ఉపేక్షించబడిన ఒక నిజమైన సూచన
1ప్రభువైన యేసు నామములో ఈ ఉదయమున కూడియున్నాము. అధికముగా ప్రార్థించిన తరువాత ఈ ఉదయమున వేకువనే లేవలేదు. ఆలస్యముగా లేచాను. ఇప్పుడు ఎందుచేత ఆ విధముగా జరిగినదని మీకందరికి తెలుసునని నేను భావించుచున్నాను.
ఈ రోజు ఉదయము లేక వెనుకటి రాత్రి నేను వచ్చినప్పుడు, నా ప్రక్కింటి అతను తన చిన్న కూతురుతో ఆ పెరడులో నిలబడియున్నారు. అతని భార్య హాస్పటలులో ప్రసవములను చూచే నర్సుగా పని చేయుచున్నది. అతడు రిబ్బను చుట్టబడి కొన్ని వాక్యములు వ్రాయబడిన ఒక చిన్న చేతికర్రతో చెప్పెను, "బ్రెన్హాం తాత, (అప్పుడు సుమారుగా 3:43 లేక 4:43 అనుకుంటా), అక్టోబరు నెల 11వ తేది. ఆ కర్ర అడుగున వ్రాయబడిన ఉప వాక్యములు చెప్పుచున్నవి, "మీరు అనుకున్నదానికంటే వృద్దులు!'' కావున న్యాయ ప్రకారము నేను ఉదయమున అధికముగా విశ్రాంతి తీసికొనవచ్చును. అది సరియే, సహోదరుడా రైట్, మీరు తాత అయినప్పుడు?
2సహోదరి కిడ్, ఒహాయో నుండి మీరు వచ్చినప్పుడు ఈ ఉదయమున నేను అక్కడ లేనందులకు మీరు మన్నించుదరని నేను తలంచుచున్నాను. ఆ తరువాత నేను 10 సంవత్సరములు అధిక వయస్సు గలవాడను అనే అనుభూతితో తలంచాను. మీకందరికీ తెలిసిన విధముగా నాకు ఒక చిన్న మనుమడు 7 లేక 8 పౌండ్లు, నేను చూచినంతలో అసహ్యమైన చిన్న బిడ్డ. అతని తాతవలె అతనుండును. సహోదరీ, అతడు ఎక్కడకు వెళ్ళెను అని చూచుచున్నాను. బిల్లీ ఎక్కడికి వెళ్ళెను. కావున…
3గతరాత్రి నా పిలుపులు ముగించిన పిదప ఆ హాలు నుండి దిగి వచ్చునప్పుడు జార్జియా నుండి వచ్చిన నమ్మకమైన స్నేహితులను కలసిసాను. మేము ఆ చిన్న బిడ్డలను చూచుచున్నాము. వారు చక్కగా ఉన్నారు. వారు ఆ విధముగా ఇప్పుడు… నేను ఎప్పుడు అనుకొందును బిల్లీని తలంచు విధముగా. మీరు భయపడుచున్నారు. వారిని మీరు విడదీయుదురని, మీకు తెలుసునువారు చాలా చిన్నవారని. నేను అనుకొనుచున్నాను. ఆమె సహోదరి బీలర్ నేను తలంచినట్లుగా ఆమె తలంచు చున్నది. అయితే తరువాత వారు అంత సునాయాసముగా విడిపోలేరని ఆమె కనుగొన్నది. కావున అదిసరి అని నేను తలంచుచున్నాను.
4నిన్నటి మధ్యాహ్నము సహోదరుడు నేవిల్ గారు మన సహోదరిణిలలో ఒకరి కూమార్తె యొక్క గృహములో (ఆ సోదరి కూడ ఈ సంఘములో ఇక్కడ ఉన్నారని నేను తలంచుచున్నాను), ఇచ్చిన పుట్టిన రోజు విందులో కలుసుకొనుటకు అనుగ్రహము పొందినవాడినైనాను. నిన్నటి దినము అతడు మరియొక మైలు రాయిని దాటాడు. కావున మనమందరము అతనికి పుటిన రోజు శుభాకాంక్షలు తెలుపుచున్నాను, ఏలయనగా అతడు ఒక మంచి సోదరుడు. అతడు ఇరవై-ఐదు సంవత్సరములు ఇప్పుడే దాటినాడు. కొద్దిగా కావున నాలాగే అందువలన… మేము రెండవ సారిగా ఇరవై-ఐదు సంవత్సరములు దాటాము. అది ఎప్పుడనగా రెండవసారి ఆ గుర్తును ( 25 సంవత్సరములు) దాటినప్పుడు ఇప్పుడు వృధాప్యమును కలుగుచున్నాము, మీకు తెలుసు.
5ఫ్రాంకి వెబర్ ఇక్కడికి వచ్చిన ఉదయమును నేను జ్ఞాపకమున్నది, అతడు మా యింటి ప్రక్కనే నివసించుచున్నాడు. అతని కుమార్తె అక్కడ ఇప్పుడు నివసించుచున్నది. అతడు ఫ్లోరిడాలో ఉన్నాడు. నేను ఫ్రాంకి ఒక్కటిగా పాఠశాలకు వెళ్ళియున్నాము. ఫ్రాంకి అతని పుట్టిన రోజు కానుకను వేసినాడు. అప్పుడు నేను మూడు లేక నాలుగు సంవత్సరములు ప్రసంగించుచునే ఉన్నాను. నేను ఫ్రాంకీని ప్రభువైన యేసు యొద్దకు నడిపించాను. అతడు ఇరవై-ఐదు సంవత్సరముల వయస్సు గలవాడు. నేను ఇరవై-రెండు అనుకుంటాను అతడు ఇరవై-ఐదు సంవత్సరములు వచ్చినప్పుడు నేను తలంచినాను, ఓ మై, ఫ్రాంకి, వెబర్స్ ఇరవై-ఐదు సంవత్సముల వయస్సు గలవాడా! ఊ..! నేను ఇరవై-ఐదు సంవత్సరములు వచ్చినప్పుడు భయపడ్డాను. ఇప్పుడు నేను ఆ విధముగా మూడు ఇరవై ఐదులను త్వరలోనే దాటుదును, కావున నేను దానిని దాటుటకు ఎంతో దూరము లేదు.
నేను, సోదరుడు, మరియు సోదరి కిడ్లను వారి ఎనభై వయస్సులో ఇంకను బలము పొందువారుగా ఉండుటను చూచునప్పుడు, నేను ఇలా తలంచాను, "ప్రభువైన యేసూ, నేను ఏభై-రెండు సంవత్సరములో ఫిర్యాదు చేసినందులకు మన్నించండి." మీరు ఎనభై మరియు సోదరుడు కిడ్ ఎనభై-ఒకటి, అది సరియేనా? వారు ఇంకను దేవుని సేవలో ఉన్నారు. నేను మీకు చెప్పుచున్నాను, అది మనకు ధైర్యమును ఇచ్చుచున్నది, అది ధైర్యమునిచ్చుట లేదా? నిశ్చయముగా ఇచ్చుచున్నది. ప్రభువు నిశ్చయముగా మనకు మంచిగా ఉన్నాడు.
6ఇప్పుడు, ఒకే ఒక చెడ్డ కార్యము ఉన్నది, ఉదయకాలపు కూడికను గూర్చి భయపడుచున్నాను, మరియు అది భయంకరమైనది… అది ఎట్లున్నదనగా చెప్పుటకు అవమానముగా ఉన్నది, ఎందుకనగా ఈ ఆరాధనలకు చాలా దూరము నుండి అనేక మంది స్నేహితులు నాకున్నారు. నేను ఇవాన్సస్ ను చూడలేదు, కాని ఇక్కడే ఎక్కడో ఉన్నారని తలంచుచున్నాను. వారు ఏ ఒక్క ఆరాధనను విడువరు. మీకు తెలుసునా, ఎన్నిమైళ్ళ దూరము నుండి వారు తమ కారును నడుపుకొని ఈ ప్రసంగములను వినుటకు వచ్చెదరో? పదమూడు వందల మైళ్ళు. అరవై నుండి డెబ్బై డాలర్లు ఒక వారమునకు ఉంటేగానీ సంఘమునకు వారు రాలేదు. అది సరియే. వారు కుటుంబముతో ఇక్కడకు రావలసిన సమయము ఇక్కడికి వచ్చి, చెల్లించుట…..
