వారి కన్నులు తెరువబడినప్పుడు వారాయనను గుర్తించిరి

వారి కన్నులు తెరువబడినప్పుడు వారాయనను గుర్తించిరి

1. ప్రార్ధన కొరకు ఒక్కక్షణం మన తలలు వంచుదాం. ఈ మైక్రోఫోన్ ద్వారా వస్తున్నటువంటి మధురమైన సంగీతం, కేవలం నమ్ముము, ఈ రాత్రి, మనము దేవునికి తెలియజేయాలని కోరుచున్న విన్నపములు ఏమైనా ఉన్నట్లయితే నేను అడిగెదను. మరియు మన చేతులెత్తుట ద్వారా, మేము చేతులు ఎత్తినందువలన మేము నమ్మిక కలిగియుండెదమని ఒప్పుకొనుచున్నాము. దేవుడు దీవించును.

2. మా పరలోకపు తండ్రీ, ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మిమ్మును మేము సమీపిస్తున్నాము, ఎందుకనగా నీవు వాగ్ధానం చేసియున్నావు, ఒకవేళ ఈ విధానములో దానిని మేము చేసినప్పుడు నీవు మా ప్రార్ధన వింటావని మరియు మా అవసరతలను గుర్తిస్తావని నీ గ్రహింపులో, ప్రభువా, మరియు మా విశ్వాసమును బట్టి మాకు బహుమానమును ఇచ్చెదవు. నీవు ఇచ్చెదవని మాకు తెలుసు, ఎందుకనగా నీవు వాగ్దానము చేసియున్నావు. ఇక్కడ అనేక విన్నపములు ఉన్నవి. చాలా చేతులు ఎత్తబడ్డాయి; నా హస్తము కూడా. ప్రభువా. ఈ రాత్రి మీరు మమ్ములను కలుసుకుంటారని, మేము ఏ విధంగా జీవించాలి మరియు నీ యందు విశ్వాసం కలిగియుండాలంటే మేము ఏమి జేయాలో అని నేను ప్రార్ధిస్తున్నాను. ఈ కూడిక అంతటి ద్వారా మీరే మహిమ పొందండి. ప్రభువా, ఏసు నామములో మమ్మును మీకు సమర్పించుకుంటున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చు.మంచిది.

 3. డాన్, ఎలా ఉన్నావు? ఈ వేదికపై అనేకమంది నా స్నేహితులు నాతో కూర్చుండియుండటాన్ని బట్టి ఈ రాత్రి నేను నిశ్చయముగా ఆశ్చర్యపడుచున్నాను. సహోదరుడు లీవైల్ నా యొక్క మేనేజర్లలో ఒకడు. సహోదరుడా నేనా జర్మన్ పేరును, పలుకలేను. హైరోలర్, నేనెల్లప్పుడూ దీనిని వెనుక నుండి పొందుకుంటాను (ఎవరో సహాయం చేయుట ద్వారా). బ్రదర్ డాన్ రడ్డల్ మరియు ఇక్కడ ఉన్న సహోదరులందరూ, ప్రతీఒక్కరూ, అందరూ నాకు పరిచయం కలిగియున్నారు. మేము వాక్యాన్ని ప్రసంగిస్తున్నప్పుడు రోగులకొరకు ప్రార్ధించుటకై రందరినీ కలిగియుండడాన్ని బట్టి నేను నిశ్చయంగా సంతోషిస్తున్నాను.

4. ఇప్పుడు, నేను తలస్తున్నాను, రేపు రాత్రి, మరియు ఆదివారం మధ్యాహ్న తిరిగి అక్కడ, శనివారం రాత్రి మరొకచోట ఎక్కడో. మీరు ఈ రోజు ప్రార్థిస్తున్నారా? (సంఘము చెస్తోంది, "ఆమేన్”), మంచిది.

5. నన్ను క్షమించండి. గత సాయంత్రము మిమ్మల్ని ఎక్కువ సమయం ఉంచాను. అయితే అది క్రొత్త స్థలము, ప్రతీదీ క్రొత్త, మరియు ఒకరితో ఒకరు కలుసుకోవడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. నేను ఈ విధంగా చెప్పెదను, నా భావమును క్షమించండి, చెడు తలంపులన్నీ తీసి ఆవల పెట్టండి, మనం ఒకరినొకరు ఎరిగియుండునట్లుగా, కనుక మనం ..... అన్నీ సరదా అనుభూతులు.

6. కొన్నిసార్లు మీరు కొన్ని స్థలములలో కలుసుకొనెదరు. ఓహ్, ఈ ఆడిటోరియంకు సంబంధించి కాదు, కానీ, చూడండి, ఇక్కడ జరిగేవి, ఇది ఎల్లప్పుడూ ఒక మతసంబంధ కార్యక్రమం కాదు, అని నేను అనుకొంటున్నాను. మరియు ఇక్కడ అన్ని రకముల కార్యక్రమములు ఉండును. మరియు అక్కడ అటువంటిది వింతగా కనిపించవచ్చు, కానీ ప్రతీదానికి ఆత్మ ఉన్నది. ఒకవేళ నీలో నీవు ఆత్మను కలిగి లేకపోతే, నీవు చచ్చినవాడవు. విభిన్నమైన ఆత్మలతో ప్రజలు ఒకరికొకరు కలిసి సహవాసము చేసెదరు.

7. ఏసు అటువంటి వారి మధ్య స్వస్థతలను చేయలేడు. ఆయన తన స్వస్థలమునకు వచ్చాడు, మరియు వారాయనను నమ్మలేదు, మరియు ఆయన వారి మధ్య గొప్ప కార్యములు చేయలేకపోయాడు. ఒకరోజు ఆయన మార్గం గుండా వెళుతున్నప్పుడు పట్టణమునకు బయట, ఆయన ఒక గ్రుడ్డివాడైన వ్యక్తిని, అతడు (ఆ గ్రుడ్డివాడు) ఆయనను గుర్తించి పట్టుకొనక మునుపే, ఆయన నడిపించవలసి వచ్చెను. మరియు ఇంకొకడు చెవిటి సమస్యతో.

8. చూడండి, కొన్నిసార్లు విశ్వాసులందరూ ఒకరినొకరు కలసి ఒకచోట కలుసుకుని మరియు విశ్వసించవలసియున్నది. మరియు ఇప్పుడు ఈ స్థలము ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క సేవకొరకు సమర్పణ చేయబడినది. మరియు ఇప్పుడు ఇది ఒక సంఘము (ఆలయము), ఒక సంఘము ఉండదగినంత ... ప్రజలు ఎక్కడైతే సమకూడుతూ ఉంటారో, అదే సంఘము. కనుక ఇప్పుడు, ఈ రాత్రి, మనము నిజానికి చాలా చాలా భాగ్యవంతులమైయున్నాము, ఈ రాత్రి ఇక్కడ ఉండుట, మీ అందరితో సమకూడుట, ప్రార్ధించుట మరియు మన మధ్య యేసుక్రీస్తును గుర్తించుట వలన ధన్యులమని మనము అనుభూతి చెందుచున్నాము.

9. ఇప్పుడు, మీకు తెలుసు, ప్రెస్బిటేరియన్ వారు చాలా ఎక్కువ లేదా ఎఫిస్కోపిలియన్, నేను దీనిని నమ్ముచున్నాను, పైకి మరియు కిందకు, పైకి మరియు కిందకు; పైకిలేచి ఏదో చెప్తారు, కూర్చుంటారు. లేచి నిలబడి ఏదో మాట్లాడతారు. కూర్చుంటారు. మరియు దేవుని వాక్యం చదవడానికై మరొక్కసారి మిమ్మల్ని లేచి నిలబడమని అడుగుచున్నాను.

10. లూకా సువార్తలో, 24వ అధ్యాయము, ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం పొడవైన లేఖనమై యున్నది. 24వ అధ్యాయం 13వ వచనం నుండి చదవాలని నేను ఆశిస్తున్నాను. మరియు, ఇదిగో ఆదినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరముననున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచూ జరిగిన ఈ సంగతులన్నిటి గూర్చి ఒకనితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను; అయితే వారాయనను గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకనితో నొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్లెయొఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడివే ఎరుగవా? అని ఆయనను అడిగెను ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన ఏసును గూర్చిన సంగతులే; ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను. మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి; ఇదికాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి యున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని, ఆయనను యాడలేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన - అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మనటువంటి మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చోన్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఉండండ

11. ప్రార్ధించుకుందాము. ప్రభువైన ఏసు, ఇది సత్యమని మేము ఎరిగియున్నాము. ఈ లోకములో ఏదీ నీ వాక్యము కంటే సత్యము కాదు (ఈ లోకములో ఏదీ సత్యము కాదు) నీ వాక్యము కంటే ఈ లోకములో ఏదీ గొప్పది కాదు. ఈ రాత్రి మా హృదయములకు నీవు ఈ కథను బయలుపరుస్తావని, మరియు లేఖనములో ఈ భాగాన్ని మరలా మా మధ్య తిరిగి జీవింపజేస్తావని ఈ రాత్రి, ప్రభువైన ఏసును వారే విధంగా గుర్తించారో అదే విధంగా గుర్తించాలని మేము ప్రార్ధిస్తున్నాము. కేవలం, పునరుద్ధానము చెందిన మరుసటి రోజున వారాయనను గుర్తించారు, మరియు ఇప్పుడు రెండువేల సంవత్సరాల తరువాత, ఆయనను గుర్తించుదుము గాక. ఆయన మహిమార్ధమై ఏసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.కూర్చొనవచ్చు.

12. ఈ గుడారము వెనుక ఏర్పాటుచేసిన స్వాగత చిహ్నమును బట్టి మీకు కృతజ్ఞతలు.

13. ఈ రాత్రి నా అంశం : వారి కన్నులు తెరువబడినప్పుడు వారాయనను గుర్తించిరి.

14. ఇప్పుడు మనము కూర్చొని ఉన్న ఈ రాత్రి, మొదటి పునరుద్ధానము. ఆ గొప్ప శిలువ శ్రమ యొక్క చీకటి దినము గతించిపోయినది. మన ప్రభువైన యేసు లోకమునకు వచ్చి మరియు ఎంతో స్పష్టంగా తనకు తాను దేవుని కుమారునిగా
గుర్తించబడ్డాడు. ఆయన కొరకై సిద్ధపరచబడిన ప్రతీ లేఖనమును, ఆయన నెరవేర్చియున్నాడు. మరియు ఆ సిలువ పైన ఆ చివరి ఘడియలు కూడా నెరవేర్చబడియున్నవి. ఇప్పుడు వాగ్దానము చేయబడిన ఆ పునరుద్ధానము కూడా వచ్చియున్నది. కానీ ఆ దినమున ప్రజలు ఈ దినమున మనమున్నట్లుగా అదే విధముగా ఉన్నారు. వారు ఏదైతే చూసియున్నారో వారు దానిపై ఎంతో ఉత్సుకతను కలిగియున్నారు, సహజాతీతమైనది, మరియు అలాంటివి, ఆయనకు సంబంధించిన ప్రతీ లేఖనమును గుర్తించుటలో వారు తప్పిపోయారు. దానిలో కొంతభాగాన్ని వారు గుర్తించారు, మరియు నమ్మారు, మరియు దానిలో కొంత భాగమును వారు గుర్తించలేదు.

15. ఆ మొత్తమంతా ఈ రోజు వలె ఉన్నది అని నేను ఆలోచిస్తున్నాను, మనము అనేకసార్లు ఏసు చెప్పిన కొన్ని సంగతులు మనం ఒప్పుకుంటాం, కానీ ఆయన చెప్పిన అన్నిటిని గూర్చి కాదు. జనులు కొన్నిసార్లు ఈ విధంగా చెప్తారు, “మంచిది, దీనిని మేము నమ్ముతాం, కానీ మేము దీనిని నమ్మము" మంచిది, నీవు దీనిని నమ్మకుండా దీనిని నమ్మలేవు. చూశారా, మీరు అంతటినీ నమ్మవలసియున్నది. ఇది అయితే అంతయూ దేవుడు లేదా మరి దేవుడే కాదు. మరియు ఇది సమస్తము దాని స్థలములో చక్కగా సరిపోవలసియున్నది. (వాక్యం)

16. మరియు గత సాయంత్రం నేను చెప్పియున్నాను, దేవుడు ఆయన యొక్క లేఖనమును విభజించియున్నాడు, ఆది నుండి, అక్కడ సమయమనేదే లేనప్పుడు, ఆయన నిత్యుడైయున్నాడు. ఆయన సమస్తము... ఆయనే నిత్యుడు, మరియు ఏవైతే సంగతులు మన మధ్య జరుగుతున్నవో అవి మొదటిగా, అది ఒక ఆలోచనై యుండవలెను, పిమ్మట అది మాటయై యున్నది. మరియు ఒక మాట, ఒక ఆలోచన వ్యక్తపరచబడినప్పుడు, అది ఒక మాట. తరువాత, అది పలుకబడితే, అది జరుగవలయును. మరియు మొత్తము సంగతి ఏమనగా దేవుడు తన గుణలక్షణములలో తనను తాను బయలుపరచుకొనుచున్నాడు. కేవలము దేవుని ఆలోచనల యొక్క గుణలక్షణములైయున్నవి. మరియు తరువాత దేవుడు పదార్ధమై (శరీరధారియై), తాకబడుచూ, మనము మాట్లాడునట్లుగా, పలుకునట్లుగా తనయొక్క సంఘమనెడి శరీరము మొత్తము మరియు ప్రతీదానిలో బయలుపరచుకొనెను.

17. కనుక, నీ పేరు ఆయన యొక్క ఆలోచనలలో ఉన్నది. ఆ విధముగానే నీవు నిత్యజీవాన్ని కలిగియున్నావు. నీవు దానిని మరో విధముగా కలిగియుండలేవు. నీవు నిత్యజీవమును కలిగియుంటే నీవు ఎల్లప్పుడూ కలిగి ఉన్నావు చూశారా? నీవు,
ఆ విధంగా కాకుంటే, ఈ విధంగా నీవు చెప్పలేవు, "మంచిది, నేను సంఘానికి చెందియున్నాను. నేను ఇది చేస్తాను". లేదండీ. నిత్యజీవము ఎన్నడూ ఒక ప్రార. విత్తమైయున్నదేదైనా ఎప్పుడూ ప్రారంభించబడదు, మరియు ముగించబడదు. కా నీవు ఆయన ఆలోచనలో ఉన్నావు. నీ పేరు, నువ్వెవరు మరియు మువ్వేమై యున్నావు. నీవు నిత్యజీవము కలిగియుండుటకు అది ఒక్కటే మార్గమైయున్నది, ఎందుకనగా నీవు ఎల్లప్పుడు ఉన్నావు.

18. మరియు వారు, వారేమైయున్నప్పటికీ, వారు ఎప్పటికీ చనిపోయి యున్నారు, వారు ప్రారంభం నుండే చనిపోయారు. మరియు బైబిలు చెపుతున్నది. "సుఖభోగముల యందు నివసించు స్త్రీ బ్రతికియుండియు చనిపోయినదే. నిజము, చూడండి, ఆమె ఎల్లప్పుడూ చనిపోయియున్నది. ఆమె తన పాపములోను అతిక్రమములోను చనిపోయినది.

19. మరియు ఇప్పుడు జీవించు శక్తి నీలో ఉన్నట్లయితే, ఆయన యొక్క ప్రారంభములో, దానిని విమోచించడానికే ఆయన వచ్చియున్నాడు. మరియు ఆయన తలంపుల్లో, ఆదిలోనే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంధములో ఉంచబడియున్నది. మరియు గొర్రెపిల్ల జీవగ్రంధములో ఉన్న అన్ని పేర్లను విమోచించడానికే ఆయన వచ్చియున్నాడు. ఎక్కువ కాదు, మరొకరిని కాదు; కేవలం అక్కడ ఉన్న దానిని మాత్రమే. ఆ ఆఖరి పేరు విమోచించబడినప్పుడు ఆయన తన గ్రంధమును తీసుకొని మరియు ఆయన విమోచించిన వారిపై హక్కును పొందుకుంటాడు.

20. ఇప్పుడు, మనము గనుక లేఖనములలో వ్రాయబడిన దానినంతటినీ నమ్మనట్లయిన ఎడల అది ఎంత వింతైన సంగతిగా ఉండును. ఎందుకనగా సమస్తము దేవుని వాక్యమైయున్నది. ఇది అంతా ప్రేరేపించబడియున్నది, దానియొక్క ప్రతీ మాట, మరియు మనము దానిలోని ప్రతీమాట నమ్ముచున్నాము.

21. మరియు ఈ రాత్రి మనముందు మనము కలిగియున్న ఈ మహిమకరమైన సన్నివేశము, ఏను మరణము నుండి లేచి, వసంతకాల సమయమున, చుట్టూ నడుచుచున్నాడు. వసంతమునుండి, పునరుద్ధానము, మరణం నుండి లేచిన మొదటి పుష్పము, మన ప్రభువైన ఏసు! ఆయన నిద్రించిన వారి నుండి లేచిన మొదటి ఫలమైయున్నాడు. పైకి వచ్చిన ఆ పునరుద్దాన పుష్పము, ఆ మొట్టమొదటి మొలక అంధకారము మరియు పావము యొక్క ఆ చల్లటి మధ్య రాత్రి గుండా తన తలను పైకెత్తినది. ఆయన పాపపు వెల చెల్లించియున్నాడు. మరియు దేవుడాయనను మూడవ దినమున తిరిగి లేపియున్నాడు. ఆయన యొక్క
వాగ్ధానమును బట్టి, దేవుడు ఆయనను మూడవ దినమున లేపియున్నాడని మన హృదయమంతటితో నమ్ముచున్నాము. మరియు లేఖనము ప్రకారము, మూడవ దినమున, ఆయన (తండ్రి) ఆయనను (యేసు) లేపియున్నాడని మనము నమ్ముచున్నాము. ఆయనే మృతులలో నుండి మొదటిగా లేచినవాడు, మరియు నిద్రించిన వారిలో మొదటి ఫలమైయున్నాడు.

22. మరియు దీనిని గూర్చి ఆలోచిస్తే, నాలుగు వేల సంవత్సరాలు శ్రమల కాలంలో ప్రపంచం పాపం ద్వారా పట్టబడియున్నది. మరియు బయటపడడానికి (విడిపించబడదు) ఎటువంటి మార్గం ఎరుగదు! ఇక్కడ ఈయన మరణము నుండి తిరిగి లేచియున్నాడు! ఎటువంటి సమయము, చిగురించే సమయము! సంఘము ఎంతగానో ఆనందించి హల్లెలూయ పాటలు పాడి దేవుని మహిమ పరచవలసి యున్నది. అయితే దానికి బదులుగా బాధతో కూడియున్నారు, విచారముతో మరియు అన్నీ, ఎందుచేతననగా ఆయన చెప్పినదానిని నమ్ముటలో వారు విఫలమైనారు.

23. మరియు అదే సంగతి ఈ రాత్రి జరుగుచున్నది. ఆయన చెప్పియున్న మరియు వాగ్దానం చేసిన దానిని నమ్ముటలో వారు విఫలమైనారు. అదే, సంఘము ఈ రోజు అటువంటి స్థితిలో ఉన్నది, అది అందులో యున్నది, ఎందుకనగా ఆయన చేస్తానని చెప్పిన ప్రతీదానిని నమ్ముటలో మనము విఫలమైయున్నాము. ఆయనకు సంబంధించిన లేఖనములు అన్నీ వాటన్నిటిని నమ్ముటలో మనం విఫలమై యున్నాము. మనం దానిని మెలిత్రిప్పి కలగలుపుగా మరియు దానికి బదులు మరొక దానిని ఉంచుచున్నాము.

24. మనము మొత్తము విషయాన్ని నమ్మితే, మన ప్రాణములలో (అంతరంగము) గొప్ప సంతోషము ఉండును. ఎందుచేతనగా మనము ఆయన యొక్క పునరుద్ధానము వలె (వంటిదై) ఆయనతో లేచియున్నాము, పూర్తి అధికారముతోను మరియు అంధకార సంబంధమైన చీకటి శక్తులను మన పాదము క్రింద ఉంచుకొని, ఇప్పుడు మనం క్రీస్తు యేసులో పరలోక స్థలములలో కూర్చుండబెట్టబడియున్నాము. మనము ఒక హక్కును కలిగియున్నాము, ఏసుక్రీస్తు యొక్క రక్తముతో, మన గురుతు, అది మనము దేవుని ద్వారా కొనబడినవారము. అది ఏసుక్రీస్తు ద్వారా మన విమోచన కొరకు దేవుడే వెల చెల్లించాడు. మనం అడిగే ప్రతీదానిపై ఆ గురుతును పెట్టి అడిగే హక్కును కలిగియున్నాము, మరియు దానిని పొందుకొనెదము, దేవుడు ఆ విధంగా చెప్పియున్నాడు! అది స్థిరపరచబడును.
మనము లేఖనాలను అన్నీ నమ్మిన ఎడల ...!

25. అయితే ఇక్కడ విషయం ఏమనగా, విచారించవలసిన భాగం ఆయనను ఎరిగిన మరియు ప్రేమించిన అనేక మంది, ఆయన మరణం నుండి తిరిగి లేచియున్నాడని గుర్తించలేకపోయారు.

26. అది ఈ రోజువలె యున్నది! అనేకమంది, ఎవరైతే ఆయన మరణించి తిరిగి లేచియున్నాడని నమ్మి దానిని బోధించుచున్నారో, ఇప్పటికీ దానిని గుర్తించలేకున్నారు. వారు నిశ్చయంగా దాని యొక్క భావాన్ని కలిగిలేరు. మరియు ఇది నమ్మడానికి చాలా దూరంగా ఉన్నది. ఇది చాలా అసాధారణమైనది. అసాధారణ సంగతులలోనే దేవుడు ఉంటాడు, దేవుడు తన వాగ్ధాన ప్రకారం ఉన్నట్లయితే !

27. అనేకమంది ఆయనను ప్రేమించారు, మరియు దానిని ఎరుగలేదు. సమాధి వద్దకు వెళ్ళి వచ్చిన వారియొక్క సాక్ష్యాన్ని నమ్మడానికి వారికి అది ఖచ్చితంగా అసాధారణమైనదిగా ఉన్నది. వారు చెప్పారు, “మేము దూతలయొక్క సమూహాన్ని చూసాం, వారు చెప్పారు, 'ఆయన మృతులలో నుండి లేచియున్నాడు.'” “ఓహో, మంచిది, మేము ..." చూడండి, వారు కనుక లేఖనములలోనికి తొంగి చూస్తే! ఆయన వాగ్ధానం చేసిన దానినే, ఆయన చేసియున్నాడు.

