ప్రశ్నలు మరియు జవాబులు
1… నేను వేదిక పైకి వెళ్ళు ముందుగా ఈ ప్రశ్నలు, కాని సహోదరుడు మూర్, అతడు అత్యవసర పిలుపును ఇచ్చెను, మరియు ఎవరో ఎంతో రోగిగా ఉన్నారు అని నేను అనుకున్నాను — మరియు అతడు కేవలము ఒక కూడికను పెట్టాలని కోరెను. అతడు థాంక్స్ గివింగ్ నుండి వచ్చి లూసియానాలో కూడికను పెట్టాలని కోరెను. గత సంవత్సరం మేము అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఉజ్జివమును ప్రారంభించెను, మరియు అది ఎన్నడు ఆరిపోలేదు. ఆ ఉజ్జివము ఇంకా కొనసాగుతూ ఉన్నది. గత సంవత్సరం, ఆ ఉజ్జివము తరువాత ఎంత మంది రక్షింపబడినారో నేను మరచిపోయాను.
2ఇప్పుడు, బహుశ ఈ ఉదయము ఇక్కడ ఉండుట అది ఆశ్చర్యముగా ఉన్నది, మరియు… అది నాకు. మరియు అది నాకు తెలియదు, కావున మేము ప్రచారము చేయలేదు, ప్రజలైన మీకు తెలుసు. ప్రజల యొక్క కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇయ్యవలెనని వచ్చాను. జనుల ప్రశ్నలు సాధారణముగా వారి సంఘ కాపరికి తెలియును. వారి హృదయములలో ఉన్న దానిని అతడెరుగును. జనులు ఏమని తలంచుచున్నారో ఆ విధముగా మనము తెలిసికొందుము.
ఈ ఉదయము దీనిని ఆరంభించు ముందుగా, ఎవరో తమ బిడ్డను ప్రతిష్ఠించవలెనని కోరిరి. ఒక బిడ్డకు ప్రతిష్ఠ కార్యక్రమమున్నదని బిల్లీ చెప్పెను. మంచిది. ఆ చిన్న బిడ్డను ఇక్కడికి తీసికొని వచ్చి ప్రభువుకు ప్రతిష్ఠించుదము. ఆ తరువాత ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చెదను. ఆ తరువాత రోగులకు ప్రార్థన చేయుట జరుగును.
3నా తల్లి ఎప్పటి మాదిరిగానే యున్నదని మీకు తెలియచేయుచున్నాను. ఇంకా దిగజారినదని చెప్పను కాని వారు మాత్రం అలాగే తలంచుచున్నారు. కాని నేను అలాగనుకొనుట లేదు. ఆమె ఎప్పటి వలెనే యున్నదని నేను తలంచుచున్నాను. ఆమె చనిపోవునని దేవుడు నాతో చెప్పు వరకు దానిని నేను నమ్మను. అమ్మ కొరకు నేను విశ్వాసమును హత్తుకొనగోరుచున్నాను, చూచారా, ఆమె వెళ్ళిపోవునని ఆయన చెప్పు వరకు చూచెదను.
ఆమెను ఆయన తీసికొని వెళ్ళవచ్చును. నాకు తెలియదు. ఆయన నాకది మరుగుచేసి యుండవచ్చును. నాకు చింతను దూరము చేయుటకో లేక మరొకందుకో ఆయన ఆవిధంగా చేసియుండును. ఏది ఏమయినా గాని దేవుడామెను బాగుచేయునని నేను నమ్ముచున్నాను. మూడు వారముల నుండి ఆమె భోజనము చేయుట లేదు. గ్లూకోజు మాత్రమే సరఫరా చేయుచున్నాము. ఏలాగయినా సరే ఆమె బ్రదుకునని నేను నముచున్నాను.
4[సహోదరుడు బ్రెన్హాం ఒక శిశువును ప్రతిష్ఠించుచున్నారు.] మంచిది, ఇది… మరొక బోధకుడు వచ్చును అని అనుకొనుచున్నాను. లిటిల్ మిస్టర్. వుడ్స్. (అతడి పూర్తి పేరు ఏమిటి?) ఈ చిన్న పిల్లవాడు వుడ్స్ యొక్క కుటుంబములో చేర్చబడ్డాడు. అవును, అతడు మామ్మ యొక్క ముద్దు బిడ్డ. విలియం డేవిడ్ జూనియర్. అతడు చక్కిన చిన్నవాడు. మరియు అతడి చిన్న చేతులు [స్పష్టత లేని మాటలు] అవును, చూడండి అతడి వెళ్ళు ముడుచుకుపోయాయి. అతడు పేల్చు వేలును పెట్టియున్నాడు. ఉడుత వేటగాడు, అవునా? అతడు నన్నే చూస్తున్నాడు. మనకు తెలుసు వీరిని దేవుడు మన గృహమునకు పంపును మరియు మనము దానిని అభినందించి మరియు వారిని పెంచునట్లు బాధ్యతను ఇచ్చును. మరియు నేను నిశ్చయముగా ఉన్నాను, ఒకవేళ ఈ కుటుంబముతో దేవుని కృప కోనసాగినట్లయితే, ఈ బిడ్డ దేవుని యొక్క భయబక్తులలో పెరుగును. మనము మన తలలు వంచుదము.
మా పరలోకపు తండ్రి, ఈ చిన్న విలియం డేవిడ్ వుడ్ను లేఖనమును బట్టి, ప్రభువైన యేసు నామమున మీ వద్దకు తెచ్చుచున్నాము. ఆయన ఈ భూమి పై ఉన్నప్పుడు, ఆయన చేతులు వారిపై పెట్టి ఆశీర్వదించుటకు వారు ఆయన యొద్దకు తెచ్చిరి. ఒకవేళ ఆయన ఈ ఉదయం శరీరముగా ఇక్కడ ఉన్నట్లయితే, మనకు తెలుసు, మన సహోదరుడు మరియు సహోదరి ఈ చిన్న కృపా గురుతును ఆయన యొద్దకు తీసుకొని పోదురు. కావున ఈ దినాన మేము ఇతడిని సువార్త బోధించిన విధముగా, సమర్పించుటకు వారు మా యొద్దకు పిల్లలను తీసుకొని వచ్చారు. మేము, విశ్వాసము ద్వారా, యేసు నామమున చిన్న డేవిడ్ ను నీ వైపు ఎత్తుచున్నాము. నీవు ఇతడిని ఆశిర్వాదించుమని ప్రార్దించుచున్నాను, ప్రభువా. దేవా, నీ యొక్క రాకడ ఆలస్యమైతే, ఇతడు నీ యొక్క సేవకునిగా జీవించునట్లు దయచేయుము. దయచేయుము, ప్రభువా. ఇతనికి ఆరోగ్యము మరియు బలమును దయచేయుము. ఇతడి తండ్రిని మరియు తల్లిని దీవించుము. మరియు నీ యొక్క దైవిక చిత్తమైతే, ఈ చిన్నవాడు ఎదిగి, రాబోవు దినాలలో నీ యొక్క సువార్తను బోధించును గాక. దయచేయుము, ప్రభువా. యేసుక్రీస్తు నామమున ఈ చిన్న విలియం డేవిడ్ ను నీకు సమర్పించుచున్నాము. ఆమెన్.
5ఆ చిన్న పిల్లలను బట్టి నేను ఎంతో జాగ్రత్తగా ఉందును. ప్రతిసారి మీరు వారిని పడవేయుదురేమో అని అనిపించును. చిన్న పిల్లలు మరియు వృద్ధులు, నేను అనుకుంటాను… ఒకవేళ అది కేవలము వృద్ధులు లేక చిన్న బిడ్డలు అక్కడ ఉండినట్లయితే… వారు ఎంతో అమాయకమైనవారుగా, మీకు తెలుసు. నేను ఇష్టపడునది వారిలో ఎదో ఉన్నది. (మనము ఎందుకు ఈ వేదిక మైకు పెట్టకూడదు. సహోదరుడా నెవిల్, నీకు తెలుసా ఎక్కడ. ఓ, ఇక్కడే.)
6ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నవి. అడుగబడిన ప్రశ్నలకు లేఖనములను చూచుటకు కూడా నాకు అవకాశము దొరక లేదు, ఎందుకనగా ఆ ఉదయమే వాటిని ఇచ్చిరి. కొద్ది నిమిషముల క్రితమే వాటిని నేను చూచాను. వాటిలో కొంత భాగమును చూచాను. కొన్ని ప్రశ్నలను చదివాను, ఆశ్చర్యపోయాను. ఇంత చక్కని గుంపు మరెక్కడా నేను చూడలేదు. ఈ ప్రశ్నలకు నేను చాలా కష్టపడి జవాబు ఇయ్యవలసి యున్నాను.
ఈ ప్రశ్నలలో మీకున్న విశ్వాసమును బట్టి నేను జవాబు ఇయ్యనియెడల, మీరు నిరుత్సాహ పడవచ్చు. కాని గుర్తుంచుకొనండి, నాకు తెలిసిన అత్యుత్తమ రీతిలోనే వీటికీ జవాబు ఇచ్చుచున్నాను. కొన్నిసార్లు వాటికి జవాబును లేఖనములో వెదుక వలసి యుండును గాని చూచే సమయము ఉండదు. కావున మీరు ఇంటికి వెళ్ళి చూడండి. నేను తప్పుగా చెప్పినయెడల, లేఖనము చూచి సరి చేసికొనండి. లేఖనమును తప్పు అన్వయించుటను నేను ఉద్దేశపూర్వముగా చేయను గాని తప్పు దొర్లుచుండును. చెప్పవలసిన ఒక మాటను మరొక రీతిగా నేను చెప్పుట జరుగ వచ్చును. అలాగు చేయుట ఎంత తేలికో మీకు తెలియును.
వాటిని సూటిగా చెప్పవలెననియే నా భావము. ఈ ఆదివారము వాటిని తీసికొని వచ్చే ఆదివారము జవాబు చెప్పుట అయితే వేరే సంగతి, అలాగయితే వారమంతా వాటిని నేను చూచుచుందును.
7కాని చాలామంది రోగులు వచ్చుచున్నారు, నిజంగా ఎంతో తీరిక లేకుండా యున్నాను. బయటకు వెళ్ళి వచ్చిన పిలుపులకు జవాబు ఇచ్చే తీరిక కూడా లేదు. ఈ రోజు అనుకూల సమయమని అనుకొన్నాను. ఆ రోగులను ఆలయములో కలిసికొని ప్రార్థించుదుననుకొన్నాను. ప్రార్థన వలన సమస్తమూ మారునని మనకు తెలియును.
ప్రార్థన మనకు ఏదయినా చేయగలదు. ప్రార్థన ద్వారానే ఈ రోజు నేను జీవించియున్నాను. ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన కృపను బట్టి బ్రదికియున్నాను. ఈ ఉదయము కొద్దిగా అలసిపోయి సొమ్మసిల్లుచున్నాను. మీ ప్రార్థనలు నాకు అవసరము. నా కొరకు మీరు ప్రార్థించండి.
PS 116:15
8నిన్న నేను ఒక స్నేహితుని ఇంటి యొద్ద ఉన్నాను. అది ఒక క్రైస్తవ గృహము. కొందరు యువ క్రైస్తవులు అచ్చట కూడియుండిరి. వారితో నేను మాట్లాడుచుంటిని, ఏదో నాకు తెలియచేయబడినది. నేను అడవి వైపు చూచుచున్నాను, చెట్లు వైపు చూచుచున్నాను, అవి చనిపోవుచున్నవి. ఆ చెట్లు చనిపోవుచున్నాగాని ఎంత అందముగా యున్నవో గదా అని తలంచుచున్నాను. చాలా సుందరముగా ఉన్నవి. కొన్నిసార్లు చెట్లు పచ్చగా ఉన్నప్పటి కంటే చనిపోవుచున్న సమయములోనే చాలా అందముగా కనిపించును. పరలోక తండ్రితో మనకు గల స్థితికి ఇది చక్కని చిత్రము కదా? "ఆయన పరిశుద్దుల మరణము యెహోవా దృష్టికి ఎంతో విలువైనది."
గృహమునకు వచ్చుచున్న తన బిడ్డను తండ్రి చూచుట ఎంత మనోహర దృశ్యము! క్రీస్తులో మనకున్న స్థానమును ఆక్రమించును. తన విశ్వాసమును ఒప్పుదలను కాపాడుకొని వచ్చును, చూచారా. "దేవుని కృపను బట్టి నేను రక్షించబడియున్నాను," మరియు అక్కడ నిలబడియున్నాను. మరణ ఘడియలో, మనము రక్షణ పొందియున్నాము అను ఒప్పుదలను పట్టుకొనియుందుము.
EZEK 18:4,20
9మన దైర్యమును, మన విశ్వానమును, మనము నిలబెట్టుకొనిన సాక్ష్యమును మన తండ్రి ప్రేమించునని నేను నమ్ముచున్నాను. నీకు అంతా బాగున్నప్పుడు, చక్కని ఆరోగ్యము కలిగి యుండి బలంగా యున్నప్పుడు సాక్ష్యము చెప్పుట కాదు. నీవు నీరసముగా యున్నప్పుడు, బలహీనతలో యున్నప్పుడు, బాధలలో యున్నప్పుడు దానిని నిలబెట్టుకోవలెను. అప్పుడే నీ సాక్ష్యము లెక్కించబడును.
దానిని గూర్చి ఆలోచించుచుండగా నాకు ఒక యోచన కలుగుచున్నది. మరణము జీవముతో ముడిపెట్టబడిలేదు. జీవము మరణము ఒకేసారి కలిసియుండలేవు. చెట్టు మీద ఆకు చనిపోవుటకు ముందుగా ఆ చెట్టులోని రసము బయటకు పోవలెను. మానవ పరిధిలో నేను ఆలోచించుట లేదు. మానవుల విషయములోనయితే మరణమునకు పాపముతో ముడి యున్నది. పాపమనునది లేనప్పుడు ఏ మరణము లేదు. పాపమెక్కడున్నదో మరణ మచటున్నది. మరణ మెక్కడుండునో పాపమక్కడున్నది, ఎందుకనగా పాపము యొక్క ఫలితమే మరణము.
పాపము చేయు ఆత్మ నశించును. దేవుని ఆత్మ వలన తిరిగి మనము జన్మించినప్పుడు మనము నిత్యజీవము పొందుదుము. ఇక మరణముతో ఏమి సంబంధము లేదు, చూచారా. జీవముతో మరణము సహవాసము చేయలేదు. మరణముతో జీవము కలిసి యుండలేదు.
10నిన్న కొందరు యువ క్రైస్తవులతో గదిలో సంభాషించుచుంటిని. "మీరిచ్చట నిలబడి యుండగా ఒక కారు గంటకు తొంభై మైళ్ళ వేగంతో అదుపు తప్పి వచ్చుచున్నదనుకొనండి. మీరు ఆ దారిలో నుండి అతి త్వరగా ప్రక్కకు తొలగుదురు గదా? మీరు గంతు వేసెదరు. ప్రక్కకు జారేదరు. ఆ కారును తప్పించుకొనుటకు ఏదయినా చేయుదురు." క్రైస్తవుడు పాపము విషయములోను ఆ విధముగానే ఉండ వలసియున్నాడు, ఎందుకనగా పాపము మరణముతో ముడివేయబడి యున్నది. పాపమును నీవు ఏ రూపములో చూచినా గాని దాని నుండి ఒక్క గంతులో దూరమగుము. నీవేమి చేయవలసి యున్నాగాని వెనుదీయ వద్దు. పాపము నుండి దూరముగా పారిపొమ్ము. గుర్తించుకొనుము, పాపముతో మరణము ముడివేయబడియున్నది. నీవు అక్కడ నిలబడియుండగా కారు వచ్చినచో ఎట్లు త్వరపడి తప్పించుకొందువో, ఆ విధంగానే తప్పించుకొనుము.
ఏమి జరుగునో అది కనిపెట్టి చూడవద్దు. ఆ దారి నుండి దూరముగా తొలగిపొమ్ము. పాపము కనబడిన వెంటనే త్వరగా దూరముగా పారిపొమ్ము. ఒక శోధన వచ్చుట నీవు చూచునప్పుడు, పాపమును చూచునప్పుడు, ఒక తప్పును చూచునప్పుడు త్వరపడి పారిపొమ్ము, ఎందుకనగా దాని వెనుకనే మరణమున్నది, చూచారా. గంటకు తొంబది మైళ్ళ వేగముతో వచ్చుచున్న కారును తప్పించుకొనుటకు ఎట్లు త్వరపడి తప్పించుకొందువో, ఆ విధంగానే పాపము నుండి తపించుకొని పారిపొమ్ము. దారిలో నుండి వెంటనే తప్పుకొందువు గదా? దాని నుండి దూరమగుటకు గంతు వేయుదువు, ప్రక్కకు జారెదవు, పరుగెత్తెదవు, మరేదయినా చేయుదువు.
11పాపమును మనము అసహ్యించుకొనుట వలన మనకు జీవమున్నదని తెలియును. పాపముతో మరణము ముడివేయబడి యున్నదని మనమెరిగి పాపమును ఎంతో అసహ్యించుకొందుము. దాని యొక్క ఛాయకే మనము వెళ్ళము. ఏ విధముగానయినా దాని నుండి దూరముగా పోదుము. ఆ పాపము నుండి దూరముగా పోవుటకు దూకుడుము, పరుగిడుదుము, మరేదయినా చేయుదుము, ఎందుకనగా పాపములో మరణమున్నది. మరణములో ఏ విధముగాను మనము సంబంధము పెంపొందించుకొనగోరము. దాని నుండి నిశ్చయముగా మనం దూరంగా పోవలెను.
ఇది ఒక మంచి ఆలోచన అని నేను తలంచుచున్నాను. ఈ క్రైస్తవులతో నిన్న మాట్లాడుతున్నప్పుడు ఈ ఆలోచన నన్ను తాకినది. ఈ ఉదయమున దానిని సంఘమునకు చెప్పుట మంచిదని నేననుకొన్నాను. ముఖ్యంగా యువకులు ఇచ్చట కూర్చొనియున్నారు. అటువంటి శోధనల గుండా వెళ్ళుచున్నారు.
12పాప సంబంధమైన ప్రతి దానిలోను మరణము ముడివేయబడి యున్నదని గుర్తుంచుకొనండి. మీరు ఆ పాపములో పాలు పొందినచో మరణములో పాలు పొందుచున్నట్లే. కావున దాని నుండి దూరముగా తొలగుము.
పాపమనగా ఏమిటి? అవిశ్వాసము. సమస్త అవిశ్వాసము నుండి దూరముగా పొమ్ము. బైబిలును లక్ష్యము చేయని ప్రతి దాని నుండి దూరముగా పొమ్ము, దేవుని యొక్క వాక్యమును లెక్కచేయని ప్రతి దానికి దూరముగా ఉండుము. వీటన్నింటికి నేను జవాబు ఇచ్చిన తరువాత నాకు సమయమున్నచో, రోగులకు ప్రార్థన చేయుటకు ముందు దీనిని గూర్చి కొద్దిగా మాట్లాడవలెనని కోరుచున్నాను.
MATT 6:24•
LUKE 16:13
13ప్రశ్నలకు జవాబులు ఇచ్చు ముందుగా, లేదా ఆ ప్రయత్నము చేయు ముందుగా ప్రార్థించుదము. మా పరలోకపు తండ్రి, యేసు నామములో ఈ ఉదయమున మేము నీ సన్నిధిలోనికి వచ్చి యున్నాము. లోక సంగతుల నుండి వేరై యున్నామని ప్రకటించుకొనుచున్నాము. దేవునిని, సిరిని ఒకే సమయములో ఆరాధించలేమని ఆయన చెప్పెను. సిరి అనగా లోకము. ఒక దానిని అసహ్యించుకొని మరియొక దానిని మేము ప్రేమించవలెను, లేదా ఒక దానిని ప్రేమించి మరియొక దానిని అసహ్యించుకొనవలెను.
ఈ ఉదయమున నిత్యజీవముతో మేము సహవాసము చేయుచున్నామని నమ్ముచున్నాను. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తును అంగీకరించియున్నాము. పరిశుద్ధాత్మ యొక్క రుజువు మాలో జీవించుచున్నది. అది మా జీవితములను నడిపించుచున్నది. దీనిని బట్టి ఎంతో కృతజ్ఞత చెల్లించుచున్నాము. పాపము ఎంత చిన్నదిగా కనబడినా గాని, ఎంత అందముగా కనబడినా గాని, దాని నుండి మేము దూరముగా పరుగిడిపోవుచున్నాము. భయంకర వేగముతో వచ్చుచున్న కారు నుండి తప్పించుకొనుటకు దూకునట్లుగా దూకుచున్నాము. ఏ విధముగా కూడా పాపములో మేము చిక్కుకొనకూడదని భావించుచున్నాము. దాని నుండి మమ్మును దూరము చేయుము.
14ప్రభువా, ఈ ఉదయమున చాలామంది రోగులు మరియు అవసరతలలో యున్నవారు వచ్చియున్నారు. వారి కొరకు ప్రార్థించుదును. ప్రభువా, వీరికి విశ్వాసము ననుగ్రహించుము. ముఖ్యంగా ఈ ఉదయకాలమున ఆలయములోని ప్రార్థన వరుసలో నిలబడియున్నవారు సమస్త చిన్న భారమును విడిచి పెట్టి, ప్రతి అవిశ్వాసమును ప్రక్కకు నెట్టి, త్వరగా విశ్వాసముతో ప్రభువైన యేసు నొద్దకు పరుగెత్తి వచ్చునట్లు సహాయము చేయుము.
ఆస్పత్రులలోను, ఇతర శాలలలోను ఉన్నవారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. ప్రభువా, నా తల్లి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభువా, ఇంకనూ ఆమెను నీవు మాతో ఉంచి యున్నావు. దీనిని బట్టి మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. విశ్వాసముతో మేము మా అవసర హస్తములను చాపుచున్నాము, మొదటగా దేవుని చిత్తమును తెలిసికొనవలెను. ఆమె వెళ్ళిపోవుట ఆయన చిత్తమో కాదో తెలిసికొనవలెను. అది ఆయన చిత్రమైనచో మా చిత్తము కూడా అదే. కాని దీనిని సాతాను కలుగజేసినదేమో మొదట మేము తెలిసికొనగోరుచున్నాము. దేవుని ప్రేమించువారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని, శోధనలు అందుకే వచ్చుచున్నవని ఎరుగుదుము. ప్రభువా, మేము విధి నిర్వహణలో యోధులము వలె నిలబడగోరుచున్నాము.
15తండ్రి, ఫోను పిలుపులన్నింటిని, ప్రత్యేక విజ్ఞాపనలను ఈ ఉదయ కాలమున జ్ఞాపకము చేసికొనమని ప్రార్థించుచున్నాము. బయట కార్యాలయములో కొందరు ఎదురు చూచుచున్నారు. మా ప్రియులు ఎక్కడున్నాగాని వారిని ఆశీర్వదించుము.
ప్రభువా, ఈ రోజు చాలా ప్రశ్నలకు జవాబియ్యవలసిన బాధ్యత మా మీద పడినది. ఈ సంగతులు ప్రజల హృదయములలో యధార్ధము గాను, లోతుగాను ఉన్నదని మేమెరుగుదుము. తప్పు పట్టుట కొరకు వారడుగుట లేదు. సత్యమును తెలిసికొనవలెనను ఆసక్తి కలిగి యుండి వారడుగుచున్నారు. నీ వాక్యమే సత్యము.
తండ్రి, ఈ సత్యములోనికి, వాక్యములోనికి మా మనస్సులను నీవు మళ్ళించమని ప్రార్థించుచున్నాము. ప్రభువా, మాకు సహాయము చేయుము. ఈ బోధనా గృహమును ఈ దినము మంచి అవగాహనా శక్తితో విడిచి పెట్టునట్లును, మా ఆత్మలకు మేలు కలుగునట్లును సహాయము చేయుము. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామములో దేవుని మహిమ కొరకు మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
16కొన్ని చేతిరుమాళ్ళు ఇచ్చట ఉంచబడియున్నవి. వాటికి ప్రార్థించ వలెననుకొనుచున్నాను, వీలయినప్పుడు ఆ కార్యమును చేయుదుము. అనుకూల సమయమయితే గంటన్నర యున్నది. ఇంతకు ముందు చేసినట్లుగా ఈ ప్రశ్నలన్నింటికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పగలనో లేదో తెలియదు. కాని మేము ఈ దినము ప్రశ్నలకు జవాబులు చెప్పవలెనని ఉద్దేశించియున్నాము, జనులలో విశ్వాసము పుంజుకొనునట్లు క్లుప్త వర్తమానమిచ్చెదను. రోగులు ప్రార్థనకు వచ్చియున్నారు. ఈ రాత్రి కూటమును గుర్తంచుకొనండి. వారము మధ్యలో ప్రార్థన కూటములున్నవి. మగవారికి కూటములున్నవి.
వచ్చే ఆదివారము గూర్చి నేనెరుగను. నా హృదయములో ఒక అంశమున్నది. సంఘమునకు దానిని చెప్పుగోరుచున్నాను. ఈ వచ్చే ఆదివారము సాధ్యమయితే, ప్రభువు అనుమతించితే, చాలా అసాధారణమగు ఒక సంగతి ఈ వారములో బోధించుటకు నాకున్నది, సువార్త వర్తమానము. ప్రభువు నడిపించిన దానిని బట్టి ఆ తరువాత దానిని గూర్చి ఆలోచించెదము.
ఇప్పుడు నా కొరకు ప్రార్థించండి, ఎందుకనగా చాలా గొప్ప నిర్ణయములు కొన్ని చేయవలసియున్నాను. సహోదరుడు రాయ్ బోర్డర్స్ కూటముల విషయము చూచుకొనును. (ఈ ఉదయమున ఇక్కడే ఎక్కడో కూర్చొనియున్నాడని తలంచుచున్నాను), గత కొద్ది నెలల నుండి వచ్చిన ఆహ్వానములతో అతని పుస్తకము నిండిపోయినది. చాలా చోట్లకు వెళ్ళవలెను. ప్రజలు కూటముల కొరకు అతనిని సంప్రదించెదరు. కావున నేను సరైన నిర్ణయములు తీసికొనునట్లుగా మీరు ప్రార్థించండి. నేను ఏది చేసినా గాని అది సరియైనదిగా లెక్కించబడును గాక.
17తెలిసిన ప్రశ్నలకు వెంటనే జవాబు ఇచ్చెదను, ఆ కారణము చేతనే ప్రశ్నలకు జవాబులు ఇచ్చుచున్నాను. స్వస్థతా కూటమునకు గాని, మరి దేనికి గాని మేము ఎన్నడూ ప్రకటనలు ఇవ్వము. ఇక్కడున్న వారే ఇచ్చెదరు, కాబట్టి వారి హృదయములలో యున్నదానిని కనుగొందుము.
మన ప్రశస్త సోదరుడు, సంఘ కాపరి అగు నెవిల్ సోదరుడు ఆ వెనుకన కూర్చొనియున్నాడు - దేవుని రాజ్యములో అతడు ముందుకు పోవుటను బట్టి నేనెంతగానో వందనమలు చెల్లించుచున్నాను. గత రెండు సంవత్సరములలో అతడు చేసినది గడిచిన సంవత్సరములన్నింటిలో చేసిన దాని కన్న మిన్నగా యున్నది. దేవుడెంతగానో ఆయనను దీవించెను. నాకు సంతోషము కలుగుచున్నది.
ఆయన ముఖం మీద చెప్పుట కాదు… ఆయన వెనుక కూడా ఇదే చెప్పెదను, దానిని మీరెరుగుదురు. నేను బాలునిగా యున్నప్పటి నుండి సహోదరుడు నెవిల్ ను ఎరుగుదురు. చూచారా? ఆయన కూడా మనందరి వలెనే పొరపాట్లు చేయవచ్చును. మనందరమూ ఆ విషయములో ఒక్కలాగే యున్నాము. మనమింకా మానవులమే. అందుకు అతీతులము కాము. కాని హృదయపూర్వకముగా ఆయన వాటిని చేయడు. అది నేను చెప్పగలను. ఆయన యధార్థపరుడు, యధార్థతలో ఆయన అత్యున్నత స్థాయికి చెందును.
