గౌరవములు

గౌరవములు

1కొద్దిసేపటి క్రితం నేను హాస్పిటల్ విడిచిపెట్టి వచ్చు వరకు, ఒక విధంగా ప్రభుని చేతులలోనే వదిలినట్లయింది. నాకు కొద్దిగా గొంతు బొంగురు పోయినదని ఎరుగుదును, ఎందుకనగా నాకు జలుబు చేసినది. కాని, నేననుకొన్నాను, అమ్మ సరిపడు ఆరోగ్యముతో యుండినచో నేను రాగలను. మీతో పరామర్శించుటకు మరల నేను వచ్చుదును. అమ్మ వలె అక్కడ పడియున్న వారిని చూచినప్పుడు, ఇక్కడున్న ఈ ఇతర తల్లిదండ్రులను చూచినప్పుడు, మనందరము ఆ చోటికి రావలెను గదా అను ఎరుక కలుగును. ఆమె వెళ్ళిపోవుటకు సిద్ధముగా నున్నది గనుక నేనెంతో కృతజ్ఞత చెల్లించవలెను గదా అనుకొన్నాను.

2సంఘమునకు చెప్పవలసిన సంగతి మరొకటున్నది. అక్కడ వెనుక సోదరి విల్సన్‌ను చూచానని నమ్ముచున్నాను. ఇక్కడే ఎక్కడో లేదా భవనములో బహుశా ఎక్కడో సొత్మాన్ దంపతులు ఉన్నారు. రాత్రులందు అమ్మతో కూర్చొనుటకుగాను, ఇంకా అట్టి అవసరములకు గాను ఇక్కడున్న వారిలో చాలామంది తమ సంసిద్ధతను, సహాయమును తెలియపరచిరి. అది ఎంతో అణకువ, మీరు చేసిన సమస్తమును బట్టి మీ అందరిని నేను ప్రశంసించుదును. నిజంగా, కుటుంబము అలసిపోయినది; మేము ప్రతి రాత్రి ఆమెతో ఉంటున్నామని మీరెరుగుదురు. ఇప్పుడు వారిలో చాలామంది పనిచేయుచున్నారు. నేను మిడా, లేదా డెలోరస్, ఆమెకు బడిలో పిల్లలున్నారు. ఆ విధంగా కొద్దిమందిమి పంచుకొనుట ఒక విధంగా చాలా కష్టముగా నుండును. పగలు రాత్రి మధ్య భేదము కూడా గమనించుట చాలా కష్టముగా నుండును. ముఖ్యంగా మీరు, నేను మిడా ఉన్న వయస్సులోనికి వచ్చినప్పుడు తెలియును, మీరు వయస్సు పైబడిన వారయితే ఎక్కువ రాత్రులు మేల్కొనియుండక పోయినా అలసిపోదురు.

3కావున, దివారాత్రులు నేను మెలకువగా వేచియుండగలనని మామూలుగా తలంచెడివాడిని. నా పాతటి టి-మోడల్ ఫోర్డు కారులో కాలిఫోర్నియా నుండి వచ్చుచున్నాను. మార్గంలో కొద్దిగా నిద్రమత్తుకు గురి అయ్యాను. అందువలన ప్రయాణము చేయుటకు నాలగయిదు రోజులు లేదా ఏడు రోజులు కూడా పట్టుట జరిగినది. నేను దివారాత్రులు కారు నడుపుకొనుచు వచ్చాను. నేను కొద్దిగా అలసిపోయాను, కారు క్రింద నా దుప్పటిని పరచి, గడ్డి బీడులలో కొద్ది గంటలు నిద్రించి, తదుపరి ముందుకు వెళ్ళెడివాడిని. నెవిల్ సోదరుడా, అప్పటి నుండి చాలా నేను మారిపోయాను, పాతికేండ్ల వయస్సును నేను దాటిపోయానని ఇప్పుడు నేను గ్రహించాను.

4ఈ రాత్రి ప్రభువు గృహములో ఉండుట మహాభాగ్యముగా ఉన్నది. ఈ ఉదయమున ప్రభువు నాకిచ్చిన వాక్యభాగము మీకు చెప్పుటకు నా యొద్ద ఉన్నది. రోగుల కొరకు ప్రార్థించు ముందుగా నాకు అవకాశము దొరికినట్లయిన దాని మీద నేను మాట్లాడుదునని తలంచాను. కాని ప్రశ్నల వలన ఈ ఉదయము ఆలస్యమయినందున బహుశా అమ్మ బాగున్నచో ఈ రాత్రికి నేను మరల వచ్చుటకు సూచనగా తీసికొందును అనుకొన్నాను. సహో. నెవిల్ యొక్క కార్య క్రమమునకు ఎక్కడా ఆటంకము కలుగనట్లయితే ఈ రాత్రి కొద్దిగా మాట్లాడవలెనని తలంచాను.

5ఈ రాత్రి మనతోయున్న ఒక క్రైస్తవ సహోదరిని గూర్చి ఇప్పుడే ఒక అద్భుతమగు సాక్షమును గదిలో నిలబడియుండగా విన్నాను. ఈ ఉదయమున ఆమె ప్రార్థన వరుసలో యుండినది, ఆమెకు ప్రార్థించుట జరిగినది, ఎవరి కొరకో ఆమె నిలబడియున్నది. ఆమె గది ఒక చీకటి గది, అక్కడ ప్రభురాత్రి భోజనము, అనగా ప్రభువు యొక్క చివరి భోజనము. ఏ కోణము నుండి కూడా సూర్యుడు ఆ గదిలోనికి ప్రవేశించుట జరుగదు. ఈ మధ్యాహ్నము మూడు గంటల వేళలో సంఘకాలములను గూర్చి బోధించుచుండినప్పుడు కనబడిన ఆ కాంతి పుంజము మరెక్కువగా వర్షధనస్సు రంగులో ప్రభువైన యేసు శిరస్సు మీదికి దిగి వచ్చినది. ఆమె కొద్ది నిమిషముల పాటు దానిని గమనించినది. ఆమె వెళ్ళి తన సోహోదరికి చెప్పినట్లుగా, నాకు ఆ వృత్తాంతము అర్థమయినది వారు వచ్చి ఒక గంట లేదా ఆ దరిదాపుగా నిలిచి యుండిన దానిని చూచి ఆశ్చర్యముతో నిండిపోయిరి. వారు ఆ పొరుగున ఉన్నసేవకుని పిలచిరి. ఇక్కడున్న సహోదరుడు స్ట్రైకర్ ఆ వింత చూచుటకు వచ్చెను. వారు కూర్చొని అయిదు లేదా ఆ దాదాపుగా దానిని గమనించుచుండిరి. ఆ సేవకుని ప్రార్థించమని అడిగిరి. తాను ప్రార్థించలేకపోవుచున్నట్లుగానో, మరేదోగానో అతడు చెప్పెను.

6కొద్దిగా ఎవరో వర్తమానమును అందించిరి, అది ఏ భావము కలిగియున్నదో వివరించుచూ అర్థమును చెప్పిరి వర్తమానములో మాట్లాడుచుండగా, ఆ సందేశము తిరిగి వచ్చినది. వారు తప్పు అర్థము చెప్పిరని తెలియచేయబడినది, దానిని వారు సరిగ్గా ఇవ్వలేదు. అది నేను సరిగ్గా చెప్పాను కదా బ్రూస్ సోదరీ? వారు దానిని సరిగ్గా ఇవ్వలేదు. అది ఏ సూచన అయి యుండెనో వారికి చెప్పబడెను, వారికి చూపించబడెను. వారిని ప్రశంసించుట వంటిది. ఈ ఆలయము నుండి బయలు వెళ్ళుచున్న వర్తమానమును వారు నమ్ముటను గూర్చినది లేక అటువంటి సంగతియే. ఈ జరిగిన సంగతుల కంటె గొప్ప సంగతులను వారు చూడబోవుచున్నారు. దేవదూతలు ఎక్కుట దిగుట కూడా వారు చూచెదరు.

2TIM 4:8

 

7కనుక మనము చివరి దినములలో జీవించుచున్నాము. మనము అంత్యకాలమునకు చేరువలో యున్నాము. క్రైస్తవులకు తప్ప మిగిలిన వారికి అది భయంకరముగా వినపడవచ్చును. ఇక్కడ మనమున్నందులకు నాకు సంతోషముగా యున్నది. మనము అంత్యమందున్నందులకు సంతోషించుచున్నాను.

ఒక సారి ఒక కూటములో దానిని నేను చెప్పాను. "దాని గూర్చిన నీ భావమేమి? అని నాతో మాట్లాడుచున్న ఒక వ్యక్తి అడిగెను. ప్రపంచ అంతము వచ్చుట చూచుటకు నీవు సంతోషించుచున్నావా?" అనడిగెను.

"ఓ, అవునండీ నిశ్చయంగా" అని చెప్పాను. "అవును!"

"అది జ్ఞానయుక్తముగా కనబడదు, లోకాంతము వచ్చుట చూడవలెనని ఎవరూ కోరరు," అని పలికెను.

"లోకాంతమున, ఆ కాలమున, యేసు వచ్చునప్పుడు, అది నేను చూడగోరుచున్నాను. ఆయన ప్రత్యక్షమగుటను ఆకాంక్షించు వారందరునూ అని బైబిలు చెప్పెను గదా అనిపలికాను." చూచారా?

మరియు ఇది తెలుసుకొనుట ఒక ఆనందము. అది ఏదనగా ఈ జీవితమందలి పాత సంగతులు ఈ దినములలో ఒక దినమున ముగియును. మరియు మనము ఆయనను చూతుము.

ROM 8:2

 

8కాని కొంతకాలము క్రిందట, ఇది చెప్పబడెను… ఓ! చాలా సంవత్సరముల క్రితము అప్పుడు బానిసత్వము ఉండేది. ఒక ముసలి నల్లజాతి వ్యక్తి ఆ పాత సంఘము పాటలు వాడుకలో యున్నవి. గ్రామీణ పాటలు, వారు కూడికొని బానిసల మధ్య సేవ చేసెడివారు. వారు బోధించెడి వారు. వారు కూటములు ఏర్పాటు చేసెడి వారు, మీకది తెలియును, ఒక రాత్రి అక్కడ ఒక ముసలి వ్యక్తి రక్షించబడెను. ఎప్పుడైతే అతడు రక్షణ పొందెనో, అప్పుడు అతడు స్వాతంత్య్రము పొందెనని తెలుసుకొనెను. మరుసటి రోజు ఉదయము మొక్కలు నాటుచుండగా "తాను స్వాతంత్య్రము పొందెనని" మిగతా బానిసలకు చెప్పనారంభించెను.

అతని యజమాని వచ్చి ప్రక్కకు లాక్కొని వెళ్ళి "ఇదిగో సామ్, ఇటు చూడు, నీవు స్వాతంత్య్రము పొందినట్లుగా ఈ బానిసల మధ్య చెప్పుచున్నావని నాకు వినబడిన దాని సంగతి ఏమిటి?" అని యజమాని ప్రశ్నించెను.

"అవునండీ, అది నిజము." "గత రాత్రి ఒక కూటములో నేను పాపమరణ నియమముల నుండి విడిపించబడి స్వాతంత్య్రము పొందాను," అని చెప్పెను. అది అంతే. అంతే.

ROM 8:2•

2COR 5:17•

GAL 6:15

 

9"పాపమరణ నియముల నుండి నేను స్వాతంత్య్రము పొందాను." ఒకప్పుడు మీరు అందులో బంధించబడిరి. చూడండి, ఇప్పుడు మీరు అందులోనుండి విడిపించబడితిరి. చూచారా, ఈ ఉదయమున నేను చెప్పి నట్లుగా మరణము పాపములో మాత్రమే నివాసము చేయును. పాపము మరియు మరణము ఒక్కటే. చూడండి, నీవు పాపము నుండి దూరమయినప్పుడు మరణము నుండి యూ దూరము అయినట్లే; కాని, నీవు పాపములో యున్నంత కాలము మరణములో యున్నట్లే, చూచారా. కాబట్టి ఎప్పుడయితే నీవు పాప మరణముల నియమముల నుండి విడుదల పొందెదవో నీవు యేసుక్రీస్తు నందు ఒక నూతన సృష్టియగుదువు, అప్పుడు నీవు విడుదల పొందెదవు.

అతని యజమాని అతనితో ఇట్లనెను. "సామ్, నీవు నిజంగా అర్థము చేసికొని చెప్పుచున్నావా?"

"అవునండీ! ప్రభువు గత రాత్రి నన్ను పిలచి నా ప్రజలతో మాట్లాడమనియు, వారితో ముచ్చటించమనియు చెప్పెను. అప్పుడు వారు పాప మరణ నియమముల నుండి విడుదల పొందెదరు. మేము బానిసలమే అయినప్పటికిని మేము పాపమరణముల నియమము నుండి విడుదల పొందెదము," అని అతడు జవాబిచ్చెను.

"సామ్, నీ కది నిజంగా అర్థమయిందా?" అని అడిగాడు.

"అయ్యా! నేనిది చెప్పిన తదుపరి మీరేమి చేయనైయున్నారో నాకు తెలియదు గాని నేను స్వేచ్ఛా మానవుడిని అని మీకు చెప్పుచున్నాను. నేను పాపమరణముల నియమముల నుండి విడుదల పొందాను," అని అతడు పలికెను.

"సామ్, నేను కూడా ఒక క్రైస్తవుడిని అని నీవు తెలిసికొనుము. నిన్ను దేవుడు పాపమరణ నియముల నుండి విడిపించినందున నీవు క్రైస్తవునివయ్యావు. దానిని గూర్చి నీవు నీ సోదరులతో చెప్పవలెనని భావించుచున్నావు. ఈ ఉదయమున నేను వెళ్ళి నిన్ను స్వేచ్ఛాగా విడిచి పెట్టుదును. ఆ ప్రకటనపై సంతకము చేయుదును. నీవు ఒక స్వేచ్ఛా మానవునిగా ఉండ వచ్చును, ఎవరి వలన బంధించబడవు. నీ సోదరులకు సువార్త బోధించుము," అని చెప్పెను.

10ఆ వృద్దుడు చాలా సంవత్సరముల పాటు బోధించెను అని అతడు చెప్పెను. మనందరము ఒక సమయమున మార్గంతమునకు వచ్చెదము. అతడు తన మార్గాంతమునకు వచ్చెను. చాలా గంటలపాటు అతడు స్పృహాలేక పడియుండెనని వారు చెప్పిరి. అతని యొక్క చాలామంది తెల్ల సోదరులు అతనిని పరామర్శించ వచ్చిరి. అతడు తనకుతానుగా లేచే సరికి ఆ భవనములో ఒక జనుల గుంపు కూడియుండెను. అతడు చుట్టూ చూచి ఇట్లడిగెను, "ఇంకా అక్కడ అయిపోలేదని మీరు అనుకొనుచున్నారా?"

"సామ్, నీవు నిద్రపోవుచున్నావు," అని వారనిరి.

"కాదు, నేను నిద్రించుట లేదు. నేను అద్దరికి వెళ్ళాను," అని అతడు చెప్పెను.

ఆ సేవక సోదరులు ఇట్లు చెప్పిరి. "సామ్, అద్దరిని ఏమి చూచావో చెప్పవా?"

"నేను ఒక గొప్ప తెల్లని ముత్యపు ద్వారము గుండా నడచివెళ్లాను. అక్కడికి నేను నడచి వెళ్ళినప్పుడు నేను సింహాసనమును చూచాను మరియు ఆయనను చూచాను. ఒక దేవదూత అటువైపు వచ్చెను. నీవు సామ్ వా?" అని అడిగినది అని చెప్పెను.

"అవును నేనే," అన్నానని అతడు చెప్పెను.

అతడీలాగు చెప్పెను, "సామ్, ఇక్కడ ఒక అంగీ మరియు కిరీటము ఉన్నది. సామ్, నీవు భూమి మీద జరిగించిన గొప్ప క్రియలనుబట్టి దీనిని నీవు జయించావు."

"బహుమానముగా ఒక అంగీ మరియు కిరీటము గూర్చి నీవు మాట్లాడవద్దు," అని అతడు చెప్పెను.

"అతడు నీవు బహుమానముగా ఏది పొందగోరుచున్నావు అనడిగెను?"

"ఒక వెయ్యేండ్ల పాటు ఆయనను నేను చూస్తుండినచో చాలును," అని చెప్పెను.

11మనందరము ఆ విధంగానే అనుకొందుమని నేను తలంచుచున్నాను. కాదా? నాకు అంగీలు, కిరీటములు, భవంతులు ఏమీ వద్దు. ఆయనను చూచినచో చాలును. ఆయన వైపు చూస్తే నాకు చాలును… మీకది తెలియును. మీరాలాగు తలంచుదురు గదా ఆలాగు నేను చేయుచుండగా, నెవిల్ సోదరుడా నీ చేతిని నేను పట్టుకొనవలెనని కోరుచున్నాను, మనిద్దరము కలిసి ఈలాగు చెప్పెదము. "దానిని గూర్చి ఆలోచించు నెవిల్ సోదరుడా, ఎండలో, చలిలో మనము ఆలయంలో ఏలాగు కలిసియున్నామో చూడు. కాని, ఇటుచూడు, ఎవరి వైపు మనము చూస్తున్నాము? సజీవుడగు దేవుని కుమారుని వైపు." అది అద్భుతము కాదా? ఆయన ముఖలక్షణములను చూచుట, పరీక్షించుట!

12ఇప్పటికి నా జీవితములో మూడు సార్లు ఆయనను దర్శనములో చూచాను. ప్రతి సారి ఆయన ఒకే రీతిగా కనబడెను. కాని ప్రపంచములో ఏ చిత్రకారుడు ఆయన చిత్రమును చిత్రీకరించజాలడు. ఆయన వలె కనబడు దానిని వారు చిత్రీకరించవచ్చును. కాని ఆయన నాకు ఎంతో మాధుర్యముగా, చక్కగా కనబడెను; ప్రపంచము అంతమగునని చెప్పినది ఆయనే ఒక చిత్రకారుని కుంచె పట్టుకొనజాలని గుణలక్షణములు ఎన్నో ఆయన కలిగియుండెను. ఒక దినమున వ్యక్తిగా నిశ్చయంగా చూడగోరుదును.

MATT 11:28,30•

MATT 25:21,23

 

13"నా యొద్దకు రండి," అని ఆయన చేతులు చాచి ఆ ప్రశస్త మాటలు పలుకుట ఆయన నుండి నేను వినవలెనని తరచుగా అనుకొనుచుందును. అలసి, సొలసిన ఆయన చూపును చూడండి. ఆయన తన ప్రయాణములో అలసి, సొలసిపోయెను. "ప్రయాసపడి భారము మోయు వారలారా! నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేసెదను. మీ మీద నా కాడి ఎత్తికొనుడి, నా యొద్దకు నేర్చుకొనుడి. నేను దీనుడను సాత్వికుడను," అని చెప్పెను. అది ఆయన పలుకుట నేను వినగోరుచున్నాను. ఆ రోజున నేను అక్కడలేను. పేతురు యాకోబు యోహానులతో నేను అచ్చట లేను. "నా నమ్మకమగు మంచి దాసుడా, "అది మంచిగా జరిగినది. ఇప్పుడు ప్రభుని యొక్క సంతోషములలోనికి ప్రవేశించుడి" అని ఆయన పలుకు దినమున, నేను వారి ప్రక్కన నిలబడియుందునని నిరీక్షించుచున్నాను.

14ఈ బైబిలును వ్రాసిన వారు అనగా పౌలు, యెషయా, యిర్మియా, అపోస్తలులు ఇంకా ఆ ప్రశస్త సోదరులందరూ — ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పటికిని సంగతులు ముందే చూచి దానిని వ్రాయించిన దేవుడు, వారితో మాట్లాడిన దేవుడు వారికి బైబిలు యొక్క వరములను, ప్రవచనములను, భాషలతో మాట్లాడుటను, అద్భుతములు, సూచక క్రియలను అనుగ్రహించెను — అదే మనుష్యులు వారు ఎక్కడ ఉన్నప్పటికిని, వారితో మనము కూడా ఉందుము. అదే దేవుడు అదే రీతిగా యున్నాడు. అది ఊహ కాదు; ఇది ఇప్పుడు మనకు తెలుసు, చూడండి, ఆయన నిజముగా ఇక్కడ ఉన్నాడని మనకు తెలుసు. కాబట్టి భూమి మీద మనము భాగ్యవంతులము కామా? మరి మనము దేనికొరకు ఎదురుచూడాలి?