28. మరియు ఆయన యొక్క దినములలో ఉన్నటువంటి పరిసయ్యులు మరియు మతబోధకులవలెనే, వారు గనుక లేఖనములను మాత్రము పరిశీలించినట్లయితే, ఆయన చెప్పియున్నట్లుగా, "లేఖనములను పరిశోధించండి, వాటిలో నిత్యజీవమున్నది అని మీరెరుగుదురు, మరియు అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి," అవి ఆయన ఎవరని చెప్పును.

29. మరియు ఆ శిష్యులు ఆ రోజు లేఖనాలను చూసినట్లయితే ఆయన తిరిగి లేస్తానని చెప్పిన వాగ్దానాన్ని లేఖనాల్లో కనుగొనియుండేవారు. మరియు దేవుడు తిరిగి లేపుతానని వాగ్ధానం చేసియున్నాడు, మరియు ఆయన చేసాడు. ఇంకా, దానిని వారికి ఆయన చేయునని, ఆయన యొక్క వాగ్దాన వాక్యం వ్రాయబడినది. ఆయన తిరిగి లేస్తాడని వాక్యము చెప్పియున్నది.

30. ఆయన దానిని వాగ్ధానం చేసాడు, కానీ ఇంకా వారు విచారముగా మరియు అందరూ బలహీనులై మరియు ప్రతీది చేశారు. వారికి కలిగియున్నదంతా కోల్పోయామని మరియు అంతా పాడై పోయినది అని వారు తలంచారు. మరియు అది చీకటి ఘడియ, వారెన్నడూ అటువంటిది చూసియుండరు అని నేను ఊహిస్తున్నాను. వారు ఆయనయందు నిరీక్షణ కలిగియున్నారు, మరియు ఆయన
యందు నమ్మిక కలిగియున్నారు, మరియు వారు ఆయన యొక్క గొప్ప సూచనలు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మరియు మెస్సీయా యొక్క రుజువునంతటినీ ప్రత్యక్ష పరచబడడం, చూచియున్నారు. మరియు అక్కడ నిలబడి ఆయన చనిపోవడం వారు చూస్తున్నారు, మరియు ఆయన ముఖముపై ఉమ్మి వేయబడ్డాడు, మరియు, ఎప్పుడు, ఆయన ప్రజల యొక్క హృదయాలలో ఉన్న ఆలోచనలు బహిరంగ పరచగలిగినప్పుడు

31. అయితే నేను దీనిని లోకరీతిగా చేసినట్లయితే దానిని మన్నించండి. కానీ “ఆ ముక్కలు క్రింద పడుచున్నప్పుడు" దానిని నీవింకను నమ్ముచునే ఉండుము.

32. వారాయన ముఖము చుట్టూ ఒక గుడ్డను చుట్టి, ఆ తాగియున్న సైనికులు, మరియు ఆయన ముఖానికి గుడ్డను చుట్టి మరియు ఒక కర్రను తీసుకుని ఆయన తలపై కొట్టి, చెప్పు, ఇప్పుడు నీవు ఒక ప్రవక్తవని మేము అర్ధం చేసుకుంటాము. నీవు ఒక ప్రవక్తవైతే", మరియు వారా కర్రను ఒకరి చేతి నుండి మరొకరు మార్చుకుంటూ, “నిన్నెవరు కొట్టారో మాకు చెప్పు. మేము దానిని నమ్ముతాము”, అని అన్నారు.

33. చూడండి, అది. అతడు-అతడు-అతడు వారి యొక్క వలలో బంధించబడినట్లుగా కనిపించినది. మరియు వారు ఈ విధంగా తలంచారు, “మంచిది, ఒకవేళ వారు ఎప్పుడైనా ఏదైనా ఆయనను అనిన ఎడల, ఆయన వారిని వెంటనే గుడ్డివారిగా మొత్తును. వారు చనిపోవునట్లుగా మొత్తును, వారేమైనా అన్నప్పుడు" చూడండి, ఆ విధముగా కార్యములు చేయుట ఎల్లప్పుడూ దేవుని ఉద్దేశ్యం కాదు. చూశారా? 

34. ఆయన సిలువపై ఉన్నప్పుడు, మరియు కయప మరియు ఆ-ఆ యాజకులు అందరూ చెప్పారు, “నీవు కనుక క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుము. సిలువ మీద నుండి క్రిందకి రా, మేము నిన్ను నమ్మెదము". చూడండి, దేవుడు ఏ విధంగా సిలువ పైకి వెళ్ళి ఆ విధంగా మరణిస్తాడని వారు అర్ధం చేసుకోలేకపోయారు. కానీ, ఆ కారణం చేతనే దేవుడు శరీరమును ధరించాడు, ఆయన ఆ విధంగా చనిపోవుటకు.

35. ఆ పరిసయ్యులు ఆయన ఎన్నడూ పొందనటువంటి గొప్ప కితాబును ఆయనకు ఇచ్చియున్నారు, వారీ విధంగా చెప్పినప్పుడు ఇతరులను ఇతడు ఏ విధంగానూ ... "ఇతడు ఇతరులను కాపాడాడు తనను తాను కాపాడు కోలేకున్నాడు.”
నిశ్చయముగా, అది ఒక కితాబు (ప్రశంస). ఆయన తనను తాను రక్షించు కొన్నట్లయితే, ఆయన ఇతరులను రక్షించలేడు. ఆయన తనను తాను అర్పించుకోవలసియున్నది.

36. ఆ కారణము చేతనే దేవుడు శరీరము ధరించెను, చనిపోవుటకు, ఆయన శిక్షను తనపై వేసుకుని భరించవలసివచ్చెను. ఆయన యెహోవాగా న్నంత కాలము దానిని చేయలేడు, ఆత్మలో. తండ్రియైన దేవుడు, ఆత్మలో, దానిని చేయలేడు. కానీ దేవుడు శరీరమును ధరించి, ఒక మానవుని వలె, మన మధ్య నివసిస్తాడో, అప్పుడు ఆయన మరణమును రుచి చూడగలడు. మానవులందరిపై యుంచిన ఆ శిక్షను తనపై వేసుకొనవలసివచ్చెను, ఆయన దానిని తనపైకి వేసుకున్నాడు. మరియు వెలను చెల్లించాడు.

37. ఆయన వాగ్దాన వాక్యము ఈ పునరుద్ధానాన్ని వాగ్ధానం చేసినది, కానీ అది ఆ విధంగా జరగడాన్ని వారు అర్ధం చేసుకోలేకపోయారు. వారు ఖచ్చితంగా దాన్ని కొంచెం కూడా అర్ధం చేసుకోలేదు. వాక్యము, ఆయన వాగ్ధానము యొక్క రుజువు ఆయనే అయి ఉన్నాడు. యేసు, క్లెయొఫా మరియు అతని స్నేహితునితో మాట్లాడుట, ఎమ్మాయికి పోవు మార్గంలో, ఆయన వాగ్దాన వాక్యము యొక్క రుజువైయున్నది, అయినప్పటికి వారు దానిని అర్ధం చేసుకోలేకపోయారు.

38. మరియు ఈ రోజు నేను దీనిని ఈ విధంగా చెప్పవచ్చు. రెండు వేల సంవత్సరాలు బోధ తరువాత, నమ్ముచూ, ఇప్పటికీ ఆయన జీవించేయున్నాడు, మరియు ప్రజలు దానిని గ్రహింపలేకపోయారు. వారు దానిని అర్ధం చేసుకోలేక పోయారు. ముఖ్యమైన సంగతి ఏమనగా ఇతర విషయములతో చాలా ఎక్కువ జాగ్రత్తలతో, మరియు మరింత ఎక్కువైన ఇతర కార్యములతో వారెంతగానో ముడి పెట్టబడియున్నారు. ఆ కారణం చేతనే వారు దానిని అర్ధం చేసుకోలేరు.దానిని అర్ధం చేసుకోవడానికి, వారు ఎంతగానో విచారించి మరియు నలిగిపోయిరి (tore up).

39. ఇప్పుడు గమనించండి, వారాయనను గూర్చి మాట్లాడుకుంటున్నారు. మరియు వారు ఇప్పుడు ఆ ఎమ్మాయికి వెళ్ళు దారిలో యున్నారు, వారు తిరిగి వారి యొక్క పాత పనులను చేసుకోవడానికి వెనుకకు వెళ్ళుచున్నారు. మరియు పేతురు చేపల వేటకు వెళ్ళాడు, మరియు మిగిలిన వారు కూడా పేతురు వెంట వెళ్ళిపోయారు. మరియు క్లెయొపా మరియు అతని స్నేహితుడు, “మంచిది, మనము కూడా ఎమ్మాయికి వెళ్ళుదము,” అని చెప్పుకున్నారు. మరియు బహుశా అది వారు నివసించిన స్థలం అయ్యుండవచ్చు, మరియు అది ఒక విశ్రాంతి దినమంత ప్రయాణం,
కొండ దాటి కొన్ని మైళ్ళ దూరము.

40. మరియు ఈ అందమైన పునరుద్ధానపు ఉదయము, ఏసు మరణం నుండి లేచియున్నాడు! లేచెను! ఆయన వాక్యము, దేవుని యొక్క వాక్యము, నెరవేరియున్నది. “నేను నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వను, నేను నా బాధిం ... నేను ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టను, నేను నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యను" అనునది వాక్యము. గమనించండి, దావీదు దానిని పలికియున్నాడు.

41. ఏసు చెప్పెను, “ఈ ఆలయాన్ని పడగొట్టండి, మరియు దానిని మూడు దినములలో తిరిగి లేపెదను”. చూశారా? మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్ళబోవుచున్నాడు, అన్యుల చేతికి అప్పగించబడబోవుచున్నాడు, మరియు అక్రమకారుడు, వెక్కిరించబడి మరియు శపించబడి, మరియు సిలువ వేయబడ్డాడు, కానీ మూడవ దినమున ఆయన తిరిగి లేచును. ఆయన అలా చెప్పియున్నాడు. అది ఆ విధంగానే జరగవలసియున్నది.

42. మరియు ఇక్కడ ఆయన వాటిని చెప్పిన ఈ మనుష్యులు, వాక్యమును ఎరిగినవారు, ఆ మార్గం వెంబడి వెళ్ళుచూ, దానిని గూర్చి బాధపడుతున్నారు. అటువంటి ఒక దృశ్యాన్ని నీవు ఊహించగలవా? కానీ ఇది ఖచ్చితముగా మరలా జరిగియున్నది. ఇది మరలా జరిగియున్నది.

43. మనము కనుగొన్నాము, వారా మార్గము గుండా వెళ్ళుచుండగా, వారిని గూర్చిన ఒక గొప్ప విషయము, ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారాయనను గూర్చి మాట్లాడుకుంటున్నారు. (వారాయన గూర్చి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన వారికి కనిపించాడు.)

44. అదే ఈ రోజు మన మధ్య పొరపాటుగా ఉన్నది, ఈ రోజు ఆయన మనలో చాలా మందికి కనిపించట్లేదు, ఎందుచేతననగా ఆయన గూర్చి మనం చాలినంతగా మాట్లాడటం లేదు, అని నేను తలస్తున్నాను. మనం మాట్లాడుకోవడానికి అనేక విషయాలు మనము కలిగియున్నాము. మన సంఘశాఖల వ్యత్యాసాలు. దాని గూర్చి మనం మాట్లాడుకోవాలి. మనము కమ్యూనిజం గురించి మాట్లాడుకోవాలి. మనం అన్ని రకముల కార్యక్రమాలు కలిగియున్నాము, మరియు ప్రతీదీ, అన్నియు మనలను కట్టివేసియున్నవి. మనకు ఆయన గూర్చి మాట్లాడే సమయము లేదు. సంఘ కార్యక్రమాలు సంఘకాపరిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారు, దీనిని ఎవరు చేయబోతున్నారు, దానిని ఎవరు చేయబోతున్నారు, ఆయన గూర్చి కప్ప ప్రతీదాన్ని గూర్చి మనం మాట్లాడుకొనుచున్నాము.


45. ఎప్పుడూ, మనము ఆయన గూర్చి మాట్లాడవలసియున్నది. అది అదే మన యొక్క విధానమైయుండవలసి ఎల్లప్పుడూ, అదే మన యొక్క యున్నది. అదే మన యొక్క మొత్తము జీవితమంతా అయ్యుండవలసియున్నది, అది ఆయనలో,

46. గత దినమున ఒక వ్యక్తితో ఇలా చెప్పాను. అతడు చెప్పాడు. "ఎందుకు, దానిని నీవు నమ్ముచున్నావా?".

47. నేను చెప్పాను, "అయ్యా, నేను నా యొక్క జీవితాన్ని వెచ్చించాను. అది నిజం. దాని కొరకు నా జీవితాన్ని ఇస్తాను. దాని కొరకు ఇవ్వడానికి నాకు పదివేల జీవితాలు ఉన్నట్లయితే ఆయనకే ఇచ్చెదనని నేను తలస్తున్నాను. నేనింకనూ దానిని నమ్ముచున్నాను."

48. నిశ్చయముగా మనం ఆయన గూర్చి మాట్లాడవలసియున్నది, మనమాయనను చూడాలనుకుంటే ఎప్పుడది, ఎల్లప్పుడూ.

49. వారాయనను గుర్తించవలసియున్నది, కానీ వారు ఎన్నటికీ చేయలేదు. ఆయన వారితో వారి ప్రక్కనే నడుస్తున్నప్పుడే, వారు గుర్తించవలసియున్నది. గుర్తించుకొనండి, వారు ఆయనతో మూడు సంవత్సరాలనుండి నడుస్తున్నారు. మరియు ఇక్కడ...... నీవు ఊహించగలవా? ఆయన శిష్యులు మూడు సంవత్సరాలు ఆయనతో కలిసి నడచియున్నవారు, ఇక్కడ ఆయన వారితో కూడా నడుస్తున్నాడు. మరియు గబ్బిలం వలె గుడ్డివారైయున్నారు. ఎందుకు? వారికి లేఖనములు తెలియవు. మరియు, ఇంకా, ఆయన వారికి లేఖనములను వివరించాడు.

50. మరియు ఇక్కడ ఆయన ఉన్నాడు. ఇమ్మానుయేలు, "శరీరము ధరించి, మన మధ్య నివశించెను", మరియు పరిసయ్యులు దానిని గుర్తించలేదు. వారు దానిని అర్ధం చేసుకోలేకపోయారు. ఈ మనుష్యుడు ఏ విధంగా మంచిది, వారాయనను సిలువ వేశారు. ఎందుచేతననగా, వారు చెప్పారు. ఇతడు విశ్రాంతి దినాన్ని మీరుచూ మరియు తనను తాను దేవునిగా చేసుకుంటున్నాడు." ఆ కారణము చేతనే వారాయనను సిలువ వేశారు. ఇప్పుడు మనం కనుగొనెదము, ఆ కారణం చేతనే వారాయనను కనుగొనుటలో విఫలమైరి, ఎందుచేతననగా వారు లేఖనములను ఎరుగకపోయిరి.

51. ఇప్పుడు ఈ శిష్యులు ఆయనను గుర్తించవలసియున్నది, కానీ వారికి లేఖనములు తెలియదు. ఇక్కడ ఆయన ఇప్పుడు వారికి బయలుపరుచుకున్నాడు.గమనించండి, ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళట ప్రారంభించినప్పుడు, ఆ కాలంలో తనకు సంబంధించిన వాక్యపు వాగ్దానములను ఆయన వారికి బయలుపరచెను. నోవహు కాలంలో ఉన్న వాక్యపు వాగ్దానములు కాదు, మరొక కాలం యొక్క వాక్యపు వాగ్దానము, అదే ఆయన ఎవరు అని చూపిస్తుంది. చూసాలా?. ఆయన వారిని అడగడం ప్రారంభించాడు. చెప్పాడు. "మీరెందుకంతగా బాధపడుచున్నారు?"

52. "ఎందుకు?" వారు చెప్పారు. "నీవిక్కడ కొత్తవాడినా?" నారాయన ముఖములోకి తేరిచూసారు. "నీవు ఇక్కడ క్రొత్తవాడవా, మరియు ఏమి జరిగినదో నీకు తెలియదా? ఎందుకు, నంచేయుడైన ఏసు, దేవుని ద్వారా అంగీకరించబడిన ప్రవక్త, మరియు ఇశ్రాయేలును విమోచించువాడు ఆయనే అని మేము ఆశించాం; మరియు ఇది మూడవరోజు, మరియు నారాయనను సిలువవేసి యున్నారు, మరియు ఈ సంగతులన్నీ" మరియు ఆయన ...

63. ఆయన అన్నాడు. "ఏ సంగతులు జరిగాయి?" అసలు దాని గురించి ఆయనకు ఏమీ తెలియనట్టుగా చూడండి, ఆయనకు దానిని గూర్చి ఏమీ తెలియదన్నట్టుగా ఆయన నటించుచున్నాడు.

54. కానీ ఇప్పుడు గుర్తించుకొనండి, అప్పుడు ఆయన వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన ద్వారా నెరవేర్చబడవలసిన వాగ్దానములను ఆయన వారికి బయలుపరచడం ప్రారంభించాడు. చెప్పాడు. "ఆయన ఏ విధంగా మొదట శ్రమపడి మరియు ఆయన యొక్క మహిమలోనికి వెళ్ళవలసియున్నదో మీరెరుగరా?" మరియు ఆయన ప్రారంభించాడు, లేఖనములతో, మోషే నుండి మరియు ప్రనక్తలందరూ. మరియు ఆయనకు సంబంధించిన లేఖనములను వారికి బయలుపరచాడు. మెస్సయ్యా మెస్సయ్యా ఏమై ఉంటాడో, ఆయన ఖచ్చితంగా ఎటువంటి కార్యములు చేస్తాడు. ఆయనను గూర్చిన సమస్తమూ, ఆయన దానిని వారికి బయలుపరచెను. మరియు వారాయనను ఇంకనూ అర్ధం చేసుకోలేకున్నారు.

55. అదే ఈ రోజు పునరావృతం (తిరిగి జరగడం) కాదా! ఆయన దానినే చేయుచున్నాడు. మరియు సంఘం దానిని గుర్తించలేని అంధకారస్థితిలో ఉన్నది. ఆయన తాను ఎవరని మరియు ఆయన ఏమై ఉన్నాడని వారికి బయలుపరచు చున్నాడు. మరియు, వారింకనూ ఇలా చెప్పుచున్నారు, "మంచిది, ఇప్పుడు, నా సంఘము బోధించుచున్నది అని నేను నమ్ముచున్నాను అక్కడే నీవున్నావు. మీరు చూడండి, ఆ కారణమును బట్టి మీరు ,గమనించండి, ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళుట ప్రారంభించినప్పుడు, ఆ కాలంలో తనకు సంబంధించిన వాక్యపు వాగ్ధానములను ఆయన వారికి బయలుపరచెను. నోవహు కాలంలో ఉన్న వాక్యపు వాగ్ధానములు కాదు, మరొక కాలం యొక్క వాక్యపు వాగ్ధానము, అదే ఆయన ఎవరు అని చూపిస్తుంది. చూసారా?.ఆయన వారిని అడగడం ప్రారంభించాడు, చెప్పాడు, "మీరెందుకంతగా బాధపడుచున్నారు?"

52. “ఎందుకు?” వారు చెప్పారు, "నీవిక్కడ కొత్తవాడివా?" వారాయన ముఖములోకి తేరిచూసారు. “నీవు ఇక్కడ క్రొత్తవాడవా, మరియు ఏమి జరిగినదో నీకు తెలియదా? ఎందుకు, నజరేయుడైన ఏసు, దేవుని ద్వారా అంగీకరించబడిన ప్రవక్త, మరియు ఇశ్రాయేలును విమోచించువాడు ఆయనే అని మేము ఆశించాం; మరియు ఇది మూడవరోజు, మరియు వారాయనను సిలువవేసి యున్నారు, మరియు ఈ సంగతులన్నీ." మరియు ఆయన

53. ఆయన అన్నాడు, "ఏ సంగతులు జరిగాయి?" అసలు దాని గురించి ఆయనకు ఏమీ తెలియనట్టుగా, చూడండి, ఆయనకు దానిని గూర్చి ఏమీ తెలియదన్నట్టుగా ఆయన నటించుచున్నాడు.

54. కానీ ఇప్పుడు గుర్తించుకొనండి, అప్పుడు ఆయన వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు, ఆయన ద్వారా నెరవేర్చబడవలసిన వాగ్ధానములను ఆయన వారికి బయలుపరచడం ప్రారంభించాడు. చెప్పాడు, "ఆయన ఏ విధంగా మొదట శ్రమపడి మరియు ఆయన యొక్క మహిమలోనికి వెళ్ళవలసియున్నదో మీరెరుగరా?" మరియు ఆయన ప్రారంభించాడు, లేఖనములతో, మోషే నుండి మరియు ప్రవక్తలందరూ మరియు ఆయనకు సంబంధించిన లేఖనములను వారికి బయలుపరచాడు, మెస్సయ్యా. మెస్సయ్యా ఏమై ఉంటాడో, ఆయన ఖచ్చితంగా ఎటువంటి కార్యములు చేస్తాడు, ఆయనను గూర్చిన సమస్తమూ, ఆయన దానిని వారికి బయలుపరచెను. మరియు వారాయనను ఇంకనూ అర్ధం చేసుకోలేకున్నారు.

55. అదే ఈ రోజు పునరావృతం (తిరిగి జరగడం) కాదా! ఆయన దానినే చేయుచున్నాడు, మరియు సంఘం దానిని గుర్తించలేని అంధకారస్థితిలో ఉన్నది. ఆయన తాను ఎవరిని మరియు ఆయన ఏమై ఉన్నాడని వారికి బయలుపరచు చున్నాడు, మరియు, వారింకనూ ఇలా చెప్పుచున్నారు, “మంచిది, ఇప్పుడు, నా సంఘము బోధించుచున్నది అని నేను నమ్ముచున్నాను...” అక్కడే నీవున్నావు. మీరు చూడండి, ఆ కారణమును బట్టి మీరు…

56. లేఖనములలోనికి తిరిగి వెళ్ళండి, లేఖనములును పరిశోధించండి అవి సత్యమును కలిగియున్నవి. మనం ఎంతగానో వాటిని మెలిత్రిప్పియున్నాము. ఇది లేఖనమని మనము ఏ విధంగా తెలుసుకొనియున్నాము? ఆ కాలమునకు అది వాగ్దానము చేయబడిన ఒక వాక్యము అయియున్నప్పుడు.

57. ఇప్పుడు, అతడు వెనుకకు వెళ్ళి మరియు “మోషే ఏమి చేసెనో నీకు గుర్తున్నదా? చూశారా? ఆయన తనను గూర్చి లేఖనములు చెబుతున్న వాటిని వారికి బయలుపరచెను ఆ కాలము కొరకు. ఆయన ఆ కాలమునకు వెలుగైయున్నాడు.

58. మోషే అతనియొక్క కాలమునకు వెలుగైయుండెను. యిర్మియా తన యొక్క కాలమునకు వెలుగైయుండెను. ఇది దేవుడు తన కాంతిని ఆ కాలమునకు వాగ్ధానము చేయబడిన వాక్యముపై ప్రకాశింపచేయుటయై యున్నది, ప్రతీ కాలము తన వాగ్దాన వాక్యమును కలిగియున్నది. దేవుడు తన ప్రవక్తలను పంపి మరియు ఆ వాక్యమును బయలుపరచును; మొదటిగా తన ప్రవక్తను రుజువు చేయును, అప్పుడు ఆ వాక్యమును బయలుపరచి మరియు అది జరుగులాగున చేయును.

59. మరియు యేసే క్రీస్తె అయియున్నాడు. మరియు క్రీస్తుకి సంబంధించిన వాటినన్నిటిని, ఆయన నిరూపించియున్నాడు. ఒక కన్యక జన్మ, రోగులను స్వస్థపరచుట, హృదయ రహస్యాలను బయలుపరచుట, మెస్సయ్యాగా ఉండుటకు ఆయన ఏ విధంగా చేయవలసియున్నాడో (ఏమి చేయవలసియుండెనో) వాటినన్నిటిని చేసెను, మరియు, ఇంకా మరణం నుండి తిరిగి లేచెను. మరియు వారింకనూ ఆయనను గుర్తించలేదు. వారింకనూ దానిని యెరిగియుండలేదు. లేఖనములను బయలుపరచిన తరువాత కూడా, వారింకనూ ఆయనను గుర్తించలేదు, ఆయన వాగ్ధానం చేయబడిన వాక్యం అయినప్పటికీ. ఇప్పుడు జ్ఞాపకము చేసుకోండి అది ఎంత మనోహరమైనది ! ఆయన వారికి బయలుపరచుచున్న వాక్యమే, వారికి చూపించుచున్నది. వారు ఆయనతోనే మూడు సంవత్సరములు నడచియున్నారు, మరియు దానిని గుర్తించారు, ఆయన వాక్యమును నెరవేర్చునని వారెరిగియున్నారు.అక్కడ వారు ఎమ్మాయికి నడుచుకుంటూ వెళ్ళుచున్నారు, "అది అలాగేనా?” ఆహ్! వారికి కొంచెం కూడా అది అర్ధం కాలేదు. వారు దానిని పొందుకోలేదు.

60 గమనించండి ఎప్పుడైతే ఆ స్థలమునకు వచ్చెనో, ఆయన వాక్యమును బయలుపరచిన తరువాత, మరొక్కసారి, వారికి, మరియు క్రీస్తు ఏ విధంగా ఈ సంగతులను చేయవలసియున్నాడని వారికి చూపించెను, మరియు వారింకనూ దానిని గుర్తించలేకపోయిరి. వారు పొందికొనియున్న గద్దింపును గమనించండి, ఆ బోధకులు వారి కళ్ళముందే నెరవేర్చబడిన, మరియు నెరవేర్చబడిన లేఖనమును ఎరిగియుండకపోవుట యందు మరియు గుర్తించలేకపోయినందుకు ఆయన వారిని గద్దించెను. వారితో ఆయన పలికిన మాటలను గమనించండి, అవివేకులారా, అర్ధం చేసుకోలేని మందమతులారా." ఇక్కడ దేవుడే స్వయముగా, పునరుద్ధానుడైన మెస్సయ్యా, వారితో నడుస్తూ ఉన్నాడు, వారికి చూపించుచున్నాడు. చెప్పెను, "క్రీస్తు ఈ కార్యములను చేస్తాడని మీరెందుకు అర్ధం చేసుకోలేకున్నారు? మీకు తెలియదా అది ఖచ్చితంగా ఈ విధంగానే ఉంటుందని, మరియు ఇదే విధంగా, మరియు ఇలాగే మరియు ఇలాగే?"

61. మరియు దినమంతయూ లేఖనములను వారికి వివరించుచూనే ఉన్నాడు, మరియు ఇంకా "అది అలాగా?” మరియు అది ఆయనే వారి ఎదుట అక్కడ నిలిచియున్నాడని వారు గుర్తించలేకపోయిరి.

62. అప్పుడు ఆయన చుట్టూ చూచెను. ఆయన వాక్యమును బోధించిన తరువాత, మరియు కార్యములు ఈ విధంగా జరగవలసియున్నవి అని ఆయన వారికి చెప్పెను మరియు చూపించెను. మరియు వారింకనూ దానిని అర్ధం చేసుకోలేదు (గ్రహించలేదు) ఆయన చెప్పెను, "బుద్ధిహీనులారా మరియు గ్రహించలేని మందమతులారా, చూడండి, ఆ ఘడియకైన నిరూపించబడిన లేఖనమును గ్రహించండి" ఆ దినమున ఆయన కొరకై సంబంధించిన వాక్యము, ఆయన ఇంకా శిష్యులతో ఉన్నప్పటికిని వ్రాయబడిన వాక్యము వారి కన్నుల ముందు ప్రత్యక్షమవ్వడాన్ని వారు గుర్తించలేకపోయారు.

63. అది మరింతగా లోతుకు వెళ్ళాలని నేను కోరుచున్నాను, ఒక్క క్షణం, చూశారా? చూడండి, ఎప్పుడో గుర్తించలేకపోయారు... లేఖనములో నుండి దానిని చదవండి, అది ఈ దినము కొరకైన వాగ్ధానమైయున్నది, మరియు అప్పుడు గమనించండి. దేవుడు దానిని ప్రత్యక్షపరచును, మరియు ఇంకా చెప్పెదరు." నేను ఆలోచిస్తున్నాను." అదే సంగతి, చూడండి, ఖచ్చితంగా అలాగే, మనమింకా మానవ తలంపులనే కలిగియున్నాము.

64. మరియు ఆయన వారిని సూటిగా గద్దించడం మనము కనుగొనెదము. వారు శిష్యులు. ఎందుకనగా, వారు వాక్యమును ఎరుగరు, అది, వారి ముందు అది ప్రత్యక్షపరచబడినప్పుడు, వారు దానిని అర్ధం చేసుకోలేకపోయారు.

65. ఏమిటది! అదే సంగతి ఈ రోజు కూడా జరిగియున్నది. కానీ జనుల యొక్క తలంపులలో ... అది వారిని గూర్చి నీకు జాలి కలిగేలా చేస్తుంది. ఎందుకనగా ఒకరు ఈ మార్గం గుండా వెళ్ళు గుంపును కలిగియున్నారు మరియు మరియొకరు ఈ మార్గం గుండా వెళ్ళు గుంపును కలిగియున్నారు, మరియు ప్రతీ ఒక్కరూ వారి యొక్క గుంపు ఏ విధంగా పెంచుకోవాలని దానిపై ఆలోచిస్తున్నారు. ఆ కారణం చేతనే క్రీస్తు తనను తాను ప్రజలకు తెలియపరచుకొనలేకున్నాడు.

66. ఎందుకు, సంఘము ఎంతగానో.. ఎందుకు, మరియు ఆయన పునరుద్ధానము యొక్క శక్తితోను గొప్ప సూచక క్రియలు మరియు అద్భుతములుతోను అది ఇప్పటికే దాని యొక్క మహిమకరమైన స్థితిలో ఉండవలసి ఉన్నది.

67. దానికి బదులుగా, వారెంతగానో వీటి చుట్టూ తిరుగుతూ మోసపోయి యున్నారు, వారెంతో గుడ్డిగా సార్వత్రిక సంఘ సమైఖ్యలోకి నడిచిపోతున్నారు, ఆ మృగము యొక్క ముద్రను తీసుకోవడానికి, మరియు దానిని ఎరుగకుండా, అది ఖచ్చితముగా, ఆయన యొక్క వాక్యం ఆ విధంగా చేయునని చెప్పుచున్నది. మరియు ఇది చాలా మంచిదని వారు అనుకొనుచున్నారు, ఇది చక్కనిది, మంచి అవకాశం ఇచ్చును, మరియు కనుక వారు ఆ విధంగా దానిని చేస్తారు. ఏ విధంగా ఇద్దరు కూడి నడవగలరు? పెంతుకోస్తు వారైన మీరు ఏమి చేయబోతున్నారు? దానిని చేయుటకు, మీరు మీ మొట్టమొదటి సిద్ధాంతమైన పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును నీవు త్యాగం చేయవలసియున్నది. నిశ్చయముగా, నీవు చేయవలసియున్నది. మరియు నీవు అక్కడే ఉన్నావు. ఆ సమయం వచ్చినప్పుడు నీవేం చేయబోతున్నావు? ఒక బుద్ధిహీనుని వలె అందులోనికి నడుచుకుంటూ వెళ్ళిపోతావు!

68. కొంత మంది పెంతుకొస్తు ప్రజల యొక్క నాయకులు, సంపూర్ణ సువార్త ప్రజలు, ఈ సార్వత్రిక సభలలో నిలబడి, మరియు వాటికన్ ముందు కూర్చుని, మరియు ఆ శ్రేణుల క్రమంలో, మరియు ఆ విధంగా, మరియు చెప్పారు, "ఇది ఎంతో ఆత్మ సంబంధమైన భావము.”

69. ఒక మనిషి దాని దేవుని యొక్క ఆత్మ చేత మొద్దుబారినట్లయితే, అది ఆ విధంగా ఉండులాగున చేయును, ఆయన ఈవిధంగా చెప్పుటలో ఆశ్చర్యం లేదు. “అవివేకులారా, లేఖనము చెప్పుచున్నదానిని అర్ధంచేసుకోలేని మంద మతులారా” ఆయన ఈ రాత్రి మాట్లాడగలడు, ఆయన ఒక పాత్ర ద్వారా మాట్లాడు చున్నట్లయితే, ఆయన అదే సంగతిని చెప్పును. "అవివేకులారా, వాక్యం ఇప్పుడు
అక్కడే మీ ముందు ప్రత్యక్షమైనప్పుడు దానిని గ్రహించని మందమతులారా, మరియు అప్పుడు ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు." ఇప్పుడు అలాగే!

70. మన కార్యక్రమములలో మనమెంతో తీరిక లేకున్నాము. చాలా .... వారెంతో తీరిక లేకున్నారు, ఆయనను వింటున్నారు, మరియు వేరే పనులు చేయుచున్నారు. మరియు మనము దానిని కనుగొనెదము, అది, ఇప్పుడు మనమెన్నో వ్యత్యాసమైన సిద్ధాంతములను కలిగియున్నాము, మనకెన్నో టెలివిజన్ కార్యక్రమములున్నవి.

71. మరియు మనమిప్పుడు కమ్యూనిజమునకు వ్యతిరేకమైన ఒక ఉద్యమమును కలిగియున్నాము. నేను లైఫ్లైన్ను వినుచున్నాను. (ఆరోగ్యమును గూర్చియైన రేడియో ప్రోగ్రాం కావచ్చు) నిన్నటి ఉదయం, దానిని గూర్చి వ్యాసము ఇచ్చియున్నారు, అది ... అది, కమ్యూనిజం, ఎందుకు, నీవు దానిని ఎన్నడూ తుడిచివేయలేవు. ఎందుకు, వారు సంవత్సరములు సంవత్సరముల నుండి ఇక్కడే ఉన్నారు. ఈ ఇతర కార్యక్రమాలు మరియు పద్ధతులు, కనుక ఆ లైన్లైన్ చెప్పెను, ఇటువంటి మెదడు సంబంధమైన పక్షవాతము మరియు దానిలో అటువంటి సంగతి, ఆ కమ్యూనిస్ట్ వ్యతిరేక ఉద్యమములో, కమ్యూనిస్ట్ వ్యతిరేక ఉద్యమము, అక్కడ దానిని ప్రేరేపించుటకు కమ్యూనిస్ట్లు ఉన్నారు, ఎవరు ఎవరనేది కనుగొనుటకు, ఓ, మై! నేను దానియందు ఆసక్తిని కలిగిలేను.

72. నేను ఏసుక్రీస్తు రాకడ యందు ఆసక్తిని కలిగియున్నాను, సంఘము కొరకు సేవకులు కూడా దానికొరకు బిజీగా (తీరిక లేక) ఉండవలసియున్నది, మరియు ఈ దినము కొరకై వాగ్ధానము చేయబడిన వాక్యమును చూడవలసిన వారైయున్నారు. కమ్యూనిజం దీనిని అంతా ఆక్రమించుకోవడం కొరకు నేను చూచుట లేదు. నేను రాబోవుచున్న రాజ్యం ఏసుక్రీస్తు మరియు ఆ వెయ్యేండ్ల పాలన కొరకు ఎదురు చూస్తున్నాను. కొంచెం కూడా (ఖచ్చితంగా) కమ్యూనిజం లేక వారి యొక్క ఇజమ్సు కాదు, లేక మీ యొక్క మత సంబంధమైన ఇజములు, అటువంటి వాటిపై నాకెటువంటి ఆసక్తి లేదు! నేను యేసుక్రీస్తు నందు ఆసక్తి కలిగియున్నాను, మరియు ఆయనపై మాత్రమే, జనులు ఆయనను చూడవలెనని చేయుచున్నాను. తనను తాను రుజువు చేసుకొనుచూ, ఆయన ఇక్కడ ఉన్నాడు, చివరి దినములలో తాను ఏమి చేస్తానని చెప్పెనో దానిని ఖచ్చితంగా ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు వారు దానిని అర్ధం చేసుకోలేకున్నారు. వారెంతో తీరిక లేకున్నారు.

73. అయినప్పటికీ ఆయన మరణించి తిరిగి లేచియున్నాడు అని
నమ్ముచున్నాము అని వారు ఈ రోజు ప్రకటించుచున్నారు. ప్రతీ ఒక్కరూ, ఆయన మరణం నుండి తిరిగి లేచియున్నాడని నీవు నమ్ముచున్నావా? నిజముగా క్రైస్తవులు అని చెప్పుకొనుచున్న వారందరూ, దానిని నమ్మెదరు. మరియు అప్పుడు ఆయన చుట్టూ వచ్చి, పునరుద్ధానము తరువాత ఆయన ఏమి చేస్తానని చెప్పెనో దానినే ఖచ్చితంగా చేయును, మరియు ఇంకను వారాయనను చూడలేదు. అవునండీ! ఓహ్! ఇదియే సత్యము. వారు, వారు ఇంకనూ ఇప్పుడు కూడా చూడలేకున్నారు.

74. సిద్ధాంతాలు, విద్యాసంబంధమైన కార్యక్రమాలు, వారు ఎంతగానో విద్యావంతులు కావడానికి వారి సేవకులను బయటకు పంపించియున్నారు. అది గ్రుడ్డితనము కలుగజేయును, వారి యొక్క మానవ నిర్మిత సిద్ధాంతాలకు గ్రుడ్డివారై యున్నారు, అది వారు దేవుని వాక్యము నుండి దూరమైపోయారు. (వారే దేవుని వాక్యాన్ని అడ్డగిస్తున్నారు.)

75. క్రితం రాత్రి నేను చెప్పినట్లుగా, దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. నేను ఆయన వాక్యమునకు అర్ధం చెప్పలేను, ఎవరూ కూడా ఆయన వాక్యమునకు అనువాదం ఇవ్వలేరు. ఆయనే ఆయన యొక్క వాక్యమునకు సొంత అనువాదకుడు ఆయన నేను చేసెదను అని చెప్పిన దేనినైనా ఆయన చేయగలడు, ఆయన చేయగలడు, మరియు అది ముగించును. అది ఆ విధంగా జరుగవలసినదే. ఆయన చేసెదను అని చెప్పెను మరియు ఆ విధంగానే ఆయన చేసెను. అది స్థిరపడును. అది ఇది లేదా ఇది అది అని చెప్పడానికి ఆయనకు ఎవరూ అవసరం లేదు. ఆయనే స్వయముగా దానిని చేయును. లేఖనములకు మన అనువాదములు అవసరం లేదు. తనకొరకు ఆయనే స్వయముగా మాట్లాడును, మరియు అది ఆ విధముగానే ఉండును.

76. ప్రారంభంలో, ఆయన పలికినపుడు "వెలుగు కలుగును గాక", మరియు అక్కడ వెలుగు కలిగెను. దానికి మరొక అనువాదము అవసరం లేదు. "కన్యక గర్భవతి అవును", మరియు ఆ విధంగా జరిగెను! "సర్వశరీరులపై నా ఆత్మను కుమ్మరించెదను”, ఆయన దానిని చేసెను ఎటువంటి అనువాదము అవసరం లేదు.

77. ఈ దినమున ఏమి చేయుదునని ఆయన చెప్పెనో, ఆయన దానిని చేసెను. అది అనువదింపబడనవసరం లేదు; అది దానికదే అనువాదం అయియున్నది. ఆయనకు ఆయనే స్వంత అనువాదకుడై యున్నాడు.

78. ఇప్పుడు, కానీ మనము ఇతర విషయములలో తీరిక లేకుండా ఉన్నాము,
మరియు మనం ప్రజలను ఎంతగానో దూరము చేసియున్నాము. మరియు మనయొక్క అనేకమైన సంపూర్ణ సువార్త సంఘములు మరియు అటువంటివి, మరియు పాఠశాలలు, ఒక మనిషికి ఒక మానసిక పరీక్షను ముందుగా ఇచ్చును... ఒక మానసిక పరీక్ష, ఒక మానసిక వైద్యుని ముందు, అతడు ఒక మిషనెరీగా మారక ముందు, అతను చాలినంత జ్ఞానము కలిగియున్నాడా లేదా అని. అది మరొక రకముగా లేదా? చాలా సంవత్సరముల క్రితము చనిపోయిన సాధారణమైన, చిత్రమైన సంగతిగా నేను దానిని ఊహించగలను. కానీ పెంతెకొస్తు ఉండదగినంత తాజాగా ఉన్నప్పుడు; వారే విధంగా దానిని ఆ విధంగా చేయగలుగుచున్నారు?

79. ఆ పెంతెకొస్తు దినాన్న కావలసిన జ్ఞానమును మీరు ఊహించగలరా? దేవుని యందు విశ్వాసము, వారికి కావలసినదదే. అవును! అదియే అవసరత. "నీవు నమ్మగలిగితే నమ్మినవారి యెడల ఈ సూచక క్రియలు జరుగును", అని ఏను చెప్పెను. ఆయన వారి తెలివితేటలను పరీక్షించమని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన చెప్పెను, "సర్వసృష్టికి వెళ్ళండి", మిషనరీలుగా, "సమస్త ప్రజలను శిష్యులుగా చేయుము. నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును!" అదియే దేవుని జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము, ఈ సంగతులు వాస్తవముగా మరియు నిజముగా చేయుటకు కావలసినంత విశ్వాసమును నీవు కలిగియున్నావా, క్రీస్తు ప్రజలకు ప్రత్యక్షపరచబడును.

80. కానీ, ఈ రోజు, మనం వారిని ఒక విద్యా సంబంధ కార్యక్రమము ద్వారా పరీక్షించాలని కోరుకొనుచున్నాము. మై!

81. మరొక దినమున, మానసిక స్థితిని గూర్చి, జాక్ రూబీని పరీక్షించి యున్నారు. వారు ఇంకనూ దానిని చేయుచున్నారు. సర్వ ప్రపంచము పిచ్చిపట్టి యున్నది. నిజం, మనుష్యుడు పిచ్చిపట్టియున్నాడు. (పిచ్చివాడైనాడు). అతడు పిచ్చివాడు కాని యెడల ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కాల్చలేదు. సమస్త ప్రపంచము పిచ్చిలో ఉన్నది. నిశ్చయముగా, ఇదియే ఒక రైతు, వ్యాపారి కొరకు పిచ్చివాడిగా యున్నాడు. ఒక వ్యాపారి రైతును బట్టి పిచ్చివానిగా యున్నాడు. ఎవరు పిచ్చివారు? సమూహము అంతా.

82. ఒకే ఒక పిచ్చితనమున్నది, మరియు అది దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు, మరియు ఆయన యొక్క సువార్త ప్రతీదానికి సమాధానము కలిగియున్నది. మనయొక్క మనస్తత్వ శాస్త్ర సంబంధ పుస్తకములు, మరియు ఇవన్నియు, బుద్ధిహీనమైనవి. ఇవి దేవుని వాక్యముతో విభేధించినట్లయితే, వాటిని దూరంగా విసిరివేయుము. దేవుని
వాక్యము సత్యము, మరియు మిగిలినవన్నియూ తప్పెయున్నవి.

83. ఈ సంగతులు మనము చూడనైయున్నాము. ప్రపంచమంతా రక్తముతో తడవబోతోంది అనుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. సమస్తమూ ఆ మార్గములోనే ఇప్పుడు ఉన్నదనుటలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు! మనము చేయలే... ప్రతీసారి ఇది అలాగే ఉంటున్నది ... ఓస్వాల్ను గూర్చి ఆశ్చర్యపోవద్దు, అతడు మన యొక్క అధ్యక్షుని చంపెను, అతడు ఒక మానసిక పరీక్ష కలిగియున్నాడా అని నేను ఆశ్చర్యపడెదను దానియందు నాకు సందేహము కలదు. కానీ, మీరు చూడండి, ఏ విధంగా ఒక వ్యక్తి లోనికి పరుగెత్తి (కాన్వాల్స్లోనికి) మరియు మరొక్క వ్యక్తిని కాల్చగలడు. మరియు తనయొక్క ప్రాణమును ఎలా తీసుకొనగలడు? ఇప్పుడు, నేను టెక్సాస్లో ఉన్నాను. దానిపై కొంచెం సేపు ఆపాలనుకుంటున్నాను. కానీ నన్నొక విషయం చెప్పనివ్వండి, ఎప్పుడైనా ఒకరోజు, ఆయన రాకడలో, వీటన్నిటి కొరకు ప్రభువు జాగ్రత్త వహించును. గమనించండి, ఏ ఒక్కని ప్రాణమును తీసివేయుటకు నీకు అధికారము లేదు, లేదండి. దేవుడు ఒక్కడు మాత్రమే ప్రాణమును తీయుటకు హక్కును కలిగియున్నాడు. ఇదియే సత్యము.

84. మరియుచూడండి, వాక్యము సత్యపూర్వకముగా వ్రాయబడెను, ఆ కాలమునకైన వాగ్దానము, ఖచ్చితంగా రుజువుచేయబడినది (నిరూపించబడినది), మరియు వారింకనూ దానిని గుర్తించలేదు. గమనించండి, వారు ఆయనను కేవలం ఒక ప్రవక్తగా మాత్రం గుర్తించియున్నారు, నజరేయుడైన ఏసు. “నీవు కేవలం నీవు ఇక్కడ కొత్తవాడవా? నజరేయుడైన ఏసు, నిజానికి ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను శక్తిగల ప్రవక్తయై ఉండెను.” ఆయనను ఒక ప్రవక్తగా గుర్తించియుండిరి! అప్పుడు, ఒకవేళ వారు ఆయనను ప్రవక్త అని గుర్తించిన యెడల, ఆ ప్రవక్త తను జీవించుచున్నకాలములోనే పంపబడును. అతడు దేవుని వాగ్ధానమును ప్రత్యక్షపరచవలెను. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. మరియు అతడు ప్రవక్త అయిన యెడల, అప్పుడు ఆ కాలమునకై వాగ్దానము చేయబడిన వాక్యము అతని ద్వారా ప్రత్యక్షపరచబడును, మరియు వారింకనూ ఆయనను చూడలేదు. వారు కొంచెం కూడా దానిని చూడలేకున్నారు.

85. వారు చెప్పారు, "ఆయన ఒక ప్రవక్తయై ఉండెను, క్రియలలో శక్తి గలవాడైయుండెను." మరియు ఆయన యొక్క పనుల యందు. దేవుని ఎదుట వాక్యములో మరియు అటువంటి వాటిలో శక్తిగలవాడై యుండెను. ఆయన గొప్పవాడై యుండెను, మరియు మేము ఆశించాం.... ఇశ్రాయేలు అంతా ఆయనపై వారి నమ్మకాన్ని కట్టుకున్నారు, ఆత్మీయ ఇశ్రాయేలు, సంఘంగా ఉన్న ఇశ్రాయేలు కాదు, ఒక ... కేవలం ఒక జనాంగము. ఒక-ఒక ప్రజ, ఒక నిజమైన ఆత్మీయ ఇశ్రాయేలు వారి యొక్క నిరీక్షణను ఆయనపై నిర్మించుకొనిరి.

86. మరియు, గమనించండి, వారు ఆయనను ప్రవక్తగా గుర్తించినప్పుడు, ఆయన ఏమి చేయబోవుచున్నాడు? ఆయన ఖచ్చితంగా ప్రవక్త ఏమి చేయవలసియున్నదో ఆ విధంగా చేసియున్నాడు, ఆయన నేరుగా వాక్యం వద్దకు తిరిగి వెళ్ళెను. చూశారా? సరిగా వెనుకకు, చూపించుటకు. వారు చెప్పినట్టు ఆయన ప్రవక్త అయితే, అతడు తిరిగి వాక్యము యొద్దకు వెళ్ళి ఆయన కొరకై వాగ్ధానం చేయబడిన ఆ దినపు వాక్యమును చూపును. ఇంకను వారాయనను ఎరుగకయుండిరి. వారు ఉండవలసినంత గ్రుడ్డిగా, నడుస్తూ, దానిని గుర్తించలేదు. వారి కాలమునకై వాగ్దానము చేయబడిన వాక్యము, అదే కార్యమును ప్రత్యక్షపరచుటకు ఆయన ప్రవక్త అయియున్నాడు.

87. ఇప్పుడు చూడండి, ఆయన చెప్పెను, "అవివేకులారా, క్రీస్తును గూర్చి ప్రవక్తలు చెప్పినది గ్రహించని మందమతులారా, ఏ విధంగా ఆయన శ్రమ పడవలెనని అని ఆయన చెప్పెనో, మరియు పిదప ఆయన మహిమలోనికి ప్రవేశించును, మరియు మూడవ దినమున పైకి లేచును. ఈ సంగతులన్నియు ఆయన జరిగించును, మరియు అయినప్పటికీ మీరు దానిని అర్ధం చేసుకోలేదా? నమ్మియున్నామని వారేదైతే మాట్లాడుతున్నారో, దాని వారికి ప్రత్యక్షపరచుచున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు వారు ఎంతగానో దానిని నమ్మవలసిన అవసరతయున్నది. కానీ వారింకనూ ఆయనను చూడలేకున్నారు. ఎల్లప్పుడు, ఆయన నిజమైన ... ఒక నిజమైన ప్రవక్త అనుటకు ఒక ఖచ్చితమైన సూచనయైయుండెను, ఆ వెనుక ఉండిన వాక్యం యొద్దకు కాదు, మరొక దానిలోనికి కాదు, కానీ ఈ రోజు ఆయన యొక్క వాగ్ధానంలో జీవించుచున్నాడు అని నిరూపించుటకు.

88. ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆయన రాక ముందు, యోహాను రంగం మీదికి వచ్చెను. అతడు ఒక ప్రవక్తయై ఉండెను. మరియు అతడు ఏమైయుండును? మెస్సయ్యాకు ముందుగా వచ్చువాడు. మరియు అతడు చెప్పెను, "నేను మెస్సయాను కాదు." వారు అలా అనుకున్నారు ఇతడే అని, ఎందుచేతననగా అతడు ఒక ప్రవక్త. అతడు చెప్పెను, "నేను మెస్సయాను కాదు, నేనాయన చెప్పుల వారు విప్పుటకు కూడా యోగ్యుడను కాను, కానీ ఆయన మీ మధ్యనున్నాడు." ఓహ్, యోహాను ఆయన అక్కడ ఉన్నాడని ఖచ్చితముగా ఎరిగియున్నాడు ఎందుచేతననగా ఆయనను పరిచయం చేయవలసింది తానేనని ఎరిగియుండెను.

89. అతని తండ్రి ఒక యాజకుడై యుండెను. యాజకత్వమును నేర్చుకొనుటకు అతడు వారి సెమినరీలకు వెళ్ళియుండలేదు. అతని యొక్క పని చాలా ముఖ్యమైనది. దేవునితో ఒంటరిగా యుండుటకు అతడు అరణ్యమునకు వెళ్ళెను. అతడెన్నడైననూ ఎవరితోనైననూ ఒక సహవాసపు కార్డు కలిగియుండవలెనని అనుకొనలేదు. లేక వారీవిధంగా చెప్పియున్నారు, అది లేదా మరొకటి, ఎందుచేతననగా వారంతా ఆ కాలంలో మనుష్యుల ద్వారా ఏర్పరచబడిన పద్ధతుల ద్వారా నియంత్రించబడియున్న క్రమములో మిశ్రమమైపోయారు. ఆయన యొక్క పని ముఖ్యమైనది. అతడు ఒంటరిగా దేవునిపై ఆధారపడియుండవలెను, ఎందుకనగా అతడు మెస్సయ్యా కొరకై ప్రకటించవలసియున్నది.

90. ఏసు చెప్పెను, "అతడు ఒక మండుచున్న మరియు ప్రకాశించుచున్న వెలుగైయుండెను, మరియు మీరొక కాలము అతనితో నడుచుటకు ఇష్టపడియుండిరి, అతనితో నడుచుట ద్వారా మీరానందించియుంటిరి. అయితే నేను యోహాను కంటె మరి ఎక్కువ సాక్ష్యమును కలిగియుంటిని" చూశారా? అతడు ... వారింకనూ ఆయనను నమ్మలేదు. (దానిని నమ్ముటలేదు.)

91. ఒక నిజమైన ప్రవక్తయొక్క ఖచ్చితమైన సూచన, పైకి వెళ్ళుచూ వారిని వాక్యము యొద్దకు తీసుకొని వెళ్ళుచున్నాడు. వారు ఆయన మాట్లాడు పద్ధతిని అర్ధం చేసుకోలేకపోయారు.

92. మరియు, చూడుము, ఖచ్చితముగా వాక్యము వెంబడి వాక్యము ఏవిధముగా ఉన్నదో, ఆ విధముగా జరుగబోవుచున్నది అని లేఖనము చెప్పినది. దావీదు కూడా, కొన్ని వందల సంవత్సరాలకు ముందే, ఎనిమిది వందల సంవత్సరములకు పూర్వము, ఆయన సిలువలో పలికియున్న దానినే కేకవేసి యున్నాడు. మరియు ఎటువంటి సందేహము లేదు, ఆ ఉదయం ఆ దేవాలయములో, కీర్తనలు 22, “నా దేవా, నా దేవా నన్నేల చేయి విడనాడితివి?" అనే ఆ పాట ఖచ్చితంగా పాడియుందురు. దానిని గూర్చి దేవాలయంలో ఆ పాటను పాడుచూ, మరియు, వారు ఆరాధిస్తున్నామని తాము ప్రకటించుకొన్న ఆ దేవునినే వారు సిలువ వేసియున్నారు.

93. ఈ దినమున అలాగే యున్నది ! తాము నమ్ముచున్నామని ప్రకటించుచున్న ఆ దేవుడే, ఆయనే స్వయముగా ప్రత్యక్షపరచుకొనెను, వారు, నీవు ప్రతీ ద్వారమును మూసివేస్తావు, మరియు ఎటువంటి సహకారము లేదు, ఏమీ లేదు. వారు ... అది వారి సిద్ధాంతములతో విబేధించుచున్నది. ఓ బుద్ధిహీనులారా, మనము జీవించుచున్న దినమును ఎరుగని మందమతులారా! చివరి దినములలో దీనిని దేవుడు వాగ్దానము చేయలేదా? లవొదికయ సంఘము ఏ విధంగా నులివెచ్చగా ఉండును, మరియు ఏసు బయట పెట్టబడి (ఉండి), చిన్న సహకారము కొరకు లోనికి వచ్చుటకు ఆయన ప్రయత్నించుట? ఏసు ఎవరు? వాక్యము, ప్రత్యక్షపరచబడిన సత్యవాక్యము. వెలుపల, లోనికి రావడానికి ప్రయత్నించుచూ, మరియు లోనికి రాలేకయున్నాడు.

94. మనం జీవించుచున్న ఆ ఘడియ, ఆ విధంగానే, గ్రుడ్డితనం, అవును. వారు ఆ విధంగానే ఉండునని ఏసు చెప్పెను. వారా విధంగా యుందురని ప్రవక్తలు చెప్పియున్నారు. "మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, సత్యమును ఎదిరించువారు, అబద్ధికులు, అజితేంద్రియులు సజ్జనద్వేషులు, పైకి దైవభక్తిగలవారై యుండి దాని శక్తిని ఆశ్రయించనివారు", ఆయన పునరుద్ధానపు శక్తి, ఆయన నిన్న, నేడు, నిరంతరమూ ఏకరీతిగా ఉన్నాడను ఆయన యొక్క ప్రత్యక్షత. మరియు ఆయన ఈ రోజు జీవించుచున్నాడు, నిత్యము ఆయన చెప్పిన ప్రతీ దానిని ప్రత్యక్షపరచుట కొరకు. నేను మీపై అరచుట లేదు, కానీ మీరు వినాలని నేను కోరుకొనుచున్నాను.

95. నిజం, వారి కన్నులు ఇంకనూ మూయబడియున్నవి. గమనించండి, వారు నమ్మలేకున్నప్పటికీ, వారిలో ఏదో ఉన్నది, వారు ఆయనను లోనికి రమ్మని ఆహ్వానించిరి. ఆయన ఇంకా ముందుకు వెళ్ళుచున్నట్లుగా నటించెను.

96. ఈ రాత్రి, ఆయన నీ యెడల కూడా ఆ విధంగానే ఈ రాత్రి చేయును. ముగింపులో, వేను దీనిని త్వరగా ముగించబోవుచున్నాను, కనుక నేను ప్రార్ధనా వరుసను కలిగియుండగలను. ఆయన ఖచ్చితంగా నిన్ను దాటి వెళ్ళునట్లుగా నటించును. బహుశా నీ ప్రార్ధనా కార్డు పిలువకపోవచ్చు, కానీ, గుర్తుంచుకోండి, ఆయన నిన్ను పరీక్షించబోవుచున్నాడు. అవును, చూడండి, ఆయన ఇక్కడ ఉన్నట్లుగా, లేక మరెక్కడైనా ఉన్నట్లుగానే అక్కడ కూడా ఆయన దేవుడైయున్నాడు. దినము వెంబడి దినము, రాత్రి వెంబడి రాత్రి ఆయన దానిని నిరూపించును. ఆయన దేవుడు, ఎక్కడైనా. చూశారా? ఆయన సర్వాంతర్యామి.

97. ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, ఆయన ఆ మార్గమున వెళ్ళి పోవుచున్నట్లుగా ఆయన చేయును. మరియు వారాయనను బలవంతపెట్టిరి. ఇప్పుడు, ఆయన దేనిని గూర్చి మాట్లాడుచున్నాడో వారికి అర్ధంకాలేదు, కానీ వారి హృదయములన్నీ
ఏమి నమ్మవలెనో వారు ఎరుగరు.

98. ఈ రోజు, అటువంటి వ్యక్తులు అనేక మంది, ఇక్కడ ఉన్నాడు ఈ రాత్రి బ్యూమెంట్లో అటువంటి ప్రజలు అనేకులు ఉండియున్నారు. వారు ఏది నమ్మవలెనో ఎరుగరు. కానీ వారేంచేసారో మీకు తెలుసా? ఏ వ్యక్తి అ చేయగలిగే ఒక తెలివైన పని వారు చేసియున్నారు. వారాయనను లోనికి ఆహ్వానించిరి. అది అంతే. అది అంతే, అది అప్పుడే మరియు అప్పుడు మాత్రమే ఆయన తనను తాను బయలుపరచుకొనగలడు, లోనికి రమ్మని ఆయున ఆహ్వానించబడినప్పుడు, ఆయనను లోపలికి ఆహ్వానించి, చెప్పుము, "ప్రభువైన యేసు, లేఖనము ఆ విధంగా చెప్పుచున్నవి అని నేనెరుగుదును. నేను దానికి అర్ధం చేసుకోలేకపోవచ్చును, కానీ నా హృదయములోనికి రండి. నేను నిన్నూ అంగీకరించగోరుచున్నాను. నేను నీ యందు నమ్మికయుంచగోరుచున్నాను. అప్పుడు, నీవుగా నాకు ప్రత్యక్షపరచుకొనుము.”

99. గమనించండి. వారు ఆయనను లోనికి ఆహ్వానించిది. ఇప్పుడు వారు దానిని వివరించలేరు, వారు-వారు, అది ఒక అతడు, అతడు కేవలం .... ఆయన దేనిని గూర్చి మాట్లాడుచున్నాడో వారికి అర్ధం కాలేదు. వారికి అదంతా కలగలుపుగా ఉన్నట్లున్నది. వారు దానిని కొంచెం కూడా అర్ధం చేసుకోలేకపోయారు, అయినప్పటికీ వారు చెప్పారు. ఆహ్వానించుము, ఆయనను బలవంతపెట్టిరి, "నీవు లోనికి రావలెను!. చెప్పెను. "లేదు, నేను - నేనింకా ముందుకు వెళ్ళవలసియున్నది", అని ఆయన

100. "ఓహ్, కానీ, ప్రభువా, నీవు - నీవు ఖచ్చితంగా లోనికి రావలెను! నీవు, నీవు ఖచ్చితంగా లోనికి రావలెను!" మరియు వచ్చేంత వరకు ఆయనను బలవంతపెట్టిరి, ఆయనను పిలిచిరి, మరియు ఆయన లోనికి వచ్చేంత వరకు.

101. నీవును అదే విధంగా చేయవలెను. మరియు ఆయన లోనికి వెళ్ళినప్పుడు, అప్పుడు అది ఆయన తనకు తాను బయలుపరచుకొనును. ఆయన లోపల (గదిలో) ఉన్నప్పుడు ఆయన స్వయముగా తనకు తాను బయలు పరచకొనగలడు.

102. ఆయన పునరుద్ధానము తరువాత ఏ విధముగా దానిని చేసియున్నాడో గమనించండి. నిజమైన వాగ్దానం చేయబడిన వాక్యం, చూడండి, ఆయన ఎవరో వారు గ్రహించలేదు. అయితే ఆయన వారితో లోపల ఉన్నప్పుడు, అప్పుడు ఆయన
వారి కన్నులు తెరిచెను. ఆ విధముగా, అక్కడ ఆ గదిలో వారితో ఆయన న్నప్పుడు, ఆయన లోనికి వెళ్ళిన తరువాత ఆయన వారి కన్నులు తెరిచెను. ఆయన వారి కన్నులు తెరిచెను. ఏమిటి? ఆయన తన చేతిని ఎత్తి (ఈ విధంగా) "తెరవబడును, మీ కన్నులు తెరవబడును గాక," అని చెప్పుట కాదు. వారి కన్నులు తెరవబడెను, ఏమయినప్పటికీ, భౌతికముగా.

103. దాతానులో జరిగినట్టుగా, లేదా-లేదా, దోతాను, అలానే, ఇది వారక్కడ కలిగియున్నప్పుడు ... ఎలీషా అక్కడ ఉండియున్నాడు. మరియు ఆ-ఆ సిరియా సైన్యం అక్కడ వారిపై ఉన్నది, మరియు అక్కడ గేహజీ, "నా తండ్రీ, సిరియా సైన్యం మనలను చుట్టుముట్టినది,” అని గట్టిగా అరిచెను!

104. మరియు ఎలీషా అక్కడకు నడచివెళ్ళి మరియు చెప్పెను, "వారితో ఉన్న వారికంటే ఇక్కడ మనతో ఎక్కువమంది ఉన్నారనెను". చెప్పెను, "ప్రభువా, ఆ బాలుని యొక్క కన్నులు తెరువుము." మరియు ఆ ముసలి ప్రవక్త చుట్టూ, మరియు ఆ కొండపైన, అగ్ని రధములు మరియు సెరాపులు అక్కడ ఉండెను.

105. మరియు బైబిల్ చెప్పెను, "అతడు సిరియనులను గ్రుడ్డివారిగా మొత్తెను." అతడు అక్కడికి వెళ్ళి చెప్పెను, "మీరు ఎలీషా కొరకు వెదుకుచున్నారా?" వారు చెప్పారు, "అవును, మేము అతనికొరకు వెదుకుచున్నాము."

106. "రండి, అతడు ఎక్కడ ఉన్నాడో మీకు చూపించెదను." మరియు వారు చూడగలరు, భౌతికముగా, నడుచుకుంటూ వెళ్ళుచున్నారు. కానీ అతడెవరని చూచుటకు వారు గ్రుడ్డివారైయున్నారు.

107. మరియు అదియే, ఈ రాత్రి, నీవు ఖచ్చితంగా నీ కనుదృష్టి 20-20 గా కలిగియున్నావు. కానీ నీ యొక్క ఆత్మ (ఆత్మీయ దృష్టి), ఈ దినము యొక్క వాగ్దాన వాక్యము ఇదే అని నీవు అర్థం చేసుకొనగలుగుచున్నావా? ఇది దేవుని యొక్క వాగ్ధానమైయున్నది. దేవుడు లోనికి వచ్చి, అప్పుడు నీ కన్నులు తెరుచును. “ఓహ్, అది ఆయనే, అవునా?" ఆయన దానిని వాగ్దానం చేసియున్నాడు. గమనించండి, లోపల, ఆయన ఎవరో, ఏమైయున్నాడనుటకు ఆయన వారి కన్నులు తెరిచెను. ఇప్పుడు ఒకవేళ ఆయన నీ లోపలికి రాగలిగిన యెడల, ఈ రాత్రి, నీ యొక్క విశ్వాసపు వరుసలోనికి, "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడ"ని హెబ్రీ 13:8లో చెప్పబడిన సత్యమును నీకు చూపించుటకు, ఆయన నీ కన్నులు తెరువగలడు. ఒకవేళ ఆయన నీలోనికి వచ్చి మరియు ఆయన నీ కన్నులు తెరిచిన ఎడల ఆయన ఇప్పుడూ అదే విధంగా చేయును.

108. ఆ బావి యొద్ద యున్న స్త్రీకి ఆయన చేసినట్లుగా, మనం గత రాత్రి దానిని మాట్లాడియున్నాము. ఇప్పుడు గమనించండి, ఆయన ఏమైయుండునని లేఖనముల ద్వారా ఆమె ఎరిగియుండెను. ఇప్పుడు, ఆ స్త్రీని గూర్చిన మంచి కార్యము అదే అయ్యున్నది.

109. మనలో చాలామంది, ఈ రోజు, లేఖనముల ద్వారా దానిని కనుగొనలేరు, ఆయన ఈ రోజు ఏమైయుండెననునది. ప్రతీ క్రిస్మస్కు మనం ఆయనను పశువుల తొట్టిలో ఉంచుతాము. అవునండి, ఈష్టరు రోజున మనము ఒక కుందేలు తీసుకుని మరియు ఆయన పునరుద్ధానముగా చూపించెదము. మనమా విధంగా గందరగోళములో ఉన్నామనుటలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. చూసారా? అది నిజం. మనం ఎక్కడ ఉన్నామో మనము ఎరుగమనుటలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే ఆ స్త్రీ ఎరిగియుండెను, ఆమె తన హృదయంలో దానిని కలిగియుండెను. ఆమె హృదయం లోపల ఆ విత్తనమున్నది.ఈ రోజు, నా మంచి స్నేహితుడైన జాకూర్ కొరకు దానిని గీచియున్నాను.

110. ఆ పరిసయ్యులు ఏ విధంగా అక్కడ చీకటిలో ఉండియున్నారు, వారి హృదయము అక్కడ చీకటితో నిండియున్నది. దానితో ప్రారంభించుటకు, వారు జీవమును కలిగియుండలేదు. వారావిధముగా కొంచెము వెలుతురును కలిగియుండుటచేత వారు ముందుకు వెళ్ళారు, ఎందుచేతననగా వారు మత సంబంధులైయుండి మరియు ధర్మశాస్త్రమును కాపాడుటకు సహాయపడియున్నారు. మరియు ఆదియందున్న వాక్యము, వాక్యము గుండా అది ప్రకాశించుచున్నప్పుడు, పరిశుద్ధ గ్రంధము ద్వారా, వారి కొరకు; వారు నడుచుచున్నారు, కానీ వారు అక్కడ ఆ వెలుగును కలిగియుండలేదు.