18ఈ వర్తమానము యొద్దకు ఆయన వచ్చెను. సంఘ వోటు ద్వారా ఆయనను ఈ సంఘకాపరిగా నియమించి యున్నాము. ఇప్పుడు అర్థము చేసికొనిన రీతిగా అప్పుడు ఆయనకు అసలు విషయములే తెలియవు. కాని యధార్థంగా పని చేయుటకు ఇష్టపడెను. ఈ భారము వహించుటకు మర్యాదగా ముందుకు వచ్చెను. ఆయనకు బలమగు నేపద్యము యున్నది. ఇప్పుడు ఆయనకు ఆయన నిలబడి యున్న చోటు తెలియును.
ఆలయమును బహుగా నేను సంతోషించుచున్నాను. ఒక రాత్రి వారు ఇక్కడ కూడి చర్చించుకొనిరి. క్రొత్తగా ఆలయమును నిర్మించవలెనా, లేదా దానినే పెద్ద చేయవలెనా, లేదా దీనిని విస్తరించి ఆదివారపు బడి కొరకు గదులు నిర్మించవలెనా అని చర్చించిరి. పెద్దదిగా చేయవలెనని సంఘము ఏకగ్రీవముగా వోటు వేసినది. ఇక్కడ క్రొత్తగా విస్తరణ చేయ తలపెట్టిరి. పెద్దదిగా చేయగోరిరి. ఆదివారపు బడికి గదులు నిర్మించగోరిరి. అన్ని తరగతులకు సరిపోవును. నేల మీద తివాచీలు వేయుదురు. దాని మీద మెత్తని చాపలు వేయుదురు. చాలా చక్కగా తయారు చేయుదురు. బయట మంచి రాళ్ళు పరచెదరు. అందుకు చర్చి వోటు చేసెను. కట్టడపు పని వారిప్పుడు భారము కలిగియున్నారు. దానికి సంబంధించిన కూటము రేపు జరుగును. పెద్ద ఆలయము నిర్మించెదరు, వెనుకకు పెంచెదరు. చుట్టూ కూడా వేరుగా విస్తరించెదరు. కాబట్టి దీని కొరకు ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాము.
19ఈ ప్రశ్నలలో కొన్నింటిని నేను చూడనే లేదు. నేను తేలికయిన పదములను వెల్లడి చేయ వచ్చును. మీరు వ్రాయుట బాగానే యున్నది గాని నా చదువు బాగోలేదు.
ప్రశ్న: అపొస్తలుల కార్యములు 2:38 ప్రకారము బాప్తిస్మము పొందుటకు మేము నమ్ముచున్నాము. కాని ఇతర విధమగు బాప్తిస్మము గూర్చి జనులతో మాట్లాడుట ఎట్లు! వారు రక్షించబడిరా, లేదా? అలాగే ఆ వెలుగును చూడక గతించిపోయిన వారి మాట ఏమిటి?
అది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నలను మరల చెప్పెదను, చూచారా, మీ ఆలోచన ప్రకారము నేను జవాబు చెప్పక పోవచ్చును. నాకు తెలిసినంత వరకు లేఖన సహితముగానే జవాబులు చెప్పెదను. లేఖనపూర్వకముగా వాటిని వివరించెదను.
MATT 28:19•
ACTS 2:38
20లేఖన పూర్వకమగు నీటి బాప్తిస్మము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమే. దానిని అపొస్తలుల కార్యములు 2:38 లో చూచెదము. మిగిలిన బైబిలు అంతటిలోను చూడగలము. ఈనాడు చాలా మంది జనులు, దాదాపు సంఘములన్నియూ ఆదిలో దీనినే ప్రారంభించారు. వారిప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మమిచ్చుచున్నారు. దానిని వారు తప్పు ద్వారానే చేయుచున్నారు. బైబిలులో అట్టి ఆజ్ఞ లేదు, ఎక్కడా లేదు. లేఖనములలో కనబడనే కనబడదు.
యేసు చెప్పిన దానిని మత్తయి వ్రాసెను, మత్తయి 28:19 చూచెదరు. "మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమియ్యుడి."
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనునవి పేరు కాదు, బిరుదులు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, బైబిలులో ప్రతి వ్యక్తికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చినట్లు చూడగలము. లవొదకయ స్థాపన వరకు అలాగే జరిగినది. క్షమించండి — నేసియన్ ఆలోచనా సమితి యొద్ద, అనగా రోమ్ లోని నైసియా యొద్ద కాతలిక్కు చర్చిలో ప్రారంభించబడెను అని చరిత్రలో చూడగలము.
21పెంతెకోస్తు సంఘము రెండు గుంపులుగా విడిపోయినది. ఒకరు వాక్యముతో నివసించిరి. వ్రాయబడిన వాక్యమును చేర్చుకొని, మిగతా వారయితే ఆధునిక సంఘముతో నిలచిది. ఇది కాన్స్టాంటయిన్ పాలనలో జరిగినది. కాన్స్టాంటయిన్ మత వ్యక్తి కాదు. ప్రారంభము నుండి అతడు అన్యుడే. అతడు ఒక రాజకీయ వేత్త, ఐక్యపరచగోరెను. రోమ్ లో సగం మంది క్రైస్తవులు; సగం మంది అన్యులు. కావున అతడు సగం అన్యత్వమును, సగం క్రైస్తవ్యమును మిశ్రమం చేసి ఒక అధునాతన గుంపును తయారు చేసెను. వారు తమ కొరకు ఒక స్వంత మతమును తయారు చేసికొనిరి.
కాబట్టి బైబిలును అలక్ష్యము చేయుట కొరకు కాతలిక్కు చర్చి దేవుడు తమకు అధికారమునిచ్చినట్లు చెప్పుకొనెను. దాని ద్వారా దేనినయినా మార్చుటకు గానీ, కోరినది చేయుటకు గాని అధికారమున్నదనిరి, చూచారా. కాబట్టి కాతలిక్కు సంఘము సరి అయినది అయినచో, అది నిజంగా దేవుని ద్వారా అనుగ్రహించబడినదే అయినచో మనందరమూ తప్పులో ఉన్నట్లే. కాతలిక్కు వారు మాత్రమే సరియైన వారగుదురు, చూచారా. మెతడిస్టు సంఘము సరియైన దగును. బాప్టిస్టు సంఘము సరియైన దగును. మిగిలిన సంస్థలన్నియూ సరియైన వగును, చూచారా. వారికి ఆ హక్కున్నది. అయితే ఎవరిది సరి? తాము కోరిన విధంగా బైబిలులో చెప్పబడిన దానిని మార్పు హక్కు తమకున్నదని కాతలిక్కు వారు చెప్పుకొనుచున్నారు. మరో రకమగు సిద్ధాంతములను తయారు చేయుచున్నారు. "మరియా! నీవు ధన్యురాలవు," అనుచున్నారు. మొతడిస్టు వారయితే ముంచుట బాప్తిస్మము తప్పు గనుక మేము చిలకరించెదమని చెప్పుచున్నారు. వారందరూ తామే సరియైన వారమని చెప్పుకొనుచున్నారు, ఎందుకనగా ప్రతివారికి తమ సంఘమే మిన్న అను భావన యున్నది. అయితే ఏది నిజమగు సంఘము? మెతడిష్టా, బాప్టిస్టా, ప్రెస్బిటేరియనా, కాతలిక్కా మరొకటా? చూచారా?
REV 22:19
22సమస్త జ్ఞానమునకు మూలాధారము దేవుడే. కావున ఆయన ఈ విధంగా చేయజాలడు. దేవుని యొక్క సహజాతీతమైన జ్ఞానము అను మాటను విడిచిపెట్టండి, అందులో ఇంగిత జ్ఞానము కూడా లేదు. ఒకటి మాత్రమే సరియైనది - అదే వాక్యము. వాక్యమే నిజము.
కావున ఈ ఉదయము కాతలిక్కు సంఘము ఈలాగు చెప్పవలెనని కోరుకోవచ్చును, "మేము మొత్తం బాప్తిస్మమునే రద్దు చేయుదుము. ప్రతి ఉదయము కొద్దిగా పంచదార తింటే చాలును. పాపముల క్షమాపణ కొరకు అది చాలును అలాగు చెప్పు హక్కు వారికున్నది, ఎందుకనగా దేవుడు అట్టి ఆధికారము సంఘమున కిచ్చెనని వారందురు.
అయితే చూడండి, నాకయితే వాక్యమే నిజము, ఎందుకనగా బైబిలు చివరలో దేవుడు తన వాక్యమందు ఇట్లు చెప్పెను, "దీనిలో నుండి ఎవరూ ఒక మాట తీసివేయ రాదు, దీనికి ఎవరూ ఒక మాట కలుప రాదు. అలాగు చేసిన వానికి జీవగ్రంధములో పాలు లేకుండా పోవును." కాబట్టి నాకు వాక్యమే ముఖ్యము.
ACTS 19:5,6
23తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఎవరునూ ఎన్నడును బాప్తిస్మము పొందినట్లు బైబిలులో లేదు, ఎందుకనగా అటువంటిది లేదు. తండ్రి అనునది పేరు కాదు, కుమారుడనునది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనునది పేరు కాదు; అయితే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము - ప్రభువైన యేసుక్రీస్తు. అపోస్తలుల కాలము నుండి అన్ని కాలములలోను గుర్తించబడినది అదే.
తరువాత ప్రశ్న. ఇది లేఖన సంబంధముగా నిజము. అది సత్యము.
యేసుక్రీస్తు నామములో కాకుండా మరో విధముగా బైబిలులో బాప్తిస్మము పొందినవారు మరల యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించబడెను. ఆ తరువాత మాత్రమే పరిశుద్ధాత్మను పొందుదురు. అపొస్తలుల కార్యములు 19:5. నిజము. కావున అది వాక్యానుసారముగా సత్యము.
ఏ బిషప్పు లేడు, ఏ ఆర్చి బిషప్పు లేడు, మినిస్టర్ లేడు, దానికి విరోధముగా మాట్లాడువారెవరునూ లేరు, ఎందుకనగా అది సత్యము, చూచారా.
24ఒక రోజున షికాగోలో మూడు వందల మంది సూవార్తికులను అడిగాను, వారందరూ నాతో వాదించుటకు సిద్ధపడి వచ్చిరి. ప్రభువు నాకు చెప్పెను, ఆయన నాకు ఒక దర్శన మిచ్చెను, మరియు నేనెక్కడుందునో, ఏమి చేయుదునో ఆయన నాతో చెప్పెను. మూడు వందల మంది త్రిత్వ సేవకుల యెదట నేను నిలబడియున్నాను. నేనిట్లు చెప్పాను, "ఈ బోధ విషయములో నేను అంత తప్పుగా మీకు కనబడినచో, మీలో ఎవరైనా సరే లేచి ఎక్కడ నేను తప్పుగా యున్నానో వాక్యము ద్వారా చూపించవలెనని కోరుచున్నాను. మీ పుస్తకములు కాదు. సర్ప సంతానము గాని, ఇంకా నేను బోధించు ఇతర సంగతులు గానీ వాక్యములో లేవని మీరు చూపించగలిగినచో చాలును." ఎవరూ కదలలేదు, చూచారా, ఎందుకనగా వారికి తావు లేదు. ఇది సత్యము. వేరుగా ఉండవలెనని కాదు గాని ఇది సత్యము. ఇది వాక్యము. దానినెవరూ కాదనలేరు. అది దేవుని యొక్క మాట. దాని నెవరూ కొట్టివేయలేరు, చూచారా.
25ఇది నిజమని నిశ్చయముగా చెప్పుటకు మరల దానిని చదివెదను. చూచారా? ఇతర విధములుగా బాప్తిస్మము పొందిన వారు రక్షించబడెదరా? ఆ ప్రకారముగానే ఎన్నడూ వెలుగును చూడక గతించిపోయిన వారి మాట ఏమిటి?
దేవుడు తన ప్రజలను పిలచియున్నాడనియు, తన సంఘమును అభిషేకించి యున్నాడనియు నేను ఖచ్చితంగా నమ్ముచున్నాను. జగత్తు పునాది వేయబడక ముందున్న వారందరూ అచ్చట ఉందురు. దానిని బైబిలు బోధించుచున్నదని నేను నమ్ముచున్నాను. తన పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించు ప్రతి వ్యక్తియు సత్యము కొరకు వెదకునని నేను నమ్ముచున్నాను. దానిని నేను నమ్ముదును. దేవుని ప్రేమించు ప్రతి వ్యక్తియు అలాగు చేయును.
తెలిసికొనకుండా ఒక వ్యక్తి తప్పు బాప్తిస్మము పొందినా, దేవుడు అతనిని రక్షించును. ఇది లేఖనమును బట్టి చెప్పుట కాదు గాని, నా స్వంత అభిప్రాయము. అది తప్పు బాప్తిస్మమని అతనికి తెలియదు గనుక దేవుడు దానిని గౌరవించును. ఏది సరియైనదో అతనికి తెలియదు. తనకు తెలిసిన మేరకు లోబడెను. గుర్తుంచుకొనండి, వెస్లీ కాలములో, సంస్కరణ కర్తయగు లూథర్ దినములలో అలాగే జరిగెను. వారు గొప్ప దైవజనులు. తమ కియ్యబడిన వెలుగులోనే నడిచిరి. దేవుడు దానిని గౌరవించెను మరియు ఆయన వారిని ఘనపరిచెను అని రుజువు చేసెను. వారు విశ్వాసముతోనే మరణించిరి, చూచారా, వారు కలిగియున్న వేలుగు అంతయు.
26ఈ ఉదయ కాలమున చార్లెస్ ఫుల్లర్ చెప్పిన దానిని ఎవరయినా విన్నారా? "పాత-కాలపు ఉజ్జీవ ఘడియ." నాకు ప్రీతికరగు బైబిలు బోధకులలో అతడు ఒకడు. అయినా అతనిది పాత మార్గము, కాని గొప్ప బైబిలు ఉపదేశకుడని నమ్ముచున్నాను. ఈ ఉదయము అతడు మాట్లాడెను. ప్రవచనము అను అంశము మీద మాట్లాడేననుకొనుచున్నాను ఇంకా గొప్ప సంగతులు ముందున్నవి. సంఘమునకు ఏ మాత్రమూ తెలియని సంగతులు జనులకు వెల్లడియగును." నేను, "ఆమేన్!" అన్నాను. ఇంకా గొప్ప వెలుగు మనకు రాబోవుచున్నది. ఈ స్వల్ప కాల వ్యవధిలోనే అది ప్రపంచమును ముంచెత్తును. బహుశా కొన్ని నెలల్లో అది జరుగవచ్చును. కాని గొప్ప వెలుగు రానున్నదని మాత్రం నేను నమ్ముచున్నాను.
ఏ వ్యక్తి అయినా గాని తనకు అనుగ్రహించబడిన వెలుగులో విశ్వాసము తోను, యధార్దముతోను నడిచిన యెడల, తప్పక అతడు రక్షించబడును.
LUKE 7:2
27గుర్తుంచుకొనండి, ప్రభువైన యేసు రాకడ సమయములో జరిగినది స్మరణకు తెచ్చుకొనుడి. ఆనాటి వెలుగులో వారు నడచినట్లు ఆయన కనుగొనినప్పుడు, ఆయన ఏమనెను? ఏమి జరిగినదో గుర్తున్నదా? "ఈ రోమా శతాధిపతి మంచివాడు కాడా? ఇతడు మన పట్టణమును నిర్మించెను - మన జనలు కొరకు ఒక సమాజ మందిరమును నిర్మించెను. (ఇవన్ని అతడు చేసెను) - అతడు అడిగిన దీవెనను పొందుటకు యోగ్యుడు." చూడండి, దేవుడు ఒక అర్థము చేసికొను తండ్రి. నీ హృదయమును ఆయన ఎరుగును. నీవు నిజంగా వెలుగును చూచినా, చూడకపోయినా ఆయన ఎరుగును.
యేసుక్రీస్తు నామములోనే నిజమగు బాప్తిస్మము, దీనిని నేను నా నిండు హృదయముతో నమ్ముచున్నాను. ఈ ప్రశ్నకు ఇదే సరియగు జవాబు. దానికి విరోధముగా బాప్తిస్మము పొందిన వారు, దానిని నిస్వార్థ హృదయముతో పొందినయెడల, ఆ సంగతి అతనికి, దేవునికి చెందును. దానినతడు తక్కువగా ఎంచడు. వారికి ఇంకొకటి తెలియనియెడల, వారు రక్షించబడుదురు. నా పూర్ణహృదయముతో దీనిని నమ్ముచున్నాను, ఎందుకనగా వారికి అది గాక వేరొకటి తెలియదు.
దీనిని చాలా సేపు చెప్పుకొనవచ్చును, చాలా విషయుమున్నది, కానీ వీలయినంత వివరముగా చెప్పవలెనని ప్రయత్నించాను.
HEB 6:4•
HEB 10:26
28ప్రశ్న: "హెబ్రీ 6:4 మరియు 6ను దయచేసి వివరించుము. హెబ్రీ 10:26-39 ని కూడా వివరించుము. ఇది పరిశుద్ధాత్మ జనులకు వర్తించునో లేక శుద్ధీకరించబడిన జనులకు వర్తించునో తెలుపుము. ఆ తేడాను దయచేసి వివరించుము."
అతడు చెప్పిన దానిని చూద్దాం. హెబ్రీ 6 మరియు 4. బైబిలు ప్రశ్నలు నాకు ఇష్టము. అది నీలో నున్న దానిని బయటకు లాగును. నీకు తెలియని దానిని నీకు బయలుపరచును, ఇతర జనులు ఏమి అనుకోనుచున్నారో, వారి హృదయములలో ఏమున్నదో నీకు తెలియును, చూచారా, వారేమి చేయుచున్నారో నీకు తెలియును.
అక్కడ హెబ్రీ 10 ఉన్నది, ఇక్కడ హెబ్రీ 6 మరియు 4.
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై
దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత
తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టివారిని మరల నూతనపరచుట అసాధ్యము.
అది ఒకటి. హెబ్రీ 10:26. మంచిది. హెబ్రీ 10:26.
మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధి పూర్వకముగా పాపము చేసిన యెడల, పాపములకు బలి ఇకను ఉండదు గాని
న్యాయపు తీర్పుకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.
ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండ వాని చంపించుదురు.
ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచ బడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
HEB 6:4
29ఆ రెండునూ దాదాపు ఒకే విధంగా యున్నవి. దీనిని నేను అతనికి వివరించగోరుచున్నాను. హెబ్రీ 6 మరియు 4 లో మీరు గమనించిరి. "ఒకసారి వెలిగింపబడి… వారిని మరల నూతన పరచుట అసాధ్యము." మనము చదివిన ఇంకొక లేఖనముతో అది ముడివేయబడి యున్నది. నీవు ఒకసారి వెలిగించబడి, ఆ తరువాత దాని నుండి తొలగిపోయినచో పోగొట్టుకొనిన స్థానమును మరల సంపాదించుట అసాధ్యము, చూచారా.
ఈలాగు నిరాకరించిన వారికి వచ్చు తీర్పును గూర్చి హెబ్రీ మాత్రమే చెప్పుచున్నది. క్రీస్తును విసర్జించుట కంటే ఈ లోకములో భయంకరమైన సంగతి మరియొకటి లేదు. లేఖన వెలుగును తిరస్కరించుట ఎంతో ఘోరమైనది.
HEB 6:4
30ఇప్పుడు చూడండి, "ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై తప్పి పోయిన వారు మారుమనస్సు పొందునట్లు మరల నూతనపరచుట అసాధ్యము." చూచారా? అక్కడ మనం ఉన్నాము. వారిని నూతనపరచుట అసాధ్యము. వారు ఒకసారి వెలిగించబడిరి. పరలోక సంబంధమైన వరమును రుచి చూచిరి. [గమనించండి], దానిని వారు అంచున యుండి చూచిరి: "పరలోక వరములను రుచి చూచిరి…"
మీరు గమనించండి, వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొద్దకు అసలెన్నడూ రాలేదు, చూచారా. వారు ఒకసారి వెలిగించబడిరి: "పరలోక వరమును రుచి చూచిరి [చూచారా?], పరిశుద్ధాత్మ యందు పాలివారైరి [దానిని రుచి చూచుట ద్వారా], దేవుని యొక్క మంచి వాక్యమును రుచి చూచిరి, [దానిలో పాలివారైయిరి, చూచారా?] లోక సంబంధమగు శక్తులు వారిని పతనము చేసినవి, వారు పడిపోయినట్లయితే, వారిని నూతన పరచుట…."
HEB 10:28
31దానికి కలుగబోవు తీర్పును గూర్చి హెబ్రీ 10 చెప్పుచున్నది. "ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపబడకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?"
ఈ రెండింటిని కలిపినప్పుడు మీకు ప్రశ్న వచ్చును, వాక్యమును తీసికొందము. ఈలాగు చేసిన ఒక వ్యక్తిని బైబిలులో నుండి తీసికొందము. అప్పుడు మనకు తెలియును.
ఈనాడు సంఘమంతయూ మాదిరికి ప్రతి మాదిరియై యున్నది. దానిని మనం ఎరుగుదుము. మాదిరి మరియు ప్రతిమాదిరి యున్నది. పాలస్తీనా దేశము నుండి - ఐగుప్తు దేశములో నుండి పాలస్తీనా దేశమునకు ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయుచుండగా మనకేమి గుర్తు వచ్చును? అది ఆత్మీయ సంఘమునకు మాదిరి. అది ఈనాడు వాగ్దాన దేశమునకు యాత్ర చేయుచూ ఉన్నది. దానితో మీరందరూ సమ్మతించెదరు, మీరు సమ్మతించరా? వేదాంత పండితులందరూ దానితో సమ్మతించెదరు, అది ఒక మాదిరి.
EXOD 14:10
32వారు ఐగుప్తును విడిచి పెట్టిరి. ఐగుప్తు అనగా ఈ లోకము. వారు బయటకు వచ్చిరి. వేరు చేయు జలముల గుండా వచ్చిరి. ఎర్ర సముద్రము నొద్ద బాప్తిస్మము పొందిరి. అవతలి దరికి చేరి సంతోషముతో దేవుని స్తుతించిరి. వారికి ధర్మశాస్త్ర మియబడెను. అక్కడ వారు వాగ్దాన దేశము వరకు వెళ్ళిరి.
వాగ్దాన దేశమునకు చేరుటకు ముందుగా, వాగ్దాన దేశములో ప్రవేశించు ముందుగా ఏమి జరిగినదో మీరు గమనించారా - కొద్ది దినములలో, పది లేక పదకొండు దీనముల్లో వారు చేరెదరు, ఎందుకనగా ఇక నలుబది మైళ్ళ దూరం మాత్రమే దాదాపుగా ఉన్నది. వారు తిన్నగా వాగ్దాన దేశములో ప్రవేశించెదరు. వారు అన్ని దశలను దాటుకొంటూ ఆ దేశ పొలిమేరల లోనికి వచ్చిరి. వారు ఎర్ర సముద్రమును దాటి వచ్చిరి. వారి వెనుకనే ఫరో సైన్యము మునిగి పోయినది. వారు తమ సైన్యములతో పాటు మునిగిరి. ఇశ్రాయేలీయులకు ఇక శత్రువు లేడు. అరణ్య మార్గమున యాత్ర చేయుచుండిరి. కాదేషు-బర్నేయా యొద్ద వాగ్దాన దేశపు అంచు వరకు వచ్చిరి. అయితే అక్కడ వారు తప్పిపోయిరి. ఎందువలన? ఎందుకని వారు తప్పిపోయిరి?
NUM 32:8,9•
ACTS 1:8
33పది గోత్రముల వారితో మోషే ఇట్లు చెప్పెను, "ప్రతి గోత్రములో నుండి ఒక్కొక్కని తీసికొని వారిని ఆ పది గోత్రములకు ప్రతినిధులుగా పంపించెను. ఆ దేశములో ఎట్టి పరిస్థితులున్నవో చూచి రమ్మని వారిని వేగుల వారిగా పంపించెను."
ఈ ఉదయమున మీరు ఆ స్థానము వరకే వచ్చిరి. ఇది నిశ్చయము. సంఘము లూథర్ ద్వారా నీతీకరణమును, మెతడిస్టు ద్వారా శుద్ధీకరణమును, దాటి ఈ వాగ్ధాన కాలము వరకు వచ్చియున్నది. ఆ వాగ్దానమే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమై యున్నది, పాత నిబంధన యంతటీలోను, క్రొత్త నిబంధనలను ఈ వాగ్దానమును మనము చూడగలము, చూచారా. వాగ్ధానము - "ఇదిగో, నా తండ్రి యొక్క వాగ్దానమును మీ మీదికి పంపుచున్నాను…" - పేతురు పెంతెకోస్తు దినమున దానినే చెప్పెను.
అదే వాగ్దానము. ఈ పరిశుద్ధాత్మలో జీవించుటయే వాగ్దాన దేశమైయున్నది. అది దేవుడు సంఘమున కిచ్చిన వాగ్దానము. పరిశుద్ధాత్మలో జీవించుటయే. అది మరియొక ప్రపంచము. అది మరొక దేశము. నీవిప్పుడున్న స్థితిలో నుండి బయటకు రావలెను. వచ్చి ఈ వాగ్దాన దేశములో జీవించవలెను. వాగ్దానమును చేర్చుకొనవలెను. వాగ్దానమును గుర్తుకు తెచ్చుకొనుడి? "పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు పైనుండి శక్తిని పొందెదరు."
పాత నిబంధన, క్రొత్త నిబంధనలన్నింటిలోనూ ఈ వాగ్దానము చేయబడినదని పేతురు చెప్పెను. పెంతెకోస్తు దినమున ఆ వాగ్దానము పైకి పైకి వచ్చుటను చూచెదము, మరియు వారప్పుడు వాగ్దానములోనికి ప్రవేశించిరి.
NUM 13:16,17,26-29,33•
HEB 10:29
34ఈ జనులు బయటకు వచ్చిరి మరియు ఇశ్రాయేలులో గొప్ప సూచక క్రియలను, గొప్ప ఆశ్చర్య కార్యములను దేవుడు చేయుటను వారు చూచిరి. అతడు ప్రతి గోత్రములో నుండి ఒకరిని తీసికొని వేగు చూచుటకు పంపెను. కొందరు వచ్చి ఏమనిరో చూడండి. అందులో కొందరు వేరుగా చెప్పిరి. ఇద్దరు మాత్రమే చూచినది చెప్పిరి. వారు అక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక గొప్ప ద్రాక్షా గెలను తీసికొని వచ్చిరి. ఒక్క గెలను ఇద్దరు మోసికొని రావలసి వచ్చెను. వారు ఎన్నడూ ద్రాక్ష పండ్లను రుచి చూడలేదు. వారు అరణ్యములో యుండిరి. అందులో ఇటువంటి ఫలములు లేవు. వారు మన్నాను భుజించిరి, ఆకాశపు భోజనమును తినిరి, పూరేళ్ళను తినిరి, జంతు జీవము ద్వారా వారు తృప్తి పొందిరి.
వారు ఆ దేశములోనికి వెళ్ళిరి. వారు ఒక పెద్ద ద్రాక్షా గెలను తీసికొని వచ్చిరి. ఆ ఒక్క గెలను మోయుటకు ఇద్దరు మనుష్యులు కావలసి వచ్చిరి. వీరిద్దరును ఆ దేశములోనికి వెళ్ళి దేశమును వేగు చూచి వచ్చిరి. మిగిలిన వారందరూ ఆ ద్రాక్షా ఫలముల రుచిని చూచిరి. వారేమి చేసిరి?
