎవరికీ తెలియదు, కాని పాట్రిక్ ను ఉత్తర ఐర్లాండులోని ఒకనికి అమ్మివేసిరి. (పాట్రిక్ పేరు సుకాటట్) అతని పని పందులను మేపుట, దీనిని చేయుటకు అతడు కుక్కలకు శిక్షణ ఇచ్చెను. అతడు కుక్కలకు ఇచ్చిన శిక్షణ చాలా గొప్పగా యున్నందున, దూరము నుండి దగ్గర నుండి చాలామంది వాటినికొనుటకు వచ్చెడివారు. అతడు ఏకాంతములో దేవుని వైపు తిరిగి రక్షణను పొందెను.

తప్పించుకొని తన తల్లిదండ్రుల ఇంటికి రావలెనను కోరిక అతనికి వచ్చెను. అందుకతడు ఒక పధకము రూపొందించుకొని శిక్షకునిగా తనకున్న సామర్థ్యమును అతడు గొప్పగా ఉపయోగించుకొనెను. కుక్కలను తనపై పరుండియుండి తన శరీరమును జాగ్రత్తగా కప్పమని తాను ఆజ్ఞాపించు వరకు కదలవద్దని వాటికి నేర్పించెను. ఆ విధముగా ఒక రోజున తన యజమాని చాలా కుక్కలను అమ్ముట జరిగెను. ఆ కుక్కలకు పాట్రిక్ ఆజ్ఞాపించెను, కానీ ఆ గుంపు నాయకునిగా ఉన్నదానికి మాత్రము ఆలాగు చెప్పలేదు. సరే. వాటిని పడవలోనికి ఎక్కించెను. ఆ గుంపు నాయకునికి అతడు రహస్యముగా సైగ చేసినందున అది పారిపోసాగినది. పడవలోనికి ఎక్కుటకు రానొల్లకుండెను. ఆ యజమాని మరియు కొనుగోలుదారుడు కుక్కను లోనికి ఎక్కించుటకు ప్రయత్నములు చేయుచుండగా పాట్రిక్ పడవలోనికి ఎక్కి తనను కప్పుమని కుక్కలకు సైగ చేసెను. అంతట అతడు ఒక ఈలవేసి ఆ కుక్కల నాయకుని పడవలోనికి రప్పించెను. అది అతని మీదికి వచ్చెను. పాట్రిక్ ఎక్కుడున్నాడో తెలియనందున కొనుగోలు దారుడు పడవను సముద్రములోనికి ప్రయాణించుటకు అనుమతించెను.

ఇక ఆ యజమాని తనను చేరుకోలేనంత దూరముగా యున్నాడని నిశ్చయముగా తెలిసికొనిన పాట్రిక్, కుక్కలకు మరియొక సైగను ఇచ్చెను. అందువలన కుక్కలు తిరుగుబాటు చేయుట ప్రారంభించినవి. ఆ తరువాత అతడు ఓడ నావికుని యొద్దకు వచ్చి, తనను తన ఇంటి తీరములో విడిచిపెడితేనే గాని కుక్కలను ఆలాగే తిరుగుబాటు చేయుటను కొనసాగించుదునని చెప్పెను. ఓడను తాను వశము చేసికొందునని చెప్పెను.

ఆ ఓడ నావికుడు క్రైస్తవుడయినందున, అతడు ఈ బాలుని గాధను విని, సంతోషముగా అతని ఇంటి తీరమును విడిచిపెట్టెను. అక్కడ పాట్రిక్ బైబిలు స్కూలుకు వెళ్ళెను మరియు ఐర్లాండుకు తిరిగి వచ్చెను. వాక్యము మరియు దేవుని యొక్క శక్తి రుజువయినందున, అతడు అనేక సూచక క్రియలు మరియు అద్భుతములు జరిగించినందున వేలాది మంది ప్రభువు యొద్దకు నడిపించబడిరి. ఏ సమయము లోను అతడు రోమ్కు వెళ్ళలేదు, ఎప్పుడును రోమ్ ద్వారా అతడు ఆజ్ఞాపించబడలేదు. అసలు సత్యమును గమనించండి, రోమ్ చివరకు ఆ ద్వీపము మీద ఆధిపత్యమును పొందినప్పుడు వారు ఆ సమయము కొరకు ఎదురు చూచుచున్నారు గనుక 100,000 మందికి పైగా క్రైస్తవులను వారు చంపిరి. వారు అసలు గుంపు వలన ఈ సంవత్సరములన్నిటిలోను వృద్ధి చెంది పరిశుద్ధ పాట్రిక్ వలన ప్రభువు యొద్దకు నడిపించబడిరి.

పరిశుద్ధ పాట్రిక్ మరణించిన దాదాపు 60 సంవత్సరముల తరువాత ఉత్తర ఐర్లండులోని డోనెగల్ కౌంటీలో జన్మించెను, ఫెర్గస్ అను ఘనులగు కుటుంబములో కొలంబా జన్మించెను. అతడు బహుమేధావి, దీక్ష గల పండితుడయ్యెను, చాలా వాక్య భాగమును కంఠస్థము చేసెను. దేవుడు అతనిని వినదగినట్టి స్వరముతో పిలచి మిషనరీగా పనిచేయుమనెను. దేవుని యొక్క స్వరమును అతడు వినిన తరువాత ఏదియూ అతనిని ఆపలేకపోయెను. అతని యొక్క అద్భుతమగు సేవవలన అనేకమంది చరిత్రకారులు అతనిని అపోస్తలుల తరువాత అంతటివాడని ప్రశంసించిరి. అతని యొక్క పరిచర్య చాలా గొప్పగా యుండెను, దైవ సంబంధమగు సూచక క్రియలు కనబడుచుండెను (ముఖ్యంగా రోమ్ లోని విద్యార్దులు) ఇతని గూర్చి మరీ అతిశయోక్తిగా వీరు చెప్పుచున్నారని కొందరనుకొనిరి.

మిషనెరీ పని నిమిత్తము అతడు చేసిన ప్రయాణములలో ఒక దానిలో అతడు ఒక ప్రాకారముగల పట్టణమును సమీపించినప్పుడు, అతనిని రాకుండా గేటు మూసి యుంచినట్లుగా అతడు చూచెను. అతడు తన స్వరమెత్తి ప్రార్థన చేసెను. దేవుడు తనకు సహాయము చేసి ఆజనులకు బోధించుటకై వెళ్ళుటకై అవకాశమియ్యవలెనని ఆర్థించెను. కాని అతడు ప్రార్ధించుచుండగా అవరణలో మాంత్రికులు పెద్ద గోలచేసి అతనిని వేధించ మొదలు పెట్టిరి. అప్పుడతడు ఒక కీర్తన పాడుటకు ప్రారంభించెను, అతడు పాడుచుండగా దేవుడతని స్వరమును ఎంతో హెచ్చించగా ఆ అన్యుల యొక్క స్వరములు అసలు వినబడనేలేదు. ఆకస్మాత్తుగా ఆ గుమ్మములు వాటంతట-అవే తెరచుకొనినవి. అతడు లోనికి వచ్చి సువార్తను వారికి బోధించి, అనేకులను ప్రభువు కొరకు సంపాదించెను.

మరియొకసారి అతనిని ఒక గ్రామములోనికి రానీయకుండా చేసినప్పుడు, అతడు వెనుదిరిగి పోసాగెను. అయితే ఆకస్మాత్తుగా ఆ గ్రామ ప్రధాని యొక్క కుమారుడు భయంకరముగా జబ్బుపడెను, మరణము అయిపోవునేమో అనునంతగా వ్యాధిగ్రస్తుడయ్యెను. ప్రార్థన చేయుటకు వారు పరిశుద్ధ కొలంబాను వెదకి తీసికొని వచ్చిరి. అప్పుడితడు విశ్వాస సహితమగు ప్రార్థన చేయగా, ఆ బాలుడు అప్పటికప్పుడే బాగుపడెను. అప్పుడు ఆ గ్రామము సువార్తకు తెరువబడినది.

మరియు అతని యొక్క సహవాసులు కొలంబా ద్వారా బోధించబడిన పవిత్ర సువార్తను మొత్తం స్కాట్లండులో వ్యాప్తిచెందించి, ఆ దేశమును దేవుని వైపు త్రిప్పిరి. అది ఐర్లాండులోనికి, ఉత్తర ఐరోపాలోనికి ప్రవహించెను. అతడు సువార్తను బోధించిన విధానమును గమనించవలెను. బహుశా పండ్రెండు మంది ఒక నాయకుని అధ్వర్యములో ఒక క్రొత్త ప్రదేశములోనికి వెళ్ళుచుండిరి, అక్షరాలా వారు సువార్త కేంద్రముగా గల పట్టణమును కట్టుచుండిరి. ఈ పండ్రెండు మందిలో వండ్రింగి వారు, ఉపాధ్యాయులు, ఉపదేశకులు మొదలగువారుండిరి. అందరునూ అద్భుతమగు వాక్య పరిజ్ఞానమును, పరిశుద్ధ జీవనమును కలిగి యుండిరి. ఈ చిన్న పట్టణము ఒక గోడ ద్వారా మూయబడి యుండెను. ఈ నివాసము లోనికి విద్యార్దులు మరియు వారి యొక్క కుటుంబములు త్వరలోనే వచ్చి స్వంత గృహములను ఏర్పాటు చేసికొని వాక్యమును నేర్చుకొనుచుండిరి. బయటకు వెళ్ళి మిషనెరీలుగా, నాయకులుగా మరియు బోధకులుగా సేవ చేయుటకు సిద్ధపడుచుండిరి. పెండ్లి వారి ఇష్టమును బట్టి చేసికొనవచ్చునని స్వేచ్చ ఇవ్వబడెను; అయినా చాలమంది పెండ్లి చేసికొనలేదు, దేవున్ని ఇంకా బాగా సేవించుటకు వారాలాగు చేసిరి. వారు రాజ్యము యొక్క సహాయమును తీసికొనకుండా స్వేచ్చగా యుండిరి, ఆ విధముగా వారు రాజకీయముల నుండి దూరముగా ఉండిరి. ఇతర మతములను నిత్యమూ దూషించుటకు బదులుగా వారు సత్యమును నేర్పించిరి, ఎందుకనగా దేవుడు తమ మనస్సులలో యుంచిన లక్ష్యములను నెరవేర్చుటకు సత్యమే ఒక ఆయుధముగా పని చేయునని విశ్వసించిరి. వారు రోమ్ యొక్క చెప్పు చేతలలో లేకుండా పూర్తిగా స్వతంత్రులుగా యుండిరి.

హాయి ద్వీపములో ఒక గొప్ప బైబిలు స్కూలును పరిశుద్ధ కొలంబా స్థాపించెను (స్కాట్లాండుకు పశ్చిమ తీరమున యున్నది) అతడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ద్వీపము చాలా నిర్మానుషముగా రాళ్ళతో నిండియుండెను. అది వారికి సరిపడు ఆహారమును ఉత్పత్తి చేయజాలకుండెను, కాని కొలంబా ఒక చేతితో విత్తనమును నాటుచూ ప్రార్థనతో మరియొక చేతిని ఎత్తి పట్టుకొనియుండెను. ఈనాడు ఆ ద్వీపము ప్రపంచములోని సారవంతమగు స్థలములలో అతిముఖ్యమైనదిగా యున్నది. ఈ బైబిలు కేంద్రముగా గల ద్వీపము నుండి మహాశక్తిగల పండితులు బయలు వెళ్ళిరి, వారు జ్ఞానము తోను, దేవుని యొక్క శక్తితో నిండియుండిరి.

ఈ గొప్ప దైవజనుని యొక్క చరిత్రను నేను చదివినప్పుడు మరియు అతడు చేసిన గొప్పఅద్భుత పరిచర్యను చూచినప్పుడు, పోపుల అధికారము అందుకు ప్రతిస్పందించిన విధానమును కనుగొని, నా హృదయము విచారముతో నిండిపోయినది. మనుష్యులనందరిని తన గుప్పెట్లో లోనికి తీసికొని రావలెనని వారు బహుగా ప్రయత్నించిరి. క్రమ క్రమముగా ఈ మిషను పొలములను వారు అపవిత్రపరచసాగిరి, కొలంబా బోధించిన సత్యమును వారు నాశనము చేసిరి.

అభినందన

ప్రకటన 2:18,

అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా."

తుయతైర కాలమునకు వెల్లడి అయిన దైవత్వము యొక్క ప్రత్యక్షత ఏదనగా యేసు దేవుని కుమారుడు. ఆయన శరీరధారిగా ఉండిన దినములలో మనుష్య కుమారునిగా వెల్లడి అయ్యెను. కాని ఇప్పుడాయన శరీరధారిగా లేడు. ఇప్పుడాయన మనుష్య కుమారుడు కాడు, మహా ప్రవక్తయగు ఆయనయందే ప్రవచనములన్నియూ నెరవేరెను. అద్వితీయుడగు ఆయన తిరిగి తండ్రి రొమ్ములోనికి వెళ్ళెను. ఇప్పుడాయనను మనము పునరుద్దాన శక్తిని పొందిన వానిగా ఎరుగుదుము. ఆయన తిరిగి లేచి మహాశక్తిని పొందెను, ఆయన స్వంత మహిమా లేదా ఘనత అన్నిటికంటెను, అందరి కంటెను మిన్నయైనది. ఆయన తన మహిమను మరియొకరితో పంచుకొనడు. సంఘము మీద ఆయనకున్న అధిపత్యమును ఆయన ఏ మానవునికి అప్పగించడు.

