ఇశ్రాయేలు మరియు సంఘము #1

ఇశ్రాయేలు మరియు సంఘము #1

VGR PARA COUNT -229... ఈ చిన్న పాత గుడారము... మరియు నేను అనేకసార్లు ఇచ్చటకు ఒక గంట లేక రెండు గంటల కొరకు ఇచ్చటకు వచ్చేవాడను లేక బహుశ ఒక ఆరాధన కోరకు వచ్చేవాడను. వెనుకకు మరలా రావటం ఇదియే నాకు మొట్టమొదటి సారి, లేక ఎచ్చటైననూ, ఇదియే మొట్టమొదటి స్థలము. మనము ఈ రాత్రి ప్రారంభించుచున్నాము. నా అభిప్రాయములో ఒక ఉజ్జీవము అనగా నూతన సంఘ సభ్యులను తీసుకొని రావటం కానే కాదు. ఒక ఉజ్జీవము అనేక మార్పిడి గుంపులను కలిగి ఉండదు, అయితే ఉజ్జీవములో అవి కూడా జరుగవచ్చు. అయితే ఉజ్జీవమేమనగా నీవు దేనినైతే ఇదివరకే పొందికొనియున్నావో దానిని ఉజ్జీవింపజేయుటయే, సరిగ్గా వాటిని పొందుకొని ఉజ్జీవింపజేయుట.

2

మరియు ఇప్పుడు మనము ఇచ్చట సహోదరుడు నెవిల్ గారు అనేటటువంటి ఒక అద్భుతమైన సంఘ కాపరిని కలిగియున్నాము. అతడు ఇప్పుడు ముందు సీటులో కూర్చొనియున్నాడు, జలుబు మరియు ఒక చిన్న గొంతు నొప్పితో ఇచ్చట ఈ రాత్రి కూర్చొని యున్నాడు.

మరియు నేను వాస్తవమైన ఈ గృహములో ఉండాలనుకొనుచున్నాను. నేను ఇచ్చట ఉండేటప్పుడు అలా ఉండేవాడను, నేను ఈ యొక్క సంఘ గృహములో గతములో సంఘ కాపరిగా ఉండేవాడను, నేనే పాటలు పాడు నాయకుడుగా ఉండేవాడను, నేనే కానుకలు పట్టేవాడను, నేను అప్పులు చెల్లించేవాడను, నేను ద్వార పాలకునిగా ఉండేవాడను, మరియు నేను వడ్రంగిగా ఉండేవాడను, మరియు నేను పొయ్యి యొక్క ధూళని శుభ్రపరిచేవాడను, మరియు చేయటకు ఏమి చేయవలెనో దానినంతటిని చేసేవాడను. పిమ్మట మరోవైపు పబ్లిక్ సర్విస్ కంపెనీలో పనిచేసేవాడను. పదిహేడవ యేటనే నేను ఇచ్చట ఉండేవాడను. మరియు ఈ రాత్రి కాల సమయములో ఈ పాత చిన్న నిర్మాణము కొరకు నేనెంతగానో సంతోషిస్తున్నాను. ఇది పెద్ద విశాలమైనది లేక గొప్ప కట్టడము కాకపోవచ్చు గాని; ఇది ఒక గృహము, మరియు నేను చాలా ఆదరణ అనుభవిస్తుంటాను. మరియు దానికొరకు నేనెంతగానో సంతోషిస్తున్నాను.

3

మరియు ఇప్పుడు, బహుశ మన యొక్క సభలు కలిగి ఉండబోవుచున్నవి... మేము అయిదు రాత్రులకు ఇచ్చియున్నాము, అనగా ఆదివారం రాత్రి వరకు మరియు మేము ఈ లేఖనములను బయటకు ఒక పాఠ్యాంశముగా బోధించబోవుచున్నాము. ఇప్పుడు ఈ యొక్క పాఠ్యాంశ బోధనలో పరిశుద్ధ గ్రంధము తప్ప ఇంకేమీ కలిగియుండము. ఇప్పుడు మరియు అప్పుడు మరియు ఈ యొక్క సభలో ఇప్పుడు నేను నిజమయిన స్పష్టతను ఇవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు ప్రారంభములో మనము వాస్తవమైన నేపద్యాన్ని కలిగియుంటాము. నేను నమ్ముచున్నాను. అది మనకు మొదటిగా కావాలి, మరియు మనము నిబంధనలు మరియు నియమాలు చూచెదము, మరియు మనము చేయునదంతా, కావున మనము ఆరాధన ప్రారంభించుకొనుటకు ముందు మరియు ప్రార్థన కలిగి ఉందాము.

4

మరియు ఇప్పుడు నేను తలస్తున్నాను, ప్రభువు చిత్తమైతే ఈ రాత్రి, “సంఘము” ను గూర్చి మాట్లాడవలెనని మరియు రానున్న అయిదు రాత్రులు కూడా సంఘమును గూర్చి తలస్తున్నాను.

ఈ మొదటి రాత్రి, “ఐగుప్తులో ఇశ్రాయేలీయులు” అనే అంశము మీద. మరియు ప్రభువు చిత్తమైనచో, రేపు రాత్రికి ఎర్ర సముద్రము యొద్ద ఇశ్రాయేలీయులును గూర్చి.

మరియు ఆ తరువాత రాత్రిన, ఇత్తడి సర్పము ముందు ఇశ్రాయేలీయులు.

అటు పిమ్మట ఆదివారము రాత్రిన కాదేషు బర్నేయ వద్ద ఇశ్రాయేలీయులు.

మరియు ఆదివారము రాత్రి వారిని మనము వారి స్వదేశములో పెట్టుటకు చూడవలెనని ఆశిస్తున్నాము.

మరియు అవన్నియు లేఖన పూర్వకమైన బోధనలు. మరియు మీ యొక్క పరిశుద్ధ గ్రంధములు మీరు తీసుకు రండి, ఎందుకనగా మనము లేఖనము తరువాత లేఖనములను చూడబోవుచున్నాము.

5

రోగుల కొరకు మరియు మిగతా వారి కొరకు ప్రార్ధించుటకు అనేకమైన పిలుపులు వస్తున్నవి. అయితే వాటిని నేను దూరముగా ఉంచుచున్నాను. నా యొక్క మనసును నిలకడగా బైబిలు బోధనల మీదే ఉంచుటకు ప్రయత్నిస్తున్నాను, మరియు ఇప్పుడు మన ప్రభువు ఏమి చేయునో నాకు తెలియదు. విదేశాలకు వెళ్లుటకు, వారి యొక్క పిలుపు కొరకు మేము వేచియున్నాము. ఇది ఒక అద్భుతమైన సమయముగా ఉన్నదని నేను భావిస్తున్నాను. బహుశ అప్పటి నుండి, బహుశ సహోదరుడు నెవిల్ గారు, ఆ సమయములోగా మంచిగా ఉందురని మరియు అచ్చట నుండి పట్టుకొనగలరని, బహుశ మరియు ఈ ఉజ్జీవములో వెళ్ళుదురని నమ్ముచున్నాను. అది ఈష్టరు గుండా వెళ్లవలెనని నేను చూస్తున్నాను. మరియు ఇచ్చట ఈష్టర్ ఉదయ కాలములో గొప్ప బాప్తిస్మ కార్యక్రమం ఉండుటకు నేను ఇష్టపడుచున్నాను. ఒక గొప్ప గుంపు బాప్తిస్మము తీసుకొనుటకు ఆ సమయము ఒక గొప్ప అద్భుతముగా ఉండదా? నేను నమ్ముచున్నదేమనగా, ఇచ్చట బాప్తిస్మము తీసుకొనుటకు కొన్ని యవ్వన గుంపులు ఉన్నాయని.

మరియు ఇప్పుడు, ఆ యవ్వన గుంపులను గూర్చి నేను ఒక ప్రశ్న మీద నున్నాను. ఇప్పుడు మనము కొద్ది మంది సందర్శకులను కలిగియున్నాము. నేను ఊహిస్తున్నాను, ఇచ్చటకు ఎవరు వస్తూ ఉన్నారో లేక ఎవరు రావటం లేదో నాకు బాగా తెలియదు. నేను దానిని ఎరుగను... [టేపు మీద ఖాళీ ఉన్నది.]

6

ప్రారంభించుటకు 12వ అధ్యాయము మరియు మీరు మీ యొక్క పెన్సిలు మరియు కాగితం తీసుకొనండి, ఎవరో ఒకరు కొన్ని లేఖనములను మరియు మరియొక దానిని కలిగియుండవలెనని కోరుకొనినచో మనము కొన్ని ఎక్కువ పరిశుద్ద గ్రంధములను కలిగియున్నాము. మీరు మీ చేతిని ఎత్తినచో, ఇప్పుడు పెద్దలలో ఒకరు దానిని మీ వద్దకు తెచ్చుటకు సంతోషముగా ఉన్నారు. మేము ఇచ్చట అయిదు లేక ఆరు పరిశుద్ధ గ్రంధములను కలిగియున్నాము. మిగతావి క్రొత్త నిబంధనలు, సోదరుడా, మరియు నేను ఈ రాత్రికాల సమయములో ఎక్కువగా పాత నిబంధన మీదే ఉండవలెనెనని ఆశిస్తున్నాను.

7

లేఖనములను అధ్యయనం చేయుచుండగా, నేను నిదించబడ్డాను మరియు ఒక గొప్ప వర్గీకరణ విధానాన్ని (మాదిరిని) చేశాను, అనగా “ప్రాచీనమైన దానిని, నూతనమైన దానితో మాదిరి చూపే విషయంలో.” నేను దానిని ఎందుకు చేశానో మీకు చెబుతాను. కారణము ఇది.

బహుశ కొన్నిసార్లు పండితులు గొప్ప పదాలును ఇస్తారు మరియు పరిశుద్ద గ్రంధము నిచ్చుటకు ప్రయత్నిస్తారు. దాని యొక్క పదజాలము, ఉచ్చరణ మొదలగునవి. అయితే నా కొరకు కింగ్ జేమ్స్ బైబిలును తీసుకొనుటకు నేను సంతృప్తిగా యున్నాను. ఇది ఏ యొక్క తర్జుమా కన్ననూ ఇప్పటికి ఎంతో కాలంగా తుఫానులను అల్లాడించినది మరియు నేను దానిని ఆ విధముగా నమ్ముచున్నాను.

8

మరియు నేను దానిని ఆ రీతిగానే నమ్ముచున్నాను. మరియు నేను నమ్ముచున్నదేమనగా, సమస్త పాత నిబంధన కూడా రాబోవుచున్న విషయాలకు ఛాయగా ఉన్నదని, సమస్త లేఖనములు బోధించుచున్నవి. కాబట్టి నేను ఆ యొక్క గోడ దిశగా వెళ్లినచో, మరియు నా యొక్క నీడ నా ముందు పడుతుంది, నేను అచ్చటికి వచ్చునప్పుడు, నేను అచ్చట ఉన్నానని ఎదో ఒకటి ప్రకటిస్తున్నది. నేను నాలుగు కాళ్ల జంతువునా లేక ఇది ఒక పక్షియా లేక ఇది ఏమైనప్పటికి, ఆ యొక్క నీడ దానిని ప్రకటించి చూపిస్తున్నది.

మరియు పాత నిబంధన అనేది క్రొత్త నిబంధనకు ఒక ఛాయ లేక మాదిరిగానున్నది. సమస్త పాత నిబంధన కల్వరికి చూపించినది, నేను నమ్ముచున్నదేమనగా, పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా, రాబోవుచున్న వారముల గుండా (ఎంత కాలమో, నాకు తెలియదు), అయితే నేను దానిని నిరూపించగలను... పాత నిబంధలోనున్న ప్రతీ అధ్యాయము యేసుక్రీస్తును గూర్చి మాట్లాడియున్నది మరియు సమస్తము ఆయనలో నెరవేరియున్నది. మరియు మనము, ఆయనలో, సంపూర్ణమైయున్నాము. దానిని దేవుడు ఎంత సామాన్యముగా చేసియున్నాడు! క్రీస్తులో మనము సంపూర్ణమైయున్నాము.

9

ఇప్పుడు, మనిషి ఎల్లప్పుడూ తనను తాను రక్షించుకొనుటకు ప్రయత్నించియున్నాడు, మరియు రక్షింపబడుటకు విభిన్నమైన విషయాలను చేశాడు, కాని మన యొక్క స్వంత క్రియల మూలముగా అది ఉన్నదని క్రొత్త నిబంధనలో చెప్పబడలేదు. అది “మీరు విశ్వాసము ద్వారా, కృప చేతనే రక్షించబడియున్నారు.” నిన్ను రక్షించే ఆ యొక్క ఒకే ఒక్క విషయము కృప మాత్రమే.

10

ఇప్పుడు, ఈ సంఘము యొక్క సంఘ సభ్యులెవరో మరియు ఎవరు కాదో, క్రైస్తవ్యములో ఎలా ఎదిగియున్నారో చూచుటకు నేను కొద్ది క్షణం క్రిందట పైకి లేచియున్న చేతులను చూచాను. మరియు ఈ రాత్రికాల సమయములో ఇచ్చట నున్న మీలో చాలా మంది అనగా 99% శాతం మంది క్రైస్తవులుగా కనిపిస్తున్నారు. మరియు మిగతా వారు కూడా ఇప్పుడు ఉండగలరని మేము నిరీక్షిస్తున్నాము.

11

ఇప్పుడు, “ఆదికాండము” అనేది పరిశుద్ధ గ్రంధము యొక్క విత్తన అధ్యాయమై యున్నది. అదియే ఆరంభము. (Genesis) అనగా “ప్రారంభము” అని అర్ధము.

మరియు ఇప్పుడు, అనగా రేపు రాత్రికి, పిల్లలను చూచుటకు మనము నిర్గమనమునకు వెళ్లవలసియున్నాము. మరియు “నిర్గమనము” (Exodus) అనగా “బయటకు పిలువబడుట, బయటకు వెళ్లుట,” అనే పదము నుండి వచ్చినది. ఆ యొక్క పిల్లలు ఇశ్రాయేలీయులు, నిర్గమనము వారి యొక్క నిర్గమనములో, వారు ఐగుప్తు నుండి బయటకు వెళ్లారు, అనగా దేవుడు వారికిచ్చిన వాగ్దాన దేశములోనికి వెళ్లారు.

12

ఇప్పుడు, అప్పటి సంఘము యొక్క చిత్రమును తెలుసుకొనే క్రమములో మరియు దానిని నేటితో మాదిరి చూపించుటకు, నిర్గమనములోనికి తీసుకువచ్చుటకు, అనగా ఇది నిర్గమనము కలిగి ఉండుటకు ముందుగా మీరు వెనుక విత్తనము వద్దకు వెళ్లవలసియున్నారు. ఇప్పుడు మీరు... లేక, సంఘము ఎచ్చట నున్నదో మీరు చూడగలుగుటకు, దానిని లోనికి తీసుకు రండి మరియు వారు ఐగుప్తులో ఏ రీతిగా స్థిరపడ్డారో మరియు పిమ్మట దేవుడు వారిని బయటకు ఎలా పిలిచియున్నాడో మీరు చూచెదరు. మరియు తరువాత ఆ మిగిలిన వారము గుండా, లేఖనముల గుండా ఆ రీతిగా మనము తిన్నగా వెళ్ళుదుము. మరియు ఈ రాత్రి ప్రభువు యొక్క చిత్తమయినచో, ఈ బోధన మీద మనము అనేకనేక లేఖనములను ఉపయోగించవలెనని కోరుకొనుచున్నాము.

13

ఇప్పుడు ఎందుకు అని మొదటి స్థలమును మనము కనుగొనవలెనని మనము ఆశిస్తున్నాము... క్రైస్తవ ప్రజల మధ్య, సర్వ ప్రపంచ వ్యాప్తముగా ఒక భయమును కలిగి ఉండుట, ఇది ఒక గొప్ప విషయముగా ఉన్నదని నేను కనుగొన్నాను. వారు ఎల్లప్పుడు భయపడుతుంటారు. మరియు ఒక చిన్న వ్యాధి సోకినప్పుడు, వారు భయపడతారు. నేను అనేక సార్లు ఆశ్చర్యపోతుంటాను మరియు నేను మీతో కూడా ఉంటూ ఉంటాను. అయితే ఈ రాత్రికాల సమయములో నేను చేయుటకు ప్రయత్నించుచున్నదేమనగా, మరియు రానున్న ఈ వారంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మీ భయమును తీసివేయుటకు ప్రయత్నించుచున్నాను.

14

ఇప్పుడు మీరు నా వద్దకు వచ్చి ఇలా చెప్పవచ్చు, “మంచిది, బ్రెన్హాం సోదరుడా, నేను దానిని నమ్ముచున్నాను.” ఇప్పుడు... “నేను దానిని నమ్ముచున్నాను.”

ప్రపంచములో నిరూపించుటకు కేవలం ఒకే ఒక్క మార్గమున్నది. ఇప్పుడు, ఎవరో ఒక్కరి అనుభవము ద్వారా నేను వెళ్ళలేను, ఏదో ఒక సంఘ సాంప్రదాయము ద్వారా వెళ్ళలేను. ఇది ఏమైయున్నదో అనే దానిని గూర్చి కేవలం ఒకే ఒక నిజ రుజువు వున్నది; అదియే దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు, దేవుని యొక్క వాక్యము ఫలాన విషయము చెప్పినచో, పిమ్మట అది సత్యమని నేను నమ్మవలసియున్నాను.

15

ఇటీవల కాలంలో ఒక యవ్వన సేవకుడు నా వద్దకు వచ్చియున్నాడు, మరియు అతడు నాకు ఒక పరిస్థితిని గూర్చి చెప్పాడు, మరియు దానిని గూర్చి అతడు ప్రార్థించానని చెప్పాడు. మరియు అతడు చెప్పినదేమనగా, ఇది ఒక నిశ్చయమైన మార్గమును ప్రభువు అతనికి బయలుపరిచియున్నాడని. మరియు నేను ఒక్క క్షణం అతని వైపు చూచితిని మరియు నేను చెప్పితిని, “సోదరుడా, అది ఎంతో ప్రియమైనది.” నీ కొరకు దానిని చేసినందుకు, “ప్రభువును నేను అభినందిస్తున్నాను. అయితే నన్ను ఒక విషయమును నీకు చెప్పనివ్వు, అది విరుద్దముగా నున్నది,” అని నేను చెప్పితిని.

అతడు చెప్పెను, “మంచిది, ఆ దర్శనము దేవుని నుండే వచ్చినది.”

నేను చెప్పాను, “ఇది అలా ఉండజాలదు సోదరుడా, ఎందుకనగా అది వాక్యమునకు విరుద్ధముగా నున్నది.

16

ఇప్పుడు, మనము సమస్త విషయములను లేఖనము ద్వారా మాత్రమే నిరూపించవలసియున్నాము. ఇది నా యొక్క విశ్వాసమునకు విరుద్ధముగా ఉన్నప్పటికి లేఖనము ఆ రీతిగా చెప్పినచో, లేఖనమే ఒప్పు మరియు నేను తప్పు, చూచారా. లేఖనము ఎల్లప్పుడూ సత్యము, మరియు నీవు దేనినైనా చేయుటకు ఒకే ఒక్క మార్గమేదనగా, లేఖనమునకు మరలుటయే. ఇప్పుడు అది సత్యమేనా? ఇప్పుడు, నేను కోరుచున్నదేమనగా మీరు దానిని నమ్మినచో, “ఆమేన్” అని చెప్పండి మీరు చూచారా. “ఆమేన్” అనగా, “ఇది అలా ఉండును గాక.” ఇప్పుడు మనము చేయజాలము...

17

ఆ మరుసటి దినమున ఎవరో ఒకరు నన్ను అడిగియున్నారు, మంచిది, ఈ దినమున కూడా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గూర్చి అనగా ఒక ప్రత్యేకమైన విషయములో ఒక విజయవంతమైన వ్యక్తి ఒక ప్రత్యేకమైన విషయాన్ని వారు చేయుచున్నారు. మరియు చెప్పెను, “ఓ, బిల్ సహోదరుడా, ప్రభువు ఖచ్చితముగా దానిలో ఉండవలసియున్నాడు.”

నేను చెప్పాను, “ఆయన అలా చేయలేడు.”

“ఓ” చెప్పెను, “వారి ఆత్మలను రక్షించబడుచున్నవి.”

నేను చెప్పాను, “ఇది అలా ఉండజాలదు. ఎందుకనగా, ఇది అలా ఉన్నచో, ఇది ఆయన యొక్క వాక్యానికి విరుద్ధముగా ఉన్నది. పిమ్మట దేవుడు ఒక విషయమును చెప్పి మరియు వేరొక విషయమును చెప్పజాలడు. ఆయన మార్గమంతటి గుండా ఒకే ఒక విషయమును చెప్తాడు.” చూచారా, దేవుడు అబద్ధమాడజాలడు. దేవుడు విఫలము కానివాడు, ఆయన మాటలు కూడా అంతే. దేవునిగా ఉండుటకు, ఆయన ఒక సార్వభౌమత్వమును కలిగి ఉండాల్సి ఉన్నాడు, మీరు చూచారా. మరియు ఆయన కలిగియున్నాడు...

18

మరియు ఇప్పుడు మీరు చెప్పవచ్చు, “మంచిది, దేవుడు ఇచ్చట ఒక విషయములను చేసినచో, ఆయన యొక్క వాక్యము వేరేది చేసినచో... అని నీవు ఆలోచించుట లేదా?”

నేను చెప్పాను, “లేదు, పరిశుద్ధ గ్రంధము చెప్పియున్నది, గ్రంధములో ఉన్న దానిని ఎవడైననూ దేనినైననూ తీసివేసినా లేక కలిపినా, జీవగ్రంధములో నుండి అతడు కూడా తీసివేయబడును.”

కావున అచ్చట ఒక కారణమున్నది. ఎల్లప్పుడూ, ప్రతిదాని ద్వారా (అనుభవము ద్వారా కాదు, లేక అది ఎలా కనిపిస్తున్నదో దాని ద్వారా కాదు) అయితే దేవుని యొక్క వాక్యము ఏమి చెప్పుచున్నదో అదే. ఇప్పుడు క్రొత్త నిబంధన యొక్క పౌలు చెప్పారు, “మీరు వినిన విషయములకు విరుద్దముగా పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను ప్రకటించినా సరే,” మీరు దానిని వ్రాసుకోవాలని కోరినట్లయితే, అది గలతీ 1:8, “అతడు శాపగ్రస్తుడవును గాక.”

19

ఇప్పుడు, కాబట్టి, మనము ఇప్పుడు వెనుకకు వెళ్లి మరియు ప్రారంభిద్దాము మరియు వాక్యము ఎంత నిశ్చయమైనదో కనుగొందాము. ఇప్పుడు, దీనిని మనసులో ఉంచుకొనండి. మరిము మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంధము గుండా సేకరించుచుండగా, దేవుని యొక్క గడియారపు ముల్లు అనే చక్రము మెల్లగా తిరుగుచుండుట మీరు చూడగలరు, అయితే అది నిశ్చయము. ఇది ఒక మిలియన్ మైళ్ల దూరముగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉండవచ్చు, కాని అది అచ్చట అన్ని కాలములలో సరిగ్గా తిరుగుచున్నది, మరియు ఈ రోజులలో ఏదో ఒక రోజున అది ఇచ్చటనుండగలదు, ఇప్పుడు, విషయం ఏదైనప్పటికీ. మీరు దేనినైనా తీసుకొనండి...

20

ఆదికాండము గ్రంధమును తీసుకొని మరియు దానిని విడిచి పెట్టకుండా అధ్యయనము చేయుటకు 6 లేక 8 మాసములు బైబిలు అధ్యయమును మనము ఇచ్చట కలిగి ఉండగలమని నేను ఆశిస్తున్నాను. మరియు నేను నమ్ముచున్నాను, రానున్న 3 లేక 4 వారములలో ఆదికాండమును అధ్యయనము చేయుచుండగా దాని యొక్క ప్రతీ తీగ, పరిశుద్ధ గ్రంధము గుండా సరిగ్గా ఎలా వెళ్లినదో చూడగలము, దాని యొక్క ప్రతీ వాక్యము కూడా. ఇప్పుడు, నాకు నేనుగా ఆదికాండమును రెండు సంవత్సరాలుగా చదువుచున్నాను, మరియు నేను రెండవ సారి దాని గుండా వెళ్లాలనుకుంటున్నాను. మరియు దాని గుండా మరలా సగ మార్గమును కూడా చేరుకోలేకపోయాను. ఎందుకు, ఇది అలా ఉన్నది... దానిలో నుండి 2 లేక 3 వచనాలు పట్టుకొని నేను వారముల తరబడి ప్రసంగించాను. మరియు ఆ యొక్క విత్తనము గూర్చి మీరు చూచారు..

21

మీరు ఎట్టి రకమైన పంటను కలిగి ఉండబోవుచున్నారో తెలుసుకొనుటకు లేక పొలములో ఏమి పెరుగుచున్నదో తెలుసుకొనుటకు, మీరు వెనుకకు వెళ్లి ఆ యొక్క విత్తనాన్ని కనుగొనవలసియున్నారు. ఆ విత్తనము అదేమైయున్నదో ఖచ్చితముగా దానినే ఉత్పత్తి చేయును. అది దాని యొక్క జాతినే ఉత్పత్తిచేయును. ఒక మొక్క జొన్న మరలా మొక్క జొన్ననే ఉత్పత్తి చేయును; ఒక గురుగు మరలా గురుగునే ఉత్పత్తి చేయును, ఒక గోధుమ మరలా గోధుమనే ఉత్పత్తి చేయును, అది ఏమైనప్పటికి, ఆ విత్తనము ఏమైయున్నదో దానినే కచ్చితముగా ఉత్పత్తి చేయును.