వారు తిరిగి వచ్చినప్పుడు, సంతోషించుటకు బదులుగా, ఆ ద్రాక్షా ఫలములను రుచి చూచి ఆనందించుటకు బదులుగా, వారు తమ తమ గోత్రముల యొద్దకు వెళ్ళి ఇట్లనిరి, "కాని మేము ఫిలిష్తియుల పట్టణములు మహా ప్రాకారములచే చుట్టబడి యుండుట చూచాము. హిత్తీయులు, పెరిజ్జీయులు, ఇంకా అనేకమగు జాతుల వారున్నారు. వారు ఉన్నత దేహులు. వారి ప్రక్కన మేము నిలబడినప్పుడు మిడుతల వలె కనబడితిమి. ఆ దేశమును మనము స్వాధీనపరచుకొనజాలము. అసలు మమ్ములను బయటకు ఎందుకు తెచ్చియున్నావు?" చూచారా? వారు ప్రతి ఒక్కరూ అరణ్యములోనే నశించియున్నారని బైబిలు చెప్పియున్నది. వారందరూ చనిపోయిరి. వారేమి చేసిరి? వారు సరిహద్దు విశ్వాసులు. వారు నిజమయిన దాని యొద్దకు వచ్చిరి. వాగ్దానమును చూచిరి, కాని వెళ్ళి ఆ వాగ్దానమును స్వతంత్రించుకొను సామర్థ్యము తమకు లేదని చెప్పిరి.
NUM 13:30
35నీతీకరణము మరియు శుద్ధీకరణము ద్వారా ఈనాడు నిశ్చయముగా అదే వచ్చి యున్నది, చూచారా. "యేసుక్రీస్తు రక్తముతో వారు శుద్ధిపొందవలసి యుండేది." కానీ వారు దానినే కాళ్ళతో త్రిక్కి యున్నారు. శుద్ధీకరణ పొందిన జనులు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును చూచుచున్నారు, గాని దానిని కాదని తిరిగి పోవుచున్నారు. ఇట్లనుచున్నారు, "ఇది మత ఛాందసము, దీనిని మనము ఆమోదించ జాలము. మేము దీనిని అంగీకరించినచో మమ్మును ఉన్నత వర్గము వారు త్రోసి వేయుదురు. మా పదవులను పోగొట్టుకొందుము. మా సంఘములలో నుండి బహిష్కరించెదరు. దీనిని చేర్చుకొనలేము, చూచారా. ఇది మా సంఘ బోధకు విరోధము," చూచారా. ఇంత దూరము వరకు వారిని నడిపించి తీసికొని వచ్చిన యేసుక్రీస్తు రక్తమును, వాగ్దానపు ముద్రను వారు తిరస్కరించుచున్నారు. అట్టి వారు ఇక ఎన్నడయినా గాని రక్షించబడుట అసాధ్యమని ఆయన చెప్పుచున్నాడు. చూచారా?
వారు ఆ వాగ్దాన దేశములోనికి వెళ్ళి చూచి వచ్చిరి.
NUM 13:26
36గుర్తుంచుకొనండి, ఆ మొత్తం గుంపులో నుండి యెహోషువా మరియు కాలేబులు మాత్రమే బయటకు వచ్చిరి. వాగ్దాన దేశములోనికి బయలు దేరిన వారు రెండున్నర మిలియను మంది. వారు వాగ్దాన దేశములోనికి వెళ్ళి దానిని చూచిరి. యెహోషువా, కాలేబులు ఆ దేశమును చూచి వచ్చిరి. దీవెనను పొందుకొనిరి. వారిట్లనిరి, "దానిని జయించుటకు మనకు శక్తి చాలును, ఎందుకనగా దేవుడు అలాగు చెప్పెను."
వారు నిలచి యుండిరి. ఎందువలన? మిగిలిన వారందరూ పరిస్థితుల వైపు చూచిరి, కాని యెహోషువా, కాలేబులు దేవుడు చెప్పిన దానిని చూచిరి: "ఆ దేశమును మీకిచ్చుచున్నాను. వెళ్ళి దానిని స్వాధీనపరచుకొనుడి."
ఈ దినమున జనులు ఈలాగు చెప్పుచున్నారు, "ఓ, నేను యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన యెడల, పరిశుద్ధాత్మను పొందిన యెడల, భాషలలో నేను మాట్లాడిన యెడల, ప్రవచించిన యెడల, నా సంఘములో సాక్ష్యమిచ్చిన యెడల, చప్పట్లు కొట్టిన యెడల వారు నన్ను బహిష్కరించెదరేమో." అలాగే వెళ్ళండి.
HEB 6:4
37నీవిట్లు అనవచ్చును, "నేను క్రైస్తవ జీవితము జీవించుచున్నాను. నేను మంచి, పవిత్రమగు, శుద్ధీకరణ పొందిన జీవితము జీవించుచున్నాను. అది నిజము. కాని నీవు అసలు రూపము బయట పెట్టినప్పుడు నీవెవరివో తెలియును. నీవు సరిహద్దు విశ్వాసివి. దాని నుండి నీవు తిరిగిపోయి యున్నావు. ఒకసారి వెలిగించబడిన నీవు, అలాగయినందున నిన్ను నూతనపరచుట అసాధ్యము." చూచారా?
"ఇంకో రీతిగా చెప్పెదను, ఒక వ్యక్తి నీతీకరణను దాటి వచ్చెను, అతడిట్లు అనును, "ఇప్పుడు నేను బోధించగలను." "నేను పాపము విషయములో అలసిపోయియున్నాను." అతడు రక్షింపబడినట్లు చెప్పుకొనును. అది మంచిదే. అతడు బయటకు వెళ్ళి ఇంకా సిగరెట్లు త్రాగుచుండును. శరీరాశలు ఇంకా అతనిని లాగుచుండును. కొంత కాలము తరువాత అతడు ఇట్లనును, "దేవా, ఇది క్రైస్తవుడనగుట కాదు. మరి ముఖ్యంగా ఒక సేవకుడు స్త్రీని చెడ్డ చూపుతో చూచినప్పుడు, పొగ త్రాగినప్పుడు, కొందరితో కలిసి సానూజిక మద్యపానముగా బీరు త్రాగినప్పుడు, మంచిగా కనబడదు గదా? కావున ప్రభువా, నన్ను రక్షించుము. నన్ను శుద్ధి చేయుము." అప్పుడు ప్రభువతని శుద్ధి చేయును. సమస్త దురాశను అతనిలో నుండి తీసివేయును. అప్పుడతడు శుద్ధీకరించబడిన పాత్రగా అగును. అప్పుడు దేవుడతనికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము నిచ్చును. దానిని పొందవలెనన్నచో అతడు ఆ గుంపులో నుండి బయటకు రావలెను. అతని రంగు అప్పుడు బయట పడును. దానినతడు బయలుపరచును. అలాగు కాకుండా దానినతడు తిరస్కరించినచో ఏమగును? అతనిని శుద్ధీకరించిన యేసుక్రీస్తు రక్తమునే అతడు కాళ్ళతో తొక్కుచున్నాడు. దానిని అపవిత్రమైనదిగా ఎంచుచున్నాడు. అటువంటి వానిని రక్షించుట అసాధ్యము. చివరికి అతనికేమి సంభవించును? భయంకరమగు ఉగ్రత మరియు తీర్పు అతని కొరకు ఎదురు చూచును.
అది స్పష్టముగా యున్నదని నేను నమ్ముచున్నాను. అది సరికాని యెడల మరొకసారి నాకు తెలియచేయుము. ఇక్కడ చాలా ప్రశ్నలున్నవి.
JOHN 10:14•
JOHN 21:15,17•
HEB 13:20
38ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, యోహాను 21:15 నుండి 17 వరకు ఉన్న మాటలలోని యేసు భావమేమిటి? పేతురూ, నన్ను ప్రేమించుచున్నావా? అయితే నా గొర్రెపిల్లలను మేపుము అని పలికెను. మరల అడిగి "నా గొర్రెలను మేపుము" అనెను. 17 వచనములో మరల, "నా గొర్రెలను మేపుము," అని చెప్పెను.
దీనిని గమనించి చూడండి. క్రీస్తు గొర్రెల కాపరియై యున్నాడు. ఆయన వెళ్ళిపోవుచున్నాడు. తన గొర్రెలను వారికి ఆయన అప్పగించుచున్నాడు. ఆయన మందను కాయవలెను. అది ఆయన సంఘము, చూచారా. ఆ మందను మేపు పనిని, వాటికి కాపరిగా యుండి, గొర్రెలను కాయవలసిన బాధ్యతను ఆయన ఈ శిష్యులకు అప్పగించెను. ఆయన వెళ్ళిపోవుచున్నాడు.
DEUT 8:3•
MATT 4:4•
LUKE 4:4•
JOHN 21:16,17
39మరో రీతిగా చూడండి, ఈ ఉదయ కాలమున ఇక్కడ నేను ఆదే చేయుచున్నాను. గొర్రెలకు గొర్రెల ఆహారము ఇచ్చినప్పుడు మాత్రమే అవి ఎదుగుచుండును. ఒక మంచి మాంసపు ముక్కను వేయించి గొర్రెలకు పెట్టినా అవి ఎదుగవు, ఎందుకనగా అది గొర్రెల ఆహారము కాదు. దాని వలన ఎదుగ లేవు, చూచారా. ఒక మంచి జంతువు యొక్క కండను నేను నూనెలో వేసి గొర్రెలకు పెట్టినా అవి తినవు, ఎందుకనగా అది గొర్రెల ఆహారము కాదు. దానిని అవి తినవు, ఎందుకనగా అది గొర్రెయై యున్నది. కాని గొర్రెలు గొర్రెల ఆహారమును ఇష్టపడును. ఆ విధముగానే నీవు దేవుని మందను కాయవలసి వచ్చినప్పుడు వాటికి మానవ-నిర్మిత వేదాంత విద్యను పెట్టవద్దు; వాక్యముతో వాటిని పోషించుము. దాని ద్వారానే గొర్రెలు ఎదుగును — వాక్యముతో పోషించుము.
గొర్రెల కాపరిగా యుండుము, నిజమగు గొర్రెల కాపరిగా ఉండుము. "నా గొర్రెలను మేపుము." గొర్రెపిల్లలనగా చిన్నవి. గొర్రెలనగా పెద్దవి. చిన్నవి, పెద్దవి కలిపి దేవుని మందగా పిలువబడును, చూచారా, వాటిని వాక్యముతో పోషించుము. వాక్యమే సత్యమైయున్నది, చూచారా. యేసు ఇట్లు చెప్పెను, "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును." అది నిజమేనా? మానవుడు జీవించవలెనన్నచో, వారు దేవుని మందగా ఉండగోరినచో, దేవుని యొక్క వాక్యమను మన్నాను తినవలసి యున్నాను. ఇదే ఆయన యొక్క మన్నా!
MATT 28:20•
JOHN 6:32,33•
JOHN 14:19
40సంఘ కాలములను ఈ మధ్యనే మనం చూచి యున్నాము. దాగి యన్న మన్నా యేసే అయి యున్నాడు. సంఘమునకు క్రీస్తే మన్నాగా యున్నాడు. మన్నా అనగా ఏమిటి? పాత నిబంధనలో చూడగలరు. ప్రతి రాత్రి ఆకాశము నుండి అది కురిసినది. దానిని తీసిన సంఘము యాత్రలో జీవించియున్నది. అది నిజమేనా? ఇప్పుడు క్రొత్త నిబంధనలో మరుగైయున్న మన్నా ఏమిటి? "ఇక కొంచెము కాలమయిన తరువాత లోకము నన్ను చూడదు [మరుగైయున్నది]; అయినను మీరు నన్ను చూచెదరు, ఏలయనగా యుగ సమాప్తి పర్యంతము నేను మీతోను, మీలోను యున్నాను. ప్రతి దినము పరలోకములో నుండి తాజాగా పడుతున్న మరుగైన మన్నా ఆ క్రీస్తే.
"రెండు వారముల క్రితం నేను దేవుని గొప్ప అనుభవమును పొందాను," అని నీవు చెప్పలేవు. ఇప్పుడు నీ సంగతి ఏమిటి? ప్రతి రోజు నూతనముగా దానిని భుజించవలెను. ఒక క్రొత్త ఆశీర్వచనము. ఒక నూతన విషయము, మరుగైయున్న మన్నా పరలోకమందున్న దేవుడగు క్రీస్తు యొద్ద నుండి వచ్చుచున్నది. క్రీస్తు అను ఈ మన్నాను మనము విందుగా తినుచున్నాము. అవతలి దరిని గల మన దేశమును చేరువరకు జరుపు ఈ యాత్రలో ఆయనే మనకు బలమును ఇచ్చును.
LUKE 8:11•
JOHN 21:16,17
41"నా గొర్రెలను కాయుము," అని ఆయన చెప్పిన దానిలో అర్థము అదే. దానిని మనము చూచెదము. తక్కిన ప్రశ్నల యొద్దకు వెళ్ళుదము, ఎందుకనగా అది నాకు మంచిది. నాకది ఇష్టము. మన్నాగా ఉండిన క్రీస్తును గూర్చి, గొర్రెల యొక్క ఆహారము గూర్చి నేను మాట్లాడుచున్నాను.
క్రీస్తు అను వాక్యముతో ఆయన పోషించును, చూచారా. ఇక్కడ వ్రాయబడియున్న వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా తీసికొని దానిని గొర్రెలకు పెట్టుము. ఎవరేమి చెప్పినా వినవద్దు: "వాటికి మాంసం పెట్టండి అందురు! దానిని నీవు నమ్మవద్దు. వాటికి ఏది అవసరమో ఇచ్చట యున్నది. ఇదే అది, చూచారా. దీనిని ఇయ్యుడి. ఇది గొర్రెల ఆహారము. అందువలననే అవి ఎదుగుచున్నవి. పరిశుద్ధాత్మ, ఇది ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క ఆజ్ఞ. వాక్యమనగా విత్తనము. విత్తనము వలన చెట్టు వచ్చును. దానిని మనము భుజించెదము. సంఘము మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అదే జరుగును. ఆ మొక్క ఎదుగును. సంఘమును పరిశుద్ధాత్మ పోషించును. దేవుని సన్నిధానము సంతోషించును. జనులు ఆయన యందు విశ్వాసముంచినప్పుడు, తమ ద్వారా పని జరుపుకొనుటకు ఆయనకు అవకాశమిచ్చినప్పుడు దేవుడు తానేమి అనుగ్రహించుదునని వాగ్దానము చేసెనో దానినే అనుగ్రహించును. తన సంఘము ఎదుగవలెనని దేవుడు కోరకొనును. కావును గొర్రెలను మేపవలెను, పరిశుద్ధాత్మ మహిమపరచబడును, చూచారా. అంతే. "నా గొర్రెలను మేపుము." మంచిది.
ఇప్పుడు, నీకది సంతృప్తికరంగా లేనిచో కొంతసేపు తర్వాత మరల ప్రశ్నించుము.
42ప్రశ్న: "బ్రెన్హాం సోదరుడా, కొద్దిసేపటి క్రితం నేను ప్రార్థన వరుసలో వెళ్ళుచుండగా నా మీద అభిషేకించబడిన హస్తములు ఉంచబడినవి మరియు రక్షించబడని నా భర్త గురించి ప్రార్థించిరి. ప్రభువు యొక్క శక్తి ద్వారా నేను వధించబడితిని. అతడు రక్షించబడుననుటకు ఇది ఖచితమైన సూచనయా?"
ఒక సోదరి దీనిని వ్రాసినది. అతడు రక్షించబడుటకు ఇది ఖచ్చితమగు సూచన అని నేను తలంచుట లేదు. అతడు రక్షించబడును, అని నేను నమ్ముచున్నాను, తప్పకుండా, కాని… ఇది "యెహోవా సెలవిచ్చుచున్నాడు," అని నీవు చెప్పగలవా? కావున ఆ విషయములో జాగ్రత్తగా ఉండుము, చూచారా, పరిశుద్ధాత్మ నిన్ను ఆశీర్వదించుచుండవచ్చును, ఎందుకనగా నీవు క్రీస్తు స్థానమును తీసుకొనియున్నావు.
1COR 14:28
43నీ రక్షించబడని భర్త గురించి నీవిక్కడికి వచ్చి నిలబడి యున్నావు. పాపముతో నిండిన సంఘమును రక్షించుటకు క్రీస్తు సిలువ ఎక్కెను, చూచారా. నీవు చేసినది చాలా గొప్ప సంగతి. ఈ ప్రశ్నను వ్రాసిన వ్యక్తి ఈ ఉదయము ఇక్కడున్నదనుకొనుచున్నాను. నీవు కోరిన దానిని దేవుడు చేయనైయున్నాడని నా పూర్ణ హృదయముతో నమ్ముచున్నాను, చూచారా. దేవుడు దానిని చేయును. ఆయన నీకు ఆశీర్వచనము ఇచ్చినా, ఇవ్వకపోయినా, దేవుడు నీకు కొసరగా దానిని ఇచ్చును. అది నీకు మంచి అనుభవము నిచ్చునని నేను నమ్ముతున్నాను, ఎందుకనగా ఆయన నిన్ను దీవించెను.
నీవు భాషలతో మాట్లాడినట్లుగానే ఇది యున్నది. సంఘములో భావము చెప్పువాడు లేనప్పుడు నీవు భాషలతో మాట్లాడరాదు. ఆ భాషకర్థము చెప్పువారు ఉండవలెను. అర్థము చెప్పువారు లేనప్పుడు భాషలు మాట్లాడరాదు. నీవు నీ ఇంటిలో ప్రార్థన చేసికొనునప్పుడయినా, లేక మరే ఇతర స్థలములో యున్నప్పుడయినా నీలో నీవు మాట్లాడుకొన వచ్చును, ఎందుకనగా తెలియని భాషలలో మాట్లాడువాడు తనకు తాను క్షేమాభివృద్ధి కలుగజేసికొనుచున్నాడు. అది అతనికి ఆదరణ నిచ్చును, చూచారా. అతడు మేలు పొందును, ఎందుకనగా అచ్చట నిలబడి ప్రార్థన చేయుచున్నాడు. మొదట తెలిసికొనవలసినది ఏమనగా ఆమె లేదా అతడు భాషలలో మాట్లాడనారంభించగానే పరిశుద్ధాత్మ దిగి వచ్చును. వారి ఆత్మ ఆనందించి సంతోషించును ఎందుకనగా వారు భాషలలో మాట్లాడిరి, చూచారా.
నీవెందుకొరకు ప్రార్థించుచున్నావో దానిని అనుగ్రహించుచున్నానని దేవుడు నీతో జవాబిచ్చుచున్నట్లుగా అది సూచన కాదు, కాని నీ ప్రార్థనను పరిశుద్ధాత్మ వినుచున్నట్లుగా అది సూచన. ఆయన నిన్ను ఎరుగును మరియు ఆయన నీతో కూడా యున్నాడు. దానినే నేను దీనికి కూడా అన్వయించుదును, పరిశుద్ధాత్మ నీకు ఒక ఆశీర్వచనమును ఇచ్చుచున్నది.
44ఇక్కడ కొంతకాలం క్రిందట జరిగినది. నాకు గుర్తున్నంత వరకూ నేను భాషలలో మాట్లాడిన చివరి సందర్భము ఇదే. ఇది దాదాపుగా మూడు లేదా నాలుగు సంవత్సరముల క్రితం జరిగినది. నేను ఇల్లినాయ్ లో ఉంటిని. జయాన్ సిటీలోని ప్రార్థన వరుస వెనుక బిల్లీ నాకు తోడుగా యున్నాడు. నా హృదయం భారముతో నిండిపోయినది. నేను మోకరించి ప్రార్థించ నారంభించాను. నేను ప్రార్థించుచుండగా, బిల్లీ వచ్చి తలుపు తట్టుట నాకు వినబడినది. "బిల్లీ, ఇప్పుడు రాలేను," అన్నాను. అతడు వెళ్ళి అచ్చట కూర్చొనెను.
నేను ప్రార్థించుచుంటిని, నా హృదయం ఎంతో భారముగా ఉన్నది. ఆ విధంగా ఉండి నేను ఆలయానికి వెళ్ళలేను. చూడండి, సాధారణంగా ఆయన నాకు దర్శనమిచ్చి జరుగబోవు దానిని చూపించుచుండును, కాని ఆ సమయమున ఆయనా విధంగా చేయలేదు. నేను దూరంగా ఆ గదిలో ప్రార్థించుచున్నాను. ఎవరో మాట్లాడుట నాకు వినబడుచున్నది. నేను ప్రార్థన ఆపు చేశాను. నేను విన్నాను, ఎవరో తలుపు యొద్ద ఉండిరి. విదేశ భాషవలె వినిపించినది. జర్మన్ లేదా లో-డచ్ వలే వినిపించినది. చాలా వేగంగా మాటలు పలుకుట విన్నాను. మరల నేను విన్నాను, "ఎవరో జర్మను మనిషి ఆ పాటలకు వచ్చి యుండుననుకొన్నాను. ఎవరికో జవాబిచ్చుచున్నాడు అనుకొన్నాను."
నేను ప్రార్థన ఆపు చేశాను, దానిని వింటూ కుర్చి మీద ఆనుకొని కూర్చొన్నాను. అతడు అలాగు మాట్లాడుచునే యుండెను. "ఏమిటి? ఎవరూ అతనికి తిరిగి జవాబు ఇచ్చుట లేదే?" అనుకొన్నాను. మరల విన్నాను. "ఇది చాలా వింతగా యున్నదే," అనుకొన్నాను.
45ఆ రోడ్డు మీద బరువులు తూయు తూకమున్నది. అక్కడ వ్యక్తి ముందుకు పోనీయండి, "ముందుకు నడపండి," అని కేకలు వేయుచున్నాడు. నేను వెనుదిరిగి అటు చూచాను. చివరకు కనుగొనినదేమనగా ఆ మాట్లాడు మనిషిని నేనే. ఏ మాత్రమూ నాకు తెలియనందున చాలా మౌనంగా యున్నాను. నేను నా స్వాధీనములో లేకుండానే ఆ మాటలు పలుకుచున్నాను. ఒక్క మాట కూడా నాకు తెలియదు. నా నోరు కదులుచున్నది. నేను ఒక విధమగు భాష మాట్లాడుచున్నాను. నేను చాలా మౌనంగా యున్నాను. కొంతసేపటికి అది ఆగినది. అది ఆగిపోయినప్పుడు నాకు కేకలు వేయవలేననిపించినది. ఎంతో సంతోషంగా యున్నాను. ఎందుకో నాకు తెలియదు, కాని నా భారమంతా పోయినది.
నేను మరల ఆలయం యొద్దకు వెళ్ళి బిల్లిని పిలచుకొని వచ్చాను. నేను ఆలయం యొద్దకు వెళ్ళేసరికి బాక్సటర్ ఆ కూటమునకు నిర్వాహకునిగా యున్నాడు. అతడు పాడుచూ ఎదురు చూచుచున్నాడు. నేను అరగంట ఆలస్యంగా వెళ్ళాను. నేను ఆలస్యంగా వచ్చానని చెప్పాను. నేను కన్నీరు కార్చుట అతడు చూచుచున్నాడు, "ఏమయింది?" అని ప్రశ్నించెను.
46"ఏమి జరుగలేదు" అన్నాను. దాదాపు పది నిమిషములలో ఒక స్త్రీ వచ్చినది. ఆడిటోరియం వెనుకకు ఆమె వచ్చినది. ఆమె వెనుక సీటులో కూర్చొనబోవుచున్నది. ఆమె ఎక్కడి నుండి వచ్చినదో మేము అడిగి తెలిసికొన్నాము. ఆమె ట్విన్ సిటీస్ నుండి వచ్చుచున్నట్లు తెలిసినది. (సెంట్ పాల్ మరియు మిన్నియూపోలిస్ మధ్య ఒక చోట అది ఉన్నది.) ఆమె తీవ్రమగు క్షయ వ్యాధితో బాధపడుచున్నది. ఆంబులెన్సులో ఆమెను తెచ్పు ధైర్యము చాలలేదు. ఊపిరితిత్తులు ఆ స్థితిలో యున్నది. కొందరు సోదరులు పాత చేవర్లెట్ కారును తీసికొని వెనుక సీటులో ఆమెకు పడకను ఏర్పరచి ఆమెను పరుండబెట్టి కూటమునకు తీసికొని వచ్చిరి. ఆమె రాగోరినది. వైద్యులు ఆశను వదలుకొనిరి.
చిన్న గతుకులో పడినా గాని ఆమె ఆగని రక్తస్రావమునకు గురియగునని చెప్పిరి. అలాగే ఆమె రక్తమును కక్కినది. వారామెను తీసికొని కారు నుండి దింపి ఆరు బయట గడ్డి మీద కూర్చోబెట్టిరి. పరిశుద్దులందరూ ఆమె కొరకు ప్రార్థించుచుండిరి. ఆమె ఊపిరి పీల్చుచున్న ప్రతిసారియూ నోటి నుండి రక్తమును కక్కుచున్నది.
అకస్మాత్తుగా ఆమె స్వస్థపడినది. ఉన్న పాటునే ఆమె లేచి సంతోషించుచూ ఆలయమునకు వచ్చినది. ఆ వెనుక కూర్చొని ఆమె సాక్ష్యమిచ్చుచున్నది.
"అది ఏ సమయము?" అనడిగాను. ఆమె సమయము చెప్పినది. నేను భాషలతో మాట్లాడిన సమయము సరిగ్గా అదే. అది ఏమిటి? పరిశుద్ధాత్మ ఆమె కొరకు విజ్ఞాపన చేయుచున్నది! నా భావమును గ్రహించారా?
47దానిని గూర్చి బైబిలు చెప్పుచున్నది. కొన్నిసార్లు మనలో మనము మాట్లాడుకొనుచుందుము. దేనిని గూర్చి మాట్లాడుతున్నామో మనకు తెలియదు. కాని అక్కడ పరిశుద్ధాత్మ సంచారము చేయుచున్నది. మనము అర్థము చేసికొనలేని విషయములను గూర్చి విజ్ఞాపన చేయుచున్నది, చూచారా.
ఆమె ఉన్నపాటునే బాగయినది. ఆమె ద్వారానే ఈ సంగతి తెలిసినది, చాలా కాలం క్రితమే విన్నాము. ఆమె పరిపూర్ణముగా బాగయినది, చక్కగా ఉన్నది.
ఆ సంగతులను గూర్చి దేవుడు ఎరుగును. ఆయనకు దానిని చేయగల మార్గము ఒకటున్నది, చూచారా. ఆయన తన స్వంత విధానములో పని చేయును. ఆయన చేయు పనికి మనలను మనము అప్పగించుకొనవలెను. సత్యమును దూరము చేయు మతోన్మాదము ఒక పదునైన కత్తి వంటిది. దాని నుండి నిన్ను నీవు దూరము చేసికొనుము. అది చాలా కష్టము.
మీరు గమనించుకొననియెడల, అపవాది మిమ్మును మతోన్మాదములోనికి విసరి వేయును. మీ అనుభవమును, మీకున్న సమస్తమును మీరు పోగొట్టుకొందురు, చూచారా, గట్టి సత్యమును నీవు పట్టుకొనియుండవలెను, బైబిలును గమనించవలెను, దానితోనే నిలచియుండవలెను. దీనుని గాను, తగ్గింపు స్వభావముతోను ఉండుము. దేవుడు నిన్ను కల్వరి యొద్దకు తీసికొని వెళ్ళుచుండును. ఆ విధముగా దానితో నీవు నిలచియుండిన యెడల ముందుకు సాగిపోయెదవు.
48సోదరీ, అది నీ సంగతి వలెనే యున్నది. దేవుడు నీకు ఒక ఆశీర్వచనము నిచ్చెను. నీవు ఖచ్చితమగు సాక్షిగా యుందువు. కాని కేవలము దాని మీదనే నేను ఆనుకొనియుండలేను, చూచారా, "ప్రభువు నాకు చెప్పెను," అందువు. ఎందుకనగా నేను ఆ ఆనుభవము చెప్పియున్నాను, ఎందుకనగా అది నిన్ను నిరంతరము ప్రోత్సాహపరచు విశ్వాసమును పురికొల్ప వచ్చును. దేవుడు చేసినది ఏ కార్యమైనా గాని దాని వలన నీ మీదికి ఆత్మ వచ్చును. ఒక ఉద్దేశ్యముతోనే అది జరుగును. నీ భర్త నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యములోనికి వచ్చును. దానిని నేను నమ్ముచున్నాను.
1COR 14:34,35
49ప్రశ్న: "బ్రెన్హాం సోదరుడా, స్త్రీ సంఘములో మాట్లాడరాదనునది లేఖనపూర్వకము కాదా?"
ఇక్కడ రెండు ప్రశ్నలు ఇతడు అడిగెను. అది సత్యము. అది వాస్తవమే. స్త్రీలు సేవకులుగా యుండి ఆలయములో మాట్లాడరాదు. అది నిజము. I కొరింథీయులకు 14 వ అధ్యాయము.