ఆయన తుయతైరను చూచినప్పుడు, ఇక్కడ ఈ పట్టణములో ఆయనకు మాత్రమే చెందవలసియుండిన మహిమను మరొకనికి ఇచ్చుటను ఆయన ఆ నాలుగవ సంఘ కాలములో చూచెను. ఆయన యొక్క కన్నులు అగ్నిజ్వాలల వలెయున్నవి, ఉగ్రత మరియు తీర్పులను ఆ చూపులు ప్రతిబింబించుచున్నవి. ఆయన మాత్రమే తండ్రికి అద్వితీయ కుమారుడుగా ఉండగా, అపోల్లోను దేవుని కుమారునిగా వారు గౌరవించుట ఆయన చూచెను. తుయతైర కాలములోని మతము మీదికి వచ్చు ఆయన తీర్పులు ఎంత భయంకరముగా ఉండునో చూడండి. ఆ సంఘ సభ్యులు దేవుని కుమారుని అరాధించు అన్యుల వలెయుండిరి (జియాస్ యొక్క కుమారుడు అపోల్లో ఒక మానవ పరిపాలకుని హెచ్చించి ఆరాధింపసాగరి. వారికి రాజ్యము యొక్క బలమున్నది. దానినే ఖచ్చితంగా ఆయన చూచెను. రోమను కాథలిక్కు సంఘము పూర్తిగా విగ్రహారాధనలో మునిగిపోయి యున్నది. సూర్య దేవుని కర్మకాండ మీద ఇది ఆధారపడియున్నది (అపోల్లో) ఒక మానవుని, వారు వాస్తవ దేవునిగా (పోపు) హెచ్చరించిరి. సంఘమును మరియు రాజ్యమును వారు ఏకము చేసిరి. థామస్ అక్వినాస్ మరియు అల్వెరస్ పెలాజియసులు రూపొందించి చెప్పినది ఇది: "పోపును ఆత్మీయ నేత్రములతో చూచువారికి అతడు మానవునిగా కాక దేవునిగా కనబడినట్లు తోచును, అతని యొక్క అధికారమునకు హద్దులు లేవు. అతడు తన ఇష్టమును బట్టి ఒకదానిని సరియనును. వారి యొక్క హక్కులను వేటినయినా అతడు తీసివేయవచ్చును. అది మంచిదని అతడు తలంచినచో ఆలాగే జరుగ గలదు. ఈ సార్వత్రిక శక్తిని శంకించినట్లయితే రక్షణ లేకుండా ద్వారము మూయబడును. విశ్వాసబ్రష్టులే సంఘమునకు గొప్ప శత్రువులు, నిజమగు విధేయత అను కాడిని వారు ఎత్తుకొనలేదు."

"దేవునికిని, మానవులకిని మధ్యవర్తి ఒక్కడే యున్నాడు. ఆయనే యేసు క్రీస్తు అను నరుడు (దేవుని కుమారుడు)"

1 తిమోతీ 2:5.

కాని రోమ్ యొక్క పోపు వాక్యమును మార్చెను. దేవునికిని మానవునికిని మధ్య ఒక్కడే మధ్యవర్తి యున్నాడని ఆయన చెప్పెను (మనుష్యులు కారు). అయితే ఇప్పుడు అతడు దేవునికిని మానవునికిని మధ్యవర్తిగా యున్నానని చెప్పుకొనుచున్నాడు. కాని కుమారుడే తప్ప మరే ఇతర మధ్యవర్తి లేడు. రోమ్ సంఘము ద్వారా పోపు రక్షణను ప్రకటించుచున్నాడు. కాని దేవుని కుమారుని ద్వారా తప్ప రక్షణయే లేదు. ఆయన కన్నులు అగ్ని జ్వాలలవలె మండుటలో ఆశ్చర్యము లేదు. తీర్పుతో ఆగ్రహించుచున్నవి. ఆయన పాదములు అపరంజిని పోలియుండుటలో ఆశ్చర్యము లేదు. ఈ లోకము యొక్క దుష్ట రాజ్యములను ఆయన ధూళిగాను, పొడిగాను తొక్కుటను సిద్ధపడి నిలబడియున్నాడు. ఆ అపరంజిని పోలిన బలమగు పాదముల బట్టి దేవునికి వందనములు. మన యొక్క తీర్పు కొరకు అవి సాగిపోయినవి. ఇప్పుడు అవి మన పునాదిగా ఉన్నవి, ఆయన సంపాదించినది మనదేయగును. ఆయనలో గుర్తింపబడి మనము నిలచి యున్నాము, యేసు దేవుడు కుమారుడు.

ఈ కాలములోనే మహమ్మదీయ మతము లేచుట మనము చూడగలము. దేవుని కుమారుని వారు ధిక్కరించిరి. క్రైస్తవులుగా చెప్పుకొనిన వారినందరినీ చంపుటకు వారు తీర్మానించుకొనిరి.

సర్వశక్తుడగు దేవుని యొక్క మొదటి ఆజ్ఞను అబద్ధ సంఘము ధిక్కరించుట కూడా ఆ కాలములోనే జరిగినది. నెమ్మదిగా రెండవ ఆజ్ఞను ధిక్కరించుటకును పధకము వేసినది, ఎందుకనగా యేసుక్రీస్తు స్థానములోనికి పోపును తీసికొని వచ్చిరి. విగ్రహారాధనను ప్రవేశపరచి దానిని బలవంతముగా రుద్ధరి. సంఘములో వాటికి స్థానము కల్పించుటకు నిరాకరించిన వారికి మరణము విధించబడునని చెప్పువరకు వారు వచ్చిరి. తియోడరా అను రాజకుమార్తె ఆధ్వర్యములో 842 నుండి 847 మధ్య కాలములోనే 100,000 మందికి పైగా పరిశుద్దులను చంపిరి, ఎందుకనగా వారు విగ్రహములను ఎందుకూ పనికిరావని చెప్పిరి.

నిశ్చయముగా ఈ కాలము మారుమనస్సు పొందవలెను, లేనిచో పూర్తిగా నాశనమగును. మహిమగల ప్రభువు అక్కడ నిలబడియున్నాడు, ఆయనే దేవుడు — ఆయన వాక్యమును వారు ప్రక్కకు త్రోసివేసిరి. ఆయనను వారు విసర్జించిరి, కాని మానవ హస్తములు మరియు మానవ హృదయములు ఆయనను నిరాకారునిగా చేయజాలవు. వారాయనను విసర్జింపనీయుడి, ఆయన నమ్మకస్తునిగానే నిలచియుండును. "చిన్నమందా భయపడకుడి; మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రి చిత్తమైయున్నది. అగ్నిజ్వాలలవంటి కన్నులతోను, అపరంజిని పోలిన పాదములతోను నేను తిరిగి వచ్చునప్పుడు ప్రతీకారము తీర్చుకొందును; తీర్పు నాది, నేను తిరిగి చెల్లించెదను?" అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

ప్రశంస

ప్రకటన 2:19,

"నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియొక్కువైనవని యొరుగుదును."

ఇక్కడ మరల అదే పరిచయ మాటలను మనము కనుగొందుము, "నీ క్రియలను నేనెరుగుదును." దేవుని కుమారుడే స్వయంగా చెప్పెను, "నేను చేయు క్రియల నిమిత్తము నన్ను నమ్ముడి." ఆయన భూమిమీద యుండగా తన స్వంత క్రియల గూర్చి నోక్కి చెప్పెను. ఆయన చేసిన క్రియలు దేవుని చేత నిర్ణయించబడినవి, ఆయన యందు విశ్వాసమును పుట్టించినవి. ఆయన యొక్క పరిచర్యలో అది ఒక గొప్ప బాగము.

ఆయన యొక్క పరిశుద్దాత్మ అపోస్తులుడగు పౌలుతో యుండి ఇట్లు చెప్పెనది,

"మరియు వాటియందు మనము నడచుకోనవలేనని దేవుడు ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనియై యున్నాము." ఎఫేస్సి 2:10.ఈ క్రియల వలన ఆయన యందలి విశ్వాసము ఎక్కువగును. ఆయనతో గల సంబదమును గూర్చి పౌలు ఇలా వ్రాయుచున్నాడు, "ఆయనలో సృష్టింపబడిన వారము."

రక్షణ విషయములో మన క్రియలు ఎప్పుడూ దేవునిలో ఉన్న మన విశ్వాసాన్ని ఆక్రమించలేవు. అయితే ఆయన యందున్న విశ్వాసమును క్రియలు నిరూపించును. మంచి క్రియలు నిన్ను రక్షించవు, కాని అవి ఒక రక్షించబడిన జీవితము నుండి వచ్చి ప్రభువునకు ఫలముగా ఉండును. మంచి క్రియల యందు నాకు విశ్వాసమున్నది. రక్షించబడని ఒక వ్యక్తి కూడా అతనికి సాధ్యమైనంత వరకు మంచి క్రియలు చేయవలెను. మానవులు చెడ్డ క్రియలు చేయుట, దేవుని దృష్టిలో భయంకరము. అటువంటి వారు కూడా తాము దేవుని చిత్తమును జరిగించుచున్నామని చెప్పెదరు. బిషప్పులు మరియు పోపులు, రోమ్ యొక్క వారసులు అదే చేయుచుండిరి. వారు చంపుచుండిరి, ప్రభువు నామములో అన్ని విధములగు చెడ్డ కార్యములు వారు చేయుచుండిరి. వాక్యము ఏమి బోధించుచున్నదో దానికి పూర్తిగా వ్యతిరేకమయిన దానిని వారు చేయుచుండిరి. ఆ చెడ్డ దినమున నిజవిశ్వాసులు, చీకటి చోటులో ప్రకాశించుచున్న వెలుగువలె యుండిరి. వారు ఎడతెగక మంచిని చేయుచుండిరి; వారు దూషణలకు ప్రతిగా ఆశీర్వచనములను పలుకుచుండిరి, దేవునిని ఘనపరచుటకు వారు సత్యమును నెరవేర్చుచుండిరి, అందువలన చాలామంది మరణించుట కూడా జరిగినది.

ఈ విషయములో ఆయన తన బిడ్డలను ప్రశంసించుచున్నాడు, ఎందుకనగా వారు మారిన జీవితములను జీవించుచుండిరి. వారిలో ఒక క్రొత్త ఆత్మ యున్నట్లుగా వారి క్రియలు సాక్ష్యమిచ్చినవి. మనుష్యులు వారి మంచి క్రియలను చూచి దేవుని మహిమపరచిరి. అవునండి, నీవు క్రైస్తవునివయినచో సరయిన కార్యమును చేయుదువు. నీ హృదయము సరిగా యున్నదని నీ క్రియలు చూపించును. దానిని నీవు పెట్టి తెచ్చుకో నక్కరలేదు, ఎందుకనగా ఆయన చిత్తమును నీవు చేయుదువు. ఎవరూ చూడనక్కర లేదు, దేవుడు నిన్ను చూచును. నీ ప్రాణమును ఒకవేళ వెలగా చెల్లింపవలసి వచ్చినా గాని ఆయన చిత్తమునే నీవు చేయుదువు.

"నీ ప్రేమను, పరిచర్యను, విశ్వాసమును, మరియు సహనమును నేనెరుగుదును." "క్రియలు" మరియు "పరిచర్యకు" మధ్య వారి ప్రేమ ఉంచబడినదని మీరు గమనించగలరు. దానికి అదే సరయిన స్థలము, ఎందుకనగా ప్రేమ లేకుండా మన క్రియలు అంగీకరించబడవు. దేవుని యెదుట వలన పరిచర్య కూడా అలాంటప్పుడు అమోదించబడదు. పౌలు కోరింథీయులతో మాట్లాడుచూ ఇట్లు చెప్పెను, "ప్రేమ లేనివాడనయితే నేను వ్యర్దుడనే, నేను ఏది చేసినా గాని అది ప్రేమ పూర్వకముగా చేయని యెడల దాని వలన ప్రయోజనము లేదు." ఈ విశ్వాసులు ఆ నీకొలాయితుల వర్గములో చేరిన వారు కారని ఇక్కడ మీరు చూడగలరు. వారు క్రియల వలన రక్షణ వచ్చునని చెప్పిరి, మనుష్యుల మొప్పు పొందవలెనని వారు చెప్పరి. వారు దేవుని మీద ప్రేమను బట్టి ఈ క్రియలను చేసిరి. పరిశుద్దాత్మ ద్వారా అది వారి హృదయములలో నివాసము చేయుచున్నది. వారి హృదయములోనున్న ప్రేమ దేవుని ప్రేమయే. అది ఆయన స్వంత ప్రేమ. యేసు ఇట్లనెను, "దీనివలన మీరు నా శిష్యులని మనుష్యులందరూ తెలిసికొందురు. మీలో ఒకనినొకడు ప్రేమించుకొనవలెను." క్రైస్తవుల యొక్క జీవితములను చూచిన అన్యులు ఇట్లనిరి, "వారెట్లు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారో చూడండి." యోహాను ఇట్లనెను,

"ప్రేమ కలిగిన ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు."

I యోహాను 4:7.

ఇక్కడ నేను ఒక హెచ్చరికను ఇవ్వగోరుచున్నాను. అది చివరి దినముల గూర్చి చెప్పుచున్నది, అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. చివరి కాలమగు లవోదికయలో స్వార్థపు ప్రేమ, వస్తువుల గురించిన ప్రేమ పెరిగిపోయి దేవుని యొక్క నిజమగు ప్రేమ చల్లారిపోవును. ఈ చివరి దినములలో మనము పాపము యొక్క శక్తిని గూర్చి అప్రమత్తముగా యుండవలెను. చాలామంది చాలా కఠినులుగా మారుచున్నారు, ఎందుకనగా వారు ఈ చివరి దినపు ఆత్మను గూర్చి గ్రహించుట లేదు. దేవుని యొద్దకు సమీపించవలసిన సమయమిది. ఆయన ప్రేమతో మనలను నింపనియ్యవలెను, లేని యెడల మనము చివరి దినపు సంఘము యొక్క చల్లదనముతో నిండిపోవుదుము, దేవుని సత్యమును విసర్జించుదుము, అది మాత్రమే మనకు సహాయము చేయగలుగును.

ఆ భయంకరమగు చీకటి దినములలో నిజమగు ద్రాక్షావల్లి దేవుని పట్ల తనకు గల ప్రేమను విడువలేదు, సోదరుల పట్ల ప్రేమ కలిగియుండెను. అందుకు గూర్చి దేవుడు వారిని ప్రశంసించెను.

