సార్దీసు సంఘ కాలము

సార్దీసు సంఘ కాలము

ప్రకటన 3:1-6

"సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము — ఏడు నక్షత్రములను దేవుని యేడాత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా — నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే.నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడువై చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడువై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను. ఏ ఘడియనునీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్ లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు.జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంతమాత్రమును తుడుపుపెట్టక నా తండ్రి యెదుటను ఆయన దూతుల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక."

సార్దీస్

పురాతన లూదియకు సార్దీస్ రాజధానిగా యుండెను. అది లూదియను చక్రవర్తుల చేతులలో నుండి పర్షియనుల చేతులలోనికి వెళ్ళిపోయినది. ఆ తరువాత అది మహా అలెగ్జాండరు ఆక్రమణలోనికి వెళ్ళినది. అది మహా అంతికస్ వలన ఆక్రమించుకొనబడినది. దానిని రోమనులు ఆక్రమించుకొనువరకు పెర్గమ రాజులు పరిపాలించిరి. టిబెరియస్ కాలములో అది భూకంపములు మరియు తెగుళ్ళు ద్వారా నాశనపరచబడినది. ఈ రోజున అది శిధిలములు గాను, నివాసులు లేకను యున్నది.

ఒక కాలములో ఈ పట్టణము వాణిజ్య రీత్యా చాలా ప్రాముఖ్యత చెందినది. ఉన్నికి రంగు వేయుట ఇక్కడే కనిపెట్టబడినదని ఫ్లయినీ చెప్పెను. ఇది ఉన్నికి రంగులు చేయుటకును, తీవాచీలు అల్లుటకును కేంద్రముగా యుండెను. దాని యొద్ద ఎక్కువ మొత్తములోనే వెండి మరియు బంగారము ఉండియుండెను. బంగారు నాణములను మొదట ముద్రించుట ఇక్కడే జరిగినదని చెప్పెను. దీనిలోనే బానిసలను కొనుట మరియు అమ్ముట జరిగెడిది.

సైబిల్ దేవతకు అపవిత్ర ఆరాధన చేయుటయే ఈ పట్టణములోని మతము. ఆ దేవాలయము యొక్క శిధిలపు గుట్టలు ఇంకా చూడగలరు.

పెర్గమ కాలములో తల్లి మరియుకు మారుల బాబిలోనియా ఆరాధనా ఒరవడిని గూర్చి నేను చెప్పినదానిని మీరు గుర్తుకుతెచ్చుకొనండి. వారే సెమిరామిస్ మరియు సైనస్. వారే ఆసియా యొక్క సైబిల్ మరియు (ఒకదానితో ఒకటి పోల్చి) డియోస్ గా మారిరి. ఈ ఇద్దరికి ఆపాదించబడిన లక్షణములు చాలా ఆసక్తికరముగా నుండును, వీటిని తులనాత్మకంగా చూద్దాం.

అతడు సూర్య దేవుడు; ఆమె చంద్ర దేవత.

అతడు ఆకాశప్రభువు; ఆమె ఆకాశ రాణి.

అతడు మంచి మరియు సత్యమును బయలుపరచువాడు; ఆమె దయ మరియు సాత్వికము కలిగినది.

అతడు మధ్యవర్తి; ఆమె మధ్యవర్తిణి.

అదృశ్య ప్రపంచము యొక్క ద్వారములను తెరచుటకు గాని లేదా మూయుటకు గాని అతనియొద్ద తాళపుచెవి యున్నది. ఆమెయొద్ద కూడా ఆలాగు చేయగలిగిన తాళపు చెవి యున్నది.

అతడు మృతులకు తీర్పరి; ఆమె అతని ప్రక్కన నిలబడియుండును.

అతడు చంపబడి, తిరిగి లేపబడి పరలోకమునకు ఆరోహణుడైయున్నాడు; ఆమె కుమారుని ద్వారా శరీరముతోనే అక్కడికి కొనిపోబడినది.

ఇప్పుడు రోమ్ లో ఇదే దేవునికి మన ప్రభువుయొక్క బిరుదు ఇయ్యబడినది. అతడు దేవుని కుమారుడనియు, ఆమె దేవుని తల్లి అనియు పిలువబడుచున్నారు.

గతించిన ఆ రెండు కాలములలోను దీనినే మనము కనుగొనగలము, తల్లి కుమారుల భావన చాలా అద్భుతమగు ప్రభావమును కలిగించినది. కాని ఇప్పుడు దానిని గమనించండి, ఆ పురాతన బబులోనులోనే కువూరుని యొక్క ఆరాధన ప్రారంభమాయెను. తల్లి యొక్క ఆరాధనను కొనసాగించవలెనను భావన వలన అది కొంత వెనుకంజ వేసెను, కాబట్టి అక్షరాలా ఆమె కుమారుని స్థానమును ఆక్రమించినది. సార్దీస్ యొక్క అన్య ఆరాధనను ఈ కాలములో మనము చూడగలము. అది స్త్రీ ఆరాధన.

అది కేవలము సైబిల్ మాత్రమే, సైబిల్ మరియు డియోస్ ఆరాధన కాదు. అక్షరాలా తల్లి ఆకుమారుని యొక్క స్థానమును అక్రమించియున్నది, దేవత్వము యొక్క లక్షణములను ఆమెకు వర్తింపచేసినది, ఆమెకియ్యబడిన ఆ యా బిరుదులను చూడవలసిన అవసరమున్నది. రోమను చర్చి వారు మరియకు ఇచ్చిన అందమగు బిరుదులను, గుణములను గుర్తుకు తెచ్చుకొనండి, ఈ కాలములోని మతము ఎక్కడ నుండి వచ్చియున్నదో మనకు అర్థమగును.

రెండు సంగతులు నన్ను చాలా బలముగా ఆకట్టుకొనినవి, ఈ సైబిల్ యొక్క ఆరాధనను చూచినప్పుడు నాకిది అర్ధమయినది. ఒక వాస్తవము ఏమనగా ఆమె జానస్ వలె ఒక తాళపు చెవిని పట్టుకొనినది. జానస్ కు ఇయ్యబడినట్లుగానే ఆమెకును అధికారము ఇయ్యబడినది, (భూమి, ఆకాశము మరియు మర్మములకు విప్పగల ఆ తాళపు చెవి) మరో వాస్తవము చూడండి. ఆరాధకులు తమ్మును తాము కొరడాలతో కొట్టుకొని, తమ శరీరముల నుండి రక్తము చిమ్ము వరకు బాధించుకొందురు. కాథలిక్కులు నేటికిని ఆలాగే చేయుచున్నారు, వారు ప్రభువుకువలె శ్రమపడుచున్నట్లు భావించుదురు.

ఒక వాస్తవము ఏదనగా పోపుల రోమ్ ఈ కాలములోనే మొదటగా చొచ్చుకొని వచ్చి నిజంగా వర్ధిల్లినది. యెజెబెలు ప్రవక్తిని బలమును కూడగట్టుకొని మరియత్వమును తన బోధను నొక్కి చెప్పినది, ఇందులో ఏమీ సందేహములేదు. ఏ విధముగానయిననూ తనను ధిక్కరించిన వారిని, అనగా ప్రొటస్టెంటు వారిని వ్యతిరేకించుటకు నిర్ణయించుకొనెను. ఆమెకు దేవునిని మెప్పించు శక్తి యున్నది గనుక మరొక రక్షణ విధానము లేదని చెప్పిరి. ఆ శిశువును మోయుటకు దేవుడామెను ఎన్నుకొనెనని చెప్పిరి. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట గూర్చి లూథర్ తేల్చి చెప్పెను. వారయితే క్రియలు, పరిహారము, ప్రార్థనలు మరియు ఇంకా ఇతర వాక్యములో లేని పద్ధతులను పట్టుకొని యుండిరి. స్వతంత్రులయిన క్రైస్తవులు కుమారుని మహిమపరచిననూ రోమను కాతలిక్కులు తమ మరియ యొక్క ఆరాధనను 20వ శతాబ్దము వరకూ విస్తరింప చేసి ఆమె మహిమ శరీరము పొంది పునరుత్థానురాలైనదని పోప్ పీయూస్ చెప్పెను. అది ఖచ్చితంగా బాబిలోనియన్ బోధ, ఒక కుమారుడు తన తల్లిని పరలోకమునకు కొనిపోయెనని వారప్పుడు చెప్పిరి.

ఈ అయిదవ కాలము కూడా ఆ ఇతర కాలములు అడుగుజాడలలోనే వెళ్ళుటలో ఆశ్చర్యము లేదు, మరియు అగ్నిగుండములో విడువరకు అది ఆలాగే జరుగుచుండును. వేశ్య మరియు దాని కుమార్తెలు రెండవ మరణము ద్వారా చంపబడుదురు. అదియే మరియారాధన అనగా సైబిల్ యొక్క ఆరాధన. సైబిల్ యనగా అష్ణార్తేయని మీకు తెలియునా? దానికి యెజెబెలు యాజకురాలుగా ఉండెను. ఆమె ఇశ్రాయేలు పతనమగుటకు కారకురాలాయెను. వికృతమగు ఆచారములను ఆమె నిర్వహించి వారిని పడగొట్టినది. అవును, బైబిలులో ఆమె గూర్చి మనము చూడగలము.

సార్దీస్

సార్దీస్ లేదా అయిదవ సంఘ కాలము 1520 నుండి 1750 వరకు కొనసాగినది. దీనిని వాడుకగా సంస్కరణ కాలమందురు.

వర్తమానికుడు

ఈ కాలమునకు వర్తమానికుడు అన్ని కాలములలో కంటెను బాగుగా తెలిసిన వర్తమానికుడు. అతడు మార్టిన్ లూథర్, అన్యుల యుగములో మార్టిన్ లూథర్ ఒక అమోఘమగు పండితుడు. అతడు ఒక న్యాయవాది కావలెనని చదువుచుండెను, కాని ఒక దీర్ఘకాల వ్యాధి మరియు ఒక సమీప స్నేహితుని యొక్క మరణము, అతనిని తన ఆత్మీయ జీవితము గూర్చి తీవ్రముగా ఆలోచించునట్లు చేసెను. అతడు 1505లో యోఫరులోని ఆగస్టీనియను సన్యాసుల మఠములో చేరెను. అక్కడతడు వేదాంతము విద్యనభ్యసించెను మరియు దేవుని వాక్యమును కూడా చదివెను.

అతడు కటిక దరిద్రునిగా జీవించెను, కాని ఈ బయటి క్రియల వలన అతని అంతరంగములోని పాపము భావన తొలగిపోకుండెను. అతడు ఇట్లు చెప్పెను, "దేవునితో సమాధానపడవలెనని నేను మరణమగునంతగా నన్ను యాతనపరచుకొంటిని, కాని నేను అంధకారములోనే ఉండి మార్గమును కనుగొనలేకపోయాను." అతని యొక్క మఠమునకు జనరల్ గా యున్న స్టాపిజ్ అతనికి కొంత ఆత్మీయ గ్రహింపు కలుగుటకు సహాయము చేసెను. ఆచారము వలన కాదు గాని ఒక అంతరంగ క్రియ యొక్క అనుభవము వలన అతనికి రక్షణ కలుగునని చెప్పెను. ఈ ప్రోత్సాహముతో అతడు ఇంకా దేవుని వెదుకసాగెను. ఆ తరువాత అతడు ఒక యాజకు డాయెను. అయినా గాని ఇంకా అతడు రక్షింపబడలేదు.

అతడు ఒక తృష్ణగలిగిన, లోతైన వాక్య అధ్యయనకర్తగా మారెను. గొప్ప వేదాంత క్రియలను కనుపరచెను. అతని యొక్క గొప్ప లోతయిన జ్ఞానము వలనను, మహా యధార్థత వలనను ఉపదేశకునిగాను, బోధకునిగాను ఉండవలెనని కోరిరి. అతడు స్వయంగా చేసికొన్న ఒక ప్రమాణము వలన రోమ్ వెళ్ళవలసి వచ్చెను. అక్కడతడు "సంఘము విధించిన క్రియలను చూసి రక్షణ అందువలన రాదన్న సత్యమును గ్రహించెను. దేవుని యొక్క వాక్యము అతని హృదయమును తాకెను. "నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును," అని గ్రహించెను. అతడు ఇంటికి తిరుగు ముఖము పట్టినప్పుడు ఈ సువార్త సత్యము

అను లేఖనము అతని మనస్సును కలియ తిప్పెను. అతడు పాపము నుండి విడిపింపబడి దేవుని యొక్క రాజ్యము లోనికి జన్మించెను. ఇది జరిగిన వెంటనే అతనిని డాక్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీతో హెచించిరి, "అతని యొక్క పూర్తి జీవితమును అధ్యయనము చేయుటకును, పరిశుద్ధ లేఖనములను నమ్మకముగా వివరించి కాపాడుటకును వినియోగించమని వారు కోరిరి." దీనిని అతడు చేసెను, అటువంటి ప్రభావము వలన అతని హృదయముతో పాటుగా అతని చుట్టూ యున్నవారి హృదయములు కూడా వాక్య సత్యము మీద లోతుగా వెళ్ళాలనుకొనినవి. త్వరలోనే వాక్యము గూర్చి బహిరంగముగా వివాదము జరిగి సంఘ ఆచారములను, బోధలను విమర్శించసాగిరి.

ఆ విధముగా లియో X పోపు అయినప్పుడు జాన్ టెటిజల్ వచ్చి పాప పరిహార పత్రములను అమ్మనారంభించెను. ఈ వాక్య విరోధ బోధకు వ్యతిరేకముగా లేచి నిలబడుట తప్ప లూథరునకు మరే ఇతర త్రోవకనబడలేదు. మొదట అతడు దానికి విరోధముగా బలిపీఠము మీద నుండి ఉరిమినట్లు మాట్లాడెను. ఆ తరువాత అతడు తన ప్రత్యేకమైన 95 పరిశోధనా వ్యాసములను వ్రాసి అక్టోబరు 31, 1517లో కాసిల్ చర్చి తలుపునకు మేకులతో కొట్టెను.

కొద్ది కాలములోనే జర్మనీ మండిపోసాగినది మరియు సంస్కరణ ప్రారంభ మాయెను. ఒక విషయము గుర్తుంచుకొనండి, రోమను కాతలిక్కు చర్చిని ఎదిరించినది మార్టిన్ లూథర్ ఒక్కడే కాడు. చాలా మందిలో అతడు ఒకడు. పోపును చాలా మంది ధిక్కరించిరి, మరికొందరు వారియొక్క ఉన్నత పదవులను, యాజకత్వపు హోదాలను వదులుకొనిరి. పోపుల మధ్య కూడా చిన్నగా ఈ సంస్కరణ చోటుచేసినది. సంగతులను ఎత్తి చూపినవారు అనేకులున్నారు, కాని లూథరు విషయము చూచినచో ఒక ఖచ్చితమగు దేవుని కాలము కదలించబడుట ద్వారా పరిపక్వమయినది. సంఘము యొక్క పునరుద్ధరణకు అది ఒక ప్రారంభము. ఆ తరువాత కాలమునకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినది.

ఇప్పుడు మార్టిన్ లూథర్ స్వయంగా ఆత్మ నింపుదలను పొందిన కదలిక గల క్రైస్తవుడు. అతడు ఖచ్చితంగా వాక్యము కొరకు నిలబడిన మనిషి, దానిని చదువవలెనను ప్రగాఢ కోరిక కలిగియుండుట మాత్రమే కాదు గాని అందరికీ అది లభ్యమగునట్లు చేయవలెనను కోరిక కూడా కలిగియుండెను. అందరూ దానివలన జీవించవలెనని కోరెను. అతడు క్రొత్త నిబంధనను అనువదించి ప్రజలకు అందించెను. ఈ శ్రమతో కూడిన పనిని అతడు స్వయంగా చేసెను, ఒక పేరాను దాదాపు ఇరవై మారులు సరిచూచెను. అతడు ఒక హెబ్రీ పండితుల గుంపును తన చుట్టు కూర్చోపెట్టుకొని పాత నిబంధనను అనువాదము చేసిరి, అందులో యూదులును ఉండిరి.

లూథర్ యొక్క ఈ చారిత్రక పని , జర్మనీలో ఆ తరువాత రానైయున్న పనియంతటికి నాందిగా యుండెను. దీనివలననే ఎన్నో లేఖన కార్యములు ఆ తరువాత వెలువడినవి.

అతడు వాక్యము యొక్క గొప్ప బోధకుడు మరియు ఉపదేశకుడు. వాక్యమును గొప్పగా ఉపదేశించెడివాడు. వాక్యము మాత్రమే అందరికి జీవనాధారము అని అతడు తన సేవ ప్రారంభించిన తొలి సంవత్సరములలో గట్టిగా ప్రజలకు నొక్కి చెప్పెను. ఆ విధముగా అతడు క్రియల వలన రక్షణ వచ్చును అను భావనకును, బాప్తిస్మము మారుమనస్సు అను భావనకును ఎదురు తిరిగెను. అతడు క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వము గూర్చి బోధించెను, ఇందులో మానవునికి ఏ జోక్యము లేదనెను. ఆది లోని పెంతెకోస్తు యొక్క బోధ అదియే. అతడు బహుగా ప్రార్థించెడివాడు. మరియు తాను చేయవలసిన పని ఎంతో ఉన్నదని అతడు గ్రహించెను, అతడు సమయమును బహుగా లెక్కించి పని చేసెడివాడు. తన సమయములో ఎక్కువ భాగమును అతడు దేవునికి ఇచ్చి ప్రార్థనలో ఎక్కువగా గడిపి సంతృప్తికరమగు ఫలితములు పొందెను. అపవాదితో యుద్ధము చేయుట అనగా ఏమిటో అతడెరుగును. మరియు ఒక రోజున సాతాను ప్రత్యక్షముగా అతనికి కనబడినది, వానిని తరిమికొట్టుటకు అతడు సీరా సీసాను విసిరి వానిని కొట్టెను. మరొకసారి ఇద్దరు మతమౌఢ్యులు వచ్చి తమతో చేరమని అతనిని కోరి మత గురువులను, బైబిళ్ళను తరిమికొట్టుదము రమ్మనిరి. వారిలోనున్న ఆత్మను అతడు వివేచించి వారిని పంపివేసెను.

సాయూర్స్ చరిత్రలోని వాల్యూమ్ 3, పేజీ 406లో డాక్టర్ మార్టిన్ లూథర్ గూర్చి ఇట్లు వ్రాయబడినది. "అతడు ఒక ప్రవక్త, సువార్తికుడు, భాషలను మాట్లాడువాడు, భాషలకు అర్ధము చెప్పువాడు, ఆత్మ యొక్క తొమ్మిది వరములు ఈ ఒక్కనిలోనే యున్నవి."

అతని హృదయము పరిశుద్ధాత్మ ద్వారా కదిలింపబడినది, అది ఒక చిన్న పచ్చని చిగురువలె ఉండి పెంతెకోస్తులో యున్నట్లుగానే సత్యము మరల సంఘము యొద్దకు వచ్చుచున్నదని గుర్తించబడెను. నీతీకరణపు బోధ వచ్చుచున్నది: క్రియల వలన కాదు గాని కృప ద్వారానే రక్షణ. డాక్టర్ లూథర్ నీతీకరణను నమ్మి బోధించుటయే కాదు గాని అది అతని యొక్క ప్రధాన ఇతివృత్తముగా యున్నది, నిశ్చయంగా అది ఆలాగే ఉండవలసి యున్నది, ఎందుకనగా అది వాక్యములోని సత్యమే మూల బోధయై యున్నది. ఈ సత్యమును ఉజ్జీవింప చేసిన దేవుని చేతిలోని ఒక సాధనముగా అతడు నిత్యమూ నిలచి యుండును. అతడు అయిదవ వర్తమానికుడు మరియు అతని వర్తమూనము, "నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును." మనము విశ్వాసములో నుండి విశ్వాసము లోనికి వెళ్ళవలసియున్నామని నిశ్చయంగా అతడెరిగి బోధించెనని మనము అంగీకరించవలెను. సార్వభౌమత్వము, ఎన్నిక, ముందు నిర్ణయము, ఇంకా ఇతర సత్యములను గూర్చి అద్భుతముగా అతడు అర్ధము చేసికొనెను. వాక్యములో అతడు గొప్పవాడని ఇందువలన రుజువగుచున్నది. చరిత్రకారులు చెప్పిన విధంగానే మరల నేనిది చెప్పుచున్నాను — "నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును," అను దేవుని స్థాయిని జనుల యొద్దకు తీసికొని వచ్చుటకు దేవుడాతనిని వాడుకొనెను. క్రియల ద్వారా కాదని చెప్పెను.

ఇంతకు ముందే నేను చెప్పినట్లుగానే చరిత్రకారులు ఈ కాలమును సంస్కరణ కాలమని పిలచిరి. అది అక్షరాలా నిజము. అది ఆ కాలమే. అది ఆలాగున ఉండవలసియున్నది, ఎందువలననగా మార్టిన్ లూథర్ ఒక సంస్కర్త, ప్రవక్త కాదు. చరిత్ర గ్రంథములు అతనిని ప్రవక్తగా పిలచునని నాకు తెలియును, కాని అందువలన చరిత్ర గ్రంథము సరియని చెప్పజాలము. దేవుని యొక్క నిజప్రవక్తగా మార్టిన్ లూథర్ గుర్తింపబడు అర్హతలు లేవు, అందుకు సాక్షాధారములు లేవు, ఆ వాక్యము యొక్క గొప్ప భావార్ధమును గ్రహించవలెను. అతడు చక్కని బోధకుడు, కొన్ని ఆత్మ యొక్క ప్రత్యక్షతలు అతని జీవితములో ఉన్నవి, అందును బట్టి మనము దేవునిని స్తుతించవలెను. సంఘమును సంపూర్ణ సత్యములోనికి అపోస్తలుడగు పౌలువలె తిరిగి నడిపించలేకపోయెను, ఎందుకనగా పౌలు అపోస్తలుడు మరియు ప్రవక్త.

సమయము గడచుచుండగా, అతడు తనకు సంబంధించిన వ్యవహారములలో జోక్యము చేసికొనిన తీరులో గొప్ప మార్పు వచ్చినట్లు కనుగొనగలము. మొదటిలో అతడు చాలా దీనునిగాను, భయము లేనివానిగాను, సహనపరుని గాను, సమస్యలను పరిష్కరించుటకు దేవుని సన్నిధిలో స్థిరముగా కనిపెట్టవాని గాను ఉండెను. కాని అతని యొద్దకు గొప్ప జనసమూహములు రాసాగిరి, వారి యొక్క ఉద్దేశ్యము నిజంగా ఆత్మ సంబంధమైనది కాదు, పైగా వారికి రాజకీయ అభిప్రాయములున్నవి. వారు పోపు యొక్క కాడిని విరుగగొట్టవలెనని చూచిరి. రోమ్ కు డబ్బును పంపించుట వారికి ఇష్టము లేదు. మతమౌఢ్యులు బయలుదేరిరి. అతనిని రాజకీయ వ్యవహారములలోనికి త్వరగానే ఈడ్చిరి. వారు చేసిన తీర్మానములు చర్చికి సంబంధించినవి కావు. ప్రార్ధన, బోధ మరియు ప్రవర్తనకు ఒక నియమావళిని ఏర్పరచవలెనని మాత్రమే వారు కోరిరి. ఈ రాజకీయ సమస్యలు ఇంకా ఎక్కువయి చివరకు అతనిని బలవంతముగా ప్రభువులకును, రైతులకును మధ్య సంధి కుదుర్చువానిగా వారు ఇరికించిరి. అతని నిర్ణయములు చాలా తప్పు, అందువలన గొప్ప అల్లరి పుట్టెను. అందుమూలముగా వేలాది మంది చనిపోయిరి. అతడు బాగుగానే అర్థము చేసికొనెను, కాని ఒకసారి అతడు మరల సంఘము — రాజ్యము యొక్క సువార్తలో ఇరుక్కొనెను, అందువలన అతడు సుడిగాలిని కోయవలసి వచ్చెను.