ఇక్కడున్న సంఘమంతటికీ ఇది తెలియును. ఈ ఉదయ కాలమున క్రొత్త వారిక్కడ ఉండియుందురు. నాకు తెలియదు. స్త్రీ సేవకురాలిగా యుండు హక్కు లేదు. ఇది నిజము. దీనిని మీకు చదివి వినిపించాను. దానిని మీరు కనుగొందురు. దానిని మీరెరుగదురు. I కొరింథీయులకు 14వ అధ్యాయమని నమ్ముచున్నాను. ఒక్క నిమిషము ఆగండి,
స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడి యుండ వలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. [ధర్మశాస్త్రముండిన ఆ గత దినములలో యాజకులుగా ఉండుటకు స్త్రీకి హక్కు లేదు, చూచారా.]
వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల ఇంట తమ తమ భర్తల నడుగవలెను: సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.
1COR 14:36,38
50ఇక్కడ కొరింథీనీ మీరు గమనించండి. మంది కొరింథీ క్రైస్తవులున్నారు. ఆ దినమున గొప్ప దేవత, డయానా, అది రోమను దేవత. ఎఫెసు యొక్క దేవత. ప్రపంచమంతా దానిని ఆరాధించిరి. దానికి సేవకులుండిరి. అది స్త్రీ గనుక దాని సేవకులును స్త్రీలే. వారు పౌలు ద్వారా క్రైస్తవ్యములోనికి మారిరి. పౌలు ఈ ఉత్తరములను వ్రాసినప్పటికి రోమ్లోని చెరసాలలో యుండెను.
ఇప్పుడు, వారతనికి ఉత్తరములు వ్రాసిరి, చూడండి, వారు భాషలతో మాట్లాడనారంభించిరి. వారి మధ్య గొప్ప వరములు ప్రత్యక్షమాయెను. మంచిది, ఈ స్త్రీలు సేవలోనే కొనసాగవలెనని తలంచిరి.
1COR 11:8
51ఇప్పుడు, మీరు గమనించినయెడల, మీ బైబిలులో 36 వచనము చదవండి.
ఏమిటి? దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలు వెళ్ళేనా? మీ యొద్దకు మాత్రమే వచ్చెనా?
ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మ సంబంధిననియైనను తలచుకొనిన యెడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.
ఎవడైనను తెలియనివాడయితే, తెలియని వాడుగానే యుండనిమ్ము.
ఇప్పుడు, సంఘమునకు వ్రాసిన ఈ ఉత్తరము యొక్క చరిత్రను, మీరు చూడండి, చూచారా, ఈ స్త్రీలు డయానా దేవతకు సేవకురాండ్రుగా యుండిన ప్రకారమే ఇప్పుడును సేవలో కొనసాగవలెనని తలంచిరి. దేవుడు స్త్రీ కాదు; దేవుడు పురుషుడు. నిజంగా పురుషుడు మాత్రమే యున్నాడు. పురుషునిలో నుండి వచ్చిన ఉప ఉత్పత్తియే స్త్రీ. మగవాడు స్త్రీ కొరకు తయారు చేయబడలేదు గాని, స్త్రీ - మగవాని కొరకు తయారు చేయబడినది, చూచారా. మీరు మీ ఆత్మీయ గ్రహింపుతో చూడండి!
GEN 1:27
52పురుషుడు మొదట భూమి మీదికి వచ్చినప్పుడు, స్త్రీయు మరియు పురుషుడు అతడే. అతనిలో స్త్రీ, పురుష ఆత్మలున్నవి, చూచారా. స్త్రీ ఆత్మ చిన్న ఆత్మ, అది పిరికిది. మగవానిలోను స్త్రీ ఆత్మ ఉన్నది. కాని లోకమును విస్తరింప చేయుటకు ఆయన వానిని వేరుగా నిర్మించెను. అతనిలో నుండి స్త్రీ ఆత్మను తీసివేసెను. అతని ప్రక్కటెముకను తీసి, స్త్రీని తయారు చేసేను.
ఆమె ఏలుబడి చేయరాదు! ఆమె మొదట దానిని ప్రారంభించి మొత్తం మానవ జాతి పతనమగుటకు కారణమాయెను, చూచారా. పతనమునకు ఆమెయే కారణము. ఆ తరువాత దేవుడామెను తీసికొని క్రీస్తు ద్వారా స్త్రీనందు మొత్తం ప్రపంచమునకు తిరిగి జీవమిచ్చెను. సంఘములో స్త్రీ సేవ చేయుటకు ఎక్కడా అనుమతి లేదు.
1TIM 2:12
53II తిమోతీ 3వ అధ్యాయములో ఇట్లు చెప్పెను, "స్త్రీ ఉపదేశించుటకైనను, పురుషుని పై పెత్తనము చేయుటకైనను నేను సెలవియ్యను. ఆమె మౌనముగా ఉండవలసినదే," గమనించారా. స్త్రీ బోధించుట తగదు - ఇది సత్యము.
ఇప్పుడు, నిజముగా బోధించగలిగిన స్త్రీలను కొందరిని నేను చూచాను. వారు కూడా బోధించగలరు — అమీ మెక్ఫర్సన్. ఇంకా చాలా మంది స్త్రీలున్నారు. అయితే దీనిపై మీరు కొంత సేపు చేతులుంచండి, చూచారా. భాషలతో మాట్లాడగల జనులు ఈ ఉదయమున ఈ ఆలయములో కూర్చొనియున్నారని నేనెరుగుదును. అర్థము చెప్పువారు లేనియెడల, వారందుకు తెగించరాదు, చూచారా.
ఒక ప్రత్యేకమగు వరుసలో ఆ స్త్రీలు జన్మించియున్నారని మీరు గుర్తుంచుకొనవలెను. నీ జన్మకు దానితో చాలా సంబంధమున్నది. నీ పేరు, పూర్తిగా నీ గురించి, మీరు చూచారా, ఏది ఏమయినా గాని అందులో చాలా యున్నది.
1COR 14:36,38
54నేను తుపాకీ యొక్క మీట లాగి ఈ ఉదయమున ఒక మనిషిని చంపగలను, కాని అందులో ధైర్యము లేదు. కానీ ఆ పనిని నిశ్చయంగా చేయగలను. చూడండి, మీరు ఒక ఉడుతను చంపినట్లుగా నేను ఒక మనిషిని చంపగలను; కానీ అలాగు చేయ తగము, చూచారా. ఆ విధముగానే ఈ విషయములను కూడా మనము గమనించవలెను. ఇవి ప్రభువు యొక్క ఆజ్ఞలు.
వారు దీనిని వ్రాసినప్పుడు పరిశుద్ధాత్మ వారితో మాట్లాడెను. పౌలు అడుగుచున్నాడు, "ఏమిటి? దేవుని యొక్క వాక్యము మీ యొద్ద నుండియే బయలు వెళ్ళినా? మీలో నుండియే వచ్చేనా? మీలో ఎవరయినా ప్రవక్తలున్న యెడల, నేను చెప్పు ఈ సంగతులు ప్రభుని ఆజ్ఞలని గ్రహించవలెను, చూచారా. [అది నిజము!] ఎవరయినా అందుకు విముఖత చూపించగోరినచో, అజ్ఞానము చూపించినచో, అట్టివానిని అజ్ఞానిగానే ఉండనిమ్ము, చూచారా. అట్టివానిని అలాగే ఉండనీయుడి, అలాగే కొనసాగనీయుడి, చూచారా. దానికి ఏమి విముఖత చూపించరాదు." అయితే గుర్తుంచుకొనండి, ఆమె సంఘములో మాట్లాడుటకు సెలవు లేదు.
1COR 14:37•
GAL 1:8
55నీ సంఘకాపరిని గాని, మరెవరినయినా గాని నీవు ఆ విధముగానే తీర్పు చేయగలవు, అతడు ఆత్మ సంబంధియో కాదో చెప్పగలవు, చూచారా. అతడిట్లు చెప్పెను, "ఎవడైనను తాను ప్రవక్తనని గాని, ఆత్మ సంబంధినని గాని తలంచిన యెడల నేను చెప్పుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని గ్రహించవలెను," చూచారా.
ఆ కారణము చేతనే నేను ప్రజలను తిరిగి యేసుక్రీస్తు నామములో మరల బాప్తిస్మము పొందమని ఆజ్ఞాపించుచున్నాను. పౌలు అలాగున చేసెను, అతడిట్లనెను, "దీనికి విరోధముగా పరలోకము నుండి వేరొక దూత దిగి వచ్చి బోధించినా శాపగ్రస్తుడగును. దీనిని ఇక్కడ ముందే బోధించెను. "పరలోకము నుండి దూత దిగి వచ్చి ఇట్లు చెప్ప వచ్చును, స్త్రీలను బోధించనీయుడి, వారిని బోధకురాండ్రుగా అభిషేకించుడి," కానీ "అలాగు చెప్పిన వారు శాపగ్రస్తులగుదురని," బైబిలు చెప్పుచున్నది. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞయై యున్నది.
56ప్రశ్న: క్రైస్తవ స్త్రీ, పురుషులు అభినందించుకొను సందర్భముగా ముద్దుపెట్టుకొనుట మంచిదేనా?
ఖచ్చితంగా మంచిది కాదు! లేదయ్యా! నీ భార్యను మాత్రమే నీవు ముద్దుపెట్టుకొనవలెను. సోదరుడా, నీ బిడ్డను ముద్దు పెట్టుకొందువు, చూచారా.
దానిని సరిగా చదివానో లేదో మరల చూచెదను! "క్రైస్తవ స్త్రీ, పురుషులు ఒకరినొకరు అభినందించుకొనుటకు ముద్దు పెట్టుకొనవచ్చునా?"
నిశ్చయంగా పెట్టుకొనరాదు! ఆ పద్ధతిని ఎన్నడూ ప్రారంభించవద్దు. లేదయ్యా! స్త్రీ నుండి దూరముగా యుండుడి! వారిని తప్పించుకొని తిరుగుడి! ఖచ్చితముగా సరియైనది!
వారు మన సోదరీలు, పెంతెకోస్తులో కూడా దానిని పేర్కొనిరి. దానిని "ఉచిత ప్రేమ" అని పిలచిరి. అటువంటిది ఏదయినా నీవు చూచినచో దానికి దూరముగా యుండుము. అది సరియైనది!
నీవెంత పవిత్రముగానయినా యుండవచ్చును. నీవు నా సోదరుడవు, నీవు శుద్ధీకరింపబడిన పరిశుద్ధ వ్యక్తివై యుండవచ్చును. నీవెంత పరిశుద్ధముగా నున్నా నేను లెక్కచేయను, ఎందుకనగా ఇంకా నీవు మానవునివే. ఆ స్త్రీ ఎంత పరిశుద్ధురాలయినా నాకు అక్కర లేదు. వివాహము చేసికొను వరకు దూరముగా యుండుము. అది నీకు మంచిది!
57ఇప్పుడు, నేను రెండు విధములుగా మాట్లాడుతున్నాను, కావున పెద్దవారు దీనిని అర్థము చేసికొందురు. ఇది మిశ్రిత గుంపు, అయితే నేను మీ సోదరుడను, ఇది ఒక ప్రశ్న, చూచారా.
ప్రతి స్త్రీ మరియు పురుషునికి వేర్వేరు గ్రంధులుండును. ఆడవారికి ఆడ గ్రంధులుండును, లైంగిక గ్రంధి. మగవారికి మగ గ్రంధులుండును, లైంగిక గ్రంధి. ఆ గ్రంధులు పెదవులలో యుండును. అది నిజము.
ఇక్కడ మరియొక సంగతిని చెప్పువచ్చును, నోటితో ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుట చాలా అపవిత్రము. అది మురికి! అది మురికి! పురుషులు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుట వలన ఏమగును? స్వలింగ సంపర్కులు తయారగును. దాని నుండి దూరముగా తొలగిపోవుడి!
58కొంత కాలము క్రిందట ఒక వ్యక్తి నన్ను ఇట్లడిగెను, "బ్రెన్హాం సోదరుడా, వారు పరిశుద్ధమైన ముద్దుతో అభినందించుకొనుచున్నారు." వారు మెడ వెనుకగా ముద్దు పెట్టుకొనిరి, మెడ మీద వారు ముద్దు పెట్టుకొనుచుండిరి. అది కరచాలనము అమలు లోనికి రాక ముందున్న పద్ధతి. ఇది ఒక అభినందన. ఆ విధముగా ఉండేది. వారు ఒకరి చేతులు ఒకరు కలుపుకొనేవారు కారు. వారు ఒకరి నొకరు చేతులతో ఆలింగనము చేసికొని ఒకరి మెడ పైన మరియొకరు ముద్దు పెట్టుకొనుచుండేవారు. పెదవుల మీద కాదు గాని ముఖము మీద పెట్టుకొనుట ప్రారంభించిరి. దానితోనే వక్రీకరణ ప్రారంభమయినది! దాని నుండి దూరముగా పోవుడి! దానిని ఎన్నడునూ ఆచరించకుడి!
ఈనాడు మనము ఒకరితో ఒకరము చేతులు కలుపుకొనుచున్నాము. నీ సోదరుని చేతులతో కౌగలించుకొనుము, అతని మెడ మీద ముద్దు పెట్టుకొనుము, లేక అతడు నిన్ను ఆ విధంగానే అభినందించును, అది పరవాలేదు. కాని స్త్రీని నీవు ముద్దు పెట్టుకొనరాదు, ఆ స్త్రీ కూడా నిన్ను ముద్దు పెట్టుకొనరాదు, చూచారా. అది నిజము! "సోదరీ! ఈ విషయములో మనము సరిచేసికొనవలెను. ఒక్క నిమిషము ఆగుము," అని ఆమెను నివారించుము, చూచారా. కావున, ఇప్పుడు ఆ విధముగా మీరు చేయుడి.
59మొదట నేను ప్రారంభించినప్పుడు కొద్ది సేపటి క్రితం ఏమి చెప్పాను? ఒక కారు రోడ్డు మీద గంటకు తొంబది మైళ్ళ వేగంతో వచ్చుచున్నదనుకొనండి, నీవు దారిలో నుండి తప్పుకొందువు. అది క్షేమము. అది వంకరలు తిరుగుట చూడగానే నీవు పక్కకు పోయెదవు. దారిలో నుండి తొలగిపోయెదవు. నీవు ఆ చోట ఉండరాదు. నీ ఆత్మను బ్రద్ధలు చేయు దానిని సాతాను నీ ముందుంచును. ఆ తరువాత నిన్ను నరకమునకు పంపును. దాని నుండి దూరముగా తొలగిపొమ్ము. చెడు కనబడినప్పుడు దాని నుండి నీవు తొలగిపొమ్ము. అది నిజము.
ఒక నిమిషము పాటు స్త్రీని చూచుదము. అది అసామాన్యము, కదా? "ఓ స్త్రీయే అందుకు కారణమని," అందురు. "ఓ, అది స్త్రీ యొక్క తప్పు అందురు, ఆమె తన స్థానము దాటిపోరాదు. అలాగే పురుషుడు తన స్థానమును దాట రాదు." ఇది సత్యము. అది సత్యము అని మనందరమూ దానిని ఒప్పుకొందుము. ఆమె తన స్థానము నుండి తొలగిపోవును. చెడ్డ స్త్రీ వలన చెడ్డ పురుషుడు తయారగును; కాని గుర్తుంచుకొనండి, చెడ్డ పురుషుడు లేకుండా చెడ్డ స్త్రీ తయారు కాదు. అది నిజము!
GEN 3:1,2•
2TIM 2:16
60దేవుని కుమారులమని చెప్పుకొనుచున్న మీరు, మీ యొక్క నియమములను ఎక్కడ పెట్టిరి? స్త్రీ తన చోటు నుండి కదలనియెడల, నీవు దేవుని కుమారునివి కావు గదా! నీవు మరి బలమగు, ఉన్నతమగు పాత్రవు కదా? ఆమె బలహీన ఘటమని, బైబిలు చెప్పుచున్నది. ఒకవేళ ఆమె బలహీనురాలైతే, నీవు దైవజనునివని చూపించుకొనుము. "సోదరీ! నీవు తప్పులో యున్నావు," అని చెప్పుము. అది మంచిది. నేను అలాగు చేశాను, ఇంకా చాలామంది క్రైస్తవులు అలాగు చేసిరి. క్రైస్తవునిగా ఉన్నంత కాలము నీవు అలాగే చేయుదువు. అయితే నీవు దేవుని కుమారునివి అని నిన్ను నీవు చూపించుకొనుము. స్త్రీ కంటే నీకు ఎక్కువ శక్తి యున్నది. ఆమె బలహీనురాలయితే ఆమె బలహీనతను గుర్తించుము, ఆమె పొరపాట్లను అర్ధము చేసికొనుము. ఆమెను సరిదిద్దుటకు ప్రయత్నము చేయుము, ఇట్లు చెప్పుము, "సోదరీ, మనము క్రైస్తవులము. మనము అలాగు చేయరాదు." నిజమైన మగవానిగా యుండుము, దేవుని కుమారునిగా యుండుము, స్త్రీని గమనించుము.
ఆదియందు గొప్ప పతనము ఇచ్చటే ప్రాంరభమాయెను. హవ్వతో సాతాను చేరినది. అందువలననే మొత్తం జాతి వినాశనమునకు గురి అయినది.
నీవు దేవుని కుమారునివైనచో, బలముగా ఉండుము, నిజమగు మగవానిగా యుండుము. ఆ విధముగా నీవు లేనియెడల, ఆ విధముగా అగువరకు బలిపీఠము నొద్ద నిలచి యుందుము. చెడు కనబడినచో అసహ్యించుకొనుము. అలాగు అభినందించుట తగదు.
61ఇక్కడ మన సంఘములో రెండు లేదా మూడుసార్లు కొంత కాలం క్రిందట అలాగు చేసిరని ఎవరో నాతో చెప్పిరి. అంటే ఈ సంఘములో కాదు, కాని ఈ సంఘమునకు వచ్చు జనులని చెప్పిరి. ఒకవేళ వారు ఈ ఉదయమున ఇచ్చట కూర్చోనియున్నచో మీ మేలు కోరకే దీనిని ఎత్తి చూపుతున్నానని తెలిసికొనవలెను, చూచారా.
స్త్రీలు, యవన స్త్రీలు, ఇక్కడికి వచ్చుచున్నారు. ఆ స్త్రీలను ఈ మగవారు ముద్దు పెట్టుకొన్నచో బాగుండునా? అలాగు మిరు చేయరాదు. అట్టివానిని ప్రోత్సహించరాదు. దానిని మీరు గుర్తుంచుకొనవలెను. ఆమె ఒంటరిగా యున్నదే కావచ్చును, లేక మరే రకమయిన స్త్రీ అయినా కావచ్చును. ఒక దినమున ఆమె ఒకరికి భార్యగా ఉండును. నీవు ఆ పని చేయుటకు నిర్ణయింపబడలేదు. ఆమె నుండి దూరముగా పొమ్ము. ఆమెను నీవు అభినందించవలెనన్నచో దేవుని కుమారునిగా యుండి, ఆమెతో కరచాలనము చేయుచూ, "సోదరీ, బాగున్నావా?" అని ప్రశ్నించుము. అంతటితో దానికి అంతము పలుకుము, చూచారా.
ఆ సంగతులకు దూరముగా యుండుము. అది రోత, దాని వలన నీవు త్వరలోనే ఆపదలో పడుదువు. పాపము చాలా తేలిక. అది ఎంతో ఆనందముగాను, ఆహ్లాదకరముగాను ఉండును. దానిలో పడుట చాలా సుళువు, అందువలన చేయవలసిన అత్యుత్తమ పని ఏమనగా, అది కనబడిన చోట నుండి పారిపొమ్ము. వెనుకకు పొమ్ము! నిజమైన క్రైస్తవునిగా ఉండుము!
62మగవారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుట గూర్చి చూద్దాం. నీవు నీ సోదరుని మెడ మీద ముద్దు పెట్టుకొనినచో, అది మంచిదే. ఏ పురుషుని నోటి మీదను, పెదవుల మీదను ముద్దు పెట్టుకొనవద్దు, ఎందుకనగా అది సరి కాదు, చూచారా. అసలు ప్రారంభములోనే తప్పున్నదని అందువలన అర్థమగును, చూచారా. కావున దాని నుండి దూరముగా తొలగిపోవుడి, దానిని తప్పుకొని పోవుము. ఈ ఆలయములో దానిని ఆచరణలో పెట్టవద్దు. నిశ్చయముగా అందుకు మేము సమ్మతించము, చూచారా.
నీ సోదరుని నీవు చూడగోరిన యెడల, అతని మెడ మీద ముద్దు పెట్టుకొనగోరిన యెడల అలాగే చేయుము, కాని పెదవుల మీద ముద్దు పెట్టుకొన రాదు, ఎందుకనగా అది మంచిది కాదు. అది సరి కాదు! దానివలన వక్రీకరణ ప్రారంభమగును. స్వలింగ సంపర్కులు అందు మూలముగానే ప్రారంభమయిరి.
అటువంటివాని వలన రెండు విషయములు మాత్రమే బయటకు వచ్చును. చాలాసార్లు జనుల మధ్య ఇది జరుగును. నేను సంఘములను చూచాను. బోధకులు వచ్చుచుందురు. వారు ప్రతి సోదరుని సమీపించి ముద్దు పెట్టుకొని కూర్చొందురు. "సోదరీ, బాగున్నావా? హల్లెలూయా!" అని చెప్పి ఆమె యొద్దకు వెళ్ళి ముద్దు పెట్టుకొందురు. అటువంటి సంఘములను చూడండి. నాకయితే అది తప్పుగా యున్నది.
63మేము ఫిన్లాండులో యుంటిమి. మీరు దీనిని వినియుందురు. అక్కడ మేము కూటములలో యున్నాము. నేను వై.యం.సి.ఎ. నందున్నాను. ఫిన్లాండులో సబ్బులు గాని, డిటర్జెంట్లు గాని ఉండవు. నా యొద్ద గడ్డము గీయుటకు ఉపయోగించు సబ్బు ఉన్నది. మేమందరము వరుసలో యుండి త్వర త్వరగా స్నానము చేయవలసి యుంటిమి. ఈ గడ్డము గీసికొనుటకు ఉపయోగించు సబ్బుతో స్నానము చేసితిమి. మా యొద్ద ఒక ముక్క ఉన్నది. ఫిన్లాండులో సబ్బు దొరకదు. వారు ఒక రకమగు దానితో శుభ్రము చేసికొందురు. అది దాదాపు చర్మమును పీకునట్లు చేయును.
ఫిన్నిష్ స్నానపు తొట్ల యొద్దకు వారు మమ్ములను తీసికొని వెళ్ళుచున్నట్లు చెప్పిరి. మేము వై.యం.సి.ఎ. యొద్దకు వెళ్ళితిమి. మేము స్నానము చేయుటకు వెళ్ళియున్నాము. అది చాలా ప్రసిద్ధమగు ఫిన్నిష్ స్నాన విధానము. ఇంతకు ముందు దానిని నేనెరుగుదును. చాలా చక్కగా యుండును. వై.యం.సి.ఎ యొద్దకు వెళ్ళుచున్నాము గనుక చాలా బాగుండునని తలంచాము.
కానీ అక్కడికి నేను బయలుదేరినప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఇట్లు చెప్పెను, "నీవక్కడికి వెళ్ళరాదు." పరిశుద్ధాత్మ యొక్క సలహా మనకు ఎంతో మేలుకరము. "అది చేయవద్దు," అనెను.
"ఈ ఉదయము నాకు స్నానమక్కరలేదు," అని చెప్పాను.
డాక్టర్. మానిన్ ఇంకా ఇతరులు ఇట్లు చెప్పిరి, "ఓ, బ్రెన్హాం సోదరుడా, అక్కడ పెద్ద అద్దపు గదులున్నవి. అది చాలా అందముగా ఉండును."
64ఈ విధముగా స్నాన విధానములో వేడి రాళ్ళ మీద నీరు పోయుదురు. అప్పుడు నీరు మరుగును. ఒక చెట్టు ఆకులతో నిన్ను తాకుదురు. ఆ వెంటనే బయటకు వచ్చి చలి నీటిలో మునిగెదరు. ఆ ఫిన్నిష్ వారు మంచులోనికి పోవుటకు అలవడి యుందురు. వారికది మామూలు అయిపోయినది. వారు చాలా ఉన్నత దేహులు, పెద్దవారు, దృఢకాయలు. ఆ తరువాత వారు వచ్చి ఈ వేడి నీటి స్నానమును చేయుదురు. వెనువెంటనే చలి నీటి లోనికి దిగెదరు. కాని వారు నన్ను చల్లని గాలి యున్న చోట నిలువబెట్టిరి, కాని నేను వారి వలెనే స్నానము చేయలేను. అందువలన గుండె ఆగిపోయినంత పని అగును. అలవాటు లేనిచో దానిని చేయజాలరు. వారిని నేనెంతో ఇష్టపడుదును, నన్ను కూడా వారు రమ్మని చెప్పిరి.
నా సోదరుడు హోవార్డ్, సహోదరుడు బాక్సటర్, ఇంకా ఇతర సోదరులు అందరూ అక్కడికి వెళ్ళుచుండిరి. అందరూ మాట్లాడుకొంటూ వెళ్ళుచుండిరి. నాకు ఒక విధంగా బిడియము వేసినది, ఎందుకనగా పరిశుద్ధాత్మ నన్ను "వెళ్ళరాదని" చెప్పినది.
65కావున మేము వై.యం.సి.ఎ. యొద్దకు వెళ్ళి యున్నాము. జనులందరూ అచ్చట గుమిగూడి యుండిరి. కూటముల గూర్చి వారు ప్రతి రోజూ వార్తా పత్రికలో ప్రధాన వార్తగా ప్రచురించుచుండిరి. ప్రతి రోజూ మొదటి, రెండు పేజీలలో కూటముల గూర్చి వ్రాయుచుండిరి. నేను చిన్న గదిలోనికి వెళ్ళి కూర్చొన్నాను. వారందరూ బట్టలు మార్చుకొనుటకు గదిలోనికి వెళ్ళిరి. వారు గదిలో దుస్తులు మార్చుకొనుచుండగా చక్కని రూపము గల చిన్న ఫిన్నిష్ యువతి వచ్చినది. వారు చాలా చక్కని వారు. వారు నైతికంగాను, పవిత్రముగాను యుందురు. ఈమె భుజముల మీద తువాలు వేసికొని గదిలోనికి వచుచున్నది. "ఇదిగో! ఆగు ఆగు" అన్నాను. నేను ఆమెను ఆపుటకు నేను ప్రయత్నించాను. ఆమె చూచీ నవ్వుకొంటూ లోనికి వెళ్ళి, (ఆ మగవారికి బట్టలు లేవు) వారిలోని ప్రతి ఒక్కరికి ఒక తువాలు ఇచ్చిరి. ప్రతి స్త్రీ వచ్చి, ఒక పురుషుని తీసుకొని, వారి వీపులను తోముట ప్రారంభించిరి. పరిశుద్ధాత్మ అనగా ఏమిటో నేను చూచాను. కావున నేను బయటకు వచ్చినప్పుడు, నేను అన్నాను, "డాక్టర్. మన్నినెన్, అది ఏలాగు, మీరు క్రైస్తవులై యుండి మరియు ఆలాగు వెళ్ళుచున్నారు, ఏలాగు వారితో ఆ వేడినీటి స్నానము చేయుచున్నారు…"
"ఓ, బ్రెన్హాం సోదరుడా, తుడిచే స్త్రీ," అనిరి.
"ఎవరైనా నేను లెక్క చేయను. అది సరి కాదు. ప్రకృతి నీకు దానిని నేర్పించుచున్నది," అని నేను అన్నాను.
"బ్రెన్హాం సోదరుడా, వారు బాల్యము నుండియు తుడుచు వారుగా పెంచబడియున్నారు. మీ అమెరికాలో నర్సుల వలెనే యున్నారు; వారు ఈ పని కొరకు పెంచబడిరి," అన్నాడు.
"వారు ఎవరయినా నేను లెక్క చేయను. అది తప్పు. పూర్తిగా తప్పు. స్త్రీలు మరియు పురుషులు వేరుగా యుండవలెను. వారి బట్టలు కూడా వేర్వేరుగా యుండవలెను," అన్నాను. ఆమేన్.