"నీ పరిచర్యను నేసెరుగుదును." యేసు ఇట్లనెను," "మీలో గొప్పగా యుండగోరు వాడు అందరికి పరిచారకుడై యుండవలెను." ఆ సూక్తి మీద ఒక జ్ఞాని వ్యాఖ్యానించెను. అతడు చెప్పిన మాటను వినండి, "ఆ ఆజ్ఞ యొక్క సత్యమును చరిత్ర మాత్రమే రుజువు చేయును." అతడు చెప్పినది నిజము. చరిత్రలోని గొప్ప వారందరునూ పరిచారకులుగానే యుండిరి. పరిచర్య చేయించుకోవలెననుకొనినవారు, అణగదొక్కవలెనను కొనినవారు, శిరస్సుగా ఉండవలెనని నిత్యమూ తలంచినవారు, అవమానమునొంది నశించిరి. ధనికులను కూడా దేవుడు శిక్షించెను, ఎందుకనగా వారు తమ సంపదను సరిగా వినియోగించుకొనలేదు. కాని మీరు చరిత్రలోనికి చూడండి. నిజంగా గొప్పవారనదగినవారు ఇతరులకు సేవచేసిరి. పరిచర్య చేయించుకొనినవారిని చరిత్ర ఎన్నడును లెక్కలోనికి తీసికొనదు, కాని ఇతరుల నిమిత్తము ఎక్కువ సేవచేసిన వారిని అది నిత్యమూ స్తుతించును.

ఇప్పుడు దానిని మనకొరకు మనము అన్వయించు కొందము. మనుష్యకుమారుడు కూడా పరిచర్య చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయుటకు వచ్చెను, ఆయన మనకు మాదిరిగా యున్నాడు. ఆయన అపోస్తలుల పాదముల యొద్దకు వంగుటను చూడండి. వారి యొక్క అలసిన, మురికి పాదములను ఆయన కడిగెను. "ఇప్పుడు నేను చేయుచున్నదానిని మీరు ఎరుగరు, కానీ ఇక మీదట మీరు దానిని చేయవలెను," అని ఆయన చెప్పెను. దేవుడాయనను అతి సర్వోన్నత స్థలములలోనికి హెచ్చించునట్లుగా ఆయన దాసుడాయెను. ఒక రోజున ఆయన పరిశుద్దులకు తీర్పు తీర్చునప్పుడు ఈలాగు చెప్పుటను మనము విందుము, "భళా, నమ్మకమగు మంచి దాసుడా, ప్రభువు యొక్క ఆనందములో ప్రవేశించుము." ఎల్లప్పుడూ దాసునిగా యుండుట కష్టము. కాని ఇతరుల కొరకు ఖర్చు చేయువారు, ఖర్చయినవారు ఒక దినమున ఆయనతో కూడా ఆయన సింహాసనము మీద కూర్చోందురు. దానితో పోల్చినచో ఇప్పుడిది ఎన్నతగినది కాదు. "వేకువజాము నుండి సూర్యాస్తమయము వరకును మనము యజమాని కొరకు శ్రవుడుదుము. ఆయన యొక్క అద్భుతముగు ప్రేమ మరియు చింత గూర్చి మాట్లాడుదము. జీవితము అయిపోయిన తరువాత, భూమి మీద మన పని ముగిసిన పిదప, పేరు పిలిచినప్పుడు అక్కడ నేనుందును."

"నీ విశ్వాసమును నేనెరుగుదును." పెర్గెమలోనున్న సంఘముతో చెప్పినట్లుగా ఇక్కడ ఆయన చెప్పుట లేదు. "నా విశ్వాసమును విడిచిపెట్టలేదని" ఆయన అక్కడ చెప్పెను. ఆయన ఇప్పుడు ఆయన విశ్వాసము గూర్చి మాట్లాడుట లేదు, కాని వారి యొక్క నమ్మకత్వమును గూర్చి ఆయన మాట్లాడి ప్రశంసించుచున్నాడు. ఈ సందర్భములో ఆయన వారి సహనమును గూర్చియు చెప్పుచున్నాడు. నమ్మకత్వము మరియు సహనము కలిసియుండును.

నిజానికి నమ్మకత్వము యొక్క ఫలితమే సహనము, ఎందుకనగా యాకోబు 1:3లో ఇట్లు చెప్పబడినది,

"మీ విశ్వాసమును శోధించుట వలన సహనము వచ్చును."

సహనమును సంపాదించుటకు నిశ్చయంగా మరో మార్గమేదియూ లేదు. మన విశ్వాసమునకు వచ్చు పరీక్ష ద్వారా అది వచ్చును.

రోమా 5:3,

"శ్రమవలన సహనము వచ్చును."

మన సహనమును దేవుడు ఎంత ఉన్నతముగా లెక్కవేయునో యాకోబు 1:4లో చెప్పబడినది,

"సహనమును మీలో పరిపూర్ణముగా పనిచేయనీయుడి, అందువలన మీరు సంపూర్ణులును, ఏమియూ కొదువలేనివారును అగుదురు."

ఆ పరిపూర్ణతయే సహనము — దేవుని యొద్ద కనిపెట్టుట. దేవునికొరకు కనిపెట్టుట. ప్రవర్తన అభివృద్ధికి ఇదియే విధానము. ఈ అంధకార యుగములలో యున్న పరిశుద్దులను దేవుడు ఎంత ఉన్నతముగా హెచ్చించెనో చూడండి. గొర్రెలవలె సహనముగా యుండుట వలన వధకు నడిపించబడిరి. ప్రేమతోను, నమ్మకత్వముతోను వారు దేవుని సేవించిరి. జీవితములో వారు చేయగోరినదంతయూ అదే, తమ ప్రభువును సేవించినచో చాలుననుకొనిరి. వారి యొక్క బహుమానము ఎంత గొప్పదో.

"నీ క్రియలను నేసెరుగుదును; మొదటి క్రియలకన్న కడపటి క్రియలు మరి ఎక్కువగా యున్నవి."

ఇది నిజంగా గుర్తించదగినది. ఆ కాలము యొక్క చీకటి వృద్ధిచెందినది; దినదినము హతసాక్షుల యొక్క సంఖ్య ఎక్కువ కాసాగినది, వారి ఘనత పెరుగుచున్నది, వారు బహుగా శ్రమించి పనిచేశారు, వారు మరింత సేవచేసిరి, మరియు వారి యొక్క విశ్వాసము వృద్ధిపొందినది. ఎఫెసు సంఘ కాలములో ప్రేమ చల్లారుట ఎంత విషాదకరము. ఇతర కాలములలో ప్రేమ యొక్క పని వృద్ధి చెందుటను గూర్చి నిజముగా చెప్పబడలేదు; కాని ఈ కాలములో, అన్ని కాలములలోను చీకటిగాయున్న ఈ కాలములో వారాయనను ఇంకా ఎక్కువగా సేవించిరి. అదెంత గొప్ప పాఠము. వారు ప్రభువును మనసారా ప్రేమించుటలో ఏ మాత్రమును తీసిపోలేదు. వారు ఇంకా ఎక్కువగా పరిచర్య చేసిరి. ఇదియే రహస్యము. శత్రువు మనలను భయపెట్టి ప్రభువును సేవించకుండా చేయును. చాలా ప్రయత్నములు చేయును, కాని మన జవాబు మరెక్కువ పరిచర్యయే. బలహీనులు భయముతో కేకలు వేయుచుందురు గాని అదే అసలు జయోత్సాహము చేయవలసిన కాలము.

"నీ క్రియలను నేనెరుగుదును, నీ మొదటి క్రియలుకన్న కడపటి క్రియలు మరింత గొప్పవి."

ఈ కాలమును అంధకార కాలమని పిలచినట్లు ముందే మనము చెప్పుకొనుచున్నాము, ఎందుకనగా ఇది చరిత్రలో అతి చీకటి కాలము. పోపు ఇన్నోసెంటు III యొక్క కాలమది. తానే క్రీస్తు ప్రతినిధినని అతడు చెప్పుకొనెను — సంఘము మీద, ప్రపంచము మీద తానే సార్వభౌముడనని చెప్పుకొసనెను. అతడే విమత దండనా సభను ఏర్పాటు చేసెను, సంస్కరణ కాలములో తప్ప మరే ఇతర కాలములోను చిందించనంత రక్తమును అతడు చిందించునట్లుగా చేసెను. అది అశ్లీలతా కాలము, వేశ్యలు పరిపాలనను చేసిరి. సగారియస్ IIIనకు ఒక భార్య యుండెను. పోపుల సంగీత కచ్చేరీని అక్రమ సంతానముతోను, దుర్భీజులగు కుమారులతోను నింపినది. పోపుల గృహమును దొంగల గుహగా మార్చినది. అనాస్టసియస్ IIIను మరణించునట్లుగా చేసిరి. దీనికి కారకురాలు సగారియస్ భార్యయగు మారోజియా. జాన్ XI మారోజియా యొక్క అక్రమ సంతానము. జాన్ XII మారోజియాకు మనుమడు. అతడు కన్యకలను, విధవరాండ్రను చెరచినవాడు. అతడు మరోక స్త్రీతో ఉండిన సమయములో, ఆ స్త్రీ భర్త కోపోద్రిక్తుడై అతనిని చంపెను. అది పోపుల క్రమము యొక్క కాలము. రెండు రకముల పోప్ లు వచ్చిరి. (ఒకరు అవిగ్గునాను నుండి , మరొకరు రోమ్ నుండి పరిపాలన సాగించిరి) వారు ఒకరినొకరు దూషించుకొనుచు పోరాడుకొనుచూ యుండిరి. దుర్నీతికరమగు శరీరేచ్ఛలను జరిగించినందుకు (అక్రమంగా పుట్టిన ఎందరో పిల్లలకు వీరే తండ్రులు, స్వలింగసంపర్కులు కూడా యుండిరి.) ఈ పోపులు దోషులుగా ఉండుటయే గాక, యూజకత్వపు అధికారములను ఎక్కువ ముడుపులు చెల్లించిన వారికి అమ్మినందుకునూ నేరుస్తులే.

చాలా బలహీనముగా వెలుగు ప్రకాశించిన కాలము ఇదియే, అయినా గాని కొద్దిమంది విశ్వాసులు, విస్తరించుచున్న చీకటిలో బహు పట్టుదలతో శ్రమపడి పనిచేయుచుండిరి. ఈ కాలాంతము వరకు ఎందరో లేచి సంస్కరణను తీసికొని రావలెనని ప్రయత్నములు సలిపిరి. వారి ప్రయాస చాలా గొప్పది కనుక రాబోవుచున్న సంస్కరణకు వారు మార్గమును సుగమము చేసిరి. కాబట్టి ఆ కాలమును గురించి వాక్యము చెప్పిన ప్రకారము, "నీ యొక్క కడపటి క్రియలు (ఆ కాలము యొక్క అంతము) మొదటి క్రియలకన్న గొప్పవి."

తుయతైర అను పదమునకు చాలా అర్ధములున్నవి, అందులో ఒక అర్థము "నిరంతర బలి." దీనిని ఒక ప్రవచనముగా చాలామంది నమ్మదురు, మాస్ అను పదమును ఉపయోగించిరి అనగా క్రీస్తుకు బలిని నిత్యమూ అర్పించుట గూర్చిన భావము ఇందులో యున్నది. అది చాలా అద్భుతమగు ఆలోచన, కాని మరొక అర్థము కూడా ఇందులో యున్నది, అదేమనగా ప్రభువు యొక్క నిజ విశ్వాసులు నిరంతరము తమ జీవితములను బలి చేసిరి, మరియు బహుగా శ్రమించిరి.

నిశ్చయంగా ఈ తుయతైర పరిశుద్దులు శ్రేష్టమగు పంటను పోలియున్నారు. పూర్తిగా పరిశుద్దాత్మతో నిండియుండి విశ్వాసమును కలిగియుండిరి, సత్ క్రియలను చేయుచుండిరి, ఆయన యొక్క మహిమను కనుపరచుచుండిరి. వారు తమ ప్రాణములను ప్రియముగా ఎంచుకొనలేదు, కాని వారు తమకున్న సమస్తమును సంతోషముగా ఇచ్చివేసి, ప్రభువునకు ఒక మధురమగు బలిని సమర్పించిరి.

గద్దింపు

ప్రకటన 2:20,

"అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసియున్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యొజెబెలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును ఆది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది."

ఇప్పుడు ఈ వచనముతో పాటుగా 23వ వచనమును కూడా మీరు గమనించవలెనని కోరుచున్నాను. మీ దృష్టికి తీసికొని రావలెనని నేను ప్రయత్నించుచున్న ఆ గొప్ప సత్యము యొక్క రుజువును గమనించండి. "దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను; అతరింద్రియములను, హృదయములను పరిక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికోనును." వాస్తవంగా సంఘములు రెండే ఉన్నవని నేను మీతో చెప్పుచుందును. ప్రతి కాలములోను ఆత్మ రెండితితోను మాట్లడుచున్ననూ వారిరువురు ఒక్కటే అన్నట్లున్నది. సంఘములు ఉన్నట్లు ఇక్కడ తేటగా చెప్పబడినది. ఆ సంఘములలో కొన్నింటిలో అతరింద్రియములను, హృదయములను పరిశీలించువాడు ఆయనే అని ఆధారపూర్వకముగా తెలియదని చెప్పుచున్నది. దానిని ఆయన వారికి రుజువు చేయబోవుచున్నాడు. ఈ సత్యమును ఎరుగని ఆ సంఘములు ఏమిటి? అది ఒక అబద్ద ద్రాక్షావల్లి గుంపు, ఎందుకనగా తీర్పు నిశ్చయంగా దేవుని యొక్క ఇంటి వద్ద ప్రారంభమగును అని నిజ విశ్వాసులు ఎరుగుదురు. మరియు వారు దైవభయమున్నందు వలన వారు తీర్పు తీర్చబడకుండునట్లు తమ్మును తాము విమర్శించుకోనిరి.

వారు అబద్ధ ద్రాక్షావల్లికి చెందియుండినా గాని దేవుడు ఈ సంఘములను నా సంఘములని ఎందుకు చెప్పుకొనెను? వారు క్రైస్తవులు. అదే ఇందులోని సత్యము. కాని వారు ఆత్మసంబంధముగా క్రైస్తవులు కారు. వారు శరీరరీత్యా క్రైస్తవులు. వారు వ్యర్ధముగా ఆయన నామమును ధరించియున్నారు. మార్కు 7:7, "వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచూ, నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు." కాని వారు నిశ్చయముగానే క్రైస్తవులు కాక మరెవరు? మహమ్మదీయుడు మహమ్మదీయుడే. దాని ప్రకారము జీవించినా జీవించకపోయినా అది అతని మతము, ఎందుకనగా ఖురాను బోధించు దానిని అతడు ఒప్పుకొనుచున్నాడు.