ఏది ఏమయినా గాని దేవుడు మార్టిన్ లూథర్ ను వాడుకొనెను. అతని యొక్క ఉద్దేశ్యములు తప్పు అని మనము చెప్పలేము. కాని అతని తీర్పు మాత్రము విఫలమయ్యెను. నిజంగా ఈ లూథరనులు అతని యొక్క బోధకు తిరిగినట్లయితే, ఈ ప్రశస్త సోదరుడు దేవుని సేవించినట్లుగా వారు దేవుని సేవించినయెడల ఆ జనులు నిజంగా మహా దేవుడును, రక్షకుడును అగు యేసు క్రీస్తునకు మహిమను, తీసికొని వచ్చెదరు.

అభివందనము

ప్రకటన 3:1,

"ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులు."

ముందు నాలుగు కాలములలో చెప్పినట్లుగానే ఆత్మ మన కృపగల దేవునిని బయలుపరచుచున్నది. ఆయన యొక్క అద్భుతమగు గుణ లక్షణముల ద్వారా ఆయనను చూపించుచున్నది. ఈ సమయములో ఆయన సంఘము మధ్యను నిలబడియున్నాడు, ఏడు నక్షత్రములును, దేవుని ఏడాత్మలును గలవానిగా ఇప్పుడాయనను మనము చూచుచున్నాము. ఆ ఏడు నక్షత్రములు ఎవరో మనమెరుగుదుము, కాని ఆ ఏడు ఆత్మలు ఎందుకు ప్రస్తావించబడినవో మనము కనుగొనవలసియున్నాము.

ప్రకటన గ్రంథములో ఇదే పదమును నాలుగు సార్లు మనము కనుగొందుము.

ప్రకటన 1:4,

"సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మలనుండియు."

ప్రకటన 3:1,

"ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులు."

ప్రకటన 4:5.

"ఆ సింహాసనములో నుండి మెరువులును ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి."

ప్రకటన 5:6,

"మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును, పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులునుండెను. ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు."

ప్రారంభములో చూచినట్లుగా, ఈ వచనములు ఒక క్రొత్త బోధను గాని లేదా యోహాను 4:24లోని వచనమునకు వేరయిన దానిని గాని బోధించుట లేదని నిశ్చయముగా మనము తెలిసికొనవలెను. "దేవుడు (ఒక్కటే) ఆత్మ స్వరూపియై యున్నాడు." కాని ఇది I కొరింధీ 12:8-11లో యున్నట్లుగానే యున్నది, ఒకే ఆత్మ తొమ్మిది విధములుగా ప్రత్యక్షమగుట మనము చూచెదము. కాబట్టి దేవుని యొక్క ఏడు ఆత్మలు, అనగా ఒకే ఆత్మ కానీ ఏడు విధములుగా బయలుపడుచున్నదని మనము తెలిసికొనవలెను. ప్రకటన 4:5లో మనము ఇదే ఏడు ఆత్మలను, సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడాత్మలు అని చెప్పబడుట చూతుము. పాత నిబంధనలోని సూచనలనే ఎల్లప్పుడూ యోహాను వాడుట మనము చూచెదము. కాబట్టి ప్రకటన గ్రంథములోని సూచనలను మనము అర్థము చేసికొనవలెనన్నచో, పాత నిబంధనలోనికి వెళ్ళవలెను. సామెతలు 20:27 చూడండి, "నరుని ఆత్మ యొహోవా పెట్టిన దీపము." ఈ ఏడు ఆత్మలు మానవునితో సంబంధము కలిగియున్నవి. బాప్తిస్మమిచ్చు యోహాను, యోహాను 5:35లో 'ప్రజ్వరిల్లుచున్న దీపముగా' పిలువబడెను. దానిని వాస్తవంగా తర్జుమా చేసినచో మండుచున్న దివిటీగా గ్రహించుదము. మరల ప్రకటన 5:6లో ఈ ఏడు ఆత్మలను ఏడు కన్నులుగా గుర్తించగలము.

జెకర్యా 4:10లో,

"కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించినవాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క ఏడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలోగుండు నూలుండుట చూచి సంతోషించును."

యొహోవా యొక్క ఏడు నేత్రములు అనగా, ఈ సందర్భములో మనుష్యులకు వర్తించునని గ్రహించవలెను. అయితే వారు అభిషిక్తులగు మనుష్యులు, పరిశుద్ధాత్మతో నిండినవారు, ఎందుకనగా దేవుని యొక్క పరిచర్యలు మానవ శక్తితో నింపబడినవి కావు, అవి పరిశుద్దాత్మతో నింపబడినవి. లేఖన సంబంధముగా మనము కనిపెట్టిన సంగతులను ఒకసారి చూసినయెడల దేవుని యొక్క ఏడు ఆత్మలు ఏడుగురు మనుష్యులు పరిశుద్దాత్మచే నింపబడి పరిచర్యను కొనసాగించుచున్నట్లు చూచుచున్నాము. దేవుడు ఆ ఏడుగురి జీవితములతో సన్నిహిత సంబంధము కలిగియున్నాడు. వారే ఆయన కన్నులు, మరియు వారే ఆయన దీపములు. ఈ ఏడుగురు వ్యక్తులు ఎవరో తేలికగా మనము గ్రహింపగలము, ఎందుకనగా ఆ ఏడుగురు ఏడు నక్షత్రములని ఆ తరువాత చెప్పబడినది. వీరిని గూర్చి ఇంతకు ముందే మనము తెలిసికొనియున్నాము. వారు ఏడు సంఘ కాలములకు చెందిన ఏడుగురు వర్తమానికులు. ఇది ఎంత అందముగా యున్నది! చూడండి. రాత్రియందు నక్షత్రము వెలుగును ప్రతిబింబించవలసియున్నది, ఎందుకనగా సూర్యుడు అస్తమించియున్నాడు. అదే విధముగా ప్రతికాలపు వర్తమానికుడు ఆ కాలమునకు (నక్షత్రముగా చూపబడియున్నాడు) కుమారుని యొక్క వెలుగును ప్రతిబింబించవలసియున్నాడు. వారందరూ దీనిని పరిశుద్దాత్మ ద్వారా జరిగించిరి.

పౌలు మొదటి వర్తమానికుడు మరియు అతడు గలతీ 1:8లో ఇట్లు చెప్పెను. ఏ దూతయైనను, ఏ వర్తమానికుడైనను, ఏ ప్రతినిధియైనను, మరెవరయినా గాని — పౌలు బోధించిన సువార్తను గాక మరొక సువార్తను బోధించినయెడల శాపగ్రస్తుడగునని చెప్పెను. తాను వెళ్ళిపోయిన తరువాత క్రూరమగు తోడేళ్ళు వచ్చునని పౌలుకు తెలియును. సాతాను తనకుతానే వెలుగు దూతగా ప్రత్యక్షమగునని అతనికి తెలియును. కాబట్టి అపవాది యొక్క అనుచరుల గూర్చి చెప్పనక్కరలేదు. కాబట్టి ఈ సువార్త ఎల్లప్పుడూ ఈలాగే యుండవలెనని అతడు హెచ్చరించుచున్నాడు. ఇప్పుడు పౌలు యేసు నామములో బాప్తిస్మము ఇచ్చెను. ఆ విధంగా బాప్తిస్మము పొందని వారికి మరల బాప్తిస్మమిచ్చెను. అతడు సంఘమును క్రమములో యుంచెను. ఆత్మయొక్క వరములను సరిగా వాడుట ఎట్లో చెప్పెను. యేసు వచ్చు వరకు అవి సంఘములో నిలిచియుండవలెనని దృవీకరించెను. ఆ విధముగా ఆ తరువాత వర్తమానికులు, అనగా ఆరుగురును అదే పరిశుద్ధాత్మను కలిగియుండి, అదే అగ్ని ద్వారా మండుచుండిరి. యేసుక్రీస్తు యొక్క అదే సువార్త వెలుగును కలిగియుండిరి మరియు అద్భుతములు, సూచక క్రియలు వారిని వెంబడించెను. ఐరేనియస్ లో అర్హతలున్నవా? అవును. మార్టిన్ అర్హుడేనా? అవును. కొలంబా అర్హుడేనా? అవును. మార్టిన్ లూథర్ అర్హుడేనా? బహు నిశ్చయంగా. వెస్లీ అర్హుడేనా? అవును, అతనికి గొప్ప పరిచర్యయుండెను. మరియు తన గుర్రము బాగగునట్లు ప్రార్ధించగా అది బాగయ్యెను. ఏడు సంఘ కాలములు మరియు ఏడుగురు వర్తమానికులు ఒకేలాగున్నారు. అక్కడే మీరున్నారు. తాను వర్తమానికుడనని చెప్పి వేరోక సువార్త బోధించి, వేరొక వెలుగులో జీవించినవాడు శాపగ్రస్తుడగునని పౌలు చెప్పెను.

నేను చెప్పిన ఆ చివరి మాట వాక్యమంతటికిని వర్తించునా? అవును. ఈ గ్రంథమునకు ఏదయినా చేర్చినా లేక ఈ గ్రంథములో నుండి ఏదయినా తీసివేసినా, అట్టివానికి తెగుళ్ళు వచ్చుననియు, దేవుని యొక్క శిక్ష లభించుననియు వాక్యములో చెప్పబడెను.

ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు రప్పించుదుననియు, జీవ గ్రంథములో అతనికి పాలులేకుండా చేయుదుననియు దేవుడు చెప్పెను.

ప్రకటన 22:18.

కావున వాస్తవానికి ఏడు ఆత్మలూ వివిధ తరాలలో దేవుని యొక్క చిత్తమునూ మరియు వాక్యమునూ నెరవేర్చుచున్న దేవుని యొక్క ఒకే ఆత్మను సూచిస్తున్నవని చూస్తున్నాము. నేను దానిని వాక్యములోనుంచి చూపించాలనుకుంటున్నాను. దేవుని ఆత్మ ఏలియా పై బలముగా ఉండెను, తర్వాత అదే ఆత్మ రెండింతలు ప్రభావంతో ఎలీషా పైకి వచ్చినది. శతాబ్దాల తరువాత, ఆ పరిచర్యను వివరించడానికై మనం ఏలియా యొక్క ఆత్మ అని పిలుస్తున్న అదే ఆత్మ మరలా తిరిగి బాప్తిస్మమిచ్చు యోహాను పైకి వచ్చింది. ఒక రోజు, అన్యసంఘ కాలము యొక్క ముగింపు కొరకై, అదే రకమైన పరిచర్యచేత గుర్తించబడిన అదే ఆత్మ ఒక మనిషి మీదికి వస్తుంది. ఇంకా నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్దాత్మ చేతనూ శక్తి చేతనూ అభిషేకించగా ఆయన మేలు చేయుచూ, దెయ్యము చేత పీడించబడిన వారినందరినీ స్వస్థపరచెనని లేఖనము చెప్పుచున్నది. ఆయన పై ఉన్న అదే ఆత్మ, మరలా తిరిగి వచ్చి, వారి పై దిగి, వారిని నింపుటకై పెంతెకోస్తు వరకూ ఎదురుచూడమని, యేసు తాను వెళ్ళిపోవుటకు ముందు శిష్యులకు చెప్పెను. అప్పుడు 'బయటికి పిలువబడిన' ఆ శరీరము (సంఘము) ఈ భూమి మీద ఆయనకు బదులుగా ఉంటూ, ఆయన స్థానమును తీసికొనును. మరియు ఆయనయందున్న అదే ఆత్మ వారియందునూ ఉండుటవలన, వారునూ సరిగ్గా అవే క్రియలు చేయుదురు. మరియు నిజంగా యేసుక్రీస్తు యొక్క శరీరమైయున్న ఏ ప్రజ అయినా (నిజ సంఘము), యేసు మరియు పెంతెకోస్తు సంఘము చేసిన అవే క్రియలను ప్రత్యక్షపరుచును, ఏలయనగా అదే ఆత్మ వారిలోనూ ఉండును. ఆత్మ మరియు ప్రత్యక్షతలు లేని ఏ యితర సంఘమైనా దేవునికి లెక్క చెప్పవలసియున్నది.

ఈ ఏడు నక్షత్రములూ, లేక ఈ ఏడు కాలాలకు అయిన ఏడుగురు దూతలూ ఆయన చేతిలో ఉన్నారని యిది యిక్కడ చెబుతుంది. వారు ఆయన చేతిలో ఉన్నట్లయితే, ఆయన యొక్క శక్తితో ముడిపడియున్నారని మీకు తిన్నగా తెలుస్తున్నది. చేయి దానినే సూచిస్తుంది, అది దేవుని యొక్క శక్తిని సూచిస్తుంది! మరియు దేవుని యొక్క అధికారమునూ, వారిలో ఒక్కరు కూడా తమ సొంత శక్తి లేక అధికారముతో రాలేదు. పౌలు చెప్పినది అదే. ఏ నరుడూ (అందుకు - తర్జుమాదారుడు) సాహసించడు. దానికి దేవుని యొక్క అధికారమూ మరియు పరిశుద్దాత్మ యొక్క శక్తి అవసరము. సువార్త ఆత్మ యొక్క శక్తియందు దేవుని యొక్క అధికారము చేత బోధింపబడుతుంది. ఈ మనుష్యులందరూ పరిశుద్ధాత్మ చేత శక్తిమంతులుగా చేయబడిరి. వారందరూ లోకాన్ని ఎదుర్కొనుటకు నిలువబడిరి. వారది చేయగలిగియుండిరి. వారు దేవునితో నిండియుండిరి. వారు దేవుని చేత పంపించబడి అధికారము పొందిన వారే గాని సొంతముగా లేక యితర మనుష్యుల వలన కాదు.

లోకము పొందజాలనిది ఏదో, అది వారు కలిగియుండిరి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోకము పొందజాలని ఆయన ఆత్మను పంపించెదనని యేసు చెప్పెను. అది నిజం. లోకము గాని లోకము యొక్క క్రమము గాని ఆయనను స్వీకరింపజాలవు. సంస్థ అనగా అదే — అది లోక క్రమము. పూర్తిగా పరిశుద్దాత్మతో నిండిన ఒక లోక క్రమపు సంఘమును నాకు చూపించండి. నాకు దానిని చూడాలనుంది. అలాంటి సంఘాన్ని మీరు నాకు చూపించగలిగినట్లయితే మీరు వాక్యంలో తప్పుపడుతున్నారు. లేదయ్యా, వీరిలో ఒక్క వర్తమానికుడూ సంస్థను స్థాపించలేదు. వారు సంస్థ యొక్క పాపము విషయమై ఒప్పించబడినవారైనందున, వారు వెలివేయబడిరి, లేక వారే బయటికివచ్చిరి. సంస్థ ఆత్మ స్థానమునూ మరియు సంఘశాఖ వాక్యము యొక్క స్థానమునూ తీసుకొంటుంటే పరిశుద్దాత్మ సంస్థలో ఉండటం ఎలా సాధ్యపడుతుంది? గుర్తుంచుకోండి, "సంస్థ" అంటే "మరణమే." మరొక విధంగా ఉండటం అస్సలు సాధ్యం కాదు. లోకం స్వాధీనపరచుకొంటే, ఆత్మ విడిచి వెళ్ళిపోవును.

అవును, ఆత్మ ఏడు ఆత్మలు కాదు గాని ఒక్కటే. ఆయన ఎల్లప్పుడూ ఒక్కటే రీతిగా ఉండి, ఒక్కటే రీతిగా క్రియ చేయును. మరియు ఏడుగురు వర్తమానికులూ ఒకే ఆత్మను కలిగియుందురు, మరియు ఒకే వాక్యము బోధించెదరూ, మరియు ఒకే శక్తి కలిగియుందురు. మరియు సంఘము నిజ సంఘమైతే, సరిగ్గా అదే ఆత్మ మరియు అదే వాక్యమును కలిగి, పెంతెకోస్తు యొక్క వారికున్న అదే శక్తిగల కార్యములను కలిగియుండును. అనుభవము ద్వారా అది ఒకపెంతెకోస్తు సంఘమగును; మరియు అక్కడ అన్యభాషలూ, భాషలకు అర్ధము చెప్పుట, ప్రవచనము మరియు స్వస్థతలూ ఉండును. దాని మధ్యను దేవుడు ఉండి, ఆయన ఎల్లప్పుడూ చేయునట్లుగానే దేవుడు తననుతాను ఆ సంఘము మధ్య ప్రకటించుకొనును, హల్లెలూయా! మరియు ఆమె సంస్థగా ఉండదు. దీనిని మరచిపోవద్దు.

వర్తమానికులలోని ఆయన యొక్క ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు వివిధ కాలాలలో, తననుతాను బయలుపరచుకొనుచున్నాడని యిప్పుడు మనము చూడగలుగుచున్నాము. ఇశ్రాయేలు సంతతివారికి మోషే ఉండినట్లుగా వారున్నారు. తన దినమునకైన ప్రత్యక్షతను అతడు కలిగియుండుటవలన, ప్రతి వర్తమానికుడూ ఆ దినమునకైన దేవుని యొక్క ప్రత్యక్షతనూ మరియు పరిచర్యనూ కలిగియుండెను.

కావున, వర్తమానికులు ఆయన చేతిలో ఉండుట మనము చూసినప్పుడు, ప్రభువు ఈ మనుష్యులతో తననుతాను గుర్తింపజేసుకుని, వారికి తన యొక్క శక్తిని అనుగ్రహించుటను మనము చూస్తున్నాము. ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య నిలిచియుండుటను చూసినప్పుడు, ఆయన సంఘమంతటితో గుర్తించబడుట మాత్రమే చాలదు. ఎఫెసీయులు నాలుగోవ అధ్యాయములోని అయిదు అంచెల పరిచర్యను (అపోస్తలులూ, ప్రవక్తలూ, బోధకులూ, సువార్తికులూ, కాపరులూ) మనము చూసిననూ, అదియు చాలదు, ఎందుకంటే ప్రతి కాలములోను సంఘము త్రోవ తప్పుచున్నది, మరియు అది సామాన్యులు మాత్రమే కాదు గాని యాజక సమూహము కూడా — గొర్రెలూ మరియు గొర్రెల కాపరులూ కూడా తప్పులో ఉండుట. అప్పుడు దేవుడు ప్రధాన కాపరిగా తననుతాను రంగము మీదికి తెచ్చుకొని, ఈ ఏడుగురు మనుష్యుల పరిచర్యల ద్వారా తన ప్రజలను సత్యము యొద్దకు మరియు ఆ సత్యములో నున్న సమృద్ధియైన శక్తి యొద్దకు నడిపించును.

దేవుడు ఆయన ప్రజలయందున్నాడు — ఆయన ప్రజలందరి యందునూ, ఏలయనగా ఏ మనుష్యుడైననూ క్రీస్తు ఆత్మ లేనివాడైతే అతడు ఆయన వారిలో ఒకడు కాడు. మరియు ఆయన వాక్యమై యున్నాడు, అనగా అది ప్రజలతో వాక్యము గుర్తించబడుటయైయున్నది. కాని, ఆయన యొక్క నిశ్చయమైన చిత్తము యొక్క ఆలోచన వలన, ఆయన సొంత ఎంపికయైన ఈ మనుష్యులలో ఆయన ఒక ప్రత్యేకమైన నాయకత్వమును ఉంచెను. ప్రతి కాలములోనూ వారు ఒకసారి కనిపించెదరు. అది వారిలో ఉన్న అదే ఆత్మ రోమ్ యొక్క మూఢ సిద్దాంతమునకు యిది ఎంత దూరముగా (వ్యత్యాసముగా - అనువాదకుడు) నున్నదో కదా. వారి సొంత ఎంపికయెమైన ఒక మనుష్యుని వారు కలిగియుందురు — ఒకని తర్వాత ఒకడు — ఎవ్వడూ దేవుని యొక్క శక్తిని కనుపరచడు — ఒక్కడూ దేవుని యొక్క వాక్యములో నిలువడు — ప్రతిఒక్కడూ తన ముందు వానికి భిన్నంగా, వాడే దేవుడైనట్టు వాడికి వచ్చినది కలుపును. దేవుడు దానిలో లేడు. కాని ఆయన ఆయన యొక్క వర్తమానికునిలో ఉన్నాడు, మరియు దేవుని యొక్క పరిపూర్ణత కలిగియుండువాడు ప్రభువుని ఆయన వాక్యమునందు వెంబడించువాడైన ఆ వర్తమానికుని వెంబడించును.

"ఏడు నక్షత్రములును, దేవుని యేడాత్మలును గలవాడు."

ప్రకటన 3:1.

ఈ ప్రభువే అవతారము ద్వారా తన్నుతాను మానవునితో గుర్తింపచేసికొనెను. ఆయన మరల మానవునియందు తన ఆత్మనుంచుట ద్వారా మానవునితో గుర్తించుకొనుచున్నాడు. "వీరు నా వారని" ప్రభువు చెప్పుచున్నాడు. ఏడుగురు ఆత్మనింపుదలగల వర్తమానికులు ప్రభువు వారు. వారు అవమానపడవచ్చును. వారిని ప్రశ్నించవచ్చును. నిశ్చయంగా, వారు మానవ మనస్సులకు అర్హులయిన వారిగా కనబడకపోవచ్చును — ఏమయినా గాని వారు తమ కాలమునకు వర్తమానికులుగా ఉన్నారు. దేవుడు ఒక అబ్రహామును ఎన్నుకొనెను (అతడు అబద్ధమాడెను), అతడు ఒక మోషేను ఎన్నుకొసెను (అతడు తిరుగుబాటు చేసెను), ఒక యోనాను ఎన్నుకొసెను (అతడు అవిధేయుడాయెను), ఒక సమ్సోనును ఎన్నుకొసెను (అతడు పాపము చేసెను), ఒక దావీదును ఎన్నుకొసెను (అతడు హత్య చేసెను), ఆయన ఒక యెహోషువాను, ఒక యోసేపును కూడా ఎన్నుకొనెను. పరిపూర్ణమగు చరిత్ర గలవారికంటె ఘోరమగు మచ్చలుగలవారే ఎక్కువ మంది యున్నారు. అందరునూ ఆయనవారై యుండిరి. ఆయన వారుగా ఉన్నారు. దానిని కాదను ధైర్యము ఎవరికిని లేదు. ఆయన వారిలో యుంచిన పరిశుద్దాత్మ ద్వారా వారిని ఉపయోగించుకొనెను. వారు తమ స్వంత యజమాని విషయములో పడిపోయిరి లేక నిలబడిరి. దేవుని యొక్క సర్వచిత్తము వీరిలో నెరవేరెను. బయట చరిత్ర వారిని నిందించినా గాని సత్యము నిలబడును. నిత్యుడగు దేవుడు ఇంకా ఆ సువర్ణ దీప స్తంభముల మధ్య నడుచుచూ మరియు ఆయన తన ఆత్మ ద్వారా ఆ వర్తమానికులను పంపించుచున్నాడు. ప్రతి కాలమునకు చెందిన ప్రజలకు ఆయన వాక్కును పంపించుటకు వారిని ఉపయూగించుకొనెను.

