ఫిలదెల్ఫియ సంఘ కాలము
ప్రకటన 3:7-13
"ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము; దావీదు తాళపుచెవి కలిగి, యొవడును వేయలేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్దుడు చెప్పు సంగతులు లేవనగా.నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ యెదుట తీసియుంచియున్నాను; దానిని ఎవడును వేయనేరడు.యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారము చేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము.జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను.సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక."
ఫిలదెల్ఫియ
సార్దీసుకు దక్షిణ, తూర్పు దిశల వైపుగా డెబ్బది అయిదు మైళ్ళ దూరములో ఫిలదెల్ఫియా యున్నది. లూదియాలో ఇది రెండవ పెద్ద పట్టణము. ఇది చాలా కొండల మీద కట్టబడియున్నది, ప్రసిద్ధి చెందిన ద్రాక్షాపండ్లు ఈ జిల్లాలో యున్నవి. దాని యొక్క నాణేముల మీద బాకస్ యొక్క శిరస్సు మరియు బకాంటే యొక్క బోమ్మ యున్నవి (బాకస్ యొక్క అర్చకురాలు). ఈ పట్టణ జనసాంద్రతలో యూదులు మరియు యూదుల సంతతికి చెందిన క్రైస్తవులు, అన్యులలో నుండి మార్పుపొందినవారు ఉన్నారు. ఈ పట్టణము తరచుగా భూకంపములకు గురికాబడినది. అయినా గాని ఇది ప్రకటనలో చెప్పబడిన ఏడు పట్టణములలోను దీర్ఘకాలము ఉండినది. వాస్తవానికి ఈ పట్టణము, టర్కీ పేరులో దీనిని అలాషెర్ అని పిలచుచున్నారు, దాని అర్థము దేవుని పట్టణముగా నిలిచియున్నది.
నాణేముల యొక్క ముద్రణ ఆ పట్టణము యొక్క దేవత బాకస్ అని చూపించుచున్నది. బాకస్, నైనస్ మరియు నిమ్రోదుల వంటి వాడే. అతడు 'విలాపవంతుడు,' మనలో చాలామంది అతనిని మద్యము మరియు అల్లరికి సూచనగా ఎంచుచుందుము.
మన మనస్సులకు ఇది ఎటువంటి జ్ఞానోదయము కలిగించును. ఇక్కడ ఒక నాణేమున్నది, దీనికి ఒక ప్రక్క దేవుడును మరో ప్రక్క అర్చకురాలు లేదా ప్రవక్తిని యొక్క బోమ్మలున్నవి. ఒక నాణమును ఎగురవేయండి. అది ఎటు క్రింద పడినా ఏమీ తేడా లేదు? లేదండి, ఎందుకనగా అది ఇంకను అదే నాణేము. అది యేసు మరియల యొక్క రోమీయుల మతము.
కాని మనము కేవలము రోమ్ గూర్చియే మాట్లాడుట లేదు. లేదు, మహావేశ్య ఒక్కటే మాత్రము కాదు. ఇది నిశ్చయము కాదు; ఎందుకనగా ఆమె, తన జారత్వముల వలన తల్లి అయినది. ఇప్పుడు దాని కుమార్తేలు ఒకే ముద్రణ శాలలో నుండి బయటకు వచ్చిన నాణేముల వలె యున్నారు. ఒక ప్రక్క ఆ నాణేమునకు యేసును ఆరాధించు బోమ్మను గీసిరి మరియు మరియొక వైపున వారు అర్చకురాలు లేదా ప్రవక్తిని యొక్క బోమ్మను చిత్రించిరి. ఆమె తన ఆచారములను, సిద్దాంతములను, బోధలను వ్రాసి జనులకు అమ్మినది. రక్షణ వచ్చునని నొక్కి చెప్పినది. నిజమగు వెలుగు తనకే యున్నట్లు చెప్పుకొనినది.
ఈ కాలము నాణేమునకు సాదృశ్యము చేయబడుట ఎంత గుర్తింపదగిన అంశము! ఎందుకనగా తల్లి మరియు కుమార్తెలు ఇరువురును తమ పరలోకపు దారిని కొనుక్కొనుచున్నారు. రక్తము ద్వారా కాదు గాని డబ్బు ద్వారా దానిని వారు కొనుచున్నారు. వారిని ముందుకు నడిపించు శక్తి, ఆత్మ కాదు, కాని, డబ్బు. ఈ యుగ సంబంధమగు దేవత (mammon) వారి కన్నులకు గ్రుడ్డితనము కలుగచేసెను.
అయితే వారి మరణ వ్యాపారము త్వరలోనే ముగియును, ఎందుకనగా ఈ కాలములో ఆత్మ ఈలాగు కేక వేయుచున్నది. "ఇదిగో, నేను త్వరగా వచ్చుచున్నాను." ప్రభువైన యేసూ, త్వరగా రమ్ము!
కాలము
ఫిలదెల్ఫియా సంఘ కాలము 1750 నుండి దాదాపు 1906 వరకు కొనసాగినది. ఈ కాలము, ఈ పట్టణము పేరునకు గల అర్ధమును బట్టి సహోదర ప్రేమగల కాలముగా పిలువబడినది, ఫిలదెల్ఫియ అనగా "సహోదర ప్రేమ."
వర్తమానికుడు
ఈ కాలమునకు వర్తమానికుడు నిస్సందేహముగా జాన్ వెస్లీ. జాన్ వెస్లీ ఎప్ వర్తులో జూన్ 17, 1703లో జన్మించెను. సామ్యూల్ మరియు సూసన్నా వెస్లీలకు జన్మించిన పందొమ్మిది మంది పిల్లలలో ఇతడు ఒకడు. ఇతని తండ్రి ఇంగ్లాండు చర్చిలో చాప్లినుగా పనిచేయుచుండెను; కాని ఇతని తండ్రి యొక్క వేదాంత విద్యకంటె, ఇతని తల్లి యొక్క మాదిరికరమగు జీవితమే మత విషయములలో ఇతనిలో మలుపు తీసికొని వచ్చెను. జాన్ చాలా ప్రతిభగల పండితుడు. అతడు ఆర్ఫోర్డులో ఉండిన సమయములో చార్లెసుతో కలిసి ఒక గుంపు యొద్దకు వెళ్ళుచుండెడివాడు. వారు ఆత్మసంబంధమగు ఆరాధనను జరిగించెడి వారు. సత్యముననుసరించి ఆచరణాత్మకంగా జీవించవలెనని వారు చెప్పుచుండిరి, కానీ సిద్దాంతమే తమ కొలకర్రగా తలంచినవారు కారు. క్రియలను చేయు ఒక ఆత్మసంబంధమగు మార్గదర్శక సూత్రములను రూపొందించిరి, బీదలకు దానమిచ్చుట, రోగులను, చెరసాలలో యున్నవారిని దర్శించుట మొదలగు క్రియలు చేయుచుండిరి. దీనిని బట్టియే వారిని మేతడిస్టులని పిలచిరి, ఇంకా ఇతర బిరదులను వారికి ఇచ్చిరి. లోక జనులకు అవసరమగు ఒక మతమును గూర్చి జాన్ దర్శనము చూచెను. ఆ దర్శనమే అతనికి సరిపోయి అతనిని బలముగా లాక్కొనిపోయెను. అతడు అమెరికాలోని (జార్జియా) ఇండియనుల మధ్య సేవ చేయుటకు మిషనెరీగా వెళ్ళెను. అక్కడికి వెళ్ళు దారిలో యున్నప్పుడు, ఆ ఓడలో యుండిన ప్రయాణికులలో చాలామంది మొరేవియనులను గ్రహించెను. వారియొక్క సాత్వికము, సమాధానము, అన్ని పరిస్థితులలోను చూపించు ధైర్యము అతనిని ఎంతో ఆకట్టుకొనెను. అతడు జార్జియాలో ఎంతో నిస్వార్ధముతోను, కష్టించియు పనిచేసినాగాని జయమును పొందలేదు. అతడు ఈలాగు మొరపెట్టుచూ ఇంగ్లాండుకు తిరిగి వచ్చెను, "ఇండియనులను మార్చుటకు నేను అమెరికాకు వెళ్ళితిని, అయ్యో! నన్నెవరు మార్చుదురు?"
లండనులో మరల అతడు మొరేవియనులను కలిసికొనెను. అతనికి రక్షణ మార్గమును చూపించినవాడు పీటర్ బోహలర్. అతడు నిజంగా తిరిగి జన్మించినందుకు అతని సోదరుడు చార్లెస్ నిరాశతో మండిపడెను. జాన్ వంటి ఆత్మ సంబంధియగు వ్యక్తి ఇంతకు ముందు దేవునితో సరిగ్గా లేనని చెప్పుట ఏమిటో ఇతనికి అర్థము కాలేదు. ఏమయినా గాని, అనతి కాలములోనే చార్లెస్ కూడా కృప ద్వారా రక్షించబడెను.
లండనులో ఇంతకు ముందు తనకు పరిచయముండిన వేదికల మీద నుండి వెస్లీ ఇప్పుడు సువార్తను ప్రకటించనారంభించెను; కాని అతనిని వారు త్వరలోనే త్రోసిపేసిరి. ఈ సమయములోనే ఇతని పాత స్నేహితుడగు జార్జి వైట్ ఫీల్డు ఇతనికి మంచి అండగా నిలచెను. అతడు జాన్ ను ఆహ్వానించి బోధించుటకు ఆయా స్థలముల లోనికి తీసికొని వెళ్ళెను, అక్కడ వేలాదిమంది వాక్యమును వినుచుండిరి. మొదట వెస్లీ, భవనములో గాకుండా బహిరంగ ప్రదేశములో బోధించుటకు సంకోచించెను, కాని అతడు వచ్చుచున్న జనసమూహములను, పరిశుద్ధాత్మ శక్తితో సువార్త పనిచేయుటను చూచినప్పుడు, అతడు మనస్ఫూర్తిగా అటువంటి బోధపైపు తిరిగెను.
ఆ పని చాలా తొందరలోనే విస్తరించిన పిదప, చాలామంది సంఘ సభ్యులను వాక్యము బోధించుటకు పంపుచుండెను. ఇది పెంతెకోస్తుకు సమానముగా యున్నట్లు తోచెను, అప్పుడు ఆత్మ జనులను లేవనెత్తి బోధించు శక్తిని, వాక్యమును ఉపదేశించు శక్తిని ఇచ్చి దాదాపు ఒక్క రాత్రిలోనే బోధించగలిగినంతగా సువార్త జరుగుచుండెను.
అతని పనికి భయంకరమగు వ్యతిరేకత వచ్చెను, కాని అతనితో దేవుడు తోడై యుండెను. ఆత్మ యొక్క క్రియలు బలముగా ప్రత్యక్షమగుచుండెను మరియు ఒప్పింపచేయు ఆత్మ తరచుగా జనులను ఒప్పించుచున్నందున, జనులు బలము లేనివారివలె నేల మీద పడిపోయి తమ పాపముల గూర్చి మహారోదనతో రోదించుచుండిరి.
వెస్లీ చాలా బలమగు వ్యక్తి అని గ్రహించవలెను. తాను పుట్టినప్పటి నుండి ఎన్నడునూ ఒక పావుగంట కూడా బలహీనతకు గురైనట్లు జ్ఞాపకము లేదని స్వయంగా అతడు చెప్పెను. దినమునకు ఆరు గంటలకంటె ఎక్కువ అతడు నిద్రించలేదు; అతడు సేవ చేసిన దినములన్నింటిలోను బోధించుటకై ప్రతిదినము అయిదు గంటలకే మేల్కోనెడివాడు; ఒక్క దినములో నాలుగు సార్లు బోధించెడివాడు, ఆలాగున అతడు ఒక సంవత్సరములో సరాసరి 800 ప్రసంగములను చేసెను.
అతడు ఎన్నో వేలాది మైళ్ళు ప్రయాణము చేసి సువార్తను దూరమునకు, దగ్గరకు అందించెను. వాస్తవానికి వెస్లీ, గుర్రము ద్వారా సంవత్సరమునకు 4500 మైళ్ళు ప్రయాణము చేసెను.
అతడు దేవుని శక్తి కలిగిన విశ్వాసి మరియు అతడు గొప్ప విశ్వాసముతో రోగులకు ప్రార్ధించగా అద్భుతమగు ఫలితములు వచ్చెను.
అతని యొక్క చాలా కూటములలో ఆత్మీయవరముల యొక్క బయలుపాటు జరిగెను.
వెస్లీ సంస్థ పట్ల మొగ్గు చూపలేదు. అతనితో నున్నవారు "ఐక్య సమాజమును" స్థాపించిరి, వారు "ఒక స్వరూపమునే కలిగియుండి భక్తిలో శక్తిని వెదకుచుండిరి, కలిసి ప్రార్థించుటకు ఏకమయిరి, వాక్య హెచ్చరికను పొందిరి, ఒకరినొకరు ప్రేమతో చూచుకొనుచుండిరి, వారు తమ రక్షణను కొనసాగించుటలో ఒకరికొకరు సహాయపడిరి." అందులో ప్రవేశము పొందగోరు వారికి ఒక షరతు యుండినది, "వారికి రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనవలెనను కోరిక యుండవలెను, మరియు తమ పాపముల నుండి రక్షణ పొందవలెనని యుండవలెను." సమయము జరుగుచుండగా, వారు కఠినమగు కొన్ని నియమములను రూపొందించిరి, వారి ఆత్మల మేలుకొరకు స్వయంక్రమశిక్షణను పాటించిరి. తన మరణము తరవాత ఈ ఉద్యమము సంస్థగా మారునని వెస్లీ గుర్తించెను. దేవుని యొక్క ఆత్మవారిని విడిచిపెట్టుననియు, అది చచ్చినదానివలె అగుననియు గుర్తించెను. మెథడిస్టూ అను పేరు ఈ భూమినుండి విడచిపోయినా గాని భయపడను, గాని ఆత్మ విడిచిపెట్టుట నాకిష్టము లేదని ఒకసారి అతడు చెప్పెను.
అతని యొక్క జీవితకాలములో అతడు ఎంతో సంపదను సంపాదించి యుండెడి వాడు; కాని అతడు సంపాదించుకోలేదు. డబ్బును గూర్చి అతడు ఎల్లప్పుడును ఈలాగు చెప్పుచుండెడివాడు, "నీవు సంపాదించుకోగలిగినంత మొత్తము సంపాదించుకో, నీవు దాచుకోగలిగినంత మొత్తము దాచుకో, నీవు ఇవ్వగలిగినంత మొత్తము ఇవ్వు. ఈనాడు మెథడిస్టూ అను పేరుగల శాఖను చూచినచో వెస్లీ ఎంత ఆశ్చర్యము పొందునో గదా! వారు ధనికులు — బహు ఐశ్వర్యవంతులు. కాని జాన్ వెస్లీ యొక్క జీవము మరియు శక్తి తప్పుకొన్నది.
శాఖాసంబంధమగు లేదా తెగకు సంబంధించిన ఆధారమగు దాని మీద ఒక పనిని నిర్మించవలెనని వెస్లీ ఎన్నడునూ ఆకాంక్షించలేదు. అతని మత విశ్వాసములు ఆర్మీనియను అయినా గాని, తమ సిద్దాంత ప్రాతిపదిక మీద సోదరుల నుండి వేరు కావలెనని తలంచలేదు. అతడు యాకోబునకు పోల్చబడినవాడు: అతడు తమ యొక్క నిత్యజీవమును, క్రియలు మరియు విశ్వాసము మీద ఆధారము చేసికొనెను. సామాన్య ఆచారమును లేదా మతసిద్ధాంతమును స్వీకరించుట కాదు గానీ, విశ్వాస జీవితమును జీవించెను.
జాన్ వెస్లీ 88 సంవత్సరముల వయస్సులో మరణించెను. ఆయన ప్రభువును సేవించినట్లుగా మేమును సేవించగలమని చెప్పగలవారు ఏ కొద్దిమందియు ఉండరు.
అభివందనము
ప్రకటన 3:7,
"ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకై ఈలాగు వ్రాయుము; దావీదు తాళపుచెవి కలిగి యొవడును వేయలేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా."
ఆ మాటలు ఎంత చక్కగా యున్నవి! వాటి యొక్క భావము ఎంతో ఔన్నత్యముతో కూడియున్నది. ఆ లక్షణములన్నియు ఒకే వ్యక్తికి అపాదించబడుటను గూర్చి ఎంతో ఆశ్యర్యము కలుగును. మహిమకు ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరెవడు ఆలాటి మాటలు స్వయంగా చెప్పగలడు? ఈ అద్భుతముగా వర్ణించబడిన మాటల యొక్క ఖచ్చిత భావమును గ్రహించవలెనన్నచో, అందుకు ఒక మూలరాయి సహాయమున్నది, అది తొమ్మిదవ వచనములో యున్నది.
"యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెను. వారు వచ్చి నీ పాదముల యొద్ద పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను."
ఈ వచనము మూలాధారమని నేను చెప్పాను, ఎందుకనగా ఇది యూదుల గూర్చి చెప్పుచున్నది. వారు తామే దేవుని పిల్లలమనియు, తక్కినవారు కారనియు చెప్పుదురు. వారు ప్రభువగు యేసుక్రీస్తును సిలువవేసి చంపిరి. వారియొక్క భయంకర కృత్యము వలన వారి రక్తాపరాధము, శతాబ్దముల తరబడి వారి మీదికే వచ్చియున్నది. ఇదంతయూ వారు యేసును మెస్సీయాగా అంగీకరించక పోయినందునే జరిగినది. నిశ్చయంగా ఆయనే మెస్సీయా; కాని వారికయితే ఆయనాలాగు కనిపించలేదు, ఆయన దావీదు కుమారుడు కాడనిరి, వారాయనను బయల్జేబూబు అనిరి, నాశనమునకు పాత్రుడగు దుర్నీతిపరునిగా ఆయనను వారు ఎంచిరి. కాని అది తప్పు. ఆయన నిశ్చయంగా ఇమ్మానుయేలు, దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. నిశ్చయంగా, ఆయన మెస్సీయా. ఇప్పుడు ఆయన ఆ విధంగానే సింహాసనము అధిష్టించియున్నాడు. ఆయన మారని యేసు — యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆ దీప స్తంభముల మధ్యనున్నవాడు యేసే. ఆయనే గలిలయ తీరములందు సంచరించెను, రోగులను స్వస్థపరచెను, మృతులను లేపెను, మరియు ఇన్ని రుజవులున్నాగాని వారాయనను సిలువచేసి చంపిరి. అయితే ఆయన తిరిగి లేచెను, ఇప్పుడు ఆయన సర్వోన్నత స్థలములో మహోన్నతుని కుడి పార్శ్యమున కూర్చొనియున్నాడు.
యూదులు అప్పుడాయనను పరిశుద్దునిగా పిలువలేదు. ఇప్పుడు కూడా వారాయనను పరిశుద్దునిగా పిలువరు. కాని ఆయనే పరిశుద్దుడు.
కీర్తనలు 16:10,
"ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్దుని కుళ్ళు పట్టనియ్యవు."
వారు ధర్మశాస్త్రానుసారమగు నీతిని ఆయనలో కనుగొనవలెనని తలంచిరి, కాని ఘోరముగా విఫలమయిరి, ఎందుకనగా ధర్మశాస్త్రము వలన ఏ శరీరము నీతిమంతునిగా తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన ఎవడును పరిశుద్దునిగా తీర్చబడరు. పరిశుద్ధత ప్రభువునకు చెందును.
I కొరింధీ 1:30,
"అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు. ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను."
II కొరింధీ 5:21.
"ఎందుకనగా మనమాయనయందు నీతి అగునట్లు."
క్రీస్తులేనియెడల నశించెదము. వారు నశించిరి, ఎందుకనగా వారాయనను నిరాకరించిరి.
ఆ కాలము నాటి జనులు చేసిన పొరపాటునే ఈనాటి జనులును చేయుచున్నారు. సమాజ మందిర ఆరాధన ద్వారా యూదులు ఆశ్రయమును పొందగోరిరి, ఆ విధముగానే ఫిలదెల్పియ కాలములోని వారు సంఘములో ఆశ్రయము పొందగోరుచున్నారు. సంఘములో చేరుట గొప్ప కాదు. సంఘములో జీవము లేదు. క్రీస్తులో జీవమున్నది. "దేవుడు మనకు నిత్యజీవమును ఇచ్చెను మరియు ఈ జీవము ఆయన కుమారునిలో యున్నది. కుమారుని కలిగియున్న వానికి జీవమున్నది, మరియు కుమారుని కలిగియుండని వానికి జీవము లేదు." మానవుడు దేవుని ఆత్మ ద్వారా పరిశుద్దుడగుచున్నాడు. పరిశుద్ధత యొక్క ఆత్మయే యేసును మృతులలో నుండి పైకి లేపెను, అది మనలో నివసించుచున్నది, మరియు ఆయన పరిశుద్దుతతో అది మనలను పవిత్రపరచుచున్నది.
అక్కడాయన పరిశుద్దునిగా నిలబడియున్నాడు. మనము ఆయన నీతిని వస్త్రముగా ధరించుకొని నిలబడుదుము, ఆయన పరిశుద్ధతతో పవిత్రముగా యుందుము.
ఇప్పుడిది ఆరవ కాలము. దేవుని యొక్క దృష్టిలో సమయము సమీపించుచున్నది. ఆయన త్వరలోనే తిరిగి రాబోవుచున్నాడు. ఆయన వచ్చుచుండగా త్వరలోనే ఈ స్వరము వినబడును,
"అపవిత్రుని ఇంకా అవిత్రునిగానే యుండనిమ్ము, నీతిమంతుని ఇంకను నీతిమంతునిగా యుండనిమ్ము, పరిశుద్దుని ఇంకనూ పరిశుద్దునిగా యుండనిమ్ము."
ప్రకటన 22:11.
నా పరిశుద్ధత నా స్వంతది కానందుకు నేను సంతోషముగా యున్నాను. నేను క్రీస్తులో యున్నందుకు ఆనందించుచున్నాను, ఆయన యొక్క అద్భుతమగు నీతిలక్షణము లన్నియూ నాకు అపాదించబడినవి, నాకవి వర్తించుచున్నవి. నిత్యమూ దేవుడు స్తుతింపబడును గొక!
"సత్యస్వరూపియగువాడు ఈ సంగతులు చెప్పుచున్నాడు." ఇప్పుడు ఈ "సత్యమను" మాట చాలా అద్భుతమగు మాట. ఇది కేవలము అబద్ధమునకు వ్యతిరేకమగు నిజమను అర్ధముతో కూడినది కాదు. ఒక అభిప్రాయమును పరిపూర్ణముగా గ్రహించుట గూర్చి ఇది చెప్పబడినది. పాక్షిక గ్రహింపునకు ఇది వ్యతిరేకము.
ఉదాహరణకు యోహాను 6:32లో యేసు చెప్పినది చూడండి,
"పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.
యోహాను 15:1,
"నేను నిజమైన ద్రాక్షావల్లిని."
హెబ్రీ 9:24,
"అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సుముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను."
I యోహాను 2:8,
"చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది."
ఈ మాట పూర్ణ గ్రహింపును వ్యక్తము చేయుచున్నది, పాక్షిక గ్రహింపునకు ఇది వ్యతిరేకము, ఈ వచనములలో మాదిరిని చూచాము. ముందెన్నడూ లేని విధంగా మనము ఇప్పుడు అర్థము చేసికొనగలము, మాదిరితో మాదిరి కానిది విభేదించుచున్నది మరియు నిజస్వరూపముతో, నీడకు తేడాయున్నది. ఇప్పుడు ఉదాహరణకు పరలోకపు మన్నాను చూడండి. దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు పరలోక మన్నాను క్రిందికి పంపించెను. కాని ఆ భోజనము సంతృప్తినియ్యలేదు. అది ఒక దినమునకు మాత్రమే బాగుండెను. దానిని తినినవారు మరుసటి దినమునకు ఆకలిగొనిరి. అది మిగిలిన యెడల అది కుళ్ళిపోవుచుండెడిది. కాని యేసు పరలోకమునుండి దిగివచ్చిన నిజాహారముగాయున్నాడు, దానికి మన్నా ఒక మాదిరిగా మాత్రమే యున్నది. పరలోకమునుండి దిగి వచ్చిన ఆఆహారమును ఎవడైనను తినినచో మరెన్నడూ ఆకలిగొనడు. అతడు మరల వచ్చి దానిని తిననవసరములేదు. దానియందు అతడు భావము పొందిన క్షణములోనే అతడు నిత్యజీవము పొందును. ఇక్కడ నిశ్చయంగా వాస్తవమున్నది. ఇక మీదట నీడ యొక్క అవసరత లేదు. పాక్షిక రక్షణ యొక్క అవసరతలేదు. దానియొక్క సంపూర్ణత ఇచ్చట నున్నది. యేసు దేవునిలో ఒక భాగముగా లేడు; ఆయన దేవుడైయున్నాడు.
ఇశ్రాయేలునకు వెలుగుండిన విషయమును ఎవరూ కాదనలేరు. వెలుగు కలిగియుండిన ఒక జనాంగముగా వారు తప్ప మరెవరును లేరు. ఐగుప్తు గడాంధకారములో యుండగా వీరు మాత్రమే వెలుగు కలిగియుండిరి. ఇశ్రాయేలీయుల యొక్క ఇండ్లలో వెలుగుండెను. కాని ఇప్పుడు నిజమగు వెలుగు వచ్చియున్నది. యేసే లోకమునకు వెలుగైయున్నాడు. మెస్సీయాకు సంబంధించిన లేఖనముల ద్వారా మోషే మరియు ఇతర ప్రవక్తలు వెలుగును తీసికొని వచ్చిరి. ఆ విధముగా ఇశ్రాయేలునకు వెలుగుండెను. కాని ఇప్పుడు వెలుగు యొక్క నెరవేర్పు వచ్చియున్నది. వెలుగుచుండిన వాక్కు ఇప్పుడు దేవుని యొక్క వెలుగుతో ప్రకాశించుచున్నది. ఆయన జనుల మధ్య బయలుపరచబడి ఉన్నాడు. అగ్నిస్తంభము రాత్రిలో వెలుగును ఇచ్చినట్లుగా, ఇప్పుడు వెలుగు మరియు జీవము సంపూర్ణముగా ప్రత్యక్షమాయెను. అది అద్భుతము. దేవత్వము శరీరరీత్యా బయలు పరచబడెను.
పాపముల పరిహారము నిమిత్తము ఇశ్రాయేలీయులు ఎర్రని పొట్టేలును తీసికొని బలిపీఠముల మీద అర్పించుట వాడుక. దోషి యొక్క పాపములు ఒక సంవత్సరము పాటు కప్పబడెడివి. కాని ఆ ముసుగు పాప కోరికను వారిలో నుండి తొలగించలేకపోయెను. అది పరిపూర్ణ బలి కాదు. అది నిజమగునది వచ్చు వరకు నీడగా యున్నది. కాబట్టి ప్రతి సంవత్సరము ఒకడు బలిని అర్పించవలసియే యుండును, ఎందుకనగా అతనిలో ఇంకనూ పాపపు కోరిక మిగిలియున్నది. అతని యొక్క పాప పరిహారము కొరకు జంతు జీవము అర్పించబడినది. కాని ఆ చిందించబడినది జంతు రక్తము గనుకను, అర్పించబడినది జంతు ప్రాణము గనుకను అవి మానవునికి సరిపోయెడిది కాదు. అది సరిపోయినయెడల వారు మరల రావలసిన పనియుండదు. కాని పరిపూర్ణ బలిగా క్రీస్తు సమర్పించబడి ఆయన రక్తము చిందించబడినప్పుడు, క్రీస్తులోయున్న జీవము పశ్చాత్తాపపడిన పాపిలోనికి వచ్చుచున్నది. ఆ జీవము క్రీస్తు యొక్క పరిపూర్ణ జీవము. పాపము లేనిది, నీతిగలది. ఇప్పుడు దోషి స్వేచ్చగా వెళ్ళగలడు, ఎందుకనగా అతనిలో పాపపు ఇచ్చలేదు. యేసు యొక్కజీవము ఆతని మీదికి వచ్చెను.
రోమా 8:2లో వ్రాయబడినదానికి అర్థము అదే,
"క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమములనుండి నన్ను విడిపించెను."
కాని యేసు కాలములో నుండిన యూదులు ఆ బలిని అంగీకరించుటకు ఒప్పుకొనలేదు. ఎద్దులు మరియు మేకల యొక్క రక్తము దేనినీ పరిపూర్ణముగా చేయజాలవు. అది ఒకప్పుడు దేవుడు నియమించినపద్ధతి. కాని ఇప్పుడు క్రీస్తు శరీరమందు ప్రత్యక్షమాయెను, మరియు ఆయన తన స్వంత రక్తమును చిందించెను. అందువలన పాపము దూరపరచబడినది. ఆయనే స్వయంగా బలియుగుట వలన మనము పరిపూర్ణులమయి యున్నాము. యూదులు దానిని ఒప్పుకొనరు. కాని ఫిలదెల్ఫియ కాలము మాట ఏమిటి? మిగిలిన కాలములను కూడా చూడండి. క్రీస్తులోయున్న ఈ నిజత్వమును వారు నిజంగా అంగీకరించిరా? లేదండి. నీతీకరణ యొక్క సత్యమును లూథరు తీసికొనివచ్చినా గాని, రోమీయుల సంఘము, దాని యొక్క తూర్పు విభాగమగు ఆర్థోడక్సు సంఘము ఇంకా క్రియలనే అంటిపెట్టుకొనియున్నవి.
ఇప్పుడు క్రియలు మంచివే, కానీ అవి నిన్ను రక్షించలేవు. అవి నిన్ను పరిపూర్ణునిగా చేయలేవు. క్రీస్తు లేనియెడల నశించెదవు. క్రీస్తు మరియు క్రియలు అని కూడా చెప్పవద్దు. క్రీస్తు మాత్రమే చాలును. ఆర్మీనియ నిజం యొక్క ప్రారంభము ఈ కాలములోనే జరిగినది. క్రీస్తును నిజత్వముగా వారు నమ్మరు, "రక్తము తప్ప? మరేదీకాదు," అను పాటను వారు పాడరు. "రక్తము మరియు నా యొక్క స్వంత ప్రవర్తన," అని వారు పాడెదరు. "మంచి ప్రవర్తనయందు నేను విశ్వాసముంచుచున్నాను." నీవు రక్షించబడినట్లయితే నీతిక్రియలనే చేయుదువు. దానిని ఇంతకు ముందే మనము చూచియున్నాము. కాని ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, రక్షణ అనునది యేసుతో ఇంకొకటి కలుపుట వలన రాదు. యేసు వలన మాత్రమే వచ్చును. "రక్షణ ప్రభువు నుండి కలుగును." ఆది నుండి అంతము వరకు అది దేవునినుండియే వచ్చును. ఆయన జీవము నాలో యుండవలెను. ఆయన రక్తము నన్ను శుద్దీకరించవలెను. ఆయన ఆత్మ నన్ను నింపవలెను. నా హృదయములోను, నోటిలోను ఆయన మాటయుండవలెను. ఆయన దెబ్బలు నన్ను స్వస్థపరచును. యేసు మాత్రమే, యేసు తప్ప మరేదీలేదు. నీతిక్రియలు కాదు, వాటిని నేను చేశాను, కాని అవి కాదు. క్రీస్తే నా జీవము. ఆమేన్.
నేను ఇంకా ముందుకు వెళ్ళి ఈ సత్యములను గురించి చెప్పవలెననిపించుచున్నది, కాని నేను మరియొక్క ఆలోచనను విడిచిపెట్టెదను. అది ఎ. బి. సింప్సన్ వ్రాసిన అద్భుతమగు గీతము.
"ఒకప్పుడు అది దీవేన,
ఇప్పుడు అది ప్రభువే.
ఒకప్పుడు ఆది భావన,
ఇప్పుడది ఆయన మాట.
ఒకప్పుడు నేను ఆయన వరమును కోరాను,
ఇప్పుడు ఇచ్చువాడే స్వంతమాయెను.
ఒకప్పుడు నేను స్వస్థత కొరకు వెదికాను,
ఇప్పుడు ఆయనే చాలును.
నిత్యమూ ఆయనయే సర్వములో సర్వము,
యేసుని గూర్చి నేను పాడెదను.
అంతా యేసులోనే యున్నది,
యేసే సర్వమూ."
ఈ జీవితములో సంతృప్తిపరచునది ఏదియూ లేదు, మంచిదిగాని, ఉత్తమమైనది గాని, మరేదియూ లేదు. అన్నింటి యొక్క సారాంశమును, సంపూర్ణతను క్రీస్తులోనే మీరు కనుగొందురు. ఆయన లేకుండా యుండిన ఏదయినా గాని గుర్తింపులేనిదియై వాడిపోవును.