7ఇప్పుడు, అది మాత్రము కాదు, కాని ఒక చిన్న సహోదరుడు అలబామా నుండి అంతే దూరము నడుపుకొని ప్రతివారము, సోదరా… ఓ, మై, ఏమిటి? సోదరుడు వెస్ట్. నాకు అతడు ఒక పిల్లవాని వలె అగుపించుచున్నాడు. అతడు ఒక తండ్రి. అధికమైన బిడ్డలు గలవాడు. అతడు ఎల్లప్పుడు ఒకటి జ్ఞాపకపర్చును. అతడు యవ్వనస్తునిగా కనపడును. అతడు, అతని భార్య - సోదరుడు వెస్ట్.
సోదరుడు మరియు సోదరి పామర్, వెనుక నున్న వారు మేకాన్ నుండి, జార్జియా మరియు సోదరి అన్గ్రీన్ వారు ఎప్పటి వలె ఇక్కడ ఉన్నారు - మెంఫిస్, టెన్నిస్స్ నుండి వచ్చెదరు. ఈ ఉదయము వారు ఇక్కడ ఉన్నారా? ఎప్పటి వలేవారు ఉన్నారు - సోదరి అన్గ్రీన్ మరియు మెంఫిస్, టెన్నిస్ సీ నుండి వారితో వచ్చిన ఆ గుంపు? సరి, ఆ వెనుక. మరి యొకరు అక్కడ పిలుపును విని అనేకులు అక్కడ ఉన్నారు. కొందరు దక్షిణ కెంటకీ నుండి, కొందరు చికాగో పరిసరముల నుండి, కొందరు చికాగో నుండి, ఆపై నుండి, చుట్టు ప్రక్కల నుండి…..
8ఆదివారము అనుకొంటాను కాలిఫోర్నియా నుండి ఒక మనుష్యుడు ఇక్కడ ఉండెను. నన్ను చూచుటకుగాను అతడు వెళ్ళకుండా వుండి పోయెను, కూటములు అయిన పిదప ఒత్తిడివలన అతడు నన్ను చూడకుండానే వెనుదిరిగి పోయెను. ఇంకొక అతను ఇల్లినోయిస్ నుండి అనేకమైన ఆపిల్ పండ్లను తెచ్చినాకిచ్చెను, నేను తిన్నవాటిల్లో అవి ఎంతో రుచికరమైన ఆపిల్. జార్జియా నుండి వచ్చిన సోదరులలో ఒకరు ఒక పాకెట్ పీకాన్స్ (ఒక రకమైన పండ్లను) తీసికొని వచ్చినారు. దానిపై -పేపరు లాంటి పెంకు ఉండును. మరియు ఓ, వాటిని నేను ఇష్టముగా తినవచ్చును.
9ఇప్పుడే నా తల్లి చనిపోయినప్పుటి నుండి నేను సరియైన మంచి ఆహారమును తినుట లేదు. అల్పాహారమును తిని గడుపుటకు ప్రభువు యొక్క దర్శనమును వెదుకుచున్నాను. ఇరవై పౌండ్ల బరువును పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను ఉపవాసములో లేను, కాదు. కేవలము దానిని చేయుట ప్రభువునకు ఇచ్చుట కాదు. నీకు కలిగిన శ్రేష్ఠమైన దానిని ప్రభువునకు నీవు ఇవ్వదలచుట, అది కాకుండా….
10నేను సహోదరుడు సమ్మర్ ను చూచాను, అక్కడ కూడా చూచాను. ఆ విధముగా అనేక మందిని నేను … పోయిన ఆదివారము ఆ విధముగా తల్లిగారితో ఉన్న ఆ ప్రజలను నేను చెప్పుచున్నాను. మరియు ఒక విశ్వాసనీయురాలైన సోదరి అక్కడ ఉన్నది. ఆ స్త్రీ పేరును మర్చిపోయాను. ఆమె ఇక్కడ ఉన్న యెడల మన్నించమని కోరుచున్నాను. అయితే వారిలో ఒకరు సోదరి బీలర్ మరియొకరు సహోదరి మరియు సహోదరుడు స్టెఫీ.
ఆ విధముగా నేను చాలా మందిని మరచిపోయినట్లయితే, మీకు నా గురించి బాగుగా తెలియును, ఆ విధముగా ఉండాలని కాదు. వారందరు విశ్వాస పాత్రులు. ఇక్కడ కొన్నిసార్లు కొందరి పేర్లును మాత్రము నేను చెప్పుదును. నా తలంపులలో వచ్చినప్పుడు, ఆ విధముగా నేను చెప్పినప్పుడు అందరిని, ఆ గుంపులోని వారినందరిని నేను గుర్తించుట. చూశారా, అలాగయితే ఎంత బాగుంటుంది అది. మరి అందరు మా యెడల ప్రేమ, దయ కలిగి యున్నారు. దానిని మేము అభినందించుచున్నాము.
11ఇప్పుడు, ఈ ఉదయము దేవుని వాక్యమును యొద్దకు మరొకసారి సమీపించబోవుచున్నాము. ఇప్పుడు, నేను చాలా స్పష్టముగా వివరించుచున్నాను, నేను ఈ కూటములో మీకు కనబడవలెనని రాలేదు. దేవుడు నాకు మంచి వర్తమానమును ఇచ్చి, దానివలన ప్రజలను ఆనందభరితులుగా చేసి, ఉద్రేకపరచి అరిపించాలని నేను రాలేదు. ఎంతగానో దానిని మనము పొందియున్నాము, దానిని మేము అభినందించుచున్నాము. అది పరవాలేదు, చూశారా, అది ఆశ్చర్యకరము, చూశారా. కాని నేను తెలుసుకొనవలసినదేమనగా, "ప్రభువా, నా తలంపులను మంచి కార్యముల యందుంచి, అట్టి కార్యముల ద్వారా ప్రజలకు సహాయపడవలెను, అవి వారిని దేవునికి అత్యంత సన్నిహితంగా వుంచి, అది వారిలో ఏదో ఒక క్రియ చేసి ఆత్మీయముగా వారిని వృద్ధి పరచుటే కాదు గాని, దేవుని జ్ఞానముతోను, గద్దింపు (భయము) తోను వారిని పెంచి, దాని ద్వారా వారి శత్రువు వారి యొద్దకు వచ్చినప్పుడు, కావున ఏ విధముగా దానిని ఎదుర్కొని నిలువవలయునో తెలిసికొందురు.
12ఈ వారము ఇక్కడ వచ్చిన సోదరి పామర్ తో నేను మాటలాడుచుంటిని. నేను ఈ దేశములో ఎలా నివసించుచున్నానో ఆమె తెలుసుకొనగోరినది. మీరు ఇక్కడకు వచ్చి… పల్లపు ప్రాంతములకు వచ్చిన వెంటనే, ప్రతిసారి అనారోగ్యమునకు గురవుచున్నాను. ఈ పల్లపు ప్రాంతములో ఉండుట నిజముగా అనారోగ్యము. మనకు అది తెలుసు. కాని దేవుని యొక్క అనేక మంది బిడ్డలు ఇక్కడ వున్నారు, ఏదో ఒక రోజులలో….
DEUT 18:22•
JER 28:9
13దేవుని యొద్ద నుండి సూటియైన వర్తమానము నాకు రావలెనని నేను ప్రభువును కోరుచున్నాను, చూశారా. మరియు నేను దేవుని సహాయము వలన ఆయన వచ్చి విశదపరచు ఆ కార్యము కొరకు వేచి వుండవలయును. నేను అనుభూతి చెందుచున్నాను, ఏదో కార్యము ఈ పరిసరముల యందు జరుగనైయున్నది. అది ఏమని తెలుసుకొనగోరుచున్నాను, మరియు అది ఏమైయుండుననిన దేవుని యొద్ద నుండి నేరుగా తెలిసికొనవలయునని ఉన్నాను, కావున అప్పుడే నేను చెప్పగలను, "అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!" అప్పుడు మీరు… ప్రజలైన మీరు తెలిసికొనగలరు, మాటలాడువాడిని నేను కాదు అని.
