లవొదికయ సంఘ కాలము
ప్రకటన 3:14-22
"లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము:ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా.నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను, వెచ్చగానైనను ఉండిన మేలు.నీవు చల్లగానైనను, వెచ్చగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై యున్నావని ఎరుగక — నేను ధనవంతుడను, ధనసమృద్ధి చేసియున్నాను, నాకేమీయూ కొదవ లేదని చెప్పుకొనుచున్నావు.నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము.ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినయెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము.నేను జయించి నా తండ్రితో కూడ ఆయనసింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక!"
లవొదికయు పట్టణము
లవొదికయ అను పేరునకు "ప్రజల హక్కులు" అని అర్థము. ఇది సామాన్యముగా రాజు స్త్రీల యొక్క గౌరవార్ధము చాల పట్టణములకు ఈ విధముగా పేరు పెట్టబడినది. ఈ పట్టణము రాజకీయ ప్రాముఖ్యత గల పట్టణములలో ఒకటియై యుండి, ఆసియామైనరులో ఆర్థికంగా వర్ధిల్లుచున్న పట్టణము. ప్రాముఖ్యత గల పౌరుల ద్వారా ఎంతో విలువైన సంపద ఈ పట్టణములోనికి వచ్చుచుండెను. ఒక గొప్ప వైద్య కళాశాలకు ఇది నిలయము. దీనిలోని ప్రజలు కళలలోను మరియు విజ్ఞాన శాస్త్రములోను ప్రావీణ్యులు. దీనిని తరచుగా 'మెట్రోపాలీస్' అని పిలచెడివారు, ఎందుకనగా ఇది ఇరవై-అయిదు ఇతర పట్టణములకు పాలనా కేంద్రముగా యుండెను. జియాస్ అను ఒక అన్య దేవతను ఇక్కడి వారు ఆరాధించుచుండిరి. వాస్తవానికి ఒకప్పుడు ఈ పట్టణమున డియోపాలిస్ అని పిలచెడివారు (జియాస్ పట్టణము) వారి దేవుని నామ ఘనత కొరకు ఆలాగు పిలచెడివారు. నాలుగవ శతాబ్దములో ఇక్కడ ఒక ప్రాముఖ్యమగు సంఘ సమితి బయలుదేరినది. తరచు వచ్చు భూకంపముల వలన ఇది పూర్తిగా విడనాడబడిన పట్టణమయినది.
ఈ చివరి కాలపు గుణలక్షణములు ఎంతగా తగియున్నవి! ఇప్పుడు మనము జీవించుచున్న కాలమునకు ఇది సాదృశ్యము. ఉదాహరణకు చూడండి, వారు జియాస్ అను దేవునిని ఆరాధించిరి, దేవతలందరికిని అతడు ప్రధానుడు మరియు తండ్రి. ఇది ఇరవైయ్యవ శతాబ్దమునకు ముందు సూచనగా యున్నది. 'ఒకే దేవుడు, మన అందరికిని తండ్రి.' ఈ మత ధోరణి వలన మానవ సోదర భావము నెలకొనబడినది. ఇప్పటికిని అదే జరుగుచున్నది ప్రొటస్టెంటు, కాథలిక్కులు, యూదులు, హిందువులు మొదలగు వారినందరిని ఏకత్రాటి మీదికి తీసికొని వచ్చుచున్నారు. పరస్పరము ఇచ్చి పుచ్చుకొను ఆరాధనను ఉద్దేశించిరి. అందువలన మన యొక్క ప్రేమ, అవగాహన, ఒకరి పట్ల ఒకరికి గల చింతను పెంపొందించుననిరి. కాథలిక్కులు మరియు ప్రొటస్టెంటులు నేటికిని అందుకొరకు పాటుపడుచున్నారు, ఈ ఐక్యతలో వారు వ్రేళ్ళూనుకొనుచున్నారు, మిగిలిన వారందరును వారిని వెంబడించవలెనను అపరిమిత వాంఛ వారికున్నది. ఐక్యరాజ్యసమితి సంస్థలో కూడా ఇదే వైఖరిని మనము చూడగలము. వ్యక్తిగతముగా ఆత్మసంబంధమగు భావములు గలవారిని గుర్తించుటకు ప్రపంచ నాయకులు నిరాకరించుచున్నారు. ఆ వేరువేరు భావములను ఒక ప్రక్కకు త్రోసివేయవలెనని వారు చెప్పుచున్నారు. మతములన్నియూ ఒకే స్థాయికి అందువలన వచ్చునని ఆశించుచున్నారు, ఎందుకనగా అందరూ ఒకే గురిని కలిగియున్నారు, అందరికీ ఒకే ఉద్దేశ్యమున్నది మరియు ప్రాధమికంగా అందరిదీ సత్యమే.
'ప్రజలు హక్కులు' లేదా 'ప్రజల యొక్క న్యాయము' అను అర్థము గల లవొదికయను గమనించండి. ఈ ఇరవయ్యవ శతాబ్దపు సంఘకాలము వంటిది మరి ఏ కాలమైనా ఉన్నదా, ఎందుకనగా దేశములన్నియూ సమానత్వము కొరకు అనగా సాంఘికము గాను, ఆర్థికముగాను ఉండవలెనని ఉద్యమించుచున్నవి. ముందెన్నడయినా ఇట్లున్నదా? ఇది కమ్యూనిస్తుల యొక్క కాలము, మనుష్యులందరూ సమానముగా యుండవలెనని కోరుచున్నారు, అయితే అది కేవలము సిద్దాంతములోనే సాధ్యము. ఇది రాజకీయపక్షముల కాలము, క్రిష్టియను డెమొక్రాటు, క్రిష్టియను సోషలిసులు, క్రిష్టియను కామనువెల్త్ ఫెడర్షను మొదలుగునవి అని తమనుతాము పిలుచుకొనుచున్నారు. మన యొక్క ఉదార వేదాంత పండితుల అభిప్రాయము ప్రకారము యేసు ఒక సోషలిస్ట్ మరియు ఆది సంఘము పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా సోషలిజంను ఆచరణలో పెట్టిరని చెప్పెదరు గనుక మనమును ఆలాగే నేడు చేయవలెనని కోరుచున్నారు.
ప్రాచీనులు లవొదికయను మెట్రోపాలిస్ గా పిలచిరి. అది ఏక-ప్రపంచ-ప్రభుత్వము కొరకు ఎదురుచూచుచుండెను, దానిని ఇప్పుడు మనము స్థాపించుచున్నాము. ఆ పట్టణమును గూర్చి మనము ఆలోచించిన, అది ఒక గొప్ప సంఘ సమితికి నిలయము. నేటి ప్రపంచ సంఘ సమాఖ్యకు అది ముంగుర్తుగా యున్నది. నామకార్ధ క్రైస్తవులందరూ త్వరలోనే అందులో కలిసిపోవుట మనము చూచెదము. సంఘము మరియు రాజ్యము, మతము మరియు రాజకీయము నిశ్చయంగా ఏకమవుచున్నవి. గురుగులు కట్టలు కట్టబడుచున్నవి. త్వరలోనే గోధుమలు కొట్టులో సమకూర్చబడును.
అది భూకంపముల పట్టణము, ఆ భూకంపములే చివరకు దానిని నాశనము చేసినవి. సర్వ ప్రపంచమును దేవుడు కుదుపుట ద్వారా ఈ కాలము ముగియును, ఎందుకనగా అది పాతవేశ్యతో ప్రేమలో పడియున్నది. ప్రపంచ పద్ధతులు నేలకూలుటయే కాకుండా భూమియే లయమైపోవును. ఆ తరువాత క్రీస్తు యొక్క వేయ్యేండ్ల పాలనకు నూతనపరచబడును.
ఆ పట్టణము ధనవంతమైయుండెను, సంపదతో తులతూగుచుండెను. నాగరికతలో అది నిండిపోయియున్నది. సైన్సు వృద్ధి పొందినది. నేటి దినము వలే యున్నది. సంఘములు ఐశ్వర్యముతో నిండియున్నవి. ఆరాధన అందముగాను, లాంఛనప్రాయముగాను యున్నది, కాని అది చల్లబడి చచ్చినది. ఆత్మ-అనుగ్రహించిన వాక్యము యొక్క స్థానములోనికి సంస్కతి మరియు విద్య వచ్చియున్నవి. విశ్వాసమును త్రోక్కివేయుటకు సైన్సు వచ్చినది. ఆ విధముగా మనిషి భౌతికవాదములోనికి దిగిపోయియున్నాడు.
ప్రాచీన లవొదికయలోని ప్రతి గుణలక్షణము కూడా ఈ ఇరవయ్యవ శతాబ్దపు లవొదికయ కాలములో తిరిగి పుట్టియున్నది. దేవుని కృపను బట్టి, వినుటకు చెవిగలవారు దానిలోనుండి బయటకు వచ్చెదరు గాక. ఆమె యొక్క పాపములలోను, తత్ఫలితముగా వచ్చు తీర్పులోను వారు పాలిభాగస్తులు కాకుందురు గాక!
లవొదికయ కాలము
ఇరవయ్యవ శతాబ్దము మలుపులో, అనగా బహుశా 1906 సంవత్సరములో లవొదికయ కాలము ప్రారంభమాయెను. ఎంతకాలము ఇది నిలచును? దేవుని దాసునిగా ఎన్నో దర్శనములను చూచాను, అందులో ఏ ఒకట్కియు ఎన్నడును తప్పిపోలేదు. ఈ కాలము దాదాపు 1977 సంవత్సరమునకు అంతమగునని నా ఊహతో చెప్పుచున్నాను (నేను ప్రవచనము చెప్పుట లేదు, ఇది ఊహ) నా వ్యక్తిగత భావనను క్షమించండి, నేను ఈ విధముగా ఊహించుటకు కారణమున్నది. ఎడతెగని ఏడు ముఖ్యమైన దర్శనములు 1933వ సంవత్సరము జూన్ నెలలోని ఒక ఆదివారము ఉదయమున నేను చూచాను. ప్రభువైన యేసు నాతో మాట్లాడెను మరియు ప్రభువు యొక్క రాకడ సమీపమాయొనని చెప్పెను, కాని ఆయన వచ్చు ముందుగా, ఈ ఏడు పెద్ద సంఘటనలు నెరవేరును. వాటినన్నిటిని నేను వ్రాసియుంచాను మరియు ఆ ఉదయము నాకు ప్రభువు యొక్క ప్రత్యక్షత ఇవ్వబడినది. మొదటి దర్శనములో ముస్సోలినీ ఇథియోపియా మీద దండెత్తుట చూచాను మరియు ఆ దేశము అతనికి వశమగును. ఆ దర్శనము కచ్చితముగా కొన్ని పరిణామాలకు కారణమయినది, చాలామంది మండిపడిరి, దానిని నేను చెప్పగా నమ్మలేదు. కాని అది ఆ విధంగానే జరిగినది. అతడు తన ఆధునిక ఆయుధములతో నడిచి వెళ్ళి, దానిని వశపరచుకొనెను. ఆ స్థానికులకు అసలు అవకాశమే లేకపోయెను. ముస్సోలినీ భయంకరమగు అంతమును చూచునని కూడా ఆ దర్శనములో చెప్పబడినది. అతని స్వంతవారే అతనిని త్రోసివేసిరి. అక్షరాలా చెప్పిన విధంగానే అది జరిగియున్నది.
ఆ తరువాత దర్శనములో అడాల్పు హిట్లరు అను పేరుగల ఒక ఆస్ట్రియను లేచి జర్మనీలో నియంతగా వచ్చునని చెప్పబడెను. అతడు ప్రపంచమును యుద్ధమునకు ఈడ్చునని చెప్పెను. సీగ్ఫ్రిడ్ గీతను చూపించినది మరియు దానిని జయించుటకు మన సైనికులు ఎంతభీకరముగా పోరాడుదురో చూపెను. ఆ తరువాత హిట్లరు ఒక మర్మయుక్తమగు అంతమునకు ఎట్లు వచ్చునో చూపెను.
మూడవ దర్శనములో ప్రపంచ రాజకీయములను చూచాను, మూడు గొప్ప ఉద్యమములు లేచునని నాకు చెప్పెను, అవి ఫాసిజం, నాసిజం, కమ్యూనిజం, కాని ఆ మొదటి రెండు ఈ మూడవ దానిలో మిళితమైపోవునని చెప్పెను. ఆ స్వరము ఇట్లు హెచ్చరించినది, "రష్యాను గమనించుము, రష్యాను గమనించుము. ఉత్తర దేశపు రాజు మీద నీ దృష్టి నిలుపుమని చెప్పెను."
నాలుగవ దర్శనములో సైన్సులో వచ్చు గొప్ప ప్రగతి చూచాను. రెండవ ప్రపంచ యుద్ధము తరువాత అది వచ్చును. ఆ దర్శనములో నేను ఒక ప్లాస్టిక్ బుడగవలె యున్న కారును చూచాను. అది రిమోటు కంట్రోలుతో అందముగా ఉన్న రాజ వీధులలో పరుగిడుచున్నది. స్టీరింగ్ వీల్ లేని ఈ కారులో జనులు కూర్చొని ఏదో వినోదము కొరకు ఆట ఆడుకొనుట చూచాను.
అయిదవ దర్శనము మన కాలము యొక్క నైతిక సమస్యకు సంబంధించినది, ప్రధానంగా స్త్రీల చుట్టు కేంద్రీకృతమైనది. ఓటు హక్కు యివ్వబడిన తర్వాత, స్త్రీలు తమ స్థానం నుండి తొలగియున్నారని దేవుడు నాకు చూపించెను. తర్వాత వారు తమ జట్టు కత్తిరించుకొనిరి, యిక ఎంతమాత్రమూ పురుషుని అధికారమునకు లోబడక, సమాన హక్కులూ, లేక అనేక సందర్భాలలో అంతకంటే ఎక్కువ హక్కులను కోరుటను అది సూచించుచున్నది. ఆమె, పురుషుల వస్త్రధారణను అనుసరించి వస్త్రహీన స్థితికి వెళ్ళినది, చివరి చిత్రంలో అంజూరపు ఆకువంటి ఒక ఏప్రన్ (apron, ముందు భాగము మాత్రమే కప్పే వస్త్రము) తప్పిస్తే, నగ్నంగా ఉన్న ఒక స్త్రీని చూశాను. ఈ దర్శనంతో ఈ లోకం యొక్క భయంకరమైన వంకరతనమూ మరియు నైతిక స్థితినీ నేను చూశాను.
ఆరవ దర్శనములో ఒక అత్యంత అందమగు స్త్రీ అమెరికాలో లేచుట చూచాను, కాని చాలా క్రూరమైన స్త్రీ. ఆమె జనులను పూర్తిగా తన అదుపులో యుంచుకొనెను. ఇది రోమను కాథలిక్కు చర్చి యొక్క ఉజ్జీవమని నేను తలంచాను, అయితే మరొక సంగతి కూడా నాకు తెలియును; అదేమనగా, స్త్రీల యొక్క ఓట్ల ద్వారా మహా అధికారముతో
ఒక స్త్రీ లేచును, అందుకు అవకాశమున్నది.
చివరిదగు ఏడవ దర్శనములో నేను ఒక భయంకరమగు ప్రేలుడు విన్నాను. దానిని చూచుటకు వెనుదిరిగాను, కాని నాకు అమెరికా భూభాగము మొత్తము మీద శిధిలములు, గోతులు, పొగ మాత్రమే కనిపించినది.
ఆ ఏడు దర్శనములను ఆధారము చేసికొని దానికి బహు త్వరగా వచ్చుచున్న మార్పులను జోడించాను. గత ఏబది సంవత్సరముల నుండి ప్రపంచమును ఇవి కుదుపుచున్నవి. ఈ దర్శనములన్నియూ 1977 కల్లా నెరవేరునని నేను ఊహించుచున్నాను (నేను ప్రవచించుట లేదు), ఇది చాలా బాధ్యతా-రహితమగు మాట అని చాలామంది అనవచ్చును. ఎందుకనగా 'ఆ దినము గాని, ఆ గడియ' గాని ఎవరికిని తెలియదని యేసు చెప్పిన వాస్తవమును చూడగలము. ఈ ఊహను ముప్పది సంవత్సరముల తరువాత కూడా నేను నొక్కి చెప్పుచున్నాను; ఎందుకనగా ఆయన రాక పరిసమాప్తమగు సంవత్సరము గాని, నెలగాని, వారముగాని ఏ మనుష్యుడూ తెలిసికొనలేడని యేసు చెప్పలేదు. కాబట్టి నేను మరల చెప్పుచున్నాను, నేను యధార్థముగా నమ్ముచున్నాను మరియు వాక్యమును అధ్యయనము చేయు విధ్యార్థిగా, దైవ ప్రేరణతో చెప్పుచున్నాను; 1977 ప్రపంచ క్రమములను విచ్చిన్నము చేసి, వెయ్యేండ్ల పాలనకు అవిష్కారము పలుకవచ్చును.
ఇప్పుడు దీనిని చెప్పుచున్నాను. ఆ దర్శనములలో ఏ ఒక్కటయినా గాని తప్పు అని రుజువుచేయగలరా? అవన్నియూ నెరవేరలేదా? అందులోప్రతి ఒక్కటియూ నెరవేరినది లేక నెరవేరు క్రమములో యున్నవి. ముస్సోలినీ విజయవంతముగా ఇథియోపియా మీదికి దండెత్తెను. ఆ తరువాత పతనమయి మొత్తం నాశనమయ్యెను. హిట్లర్ యుద్ధమును ప్రారంభించి దానిని ముగించకుండానే మర్మమగు రీతిలో మృతి చెందెను. ఆ రెండు ఉద్యమములను కమ్యూనిజం మింగివేసెను. ప్లాస్టిక్ బుడగవంటి కారు నిర్మింపబడి ఇంకా మంచి రహదారుల కొరకు ఎదురు చూచుచున్నది. స్త్రీలు దిగంబరులుగా యున్నారు, ఇప్పటికే వారు పైన ఏమీ లేని స్నానపు దుస్తులను ధరించుచున్నారు. ఈ మధ్య నేను ఒక పత్రికలో దుస్తులను చూచాను. ఆ దుస్తులు దర్శనములో చూచినట్లేయున్నవి. (దానిని మీరు దుస్తులు అనినచో) అది అంతా కనబడు ప్లాస్టిక్ బట్టవలెయున్నది. ఆ బట్టకు మూడు నల్లని మచ్చలున్నవి. వాటితో రెండు రొమ్ములను కప్పుకొనిరి. ఆ క్రింద చిన్న అంజూరపు కచ్చడమువలె యున్నది. కాథలిక్కు చర్చి పైకి లేచుచున్నది. మనకు ఒక కాథలిక్కు అధ్యక్షుడు వచ్చెను. నిస్సందేహముగా మరియొకడు వచ్చును.
ఇంకేమి మిగిలి యున్నది? హెబ్రి 12:26 తప్ప మరేమియూ లేదు. "ఆయన స్వరము అప్పుడు భూమిని కంపింపచేసెను. ఇప్పుడు మరియొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేతునని," ఆయన సెలవిచ్చుచున్నాడు. మరొక్కసారి దేవుడు భూమిని కంపింపచేయును మరియు దానితో పాటుగా అన్నియూ కదులును. అప్పుడాయన దానిని నూతనము చేయును. 1964 మార్చి అనగా గత నెలలోనే, మంచి శుక్రవారము దినమున అలస్కా యొక్క భూకంపము యావత్తు ప్రపంచమును కదిలించినది. అయితే స్థానభ్రంశము కలుగలేదు, కాని దేవుడు ఈ జగత్తును కంపింప చేయుట ద్వారా హెచ్చరిక చేయుచున్నాడు. త్వరలోనే ఆయన ఇంకా ఎక్కువ పరిధిలో దానిని కంపింపచేయును. పాపముతో శపించబడిన ఈ లోకమును ఆయన ప్రేల్చి కంపింప చేయును. నా సోదరీ, సోదరుడా, ఆ కంపనము నుండి దాగు చోటు ఒక్కటే యున్నది. అదే ప్రభువైన యేసు యొక్క కౌగిలి. ఇంకా నీకు దేవుని కృప దొరకుచుండగానే నీ పూర్తి జీవితమును, ఏమియూ దాచుకొనకుండా యేసు క్రీస్తుకు యిమ్మని బ్రతిమాలుచున్నాను. నమ్మకస్తుడగు గొర్రెలకాపరి నిన్ను రక్షించి నీపట్ల శ్రద్దవహించును మరియు నిన్ను నిర్దోషిగా ఆయన నిలబెట్టును మహిమతోను, మహదానందముతోను నిండియుందువు.
వర్తమానికుడు
ఏ కాలముకూడా దేవుడు పంపిన వర్తమానమునందించు వర్తమానికుని గుర్తించలేదని నా భావము. మొదటి కాలము మాత్రమే ఆ కాలపు వర్తమానికుని గుర్తించినది, పౌలు దానికి వర్తమానికుడు. ఆ కాలములో కూడా అతడు వర్తమానికుడని గుర్తించని చాలా మంది యుండిరి.
ఇప్పుడు మనము జీవించుచున్న ఈ కాలము చాలా తక్కువ వ్యవధిని కలిగియుండబోవుచున్నది. అతి వేగముగా సంఘటనలు జరిగిపోవుచున్నవి. కాబట్టి ఈ లవొదికయ సంఘ వర్తమానికుడు ఇచ్చట ఉండవలసియున్నాడు. బహుశా ఇంకా అతనిని మనము గుర్తించియుండకపోవచ్చును. కాని అతడు తెలియబడవలసిన కాలము తప్పకుండా వచ్చును. ఇప్పుడు నేను దానిని నిరూపించగలను, ఎందుకనగా అతని పరిచర్యను వివరించు లేఖనము మనకున్నది.
మొదటిగా, ఈ వర్తమానికుడు ప్రవక్తయై యుండెను. అతడు ప్రవక్త యొక్క పనిని కలిగియుండును. అతడు ప్రవచనాత్మక పరిచర్యను కలిగియుండును. అది పూర్తిగా వాక్యము మీదనే ఆధారపడియుండును, ఎందుకనగా ప్రవచనములు గాని దర్శనము గాని ఎల్లప్పుడూ "వాక్యపూర్వకమైనవిగానే యుండును," మరియు అవి ఎల్లప్పుడూ నెరవేరును. అతడు ప్రవక్తగా బయలుపరచబడును, ఎందుకనగా అంత ఖచ్చితత్వమును అతడు కలిగియుండును.
అతడు ప్రవక్తగా యుండుననుటకు రుజువును ప్రకటన 10:7లో కనుగొందుము.
"ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను."
ఇప్పుడు ఈ వచనములో యున్న ఈ వ్యక్తి "దూతగా" పిలువబడెను. కింగ్ జేమ్సు తర్జుమా ప్రకారము దూత అనగా పరలోకములో యుండినది కాదు. ఆరవ బూరనూదు దూత, పరలోక దూతయై యున్నది. దానిని ప్రకటన 9:13లో చూడగలరు. అదే క్రమముగల ఏడవది ప్రకటన 11:15లో చూడగలరు. ఈ ప్రకటన 10:7లో ఉన్నది ఏడవ దూత, అనగా మానవుడే. ఇతడు దేవుని యొద్ద నుండి ఒక వర్తమానమును తీసికొని వచ్చును. దేవుడు తన దాసులగు ప్రవక్తలకు ఇచ్చిన మర్మమును సమాప్తము చేయుటయే అతని యొక్క వర్తమానము మరియు పరిచర్యగా యుండును. ఈ చివరి వర్తమానికుని దేవుడు ప్రవక్తగా చూచును, ఎందుకనగా "అతడు ప్రవక్తయై యున్నాడు." మొదటి కాలములో పౌలు ఆలాగే యుండెను, చివరి కాలమునకు కూడా ఒకరుందురు.
ఆమోసు 3:6-7,
"పట్టణములో బాకా నాదము వినబడగా భయపడనివాడుండునా? యొహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పి౦చినదానిని బయలుపరచుకుండా ప్రభువైన యెహోవా యేమియు చేయడు."
యేసు యొక్క ఏడు ఉరుములు అంత్యకాలములోనే బయలు వెళ్ళును.
ప్రకటన 10:3-4,
"సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములుపలికెను.ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా — "ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని."