"దావీదు యొక్క తాళపుచెవి గలిగినవాడు." ఇది చక్కని పద సంచయము. "సత్యస్వరూపియగు వాడను" మాట తరువాత ఇది వచ్చుచున్నది — ఆయనే క్రీస్తు, పరిపూర్ణ గ్రహింపు, పాక్షిక గ్రహింపునకు విరోధము. ఇక్కడ చూడండి. మోషే దేవుని యొక్క ఒక ప్రవక్త, కాని యేసు (మోషే వంటివాడు) దేవుని ప్రవక్త. దావీదు ఇశ్రాయేలీయులకు రాజు, (దేవునికిష్టానుసారుడగు వాడు) కాని యేసు దావీదు కంటె గొప్పవాడు. ఆయన రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభువు. దేవుడు దేవుడే. ఇప్పుడు దావీదు యూదా గోత్రములో నుండి జన్మించెను, అందులోనుండి యాజకులు రారు, అయినా గాని అతడు యాజకుల కొరకు దాచియుంచిన మందసపు రొట్టెలను తినెను. అతడు శత్రువులను జయించిన మహా-యోధుడు, జనులను స్థిరపరచుచుండెను; రాజుగా అతడు సింహాసనము మీద కూర్చొనెను. అతడు ఒక ప్రవక్త. అతడు క్రీస్తునకు అద్భుతమగు మాదిరి.
ఇప్పుడు యెషయా 22:22లో ఈలాగున చెప్పబడియున్నది,
"నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముల మీద ఉంచెదను; అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు."
ఈ పాత నిబంధన వచనము ప్రభువైన యేసుక్రీస్తుకును, సంఘములో ఆయన పరిచర్యకును వర్తించునట్లు ఆత్మ పలికియున్నది. ఈ సమయములో దావీదు తాళపుచెవిగా ఉన్న ఆయన ఇప్పుడు దీపస్తంభముల మధ్యను నిలబడియున్నాడు. ఇది మన ప్రభువునకు చెందును. ఇది ఆయన పునరుత్థానము తరువాతది. ఆయన భూలోక యాత్రలోనిది కాదు. కాని ఈ తాళపుచెవి దేనిని చూపించుచున్నది? తాళపుచెవి యొక్క స్థానములోనే జవాబు దాగియున్నది. ఇది ఆయన చేతిలో లేదు. ఆయన యొక్క మెడలో అది ధరించబడిలేదు. అది మరెవరి చేతులలోనో లేదు, ఆలాగుండిన యెడల వాక్యము ఆ విధముగా వ్రాయబడియుండెడిది కాదు, "ఆ తాళపుచెవిని ఆయన మాత్రమే ఉపయోగించగలడు — ఆయన మాత్రమే తెరచును మరియు మూయును. యేసుకు తప్ప మరెవరికిని అధికారము లేదు." అది నిజము కాదా? కాని తాళపుచెవి ఎక్కడున్నది? అది ఆయన భుజము మీద యున్నది. భుజమునకు దానితో ఏమి సంబంధము?
యెషయా 9:6 చదవండి,
"ఆయన భుజముల మీద రాజ్యభారముండును."
దీనియొక్క అర్థము ఏమిటి? దానికి జవాబు ఇది: "ఆయన భుజముల మీద రాజ్యభారముండును" అను పద సంచయము, తూర్పు దేశముల పెండ్లి ఉత్సవములో నుండి పుట్టినది. వధువును పెండ్లి కుమారునికి అప్పగించినప్పుడు, ఆమె తన ముసుగును తీసివేసి పెండ్లి కుమారుని యొక్క భుజముల మీద పెట్టును. ఆమె అతని ఆధిపత్యము క్రిందికి వచ్చుచున్నట్లు ఇది సూచనగా ఆమె తన హక్కులను అతనికి మార్పిడి చేసినట్లు కూడా దీని అర్థము — అతడే ఆమెకు శిరస్సు — అంతే కాకుండా హక్కు మరియు బాధ్యత యున్నది — మరే పురుషునికి అధికారము లేదు — అతడు ఒక్కడే అర్హుడు. ఆ ప్రియుడే, దావీదు యొక్క తాళపుచెవియై యున్నాడు. దేవుడు సౌర్వభౌముడు గనుక దైవ ఏర్పాటు ద్వారా ముందే చూడగలడు. ఎవరు ఆయన యొక్క వధువైయున్నారో ఖచ్చితంగా ఆయనెరుగును. ఆమెను ఆయన ఏర్పరచుకొనెను. ఆమె ఆయనను ఎన్నుకొనలేదు. ఆమెను ఆయన పిలచును. ఆమె స్వంతగా రాలేదు. ఆమె కొరకు ఆయన చనిపోయెను. ఆమెను ఆయన తన స్వరక్తములో కడిగెను. ఆమె కొరకు ఆయన వెల చెల్లించెను. ఆమె ఆయనకు చెందును. ఆయనకు మాత్రమే ఆమె చెందును. ఆమె ఆయనకు పూర్తిగా లోబడును. ఆయన ఆమె బాధ్యతలను అంగీకరించెను. ఆమెకు ఆయనే శిరస్సు, ఎందుకనగా క్రీస్తే సంఘమునకు శిరస్సు. అబ్రహామును శారా ప్రభువని పిలచినట్టుగానే, వధువు ఆయనను ప్రభువని పిలచును. ఆమెకు ఆయన ప్రభువైనందున ఆమె సంతోషించుచున్నది. ఆయన మాటకు ఆమె లోబడును, అదే ఆమెకు ఆనందము.
కాని మనుష్యులు ఈ సత్యమునకు చెవియొగ్గుచున్నారా? ఆయన యొక్క వ్యక్తిత్వమును వారు ఎట్లు ఎంచుచున్నారు? ఆయనకు మాత్రమే తన సంఘము మీద సంపూర్ణ సార్వభౌమ అధికారమున్నది. కాని వారాలాగు లేరని నేను చెప్పెదను, ఎందుకనగా ప్రతి కాలములోను సంఘము ఒక పాలనా వర్గము ద్వారా పరిపాలించబడుచున్నది. ఒక యాజకత్వము, ఒక అపోస్తలుల క్రమము వారిని ఏలుచున్నది. ఇచ్చయించు వారికి కృప ద్వారమును మూయుచున్నది. సంఘము యొక్క ప్రేమ మరియు బాధ్యతను మోయుటకు బదులుగా, వారు కిరాతకులవలె పని చేయుచున్నారు మరియు దురాశలతో వారు సంఘమును చెరచి నాశనము చేసియున్నారు. సంఘ పాలకులు సుఖభోగములలో జీవించిరి, పేద సంఘమయితే నింద అను పొట్టును తింటూ బ్రదుకసాగినది. ఏ కాలము కూడా ఇందుకు మినహాయింపు లేదు. ప్రతిదియు సంస్థలో బందీయైనది మరియు మానవుల మీద ఏలుబడిని పెట్టిరి మరియు సంఘమును ప్రభుత్వమునకు అప్పగించిరి. ప్రజలు కొందరు ధైర్యముగా లేచినా గాని వారిని క్రూరముగా అణచి వేయుట, లేదా బహిష్కరించుట జరిగినది. ప్రతి శాఖకును అదే ఆత్మయున్నది. సంఘము యొక్క ఏలుబడికి చెందిన తాళపుచెవి తమ చేతిలో యున్నదని ప్రతివారును గొప్ప చెప్పుకొనుచున్నారు. కాని అది నిజము కాదు. అది యేసు, యేసు మాత్రమే దానిని చేయగలడు. ఆయన శరీరములోని సభ్యులను ఏర్పరచును. ఆయన వారి పరిచర్యలను బలపరచును. ఆయన ఆమెకు వరములిచ్చును. ఆమె కొరకు ఆయన శ్రద్ధవహించును మరియు ఆమెను ఆయన నడిపించును. ఆమెయే ఆయన యొక్క ఆస్తి, ఆయనకు ఆమె తప్ప మరెవరును లేరు.
ఇది వాస్తవమునకు ఎంతో దూరముగా యున్నది, మనము జీవించుచున్న సంఘ కాలము కూడా అంతే. త్వరలోనే ఒక దినమున వీరు లేచి ప్రపంచ-సంఘ-సమితిని స్థాపించి సంఘములకు విరోధముగా సజీవుడగు అంత్యక్రీస్తును నిలబెట్టుదురు. వారియొక్క సంస్థకు అతడే శిరస్సు. ప్రభువును వారు బహిష్కరించెదరు. ఆయన (క్రీస్తు) సంఘమునకు వెలుపట యుండును. అక్కడ నిలబడి ఆయన ఇట్లు పలుకును,
"ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను; ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినయెడల అతని యొద్దకు నేను వత్తును. అతనితో నేనును, నాతో అతడును కలిసి భోజనము చేయుదుము."
ప్రకటన 3:20.
కాని ఒక్క విషయము చెప్పెదను. మన ప్రభువు ఓడిపోలేదు. దేవునికి తలుపు తెరచుట, తలుపు మూయుట మా పని అని కొందరు చెప్పుకొనుచున్నారు; కాని వారు అబద్ధికులు. తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు, ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంతమాత్రమును త్రోసివేయడు; వారిలో ఎవరినీ ఆయన పోగొట్టుకొనడు. యోహాను 6:37-39. ఎప్పుడైతే ఏర్పరచుకొనబడిన ఆ చివరి సభ్యుడు క్రీస్తు యొక్క శరీరములోనికి వచ్చునో, అప్పుడు ప్రభువు ప్రతక్షమగును.
దావీదు తాళపుచెవి. దావీదు ఇశ్రాయేలీయులందరికిని రాజు కాదా — ఇశ్రాయేలు అంతటికి? మరియు దావీదు కుమారుడగు యేసు, వాస్తవముననుసరించి వెయ్యేండ్ల పాలనలో దావీదు సింహాసనము మీద కూర్చొని ఆయన వారసులను ఏలును. నిశ్చయంగా. కాబట్టి దావీదు యొక్క తాళపు చెవియనగా యేసే. ఆయన వెయ్యేండ్ల పాలనను తీసికొని వచ్చును. మరణము యొక్కయు, పాతాళము యొక్కయు తాళపుచెవులను ఆయన కలిగియున్నాడు. ఆయన తన స్వకీయులను లేపును. వారు భూమిమీద ఆయన యొక్క నీతిపాలనలో పాలుపంచుకొందురు.
ఎంత అద్భుతము! అన్ని జవాబులను మన ప్రభువు కలిగియున్నాడు. నిజంగా ఆయనలో దేవుని యొక్క వాగ్దానములన్నియూ నెరవేర్చబడియున్నవి. నిజంగా ఆయనలో మనము ఉండుట ద్వారా మనము దానికి వారసులమగుదుము, అందుకొరకే ఆయన మనలను కొనియున్నాడు.
అవును, మహిమ యొక్క ప్రభువు అక్కడ నిలబడియున్నాడు. ఒకప్పుడు ఆయన తండ్రిగా యుండి దేవదూతల చేతను, ప్రధాన దూతల చేతను, కెరూబులు చేతను, సెరాపులు చేతను, పరలోక సైన్యసమూహమంతటి చేతను స్తుతింపబడుచుండెను. "పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, సైన్యములకథిపతియగు యెహోవా పరిశుద్దుడు," అని వారు కేకలు వెయుచుండిరి. ఆయన యొక్క పరిశుద్ధత అటువంటిది ఎవడునూ ఆయనకు సమీపింపజాలకుండెను. కాని ఇప్పుడాయనను సంఘములో మనము చూచుచున్నాము, ఆయన తన యొక్క స్వంత పరిశుద్ధతను మనతో పంచుకొనుచున్నాడు. చివరకు ఆయనలో నీతిగా మనము మారువరకు. అవును, అక్కడ ఆయన నిలబడియున్నాడు, "యేసు అన్నింటిలోనూ పరిపూర్ణుడు," — లోయలోని పద్మము, ప్రకాశించుచున్న వేకువ చుక్క, పదివేలలో అతి ప్రియుడు, అల్ఫా మరియు ఓమేగా, దావీదు యొక్క వేరు మరియు చిగురు అయి యున్నాడు. ఆయనే తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ — సర్వములో సర్వము ఆయనే.
యొషయా 9:6.
"ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను."
ఆయనలోనే పరిపూర్ణ నెరవేర్పు ఉన్నది. ఒకప్పుడు ఆయనను మనము ఘనపరచలేదు, ఇప్పుడు మనము చెప్పశక్యము కాని సంతోషమును, పూర్ణ మహిమతో ఆయనను ప్రేమించుచున్నాము. సంఘము మధ్య ఆయన నిలబడియున్నాడు, ఆయన స్తుతిని మనము పాడెదము, మహా-విజయశీలుడగు ఆయన, సంఘమునకు శిరస్సుగా యున్నాడు. ఆమె ఆయన వధువు. ఆ వధువును ఆయన కొనెను. ఆమెకు ఆయనే యజమాని. ఆమె ఆయన సొంతం. ఆయనకు మాత్రమే చెందును. ఆయన ఆమెను సంరక్షించును. ఆయన మన రాజు, మనము ఆయన యొక్క రాజ్యము, ఆయన యొక్క నిత్యమైన స్వాస్థముగా యున్నాము.
ఇప్పుడు మీరు 7వ వచన ప్రారంభములో దీనిని అర్థము చేసికొనుటకు 9వ వచనము సహాయము చేయునని నేను చెప్పినది మనసుకు తెచ్చుకొనుడి. నా భావమును మీరు గ్రహించారని ఆశించుచున్నాను. యేసు పరిశుద్దుడు, సత్యవంతుడు, (ఆయన మాత్రమే యధార్థవంతుడు) దావీదు యొక్క తాళపుచెవిని కలిగియున్నాడు, ఆయనే తెరువగలడు మరియు మూయగలడు. ఇది కచ్చితముగా నిజము. ఆ పదజాలములు ఆయనను చక్కగా వర్ణించియున్నవి. కాని ఆ దినమునాటి యూదులు ఆయనను మరియు ఆయన ఏమైయున్నాడో సమస్తమును తిరస్కరించిరి. వారు తమ రక్షకుని విసర్జించిరి, వారిపట్ల ఆయనకుగల ఉద్దేశ్యమునే త్రోసివేసిరి. నామకార్ధ క్రైస్తవుడు ఇప్పుడు అదే చేసెను. యూదులు చేసిన దానినే వీరును అక్షరాలా చేయుచున్నారు. యూదులు ఆయనను సిలువచేసిరి, ఆ తరువాత నిజ విశ్వాసుల వైపు తిరిగిరి. నామకార్థ క్రైస్తవుడు నూతనముగా ఆయనను సిలువవేయుచున్నాడు, నిజ సంఘమును నాశనము చేయుటకు దాని మీద పడుచున్నాడు. కాని దేవుడు సత్యవంతుడు, మరియు ఆయన అందరికంటెను పైనున్నవాడు, ఆయన తిరిగి వచ్చుచున్నాడు, మరియు ఆయన వచ్చునప్పుడు ఎవరు అర్హులో ఆయన తెలియచేయును. లోకమునకు తన్నుతాను రుజువు చేసికొనినప్పుడు, సర్వలోకము ఆయన పాదముల యొద్ద వంగును. ఆ కాలములో సర్వ ప్రపంచము పరిశుద్దుల యొక్క పాదముల యొద్ద వంగును, వారాయన పక్షముగా సరిగా నిలబడిరని ఇందువలన రుజువగును. సదాకాలము దేవుడు స్తుతింపబడును గాక!
తెరువబడిన ద్వారము యొక్క కాలము
ప్రకటన 3:8,
"నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమైయుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపు నీయెదుట తీసియుంచియున్నాను; దానిని ఎవడును వేయనేరడు."
ఈ వచనములోని మొదటి మాట: "నీ క్రియలను నేనెరుగుదును," మిగిలిన వాక్యమంతటిని ఇది విశ్లేషించియున్నది. "తెరువబడిన తలుపుతోను," "కొంచెము శక్తితోను," "వాక్యము మరియు నామముతోను," వారు క్రియలు చేసియుండిరి.
ఈ పదసంచయము యొక్క భావసంపదను గ్రహించవలెను, "తలుపు నీ యెదుట తీసియుంచియున్నాను, దానిని ఎవడును వేయనేరడు." మరొక కాలములోనికి వచ్చు ముందు, ఆ క్రితం కాలమును గూర్చి ఏమి చెప్పబడినదో మనము తప్పుక ఇప్పుడు మనసుకు తెచ్చుకొనవలెను. హద్దు మీరుట, వెనుకకు జారుట లేదా కరిగిపోవుట మనము చూచియున్నాము. పూర్తిగా అంతము వచ్చి, స్పష్టముగా ప్రారంభమగుటను చూడము. ఈ కాలము ముఖ్యంగా ఆ తరువాత కాలములోనికి పరుగిడుచున్నది. ఈ కాలము చివరి కాలము లోనికి వెళ్ళటయే కాకుండా, చివరి కాలము, ఈ ఆరవ కాలము యొక్క చాలా లక్షణములను మోసికొనిపోయినది. ఏడవ కాలము (చాలా చిన్న కాలము) త్వరగా పనిచేసినది. ప్రతి కాలములోని చెడును పోగుచేసికొనినది, అయినా గాని పెంతెకోస్తు యొక్క సర్వ పరిపూర్ణతను కూడా కలిగియున్నది. ఫిలదెల్పియ కాలము అయిపోయిన తరువాత, వెంటనే లవొదికయ కాలము వచ్చెను. గోధుమలు, గురుగులు పంటకు వచ్చినవి.
కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను సమకూర్చి నా కొట్టులో పెట్టుడి."
మత్తయి 13:30.
దయచేసి గుర్తుంచుకొనండి, సార్దీస్ కాలములో సంస్కరణ ప్రారంభమాయెను మరియు అది ముందుకు సాగవలెను, పెంతెకోస్తు యొద్ద నాటబడిన గింజ ఆయా దశలను దాటి రావలసియున్నది; నాటుట, నీళ్ళు పోయుట, సారము వేయుట, పూర్తి చక్రమువలె పనిచేసినది; తిరిగి అది అసలు గింజవలె బయటకు వచ్చువరకు. ఇది జరుగుచుండగా, విత్తబడిన గురుగు కూడా తమ చక్రము యొక్క దశలను దాటి ఎదుగుచుండును మరియు కూర్చబడును కూడా. అది జరుగుటయే ఖచ్చితంగా మనము చూచుచున్నాము. రుతువులను గూర్చి మీరు ఆలోచించిన ఎడల, మీకు చక్కగా ఇది కనబడును. ఎండా కాలములో బహు బలముగా ఎదిగి పండుచున్న మొక్క, ఆకస్మాత్తుగా, విత్తనముగా మారును. ఎండాకాలము ఎప్పుడు ఆకురాలు కాలముగా మారెనో ఖచ్చితంగా నీవు చెప్పలేవు — అది దానిలోనికి మారిపోవును. ఈ కాలములు కూడా ఆ విధంగానే యున్నవి, మరి ముఖ్యంగా ఈ రెండు కాలములు.
"నేను త్వరగా వచ్చుచున్నానని," ఈ కాలముతో యేసు చెప్పుచున్నాడు. 11వ వచనము. అందువలన చివరి కాలము చిన్నదగుచున్నది. లవొదికయ కాలము త్వరగా పనిచేయు కాలము. అది కుదించబడినది.
ఇప్పుడు మనము ప్రత్యేకంగా తెరువబడిన తలుపు గూర్చి ఆలోచన చేయదము, ఎవడును దానిని వేయజాలడు. అన్నిటికంటె ముందుగా నేను తెరువబడిన తలుపు గూర్చి చెప్పగోరుచున్నాను, ఆ కాలములోని అద్భుతమగు మిషనెరీ ప్రయత్నములను అది చూపించుచున్నది. ప్రభువు కొరకు ఒక క్రొత్త మిషనైరీ ప్రయత్నమును చేయుట, తెరువబడిన తలుపు, అని పౌలు చెప్పెను.
II కొరింధీ 2:12,
"క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు ద్వారము తెరువబడియుండును."
లేఖనములను పోల్చి చూచినప్పుడు, మనకు తెలియును. ఈ తెరువబడిన తలుపు, ప్రపంచము ఎన్నడునూ చూడని సువార్త వ్యాప్తికి సూచనగా యున్నది.
ఇక్కడ మీరు ఒక సంగతి చూడవలెనని కోరుచున్నాను. దేవుడు మూడులో పని చేయును, ఆయన అవునా? మూడవదగు పెర్గమ కాలములో సంఘము, రాజ్యమును వివాహము చేసికొనినది. నీకొలాయితుల క్రియలు, నీకొలాయితుల బోధగా మారియున్నవి. ఆ కాలము కారుద్రాక్షావల్లికి తెరువబడిన తలుపుగా యున్నది. ఎప్పుడైతే దానికి రాజ్యము యొక్క అండ దొరికెనో, క్రైస్తవ్యమను పేరును అది కలిగియున్నప్పటికిని అది వాస్తవానికి ప్రపంచ సంఘ క్రమమయినది. ఆ విధముగా అది కార్చిచ్చువలె పయనించినది. కాని ఇప్పుడు, మూడు కాలముల తరువాత, విశ్వాసముతో కఠినమగు సుదీర్ఘ పోరాటము జరిపిన తరువాత, సత్యమునకు ఇక్కడ ద్వారము తెరువబడుచున్నది. ప్రభువు యొక్క వాక్యమునకు దానియొక్క కాలము వచ్చియున్నది. ఈ బలమగు ఉద్యమమునకు అయిదవ కాలము ఒక దశను ఏర్పరచినది. ఆ కాలములోనే అన్వేషణ, నివాసములను ఏర్పరచుకొనుట, పుస్తకములను ముద్రించుట మొదలగునవి వచ్చినవి.
పెంతెకోస్తు యొక్క దైవిక మాదిరిని ఈ 'తెరువబడిన తలుపు' వెంబడించి యుండినచో చాలా అద్భుతముగా ఉండియుండును. హెబ్రీ 2:1-4లో ఆ మాదిరి యున్నది, "కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టిరక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను, వారితోకూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారిచేత మనకు ధృఢపరచబడెను." యేసుకు కూడా ఇదే మాదిరియని మీరు చూడగలరు. ఆయనే ఆలాగున చెప్పెను,
మార్కు 16:15-20,
"మరియు — మీరు సర్వలోకమునకు పెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.నమ్మి బాప్తిన్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మనివానికి శిక్ష విధింపబడును.నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్తభాషలు మాటలాడుదురు,పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అదివారికి హానిచేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువువారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్."
సర్వలోకమునకు వెళ్ళి బైబిలు కాలేజీలను స్థాపించుడని, ఎన్నడును ఆయన వారికి చెప్పలేదు. లేక సాహిత్యమును పంచిపెట్టడని కూడా ఆయన వారితో చెప్పలేదు. ఆ పనులు మంచివే, కాని యేసు వారికి చేయమని చెప్పినది సువార్త ప్రకటించుట — వాక్యముతో హత్తుకొనియుండుట — ఆ తరువాత సూచక క్రియలు వెంబడించును. దేవుని యొక్క రాజ్యము గూర్చి ప్రకటించు విధానమును మొదటిసారిగా ఆయన పండ్రెండు మందిని బయటకు పంపినప్పుడు చెప్చెను. మత్తయి 10:1-8, ఆయన ఈ విధముగా వారికి ఆజ్ఞాపించి పంపెను,
"ఆయన తన పండ్రెండు మంది శిష్యులను పిలచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను.ఆ పండ్రెండు మంది అపోస్తలుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రియ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను,ఫిలిప్పు, బర్తోలోమయి, తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి,కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా,యేసు ఆ పండ్రెండు మందిని పంపుచూ, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని,ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి.వెళ్ళుచూ — పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి.రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టరోగులను శుద్దులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టడి; ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యడి."
వారికిచ్చిన ఆ పరిచర్య వాస్తవంగా ఆయన యొక్క స్వంత పరిచర్యయే. ఆయన వారితో పంచుకొనెను, ఎందుకనగా మత్తయి 9:35-38లో ఇట్లు చెప్పబడినది,
"యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను.ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొర్రెలవలె విసిగి చెదరియున్నందున, వారి మీద కనికరపడి,కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను."
అపోస్తలులకు మన ప్రభువైన యేసు ఈ పరిచర్యను ఇచ్చెను గనుక వారు చనిపోయిన వెంటనే ఆ పరిచర్యయు సమాప్తమైనదని ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుచున్నారు. అది కాదు.
ఇక్కడ లూకా 10:1-9లో చూడండి, ఆయన భూమిమీద యాత్ర చేసిన దినములలోనే ఆయన తన స్వకీయులకు పరిచర్యను ఇయ్యగోరెను,
"అటు తరువాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను.పంపినప్పుడాయన వారితో ఇట్లనెను — కోత విస్తారముగా ఉన్నది, కాని పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి.మీరు వెళ్ళుడి. ఇదిగో, తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను.మీరు సంచినైనను, జాలెనైనను, చెప్పులనైనను తీసికొనిపోవద్దు. త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలడగవద్దు.మీరు ఏ ఇంటనైనను ప్రవేశించునప్పుడు — ఈ ఇంటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.సమాధానపాత్రుడు అక్కడ ఉండినయెడల మీ సమాధానము అతని మీద నిలుచును. లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.వారు మీకిచ్చు పదార్ధములను తినుచు త్రాగుచూ ఆ ఇంటిలోనే యుండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు.మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందుర పెట్టునవి తినుడి.అందులోనున్న రోగులను స్వస్థపరచుడి — దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి."
ఫిలిప్పు యొక్క బలమగు పరిచర్యను ఎవరు కాదనగలరు? ఐరేనియస్, మార్టిన్, కొలంబా, పాట్రిక్ ఇంకా చాలామంది దేవుని యొక్క అభిషేకమును తమమీద కలిగియుండిరి. వారియొక్క అద్భుతమగు పరిచర్యలను ఎవరు కాదనగలరు?
తెరువబడియున్న తలుపునకు బైబిలు మార్గమే నిజమగు మార్గము. దానికి నేను నా సాక్ష్యమును కలుపగోరుచున్నాను. ఆలాగు చేయుటకు నాకు ఒక కారణమున్నది, ఎందుకనగా నేను నిశ్చయతతోనే మాట్లాడగలను, మరియు నా జీవితములో దేవుడు చెప్పినదానిని వివరించగలను. మీరిక్కడ నా విషయములో క్షమించిన ఎడల యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఎట్లున్నాడో నాయంతట నేనే స్వానుభావముతో చెప్పుగలను, మరియు నమ్మి పొందగోరు వారికి దేవుని యొక్క శక్తి ఇంకా అందుబాటులోనే యున్నది.
దక్షిణాఫ్రికాలో నేను మిషనెరీగా పర్యటించినప్పుడు, ఆ సమయమున దేవుడు నన్నెంతగానో ఆశీర్వదించగా నేను డర్బనుకు వచ్చాను, జనులను పట్టు చోటు అక్కడ మూత్రమే యున్నది. అక్కడ ఒక పెద్ద పందెపు రంగ (Race Track) మున్నది, ప్రపంచములో అది రెండవది. 100,000 మంది జనులకు పైగా వచ్చిరి. వారిని అదుపులో పెట్టుటకు వారు కంచెలను నిర్మించి ఆయా తెగలను వేరు చేసిరి. జన సమూహములను నిమ్మళపరచుటకు వారు వందలాది మంది పోలీసులను నియమించిరి. ఆకలిగల ఆత్మలతో వారు చాలా మైళ్ళ దూరము నుండి వచ్చిరి. రోడీషియా నుండి ఒక రాణి 27 పెట్టెలు ఉన్న ఒక రైలుబండి నిండా ఆఫ్రికను తెగవారిని తీసుకు వచ్చినది. వారు కొండలను, పొలములను దాటుకొంటూ బహు ప్రయాసపడి సహాయము కావలసియున్న తమ ప్రియులను వీపుల మీద ఎక్కించుకొని చాలా దూరముల నుండి వచ్చిరి. పరిశుద్దాత్మ ద్వారా బయలుపరచబడిన గొప్ప క్రియలను చూచి మొత్తం దేశమంతయూ తలక్రిందులయినది.
ఒక మధ్యాహ్నము నేను పరిచర్య చేయనారంభించాను, వేలాదిమంది మహమ్మదీయులు అచ్చట వుండిరి. అందులో ఒకామె వేదిక మీదికి వచ్చెను, ఆమె నా ఎదురుగా నిలబడినది, ఇంతలో మహమ్మదీయులకు మిషనైరీగా ఉన్న ఒక వ్యక్తి నెమ్మదిగా ప్రభువును అడుగసాగెను, 'ఓ, ఆ గొప్పదగు ఆత్మ కొరకు. ఓ, ప్రశస్తమగు దేవా? అనేక సంవత్సరముల నుండి అక్కడే యుండిన అతను స్వయంగా సాక్ష్యమిచ్చినాడు. ఇన్ని సంవత్సరముల నుండి ఒక్క మహమ్మదీయుడు మాత్రమే రక్షించబడి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినట్లు చెప్పినాడు. వారు నిజంగా మాదీయ-పారసీకులు, వారి చట్టములు మారలేదు. వారిని జయించుట చాలా కష్టము. "ఒక్కసారి మహమ్మదీయుడయితే ఎల్లప్పుడూ మహమ్మదీయుడే," అని అందురు. అది వారి యొక్క చట్టము.
ఆమె నా ఎదుట నిలబడి యుండగా నేను మాట్లాడసాగాను. అక్కడున్న అనువాదకులు ఆ వేలాది మందికి చెప్పుచుండిరి, "యేసు ప్రభువు రక్షించుటకు వచ్చెనని మిషనైరీలు ఎంతో కాలమునుండి అక్కడ చెప్పుచుండిరి. అవునా? అని ఆ మాటను చెప్పుచుండగా, ఆ జనులందరూ ఒకరివైపు ఒకరు చూచుకొనుచుండిరి. వారు అది సత్యమని ఆలాగే జవాబు ఇచ్చిరి, (వారి ముందర నేను బైబిలును పైకి ఎత్తి చూపించాను) "ఈ గ్రంథములో నుండియే మిషనైరీలు వారికి యేసును గూర్చి చదివి వినిపించిరా. యేసు గొప్ప స్వస్థపరచువాడు. ఆయన అన్ని యుగములలోను తన ప్రజలలో జీవించుచున్నాడు. ఆయన మరల వచ్చి తన స్వకీయులను చేర్చుకొనును. అంతవరకు ఆయన వారిలో జీవించుచునే యుండును. యేసులో యుండిన ఆత్మయే వారిలోను యుండును అని చెప్పినా? అందువలన వారును యేసు చేసినటువంటి గొప్ప కార్యములనే చేయుదురు అని వారు మీకు చెప్పెనా? మీరును స్వస్థత పొందగలరు. మీరును రక్షణ పొందగలరు అని చెప్చెనా? ఈ యేసు మన మధ్యకు వచ్చి చాలాకాలం క్రిందట భూమీ మీద శరీరముతో ఉండినప్పుడు చేసిన కార్యములనే జరిగించబోవుచున్నాడు. మీలో ఎందరు దీనిని చూడగోరుచున్నారు?" ఆ ప్రశ్నకు వారందరూ చూడగోరుచున్నామని జవాబు పలికిరి. వారు మాత్రమే కాదు. అందరూ అందుకు సమ్మతించిరి.
ఇంకా నేను ఈలాగు చెప్పసాగాను, "యేసు భూమిమీద ఉండగా చేసిన కార్యములు ఇక్కడ మరల చేసినయెడల మీరందరూ ఆయన వాక్యమును నమ్ముదురా? నా ఎదుట ఆ ముస్లిం స్త్రీ ఉన్నది. నా ద్వారా ఆత్మ సంచారము చేసినది.
నేను ఆ స్త్రీతో "నేను నిన్ను ఎరుగను. నీ భాష కూడా రాదు." దానిని ఆమె అంగీకరించినది. "నావలన స్వస్థత కలుగదు, నీకు తెలుసు నేను చేయలేను. కానీ ఈ మధ్యాహ్నము మీరు వర్తమానము విన్నారు మరియు నన్ను అర్ధము చేసికొన్నారు." తర్జుమా చేయుచున్న ఇండియను వ్యక్తి ఆమె అర్థము చేసికొనినట్లు చెప్పగా, ఆమె క్రొత్త నిబంధనను కూడా చదివినది.
మహమ్మదీయులు అబ్రహాము యొక్క సంతతియైయున్నారు. వారు ఒకే దేవునిని నమ్మదురు. కాని వారు యేసును దేవుని కుమారుడు కాద౦దురు మరియు దానికి బదులుగా మహమ్మదు ఆయన ప్రవక్త అందురు. యేసు ఎన్నడూ చనిపోయి తిరిగి లేవలేదని వారందురు. వారి మత గురువులు ఆ ప్రకారముగా వారికి బోధించిరి గనుక వారది నమ్ముదురు.
కాని నేనిట్లు చెప్పాను, "యేసు చనిపోయి మరల లేచెను. ఆయన తన ఆత్మను మరల సంఘము మీదికి పంపెను. ఆయనలో ఉండిన ఆత్మయే ఇప్పుడు సంఘములో యున్నది. యేసు చేసిన కార్యములనే అది చేయును."