అదే రీతిగా యేసు దేవుని కుమారుడనియు, కన్యకకు జన్నించెననియు, సిలువ వేయబడి, మృతిపొంది, తిరిగి లేచెననియు, ఆయన మానవులకు రక్షకుడనియు ఒప్పుకొనినంత కాలము ఒక క్రైస్తవుడుగానే యుండును. (వాస్తవానికి లవొదికయ సంఘ కాలములో కొందరుందురు, వారు తమ్మును తాము క్రైస్తవులవుని పిలుచుకొందురు, ఎందుకనగా వారు యేసు యొక్క చక్కని గుణలక్షణములను మెచ్చుకొందురు. అయితే వారాయన యొక్క దైవత్వమును నిరాకరించు హక్కును కలిగియుందురు. ఇప్పటికే క్రైస్తవ శాస్త్రజ్ఞలు ఆలాగు చేసియున్నారు మరియు సంఘ సువార్తను బోధించుచున్నవారు కోకొల్లలుగా యున్నారు). అతడు ఒక నామకార్ధ క్రైస్తవుడుగా సంఘమునకు చెందియుండును. కాని అతడు ఒక నిజమగు, ఆత్మ నింపుదలగల క్రైస్తవుడు కాడు. క్రీస్తు యొక్క శరీరములోనికి బాప్తిస్మము పొందిన అటువంటి క్రైస్తవుడే ఆయనలో సభ్యుడగును. కాని ఏది ఏమయినా, గోధుమలతో పాటుగా గురుగులు పెరుగుట దేవుని యొక్క చిత్తమైయున్నది, అవి పీకివేయబడవు. అది దేవుని యొక్క ఆజ్ఞ. అవి పోగుచేయబడి, కట్టలు కట్టబడు దినము వచ్చుచున్నది; కాని ఇంకా రాలేదు.

కాబట్టి ఆత్మ ఈ మిశ్రిత గుంపుతో మాట్లాడుచున్నది. ఒకవైపు ఆయన పొగడుచున్నాడు, మరియొక్క వైపు ఆయన గద్దించుచున్నాడు. ఏది సరియో ఆయన నిజ విశ్వాసితో చెప్పియున్నాడు. ప్రభువు యెదుట నిలబడి నీతిమంతునిగా తీర్చబడ వలెనన్నచో కారు ద్రాక్షావల్లి ఏమి చేయవలెనో ఆయన చెప్పి హెచ్చరించుచున్నాడు.

ఆ యొజెబెలు అను స్త్రీ

పాపము వలన వచ్చు శాపమును అపోస్తలుడగు యాకోబు మనకు చూపించి యున్నాడు.

యాకోబు 1:14-15,

"ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును."

ఇప్పుడు సంఘ కాలములలో జరుగుచున్న దాని యొక్క ఖచ్చితమగు దృశ్యమది. పాపము మొదట భావనలోనే ప్రారంభమయ్యెను, కావున సంఘమునకు మరణము సామాన్యమైన నీకొలాయితుల క్రియల వలన ప్రారంభమయినది. క్రియల నుండి అది ఒక బోధకు మారినది. బోధనుండి అది ఒక రాజ్యాధికారమును సంక్రమింప చేసికొని అన్యత్వమును పరిచయము చేసినది. ఈ కాలములో అది తన స్వంత ప్రవక్తినిని (బోధకురాలిని) తయారు చేసికొనినది. ఇంకా ముందుకు పయనించుచూ చివరకు అది అగ్నిగుండములోనికి వెళ్ళును, దాని యొక్క అంతము అదియే, అదియే రెండవ మరణము.

ఆ నాలుగవ కాలమునకు విరోధముగా దేవుని యొక్క పూర్తి కేకను వినండి. ఆయన ఈ ప్రవక్తినియగు యొజెబెలును నిందించుచున్నాడు. ఆమెను ఆ విధంగా ఎందుకు ఆయన నిందించుచున్నాడో ఖచ్చితంగా తెలిసికోవలెనన్నచో, ఆమె యొక్క చరిత్రను బైబిలులో మనము చూడవలసియున్నాము. ఆ వెనుక ఆమె ఏమి చేసినదో మనము కనుగొనినయెడల, ఈ సమయములో ఏమి జరుగునో చూడగలము.

మొదటిగాను మరియు ప్రాముఖ్యముగాను మనము యొజెబెలును గూర్చి తెలిసికొనవలసినది ఏమనగా ఆమె అబ్రహాము యొక్క కుమార్తె కాదు. ఇశ్రాయేలు వారి గోత్రములలో ఆమె చేరిలేదు, లేదా మోయాబీయురాలగు రూతువలె ఆమె ఆత్మ సంబంధమగు హక్కును పొందియూ లేదు. ఆలాగును ఆమె చేసియుండలేదు. ఈ స్త్రీ సీదోను రాజగు ఎతాబాయెలు కుమార్తె. (1 రాజులు 16:31) అతడు అష్టార్తె దేవతకు యాజకుడు. తనకు ముందున్న ఫిలిస్ అనువానిని చంపి ఇతడు సింహాసనమును సంపాదించెను. కాబట్టి ఆమె ఒక హంతకుని కుమూర్తెయని మొదట మనము గమనించవలెను. (ఇది నిశ్చయంగా కయీనును మనకు జ్ఞాపకము చేయును) ఆమె ఇశ్రాయేలులో ఏలుబడి చేసిన విధానము ఆత్మ సంబందమగు మార్గము కాదు. అన్యుల ప్రవేశము కొరకు దేవుడు నిర్ణయించిన విధానములో ఈమె రాలేదు; కాని ఆమె ఆహాబును పెండ్లి చేసికొనుట ద్వారా ప్రవేశించెను, ఇశ్రాయేలు యొక్క పది గోత్రములకు అతడు రాజు. ఇప్పుడు ఈ వివాహము ఆత్మసంబంధమైనది కాదని మనకు తెలియును; అది రాజకీయమైనది. విగ్రహారాధనలో మునిగిపోయిన ఈ స్త్రీ, ఒకే నిజ దేవుని ఆరాధించవలెనను కోరికను కూడా కలిగియుండలేదు, పైగా ఆమె ఇశ్రాయేలీయులను ప్రభువు నుండి త్రిప్పివేయుటకును సకల విధములుగా ప్రయత్నించినది.

ఇంతకు ముందే ఇశ్రాయేలునకు (పది గోత్రములు) బంగారు దూడలను ఆరాధించుట ఏమిటో తెలియును, కాని ఇంకా వారు విగ్రహారాధనకు అమ్ముడుపోలేదు, దేవునిని వారు ఆరాధించుచునేయున్నారు మరియు మోషే యొక్క ధర్మశాస్త్రమును వారు నెరవేర్చుచుండిరి. కాని ఆహాబు యొజెబెలును పెండ్లి చేసికొనిన సమయము నుండి భయంకరమగు రీతిగా విగ్రహారాధన పెచ్చుపెరిగిపోయినది. ఈ స్త్రీ ఒక యాజకురాలుగా దేవాలయములలో పీఠము వేసినప్పుడు ఆమె అష్టార్తేకు, బయలుకు (వీనస్ మరియు సూర్య దేవుడు) దేవాలయములను నిర్మించినది. పిదప ఇశ్రాయేలు యొక్క వరిస్థితి చాలా క్లిష్టదశకు చేరుకొనినది.

దీనిని మనస్సులో ఉంచుకొని, దేవుని యొక్క ఆత్మ ఈ తుయుతైర కాలములో దేనిని నియమించుచున్నదో చూచెదము. ఇక్కడ గమనించండి.

ఆహాబు యొజెబెలును పెండ్లి చేసికొనెను మరియు ఒక రాజకీయ ఎత్తుగడగా అతడు తన రాజ్యమును బలపరచుకొనుటకును, దానిని సురక్షితముగా ఉంచుకొనుటకును దీనిని చేసెను. సంఘము కూడా అక్షరాలా అదే విధంగా చేసినది, అది కాన్స్టాంటైన్ అధ్వర్యములో పెండ్లి చేసికొనినది. వారిరువురు రాజకీయ కారణముల కొరకు విజ్జోడు అయిరి, దానికి వారు ఆత్మీయ పేరును పెట్టిరనుకొనండి. కాన్స్టాంటైన్ క్రైస్తవుడని ఎవరూ నన్ను ఒప్పించజాలరు. అతడు అన్యుడు, కానీ ఒక క్రైస్తవునివలె కనబడి మోసము చేసెను. సైనికుల డాళ్ళు పైన అతడు తెల్లని సిలువలను వేయించెను. కొలంబస్ యోధుల యొక్క మూల కారకుడు ఇతడే. పరిశుద్ధ సోఫియా యొక్క శిఖరము మీద అతడు ఒక సిలువనుంచి ఆ విధముగా అతడు ఒక ఆచారమును ప్రారంభించెను.

అందరినీ కలుపవలెనను అభిప్రాయము కాన్స్టాంటైన్ దే, అన్యులను, నామకార్థ క్రైస్తవులను, నిజ క్రైస్తవులను అతడు ఏకము చేసెను. కొంతకాలము అతడు అందులో సఫీలకృతుడయినట్లుగానే కనిపించెను, ఎందుకనగా నిజ విశ్వాసులు వాక్యము నుండి తొలగిపోయిన వాటిని తిరిగి తీసుకొని రావచ్చునేమోనని చూడసాగిరి. కాని సత్యము లోనికి వారిని తీసికొని వచ్చు అవకాశము ఇందులో లేదని గ్రహించి, వారు బలవంతముగా రాజకీయ విభాగము నుండి తొలగించబడిరి. వారు మత విచ్ఛేదకులని పిలువబడి మరియు హింసిచబడిరి.

ఇక్కడ ఒక సంగతి నేను చెప్పెదను, ఇప్పుడు అదే సంగతి జరుగుచున్నది. జనులందరూ ఒకే చోటికి సమాయత్తమగుచున్నారు. అందరికి సరిపడు బైబిలును వారు వ్రాయుచున్నారు. యూదులకు, కాతలిక్కులుకు, ప్రొటస్టెంటులకు అది సరిపోవును. వారికి వారి స్వంత నైసియా ఆలోచన సభయున్నది, కాని వారు దానిని ఎక్యుమినికల్ (సంఘ సమాఖ్య) ఆలోచన సభ అనుచున్నారు. ఈ సంస్థలన్నియూ కలిసి ఎవరి మీద పోరాడుచున్నవో ఎరుగుదురా? వారు నిజమగు పెంతెకోస్తు వారిమీద పోరాడుచున్నారు. పెంతెకోస్తు అను సంస్థను గూర్చి నేను చెప్పుట లేదు. నిజమగు పెంతెకోస్తు వారిని దృష్టిలో యుంచుకొని నేను దీనిని చెప్పుచున్నాను, ఎందుకనగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి. వారి మధ్య సూచక క్రియలు, వరములు యున్నవి, ఎందుకనగా వారు సత్యములో నడచుచున్నారు.

రాజకీయ కారణములను బట్టి ఆహాబు యొజెబెలును పెండ్లి చేసికొని తన జన్మహక్కును అమ్ముకొసెను. నీవు ఒక సంస్థలో చేరినచో, నీ జన్మహక్కును అమ్ముకొనవలెను. సోదరుడా, నీవు దీనిని నమ్మవచ్చును లేదా నమ్మకపోవచ్చును. బయటకు వచ్చి మరల అందులోనికి వెళ్ళిన ప్రతి ప్రొటస్టెంటు గుంపు తన జన్మహక్కును అమ్ముకొన్నదని మరువరాదు. నీవు నీ జన్మహక్కును అమ్ముకొన్నప్పుడు, ఏశావు వలె యుందువు — నీవు పశ్చాత్తాపడి ఏడ్వవచ్చును, ఏదేదో చేయవచ్చును, కాని ఏమీ ప్రయోజనము ఉండదు. నీవు చేయకలిగినది ఒకే ఒకటున్నది, అదేమనగా, "దానిలో నుండి బయటకు రమ్ము, నా జనులారా, దాని పాపములలో పాలిభాగస్తులు కావద్దు." ఈ విషయములో నేను చెప్పునది సరికానియెడల, ఈ నా ఒక్క ప్రశ్నకు జవాబు ఇయ్యండి. జీవించియున్నవారెవరైనా నాకిది చెప్పవచ్చును, ఏ సంఘమయినా గాని లేదా దేవుని యొక్క ఏ ఉద్దేశమేమైనా గాని ఉజ్జీవమును పొంది బయటకు వచ్చిన తరువాత మరల సంస్థగా మూరినచో, లేదా శాఖగా మారినచో బ్రదికియుండునా? మీ చరిత్రలు చదవండి. ఒక్క దానిని — కనీసము ఒక్క దానిని కూడా మీరు కనుగొనజాలరు.

లోకముతో కలిసిపోయి ఆత్మ సంబంధమగు దానిని విడిచిపెట్టినప్పుడు, అది ఇశ్రాయేలుకు అర్థరాత్రి ఘడియ, రాజకీయము కొరకు దీనిని చెసెను. నైసియా యొద్ద సంఘము కూడా దానినే చేసినప్పుడు, అది అర్థరాత్రి ఘడియ, ఎందుకనగా సంఘము లన్నియూ ఒకటిగా సమకూడుచున్నవి.

ఆహాబు యుజెబెలును వివాహము చేసికొన్న తరువాత రాజ్యము యొక్క డబ్బును తీసికొని రెండు గొప్ప ఆరాధనా స్థలములను, అష్టార్తే మరియు బయలునకు కట్టునట్లు ఆమెకతడు అనుమతిని ఇచ్చెను. ఇశ్రాయేలీయులందరు వచ్చి ఆరాధనా కార్యక్రమము నిర్వహించగలిగినంత పెద్ద ఆలయమును బయలునకు కట్టించెను. కాన్స్టాంటైన్ మరియు సంఘము పెండ్లి చేసికొనినప్పుడు అతడు సంఘమునకు భవనములను ఇచ్చెను, బలిపీఠములను, ప్రతిమలను ఏర్పరచెను, మరియు అప్పటికే రూపుదిద్దు కొనుచున్న ఆచార్యాధిపత్యమునకు జీవము పోసెను.