ఆ ఉరుములలో ఏమి ఉన్నదో ఎవరికిని తెలియదు. కాని మనకు తెలిసికొనవలసిన అవసరమున్నది. దాని యొక్క ప్రత్యక్షతను పొందుటకు ప్రవక్త కావలెను, ఎందుకనగా దేవునికి మరియొక మార్గము లేదు. ప్రవక్త ద్వారా మాత్రమే ఆయన తన లేఖన ప్రత్యక్షతలను తీసికొని వచ్చును. వాక్యము ఎప్పుడును ప్రవక్త ద్వారానే వచ్చెను, ఆలాగే ఇక ముందు కూడా వచ్చును. ఇది దేవుని యొక్క నియమము అది వాక్యమును పరిశోధించినప్పుడు మీకు తెలియును. దేవుడు మారనివాడు, ఆయన విధానములు మారవు కనుక ప్రతి కాలములోను ఆయన తన వర్తమానికుని పంపును. వేదాంత పండితులు మరియు ప్రజలు ఇరువురునూ వాక్యము నుండి తొలగిపోయినప్పుడు దేవుడెల్లప్పుడును తన ప్రజల కొరకు ఒక ప్రవక్తను పంపించును (వేదాంత పండితులుకు కాదు) అబద్ద బోధను సరిచేయుటకు, జనులను తిరిగి దేవుని వైపునకు నడిపించుటకును ఆయన ఆలాగు పంపించెను.
కావున ఏడవ కాల వర్తమానికుని రాకను మనము చూచుచున్నాము. అతడు ప్రవక్తగా యుండును.
ఈ వర్తమానికుడు ప్రకటన 10:7లో వచ్చుట మాత్రమే మనము చూడము గాని వాక్యములో యేసు తిరిగి వచ్చు ముందుగా ఏలియా వచ్చుటను గూర్చియు చెప్పబడెను.
మత్తయి 17:10,
"అప్పుడాయన శిష్యులు — ఈలాగైతే ఏలియా ముందురావాలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని అయన నడిగిరి. అందుకాయన — ఏలియా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే."
మన ప్రభువు యొక్క రాక ముందుగా ఏలియా తప్పక తిరిగి రావలెను. అతడు వచ్చి సంఘములో సమస్తమును చక్కబెట్టను.
మలాకీ 4:5లో అదే చెప్పబడినది,
"యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీయొద్దకు పంపుదును. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును."
యేసు రాకడకు ముందుగా ఏలియా తప్పక రావలెననునది నిశ్చయము. అతడు నెరవేర్చవలసిన ఒక ప్రత్యేక పని యున్నది. ఆ పని మలాకీ 4:6లోని భాగమైయున్నది, అతడు పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది అతని ప్రత్యేక పని మనము చెప్పుటకు కారణమున్నది, ఎందుకనగా ఇంతకు ముందే అతడు అందులోని కొంత భాగమును నెరవేర్చెను. అతడు "తండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పెను," ఏలియా యొక్క పరిచర్య బాప్తిస్మమిచ్చు యోహానులో నెరవేరినది.
లూకా 1:17,
"మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు, శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను."
యోహాను పరిచర్యలో అదే జరిగెను, "తండ్రుల హృదయములు పిల్లల తట్టును తిరిగెను." యేసు ఆ విధముగా చెప్పెను గనుక దానిని మనము ఎరుగుదుము. కాని పిల్లల యొక్క హృదయములు తండ్రుల వైపుకు తిరిగినట్లుగా చెప్పలేదు. అది ఇంకా జరుగవలసియున్నది. చివరి దినపు పిల్లల యొక్క హృదయములు పెంతెకోస్తు తండ్రుల వైపుకు తిరుగును. యోహాను వచ్చి తండ్రులను సిద్ధపరచెను, యేసు వచ్చి పిల్లలను తన యొద్దకు ఆహ్వానించెను. ఇప్పుడు ఏలియా యొక్క ఆత్మ ఏ ప్రవక్త మీద పడునో, ఆ ప్రవక్త పిల్లలను సిద్ధపరచి యేసు యొద్దకు ఆహ్వానించును.
బాప్తిస్మమిచ్చు యోహానును ఏలియాగా, యేసు పిలచెను.
మత్తయి 17:12,
"అయినను ఏలియా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి."
యోహానును ఏలియా అని ఆయన పిలచుటకు కారణమున్నది, ఎందుకనగా ఏలియా మీదనున్న ఆత్మయే తిరిగి యోహాను మీదికి వచ్చెను, అదే ఆత్మ ఎలీషా మీదికి ఆహాబు రాజు ఏలుబడిలో వచ్చెను. యేసు మరల వచ్చు ముందుగా అదే ఆత్మ మరల ఇంకొకని మీదికి వచ్చును. అతడు ఒక ప్రవక్తగా యుండును. దేవుని ద్వారా అతడు ఆలాగున బయలుపరచబడును. యేసు స్వయంగా అతనిని బయలుపరచుటకు శరీరధారిగా ఇక్కడ ఉండడు గనుక ఆ పనిని పరిశుద్ధాత్మ జరిగించును. (యోహానుకు ఆయన చేసెను) ఈ ప్రవక్త యొక్క పరిచర్యలో గొప్ప అద్భుతములు వెల్లడియగును. ఒక ప్రవక్తగా ప్రతి ప్రత్యక్షతయు బయలుపరచబడును, ఎందుకనగా ప్రతి ప్రత్యక్షతయు రుజువు చేయబడును. అతడు విశ్వాసముతో ఆజ్ఞాపించగా, అద్భుతమగు ఆత్మ కార్యములు వెల్లడియగును. అప్పుడు అతనికి దేవుడిచ్చిన వర్తమానము అందించబడును. అతడు వాక్యమును బోధించి, జనులను సత్యము యొద్దకు తీసికొనివచ్చును. దేవుని యొక్క నిజమగు శక్తిని వెల్లడి చేయును. కొందరు విందురు, కాని ఎక్కువ మంది ఆచారముల వైపు పరుగిడి మరియు అతనిని విసర్జించెదరు.
ప్రకటన 10:7లోని ఈ ప్రవక్తయగు వర్తమానికుడు మలాకీ 4:5-6లోని యున్న వానివలెనె యుండును. సహజ సిద్ధముగానే అతడు ఏలియా మరియు యోహానుల వలెయుండును. వారిరువురును ఆనాటి అంగీకారము పొందిన మత పాఠశాలల ఆచారములను త్రోసివేసిరి. ఇద్దరును అరణ్యములో నివసించిరి. వారిద్దరును "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ఉన్నప్పుడే బయటకు వచ్చిరి. దేవుని యొద్ద నుండి సూటియగు ప్రత్యక్షతను పొందిరి. వారిద్దరును వారి వారి దినమున ఉండిన మత క్రమములను, నాయకులను దుయ్యబట్టిరి. అంత మాత్రమే కాదు గాని చెడిపోయిన వారినందరిని, లేదా ఇతరులని చెరుపు వారినందరినీ వారు దుయ్యబట్టిరి. గమనించండి. ఇద్దరును నీతి లేని స్త్రీలను మరియు వారి విధానములను ఖండించి వారికి విరోధముగా ప్రవచించిరి. యొజెబెలునకు విరోధముగా ఏలియా లేచెను, ఫిలిప్పు భార్య యగు హేరోదియకు వ్యతిరేకముగా యోహాను లేచెను.
వారు పేరు పొందక పోయినప్పటికిని, దేవుని చేత ఇతను రుజువుచేయబడును. యోహానును యేసు ప్రత్యక్షపరచెను, మరియు యేసును పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరచెను, ఇతనిని అన్నిటికన్న ముందుగా ఆత్మ ప్రత్యక్తపరచునని మనము ఎరుగగలము. అతని జీవితములో శక్తిగల కార్యములు బయలుపడుచుండెను, అందులో ఏమియ సంశయము లేదు, మరెక్కడను అట్టివి కనబడవు; యేసు తిరిగి వచ్చినప్పుడు తనకుగా ఇతనిని ధృవపరచును, యోహానును ఆయన ధృవపరచినట్లుగా, యేసు వచ్చునట్లుగా యోహాను సాక్ష్యమిచ్చెను. కాబట్టి ఇతడు కూడా యోహానువలెనె యేసు రాకకు సాక్షిగా యుండును. ఆయన యొక్క రెండవ రాకడకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు ఇతడు వచ్చినటు క్రీస్తు రాకడయే నిరూపణ చేయును. ఇదియే చివరి రుజువు. మలాకీ 4లోని ప్రవక్త నిశ్చయంగా ఇతడే, ఎందుకనగా అన్యుల కాలాంతమునకు యేసే ఉండును. ఆయనే స్వయంగా ప్రత్యక్షమగును. ఆయనను నిరాకరించిన వారికి ఇక అవకాశముండదు.
ఈ చివరి దినపు ప్రవక్తను గూర్చి ఇంకా తేటగా మనము చూడవలెనన్నచో, ప్రత్యేకంగా మత్తయి 11:22లోని ప్రవక్తను గమనించండి, అతడు బాప్తిస్మమిచ్చు యోహాను, మలాకీ 3:1లో చెప్పిబడినవాడితనే.
"ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు."
మత్తయి 11:1-12
"యేసు తన పండ్రెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను.క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవువాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను.యేసు వారిని చూచి — మీరు వెళ్ళి విన్నవాటిని, కన్నవాటిని యోహానుకు తెలుపుడి.గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడచుచున్నారు, కుష్టరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తరమిచ్చెను.వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను — మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో — సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో ఉందురు గదా?మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అని యొవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను.స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు."
ఇది ముందే జరిగిపోయినది. ఇది సంభవించిన సంగతి. అది సమాప్తమయినది. కాని ఇప్పుడు మీరు మలాకీ 4:1-6లో ఉన్నది గమనించండి,
"ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్టులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండ రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యొహోవా సెలవిచ్చుచున్నాడు.అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రోక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసికొనుడి.యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును.నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టను పిల్లల హృదయములను తండ్రుల తటును త్రిప్పును."
చూడండి, ఈ ఏలియా వచ్చిన వెంటనే భూమి అగ్నిద్వారా శుభ్రపరచబడును. దుర్మారులు దహింపబడి ధూళిగా మారెదరు. అయితే ఇది యోహాను కాలములో జరుగలేదు (ఆనాటి ఏలియా) దేవుని యొక్క ఆత్మ ఆ వర్తమానికుని యొక్క రాకను గూర్చి ప్రవచించెను. మలాకీ 3:1 (యోహాను) తన ముందున్న ప్రవచనాత్మక వచనమును ఎత్తి చూపించుచున్నాడు. యెషయా 40:3లో దాదాపు ముందున్న మూడు శతాబ్దముల దానినిగూర్చి చెప్పెను.
"అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము. యెహోవా కొరకు మార్గము సిద్ధపరచుడి. మన దేవునికి ఎడారిలో రాజ మార్గము సరాళము చేయుడి."
ఇప్పుడు యోహాను పరిశుద్ధాత్మ ద్వారా యొషయా మరియు మలాకీలో నున్న దానిని ఎలుగెత్తి చెప్పెను. మత్తయి 3:3.
"ప్రవక్తయగు యెషయా ద్వారా పలుకబడిన వాడితడే. అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము, ప్రభువు యొక్క మార్గము సరాళము చేయుడి, ఆయన త్రోవలను సరాళము చేయుడి"
ఈ లేఖనములను బట్టి మనము తేటగా చూడగలము. మలాకీ 3లోనివాడు యోహాను. మలాకీ 4లోని ప్రవక్త కాడు, అయిననూ యోహాను మీదను, ఈ చివరి దినపు ప్రవక్తయగు వాని మీదను ఒకే ఆత్మ ఏలియా యొక్క ఆత్మ నిశ్చయముగా ఉండును.
మలాకీ 4 మరియు ప్రకటన 10:7లోని ఈ వర్తమానికుడు రెండు కార్యములను చేయనైయున్నాడు. ఒకటి: మలాకీ 4 ప్రకారము అతడు పిల్లల హృదయములను తండ్రుల వైపుకు త్రిప్పును. రెండు: ప్రకటన 10లోని ఏడు ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును, అవి ఏడు ముద్రలలో యుండిన ప్రత్యక్షతలే. ఈ 'మర్మముగానున్న సత్యములను' దైవసంబంధముగా ప్రత్యక్తపరచును, అవి పిల్లల యొక్క హృదయములను పెంతెకోస్తు తండ్రుల వైపునకు త్రిప్పును. అక్షరాలా ఇది నిజము.
కాని దీనిని కూడా ఆలోచించండి. ఈ ప్రవక్తయగు వర్తమానికుడు తన స్వభావములోను, వైఖరిలోను ఏలియాను, యోహానును పోలియుండును. ఈ ప్రవక్తయగు వర్తమానికుని యొక్క దినములలో యుండు జనులు ఆహాబు దినములలోను, యోహాను దినములలోను యున్న జనులవలె యందురు. "పిల్లల యొక్క హృదయములు" మాత్రమే త్రిప్పబడును అని చెప్పబడినటుగా, ఆ పిల్లలు మాత్రమే విందురు. ఆహాబు దినములలో 7,000 మంది నిజమగు ఇశ్రాయేలీయులు ఉండిరి. యోహాను దినములలోను కొద్దిగానే యుండిరి. ఆ రెండు కాలములలో యుండిన సమూహములు విగ్రహారాధన అను జారత్వములో యుండిరి.
యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందుగా పెళ్ళిన ప్రవక్త — వర్తమానికుడు అయిన యోహానుకీ మరియు లవొదికయ యొక్క ప్రవక్త — వర్తమానికుడూ అయిన వానికీ మధ్య మరొక పోలిక నేను చూపించాలనుకుంటున్నాను. యోహాను దినములోని ప్రజలు అతడిని మెస్సీయా అని పొరబడిరి
యోహాను 1:19-20,
"నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు యొరుగననక ఒప్పుకొనెను; — క్రీస్తును కానని ఒప్పుకొనెను."
యిప్పుడు ఈ చివరికాల వర్తమానికుడు ప్రభువు ఎదుట కలిగియున్న గొప్ప శక్తిని బట్టి అతడు ప్రభువైన యేసు అని పొరబడువారు కొందరు ఉందురు.
(చివరి దినములలో లోకములో ఉండు ఒక ఆత్మ వారిని మోసపరచి దీనిని నమ్మునట్లుగా చేయును.
మత్తయి 24:23-26.
"ఆ కాలమందు ఎవడైనను — ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి. అబద్దపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.యిదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.కాబట్టి ఎవరైనను — యిదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను పెళ్ళకుడి — యిదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి.")
కాని మీరు దానిని నమ్మవద్దు. అతడు యేసుక్రీస్తు కాడు. అతడు దేవుని కుమారుడు కాదు. అతడు సహోదరులలో ఒకడు, ఒక ప్రవక్త, ఒక వర్తమానికుడు, దేవుని సేవకుడు. "నేను ఆయనను కాదు, కాని ఆయన నా వెనుకవచ్చుచున్నాడు," అని కేకవేయుచున్న స్వరముగా యోహాను ఉన్నప్పుడు, అతడికి లభించిన గౌరవముకంటే ఎక్కువ గౌరవము యితనికి చూపించనవసరము లేదు.
ఈ లవొదికయ సంఘకాల వర్తమానికుని గూర్చిన విభాగమును ముగించు ముందుగా ఈ రెండు ఆలోచనలను మనము తీవ్రంగా యోచించవలెను. మొదటగా ఈ కాలమునకు ఒక ప్రవక్త వర్తమానికుడు ఉండును. ప్రకటన 10:7లో ఇట్లు చెప్పెను, "అతడు (ఏక వచనము) బూర ఊదబోవుచుండగా," ఒకే సమయములో ఇద్దరు పెద్ద ప్రవక్తలను దేవుడు తన ప్రజలకు ఏ కాలములోనూ ఇచ్చుట జరుగలేదు. ఆయన హానోకును ఇచ్చెను (ఒక్కడే); నోవహును ఇచ్చెను (ఒక్కడే); మోషేను ఇచ్చెను (ఒక్కడు మాత్రమే వాక్యమును కలిగియుండెను, ఇతరులు ప్రవచించిరి); బాప్తిస్మమిచ్చు యోహాను ఒక్కడే. ఈ చివరి దినములలోను ఒక్కడే ప్రవక్త యుండును (ప్రవక్తిని కాదు — ఈ కాలములో మగవారికంటె ఎక్కువమంది స్త్రీలు దేవుని యొక్క ప్రత్యక్షత తమ యొద్దకు వచ్చినదని చెప్పుకొందురు), కాని అతడు (ప్రవక్త) అంత్యకాల జనులకు మర్మములను బయలు పరచునని తప్పిపోని వాక్యము చెప్పుచున్నది, పిల్లల యొక్క హృదయములను తండ్రుల వైపునకు త్రిప్పును.
ఒక సామూహిక ప్రత్యక్షత ద్వారా దేవుని యొక్క ప్రజలు కలిసిపోదురని చెప్పువారు కొందరున్నారు. ఆ మాటను నేను సవాలు చేయుచున్నాను. అది అర్థములేని, విలువలేని మాట, ప్రకటన 10:7 వారికి తెలియదు. ఈ చివరి కాలములో జనులు ప్రవచించరని నేను చెప్పను. వారి పరిచర్యలు సరియెనవే కావచ్చును. పౌలు దినములలో యున్నట్లుగానే ప్రవక్తలు ఉండరని నేను చెప్పను, "ఆ దినములలో అగబు అను ప్రవక్త కరవు వచ్చునని ప్రకటించెను." అది అలాగే అని నేను ఒప్పుకోనుచున్నాను. కాని వాక్యము యొక్క తప్పిపోని రుజువును బట్టి నేను దీనిని కాదనుచున్నాను. అందరికంటె ప్రధానమైన ఒక ప్రవక్త వర్తమానికుడై యుండును. వాక్యములోని మర్మములను అతడు బయలుపరచును. పిల్లల హృదయములను తండ్రుల వైపు త్రిప్పు పరిచర్యను అతడు కలిగియుండును. తప్పిపోని తన వాక్య ప్రమాణమును బట్టి "యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు"ను అతడు నిలబడి బయలుపరచును. ఈ కాలమునకు ఒక ప్రవక్తయగు వర్తమానికుడు ఉండును.
మానవ నడవడిని ఒక్కదానినే ఆధారముచేసికొని ఇది మనకు తెలియును, ఎక్కడైతే ఎక్కువ మంది మనుష్యులుందురో అక్కడ ఏకాభిప్రాయము ఉండదు. పెద్ద బోధలోని తక్కువ విషయములను మాత్రమే వారు పటుకొనియుందురు. తప్పిపోని శక్తిని కలిగియుండు ఒక వ్యక్తి ఈ చివరి కాలములో పునరుద్ధరణను తీసికొని రావలసియున్నాడు, ఎందుకనగా ఈ చివరి కాలము పవిత్రమైన దేవుని వాక్య వధువును బయలుపరచవలసియున్నది. దాని అర్థమేమనగా మనకు మరొకసారి వాక్యము ఉన్నది-ఉన్నట్లుగా పౌలు దినములలోవలె పరిపూర్ణముగా అనుగ్రహించబడును. దానినెవరు కలిగియుందురో మీకు చెప్పెదను. హానోకు దినములు మొదలుకొని, ఈ దినము వరకూ ఎన్నడూ బయలుపరచబడనంత తేటగా అది బయలుపరచబడును. ఏకాలములోనూ ఏ ప్రవక్తయూ ఆలాగు బయలుపరచలేదు, ఎందుకనగా మూలరాయి యగు ప్రవచనాత్మక పరిచర్యను కలిగియుండవలసిన అవసరము ఇతనికి ఉండును, దానిని దేవుడు అతనికి చూపించును. అతడు స్వయంగా ఏమియూ చెప్పుకోనవసరము లేదు. సూచన యొక్క స్వరము ద్వారా దేవుడతని తరుపున మాట్లాడును. ఆమేన్.
మన హృదయములలో ముద్రింపబడవలసిన రెండవ ఆలోచనను చూడండి, ఏడు సంఘ కాలములు క్రీస్తువిరోధి ఆత్మతో ప్రారంభమైయుండి అదే విధంగా పరిశుద్ధాత్మయు ఉండి నిత్యమూ ఆశీర్వదించుచుండును.
I యోహాను 4:1
"ప్రియులారా, అనేకులైన అబద్ద ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి."
దానిని మీరు గమనించారా? అబద్ధ ప్రవక్తలతో క్రీస్తువిరోధి యొక్క ఆత్మ గుర్తించబడినది. అబద్ధ ప్రవక్తలతో ఈ కాలములు వచ్చియున్నవి. అబద్ధ ప్రవక్తతోనే అవి గతించును. ఒక నిజమగు అబద్ధ ప్రవక్త ఉండును. అతనిని గూర్చి ప్రకటనలో ముందే చెప్పబడినది. కాని ఇప్పుడు వానికంటె ముందుగానే చాలామంది అబద్ధ ప్రవక్తలు ప్రత్యక్షమగుచున్నారు.
మత్తయి 24:23-26,
"ఆ కాలమందు ఎవడైనను — ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి.అబద్ధపు క్రీస్తులును, అబద్ధపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.కాబట్టి ఎవరైనను, ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి; ఇదిగో, లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి."
ఈ అబద్ధపు ప్రవక్తలు గురించి మనకొరకు అనేకమైన లేఖనములలో క్రింది చెప్పబడినది.
II పేతురు 2:1-2,
"మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో యుండిరి. అటువలెనె మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును."
II తిమోతీ 4:3-4,
"ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగు కాలము వచ్చును.
I తిమోతీ 4:1.
"అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు."
ఇప్పుడు వాక్యమునకు వెలుపట యుండువాడు అబద్ధ ప్రవక్తయుని అన్ని సందర్భములలోను చెప్పబడియున్నది. "క్రీస్తువిరోధియనగా "వాక్యవిరోధియని" మీకు చూపించియున్నాను. కావున ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి వాక్యమును వంకర చేయుదురు. తమ యొక్క స్వంత దయ్యపు విధానములకు సరిపడునట్లుగా అర్ధము చెప్పెదరు. ఇతరులను తప్పు త్రోవ పట్టించినవారు, చివరికి తామే భయములో చిక్కుకొని పోవుటను మీరు ఎప్పుడైనా గమనించారా? తాము చేయచున్నదానిని చేయకుండా జనులు వెళ్ళిపోవుచున్నప్పుడు వారిని నాశనము వెంబడించును. వారు అబద్ధ ప్రవక్తలు, ఎందుకనగా నిజమగు ప్రవక్త ఎల్లప్పుడునూ వాక్యము యొద్దకు నడిపించును, జనులను యేసుక్రీస్తునకు కట్టును. తనకు భయపడుమని గాని లేక తాను చెప్పినది చేయమని గాని అతడు అనడు. వాక్యము చెప్పుచున్నదానికి భయపడుడని చెప్పును. గమనించండి, వీరు యూదావలె డబ్బు కొరకు అమ్ముడుపోయెదరు. నీకున్నదానినంతటిని అమ్ముటకు వారు చూచెదరు. వారు ప్రణాళికలకు, వారి స్వంతమునకు దానిని ఇమ్మని కోరుదురు. వాక్యముకంటె ఎక్కువగా వారు అర్పణలను సంపాదించుకొనుటకు ఉపయోగించెదరు. ఇది చాలా గొప్ప తప్పు. వారాలాగు వరమును ఉపయోగించి డబ్బునడుగుదురు, వాక్యమును అలక్ష్యము చేయుదురు. ఇది దేవుని పని యందురు. ప్రజలు వారియొద్దకు వెళ్ళుదురు, వారితో ఏకమవుదురు, వారిని బలపరచుదురు, వారిని నమ్ముదురు. అది మరణ మార్గమని వారికి తెలియదు.
అవును, శరీరసంబంధులగు అనుకరణకర్తలతో దేశము నిండియున్నది. ఆ చివరి దినమున వారు ఆ ప్రవక్త వర్తమానికుని అనుకరించుటకు ప్రయత్నము చేయుదురు. స్కెవ యొక్క ఏడుగురు కుమారులు పౌలును అనుకరించుటకు ప్రయత్నించినట్లుగా, సీమోను అను మంత్రగాడు పేతురును అనుకరించుటకు ప్రయత్నించెను. వారియొక్క అనుకరణలు శరీర సంబంధమైనవి. నిజమగు ప్రవక్త చేసిన కార్యములను వారు చేయజాలరు. ఉజ్జీవము అయిపోయినదని అతడు చెప్పిన వెంటనే వారందరూ గుమిగూడి గొప్ప ప్రత్యక్షతను మేము పొందియున్నామని చెప్పుకొందురు. అది చాలా నిజమయినదని చెప్పెదరు. దేవుడు ఇంకా గొప్పవాటిని, అద్భుతమగువాటిని జనుల మధ్య చేయునని వారందురు. ప్రజలు నిజమేనని వెంబడించెదరు. చివరి దినపు వర్తమానికుడు వేదాంత పండితుడు కాడని వీరే ఒప్పుకొందురు. అయితే అతని మాట మాత్రము వినవద్దని చెప్పెదరు. వర్తమానికుని కార్యములను వీరు చూపించజాలరు. ఆ చివరి దినపు ప్రవక్తవలె వారు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందరు. కాని వారు గొప్ప డంబపు మాటలు పలుకుచూ ప్రపంచ వ్యాప్తంగా వారికి గల పలుకుబడిని బట్టి, జనులను వారు హెచ్చరించి అతని మాటలను విననీయకుండా చేయుదురు (ఆ వర్తమానికుని) అతడు తప్పు బోధించుచున్నాడని వారందురు. అక్షరాలా వారు తమ తండ్రులగు పరిసయ్యుల వలెనె యున్నారు, వారు అపవాది సంబంధులు, యోహాను మరియు యేసు ఇద్దరును తప్పు చెప్పిరని వారందురు.