యోహాను 5:19 ఆయన ఇట్లు చెప్పెను,
"కాబట్టి యేసు వారికిట్లు ప్రత్యత్తరమిచ్చెను — తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కానితానంతట తాను ఏదియు చేయడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు ఆలాగు చేయును."
యేసు వచ్చి నా ద్వారా మీ వ్యాధిని, మీరిచ్చటికి ఎందుకు వచ్చితిరో తెలియచేయును — మీ గతమును గూర్చి ఆయన చెప్పినచో, నిశ్చయంగా మీ భవిష్యత్తు కొరకు మీరాయనను నమ్మగలరా?
"అవును, నిశ్చయంగా నమ్ముదును," అని తర్జుమా చేయువాని ద్వారా ఆమె పలికెను.
"అయితే ఆయన చేయును," అన్నాను.
ఆ మహమ్మదీయులు జాగ్రత్తగా గమనించుచుండిరి. ఏమి జరుగునోయని వారందరూ ముందుకు వంగి చూచుచుండిరి.
అప్పుడు పరిశుద్దాత్మ మాట్లాడెను, "నీ భర్త పొట్టివాడు, స్థూలకాయుడు, నల్లని మీసమున్నది. నీకు ఇద్దరు పిల్లలు. దాదాపు మూడు రోజుల క్రితం నీవు వైద్యుని యొద్దకు వెళ్ళావు మరియు అతడు నిన్ను పరీక్షించెను. నీ గర్భాశయములో ఒక కాయ పెరిగినది."
ఆమె తన తలను వంచి "ఇది నిజమే," అని చెప్పెను.
"నీవు మహమ్మదీయ ప్రవక్త యొద్దకు వెళ్ళకుండా నా యొద్దకు ఎందుకు వచ్చితివి, నేను క్రైస్తవుడను కదా?" అన్నాను.
"నీవు నాకు సహాయము చేయగలవని తలంచాను," అన్నది.
"నేను నీకు సహాయము చేయలేను, కాని యేసుక్రీస్తును నీవు నీ స్వరక్షకునిగా స్వీకరించినయెడల, ఆయన నీకు సహాయము చేయును. ఆయన ఇప్పుడిక్కడున్నాడు, నీ గూర్చి ఆయనకు తెలియును," అన్నాను.
ఆమె ఇట్లన్నది, "నా రక్షకునిగా యేసును నేను అంగీకరించుచున్నాను." అంతే. ఆమె స్వస్థతపొందెను, ఆ దినమున దాదాపు పదివేలమంది మహమ్మదీయులు క్రీస్తు యొద్దకు వచ్చిరి, ఎందుకనగా సువార్త మాటలోను, క్రియలోను వెల్లడయ్యెను. ముప్పయి సంవత్సరాల కష్టించి మరియు పంటను కోయరాదని దేవుడెన్నడు మనుష్యునికి చెప్పలేదు. ఆయన తెరచిన తలుపును ఇచ్చెను, అదియే వాక్యము మరియు శక్తి, దానినే మనము వాడుకొనవలసి యున్నాము. దానివలననే పౌలుకు గొప్ప ఫలము గల సేవ వచ్చెను. I కొరింధీ 2:4, "నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను ఉపయోగింపక, పరిశుద్దాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించితిని."
ఇప్పుడు నా మాట వినండి. ఈ పర్యటనలోనే నేను రొడీషియాలోని న్యూ సాలిస్బరీలో విమానమును ఎక్కుచుండగా అమెరికను పాస్ పోర్టులు గల నలుగురిని నేను చూచాను. నేను వారియొద్దకు వెళ్ళి, "హలో, మీరు అమెరికను పాస్ పోర్టులు కలిగి యుండుట నేను చూచాను. ఎక్కడికయినా వెళ్ళుచున్నారా?" అని ప్రశ్నించాను.
"కాదు, మేమందరమూ ఇక్కడ మిషనైరీలము," అని యువకుడు జవాబు ఇచ్చెను.
"ఎంత మంచి పని! మీరు మీ స్వంతగా పనిచేయ వచ్చిరా? లేక ఏదయినా సంస్థతో పనిచేయుచున్నారా?" అనడిగాడు.
"మేము మెథడిస్టులము. మేము కెంటాకీలోని విలుమర్ నుండి వచ్చాము," అన్నాడు.
"అది నా ఇంటి వెనుక యున్నట్లే యున్నది," అన్నాను.
"నీవు ఆ దారిలో పయనించుచుండు బ్రెన్హాం సోదరునివి కదా?" అన్నారు.
"అవును, నిజంగా" అన్నాను. అది వారిని ఆశ్చర్యపరచినది. అతడు మారు మాట్లాడలేదు — అతడు ఇంకా, ఆ ముగ్గురు బాలికలు ఒకరి ముఖం వైపు మరియొకరు చూచుకొన్నారు. "ఒక్క నిమిషం ఆగు కుమారుడా! మీ అందరితోను నేను కొన్ని నియమముల గూర్చి మాట్లాడగోరుచున్నాను, ఎందుకనగా మనందరము క్రైస్తవులము. గొప్ప ఉద్దేశ్యముతో ఇచ్చటికి వచ్చియున్నాము. ఇప్పుడు మీ నలుగురు రెండు సంవత్సరములు ఇచ్చట యుండుటకు వచ్చియున్నారని చెప్పియున్నారు. మీరు ప్రభువు కొరకు ఒక ఆత్మను సంపాదించినట్లు మీ వ్రేలు పెట్టి చూపించగలరా?" వారది చేయలేరు.
"బాలికలారా, మిమ్మును నేను కించపరచుట లేదు." మీరందరూ మీ ఇండ్లయొద్ద మీ తల్లులకు పాత్రలు తోముటలో సహాయపడవలసినది. మీరు పరిశుద్దాత్మతో నింపబడు వరకు మీకు బయటకు వచ్చి పని చేయుటతో సంబంధము లేదు. నిజమగు సువార్తను బోధించవలెను. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రచురపరచవలెను. యేసు చెప్పిన ఫలితములను మీరు చూడవలెను, లేనిచో మీరు నిజమగు సువార్త బోధించుట లేదని అర్థము."
మరో అడుగు ముందుకు వెళ్ళి మిషను పరిచర్యలో సంగతులు ఎట్లుండునో నేను చూపించెదను. అంతా ఆ విధంగానే యుండునని నేను చెప్పుట లేదు, కాని చాలా వరకు ఈ విధంగానే యున్నది. ఇదే పర్యటనలో నేను మేయరుతో కలిసి డర్బన్ చుట్టూ తిరుగుచున్నప్పుడు ఒక స్థానికుని నేను చూచాను. అతని మెడకు ఒక కాగితము తగిలించబడియున్నది. అతడు ఒక విగ్రహమును మోసికొని వచ్చుచున్నాడు. ఈ కాగితము ఎందుకు తగిలించుకొన్నాడని, నా స్నేహితుని ప్రశ్నించాను. ఒక స్థానికుడు క్రైస్తవుడయినప్పుడు అతనిని ఈలాగు చేయుదురని, నాకతడు చెప్పెను. నేను చాలా ఆశ్చర్యము పొందాను, ఎందుకనగా అతడు క్రైస్తవుడని పిలచుకొనుచూ ఒక విగ్రహమును మోయుచున్నాడు, అదెట్లు సాధ్యమని నేనడిగాను.
"అతని భాష నాకు తెలియును, గనుక వెళ్ళి అతనితో మాట్లాడుదుము," అన్నాడు.
కాబట్టి మేమతని యొద్దకు వెళ్ళాము, ఆ మేయరు నా అనువాదకునిగా యున్నాడు. అతడు క్రైస్తవుడేమోనని నేను అడిగాను. తాను నిశ్చయంగా క్రైస్తవుడనని అతడు చెప్పెను. క్రైస్తవుడయితే మత విగ్రహమును ఎందుకు మోయుట అని నేనడిగాను. అతని తండ్రి ఆ విగ్రహమును మోసి, ఇతనికి దానిని విడిచిపెట్టినట్లుగా చెప్పాడు. ఏ క్రైస్తవుడును విగ్రహములను మోయరాదని నేను అతనితో చెప్పినప్పుడు, అతడు ఈ విగ్రహము అతని తండ్రికి ఎంతగానో ఉపయోగపడినట్లుగా చెప్పెను. నాకు చాలా ఆశ్చర్యము కలిగి అదెట్లు సాధ్యమని అడిగాను. అతని తండ్రిని ఒక రోజన సింహము ఎదుర్కొన్నదట. అతడు నిప్పులు రాజేసి, ఆ విగ్రహముతో అతని మంత్రగాడు నేర్పించినట్లుగా మాట్లాడినాడట. సింహము వెళ్ళిపోయెనట, కాని ఆ సింహము నిప్పుల వలన అక్కడి నుండి వెళ్ళిపోయినదే గాని మరెందువలన కాదని అతనితో నేను చెప్పాను. అగ్ని అంటే అన్ని అడవి జంతువులకునూ భయమే అని చెప్పగా, అందుకతడు ఇచ్చిన జవాబును ఎన్నడును నేను మరువలేను. "అదే నిజమయితే అమోయా (ఆత్మ) తప్పిపోయినా గాని, ఈ విగ్రహము మాత్రము తప్పిపోదు," అని చెప్పెను.
(ఆఫ్రికా కూటముల యొక్క వివరణను మీరు తెలిసికొనవలెనన్నచో "ఆఫ్రికాను ప్రవక్త దర్శించుట," అను పుస్తకమును చదవండి.)
క్రైస్తవ సమూహముల యొద్ద ఉన్న బలమంతయూ అదే, ఎందుకనగా వాక్యము వారియొద్దకు తీసికొనిపోబడుట లేదు. పెంతుకోస్తు యొక్క అసలు తెరువబడిన తలుపు అదే.
ఇప్పుడు మనము మరల తెరువబడిన ఫిలదెల్ఫియా కాలము యొక్క మిషను తలుపు యొద్దకు వచ్చుదము. శక్తి యొక్క తెరువబడిన తలుపు దానియొద్ద లేదు. ఈ తెరువబడిన తలుపు గూర్చి చెప్పుబడిన ఈ వచనమునే మరల గమనించండి. "నీకు కొద్దిగా బలమున్నది." అది నిజము. ఆ కాలములో ఆత్మయొక్క బలము తప్పుకొనినది. వాక్యము బాగా బోధింపబడినది. రక్షణను గూర్చిన జ్ఞానమును ఆత్మలకు అందియున్నది. కాని ఆయన గొప్పకార్యములను చూపించిన ఆ మహా దేవుని శక్తి మరియు ఆయన హస్తము వారిపట్ల దాచబడియుండినది, చెల్లాచెదురయిన గుంపుల మధ్యనే అది యున్నది. దేవునికి స్తోత్రము, అది ఎదుగుచుండెను మరియు ఆ సంస్కరణ కాలములో యుండినది వర్ధిల్లుచుండెను.
తరచుగా మనము మిషనులకు తండ్రి అని పిలచువారు ఈ కాలములోనే బయలు వెళ్ళిరి. విల్లియం కేరీ, ఒక చెప్పులు కుట్టువాడు, ఇంగ్లాండులోని మౌల్టనులో ఒక ప్రత్యేక బాప్టిస్టు చర్చికి సంఘకాపరిగా పనిచేసెను. తన బోధ ద్వారా మనుష్యులను బహు బలముగా మేల్కోలిపెను. "సర్వలోకములోనికి వెళ్ళి సువార్తను ప్రకటించమను ఆజ్ఞ కేవలము అపోస్తలులకు మాత్రమే వర్తించదు గాని లోకాంతము వరకు సేవచేయు పరిచారకులందరూ క్రమముగా ఆజ్ఞను పాటించవలెననియు, ఆ వాగ్దానము అంతే సమానముగా నెరవేర్చ బడుననియు," అతడు నొక్కి చెప్పెను. కాల్వినిస్టులు అతనితో పోరాడిరి, ఎందుకనగా వారు ఎన్నిక చేసికొనుట అను సిద్దాంతముతో విపరీత స్థాయికి పోయిరి. రక్షింపబడు వారెవరో రక్షింపబడుదురు. ఆత్మ యొక్క కార్యమునకు మిషనెరీ పని వ్యతిరేకమని వారు చెప్పిరి. కాని ఆండ్రూ ఫుల్లర్ తన బోధ ద్వారాను, నిధులు పోగుచేయుట ద్వారాను కేరీకి సహాయపడెను. దాని యొక్క ప్రభావము వలన అన్ని దేశములకు సువార్తను ప్రకటించవలెనను ఉద్దేశ్యముతో వారు 1792వ సంవత్సరమున ఒక సొసైటీని స్థాపించిరి. ఈ సొసైటీ కేరీని పంపించగా ఇతడు ఆశీర్వదించబడిన వాడై దేవుని కొరకు ఇండియాలో ఆత్మలను సంపాదించెను. 1795వ సంవత్సరములో మేల్కోనబడిన క్రైస్తవులు లండన్ మిషనెరీ సొసైటీని స్థాపించిరి. దీనిని మనందరమూ బాగుగా ఎరుగుదుము. అది మిలియనుల పౌండ్లను పోగుచేసినది, వేలాది మంది మిషనైరీలను ఆ సంవత్సరములలో పంపించినది. ప్రభువు యొక్క కోరికను నెరవేర్చినది. దేవుని యొక్క ఆత్మ సంచరించుచుండెను, మరియు ఆసక్తిగల విశ్వాసులు "ఇతర గొర్రెలను" కూడా తీసికొని రావలెనని హృదయములో వేదన కలిగి మొరపెట్టుచుండిరి.
"నేను నీ యెదుట తెరువబడిన తలుపును ఉంచియున్నాను." ఈ మాటల వైపు మీరు మరల చూడవలెనని కోరుచున్నాను. ఈ సమయములో నేను దానిని మిషనులతో ముడివేయ గోరుటను విడిచిపెట్టను. ఒక ఆలోచనను నేను మీ ముందుకు తీసికొని రాగోరుచున్నాను. ఇది చివరి కాలము లోనికి లోతుగా తీసికొనిపోవును. ఇంతకు ముందే నేను చెప్పినట్లుగా, ఈ కాలము చివరి కాలము లోనికి వెళ్ళును. ఈ కాలములో యేసు ఈలాగు చెప్పెను, "నేను త్వరగా వచ్చుచున్నాను" (11వ వచనము), "చివరి కాలములో ఆయన పనిని పూర్తిచేసి దానిని కుదించును; ప్రభువు భూమి మీద పనిని కుదించును." రోమా 9:28. ప్రకటన 3:8లోని ఈ వచనము ఎట్లు వెళ్ళునో చూడండి — "తెరువబడిన తలుపు — కొద్దిపాటి బలము, వాక్యము, నామము." ఆ తెరువబడిన తలుపునకు ఈ మూడింటితో సంబంధమున్నది. ఆ తలుపు ఇప్పుడు దేనికి సూచనగాయున్నది?
యోహాను 10:7లో ఇట్లు చెప్పబడినది,
"అటు తరువాత యేసు మరల వారితో ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
అది నిజము: గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఇది ఏదో మామూలు మాట కాదు. ఇది అక్షరాలా నిజము. " యోహాను 10లో యేసు చెప్పిన ఈ ఉపమానమును గ్రహించండి. ఆయన గొర్రెల కాపరిగా చెప్పుకొనెను. ఆ తరువాత ఆయన ద్వారమును నేనే అని చెప్పెను. గొర్రెల కాపరి, గొర్రెలకు అదే అయి యున్నాడు. ఆయన వాస్తవంగానే వారి ద్వారమై యున్నాడు.