నేను దీనిని చెప్పవలెననుకొనలేదు, కొద్ది సేపటి క్రితం నేను ప్రారంభించినది మరొకటి గదా? సరే చూడండి.
66ప్రశ్న: "అపోస్తలుల విశ్వాసమును వివరించుము."
అది ఒక్క ప్రశ్న. ఒకటి, రెండు, మూడు ప్రశ్నలున్నవి. అపోస్తలుల విశ్వాసమనగా అర్థము, "అపోస్తలుల యొక్క విశ్వాసము." అపోస్తలుల విశ్వాసమనగా అదే భావము. బైబిలులో నిలచి యుండుటయే. ఈనాడు చాలామంది మాది అపోస్తలుల విశ్వాసమని చెప్పుకొనుచున్నారు, కాని వారిలో అనేకులు బైబిలుతో నిలచియుండుట లేదు. బైబిలులో అపోస్తలుల యొక్క విశ్వాసమున్నది. అపోస్తలుల విశ్వాసమనగా అదే అర్థము. మంచిది.
67ప్రశ్న: "… ఒక గుంపు వారు తాము సనాతనవాదులమని చెప్పుకొనుచున్నారు, ఈ రెండు గుంపుల వారు రక్షింపబడుదురా?"
ఇప్పుడు, నాకు తెలియదు. చూచారా, దీనికి జవాబు ఎట్లు ఇవ్వవలెనో నాకు తెలియదు. ఇప్పుడు, "ఈ గుంపులు రక్షించబడునా?" నాకు తెలియదు.
ఆత్మకును… మధ్యనున్న భేదమును వివరించుము.
ఇప్పుడిది వేరే ప్రశ్నయైయున్నది.
ఆ రెండు గుంపులు రక్షించబడునా? ఇప్పుడు, నాకు తెలియదు. చూచారా, దానికి సమాధానము ఎలా చెప్పాలో తెలియదు. ఇప్పుడు, ఈ రెండు గుంపులు రక్షిపబడినవా? నాకు తెలియదు. ….ఆత్మకు తేడాను వివరించుము. ఇప్పుడు అది మరొక ప్రశ్న. ఆ రెండు గుంపులు రక్షింపబడినవా? ఈ విషయమును మీకు మరింత విశదమగునట్లుగా చెప్పెదను. నాకు తెలియదు. దానిని నేనెరుగును. ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఇది నా ఆలోచన. బహుశా తప్పు కావచ్చును. రోమను కాతలిక్కులు, మెతడిస్టులు, ప్రెస్బిటేరియనులు, చర్చి-ఆఫ్-క్రైస్ట్ వారు, లూథరనులు ఇంకా చాలా మంది యున్నారు. వారెవరయినా గాని ప్రభువైన యేసుక్రీస్తు నందు సంపూర్తిగా విశ్వాసముంచి, రక్షణ కొరకు ఆయనను ఆశ్రయించినచో రక్షింపబడుదురని నేను నమ్ముతున్నాను.
కాని చూడండి, కాతలిక్కు సంఘము అలాగున చేయదు. సంఘమే వారిని రక్షించునని వారు నమ్ముదురు, చూచారా. వారి రక్షణ సంఘములోనే యున్నది. ఒక రోజున ఒక మత పూజారి ఇట్లు బాహాటముగా చెప్పుట మీరు విన్నారు గదా? సంఘములో తప్ప మరెక్కడునూ రక్షణ లేదు. రోమను కాతలిక్కు సంఘములో మాత్రమే యున్నది. అది తప్పు. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగును. ఇది నిజము. సంఘము ద్వారా కాదు గాని, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ వచ్చును.
ఇప్పుడు, అపోస్తలిక్ అని, మరియు సనాతనవాదులమని చాలామంది చెప్పుకొనుచున్నారు…
ROM 8:1
68ఒక సనాతనవాది నా యొద్దకు వచ్చెను, ఎంతో కాలము కాలేదు, నన్ను ఇట్లడిగెను, "మీరు ఒక రకమగు కాల్వినిస్టులు గదా?"
"కాల్విన్ బైబిలులో యున్నంత కాలము నేను అతనివాడనే. నేను బైబిలు యొద్దకు వెళ్ళుదును. కాల్విన్ బైబిలులో నిలచియుండిన చాలును; కాని అతడు బైబిలును విడిచి వెళ్ళిపోయిన యెడల, నేను మాత్రం బైబిలునే నమ్ముదును," అన్నాను.
"నీకు ఒక సంగతి చెప్పగోరుచున్నాను. ఒక వ్యక్తి ఒకసారి రక్షించబడినయెడల, మరెన్నడునూ అతడు నశించిపోడని నీవు చెప్పగా విన్నాను," అన్నాడు.
"వాక్యము ఖచ్చితంగా అదే చెప్పుచున్నది: 'నిత్యజీవమును పొందినవాడు ఎన్నడునూ శిక్షలోనికి గానీ, తీర్పులోనికి గాని రాడు. అట్టివాడు మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు,'" అని చెప్పుబడెను. "ఇది నా మాట కాదు. యేసుక్రీస్తు దానిని చెప్పెను."
"అయితే ఒక సంగతి నిన్ను అడిగెదను. సౌలు రక్షించబడెనని నీవు నమ్ముచున్నావా?" అనడిగాడు.
"సౌలు, రాజగు సౌలా?" అనడిగాను.
"అవును," అన్నాడు.
"నిశ్చయంగా," అన్నాను.
"అతడు ప్రవక్త అని నీకు గుర్తున్నది గదా?" అనడిగాడు.
"అది సరియే, ప్రవక్తలతో కూడా కలిసి అతడు ప్రవచించెనని వ్రాయబడియున్నది గదా? అతడు ప్రవక్త కాడు గానీ అతనికి ప్రవచన వరమున్నది, ఎందుకనగా అతడు అక్కడ ప్రవక్తల యొద్దకు వెళ్ళి వారితో కూడా ప్రవచించెను. కాని ఆ దినమున సమూయేలు ప్రవక్తగా ఉండెనని మనకు తెలియును. కానీ సౌలు ప్రవక్తలతో కలిసి ప్రవచించుచుండెను."
"అతడు ప్రవక్త అయితే రక్షించబడియుండును," అని అన్నాడు.
"నిశ్చయంగా!" అన్నాను.
"అయితే ఒక విషయం నిన్ను అడుగుచున్నాను. ఒక సంగతి చెప్పుము. సౌలు రక్షించబడెనని నీవు చెప్పుచున్నాను. ప్రభువు యొక్క ఆత్మ అతనిలో నుండి తప్పుకొనినదని బైబిలు చెప్పుచున్నది. అతడు దేవునికి శత్రువాయెను. అతడు ఆత్మహత్య చేసికొనెను. అతడు రక్షింపబడెనని ఇప్పుడు నీవు చెప్పగలవా?" అనడిగాడు.
1SAM 16:14
69"నీవు సనాతనవాదివి? సోదరుడా, నీవు దానిని సరిగా చదువలేదు, అంతే. లేఖనము చెప్పిన దానిని నీవు చదువు లేదు," అని నేను అన్నాను.
"దేవునికి శత్రువుగా సౌలు మారెను గనుక అతడు రక్షించబడజాలడు," అన్నాడు.
"సౌలు రక్షించబడెను," అన్నాడు.
"ఓ!" అన్నాడు…
"అతడు ప్రవక్త, అతడు రక్షింపబడవలసియున్నాడు, చూచావా. దేవుడతనిని రక్షించెను, మరియు మనమనుకొనినట్లుగా దేవుడు ఇండియను దాత కాడు. దేవుడు నీకు పరిశుద్ధాత్మను ఇచ్చెను, కాని నీవు ఏదో ఒక రోజున నశించెదవని ఆయనకు తెలిపినచో ఆయన నీకు పరిశుద్ధాత్మను బుద్దిహీనముగా ఇచ్చిన వాడగును. అసలు ముందే ఆయన దానిని ఇవ్వడు గదా!" అన్నాను.
1SAM 15:9
70నీవు పరిశుద్ధాత్మను అనుకరించ వచ్చును మరియు పరిశుద్ధాత్మను పొందియున్నట్లుగా నటించ వచ్చును, కాని నీవు పరిశుద్ధాత్మను కలిగియుండినయెడల నీకు దేవుడే ఆది, అంతముగా యుండును. అది నిజము. దేవుడు అనంతుడు. ఆదిలోనే ఆయనకు అంతము తెలియును. ఏమి జరుగునో ఆయనకు పూర్తిగా తెలియును. భూమి మీద ఉండబోవు ప్రతి పూవును, ప్రతి దోమను ఆయన ఎరుగును. ఏదీ లేక ముందే ఇదంతయూ ఆయనకు తెలియును. కావున ఆయన తాను చేయుచున్న పనిని ఎరుగును. కావున అర్థరహితముగా ఆయన పని చేయడు.
నీవు నిజముగా పరిశుద్ధాత్మను పొందినచో నిత్యముగా రక్షించబడెదవు. లేఖనముల ద్వారా దానిని రుజువు చేసెదను, దానిని ఆయా సమయములలో చూచుచున్నాము. కాని సమయము ఇప్పుడు లేదు, ప్రశ్నలు చాలా యున్నవి, చూచారా, ఈ వ్యక్తి అడిగినదానిని చూచారా? "అయితే సౌలు రక్షించబడేనని నీవందువా?"
"నిశ్చయంగా, సౌలు రక్షించబడెను. గుర్తుంచుకొనుము, సౌలు వెనుకకు జారెను. దానిని నేను అంగీకరించెదను. అతడు వెనుకకు జారెను. దేవుని నుండి దూరముగా పోయెను, ఎందుకనగా అతనికి గర్వము వచ్చెను. డబ్బును ఆశించెను. అతడు ఎన్నో బలులను తీసికొని వచ్చెను. వాటినన్నిటిని నాశనము చేయవలెనని యెహోవా మాట ద్వారా సమూయేలు పలికెను. కాని అతడు రాజును రక్షించెను, చాలా జంతువులను దాచి పెట్టెను… చూచావా, దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా వెంబడించుటకు బదులుగా దానికి స్వంత అభిప్రాయమును కలిపెను. అదే వెనుకకు జారుట," అని చెప్పాను.
శాఖలు గూర్చి అదే నేను తలంచుచున్నాను. వారు వెనుకకు జారిరి, ఎందుకనగా వారు వాక్యమును వెంబడించుట లేదు. నీవు వారికి వాక్యము చూపించుము, వారు దానిని కాలదన్ని వెళ్ళిపోవుదురు, "ఓ, మా సంఘము ఈలాగు బోధించుచున్నది," అని అందురు. అది సరి కాదు; దేవుడు చెప్పునది అదే!
1SAM 15:9•
1SAM 16:14•
1SAM 28:6,9,10,13
71సౌలును అక్కడికి వెళ్ళి సమస్తమును నాశనము చేయమని చెప్పెను. ప్రతి దానిని హతమార్చ వలెనని ఆజ్ఞ ఇయ్యబడినది. దానిని చేయుటకు బదులుగా కొన్నింటిని బలి కొరకు దాచి యుండెను. రాజు యొక్క ప్రాణమును కాపాడెను. సమూయేలు అతని యొద్దకు వచ్చి దేవుని ఆత్మ అతనిని విడిచి పెట్టెనని చెప్పెను.
సమూయేలు చనిపోయెను. సౌలు మీద నుండి దేవుని ఆత్మ తొలగిపోయెను గాని అతడు నశించిపోలేదు. నిశ్చయంగా, నశించిపోలేదు. అతని మీద నుండి ఆభిషేకము తొలగిపోయెను. దానిని ఇప్పుడు గమనించండి.
సౌలు దేవుని నుండి దూరంగా పోయెను. అతడు యుద్ధము చేయ వెళ్ళెను. యుద్ధమునకు వెళ్ళు ముందుగా ఆలోచన చేయగోరెను, ఒక కలను ఇమ్మని ప్రభువును అడిగెను. ప్రభువతనికి కలను ఇవ్వలేదు. ఆ దినమున దేశములో ప్రవచనము లేదు. ప్రవక్తలు లేరు. సమూయేలు ఒక ప్రవక్త. ప్రవచనములు పలుకు వారుండిరి, కాని ఏ విధముగాను అతనికి దేవుని నుండి జవాబు రాలేదు. ఊరీము, తుమ్మిము యొద్దకు కూడా వెళ్ళి అడిగెను. ఊరీము మరియు తుమ్మిము మీద పడిన వెలుగు కూడా అతనికి ఏ జవాబును ఇయ్యలేదు. అతడేమి చేసెను? ఒక గుహ యొద్దకు వెళ్ళెను. అక్కడ ఒక సోదే చెప్పు స్త్రీ యున్నది. అతడు ఒక మామూలు బాటసారి వలె మారు వేషము ధరించెను, "ప్రవక్తయగు సమూయేలు ఆత్మను పిలచేదవా?" అనడిగెను.
మరియు ఆమె చెప్పెను, "మంచిది, సౌలు ఏమి చెప్పెనో నీకు తెలుసు." (ఆమె సౌలుతో మాట్లాడుచున్నది, కానీ అది ఆమెకు తెలియదు.) చెప్పెను, "సోదే చెప్పువారందరు చంపబడవలెను అని సౌలు చెప్పెను."
"సౌలు నుండి నీకు ఏ హానియు రాకుండా నేను చూచెదను, కాని సమూయేలు ఆత్మను రప్పించుమని," ఆ స్త్రీతో చెప్పెను.
కావును ఆ స్త్రీ సోదే చెప్పనారంభించినది, సమూయేలు పైకి లేచుటను ఆమె మొదట చూచెను. అతని ఆత్మ వచ్చుచున్నది. వారి ఎదుట నిలబడినవి, "భూమి మీద నుండి దేవతలు లేచి వచ్చుట నాకు కనబడుచున్నది," అన్నది.
1SAM 28:15,16,19
72అది ఓదార్పులో ఒకటి. వృద్ధ సమూయేలు అక్కడ నిలబడి యుండుటను చూడండి. అప్పటి కతడు చనిపోయి రెండు సంవత్సరములయినది, కాని అక్కడ నిలబడి యున్నాడు. తన ప్రవక్త దుస్తులు ధరించుకొని అతడచ్చట నిలబడియున్నాడు. ఇంకా అతడు జీవించి యుండుట మాత్రమే కాదు గాని ప్రవక్తగానే యున్నాడు. హల్లెలూయా!
"నీవు నన్ను మోసము చేసితివి!" అన్నదామె.
సౌలు ఇట్లనెను, "సమూయేలూ, నాకేమి చేయవలెనో తెలియుట లేదు. రేపు నేను యుద్ధమునకు పోవుచున్నాను. ఆత్మ నా యొద్ద నుండి తొలగిపోయి యున్నది. ప్రభువు యొద్ద నుండి ఒక్క కల కూడా నాకు రాలేదు. ఊరీము మరియు తుమ్మిము నాతో మాట్లాడలేదు. నేను భయంకరమగు స్థితిలో ఉన్నాను."
అతడిట్లనెను, "నీవు దేవుని శత్రువువై యున్నావు. నన్నెందుకు విశ్రాంతిలో నుండి రప్పించి యున్నావు? దేవునికి విరోధివైన నీవు నన్నెందుకు విశ్రాంతిలో నుండి రప్పించియున్నావు?" చూచారా? అయినా గాని యెహోవా వాక్కును అతనికి చెప్పెను. గుర్తుంచుకొనండి, అతడు చనిపోయి రెండు సంవత్సరములయినది, చూచారా. అయినా గానీ వాక్యమును చెప్పెను. ప్రభువు యొక్క మాటను చెప్పెను. యెహోవా యొక్క వాక్కును చెప్పెను. అతడిట్లనెను, "రేపు నీవు యుద్ధములో కూలి పోవుదును. నీతో పాటుగా నీ కుమారుడగు యోనాతాను కూడా కూలిపోవును. రేపు రాత్రి ఈ సమయమునకు నీవు నాతో కూడా ఉందువు." సమూయేలు ప్రవక్త నాశనమునకు పోలేదు కదా? సౌలును అక్కడికే వెళ్ళెను. సనాతనవాదమని అందుకే దానిని పిలిచారు, చూచారా. "రేపు రాత్రి ఇదే సమయమునకు నీవు నాతో కూడా యుందువు. అతడు నశించినట్లయితే సమూయేలు కూడా నశించినవాడే అగును, చూచారా. సౌలు నశించినట్లయితే సమూయేలు కూడా నశించినవాడగును, ఎందుకనగా వారిద్దరూ ఒకే స్థలములో యుండిరి.
73వారు నామకార్థులగు సనాతనవాదులు. నామకర్థమగు క్రీస్తు సంఘము వలెనే యున్నారు. నామకార్థ క్రైస్తవుల వలె యున్నారు. ఈ రోజున మీరు అమెరికా వారు గనుక క్రైస్తవులుగా పిలువబడుచున్నారు. అమెరికనులందరూ క్రైస్తవులను కొనుచున్నారు, చూచారా. అది నామకార్థ క్రైస్తవ్యము. కాని ఒక నిజమైన క్రైస్తవుడు ఆత్మ మూలముగా తిరిగి-జన్మించినవాడు, ఆత్మ మూలముగా జన్మించిన స్త్రీ. మిగిలిన వారు అనుకరణలు చేయువారు, కాని నిజమయిన క్రైస్తవులు దేవునిచే పిలువబడినవారు.
74ప్రశ్న: "ఆత్మకును, ప్రాణమునకును మధ్య గల తేడాను వివరించుము."
అది కష్టమైన ప్రశ్న. మొదట నీవు త్రిత్వ జీవివని గ్రహించవలెను. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ వలెనే యున్నావు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను మూడు బిరుదులు ఒకే వ్యక్తికి చెందును. ఆయనే యేసుక్రీస్తు. నీవు శరీరము, ప్రాణము, ఆత్మలను కలిగి యున్నావు. ఆ మూడు మూలముగా నీవు తయారైయున్నావు. ఏ ఒక్కటి అందులో లోపించినా, నీవు తయారు కావు. ఆ మూడింటి వలన నీవు తయారగుచున్నావు.
ఒక రోజున ఇట్లు నేను చెప్పాను, "ఇది నా చేయి, ఇది నా వ్రేలు, ఇది నా ముక్కు ఇవి నా కన్నులు, కాని అసలు నేనెవరిని?" నేనెవరికి చెందియున్నాను. నా అంతరంగమందు అది ఉన్నది - అదే జ్ఞానము.
ఈ కన్నులు, ఈ చేతులు, ఈ శరీరము ఈనాడున్నట్లుగా నిలచియున్న యెడల, నిలచియుండవు. నా శరీరము ఇక్కడ విడిచిపెట్టబడును. నేను వెడలి పోవుదును. నా అంతరంగమందున్నది ఎగిరిపోవును. అదియే ఆత్మ. ప్రాణము యొక్క స్వభావమును ఆత్మ కలిగియున్నది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీ ఆత్మను అది మారి నూతనముగా చేయును. ఆ ఆత్మ వేరయిన స్వభావమును పొందును. కాబట్టి నీ ప్రాణము యొక్క స్వభావమును నీ ఆత్మ కలిగియున్నది.
మొదట నీవు చెడ్డవానిగా, దుష్టునిగా, నీచునిగా యుంటివి, పూర్వము నీవు జగడములకు, కలహములకు ముందుటివి. ఇప్పుడు నీవు ప్రేమను, మాధుర్యమును, దయను కలిగియున్నావు. ఆ భేదమును చూచావా? అది నీ స్వభావము. నీ ఆత్మ మారిపోయినది, పాత ఆత్మ చనిపోయినది, క్రొత్త ఆత్మ క్రొత్త స్వభావముతో జన్మించి యున్నది, చూచారా.
75నీ మెదడు నీ తెలివి కాదు; నీలో ఉన్న ఆత్మయే జ్ఞానమును కలిగించును, చూచారా. నీ మెదడు ఒక మాంసపు ముద్ద మరియు కణములతో నిర్మించబడినది. దానిలో తెలివి లేదు. అది అక్కడ ఉండిన యెడల నీవు చనిపోయినా, బ్రతికి ఉన్నా అది ఇంకా పనిచేయుచునే యుండును, చూచారా. నీ మెదడు కాదు; నా అంతరంగమందు. ఆత్మ యున్నది. నీ ప్రాణము యొక్క స్వభావమును నీ ఆత్మ కలిగియున్నది. శరీరమును ఆత్మయే స్వాధీనమందుంచుము, చూచారా. అక్కడే మీరున్నారు.
నేనిప్పుడు త్వరపడవలెను, ఎందుకనగా మనకు కొద్దిగా ఆలస్యమగుచున్నది. ఈ వివరణ చాలునని తలంచుచున్నాను.
NUM 12:1•
1TIM 2:12
76ప్రశ్న: "బ్రెన్హాం సోదరుడా, సమాజములో యుండగా స్త్రీలు సాక్ష్యమును లేదా భాషలలో మాట్లాడుటను చేయ వచ్చునా?" వివరించుము. స్త్రీ సంఘమునకు సేవకురాలుగా యుండరాదు. కాని ఆమెకు భాషల వరముండి సమాజములో మాట్లాడుచుండిన యెడల అనగా వరములు గల వారందరూ అచటున్న యెడల, ఆమెకు అలాగు చేయు హక్కున్నది, ఎందుకనగా బైబిలులో స్త్రీలు ప్రవక్తలుగా యున్నారు, మిర్యాము తదితరులుండిరి. వారికి పరిధి లేదు. నా చిన్న నోట్సు అక్కడ ఉన్నది. దానిని చూచెదను, చూచారా.
77స్త్రీలు వరములను కలిగి యుండవచ్చును. అందరము కలిసి వచ్చినప్పుడు క్రమమును పాటించవలెను. సంఘము కొద్దిగా స్థిరపడవలెను. ఇటువంటి వాటికి మనము చోటు ఇచ్చిన వెంటనే మరియొక చిన్న గుంపు లేదా సంఘము బయలుదేరును. ఒక సంస్థ కాదు, కాని ఒక గుంపు. ఒక సంఘము లేదా మనుష్యుల గుంపు బయలుదేరును. వారందరూ వరములు గల జనులు ఆ గుంపు లేచును.
ఈ వరములు గల జనులు కొన్ని సమయములలో తప్పకుండా కూడి యుండవలెను. ఆత్మ వారితో చెప్పుచున్న దానిని వినవలెను. దానిని ఆ తరువాత వేదిక మాద వినిపింప చేయవలెను. అది సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇయ్యబడును.
78నీవు భాషలతో మాట్లాడుచుండగా ఎవరూ దానికి అర్థము చెప్పుట లేదనుకొనుము. కొన్నిసార్లు నీవు కూటములో యున్నప్పుడు చాలా అక్రమమును చూచెదవు. నేను నా ఆలయములో వేదిక పిలుపును ఇచ్చుచున్నప్పుడు ఎవరో లేచి భాషలతో మాట్లాడితే ఆ వేదిక పిలుపు విచ్ఛిన్నమగును. ఆ వ్యక్తి భాషలలో సరిగానే మాట్లాడుచుండవచ్చును. అది పరిశుద్ధాత్మయే కావచ్చును. కాని చూడండి, వారికి ఎప్పుడెట్లుండవలెనో నేర్పించలేదు.
నేను వేదిక మీద కూర్చొనియున్నాను మరియు ఒక బోధకుడు బోధించుట విన్నాను. అతడు చేయుచున్న దానిని చూచినప్పుడు నేను లేచి అతనికి సహాయము చేయవలెనను తలంపు వచ్చినది, నాకేమియూ తోచలేదు. మీకును అలాగే యుండును. మనందరమూ అలాగే చేయుదుము. కాని అది ఏమిటి? అది ఆమర్యాద. కూర్చొనండి. నా సోదరుని మన్నించుడి.
79సహోదరుడు నెవిల్ బోధించుట నేను విన్నాను. నేను బోధించగా అతడు వినెను. సహోదరుడు జె.టి. ఇంకా చాలామంది సోదరులు ఇచ్చటున్నారు. మేమందరమూ ఒకరి మాటలు మరొకరము వినుచుందుము. "ఓ, సోదరుడా, నేను అతనికి సహాయము చేయుదుము అనుకొనుచుందుము," చూచారా. మీ మీద ఆత్మ కుమ్మరించబడుట మీరు చూచుచుందురు. కాని మీరేమి చేయుదురు? నెమ్మదిగా యుండండి, చూచారా, ఎందుకనగా ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో యున్నవి, చూచారా. అది నిజము, మీరు నెమ్మదిగా యుండండి. అది మంచిది. మీరది చేయండి.
ఒక స్త్రీకి భాషలు మాట్లాడు వరము ఉన్నయెడల, ఆమె మాట్లాడగోర వలెనని అనుకొనినయెడల, ఆ సమయము వచ్చినప్పుడు ఆమెకు మాట్లాడు హక్కున్నది. భాషల వరమును ఉపయోగించుకొన వచ్చును; కాని బోధించుటకు గాని, పురుషుని మీద అధికారము చేయుటకు గాని ఆమె సెలవు లేదు. ఆమె బోధకురాలయితే, పురుషుని మీద అధికారము చేయుచున్నట్లే.
80ప్రశ్న: "బ్రెన్హాం సోదరుడా, ఇంతకు ముందు పెండ్లి చేసికొనిన ఒకామెను నేను పెండ్లి చేసికొన్నాను. మేము విడాకులు పుచ్చుకొన్నాము. ఆ తరువాత ఆమె రెండుసార్లు పెండ్లి చేసికొనినది. మేము పెండ్లి చేసికొననాశించిన యెడల బైబిలు ఏమి చెప్పుచున్నది. ఇంతకు ముందు పెండ్లి చేసికొనిన నా మొదటి భార్యను నేను మరల స్వీకరించవచ్చునా? ఆమె ఇంతకు ముందు మరల పెండ్లి చేసికొనెను లేక నేను స్వేచ్చగా యుండవలెనా?
నా సోదరుడా, నీవు చేయ కలిగినది ఒక్కటే యున్నది. ఇది చాలా గొప్ప అంశము. సంఘము క్రమమును పొంది ఒక స్థాయికి చేరుకొనిన యెడల, ఆ దినమున నేను సరిచేయుదును. దీనిని మర్యాదతో చెప్పుచున్నాను. సంఘములలో ఈ వివాహము పరిత్యాగము విషయములో రెండు అభిప్రాయములున్నవి. ఒకరు ఒక ఉద్దేశ్యమును, మరియొకరు మరో ఉద్దేశ్యమును కలిగి యున్నారు. నా ఉద్దేశ్యము ప్రకారము ఆ రెండు తప్పు. దేవుని ఎదుట, బైబిలు ఎదుట నిలబడి కృపను బట్టి చెప్పుచున్నాను, చూచారా. అయితే అక్కడ ఒక సత్యము నిలచి యున్నది.
MATT 5:32•
MATT 19:9
81యేసు చెప్పిన దానిని గమనించండి. ఇక్కడ నాకు ఒక సోదరుడున్నాడు, నా రక్త సంబంధియగు సోదరుడు. ఒకామెను పెండ్లి చేసికొనగోరుచున్నాడు. నా సోదరునికి ఇంతకు ముందు పెండ్లి అయినది. ఒక మంచి స్త్రీ ద్వారా బిడ్డను పొందెను. నా యొద్దకు వచ్చి తన పెండ్లి చేయమని అడిగెను. అది జరగని పని అన్నాను.
మత్తయి 5లో యేసు చెప్పెను, "తన భార్యను విడనాడి వేరొకతెను పెండ్లి చేసికొనువాడు వ్యభిచరించుచున్నాడు. (పెండ్లి కాక ముందు ఆ స్త్రీ జారత్వమును చేసినదని ఒప్పుకొనుట బట్టి ఆమెను విడనాడ వచ్చును), విడనాడబడిన దానిని పెండ్లి చేసికొనువాడు వ్యభిచారములో జీవించుచున్నాడు." కావున అలాగు చేయరాదు. నీ మొదటి భార్య మరల పెండ్లి చేసికొనిన యెడల, ఆమె యొద్దకు నీవు తిరిగి వెళ్ళరాదు. ఆమె నీకు పరిత్యాగ పత్రిక ఇచ్చినది.