22

మరియు ఈ యొక్క తెగలు మరియు గుంపులన్నియు మరియు ఈ యొక్క విషయములు మరియు నేటి వాదములు (Isms) దేవుని కృప ద్వారా వీటిలో ప్రతీ ఒక్కటి గూర్చి వెనుక అచ్చట వీటి యొక్క ప్రారంభము ఎచ్చట నున్నదో ఆ యొక్క ఆదికాండములో వ్రాయబడెను. మరియు ఇది వేరొక పేరును పొందుకొని యున్నది. అయితే ఆ దినపు యొక్క ఆత్మ పని చేయటాన్ని మీరు గమనించండి, మరియు అది నేడు ఎలా పని చేయుచున్నదో గమనించండి, పిమ్మట అది ఒకే రకమైన విషయమును మీరు చూచెదరు. మరియు స్నేహితులారా, దానిలో కొంత ఆశ్చర్యకరమైనది ఉన్నది. దానిలో కొంత భాగము ఒక ఉన్నతమైన మత సంబంధమైన రాజ్యములో ఉన్నదని చూచుటకు మీరు ఆశ్చర్యపోతారు.

23

ఇప్పుడు, ఆ యొక్క ఆత్మవైపు చూడండి, ఇది వెనుక కయీను వద్ద ఎలా లేచియున్నదో, ఇది హాము వరకు ఎలా వచ్చినదో, నిమ్రోదు ద్వారా బబులోను లోనికి; బబులోనులో నుండి యేసు యొక్క రాకడ దినములలోనికి వచ్చినది. బోధకులు, బైబిలు విద్యార్థులు మరియు వారంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తును గుర్తించుటలో విఫలమయ్యారు.

మరియు అచ్చట వారు నిలువబడియున్నారు, ప్రసిద్ధిగల మేధావులు, పరిశుద్దులు, నీతిమంతులు, వాక్యమును ఎరిగినవారు, దానియొక్క ప్రతీ అక్షరమును తెలిసినవారు మరియు ఇది ఎచ్చటనున్నది, ఎలా వ్రాయబడియున్నది, ప్రతీ దాని గుండా వారు దానిని కంఠస్తము చేసిరి. ప్రతీ గ్రంథపు చుట్టను మరియు ప్రతి దానిని, అది ఒక ఖచ్చితమైన మానవ వరుస క్రమములో జన్మించవలసియున్నది, లేక ఒక యాజకత్వము, లేక ఒక తెగ రావలసియున్నది. ప్రసిద్ధి గాంచిన విద్యావంతులు, సెమినరీ విద్యార్థులు వారందరినీ నేడు వెనుకకు వెళ్లి ప్రక్కన పెట్టవలసియున్నాము, అయినను, యేసును తెలుసుకొనుటకు వారు విఫలమయ్యారు.

మరియు యేసు వచ్చినప్పుడు, వారు పరిశుద్ధ ప్రజలు మరియు యేసు చెప్పెను, “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు.” చెప్పెను, “మీరు దేవుని యొక్క శక్తిని గాని, దేవుని యొక్క వాక్యపు శక్తిని గాని యెరుగకయే పొరబడుచున్నారు.” ఒక పరిశుద్ధుని, నీతిమంతుని, విద్యావంతుని, బైబిలు వేదపరిశోధనా విద్యార్థిని చూచి ప్రభువైన యేసుక్రీస్తు, వారిని చూచి “అపవాది” అని పిలుచుట మీరు ఊహించగలరా? అయితే ఆయన అలా పిలిచాడు. మరియు ఇప్పుడు, మీరు వెనుకకు వెళ్లినచో, అది ఎచ్చట నుండి వచ్చినదో మీరు కనుగొనెదరు.

24

మరియు గమనించండి, ఇది నేడు ఖచ్చితముగా, చుట్టూ ఒక భయంకరమైన శక్తిలోనికి కదులుతున్నది... ఇది మిమ్ములని యోగ్యునిగా చేస్తుంది, నా సహోదరీ, సహోదరుడా మీరు దేనినైతే వినుచున్నారో దానిని గూర్చి ఆలోచించినచో మరియు సాతానుని యొక్క మోసం చేసే శక్తిని మీరెన్నడూ తక్కువగా ఆలోచించవద్దు, వాడిని మీరెన్నడూ తక్కువగా ఊహించవద్దు. అతడు ఉండగలిగినంత మృదువుగా ఉంటాడు మరియు క్రీస్తువిరోధి యొక్క ఆత్మ కమ్యూనిజం కాదు, లేదు. క్రీస్తువిరోధి యొక్క ఆత్మ అనేది ఒక నిజమైన దానికి అతి దగ్గరగా ఉంటుంది. మరియు సాధ్యమైతే ఏర్పరచబడినవారిని కూడా మోసం చేస్తుంది. యేసు (మత్తయి 24లో) చెప్పెను, ఇది ఒక మతసంబంధమైన ఆత్మ. ఓ, కయీను మరియు హేబేలు ఎందుకు సోదరులైయున్నారు. ఒక కాకి మరియు పావురము కలిసి ఒకే కొమ్మ పైన కుర్చున్నవి. ఏశావు మరియు యాకోబు సహోదరులు, అలాగే యూదా మరియు యేసు కూడా ఒకే సంఘములోనున్నారు — ఒక వ్యక్తి బోధకుడు మరియు వేరొక వ్యక్తి కోశాధికారి. అచ్చట చూడండి? ఎల్లప్పుడూ మోసము చేయుట. కయీను చెప్పిన అబద్దము... సాతానుడు హవ్వకు చెప్పాడు, అది తొంబై శాతం సత్యము, తొంబై శాతం సత్యము. మరియు నీవు చెప్పే ఒక అబద్ధము! లేఖనములలో కొన్ని ముక్కలను మనుషులు ఎలా దాటిపోతారో అని నేను విన్నాను... అది వారి యొక్క వేదాంతమును గాయపరుస్తుంది, చూచారా. అయితే ఈ యొక్క భాగము సత్యము, ఆ యొక్క భాగము సత్యము! అయినచో, దానిని మనము కలసికట్టుగా సమకూర్చి మరియు సమస్త పరిశుద్ధ గ్రంథమునకు అమర్చెదము. ఇప్పుడు, ఆదిలో దేవుడు...

25

దీనిలో మనకు సమయము లేదు. అచ్చటకు వెళ్ళుటకు సమయము లేదు గాని మనము ఇచ్చట సంఘము యొక్క ఆదిని గూర్చి ప్రారంబించెదము. మరియు అది దేవుడు... ఇప్పుడు, సంఘము అను పదమునకు అర్ధమేమనగా, “బయటకు పిలువబడుట, బయటకు పిలువబడిన ప్రజలు.” మరియు నేను నమ్ముచున్నదేమనగా, నేడు ఆకాశము క్రిందనున్న ప్రతీ సంఘ శాఖ, వారిలో ప్రతీ శాఖలో కూడా మంచి ప్రజలున్నారని, మరియు నేను నమ్ముచున్నదేమనగా, యేసు వచ్చినచో, ఇది బయటకు పిలువబడిన గుంపుగా ఉంటుంది. మరియు నేను నమ్ముచున్నదేమనగా, ప్రభువు యొక్క రాకడ నుండి మనము సుదూర మార్గములోనున్నాము. సంఘానికి సంబందించినంత వరకు ప్రభువు యొక్క రాకడను ఎదుర్కొనుట కొరకు మన యొక్క స్థితిగతులు అంతగా బాగాలేవు. దైవిక స్వస్థత కొరకే మనకు చాలినంత విశ్వాసం లేనప్పుడు, ఎత్తబాటులోనికి మనము ఎలా వెళ్లగలము? కావున ఎదో ఒకటి జరగవలసియున్నది.

26

ఎవరైనా ఎత్తబాటును గూర్చి మాటలాడినచో, ఎందుకు, వారు చెప్తారు, “మీరు దేనిని గూర్చి మాట్లాడుతున్నారు?” కొంత మంది ప్రజలు, సంఘ సభ్యులు, దైవిక స్వస్థత కొరకు మాట్లాడుతారు, “అట్టి దానిలో నాకు నమ్మకము లేదు.” వారు చూడలేరు. చెప్తారు, “మంచిది, వీరు వారిని మంత్రముగ్ధులుగా చేశారని నేను నమ్ముచున్నాను.” మంచిది, ఆ వ్యక్తి ఎన్నడైననూ, ఎలా ఎత్తబాటులోనికి వెళ్లగలడు? పునరుత్థానపరచుటకు అచ్చట ఏదియు లేనప్పుడు, అతడు ఎలా మరణము నుండి పునరుత్థానమవ్వగలడు? అతనిని పునరుత్థానము చేయుటకు అచ్చట ఏమియు లేదు.

27

ఇది కేవలం ఒక నటించు విశ్వాసం, మానసిక సంబంధమైనది. “యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను,” అని నీవు చెప్పునప్పుడు, అది సరియే. అయితే సోదరుడా, అది హృదయములో నుండి రానిచో, అది ఒక మానసికమైనది మాత్రమే. మరియు పరిశుద్ధాత్మ దానిని సాక్ష్యము ఇచ్చువరకు అది హృదయములో నుండి రానేరాదు. యేసు చెప్పెను ఎవడును... లేక, పరిశుద్ధ గ్రంథము చెప్పెను, “పరిశుద్ధాత్మ ద్వారా తప్ప యేసే క్రీస్తు అని ఎవడును చెప్పజాలడు.” మరియు దానిని నీకు నీవుగా చెప్పజాలవు; పరిశుద్ధాత్మే నీలోపల నుండి మాట్లాడవలసియున్నది.

28

పేతురు ఆయనను ఒప్పుకొనినప్పుడు, అతడు చెప్పెను, “నీవు జీవముగల దేవుని కుమారుడువైన క్రీస్తువు,” ఆయన చెప్పెను, “సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, నీకు రక్తమాంసములు ఈ విషయములు బయలుపరచలేదు, కాని పరలోకమందున్న నా తండ్రియే దానిని నీకు బయలుపరిచియున్నాడు. మరియు నేను చెప్పుచున్నాను, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును మరియు పాతాళలోక ద్వారములు దానియెదుట నిలవనేరవు.” అది సరియైనది కాదా? కావున మనము ఎచ్చటనున్నామో మీరు చూడండి.

29

ఇప్పుడు, మనము ఒక ముఖ్య భాగాన్ని ప్రారంభించుచున్నాము. ఆదిలో దేవుడు ఆయన యొక్క ప్రజలను బయటకు పిలిచియున్నాడు.

(కాక్స్ సోదరుడా, నేను మరీ బిగ్గరగా మాట్లాడుచున్నానా లేక చాలినంత బిగ్గరగా లేదా? [“కొద్ది బిగ్గరగా ఉన్నది.] నన్ను క్షమించండి, ఈ వస్తువు చాలా భయంకరమైన శబ్దాన్ని ఇస్తున్నది, మరియు నేను ప్రాచీన పెద్ద ధాన్యపు కోట్లును మరియు ఆడిటోరియంలను మరియు బహిరంగ ప్రదేశములను మరియు వస్తువులను ఉపయోగించేవాడను మరియు నేను ఊహిస్తున్నాను, నేను కొద్ది పాటి బిగ్గరగా కేక వేయుచున్నట్లుగా ఉన్నది. అయితే నిజానికి నేను మీపై అరవాలని నా భావము కాదు.)

30

ఇప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము నుండి మన యొక్క మొదటి రాత్రి కొరకు ప్రారంభించుదుము.

“యోహోవా - నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.

నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువానిని శపించెదను; భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా.“

31

అబ్రాహాము తన యొక్క తండ్రితో కలిసి బబులోను నుండి షీనారులోనికి వస్తూ ఉండగా, షీనారు లోయలో బబులోనును నాశనం చేసిన తరువాత అనేక ఆత్మలు ప్రయాణం చేసినవి... లేక, అచ్చట గందరగోళము నెలకొన్నది. అబ్రాహాము యొక్క తండ్రి అబ్రాహామును మరియు తన యొక్క ప్రియులను కూడా షీనారులోనికి తీసుకువచ్చియున్నాడు. మరియు ఆ భూమియంతట, ఆ ప్రజలందరి మధ్య దేవుడు ఒక్క మనిషికే అనుగ్రహం చూపాడు లేక ఒక్కడే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొనియున్నాడు.

32

ఇప్పుడు, అదియే సంఘము యొక్క లేక క్రైస్తవ్యము యొక్క ఆరంభమని, మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను. మరియు మీరు గమనించవలెనని నేను కోరుకొనుచున్నదేమనగా, అది అబ్రాహాము ఏదో ఒక మంచి వ్యక్తి అని కాదు; ఇది కేవలము దేవుడే అబ్రాహామును ఎన్నుకొని మరియు ఏర్పరచుకొనెను. అది అబ్రాహాము దేవునిని ఎన్నుకొనుట కాదు; ఇది దేవుడే అబ్రాహామును ఎన్నుకొనుట. మీరు దానిని చూడగలుచున్నారా? మరియు ఇప్పుడు గమనించండి. మరియు అప్పటి వలె ఈ దినము కూడా అలాగే ఉన్నది. ఇది నీవు దేవునిని ఎన్నుకొనుట కాదు; ఇది దేవుడే నిన్ను ఎన్నుకొనుట.

33

ఇప్పుడు, ఇది చాలా బలముగా ఉండవచ్చు, మరియు మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను. ఎన్నిక మరియు ఏర్పాటు జరిగిన వెంటనే, ప్రతీదాని నుండి వేరు కావలసియున్నది అనగా ఆయన పిలిచిన వెంటనే.... ఆయన ఎన్నుకొని, పిలుస్తాడు.... పిమ్మట ఆయన పిలిచినప్పుడు, నీవు పట్టుకొని వ్రేలాడుచున్న ప్రతిదాని నుండి ఆయన నిన్ను వేరుచేస్తాడు. ఇది ఒక సంస్థ కాదు అని అది నిరూపిస్తున్నది. ఇది ఇద్దరు లేక ముగ్గురు ప్రజలు కలసికట్టుగా ఉండుట కాదు. ఆయన ప్రతీ ఒక్క వ్యక్తిని ఆశిస్తాడు! ఆమేన్. ప్రతీ ఒక్క వ్యక్తితో ఇది ఒక వ్యక్తిగతమైన సంబంధము.

34

మా అమ్మగారు రక్షించబడియున్నారు గనుక, నేను కూడా రక్షించబడియున్నాను అని కాదు, ఇది కేవలం దేవుడే నిన్ను క్రీస్తులో ఎన్నుకొనుట. మీరు దానిని చూడవలెనని నేను కోరుచున్నాను. నీకు నీవుగా ఎన్నుకొనుట కాదు; ఇది నీ యొక్క ఎన్నిక కాదు, నీవు ఒక కొత్త పుటను త్రిప్పి ఎంతగా ప్రార్ధన చేశావు అన్నది కాదు. దానితో నీవు చేసినది ఏమియు లేదు. దేవుదు! ఓ, మై! సత్యం అనేది ఏమిటో నీవు చూచినప్పుడు! నీవు చెప్తావు, “నేను ప్రభువు వైపుగా తిరగలేదని నీ భావమా?” లేదయ్యా. నీవు ప్రభువు వైపుగా తిరిగే ఈ మార్గమును నీవు కలిగియుండలేదు. నీ యొక్క సమస్త స్వభావము, నీ యొక్క సమస్త వేశధారణ అంతా కూడా దేవునికి వ్యతిరేఖముగానే యున్నది. దేవుడు నిన్ను పిలిచియున్నాడు. ఇది ఎల్లప్పుడూ ఆ మార్గములోనే యున్నది.

35

ఏదేను తోటలో మనిషి పాపము చేసినప్పుడు, మొట్టమొదటిగా ఒక పాపి యొక్క స్వభావం వైపు చూడండి: దాగుకొనుట. అయితే అప్పుడు ఆదాము, దేవునిని పిలువవలసియున్నాడు; అయితే ఆదాము దాగుకొనియున్నాడు, మరియు దేవుడే ఆదామును పిలిచాడు. మీరు దానిని చూచారా? అదియే ఒక పాపి యొక్క స్వభావము: దాగుకొనుట, దూరముగా పారిపోవుట, దేని వేనుకకో వెళ్లిపోవుట. అయితే, దేవుడు పిలుస్తున్నాడు! ఓ, మై. కృప, ఆశ్చర్యకరమైన కృప, దేవుడు పిలుస్తున్నాడు!

మరియు ఇప్పుడు గమనించండి. “ఓ, అది ఆదాము మరియు హవ్వ,” అని మీరు చెప్పవచ్చు.

పరిశుద్ధ గ్రంథము అంతా ఎల్లప్పుడూ ఇది ఒకే రీతిగా ఉన్నది. యేసు చెప్పెను, “నా తండ్రి ఒకనిని మొదట ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు.” అది నిజమేనా? ఇప్పుడు, అది వాక్యమైయున్నది. మరియు వాక్యమును ఆ రీతిగానే మనము కోరుకొనుచున్నాము. అప్పుడు నీవెచ్చట నిలువబడియున్నావో నీవెరుగుదువు.

36

ఇప్పుడు ఇచ్చట ఈ రాత్రి క్రైస్తవులుగా నేడు ఎంత మంది ఉన్నారు, మీరు క్రైస్తవులని మీకు మీరుగా ఎరిగి, నీవు క్రైస్తవుడవని ఏదో ఒకటి నీలో చెప్పుచున్నదని మీకు తెలియును? అది నిజము. మీరు చూచారా? ప్రపంచములో మీరు మాత్రమే సంతోషకరమైన ప్రజలుగా ఎందుకుయున్నారు. మీరు దానిని అలాగే నమ్మవలసియున్నారు. మై, అది సులువు. దానికొరకు దేవుని యొక్క వాక్యమును తీసుకొనుము!

37

ఇప్పుడు, నీవు క్రైస్తవునిగా మారుటకు ముందుగానే, దేవుడు నిన్ను పిలిచియున్నాడు. నీవు దేవునిని పిలచుట కాదు; దేవుడు నిన్ను పిలచెను. ఇప్పుడు, ఆయన అబ్రాహామును పిలిచాడు, మరియు అతడు విశ్వాసము ద్వారా మనకందరికి తండ్రియైయున్నాడు. గమనించండి. ఇప్పుడు, ఆయన చెప్పెను, “అబ్రాహామా!”

ఇప్పుడు, అది ఒక ఎన్నిక. నేను ఆ యొక్క ఎన్నికను గూర్చి బలముగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకనగా ఇది ఒక సత్యము. ఇప్పుడు, నీవు యాధృచ్చికంగా ఒక క్రైస్తవునిగా మారలేదు, ఎందుకనగా నీవు ఈ లోకములోనికి పుట్టక మునుపే నీవు క్రైస్తవునిగా మారావు. నీవు పుట్టకముందే క్రైస్తవునిగా ఉండుటకు దేవుడు నిన్ను అభిషేకించియున్నాడు, ఏదేను వనము నుండి, ఈ జగత్తు పునాదికి ముందు నుండే దేవుడు నిన్ను అలా చేశాడు. “ఓ” మీరు చెప్పవచ్చు, “సోదరుడా, అది నిజమేనా?” అది సత్యము. ఎందుకనగా నీవు దేనిని ఎన్నడూ ఎరుగక ముందే దేవుడు...

38

నీవు ఎరిగిన ఒక సమయమున్నది... ఇప్పటికీ నీ యొక్క మనసు దానికి అంధకారముగా ఉన్నది. భూమి మీద ఒకే ఒక్క మనిషి ఆయన ముందుగా యున్నాడని ఎరిగియున్నాడు. మరియు అతడే యేసు. ఆయన చెప్పెను, “తండ్రీ, లోకమునకు మునుపు నేను నీ వద్ద ఎలా ఉంటినో, ఆ మహిమతో నీవు నన్ను మహిమపరచుము.” ఆయన అవతారమెత్తిన దేవుడు, ఆయన వెనుకకు కదలి అది ఏమిటో తెలుసుకొనగలడు. అయితే అచ్చట మన మనసులు మాత్రము అంధకారమయ్యాయి.

39

అయితే మనము అభిషేకించబడ్డాము, ముందుగా నిర్ణయించబడ్డాము. ముందు నిర్ణయమనగా ఏమిటో మీకు తెలుసా? ప్రతీ దాని యొక్క గమ్య స్థానము కూడా దేవుడు ముందుగానే చూచియున్నాడు. ఆమేన్. అది ఇప్పుడు కొవ్వుతీసిన పాలు కాదు. గమనించండి. అది మిమ్ములను కలవరపరచినదని నేను నమ్ముచున్నాను. మరియొక నిముషములో మనము అచ్చటకు వెళ్ళుట మంచిది. నాతో కూడా మీరు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయమునకు త్రిప్పండి. మరియు మనము అచ్చట కొద్ది భాగమును చదివెదము, ఎందుకనగా మీరు దానిని కోల్పోవుచున్నారని నేను భయపడుచున్నాను, మరియు నేను దానిని ఆలోచిస్తూ, దానిని చెప్పుచున్నాను. నేను కాదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మనము కొద్ది క్షణాలలో సంఘమును గూర్చి చూచెదము, లేక ఒక క్షణము తరువాత. ఇప్పుడు, పౌలు మాట్లాడుతూ, (ఎఫెసీ 1) నేరుగా సంఘము యొక్క భుజములను గూర్చి చెప్పుచున్నాడు. అదియే మనము ఈ రాత్రి చేయుచున్నాము. ఇది శిశువులకు కాదు. ఇది ఎదిగిన వారికి, శిశువులకు కాదు.

40

చిన్న శిశువులు. ఇప్పుడే నడుచుట నేర్చుకొనియు ఒక చిన్నవానిని నేను కలిగియున్నాను. అతడు గట్టి శబ్దముతో పడిపోయి ఉన్నాడు, పిమ్మట లేచియున్నాడు, మరియు అతడేదో గొప్ప విషయమును చేయుచున్నట్లు తలస్తున్నాడు. ఒకానొక దినమున నేను కూడా అదే మార్గమున ఉంటిని. అయితే నేనిప్పుడు ఒక పెద్దవాడను; నా యొక్క బాల్యపు పనులన్నియు విడిచి పెట్టితిని.

ఇప్పుడు మనము సంపూర్ణ సిద్ధాంతమునకు రావలిసియున్నది. గట్టిగా శబ్దాలు చేసే మంచి పాత కూడుకలను నేను ఇష్టపడతాను, అనగా మన యొక్క చప్పట్లు కొట్టుట, లేక మరియు ధ్వని చేయుట మరియు మంచి సమయమును కలిగియుండుట, గొప్ప శక్తి కలిగిన ఆరాధనలు కలిగియుండుట, ఆనందముతో నాట్యము చేయుట మొదలగునవి ఇష్టపడతాను. అయితే ఆగండి! ఆ బలప్రదర్శన సమయము వచ్చునప్పుడు, మీరెచ్చట నిలువబడియున్నారో మీకు తెలియదు. మనము వెనుకకు వెళ్ళి కనుగొందాము. దానిని చేయుటకు ఏది మనకు దోహదము చేయుచున్నదో కనుగొందాము. మనము ఎచ్చటనున్నామో చూచుటకు ఆ యొక్క వెనుక పునాదికి వెళ్ళుదము.

దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలను నేను... (నేను దానిని ఇష్టపడతాను, “నన్ను ఏ యొక్క వేదాంత పాఠశాల కూడా బయటకు పంపలేదు”); దేవుని చిత్తము వలన, ఎఫెసులో ఉన్న వారికి, ....(ఇప్పుడు గమనించండి, అతడు వీరికి వ్రాయుచున్నాడు) క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి:

గమనించండి, నేరుగా ఎవరికి వ్రాయుచున్నాడు? పాపులకు కాదు, శిశువులకు కాదు, కాని ఎదిగిన వారికి.

41

దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలను నేను...

చూడండి. మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానము కలుగును గాక.

మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును మనకనుగ్రహించెను:

ఓ, మై! అతడు ఎవరికి వ్రాయుచున్నాడో చూచారా? అతడు ఒక గుంపు శిశువులకు వ్రాయుట లేదు, అయితే పరలోక స్థలములో కూర్చొనియున్న వారికి మరియు ఆశీర్వదింపబడిన వారికి వ్రాయుచున్నాడు. ఇప్పుడు అతడు చెప్పెను, “మీకు కొంత విషయము తెలుసు, మీకు కొంత బోధింపబడినది, మీరు రక్షించబడియున్నారు మరియు దానినంతటిని గూర్చి మీకు చెప్పవలెనని నేనాశిస్తున్నాను.” ఓ, నేను దానిని ఇష్టపడతాను, మరి మీరు? “భూమికి చెందినవారిగా ఉండడము కంటే, కొద్దిసేపు మీరు మీ యొక్క పాదములు పరలోకములో పెట్టవలెనని నేను కోరుచున్నాను.” చెప్పెను, “ఇప్పుడు, ఎందుకో నేను మీకు చెప్పెదను. నేను మీకు ఒక చిన్న, ఒక చిన్న, ఒక చిన్న ఉజ్జీవమును, ఒక చిన్న కదలికను ఇవ్వాలనుకుంటున్నాను.” ఆమేన్. నేను కదిలే ఉజ్జీవమును ఇష్టపడతాను: మిమ్ములను ఒక రకముగా నిర్మించుటకు, మరి ముఖ్యముగా “యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,” అనే దానిని మీరు తెలుసుకొని చెప్పే స్థితికి. “ఇప్పుడు, నేను మీతో మాట్లాడదలచుకొన్నాను,” అతడు చెప్పెను, “క్రీస్తు యేసుతో పరలోక స్థలములో కూర్చొన్న మీరు, ఆత్మ సంబంధమైన సమస్త దీవెనలతో దీవించబడి కలసికట్టుగా ఉన్న మీరు, అనగా దేవుడు ప్రదర్శిస్తున్నటువంటి వరములు, స్వస్థత, ప్రవచనములు, సమస్తమును అలా జరుగుచున్నవి. ఇప్పుడు మీరు ఎదిగిన ప్రజలు, కావున నేను మీతో మాట్లాడదలచుకొన్నాను. నేను దానిని మీకు వ్రాయుచున్నాను.”

42

ఇప్పుడు గమనించండి, “దాని ప్రకారము....” ఆమేన్. ఇప్పుడు అది ఇచ్చటనున్నది. నేను నిరీక్షిస్తున్నాను, ఇది నిజముగా... నేను దానిని సరిగ్గా నానబెట్టవలెనని, మంచి వాస్తవముగా చేయవలెనని చూస్తున్నాను, ఎందుకనగా ఇది మంచి చేయును; ఇది బహుశ ఎముకులలోనికి చొచ్చుకొని పోవచ్చు.

తన చిత్తప్రకారము ఆయన మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని...

ఎవరు చేశారు? “నేను దానిని విని మరియు నేను వచ్చియున్నానా”? లేదు, లేదు, నీవెన్నడూ అలా చేయలేదు. “ఆయన ఎన్నుకొనియున్నాడు... (భూతకాలము) మనలను (సంఘమును) ఆయనలో నిర్ణయించుకున్నాడు.” పౌలు గారూ, ఎంత కాలం క్రితమండీ? గతవారమా, లేక ఆ ఉజ్జీవమును మీరు ప్రారంభించినప్పుడా? లేదు.

... జగత్తుకు పునాది వేయబడక మునుపే,...

43

ఇప్పుడు మీరు ఆ యొక్క మేఘము మీద స్వారీ చేయండి, చూచారా. ఆయన ఏమి చేశాడు? “ఆయన మనలను తనలో (క్రీస్తులో) జగత్తుకు పునాది వేయబడక మునుపే ఏర్పాటు చేసుకొనెను.

మనకు కొద్ది సమయము ఉన్నచో, యోబు 7:37కు వెళ్లవలెనని ఆశిస్తున్నాను, మరియు అచ్చట ఆయన ఇలా చెప్పెను, “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నేను జగత్తుకు పునాది వేసే ముందు! వాటికి ఎక్కడ పునాదులు వేయబడినవో నాకు నీవు చెప్పుము. లేక, ఉదయ నక్షత్రములన్నియు కలసి పాటలు పాడినప్పుడు మరియు దేవుని కుమారులందరు ఉత్సాహధ్వని చేసినప్పుడు నీవెక్కడనుంటివో చెప్పుము? యోబునకు ఇలా చెప్పుచు, ”పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు నాకు దానిని తెలియజెప్పుము.“

44

ఇప్పుడు, పౌలుగారు చెప్పుచున్నారు, “ఆయన తనలో మనలను ఎన్నుకొనెను, (సంఘము), ఈ యొక్క జగత్తు పునాదికి ముందే.” ఇప్పుడు గమనించండి.

...మనము తన యెదుట పరిశుద్దులుగా ఉండవలెనని...

మన యొక్క స్వంత పరిశుద్ధత కాదు. మీరు చెప్పవచ్చు, “బ్రెన్హాం సోదరుడా, మీరు పరిశుద్ధత యందు నమ్మికయుంచుచున్నారా?” నిశ్చయముగా. నా స్వంత దాని యందు కాదు; ఆయన యందు. నా యొక్క పరిశుద్ధత ఏమీ కాదు; ఆయనవి మాత్రమే పరిపూర్ణమయినవి.

ఏల, అప్పుడు మీరు చెప్పవచ్చు, “నీవు త్రాగవచ్చు అని నీవు నమ్ముచున్నావా, లేక.....” లేదు, నేను దానినెన్నడూ చెప్పలేదు. చూడండి, ఒక గోధుమ ధాన్యము అనేది కేవలం గోధుమనే ఉత్పత్తి చేయును; అది ఎన్నడూ గురుగులను ఉత్పత్తి చేయలేదు. దానిలో అటువంటి కోరిక లేదు; గురుగులను ఉత్పత్తి చేయుటకు దానిలో ఏ విధమైన జీవమును లేదు. మరియు మనము క్రీస్తు యేసులో ఉన్నచో...

45

మోసపోవద్దు; ఇప్పుడు మీరు చాలా దగ్గరగా పరిశీలించుట మంచిది, చూడండి. “మంచిది, నేను దీనిని చేయుటకు మరియు దానిని చేయుటకు అది నన్ను గద్దించుదు,” అని మీరు చెప్పుచూ ఉన్నచో; ఈ లోకము యొక్క విషయాలు. ఇప్పుడు, నేను మిమ్ములను కొంత గాయపరచబోవుచున్నాను; మరొక వైపు నుండి మీ యొక్క ఈకలను పేరికెదను. అయితే అది ఇదే ఒక ఖచ్చితమైన రుజువు: నీవు ఎన్నడూ క్రీస్తు యొద్దకు రాలేదు. నీవు ఎన్నడూ తిరిగి జన్మించలేదు.

“లోకమునైనను లేక లోకములో ఉన్నవాటినైనను ప్రేమించువానిలో, దేవుని యొక్క ప్రేమ వానిలో ఉండదు.”

ఇప్పుడు, ఒకవేళ దానిని చేయుట నీవు మానివేసినచో ఎందుకనగా నీకు తెలుసు నీవు అది చేయవలెనని, మరియు దేనిని చేయుట మానివేసినచో, అదే సూచన అయి యున్నది నీవు ఇంకను ఎక్కడికి చేరుకోలేదు అని. నీలో ఆ యొక్క విషయము చనిపోయినప్పుడు, మరియు దానియొక్క స్వభావము దూరముగా పోయినప్పుడు, అప్పుడచ్చట వేరొక వ్యక్తి ఉన్నాడు, మరియు ఇది ఉత్పత్తి చేయగలదు... క్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో, క్రీస్తు లాంటి జీవితాన్ని ఉత్పత్తి చేస్తుంది. నీవు చేయవలసినది ఏమీ లేదు; ఆయన చేసినది. జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన దానిని ఎన్నుకొన్నాడు.

46

ఎవరో ఒకరు ఇలా చెప్పారు, “మంచిది, నేను రక్షించబడియున్నాను, ఎందుకనగా నేను పొగత్రాగుట విసర్జించాను.”

దాని మూలముగా నేను రక్షించబడలేదు; అందుచేత నీవు రక్షించబడలేదు. నీవు రక్షించబడియున్నావు, ఎందుకనగా రక్షింపబడుటకు దేవుడే నిన్ను జగత్తుపునాది వేయబడక మునుపు ఎన్నుకొనియున్నాడు. అదియే లేఖన పూర్వకమైన బోధన, ఆమేన్. ఇప్పుడు మీరు చూచారా, ఇది మనకు చేసుకొనుట కాదు అని కనుగొనుటకు మనము ప్రారంభించాము; ఇది ఆయనే మనకు చేశాడు, చూచారా. ఆయనే మనలను ఎన్నుకొన్నాడు.

“మంచిది, దేవునికి వందనములు, బబులోను గోపురము నుండి నేను వచ్చియున్నాను, హల్లెలూయ. అందుచేత నేను రక్షింపబడియున్నాను” అని అబ్రాహాము చెప్పజాలడు. ఒకవేళ ఆ కారణము చేత వారు అది చేసినట్లయితే, ఆయన అచ్చట గల సమస్త గుంపును రక్షించియుండేవాడు. చూచారా, దానిని ఆయన అలా చేయలేదు.

47

ఆయన అబ్రాహామును ఎన్నుకున్నాడు. ఆయన మనిషిని పిలిచినప్పుడు అదియే మన యొక్క రక్షణ యొక్క ప్రారంభము: ఆయనను పిలచినప్పుడు, మరియు అతనిని ఎన్నుకొన్నాడు, మరియు అతనిని ముందుగా నిర్ణయించియున్నాడు, మరియు అతనికి ఒక వాగ్దానమునిచ్చాడు, మరియు అబ్రాహాముతో ఒక నిబంధన చేశాడు మరియు అతని యొక్క విత్తనము (సంతానము) నిత్యము ఉండునని చెప్పెను.

ఇప్పుడు, మనము ఇక్కడ ముందుకు వెళ్లి మరియు దానిలోని పూర్తి అధ్యాయమును చదువవచ్చు, కాని మనకు సమయము లేదు. ఇప్పుడు, దేవుడు పిలిచియున్నాడు.... గమనించండి. ఆయన ఇచ్చట అబ్రాహామును పిలిచినప్పుడు, ఎన్నిక ద్వారా ఆయన అతనిని పిలిచెను. అతడు చేశాడని కాదు గాని దేవుడే చేశాడు. మరియు ఆయన అతనిని తన యొక్క ప్రజలులో నుండి బయటకు పిలిచియున్నాడు, మరియు అతనిని ఆశీర్వదించాడు మరియు “నేను నిన్ను రక్షించబోవుచున్నాను” అని అతనితో చెప్పాడు, మరియు దిగువన ఇచ్చట ఆయన చెప్పాడు, “నీవు నా వద్దకు ముసలి ప్రాయములో వచ్చెదవు.” అతడు దానికి అర్హునిగా ఉండుటకు, ఏదైనా చేయుటకు ముందుగానే, దేవుడు అతనిని ఎన్నుకొన్నాడు మరియు చెప్పెను: “మరియు నీవు మాత్రమే కాదు గాని నీ యొక్క సంతానము కూడా.” ఓ, మై! గమనించండి. “మరియు అతడు తిరిగి వెళ్ళాడు...” 8వ వచనము.

ఇప్పుడు మనము ఈ యొక్క మిగతా విషయము మీద క్రిందన కొద్ది భాగము చదివెదము.

యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను; లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్లు యీడు గలవాడు.

అబ్రాము తన భార్యయన శారాయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైనవారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి.

48

ఇప్పుడు గమనించండి, దేవుడు ఏమి చేయవద్దని అతనికి చెప్పియున్నాడో అదే అతడు చేసియున్నాడు; అతడు తన యొక్క బంధువైన లోతును తీసుకొనియున్నాడు మరియు అబ్రాహాము తన యొక్క తండ్రిని కూడా తీసుకొనియున్నాడు. అయితే ఆయన (దేవుడు) అబ్రాహాము యొక్క నాన్నగారిని తీసుకురమ్మని ఎన్నడూ చెప్పలేదు గాని అతడు (అబ్రాహాము) ఎలాగైననూ అతనిని తీసుకువచ్చాడు మరియు బైబిలు చదువరులెవరైనా వీరిని గూర్చి మీరు ఆదికాండములో రేపు మీకు సమయమున్నప్పుడు చదవండి. దానిని గమనించండి, ఆ యొక్క మసలి వ్యక్తి చనిపోయినంత వరకు ఆ తైలములో ఈగ ఉన్నది. అతడు మార్గమంతటి గుండా ఒక అడ్డుబండగా ఉండేవాడు, మరియు లోతు కూడా. దేవుడు అబ్రాహామునే పిలిచాడు, లోతును కాదు. ఆయన అబ్రాహామునే పిలిచాడు గాని తన తండ్రిని కాదు.

మంచిది, మీరు ఇలా చెప్పవచ్చు, “శారాను గూర్చి ఏమిటి?” ఒక పురుషుడు మరియు తన యొక్క భార్య ఒక్కటే, చూచారా. “వారిద్దరూ ఒక శరీరము.” పరిశుద్ద గ్రంధము ఆలాగు చెప్పుచున్నది. అది సరియే.

49

అయితే ఆయన అబ్రాహామును పిలిచియున్నాడు మరియు అతనికి చెప్పియున్నాడు మరియు అతడు కలిగియున్న అంతటి నుండి వేరుపడమని అతనికి చెప్పియున్నాడు, మరియు ఒక నూతన భూమిలోనికి రమ్మని పిలిచియున్నాడు.

చూడండి ఒక వేరుపాటు... నీకు ఏమియు తెలియని ఒక వింతైన భూమి (దేశము) లోనికి వెళ్లుట, ఇదియే క్రైస్తవ్యము. లోకము యొక్క విషయాలు నుండి వేరుపడుట, ఎందుకనగా దేవుడు నిన్ను పిలిచియున్నాడు, వేరొక దేశము లోనికి వెళ్ళుట, ఒక యాత్రికునిగా వెళ్లి నీవు ఏమీ ఎరుగని ప్రజల మధ్య నివసించుట. ఆమేన్. దానిని గూర్చి నేను ఆలోచించినప్పుడు, నాకు నేనుగా చాలా కష్టముగా పట్టుకొని యున్నాను. యాత్రికుడు! ప్రయాణికుడు అనే దానిని!

ముసలి యాకోబు చనిపోతూ, ఫరో ముందు నిలువబడి ఇలా చెప్పెను, “నేను నా యొక్క యాత్రలో అనేక సంవత్సరములు వచ్చియున్నాను.” ఆమేన్. అతడేమిటి? అతడు తనకు తానుగా అతని వద్దకు వచ్చుటకు ప్రారంబించెను. ఆ చిన్న వ్యక్తి ఎంతో కష్టబడియున్నాడు. అతడు కేవలము ఇచ్చట ఒక యాత్రికుడని గుర్తించియున్నాడు. ఇప్పుడు గమనించండి!

50

మనము ఇచ్చట 8వ వచనమునకు వచ్చియున్నాము మరియు ఆయన అబ్రాహామును మరియు అతని తరువాత తన యొక్క సంతానాన్ని ఎలా దీవించెనో దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేసియున్నాడు. ఇప్పుడు ఆయన షరతులు లేని నిబంధన చేసియున్నాడు. ఇది అబ్రాహాము ఎదో చేశాడు గనుక ఆయన దానిని తనకు చేయటం కానే కాదు. ఆయన ఇలా చెప్పలేదు, “ఇప్పుడు అబ్రాహామా, నీవు దానిని చేసినచో, నీవు దానిని చేసినచో.” అయితే ఆయన చెప్పెను, “అబ్రాహామా, నేను దానిని ఇదివరకే చేసియున్నాను, దానిని పొందుకొనుటకు నీవేమీ చేయవలసిన పనిలేదు. దానిని నాకు నేనుగానే చేసితిని.” ఆమేన్. ఓ, మై! దానిని గూర్చి నేను ఆలోచించినప్పుడు! దేవుడు దానిని షరతులు లేకుండా తనకు తానుగానే చేసియున్నాడు. దేవుని యొక్క నిబంధన షరతులులేనిది!

51

నీవు ఇలా చెప్పవచ్చు, “మంచిది సోదరుడా, నేను మాంసం తినుట మానివేశాను. నేను దానిని చేయుట లేదు. నేను...” సోదరుడా, దానితో చేయుటకు అచ్చట ఒక్క విషయము కూడా లేదు, నీవు మాంసము తినుచున్నావా, లేక తినుట లేదా, లేక పౌర్ణమి దినాలు లేక ఆదివారమున, ఆదివారపుబడికి వెళ్లుట, లేక ఇది ఏమిటో అనేది, విషయములు పాటిస్తున్నావా లేదా అనవసరం. నీవు షరతులు లేకుండా రక్షించబడియున్నావు.

అప్పుడు నీవు ఇలా చెప్పవచ్చు, “బ్రెన్హాం సోదరుడా, నేను అలా రక్షించబడినచో, దేవునికి మహిమ, నేను ఏమి చేయవలెనని కోరుకొనుచున్నానో నేను చేయగలను.” అవునయ్యా. మరియు నీవు రక్షించబడినచో లోకము యొక్క కోరికను నీవు ఇంకా ఏమీ కలిగియుండవు. మరియు నీ యొక్క సమస్త హృదయము దాని మీదే కేంద్రీకృతమై యుంటుంది. నీవు దాని నుండి దూరముగా ఉండలేవు. అయితే అచ్చట ఏదో లాగేది ఇంకా ఉన్నచో, ఏదో అచ్చట తప్పు ఉన్నదని నీకు తెలియును.

ఇప్పుడు, ఎన్నిక. దేవుడు అబ్రాహామును ఎన్నుకొనియున్నాడు, మరియు షరతులు లేకుండా ఆయన అతనిని రక్షించెదనని అతనికి చెప్పియున్నాడు.

52

ఇప్పుడు, వాగ్దానము తరువాత మరికొద్ది సమయము తరువాత జరిగిన దానికి మనము ఇచ్చటకు ఇప్పుడు వెళదాము. ఒక్క క్షణము ఇచ్చట మీరు నాతో కలసి ఆదికాండము 15:7కు వెళదాము, మరియు కొద్ది క్షణముల కొరకు ఇచ్చట దానిని చదివెదము. మంచిది.

మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనునట్లు దానిని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు.

అతడు ప్రభువైన యెహోవా, నేను దానిని స్వతంత్రించుకొనెదని నాకెట్లు తెలియుననగా?

53

ఇప్పుడు, అబ్రాహాము కల్దీయుల భూమి, కల్దీయుల యొక్క ఊరు అను పట్టణము, భూమి బయటకు వచ్చి, షీనారుకు వచ్చి, వేరుపడి. దాని వైపు చూడండి, అది నేటి క్రైస్తవుల వలె నున్నది. ఇంకా సంచరిస్తూ ఉండుట.

ఆయన మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.

54

ఇప్పుడు, మీరు రేపు ఇంకా ముందుకు వెళ్లి దానిని చదువవలెనని నేను ఆశిస్తున్నాను. మీరు దానిని క్రింద వ్రాసుకున్నచో, నేను దానిని చెప్పెదను. ఎందుకనగా సమయమును మరియు స్థలమును బట్టి మిమ్ములను ఎక్కువ సేపు ఇక్కడ ఇచ్చట ఉంచదలచుకోలేదు. మీరు రేపు రాత్రికి మరలా రావలెనని మరలా కోరుచున్నాను. కావున మనము దానిలోనికి నేరుగా వెళ్లగలము. ఈ రాత్రి మనము కేవలము ఒక ప్రారంభపు పునాదిని మాత్రమే వేయుచున్నాము, చూచారా.

55

ఇప్పుడు, అతడు వీటిని తీసుకొనియున్నాడు, అనగా ఒక పెయ్యను, ఆడు మేకను, పొట్టేలును మరియు తెల్ల గువ్వను, మరియు పావురపు పిల్లను మరియు అతడు పొట్టేలును మరియు పెయ్యను విడదీసి యున్నాడు.

మరియు మొదలగువాటిని, మరియు వాటిని బయట పెట్టి, ఆ తెల్ల గువ్వను అచ్చట ఉంచి దానిని వేరు చేయకుండా ఉంచియున్నాడు. మరియు సూర్యుడు వెళ్లిపోయే వరకు అతడు ఆ పక్షులను బయటే ఉంచియున్నాడు. మరియు దేవుడు క్రిందికు వచ్చి ఆ యొక్క నిబంధనను స్థిరపరచుటకు అబ్రాహాము వద్దకు దిగివచ్చి యున్నాడు, చెప్పెను, “ఇప్పుడు, అబ్రాహామా, ఇప్పుడు నేను ఏమి చేయబోవుచున్నానో, నేను నీకు నిరూపించబోవుచున్నాను.”

56

మరియు మీకు తెలుసు, ఇదే విషయమును నేను చాలా సంత్సరాల క్రితం బోధించినప్పుడు, అనేక మంది ప్రజలు ఇచ్చట సంఘములో నున్నారు. అవును. అవునండీ. గత 1949 సంవత్సర కాలములో దానిని నేను బోధించాను. అది సరియే, ఈమె దానిని తన యొక్క బైబిలులో గుర్తించి ఉంచినది.

57

చూడండి! అప్పుడు ఆయన క్రిందికి దిగివచ్చి మరియు ఆయన ఏమి చేయుచున్నాడో అబ్రాహాముకు దానిని చూపించియున్నాడు. మొదటిగా, ఆయన అబ్రాహాముకు నిద్రపుచ్చాడు: “ఇప్పుడు అబ్రాహామా, దానితో నీవు చేయవసినదేమియు లేదు.”

58

ఇప్పుడు, నీకు, అది నిన్ను నీవు రక్షించుటకు ప్రయతించునట్లుగా ఉన్నది. నేను దానిని సంఘములోను, గుడారములోను అర్ధము చేసుకొని యున్నాను. అయితే ఈ యొక్క బోధన క్రింద కూర్చొనిన తరువాత అనేక మంది ఈ గుడారమును విడిచిపెట్టియున్నారు, కొన్ని తెగలలోనికి వెళ్లిపోయి ఉన్నారు మరియు నమ్ముటకు అనేక రకాలైన వాటికి వెళ్లియున్నారు. కొంత మంది వారి యొక్క మాంసాహారము తినుటకు ఆపివేసియున్నారు. మరియు వారిలో మరికొంత మంది వారి యొక్క సబ్బాతు దినములను మరియు పౌర్ణమి దినాలను గైకొనియున్నారు. మరి కొన్ని బలులను కూడా చేసియున్నారని నేను ఊహిస్తున్నాను. మరియు దేవుని యొక్క వాక్యమును అంగీకరించుటకు నిజముగా తృణీకరించిన పిమ్మట సమస్తమును ఆలాగు చేసిరి. ఇచ్చట ఏమియున్నదో అది చూపిస్తున్నది. పౌలు చెప్పెను, “వారు మనలో నుండి వెళ్లిపోయిరి గనుక వారు మనవారు కాదు.” చూడండి, అది నిజము. చూచారా, అది నిజము. పరిశుద్ధాత్మయే దేవుని యొక్క వాక్యమును పట్టుకొని ఉంచును. ఆ విషయములు వారు తప్పు అని నిరూపించుచున్నవి.

59

ఇప్పుడు, ఆయన పిలిచెను, “అబ్రాహామా'' ఆయన అతనిని నిద్రపుచ్చియున్నాడు, ఇలా చెప్పెను, ”నేను దానిని ఎలా చేయుబోవుచున్నానో నేను నీకు చూపించెదను, నా యొక్క నిబంధనను ఎలా నెరవేర్చెదనో నీకు చూపించెదను. మరియు ఆయన ఆ యొక్క జంతువులను తీసుకొనియున్నాడు. మరియు గమనించండి, అబ్రాహాము నిద్రలోనికి వెళ్లినప్పుడు, మరణము ప్రతి జీవికి ఖచ్చితముగా రావలసియున్నదని చూపిస్తున్నది. పిమ్మట అతనికి ముందు మండుచున్న ఒక కొలిమి వెళ్లినది; మరియు కాలుచున్న ఆ యొక్క కొలిమి అనేది నరకమునకు మాదిరిగానున్నది, అనగా ప్రతి పాపి నరకమునకు వెళ్లుటకు అర్హుడని చూపిస్తున్నది. మరియు దాని వెనుక ఆ కొండ మీద బలి ద్వారా, ఒక తెల్లని చిన్న వెలుగు వెళ్లినది, అది బలి అర్పించబడిన ఆ యొక్క రెండు ముక్కలు మధ్య నుండి వెళ్లినది. నిబంధన!

60

మీరు గమనించినట్లయితే, చాలా ఎక్కువ కాలము ప్రజలు నిబంధనను చేసే అనేక మార్గాలున్నవి. నేడు మనము ఒక నిబంధనను ఎలా చేయుచున్నాము? చెప్తాము, “కలచాలనము, చేతులు కలుపుట.” అది అంగీకారము. అదియే మన యొక్క నిబంధన, ఇది కాదా? ప్రాచీన దినాలలో, వారు ఇలాగు చేసేవార్... చైనాలో వారు నిబంధన ఎలా తయారు చేసేవారో మీకు తెలుసా? వారు ఒకరి పై మరి ఒకరు ఉప్పును జల్లుకొనేవారు. అదియే చైనాలో ఒక నిబంధన, చూచారా. మరియు వారు వివిధ రకాలైన నిబంధనలు చేసేవారు, వివిధ రకాలైన ప్రజల ఆచారములు.

61

అయితే తూర్పుదేశాల వారి ఆచారమేమనగా, ఒక జంతువును వధించుట మరియు ఆ జంతువు మధ్య నిలువబడుట మరియు పిమ్మట వ్రాయుట (దానిని మీరు అచ్చట లేవీకాండములో కనుగొందురు), మరియు ఆ యొక్క అంగీకార పత్రము చనిపోయిన ఆ యొక్క మృగము మీద రెండుగా చీల్చివేయుదురు. మరియు వారు ఆ చనిపోయిన మృగము మీద ప్రమాణమును తీసుకొందురు, అనగా దాని అర్ధమేమనగా, వారు ఆ యొక్క నిబంధనను అతిక్రమించినచో వారి యొక్క శరీరము కూడా ఈ యొక్క చచ్చిన మృగము వలె ఉండబోవునని. మరియు వారు దాని యొక్క ముక్కను ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఇచ్చెదరు. పిమ్మట వారు పంపబడతారు. మరియు వారు తిరిగి వచ్చినప్పటికి ఆ యొక్క రెండు ముక్కలు కూడా ఒకదానికొకటి ఆ ముక్కలో ఉన్నరీతిగానే కలుసుకొనవలసియున్నది. అది ఎంత అందముగానున్నది.

62

దేవుడు ఒక నిబంధన చేయుచున్నాడు, చూపిస్తున్నాడు అనగా ఆయన ముందుగా దానిని చూపిస్తున్నాడు, అదేమనగా “నేను దానిని చేసెదనని నాతోడని ప్రమాణము చేయుచున్నాను, నీ యొక్క సంతానము ద్వారా ప్రపంచములోను, లోకములో నున్న సమస్త జనములను నేను ఆశీర్వదించెదను.” దానిని చదవండి. “నేను అన్యులను దీవించెదను. నేను నలుపు వ్యక్తిని దీవించెదను, పసుపు వ్యక్తిని, తెలుపు వ్యక్తిని దీవించెదను, నీ యొక్క సంతానము ద్వారా ప్రతి ఒక్కరిని దీవించెదను. నీలో నుండి రాజులు మరియు రాకుమారులు వచ్చెదరు.”

“ప్రభువా, దానిని నీవు ఎలా చేసెదవు?”

“ఎలా చేసెదనో నేను నీకు చూపించెదను.”

మరియు ఆయన అతనికి ఆ కొండవైపుగా చూపించియున్నాడు, ఆ యొక్క ముక్కలు అచ్చట సాదృశ్యముగా నున్నవి మరియు ఇచ్చటనున్న ఏ ఒక్క బైబిలు పండితునికైనా తెలియును, అదేమనగా అచ్చట ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక శుభ్రమైన జంతువు మరియు అవి యేసుక్రీస్తు యొక్క బలికి మాదిరిగా నున్నవి. ఆయనే ఒక పొట్టేలు, ఆయనే ఒక దూడ, అనగా నీవు నీటి వేరుపాటును కలిగియున్నప్పుడు చేసిన ఆ యొక్క వేరుపాటు జలములు. ఇప్పుడు మనము నీటి ద్వారా కడగబడియున్నాము, పాపము నుండి వాక్యము అనే వేరుపాటు ద్వారా, వాక్యము ద్వారా, నమ్ముట ద్వారా. మరియు తెల్ల గువ్వ మరియు పావురము అనేవి దైవిక స్వస్థతకు గురుతులు, ఇవన్నియు క్రీస్తులో గురుతులుగానున్నవి...! ఆమేన్!

63

అచ్చట దేవుడు అబ్రాహాముకు ఏమి చెయ్యబోవుచున్నాడో చూపించాడు, అనగా ఇస్సాకు యొక్క సంతానము ద్వారా, ఆయన తన ప్రియకుమారుడైన క్రీస్తును తీసుకువచ్చెదనని మరియు ఆ వెనుకాల, అనగా భూమికి మరియు ఆకాశమునకు మధ్యలో, ఆ యొక్క సూర్యుడు అస్తమించిన సమయములో భూమికి చీకటి కమ్ముకున్న సమయములో ఆయనను వధించెదనని మరియు అచ్చట ఆయనను రెండుగా చీల్చియున్నాడు. దేవుడు ఆయనలో నుండి ఆత్మను బయటకు లాగి మరియు అచ్చట భూమి యొక్క కుటుంబాలతో ఒక నిబంధన వ్రాసియున్నాడు. ఆ యొక్క కల్మషములేని సర్వశక్తుని యొక్క ప్రశస్తమైన రక్తము ఇమ్మానుయేలు యొక్క నరముల నుండి ప్రవహించినప్పుడు, ఆయన ఆ యొక్క ఆత్మను అతనిలో నుండి చీల్చియున్నాడు.

అప్పుడు ఆయన ఇలా చెప్పెను, “నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి?” ఆయన యొక్క ముఖము పరిహాసపు ఉమ్ములతో నిండినది. ఆయన యొక్క కనుబొమ్మలు పైకి క్రూరమైన పరిహాసపు కిరీటమును (ముళ్ల కిరీటమును - సంపా) పెట్టిరి, ఆయన యొక్క గోళ్ళు రోమీయులు మేకులు దింపిరి, ఆ యొక్క రోమా కొరడాలతో అతని యొక్క వీపు - లోపల నున్న ఎముకలు బయటకు కనిపించేంత వరకు చీల్చిబడినది, సిలువ మీద వ్రేలాడబడుతూ, గట్టిగా అరుస్తూ, చనిపోయాడు, పాపి యొక్క మరణము, అనగా లోకము యొక్క పాపము అతని మీద మోపబడినది, మరియు అచ్చట దేవుడు ఆయన యొక్క ప్రక్కలను చీల్చియున్నాడు. ఆయనలో నుండి ఆ యొక్క ఆత్మను చీల్చియున్నాడు. “నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను,” అని ఆయన చెప్పినప్పుడు మరియు పిమ్మట ఆయన తన తలను వాల్చియున్నాడు. మరియు అప్పుడు భూమి వణికిపోయినది మరియు బండలు బ్రద్ధలైనవి. అచ్చట ఆయన ఉన్నాడు; అచ్చట దేవుని యొక్క నిబంధన ఉన్నది. అక్కడ దానియొక్క నెరవేర్పు ఉన్నది

అరిచే మధ్య బండలు మరియు అంధకారపు ఆకాశములు

నా యొక్క రక్షకుడు ఆయన యొక్క తలను వంచి చనిపోయెను,

విప్పబడిన ముసుగు మార్గమును తెరిచినది

పరలోక ఆనందాలకు మరియు అంతము కాని జనమునకు.

64

ఓ కల్వరి, ఓ కల్వరి, యేసు రక్తము చిందించి నొ కొరకు చనిపోయెను. పిమ్మట ఆయన తన స్వంత కుమారుని యొక్క ప్రాణమును చీల్చెను, ఒక నిబంధనను వేరు చేసెను, మరియు ఆయన ఆ యొక్క శరీరమును నేలలోనికి త్రోసెను. ఇది అచ్చట మూడు రాత్రింబగళ్ళు ఉండెను. ఇది పైకి లేచెను! “ఇది సాధ్యము కాదు, అనగా నా యొక్క పరిశుద్దుడు కుళ్ళును చూడడు, లేక నేను ఆయన యొక్క ఆత్మను (ప్రాణమును) పాతాళములో (నరకములో) విడిచి పెట్టను.” మరియు ఆయన యొక్క ప్రాణము, ఆయన యొక్క ఆత్మ పాతాళములోనికి దిగినది. మరియు ఆయన లేచియున్నాడు. దేవుడు చేసెను మరియు ఆయన యొక్క శరీరమును పట్టుకొని పైకి లేపియున్నాడు మరియు ఆయనకు జీవమునిచ్చాడు. మరియు యేసు యొక్క శరీరమును తీసుకొని మరియు మహిమలో ఆయన యొక్క కుడి పార్శ్వమున ఉంచుకొనియున్నాడు, మరియు ఒక నిబంధన పరిశుద్ధాత్మను మరలా పంపించియున్నాడు.

65

మీరు అచ్చటే ఉన్నారు. సోదరుడా, ఆ విషయములో పడిపోవద్దు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేనిచో నీవు నశించినట్లే. అది మాత్రమే... పరలోకమునకు వెళ్ళుట గూర్చి నీవు ఇక చింతించనవసరం లేదు. ఇచ్చట ఏ యొక్క సహజాతీతమైనది లేనిచో, ద్వారములు తెరుచుకోనవు; నీవు అచ్చటకు నడిచి వెళ్లి, నీ తలను దానికి కొట్టుకొందువు. అయితే అచ్చట దేవుని యొక్క ఆత్మ ఉన్నచో దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క లోపల ఆ ద్వారముల లోపల తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వెనుక ఇచ్చట దానిని విప్పుటకు ఒక దానిని పొందుకొనవలసియున్నది. అది నిజము. కావున నీవు యేసుక్రీస్తును గూర్చి ఏమి ఆలోచిస్తున్నావో దాని మీద ఇదివరకే తీర్పు తీర్చబడియున్నావు.

66

ఇప్పుడు, ఇచ్చటకు ఆయన వచ్చి, చీల్చియున్నాడు, బ్రద్దలు చేసియున్నాడు, ముక్కలుగా చింపియున్నాడు. ఆయన యొక్క ప్రాణము దేవుని వద్దకు వెళ్లినది. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, మరియు అప్పుడు ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ రూపములో మరలా వెనుకకు వచ్చెను, అనగా అది ప్రతీ విశ్వాసిలోనికి శుద్ధీకరించుటకు, మనసును శుభ్రపరచుటకు, హృదయాన్ని శుభ్రము చేయుటకు వస్తున్నది. మరియు అచ్చట మరియు ఇచ్చట పరిశుద్ధాత్మ యొక్క భాగమును విడిచి పెట్టుచున్నది. మరియు ఆ యొక్క పరిశుద్ధాత్మను బయటకు ఇవ్వబడినప్పుడు, ఏ పరిశుద్ధాత్మ అయితే యేసు శరీరమును సమాధిలో నుండి లేపినదో అదే ఎత్తబాటు చేయును. మరియు ఆ యొక్క నిబంధన అనేది ఒకదానికొకటి అమరవలసియున్నది, ఆయన అచ్చట చీల్చి మరియు శరీరమునిచ్చియున్నాడు; దేవుని యొద్దకు తిరిగి వెళ్లాను మరియు అదే ఆత్మ మరలా భూమి మీదకి తిరిగి వచ్చెను. అప్పుడు నీ యొక్క ఆత్మ అదే రకమైన ఆత్మగా ఉంటుంది, లేనిచో కలసికట్టుగా అక్కడకు వెళ్లే స్థలమును అది కొల్పోతుంది. ఆమేన్. అవునయ్యా. నీకు నీవుగా ఏదో చేసుకొన్నావని కాదు గాని, ఏదో ఒకటి అనగా దేవుని యొక్క ప్రేమ నీ యొక్క ప్రాణములోనికి వచ్చి ప్రతీ భూసంబంధమైన విగ్రహమును బయటికి చీల్చివేసియున్నది. ఇది అచ్చటనున్నది.

67

మరియు ఏదో ఒకటి రోధిస్తూ మరియు దేవునికి పిలుస్తున్నది, ఇది ఇచ్చట నీలోనున్న నీ యొక్క ప్రాణము, పరలోకపు తండ్రిని పిలుస్తున్నది. నీవు అచ్చటనున్నావు. అది నీకు విశ్వాసమునిచ్చుచున్నది మరియు నీవు అబ్రాహాము యొక్క సంతానముగా మారుతున్నావు. అబ్రాహాము చేసినట్లుగా దేవుని యొక్క వాగ్దానమును నీవు నమ్ముచున్నావు, ఇది ఆలస్యమైనప్పటికి, ఇంకా దానిని నీవు నమ్మవలసియున్నావు. విశ్వాస వీరుడైన అబ్రాహాము, అవిశ్వాసము వలన దేవుని యొక్క వాగ్దానమును సందేహించ లేదు గాని, బలము పొందుకొని దేవునిని స్తుతిస్తూ వచ్చెను.

మరియు నీవు ఒక ఉజ్జీవము నుండి వేరొక ఉజ్జీవమునకు రక్షింపబడి ఉండజాలవు. పిమ్మట అబ్రాహాము యొక్క సంతానముగా నిన్ను నీవు చెప్పుకొందువా? ఏదో ఒక దానిని మొట్టమొదటిగా నీవు బాగా ఆలోచించుట మంచిది. దేనిని తప్పుగా తీర్పుతీర్చవద్దు. వాక్యముతో సూటిగా ఉండుము.

అవిశ్వాసము ద్వారా అబ్రాహాము దేవుని యొక్క వాగ్దాన విషయములో సందేహపడలేదు. ఆయన తనకు ఒక కుమారుని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు, అతడు దాని కొరకు 25 సంవత్సరాలు వేచియున్నాడు, ప్రతీ కాలములోను ఆయన బలము పొందుకొనియున్నాడు. అతడు ప్రభువు యొక్క కృపలోను మరియు జ్ఞానములోను ఎదిగాడు. ఆమేన్.

68

బోధించాలని అనుకోలేదు, కాని బోధించుట అనేది నాలోనున్నది. అది సరియే.

69

దేవుడు పిలుపు, ఎన్నిక. ఇప్పుడు, నీవు దానిని ఎదుర్కొనవచ్చు: అయితే కొంత మంది ప్రజలు గలరు, వారు ఎన్నటికిని రక్షింపబడరు. ఎన్నడూ రక్షింపబడని ప్రజలు గలరు, వారు ఏమి చేసినా రక్షింపబడరు. మరియు మీకది తెలుసు. నశించుపోవుట కొరకే కొంత మంది ప్రజలు నిర్ణయించబడ్డారు. రక్షింపబడుట కొరకే కొంత మంది ప్రజలు నిర్ణయించబడ్డారు. ఏది ఏమైనా గాని రక్షింపబడుటకు ముందగా నిర్ణయించబడిన వారందరూ రక్షింపబడుదురు.

70

అది అంత మంచిగా ఉండక పోవచ్చు. దానిని మీరు అర్ధము చేసుకోలేనట్లుగా కనిపిస్తూ ఉన్నది, మంచిది, మనము త్రిప్పెదము.... మనము దానిని పిమ్మట కనుగొనెదము; దేవుడు ఏమి చెప్పియున్నాడో చూచేదము. మనము ముందుకు వెళ్లెదము, మొదటిగా మనము క్రొత్త నిబంధనకు వెళ్లెదము. ఒక్క నిమిషము రోమా పత్రిక 9వ అధ్యాయము, అప్పుడు ఇది సరియైనదా కాదా చూచేదము, అనగా కొంత మంది నశించిపోవుదురనియు మరియు మరి కొంత మంది రక్షించబడుదురనియు దేవుడు చెప్పెనా చూచెదము. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడుచున్నారా? మంచిది, ఇప్పుడు, ఇది ఏమి చెప్పుచున్నదో చూచెదము. మరియు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మీరు మీ సమయాన్ని తీసుకొనండి; తొందరపాటుగా ఉండవద్దు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో, రోమా పత్రిక 9వ అధ్యాయములో పౌలు మాట్లాడుతున్న దానిని గమనించండి. పాత నిబంధనలో మిముమ్మలను చాలా స్థలాలకు తీసుకొని వెళ్లెదను.

71

మరియు దానిని అచ్చట వ్రాయుచున్న మీరు, దానితో కలసి మీరు అచ్చట ఉంటుండగా యూదా పత్రిక 4వ వచనము కూడా వ్రాసుకొండి: “ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాధుడును, ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.” తిమోతి పత్రికలో కూడా ఇలా చెప్పబడినది, “యన్నే, యంబ్రెలు మోషేను మరియు అహరోనును ఎదురించిన రీతిగానే; దుష్ట మసస్సు కలిగిన మనుష్యులైన వీరు కూడా సత్యమును ఎదురించుదురు.” వారు అచ్చట ఉందురని దేవుడు చెప్పెను, మరియు వారు ఇచ్చట నున్నారు!

అబద్దపు విషయాలను చూడండి. మీరు ఇచ్చట నుండి బయటకు వెళ్ళండి, పెంతుకోస్తు సంఘముల గుండా వెళ్ళండి, మెథడిస్టు, బాప్టిస్టు, హోలీనెస్, మీరు ఎక్కడికి వెళ్లినప్పటికి దానిని అనుకరించు ప్రజలను మీరు కనుగొందురు, ప్రజలు అలా వారు తయారు చేసుకొనుచున్నారు. “మంచిది, దేవునికి మహిమ, హల్లెలూయ!”

72

ఒక దినాన ఒక స్త్రీ ఇలా చెప్పినది, “నాకు పదిమంది పిల్లలు, అయితే దేవునికి మహిమ, సువార్తను బోధించుటకు ప్రభువు నన్ను పిలిచియున్నాడు. హల్లెలూయ! దానిని చేయుటకు నేను బయటకు వెళ్ళుచున్నాను.” ఆయన అటువంటి దానిని చేయలేడు. ఆయన ఎన్నడూ చేయలేదు మరియు ఆయన ఇకమందూ కూడా చేయడు, ఎందుకనగా ఆయన అలా చేయనని ఆయన చెప్పెను. ఇప్పుడు అలా చేయుదునని అలా ఆమె భావించినది. అవునండీ. పెంచుటకు దేవుడు ఆమెకు పది మంది పిల్లలను ఇచ్చెను; ఆమె చేయవలసిన పని అదియే. మంచిది. అయితే దానియొక్క విషయమేమనగా, దానిని వారికి వారే పొందుకొనుచు ఉద్రేకములో అలా అపార్ధము చేసుకొనుచున్నారు.

73

“మంచిది,” వారు చెప్తారు, “ఎవరూ నాకు బోధించనవసరం లేదు, దేవునికి, మహిమ, నేను పరిశుద్ధాత్మను పొందుకొనియున్నాను.” మంచిది, అది కొంత మందిని సంఘములో ఉపదేశకులను ఉంచినది అని చెప్పినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ తప్పై ఉండవలసియున్నాడు. దేవుడు వారిని ఉపదేశకులనుగా ఆయన సంఘములో పెట్టెను. అది దానిని పరిష్కరిస్తున్నది. ఆయన అచ్చట ఉపదేశకులను ఎందుకు పెట్టెను, అనగా పరిశుద్ధాత్మయే సమస్త బోధన చేయునప్పుడు ఇక వారెందుకు? మంచిది.

చూచారా, నేడు ప్రజలకు కావలసియున్నదేమనగా వారి యొక్క నీటిని మినహాయించి, వారి యొక్క మనసులకు బాప్తిస్మము కావలసియున్నది. అది నిజము. మంచిది. దానిని గట్టిగా చెప్పినందుకు క్షమించండి, అయితే నేను వాస్తవముగా నానబెట్టవలెనని కోరుదును. మనకు ఒక ఉజ్జీవము కావాలి, మరియు సోదరుడా, నీవు ఆ యొక్క విషయమును పైకి ఉజ్జీవింపజేయాలి. నీవు దానిని చేయుటకు ముందుగానే, సాతానుని దూరముగా తన్నివేయాలి. వాడితో తగాదా పడవద్దు, నీ యొక్క స్థానాన్ని పొందుకొని అచ్చటే నిలువబడియుండు. సర్వ ప్రపంచము చుట్టూ వాడితో యుద్దము చెయ్యండి మరియు దేవుని కొరకు నిలువబడిన ప్రతీ ఇతర క్రైస్తవుడు కూడా వాడితో యుద్దము చేయవలసియున్నాడు. అయితే దేనికొరకు నీవు నిలువబడియున్నావో నీవు తెలిసికొనినచో, నీవు తెలిసికొనిన ఇది సత్యమని యెరిగినచో, అనగా ఇది “యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,” అని తెలుసుకున్నచో, నీవచ్చట నిలువబడగలవు.

74

నీవు ఇలా చెప్పవచ్చు, “మంచిది, నేను రక్షించబడియున్నాను, ఎందుకనగా నేను త్రాగుడు విడిచి పెట్టాను. దేవునికి మహిమ. నా యొక్క వెన్నులో వణుకు కలిగియున్నాను. నా యొక్క ముఖము మీద తాకేటటువంటిది ఒక బలమైన గాలి వంటి ధ్వని కలిగి ఉన్నాను. బ్రెన్హాం సోదరుడా, దానిని నీవు నమ్ముచున్నావా?” నిశ్చయముగా. అయితే ఆ యొక్క బలమైన గాలి వంటి ధ్వని ఎచ్చట నుండి వచ్చుచున్నదో మొట్టమొదట నేను చూడదలచుకొన్నాను, చూచారా. అది సరియే. నిజముగా, అది వణికిస్తుంది, మంచిది, అయితే నేను వణుకు కలిగియున్నాను గనుక రక్షించబడియున్నానని కాదు, మరియు బలమైన ధ్వని వంటి గాలిని కలిగియున్నాను గనుక రక్షించబడియున్నావని కాదు. “సోదరుడా, నీవు దానిలో నమ్మకము కలిగిలేవా?” అవును, నేను నమ్ముతాను. అయితే ఒక్క నిమిషం ఆగండి; ఇచ్చట కొద్దిసేపు దానిని వెనుకకు తీసుకు వద్దాము. అచ్చట దయ్యము కొన్ని మోసాలను కలిగియున్నది.

నేను రక్షించబడియున్నాను, ఎందుకనగా దేవుని యొక్క షరతులును నేను కలుసుకొనియున్నాను. ఆయన నన్ను పిలిచియున్నాడు, మరియు ఆయన నన్ను పిలిచియున్నాడని నేను ఎరుగుదును. ఆయన వాక్యము మీద నేను ఆయనను అంగీకరించియున్నాను; కాబట్టి, ఇది “యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు!” అని సాతానునికి నేను చెప్పగలను.

75

యేసు ఇచ్చట భూమి మీదనున్నప్పుడు, ఆయన దేవుడైయున్నాడు; ఆయన ఇమ్మానుయేలు. దేవుడు క్రీస్తులోనున్నాడు, ఈ లోకమును తనకు సమాధాన వరచుకొనుచున్నాడు. సాతానుని ఎదుర్కొనప్పుడు, ఆయన తన యొక్క గొప్ప వరములనేవియు ఉపయోగించుకొనలేదు. “మనుషులు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చిన ప్రతిమాట వలన జీవించును,” అని వ్రాయబడియున్నది. “నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు,” అని మాత్రమే చెప్పియున్నాడు. మరియు ఆయన వానిని ఓడించాడు. అదియే ఇది: లేఖనములను తెలుసుకొనండి. సాతానునికి కూడా అవి తెలియును, అయితే దేవుని యొక్క వాక్యమును సరిగ్గా ఎలా విభజించవలెనో మీరు తెలుసుకొనవలసియున్నారు, చూచారా.

76

గమనించండి. పౌలు మాట్లాడుచున్నది వినండి. పౌలు యొక్క సిద్ధాంతమును ఎంత మంది అంగీకరించెదరు? అతడు చెప్పెను, “దేవదూతయైనను దీనికి విరుద్ధముగా బోధించినచో, అతడు శాపగ్రస్తుడవును గాక.”

క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది.

పౌలు తనను తాను నిశ్చయం చేసుకొనుచున్నది వినండి, చూచారా, ఇది ఇలా పెట్టడం ద్వారా, మీరు సంపూర్ణముగా తెలుసుకొనెదరు.

క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది.

సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరుదును.

77

“ఓ, యూదులు అందరూ దేవుని యొక్క ఎన్నిక ప్రజలు,” అని చెప్పుట మీరు వినేయుంటారు. అది నిజము కాదు. అది నిజము కాదు. యూదులు అందరూ దేవుని యొక్క ఎన్నిక ప్రజలు కాదు. చూచారా, వారు కాదు. ఇప్పుడు, మీరు వినండి, పౌలు అదే విషయమును చెప్పుట లేదు మరియు అతడు కూడా ఒక యూదుడై యున్నాడు. చూచారా, అబ్రాహాముకు పదకొండు మంది కుమారులున్నారు, మీకు అది తెలుసు, (మీకు తెలియదా?), మరియు వారంతా అబ్రాహాము యొక్క సంతానము. వారందరూ అబ్రాహాము యొక్క సంతానమే గాని “ఇస్సాకు వలనైనది మాత్రమే నీ సంతానమనబడును.” మిగతా వారు కాదు, ఇష్మాయేలు నుండి కాదు, మిగతా భార్య నుండి అతడు కలిగియున్న తొమ్మిది మంది కుమారులు ద్వారా కాదు... అతడు మూడవ భార్యను కూడా కలిగియున్నాడు. లేదు. “ఇస్సాకు వలనైననిది మాత్రమే నీ సంతానముగా పిలువబడును,” అని చెప్పబడెను. వేచియుండండి, ఇది ఈ యొక్క అధ్యాయములోనే ఉన్నదని నేను నమ్ముచున్నాను.

వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములను వీరివి.

ఇప్పుడు, ఇశ్రాయేలీయులను గూర్చి అతడు మాట్లాడుచున్నాడు, ఇప్పుడతడేమి చెప్పుచున్నాడో అతనిని గమనించండి.

పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను, ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.

అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.

అది సరియేనా? అట్లయినచో యూదులు అందరూ ఇశ్రాయేలీయులు కానే కాదు; వారందరూ ఇశ్రాయేలీయులు కాదు, వారు ఇశ్రాయేలీయులా?

అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని,...

78

అది వారిని ఇశ్రాయేలీయులనుగా చేయదు. ఇప్పుడు గమనించండి. “సహోదరుడా బ్రెన్హాం, మీరు దేనిని మాదిరిగా చూపిస్తున్నారు.” నేను సంఘమును మాదిరిగా చూపుచున్నాను. క్రీస్తును అంగీకరించిన వారందరూ క్రైస్తవులు కారు. సంఘమునకు వెళ్ళుచున్న వారంతా క్రైస్తవులు కాదు. అబ్రాహాము యొక్క సంతానమంతా వాగ్దానాన్ని కలిగి లేరు. ఇది ఒక ఎన్నిక; ఇది ఒక వాగ్దానము. మరియు ఆ యొక్క వాగ్దానము అబ్రాహాముకు ఇవ్వబడినది. మరియు దేవుని యొక్క ఎన్నికలో ఉన్నవారందరూ ఈ జగత్తు పునాది ముందుగానే నిర్ణయించబడ్డారు, చూచారా. గమనించండి!

అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని,

ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును.

మిగతా యూదులలో కాదు, కాని ఇస్సాకులోనే. ఇస్సాకు ద్వారానే క్రీస్తు వచ్చెను, అతడు అనగా క్రీస్తు అబ్రాహాము యొక్క సంతానము. మరియు అబ్రాహాము యొక్క మొట్టమొదట సంతానము (విత్తనము) లైంగిక చర్య ద్వారా రాలేదు; అది ఆయన యొక్క విశ్వాసమును దేవుడు ఎంచెను. మరియు మనము మన యొక్క విశ్వాసము ద్వారా అనగా క్రీస్తు యొక్క మరణ, సమాధి, మరియు పునరుత్థానములను నమ్ముట ద్వారా, మనము అబ్రాహాము యొక్క సంతానముగా చేయుచున్నది.

79

మరియు అబ్రాహాము అతని యొక్క విశ్వాసానికి గురుతుగా సున్నతి చేసుకొనియున్నాడు. ఇప్పుడు, అతడు సున్నతి చేసుకొనుచూ ఉండగా దానినతడు పొందుకొనలేదు గాని, అతడు సున్నతి చేసుకొనుటకు ముందుగానే అతడు ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకొనియున్నాడు.

పెద్దగారూ అది నిజమేనా? ఆ యొక్క వేరొక బోధకుడు ఎచ్చట ఉన్నాడు; నేను అతనిని చూచియున్నాను... ఓ, సోదరుడా, అతడు అచ్చట వెనకాల రికార్డు చేయుచున్నాడు. అవును. అది సరియే.

80

అతడు సున్నతి పొందుకొనకమునుపే వాగ్దానమును పొందుకొనియున్నాడు. రోమా 4వ అధ్యాయము మీకు చెప్పుచున్నది. అతడు సున్నతిని చేసుకొనక మునుపే ఆ వాగ్దానమును స్వీకరించాడు. పిమ్మట అతని యొక్క విధేయతకు ఒక గురుతుగా సున్నతి అతనికివ్వబడినది. ఇప్పుడు, మనము చెప్పినపుడు... అందుచేతనే బిల్లీ గ్రాహమ్ గారు, చార్లెస్ ఫుల్లర్ గారు, బిల్లింగ్స్ గారు మరియు వారంతా ఆ యొక్క బాప్తిస్టు సహోదరులు గురించి ఎందుకు మాట్లాడుతున్నారోనని, వారిలో చాలా మంది అనగా రుఫుస్ మోస్లి గారు మరియు తన యొక్క సమస్త గుంపును గూర్చి నేను అలా చేప్పితిని.

అతడు చెప్పెను, “మంచిది, మేము రెండు వారాలలోనే 20 వేల మందిని మార్చియున్నాము. అయితే వారు 20 మందిని కూడా కనుగొనలేదు.”

నేను చెప్పాను, “మంచిది, వారు మార్పుచెందలేరు.”

“ఓ,” అతడు చెప్పెను, “వారు క్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించియున్నారు.”

నేను చెప్పాను, “ఇంకను, వారు మార్పుచెందిన వారు కారు.” అది నిజము. అది చేయువరకు నీవు మార్పు చెందనివాడవు కావు. మారుమనస్సు పొందుట అనగా “మార్పు చెందియుండుట” అని అర్ధము. మరియు చూడండి , పౌలు...

81

పేతురు ప్రభువు నందు విశ్వసించాడు, అతడు బాప్తిస్మము పొందియున్నాడు, రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెల్లగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు, మృతులను లేపుటకు అతనికి అధికారమియ్యబడెను. మరియు యేసు తాను సిలువ వేయబడక ముందు రాత్రి పేతురుకు ఇలా చెప్పెను, “నీవు మార్పు చెందిన తరువాత, మిగతా నీ సహోదరులను కూడా బలపరచుము.” అది నిజమేనా? అతడు రక్షింపబడియున్నాడు మరియు శుద్దీకరించబడియున్నాడు, అయితే మార్పుచెందలేదు. అది లేఖనము.

“ఓ, అతడు శుద్ధీకరించబడియున్నాడా?” అవునయ్యా!

యెహాను 17:17: “తండ్రి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము.” యోగ్యము కాని ఒక పాత్రలో ఆ యొక్క ఆత్మను ఆయన పెట్టునని మీరు భావిస్తున్నారా? మరియు వారు బయటకు వెళ్లి మరియు దయ్యములను వెల్లగొట్టిరి; కేకలు వేయుచు తిరిగి వచ్చిరి. మంచిది, మెథడిస్టులారా. వారు ఉత్సాహ ధ్వని చేయుచు, దేవునిని స్తుతించుచూ తిరిగి వచ్చిరి, మరియు చెప్పెను, “ఓ, దెయ్యములు కూడా మనకు లోబడుచున్నవి!”

ఓ, ఒక్క నిమిషం! మత్తయి సువార్త 10వ అధ్యాయము: మరియు ఆయన చెప్పెను, “దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి.” అది నిజమేనా?

82

ఇప్పుడు, ఒక్క నిమిషము మిమ్ములను నిశబ్దముగా ఉంచవలెనని కోరుచున్నాను మరియు యూదా కూడా వారితో యున్నాడు. అది నిజమేనా? యూదా ఒక మురుగు నీటి గుంటలో ఒక పెద్ద బాతువలె ఉన్నాడు. అతడు కూడా పెద్దగా కేక పెడుతూ ఆనందిస్తున్నాడు. మరియు అతడు, ఆ సంఘము పెంతుకోస్తు వద్దకు వచ్చినంతగా దానిని వెంబడించాడు. అయితే అది పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకొనుటకు పెంతుకోస్తు వద్దకు వచ్చేసరికి అతడు ఆయన దానిని తృణీకరించి మరియు యేసును మోసగించాడు. మరియు అది క్రీస్తువిరోధి అయి యుండెను. మరియు అదే ఆత్మ నేడు కూడా నేరుగా వచ్చి మరియు విశ్వాసము ద్వారా నీతీకరణము, మరియు సమస్తమైన విషయములు బోధిస్తుంది మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము వద్దకు వెళుతుంది, పిమ్మట అది దానియొక్క రంగును ప్రదర్శిస్తుంది. అది ఖచ్చితము.

83

మరియు బయటకు వెళ్ళిన ఆ యొక్క పది మంది కన్యకలను గమనించండి. వారందరూ కూడా కన్యకలు. వారిలో ఐదుగురు బుద్దిలేనివారు; ఐదుగురు వారి యొక్క దివిటీలలో నూనెను కలిగియున్నారు. నూనె అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ, చూశారా. అది నిజమే. వారందరూ కూడా కన్యకలే, మంచిగా మరియు పరిశుభ్రమైన జీవితాలు జీవించారు.

నీవు చెప్పవచ్చు, “మంచిది, సోదరుడా, నేను నాట్యము చేయుటకు వెళ్ళను; నేను సినిమాలుకు వెళ్ళను.” అవి కేవలం నైతిక విషయాలు. ఒక సహాజాతీతమైనది ఏదైనా అచ్చట ఉంటేనే తప్ప! నీవు గట్టిగా అరిచియున్నావని కాదు, నీవు భాషలతో మాట్లాడియున్నావని కాదు, నీవు పైకి-క్రిందికి ఎగిరియున్నావని కాదు, నీవు దీనిని చేసియున్నావని కాదు; అయితే ఇచ్చట ఎదో ఒక సహజాతీతమైనది జరిగినది మరియు అదియే నిన్ను మార్చినది మరియు నిన్ను దేవునిలో ముద్రించబడిన ప్రేమతో ఉంచినది. నీవు లంగరు వేయబడియున్నావు. అది నిజము.

“నీవెందుకు నమ్ముట లేదు...?” కేకలు వేయుటను నేను నమ్ముతాను, నేను వీటన్నింటిని నమ్ముతాను, అయితే అది సమాధానము కాదు.

84

మెథడిస్టులు భావిస్తున్నదేమనగా, వారు గట్టిగా కేకలు వేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మను కలిగియున్నారని, అయితే వారు తప్పై ఉన్నారని వారు కనుగొన్నారు. ఎందుకనగా అనేక మంది కేకలు వేసిరి అయిననూ వారు దానిని కలిగిలేరు. పెంతుకోస్తు ఆ మార్గములో వచ్చినది. వారు భాషలతో మాట్లాడియున్నారు, వారు చెప్పారు “మేము పొందుకొనియున్నాము,” అయితే వారు తప్పు అని వారు కనుగొనియున్నారు. వారిలో చాలా మంది భాషలతో మాట్లాడియున్నారు గాని ఏమియు కలిగిలేరు. “నేను మనుష్యుల భాషలతోను మరియు దేవదూతల భాషలతోను మాటలాడినను, ప్రేమ లేనివాడినైతే, అది నాకు ఏమియు పనికిరాదు.” మీరు దానిని కలిగిలేరు. అది నిజము. ఆ కారణము చేతనే సర్వ ప్రపంచము దానిద్వారా మోసగించబడినది, మరియు మిగతా విషయము... అది సమాధానము కాదు. ఏ విధమైన శారీరక ప్రదర్శనలు లేక ఉద్రేకములు కాదు గాని, నీ యొక్క సమస్త అభిప్రాయమును, నీ యొక్క సమస్త స్వభావమును మార్చుటకు ఇచ్చట ఎదో జరిగినది. నీవు మార్పు చెందియున్నావు; నీవు కాదు గాని, క్రీస్తే నీలోనికి వచ్చి మరియు నిన్ను మార్చియున్నాడు. నీ యొక్క ప్రాచీన పురుషుడు అనే స్వభావము చనిపోయినది, మరియు నీవు తిరిగి జన్మించియున్నావు, మరియు నీవొక నూతన వ్యక్తేవి. గమనించు. ఆమేన్.

85

ఇచ్చట నేను ఆలస్యము చేయుచున్నానని మీరు చెప్పవచ్చు, ఒక కొద్దిపాటిగా మీరు నా పైన అరవండి, సహోదరులారా, ఆ వెనుక మీరు, నేను మరి కొద్ది ఎక్కువ సేపు ఆలస్యము చేసినచో అలా చేయండి. నేను మరియొక నిముషములో ఇచ్చట ఇశ్రాయేలు పిల్లలను గూర్చి చెప్పబోవుచున్నాను. అయితే ఈ యొక్క విషయములను చేయటకు ఇది దేవుని యొక్క పనిగా ఎలా ఉన్నదో నేను మీకు చెప్పెదను. మీరు నన్ను ఇంకా ప్రేమించెదరా? మంచిది. ఇప్పుడు, నా కొరకు ప్రార్ధన చేస్తూ ఉండండి. మంచిది. అయితే మీరు అటు పిమ్మట కొద్దిగా నన్ను ప్రశాంతంగా ఉంచండి. ఇప్పుడు ఒక్క క్షణము.

అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువలనైనది నీ సంతానము అనబడును.

అనగా శరీరసంబంధమైన పిల్లలు , దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు. (ఓ, దాని వైపు చూడండి.) సంతానమని ఎంచబడుదురు.

“వాగ్దాన పిల్లలు.” వాగ్దానము ఏమిటి? అది ఏ రకమైన వాగ్దానము? దానిని దేవుడు జగత్తుపునాది వేయబడక మునుపే వాగ్దానం చేశాడు. “అదియే నీ యొక్క సంతానము!” అని ఆయన చెప్పెను. నీవు దానిని చేయుట ఆపివేశావని కాదు మరియు దానిని చేయుట ఆపివేశావని కాదు, మరియు అబద్ధమాడుట ఆపివేశావని కాదు, దొంగతనము చేయుట ఆపివేశావని కాదు. అవి కేవలం నైతిక క్రియలు; ఒక మంచి పౌరుడు కూడా వాటిని చేస్తాడు. ఇచ్చట ఏదో ఒకటి నీకు జరిగేంత వరకు, నీకు నీవుగా ఒక క్రైస్తవునిగా పిలుచుకొనజాలవు, నీవు నూతనముగా జన్మించేవరకు, ఇచ్చట ఏదో ఒకటి జరిగేంత వరకు నీవు క్రైస్తవునివి కాదు. గమనించండి.

వాగ్దానరూపమైన వాక్యమిదే మీదటికీ ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును.

అంతే కాదు; (ఇప్పుడు దీనిని వినండి.) రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు.

86

నీ పైకోటును వేసుకొనుము, మీ యొక్క శిరస్త్రానమును సిద్దముగా ఉంచండి. ఇది మిమ్ములను చుట్టూ తిప్పుతుంది.

(పిల్లలింక పుట్టి, మేలైనను కీడైనను చేయకముందే, [ఇది ఏశావు మరియు యాకోబు.] ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము.

నేను ఆ యొక్క విషయమును ఎక్కువ సేపు నానబెట్టుచున్నాను. ఒక చిన్న విషయమును గూర్చి ఇప్పుడు మేల్కొనండి. ఏశావు మరియు యాకోబు ఆ యొక్క పిల్లలు పుట్టకమునుపే అనగా మంచి చెడు ఇంకా వారు ఎరుగక మునుపే...

... ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియలు మూలముగా కాక, పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము;)

హో! రక్షింపబడుటకు మీరు మాంసమును విసర్జించియున్నారని నేను భావిస్తున్నాను? దానితో (రక్షణతో) నీవు చేయవలసినదేమియు లేదు! నీవు రక్షింపబడినచో, దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపే నిన్ను పిలిచియున్నాడు, మరియు నిన్ను రక్షించియున్నాడు. అది నిజమేనా? ఇప్పుడు గమనించండి.

పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.

ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది.

పిల్లలింకను పుట్టక ముందే, దేవుడు చెప్పెను, “నేను ఒకనిని ప్రేమించితిని మరియు ఒకనిని ద్వేషించితిని.” ఇది దేవుని యొక్క వాక్యమేనా? దానికొరకు నేను బాధ్యుడును కాను, ఏమీ చేయలేను గాని దానిని ప్రసంగించవలసియున్నాను.

87

ఇప్పుడు, ఎన్నిక అనేది నీవు చేయవలసినది ఏమి లేదు; దేవుడు ఏమి చేసెను అనునది. దానిని నీ కొరకు ఈ ప్రపంచ నిర్మాణమునకు ముందుగానే దేవుడే క్రీస్తునందు చేసియున్నాడు. “నా తండ్రిచేత నాకు అనుగ్రహించబడిన వారందరూ నా యొద్దకు వత్తురు.” హల్లెలూయ! ఓ, మై! నన్ను మన్నించండి. నేను ఉద్రేకపడుట లేదు; కాని సంతోషిస్తున్నాను. “నా తండ్రిచేత అనుగ్రహించబడినవారందరూ నా యొద్దకు వచ్చెదరు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను. నా శరీరము తిని మరియు నా రక్తము త్రాగువాడు యోగ్యుడైయున్నాడు, అతడు ఆత్మను పొందుకొనిన తరువాత, నిత్యజీవమును కలిగియున్నాడు. నేను అతనిని అంత్యదినమందు లేపుదును.” [టేపు మీద విరామము.]

88

దేనికొరకు మీరు భయపడుచున్నారు? హో! షరతులు లేకుండా దేవుడు వాగ్దానము చేసియున్నాడు. ఆ యొక్క దేవుని ప్రేమ, మీ హృదయములలో మ్రోగుచున్నది, మరియు మీరు మరణము నుండి జీవములోనికి దాటియున్నారని మీరెరుగుదురు; మీరు అందరిని ప్రేమిస్తున్నారు; మరియు ఈ సమస్త ప్రపంచము మీకు విభిన్నముగానున్నది; మరియు ఆమె అచ్చట లంగరు వేయబడియున్నది; ఏదియు మిమ్ములను కదిలించలేదు. కేవలం సంతోషముగా ఉండి ముందుకు కదలండి. దేవునికి మహిమ! ఏదియు మిమ్ములను కదిలించనివ్వకుడి. ఓ, మీరు బయటకు వెళ్లవచ్చు మరియు చల్లగా ఉండవచ్చు మరియు కొద్దిగా వణకవచ్చు, అయితే దేవుని యొక్క విత్తనము సత్యముగా నిలిచియుంటుంది. పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నదేమనగా, “మనము నమ్మదగనివారమైనప్పటికి ఆయన అట్టివాడు కాడు. ఆయన సత్యవంతుడు. ఆయన నమ్మదగినవాడు.” ఇప్పుడు గమనించండి. మనము చదివెదము.

కాబట్టి యేమందుము? (పౌలు చెప్పినది వినండి.) దేవునియందు

అన్యాయము కలదా? అట్లనరాదు. (అన్యాయము కలదా?)

అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు, ఎవని కరుణింతునో వానిని కరుణింతును; ఎవని యెడల జాలిచూపుదునో వానియెడల జాలి చూపుదును.

ఓ, మీరు చెప్పవచ్చు, “దేవునికి మహిమ, హల్లెలూయ, నేను చనిపోకముందుగానే నేను రక్షించబడుదును.” నీవు రక్షిపబడుదువా?దానిని గూర్చి చెప్పుటకు దేవుని యొద్ద ఒకటి కలదు.

... కాగా పొందగోరు వాని వలనైననూ... (లేదండి, కావున) ... లేక... ప్రయాసపడు వాని వలనైననూ, (గమనించండి) అయితే కరుణించు దేవుని వలననే.

ఇది పొందగోరు వాని వలనైననూ లేక ప్రయాసపడువాని వలనైననూ కాదు; ఇది కరుణించు దేవుని వలననే. ఇది దేవుని యొక్క ఎన్నిక. దేవుడు ఆయన దేనినైతే కోరుకుంటాడో దానినే చేస్తాడు.

89

ఇప్పుడు గమనించండి. కొద్ది ముందుకు. (నేను దానిని ఇచ్చట ఎర్రటి అక్షరాలతో గుర్తించుకున్నాను, చాలా ఎక్కువగా, దానిని నేను చూచుటకు కష్టముగా పొందుకొనేంత వరకు అన్నింటిని సంపూర్తి చేశాను. దానిని ఇచ్చట నేను ఎంతో ఎక్కువగా చదివియున్నాను.) “కాగా..” (అచ్చట అది ఏమిటో నాకు తెలియదు. ఇది అవును, ఇది అచ్చట రుద్దబడినది. ఇది అచ్చట ఉన్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను; ఇది అచ్చట ఎర్రటి అక్షరములతో కొట్టివేయుబడినది.)

ఆ లేఖనము (నేను నా యొక్క మరియొక బైబిలును రేపు రాత్రికి తెచ్చుకొనెదను.) మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను. నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.

దేవుడు ఫరోను లేపి మరియు ఆ యొక్క ఉద్దేశము కొరకు అతని యొక్క హృదయమును కఠినపరచెను. దేవుడు యూదా ఇష్కరియోతును లేపియున్నాడు; అతడు ఇచ్చట నాశనపుత్రునిగా జన్మించియున్నాడు. అది నిజమేనా? దేవుడు ఏశావు మరియు యాకోబును గూర్చి వారు పుట్టక మునుపే చెప్పియున్నాడు, ఏమి జరగబోవుచున్నదో అన్ని విషయములను వారి తల్లితో చెప్పియున్నాడు. ఒక వ్యక్తిని ఆయన ద్వేషించాడు మరియు ఇంకొక వ్యక్తిని ఆయన ప్రేమించాడు. అది నిజమేనా? కావున ఇది దేవుడే సమస్తములో సమస్త విషయములు చేయుచున్నాడు, మరియు దానితో నీవు చేయవలసినది ఏమియులేదు. మరియు దేవుడు నిన్ను పిలిచినచో, దేవుని యొక్క ప్రేమ నీ యొక్క హృదయములో మ్రోగుతూ ఉంటుంది. మరియు ఆయన పిలిచిన వారందరూ ఆయన యొద్దకు వచ్చెదరు, వారీలో ఏ ఒక్కడు నశించిపోరు. దేవుడు వాగ్దానము చేసియున్నాడు: వారిలో ఏ ఒక్కడు నశించిపోడని ఆయన చెప్పియున్నాడు. “తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు. మరియు వారిలో లేఖనము నెరవేరినట్లుగా యూదా ఇస్కరియోతు తప్ప ఎవరును నశించలేదు. మరియు నేను వారిని అంత్యదినమందు లేపుదును.”

90

ఇప్పుడు, ఒక్క క్షణము క్రితము నీవు క్రైస్తవుడవని నీవు చెప్పియున్నావు. ఒక క్రైస్తవునిగా అగుటకు ఏది నీకు కారణమైనది? ఎందుకనగా ఒక క్రైస్తవునిగా ఉండుటకు జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడే నిన్ను పిలిచియున్నాడు మరియు నీవు క్రైస్తవునిగా మారియున్నావు. పిమ్మట నీవు రక్షించబడియున్నావు, పరిశుద్ధాత్మతో నింపబడియున్నావు, నీవు నిత్యజీవమును పొందుకొనియున్నావు. ఆయన నీకెందుకు పరిశుద్ధాత్మను అనుగ్రహించియున్నాడు? నీ యొక్క విశ్వాసమునకు గురుతుగా. నీవు విశ్వాసమును మొదట కలిగియున్నావు.

ఇప్పుడు, ఒకవేళ మీరు, “మంచిది కొద్ది నిముషాల క్రితము మీరు బిల్లీ గ్రాహమ్, 'ఎంత మంది క్రీస్తును వారి యొక్క వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించుచున్నారు, చేతును పైకి లేపండి,' అని వారు కేకలు వేయుట గూర్చి కొద్ది నిముషాల క్రితము మీరు చెప్పియున్నారు. అది సరియేనా?” అని మీరు చెప్పినట్లయితే. ఖచ్చితముగా, అది సరియే. అది మంచిదే, అయితే అది కేవలము ప్రారంభము మాత్రమే. నీవు వాస్తవముగా దానిని నమ్మినట్లయితే మరియు వాస్తవముగా నీవు నీ యొక్క హృదయములో అంగీకరించినట్లయితే, మరియు సరిగ్గా నీకు బోధించబడినట్లయితే, అప్పుడు పరిశుద్ధాత్మ ఒక సున్నతివలె వచ్చును, అనగా ఆయన అబ్రాహామునకు దానిని అతని విశ్వాసమును నిశ్చయము చేస్తూ గురుతుగా ఇచ్చెను.

91

ఇప్పుడు, మీరు చెప్తారు... మంచిది, ప్రజలు చెప్పారు, “మనము ఒక వేచియుండు సభను కలిగి ఉందాము. దేవునికి మహిమ, మనము వెనుకకు వెళదాము.” మరియు చెప్తారు, “దేవునికి మహిమ మనము పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉందాము.” అట్టిదేమియు లేదు.

“నిలిచి ఉండుట” అనే దాని యొక్క అర్ధమేమనగా “ప్రార్ధించుట” అని కాదు. “నిలిచి ఉండుట” అనగా “వేచి ఉండుట” అని అర్ధము. నిలిచి ఉండుట అనగా వేచియుండుట అని అర్ధమని ఎంత మందికి తెలుసు? యేసు చెప్పెను, “మీకు అనుగ్రహింపబడిన ఆ వాగ్దానము మీ మీదకి వచ్చునంత వరకు మీరు యెరూషలేములోనే నిలిచియుండండి.” వారేమి చేయుచున్నారో నాకు తెలియదు. వారు బహుశ ప్రార్ధన చేయుచున్నారు. నాకు తెలియదు.

అయితే దాని తరువాత వారు వేచియుండవలసిన అవసరము లేదు. “పేతురు ఈ మాటలు వారితో పలుకుచుండగా, పరిశుద్ధాత్మ వారి మీదకు దిగివచ్చెను.” అందరి మీదకి దిగివచ్చెను.... మరియు పౌలు వారి మీద చేతులుంచినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగివచ్చెను. అది నిజమేనా? చూచారా, ఇక ఎదురు చూచుట లేదు. ఆ పరిశుద్ధాత్మ అచ్చటనున్నది మరియు వారి యొక్క విశ్వాసము స్థిరపరచబడినది అనే దానికి గురుతుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము వారికివ్వబడినది.

92

మరియు అబ్రాహాము యొక్క విశ్వాసమును స్థిరపరచుటకు గురుతుగా దేవుడు అబ్రాహాముకు సున్నతినిచ్చెను. మరియు ఇది ఏమిటి? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ ఎందుకొరకు అనే విషయము ఎవరైనా నాకు చెప్పండి? అది ఒక సూచన. అది నిజమేనా? సున్నతి అనగా ఏమిటి? ఒక సూచన. అది నిజమేనా? ఒక సూచన. దేవుడు అబ్రాహామును అంగీకరించియున్నాడు అనుదానికి గురుతుగా దేవుడు సున్నతిని ఒక సూచన ఇచ్చియున్నాడు.

మరియు, “నేను దేవునిని నమ్ముచున్నాను, నేను యేసుక్రీస్తుని నమ్ముచున్నాను,” అని నీవు చెప్పినప్పుడు, దేవుడు నీకు గురుతుగా అనగా ఆయన నీ యొక్క విశ్వాసమును అంగీకరించియున్నాడు అనే దానికి గురుతుగా దేవుడు నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఇచ్చును. హల్లెలూయ! మరియు అప్పుడు నీవు దేవుని యొక్క రాజ్యములోనికి ముద్రించబడియున్నావు; మరియొక ఉజ్జీవము వచ్చేంత వరకు కాదు గాని, నీ యొక్క విమోచనా దినము వరకు. ఎఫెసీ 4:30: “పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఎందుకనగా మీరు మీ విమోచనా దినము వరకు దానియందు ముద్రించబడియున్నారు.” అచ్చటే మీరున్నారు.

93

ఇప్పుడు, త్వరగా, మరియొక అయిదు నిమిషములు ఎక్కువగా. ఆది కాండము 45వ అధ్యాయమునకు వెళ్ళెదము. మరియు నేను ఇచ్చట ఒక అద్భుతమైన విషయమును చిన్నగా చేసి తీసుకొనవలెనని కోరుచున్నాను. ఈ యొక్క ఇశ్రాయేలు పిల్లలను ఆ యొక్క స్థలములో మీరు రేపు రాత్రికి చూచేలాగున నేను చూపించాలనుకొనుచున్నాను మరియు వారిని బయటకు తీసుకొని వెళ్లుట అనే విషయాలు. ఈ రాత్రి నేను ఆలస్యముగా చేసినందుకు విచారిస్తున్నాను, కాని నేను దీనిని మొట్టమొదటిగా ప్రారంభించవలసియున్నాను.

94

ఇప్పుడు, అబ్రాహాము ఆ వాగ్దానమును స్వీకరించియున్నాడు. ఇస్సాకు తరువాత వచ్చియున్నాడు. ఆ బలులను గూర్చి మీకు తెలుసు. నేను మీకు తిరిగి ఇచ్చుటకు ప్రయత్నము చేసియున్నాను, అక్కడ ఉన్న సంఘము పిలచుచు, ఎన్నిక దేవునిదై యున్నది, అది ఈ దినము కూడా అలాగే ఉన్నది. ఆయన అబ్రాహామును ఎన్నిక ద్వారా పిలచెను; ఆయన సంఘమును ఎన్నిక ద్వారా పిలచును. ఆయన అబ్రాహామునకు వాగ్దానమునిచ్చెను, అబ్రాహాము దేవునిని నమ్మెను; మరియు ఆయన నేడు సంఘమును పిలచుచున్నాడు. మీరు యేసుక్రీస్తును నమ్ముచున్నారా? అప్పుడు, మొదటిగా, మీరు నమ్మియున్నారు. పిమ్మట దేవుడు అబ్రాహామును మరియు అతని యొక్క పిల్లలను అతని యొక్క సంతానమునకును ఒక గురుతుగా సున్నతి చేసెను; మరియు ఆయన మీకు నేడు పరిశుద్ధాత్మను ఒక సూచనగా ఇచ్చుచున్నాడు.

అది వచ్చినప్పుడు, నేడు ఒక మానవునికి పరిశుద్ధాత్మ ఏమైయున్నది? ఇది సున్నతి చేయవలసి ఉన్నది. (అపోస్తలుల కార్యములు, 7వ అధ్యాయములో) స్తెఫను అలా చెప్పలేదా, “ఓ, హృదయమందు మరియు చెవులయందు సున్నతి లేని ముష్కరులారా, మీరు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితురులు చేసిన రీతిగానే మీరును చేయుచున్నారు.” అది సరియేనా? మరియు ఆ పరిశుద్ధాత్మ ఒక సున్నతిగా ఉన్నది మరియు సున్నతి ఏమి చేయును? మిగతా చర్మమును కత్తిరించును అనగా లోకము యొక్క మిగతా విషయములన్నింటినీ. ఇది లోకము యొక్క విషయముల నుండి మిమ్ములను దూరముగా, లోకము యొక్క విషయముల నుండి దూరము చేస్తుంది, లోకము యొక్క ప్రేమ నుండి, శరీరము యొక్క ప్రేమ నుండి, జీవపు డంబము నుండి. ఇది ఖచ్చితముగా మిమ్ములను దాని నుండి సున్నటి చేస్తుంది. దానితో నీవు చేయవలసినదేమియు లేదు; అది దానికదే చేస్తుంది, మరియు మిమ్ములను యేసుక్రీస్తుతో మరణము లేని ప్రేమలో ఉంచుతుంది.

“యేసుక్రీస్తులో దేవుని ప్రేమ నుండి మిమ్ములను ఏదియు వేరుచెయ్యలేదు.” పౌలు చెప్పెను, “అపాయము గాని మరియు శ్రమలైనను, మరియు చెరసాలయైనను, మరియు ఇక ఏదైననూ, వర్తమాన కాలములో ఉన్న ఏదైననూ, భవిష్యత్తులో రాబోవు ఏదైననూ సరే, యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఏదియూ ఎడబాపనేరదు.”

95

మరియు ఆయన నిన్ను పిలిచియున్నాడు, నిన్ను సున్నతి చేసియున్నాడు, నిన్ను ఆయనలో పెట్టియున్నాడు, మరియు నీ యొక్క నిత్య గమ్యస్థానాన్ని ముందుగానే నిర్ణయించియున్నాడు. అది క్రైస్తవులను ఉత్సాహ ధ్వని చేయింపనిచో, మరి ఇక ఏది వారిని అలా చేయునో నాకు తెలియదు. క్రీస్తులోనున్న ఆ యొక్క మనిషిని అది మేల్కొలపనిచో, మరి ఇక ఏది అతనిని మేల్కొలుపునో నేనెరుగను; అట్టివాడు రెండుసార్లు మృతమైయున్నాడని నేను నమ్ముచున్నాను, వేళ్ళు మటుకు పెల్లగింపబడియున్నాడు. మీకు అలా లేదా? అది సరియే.

96

ఇప్పుడు, ఆయన పిలిచియున్నాడు, ఆయన యొక్క సంతానమును క్రిందికి తెచ్చియున్నాడు. తరువాత విషయమేమనగా, ఆయన అబ్రాహాము గుండా క్రిందికి వచ్చియున్నాడు మరియు, పిమ్మట ఇస్సాకు గుండా మరియు పిమ్మట యాకోబు గుండా, మరియు పిమ్మట యాకోబు నుండి యోసేపు గుండా వచ్చియున్నాడు. ఇప్పుడు గమనించండి, దానిలోనికి వెళ్లుటకు మనకి సమయమున్నచో వెళ్ళెదము; మనము వెళ్ళెదము గాని ఇప్పుడు కాదు. చూడండి. అబ్రాహాములో ఎన్నిక ఉన్నది. మీరు గమనించారా? ఆ యొక్క నలుగురు పితరులను, మరియు పిమ్మట ఇది ఆగిపోయినది, బ్రద్ధలైనది. 12 మంది పెద్దలలోనికి వెళ్లినది మరియు తేగలు గుర్తించబడియున్నారు. అది నిజమేనా? అది ఎన్నడూ మరలా తిరిగి రాలేదు, అది మరలా తిరిగి అబ్రాహాము యొక్క ఒకే ఒక్క సంతతిలోనికి వచ్చేంత వరకు; పిమ్మట అది ఒక్క మానవునిలోనికి వచ్చినది ఆయనే యేసుక్రీస్తు; ఆయన ఇచ్చట భూమి మీద మహిమ పరచబడి మరియు దేవుని యొద్దకు ఎత్తబడియున్నాడు. మరియు ఆకాశములు ఎంత లోతైనవో అంతగా భూమిని ప్రభువు యొక్క జ్ఞానముతో నింపుటకు, పరిశుద్ధాత్మ సమస్త దేశములకు ప్రకటించుటకు గాను తిరిగి వచ్చినది. నేడు అదియే పరిశుద్ధాత్మయైయున్నది.

97

ఇప్పుడు గమనించండి. అబ్రాహాములో ఎన్నిక; ఇస్సాకులో నీతీకరణము; యాకోబులో కృష; మరియు యోసేపులో పరిపూర్ణత. అయితే యోసేపుకు వ్యతిరేఖంగా ఒక్క విషయము కూడా వ్రాయబడలేదు. అదియే పరిపూర్ణత. ఇశ్రాయేలు పిల్లల యొక్క భూసంబంధమైన మూడు ప్రయాణపు ఘట్టములు. మరియు 4వ దశ అనేది వారు వాగ్దాన భూమిలోనికి వెళ్లుట, అదియే వెయ్యేండ్ల పాలన (మిలీనియం). మరియు అన్యజనుల సంఘము యొక్క మూడు దశలు... ఈ వారములో, దేవుని చిత్తమైనచో, నేను దానిని పరిశుద్ధ గ్రంథము ద్వారా తీసుకు రాగలను, మరియు మనము మన యొక్క మూడవ దశలో ఇప్పుడున్నామని మీకు చూపించెదను, యోసేపు కాలములో వెయ్యేండ్ల పాలనలోనికి వెళ్ళుటకు సిద్దముగా ఉండుట.

98

ఇప్పుడు గమనించండి. సమస్తమును యోసేపులో కుప్పగా వేయబడినప్పుడు. గమనించండి. ఒక పరిపూర్ణ మానవుడు, తన యొక్క తండ్రికి జన్మించినవాడు, తండి చేత ప్రేమింపబడినవాడు, తన సహూదరుల చేత ద్వేషిపంబడినవాడు. ఇప్పుడు, త్వరగా, ఎందుకనగా నేను త్వరపడవలసియున్నాను; మీరు మీ యొక్క అచంచలమైన శ్రద్ధను చూపించండి. ఆయన యొక్క తండ్రి చేత ప్రేమింపబడినవాడు, ఆయన యొక్క సహోదరుని చేత ద్వేషించబడినవాడు: ప్రభువైన యేసు. గమనించండి యేసు అచ్చట ప్రతీ ఒక్క వ్యక్తిలోను కనబడుచున్నాడు. యోసేపును చూడండి, ఒక పరిపూర్ణ మానవుడు. ఓ, అతనిని గూర్చి మనము వారములు తరబడి మాట్లాడగలము. చూడండి. తన యొక్క సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, తన యొక్క తండ్రి చేత ప్రేమించబడ్డాడు. ఎందుకు? అతడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి గనుక. అతడు దర్శనములు చూచియున్నాడు, కలలను అనువదించగలడు. అతడొక ఆత్మ సంబంధమైన మనుష్యుడు. అతని యొక్క సహోదరులు చెప్పారు, “బుద్దిలేని వాడా ఇక్కడ నుండి పొమ్ము.”

ఇప్పుడు నేటి సంఘములను చూడండి. ఆత్మ సంబంధమైన భాగమును గమనించండి. ప్రభువైన యేసు నేడు ఆయన యొక్క సంఘములో, ఆయన అన్ని జాతుల (వంశములు) ద్వారాను ద్వేషించబడియున్నాడు. చూడండి, సరిగ్గా అలాగేయున్నది. పరిహసింపబడ్డాడు, వారిని ప్రతిచోటను మూఢభక్తులుగా పిలిచెను. మంచిది, ఇది అలా ఉండవలసియున్నది. అచ్చట ఒక వ్యతిరేఖ మాదిరి ఉన్నది; ఇచ్చట దాని గూర్చి ఒక ఛాయ ఉన్నది.

మీరు చెప్పవచ్చు, “మంచిది, బ్రెన్హాం సోదరుడా, నేను పరిశుద్ధాత్మను పొందుకొనినచో, వారందరూ నన్ను చూచి నవ్వెదరు.”

మంచిది, నీవు పొందికొననిచో, నీవు దానిని ఇంకా పొందుకొనలేవు. నీవు లోకము చేత ద్వేషించబడవలసియున్నావు. యేసు చెప్పెను, “వారు నన్ను దయ్యములకు అధిపతి అని పిలిచినప్పుడు 'బెల్జేబూబు,' ఆయన యొక్క శిష్యులను ఇంకా ఎంతగా పిలిచెదరు,” చూచారా — వారు ఆ యొక్క ఇంటిరు.“ మరియు గమనించండి.

99

పిమ్మట అతడు ప్రేమించబడ్డాడు. మరియు తన యొక్క తండ్రి... దీనిని చెప్పకుండా విడిచి పెట్టలేము. అతని యొక్క తండ్రి అతనికి అనేక రంగులతో కూడిన ఒక అంగీని ప్రసాదించాడు. ఇది నిజమేనా? ఇప్పుడు, మీరు ఆ యొక్క అంగీని గమనించినచో అది ఏ విధమైన మధ్యకుట్టును కలిగి లేదు, అది అతని యొక్క దేహమంతటిని కప్పిన పరిశుద్ధాత్మకు మాదిరిగానున్నది. మరియు నేడు పరిశుద్ధాత్మ సంఘమును అనేక రంగుల గల అంగీతో కప్పినట్లుగా నున్నది, మరియు ఆ యొక్క వర్షధనుస్సులో 7 రంగులున్నవి, చూచారా. మరియు అది 7 పరిపూర్ణ రంగులు వాటన్నింటిని మనము కలిగియున్నాము. మరియు వర్షధనుస్సును తెచ్చుటకు వారు వాటన్నింటిని మిశ్రమం చేసియున్నారు. మరియు పరిశుద్ధ గ్రంథములో వర్షధనుస్సు అనేది ఒక నిబంధనకు సూచనగానున్నది. మరియు దేవుడు ఆయన యొక్క నిబంధనను నోవహూతో చేసియున్నాడు, అనగా ఇక ఎన్నడూ జలప్రళయము ద్వారా సృష్టిని నాశనం చేయబోనని, (అయితే ఈ సారీ అగ్ని ద్వారా), ఆయన అతనికి వర్షధనుస్సు సూచననిచ్చియున్నాడు, మరియు దానిని ఇప్పటికి మనము కలిగియున్నాము. ఇది నిజమేనా?

100

ఇప్పుడు, మీరు త్రిప్పినచో (ఈ యొక్క మిగతా లేఖనములను చూచుటకు నాకు సమయమున్నచో) ప్రకటన గ్రంథము 1వ అధ్యాయమునకు మరియు ఆయన నిలువబడియుండుట యోహాను చూచుటను గూర్చి, “మనుష్యకుమారుని పోలిన ఒకడు యేడు దీపస్తంభములు మధ్య సంచరించుచున్నాడు.” అది యేడు సంఘకాలములైయున్నవి.

మరియు మనము ఎఫెసు కాలములో ప్రారంభించి లవొదకయ కాలముతో ముగిస్తాము, ఒక నులివెచ్చని సంఘములో ఇప్పుడు ఉన్నాము. “పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని యొక్క శక్తిని ఆశ్రయించని వారు.” సంఘమునకు వెళ్ళుచు, మరియు ప్రజలులోనికి వచ్చి చెప్పుచుంటారు, “క్రీస్తును అంగీకరించుము” మరియు వారి యొక్క పేర్లు పుస్తకములో వ్రాయుచు; అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును మరియు శక్తిని, అద్భుతాలను, మరియు సూచనలను తృణీకరించుచు, వాటిని ఎగతాళి చేయుచు, ఈ యొక్క లవొదకయ సంఘకాలములో ఇది దేవుని యొక్క నోట నుండి ఉమ్మివేయబడినది; మరియు ఎన్నిక చేయబడిన వారు పైకి కొనిపోబడియున్నారు. ఓ, హల్లెలూయ! ఓ, స్నేహితులారా, దానిని గూర్చి ఆలోచించినప్పుడు ఏదో ఒకటి నా ప్రాణములోనికి వచ్చుచున్నది. ఓ, ఈ ప్రపంచము నేడు దాని యొక్క స్థితిలో!

101

మరియు ఆయన అచ్చట నిలువబడియున్నాడు. గమనించండి. మరియు ఆయన సూర్యకాంతము వలె మరియు పద్మరాగము వలె ఉన్నాడు సూర్యకాంతమనగా ఏమిటి? అది రూబేను యొక్క రాయి. మరకతము అనగా ఏమిటి? అది బెన్యామీను. మొదటి వాడు మరియు కడపటి వాడు, ఆయన ఆది మరియు అంతము వలె కనిపిస్తున్నాడు. మరియు ఆయన యొక్క తలకు పైగా యేడు సువర్ణ దీప స్తంభములున్నవి... ఒక వర్షధనుస్సు, దేవుడు అబ్రాహాము ద్వారా చేసిన ఒక నిబంధన, ఇస్సాకు ద్వారా, క్రీస్తు ద్వారా, సంఘము ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా ఒక . నిబంధన, యోసేపు మీదనున్న యేడు రంగుల గల అంగీయే యేసు మీదనున్నది. ఇది నేడు సంఘము మీద ఉండి సంరక్షించుచున్నది. ఆ శరీరము అంగీ ద్వారా నింపబడియున్నది. మరియు ఆ సంఘము నీవు కాదు గాని, ఇది పరిశుద్ధాత్మయే తన రక్తముతో నిన్ను కప్పుచున్నది, దేవుని యొక్క నిబంధన, జగత్తుకు పునాది వేయబడకముందే నిర్ణయించబడినది.

హల్లెలూయ! నేను దానిని బయటకు చెప్పవలసియున్నది. అది సరియే. ఇది నన్ను చీల్చివేయుబోవును.

102

గమనించండి. నన్ను చెప్పనివ్వండి... నేనొక పిచ్చివాడినని మీరనుకోవచ్చు. నేను అలాగైనచో, నేను సంతోషముగానున్నాను; నన్ను ఇలానే ఒంటరిగా ఉండనివ్వండి. అది సరియే. మీకు ఒక విషయము నన్ను చెప్పనివ్వండి. ఓ, సంతోషముగా ఉండేటట్లుగా నేను ఎలా ఉండగలుగుచున్నాను మరియు నేను దేనినైతే ఎరిగియున్నానో దానినెరుగుదును? దానిని నేను చెప్పజాలకున్నా మరియు నేను దానిని ఎరిగియున్నానని ఎలా చెప్పగలను? నేను ప్రజలకు ఇది చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. మై! ఇది ఏ ఒక్క వ్యక్తినైనా సరే సంతోషపరుస్తుంది. మై! అది సరియే.

103

ఆయన అచ్చటనున్నాడు, మరియు యాకోబు మరియు యోసేపు కూడా ఆయనకు మాదిరిగానున్నాడు. కప్పుట, నా తండ్రి అతనికి ఒక అంగీనిచ్చుట. హల్లేలూయ. యేసు బాప్తిస్మము పొందినప్పుడు మీరు గుర్తించలేదా, “నీటిలో నుండి బయటకు వచ్చి నేరుగా వెళ్లియున్నాడు మరియు ఇదిగో, ఆకాశము ఆయనకు తెరవబడియున్నది మరియు పరిశుద్ధాత్మ ఒక పావురము వలె దిగివచ్చెను మరియు అతని పైకి వచ్చెను, చెప్పెను, 'ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను.'” అంతవరకు ఆయన ఏ విధమైన ఒక్క అద్భుతము కూడా చేయలేదు. పిమ్మట నేరుగా శోధిపంబడుటకు అరణ్యములోనికి వెళ్ళెను, మరియు రోగులను స్వస్థపరిచెను, మరియు దేవుని యొక్క శక్తులను...

అదియే సంఘము. అది బాప్తిస్మము పొందినప్పుడు, అది పరిశుద్ధాత్మ యొక్క వస్త్రమును శక్తితో ధరించినది. ఓ, మై!

104

ఒక అసాధారణమైన విషయమేమనగా, ఇస్సాకు వచ్చుటకు ముందుగానే శారా యొక్క గర్భము మృతతుల్యమైయున్నది. దేవుడు దానిని అలా వెళ్లనిచ్చియున్నాడు ఆమె ఆ యొక్క వాగ్దానమును పొందికొనినప్పుడు 60 సంవత్సరములు వయస్సు గలది. ఆమెలోనికి ఆ యొక్క విత్తనము వచ్చినప్పుడు 90 సంవత్సరములు వయస్సు గలది. పరిపూర్ణముగా, సంపూర్ణముగా అసాధారణమైన విషయము.

మరియు తిరిగి జన్మించిన ఒక వ్యక్తి కూడా ఒక అసాధారణమైన వ్యక్తిగానున్నాడు. హల్లెలూయ. ఇది అంగీకరించుట లేక ఇంకా మీ చేతులెత్తుట కాదు. ఇది ఒక దేవుని వరము. అసాధారణమైనది! తిరిగి జన్మించుట, జ్ఞానేంద్రియములు యొక్క రాజ్యములో ఈ ప్రపంచములో నుండి తీయబడుట. అవునండి. ఎందుకు? ఎందుకనగా దేవుడు దానిని వాగ్దానము చేసెను. అనగా ఎన్నిక ప్రకారముగా ఆ వాగ్దానము స్థిరముగా ఉండేటట్లుగా.

105

పిమ్మట యోసేపు తన యొక్క సహోదరులు ద్వారా సుమారు 30 వెండి నాణెములకు అమ్మబడెను. యూదుల సంఘము యోసేపును మోసం చేసెను.

ఈ దినము, ఈ యొక్క సంఘములో ఏమున్నది? ఒక మోసము. వారు పత్రములను పొందుకొనియున్నారు; వారు ఒక దానిని కలిగి ఉండుటకు ప్రయత్నించుచున్నారు... మంచిది, ఇప్పుడు, మీరు దీనిని మీ యొక్క మనసులో ఉంచుకొనండి. వారు సంఘముల యొక్క సమాఖ్యను కలిగి ఉండబోవుచున్నారు. అమెరికా యొక్క క్రీస్తు సంఘములన్నియు ఇదివరకే వారి యొక్క సంఘములన్నింటితో సమాఖ్యగా అయ్యారు మరియు వారు ఏదో ఒక దినమున ఇచ్చట ఒక గుంపును కలిగి ఉండబోవుచున్నారు. అది కమ్యూనిజముతో పోరాడుటకు మూయబడుతుంది, అది కాథలిజముతో కలిసిపోతుంది, మరియు ప్రొటస్టెంటు సంఘముతోను మరియు కాథలిక్ సంఘముతోను కలిసిపోతారు. మరియు సత్యము కొరకు నిలువబడిన ఆంతరంగిక సంఘములన్నియు అనగా ఆ యొక్క సిద్ధాంతము నుండి దూరముగా వెళ్లిపోయిన వారంతా హింసించబడుదురు. మృగము యొక్క ముద్ర, దేవుని యొక్క ముద్ర రెండింటికి మధ్య బల ప్రదర్శన వచ్చును.

మరియు సహోదరుడా, అది అచ్చట లేనిచో, లోకము వలె నిశ్చయముగా నీవు మోసగింపబడుదువు, ఎందుకనగా అది చాలా మంచిగా కన్పిస్తుంది. మీరు చెప్తారు, “ఇప్పుడు, కమ్యూనిజం అనేది ప్రపంచమును అలా చేసినచో... మన మెందుకని వేరొక అంగీకారమును చేసుకొనరాదు మరియు క్రైస్తవులందరిని తీసుకు వచ్చి పిమ్మట క్రైస్తవ్యముగా చేసి, ప్రపంచమును ఎందుకు వెనుకకు తీసుకు వెళ్లరాదు.” మరియు అది చాలా మంచిగా కన్పిస్తుంది, ప్రజలు దానిలోనికి దూకుతారు, చూచారా. వారు సంఘములను సమాఖ్య చేస్తారు, మరియు క్రైస్తవులందరిని ఒకే ఐక్యత క్రిందకు తెచ్చుటకు ప్రయత్నిస్తారు. మరియు ప్రకటన గ్రంథములో పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నదేమనగా, అది తన యొక్క శక్తిని మరియు సమస్తమును ఆ యొక్క ప్రతిమకు ఇచ్చియున్నది, అనగా ఆ యొక్క మృగము యొక్క ప్రతిమ తన యొక్క సమస్త శక్తిని దాని ఎదుట ప్రదర్శించుచున్నది. నిశ్చయముగా, ఇది ఉన్నది. ఈ విషయములోనే ప్రకటన గ్రంథము యొక్క సంగతులను కూడా సమయమున్నచో కలుపుటకు ఆశించితిని (అయితే మనకు సమయము లేదు, చూచారా), అది ఎచ్చటున్నదో చూపించవలెనని కోరితిని. సహోదరుడా, మీరు ఇచ్చట అంత్యకాలములోనున్నారు. మనము కాలము యొక్క చివరలోనున్నాము.

106

పిమ్మట వారు యోసేపును అమ్మివేసిరి, 30 వెండి నాణెములకు, అతడు చనిపోయేలాగున, ఒక గోతిలోనికి అతనిని త్రోసివేసిరి. పిమ్మట అతడు పైకి తీయబడి లోనికి పంపబడెను. మరియు అచ్చట అతడు అతని యొక్క చెరశాలలో ఉంటుండగా, అతడు... అచ్చట ఇద్దరు మనుష్యులున్నారు, ఒక రొట్టెలును తయారు చేయువాడు మరియు వేరొకడు మాంసమును విక్రయించేవాడు — పానదాయకుల అధిపతి మరియు బక్ష్యకారులు యొక్క అధిపతి. వారిలో ఒకడు నశించాడు మరియు ఒకడు రక్షించబడియున్నాడు. యోసేపు ద్వారా వారి యొక్క కలకు భావం చెప్పబడినది.

మరియు యేసు సిలువ పైన వ్రేలాడినప్పుడు అదే జరిగినది. ఆయనకు ఒక ప్రక్క ఒక దొంగ, వేరొక ప్రక్క వేరొక దొంగ ఉన్నారు, మరియు ఒకడు నశించాడు వేరొకడు రక్షించబడియున్నాడు. ఖచ్చితంగా అలాగే జరిగినది.

పిమ్మట అతడు ఫరో ఎదుటకు తేబడెను మరియు అతని కలకు భావం చెప్పెను మరియు ఫరో యొక్క దక్షిన హస్తముగల మనిషిగా నియమించబడెను; యోసేపు వద్దకు ముందుగా రాకున్నా ఏ ఒక్క వ్యక్తి ఫరోను చూడలేదు.

మరియు అది దేవుని యొక్క కుడి పార్శ్వమున యేసు ఉన్నదానికి పరిపూర్ణమైన మాదిరిగా ఉన్నది, మరియు క్రీస్తు ద్వారా తప్ప దేవుని వద్దకు ఎవరును రాలేరు, అచ్చట కూడా ఖచ్చితముగా పరిపూర్ణమైన మాదిరి ఉన్నది.

107

మరియు గమనించండి, ఇచ్చట మరియొక విషయమున్నది. అన్యప్రజలైన మీరు మీ యొక్క సంతానము ప్రకారముగా మరియు ఎన్నిక ప్రకారముగా యోసేపుకు ఒక అన్యవధువు ఇవ్వబడినది; అతడు తన యొక్క సహోదరుని చేత తృణీకరించబడియున్నాడు మరియు ఒక అన్యవధువును తీసుకొనియున్నాడు. అది సరియేనా? అతడు ఇతనికిచ్చెను... ఫరో అతనికి ఒక యాజకుని యొక్క లేక ఒక కుమార్తెను ఒక వధువుగా ఇచ్చెను. మరియు అతడు ఒక అన్యస్త్రీని పెండ్లాడెను మరియు ఆమె ఎఫ్రాయిము మరియు మనషేను కనియున్నది, అనగా వారు రాజ్యములోనికి సమవారసులు, పితరులుకివ్వబడిన వాగ్దానములోనికి సమవారసులు.

108

గమనించండి. యేసు ఎంత పరిపూర్ణుడుగానున్నాడు, యూదులు ద్వారా తృణీకరించబడియున్నాడు, పరిశుద్ధాత్మను మరలా వెనుకకు పంపియున్నాడు మరియు వారు ఆయన వైపు చూచి నవ్వారు మరియు వారందరికి ఆయన పరిహాసమయ్యాడు మరియు చెప్పెను, “వారు క్రొత్త ద్రాక్షారసమును త్రాగియున్నారు.” అది నిజమేనా?

మరియు యేసు చెప్పెను, “మీరు నన్ను దూషించవచ్చు గాని పరిశుద్ధాత్మకు ఒక్క మాటైనను విరుద్ధముగా మాట్లాడినచో, అది మీకెన్నడునూ క్షమించబడదు.”

మరియు ఆ యొక్క యూదులు అచ్చటికి వచ్చి చెప్పిరి, “మంచిది, ఆ మనుష్యులు క్రొత్త ద్రాక్షారసముతో పూర్తిగానున్నారు, హ, హ, హ,” మరియు వారిని చూచి నవ్వారు. మరియు అచ్చట నుండి 30 సంవత్సరాలు కూడా మీంచకుండగానే టైటస్ రాజు ఆ యొక్క గోడలను నాశనము చేసియున్నాడు, వారు ఒకరి పిల్లలను మరియొకరు తినియున్నారు. మరియు వారు వీరిని అతి ఘోరముగా వధించిరి, పిమ్మట దేవుని వాక్యములో వ్రాయబడిన రీతిగా, ఆ దేవాలయమును దహించివేసిరి. మరియు అన్యల యొక్క దినాలు వచ్చేంత వరకు అది ఎన్నడూ లేపబడలేదు.

మరియు అచ్చటకు నేను మరియొక కొన్ని వారముల తరువాత యెరూషలేమును దర్శించుటకు ప్రయత్నిస్తున్నాను, మరియు అచ్చట గల ఆ యొక్క ప్రాచీన నాశనము చేయబడిన వస్తువులు మరియు రోధన గోడలు మొదలగువాటిని. వారు అచ్చట నుండి సమస్త ప్రపంచమునకు చెదిరిపోయి ఉన్నారు, ఎందుకనగా వారు అలా ఉందురని దేవుడు వారికి చెప్పెను, మరియు వారు వచ్చి అలా చేసిరి. అది నిజము. ఓ, మై! పరిశుద్ధాత్మను తృణీకరించినందుకు గాను ఆ యొక్క శాపమును గూర్చి ఆలోచించండి!

109

ఇప్పుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించబడినది, మరియు వారు దానిని తృణీకరించారు.

మరియు దానిని యూదులు తృణీకరించినప్పుడు, అన్యజనులు దానిని స్వీకరించారు, అది వధువుకు ఒక మాదిరిగానున్నది. ఆయన నామ ఘనత కొరకు, అన్యజనులలో నుండి ప్రజలును పిలిచెదనని ఆయన చెప్పెను.

ఆ యొక్క చిన్న అమ్మాయి వెనుక అచ్చటనున్నది ఆమె ఒక బ్రోయ్ గా ఉండినది, అయితే ఇప్పుడు ఆమె బ్రెన్హాంగా ఉన్నది; ఆమె నా యొక్క భార్య.

మరియు యేసుక్రీస్తు యొక్క వధువు కూడా శ్రీమతి. యేసు క్రీస్తుగా ఉండబోవుచున్నది. (హల్లెలూయ) ఆయన యొక్క ఆత్మలో బాప్తిస్మము పొందుకొనియున్నది, ఆయన యొక్క నామములో, ఆయన యొక్క శక్తితో నింపబడెను, ఆయన యొక్క నీతిని వస్త్రముగా ధరించుకొనెను. హల్లెలూయ! ఆమే అచ్చటనున్నది. మరియు ఇప్పుడు, గమనించండి, అదియే అన్యవధువు.

110

ఇప్పుడు, ముగించే ముందుగా మిగతా వాక్యములను చదివెదము. ఇచ్చట ఒక విచారకరమైన గాధ యున్నది. ఇది అంత్యకాలములో మీరెన్నడూ చూడలేనిది ఇచ్చటనే మనమిప్పుడు ముగిస్తున్నాము. అన్యవధువు ఇదివరకే ఎన్నుకొనబడినది మరియు పైకి వెళ్లియున్నది. ఆ యొక్క విషయము ముగించబడియున్నది. ఇప్పుడు ఇచ్చట 41వ అధ్యాయములో వినండి. “మరియు ఇది జరిగియున్నది...” ఇదియే యూదులు యొక్క కాలపు అంతము, పిమ్మట మనము ముగిస్తున్నాము. “చివరిలో, రెండు సంపూర్ణ సంవత్సరములు, ఫరో...” లేదండి, ఒక్క నిముషమాగండి, ఇచ్చట నేను అధ్యాయమును తప్పుగా చూచాను, నేను నిశ్చయముగా 45వ అధ్యాయమనుకుంటాను, నేను దానికి బదులుగా 41 అని చెప్పాను.

అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి ఎదుట తను తాను అణచుకొనజాలక; నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పెను, యోసేవు తన సహూదరులకు తన్నుతాను తెలియజేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు, (అతనిని తృణీకరించిన వ్యక్తులు ఉండిరి.)

111

ఇప్పుడు, మనము విడిచిపెట్టే ముందుగా ఒక్క క్షణం. ఈ సంవత్సరములన్నింటి గుండా యేసేపు అచ్చటనున్నాడు, అచ్చట స్వదేశములో కరువు సంభవించినది; దేవుడు కదులుచున్నాడు. ఒక చిన్నవాడైన బీద యోసేపు కుడి పార్శ్వపు మనిషిగా అయ్యాడు. మరియు ఇచ్చట అతనిని అమ్మివేసిన తన సహోదరులున్నారు, వారు అతని వద్దకు వస్తున్నట్లుగా మరియు అతనికి నమస్కరించునట్లుగా వారిని గూర్చి అతడు ముందుగానే కలకన్నాడు మరియు వారు ఇతనిని కలలు కనువాడు అన్నారు, మరియు దర్శనములు చూచే వ్యక్తి అన్నారు, మరియు అతనినీ చంపుటకు ప్రయత్నించిరి. వారు చేసినట్లుగానే...

యేసు ఆ యొక్క యూదులతో ముందుగానే చెప్పాడు, వారేమైయున్నారో మరియు వారేమిచేసియున్నారో మరియు వారికి ఏమి జరుగబోవుచున్నదో ముందుగానే చెప్పాడు. ఒక గృహ యజమాని తన యొక్క సొంత కుమారుని మరియు తన స్వంత దాసులను పంపియున్నాడు, మరియు వారతనిని ఎలా చంపియున్నారో మరియు సమస్తమును ఆ రీతిగా చేసియున్నారు. అయితే కోత యజమానుడు, ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క దుష్ట సేవకులను కనుగొనినప్పుడు ఏమి చేయును? ఇప్పుడు, ఒక్క నిముషము.

112

ఇచ్చట యోసేపు, ఒక పరిపూర్ణ మాదిరిగా యున్నాడు, యూదులు అంత్యకాలపు చివరి దినములలో మరలా తిరిగి వచ్చెదరు అనేదానికి మరలా అతడు నిలువబడియున్నాడు, అనగా ఆ యొక్క వెయ్యేండ్ల రాజ్యమునకు రావటం, ఆ యొక్క యూదులు మరలా రక్షించబడటం.

మరియు వారు చూశారు. మరియు యోసేపు... అతడు అచ్చటికి ఎలా పంచబడ్డాడో మీకు తెలుసు, ఆ యొక్క ఇశ్రాయేలీయులు అతని యొక్క పిల్లలను ఎలా అచ్చటికి పంపియున్నాడో మీకు తెలుసు, వారు కొద్ది ధాన్యాన్ని పొందుకొన్నారు; వారు మరణమైనంతగా కరువులో ఉన్నారు మరియు యోసేపు రాజు యొక్క కల భావాన్ని చెప్పాడు, మరియు అతడు ఎలా అచ్చట ఆ యొక్క ధాన్యాగారాన్ని నిల్వయుంచాడో, సర్వప్రపంచలో కేవలము అచ్చట మాత్రమే ఆహార నిల్వలున్నాయి.

నేడు సంఘమునకు ఒక పరిపూర్ణ మాదిరి, ఆత్మ సంబంధమైన ఆహారం ఇవ్వబడిన ఒకే ఒక్క స్థలము, యేసుక్రీస్తు యొక్క రాజ్యములో మాత్రమే యున్నది. మీరు వెళ్లి ఒక ప్రాచీన సంఘ సిద్ధాంతమును తీసుకొనవచ్చు, మరియు కొంత మంది అపొస్తులల యొక్క సిద్ధాంతములను వల్లించవచ్చు, మరియు మీరేది కోరుకుంటారో దానిని, అయితే, సోదరుడా, ఆత్మ అనేది కేవలం తిరిగి-జన్మించిన జీవముగల దేవుని సంతుములో మాత్రమే నివసించును, అచ్చట మాత్రమే ఆహారం ఉంటుంది. మరియు ఈ దినములలో ఏదో ఒక దినమున యూదులు గుర్తిస్తారు, మరియు వారు వచ్చుచున్నారు.

113

ఇప్పుడు మీరు గమనించండి. పిమ్మట అతడు వచ్చినప్పుడు, అతడు ఆ చిన్న బెన్యామీనును చూచెను. మరియు ఎలాగో మీకు తెలుసు అచ్చట అతడు ఎలా చేసియున్నాడో మరియు అర్ధము చేసుకొన్నారు. అతని యొక్క తండ్రి మరియు తల్లి ఈ యొక్క బిడ్డకు ఎలా జన్మనిచ్చారో మరియు పిమ్మట చనిపోయెను, చిన్న బెన్యామీను. మరియు అతడు తన యొక్క సహోదరులను చూచెను, మరియు అతడెవరో వారతనిని గుర్తించలేకపోయిరి. అతడొక గొప్ప రాకుమారుడని వారు భావించారు మరియు వారతనికి ఎక్కువగా భయపడ్డారు. మరియు పిమ్మట అతడే వారిని వెనుకకు పంపి మరియు “మీరెవరు?” అని అతడు వారినడిగెను.

మరియు వారు చెప్పిరి, “మేమందరము ఒకే మనిషి యొక్క కుమారులము, అతడే యాకోబు, అతడు వృద్దుడైయున్నాడు, ఇశ్రాయేలును మీకు తెలుసా, మరియు అతడు ప్రభువు చేత ఆశీర్వదింపబడియున్నాడు.” మరియు అప్పుడు తన యొక్క ప్రియమైన వృద్ధ తండ్రి ఇంకను జీవించే ఉన్నాడని అతడు వినియున్నాడు. ఇచ్చట అతడేమి చెప్పియున్నాడో వినండి. మరియు అతడు ఆ యొక్క ద్వారములను మూసివేసినప్పుడు, అతడేమైయున్నాడో తననుతాను వారికి తెలియజేసుకొనెను. అతని యొక్క హృదయము దేవుని యొక్క ప్రేమ వైపుగా చూచినది, అచ్చట ఇంకనూ పిలుచుచున్నది మరియు అచ్చట ఆ యొక్క యూదులు నిలువబడియున్నారు, దీన బాలురు వారు ఆకలితోనున్నారు.

కరువుతో అల్లాడుతున్న వారి నాన్నగారు ఇలా చెప్పారు, “మీరు అచ్చటికి పోయి మరీ ఎక్కువ ధాన్యమును తీసుకు రండి, లేనిచో మనము ఆకలితో చనిపోతాము.”

మరియు అతడు అచ్చట, ఒక గురుతుగా బైన్యామీనును ఉంచియున్నాడు. మరియు అతడు ఇతని ముందు ఎలా నిలువబడియున్నాడో, అది ఎలా ఉన్నదో మీకు తెలుసు. మరియు అతడు బెన్యామీను చూసియున్నాడు, ఇకనెంత మాత్రమును అతడు నిలుపుకోలేకపోయాడు. అతని వద్ద నుండి ప్రతీ ఒక్కని దూరముగా పోనిచ్చాడు. మరియు ఆ దీన యోసేపు అచ్చట నిలువబడియున్నాడు, మరియు “నేను మీ యొక్క సోదరుడనైన యోసేపును,” అని చెప్పెను.

114

మరియు అతని యొక్క సహోదరులు అతనితో ఇలా చెప్పెను, “మాకొక సహోదరుడుండెను, ఇప్పుడతడు లేడు, అతడు మృగముల ద్వారా చంపబడెను,” మరియు అతడు నేరుగా తన యొక్క సోదరునితో మాట్లాడుచున్నాడు. అది అచ్చట నిలువబడియున్న వారి సహోదరుడైన యోసేపుతో.

మరియు అతడు అందరిని అచ్చట నుండి విడిచి వెళ్ళమని చెప్పాడు, పిమ్మట తననుతాను బయలుపరచుకొనియున్నాడు, అతడు చెప్పెను, “నేను మీ సోదరుడనైన యోసేపును.” మరియు పెద్దలైన వారు భయపడ్డారు. వారు భీతిగొన్నారు. అతడు చెప్పెను, “మీరు భయపడవద్దు.” మరియు అతడు చాలా బిగ్గరగా ఏడవటం మొదలు పెట్టాడు, ఫరో యొక్క రాజభవనము లోపలికి కూడా వినబడేటట్లుగా రోధించాడు, రాజ భవనము, అది ఆ యొక్క రోధనను మరియు ఏడ్పును వినియున్నది. అతడు పరుగెత్తుకు పోయి తన యొక్క చేతులును చిన్న బెన్యామీను వైపు పెట్టి మరియు అతనిని కౌగిలించుకున్నాడు మరియు అతనిని ముద్దాడాడు, మరియు అతని యొక్క మెడమీద పడి ఏడుస్తూ ఇలా, అడిగాడు “నా యొక్క వృద్ధ దీన తండ్రి ఇంకనూ కనాను బ్రతికేయున్నాడని మీరనుచున్నారా?” ఎట్టి అనుభూతి! దేవుని యొక్క ప్రేమ ఎంత విశాలముగా వ్యాపించినది! “నా యొక్క నాన్న గారు ఇంకనూ జీవిస్తూనే యున్నారు మరియు అతనికి నేను ధాన్యమునిస్తున్నాను, ఓ!” అని చెప్పెను. మరియు అతడు తన గొంతు చించుకొని ఏడ్చెను.

అది ఎలా ఉండునోనని నేను ఆశ్చర్యపోతుంటాను, అనగా మన ప్రభువైన యేసు ఆ యొక్క తూర్పు ఆకాశమండలము గుండా, చీల్చుకొని భూమికి మరలా తిరిగివచ్చినప్పుడు ఎలా ఉంటుందో. హల్లెలూయ!

115

అచ్చట అతడు రోధించెను మరియు ఏడ్చెను, ఆ యొక్క గొప్ప రాకుమారుడు అచ్చట నిలువబడియున్నాడు మరియు ఆ యొక్క పెద్దలు కూడా అచ్చట నిలువబడియున్నారు. అతడు చెప్పెను, “విచారించవద్దు.” చెప్పెను, “దేవుడే నన్ను పంపెను.” పరిశుద్ధాత్మను చూడండి, దైవిక ప్రేమ ఎలా చేయునో చూచారా? చెప్పెను, “దేవుడే నన్ను ఇచ్చటికి పంపియున్నాడు. మీరేదో నాకు చెడు చేశారని మీకు మీరుగా అనుకోవద్దు.” చెప్పెను, “ఈ కాలాలు గుండా మీ జీవములను కాపాడుటకు దేవుడే నన్ను ఇచ్చటకు పంపియున్నాడు.”

మరియు దేనికొరకు దేవుడు అతనిని ఇచ్చటకు పంపియున్నాడు, జీవమును భద్రపరచుట కొరకా? ఈ రాత్రికాల సమయములో పరిశుద్ధాత్మ ఇచ్చట దేనికొరకు ఉన్నది, జీవమును భద్రపరచుట కొరకేనా? ఆయన యూదుల ద్వారా తృణీకరించబడియున్నాడు, మన యొక్క జీవములను భద్రపరచుటకు ఇచ్చట అన్యజనులమైన మనకొరకు పంపబడియున్నాడు. మీరు దానిని ఈ రాత్రి గ్రహించారా, నా స్నేహితుడా?

పిమ్మట అతడు ఇలా అడిగెను, “నా యొక్క తండ్రిగారు ఇంకనూ జీవిస్తూనే యున్నాడా?” మరియు అప్పుడతడు అచ్చటికి ఎద్దులు, బళ్ళు మరియు మొదలగువాటన్నింటితో పంపియున్నాడు.

మరియు దీన, వృద్ధ, అంధుడైన ఇశ్రాయేలు బయటికి వచ్చెను, ఒక వృద్ధ ప్రవక్త బయటకు అలాగే వస్తాడు మరియు యోసేపు ఇంకనూ బ్రతికేయున్నాడని అతడు వినియున్నాడు. అతడు కన్నీరు కార్చెను, మరియు అతడు చెప్పను “ఓ, దేవుడు దీవించబడును గాక! నేను నా యొక్క కుమారుని ఇంకొకసారి చూడబోవుచున్నాను, తాకబోవుచున్నాను.”

అతడు ఇతనిని అచ్చటికి తెచ్చినప్పుడు, అతడు ఇతనిని కలిసియున్నాడు. అతని యొక్క వృద్ద అంధ... బలహీనమైన వ్రేళ్లు ఆ రీతిగా వణకుచున్నవి, మరియు యోసేపు యొక్క ముఖాన్ని పట్టుకున్నది. మరియు వారు అచ్చట ఏదో ఒక దాని మీద మోకరించారు మరియు ఏడ్వటం మరియు కన్నీరు కార్చటం ప్రారంభించారు, తండ్రి మరియు కుమారుడు, ఒకరినొకరు కౌగలించుకొనుచున్నారు. ఓ, మై!

116

దేవుని నుండి దూరముగా పోయిన తప్పిపోయిన కుమారుని గూర్చి నేను ఈ రాత్రి ఆలోచిస్తున్నప్పుడు, అచ్చట పాపములో, సోదరుడా, పందుల యొక్క పొట్టును తినుచున్నాడు, లోకము చుట్టూ తిరుగుచూనేయున్నాడు! ఎందుకు, నీవెందుకు చేయరాదు, ఉజ్జీవ కాలములో, నీ యొక్క జీవితమును ఈ సంవత్సరములన్నింటి గుండా దుర్వ్యాపారముగా జీవిస్తున్నచో, మరియు మీ యొక్క జీవమును, తండ్రివైపుగా నీ యొక్క హృదయమును ఎందుకు త్రిప్పుకోరాదు? నీవు ఏదైననూ తప్పు చేసినచో నీవెందుకు ఈ రాత్రికాల వేళలో నీ యొక్క దారి మధ్యలో ఆయనను కలుసుకొని మరియు నీ యొక్క చేతులను ఆయన చుట్టూ వేయకూడదు?

“బ్రెన్హాం సోదరుడా, దేవుడు నన్ను ఇంకను ప్రేమించుచున్నాడని నాకు చెప్పవలెనని నీ అర్ధమా?”

ఆయన నీ కొరకు ఈ రాత్రికాల సమయములో చూస్తున్నాడు. ఆయన నీ కొరకు గమనిస్తున్నాడు. నీ యొక్క జీవమును రక్షించుట కొరకు, నిన్ను కాపాడుట కొరకు, నీకు దీవెనలు ఇచ్చుట కొరకు మరియు నిన్ను ఎన్నుకొనుట కొరకు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. మరియు నీవు దేవుని చేత ఎన్నుకొనబడినచో, నీవు ఇచ్చటికి ఏదో ఒక ఉద్దేశ్యము ద్వారా వచ్చియున్నావు.

“బ్రెన్హాం సోదరుడా, దానికి నన్నునేను వర్తింపజేసుకొనవచ్చునా?” అని నీవు అడుగవచ్చు.

117

ఈ రాత్రిన నీవెందుకు సంఘమునకు వచ్చియున్నావు? ఏది నిన్ను వచ్చునట్లు చేసినది? దయ్యము నిన్ను ఈ సంఘమునకు లాగుకొని వచ్చినదని నీవు అనుకొనుచున్నావా? లేదయ్యా. దయ్యము నిన్ను ఇచ్చట నుండి దూరముగా మాత్రమే తీసుకొని పోతుంది. దేవుడు ఇంకనూ పిలుస్తూనే యున్నాడు. తండ్రి నిన్ను ఈ రాత్రికాల వేళలలో పిలుస్తున్నాడు. ఇప్పుడు దేవునిలో నీకొక స్థలమున్నది, మరియు దేవుడు నిన్ను పిలిచియున్నాడు, మరియు పిలిచియున్నాడు మరియు పిలిచియున్నాడు. నీవు ఆ యొక్క స్థలమును స్వీకరించనిచో... ఇచ్చట ఉన్న ప్రతీ ఒక్కరికి అనేకమైన స్థలములు లెక్కించబడియున్నవి మరియు దేవుడు అచ్చట వెనుకన ఈ యొక్క స్థలమును మీ కొరకు ముందుగానే నిర్ణయించియున్నాడు. ఇప్పుడు, నీ యొక్క స్థానములో ఎవరో ఒకరు తీసుకొంటారు. కావున ఇప్పుడు, ఈ రాత్రికాల సమయములో నీవు నీ యొక్క స్థలమును తీసుకొననిచో, నీ యొక్క స్థలము నీవు తీసుకొనుటకు ఈ రాత్రి నీకు ప్రసాదించును గాక.

118

రేపు రాత్రికి మనము... వారు అచ్చట ఐగుప్తులో సంవత్సరములు తరబడియున్నారు. మరియు ఇప్పుడు, రేపు రాత్రికి మనము వారిని బలి గొర్రెపిల్ల క్రిందకు తీసుకురాబోవుచున్నాము, మరియు దూరముగానున్న యోర్దాను యొద్దకు వారిని తీసుకురావలసియున్నాను మరియు అచ్చట నది వద్ద నుండి ఆ యొక్క అరణ్యములో నుండి వేరొక భూమికి వారిని తీసుకు వెళదాము.

మీలో ప్రతీ ఒక్కరిని ప్రభువు దీవించును గాక. ఈ రాత్రి ఇదెంతో కఠినముగానున్నది; ఇది చాలా ఎక్కువ సమయము తీసుకున్నది. ఇది అన్ని విషయములను గీస్తూ మరియు లాగుచూ ఇచ్చట గంటన్నర కాలవ్యవధి లేక మరి ఎక్కువగా తీసుకున్నది మరియు లేఖనముల ద్వారా వెళ్లుచు దానితో కఠినముగా వెళ్లినది. అయితే సోదరీ, సోదరుడా, ఇది ఈ రాత్రి దేవునిలోనున్న ఎన్నికను నీవు అవగాహణ చేసుకొనగలవా? దేవుని యొక్క ఎన్నికలో ఎంత మంది నమ్మికయుంచుచున్నారు? దేవుడు మిమ్ములను ఎన్నుకొనుచున్నాడని మరియు పిలుచుచున్నాడని ఎంత మంది నమ్ముచున్నారు. దానిని ఆయన చేయుచున్నాడా? ఇప్పుడు, మీరు సంతోషముగానున్నారా? మీరు నమ్ముచున్నారా?

119

ఇప్పుడు నీవు నిలువబడగలవని ఈ రాత్రి నీవు నమ్ముచున్నావా, రేపు ఇలా చెప్పగలవా, “సాతానా, నీవు నన్ను చుట్టూ తోశావు; నీవు ఇది చేశావు మరియు నీవు అది చేశావు. మరియు నా యొక్క హృదయములో, ఎల్లవేళలా, ఏదో ఒకటి కొట్టుకొనుచున్నది, మరియు ఏదో ఒకటి దేవుని వైపుగా నన్ను లాగుచున్నది. ఇప్పుడు నా యొక్క పిలుపేమిటో నేను గ్రహిస్తున్నాను. ఇంకెంత మాత్రమును బయట అచ్చట నేను సంతృప్తి చెందలేను. నేను బయట అచ్చట సంతృప్తి చెందజాలను, ఎందుకనగా దేవుడు నన్ను పిలిచియున్నాడు, కావున ఈ చెత్త విషయములన్నింటిని ప్రక్కకు త్రోసివేయవలెనని నేను నిర్ణయించుకొని మరియు నా యొక్క పరలోకపు తండ్రి వద్దకు రావలెనని అనుకొనుచున్నాను. ఆయనతో నేను ఇక జీవించెదను.”

ఇచ్చటనున్న ఎంత మంది ఇలా చెప్పెదరు, “ బిల్ సోదరుడా, ఈ రాత్రి నుండి నేను దేవునిని సేవించెదనని, దేవునికి నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. మనము రహదారి అంతములోనున్నామని నేనెరిగియున్నాను మరియు మనకు ఇంకా ఎంతో ఎక్కువ కాలము లేదని నేనెరుగుదును. అయితే దేవుని యొక్క కృప ద్వారా, ఈ రాత్రిన నేను ఒక స్పష్టమైన ఓర్పును చేసుకొని మరియు నేను దేవునిని సేవించెదను?” మీరు మీ యొక్క చేతిని ఎత్తెదరా? దేవుడు మీ యొక్క హృదయమును దీవించును. మంచిది.

ఎంతమంది మీలో భావించి మరియు ఇలా చెప్పుదురు, “బిల్ సోదరుడా, నేను నా యొక్క మనసులో దానిని ఇంకా ఖచ్చితంగా పొందుకొనలేకపోయాను. కావున మీరు నా కొరకు ప్రార్ధించెదరా, తద్వారా దేవుడు ఆ దినమున అచ్చట నన్ను కలిగియుండి, అనగా దేవుడు నా యొక్క హృదయములో మరియొక పిలుపును దేవుడు ఇచ్చులాగున? మీరు ప్రార్ధించగలరా? మరియు ఆయన నన్ను మరియొక సారి పిలచినచో, నేను వచ్చెదను, నేను వచ్చెదను.” మీరు మీ యొక్క చేతిని ఎత్తెదరా? మీరు ఈ రాత్రికాల సమయములో అంతగా ఆలోచిస్తున్నారా? ఓ స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. ఎవరో ఒకరు ఇప్పుడు చెప్పవచ్చు... ఓ స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక, అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక, మరియు ఓ యవ్వన స్త్రీ దేవుడు నిన్ను దీవించును గాక.

120

ఎవరైనా ఒకరు ఇలా చెప్పండి, “బ్రెన్హాం సోదరుడా, నేను ఈ రాత్రి ఏమి చేయవలసియున్నానో అలా చేసియుండలేదు. నేను అలా లేనని నాకు తెలుసు. నేను నా యొక్క ప్రభువును దుఃఖపరిచాను, అయితే నేను ఒక క్రైస్తవునిగా ఉండవలసియున్నాను అని ఎల్లప్పుడు నా హృదయములో ఏదో ఒకటి చెప్పుచున్నది. మరియు నేను దేవునిని సేవించవలెనని కోరుకొనుచున్నాను.” అట్టి దానిని ఎన్నడూ ప్రారంభించనివారు, అట్టి వ్యక్తి ఈ రాత్రి ఉన్నారా? ఇప్పుడు, ముగించుచుండగా, ఇప్పుడు నేను మీతో నిజాయితీగా ఉండదలచుకొన్నాను, అది దీనినెరుగును: అనగా నీ జీవితము ద్వారా ఏదో ఒకటి నీవు దేవునిని తప్పక సేవించవలెనని చెప్పియున్నది; నీవు ఆ రీతిగా ఎంతో కాలము భావించియున్నావు. నీవు ఇంకా ఎన్నడూ దానిని ప్రారంభించలేదు, అయితే ఏదో ఒకటి దానిని నీకు చెప్పియున్నది.

అచ్చటకు వెనుకకు పరుగెత్తి మరియు మిమ్ములను ఇచ్చటకు బలవంతముగా లాగే వ్యక్తులలో ఒక వ్యక్తిని నేను కాదు. లేదు, లేదు. పరిశుద్ధాత్మ వాక్యమును ప్రసంగించుట ద్వారా దానిని చేయలేనిచో, అది నాకు ఏ మంచియు చేయదు. చూడండి, అది నిజము, మీరు మీ యొక్క ఎన్నికను చేసుకొనవలసియున్నది.

121

అయితే మీరు నాతో నిజాయితీగా ఉండెదరా మరియు ఇలా చెప్పెదరా, “బిల్ సోదరుడా, ఏదో ఒకటి నాతో ఎన్నో సంవత్సరములుగా, లేక అనేక సమయములుగా ఉన్నది, లేదా ఏదో ఒకటి నన్ను పిలిచియున్నది. అది నాకు చెప్పియున్నది, నేను దేవుని వైపుగా తిరుగుచున్నట్లుగా కన్పించినది, అయితే నేను దానిని ఇంకా చేయలేదు. బిల్ సోదరుడా, మీరు నా కొరకు ప్రార్ధించండి. అది, నేను ఒక స్త్రీగా లేక పురుషునిగా చాలినంతగా దానిని చేయవలసియున్నానా?” ఈ యొక్క భవనములో ప్రతీ స్థలములందును మీ యొక్క చేతిని ఎత్తెదరా? అది దేవుడు కలిగియున్నాడని భావన...? దేవుడు మిమ్ములను దీవించును గాక.

ఎవరైనా ఒకరు ఇలా చెప్పండి, “నా యొక్క హృదయములో ఏదో ఒకటి పిలిచియున్నది మరియు నా యొక్క లోబడుటను నేను ఇంకా చేయలేదు.” మీరు మీ యొక్క చేతినెత్తి ఇలా చెప్పండి, “నేనే ఆ వ్యక్తిని. నేను ఇంకా ఎన్నడూ ఒక క్రైస్తవునిగా మారలేదు, అయితే నేను కావలెనని కోరుచున్నాను. నేను మారవలెనని కోరుచున్నాను, మరియు నేను నా యొక్క నిర్ణయము తీసుకొనేంత వరకు దేవుడు నా నుండి తిరిగిపోకుండా, మీరు ప్రార్ధించవలెనని నేను కోరుతున్నాను.” మీరు దానిని చేసేదరా? మీ చేతినెత్తండి. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. అది బలముగా, మంచిగా ఉన్నది. ఎవరో ఒకరు మీ చేతినెత్తి, ఇలా చెప్పండి, “మీరు ప్రార్ధించవలెనని నేను కోరుచున్నాను, బిల్ సోదరుడా, నేను దేవునిని త్రోసివేయను.” అయ్యా, దేవుడు మిమ్ములను దీవించును గాక. అది మంచిది. ఇప్పుడు, ఎవరైనా. ఇచ్చట ఎవరైనా ఒకరు ఉన్నారా? ఇప్పుడు, నిజాయితీగా ఉండండి.

122

ఇప్పుడు చూడండి, వేకువ వెలుగు వచ్చే ముందుగా, వైద్యుడు నీ ఇంటికి వచ్చి, నీ యొక్క నాడిని చూచి, నిన్ను వెనుకకు కదిపి, “లేదు, ఇతడు ఎన్నడూ దానిలో నుండి బయటకు రాలేడు, ఇతని పని అయిపోయింది,” అని చెప్పినచో? “ఓ, నీవు ఆ యొక్క చేతిని పైకెత్తుటకు కోరుకొనుట ఎలా ఉన్నది!

ఇది ఏదో ఒక అర్ధమునివ్వలసియున్నది, “సోదరుడా, నా కొరకు ప్రార్ధించండి,” అని చెప్పుచున్నారు. మీరెవరో నాకు తెలియదు, నేను తెలుసుకొనే వరకు మీరెవరో నాకు తెలియదు. నీవెవరో సంఘమునకు తెలియదు. అయితే నీవు నీ యొక్క చేతినెత్తినచో, దేవుడు దానిని గుర్తిస్తాడు. అది నిన్ను రక్షించదు, లేదు, అయితే నీవు ప్రారంభించుటకు అది సరిపోవును. అది అంత ప్రారంభమును నీకిచ్చును. పిమ్మట బహుశ ఉజ్జీవమును అయిపోయేముందుగా, నీవు నీ యొక్క హృదయమును క్రీస్తునకు ఇవ్వవచ్చును.

ఇప్పుడు, ఈ రాత్రి చాలా కఠినముగా ఉన్నది. మనము అలా ముందుకు వెళ్లుచుండగా, ప్రారంభములో దేవుని వాక్యములోనికి... నా భావము, మనము వెళ్ళుచుండగా.

123

అచ్చట ఇంకెవరైనా ఉన్నారా? అచ్చట ఐదుగురు వారి యొక్క చేతులను ఎత్తియున్నారు, ఎవరో ఇంకొకరు. నేను ఆరు లేక యేడుగురిని చూడగలనా? ఇప్పుడు, మీరందరూ నిజాయితీగా ఉండవలెనని నేనాశిస్తున్నాను. ఓ, యవ్వన స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడు, ఇచ్చట ఇంకొక వ్యక్తి మీ యొక్క చేతిని ఎత్తవలసియున్నాడని నాకు తెలుసు. ఇప్పుడు మీ యొక్క చేతిని పైకెత్తి, “బిల్ సోదరుడా, నా కొరకు ప్రార్థించండి,” అని చెప్పండి. మీరు ఎచ్చటనున్నారో నేను వెనుకకు రావటం లేదు, నేను ఇచ్చట నుండి మీ కొరకు ప్రార్ధించబోవుచున్నాను. మరియు అయితే ఇలా చెప్పండి, “ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనండి, అనగా నేనొక క్రైస్తవుడను కాను, అయితే నేను క్రైస్తవునిగా ఉండవలెనని ఎల్లప్పుడు భావిస్తున్నాను. మరియు ఇప్పుడు, నేను క్రైస్తవుడను కానని నాకు తెలుసు.” ఇప్పుడు అట్టి ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నారా, మీ యొక్క చేతిని పైకెత్తండి. అవును, నేను ముగిస్తున్నాను. టెడ్డీ, నీవు చేయగలిగినచో పియానో మ్రోగించుము.

124

పిమ్మట ఎవరో ఒకరు ఇలా చెప్పండి, “బిల్ సోదరుడా, నన్ను జ్ఞాపకం చేసుకొనండి, అనగా నా యొక్క జీవితం దేవునికి దగ్గరగా ఉండులాగున. నేను ఈ యొక్క జీవిత సగమార్గమును జీవించదలచుకోలేదు మరియు ఈ యొక్క నులివెచ్చని స్థితిలో ఉండదలచుకోలేదు, నా యొక్క హృదయము వాస్తవముగా అగ్నివలె మండవలెనని కోరుకొనుచున్నాను. నా కొరకు ప్రార్థించండి.” దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక, నిన్ను, నిన్ను కూడా. అది మంచిది. దేవుడు మిమ్ములను దీవించును గాక. మీ యొక్క చేతులు పైకి లేచుట నేను చూస్తున్నాను.

చూడండి, గ్రుడ్డివారి యొక్క కన్నులను తెరవటానికి, దేవుడు నా యొక్క ప్రార్థనను వినినచో, మరియు చెవిటి వారి యొక్క చెవులను తెరచుటకు, కుంటివారిని బాగుచేయుటకు దేవుడు నా యొక్క ప్రార్థన వినినప్పుడు: రాజకీయ నాయకులు, రాజులు, అధికారులు, సామ్రాజ్యనేతలు, అవిటీవారు బాగుపడియున్నారు! ప్రపంచము చుట్టూ చూడండి, లక్షల, లక్షల కొలది ప్రజలు. దీనిని నా హృదయము నుండి వాస్తముగా చెప్పుటకు సాహసం చేస్తున్నాను. పది మిలియన్ల మంది ప్రజలు ఈ యొక్క వర్తమానమును విన్నారు, అన్ని దేశముల నుండి సుమారు 10 మిలియన్ల ప్రజలు (కోటిమంది) ఈ నా యొక్క వర్తమానమును విన్నారు నేను ఒకేసారి పది నుంచి పదిహేను వివిధ రకాలైన దేశపు ప్రజలతో మాట్లాడియున్నాను. 10 లేక 12 మంది తర్జుమాదారులు ఒకే సారి చేయవలసి వచ్చినది, మరియొక మాటను కూడా చెప్పుటకు వీలులేకుండా, ఆ యొక్క అనువాదకులు ద్వారా అలా మాట్లాడటం జరిగినది, మరియు రాగలిగినంతగా ఒక లక్ష మంది లేక ఎంత మంది రాగలరో అంతమంది, సుమారు 30 వేల మంది ఒకేసారి క్రీస్తు వద్దకు వచ్చియున్నారు, ఒకేసారి 30 వేల మంది మార్పు చెందారు. దక్షిణ ఆఫ్రికాలో గల డర్బన్లో...

125

మరియు నేను మూడు లక్షల మంది ప్రజలు గుమిగూడే చోట ఒక సభకు వెళ్లబోవుచున్నాను. నేను దీనిని నా యొక్క హృదయమంతటితో చెప్పుచున్నాను. ప్రభువు యొక్క నామములో నేను దేనినైనా ప్రవచించడాన్ని మీరెన్నడైనా వినియున్నారా, అయితే అది ఏ మార్గములో ఉన్నాదో అలాగే ఉన్నది? ఎచ్చట అడగాలనుకుంటున్నారో అడగండి, సర్వప్రపంచ వ్యాప్తముగా ఎచ్చటైనా అడగండి. మరియు ఆయన చెప్పిన వందల, వేల విషయములను గూర్చి చూడండి, నేను దేనిగూర్చి మాట్లాడుచున్నానో నాకు తెలుసు. నాకు నేనుగా మాట్లాడుకోలేదు; క్రీస్తు ఇచ్చటనున్నాడు.

మరియు స్నేహితులారా, నేను మీకు సత్యమే చెప్పుచున్నాను, మీరు తిరిగి-జన్మించకుండా చనిపోయినచో, మీరు నశించిపోయినట్లే. యేసు చెప్పెను, “ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను క్రొత్తగా జన్మిస్తేనే గానీ, అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు.” నీవెంత మంచివాడవో, నీకు సంబంధించిన సంఘమునకు నీవెంతగా చెల్లించావో, దానితో నీ యొక్క తల్లిదండ్రులు ఎంతటివారో, మరియు నీ యొక్క సంఘ కాపరి ఏమైయున్నాడో, అదంతా అనవసరం. “ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు.”

126

ఆ మరునాడు మనము ఆ యొక్క ధాన్యమును తీసుకొనియున్నాము... మీరు దానిని ఇచ్చట వ్యవసాయము నుండి చూచారు. వాటిలో ఒకటి పరిపూర్ణమైన ధాన్యము (ధ్యానపు గింజ) కాల్షియం యొక్క ప్రతి పదార్ధము, సమస్తమును ఈ యొక్క ధాన్యపు గింజలోనున్నది. పొలములో ఒకటి ఎదిగినది మరియొకటి పెరగలేదు, ప్రతి దానిలో నుండి కొన్ని మాత్రమే. వారు వాటిని పాతిపెట్టారు. ప్రతీ యొక్క పదార్దముతోను సమానముగా కలసికట్టుగా తయారైనది, ఒక్కటి కూడా లేదు, ఒకే విధముగా రూపించబడినది ఏదియు లేదు మరియు సమస్తమును వాటిలో నుండి ఒక్కటి కూడా పైకి రాలేదు. అయితే వాటిలో ప్రతీ ఒక్కటి పైకి వచ్చినది. ఎందుకని? వాటిలో జీవ కణము దాగియున్నది.

ఇప్పుడు ఇచ్చట, ఈ రాత్రి స్త్రీలు మరియు పురుషులు కూడా ఉన్నారు, మరియు ప్రపంచమంతటనూ, వారి యొక్క సంఘములకు వెళ్లుచున్నారు. సంఘమునకు చెందియున్నారు, క్రైస్తవులుగా ఒప్పుకొనుచున్నారు, అయితే వారితో జీవపు మొలకలను లేక అంకురాన్ని కలిగిలేరు. అవి బయటకు రాజాలవు. పునరుత్థానమగుటకు వారికి ఏమియు లేదు. స్నేహితుడా, మిమ్మల్ని మీరు మోసగించుకొనవద్దు; మీకు మీరుగా తూచుకొనండి. ఇది మీకు సంబంధించిన విషయము. ఇది మీలో నున్నది. ఇది మీ యొక్క నిర్ణయం, మనము మన తలలు వంచుచుండగా ప్రభువు మనలను దీవించును గాక.

127

తండ్రి, ఈ రాత్రి దీనిని తీసుకొనుచుండగా నేను కఠినమైన, కరుకైన విషయములు చెప్పవలసి వచ్చెను, కఠినముగా కత్తిరించవలసియున్నాను అయితే మీరు చెప్పారు, సువార్త అనేది రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదియై, ఎముకలును మూల్గులును విభజించినంత మట్టుకు దూరుచు మరియు మనస్సు యొక్క తలంపులను వివేచించువాడవు, దేవా, దాని కన్నా తక్కువగా దేనినీ మేము పొందుకొనకుండా నిషేదించుము. ఇప్పుడు, “ఎన్నిక” కొరకు మీకు మేము వందనములు చెల్లిస్తున్నాము; నీవు మమ్ములను పిలిచినందుకు మేము వందనములు చెల్లిస్తున్నాము. మరియు ఇప్పుడు, ఈ సంవత్సరములన్నింటి గుండా పరిశుద్ధాత్మ మమ్ములను దాచినది. మీకు మేము ఎలా కృతజ్ఞతలు చెల్లించాలి. గత దినాలలో పాపపు యొక్క మురికి కాలువలు నుండి మమ్ములను పైకి లేపిన మిమ్మును గూర్చి ఆలోచిస్తుంటే, ఆశ్చర్యకరమైన కృప మరియు నీవు మాకు ఎంత మాదిరిగా ఉన్నావో.

మరియు ఇచ్చట ఈ యొక్క లోకములో ఇప్పుడు ఈ స్త్రీ మరియు పురుషులను నీవు ప్రేమిస్తూ ఉన్నావు, ఇది మరియొక కొన్ని సూర్యుని యొక్క మలుపులని ఎరిగి మరియు అప్పుడు, ఇది ఎంతో ఆలస్యమైనదని ఎరిగియున్నాము. ఈ దినాలలో ఏదో ఒక దినాన, ఇది చాలా ఆలస్యమగును. వారు నరికివేయబడుదురు మరియు ఆ యొక్క తొందరగా, నివారణ లేకుండా, కనికరము లేకుండగానే, మరియు వారి యొక్క ఆపదలో నేను నవ్వెదనని మీరు చెప్పియున్నారు.

128

ఈ ప్రపంచమును గూర్చి ఆలోచించుటకు ఈ దినాలలో ఏదో ఒక దినాన భయంకర గాలులు, ఈ ప్రాచీన ప్రపంచము చుట్టూ వీచబోవుచున్నది, ఇది ఒక అణుబాంబు ద్వారా వీయబోవునప్పుడు, ఆ యొక్క సూర్య గోళములో అచ్చట బయట మరియు భయంకర గాలులు, చుట్టూ వీయబోవుచున్నవి, ఈ రాత్రి నుండి 500 సంవత్సరములుగా అవి వీచినవి. మరియు ఆ యొక్క ఇసుకలో సమాధి రాళ్లు దాగుకొనియున్నవి. బహుశ, వాటి పైన మన యొక్క పేర్లతో వెనుక అచ్చట పరుండి ఉంటూ, సుడిగాలి సృష్టిస్తూ మరియు ధ్వని చేయుచు, ఆ గాలులు సూర్యుని నుండి అతి వేడిని పొక్కబోవుచున్నవి. అయితే మన యొక్క దీన ఆత్మ ఎక్కడ ఉంటుంది?

దేవా, ఈ రాత్రి, వారి యొక్క నిత్య గమ్య స్థానమును నిర్ణయం తీసుకొనే రాత్రిగా ఉండును గాక. ప్రభువా, దీనిని ప్రసాదించండి, అనగా ఇచ్చటనున్న ప్రతీ ఒక్క పాపి కూడా, ఆ యొక్క స్త్రీ మరియు పురుషులు మరియు యవ్వన స్త్రీలు మరియు మొదలగు వారు. వారి చేతులెత్తిన వారంతో మరియు వారంతా పాపులుగా చెప్పుచున్నారు మరియు ప్రార్ధనలో వీరంతా గుర్తింపబడవలెనని కోరుకొనుచున్నారు, ఓ దేవా, పరిశుద్ధాత్మ దానిని ఇప్పుడు అనుగ్రహించును గాక. మరియు వారు యేసుక్రీస్తుని వారి యొక్క రక్షకునిగా అంగీకరించుదురు గాక, మరియు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుదురు గాక.

ప్రభువా, ప్రసాదించండి, ఈ యొక్క వెనుకకు జారినని వారిని మరియు మీ నుండి దూరముగా పోయి చల్లగా ఉన్న వారిని, మరణమగునంతగా కరువుతో ఉన్న పిల్లల గుంపుగా, ఈ రాత్రి వారంతా మీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చేదరు గాక. దేవుని యొక్క బల్ల వద్దకు పరుగెత్తుకొని వచ్చి, “నేను పోషింపబడవలెనని ఆశిస్తున్నాను” అని చెప్పుదురు గాక. మరియు మీరు దానిని చేయండి, ప్రభువా.

129

మరియు వారి యొక్క హస్తములను పైకెత్తిన దేవుని యొక్క ప్రియ పరిశుద్దులు కొరకు మీకు వందనములు, మరియు కన్నీళ్లు గుండా మరియు ప్రార్ధన గుండా మరియు అలా ముందుకు పోతూ, వారు ఈ యొక్క ఘడియ వరకు నమ్మకముగా ఉన్నారు.

ప్రభువా, ఈ రాత్రి ఈ మాటలను దీవించండి, వారు పరిశుద్ధ గ్రంథము యొక్క ఒక వైపు నుండి మరియొక వైపునకు పరుగెత్తినప్పటికి, మరియు వారంతా తప్పుగా రూపించబడియున్నారు. మరియు ప్రభువా, బహుశ నీవు దానిని వారి యొక్క మనసులో ఖాయం చేయగలవు. ఏడు సంవత్సరములలో మొదటిసారి వీటిని పరీక్షించుటకు ఇది నాకు నూతనముగా ఉన్నది, ప్రభువా.

మరియు రేపు రాత్రికి మీరు మా అందరిని మరి ఎక్కువగా తీసుకొని రమ్మని నేను ప్రార్ధించుచున్నాను మరియు పరిశుద్ధాత్మ ఇచ్చట ఉండును గాక. మరియు ఈ రాత్రి ఇచ్చటనున్న అనేక మంది ఒక నిర్ణయం తీసుకొని మరియు రక్షించబడియున్నారు, రేపు రాత్రికి మరలా వచ్చి, ఆనందిస్తూ మరియు సంతోషిస్తూ రావలసియున్నారు. (దానిని ప్రసాదించండి, ప్రభువా) యోసేపు చేసిన రీతిగా, తండ్రి యొక్క మెడ మీద పడవలసియున్నారు, ప్రభువా, తండ్రిని ముద్దు పెట్టుకొనుచు, ఓ, మరియు చెప్పవలసియున్నారు, “ప్రభువా, నన్ను రక్షించినందుకు మీకు ధన్యవాదములు. దానిని ప్రసాదించండి, ప్రభువా. ఇప్పుడు, ఏదో ఒకటి జరుగును గాక. నీవు మమ్ములను ఈ సభ నుండి నిష్క్రమింపజేయుచుండగా, ఈ దీవెన కొరకు మేము అడుగుచున్నాము. అయితే ఎన్నడూ మీ యొక్క సన్నిధి నుండి వెళ్లిపోకుండా మరియు మరలా మేము సంతోషముగా, ఆనందముగా రేపు రాత్రికి విలువైన పనలుతో మేము తిరిగి వచ్చుచుము గాక. మేము దానిని క్రీస్తు యొక్క నామములో అడుగుచున్నాము. ఆమేన్.

130

క్రైస్తవ స్నేహితుడా, ఈ సమయమంతా మిమ్మును ఉంచినందుకు నన్ను మన్నించండి, నేను చాలా చింతిస్తున్నాను. సాధ్యమైతే, రేపు రాత్రికి నేను మిమ్ములను 9 గంటలకే విడిచి పెట్టవలెనని ఆశిస్తున్నాను. నేను కొద్ది కఠినముగా మాట్లాడవలసియున్నాను, దానిని నేను సహాయము చేయజాలలేను, ఎలాగైనప్పటికి మీరు నన్ను ప్రేమిస్తారు, ప్రేమించరా? నేను చేస్తాను, నేను మిమ్మును ప్రేమిస్తాను మరియు కేవలము ఇది మీ మంచి కొరకే, ఇప్పుడు మనము లేచి నిలబడదామా.

మంచిది, “మీతో యేసు నామమును తీసుకు వెళ్లండి,” చిన్న పల్లవి పాడెదము.

మీతో యేసు నామమును తీసుకు వెళ్లండి,

విచారణ బిడ్డ మరియు శ్రమ బిడ్డ;

ఇది ఆనందము మరియు ఆధరణ ఇచ్చును...

ఇప్పుడు, రేపు మీరు ఫోనును తీసుకొనండి. ఎవరో ఒక పాపిని పట్టుకొని అతనిని తీసుకొని రండి. వెనుకకు మళ్లీ రండి. సంఘ కాపరులకు చెప్పండి. ఇప్పుడు రండి, మనమందరము కలసికట్టుగా ఒక ప్రాచీన ఉజ్జీవమునకు వెళ్లుదము, కావున మనము ముందుకు పోయి మరియు ఒక మంచి సమయాన్ని కలిగి ఉందాము. ఒకరి యొక్క చేతులను మరియొకరు ఇప్పుడు కరచాలనం చేసుకొనండి.

....... పరలోకము;

ప్రశస్త నామము, ఓ ఎంత మధురమైనది!

భూమి యొక్క నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.

131

ఇప్పుడు, దేవుని యొక్క కృప మరియు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీతో ఉండి మరియు వశించును గాక, యేసు నామమములో మనము మరలా కలుసుకునే వరకు అలా ఉండును గాక. ఆమేన్.

దేవుడు ఇప్పుడు మిమ్ములను దీవించును గాక. మీరు దేవుని యొక్క ప్రేమ మరియు దీవెనలతో వెళ్లుచున్నారు. ఇప్పుడు, ఇచ్చట గుడారములో గల సభ్యులైన మీరు, బయట నుండి ఇచ్చటకు వచ్చిన ప్రజలతో కరచాలనం చేయండి. మనలో ప్రతీ ఒక్కరము వారితో కరచాలనము చేయుట విషయములో తప్పిపోవద్దు. వారిని మరలా ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ కూడా అదే చేయును గాక! ఇప్పుడు, కలసిపోండి, మీ యొక్క బేధములన్నియు మరచిపోండి, కలసిపోండి. మంచిది.

యేసు నామము వద్ద తల వంచండి,

పడిపోవుచూ..........

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...