111. ఇక్కడ ఈ చిన్నది, చెడ్డపేరు కలిగిన వేశ్య, ఆమె యొక్క మొదటి జీవితం ఎంత కలిగి ఉండవలెనో అంత చీకటిని కలిగియున్నది, ఆమె జీవితము ద్వారా. ఆమె ఒక వ్యభిచారిణి అయియున్నది. రెండవదిగా, చివరన కొంచెముగా వెలుగును కలిగియున్నది, ఎందుచేతననగా మెస్సయ్యా ఏమైయుండునో అను దానిపై ఆమె ఒక భావమును కలిగియున్నది.వారి మధ్యన, ఏసు ఇక్కడ నిలిచెను.

112. ఆయన ఎప్పుడైతే మెస్సయ్యా యొక్క సూచన చేసి ఆయన ఎవరో మరియు సమస్తమును వారికి చూపెనో, అది అక్కడున్న పరిసయ్యులందరినీ గ్రుడ్డివారిగా చేసినది. వారక్కడ చీకటిలోనికి పోయిరి. వారిని పట్టియుంచుటకు అక్కడ ఏదీ లేదు. వారాయనను "బయల్టెబూబు” అని పిలచిరి, ఒక దెయ్యము.మరియు వారు కలిగియున్న వెలుగు వద్ద నుండి, బయటకు వెళ్ళిపోయిరి. మరియు వారు దానిలోనే నశించిరి.

113. ఇక్కడ ఈ స్త్రీ ఉన్నది. ఉండవలసినంత పాపమనే చీకటిలో ఉన్నది. కానీ ఆమె యొక్క హృదయములో మెస్సయ్యా ఏమైయుండునో ఎరిగియున్నది. ఆయన ఏ సూచకక్రియను చూపించునో ఆమె ఎరిగియుండెను, మరియు ఆయన ఆమెకు చెప్పిన వెంటనే ...

114. "నాకు త్రాగుటకు నీళ్ళు ఇమ్ము", అని ఆయన అడిగెను. ఆమె చెప్పెను ... ఆయన ఆమె యొక్క ఆత్మను సంధించుచుండెను, ఆమె ఎక్కడ నిలబడియుండెనో చూచుటకు. మరియు ఆమె చెప్పెను, "ఇది వాడుక కాదనెను."

115. ఆయన చెప్పెను, "నీతో మాట్లాడుచున్నది ఎవరో నీవెరిగినట్లయితే, త్రాగుటకు నీవే నన్నడుగుదువు. మరియు సంభాషణ ఆ విధంగా కొనసాగుచున్నది. ఆయన సూటిగా ఆమె యొక్క తలంపులు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నవో గుర్తించెను, మరియు ఆమె హృదయములో ఉన్నదానిని కూడా.

116. ఆమె అక్కడే దానిని ఎరిగియుండెను, మెస్సయ్యా వచ్చినప్పుడు, మెస్సయ్యా దేవుడైయుండును. దేవుడు వాక్యమైయుండెను. మరియు వాక్యము హృదయము యొక్క తలంపులను బయలుపరచునదై యున్నది. (వివేచించును) అదే ప్రవక్తలలో ఉండినది. ఈ రాత్రి అమెరికాలో ఉన్న నగం పైగా బోధకులను ఆమె ఎరిగియున్నది, అది నిజము, అది ఖచ్చితముగా నిజము, మరియు ఆమె దానిలో - ఆ స్థితి. కానీ, చూడండి, ఆమె ఆ వెలుగుకు నిర్ణయించబడినది, మరియు ఆ వెలుగు బ్రద్దలవ్వగానే!

117. మరియు ఆమె ఆయనను ఒక సాధారణ వ్యక్తిగా ఊహించెను, బహుశా చమత్కారము చేయువానిగా ఊహించియుండవచ్చు. ఆమె చెప్పెను, "ఎందుకు, మా యొక్క పితరులు ఈ పర్వతంపై ఆరాధించారు. మరియు ఒక యూదునిగా ఉండి, నీవు యెరూషలేములో అని చెప్పుచున్నావు." మరియు అలాగున, సంభాషణ …"వెళ్ళి నీ భర్తను తీసుకుని ఇక్కడకు రా." అని ఆయన చెప్పెను. ఆమె చెప్పెను, "నాకు ఎటువంటి భర్త లేడు." చెప్పెను, "నీవు సత్యము చెప్పితివి. నీవు ఐదుగురిని కలిగియుంటివి.”

118, గమనించండి! ఆ చిన్న వెలుగు కణము, ఆయన ఎవరో ఎరిగియుండి,
అది చూడడానికి ఆ విధంగా ఉండును. "అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. నేనెరుగుదును, మెస్సయ్యా వచ్చినప్పుడు, ఆయన ఈ విధంగానే చేయును.ఆయన చెప్పెను, "నేనే ఆయనను.” ఆమె చెప్పెను, “అది స్థిరపరచబడెను!” చూసారా?

119. ఆమెలో ఉన్న చీకటి అంతా వెలుగుగా మార్చబడెను. అయితే దానిని నిరాకరించుట ద్వారా, ఆ పరిసయ్యులలో ఉన్న వెలుగంతా చీకటిగా మారెను. అదియే వ్యత్యాసము, వాక్యము గుండా ప్రకాశించుచున్న వెలుగు. చూశారా? ఎందుచేతననగా జగత్పునాది వేయబడక ముందే ఆమె పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంధములో పెట్టబడియున్నది, ఆమె ఇప్పుడే దానిని గుర్తించినది. అది ఆ చెడ్డ మురికి మరియు ఆ విధమైన వాటి వెనుక పడియున్న ఆ చిన్న విత్తనమును తీసుకుని మరియు దానిని శుద్ధిచేసెను.

120. అందు నిమిత్తమే ఆయన వచ్చును, జగత్పునాది వేయబడక మునుపు తండ్రి ఎవరినయితే ఆయనకు అనుగ్రహించెనో వారిని ఆ విధంగా పరిశుద్ధ పరచుటకు, ఆమెన్. అది సత్యమని నేను ఎరిగియున్నప్పుడు, నేనెంతో భక్తిగలవానిగా తలస్తున్నాను. “పొందగోరువాని వలననైననూ, ప్రయాసపడు వారి వలననైననూ కాదు గాని, దేవుని వలననే.” ఆమెన్. నీవు ఎంత చేసియున్నావు అని కాదు, లేక ఎంత చేయలేదు అని కాదు. ఏ మనుష్యుడు దేవునిని వెదకలేదు. దేవుడే నిన్ను వెదకియున్నాడు.

121. మరియు ఆ వెలుగు ప్రకాశించినప్పుడు, ఆ పరిసయ్యులు చెప్పిరి, “ఓహ్, ఆ సంగతులు మేము ముందుగానే వినియున్నాము. అతడొక బయల్డెబూబు. అది సోదె చెప్పుట.” అప్పుడు అదంతయు చీకటిలోనికి వెళ్ళిపోయెను.

122. మరియు ఈ చిన్న స్త్రీ, ఇక్కడ చీకటిలో ఉన్నది, మరియు ఇక్కడ వెలుగులో ఉన్నది. ఆమె చెప్పెను, "నీవు ఖచ్చితంగా ప్రవక్తవు. మెస్సయ్యా వచ్చినప్పుడు నేను ఎరిగియుండెదను. నేను ఆయన కొరకు ఎదురు చూచుచున్నాను. ఆయన వచ్చినప్పుడు, ఆయన అది చేయును.” ఆయన చెప్పెను, “లేదు, నేనే ఆయనను.”

123. ఆమె చెప్పెను, "రండి, నేను చేసిన పనులను గూర్చి నాతో చెప్పిన మనుష్యుని చూడండి. వాక్యము హృదయములోని తలంపులను బయటపెట్టును అంటే ఇది కాదా? ఈయన ఆ మెస్సయ్యా కాదా?” ఈ రాత్రి అమెరికా సంయుక్త
రాష్ట్రముల వారికి బోధించుటకు, ఆమె ఇక్కడ ఉండవలసియున్నది, నేను దానిని తీవ్రముగా వ్యతిరేకించినప్పటికి... ఆమె, ఆమె ఇక్కడ అటువంటిది చేయవలసి యున్నది, ఈ జనులకు మెస్సయ్య అనగా ఏమైయుండెనో చూపించును.

124. గమనించండి, ఒకసారి లోపల, వారి కన్నులు తెరిచెను, అప్పుడు, లేఖనముల ద్వారా, ఆయనను ఆయనే కనపరచెను. ఇప్పుడు ఆయన వారి కన్నులు తెరిచెను.

125. పిదప ఆమె అలా చెప్పినప్పుడు, ఆయన లోనికి వచ్చెను. ఆమె ఒక లోనికి వచ్చినది ఏమిటి? ప్రత్యక్షత; ఆ కుమారుని వెలుగు దానిపై పడినప్పుడు! ఈ విత్తనం అక్కడ ఉండియున్నది.నీవు ఒక విత్తనమును తీసుకొని ఒక రాయి క్రింద దానిని పాతిపెట్టుము.

126. ఎంతో కాలం కాలేదు, నేను చూసాను, నాలుగు వేల సంవత్సరముల క్రితం ఐగుప్తులో ఒక ప్రాంతంలో నిల్వ చేయబడిన పొద్దు తిరుగుడు పువ్వు విత్తనములు కలిగియుండిరి. మరియు వారా విత్తనములను తీసుకుని మరియు ఆ గాదెలలో ఉన్న కొన్ని గోధుమ విత్తనములను, చాలా ఏళ్ళక్రితం అక్కడ వాటిని యోసేపు ఉంచియున్నాడు. మరియు అవి నేలలో (భూమిలో) పెట్టబడినప్పుడు, మరియు సూర్యకాంతి వాటిని తాకి, అవి జీవించెను. ఆ జీవకణము అక్కడ దానిలో ఉండియున్నది.

127. ఓహ్, సహోదరుడా, భూమికి పునాదులు వేయబడక మునుపు, దేవునిలో కుమారులుగా మరియు కుమార్తెలుగా ఉండుట కొరకు మనము దేవుని చేత నిర్ణయింపబడినప్పుడు, ఆ వెలుగు దానిని తాకినప్పుడు, అక్కడ ఎటువంటి సంఘశాఖ లేదు, ఎటువంటి సంఘపు కట్టుబాట్లు లేవు, అక్కడ ఎటువంటి విమర్శలు లేవు, అక్కడ దానిని ఆపుటకు ఏదీ లేదు (ఆపజాలదు). అది జీవించును, ఎందుకనగా దేవుడు ఆ విధముగా ఉండునని చెప్పెను.

128. వారు దానిని గుర్తించిరి. వారి కన్నులు తెరువబడెను, మరియు ఆమె దానిని గుర్తించెను. ఆమె దానిని గుర్తించెను. ఒక్కసారి లోపల. ఆమె లేఖనములను ఎరిగియున్నది, ఆ కారణము చేతనే ఆమె ఆయనను గుర్తించెను.

129. ఆయన పునరుద్ధానం చెందిన తరువాత ఈ శిష్యులు లేఖనములను ఎరుగరు, ఆ కారణముచేతనే వారు ఆయనను గుర్తించలేకపోయిరి.

130. మరియు పరిసయ్యులు కూడా అదే విధంగా ఆయనను గుర్తించలేక
పోయిరి. ఆయన చెప్పెను, "లేఖనములను పరిశోధించుడి. మీరు నిత్యజీవమును కలిగియున్నారని మీరు తలంచుచున్నారు, నేను... అవే నేనెవరనేది మీకు చెప్పుచున్నది.”

131. ఓ, ఆయన అక్కడే ఉన్నాడనుటకు అది ఎటువంటి రుజువు! ఆ వాగ్ధానము రుజువుపరచబడినప్పుడు, వారి కన్నులు తెరువబడెను, మరియు వారాయనను గుర్తించిరి.

132. అదే విధంగా, కన్నులు తెరచిన అదే సంగతి, కన్నులు మూయును, కూడా. దానిని గూర్చి ఎవరైతే అపహాస్యము చేస్తారో, ఆదిలో వారు ఎక్కడైతే ఉన్నారో తిరిగి అక్కడే వారు నిత్యము ఉంచబడుదురు, మీరు చూడండి, వారి కన్నులు మూయబడ్డాయి.

133. అదే సంగతి ద్వారా పేతురు యొక్క కన్నులు తెరవబడెను. అతడు దాని కొరకు ఎదురు చూచుచున్నాడు. నతానియేలు కన్నులు కూడా. యేసు చెప్పెను, ఈ వర్తమానికులుగా వారు ఉండుటకై జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన వారిని ఎరిగియున్నాడు.

134. ఇప్పుడు మనం జీవించుచున్న ఈ కాలంలో, ఇది మీ ముందు ఉంచబడియుండగా, అది మీ కన్నులకు ఏమి చేసినది? ఇప్పుడు అదే ప్రశ్న అయ్యున్నది, అది వారికి ఏమి చేసినది అని కాదు. ఈ రాత్రి, మీరు ఎటువైపు ఉన్నారు? ఇప్పుడు మీరు పరిసయ్యులతో సంబంధం కలిగియున్నారా, లేక విశ్వాసులతో లేదా అపొస్తులులతో సంబంధం కలిగియున్నారా. ఇప్పుడు అది మీ కొరకు ఏదో చేసియున్నది. మీరు ఇప్పుడు - మీరు ఇప్పుడు దానికి వ్యతిరేకముగా ఉన్నారు. అది ఏదో చేసియున్నది. ఒకవేళ నీవు ఆ దినములో జీవించియున్నట్లయితే, నీవు ఏమి చేసేవాడివి? ఇప్పుడు నీ యొక్క ప్రస్తుత స్థితి ఏమిటి - ఏమైయున్నదో గుర్తించగలవా? అది నిన్ను ఎక్కడ ఉంచబోవుచున్నది? దాని గూర్చి ఆలోచించుము. "మంచిది, మా యొక్క సంఘము ...” అదే పరిసయ్యులు చెప్పియున్నారు. చూశారా?

135. ఆయన యొక్క పునరుద్ధానపు శక్తి ద్వారా, యేసుక్రీస్తును గుర్తించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? సమస్తమును విడిచి మరియు ఆయనతో నడుచుటకు మీరు ఇష్టపడుచున్నారా? ఇతరుల యొద్దకు ఆయన యొక్క వెలుగును మరియు జీవమును తీసుకొనిపోవుటకు, మీరు ఆయనను నమ్ముటకు సిద్ధముగా ఉన్నారా? అది ఏమి చేసినది? ఆయన దాన్ని వాగ్దానము చేసియున్నట్లుగా ఆయన ఈ చివరి
దినములలో బయలుపరచుకొనెను.

136. ఇప్పుడు నీవు చెప్పుము, "సహోదరుడా బ్రెన్హామ్, అప్పుడు మెస్సయ్యా బయలుపరచబడ్డాడు. లేఖనము అలా చెప్పినదని నేను ఎరిగియున్నాను."

137. మంచిది, ఈ దినము ఆ మెస్సయ్యే తనకు తానుగా బయలుపరచు కొనునని వాగ్దానము చేసెను. అదే సంగతి! ఇప్పుడు, హెబ్రీ 13:8, ఇప్పుడు ఆలకించుము, "నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉంటాడని" ఆయనను గుర్తింపచేయును. యోహాను 14:8 చెప్పెను. “నా యందు విశ్వాసముంచువాడు, చూడుము, నేను చేయు కార్యములు అతడు కూడా చేయును." యోహాను 14, తొమ్మిది ... ఇక్కడ మనము కనుగొనెదము, ఆయన చెప్పెను, "కొంత కాలమైన తర్వాత మరియు ఈ ప్రపంచ క్రమము, కాస్మోస్, నన్ను ఇక ఎంతమాత్రమును ఎరిగియుండదు. వారు పూర్తిగా గ్రుడ్డివారు అయిపోతారు. వారు ఇక ఎంతమాత్రము నన్ను చూడరు. కొంతకాలమైన తర్వాత వారు నన్ను చూడరు, మీ కన్నులు తెరువబడును గనుక మీరు నన్ను చూచెదరు; యుగసమాప్తి వరకు నేను మీతోను, మీలోను ఉందును.” “నిన్న, నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు.”

138. లూకా 17:28 చెప్పెను. యేసు చెప్పెను, "ఆ సొదొమ -గొమొర్రా వద్ద నాశనమైన అన్యుల వలె ఈ అంత్యదినములలో ఈ ప్రపంచము ఆ విధముగానే ఉండును." నోవహు కాలములో కాదు, ఆ జలప్రళయం (ఆ దినము యొక్క అనైతికతను ఆయన చూపెను) కానీ ఆయన చెప్పాడు, “సొదొమ దినములలో ఉండునట్లుగా ఇప్పుడు అది అన్య ప్రపంచము అది అగ్నితో నాశనము చేయబడినది. దేవుడు ఆకాశములో ఒక వర్ష ధనస్సు పెట్టియున్నాడు, ఇక "నీళ్ళు" కాదు, కానీ ఈ సమయములో అది అగ్ని. ఇప్పుడు అన్యుల ప్రపంచం నాశనమగుటకు సిద్ధముగా ఉన్నది.

139. దేశములో ఒక గొప్ప వక్రబుద్ధి ఉండునని ఆయన వాగ్ధానము చేసెను. ఒకవేళ మీరు కొన్ని చిత్రములను చూసిన ఎడల అక్కడ ఆ స్త్రీలు బట్టలను ధరించెడి విధానము, వారి యొక్క కన్నుల క్రింద ఆ నీలిరంగు కలిగి ఉండటం, చెడిపోయినట్లు వారు కనిపించుచున్నారు. ఈ దినము వారు ఏమి చేయుచున్నారో చూడుము! అనైతికత, వక్రబుద్ధి, ఓ, భయంకరమైన ఎన్నో సంగతులలో కొన్ని, మరియు ఈ దేశము దానిలో చొచ్చుకుపోయినది. మిగతా ప్రపంచాన్ని అది విడాకులలోనికి తీసుకెళ్ళుచున్నది. మన స్త్రీలు వారి-వారి-వారి యొక్క నైతిక ప్రమాణమును కోల్పోయారు. వారు ఈ దేశము యొక్క వెన్నెముకను విరిచియున్నారు. మరియు
వాటన్నిటిలో అమెరికాలో సగానికి పైగా సంగతులు వ్యభిచారముపై కట్టబడియున్నవి; నమస్తము, వారి విస్కీ, వారి పొగాకు మరియు ప్రతీది, మరియు వైద్యులు చెప్పుచున్నారు, "అది విషము, అది మిమ్ములను చంపివేయును." వారు అదే విధముగా, ఇప్పుడును పీల్చుచున్నారు. ఏదేమైనప్పటికి, వారు దానిని చేయుదురు, హెచ్చరికను గ్రహించే స్థితి వారికి లేదు.

140. మరియు వారి యొక్క జుట్టును కత్తిరించుకొనరాదని మరియు అటువంటివి చేయవద్దని లేఖనములు చెప్పుచున్నవి. మరియు ఈ ప్రపంచం యొక్క స్త్రీలను గూర్చి నేను మాట్లాడటం లేదు; ఏదేమైనప్పటికి వారు ఆ ఫిరంగికి మేతగా ఉన్నారు. కానీ పెంతుకొస్తు స్త్రీలైన మీ కొరకు నేను మాట్లాడుచున్నాను. మీరు వారికంటే బాగా ఎరిగియున్నారు. బైబిల్ చెప్పుచున్నది సంసోను యొక్క జుట్టు అతన్ని వేరుపరచింది; దేవుని యొక్క వాక్యము కొరకు ఒక నాజీరు చేయబడిన జన్మ అతన్ని వేరుపరచింది. స్త్రీలారా, అది మీకును అదే చేయును, ఒక ప్రత్యేకపరచబడిన వ్యక్తి. మరియు ఆ నాజీరు వాక్యము కొరకు ప్రత్యేకపరచబడును, లోకము యొక్క సంగతులకు దూరముగా, మరియు నీవు దానిని బోధించి, దానిని కేకవేసి మరియు దానిని అరచి, మరియు తర్వాత సంవత్సరం తిరిగి రమ్ము మరియు నీవు అక్కడ ఉన్నప్పుడు అది నీకు మిక్కిలి హీనముగా ఉండును. ఈ లోకమంతటి కొరకు, అక్కడ ఏదీ మిగలదు కానీ దేవుని యొక్క దైవిక తీర్పు, ఆ అణుబాంబులు మరియు ఆ రాకెట్ ద్వారా పంపబడే ఆయుధములు (మిస్సైల్స్) మరియు మిగిలినవన్ని.

141. ఆ టి.వి.లలో హాస్యనటులు, మరియు చెప్పును, మరియు-మరియు రేడియో మరియు ఇవన్ని, ఈలలు వేయుచు మరియు పాటలు పాడుదురు, మరియు మురికి ఛలోక్తులు పేల్చుదురు, మరియు శాప వచనములు పలుకుదురు, మరియు అనుమతి లేని భయంకరమైన సంగతులు పలుకుదురు. మరియు వార్తా పత్రికలంతా మరియు ఆ యొక్క దిగంబరత్వంతో, అనైతికమైన స్త్రీలతో, ప్రతీదానితో, మీ యొక్క మనస్సును ఆనందముగా ఉంచుటకు ప్రయత్నిస్తూ మిమ్మల్ని ప్రశాంతపరచుటకు ప్రయత్నిస్తూ వేయబడుచున్నవి. అది ఒక చిన్నబాలుడు ఈల వేయుచు చీకటిలో, ఆ సమాధుల గుండా వెళ్ళుచూ, అతడు తనకుతానుగా భయము లేనివాడుగా ఆలోచించ ప్రయత్నిస్తూ ఉండుట నాకు గుర్తుకొస్తున్నది. నీవు చావుకు భయపడుదువు, మరియు అది మీకు తెలుసు. నీవు తీర్పు కొరకే ఉన్నావని నీవు ఎరిగియున్నావు. మరియు అది వచ్చుచున్నది ఎందుకంటే నీవు పరిశుద్ధాత్మను దూషించియున్నావు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తును నీవు త్రోసివేసియున్నావు. ఖచ్చితముగా వారి కన్నులు మూయబడినవి. వారు దాన్ని ఎరిగియుండలేదు.