నేను తూర్పు దేశములలో యుండగా దానిని చూచాను, రాత్రి సమయములో గొర్రెలకాపరి తన గొర్రెలనన్నింటిని ఒక చోటకు చేర్చును. అతడు వాటిని దొడ్డిలో చేర్చును. ఆ తరువాత అతడు వాటిని లెక్కించును. అవన్నియూ లోనికి వచ్చినట్లు నిశ్చయత పొందినప్పుడు, అతడు ఆ దొడ్డి యొక్క తెరువబడిన తలుపు యొద్ద పరుండును, మరియు అక్షరాలా అతడే ఆ మందకు ద్వారముగా యుండును. అతనిని దాటకుండా ఎవరును బయటకు వెళ్ళజాలరు లేదా లోనికి రాజాలరు. అతడే ద్వారము. నేను మరుసటి రోజున నా స్నేహితునితో జీపులో ప్రయాణము చేశాను. అప్పుడు ఆ గొర్రెలకాపరి, గొర్రెలను పట్టణములోనికి నడిపించుటను నేను గమనించాను. ట్రాఫిక్ మొత్తం ఆగిపోయినది, గొర్రెలు పోవుటకు అందరూ మార్గము ఇచ్చిరి. తూర్పు దేశములలో పట్టణములు మన పట్టణములవలె యుండవు. మనము మన వ్యాపారమంతయూ లోపల చేసెదము; కాని అక్కడయితే అది వ్యవసాయ సంతవలె యుండును, తమ వస్తువులను రహదారి మీదనే పెట్టెదరు, దారిన వెళ్ళువారు వాటిని చూచి కొనుచుందురు. "ఆ గొర్రెలు వచ్చుట చూచి నాకు భయము వేసినది, ఎందుకనగా ఆ తినుబండారములను చూచి గొర్రెలు ఊరుకొనవు గనుక అంతా గందరగోళమగును." కాని ఆ గొర్రెలకాపరి ముందు నడచుచుండెను, అతని అడుగుజాడలనే ఆ గొర్రెలు చక్కగా వెంబడించినవి. అవి ఆ ఆహార సామాగ్రిని చూచుచునేయున్నవి, కాని ఒక్క గొర్రె కూడా వాటిని తాకలేదు. ఓ, వాటి భాష నాకు తెలిసియుండినచో ఎంత బాగుండును! నేను చూచిన దానిని గూర్చి ట్రాఫిక్ ను ఆపి అక్కడ ప్రసంగము చేసియుండెదను.
ఆ గొప్ప గొర్రెల కాపరియొక్క గొర్రెలముగా మనమున్నయెడల, ఆయన యొక్క అడుగుజాడలను మనము వెంబడించవలెను, ఆ గొర్రెలు వెంబడించినట్టే వెంబడించవలెను. గడ్డి మీద సంఘము యొక్క పెద్ద పుష్పము చూచి ఆగిపోవు లేక డి.డి., లేదా పి.హెచ్.డి., లేదా ఎల్.ఎల్.డి., చదివిన వారి స్వరమును వినుటకు ఆగవు, అయితే నీవు గొర్రెల కాపరితోనే నిలచియుందువు. ఆయన గొర్రెలు ఆయన స్వరమును విని ఆయనను వెంబడించునని బైబిలు చెప్పెను, క్రొత్తవాని స్వరమును వినినయెడల అవి పారిపోయి వాటి నిజమగు గొర్రెలకాపరి యొద్దకే అవి పరిగేత్తును. దేవునికి స్తోత్రము.
కాని నేను చూచి నేర్చుకొన్నదంతా అదే కాదు. ఒక రోజు నేను పొలములో వివిధ జంతువులను మేపుచున్న వారిని చూచాను. నాకు ఒక ఆలోచన కలిగినది. ఒకడు కొన్ని పందులను, మరొకడు కొన్ని మేకలను, మరొకడు కొన్ని ఒంటెలను, మరొకడు కొన్ని గాడిదలను మేపుచున్నాడు. కాబట్టి నేను అక్కడ ఉండిన నా స్నేహితునిని అడిగాను. ఆ మేపు వారిని ఏమంటారని అడిగాను. "ఓ," "వారు గొర్రెల కాపరులు," అని జవాబిచ్చెను.
దానిని నేను అంగీకరించలేకపోయాను. వారందరూ గొల్లవాళ్ళని నీవు చెప్పుచున్నావు కాని గొల్లవాళ్ళు గొర్రెలనే గదా మేపుదురు అని అడిగాను.
"కాదు," "పశువులను మేపినా, మరే జంతువును మేపినా, అందరినీ గొల్లవాళ్ళని అందురు," అన్నాడు.
అది నన్ను ఆశ్చర్యపరచిసది. కాని ఆ పశువుల కాపరులకును మరియు గొర్రెల కాపరులకును మధ్య ఒక భేదము నేను గమనించాను. రాత్రి సమయము వచ్చినప్పుడు ఆ గొర్రెల కాపరి తప్ప మిగిలిన కాపరులందరూ జంతువులను పొలములో విడిచిపెట్టి ఇండ్లకు పోయెదరు. గొర్రెల కాపరి తన గొర్రెలను వెంటబెట్టుకొనిపోయి, వాటిని దోడ్డిలోనికి తీసికొనివెళ్ళి అక్కడే పరుండును మరియు వాటికి తలుపుగా నుండును. ఓ, దేవునికి స్తుతి, మన గొర్రెలకాపరి మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. రాత్రి సమయము వచ్చినప్పుడు నేనాయన మందలో ఉండగోరుచున్నాను. ఆయన యొక్క కాపుదలలో నేనుండగోరుచున్నాను.
యేసే ఆ ద్వారమని మనము చూడగలము. ఆయనే గొర్రెలు పోవు ద్వారము. దానిని గమనించండి. తలుపు తెరువబడుటను గూర్చి ఇప్పుడది మాట్లాడుచున్నది. అది ఆయన యొక్క ప్రత్యక్షత కాక మరేమిటి? ఆ ప్రత్యక్షత తెరువబడుట వలన మనకు బలము కలుగుచున్నది, వాక్యమును వెలిగించును మరియు ఆయన నామమును మహిహపరచును. రెండు చివరి కాలములకు మధ్యను యేసుక్రీస్తు దైవత్వము యొక్క ప్రత్యక్షత మన ముందు విప్పబడినది. అవును, ఆయన దేవుడని మనకు తెలియును. లేనియెడల ఆయన మనకు రక్షకునిగా ఎట్లు యుండగలడు? కాని ఆయనే దేవుడని మనకు తెలియును, ఆయన మాత్రమే దేవుడు. ఆయనే అల్ఫా మరియు ఓమేగా —ఈ యేసే ప్రభువు మరియు క్రీస్తు అయి ఉండి — ప్రభువైన యేసు క్రీస్తుగా ఉన్నాడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అన్నీ ఒకే వ్యక్తి — మొదటి సంఘ కాలము యొద్ద నుండి అది పోయినది, కాని ఇప్పుడు మరల దానిని మనము చూచుచున్నాము. ఆయన ఎవరైయున్నారో ఆ ప్రత్యక్షత మరల వచ్చుచున్నది. దేవత్వము నిశ్చయంగా ముగ్గురు వ్యక్తులుగా లేక ఒకే వ్యక్తిగా కాదు, వ్యక్తిత్వము వలన వ్యక్తి తయారగును. ఒకే వ్యక్తిత్వమున్నచో, ఒకే వ్యక్తి యుండును. కాని ముగ్గురు వ్యక్తులయందు విశ్వాసముంచు వ్యక్తి, మొదటి ఆజ్ఞను మీరిన దోషియగును.
కాని దేవత్వము యొక్క ప్రత్యక్షత తిరిగి వచ్చియున్నది. ఇప్పుడు నిజమగు సంఘము మరల బలముతో నిర్మాణమగును. ఇంత కాలమయిన తరువాత చివరగా ఆమె తన ప్రభువును ఎరిగియున్నది. మరల మనము ప్రభువైన యేసు నామములో బాప్తిస్మమిచ్చుచున్నాము, వారు పెంతెకోస్తు యొద్ద చేసిన విధముగా.
దేవుడు నాకిచ్చిన ఒక దర్శనమును మీకు చెప్పెదను, అది త్రిత్వ బాప్తిస్మమును గూర్చినది. ఇది దర్శనము కాదు గాని, ఒక కల. సంఘ కాలముల ఆశీర్వచనములలో ఒకటి, ఏమనగా, ఒకడు దర్శనము పొందుకోను విధముగానే, పరిశుద్దాత్మ ద్వారా కలలను పొందుటయని మీకు నిశ్చయముగా తెలియును. అది శనివారము ఉదయము దాదాపు 3 గంటల సమయము. జోసెఫ్ నకు మంచినీరిచ్చుటకు నేను లేచాను. మరల నేను పండుకొనగా వెంటనే నిద్రపట్టినది, అప్పుడు ఈ కల వచ్చినది. నా తండ్రివలె యుండిన, ఒకనిని నేను చూచాను. అతడు చాలా బలిష్టునిగా యున్నాడు. ఒక స్త్రీని కూడా చూచాను, ఆమె నా తల్లివలెయున్నది, కాని ఆమె రూపము వేరుగా యున్నది, ఆ మగవాడు కూడా నా తండ్రి రూపములో లేడు. ఇతడు తన భార్యపట్ల చాలా క్రూరముగా ప్రవర్తించుచుండెను. అతని యొద్ద పెద్ద కర్రయున్నది, దానికి మూడు కోనలున్నవి. మీరు ఒక మొద్దను తీసికొని దానిని గొడ్డలితో నరికినప్పుడు మూడంచుల పేడు వచ్చును. దానిని మనము వంట చెరకుగా వాడుచుందుము, అది ఆవిధముగా యున్నది. అతడు ఈ కర్రను తీసికొని ఆమెను కొట్టుచుండెను, ఆమె క్రిందపడిపోయినది. ఆమె అక్కడ పడి ఏడ్చుచుండెను, అతడు గుండెను ముందుకు చాచి, గర్వపు ముఖముతో, అతిశయపు చూపులతో అటు ఇటు నడచుచుండెను. ఆ దీన స్త్రీని కొట్టి ఈ వ్యక్తి, గొప్ప గర్వమును, సంతృప్తిని వ్యక్తపరచుచుండెను. ఆమె పైకి లేవబోయిన ప్రతిసారియు అతడామెను కొట్టుచుండెను. అతడు చేయుచున్నది నాకు నచ్చలేదు. అతనిని అడ్డగించవలెనని ప్రయత్నము చేయగోరాను. కాని "అతనిని ఎదిరించు బలము నాకు లేదని అనుకొన్నాను, చాలా పెద్దగా యున్నాడు, అప్పుడతడు నా తండ్రిని పోలియున్నాడు." కాని అతడు నా తండ్రి కాడని నా అంతరంగమందు ఎరుగుదును. కాని ఏ వ్యక్తికిని స్త్రీని కొట్టు అధికారము లేదు. నేను దగ్గరకు వెళ్ళి అతని కాలరును పట్టుకొని, ఇటు అటు ఊపి, "నీకామెను కొట్టు హక్కులేదని చెప్పాను." ఆ విధంగా నేను చెప్పగానే, నా కండరములు ఎదిగి నేను మహా బలాఢ్యునివలె కనిపించసాగాను. ఆ వ్యక్తి నా భీకర రూపము చూచి భయపడెను. "ఆమెను మరల కొట్టినచో, నాతో ఢీకొందువు, అని పలికాను." అతడామెను కొట్టుటకు సంకోచించెను. నా కల ముగిసినది.
ఆ కల అయిపోయిన వెంటనే నేను లేచాను. ఎంత వింతగా యున్నది అనుకొన్నాను. ఆ స్త్రీని గూర్చి నాకు కల ఎందుకు వచ్చినదో అర్ధము కాలేదు. ఆకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షమాయెను, దేవుని యొక్క సన్నిధి నాకు తెలియసాగినది. ఆయన నుండి ఆ కల భావము నాకు తెలిసినది. (చాలా సార్లు నేను మీ కలలకు అర్థమును ఖచ్చితంగా చెప్పుటను మీరెరుగుదురు; అంతే గాకుండా చాలా, చాలా సార్లు, మీ కలను నాకు చెప్పకుండానే, నేను చెప్పుట జరిగినది.) ఆ స్త్రీ ఈనాటి ప్రపంచపు సంఘముగా యున్నది. ఈ గందరగోళములోనే నేను పుట్టాను — ఆమె గందరగోళములోనే యున్నది. ఆమె ఒకరకమగు తల్లివలె యున్నది (ఆమె వేశ్యలకు తల్లి). ఆమె భర్త అనగా శాఖ, ఆమెను శాఖలు ఏలుచున్నవి. ఆ ముక్కోణములు గల కర్ర ఏమనగా, అబద్ధపు త్రిత్వ బాప్తిస్మము. ఆమె లేచుటకు చాలాసార్లు ప్రయత్నించినది (దాని అర్థము ఏమనగా, సమూహములు సత్యము అంగీకరించవలెనను కొరుచున్నవి) కాని అతడామెను తన అబద్ధ బోధతో క్రిందికి పడవేయుచున్నాడు. అతడు చాలా పెద్దగా యున్నాడు, మొదట నేను వానిని చూచి భయపడితిని, కాని నేనతనికి వ్యతిరేకముగా నిలబడినప్పుడు, నాకు గొప్ప బలమగు కండరములు వచ్చుట చూచాను. అవి విశ్వాస కండరములు. ఆ కల యొక్క భావమును గ్రహించండి, "దేవుడు నాతో యున్నాడు గనుక నాకు బలము వచ్చియున్నది, ఆ శాఖల యొక్క బలమును లోకము యొక్క అధికారమును నేను ఎదిరించి నిలబడితిని, మరియు అతడామెను కొట్టుట ఆపి వేసెను."
కలను ఆధారముగా చేసికొని నేను ఒక సిద్దాంతమును నిర్మించుటకు పూనుకొనుట లేదు. కల ద్వారా నేను నా యొక్క సిద్దాంతమును బయలుపరచుటకు ప్రయత్నము చేయుట లేదు. దైవత్వము యొక్క ఏకత్వమును గూర్చిన బోధ ఆదికాండము 1:1 నుండి మొదలుకొని ప్రకటన 22:21 వరకుయున్నది. కాని ప్రజలు లేఖన సహితము కాని ఒక సిద్ధాంతమును పట్టుకొని గ్రుడ్డివారయియున్నారు, మరియు ఆ త్రిత్వ బోధను విశ్వవ్యాప్తము చేసియున్నారు. దానిని అందరూ అంగీకరించారు. ఒకే దేవుని వ్యక్తిత్వమును చూచుటకు ప్రయత్నించుచున్నాను గాని అది అసాధ్యముగా తోచుచున్నది. దేవత్వము యొక్క సత్యమును జనులు చూడలేకపోవుచున్నారు. దానికి విరోధముగా పోరాడుచున్నారు. మిగిలిన సత్యమును కూడా వారు ఎన్నడునూ చూడలేరు, ఎందుకనగా యేసు క్రీస్తుయే ప్రత్యక్షతయై యున్నాడు. ఆయన సంఘములో యుండి, ఆ సంఘములో తన క్రియలను బయలు పరచుచున్నాడు. ఏడు సంఘ కాలములలో అది ప్రత్యక్షమయినది. దానిని మీరు గ్రహించారా? మీరు నిశ్చయముగా అర్థము చేసికొనగలరని నమ్ముచున్నాను.
"నీకు మిగిలియున్న కొద్ది బలముతో నీవు నా వాక్యమును గైకొని నా నామమును కాదనలేదు." బలము ఎట్లు వచ్చుచున్నదో ఇంతకు ముందే చెప్పాను. బలవంతముగా అణచుట వారివల్ల కాకపోయెను. ప్రజలు తమ ఇండ్లను, దేశములను విడిచిపెట్టి ఆరాధనా స్వేచ్చను కోరుకొనిరి. పాలనా విభాగపు కాడి విరుగగొట్టబడినది. ఒక గుంపును రేపి మరొక గుంపు మీదికి వెళ్ళునట్లు చేయుట బుద్ధిహీనపు పని అని ప్రభుత్వములు గమనించి యున్నవి. వాస్తవానికి జనులు బాగుగా గ్రహించిరి గాని నడిపింపు మంచిది కాదు, తమ మత హక్కులను పరిరక్షించు కొనుటకు జనులు పోరాడుటకైనను సిద్ధపడిరి. మత బలము యొక్క అత్యధిక ప్రదర్శన ఈ కాలములో చూతుము. విప్లవము ద్వారా ఫ్రాన్సు పతనమయినది. గొప్ప బ్రిటను లోనికి విప్లవము రాకుండా మహా వెస్లీయన్ ఉజ్జీవము అడ్డగించినది. అనేక మహిమాన్విత సంవత్సరములు దేవుని చేతిలో సాధనముగా యుండుటకు ఆమెను రక్షించెను.
వాక్యమును బోధించుట ఎన్నడూ హెచ్చలేదు. స్వేచ్చగా ఆలోచించు మనుష్యులను సాతాను లేపినది, కమ్యూనిజం యొక్క మూల కర్తలు లేచిరి. ఉదార వేదాంత పండితులు తమ అపవిత్ర బోధలను వ్యాప్తి చేసిరి. దేవుడు మహా-విశ్వాస-యోధులను లేపెను, క్రైస్తవ సాహిత్యములో గొప్ప వ్రాతలు వెలువడినవి. ఈ శతాబ్దములోనే ఉపదేశము మరియు బోధించుట ఉద్భవించినవి. అటువంటి బోధకులు గాని, ఉపదేశకులు గాని లేరు. వారికెవరూ సాటిరారు. స్పర్దన్, పార్కర్, మెక్క్లారెన్స్, ఎడ్వార్డ్, బన్యన్, ముల్లర్, బ్రెయినార్డ్, బార్నెస్, బిషప్స్, తదితరులందరూ ఈ శతాబ్దములో నుండియే వచ్చిరి. వారు బోధించిరి, ఉపదేశించిరి, వాక్యమును వ్రాసిరి. వారు ఆయన నామమును మహిమపరచిరి.