రాజ్యము యొక్క అధికారమును యొజెబెలు చిక్కించుకొన్న తరువాత ఆమె తన మతమును బలవంతముగా జనుల మీద రుద్దెను. దేవుని యొక్క ప్రవక్తలను మరియు యాజకులను చంపెను. పరిస్థితి చాలా విషమించెను కనుక ఆ దినపు వర్తమానికుడగు ఏలియా, తానొక్కడినే మిగిలియున్నానని తలంచెను; కాని బయలునకు మోకాళ్ళూనని వారు ఇంకా 7000 మంది యున్నారు. బాప్టిస్టు, మెతడిస్టు, ప్రెస్బిటేరియను మొదలగు శాఖల మధ్య నుండి బయటకు వచ్చి దేవునివైపు తిరుగువారున్నారు. నేను ఎన్నడునూ జనులకు వ్యతిరేకిని కానని మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. శాఖ — ఆ సంస్థ యొక్క క్రమమునకు నేను విరోధిని. దానికి నేను వ్యతిరేకిని కావలసియున్నాను, ఎందుకనగా దానిని దేవుడు ద్వేషించుచున్నాడు.

ఇక్కడ ఒక నిమిషము ఇప్పుడు మనము ఆగి తుయుతైరలోని ఆరాధన గూర్చి చెప్పుకొన్నదానిని తిరిగి ఆలోచించుదము. వారు చక్రవర్తితో పాటుగా అపోల్లోను (అతడు సూర్య దేవుడు) ఆరాధించిరని నేను చెప్పియున్నాను. ఈ అపాల్లో కీడును తప్పించు వానిగా పిలువబడెను, అతడు జనుల నుండి కీడును దూరము చేసెను, అతడు వారిని దీవించి వారిపట్ల మంచి దేవునిగా ఉండెను, జనులకు అతడు ఉపదేశించునని భావించిరి. ఆరాధన, ఆలయ కృత్యములు, దేవతా కార్యములు, బలులు, జనన మరణములు గూర్చి అతడు వివరించెను. దీనిని అతడు ఒక ప్రవక్తిని ద్వారా చేయుచుండెను. ఆ స్త్రీ మూడు కాళ్ళ కుర్చీలో ధ్యానములో యుండెడిది. దానిని మీరు చూచారా? ఇక్కడ యొజెబెలు అను ప్రవక్తినిని గూర్చి చెప్పబడినది, మరియు ఆమె జనులకు ఉపదేశించుచున్నది. ఆమె యొక్క బోధ ఏమనగా, దేవుని దాసులను వంచించి, వారు జారత్వము చేయునట్లుగా ప్రోత్సహించుటయే. ఇప్పుడు జారత్వమనగా విగ్రహారాధన. దాని యొక్క ఆత్మ సంబంధముగు అర్ధము అదే. అది ఒక అవాంఛనీయ ఐక్యత. ఆహాబు యొక్క ఐక్యత మరియు కాన్స్టాంటైన్ యొక్క ఐక్యత రెండునూ చట్టవిరుద్ధమైనవే. ఇద్దరును ఆత్మ సంబంధమగు జారత్వము జరిగించిరి. ప్రతి వ్యభిచారియు అగ్నిగుండములో పడవేయబడును. దేవుడాలాగున చెప్పెను.

ఇప్పుడు కాథలిక్కు సంఘము యొక్క బోధను చూడండి (సంఘము స్త్రీ గా పోల్చబడెను) దేవుని వాక్యమును నిరాకరించుటయే దాని బోధ. పోపు అక్షరాలా ఆధునిక అపోల్లోగా యున్నాడు, విగ్రహములకు పూజ చేయుడని జనులకు ప్రోత్సహించుచున్నాడు. రోమను సంఘము ఇప్పుడు జనులకు అబద్ధ ప్రవక్తినిగా యున్నది, ఎందుకనగా జనుల యొద్ద నుండి ప్రభువు యొక్క వాక్యమును లాగివేసికొని తన స్వంత ఆలోచనలను ప్రవేశపెట్టినది. పాపములను క్షమించుటను వారు ప్రవేశపెట్టిరి, దేవుని ఆశీర్వచనములు వారు ఇవ్వసాగిరి; యూజకులు ఎంతవరకు పోయారంటే, తమకు జీవములోనే గాక మరణములోను కూడా అధికారమున్నదని వారు నిర్భయముగా చెప్పిరి. పాప క్షమాపణ యున్నదను తమ స్వంత బోధను వారు చెప్పిరి, కాని దానిని వాక్యములో మీరు కనుగొనలేరు. ప్రార్థనలు మరియు మాస్ లు మరియు డబ్బు వలన పరిహారము పొంది పరలోకమునకు కొనిపోబడుదురని వారు జనులకు చెప్పుచుండిరి. ఆ బోధ మీద ఆధారపడిన ఆ మొత్తం క్రమము తప్పు. దాని మూలమే అబద్ధము. దాని యొక్క వునాది దేవుని ప్రత్యక్షత్ర మీద గాని, దేవుని యొక్క వాక్యములోను గాని వేయబడలేదు, కానీ భ్రమపరచు అసత్యములలో వేయబడియున్నది, అది కూలిపోవు, కుప్పకూలు ఇసుక పునాది.

సంఘము, సంస్థలో నుండి శాఖలోనికిని, ఆ తరువాత అబద్ద బోదలోనికిని పోయినది. ఆది నిజము. దేవుడు తన వాక్యములో యున్నాడని రోమను క్యాథలిక్కులు నమ్మరు. లేదండి. వారది నమ్మినట్లయితే మారుమనస్సు పొంది దానిని బలపరచవలసి యున్నారు, కానీ దేవుడు తన సంఘ మందున్నాడని వారందురు. దానిని బట్టి బైబిలును చరిత్ర అని కాథలిక్కు సంఘము చెప్పును, కాని అది తప్పు. ఒక్క నీటి బాప్తిస్మము విషయములోనే వారేమి చేసిరో చూడండి. క్రైస్తవ బాప్తిస్మమును వారు ప్రజల నుండి లాగివేసికొని దానిని వారు బిరుదులలోనికి మార్చి అన్యత్వముగా చేసిరి.

ఒక కాథలిక్కు యాజకునితో నాకు జరిగిన ఒక సంభాషణ అనుభవమును చెప్పెదను వినండి. ఒకసారి నేను బాప్తిస్మమిచ్చిన ఒక బాలిక కాథలిక్కుగా మారిపోయినది, కాబట్టి ఆమెను గూర్చి ఆ యాజకుడు నన్ను కొన్ని సంగతులు అడుగగోరెను. ఆమె ఎటువంటి బాప్తిస్మము పొందినదని నన్ను అడిగెను. ఆమెకు క్రైస్తవ బాప్తిస్మమిచ్చానని, నాకు తెలిసినంత వరకు ఒకే ఒక బాప్తిస్మమున్నదని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమెను ముంచడము ద్వారా బాప్తిస్మమిచ్చానని చెప్పాను. ఒకప్పుడు కాతలిక్కు చర్చి కూడా ఆ విధంగానే చేసెడిదని ఆ యాజకుడు నాకు చెప్పెను. ఆ విధంగా రోమను కాథలిక్కు చర్చి ఎప్పుడు చేసినదని నేనడిగాను, ఎందుకనగా వారి చరిత్రలు నేను చదివాను. కాని అతడు చెప్పినది నాకు ఎక్కడా దొరకలేదు. అది బైబిలులో యున్నదని, కాతలిక్కు చర్చిని యేసు స్థాపించెనని చెప్పెను. మొదటి పోపు నిజంగా పేతురేనా అనడిగాను. అతడు అవునని గట్టిగా చెప్పెను. మాసెస్ ను లాటిన్లో చెప్పేవారా అని అడిగాను, ఎందుకనగా అవి సరిగాను, మారకుండాను ఉండునట్లుగా ఆలాగే చెప్పదలచిరి. అది నిజమేనని అతడు చెప్పెను. ఆదిలో యున్నదాని నుండి మీరు చాలా దూరముగా తరలిపోయిరి గదా అని నేనడిగాను. క్యాథలిక్ సంఘం నిజంగా అపొస్తలుల కార్యముల గ్రంథము నమ్మినదా అని అతనికి తెలియపరచగోరాను, అప్పుడు నేను పాతకాలపు క్యాథలిక్ నని అతనికి తెలియపరచితిని. క్యాథలిక్కు చర్చి యొక్క సంగ్రహమే బైబిలు అని దేవుడు చర్చిలోనే యున్నాడని చెప్పాడు. ఆ విషయములో నేను అంగీకరించలేదు. దేవుడు వాక్యమందున్నాడని చెప్పాను.

దేవుడు మాత్రమే సత్యవంతుడు, ప్రతి మానవుడు అబద్ధికుడే. ఆ గ్రంథములో నుండి దేనినీ తీసివేయరాదు, దానికి నీవేమీ కలుపరాదు, అటువంటి వారికి తెగుళ్ళు ప్రాప్తించునని ఆయన ముందే చెప్పెను. దానికి ఎవరూ ఏదియూ చేర్చరాదు. దానిలో నుండి ఏదియూ తీసివేయరాదు, ఆలాగు చేసిన వారికి జీవగ్రంథములో పాలులేకుండా పోవును. కాబట్టి వారు ఆ విషయములో జాగ్రత్తగా ఉండవలెను. ప్రకటన 22:18, 19.

వాక్యములో యుండుటకు బదులుగా దేవుడు సంఘములో యున్నాడని నమ్ము ఈ రోమను కాతలిక్కు సంఘమును గూర్చి చూపించెదను. 23వ పోప్ జాన్ డైరీలో ఒక చిన్న భాగమును మీకు చూపించెదను. "పోపుగా అనుభవము గడించిన ఈ మూడు సంవత్సరములు నేను భయము మరియు వణకుతో ఈ సేవను స్వీకరించాను. ప్రభువు యొక్క చిత్తమునకు పూర్తిగా విధేయుడనయ్యాను, పవిత్రమగు కార్డినలుల యొక్క కాలేజి విద్య ద్వారా నాకిది సంక్రమించినది. ఈ సంగతికి వారే సాక్ష్యులుగా యున్నారు దానిపట్ల నమ్మకముగా యుండి పనిచేయవలెనను ఒక సంచలనాత్మక మరియు స్థిరమగు కారణమున్నది. దేవునియందు పూర్తి నమ్మకమున్నది. దానంతటిలోను వర్తమానమునకు సంబంధించినది యున్నది. భవిష్యత్తుకు సంబంధించినంత వరకూ సంపూర్ణ ప్రశాంతత యున్నది." దేవుడు సంఘము ద్వారా మాట్లాడి తన చిత్తమును బయలుపరచెనని, ఈ పోపు వివరించెను. ఎంత అబద్ధము! దేవుడు తన వాక్యముతో యున్నాడు. వాక్యము ద్వారా మాట్లాడి ఆయన తన చిత్తమును బయలుపరచెను. మానవుల యొక్క మాటల యందు పరిపూర్ణ విశ్వాసము తనకున్నట్లుగా అతడు చెప్పెను. అందువలన దానికి అతడు ప్రశాంతముగా లోబదినట్లు చెప్పెను. అది చాలా అందముగా యుండును, కాని అది మాత్రము అబద్ధము. ఏదెను తోటలోని వంకరతనమువలెనె ఇది యున్నది.

ఇప్పుడు మనము ప్రకటన 17లోని ఈ స్త్రీని చూద్దాం, అబద్ధ ప్రవచనముల మీద జీవించుచున్న సంఘము ఇది, దేవుని వాక్యము వలన జీవించుట లేదు. 1వ వచనములో దేవుడామెను మహా వేశ్యగా పిలచెను. ఎందువలన ఆమె వేశ్య అయినది? ఆమె విగ్రహారాధనలో యున్నది. ఆమె జనులను అందులోనికే ఈడ్చుకొని పోయినది. విగ్రహారాధనకు విరుగుడు ఏమిటి? దేవుని యొక్క వాక్యము. ఈ స్త్రీ ఒక వేశ్య, ఎందుకనగా ఆమె వాక్యమును విడిచి పెట్టినది. ఆమె విస్తారమగు జలముల మీద కూర్చొనియున్నది, అనగా జన సమూహములని అర్థము. ఇది నిశ్చయముగా అబద్ధ సంఘము, ఎందుకనగా దేవుని సంఘము చిన్నది — దానిని కనుగొనువారు కొందరే.

దేవుని యొక్క దృష్టిలో ఆమె ఎట్లున్నదో గమనించండి, ఆమె జనులకు ఎంత అద్భుతముగా కనిపించినా లెక్కకు రాదు. ఆమె ఎంత వేదాంత రూపిణిగా కనిపించినా లెక్కకు రాదు. ఆమె తన జారత్వము వలన అపవిత్ర మద్యమును త్రాగించినది. ఆమె హతసాక్షుల యొక్క రక్తమును త్రాగినది. బయలుకు వంగక, పూజించని, జనులను నాశనము చేసి, ప్రవక్తలను, యాజకులను చంపిన యొజెబెలు వలె యున్నది. క్యాథలిక్కు చర్చి అక్షరాలా ఆలాగే చేసినది. పోపుల ఆధిపత్యమునకు వంగని వారిని వారు చంపించిరి. మానవ మాటలకు బదులుగా దేవుని వాక్యమును అంగీకరించు వారిని వారు చంపించిరి. క్రూర పద్ధతులతో వారిని చంపుట వాడుక, మారణకాండను ప్రోత్సాహించిన ఈ సంఘము మరణించినది, కాని ఆ సంగతి ఎరుగదు. దానిలో ఏ జీవమును లేదు మరియు ఆమెను ఎట్టి సూచనలు వెంబడించలేదు.

మారుమనస్సు పొందుటకు వ్యవధి

ప్రకటన 2:21;

"మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు."