ఆరోపణ

ప్రకటన 3:1,

"నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే."

ప్రకటన 3:2,

"నీ క్రియలు దేవుని యెదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు."

ఇక్కడ ఇది నిశ్చయంగా చాలా వింతగా యున్నది. ఇప్పటి వరకు ప్రతి కాలములోను ఆత్మ నిజవిశ్వాసులను మొదటగా ప్రశంసించుట చూడగలము, ఆ తరువాత కారుద్రాక్షా తీగెలను నిందించుట చూచి యున్నాము. కాని ఈ కాలములో ప్రభువు పట్లను, ఆయన యొక్క వాక్యము పట్లను వారు చాలా నిర్లక్ష్యము చూపియున్నారు. మరియు ఈ అయిదవ కాలమునకు చెందిన వర్తమానము మొత్తము నేరారోపణతోనే కొనసాగుచున్నది.

"నీ క్రియలను నేనెరుగుదును."

దేవుని ఎదుటికి వచ్చి దేవునికి అ సంతోషము కలిగించిన ఈ క్రియలు ఏమిటి? ప్రతికాలము ఆ తరువాత కాలములోనికి వెళ్ళుటను మీరెరుగుదురు, కాబట్టి నాలుగవ కాలము యొక్క క్రియలు అయిదవ కాలములోనికి వెళ్ళుట మీరెరుగదురు. మీకు బాగుగా తెలిసిన కార్యములేవనగా:

పరిశుద్దాత్మ నాయకత్వమును విడనాడి మూవవ పాలక వర్గమును నియమించిరి.

దేవుని యొక్క పవిత్రమగు వాక్యమును దానియొక్క ఉచిత లాభమును మనుష్యలందరికి అందకుండా చేసిరి. ఆచారములను, సంప్రదాయములను, సంఘ క్రమములు మొదలగువాటిని రూపొందించిరి.

ఆత్మయందు ఆరాధన చేయుట, ఆత్మ యొక్క వరములు, నిజమగు పరిశుద్దులకు సంబంధించిన ఆరాధనను వారు ప్రక్కకు త్రోసివేసిరి. అందుకు బదులుగా కర్మకాండను, అక్షరాలా విగ్రహారాధనను, అన్యపండుగలు మొదలగు వాటిని ప్రవేశపెట్టిరి.

క్రైస్తవారాధనలో మరియమ్మ పూజను ఒక గొప్ప భాగముగా ఎంచిరి. చివరకు దైవత్వములో ఒక భాగము ఆమెకు ఆపాదించిరి. కుమారుని యొక్క స్థానములోనికి పోపును తీసికొని వచ్చిరి. తాను క్రీస్తుకు ప్రతినిధినని అతడు చెప్పుకొనెను.

ఈ భయంకరమగు క్రీస్తువిరోధి సంఘమును వ్యతిరేకించి పోరాడినవారిని నాశనముచేసిరి. దానితో నిలచియుండినవారు ఆ సంఘము యొక్క పాపులుగా తయారయిరి. వారు రాజులయినా, రైతులయినా, ఆలాగే యుండిరి. వారి జీవితములు వారి స్వంతవి కావు, వారి జీవితములు క్రీస్తువి కూడా కావు; కానీ వారి యొక్క శరీరము, ప్రాణము, ఆత్మలు రోమ్ చర్చికి చెందియున్నవి. వారు డబ్బు ఇచ్చి తమ రక్షణను కొనుక్కొనుచున్నా గాని వారు క్రీస్తు యొక్క రక్తము గూర్చి మాట్లాడుకొనుచుండిరి. బంగారము ఇచ్చి గాని లేదా తపస్సు చేసి గాని వారు తమ పాపములకు క్షమాపణను పొందవలెనని ప్రయత్నించుచుండిరి. వారిలో ఉన్న ధనవంతులకు ఇది చాలా సంతోషముగా యుండెను, పోపు లియో X పాపపరిహార పత్రములను కొనుటకు అనుమతించెను. మనస్సాక్షికి చెందినంతవరకు వారికేమీ పట్టలేదు. అందుకే వారు భయంకరమగు నేరములను జరిగించుటకు పధకములు వేసికొని వాటిని ఆ తరువాత అమలు చేసిరి, ఎందుకనగా పోపు తమ పాపములను ఎప్పుడో క్షమించెనని వారు నమ్మిరి. వారికొరకు దేవుని యొక్క వాక్యము మరుగుచేయబడెను. కాబట్టి ఇక సత్యము ఎట్లు వారికి తెలియును? ఎందుకనగా సత్యము వాక్యము నుండియే వచ్చును. కానీ జనులు రోమను చర్చి అను గుహలో బంధింపబడిరి, మరణము కొరకును, మరణము తరువాత తీర్పు కొరకును వారు కనిపెట్టియుండిరి. కాని ఆ మహా వేశ్య హతసాక్షుల యొక్క రక్తమును త్రాగినది, దానికి తీర్పు యొక్క ఆలోచనయే లేదు. జనులను శారీరకము గాను, ఆత్మీయము గాను చంపుటకు అది భయంకరముగా చెలరేగినది.

నాలుగవ కాలము యొక్క అంతములో, అనగా అయిదవ కాలము యొక్క ప్రారంభములో టుర్కుల ద్వారా కాన్స్టాంటన్ నోపిల్ దండెత్తి తూర్పు దేశపు వేదాంత పండితులను తీసికొని వచ్చెను. వారు గ్రీకు వ్రాత ప్రతులను తీసికొని పశ్చిమమునకు వచ్చిరి. ఆ విధముగా వాక్యము యొక్క పవిత్రత మరియు నిజ విశ్వాసుల యొక్క బోధను మరుగున పడవేసిరి. వీరు మహా ప్రాముఖ్యత గలిగిన గొప్ప పండితులు మాత్రమే గాకుండా మన ఆధునిక యంత్రములను కనిపెట్టుటకు పునాదిని వేసినవారు కూడా అయి యుండిరి. పుస్తకములు ఆ విధంగా అందుబాటులోనికి వచ్చినవి. ఆ విధముగా బైబిలు కొరకు గల గొప్ప ఆకలి మరియు ఆసక్తి చల్లారుటకు మార్గము తెరువబడినది.

దేవుడు చాలా మంది శక్తిగలవారిని లేపెను, వారిలో లూథర్ ఒకడు. కాల్విన్ మరియు జ్వింగ్లీ అనువారు ఇతర గొప్ప అన్వేషకులు, వీరు గాకుండా ఇంకా చాలా మంది యుండిరి. వారిని గూర్చి ఎవరికీ బాగుగా తెలియక పోవచ్చును. ఏది ఏమయినా గాని ఇదంతయూ వృధగా పోలేదు, కాని దేవుని యొక్క గొప్పకార్యమును జరుగనీయకుండా వీరందరూ అడ్డుపడిరి. నైసిన్ ఆలోచన సభ ద్వారా సంఘము మరియు రాజ్యము ఏకమగుటకు వారు అడ్డుపడలేదు కానీ సహాయము చేసిరి. ఆ ఐక్యతకు భంగము రాకుండా వారు చూచిరి.

సంఘము యొక్క సువార్తను రాజ్యము పరిరక్షించుట అభిలషణీయమని వారు స్వాగతము పలికిరి, కాని దానికి వాక్యాధారము ఎక్కడనూ లేదు. కాబట్టి "దేవునిని స్తుతించు వారిమీద ఉగ్రతను మనము చూచెదము. ఎనిమిదవ హెన్రీ సంస్కరణపట్ల మొగ్గుచూపి పోపుల అధికారమును తిరస్కరించెను. అప్పటికే పెంతెకోస్తు నుండి చాలా దూరముగా వారు పోయి యుండిరి, సర్వశక్తుడగు దేవునిని సంరక్షించువారు లేకపోయిరి.

స్థానిక సంఘ విషయములలో బయటి వారిజోక్యమును లూధర్ నిరంతరము ఎదిరించుచునే యున్నాగాని మనుష్యుల మనస్సులలో బిషప్పు, ఆర్చిబిషప్పు అను సంఘ ప్రభుత్వపు భావనను అతడు దూరము చేయలేకపోయెను. ఆ విషయములో సంఘము మంచి మార్గములో ఒకడుగు ముందుకు వేసినా గాని ఇంకా బంధకములలోనే వారుండిరి. మరో రీతిగా చెప్పవలెన్నచో, అది ఏ గుహను తప్పించుకొనవలెనని ముందు ప్రయత్నించెనో, మరల అదే గుహలో బందీయైనది.

హేయ కార్యముల యొక్క గిన్నె ఇంకా నిండలేదు. సరియైన అంచనా వేయలేనందున లూథర్ యుద్ధమునకు పురికొల్పి ఆ విధముగా అనేకులు చనిపోవుటకు కారకుడాయెను. కానీ జ్వింగ్లీ యొక్క వర్గము వారు భక్తుడగు డాక్టర్ హబ్మేయరును హింసల పాలుచేసి చెరసాలలో వేయించిరి. అయితే ఉరికొయ్యకు ఎక్కించక, అతడిని అగ్ని ద్వారా చంపబడుటకు దాదాపుగా వీరే బాధ్యులయిరి. కాల్విన్ కూడా ఏమీ తక్కువ చేయలేదు, అతడు సెర్విటస్ ను అరెస్టు చేయమని కోరెను. దైవత్వము యొక్క ఏకత్వమును ఈ సెర్విటస్ గ్రహించి బోధించెను. అందువలన రాజ్యము ఈ సోదరునిపై నేరారోపణ చేసి, కాల్విన్ యొక్క ఇష్టము చొప్పున అతనిని ఉరికొయ్యకు కట్టి, కాల్చి చంపిరి.

ఈ విషాదకరమగు కాలములో లేచిన శాఖా సంబంధమగు పట్టుదల మరే కాలములోను లేవలేదు. ఈ శతాబ్దము గూర్చి ఎక్కువగా చెప్పినవాడు కొమినియస్. "అవసరమైనది ఒక్కటే" అను గ్రంథమును కొమినియస్ వ్రాసెను. లోకమును ఉక్కు పిడికిలిలో నుండి బయటపడుట చాలా అవసరమని అతడు వ్రాసెను. అనవసరమైన దానిని విడిచిపెట్టి అవసరమైన దానిని ఎన్నుకొనలెనని — క్రీస్తే అవసరమైనవాడని చెప్పెను. ఉపదేశకులు చాలా సంఖ్యలో యుండిరి, కనుకనే తెగలు కూడా చాలా యున్నవి, ఇక చివరికి పేరు కూడా దొరకవని అతడు చెప్పెను. ప్రతి సంఘము తనే నిజమైన దానినని చెప్పుకొనుచున్నది. మరియు కొంతలో కొంత భాగము పరిశుద్ధమైనా గాని, వారు తమలోతాము బహు ద్వేషము కలిగియుండి, ఒకరినొకరు హింసించుకొనుచుండిరి. వారి మధ్య ఎట్టి సమాధానమును లేదు; వారి యొక్క శత్రుత్వము సమాధానపడని శత్రుత్వము.

వారు బైబిలులోని వివిధ విధులను మరచిపోయిరి. వారి ఆచారములే వారికి ప్రాకారములుగా ఉన్నవి. తమ్మునుతాము దాచుకొనుటకు బహు ప్రయాసతో గోతులను త్రవ్వకొనిరి. అన్ని రకముల దాడులను ఎదిరించిరి. వీరు విశ్వాసమును ఒప్పుకొననివారని నేను చెప్పను. చాలా సందర్భములలో వారు విశ్వాసమును ఒప్పుకొనినవారని చెప్పక తప్పదు, కాని వారిలోవారు చాలా చెడ్డగా యుండిరి. వారు ఆలాగున ఉండి శత్రుత్వమునకు ఇంకా ఎక్కువ ఆజ్యము పోయుచుండిరి. వారినందరినీ కలిపి బయటకు గెంటివేసినప్పుడే సంఘమునకు తగిలిన గాయములకు స్వస్థత కలుగును గాని మరో విధంగా అది సాధ్యము కాదు. ఈ తెగలు మరియు విశ్వాస ప్రమాణము ఒక చిక్కు ముడివలె యున్నవి, వారిలోవారికి ప్రేమ లేకుండా పోయి భేదములు ఎక్కువయినవి. దానివలన వారేమి సాధించిరి? ఒక చిన్న వాదమునయినా వారు పరిష్కరించగలిగిరా? ఎన్నడూ అది చేయలేకపోయిరి. వారియొక్క సంఖ్య మాత్రమే పెరిగినది.

సాతానుకంటె గొప్ప యుక్తిగలవారుండరు; మాటల వివాదములో అదెన్నడునూ జయము పొందదు… దైవ సంబంధమగు సేవలో దేవుని మాటలకంటె ఎక్కువగా మనుష్యుల మాటలే వినబడుచుండును. ప్రతివారు తమకిష్టము వచ్చినట్లుగా మాట్లాడుకొందురు. నేర్చుకొనిన తెలివితేటల ద్వారా సమయమును గడుపుచుందురు. ఇతరుల భావములను కించపరచుచుందురు. క్రొత్తజన్మను గురించి గాని, క్రీసు యొక్క స్వరూపములోనికి ఒకడు ఎట్లు మారవలెనను విషయము గూర్చి గాని, దైవిక స్వభావములో పాలుపొందుట గూర్చి గాని వారేమీ మాట్లాడరు. (II పేతురు 1:4), తాళపుచెవుల శక్తి గురించి, బంధించు విషయములో సంఘము దాదాపుగా తన శక్తిని పోగొట్టుకొనినది, విడిపించుశక్తి మాత్రమే మిగిలియున్నది… ఐక్యత, ప్రేమ మరియు క్రీస్తు యొక్క జీవముల గూర్చిన వాక్యములను అతి వివాదకరమగు అంశములుగా చేయుట వలన పరస్పర ద్వేషము ఎక్కువయినది, తెగలకు ప్రధాన కేంద్రముగా అది వెలసినది.

క్లుప్తంగా చెప్పవలెనన్నచో, క్రైస్తవ్యమే ఒక చిక్కుముడివలె తయారయినది. విశ్వాసమును వేలాది చిన్న అణువులుగా చీల్చివేసిరి. ఒకదానిని అంగీకరించక పోయినచో వారు నిన్ను మతవిద్వేషకునిగా ఎంచుదురు. ఎవరు సహాయము చేయగలరు? అవసరమైనది ఒక్కటే, క్రీస్తునొద్దకు రావలెను, క్రీస్తును మాత్రమే ఏకైక నాయకునిగా చూడవలసియున్నారు, ఆయన యొక్క అడుగుజాడలలో నడవవలసియున్నారు. గురిని చేరు వరకు ఇతర అన్ని విషయములను ప్రక్కకు త్రోసివేసి విశ్వాసము యొక్క ఐక్యతలోనికి మనము రావలెను. (ఎఫెసీ 4:13). లేఖనములు అను పునాది మీదనే పరలోక యజమానుడు సమస్తమును నిర్మించెను, కావున మనము మిగిలిన వాటినన్నింటిని విడిచిపెట్టి, మన ప్రత్యేకమగు ఒప్పుదలలు వాక్యానుసారమైనవిగా ఉండినప్పుడే సంతృప్తిచెందగలము. మరియు ఆ వాక్యమే మనందరికి చెందును. మన చేతులలో బైబిలులను పట్టుకొని ఇట్లు మొరపెట్టవలెను: దేవుడు ఈ గ్రంథములో బయలుపరచిన దానిని నేను నమ్ముదును. నేను ఆయన ఆజ్ఞలను విధేయతగా వెంబడించుదును. ఆయన వాగ్దానము చేసిన దానియందు నాకు నిరీక్షణ యున్నది. క్రైస్తవులారా, చెవి యొగ్గుడి ఒకే ఒక జీవితమున్నది, కాని మరణము మనకు వేయి రూపములలో వచ్చును. క్రీస్తు ఒక్కడే యున్నాడు, కాని వేలాది మంది క్రీస్తు విరోధులున్నారు… కాబట్టి ఓ క్రైస్తవులారా తెలిసికొనండి, అవసరమైనది ఒక్కటి ఏమిటి. నీవు క్రీస్తు వైపుకు తిరిగిన సరి, లేనియెడల క్రీస్తువిరోధివలెనె నాశనమగుదువు. నీవు బుద్ధిమంతునివయితే బ్రదుకుదువు, జీవమునకు నాయకుడగు వానిని వెంబడించుము.

కాని క్రైస్తవులారా, మీ ఎత్తబాటును గూర్చి ఆనందించుడి… మీ పరలోక నాయకుని యొక్క మాటలను వినండి, "నా యొద్దకు రమ్మని" ఆయన పిలచుచుండగా ఒకే స్వరముతో "వచ్చుచున్నామని" జవాబు ఇయ్యండి.

ఈ శతాబ్దము శాఖా సంబంధమగు ఆత్మను బహు అద్భుతమగు రీతిలో ఎదుగునట్లుగా చేసినది అని ముందే నేను చెప్పాను. కొరింధు వారియొక్క వైఖరి చూసిన "నేను పౌలు వాడను, నేను కేఫా వాడను," అని చెప్పుకొనిరి. ఆ విధంగా బయటపడిన కాలము ఇదే. లూథరనులు, హస్సీయులు, జ్వింగ్లీవారు కలిసి శరీరమును ఆలాగు ముక్కలు చేయుట విషాదకరము. వారికి జీవించుచున్నారను పేరు మాత్రమున్నది గాని మృతులే, నిశ్చయంగా వారు చనిపోయిరి. వారు సంస్థగా మారిన నిమిషములోనే చనిపోయిరి. గొప్ప గుంపులు సంస్థలుగా మారి రాజ్యముతో అవి కుమ్మక్కయ్యి పెండ్లిచేసికొనినవి. వారి పని సమాప్తమయినది. రోమను సంఘమును విమర్శించిన లూథరనులు ఇక్కడున్నారు. రాజకీయ మరియు ఆత్మీయ ఐక్యత ద్వారా వచ్చు దుర్నీతిని గూర్చి వారెరుగుదురు — అయినా గాని లూథర్ ముందుకు కొనసాగెను (యూదుల వలన పేతురు పట్టు సడలినట్లేయున్నది) దేవునికి బదులుగా రాజ్యమును అతడు నిలబట్టెను, విశ్వాసమును పరిరక్షించువాడు చేయు పని కాదది. వేశ్యలో నుండి బయటకు వచ్చి ప్రసిద్ధిపొందిన మొదటి శాఖ ఇదే, కాని లూథర్ చనిపోయిన తరువాత కొద్ది కాలమునకే అందులో పాలక వర్గపు కుమ్ములాటలు మొదలయినవి. దానిని పోరాడి అది ముందు వచ్చెను. ఈ దేవుని యొక్క ఉద్యమము, రెండవ తరము వచ్చేసరికి తిరిగి తన తల్లి రెక్కల క్రిందికి వెళ్ళిపోయినది. అది దిగజారిపోయినది గాని ఆ సంగతిని ఎరుగదు. వారు ఆయన నామమును విడనాడి తమ స్వంత పేరును పెట్టుకొనిరి. వారు తమ యొక్క స్వంత పేరును బట్టియే జీవింపసాగిరి.

ఈనాడు శాఖలన్నియూ అదే పనిని చేయుచున్నవి. వారు తమ స్వంత పేరును బట్టియే జీవించుచున్నారు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్వీకరించలేదు. దీనిని తేలికగా చూడగలము, ఎందుకనగా ప్రతి సంఘము దాని ఆరాధనను బట్టి తెలియును, కాని దేవుని యొక్క శక్తి ఎవరిలోనూ లేదు. మీ పరీక్ష ఇప్పుడే. ఈ శతాబ్దమును మీరు గమనించవలెనని కోరుచున్నాను. వీరి మధ్య సూచక క్రియలు గాని అద్భుతములు గాని లేవు. రాజ్యము యొక్క అధికారమును సంపాదించుకోవలెనని వారు దేవుని యొక్క శక్తిని విడిచిపెట్టిరి. వారు తమ స్వంత పేరును హత్తుకొని యుండిరి; వారు తమ పేరును గొప్పగా చేసికొనిరి. అందరినీ ఒకే చోట కలుపవలెనను పాత ఆత్మ పనిచేయసాగినది. మెథడిస్టు వారు బాప్టిస్టు వారి యొద్దకు రావలెనని ఈనాడు బాప్టిస్టువారు కోరుచున్నారు. ప్రెస్బిటేరియనులను మార్చవలెనని మెతడిస్టు వారు తలంచుచున్నారు. వారందరినీ మార్చవలెనని పెంతెకోస్తువారు తలంచుచున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో గొప్ప నిరీక్షణను వాగ్దానము చేయుచూ చాలా ఆశ చూపించుచున్నారు. పరలోకమునకు దారి తమ యొద్ద ఉన్నదని పలుకుచున్నారు. కనీసము సమృద్దియగు ప్రవేశ అవకాశము తమయొద్ద ఉన్నట్లుగా చెప్పుచున్నారు. ఎంత విషాదకరమది!

ఈ శాఖా సంబంధమగు ఆత్మ ఈ శాఖలన్నియు తమ తమ రాజ్యాంగములను, ఆచార విధులను వ్రాసికొనునట్లుగా చేసినది, కార్యాలయములు స్థాపించుకొనిరి, మరియు సంఘ ప్రభుత్వములు ఏర్పడినవి. ప్రతీ ఒక్కటీ తాను మాత్రమే దేవుని పక్షముగా మాట్లాడగలననియు, అందుకు తానే ప్రధాన అర్హతను పొందితిననియు చెప్పుకొనుచున్నవి. ఒకవేళ పోపు మరియు రోమను కాథలిక్కు సంఘము అదే చెప్పుకొనుచున్న ఎడల వేశ్యయగు తమ తల్లి యొద్దకు వారు చేరియన్నారు, గానీ అది వారెరుగరు.