కావున మొదట ఆయన యొద్ద నుండి వినవలయునని ప్రయత్నించుచున్నాను, ఏలయనగా ఒక వ్యక్తి యందు దేవుని వాక్యము వున్నట్లయితే, ఆ వాక్యములు వున్న వ్యక్తి కాదు గాని, ఆయనే. ఇక మీదట, ఒక వ్యక్తి తన స్వంతముగా ఏమైనా చెప్పిన దాని వలన ఏమియు లాభము లేదు. కాని అది ప్రభువు యొక్క వాక్యము ఒక వ్యక్తిలో వున్నయెడల అది బయటకు వచ్చు, అది ఖచ్చితముగా ఉండును. బైబిలులోని ద్వీతీయోపదేశ కాండము 20వ అధ్యాయములో దేవుడు మనకు ఎచ్చిన ఆజ్ఞ ఇదే, నేను నమ్ముచున్నాను. అది ఇట్లు చెప్పుచున్నది, "గమనించండి, ఎవరైనా ప్రభువు నామములో చెప్పి - అది జరుగకున్నయెడల, ఆ వ్యక్తిని లక్ష్యపెట్టవద్దు. అయితే వారు మాట్లాడి, అది జరిగినయెడల, మీరు జాగ్రత్తగా దానిని వినండి, ఏలయనగా అది దేవుని నుండి వచ్చుచున్నది."
14ఆ విధముగా దేవునికి వుండును. బైబిలులో దేవుని యొక్క క్రమమైన పద్దతి వున్నది. మరియు ఏ విధముగా చదువవలెనో మనకు తెలియును, అయితే కొన్ని కార్యములు ఉన్నవి… కాలమును గూర్చియు, సంభవములను గూర్చియు, సంఘములకు పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడలేదు, అందువలన ఆయన తన స్వరమును ఒక మనుష్యుని యందు వుంచి ఆ మనుష్యుని ద్వారా మాట్లాడును, చూశారా. కావున, అప్పుడు, అట్టి మనుష్యుడు ఏదైనను చెప్పి, అది ఆ విధముగా జరిగినయెడల, జరుగుచుండిన అది దేవుని యొద్ద నుండి వచ్చినదిగా ఉండును. అప్పుడు మనము జరుగుచున్న కార్యములకు (సంభవములకు) సిద్దముగా ఉండవలెనని నమ్ముదుము.
15ఈ ఉదయము బైబిలు నుండి రెండు, మూడు స్థలముల నుండి చదువవలెనని కోరుచున్నాను. మొదట నిర్గమకాండము 4వ అధ్యాయము నుండి ప్రారంభిద్దాము.
మీరు లేఖనములను చదువుటకు సిద్దపడుచుండగా, ఈ ఉదయము దేవుడు ఏ కార్యమును నా హృదయములో ఉంచెనో, మీతో ఏమి మాట్లాడవలెనో నేను ప్రకటించబోవుచున్నాను. నేను ప్రకటించు కార్యము, నాకు తెలియదు., ఆయన మీతో ఏ విధముగా చేయునని. ఆ ప్రసంగము ఒక మనుష్యుని కొరకై ఉండవచ్చును, లేక టేపు వినువారి కొరకైనా ఉండవచ్చును, లేదా వేరే ఎక్కడైనా ఎవరికైనా ఉండవచ్చును, అయితే ఈ ఉదయాన ప్రకటించ…
16గడచిన ఆదివారము ఉదయము నేను "ఒక నిజమైవ సాక్షి," అను అంశము పై ప్రసంగించితినని తలంచుచున్నాను. ఈ ఆదివారము ప్రభువుకు చిత్తమైతే, "ఉపేక్షించబడిన ఒక నిజమైన సూచన," అను అంశముపై ప్రసంగించనైయున్నాను.
సహోదరుడు పామర్ నాతో చెప్పుచుండెను. నేను గత ఆదివారము ఉదయము మాట్లాడినప్పుడు ఈ ఆదివారము, "సంఘము యొక్క నాలుగు సంగమములు," అనే అంశముపై మాట్లాడబోవుదునని నేను చెప్పినట్లు అతను చెప్పెను. నేను గత రాత్రి వెళ్ళిపుడు, నేను ఎల్లప్పుడు వ్రాసికొని యుంటాను. నాకు తెలియదు, మీరు ఆ విధముగా చేయువలయునో లేదో కాని, నేను అనేక పర్యాయములు తలంచెదను. నేను వ్రాసిన ఆ కార్యము దానిని చూచినప్పుడు నేను అనుకొన్న కార్యము నాలుగు సంగమములు కాదు. ఆ విధముగా నేను చెప్పినాను నిజముగా, కాని నేను నిజముగా తలంచిన కార్యము నాలుగు విధములైన సంఘ పరిపాలన. దానిని ప్రసంగించ వలేనన్న, నేను చరిత్రను సేకరించవలయును. కావున తరువాత దానిని నేను ప్రసంగించెదను, ఎందుకనగా అది అధికమైన సమయమును తీసుకొనును. నేను తేదీలను, సంభవములను సేకరించవలెను, ఏలయనగా మీరు గ్రహించుదురు. ఎక్కడైనను మనసు పలుకు కార్యములను గూర్చిన స్థిరత్వమును నిశ్చయతను కలిగి యుందుము. ఆ కార్యములు ఖచ్చితముగా ఉండవలయును, ఎందుకనగా ప్రపంచములో అన్నిటికైన ఉన్నతమైన స్థానమున సేవకునిగా మనము ఉన్నాము. నిజాయితీగా, క్రమముగా మరియు ఖచ్చితముగా మనము ఆ విధముగా ఉండవలయును. మనము ఆ విధముగా సేవ చేయుటకు నిజముగా దేవునిపై ఆధారపడవలయును.
EXOD 4:1
17ఇప్పుడు, నిర్గమకాండము 4వ అధ్యాయము:
అందుకు మోషే - చిత్తగించుము; వారు నన్ను నమ్మురు. నా మాట వినరు - యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా,
యెహోవా - నీ చేతిలోనిది ఏమిటి అని అతనినడిగెను. అందుకతడు - కర్ర అనెను.
అప్పుడాయన - నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేలపడవేయగానే అది పామాయెను, మోషే దానినుండి పారిపోయెను.
అప్పుడు యెహోవా - నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను.
ఆయన - దాని చేత వారు తమ పితురుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను.
మరియు యెహోవా - నీ చెయ్యిని రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రోమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు, ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమము వలె తెల్లగా ఆయెను.
తరువాత ఆయన - నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలువరికి తీసినప్పుడు, అది అతని మిగిలిన శరీరము వలె ఆయెను.
మరియు ఆయన - వారు నిన్ను నమ్మక, మొదటి సూచనను బట్టి వినక పోయినయెడల, రెండవ దానిబట్టి విందురు. [మీరు గమనించండి, రెండు సూచనలు మరియు ఒక్కొక్క సూచనకు ఒక శబ్దము.]
[మరల 8న వచనమును చదివెదను.] మరియు ఆయన - వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయినయెడల, రెండవ దాని బట్టి విందురు.
వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీ మాట వినక పోయినయెడల, నీవు కొంచెము ఏటి నీళ్ళు తీసి యెండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్ళు పొడి నేల మీద రక్తమగుననెను.
EZEK 24:24•
JOHN 1:6
18మరల ఇప్పుడు పరిశుద్ద యోహాను 1వ అధ్యాయము 6వ వచనము. ఈ వచనములను చదివెదము, లేక ఈ వచనము యెహాను 1వ అధ్యాయము, 6వ వచనము:
దేవుని యొద్ద నుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యెహాను…. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు, అతని పేరు యోహాను.
మరియు యెహెజ్కేలు 24:24, ఈ వాక్యమును ఇక్కడ పెట్టి, పాత నిబంధన నుండి ప్రవక్తల వరకు క్రొత్త నిబంధన వరకు ముడివేయవలెనని ఉన్నాను. అందువలన మీరు ప్రారంభము నుండి ముగింపు వరుకు నిర్గమకాండము నుండి వచ్చు కార్యములను గ్రహించుదురు.
యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును: అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు, ఇది సంభవించునప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
ఇప్పుడు, ఆయనను ప్రార్థన ద్వారా భయభక్తులతో సమీపించుటకు ఒక్క క్షణము మన తలలు వంచెదము.