ఈ అబద్ద ప్రవక్తలు నిజప్రవక్తకు విరోధముగా లేచి అతని బోధను ఎందుకు అడ్డగించెదరు? ఎందుకనగా వారు తమ పితరులవలెనె ఖచ్చితంగా చేయుచున్నారు. ఆహాబు దినములలో వారు మీకాయాకు విరోధముగా లేచిరి. వారు నాలుగు వందల మందియుండిరి, వారందరూ ఏకాభిప్రాయముతో ఉండిరి; వారందరూ ఒకే మాట పలుకుచుండిరి, వారు జనులను మోసము చేసిరి. కాని ఒక ప్రవక్త — కేవలము ఒక్కడు —సరియైనవాడు మరియు మిగిలిన వారందరూ అబద్ధికులే, ఎందుకనగా దేవుడు తన ప్రత్యక్షతను ఒకే ఒకనికి అప్పగించెను.
అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి, ఎందుకనగా వారు క్రూరమైన తోడేళ్ళు.
దీనిని గూర్చి ఇంకా నీకు ఏదయినా సందేహమున్నచో దేవునిని అడుగుము. ఆయనాత్మతో నిన్ను నింపి, నడిపించమని అడుగుము, ఎందుకనగా ఏర్పరచబడినవారు మోసపుచ్చబడరు. దానిని మీరు గ్రహించారా? నిన్ను ఏ మానవుడును మోసము చేయజాలడు. పౌలు గాని తప్పు మార్గములో ఉండియుండినచో, ఎవనినీ, అనగా ఏర్పరచబడిన వానిని మోసము చేయలేకపోయి యుండును. మొదటి ఎఫెసు కాలములో ఉండిన ఏర్పరచబడినవారు మోసపుచ్చబడలేదు, ఎందుకనగా వారు అబద్ధ ప్రవక్తలను, అపోస్తలులను పరీక్షించిరి. వారిని అబద్ధికులని కనుగొని బయటికి పంపించి వేసిరి. హల్లెలూయా. ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును మరియు ఆయనను అవి వెంబడించును. ఆమేన్. దానిని నేను నమ్ముచున్నాను.
అభినందనము
ప్రకటన 3:14,
"ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవునికి సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు."
మన ప్రియ ప్రభువును మరియు రక్షకుడును అగు యేసుక్రీస్తు యొక్క లక్షణములను అద్భుతముగా వర్ణించెను గదా? ఈ మాటలు నన్ను అరచునట్లుగా చేయుచున్నవి. అవి అంత గొప్ప వాస్తవ ఆత్మను నా హృదయములోనికి తీసికొని వచ్చుచున్నవి. వాటిని గూర్చి ఆత్మ క్షుణ్ణంగా ప్రత్యక్షతను ఇచ్చు వరకు ఆగనక్కరలేదు, వాటిని చదివితే చాలును. చదవగానే ఎంతో ఉత్తెజము కలిగించుచున్నవి.
చివరి కాలమునకు సంబంధించి యేసు తనయొక్క వివరణను స్వయంగా ఇచ్చుచున్నాడు. కృపా దినములు గతించుచున్నవి. మొదటి శతాబ్దము మొదలుకొని ఇరవైయ్యవ శతాబ్దము వరకు గల వారిని ఆయన చూచియున్నాడు. మరియు ఈ కాలములకు చెందిన సంగతులన్నింటిని గూర్చి ఆయన చెప్పెను. ఆయన మనకు చివరి దినపు గుణలక్షణములను బయలుపరచుటకు ముందుగా మనకు ఒక చివరి చూపును ఇచ్చియున్నాడు. ఆయన యొక్క కృపగల మహత్తర దైవత్వమును మనకు చూపించెను. ఇది ఆయన యొక్క తలరాయి ప్రత్యక్షత.
"ఆమేన్" అనువాడు ఈలాగు చెప్పుచున్నాడు. యేసు దేవుని యొక్క ఆమేన్ అయి యున్నాడు. యేసు దేవుని యొక్క, "అలాగు జరుగును గాక" అయి యున్నాడు. నమ్మకమైన సత్యసాక్షియు అయి యున్నాడు. ఆమేన్ అనునది ముగింపును చూపించుచున్నది. అది నిశ్చయతకు నిరూపణగా యున్నది. జయించు వాగ్దనమునకు అది సూచనగా యున్నది. మారని వాగ్దనమునకు అది సూచనగా యున్నది. దేవుని యొక్క ముద్రకు అది సూచనగా యున్నది.
ఇప్పుడు దీనిని మీరు జాగ్రత్తగా గమనించవలెనని కోరుచున్నాను మరియు ఇక్కడ చాలా అందమైనది, మధురమైనది ఉన్నది గనుక చూడవలెను. ఇది స్వయంగా ఆయన యొక్క అంత్యకాల ప్రత్యక్షత అని నేను చెప్పాను. కృపా దినము ముగించినప్పుడు కొద్ది దినములలోనే లేదా కొంత వ్యవధిలోనే వెయ్యేండ్ల పాలన ప్రారంభమగును, అవును గదా?
మంచిది, నాతో కూడా కలిసి యెషయా 65:16-19 చదవండి.
"దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును. దేశములోప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలునా దృష్టికి మరువబడును. అవి నా దృష్టికి మరుగవును.ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిమి సృజించుచున్నాను. మునుపటివి మరువబడును. జ్ఞాపకమునకు రావు.నేను సృజించుచున్న దానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను.నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు."
ఇది నూతన యొరూషలేమును గూర్చినది. ఇది వెయ్యేండ్ల పాలనా కాలము. కాని మనము వెయ్యేండ్ల కాలములోనికి వెళ్ళుచుండగా ఆయన చెప్పుచున్న మాటను నిశ్చయముగా వినండి, 16వ వచనము చూడండి, ఒక రకమగు దేవుని గూర్చి వ్రాయబడినది.
"దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదించవలెనని కోరుకొనును."
అవును అది నిజము, కానీ నిజమగు అనువాదములో "నమ్మదగిన దేవుడు" అని లేదు. "ఆమేన్ అను దేవుడని," యున్నది. కాబట్టి మనము "దేశములో ప్రమాణము చేయువాడు ఆమేన్ అను, దేవుని తోడని ప్రమాణము చేయును." ఎందుకనగా పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుచున్నాను; మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా, నేను యెరూషలేమును ఆనందరకమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించువారిని గాను, సృ జించుచున్నాను. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను, రోదన ధ్వనియు విలాస ధ్వనియు దానిలో ఇకను వినబడవు." హల్లెలూయా! పాత నిబంధన యొహోవా ఇక్కడున్నాడు. "ఆమేన్ అను దేవుడు." ఇక్కడ క్రొత్త నిబంధన దేవుడు ఉన్నాడు. "ఆమేన్ అను దేవుడు" ఓ ఇశ్రాయేలూ వినుము. నీ ప్రభువగు దేవుడు ఒక్కడే. మరల దానిని చూడండి. పాత నిబంధనలోని యెహోవాయే, క్రొత్త నింబంధనలోని యేసు. ఓ! ఇశ్రాయేలూ వినుము, నీ ప్రభువగు దేవుడు ఒక్కడే! క్రొత్త నిబంధన మరియొక దేవునిని బయలుపరచలేదు, కానీ మారని ఒకే దేవుని యొక్క ఎక్కువ ప్రత్యక్షతను అది ఇచ్చియున్నది. క్రీస్తు తన్నుతాను బయలుపరచుకొనుటకు రాలేదు. కుమారుని బయలుపరచుటకు ఆయన రాలేదు. తండ్రిని బయలుపరచుటకు, తెలియచేయుటకు ఆయన వచ్చెను. ఆయన ఎన్నడునూ ఇద్దరు దేవుళ్ళను గూర్చి మాట్లాడలేదు; ఒకే దేవుని గూర్చి ఆయన మాట్లాడెను. ఇప్పుడు ఈ చివరి కాలములో మనము మూలరాయి ప్రత్యక్షతను పొందుచున్నాము. దైవత్వము యొక్క అతి ప్రాముఖ్యమగు ప్రత్యక్షతను, మొత్తం బైబిలులో మనము చూడగలము. అదేమనగా, యేసే దేవుడు, ఆయన మరియు తండ్రి ఒక్కడే: ఒకే దేవుడున్నాడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయన ఆమేన్ అను దేవుడు. ఆయన ఎన్నడూ మారడు. ఆయన క్రియలు ఎన్నడును మూరవు. దానిని ఆయన పలుకగా, ఆలాగున అవి నిలబడును. ఆయన దానిని చేయగా, అది నిరంతరము నిలచియుండును. ఆయన చెప్పినదానిలో నుండి దేనినీ ఎవరునూ తీసివేయజాలరు. దానికి మరేమీ కలుపజాలరు. ఆలాగు జరుగును గాక, ఆమేన్. అటువంటి దేవునిని సేవించుచున్నందుకు మీరు సంతోషముగా లేరా? ఆయనతో నీవు ఏ సమయములోనయినా గాని ఎక్కడుందువో ఖచ్చితంగా తెలిసికొనగలవు. సదా కాలము ఆయనతో కూడా యుందువు. ఆయన ఆమేన్ దేవుడు మరియు ఆయన మారడు.
"ఆమేన్ అనువాడు చెప్పు సంగతులు."
ఆ మాట నాకు ఇష్టము. దాని అర్థము ఏమనగా ఆయన మాటయే ఇక తుది. మొదటి కాలమునకు, రెండవ కాలమునకు, అన్ని కాలములకు ఆయన చెప్పినదియే తుది. ఆయన తన నిజమగు సంఘమును గూర్చియు, అబద్ధ ద్రాక్షావల్లి గూర్చియు ఖచ్చితంగా చెప్పెను. అది మారదు. దీనియొక్క అర్థము ఏమనగా, ఆయన ఆదికాండముతో ప్రారంభించిన దానిని ప్రకటనలో సమాప్తము చేయును. ఆలాగు ఆయన చేయవలసియున్నాడు, ఎందుకనగా ఆయన ఆమేన్ అయి యున్నాడు. కావున ఆలాగు జరుగును. ఆదికాండము మరియు ప్రకటన గ్రంథములను అపవాది ఎందుకు ద్వేషించునో మీరు గ్రహించగలరు. సత్యమును వాడు ద్వేషించును. సత్యము జయించునని వాడికి తెలియును. వాని యొక్క అంతము గూర్చి వానికి తెలియును. ఎంతగా దానిని ఎదిరించుచున్నాడో చూడండి. కాని మనము జయము పక్షమున యున్నాము. మనము (ఆయన వాక్యమును నమ్ము విశ్వాసులు మాత్రమే అని నా భావము) ఆమేన్ పక్షమున యున్నాము
"నమ్మకమైన సత్య సాక్షి చెప్పు సంగతులు." "నమ్మకమగువాడు" అను దాని గూర్చి నేను ఆలోచించిన దానినిగూర్చి మీకు చూపించగోరుచున్నాను. మనము ఎల్లప్పుడును మారని ఒక గొప్ప దేవుని గూర్చి మాట్లాడుచుందుమని మీకు తెలియును. ఆయన వాక్యము మారదు. ఆ విధముగా ఆయనను గూర్చి మనము మాట్లాడినప్పుడు, ఆయన వ్యక్తిగా లేడను ఒక ధృక్పధమును మనము కలిగియుందుము లేదా అట్టి భావము గోచరించినట్లు కనబడును. దేవుడు మొత్తం విశ్వమును, దానికి సంబంధించిన నియమములను సృజించెను మరియు ఆ తరువాత ఆయన వాటి వెనుక నిలబడి, ఒక వ్యక్తిగా లేని గొప్ప దేవునిగా మారినట్లు మనము తలంచుచుందుము. నశించిపోయిన మానవుల కొరకు ఆయన ఒక రక్షణ మార్గమును ఏర్పరచెను, ఆ మార్గము సిలువ, మన పాపముల పరిహారమును క్రీస్తు యొక్క మరణము తీర్చెను, ఆయన పునరుత్థానము వలన మనకు ఆయన తలుపు తెరువబడియున్నది. ఆ తరువాత ఆయన మన వెనుక చేతులు ముడుచుకొని నిలబడెను. ఒక గొప్ప సృష్టికర్తను మనము చూచుచున్నాము, ఆయన సృజించెనని మనము నమ్ముచున్నాము, ఆయన తన సృష్టియందు తన ఆసక్తిని కోల్పోలేదు. కానీ అది తప్పు ఆలోచన, ఎందుకనగా దేవుడు ఇప్పుడు కూడా మానవుల యొక్క వ్యవహారములను ఏలుబడి చేయుచున్నాడు. ఆయన సృష్టికర్తయు మరియు కొనసాగించువాడునై యున్నాడు.
కొలస్సీ 1:16-17.
"ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనివి గాని, అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను.ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు."
ఆయన సార్వభౌముడగు దేవుడు. ఆయన తనయొక్క స్వంత ఆలోచన ద్వారా రక్షణ పధకమును నియమించెను. తాను ముందుగా ఏర్పరచుకొనిన వారిని ఆయన స్వయంగా ఎరుగును. రక్షణ విధానమును స్థాపించుట కొరకు కుమారుడు సిలువ మీద మరణించెను. పరిశుద్ధాత్మ జాగ్రత్తగా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుచున్నది. ఈ సమయములో ఆయన ప్రతివానిని కూడా తన స్వచిత్తవు యొక్క సంకల్పవు ననుసరించి జరిగించుచున్నాడు. అన్నిటియందును ఆయనయున్నాడు. తన యొక్క సంఘము మధ్యలో ఆయన యున్నాడు. ఈ గొప్ప సృష్టికర్త, రక్షకుడగు దేవుడు, నమ్మకముగా తన పనిని నిర్వహించుచున్నాడు. ఆయన తన స్వంత గొర్రెల మధ్య గొప్ప గొర్రెలకాపరిగా యున్నాడు. ఆయన తన ఉనికిని స్వంత వారి మధ్య కనుపరచుచున్నాడు. ఆయన వారిని ప్రేమించి వారి పట్ల శ్రద్ధ చూపుచున్నాడు. ఆయన దృష్టి సదా వారి మీద యున్నది. "మీ జీవితములు క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి యున్నవని" వాక్యము చెప్పుచున్నది. దానికి మరొక అర్థము లేదు. ఓ! నాకు చాలా సంతోషముగా యున్నది. నా దేవుడు నమ్మకస్తునిగా యున్నాడు. ఆయన యధార్థపరుడు, ఆయన అబద్దమాడడు. ఆయన తన వాక్యము పట్ల నమ్మకముగా యుండును, దానిని ఆయన బలపరచును. ఆయన మన పట్ల నమ్మకమయినవాడు, ఆయన మనలో ఎవరినీ పోగొట్టుకొనడు, అంత్యదినమున మనలను ఆయన లేపును. ఆయన యొక్క నమ్మకత్వమునందు నేను విశ్రమించుచున్నందుకు సంతోషించుచున్నాను.
ఫిలిప్పీ 1:6
"మీలో ఈ సత్ క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను."
"ఆయనే సత్యసాక్షి."
ఇప్పుడు ఈ సత్యము అను మాటను చూడండి. ప్రకటన 3:7లో చూచిన మాట ఇదే. మీకు గుర్తు౦డియుండును, ఇది "అబద్దమను" మాటకు వ్యతిరేకముగా ఉన్ననూ "నిజమను" మాట కాదని చెప్పాను. దానికంటె ఇంకా బలమైన, ఇంకా లోతైన అర్ధమును కలిగియున్నది. పాక్షిక గ్రహింపునకు వ్యతిరేకముగా పరిపూర్ణ గ్రహింపును ఇది వ్యక్తపరచుచున్నది. గత ఫిలడెల్సియ కాలములో ప్రభువు యొక్క రాకడ సమీపించియున్నది. ఆ కాలము ఆయన కొరకు ఎంత గొప్ప ప్రేమను కనుపరచినదో చూడండి
I పేతురు1:8లోని రమ్యమగు మాటలు నాకు అందువలన గుర్తుకు వచ్చుచున్నవి.
"మీరాయనను చూడకపోయినను, ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడాయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచూ, చెప్పనాశక్యమును మహిమ యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు."
వారితో కూడా మనమును ఆనందించుచున్నాము. ఆయనను మనము చూడలేదు, కాని ఆయనను మనము తాకియున్నాము. పరిమితమగు మన జ్ఞానేంద్రియములు అనుమతించుదానిని బట్టి ఇప్పుడు ఆయనను మనము ఎరుగుదుము. కాని ఒక దినమునము ఖాముఖిగా చూచెదము. అదే ఈ కాలము. ఈ కాలము యొక్క అంతమందు ఆయన వచ్చును. పాక్షిక గ్రహింపు, పరిపూర్ణ గ్రహింపుగాను, సంపూర్తి అయిన గ్రహింపుగాను మారును. హల్లెలూయా! మనకు గల అద్దము గుండా మనము చూచుచున్నాము, అయితే త్వరలోనే ముఖాముఖిగా చూచెదము. మనము మహిమ నుండి అత్యధిక మహిమలోనికి వెళ్ళచున్నాము, కాని త్వరలో మహిమలోనే యుందుము; ఆయన యొక్క మహిమలో మనము ప్రకాశించుదుము. మనము ఆయనవలె యుందుము, అద్భుతముగా ఆయనను పోలియుందుము, యేసు మన దైవ రక్షకుడు! అది అద్భుతముగా లేదా? ఆయనలో మనము సంపూర్తులము. ఇది సత్యమే. దానిని గూర్చి ఆయన మనకు అబద్ధము చెప్పడు. కాని ఒక దినమున మనము అణువులలో నుండి మార్సు పొందుదుము. మనము అమర్త్యతను ధరించుకొందుము. మనందరమును జీవములో ప్రిమింగివేయబడుదుము. అప్పుడు మనము గ్రహింపును గ్రహించుదుము.
"ఆయన నమ్మకమైనవాడును, సత్యసాక్షియు అయి యున్నాడు."
ఇప్పుడు 'సాక్షి' అను మాటను మనము ఆలోచించుదము 'హతసాక్షి' అంను మాట నుండి అది వచ్చియున్నది. సైఫను, అంతిప ఇంకా ఇతర హతసాక్షుల గూర్చి బైబిలు చెప్పుచున్నది. వారు హతసాక్షులు, ఆలాగే వారు సాక్షులు కూడాను. యేసు ఒక నమ్మకమగు హతసాక్షి. అందుకు పరిశుద్ధాత్మయే సాక్షి. అందుకు ఆత్మ సాక్ష్యమిచ్చుచున్నది. ఈ లోకము యేసును ద్వేషించెను. అది ఆయనను చంపెను. కాని దేవుడాయనను ప్రేమించెను మరియు ఆయన తండ్రి యొద్దకు వెళ్ళెను. పరిశుద్ధాత్మ వచ్చుటయే ఆయన తండ్రి యొద్దకు వెళ్ళినట్లు రుజువు. యేసు గాని తండ్రి చేత స్వీకరింపబడనియెడల ఆత్మ వచ్చియుండెడిది కాదు.
యోహాను 16:7-11లో దానిని చదవండి.
"అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్ళనియెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీ యొద్దకు పంపుదును.ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసముంచ లేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును."యేసు ఇక్కడ ఉండుటకు బదులుగా, ఈ లోకములో పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి యున్నది. యేసు నీతిమంతుడనియు, ఆయన తండ్రి యొద్దకు వెళ్ళియున్నాడనియు రుజువగుచున్నది.
కాని యోహాను 14:18లో కూడా ఈలాగు చెప్పబడినది.
"మిమ్మును అనాధలుగా విడువను, మీయెద్దకు నేను వచ్చెదను."
ఆయన ఆదరణకర్తను పంపించెను. ఆయనే ఆదరణకర్తగా యుండెను. ఆయన తిరిగి ఆత్మరూపిగా నిజ సంఘము మీదికి వచ్చెను. ఆయన సంఘము మధ్య నమ్మకమగు సత్యసాక్షిగా యున్నాడు. కాని ఒక దినమున ఆయన మరల శరీరములో రానైయున్నాడు. ఎవరు జ్ఞానము గలవారో ఆయన అప్పుడు రుజవు చేయును — అది ఆయనే, యేసుక్రీస్తు మహిమకు ప్రభువు.
నమ్మకమగు సత్యసాక్షి సృష్టికర్త, కొనసాగించువాడు, పరిపూర్ణ గ్రహింపు, దేవుని యొక్క ఆమేన్.
ఓ! ఆయనను నేను ఎంతగానో ప్రేమించుచున్నాను, ఎంతో ఆయనను ఘనపరచుచున్నాను, యేసు దేవుని కుమారుడు.
ఈ అభినందనమును గూర్చిన నా ఆలోచనలను ఈ మాటలతో ముగించగోరుచున్నాను,
II కొరింధీ 1:18-22
"దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్లుగా ఉండలేదు.మాచేత, అనగా నా చేతను సిల్వానుచేతను తిమోతీచేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవునను వాడైయున్నాడు.దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే యున్నవి గనుక,మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు."
"దేవుని సృష్టికి ఆదియునైయున్నాడు."
ప్రభువైన యేసు అదే అయి యున్నాడు, అని తాను చెప్పుకొనుచున్నాడు. కాని ఆ మాటలు మనకు వినుటకు అర్ధము కానట్లు ఉండును. ఆ పదముల యొక్క భావమును కొందరు తప్పుగా అర్ధము చేసికొనుచున్నారు. యేసు, దేవుని యొక్క ఆది సృష్టియని కొందరు అభిప్రాయపడుచున్నారు. (వాస్తవంగా చాలామంది ఆలాగున ఉద్దేశ్యము కలిగియున్నారు) దేవునికంటె ఆయనను తక్కువవానిగా చూచుచున్నారు. ఈ మొదటి సృష్టి తరువాత మిగిలిన విశ్వము మరియు అందులో ఉన్నవియు సృజింపబడినవి వారు తలంచుచున్నారు. కాని అది తప్పు అభిప్రాయము. అది బైబిలునకు సరిపోదు. "దేవుని సృష్టికి అది లేదా మూలము ఆయన అయి యున్నాడని," చెప్పబడినది. యేసే దేవుడనియు, ఆయన దేవుడు గాక మరేది కాడనియు నిశ్చయముగా మనము ఎరుగుదుము. ఆయన సృష్టికర్త.
యోహాను 1:3,
"సమస్తమును ఆయన ద్వారా కలిగెను. కలిగియున్నదేదియూ ఆయన లేకుండా కలుగలేదు."
ఆయనను గూర్చియే అది చెప్పబడెను, ఆదికాండము 1:1.
"ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను."
నిర్గమకాండము 20:11లో కూడా ఇట్లు చెప్పబడెను,
"ఆరు దినములలో యెహోవా భూమ్యాకాశములను, సముద్రమును అందులో యున్న సమస్తమును సృజించి యేడవ దినమున విశ్రమించెను."
చూడండి, ఆయన సృష్టికర్త యనుటలో ఏ సందేహములేదు. సమాప్తము చేయబడిన భౌతిక సృష్టికి ఆయన సృష్టికర్తయు యుండెను.
ఈ మాటల యొక్క అర్ధము ఏమిటో ఇప్పుడు మనము నిశ్చయముగా చూడగలము. మరి యొక భావము ఏమనగా, దేవుడు దేవునిని సృజించెనని చెప్పెదరు. దేవుడే సృష్టికర్తయి యుండగా ఆయన ఏలాగు సృజింపబడగలడు?