"నీకు జీవించుచున్నావను పేరు మాత్రమున్నది గాని మృతుడవే" అను ఈ వచనమును ముగింపులో చూచెదము. ఈ కాలములో సంస్కరణ వచ్చినది, కాని దేవుడు దీనిని పొగడుటకు బదులుగా కఠినంగా గద్దించియున్నాడు. కాబట్టి ఈ కాలమును గూర్చి మంచిగా నేను చెప్పజాలను, ఎందుకనగా ఇది శాఖ యొక్క విత్తనమును చల్లినది. దానివలన సంస్థ ఏర్పడి మరల వేశ్య యొద్దకే చేరుట జరిగినది. దేవుడు తప్పించుకొనుటకు ఒక మార్గమును తెరచిన తరువాత వీరు ఈలాగయిరి. కాథలిక్కు చర్చి నుండి దూరమగు ఒక ఉద్యమము బయలుదేరినది, అది పూర్తిగా ఆత్మ సంబంధమైనదిగా లేదు, కాని చాలా రాజకీయ పురాతనమైనది. చాలామంది ప్రజలు ప్రొటస్టెంటిజము వైపు తిరిగిరి, ఎందుకనగా నేను చెప్పినట్లుగా వారు రోమను పద్ధతిలోని రాజకీయ మరియు ఆర్థిక దాస్యమును అసహ్యించుకొనిరి. ఆ విధముగా ఇది ఒక గొప్ప ఆత్మ సంబంధమగు ఉద్యమముగా ఉండుటకు బదులుగా రాజకీయముగా మారినది. పరిశుద్దాత్మ యొక్క ప్రభావము కనబడలేదు. దేవుడు పెంతెకోస్తు యొద్ద సాధించవలెననుకొనిన లక్ష్యములను ఆత్మ సంబంధము గానే నెరవేర్చును. మానవుని మీద వచ్చిన కోపము నిశ్చయముగా దేవునిని స్తుతించుటకు కారణమాయెను. ఈ ఫలితములు ఐగుప్తును విడిచి వచ్చిన ఇశ్రాయేలు, ఎడారిలో దారి లేక తిరగసాగి, కానాను దేశమునకు వెళ్ళలేకపోయినది. ఆలాటి చరిత్రయే తిరిగి జరుగుచున్నది. ఏమయినా గాని చాలా సాధించుట జరిగినది. రోమ్ యొక్క కాడిని కొంత విరుగగొట్టుట జరిగినది. ఇప్పుడు జనులు దేవుని వాక్యమును స్వీకరించుచున్నారు. మరియు ఇంతకు ముందుండిన గొప్ప భయము లేకుండా వారు ఆత్మ యొక్క ప్రభావమునకు లోబడుచున్నారు. ఆ తరువాత వచ్చిన మిషసెరీ కాలమునకు ఇది ద్వారమును తెరచినది.

తుయతైరలోని యెజెబెలు, ప్రజల మీద తనకు గల పట్టును విడిచిపెట్టుటకు అంగీకరించలేదు. కాబట్టి ఆమె కుమార్తెయగు అతల్యా తన శిరస్సును సార్టీస్ కాలములో ఎత్తెను. తన యొక్క సంస్థ అను పన్నాగము ద్వారా నిజ సంతానమును బిగించవచ్చునని తలంచినది.

హెచ్చరిక

ప్రకటన 3:2,

"నీ క్రియలు నా దేవుని యెదుట పరిపూర్ణమైనవిగా కనబడలేదు. గనుక జాగరూకుడువై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము."

సార్దీస్ కాలము సంస్కరణ కాలమునుటకు బదులుగా పునరుద్ధరణ కాలము అని చెప్పబడియుండవలెనను కోరిక నాకున్నది. నేనాలాగు చెప్పరాదు, ఎందుకనగా వాక్యము దానిని చక్కదిద్దు కాలము అనలేదు గాని నిశ్చయంగా సంస్కరణ కాలమని పిలచెను. అది చక్కదిద్దు కాలమే అయి యుండినచో అది మరొక పెంతెకోస్తు యుగముగా నుండెడిది, కాని అది ఆలాగు లేదు. దాని గూర్చిశ్రేష్టముగా చెప్పగలిగినది, ఇదే, "చావవైయున్న మిగిలిన వాటిని బలపరచుము." ఏదో తప్పిపోవుచున్నది. నిశ్చయంగా ఒకటి తప్పిపోవుచున్నది. ఈ కాలమునకు నీతీకరణ యున్నది, కాని శుద్దీకరణ మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేవు. అదే దేవుని యొక్క మూల సంకల్పము. పెంతెకోస్తు యొద్ద వారు దానినే కలిగియుండిరి. వారు నీతిమంతులుగా తీర్చబడి, శుద్దీకరించబడి, పరిశుద్దాత్మతో నింపబడిరి. ఎందుకు, నా మాట సరిగా వినండి, నీతిమంతులుగా తీర్చబడుటయు, శుద్దీకరించబడుటయు పరిశుద్ధాత్మను పొందుటకేనని గ్రహించవలెను.

సంఘమనునది అందుకొరకే యున్నది. అది దేవుని యొక్క ఆలయముగా దేవునితో నింపబడియున్నది, పరిశుద్దాత్మతో కూడా నింపబడియున్నది. భూమి మీద యేసు ఉండిన దినములలో ఆయన మీద ఉండిన ఆత్మయే ఆయన గొప్ప కార్యములను చేయునట్లు చేసెను. అదే ఆత్మను పెంతెకోస్తునాడు ఆయన తన సంఘము మీదికి పంపెను. కావున వారు ఆయన చేసిన కార్యములనే చేసిరి. కాని ఈ కాలములో ఆయన క్రియలు లేవు. ఓ, వారికి వ్రాయబడిన వాక్యమున్నది. (కాని బయలుపరచబడిన వాక్యము లేదు). ఇది సంస్కరణ కాలము. కాని చిన్నమందా భయపడకుడి, "నేను తిరిగి ఇచ్చెదనని" దేవుడు చెప్పుచున్నాడు, ఈ సంస్కరణ కాలము దానికి ప్రారంభము. ఆంధకార యుగములో సాతాను యొక్క గూఢమగు సంగతులలో దిగిపోయిన సంఘమును దేవుని యొక్క లోతయిన సంగతుల లోనికి తీసికొనివచ్చుదునని ఆయన వాగ్దానము చేసియున్నాడు. పెంతెకోస్తు దినమున యున్నట్లుగా అది యుండి మరియు ఆ మొదటి కొద్ది సంవత్సరములలో సంఘము ఉన్న స్థితికి మరల వచ్చును.

ఇప్పుడు జాగ్రత్తగా దీనిని వినండి, రెండవ వచనములో మనము చదివినట్లుగా, "నీ క్రియలు నా దేవుని యెదుట పరిపూర్ణమైనవిగా కనబడలేదని" చెప్పెను. 'పరిపూర్ణముగా లేవు' అను మాటను నిజమయిన అర్థము మీకు తెలియునా? 'నెరవేరలేదు' అని అర్థము. ఈ కాలము నెరవేర్పులేని కాలము. తిరిగి వచ్చుటకు ఇది ప్రారంభము. అందుకే దానిని బైబిలు సంస్కరణ అని పిలచినదని చెప్పియున్నాను —పునరుద్ధరణ కాదు. రక్షణ అనునది దేవుని మూలముగా కలిగినదను సత్యమును ఈ నీతీకరణము ద్వారా బోధించుట ప్రారంభమయినది. దేవుని యొక్క సర్వాధికారమును గూర్చియు, ఎన్నికను గూర్చియు లూథరు ఎట్లు బోధించెనో చూడండి. ఇది కేవలము కృప ద్వారా కలిగెనని చెప్పబడినది. మత సంబంధమగు పరిపాలనా విభాగము నుండి అతడు సంఘమును వేరుచేసెను. అతడు విగ్రహములను తుత్తునియలు చేసెను. మత గురువులకు ఒప్పుకొనుటను అతడు ధిక్కరించెను. పోపును అతడు నిందించెను. అది అద్భుతంగా మంచి పనియే, అతడు ప్రారంభించినట్లుగా, దేవుడు 1500 సంవత్సరముల ముందే చెప్పెను, 'లూథర్, నీవు క్రియ చేయ ప్రారంభించెదవు, కాని అది ఆసంపూర్తిగా నెరవేరుటను నీ కాలము చూచును. దానిని ఆ తరువాతకు వదిలివేయుచున్నాను." హల్లెలూయా! మన దేవుడు పరిపాలన చేయుచున్నాడు! ఆయన ఆది నుండియే అంతమును ఎరుగును. అవును, లూథర్ ఆయన యొక్క వర్తమానికుడు. మనము లోపములను పరీక్షించినప్పుడు ఆ విధంగా అతడు కనిపించడు. కాని యోనా అను ఒక మనుష్యుడున్నాడు, అతని జీవితములో కూడా ఎన్నో లోపములున్నవి. అతడు ఒక ప్రవక్త, అతని యొక్క ప్రవర్తనను చూచిన మనము అనగా నీవు, నేను ఆలాగని ఒప్పుకొనక పోవచ్చును. కాని దేవునికి వారు తనవారని తెలియును, ఆయనకు స్వంత మార్గమున్నది. ఆయన తన ఇష్టానుసారముగా యోనా విషయములో చేసెను. ఆ కాలములో ఆయన లూథరు విషయములో తన ఇష్టానుసారముగా చేసెను, మరియు యుగాంతము వరకు ఆయన తన విధానమును ఆలాగే కొనసాగించును.

ఇది నేరెవేర్పు పొందని కాలము. ఇది సంస్కరణ కాలము. ఆలాగునే అది యుండవలెనని దేవుడు కోరెను. ఒక చక్కని లూథరను సోదరునికి వివరించిన ప్రకారమే దానిని మీకు వివరించగోరుచున్నాను. అతడు పశ్చిమాన ఉన్న ఒక చక్కని సెమినరీకి ప్రెసిడెంటుగా యున్నాడు. నేను అతని చోటుకు భోజనమునకు ఆహ్వానించబడ్డాను. పరిశుద్దాత్మ గురించి అతనితో మాట్లాడు అవకాశము కలిగినది. అతడు చాలా సంగతుల గూర్చి ఆశ్చర్యపడెను. "మా లూథరనులకు దొరికినదేమిటని?" అతడు నన్ను అడుగనారంభించెను.

"మీకు క్రీస్తున్నాడు'' అని చెప్పాను.

"మాకు పరిశుద్దాత్మ కావలెను. దానిని మేము పొందియున్నామని నీవనుకొనుచున్నావా?" అనడిగాడు.

"మీరు దానియందు విశ్వాసముంచుచున్నారు గదా?" అన్నాను.

"దాని అర్థము ఏమిటి? మేము దేవుని కొరకు ఆకలిగలిగి యున్నాము. మేము పెంతెకోస్తు మీద ఒక పుస్తకము చదివియున్నాము, ఆత్మ యొక్క వరములు గూర్చి. కాబట్టి ఆ గ్రంథకర్తను కలిసికొనుటకు కాలిఫోర్నియాకు విమానములో వెళ్ళియున్నాము. అక్కడికి మేము వెళ్ళి అతనిని కలిసికొనినప్పుడు అతడు గ్రంథమును వ్రాసెనే గాని ఆ వరములను కలిగియున్నటుగా చెప్పలేదు. కాని నీ పరిచర్యలో వరములను ఉపయోగించుటను చూచినప్పుడు నీతో మేము మాట్లాడవలెనని కోరియున్నాము, ఎందుకనగా వాటిని గూర్చి తప్పకుండా మీరెరుగుదురు? అని అతడు చెప్పెను."

ఇప్పుడు ఈ సోదరుని సెమినరీ గ్రామప్రాంతములో యున్నది. దానిచుట్టు చాలా ఎకరముల పంట పొలమున్నది. విధ్యార్దులు అందులో పనిచేసి కాలేజికి తమ ఖర్చులను చెల్లించుచున్నారు. పంట పొలముతో పాటు కొన్ని ఫ్యాక్టరీలు కూడా అతనికున్నవి. ఆ విధంగా వారికి ఉపాధి కల్పించుచుండెను. నా ఉదాహరణను అతని పొలములను బట్టి చెప్పాను, "ఒకప్పుడు ఒక వ్యక్తి తన స్వంత పొలములో పంటను చల్లుటకు వెళ్ళెను, అతడు నేలను చదును చేసెను, భూమిలోని మొదులను పీకి పారవేసెను, రాళ్ళను ఏరించెను, దున్ని దానిని బాగుగా సిద్ధపరచెను, అప్పుడు పంటను నాటెను. ప్రతి ఉదయము అతడు వెళ్ళి, పొలమును పరీక్షించుచుండెను. ఒక ఉదయము వెళ్ళేసరికి నేలలో నుండి చిన్న మొలకలు బయటకు పొడుచుకొనివచ్చుటను చూచెను. నా పొలములో పంట మొదలయినందుకు "దేవునికి సోత్రములు" అని అతడు చెప్పెను. "అయితే పంట అప్పుడు వచ్చినదా?" అని నేనతనిని అడిగాను,

"ఒక విధంగా పండినట్లే గదా?" అన్నాడు.

"ఒక విధంగా, అది నిజమే'' లూధరనులగు మీరును సంస్కరణ కాలములో ఆలాగే యున్నారు, మీ మొలకలు పైకి వచ్చియున్నవి, చూచారా? పంట ఎదుగ నారంభించెను. (చీకటి యుగములలో ఆ పంట దీపములు నేలలో చీకిపోయినవి) చాలా రకములుగా దశలు మారి పెద్ద కాండములు పైకి వచ్చియున్నవి. ఒక రోజున పువ్వు పైకి వచ్చినది. ఆ పువ్వు తన క్రిందనున్న ఆకులను చూచి, "మీ లూధరనులకు ఏమియూ లేదు. మా వైపు చూడు, మేము పంటగా ఉన్నాము, గొప్ప మిషనరీలము. మాది మిషనరీల శతాబ్దము." ఆ పువ్వు యుగము వెస్లీ యుగము. వారుచాలా గొప్ప మిషనరీలు. మన కాలమును కూడా వారు మించిపోయియున్నారు. ఆ కాలము ఏమి చేసెను? గాలిలో పుప్పొడి వ్యాపించినట్లుగానే అది యున్నది.

ఇప్పుడు తరువాత మొట్టు ఏమిటి? సాధారణముగా మనము దానిని వ్యవసాయ కాలము మరియు పంటకోయు కాలము అనుకొందము, కాని అది ఒక చక్రము వలెయున్నది. కాని అది కాదు. మరియొక దశ యున్నది. ఆ దశలో విత్తనమును కప్పుటకు పొట్టు లేదా పైన తొక్క ఏర్పడును. ఈ ఆత్మ సంబంధమగు చక్రములో సరిగ్గా అదే జరిగియున్నది. ఇరవయ్యవ శతాబ్దపు మలుపులో, ఈ లవొదికయ సంఘకాల ప్రారంభములో, పెంతెకోస్తునాడు వచ్చిన విధముగానే పరిశుద్దాత్మ వచ్చునని ఒక అపోహ ఉండినది. జనులు భాషలతో మాట్లాడుచుండిరి మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినట్లుగా చెప్పుకొనుచుండిరి, అందుకు సూచన భాషలు మాట్లాడుటయే అనిరి. కాని నేను చాలాసార్లు పంట పొలములలో నడిచాను, ఎండాకాలపు చివరి భాగములో గోధుమ వెన్నులను తెంపిచూచాను. గింజలు ఎట్లున్నవో చూచుటకు నా చేతులలో వాటిని నలిపి చూచాను. కాని నాకు ఆశ్చర్యము కలిగినది, ఎందుకనగా ఆ గుత్తిలో గోధుమ గింజలు ఏమియూ లేవు, కాని అందులో గోధుమల గింజలున్నట్లు నిశ్చయంగా కనిపించెను. ఈ నామకార్ధ పెంతెకోస్తు ఉద్యమమునకు ఇది చక్కని ఉదాహరణ.

ఇది నిరూపణ అయిన వాస్తవము, కాని ఈ జనులు ఒక బోధను గూర్చి సంస్థగా మారిరి. తమ్మును తాము ఆ విధముగా బంధించుకొనిరి. వారికి ముందున్న సంస్థవలెనె వారుండిరి. వారు నిజమయిన గింజవలె యుండుటకు బదులుగా పొట్టవలెయున్నారు. రాబోవుచున్న గింజను సంరక్షించుటకు పొట్టుగా వారున్నారు. ఈ పొట్ట కాలము చాలా ప్రమాదకరమగు కాలము. దానిని గూర్చి యేసు మత్తయి 24:24లో చెప్పెను, "సాధ్యమయితే ఏర్పరచబడినవారిని కూడా మోసము చేయును." ఈ పొట్టును జనులు చూచి నిజమయిన గింజ అనుకొనిరి. ఈ నామకార్ధ పెంతెకోస్తూ కూడా అంతే, వాహకముగా మాత్రమేయున్నది. కాని నిజమగు పునరుద్ధరణ ఆ తరువాత కాలములో రానుండెను. గోధుమ గింజవలె పెండ్డీకుమార్తె బయలుపడును. యోహేజ్కేలు 47:2-5లో చెప్పబడిన శక్తి ప్రత్యక్షమగును.

"పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్ళు ఉబికి పారుచుండెను.ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్ళగుండా నన్ను నడిపించగా, నీళ్ళు చీలిమండ లోతుండెను.ఆయన మరి వెయ్యి మూరలు కొలచి నీళ్ళగుండా నన్ను నడిపించగా నీళ్ళు మొలలోతుండెను. ఇంక ఆయన వెయ్యి మూరలు కొలచి నీళ్ళ గుండా నన్ను నడిపించగా నీళ్ళు మొలలోతుండెను.ఆయనఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్ళు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలులేకుండా ఈదవలసినంత నీరుగల నదియాయెను."

"దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము మరియు కార్యక్రమము ద్వారా ఆ విధముగానే జరిగెను. నీతీకరణ క్రింద లూథరను వారు పరిశుద్ధాత్మను సంచకరువుగా పొందియున్నారు. శుద్దీకరణ క్రింద మెతడిస్టు వారు దానిని సంచకరువుగా పొందియున్నారు. ఈ రోజున అది తిరిగి తీసికొనిరాబడినది, ఒక పునరుద్ధరణ — పరిశుద్దాత్మ ఇచ్చటున్నది."

"గనుక జాగరూకుడవై చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము."

రెండు పదములలో ఈ ఉద్దేశ్యము బయలుపరచబడినది. "జాగరూకుడవై" మరియు "బలపరచుము." జాగరూకుడవై అనగా అర్థము మేల్కొనియుండుటయే గాక కనిపెట్టి చూచుట అని. ఆలాగు లేనియెడల అపాయము మరియు నష్టము కలుగును. బలపరచుట అనగా అర్థము బలమిచ్చుట అని కాదు, శాశ్వతముగా నిలచియుండునట్లు వాటిని స్థిరపరచుట లేదా సిద్ధపరచుట అని అర్థము. విడిచిపెట్టబడిన సత్యము గూర్చి ఈ రెండు మాటలును మిగిలియున్న సత్యమును సూచించుచున్నవి, అది మొదలగుట లేదా చనిపోవుట. ఈ ఆత్మ యొక్క భావమును చూచినప్పుడు నాకు ఒక ఉదాహరణ గుర్తుకు వచ్చుచున్నది. కొందరు బానిసలుండిరి, వారు శారీరకంగాను, నైతికంగాను పూర్తి దాస్యములో యుండిరి. వారు లేచి తమను బందీగా చేసిన వాని నుండి తప్పించుకొని పారిపోయిరి. (సార్దీస్ అనగా నిశ్చయంగా అదే అర్థము: తప్పించుకొనినవారు) వారు వీరిని అనుసరించుట ద్వారా వారియొక్క ఆస్తి సంపాదనను పూర్తిగా కోల్పోయిరి. వారు మరల ఆ స్థలమునకు తిరిగి రాలేదు. ఏది ఏమయినా గాని వారు మాత్రము తప్పించుకొనిరి — వాక్యము ప్రకారము వీరు పవిత్రముగా తప్పించుకొనిరి గాని వీరు ఆలాగున తప్పించుకొని యుండకపోవచ్చును. వారు తమ హక్కులలో చాలా వాటిని కోల్పోయిరి.

ఇప్పుడు ప్రభువు చెప్పుచున్నాడు, "మీరు మరల దాస్యము లోనికి వచ్చిరి; మీరు వెనుకకు జారిపోకుండా జాగ్రత్తపడండి. వెనుకకు పోకుండా ఉండవలెనన్నయెడల మెళకువగాను, ఎప్పుడు జాగ్రత్తగాను ఉండవలెను. మీ చెరను గూర్చిన విషయములలో మీరు జాగ్రత్తగా యుండవలెను, లేనియెడల మీరు సర్వస్వము కోల్పోయెదరు. నీకు మిగిలియున్నదానిని బలపరచుకొనుము, నీవు కలిగియున్న దానిని శాశ్వతముగా స్థిరపరచుము, ఆ విధముగా యుండి భవిష్యత్తు నష్టమును తప్పించుకొనుము. నీవు నెరవేర్చని దానిని నెరవేర్చుకొనుటకు ఇది ఒక అవకాశము. కాని వారు ముందుకు సాగిపోయిరా? లేదండి. వారు ఆత్మయొక్క స్వరమునకు చెవియొగ్గలేదు, కావున మరొక యుగము చెరలోనికి పోయినది. కాబట్టి దేవుడు తన చిత్తమునునె రవేర్చు మరికొందరిని లేపెను. లూథరను శాఖను దేవుడు దాటిపోయెను, మిగిలినవారిని కూడా ఆయన ఆలాగే దాటిపోయెను, మరియు వారు మరెన్నడును తిరిగి రారు. దేవుడు అలాగే ముందుకు వెళ్ళిపోయి రానున్న క్రొత్త యుగములో ఇంకొంత సత్యమును మరియు మరికొంత పునరుద్ధరణ తీసుకొనివచ్చును.

తీర్పు

ప్రకటన 3:3,

"నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకముచేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను. ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు."

ఈ వచనమును మరో అనువాదము (Wuest) నుండి చదివెదను.

"జ్ఞాపకముంచుకొనుము, నీవు పొందియున్న దానిని, (సత్యమనునది శాశ్వతమగు నిధి) నీవు వినిన దానిని జాగ్రత్తగా కాపాడుకొనుము. ఒక్కసారి నీ మనస్సు మార్చు కొనుము."

దేవుడు వారికి సత్యమును శాశ్వత నిధిగా ఇచ్చినట్లు ఈ వచనము వలన మనము తెలిసికొనగలము. దానిని చేర్చుకొనిరి, అది సంపూర్తిగా వారిదే. ఇప్పుడు ఆ నిలచియున్న దానిని చూడగలము, దానితో వారేమి చేయుదురో చూడండి. దానిని వారు స్వీకరించవచ్చు లేదా త్రోసివేయవచ్చు. అది నిజము. సంపూర్ణ సువార్త యొక్క మొత్తం సత్యము స్థూలముగా వారికియ్యబడినది. "నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును." "రక్షణ యెహోవా నుండి కలుగును." వారు బైబిలు యొక్క సత్యమును విని రోమ్యొక్క బోధను త్రోసివేసిరి, పోపుల అధికారమును ఎదిరించిరి. సంఘము రక్షింపజాలదను సత్యమును వారు వినిరి. ప్రభురాత్రి భోజనమును వారు అర్థము చేసికొనిరి. నీటి బాప్తిస్మమును గూర్చిన వెలుగు వారికున్నది. వారు విగ్రహములను పారవేసిరి. నిజమేనా? ఆ కాలములో అంత వెలుగును పొందిన జనులు మరెందరో లేరు. వారికి సరిపోయినంత వెలుగున్నది. పాత పద్ధతిని అందుమూలముగా నాశనము చేయగలరు. క్రొత్తదానిని ప్రారంభించగలరు. దేవుడు వారిని నడిపించును. సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞవెంబడి ఆజ్ఞ వారికి వచ్చినది. వారు సత్యమును చేర్చుకొనిరి. దానిని వారు కోరుకొనిరి, దానిని వినిరి.