అబద్ద యూదుని యొక్క తీర్పు
ప్రకటన 3:9,
"యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెను. వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారము చేసిరి. ఇదిగో, నేను, నిన్నుప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను."
రెండవ కాలములోనే ఈ అబద్ద యూదులు లేదా అబద్ధ విశ్వాసుల యొక్క సమస్య యున్నదని మనము గమనించగలము. మేము యూదులమని వారు అబద్ధముగా చెప్పుకొనిరి. మొదటి కాలములో మొదటి కుమ్మరింపు జరుగగానే వారాలాగు చెప్పుకొనసాగిరి. ఇప్పుడు వారు మరల సంస్కరణ కాలము తరువాత కనబడుచున్నారు. ఇది ఆకస్మిక పరిమాణము కాదు. నిశ్చయంగా, ఇది ఆకస్మిక సంఘటన కాదు. ఇది సాతాను యొక్క సిద్దాంతము. సంస్థగా మార్చుటయే దాని సిద్దాంతము. ఆ సంస్థయే అసలయినది చెప్పును. ప్రత్యేక హక్కులు మరియు భాగ్యములు అందువలన పొందును. మీకు చూపించెదను. స్ముర్న కాలములో వీరు అబద్ధమాడిరి. నిజంగా యూదులము మేమేనని చెప్పుకొనిరి. (లేక విశ్వాసులు) కాని వారు ఖచ్చితంగా కారు. వారు సాతాను సామాజపువారు. వారు సాతాను యొక్క సంస్థకు చెందిన గుంపు. సేవ చేయుచున్న సోదరుల మీద నాయకత్వము చేయువారు ఈ కాలములోనే లేనసాగిరి. (పెద్దల మీద జిల్లాలో బిషప్పులు నియమింపబడిరి) మరో సంగతి మనము చూచెదము. మూడవ కాలములో "సాతాను సింహాసనము" అని పిలువబడిన ఒక చోటు ఖచ్చితముగాయున్నది. ఆ కాలములో సంఘము మరియు రాజ్యము పెండ్లి చేసికొనినవి. దాని వెనుక రాజ్యము యొక్క బలమున్నందువలన శారీరకముగా సంఘమును జయించుట అసాధ్యము.
కాని దేవుడు ఆ బలమును విరుగగొట్టెను, రాజ్యము యొక్క బలము ఉన్నాగాని సంస్కరణ ద్వారా గొప్ప వెలుగు వచ్చెను. కాని ఏమి జరిగినది? లూథరనులు సంస్థగా మారి రాజ్యముతో కలిసిరి. మరల ఈ ఆరవ కాలములో సాతాను సమాజము బయలుదేరుట మనము చూచెదము. మేము సాతాను సమాజపు వారమని వీరు చెప్పుకొనరు. తాము దేవుని సంబంధికులమనియే చెప్పుకొందురు. కాని వారు అబద్ధమాడుచున్నారు. అంతరంగమందు యూదుడైనవాడే నిజమగు యూదుడు. (వారాలాగే చెప్పుకొనిరి) — ఆత్మయందు యూదుడు. వారు అబద్ద యూదులు. అనగా వారు యూదా 19లోచెప్పినట్లుగా యున్నారు, "ఆత్మపూర్ణులు కారు." దేవుని యొక్క పిల్లలనగా ఆత్మ మూలముగా జన్మించినవారు. కాని వీరు ఆత్మలేని వారు, కాబట్టి వారు దేవుని పిల్లలు కారు. వారింత తీవ్రముగా వ్యతిరేకించుచున్నా గాని, ఎంతగా నిరూపించుకొనవలెనని ప్రయత్నించినా గాని, వారు కారు. వారు మృతులే. వారు సంస్థ యొక్క పిల్లలు. నిజమగు ఫలములు వారిలో కనబడవు. వారు తమ యొక్క స్వంత ఆచారముల మీద కట్టబడియున్నారు. వారి సిద్దాంతములు మరియు బోధలు వేరు, వారిలో సత్యము లేదు, వారు దేవుని వాక్యమును విడిచిపెట్టి మానవుల ఆలోచనలను తీసికొనిరి.
రెండు వేర్వేరు ఆత్మల నుండి వచ్చియున్న రెండు ద్రాక్షావల్లుల గురించి ఇంతవరకూ నేను మీతో చెప్పుచూ వచ్చిన దానిని గమనించండి. ఈసారి ఉదాహరణముగా యేసును మరియు యూదాను చూద్దాం. యేసు దేవుని కుమారుడు. యూదా నాశన పుత్రుడు. దేవుడు యేసులోనికి ప్రవేశించెను. సాతాను యూదాలోనికి ప్రవేశించెను.
సంపూర్ణమగు పరిశుద్దాత్మ పరిచర్యను యేసు కలిగియుండెను,
అపో. కా. 10:38,
"అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పిడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను."
అపొ. కా. 1:17,
"అతడు (యూదా) మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను."
మత్తయి 10:1,
"ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను."
యూదాలో నుండిన ఆత్మ యేసు పరిచర్యను వెంబడించెను. వారిద్దరును సిలువవరకు వచ్చిరి. యేసు సిలువ మీద వ్రేలాడెను. పాపుల కొరకు ఆయన సంతోషముగా తన ప్రాణమును ఇచ్చి తన ఆత్మను దేవునికి అప్పగించెను. ఆయనాత్మ దేవుని యొద్దకు వెళ్ళెను మరియు ఆ తరువాత పెంతుకోస్తు యొద్ద అది సంఘము మీద కుమ్మరింపబడెను. కాని యూదా ఉరివేసికొనెను మరియు అతని ఆత్మ సాతాను యొద్దకు తిరిగి వెళ్ళెను, కాని పెంతుకోస్తు తరువాత యూదాలో ఉండిన అదే ఆత్మ కారుద్రాక్షావల్లి లోనికి వచ్చినది. అది నిజమగు ద్రాక్షావల్లితో కూడా పెరుగుచున్నది. కాని గమనించండి, యూదా ఆత్మ పెంతెకోస్తు యొద్దకు ఎన్నడూ వెళ్ళలేదు. పరిశుద్దాత్మను పొందుటకు అది ఎన్నడునూ వెళ్ళలేదు. దానికి అవకాశము లేదు. యూదా ఆత్మ ఎందుకొరకు వెళ్ళినది? బంగారపు సంచి కొరకు వెళ్ళి యున్నది. అది డబ్బును ప్రేమించినది. అది ఇంకా డబ్బును ప్రేమించుచున్నది. అది యేసు నామములో గొప్ప కార్యములు చేయుచూ వెళ్ళుచుండవచ్చును, గొప్ప కూటములను ఏర్పాటు చేయుచుండవచ్చును, బాగా డబ్బును, భవనములను, విద్యను ఇంకా ఆయా వస్తు సంబంధమగు సంపదను సంపాదించుకొనుచుండవచ్చును. వారి మీద యుండిన ఆత్మను మీరు గమనించండి, మోసపోవద్దు, పండ్రెండు మందిలో ఒకనిగా యూదా వెళ్ళుచుండెను. అతడు అద్భుతములను కూడా చేసెను, కాని అతనిలో దేవుని యొక్క ఆత్మలేదు. అతనికి సేవయుండెను. అతడు పెంతెకోస్తు యొద్దకు ఎన్నడును రాలేదు, ఎందుకనగా అతడు నిజ సంతానము కాదు. అతడు దేవుని యొక్క నిజ బిడ్డ కాడు. లేదండీ, సాతాను యొక్క సమాజములో ఆ విధముగా అతడు చేరియన్నాడు. మీరు మోసపోవద్దు. మీరు ఏర్పరచబడినవారయితే మోసపోరు. మీరు మోసపోరని యేసు చెప్పెను.
అవును, వీరు క్రైస్తవులని చెప్పుకొనుచున్నారు గాని కారు.
"వారు వచ్చి నీ పాదముల యొదట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను."
I కొరింధీ 6:2,
"పరిశుద్దులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా?"
మీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుటకు పండ్రెండు మంది శిష్యులు సింహాసనములను అధిష్టించుట మాత్రమే కాదు గాని, పరిశుద్దులు కూడా లోకమునకు తీర్పు తీర్చుదురు. దేవునికి చెందినవారెవరో, దేవుడెవరిని ప్రేమించుచున్నాడో మనము కనుగొందుము. నిజంగా దేవుని యొక్క బిడ్డ ఎవరో, దేవుడు ప్రేమించు కుమారుడెవరో తెలిసికొందురు. అది బయలుపరచబడు దినము వచ్చుచున్నది. ఒక కొలత చొప్పున ఇప్పుడు లోకమును ఏలుచున్నవారు. చివరి కాలములో మృగము యొక్క ప్రతిమను తయారు చేయువారు, అందుమూలముగా లోకమును పరిపాలించువారు ఒక దినమున కృంగిపోదురు. అప్పుడు యేసు తన పరిశుద్దులతో కూడా వచ్చి, నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును. మత్తయి 25లో మనము ఖచ్చితంగా దానినే చూచియున్నాము, మొదటి పునరుత్థానమును తప్పించుకొనిన "వారందరూ" న్యాయాధిపతి యెదుటను ఆయన యొక్క వధువు ఎదుటును నిలబడుదురు.
మొప్పు మరియు వాగ్దానము
ప్రకటన 3:10,
"నీవు నా ఓర్పు విషయమైన వాక్యమునుగైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను."
"ఓర్పు విషయమైన వాక్యమనగా?" అర్థమేమిటి?
హెబ్రీ 6:13-15. "దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి — నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను." మనకియ్యబడిన దేవుని యొక్క వాక్యము గురించి ఆత్మ మాట్లాడుటను మీరు చూడగలరు. ఆ వాక్యము నెరవేరువరకు ఎదురుచూడవలెను, అందుకు సహనము కావలెను. అబ్రహాము విషయములో అదే జరిగినది. అదృశ్యుడగు ఆయనను చూచినట్లుగానే అతడు సహించెను. అతడు సహనము చూపెను మరియు చివరకు ఆ వాక్యము నెరవేర్చబడెను. ఈ విధముగానే దేవుడు తన ప్రజలకు సహనము నేర్పును. ఆయన తన వాక్యమును శరీర ప్రత్యక్షత ద్వారా నెరవేర్చును. నీవు ప్రార్ధించిన వెంటనే అది దొరికినచో నీకు సహనము రాదు. ఇంకా చెప్పాలంటే జీవితములో చాలా అసహనమును పొందెదవు. ఇంకా తేటగా ఈ సత్యమును నేను మీకు చూపించెదను.
హెబ్రీ 11:17,
"అబ్రహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను."
అతడు వాగ్దానమును పొందెను (దేవుని యొక్క వాక్యము). వాగ్దాన వాక్యమును పొందిన తరువాత అబ్రహాము శోధింపబడెను. మనము దేవుని యొక్క మంచి వాగ్దానములను తీసికొని యేసు నామములో ప్రార్ధించిన వెంటనే ఇక శోధనలు రావనుకొందుము. కాని ఇక్కడ అది చెప్పుచున్నది, వాగ్దానము పొందిన తరువాత అబ్రహాము శోధింపబడెను.
కీర్తన కారుని ప్రకారము కూడా అది అక్షరాలా నిజము, యోసేపును గూర్చి ఇట్లు చెప్పెను.
కీర్తనలు 105:19,
"అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు: యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను."
అత్యధికమగు గొప్ప ప్రశస్త వాగ్దానములను దేవుడు మనకు అనుగ్రహించును. వాటిని నెరవేర్చుదునని కూడా ఆయన వాగ్దానము చేసెను. ఆయన నెరవేర్చును. మనము ప్రార్ధించుట ఆరంభము చేసిన కాలము మొదలుకొని మనము దానికి జవాబును పొందుకాలము వరకును మనము ఓర్పుతో యుండి కనిపెట్టుట అవశ్యము. మన ఆత్మలను సహనములో నడిపించుకొనుచున్నచో మనము జీవమును పొందుదుము. ఈ పాఠమును నెరవేర్చుకొనుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక! ఈ ఆరవ కాలములోని జనులు సహనమును నేర్చుకొనుట గూర్చి మనము చూచాము. ఈ గొప్ప క్రైస్తవుల యొక్క జీవిత చరిత్రలను మనము చదివాము; వారి జీవితములకును మన జీవితములకును మధ్య ఎంతా తేడా యున్నది! ఎందుకనగా వారెంతో సహనమును, నెమ్మదిని కలిగియుండిరి. కాని ఈ రోజున మనమందరము అసహనము మరియు తొందరపాటు వలన ఓడిపోవుచున్నాము.
ఆయన వారికి ఇంకా ఈలాగున చెప్పుచున్నాడు, "నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను." ఇక్కడ కూడా మనము రెండు కాలముల యొక్క ఆరంభము, అంతములను చూడగలము. ఈ వాగ్దానము అన్యుల యొక్క అంతమును చూపించుచున్నది. మహా శ్రమల కాలముతో అది పరిసమాప్తియగును.
"భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను." నిజమగు సంఘము శ్రమలలోనికి వెళ్ళి శ్రమల కాలమును దాటి వచ్చునని ఈ వచనము యొక్క అర్ధము కాదు. దాని అర్థము అదే అయితే, ఆ ప్రకారంగానే చెప్పియుండును. "శోధనకాలములో నేను నిన్ను కాపాడెదనని" చెప్పబడియున్నది. ఈ శోధన నిజానికి ఏదెను తోటలోని శోధనవంటిది. దేవుడిచ్చిన వాక్యమునకు విరోధముగా నిలబడవలెనను శోధన వారికి వచ్చెను. మానవ ఆలోచనకు అది సరిగానే కనిపించును. ఆ యొక్క జ్ఞానము మరియు జీవనాధారము లోకమునకు వెర్రితనముగా కనిపించినది.
ఏర్పరచబడిన వారు మాత్రమే మోసపుచ్చబడరు. ప్రపంచ సంఘ సమితి ఇప్పటికే ఆరంభమయినది. శోధనకాలము ఆరంభమాయెను. ఈ ప్రపంచ సంఘ ఉద్యమము చాలా చక్కగాను, దీవెనకరమగు సూత్రముగాను కనబడుచున్నది (అందరూ ఏకము కావలెనను క్రీస్తు ప్రార్థనకు నెరవేర్పువలె కనిపించుచున్నది), రాజకీయంగా చాలా బలమును సంపాదించుకొన్నది. ప్రభుత్వము మీద అది వత్తిడి తెచ్చుచున్నది, వారితో ప్రత్యక్షంగా చేరవలెను లేదా వారి సూత్రములకు కట్టుబడియుండవలెను, లేనియెడల ఎవరునూ సంఘముగా గుర్తింపబడరని చెప్పుచున్నది. ఈ విధముగా ఈ సంఘ సమాఖ్య జనుల మీద, సంఘముల మీద ప్రత్యక్షముగానో, పరోక్షముగానో అధికారము చేయును. చిన్న గుంపులు తమ నియమావళులను, హక్కులను, మొదలగు వాటిని పోగొట్టుకొనవలసివచ్చును, చివరకు వారు ఆస్తులను పోగొట్టుకొనువరకు మరియు ప్రజలతో ఆత్మీయ హక్కులను పోగొట్టుకొనువరకు.
ఉదాహరణకు, స్థానిక సేవక బృందము యొక్క మద్దతు లేనియెడల మత కార్యక్రమముల కొరకు ఒక బిల్డింగును అద్దెకు తీసుకొనుట కుదరదు. కొద్ది పట్టణములలో అది యున్నది. సైన్య బలములోను, ఆస్పత్రులలోను చాప్లిన్ కావలెనన్నచో త్రిత్వపు సంఘ ఐక్య ఆలోచన సభ వారి ఆమోదము కావలెను. దాదాపు అది చట్టముగా మారిపొయినది. ఈ వత్తిడి ఎక్కువగునప్పుడు దీనిని వివరించుట కఠినమగును. దానిని ఎదిరించుట అనగా హక్కులను పోగొట్టుకొనుటయే. చాలామంది దానిని అనుసరించుటకు శోధింపబడుదురు. ఈ సంస్థ యొక్క స్వరూపముతో కలిసియుండి బహిరంగముగా సేవచేయుట ఇతర విధములుగా సేవచేయుటకన్న మంచిదని తలంచెదరు. కాని వారు తప్పుచేయుచున్నారు. అపవాది యొక్క అబద్ధమును నమ్ముట అనగా సాతాను యొక్క సేవచేయుటయే. మీరు వానిని యొహోవా అని పిలువ వచ్చును. కాని ఏర్పరచబడినవారు మోసపుచ్చబడరు.