కాని ఇప్పుడాయన సంఘము మధ్య నిలబడియున్నాడు. ఆయన అక్కడ నిలబడి యుండగా, తాను చివరి కాలములో ఏమైయున్నాడో బయలుపరచుచున్నాడు. "దేవుని యొక్క సృష్టికి ఆదియై యున్నట్లుగా" ఆయన స్వయంగా చెప్పుకొనుచున్నాడు. ఇది మరియుక సృష్టి. ఇది సంఘమునకు సంబంధించియున్నది. ఇది ఆయన యొక్క ప్రత్యేక హోదా. ఆయన ఆ సంఘము యొక్క సృష్టికర్త, పరలోక పెండ్లి కుమారుడు తన స్వంత పెండ్లి కుమార్తెను సృజించెను. దేవుని యొక్క ఆత్మగా, ఆయన దిగివచ్చి కన్య మరియ గర్భములో కణములను సృజించి ఆలాగు ఆయన శరీరము జన్మించెను. దానిని మరల చెప్పగోరుచున్నాను. ఆయన ఆ శరీరము కొరకు మరియ గర్భములో కణములను సృజించెను. మరియ ద్వారా ఉత్పత్తి చేయబడిన అండమునకు పరిశుద్ధాత్మ కేవలము జీవమును ఇచ్చినచో చాలదు. ఎందుకనగా అది మానవ అండము, అందువలన పాపయుక్తమగు శరీరము పుట్టియుండును. దానివలన "కడపటి ఆదాము" జన్మించియుండెడి వాడు కాడు. ఆయనను గూర్చి ఇట్లు చెప్పబడినది, "నీవు (తండ్రి) నా కొరకు ఒక శరీరమును సిద్ధపరచియున్నావు." ఆ శరీరమును దేవుడు (మరియ కాదు) ఏర్పరచెను. మరియ ఒక మానవ పొదుగు యంత్రముగా యున్నది మరియు ఆ పరిశుద్ధ శిశువును ఆమె మోసి ఆయన జన్మించునటు చేసినది. ఆయన దైవ-నరుడు. ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆయన నూతన సృష్టి. మానవుడు మరియు దేవుడు కలిసిరి; ఈ నూతన సృష్టికి ఆయనే మొదలు, ఆయనే శిరస్సు.
కొలస్సి 1:18,
"సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
II కొరింధీ 5:17,
"కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను, ఇదిగో సమస్తవమును నూతన మాయెను."
మానవుడు సృష్టిలో పాత క్రమము వాడు అయినప్పటికిని, ఇప్పుడు క్రీస్తు యందు ఐక్యతతో, దేవుని యందు నూతన సృష్టిగా యున్నాడు.
ఎఫెసీ 2:10,
"మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్ క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము."
ఎఫెసీ 4:24,
"నీతియు యధార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను."
ఈ క్రొత్త సృష్టిని పాత సృష్టితో చేయలేదు, ఆలాగయినయెడల దానిని క్రొత్త సృష్టియని పిలువజాలవు. కాని అక్కడ "క్రొత్త సృష్టి" అని ఖచ్చితముగా చెప్పబడియున్నది. అది మరియొక సృష్టి, పాతదానికి పూర్తిగా భిన్నమైనది. శరీరసంబంధమగు విధానముల ద్వారా ఇక ఆయన పనిచేయుట లేదు. ఇశ్రాయేలీయులతో ఆయన శరీరరీత్యా పనిచేసెను. ఆయన అబ్రహామును ఎన్నుకొనెను, అబ్రహాము యొక్క సంతానము ద్వారా ఇస్సాకు యొక్క వంశము వచ్చెను. అది దైవ సంబంధమైనది. కాని ఇప్పుడు ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి జనాంగములో నుండియు ఆయన ఒక నూతన సృష్టిని ఉద్దేశించెను. అట్టి సృష్టిలో ఆయన ప్రధముడు. ఆయన దేవుడైయుండి మానవ రూపములో సృజింపబడెను. ఇప్పుడు ఆయన ఆత్మ ద్వారా ఎందరో కుమారులను తన కొరకు సృజించుకొనుచున్నాడు. సృష్టికర్తయిన దేవుడు, తన్నుతాను ఆ సృష్టిలో భాగముగా చేసికొనియున్నాడు.
ఇది దేవుని యొక్క నిజ ప్రత్యక్షతయైయున్నది. ఇది ఆయన యొక్క ఉద్దేశ్యము. ఎన్నిక ద్వారా ఆయన ఈ ఉద్దేశ్యమును నెరవేర్చుచున్నాడు. అందుచేత ఆయన చివరి కాలము వరకును చూచుచున్నాడు. అందరూ అయిపోయిన తరువాత ఆయన సంఘము మధ్యను ఇంకనూ నిలచియుండును. ఈ దేవుని యొక్క నూతన సృష్టికి ఆయన ఆరంభమైయున్నాడు. ఆయన యొక్క సార్వభౌమాధికారము దానిని నెరవేర్చియున్నది. తన యొక్క స్వంత ఆజ్ఞ ద్వారా నూతన సృష్టిలోని తన సభ్యులను ఎన్నుకొనియున్నాడు. ఆయన యొక్క ఆనందకరమగు చిత్తము ద్వారా వారు పిల్లలుగా ఉండుటకు ముందుగానే నిర్ణయించెను. ఆయన తన యొక్క సర్వజ్ఞానము మరియు సర్వశక్తి ద్వారా దానిని జరిగించెను. ఆయన సంఘము మధ్యను నిలబడి, తన సోదరుల యొద్ద నుండి మహిమను పొందుచున్నాడు. ఆయన ఈ సంగతిని నిశ్చయముగా ఎరుగకుండా ఎట్లు ఈలాగు చేయగలడు? సమస్తమూ ఆయన యెరుగును, అన్నింటిని ఆయన నెరవేర్చెను, ఆయన తన యొక్క ఉద్దేశ్యమును మరియు మంచి చిత్తమును ఆయన యెరిగిన దానిని బట్టి జరిగించెను.
ఎఫెసీ 1:11
"దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయి౦చి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు."
హల్లెలూయా! నీవాయనకు చెందియున్నందుకు సంతోషముగా లేవా?
లవోదికయ సంఘ కాలమునకు వర్తమానము
ప్రకటన 3:15-19
"నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను, వెచ్చగానైనను ఉండిన మేలు.నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవును అయియున్నావని ఎరుగక. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడుకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము."
దీనినంతటినీ మనము కలిసి చదివియున్నాము. ఆత్మ ఈ కాలమును గూర్చి ఒక్క దయగల మాట కూడా చెప్పలేదు అని మీరు తప్పకుండా గ్రహించియుందురని నమ్ముచున్నాను. రెండు నేరారోపణలను ఆయన చేసియున్నాడు మరియు అందుకు ఆయన శిక్షను దాని మీదికి రప్పించెదనని చెప్పియున్నాడు.
(1) ప్రకటన 3:15,16"నీ క్రియలను నేనెరుగుదును, నీవుచల్లగానైను వెచ్చగానైనను లేవు.నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను, చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నానోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను."
దీనిని మనము జాగ్రత్తగా చూడబోవుచున్నాము. ఈ లవొదికయ సంఘకాల గుంపు నులివెచ్చగా ఉంచబడినదని చెప్పబడెను. ఈ నులివెచ్చనితనము వలన దేవుని యొద్ద నుండి శిక్ష వచ్చును. ఆయన నోటనుండి ఉమ్మివేయబడుటయే. ఆ శిక్ష చాలా మంది తప్పిపోయినటుగా ఈ విషయములో మనము తప్పిపోరాదు. దేవుడు తన నోట నుండి నిన్ను ఉమ్మివేయునని వారు అజ్ఞానముతో పలుకుచున్నారు. పరిశుద్ధుల యొక్క పట్టుదల అను బోధలో సత్యము లేదని ఇందువలన రుజువగుచున్నది. ఇప్పుడు మీ ఆలోచనను సరిచేసికొనవలెనని నేను కోరుచున్నాను. ఈ వచనము ఒక వ్యక్తికి ఇవ్వబడినది కాదు. ఇది సంఘమునకు ఇయ్యబడినది. ఆయన సంఘముతో మాట్లాడుచున్నాడు. మరో సంగతి, మీ మనస్సులో గుర్తుంచుకొని వాక్యమును బట్టి ఆలోచించండి, మనము దేవుని యొక్క నోటిలో యున్నట్లు ఎక్కడను చెప్పబడలేదు. ఆయన యొక్క అరచేతులలో మనము చెక్కబడియున్నాము. ఆయన యొక్క భుజముల మీద మోసికొనిపోబడుచున్నాము. మనకు తెలియని ఆనాది కాలములో అనగా సమయమనునది లేక ముందే ఆయన మనస్సులో మనమున్నాము. ఆయన యొక్క గొర్రెల దొడ్డిలో మనమున్నాము, ఆయన యొక్క పచ్చిక బీడులలో మనమున్నాము, కాని ఎన్నడూ ఆయన నోటిలో లేము. కాని ప్రభువు యొక్క నోటిలో ఏమున్నది? ఆయన యొక్క నోటిలో వాక్యమున్నది.
మత్తయి 4:4
"ఆయన వారికి ఈలాగు జవాబిచ్చెను, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును."
మన నోళ్ళలో కూడా వాక్యము ఉండవలసియున్నది. సంఘము ఆయన శరీరమని మనకు తెలియును. ఇక్కడ అదే జరుగుచున్నది. సంఘము యొక్క నోటిలో ఏమి ఉన్నది? వాక్యము.
I పేతురు 4:11
"ఒకడు బోధించినయెడల దైవోక్తులను (వాక్యము) బోధించునట్లు బోధించవలెను."
II పేతురు 1:21
"ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి."
అయితే ఈ చివరి దినములో యున్న మనుష్యల యొక్క తప్పు ఏమిటి? వారు వాక్యమును విసర్జించి దూరమయిరి. వారు దాని విషయములో ఇక తీవ్రత కలిగిలేరు. దాని విషయములో వారు నులివెచ్చగా యున్నారు. ఇప్పుడు నేను దానిని రుజువు చేయబోవుచున్నాను.
వాక్యమును ఆధారము చేసికొనియే బాప్తిస్టులు తమ ఆచారములను, సిద్ధా౦తములను రూపొందించుకొనిరి మరియు నీవు వారిని కదపలేవు. అపోస్తలుల యొక్క అద్భుతముల రోజులు అయిపోయినవనియు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదనియు వారందురు. వారియొక్క నమ్మికను బట్టి నీటి బాప్తిస్మము లేదని (చిలకరింపు అనునది బాప్తిస్మము కాదు) మొతడిస్టు వారందురు (వాక్యాధారమును బట్టి) శుద్దీకరణయే పరిశుద్ధాత్మ బాప్తిస్మమందురు. క్రీస్తు సంఘమయితే బాప్తిస్మము ద్వారా మారుమనస్సని చెప్పును మరియు చాలా సందర్భములలో వారు పొడి పాపిని ముంచి తడి పాపిగా పైకి తీసికొని వచ్చుచున్నారు. అయినా గాని వారు తమ బోధ వాక్య-సహితమని చెప్పుచున్నారు. ఆ విధంగా వెళ్ళి వరుసగా పెంతెకోస్తు వారి యొద్దకు రండి. వారికి వాక్యమున్నదా? వారికి వాక్య పరీక్ష పెట్టి చూడండి. ప్రతిసారి వారు ఒక ఉద్రేకమునకు వాక్యమును అమ్మివేయుచున్నారు. నూనె మరియు రక్తము, భాషలు మరియు ఇంకా ఇతర సూచనలు వారికి కనబడితే చాలును. అది వాక్యములో ఉన్నదో లేదో వారికి అక్కరలేదు. వాక్యము నుండి సరిగ్గా అది అనువాదము చేయబడినదో లేదో అన్నది వారికి అక్కరలేదు. ఎక్కువ మంది వాటి కొరకు పడిపోవుచున్నారు. కాని వాక్యమునకు ఏమయినది? వాక్యమును త్రోసివేసియున్నారు. అందుకే దేవుడు ఈలాగు చెప్పుచున్నాడు, "మీ అందరికి నేను విరోధిని. నా నోటిలోనుండి మిమ్మును ఉమ్మివేయుచున్నాను. ఇదే అంతము. ఏడు కాలములలో నుండి వచ్చిన మనుష్యులు నా మాటకంటె తమ యొక్క స్వంత మాటకు ఎక్కువ విలువ ఇచ్చుట తప్ప మరేమీ నాకు కనబడలేదు. కాబట్టి ఈ కాలాంతమున నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించియున్నాను. అంతా అయిపోయినది. నేను రాత్ర౦తా మాట్లాడబోవుచున్నాను. అవును, నేను సంఘము మధ్యనే యున్నాను. దేవుని యొక్క ఆమేన్ అనువాడును, నమ్మకమగువాడును, సత్యవంతుడును తన్నుతాను బయలుపరచుకొనును మరియు నా ప్రవక్తద్వారా అది జరుగును." అవును, అది ఆలాగు జరుగును.
ప్రకటన 10:7,
"యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను."
ప్రత్యక్షత కలిగిన ఒక ప్రవక్తను ఆయన పంపించును. దాదాపుగా రెండు వేల సంవత్సరముల తరువాత ఆయన ఒక ప్రవక్తను పంపించుచున్నాడు. సంస్థకు, విద్యకు, మత ప్రపంచమునకు ఎంతో దూరముగా యున్న ఒకనిని ఆయన పంపుచున్నాడు. ఆనాటి ఏలియా, మరియు బాప్తిస్మమిచ్చు యోహానుల వలె అతడు దేవుని మాటను మాత్రమే వినును. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును," అతడు కలిగియుండును మరియు దేవుని తరపున మాట్లాడును. అతడు దేవుని యొక్క నోరుగా ఉండును మరియు మలాకీ4:6లో చెప్పబడియున్నట్లుగా అతడు "పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పును." చివరి దినములలోని ఏర్పరచబడినవారిని ఆయన తిరిగి తీసికొని వచ్చును. రుజవు చేయబడిన ప్రవక్తయొక్క మూటను వారు విందురు, పౌలుకు ఇవ్వబడినట్లుగానే వారికి ఆ సత్యము ఖచ్చితంగా ఇవ్వబడును. వారు చక్కదిద్దిన విధముగానే ఇతడును సత్యమును చక్కదిదును. ఆయనతో కూడా ఆ దినమున ఏర్పరచబడినవారు ప్రభువును నిజముగా బయలుపరచుదురు. వారాయన శరీరముగా ఉందురు, మరియు ఆయన స్వరముగా వారుందురు, మరియు ఆయన క్రియలను జరిగించుదురు. హల్లెలూయా! దానిని మీరు చూచుచున్నారా?
సంఘ చరిత్రను కొద్ది సమయము పాటు మీరు గమనించినయెడల, ఈ ఆలోచన ఎంత ఖచ్చితమో మీకు అర్థమగును. చీకటి కాలములలో వాక్యము దాదాపు పూర్తిగా ప్రజల నుండి దూరము చేయబడినది. కాని దేవుడు లూథరును వాక్యముతో పంపెను. ఆ కాలములో లూథరనులు దేవుని తరపున మాట్లాడిరి, కాని వారు సంస్థగా మారిరి, మరల ఆ పవిత్ర వాక్యము మరుగైపోయినది; ఎందుకనగా సంస్థ ఎల్లప్పుడును ఆచారములు, మానవ బోధల వైపు మొగ్గుచూపును, సామాన్య వాక్యమును నమ్మదు. వారు ఇక దేవుని పక్షముగా మాట్లాడరు. అప్పుడు దేవుడు వెస్లీనీ పంపెను, మరియు అతడు తన దినమున వాక్యము యొక్క స్వరముగా యుండెను. దేవుని యొద్దనుండి ప్రత్యక్షతను గ్రహించిన జనులు సజీవ పత్రికలయిరి. ఆనాటి తరములోని మనుష్యులందరూ వారిని చదివి తెలిసికొనిరి. మెథడిస్టులు తప్పిపోయినప్పుడు, దేవుడు మరికొందరిని లేపెను. ఆ విధముగా సంవత్సరముల తరబడి అది ముందుకు సాగిపోయినది, చివరకు ఈ చివరి దినమున దేశములో మరి యొక జనులున్నారు, వారు తమ వర్తమానికుని ద్వారా చివరి కాలములో చివరి స్వరముగా ఉందురు.
సంఘము ఇక మీదట ఏ మాత్రము "దేవుని నోటిగా" ఉండదు. దానికి దాని స్వంత నోరున్నది. కాబట్టి దేవుడామె యొద్ద నుండి మళ్ళుకొనెను. ప్రవక్త ద్వారాను వధువు ద్వారాను దేవుడామెను గద్దించును, ఎందుకనగా దేవుని స్వరము ఆమెలో ఉండెను.
ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 17వ వచనములో ఈలాగు చెప్పబడినది,
"ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు."
పెంతెకొస్తు యొద్ద వినబడినట్లుగానే మరొక్క సారి వాక్యము ప్రత్యక్షంగా వినబడును; అయితే వాక్యపు వధువు మొదటి కాలములో వలెనె నిందకు గురియగును.
ఇప్పుడాయన చివరి కాలములో మాట్లాడుచున్నాడు, "నీకు వాక్యమున్నది. నీకు ఎప్పటికన్న ఎక్కువ బైబిలున్నవి, కాని వాక్యము గూర్చి నీవు ఏమియూ చేయుట లేదు. కేవలము దానిని నీవు నరికి ముక్కలు చేయుచున్నావు, నీకిష్టమయిన దానిని తీసికొనుచున్నావు మరియు నీకు ఇష్టములేని దానిని వదిలిపెట్టుచున్నావు. దానిలో జీవించవలెనను ఆశ నీకు లేదు, దాని విషయములో నీవు వివాదపడుచున్నావు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలని హెచ్చరించుచున్నాను. నీవు చల్లగాయండి దానిని నిరాకరించినట్లయితే, దానిని నేను సహించెదను. నీవు బహు వెచ్చగాయండి దానిని సత్యమని ఎరిగి ఆ ప్రకారముగా జీవించినట్లయితే, అందుకొరకు నిన్ను నేను పొగడెదను. నీవు కేవలము నా వాక్యమును తీసికొని ఆ వాక్యమును ఘనపరచనియెడల, నేనును నిన్ను ఘనపరచుటకు నిరాకరించుదును. నీ వలన నాకు వాంతి కలుగును గనుక నా నోటనుండి నిన్ను ఉమ్మివేయుదును."
ఇప్పుడు ఇది అందరికీ తెలియును, నులివెచ్చని నీరు నీకు వికారము పుట్టించును గనుక నీ కడుపు పాడగును. నీకు వాంతి రావలెనన్నచో నీవు నులివెచ్చని నీరు త్రాగినచో చాలును, అంతకన్న మంచిది లేదు. నులివెచ్చని సంఘము వలన దేవుడు జబ్బుపడును మరియు తన నోటిలోనుండి ఉమ్మివేయుదునని ఆయన సెలవిచ్చుచున్నాడు. జల ప్రళయమునకు ముందు దేవుడేమనెనో మీరు గుర్తుచేసికొనండి?
సంఘము చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలని, దేవుడు కోరుచున్నాడు. అన్నిటికంటె ఉత్తమమైనది ఆమె తీవ్రముగా (వేడిగా) ఉండవలెను. కాని ఆమె ఆలాగున లేదు. శిక్షజారీ అయినది. ఆమె ఇక లోకమునకు దేవుని స్వరముగా లేదు. ఆలాగున్నానని ఆమె చెప్పుకొనుచున్నది గాని, దేవుడయితే అలాగు లేదని చెప్పుచున్నాడు.
ఓ, ప్రపంచములోని ప్రజలకు ఇంకా దేవుడు స్వరమును వినిపించుచున్నాడు, వధువుకు ఆయన స్వరమును ఇచ్చినట్లే యున్నది. మనము చెప్పినట్లుగా స్వరము వధువులో యున్నది మరియు దానిని గూర్చి ఎక్కువగా తరువాత మాట్లాడుకొందము.
(2) ప్రకటన 3:17-18"నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలినవాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని ఎరుగక — నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు.నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను."
ఈ వచనములోని మొదటి పదము ఇప్పుడు చూడండి, "నీవు చెప్పుకొనుచున్నావు." చూడండి, వారు చెప్పుకొనుచున్నారు. వారు దేవుని యొక్క నోరువలె మాట్లాడుచున్నారు. నేను చెప్పిన దానిని ఇది ఖచ్చితంగా రుజవు చేయుచున్నది. 16-17 వచనముల భావమదే. వారు చెప్పుకొనుచున్నారు గాని, అది సరి కాదు. తాను దేవుని పక్షముగా పని చేయుచున్నానని కాథలిక్కు చర్చి చెప్పుకొనును, ప్రభువు యొక్క స్వరము నిశ్చయంగా నేనే అని చెప్పుకొనును. నాకు తెలిసినంతవరకు వారికంటె ఆత్మసంబంధముగా దుర్మారులు ఇంకెవరునూ లేరు, అయితే వారిలోయున్న విత్తనము ప్రకారమే వారు ఫలించుచున్నారు, మరియు ఆ విత్తనము ఎక్కడినుండి వచ్చియున్నదో మనకు తెలియును కాదా?
లవొదికయ సంఘము చెప్పుకొనుచున్నది, "నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసికొనియున్నాను, నాకేమియూ కొదువ లేదు." అది దాని యొక్క స్వగర్వము. ఆమె తనవైపు తాను చూచికొనినప్పుడు దానినే చుచుకొనును. "నేను ధనవంతురాలను," అని చెప్పుకొనుచున్నది. దాని యొక్క అర్థము ఏమనగా లోక సంబంధమగు సంగతులలో ఆమె ధనికురాలుగా యున్నది.
ఆమె అతిశయపడుచున్నది, యాకోబు 2:5-7,
"నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా?మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా?"
ఇప్పుడు ధనవంతుడు ఆత్మ సంబంధముగా యుండడని నేను చెప్పుట లేదు, కాని కొద్ది మంది మాత్రమే ఆలాగున యుందురని వాక్యము చెప్పుచున్నదని మనందరికిని తెలియును. నిజమగు సంఘములో, అనగా శరీరములో అధిక్యతను కలిగియుండువారు పేదలే. సంఘము ధనముతో నిండిపోయిన యెడల ఒకే ఒకటి జరుగునని మనకు తెలియును; అది "ఈకాబోదు"గా (ప్రభావము పోయినదిగా) మిగులును. దానిని మీరు కాదనలేరు, ఎందుకనగా అది వాక్యము.
సంఘములోని సంపద గూర్చి మాట్లాడండి — ఇంత ధనవృద్ధి ముందెన్నడును లేదు. ముందెన్నడూ లేని విధంగా శృంగారమగు ఆలయములు అన్ని చోట్లను వెలసియున్నవి. అన్ని గుంపుల వారు ఒకరితో ఒకరు పోటీపడుచున్నారు, ఎవరు గొప్పది అందమైనది కట్టదురో చూద్దామని సవాలు చేసికొనుచున్నారు. వారు విద్యా కేంద్రములను నిర్మించుచున్నారు, వాటి విలువ ఎన్ని మిలియనులో మనము అంచనా వేయలేము. ఆ గొప్ప భవనములను వారములో ఒక్కసారి లేదా రెండు సార్లు మాత్రమే ఉపయోగించుదురు. అంత కంటె భయంకరమగు సంగతి మరొకటి లేదు, అయితే ఈ కొద్ది సమయమును కూడా వారు పిల్లలకు విధ్యాబుద్ధులు నేర్పించుటకు వెచ్చించుదురు. చిన్నపిల్లలకు ఇండ్లలో గంటల కొలదిగా తర్ఫీదు ఇవ్వవలసినది పోయి ఈ కొద్ది సమయముతో కాలము గడుపుచున్నారు.
సంఘములోనికి డబ్బు పోయబడుచున్నది, చాలా శాఖలకు చివరికి స్వంత పెట్టుబడులు, బాండు, ఫ్యాక్టరీలు, నూనె బావులు, ఇన్సురెన్సు కంపెనీలు ఉన్నవి. సంక్షేమ మరియు రిటైర్మెంటు నిధులలోనికి వారు తమ డబ్బును మళ్ళించియున్నారు. ఇది చాలా చక్కగా కనబడును, కాని ఇది సేవకులకు ఉరి అయినది. ఇంకా ఎక్కువ వెలుగు కొరకు లేదా ఎక్కువగా దేవుని ప్రేమకొరకు వారు తమ గుంపును విడిచిపెట్టిన యెడల వారి యొక్క పింఛనులు పోవును. చాలా మంది దీనిని తటుకొనలేకపోవుచున్నారు, తమ యొక్క బలత్కార గుంపులలోనే నిలచియుంటున్నారు.
ఇది చివరి కాలమని మీరు మరచిపోవద్దు. ఇది చివరి కాలమని మనకు తెలియును, ఎందుకనగా ఇశ్రాయేలు తిరిగి పాలస్తీనాకు చేరుకొనినది. ఆయన వచ్చుచున్నాడని నిజముగా మనము నమ్ముచున్నయెడల, ఇంత గొప్ప భవనములను కట్టుచున్న వారిలో ఏదో తప్పున్నది. ఈ జనులు ఇక్కడే నిత్యమూ జీవించివలెనను ఉద్దేశ్యమును కలిగి యున్నారని మనకు ఆలోచన వచ్చును, లేక యేసు రాకడ మరో వంద సంవత్సరముల వరకు రాదని తలంచుచుండవచ్చును.