ఈ సంఘము నిజానికి ఆహాబు కంటె చాలా దుర్మార్గమైనదని మీరెరుగుదురా? అతడు కొంతకాలము మారుమనస్సు పొంది దేవుని యెదుట తగ్గించుకొని నడిచెనని మీకు తెలియునా? రోమను కాథలిక్కు చర్చి ఆ విధంగా ఎన్నడునూ లేదు. అది ఎన్నడునూ మారుమనస్సు పొందలేదు. ఆమెను మారు మనస్సు పొందించవలెనని సహాయపడిన వారిని మూర్ఖంగా నాశనము చేసినది. అందరినీ అది నాశనము చేసెను. అది చరిత్ర, దేవుడు ప్రతి కాలమునకు ఒక వర్తమానికుని లేపుట మాత్రమే గాక, ఆ వర్తమానికులకు సహాయపడుటకు కొందరు అద్భుతమగు వారిని కూడా ఆయన లేపెను. ఆయన ప్రతి కాలమునకు కొందరు అద్భుతమగు దైవజనులను లేపెను. సంఘమును తిరిగి దేవుని యొద్దకు తెచ్చుటకు వారు చేయకలిగినదంతయూ చేసిరి. దేవుడు నిశ్చయంగా ఆమెకు అవకాశమిచ్చెను మరియు మారుమనస్సు పొందుటకు సహాయము చేసెను. ఆమె ఎన్నడయినా మారుమనస్సు పొందినదా? ఆమె యొక్క క్రియలలో ఎక్కడా రుజువు కనిపించలేదు. లేదండీ! ఆమె ఎప్పుడూ పొందుకొనలేదు, మరియు పొందుకొనదు కూడా. ఆమె మత్తురాలయినది. ఆత్మీయ సంగతులలో తనకున్న చలనమును ఆమె పోగొట్టుకొనినది.

ఇప్పుడు గందరగోళ పడవద్దు. పరిశుద్దులను సంహరించినందుకు రోమ్ చర్చి మారుమనస్సు పొందినదని, ఎందుకనగా ఆమె ప్రొటస్టెంటు వారితో ఏకమగుటకు ప్రయత్నించుచున్నదని, ప్రొటస్టెంటు విశ్వాస ప్రమాణముల వరుసలోనికి తన యొక్క విశ్వాస ప్రమాణములను తీసికొని వచ్చుచున్నదని మీరు తలంచవద్దు. ఆమె ఒక్కసారి కూడా పశ్చాత్తాపపడలేదు మరియు మూకుమ్మడిగా హత్యలను చేసినందుకు విచారించలేదు. ఎన్నడూ చింతించదు. ఈ ప్రత్యేక కాలములో అమె ఎంత చక్కగాను, మాధుర్యముగాను కనిపించినా గాని ఆమె చంపుటకు లేచును, ఎందుకనగా ఆమె యొక్క మారుమనస్సు పొందని చెడు హృదయములో హత్య దాగియున్నది.

వేశ్యకు ప్రతిగా శిక్ష విధించబడెను

ప్రకటన 2:22-23,

"ఇదిగో నేను దానిని మంచము పట్టించి, దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును.దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను; అందువలన అంతరింద్రియములను, హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియూ తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను."

ఏమిటి? ఈ స్త్రీకి పిల్లలున్నారా? ఆమె వేశ్యయా? అదే నిజమయితే ఆమె వేశ్యాగమనము వలన ఈ పిల్లలను కనినచో వాక్యము చెప్పినట్లుగా ఆమె అగ్నితో దహించబడును. ఇది పూర్తిగా నిజము. ఆమె యొక్క అంతము అది. అగ్నితో దహించబడును. అగ్నిగుండమే ఆమె యొక్క అంతము. కాని ఒక నిమిషము ఆగి ఈ పిల్లలను గూర్చి ఆలోచించుదము. పిల్లలు స్త్రీలలో నుండి వచ్చుదురు. ఈ స్త్రీలో నుండి పిల్లలు వచ్చిరను మాట నిజము, కాని వారును ఆమె వలెనే చేసిరి. సంస్థలో నుండి బయటకు వచ్చిన సంఘము తిరిగి ఆ సంస్థలోకి పోకుండా ఎక్కడున్నదో ఒక్కదానిని నాకు చూపించండి. ఒక్కటి కూడా లేదు. లూథరనులు బయటకు వచ్చిరి, తిరిగి సంస్థగా మారిరి, ఈ రోజున వారు ఈ సార్వత్రిక సంఘ ఉద్యమముతో చేతులు కలుపుచున్నారు. మొతడిస్టు వారు బయటకు వచ్చిరి మరియు వారును మరల సంస్థగా మారిరి. పెంతెకోస్తువారు బయటకు వచ్చిరి మరియు వారును సంస్థగా మారిపోయిరి. మరియొక నిర్గమనముండును, దేవునికి స్తోత్రము, వారు తిరిగి సంస్థగా మారరు, ఎందుకనగా వారికి సత్యము తెలియును. ఆ గుంపు చివరి దినము యొక్క పెండ్లి కుమార్తెగా యుండును.

ఈ వేశ్యకు పిల్లలు ఉండినట్లు ఇక్కడ చెప్పుబడెను. వారు ఎవరు? వారు కుమార్తెలు, అవి సంఘములు, ఆ తల్లివలెనె యున్నవి. ఇక్కడ ఒక ఆసక్తికరమగు సంగతి యున్నది. యొజెబెలు మరియు ఆహాబులకు ఒక కుమారై యుండెను. ఆ కుమార్తె యెహూరామును పెండ్లి చేసికొనెను, అతడు యొహోషాపాతు కుమారుడు. 2 రాజులు 8:16లో ఇట్లు చెప్పబడినది,

"యెహూరాము తన మామ యొక్క త్రోవలలోనే నడిచెను."

ఈ పెండ్లీ వలన అతడు విగ్రహారాధనలోనికి వెళ్ళేను. దేవునికి భయపడి, దేవుని ఆరాధించు యూదాను ఇతడు విగ్రహారాధనలోనికి తీసికొని వచ్చెను. ఈ కుమార్తె సంఘములన్నియూ ఖచ్చితంగా ఆలాగే చేసినవి, ఆ విషయము మీకు ముందే చెప్పాను. వారు సత్యములోనే ప్రారంభించారు, కాని సంస్థలో పెండ్లి చేసికొనిరి. వాక్యమును విడిచిపెట్టి ఆచారమును, సాంప్రదాయములను వారు వెంబడించిరి. దీనిని ఇప్పుడు మీకు చెప్పెదను.

హెబ్రీ 13:7లో ఈలాగు చెప్పబడినది,

"మీ పైని నాయకులుగా ఉన్నవారికి మీరు లోబడుడి. వారు మీకు దేవుని వాక్యమును చెప్పుచున్నారు."

మనలను పరిపాలించునది వాక్యమే గాని మానవులు కారు. పురుషుడు స్త్రీకి శిరస్సు అయి యున్నాడు. అతడు ఆమెను ఏలును, కానీ సంఘము స్త్రీ అయి ఉన్నది, ఆమెను ఏలునది వాక్యము. యేసే వాక్యమై యున్నాడు. ఆమె వాక్యమును నిరాకరించినయెడల, మరే ఇతర నాయకత్వమును అంగీకరించినా గాని ఆమె వ్యభిచారిణి యగును. ఆచారములు మరియు సంప్రదాయముల కొరకు వాక్యమును విడిచిపెట్టని ఒక్క సంఘమును మీరు చూపించండి. వారందరూ వేశ్యలే — తల్లివలెనె కుమార్తెలున్నారు.

వేశ్యకును ఆమె యొక్క పిల్లలకును శిక్ష ఏమిటి? అది రెండింతలుగా ఉండబోవుచున్నది. మొదటగా ఆయన చెప్పినది వినండి, "ఆమెను నేను మంచము పట్టించెదను." 22 వచనము చివరి భాగము ప్రకారము అది శ్రమల పడక లేదా మహా శ్రమల కాలము. మత్తయి 25:1-13లో యేసు చెప్పినది అక్షరాలా అదే. పది మంది కన్యకలుండిరి. అయిదుగురు బుద్ధిగలవారు మరియు అయిదుగురు బుద్ధిలేనివారు. అయిదుగురు బుద్ధిగలవారికి నూనెయున్నది (పరిశుద్దాత్మ), కాని మిగిలిన అయిదుగురికి నూనె లేదు. "ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు," అను కేక వినబడు సరికి బుద్ధిలేని అయిదుగురు నూనెకొరకు వెదుకుచూ పరుగెత్తవలసి వచ్చినది. ఆ సమయములో అయిదుగురు బుద్ధిగలవారు పెండ్లిలోనికి వెళ్ళిపోయిరి. బయట మిగిలిపోయిన అయిదుగురు ఆ మహాశ్రమల కాలము లోనికి వెళ్ళిపోయిరి. రాకడలో ఎత్తబడకుండా మిగిలిపోయిన వారికందరికి అదే సంభవించును. వేశ్యకు దాని కుమార్తెలకును అదే జరుగును. రెండవదిగా ఆయన చెప్పినది వినండి, ఆయన వారిని మరణమునకు గురిచేయును అని అక్షరాలా వ్రాయబడియున్నది. ఇది చాలా వింతగా యున్నది కదూ? మనము ఒకనికి ఉరిశిక్ష ద్వారానో లేక కరెంటు ద్వారానో లేదో మరో విధానములోనో మరణశిక్ష వేయుదుము. కాని ఇక్కడ "మరణము ద్వారానే మరణమును కలుగచేయునని చెప్పబడినది." వారి మరణమునకు కారణము మరణమే.

దీనిని మీరు తేటగా చూడవలెనని కోరుచున్నాను, యొజెబెలు కుమార్తె యూదా ఇంటి వారిని పెండ్లి చేసికొని తద్వారా విగ్రహారాధనను తీసికొని వచ్చుటను దృష్టాంతముగా చూచాము. అందువలన దేవుడు యూదాకు మరణము కలుగజేసెను. బిలాము చేసినది కూడా అదే. ఆలాగే ఇక్కడ యొజెబెలు తన అన్యత్వముతో యున్నది. అక్కడ యూదా సరిగా ఆరాధన చేయుచూ వాక్య ప్రకారముగా జీవించుచున్నది. యెజెబెలు తన కుమార్తెను యెహోరాము కిచ్చి పెండ్లి చేసినది. అది జరిగిన నిమిషములోనే యెహోరాము తన ప్రజలనందరినీ విగ్రహారాధన చేయునట్లు ప్రేరేపించెను. ఆ పెండ్లి జరిగిన నిమిషమందే యూదా మరణించినది. ఆత్మ సంబంధమగు మరణము ప్రవేశించినది. రోమ్ యొక్క మొదటి సంఘము సంస్థగా మారిన నిమిషములోనే అది చనిపోయినది. లూథరు వారు సంఘము నుండి సంస్థగా మారిన వెంటనే చనిపోయిరి. చివరగా పెంతెకోస్తు వారు వచ్చిరి, వారును సంస్థగా మారిరి. ఆత్మ తప్పుకొన్నది, అయినా వారు దీనిని నమ్మరు. కాని ఆయన లేడు. ఆ పెండ్లి వలన మరణము వచ్చెను. ఆ తరువాత దేవత్వము యొక్క ఏకత్వపు వెలుగు వచ్చెను. వారు సంస్థగా మారి వారు కూడా చనిపోయిరి. తరువాత 1933లో ఒహియో నదియొద్ద దేవుని యొక్క అగ్ని దిగినది. ప్రపంచమును ఒక స్వస్థతా ఉజ్జీవము ఊడ్చివేసినది, కానీ అది ఏ సంస్థ ద్వారాను రాలేదు. పెంతెకోస్తు గుంపులలో నుండి దేవుడు బయటకు వెళ్ళియున్నాడు, సంస్థకు వెలుపల యున్నాడు, భవిష్యత్తులో కూడా ఆయన సంస్థకు బయటనే ఉండగోరుచున్నాడు. చచ్చిన వారి ద్వారా దేవుడు పనిచేయజాలడు. సజీవముగానున్న సభ్యుల ద్వారానే ఆయన పనిచేయగలడు. ఆ సజీవము గల సభ్యులు బబులోనుకు బయట ఉన్నారు.

"మరణము" లేదా "సంస్థ" వచ్చిన విధానమును మీరు చూడండి. సంఘము చనిపోయినది, ఇంకా తేటగా చెప్పవలెనన్నచో మరణము నివాసము చేయసాగినది. ఆ స్థానములో ఇంతకు ముందు జీవము ఏలుబడి చేసినది. ఆదిలో హవ్వ మూలముగా మానవ జాతి యావత్తుకు మరణము సంప్రాప్తించినది, ఆ విధముగానే ఇప్పుడు సంస్థ ద్వారా మరణము వచ్చినది. ఎందుకనగా సంస్థ అనునది రెండింతలు చెడిపోయిన వారి మూలముగా పుట్టినది, అది నీకొలాయితిజం మరియు బిలామిజం. యొజెబెలు అను ప్రవక్తిని ద్వారా అది వెల్లడి అయినది. వారు చేసిన భయంకరమగు కార్యమును బట్టి హవ్వ కూడా సర్పముతో పాటుగా మండిపోవలసినది. కాని ఆదాము మధ్య నిలచెను, వెంటనే తన యొద్దకు ఆమెను చేర్చుకొనినందున ఆమె రక్షింపబడినది. కాని ఈ సాతానీయ మతము యుగములన్నింటను చొచ్చినప్పుడు, దానికి మధ్య నిలబడువారెవరూ దొరకరు, ఆమె తన మోసగానితో కూడా దహించబడును; ఎందకనగా మహావేశ్య దాని కుమార్తెలు, అంత్యక్రీస్తు, మరియు సాతాను అగ్నిగుండములో పాలు పొందుదురు.