కాని వారెట్లు వినిరనినదే ప్రశ్న? దాని మీద కట్టబడవలెనను రీతిలో వినిరా? లేక చాలా మంది గ్రీకులు వినిన మాదిరిగా వినిరా? చర్చించుకొని దాని మీద సిద్దాంతము రూపొందించుకొనుటకు వినిరి, సమృద్దియగు సత్యవాక్యమును వారు వినిరి, తెలివితేటల ద్వారా వినిరి, కాని ఆచరణాత్మకంగా వారు దానిని వినలేరు. కానీ దేవుడు ఆ విషయములో వారి మనస్సు మార్చుకొనవలెనని కోరెను. అది నిశ్చయముగా దేవుని యొక్క వాక్యము, కాబట్టి దానికి వారు లోబడవలెను, లోబడక పోవుటవలన తీర్పు వచ్చును. పవిత్ర దేవాలయము యొక్క కావలివారు నిద్రపోవుచుండగా వారు కొట్టబడిరి. వారియొక్క వస్త్రములు దహించబడినవి. ఈ కాలములో జాగ్రత్తగా యుండకుండా అలసత్వముతో నుండు వారిని ప్రభువు ఏమిచేయును?

"నేను దొంగవలె వచ్చెదను."

ప్రాచీన సార్దీసువారు నిరంతరము బందిపోట్లు ద్వారా బాధింపబడిరి, వారు కొండలలో నుండి వచ్చిరి, జనులను దోచుకొనెడివారు. ప్రభువు యొక్క రాకడ దొంగవలె వచ్చునని ఆత్మ చెప్పుచున్న మాట వారికి బాగుగా తెలియును. మెళకువగా యుండుట మరియు సిద్ధపాటుతో ఉండుట మాత్రమే, ఆయన రాకను ఎదుర్కొనుటకు చాలునని ఇందువలన అర్థమగుచున్నది. దొంగ ద్రాక్షావల్లికి ఇది ఒక వర్తమానము, ఎందుకనగా ప్రభుని రాకడ, నోవహు దినములలో ఉండినట్లుగా యుండునని తెలియచేయబడినది. రాబోవు వరద గూర్చి రక్షింపబడిన ఎనిమిది మందికి బాగుగా తెలియును, అందువలన వారు సిద్ధపడి రక్షింపబడిరి. కాని భక్తిహీనుల యొక్క ప్రపంచము కొట్టుకొనిపోయెను. వారికి అనుదినము నీతిమంతులతో పరిచయమున్నది. వారు సత్యమును వినిరి, కాని వారు దానిని ప్రక్కకు త్రోసివేసిరి. సమయము మించి పోయినది. ఆ పురాతన కాలములోని శరీర సంబంధులగు జనులు ఈనాటి నామకార్థ క్రైస్తవులకు సూచనగా యున్నారు. వీరి జీవితములు లోక సంగతులతో నిండిపోయి యున్నవి, వాటియందు వారు ఆనందించుచున్నారు, ఆత్మ సంబంధమగు వాటిపట్ల ఇష్టము లేని స్థితికి చేరియన్నారు, ఆయన యొక్క రాకడ గూర్చి వారికి తెలియదు, అందుకు వారు సిద్ధపడలేదు.

మెప్పు

ప్రకటన 3:4,

"అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్ లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు."

"కొందరు" అనగా "జనులు" అని మేడగదిలో కూడియుండిన వారిని గూర్చి అపో. కా. 1:15లో వ్రాయబడియున్నది, "అక్కడ చేరియుండినవారు 120 మంది." కాని నా దృష్టిలో అయితే అది కేవలము జనులను గుర్తించుట మాత్రమే కాదు. ప్రతి కాలములోను ఉన్నవారిని గూర్చి అది వ్రాయబడియున్నది. దానిని మన ప్రభువు నొక్కి చెప్పుచున్నాడు. అది ఈలాగున ఉన్నది: ఈ కాలముల యొక్క సంఘ పద్ధతి రెండు ద్రాక్షావల్లులతో తయారయినది. అది నిజమైనది మరియు కారుద్రాక్షావల్లి, దేవుడు తన యొక్క సార్వభౌమాధికారము చొప్పున వాటిని కలిపియుంచి, వాటిని సంఘముగా పిలచెను.

ఈ కాలములో ఆయన వాటిని ఎట్లు గద్దించెనో చూడండి, సార్దీస్ లో యున్న "సంఘములని" విడగొట్టి చెప్పలేదు గాని "సంఘము" అని చెప్పెను. కానీ వాటిని కలిపి చెప్పెను, "నీ క్రియలను నేనెరుగుదును… నీవు మృతుడవే… నీ క్రియలు అసంపూర్ణముగా యున్నవి…" "తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు," అను ఈ మాటలన్నియును సార్దీస్ లోని సంఘమును ఉద్దేశించి పలుకబడినవి. ఈ ప్రజలు దేవుని యొక్క పరిశుద్దులు. "ప్రభువును సంతోషపరచు రీతిలో నడచుచున్నారు." వారి వస్త్రములు పరిశుద్ధముగానున్నవి. మీరెరుగుదురు, ఆ దినములలో తమ వస్త్రములను రోడ్డు మీద ఈడ్చుకొంటూ పోయెడివారు గనుక మురికి మరియు ధూళి అంటుకొనెడిది. వారెట్లు నడిచిరో వీరు గమనించుచున్నారు, కాబట్టి వారు లోకము ద్వారా మురికి వారు కాలేదు. వారు ఆత్మలో యుండి, ఆత్మలో నడచుచుండిరి. వారు పరిశుద్ధముగాను, ఆయన యెదుట నిందారహితులుగాను ఉండిరి. ఆ విధముగా వారు తమ యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చుచుండిరి. మనపట్ల దేవునికి గల ఉద్దేశ్యమును గూర్చి ఎఫెసీ 1:4లో చెప్పబడినది, "ఆయన యెదుట మనము పరిశుద్ధము గాను, నిందారహితులము గాను ఉండవలెను."

దేవుని చేత ఏర్పరచుకొనబడినవారు "కొద్దిమందియే" యున్నారని, ఈ వచనము ద్వారా తెలియుచున్నది. ఈ కాలము గూర్చి మనము దేనిని బోధించుకొనియున్నామో మీరు తేటగా చూచిరి. అది కూపమువలె యున్నది. అది అసంపూర్ణముగా యున్నది. అది ఎన్నో విధములుగా చీలిపోయి యున్నది. దానిని దాదాపు పూర్తిగా దేవుడు గద్దించెను. అది బలహీనముగా మరియు జబ్బుగా ఉండి చనిపోవుటకు సిద్ధముగా యున్నది. శరీర సంబంధమగు మనస్సు గల చరిత్రకారులు చిత్రించిన విధంగా అది మహిమకరమగు శతాబ్దము కాదు. ఆ చెట్టు వైపు ఒక క్షణిక చూపు చూచినయెడల అర్థమగును. దానిని గొంగళి పురుగులు తినివేసినవి. ఆకులు పూర్తిగా కొరకివేయబడి బోడిగా తయారయినది, ఫలహీనముగా తయారయినది. ఏవో కొన్ని వంకర కాయలు, పురుగులతో తినివేయబడిన ఫలములు తప్ప మరేమీ కనబడలేదు, అవి త్వరలోనే రాలి నేల మీద పడుటకు సిద్ధముగా యున్నవి. కాని ఒక్క నిమిషము చూడండి! బాగా పరిశీలించండి! ఆ పై భాగమున, సూర్యుని యొక్క వెలుగులో కొన్ని 'ప్రధమ ఫలములు' నిలచియున్నవి — 'కొన్ని పేర్లున్నవి' — ఆయనలో సంపూర్ణులైయున్నవి. ఎందుకనగా అవి ఆయన ద్వారా జన్మించినవి, మరియు ఆయనతో నింపబడి మరియు ఆయనతో నడచుచూ ఆయన వాక్యములో నిలచియున్నవి.

'ఆ కొద్దిమందిని' బట్టి దేవునికి వందనములు.

"వారు నాతో కూడా సంచరించెదరు."

వారు నీతిమంతులుగా నడిచినందుకు దేవుడు వారికనుగ్రహించు భాగ్యమదే. ఆయన వారికొరకు సిద్ధపరచియుంచిన స్వాస్థ్యములో భాగము అదే. శ్రమలు, జీవితకడగండ్లు ఎదురయినా గాని వారాయనతో నడచుటకు ఇష్టపడుచూ మరియు ఆయనను ఘనపరచినయెడల, ఆయన వారికి బహుమానము ఇవ్వబోవుచున్నాడు. మనము ప్రేమతో శ్రమించిన దానిని ఆయన మరచిపోడు. ఆయనను సంతోషపెట్టుటకు మనము పడిన పాట్లనన్నిటినీ ఆయన లెక్కలోనికి తీసికొని బహుమానమిచ్చును.

అవును వారు లోకములోనే నడిచిరి గాని దానిలోని పాలిభాగస్తులు మాత్రము కాలేదు. వారు లోకము యొక్క పద్ధతులు వారిని జయించుటకు అవకాశము ఇయ్యలేదు. ఆ కాలములోని మాదిరికరమగు పేరు గలవారు రాజ్యము యొక్క బానిసలుగా మారి రాజకీయ మనస్సులను కలిగియుండిరి, కానీ ఆత్మ సంబంధమగు మనస్సు లేనే లేదు. మరియు వారు తిరిగి లోకములోనికి వెళ్ళుచున్నారు, ఈ కొద్ది మంది దేవుని యొక్క వాక్యము కొరకు నిలబడిరి, అందు మూలముగా వారు ప్రభువును ఘనపరచిరి. ఇప్పుడు అందుకు ప్రతిగా ఆయన వారిని ఘనపరచును. వారు ఆయనతో కూడా తెల్లని వస్త్రములు ధరించి సంచరించెదరు. వారు భూమి మీద తమ్మును ఆయనతో కూడా గుర్తింపచేసికొనిరి. ఇప్పుడాయన నూతన యెరూషలేములో ఆయనతో వారిని గుర్తింపచేసికొనును. ఆ గుర్తింపు ఎంత అద్భుతము! నాకు సంతోషము కలుగుచున్నది. మీరు గమనించండి, ఆయన పరిశుద్దులు ధరించిన వస్త్రములకు వేరైనవి ధరించలేదు. ఈ లోక నాయకులయితే వేరేగా వస్త్రములు ధరించెదరు. లేదు, వారాయనను పోలియున్నారు, ఆయన వారివలెనె యున్నాడు, వారాయనవలె యున్నారు. 'ఆయనను ఉన్న ప్రకారమే చూచెదమని' యోహాను కూడా చెప్పెను.

"ఎందుకనగా వారు అర్హులు." దీనిని ఎవరు చెప్పియున్నారో మీరు గ్రహించారా? యోగ్యుడగు యేసు ఈ మాట చెప్పెను. సింహాసనము మీద కూర్చొనియున్నవాని చేతిలో నుండి గ్రంథము తీసికొనుటకు ఆయనే అర్హుడు. ఈ యోగ్యుడు ఇప్పుడు వీరిని అర్హులని పిలచుచున్నాడు. తీర్పు తీర్చుటకు ఆయన మాత్రమే అర్హుడు. (నిశ్చయముగా తీర్పంతయూ ఆయనకే అప్పగింపబడియున్నది,) మీరు అర్హులని ఆయన వారితో చెప్పు చున్నాడు.

ఈ మాటలు రోమా 8:33లోని మాటలంత ఆశ్చర్యముగా యున్నవి.

"నేను నీతిమంతుడనని దేవుడు చెప్పుచున్నాడు."

(వే అనువాదము) దేవుని నీతియను తెల్లని వెలుగులో యేసు యొక్క మధుర స్వరము ఈలాగు చెప్పుటను విందుము. "వీరు నా వారు. వారు నీతిమంతులు. వారు అర్హులు. వారు నాతో కూడా తెల్లని వస్త్రములు ధరించి సంచరించుదురు."

జయించువానికి వాగ్దానము

ప్రకటన 3:5,

"జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి వాని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.""జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును."

ఇది వాస్తవంగా 4వ వచనమును మరల చెప్పుటయై యున్నది. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు గూర్చి ఇక్కడ చెప్పబడినది. మనకు చాలా సంవత్సరాల క్రితం ఒక సామెత యుండెడిది, దానిని ఈ వచనము ద్వారా తీసికొనియుందురని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఆ నానుడి ఏమనగా "నీ బట్టలు శుభ్రంగా ఉంచుకో" దానియొక్క అర్థము ఏమనగా: ఇతరులు ప్రశ్నించు కార్యములలో జోక్యము చేసికొనవద్దనియే; ఇతరులు జోక్యము చేసికొనవచ్చును, అందువలన నీవు కూడా జోక్యము చేసికొనుటకు శోధన ఏర్పడును, లేదా మరికొందరు, నిన్ను జోక్యము చేసుకొనునట్లుగా ప్రయత్నించవచ్చును; కాని వాటికి దూరముగా యుండుము, దాని నుండి దూరముగా వెళ్ళుటకు ప్రయత్నించుము. ఈ సలహాను పాటించు వారికి దేవుడు బహుమానము ఇయ్యబోవుచున్నాడు. ఆయన తెల్లని వస్త్రములను ధరించుకొని యున్నట్లుగా వారికిని తెల్లని వస్త్రములు ఇవ్వబోవుచున్నాడు. పేతురు, యాకోబు, యోహానులు ఆయనను రూపాంతరపు కొండ మీద చూచిరి. ఆయన వస్త్రములు సూర్యునివలె ధగ ధగ మొరయుచుండెను. ఆ విధమగు వస్త్రములనే పరిశుద్దులు ధరించుదురు. వారి యొక్క వస్త్రములు అత్యధికమగు తెల్లదనముతో మొరయుచుండును.

మనము అంత్యకాలములో జీవించుచున్నామని మీకు తెలియును. ఈ కాలములోనే సంఘములు ఒక చోటకు కలిసి వచ్చును. ప్రపంచ రాజకీయములను అవి ఇప్పుడు అదుపులో యుంచుచున్నవి. త్వరలోనే అవి ప్రపంచ ఆర్థిక స్థితిని అదుపులో యుంచును. నీవు ప్రపంచ సంఘముల సంస్థకు చెందనిచో, కొనుటకు గాని లేదా అమ్ముటకు గాని నీకు వీలుండదు. నీవు సర్వస్వమూ కోల్పోయెదవు. దేవుని పట్ల నమ్మకముగా యుండి ఈ లోక క్రమము యొక్క మురికి అంటుకొనకుండా తమ వస్త్రములను శుభ్రముగా యుంచుకొని, చర్చి క్రమములను ఆచరించని వారిని లోబరచుకొనుటకు శారీరకంగా చాలా రకములుగా శోధించుదురు. సంఘ బోధకులు సాకులు చెప్పి, క్రీస్తువిరోధియగు మృగము యొక్క క్రమములో యుండి దేవునికి సేవచేయుచున్నామనుకొందురు. పొగడ్తలకును, పాలక వర్గము యొక్క మొప్పుకును వారు పడిపోదురు. మరియు ఈ ప్రజలు ఆ చెడు గొర్రెల కాపరులను నమ్మి బలిగా ఆర్పించబడెదరు. కాని తీర్పు దినమందు వారందరూ దిగంబరులుగా కనబడుదురు. వారికి ఆ తెల్లని వస్త్రములు ఇయ్యబడవు; వారాయనతో సంచరించరు. ఈ లోకము వలన డాగులు పడిన వస్త్రములు ధరించుకొని మీరు ఆయనతో నడవజాలరు. ఇక్కడ అపవాదితో చేతులు కలుపుచూ దేవునితో ఉండగలమని ఎట్లు ఆశించగలరు? ఇది మేల్కొనవలసిన సమయము. దేవుని యొక్క స్వరమును వినవలెను. "నా జనులారా, దానిలో నుండి బయటకు రండి! (మత సంస్థలో నుండి) దానియొక్క పాపములలో పాలిభాగస్తులు కాకుండుడి. దానియొక్క తెగుళ్ళను మీరు పొందకుడి." ఆమేన్. దేవుడు మాట్లాడుచున్నాడు. తెగుళ్ళకు ఎట్లు మీరు భయపడుదురో ఆ విధముగానే ఈ లోక మతములకును భయపడుడి. లోకముతో నడచుటను వదిలివేయవలెను. మారుమనస్సు పొంది గొర్రెపిల్ల యొక్క రక్తములో మీ వస్త్రములను తెల్లగా శుభ్రము చేసికొనుడి. కాని ఆ పనిని ఈ రోజే మీరు చేయవలెను, ఎందుకనగా రేపటికి సమయము మించిపోవును.

"జయించువాని పేరును జీవగ్రంథములో నుండి ఎంత మాత్రమును తుడుపు పెట్టను."

మరొకసారి మనము అతికష్టమైన వాక్య భాగములోనికి వచ్చుచున్నాము. ఈ వచనమును ఆర్మీనియనులు మరియు కాల్వినిస్తులు ఇద్దరును తమ ఉద్దేశ్యములకు అనుగుణముగా ఉపయోగించుకొనిరి. యోహాను 6:37-44 వరకు యున్నదానిని ఈ వచనము స్థిరపరచుచున్నదని ఆర్మీనియనులు చెప్పెదరు.

"తండ్రి నాకు అనుగ్రహించు వారందరునునా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనంత మాత్రమును బయటికి త్రోసివేయను.నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని,ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేవుదును.కాబట్టి నేనుపరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున, యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచుఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనమెరుగుదుము గదా? నేను పరలోకము నుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.అందుకు యేసు — మీలో మీరు సణుగుకొనకుడి.నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యొవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేవుదును."

ఆర్మీనియనులు తండ్రి యొక్క చిత్తమును సార్వభౌమాధికారమని చెప్పరు. కేవలము ఒక పరిమిత కోరికయని చెప్పెదరు. ఆయన యొక్క మంచి కృపగల వరములు మరియు నిత్యజీవముతో మనుష్యులందరూ ఏమి చేయుదురో అని ఆయన వెనుక నిలబడి చూచునని వారందురు.

కాల్వినిస్టులు దానిని చూడరు. ఈ వచనములో వారు గొప్ప ఆదరణను చూచెదరు. శ్రమపడినవారు, భారమును మోసిన పరిశుద్దుల ఆదరణ కొరకు ఇది ఇయ్యబడెనని చెప్పెదరు. కాలము ఎంత చెడ్డగా యున్నాగాని, హింస ఎంత భయంకరముగా యున్నా గాని జయించువాడు ఒక్కడే అందురు. "యేసే క్రీస్తని నమ్మినవాని పేరును ఆయన జీవగ్రంథములో నుండి తొలగించడని వారందురు. ఈ జీవగ్రంథము అనగా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము కాదని కూడా వారు అందురు. కానీ సాధారణముగా ఒక వ్యక్తి ఒక వచనమును ఏ కోణముతో చూచునో, ఆ కోణములోనే అది అతనికి అర్థమగును.

దేవుని యొక్క గ్రంథములో నుండి ఒకని పేరును తొలగించవలెనన్నచో సాధ్యమగు కారణములను మామూలు అధ్యయనము వలన కనుగొనలేరు. చాలా మంది యొక్క అభిప్రాయము ఇంతవరకు ఈ విషయములో ఒకేలాగున్నది, అదేమనగా, తిరిగి జన్మించినప్పుడు మాత్రమే ఒకని పేరును ఆయన గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయునని వారనుకొనుచున్నారు; ఏ కారణము చేతనయినా గాని, ఒకవేళ ఆ పేరును తొలగించినట్లయితే, అక్కడ మామూలుగా ఆ పేరు వ్రాయక ముందు ఏలాగు ఖాళీ యున్నదో ఆలాగే యుండునని వారనుకొందురు. ఇది వాక్యము నిజంగా భోదించు దానికి నూటికి-నూరు-పాళ్ళు వ్యతిరేకాభిప్రాయము.

ఈ అధ్యయనమును ప్రారంభించు ముందే నేను చెప్పితిని, అదేమనగా దేవుడు పేర్లను ఇప్పుడు వ్రాయుచూ ఉండుట లేదని చెప్పాను. ఆ విధముగా బోధించు ఒక్క లేఖనము కూడా లేదు. ఇదంతయూ జగత్తు పునాది వేయబడక ముందే జరిగియున్నది, దాని గూర్చి క్లుప్తంగా చెప్పెదను. అలాగే రెండు గుంపుల జనాంగములో మనలను మనము సామాన్యముగా ఇరికించుకొను ప్రశ్న కాదు ఇది. ఆ రెండు గుంపుల వారికిని నిత్యజీవమును పొందు అవకాశమున్నది. ఒక గుంపువారు దానిని చేర్చుకొనిరి, వారి యొక్క పేర్లు వ్రాయబడియున్నవి. నిరాకరించిన వారి పేర్లు వ్రాయబడియుండలేదు. వాస్తవానికి తిరిగి జన్మించని వారు కూడా నిత్యజీవమును పొందుదురని, అట్టివారు సమూహములుగా యున్నారని వాక్యము ద్వారా చూపించెదను. ఇది చాలా వింతగా వినబడవచ్చును, కాని ఇది నిశ్చయంగా నిజము. మనము నిశ్చయముగా చూపించెదము, ఎవరి పేర్లు జగత్తు పునాది వేయబడక ముందే ఆ గ్రంథములో వ్రాయబడియున్నవో, 'ఎట్టి పరిస్థితులలోను ఆ పేర్లు తొలగించబడవు;' మరియొక గుంపును గూర్చి కూడా చూడండి, 'వారి పేర్లు జగత్తు పునాది వేయబడక ముందే అక్కడయున్నను తొలగించబడును.'

అసలు చెప్పవలెనన్నచో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము, జీవగ్రంథము ఒకటి కాదని చెప్పువారికి ఏ ఆధారము లేదు. జీవగ్రంథమును గొర్రెపిల్ల జీవగ్రంథమని పిలువ వచ్చును లేక క్రీస్తు యొక్క జీవగ్రంథము. అది నీ గ్రంథము లేదా జీవించియున్న వారి గ్రంథము. దాని మీద పేర్లు వ్రాయబడియున్నవి.

ప్రకటన 13:8,

"భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు."

ప్రకటన 17:8,

"నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది ఆగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది ముందుకు వచ్చుచున్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు."

ప్రకటన 20:12-15,

"మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని; అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథముల యందు వ్రాయబడియున్నవాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పుపొందిరి.సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులనప్పగించెను: వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము.ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడనియెడల, వాడు అగ్నిగుండములో పడవేయబడెను."

మీరు చూడవచ్చును, ఒకవేళ ఇతర గ్రంథములు ప్రస్తావించబడినప్పటికిని ఎప్పుడునూ ఒకే గ్రంథములో పేర్లు ఉన్నట్లుగా చెప్పబడెను. ప్రకటనలో దానిని 'గొర్రెపిల్ల జీవగ్రంథము' లేదా 'జీవగ్రంథము' అని పిలచెను.