142. సొదొమ మరియు గొమొర్రా, యేసు చెప్పెను, "సొదొమ మరియు గొమొర్రాలో అది ఉన్నట్లుగా. దాన్ని మీకు గత రాత్రి మరలా చెప్పియున్నాను, చరిత్రలో ఈ విధముగా ఉన్నట్లుగా ఎన్నడూ లేదు. చూడుము, లోతు ఎల్లప్పుడు అక్కడ మూడు తరగతులకు చెందిన ప్రజలు ఉందురు.

143, లోతు సంఘమునకు సూచనగా ఉన్నాడు, నామకార్ధముగా. అతను అక్కడ ఆ సొదొమలో ఉండియున్నాడు, అక్కడ ఆ స్త్రీలు వారియొక్క తలవెంట్రుకలు కత్తిరించుకొనుచున్నారు, మరియు వారు గొప్ప సంగతులను కలిగియున్నారు, మరియు అతడు ఆ పట్టణమునకు ఒక ముఖ్య వ్యక్తి, మరియు అటువంటి గొప్ప సంగతులు మరియు, "నన్ను చెప్పనివ్వుము.” కానీ, వాస్తవముగా, అతని హృదయములో అది అతని ప్రాణమును విసిగించెను. అతడు మంచిగా (సత్యమును) ఎరిగియుండెను; అతడు అబ్రహాముతో ఉండియున్నాడు.

144. ఆదిలో, అబ్రహాము ఎన్నడూ అందులోనికి వెళ్ళలేదు. అతడు రాబోయే కుమారుడి కొరకు, ఒక వాగ్దాన కుమారుడి కొరకు ఎదురుచూస్తూ ఉన్న, దేవుని చేత వాగ్దానము చేయబడిన ఎన్నుకొనబడినవాడు.

145. సొదొమ ఇంకనూ దాని సంగతులతో ఉండియున్నది. మరియు గుర్తించుకొనుము, ఆ ఇద్దరు దేవదూతలు అక్కడ బోధించుటకు వెళ్ళియున్నారు. అబ్రహాము మరియు అతని సమూహముతో ఒకరు నిలచియున్నారు.

146. ఇప్పుడు, గమనించండి, వారు బోధించుటకు అక్కడకు వెళ్ళియున్నారు. మరియు, గుర్తించుకొనుము, మనము సంఘకాలములలో ఉండియున్నాము, ఇప్పటివరకు తన పేరు చివరన H-a-m అని కలిగియున్న వ్యక్తి సంఘమునకు పంపబడియుండలేదు. G-r-a-h-a-m ఆ బబులోనులో ఉన్న సంఘమునకు మరియు సొదొమనకు అతడు ఘడియ వర్తమానికుడు. గొప్ప సువార్తికుడు దానిలో కూడా గొప్ప కార్యములను చేయుచున్నాడు. కుడి మరియు ఎడమకు ఆయన వారిని గద్దించుచుండెను. దానిపై వారు ఎటువంటి శ్రద్ధ వహించలేదు. అతడు చెప్పెను, “నేను ఆరు వారములలో ముప్పై వేల మందిని కలిగియుందును. ఆరు వారముల తర్వాత అక్కడకు వెళ్ళుము, ముప్పై మంది కూడా లేరు. 

147. విషయం ఏమైయున్నది? వారు ఎక్కడికీ వెళ్ళియుండలేదు. వారు ఆ
చూయింగ్ గమ్ను నములుచూ, పొగ త్రాగుచు, మరియు ప్రతీదాన్ని చేయుచున్నారు, ఒక ఒప్పుకోలు కొరకు, లేదా వారు ఏదైనా పిలవచ్చు “ఒక నిర్ణయం." అది సరియే, దేవుడు చెప్పిన విధముగా సువార్తికులు వెళ్ళవలెను.

148. నా వరకు, అది ఒక నిర్ణయము కాదు. అది ఒక జన్మ! నీవు జన్మించవలెను. ఏదైనా సంభవించుటకు నీవు ఏదైనను పొందవలసియున్నది.

ఇక్కడ మనము ఉన్నాము, ఏ విధముగానైనా, అక్కడ, h-a-m

149. గమనించండి, ఇక్కడ కొండపైన, అబ్రహాముతో అక్కడ ఒకరు నిలిచియున్నారు, కానీ ఆయన ఎటువంటి సూచనను చూపియున్నాడో గమనించండి. మరియు అది అబ్ర... అబ్రహాముకు దేవుడు సూచన వెంబడి సూచన చూపెను, కానీ అది ఆ వాగ్దాన కుమారుడు వచ్చుటకు ముందు చివరది; చివరది. ఆ మనుష్యుడు, ఆయన ఒక మానవుని వలె కనిపించెను. ఆయన కేవలం ఒక సామాన్యమైన మానవుని వలె ఉండెను, వస్త్రములు ధరించెను; ఆ యొక్క వస్త్రములపై దుమ్ము ఉన్నది, ఆయన ఒక ప్రయాణములో ఉన్నానని చెప్పెను, అబ్రహాము ఆయన పాదములను కడిగెను.

241

తేది 150. మరియు అంతట ఆయన అక్కడ కూర్చునియున్నప్పుడు, ఆయన వెనుక గుడారము ఉన్నది, ఇప్పుడు గమనించుము, ఆయన చెప్పెను, “అబ్రహాము.” ఒకటి లేదా రెండు దినములు మునుపు, అతడు అబ్రాము, మరియు ఆమె శారాయి, S-a-r-a. ఇప్పుడు ఆమె S-a-r-a-h అయినది, “రాజకుమార్తె.” అతడు అబ్రాము కాడు. అబ్రహాము, “జనములకు తండ్రి.” అతని యొక్క పేరును ఆయన మార్చవలెను. గమనించుము, ఆయన చెప్పెను, "అబ్రహామా, నీ భార్య అయిన శారా, ఎక్కడ?"

151. మరియు గుర్తించుకొనుడి, అతనికి నూరు సంవత్సరములు మరియు ఆమెకు తొంభై సంవత్సరములు చెప్పెను, "ఆమె నీ వెనుక గుడారములో యున్నది.”

152. ఆయన చెప్పెను, "వాగ్దాన ప్రకారము నేను నిన్ను దర్శించబోవు చున్నాను.” చూశారా? మరియు అవి ఇరవై ఎనిమిది రోజులు, శారాతో.

153. మరియు శారా నవ్వెను, తనలో తను ఈ విధంగా, అనుకొనెను. “ముసలిదాననైన నేనా, నా యజమానుడితో ఆనందించగలనా; అతడు కూడా వృద్ధుడే?”

154. ఆయన చెప్పెను, " 'ఇవి ఎలా జరుగునని' తన మనసులో అనుకొనుచూ
శారా దానిని ఎందుకు సందేహించినది?”

మరియు ఆమె దానిని త్రోసిపుచ్చెను.

కానీ ఆయన చెప్పెను, "అవును నీవావిధంగా అనుకొన్నావు."

యేసు చెప్పెను, “అదే విధముగా ...”

155. ఇప్పుడు గమనించండి. అబ్రహాము ఏ విధంగా దానిని కనుగొన్నాడు. (గుర్తించాడు)? ఇప్పుడు, అబ్రహాము ఆయనను "ఎలోహిం" అని పిలిచెను. బైబిల్ చదవరులారా అది సత్యమని ఎంతమందికి తెలుసు? అవునండీ, ఎలోహిం అన్నిటికీ చాలినవాడు, స్వయముగా ఆ గొప్ప సృష్టికర్తే. ఎందుకతడు ఆయనను ఎలోహిం అని పిలిచెను? ఎందుచేతననగా ఆయన హృదయములోనున్న తలంపులను బహిర్గతం చేసెను. అదియే వాక్యము. హెబ్రీ:4 చెప్పెను. “దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము కంటెనూ వాడియైనది, కీళ్లను, మూలుగులను ప్రాణాత్మలను చేధించును, మరియు హృదయము యొక్క తలంపులను మరియు ఆలోచనలను శోధించును."

156. ఆ విధముగానే, ప్రవక్తలు, ఏసు వారిని “దైవములు” అని పిలిచెను. ఆ విధంగానే యేసు ఆయనను నిరూపించుకొనెను, మరియు ఆయన వాక్యమని ఆ స్త్రీ ఎరిగియుండెను. ఆయన తలంపులను బయలుపరచగలడు. మరియు ఏసు చెప్పెను, "సొదొమ దినములలో ఉండినట్లుగా, మనుష్యకుమారుని దినములలో ఉండును, మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచబడునప్పుడు.”

157. అది మీ కన్నులకు ఏమి చేసినది? ఈ రాత్రి ఆయన లోనికి రాగలుగునా? ఆయన వచ్చునని నేను ఆశిస్తున్నాను. దానిని జ్ఞాపకముంచుకొనండి, మన హృదయమంతటితో దానిని నమ్మి. మరియు గౌరవముతో ఉందము.

158. జ్ఞాపకముంచుకొనండి, ఆయన వాగ్ధానము చేసెను, మలాకీ :4 అక్కడ ఒక వర్తమానము రాబోవుచున్నది. “అది మరొక్కసారి తండ్రుల యొక్క విశ్వాసమును పునరుద్ధరించును, పిల్లలను తండ్రులు యొక్క విశ్వాసమునకు (యొద్దకు) తెచ్చును.” ఓహ్, పెంతెకొస్తు అధ్యాపకులారా, మీ యొక్క సంఘశాఖలలో మీరు కలిగియున్న బేధములకు దూరముగా, మరియు మీరు మరింత స్వార్ధముతో నిండి మరియు పోట్లాడుకొనుచున్న మీ యొక్క సిద్ధాంతములు, మరియు సంగతుల నుండి, ఈ దినమున మీ గ్రుడ్డి కన్నులను దేవుడు తెరచి మరియు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు దేవుని కుమారుడుని చూచునట్లు చేయును గాక. రెండు వేల సంవత్సరములు, మరియు ఆయన ఇంకనూ సజీవుడై మరియు ఈ రాత్రి ఆయన
వాగ్ధానమును రుజువు చేయుచూ మనమధ్యన ఉన్నాడు.

159. ఈ రాత్రి, దేవుడు ఎమ్మాయి మార్గములో వారికి చేసిన విధంగానే ఆయన మనకును చేయును, తలుపులను మూసి ఒకదానిని మనకు బయలు పరుచును. గుర్తుంచుకొనండి, అది ఆయనే అని వారు గుర్తించగలుగుటకు కారణము సిలువలో మరణించుటకు ముందు ఆయన ఏమి చేసెనో అదే విధంగా ఆయన చేసియున్నాడు; మరియు ఆయన వారి కన్నుల ముందే అదృశ్యమై పోయెను, వారికి దూరముగా, ఆయన ఆ విధముగా చేసియున్నాడు. ఈ రాత్రి బహుశా ఆయన మన మధ్యకు వచ్చి, మన మధ్యలో, మరియు మన కన్నులు తెరచును, మరియు ఆయన భూమిపై ఉన్నప్పుడు చేసిన అవే సంగతులు చేయుట ద్వారా ఆయన మనకు ప్రత్యక్షపరచుకొనును, ఎందుచేతననగా ఆయన దానిని వాగ్దానము చేసియున్నాడు. ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మనకు కనిపించిన విధముగా మనమాయనను చూచుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక.

మన తలలు వంచుదము (టేపులో ఖాళీ స్థలమున్నది).

160. నా గమ్యము ఏమిటి? నా గమ్యం వెనుక గల నా ఉద్దేశ్యం ఏమిటి? ప్రభువైన దేవా, నేను అవునని లేక కాదని చెప్పలేను. దీనిని నీవు మాత్రమే బలవంతము చేయుచున్నావు. నీవు దీనిని వాగ్దానము చేసియున్నావు, మరియు నీ ప్రజలు దానిని చూసి అర్ధము చేసుకొనులాగున దయచేయము అని ఈ రాత్రి నేను ప్రార్ధించుచున్నాను. వారిని, ఒక్కసారి, ప్రభువా, వారి హృదయములను తెరువుము, విశాలపరచుము, “ప్రభువా, లోనికి రమ్ము, ఇప్పుడు నీవు మాకు బయలు పరచుకొనుము." అని చెప్పులాగున. మరియు అప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడును గాక, దానిని గ్రహించుటకు

861

161. ఈ రాత్రి ఈ భవనములో ఏ ఒక్క పాపి విడచిపెట్టబడకుండును గాక, ఒక అవిశ్వాసిగాని. ఓహ్, బహుశా ఇక్కడున్న వారు అలాంటి వారై ఉండవచ్చు, వారొక ... వారిని పాపి అని పిలుచుటలో కొంచెము నాపై కోపపడెదరు. కానీ, తండ్రి, దేవా, మతసంబంధమైన (దైవభక్తి గలిగిన) మరియు విధేయులైన మతస్తులు, ఆ పరిసయ్యులను నీవు "దెయ్యములు" అని పిలిచావు, “మీరు అపవాది అయిన మీ తండ్రి సంబంధులు, మరియు అతడి క్రియలు మీరు చేయుదురు," అని చెప్పెను, ఎందుకనగా రుజువు చేయబడిన వాక్యమును, మెస్సయ్యాను వారు గుర్తించలేదు. వారు ఆయనను నమ్మగలరు, ఆత్మలో; కానీ శరీరములో ఉన్నప్పుడు,
నమ్మలేరు. మరియు, ఇంకా, ఆయన "దేవుడు మనతో ఉన్నాడు". అని వారి లేఖనములు చెప్పుచున్నవి.

162. తండ్రీ, ఈ రాత్రి మరలా దానిని దయచేయుమని నేను ప్రార్ధించుచున్నాను. ఇక్కడ ఉన్నవారిలో ఎవరైనా వారి కన్నులు తెరువబడవలెనని ఆశించుచున్నారా? ప్రత్యక్షత గ్రంధము 3వ అధ్యాయములో నీవు వాగ్ధానము చేసినట్లుగా కాటుకను వారికి దయచేయుము, ఈ లవొదికయ సంఘకాలములో; కాటుకను కొనుము, ఈ రాత్రి వారి యొక్క కన్నులు ఖచ్చితంగా తెరవబడును. అది ఖచ్చితంగా వారు జీవించుచున్న ఘడియను, మరియు ఈ ఘడియకైన దేవుని వాగ్ధానము యొక్క రుజువును గుర్తించునట్లు చేయును. ఏసుక్రీస్తు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.

163. ప్రార్ధన కార్డులు ఏమిటి? కె. మనమెక్కడ నుండి ... మనము ఒకటి నుండి ప్రారంభించాము, గతరాత్రి, అవును కదా? (ఎవరో చెప్పుచున్నారు, “అవును, అయ్యా" -సంపా) కానీ మనము ఎక్కువ సమయమును కలిగిలేము, కేవలం పదిహేను లేదా ఇరవై నిమిషములు మాత్రమే. ప్రారంభించెదము... మరియు అతడు ప్రార్ధన కార్డు కె ఇచ్చియున్నాడు. ఇప్పుడు మీ కార్డులను పట్టుకొనియుండండి, మేము ప్రతీ ఒక్కరినీ సమీపించబోవుచున్నాము.

164. ఇది, ఇప్పుడే ఏదో, మాట్లాడిన తరువాత ... అది ఈ విధముగా జరుగును, మాట్లాడునది ఎవరైనప్పటికి, వారు మాట్లాడియున్నారు. దానిని మీరు గుర్తించుకొనండి, ఇప్పుడు నేను వచ్చి మరియు ప్రార్ధనా వరుసను ప్రారంభించెదను. అది చాలా సులభమైనది. కానీ, ఈ రోజు, నేను-నేను-నేను మరి ఏదో చేయవలసి యున్నాను. చూశారా? మరియు నేను-నేను దీనిని తీసుకురావలసియున్నాను, అది అంతే. ఒకవేళ అది స్వీకరించబడిన యెడల ... నేను-నేను కేవలం విత్తనమును విత్తగలను. నేను వాటిని జీవించులాగున చేయలేను. అది ఒక మంచి నేలను పడవలసియున్నది.

165. మీకు తెలుసు, ఆయన యొక్క విత్తనం, వారు చెప్పారు ఆయన విత్తియున్నాడు. కొన్ని త్రోవ పక్కన పడెను, అది ఏ మంచి చేయలేదు. కొన్ని ముళ్ళ తుప్పలలో పడెను, కానీ మరియు కొన్ని రాతి నేలను పడెను. కానీ కొన్ని మంచి నేలను పడెను. అవియే దేవుని కుమారులై ఉండెను. రాజాఅదే విధముగా, నేను కేవలం విత్తనములను విత్తగలను. చూశారా?

166. ఆయన నా అజ్ఞానమును తీసుకొని, ఒక ప్రక్కన పెట్టును గాక; మరియు
నేను ఆయనను నమ్మునట్లు, నా హృదయమును తీసుకొని, మరియు క్రిందకి చూసి మరియు నేను ఆయనను ప్రేమించుచున్నానో లేదో చూచును; మరియు అప్పుడు నా యొక్క పాపములన్నిటిని క్షమించును, ఆయన-ఆయన నా నుండి మహిమను పొందుకొనుటకు ఏవిధముగానైనను నన్ను ఆయన పయోగించుకొనును. జీవము లేక మరణము, అనునది సమస్య కాదు, అది కేవలం ఆయనను మహిమ పరచును. 白

167. ప్రభువైన ఏసుక్రీస్తు నామములో, నేనిప్పుడు అందరిని అడుగు చున్నాను, దయచేసి కొన్ని నిమిషములు కూర్చొనండి. అటు ఇటు తిరుగవద్దు. ఇది ఎల్లప్పుడు ఈ విధముగా జరుగును. ఏసుక్రీస్తు యొక్క బయలుపాటు యొక్క ఆకాంక్షను మీరు ఊహించగలరా?

168. ఇప్పుడు నేనిక్కడ నడచిన యెడల, ఒక మానవునిగా, “నేను ప్రభువైన ఏసును" అని చెప్పుచూ, పొడవైన జుట్టు కలిగియుండి; ఆయన చేయునో లేదో మనకు తెలియదు. “నా చేతులలో మేకులు గాయములను కలిగియున్నాను," ఉహ్ ఉహ్ ఏ వేషధారి అయినా ఆ విధముగా చేయును. “నేను నూనెను, మరియు రక్తమును కలిగియున్నాను, మరియు అన్నీ...” అది, ఇంకనూ, అది కలిగిలేదు వాక్యము దానిని వాగ్దానము చేసియుండలేదు.

169. నీవు యేసును ఏ విధంగా కనుగొనగలవు? నీవు గొనలేవు. నీవు చెప్పవచ్చు, “మంచిది, నేను ఆయనను ఆయన యొక్క చిత్రము ద్వారా గుర్తించెదను". లేదు దానిని ఒక మానసిక శాస్త్రము చిత్రించినది. ఆయన చూచుటకు ఏ విధంగా ఉన్నాడో మనకు తెలియదు. చూశారా? ఆయన ఏమిటో నేనెరుగను. అదియే, చూడండి. అది ఆ విధంగా ఉండవలయును.

170. ఇస్సాకు ఎలా ఉండునో రిబ్కా ఎరిగియుండలేదు, కానీ ఏమైనప్పటికి, అది ప్రేమయై ఉన్నది. చూశారా? చూచుటకు అతడు ఎలా ఉండునో ఆమెకు తెలియదు; ఆమె కేవలం వెళ్ళవలసియున్నది. మాదిరులు! ఆమె అతనిని చూచెను. మరియు అతనిని ప్రేమించెను. ఏ విధముగానైనా ఆమె వెళ్ళుటకు ఇష్టపడినది, అతడు ఎలా ఉన్నప్పటికి అది పెద్ద విషయము కాదు.

171. కానీ ఏ విధముగా నేనాయనను కనుగొనగలను? ఏసు చెప్పెను “వారి ఫలముల ద్వారా వారు తెలియబడును." ఇప్పుడు ఏసు ఇక్కడ ఉండిన యెడల, ఆయన నావలె ఒక భౌతికశరీర రూపములో ఉండడు, ఎందుచేతననగా ఆ శరీరము సింహాసనాసీనుడైన వాని కుడి పార్శ్వమున ఉండియున్నది. అయితే ఆయన యొక్క జీవము ఇక్కడ ఉండియున్నది.

172 మరియు, జ్ఞాపకముంచుకొనండి, ఇదియే ఆఖరి వాగ్దానము, సంఘము పొందుకొను అఖరి సూచన, వాగ్దానము చేయబడిన సూచన వాగ్దాన కుమారుడు (తిరిగి) మరలా వచ్చుటకు ముందు. మీరు ఎరుగుదురు, ఆ లేఖనము తప్పిపోదు. సొదొమ తరువాత వెంటనే, వాగ్దాన కుమారుడు వచ్చెను, మరియు సొదొమ కాల్చబడెను. మరలా అదే విధముగా జరుగును!

173. ఈ ప్రార్ధన కార్డు నుండి పిలచెదము, దానిని గూర్చి చెప్పెను ఎక్కడ నుండి ప్రారంభించుదము, ఒకటి నుండి పదిహేను వరకు, గతరాత్రి? మరియొక పదిహేను తీసుకొనెదము, ఎనభై ఐదు నుండి వంద వరకు. ప్రార్ధనా కార్డు కె. అదేనా, కె? కె, ఎనభై ఐదు, ఎవరు కలిగియున్నారు? మీ చేయి పైకెత్తండి, అవును, ఎక్కడ ఉన్నారు? ఎనభై ఐదు, ఇక్కడకు రండి, ఎనభై ఆరు, ఎనభై ఏడు, ఎనభై ఎనిమిది, ఎనభై తొమ్మిది, తొంభై, కె లో. తొంభై, తొంభై ఐదు, వంద, ఒక్క క్షణము, ఇక్కడ నిలిచియున్న మిగతా జనాంగముతో మాట్లాడుచుండగా ఇక్కడ వరుసలో నిలబడండి.

174. ఇక్కడ ఎంతమంది ప్రార్ధనా కార్డులు కలిగియుండలేదు? మరియు మీరు నిజముగా యదార్ధపరులు, మరియు దేవుని నుండి సహాయము పొందాలని మీరు ఆశించుచున్న ఎడల మీ చేతులు పైకెత్తండి. "సహోదరుడా బ్రెన్హాం, నాకు ప్రార్ధనా కార్డు లేదు," ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఎటూ కదలవద్దు. ష్! బయటకు వచ్చుచున్న వారిని రానివ్వండి, ఇక్కడకు రండి, ఒక్క నిమిషం ఇప్పుడు నిజముగా గౌరవముగా ఉండండి, కేవలం కొన్ని నిమిషములు.