19తండ్రియైన దేవుడా, అబ్రాహాము దేవుడును, ఇస్సాకు, మరియు యాకోబు దేవుడైన నీతిమంతుడైన యేసుక్రీస్తు నామములో మేము వచ్చుచున్నాము. ఆయన మాకై చెవియొగ్గి వినునని మేము తెలుసుకొని వచ్చియున్నాము, ఎందుకనగా మేము ఏదో ఊరకే ఈ కట్టడములోనికి వచ్చువారి వలె రాలేదు, కాని ఆయన వాగ్దానము చేసినట్లు చేయునని నిర్భయమైన విశ్వాసముతో వచ్చి యున్నాము. అందువలన ఈ రోజు అడుగుచున్నాము, ప్రభువా, ప్రసంగపీఠము నుండి కట్టడము చివర వరుకు గల వారిని, ప్రతి స్థలములలో ఉన్న వారిని, ఇక్కడ కూడివున్న వారిని, మీరు అదుపులోనికి తీసుకొని, ప్రతి హృదయమును తెరచి, మా చెవులను సున్నతి చేసి, జీవించు దేవుని వాక్యము పరలోకము నుండి వచ్చి మా హృదయములలో పోయబడి, వాక్యము వినుట ద్వారా దానిని విశ్వసించువారుగా చేయుము. ఈ రోజు ఉదయము చదివిన వాఖ్యానుసారముగా మమ్ములను చేయుము. మరియు మీ వాక్యము కొరకు మీకు కృతజ్ఞతలు. నీ వాక్యము సత్యమైనది.
20మరియు ఇప్పుడు, దుష్ట సమయము సమీపించుచుండగా, దేవుని యొక్క ఉగ్రత ఆకాశములో గూడు కట్టుకొనుచున్నది. నిన్ను విడచిపెట్టిన ఈ దేశములో ఏ వేళలోనైనను ఏమైనను జరుగవచ్చును. పెద్ద ప్రేలుట సంభవించి ప్రపంచ పటము నుండి ఈ దేశము పేరు తుడిపివేయబడ వచ్చును. భక్తిహీనమైన ఈ దేశమునకు అటువంటి బెదిరింపులు ఉన్నవి. ప్రకటన గ్రంధము మరియు లేఖనమములన్నియు ఈ దినమును గూర్చి చెప్పుచున్నదని తెలిసినవారై, దేవునికి దగ్గరగా సమీపించుటకు బదులుగా - దూరముగా పోవుచున్నారు. మనము ముందున్న వారు నిద్రపోతులుగా, సోమరిపోతులుగా ఉండినట్లు ఉండకుండా, హెచ్చరికను అంగీకరింపచేయుము ప్రభువా. మేము లేచి మమ్ములను కదిలించుకొందుము గాక.
ఇంతకు మునుపు లేనివిధముగా ఈ రోజు మాకు ప్రత్యేకతను అనుగ్రహింపుము. ఈ రోజు ముగించిన తరువాత మా హృదయములు అగ్నితో మండి, మా ఆత్మలలో అగ్ని రగులుకొని, అది ఈ దేశమునంతయు కదిలించి - మేము ఎక్కడ ఉన్నను ఉత్తమ సాక్షిగా జీవించులాగున చేయుము ప్రభవా.
1COR 12:13•
REV 22:20
21వ్యాధితోను, బాధతోను, అవసరములతో ఉన్న మా మధ్యలో ఉన్నవారిని, మా మధ్యలో లేనివారిని ప్రతీ చోట వున్న నీ ప్రజలను ఆశీర్వదించుము.
నీ యొక్క వాక్యమును ఆశీర్వదించుము. నీ దాసుని, వినుచున్న నీ దాసులను పరిశుద్ధపరిచి, జీవితములో ఇంతుకు మునుపు కంటేను ఆయన ప్రత్యక్షత, నెరవేరుచున్న దానిని చూచుటకు మమ్ములను అందరిని సమీపముగా తీసికొని రమ్ము. ఇక్కడ ఉన్న వారికి మాత్రము ప్రార్థించుట లేదు గాని, ప్రపంచమంతట ఈ టేపులను వినుచున్న వారి కొరకును, వారు జీవము గల దేవుని ఆలయమునకు రావలయునని ప్రార్థించుచున్నాను. మనము గుర్తెరిగి యున్నాము, సంఘములో ఒకడుగా ఉండుటకు ఒకే ఒక మార్గమున్నది - అది ఆత్మలో జన్మించుటయే. అప్పుడు మనము ఒకే ఒక ఆత్మతో ఆ ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. దేవా, ప్రపంచమంతట ఉన్న ప్రతి ఒక్కొక్కరి కొరకు నేను ప్రార్థించుచున్నాను, మీ మహిమను మీరే తీసుకోండి. ప్రపంచమంతటను ఏక కేకతో, "ప్రభువైన యేసూ, రమ్ము!" అను స్వరముతో మా ఆత్మలను సిద్ద పరుచుదుము గాక. యేసుక్రీస్తు నామములో దీనిని మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్.
MATT 12:38•
MATT 16:4•
MARK 8:11,12•
LUKE 11:29
22"ఉపేక్షించబడిన ఒక విజమైన సూచన." మనుష్యుడు, ఫరో మొదలు ఈ రోజు వరుకు ఏదైన సూచనలను కోరుచునే ఉన్నాడు. మరి యేసు సూచననలును వెదకు వారి కాలము ఉండునని మనకు చెప్పియున్నాడు. మరియు పాపపు, వ్యభిచార సంతతి సూచనలను వెదకుదురని చెప్పెను. అయినప్పటికిని వారు ఒక సూచనను గైకొందురు; ఆ సంతతి ఒక పునరుత్థాన సూచనను గైకొనవలసినదిగా ఉండెను - అది ఒక బలహీనమైన, పాపపు, మరియు వ్యభిచార సంతతివారికి పునరుత్థాన సూచన ఇవ్వబడును.
EZEK 24:24•
MATT 16:1,2
23మనముందున్న లేఖనముల ప్రకారము యెహెజ్కేలు 24వ అధ్యాయము 24న వచనము, ఈ ప్రవక్త ఒక సూచనగా చేయబడెను, మరియు ఆ సూచనను గురించి నేను మాట్లాడవలెనని కోరుచున్నాను.
ఈ మనుష్యుడు ఇశ్రాయేలీయులకు ఒక సూచనగా చేయబడెను. లేఖనములంతటను దేవుడు తన ప్రవక్తలను సూచనలుగా ఉపయోగించుకొనెను మరి, వారు ఎప్పుడో నిరాకరించబడిన వారైనారు. ప్రజలు ఆ సూచనను గ్రహించలేకపోయారు. వారు ఎల్లప్పుడు ఉద్రేకముతో కూడిన సూచన కొరకు ఎదురు చూచువారుగా ఉన్నారు.
యేసు దినములలో ఉన్న పరిసయ్యులు కూడా, "పరలోకము నుండి ఒక సూచనను చూపుము,'' అని చెప్పిరి.
కాని యేసు వారిని చూపి వారొక సూచనను పొందుదురని చెప్పి మీరు సూచనను ఇది వరకే పొందియున్నారు. మీరు ఆకాశమును కనుగొని ఆ సూచనను చూచెదరు. ఆకాశము ఎర్రగా దిగి ఉన్న యెడల రేపు సరియైన వాతావరణము ఉండదని మీరు చెప్పుదురు.
వారు గాని ఆ సూచనను చూచి ఉండినట్లయిన ఆయనను చూచి ఆయన దేవుని యొక్క సూచన అని తెలిసికొని యుందురు, ఏలయనగా ఆయనను గూర్చిన ప్రవచనములు వారి కళ్ళ ముందే నెరవేరుచున్నవి. అయినప్పటికిని వారు ఇంకను సూచన కొరకు ఎదురు చూచువారై ఉండిరి.
మనుష్యులు ఆ విధముగా చేయుట ఎంత వింతగా ఉన్నది. ఆ సూచన వారితో కూడా, వారి మధ్యలో ఉన్నప్పుడు వారు సూచన కొరకు చూచుట. ఇప్పుడు, ఇశ్రాయేలు అటువంటి స్థితికి దిగజారి పోయినారు.