ఇప్పుడు ఈ గ్రంథము ఎక్కడున్నది? లూకా 10:17-24,

"ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి — ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా,ఆయన — సాతాను మెరుపువలె ఆకాశము నుండి పడుట చూచితిని.ఇదిగో, పాములను తేళ్ళను త్రోక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను. ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను.ఆ గడియలోనే యేసు పరిశుద్దాత్మయందు బహుగా ఆనందించి — తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను.సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడియున్నది: కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను.అప్పుడాయన తన శిష్యుల వైపు తిరిగి — మీరు చూచుచున్నవాటిని చూచు కన్నులు ధన్యములైనవి.అనేకమంది ప్రవక్తలును, రాజులును మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పచున్నానని ఏకాంతమందు వారితో అనెను."

జీవగ్రంథము నిశ్చయంగా పరలోకమందుయున్నది, మరియు మహా ధవళ సింహాసన తీర్పునాడు అది ప్రత్యక్షమగును. ఈ వచనములలో యేసు వారి పేర్లు పరలోకమందు వ్రాయబడియున్నట్లు చెప్పెను. అవి జీవగ్రంథములో వ్రాయబడియున్నవి. అందులోనే పేరుండును. యేసు డెబ్బది మంది శిష్యులతో చెప్పుచుండెను (17 వచనము), కాని ఆయన పన్నెండు మందితో కూడా మాట్లాడుచుండెను ( 23 వచనము). యేసు నామములో దయ్యములు తమకు లోబడుచున్నవని చెప్పి వీరందరునూ సంతోషించుచుండిరి. క్రీస్తు అందుకు వారితో చెప్పినది వినండి, "దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేరులు పరలోకముందు (జీవ గ్రంథముందు) వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను." ఇక్కడ మీరు గమనించవలెను, యేసు నామములో దయ్యములను వెళ్ళగొట్టిన వారిలో యూదా ఒకడు, కాని అతడు అపవాది, నాశనపుత్రుడు అని మనకు తెలియును.

యోహాను 6:70-71,

"అందుకు యేసు — నేను మిమ్మును పండ్రెండు గురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవుచుండెను. గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను."

యోహాను 17:12,

నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.

యోహాను 13:10-11, 18,

"యేసు అతని చూచి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు, కాని మీలో అందరు పవిత్రులు కారనెను.తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక — మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.మిమ్మునందరిని గూర్చి నేను చెప్పలేదు: నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని — నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ నెత్తెను అను లేఖనము నెరవేరుటకై ఈలాగు జరుగును."

ఆ భాష తేటగా అర్థమగుచున్నది. యేసు యూదాను ఏర్పరచుకొనెను. (యోహాను 13:18), అయినా గాని అతడు పవిత్రుడు కాడు. (యోహాను 13:10-11), యూదా కూడా తండ్రి ద్వారానే యేసుకు ఇవ్వబడెను. యోహాను 17:12. (ఇక్కడ గమనించండి, ఎన్నుకొనుట మరియు ఇచ్చుట రెండునూ సమానార్ధమును కలిగియున్నవి. మోషే మరియు ఫరో, యాకోబు మరియు ఏశావుల యొక్క ఉదాహరణను చూడండి. ఏశావు మరియు ఫరోలు ఇద్దరూ ముందుగా తెలిసినవారే గాని ఉగ్రత కొరకు ముందుగా నిర్ణయింపబడిరి. మోషే మరియు యాకోబుల యొక్క అంతము మహిమకరముగా యుండెను. I పేతురు 2:8-9, వారిద్దరును భ్రష్టులు మరియు ఏర్పరచబడినవారని చెప్పుచున్నది. "కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు ఏర్పరచబడిన వంశముగా యున్నారు.") పండ్రెండు మందితో కూడా యూదా లెక్కించబడెను. వాస్తవంగా వారితో పరిచర్యలో భాగము ముందు, అనగా పెంతెకోస్తుకు ముందు కలిగియుండెను.

అపో. కా. 1:16-17,

"సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్దాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసియుండెను.అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై ఈ పరిచర్యలో పాలుపొందెను."

పండ్రెండు మందిలో యూదా కూడా ఒకనిగా పాలుపొంది ఆ తరువాత నశించెను. మిగిలిన పదకొండు మంది పరిచర్యకు ఇతడేమియూ తీసిపోలేదు. అది దయ్యపు పరిచర్యగా వారి పరిచర్య మధ్యకు చొచ్చుకొని రాలేదు.

అపో. కా. 1:25,

"తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను, అపోస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనబరచుమనిరి."

యూదా, ఒక అపవాది, దేవుడిచ్చిన పరిశుద్దాత్మ పరిచర్యను పోగొట్టుకొనెను, మరియు తనను తాను చంపుకొని, తన స్వంత చోటికి వెళ్ళెను. అతని పేరు జీవగ్రంథములో యున్నది. కాని అతని పేరును తుడిచి వేయుట జరిగినది.

యూదాను గూర్చి మనము ఆలోచించు ముందుగా, పాత నిబంధనలోనికి వెళ్ళి దేవుడాలాగు చేసిన మరియొక దానిని చూద్దాం. ఆదికాండము 35:23-26, "యాకోబు కుమారులు పండ్రెండుగురు. యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, మరియు జెబులూను; యోసేపు మరియు బెన్యామీను; దాను మరియు నఫ్తాలి; గాదు మరియు ఆషేరు. వీరు పండ్రెండు మంది యాకోబునకు పుట్టిన కుమారులు. యోసేపు పేరు మీద మాత్రము గోత్రము లేదు. దేవుని యొక్క ఏర్పాటులో పదమూడు మందికి గోత్రములుండెను. పండ్రెండును పదమూడుగా చేయగల ఘనత యోసేపు యొక్క ఇద్దరు కుమారులకు ఇయ్యబడెను. అవును, ఇది ఖచ్చితముగా చేయవలసినది, ఎందుకనగా దేవునియొక్క యాజకత్వము కొరకు లేవీని దేవుడు ప్రత్యేకించవలసిన అవసరము ఏర్పడెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన తరువాత దేవుడు వారికి అరణ్యములో మందసమును ఇచ్చినప్పుడు పన్నెండు గోత్రములకు లేవీ పరిచారము చేయుచుండెను. వారెవరనగా రూబేను, పిమ్యోను, ఇశ్శాఖారు, యూదా, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఎఫ్రాయీము, మనషేలు. సంఖ్యాకాండము 10:11-28లో వారి పేర్ల క్రమమియ్యబడినది. యోసేపును గాని, లేవీని గాని అక్కడ ప్రస్తావించలేదు. కాని మనము ప్రకటన 7:4-8 చూచినచో, అక్కడ ఇట్లున్నది, "మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రము లన్నింటిలో ముద్రింపబడినవారు లక్ష-నలువది-నాలుగు-వేల-మంది." వారి పేర్లను ఈలాగు వ్రాసెను: యూదా, రూబేను, గాదు, ఆపేరు, నఫ్తాలి, మనషే, షిమ్యోను, లేవీ, ఇశ్శాఖారు, జెబూలును, యోసేపు, బెన్యామీను. ఈ పండ్రెండు మంది పేర్లలో మరల లేవీ, యోసేపులున్నారు, కాని దాను, ఎఫ్రాయీములు కనబడరు.

ఇప్పుడు ప్రశ్న ఏర్పడును, ఎందుకు ఈ రెండు గోత్రములను తీసివేసిరి? దీనికి జవాబు ద్వితీయోపదేశకాండము 29:16-20లో యున్నది.

"మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనమెట్లు దాటి వచ్చితిమో మీరెరుగుదురు.వారి హేయ క్రియలను, కర్రతోను, రాతితోను, వెండితోను, బంగారముతోను చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి గదా.ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యోహావా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీ యే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునటును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను.అట్టి పనులను చేయువాడు ఈ శాప వాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.అయితే యెహోవా వానిని క్షమింపనోల్లడు, అట్టివాడు మీలో ఉండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్పమియు ఆ మనుష్యుని మీద పొగ రాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నియూ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండా తుడిచి వేయును."

విగ్రహారాధనకు అనగా ఆత్మీయ జారత్వమునకు విరోధముగా శాపము ప్రకటింపబడినది. విగ్రహారాధన వైపు తిరిగిన గోత్రము యొక్క పేరు తుడిచివేయబడును. విగ్రహారాధన ద్వారా తుడిచివేయబడిన రెండు గోత్రముల యొక్క పేర్లు 1 రాజులు 12:25-30లో కనబడుచున్నవి.

"తరువాత యరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను.ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరల చేరుదురు. రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని యరోబాము తన హృదయమందు తలంచి,ఆలోచన చేసి వచ్చి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలచి — యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి,ఒకటి బేతేలు నందును, ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను."

హోషేయ 4:17,

"ఎఫ్రాయీము విగ్రహములతో కలిసికొనెను: వానిని ఆలాగే యుండనిమ్ము"

ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, విగ్రహారాధనకు శిక్షను చూసిన ఆ గోత్రము యొక్క పేరును 'ఆకాశము క్రింద ఉండకుండా తుడిచిపెట్టబడును.' ద్వితీయోపదేశకాండము 29:20. పరలోకములో ఆ పేరును తుడిచిపెట్టుదునని ఆయన చెప్పలేదు గాని, ఆకాశము క్రిందనుండకుండా తుడిచిపెట్టెదనని చెప్పెను. ఖచ్చితంగా ఆలాగే జరిగియున్నది, ఎందుకనగా ఇప్పుడు ఇశ్రాయేలు మరల పాలస్తీనాలో యున్నది, మరియు త్వరలోనే ప్రభువు వారిలో 144,000 మందిని ముద్రించును. కాని ఆ సంఖ్యలో నుండి దాను మరియు ఎప్రాయీములు తప్పుకొందురు.

ప్రకటన 7:4-8,

"మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్ష-నలుబది-నాలుగు-వేల-మంది.యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండు వేల మంది. రూబేను గోత్రములో పండ్రెండు వేల మంది. గాదు గోత్రములో పండ్రెండు వేల మంది.ఆషేరు గోత్రములో పండ్రెండు వేల మంది. నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేల మంది. మనషే గోత్రములో పండ్రెండు వేల మంది.షిమ్యోను గోత్రములో పండ్రెండు వేల మంది. లేవి గోత్రములో పండ్రెండు వేల మంది. ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేల మంది.జెబూలూను గోత్రములో పండ్రెండు వేల మంది. యోసేపు గోత్రములో పండ్రెండు వేల మంది. బెన్యామీను గోత్రములో పండ్రెండు వేల మంది ముద్రింపబడిరి.

(దాను మరియు ఎప్రాయీములు కనబడరు చూడండి).

దీనితో పాటుగా దానియేలు 12:1 చూసిన ఎడల, ఆరవ ముద్ర సమయములోను, మహా శ్రమల కాలములోను లేదా యాకోబు యొక్క వేదన కాలములోను ముద్రింపబడిన లక్ష-నలువది-నాలుగు-వేల-మందిని చూడండి.

"ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును: అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు."

ఏది ఏమైనా గాని, ఈ శ్రమ కాలము తరువాత, (వెయ్యేండ్ల పాలన కాలములో,) యెహెజ్కేలు చూచినట్లుగా 48:1-8, మరియు 22-29లో మనము చూచిన ఎడల, దైవిక క్రమములో ఈ గోత్రములు తిరిగి వచ్చును. ఎఫ్రాయీము మరియు దానులు విగ్రహారాధనలో కూడినప్పటి నుండి వారు చనిపోయిరి. ఆ గోత్రములకు ఇక ఏమియూ గుర్తింపులేదు. నేను గ్రహించినదేమనగా, యెరూషలేము నాశనమయినప్పటి నుండి అన్ని గోత్రముల యొక్క రికార్డులు నాశనమయినవి. కాబట్టి ఎవరికిని వారు ఏ తెగ నుండి వచ్చిరో తెలియదు, కాని దేవునికి తెలియును. ఇశ్రాయేలీయులను తిరిగి పాలస్తీనాకు తీసికొని వచ్చిన ఆ గొప్ప దేవుడు, నిజమగు ప్రతి ఇశ్రాయేలీయుని ఎరుగును. వారి గోత్రమును ఆయన ఖచ్చితంగా ఎరుగును. చేరి వచ్చిన లక్ష-నలువది-నాలుగు-వేల-మందిలో దాను మరియు ఎఫ్రాయీములు తప్పిపోవును.

ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క గోత్రములున్నవి. యెహేజ్కెలు 48:1-8 మరియు 22-29.

"గోత్రముల పేరులు ఇవి. దానీయుల కొక భాగము. అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు హిల్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను, పడమరగాను వ్యాపించు భూమి.దాను యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.ఆషేరీయుల సరిహద్దునానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము.నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనషేయులకు ఒక భాగము.మనషేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగము.ఎఫ్రామీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము.రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదా వారికి ఒక భాగము.యూదా వారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమి యుండును.దాని వెడల్పు ఇరువదియైదువేల కొల కర్రలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగముల నిడివివలెనే యుండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను. యూదా వారి సరిహద్దునకును బెన్యామీనీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీయుల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటయిన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతిదగును.తూర్పు నుండి పడమటి వరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామినీయులకు ఒక భాగము.బెన్యామీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగము.షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒక భాగము.ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జెబూలోనీయులకు ఒక భాగము.జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగము.ఈ విధముగా పంచబడియున్నది."

మనము తీసికొనవలసిన మరియొక ఉదాహరణ ఏమిటనగా, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి కనాను దేశమునకు ప్రయాణము చేయుట. ఇశ్రాయేలును బయటకు తెచ్చుట మరియు లోనికి తెచ్చి చివరకు వారాయనను సేవించుట ఈ కాలములో దేవుని యొక్క ఉద్దేశ్యమైయున్నది. ఐగుప్తును విడిచి బయటకు వచ్చి వారందరూ బలిగా వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము క్రిందకు వచ్చిరి; వారందరూ ఎర్ర సముద్రములో నీటి బాప్తిస్మము పొందియుండిరి; వారందరునూ గొప్ప అద్భుతములను అనుభవించిరి; అందరునూ మన్నాను తినిరి; అందరునూ బండలోనిది త్రాగిరి; బాహ్య ఆశీర్వచనములు మరియు ప్రత్యక్షతలకు సంబంధించినంత వరకు వారందరునూ సమానముగాను, ఒకే విధముగాను వాటిలో పాలుపొందిరి. కాని వారు మోయాబునకు వచ్చినప్పుడు బయల్పెయోరు పండుగలో పాలుపొందినందున అందరునూ చనిపోయిరి. వారి శవములు అరణ్యములో రాలిపోయినవి, ఎందుకనగా అక్కడే వారు దేవుని యొక్క వాక్యమును తిరస్కరించి దాని నుండి వారు మళ్ళిరి. ఇప్పుడు హెబీ 6:1-9లో దానిని గూర్చి చెప్పబడినది. బహు జాగ్రత్తగా పెర్గమ కాలములో తీసికొనివచ్చి యున్నాము. 'వాక్యములో కొంత భాగము తీసికొనినచో చాలదు, వాక్యమంతయూ తీసికొనవలెను. కొందరు జనులు నూటికి నూరు శాతము దేవుని యొక్క కార్యములలో ఇమిడియున్నట్లుగా కనిపించెదరు. వారు యూదావలె యున్నారు. యూదా ఎటువంటి వాడో యేసునకు తప్ప మరెవరికిని తెలియదు. కాబట్టి ఒక దినము వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు బయల్పెయోరు యొద్ద చేసిన దానినే యూదా కూడా చేసెను. కారుద్రాక్షావల్లి బలగముతో చేరిపోవుటకు అతడు నిశ్చయించుకొనెను. ఆర్థిక సంబంధముగాను, రాజకీయ సంబంధముగాను వారితో చేతులు కలిపెను. వాక్యవిరోధియగు సంస్థలో చేరెను. క్రీస్తువిరోధియగు మతములో చేరెను. అతడు బుద్ధిహీనుడు! మిగిలిన పదకొండు మంది ఆలాగున లేరు. వారాలాగు ఉండలేరు, ఎందుకనగా వారు ఎన్నుకొనబడిన వారు. యూదా వెళ్ళి ప్రభువును అప్పగించినప్పుడు, అతని పేరు జీవగ్రంథములో నుండి తొలగించబడెను. (ప్రకటన 22:19).

మీరిది నిశ్చయముగా గమనించియుందురని నమ్ముచున్నాను, జీవగ్రంథములో ఎవరి పేరు అయితే యున్నవో, వారు ఆనాటి మత క్రమములో భాగస్తులుగా యుండి నిజ దేవుని చుట్టూ చేరి, ఆయనను ఆరాధించిరి. వారా సత్యము (వాక్యము) ననుసరించి ఆరాధన చేసియుండక పోవచ్చును, అయితే యూదావలె మాత్రము ప్రవర్తించలేదు. దేవుడు యూదాను ఎట్లు ఏర్పరచుకొనెనో చూడండి. మర్మములను గ్రహించు జ్ఞానములో అతడు పాలుపొందెను. అతనికి పరిచర్య చేయు శక్తి అనుగ్రహించబడెను, మరియు అతడు రోగులను బాగుచేసెను, మరియు యేసు నామములో దయ్యములను వెళ్ళగొట్టెను. కాని అసలు రంగు బయటపడు పరిస్థితి వచ్చినప్పుడు, అప్పుడతడు, బంగారమునకు, రాజకీయాధికారమునకును అమ్ముడు పోయెను. దేవుని యొక్క ఆత్మను పొందుటకు అతడు పెంతెకోస్తు యొద్దకు వెళ్ళలేదు. అతడు ఆత్మచేత తృణీకరింపబడెను. పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మమును నిజముగా పొందిన వ్యక్తి క్రీస్తు యొక్క శరీరము లోనికి వచ్చి అతడు ఆత్మ యొక్క సంపూర్ణతను పొందును. అట్టివాడు ఎల్లప్పుడూ వాక్యములోనే యుండును. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినట్లుగా అదే సూచన. యూదా తప్పిపోయెను. జన సమూహములు అక్కడే తప్పిపోవుచున్నవి. వారు వాక్యములో సాగిపోకుండా తప్పిపోయినప్పుడు, వారి పేర్లు జీవ గ్రంథములో నుండి తీసివేయబడును.

జీవగ్రంథములో నుండి పేరు తీసివేయబడుటను గూర్చి ఇంకా తేటగా తెలిసికొనవలెనన్నయెడల, మనము మోషే దినములలో యున్న ఇశ్రాయేలీయులను చూడవలెను.

నిర్గమకాండము 32:30-34,

"మరునాడు మోషే ప్రజలతో — మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ యొక్కి వెళ్ళేదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి — అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసికొనిరి.అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలుకొను చున్నాననెను.అందుకు యెహోవా — ఎవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును.కాబట్టి నీవు వెళ్ళి, నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదని మోషేతో చెప్పెను."

కాలమునకు ముందే పేరులు జీవగ్రంథములో నుండి తుడిచివేయబడుట జరుగునని ఇందువలన అర్థమగుచున్నది. ఈ ప్రత్యేక సందర్భములో వారు విగ్రహారాధన చేయుటయే అందుకు కారణము. ఆలాగే దాను మరియు ఎప్రాయీములు తమ గోత్రముల హక్కులను కోల్పోయిరి, ఎందుకనగా వారు బంగారు దూడలను పూజించిరి. విగ్రహములకు పూజ చేయు వారందరి పేర్లు జీవగ్రంథములో నుండి తొలగించబడును.

అగ్నిస్తంభములో యుండిన దేవుని నాయకత్వమును ఇశ్రాయేలీయులు విసర్జించినప్పుడు, వారు బంగారు దూడలను ఆరాధించుటకు తిరిగినప్పుడు వారి పేర్లు జీవగ్రంథములో నుండి తొలగించబడెను. నిర్గమకాండము 32:33. (నాకు విరోధముగా ఎవరయితే పాపము చేసిరో వారి పేర్లనే తుడిచివేయుదును) విగ్రహముల వైపుకు తిరిగినందుకు శిక్షగా జీవగ్రంథములో నుండి వారి పేర్లు తొలగించబడినప్పుడు మరి యేసు క్రీస్తును మెస్సీయాగా ఇశ్రాయేలీయులు అంగీకరించలేదు. అప్పుడు దానికి మరింత కఠినముగా శిక్ష వచ్చును. ఇది ఖచ్చితంగా నిజము.

కీర్తనలు 69లో యేసు యొక్క అవమానము గూర్చి వ్రాయబడినది. 21-28వ చనములు.

"వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పికరమైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక, వారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక,వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము.వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక.వారి పాళేము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక!నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరచిన వారి వేదనను వివరించుచున్నారు.దోషము మీద దోషము వారికి తగులనిమ్ము; నీ నీతి వారికి అందనీయకుము.జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టము. నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము."

యూదులు యేసును నిరాకరించినప్పుడు దేవుడు వారి యొద్ద నుండి అక్షరాలా అన్యుల వైపుకు తిరిగెను.

అపో. కా. 13:46-48,

"అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి — దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే: అయీనను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము.ఏలయనగా — నీవు భూదిగంతముల వరకు రక్షణార్ధముగా ఉండునట్ల నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెననిరి.అన్యజనులు ఆ మాట విని, సంతోషించి, దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి."

జీవగ్రంథములో ఇశ్రాయేలు గోత్రముల వారి పేర్లు మిగిలి ఉండవని దీని అర్థము కాదు, ఏర్పరచుకొనుట అను నియమము ద్వారా అన్య సంఘ కాలములో చాలా మంది (సమూహములుగా కాదు) యేసుక్రీస్తు శరీరములోనికి వచ్చెదరు, వారి పేర్లు నిశ్చయముగా జీవగ్రంథములో నిలచియుండునని ఇందువలన తెలియుచున్నది. అయిదవ ముద్ర ప్రకారముగా హతసాక్షులయిన యూదులు తెల్లని వస్త్రములను మరియు ప్రభువు ద్వారా నిత్యజీవమును పొందుదురు. మరియు ఆయన రాక సమయములో లక్ష-నలుబది-నాలుగు-వేల-మంది ముద్రింపబడియున్నప్పటికిని, వారి పేర్లు కొట్టివేయబడలేదని నిరూపణ అయి యున్నది. 69వ కీర్తనలో అది చాలా చక్కగా చూపబడియున్నది. దుర్మార్గులు మరియు నీతిలేనివారు క్రీస్తును విసర్జించియున్నారు మరియు ఆయన జనులను నాశనము చేయువారి పేర్లు తొలగించబడును.

యేసును నిరాకరించుట ద్వారా ఇశ్రాయేలీయులలో అధిక భాగము (వారు దేవునిచే ఏర్పరచుకొనబడిన వారు) జీవగ్రంథములోని తమ పేర్లను తాకట్టు పెట్టుకొనియున్నారు, అలాగే అన్యుల సంఘములోని అధిక భాగము కూడా శిక్షకు గురియగుదురు. వారు వాక్యమును నిరాకరించి ప్రపంచ-సంఘ-సమితి ఉద్యమములో పాలుపొందుదురు, అది మృగము యొక్క ప్రతిమయయైయున్నది, అందువలన వారి పేర్లు జీవగ్రంథములో నుండి తొలగింపబడును.

ఇక్కడ మరొక సంగతిని చూడవలెను. ఆ గొప్ప ధవళ సింహాసన తీర్పులో జనులను వేరు చేయుట జరుగును. జీవగ్రంథము విప్పబడును. మరియొక గ్రంథము కూడా తెరువబడును.