ఇక్కడ నేను నా హద్దును దాటిపోవుచున్నాను. దీనిని నేను చివరికాలపు వర్తమానము కొరకు దాయవలసియున్నాను, కాని ఇప్పుడు దానిని చెప్పవలసిన అవసరత కనబడియున్నది, ఎందుకనగా ఇది తేటగా సంస్థను గూర్చి బయలుపరచుచున్నది మరియు దానివలన ఏమి జరుగునో చెప్పుచున్నది. మిమ్మును నేను హెచ్చరించగోరుచున్నాను. ప్రకటన 13:1-18,

"మరియు పది కొమ్ములును, ఏడుతలలును గల యొక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద పది కిరీటములును దాని తలలు మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను.నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలియుండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమునను గొప్ప అధికారమును ఇచ్చెను.దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్లుండెను, అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను, గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడసాగిరి.ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు? దానితో యుద్ధము చేయగలవాడెవడు? అని చెప్పుకొనుచూ ఆ మృగమునకు నమస్కారము చేసిరి.డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయెను.గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.మరియు పరిశుద్దులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారము ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాటలాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను.భూ నివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.ఎవడైనను చెవిగల వాడయితే వినును గాక,ఎవడైనను చెరపట్టవలెనని ఉన్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన యెడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధల ఓర్పును, విశ్వాసమును కనబడును.మరియు భూమిలో నుండి మరి యొక క్రూరమృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పమువలె మాటలాడుచుండెను.అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికార చేష్టలన్నియూ దానియెదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల యెదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బతినియు బ్రదికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచూ ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లను ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారను చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరును తమ కుడిచేతి మీదనైనను, తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనునట్లును,ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను, దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లను అది వారిని బలవంతము చేయుచున్నది.బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య ఆరు వందల ఆరువది ఆరు. ఇందులో జ్ఞానము గలదు."

ఈ అధ్యాయము రోమను కాతలిక్కు చర్చి యొక్క అధికారమును మరియు సంస్థ ద్వారా అది ఏమి చేయునో చూపించుచున్నది. ఇది కారు ద్రాక్షావల్లి అని గుర్తుంచుకొనండి. ప్రభువు యొక్క పేరును అది పెట్టుకొనవచ్చును, అది అబద్ధము గానే ఆ విధముగా చేయుచున్నది. దాని యొక్క శిరస్సు ప్రభువు కాదు గాని సాతాను. చివరకు అది మృగముతో పూర్తిగా ఏకమై కలిసిపోవును. వేశ్య ఎర్రని మృగము మీద పయనించుచూ ప్రత్యేకముగా తన యొక్క అధికారమును చూపించుచున్నది. దానికి అధికారము సాతాను కానీ మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు కాదు.

17 వచనము చూడండి, భూమి మీద వర్తకము అ౦తటిని తన అధీనములోనికి తెచ్చుకొనునని ఖండితముగా చెప్పబడినది. దాని సెలవు లేకుండా ఏ మనిషియు కొనజాలడు మరియు అమ్మజాలడు. ఇది ప్రకటన 18:9-17లో యున్నది. అది రాజులతోను, ప్రధానులతోను, వర్తకులతోను, రోమ్ తో సంబంధముండి వాణిజ్యము జరుపుచున్న వారందరితోను జోక్యము కలిగియుండును.

ప్రకటన 13:14లో ఈ మృగము దాని కొరకు నిర్మించబడిన ప్రతిమ ద్వారా తన ప్రభావమును వ్యాప్తి చేయును అని చూడగలము. తయారు చేయబడిన ఆ ప్రతిమ ఏదనగా, ప్రపంచ వ్యాపిత సార్వత్రిక ఆలోచనా సభ (world-wide ecumenical council), సంస్థాగత సంఘములన్నియూ అందులో కలిసిపోవును, వారందరూ రోమను క్యాథలిక్కులతో చేరిపోవుదురు (ఇప్పుడును వారు అది చేయుచున్నారు.) కమ్యూనిజం యొక్క అధికారమును ఆపుటకు ఈ శక్తి ఏకమవుట సాధ్యమే. నెబుకద్నెజరు లేచినట్లుగా కమ్యూనిజం లేచినది, వేశ్య యొక్క దేహమును అది కాల్చును, రోమును జయించి నాశనము చేయుదురు. గమనించండి, రోమీయుల సంఘము ఎచ్చటికి వెళ్ళినా గాని అక్కడికి కమ్యూనిజం వెళ్ళినది. అది ఆ రీతిగానే ఉండవలసియున్నది. మిమ్మును ఇప్పుడే హెచ్చరించుచున్నాను, కమ్యూనిజం మాత్రమే మీ శత్రువుని మీరు తలంచవద్దు. లేదండి. అది కాతలిక్కు చర్చి కూడా, మరియు అంతకంటె గొప్ప శత్రువు.

ఇప్పుడు మనము ప్రకటన 13: 1-4 వరకు చదివి, దీనిని ప్రకటన 12:1-5తో పోల్చుదము.

ప్రకటన 13:1-4,

"మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరువంటిది, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.దాని తలలలో ఒక దానికి చావుదెబ్బ తగిలినట్లుడెను. అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగమువెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు — ఆ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగలవాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి."

ప్రకటన 12:1-5,

"అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను.ఆమె గర్భిణియై ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలల మీద ఏడు కిరీటములుండెను.దాని తోక ఆకాశ నక్షతములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీని కనగానే, ఆమె శిశువును మ్రింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ యెదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనైయున్న ఒక శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను.

సాతాను వాని యొక్క సాతనీయ మతము రెండునూ ఈ మృగములలో యున్నవి. ప్రకటన 14లో చావు దెబ్బతిని మరల బ్రతికిన క్రూరమృగమును చూచాము. అది రాచరికపు అన్య రోమ్. అది బార్చెరీయనుల ఊచకోతకు గురియై పతనమైనది. అందువలన తాత్కాలికముగా దాని యొక్క శక్తిని కోల్పోయినది. కాని పోపుల రోమ్ లో అది మరల తన బలమును పుంజుకొనినది. దానిని మీరు చూచారా? అందరినీ అణగద్రోక్కి పరిపాలించిన దేశము అన్నిటికంటె బలమగు దేశముగా తయారయినది, కాని చివరకు చావు దెబ్బ తినినది. శారీరకంగా దాని యొక్క శక్తి పోయినది, సైన్యముల ద్వారా వశపరచుకొను శక్తి పోయినది. కానీ కాన్స్టాంటైన్ ఆధ్వర్యములో అది మరల జీవమును పుంజుకొనినది, పోపుల రోమ్ సర్వ ప్రపంచమును గుప్పెటలోనికి తెచ్చుకొనియున్నది, దాని యొక్క శక్తి తిరుగులేనిది. అది రాజులను, వర్తకులను ఉపయోగించుకొనును. దాని యొక్క మరణకరమగు మత మరియు ఆర్థిక బలముతో ఈ ప్రస్తుత యుగపు దేవతగా పరిపాలన చేయుచున్నది. అది ఘట సర్పముగా కననైయున్న మగ శిశువును మ్రింగవలెనని కనిపెట్టియున్నది. హేరోదు, ప్రభువగు యేసును చంపవలెనని విఫల ప్రయత్నము చేసెను. ఆ తరువాత రోమను సైనికుల ద్వారా యేసు సిలువ వేయబడెను, కాని ఇప్పుడాయన సింహాసనము మీద యున్నాడు.

ఇంతవరకు నేను చెప్పిన దానితో పాటుగా ఇది కూడా చెప్పవలెను. దానియేలు యొక్క దర్శనమును గుర్తుచేసికొనండి. ప్రతిమలోని చివరి భాగము అనగా కడపటి ప్రపంచ రాజ్యము యొక్క శక్తి పాదములలో యున్నది. అది మట్టి మరియు ఇనుము. ఇనుము ఆ రోమను సామ్రాజ్యము. కాని ఇప్పుడది గట్టి ఇనుముగా లేదు. అందులో మట్టి కలిసియున్నది. అయినా గాని అది ఇంకా నిలచియున్నది మరియు ప్రపంచ వ్యవహారములను నడిపించుచున్నది, ప్రాజాస్వామ్య రాజ్యములున్నవి మరియు చాలా నియంతత్వ పాలనలును ఉన్నవి. రోమీయుల సంఘము ప్రతి దేశములోను యున్నది. అది అన్నింటిలోను కలిసి పోయియున్నది.

ఇనుము మరియు మట్టిని గూర్చి నేను కొంచెము చెప్పవలెను. ఐక్యరాజ్యసమితి బల్లమీద కృశ్చేవ్ తన జోడుతో కొట్టి చెప్పిన విషయము గుర్తుచేసికొనండి. అక్కడ అయిదు తూర్పు దేశములు మరియు అయిదు పశ్చిమ దేశములు యున్నవి. తూర్పు దేశముల పక్షముగా కృశ్చెవ్ మాట్లాడెను. పశ్చిమ దేశముల పక్షముగా ప్రెసిడెంటు ఐసెన్ హోవర్ మాట్లాడెను. రష్యా భాషలో కృశ్చెవ్, అనగా మట్టి మరియు ఐసెన్ హోవర్ అనగా ఇనుము. వారిద్దరు ప్రపంచములోని ప్రధాన నాయకులు, వారిద్దరు ఆ పెద్ద పాదములుగా యున్నారు, మట్టి ఇనుము ప్రక్క ప్రక్కనే యున్నవి. మనము అన్నింటి యొక్క అంతములో ఉన్నాము.

4 వచనములో ఈ ప్రశ్నయున్నది,

"ఈ మృగముతో యుద్దము చేయువాడెవడు?"

ప్రస్తుతము ప్రపంచములో కొన్ని గొప్ప పేర్లున్నవి. కొన్ని బలమగు దేశములున్నవి, కాని ఇప్పుడు రోమ్ కేక వినబడుచున్నది. పోపు ఇప్పుడు నాయకత్వపు సింహాసనమధిష్టించి యున్నాడు. అతని యొక్క శక్తి హెచ్చనైయున్నది. అతనికి వ్యతిరేకముగా ఎవరును యుద్ధము చేయలేరు.

6 వచనము.

"అతడు దేవదూషణ చేయ మొదలుపెట్టెను."

దేవుని బోధకు బదులుగా మానవుల యొక్క పద్ధతులను బోధించుట. (అహంకారులు, గర్వాంధులు, సుఖమును ప్రేమించువారు, పైకి భక్తి కలిగియుండియు దాని శక్తిని ఆశ్రయించనివారు.) అతడు దేవుని నామమును దూషించెను — ఆ నామమును బిరుదుల క్రింద మార్చెను మరియు నామమును నిరాకరించెను.

7 వచనము.

"పరిశుద్దులతో యుద్ధము చేయ మొదలుపెట్టెను."

హింస — నిజవిశ్వాసికి మరణము. ప్రభువు యొక్క నామములోయున్న వారందరికి హింస, దేవుని నామమును దూషించెను, రష్యాలో కూడా అదే జరుగుచున్నది, ఎందుకనగా అక్కడ క్యాథలిక్కు మతము ఆలాగు ప్రవర్తించెను.

8 వచనము.

భూనివాసులందరును వానిని ఆరాధించుదురు (జగదుత్పత్తి మొదలుకొని, వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లయితే వ్రాయబడలేదో వారందరూ)."

గొర్రెలు వానిని ఆరాధించనందుకు దేవునికి వందనములు చెల్లించవలెను. ఏర్పరచబడినవారు తప్ప ప్రతి ఒక్కరును మోసపుచ్చబడుదురు. కాని వారు మాత్రము మోసపుచ్చబడరు. ఎందుకనగా వారు గొర్రెలకాపరి యొక్క స్వరము విందురు మరియు ఆయనను వెంబడించుదురు.

ఇప్పుడు, దీనిని చూడండి, మేము దీనిని మీకు చూపించ ప్రయత్నించుచున్నాము. ఈ మరణ బీజము మొదటి కాలములోనే ప్రారంభము అయినది — ఈ సంస్థ యొక్క బీజము చివరకు ఒక వృక్షముగా ఎదిగినది. ప్రతి అపవిత్ర పక్షికిని అది ఉనికి పట్టు అయినది. జీవ ప్రదాతనని అది చెప్పుకొనుచున్నది గాని నిజనికి అది మరణ ధాత. దాని యొక్క ఫలము మరణము. దానిలో పాలుపొందు వారు చనిపొయిన వారే. ఈ బలమగు ప్రపంచ సంఘ క్రమము లోకమును మోసము చేసినది, దానియందు శారీరక మరియు ఆత్మీయ రక్షణ యున్నదను మాట అబద్ధము. జనసమూహములను మోసము చేసి నాశనము చేయుచున్నది. అది మరణ సాదృశ్యముగా ఉండుట మాత్రమే కాదు గాని ఈ చచ్చిన జీవి ఇతరులను చంపుచున్నది. అదియే అగ్నిగుండము. ఓ, దానిలో నిలచియుండిన మనుష్యులకు ఎటువంటి అంతము వచ్చునో చూడండి. "బయటకు రండి, మీరెందుకు చనిపోవలెను?"

ఒక తుది హెచ్చరిక

ప్రకటన 2:23.

"దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియూ తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను."

దేవుడు హృదయములను చూచుచున్నాడు. అది ఎన్నడును మారదు. ముందెన్నడునూ అది మూరలేదు. అన్ని యుగములలోను చూచినట్లుగా రెండు గుంపులున్నవి, ఆ రెండును తమకు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత వచ్చినదని చెప్పుకొనుచున్నవి. దేవునితో తమకు సంబంధమున్నదని చెప్పుకొనుచున్నవి.

"ఏమయినా గాని దేవుని యొక్క పునాది నిశ్చయముగా నిలబడియున్నది, ముద్రింపబడియున్నది, ఆయన వారెవరో ప్రభువు ఎరుగును."

II తిమోతీ 2:19.

"ప్రభువు మీ అంతరింద్రియములను పరిశోధించుచున్నాడు."

పరిశోధించుట అను మాటకు 'వెదకుట' లేదా 'పసిగట్టుట' అని అర్థము. దేవుడు మన ఆలోచనలను కనుగొనును (అంతరింద్రియములు); ఆయనకు మన హృదయములలో ఉన్నది తెలియును. ఆయన మన క్రియలను చూచుచున్నాడు, అవి మన అంతరింద్రియములలో ఉన్నవాటికి నిదర్శనములు. నీతి అయినా, దుర్మార్గత అయినా హృదయములో నుండి బయటకు వచ్చును. మన ఉద్దేశ్యములు, మన ఆలోచనలు — అన్నియూ ఆయనకు తెలియును, ఎందుకనగా ఆయన ప్రతి క్రియను గమనించుచున్నాడు. మన జీవితముల యొక్క లెక్క ఇవ్వబడినప్పుడు ప్రతి క్రియ, ప్రతి మాట తీర్పులోనికి తేబడును. అబద్ధ ద్రాక్షావల్లికి దేవుని యొక్క భయము లేదు మరియు వారు అందుకు ప్రతిఫలమును చెల్లించెదరు. ఆయన నామమును ధరించుకొనిన పరిశుద్దులందరూ ఆయనవలెనె జీవించిరి. మనము జనులను మోసము చేయవచ్చును, కాని మనము ఎన్నడూ ప్రభువును మోసము చేయజాలము.