EZEK 4:4,6
24కొన్ని సమయములలో ఆ సూచన పలు హింసలతో పోవునప్పుడు ఆశ్చర్యముగా ఉండును. దేవుని సూచనను రుజువు పరచుటకు యేసు పలు విధములుగా బాధింపబడెను, ఆయనే మెస్సీయా అని…
మనము ఇక్కడ కనుగొనుచున్నాము, యేహెజ్కేలు అను పేరుగల యువకుడైన ప్రవక్త ఎల్లప్పుడును విడువకుండా ఒక సూచనగా ఉండెను. అతడు ఏ విధముగా బాధింపబడెను! ఒక చోట మనము చూచుచున్నాము, అతడు మూడు వందల తొంబది రెండు దినములు, అతడు ఒకే ప్రక్క (ఎడమ ప్రక్క) పండుకొని యుండెను. దేవుడు అతనితో చెప్పెను కాయ, ధాన్యములను తీసికొని, గంజి తీసుకొని కలిపి దానిని వండి, ప్రక్కలో పెట్టుకొని, ఒక పెంకు పైన పండుకొని ఎడమ ప్రక్క మాత్రము పండుకొనవలెను. మూడు వందల తొంబది దినములు అటు, ఇటు తిరుగక ఉండ వలయును. దానిని తలంచి చూడండి! మరల చెప్పెను, "కుడి ప్రక్కకు తిరిగి నలుబది దినములు అలాగే పండుకొనవలయును."
అప్పుడు అతడు చెప్పెను, "ఏమి చూచుచున్నావు [యేహెజ్కేలు చెప్పెను] ఎందుకనగా నీవు ప్రజల యొక్క దోషములను భరించుచున్నావు. ఒక్కొక్క దినము నేను వారికి ఒక సంవత్సరముగా లెక్కించుదును." ఒక్కొక్క దినము అతడు ఆ విధముగా పండుకొని ఉన్నప్పుడు ఆ ఒక దినము అర్థము వారు ఒక సంవత్సరము చెరలో ఉన్నారని, దేవుడు వారి దోషములను గుర్తించుకొని వారి ప్రార్థనలను దేవుడు ఇంకెన్నడును వినడు.
2COR 3:2
25ఆ విధముగా ఆ మనుష్యుడు బాధింపబడుట ఎందులకు అవసరము? అటువంటి కార్యము ఏల అవసరమని చాలా మంది ఆశ్చర్యపడిరి. అది ఎందుకనగా ప్రజలు వాక్యమును చదువరు, వారు ప్రార్థించరు. కావున దేవుడు సర్వాధికారి, మరియు ఆయన ఒక సూచనగా తన ప్రవక్తను పంపును. ప్రజలు చదువరు. చదువవలెనన్న అక్కర లేదు. మరియు ప్రార్థించరు, ఎందుకనగా వారికి మిగతా కార్యములు ఉన్నవి చేయుటకు. ప్రార్థించుటకు వారు సమయమును తీసికొనరు. వారికి బైబిలు విసుగనిపించును; నవీన కాలము వలె, లేక ఏ రోజులలోను వారిలో చలనము లేదు.
మీకు తెలుసును, పౌలు చెప్పెను అని నమ్ముచున్నాను, "మీరు మనుష్యులందరు చదువు దేవుని పత్రికలు. దేవుడు ప్రజలను సూచనలుగా వాడుకొనును, ఏలయనగా తన సూచనను చూపించుటకు అనేక సార్లు ఆ సూచన (ప్రతిసారి ఎన్నుకొనబడిన ప్రజలు తప్ప మిగతా వారి వద్ద), ఉపేక్షింపబడి (నిరాకరించబడి), విమర్శించబడి, హేళన చేయబడి, వెళ్ళగొట్టబడి మరియు తప్పుగా ఆలోచించుచు…
పాత నిబంధన ప్రవక్తల రోజులలో సహితము ప్రజలు ప్రవక్తలను పిచ్చివారని, కలతచెందిన వారని ఎంచిరి. ఆ ప్రవక్తలు మతి-స్థిమితిలేనివారని, బుద్ది స్వాధీనము లేని వారని తలంచిరి. ప్రజలు వారిని అరణ్యము నుండి వచ్చి సూచనలు చేసి, మరల అరణ్యమునకు తిరిగిపోవు వారిగా చూచారు. లేఖనములు ప్రజలకు తెలియనందున ప్రవక్తలను వారు ఎగతాళి చేసారు.
DEUT 25:5•
MATT 22:23•
MARK 12:18•
LUKE 20:27
26పునరుత్థానమును గూర్చి యేసు పరిసయ్యులకు ఒకమారు చెప్పెను వారు చెప్పిరి, "ధర్మశాస్త్రము చెప్పుచున్నది, ఒక మనుష్యుడు బిడ్డలు లేక చనిపోయినయెడల, అతని సహోదరుడు చనిపోయిన తన సహోదరుని భార్యను తీసుకొని సంతానమును ఉత్పత్తి చేయవచ్చును. మాలో ఒకతనికి ఏడుగురు సోదరులుండిరి. మొదటి మనుష్యుడు ఒకామెను భార్యగా చేసికొని, సంతానము లేకుండా చనిపోయెను. ఆ తరువాత అతని సహోదరుడు ఆమెను చేర్చుకొనెను, అతడును చనిపోయెను, ఆ విధముగా ఏడుగురు చనిపోయిరి. కడపట ఆ స్త్రీ చనిపోయెను." వారు అడిగిరి, "పునరుత్థానములో ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును?"
MATT 22:29,30•
MARK 12:24,25•
LUKE 20:35,36
27ఓ, ఆ వాక్యమును నేను ఇష్టపడుచున్నాను. యేసు చెప్పెను, "మీరు దేవుని శక్తిని, లేఖనముములను తెలియక ఎప్పుడు తప్పు చేయుచున్నారు!" ఒకవేళ ఆయన ఇక్కడ నిలచియుండినయెడల ఈ విధముగా ఈ రోజు మండిపడును. "మీరు దేవుని శక్తిని, వాక్యములను గుర్తించక, ఎల్లప్పుడును తప్పు చేయుచున్నారు!" దేవుని శక్తి లేఖనములలో ఐక్యమైయున్నది. "మీరు చాలా పెద్ద పొరపాటు చేయుచున్నారు." అప్పుడు ఆయన ఈ విధముగా చెప్పెను, "పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు." ఆయన వారిని దూతలుగా ఉందురు అని చెప్పలేదు, కాని దూతల వలె ఉందురని చెప్పెను - లైంగిక గ్రంధులు వారిలో ఉండవు. వారు పెండ్లి చేసికొనరు లేక పెండ్లికి ఇవ్వబడరు.
28మనము మృత దినాలలో జీవించుచున్నాము… లేక, మర్త్యమైన, మర్త్యమైన రాజ్యములో జీవించుచున్నాము. కాని ఒక రోజు రానైయున్నది, నిత్యమూ జీవించు రాజ్యము వచ్చుచున్నది. ఆ నిత్యమైన రాజ్యములో విమోచింపబడిన వారు మాత్రమే జీవించుదురు, విమోచింపబడిన వారు…… మరణించిన పిదప ఆత్మ శరీరమును వదిలి దానిని ఇచ్చిన దేవుని యొద్దకు వెళ్ళును. మరల జీవవృక్షము నుండి ఆ ఆత్మ ఒకరోజు తిరిగి వచ్చి నిత్యకాలము వరుకు పరిపాలించును.
29ఆ ప్రజలు ఉపేక్ష చేసెడు వారిగా ఉన్నందువలన వారు పొందబోవు శిక్షకు సూచనగా ఆ యువకుడు, యువ ప్రవక్త తన జీవితము యావత్తును వారి కొరకు త్యాగము చేసినాడు. వారికి దేవునితో పని లేదు, వారు ప్రవక్తలను నమ్మరు; వారిని పరిహసించిరి. ఆ ప్రజలు ఎంతగా ఆ సూచనను నమ్మలేదో దేవుడు దానిని వారు పొందునట్లు చేసాడు.
యెజెబెలు, ఏలియాను తన పాస్టరుగా ఒప్పుకొన లేదు, కాని అతడే ఆమె యొక్క పాస్టరు. దేవుడు ఆ సూచనను ఆమె పొందునట్లు చేసాడు. ఈ దేశము ఈ దినము ఆ విధముగా ఉన్నది. నీతిమంతుడును, నమ్మకస్థుడైన దేవుడు ఒక సూచనను ఇవ్వకుండా ఏ కార్యమును జరుగనివ్వడు. అతడు ఎల్లప్పుడు ఆ విధముగా కలిగి యుండును. ఇప్పుడు మనము దాని కొరకు (సూచన) చూడవలయును. నేను నమ్ముచున్నాను మంచి వాక్య జ్ఞానము కలిగియున్న ప్రజలు ఏ విధముగా ఆ సూచనను చూడవలయునో అని తెలిసికొందురు.