ఈనాడు మతము పెద్ద వ్యాపారముగా మారిపోయినదని మీరెరుగుదురా? ఇది సంపూర్ణమైన సత్యము. నిజానికి ఆర్థిక విషయములను చూచుటకు సంఘములలో వ్యాపార మేనేజరులను నియమించుచున్నారు. దేవుడు కోరినది ఇదేనా? అపోస్తలుల కార్యముల గ్రంథములో ఆయన వాక్యము చెప్పుచున్న దానిని మీరు మరచిపోయారా? పరిశుద్ధాత్మతోను, విశ్వాసముతోను నిండిన ఏడుగురు మనుష్యులు ప్రభువు యొక్క పనులను నిర్వహించిరి. వ్యాపార సంబంధమైన పనులు కాదు. అందుకే దేవుడు చెప్పిన దానిని మీరు ఖచ్చితంగా చూడగలరు, "నీవు ధనవంతుడనని చెప్పుకొనుచున్నావు గాని; నేనెన్నడునూ ఆలాగు చెప్పలేదు."
రేడియో కార్యక్రమములు, టెలివిజను కార్యక్రమములు, ఇంకా ఎన్నో చాలా సంఘ పనులు కొరకు ఎన్నో మిలియనుల, మిలియనుల డాలర్లు వెచ్చించుచున్నారు. సంఘము లోనికి డబ్బు ప్రవాహమువలె వచ్చుచున్నది, డబ్బుతో పాటు సభ్యులును పెరుగుచున్నారు, అయినా గాని డబ్బు లేనప్పుడు ఎంత పని జరిగినదో అంతపని జరుగుట లేదు. కాని అప్పుడయితే మనుష్యులు పరిశుద్ధాత్మ తమకిచ్చిన సామర్థ్యము మీదనే పూర్తిగా ఆధారపడి పనిచేసిరి.
జీతపు బోధకులు, జీతపు సహపనివారు, జీతపు సంఘకాపరులు, జీతపు సంగీత మరియు విద్య వారికి యున్నది, డబ్బు ఇచ్చి పాటలు పాడించుచున్నారు. అన్ని కార్యక్రమములు, వినోదములు డబ్బుతోనే కొనసాగించుచున్నారు — వీటంతటికీ ఎంతో డబ్బు కావలెను, అయినా గాని శక్తి సన్నగిల్లుచున్నది. అవును, సంఘము ధనవంతముగానే యున్నది, కాని శక్తి అచ్చట లేదు. దేవుడు తన ఆత్మ ద్వారా కదలును, అంతే గాని డబ్బువలన గాని లేదా సంఘములోని తలాంతుల వలన కాదు.
ఇప్పుడు డబ్బు కొరకైన ఈ తాపత్రయము ఎంత మీతిమీరియున్నదో నేను మీకు చూపించగోరుచున్నాను. సంఘములన్నియూ సభ్యత్వము కొరకు, ముఖ్యంగా సంపద కొరకు బయలుదేరియున్నవి. మతమును చాలా ఆకర్షణీయముగా చేయుటకు అన్ని చోట్ల కేక వినిపించుచున్నది మరియు ధనికులు, నాగరికతగలవారు, లోకములో హోదా గలవారు అందరూ వచ్చి సంఘ కార్యకలాపములలో పాలు పొందవలెనని ఆహ్వానించుచున్నారు. ఆత్మీయతకు సంపదయే కొలబద్ధయైనయోడల, లోకము ఎప్పుడో దేవుని సంపాదించుకొనియున్నదని వారికి అర్థమగుట లేదు, ఆలాగయితే దేవుడు వారికే ఉండును, మరియు సంఘము ఏమియు కలిగిలేదు?
"నేను ధనసమృద్ధి చేసికొనియున్నానని నీవు చెప్పుచున్నావు."
'నాకు ఆత్మసంబంధమగు సంపద యున్నదని' అక్షరాలా అది చెప్పుకొనుచున్నది. ఇది బంగారపు వీధులు మరియు దేవుని యొక్క సన్నిధిగల వెయ్యేండ్ల పాలనవలె యున్నది. కాని ఇది అది కాదు. దేవుని యొక్క ఆత్మీయ విషయములలో సంఘము నిజంగా ధనవంతముగా యున్నదా? గర్వపడుచున్న ఈ ఇరవయ్యవ-శతాబ్దపు లవోదికయ సంఘమును వాక్యవెలుగులో మనము పరీక్షించుదము.
సంఘము గాని నిజంగా ఆత్మీయుముగా ఐశ్వర్యముగా యున్న యెడల, దాని యొక్క ప్రభావము సామాజిక జీవనము మీద పడియుండెడిది. కాని ఖచితముగా ఎలాంటి రకపు జీవితమును నామకార్థపు ఆత్మ సంబంధికులుగా మరియు ప్రభావముగల మనుష్యులుగా యున్నవారు జీవించుచున్నారు? పట్టణ ప్రాంతములలోను, ఉన్నత తరగతి వారు నివసించుచున్న జిల్లాల్లోను భార్యలను కొట్టుట, వ్యభిచారము, పిల్లలు అల్లరితో కూడిన ఆటపాటలకు హాజరగుట, భయంకర దౌర్జన్యముతో ఆసులను ధ్వంసము చేయుటను గమనించండి. ఎన్నడు లేనంత నైతిక పతనమును ఇప్పుడు మనము చూచుచున్నాము, లైంగిక విశృంఖలత పెరిగిపోవుచున్నది, మత్తుమందులు సేవించుట చాలా ఎక్కువయిపోయినది, జూదము, దొంగతనము, అన్ని రకముల చెడు క్రియలు ఎక్కువై పోయినవి. కాని సంఘమయితే ఈ తరము చాలా చక్కగా యున్నదని చెప్పుకొనుచున్నది, సంఘములు నిండిపోవుచున్నవి, మిషను కార్యములలో కూడా ఎంతో చక్కగా ఆ స్థానికులు స్పందించుచున్నారు అని చెప్పుచున్నది. సంఘము ప్రజలను వైద్యుల యొద్దకు త్రిప్పుచున్నది, ముఖ్యంగా మానసిక వైద్యుల యొద్దకు నడిపించుచున్నది. కాబట్టి ఆత్మ సంబంధముగా ధనవంతురాలనని అది ఎట్లు చెప్పుకొనగలదు? అది సత్యము కాదని నాకు తెలియును. వారు దివాళా తీసియున్నారు, కాని వారికి తెలియదు.
మీ చుట్టు చక్కగా చూడండి. ప్రజలు ప్రక్కనుండి నడచుచుండగా వారిని పరీక్షించండి. మీరు ఎందరినో చూచుచున్నారు, క్రైస్తవుల వలె ఎవరయినా కనబడుచున్నారేమో చెప్పండి? వారి వస్త్రధారణ చూడండి, వారి యొక్క ప్రవర్తనను చూడండి, వారి మాటలను వినండి, వారు వెళ్ళు ప్రదేశములను గమనించండి. వారు నిజంగా క్రొత్తగా జన్మించియున్నయెడల వారు వెళ్ళిపోవుచుండగా వారిలో ఏదో ఒక సూచన కనబడవలసియున్నది. కాని కొద్ది మంది మాత్రమే అట్టివారున్నారు. అయినా గాని నేడు మౌలిక సంఘములు తాము మిలియనుల మందిని రక్షించినట్లను, ఆత్మ నింపుదలగల వారిగా చేసినట్లును చెప్పుచున్నారు. ఆత్మ నింపుదలయా? జుట్టులు కత్తిరించుకొని, పొట్టిబట్టలు, మగవారి దుస్తులు ధరించుకొనిన ఈ స్త్రీలు, రంగులు పూసికొని, వికృతముగా కనబడుచున్న ఈ స్త్రీలు పరిశుద్ధాత్మతో నింపబడిరా? వీరు యొజెబెలు వలెయున్నారు. క్రైస్తవ స్త్రీలకు సంబంధించిన వస్త్రములు ధరించుకొనినచో ఎంతో చక్కగా ఉండియుందురు. వీరిని గూర్చి ఆలోచించితేనే నాకు అసహ్యము కలుగుచున్నది. వారు అసభ్యతకు, దుర్నీతికి సాక్ష్యులుగా యున్నారు.
ఈ నాజూకులు స్త్రీలు తమ౦తట తాము రూపొందించుకొనుటలేదు. హాలివుడ్ దానిని చేయుచున్నది. కాని స్త్రీలారా, వినండి! ఇంకా మీకు కుట్టు మిషనులు, కావలసిన సామానులు కొనుక్కొనుటకు మార్కెట్లో దొరకుచున్నవి. స్టోరులలో ఉన్నవాటిని మీరు కొనుక్కొని, వాటిని ఉపయోగించుచున్నందుకు నెపము చెప్పరాదు. ఇది చాలా ప్రమాదకరమైన పోకడ గనుక దీనిని గూర్చి తీవ్రంగా ఆలోచించవలెను. మీరు వాక్యములో చదివియున్నారు గదా? ఒక స్త్రీని మోహము చూపుతో చూచువాడు, అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించినవాడగును. ఆమెతో హృదయములోనే వ్యభిచరించిన వాడగును గదా? అందుకు కారణము మీరు ఆ విధమగు బట్టలు ధరించుటయే. అందువలన నీవు ఆలాగు పాపము చేసిన వానికి భాగస్తురాలవై యున్నావు, దీనిని నీవు ఏ మాత్రము ఎరిగియుండకపోవచ్చును. నీకు అటువంటి కోరికలు లేకపోవచ్చును మరియు నిజమగు కన్యకవు కావచ్చును. అయినా గాని అందుకు నిన్ను దేవుడు లెక్కలోనికి తీసికొనును మరియు నీవు తీర్పు తీర్చబడుదువు.
ఇటువంటి బోధ స్త్రీలకు నచ్చదని నాకు తెలియును, కాని సోదరీ! నీవు చేయుచున్నది పూర్తిగా తప్పు. జుట్టు నీవు కత్తిరించుకొనరాదని బైబిలు చెప్పుచున్నది. దానిని దేవుడు ఒక ముసుగుగా నీకు ఇచ్చెను. దానిని పొడవుగా ఎదుగనియ్యవలెనని దేవుడు ఆజ్ఞాపించెను. అది నీకు మహిమ. నీవు నీ జుట్టును కత్తిరించుకొనినప్పుడు నీవు నీ శిరస్సు అగు నీ భర్తను తిరస్కరించినట్లు అర్ధము. హవ్వ వలె నీవు బయటకు వెళ్ళి నీవు నీ స్వంత ఇష్టము చొప్పున చేయుచున్నావు. నీకు ఓటు హక్కు వచ్చినది. మగవారి ఉద్యోగములు నీవు చేయుచున్నావు. స్త్రీవలె యుండుట నీవు విడిచిపెట్టియున్నావు. నీవు మారుమనస్సు పొంది దేవుని యొద్దకు తిరిగి రావలసియున్నావు. ఇంకా ఈ చెడిపోవుట చాలదన్నట్టు బలిపీఠముల మీదికి, సంఘ కార్యాలయములోనికి చొరబడవలెనను అభిప్రాయమును కలిగియున్నావు. దేవుడు వాటిని మగవారికి మాత్రమే ఏర్పరచెను మరియు కేవలము పురుషులే అందుకు అర్హులు. నేను బాధకలిగించు ప్రదేశమును తాకియున్నాను గదా? మంచిది, బోధించుటకు గాని, పురుషుని మీద అధికారము చేయుటకు గాని, దేవుడు ఏ స్త్రీనైనా ఎన్నడయినా అభిషేకించెనేమో బైబిలులో ఒక్కచోట నాకు చూపించండి, అలాగయితే నేను చెప్పిన దానికి క్షమాపణ కోరుకొందును. నేను చెప్పునది తప్పు అని మీరు కనుగొనలేరు. నేను నిజమే చెప్పాను, ఎందుకనగా వాక్యముతో మరియు వాక్యములో నేను నిలబడియున్నాను. మీరు ఆత్మసంబంధముగా ధనికులయితే అది సత్యమని మీకు తెలియును. వాక్యము తప్ప సత్యము మరియొకటి లేదు. "బోధించుటకు గాని, పురుషుని మీద అధికారము చేయుటకు గాని, స్త్రీకి అనుమతి ఇయ్యనని," పౌలు చెప్పెను. ఎఫెసీ 4లో అయిదు రకముల పరిచర్యలున్నవి, వాటిలో మీకు ఏ స్థానము లేదు. మగవారి మీద అధికారము చేయుటకు పెత్తనము చేయ వీలులేదు. సోదరీ, నీవు వాక్యము వినుట మంచిది. నిన్ను బోధించమని చెప్పినది దేవుని ఆత్మ కాదు, నీనుండి బయటకు వచ్చుచున్నది ఆత్మసంబంధమగు జీవితము కాదు, ఎందుకనగా వాక్యము మరియు ఆత్మ ఒక్కటే. వారును ఒక్కటే చెప్పెదరు. ఎవరో తప్పు చేసిరి. ఎవరో మోసపోయిరి. సమయము మించిపోక ముందే మేల్కొనుము. మీ తల్లియగు హవ్వను, సాతాను మోసము చేసినది; ఇప్పుడది కుమార్తెలను మోసము చేయుచున్నది. దేవుడు మీకు సహాయము చేయును గాక!
"నాకేమియు కొదువలేదని చెప్పుచున్నావు."
ఇప్పుడు, "నాకేమియూ అవసరములేదని" ఎవరయినా చెప్పుచున్నారంటే వారికి అన్నియూ ఉన్నవని అర్థము. ఇప్పుడు నేను నిండుగాయున్నాను గనుక నాకేదీ అక్కరలేదని చెప్పుచున్నట్లు భావము." దీనిని మీరు మీకిష్టమొచ్చిన విధంగా చెప్పవచ్చును. సంఘము నిండుగా యున్నటుగా చెప్పుకొనుచున్నది. అంతా తనకున్నదని గాని, లేదా చాలినంత యున్నదని గాని దాని అర్ధము. ఈనాడు మనము అక్షరాలా దానినే కనుగొనుచున్నాము. తన యొద్ద ప్రత్యక్షత, సత్యము, మరియు శక్తి లేదని చెప్పుకొను సంఘము ఏదయినా యున్నదా? బాప్టిస్తులు ఏమి చెప్పుచున్నారో వినండి, అంతా తమ యొద్ద ఉన్నదనుచున్నారు. మెథడిస్తులు ఏమి చెప్పుచున్నారో వినండి, అంతా తమ యొద్ద ఉన్నదనుచున్నారు. క్రీస్తు సంఘము వారు ఏమి చెప్పుచున్నారో వినండి, వారిది తప్ప మిగిలినవన్నియూ తప్పు అనుచున్నారు. పెంతెకోస్తు వారేమి చెప్పుచున్నారో వినండి, సంపూర్ణమగు యావత్తు తమ యొద్దనే ఉన్నదనుచున్నారు. వారిని గూర్చి నేను సత్యము చెప్పుచున్నానని వారెరుగుదురు, ఎందుకనగా వారి యొక్క విధులు ఆలాగునే వ్రాయబడియున్నవి. వారు అన్నియూ చాలా చక్కగా వ్రాసికొనియున్నారు మరియు తమపేర్లు అందులో పొందుపరచుకొని ఇక ఏమీ పరవాలేదని కూర్చొనియున్నారు. దేవుడు ఇక ఎక్కువ మందిని కలిగిలేడని మరియు చేర్చుకొనడనుకొనుచున్నారు. ఇంకా ఎవరూ రానవసరము లేదనువారు కూడా యున్నారు. వారికి స్వస్థత యందు నమ్మకము లేదు. అది వారికి అక్కరలేదు మరియు వాక్యములో యున్నాగాని వారికది వద్దు. దేవుడు పరలోకము వారి ముందు తెరచి ఒక సూచన చూపించినా గాని వారు నమ్మక పరిశుద్ధాత్మ స్వీకరించనివారు అందులో యున్నారు.
అంతా తమకున్నదని వారు చెప్పుచూ, దానిని రుజవు చేయుటకు ప్రయత్నించుచున్నారు, లేదా వారికి ఇక చాలును. అవును, అది సత్యమేనా? ఈ ఇరవయ్యవ శతాబ్దపు సంఘమును, మొదటి శతాబ్దపు సంఘముతో పోల్చి చూడండి. ముందుకు వెళ్ళండి. దానిని చూడండి. శక్తి ఎక్కడున్నది? ప్రేవు ఎక్కడున్నది? పాపమును ఎదిరించి విశ్వాసముతో యేసు వైపు నడిచిన పవిత్ర సంఘము ఎచ్చటున్నది? ఐక్యత ఎక్కడున్నది? దానిని మీరు కనుగొనలేరు. ఈ సంఘమునకు కావలిసినవి అన్నియు ఉన్నయెడల, వారు దేవుని యొద్ద నుండి ఇంకా ఎక్కువ పొందుటకు ఎందుకు అపోస్తలుల కార్యముల గ్రంథములో వారు తమకు అసలు ఏమిలేనట్లు ఎందుకు మొరపెట్టుచున్నారు, అయినను ఈ రోజు ఉన్నదానికంటే చాలా రేట్లు ఎక్కువ వారికి ఉండెను.
దేవుని యొక్క పరిశీలన
ఇప్పుడు వారు చూచుచున్నామని చెప్పుకొనుచున్నదానికి పూర్తి వ్యతిరేకమైనదానిని దేవుడు చూచెను. వారు ధనవంతులమని ధనసమృద్ధి చేసికొని ఆత్మసంబంధముగా ధనికులమని చెప్పుకొనుచున్నారు. వారు అంతా సంపాదించుకొనిరి. ఇంకవారికి ఏ అవసరమును లేదు. కాని దేవుని దృష్టికి వారు వేరుగా యున్నారు. ఆయన ఇట్లనుచున్నాడు, "దీనిని నీవెరుగవు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రడవును, గ్రుడ్డివాడవును, దిగంబరివిని అయి యున్నావు." ఇప్పుడు జనులు ఆ విధంగా యుండినయెడల, ముఖ్యంగా దిగంబరులుగా ఉండి మరియు వారు ఆ సంగతిని యెరుగనియెడల, అక్కడ ఏదో భయంకరమగు పొరపాటున్నది. నిశ్చయంగా ఏదో తప్పక జరుగుచున్నది. యూదులకు గ్రుడ్డితనము కలుగజేసినట్లుగా ఆయన వారికి గ్రుడ్డితనము కలుగజేసెనా? సువార్త మరల యూదుల యొద్దకు వెళ్ళుచున్నదా? చరిత్ర మరల పునరావృత్తమగుచున్నదా? అవునని చెప్పుచున్నాను.
ఈ లవదికయ సంఘకాలము "దౌర్భాగ్యురాలు" అని దేవుడు చెప్పుచున్నాడు. రెండు గ్రీకు పదముల నుండి అది వచ్చుచున్నది, "సహించుట" మరియు "శోధన." నిజ క్రైస్తవునికి వచ్చు శోధనలతో దానికేమియూ సంబంధము లేదు, కాని శోధనలో యున్న క్రైస్తవునిని "దీవించబడినవాడు" అని దేవుడు వర్ణించుచున్నాడు. అతని వైఖిరి ఆనందముతో కూడియుండును, కాని ఇక్కడ వాడిన పదములను చూడండి, "దౌర్భాగ్యుడవును, దిక్కుమాలినవాడవును." ఎంత వింత. ఈ ధనసమృద్ధిగల స్థితిలో, ఈ అభివృద్ది పొందిన కాలములో, ఈ విస్తారత గల సమయములో శోధనలు ఎక్కడివి? ఇప్పుడిది, చాలా వింతగా యున్నది; కాని ఈ విస్తారత గల కాలములో మరియు తరుణములో మానసిక వ్యాధులు ఎక్కువగుచున్నవి, దేశము అందువలన అందోళన చెందుచున్నది, అంతగా అది పెచ్చుపెరుగుచున్నది. మన పనుల కొరకు ఎన్నో క్రొత్త క్రొత్త వాటిని కనిపెట్టియున్నారు. మనకు ఆనందమిచ్చునవి ఎన్నోయున్నవి, అయితే ఆకస్మాత్తుగా, అందరూ ఆనందముగా ఉండవలసిన సమయములో, అసంతోషమునకు నిజంగా తావులేని సమయములో ఎన్నో మిలియనుల మంది రాత్రి సమయములలో మత్తుమందులు తీసికొనుచూ ఉదయ కాలమున ఇంకేవో మాత్రలు చప్పరించూ, వైద్యుల యొద్దకు పరుగిడుచున్నారు. అనేక సంస్థలలో చేరుచున్నారు, తెలియని భయుములను విదిలించుకొనుటకు సారాయిని త్రాగుచున్నారు.
అవును, ఈ కాలము అద్భుతమగు సాధనములను కనిపెట్టి గొప్పలు చెప్పుకొనుచున్నది, కాని జనులు మాత్రం ఎప్పటికన్నను తక్కువ సంతోషముతో యున్నారు. ఆత్మ సంబ౦ధముగా ఏవో సాదించినట్లు ఈ కాలము చెప్పుకొనుచున్నది, కాని జనులు మాత్రం ఎన్నడూలేనంత అనిశ్చిత స్థితిలో యున్నారు. చాలా మంచి నైతిక విలువలు ఉన్నవని ఈ కాలము చెప్పుకొనుచున్నది, కాని జలప్రళయము తరువాత ఇంతకంటె చెడిపోయిన కాలము మరియొకటి కనబడదు. జ్ఞానము మరియు సైన్సు గురించి ఇది మాట్లాడుచున్నది, కాని ఇది అన్ని రంగములలోను ఓడిపోయేపోరాటము చేయుచున్నది. ఈ భూమి మీదికి వచ్చుచున్న మార్పులనన్నింటినీ గ్రహించగల, లేదా అంచనా వేయగల మానవ మనస్సు గాని, ఆత్మ గాని, ప్రాణము గాని, ఇప్పుడు లేదు. ఒక్క తరములోనే మనము గుర్రపు బండ్ల కాలము నుండి అంతరిక్ష యుగములోనికి పెళ్ళియున్నాము, మరియు దానిని గూర్చి మనము గర్వముగాను, అతిశయముగాను చెప్పుకొనుచున్నాము; కాని లోపల చూచినట్లయితే చాలా అంధకార గుహగా ఉండి, యాతనతో అరచుచున్నది. ఇందుకు కారణము తెలియదు. భయముతో మానవ హృదయములు బ్రద్దలగుచున్నవి మరియు లోకము బహు చీకటితో నిండియున్నది. ఈ కాలమును మనము మానసిక ఉద్రిక్తత లేదా మతిస్థిమితము లేనివారి కాలమని పిలువవచ్చును. గొప్ప చెప్పుకొనుచున్నది గాని, దానికి రుజువు లేదు. శాంతి కొరకు కేకవేయుచున్నది గాని, శాంతి దొరకుట లేదు. తనకు అన్నియూ సమృద్ధిగా యున్నవని చెప్పుకొనుచున్నది గాని, అది కోరికలతో దహించుకొని పోవుచూ, తృప్తిలేని అగ్నివలె యున్నది! "సమాధానము లేదు," అని దుష్టులకు నా దేవుడు పలుకుచున్నాడు.
"వారు దిక్కుమాలినవారు." అనగా, వారికి దయ చూపుట అవసరత కలిగియున్నారు. దయచూపుటా? వారు దయ చూపితే కోపించెదరు. వారు గర్వముతో నిండిపోయియున్నారు. వారికి కలిగియున్న దానిని బట్టి వారు అతిశియి౦చెదరు. కాని వారు కలిగియున్నది కాలపరీక్షకు నిలబడలేదు. దేవుని యొక్క వాక్యపు ప్రత్యక్షత అను బండ మీద కట్టుటకు బదులుగా వారు త్వరగా కూలిపోయే ఇసుక మీద కట్టిరి. త్వరలోనే భూకంపము వచ్చును. త్వరలోనే దేవుని తీర్పు ఉగ్రత యొక్క తుఫాను వచ్చును. అప్పుడు ఆకస్మిక నాశనము వచ్చును, మరియు వారు శరీర సంబంధమగు ఎన్నో సిద్ధపాటు కలిగియున్ననూ; వారికది సహాయపడదు, భూమి మీదికి రాబోవు దానికి వారెంతమాత్రమును సిద్ధపడలేదు. వారు ప్రపంచ ప్రయత్నములను ఎన్నింటినో చేయుచున్నారు, కానీ వారి ప్రయత్నములు వారికే బెడిసికొట్టునని వారికి తెలియుదు. నిజానికి వారు జాలిపొందుటకు పాత్రులు. ఈ చివరి దినపు సంఘముల ప్రపంచ సమాఖ్యలోనున్న దిక్కుమాలిన వారిని చూచి జాలిపడవలెను. దానిని వారు దేవుని ఉద్యమమని పిలచుచున్నారు గాని, అది సాతాను ఉద్యమము. సంస్థ యొక్క శాపమును తెలియని వారిని గూర్చి జాలిపడుడి. చాలా అందమగు ఆలయములున్న వారిని గూర్చి, చాలా చక్కని నివాసములున్నవారిని గూర్చి, గొప్ప తర్ఫీదు పొందిన గాయక బృందములున్న గొప్ప సంపదయు గొప్ప ఆరాధనా క్రమములు, ఆచారములు ఉన్నవారిని చూచి, జాలిపడుడి. వారిని చూచి అసూయ చెందవద్దు, వారిని చూచి జాలిపడుడి. ఆ పాత స్టోరు భవనముల యొద్దకు తిరిగి రండి, గుడ్డి దీపమను వెలుతురు గల గదుల లోనికి తిరిగి రండి, ఆ కాలపు మేడ గదిలోనికి రండి; తక్కువ లోకము, ఎక్కువ దేవుడు అను వారి నినాదము యొద్దకు తిరిగి రండి. గొప్పలు చెప్పుకొనుచున్న తమ వరములను గూర్చి చెప్పుకొనుచున్న వారిని గూర్చి చింతపడుడి. వారు జాలిపొందుటకు పాత్రులు, ఎందుకనగా వారు త్వరలోనే ఉగ్రతకు పాత్రులగుదురు.