ఆ చీకటి దినములలో వాగ్దానము

ప్రకటన 2:24-25,

"అయితే తుయుతైరలో కడపటివారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమగా — మీ పైని మరి ఏ భారమును పెట్టను.నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి."

ఇప్పుడు వాగ్దానముల లోనికి వెళ్ళక ముందు మరల మీకు ఈ సంగతిని చూపించెదను. ఈ గ్రంథములో సంఘము గురించి ఆత్మ చెప్పియున్నది. రెండు ద్రాక్షావలులున్నవి. వాటి తీగెలు ఒకదానితో ఒకటి పెనవెసికొనియున్నవి.

"అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపని వారితో చెప్పుచున్నాను."

ఆయన రెండు గుంపులతో మాట్లాడుచున్నాడు. ఒకరికి బోధయున్నది గాని మరొకరికి లేదు. చూడండి, వారు దేశములన్నింటిలోనికి చెదరిపోయి యున్నారు. ఒకరి బోధకు విరుద్ధముగా మరొకరు. ఒకటి దేవునికి సంబంధించి, ఆయన యొక్క లోతులను ఎరిగియున్నది. మరొకటి సాతానుకు సంబంధించి, సాతాను యొక్క లోతులను ఎరుగును.

"మీ పైని ఏ భారమును నేను పెట్టను."

భారము అను మాటకు బరువు లేదా ఒత్తిడి అని అర్థము. అంధకార యుగములలోని ఒత్తిడి, అనగా వంగుట కాని లేదా విరుగుట గాని అగును. వంగుట లేదా చావు. అది బలవంతము, సాతానీయ ఆరాధనను ఆ రాజ్యము యొక్క శక్తి ప్రోత్సహించుచున్నది. నీవు సంస్థగా మారలేనిచో ప్రాణమును చెల్లించవలెను. ప్రతి కాలములోను భారములున్నవి. ఉదాహరణకు చివరి కాలములోని గొప్ప భారము సంపద యొక్క మానసిక ఉద్రికత్తతో జీవించుట ఈ కాలములో మనము చూడగలము. మనము జీవించలేమనునట్లుగా ఇది కనబడుచున్నది. ఈ నాలుగవ కాలములో స్పష్టమగు భారము కనబడుచున్నది. రోమ్ ను ఎదిరించి, మరణమయినా గాని వాక్యము కొరకు నిలబడవలెను.

"వారు సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగరు."

వాఖ్యానకర్తలు ఈ వచనమును వదిలిపెట్టినట్లుగా కనబడుచున్నది, ఎందుకనగా ఈ వచనములో చెప్పబడిన బోధ ఏమిటో, వారి అనుభవములు ఏమిటో వారు గ్రహించలేకపోయిరి. దాని యొక్క వాస్తవ అర్ధమును కనుగొనుట చాలా సులభము. దేవుని యొక్క లోతయిన సంగతులు ఏమిటో మొదట మనము తెలిసికొనవలెను. దానికి వ్యతిరేకముగా యున్నది సాతాను యొక్క లోతయిన సంగతియగును. ఎఫెసీ 3:16-19.

"మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మవలన బలపరచబడునట్లుగాను,క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్యర్యము చొప్పున మీకు దయచేయవలెననియు,మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్దులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకునుజ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను."

ఈ వచనముల ప్రకారము ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి తన జీవితములో దేవుని యొక్క లోతయిన సంగతులను అనుభవించినప్పుడు, అది వాస్తవముగా అతని స్వంత అనుభవముగా యుండును. దేవుని యొక్క ఆత్మ అతనిలో నివాసము చేయును. వాక్యము ద్వారా దేవుడు యొక్క జ్ఞానము మరియు బుద్ధి అతనిలోనికి వచ్చి అతని మనస్సు వెలిగించబడును. కాని సాతాను యొక్క లోతు ఏమనగా దీనిని నాశనము చేయుటకు ప్రయత్నించుటయే. వాడు ఎల్లప్పుడూ దేవుని యొక్క నిజత్వమునకు ప్రతిగా మరో ప్రత్యామ్నాయమును ఏర్పరచ ప్రయత్నించును. దానిని వాడెట్లు చేయగలడు? వాడు దేవుని యొక్క సత్య జ్ఞానమును తీసివేయును — వాడు తన స్వంత మాటలతో దేవుని వాక్యమును నాశనము చేయజూచును. ఆలాగు దేవుడు చెప్పినా? అని సందేహము పుట్టించును. ఆ విధముగా వాడు క్రీస్తుకు బదులుగా మన ఆత్మలలో మరొక దానిని ఉంచును. ఇశ్రాయేలునకు వాడు ఆ విధముగానే చేసెను గనుక ఇప్పుడును ఆలాగే చేయును. దేవునికి బదులుగా ఒక మానవుడగు రాజును వారిని ఏలునట్లుగా చేసెను. తిరిగి-జన్మించు అనుభవమును వారు నిరాకరించెదరు, సంఘములో చేరుటకే వారు మొగ్గుచూపుదురు. సాతాను యొక్క గూఢమగు సంగతులు ఆ కాలములో ప్రవేశించినవి. సాతాను యొక్క లోతయిన సంగతుల ఫలితములేవనగా అబద్ధములు, హత్యలు మరియు ఘోరమగు నేరములు.

బహుమానములు

ప్రకటన 2:26-29.

"నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను.అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రలవలె పగులగొట్టబడుదురు.మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక!"

"జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి."

ఆత్మ యొక్క ఈ మాటను మనము గ్రహించవలెను. ఆత్మ యొక్క క్రియల ద్వారా ప్రభువు తన స్వంత వాని యొద్దకు రావలెనని ప్రయత్నించుచున్నాడు. నీతి క్రియులు జరిగించవలెననునది ఆయన ఉద్దేశ్యము. క్రియల గూర్చి నాలుగు సార్లు ఆయన ప్రస్తావించియున్నాడు. ఇప్పుడాయన చెప్పుచున్నది గమనించండి, అంతము వరకు ఆయన క్రియలను నమ్మకముగా యుండి జరిగించు వానికి జనముల మీద శక్తి ఇవ్వబడును. అతడు బలముగల వానిగాను, సామర్థ్యముగల వానిగాను, వంగని పరిపాలకునిగాను ఉండును. ఏ పరిస్థితినయినా గాని అతడు చక్కగా ఎదుర్కొనగలడు. అవసరమయితే అతి క్రూరుడగు శత్రువును కూడా తుత్తునియలు చేయగలడు. అతని యొక్క శక్తితో నిండిన పరిపాలన కుమారులకు వలె యుండును. ఇది చాలా ఆశ్చర్యము.

కాని ఈ కాలపు వెలుగులో మనము ఈ వాగ్దానమును చూద్దాం. శక్తిగల రోమ్ వెనుక రాజ్యము యొక్క అండయున్నది, రాజులను మరియు సైన్యములను మరియు శాసన సభ్యులను ఏర్పరచెడిది. దానికి ఎదురుగా వచ్చిన ప్రతిదానిని బ్రద్దలుగొట్టి తుత్తునియలు చేసెడిది. అది మిలియనుల మందిని చంపినది, ఇంకా ఎన్నో మిలియనుల మందిని చంపవలెను ఆకలి కలిగియున్నది. ఆ శక్తికి వంగని వారిని చంపును. అది అసహనముతో రాజులను నియమించుచున్నది. తనకిష్టమయినప్పుడు వారిని మరల అవమాన పరచుచున్నది. దాని యొక్క జోక్యము వలన నిజముగా దేశములు పతనమగుట జరిగినది, ఎందుకనగా అది దేవునిచే ఏర్పరచబడిన వారిని నాశనము చేయవలెనని కంకణము కట్టుకొనినది. దాని యొక్క క్రియలు అపవాది యొక్క క్రియలే. వారివలెనె ఇదియు అబద్ధములాడి, హత్యయు చేయును. కాని ఒక దినము వచ్చుచున్నది, అప్పుడు ప్రభువు ఈలాగు చెప్పను, "నా శత్రువులను నా యెదుటికి తీసికొని వచ్చి వధించుడి." అప్పుడు నీతిమంతులు తమ ప్రభువుతో నిలచియుందురు, దేవదూషణ చేయు వారిమీద ఆయన యొక్క నీతితో కూడిన ఉగ్రత దిగును. నీతిమంతులు ఆయనతో కూడా మహిమ లోనికి వచ్చెదరు. భూమిని నాశనము చేసి దేవుని యొక్క పరిశుద్దులను భయ కంపితులను చేసిన వారిని వారు నాశనము చేయుదురు. ఇది చెంపను త్రిప్పు కాలము, భయంకరమగు వేదనయున్నది; కాని ఒక దినము వచ్చుచున్నది, అప్పుడు సత్యము జయించును మరియు దాని యొక్క అగ్నిలో నిలబడి కాలకుండా ఉండగలిగినవాడెవడు? ప్రభువు చేత విమోచించ బడినవారు మాత్రమే.

"వానికి నేను వేకువ చుక్కను ఇచ్చెదను."

ప్రకటన 22:16 మరియు II పేతురు 1:19 ప్రకారము యేసే ఆ వేకువ చుక్క.

"నేను దావీదు యొక్క వేరును, చిగురును అయి యున్నాను. ప్రకాశించు వేకువ చుక్కనైయున్నాను.""సూర్యోదయము వరకు, ఆ వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు."

అంధకార యుగములలో ఏర్పరచబడినవారికి ఆత్మ ఒక వాగ్దానమును చేయుచున్నది, రానున్న యుగములకు అది ఆయనకు చెందినది.

ఇంతకు ముందే మనము చెప్పుకొనిన రీతిగా, యేసు తన్నుతాను ప్రతికాలపు వర్తమానికునితోను గుర్తింపు చేసికొనును. ప్రతి కాలమునకు చెందిన వాక్యము మీద వారికి ఆయన నుండి ప్రత్యక్షత్ర దొరకును. ఈ వాక్య ప్రత్యక్షత వలన లోకములో నుండి బయటకు పిలువబడి, దేవునిచే ఏర్పాటు కాబడిన వారు యేసుక్రీస్తుతో పూర్ణ ఐక్యతను పొందుదురు. ఈ వర్తమూనికులను నక్షత్రములని పిలచుట జరిగినది, ఎందుకనగా వారు కుమారుని యొక్క లేదా యేసు యొక్క ప్రతిబింబపు వెలుగును ఇతరులకు చూపించుదురు. వారు నక్షత్రములని పిలువబడుదురు, ఎందుకనగా వారు రాత్రియందు వెలుగును చూపించుచున్నారు. ఆ విధముగా పాపపు చీకటిలో, వారు దేవుని ప్రజలకు, దేవుని వెలుగును తీసికొని వచ్చుచున్నారు.

ఇది చీకటి కాలము. ప్రభువు యొక్క వాక్యమునకు మరీ ప్రత్యేకంగా ఇది అంధకార కాలము. దాదాపుగా వాక్యము ప్రజలకు మరుగైయున్నది, సర్వోన్నతుని యొక్క జ్ఞానము దాదాపుగా మరుగైపోయినది. అధిక సంఖ్యాకులగు విశ్వాసులను మరణము జయించి యున్నది. చివరకు ఎదిగినవారే నిర్వీర్యులగుచున్నారు. దేవుని యొక్క కార్యములు చాలా అల్ప సంఖ్యలో యున్నవి. దేవుని యొక్క ప్రజలను సాతాను నిశ్చయంగా జయించుచున్నట్లుగానే కనిపించుచున్నది.

రాత్రి లేని దేశమును స్వతంత్రించుకొందుమను వాగ్దానమును జనులు ఎప్పుడయినా గాని కార్య రూపములో చూడగోరినచో, వారు ఆలాగే చీకటి కాలముగుండా వెళ్ళవలసి యుందురు. ఆ కారణము చేతనే ఆత్మ వారికి వేకువ చుక్కను వాగ్ధానము చేయుచున్నాడు. ప్రధాన నక్ష్యత్రమగు యేసు, ఏ మానవుడు సమీపించలేని వెలుగులో నివసము చేయుచున్నాడు. ఆయన తన భవిష్యత్తు రాజ్యములో వారిని తన యొక్క స్వంత, వ్యక్తిగత సన్నిధి ద్వారా వెలిగించునని వారితో చెప్పుచున్నాడు. ఇక మీదట ఆయన చీకటిలో వెలుగును ఇచ్చుటకు చుక్కలను (వర్తమానికులను) వాడుకొనడు. యేసే, స్వయంగా, వారితో మాట్లాడును. ఆయన తన రాజ్యము యొక్క సంగతులను ముఖాముఖిగా పంచుకోనును.

సూర్యుని యొక్క వెలుగు ప్రకాశించుటకు ముందుగా వేకువ చుక్క కనబడును. మన సూర్యుడగు (యేసు) వచ్చినపుడు, ఇక వర్తమానికుల అవసరత వుండదు; ఆయన స్వయంగా తన ధైర్యమును ఇచ్చు వర్తమానమును మనకు అందించును; ఆయన తన రాజ్యమును ఏలుచుండగా, మరియు మనము ఆయన సముఖమందు జీవించేదము, వాక్యము యొక్క వెలుగు ఇంకా ఇంకా ప్రకాశామానమగుచుండగా మన యొక్క పరిపూర్ణ పగలు భయలుపడును.

యేసుకంటె ఎక్కువ మనకు ఇంకేమి కావలెను? ఆయనే సమస్తమూ కాదా? ఆయన అన్నింటిలోను పరిపూర్ణుడు కాడా?

సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటను చెవిగలవాడు వినును గాక!ఆమెన్. ప్రభువగు దేవా, నీ ఆత్మ ద్వారా, మీ సత్యమును మేము వినగలుగునట్లు చేయుము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...