175. ఆలోచించండి, మనము భూమ్యాకాశములకు న్యాయాధిపతి అయిన వాని సన్నిధిలో ఉన్నాము. ఆయన ఇక్కడ నిలచియుండుట మనము చూడగలిగి న్నట్లయితే మనము ఎంత గౌరవముగా యుండవలెను? మీరు మీ యొక్క మోకాళ్ళపై ఉండి ఏడ్చుచూ అరచుచూ, సమస్తమూ. అయితే ఆయన ఇక్కడున్నాడు. ఆయన దానిని వాగ్దానము చేసెను, "ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడుకుంటారో ..." ఎందుచేతననగా నీవు దానిని చెప్పియున్నావు, "ఇక్కడ ఒక నామము ఉన్నది," దాని అర్ధము అది కాదు. దాని భావము, "... ఆయన నామములో, నేను వారి మధ్యలో ఉన్నాను." గమనించండి.

176. ఇప్పుడు నేను పిలచిన వారందరూ ఇక్కడున్నారా? లేరు. కె, ఎనభై ఐదు, నేను పిలచినది అదే కదా, లేక తొంభై? (ఎవరో చెప్పుచున్నారు, “ఎనభై ఐదు.") ఎనభై ఐదు, ఎనభై ఐదు నుండి వంద వరకు, ఇక్కడ నిలబడండి. మీరు రాలేనట్లయితే, కొంత

177. ఇక్కడ ఒక వ్యక్తి మంచంపై ఉన్నాడు, ఎవరైనా అతని కార్డు సరి చూడండి. బహుశా ఆ వ్యక్తి నడవలేకపోవచ్చు. అయితే చూడండి. ఆ సంఖ్య అతనిదేమో చూడండి. అతని చేతిలో ప్రార్ధనా కార్డును నేను చూచుచున్నాను. ఒకవేళ అది అతడే అయినట్లయితే, ఎందుకు, అతనిని మీరు ప్రార్ధన వరుసలోనికి తీసుకొనిరండి. కె, ఎనభై ఐదు నుండి వంద వరకు. అక్కడ ఎవరయినా లేవలేకున్నట్లయితే, ఒకవేళ వారు చెవిటివారయితే; మీ చుట్టూవున్న వారి కార్డులు ఒకరినొకరు చూడండి. మరియు మీరు దానిని చేయుచుండగా, మిగతా వారందరూ ఇక్కడ నా వైపు చూడండి.

178. ఇప్పుడు నీవు దానిని నమ్ముచున్నావా, "ఆయన, ఆదిలో, వాక్యమై యుండెను, మరియు వాక్యము దేవుని యొద్ద యుండెను, మరియు వాక్యము దేవుడైయుండెను; మరియు ఆ వాక్యం శరీరము ధరించి మన మధ్య నివశించెను"? "నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు." నీవు దానిని నమ్ముచున్నావా? అప్పుడు, వాక్యము ఎల్లప్పుడూ ఏమి చేయుచున్నది, అది హృదయం యొక్క ఆలోచనలను బట్టబయలు చేయుచున్నది. ఆ కారణము చేత జనులు యేసే మెస్సయ్యా అని ఎరిగియున్నారు. అది నిజమేనా? ఎంతమందికి అది తెలుసు?

179. ఇప్పుడు, అక్కడ ఒక చిన్న స్త్రీ యున్నది, ఒకసారి, ఆయన వస్త్రపు చెంగును ముట్టిన యెడల తాను బాగవుదునని ఆమె నమ్మియున్నది. మీకా కథ జ్ఞాపకమున్నదా? ఇప్పుడు, గుర్తించుకొనండి, ఆమె కేవలం నమ్మినది. అప్పుడు ఆయన భౌతిక రూపములో ఉండెను.

180. మరియు, గుర్తించుకొనండి, ఆయన కేవలము దానిని ఒక్కసారి చేసియున్నాడు. ఆయన కేవలం ఆ స్త్రీ ఏమి చేసినదో చెప్పియున్నాడు; ఆమె అనేక మంది భర్తలను కలిగియున్నది. మరియు ఆ సుకారు పట్టణమంతా ఆయన యందు విశ్వాసముంచిరి. ఎందుకనగా ఆ స్త్రీ యొక్క సాక్ష్యమును బట్టి, మరియు ఆమె ఒక వేశ్య.

181. మరియు ఇప్పుడు, ఒక దేవుని యొక్క సేవకుడు దేవునిచే నియమింపబడిన వ్యక్తి, సువార్తతో, వారికి చెప్పిన ఎడల వారు నమ్మరు. వారు ఇంకనూ, దానిని నమ్మరు. చూశారా? చూశారా? కేవలం మసక, చీకటి! మంచి దానికొరకు సముఖత కలిగియుండు, మొత్తము ప్రపంచము, దానిపై ఒక ఒత్తిడి ఉండియున్నట్లుగా కనిపించుచున్నది. కేవలం, దానిని ఏ విధంగా వివరించవలెనో నాకు తెలియదు, కానీ అది ఇక్కడ ఉన్నది. స్నేహితులారా మేల్కొనండి! అది మనము ఆలోచించిన దానికంటే ఆలస్యమైనది.

182. ఇప్పుడు మీరు అక్కడ కూర్చుని మరియు ఆయన వైపు చూడుము. ఇప్పుడు బైబిల్ చెప్పుచున్నది, హెబ్రి : 4వ అధ్యాయంలో, అది, “మన బలహీనతల యందు మనతో సహానుభవము గల ఆయన ప్రధానయాజకుడైయుండెను." అది నిజమేనా! ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడైనట్లయితే, మరియు మీరాయనను తాకియున్నారు, ఆ స్త్రీ తాకినట్లుగానే మీరును తాకియున్నారు. ఇప్పుడు, ఆయన ఒక భౌతికమైన తాకిడిని అనుభవించలేదు; ఆయన చెప్పెను, "ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయెను నేను బలహీనుడనైతిని." ప్రభావము ఆయన నుండి వెళ్ళిపోయెను. ఇప్పుడు ఆయన ఇంకనూ అదే ప్రధానయాజకుడైనట్లయితే, నీవింకనూ ఆయన నుండి ప్రభావము లాగుకొనగలవు, ఎందుకనగా ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు.

183. ఆయన ఇప్పుడు ఏ విధంగా చేయును? దేవుడు చెప్పినట్లుగా, సొదొమ దినములలో, ఆ సూచన ఏమిటి? దేవుడు; ఎలోహిం, మానవ రూపంలో (శరీరంలో), అది తినును, త్రాగును. నీవు దానిని అర్ధం చేసుకున్నావా? ఏసు మానవ శరీరంలో ఉన్న దేవుడు. ఆ కారణం చేతనే ఆయన హృదయం యొక్క తలంపులను బయలుపరచెను, మానవునిలో దేవుడు! మరలా దానిని చేసియున్నాడు, కడవరి దినములలో అది మరలా జరుగునని చెప్పబడెను. "ఆయన బయలుపరచుకొను నప్పుడు, అది సొదొమ దినములలో ఉండినట్లుగా యుండును." డజన్ల సార్లు, డజన్ల కొద్ది లేఖనములు దాన్ని మీ ముందు నిరూపించును. కానీ నీవు దానిని అనువదింపవలసిన అవసరము లేదు; అది సరి అయినట్లయితే దేవుడు దానిని అనువదించును. అది సరి అని ఆయన నిరూపించును. ఇప్పుడు విశ్వాసమును మరియు నమ్మికను కలిగియుండండి. ఆయన నుండి వచ్చు ఒక్క మాట దానిని స్థిరపరచును.

184. ఇప్పుడు, పరలోకపు తండ్రీ, ఇది నీ వాక్యమై యున్నది, నేను ఎరిగియున్న ఉత్తమమైనది. ఇప్పుడు అన్నియూ నీ చేతులలో ఉన్నవి, తండ్రీ. వినుచున్న వీరితో, నన్ను నీకు సమర్పించుకొనుచున్నాను. ఈలాగున ఈ రాత్రి, మేము ఇక్కడ నుండి వెళ్ళుచుండగా, మేము ఈవిధముగా చెప్పుదుము గాక, “ఆయన మనతో ఉన్నప్పుడు మన ప్రభువైన ఏసు, పరిశుద్ధాత్మ రూపంలో, అక్కడ మనతో మాట్లాడుచుండగా, మన హృదయములు మండలేదా?" దానిని దయ చేయుము, తండ్రీ. యేసు నామములో నేను ప్రార్ధించుచున్నాను. ఆయన మహిమార్ధమై ఆమేన్.

185. ఇప్పుడు విశ్వాసం కలిగియుందండి, నమ్మండి. నేను నమ్ముచున్నాను. సహోదరుడు పెర్రీ దీనిని ఇక్కడ త్రిప్పబోవుచున్నాడు, కేవలం ఒక నిమిషములో,

186, మరియు ఇప్పుడు, జ్ఞాపకముంచుకొనండి, ఈ ప్రజలను నేను ఎరుగను, వారు ... ఇక్కడ ఉన్న సేవకులను నేనెరుగుదును. ప్రతీ ఒక్కరినీ నేనెరుగుదును. నాకు తెలిసిన వారు ఎవరూ ఉన్నట్లుగా నేను చూడలేదు. కొంతమంది నాకు తెలిసిన ప్రజలు ఇక్కడ ఉందురని నేను ఎరిగియున్నాను. నేను పొరబడ నట్లయితే, ఇక్కడ కూర్చునియున్నది సహోదరుడు పేట్ టేలర్ అని నేను తలంచుచున్నాను; నేను ఖచ్చితం కాకపోవచ్చు, కూర్చునియున్న....

187. ప్రార్ధనా వరుసలో, నేను కానట్లయితే, నీ గురించి నాకేమి తెలియదని నీకు తెలుసు, నీ యొక్క చేతులు పైకెత్తుము. అక్కడ ప్రార్ధన వరుసలో ఉన్న నీవు, ఆ కార్డును కలిగియున్నావు, ముందుకు వచ్చి, నీ చేతులను పైకెత్తుము. అవును, అయ్యా, ఇప్పుడు, వెలుపల అక్కడ, నీకును అదియే తెలుసు.

188. ఇప్పుడు ఇక్కడ సత్యమున్నది. ఆయన మరణం నుండి తిరిగి లేచినయెడల, అప్పుడు దేవుడు మానవ స్వరూపంలో వచ్చి తనను బయలుపరచు కొనునని ఆయన వాగ్దానము చేసియున్నాడు. ఇప్పుడు, ఆయన నన్నెంతగా అభిషేకించినా గానీ దానిని నమ్ముటకు నీవు కూడా విశ్వాసం ద్వారా అభిషేకం పొందవలసియున్నది. చూశారా? అది మనలను ఇరువురినీ తీసుకొనును. నీవు ... ఆయన యొక్క వస్త్రములను తాకిన ఆ స్త్రీ, ఆమె దానిని నమ్మియున్నది. ఆయన అలా వెళ్ళిపోయి యుండెడివాడు. చూశారా? ఆమె దానిని నమ్మవలసియున్నది. చూశారా?

189. అదియే దేవుడు! ఇప్పుడు ఎవరయినా ఇలా ఆలోచించిన, “ఒక వరం అనేది ఒక గొప్ప పెద్ద కత్తి. దేవుడు నీకు వరమును ఇచ్చును, నీవు దానిని తీసుకుని ముక్కలు చేస్తావు, మరి ఏదో చేయి? ... వరమును గూర్చి నీవు తప్పుడు భావనను కలిగియున్నావు. వరమనగా నిన్ను నీవు రంగము మీద (మార్గములో) నుండి తీసువేసుకొనుట ఎరిగియుండటమే, మరియు దేవుడు ఆయన ఏమి చేయాలని కోరుకుంటున్నాడో ఆయననే చేయనిచ్చుట. చూడండి, ఆయన ఇష్టపడు విధానంలో దేవుడు నిన్ను వాడుకొనులాగున అది నీకు నీవు ఏవిధంగా విశ్రాంతి తీసుకొనవలెనో ఎరిగియుండుట. కేవలం నీవు ఆ మార్గము నుండి తొలగిపొమ్ము, చూశారా?

190. ఇప్పుడు ఈ జనులు ఎవ్వరినీ నేను ఎరుగను, ఇక్కడ ఉన్న ఈ వ్యక్తినీ నేను ఎరుగను. ఇక్కడ ఒక స్త్రీ నిలుచుని యున్నది. ఆమె చూచుటకు, ఈ మధ్యనే, మహిమలోనికి వెళ్ళిన నా ప్రశస్తమైన ఒకరి వలెయున్నది. నా తల్లి ఈ రాత్రి ఆ మహిమలో నుండి చూచుచున్న ఎడల, అలోచించండి ఇటువంటి పేద వ్యక్తిని మోసం చేయుటకు నేను వచ్చినట్లయితే, నేను ఒక భయంకరమైన వ్యక్తిగా ఉండనా? ఎటువంటి ఉద్దేశ్యమును నేను కలిగియున్నాను? నేను బుద్ధిహీనుడిగా ఉండెదను. నేను మీకు సహాయం చేయుటకే ఇక్కడ ఉన్నాను, అమ్మా.

191. మరియు నాకు ఏదైతే ఆజ్ఞ ఇవ్వబడెనో కేవలం ఆ ఒక్క విషయం మాత్రమే నేను చేయగలను. ప్రజలు నమ్ములాగున నేను చేయలేను. ఏ ఒక్కరినీ నమ్ములాగున నేను చేయలేను. కేవలము, నేను కలిగియున్నాను...

192. నేను వేదాంతిని కాదు. నేను కనీసం ఒక ... నేను కాదు, నన్ను నేను ఒక బోధకునిగా పిలుచుకొనను, చూడండి, ఎందుచేతననగా నాకెటువంటి చదువు లేదు. ఈ రోజుల్లో బోధకుడనబడేవారు, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు డాక్టర్ డిగ్రీలను కలిగియుండవలెను. ఎందుకు, అవి ఏమిటో నాకు తెలియదు.

193. నిన్నటి దినమున ఎవరో నన్నీవిధముగా అడిగారు, “నీవు సర్వనామములను, నామవాచకములను సరిగా ఉపయోగించవు", అని చెప్పారు.

194. నేను చెప్పాను, “అవి ఏమిటో నాకు తెలియదు నేను ఎరుగను." ఒక నామవాచకము అనగా ఏమిటో నేను ఎరుగను, లేక ఒక సర్వనామము. నేను మీకు చెప్పలేను, నా ప్రాణమును రక్షించుకొనుటకు, నామవాచకమునకు సర్వనామమునకు మధ్య నున్న తేడా. నేను మీకు వివరించలేను.

195. అయితే ఒక విషయం నాకు తెలుసు, నేను ఆయనను ఎరుగుదును, ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని. నేను దానిని గూర్చే జాగ్రత్త వహించెదను, చూడండి. “ఆయన” నేను ఎరిగియుండవలసిన ఒక్కరు ఆయనే. "ఆయనను ఎరుగటయే నిత్యజీవమై యున్నది.” దాని వెనుకే నేను వెళ్ళుచున్నాను, జీవము, జీవించడానికి. దాని కొరకే నీవిక్కడున్నావు, జీవము, జీవించుటకు.

196. ఇప్పుడు, అమ్మా, నీవు చేసినదానిని ప్రభువైన యేసు నాకు బయలుపరచి నట్లయితే, నీవు చేయకూడనిది ఏదో నీవు చేసియున్నది, దానికొరకై నీవు ఇక్కడ ఉన్నావు. ఆయన ఆ స్త్రీకి చేసినట్లుగా, ఆమెలో ఉన్న తప్పిదమును ఆయన చెప్పెను; బహుశా నీతో ఉన్న పొరపాటును కూడా చెప్పవచ్చును, ఒకవేళ ఉంటే, అప్పుడు అది సత్యమా, లేక కాదా అని నీవు తీసుకొనగలవు. నీవు దానికి సాక్షిగా ఉండబోవుచున్నావు. నీవు దానిని చేస్తావా... ఇక్కడ ఏదో ఉన్నదని నీవు కనుగొనగలవు, అది ఏదో ఎక్కడి నుండో వచ్చియున్నది. అది సహజమైనది కాదు. అది ఒక సహజాతీతమైనదిగా ఉన్నది. మంచిది. ఎందుచేతననగా నేనేదైతే చెప్పితినో ఆ వాక్యమును నీవు నమ్ముట కొరకే, అది దేవుడు తన వాక్యమునకు తానే అనువాదము చేయునట్లుగా ఉన్నది (ఉండును) అప్పుడు అది దేవుడు రుజువు చేయుచున్నట్లుగా ఉన్నదా?

197, సభికులు కూడా దాన్నే నమ్ముచున్నారా? (సమాజము చెప్పెను. ఆమేన్) ఇప్పుడు ప్రార్ధనా పూర్వకముగా ఉండండి. ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, నిజమైన గౌరవములు కలిగి ఉండండి. మీరు చెప్పవచ్చు, "నీవు చాలా ఆలస్యం చేయుచున్నావు సహోదరుడా ట్రైన్హాం?"

198, అవును, నిశ్చయంగా. నేను ఆ స్త్రీని ఎరుగను. అది దేనినో తీసుకొనవలసియున్నది, ప్రభువు యొక్క దూత, పరిశుద్ధాత్మే స్వయముగా.

199, ఆ అగ్నిస్తంభము ఇశ్రాయేలు పిల్లలను మార్గం గుండా నడిపించెను, ఇశ్రాయేలు అరణ్యం గుండా వెళ్ళెను, చూడండి, ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఆయన యేసై యుండెను. “మోషే ఐగుప్తు సుఖభోగముల కంటే క్రీస్తును గూర్చిన నింద గొప్ప భాగ్యమని యెంచెను." అతడు ఐగుప్తును విడిచెను.

200. ఏసు ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు, ఆయన చెప్పెను "నేను దేవుని యొద్ద నుండి వచ్చితిని, మరియు దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను." ఆయన చనిపోయెను, పాతి పెట్టబడెను, లేచెను, పైకెక్కిపోయెను.

201. మరియు సౌలు, దమస్కునకు పోవు మార్గములో, అదే వెలుగు ద్వారా సంధించబడెను. మరియు ఆ యూదుడు అటువంటి వెలుగును “ప్రభువా” అని ఆ విధంగా పిలుచుటకు ఎప్పుడూ నేర్పింపబడియుండలేదు. మరియు అతడు చెప్పెను. “ప్రభువా నీవెవరవు?” తన ప్రజలను అరణ్యం గుండా నడిపించిన ప్రభువైయున్నాడని అతడు ఎరిగియుండెను.

202. ఆయన చెప్పెను, "నేను ఏసును." "నేను నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాను."

203. ఇప్పుడు మన మధ్య అదే వెలుగు ఉన్నట్లయితే, చూడండి, అప్పుడు అక్కడ చేసిన కార్యములన్నిటిని ఉత్పత్తి చేయుట ద్వారా అది రుజువు చేయును. ఇప్పుడు వాటిని ఆయన చేసినట్లయితే, అది మనలను నమ్మునట్లును మరియు ఆనందించునట్లును చేయును, అవును కదా? దానిని ఆయన దయ చేయును గాక, మీరు

204. నేను కొంచెము ఏదో చెప్పుటకు మీయొద్దకు వచ్చుచున్నాను. చూడండి, నీవు ఎప్పుడైనా ... ఎప్పుడైనా నీవు దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఇది నిన్ను ఎత్తిపట్టుకొనును; మరియు కేవలం ఏ మాటయైనా మాట్లాడుము, ఏదైనా చూడుము. నీవు ఒక మానవునివి, ఒక ఆత్మను పొందుకున్నావు. మరియు ఆ ఆత్మ ఏమై ఉన్నదో, అది నిన్ను అభిషేకించిన వెంటనే, నేను చూచెదను, అది ఏమైయున్నదో నేను చూడగలను మరియు నీవక్కడ ఏ మార్గం గుండా వెళ్ళుచున్నావని, అలా ... అది దేవుని యొక్క వరమైయున్నది. ఆయన అదే విధంగా చేసియున్నాడు, ఆ స్త్రీకి చెప్పెను. అదే విధానం ఖచ్చితంగా అదే విధానము.

205. ఇప్పుడు నీవు ఇక్కడ ఎవరి కొరకో నిలబడియున్నావు, నీవు వేరొకరి నిమిత్తం ప్రార్ధన సహాయం కొరకు నిలబడియున్నావు, మరియు వారు హాస్పిటల్ నందు ఉన్నారు. అవును. మరియు అది క్షయవ్యాధి. మరియు అతను నీ భర్త. అది నిజము. మరియు మరొక దృశ్యమును నేను చూచాను, అతను చావసిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఒక చీకటి ఆత్మ అతనిని పట్టి ఉన్నది, కారణం అతడు క్రైస్తవుడు కాదు. అది నిజము. అది నిజము కాదా? చూశారా? అతడు క్రైస్తవుడు కాదు. అతడు మరణశయ్యపై ఉన్నాడు. మరియు అతడు క్రీస్తును అంగీకరించుటను గూర్చి నీవు ఆసక్తి కలిగియున్నావు.

206. మరియు నీవు ఏదో ఇబ్బందిని కలిగియుండుటను నేను చూచుచున్నాను. లేదా వారు నీవు క్షయవ్యాధి లేక అలాంటిదేదైనా కలిగియున్నావని భావించుచున్నారు. అదియే, నీవు ఎక్స్రే లేదా అటువంటిది కలిగియున్నావు. వారు క్షయవ్యాధి (నిర్ధారించుటకు) కొరకు నీకు ఎక్స్రే తీసియున్నారు. అది సత్యము, అది కాదా?