GEN 2:5•
GEN 6:13
30రాబోవు న్యాయ తీర్పునకు నోవహు అతని కాలములో ఒక సూచనగా ఉండెను. నోవహు అతని కాలములో ఒక మత పిచ్చి పట్టినవానిగా ఎంచబడెను. అతడు ఒక ప్రవక్త. అతను మంచివానిగా మరియు మతిలేనివానిగా ఎంచబడెను. భూమిపై -నీళ్ళు లేనప్పుడు ఊట మాత్రము ఉన్నప్పుడు, ఆ మనుష్యడు ప్రతి సంవత్సరము సుత్తి కొట్టుచునే పడువను కట్టెను. మనుష్యులు తన బుద్దితో పరిహాసము చేయునప్పుడు ఏదో జరుగునని అతడు నమ్మెను. అతడు చెప్పెను, "ఆకాశము నుండి నీళ్ళు వచ్చును.''
నిస్సందేహముగా అనేకులు, "మాకు చూపించు, నీళ్ళెక్కడ ఉన్నవి," అతడిని అడిగియుండవచ్చును.
విజ్ఞాన శాస్త్రము చెప్పును, "నేను నిరూపించెదను, పైన నీరు లేదని." అయినను దేవుడు, " ఆకాశము నుండి నీళ్ళు వచ్చును,'' అని చెప్పినయెడల, ఆయన వాక్యమును నెరవేర్చుట ఆయన చూచుకొనును.
సమీపములో నీళ్ళు ఉన్నట్లుగా అగుపించలేదు, ఆకాశములో ఒక మబ్బు తునకైనను లేదు, అంత వరకు ఒక చుక్క వర్షమైనను లేదు - అంతవరుకు వర్షము అంటే ఏమి అని తెలియదు - అయినప్పటికీ నోవాహు వర్షము కొరకు పడవను కట్టుచునే యున్నాడు. ఆ ప్రవక్త దేనిని గూర్చి మాటలాడెనో దానిని నమ్ముటయు, దాని కొరకు సిద్దపడుటయు ఇదంతయు ఒక జీవించు రుజువుగా ఉండెను.
ఏ వ్యక్తినను ఏమి మాటలాడునో దానిని నమ్మినయెడల, దానికొరకు సిద్దపడియుండును.
MATT 24:37•
LUKE 17:26
31నోవహు దినములలో నేను కొంచెము నిలుప వచ్చునా? యేసు చెప్పిన విధముగా, "మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.'' ఈ దినములలో సంఘములు వారు చెప్పిన దానిని నమ్మినయెడల, వారు చెప్పిన దానినే అనుసరించుదురు.
మరి ఏ విధముగా మనము గొప్ప కట్టడములను, లక్షల కొలది డాలర్లు భవనములపై, సంఘ శాఖలను గొప్పగా విస్తరింపచేయుట, ఇంకను అదే విధమైన కార్యములు చేయుచు, క్రీస్తు ఏ క్షణములలోనైనా రావచ్చునని, అని ప్రసంగించుచునే యున్నాము. మనము ఎలాగు దానిని కొనసాగించు… మన ప్రజల వైపు చూచి, మరియు వారు దేవుని శక్తి నుండి వేరైపోవుట చూచి, మరియు లోకకార్యములవైపు వెళ్ళుచు, మరియు దానిని మనము అనుమతించుచున్నాము? ఎందుకనగా పేరు ప్రఖ్యాతులు, ప్రజల యొక్క కోరికల వలన, శాఖల భేదముల వలన, ఇంకొక సంస్థ కంటెను మించి పోవలెనన్న కోరిక వలన మనము ఏమి ప్రసంగించుచున్నామో దానిని ఏ విధముగా అమలుపరచగలము? మరియు ప్రపంచము దానిని చూచుచున్నది, అది వారికి తెలియును.
కావున మతము అనునది ఏదో ఒక క్రమములో చేరుట లేక ఒక సమాజములో చేరుట. ఆ విధముగా … మతము…. క్రీస్తు యొక్క రక్షణ సమాజము కాదు. అది ఏదో చేరుటను కాదు; అది జీవించు అనుభవము.
GEN 6:13,18
32ఇప్పుడు నోవహు ఏమి మాట్లాడుచున్నాడో దానిని ఉత్పత్తి చేయుచున్నాడు. అతను చెప్పెను, "ఓ అవినీతి పరులైన ఈ సంతతిపై వరద అనే న్యాయతీర్పు వచ్చుచున్నది. దేవుడు ఆకాశము నుండి వర్షమును కుమ్మరించును, భూమినంతటిని వరదలతో నింపును." ఆయన అది చేయుటయే కాదు, తప్పించు కొనుటకు ఒక మార్గమును ఏర్పరచి ప్రజలను అందులోనికి రమ్మని కోరుచున్నాడు. కాని వారు ఆయన మాటను వినుట లేదు.
కాని నోవహు ఆ సంతకి ఒక సూచనగా ఉన్నాడు, ఆ సూచన చెడ్డగా మాట్లాడబడినది, మతి-స్థిమితిలేనివాడని తలంచబడ్డాడు. ఆధారము లేని దాని కొరకు (అటువంటి కార్యము అంత వరుకు జరుగ లేదు) అతను పడవను తయారు చేయుచున్నాడు. దానిని (పడవను) ఉపయోగించుటకు వీలు పడదు (అంత వరుకు వర్షము లేనందున ప్రజలు అటువంటి పడవను ఊహించలేకపోయారు.) అయితే ప్రజలు ఈ రోజు కూడా అదే విధముగా తలంచుచున్నారు. వారు ఆశ్రయమును తలంచుచున్నారు. భూమిపై ఒక వృక్షమైనను, రాయైనను మిగల కుండా ఉన్నప్పుడు, ఆశ్రయము వారికి ఏ మంచి చేయును? మనకు ఆశ్రయము ఉన్నది, క్రైస్తవునికి ఉన్నది.
నేను కొన్ని ఆదివారముల క్రిందట చెప్పిన విధముగా, లేక ఎక్కడో నా మార్గములో చెప్పినట్లు, "పడిపోయిన ఆశ్రయము కాదు, ఆ ఆశ్రయములోనికి పడిపోవుట. రక్షనైన దేవుని పడవలో, క్రీస్తులోనికి, మన హృదయమంతటితో, పరిపూర్ణ ఆత్మతో, మన తలంపులన్నింటిలో పడుటయే, దేవుని రక్షణ అను ఆశ్రయములో పడుట.
HEB 11:7
33అయితే నోవహు పిచ్చిగా అగుపించు ప్రసంగముల వలన అతనిని ఆ రోజు మతి-స్థిమితములేనివాడని చెప్పినప్పటికిని ఆ సూచనను వారికి చేసి చూపించుచు, హెచ్చరికలు వారికీ ఇచ్చుచు. తేలుటకు నీళ్ళు లేనప్పుడు, ఒక పడవను కట్టుట ద్వారా ప్రపంచమును ఖండించెను. అతడు ప్రపంచమును దోషిగా యెంచెను, బైబిలు చెప్పుచున్నది - హెబ్రీయులు 11వ అధ్యాయము, ఆ రోజు ముంచుకొచ్చుచున్న న్యాయ తీర్పునకు దేవుని సూచనగా ఉండి సిద్దపడుట ద్వారా తన కుటుంబమును రక్షించుకొని ప్రపంచమును అతడు ఖండించెను. ఎటువంటి మహిమకరమైన కార్యము!
GEN 15:13•
ACTS 7:6
34తరువాతి సంవత్సరములో ఇంకొక సూచన వచ్చినది - అది మోషే ఒక ప్రవక్త. అది ఇశ్రాయేలునకు దేవుని సూచన. వారు నాలుగు వందల సంవత్సర ములు బానిసత్వములో ఉందురు. విడుదలకు ముందు దేవుడు వారికి ఒక సూచన సిద్దము చేసెను. అతడు ఇశ్రాయేలీయులకు విడుదల సూచనగాను, ఐగుప్తుకు న్యాయతీర్పు సూచనగా ఉండెను.
నోవహు తన ప్రజలకు రక్షణ సూచనగాను, అవిశ్వాసికి తప్పిపోయిన ప్రపంచమునకు న్యాయతీర్పు సూచనగా ఉండెను. ప్రపంచమును ముంచి, ఊపిరి ఆడకుండా చేసిన అదే నీళ్ళు నోవహును రక్షించు మార్గముగా ఉండెను. న్యాయతీర్పు ఒక్కటే అతనిని రక్షించునదిగా ఉండెను. ఈ రోజు సంఘమును రక్షించునది న్యాయతీర్పు ఒక్కటే, దేవుడు న్యాయతీర్పును ప్లమ్మెట్ (నీటి లోతును కొలుచుటకు ఉపయోగించు సీసపు గుండు కట్టిన త్రాడు) కు వేశాడు. కాని నోవహు దానినే ప్రసంగించాడు, అతడే ఒక సూచనగా మారెను.