15ఈ మధ్యాహ్నము ఒక వృద్ధునితో నేను మాట్లాడుచున్నాను. అతడు ఎనభై-ఎనిమిది లేదా ఎనభై-తొమ్మిది సంవత్సరముల వయస్సులోనున్నట్లుగా చెప్పెను. ఈ మధ్యనే క్రైస్తవుడాయెను. మామూలు ఆదివారపు సూటు తప్ప అతనికి ధరించుకొనుటకు మరేదియూ లేని ఆ సమయమున నేను యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చాను. నీటి లోనికి అతనిని నేను తీసికొని వెళ్ళాను. సహో. ఉడ్ అతనికి ఒక జత బట్టలు ఇచ్చెనున అనుకోనుచున్నాను. ఇక్కడ అతనికి మేము బాప్తిస్మము ఇచ్చాము (ఇప్పుడతడు చాలా ధనికునిగా ఉన్నాడు)… అయితే అతడు బాలునిగా ఉన్నప్పుడు, నెలకు ముప్పది డాలర్ల వేతనమునకు పని చేసెనని చెప్పెను. అతడు వృద్ధుడగువరకు ఎన్నడూ పెండ్లి చేసికొనలేదు లేదా అటువంటిది ఏదియూ లేదని చెప్పెను. తాను ముసలి వాడయినప్పుడు భిక్షమెత్తుకొనుట గాని, వీధిలో పడి యుండుట గాని జరుగరాదని ఎంతగా సమయమంతా కష్టించి పనిచేసెనో చెప్పెను. తాను పోగుచేసిన నికెలులను, చిన్న నాణెములను కలిపి పనిలో ఎట్లు ఉపయోగించెనో చెప్పెను. వాటి వలన అతడు తన సంపదను వృద్ధిచేసుకొనుట నిజంగా జరిగినది. ఇప్పుడతడు ఎనుబది ఏండ్లు దాటి లేదా (ఎనుబది-ఎనిమిది లేక ఎనుబది- తొమ్మిదేండ్ల వయస్సులో యున్నాడు). తొంబది సంవత్సరములకు దగ్గరగా యుండిననూ ఇంకా నడచుచుండెను. ఈ ఉదయమున ఇక్కడే ఆలయములో కూర్చొనెను. తాను బాధపడనవసరము లేకుండా సమకూర్చు కొనెను. అతడు ఇంకా వంద సంవత్సరములు బ్రదికిననూ, ఆర్థిక సంబంధముగా అతని గూర్చి ఎవరూ చింతించనవసరము లేదు. మంచి హృదయము, మంచి పవిత్రత కలిగిన సోదరుడు క్రైస్తవుల కొరకు సమస్తమూ చేయును. తనకు తెలిసి చేయదగిన మంచి కార్యములన్నియూ అతడు చేయును.

నేనిట్లు చెప్పాను, "ఆ పైనున్న వాటికన్నిటి కంటే, నా ప్రశస్త సోదరుడా, నీవు ఈ ఎనుబది-ఎనిమిది లేదా ఎనుబది-ఏడు సంవత్సరముల వయస్సులోనికి వచ్చినపుడు, దేవుడు తన కృపలో క్రిందికి దిగి వచ్చి పరలోక గృహమునకు కొనిపోవు నిత్యజీమును నీకు అనుగ్రహించెను." జీవితములో అంతకన్నా ఎక్కువ ఏమి కావలెను? అవునండీ.

16మనము కూడబెట్టి వృద్ధి చెందిన ధనసంపదంతటికి, మనము భూమి మీద సమస్తమును చేసినప్పటికిని, వారు ఏమైనప్పటికిని, మనుష్యుడు ఏమి చేసినప్పటికిని, నీవు చనిపోవలసియున్నావు. మరియు సమస్తము విడువవలసియున్నావు.

ఈ ప్రపంచము యొక్క నిరూపయోగమైన ఆస్థిని ఆశించకు,

అది వేగంగా నశించిపోవును.

నిత్యత్వపు సంగతుల మీద నీ నిరీక్షణ నుంచుము,

అవి ఎన్నటికి గతించవు!

అది నిజము. "మారని దేవుడు హస్తమును పట్టుకొనియుండు." ఆ పాట నాకిష్టము. ఎక్కువగా ఈ ఆలయములో ఆ పాటను మేము పాడెడివారము.

కాలము త్వరగా మార్పు చెందుచూ, సంపూర్ణమగుచున్నప్పుడు,

భూమి శూన్యములో కదలకుండా నిలుచున్నప్పుడు,

నిత్యత్వపు సంగతుల మీద నీ నిరీక్షణనుంచుము,

మారని దేవుని హస్తమును పట్టుకొని ఉండుము!

17ఈ రాత్రి నా ముసలి తల్లి అక్కడున్నది. నా యొద్ద ఒక వంద-మిలియను డాలర్లున్నచో, దానిలోని ప్రతి పెన్నీని ఒక గంటసేపు ఆమెతో మాట్లాడుట కొరకు ఇచ్చివేయుదును. నిశ్చయంగా అది నేను చేతును. ఆమెకు ఒక వంద మిలియను డాలర్లు ఉన్నాగాని ఇప్పుడు దానివలన ఆమెకు ఏమి ప్రయోజనము? ఏమీలేదు, చూడండి. ఆమె భూసంబంధముగా ఏ నిధులు విడిచిపెట్టలేదు — కాని ఇది ఆమె విడిచి వెళ్ళినది: ప్రభువైన యేసును ఆమె తన రక్షకునిగా ఎరిగినది. అదే ప్రధానమగు విషయము.

18ఈ సందర్భముగా, ఈ రాత్రి మనలను గూర్చి మనము విమర్శచేసికొందము. ప్రార్థనకు వెళ్ళు ముందుగా మనము కాస్త ఆలోచించుదము. దేవుని తో ఈ రాత్రి నా పరిస్థితి ఎట్లున్నది? మన హృదయములను పరీక్షించి కనుగొందము. "ప్రభువా, ఈ రోజు ఏ ఆత్మనయినా నేను గాయపరచినచో, ఒక్క అడుగు తప్పిపోవుటకు నేను కారణమైనచో, నేను ఏ తప్పు చేసినా, ఏ తప్పు చెప్పినా, ఓ దేవా, దానిని బట్టి నన్ను క్షమించుము," చూచారా.

నా విశ్వాసము నీ వైపు చూస్తున్నది,

కల్వారి గొర్రెపిల్లవు నీవు,

దైవసంబంధమైన రక్షకుడా;

ఇప్పుడు నేను ప్రార్థిస్తుండగా వినుము,

నా దోషములన్నియు దూరంగా తీసివేయుము,

ఈ దినము నుండే నన్ను నీ సొత్తుగా చేసుకొందువు గాక!

అంధకారమైన జీవితమనెడి చిక్కుల్లో నేను అడుగువేసినప్పుడు,

విచారములు నన్ను చుట్టినప్పుడు,

నీవు నా మార్గదర్శిగా ఉండుము;

చీకటిని పగలుగా మారునట్లు ఆజ్ఞాపించుము,

చింతలు, బాధలు, భీతుల తొలగించుము.

ఎన్నటికిని నన్ను, నీ యొద్ద నుండి తప్పిపోనియ్యకుము.

19ప్రభువా, నన్ను మార్గములో ఉంచుము. నీ చిత్తమునకు మధ్యలో నన్నుంచుము. వృద్ధులమైనా, యువకులమైనా, మీరెంత వృద్ధులో నాకు తెలియదు. నీవు ఎనుబది సంవత్సరముల వయస్సులో ఉండవచ్చును, ఉదయము వరకు నీవు జీవించియుండినచో, నీవు ఎందరో పదహారేళ్ళ బాల బాలికల వయస్సును దాటి జీవించినట్లగుదువు. ఉదయమున సూర్యకాంతి రాకముందే ఎంతోమంది పదహారేండ్ల బాలబాలికలు దేవుని కలిసికొనుటకు వెళ్ళవలసియుందురు. అది నిజము. కాబట్టి వయస్సుతో దానికి ఏ సంబంధము లేదు. ఆయనను కలిసికొనుటకు సిద్ధముగా ఉన్నావా? అనునది అసలు సంగతి అదే ముఖ్య విషయము.

మనము తలలు వంచి ప్రార్థించుచుండగా, ఈ విషయముల గూర్చి ఆలోచించుము.

20ఓ కృపగల పవిత్ర, గౌరవనీయుడగు జీవదాతా, మేము నీ సన్నిధిలోనికి వచ్చుచున్నాము. సర్వశక్తుడగు దేవా, హృదయాంతరంగములో నుండి వందనములు చెల్లించుటకు ఈ రాత్రి ఇక్కడ కూర్చొను భాగ్యము మాకు కలిగినది. కొంత సేపటి క్రితం ఆ హాస్పిటల్‌ లో అటూఇటూ తిరుగుచుండగా స్పృహలేనివారిని, రక్తము కారిపోవుచున్నవారిని, కేకలు వేయుచున్నవారిని, తలకు కట్లు కట్టుకొని పడకలకు కట్టబడిన వారిని చూచాను. ఓ దేవా, వారందరునూ సిద్ధముగా యుండగలిగెందులకు ప్రార్థించుచున్నాను. తండ్రీ, వారు ఈ జీవితమును వీడి వెళ్ళిపోవుట జరిగినచో, వారు నిన్ను కలుసుకొనుటకు సిద్ధంగా ఉందురు గాక. మాలో ప్రతి ఒక్కరము నీ కృపలేనియెడల అందులో ఒక రకముగా ఉండెడివారమని తలంచుచున్నాను. కాని సిద్ధపాటు చేసికొనుటకు ఈ రాత్రి సజీవులుగా ఉంచి ఇక్కడకు రానిచ్చితివి. ప్రభువా, ఇప్పుడు ఆ సంగతులు మా హృదయములు, మనస్సుల గుండా బయలు వెళ్ళుచున్నవి. ప్రభువా, మా హృదయము నాళములను పరిశోధించి మాలో అపవిత్రమైనది ఏదయినా ఉండినచో, తీసివేయుము. తండ్రీ, దేవా, మా ఆత్మలను నీకు అంకితము చేసికొనుము.

నీవు చేయగలవని మేము నమ్ము దానికొరకును, నీవు మా పట్ల చేసిన సమస్తము కొరకును మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. సహోదరి బ్రూస్, గృహములో ఈ రోజు ప్రత్యక్షమయిన ఆ వెలుగును బట్టి ప్రభువా నీకు వందనములు చెల్లించచున్నాను. అది వారికి బలము నిచ్చును.

21ప్రభువా, ఇప్పుడు ఇక్కడి ఈ ఆలయములోని నీ సముఖమందు ఈ రాత్రి మా ఆత్మలు ఎడతెగక నూతనపరచబడునట్లుగా నీవు దయచూపుమని నేను ప్రార్థించుచున్నాను. తండ్రీ, ఈ ఆలయమును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాను. దీనుడు, యధార్థపరుడు, క్రీస్తుపట్ల, ఆయన సంఘముపట్ల నిండుగా దైవప్రేమ కలిగినవాడు అతనిని, అతని పిల్లలను, అతని చక్కని సహకారిని నీవు ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను. ప్రభువా, వారు ఈ భూమి మీద మీ మధ్య ఎక్కువ కాలము జీవించుదురు గాక! అది అనుగ్రహించుము. వారి ద్వారము నుండి అనారోగ్యమును దూరపరచుము, మరియు వారిని అనరోగ్యముతో ఉంచుము. ప్రభువా, మా అందరి గుమ్మముల నుండి అనారోగ్యమును దూరపరచుము. మేము నిన్ను సేవించునట్లుగా మమ్మును ఆరోగ్యముగా ఉంచుము.

PS 105:1,15

 

22ఇప్పుడు పరిశోధన కొరకు మేము మా ఆత్మలను బలిపీఠము మీద ఉంచుచున్నాము. నీ చిత్తమయినట్లయితే, నీ వాక్యమును చదువుటకు కొద్ది క్షణములలో నాకండ్లు తెరచేదును. జనులకు జీవాహారమును గూర్చి మాట్లాడు వంతు చీటి ఈ రాత్రి నా పైబడినది. ఈ రాత్రి ఇక్కడున్న ఒక అలసిన, దీన, ఆత్మకు సహాయపడు కొన్నిసంగతులను చెప్పుటకు, ప్రభువా, ఇప్పుడు నాకు సహాయము చేయుము. మమ్మును మేము ఎట్లు క్రమపరచుకొనవలెనో, మేమేమి చేయవలెనో, ఈ ప్రస్తుత లోకములో ఎట్లు జీవించవలెనో, పరలోకమును మా గృహముగా చేసికొన ఆశించినచో అదెట్లు సాధ్యపడునో తెలిసికొనుటకు అవసరమగు దిద్దుబాటు మాటలుగా అవి ఉండునట్లును సహాయము చేయుము. ప్రభువా, అది దయచేయుము. రోగమును బాగుచేయుము. మా మధ్య రోగులెవరయినా ఉన్నచో, వారిని స్వస్థపరచుమని ప్రార్థించుచున్నాము. వారి కొరకు మేము ప్రార్థించుచున్నాము.

మేము ఈ సంఘము కొరకు మాత్రమే కాక దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలు చెల్లించుచున్న సర్వప్రపంచములో ఉన్న ఇతర సంఘముల కొరకును ప్రార్థించుచున్నాము. ఆకలి హృదయములు కలిగిన వేలాదిమంది పరిశుద్ధులు. "రమ్ము, ప్రభువైన యేసు రమ్ము," అని మొర పెట్టుచున్నారు. ఓ, నిశ్చయంగా, ప్రభువా ఒక దినమున మా మొరవిందువు మరియు వచ్చెదవు.

ఆ రాకకు ముందు, రాకడకు ముందుగా నిద్రించవలసిన వంతు మాకు కలిగినయెడల బూర మ్రోగును. క్రీస్తునందు మృతులు మొదట లేచెదరు అని మాకు తెలియును. మేము లేచి వచ్చి ఒక దినమున నీ సన్నిధిలో నిలబడుదము. దీనిని బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ఆ సమయము కొరకు మేము కనిపెట్టుచున్నాము. ఇప్పుడు, మా హృదయములు సిద్ధపరచుము, యేసు నామమున దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.

23ఇప్పుడు, ఈ రాత్రి ఎక్కువసేపు మాట్లాడవలెనని నేను ఆశించుటలేదు. బహుశా ముప్పది లేదా నలుబది నిమిషములు ఇక్కడ ఒక అంశము మీద నేను మాట్లాడుదును. మొదటగా కీర్తనలోని ఒక లేఖన భాగమును మొదట నేను చదువగోరుచున్నాను. కీర్తనలు 105, 15వ వచనము కలుపుకొని పై నుండి చదువుకొందము. నేను ఈ కీర్తన చదువుచుండగా, వాక్య భాగమును బహు జాగ్రత్తగా మీరు వినవలెనని కోరుచున్నాను,ఎందుకనగా దేవుని వాక్యము ఎన్నడూ తప్పిపోదు.

యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. జనులలో ఆయన కార్యములను తెలియచేయుడి.

ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్యకార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి.

ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకు వారు హృదయమందు సంతోషించుదురు గాక.

యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసికొనుడి.

ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి యందంతట జరుగుచున్నవి.

తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును -

నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్దిమంది ఆదేశమందు పరదేశులైయుండగను కొలవబడిన స్వాస్థముగా కనాను దేశమును మీ కిచ్చెదనని ఆయన సెలవిచ్చెను.

ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచియున్నాడు.

వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యము నుండి

మరియొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేనభిషేకించిన వానిని ముట్టకూడదనియు,

నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి.

ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను.

PS 105:15

 

24అక్కడ నుండి నేను ఒక అంశమును తీసుకొనగోరుచున్నాను "గౌరవములు" చదివిన ఈ భాగములో దావీదు యెహోవాకు మొరపెట్టుచున్నాడు. గౌరవములు, అనగా మనము దేవునికి చెల్లించవలసినవి. నా కిష్టమైనది అది ఒక్కటి ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి వాని యొక్క హృదయములోనికి దీనిని ఎక్కించవలెను. మన కండ్ల ముందు జరుగుచున్న ప్రతి విషయములోను దానికి తప్పక గౌరవములు చెల్లించవలెను. ఇశ్రాయేలీయులలోని చాలా కొద్దిమందిగా వారుండినప్పుడు దావీదు దానిని చెప్పెను. బహుశా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గూర్చి చెప్పబడెను. చాలా కొద్దిమంది ఆయన రాజులను రాజ్యములను వారి కొరకు గద్దించెను, "నా అభిషిక్తుని ముట్టవద్దు, నా ప్రవక్తలకు ఏ హాని చేయవద్దు," అని చెప్పెను. దేవుడు రాజులను రాజ్యములను గద్దించెను.

PS 111:10•

PROV 9:10•

ECCL 12:13

 

25ప్రసంగిలోని 12వ అధ్యాయము 13వ వచనములో ఈలాగు వ్రాయబడియున్నది, చూడండి.

ఇదంతయూ వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునికి భయపడి ఆయన కట్టడలను అనుసరించుటయే మానవుని యొక్క పూర్తి విధి.

అంతయూ వినిన తరువాత తేలిన ఫలితార్థము దేవునికి భయపడుట. నీకు భయము ఏర్పడనంత వరకు గౌరవించుట రాదు. నీవు దేవునికి భయపడవలయును. సొలొమోను సామెతలలో కూడా చెప్పెను, దేవునియందలి భయమే జ్ఞానమునకు మూలము. దేవుని యందలి భయమే జ్ఞానమునకు మూలము.

ఇప్పుడు, అనగా దాని అర్థము నీవు ఆయన గూర్చి భీతిచెందుట కాదు గాని, గౌరవము మరియు మర్యాద నీవు ఇచ్చుట అని అర్థము. దేవుని నీవు గౌరవించినప్పుడు దేవునికి నీవు భయపడుదువు. ఆయనను ఏదో విధంగా అ సంతోషపరచుదునేమోనని నీవు భయపడుదువు. నీవు ఏదయినా తప్పు చేయుదువేమోనని భయపడుదువు. నీ వాలాగుచేయగోరవు.

26నా తల్లికి నేను భయపడుదును. నా భార్యకు నేను భయపడుదును. నా సంఘమునకు నేను భయపడుదును. వారి మార్గములలో ఎక్కడో నేను ఒక అడ్డుబండను పెట్టనంత కాలము దేవుని సేవకులందరికి నేను భయపడుదును. ప్రజలకు నేను భయపడుదును. నేను క్రైస్తవుడిని కానేమోనని ఆలోచింపజేయు ఏదో పొరపాటు చేయునంత కాలము పట్టణ ప్రజలకు నేను భయపడుదును.

చూడండి, మీరు… గౌరవము చూపుటకు ముందు భయము కలిగియుండవలెను. దేవుడు దానిని కోరును. ఆయన గౌరవమును కోరును. దేవుడు దానిని కోరును. భయము దానిని తెచ్చును. భయమువలన గౌరవము ఏర్పడునని మనకు తెలియును.

27ఇప్పుడు, ఉదాహరణకు, ఒక వ్యవసాయకుని లేక ఒక షాపు పనివానిని తీసికొనండి. ఎవరూ అతనిని పట్టించుకొనరు. కాని పోలిసు దళములో అతనికి ఒక ఉద్యోగము ఇచ్చిరనుకొందము. అతడు యూనిఫారము ధరించి బాడ్జి తగిలించుకొని, ఒక పోలీసుగా వీధిలో వస్తూంటే (ఆ ముందు రోజు అతన్ని ఎవరూ చూచియూ పలుకరించకపోయి యుండవచ్చును), జనులు "హల్లో, జాన్! బాగున్నావా?" అందురు. చూడండి? ఎందువలన? అది ఒక విధమగు భయము, లేదా భీతి, లేదా ఒక గౌరవము. అందువలనే అలాగందురు. అతడు పట్టణ మేయరుగా ఎన్నిక కాబడవచ్చును, లేదా మరేదో కావచ్చు…

28కెనెడీ ప్రెసిడెంటు కానియెడల ఈ రాత్రి అసలు ప్రెసిడెంటు. కెనెడీ ఈ రాత్రి ఎవరికి తెలియును? అతడు ముందున్న స్థితిలోయుండి, అనగా, ఇక్కడ కోల్గేటులో వారమునకు నలుబది డాలర్లకు పనిచేయు పనివానిగా నున్నయెడల ఎవరికి లెక్క? చూచారా? అతడు ఇక్కడి పట్టణము లోనికి వచ్చిననూ ఎవరూ అతని వైపు చూడరు. అతనికి తెలిసినవారే పలుకరించెదరు. కాని అమెరికా దేశ అధ్యక్షునిగా ఉన్నందున అతడు గౌరవము పొంద అర్హుడు, మీరు చూచారా.

29ఎందుకనగా, దేవుడు దేవుడే గనుక ఆయన గౌరవము పొంద పాత్రుడు. అది సరియే. మనమాయనను గౌరవించవలసియున్నాము, ఆయనకు భయపడవలసియున్నాము, దానివలన గౌరవము ఏర్పడును. దేవుడు దానిని తన కొరకు మరియు తన దాసులందరి కొరకు ఉండవలెనని కోరుచున్నాడు. దేవుడు తన దాసుల పట్ల గౌరవమును కోరును. వారు ఆయన దాసులని మనకు ఏలాగు తెలియుచున్నదనగా, ఆయన తన వాక్యము ద్వారా ఈ దాసులకు బయలు పరచుచున్నాడు. ఈ దాసులను ఆయన తీసికొని వారిని దేవుని దాసులుగా చేయుచున్నాడు. ఆ దాసుల ద్వారా తన వాక్యమును పనిచేయించుట ద్వారా వారు దాసులని రుజువు పరచుచున్నాడు. ఆ దాసుని గౌరవించుట ద్వారా, నీవు దేవుని గౌరవించుచున్నావు. కాబట్టి నన్ను నీవు, నిన్ను నేను పరస్పరము గౌరవించుకొనినప్పుడు, మనము దేవుని గౌరవించుచున్నాము.

MATT 18:10•

MATT 25:40•

MARK 9:42•

LUKE 17:2

 

30యేసు ఈలాగు చెప్పలేదా, "మిక్కిలి అల్పులగు, ఈ నా, చిన్నవారి ఒక్కరికి మీరు చేసినందున నాకు చేసినట్లే. వారిలో ఒక్కరిని అభ్యంతరపరచుటకంటె, నీ మెడకు, తిరుగటి రాయి కట్టుకొని సముద్రములో పడుట మేలు. ఎందుకనగా, వారి ముఖములను చూడుడి, వారి దేవ దూతలు ఎల్లపుడును పరలోకమందున్న నా తండ్రి ముఖమును చూచును," అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని పిల్లలమై యుండిన మనమే వారిమని మనకు తెలియును. మనము దేవునిలో ఒక భాగము. దేవుడు ఈ గౌరవమును కోరును. అప్పుడు దేవుడు తనపిల్లలెవరో చూపించును. ఆయన దానిని జరుగుచున్న అద్భుతములు ఆశ్చర్యకార్యముల ద్వారా చూపించును.

GEN 6:13,14•

MATT 24:37•

LUKE 17:26•

HEB 11:7•

2PET 2:5

 

31ఇప్పుడు, మనము ప్రారంభించి ఈ జనులలో కొందరిని ప్రశ్నలు అడుగుదము. మొదటిగా ఎవరిని తీసుకొందమా అన్నప్పుడు ఒక్క క్షణము పాటు నోవహును తీసికొందము. నోవహు దేవుని నుండి ఒక ప్రత్యక్షతను పొందెను, అయినాగాని అది సైన్సు ద్వారా రుజువుకాబడు ప్రతిదానికి విరుద్ధమే. అయినా గాని అతడు దేవునితో మాటలాడెను, మరియు దేవుడు అతనితో మాటలాడెను. అతడు ఓడను సిద్ధపరచుచూ ఉండెను. ఆ అపహసకులు నోవహును చూచి అపహస్యము చేసిరి. ఆ రోజులలో ఉండినట్లుగానే అంత్యదినములయందు అపహాసకులు ఎగతాళి చేయువారు ఉందురని బైబిలు చెప్పెను. అతడు మతిపోయిన వాడయినందుననే ఓడను నిర్మించుచున్నాడని చెప్పిరి. కాని, దేవుడు ఆ అపహాసకుల మీదికి తీర్పును తీసికొని వచ్చెను. ఎందుకనగా, వారు దేవుని వర్తమానికుని యొక్క సందేశము వినలేదు, అతని బోధవలన ఓడలోనికి రానందున దేవుడు దైవిక తీర్పులను భూమి మీదికి పంపించెను. దానిని అంగీకరించి, దాని నుండి తప్పించుకొనగోరు వారందరికి మొదట ఆయన ఒక సిద్ధపాటును ఏర్పరచెను. అయితే వారు దానిని తప్పించుకోనట్లయిన ఇంక ఒక్కటే మిగిలియున్నది. తప్పించుకొను దేవుని సిద్ధపాటును వారు స్వీకరించనియెడల ఒక్కటి మాత్రమే ఇక మిగిలియున్నది — అది దైవ తీర్పు.

32నీవు రెండే రెండు సంగతులు చేయవలెను — కృప లేదా తీర్పు. నీవు ఏదో ఒకటి అంగీకరించవలెను. ఈ రాత్రి అక్కడే మనము నిలబడితిమి. మనము దేవుని కృపనయినా స్వీకరించాలి లేదా ఆయన తీర్పుకయినా నిలబడాలి. దానికి వేరే ప్రక్కదారి ఏదీ లేదు. తప్పించుకొనగోరు కోరికయున్న వారి కొరకు దేవుడు ఎల్లపుడూ ఒక తప్పించుకొను మార్గమును ఏర్పరచును. అది అయిపోయిన తరువాత ఇక మిగిలినది తీర్పుకు నిలబడుటయే. దేవుడు వారికి తీర్పు చేయవలెనని కోరుట కాదు గాని, వారు తమకుతాము ఆ మార్గమును ఎన్నుకొనిరి. చూడండి, వారు తమ స్వంత ఎన్నిక చేసికొనిరి. స్నేహితులారా, అచ్చట మనము నిలబడియున్నాము. అదే సంగతి. తప్పించుకొను దేవుని మార్గమునయినా మనము తీసికొనవలెను లేదా ఆయన తీర్పులకు నిలబడనయినా నిలబడవలెను. ఏదో ఒకటి మనము చేయుటకు కోరుకోవలెను. తప్పించుకొను మార్గమును మీరు తీసికొనినందుకు మీరు సంతోషపడుట లేదా? ఎందుకనగా, తప్పించుకొను మార్గమును నిరాకరించువారందరూ తీర్పు క్రిందకు రావలెను.

33నేను మరొక వ్యక్తిని గూర్చి మాట్లాడగోరుచున్నాను. మోషే అను పేరుగల ఒక గొప్ప, శక్తిగల ప్రవక్తయుండెను. వాక్యమును బట్టి జనులు (ఇశ్రాయేలీయులు) దేవుడు తమను విడిపించనైయున్నాడనియు, వారిని ఐగుప్తు నుండి రప్పించనైయున్నాడనియు అర్థము చేసికొని యుండవలసినదే, కాని దేవుడు తన మనుష్యుని సిద్ధముచేసి ఐగుప్తులోనికి పంపినవెంటనే వారతనిపట్ల గౌరవము చూపలేదు. వారతనిని త్రోసిపుచ్చి, "ఐగుప్తీయుని చంపినట్లుగా మమ్మును చంపగోరుచున్నావా?" అనడిగిరి. ఆ కారణము వలనవారు ఇంకో నలుబది సంవత్సరములు దాస్యములోనుండిరి. వానిని విడిపించుటకు వచ్చిన విమోచకుని వారు గౌరవించనందున వారింకా దాస్యములో నిలిచియుండిరి. అది వారిని తిరిగి దాస్యములో యుంచెను. దేవుడు వానిని ఉంచవలెనని కోరినందువలన కాదు గాని (కాలము అక్షరాలా నిజమే) దేవుడు వారు తప్పించుకొనుటకు ఏర్పాటు చేసిన మార్గమును విసర్జించినందున, వారు నలుబది సంవత్సరములు ఎక్కువ నిలచియుండిరి.

ఈ రాత్రి ఆలాగే యున్నదని ఎంతగానో నేను నమ్ముచున్నాను. అదే సంగతి, చూడండి.

NUM 14:23

 

34వారు బయటపడు మార్గమును విసర్జించిరి. దేవుడు దృఢతీర్మానము కలిగియుండెను. అబ్రాహాము తదితరులకు ఆయన తన నిబంధన ద్వారా తెలియచేసెను. (ఈ రాత్రి దావీదు దానిని గూర్చి పాడుట మనము చదివాము), ఆయన తాను ఒక ప్రత్యేక కార్యము చేయనైయున్నట్లుగా వారికి వాగ్ధానము చేసెను. కనుక, దేవుడు తన వాగ్ధానమును నిలబెట్టుకొనును. ఏమయినా గాని ఆయన వారిని వెలుపలకు తెచ్చును, కాని దాదాపు ఒక తరము చనిపోయినది. మోషేను చూచి నవ్విన ఆ వృద్ధతరము, వర్తమానము అంగీకరించని ఆ తరము (నలుబది ఏండ్లు) చనిపోయెను, మోషే మరియొక తరములోనికి వచ్చెను. నేను చెప్పునది అర్ధమైనదా? వారు దానిని అంగీకరించనప్పుడు, దేవుడు ఆ తరమును చావనిచ్చి దానిని చేయుటకు మరియొక తరమును తీసికొనివచ్చును. కావున, వారు దానిని విసర్జించిరి. అప్పుడు మరియొక తరము వచ్చుట మనము కనుగొందము. మోషే తన్ను బయలుపరచు కొనుటకు వెళ్ళినప్పుడు…

EXOD 3:2,10,11,14•

EXOD 4:2,6-8

 

35మీకు తెలుసా, మోషే మరల వెళ్ళుటకు భయపడెను. ఇప్పుడు ఎనుబది ఏండ్ల వాడు. అతడు వెళ్ళిపోయి నలుబది సంవత్సరములాయెను. మండుచున్న పొద యొద్ద దేవునితో అతడు మాట్లాడినప్పుడు, "ఎవరు నన్ను పంపిరని చెప్పుదును?" అనడిగెను. దేవునికి పేరు లేదు. "ఎవరు నన్ను పంపిరని చెప్పగలను? 'మీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమాయెనని వారికి చెప్పినపుడు,' వారు, మా పితరుల దేవుడెవరు?అనందురు. అప్పుడు వారికి నేనేమి చెప్పెదను?"

"నేను ఉన్నవాడను అనువాడను," అని వారికి చెప్పుమని ఆయననెను. 'నేను ఉన్న వాడను అనువాడను అని వారికి చెప్పుము'. "మోషే, నీ చేతిలో యున్నదేమిటి"? అనడిగెను.

"ఒక కర్ర" అని చెప్పెను. అతడు దానిని క్రింద పడవేసెను మరియు అది సర్పముగా మారెను. అతడు తన చేతిని ముడుచుకొనగా అది కుష్టముతో నిండిపోయెను, తిరిగి చాపగా బాగాయెను.

"వెళ్ళి ఈ సూచక క్రియలను ఆ ప్రజల ఎదుట జరిగించుము, అది ఒక సూచనగా ఉండును. ఈ సూచనలను బట్టి విడిపించుటకు నిన్ను పంపితినని వారు తెలిసికొందురు," అని ఆయన చెప్పెను. ఓ, సోదరుడా! దేవుడు ఎల్లప్పుడు ఆలాగు చేయును. దేవుడు ఎల్లప్పుడు సహజాతీతమగు గురుతులను ఇచ్చును, చూచారా.

EXOD 4:29•

EXOD 14:10,12

 

36అతడు వచ్చి జనులను పిలచి తన సూచక క్రియలను వారియెదుట చూపించినప్పుడు ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరును నమ్మిరి. వారు విడుదల కొరకు తిన్నగా రాజభవనములోనికి వెళ్ళిరి కూడా. అప్పుడు ఫరో వారికి విడుదల ఇవ్వకుండుటకు తీర్మానించుకొనెను, అప్పుడు ఫరో మీదికి దేవుడు తీర్పును రానిచ్చెను. ఐగుప్తులో ఏమి జరిగినదో మనకు తెలియును.

వింత, ఆ సూచక క్రియలన్నియు జరుగుట వారు చూచినపిదప వారు ఎర్ర సముద్రము యొద్దకు వచ్చిరి. ఆ గురుతులన్నియూ జరిగించిన దేవుని ఈ ఎర్ర సముద్రము యొద్ద వారు సందేహించుట మనము కనుగొందము. ఆయన తప్పించుకొను మార్గమును ఏర్పాటు చేయగల సమర్థుడనునదే అసలు ప్రధాన విషయము.

37ఇప్పుడు, అక్కడే మనమును తప్పు చేయుచున్నాము. ఒక చిన్న వ్యాధి మనలను చుట్టినప్పుడు, ఒక చిన్న విపత్తు లేదా ఒక చిన్న కష్టము ఎక్కడో మార్గములో సంభవించినప్పుడు మనము పడిపోవ సిద్ధమగుచున్నాము. ఒక యువ క్రైస్తవుడు, ఎవరయినా అతని వైపు చూచి "నీకు ఒక పరిశుద్ధ బండవు తప్ప మరేమి కాదు," అని అన్నప్పుడు, హేళన చేసినప్పుడు పడిపోవును.

"పరిశుద్ధ బండగా పిలువబడుట నాకసహ్యము." మీరు చూడండి? చూచారా, మీరు అక్కడే యున్నారు. మీరు ఆ సందేహము పొందుచున్నారు.

ఆవల నిలబడవలసిన సమయము అప్పుడే! వర్తమానికుని గౌరవించవలసిన సమయము అదే. దేవునికి మహిమను ఇవ్వవలసిన సమయము అదే.

EXOD 14:21

 

38మోషే ఇట్లనెను, "ఇప్పటికే ఇవి నేను జరిగించాను, మీ ఎదుట పది అద్భుతములు చేశాను. దేవుడు మీకు పది అద్భుతములను ఇచ్చెను, ఇప్పుడు మీరు సముద్రమునకు భయపడుచున్నారు. నిశ్చయంగా. మీరు నమ్మవలెనంటే ఇంకెంత కావలయునో గదా?" అతడు వెనుకకు నడిచెను, మరియు కర్రను తీసి సముద్రము ముందర చాపెను. తుఫానులు దిగి వచ్చి దానిని ఒక ప్రక్కకు చెదరగొట్టెను, మరియు వారు దాటిపోయిరి. వారు ఆవలకు దాటిన వెంటనే, వారు తమకు ఆహారము లేదని సణిగిరి. చూడండి, మళ్ళీ మొదలు. అప్పుడు దేవుడు ఆకాశము నుండి వారికొరకు ఆహారమును కురిపించెను. అంతట వారు తమకు నీరు లేదని సణిగిరి. వారు ఒక దాని తరువాత మరొక దానికొరకు సణిగిరి. నేను గమనించాను…

39సరే, "వారు మార్పలేనివారు," అని మీరన వచ్చును. వారు ఆలాగే కావచ్చును. నిజంగానే ఆ బయలు వెళ్ళినవారు మిశ్రిత జనాంగము.

కాని మీ జ్ఞాపకమునకు మరో సంగతి నేను తేగోరుచున్నాను. దేవుడు వర్తమానికుని పంపి, అతడు దేవుని యొద్ద నుండి పంపబడినవాడుగా సూచక క్రియల చేత బయలుపరచినప్పుడు ఈ వర్తమానికునికి లోబడుట వారి పని. ఖచ్చితంగా. వారు తప్పక వర్తమానికునికి లోబడవలెను, ఆ వర్తమానికుని పట్ల గౌరవము చూపవలెను. యెహోషువా మరియు కాలేబుల వైపు చూడండి, వారు అతని పక్షమునే నిలబడిరి. అవునండీ. మోషే ఎందులో ఉంటేవారు కూడా అందులో ఉండిరి. మోషే తప్పు చేసినా ఒప్పు చేసినా, ఏమైనా గాని వారు అతనితోనే నిలచియుండిరి, ఎందుకనగా అతడు దేవుని వర్తమానికుడని వారు ఎరిగియుండిరి.

NUM 12:1,5,10-13

 

40ఒక రోజున ప్రవక్తీనియగు మిరియాము, ప్రధాన యాజకుడగు అహరోనులు కూడా మోషే భార్యను ఎగతాళి చేసిరి, ఎందుకనగా ఆమె ఐతియోపీయురాలు. అక్కడికి వెళ్ళి ఆమెను పెండ్లి చేసికొనుటకు బదులుగా ఇక్కడ మన గుంపులో సరిపోయినంత స్త్రీలు లేరా? అని తలంచిరి. అది మోషే ఎన్నిక కాదు; అది మోషే కొరకు దేవుని ఎన్నిక. వారు దానిని ఎగతాళి చేసినప్పుడు, దేవునికి కోపము వచ్చెను. ప్రవక్తీనియగు మిరియాము నిండుగా కుష్ట రోగముతో మొత్తెను. మోషే యొక్క స్వంత సోదరి. దాని సంగతి ఏమిటి? ఆమె ఒక ప్రవక్తీని, కాని ఏమి చేయుచున్నది? ఆ నాటి నిబంధన యొక్క వర్తమానికుడుని ఆమె అగౌరవించెను. అలాగే ప్రధాన యాజకుడగు అహరోను కూడా ఆమె పక్షమున ఉండెను. అతడు మోషే నోటికి నోరు.

అప్పుడు అహరోను తన సోదరి కుష్టరోగము తో మొత్తబడుట చూచి మోషే యొద్దకు వెళ్ళి, "నీ స్వంత సోదరిని చావనిచ్చెదవా?" అనడిగెను.

మరియు మోషే గుడారములోనికి వెళ్ళి దేవుని ముందు పడి, తన సహోదరిని కరుణించమని విలపిస్తూ దేవునిని పిలిచెను. మరియు దేవుని ఆత్మ క్రిందికి దిగివచ్చి, ఇలాగు పలికెను, "అహరోను మరియు మిర్యాములను నా ముందుకు నిలుచుటకు పిలువమనెను." ఓ, మై!

దేవుడు గౌరవమును కోరును! దేవుడు తన వర్తమానమును పంపును. దానిని నీవు చేర్చుకొని దానికి గౌరవము చూపవలెను. పరిశుద్ధ బండల గుంపు అని లేదా మరో విధంగా వారు పిలిచినా లెక్క చేయవద్దు. లోకమును దాని ఇష్టము వచ్చినట్లు చేయనీయండి, కాని మీరు గౌరవమును ఇయ్యండి!

NUM 12:5,6,9

 

41అక్కడ మిరియాము నిలబడినది. మిరియామును, మోషేను… లేదా అహరోనును, అనగా "నీ సోదరిని, సోదరుని నా యెదుటకు పిలువుము," అని దేవుడు చెప్పెను.

వారు దేవుని ఎదుటకు వచ్చినపుడు దేవుడు ఇట్లనెను, "మీరు దేవునికి భయపడరా?" ఆ ప్రధాన యాజకునికి, ప్రవక్తీనియగు మిరియామునకు ఆలాగు చెప్పెను, "మీ మధ్య ఆత్మ సంబంధి లేక ప్రవక్త ఎవరయినా ఉన్నచో, వారికి యెహోవానగు నన్నునేను బయలుపరచుకొందును. దర్శనముల ద్వారా వారితో మాట్లాడి, కలలలో నన్నునేను ప్రత్యక్షపరచుకొందును, అయితే వారు ఆత్మసంబంధి లేక ప్రవక్త అయియుండవలెను." "నా సేవకుడగు మోషేతో నేను ప్రత్యక్షముగా మాట్లాడాను." "మీరు దేవునికి భయపడరా?" అని అడిగెను. ఇంకో మాటలో, "మీరు మోషేకు విరోధముగా మాట్లాడినప్పుడు, నాకు విరోధముగా మాట్లాడినట్లే. మీరు మోషేను గౌరవించనిచో, నన్నును గౌరవించరు." "అతడు నా దాసుడని మీ మధ్య నేను రుజువు చేయలేదా? అసలు అతని పట్ల మీకు గౌరవమే లేదు."

మర్యాదలు, గౌరవములులేని ఈనాటి జనులకు ఇట్టి పాఠముగా ఉన్నది!

"మీరది చేయని కారణము వల్లనే మీకు కుష్టరోగము వచ్చినది, ఆ కారణము వల్లనే ఈ సంఘటనలు జరిగినవి, ఇతడు నా దాసుడని మీరు తెలిసికొని యుండవలసినది. కనుక మీరు అతనికి విరోధముగా ఏది పలికినా అది నాకు విరోధముగా పలికినట్లే అనెను."

NUM 12:13

 

42కనుక మోషే ఆమె ప్రాణమును రక్షించుటకు ప్రార్థించెను, దేవుడు ఆమెను కాపాడెను. ఆ తరువాత ఎంతో కాలము ఆమె బ్రదుకలేదు. ఆమె చని పోయినది, అయితే ఆమె కుష్టరోగము నుండి పరిశుభ్రమయినది. పరిశుద్ధత కొరకు ఆమె ఏడు దినముల పాళెము వెలుపట ఉండెను, మీకు తెలియును, ఆమె తన కుష్టరోగము నుండి మరల పవిత్రురాలయ్యెను. దేవుడామెను స్వస్థపరిచెను.

అయితే ఆయన వారిని ఏమి గ్రహించవలనని ప్రయత్నించెననగా, "నేను చేసిన దానిని మీరు గౌరవించవలసియున్నది."

ఆనాడు దేవుని యొక్క సంకల్పము అదే అయినచో, దేవుడు మార జాలడు. దేవుడు, తాను చేయుచున్న దానిని మనము గౌరవించవలెనని కోరుచున్నాడు. ఆయన గట్టిగా కోరుచున్నాడు. "మీరు గౌరవించవలెను, లేనిచో, ఏదో జరుగనైయున్నది," అని చెప్పెను.

43ఒక రోజున ఒక వ్యక్తి నాతో చెప్పినది… పేదవాడు, జీవనము కొరకు ఇక్కడి మార్కెట్టులో తుడుచును. అతడు బహు ఘోరముగా దెబ్బతినెను. విశ్వాసమును బట్టి అతడు లూథరను, వారికి ప్రభురాత్రి భోజనము ఏర్పాటాయెను. అతడు సంఘమునకు నడచి వెళ్ళుటకు కూడా బలము లేని స్థితిలో యుండినందున అద్దెకారు తీసికొనెను. వెళ్ళి వచ్చుటకు రెండు ప్రక్కలా ఎనభై-ఎనభై సెంట్లు ఖర్చు అయ్యెను. బహు భక్తిహీనుడగు అతని పొరుగువాడు ఇతడు ఒక ఉదయము పరలోక ప్రార్థన చేయుట చూచి నవ్వెను. అతనిని ఎగతాళి చేసెను. "ఉదయమున అద్దె కారులో ఎక్కడికి వెళ్ళావు?" అని ఇతనిని ఆ పొరుగువాడు ప్రశ్నించెను.

"ప్రభురాత్రి భోజనము అనగా ఏమిటి?" అని ప్రశ్నించెను.

"రొట్టె ద్రాక్షారసము మేము తీసికొందము."

"ఈ రోజు నేను కూడా నా భోజనపుబల్ల మీద ఒక చిన్న రొట్టె ముక్క చిన్న విస్కీతో కలిపి తీసికొన్నాను," అని చెప్పాడు, చూచారా.

44సంఘములో ప్రభురాత్రి భోజనము ఒకసారి హేళనగా మాట్లాడిన ముగ్గురు బాలురను గూర్చి నాకు తెలియును, వారిని గూర్చి నాకు తెలుసును. వారు హోటల్ గదిలోనికి వెళ్ళి కొన్ని సాండ్‌విచ్‌లు ఒక విస్కీ సీసా తీసికొని అక్కడ తమ ప్రభురాత్రి భోజనమును అవ హేళనగా తీసికొనిరి. పెంతెకోస్తు సంఘములోని ప్రభురాత్రి భోజనము వారాలాగు హేళన చేసిరి. మూడు నెలలు నిండకుండానే అందులో ఒకడు చనిపోయెను. మిగిలిన ఇద్దరు పిచ్చాసు పత్రిలో పెట్టబడిరి.

నీవు దేవుని అగౌరవించజాలవు! నీవు దేవుని గౌరవించవలసియున్నావు. నీవు దానిని నమ్మక పోయినచో, మౌనముగా ఉండు, దానికి దూరంగా ఉండు. లేదా దానిని అనుసరించు; లేదా గౌరవముగా వచ్చి, దానిని సన్మానించు. ఆత్మ నందున్న జనులను హేళన చేయవద్దు. దేవుని యొక్క ఆత్మయందు ఆరాధన చేయుచున్న ప్రజలను గూర్చి మాట్లాడవద్దు. వారి జోలికి పోవద్దు.

45ఒక బాల బోధకునిగా నేనుండిన సమయములో, చాలా సంవత్సరముల క్రితం ఒక మూలన బోధించుచూ నిలుచున్నాను. ఒక స్త్రీ అటు వచ్చినది. ఆమె కాథలిక్కు విశ్వాసి. ఆమె భర్త కాథలిక్కు అని నాకు తెలియును; ఆమె ఏమీ కాదు. చాలా అందమైన, చక్కని స్త్రీ, బాగా కనబడేది; దాదాపు ఇరవై, ఇరవై-రెండేండ్లు ఉండును. ఈ పట్టణములో ఆమె బాలికగా ఉన్నప్పటి నుండి నాకు తెలియును. ఆమె వచ్చి దగ్గర నిలబడి ఈలాగన్నది, "విలియం బ్రెన్హాం పొందిన ఆ మతమును నా పెంపుడు ఆవును కూడా పొందనీయను."

ఆ మరుసటి రాత్రి నేనామెను కలిసికొనకముందే ఆస్పత్రిలో ఆమె చనిపోవుచున్నదని విన్నాను, ఆమెను ఏమి చంపినదో ఇంకా తెలియలేదు. ఆమె ఆస్పత్రిలో చనిపోవుచున్నది, ఆమె భర్త నన్ను తీసికొని వెళ్ళుటకు వచ్చెను. తాను కాథలిక్కునని అతడు చెప్పెను, "తొందరగా రమ్ము మరియు నా భార్య కొరకు ప్రార్థించుము. రాత్రంతయూ ఆమె నిన్ను పిలచుచున్నది. ఆమె చనిపోవుచున్నది," అని చెప్పెను.

46సరే, "నేను వచ్చెదను," అని చెప్పి, కారు తీసి కూటము నుండి హాస్పిటల్‌కు బయలు దేరాను. నేను మెట్ల క్రిందకు పరుగెత్తాను, నర్సును కలిసికొన్నాను. "ఆమె అప్పటికే చనిపోయినది," అని చెప్పినది.

"ఏలాగయినా, సరే వచ్చి ఆమె కొరకు ప్రార్థించు," అని అతడు చెప్పెను.

"ఆమె చనిపోయినది," అని చెప్పెను.

"ఏలాగయినా, ప్రార్థన చేయుము," అనెను.

"అందువలన మరేమీ లాభము ఇప్పుడుండదు."

"సరే. వచ్చి ఆమె వైపు చూడుము," అనెను.

నేను వెళ్ళాను. ఆమెకు నలుపు ఎరుపు కలిసిన జుట్టుయున్నది. దాని అబర్న్ జుట్టు అని పిలచెడి వారు. చాలా అందమగు స్త్రీ, ఆమె ముఖము మీద కొద్దిగా మచ్చలు ఉన్నవి, చాలా పెద్ద కండ్లు గోధుమ రంగులో యున్నవి. "బిల్లీ, ఆ స్త్రీ ఎంతో బిగ్గరగా నీ పేరును పిలుచుచూ నన్ను క్షమించమని అతనికి చెప్పండి అంటూ మహా వేదనతో చనిపోయినది," అని నర్సు చెప్పినది. ముఖము మీద మొటిమల వంటి మచ్చలు పొంగిపోయి కనబడినవి. ఆ పెద్ద కండ్లు ఎంతో లోతుకు పోయినవి. ఆమె కను రెప్పలు సగం కండ్లను మూసి వేసినవి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమి జరుగునో మీరెరుగుదురా? వారి మూత్ర పిండములు, ప్రేవులు కదలును. ఆమె సెగలు విడుచుచూ అక్కడున్నది. ఎంతో వేదనతో ఆమె చనిపోయినది. నన్ను ఆమె అగౌరవించినందున కాదు గాని ఆమె నేను బోధించుచున్న సువార్తను, దేవుడు జరిగించుచున్న అద్భుతములను సూచక క్రియలను అగౌరవించినది.

MARK 9:42•

LUKE 17:2•

GAL 6:7,8

 

47ఒక సారి న్యూ అల్బనిలో ఒక పాపిని క్రీస్తు నొద్దకు నడిపించుటకు నిలబడి మాట్లాడుచున్నాను. అతడు ఒక పెద్ద కరుకు చేతులు గల మనిషి కార్లు బాగుచేయు స్థలములో పని చేయుచున్నాడు. నాకు స్నేహితుడే. మా ఇంటి ప్రక్కన అతని అల్లుడు ఆ కార్లు మరమ్మత్తు పని చేయుచున్నాడు. నేను అక్కడ నిలబడి భోజన సమయములో ఒక సాండ్‌విచ్ తినుచూ అతనితో దేవుని గూర్చి మాట్లాడుచున్నాను. పగటివేళ ఎక్కడో ఒక చోట భోజనము దొరుకు చోటు కనుగొని ఆ సమయములో ఒక ఆత్మను క్రీస్తు నొద్దకు నడిపించుటకు ప్రయత్నించుదును. "బ్రెన్హాం" అని నన్ను పిలచాడు. నేను కేవలము ఒక బాల బోధకుడిని మాత్రమే. "బ్రెన్హాం, నా తల్లికి అలాంటి మతమే ఉండేది. హృదయానికి బాధ కలుగచేయు మతము అని చెప్పెను." అతని బుగ్గల మీద నుండి కన్నీరు కారుచుండెను. "ఆమె పోయి ఎంత కాలమయినది?" అనడిగాను. "కొన్ని సంవత్సరాలు. ఆమె ఎల్లప్పుడు నా కొరకు ప్రార్థించుచుండెను," అన్నాడు.

"ఆమె ప్రార్థనలు వినిన దేవుడు ఆమె కొరకు ఇప్పుడు జవాబు ఇయ్యనై యుండెను," అన్నాను.

ఇతడు అక్కడికి వచ్చి "హాల్లో" అని పలుకరించెను. అతడు త్రాగి యున్నాడు. "హ, బిల్లీ," విను. "నీవు నా గేరేజికి ఎప్పుడయినా రావచ్చు కాని నీ యొక్క ఆపాత పరిశుద్ధ బండ మతమును మాత్రం తీసికొని రావద్దు, అని చెప్పాడు."

అతని వైపు నేను తిరిగి, "క్రీస్తు ఏ స్థలంలో అయితే ఆహ్వానించబడడో, ఆ స్థలానికి నేను రాను," అని చెప్పాను.

కనుక అతడు నా వైపు తిరిగి, "నీవు అవతలకుపో కుర్రవాడా అన్నాడు."

నా హృదయంలో ఒక స్వరము ఈలాగు చెప్పుట విన్నాను, "నీవేమి విత్తెదవో అదే కోయుదువు. నీ మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్ర అగాధములో మునిగిపోవుట మేలు." అతని స్వంత అల్లుడే ఆ మధ్యాహ్నము అతని పై రెండు టన్నుల బరువు గల చెవర్‌లెట్ ట్రక్కును పోనిచ్చెను. తుక్కు అయి నేలమీద పడిపోయాడు.

చూడండి, మీరు దేవుని గౌరవించవలసియున్నారు. అది మీరు చేయవలెను దేవుడు మర్యాదను కోరును, దానిని ఆయన పొందగోరును,

కనుక మిరియాము ఇంకా ఎక్కువ తెలిసికొనియుండవలసినది. ఇంతకంటె ఎక్కువగా అహరోను ఎక్కువగా తెలిసికొనియుండవలసినది. మోషే తాను చేయబోవుచున్న దానిని దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి చేయనున్నట్లుగా వారు ఎరిగియుండవలసినది.

48ఇక్కడే ఒక చోటనుండి బాప్టిస్టు సేవకుడు ఒక ఉత్తరమును కొద్ది రోజుల క్రితము వ్రాసెను. ఓ! అతడు నన్ను నిప్పులో వేసినట్లున్నది! అతడిట్లనెను, నీ అంత బద్దకస్థుడు మరొకరుండరు. ప్రవక్తలు, ఏలియాకు సమానమగు సేవ అనుచున్నావు. ఇంట్లో కూర్చొని నీవు ఏమీ చేయకుండా కనబడుచున్నావు.

ఆ సమయమున బిల్లీ నాకు కార్యదర్శిగా పని చేయుచున్నందున తిరిగి అతనికి ఉత్తరము వ్రాసెను. నేను అతనికి జవాబు ఇవ్వాలని అనుకొన్నాను అని అతడు చెప్పెను. అయితే అతడు దానికి జవాబు ఇవ్వక ముందుగా నేను దానిని బాగుగా చదువవలెనని కోరెను. కాని అందులో ఎంతో లౌకికమున్నది. అతడిట్లు వ్రాసెను, ఇది నా తండ్రి కాదు నేనే వ్రాయుచున్నాను. ఏలియా వంటి సేవ మీ తండ్రికి ఉన్నట్లు నీవు చెప్పావు చేపల వేటకు గాలము పట్టుకొని ఎక్కడో చెరువు గట్టు మీదనో లేదా రైఫిల్ పట్టుకొని ఏదో అడవిలోనే కూర్చొని యుండును అని వ్రాశావు. అయితే మూడు సంవత్సరములు ఏలియా వాగు ప్రక్కన కూర్చొని యుండుటను నీవేమందువు? వారు ఏమి చేయుచున్నారో అది చేయుటకు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుచున్నారని నీవెరుగవా? చూడండి. ప్రతిఒక్కరూ దానిని తమ ధోరణిలో లాక్కొని పోవలెనని కోరుచున్నారు. కాని మానవుడు దేవుని ఆత్మచే నడిపించబడుట అగత్యము. మీరు దానిని గౌరవించవలెను. అంతే!

49ఒక రోజున ఇక్కడే, ఈ పట్టణములోనే ఒక ప్రశస్త సోదరుడు మరొక సోదరుని చూచి "బిల్ ఎక్కడున్నట్లు?" అనడిగాడు.

"అతడు కెనడా వెళ్ళెను," అని చెప్పాడు.

"ఒక వేళ వేటకు వెళ్ళాడను కొంటాను," అని పలికాడు.

"అవును. అతడు వేటకు వెళ్ళాడు," అని చెప్పాడు.

"ఆ అదంతా బూటకము అన్నాడు."

సరే మంచిది, ఆ వ్యక్తి నేను పరిశుద్ధాత్మ శక్తి క్రింద ఉన్నానని ఎరుగక, 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు' అను దర్శనము వలన వెళ్ళానని ఎరుగక అలాగనెను. తీర్పు దినమున మీరేమందురు? ఆ వ్యక్తి పరుపు ప్రక్కకు వెళ్ళి అతనికి నేను ప్రార్థన చేయుటవలన లాభమేమి? మొదటగా అతడు నన్ను నమ్మడు. ఈలాగు పలుకుచున్న ప్రజలను చూచునప్పుడు వారెందుకు దానిని నమ్ముట లేదో నాకు తెలియుట లేదు. వారు నీ వీపు మీద నిమిరి నిన్ను "సోదరుడా" అని పిలిచినా గాని వారు దానిని నమ్ముట లేదని నీకు తెలియును. దానిని వారు నమ్మరు. మీరు వారి కొరకు ఏమియూ చేయజాలరు. వచ్చి ప్రార్థించుడి అని వారు మీకు కబురు చేయుదురు గాని, అందువలన వారికేమియూ మేలు కలుగదు. ఎందుకనగా వారు దానిని అగౌరవించుచున్నారు. చూడండి, దానిని మీరు నమ్మవలసియున్నారు. నిజంగా ఎవరు నమ్ముచున్నారో వారిని పరీక్షించండి. ఏమి జరుగునో గమనించండి. చూడండి, దానిని మీరు గౌరవించవలసియున్నారు.

2KGS 9:36

 

50ఏలియా దినములలో యెజెబెలు, ఏలియాను ఎంత అగౌరవపరచినదో గదా! ఏలియా నిజంగా ఆమె సంఘకాపరి. నిశ్చయంగా. ఓ, ఆ మాట ఆమె ఒప్పుకోదు నిజంగానే ఒప్పుకోదు! ఆమె ఒక నాస్తికురాలు లేదా అవిశ్వాసి-విగ్రహారాధికురాలు. ఆమెకు తన స్వంత అన్యపూజరులున్నారు. అయినా గాని ఏలియా ఆమెకు సంఘ కాపరియే, కాపరిగా నుండుటకే దేవుడాయనను అక్కడికి పంపెను. అతడు సంఘకాపరి ఆమెను దుయ్యబట్టినా, ఆమె పాపములను ఎత్తి చూపినా అతడు మాత్రము ఆమె సంఘకాపరియే. ఆమె అది ఎంత మాత్రము అంగీకరించదు, కాని అది అతనిని అగౌరవించినట్లే. అతనిని ద్వేషించినది! నిజంగానే ఆలాగు చేసెను. ఆమెకు ఏమి జరిగినది? వీధిలో కుక్కలు ఆమెను తినునట్లుగా ఆయన చేసెను. అది నిజము. ఎందువలన? ఏలియా బోధించుచున్న వర్తమానమును ఆమె అగౌరవించినది.

1KGS 17:1•

1KGS 18:17

 

51దేవుడు మర్యాదను కోరును. దానిని మీరు కలిగియుండవలసియున్నారు. దేవుని నుండి మీరు ఏదయినా పొందవలసియున్నచో, మీరు దేవుని గౌరవించవలసియున్నారు. మీ హృదయముతో, అంతరంగము నుండి అది మీరు చేయవలసియున్నారు. దానిని మీరు తప్పక చేయవలెను.

కాని ఆమె ప్రవక్తను అగౌరవించినందున దేవునిని అగౌరవించినట్లే. ఏలియా ఒక ప్రవక్త అని ఆమె ఎరుగును. ఏలియాకు సరిపోయినది ఇశ్రాయేలంతటిలో వారికి మరేదియూ లేదు. ఎందుకు, ఆయన దర్శనమలు, సమస్తము దేవుని ఎదుట పరిపూర్ణముగా యుండెను. అయితే అతడు చేసినది వారిని ఖండించుటయే. కృప, అవును! ప్రతి శాఖను, ప్రతి దానిని గద్దించును. పాపముగా పిలువబడు ప్రతి దానిని అతడు గద్దించును. అది పెద్దదయినా, చిన్నదయినా, రాజయినా, మరెవరయినా, ఎవరినీ అతడు మినహాయించక గద్దించును. కాని అతడు ప్రవక్త అని వారు ఎరిగి యుండవలసినది. అది ఎరిగి యుండకుండా వారుండలేరు. అవునండీ.

కరువును గూర్చి అహాబు సహితము అతనిని గద్దించసాగెను. కరువు రప్పించమని అతడు ప్రార్థించెనని పలికెను. అవును, అతడు చేసెను. నాకు శక్తి యున్నది. "నేను ఆకాశములను మూయగలను. నేను తిరిగి ప్రార్థించువరకూ మంచు గాని, వర్షము గాని పడదు," అని అతడు చెప్పెను.

1KGS 17:1

 

52ఆ యెజెబెలు ముఖమునకు రంగు పూసికొని, ఆ వసారాలో చిందులు త్రొక్కుచుండును. ఆ ముసలి వేషధారి! ఆ ముసలి వేషధారి వల్లనే ఇక్కడున్న పిల్లలందరూ శ్రమపడుచున్నారు, అని నానారకములుగా తిట్టు చున్నది. ఏలియా వారిని తిరిగి దేవుని యొద్దకు తెచ్చుటకు ప్రయత్నించుచుండెను, ఒక దేశమును తిరిగి దేవుని కొరకు సంపాదించుటకు ప్రయత్నించుచుండెను. చూచారా, "ఆమె ప్రజలను ఎట్లు మభ్యపరచినదో చూడండి, వర్షము, కనీసము మంచు కూడా కురియకుండా ఈలాగు బంధించి అటువంటి వానిని నమ్మమని మీరు నాకు చెప్పుదురా? అతని యొక్క వేషధారణ, చేతబడితనము అంతా గ్రహించుము. (ఆమె ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడినది). అతడు కట్టుబడి, లేక సోదె లేదా మరేదో చేయువాడు తప్ప మరొకడు కాడు. అతడు ఆకాశములను బంధించెను అందువలన వర్షము రాలేదు, ప్రజలందరినీ శ్రమపరచుచున్నాడు. అది దేవునికిష్టమని మీరందురా"?

అది దేవుని చిత్తము!

53అదే మయినా గాని, చూడండి, ఆయన ఏమి చేసినాగాని దేవునిని మీరు గౌరవించవలసియున్నారు. కీడుగానే కనిపించినది. పిల్లలు శ్రమపడుచున్నారు, ప్రజలు కష్టాలకు గురైరి, పశువులు చనిపోవుచున్నవి, గొర్రెలు చనిపోవుచున్నవి, ఎక్కడా నీరు లేదు. రాత్రులందు వేడిగాలి, ఉక్కబెట్టు పరిస్థితులు, పగటి యందు సూర్యుడు ఎన్నడూ లేని రీతిగా మండిపోవుచున్నాడు. ఆకాశము ఇత్తడివలె ఆయెను. మూడున్నర సంవత్సరముల పాటు ఆలాగు అయినది. ఏలియా ఆ పర్వతము మీద కూర్చొని, "నేను తిరిగి ప్రార్థించు వరకూ వర్షము గాని మంచు గాని కురియదు," అని చెప్పెను. అది నిజము. ఓ! ఎంతగా వారతని ద్వేషించిరో!

1KGS 18:17,18•

1KGS 21:19

 

54"ఇశ్రాయేలును బాధపరచుచున్న వ్యక్తిని నీవు కావా?" అని ఆహాబు అతనిని ప్రశ్నించెను.

ముసలి ఏలియా అతని ముఖము లోనికి చూచి, "కాదు, నేను కాదు, కాని ఇశ్రాయేలును శ్రమపరచుచున్నవాడవు నీవే అనెను." అది నిజము. చూడండి, ఆహాబు కూడా అతనికి గౌరవము ఇయ్యలేదు. ఏలియా ఆహాబుతో ఏమి చెప్పెనో మీరెరుగుదురా? "నాబోతు యొక్క నిరపరాధ రక్తము నీవు చిందించినందున, నీ రక్తమును కూడా కుక్కలు వీధిలో నాకును. ఆలాగే జరుగును! వారు దేవుని వర్తమానికుని అగౌరవపరచినందునే. అది అక్షరాలా నిజము. దానిని వారు అగౌరవించిరి.

ఇప్పుడు, మిరియాము దానిని అగౌరవపరచినది. అహరోను దానిని అగౌరవపరచెను.

నీవు ఏమైయున్నాగాని, క్రైస్తవునివైనా లేక కాకపోయినా, దేవుని మాత్రము గౌరవించవలసియున్నావు. ఆయన చేయుచున్న దానిని గౌరవించవలసియున్నావు, లేనిచో, ఫలితమును అనుభవించెదవు. దానిని చేర్చుకోనయినా చేర్చుకోవాలి లేకపోయినచో, తీర్పులోనికి వెళ్ళెదవు. ఏదో ఒకటి నీవు అనుభవించవలసియున్నావు.

55నా జీవిత కాలములో నేను చూచినది. విదేశములలోను, ప్రపంచ ఇతర భాగములలోను జరుగుచున్న వానిని ఘడియకు నేను సాక్షముగా నిలబడి ఏలాగు చెప్పకలుగుచున్నానో గమనించండి. దానిని త్రోసి వేయకుండా నేను మీతో ఏది చెప్ప ప్రయత్నించుచున్నానో, ఆ ఉద్ధేశ్యమును మీరు తప్పక గౌరవించవలెను. యువకులు కూటములో కూర్చొని నవ్వుట, సకలించుట నేను చూచాను. ఆ తరువాత ఇరువది-నాలుగు గంటలు జరుగక ముందే వీధిలో నలిగి చనిపోవుట చూచాను. ఒకసారి నేను ఒక స్థలములో ఒక సంవత్సరము కూటములో యుండగా, యువకులు కూర్చొనియుండిరి. ఆ తరువాత ఆరు నెలలకు నేను ఆ స్థలమునకు వెళ్ళినపుడు వారిలో ప్రతి ఒక్కరు చనిపోవుట చూచాను. ఎక్కడో చంపబడుటయో లేక ఎక్కడో కొట్టబడుటయో, రోగములు మొదలగు వానితో మోత్తబడుటయో చూచాను. అది నిజము. దానిని మీరు గౌరవించవలసియున్నారు.

56టెన్సిస్సీలో ఒక రాత్రి ఒక యువతి నాకు జ్ఞాపకమున్నది. ఒక పెద్ద బాప్టిస్టు చర్చిలో ప్రసంగించుటకు తలుపు దాటి వెళ్ళుచున్నాను. ఆ రాత్రి ఆమెను క్రీస్తు నొద్దకు రమ్మని పిలువవలెనని నాకు నడిపింపు వచ్చినది. క్రీస్తు నొద్దకు రమ్మని పిలువగా, ఆమె నా ముఖము మీదనే నవ్వినది. ఆమె సంఘ పెద్దలలో ఒకాయన కుమార్తె. ఆ రాత్రి తలుపు నొద్ద వేచియుండి, ఆమె నా కొరకు ఎదురుచూచినది. నేను బయటకు రాగా ఆమె నాతో ఇట్లన్నది, "ఒక్క సంగతి మీకు చెప్పవలెనని యున్నాను, మరల ఎన్నడూ నన్ను ఆలాగు సిగ్గుపరచ వద్దు సుమా"!

"దేవుడు నిన్ను పిలచుచున్నాడు," అని చెప్పాను.

"చెత్త మాటలు చెప్పవద్దు. నేను యవ్వనస్థురాలను. అది చేయుటకు ఇంకా నాకు చాలా సమయమున్నది. మా తండ్రికి మా ఇంట్లో ఉన్నవారందరికి సరిపోవునంత భక్తియున్నది," అని చెప్పినది.

"సోదరీ, అది నీకు చాలదు. ప్రతి ఒక్కరు తమతమ స్వభక్తిని కలిగియుండవలెను," అన్నాను.

"దాని గూర్చి నాకు ఎవరయినా చెప్పవలెనని నేను కోరినచో, నేను నీ లాంటి వారిని కాదు, ఇంకా కాస్త జ్ఞానమున్న వారిని పిలిపించు కొందును అన్నది."

"పో, వెళ్ళి నీ ఇష్టమొచ్చినట్లు చెప్పుకో. నాకేమీ బాధ లేదు, కాని ఒక దినమున నీవు చింతపడుదువు," అన్నాను.

57అది జరిగిన కొద్ది కాలము తరువాత అదే పట్టణముగుండా వెళ్ళుచున్నాను. పొట్టి లంగా వేసికొని చేతిలో సిగరెట్టుతో ఆమె వీధిలో వస్తున్నది. నాకు విస్కీ ఇవ్వచూచినది. అదే! ఇదిగో ఆమె సాక్షము ఈ లాగున్నది, "నీవు ఆ రాత్రి అక్కడ పిలిచిన సంగతి గుర్తున్నదా?" "అది నిజమే." "ఆ రాత్రి దేవుని యొక్క ఆత్మ నన్ను రమ్మని కోరుటకు ప్రయత్నించుట నాకు రుజువుగా తెలిసినది." "అప్పటి నుండి నా తల్లి పెనములో వేగుచున్నట్లుగా పాతాళములో వేగుట నేను చూచుచున్నాను, దానిని చూచి నవ్వుచున్నాది." అదే జరిగిన సంగతి, చూడండి.

దేవునిని నీవు గౌరవించవలసియున్నావు. అంతే. సోదరుడా, అది నీవు చేయవలసియున్నావు. అంతే యెజెబెలు దానిని అగౌరవించెను.

2KGS 2:11-15,23•

MARK 16:17•

JOHN 14:12

 

58మరొక సారి జరిగినది గుర్తున్నది, గౌరవము లేని పిల్లలు ఒకచోట ఉండిరి. వారు ఒక ఇంటిలో పెరిగిరి…

ఏలియా దినములు అయిపోయిన తదుపరి సంగతి, ప్రజలు అతనిని ద్వేషించిరి, ఎందుకనగా అతడు దేశము మీదికి కరువు రప్పించెను. "ఏలియా, అంత గొప్పవాడు అతడు పరమునకు కొనిపోబడెను? అని కొందరు తమ పిల్లలకు నేర్పించిరి. అతడు ఎక్కడో చంపబడెను, అతనిని సమాధి చేసిరి మరియు మరుగుపరచిరి," అని కొందరు చెప్పిరి. దానిని వారు నమ్మలేదు.

కనుక ఎలీషా అతనికి బదులుగా స్థానము తీసికొనెను. ఏలియా కొనిపోయిన తరువాత ఆ దినమునకు అతడే వర్తమానికుడు. ఒక నాడు ఒక పట్టణము గుండా వెళ్ళుచుండెను. ఆ పట్టణములోని చిన్న పిల్లలు పరుగిడి వచ్చి అతనిని హేళన చేసిరి. "బట్టతల ముసలివాడా, ఏలియావలె నీవెందుకు ఎక్కిపోలేదు?" అనిరి. చూడండి, ఏలియా ఎక్కిపోయెనని వారు నమ్మలేదు. అంతే! అది మానవుని అగౌరవించుట కాదు; అతని వర్తమానమును అగౌరవించుట. అతడు ఏలియాకు వారసుడు… అతడు బయలు వెళ్ళి ఏలియా చేసిన క్రియలనే చేసెను. హల్లేలూయా!

"నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును," అని యేసు చెప్పెను. "అవును. నమ్మువారివలన ఈ సూచక క్రియలు కనబడును."

దానిని వారు అగౌరవించిరి. ఏలియాను నమ్మనందున ఎలీషాను కూడా వారు అగౌరవించిరి, ఎందుకనగా ఆత్మ అతనిపై యున్నది. అతడు వెళ్ళి తన దుప్పటితో యోర్ధానును కొట్టగా యోర్ధాను త్రోవ ఇచ్చెను. ఇంకా వెళ్ళి ఏలియా చేసిన అద్భుతములవంటివే అతడు చేసెను. ప్రవక్తల పాఠశాలలో యున్న బోధకులందరును "ఏలియా ఆత్మ, ఎలీషా మీద ఉన్నది," అని కూడా దేశమంతటా చాటించిరి.

2KGS 2:11•

MATT 28:12

 

59ఆ ప్రజలు ఒకరికొకరు చెప్పుకొని నవ్విరని నేను పందెము వేయుదును. "హే, హే, అటు చూడండి. ఆ పరిశుద్ధ బండల గుంపు, మతోన్మాదులు ఈలాగు చెప్పుచున్నారు, చనిపోకుండా ఆ మనుష్యుడు పరలోకమునకు వెళ్ళెనట, గుర్రములు దిగి వచ్చినవట. మనకేమీ కనబడలేదే?" నిశ్చయంగా వారికి కనబడదు, ఖచ్చితంగా, వారికది ఏదియూ కానరాదు. "మేము ఏగుర్రములను చూడలేదు. ఎక్కడా ఏ రథముల అలికిడి మాకు వినబడలేదు. బూటకం! ఆ ముసలివాడు చనిపోయెను మరియు వారతని పాతిపెట్టిరి, దాని మీద వారు ఏదో కల్పనా కథలు చెప్పుచున్నారు, అనిరి.

అదే సంగతి! ఈ రోజు కూడా వారు అలాగే చెప్పుచున్నారు.

యేసును గూర్చి వారు చెప్పినట్లుగానే యున్నది, "వారు రాత్రి వేళ వచ్చి ఆయన శరీరమును ఎత్తికొనిపోయిరి." దానిని గూర్చి సాక్షమిచ్చుటకు వారు సైనికులకు కూడా డబ్బు ఇచ్చిరి. కాని ఆయన మృతులలో నుండి తిరిగి లేచెను!

ఏలియా అగ్ని గుర్రములతో, అగ్ని రథములో ఎత్తికొని పోబడెను.

2KGS 2:23,24

 

60ఈ యువ ప్రవక్త ఆ పట్టణముగుండా నడిచిపోవుచుండెను. యువకునిగా ఉండగానే అతని జుట్టు రాలిపోయినది. అతడు దిగి వెళ్ళుచుండెను. ఈ చిన్న పిల్లలు అతని వెంబడి వచ్చి "హేయ్, ఏలియాతో, నీ వెందుకు ఎగిరిపోలేదు? నీవే, ఓ బోడివాడా!" అనిరి. చూడండి, వారు అగౌరవము చూపుచుండిరి. ఎలీషా ఏమి చేసెను? ఆత్మ శక్తితో వెనక్కు తిరిగి ఆ పిల్లలను శపించెను. ఏమి జరిగెను? రెండు ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి, నలుబది రెండు మందిని తినివేసెను. నిజము, అగౌరవము, అమర్యాద! నీవది చేయరాదు. దేవుని నీవు గౌరవించవలసియున్నావు.

61ఆ పిల్లల తల్లిదండ్రుల వారితో ఈలాగు చెప్పియుండినచో, ఎంత బాగుండును! "ఇదిగో, పిల్లలారా, చూడండి, ఏలియా ఎత్తబడెనని వారనుచున్నారు. దాని గూర్చి మనకేమి తెలియదు. అది అవునో కాదో మాకు తెలియదు గాని, దాని గూర్చి మీరేమియూ పలుకవద్దు. అదే అన్నింటికన్న మంచి విషయము. తలవంచుకొనిపోండి. ఈ రోజున అతడు పట్టణము గుండా వెళ్ళునని విన్నాము. ఎక్కడో వీధి కూటము పెట్టునని తెలిసినది. బడికి వెళ్ళునప్పుడు మీరు దారిలో ఎక్కడయినా అతడు వచ్చుట చూచినచో, అయ్యగారూ! బాగున్నారా అని పలుకరించండి. ఏమండీ? ఎట్లున్నారు? అని అడగండి. ఆలాగే మర్యాదగా మాట్లాడండి."

కాని వారు ఇంట్లో భోజనపు బల్లయొద్ద అమ్మ, నాన్న కూర్చొని ఒకరికొకరు నవ్వు కొంటూ అందుకు వ్యతిరేకంగా చెప్పుకొనుట, ఈ పిల్లలు విన్నారనుటలో సందేహము లేదు. "మీ కేమీ తెలియును? ఆ ముసలి పరిశుద్ధబండ పోయెనని వారు చెప్పుచున్నారు! అటువంటిది ఎన్నడైన నీవు నమ్ముదువా? ఈ బట్టతల వాడువస్తున్నాడని చెప్పుకొనుచున్నారు. ఆ గుమ్మడి కాయంత బోడిగా ఉన్నాడు. ఇంకా ముప్పది అయిదేళ్ళు కూడా నిండలేదు. ఒక వీధి కూటము ఏర్పాటు చేస్తున్నారట. అటువంటి చెత్త మనము నమ్మము గదా. హేళనకు పాత్రుడు తప్ప మరేమీ కాదు. అంతే. ఎందుకనగా, అతడు మన సంఘానికి రాడు, చూడండి. బహుశా… ఒక విధమగు చేతబడితనము, హూడూ, మంత్ర శక్తి ఏలియా వలె ఇతడును పొందియుండును." వారతనిని నమ్మలేదు. చిన్నపిల్లలు ఆలాగే ఇంటి యొద్ద నేర్చుకొనిరి.

2KGS 2:24

 

62వారికి గౌరవము, మర్యాద నేర్పియుండినయెడల వారు ఆ ప్రవక్త ఎదురయినప్పుడు ప్రార్థించమని కోరెడివారు.

కాని, వారు ఎగతాళి, హేళన చేయుటకు నేర్పింపబడిరి, గేళి చేసిరి. ఈ నాటి పిల్లలవలెనే యున్నారు. ఈనాడు పిల్లలో ఎక్కువ భాగము వీధి కూటమును, సువార్త ప్రకటనను అపహాస్యము చేయుచున్నారు.

కనుక, యెహోవా నామము పేరట ఎలీషా వారిని శపించెను. పిల్లలను బట్టి కాదు గాని, దేవునిని ఆ విధంగా అగౌరవించునట్లు పెంచిన ఆ మర్యాద లేని తల్లిదండ్రులను బట్టియే. రెండు ఆడ-ఎలుగుబంట్లు వచ్చినవి మరియు నలుబది రెండు మంది పిల్లలను చంపివేసెను. ఇప్పుడు, అది వేరే విషయము. దేవుడు గౌరవమును కోరును! వారు ఆయన ప్రవక్తను అగౌరవపరచినప్పుడు, ఆయనను వారు అగౌరవించినట్లే. వారు నమ్మక పోయినా పరవాలేదు, వారు తమ నోరు మూసికొని యుండవలసినది, దానికి దూరంగా ఉండవలెను. వారు తమ వెలను చెల్లించిరి. వారు చెప్పిన దానిని చెప్పకుండా ఉండవలసియుండిరి. మరియు వారికేమి జరిగినది?

2KGS 4:8

 

63ఆ విధంగా మర్యాద చూపిన కొందరిని మనము తీసికొందము. అదే ఏలియా ప్రవక్తకు మర్యాద చూపిన షూనేమీయురాలుని చూద్దాం. ఆమె అసలు ఇశ్రాయేలీయురాలు కాదు. ఆమె షూనేము నుండి వచ్చినది, కాని ఆమె దేవుని యందు విశ్వాసముంచినది. ఇతడు పట్టణము నుండి వెళ్ళుచూ మాట్లాడుటను వినినది. అతడు జరిగించిన ఆశ్చర్యకార్యములను ఆమె చూచినది.

చరిత్రలో ఆలాగు చెప్పబడినది — అది నిజమో అబద్ధమో తెలియదు గాని — ఒక రోజున ఒక చిన్న బాలికను పట్టుకొనుటకు ఒక అడవి కుక్కల గుంపు ప్రయత్నించినది. ఇప్పుడు, ఇది లేఖనము కాదు, ఇది కేవలము నేను చదివిన ఒక గాధ. షూనేమీయురాలు ఒక మూలన నిలబడియున్నది. ఈ కుక్కలు ఆ చిన్న బాలికను చంపబోవుట ఆమె చూచెను. ఈ పరిశుద్ధుడు పట్టణము గుండా వెళ్ళుట చూచెను. అతడు తన కర్రను దేవుని వైపు ఎత్తి ఆ చిన్న పిల్లల పట్ల దయచూపమని మొరపెట్టెను. ఆ కుక్కలు వారిని కరవక దూరమైపోయెను. అది అవునో కాదో గాని, అది జరిగియుండునని తోచుచున్నది, నాకు తెలియదు.

2KGS 4:9,10

 

64ఏమయినా గాని, ఈ స్త్రీ ఈలాగు చెప్పినట్లుగా బైబిలులో వ్రాయబడెను. ఇతడు ఒక పరిశుద్ధుడు అని కనుగొన్నది. ఏదో ఒక గొప్ప సంగతి జరిగినదని ఆమె కనుగొన్నది. అతడేమైయుండెనో, ఆమె కనుగొనెను. అతడు దేవుని యొద్దనుండిన ఒక పరిశుద్ధ మనుష్యుడు అని ఆమె గ్రహించినది. యెజెబెలు చేసినట్లుగా ఆమె అతనిని అగౌరవించలేదు గాని, అతనిని గౌరవించినది. ఆమె తన భర్తతో ఇట్లన్నది, "దీనిని మనము తప్పక చేయగల సమర్థులము. ఇక్కడే ఎక్కడో ఒక చోట మనము ఒక గృహమును నిర్మించుదము. అతడు అలసిపోయినప్పుడు విశ్రాంతి పొందుటకు ఒక చిన్న స్థలము మనము కేటాయించుదము. అతనిని నేను గమనించాను, అతని చిన్న పాత కర్ర, అతని వడలిన సన్నని చేతులు నడచి వచ్చుచున్నప్పుడు, వణకుట చూచాను. ఇక్కడికి అతడు ఒక చిన్న నూనె సిద్దెతో గొర్రె చర్మము ధరించుకొని మండుటెండలో వచ్చుచున్నపుడు, అతని శరీరము ఎండకు ఎర్రగా కమిలిపోయి కనబడుచున్నది. ఇక్కడ ఆగి విశ్రాంతి పొందుటకు ఒక చిన్న ఆశ్రయము ఏర్పాటు చేయమని వేడుకొనుచున్నాను. గృహము నిర్మించు కాంట్రాక్టరును ఇక్కడికి రమ్మని చెప్పి ఈయన కొరకు ఒక గహమును నిర్మించమని కబురు చేయండి, ఎందుకనగా ఈయన ఆత్మను బట్టి ఇతడు ఒక దైవజనుడని గ్రహించుచున్నాను. ఇతడు ఒక పరిశుద్ధుడు." ఓ! ఓ!ఎంత తేడా!

2KGS 4:11-15

 

65ఇప్పుడు, ఆమె భర్త సమ్మతించెను. అతడు ఈలాగు చెప్పియుండును, "ప్రియురాలా, ఆయనను నేను గమనించాను, అతని బోధ విన్నాను, అతని పరీక్షించాను మరియు అతని కార్యములు చూచాను. అతడు ఒక పవిత్ర దైవ జనుడని తెలిసికొన్నాను, కనుక అది మనము చేయుదము. కనుక వారు కాంట్రాక్టరును పిలిపించి, అతనికి ఒక చక్కని చిన్న గహమును నిర్మించిరి. విశ్రాంతి తీసికొనుటకు ఒక చిన్న పడక ఏర్పాటు చేసిరి. అతడు పరుండి విశ్రాంతి పొందగలడు. తన పాదములు కడుగు కొనుటకు నీటిని, ఇంకా కొన్ని సామాగ్రిని అందులో ఏర్పాటు చేసిరి.

ప్రవక్త అటు వెళ్ళునప్పుడు, తనకొరకు ఏర్పాటు చేయబడిన దానిని చూచి అతని ఆత్మ ధన్యతనొందును. గేహజీని పిలచి అతడు ఇట్లనెను, "వెళ్ళి, ఆమెను పిలువుము, ఆమె కొరకు నేనేమి చేయవలెనో అడుగుము. ఆమెను గూర్చి నేను రాజుతో లేదా సైనికాధికారితో మాట్లాడవలెనా?"

"నేను నా జనుల యొద్ద కాపురముండుచున్నాను. నాకు ఏ అవసరత లేదు," అని చెప్పెను.

కాని గేహజీ ఇట్లనెను, "ఆమెకు పిల్లలు లేరు. ఆమె భర్తబాగా వయస్సు మీరినవాడు. ముసలివాడు. వారికి పిల్లల లేరు."

తాను పరుండట కొరకు ఆమె కానుకగా ఇచ్చిన ఆ చిన్న పడక మీద అతడు పరుండియుండెనని నేను ఊహించుచున్నాను. అతని పాదములు కడుగబడియున్నవి. అతని గడ్డము మొదలగునవి శుభ్రము చేసికొనెను. అతడు ఆ సమయమున ప్రభుని దర్శనము చూచెనని నిస్సందేహముగా చెప్పవచ్చును, ఎందుకనగా వారికది పరిపాటి. "వెళ్ళి ఆమెను నా ఎదుటకు పిలుచుకొని రమ్ము, అని అతడు పలికెను. ఓ! వెళ్ళి ఆమెను పిలువుము, ఎందుకనగా ఆమె దేవునిని గౌరవించినది. వెళ్ళి ఆమెను ఇక్కడికి తీసికొని రమ్ము."

ఆమె వచ్చి, ఆ ద్వారము యొద్ద నిలడినప్పుడు, "అతడిట్లనెను, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వచ్చే సంవత్సరము ఈ కాలమునకు నీవు ఒక బిడ్డను కందువు," ఆ ప్రకారమే ఆ మరుసటి ఏడాది ఆ సమయమునకు ఆమెకు ఒక బిడ్డ కలిగెను.

2KGS 4:18,22,23

 

66ఆ బిడ్డకు దాదాపు పండ్రెండు సంవత్సరములు వచ్చినప్పుడు, అతని తండ్రితో కూడా పొలములో ఉండెను. అప్పుడు సాతాను ఈలాగనుకొనెను, "ఈ బిడ్డను నేను తొలగించుదును," కనుక అతనికి ఒక ఎండ దెబ్బ కలుగజేసెను. అతడు తన తల్లి చేతులలో చనిపోయెను.

అది ఆమెను నిరుత్సాహపరచినదా? లేదండీ! ఆమె ఇట్లనెను, "ఒక గాడిదకు గంతకట్టుము, ముందుకు సాగిపొమ్ము; ఆగిపోవద్దు, కర్మెలు పర్వతము మీదికి ఎక్కిపొమ్ము; ఎందుకనగా, అక్కడికి అతడు ఆ ముందు రోజే వెళ్ళియుండును." ఓ! ఓ! అంతే! అది మర్యాద. అది గౌరవము.

ఆమె భర్త ఇట్లనెను, "నీవు దైవజనుని యొద్దకు వెళ్ళుచున్నావు." "ఇది అమావాస్య కాదూ, సబ్బాతూ కాదు. అతడక్కడ ఉండి యుండకపోవును."

"అంతా అనుకూలముగా జరుగును గాక! గాడిదకు గంతకట్టి నన్ను పొనిమ్ము అన్నది." అలాగున వారు దూరముగా వెళ్ళిరి.

2KGS 4:25-27

 

67వారు కొండయొద్దకు వచ్చిరి. ఆ వృద్ధ ఎలీషా గుహ యొద్దకు వచ్చి చూచి అతనితో ఇట్లనెను, "ఆ షూనేమీయురాలు వస్తున్నట్లుగా యున్నది. ఆమె తప్పక దుఃఖములో ఉండియుండును. వెళ్ళి ఆమెను కలిసికొనుము. ఆమె తన హృదయమందు వ్యాకులము కలిగియున్నది. దేవుడు దానిని గూర్చి నాకేమియూ తెలియచేయలేదు," అని అతడనెను.

చూడండి, దేవుడు నీకు అంతయూ చెప్పనవసరము లేదు, చూడండి, ఆయన తన ప్రవక్తలకు కూడా అంతయూ చెప్పలేదు. ఆయన తాను ఏది చేయగోరునో అదే చేయును. ఆయన దేవుడైయున్నాడు.

68ఇప్పుడు, ఎలీషా ఇట్లనెను, "దేవా!" ఒకవేళ ఎలీషా ఇట్లు పలికినచో ఎలాగుండును? "ఆమె వచ్చుచున్న సంగతి నీవెందుకు మరుగు చేసితివి?" దానంతటి గూర్చియూ నీవెందుకు నాకు చెప్పలేదు? అతడు దానిని అసలేమాత్రము చూడలేదు. ఏది ఏమయినా గాని, ఎలీషాకు ఏమి తొందర కలుగలేదు.

ఆమె వచ్చి అతనితో ఇట్లు చెప్పి యుండినచో, ఏలాగుండును? "నీవు దేవుని దాసుడవని చెప్పకొన్నావు. వేషధారివి! నీవు ఒక పరిశుద్ధ బండవి తప్ప మరేదియూ కాదని నేను నమ్ముచున్నాను," అని అన్నదనుకోండి. అది ఎన్నడూ జరిగి యుండెడిది కాదు, చూచారా. దేవుడు కొన్నిసార్లు మనమేమి చేయుదుమోనని పరిశోధించును.

2KGS 4:27-37

 

69కాబట్టి, అందుకు బదులుగా, ఆమె వెంటనే పరుగిడి వెళ్ళి దేవునిపట్ల మర్యాద చూపునంతగా ప్రవక్తపట్ల మర్యాద చూపి ఆరాధించెను. ఆమె తన పరిస్థితి ఏమిటో బయలుపరచెను. "నా దండము తీసికొని వెళ్ళి ఆ బిడ్డ మీద ఉంచుము," అని అతడనెను.

అతడా విధముగా అన్నప్పుడు, ఆమె ఇట్లనెను, "యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు [ఓ, మై], దైవజనుడగు నిన్ను, నేను వదలను. దేవుడు దర్శనము పంపు వరకు, ఇక్కడే నేను వేచియుందును." ముసలి ఎలీషా అక్కడే మరికొంత సేపు వేచియుండెను, తన మొలకు దట్టీ కట్టుకొనెను, తన దండము తీసికొని వెళ్ళిపోయెను.

ఆ బిడ్డ పడియున్న చోటకు అతడు వెళ్ళెను, గదిలో చనిపోయి పడియున్న శరీరమది. ఆలాగున అతడు నేలమీద అటు ఇటూ కొన్నిసార్లు నడిచెను. ఆమె మర్యాదగల స్త్రీ, అతనిని గౌరవించిన మనిషి. అతనిని దైవజనునిగా భావించి, నమ్మిన స్త్రీ. దేవుడు జవాబు ఇచ్చు వరకు అతడు అటుఇటు నేల మీద, నడచుచునే యుండెను. ఆమేన్. అప్పుడతడు తన్నుతాను బిడ్డ మీద చాపుకొనెను. బిడ్డ ఏడు సార్లు తుమ్మి బ్రతుకగా, అతడు ఆబిడ్డను తల్లికి అప్పగించెను. తిరిగి అతడు తన గుహ యొద్దకు వెళ్ళిపోయెను. ఎందుకనగ, ఆమె దైవజనుని గౌరవించినది! ఆమేన్. దేవుడు గౌరవమును కోరును.

LUKE 10:38,39•

JOHN 11:32

 

70మార్త సంగతి ఏమిటి? యేసునకు మంచి భోజనము సిద్ధపరచుటకే ఆమె ఎల్లప్పుడూ ప్రయత్నించుచుండెను. మరియు దేవుని వాక్యము వినగోరెను, కనుక ఆమె కూర్చొని ఆయన మాటలు వినెను. తలగడ కవర్లు మార్చారా, లేక గుమ్మపు తెరలకు ధూళి పట్టినదా, తినుటకు ఏమైనా ఉన్నదా లేదా అని ఆమె ఏమీ ఆలోచించలేదు. యేసు ఏమి చెప్పనైయున్నాడో దానిని మాత్రమే ఆమె వినగోరెను. కాని మార్త ఎల్లప్పుడూ మంచి విందు ఏలాగు చేయవలెనా అనియే తలంచుచుండెను. కుర్చీ మెత్తగా ఉన్నదో లేదో, అది సరిగా వేయబడినదో లేదో, అంతా శుభ్రముగా ఉన్నదో లేదో, ఆమె చూడగోరెడిది. ఆమె తన రీతిలో యేసునకు ఏదో చేయవలెనని కోరెను; మరియ తన పద్దతిలో చేయగోరెను. కాని ఒక రోజున లాజరు వచ్చెను… చాలామంది మార్తకు విరోధముగా మాట్లాడుదురు, ఆమె మరింత శ్రద్ధ చూపియుంటే బాగుండెడిది. ఓ! కాదు, ఒక్క క్షణము ఆగండి. మార్త తన ఆసక్తినిక చూపించవలసిన ఒక సమయము వచ్చెను. ఆమె సోదరుడగు లాజరు చనిపోయెను, వచ్చి అతని కొరకు ప్రార్థించమని కబురు పంపెను. ఆయన రాలేదు. ఆయన పిలుపును లెక్క చేయలేదు. ఆయన మరెక్కడికో వెళ్ళెను. ఆమె మరల పంపెను. అయినా గాని ఆయన లెక్క చేయలేదు. పిలుపును నిర్లక్షము చేసెను.

JOHN 11:17

 

71కాని చివరకు ఆయన వచ్చినపుడు, ఆమె ఆయన యొద్దకు వెళ్ళి, ఈలాగు చెప్పియుండ గలదు, "నీవు ఎందుకు రాలేదు? నీకు నేను కబురు పంపగా ఎందుకు రాలేదు? మా తమ్ముడు అక్కడ జబ్బుతో పడియుండెను. మేము మా సంఘమును విడిచిపెట్టాము, మేము మా సంస్థను విడిచిపెట్టాము. నీ వర్తమానమును వెంబడించుటకు మేము చేయవలసినదంతయూ చేశాము. నీవు దైవజనుడవని నమ్మినందునే ఇదంతయూ చేశాము. కాని ఒక దైవజనుడు ఏలాగు మేము ముగ్గురము అనాథలము. తల్లిదండ్రులను కోల్పోయినవారము. మా జీవన భతి కొరకు ఆలయసంబంధమగు పనులు చేయుచున్నాము. అక్కడ మేము సభ్యులము, మా తల్లిదండ్రులు అందులో సభ్యులే, కాని నీవు బోధించుచున్న ఇందులోనికి మమ్మును తీసికొనివచ్చినందున, దేవుని కుమారుడవిని, దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్తవని, ఈ సంగతులన్నియూ చెప్పినందుననే నిన్ను నమ్మితిమి. నీ కొరకు కబురు పంపినా గాని రాని నిన్ను, ఏలాగు మేము నమ్మగలము? నేను అక్కరలో యుండగా, నీ అవసరత నాకుండగా ఆ కబురును నీవు నిర్లక్షము చేసితివి. నేను మరల పంపాను, అయినా గాని నీవు వినలేదు. నీవెందుకు ఆలాగు చేశావు?" ఆమె అలాగు అని యుండినయెడల ఈ కథ రాత్రి మరోరీతిగా ఉండియుండును.

JOHN 11:20-27

 

72ఆమె ఏమి చేసెను? ఆయనెక్కడ యుండెనో అక్కడికే ఆమె పరుగిడి వెళ్ళి, ఆయన పాదముల మీద పడి, "ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సోదరుడు చనిపోకయుండును" అనినది. అదీ సంగతి. ఆమె ఏమి చేయుచున్నది? ఆమె గౌరవించుచున్నది. ఆమె దేవుని సన్నిధిలో యున్నది. ఆయనను ఆమె గౌరవించినది. ఆమె ఆయనను తన ప్రభువుగా పిలుచుకొన్నది. ప్రభువా, నీవిక్కడ ఉండియుండినయెడల. ("నీ కొరకు నేను కబురు పంపాను," ఆ మాటలన్నీ ఆమె మరిచిపోయినది.) "ఇప్పుడు నీవిచ్చట ఉన్నావు, చూచారా. నీవిక్కడ ఉండినయెడల, నా సోదరుడు చనిపోయెడివాడు కాడు."

"నీ సోదరుడు మరల బ్రతుకునని," అయన చెప్పెను.

"ఓ! అవును, ప్రభువా, అంత్యదినమున అతడు తిరిగి లేచునని నాకు తెలియును," అన్నది.

అందుకాయన, "పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరల బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచినవాడు ఎన్నడూ చనిపోడు," అని చెప్పెను.

"లోకమునకు రావలసియున్న దేవుని కుమారుడవు నీవే ప్రభువా, అని నేను నమ్ముచున్నాను. అయినను ప్రభువా! ఓ! ఇప్పుడయినను! ప్రభువా నీవిది చేసియుండవలసినది, అది చేసియుండవలసినది అని కాదు! "ఇప్పుడు కూడా, దేవుని నీవేది అడిగినా, అది నీకు దయచేయును." అది అంతే.

JOHN 11:22

 

73ఈ రాత్రి ఎవరికయినా అది మనము చెప్పగలిగినయెడల ఎట్లుండునో గదా! "ఓ, నా సోదరుడా, నీవు దేవుని ఏది అడిగినా, అది దేవుడు నీకు ఇచ్చునని నేను నమ్ముచున్నాను." ఆనాటి ఫలితములే మనకు వచ్చును.

గతంలో ఆయనెంతగాయుండెనో అని కాదు. ఆయన దేవుని కుమారుడని మనకు తెలియును. దానిని ఆమె అగౌరవించినయెడల అది ఎన్నడూ జరిగియుండెడిది కాదు. అది ఆమె హృదయము నుండి వచ్చెను. "ప్రభువా, ఇప్పుడయినా గాని, నీవు దేవుని ఏమడిగిననూ, దేవుడు దానిని నీకు ఇచ్చును అన్నది." అది అంతే! ఆమె తన హృదయమంతటితో దానిని నమ్మినది. ఆయన చేపలు వేటాడుటకో, లేదా మరే వేటకో వెళ్ళినా ఆమెకేమీ అక్కరలేదు.

JOHN 11:22,23,34,43,44

 

74ఆ షూనేమీయురాలికి ఎలీషా వేటకు వెళ్ళినా, మరెక్కడికి వెళ్ళినా అందువలన ఆమెకేమీ బేధము కనిపించలేదు. ఆమె ఇంకనూ ఆయనను దైవ జనడుగా నమ్మినది. నిశ్చయంగా! ఆయనేమి చేసినా పరవాలేదు. ఆమెకు ఆయన ఇంకా దైవజనుడే, ఎందుకనగా ఆయన జీవితములో దేవుడు సంచరించుటను ఆమె చూచినది.

ఏమీ జరిగినా గాని, మార్త లెక్క చేయలేదు. దేవుడు ఆయన కొరకు చేసిన దానిని ఆమె చూచెను. అందువల్లనే ఆమె ఇట్లనెను, "ప్రభువా, ఇప్పుడయిననూ నీవు దేవుని ఏమి అడిగిననూ, దేవుడు, దానిన నీ కొరకు చేయును." ఆహా, అక్కడే మీరున్నారు.

"నీ సోదరుడు తిరగి లేచును." "అతనిని ఎక్కడ పాతిపెట్టిరి?" అని ఆయన అడిగెను. వారు సమాధి యొద్దకు వెళ్ళిరి. చనిపోయి నాలుగు రోజులయిన లాజరును సమాధిలో నుండి ఆయన పిలిచెను. ఎందువలన? ఆయన ఏమైయుండెనో దానిని లాజరు సోదరి గౌరవించిన కారణమువల్లనే.

MATT 10:40•

MARK 9:37•

LUKE 9:48•

JOHN 8:44•

JOHN 13:20

 

75నీవు ఒక మనిషిని గౌరవించక పోయినా గాని, అతడు దేవుని యందు కలిగియున్న ఆ పనిని గౌరవించుము. అది ఖచ్చితంగా నిజము. చూడండి, ఆయనను గౌరవించుడి. ఒక సేవకుడు వచ్చినచో, లేదా మీ సంఘకాపరిని ఎల్లప్పుడూ గౌరవించవలెను. తమ సంఘకాపరిని ఏలాగు తరిమివేయవలెనో, ఏలాగు హేళన చేయవలెనో, అతని గూర్చి ఏలాగు చెప్పవలెనో దానిని గూర్చి సంఘములోనికి వారు మాట్లాడుకొనుట నేను విన్నాను. నీ కొరకు ఆ సంఘకాపరి ఏదయినా గాని ఏలాగు చేయగలడు? అతడేమీ చేయలేడు. ఈ సంఘము అని నేను చెప్పుట లేదు, కాని నేను చూచిన సంఘముల గూర్చి చెప్పుచున్నాను. మీరు మీ సంఘకాపరిని గౌరవించి ప్రేమించవలసియున్నారు. అతడు మానవ మాత్రుడే గాని, దేవుడతనిని తన సంఘకాపరిగా చేసికొనెనని మీరు తెలిసికొనవలసియున్నారు. పరిశుద్దాత్మ అతనిని మీ కాపరిగా చేసెను. ఆ కోణములో మీరతనిని గౌరవించవలసియున్నారు. ఆ సంఘకాపరి ఏమి చేసినా లెక్కకాదు గాని, నీవు నీ హృదయమందు దేవుని దాసునిగా భావించి గౌరవించుచున్నావా? ఆలాగు చేసినచో, దేవుడు నిన్ను గౌరవించును.

"నన్ను చేర్చుకొనినవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును," అని యేసు చెప్పెను. "నన్ను చేర్చుకొనని వాడు అతనిని చేర్చుకొన జాలడు." చూడండి, దేవుడు తమ తండ్రి అని వారు చెప్పుకొనిరి; "మీ తండ్రి అపవాది," అని ఆయన పలికెను.

కనుక, మీరు చూడండి. దానిని మీరు గౌరవించి, దానిని నమ్మవలసియున్నారు. ఆయన ఉన్నాడని మీరు నమ్మవలెను. అవును. మార్త దానిని నమ్మెను.

MATT 15:22•

MARK 7:25,26

 

76సురోఫెనికయ స్త్రీ వచ్చిన సమయములో ఆలాగు చేసినదని ఈ ఉదయ కాలమున నేను నొక్కి చెప్పాను. ఆమె ఎంతో ఘోరముగా నిరాకరించబడినదో చూడండి. ఆయన ఒక యూదుడుగా అక్కడుండెను; ఆమె ఒక అన్యురాలు. ఆయన యొద్దకు పరుగిడి వచ్చినది. ఆయనను ఏలాగు సమీపించవలెనో ఆమె ఎరుగదు, కాని ఆమెకు ఒక అక్కరయున్నది మరియు ఆయనే ఆ దేవుని కుమారుడని ఆమె తెలిసికొనెను. దానిని ఆమె నమ్మినది. దేవుడు ఇతరుల కొరకు ఆయన చేసిన ప్రార్థనలకు జవాబు ఇచ్చినయెడల తన పార్థన కొరకును జవాబు ఇచ్చును అనుకొనెను. ఆయన చెప్పినది దైవవాక్యమైయుండెనని ఆమె ఎరిగెను. ఆయన చెప్పినది ఏదయినా గాని అది యూదులకు దేవుని యొక్క వాక్యమై యుండెనని ఆమె ఎరిగెను. ఆయన చెప్పినది ఏదయినా గాని అది యూదులకు దేవుని యొక్క వాక్యమైయుండినయెడల అన్యులకును దేవుని వాక్యమేనని నమ్మినది. యేసు ఆమెకు ఒక పరీక్ష ఇచ్చెను. "ప్రభువా, నన్ను కరుణించుము" అన్నది. "దావీదు కుమారుడా!" అని యూదులు అనుట విన్నందునే అలాగన్నది. ఆమెకు ఆయన దావీదు కుమారుడు కాడు, చూచారా. "నీవు దావీదు కుమారుడవు!" ఒక యూదుడు ఆయనను సమీపించిన విధానము అదియే అయి యుండును. ఎందుకనగా, ఆమె ఆ తక్కిన వారిదంతయూ వినినది. ఆమెయు వారి వలెనె రాగోరినది, ఎందుకనగా ఆమె గౌరవమిచ్చుట ఏలాగో అన్వేషించినది. ఆమె తన గౌరవమును చూపించ ప్రయత్నించుచున్నది; ఆమె దానిని నటించుటలేదు. యేసు దానిని ఎరుగును. అవును, ఆయనకు తెలియకుండాలేదు.

MATT 15:26-28•

MARK 7:27-29

 

77కనుక, ఆమె వచ్చి ఇట్లన్నది, "దావీదు కుమారుడా, నా కుమార్తెను కరుణించుము, ఎందుకనగా, ఆమె దయ్యము బట్టి బహు బాధపడుచున్నది."

ఆయన తిరిగి ఆమె వైపు చూచెను, "పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు," అని చెప్పెను. ఓ! ఆయన కాదా? అది ఆయనే! ఆమెను ఆమె విన్నపముతో పాటుగా త్రోసివేయుట మాత్రమే కాదు గాని ఆమెను ఆయన ఒక కుక్క అనెను. అది నిజము. మీకు తెలియును. బైబిలులోని అతి అల్పమగు నామములలో కుక్క ఒకటి. "పిల్లల రొట్టెను తీసికొని కుక్కలకు వేయుట యుక్తము కాదు," అని చెప్పెను.

ప్రభువా! "అది నిజమే" అని ఆమె అన్నది. ప్రభువు అని ఆమె అప్పుడు అన్నది. ఆమెకు ఆయన దావీదు కుమారుడు కాడు గాని, ఆమెకు ప్రభువే. "నిజమే, ప్రభువా! అది సరియే. కాని, కుక్క పిల్లలు యజమానుని బల్ల క్రింద పడిన ముక్కలను తినును అన్నది. ఆమెకు అది దొరికెను. అదే. అదియే మర్యాద."

యేసు ఆమె వైపు తిరిగి ఇట్లనెను, "నీ విశ్వాసము గొప్పది. ఇప్పుడు ఇంటికి వెళ్ళుము, నీవు నమ్మిన రీతిగానే నీ కుమార్తె యుండుట నీవు కనుగొందువు." అంతే. ఎందువలన? అది ఆమె వచ్చిన విధానము.

MATT 15:26-28•

MARK 7:27,28

 

78నేను ఆలాగు చేయుట మంచిది కాదు, లేక సరి కాదు అని ఆయన తిరిగి చెప్పినచో ఎట్లుండెడిది?

ఒక కాథలిక్కు వచ్చి ఇట్లు పలికెననుకొందము, "ఓ, బ్రెన్హాం సోదరుడా, ఈ జనులకు, ఇక్కడున్న వారికి నీవు చేసిన ప్రార్థనను దేవుడు వినునని నేనెరుగుదును. నా కొరకు నీవు ప్రార్థించెదవా?"

ఇక్కడున్న, "ఈ పిల్లల సమయమును నేను తీసికొని నీకు వెచ్చించుట మంచిది కాదు. ఇక్కడ నేను ఈ పెంతెకోస్తు గుంపు వారి కొరకు ప్రార్థించవచ్చాను గాని, మీ కాథలిక్కుల కొరకు కాదు," అని నేను చెప్పాననుకోండి, చూచారా. ఆమె ఏమి చెప్పియుండును? ఓ! ఆమె ఇక్కడ భీభత్సము చేసియుండును అనుకొనుచున్నాను, చూచారా.

అయితే ఆమె తిరిగి ఈలాగనెను, "అది నిజమే, ప్రభువా. అది నిజమే ప్రభువా." కాని, "కుక్కలు యజమానుని బల్ల క్రింద పడు ముక్కలు తినును గదా!"

చూడండి, అది వెంటనే ఆయనను పట్టుకొన్నది. ఆయన ఆమె వైపు తిరిగి "నీ విశ్వాసము గొప్పది," అనెను. మరో సందర్భము మనము కనుగొందము. చూడండి, అది ఆమె వచ్చిన తీరు, ఆమె గౌరవము. ఆమె ఆయనను గౌరవించినట్లుగా దేవునిని గౌరవించెను.

MATT 8:5-8•

LUKE 7:2-6

 

79ఒక సారి ఒక రోమనును మనము కనుగొందము. అతడు ఒక గొప్ప వ్యక్తి. అతడు యూదులను ప్రేమించెను. అతని దాసుడు ఒక వ్యాధిగ్రస్తుడాయెను. తనంత తానుగా యేసు యొద్దకు వెళ్ళి అడుగుటకు యోగ్యుడను కానని ఎంచుకొనెను.

చూడండి, మీరు ఏమైయున్నారో అంతకన్న కొద్దిగా చిన్నగానే ఎల్లప్పుడూ మీరు తలంచుకొనుట జరుగును. మీ స్వదృష్టిలో ఎన్నడూ మీరు పెద్దగా ఎంచుకోవద్దు, చూడండి. ఇప్పుడు, నీవు పెద్ద వానివైనచో, దానిని గూర్చి మరొకరిని చెప్పవలేను, చూచారా.

కాని ఈ స్త్రీ, లేదా ఇతడు తాను రోమను శతాధిపతిననియు, తనకు జబ్బుగానున్న ఒక దాసుడు కలడనియు, కనుక ఈ వ్యాధిగానున్న దాసుని స్వస్థపరచుటకు తాను ప్రార్థించవచ్చితినని చెప్పెను! "నేను వచ్చి అతని బాగుచేయుదును," అని యేసు చెప్పెను.

MATT 8:8,9•

LUKE 7:6,7

 

80కనుక ఆయన తన మార్గములో వచ్చుట ఈ రోమను చూచెను. "ఓ, ఆ పరిశుద్ధుడు ఇదిగో వచ్చుచున్నాడు. ఆ పవిత్రుడు వచ్చుచున్నాడు. నేను ఎన్నిక-లేని అన్యుడను. నేను ఒక రోమా శతాధిపతిని. నేను ఒక సైన్యాధిపతిని, లేదా ఒక అధికారిని. నేను నిజంగా ఒక యూదుని కాను. ఆ పరిశుద్ధుడు వచ్చుటకు నాకు నిజంగా అర్హత లేదు," అని అతడు తలంచియుండునని ఊహించుచున్నాను. ఆ గౌరవము చూడండి? చూచారా? "దేవుని యొక్క పరిశుద్ధ దాసుడు, నా ఇంటిలోనికి వచ్చుటకు నాకు యోగ్యత లేదు,"

ఆయన ద్వారము దగ్గరకు వచ్చుట చూచి, ఆయనతో, "ప్రభువా! నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడను కాను అని," చెప్పెను. ఒక శతాధిపతి, అనగా, బహుశా ఒక రాజ గృహమువంటిది ఉండియుండును, "నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నాకు నేను నీ యొద్దకు వచ్చు అర్హత కూడా నాకు లేదు, అందుకే నేను నీ యొక్క ధన్య జనులగు యూదులలో కొందరిని నీ యొద్దకు పంపాను." "నా దాసుడు ఒక్కడు ఇక్కడ బహు జబ్బుతో పడియున్నాడు. నేను అధికారముగలవాడను. నేను ఒక సైనికుని, రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవును అనెను."

MATT 8:8-10,13•

LUKE 7:7-10

 

81అక్కడతడు ఏమి చెప్పెను? "నీకు సర్వశక్తియున్నదని నాకు తెలియును. నీవు ఈ వ్యాధిని 'పొమ్మంటే' అది పోవును. నీవు 'రమ్మని చెప్పినచో అది రాగలదు.'" చూడండి, అతడు గుర్తించెను. ఈ సైనికుల పై అతడు అధికారము కలిగియున్న ప్రకారమే యేసునకు సమస్త వ్యాధి, బలహీనతల మీద అధికారము కలిగియుండెనని గ్రహించెను. "ప్రభువా, నీవు మాట మాత్రము సెలవిమ్ము." చాలును! అంతే! "నీవు మాట మాత్రము సెలవిచ్చినచో, నా దాసుడు బ్రదుకును."

యేసు ఆగి, ఆ యూదుల వైపు తిరిగి ఇట్లనెను, "ఇశ్రాయేలీయులందరిలో ఎవరికైనను ఇట్టి విశ్వాసముండుట నేను కనుగొనలేదు."

"నీ దాసుడు ఇప్పుడు బాగవును," అని చెప్పెను. ఆమేన్. ఎందువలన? అతడు దానిని గౌరవించినందున, పరలోకపు దేవుడగు యేసుక్రీస్తును అతడు గౌరవించెను.

82ఇప్పుడు, ఆలస్యమగుచున్నదని తలంచుచున్నాను. నేను మరియొక్క సంగతి ఎక్కువగా చెప్పగోరుచున్నాను: అవన్నియూ గొప్ప గౌరవములు, కాని ఈ రోజు ఏదో అది తేడాగా యున్నది. ఈ రోజున దేవుడు ఒకటి చేయగలడు గాని, దానివైపు చూచి జనులు నవ్వుదురు. నలుబది ఏండ్ల క్రితము మొదటగా పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఉన్న పరిస్థితికి మనము వేరుగా నున్నామని ఈనాడు నేను నమ్ముచున్నాను. ప్రజలు ఏమి చేయుదురు? బోధకులను బంధించి వారిని పరిశుద్ధ బండలని పిలుచుదురు. పట్టణములలో సహితము వారిని పోషించకున్నారు, అటువంటిదే అంతా జరుగుచున్నది; జీవించుట కొరకు వారు రైలు మార్గముల మీద తిండి గింజలను దొంగలించుచున్నారు. వారేమి చేసిరి? మరో నలుబది ఏండ్ల కాలములో రెండు యుద్ధములు, సంఘము అన్ని రకముల శ్రమ గుండా వెళ్ళుట జరిగినది. వారిలో వేలాదిమంది చంపబడిరి. ఆమె చంపిన వారందరూ గృహమునకు చేరియుందురు.

83ఇప్పుడు, అంత్యదినములలో దేవుడు పరిశుద్ధాత్మను సంఘము మీద కుమ్మరించ నారంభించినప్పుడు, ఇరవై-అయిదేండ్ల క్రితము ఆయన తన అద్భుతములు, సూచక క్రియలు మరియు మహత్కార్యములు పంప నారంభించినప్పుడు ప్రజలందరూ దానిని అంగీకరించి యుండినచో, ఏమి జరిగియుండెడిది? "అది ఒక మంత్ర విద్య, అది ఒక వశీకరణ విద్య, అతడు ఒక మానసిక వివేచకుడు, అతడు ఇది, అది లేక మరేదో," అని చెప్పిరి. "దేశములన్నియూ కలిసి, ప్రభువు యొక్క నామము స్తుతింపబడును గాక! అని పలికియుండినచో ఎట్లుండెడిది? మెతడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియనులు మొదలగు వారందరూ తమ చేతులు కలిపి "దేవా, వందనములు మేము ఎదురుచూచినది ఇదే. పరిశుద్ధాత్మ కుమ్మరించబడినది, దర్శనములు చూచువారు ఇక్కడున్నారు. మా మధ్య ప్రవక్తలున్నారు గొప్ప వరములు గలవారందరూ ఇచ్చటున్నారు. భాషలు మాట్లాడువారు, దైవిక స్వస్థత చేయువారు ఇక్కడున్నారు. ఇక్కడ మా మీద సమస్తమూ కుమ్మరించబడుచున్నది. దేవునికి వందనములు! పెంతెకోస్తు అని పిలువబడుచున్న ఒక దీనమగు చిన్న గుంపు ద్వారా అది వచ్చుచున్నది. మనందరము తిరిగి బైబిలు యొద్దకు వెళ్ళుదము. సోదరులారా! తిరిగి మనము వెళ్ళుదము. మన సంస్థలను పగులగొట్టుదము. అందరము ఒక్క సోదరుని వలె ఉందము! అని యుండినచో ఎట్లుండెడిది? ఆ గొప్ప సంఘములన్నియూ ఏకముగా కూడి వచ్చినచో, ఏమి జరిగియుండెడిది?" సోదరుడా, ఈనాడు దేశములో ఒక్క ఆస్పత్రి యొక్క అవసరత కూడా ఉండి యుండెడిది కాదు. అది నిజము, అంత శక్తివంతమగు గొప్ప వరములు మరియు అద్భుతములు ప్రజల మధ్య జరిగి యుండెడివి. అటువంటి ఒక గౌరవము ఉండియుండినచో, బహుశా సంఘము గృహమునకు వెళ్ళిపోయియుండెడిది మరియు వెయ్యేండ్ల పాలన ఆరంభమయ్యెడిది.

84కాని వారు దానిని అగౌరవించిరి. వారిని పరిశుద్ధ బండలు అని పిలిచిరి. వార్తా పత్రికలు తాము చెప్పకలిగినంత అసహ్యంగా, ఎబ్బెట్టుగా దానిని గూర్చి చెప్పుటకు కాచుకొనియుండిరి. దానికి వారు తమకు వీలయినంత మట్టుకు అపవిత్ర భావమును అపాదించిరి. సంఘములు దానిని తేలికపరచి దానిని చూచి నవ్విరి వారిని అవహేళన చేసిరి, వారిని తరిమికొట్టిరి, పట్టణములలో నుండి వారిని దూరముగా ఉంచుటకు ప్రయత్నించిరి. అమర్యాదతో అన్ని పనులు చేసిరి. ఇప్పుడు, దానిని గూర్చి ఎంతో నేను చెప్పగలను, కాని అలస్యమగుచున్నది.

85దయచేసి, నన్ను బ్రెన్హాం ఆలయమునకు రానీయుడి. ఇప్పుడు దేవుడు మన పైన వరములను కుమ్మరించ నారంభించెను. దానిని మనము చూతుము. ఈనాటి దేవుని వరము ఏమిటి? పరిశుద్ధాత్మయే. మనలో నున్న ఆ పరిశుద్ధాత్మయే. దానిని మనము గౌరవించవలసియున్నాము. అది ఎవరి మీదికి వచ్చునో, ఆ ప్రతి వ్యక్తిని మనము గౌరవించవలసియున్నాము. దేవుని యొక్క దైవిక వరములకు మనము మర్యాద ఇవ్వ వలసియున్నాము. ఆయన ఆ వరములను పంపునప్పుడు అవి ఎంత గొప్పవి అయినా గాని, ఎంత వాస్తవ మయినవి అయినా గాని వానిని మనము గౌరవించు స్థలమునకు వచ్చు వరకు మనకు ఎట్టి సహాయము అందువలన లభించదు. ఒకరు ఒక ప్రవచనము ఇవ్వ వచ్చును. ఆ ప్రవచనములో నీకు నమ్మిక లేనిచో, అది నీకు ఎన్నడూ మేలు కలుగజేయదు. నీవు గౌరవము కలిగియుండవలెను, దానికి మర్యాద చూపవలెను. అది దేవుని నుండి వచ్చినదని నీవు విశ్వాసము కలిగి యుండవలెను. దానికి మర్యాద చూపవలెను. అది దేవుని నుండి వచ్చినదని నీవు విశ్వాసము కలిగియుండవలెను.

అది తప్పు అని రుజువు కాబడు వరకు దానిని నమ్ముము. అది తప్పు అని రుజువయిన తరువాత దానిని నీవు నమ్మకుండుటకు హక్కున్నది. ఇంక ఏ మాత్రము దానితో సహవాసము కలిగి యుండవద్దు, కాని అది సత్యమని రుజువగునంత కాలము దానిని నీవు నమ్మవలెను.

1SAM 8:5,19,20•

1SAM 12:3,12

 

86ఆనాడు వృద్ధ సమూయేలు వారు ఒక రాజు కావలెనని కోరినప్పుడు అలాగే చెప్పెను. అతడు ఇట్లు పలికెను, "ఒక్క సంగతి మిమ్మును అడుగ గోరుచున్నాను. మీ యొద్ద నుండి ఎన్నడయినా నేను డబ్బు తీసికొన్నానా? జీవనోపాధి కొరకు ఎన్నడయినా మిమ్మును అడిగినా? యెహోవా నామము పేరిట నేను పలికినది ఎన్నడయినా నెరవేరకుండా ఉండెనా? మీకు రాజు అవసరము లేదు. రాజు వలన మీకు మేలు జరుగదు! ఆ ప్రకారము అతడు వారితో పలికెను. నేను 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' అని చెప్పిన దానిలో ఏదయినా ఎన్నడయినా జరుగకుండా మానెనా?" అను ప్రశ్నను అతడు వారి ముందుంచెను.

అప్పుడు, జనులు సమూయేలును అగౌరవించిరి. "ఓ, మాకు తెలుసు, సమూయేలు. అది నిజమే, నీవు మాకు చెప్పినది ఎప్పుడూ నిజమే, కాదని అనలేము, అయినా గాని ఈ విధంగానే మేము చేయగోరుచున్నాము." చూచారా? మీరాలాగు చేయరాదు. దానిని మీరు దేవుని విధానములోనే తప్పక చేయవలెను.

87సంఘకాపరితో చేతులు కలుపుట మనము పరిశుద్ధాత్మ పొందినట్లు లెక్క కాదు. పరిశుద్ధాత్మను పొందుట అనగా క్రీస్తును నీ లోనికి చేర్చుకొనుటయే, ఎందుకనగా ఆయన ఆ దినము యొక్క దేవుని వర్తమానికుడు. పరిశుద్ధాత్మయే దేవుని యొక్క వర్తమానికుడు. అందుకే మనము ఆయనను తప్పక గౌరవించాలి. ఆయన వచ్చినప్పుడు, "హీ, హీ, హీ అక్కడ కేకలు వేయుచు తన బుగ్గల మీద నుండి నీరు కార్చుచున్న ఆ స్త్రీ వైపు చూడండి. అక్కడున్నఅతని వైపు చూడండి. తన చేతులు కదుపుచూ, వణకుచూ మొరపెట్టుచున్నాడు. అది ఏమిటో మీరు ఎరుగుదురా? ఉద్రేకము కొరకు పనిచేయుచున్న ఒక గుంపు అని అన వద్దు." నీవు పరిశుద్ధాత్మను దేవ దూషణ చేయుచున్నట్లే. దానిని నీవు గౌరవించవలెను.

88గుర్తుంచుకొనండి, కొంత కాలము క్రిందట నేను ఒరేగాన్‌ లో యున్నాను. దాదాపు పండ్రెండు సంవత్సరాల క్రితం సంగతి. ఇద్దరు చిన్న కాథలిక్కు విలేకరులు వచ్చిరి, వారు బాలికలు. వారు కాథలిక్కులని కాదు, అది మాత్రమే కాదు. నన్ను హేళన చేయు వారిలో కాథలిక్కుల కంటె ప్రొటస్టంటులే ఎక్కువ ఉన్నారు. ఈ బాలికలు ఒక నివేదిక అందించుటకు వచ్చిరి. వారు అక్కడికి వచ్చిన వెంటనే వారి ఆత్మను నేను వివేచించాను. వారిని ఈలాగు ప్రశ్నించాను, "సరే, మంచిది! ఇప్పుడు మీరు ఏ విమర్శ చేయుటకు సిద్ధముగా యున్నారు? ఈ బాలిక సిగరెట్టు తీసి వెలిగించి ప్రారంభించినది, "నా గదిలో యుండగా అది నీవు వెలిగించవద్దు, కాస్త ఆగుము," అని చెప్పాను.

89అక్కడ కొద్దిగా కూర్చొని నన్ను కొట్టినట్లుగా చూస్తూ ఆమె మాట్లాడుటకు ఉపక్రమించినది, "కొన్ని ప్రశ్నలు అడుగగోరుచున్నాను," అని చెప్పినది.

"సరే, అడుగు," అన్నాను.

"ఇక్కడున్న ఈ పరిశుద్ధ బండల గుంపులో నీవును సంబంధము కలిగి యున్నావని విన్నాము. నీవును వారిలో ఒకనివా?" అని అడిగినది.

"నేను వారిలో ఒకనిని," అని చెప్పాను.

"దాని గూర్చి ఏదో భక్తి సంబంధముగా నాతో మాట్లాడవలెనని నీవను కొనుచున్నావా?" అన్నది.

"కాథలిక్కువగు నీవు ఇప్పుడు దానిని నమ్మవు," అన్నాను.

"నేను కాథలిక్కునని నీకేలాగు తెలియును?" అన్నది.

"నీవు ఒక కాథలిక్కు వని నాకు తెలియును. నీ పేరు ఏమిటో, నీవు ఎవరివో నేను చెప్పగలను, చూడు అన్నాను. ఆమె ఆ మాటతో అక్కడ నిలబడుటకు ధైర్యము కోల్పోయినది."

"భూమి మీద ఆ విధంగా జీవించిన వారే పరలోకములో ఉందురని నీవు నాకు చెప్పబోవుచున్నావా? అటువంటి వారితో నేను పరలోకములో ఉండగోరుట లేదు అన్నది."

"నీవు మరీ అంతగా బాధపడనక్కరలేదు. ఆ విధంగా నీవు ఆలోచించునంత కాలము, అక్కడికి నీవు వెళ్ళవు." చూడు దాని గూర్చి నీవు ఏమీ బాధపడవద్దు," అని చెప్పాను.

90నేను లేచి నిలబడ్డాను, సూటిగా ఆమె ముఖములోనికి చూచాను. కొద్ది మంది సోదరులు ఆ భవనములో కూర్చొనియుండిరి. "నేను కోపోద్రేకముగల వ్యక్తిని కాను, అయితే నీవు ఎక్కడ నిలబడియున్నావో అది నేను చూపించగోరుచున్నాను." "నీవు ఏదో ఇక్కడ దీని గూర్చి సంగతి వ్రాయవలెనని వచ్చియున్నావు, అయితే నేను చెప్పినది, "నీవు ఎన్నడూ వ్రాయవు, దానిని నీవు స్వంత కథగా మార్చి వ్రాయుదువు. నీ వేమి చేసికొందువో అదే చేసికొనుము, కాని ఒక్క సంగతి నేను చెప్ప గోరుచున్నాను. నీ వెంత చెడ్డగా వ్రాయదలచుకొన్నావో అంత చెడ్డగా వ్రాసుకో; నీవు చనిపోకముందు, నా స్వరము నీకు వినబడి పిలచును, నీ చెవులలో వినబడును. ఆలాగు జరుగని చో నేను అబద్ధ ప్రవక్తనని తెలిసికొనుము. నీవు నీకు తోచినది వ్రాసికొనుము, అది నీ పని. నీకిష్టమైనది వ్రాసికొమ్మని నీకు స్వేచ్ఛ ఇచ్చుచున్నాను. కాని నీవు చనిపోకముందు నీ చెవులలో నా స్వరము గింగురుమనుటను విందువు. అయితే దానివలన లాభముండదు. ఇప్పుడు వెళ్ళి నీ ఇష్టము వచ్చినది వ్రాసికొనుము," అని చెప్పాను.

ACTS 1:14•

ACTS 2:1,4,15

 

91ఆమె కొద్దిగా అక్కడ నిలబడినది. "రాత్రంతయూ గోల చేయుచూ కేకలు వేయు ఆ గుంపును గూర్చి నీవేమి తలంచుచున్నావు?" అని అడిగినది.

"వారందరూ క్రైస్తవులు" అన్నాను.

"క్రైస్తవులా?"

"నిశ్చయంగా, వారు క్రైస్తవులు." "వారు పరిశుద్ధాత్మతో నిండిన క్రైస్తవులు," అని నేను చెప్పాను.

"అది పరిశుద్ధాత్మ కాదు," అన్నది.

"దేనిని నీవు పరిశుద్ధాత్మ అని పిలుతువు?" అనడిగాను. దాని గూర్చి ఆమె ఏమి చెప్పునో అని చూచాను. ఒక సంగతి నీకు నేను చెప్పగోరుచున్నాను," అని అన్నాను.

"అటువంటి గుంపుతో నేను సంబంధము కలిగియుండగోరుట లేదు అన్నది."

"అందులో పెద్ద ప్రమాదమున్నదని నేను తలంచుట లేదు. అటువంటి దానితో నీవు సంబంధము కలిగియుండుట అపాయము కాదు. ఎందుకనగా, నీవెన్నడైనా దేవునితో గాని ఆయన ప్రజలతో గాని సహవాసము కలిగియుండినచో ఆలాగే నీవును అగుదువు," అని చెప్పాను.

"బైబిలు పరిశుద్ధులా?" అని అడిగినది.

"అవును. మీ ధన్యురాలగు కన్య మరియ, మీరాలాగే ఆమెను పిలచుదురు గదా, ఆమె మీ దేవత. పరలోకమునకు ఆమెను దేవుడు రానిచ్చు ముందుగా ఆమె పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందినట్లుగా చేసెను. దేవుని శక్తి క్రింద మద్యము సేవించిన మత్తురాలివలె తూలెను," అని చెప్పాను.

"అది ఒక అబద్ధము," అన్నది.

92ఒక్క నిమిషము ఓపిగ్గా విను, అని చెప్పి "గ్రంథమును తీసి చూపించి ఇటు చూడు అన్నాను. ఇదిగో ఈ గ్రంథములోనే యున్నది అన్నాను." ఆమె తన తలను త్రిప్పినది. "దేవుని వాక్యము చదువుటకు నీకు అధికారము కూడా లేదు. నిశ్చయంగా," అన్నాను. చూచారా? అది అ గౌరవము. "ఇప్పుడు నీవు నీ సిగరెట్టు పెట్టెను బల్లపై నుండి తీసికొని నీవు సిద్ధపడినప్పుడు వెళ్ళుము. ఒక్క సంగతి నీకు తెలియవలెనని కోరాను. నీవు నీ ఇష్టానుసారంగా వ్రాసుకో వచ్చును, కాని నేను చెప్పిన చివరి మాటలు గుర్తుంచుకొనుము. నీవు చనిపోకముందు దానిని నీవు గుర్తు చేసికొందువని ప్రభువు నామములో చెప్పుచున్నాను, అని పలికాను." ఆమె ఏదియూ ఎన్నడూ వ్రాయలేదు. అది నిజము. ఆమె పట్టించుకోలేదు.

అది ఏమిటది? అగౌరవములు, అపహస్యము చేయ ప్రయత్నించుట, ఏదో చేయుట; వారేమి చేయుచున్నారో వారెరుగరు. నిజము.

93కాని ఇక్కడి ఈ ఆలయములో ఈ సంగతులన్నియూ మీరు తెలిసికోవలెనని కోరుచున్నాను. ప్రజల మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించ నారంభించినప్పుడు కొన్నిసార్లు శరీరమందున్న వారు ఆత్మ యొక్క అభిషేకము క్రిందనుండి విపరీతమగు కార్యములు చేయుట చూచాను, కాని దాని గూర్చి నీవేమియూ అనవద్దు. నీ తలను వంచి దానిని గౌరవించుము. నీవది అర్థము చేసికోలేక పోవచ్చును, నాకు అర్థము కాకపోవచ్చును, కాని ఏమయినా గాని, దానిని నేను గౌరవించ గోరుదును. దేవునికి తప్పక మనము గౌరవము చెల్లించవలెను. దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించునప్పుడు, "పరమ తండ్రీ, నీకు వందనములు. ఒక దినమున నేను చేసినట్లుగానే, ఆ ప్రశస్త ఆత్మ నీ గృహమునకు రాగోరుచున్నది, కనుక ఆ దీన ఆత్మ కొరకు నీవు ఏదో చేయుచున్నావు," అని చెప్పెదను.

94సేవలో యున్న ఒక సోదరుడు నేను అతనితో ముచ్చటించినప్పుడు ఆలాగే చెప్పెను. ఒక సారి ఇక్కడ ఒక సోదరుని ఆలాగే చూచాను. మరియు మేము వెళ్ళి ఆ రికార్డింగ్ తీసుకొని అతనికి పంపించితిమి. అది సహోదరుడు ఎ.ఎ. ఆలెన్. మీ చేతిలో నుండి రక్తము కారినప్పుడు లేక అతని చేతిలో నుండి రక్తము, నూనె కారినప్పుడు, అట్టి వానిని చూచి నేను అతనిని హేళన చేసితినని అతడు చెప్పెను, దానిని పరిశుద్ధాత్మకు ప్రాథమిక సూచన అందురు. అతని చేతులు, నుదుటి పైనుండి అవి కారునప్పుడు నేను దానిని హేళన చేసి అది అపవాది వలన కలిగినదని నేను చెప్పానని అన్నాడు. నేను తిరిగి అతనికి ఉత్తరము వ్రాశాను, "అలెన్ సోదరుడా…" అని వ్రాశాను. అతడు ఒక కాగితము మీద వ్రాసి పంపెను. అది మీరు చదివారు, "ప్రియ బ్రెన్హాం సోదరుడా," అనెను. చూచారా, దాని గూర్చి నా యొద్దకు వచ్చి అడుగుటకు బదులుగా దేశమంతయూ అతడు కరపత్రికలు పంచెను.

MARK 16:17

 

95కాని నేను చెప్పినది ఈలాగున్నది, "ఫీనిక్సులో తీసిన ఆరు రాత్రుల టేపులను నేను పంపించి మీకు చూపించుదును." లియో మొదలగు వారు వారికి ఆలాగే పంపిరి. "నీ పేరు ఒక్కసారి మాత్రమే చెప్పబడినది. ప్రజలు నా బల్లయొద్దకు వచ్చి సహో. ఆలెన్ పట్టణములోనికి వచ్చి పరిశుద్ధాత్మ పొందినట్లుగా ముందు సూచన చేతులు, ముఖములందు రక్తము స్రవించుట, చేతిలో నుండి నూనె కారుటయే, అని చెప్పుచున్నాడని తెలియచేసిరి. అది పరిశుద్ధాత్మకు సూచన అనెను, అని చెప్పినట్లుగా అందులో వ్రాశాను."

"పరిశుద్ధాత్మకు అది ముందు సూచన, అని అన్నచో, సహో. అలెన్‌తో నేను సమ్మతించను; ఎందుకనగా ఎవరునూ చేతులలో నుండి రక్తము కార్చినట్లు గాని, తమ ముఖము, చేతులలో నుండి నూనె కార్చినట్లు గాని బైబిలులో ఎక్కడనూ లేదు. పరిశుద్ధాత్మ పొందినట్లు సూచనగా అది ఎవరూ కలిగియున్నట్లు వాక్యములో లేదు. పరిశుద్ధాత్మ వారి యొక్క జీవితములలో ఒక దైవ శక్తియైయుండెను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, అని యేసు చెప్పెను. అవి ఆయన నామమందు దయ్యములను వెళ్ళుగొట్టుట మొదలగునవి. "సహో. అలెన్ గూర్చి ఇక్కడ నేను చెప్పునది ఒకటున్నది: అతడు ఒక దైవజనుడు, సహో. అలెన్ బోధించునంత చక్కగా నేను భోధించకలిగినా, నేను ఎన్నడూ స్వస్థతా కూటము జరిపించలేను — నేను కేవలము సువార్తను బోధించుదును."

అప్పుడు చూడండి, నేను చేశాను అని చెప్పి అతడు ఆ పత్రిక వేసి అదంతయూ చేసిన తరువాత ఎవరో ఇది చెప్పిరి. ఈ సోదరునితో అతని సిద్ధాంతమును బట్టి నేను సమ్మతించకపోయినా గాని, నిశ్చయంగా ఆ సోదరుని నేను దేవదూషణ చేయుట లేదు.

96ఆ రాత్రి మిన్నిసోటాలోని, మిన్నెపొలిస్‌లో ఆ గొప్ప దేవాలయములో గోర్టన్ పీటర్‌సన్‌తో నిలబడియున్నాను. ఎ.ఎ. ఆలెన్‌కు వ్యతిరేకంగా ఈ పుస్తకము వ్రాసిన వ్యక్తి అనకలిగినవన్నియూ అతనిని అనెను. "దయ్యముల కొరుకుడు అను పేరుగల ఆ గ్రంథమును వ్రాసిన వ్యక్తి ఆ స్త్రీని దయ్యము కరచినందునే ఆమె చేతుల మీద గాటులు ఏర్పడినవనియు, ఇంకా అనేక అట్టి సంగతులు తాను అధికారపూర్వకముగా వ్రాయుచున్నాననియు చెప్పెను". అది నిజమో కాదో నిశ్చయంగా నాకు తెలియదు, ఎందుకనగా దయ్యము ఒక ఆత్మ, మీరు చూడండి; ఈ స్త్రీ తనను ఒక పెద్ద జుట్టు ఎక్కువగా గల దయ్యము వచ్చి కరువగా, ఆ చేతులందు మరియు ముఖము మీద గాటులు ఏర్పడినవని చెప్పుకొన్నది. "ఎ.ఎ. ఆలెన్ ఆ పుస్తకమును వ్రాసెనని అతడు చెప్పెను." ఆ పుస్తకమును వ్రాసిన వ్యక్తి నా గూర్చి ఒక చక్కని వ్యాసము వ్రాసెను. ఈ రాత్రి అతడు ఈలాంటి కూటములో కూర్చొనియుండెను. సహో. పీటర్‌సన్ తదితరులతో అతడు అక్కడ కూర్చొనెనని నాతో చెప్పిరి. అతడు నన్ను గొప్పగా చెప్పుచూ, ఎ.ఎ. ఆలెన్‌ను కించపరచుచుండెను.

97"సహో. ఆలెన్‌ ను ఆదరించవలసిన సమయము ఇదే," అని నేను అనుకొన్నాను.

కనుక అక్కడికి నేను నడిచి వెళ్ళాను. నేను ఈలాగు చెప్పాను, "పట్టణములో యున్న ఒక వ్యక్తి ఈ రోజున వ్రాసిన ఒక వ్యాసమును ఇక్కడ చదువుచున్నాను [అతడు అక్కడే కూర్చొని యున్నాడని నాకు తెలియును.]…" ఎ.ఎ. ఆలెన్ గూర్చి ఇక్కడ వ్రాసెను. విమర్శ అంతా ఇక్కడున్నది. ఆ వ్యక్తి నన్ను గూర్చి అభినందించుచూ వ్రాసినప్పటికిని, "నేను డబ్బు మొదలగు వానికి దాసుడను కాదు. ఎవరూ పెట్టని చక్కని, శుభ్రమగు కూటములు పెట్టామని ఎన్నో మంచి విషయములు మా గూర్చి వ్రాసెను." "అది నేను మెచ్చుకొనుచున్నాను." ఈ పత్రికలో ఈ వ్యాసము వ్రాసిన అతడు, ఎ.ఎ. ఆలెన్ ఆ "దయ్యముల కొరకుడు" అను పుస్తకమును వ్రాసెనో లేదో జాగ్రత్తగా పరిశీలించి యుండవలసినది. ఎ.ఎ. ఆలెన్ ఆ పుస్తకమును వ్రాయలేదు. దానిని వ్రాసిన వ్యక్తి ఎవరు అని నేను ఎరుగుదును. వ్రాసినది ఇతడు కాడు. ఆ వ్యాసమును వ్రాసిన వ్యక్తి ఆ విషయము జాగ్రత్తగా వెదికి కనుగొనియుండవలసినది. సహో. ఆలెన్ గూర్చి అతడు చెప్పిన ఆమిగిలిన సంగతులు నిజమా కాదా అని నాకు సందేహము కలుగుచున్నది. అంతే కాకుండా, "సహో. ఆలెన్ తప్పు చేసినట్లయిన నేను తీర్పునందు సహో. ఆలెన్ చేసిన తప్పు పక్షమునే నిలబడుదును, ఎందుకనగా అతడు క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటకు ప్రయత్నించుచున్నాడు. ఒక మనిషి చేయుచున్నదానిని విమర్శించుట కంటె, ఇది మంచిది అని చెప్పాను. సహో. ఆలెన్‌ను బలపరిచాను." ఆమేన్. అది నిజము. అవునండీ!

98యేసుక్రీస్తు నామమును ప్రకటించు వారెవరయినా గాని, అతడు పెంతెకోస్తు, కాథలిక్కు లేదా మరి ఎవరయినా గాని నేను వారి పక్షమున ఉందును. వేదాంత రీత్యా అతనితో నేను అసమ్మతించ వచ్చును, కాని నా సోదరునిగా, క్రీస్తు దాసునిగా నేను గౌరవించగోరుదును, చూచారా. అతడేమి చేసెనో మనకు వద్దు, పరిశుద్ధాత్మకు గౌరవము మనము ఇవ్వవలసియున్నాము. ఖచ్చితంగా నిజము. అవునండీ! ఆలాగు చేయుటకు మనము సిద్ధపడినప్పుడు దేవుడు మన మధ్య తన దీవెనలను కుమ్మరించును. దాదాపు ఏభై, అరవై లేదా డెబ్బది-అయిదు మంది గల ఒక చిన్న గుంపుగా ఈ రాత్రి ఇక్కడ మనము కూర్చొని యున్నాము. మనందరము ఒక్కటిగా కలిసిపోయి ఏకముగా బంధించబడి దేవునికి మరి పరిశుద్ధాత్మకు భక్తి మర్యాదలు చూపించినచో, ఈ దినమున ఆయన చేయుచున్న దానికి, మన మధ్యకు పంపించుచున్న ప్రతి వరము, ప్రతి క్రియకు మనము గౌరవము చూపించుచున్నచో, దేవుడు మన మీద తన ఆత్మను తప్పక కుమ్మరించును. మనము సంఖ్యలో ఎదిగి విస్తరించుదుము. మీరది నమ్మరా? నిశ్చయంగా. దేవుని యెడల మనము గౌరవము కలిగియుండవలెను.

99ప్రార్థన కొరకు ఒక్క క్షణము మనము తలలు వంచుదము. మనము ప్రార్థనలోనికి వెళ్ళక ముందు, ఇక్కడి వారెవరైనా గాని, "సహోదరుడా బ్రెన్హాం, నా కొరకు నీవు ప్రార్థించవలెనని కోరుచున్నాను. దేవుని యెడల నేను గౌరవము చూపునట్లుగా, దేవుని యొక్క సంగతులకు విరోధముగా మాట్లాడకుండా నేను సదా నోరు మూసికొనునట్లుగా, వారెవరయినా గాని, సంఘములోనికి ఆయన పంపించు ప్రతి దైవ వరమునకు నేను గౌరవము చూపునట్లు, నా హృదయములో దేవుడు మర్యాద ఉంచునట్లు ప్రార్థించుము అని కోరుచున్నచో మీరు మీ చేతులు ఎత్తి 'నా కొరకు ప్రార్థించుము' అని చెప్పండి. దేవుడు మిమ్ము దీవించును." దాదాపు సంఘములో ప్రతి చేయి, నా చేయి కూడా ఎత్తబడియున్నది.

దేవా, నీ దాసునిగా ఉండుటకు నాకు సహాయము చేయుము. నా సోదరులను గౌరవించుటకు నాకు సహాయము చేయుము. నా సోదరీలను గౌరవించునట్లుగా నాకు సహాయము చేయుము. కూటములోనికి వచ్చిన దేవుని యొక్క ఆత్మను, అది భాషలతో మాట్లాడునది అయినా, భాషలకు అర్థము చెప్పునది అయినా, ప్రవచనమయినా, వివేచన వరమయినా, మరేదయినప్పటికిని, "ఓ, ప్రభువగు యేసు వారిని పంపుము, ఓ! ప్రభూ వారిని పంపుము. నీకు నేను వందనమలు చెల్లించుచున్నాను," అని చెప్పుచున్నాను.

NEH 1:5

 

100పరమ తండ్రీ, నీవు ఒక గొప్ప భీకరుడవగు దేవునివని మాకు తెలియును. నీకు కోపము ఒక్కసారి రగిలినచో, ఆ ఉగ్రత భయంకరమని మాకు తెలియును. అది చాలా భయంకరమగు సంగతి. దేవుని ఉగ్రత ప్రపంచమును ఒక్క సెకండులో నాశనము చేయగలదు. కాని నీవు ప్రభువైన యేసు రక్తమును పైన చూచినప్పుడు, నీ ఉగ్రత మళ్ళును. ఓ! యుగముల బండలో నన్ను దాచుము! ప్రభువగు దేవా, ప్రభువగు యేసు రక్తముతో నా ఆత్మను కప్పియుంచుము. ప్రభువా, నాది మాత్రమే కాదు గాని, ఈ రాత్రి ఇక్కడున్న వారిది కూడా కప్పుము. ప్రభువా, మేము నిన్ను ప్రేమించుచున్నాము. నీవు మా కిచ్చిన ప్రతి వరమును, ఇతరులు ఏలాగు మమ్మును పిలచినప్పటికిని దానిని దేనినీ లెక్క చేయకుండా, ప్రభువా, గొప్పవాడవును, మహా పరిశుద్ధాత్మయగు నిన్ను ఇంకా మేము గౌరవించుదుము. తండ్రీ, నిన్ను మేము ప్రేమించుచున్నాము.

MARK 12:37

 

101మా మధ్య స్వస్థతావరమును ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. మా మధ్య ప్రవచనవరము ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. భాషలవరము, దాని భావము చెప్పు వరమును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ఓ దేవా, మా మధ్యకు ఎడతెగక వరములను పంపమని ప్రార్థించుచున్నాము. పరిశుద్ధాత్మ వరములు పంపుము. ప్రభువా, అన్నిటి కంటె పైగా, అన్నింటికి సరిపోవు వరమగు యేసుక్రీస్తును బట్టి మా హృదయములలో అతిగొప్ప గౌరవము కలిగియున్నాము. ఆయన కృప మరియు కరుణలనుబట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ఆయన యొక్క సిలువ శ్రమలు, కల్వరిలో రక్తము కార్చుట ద్వారా ఈ తక్కిన అల్ప విషయములన్నింటిలో ను మాకు సామార్థము ఆయన వలననే కలిగినది. ఆయన మాటను సంతోషముగా విను సామాన్య జనుల హృదయములను ఆయన పవిత్ర పరచును.

ప్రభువా, నీవు సామాన్య జనుల యొద్దకు వచ్చినందులకు మేమెంతో సంతోషించుచున్నాము. బైబిలులోని పరిశుద్ధ లూకా గ్రంథములో ఈలాగు చదువుదుము, సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినిరి. ఈనాడు వీరు, "ఓ, వారు సామాన్య ప్రజా గుంపు అనుచున్నారు." కాని ప్రభువా, నీవు ఇక్కడ శరీరధారివై యున్నప్పుడు, నీ మాటను వినిన వారు వారే. సామాన్య జనులే, నీ వాక్కును సంతోషముగా వినిరి. గర్విష్టులు, ధనికులు, ఇంకా అట్టి వారనేకులు నీ మాట వినరు. ఆనాటి రాజులు , అధికారులు, యాజకులు నీ మాట వినలేదు. కాని సామాన్య జనులు నిన్ను సంతోషముగా చేర్చుకొనిరి.

ACTS 5:40,41•

ACTS 24:14•

ACTS 26:24-29

 

102తండ్రీ, ఈ రాత్రి మేము సామాన్య జనులము. నిన్ను మేము సంతోషముగా చేర్చు కొనుచున్నాము. వారు తిరిగి వచ్చుచూ సంతోషించినట్లుగానే మేమును సంతోషించుచున్నాము. అది ఆశ్చర్యకరమగు సంగతి అని ఆలోచించుచున్నాము. ఆయన నామము యొక్క నిందను భరించకలుగునట్లుగా వారున్నందుకు సంతోషముగా యున్నారు, ఎందుకనగా, యేసుక్రీస్తు నామము నిమిత్తము శ్రమననుభవించు భాగ్యము వారికి దొరికినందుకు వారు సంతోషించిరి. తండ్రియగు దేవా, మేమును ఆనాటి శిష్యులతో చేరి "మాకు సంతోషముగాయున్నది," అని చెప్పెదము.

ఆనాటి పరిశుద్ధ పౌలువలె ఈ రాత్రి నేను నిలబడియున్నాను. అగ్రిప్ప యెదుట అతడు నిలబడినప్పుడు ఈలాగనెను, విశ్వాసభ్రష్టత, ఉన్మాదము అని మీరనుచున్న "ఆ పద్ధతిలోనే నేను నా పితరుల దేవుని ఆరాధించుచున్నాను."

"పౌలా, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది," అని అగ్రిప్ప పలికెను. "అగ్రిప్పా, నేను వెర్రివాడిని కాను," అని ఇతడనెను.

"నన్ను అంత తేలికగా క్రైస్తవుని చేయ ప్రయత్నించుచున్నావే," అని చివరకు అనుస్థితికి అతడు వచ్చెను.

"ఈ సంకెళ్ళ మరియు బంధకములు తప్ప నీవు నావలె యుండవలెనని కోరుదును," అని అతడనెను.

MATT 6:12,13•

ROM 9:3

 

103ఓ దేవా, తన ప్రజలు రక్షించబడునట్లుగా తాను శాపగ్రస్తుడనగుటకయినా ఇష్టపడుచున్నట్లు పౌలు చెప్పుట ఎంత ప్రేమ చిహ్నము! ఓ, తండ్రీ, దేవా, అలాగే మాకును ఒకరి పట్ల ఒకరికి ప్రేమను ఇమ్ము. చనిపోని ప్రేమను, ఆ సౌభ్రాతత్వమును, ఒకరి పట్ల ఒకరికి గౌరవమును మాకు ఇమ్ము. ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపు కొనక క్షమించకలుగు క్రైస్తవులముగా ఉండునట్లు మమ్ము చేయుము — ఎందుకనగా దేవునిచే దీవించబడిన ఒక వ్యక్తి ఒక తప్పిదము చేయవచ్చును. ఓ తండ్రీ, ఆ ప్రశస్త సోదరుని పడవేయుటకు సాతాను వల యొగ్గి యుండవచ్చునని ఎరిగియుండి మేము ఆ తప్పు చూడకుందుము గాక. ఒకవేళ అతడు పొరపాటు చేసిననూ, ప్రభువా, అతడు, లేదా ఆమెకు నీవు తిరిగి స్థానములో నిలబెట్టుటకు సహాయము చేయుమని ప్రార్థించుచున్నాము. తప్పిపోయిన గొర్రెలను వెదకి, తిరిగి సంపాదించి మందలోనికి తెచ్చునట్లు మా హృదయములలో ప్రేమను ఉంచుము. ప్రభువా, అది దయ చేయుము. మాకు విరోధముగా పాపము చేసిన వారిని మేము క్షమించునట్లుగా మా దోషములను క్షమించుము. ప్రభువా, అది దయచేయుము. శోధనలోనికి మమ్మును నడిపించక, దుష్టుని నుండి మమ్ము తప్పించుము; ఎందుకనగా, రాజ్యము, శక్తి, మహిమ సదానీవై యున్నవి. ఆమేన్.

104[సహో. నెవిల్ ఒక ప్రవచన సందేశమును ఇచ్చుచున్నాడు సంపా.]

ఆమెన్. ప్రభువా, నీకు వందనములు. తండ్రీ, నీకు వందనములు. ఓ, పరిశుద్ధుడా, మేము నిన్ను స్తుతించుచున్నాము. తండ్రీ, నీవు ఎంత మహిమాన్వితుడవు! ప్రభువా, ఎంతగా నీకు వందనములు చెల్లించుచున్నాము! మా మధ్య ఆయన ఇంకనూ దేవుని గానే నిలచియున్నాడని నిరూపించుచూ మానవ పెదవుల ద్వారా ఆయన మాట్లాడగా వినుట, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అనుభవించుట ఎంత ఆదరణ! తండ్రీ, దీని కొరకు నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మాతో ఎడతెగక యుండుము. మేము నీ జనులమగుచున్నట్లుగా మాతో నిలచియుండుము. దీనిని యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము. ఆమేన్.

105క్రైస్తవునిగా ఉండుట ఆశ్చర్యము కాదా? దేవునిని ఎరుగుట, ఆయన సన్నిధిని ఎరుగుట ఆశ్చర్యము కాదా? రెండవ సారి కూడా ఆయన చేసిన దానిని ఈనాడు తలంచుచుండగా ఆశ్చర్యము కలుగుచున్నది! ఇంతకు ముందువలెనే ఆయన వెలుగులో వచ్చి నేడు ఇక్కడున్న సోదరితో మాట్లాడెను. వారు వర్తమానమును నమ్మిరి గనుక ఆయన వారితో మాట్లాడెను. ఆయన మహిమాన్వితుడు కాడా? మీరాయనను ప్రేమించరా? మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో ఎందరు ప్రేమించుచున్నారు? ఆయన ఆశ్చర్యకరుడు. లేచి మనము నిలబడి మనందరికి ఇష్టమగు ఆ మంచి పాత పాట ఇప్పుడు పాడుదము.

నేనాయనను ప్రేమించుదును,

నేనాయనను ప్రేమించుదును,

ఎందుకనగా, ఆయనే మొదట నన్ను ప్రేమించెను

మరియు నా రక్షణను కొనెను

కల్వరి వక్షముపైన.

ఓ, ఆయన ఆశ్చర్యకరుడు కాడా? ఆశ్చర్యకరుడు! బుధవారము రాత్రి ఆరాధనను ఇప్పుడు మీరు గుర్తుంచుకొనండి. ప్రభువు చిత్తము అయితే, తిరిగి మరల ఇక్కడ కూడు కొందము. వారమంతా మా కొరకు ప్రార్థించండి. ఇప్పుడు మనము ప్రార్థనలో తలలు వంచియుండగా, మన సంఘకాపరియగు సహో. నెవిల్‌ను మీకు చివరి మాటలు చెప్పుటకు రమ్మని ఆహ్వానించుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...