మత్తయి 25:31-46,

"తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును.అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగుచేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు, ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టను.అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై యుంటిని, నన్ను చేర్చుకొంటిరి.దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినైయుంటిని, నన్ను చూడ వచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను.అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి?ఎప్పుడు పరదేశివైయుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి?ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.అందుకు రాజు — మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.అప్పుడాయన ఎడమవైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు.పరదేశనైయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినైయుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో యుంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును.అందుకు వారును — ప్రభువా, మేమెప్పుడూ నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో యుండుటయైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.అందుకాయన — మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనును.వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు."

ప్రకటన 20:11-15,

"మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న ఒకనిని చూచితిని. భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను.మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైనవారందరూ, ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని; అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములయందు వ్రాయబడియున్నవాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి.సముద్రము తనలో యున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునయున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము.ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును."

ఈ తీర్పులో నీతిమంతులు, అనీతిమంతులు ఇద్దరును యుందురు. ఆ విధముగా ఇక్కడ చెప్పబడినది. ఈ నీతిమంతులు వధువు కాదు, ఎందుకనగా వధువు ఆయనతో కూడా తీర్పులో కూర్చొనియున్నది.

I కొరింధీ 6:2-3,

"పరిశుద్దులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యతా లేదా?మనము దేవదూతలకు తీర్పుతీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?

ప్రకటన 3:21,

"నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము, జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను."

చూడండి, వధువు ఆయనతో కూడా ఆయన సింహాసనము మీద కూర్చొనియుండి లోకమునకు తీర్పు తీర్చును. దానియేలు ఖచ్చితంగా దానినే చూచెను.

దానియేలు 7:9-10,

"ఇంక సింహాసనములను వేయుట చూచితిని, మహా వృద్దుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొర్రె బోచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె వుండుచుండెను. దాని చక్రములు అగ్నివలె ఉండెను.అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్లకొలది మనుష్యులు ఆయన యెదుట నిలచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను."

చూడండి, అదే రంగము, వేలకొలదిగా ఆయన యొక్క వధువు యుండి పరిచారము చేయుచున్నది. భర్తకు పరిచారము చేయునది భార్య గాక మరి ఎవరుందురు?

ఇప్పుడు ప్రశ్న తలయెత్తును, ఈ నీతిమంతులు ఎందుకు తీర్పులోనికి వచ్చుచున్నారు? వారు వచ్చుచున్నట్లుగా కనబడు చోటు మరెక్కడను లేదు, ఎందుకనగా రెండు పునరుత్థానములున్నవి, వారు మొదటి పునరుత్థానమునకు అర్హులు కాలేదు, గనుక వారు తప్పకుండా రెండవ దానిలోనికి రావలసియున్నారు, తదుపరి తీర్పు. మొదటి పునరుత్థానమునకు అర్హులైనవారు (వధువు) తీర్పులో లేరు. యోహాను 5:24 "నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అనగా విశ్వాసి నిత్యజీవమును ముందే పొందియున్నాడు. ఇప్పుడు ఆ స్వాస్థ్యమును పొందుకొనుచున్నాడు. తీర్పులోనికి రాడు. (శాశ్వతంగా నిత్యజీవమును పొందియున్నాడు)." కాని మీరు జాగ్రత్తగా గమనించండి, యేసు మరియొక గుంపును మనస్సులో యుంచుకొని చెప్పియుండును, వారు ఒక ప్రత్యేక పునరుత్థానములో నిత్యజీవమును పొందుదురు. వారు ఆ పునరుత్థానమందే దానిని పొందెదరు. వధువులో సభ్యునిగా యుండి ముందుగానే దానిని పొందియుండినట్లుగా కాదు.

యోహాను 5:28-29,

"దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరు ఆయన శబ్దము విని, మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు."

యోహాను 5:28-29. 'ఎత్తబడుట కాదని' మనందరికి తెలియును. క్రీస్తునందు మృతులు మాత్రమే సమాధులలో నుండి లేచెదరు. ఆ సమయమందు భూమి మీద నిలచియుండిన సజీవ వధువు కూడా ఎత్తబడును.

I థెస్స. 4:16-17,

"ఆర్బాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదటలేతురు.ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము.

కాని యోహాను 5:28-29లో అందరు సమాధులలో నుండి బయటకు వచ్చెదరని చెప్పబడినది. ప్రకటన 20:11-15లో చెప్పబడిన పునరుత్థానము ఇదే. అప్పుడు మృతులు ప్రభువు ఎదుటికి తేబడివారి క్రియల వలన తీర్పు చేయబడుదురు. జీవగ్రంథములో ఎవరి పేర్లు లేవో వారందరూ అగ్నిగుండములో పడవేయబడుదురు.

ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఎదురగును, తీర్పు యొద్ద వారికి నిత్యజీవము ఎందుకియ్యబడవలెను? క్రీస్తు ఆత్మ లేనివాడు నశించునని దాదాపు పత్రికలన్నియూ ముక్త కంఠముతో ఘోషించుచున్నవి గదా. ఆ విధముగానే అది కనబడవచ్చును, కాని యేసు యొక్క మాటలను మనము చిన్నగా చూడరాదు, ఆయన చాలా ఖచ్చితముగా చెప్పెను. కొందరి పేర్లు జీవగ్రంథములో యుండును, వారు మామూలు పునరుత్థానము ముందు గాని లేదా ఆ తరువాత గాని నిత్యజీవమును పొందుదురు.

పౌలు ఈ సత్యమును దాటనీయలేదు, అతడు తేటగా చెప్పెను.

ఫిలిప్పీ 3:11లో చూడండి,

"ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని."

ఇప్పుడీ మాట చాలా వింతగా యుండును. మనము కోరుకొనినా, కోరుకొనకపోయినా, అందరమును ఒక పునరుత్థానములో ఉందుమని ఎరుగుదుము. అందరునూ పునరుత్థానము పొందెదరు, కాబట్టి పౌలు చెప్పినది వినండి, "ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని." ఈ మాట యొక్క సత్యమును చూడండి. అతడు చెప్పుకొన్నది వేరు, అక్షరాలా ఈలాగు చదువవచ్చును, 'ఏ విధముగా నైనను నేను మృతులలో నుండి పునరుత్థానమును పొందెదను." ఇది సాధారణ పునరుత్థానమును గాని లేక రెండవ పునరుత్థానమును గూర్చి గాని చెప్పబడినది కాదు, కాని మొదటి పునరుత్థానము పొందుట గూర్చి అతడు చెప్పెను, "ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్దులునై యుందురు, ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు, వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు." మొదటి పునరుత్థానమునకు రెండవ మరణముతో సంబంధము లేదు. అది వేయి సంవత్సరముల చివరలో యుండును. మృతులలో మిగిలినవారందరూ మరల బ్రదికెదరు, ఆ దినమున నిత్యజీవమునకు వచ్చు వారు౦దురు, రెండవ మరణమునకు నిర్ణయింపబడినవారుందురు. రెండవ పునరుత్థానములో యుండి జీవమును పొందువారెవరా అని మనము ఊహించవలసిన అవసరము లేదు. వారు "సోదరుల" పట్ల మంచి గాను, దయ గాను ఉండినవారు. దీనిని బట్టియే ఇది వీరికియ్యబడెనని మనకు చెప్పిరి. తిరిగి లేచియు అగ్నిగుండములోనికి విసిరివేయబడినవారు ఎందువలన ఆలాగు చేయబడిరనగా వారు "సోదరుల" పట్ల దయాత్మకంగా ప్రవర్తించలేదు. ఇది దేవుని వాక్యము గనుక మనము దానిని కేవలము అంగీకరించవలెను. ఇక్కడ ఎట్టి వివాదము లేదు, ఇది ఒక సామాన్య నిజము.

ఇంకా వివరణ కావలెనన్నచో, మత్తయి 25:31-46లో యున్న మాటలను ప్రత్యేకంగా గమనించండి. "గొల్లవాడు గొర్రెలను, మేకలను వేరు చేయుట" గూర్చి అక్షరార్ధముగా ఇక్కడ చెప్పబడలేదు, కాని ఇది గొల్లవాడు గొర్రెల నుండి మేకలను వేరు చేయుచున్నట్లుగా యున్నదనెను. ఈ ప్రత్యేక కాలపరిధిలో గొర్రెలు లేవు (ధవళ సింహాసన తీర్పు). గొర్రెలు ఆయన దొడ్డిలో యున్నవి, వారాయన స్వరమును వినిరి (వాక్యము) వారాయనను వెంబడించిరి. వారికి ముందే నిత్యజీవము ఉన్నది మరియు వారు తీర్పులోనికి రారు. కాని వీరికి నిత్యజీవముండదు, వారు తీర్పులో యున్నారు. వారు నిత్యజీవములోనికి వెళ్ళుటకు అనుమతించబడియున్నారు. కాని వారు ఏ ఆధారమునుబట్టి నిత్యజీవము లోనికి వెళ్ళుచున్నారు? వారు ఆయన వధువు కలిగియున్నట్లుగా ముందే ఆయన జీవమును కలిగిలేరని నిశ్చయముగా చెప్పవచ్చును, కాని వారు ఆయన సోదరుల పట్ల దయ చూపిరి గనుక దానిని పొందియున్నారు. వారు ఆయన సోదరులు కారు: ఆలాగయితే వారు యేసుతో సహవారసులగుదురు. వారు దేనికిని సహవారసులు కారు గాని జీవమునకు మాత్రమే. వారు సింహాసనమును పంచుకొనరు. వారి పేర్లు తప్పకుండా జీవగ్రంథములో ఉండియుండును, అవి తొలగించబడలేదు. వారు దేవుని ప్రజలను ప్రేమించిరి, వారిని గుర్తించిరి, రక్షించిరి. వీరు దేవుని పిల్లలను రక్షించి సహాయము చేసిరని నిస్సందేహముగా చెప్పగలము. బహుశా నికోదేము మరియు గమలియేలు వలె కష్టకాలములో దేవుని పిల్లలకు సహాయపడి అండగా నిలచిరి.

ఇది "పునరుద్దరణ" వలె కనబడియుండిన, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దుర్మార్గులు సరిదిద్దపడలేదు గాని అగ్నిగుండములో పడవేయబడిరి. నాశనము చేసినవారి చాలా మంది పేర్లు కూడా జీవగ్రంథములో యున్నవి; కాని ఆ పేర్లు తుడిచివేయబడినవి, ఎందుకనగా వారు అ దినమునకు, దేవుని జీవవాక్యముగా (సజీవమగు పత్రికలు) యున్న దేవుని యొక్క ప్రజలను గౌరవించటకు తప్పిపోతిరి.

ఇప్పుడిచ్చట మనము చాలా తేటగాయుండవలెను. వారు యూదులకు సహాయము చేసి ఆశ్రయమిచ్చిరి, జనములు ఇక్కడ తీర్పు తీర్చబడి వారు వెయ్యేండ్ల పాలనలోనికి వెళ్ళుట లేదు. కనుక అది చాలా తేటగా యున్నది, ఎందుకనగా ఈ వచనముల యొక్క సారాంశము చూడండి. "వీరు (దుర్మార్గులు) నిత్యశిక్షలోనికి వెళ్ళెదరు (అగ్నిగుండము), కాని నీతిమంతులు నిత్యజీవములోనికి వెళ్ళేదరు." రెండు తీర్పులున్నట్లుగా ఎక్కడా వ్రాసిలేదు, దుర్మార్గులు అగ్నిగుండములోనికి పడత్రోయబడుదురు. మహాశ్రమకాలాంతమందు మృగము మరియు అబద్ధ ప్రవక్త మాత్రమే తీర్పు చేయబడుదురు. కాదు, ఇది ధవళ సింహాసన తీర్పు, గ్రంథములలోవ్రాయబడియున్న దాని ప్రకారముగా వారికి తీర్పు తీర్చబడును.

ఇది రెండవ పునరుత్థానములో ఉన్నట్లుగా "బలిపీఠము క్రిందనున్న ఆత్మలు" గూర్చి అయిదవ ముద్రలో చూచెదము (ప్రకటన 6:9-11) వారికి తెల్లని వస్త్రములు ఇయ్యబడినవి, మరియు నిత్యజీవమియ్యబడినది, లేనిచో ఈ తెల్లని వస్త్రములను గూర్చి సూచనయే యుండదు.

"ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.వారు నాధా, సత్య స్వరూపీ, పరిశుద్దుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండనచేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను. మరియు వారివలెనె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంక కొంచెము కాలము విశ్రయింపవలెనని వారితో చెప్పబడెను."

జాగ్రత్తగా ఇది గమనించండి, ఈ బలిపీఠము క్రిందనున్న వారెవరూ యేసును గూర్చిన సాక్ష్యము గూర్చి చంపబడలేదు. ఆయన నామమును పట్టుకొనియున్నందున చంపబడిన అంతిప వలె వీరు ఎవరూ లేరు. వీరు తిరిగి జన్మించినవారు కారు, నిత్యజీవమును స్వాస్థ్యముగా పొందినవారు కారు. వారు పునరుత్థానముందు లేచి జీవమును పొందియున్నారు, ఎందుకనగా వారు వాక్యమునకు హత్తుకొనియుండిరి. వీరు ప్రతీకారము కొరకు ఏలాగు కేకలు వేయుచున్నారో చూడండి. వారు వధువు సంబంధికులు కారు. వధువు అయితే చెంపను త్రిప్పి ఇట్లనును, "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక క్షమించుము." వీరు యూదులు. వారే అయి యుండవలెను, ఎందుకనగా వారు అయిదవ ముద్రలో యున్నారు, నాలుగవ ముద్రలో అన్య సంఘపు వధువు ఎత్తబడినది. కావున ఈ యూదులు ఆయనాత్మకు పుట్టినవారు కారు. యేసే మెస్సీయా అని కూడా వారు నమ్ముట లేదు. వారు అన్యుల నిమిత్తము దేవుని చేత గ్రుడ్డివారుగా చేయబడిరి, వారికి దేవుడు కొన్ని కారణములను బట్టి నిత్యజీవమిచ్చెను. వారాయనయొద్దకు రాలేరు, అయినా గాని వారు తమకు తెలిసిన వాక్యము విషయములో నిజంగా నమ్మకస్తులుగా యుండిరి, మరియు దానికొరకు చనిపోయిరి; హిట్లర్, స్టాలిన్ మొదలగు వారి ద్వారా సమూహములు చనిపోయినవి, ఇంకా చనిపోవుచునే యున్నారు.

బుద్ధిలేని అయిదుగురు కన్యకలు రెండవ పునరుత్థానములో వచ్చిరి. వారు కన్యకలని మీరు గమనించండి. వారికి పరిశుద్దాత్మ లేనందున వధువులో యుండకుండా తప్పిపోయిరి. నూనె ఉన్న అయిదుగురు బుద్ధిగల కన్యకలు వధువులో భాగముగా వెళ్ళిపోయిరి. కాని ఈ జనులు వేరుగా నుండిరి, దేవునిని ప్రేమించిరి, వాక్యములో నిలచియుండుటకు ప్రయత్నించిరి, మరియు తమకు తెలిసినదానిని నవ్ముకముగా వెంబడించిరి, ప్రభువు యొక్క పరిచర్యలో సహాయపడిరి, వారు అంత్యకాలములో లేచెదరు. వారు వెయ్యేండ్ల పాలనను పోగొట్టుకొందురు. ఈ సత్యముల ద్వారా దీనియొక్క ప్రాముఖ్యతను, అద్భుతమును మీరు చూడనారంభించుచున్నారు, ఈలాగున ఎన్నడూ మనము ఆలోచించనూ లేదు, లేదా నమ్మనూ లేదు.

ఈ జనులందరి యొక్క పేర్లు జీవగ్రంథమందున్నవి మరియు వారి పేర్లు నిలచియుండినవి. అయితే ఎవరి పేర్లు నిలచియుండలేదు? లోకసంఘ క్రమమును వెంబడించిన సంఘములును మరియు ఎవరైతే వధువును ఎదిరించిరో, వారి పేర్లు తొలగించబడినవి. వారే నష్టపోయెదరు. వారు అగ్నిగుండములో పడద్రోయబడుదురు.

ఇప్పుడు మనము మరో అడుగు ముందుకు వెళ్ళుదము, కాని అది చేయు ముందుగా ఇంతవరకూ చెప్పుకొనిన దానిని సమీక్షించుదము, ఏర్పరచుకొనుటలో దేవుని యొక్క ఉద్దేశ్యమున్నదని మనకు అన్నిటికంటె ముందుగా నిశ్చయముగా తెలిసియున్నది. ఆయన స్వయంగా ఆ ఉద్దేశ్యము కలిగియున్నాడు. తనవంటి జనులను లేవనెత్తుట దేవుని యొక్క ఉద్దేశ్యమైయున్నది. వారు వాక్య వధువుగా యుందురు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయనలో ఆమె ఎన్నుకొనబడియున్నది. ముందే ఆమెను ఆయనెరుగును, ఆయనకు ప్రియురాలు, ఈ భూమి మీదికి రాకముందే ఆమెనాయన ఎరుగును. ఆమె ఆయన రక్తము ద్వారా విమోచింపబడినది మరియు ఎన్నడునూ తీర్పులోనికి రాదు. ఆమె ఎన్నడూ తీర్పులోనికి రాదు, ఎందుకనగా ఆమెకు పాపము ఆరోపించబడదు.

రోమా 4:8,

"దేవుడు ఎవనిని పాపిగా ఎంచడో అతడు ధన్యుడు."

ఆమె నిశ్చయముగా ఆయనతో పాటు తీర్పు సింహాసనము మీద ఉండును, లోకమునకు, దూతలకు కూడా తీర్పు తీర్చును. జగత్తు పునాది వేయబడక ముందే ఆమె పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములోని ఒక భాగములోవ్రాయబడియున్నది (ప్రతి సభ్యుని పేరు) రెండవదిగా మరో తరగతి వారున్నారు. వారి పేర్లు కూడా జీవగ్రంథములో యున్నవి మరియు వారు రెండవ పునరుత్థానములో వచ్చుదురు. బుద్ధిలేని కన్యకలు అటువంటి వారే, మత్తయి 25లో చెప్పబడిన నీతిమంతులును అట్టివారే. ఈ తరగతి వారిలో కూడా మృగమును ఆరాధించని వారున్నారు లేదా క్రీస్తువిరోధి క్రమములో జోక్యము చేసికొనక వారు వధువులో లేకపోయినా గాని తమ విశ్వాసమును బట్టి చనిపోయిరి, రెండవ జన్మ (తిరిగి జన్మించుట) కూడా వారికి లేదు. కాని వారు రెండవ పునరుత్థానములో లేచెదరు, మరియు నిత్యజీవము లోనికి వెళ్ళెదరు. మూడవదిగా వారు అటు-ఇటు క్రైస్తవులు, ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులలో మనము వారిని చూచియున్నాము. వీరి పేర్లు జీవగ్రంథములో యున్నవి, వారి క్రియలు గ్రంథములో వ్రాయబడినవి. వీరు దేవునికి లోబడుటలో తప్పిపోయిరి మరియు ఆత్మను పొందిలేరు, వారి మధ్య సూచక క్రియలు మరియు అద్భుతములు యుండినవి, వారి పేర్లు జీవగ్రంథములో నుండి తొలగించబడవలెను. ఈ గుంపు వారి మధ్యనే యూదా లాంటి వారున్నారు. ఆయనాత్మ వారిలో లేదు, కాని మతభక్తి యున్నది, వారి జీవితములలో ప్రత్యక్షత యున్నది, ఆయనలో ఏర్పరచబడకపోయినా గాని వారి పేర్లు జీవగ్రంథములో యున్నవి. ఆ గుంపులో బిలాములాంటివారును యున్నారు. నాలుగవదిగాను, చివరిగాను ఆ గ్రంథములలో పేర్లు ముందు లేనివారును, మరెన్నడూ వ్రాయబడకుండా యుండు వారును ఉన్నారు.

అట్టివారిని ప్రకటన 13:8 మరియు ప్రకటన 17:8లో చూచెదము.

"భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు; అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడెదరు."

ఒకడు తన స్వంత పేరున వచ్చినప్పుడు వారు అతనిని అంగీకరించెదరని యేసు ఒక ప్రత్యేక గుంపు గూర్చి చెప్పెను. వాడే క్రీస్తువిరోధి. ప్రకటన 13:8, మరియు 17:8లో వారిని గూర్చి చెప్పబడినది అదే. వీరు దేవుని చేత నిర్ణయింపబడిరి గాని ఏర్పరచబడలేదు. ఈ గుంపులోని వారు ఫరో వంటి వారు.

అతని గూర్చి ఇట్లు చెప్పబడెను,

నేను నీయందు నా బలము చుపుటకును, నా నామము భూలోకమంద౦తట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.

రోమా 9:17 మరియు 22.

వీరెవరును జీవగ్రంథములోనికి రారు. వారిని గూర్చి వ్రాయబడదని నేను చెప్పుట లేదు. వారిని గూర్చి వ్రాయబడియుండుట నిస్సందేహముగా నిజము, కాని జీవగ్రంథములో వ్రాయబడరు. వారియొక్క ఉనికి, వారియొక్క దేవుని ఏర్పాటు వేరుగా యున్నది, కాని మరి రెండు వచనములను మనము చేర్చవచ్చును.

సామెతలు 16:4,

"నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.''

యోబు 21:30,

"దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తొడుకొనిపోబడుదురు."

మానవ మనస్సు ఈ వాక్య భాగమును గ్రహించుట కష్టము, విశ్వాసము ద్వారానే దీనిని అంగీకరించి నమ్మవలెను. నేను చెప్పినదానిని గూర్చి కొందరు అభ్యంతరపడుదురు, ఎందుకనగా వారు దేవుని యొక్క సార్వభౌమత్వమును అర్థము చేసికొనుటలో విఫలమయిరి. దేవుడు దేవుడే, మరియు ఆయన దేవుడు గనుక ఎవరునూ ఆయన ఆలోచనలను ఓడింపజాలరు, ఆయన చిత్తమును ఆయన ఉద్దేశ్యమును ప్రశ్నించజాలరు; కాని ఆయన, సర్వశక్తిగలవాడు, అన్ని వ్యవహారములను ఏలుచున్నాడు, తనకిష్టమయిన దానిని తన సృష్టి విషయములో ఆయన చేయుచున్నాడు, ఎందుకనగా ఆయన యొక్క మంచి ఆనందము నిమిత్తమే అందరును సృజింపబడిరి. కాబట్టి పౌలు ఇట్లనుచున్నాడు, "దేవుడు ఒక మట్టి ముద్దను తీసికొని అదే మట్టి ముద్దలో నుండి ఘనత కొరకు ఒక పాత్రను, ఘనహీనత కొరకు మరియొక పాత్రను తయారు చేయును. ఆయనకు ఎదురు చెప్పగలవాడు ఎవడు? ఆయనను ప్రశ్నించగలవాడెవడు?" దీనిని చేయుటకు ఆయనకు హక్కున్నది, సృష్టి మీద ఆయన సార్వభౌముడు, మనము కాదనలేము. అయినా గాని ఆయన ఇంకా ముందుకు వెళ్ళును. రోమా 14:7-9 ప్రకారము, సర్వలోకము కొరకు యేసు చెల్లించిన వెలకు మనము రుజువుగా యున్నాము, కాబట్టి ఆయన తన స్వకీయుల విషయములో తన చిత్తమును నెరవేర్చుకొనును.