EXOD 2:23•
MATT 11:25•
MATT 16:1•
MARK 8:11•
LUKE 10:21
35మరి ఇప్పుడు ఇశ్రాయేలు నాలుగు వందల సంవత్సరముల తరువాత విడుదల కొరకు మొరపెట్టుటకు ఆరంభించిరి. మరి దేవుడు ఎప్పుడో తాను చేయు కార్యమును తన ప్రజలు అంగీకరించుటకు సిద్దపడితేనే గాని ఆయన తన్ను బయలు పరచడు, తనను చూపించడు.
ఇప్పుడు, ఈ దేశమును దేవుడు దిగంబరముగా వదులుటను గూర్చి ఏమి చెప్పగలము? వారికి బాగుగా తెలియును. దినపత్రికలు వాటిని ప్రచురించుచునే ఉన్నది. ఆయన వచ్చు సూచనలు ప్రత్యక్షము అగుచున్నవి, అయితే వారు దానిని విడచి వారి దారిలో పోవుచున్నారు. మన్నింపు లేకుండా వారున్నారు. మనము కడపటి కాలములో ఉన్నాము.
జనులు ప్రవక్త కావలెనని కోరినప్పుడే, దేవుడు ప్రవక్తలను పంపును. ప్రజలు - సూచనకు సిద్దపడినప్పుడు, దేవుడు ఆయన సూచనను పంపును. అయితే విషయము ఏమనగా, ప్రజలు అరుదుగా… వారు ఉద్రేకపడు చోటికి పోవుదురు, లేక ఏదో వారికి కావలయును, "ఆకాశము నుండి ఒక సూచనను మాకు చూపుము!'' అయితే దేవుడు ఆ సూచనను పంపినప్పుడు, అప్పుడు వారు దానిని చూచుటకు ఇష్టపడలేదు. కావున అది జ్ఞానులకు, వివేకవంతులకు మరుగు చేయబడి, నేర్చుకొను పసిబాలుర వంటి వారకు బయలు పడుచున్నది.
GEN 15:13,14•
EXOD 2:1•
ACTS 7:6,7•
HEB 11:23
36ఆ సూచనను ఉపేక్షించినారు. ఆ సరియైన బిడ్డ పుట్టునని, వారు జీవించుచున్న ఆ సంవత్సరములను చూచినప్పుడు గమనించినప్పుడు, ఇశ్రాయేలీయులకు ఏ విధముగా తెలియును, ''నీ ప్రజలు నాలుగు వందల సంవత్సరములు అన్యులుగా పరదేశములో ఉండెదరు, అయితే నేను వారిని బయటికి పిలుచుకొని వచ్చెదను." ఆ తగిన బిడ్డ పుట్టినప్పుడు కాలము సమీపించెనని వారికి తెలియును, ఆయన తల్లిదండ్రులైన అమ్రము, యాకెబెదు రాజాజ్ఞలకు భయపడలేదు. వారు ఆ నదిలో అతడిని వదిలారు. ఆ నదిలో ఉన్న మొసళ్ళు ఒక్కటి కూడా అతడిని తాకలేదు. వారు ఒక సూచన ఉన్నదని చూడగలిగారు. కాని వారు (ప్రజలు) దానిని త్రోసివేసినారు. వారు ఆ సూచనను అంగీకరించుటకు సిద్దముగా లేరు. దేవుడు మోషేను ఫరో అంతఃపురములో వుంచి, ఫరో అతనిని పెంచేలాగ చేసి, సమస్త జ్ఞానమును, విద్యను మోషేకు నేర్పించి, అతను (దేవుడు) ఏ విధముగా చేయునో చూపించుచున్నాడు; మరల మోషేను ఎడారి యొద్దకు తీసికొనిపోయి, అతడు నేర్చుకొనినదంతయు మరచి పోయేలా చేసెను.
EXOD 3:2,3
37ఫరో అతనిని తర్ఫీదు చేయుచున్నాడు. దేవుడు అతనిని తర్ఫీదు చేయుచున్నాడు… ఫరోకు అతనిని తర్ఫీదు చేయుటకు నలుబది సంవత్సరములు పట్టినవి. మరల దేవుడు మోషేను తర్ఫీదు చేయుటకు నలుబది సంవత్సరములు అయినవి. అదంతయు మరచిపోవునట్లు చేయుటకు ఫరో దగ్గర మోషే అభ్యసించిన విద్య (జ్ఞానము) మానవుని యొక్క తర్ఫీదు, దేవుని యొక్క తర్ఫీదు … ఫరో ఆ కుమారుని (మోషేను) ఒక నాయకునిగా, ఒక రాజ ప్రతినిధిగా, యోధుడుగా, యుద్ధ వీరునిగా, అన్ని దేశములను జయించి ఆ దేశములన్నియు ఫరోకు కప్పము కట్టునట్లుగా, రాబోవు ఫరోగా ఐగుప్తును ఉన్నత స్థానములో ఉంచి పాలించువానిగా అతనికి తర్ఫీదునిచ్చెను. అయితే దేవుడు అతనిని ఎడారి వెనుకు తీసికొని పోయి, అతనిలో ఉన్నదంతయు (ఈ లోక జ్ఞానము) ఎత్తివేసి, అయన జీవము గల దేవాది దేవుడని మండుచున్న అగ్నిపొద మూలముగా ఐదు నిమిషములలో మోషేకు చూపించెను.
EXOD 2:24
38దేవుడు ఆయన ప్రజలు ప్రార్థించవలెనని కోరుచున్నాడు. ఇశ్రాయేలు యొక్క బాధలు అధికమై, వారు కొనసాగలేక పోయినారు. వారు తలంచిన దానికన్న వారి బాధలు అధికముగా ఉన్నవి. వారి విడుదల కాలము నెరవేర వలసి వచ్చినప్పుడు, వారు ప్రార్థించుటకు ప్రారంభించిరి. దేవుని ప్రజలు ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు, దేవుడు వినుటకు ప్రారంభించాడు. అది దేవుని యొక్క వాక్యము నేరవేరవలసిన సమయము.
అందువలన అమ్రాము మరియు యోకెబెదు దేవుని వాక్యము నెరవేరవలసి వచ్చినదని గుర్తించి, దేవునితో ప్రార్థించుటకు వెళ్ళారు. సాధారణముగా ఎవరికి అధికమైన భారము ఉండునో వారు ప్రార్ధించునప్పుడు దేనినో పొందుదురు. ఎవరు దేవుని వలన నిర్ణయింపబడినారో వారే ప్రార్థించుదురు.
39ఈ రోజు ఉదయము సంఘమునకు వచ్చే ముందు ఉదయపు అల్పాహార విందులో త్వరత్వరగా తోస్టును తినుచు మాటలాడుచుంటిని. కాన్సర్ వ్యాధిలో నుండి స్వస్థత నొందిన ఒక మనుష్యుడు (ఇక్కడ తను లేడు)… తిరిగి దిగజారి పోయి, సిగరెట్ల పొగను పీల్చటము వైపు వెళ్ళెను. నేను చెప్పాను, "ఎటు వంటి దయామయ స్థితి."
కావున ఒకరు మాట్లాడుచు చెప్పారు, "పొగ పీల్చుటను మానివేయుట అనునది ఎంతో కష్టతరమైనది."
నేను చెప్పాను, "నాకు తెలుసును, అది సాతానుని పని. నేను చెప్పాను, "అది సాతాను." "దేవుని యొక్క శక్తి నీపై వుంటే తప్ప దానిని నీవు మానలేవు," అని చెప్పాను. నా యొక్క జీవిత ప్రారంభ దశలో నాకు తెలిసిన ఇద్దరు దేవుని మనుష్యులుగా కావలయునని కోరారు. ఒకనిని దేవుని యొద్దకు నడిపించిన పిదప అతడు సిగరెట్టు ముట్టించుటకు ప్రారంభించెను. అతడు ఒక రోజుకు 5 లేక 6 ప్యాకెట్లు సిగరెట్లు ఒకదాని తరువాత ఒకటి ముట్టించుచుండెను. అయితే అతడు ఇంకొక సిగరెట్టును వెలిగించుటకు ప్రయత్నించుచుండగా, ఏదో కార్యము దానిని చేయుటకు అడ్డగించెను. అతనికి వాక్యము దానిని ఖండించుచున్నది అని అతడికి తెలియకనే, అతడు నేరుగా పొయ్యి దగ్గరకు వెళ్ళి, ఆ సిగరెట్టు ప్యాకెట్టును అందులో వేశాడు, ఆ కార్యము అంతటితో ముగిసినది.