"వారు దరిద్రులు." ఇప్పుడు దీని అర్థము వారు ఆత్మ సంబంధముగా దరిద్రులు. ఈ ముగింపునకు వచ్చిన ఈ కాలపు సూచన ఏదనగా, పెద్దవైన మంచి సంఘములు, విస్తారమగు సభ్యులు, ఎన్నెన్నో ప్రత్యక్షతలు; అవన్నియూ పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చుచున్నావని తలంచుచున్నారు. కాని ఈ నిండు వేదికలు, ఆత్మ వరముల యొక్క కార్యములు, చెప్పుకోదగిన౦త హాజరయ్యే ప్రజలు, దేవుని యొక్క జవాబుకు సూచన కావు. వేదిక (altar) యొద్దకు వచ్చు జనులు బహు అరుదుగా దేవునితో నడిచెదరు, ఆ గొప్ప కూటములు అయిపోయిన తరువాత, ఆ జనులందరు ఎక్కడికి పోయిరి? ఒక మానవుని యొక్క మాటలు విని, ఒక విన్నపమునకు చెవి యొగ్గి, వారు వలలోనికి వచ్చిరి, కాని వారు చేపలు కారు, తాబేలు వలె తిరిగి నీటిలోనికి జారిపోవుచున్నారు.
బాషలు మాట్లాడువారి (glossalalia) గుర్చిన వారి యొక్క సంభాషణను వినండి — పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందియున్నట్లు అదే సూచనగా చెప్పుచున్నారు మరియు గొప్ప ఉజ్జీవము మధ్యలో యున్నామని జనులు చెప్పుకొనుచున్నారు. ఉజ్జీవము అయిపోయినది. 1957లోనే అమెరికాకు చివరి తరుణము పోయినది. ఇప్పుడు రానున్న నాశనమునకు ఈ భాషలు దేవుని సూచనగా యున్నవి, మరియు బెల్షజరు విందు సమయములో గోడ మీది వ్రాతలు అందుకే సూచనగా యున్నవి. అంత్య దినమున అనేకులు వచ్చి ఈలాగు అందురురని మీరెరుగరా? "ప్రభువా, ప్రభువా, నీ నామములో మేము అద్భుతములు చేయలేదా? దయ్యములను కూడా వెళ్ళగొట్టియున్నామే?"
అందుకు ప్రభువు ఇట్లనును,
"అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి తొలగిపోవుడి. మిమ్మును నేనెన్నడూ ఎరుగను."
మత్తయి 7:22-23
వారు అక్రమము చేయువారని యేసు చెప్పెను. అయినను వారు రోగులకు ప్రార్ధించి, నూనె మరియు రక్తమును జనులకు చూపించిరి. ప్రవచనము బయలు వెళ్ళి ఎన్నో రకముల సహజాతీతమగు కార్యములు చేసిరి, వారి చుట్టు జనులు పోగయిరి, ప్రభువు వలన పంపబడినవారని ప్రమాణము చేసిరి, కాని నిజానికి వారు మతము ద్వారా డబ్బును పోగుచేయుచూ పాపములో జీవించుచున్నారు. వారికి ఒకే జవాబున్నది, కాని ఆ జవాబు పూర్తిగా బైబిలుకు విరుద్ధమయిన జవాబు, "ఫలితములు కనబడుచున్నవి గనుక వారు దేవుని సంబంధులు అయియుందురు," అను జవాబు ఎంత భయంకరము! దేవుని యొక్క ఆత్మలో ఈ కాలము ఎంత దరిద్రులుగా యున్నదో చూడండి; మరియు వారు పేదవారై, పేదరికపుబారిన పడియున్నరనియు వారెరుగరు.
"వారు గ్రుడ్డివారు, దిగంబరులు." ఇప్పుడిది నిజంగా నిరాశాజనకము. గ్రుడ్డివాడు, దిగంబరియై యుండియు దానిని తెలిసికొనకుండుట ఎంత ఘోరము! వారు గ్రుడ్డివారు! దిగంబరులు, కాని ఆ సంగతిని ఎరుగరు. దీనికి జవాబు ఏమనగా, వారు ఆత్మ సంబంధముగా గ్రుడ్డివారు, మరియు ఆత్మ సంబంధముగా దిగంబరులు. సిరియా దండు చేత ఎలీషా మరియు గేహజీలు చుట్టుముట్టబడిన సంగతి మీకు గుర్తున్నదా? దేవుని యొక్క శక్తిచేత ఎలీషా వారిని గ్రుడ్డితనముతో మొత్తెను. అయినా వారి కన్నులు తెరువబడుట చేత ఎక్కడికి వెళ్ళుచున్నారో వారు చూడగలుగుచున్నారు. అది ఒక వింతయిన గ్రుడ్డితనమైనందువలన కొన్ని చూడగలిగిరి గాని ఎలీషా మరియు అతని దాసుడు మరియు ఇశ్రాయేలీయుల స్థావరమును వారు చూడలేకపోయిరి. కానీ వారు ఏమి చూచితిరో అది వారికి ప్రయోజనముకాలేదు. వారు ఏమి చూడలేకపోయిరో అదే వారిని ముట్టడి చేసినది. దీనివలన మనకు ఏమి అర్థమగుచున్నది? యేసు భూమి మీద ఉన్నప్పుడు చేసిన పరిచర్య కూడా ఖచ్చితంగా ఈలాగే యున్నది. దీని అర్ధము వాస్తవానికి అదే. వారికి ఆయన సత్యము చెప్పుటకు ప్రయత్నము చేసెను, కానీ వారు వినలేదు.
యోహాను 9:40-41
"ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని — మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.అందుకు యేసు — మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని —చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలచియున్నదని చెప్పెను."
ఈ కాలము యొక్క వైఖరి అక్షరాలా ఆనాడు యున్నట్లే యున్నది. జనులు సమస్తము కలిగియుండిరి. వారు సమస్తము యెరిగియుండిరి. వారు చేవియోగ్గరు. వాక్యములో నుండి ఒక సత్య విషయము బయటకు వచ్చినప్పుడు, ఒక మనుష్యుడు వ్యతిరేక దృష్టిగల వేరొకనికి తన యొక్క తాత్పర్యమును వివరించుచున్నప్పుడు, ఒకరికి ఆ విషయములో ఒక ధృక్పధముండును, మరి యొకరికి దానికి విరోధమగు ధృక్పధముండును. వినువాడు ఎంత మాత్రము దానిని నేర్చుకొనుటకు వినుట లేదు. కాని పలుకబడినదానిని ఎలాగు తిరస్కరించుదుమా అని వినుచున్నాడు. ఇప్పుడు నేను ఒక న్యాయమైన ప్రశ్న అడుగుచున్నాను. వాక్యముతో వాక్యము పోరాడునా? బైబిలుతో బైబిలు విభేదించునా? ఒకదానితో ఒకటి వ్యతిరేకించుట, లేదా ఒక దానికి విరుద్ధమగు మరొక బోధ బైబిలులో యుండునా? లేదు. అది అలా ఉండజాలదు. అయినా గాని ఎంతమంది దైవజనులు సత్యమునకు తమ కన్నులు తెరచియున్నారు? నాకు తెలిసినంత వరకు ఒక్క శాతము కూడా లేరు. లేఖనమంతయూ దేవుని వలన ఇవ్వబడినదని నేర్చుకొన్నారు. బోధించుటకును, గద్దించుటకును, బుద్ధి చెప్పుటకును లేఖనమంతయూ అలాగూ అవకాశమియ్యబడిన ఎడల, ప్రతి వాక్య వచనము ఇయ్యబడినచో, ఒకదానికొకటి అతుకును. కాని ఎంత మంది ముందు నిర్ణయము ద్వారా ఏర్పరచబడుటను, నాశనము కొరకు భ్రష్టులగుటను నమ్ముచున్నారు? నమ్మనివారు దానిని విందురా? లేదు, వారు వినరు. అయినా గాని ఆ రెండునూ వాక్యములోనే యున్నవి, మరియు దానిని ఏదియును మార్చలేదు. అయితే దానిని గూర్చి నేర్చుకొనుటకును మరియు ఆ సత్య సిద్ధాంతమును వ్యతిరేకించుచున్నట్లు కనబడుచున్న సత్యములతో దానిని సమాధానపరుచుటకును కావలసిన కాల వ్యవధిని తీసుకొనరు. వారు తమ చెవులు మూసికొందురు, పండ్లు కొరుకు కొందురు, బయటకు పోయెదరు. ఈ కాలము యొక్క అంత మందు ఒక ప్రవక్త వచ్చును, కాని అతడు చెప్పుచున్నది మరియు చేయుచున్నది చూచుటకు వారు గ్రుడ్డివారిగా యుందురు. వారిదే నిశ్చయంగా సరియనుకొందురు, మరియు వారి యొక్క గ్రుడ్డితనములో వారు అంతటిని కోల్పోవుదురు.
ఇప్పుడు వారు గ్రుడ్డివారనియు, దిగంబరులనియు దేవుడు చెప్పుచున్నాడు. గ్రుడ్డివాని గాను మరియు దిగంబరి గాను యున్న ఒకడు ఆ సంగతని ఎరుగకుండుట కంటే విషాదకరమైన పరిస్థితి నేను ఊహించలేను. ఒకే ఒక జవాబున్నది — అతని మతిస్థిమితము లేదు. అతడు అయోమయ స్థితిలో కూరుకొనిపోయి యున్నాడు. అతని యొక్క వివేకము నశించినది, ఆత్మీయ మతిమరపు వచ్చియున్నది. దాని యొక్క భావము మరేమిటి? ఈ చివరికాలపు సంఘములో నుండి పరిశుద్ధాత్మ తరలిపోయినదని దాని అర్థమా? వునుష్యులు తమ మనస్సులలో నుండి దేవునిని అంతగా తొలగించుకొనియున్నారు, రోమా1:28లో చెప్పినది జరుగుచున్నది.
"మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను."
అటువంటిది ఏదో జరిగినట్లే కనబడుచున్నది. ఇక్కడ ఈ జనులు దేవుని సంబంధులమని చెప్పుకొనుచున్నారు, మరియు దేవునిని, పరిశుద్ధాత్మను ఎరుగుదుమని చెప్పుకొనుచున్నారు; అయినను వారు దిగంబరులు గాను, గ్రుడ్డివారు గాను యుండియు, ఆ సంగతిని ఎరుగకున్నారు. "వారు ఎప్పుడో మోసపోయిరి. వారు అబద్ధ ఆత్మను కలిగియున్నారు. ఏర్పరచబడినవారు మోసపుచ్చబడరు, కాని మిగిలినవారు మోసపుచ్చబడుటను చూచెదము." వారు దేవుని యొక్క వాక్యమును నిరాకరించినందునే, గ్రుడ్డివారుగా మారిరి. దేవుని యొక్క కాపుదలను మరియు సంరక్షణను వారు విడిచిపెట్టి, దుస్తులు లేని దిగంబరులుగా మారిరి. తమ స్వంత విధానములో వారు రక్షణను కట్టుకొనుచున్నారు, సంస్థ ద్వారా తమ స్వంత బాబెలు గోపురమును నిర్మించుకొనుచున్నారు.
ఓ, వారు ఎంతో చక్కగాను, అందముగాను వస్త్రములు ధరించుకొనునట్లు వారి స్వంత కండ్లకు కనబడుచున్నారు; వారు తమ స్వంత సమాజములను నిర్మించుకొనుచున్నారు, వారికి స్వంత ఆలోచన సభలున్నవి. అయితే ఇప్పుడు దేవుడు వాటినన్నింటిని ఒలిచివేయుచున్నాడు, మరియు అందుకే వారు దిగంబరులుగా యున్నారు. ఈ సంస్థలు వారిని క్రీస్తువిరోధి కూటమిలోనికి తప్ప మరెక్కడికిని నడిపించుట లేదు. గురుగుల పొలములోనికి వారు వెళ్ళుచున్నారు. కట్టలలో కట్టబడి కాల్చబడును. నిజానికి వారు జాలిపొందుటకు పాత్రులు. అవును, వారికి దయ చూపుడి. వారిని హెచ్చరించండి, వారిని బ్రతిమాలుడి, వారు నాశనములోనికి నడచుచున్నారు, వారు కాల్చబడుకుండ రక్షించుటకు చేయుచున్న ప్రయత్నములను అగ్రహాముతో వారు తిరస్కరించున్నారు. నిజానికి వారు దిక్కుమాలినవారుగా ఉన్నారు, అయినను వారు దానిని ఎరుగరు. వారికి నిరీక్షణ లేదు, వారు నిజంగా సిగుపడవలసిన దాని విషయములో అతిశయించుచున్నారు. వాక్యమునకు విరోధముగా పోరాడుచున్నారు, కాని ఒక దినమున వారు దానివలననే తీర్పుపొంది దాని యొక్క భయ౦కరమైన నేరారోపణల వెల చెల్లించుదురు.
కాలములకు తుదిగా బుద్ధి చెప్పుటు
ప్రకటన 3: 18-19
"నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.నేను ప్రేమించు వారినందరిని గద్దించి శిక్షించుచున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము."
దేవుని యొక్క గద్దింపు సూటిగా యున్నది. విషయమును తేటగా చూపించెను. ఈ చివరి కాలపు సంఘమును ఆయన ఒక నిరీక్షణ వైపుకు నడిపించుచున్నాడు. ఆ నిరీక్షణ ఆయనే. "నా యొద్దకు వచ్చి కొనుము," అని ఆయన చెప్పుచున్నాడు. నాయొద్ద కొనుమని ఆయన చెప్పిన మాట, ఈ లవొదికయ సంఘము దేవుని రాజ్యము యొక్క ఆత్మీయ ఉత్పత్తులను కొనుటకు యేసుతో సమాలోచన చేయుట లేదని ఇందువలన అర్థమగుచున్నది. వారి యొక్క వ్యవహారములు ఆత్మ సంబంధమైనవి కాలేవు. తాము ఆత్మ సంబంధులముగా యున్నామని వారనుకొనుచుండవచ్చును, కాని ఏలాగుందురు? వారి మధ్యనున్న క్రియలు నిశ్చయంగా పౌలు చెప్పినట్లుగా లేవు, "ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, కార్యసిద్ధి కలుగజేసికొనుటకును తన దయాసంకల్పము నెరవేరుటకు మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే." ఫిలప్పి 2:13. అయితే ఈ సంఘములు, స్కూళ్ళు, ఆస్పత్రులు, మిషనైరీ మున్నగువాని సంగతి ఏమిటి? అవి శాఖల యొక్క బీజమునకును, ఆత్మకును చెందియున్నంత కాలము దేవుడు వారిలోయుండడు. మరియు దేవుని యొక్క విత్తనముగాను, ఆత్మగాను యుండవు.
"నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును కొనుము."
ఈ జనులకు బంగారము సమృద్ధిగా యున్నది, కాని అది తప్పువిధమగు బంగారము. ఆ బంగారము మానవుల జీవితములను కొని, వారిని నాశనము చేసినది. మానవ గుణశీలమును మలచినది, వంకర చేసినది కూడా ఆ బంగారమే, ఎందుకనగా దాని యొక్క ప్రేమయే సమస్త కీడులకు మూలము.
ప్రకటన 18:1-14.
"అటు తరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను.అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను — మహా బబులోను కూలిపోయెను. కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపటును అయ్యెను.ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలివర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి.మరియు ఇంకొక స్వరము పరలోకమునుండి ఈలాగు చెప్పుట వింటిని — నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్ళలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లను దానిని విడిచి రండి.దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.అది యిచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపిపెట్టుడి.అది — నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను. దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక,అది తన్నుతాను ఎంతగా గొప్ప చేసికొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి.అందుచేత ఒక్క దినముననే దానితెగుళ్ళు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ణుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును.దానితో వ్యభిచారము చేసి సుఖ భోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూపమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచూ — అయ్యో, బబులోను మహా పట్టణమా, బలమైన పట్టణమూ, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు.లోకములోని వర్తకులును ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరకులను ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతవు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, యిత్తడి, యినుము చలువ రాళ్ళు మొదలైనవాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను,దాల్చిని, చెక్క, ఓమము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి ద్రాక్షారసము, నూనె, మొత్తనిపిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని గుర్రములను, రధములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు.నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడచిపోయెను. రుచ్యమైనవన్నియు, దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించిపోయినవి, అవి ఇక మీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు."
ఇది నిజంగా చివరి దినపు సంస్థల యొక్క స్వరూపము, ఎందుకనగా 4వ వచనములో ఇట్లు చెప్పుచున్నది, "నా జనులారా, దానిలో నుండి బయటకు రండి." ఇంకా రాకడ జరుగలేదు. ఈ ధనికమగు అబద్ధ సంఘములో ఈ భయంకరమగు పరిస్థితులు ఉండిన సమయములో వధువు ఇక్కడ యున్నది.
కాని దేవుని యొక్క బంగారమున్నది.
I పేతురు 1:7
"నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దాని కంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును."
ఈ దేవుని యొక్క బంగారము క్రీస్తును పోలియుండును, శ్రమల కొలిమిలో శోధించబడును. అదియే సరియగు సువర్ణము.
కాని ఈనాడు సంఘము యొద్ద ఏ విధమగు బంగారమున్నది? నశించిపోవు ఈ లోకబంగారమున్నది. అది ధనికురాలు. దానికి కొదువ లేదు. ఆత్మసంబంధముగా అన్నియూ కలిగియున్నానని చెప్పుచున్నది. దేవుని ఆశీర్వచనము యొక్క సూచనయున్నది. సిద్దాంతపు సిద్ధపాటున్నది. దానిలో ఎందరో ధనికులు చొరబడి యున్నారు.
"కాని సమయము మించిపోకముందే నీవు బయటకు వచ్చుట మంచిదని," ప్రభువు సెలవిచ్చుచున్నాడు, "అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నాయొద్ద కొనుము అప్పుడు నీవు నిజముగా ధనవృద్ధి చేసికొందువని," ఆయన చెప్పుచున్నాడు. దానిని మనమ గ్రహించుచున్నామా? నా మాట వినుడి. "ఈ లోకములోనికి దిగంబరులముగా (శరీరరీత్యా) మనము వచ్చియున్నాము, కాని దిగంబరులముగా (ఆత్మీయముగా) మాత్రము ఈ లోకమును విడిచిపెట్టము. మనతో కూడా ఒక దానిని మనము తీసికొని పోవుదము. మనము తీసికొనిపోగలిగినదంతయూ అదే, అందులో తక్కువ లేదు మరియు ఎక్కువ లేదు. కాబట్టి ఇప్పుడు మనము జాగ్రత్తపడవలెను. మనము తీసికొని వెళ్ళునది దేవుని యెదుట మనలను సరిగా నిలబెట్టునో లేదో అని జాగ్రత్తపడవలెను. దేనిని మనతో తీసికొని వెళ్ళుదము? మన గుణలక్షణమును తీసికొనిపోదుము. సోదరుడా, అదే మనము తీసికొని పోయెదము. నీతో కూడా ఎటువంటి గుణలక్షణమును నీవు తీసికొనిపోయెదవు? అది ఆయన వంటిదేనా, ఆయన గుణలక్షణము శ్రమల ద్వారా మలచబడినది మరియు వేదన అను అగ్నిలో పుటము వేయబడినది; లేదా ఏ గుణలక్షణమును లేని, యీ లవొదికయ జనుల వలె, మొత్తని స్వభావమును కలిగియున్నారా? ఆ దినమున ప్రతివారు వారివారి భారములను కలిగియుందురు, కాబట్టి మనకు బాధ్యత యున్నది.
ఈ లవోదికయ పట్టణము ధనవంతమైన పట్టణమని నేను చెప్పాను. ఇరువైపుల వ్రాతలు కలిగిన బంగారు నాణములను అది ముద్రించినది. బంగారు నాణములు ఆ కాలమునకు చిహ్నములు — వర్ధిల్లుచున్న వ్యాపారము దీనినిబట్టి ఉనికిలో ఉన్నది. ఈనాడు, రెండు శిరస్సులు గల బంగారు నాణేము మనయొద్ద ఉన్నది. మనము కొనుగోళ్ళు, అమ్మకములు స్వయంగా జరుపుచున్నాము. సంఘములో కూడా మనము అదే చేయుటకు ప్రయత్నించుచున్నాము. పాపమును మనము అమ్ముచున్నాము మరియు పరలోకమును కొనుచున్నాము — లేదా ఆలాగు మనము చెప్పుకొనుచున్నాము. కాని దేవుడు ఆలాగున చెప్పడు.
అంత విస్తారమగు సంపదను సంఘము కలిగియున్నది, ఏ సమయములోనయినా గాని అది మొత్తం ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే కైవసము చేసికొనగలదు. వాస్తవానికి దానిని చేయగలదని ప్రపంచ సంఘముల సమాఖ్యలోని ఒక నాయకు బహిర౦గముగా ప్రవచించెను; అదేమనగా, సంఘము భవిష్యత్తులో చేయవలెను, చేయగలుగును, మరియు చేయును అని చెప్పెను. కాని వారి యొక్క బంగారపు బాబెలు గోపురము కూలిపోవును. అగ్నిలో పుటము వేయబడిన బంగారము మాత్రమే నిలచును.
కాలములన్నిటిలోను సంఘము చేయుచుండినది అదే. దేవుని వాక్యమును అది విడిచిపెట్టినది మరియు స్వంత ఆచారములను, పద్ధతులను రూపొందించుకొని సంస్థగా మారి లోకములో చేరిపోయినది. ఆ విధముగా ఆమె దిగంబరియైనది, మరియు దాని కాముకత్వానికి దేవుడు తీర్పు తీర్చనైయున్నాడు. దేవునికి లోబడి ఆయన యొక్క వాక్యమునొద్దకు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే, ఆమె ఈ భయంకరమగు స్థితినుండి బయటపడగలదు.
ప్రకటన 18:4,
"దానిలోనుండి నా జనులారా బయటకు రండి."
II కొరింధీ 6:14-18.
"మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై యున్నాము. అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు — నేను వారిలో నివసించిసంచరింతును, నేను వారి దేవుడనైయుందును. వారు నాప్రజలైయుందురు.కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైనదానిని ముట్టకుడని చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకొందును.మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు."
ఆ వస్త్రముల కొరకు చెల్లించవలసిన ఒక వెలయున్నది, మరియు అదియే ప్రత్యేకించబడుట అను వెల.
"నీకు దృష్టికలుగునట్లుగా నా యొద్ద కాటుక తీసికొనుమని బుద్ధి చెప్పుచున్నాను."
ఈ కాటుకను నీవు కొననవలసినదే అని ఆయన చెప్పుట లేదు. ఓ, కాదు. పరిశుద్ధాత్మకు వెల లేదు.
"ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా? లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా?"
గలతీ 3:2
పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము పొందకుండా, వాక్యము యొక్క నిజమగు ఆత్మీయ ప్రత్యక్షతను నీవు చూచునట్లుగా కన్నులు తెరువబడవు. ఆత్మ లేనటువంటి మనుష్యుడు, దేవునిని మరియు ఆయన సత్యమును చూడలేడు.
ప్రజల కన్నులను తెరచు ఈ కాటుకను గూర్చి నేను ఆలోచించుచుండగా, నా కెంటాకీలోని బాల్యము గుర్తుకు వచ్చుచున్నది. నా సోదరుడు నేను కలసి పైన గడ్డి చాప వేసి పరుండేవారము. ఇంటికి బీటలున్నందున, చలి గాలులు లోనికి వచ్చెడివి. కొన్ని సార్లు చలికాలములో ఎంతో చలివేసెడిది, మేము లేచే సరికి మా కన్నులు పసితో అంటుకు పోయెడివి. మేము అమ్మా అని అరిచే వారము, మరియు ఆమె వేడి చేసిన క్రొవ్వు పధార్ధమును తీసికొని వచ్చి ఆ గట్టి పసి పోయెడివరకు మా కళ్ళ మీద రుద్దెడిది, అప్పుడు మా కన్నులు తెరువబడెడివి.