ఇంకా చెప్పవలెనన్నయెడల ఏర్పరచబడి వారు కాపాడబడుదురు, అయితే ఈ ఉద్యమము ముదరిపోయి "మృగమునకు ప్రతిమను నిర్మించుదురు," పరిశుద్దులు రాకడలో ఎత్తబడుదురు. ఈ చిన్న ఆనందరకమగు, అందమగు ఉద్యమము ఎఫెసు వారి సహవాసములో బయలుదేరినది. చివరకది సాతాను యొక్క ఘట సర్పముగా తయారగును, మొత్తం ప్రపంచమును అది అపవిత్రపరచి మోసము చేయును. రోమను కాథలిక్కు మరియు ప్రొటస్టెంటుల యొక్క సంఘ క్రమము ఏకమైపోయి, మొత్తం ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను నియంత్రించును. మొత్తం ప్రపంచమును తనయొక్క మత బోనులోనికి రప్పించును, లేనియెడల వారిని చంపును. దానికి లోబడనియెడల వారు కొనుటకు గాని, అమ్ముటకు గాని హక్కుండదు, ఆ విధముగా వారి హక్కులను హరించును, మరియు ఆలాగు వారు బ్రదుకుట కష్టము. ఇది చాలా తేలికగా నెరవేర్చబడును, ఎందుకనగా వేశ్య యొక్క కుమార్తెలు పూర్తిగా ఆమె వద్దకు పోయెదరు. ఈ మధ్య సమయములో, దాదాపు బంగారమును అందించు ప్రతి గనిని లేదా మూలమును స్వాధీనపరచుకొను పనిని రోమ్ చేయును. యూదుల యొద్ద బాండు మరియు పత్రములే యున్నవి. తగిన కాలములో, ఆ వేశ్య ప్రస్తుత ఆర్థిక విధానమును నాశనము చేయును. పత్రములను త్రోసివేసి బంగారమును పోగుచేయుదురు. బంగారము లేనప్పుడు, ఆ పద్ధతి పడిపోవును. యూదులు చిక్కుకుందురు, మరియు వారితో కూటమి ఏర్పాటు చేసుకొందురు, మరియు వేశ్యగానున్న సంఘము సర్వ ప్రపంచము మీద ఆధిపత్యమును వహించును.
ఆయన స్వకీయులకు వాగ్దానము
ప్రకటన 3:11-12,
"నేను తర్వగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము.జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములోనా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను."
ఆయన త్వరగా వచ్చుచున్నాడను ఆలోచన గూర్చి మనము వ్యాఖ్యానించవలసిన అవసరము లేదు. ఆయన వచ్చుచున్నాడని మనకు తెలియును, ఎందుకనగా మనము చివరి దినముల యొక్క అంతమందున్నాము. లేమా? "ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము," అని ఆయన చెప్పుచున్నాడు.
మహా ఆపద కలిగిన కాలము మధ్యలో యేసు వచ్చును. ఆయన రాకతో అచ్చట ఒక పునరుత్థానముండును. చాలామంది ధూళిలోనుండి బయటకు వచ్చి, సజీవులైనవారితో కూడా పైకి వెళ్ళేదరు. ఈ సజీవులు ఎవరనగా ఆయన రాక కొరకు ఎదురుచూచుచున్నవారు. వీరికి కిరీటములు ఇవ్వబడును. ఎందువలన? వారు దేవుని కుమారులు. వారు ఆయనతో రాజులు. వారు ఆయనతో పరిపాలన చేయుదురు. కిరీటము దానినే చూపించుచున్నది — మహా రాజుతో ఏలుబడి చేయుట, పరిపాలనచేయుట. ఈ భూమిమీద ఆయనతో పాటు శ్రమపడు వారందరూ ఆలాగే యుందురు, ఇది వారికిచ్చిన వాగ్దానము. వారందరూ ఓర్పుతో సహించిరి. న్యాయవంతుడగు న్యాయాధిపతి యగు దేవుడు వారికి బహుమానమిచ్చునని వారు ఎరుగుదురు. వారాయన కొరకు సమస్తమును త్యాగము చేసిరి, ఆయనకు సమస్తమును అప్పగించిరి. ఆయన సింహాసనములో వారిని కూర్చొండబెట్టుకొనును. ఆయన యొక్క మహిమగల రాజ్యమును వారితో పంచుకొనును.
ఓ! మనందరి కొరకు ఈ కాలములో ఒక వాక్యమున్నది. అదేమనగా, గట్టిగా పట్టుకొనుట. పట్టుదల కలిగియుండుట. విడిచిపెట్టవద్దు. దేవుని యొక్క సంపూర్ణ కవచమును ధరించుకొనుట — ఆయన మనకు ఇచ్చిన ప్రతి ఆయుధమును ఉపయోగించవలెను — మనకు లభ్యమయిన ప్రతి వరమును వాడుకొనవలెను. సంతోషముతో ముందుకు చూడవలెను, ఎందుకనగా ఆయనతో కూడా మనము కిరీటమును ధరింపనైయున్నాము. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.
ఇప్పుడాయన కిరీటములను ఇచ్చుట మాత్రమే కాకుండా, ఈ వధువులో యున్నవారు దేవుని యొక్క ఆలయములో స్తంభములుగా చేయబడుదురనియు చెప్పెను. అయితే దేవుని ఆలయమనగా ఏమిటి? యేసు తన శరీరమే దేవాలయమని చెప్పెను. అవును. అది దేవుని యొక్క ఆలయము. ఇప్పుడు మనము ఆయన యొక్క శరీరమై యున్నాము. మనలో పరిశుద్ధాత్మ నివాసము చేయుట ద్వారా నిజమగు సంఘముగా దేవుని యొక్క ఆలయమై జయించు వానిని ఆయన ఆలయములో ఒక స్తంభముగా చేయబోవుచున్నాడు. అయితే స్తంభమనగా ఏమిటి? స్తంభమనగా నిజానికి పునాదిలోని ఒక భాగము, అది మొత్తం నిర్మాణమంతయూ దాని మీదనే నిలచియుండును. దేవునికి స్తోత్రము, జయించు వాడు అపోస్తలులతోను, ప్రవక్తలతోను ఉండును,
ఎందుకనగా ఎఫెసీ 2:19-22లో ఈలాగు వ్రాయబడినది,
"కాబట్టి మీరిక మీదట పరజనులును, పరదేశులువైయుండక, పరిశుద్దులతో ఏక పట్టణస్తులును దేవుని ఇంటివారునై యున్నారు.క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపోస్తలులును, ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
అవును, వారితో కూడా మనమును కట్టబడుచున్నామని 22వ వచనము చెప్పుచున్నది. ప్రతిదీ తలుపు గుండా ప్రవేశించవలెను (యేసు) అలాగు వెళ్ళినవారు ఆ శరీరములో లేదా ఆలయములో భాగమైయుందురు. దేవుడు ఒకనిని దేవాలయములో స్తంభముగా నిలబెట్టినప్పుడు, అతడు ఆ పునాదిలో భాగమగుచున్నాడు. ఆ గుంపును ఆయన ఏమిచేయుచున్నాడు? ఆయన వానికి వాక్యము యొక్క ప్రత్యక్షతను ఇచ్చుచున్నాడు. అపోస్తలులు మరియు ప్రవక్తలు దానినే కలిగియుండిరి. మత్తయి 16:17. అక్కడ ఆయన వాక్యములో ఉన్నాడు. అక్కడాయన నిలబడియున్నాడు. ఎవరునూ ఆయనను బయటకు త్రోసివేయలేరు.
"జయించుట" అను మాటను గూర్చి ఆలోచించండి. యోహాను ప్రశ్న అడుగుచున్నాడు. జయించువాడు ఎవడు? వెంటనే దానికి జవాబు వచ్చుచున్నది. "యేసేక్రీస్తని నమ్మవాడు." ఒక యేసును లేదా ఒక క్రీస్తును నమ్మువాడు జయించువాడని చెప్పుట లేదు. యేసే క్రీస్తని నమ్మవాడు — ఒకే వ్యక్తి — ఇద్దరు కారు. అతడే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందినవాడు.
ఇక్కడ దేవుడు వధువును గూర్చి మాట్లాడుచున్నాడు. ఆమె యొక్క మరో దృశ్యమును మీరు చూడగోరుచున్నారా?
అది ప్రకటన 7:4-17లో యున్నది,
"మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండు వేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది. గాదు గోత్రములో పండ్రెండు వేలమంది.ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది. నస్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది. మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది.పిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది. లేవీ గోత్రములో పండ్రెండు వేలమంది. ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది.జెబులూను గోత్రములో పండ్రెండు వేలమంది. యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది. బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది, ముద్రింపబడిరి.అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండి ప్రతి వంశములో నుండియు ప్రజలలో నుండియు ఆయా భాషలు మాటలాడు వారిలోనుండియు వచ్చి యొవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై సోత్రమని మహా శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.దేవదూతలందరును సింహాసనము చుట్టును, పెద్దల చుట్టను, ఆ నాలుగు జీవుల చుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి — ఆమేన్; యుగయుగముల వరకు మా దేవునికి సోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్.పెద్దలలో ఒకడు — తెల్లని వస్త్రములను ధరించికొని యున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.అందుకు నేను — అయ్యా నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను — వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసికొనిరి.అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;వారికి ఇక మీదట ఆకలియైనను దాహమైనను ఉండదు. సూర్యునియొండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు.ఏలయనగా సింహాసనము మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియై జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును."
యేసు వచ్చెను. ఆయన 144,000 మందిని ముద్రించియున్నాడు. ప్రతి గోత్రము నుండియు ఆయన 12,000 మందిని తీసికొనియున్నాడు. 144,000 మందికి చెందని మరియొక గుంపు ఉన్నది, వారిని మనము 9-18 వచనములలో చూతుము. వారెవరు? అన్యులలో నుండి వధువుగా తీసుకొనబడినవారు. వారాయన సింహాసనము యెదుట రాత్రింబవళ్ళు నిలచియుండిరి. వారాయనను ఆలయములో సేవించుదురు. వారు ప్రభువు చేత ప్రత్యేకముగా చూడబడుదురు. వారాయన వధువు అయి యున్నారు.
పెండ్లికుమారుడు ఎక్కడికి వెళ్ళునో, పెండ్లికుమార్తె అచ్చటికి వెళ్ళును. ఎన్నడునూ ఆమె ఆయనతో విడిచిపెట్టబడదు. ఆమె ఎన్నడునూ ఆయన ప్రక్కను విడువదు. ఆమె ఆయనతో కూడా సింహాసనమును పంచుకొనును. ఆయన యొక్క మహిమను మరియు ఆయన యొక్క ఘనతను ఆమె కిరీటముగా ధరించును.
"నా దేవుని పేరును, నా దేవుని పట్టణపు పేరును వాని మీద వ్రాసెదను." దేవుని యొక్క పేరు ఏమిటి? ఆయన మనకు తోడైయున్న దేవుడు, లేదా ఇమ్మానుయేలు, కానిఅది ఆయనకు పెట్టబడిన పేరు కాదు. "నీవాయనకు యేసు అను పేరు పెట్టెదవు." యేసు చెప్పెను, "నేను నా తండ్రి నామములో వచ్చియున్నందున, మీరు నన్ను చేర్చుకొనలేదు." కాబట్టి దేవుని పేరు యేసు, ఎందుకనగా ఆ పేరులోనే ఆయన వచ్చెను. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. ఒక స్త్రీ పెండ్లి చేసికొనినప్పుడు ఎవరి పేరును ధరించును? ఆ పురుషుని పేరును ధరించును. ఆయన ఆమెను స్వీకరించునపుడు, ఆయన పేరు వధువుకు ఇయ్యబడును.
ప్రకటన 21:1-4.
"అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును, మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన వధువు వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.అప్పుడు — ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురవుండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడై యుండి వారికి తోడైయుండును.ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పుయైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని."
ఎంత అద్భుతము! దేవుని యొక్క అద్భుతమగు వాగ్దానములన్నియూ నెరవేర్చబడియున్నవి. అంతా గతించియున్నది. మార్పు జరుగుట పూర్తియైనది. గొర్రెపిల్ల మరియు వధువు నిత్యమూ కలిసియుందురు. దేవుని యొక్క పరిపూర్ణత అంతయూ వారిలో యుండును. దానిని వివరించుటయా? ఎవరు వివరించగలరు? ఎవరికినీ సాధ్యము కాదు. దాని గూర్చి ఆలోచించుటయా? దానిని గూర్చి కలగనుటయా? దాని గూర్చి వాక్యము ఏమి చెప్పుచున్నదో చదవండి? దానినంతటినీ మనము చేయగలము, అయినా గాని, దానిలోని రవ్వంత భాగమయినా గాని మనకు తెలియదు, మొదటి పునరుత్థానములో అది ఒక వాస్తవముగా మారును.
"నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను."
నా క్రొత్త పేరు. సమస్తము నూతనమైనప్పుడు, అప్పుడాయన ఒక క్రొత్త పేరును తనకొరకు స్వీకరించును మరియు ఆ పేరు వధువు యొక్క పేరు కూడా అయియున్నది. ఆ నామము ఏమిటో చెప్పగల ధైర్యము ఎవరికీ లేదు. అది ఆత్మ యొక్క ప్రత్యక్షత్ర ద్వారానే తెలియగలదు, దానిని తేటపరచగా, ఎవరునూ దానిని కాదనుటకు తెగింపలేరు. అయితే సందేహము లేదు, ఆయన నామమును బయలుపరచవలెనని ఆశించు దినమున, ఆ బయలుపాటును మనకు దయచేయును మరియు ఆయన నామమును మనకు తెలియజేయును. అది మనము ఊహించగలిగినదాని కంటె చాలా అద్భుతమైనది అని మనము తెలుసుకొందుము.
కాలమునకు చివరి హెచ్చరిక
ప్రకటన 3:13.
"సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక!"
ప్రతి కాలము ఇదే హెచ్చరికతో అంతమగుచున్నది. ప్రభువు యొక్క స్వరమును సంఘములు వినవలెనని నిరంతర హెచ్చరిక చేయబడుచున్నది. ఇతర కాలములకన్ననూ, ఈ కాలములో ఆ హెచ్చరిక మరింత స్పష్టముగా ఉన్నది, ఎందుకనగా ఈ కాలములో ప్రభుని యొక్క రాకడ మరింత సమీపమయినది. ఇప్పుడు బహుశా ప్రశ్న తలెత్తును, "ఈ కాలమునకు ఆవల మరి ఒక కాలము ఉన్నది గదా? ఎందుకు ఈ అత్యవసర హెచ్చరిక? అని అడుగవచ్చు. జవాబు ఇక్కడ దాగియున్నది. చివరి కాలము చిన్నదిగా యుండును — యుగముల యొక్క సమాప్తము వచ్చినది గనుక త్వరగా పనిచేయవలెను, ఇది మాత్రమే కాదు, తప్పక ఇది గుర్తుంచుకొనవలెను, దేవుని యొక్క దృష్టిలో కాలము ఎగిరిపోవుచున్నది; వేయి సంవత్సరములు ఒక దినమువలె యున్నవి. ఆయన దృష్టిలో చూచినట్లయితే మరి కొన్ని గంటలలో ఆయన రానైయున్నాడు, కావున ఆయన తప్పకుండా మనలను సంపూర్ణ అత్యవసరతతో హెచ్చరించవలసి యున్నాడు. మరియు ఆయన రాకకు సిద్ధపడవలెనను, ఆయన స్వరము మన హృదయములలో నిరంతరము వినబడవలసియున్నది.
ఓ! ప్రపంచములో చాలా స్వరములు యున్నవి — చాలా సమస్యలు మరియు అవసరతలు మన దృష్టి నిలుపవలెనని మొరపెట్టుచున్నవి; అయితే ఆత్మ యొక్క స్వరము కంటె మన దృష్టి నిలుపుటకు ప్రాముఖ్యమైనది గాని, యోగ్యమైనది గాని మరొకటి ఏదియునూ లేదు. కావున "చెవిగలవాడు వినును గాక, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక."