ఆదరణ కర్త
1నెవిల్ సోదరుడా, వందనములు. స్నేహితులారా, శుభ సాయంకాలము. మరల ఆయనను సేవించుటకు ఈ కూడికలో ఈ రాత్రి తిరిగి ప్రభుని గృహములోనికి వచ్చుట ఒక భాగ్యము. ఆయనను సేవించు భాగ్యము కలిగియుండుటయే నాకు దొరికిన అన్నింటిలోను అతి గొప్పదని తలంచుచున్నాను. మీకు సేవ చేయుచుండగా ఆయనకు సేవ చేయుచున్నానని నేనెరుగుదును. "నా ఈ చిన్నవారిలో మిక్కిలి అల్పులగు వారికి మీరు చేసినప్పడు నాకు చేసినట్లే." ఆయన మాటలు ఎన్నడునూ తప్పిపోవు.
2కొద్ది సేపటి క్రితము నేను ఆస్పత్రి విడిచిపెట్టినప్పుడు తల్లి ఇంకా ఊపిరి పీల్చుచున్నదని చెప్పుటకు ఈ సమయమును తీసికొన కోరుచున్నాను. ఈ రాత్రి సంస్కారపు ఆరాధన అయిన వెంటనే నేను (నా భార్య ఆమెతో ఈ రాత్రి కూర్చుందుము), మేము వైద్యశాలకు వెళ్ళనైయున్నాము.
నా తల్లి పట్ల సానుభూతితో మీరు పంపిన చక్కని కార్డులు, పూలు మొదలగు వాటి కొరకును, ఈ కష్టకాలములో మా కొరకు ప్రార్ధి౦చుచున్నందుకును మీపట్ల మేము కలిగియున్న కృతజ్ఞతను ఆమె వ్యక్తము చేయలేదు గనుక ఆమె తరపున నేను వ్యక్తపరచ గోరుచున్నాను. నేను వీటిని ఎంతో మెచ్చుకొనుచున్నాను. ఆమె కూడా అభినందించును. చాలా దయతో, మీకు వందనములు. మీకును ఆలాగే చేయుట కొరకు నేను నా శాయశక్తులా ప్రయత్నించుదును. మీరది ఎరుగుదురు. కనుక ఇది ఎరిగియుండి, అది బహుశ…
3ఆమె చనిపోవుచున్నదని వైద్యుడు చెప్పుచున్నప్పటికీని నేను ఆలాగు చెప్పను. కాని గత ఆదివారమే ఆమె చనిపోవుచున్నదని అతడు నాతో అనెను. వారమంతా పిల్లలు చుట్టూ చేరి కూర్చుని ఆస్పత్రిలో ఎదురు చూస్తున్నారు. గంట కొకరు చొప్పున మారుచూ అమ్మ వెళ్ళిపోవునని కనిపెట్టి చూస్తున్నారు. కాని, ఇప్పుడు, ఆమె ఎన్నడూ లేనంత క్షీణ దశలోనికి వచ్చినది.
వైద్యుడు ఆమెలో ఇరవై రెండు విభిన్న రుగ్మతలు కనుగొనెను. ఆ తరువాత వేరొక వైద్యుడు వచ్చి "దానిని నేను నమ్మను" అని చెప్పెను.
చివరగా ఒకాయన ఇట్లనెను, "ఆమె పండిపోయిన ముసలి తల్లి. ఇక బ్రతుకుటకు ఇష్టము కూడా ఆమెకు లేదు." కనుక ఆలాటి భావము సరియేననుకొనుచున్నాను. అది నిజము. ఆమె పదిమంది పిల్లలకు తల్లి, ఆ కాలములో బహు కఠిన పరిస్థితులుండినవి. వేుము పేదగా బ్రతికాము. ఉండవలసిన రీతిలో - పరిస్థితులు లేవు అని నేననుకొనుచున్నాను. కాని ఆమె అలసిపోయి, వాడిపోయి ఇంటికి వెళ్ళనైయున్నది.
JOHN 11:25,26
4అది సంతోషముతో… మరియు ఇప్పుడు నేను నమ్ముచున్న బోధించిన గొప్ప సువార్తతో పలుకుచున్నాను. అన్నీ చక్కగా ఉన్నప్పుడే అది పని చేయుట కాదు గాని అన్నీ సరిగ్గా లేనప్పుడు కూడా - పని చేయును. అదే నా ఆదరణ. నా తల్లి ఎన్నడైనా చనిపోవునని నేను నమ్మజాలను. ఎందుకనగా ఆమెకు నిత్యజీవము కలదు. చూచారా? "నాయందు విశ్వాసముంచినవాడు ఎన్నడూ మరణించడు." ఇప్పుడు, నా ప్రభువు దానిని చెప్పెను. నేను ఆ మాటలు పట్టుకొనియున్నాను. మనందరము ఆ లోయనుండి నడిచి వెళ్ళినప్పటికిని, వారే - మన ప్రశస్త సంఘకాపరి ఈ మధ్యాహ్నము ఆమె యొద్ద, వారికీ వ్యక్తము చేసినట్లుగానే ఈ అలసిన, వేసారిన ఘడియలు, ఇక్కడ భూమిమీద చివరివి.
5శ్రీమతి ఫోర్డయిస్ అను మా మరొక స్నేహితురాలు ఆమె ప్రక్కనే గుండె వ్యాధితో చావనైయున్నది. ఆమె వద్దనుండి చాలాసార్లు వీధిలోనుండి వెళ్ళి కాయగూరలు మొదలగునవి తీసికొచ్చాము. ఆమె ఇక్కడి జూరిస్ మెయిడ్ అను పల్లె ప్రాంతములో జీవించెడిది. దగ్గరగా వెళ్ళి చూచేవరకు ఆమెను ఆనవాలు కట్టలేదు. ఆమె డెబ్బది ఐదు లేదా డెబ్బది ఆరు ఏండ్ల వయస్సులో ఉన్నది. ఆమెను పరామర్శించుటకై ఆమె ఇద్దరు ముసలి సోదరీలు వచ్చారు. ఆమె వెళ్ళిపోయిన తరువాత నేను దగ్గరగా వెళ్ళగా ఆమె నన్ను చూచి, "నీవు సువార్తికుడవగు సహో, బ్రెన్హాం గదా?" అన్నది.
"అవునమ్మా," అని నేనన్నాను.
ఆమె ఏడ్వసాగింది. ఇలా అన్నది, "నేను తాకగలను . నా ప్రక్కనే మీ తల్లి ఉన్నదని నేను విన్నాను. మామధ్య ఒక్క తెర మాత్రమే ఉన్నది."
"అవును" అన్నాను.
"బహుశా, మేమిద్దరము ఒకేసారి వెళ్ళిపోవుదుమేమోలే" అని ఆమె అన్నది.
6నేనిట్లు అడిగాను. "శ్రీమతి ఫోర్డయిస్, నా సోదరీ, ఒక ప్రశ్న నిన్ను అడుగగోరుచున్నాను. అక్కడున్న ఆ పెద్ద వరుసల్లో నుండి మీ స్థలాలలోనికి నేను నడిచివెళ్ళాను.
నీవు అక్కడ పలుగు పట్టుకొని త్రవ్వుతూ ఎంతో కష్టపడుట చూచాను. ఆ తరువాత నీవు నీ కాయగూరలను తీసికొని వచ్చి పట్టణమంతా తిరిగి అమ్ముట, తిరిగి ఇంటికి వెళ్ళుట చూచాను. నీవు ఒక యధార్థ జీవితాన్ని గడిపావు. నా ప్రభువును నీవు నీ రక్షకునిగా ఎరుగుదువా ?
ఆమె ఇట్లు చెప్పెను. "నేను ఆయనను నా రక్షకునిగా ఎరుగుదును. ఆయన కృపయందు నేను నమ్మికయుంచుచున్నాను. మరణ లోయగుండా నన్ను నడిపించునని నమ్ముచున్నాను."
"అమ్మ అక్కడ నీతోపాటు నడిచి రాలేకపోవచ్చును. కాని ఆయన నడిపించును." అని నేను చెప్పాను. మేము ప్రార్ధించాము. ఆమె నా చెయ్యి ఎంత గట్టిగా పట్టుకొన్నదంటే, బయటకు వెళ్ళుటకు దాదాపుగా నేను నా చేతిని లాక్కోవలసి వచ్చింది.
7కొద్ది గంటల క్రితమే ఆ గదిలో ఉన్న మరో ముసలి తల్లి శ్రీమతి గైతర్ ప్రభువుతో నుండుటకు వెళ్ళినది. చక్కెర వ్యాధి వలన రెండు కాళ్ళు తీసివేయబడినవి. ఆ తరువాత నేను గమనించాను. ఒక అవయవము తీసివేయబడి ఆమె భర్త అక్కడ పడియున్నాడు. లోకము శోకముతో నిండియున్నది.
ఈ లోక వ్యర్ధ సంపదలు ఆశించకు
బహు త్వరగా గతి౦చును
నిత్యత్వపు స౦గతులపై ఆశ పెంచుకో
అవి ఎన్నడూ గతించవు!
8నేను, ముప్ఫయి ఒక్కటి సంవత్సరాలనుండి ఇక్కడి ఈ బల్ల వెనుక నిలబడి యున్నాను. ప్రపంచమంతా తిరిగాను. ప్రపంచమే నా ప్రసంగవేదిక అని నేను చెప్పుకొన్నాను. అప్పుడు నేను జనులకు ఈ నిత్య జీవవాక్కు ఇవ్వ ప్రయత్నించాను. మార్గాంతమునకు నీవు వచ్చినప్పుడు నీకు సహాయపడునది అది ఒక్కటి మాత్రమే. కనుక మేము దేనినయినా ఎందుకు నమ్మాలి? మనము నమ్మదగినదేది?. తాను వెళ్ళిపోవసిద్ధముగా నున్నానని తల్లి ఒక రోజన చెప్పినప్పుడు నేను వెళ్ళి ఆమెతో మాట్లాడాను.
నా అత్తగారు శ్రీమతి బ్రోయ్ ఒక నెలకు మరణించుననగా నేను వెళ్ళి ఆమెతో ఎట్లు మాట్లాడానో ఆలాగే ఈమెతో మాట్లాడాను. అయితే ఆమెకు బాప్తిస్మము ఇచ్చాము.
నేను ఇప్పుడు నివసించుచున్న ప్రదేశములోనే ఉన్న నదిలోనే ముప్పది సంవత్సరాల క్రిందట యేసు క్రీస్తు నామంలో నేను నా స్వంత తల్లికి బాప్తిస్మము ఇచ్చాను.
9దాదాపు వంద సంవత్సరాలున్న నా తల్లి యొక్క తండ్రికి ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఆ బురద నీటిలో బాప్తిస్మము ఇచ్చాను. పక్షవాతపు చేతితో వణకుచున్న ఆ ముసలాయన నన్ను పట్టుకొనుట చూడగలను. నన్ను గట్టిగా కౌగలించుకొని నా ముఖంలోకి చూచాడు. అవతలి ఒడ్డున నేను మరల ఆయనను కలసికొందును. ఓ! అవును. అవును.
నా ఆశలు దేనిమీద నేను నిర్మించుకోలేదు
నీతితో యేసు రక్తము మీదనే
నా ఆత్మ చుట్టూ ఉన్నది గతించిపోయినా
ఆయనే నా నిరీక్షణ మరియు నివాసము
కదలని బండయగు క్రీస్తు మీదనే
నేను నిలబడియున్నాను
తక్కిన ఇతర స్థలములన్నియూ కూలిపోయే ఇసుక నేలలే.
10ఈ రాత్రి సంస్కారము. ఇక్కడ ఉందునని వాగ్దానము చేశాను. ఈ రోజు అనేక మంది నాతో సమావేశమవ్వాలని ఆశించుచున్నట్లుగా బిల్లీ నాతో చెప్పాడు. వారికి అవకాశమివ్వాలనే నేను కూడా ఆశించితిని. కాని, ఈసారికి ఆ సమావేశాలను రద్దు చేయగలవా అని నేను అతడిని అడిగాను. నా పరిస్థితిని మీరు అర్థము చేసికొందురని నమ్ముచున్నాను.
నేను కొద్దిగా చలించిపోయాను. అటు వంటిది మీకు వచ్చినచో ఎలా ఉండునో మీరెరుగుదురు. కాని ఇంకను - నేను నా ప్రభువును నమ్ముచున్నాను. ఆయన కృప చాలును. నాకు కావలసినదంతయూ అదే. నాకు ప్రార్ధన అవసరము కాబట్టి నా కొరకు ప్రార్ధించండి.
మీ ప్రతి ఒక్కరిని దేవుడు నిత్యమూ సమృద్ధిగా ఆశీర్వదించును గాక!
మార్గము యొక్క అంతమునకు మీరు వచ్చినప్పుడు తిరిగి జన్మించకుండా దాని నెన్నడూ దాటుటకు మీరు ప్రయత్నించరని నేను నమ్ముచున్నాను.
11నేను అనుకొనుచుంటిని. బిల్లీ అక్కడున్నాడు. అతని తల్లి చేతిని నేను పట్టుకొన్నాను. ఆమె నా భార్య, ఆమె మృతి చెందుచున్నది. ఇప్పుడు మా తల్లి ఉన్న స్థితికంటే ఇంకా కొంచెము దీన స్థితిలోనే ఆమె యున్నది. ఆమె పైకి చూచినది. ఆమె చనిపోక ముందు అక్కడ ఆమెకు ఒక అనుభవము కలిగినది. కేవలము ఒక బాలికగా ఆమె యున్నది. ఇరవై రెండేళ్ల ప్రాయము. ఇద్దరు పిల్లలకు తల్లి, ఆమె ఇట్లన్నది, "బిల్లీ, నీవు దాని గూర్చి సంభాషించావు. దాని గూర్చి బోధించావు గాని అది ఏమిటో నీకు తెలియదు. అదెంత మహికరమగునది! మనము అప్పుడే ఆ మంచి పురాతన సువార్తను కనుగొనుట మంచిదైనది. బిల్లీ, దానితోనే నిలిచియుండు. దానితోనే నిలచియుండు! ఎన్నడూ దానిని విడిచిపెట్టవద్దు. ఈ ఘడియలో అది మన ఋణాన్ని తీర్చుచున్నది." నేను ఈలాగు చెప్పాను.
ప్రకాశవంతమగు మెరయుచున్న
ఆ ఉదయాన నిన్ను కలిసికొందును,
దుఃఖములన్నీయూ గతించిపోయిన తరువాత
నేను ద్వారముల వద్ద నిలబడియుందును
అప్పుడు ద్వారములు విశాలముగా తెరచుకొనును
జీవితము యొక్క దీర్ఘ అలసిన దినము అయిపోయినప్పుడు
అది ఇదే. నాలో ఉన్నదానంతటితో నేను దానిని నమ్ముచున్నాను. నేనది విశ్వసింతును. ఆ ఉదయ కాలమున మీ అందరినీ కలిసికొందునని నిరీక్షించుచున్నాను.
ఆ ఉదయాన మీరు నన్ను తెలిసికొందురు
నాలో ఉన్న నవ్వును బట్టి
ఆ పాటలో సహో. నెవిల్ మరియు ఇతరులు చెప్పుచున్న రీతిగా,
చచ్చవుకముగా కట్టబడిన
ఆ పట్టణములో ఆ ఉదయాన నిన్ను కలిసికొందును.
12గత రెండు రోజుల్లో ఆస్పత్రి నుండి వస్తూ ఇక్కడున్న - ఆ పెన్సిల్వేనియా లైల్ రోడ్ స్థలంలో ఒక గుడారము వేయబడియుండుట గమనించాను. 9, 10 వీధుల మధ్య స్ప్రింగ్ వీథిని దాటిన తరువాత అనుకొంటాను. వస్తూ ఉండగా, ఒక వ్రాయబడిన పలకను చూశాను. అదిట్లున్నది, "వరముల సేవ." ఆ సోదరుడ్ని నేనెరుగను. నేనెప్పుడైనా అతన్ని కలిసికొన్నానేమో నాకు తెలియదు. కాని ఆయన ఒక సోదరుడు. ఇక్కడే ఆ పట్టణంలో ఉండి ఒక కూటము ఏర్పాటు చేయుచున్నాడు. ఒక పట్టణములోనికి వెళ్ళుట, అందులోను ఇంత వైశాల్యముగల పట్టణములోనికి వెళ్ళుట అనగా ఏమిటో నాకు తెలియును. మరియు . ఎవరూ వెనుక మద్దతు లేకుండా, అతనిని నేనెరుగను. ఇది నన్ను చెప్పమని ఎన్నడునూ అతడు నన్ను అడగలేదు. కాని— ఎక్కడికయినా వెళ్ళవలెనని ఆలోచించుచున్న వారెవరయిననూ మన సోదరుడు బోధించు సువార్తను వినుటకు వెళ్ళితే బాగుండునని తలంచుచున్నాను. అతడు క్రీస్తు బిడ్డలతో ఒకడయి యుండును. లేనిచో ఈ సెప్టెంబరు వాతావరణములో, ఇంత చల్లని సమయాన గుడారము వేసి ప్రభువు కొరకు ఏదో చేయాలని ప్రయత్నించడు. కాబట్టి ఈ వారము అక్కడున్న మన సోదరుని దర్శించి, బోధించుచుండగా వినండి.
నేను చెప్పవలసినవి, చేయవలసిన ప్రకటనలు అన్నీ ఇవే అని నేను తలంచుచున్నాను.
13కాని నిశ్చయంగా నేను ఈ సంగతి చెప్పగోరుచున్నాను. మీరందరూ నిలిచి యుండుటను నేను అభినందించుచున్నాను. ఇటువంటి వాతావరణములో, ఇటువంటి సమయములో ఈ చిన్న పాత సంఘానికి వచ్చి ఇక్కడ నిలబడియున్నారు. మీరు లేకుండా నేనేమి చేయుదును? మనము ఒకరికి ఒకరము లేనిచో ఏమి చేయగలము? ఇది హత్తుకొని ఉండవలసిన ఘడియ,
ఓ! వారు తూర్పు పడమరలనుండి వచ్చుదురు.
వారు దూర దేశములనుండి వచ్చెదురు.
ఈ ఉదయాన మిడా మరియు మేబిల్ నా కోసము ఆ పాట పాడాలని కోరుచున్నాను. కాని ఈ ఘడియలో వారది చేయజాలరు. సుమారు పదిహేనేళ్ళ క్రితం నా సువార్త ప్రయాణముల ప్రారంభించినప్పుడు వారు నాకోసం పాడిన పాట అదే. మీరు ఆ పాటను విన్నారు.
మన రాజుతో విందు చేయుటకు,
ఆయన అతిధిగా భుజించుటకు,
ఈ యాత్రికులు ఎంత ధన్యులు!
ఆయన పవిత్ర ముఖమును చూసినప్పుడల్లా దైవీక ప్రేమతో ప్రకాశించుచుండును.
ఆయన కృపలో ఆశీర్వచన సహవారసులు
ఆయన కిరీటములోని మణులుగా మెరయుదురు.
14ఇప్పుడీ ఉదయాన నేను త్వరపడవలెను. ఇప్పుడు తల్లి కూడదీసుకొన్నది. ఇప్పుడే ఆమె ఊపిరి పీల్చక ఉక్కిరిబిక్కిరయినది. అతి కష్టంగా ఊపిరి పీల్చుచున్నది అని వారు నాకు చెప్పారు. కాని ఏలాగో ఆమె కొంత మెరుగైనది. మరల ఊపిరి పీల్చుచున్నది. ఆమెకు తెలియదు. కాని నేను బోధించుచుండగా ఆయన ఆమెను జీవించి యుంచును. కొంతసేపు ఆలాగే యుంచును. ఈ రాత్రి నేను ఇక్కడుండగానే ఇప్పుడే ఆయన ఆలాగు చేయునని నమ్ముచున్నాను. ఇప్పుడు ప్రార్ధనల నిమిత్తము మీ అందరకు దయతో వందనములు.
PS 23:4
15ఇప్పుడు మనము ప్రార్థించుచుండగా ఒక్క క్షణము తలలు వంచుదము. మనము తలలు వంచియుండగా మిమ్మును ఒక నిజమైన, గంభీరమగు ప్రశ్న అడుగ గోరుచున్నాను. ఇది అడిగినందుకు మీరు అభ్యంతరపడరని నేను ఆశించుచున్నాను. కాని ఇప్పుడు నాకు తెలియును. ముసలివారు, యువకులను ఉద్దేశించి దీనిని నేను అడుగుచున్నాను. యవ్వన బాలికలారా, యవ్వన బాలలారా, ఒక దినమునకు మీరును అమ్మ ఈ రాత్రి ఉన్న స్థితికి రావలసియుండును. మనము ఆ స్థానమునకు రావలసియున్నామని అందరము ఎరుగుదుము.
దేవుని కలిసికొనుటకు సిద్ధముగా లేవని ఖచ్చితంగా ఎరిగినచో, ఎవరూ చూడక ముందే నీవు నీ చేతులను పైకెత్తి . "దేవా, నన్ను జ్ఞాపకము చేసికొనుము" అని చెప్పుము. దేవుడు నిన్ను దీవించును. అన్నిచోట్లా ఉన్నవారిని దేవుడు దీవించును."ఓ దేవా, నన్ను జ్ఞాపకము చేసికొనుము" నేను అక్కడికి రావలసియున్నాను. బహుశా అపస్మారక స్థితిలో రావచ్చును. కాని వెళ్ళిపోక ముందు నిశ్చయముగా ఇది తెలిసికొనగోరుచున్నాను. నేను నా మంచి మనస్సులో ఉండగానే నా ఆత్మ దేవుని వైపునకు నిర్దేశించబడవలెను. మరణ ఛాయగల లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏలయనగా నీవు నాకు తోడైయుందువు."
JOHN 5:24
16పరలోకమందున్న మా తండ్రీ, ఇప్పుడు తమ చేతులెత్తిన ప్రశస్త్ర ఆత్మలను ఈ రాత్రి నా చేతులలో విశ్వాసముతో తీసికొనివచ్చుచున్నాను. నీ కృప, కరుణ సింహాసనముల ఎదుట వారిని లేవనెత్తుచున్నాను. ఈ ఒక్కటి ఎరిగియుండి, తండ్రీ! ఇక్కడ రోగులు ఉండియుందురు. వ్యధలలోనున్న జనులు ఉండియుందురు. కాని దేవా, చేతులెత్తిన వారి అవసరత కంటె ఎక్కువైన అవసరత గలవారు మరెవరూ లేరు. ఎందుకనగా వారు ఒక వేళ రోగము నుండి బాగుపడి ఎక్కువ కాలము జీవించిననూ మరలా ఒక వేళ వ్యాధిగ్రస్తులు కావచ్చునని మీరెరుగుదురు. కాని ఓ దేవా, ఒక్కసారి వారు ఈ ధన్యకరమగు రక్షకుని, నిత్యజీవమును అంగీకరించి తిరిగి జన్మించినచో వారిని దేవుని నుండి వేరుచేయునది ఇక ఏదీ ఉండదు. వారు దేవుని బిడ్డలగుదురు. ఇక మీదట ఎన్నడూ వేరుచేయబడరు. "అట్టివాడు మరణమునుండి జీవములోనికి దాటియున్నాడు. ఎన్నడూ శిక్షలోనికి రాడు." ఎట్టి వాగ్దానము ప్రభువా! అక్కడ మనము మన ఆత్మలను ఎట్టి విధముగా లంగరు వేయుదుము! తుఫాను ఎంత బలంగా వీచినను, అలలు ఎంత ఉధృతంగా చెలరేగినను పరవాలేదు. మా విశ్వాసము కల్వరి గొర్రెపిల్లవగు నిన్ను, దైవ రక్షకుడవగు నీవైపు చూచును! ఓ ప్రభువగు దేవా, నీ కృప మరియు రక్షణలోనికి ఈ రాత్రి ఇప్పుడు వారిని తీసుకొనుము. ఇప్పుడే వారి ఆత్మలను రక్షించుము. వారు - "సమస్త అవగాహనను మించిన సమాధానము" వారి హృదయాలలోనికి రాకముందు వారు ఈ రాత్రి ఈ భవనమును విడిచి వెళ్ళకుందురు గాక. వారు తమ చేతులను పైకెత్తిన తరువాత నేను నా స్వరమును ఎత్తి"ఓ దేవా, కరుణించుము" అని నిన్ను ప్రార్ధి౦చుట తప్ప నేను ఏమి చేయగలను? తండ్రీ దీనిని అనుగ్రహించుము.
1COR 11:24
17ఈ అనేక సంవత్సరములు నీవు నన్ను కాపాడియున్నావు. పొలములలోను, ప్రపంచమంతట తిరుగుచున్నప్పుడు నిన్నెరుగకుండా మార్గాంతమునకు వచ్చిన వారిని నేను చూచాను. కృపకొరకు మొరపెట్టుట విన్నాను. "ఆనంద దినము, ఆనంద దినము, యేసు నా పాపములు కడిగిన దినము" అని నిన్నెరిగిన వారు పాడుట నేను చూచాను. ఓ! అవును. అనేక సార్లు దుర్మార్గులు పచ్చని చెట్టువలె విస్తరించుదురు. కాని మార్గము యొక్క చివరకు వచ్చినప్పుడు వారి స్థితి వేరుగా నుండును.
ఈ రాత్రి మన మధ్య ఒక్క దుష్టుడు కూడా ఉండకుండును గాక. అందరూ వారి ప్రతి పాపము నుండి క్షమాపణ పొందుదురు గాక దేవుని నుండి నూతనత్వము, క్రొత్తదనము ఇక్కడున్న వారందరూ పొందుదురు గాక! ఎందుకనగా, తండ్రీ, నీవు మాకు విడిచిపెట్టిన ఆ పవిత్ర, పరిశుద్ధ క్రమము, అనగా ప్రభురాత్రి భోజనము తీసికొనుటకు ఇప్పుడు అంచున మేము ఉన్నాము. "ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము. ఇది క్రొత్త నిబంధన యొక్క రక్తము. ఆశీర్వచనముల గిన్నె మీరు దీనిని తిని, త్రాగినప్పుడెల్లనూ ఆయన వచ్చువరకూ, ప్రభువు యొక్క మరణమును జ్ఞాపకము చేయుదురు."
దేవా, నీవు వచ్చుచున్నావని మేము నమ్ముచున్నాము. యేసు వచ్చునని మేము నమ్ముచున్నాము. ఆయనను మేము చూతుము. ఆయన ఆ గొప్ప మహిమాన్వితుడు. ముసలితనమంతయూ గతించిపోవును. పాత దు:ఖములన్నియూ, గుండెపోటులు, వ్యాధులు మొదలగునవన్నియూ అదృశ్యమగును. ఆ గొప్ప క్రొత్త రేపటిలో, ప్రభువా, జయధ్వనులతో, కేకలతో మేము మేల్కొందుము. "రాజు తన సింహాసనము అధిష్టించుచుండగా ఖర్జూర మట్టలు చేబూని ఆనంద హోసన్నాలు పాడుదుము." మేము ఆ ఘడియ కొరకు చూచుచున్నాము.
18ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యముతో కూడా మమ్ము ఆదరించుము. ఆదరణకరమగు ఈ సంగతులు మాతో మాట్లాడుము. దానివలన మా హృదయములు ఆదరణ పొందును.
నేను నా తల్లి కొరకు ప్రార్ధి౦చుచున్నాను. ప్రభువగు దేవా, నేను ఎరిగిన నా తల్లి ఆమె ఒక్కతే. భార్య ఎంత మాధుర్యముగా నున్నప్పటికిని, ఆమె ఎంత ప్రియముగా ఉన్నప్పటికిని తల్లి స్థానమును తీసికొనజాలదు. విస్తరించిన ఆ వృద్ధ సింధూర వృక్షము, ప్రభువా, వ్రేళ్ళూని నేలలో పాతుకొని పోయినది. నీవామె యొద్దకు వెళ్ళి ఆమె ప్రక్కను కూర్చొని ఆమెతో మాట్లాడగలవు. నీవామెను శ్రమపడనీయవలదని దేవా, నేను ప్రార్ధి౦చుచున్నాను. ఆమె బాధపడుచున్నదని నేను ఎరిగినచో, ప్రభువా, అది నా హృదయమును బ్రద్దలు చేయును. ఏ అపాయమునకు భయపడక ఆమెను మరణఛాయగల లోయగుండా నడిచిపోనిమ్ము.
నీకెంతగా నేను వందనములు చెల్లించవలెను! కొద్దిసేపటి క్రితము తన పేరును కూడా చెప్పలేని స్థితిలో నుండగా, నేను "యేసు" అని చెప్పినప్పుడు ఆమె తన తలను ఊపినది. ఆయనను ఆమె ఎరుగును. ప్రభువా! అందుకు నేను ఎంతగా నీకు వందనములు చెల్లించవలెను! "ఆమె అపస్మారక స్థితిలో ఉన్నది. ఆమెకేమీ తెలియదు." అని వైద్యుడు చెప్పుచున్ననూ, (ఆమె) ఈ భూమి మీద ఉన్నదేదీ జ్ఞాపకము లేకపోయినను ప్రభూ! నిన్నెరుగును! దానిని బట్టి ఎంతో ఆనందించుచున్నాను. అది నా ఆత్మకు విశ్రాంతి నిచ్చును.
ఆమె వెళ్ళిపోవుటను గూర్చి నీవు నీ దాసునికి ఏమియూ చెప్పలేదు. ప్రభువా, దాని గూర్చి నీవు నాకేమీ చెప్పనవసరము లేదు. కాని ప్రభువా, తెలిసియుండినచో ఎంత బాగుండునని అనుకోనుచున్నాను ఏమయినప్పటికిని ప్రభువా, దీనిని నీ చేతులకు అప్పగించుచున్నాను. నీ చిత్తమే జరుగును గాక!
ఇప్పుడు తండ్రీ, ఈ రాత్రి మాటలను, వర్తమానమును, వాక్య పఠనమును, పాడబోవు పాటలను, సంస్కారము ఆచరించుటను దీవించుము. సమస్తమూ నీ మహిమ, ఘనత కొరకు యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
19ప్రార్ధి౦చవలెనని ఇక్కడ కొన్ని చేతి రుమాళ్ళు ఉంచి యున్నారు. మనము ప్రార్ధనలో యుండగా కొద్దిసేపటి తరువాత ఆలాగు చేయుదును.
ఇప్పుడు మనము ఈ రాత్రి వాక్యపఠనము వైపునకు తిరుగుదుము. వీలయినంత త్వరగా ముగించ యత్నించగోరుదును. ఎందుకనగా అలసిపోయి సొమ్మసిల్లి నేను బయటకు వచ్చునప్పుడు మాట్లాడుటకు కొందరు బయట కూర్చుని ఎదురు చూచుచున్నారు.
JOHN 14:12,17
20యోహాను సువార్త 14వ అధ్యాయముతో ప్రారంభించగోరుచున్నాను. మనము ప్రారంభమును . 12 వచనముతో చేయుదము. ఈ రాత్రి నా అంశము : ఆదరణ కర్త మనము చదువుకొనుచుండగా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 14, వచనము 12.
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటె గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మీరు నా నామమున ఏది అడుగుదురో తండ్రి కుమారుని యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును.
మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.
లోకము ఆయనను చూడదు. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును.
ఈ 17వ వచనమును దయ చేసి నన్ను మన్నించి నాకొరకు మరల చదువలెనని కోరుచున్నాను.
సత్య స్వరూపియగు ఆత్మ; లోకము ఆయనను చూడదు .
"లోకము," లోకమును నీవు ప్రేమించినంత కాలము దానిని నీవెన్నడూ పొందవు. చూచారా?
ఎందుకనగా అది ఆయనను చూడదు .
ఆయన ఏమి చేసినా గాని లోకము దానిని చూడదు. దానిని వారు నమ్మరు. "అది ఉద్రేకము. మానసిక శాస్త్రము"గా వారికది ఉండదు. చూడండి. ఆయనను చూడదు. ఆయనను ఎరుగదు .45. ఇప్పుడు వినండి. ఈ "ఆయన"గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు కాని మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించుచున్నది యేసు. మీలో ఉండును.
JOHN 14:16,17
21అది తేటతెల్లముగా లేదా? అయితే ఈ ఆదరణ కర్త ఎవరు? యేసు. చూచారా? ఆయనిట్లు చెప్పెను, "నేను తండ్రిని వేడుకొందును ఆయన వేరొక ఆదరణ కర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు." చూడండి. ఆయన తన్నుగూర్చి మాట్లాడుకొనుచున్నాడు. "మీరు ఆయనను ఎరుగుదురు. ఎందుకనగా ఆయన మీతో కూడా నివసించును. ఇప్పుడు శరీరధారిగా ఉన్నాడు." శిష్యులతో మాట్లాడుచున్నాడు. "మీలో ఉండును. నిత్యము మీతో నివసించును. ఎన్నడూ విడువడు."
ఓ, ఆయన ఒక మంచి దేవుడు కాడా? యేసు మనకెంతో మంచివాడు! "మన దేవుడు మంచి దేవుడు" అనునది బాగుగా వ్యక్తపరచబడినది. ఆయన తన బిడ్డల పట్ల ఎంతో మేలు చేయువాడు! ఆయన మన కొరకు ప్రతి మంచి దానిని ఏర్పాటు చేసెను. మనకు కావలసిన ప్రతిది ఆయన ఏర్పరచెను. నిజంగా నీవు, "పరలోకమందున్న మా తండ్రీ" అని చెప్పగలవు. ఎందుకనగా ఆయన ఒక తండ్రి. మనము అవిధేయుల మైనను, లోబడ నొల్లని వారమైనను, ఆయన ఎప్పటి వలెనె అన్నియూ ఏర్పాటు చేయుచున్నాడు. మనము మంచివారమయినా, లేదా చెడ్డవారమయినా ఆయన మనకు తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను, నివసించుటకు గృహమును అనుగ్రహించుచున్నాడు. ఓ, ఆయన ఎంతో మంచివాడు!
22ఆయన మనకు ఎన్ని మేలులు చేసెనో కాస్త్ర వెనక్కు చూచి లెక్కపెట్టినచో అర్థమగును! దానిని ఆలోచించుటకు మనము ఆగము. నీకు కండ్లు లేకపోయినచో ఎట్లుండేవాడవు? నీకు ముక్కుగాని, నోరుగాని, చెవులుగాని లేకపోయినచో ఎట్లుందువు? నీకు పాదములు, అవయవములు లేక, నడువలేని స్థితిలో యున్నచో ఎట్లుండి యుందువు? కాని నీవు . కాని, చూడు. ఆయన నీకు పాదములు యిచ్చెను. నీకు కండ్లు లేక చూడలేని స్థితిలో ఉన్నచో ఎట్లుండును? అప్పుడు నీవు శబ్దములు విందువు గాని అవి ఏమిటో నీవు ఎరుగవు. ఇప్పుడు ఆయన ఆ అయిదు జ్ఞానేంద్రియములను నీకు అనుగ్రహించెను.
కాని ఇప్పుడు మనమాయనకు సన్నిహితంగా జీవించినచో ఆయన ఇంకా మరెన్నో కార్యములను మనకు అనుగ్రహించును. ఒక అంతః దృష్టి యున్నది. సాధారణ మనిషి ఎన్నడూ చూడని దానిని మనము చూతుము. మనము తిరిగి జన్మించినాము ఆయనను చూతుము. చూచారా? "మీరాయనను ఎరుగుదురు. మీరాయనను చూచారు. ఆయన నిత్యము మీతో నివసించును." ఓ! ఆయన మంచి తండ్రి. ఆయన మంచి తనపు ఊట. సమస్త మేలులకు గొప్ప మూలము. పితృత్వము మన దేవునికే చెందును. ఆయన తన యందు విశ్వాసముంచిన పిల్లలకు చాలా మంచివాడు! కాని ఇప్పుడు బహుశా …
23ఆయన మనకు ఇచ్చునది సూర్యరశ్ళి ఒకటి. ఓ! అది ఏలాగు. మీకు తెలుసు . మీరు సూర్యరశ్మి లేకుండా జీవించలేరు. కొద్దిసేపు తప్ప నీవు జీవించలేవు. ఎందుకనగా ఏదీ ఎదుగదు. సూర్యరశ్మి అనునది అంత గొప్పది. అంత అవసరమైనది. అయినను మనము చూచి, "ఓ, అదా సూర్యుడేనా?? అందుము. పట్టించుకోకుండా వెళ్ళిపోదుము. చూడండి. మనం అంతగా చిన్నచూపుతో దాన్ని చూతుము. కాని సూర్యరశ్మి మన జీవితమునకు ఎంతో ప్రాముఖ్యమైనది. అది మనకు ఎంతో సహాయము చేయుచున్నది. మనకు బలమును ఇచ్చుచున్నది. అది ప్రకృతి సంబంధమగు మానవునికి సంబంధించిన విషయము.
ఇప్పుడు మనము జీవించ కలిగిన ఆత్మీయ సూర్యరశ్మి ఒకటి అక్కడున్నది. ప్రకృతి సంబంధమైన వన్నియూ ఆత్మీయమైన వానికి మాదిరులు. బల్ల మనము తిను మంచి భోజనము వాక్యము నుండి మనము భుజించు మంచి ఆహారమునకు మాదిరిగా యున్నది. చూడండి. అది కేవలము ఒక మాదిరి. ఆత్మీయ భాగము యొక్క బాహ్య వ్యక్తీకరణయే అది. (భౌతిక భాగము) అది మనకు భౌతిక భాగముకన్న మిన్నయైన అర్థమును మనకిచ్చును. చూడండి.
24అది చిన్నపిల్లవలెనున్నది. తల్లి గర్భమందు చిన్నబిడ్డ పడినప్పుడు అది కేవలము రక్తము మరియు మాంసముగా నుండి గంతులు వేయుచూ, కేరింతలు కొట్టుచుండును. కాని అది జన్మించిన వెంటనే, నీవు చూడవు గాని, ఆ బిడ్డ జన్మించిన వెంటనే లోనికి వచ్చుటకు ఆ తల్లియొద్ద ఒక ఆత్మ ప్రాణము అంటిపెట్టుకొని యుండును. ఆ బిడ్డ లోకములోనికి జన్మించిన వెంటనే ఆ బిడ్డలో ఉండుటకు దేవుడు ఒక ప్రాణమును, ఒక ఆత్మను సృజించెను. ఆ చిన్నబిడ్డ పరిపక్వత చెంది, అభ్యసించ నారంభించును. అప్పుడది జీవించు ఆత్మయగును. అప్పుడది మంచి, చెడులను తెలిసికొనును. అప్పుడు దాని ఎదుట, ఆదామవ్వల ఎదుట పెట్టబడినట్లుగానే మంచిచెడ్డల వృక్షము పెట్టబడియుండును. అది దాని ఎన్నికను చేసికొనును. అప్పుడది తెలివిగలదియగును. కాలమంతయూ ఎదుగుచునేయుండును. అది దేవుని యొక్క గొప్ప ఐశ్వర్యముగా యున్నది.
చివరగా అది ఈ భౌతిక దేహము యొక్క మార్గంతమునకు వచ్చును. ఈ శరీరము క్షీణించి వెళ్ళిపోవుచున్న రీతిగానే, దానిని చేర్చుకొనుటకు ఒకటి సిద్ధమగుచున్నది. ఇక్కడ అది సమాప్తమయిన వెంటనే ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ మరియు ఈ ప్రాణము, ఈ శరీరమును విడిచి మరియొక దానిలోనికి పోవును. అది ఒక యవ్వనత్వము గలది, మ౦చిది, శ్రేష్టమైనది ఎన్నడూ వృద్దాప్యము లోనికి రానిది, ఎన్నడూ గతించనటువంటిది. చూచారా, ఆయన మంచి దేవుడు. నిశ్చయంగా ఆయన అట్టివాడే!
25కాని ఇప్పుడు ఉదాహరణకు చూడండి. సూర్యరశ్మిని గూర్చి ఎరిగిన మనిషి ఒకడు, అది ప్రకాశించుచుండగా ఆ సూర్యకాంతిని అంగీకరించుటకు నిరాకరించినచో ఎట్లు౦డును? "నేను దానిని నమ్మను" అని అతడు చెప్పెను. అతడు తన క్రింది గదిలోనికి వెళ్ళి తలుపు మూసికొని సూర్యుడు ప్రకాశించుట లేదని అంటూ "నేను దానిని నమ్మను" అంటే ఎట్లు౦డును!
ఒకరు వచ్చి ఇట్లందురు, "ఓ! అది వెచ్చగా నుండును. ఆరోగ్యవంతమైనది. సూర్యకాంతిలో జీవించు ప్రజలు రంగు కలిగియుందురు. సూర్యరశ్మిలో వారున్నచో ఆరోగ్యముగా ఉందురు."
"నేనది నమ్మను" అని అతడు చెప్పి, లోపల తలుపు మూసికొని యుండును. ఆ వ్యక్తి విచారకరమగు స్థితిలో నున్నాడు. ఆ విధముగా ఒక మనిషి ప్రవర్తించినచో అతని మానసిక శక్తులలో ఏదో పొరపాటు యున్నది.
26ఒక వ్యక్తి తన్నుతాను దేవుని ఆత్మీయ సూర్యుని నుండి దాగుగొని, సూర్యరశ్మికి మూసికొనినచో, అతని ఆత్మీయ స్థితిలో ఎక్కడో పొరపాటు యున్నది. ఎందుకనగా ఒక మంచి మనిషి మంచి దేవుని యొక్క నడిపింపులో నడువ నిరాకరించినచో, మనకు ఆదరణ మరియు మనకు బలము అయిన మన దేవుని వంటి మంచి దేవుని తిరస్కరించినచో అతనిలో ఏదో తప్పు ఉన్నది. ఆయన సూర్యకాంతిలో జీవించుట ఆత్మీయ ఎదుగుదలకు మూలము. కుమారుని యొక్క ప్రకాశించు మహిమలో, ఆయన సూర్యకాంతిలో జీవించుటయే ఆత్మీయ బలముగా యున్నది! దేవుని మహిమయొక్క సూర్యకాంతి క్రింద జీవించుటయే మనకున్న గొప్ప భాగ్యము. మంచి, ఆరోగ్యకరమగు క్రైస్తవుల వైపు చూడండి
27స్త్రీ, పురుషులెవరైనా గాని - ఏదో చిన్న గదిలో తన్నుతాను ఉంచుకొని సూర్యరశ్మిని చూడక, ఆ వ్యక్తి కొరకు దేవుడేర్పాటు చేసిన సహజ సూర్యరశ్మిని నిరాకరించి, దానిని నమ్మని వానిని ఏమందుము? స్వార్ధమును బట్టి తన్నుతాను మూసియుంచుకొనును. ఆవ్యక్తి తొందరలోనే పాలిపోవును, జబ్బువాడగును, మంచి బలము అతనికుండదు, అతనికి ఆరోగ్యముండదు, అతడు త్వరలోనే ఎందుకనగా దేవుడతనికి అనుగ్రహించిన మహాభాగ్యమును అనుభవించక మూసికొనియున్నాడు. అది నిజము. అతడు ఇష్టపూర్వకముగా ఆలాగు చేసెను.
దేవుని మహిమనుండి, పరిశుద్దాత్మ బాప్తిస్మమునుండి, లేక ఆత్మయొక్క సహవాసము నుండి మనలను మనము మూసికొన్నచో ఏమగును! మొదటగా మనము తెలిసికొనవలసినది ఏమనగా పాలిపోవుదుము; జబ్బు క్రైస్తవుల మగుదుము. మన అనుభవము కాంతి విహీనమై వృద్ధిచెందదు. గొప్ప శోధనలు వచ్చినప్పుడు మనము కృ౦గిపోయి వెనక్కు పోదుము.
దేవుని యొక్క సూర్యకాంతిలో జీవించు ఒక యోధుడు దానికి కావలెను. దానికి దేవుడనెరుగు ఒక ఆత్మ కావలసియున్నది. అటువంటివారు కొంచెము కూడా సందేహించకుండా శ్రమల మధ్య నిలబడుకొని "నా విమోచకుడు సజీవుడు" అని కేకవేయగలడు. హల్లెలూయా! అదే ఇది, చూచారా.
28మనలను మనము మూసివేసికొనుచున్నాము. యాధృచ్చికంగానే వారది చేయుచున్నారు. దానిని మనము చేయగోరుచున్నాము. కాబట్టి ఆలాగు మనము చేయుచున్నాము. కాని దేవుడు మంచివాడు. దానిని మన కొరకు ఆయన ఇచ్చుచున్నాడు. కాని ఈనాడు చాలామంది దేవునితో ఆరోగ్యకరమగు స్థలములోనికి వెళ్ళగోరుట లేదు. ఒక ఆరోగ్య క్రైస్తవుడు ఆరోగ్యకరమగు ఆత్మను కలిగియుండును. అందరివలెనె మీరు కూడా ఒక ఆరోగ్యవంతమగు శరీరము కొరకు నిశ్చయంగా ఆకాంక్షించుదురు. కాని ఆ శరీరము, అనగా ఆ శరీరములో నీవు ఎంత ఆరోగ్యము సమకూర్చి పెట్టినప్పటికిని, అది తిరిగి ధూళిలోకి పోవును
కాని, ఓ, సోదరుడా, ఆ ఆత్మ అతి ఎక్కువ ఆరోగ్యవంతమైన స్థితిని పొందుకోజాలదు. అది పెరిగిన ప్రతిసారి దేవుని యొక్క శక్తి, కృప, బలమునందే అది పెరుగును. దేవుని యొక్క సూర్యకాంతిలో మనము నడువవలసిన అవసరత యున్నది. ఎందుకనగా ఆయన మంచివాడు.
29మనకు ఒక గొప్ప స్వాస్థ్యమున్నది. ఒక గొప్ప పవిత్ర విశ్వాసము ఇవ్వబడినది.
నీవు ఇప్పుడు ఆశ్చర్యపడవచ్చును, "సహో, బ్రెన్హాం, నీవు సూర్యకాంతిని గూర్చి దేవుని మహిమయొక్క గొప్ప సూర్యకాంతిని గూర్చి మాట్లాడుచున్నావు. ఆత్మలను ఆరోగ్యకరముగా చేయుననియు, మనలను బలమగు క్రైస్తవులనుగా చేయుననియు చెప్పుచున్నావు" అనే మీ ప్రశ్నలకు జవాబును కనుగొనుటకే ఈ రాత్రి మనము ఇచ్చట ఉన్నాము. "ఇవి మనమెట్లు పొందగలము? అవి ఎక్కడనుండి వచ్చును? అవి ఏమిటి? అది ఏమిటో నాకు చూపించు సహో, బ్రెన్హాం? దానిని నేను మందుల అంగడిలో కొనగలనా? అది ఏ రకమగు విటమిను?"
నీవు దానిని ఒక మందుల అంగడిలో కొనజాలవు. కాని నీకు కావలెనన్నచో నీకు సమీపములోనే అది సమృద్ధిగా యున్నది. దానినెట్లు పొందుకొనవలెనో నీవు ఆ పద్ధతిని తెలిసికొన్నచో చాలును.
మందుల కొట్టులో మందులు ఉండవచ్చును. కాని ఆ వ్యాధిని గుర్తించు వైద్యుడు ఉండవలెను. వారది చేయనిచో నిన్ను అది చంపును.
కాబట్టి నీవు వ్యాధి యొక్క గుర్తింపును పొందవలసియున్నావు. నీవు వెళ్ళి ఒక పాపిని తీసికొని అతనికి పరిశుద్దాత్మను ఇవ్వజాలవు. మొదటగా అతడు పశ్చాత్తాప పడవలెను. అతడు తన పాపములను కడుగుకొనవలెను. పాపములు పోగొట్టుకొనవలెను. అతనికి ఇవ్వబడనైయున్న ఈ గొప్ప విటమిను కొరకు అతడు సిద్ధపడవలసియున్నాడు.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
30ఇప్పుడు మనము ఒక పవిత్ర నిధిని కలిగియున్నాము. ఒక నిధి అనగా ఏమిటో మీకు తెలియును. మనకొక స్వాస్థ్యము ఉన్నది. విశ్వాసము గల బిడ్డలుగా మనము స్వతంత్రించుకొను ఒక స్వాస్థ్యము మనకున్నది. అది ఒక పవిత్ర నిధి. ఆ పవిత్ర నిధి మరియు మన పవిత్ర స్వాస్థ్యము మనకియ్యబడిన దేవుని వాక్యమే. సంపూర్ణ దేవుని వాక్యము. వాక్యమే విటమిను అయి ఉన్నది. వాక్యమే దేవుని మాట.
ఆ కారణమును బట్టియే నేను నిర్హేతుకముగా ఈ వాక్యము మీద నిలబడి యున్నాను. ఎవరేది చెప్పినా నాకు అవసరము లేదు. అది వాక్యముతో సరిపోనిచో నేను దానిని నమ్మను. చూచారా, మీరు దానిని నమ్మగోరుదురు. అది మంచిదే. కాని నాకు అది వాక్యమైయుండవలెను. ఎందుకనగా, "భూమ్యాకాశములు గతించును గాని ఆయన మాటలేమాత్రమును గతించవు." కాబట్టి అది వాక్యమై యుండవలెను.
DEUT 8:3•
MATT 4:4•
LUKE 4:4•
1JN 3:21
31నేను వాక్యము ద్వారా జీవించుదును. యేసు చెప్పెను, "మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును." అని వ్రాయబడియున్నది. అది ఇదే! అది మనకు వారసత్వముగా ఇవ్వబడెను.
ఓ దేవా, దాని లోతులో దానిగూర్చి మమ్ము ఆలోచించనిమ్ము.
అది మన భాగ్యము. ఈ పవిత్ర నిధిని దేవుడు తన సంఘము కొరకు అనుగ్రహించెను. దేవుడు తన సంఘము కొరకు తన వాక్యమును ఇచ్చెను. ఆ పవిత్ర వారసత్వము మనదే. అది దేవుని నుండి పొందుకున్న కానుకగా యున్నది. దీన్ని తీసేసి, దీన్ని పారేసి, దీన్ని కలిపి, దీని మీద రాజీపడుట కాదు. మన స్వంత అభిరుచికి అనుకూలమైనది కాదు. కాని పూర్తి వాక్యమును, సంపూర్ణ సువార్తను బోధించవలెను. మనము క్రైస్తవులముగా దానిని తీసికొని, దానిని నమ్మియుండుటకు నియమ బద్దులమై యున్నాము. "మన హృదయములు మన మీద నేరారోపణ చేయుట లేదని మనము ఎరిగినప్పుడు మనము దేవుని కృపకు పాత్రులమని తెలిసికొందుము."
మనము దేనినయినా అతిక్రమించుచున్నామని ఎరిగినప్పుడు, మనకు చెందిన ఆ గొప్ప వారసత్వమును మనము దాటిపోవుచున్నము, "ఈ రోజున దీనిని నమ్మవద్దు. అది ఈనాటి కొరకు కాదు, మనకు కాదు"అని మన సంఘము చెప్పినందున దానిని మనము దాటిపోవుచున్నప్పుడు, మన స్వాస్త్యమును మనమే పాడుచేసికొనుచున్నామన్నదే నిజము.
32ఈ రాత్రి ఆలయములో ఉన్నవారందరూ - మనందరమూ - అమెరికనులమని నేను తలంచుచున్నాను. మనందరము అమెరికా పౌరులము. అమెరికనులముగా ఉన్నందుకు కృతజ్ఞలము. కాని మన అమెరికను వారసత్వమునకు ఏమి జరిగినది? అది ఏమైయుండెను? మనము రాజీపడనారంభించాము. మనము రాజీపడిన వెంటనే, మన వారసత్వము యొక్క పవిత్రతను పోగొట్టుకొన్నాము. ఎందుకనగా మనము రాజీపడితిమి. నాలుగుసార్లు అధ్యక్షులను మనము నిలబెట్టాము. అది రాజ్యాంగమును విభిన్నము చేసెను. నేడు మనము చేయుచున్న క్రియలు; మరియు మనము … వీథులలో మనకున్నకారును నిలపుట కొరకు చెల్లించవలసిన పైకమును నిర్ణయించుటకు మీటర్లను దానికి అమర్చుట రాజ్యాంగమునకు వ్యతిరేకమైనది. ఆ విధముగా రాజ్యాంగ చట్టమునందు వ్రాయబడిలేదు. అది రాజ్యాంగమునకు వ్యతిరేకమైనదైనను దానిని మనము పాటించుచున్నాము. ఈ దేశము ఏ సూత్రములపై పునాది వేయబడినదో దానికి వ్యతిరేకమైన పనులన్నీ మనము చేయుచున్నాము, మనము అన్నీ వ్యతిరేకముగా చేయుచున్నాము. కనుక మన వారసత్వమును పోగొట్టుకొనుచున్నాము. ఏ కారణమును బట్టి? అది ఏ సూత్రములపై ఆధారపడియున్నదో ఆ సూత్రముల విషయములో రాజీపడియుండుటయే అదియగును.
33నాకు దేవుడు సహాయము చేయును గాక! నీకు దేవుడు సహాయము చేయును గాక క్రైస్తవులముగా మనము ఎన్నడూ ఒక్క దేవుని మాట విషయములో కూడా రాజీపడరాదు! ఈ పవిత్ర నిధి సంఘమునకు అందించబడినది. ఈ సువార్తను, సంపూర్ణ సువార్తను కలిగియుండుట, ఎక్కడను రాజీపడకుండా దాని బోధించుట ఒక మహిమకరమగు విషయము. వ్రాయబడియున్నట్లుగా దానిని బోధించుము. వ్రాయబడియున్నట్లుగానే దాని జీవించుము. ఎంత గొప్ప పవిత్రమైన నిధి!
ఈ వాక్యము ఎప్పుడైనాగాని నెరవేరవలెనని మనము ఆశించుచున్నచో, ఎప్పుడైనా గాని దేవుడు తన వాక్యమును నిలబెట్టుకొనవలెనని ఆశించుచున్నచో, దేవుడు దానిని వ్రాసిన విధంగానే మనము దానిని అంటిపెట్టుకొని యుండవలెను. అదే కారణము. దేవుడు దానిని వ్రాసిన రీతిలో నీవు దానిని హత్తుకొనియుండినచో, మీ మధ్య అన్ని రకములగు క్రియలు జరుగును. ప్రతిమాట నెరవేర్చబడును.
34ఒక కదిలించు శక్తి రావలెనని నాయంతట నేనే ఇప్పుడు ఒక ఆశ కలిగియున్నాను. అది వచ్చినప్పుడు రాజ్యములను కదిలించును.
తన వాక్యము విషయములో రాజీపడని ఒక స్త్రీ లేక ఒక పురుషుడు ఆయనకు దొరికినప్పుడు, దేవుడెప్పుడో అట్టివారిని తన ఆధీనములో ఉంచుకొనును; దాని యొక్క ప్రతి మాటను నమ్మి యుగముల బండవలె నిలబడును. దాని వెనుక ఆయన ఉన్నాడని నమ్మును. దానిని నమ్ము వ్యక్తి, దానివలె పనిచేయవలెను. నీవు దానివలె ప్రవర్తించనిచో దానిని నీవు నమ్ముట లేదు. కాని దానిని నీవు నమ్మినచో దానివలె ప్రవర్తించెదవు. దానిని నీవు క్రియా రూపములో ఉంచగలవు. నీలో వాక్యము ఉండును.
35మనము మన వారసత్వమును పోగొటుకొనియున్నాము — ఎందుకనగా మనము రాజీపడితిమి. మనము రాజీపడినప్పుడు దేవుడు తన వాగ్దాన విషయములో మాట నిలబెట్టుకొనవలెనని మనము ఆశించలేము. ఎందుకనగా ఆ పవిత్ర నిధిని మనము విచ్చిన్నము చేశాము. దేవుడు మనకిచ్చిన నిధిని అపవిత్రపరిచాము. ఆ నిధిని మనము నిలిపియుంచుకొందుము. దానిని పవిత్రముగా ఉంచుము; పరిశుద్ధముగా ఉంచుము. దాని యొక్క ప్రతి మాటను నిలిపియుంచుకొందుము. ఎక్కడునూ రాజీపడవద్దు. దేవునిని, ఆయన వాక్యము యొద్దనే తీసికొని, దానిని నమ్ముము. దానివలె ప్రవర్తించుము. దానిపై నిలబడుము! కదలవద్దు! అదే మనము చేయవలసినది. దాని కొరకే దేవుడు చూచుచున్నాడు.
"నీతి యావత్తును ఈలాగు నెరవేర్చవలసియున్నది. ఇప్పటికీలాగు కానిమ్ము" అను వర్తమానమును ఈ ఉదయాన ప్రసంగించినప్పుడు నేను చెప్పాను. అది మన వంతు. వాక్యము మనకు ప్రకటించబడినది, కాబట్టి మనదే బాధ్యత. వాక్యముతో నిలచి యుండవలసిన బాధ్యత మన వంతుగా యున్నది. మనము దానితో నిలచియుండగా మన మధ్య దేవుడు పని చేయుటను చూతుము. కనుక దానితో నిలచియుండవలసిన పని మనము నెరవేర్చవలసియున్నాము. దేవుడు మనకు ఇచ్చిన వారసత్వము అది.
JOHN 11:25,26
36దేవుని గొప్ప పవిత్ర నిధిని పట్టుకొనియున్న కొందరు మనుష్యులను కొద్ది నిమిషాల పాటు మనము వెనక్కి వెళ్ళి చూద్దాం. ఆ నిధి ఆయన వాక్యమే. వాక్యమునే మనము వారసత్వముగా పొందాము. వత్తిడి సమయములో గందరగోళ సమయములో, వేదన సమయములో, అపాయకర కాలములో వాక్యమును హత్తుకొని యుండుటచే వారు ఆదరణ పొందిరి.
వాక్యమే దేవుని యొక్క ఆదరణ. మరణ ఛాయగల లోయలో సహితము నీవు నడచుట జరిగినను దేవుడాలాగు చెప్పెనని నీవు ఎరుగుదువు గనుక నీవు కలవరము చెందవు. దేవుడాలాగు చెప్పెను!
"పాస్టరుగారు దానిని చెప్పారు" లేక "సంఘము దానిని చెప్పెను" అని నీవు అనజాలవు.
నీవు "దేవుడాలాగు చెప్పెను" అని చెప్పవలెను. మనము పొందు ఆదరణ అది. ఇప్పుడు నేను పొందు ఆదరణ అక్కడే. నీవు పొందు ఆదరణయు అక్కడే. దేవుడాలాగు చెప్పెను! "నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రదుకును. బ్రదికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడు. దీనిని నీవు నమ్ముచున్నావా?
JOHN 14:17
37ఈ ఉదయ కాలమున నోవహును గూర్చి మాట్లాడానని తలంచుచున్నాను. విమర్శ మధ్యన ఉన్నప్పటికిని అతడు ఆదరణ పొందియుండును! నిశ్చయంగా!
"లోకము ఆయనను చేర్చుకొనదు. ఎందుకనగా ఆయనను అది ఎరుగదు. కాని మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచియున్నారు. ఆయన మీతో నివసించును, మీలో ఉండును." అని యేసు చెప్పెను.
నోవహు దేవుని కలిసికొనెను. అతడు దేవుని మాట వినెను. అతడు దేవుని వాక్యమును కలిగియుండెను. కాబట్టి ఎవరేమి చెప్పినను అతనికి ఏమీ తేడా కనిపించలేదు. నోవహు దేవుని వాక్యమును కలిగియుండెను. కనుక అది అతనికి ఆదరణ. విమర్శకులు వచ్చి వారు చేయుచున్నది చేయుచునే యుండిరి. అతనిని విమర్శించుచుండిరి. విజ్ఞాన శాస్త్రము ఈలాగు అన్నది, "పైన నీరు లేదు కదా, ఆకాశమునుండి నీరు ఎట్లు పడును? అక్కడ నీరు లేదని మేము రుజువుపరచగలము. నీవు పిచ్చివాడివి, నోవహూ! నీవు ఉన్మాదివని మేము రుజువుచేయగలము. ఇటు చూడు, అక్కడ నీరు ఎక్కడిది? నాకు చూపించు." నూట ఇరవై మిలియనుల కాంతి సంవత్సరముల అంతరిక్షములోనికి చూడగల నేటి మన కటకముల వంటివి ఆనాడు వారు కలిగియుండవచ్చు. కనుక ఎన్నడూ వాన కురియలేదని నీకు తెలియును. కాని ఇంకనూ నోవహు ఆదరణ పొందెను. ఎందుకనగా, అతడు దేవుని వాగ్దానమును కలిగియుండెను. ఆమేన్.
38అతడేమి చేసెను? ఒక ఓడ నిర్మించుచూ చుండెను. "ఎంత వెకిలితనము" బహుశా అచ్చట ఎన్నడూ ఓడ అనేది యుండియుండదు. ఆ దినములలో సరస్సులుగాని, నదులుగాని అట్టివి మరేవీగాని లేవు. కనుక వారికి ఓడ యొక్క అవసరము లేదు. కాని ఇక్కడ ఇతడు ఒక విడ్డురంగా కనబడుచున్న వస్తువును నిర్మించుచున్నాడు. అందరూ అతనిని చూచి నవ్వుచుండిరి. అతనిని నిరుత్సాహపరచుటకు అది చాలును. అందరూ అటు వచ్చిఇట్లనుచుండిరి. "ఆ కొండ మీద చూడు, అక్కడొక పిచ్చివాడున్నాడు. ఎదో ఇల్లువలె కనబడుచున్న దానిని నిర్మించుచున్నాడెందుకు? దాని బయటి నిర్మాణము అసలు ఏ తరహాకు చెందినది? దానితో ఎటువంటిది నిర్మించుచున్నాడో చూడు! ఇదంతా మతిలేని పని!" అయినను నోవహు ఆదరణ కలిగియుండెను. ఎందుకనగా అతడు దేవుని వాక్యమును కలిగియుండెను! అది ఒక ఆదరణ. దేవుడు ఆలాగు చెప్పెనని అతడు ఎరిగియుండెను. ఆమేన్! దేవుడు దానిని చెప్పెను గనుక అంతే చాలును. దేవుడు ఆలాగు చెప్పెను.
"వర్షము కురియనున్నదని నీకెట్లు తెలియును?"
"దేవుడు ఆలాగున చెప్పెను."
"అ పైనుండి నీరు వచ్చునని నీకెట్లు తెలియును?"
"దేవుడాలాగు చెప్పెను" అదే అతనికున్న ఆదరణ, వాక్యములోనే.
39కొద్ది నిమిషములు అతని ఓడను పరిశీలించుదము. దానిని నిర్మించు విధానము ఒక పిచ్చివాని పద్ధతివలె ఉన్నది. ఆది కాండములో ఆయన "చితిసారకపు మ్రానుతో ఓడను నిర్మించుము?" అని చెప్పినది మీరు గమనించారా? ఆ చితిసారకపు మ్రానుగూర్చి మీరెప్పుడైనా పరిశోధించి అధ్యయనము చేసినచో అది దాదాపుగా బెండువలె ఉండును. ఇది నిజంగా తేలికైన చెక్కవలె మరియు దూదివలె ఉండును. దాని గుండా చిన్న రంద్రముల వంటివి ఉండును. అది చెట్టులో అనగా సజీవంగా ఉన్నప్పుడు అందులో రసము ఉండును. మీరు దానిని నరికి వేసిన వెంటనే దానిలో నుండి రసము కారిపోవును. కనుక అది బెండుగా తప్ప మరి దేనికి ఉపయోగపడదు. ఇప్పుడాయన ఇట్లు చెప్పెను, "దానిని మంచి గట్టి సింధూర వృక్షముతో నిర్మించవద్దు. దానిని అత్తి జాతి చెట్టుతో నిర్మించవద్దు లేదా ఏదో గట్టికర్రతో తయారుచేయవద్దు, కాని దానిని చితిసారకపు మ్రానుతో తయారుచేయుము. అది అతి తేలికగా బెండువంటి కర్రవలె అది యుండును." నీటిలో వేసినచో ఒక నిమిషములో మునిగిపోవును. "దానిని చితిసారకపు మ్రానుతో ఆలాగు తయారుచేయుము." అదెంత పొడవు, వెడల్పులు కలిగి యుండవలెనో చెప్పెను. "దానిలో గదులుంచవలెను. మూడు గదులుంచవలెను" అని చెప్పెను.
40ఎంత సుందరమగు మాదిరి! నీతీకరణము, శుద్దీకరణము, పరిశుద్దాత్మ బాప్తిస్మము. మూడు గదులు. చూచారా?"దానికి ఒక కిటికీ ఏర్పరుచుము."అని చెప్పెను. గుర్తున్నదా? ఆ కిటికీ లోపట లేదు గాని పై భాగమున ఉండెను. చూడండి? నీతీకరణము, లూథరు, శుద్దీకరణము, వెస్లీ; పరిశుద్దాత్మ బాప్తిస్మము మరియు వెలుగు ముందుకు ప్రకాశించుచున్నది! అది దేవుని యొక్క సూర్యరశ్మి తప్పక అందులో నివసించవలెను. ఆ వెలుగులో నడువవలెను. ఆమేన్! క్రింది అరలో ప్రాకు జీవులుండెను; రెండవ అంతస్తులో పక్షులుండెను. కాని పై భాగమున నోవహు మరియు అతని కుటుంబము ఉండిరి. వారు చూడకలుగునట్లుగా పైన ఉండిరి. వెలుగులోనికి వచ్చెను.
GEN 6:14
41ఇప్పుడాయన ఇట్లు చెప్పెను, 'నీవు దీనిని చితిసారకపు మ్రానుతో తయారుచేసిన తరువాత, అంతా నిర్మించి అమర్చిన తరువాత వెలుపట లోపట దానికి కీలు పూయవలెను."
ఒకరోజున నేను ఈ కీలు అనగా ఏమిటో చదువుచున్నాను. కీలు అనగా మనకు తారు; మనము రసాయన పదార్ధములను తీసికొని తారుచేయుచున్నాము. రోడ్డు వేయుచున్నాము - తారుతో పగుళ్ళు, బీటలు మూయుచున్నాము. కాని ఆ రోజులలో అది వేరు. వారికి రోజిన్ (గుగ్గిలము లేదా రోజనము) చెట్లు ఉండెడిది. వారీ నిత్య హరితమును తీసికొని నరికి వేసెడివారు. నేడు మనకున్న సాధనములకు బదులుగా వారు చెట్లను దంచి దానిని బయటకు తీసెడివారు. ఆ రసము లేదా జిగురు బయటకు వచ్చే వరకు చెట్టును వారు దంచెడివారు. తరువాత దానిని వారు వేడి చేసి ఈ మెత్తని చితిసారకపు మ్రానుపై పోసెడివారు . బెండువలె అది ఉండి ఆ రసమంతటినీ పీల్చుకొనేది. అది గట్టిపడినప్పడు నీవు మేకును కూడా అందులో కొట్టజాలవు. చూచారా? అది నింపబడుటకు సిద్ధముగా ఉన్నది. క్రీస్తువలె అది ఉన్నది.
అదే సంఘము. చూడండి, సంఘము తనను ఒట్టిదిగా చేసుకొని మృదువుగా మారిపోవలెను. నిజమగు వెలుగును పొందుకొని నీలోనుండి శాఖా అంతయు వెలుపలకు తీసికొని రావలెను, నీలో నుండి లోకమంతయు బయటకు వచ్చివేయవలెను, నీలోనుండి అవిశ్వాసము అంతయు అంతటినీ వెలుపలికి పారద్రోలి దాని నుండి దూరముగా వెళ్ళిపోవలెను.
ISA 53:5•
1PET 2:24
42మనకంటే వ్యత్యాసముగా యుండిన ఒకాయన, ఆయన యొక్క యవ్వన ప్రాయము నందే నరికివేయబడెను; ఆయన చితుకగొట్టబడెను. నలుగగొట్టబడెను. "మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను. మన దోషములను బట్టి చితుక గొట్టబడెను." ఆ చెట్టులోనుండి సారమంతయూ బయటకు వచ్చివేసినట్లుగా ఆయన జీవమంతయూ బయటకు పారద్రోయబడు వరకు కొట్టబడెను.
ఓ! నిన్ను నీవు ఖాళీ చేసికొన్నచో, ఓ, క్రైస్తవుడా దానిలోనిది ఎంతగా నీవు పీల్చుకోగలవు కదా! కాని మొదట నిన్ను నీవు ఖాళీ చేసికోవలెను. అయితే కష్టము ఏమిటనగా, మనము ఖాళీ అగుటకు ఇష్టపడము. కాని మనము ఖాళీ చేసికొందము. మన ఆలోచనలన్నీ మన మత విశ్వాసములన్నీ మన గ్రంథములన్నీ ఖాళీ చేసికొని పరిశుద్దాత్మలో నానినవారమై దానిని పీల్చుకొనెదము. పరిశుద్దాత్మ అనగా ఆయనే వాక్యములో ఉన్న దేవుడుగా యున్నాడు.
అప్పుడది తుఫానును దాటించగలదు. సముద్రములో తేలుచూ సాగిపోగలదు. ఎందుకనగా అది ఏ ఇతర కర్రల కంటెను గట్టిది. దాని స్థానమును ఆక్రమించునది ఏదియూ లేదు. ఏదీ ఆలాంటిది లేదు. ఆరు వేల సంవత్సరములకు ముందు తయారు చేయబడిన ఓడయొక్క భాగములు నేటివరుకు కూడా ఇంకా ఆలాగే చెక్కుచెదరకుండా యున్నవి. అది నాశనమవ్వకుండా యుండుటవలన, దాని భాగములను నేడు వారు కనుగొనగలుగుచున్నారు. అది న్యాయతీర్పు లోపలికి ప్రవేశించకుండునట్లు దానిని వెలుపలనే నిలిపి వేసినది. జలములే అప్పటి న్యాయతీర్పుగా యున్నది.
మనము క్రీస్తు యెుక్క కొట్టబడిన జీవితము ద్వారా ఆయనలోనికి ప్రవేశించి, మనలోనికి ఆయనను మనము పీల్చుకొనిన, లోకము యొక్క కార్యములు మనలోకి ప్రవేశించకుండునట్లు నివారించబడి, ఉగ్రకోపము కుమ్మరించబడినను మనము నిలిచి యుందుము. తుఫానులు కొట్టుచున్నప్పుడు, సముద్రము ఉప్పొంగుచున్నను, ఆ చిన్న నావ పడిపోదు. ఆ అలల గుండానే అది తేలియాడుచూ ముందుకు కొనసాగిపోవుచూ యుగముల బండయొద్దకు చేరును.
43దీనిని నిర్మించుచుండగా, ఈ ఓడను తయారు చేయుచుండగా, అతనికొక ఆదరణ ఉండెను. తాను ఊరట పొందవలెనని అతడు ఎరిగియుండెను. "నీవు చేయవలసిన విధానము ఇదియే" అనే దేవుని యొక్క వాక్యమును అతడు కలిగి యుండెను. అదియే నోవహుకు ఒక ఓదార్పుగా యుండెను.
ఒకవేళ ఎవరైనా ఈ విధంగా చెప్పియు౦డినచో ఎట్లుండెడిది?"నోవహూ, ఆ చితిసారకపు మ్రానుతో నీవు దానిని నిర్మించుటలో ఏమైనా అర్ధమున్నదా?" ఏమి, నీకు ఆ కర్ర సంగతి తెలియును గదా. "ఒకవేళ నీళ్ళు గనుక వచ్చినట్లైతే, ముందు మునిగి పోయేది అదే"
కాని చూడండి. నోవహు ఆ దేశములను అనుసరించుచుండెను. అతడు దేవుని వాక్కును కలిగియుండెను. అదే అతని ఆదరణ కర్త. వాక్యమే అతని ఆదరణ. "ఈ విధముగా నిర్మించమని దేవుడెందుకు నాతో చెప్పుచున్నాడో నేను అర్థము చేసికొనలేను, గాని ఆయన చెయ్యమని చెప్పినది ఇదే."
MATT 16:18
44నేను చేసే విధంగా చేయుటకు దేవుడు నన్నెందుకు ప్రేరేపించెనో నాకు అర్థము కాదు. తక్కిన సంగతులన్నింటిలో ఆయన ఎందుకు నన్ను సహకరించుటకు అనుమతి ఈయుట లేదో నాకు అర్ధముకాదు. ఆలాగు చేస్తూ నేను సంఘశాఖలతో కొనసాగిపోవుటకు ఆయన ఇష్టపడుట లేదు. కాని ఇది ఆయన ఆదేశము. దీనిని నిర్మించమని ఆయన చెప్పిన విధానము ఇదే.
"ఆయన దానితో ఏమి చేయనైయున్నాడు?"
నాకు తెలియదు. ఆ దుంగలు అక్కడ నేను పేర్చి మేకులు కొట్టవలసియున్నాను. ఆ దుంగలు దేవుని యొక్క వాక్యమే. అక్కడ నా ఆదరణ యున్నది. అది నిజము. ఎందుకనగా అది దేవుడు నిర్మించమని చెప్పిన ప్రకారము నిర్మించబడినది. "ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని యెదుట నిలువజాలవు." అది నిజము. అది ఏమిటి? "యేసు క్రీస్తు ఎవరనే దానిని గురించి తెలుసుకొనుటకు ఆయనను గూర్చిన ఆత్మీయ ప్రత్యక్షత మీద." త్రిత్వములోని మూడవ వ్యక్తి కాదు. అందులో త్రిత్వము లేదు. ఆయన దేవుడైయున్నాడు. ఆయనే దేవుడు. శరీరధారిగా ప్రత్యక్షమాయెను. అక్కడే ఆయన తన సంఘమును నిర్మించెను. "పాతాళ లోక ద్వారములు దానియెదుట నిలువజాలవు. దానికి వ్యతిరేకముగా పాతాళ లోక ద్వారములు లేచునని అది చూపించుచున్నప్పటికిని, ఎన్నడూ దానిని జయించజాలవు.
45నోవహు, నిశ్చయంగా, ఈ మాటలు కలిగియుండెను. తాను ఎరుగును గనుక ఆదరణ పొందియుండెను. లోకము ఏమి చెప్పినా లెక్కచేయలేదు.
ఒప్పందము (contractor) చేసుకొనినవాడు వచ్చి ఈలాగు చెప్పియుండిన ఎట్లు౦డును. "సహో, నోవహు, నీవు సంఘమును విడిచిపెట్టి ఈ తంత్రము నమ్మి వెళ్ళినందువలన నేను ఒకటి చూపించెదను. నీవు నిర్మించుచున్నచో ఎందుకు నీవు మంచి గట్టి సింధూర వృక్షపు మ్రానును తీసికొనలేదు?" "సింధూర వృక్షము వలన పని జరుగదు."
"దీనికంటె సింధూర వృక్షపు మ్రాను గట్టిదని నేను రుజవు చేయగలను" అని నీవందువు.
సింధూర వృక్షపు మ్రాను ఎంత గట్టిగానున్ననూ ఏమీ తేడాలేదు. దేవుని ప్రత్యేకత "చితిసారకపు మ్రాను." ఆ కర్రతో దేవుడు ఏదో చేయనైయున్నాడు. దానిని కలుపుటకు దేవునికి మరేదో యున్నది.
46అందులో కొందరు ఇట్లు చెప్పవచ్చును, "మంచి దుస్తులు ధరించి, చక్కగా ముస్తాబయి నీకు బాగా డబ్బు చెల్లించ కలిగిన, ఇంకా అటువంటి కార్యములు చేయగల తెలివిగల గొప్ప జనసమూహములు గల ఒక సంఘమును ఎందుకు నీవు సమకూర్చుకొనవు? సువార్త అట్టివారికి బోధించవచ్చునుగదా? పేదలకు నీవెందుకు సువార్త ప్రకటించుచున్నావు? నీవు సగం ఆకలితోను, ఇంకా ఆయా రకములకు బాధలతోను ఈ విధముగా ఉండుట యేల?" సత్యముకొరకు నిలబడిన బోధకులకు వారు ఆలాగు చెప్పెదరు.
"కాని ఓ సోదరుడా, నేను నీకు ఆలాగు చెప్పలేను!"
"ఆ, ఆ లు తెలిసిన ఒక మేధావి గుంపును నీవు సంపాదించుకొనలేవా?"
గుంపు ఏలాటిదయినను ఏమీ భేదము లేదు. క్రీస్తును చేర్చుకొన ఇష్టపడువారుగా యుండవలెను. వారితో దేవుడు ఒక పని జరిగించును. అది అట్టి గుంపు. ఆ వ్యక్తి బహుశా అ ఆ లు రానివాడై యుండవచ్చును. కాని అతడు క్రీస్తును ఎరిగి యుండెను. అక్కడే బేధమున్నది. చూచారా? అది — నిలబడుట కాదు; మీరు ఉన్నత వర్గమునకు చెందినవారమని గొప్పలను చెప్పుకొను మాటలయందు అది ఆధారపడి లేదు, మనము లంగరు వేయబడిన వారమై, మనకు భద్రతను కలిగించు యేసు క్రీస్తు యెుక్క రక్తముయందు అది ఆధారపడి యున్నది.
47మనమింకా ఈ అంశమును మాట్లాడుకొను సమయములో మరియొక పేరును మనము తీసికొందము. యోబును గూర్చి నేను మాట్లాడగోరుచున్నాను. ఆ వ్యక్తి ఆదరణ కర్తను ఎంతగా కలిగియుండెను! అతడి ఆదరణ కర్త ఎవరు? దేవుని యొక్క వాక్యము! ఆ దహనబలిని అర్పించినంత వరకూ అతడు నీతిమంతుడుగానే యుండునని దేవుడతనికి చెప్పెను. యోబు ప్రశాంతముగా ఆ దహనబలిపై విశ్రాంతి పొందెను. తుఫానులు ఎంత గట్టిగా కొట్టినను, ఎన్ని కురుపులు పుట్టుకొచ్చినప్పటికిని, అతని యొద్దనుండి ఎన్ని తీసివేయబడినప్పటికిని ఇంకా అతడు దేవుని వాక్యము మీద నిలబడియుండెను. యోబుకు అది ఒక ఆదరణగా ఉండెను.
JOB 19:25,26
48తనవారు, సంఘములు, వచ్చి అతనిని సమాధానపరచ యత్నించిరి. ఇటు పలికిరి, "ఇటు చూడు, యోబు , ఇటు చూడు, నీవు పాపము చేసితివని నీవెరుగుదువు. తప్పు చేసితివని నీవెరుగుదువు. ఒకనికి ఉన్నదంతా తీసివేసికొని, బిడ్డలను తీసివేసికొని, ఇంటిని విచ్చిన్నము చేసి, ఆరోగ్యమును పాడుచేసి, ఇంకా ఈ విధమగు శిక్షలను నీతిమంతునికి దేవుడు ఎందుకు విధించును? ఇక్కడ నీవు ఒక దిక్కుమాలిన దరిద్రునిగా కూర్చొనియున్నావు. ఏలాగు, నేను, "పాపిని కాను" అని నీవు ఏలాగు నీతిమంతునిగా నిన్ను నీవు తీర్పు చేసికొందువు యోబూ?"
కాని తాను పాపిని కానని యోబునకు తెలియును. ఎందుకనగా అతడు దేవుని వాక్యముపై నిలబడెను! ఆమేన్! దేవుడు ఆ ఒప్పుదలను, ఆ దహన బలి అర్పణను దేవుడు కోరియుండెను. యోబు తన ఒప్పుదలను చేసికొని వాక్యము మీద నిలబడియుండెను. తన యొక్క శ్రమల మధ్యలోనే అతడు ఇట్లు కేకవేసెను. "నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అంత్య దినమున ఆయన ఈ భూమిమీద నిలుచును. ఈ దేహమును పురుగులు నాశనము చేసినను, నా శరీరముతో నేను దేవుని చూతును" చూడండి. దేవుని వాక్యము. దేవుని వాగ్దానమే అతని యొక్క ఆదరణ.
దేవుని వాక్యమే మనకున్న వారసత్వము. అది వాగ్దానము. అవునండీ!
49అబ్రాహాము; అతని గూర్చి ఈ ఉదయాన మనము మాట్లాడుకొన్నాము. ఈ రాత్రి మరియొక సాక్షిగా మరల అతనిని తీసికొని వచ్చుచున్నాను. ప్రజలు అతనిని మతిపోయిన వాడని పిలువగోరినప్పుడు అబ్రాహామునకు ఎట్టి ఆదరణ యున్నది! అబ్రాహామునకు అంతా ప్రతికూలముగా జరుగుచున్నప్పుడు వారు ఏమి చెప్పియుందురు?
"ఆ చిన్నబిడ్డతో నీవెక్కడికి వెళ్ళుచున్నావు అబ్రాహామూ?"
"అతనిని బలిగా అర్పించుటకు"
"ఎందుకు?"
"ఆయన యొహోవా; ఆయన నాతో మాట్లాడెను. సర్వశక్తుడగు దేవుడు, ఎల్ షద్దయి, రొమ్ము- నేను వంద సంవత్సరముల ప్రాయములోను, నా భార్య తొంబది సంవత్సరముల వయస్సులోను ఉన్నప్పుడు ఆయన ఈ బిడ్డను నాకు ఇచ్చెను. ఆ దేవుడే ఈ బిడ్డను కోరుచున్నాడు. మృతతుల్యునిగా నున్నప్పుడు నేను ఆ బిడ్డను పొందాను. మృతులలోనుండి అతనిని దేవుడు లేపుటకు సమర్దుడని నాకు నమ్మకమున్నది.
ROM 4:19
50ఆ పురాతన యోబు తన కాలములో ఇట్లు చెప్పెను, "ఆయన నన్ను చంపినను నేనాయనను నమ్ముదును." ఆయన వాక్యములో అతడు లంగరు వేయబడియుండెను. వాక్యము ఏమి చెప్పెనో అతడు ఎరిగియుండెను. అదే అతని ఆదరణ. ఆయనను చేర్చుకొనుట, ఆయనను పట్టుకొనుటయే అతని విశ్వాసము.
దేవుడై యుండెనని అబ్రాహాము ఎరుగును. కనుక అతని కుమారుడు… అతడు మృతతుల్యుడాయెను. శారా గర్భము మృతతుల్యమాయెను. అతని పురుషత్వము మృతతుల్యమాయెను. అయినను దేవుడు ఈ బాలుని అతనికిచ్చెను. ఎందుకనగా అది ఆయన వాగ్దానము చేసెను. దానిని వాగ్దానము చేసిన ఆయన, "కుమారుని బలిగా ఇమ్మని" చెప్పగా, మృతులలోనుండి కూడా దేవుడు అతనిని లేపగల సమర్దుడని ఎరిగియుండెను.
JOB 13:15•
JOHN 6:54•
JOHN 11:25•
EPH 2:1
51ఇప్పుడు, పాపిగా నుండిన నన్ను పాపములలోను, అతిక్రమములలోను చనిపోయిన నన్ను దేవుడు మృతులలోనుండి నన్ను లేపి, నా ఆత్మను మేల్కొలిపి నాకు ప్రత్యేక క్రియ చేసెను. ఆయన మీకును ఏదో క్రియ చేసెను. లోకపు ఆత్మను ఆయన నాలోనుండి తీసివేసెను, లోకపు ఆశను నాలోను౦డి ఆయన తీసివేసెను. ఆ ఛాయల నుండి పైగా నన్ను లేవనెత్తెను. ఆయన నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇచ్చెను. నా దేవుడు అది చేసెను గనుక ఆయననుండి మరణమునుండి నన్ను విడదీయలేదు. అది అదే! నన్ను వేరుచేయునది ఏదియూ లేదు. అదియే ఆదరణ. "నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రదుకును." అది నిజము! నాకు తెలియును! "నా శరీరమును తిని నా రక్తమును త్రాగువారే నిత్యజీవముగలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును."
52జిగట గల ఊబిలోను, పాపములో పడియున్న నన్ను దేవుడు లేవనెత్తి ఒక క్రైస్తవునిగా చేసెను! కలవరములోను, కలతలోను ఉన్న నన్ను పూర్వము నేనుండిన స్థితిలో నుండి నన్ను ఒక నీచ దరిద్రునిగా ఉన్న నన్ను ఆయన తీసికొనెను. నిత్యజీవ నిరీక్షణ, పరిశుద్దాత్మతో బాప్తిస్మమిచ్చుటకు, ఆయన శక్తి మహిమతో నింపుటకు ఆయన నన్ను తీసికొనెను. నిత్యజీవ నిరీక్షణ ఇచ్చుటకు, పరిశుద్దాత్మతో బాప్తిస్మమిచ్చుటకు, ఆయన శక్తి, మహిమతో నింపుటకు ఆయన నన్ను లేనవెత్తెను. గనుక ఆయన నన్ను మరణాంధకారపు లోయగుండా నడిపించి అవతలి ఒడ్డున మహిమలోనికి స్వీకరించుటకు సమర్దుడు. ఎందుకనగా ఆయన దానిని వాగ్దానము చేసెను. అదే మన ఆదరణ.
కదలని బండయగు క్రీస్తు మీదనే నేను నిలబడుదును
తక్కిన నేలలన్నియూ కూలిపోవు ఇసుకయే.
DAN 3:19
53ఆ హెబ్రీ పిల్లలు మండుచున్న అగ్నిగుండములోనికి ఎట్లు వెళ్ళిరో దానినిగూర్చి ఈ ఉదయాన మనము మాట్లాడుకొన్నాము. తమ ప్రాణములను తృణీకరించి ధైర్యముగా వారు అగ్నిగుండములోనికి నడిచి వెళ్ళిరి. వారొక నిశ్చయత చేసికొనిరి. ఈ ఉదయాన మనము మాట్లాడుకొన్న రీతిగానే. కాని వారికేమి జరిగినది? "మా దేవుడు సమర్దుడు." అని వారనిరి. ఆమేన్! వారు అక్కడే నిలబడియుండిరి! దేని మీద వారు నిలబడియుండిరి? వారి ఆదరణ ఏదైయున్నది? కొద్ది నిమిషాలలో వారు శల్యములై మాడిపోవుదురు. ఆ అగ్నిగుండమును ఎప్పటికంటె ఏడురెట్లు వేడిగా చేసిరి. కాని వారికి ఆదరణ యుండెను! ఎందువలన? "మండుచున్న అగ్నిగుండమునుండి మా దేవుడు మమ్మును తప్పించగల సమర్దుడు" అనునది వారెరుగుదురు. వారు, వారి ఆదరణ, వారు సేవించుచున్నదేవుని యొక్క సామర్థ్యమును వారు ఆధారముగా చేసికొనియుండిరి. ఓ!
DAN 3:17,18
54ఆయన సామర్థ్యము మీద ఆనుకొనియుండుట! నా నిరీక్షణ, ఆశయము అదే. నేను ఆయన సామర్థ్యము పైనే ఆనుకొనియున్నాను. ఆయన కృప మీదనే నేను విశ్రాంతి పొందుచున్నాను. నేను ఏమైయున్నానో దాని మీద కాదు; ఆయన ఏమైయున్నాడో దాని మీదనే. ఆయన వాగ్దానము మీద నేను ఆనుకొనియున్నాను. ఎందుకనగా ఆయన వాగ్దానము చేసెను. వాగ్దానమునకు ఆయన ప్రమాణము చేసెను. మనకు నిత్యజీవమున్నదని నేను ఎరుగుదును. అది నిజము.
అతడు దానిపై విశ్రాంతి పొందెను. ఆ హెబ్రీయులు ఇట్లనిరి"ఆయన మమ్ములను రక్షించుటకు సమర్దుడు. ఆయన మమ్ములను రక్షింపక పోయినను ఎన్నడునూ నీ విగ్రహమునకు మేము మొక్కము" నాకది ఇష్టము. అవునండీ!
మార్గాంతమున ఆయన నన్ను త్రోసివేసినప్పటికిని, ఏ క్రైస్తవుడయిననూ చెప్పగలడు, ఆయన నన్ను నిత్యత్వపు ఎడబాటుకు విసిరి వేసినను, ఆయనను ఇంకా నేను ప్రేమింతును. అయినను ఆయన నా వాడు, పాతాళములో కూడా ఇంకా నేను ఇప్పుడు ఆలోచించుచున్న ధోరణిలోనే ఆలోచించుదును. ఆయనను ఇంకా ప్రేమించుదును. యుగములు దొర్లిపోవు చుండగా ఇంకా నేనాయనను ప్రేమింతును. ఎందుకనగా నా హృదయములో ఏదో జరిగినది. ఏదో సంభవించినది. "ఒకవేళ నాకు ఒక జీవితమున్ననూ, లేక మూడు జీవితములున్ననూ ప్రభువైన యేసు క్రీస్తువలెనే నేను ఉండగోరుచున్నాను." అది నిజము. ఎందుకనగా ఏదో జరిగినది. ఆయన నా జీవము. ఆయన నాయొద్దకు వచ్చెను.
EXOD 3:12
55మోషే ఎరిగియుండెను. మోషే ఇరువది లక్షలమంది ప్రజలను ఐగుప్తునుండి బయటకు నడిపించుటకు బాధ్యత కలిగియున్నాడు. వారినెట్లు అతడు పోషించనై యున్నాడు? ఇరువది లక్షలమంది జనులు - స్త్రీలు పిసికిన రొట్టెలను కొన్నింటిని సిద్ధపాటు చేసికొని తలలమీద ఉంచుకొనిరి. నలుబది సంవత్సరాల ప్రయాణములో ఎట్లు అతడు వారిని పోషించనైయున్నాడు? అంతమంది జనులుగల గుంపులో ప్రతిరాత్రి ఎంతమంది పిల్లలు పుట్టియుందురు? ఎందరు వృద్దులు, బలహీనులు ఉండియుందురు? ఎన్ని బట్టలు వారు ధరించియుందురు?"ఎక్కడ నుండి నేను వస్త్రములు తీసికొందును? ఎక్కడనుండి తెచ్చి వారిని పోషించుదను? నేను వారికి ఒక నాయకునిగా ఉండుటకు వచ్చాను. దానిని నేను ఏలాగు నెరవేర్చగలను"?
మోషే దీని మీద ఆశ్రయించియుండెను. ఎందుకనగా దేవుడు ఇట్లు చెప్పెను, "నిశ్చయముగా నేను నీతో యుందును." వారికి అవసరమగునదంతయూ అదే. అది; మోషే దేవుని వాగ్దానము యొక్క ఆదరణ మీద విశ్రాంతి పొందియుండెను. "మోషే నిశ్చయముగా నేను నీతో యుందును." కాబట్టి వారెట్లు పోషించబడుదురో మోషేకు అక్కరలేదు.
"ప్రభువా, ఎట్లు నీవు దానిని చేయనైయున్నావు"?" అన్న ప్రశ్నను మోషే అడుగలేదు.
ప్రశ్నలు అడుగుట నా పని కాదు, ప్రశ్నలు అడుగుట నీ పని కూడా కాదు. ఆయనను విశ్వసించుట, ఆయనకు లోబడుట, ఆయన వాగ్దానముపై నిలిచియున్నంత సేపు ఆదరణ కలిగియుండుటయే మన పని దేవుడాలాగు చెప్పెను. గనుక" అది స్థిరమగును."
56ఒకసారి ఎవరో నాతో ఇట్లు చెప్పారు, "సహో, బ్రెన్హాం, నీవు రోగులను పిలచుటకు వేదిక మీదకు వెళ్ళునప్పుడు నీవు భయపడవా? ఆ వరుసతో నుండునప్పుడు ఏదైనా పొరపాటు జరుగునని కొన్నిసార్లు నీవు భయపడుట జరుగదా?" జరుగదు.
నేను భయపడను. ఎందుకనగా నేను పూర్తిగా ఆయన వాక్యముపై నిలిచియున్నాను. "నేను నీతో యుందును." ఆ రాత్రి ఆయన నాతో ఆలాగు చెప్పెను. "నీ జీవితకాలమంతటిలో నీ యెదుట ఏ మానవుడు నిలువజాలడు." "నేను నీతో యుందును" అని ఆయన చెప్పెను. ఆయన శత్రువును సంహరించెను. నేను నిలబడవలసిన అర్హత నాకు లేనప్పుడు ఆయన నాయొద్ద నిలబడెను. కాని ఆయన దానిని వాగ్దానము చేసిన కారణమున, ఆయన కృపనుబట్టి, ఆ వాక్యముపై పూర్తిగా నేను నిలచియున్నాను. ఎందుకు? ఆయన దానిని వాగ్దానము చేసెనుకాబట్టి. ఆయన వాగ్దానము చేసెను. ఆయన వాగ్దానము చేసిన దానిని నిలబెట్టుకొనగల సమర్దుడు. అది నిజము. మోషే దానిని ఎరుగును.
"సముద్రమును ఎట్లు నీవు దాటగలవు?"
"నాకు తెలియదు. కాని ఆయన నాతో ఉందునని నాకు వాగ్దానము చేసెను"అని మోషే చెప్పెను.
కాబట్టి వంతెన దగ్గరకు వచ్చేవరకు నీవు దానిని దాటవద్దు. దేవుని వాక్యముతో నిలిచియుండుము. మార్గమును దేవుడు తెరచును. ఎందుకనగా ఆయనే మార్గము. అవును. దేవుడు అతనితో మాట్లాడిన మాటనుబట్టి మోషే ఆదరణ పొందెను.
LUKE 3:16•
JOHN 1:26
57ఇప్పుడు. యోహాను. ఈ ఉదయాన అతని గూర్చి మాట్లాడుకొన్నామనుకొంటాను. ఖచ్చితంగా చెప్పలేను. కాని మనము బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి మాట్లాడుకొన్నామను కొంటాను. అతడు అరణ్యములోనుండి వచ్చినప్పుడు ఎవరయినా గాని . ఇట్లు అని యందురు. "ఇటు చూడు! ఈనాడు ఇశ్రాయేలులో ఇరువది లక్షలకంటె ఎక్కువ ప్రజలు ఉన్నారు. ఈ మెస్సీయాను నీవెట్లు ఎరుగదువు? నీకెట్లు తెలియును?"
"అతడు ఒక సాధారణ మనిషిగా ఉండును. అతడు దావీదు కుమారులలో ఒకనిగా ఉండును."
"దావీదు వంశావళి గుండా ఆయన ఎక్కడికి వచ్చును? వారు వేలకొలదిమంది ఉన్నారు. ఆయనను నీవు ఎట్లు ఎరుగుదువు? అది ఆయనే అని తెలిసికొని, లోకమునకు నీవెట్లు పరిచయము చేయగలవు?"
అతడిట్లు పలికెను, "నాకు దేవుని వాక్యమున్నది. నేను ఆయనను ఎరుగుదును." అతడిట్లు పలికెను. "మీమధ్య నిలబడియున్నవాడు ఆయనే." ఆమేన్! "ఇప్పుడు ఒకాయన మీ మధ్యను నిలబడియున్నాడు. మీరాయనను ఎరుగరు. ఆయన మీకు అగ్నితోను, పరిశుద్దాత్మతోను బాప్తిస్మము ఇచ్చును."
LUKE 3:16•
JOHN 1:31,33
58"ఆయనను నీవెట్లు ఎరుగుదువు, యోహానూ?"
"నేను దేవుని వాక్యము మీద నిలబడియున్నాను. ఎందుకనగా అరణ్యములో దేవుడు నాతో ఈలాగనెను, "వెళ్ళి నీళ్ళతో బాప్తిస్మము ఇమ్ము" "ఆత్మ ఎవని మీద దిగి నిలిచి యుండుట నేను చూచెదనో ఆయనే మీకు పరిశుద్దాత్మతోను, అగ్నితోను బాప్తిస్మము ఇచ్చువాడని" చెప్పెను.
యోహాను చెప్పెను, "ఆయన అక్కడ నిలబడియుండెను. కాని ఆయనను నేనెరుగను. ఆయన ఒక సాధారణ మనిషి, ఆయన పురుషునివలె దుస్తులు ధరించెను. ఆయన పురుషునివలె కనిపించెను. ఆయన ఒక మనిషి' 'నేనాయనను ఎరుగను. కాని అరణ్యములో ఒకాయన నాతో ఇట్లు చెప్పెను, "నీవొక గురుతు చూచెదవు. అదేమనగా ఆత్మ ఆయనపై నిలిచియుండును. దానిని కలిగియుండునది ఆయన ఒక్కడే" అని చెప్పెను. తాను పొరపాటు చేయుదునని యోహాను ఏ మాత్రమూ భయపడలేదు. ఎందుకనగా ఆయనను అతడు ఎరిగెను. ఆమేన్!
MARK 16:17,18•
2TIM 3:5
59ఓ! యేసూ ఈలాగు చెప్పెను గనుక మనమెట్లు పొరబడుదుము! "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. సర్పములను ఎత్తి పట్టుకొందురు. విషకరమైనది ఏదయినను త్రాగినను వారికి ఏ హానియు కలుగదు. వారు రోగులపైన చేతులుంచినప్పుడు బాగుపడుదురు."
ఆ శక్తిని వారు నిరాకరించుచున్నారని ఈనాటి మనుష్యులు కనుగొనుచున్నారు. "పైకి భక్తి కలిగియుండియు పరిశుద్దాత్మ యొక్క శక్తిని నిరాకరించుచున్నారు." నిశ్చయంగా అది మనము చూడకలిగినంతగా బయటకు కనపడుచున్నది.
MATT 14:4•
MARK 6:18•
MARK 16:17
60మనము ఆదరణ పొందియున్నాము. ఎందుకనగా దానిని దేవుని వాక్యము చెప్పెను. మనకిట్లు చెప్పెను. "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును."
విమర్శకులు లేచి ఈ మాటలు చెప్పుదురని ఆయన చెప్పెను. కనుక అది మనలను దానినిబట్టి ఆదరించవలసియున్నది.
(టేపుపై ఖాళీయున్నది - సంపా.) అతడు ఆదరణ పొందెను.
"అది కాదు అని ఎవరైనా చెప్పవచ్చును." "ఒక్క నిమిషము ఆగుము!" అవతలి ప్రక్కన ప్రధాన యాజకుడు ఉన్నాడు అని చెప్పిరి."
"ప్రధాన యాజకుడు ఉండనీ, లేకపోనీ, బిషప్పు ఉండనీ లేక ఉండక పోనీ, రాజు ఉండనీ, లేక ఉండక పోనీ" అక్కడ హేరోదు కూర్చొనియుండెను. యోహాను ఈలాగు చెప్పెను, "ఫిలిప్పు భార్యను తీసికొని ఆమెతో జీవించుట చట్ట సమ్మతము కాదు." ఆమేన్!
అతడు ఏమి కలిగియుండెను? దేవుని యొక్క వాక్యము. ఆమేన్. అతడు లెక్కచేయలేదు. రాజీలేకుండా దానిని బోధించెను. అతడు వాక్యమును కలిగియుండెను. అది అతని ఆదరణ. ఆ మెస్సీయా ఎవరైయుండునో దేవుడతనికి చెప్పెను.
JOHN 1:29,33
61"అక్కడ మొస్సీయా ఉండినా, ఉండకపోయినా, ఆయన మన ప్రధాన యాజకుడేనని నీవు అనుకొనుట లేదా? అతడు ఆయనగూర్చి ఎరుగునని నీవు తలంచుట లేదా?"
"దానిగూర్చి నాకు తెలియదు. కాని ఆత్మ దిగి వచ్చుటను నేను చూతునని దేవుడు నాతో చెప్పెను. అది ఆయన మీద నిలిచియుండును. ఆయనే ఆ వ్యక్తిగా ఉండును. ఆమేన్! ఆయనే నా మెస్సీయా" యోహాను ఇట్లనెను, "కనిపెట్టి చూచుటలో నా హృదయమందు నేనొక ఆదరణ కలిగియున్నాను. ఎందుకనగా దేవుని యొక్క వాగ్దానమును నేను ఎరుగుదును. ఆయనను నేను చూచినప్పడు ఆయనను నేనెరుగుదును."
ఒక రోజున లాజరు, యోహానులు కొండ దిగువగుండా నడిచి వచ్చుచుండిరి. పర్వతము క్రిందగా నడిచి వచ్చుచుండిరి . తిన్నగా నీటిలోనికి నడిచి వచ్చెను.
అప్పుడు యోహాను ఇట్లనెను, "ఇదిగో. ఆయన ఇచ్చటున్నాడు! అది ఆయనే!" అందరూ చుట్టూ కలియ చూచిరి. ఒకరికొకరు ఏమీ చెప్పకొనలేకపోయిరి. గడ్డములు, అంగీలతో వారందరూ ఒక్క విధముగానే కనబడిరి. కాని యోహాను అన్నాడు, "నేనాయనను ఎరుగుదును. ఎందుకనగా ఆయనను ఒక సూచన వెంబడించుచున్నది. నేనాయనను ఎరుగుదును. అది ఆయనే. ఇదిగో లోక పాపము మోసికొనిపోవుచున్న దేవుని గొర్రెపిల్ల."
MATT 3:15•
MARK 16:17•
JOHN 11:25,26•
1TIM 1:12
62యేసు ఎన్నడూ తలను పైకెత్తలేదు. కాని తిన్నగా నదిలోనికి బాప్తిస్మము పొందుటకు నడిచి వెళ్ళెను. "నీతియావత్తు ఈ విధముగా నెరవేర్చుట మనకు తగి యున్నది." తానే మెస్సీయాను అని ఆయన ఎరిగియుండెను. ఎందుకనగా అతడు తన హృదయములో దేవుని వాక్యమును, వాగ్దానమును కలిగియుండెను. ఓ! ఈ రాత్రి ఎంతగా మనము విశ్రాంతి పొందగలము!
వైద్యుడు ఆ పడకను విడిచిపెట్టి ఈ విధముగా పలుకుతూ వెళ్ళిపోవుచున్నప్పుడు ఎట్లు౦డును, "ఆ గుండె ముక్కలయి పోవుచున్నది. నాడి దొరుకుట లేదు. శ్వాస ఆడుట లేదు. అతడు మరణించుచున్నాడు."
"కాని నేను నమ్మినవానిని నేను ఎరుగుదును. ఆ దినమునకు విరుద్ధముగా నేనాయనకు అప్పగించిన దానిని ఆయన తప్పించుటకు సమర్దుడని నేను పూర్తిగా నమ్మియున్నాను."హల్లెలూయా! నిశ్చయంగా, దేవుని వాగ్దానమును నీవు పొందియున్నావు. "నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడును చనిపోడు." మనకు ఆ వాగ్దానమున్నది. దేవుని వాక్యము. దేవుని వాక్యముతో నిలిచియుండుటయే మనకు ఆదరణ.
63ఇప్పుడు ఈ కధానాయకులందరూ, నేను ఇక్కడ వ్రాసియుంచినవారు అనేకమంది ఉన్నారు. కాని సమయమును ఆదా చేయుటకు వివరించుట లేదు. దేవుని వాక్యము ద్వారా ఆదరణ పొందిరని మనకు తెలియును. వారేమి చేసిరో ఇక్కడ ఉన్నది. వారు వెనుకకు చూచిరి. ఒక వ్యక్తి వెనుకకు చూచి, మరొక వ్యక్తి ఏలాగు వాక్యమును నమ్మి ఆదరణ పొందితిరో ఎరిగి బయటకు వచ్చెను. అప్పుడు ఈ వ్యక్తి అతడు చేసిన దానిని వెనుదిరిగి చూచి వాక్యమును వెంబడించి బయటకు వచ్చెను; ఆదరణను పొందెను. తాను దేవుని యొక్క వాగ్దానమును పొందియున్నానని తెలిసికొనియుండెను. తరువాత మరియొకడు వచ్చి అతనిమీదనున్న ఆత్మను ఎరిగియుండి అనుభవించెను. కనుక అతడు దేవుని వాక్యమును వెంబడించి, అతడు పొందిన ఆదరణను కలిగియుండెను. వారు ప్రతిఒక్కరు దేవుని వాక్యమును వెంబడించుచుండిరి. అది ఒక ఆదరణ.
JOHN 1:1,14
64ఓ! సోదరుడా! ఇప్పుడు దీనిని వినుము! ఒక రోజున ఆ వాక్యమే శరీరధారి యాయెను. అది ఇదే! ఆ వాక్యము ఒక మానవ రూపములో శరీరము ధరించెను. ఆదరణను తీసికొని వచ్చిన దేవుని వాక్యము ఇక్కడ మనమధ్య ఒక నరునిగా మారెను. మన చేతులలో దేవుని వాక్యమును మనము పట్టుకొనగలము. దేవుని వాక్యముతో మనము కరచాలనము చేయగలము. ఆయనే ఆ వాక్యమైయుండెను. "ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యమే దేవుడైయుండెను. ఆ వాక్యమే శరీరధారియొ మనమధ్య నివసించెను." ఆ దేవుని యొక్క వాక్యము శరీరధారియాయెను, ఆదరణ కర్తయాయెను. ఆయన ఇక్కడ ఈ భూమిమీద జీవించెను. ఆయన వాక్యమై యుండెనని మనము చూద్దాము. ఆయన దేవునివలె పని చేసెను, ఆయన దేవునివలె కనిపించెను, ఆయన దేవునివలె బోధించెను, ఆయన దేవునివలె స్వస్థపరిచెను, ఆయన దేవుడైయుండెను. ప్రతి విధముగాను ఆయన దేవుడైయుండెను; వాక్యమువలె ఆయన మాట్లాడెను. వాక్యము వలె ఆయన కనిపించెను. వాక్యమువలె ఆయన బోధించెను. ఆయనే వాక్యమైయుండెను! ఆమేన్!
JOHN 11:25,43
65ఓ! ఆయన యొద్ద కూర్చొనియుండుట ఎంత ఆదరణగా యుండును! అది చేయుటకు నీవు ఇష్టపడవా? "ఓ! నిశ్చయంగా, సహోదరుడా బ్రెన్హాం," అని నీవందువు. ఒక్క క్షణము నేనయితే ఆయన వద్దకు పరుగిడి వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చొందును. ఆయన ఈ భూమిమీద నుండినప్పుడు ఆలాగు చేసియుందును.
ఈ భూమి మీద నిలబడి, ఆయన మాదిరిగా "పునరుద్దానమును, జీవమును నేనే" అని లాజరు సమాధియెద్ద చెప్పకలిగినవాడు ఏ మనుష్యుడునూ లేడు. "నా యందు విశ్వాసముంచినవాడు చనిపోయినను తిరిగి బ్రదుకును.' ఓ! ఆయన ఎవరు? అది ఏమిటి? అది వాక్యము. ఆయనే వాక్యము. ఆయన అక్కడ నిలబడి ఒక మానవునిగా కళ్ళనీళ్ళను తుడుచుకొన్నందుకు ఆశ్చర్యపడనవసరము లేదు. చనిపోయి, నాలుగు దినములు సమాధిలోనున్నవానితో, "లాజరూ! బయటకు రమ్ము" అని చెప్పగలిగినవాడు, ఎవరు? వాక్యమే! ఆమేన్! అది కార్యరూపములోనున్న వాక్యము. ఆయనే వాక్యమైయుండెను. ప్రవక్తలయొద్దకు వచ్చిన వాక్యము అదే. అది అదే అయి యుండును. ప్రవక్తలు ప్రతిఒక్కరూ ఆయనను గూర్చి ముందుగా చెప్పిరి.
ACTS 7:52
66సనైడ్రిను సభ యొదుట సైఫను ఈలాగు చెప్పెను. "మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి. ఇప్పుడు మీరు జీవాధిపతిని చంపిరి." "ఓ! మీరు జీవ వాక్యమును అప్పగించిరి. ఎందుకనగా ఆయనే వాక్యము."
అక్కడ ఆయన ఉన్నాడు. వాక్యము వారి మధ్యనే యుండెను. చనిపోయినవారి సమాధి యొద్దకు ఆయన నడిచి వెళ్ళుటను వారు చూచిరి. ఆ సమాధి కార్యక్రమ సమయమున నాయిూను విధవరాలిని ఆయన ఆపెను. ఆమె యొక్క ఒక్కడే కుమారుడు ఒక శవముగా మారి, సుగంధ ద్రవ్యములచే సిద్ధపరచబడి, సమాధికి మోసికొనిపోబడుచుండెను. కాని ఆ శవము వాక్యముతో సంపర్కమునకు వచ్చెను. శవముగా మారినను అతడు బ్రదికెను!
"అతడు చనిపోయినను తిరిగి బ్రదుకును." ఒక శవము తిరిగి జీవమును పొందును. ఎందుకనగా అది వాక్యముతో సంబంధము కలిగియుండుటకు వచ్చెను ఓ! వాక్యముతో సంబంధములోనికి వచ్చినప్పుడు అది ఏమి చేయును! అదియే ఆదరణ!
MATT 9:3-6
67ఓ! ఒకసారి గలిలయ వారిలో ఒకడు, బహుశా జాలరిని ఆయన చూచెను. పడక మీద నుండియు లేవలేని గొప్ప వ్యాధిగ్రస్తుడగు ఒక వృద్దుని వారు వాక్యము నొద్దకు తీసికొని వచ్చుటకు ప్రయత్నించిరి. అనేకమంది దేవుని కొరకు ఆకలిగొనుచున్నందున వారికి అక్కడ చోటు దొరకలేదు. ఆ చిన్నగుడిసె, ఇల్లు, పూర్తిగా జనముతో నిండిపోయెను. జాలరులు నది మీద తెప్పతో వచ్చిరి. కప్పుమీద కొన్ని పెంకులుండెను. వాక్యము ఎదుటకు ఇతనిని తీసికొని వచ్చుటకు, వారు ఎంత వెల చెల్లించవలసియున్నారో కూడా లెక్కచేయలేదు. ఏమైనా సరే, వారు పై కప్పును పీకివేసిరి. వాక్యముతో సంబంధము కలిగియుండుటకు ఆలాగు చేసిరి. వాక్యమైయున్న ఆయన, మంచము క్రిందికి దిగుట చూచిన వెంటనే, "కుమారుడా! నీ పాపములు క్షమించబడియున్నవి. నీ పరుపును ఎత్తికొని ఇంటికి నడిచి వెళ్ళుము." అని చెప్పెను. ఎందువలన? అతడు వాక్యముతో సంబంధమును కలిగియుండెను. చూచారా? దానిని అతడు నమ్మెను.
"నీకు తెలియునా? నేను ఎన్నో సంవత్సరముల నుండి ఇక్కడ పడియున్నాను. ఆలాగు నేను చేయలేను." అని అతడు చెప్సియుండినచో, అతనికి ఏ మేలును జరిగి యుండెడిది కాదు.
కాని అతడు వాక్యమును సంధించగానే, వాక్యమును చేర్చుకొనెను. సంతోషముగా వాక్యమును అతడు చేర్చుకొనెను. "నేను అది నమ్ముదును. అది ఆలాగునే అని నేనెరుగుదును. ఆయన అలాగునే అని నేనెరుగుదును." కాబట్టి వాక్యముతో అతడు సంబంధము ఏర్పరచుకొన్న వెంటనే అతడు తన మంచమును ఎత్తికొని నడువసాగెను.
పరిసయ్యుడు ఇట్లు అనెను, "ఈ మనుష్యుడు దేవదూషణ చేయుచున్నాడు. ఇతడు పాపములను క్షమించుచున్నాడు."
"నీ పాపములు క్షమించబడియున్నవని చెప్పుట సులభమా? లేక లేచి నీ పరుపునెత్తికొని నడువుమని చెప్పుట సులభమా?" అనడిగెను. చూచారా? ఓ!
ఆయన ఎవరైయుండెనో చూచుటలో వారు విఫలమయిరి. ఆయన వాక్యమైయుండెను.
JOHN 14:16,19
68ఆ గలిలయులకు ఎంత ఆదరణ! ఎట్లు ఆయనను నమ్మిరో ఆయననెట్లు విశ్వసించిరో!
ఇప్పుడు, ఒక రోజున ఆయన కల్వరికి ఎక్కిపోవుటను వారు చూచారు. "ఇక కొంతకాలము అయిన తరువాత లోకము నన్ను చూడదు. ఓ! నేను మనుష్యకుమారుడిని. యెరూషలేమునకు వెళ్ళుట అగత్యము. పాపుల చేతిలో ఉంచబడుదును. వారితో సిలువ వేయబడి మరణించుదును" అని ఆయన చెప్పెను. వారెట్లు దానిని తట్టుకోగలరు? వారి హృదయములు బ్రద్దలయినవి. వారు నిరాశతో కృంగిపోయిరి. అక్కడ వారంతా చీకటిలో ఉండిరి. ఎన్నడైనా వారెట్లు ఆయనను పోగొట్టు కొనగలరు? ఎందుకనగా ప్రవక్తలు, జ్ఞానులు మరియు ఆదినుండి అంతము వరకు ఉండిన మహా పరిశుద్దులు, పలికిన ప్రవచనా వాక్యములవి. లోకము యొక్క ఆది నుండి ఆ వాక్యమును గూర్చియే మాట్లాడిరి. ఇక్కడ అది వారి మధ్య ఉండెను.
కాని ఇప్పుడు చూడండి. ఆయన ఎట్టి వాగ్దానము చేసెనో "మిమ్మును ఆదరణ లేకుండా నేను విడిచిపెట్టను. ఆదరణ లేకుండా మిమ్మును విడిచిపెట్టను. నేను తండ్రిని వేడుకొందును. ఆయన మీకు మరియొక ఆదరణ కర్తను పంపును. అదియే పరిశుద్దాత్మ, ఆయన మీతో నిత్యమూ నివసించును. సత్య స్వరూపియగు ఆత్మ, లోకము ఆయనను చేర్చుకొనదు. ఆయనను ఎరుగదు — కాని మీరాయనను ఎరుగుదురు! ఆయనను మీరెరుగుదురు. ఎందుకనగా ఆయన మీతోను, మీలోను ఉండును."
JOHN 1:14•
JOHN 14:18
69అక్కడే అది యున్నది! కాని ఎంతకాలము ఆయన నివసించనైయున్నాడు? నిత్యము! అయితే దేవుని వాక్యము ఏమిటి? నేడు మన ఆదరణ ఏమిటి? మనము పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందినప్పుడు సజీవ దేవుని శక్తి మనలో నివసించును. అది సజీవ దేవుని యొక్క వాక్యముతోనే యున్నది. మనము నిలబడుదుము. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను. మన మధ్య శరీరధారియై నివసించిన ఆ వాక్యమే మన శరీరముగా అయినది. 'ఇప్పుడు ఆయన మీతో ఉన్నాడు గాని ఆయన మీలో ఉండును." ప్రవక్తలు పలికిన ఆ వాక్యమే. శరీరధారియైన ఆ వాక్యమే, అదే వాక్యము సంఘములో నివాసము చేయుచున్నది. కాబట్టి ఆ వాక్యము విషయములో మనము రాజీపడనిచో దానితోనే మనము నిలచియుందుము. దేనియందు మనము రాజీపడకుండా వాక్యముతోనే నిలిచియుండిన, నీతో నివసించుచున్న ఆ వాక్యమే, శరీరధారియైనప్పుడు ఏమి చేసెనో అదే దానిని ప్రత్యుత్పత్తి చేయును. ఎందుకనగా నీ శరీరము దానిని పట్టుకొనియున్నది.
అందుచేతనే శబ్దపు ఆటంకములను సహితము బ్రద్దలు చేసుకొనుచు దర్శనములు దాటి వచ్చుటకు అదే కారణము. కాల అవధులను కూడా ఒక దర్శనము దాటి వచ్చి "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అది పలాని పలాని రీతిలో ఉండును." అని చెప్పుటకు అదే కారణము. అది ఉన్న పద్ధతి అదే. అది ఏమిటి? ఒక ఆత్మనుండి బయలు వెళ్ళుచున్న వాక్యమది.
70మీరు నన్ను చూడరు; నా శరీరమును మీరు చూతురు. మీరు నన్ను చూడరు. నేను మిమ్మును చూడను. ఎందుకనగా నేను మీ శరీరమును మాత్రమే చూచుచున్నాను. ఇది నా చేయి. కాని నా చేయిని కలిగియున్న నేనెవరు? ఇది నా శరీరము కాని నేనెవరు? అది ఒక ఆత్మ
నేను తిరిగి జన్మించినచో, మీరు తిరిగి జన్మించినచో, అది దేవుని పరిశుద్దాత్మ దేవుని వాక్యము మనతో జీవించుచున్నది. ఈ వాక్యము విడిచిపెట్టి వేరేదేనితోనైనా మనము దేవుని ఆత్మ కలిగియున్నామని చెప్పుకొన్నచో, దేవుని ఆత్మను కలిగియున్నామని ఎట్లు మనము చెప్పుకోగలము? దేవుని వాక్యము ఆయన స్వంత వాక్యమును గూర్చి సాక్ష్యమిచ్చునప్పుడు ఆయన ఒక్క అంగుళము కూడా దానినుండి దూరంగా కదలడు. శాఖలు ఏమి చెప్పినా లెక్కలేదు! అది ఆయన యొక్క స్వంత వాక్యమైనప్పుడు, ఆయన ఏలాగు దానినుండి దూరంగా కదలగలడు?
ISA 28:10,11,13•
JOHN 15:26•
ACTS 2:1•
1THS 5:21
71ఆ వాగ్దానము, "నేను మీతో ఉందును; ఆదరణ కర్త" ఆయనిట్లు చెప్పెను. "నేను ఆదరణ కర్తను పంపించెదను."
వారు మేడ గదిలో కూడియుండిరి. పెంతెకోస్తు దినము వరకు వారు అక్కడ కనిపెట్టుకొనియుండిరి. పరిశుద్దాత్మ వచ్చినప్పుడు, అది ఏమి చేయునని వాక్యము చెప్పెనో సరిగ్గా అలాగే జరిగెను. అది ఏమి చేయునని దేవుడు చెప్పెనో అదే రీతిగా జరిగినది యెషయ 28, లేదా 28:18 లేదా ఆ యెషయ 19 అని నమ్ముచున్నాను. "సూత్రము వెంబడి సూత్రము.; ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ; ఇక్కడ కొంచెము అక్కడ కొంచెము; మేలైన దానిని పట్టుకొని యుండుడి. ఏలయనగా నత్తి పెదవులతోను, అన్యభాషలతోను నేను ఈ ప్రజలతో మాట్లాడుదును." ఆయన దానిని నేను చేయుదునని చేప్పెను. ఆ పత్రికలలో పౌలు దానిని ప్రస్తావించెను"అన్యజనుల పెదవుల ద్వారా ఈ జనులతో ఆయన మాట్లాడును." పరిశుద్దాత్మ వచ్చినప్పుడు, అది సరిగ్గా వాక్యముతోనే ఏకీభవించి వచ్చెను.
మహిమ! అది మరల వచ్చినప్పుడు, తిరిగి జన్మించిన ఒక సంఘములోనికి అది వచ్చి కదిలించినప్పుడు, అది దాని యొక్క వ్యక్తిత్వపు ప్రదర్శన మరియు శక్తితో వచ్చును. దేవుని వాక్యము, ఆదరణ కర్త సరియైన దానిని తీసికొని వచ్చుచూ మనతో ఉన్నాడు!
JOHN 1:14
72ఈ మధ్యనే నేను ఒక కాథలిక్కు గురువుతో మాట్లాడుచున్నప్పుడు ఈలాగు అన్నాడు, "నీవు మరొక పరిశుద్ధ గ్రంథపు ఉపాధ్యాయునివి." "నీవు, నీవు కేవలము పరిశుద్ధ గ్రంథముతోనే నిలిచియుండుము." "అది కాథలిక్కు సంఘము యొక్క చరిత్ర." అని చెప్పెను.
"అయితే నీవు ఈ రోజున గొప్పవాడినని చెప్పుకొంటున్నావు?" అన్నాను.
"నిశ్చయంగా మేము కోరిన రీతిగా మార్చుకొందుము. ఎందుకనగా అది ఒక సంఘము వలన చేయబడినది - ఒక సంఘమునకు అధికారము ఈయబడెను." అని అతడు చెప్పెను.
నేను ఈలాగు అన్నాను, "ఏదో జరిగినది! ఎందుకనగా, ఆది కాలముల యందు పరిశుద్ధాత్మ మీతో యుండినది. అందుకు రుజువుగా మీతో సూచకక్రియలు, అద్భుతములు, మహత్కార్యములు ఉండెను."
ఆదిమ కాథలిక్కు సంఘము భాషలలో మాట్లాడెను, ఆది కాథలిక్కు సంఘము ప్రవచించెను, వారికి ప్రవక్తలుండిరి. ఆది కాథలిక్కు సంఘము ఈ అద్భుతములన్నియూ జరిగించెను. వారు రోగులను బాగుచేసిరి, వారు మృతులను లేపిరి, వారు అరచిరి, కేకలు పెట్టిరి, వారు మతిభ్రమించినవారివలె ప్రవర్తించిరి, వారు ఆత్మతో నాట్యమాడిరి. వారు "పిచ్చివారు"గా పిలువబడిరి.
కాని కాథలిక్కువారగు మీరు ఈనాడు ఎంతో మొత్తబడిపోయారు. చూడండి; మీరు ఒక క్రొత్త పోకడకు వెళ్ళిపోయారు. అప్పుడు ఎక్కడ అది ప్రారంభమైనదో అక్కడకు తిరిగి కాథలిక్కు సంఘము రావలసిన కాలమిది; ఆ దినములలోనజరేయుడగు యేసుతో మీరు నడిచిరి; వాక్యము శరీరధారియాయెను. మీరు చూడండి; ఇప్పుడు మీకు యాజకులు, పోపులు, ఇంకా ఏవేవో ఉన్నవి. వారివలన వాక్యము మార్చబడినది. దానిని వంకరగా చేసిరి. ఇక సంఘములో ఏమాత్రము శక్తి లేదు. అది కేవలము ఒక సంస్థ. మెథడిస్తు, బాప్టిస్తు, ప్రెస్బిటేరియను, మరియు పెంతెకోస్తులవలెనె అదికూడా ఒక సంస్థగా మారిపోయెను. ఈ సంస్థనుండి మనము దూరముగా పెళ్ళిపోవుదము.
73ఏదో ఒక సంఘశాఖయొక్క చెరశాలలో మిమ్మల్ని మీరు బంధించుకోవద్దు. అవిశ్వాసమనే అట్టడుగునయుండు ఒక గదిలో చిక్కుకొని దేవుని యొక్క వాక్యమును తృణీకరించవద్దు. ఏ బిషపపు, లేక మరెవరు చెప్పినా నాకక్కరలేదు. పరిశుద్దాత్మయొక్క శక్తిద్వారా శరీరధారియైన వాక్యమును నీలోనికి రానిమ్ము, నీ శరీరమును తీసికొని, దానిని ఆధీనములో ఉంచుకొని సజీవ దేవునియొక్క గొప్ప శక్తులను, కార్యములను నీద్వారా సాక్ష్యమును చెప్పనీయుము. అదియే సరియైనది. సంఘములు ఏమి చెప్పినా గాని మనకు అక్కర లేదు. ఆ శాఖలు నిన్ను కేవలము ఒక చిన్న గదిలో నిన్ను పెట్టును. ఆశీర్వాదకరమగు సూర్యునియొక్క వెలుగులోనుండి నిన్ను నీవు మరుగుపరచుకొందువు. అది సత్యమని నేను ఎరుగుదును. ఆ గదిలో ఉండుటకు నీవు కోరుచున్నావా? ఎవరూ ఇష్టపడరు. మీరు ఆ అంధకారపు గదిలోనికి వెళ్ళవద్దు. సూర్యవెలుగులోనికి రమ్ము! నీవు వాక్యమును తీసికొని, దానిని నమ్మగల ఒక స్థలము యొద్దకు రమ్ము! వాక్యము తన్నుతాను నీకు బయలుపరచుకొనును. నీద్వారా అది తన్నుతాను బయలుపరచుకొనును. ఆయన వాక్యమును ప్రత్యక్ష్యపరచి నెరవేర్చును.
74దేవుడు తన వాక్య విషయములో నమ్మకముగా ఉండవలెనని మనము కోరినచో మనము అడుగుచున్నవాటిని దేవుడు మనకొరకు చేయవలెనని మనము ఆశించినచో, దేవుడు ఏది చేయమని చెప్పెనో దానికి లోబడునంతవరుకు, మనము తిరిగి సరిచేసికొననిచో దానిని ఎన్నడూ మనము చేయుటకు సమర్దులము కాము. ఎక్కడ మనము విడిచిపెట్టి వెళ్ళిపోయామో తిరిగి అక్కడకు మనము రావలసియున్నాము. పెంతెకోస్తు నొద్దకు తిరిగి మనము రావలసియున్నాము. ఆదరణ కర్త యొద్దకు తిరిగి మనము రావలసియున్నాము. మనకు ఆదరణయగు పరిశుద్ధాత్మయొద్దకు తిరిగి మనము రావలసియున్నాము. పరిశుద్దాత్మ వచ్చినప్పుడు, అది చెప్పిన వాక్యములోని దేనిని అది నిరాకరించదు. అది ఆ వాక్యముతోనే నిలచియుండును. ఎందుకనగా అది వాక్యమే. ఆమేన్!
ఆశ్చర్యము లేదు పగటి కాంతిని ఎన్నడునూ ఆ వృద్ధ అంధురాలగు ఫెన్సీ క్రాస్బీ చూడలేదు. క్రీస్తును గూర్చి ఏమనుకొనుచున్నావని వారామెను ప్రశ్నించిరి. ఆమె ఇట్లు చెప్పెను:
నీవే నా సమస్త ఆదరణ యొక్క ప్రవాహము,
జీవముకంటె నీవే నాకు మిన్న
నీవు తప్ప ఈ భూమిమీద నాకెవరున్నారు?
లేక నీవు తప్ప పరమందు నాకెవరున్నారు.
ఆదరణ కర్త ఇచ్చటున్నాడు. ఆదరణ కర్త వఛ్చెను.
ఓ! మానవుడు కనబడు చోటెల్లను ఈ వార్తను వ్యాప్తి చేయుడి ఆదరణ కర్త వచ్చియున్నాడు!
JOB 19:25
75అది ఏమిటి? నీ శరీరములో లంగరు వేయబడియున్న దేవుని వాక్యము, నీకు నిత్యజీవమును ఇచ్చును. లోక విషయములలో నుండి నిన్ను బయటకు తెచ్చుటకు కావలసిన పునరుద్దాన శక్తిని అది నీకు ఇచ్చును; మానవుని యొక్క గ్రుడ్డి ఆచారముల నుండి వెలికి తెచ్చి, దేవుని యొక్క ఆరోగ్యకరమగు సూర్యకాంతిలో నడిపించును. ఆదరణ కర్త చేయునది అదే, అంధకారపు అడుగున యుండు గదిలోనుండిన నీ స్థితిలో నుండి అది నిన్ను లేవనెత్తును. దేవుని సన్నిధిలోనికి అది నిన్ను తీసికొనివచ్చును. దేవునితో ఒక అనుభవమును అది నీకు ఇచ్చును. అప్పుడు నీవు ఆ పురాతన యోబుతో పాటుగా ఇట్లు చెప్పెదవు, "నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును."
ఆయన వాక్యమును చూచియు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో ఉండుటకు, నడచుటకు నిరాకరించినచో, దేవునితో మన సహవాసము తెగిపోవును. కాని మనము వెలుగును చూచి, ఆయన వెలుగులోనున్న ప్రకారము వెలుగులో నడిచినప్పుడు మనము ఒకరితో ఒకరము సహవాసము కలిగియుందుము; దేవుని కుమారుడగు యేసు క్రీస్తు యొక్క రక్తము మనలను సమస్త పాపము నుండియూ కడుగును.
JOHN 5:24•
JOHN 14:15,23•
ROM 3:4
76కొద్ది నిమిషములలో మనము వాక్యమునకు ప్రతినిధిగాయున్న రొట్టెను విరువనై యున్నాము. దానినెన్నడూ మీరు మరచిపోవద్దు! ఆదరణ. నా ఆదరణయొక్క సమస్త ఆధారము, ఈ రాత్రి నా ఆదరణ యొక్క ప్రవాహము అదే అయియున్నది. దేవుడు తన వాక్యమును తప్పిపోడని నేనెరుగుదును. నాకు ఏదో జరిగియున్నదని నేనెరుగుదును. నేను మరణములోనుండి జీవములోనికి దాటియున్నానని ఎరుగుదును. ఆయన ఆజ్ఞలను నేను అనుసరించుచున్నానని నాకు తెలియును. నేను ఒకవేళ . "మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను గైకొందురు." అని ఆయన చెప్పెను"మీరు నన్ను ప్రేమించినచో నేను మీకు ఏది చేయవలెనని చెప్పితినో అది చేయుడి! ప్రతి మనుష్యుని మాట అబద్ధము గాని నా మాట సత్యము." మానవుడు చెప్పినది వెంబడించవద్దు. దేవుడు చెప్పినది వెంబడించుము. అక్కడ నీవు ఆదరణ కర్తను కనుగొందువు. ఆదరణ వలన నీకు అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని ఎరిగినందున సంతృప్తి లభించును.
MATT 28:20•
JOHN 14:18,19
77మన తలలు వంచుదము.
గొప్పశక్తిగల యెహోవా! కొద్ది క్షణముల క్రితము ఫెన్సీ క్రాస్బీని నేను ఉదహరించి ఈలాగు చెప్పాను, "నీవే, నా సమస్త ఆదరణయొక్క ప్రవాహము." నిజంగా ప్రభువా, నేను ఈ రాత్రి, ఈ చిన్న సంఘముతో కలిసి, నీవే "నా సమస్త ఆదరణయొక్క ప్రవాహము." అని చెప్పుచున్నాను.
నా చేతిక్రింద రోగులనుండి వచ్చిన కొన్ని చేతిరుమాళ్ళను నేను పట్టుకొని యున్నాను. ప్రభువా, బాధపడుచున్న వారి యొద్దకు అవి వెళ్ళును. వారిని నీవు బాగు చేయుమని తండ్రీ నీకు ప్రార్ధి౦చుచున్నాను.
నీవే వాక్యము. వాక్యము మా మధ్యకు వచ్చుచున్నది. వాక్యము మాలో నివాసము చేయుచున్నది. "ఆదరణ లేకుండా మిమ్మును నేను విడువను. మరల నేను మీ యొద్దకు వత్తును. ఇంక కొద్దికాలమైన తరువాత లోకము నన్ను చూడనేరదు. అయినను మీరు నన్ను చూతురు. ఎందుకనగా యుగసమాప్తి పర్యంతము నేను మీలో ఉందును." ప్రభువా, దానికొరకు మేము నిన్ను ఎంతగా స్తుతించనైయున్నాము!
MATT 16:19•
ACTS 2:39
78ఒక పాపి జీవితములోనికి, ఒక నీచురాలగు స్త్రీలోనికి, నైతిక గీతను దాటిపోయిన ఒక బాలికలోనికి, నీతినుండి అవినీతికి దాటిపోయిన వ్యక్తిలోనికి; పవిత్రతనుండి ఒక త్రాగుబోతు, సిగరెట్లు త్రాగే స్థితిలోనికి వచ్చిన ఒక బాలునిలోనికి, ఒక విధమగు ఆత్మతో తనను తాను అస్లీలతలోనికి దించుకొన్న ఒక స్త్రీ జీవితములోనికి, పురుషుని ఎదుట తన్నుతాను చూపించుకొనుట వరకు ఆ పాత అపవిత్ర బట్టలు ధరించుకొనిన స్త్రీలోనికి - నీ శక్తి తిన్నగా దిగి వచ్చుటను చూడగోరుచున్నాము. అటువంటి స్త్రీ ఒక మర్యాదగల వ్యక్తిగా మారుటను చూడగోరుచున్నాము! ఆ కుర్రవాడు ఆ సిగరెట్లు, త్రాగుడును ప్రక్కకు పడవేసి ముందడుగువేసి దేవునియొక్క ఒక పరిశుద్దునిగా మారి వేదికమీద ప్రసంగీకునిగా ఉండుట చూడగోరుచున్నాము. ప్రభువైన దేవా, నీ గొప్ప శక్తి సమస్త కార్యములను చేయగలదని మేము ఎరుగుదుము. అక్కడ పడియున్న మనుష్యుని యొక్క నీడను చూచియున్నాము. కాన్సరుతో తినివేయబడి మరణించుచున్నాడు. ఆ గ్రుడ్డివాడు ఆవల నిలబడియున్నాడు. వారు తిరిగి జీవమును పొంది బ్రదుకుట చూచుటకు వచ్చియున్నాము! ఓ! ఆ సజీవ దేవుని యొక్క వాక్యమా! ఎంతగా నీకు వందనములు చెల్లించవలెను
మా సమస్త ఆదరణ యొక్క ప్రవాహము నీవే. "మీతో నేను నిత్యము ఉందును." అను వాగ్దానముతో ఆదరణ కర్త వచ్చియున్నాడని ఈ రాత్రి ఎంతో సంతోషముగా నేను యున్నాను.
రాజ్యము యొక్క తాళపు చెవులు ఈయబడిన ఆ గొప్ప అపోస్తలుడు పెంతెకోస్తు దినమున ఇట్లు చెప్పెను, "ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని, మన ప్రభువగు దేవుడు పిలిచిన వారికందరికిని చెందును." అదే ఆదరణ కర్త వచ్చునని ఇప్పుడు మనము ఎరుగుదువు. ఈ రాత్రి ఆయన మన రక్షకుడు అని మనమెరుగుదుము. ఎందుకనగా ఆయన తన్నుతాను మనమధ్య అప్పటివలెనె చూపించుకొనుచున్నాడు. ఆలాగే మనము ఆయనను ఎరుగుదుము. ఎందుకనగా ఆయన తాను పలికిన ప్రతి మాటను విశ్వసించి క్రియ చేయును. ఆయన దానిని తిరిగి తీసికోజాలడు. ఎందుకనగా ఆయన దేవుడు. తండ్రీ, దీనినిబట్టి మేము నీకు వందనములు చెల్లించుచున్నాము.
79ఈ రాత్రి ఇక్కడ ప్రతి హృదయమును నీవు ఆదరించమని నేను ప్రార్ధి౦చుచున్నాను. ఈ జనులను ఆదరించుము. నీ ఆత్మను వారికి అనుగ్రహించుము. రోగులను బాధపడుచున్నవారిని బాగుచేయుము. ఓ! ఆ కృంగిపోయిన స్త్రీ, ఆ కృంగిపోయిన పురుషుని, బాలుడు లేదా బాలికను నీవు స్వీకరించుము! ఈ రాత్రి వారు తమ పాపము నుండియు, లోక విషయముల నుండియు దృష్టిని మళ్ళించి, మనలో నిలిచియుండుదునని వాగ్దానము చేసిన యేసువైపు చూచుదురు గాక. ఆయన చేసిన కార్యములు మనము కూడా చేయుదుము. ఎందుకనగా ఆయన పరిశుద్దాత్మాకారములో మనలోనికి వచ్చును. నిలిచియుండు ఆదరణ కర్తగా మనతో నిత్యము ఉండుటకు ఆయన వచ్చును. తండ్రీ, ఈ ఆశీర్వచనములు అనుగ్రహించుము. రోగులను బాగుచేయుమని మరలా ప్రార్ధి౦చు చున్నాను. తండ్రి, వారిలో అనేకులు బాధతో, అవసరతలతో యున్నారు.
1COR 11:26
80ఇప్పుడు మేము సహవాసపు బల్ల నొద్దకు వచ్చుచున్నాము. మాకొరకు విడిచి పెట్టబడిన ఆజ్ఞలను తీసికొనుటకై వచ్చుచున్నాము. 'ఆయన వచ్చువరకు ఇది చేయుడి" అనునది ఒక క్రమము. తండ్రీ, ఈ విషయముల కొరకు మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ రాత్రి మామధ్య ఒక బలహీనుడు ఉన్నప్పటికినీ, ఈ సహవాసపు బల్లను సమీపించుచున్నప్పుడు . యేసు నామములో మేము ప్రార్ధి౦చుచున్నాము.
ప్రభువా, నా యొక్క వణుకుచున్న ఆ ముసలి తల్లి అక్కడున్న బల్లల మధ్యగా నడిచి వచ్చుటను ఇప్పుడు నేను చూచుచున్నాను. ఇక్కడ సహవాసము తీసికొనుటకు చివరిసారి కావచ్చును. ఆమె అల్పమగు వణుకుచున్న ముసలి చేతులు ఆ పళ్ళెమును కదిలించినవి. నేను ఇక్కడ నిలబడి ఆమెను గమనించుచుండగా నా హృదయములోనుండి కన్నీరు కారినది. కాని ఈ రాత్రి ఆమె అక్కడ కల్వరికి ఎదురుగా నిలబడినది. ఓ దేవా! నేను ఎంత కృతజ్ఞడను! నీవిట్లు చెప్పావు, "నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్యజీవముగలవాడు. అంత్య దినమున నేను అతనిని లేపుదును."
ప్రభువా, అది వాక్యము. అందుకే నేను నిలబడి "దేవుని నేను నమ్ముచున్నాను."అని చెప్పగలను.
81ఇప్పుడు తండ్రీ, ఇది మొదట ఆ అవతలి అరణ్యములో, ఐగుప్తు దేశములో ఆజ్ఞగా విధించబడినప్పుడు, పస్కా గొర్రెపిల్ల వధించబడెనని మేము గ్రహించియున్నాము. వారు నలుబది సంవత్సరములు ప్రయాణము చేసిరి. బయటకు వచ్చిన ఇరువది లక్షలమందిలో ఒక్క బలహీనుడును లేడు. వారు పస్కాను ఆచరించుచుండగా వారిని నీవు ఆరోగ్యముతో ఉంచావు. ఓ, దేవా, ముందుకు వచ్చుచున్న ప్రతి వ్యాధిగ్రస్తుని నీవు బాగుచేయుము. ప్రభువా, దీనిని దయచేయుము. ప్రతి పాపిని రక్షించుము. ప్రతి విశ్వాసిని పరిశుద్దాత్మతో నింపుము. తిరిగి యేసు క్రీస్తు యొక్క వ్యక్తి మామధ్య శరీరధారిగా ప్రత్యక్షమగు వరకూ ఆదరణ కర్త నివాసము చేయును గాక! యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్!
82నేనాయనను ప్రేమింతును,
నేనాయనను ప్రేమింతును ఏలయనగా
మొదట ఆయన నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను
కల్వరి సిలువ మీద
మీరాయనను ప్రేమించుచున్నారా? మనము కండ్లు మూసికొని చేతులను పైకెత్తి దానిని మన హృదయములో నుండి పాడుదము.
నేనాయనను ప్రేమింతును,
నేనాయనను ప్రేమింతును
ఏలయనగా మొదట ఆయన నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను
కల్వరి సిలువ మీద
1COR 14:15
83ఇప్పుడు ఎవరో ఒక బాటసారియగు సైనికుడు నీ ప్రక్కన కూర్చొనియున్నాడు. మార్గములోయున్న ఎవరో ఒక సోదరి లేదా సోదరుడు కావచ్చును. నీవు వెళ్ళుచున్న అదే మార్గములో వారును ప్రయాణము చేయుచున్నారు. నీవు ప్రేమించుచున్న ఆయననే వారు ప్రేమించుచున్నారు. నేనాయనను ప్రేమింతును అను పాట మనము పాడుచుండగా దానిని ఒక సాక్ష్యముగా ఉండనీయుడి. నీ చుట్టునున్న వారిలో ఒకరితో ఆ విధముగా కరచాలనము చేయుము. ఆరాధనలో దానిని మరల ఆలాగు పాడెదమని మీకు తెలియును. ఒక వర్తమానము తరువాత నేను దీనిని ఇష్టపడెదను. "నేను పాడినను ఆత్మతో పాడెదను" అని పౌలు చెప్పెను. దగ్గరగా వెళ్ళి ఎవరి చేతినయినా పట్టుకొని, "దేవుడు నిన్ను దీవించును" అని చెప్పుము.
నేనాయనను ప్రేమింతును, నేనాయనను ప్రేమింతును
ఏలయనగా మొదట ఆయన నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను
కల్వరి సిలువ మీద
నేనాయనను ప్రేమింతును.
(ఇప్పుడు ఆత్మలో దానిని పాడుడి!)
నేనాయనను ప్రేమింతును!
ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను
కల్వరి మ్రానుమీద
MATT 6:9•
LUKE 11:2
84ఇప్పుడు అందరము కలిసి తలలు వంచుదము. "పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక! నీ రాజ్యము వచ్చును గాక! నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకమందును నెరవేరును గాక! మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా రుణసులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైయున్నవి తండ్రీ, ఆమేన్!"
1COR 11:27
85ఓ, నిత్యుడగు దేవా, జీవాధిపతీ, సమస్త మంచి ఈవుల దాతా, ప్రభువా, మా అపవిత్ర హృదయాలను పవిత్రపరచుము. బలిపీఠము యొద్ద నుండి దేవదూత అగ్నికణములు, నాలుకలతో వచ్చి మా పెదవులను, హృదయాలను తాకి, మా ఆలోచనలను, మనస్సులను, మా ఆత్మలను పవిత్రపరచుము. మా ప్రభుని జ్ఞాపకార్ధముగా ఈ కోషేరు రొట్టెను మేము స్వీకరించుచుండగా శుద్దీకరించుము. "అయోగ్యముగా దీనిని తిని త్రాగువాడు దోషి"అని వ్రాయబడియున్నది. ఓ దేవా, లోకముతో పాటుగా మేము శిక్షించబడకపోదుము గాక! కాని మేము శుద్దీకరించబడి, లోకమునుండి వేరుచేయబడి, మా జీవితములలో దేవుని వాక్యము ప్రత్యక్ష్యపరచబడుచుండగా వెలుగు దీపములుగా మేము ప్రకాశించుదుము గాక ప్రభువా, నీ దాసులుగా మమ్మును వాడుకొనుము. మా అందర్నీ కలిసి వాడుకొనుము. యేసు నామమున మేము దీని అడుగుచున్నాము. ఆమేన్.
86ఇప్పుడు వెళ్ళిపోవలసియున్న వారికి, ఎక్కువ దూరము కారు నడుపుకొని వెళ్ళవలసియున్న వారి కొరకు మేమందరము సమాప్తము చేయుచున్నాము. ఆ వెంటనే మనము సహవాసపు ఆరాధనలోనికి వెళ్ళెదము. మాతో నిలచియుండి సంస్కారమును తీసికొనగోరు వారికిది చెప్పుచున్నాను. కాని మీరు వెళ్ళగోరినచో , నా గడియారమును బట్టి ఇప్పుడు ఇరవై అయిదు నిమిషముల తక్కువ పది అయినదని నేనెరుగుదును. సంస్కారము తీసికొనుటకు ముందుగానే పది అయిపోవునని తలంచుచున్నాను. అప్పుడు దానివెంటనే కాళ్ళు కడుగుటను వారు ఆచరింతురు. మాతో పాటుగా ఉండి దీనిని ఆచరించగోరినచో మిమ్మును కలిగియుండుటకు మేము ఎంతో ఆనందించుదుము. దేవుని రాజ్యము నిమిత్తమై వచ్చిన మీ అందరికి నా వందనములు మరల చెల్లించుచున్నాను. నేను, నాకు కూడా అదే కావలెను. దేవుడు సదా మీతో ఉండునుగాక!
MATT 25:40,45
87ఈ ఉదయాన ఆ చిన్న కౌబాయ్ పిల్లవానికి నేను వందనములు చెల్లించగోరుచున్నాను. ఆ చిన్నవాడు, దరిదాపు ఆలాగే ఉన్న ఒక చిన్న కౌబాయ్ టోపీ ధరించుకొనిన అతడు వచ్చి అక్కడ ఒక పర్సుని (Purse) ఇచ్చాడు. ఒక చిన్న జేబులో పెట్టుకొను పుస్తకమును దానిపై నా పేరు చెక్కి ఇచ్చాడు. "రెవ. విల్లియం బ్రెన్హాం," మరియు ఒక చిన్న బహుమానము. ఆ చిన్నపిల్లవాడు ఎవరో నాకు తెలియదు. ఆ చిన్నవానికి వందనములు చెల్లించుట మరచిపోవు వరకు ఈ ఉదయాన నేనెంతో తపించిపోయాను. కాని మాధుర్యమగు వాడా, నేను నీకు వందనములు చెల్లించుచున్నాను.
నాకిచ్చట కొరకు ఇక్కడున్నవారనేకులు చిన్నకానుకలు ఇచ్చి వెళ్ళారని బిల్లీ నాతో చెప్పెను. బిల్లీ దానిని చేయగలడు. కనుక చాలా దయతో మీకు వందనములు. దేవుడు సదా మిమ్మును ఐశ్వర్యవంతులుగా దీవించును గాక దీనిని గుర్తు౦చుకొనండి, "మిక్కిలి అల్పులగు నా ఈ చిన్నవారికి మీరు చేసిన దాని చొప్పున మీకు ప్రతిఫలము అనుగ్రహించ బడును గాక. అది మీరు నాకు చేసినట్టే."
దేవుడు సదా దీవించవలెననియే నా ప్రార్థన. ఇప్పుడు మీరు వెళ్ళగోరినచో సరే, వెళ్ళవచ్చును. దేవునియొక్క అత్యుత్తమ కాపుదల మీకుండవలెనని కోరుచున్నాము. మీరు మాతో ఉండగోరినచో మిమ్మును కలిగియుండుటకు సంతోషించుదుము.
88ఇప్పుడు మనము నిలబడి, యేసు నామమును మీతో కొనిపొమ్ము అను పాట చరణమును ఒకటి పాడుకొందము. అప్పుడు వెళ్ళిపోవుగోరువారు ఆ తరువాత వెంటనే ప్రార్థనతో పంపించబడుదురు.
ఏసు నామమును మీతో కొనిపొ౦డి
శ్రమ, దు:ఖముల యొక్క బిడ్డా;
అది నీకు ఆదరణ, ఆనందము ఇచ్చును.
నీవు వెళ్ళు ప్రతిచోటకు దానిని తీసికొనిపొమ్ము
ప్రశస్త్ర నామము, ఓ! ఎంత మాధుర్యము
పరలోక ఆనందము, భూలోక నిరీక్షణ
ప్రశస్త్ర నామము, ఓ, ఎంత మాధుర్యము
పరలోక ఆనందము, భూలోక నిరీక్షణ,
89మనము మరో చరణము పాడుకొందము. అప్పుడు ఒక చిన్న పరిచారకుని అడుగుదును . అతడు గ్రీకువాడనుకొంటాను. కొంతకాలము క్రిందట నేను కలిసికొన్నాను. ఇప్పుడు నేను ఆయన పేరును గుర్తుచేసుకోలేను. సహో. బోతమ్. ఈ రాత్రి ఇక్కడ ఆయన మనతో నిలబడియున్నాడు. ఆయన మనతో ఉండుట చాలా సంతోషము. ఏదో కళాశాలలో విధ్యార్థి అని నేననుకొనుచున్నాను. కొద్దికాలం క్రిందట ఇక్కడే నేనాయనను కలిసికొన్నానని నమ్ముచున్నాను. ఒక నిజమైన యధార్థ సోదరుడు. భయము వణకుతో తన రక్షణను కొనసాగించ ప్రయత్నించుచున్న వ్యక్తి అతడు గ్రీసునుండి వచ్చెను. అతడు భాషను అనర్గళంగా మాట్లాడును. కనుక ఈ రాత్రి సోదరుని మనము కలిగియుండుట చాలా సంతోషము. మీరందరూ ఆ దూరాన ఉన్న ఒరేగాన్, లేదా కాలిఫోర్నియో, లేదా లాస్ ఏంజలస్నుండి వచ్చారని నమ్ముచున్నాను. మీరు మాతో ఉండుట మాకు చాలా సంతోషము. ఆయన తన్నుతాను నిమ్మళపరచుకొను అవకాశము ఇచ్చుట కొరకు మరొక చరణమును పాడుకొందము. అప్పుడు ఆయన మనలను ఒక్కమాట ప్రార్థనలో పంపించివేయును. నీకిష్టమైతే సోదరుడా. సరే. మంచిది.
యేసు నామము ఎదుట తలను వంచి
ఆయన పాదముల యొద్ద సాష్టాంగముగా పడి
పరమందు రాజాధిరాజుగా ఆయనకు మనము కిరీటము పెడుదుము
మన యాత్ర ముగిసిన పిదప
అది అద్భుతముగా ఉండదా?
ప్రశస్త నామము, (ప్రశస్త్ర నామము),
ఓ, ఎంత మాధురము!
పరలోక ఆనందము, భూలోక నిరీక్షణ;
ప్రాశస్త నామము, ఓ, ఎంత మాధుర్యము,
పరలోక ఆనందము, భూలోక నిరీక్షణ.
ఇప్పుడు మనము తలలు వంచుదము. మంచిది, సోదరుడా.