207. ఇప్పుడు దానిని నీ హృదయమంతటితో నమ్ముచూ వెళ్ళగలవా? ఇప్పుడు నీవు దానిని నమ్మియున్నట్లుగా, నీవు నమ్మి యున్నవన్నీ, ఇప్పుడు అవి తెలియబడియున్నాయి, కేవలం నీవు నమ్మియున్నట్లుగా; అతని దగ్గరకు వెళ్ళుము. ఇక్కడ జరిగినది అతనికి చెప్పుము, మరియు బహుశా అతని నుండి ఆ చీకట్ ఆత్మ విడిచి వెళ్ళిపోవచ్చును; అతడు రక్షించబడును, అప్పుడు అతడు లేచి మరియు
ఇంటికి తిరిగి వచ్చును. ఇప్పుడు నీ హృదయమంతటితో దానిని నమ్ముము. నిన్ను దేవుడు దీవించును,

208. నీవు నమ్ముచున్నావా? (సమాజము చెప్పుచున్నారు, ఆమేన్) అది, నీకు నీవే నీ ఇష్టం వచ్చిన (నీకు నచ్చిన రీతిలో తీర్పు తీర్చుకొనవచ్చును. ఇప్పుడది. నీకు సంబంధించినది.

209. అమ్మా, మీరెలా ఉన్నారు? మనము అపరిచితులమని నేను భావిస్తున్నాను, కానీ దేవుడు నీ ఇబ్బందులను నాకు బయలుపరచునని నీవు నమ్ముచున్నావా? (ఆ సహోదరి చెప్పుచున్నది. "అవునయ్యా" - సంపా) మరియు అలా అయినట్లయితే, నీవు గొప్ప నమ్మకమును కలిగియుండునట్లు అది చేయును, అది కాదా? ఆ మనుష్యుడు ఇక్కడ నుండి పైకి వచ్చుచున్నాడు, నేను చూస్తున్నాను, కొద్ది నిమిషముల క్రితం దానిని నీవు నమ్మియున్నావు. కాదు, నీవు ఇక్కడ ఎవరికోసమో నిలిచియున్నావు, అవును, అది నీ యొక్క భర్త. (“అవునయ్యా”) నీ భర్తతో ఉన్న సమస్యను ప్రభువైన ఏసు నాకు బయలుపరచునని నీవు నమ్ముచున్నావా? నీవు దానిని నమ్ముచున్నావా? అతడు హెర్నియాను కలిగియున్నాడు. అది నిజము. మరియు ఇక్కడ ఒక బాలుడు అనారోగ్యంను కలిగియున్నాడు, నీవు దాని కొరకు కూడా ప్రార్దించుచున్నావు. అది కూడా జరుగునని నీవు నమ్ముచున్నావా? మంచిది. ఇప్పుడు నీవు దానిని నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? కేవలం నీవు నమ్మిన విధంగానే, అది అలాగునే ... చూడండి, నేను స్వస్థపరచలేను. నేను కేవలం దానిని పలకగలను, చూడండి, నేనేమి చూచియున్నాను. మరియు నీవు దీనిని నీ హృదయమంతటితో నమ్ముము, నీవు నమ్మిన మార్గంలోనే అది జరుగును. నీవు దానిని నమ్ముము, మరియు దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును.

210. దానిని సందేహించవద్దు. విశ్వాసమును కలిగియుండు. కేవలం అటు ఇటు (నడచుట) నిజమైన మర్యాదతో ఇప్పుడు గనుక నీవు ప్రారంభించిన కదలుట చేయవద్దు. చూడండి, మీరు ఎంతో చక్కగా కూర్చుండియున్నారు. ఆ విధంగానే ఉండి వినండి, కొద్ది నిమిషములు.

211. అయ్యా, మీరెలా ఉన్నారు? నేను నిన్ను ఎరుగను, మనము ఒకరికొకరము అపరిచతులము, ఈ రాత్రి మనము ఇక్కడ కనపరచుకొన్నదానిని బట్టి మరియు ఆ క్రీస్తు యొక్క న్యాయతీర్పులో సమాధానం చెప్పవలెను. నీవు దానిని నమ్ముచున్నావా, నీవు నమ్మవా? నీవు ఖచ్చితంగా చేస్తావు. నేను-నేను ఒక వెలుగును చూస్తున్నాను, అయ్యా, చూడండి, అది అభిషేకం, పరిశుద్ధాత్మ,

212. ఇప్పుడు, నీవు కడుపునొప్పితో ఇబ్బంది పడుచున్నావు. నీ కడుపు నిన్ను ఇబ్బంది పెట్టుచున్నది. అది నిజము, మరియు నీవు కలిగియున్న ఏదో, ఒక అలవాటును అధిగమనించాలని ప్రయత్నించుచున్నావు. నీవు దానిని ఆపలేక పోయినట్లయితే, పొగత్రాగుట, మరియు అదే నిజంగా నీ కడుపునొప్పికి కారణం. అది నిన్ను త్వరలోనే కేన్సరులోనికి తీసుకువెళ్ళును. దేవుడు దానిని నీ నుండి దూరంగా తీసివేయునని నమ్ముచున్నావా, మరియు నీవు చేస్తావా - మరియు నీవు సరిచేసుకుంటావా? నీవు చేస్తావా? నీవు దీనిని నమ్మినట్లయితే ఇప్పుడు నా చేతులు నీపై ఉంచబోవుచున్నాను. ఇప్పుడు ఇది నీవు చూచుటకు మర్మయుక్తముగా అనిపించుచున్నదా? అయితే క్రీస్తు యొక్క అభిషేకం, దానిని నీ నుండి దూరంగా తీసివేయమని మరియు నిన్ను సరిచేయమని నేను ఆయనను అడిగినట్లయితే నీవాయనను తీసుకుని మరియు నడిచి వెళ్ళు. నీవు దానిని నమ్ముచున్నావా? (ఆ వ్యక్తి చెప్పుచున్నాడు, "నేను నమ్ముచున్నాను.”) ఇక్కడకు రండి. ఇక్కడకు రండి, అయ్యా,

213. సాతానా, మా విశ్వాసము యొక్క ఆధారమును బట్టి, నీపైన మరియు నీ జాతి రక్తమునంతటి పైన విజయము సాధించిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఆ సిగరెట్లతో ఈ వ్యక్తిని ముందుగానే సమాధిలోనికి పంపుచున్న ఆ దెయ్యమును గద్దిస్తున్నాను, అతనిలో నుండి బయటకు రా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో. ఆమెన్.

214. ఇప్పుడు వెళ్ళి మరియు దానితో (స్వస్థత) నిలిచియుండుము. నమ్ముము, మరియు నీవు జీవించులాగున జీవించుము.

215. నీవు నమ్ముచున్నావా? (సమాజము "ఆమెన్,” అని చెప్పుచున్నది). కేవలము నమ్ముచూ ఉండుము.

216. నీవెలా ఉన్నావు? బలముగా చూచుటకు స్నేహపూరితమైన స్త్రీ, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నీవు నమ్ముచున్నావా? నేనాయన సేవకుడనని నీవు నమ్ముచున్నావా? నేను దానిని చెప్పుటకు కారణము, ఎప్పుడైతే అతడు... నా పుస్తకములను ఎప్పుడైనా నీవు చదివావా? అందులో ఇలా చెప్పబడినది, "నీవు ప్రజలను నిన్ను నమ్మునట్లుగా చేయగలిగినట్లయితే” (నిన్ను నమ్మినట్లయితే). చూడండి, అదియే ముఖ్య విషయం అయి యున్నది. నీవు దానిని నమ్మవలసి యున్నది. నీవు కేవలం ... దేవుని సమీపించుటకు మరొక మార్గం లేదు గాని, వరము ద్వారా, అయితే దానిని నమ్ముటకు.

217. మార్త చెప్పినట్లుగా, “నేను-నీవు దేవుని కుమారుడవని నమ్ముచున్నాను.. నీవు ఇక్కడ ఉండినట్లయితే, నా సోదరుడు చనిపోయి ఉండెడివాడు కాదు." చూశారా? ఆమె దానిని సరిగా సమీపించియున్నది. అప్పుడు, ఆయన రాకపోవుటను బట్టి ఆమె ఆయనపై కోపగించుటకు హక్కు కలిగియున్నది, కానీ ఆమె ఆ విధంగా చేయలేదు. ఆమె గౌరవముతో సమీపించినది, మరియు ఆమె ఆశించినదానిని పొందుకొన్నది.

218. అది దేవుడు ఉండి మరియు సమస్తమును ఎరుగునని ఇప్పుడు నీవు దానిని నమ్ముచున్నావా? మరియు దేవుడు నీలో ఉన్న తప్పిదములను నాకు తెలియజేయుటకు సమర్ధుడని నీవు నమ్ముచున్నావా? సమస్య నీ కడుపులో ఉన్నది. నీవు క్లిష్టమైన సమస్యను కలిగియున్నావు, అనేక సంగతులు తప్పుగా ఉన్నవి. నీవు క్లిష్టమైన సమస్యలు కలిగియున్నావు. అది కడుపులో ఒక కణితి అయియున్నది. దానిని గూర్చి అది సత్యమైయున్నది. అది సత్యము. అది సరియే. శ్రీమతి ...? నీవు వెనుకకు వెళ్ళు, నీ హృదయమంతటితో నమ్ము, మరియు నీవు బాగవుతావు. మంచిది. ఆశ్చర్యము (వింత సంగతి) నేను నీ పేరు పిలచియున్నానా? ఆయన నిన్నెరుగును, అవును, చూడుము.

219. మీరెలా ఉన్నారు? ఇప్పుడు నీవు స్త్రీ సంబంధమైన జబ్బును కలిగియున్నావు, అది నీ గర్భాశయంలో ఉన్నట్లుగా కనిపించుచున్నది, మరియు అది గర్భాశయంలో కణితి. ఆ కణితిని యేసుక్రీస్తు తీసివేయగలడని నీవు నమ్ముచున్నావా? ఈ మధ్య కాలములో నా భార్యకు ఏమి జరిగిందో దానిని మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. చూడండి, అప్పుడు ... ఈ సాక్ష్యము మీరు వినియున్నారా? మంచిది, ఆమెకు జరిగినట్లుగా మీకును జరుగదా? సరియే, కేవలం నీ హృదయమంతటితో దీనిని నమ్మిన యెడల అది ఆ విధముగా జరుగును.

220. ఇటు చూడు, యవ్వన స్త్రీ. నీవు స్త్రీల సమస్యను కలిగియున్నావు, రుతుక్రమము సరిగా లేదు. యేసుక్రీస్తు నిన్ను క్రమపరచి మరియు ఇప్పుడే బాగు చేయునని నీవు నమ్ముచున్నావా? మరియు నీవు నమ్మిన యెడల ఇప్పుడే అది అంతా వెళ్ళిపోవును (విడిచిపోవును), మరియు నీతో ఉన్నదంతా, మరియు నీవు బాగవుదువు మరియు ఇంకా సాధారణమైన జీవితాన్ని జీవించు? మంచిది. వెళ్ళు, ఇప్పుడే దానిని నమ్ము, అది ఆ విధంగా ఉండును.

221. దేవుడు నీ మధుమేహ వ్యాధిని స్వస్థపరచగలడని నిన్ను బాగుచేయునని మీరు నమ్ముచున్నారా? మంచిది, "నేనాయనను నమ్ముచున్నాను” అని చెప్పుచు వేదికపైన ఆ విధంగా నడుచుచూ ఉండు. మరియు నీవు కేవలం నమ్మిన యెడల దానిని పొందుకుంటావు. కల్వరిలో చిందించిన రక్తము నిన్ను బాగుచేయును.

222. ఇప్పుడు ఇక్కడ సభికుల మధ్యలో ఏదో జరిగినది, దానిని నేనింకా పొందియుండలేదు (గ్రహించలేదు).

223. ఒక స్త్రీ ఇక్కడ కూర్చునియున్నది, నా వైపు చూస్తున్నది, ఉదర సంబంధ వ్యాధితో (బాధతో) ఇబ్బంది పడుచున్నది. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయునని నీవు నమ్ముచున్నావా?

224. ఆమెకు వెనుకగా కూర్చున్న స్త్రీ గుండెనొప్పి బాధను కలిగియున్నది. ఆ వెనుక అక్కడ దానితో ... వెనుకనే నల్లటి టోపీ పైన, గుండె నొప్పితో ఉన్నది.

225. నీవు దానిని కలిగియున్నావు, అవును, నీవు దానిని కలిగి యుంటున్నావు. చూడు, నీవు దానిని కలిగియున్నావని నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఇరువురూ విడుదల పొందియున్నారు. యేసుక్రీస్తు మిమ్ములను బాగుచేసియున్నాడు. మంచిది, ఇప్పుడు రహదారి వెంబడి వెళ్ళండి, మరియు దేవుడు నిన్ను దీవించును. విశ్వాసము కలిగియుండండి, మీ హృదయమంతటితో నమ్మండి.

226. నీ వయస్సులో, నీవు తీవ్రమైన సమస్యలను కలిగియున్నావు, చాలా పొరపాట్లు ఉన్నవి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమనగా, నీవు నీ గుండె వ్యాధి నిమిత్తం ప్రార్ధన కోరుచున్నావు, మరియు స్వస్థపరచునా? మంచిది. వెళ్ళు, దానిని నమ్ముము, చెప్పుము, "ప్రభువా, కృతజ్ఞతలు" నీవు నీ స్వస్థతను కలిగియున్నావు.

227. నరాల బలహీనత అతనిని చాలా కాలంగా ఇబ్బంది పెట్టుచున్నది, అతనికి మోకాళ్ళపై నిలుచుటకు అవకాశమివ్వండి. ఈ రాత్రి దానిని పొందుకొనుము, అయితే ఒక ముఖ్యమైన సమస్యను నీవు కలిగియున్నావు. అది మధుమేహం. నీవు నమ్ముచున్నావా దానిని కూడా దేవుడు స్వస్థపరచునని మరియు నిన్ను బాగుగా చేయునని? కేవలం ఆ విధంగా ముందుకు వెళ్ళు, చెప్పుము, "ప్రభువైన యేసూ కృతజ్ఞతలు. నా హృదయమంతటితో నేను నమ్ముచున్నాను."

228. దేవుడు ఎటువంటి రక్త సంబంధ వ్యాధినైనను స్వస్థపరచును, రక్తహీనత, లేదా ఏమైయున్నప్పటికీ. నీవు దానిని నమ్ముచున్నావా? మంచిది. కేవలం అలా వెళ్ళుచుండుము, మరియు దేవుడు నిన్ను బాగుచేయును. దానిని నమ్ముము.

229. నీవెలా ఉన్నావు? నీవు మంచంపై నుండి లేచుటకు ప్రయత్నించుటను నేను చూచుచున్నాను, చాలా మెల్లగా, కీళ్ళ నొప్పులు కొంతకాలంగా కలిగియున్నావు. నీవు నమ్మినట్లయితే అతడు నిన్ను విడచి వెళ్ళుచున్నాడు, ఈ రాత్రి, మరియు నీవు
బాగుపడబోవుచున్నావు? కేవలం వేదిక వద్ద అలా నడుస్తూ ఉండు, చెప్పుము "ప్రభువైన యేసూ, నీకు కృతజ్ఞతలు," మరియు నీ హృదయమంతటితో నమ్ము.

230. నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? అతన్ని ఆ విధంగా వెళ్ళనీ. అతడు స్వస్థపడియున్నాడు ఏమైనప్పటికీ, అలాగున - కేవలం ... అతడు దానిని పట్టుకున్నాడు. తనకు తానుగా, అలాగున !

231. రా. నీవు నమ్ముచున్నావా. ప్రభువైన యేసు నీ ఉదర సమస్యను స్వస్థపరచి నిన్ను బాగుచేయునని, మరియు తినడానికై ఇంటికి వెళ్ళమని చెప్పునా? ముందుకు వెళ్ళు. మరియు దానిని నమ్ము మరియు యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును.

232. స్త్రీ, రమ్ము. నీవు నమ్ముచున్నావా వెన్ను సమస్య, ...? సమస్య, ఒక ప్రత్యేక పరిస్థితి, నిన్ను వదిలి వెళ్ళును, నీవా విధంగా దాటి వెళ్ళతావా? వెళుతూ ఉండు, చెప్పు, "నీకు కృతజ్ఞతలు, ప్రభువైన యేసూ",

233. మీరంతా ఏమి ఆలోచిస్తున్నారు? మీ కన్నుల ముందే ఇవన్నీ జరుగుటను చూస్తున్నారా, ఈ రోజుకై? మీ హృదయమంతటితో దీనిని మీరు నమ్ముచున్నారా? (సమాజము చెప్పుచున్నది - ఆమేన్.) కేవలం ప్రజలతో వెళ్ళుతున్న దానిని చూడండి, ప్రజలతో!

234. ఇప్పుడు నీవు ప్రజల మధ్య ఉన్నావు, నీవు నమ్ము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏమిటో చూడు, ఆయన ఇంకనూ దేవుని కుమారుడైతే.

235. అవును, ఆ ప్రజలు వెళ్ళుచున్నారు, లోపల కూర్చున్నారు, వారందరూ సంతోషంగా ఉన్నారు, ఒకరి వైపు ఒకరు చూచుకొనుచున్నారు, ఆనందిస్తున్నారు. దేవుడు వారికి చేసిన అద్భుత కార్యములను ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు.

236. చిన్న స్త్రీ ఇక్కడ కూర్చునియున్నది. వెన్ను నొప్పితో బాధపడుచున్నది. ఇక్కడ కూర్చునియున్నది, రంగుజుట్టు కలిగియున్నది; లేదు, ఆ నీ వెనుకనున్న స్త్రీ. నీవు దేనినో తాకియున్నావు, నీవు చేయలేదా? (తాకలేదా) నీకు తెలుసు అది నేను కాదు. ఇది ఆయనే, ప్రధాన యాజకుడు. నీ వెన్ను నొప్పి ఇక నిన్నెన్నడూ బాధించదని నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా?

237. నీవు పొగత్రాగుట మానివేయుటకు ఇష్టపడుచున్నావా, మరియు చెప్పుము, "నేనెప్పటికి మరలా వాటిని పట్టుకొననని, అయ్యా”, ఆ తరువాత కూర్చున్న స్త్రీ? నీవు చాలా కాలం ప్రయత్నం చేసియున్నావు, కానీ నీవు దానిపై విశ్వాసం కలిగిలేవు.
ఏమైనప్పటికీ, దానిపై విశ్వాసం కలిగియుండడానికి ఇప్పుడు నమ్ముతావా? నీ చేతులెత్తి ఈ విధంగా చెప్పినట్లయితే "నేను ఇప్పుడే దానిని నమ్ముచున్నాను.” మంచిది, ఇక ఎంతమాత్రము పొగత్రాగకు. ఇంటికి వెళ్ళి మంచిగాయుండు. నీవు ఆ విధంగా (తప్పని సరిగా) దానిని చేయవలెను. "ఒకవేళ నీవు నమ్మగలిగినట్లయితే!”

238. ఎర్రకోటును ధరించిన, స్త్రీ ఇక్కడ కూర్చునియున్నది. నా వైపు చూస్తోంది, కీళ్ళనొప్పులతో బాధపడుచున్నది. దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా, అమ్మా? నీవు చేస్తావా? (నమ్ముచున్నావా?) మంచిది నీవు నీ భాగమును పొందగలవు. మంచిది.

239. సహోదరి అక్కడ కూర్చునియున్నది, అది నిన్ను ఆశ్చర్యచకితురాలిని చేసినదా? ఆ స్త్రీ క్లిష్టమైన కార్యములను కలిగియున్నది. దానిని ఇక ఆమె మరువబోవు చున్నది. దేవా, నాకు సహాయం చేయుము. శ్రీమతి. కాక్స్, నీవు నమ్ముచున్నావా? మంచిది. అలా కాదు, దానితో పొందగలనని అతడు ఆశించెను, కానీ అతడు దానిని చేయలేదు. నీవు దానిని పొందుకున్నావు. ఏమైనప్పటికీ.ఈ విధంగా చెప్పు, “దేవునికే స్తోత్రము” స్నేహితులారా. మీరు దానిని ఎరుగరా ...

240. అయ్యా నీవు కేన్సరును కలిగియున్నావు, పచ్చకామెర్లు, నీవు ఇక జీవించవు, అక్కడ పడుకొనియున్నావు. అది నిజము. నేను చేయలేను, నేను నిన్ను స్వస్థపరచలేను. అయితే నీతో ఉన్న పొరపాట్లను నీవు దాచియుంచలేవు. చూడు, అది అక్కడ యున్నది. నీవు, అక్కడ కూర్చుండియున్న నీవు ఇక బ్రతుకవు, దానిని నీవు ఎరుగుదువు, 'ఎందుకనగా' నీవు- 'నీవు' వెళ్ళిపోయావు. అది నీ కడుపులో ఉన్నదని వారు చెప్పారు, మరియు అక్కడ ఉన్నది. అది కాలేయములో ఉన్నది, ఆ కారణం చేతనే నీకు ఆ కామెర్లు ముదిరియున్నవి. అయితే నీ హృదయమంతటితో దానిని నమ్మినట్లయితే, మరియు ఇప్పుడే సిద్ధంగా ఉండు, సమరియ ద్వారం (షోమ్రోను గవిని) వద్ద పడియున్న ఆ వ్యక్తులవలె, చెప్పు, మేము చావకుండా ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? నీవు చావబోవుచున్నావు, అక్కడ పడియున్నారు. కేవలం నీవు ఒకే ఒక అవకాశం కలిగియున్నావు, అది నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఆయనను అంగీకరించు, మరియు నీ హృదయమంతటితో దానిని నమ్ముము, నీవు దానిని చేస్తావా, అప్పుడు, యేసుక్రీస్తు నామములో నీ హృదయమంతటితో దానిని నమ్ముము, మరియు పైకి లే, నీ మంచమెత్తుకుని ఇంటికి వెళ్ళు, కృతజ్ఞతతో దేవుని ఘనపరచు. ఆమెన్,

241. నీవు దానిని నమ్ముచున్నావా, ఓహ్, దేవుడు అతడికి శక్తినిచ్చును, దానిని గూర్చి చింతించవద్దు. ఒకవేళ అతడు అతడు ఇక్కడున్నాడు, తన మంచమును తీసుకొనుటకు వెళ్ళుచున్నాడు, మడతపెట్టుకుని మరియు ఇంటికి వెళ్ళును.

242 మిగిలిన వారందరూ నమ్ముచున్నారా? ఇప్పుడు మీ పాదములపై నిలచియుండండి. నీవు పొందుకొనిన దానిని గూర్చి ఏమనుకుంటున్నావు? నీలో ఏ పొరపాటున్నప్పటికీ నేను లెక్కచేయను, పైకి లెమ్ము. నీ చేతులెత్తి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము.

243. ప్రభువైన యేసూ, వారు నీ చేతులలో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో !

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...