ఈ తరములో సంఘములోని పగుళ్ళగుండా భయంకరమగు చలిగాలులు కొన్ని వీచుచున్నవి. ఆమె కన్నులు మ౦చుతో గడ్డకట్టుకొనిపోయి, మూసికొనిపోయినవి. ఆమె కన్నులు తెరువబడుటకు, దేవుని యొక్క వేడి నూనె కావలెను. దేవుని ఆత్మను పొందితేనే గాని ఆమె దేవుని శక్తిని, వాక్యమును పొందనేరదు. ఆమె వాటికి బదులుగా కార్యక్రమములను, ఆచారములను పాటించుచున్నది. సంఖ్యను చూచి ఆమె జయమును అంచనా వేసికొనుచున్నది. ఫలము కొరకు ఆమె వెదకుట లేదు. వేదాంత పండితులు వచ్చి విశ్వాస ద్వారమును మూసివేసిరి, అందరినీ ప్రవేశించనియ్యకుండా నిషేధించిరి. వారు ప్రవేశించరు, ప్రవేశించువారిని లోపల ప్రవేశింపనియ్యరు. మానసిక శాస్త్రము మీద ఒక అవిశ్వాసి వ్రాసిన పుస్తకములో నుండి వారి వేదాంతము వచ్చియున్నది. మానసిక శాస్త్రము మీద ఒక గ్రంథము ఉన్నది, అది మనందరికి అవసరమైనది ఏదనగా: అది బైబిలు. అది దేవునిచే వ్రాయబడెను మరియు దానిలో దేవుని యొక్క మానసిక శాస్త్రము అందులో యున్నది. దానిని నీకు వివరించుటకు ఏ వైద్యుడు అవసరము లేదు. నీవు పరిశుద్ధాత్మను పొందుము మరియు ఆయనే నీకు దానిని వివరించును. ఆయన గ్రంథమును వ్రాసెను మరియు అందులో ఏమి ఉన్నదో, దాని యొక్క భావము ఏమిటో, ఆయనే నీకు చెప్పును.
I కొరింధీ 2:9-16
"ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడియున్నది.మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు.ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచించబడడు.ప్రభువు పునస్సును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము."
ఇప్పుడు ఈ కాలమును గూర్చి ఆత్మ వ్యతిరేకముగా ఘోషి౦చుచున్న సంగతులన్నియూ నిజము అయినచో, బాప్తిస్మమిచ్చు యోహానువలె ఒకడు రంగము మీదికి రావలసిన అవసరమున్నది. మరియు ముందెన్నడూ లేని విధంగా సంఘమును సవాలు చేయవలెను. మన కాలమునకు సరిగ్గా అదే జరుగుచున్నది. మరి యొక బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చుచున్నాడు మరియు మొదటి ముందుగా వచ్చువానివలె ఇతడును కేకవేయును. అది మనకు తెలియును, ఎందుకనగా తరువాత వచనము చూడండి.
"నేను ప్రేమించువారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము."
ప్రకటన 3:19.
యోహాను కూడా ఇదే వర్తమానమును కలిగియుండెను. పరిసయ్యులు, సద్ధూకయ్యులు, అన్యులు అను మత అరణ్యములో అతడు కేకవేసెను. "మారుమనస్సు పొందుడి!" మరియొక మార్గము లేదు; ఇప్పుడును మరో మార్గము లేదు. దేవుని యొద్దకు తిరిగి వచ్చుట తప్ప, మరొక మార్గము అప్పుడు లేదు; ఇప్పుడును అది తప్ప, మరొక మార్గము లేదు. మారుమనస్సు పొందుము. మీ మనస్సును మార్చుకొనుము. వెనుకకు తిరుగుము. మారుమనస్సు పొందుము, ఎందుకు నీవు చావవలెను?
మొదటి మాటను గమనించుదము, "నేను ప్రేమించువారినందరినీ." అయితే, "నేను" అను మాటను గ్రీకులో నొక్కి చెప్పెను. "నన్ను ఎందరు ప్రేమించుచున్నారో వారినందరినీ నేను ప్రేమించుచున్నానని, ఆయన చెప్పుట లేదు." లేదండి. మానవుల ప్రేమకు కేంద్రముగా మనము ఎన్నడునూ యేసును ఇక్కడ పెట్టుటకు ప్రయత్నించరాదు, ఈ వచనము అలాంటిది కాదు. లేదు! దేవుని చేత ప్రేమించబడువారు అనేకులున్నారు. ఆయన ప్రేమను గూర్చి ప్రశ్నించవలెను గాని మన ప్రేమను గూర్చి కాదు.
ఆయన రక్షణ గూర్చియు, ఆయన సంకల్పము గూర్చియు మనము అతిశయించుచుందుము. దేవుని యొక్క సార్వభౌమత్వము అను వాక్య సత్యమును మరిగట్టిగా నమ్ముచుందుము. రోమా 9:13లో ఆయన చెప్పెను, "యాకోబును నేను ప్రేమించితిని." ఆయన చాలా మందిని ప్రేమించి యున్నాడు గనుక ఆయన ఇక ఎవరినీ ప్రేమించరాదని దీని అర్థమా? లేక ఆయన ప్రేమించుట అయి పోయినది గనుక ఆయనకు దూరస్తులుగా యున్నవారు ఆయనను సమీపించి ప్రేమించవలెనని ఆయన ఎదురు చూచుచున్నాడా? ఏ విధముగాను ఇది దాని భావము కాదు. రోమా 9:13లోనే ఆయన ఈలాగు చెప్పెను, "ఏశావును నేను ద్వేషించితిని." 11వ వచనములో ఆత్మ బాహటముగా చెప్పుచున్నది, "ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను, కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను." ఈ ప్రేమ "ఏర్పరచబడిన ప్రేమ." ఆయన తానేర్పచుకొనిన వారిపట్ల ప్రేమ చూపెను. "మానవ సత్క్రియలను" బట్టి ఆయన వారిని ప్రేమించలేదు. దేవుని సంకల్పము పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము అని యున్నది, మానవుని క్రియలకు అది విరోధము. "పిల్లలింకా పుట్టక ముందే" ఆయన చెప్పెను, "యాకోబును నేను ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని."
ఇప్పుడాయన తన స్వంత వారితో చెప్పుచున్నాడు, "నేను ప్రేమించుచున్న వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను." గద్దించుట అనగా బుద్ధి చెప్పుటయే. బుద్ధి చెప్పుట అనగా సరిచేయవలెనని బహిర్గతము చేయుట. శిక్షించుట అనగా, బాధ కలుగ చేయుట అని అర్థము కాదు; క్రమ శిక్షణలో పెట్టుట, అని దాని అర్థము, ఎందుకనగా అతనిని సరిచేయవలెనని మనస్సులో యున్నది.
హెబ్రీ 12:5-11లో సరిగ్గా దానినే మనము కనుగొందము,
"నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము.ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్ళయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు. మీరు పొందనియెడల దుర్భీజులే గాని కుమారులు కారు.మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైయుండిరి. వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికిమరి యొక్కువగా లోబడి బ్రదుకవలెను గదా?వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెననిమన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు.మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును."
దేవుని యొక్క ప్రేమ ఇక్కడ కనబడుచున్నది. ఆయన ప్రేమగల తన కుటుంబమును గూర్చి ఆశించెను, కుమారుల కుటుంబమది — ఆయన వంటి కుమారులే. కాబట్టి ఆయన ముందు మానవులందరును ఒకే మట్టి ముద్దవలె కనబడుచున్నారు. అదే ముద్ద నుండి ఆయన పాత్రలను చేయుచున్నాడు. అవి కొన్ని ఘనతకును మరికొన్ని ఘన హీనతకును తయారు చేయబడుచున్నవి. ఆ "ఎన్నిక" ఆయన స్వంత ఎన్నిక ఆ ఏర్పరచబడినవారు ఆయనాత్మ మూలముగా జన్మించిన వారే నడకలో ఆయన యొక్క స్వరూపమును చూపించుటకు నియమాలను అనుసరించి తర్ఫీదు పొందుదురు. ఆయన ఎంతో దీర్ఘశాంతముతోను, మంచితనము తోను, కృపతోను వారిని గద్దించుచున్నాడు. మేకులతో గాయపరచబడిన చేతులతో ఆయన శిక్షించుచున్నాడు. కొన్నిసార్లు కుమ్మరి తాను తయారు చేయుచున్న దానిని పిసికి ముద్దచేసి తిరిగి అతడు తాను కోరుకొనిన రూపము రావలెనని పనిచేయును. కాని ఇది ప్రేమతో చేయును. అదే ఆయన ప్రేమ. ఆయనకు మరియొక రకమగు ప్రేమ లేదు. మరొక ప్రేమ ఉండజాలదు.
ఓ, చిన్న మ౦దా, భయపడకుము. ఈ కాలము త్వరగా ముగియుచున్నది. గురుగులు కట్టలు కట్టబడును, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు, వారికి అద్భుతమగు మూడు పేటల త్రాడు యొక్క శక్తి యున్నది: అది రాజకీయము, శరీరకము మరియు ఆత్మీయనము (సాతాను సంబంధమైనది), మరియు వారు క్రీసు యొక్క వధువును నాశనము చేయగోరుచున్నారు. ఆమె శ్రమపడును గాని సహించును. భూమి మీదికి వచ్చుచున్న సంగతుల గూర్చి భయపడవదు, ఎందుకనగా "ఆయన తన స్వంతవారిని అంతము వరకు ప్రేమించెను." యోహాను 13:1.
"ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము." ఇప్పుడు అబద్ధ సంఘమునకు ఆసక్తియున్నది; దాని గురించి ఏ పొరపాటు చేయవద్దు. ఆ ఆసక్తి యూదుల యొక్క ఆసక్తి వలెనె యున్నది.
యోహాను 2:17
"నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది."
కాని వారిది తప్పు ఆసక్తి. వారి యొక్క స్వంత భవనమును గూర్చి వారికి ఆసక్తియున్నది. వారి స్వంత ఆచారములు, సిద్ధాంతములు, సంస్థలు, స్వనీతి వారికి ఉన్నవి. వారి స్వంత అభిప్రాయము కొరకు వాక్యమును బయటకు త్రోసివేసిరి. పరిశుద్ధాత్మను వారు తొలగించి మనుష్యులను నాయకులుగా నియమించుకొనిరి. వారు నిత్యజీవమును ఒకమానవుని వలె ప్రక్కకు పెట్టిరి, మంచి క్రియలు చాలుననిరి, మంచి క్రియలకన్న సంఘమునకు అనుగుణముగా ఉన్నదే మంచిదనుకొనిరి.
కాని దేవుడు మరియొక ఆసక్తి కొరకు వెదకుచున్నాడు. "నేను తప్పు చేశాను," అని కేకపెట్టు ఆసక్తి కావలెను. ఇప్పుడు తాను తప్పు చేయుచున్నానని ఎవడు చెప్పగలడు? ఆ శాఖలన్నియూ దేని మీద ఆధారపడియున్నవి? — అందరును దేవుని యొక్క మూలవాక్కు మీదనే ఆధారపడియున్నామందురు, మరియు దేవుని వలనైనదని అందురు, — తమదే సరియందురు. అందరూ సరి కాలేరు గదా? వాస్తవానికి వారిలో ఎవ్వరు సత్యవంతులు లేరు. వారు సున్నము గొట్టిన సమాధులు, చచ్చిన వారి ఎముకలతో నిండియున్నారు. వారిలో జీవము లేదు. వారికి రుజువు లేదు. సంస్థలో దేవుడు ఎన్నడు తన్నుతాను బయలుపరచుకొనలేదు. తమదే సరియని వారు చెప్పుకొందురు, ఎందుకనగా వారు మాత్రమే దానిని చెప్పుచున్నారు, కాని చెప్పుకొనుట వలన అది నిజముగా మారదు. "యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను దేవుని యొక్క రుజువు వీరికి అవసరము, అది వారియొద్ద లేదు.
ఇప్పుడు నన్ను దీనిని ఇక్కడ చెప్పునివ్వండి. అబద్ధ సంఘమును మాత్రమే మారుమనస్సు పొందమని దేవుడు పిలచుచున్నట్లుగా నేను అనుకొనుట లేదు. ఈ వచనములో ఆయన తానేర్పచుకొనిన వారితో మాట్లాడుచున్నాడు. వారు కూడా కొంత మారుమనస్సు పొందవలసిన అవసరమున్నది. వారిలో చాలా మంది పిల్లలు ఇంకా అబద్ధ సంఘములలో యున్నారు. ఎఫెసీ 5:14లో వారిని గూర్చి చెప్పబడియున్నది, "నిద్రించుచున్నవారలారా, మృతులలో నుండి మేల్కొనుడి, క్రీస్తు మీకు వెలుగునిచ్చును." నిద్రించుచుండుట అనగా మృతి పొందుట కాదు. వీరు మృతుల వధ్యను నిద్రించుచున్నారు. వారు ఆ బయట చచ్చిన శాఖలలో యున్నారు. వారితో పాటును వీరునూ తేలుచున్నారు. "మేల్కోనుము! నీ అవివేక విషయమై మారుమనస్సు పొందుము," అని దేవుడు మొరపెట్టుచున్నాడు. ఇక్కడ వారు తమ ప్రభావమును చూపించుచున్నారు, వీరు తమ సమయమును, డబ్బును, ప్రాణములను ఈ క్రీస్తువిరోధియగు సంస్థలకు ఖర్చు చేయుచున్నారు, అదే సరియని వారు అనుకొనుచున్నారు. వారు మారుమనస్సు పొందవలసిన అవసరత యున్నాది. వారు తప్పక మారుమనస్సు పొందవలెను. వారు మనస్సు మార్చుకొని సత్యము వైపు తిరుగవలసియున్నారు.
చాలా మందికి ఈ కాలములో మారుమనస్సు అవసరమై యున్నది. కాని పొందుదురా? వాక్యమును అది తిరిగి తీసికొని వచ్చునా? మానవ జీవితములలో పరిశుద్ధాత్మ మరల చోటు చేసికొనునా? యేసు మాత్రమే రక్షకుడని వారు మరల ఒప్పుకొని ఘనపరచుదురా? ఆలాగు జరుగదని నేను చెప్పుచున్నాను, ఎందుకనగా ఆ తరువాత వచనము ఆశ్చర్యమును, సంచలనమును కలిగించు సత్యమును ఈ కాలాంతము గూర్చి చెప్పుచున్నది.
క్రీస్తు సంఘమునకు బయటయున్నాడు
ప్రకటన 3:20-22,
"ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినయెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము.నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గొక."
ఈ వచనమును గూర్చి చాలా గొప్ప గందరగోళము యున్నది, ఎందుకనగా చాలామంది వ్యక్తిగత పనివారు దీనిని వ్యక్తిగత సువార్తలలో ఉపయోగించుకొనుచున్నారు. ప్రతి పాపి యొక్క హృదయ ద్వారము నొద్ద యేసు ఉండి లోనికి రావలెనని తట్టుచున్నాడని వారనుచున్నారు. ఆ పాపి గాని ద్వారమును తెరచినయెడల ప్రభువు లోనికి వచ్చునని వారు అనుచున్నారు. కాని ఈ వచనము వ్యక్తిగత పాపులను గూర్చి మాట్లాడుట లేదు. ప్రతి కాలములోను ఉండిన వర్తమానము వలెనె ఈ మొత్తం వర్తమానము దానికి వర్తించును. 22వ వచనములో ఇట్లు చెప్పబడినది, "చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటను వినును గాక" కాబట్టి ఇది చివరి సంఘ కాలమునకు వర్తమానము. అంతము సమీపించుచుండగా ఇది లవోదికయ సంఘము యొక్క పరిస్థితి. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వర్తమానము కాదు; యేసు ఎక్కడున్నాడో వాక్యము మనకు చెప్పుచున్నది. "క్రీస్తు సంఘమును వీడి వెళ్ళిపోయెను."
ఇది చాలా విషాదకరమగు అంతము లేదా ఫలితము, ఆచారముల కొరకు వాక్యమును ప్రక్కకు త్రోసివేసిరి. పరిశుద్ధాత్మ యొక్క స్థానములోనికి పోపులు, బిషప్పులు, ప్రెసిడెంటులు, కౌన్సిల్లరు మొదలగు వారు వచ్చిరి. సంఘ కార్యక్రమాల కొరకు రక్షకుని ప్రక్కకు త్రోసివేసిరి, సంఘములో చేరితే చాలుననుచున్నారు, లేదా సంఘ క్రమములో ఒక రకవుగు నిర్ధారణ పొందితే చాలుననుచున్నారు. ఇంత కంటె ఆయనకు విరోధమైనది ఇంకేమున్నది? ఇదే విశ్వాసభ్రష్టత్వము! ఇదే దారి తొలగుట! క్రీస్తు విరోధికి తలుపు తెరచిరి, తండ్రి నామములో వచ్చిన వానిని (యేసు) వారు చేర్చుకొనకుండా విసర్జించిరి, అయితే తన స్వంత పేరుతో ఒకడు వచ్చును (వాడు అబద్ధికుడు, అనుకరించువాడు) వానిని వారు చేర్చుకొందురు. యెహాను 5:43. వాడు పాప పురుషుడు, ఆ నాశనపుత్రుడు ఆక్రమించును.
మత్తయి 24లో ఆకాశమందు సూచనలు కనబడుట గూర్చి చెప్పబడెను, యేసు రాకకు ముందుగా ఈ చివరి దినములలో అది జరుగును. ఈ మధ్యనే అటువంటి సూచన గూర్చి మీరు వినిరనుకొంటాను, మనము చర్చించుకొనుచున్న ఈ సత్యమును అది నెరవేర్చియున్నది. యేసును నెమ్మది నెమ్మదిగా త్రోసివేసుకొంటూ వచ్చిరన్నదే ఆ సత్యము, చివరకు ఈ అంత్యకాలములో చూడండి, ఇప్పుడాయన సంఘమునకు వెలుపట యున్నాడు. గుర్తు చేసుకొనండి, మొదటి కాలములో సంఘము యొక్క సత్యము దాదాపుగా పూర్తి వృత్తమువలె యున్నది. అయినా గాని చిన్న తప్పు అందులో యున్నది, అదే నీకోలాయితుల క్రియ, అందువలన ఆ వృత్తము నిండుగా లేదు. ఆ తరువా తకాలములో ఇంకా ఎక్కువ చీకటి ప్రాకి వచ్చినది, ఆ వెలుగు గోళము తక్కువ కాంతిని ఇచ్చినది, ఆ వృత్తమును చీకటి ఎక్కువగా కమ్మినది. మూడవ కాలములో ఇంకా ఎక్కువ చీకటి కమ్ముకొనినది, నాలుగవ కాలములో అంధకారమే మిగిలినది, వెలుగు పూర్తిగా పోయినది.
దీనిని గురించి ఇప్పుడు ఆలోచించుము. క్రీస్తు యొక్క ప్రతిబింబిత వెలుగుబట్టి సంఘము ప్రకాశించును. ఆయన సూర్యుడు. సంఘము చంద్రుడు. ఆ విధముగా ఈ వెలుగు గోళము చంద్రుడు. మొదటి యుగములో దాదాపుగా నిండు చంద్రునిగా యున్నది. కాని నాలుగవ కాలములో వెండివలె యున్నది. కాని అయిదవ కాలములో అది ఎదుగసాగినది. ఆరవ కాలములో ఎక్కువ ఎదుగుదల కనిపించినది. ఏడవ కాలభాగములో ఇంకా అది ఎదుగుచుండెను, కాని ఆకస్మాత్తుగా అది ఆగిపోయెను, పూర్తిగా కాంతిహీనమై పోయినది, కావున వెలుగునకు బదులుగా భ్రష్టత్వమును చీకటి వచ్చియున్నది. కాలము చివరికి వచ్చు సరికి ప్రకాశించుట ఆగిపోయెను, ఎందుకనగా చీకటి దానిని అక్రమించినది. క్రీస్తు ఇప్పుడు సంఘమునకు బయటయున్నాడు.
ఇది ఆకాశము యొక్క సూచన. గత చంద్ర గ్రహణము సంపూర్ణ చంద్ర గ్రహణము. పూర్తి అంధకారమునకు అది ఎదిగినది, ఏడు దశలలో అది పెరిగినది. ఏడవ కాలములో పూర్తి అంధకారము వచ్చెను, రోమ్ యొక్క పోపు (ఆరవ పౌలు) యెరూషలేము పరిశుద్ధ పర్యటనకు పాలస్తీనాకు వెళ్ళెను. యోరుషలేముకు వెళ్ళిన మొదటిపోపు అతడే. ఆ పోపు నామము ఆరవ పౌలు. పౌలు మొదటి వర్తమానికుడు, ఈతడు ఆ పేరుతోనే వెళ్ళెను. గమనించండి. ఇతడు ఆరవ పౌలు, ఆరు అనునది మానవ సంఖ్య. ఇది సహజ సంఘటన అనుకొనవద్దు. అంతకంటె గొప్పది. అతడు యెరూషలేముకు వెళ్ళినప్పుడు, చంద్రుడు లేదా సంఘము పూర్తీ అందకారములోనికి వెళ్ళిపోయియునది. ఇది అదే. ఇదే అంతము. అదంతాయూ నెరవేరు వరకు ఈ తరము గతించదు. ప్రభువైన యేసూ, త్వరగా రమ్ము!
రెండు ద్రాక్షావల్లులు ఎందుకున్నవో మనం చూచుచున్నాము, ఒకటి నిజమైనది, మరి యొకటి అబద్ధమైనది. అబ్రహాముకు ఇద్దరు కుమారులు ఎందుకుండిరో చూచాము, ఒకడు శరీర సంబంధి (ఇస్సాకును శ్రమపెట్టెను) మరియు ఒకడు వాగ్దాన పుత్రుడు. ఒకే తల్లిదండ్రుల నుండి ఇద్దరును కవలలుగా వచ్చిన వారిని చూచాము. ఒకడు దేవుని సంగతులను తెలిసికొని ప్రేమించుచుండెను. మరియొకడు సత్యమును ఇంకా ఎక్కువగా తెలిసికొనెను గాని ఆత్మ వేరుగా యున్నది, అందువలన ఏర్పరచకొనబడిన కుమారుని హింసించుచుండెను. దేవుడు భ్రష్టత్వము కొరకు భ్రష్టులనుగా చేయడు. ఏర్పరచబడిన వానికొరకు అతనిని భ్రష్టునిగా ఆయన చేసెను. ఏర్పరచబడినవాడు ఏర్పరచబడిన వానిని హింసించడు. ఏర్పరచబడినవాడు ఏర్పరచబడిన వానికి హానిచేయడు. భ్రష్టులు, ఏర్పరచబడిన వారిని హింసించి నాశనము చేయ చూచెదరు. ఓ, ఆ భ్రష్టులు భక్తులవలె యున్నారు. వారు తెలివైనవారు. వారు కయీను సంతతి వారు, సర్ప సంతానము. వారు తమ కొరకు బాబెలులను నిర్మించుకొన్నారు, వారు తమ పట్టణములను కట్టుకొనిరి, వారు తమ సామ్రాజ్యములను కట్టుకొనిరి, దేవునికి వారు ప్రార్థన చేయుట మానలేదు. వారు నిజ సంతానమును ద్వేషించి, దేవుడు ఏర్పరచుకొనిన వారిని నాశనము చేయుటకు తమకు చేతనయినదంతా చేసిరి, (ప్రభువు నామములోనే చేసిరి). కాని వారి అవసరమున్నది. "గోధుమలతో పొట్టుకు ఏమి సంబంధము?" కాని పొట్టు లేనిచో, గోధుమలు లేవు. కాని అంతమందు, పొట్టుకు ఏమి జరుగును? ఆరని అగ్నితో అది కాల్చబడును. గోధుమలు? ఎక్కడుండును? ఆయన యొక్క కొట్టులోనికి సమకూర్చబడును. అక్కడే ఆయన ఉండును.
దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారలారా, జాగ్రత్తగా యుండండి. జాగ్రత్తగా చదవండి. జాగ్రత్తగా యుండండి. భయముతోను, వణుకుతోను మీ రక్షణను కొనసాగించండి. దేవుని మీద ఆధారపడండి మరియు ఆయన శక్తితో బలవంతులు కండి. మీ శత్రువగు అపవాది ఎవరిని మ్రింగుదునా అని గర్జించు సింహమువలె వెదకుచూ తిరుగుచున్నాడు. ప్రార్థనతో గమనిస్తూ స్థిరంగా ఉండండి. ఇదే చివరికాలము. మంచి ద్రాక్షలు, కారుద్రాక్షలు రెండునూ పరిపక్వమగుచూ యున్నవి, కాని గోధుమలు పక్వమగు ముందుగా ఆ పండిన గురుగులు కాల్చబడుటకు కట్టెలు కట్టబడును. చూడండి, వారందరూ ప్రపంచ సంఘముల సమాఖ్యలో చేరుచున్నారు. అదే కట్ట. త్వరలోనే గోధుమలు తూర్పార చేయబడును. కాని ఇప్పుడు రెండు ఆత్మలు రెండు ద్రాక్షవల్లులో పనిచేయుచున్నవి. గురుగుల మధ్యనుండి బయటకు రండి. జయించనారంభించండి, అప్పుడు మీరు మీ ప్రభువు చేత యోగ్యులనిపించుకొందురు. ఆయనతో కూడా పరిపాలించుటకు, ఏలుటకు సిద్ధపడండి.
జయించువాని సింహాసనము
ప్రకటన 3:21,
"నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను."
ఇప్పుడు మనము జయించవలసినది ఏమిటి? ఇక్కడ అడగవలసిన ఒక సామాన్య ప్రశ్న ఇది. కాని అది ఈ వచనము యొక్క అసలు ఆలోచన కాదు, ఏమిటి జయించవలెననునది ప్రశ్న కాదు గాని ఏలాగు మనము జయించవలెనన్నదే ప్రశ్న. ఇది చాలా ఆశ్చర్యముగా యుండును. ఏలాగు మనము జయించవలెనో ఎరిగియున్నప్పుడు ఏమిటి జయించవలెనన్నది లెక్కలోనికి రాదు.
ఆ లేఖనముల వైపు చూచినట్లయితే తెలియును, యేసు ప్రభువు జయించుట గూర్చియు అందులో యున్నది. దీని యొక్క సత్యము అందులోనే యున్నది. మత్తయి 4లో యేసు అపవాది చేత శోధింపబడుట చూచెదము. వాక్యము ద్వారా ఆయన సాతాను యొక్క వ్యక్తిగత శోధనలను జయించెను, వాక్యము ద్వారా మాత్రమే జయించెను. ఆ మూడు ప్రధాన శోధనలలోని ప్రతి శోధనను ఏదెను తోటలోని శోధనలకు పోల్చవచ్చును. అవి శరీరాశ, నేత్రాశ, మరియు జీవపు డంభము. వాటిని యేసు వాక్యము ద్వారా జయించెను. సాతాను యొక్క వ్యక్తిగత శోధన ద్వారా హవ్వ పడిపోయెను, వాక్యమును ఉపయోగించుటలో తప్పిపోయెను. వాక్యమునకు ప్రత్యక్షముగా అవిధేయత చూపుట వలన ఆదాము పతనమాయెను, కాని యేసు వాక్యము ద్వారా జయించెను. ఇప్పుడు ఒక సంగతిని చెప్పెదను, జయించువానిగా యుండుటకు ఇదొక్కటే మార్గము. నీవు జయించుచున్నట్లుగా తెలిసికొనుటకు ఇదొక్కటే మార్గము, ఎందుకనగా ఆ వాక్యము తప్పిపోజాలదు.
ఇప్పుడు మతము యొక్క ప్రాపంచిక పద్ధతులను యేసు ఎట్లు జయించెనో మరల మనము గమనించుదుము. ఆనాటి వేదాంత పండితులు పదే పదే ఆయనను ఎదిరించిరి, కాని ఆయన నిరంతరము వాక్యమును ఉపయోగించెను, తాను మాట్లాడుటకు తండ్రి ఏమి తనకిచ్చెనో దానిని ఆయన మాట్లాడెను. ఆయన జ్ఞానము ద్వారా ప్రపంచము గందర గోళములో పడిన సందర్భము ఒక్కటి కూడా లేదు, ఎందుకనగా అది దేవుని జ్ఞానము.
ఆయన యొక్క స్వంత వ్యక్తిగత జీవితములో, స్వంతగా పోరాడుచూ, దేవుని యొక్క వాక్యమునకు విధేయుడై ఆయన జయించెను.
హెబ్రీ 5:7లో ఇట్లు చెప్పబడినది,
"శరీరధారియైయున్న దినములలో మహారోదనముతోను, కన్నీళ్ళతోను, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యూచనలను సమర్పించి భయభకులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.ఆయన కుమారుడై యుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.సంపూర్ణుడై యున్నందున ఆయన నిత్యరక్షణకు కారకుడాయెను. ఆలాగే ఆయనకు లోబడు వారికందరికిని అది చెందును.
ఆయన దేనికి విధేయుడయ్యెను? దేవుని యొక్క వాక్యమునకు.
ఆ వాక్యమును జీవించితేనే గాని ఎవనికిని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సింహాసనము మీద కూర్చొనుటకు అధికారముండదు. మీ ప్రార్ధనలు, మీ ఉపవాసములు, మీ పశ్చాత్తాపములు — మీరేమి దేవునికి సమర్పించినా గాని — దేవుని యొక్క సింహాసనము మీద కూర్చొను ఆధిక్యతను ఇవ్వజాలవు. వాక్య వధువుకు మాత్రమే అది అనుగ్రహించబడును. రాజుయొక్క సింహాసనమును రాణి పంచుకొనిన విధముగానే, ఆమె ఆయనతో ఏకమైయుండెను. ఆయన వాక్య సంబంధియైయున్న ప్రకారముగా వారు కూడా వాక్య సంబంధులుగా యున్నప్పుడే ఆ సింహాసనమును పంచుకొందురు.
అన్ని కాలములలోను మనము తేటగా చూచియున్నాము, దానిని గుర్తుచేసికొనండి. వాక్యమును విడిచిపెట్టినందునే ఆదామువ్వలు పడిపోయిరి, ఆ విధముగానే ఎఫెను కాలము కూడా వాక్యము నుండి కొద్దిగా తప్పుకొన్నందునే పడిపోయినది. ప్రతి కాలము కూడా రానురాను దూరమగుచూ వచ్చుచున్నది, చివరకు వాక్యమును త్రోసివేయు ప్రపంచ సంఘ క్రమము వచ్చియున్నది, వాక్యమును త్రోసివేయుటతో ఈ లవొదికయ సంఘకాలము ముగియును. అందువలన ప్రభువు వారి మధ్యనుండి నిష్కృమించును. ఎవరైతే వాక్యమునకు విధేయత చూపి ఆయనను వెంబడించెదరో వారిని ఆయన బయట నిలబడి తన స్వంతవారిని పిలచుచున్నాడు. ఆత్మ యొక్క కొద్దిపాటి శక్తివంతమగు ప్రదర్శన తరువాత ఈ చిన్న హింసించబడిన సంఘము లేదా గుంపు యేసుతో నుండుటకు వెళ్ళును.
అన్యుల కాలము యొక్క పరమావధి
ఈ కాలము ఏడు సంఘ కాలములలోను చివరది. మొదటిదగు ఏఫెసు సంఘ కాలములో ప్రారంభమయినది, చివరిదగు లవొదికయ సంఘ కాలములోనికి వచ్చుసరికి పరిపక్వత చెంది కోతకు సిద్ధపడవలెను. రెండు ద్రాక్షావల్లులు తమ కడపటి ఫలమును ఫలించును. రెండు ఆత్మలు తమ ప్రత్యక్షతను వెల్లడి చేయును. వారివారి తుది గమ్యములు వెల్లడియగును. నాటుట, నీరు పెట్టుట, ఎదుగుట అంతా అయిపోయినది. ఎండాకాలము ముగిసియున్నది. కోతకొరకు కొడవలి సిద్ధపరచబడినది.
పదిహేను నుండి పద్దెనిమిది వచనముల వరకు యున్న దానిని మనము చూచాము. పరిపక్వము చెందిన కారుద్రాక్షవల్లి, అబద్ధ సంఘ జనుల యొక్క నిజ చిత్రమును మనము చూచియున్నాము. "నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను,వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను యుండిన మేలు. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను యుండక, నులివెచ్చగా యున్నావు గనుక నిన్ను నోటినుండి ఉమ్మివేయునుద్దేశించుచున్నాను. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసికొనియున్నాను గనుక నాకేమియూ కొదువలేదని నీవు చెప్పుకొనుచున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరియనై యున్నావని ఎరుగవు. నీవు ధనవృద్ధి చేసికొనునట్లుగాను అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లుగా తెల్లని వస్త్రమును, నీకు దృష్టికలుగునట్లు కళ్ళకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను." ఇంతకన్న బాధకరముగా నింద ఎన్నడూ మాట్లాడబడలేదు, గర్వము మరియు దురహంకారముగల మతప్రజలు అంతకంటె ఎక్కువ పొందుకోనుటకు అర్హులు కాదు.
అయినను 21వ వచనము చూడండి.
"నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనము మీద కూర్చుండియున్న ప్రకారము, జయించువానిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చొండనిచ్చెదను."
నిజమగు ద్రాక్షాపల్లి, నిజమగు ఆత్మ, నిజమగు సంఘపు జనులు, దేవుని యొక్క సింహాసనము వరకు హెచ్చింపబడుదురు. దీనులగు వారికి అంతకంటె ఉన్నతమగు అభినందన మరేమి ఉండును? వారు నిలకడగా నున్న ఆత్మీయ గుంపుకు చెందినవారు.
బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క మాటలు చాలా ఖచ్చితంగా సరిపోయియున్నవి. నిజమైన సంఘము మరియు అబద్దపు సంఘముకు సంబంధించిన క్రీస్తును గూర్చి అతడు చెప్పినది ఇప్పుడు నెరవేరుచున్నది.
మత్తయి 3:11-12.
"మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మతోను, అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆతను తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను."
క్రీస్తే ఆ గొప్ప కోత యజమాని, భూమి యొక్క ఫలమును ఇప్పుడాయన కోయుచున్నాడు. ఆయన గోధుమలను కొట్టలో సమకూర్చుచున్నాడు, తన స్వకీయుల కొరకు వచ్చుచున్నాడు, వారిని సదాకాలము ఆయన తనతో కూడా యుంచును. ఆ తరువాత ఆయన దుర్మార్గులను ఆరని అగ్నితో కాల్చి నాశనము చేయును.
గురుగులు మరియు గోధుమల యొక్క మర్మమును మత్తయి 13:24-30లో చూతుము, అదిప్పుడు నెరవేరియున్నది.
"ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా — పరలోకరాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడ అగుపడెను.అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి — అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా? అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి.ఇది శత్రువు చేసిన పని అని అతడు చెప్పగా, వారితో ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. @@అందుకతడు — వద్దు; గురుగులను పెరుకుచుండగా వాటితో కూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.కోతకాలము వరకు రెంటిని కలిపి ఎదుగనియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలుకట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టడని కోతగాండ్రతో చెప్పుదుననెను."
మొదటి కాలమునుండి ఇప్పటి వరకును గురుగులు మరియు గోధుమలు ప్రక్క ప్రక్కనే కలిసి పెరిగియున్నవి, కోత వచ్చినది. నైసియా దేనిని స్థాపించవలెనని కోరుకోనినదో అది చివరకు నెరవేరినది. సంస్థ యొక్క శక్తి ద్వారా అబద్ధ సంఘము సత్యమును విడనాడినది, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొనినది. రాజ్యము దానికి అండగా యున్నది, నిజమగు విశ్వాసివి నిర్మూలము చేయుటకు పూనుకొనినది. తన పిరికి కుట్రను నేరవేర్చనైయున్న సమయములో గోధుమలు కొట్టులోనికి సమకూర్చబడును. ఇక మీదట గురుగులు మరియు గోధుమలు ప్రక్కప్రక్కనే ఎదుగవు. గురుగులు ఇక దేవుని యొక్క ఆశీర్వచనమును పొందవు, గోధుమల వలన అవి కూడా దీవించబడినవి, అయితే గోధుమలు వెళ్ళిపోయినవి గనుక దేవుని యొక్క ఉగ్రత ఆరవ ముద్రలో కుమ్మరించబడును, దుర్మారులను బోత్తిగా నిర్మూలించుట ద్వారా అది అంతమగును.
కారుద్రాక్షావల్లి ఈ కాలములో పూర్తి పరిపక్వతకు వచ్చియున్నదని కొద్దిసేపటి క్రితం నేను చెప్పితిని. దాని ఫలమునుండి పక్వమునకు వచ్చినది. అది నిజము. ఈ దురాత్మయొక్క సంఘము పూర్తి అతిక్రమముతో నిండియున్నది, ఆవగింజవలె బయట పడును, అది మహావృక్షముగా పెరిగియున్నది, ఆ చెట్టు నీడలో ఆకాశపక్షులు గూళ్ళు నిర్మించుకొన్నవి. దాని శిరస్సు క్రీస్తువిరోధి, మర్మమైయున్న అతిక్రమము. ఇదంతయూ సత్యము. ఇది నిజమయినట్లయితే, వధువు సంఘము పక్వమగుట కూడా నిజమే. ఆమె వాక్యము ద్వారా తన ప్రభువుతో గుర్తించబడుటయే ఆ పరిపక్వత, ఆమెకు ఆయన శిరస్సు వచ్చును, అదియే దైవత్వము యొక్క మర్మము, నిజానికి ఆయనే క్రీస్తు. అబద్ధ సంఘము యుక్తితో యున్నది, అది మోసపు శక్తి, రాజకీయ శక్తితో చేయబడినది, శారీరక శక్తి దానికి ఉన్నది మరియు చీకటి శక్తులు ఈ నిజమగు ద్రాక్షావల్లి మీదకు వచ్చుచున్నవి, నిజద్రాక్షావల్లి అయితే ఆత్మతోను వాక్యముతోను నిండియున్నది మరియు యేసు అధికరముతో చేసిన కార్యములనే వాక్యము చేయును. ఆమె తన యొక్క మూలరాయిని సమీపించుచుండగా, ఆమె వాక్యము ద్వారా ఆయన వలె మార్పుపొందును. యేసు వచ్చును, పెండ్లి కుమారుడు మరియు వధువు నిత్యమూ ఒక్కటిగా యుండుటకు ఏకమవుదురు.
నేను చెప్పుచున్న సంగతుల యొక్క దృశ్య రుజువులను ఇప్పటికే మన చుట్టూ మీరు చూచియున్నారు. గురుగుల యొక్క ప్రపంచ సంఘ సమాఖ్య నిజము. అయితే చివరకాలపు ప్రవక్త సంగతి కూడా నిజము, దేవుని యొద్ద వర్తమానమును తీసికొని వచ్చుచున్నాడు, అది ప్రభువు యొక్క రెండవ రాకడకు ముందుగా వెళ్ళును. అతని యొక్క వర్తమానము ద్వారా పిల్లల యొక్క హృదయములు పెంతెకోస్తు తండ్రుల వైపుకు తిరుగును, మరియు వాక్యము యొక్క పునరుద్ధరణ వలన శక్తి తిరిగి పునరుద్ధర౦చబడును
మనము క్లిష్ట సమయములలో జీవించుచున్నాము. మనము ఎంతో జాగ్రత్తగా యుండవలెను, ఈ వాక్యము పట్ల నమ్మకముగా నిలచియుండవలెను, దానిలో నుండి ఏదియును తీసివేయరాదు, దానికి ఏదియును కలుపరాదు. దేవుడు చెప్పుని దానిని చెప్పువాడు అబద్ధికుడు. నా మనస్సులో ఇది ప్రత్యేకముగా యున్నది: శతాబ్దపు మలుపులో దేవుని కొరకు ఆకలి, ఫిలడెల్సియ కాలములో కలిగినది, అందువలన దేవునికి మొరపెట్టిరి. దేవుని ఆత్మకొరకు వారు పెట్టిన కేకకు జవాబుగా ఆయన భాషల వరమును అర్ధము చెప్పు వరమును, ప్రవచన వరమును పంపెను. ఒక గుంపు వెంటనే బయలుదేరినది, వాక్యమునకు పూర్తిగా విరోధమైన ఒక సిద్దాంతమును రూపొందించిరి, భాషలు మాట్లాడుటయే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినట్లు సూచన అనిరి. భాషలకు, సూచనకు అసలు పొత్తు లేదు. అవి ప్రత్యక్షతలు, అంతే గాని సూచన కాదు. ఆ సిద్దాంతము యొక్క తప్పుడు లేఖనము ద్వారానే చూడగలము, దానికి రుజువు లేదు, కాని ఆ సిద్దాంతమును రూపొందించిన వారు వెంటనే ఆ సిద్దాంత పునాదిపై సంస్థను నిర్మించిరి, ప్రజలు వారిని నమ్మునట్లు వారు సత్యములో లేరని అందువలన రుజువయినది. ఓ! అది మంచిగా కనబడుచున్నది. పెంతెకోస్తు తిరిగి వచ్చినట్లే అది కనిపించినది. కాని అది కాదని రుజవు చేసినది. అది సంస్థగా మారినది గనుక అది కాజాలదు. అది మరణమే గాని, జీవము కాదు. నిజమగు దానికి చాలా సన్నిహితముగా అది కనబడినది. అందువలన జనసమూహములు మోసము చేయబడినవి.
ఇప్పుడు అది నిజమయినది కానిచో, అది మరి ఏమిటి? అది పొట్టు, తుప్ప. పచ్చని వెన్నులో అది యున్నప్పుడు నిజంగా గింజవలెనె కనిపించినది. కాని ఎవరయినా పొలములోనికి వెళ్ళి చూచినచో, ఆ గింజవలె కనిపించిన దానిని చూచినచో అది పొట్టు అని అర్థమగును (ఇంకా గోధుమ గింజ రూపొందలేదు) ఇది మొత్తని గుల్ల. రాబోవుచున్న నిజమగు గింజవలెనె అది కనబడెను.పెంతెకోస్తు అను నిజమగు గోధుమ గింజ, చివరి కాలములో రానైయున్నది. అది నైసియాలో పాతిపెట్టబడినది. సార్ధిస్లో అది చిగురు వేసినది. ఫిలడెల్ఫియాలో కాండము బయటకు వచ్చెను. లవొదికయలో అది పరిపక్వము చెందును. అయితే వాక్యము పునరుద్ధరించబడు వరకు అది అసలు స్థితికి రాదు. ప్రవక్త ఇంకా తెర మీదికి రాలేదు. కాని ఇప్పుడు కాలమాన ప్రకారము, మనము లవొదికయ కాలములో నిలబడియున్నాము. ప్రకటన 10:7లోని ప్రవక్త - వర్తమానికుడు ఇప్పటికి తప్పక దేశములో ఉండి తీరును. మరొకసారి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," ఇక్కడ తప్పక ఉండవలసియున్నది. తప్పిపోని ప్రత్యక్షతతో అది బయలుపరచబడుటకు సిద్ధముగా యున్నది. ఆ విధముగా నిజమగు విత్తనము ఇప్పటికే పరిపక్వమగుచున్నది, ఇక కోతకాలము వచ్చును.
కోతకాలము. అవును, కోత సమయము. రెండు ద్రాక్షావల్లులు కలిసి పెరిగినవి మరియు వాటి కొమ్మలు ఒకదానికొకటి పెనవేసికొని పోయినవి, ఇప్పుడవి వేరుచేయబడును. ఆ ద్రాక్షావల్లుల యొక్క ఫలములు చాలా తేడాగా యున్నవి, అవి వేర్వేరు కొట్టులలోనికి కూర్చబడును. రెండు ఆత్మలు వాటివాటి వేర్వేరు గమ్యములకు చేరును. ఇప్పుడు తుది హెచ్చరికను లక్ష్యపెట్టుటకు సమయము, అది కేవలము గోధుమ వధువు నోద్దకు మాత్రమే వచ్చును. "దాని యొక్క పాపములలో పాలిభాగస్తులు కాకుండునట్లును, మీరు (గోధుమ) దాని (గురుగులు) తెగుళ్ళలో పాలు పొందకుండునట్లును బయటకు రండి." (ఆరవ ముద్ర యొక్క మహా శ్రమలు మరియు మత్తయి 24).
ఆత్మ యొక్క చివరి హెచ్చరిక
ప్రకటన 3:22,
"సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినునుగాక."
ఇది చివరి హెచ్చరిక. మరియొకటి ఉండదు. సింహాసనపు గది సిద్ధపరచబడినది. పండ్రెండు పునాదులు వేయబడినవి. బంగారు వీధులు పరచబడినవి. మహోన్నత ముత్యములతో చేసిన గుమ్మములు నిలబడి ఎదురుచూచుచున్నవి. పిరమిడ్ వలె ఆమె చాలా అందముగాను, మహిమకరముగాను నిలబడియున్నది. ఆమెను సిద్ధపరచిన పరలోక సంబంధులు ఊపిరి బిగపట్టి ఎదురుచూచున్నారు, ఆమె మహిమతో ప్రకాశించి మొరయుచున్నది అది భూసంబంధమైనది కాదు. ఆమె అందములోని ప్రతి కవళిక, వింతైన కృప మరియు యేసుని ప్రేమ గాధను చాటి చెప్పుచున్నవి. సిద్ధపరచబడిన జనుల కొరకు ఆమె సిద్ధపరచబడిన పట్టణముగా యున్నది. తన నివాసుల కొరకు మాత్రమే ఆమె ఎదురుచూచుచున్నది, వారు త్వరలోనే ఆనందముతో ఆమె వీధులలో సంచరించెదరు. అవును, ఇదే చివరి పిలుపు. ఆత్మ మరి యొక కాలములో మాట్లాడదు. కాలములు సమాప్తమైనవి.
అయితే దేవునికి వందనములు, ఈ క్షణములో, ఈ కాలము ఇంకా ముగియలేదు. ఇంకా ఆయన పిలచుచున్నాడు. ఆయన యొక్క కేక, ఆతనాత్మ కలిగిన మానవుల యొక్క ఆత్మీయ చెవులలో మాత్రమే వినబడుట కాదు గాని, ప్రవక్త కూడా మరోసారి దేశములోనికి వచ్చియున్నాడు. పౌలుకు బయలుపరచినట్లుగానే మరొకసారి దేవుడు సత్యమును బయలుపరచును. ఏడవ వర్తమానికుని కాలములో, లవొదికయ సంఘ కాలములో, దేవుని యొక్క మర్మములను ఆ వర్తమానికుడు పౌలు బయలుపరచినట్లుగానే బయలుపరచును. అతడు మాట్లాడును, ఆ ప్రవక్తను అతని స్వంత నామములో చేర్చుకొనినవాడు ఆ ప్రవక్త పరిచర్య యొక్క ప్రభావమగు ఫలితమును పొందును. అతని మాట వినువారు ఆశీర్వదించబడుదురు. ప్రకటన 22:17లో, ప్రస్తావించబడిన చివరి దినపు పెండ్లికుమార్తెలో భాగముగా మారుదురు.
"ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు."
నైసియా యొద్ద భూమిలో పడిన గోధుమ గింజ (గోధుమ గింజయగు వధువు) మూల వాక్య బీజముగా తిరిగి వచ్చియున్నది. సదా దేవునికి స్తుతి కలుగును గాక! అవును, అధికారము పొందిన చివరి దినము యొక్క ప్రవక్త మాటను వినండి. దేవుని యొద్ద నుండి పొందినదే అతడు చెప్పును, దానినే వధువు చెప్పును. ఆత్మ మరియు ప్రవక్త మరియు వధువు ఒకే దానిని చెప్తున్నారు. వారు చెప్పుచున్నది ఇంతకు ముందే వాక్యములో చెప్పబడియున్నది. ఇప్పుడు దానిని వారు చెప్పుచున్నారు, "దానిలోనుండి బయటకు రండి, ప్రత్యేకముగా యుండుడి." కేక బయలువెడలినది. కేక ఇంకను బయలువెడలుచున్నది. ఎంతకాలము ఆ స్వరము వినబడును? మనకు తెలియదు, కాని ఒక సంగతి మనకు తెలియును, ఎక్కవ సమయముండదు, ఎందుకనగా ఇది కడవరి కాలము.
సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినును గాక. ఆత్మ పలికెను. సంఘ కాలముల విషయమై అస్తమించుచున్న సూర్యుడు నిత్యత్వములో మరుగవబోవుచున్నాడు (సంఘ కాలములకు ఇది సూర్యాస్తమము — తర్జుమాదరుడు). అప్పుడు అంతయూ ముగియును. ఇక లోనికి వచ్చుటకు సమయము మించిపోవును. అయితే పలుకబడిన ఈ వర్తమానములలో ఎక్కడైన దేవుడు, ఆయనాత్మతో నిన్ను సంధించియున్నచో, ఇప్పుడే మారుమనస్సుతో ఆయనవైపు తిరిగి మరియు నీ జీవితమును ఆయనకు ఇమ్ము, ఆయనాత్మద్వారా నీకు ఆయన నిత్యజీవమును దయచేయును.