"మనలో ఎవరమును మన కొరకు జీవించుట లేదు, ఎవరును తన కోసము చనిపోవుట లేదు.మనము జీవించినా ప్రభువు కొరకు జీవించుచున్నాము. మనము చనిపోయినా ప్రభువు కొరకు చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినా, చనిపోయినా ప్రభువువారమే.ఇందుకొరకే క్రీస్తు చనిపోయి, తిరిగి లేచి, పునరుజ్జీవుడాయెను. ఆయన మృతులకును, సజీవులకును కూడా ప్రభువే."

(ఇక్కడ సంబంధమును గూర్చి చెప్పుట లేదు: యాజమాన్యమును గూర్చి చెప్పుచున్నాడు.)

దీనిని యోహాను 17:2లో మనము చూడగలము,

"సర్వశరీరుల మీద నీవు ఆయనకు అధికారమిచ్చియున్నావు. నీవు ఎందరికి అనుగ్రహించితివో వారందరికి ఆయన నిత్యజీవమనుగ్రహించును."

దేవుడు సర్వజ్ఞాని అని మనము ఒప్పుకొనినయెడల, ఆయన జ్ఞానము విషయములోను మరియు నీతి విషయములోను పరిపూర్ణుడనియు మనము ఒప్పుకొనవలెను. ఈ ఎన్నిక విధానము మరియు తిరస్కార పద్ధతి, రెండునూ దేవుని యొక్క జ్ఞానమై అన్ని యుగములలోను ప్రత్యక్షమయినది. ఎఫెసీ 1: 3-11లో కూడా అది చెప్పబడియున్నది,

"మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,మనము తనయెదుట పరిశుద్దులమును, నిర్దోషలముమై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.దేవుని కృపా మహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనయడల విస్తరింపచేసెను.ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు."

దేవుడు ఆ విధముగా నియమించి గొర్రెపిల్ల జీవగ్రంథము యొక్క ఒక భాగములో కొందరి పేర్లు వ్రాసెను, వ్రాసి వాటిని తుడిచివేయుట జరుగదు, ఎందుకనగా వారాయన యొక్క వధువుగా యున్నారు అని చెప్పిన ఎడల దానిని మనము అంగీకరించి తీరవలెను. మరియొక సంగతిని కూడా అది చెప్పుచున్నది, జీవగ్రంథములో కొందరి పేర్లున్నవి, కాని దేవుని యొక్క ముందు జ్ఞానము ప్రకారము వారు తప్పిపోయి వారి పేర్లను తొలగించవలసియున్న విషయమును కూడా మనము అంగీకరించవలెను. జీవగ్రంథములో ఎన్నడునూ పేరు వ్రాయబడనివారును యున్నారు. దానిని కూడా మనము అంగీకరించి తీరవలెను. ధవళ సింహాసన తీర్పు తరువాత కొందరు నిత్యజీవములో ప్రవేశించెదరు, దానికి కారణము వారు దేవుని చేత ఏర్పరచబడిన ఆయన సోదరుల పట్ల దయను చూపించి మేలు చేసియున్నారు, దానిని కూడా మనము అంగీకరింపవలెను. ప్రభువు యొక్క మనస్సును ఎరిగి, ఆయనకు నేర్పింపగలవాడెవడు? దానికి బదులుగా మనము విశ్వాసముతో ఆయనకు విధేయులమగుదము. ఆయనే మనకు తండ్రి మరియు ఆయన వలన మనము బ్రదుకుచున్నాము.

దీనిని గూర్చి మరి తేటగా అర్థము చేసికొనవలెనన్నయెడల, అన్ని కాలములలోని సంఘ విషయములను చూడవలెను, ఆ విధముగా వాటిని సమీపించుటయే జ్ఞానయుక్తము. ఇంతవరకు మనము వ్యక్తిగతముగా వారి వారి పేర్లు ఎట్లు తొలగించబడునో చూచాము. ఇప్పుడు మనము వ్యక్తులను గూర్చి ఆలోచించుట లేదు, సంఘములోని గుంపులను చూద్దాం. అందుకొరకు వివిధ కాలములలో యున్న సంఘమును మనము చూడవలెను, అందులో గోధుమ గింజలున్నవి. ఒక గోధుమ గింజను నాటుదుము, ఆ ఒక్క గోధుమ గింజ మొలకెత్తి ఎదిగి చివరకు ఎన్నో గోధుమ గింజలను పునరుత్పత్తి చేయును. ఒక ప్రత్యేమగు విధానము ద్వారా, ఒక కాలవ్యవధిలో అది అభివృద్ధి చెందును. ఆ ఒక్క గింజ చనిపోవును, కాని చనిపోయి, దానిలోయున్న జీవమును ఆ మొక్కలోనికి పంపించును. అది మరల జీవమును తీసికొని వచ్చి ఆదిలోనుండినదే విస్తరించి ఇప్పుడు ముందుకు వచ్చును. యేసు, గొప్ప రాజ సంతానము చనిపోయెను. సాటిలేని ఆయన సంఘము యొక్క జీవముగా ఉండి ఆయన సంఘముల మధ్యను నిలబడి ఏడు సంఘకాలములలోను తన జీవమును ఇచ్చెను. అంతమందు ఆయన జీవము శరీరములందు ప్రత్యక్షమగును. ఆయనవలె పునరుత్థానములో యు౦దుము. పునరుత్థానములోనే రాజ సంతానములో నుండి అనేక రాజ సంతానములు వచ్చును, వారాయనను పోలియుందురు, వారు ఆయన ఉన్నట్లుగానే యుందురు. "ఆయనవలె యుందుమని" యోహాను చెప్పెను. బాప్తిస్మమిచ్చు యోహాను దీనినే ఎత్తి చూపెను, యేసు గోధుమలను కోట్టులో సమకూర్చునని చెప్పెను. అదియే పునరుత్థానము, నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారు వచ్చెదరు.

ఈ గోధుమ మొక్కను గూర్చి చూచియున్నాము, అది చివరలో అసలు విత్తనమును ఉత్పత్తి చేయును, విస్తారముగా పంట వచ్చును, అదియే జీవగ్రంథము. మరల చెప్పుచున్నాను: ఈ గోధుమ మొక్క యొక్క చరిత్రను లేదా గాధను చూడండి, అదియే జీవగ్రంథము, జీవగ్రంథములోని ఒక భాగము, అనగా నిత్యజీవపు సాక్ష్యము. (జీవగ్రంథములోని ఒక భాగము). గోధుమ మొక్కను చూచినప్పుడు మీకు ఇది అర్థమగును. ఒక విత్తనమును చల్లుదుము. ఒక పచ్చని మొలక వచ్చును. కాని అది విత్తనము కాదు. ఆ తరువాత అది కాండముగా మారును. అది కూడా గోధుమ గింజ కదా. జీవము అక్కడున్నది గాని అది గింజరాదు. ఆ తరువాత పుప్పొడి రేణువులు ఫలదీకరణము చెందును. పొట్టు ఎదుగుట మనము చూచెదము. ఇది గింజ వలె బలముగా కనబడును, కాని గింజ కాదు. ఆ తరువాత పోట్టులో గింజ రూపొందును. అప్పుడది అసలు దాని యొక్క రూపమును పొందును. ఇప్పుడు ఫలము పక్వము చెందినప్పుడు పంటను కోయుదురు.

యేసుక్రీస్తు చనిపోయెను. ఆయన తన జీవమును ఇచ్చెను. ఆ జీవము సంఘము మీదికి రానైయున్నది మరియు ఆయన వంటి కుమారులు చాలా మంది పునరుత్థానమందు మహిమ లోనికి వచ్చెదరు. కాని గోధుమ గింజ దశ దశలుగా వచ్చుట అవశ్యకమని మనము చూచియున్నాము. ఒక్క గోధువు గింజ ఎన్నో గింజలుగా విస్తరించును, ఒక సంఘముండును, అది యేసుక్రీస్తు యొక్క జీవమును మోసికొని పోవుచుండును. దశము, కాండము, కుచ్చు, మరియు పొట్టు అనునవి గింజకు వాహకములు, కాని అవి జీవము కాదు. కావున సంఘము వివిధ కాలములలో నిజ విత్తనమును మోసికొని వచ్చుచున్నది, కానీ అది స్వయముగా విత్తనము కాదు. అందువలననే మనము జీవగ్రంథమును మొత్తం గోధుమ మొక్క (WHOLE WHEAT plant) అని పిలచుచున్నాము.

దాని యొద్దకు మరల మనము వచ్చుదము. నాటబడిన ఆ మూల విత్తనము అక్కడున్నది. అది ఒక చిగురును వేసినది, అది విత్తనము కాదు. తరువాత కాండము వచ్చినది, అది గింజ కాదు. గింజ రూపములో యున్న పొట్టు వచ్చినది, అది గింజ కాదు. కుచ్చు వచ్చినది, ఆ తరువాత పుప్పొడి వాటి మీద పడును. మొక్కలోని ఆ భాగము మేల్కోనును. మూల విత్తనములోని కొంత భాగము పైకి వచ్చినది, దాని ద్వారా మిగిలిన మొక్కంతయూ గింజగా మారును. ఎందుకు మొత్తం మొక్కంతయు గింజలోకి వెళ్ళినది? ఎందుకనగా అది దాని చివరన మాత్రమే సృష్టి౦చబడినది. మొక్కలోని ఆ భాగము మాత్రమే గింజగా మారును ఎందుకనగా గోధుమ మొక్కలోని ఆ భాగము మాత్రమే నిత్యజీవ గోధుమ గింజగా మారును.

ఐగుప్తును విడిచిపెట్టిన ఇశ్రాయేలులో మీరు ఆ పూర్తి మాదిరిని చూడగలరు. వారు బలము గల రెండు మిలియనుల మందిగా బయలుదేరిరి. అందరునూ గొర్రెపిల్ల యొక్క బలి రక్తము ద్వారా తప్పించుకొనిరి. అందరును ఎర్ర సముద్రములో బాప్తిస్మము పొందిరి; పరిశుద్దాత్మ యొక్క ప్రత్యక్షతను అనుభవించుచూ అందురును నీటిలో నుండి బయటకు వచ్చిరి; అందరూ ఆశీర్వచనములను పొందిరి; అందరూ దూతల ఆహారము తినిరి; అందరూ తమను వెంబడించిన బండలోనిది త్రాగిరి. అయినా గాని బహు కొద్దిమంది మాత్రమే వాహకులుగా యుండిరి. కానాను దేశములోనికి వెళ్ళు పిల్లలను వారు కనిరి. ఇశ్రాయేలీయులందరునూ ఇశ్రాయేలీయులు కారు. కొద్ది మంది పేర్లు తప్ప మిగిలిన వారి పేర్లనన్నియూ జీవగ్రంథములో నుండి తుడిచివేయబడెను.

ఈనాడు అదే రకమగు హక్కు మనకు సంఘములో యున్నది. జీవగ్రంథములో నుండి పేరు తుడిచివేయబడును. నిత్యజీవ గ్రంథములో నుండి ఏ పేరు కూడా తుడిచి పెట్టబడవు, ఎందుకనగా అది జీవగ్రంథములో యున్న మరో విధమగు గ్రంథము. ఇదియే ఆ గ్రంథము: దేవుడు మనకు నిత్యజీవమును ఇచ్చెను, ఈ జీవము ఆయన కుమారునిలో యున్నది. కుమారుని కలిగియున్నవాడే జీవముగలవాడు (నిత్యజీవము) మరియు కుమారుని కలిగిలేనివాడు జీవములేనివాడు (నిత్యజీవము). ఆ జీవము కలిగియున్నవారందరూ ఆయనలో జగత్తు పునాదికి ముందే యున్నారు. జగత్తు పునాది వేయబడక ముందే వారాయనలో ఏర్పరచుకొనబడిరి. ఆ గొప్ప రాజ సంతానమగు యేసుక్రీస్తు నాటబడెను (ఆయన చనిపోయెను) మరియు ఆయనలో జీవము ఆ గోధుమ మొక్క ద్వారా ముందుకు వచ్చెను, అది విస్తారమగు గోధుమ గింజలను తిరిగి పండించుచున్నది. అదే జీవము వాటియందున్నది, మూలములో ఉన్నదానివలెనె అది యున్నది, ఎందుకనగా వాటి యొక్క ఆత్మ కల్తీ లేనిది.

విమోచింపబడిన (మూల యజమాని ద్వారా మరల కొనబడిన) వధువు (ఆదాములో అవ్వయున్నట్లుగానే ఆమె ఆయనలో యున్నది) యొక్క పేరు, అనగా ఆ సభ్యుల పేర్లు గ్రంథములో నుండి ఎందుకు తుడిచివేయబడవో మనము చూడగలము. ఆమె ఆయనలో భాగమైయున్నది. ఆమె సింహాసనము మీద యున్నది. ఆమె ఎన్నడునూ తీర్పులోనికి రాదు. వదువులో యున్న ప్రతివారు ఆయనలో సభ్యులుగానే యున్నారు, ఆయన ఎవరినీ పొగొట్టుకొనడు. కాని జీవగ్రంథములో యున్న "వారందరు" ఆలాగుందురని దీని భావము కాదు. వారి మధ్యలో యూదా వంటి వారు కూడా యున్నారు. వారికి గ్రంథములో భాగమున్నది, కాని వారి పేర్లు తొలగించబడినవి. చివరి దినములలో రానున్న వారిని మనము చూచెదము, మరియు వారు అద్భుతమగు కార్యములను చేసిన తరువాత కూడను యేసు వారిని ఎన్నడును ఎరుగనని చెప్పెను. దానికి అర్థము ఆయనకు వారు తెలియరని కాదు. ఆయన సర్వజ్ఞుడు గనుక ఆయనకు తెలియును; కాని వారు వధువు వలె ముందుగా ఎరుగబడినవారు కారు; రెండవ పునరుత్థానములో యుండిన నీతిమంతులవలె కూడా వారు ఎరుగబడినవారు కారు. వారు ఎట్టి ఫలములు ఫలించలేదు (ఎలయనగా వారు వాక్యమునకు వెలుపల యున్నారు — అందులో నిలిచియుండలేదు) ఆ కారణము వలన వారికి మరణ శిక్ష విధింపబడినది. మనము ఇంతకు ముందే చూచినట్లుగా, వధువు పక్షముగా నిలబడినవారున్నారు. ఆమెకు వారు సహాయకరము గాను, ఆదరణము గాను యున్నారు. వారి యొక్క పేర్లు జీవగ్రంథములో నిలచియున్నవి, వారు నిత్యజీవములో ప్రవేశించుదరు. చివరగా ఫరో వంటి వారు అచ్చట ఉన్నారు, వారి యొక్క పేరు జీవగ్రంథములో ఎన్నడును లేవు, వీరు కూడా అగ్నిగుండములో పడద్రోయబడుదురు.

ఆ విధముగా గోధుమ గింజ కోతకాలమునకు ఒక మొక్కగా తయారయినది, అది సంఘము యొక్క గ్రంథము. అందరూ గోధుమ గింజలుగా యుండరు, మరియు అన్ని గింజలూ కోత కాలములోనికి రావు, ఆ విధముగానే సంఘము కూడా యున్నది: — సంఘమంతయూ వధువు కాదు; ఆలాగే అందరికిని నిత్యజీవము ఉండదు; కాని అందులో కొంత భాగము మాత్రమే కొట్టులోనికి సమకూర్చబడును; మరియు అందులో ఒక భాగము దాచబడును, రెండవ పునరుత్థానమందు ఆ భాగము నిత్యజీవములో ప్రవేశించును; అందులో పొట్టుగా లెక్కించబడు భాగము, అగ్నిలోనికి వెళ్ళును.

బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసు దీనినే చెప్పిరి, గోధుమలు కొట్టులోనికి పోగుచేయబడును మరియు పొట్టు కాల్చివేయబడును. యేసు చెప్పెను, "గురుగులను కట్టలు కట్టుడి, మరియు గోధుమలను కొట్టులో వేయుడి." ప్రపంచ-సంఘ-ఉద్యమము ద్వారా ఈ గురుగు సంఘములన్నియూ కట్టలు కట్టబడును, మొదటగా గురుగులు కట్టలు కట్టబడవలెను, మరియు వాటి అంతము అగ్ని అయినా గాని కట్టలు కట్టబడినప్పుడు కాల్చబడవు, ఆ తరువాత దినము కొరకు అవి భద్రపరచబడి యున్నవి, అది వెయ్యేళ్ళ కాలాంతము, లేదా రెండవ పునరుత్థానము. కాని ఒక్కసారి గురుగులు కట్టబడగానే ఎత్తబడుట జరుగును. కట్టలు కట్టబడుటకును, క్రీస్తువిరోధి ప్రత్యక్షమగుటకును మధ్య అది జరుగును. అప్పుడు ఆ దినము వచ్చును. దానియేలు చూచినట్లుగా అందరునూ లేచి నిలబడెదరు. రాజు తన వధువుతో అచ్చట యుండును, వారి ముందుర తీర్పుతీర్చబడబోవు జనసమూహములుండును. అవును. అందరూ అక్కడ ఉందురు. గ్రంథములన్నియూ విప్పబడును. అందరి యొక్క అంత్య తీర్పు జరుగును. కోతకాలము నిశ్చయంగా ముగిసినది. ఒకప్పుడు తెరువబడిన గ్రంథములు మూయబడును.

ఈసారికి ఈ అంశమును నేను ముగించబోవుచుండగా, ఆదిలో నేను చెప్పిన ఒక మాటను గూర్చి ప్రస్తావించెదను. ప్రభువు ప్రస్తుతము పేర్లను వ్రాయుట లేదని, అందుకు ఏ ఒక్క లేఖనాధారము లేదని చెప్పాను. అది నిశ్చయంగా అంతే. కాని భవిష్యత్తు సమకూర్పును గూర్చి ఒక లేఖనము చూపించుచున్నది. అది ఎనభై-ఏడవ కీర్తనలో యున్నది. సీయోనులో జన్మించిన వారందరి పేర్లు ప్రభువు వ్రాయుట గూర్చి ఈ కీర్తన పలుకుచున్నది. యుగముల అంతము వరకు లేదా సీయోనుతో వ్యవహరించు సమయము వరకు దేవుడు ఎదురు చూడవలెనని చూపించు సందర్భము ఎక్కడనూ లేదు, అందరూ సీయోనులో జన్మించునట్లుగా ఆయన ఆగి చూడడు. మరల ఇందులో ఆయన యొక్క ముందు జ్ఞానము కనబడుచున్నది. అందులో యుండు సంఖ్య అంతయూ నిశ్చయంగా ఆయనకు తెలియును. కాని అది ఏమిటి? అది కేవలము వెసులుపరచబడిన సంఖ్య కాదు. దానిని దేవుడు కేవలము క్రొత్త వుస్తకములో వ్రాయుట కాదు, ఆ పేర్లు రెండవ పునరుత్థానములో యుండి సీయోనుకు సంబంధించినవా? నిశ్చయంగా అవే అయియున్నవి.

"నా తండ్రి యెదుటను, ఆయన దూతల యెదుటను అతని పేరును నేను ఒప్పుకొందును."

పరలోకమందు హాజరు పిలచుటయా? "ఒక మనుష్యుడు చనిపోయిన తరువాత, మరల బ్రదుకునా? నా మార్పు వచ్చు వరకు నా నిర్ణయకాల దినములన్నిటను, నేను కనిపెట్టియందును. నీవు పిలువగా, నేను మీకు జవాబు ఇచ్చెదను: నీ చేతి కార్యముల మీద నీవు ఒక కోరికను కలిగియున్నావు." ఆ గొప్ప కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలచుచున్నాడు. దేవుని యొక్క సృజనాత్మక స్వరము వారిని ధూళిలో నుండి పిలచుచున్నది లేదా వారియొక్క అణువులను మార్చుచున్నది, వారు చనిపోనట్లుగా పిలచుచున్నది. అది ఎత్తబడుట. అది మహా పెండ్లివిందు, గొర్రెపిల్లకును ఆయన యొక్క వధువుకును జరుగును.

కాని ఈ ఎత్తబడుట కేవలము హాజరు పట్టి కాదు. రెండవ పునరుత్థానము నందు, ఆ మహా ధవళ సింహాసన తీర్పునందు, తండ్రి యెదుటను, దూతల యెదుటను, ఈ పేరు ఒప్పుకొనబడును. తెలిసినవారి ద్వారా నాకు చెప్పబడినది, ఒక వ్యక్తిని అతని పేరు పెట్టి పిలచినప్పుడు, ఆ వ్యక్తికి అది మధురముగా వినబడునని నాకు చెప్పిరి. జనులు తమ పేరు బయట వినబడవలెనని ఎంతగా కోరుదురు! వాటిని వారెంతగానో ప్రేమించెదరు. దేవుని యొక్క స్వరము నీ పేరును పిలచినప్పుడు, అది ఎంతో మాధుర్యముగా చెవులకు వినిపించును; ఏ భూలోక స్వరము కూడా దానికి సమానము కాదు. నీ పేరు జీవగ్రంథములోయున్నయెడల అది అందులో నిలచియున్నయెడల పరిశుద్ధ దూతల యెదుట అది బయలుపరచబడును. అది ఎంత గొప్ప దినము! యేసు ఈలాగున పలుకును, "తండ్రీ, వీరు తమ భూలోక యాత్రలో మనుష్యుల యెదుట నా నామమును ఒప్పుకొనిరి. ఇప్పుడు నేను వారి పేరును నీ యెదుటను, పరలోక దూతలందరి యెదుటను ఒప్పుకొనుచున్నాను."

"ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటను, చెవిగలవాడు వినును గాక!"

మరొకసారి ఆత్మ మాట్లాడియున్నది. మరొక కాలమునకు ఆత్మ చెప్పియున్న దానిని మనము సమీక్షించియున్నాము. ఆ సరియగు సాక్ష్యమును మనము కనుగొనియున్నాము. మరియొక కాలము గతించియున్నది మరియు అదెట్లు నెరవేరునని ఆయన చెప్పియున్నాడో, ఆ విధముగానే అది నెరవేరియున్నది. చివరి దినపు వధువులో యుండుటకు నిరీక్షించుచున్న మనకు, అది ఎట్టి ఆదరణ! మన హృదయము సంతోషముతో గంతులు వేయునట్లుగా అది చేయును. ఆయన నమ్మకస్తుడు. తన యొక్క ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చును. సార్దీసు కాలములో యున్న వారిపట్ల ఆయన నమ్మకస్తుడు గాను, యధార్థము గాను యుండిన విధముగానే, ఈ కాలములో ఉన్నవారి పట్లను నమ్మకముగా యుండును. వారు ఆయన యొక్క కృప మరియు శక్తి ద్వారా చేర్చుకొనబడి ఆయనచే ప్రశంసించబడియున్నారు, కావున మనమును ఆలాగే యుందుము. కాబట్టి మనము సంపూర్ణతలోనికి సాగిపోయి ప్రభువును మధ్యాకాశములో కలిసికొని, మరియు సదాకాలము ఆయనతో కూడా వుందుము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...