LEV 21:7•
DEUT 24:1,4,5
82"అయితే నేను స్వేచగా ఉండవచ్చునా?" అని ప్రశ్నించిరి. దానిని మరల చదివెదను. "ఇంతకు ముందెన్నడూ వివాహము చేసికొనని స్త్రీని నేను పెండ్లి చేసికొనియున్నాను. మేము పరిత్యాగ పత్రికలు తీసికొన్నాము. ఆ తరువాత ఆమె రెండు సార్లు పెండ్లి చేసికొనెను. [ఇతడు ఒంటరిగానే ఉండినట్లు తలంచుచున్నాను.] మొదట పెండ్లి చేసికొనిన స్త్రీని మరల వివాహము చేసికొన వచ్చునా?"
వద్దండీ! లేవియుల ధర్మశాస్త్రమును దాటిపోయినది, మరల ఆమె యొద్దకు వెళ్ళుము అనను, ఎందుకంటే ఆమె మరియొకరి సొత్తు. నీవామెను చేసికొనినచో ఇంతకు ముందు కంటే అధ్వాన్న స్థితికి దిగజారి అపవిత్రుడ వగుదువు. ఇంకొకరు పెండ్లి చేసికొనిన స్త్రీని నీవు మరల పెండ్లి చేసికొన రాదు.
"ఇంతకు ముందు పెండ్లి చేసికొనిన ఆమెను నేను చేర్చుకొనవచ్చునా? లేక స్వేచ్చగా ఉండిపోవచ్చనా!" నీవు స్వేచ్ఛగా ఉండి పోవచ్చును. స్వతంత్రునిగానే ఉండుము. మరల ఆమె యొద్దకు వెళ్ళరాదు. ఆమె మరొకరిని పెండ్లి చేసికొనినది. ఆమె నుండి దూరముగా తొలగుము. అది మంచిది. అందువలన నీవు అపవిత్రుడ వగుదువు, అర్థము చేసికొనుము. ఇరకా కొద్ది సమయము మనకుండిన యెడల, దానిని నేను మరి కాస్త వివరించి యుందును. నా సోదరుడా, నీ ప్రశ్నకు సమాధానమిచ్చి యున్నాను. నీవు పెండ్లి చేసికొని విడిచి పెట్టిన తరువాత ఆ స్త్రీ మరల రెండు లేదా మూడుసార్లు పెండ్లి చేసికొనినది గనుక మరల నీవామె యొద్దకు వెళ్ళవద్దు. అది తప్పు.
83కొంత కాలం క్రిందట ఇక్కడ ఒక జంటకు వివాహము చేశాను. ఆ తరువాత వారు పరిత్యాగము తీసికొని విడిపోయిరి - ముసలి దంపతులు. పకెట్ దంపతులు. వారి మధ్య చిన్న వివాదము చెలరేగినది. వారిక కొనసాగ లేకపోయిరి, విడాకులు తీసికొనిరి. ఆమె ఎంతో యధార్థముగా ఒంటరిగా జీవించినది. అతడును ఆ విధంగానే జీవించెను. ఎంత వింతయో వినండి. వారు కొంతకాలము తరువాత మరల వచ్చి పెండ్లి చేయమని అడిగిరి. "నిశ్చయంగా! అలాగే మీరు ఉండవలెను!" అని చెప్పాను. వారు పెండ్లి చేసికొనిరి, ఎన్నడునూ విడిపోలేదు. వారు భార్యా భర్తలుగా కలిసి జీవించుటకు పత్రములు ఇచ్చాము, అంతే, ఎందుకనగా వారు ముందు పెండ్లి చేసికొనిరి.
MARK 15:12
84ప్రశ్న: "కాతలిక్కు సిలువ మీద యున్న మూడక్షరముల భావమేమి? [మనము చూద్దాం.] కాతలిక్కుల సిలువ మీద గల మూడక్షరములకు అర్థము ఏమిటి?"
సిలువలన్నియూ ఒక్కటేనని నేను తలంచుచున్నాను. దానిని నేను బాగుగా చూడవలెను. దాని మీద ఐ-ఆర్-ఎన్-ఐ అని ఉన్నది. దాని అర్థము, "నజరేయుడగు యేసు, యూదుల రాజు." అదే దాని భావము. ఇంకేదయినా ప్రత్యేకర్థమున్నదేమో నేనెరుగను. ఆ అక్షరముల అర్థము ఇదే, "నజరేయుడగు యేసు, యూదుల రాజు. ఐ-ఆర్-ఎన్-ఐ. అది సిలువ మీద యున్నది. సరే.
NEH 10:37
85ప్రశ్న: "సంఘ నిర్మాణ నిధుల మీద దశమ భాగములు ఉపయోగించుట తప్పు అందురా?"
ఇప్పుడు, సంఘమును అంటుకొను చిన్న సంగతి ఇచ్చట యున్నది. ఖచ్చితంగా చెప్పవలెనన్న దశమ భాగములు సేవకునికి చెందవలెను. అది నిజము! బైబిలు కాలములో వారు ఒక పెట్టెను ద్వారము నొద్ద ఉంచెడి వారు. అది పాత నిబంధనలో యున్నది. ఈ పెట్టెలో నిధులు ఉంచుచుండిరి. దానిని ఆలయ నిర్మాణమునకు ఉపయోగించుచుండిరి. దీనిని మీరు పాత నిబంధనలో చాలాసార్లు చదువుదురు. ఆ విధమగా వారు ఆలయమును సరిదిద్దెడి వారు. ఆ నిధిలో నుండి తీసి వారు ఆలయ మరమ్మత్తులు జరిగించెడి వారు. కానీ దశమ భాగములన్నియూ యాజకునికి వెళ్ళుచుండవలెను. సంఘ కాపరులకు దానిని ఇయ్యవలెను. అవును, అంతే గానీ దశమ భాగములు మరెవరికిని చెందవు.
కొందరు తమ దశమ భాగములను తీసి విధవరాండ్రకు ఇచ్చుచుందురు. అది తప్పు. నీవు విధవరాండ్రకు ఇవ్వవలెనన్నచో ఇవ్వ వచ్చును గాని దేవుని ద్రవ్యములో నుండి తీసి కాదు. అసలు అది నీది కానే కాదు - అది దేవునిది.
NEH 10:37•
MAL 3:8
86నీవు నన్ను రొట్టెను కొనుక్కొని రమ్మని పట్టణములోనికి పంపించావను కొందము. ఆ రొట్టెను కొనుటకు ఇరవై-అయిదు సెంట్లు నాకిచ్చి యున్నావు. నేను ఆ ద్రవ్యమును వీధిలో ఎవరికో ఇచ్చేశాను. ఇరవై-అయిదు సెంట్లు నేను ఇచ్చి వేశాను. అది నీ డబ్చు. వారు నన్ను ఎవయినా ఇమ్మని అడిగిన యెడల, నేను నా జేబులో నుండి నా డబ్బును తీసి ఇవ్వవలెను. అంతేగాని నీ డబ్బును ఇయ్యరాదు. దశమ భాగము దేవునిది, యాజకుడగు లేవీ ఆ దశమ భాగము వలన జీవించును.
దశమ భాగమును దేవుని ఇంటికి తీసికొని రావలెను. దానిని దీవించుదునని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. దానిని నిరూపించును. ఆయన ఇట్లు చెప్పెను, "మీరు దానిని నమ్మని యెడల వచ్చి నన్ను పరిశోధించుడి," చూచారా. ఇది నిజము.
దశమ భాగములు సంఘము యొక్క కాపరికి చెందును. దానివలన అతడు జీవించును. ఆలయ నిర్మాణ నిధులు వేరు. అది లేఖన సహితము.
ఒకసారి మేము ప్రారంభించాము. ఆలయమును విడిచి పెట్టక ముందు నేను ఒక చోటకు వెళ్ళాను. ఇటువంటి అంశమునే తీసికొని రెండు లేదా మూడు వారములు బోధించాను. సంఘమునకు దశమ భాగములెట్లు ఉపయోగపడునో చూపించాను.
87ప్రశ్న: "బ్రెన్హాం సోదరుడా, క్రైస్తవులమయిన తరువాత మాసన్స్ వంటి ఏదయినా లాడ్జికి చెంది యుండుట తగునా?"
తగదు. ఎక్కడున్నప్పటికిని నీవు క్రైస్తవునిగానే యుండవలెను. నీవు ఏ స్థలములో యున్నాగాని క్రైస్తవునిగా చూపించుకొనవలెను.
88ప్రశ్న: "కొన్ని ప్రాముఖ్యమగు విషయములలో ప్రభువు యొక్క చిత్తమును కనుగొనుటకు ఉత్తమ మార్గమేది?"
ఈ ప్రశ్నకు ఇంకా ఏమయినా కలుపబడినదేమో చూడనీయండి. "ఉత్తమ విధానము గూర్చి ప్రశ్నించెను. [అక్కడ ఒక కామా ఉండవలసినదని తలంచుచున్నాను.] కొన్ని ప్రాముఖ్యమగు విషయములలో ప్రభుని యొక్క చిత్తమును తెలిసికొనుటకు ఉత్తమ విధానమేది?"
ప్రియ స్నేహితుడా, కొన్ని ప్రాముఖ్యమగు విషయములలో దేవుని యొక్క చిత్తమును కనుగొనుటకు ప్రార్థనయే ఉత్తమ మార్గమని నేను చెప్పుచున్నాను, చూచారా.
ఇక్కడ ఒక అద్భుతమైన చిన్న ప్రశ్న యున్నది. ఒక ప్రాముఖ్యమగు సంగతి నీకు ఉన్నదనుకొనుము. దానిని గూర్చి ఒక పద్ధతి కలదు. దానిని నేను ప్రభువు యొద్దకు తీసికొని వెళ్ళుదును. అది ఎల్లపుడూ నా బలమైయున్నది. నేను దేవుని కొరకు కనిపెట్టెదను. ఆయనేమి చెప్పునో చూద్దాం. దాని విషయములో నేను తటస్థముగా ఉందును, ఏ వైపు నేను మొగ్గను. "పరలోకపు తండ్రీ," అని పిలచెను.
89నా విషయములలో నా మట్టుకు నేను దర్శనము కొరకు ఎదురు చూచెదను. ప్రాముఖ్యమైన సంగతి అయితే నేను దానికై చూతును. కాని చాలా మందికి దేవుడు దర్శనములు ఇయ్యడు. కావున మీరాలాగు ఎదురు చూడరాదని సలహా ఇచ్చుచున్నాను, చూచారా, ఎందుకనగా కొందరికి మాత్రమే దర్శనములు దొరుకును. మరి కొందరికి మరో విధముగా యుండును. నాకు రానిది మీకు వచ్చును. మీరు ఆ విధముగా ప్రభుని ఆరాధించ వచ్చును. మీరు చేయలేని దానిని నేను చేయ వచ్చును, చూచారా. దేవుడు వివిధ రకములుగా పని చేయును.
నేను మీ స్థానములో ఉండిన యెడల, ప్రభువు యొద్ద నుండి దర్శనములను పొందని యెడల, నేను ప్రభువు కొరకు కనిపెట్టి ఈ విధముగా పలుకుదును, "ప్రభువా, ఏ నిర్ణయము చేయవలెనో నీవు నాకు చూపించుము." నీవు ఆ విధముగా నడిపించబడుదువు. ఇంకొద్ది సేపు ఎదురుచూడుము. ఇంకా కొద్దిగా కనిపెట్టుము. ఏ విధానమో చూడుము. ఎటు వైపు నీవు మొగ్గుచున్నావో, ఆత్మ ఎటు నిన్ను నడిపించుచున్నదో గమనించుము. ఇట్లు చెప్పుము, "తండ్రి నా హృదయములో ఏదయినా పరవాలేదని నేను భావించుట నీవెరుగుదువు. దీని విషయములో నీవేమి చేయవలెనని నాకు చెప్పెదవో తెలిసికొనుచున్నాను."
కొన్నిసార్లు కూటముల విషయములలో ఆ విధంగానే నేను చేయుదును. నేను అటు లేదా ఇటు వెళ్ళవలేననుకొందును. అప్పుడు నేను ఆ మార్గమును వెంబడించెదను. ఆ విధముగానే చేయవలెను, ఎందుకనగా అది ప్రార్థన విధానము. నీవు నీకు చేతనయిన ఉత్తమ మార్గమును అనుసరించుము.
ACTS 16:9
90స్నేహితులారా, దీనిని నేను నమ్ముచున్నాను. క్రొత్త నిబంధనలోని పౌలు ఆ రోజులలో ఆ విధంగానే వెళ్ళెను. అతడు రెండు అభిప్రాయముల మధ్య నిలబడెను, ఎటు వెళ్ళవలెనో తెలియదు. అతడు తప్పు దారిన ప్రారంభించెను, మాసిదోనియ పిలుపు అతనికి వచ్చెను. నీవు దేవుని కొరకు ఒక తీర్మానము చేసికొనినప్పుడు, నీకు చేతనయిన ఉత్తమ విధానములో దానిని చేయుము. అప్పుడు దేవుడు నిన్ను సరి చేయునని నేను నమ్ముచున్నాను. నీవు తప్పు దారిన పడకుండా ఆయన కాపాడును. దేవుడా ఆ విధముగా చేయునని నేను నమ్ముచున్నాను.
91ప్రశ్న: మనము చూద్దాము. "బ్రెన్హాం సోదరుడా, నిద్రించుచున్న కన్యకలుగా ఎంచబడుచున్న వారికి తీర్పు దినమున ఏమని తీర్పు తీర్చబడును?"
నిద్రించుచున్న కన్యక రక్షించబడును, తీర్పులో ఆమె రక్షించబడును. ఆమె ఎన్నడూ వధువుగా యుండదు, కాని ఆమే రక్షించబడిన గుంపుగా యుండును, వారు తీర్పు లోనికి వచ్చెదరు. వధువులో వారిని లెక్కించుట జరుగదు. వారు కన్యకలుగా ఉన్నంత కాలము వారు దేవుని ఎదుట ఉండెదరు, చూచారా. వారు రక్షించబడుదురు. వారు ఆయన కుడి వైపున ఉన్న గొర్రెలు, రక్షించబడనివారు ఆ మహా ధవళ సింహాసన తీర్పులో ఆయన ఎడమ చేయి వైపున మేకలుగా యుందురు.
చాలా సమయము తీసికొని దానిని నేను చెప్పవలెను, కాని ఆలస్యమగుచున్నది.
1JN 4:4
92ప్రశ్న: "పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి తాను చేయగోరని చిన్న విషయములలోనికి కొట్టుకొనిపోవుట సాధ్యమేనా?"
అవును! నేను పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తినయినా గాని ఈ స్థానములో యున్నంత కాలము అందుక ఆస్కారము కలదు. నీ కొరకు నీవు ఒక గురిని ఎన్నుకొనుము. నీవు అపవాదికి బానిసగా ఉండినప్పుడు నీ కిష్టమయిన దానిని చేయుటకు నిన్ను వాడుకొనెను. కానీ ఇప్పుడు నీవు క్రీస్తు కొరకు ఒక నిర్ణయము తీసికొనియున్నావు. నీవిప్పుడు అవతలి దరికి వచ్చి యున్నావు. వాడిప్పుడు నీ మీదికి ఎన్నో తుపాకులు గురిపెట్టి యున్నాడు. ప్రతి శోధనను నీ మీదికి తీసికొని వచ్చును. కాని నీవు దేవుని పొందియున్నావు? "మీలో యున్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు."
నీకు ఎక్కడా యుద్ధములు లేవనుకొనరాదు, నీవు జారిపోవుచున్నావు., చూచారా. ఇప్పుడు, నీవు పవిత్రుడవైయున్నావు, నీవు దుస్తులు ధరించుకొనియున్నావు, నీవు చక్కగా శుద్ధికాబడినావు, నీ జుట్టును చక్కగా దువ్వుకొనియున్నావు, నీవు యూనిఫారం ధరించుకొనియున్నావు, నీ చేతిలో ఒక తుపాకీ యున్నది. "వెళ్ళుదము!" చూచారా? నీవు యుద్ధములో యున్నావు. కనబడుటకు కాదు, యుద్ధము చేయవలెను, పోరాడవలెను. నిశ్చయముగా, నీ మీదికి శోధనలు లేచును. విశ్వాసమను డాలును పట్టుకొనుము. ముందుకు సాగిపొమ్ము, చూచారా. అది నిజము. దేవుని యొక్క సర్వాంగ కవచనమును ధరించుకొనుము. యుద్ధమునకు సిద్ధపడితేనే గానీ సర్వాంగ కవచనమును ధరించుకొనవలసిన అవసరము లేదు గదా? సైనికులందరూ పోరాడుటకు వస్త్రములు ధరించుదురు. పైకి చూపించుకొనుటకు కాదు. "నేను ఫలాని ఫలాని అని చెప్పుకొనుటకు కాదు. ఇప్పుడు నేను క్రైస్తవుడను. నేనెవరినో చూడు! నేను ఫలానీ దానికి చెందియున్నాను. హల్లెలూయా! ఒక రాత్రి నేను పరిశుద్ధాత్మ పొంది యున్నాను. నిశ్చయంగా, ఏదియూ నన్ను తొందరపరచలేదు." ఓ, సోదరుడా, నీవు మరల వెళ్ళి ప్రయత్నించుట మంచిది, చూచారా.
EPH 6:10,17
93నేను మీకు చెప్పుచున్నాను. నీవు పరిశుద్ధాత్మను పొందితినని చెప్పుకొనిన వెంటనే సాతాను నీ మీదికి తుపాకీ గురిపెట్టును. నిన్ను కొట్ట జూచును. అప్పుడు నీవు పూర్తి సర్వాంగ కవచమును ధరించుకొనవలెను. విశ్వాసమును డాలును పట్టుకొనుము. ఆత్మ లేదా వాక్యము అను ఖడ్గమును పట్టుకొనుము. ఆత్మ లేదా వాక్యము అను ఖడ్గమును పట్టుకొనుము. సువార్తయను మైమరువు ధరించుకొనుము. పోరాటము కొరకు సిద్ధపడుము, ఎందుకనగా అది వచ్చుచున్నది. నీవు వెరవవద్దు. నీకు ఎంతో ఇబ్బంది కలిగించగోరును. కాని గుర్తించుకొనుము, "నీలో నున్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు."
MATT 16:6-10
94ప్రశ్న: "మత్తయి సువార్త 16:9 మరియు 10లో యేసు చెప్పిన దానికి భావమేమిటి? పండ్రెండు గంపలు మరియు ఏడు గంపలు దేనికి సాదృశ్యము? ఆదివారం ఉదయమునకు ప్రశ్న."
మత్తయి 16:10ని చూద్ధాం. నాకిప్పుడు నిశ్చయంగా తెలియదు. దానిని తీసి గమనించుదం: మత్తయి 16:9 మరియు 10.
మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదు వేల మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో?
అదియైనను, ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిలో అదియైనను మీకు జ్ఞాపకము లేదా?
ఇపుడు చూడండి. దీనికి ముందున్న వచనము చూద్దాం.
అప్పుడు యేసు - చూచుకొనుడి పరిసయ్యులు, సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండి గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను.
కాగా వారు - మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పెనని తనలో తాము ఆలోచించుకొనుచుండిరి.
[ఇప్పుడు గమనించండి!] యేసు అది ఎరిగి యుండెను. [చూచారా! ఆయన వారి ఆలోచనలను ఎరిగియుండెను.] అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?
ఆయిదు రొట్టెలు ఆయిదు వేల మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా?
EXOD 9:14•
EXOD 13:18•
DEUT 1:40•
MATT 15:34•
MARK 8:7
95మరో విధంగా ఇట్లు చెప్పగలము: "దేవుడు మార్గము తెరచి ఒక అద్భుతము చేయుటను నీవు చూచావు! ఆ తరువాత ఆయన ఇంకో అద్భుతము చేయలేడా? చూచారా? మరో విధంగా ఇట్లు చెప్పగలము: పాపపు జీవితము నుండి ఆయన నిన్ను రక్షించెను గదా? నీ అనారోగ్య శరీరమును ఆయన బాగుచేయలేడా? నీవు పాపిగా యున్నప్పుడు ఆయన నీ ఆత్మను పైకి లేపెను. నీవు విశ్వాసముంచి యున్నావు. అలాటి కార్యమును మరల ఆయన చేయలేడా? నీ కొరకు మరో గొప్ప పనిని లేదా అద్భుతమును ఆయన చేయలేడా?"
వారు ఎర్ర సముద్రమును దాటిపోయిరి, వారి కొరకు ఒక దారి ఏర్పరచబడెను, ఎర్ర సముద్రము పాయలాయెను. దానిలో నుండి వారు నడిచిపోయిరి. వారు అవతలి దరికి వచ్చిరి. ఆ దరికి వచ్చిన వెంటనే వారికి నీరు దొరక లేదు. వారు సణుగుట ప్రారంభించిరి. అది నిజమేనా? వారికి ఆహారము లేదు. వెంటనే వారందరూ కేకలు వేయసాగిరి. "మాకు ఆహారము లేదు,'' చూచారా. ఆ ఎర్ర సముద్రము నొద్ద జరిగిన అద్భుతము గూర్చి వారు ఆలోచించనే లేదు. వారందరూ ఎర్ర సముద్రమును దాటిరి. మేము అక్కడే చనిపోతే బాగుండేది అనిరి. ఇప్పుడు ఐగుప్తీయులు తరుముచున్నారనిరి. మేమేమి చేయవలెనని అడిగిరి.
"మీరక్కడ ఉండగా ఆ దేశమును తెగుళ్ళతో మొత్తినవారెవరు? గోషేనులో సూర్యుని ఉదయింప చేసినవారెవరు?" చూచారా? ఆ సంగతులను తప్పక మనము గుర్తుచేసికొన వలయును. దేవుడు, దేవుడేనని గుర్తుంచుకొనండి! హల్లెలూయా! ఏది ఏమయినా గాని, ఆయన ఇంకనూ దేవుడే. ఆయన నిశ్చయంగా ఏదయినా చేయగలడు.
1COR 12:27•
REV 21:9
96ప్రశ్న: 1 కొరింథీ 12:27 లో ఉన్న "క్రీస్తు శరీరము" ను, ప్రకటన 21:9లో ఉన్న క్రీస్తు వధువు," అను విషయములను గూర్చి వివరించెదరా? ఈ ప్రకటనలో ఉన్న నూతన యెరూషలేము ఆత్మ సంబంధమైనదా? ఇది సంఘము యొక్క ఆత్మ సంబంధమగు వివేచనయేనా?
కాదు. ఇప్పుడు, I కొరింథీలో ఉన్న దానిని మొదట చూద్దాం. కొరింథీయులకు 12వ అధ్యాయము 27వ వచనము.
మీరు క్రీస్తు యొక్క శరీరమైయున్నారు. మరి విశేషముగా అవయవములై యున్నారు.
ఆ తరువాత లేఖనము ఏది? ప్రకటన 21:9. ప్రకటన 21వ అధ్యాయము 9వ వచనము. చూడండి.
అంతట ఆ కడపటి ఏడు తెగుళ్ళతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొనియున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి - ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను, అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి.
GEN 2:22,23•
EPH 4:12,16•
COL 1:22
97అవును, క్రీస్తు యొక్క శరీరము. క్రీస్తు యొక్క శరీరము మన పాపముల కొరకు విరువబడినది. ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఆ శరీరములోనికి బాప్తిస్మము పొంది సభ్యులమైయున్నాము. సూచన ప్రాయముగా మాట్లాడుచున్నాను. హవ్వ ఎక్కడ నుండి వచ్చినది? ఆదాము యొక్క శరీరములో నుండి, అతని ప్రక్కలో నుండి ఆమెను తీసెను. ఆదాము యొక్క ప్రక్కలో నుండి హవ్వ తీయబడెను. ఆమె అతని శరీరములో ఒక భాగమైయుండెను. అతడిట్లనెను, "ఆమె నా శరీరములో శరీరము, నా ఎముకలలో ఎముకయై యున్నది. ఆమె నారీ అనబడును," చూచారా.
ఇప్పుడు, క్రీస్తు యొక్క శరీరమును యేసు శరీరములో నుండి బయటకు తీసెను, ఏలయనగా మనము ఆయన యొక్క మాంసము, ఎముక మరియు ఆత్మయై యున్నాము, చూచారా. ఎందుకనగా మనము ఆయన యొక్క శరీరములోనికి జన్మించియున్నాము. ఇక్కడున్న ఈ శరీరము ఆయనకు చెందినది, అయినప్పటికిని ఇది పాపములో రూపించబడినది, దానిని ఆయన విమోచించెను. "చివరి దినమున దేవుడు దానిని లేపును, మరియు నేను అందులో నిత్యముగా జీవించెదను, చూచారా. అంతే. మంచిది.
98ఇక్కడున్న చివరి ప్రశ్నను మనం చూద్దాం: "క్రొత్త యెరూషలేము ఆత్మ సంబంధమైనదా?" నూతన యెరూషలేము పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుటను యోహాను చూచెను. ఇప్పుడది సంఘము యొక్క వివేచన కాదు, చూచారా. క్రొత్త యెరూషలేము పరలోక మందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుటను యోహాను చూచెను. ఇప్పుడది సంఘము యొక్క వివేచన కాదు, గమనించారా. పరలోకములో నుండి క్రొత్త యెరూషలేము దిగి వచ్చుటను యోహాను చూచెను. తన భర్త కొరకు (ప్రకటన 21, చూచారా.)… అలంకరించబడిన పెండ్లి కుమార్తెను ఆమె పోలియున్నది.
ROM 8:28
99ఇప్పుడు చివరి ప్రశ్న. అంతే అనుకొంటాను.
ప్రశ్న: "ప్రభుని ప్రేమించువారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగునని బైబిలు చెప్పుచున్నది. నీవు దేవుని ప్రేమించి, లోకములోనికి దిగజారిపోయిన పిదప నీవు ఆ పాపములోనే మరణించునట్లు దేవుడు చేయునా! లేదా నీవు గతించక ముందే నిన్ను తిరిగి ఆయన యొద్దకు రప్పించుకొనుటకు మార్గము కల్పించునా?"
దీనిని వ్రాసిన ఆమె పేరున్నది, చూచారా ఆమె సంతకము పెట్టినది. సోదరి. దీనినిప్పుడు చెప్పెదను. చూడండి. తాత్కాలికంగా, చిన్న చిన్నగా, దినములో చాలాసార్లు మనము వెనుకకు జారుచునే యుందుము. మనకది తెలియును. మనందరమూ దోషులమై యున్నాము. మనలో ఎవరునూ పరిపూర్ణులు లేరు. ఈ శరీరములో మనం ఉన్నంత కాలం అంతే, ప్రజలు ఈలాగనినంత మాత్రమున చాలదు, "నేను శుద్ధీకరింపబడి యున్నాను, నేను ఈ స్త్రీని ముద్దు పెట్టుకొన్నా గాని పాపము కాదు." అట్టివాడు అబద్ధమాడుచున్నాడు. అది అతనికి అసాధ్యము. అంతే.
"ప్రభువా, ఎంత దగ్గరగా నేను వెళ్ళగలనో ప్రయత్నించనీ" అని నీవు పలుకరాదు. "ప్రభువా, దానికి నన్ను దూరముగా ఉంచుము," అని పలుకవలెను, చూచారా. గుర్తుంచుకొనండి, మీరు ఇంకనూ మానవులే. దానికి వీలయినంత దూరంగా ఉండండి, చూచారా.
HEB 10:17
100నీవు ఒక పొరపాటు చేసినప్పుడు, దానిని ఇష్టపూర్వకముగా చేయవు. నీవు తిరిగి జన్మించిన క్రైస్తవునివయితే, తప్పు చేయవలెనని తలంచవు. మన ఉద్దేశ్యములు అన్నియూ సరిగానే యుండును. కాని ఇక్కడ ఈమె చెప్పినట్లుగా నీవు ఏదయినా తప్పు చేసినప్పుడు, దేవుడు నిన్ను ఆ తప్పులోనే యుంచి, కొనసాగి మరియు చనిపోవునట్లు చేయునా? లేక నిన్ను తిరిగి సమాధానపరచి వెనుకకు తెచ్చునా? ఆయన నిన్ను వెనకకు తిరిగి తెచ్చును. అది నిజము! ఆయన నిన్ను మరల వెనకకు తెచ్చును.
నీవు ఏదయినా తప్పు చేసినప్పుడు, అది నిన్ను గద్దించని యెడల, అందులోనే నీవు కొనసాగిపోవుచున్నయెడల, ఒక సంగతి నీవు గుర్తుంచుకొనుము, అసలు ప్రారంభములోనే నీవు రక్షించబడలేదు. ఇది నిజము. నీకు రక్షణానుభవము లేదు. నీకు ఒక రకమగు నమ్మకమున్నది, అంతేగాని రక్షింపబడలేదు. కాని నీవు రక్షించబడినప్పుడు, నీలో వేరే ఆత్మ, వేరే స్వభావము ఉండును. క్రీస్తు నందు నీవు నూతన సృష్టిగా యుందువు. పాత సంగతులు గతించిపోయెను, అవి చనిపోయి మరుపు అను సాగరములో సమాధి చేయబడినవి. మీరు చూచారా?
కాని నీవు ఈ లోకములో జీవించుచున్నందున, నీ కొరకు అన్ని చోట్ల ఉరులు ఉంచబడియున్నది. నీవు క్రీస్తు మీద నీ కండ్లు నిలిపి నడచెదవు. గుర్తుంచుకొనుము, నీవు ఒక తప్పు చేసినప్పుడు, నీవు నిజమైన క్రైస్తవునివయినచో తప్పకుండా మరల వెనుకకు వచ్చెదవు, నీవు వచ్చి సమాధానపడెదవు.
GEN 8:7,8
101చూడుము, ఓడలో నుండి నోవహు ఒక కాకిని బయటకు విడిచి పెట్టెను. అదేమాయెను? అది ఒక కాకీ, అది పావురముతోనే నివసించినది, అవి రెండునూ ఒకే గూటిలో ఉండెను. ఆ కాకిని అతడు బయటకు వదిలెను. నీరు మొత్తం క్రుళ్ళిన శవములతో వాసన కొట్టుచుండెను, మిలియనుల కొలది జనులు చనిపోయిరి, వారి దేహములు ఉబ్చిపోయినవి. గుర్రములు, సకల జీవుల శరీరములు క్రుళ్ళి, ఆ నీటి మీద తేలియాడుచుండెను. సర్వలోకము నాశనమయినది. నీటి మీద శవములు క్రుళ్ళి తేలుచున్నవి. నోవహు సూర్యరశ్మిని చూచెను కనుక నీరు తగ్గినదో లేదో తెలిసికొనుటకు అతడు ఒక కాకిని బయటకు విడిచిపెట్టెను. ఆ కాకి ఎగిరి వెళ్ళి పీనుగుల మీద వ్రాలినది. దానికది చాలా బాగున్నది. పీనుగును పీక్కొని తినుచుండెను. ఎందువలన? అది దాని స్వభావము. అది కాకి. అది పావురముతో ఎన్ని రోజులు కలిసియున్నాగాని, నోవహు ప్రసంగమును ఎంతగా వినినా గాని, శుభ్రమైన పక్షులతో ఎంతగా తిరిగినా గాని, కాకి స్వభావము మారలేదు. తనకు అవకాశము వచ్చిన వెంటనే దాని స్వభావము బయటకు చూపించినది.
కాని అతడు పావురమును బయటకు విడిచెను. అది బయట నిలబడలేకపోయినది, ఎక్కడికి వెళ్ళలేకపోయెను. దానికి పాదములు మోపు స్థలము దొరకక పోయెను. కావున అది తిరిగి ఓడ యొద్దకు వచ్చెను. అది ఆ విధముగానే యుండును.
102కొన్నిసార్లు నీవు కొద్దిగా జారిపోవచ్చును. నీవు ఇటు అటు తిరుగు చుండవచ్చును, కాని నీకు పావురపు స్వభావమున్నప్పుడు కాకి ఆహారమును తినజాలవు. అది నీకు పడదు, అంతే.
నీవెక్కడికి వెళ్ళెదవు? ఏమి చేసెదవు? నీవు క్రైస్తవుని కానియెడల ఏమి చేయుదువో నాకు చెప్పుము. నేను ఈ ఉదయమున క్రైస్తవుని కానియెడల ఏమి చేయుదునో చెప్పుము. ఈ ఉదయమున నా తల్లి ఆసుపత్రిలో ఆ విధముగా పడియున్నది. ఆమె అచేతనంగా అక్కడ పడియున్నది. నేను ఈ వేదిక పైన నిలబడి హృదయపూర్తిగా బోధించుచున్నాను. నా పనిని నేను నిర్వర్తించుచున్నాను. ఆమె పట్ల నేను ఎక్కువ శ్రద్ధ చూపించలేనట్లు కనిపించుచున్నది. ఎందువలన? నా తల్లి రక్షించబడినదని నాకు తెలియును, చూచారా. ఆమె రక్షించబడినదని నేనెరుగుదును. నేను నమ్మిన వానిని నేనెరుగుదును. ఆ దినమున నేనాయనకు అప్పగించిన దానిని ఆయన కాపాడగల సమర్థడని నేనెరుగుదును.
103ఇప్పుడు నా తల్లి ఏమి చేయుచున్నది. బహుశా ఆమె జీవితములో ఎన్నడూ తలంచని మంచి ఉద్దేశ్యముతో ఇప్పుడుండి యుండ వచ్చును. "ఒక దినమున నేను క్రైస్తవురాలనగుదును. కాని అచేతనంగా పడియుండిన ఆమె ఇప్పుడు క్రైస్తవురాలెట్లు కాగలదు? ఆమె పిల్లలు ఏమి చేయుదురు?
ఆ దినమున మేము గ్లూకోజు ఇప్పించుటకు అక్కడికి తీసికొని వెళ్ళాము. ఆమె శరీరములో ఆ గ్లూకోజు మాత్రమే యున్నది. ఆమె మ్రింగలేదు, పక్షవాతమునకు గురియైనది. "బిల్లి! ఒక్క సంగతి నేను తెలిసికొనగోరుచున్నాను," అని అన్నది. ఆమె నా గూర్చి మాట్లాడినది మరియు డియోలరస్ అప్పుడక్కడే నిలబడినది, ఆమె తన పిల్లల గూర్చి మాట్లాడినది, నా సోదరులు ఇద్దరు త్రాగుట మానలేదు.
"వారు నీ హృదయమును బ్రద్దలు చేసిరి గదా?" అనడిగాను.
ఆమె ఇట్లన్నది, "బిల్లీ, ఒక తల్లి అవన్నియూ భరించవలెను. అయితే నేను రక్షించబడితిని. నేను వెళ్ళుటకు సిద్ధపడి యున్నాను."
"అమ్మా! జెఫర్సన్ విల్ నుండి యుటికా వరకు గల విస్తీర్ణములో పెద్ద భవంతిని నీవు మాకు నిర్మించి యుండవచ్చును. దానిని మాకు విడిచి పెట్టుదువు. నీవు మాకు పది మిలియనుల డాలర్లు విడిచి పెట్టియుండవచ్చును. నీవు వెళ్ళిపోయిన తరువాత మేము దాని కొరకు తగవులాట వాదించుకొందుము. అదే గదా జరుగును? కాని నీవు ఎవరూ విడువని గొప్ప నిధిని మాకు విడిచిపెట్టియున్నావు. ఒక నిశ్చయత యున్నది. ఆ నది కావల మేము మరల నిన్ను చూచెదము," అని నేను అన్నాను. అది నిజము, చూచారా.
104నీవు రక్షించబడితివి, క్రీస్తు నిన్ను రక్షించెనని నేను ఎరుగుట గొప్ప విషయము. మనము వెనుకకు జారవచ్చును, తప్పులు చేయ వచ్చును, మనందరికి ఏవో అవకతవకలున్నవి. నీవు ఏదయినా చేసిన వెంటనే నీ హృదయములో నీకది తెలియును. అక్కడే నీవు పైకి ఎగురుదువు. అలాగు తప్పించుకొనవలసిన సమయం అదే. దాని నుండి దూరముగా పొమ్ము.
నీవు ఇక్కడి నుండి బయటకు వెళ్ళినప్పుడు, వారు నిన్ను పరిశుద్ధ బండలలో నీవును యున్నావా అని ఎగతాళి చేయుదురు.
"ఆ మాట వినగానే అతనిని చెంపదెబ్బ కొట్టవలెనని," సాతాను నీకు చెప్పును.
"పరిశుద్ధ బండగా ఉండుట అనగా ఏమిటో నేనెరుగను. నేను క్రైస్తవుడను." చూచారా? ఎల్లప్పుడును దుష్టత్వమును మేలుతో జయించుము. గుర్తుంచుకొనండి, దీనిని మరువరాదు: నీవు చెడును మేలుతో కలిసికొనినప్పుడు ఆ మేలు యొక్క సాంగత్యములో కీడు నిలబడలేదు. అది దానిని తాళజాలదు.
105నేను మిషనెరీని, ప్రపంచమంతా పర్యటించాను, ఎన్నో రకముల కీడులను చూచాను, అన్ని రకముల క్షుద్ర శక్తులను చూచాను, అన్ని రకముల బోధలు విన్నాను, అన్ని రకముల దయ్యపు ఆరాధనను చూచాను, వాటన్నిటి గూర్చి మీరు తలంచలేరు — నేను ఎల్లప్పుడూ తెలుసుకున్నది ఏమనగా, మేలు అన్నివేళలలోను కీడును జయించును.
వినండి, రాత్రిలో చీకటి ఎంత దట్టంగా ఉన్నా నాకు లెక్క లేదు. చీకటి చేతికి దొరుకునంత యుండ వచ్చును. నీవు అందులో చేయినుంచగా నీడ కూడా నీకు కనబడనంత దట్టముగా కమ్మియుండవచ్చును. చిన్న వెలుగు ఆ మొత్తం చీకటిని తరిమి కొట్టును. నిశ్చయముగా! మరణము యొక్క సాన్నిధ్యములో జీవము అలాగే చేయును. మంచి సన్నిధిలో తప్పు ఆ విధంగానే చేయును. సందేహపు సన్నిధానములో విశ్వాసము అలాగే చేయును. దానినది చెదరగొట్టును.
106సూర్యుడు వచ్చినప్పుడు రాత్రి ఎట్లు నిలచి యుండగలదు? ఆశీర్వచనములు కుమ్మరించబడును. రాత్రి ఎచ్చటికి పోవును? అది ఇక ఉండదు. రాత్రికి ఏమి సంభవించెను? సుమారు పన్నెండు గంటల క్రితం ఈ ఆలయంలో ఉండిన చీకటికి ఏమి జరిగినది? ఈ గోడల లోపట దాగియుండిన చీకటికి ఏమి జరిగినది? అది ఇక లేదు. అది అదృశ్యమయినది. ఎందువలన? వెలుగు వచ్చెను. వెలుగు వచ్చినప్పుడు, చీకటి పారిపోవలసి యున్నది.
1THS 5:5,8
107రాత్రి యందు సంచరించు జీవులను మీరు చూడండి. బొద్దింకలు, ఇలకోళ్ళు, నల్లులు మొదలగునవి చూడండి. సూర్యోదయమవగానే, లేదా లైటు వెలిగించగానే అవి ఎంత త్వరగా చీకటిలోనికి పరుగిడునో చూడండి. సువార్త ఆ విధంగానే యున్నది. దీపము వెలిగినప్పుడు ఏమగును? నిన్ను పరిశుద్ధ బండయని హేళన చేయువారికి ఏమి జరుగును? నిన్ను చూచి నవ్విన ప్రజలకు ఏమగును? వెలుగు వచ్చి యున్నది. వారు చీకటిలో బహు నెమ్మదిగా పోయెదరు, ఎందుకనగా వారు చీకటి సంబంధులు. కాని పగటి సంబంధులు వెలుగులో నడచెదరు. ఆమెన్!
మనము దేవుని కృప చేత పగటి పిల్లలమై యున్నాము. కావున దీపములు వెలిగినప్పుడు మనము దేవునికి వందనములు చెల్లించి, మన కండ్లు తెరచి నడచుదుము. నీ స్వాభావిక నేత్రములతో చూడని వానిని నీవు చూచెదవు, విశ్వాసమనగా నిరీక్షించువాటి యొక్క నిజస్వరూపమును, లేనివి ఉన్నవనుటకు రుజువునై యున్నది. ఆమేన్! నేను దానిని ప్రేమింతును.
108నేను మాట్లాడనైయున్న చిన్న ప్రసంగమును చేయుటకు నాకు సమయము లేదు, ఎందుకనగా మనము రోగులకు ప్రార్థించవలెను.
ఎంతమంది ప్రభువును ప్రేమించుచున్నారు? ఆమేన్! ఈ ప్రశ్నలన్నింటినీ మనం చూచాము. అందులో కొన్ని చాలా పదునుగా యున్నవి, జవాబులు చెప్పాము. నేను సరిగా చెప్పియుండక పోవచ్చును, ఎందుకనగా లేఖనములను చూచు వ్యవధి నాకు లేకపోయినది. లేనియెడల చిన్న కాగితము మీద వాటిని వ్రాసి తెచ్చి యుందును. అందరునూ సంతృప్తి చెందితిరని ఆశించుచున్నాను, లేనియెడల మరల నాకు వ్రాయండి. అది పూర్తిగా జవాబు కాదని మీరనుకొనినయెడల, దానిని అధ్యయనము చేయటకు నాకు సమయమియ్యుడి.
109నిలచియున్నందుకు వందనములు. ఒక నిమిషములో ప్రార్థన వరుసను ఏర్పరచుదుము. కాని దానిని చేయు ముందుగా, ఈ జవాబుల వాతావరణము నుండి దీనిని మారుదము, ఎందుకనగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమగు జవాబులు, విధానములు, పద్ధతులు ఉన్నవి. వేర్వేరు నమ్మకములున్నవి. చూడండి, ప్రశ్నలకు జవాబులిచ్చుచున్నప్పుడు కొన్నిసార్లు సూటిగా మాట్లాడెదము, కావున వాతావరణమును మారుటకై పాట పాడి ప్రభువును ఆరాధించెదము.
నేనాయనను ప్రేమించెదను, ప్రేమించెదను,
ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,
నా రక్షణను కొనెను,
కల్వరీ మ్రాను మీద.
ఈ పాటను మరల మనము పాడుచుండగా, మీ చుట్టూ ఉన్న వారితో మీరు కరచాలనము చేయవలెనని కోరుచున్నాను.
నేనాయనను ప్రేమించెదను, ప్రేమించెదను,
ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,
నా రక్షణను కొనెను,
కల్వరి మ్రాను పైన.
ఇప్పుడు, మనము మన నేత్రములు మూసికొని ఆయన వైపుకు మన చేతులెత్తుదము.
నేనాయనను ప్రేమించెదను, ప్రేమించెదను,
ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,
నా రక్షణను కొనెను,
కల్వరి మ్రాను మీద.
110మా పరలోకపు తండ్రి, ప్రభువా, మేము నిన్ను ప్రేమించుచున్నాము. ఈ చిన్న గుంపు నిన్ను ప్రేమించుచున్నదని నేను నమ్ముచున్నాను. మేము సజీవుడగు దేవుని ఇంటికి వచ్చియున్నాము. చిన్నదయినా, పెద్దదయినా భవనము లెక్కలోనికి రాదు, కాని దేవుని నివాసము కావలెను. నా ఈ ముసలి శరీరములో నివసించుచున్నవాడు గతించడు. ఒక దినమున ఈ శరీరము రాలిపోవును, కాని అంతరంగ పురుషుడు సదా జీవించును, ఎందుకనగా దేవుని శక్తి వానిని పట్టుకొనియున్నది.
మనము ఈ ఉదయమున ఈ పాత భవనములో ఆరాధన జరిగించుచున్నాము, ఇదెట్లున్నదనునది లెక్క కాదు, ఒక దినమున ఇది కూడా నేల కూలును. కానీ భవనములో నివాసము చేయుచున్న దేవుడు నిత్యుడు. తండ్రి, ఇప్పుడు మేము నిన్ను ఎదుర్కొని వందనములు మరియు స్తుతులు చెల్లించుటకు వచ్చుచున్నాము.
ప్రజల హృదయములలో ఈ ప్రశ్నలున్నవి, దీనిని చేయవలెనా లేక దానిని చేయవలెనా అని చెప్పి వారు ఆశ్చర్యపడుచున్నట్లుగా మేము గ్రహించి యున్నాము. తండ్రి, ప్రతి మెత్తని క్రైస్తవ హృదయములో ఎదో రకముగా జవాబు నిలచియున్నది. ఏది సత్యమో వారు ఏలాగయినా అర్థము చేసికొందురు. ప్రభువా, నీ కృప చూపుము. నేను తప్పు చెప్పినచో నన్ను క్షమించుము. ఉద్దేశపూర్వకముగా నేను పొరపాటు చెప్పలేదు. నీ పిల్లలయిన వీరు ఈ ప్రశ్నలు అడిగియున్నారు. తండ్రీ, నాకు తెలిసినదంతయూ వారికి నేను చెప్పవలెనని ప్రయత్నించాను. నేను చెప్పిన దానిని బట్టి నీవు నాకు తీర్పు తీర్చుటకు ఇక్కడ నిలబడియున్నావని గ్రహించుచున్నాను.
MATT 15:26,27•
MARK 7:27,28
111ప్రభువా, ఇప్పుడు రోగులను సమీపించబోవుచున్నాము. మేము నమ్మిన దానిని పొందెదమని బైబిలులో మేము చదివియున్నాము. తండ్రి, ఒకసారి యేసు ఈ భూమి మీద ఉండగా చేసిన దానిని మేము జ్ఞాపకము చేసికొనుచున్నాము. సురోఫెనికయ స్త్రీ ఆయన యొద్దకు వచ్చి, "ప్రభువా, నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నది గనుక కరుణించుము," అని పలికినది.
ఆయన చెప్పిన దానిని మేము వినుచున్నాము, "పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు."
ఓ, దేవా, అది పూర్తి తిరస్కారము వలె కనిపించియున్నది, అంతే కాదు గాని ఆమెను కుక్క అని పిలిచావు. దానిని గూర్చి ఆమె కోపము తెచ్చుకొనుటకు బదులుగా, చాలా మధురముగాను, దీనము గాను ఇలా జవాబు చెప్పినది, "అది నిజమే ప్రభువా!" ఎందుకనగా అది సత్యము. "అది నిజమే ప్రభువా, కాని కుక్కలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను తినును గదా?" అందువలననే పని జరిగినది. పిల్లల యొక్క బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆమె తినుటకు ఇష్టపడినది. దేవా, ఇప్పుడు మా ధృక్పధము కూడా అదే అయి యున్నది. తండ్రీ, నీవు చేయు ఏ క్రియనయినా సరే అందుకోవలెనని మేము ఎదురు చూచుచున్నాము. మేము నీ చేతులలో యున్నాము.
MARK 16:17
112దర్శనములు, సూచకక్రియలు మరియు అద్భుతములు చూపించిన పాత నిబంధన దేవుడు నేడు కూడా సజీవునిగా యున్నాడని ఎరిగి నేనెంతో సంతోషించుచున్నాను. వారు ఒక దినమున పరలోకములో ప్రవేశించెదముని ఎదురు చూచిరి. దేవుని కృప చేత మనము కూడా ప్రవేశించుదము, ఎందుకనగా అదే దేవుడు మన మధ్య తన్ను తాను బయలుపరచుకొని చూపించుకొనుచున్నాడు.
తండ్రీ, అటువంటి వారు మా మధ్య ఉన్నారు, ఈ ఉదయమున రోగులు మరియు అక్కరలలో యున్న వారు మా మధ్య ఉన్నారు. వారు ఒక ప్రార్థన వరుస గుండా వెళ్ళిపోవుచున్నారు. వారు వచ్చి ఈలాగు చెప్పుచుందురు గాక, "నీవు ఇక నాకు ఏ మేలు చేయుదువని నమ్మను. ప్రభువా, అట్టి వైఖరి వారికి ఉండకుండును గాక! కానీ వారు దేవుడు చెప్పిన దానిని జ్ఞాపకము చేసికొందురు గాక! "నమ్మువారి వలన ఈ సూచక క్రియలు కనబడును, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు బాగవుదురు." దానిని నీవు వాగ్దానము చేసితివి, అలాగున నీవు చెప్పియున్నావు.
పరిశుద్ధమగు గౌరవముతో - వారు వచ్చెదరు గాక! వారి మీద చేతులుంచి ప్రార్థన చేసిన తరువాత, వారు విశ్వాసముంచునట్లు కృప చూపుము. ఈ ప్రియ సోదరి వ్రాసిన ప్రశ్న వలె పరిశుద్ధాత్మ దిగి వచ్చును గాక! ఆమె ఇట్లు వ్రాసినది, పరిశుద్ధాత్మ ఆమె ఈ మర్త్యతను దాదాపుగా చంపివేసినట్లు వ్రాసినది. ఆయన యొక్క సన్నిధి యొక్క అద్భుత బాప్తిస్మమును ఆమె పొందినది.
ప్రభువా, ఈ ఉదయమున వచ్చిన ప్రతి ఒక్కరి మీద అదే ప్రభావము చూపబడును గాక! దానిని అనుగ్రహించుము. వారు బాగవుదురు గాక! నీవు దానిని వాగ్దానము చేసియున్నావనియు, నీవు అబద్ధమాడవనియు వారు ఏ మాత్రమూ సందేహించక తెలిసికొందురు గాక. వెలుగు తాకిన వెంటనే చీకటి అను సందేహము ఎగిరిపోవును. తండ్రి, దానిని దయచేయుము. ఇప్పుడు వారిని నీకు అప్పగించుచున్నాను. యేసు నామములో వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్.
113ప్రార్థన కొరకు వచ్చిన వారు వరుసలో ఏర్పడండి. ఇక్కడి భవనములో ఈ వైపు నున్న వారు మొదట రండి. "ఆ మహా వైద్యుడు మన చెంతనే యున్నాడు," అను పాటను టెడ్డీ మన కొరకు పాడును. ఇటు వైపు నున్నవారు మొదటగా రండి. "మహా వైద్యుడు చెంతనే యున్నాడు."
114నెవిల్ సోదరుడు వచ్చుచున్న వారిని వరుసలో ఉంచుచున్నాడు. మనము ఇచ్చట నిలబడుదము. సంఘమంతా ప్రార్థించవలెను. నెవిల్ సోదరుడు నేను కలిసి ఇచ్చటుందుము; అతడు అభిషేకించును; నేను రోగుల మీద చేతులుంచెదను. ఈ ముందుకు రండి. ఇప్పుడందరూ ప్రార్థనలో యుండండి.
ఇప్పుడు, మనం ఏమి చేయుచున్నాము? మనము రోగులకు నూనే రాచి మరియు వారి కొరకు ప్రార్థించుదము. మీ కొరకు లేఖనమును ఉదహరించెదను, మీలో ఎవనికైనను రోగము సంభవించినయెడల, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనే రాచి అతని కొరకు ప్రార్ధన చేయవలెను. విశ్వాస సహితమగు ప్రార్ధన రోగిని స్వస్థపరచును, దేవుడు వారిని లేపును. వారు ఏదైనా పాపము చేసినట్లయితే, అది క్షమింపబడును. మీ తప్పులను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మరియు మీరు స్వస్థతనొందునట్లు ఒకనికొరకు ఒకరు ప్రార్ధన చేయుడి."
ఇప్పుడు తక్కినది ఈ పక్కన ఉన్నవారు, మీరు కోరినట్లయితే, అక్కడ ఆ వరుస క్రిందకు మీరు వెళ్ళిన వెంటనే, ఆ స్థలము, ఆ ప్రక్క, మీరు అక్కడే వెనక ఉందురు. ఇప్పుడు ఈ సంఘపు పెద్ద నూనే రాచి మరియు ప్రార్ధన చేయును. నేను ప్రార్దించి మరియు రోగులపై చేతులుంచెదను. మరియు ఇప్పుడు, గుర్తుంచుకొనండి స్నేహితులారా, ప్రార్ధనా వరుసలో నిలబడియున్న మీరు, ఇక్కడ ఎందుకొరకు నిలబడియున్నారో నిరూపించుకొనుటకు ఇదే ఆ తరుణము. మీరు స్వస్థతనొందబోవుచున్నారు.
నేను విశ్వసించుచున్నాను కనుక అదే మా అమ్మను (మరియు ఆమె ఒక వృద్దురాలు) అన్నివేళలా పట్టుకొనియున్నది అని నేను నా పూర్ణహృదయముతో నమ్ముచున్నాను. ఆయన నాకు తెలుపువరకు… ఆమె చనిపోవు చుండవచ్చు, అయితే ఆయన తెలుపువరకు, ఆమె చనిపోదు అని నేను నమ్ముచున్నాను, చూచారా. మరియు ఇప్పుడు, ఆమె వెళ్ళవలసియున్నది అని నాకు తెలుసు, మరియు ఆమె వెళ్ళుటకు తగిన వయస్సు కలదు, మరియు వెళ్ళుటకు కోరుచున్నది, మరియు ప్రయత్నము చేయుచున్నది. అయినను, ఆయన నాకు తెలుపును అని నేను నమ్ముచున్నాను. ఆయన నాకు తెలుపును అని నేను నమ్ముచున్నాను, చూచారా. ఇప్పుడు ఆయన ఆలాగు చేయకపోవచ్చు. నాకు తెలియదు, ఆయన ఆలాగు చేయును అని నాకు తెలియదు, అయితే ఆయన తెలుపును అని నేను నమ్ముచున్నాను, చూచారా. అయితే ఇంతవరకు దానిగురించి ఆయన నాకు ఏమియు తెలుపలేదు. మరియు దానిని నేను నమ్ముచున్నాను. మరియు ఒకవేళ నీవు….?…
115ఆయన నాకు చూపించువాటిని అంతయు నేను ప్రజలకు తెలియజేయను, మీకు అది తెలుసు. మంచిది, నిన్న నేను ఫలానా స్థలములో ఉన్నాను, మరియు దర్శనములో ఏమి జరుగనైయున్నదో నేను ఖచ్చితముగా చూచాను, అది సత్యము అని దేవుడు ఎరుగును, మరియు ఇద్దరు లేక ముగ్గురితో కూర్చొనియున్నాను. దాదాపు అర్ధగంట తరువాత అది జరుగుట చూచాను, కేవలము ఖచ్చితముగా, అది ఎలాగు ఉండవలేనో అలాగే. నేను అక్కడ నిలిచి, మరియు నాలో నేను వణికాను, ఆలోచించుచూ, చూచారా? నేను చెప్పాను, "అది ఆలాగు జరుగును అని నేను వారికి బహుశ ముందే చెప్పవలసియుండేది." కాని నేను చెప్పాను, "మంచిది, కేవలము దానిని అలాగే వదిలివేయు. చూచారా?"
అది ప్రతి దినమూ జరుగుచున్నది. చూచారా? ఏదో జరుగనైయున్నదని నేనెరుగుదును; అది నిజమని దేవునికి తెలియును. చూచారా? ఏదో జరుగబోవుచున్నది. దానిని చూపించి దానిని గూర్చి చెప్పెను. ఏదో నాకు కనబడి నాతో ఇట్లు చెప్పెను, "ఈ మాటను ఆ విధముగా చెప్పుము, మరియు ఆ కార్యము అక్కడ నెరవేరును." మరియు అప్పుడు నేను పలికాను, "మంచిది, అది ఆలాగు ఉండును గాక." అప్పుడు నేను గమనించితిని; అది అక్కడ ఉండెను. చూచారా? అవును.
మంచిది, మనము దానిని పలికాము కనుక, ఆయన మాట చేత జీవములేని కొన్ని పదార్థములు కదలునట్లు చేయగలిగియెడల, మరి ఇంక ఎంత అధికముగా ఆయన నిన్ను మరియు నన్ను, నాతో కలిసి చేయునట్లు చేయును. మీరు నాతో ఉన్నారు; మీరు నా - మీరు రోగియైన నా సోదరీ మరియు సోదరులు. "దేవుని యొక్క శక్తి ఈ వ్యక్తి స్వస్థపరచును గాక," అని మనము ఈ మాటలను పలికినట్లయితే, ఎందుకు, అది నెరవేరవలసియున్నది. ఇప్పుడు, "లేదు, నేను దానిని సందేహింతును," అని ఆ వస్తువు పలుకలేదు. అయితే "మంచిది, నేను ఆశ్చర్యపోవుదును," మరియు అది జరుగదు. చూచారా? కాని మీరు కేవలము ముందుకు సాగి మరియు కేవలము మీ యొక్క ఆలోచనతో ఆ వరుసలో, "నేను స్వస్థతను పొందబోవుచున్నాను," అని మీరు వెళ్ళినయెడల. మీరు దానిని కలిగియుండవలసియున్నది. మీరు దానిని నమ్ముచున్నారా?
116ఇప్పుడు, మనందరం ప్రార్థించుదము. మా పరలోకపు తండ్రి, ఇక్కడ నిలబడియున్న ఈ యువతి మీద, యువ తల్లి మీద చేతులుంచుచున్నాను. [టేపు మీద ఖాళీ యున్నది.]
ఈ చేతి గుడ్డలు ఎవరి మీద అయితే ఉంచబడునో వారిని నీవు స్వస్థపరచెదవని నమ్మి ప్రార్థించుచున్నాను. వారి మనవులను దయచేయుము. యేసుక్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాను. ఆమేన్.
117ఇంత సేపు మీరు నిలచియుండి నెమ్మదిగా యున్నందుకు మిమ్మునెంతగానో అభినందించుచున్నాను. ఇటువంటి ఆలయములో ఉండుట సంతోషకరము. ఈ ఆలయములో ఉండుట కంటే మరెక్కడ ఉండుటయు శ్రేష్ఠము కాదు. ఇంతకంటే మంచి స్థలము మరెక్కడున్నదో నాకు తెలియదు. ఇప్పుడాయన ఇక్కడే యున్నాడు. దేవునికి గౌరవము చూపవలెను. ఆయన ఇక్కడ ఉన్నాడను సంగతి మనకు ఆదరణను ఇచ్చును.
ఒక్క క్షణము ఆయన ఎంత గొప్పవాడో మనం ఆలోచించుదము. ఆయన చేసిన గొప్ప కార్యములను తలపోయుదము. ఆయన లేకపోయినచో మనం ఏమీ చేసియుండెడి వారము? ఆయనను ఎన్నో విషయములలో మనం చూచియున్నాము. ఒక్కటి కాదు, ఆయన చెప్పిన ప్రతిది జరిగినది. ఆయన నాకు దర్శనములను ఇచ్చెను. ఈ ఉదయము నేను ప్రశ్నించుచున్నాను, ఆయన జరిగించలేని ఒక్క కార్యమును మీరు ఎత్తి చూపగలరా? ఆయన తాను చెప్పిన దానిని ఖచ్చితంగా చేయును. ఆ క్షణములోనే చేయును. ఆయన దేవుడు. ఆయన మన తండ్రి. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. ఆయన పరలోకము ఎక్కడున్నా గాని అచ్చటికి మనము వెళ్ళ బద్ధులమైయున్నాము. ఇప్పుడాయన ఇచ్చటనే యున్నాడని మనం ఎరుగుదుము. దానిని మనం గ్రహించియున్నాము.
118మనము అదృశ్యమగు వాటిని చూచుచున్నాము. ఇప్పుడు మీలో చాలామందికి ప్రార్థించియున్నాము. (చూచారా?) వ్యాధి లక్షణములను చూడవద్దు, అందుకు వ్యతిరేకముగా నిలబడండి. చూచారా, దేవుడు వాగ్దానము చేసిన దేనినయినా గాని సందేహించరాదు. ఇప్పుడు నీవు నీ కన్నుతో చూచుట కాదు. క్రైస్తవుడు అలాగు చూడడు. మీకిది తెలియును. మీరు మీ నేత్రములతో చూడరు. మీ హృదయములతో మీరు చూడవలెను. చూచారా? "చూచుట" అనగా "అర్థము చేసికొనుట," అని భావము. మీ హృదయముతో మీరు గ్రహించవలెను; కావున మనం మన నేత్రములు చూడలేని వానిని చూడగలుగుచున్నాము. చూచారా? క్రైస్తవ ఒప్పుదల, క్రైస్తవ్యము యొక్క సర్వాంగ కవచము దాని మీదనే ఆధారపడియున్నది. మనం చూడనివాటి కొరకు ఎదురు చూచుచున్నాము. అబ్రాహాము దేవునిని నమ్మెను గనుక అతడు లేని వాటిని ఉన్నట్లుగా పిలచెను. చూచారా?
ఇప్పుడు, మనం ఏమి చేయుచున్నాము? ఆ విధంగా నీవు ప్రార్ధించినప్పుడు, స్వస్థపరచెదనని ఆయన వాగ్దానము చేయుచున్నాడు. వెంటనే నీకు చిన్న తేడా కూడా కనబడకపోవచ్చును, కాని దానిని ఎన్నడూ… అది కాదు. చూచారా? ఏమయినా గాని దానిని మనము నమ్మవలెను.
119దాదాపు రెండు గంటల క్రితం నేను వేదిక యొద్దకు వచ్చాను. కూటములో ఇంకా సగం కూడా జరుగలేదు. నేనెంతో అలసిపోయి, సొమ్మసిల్లతిని. నాకు ఫ్లూ వచ్చినట్లనిపించినది, కాని ఇప్పుడు నాకు బాగున్నది, ఎందుకనగా దానిని నేను చెప్పియున్నాను, "దేవుని పనిని నెరవేరవలసిన బాధ్యత నాకున్నది. నేను దేవునిని నమ్ముచున్నాను." అపవాదితో నేను పోరాడవలసి యున్నాను. ఇది మీరు తెలిసికొనవలెను. అక్కడున్న నా భార్య కూడా ఈ విధంగానే చెప్పగలదు, ఈ ఉదయం నేను ఇచ్చటికి వచ్చే ముందు నా గొంతు బొంగురు పోయినది. ఏమి బాగోలేదు. నేనిట్లు దీనిని కొనసాగించగలనని అనుకొన్నాను, కాని ఇప్పుడు ఎంతో అద్భుతంగా యున్నాను. యధార్ధముగా చెప్పు చున్నాను, నేనిప్పుడు నా అంశమును తీసికొని ఇంకా బోధించగల చక్కని స్థితిలో యున్నాను.
మీ కన్నులతో చూడలేని వాటిని మీరు చూడవలెను. మీ హృదయముతో వాటిని చూడవలెను. దానిని మీరు నమ్మవలెను. నీవు నీ నేత్రములతో చూడలేని వాటిని గూర్చి సాక్ష్యమియవలెను. నీవు విశ్వసించవలెను. ఎందుకనగా అదే విశ్వాసము. "విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, లేనివి ఉన్నవనుటకు రుజువునై యున్నది."
120ఈ ఉదయమున నా ముందు కూర్చొనియున్న ఒక యువ క్రైస్తవుని నేను గమనించాను. అతడు ఒక తీర్మానము తీసికొనెనని నాకు తెలియును. దానిని నిశ్చయంగా నేను ప్రశంసించుచున్నాను. అతడెవరో నేను చెప్పను. అతడు మన సహచరుడు కాకపోయినా, స్నేహితుడు కాకపోయినా, తల్లి కాకపోయినా, తండ్రి కాకపోయినా తీర్మానము చేసికొనిన క్రైస్తవుడనినచో అభినందించుట తప్పనిసరి. వారు క్రీస్తుకు లోబడి యుండవలెనని తీర్మానించుకొనిరి. చూచారా?
విధేయత చూపుట ద్వారానే నీవు ప్రేమించువారిని నీవు జయించగలవు. లోబడుట ద్వారా నీవు ప్రజలను రక్షణలోనికి నడిపించగలవు. నీవు పట్టుకొనిన దానిని గట్టిగా హత్తుకొనుము. దేవునితో నీవు సరిగా యున్నావో లేదో నిశ్చయంగా తెలిసికొనుము, ఎల్లప్పుడూ అలాగే నిలచియుండుము. దానితోనే కొనసాగుము. నీవు దానితోనే నిలచియుండిన యెడల, ఏదియు ఎన్నడూ నిన్ను కదపజాలదు.
121మనందరము పొరపాట్లు చేయుదుము. కాని గుర్తుంచుకొనండి, మీరు ఒకరి వైపు ఒకరు చూచుకొనునప్పుడు అవతలి వ్యక్తి యొక్క తప్పును చూడవద్దు. చూడండి, అలాగును చేయవద్దు, ఎందుకనగా గుర్తుంచుకొనుడి, మనందరము తప్పులు చేయుదుము. కానీ ఆ వ్యక్తిని నడిపించుచున్న క్రీస్తు వైపు చూడండి. వారికి ఏదయినా సహాయము అవసరమైనచో, వారి కొరకు ప్రార్థించుము. ఆ విధంగానే మనం కొనసాగిపోగలము. (చూచారా?) ప్రార్ధించండి. గుర్తుంచుకొనండి, అటువంటి స్థితిలో యున్న వారెవరికోసమైనా మీరు ప్రార్థించినప్పుడు, దేవుడు ఆ ప్రార్థనను గౌరవించి, ఆ విధంగా నీవు పరుల కొరకు విజ్ఞాపన చేయునప్పుడు, నీవే ముందు స్వస్థత పొందెదవు. ఇది నిజము. ఒకరి కొరకు ఒకరు సహాయపడుట మీద, ఒకరి కొరకు ఒకరు పని చేయుట మీద, ఒకరి పట్ల ఒకరు దయచూపుట మీద, ఒకరి నొకరు అర్థము చేసికొనుట మీద క్రైస్తవ్యము ఆధారపడి యున్నది. నీ పొరుగువారు తప్పు చేయుచున్నట్లు నీవు గమనించినప్పుడు, వారే విషయంలో తప్పు చేయుచున్నారో, చూచి నీవును వారితో పాటు ఆ తప్పులో పాలు పొందవద్దు, కాని వారి కొరకు ప్రార్థించుము. ఎడతెగక ప్రార్థించుము, మరియు దానిని దేవుడు అర్థము చేసికొనును. ఆయన సమస్తమును చక్కదిద్దును.
122ప్రభుని చిత్తమయితే, ఇది నా ఆశ, బిల్లీకి ఒక పద్ధతి ఉన్నది. ప్రతి వారికి అతడు ఒక పోస్టు కార్డు పంపించును. ఈ వారములో నా తల్లి బాగయినచో, వచ్చే ఆదివారం నేను ఒక సువార్త వర్తమానము అందించగోరుచున్నాను. ఇది ఖచితము కాదు గాని, నాకు తెలిసినంత మట్టుకు ఆ విధంగా తలంచుచున్నాను. నా తల్లి ఈ వారములో బాగయి అంతా సక్రమముగా జరిగినచో అది జరుగును. ఇక్కడున్న మన ప్రశస్త సంఘకాపరి అందుకు సమ్మతించితేనే జరుగును. వీలయితే మీరందరూ తిరిగి రావలెనని ఆశించుచున్నాను. మీరు రాగలిగినట్లయితే, మిమ్మును చూచి ఎంతో సంతోషించెదము.
మీరు మీ పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించుచున్నారా? ఆయన ఆశ్చర్యకరుడు గదా? ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయగలము? మీరేమైనా సాధించగలరా? ఆయన కంటే గొప్పవారెవరైనా యున్నారేమో మీరు నాకు చెప్పగలరా? ఆయన కంటే గొప్ప వారిని మీరు నాకు చూపించగలిగినయెడల, నాకున్నదంతయూ నేను అమ్మివేసికొందును. ఇంతకంటే గొప్ప దానిని నాకు చూపించండి. నేను చూడగోరుచున్నాను. నాకు తెలిసిన అతి గొప్పది, ఇది. ఈ నిశ్చయతతోనే మనము రక్షించబడితిమని ఎరుగుదుము. భూమ్యాకాశములను సృజించిన దేవుడు తన్ను తాను తగ్గించుకొని, దిగి వచ్చి, మన మధ్య నివాసము చేసి, మన కొరకు పని చేసెను.
123మనము సరిగా యున్నామో లేదో ఇక్కడే మనకు తెలియును, ఎందుకనగా ఆయన ఆదియందు దీనినే చేసెను. ఆ వెనుకటి క్రైస్తవులను, సంఘమును చూడండి, పరిశుద్ధాత్మ కదిలి వచ్చి ఎట్లు పని చేసెనో చూడండి. వారెట్లు ఆపవాదితో పోరాడిరో చూడండి. వారెట్లు నిలబడిరో చూడండి. ఇక్కడ కూడా అదే జరుగుచున్నది. అవే సూచక క్రియలు, ఆవే అద్భుతములు, అదే దేవుడు పనిచేయుచున్నవి, ఆయన తప్పిపోనివాడని రుజువు చేయుచున్నవి.
కొన్ని సంవత్సరములకు జరుగు దానిని ముందే ఎట్లు చెప్పగలరో నాకు సైన్సు ద్వారా వివరించండి. సైన్సులో దానికి ఏదయినా పదమున్నదా? అలాగు ముందుగా తెలియచెప్ప గల సైన్సు విధానమున్నదా? ఆటువంటి శక్తిని నాకు చూపించండి. జరుగకముందే తెలియ చెప్పగల శక్తి ఎక్కడున్నదో నాకు చూపించండి. ఏ మానవ మేధస్సు అయినా గాని అలాగు చెప్పగలదేమో చూపించండి. జరుగబోవు దానిని నీవెట్లు తెలిసికొని చెప్పగలవు? చూచారా? అలంటిది లేదు..
124కావున ఆయన దేవుడు. చూడండి, ఆయన దేవుడై యున్నాడు. ఆయన దేవుడై యున్నాడు గనుక కృప చూపించి మనతో నివాసము చేయుటకు వచ్చును. ఆ వెనుకటి కాలములో ఆ విధంగానే ఆయన చేసెను. వారు జరుగబోవు వాటిని ముందుగానే చెప్పిరి. వారు చెప్పిన విధంగానే ప్రతి ఒక్కటియూ నేరవేరినది. ఆ దేవుడే మనకు తోడైయున్నాడు. ఆ వెనుక కాలములో ఆయన జరిగించిన కార్యములనే ముందుగా మనకు చెప్పుచూ జరిగించుచున్నాడు. మనం ఎంతో సంతోషించవలెను. మనం మేఘముల మీద గంతులు వేసినట్లు తన్మయము చెందవలెను. అంతరిక్షము మీద నడచిన ఆనుభూతిని దాదాపు పొందవలెను, ఎందుకనగా దానిని మరం ఎరుగుదుము.
మనము మరణములో నుండి జీవములోనికి దాటి యున్నామని ఎరుగుదుము. మనకు రక్షణ ఉన్నదని మనమెరుగుదుము. మనము క్రైస్తవులమని మనకు తెలియును. మనము పరలోకమునకు వెళ్ళుచున్నామని మనకు తెలియును, ఎందుకనగా దేవుడు వాగ్దానమును చేసెను, ఇక్కడ ఆయన మనతో కూడా సంచరించుచున్నాడు. ఆ విధంగా ఆయనను మనం చూచుచున్నాము.
125ఆయనను మనం చూచుచున్నాము. ఆయనను నేనెట్లు చూచెదను? నేను నిన్ను చూచినప్పుడు. నాలో నీవు ఆయనను చూచెదవు; నీలో నేను ఆయనను చూచెదను. చూచారా, ఆయన నీకు చేసిన దానిని నేను చూచుచున్నాను. ఇక్కడ ఆయన నాకు వాక్యమును బయలు పరచుటను నేను చూచుచున్నాను. నాలో ఆయనను నీవెట్లు చూడగలవని నీవు ప్రశ్నించవచ్చును. చూడు, ఇక్కడ ఆయన నాకు వాక్యమును బయలుపరచుచున్నాడు. దానిని నేను చూచుచున్నాను. దానిని ఆయన నీకిచ్చుచున్నాడు. నీవు దానిని వెంబడించుచున్నావు. చూచారా? ఆ తరువాత నీవు వెనుదిరిగి ఇది నాకెట్లు వచ్చినదని ఆశ్చర్యపడుచుందువు. ఆ విధంగా ఆయనను నీవు కనుగొందువు. చూచారా? నీవు నాలో ఆయనను చూడుము; నీలో నేనాయనను చూచెదను.
సూర్యోదయయములో ఆయనను మనము చూడగలము. సూర్యాస్తమయములో ఆయనను మనము చూడగలము. పూవులలో ఆయనను మనము చూడగలము. ఎక్కడయినా ఆయనను మనము చూడగలము, ఎందుకనగా మనము ఈ భూసంబంధమగు పరిస్థితుల నుండి దాటిపోయి యున్నాము. నిమగ్నమగు సంగతులను దాటిపోయి దేవుని మహిమ యొక్క మహోన్నత శిఖరము మీదికి వచ్చియున్నాము. ఆయన యొక్క సౌందర్య మనము చూడగలము.
కొద్ది రోజుల క్రితం అలాస్కా ప్రధాన మార్గములలో ఒక దానిలో నేను ప్రయాణించుచున్నాను. నేను వేట కొరకు వెళ్ళుచున్నాను. నేను వెనుక నుండి ఆశ్చర్యపడి ఆలోచించుచున్నాను. "ఎందుకు? ఎందుకు?" దేవుడెంత వాస్తవముగా యున్నాడు. ప్రతి చోటను రోగులున్నారు, కాని దేవునికి ఇవన్నియూ తెలియును.
126రేపు నేను వెళ్ళిపోవలసియున్నాను, సహోదరుడు రాయ్ అక్కడ యున్నాడు. మేమందరమును రేపు కొలరెడోకు వెళ్ళవలసి యున్నాము. ప్రతి ఆకురాలు కాలములోను మేము వెళ్ళుచుందుము. నేను వచ్చి కూటములకు వెళ్ళవలసి యున్నాను. అయితే మా తల్లి పరిస్థితి బాగోలేనందున వెళ్ళలేదు.
పరిశుద్ధాత్మ యొక్క దయను గూర్చి గమనించండి. చాలా కాలము క్రితమే ఆయనకది తెలియును. కావున వారు నన్ను వెళ్ళనీయుటకు బదులుగా ఆపిరి. అప్పుడాయన నాకు ఒక దర్శనమను అనుగ్రహించెను. అక్కడికి నన్ను ఆయన పంపెను. నాకు ఒక వేట పర్యటనను ఆయనను అనుగ్రహించెను. నేను కొలరెడోకు వెళ్ళలేకపోయాను. (చూచారా?) కొలరెడోలో అటువంటి జంతువులుండవు. నేను వెనుదిరిగాను, ఆయన నాకు ఒక దర్శనమిచ్చెను. నాకది అవసరము. ఆయన నాకు ఆ పర్యటనను దూరము చేయుచున్నట్లు తెలిసినది. కొలరెడో పర్యటన ఆయనకు ఇష్టము లేదు. దేవుని యొక్క మంచితనము మరియు దయ గూర్చి మాట్లాడుచున్నాను. అయితే ఎందుకు జరిగినది? చాలా కాలము అయినది. నా తల్లి శ్రమపడబోవుచున్నదని ఆయనకు తెలియును. నా తల్లి ఆస్పత్రిలో యుండబోవు చున్నదని ఆయనకు తెలియును. ఆయన దానిని అనుమతించిన యెడల, అది ఒక మేలు కొరకేనని నాకు తెలియును. దానిని గూర్చి నాకేమియూ తెలియదు. ప్రభువును ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుచున్నవి అని నేనెరుగుదును.
మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఆగి ఆయనను మనము చూడవలెను. నీవు ఆగుము. నీ నిరాశల నుండి దూరము కమ్ము. ఆయన ఆత్మ యొక సన్నిధిలో కొద్ది నిమిషములు మౌనముగా నిలబడుము. ఆయన అన్ని చోట్ల సంచరించుచున్నాడు. ఆయనెంతో మంచివాడో చూచారా?
127అక్కడ మా తల్లి పడియున్నది. ఆమెను గూర్చి నేను ఆలోచించుచున్నాను. ఆమెకు ఈ పక్షవాతము వచ్చినా గాని ఆయనేందుకు ఆమెను తీసికొనలేదు. ఆమె అప్పుడే ఎందుకు చనిపోలేదు? కాని చూడండి, ఆయన భవిష్యత్తును ముందే ఎరుగును. ఆయన వాగ్దానమును మీరు గమనించండి. నేను కొలరెడోకు వెళ్ళుచున్నాను. నాకు ఆ విధంగా అడువులకు వెళ్ళుట చాలా ఇష్టము. ఆయన నాకు ఒక మంచి దర్శనమిచ్చెను. అక్కడికి ఆయన నన్ను పంపెను. నాకేమి దొరుకునో ఆయన నాకు చెప్పెను. నేను బయలుదేరేక ముందే, ఆయన అంతా నాకు చెప్పెను. మేమెట్టి దుస్తులు ధరించుదుమో, ఏమేమి చేయదుమో ఆయన చెప్పెను. దానంతటిని గూర్చి ఆయన నాకు చెప్పెను. ఆ తరువాత వచ్చి దానిని గూర్చి మీ యందరికీ చెప్పాను. ఆ చెప్పిన విధంగానే అదంతయూ జరుగుట వారు ఆ తరువాత ఖచ్చితంగా చూచారు. అక్షరాలా జరిగినది. నా తల్లి అక్కడుండునని నేనెరుగుదును. ఆ సమయములో ఆమె చాలా దిగజారిపోయిన ఆరోగ్య స్థితిని కలిగి యుండునని తెలియును. మరో వేట పర్యటనకు నేను వెళ్ళజాలను. చూచారా? అది నాకే అర్థము కాలేదు. కాని మనలను మనము ఆయనకు అప్పగించుకొని చూడవలెను. ఆయన సమస్తమును చక్కగా నడిపించును. చూచారా? ఆయన ప్రతి దానిని ఒకదాని వెంబడి ఒకటిగా రానిచ్చును.
128ఒక రోజున నేను ఒక సేవకుని యొద్ద నిలబడి యున్నాను. అతనికి దర్శనములు, కలలు వచ్చును. వాటిని నాకు చెప్పుచుండును. దానికి ఆర్థము చెప్పుచుండును. బిల్లీ మరియు ఈ సేవకుడు కలిసి అక్కడ నిలబడి యున్నారు. అది చాలా పరిపూర్ణముగా యున్నది. పరిశుద్ధాత్మ సంగతులకు ఎట్లు బయలుపరుచునో అతడు చూచి ఆశ్చర్యపోయెను. ముందే చెప్పిన సంగతులను అతడు పరిపూర్ణముగా నెరవేరుట చూచెను. వాటిని ఆ దారిలో చూపించెను. ఆయన దేవుడని మీతో నేను చెప్పుచున్నాను. ఆయన దేవునిగా బయలుపరచుకొనుచున్నాడు.
129మీలో చాలామంది జనులు త్యాగములు చేసియున్నారు. మీరు మగ స్నేహితులను, ఆడ స్నేహితులను విడిచి పెట్టియన్నారు. మీరు గృహములను విడిచిపెట్టి యున్నారు. మీలో చాలామంది మీ మీ సమాజములలో నుండి బయటకు వచ్చియున్నారు. చాలా కాలము నుండి మీతో స్నేహము చేయుచున్న వారిని విడిచి వచ్చిరి. ప్రభువు మార్గములో నడువవలెనని మీరిట్లు చేసియున్నారు. దానిని బట్టి మిమ్మును అభినందించున్నాను. ఆ విధముగా చేయుట చాలా గొప్ప సంగతి అని నేను తలంచుచున్నాను, ఎందుకనగా మీరు సువార్త వెలుగును చూచియున్నారు. అది సత్యము. మీరు ఆ వెలుగులో నడచెదరు. పిల్లలారా, మీరేమి చేసినా గాని, మీరెక్కడికి వెళ్ళినా గాని చెడును మాత్రము అసహ్యించుకొనండి. క్రీస్తును వెంబడించండి. మీరు జీవించునంత కాలము సరయిన మార్గములోనే నిలచియుండండి. దాని నుండి తొలగిపోవద్దు, అది మీకు నిశ్చయముగా మేలు కలుగజేయును. అది నిత్యజీవము.
130నా తల్లిని నేను చూచుచున్నాను. కొద్ది నిమిషముల పాటు ఆమె తనకు తాను లేవగలుగుచున్నది. ఆమె మేల్కొనినప్పుడు ఆమెను నేనడిగాను, "అమ్మా, ఆమ్మా, నా మాట వినబడుచున్నదా?" కొన్నిసార్లు అక్కడామె పడియుండగా ఈలాగు అడిగాను. ఆమెకు వినబడలేదా? ఆ తరువాత కొంత సేపటికి, ఆమె "హూ" అని ఒక విధంగా తల ఊపెను. ఒక రాత్రి నేనిట్లు అడిగాను, "అమ్మా! నీవు నన్ను ఎరుగుదువా?" ఆమె నన్ను గుర్తించలేదు. నేనిట్లడిగాను, "ఇక్కడ నిలబడియున్నదెవరో చూచారా?" ఆమెకు తెలియలేదు. "అమ్మా, నీవు యేసును ఎరుగుదువా?" అనడిగాను. ఆమె తన స్వంత బిడ్డను మరచిపోయి యుండును గానీ ఆమె యేసును మరువజాలదు. అవును. ఓ, సోదరుడా.
చూడండి, మీరు మీ స్వంత కుటుంబములోని వారికి ఎవరయినా అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు అర్థము చేసికొనగలరు. ఆయనను ఎరుగుటయే జీవము. ఆయనను ఎరుగుటయే నీ జీవితపు పరుగు పందెమును ముగించిన పిదప సంతృప్తి నిచ్చును. ఆవల నున్న ఆకాశములకు వేలుపట నీకు ఒక గృహమున్నది. అదేమిటో నాకు తెలియదు, నేనెరుగను. అదెట్లు ఉండునో నీకు నేను చెప్పు విధానము లేదు, ఎందుకనగా నా మట్టుకు నాకే తెలియదు. కానీ ఒక దినమున దేవుని కృప చేత మనము అక్కడికి యాత్ర చేయుదుమని నేనెరుగుదును.
131ఈ వారము నా కొరకు ప్రార్థించుడి. నాకది అవసరము. మీరిప్పుడు నా కొరకు ప్రార్థించుడి. మీ కొరకు నేను ప్రార్థించుచుందును. ప్రభుని చిత్తమయితే, ఆయనకిష్టమయితే, వచ్చే ఆదివారము నేను కలిసికొందును. ఈ రాత్రి కూటమును గుర్తుచేసికొనండి. సాధ్యమయితే ఈ రాత్రికి నేను తీసికొనక పోవచ్చును. ఏమయినా జరిగితే నా తల్లి యొద్దకు వెళ్ళెదను. అంతా అనుకూలముగా యున్నచో, ఈ రాత్రికి తిరిగి మీ యొద్దకు వచ్చెదను.
ఇప్పుడు మన సోదరుడు, ప్రశస్త సంఘకాపరియగు నెవిల్ ఇక్కడికి వచ్చును. ఇక్కడున్న వారందరూ నిశ్చయంగా ఈ సంఘ జనులేనని తలంచుదును. వీరిని మనము గృహ జనులని పిలచుదుము. సువార్త సత్యము కొరకు సహోదరుడు నెవిల్ నిలబడిన విధానమును మేము ప్రశంసించుచున్నాము. జనుల ఎదుట అతనికి గల యధార్థతను మరియు అణకువను మేము ప్రశంసించుచున్నాము. ఒక రోజున అతడు మాట్లాడుచుండగా నేనెన్నడూ అలాగు ఇంతకు ముందు వినలేదు. ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రవచనమును అందించెను. అతడు నన్ను ఒక ప్రవక్త అని పిలచెను. ఆత్మావేశము ద్వారా అలాగనెను, అది పరిశుద్ధాత్మ యొక్క పలుకు. అందువలన నాకు ముందుకు కదిలిపోయి లోతులకు, ఉన్నత స్థలములకు దేవునితో కూడా సాగిపోవు విశ్వాసమును అనుగ్రహించబడినది. నేను నిన్ను అభినందించుచున్నాను నెవిల్ సోదరుడా, దేవుడు సదా నిన్ను దీవించు గాక. మిమ్మును మరల చూచువరకు దేవుడు మీకు తోడైయుండు గాక.