MATT 11:25•
LUKE 10:21•
JOHN 6:37,44•
ROM 9:16
40మరియు ఇంకొక వ్యక్తి క్రైస్తవుడు కావలయునని కోరెను, అతడు తన శాయశక్తుల ప్రయత్నించెను. దేవునితో ప్రలాపించుకొనెను. రెండు, మూడు వారములు సిగరెట్లను ముట్టుకోలేదు. ఆ స్థితిలో తన మతిని కోల్పోయేను… అతడి పిచ్చివాడైపోయెను. తన ఇంటికి వెనుక అటు ఇటు తిరుగులాడుచు, తల పై ఒక రేకు ముక్కతో కొట్టుకొనసాగెను. గబగబా ఇంటిలోనికి వెళ్ళి, సిగరెట్టు ప్యాకెట్టు తీసుకొని ఆ రోజు సాయం కాలము ఇంటిని వదిలి బయటికి పోవు లోపల ఒక్కొక్కటిగా ఆ సిగరెట్టు ప్యాకెట్టులో వున్నన్నింటిని పీల్చివేసెను.
చూశారా, ఒకడు పిలుబడ్డాడు. ''నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే గాని ఏ మనుష్యుడు నా యొద్దకు రాలేడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా యొద్దకు వచ్చును.'' ఆ హెచ్చరిక యొక్క అర్థము ఏమి? అది ఒకరికి జీవము. అతడు దానిని చూచెను. దేవుడు బయలు పరిచితేనే గాని మీరు దానిని చూడలేరు. జ్ఞానులకు, వివేకులకు వారి కళ్ళకు మరుగుచేయబడి, నేర్చుకొను పసి బాలుర వంటి వారికి బయలుపడినది. అది సరియే.
అది సరియైన సమయమని, ఆ సమయము అతి చేరువలో వున్నది, అమ్రాము మరియు యోకెబెదుకు తెలుసును.
రోమా 9:16.
41నేను దానిని మాటలానప్పుడు ఇది చెప్పవలయునని ఉన్నాను. "కాగా పొందగోరువాని వలననైనను, ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని, కరుణించు దేవుని వలననే అగును." అది సరియే. అది దేవుడే.
కావున ఈ రోజు… ఓ ఇది లోతునకు పోనియ్యుము! ఈ రోజు దేవుడు నిన్ను పిలిచి మరియు నిన్ను ఈ లోక కార్యముల నుండి వేరుచేసి, ఆ కార్యముల నుండి దేవుని మహిమా శక్తి, మిమ్ములను పరిశుద్ధపరచినయెడల మీరు ఈ లోకములో మహా సంతోషమైన వ్యక్తిగా ఉండవలెను. లక్షలాది ప్రజలు ఆ విధముగా చేయగలిగినయెడల, వారు చేయుదురు, కాని వారు చేయలేరు. అది వారు పొందుట కొరకు కాదు. ఈ రోజు సంఘము వేరుచేయబడి పిలువబడియున్నది. ముందున్న సంఘము మాదిరి ఇప్పుడు లేదు.
EXOD 2:23•
MATT 5:6
42ప్రజలు ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు… ఇశ్రాయేలీయులు ప్రవక్త కొరకు ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు, దేవుడు ప్రవక్తను కలిగియున్నాడు. ఎల్లప్పుడు దేవుడు ప్రవక్తను కలిగి యుండును, ఏలయనగా దేవుడు సమస్త కార్యములను ప్రజల కంటే ముందుగా ఏర్పరచును. దేవుడు ఒక మనుష్యుని సిద్దపరచియున్నాడు, కాని ప్రజలు దానిని కోరి ప్రార్థించువరుకు ఆయన వేచియున్నాడు.
ఈ రోజు, ఆ రోజులలో వున్న విధముగానే జరుగుచున్నదని నేను చెప్పుచున్నాను. ఈ రోజు మనకు కావలసినది పునరుద్దరించే మనిషి కాదు. ఏదో సంఘ స్థావరములకు చెంది, అన్ని తెగలను ఒకటిగా స్థాపించే మనిషి కాదు. ఈ రోజు మనకు కావలసినది ఈ లోకమును ఖండించు వర్తమానమును కలిగియున్న దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్త. ప్రజలు సిద్దబడియున్న యెడల, దేవుడు ఆ మనిషిని (ప్రవక్త) కలిగియున్నాడు. నేను ఏమి మాట్లాడుచున్నానో మీకు తెలియును. ప్రపంచములో దేవుడు అతడిని ఎక్కడో కలిగి యున్నాడు, కాని ప్రజలు దానిని కోరుకొనవలయును. దేవుడు మీ గొంతులో (బలవంతముగా) కార్యములను త్రోయడు. మీరు కోరుకొనవలయును. ''నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడెదరు.'' అది సరియే!
EXOD 2:23
43ప్రజలు వారికొక నాయకుడు కావలయునని ఎరిగి ప్రార్థించిన తర్వాత మోషే గుర్తింపబడెను. వారు వారి బానిసత్వము నుండి బయటకు తీసుకొని రావటానికి ఒక నాయకుని పంపమని దేవునితో ప్రార్థించినప్పుడు, ఆయన వారికొరకు ఒక మనుష్యుని పంపెను, ఒక ప్రవక్త. అది ఆయన సూచన. ఇప్పుడు అతడు ప్రవక్త కానియెడల, ఒకవేళ అతడు లేచి, ''నేను సైనిక ప్రతిభగలవాడినని,'' చెప్పినయెడల, ఆ మనుష్యుని అవిశ్వాసించుటకు ఇశ్రాయేలీయులకు హక్కు గలదు, ఏలయనగా దేవుడు తప్పిపోకుండా ప్రతిసారి ప్రవక్తను పంపుచున్నాడు. ఆ విధముగా బైబిలులో ఎక్కడైనా ఉన్నదా చెప్పండి. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" తో ఆయన ఎల్లప్పుడు ప్రవక్తను పంపును.
ఇశ్రాయేలీయులు కలిగిన వాటిలో దావీదు ఒక గొప్ప యుద్ద వీరుడు, అయినను దావీదు ఒక ప్రవక్త. నిశ్చయముగా అతడు ప్రవక్త. అతడు దావీదు ప్రవక్త.
GEN 15:13,14•
EXOD 3:2,3•
EXOD 12:38•
NUM 11:4•
ACTS 7:6,7
44ప్రజల హృదయాలలో ఆ ప్రవక్త మాట వినవలయును అనే ఆశ వచ్చు వరుకు ఆయన ప్రవక్తను పంపుటకు వేచియున్నాడు. వారది చేసారు అని వారిలో కొందరు చెప్పిరి, అది చేయలేదు (మాట వినలేదు). తరువాత వారు సరికాదని నిరూపించబడినది. వారందరు ఉద్రేకములో ఏదో చేసారు, బైబిలు చెప్పుచున్నది, ఒక మిశ్రమ సమూహము వారితో పోయినదని. అది ఏమి చేసినది? ఎడారిలో బాధలు తెచ్చినవి. ప్రతీసారి ఈ విధమైన కార్యము జరుగుచున్నది. ఓ, ఇది బాగా లోతుగా పోవలయునని కోరుచున్నాను. ప్రతిసారి దేవుడు ఒక కార్యమును పంపినప్పుడు, మూర్ఖులైన వేషధారులు వారితో పోయి వారి యొక్క తప్పుడు కార్యములను నమ్మునట్లు చేయుచున్నారు. ప్రజలతో అది ఆ విధముగా సరిగా జరుగుచునే యున్నది. కాని నిజమైన దేవుని ప్రవక్త, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," తో నిలుచును. అతడు దేవుని వలన పంపబడినవాడైతే, వాక్యము నుండి ఎన్నడు తొలగిపోడు.
మోషే ఖచ్చితముగా లేఖనముపై నిలిచాడు. దేవుడు చెప్పెను, ''నేను వారిని బయటికి పిలుచుకొని వచ్చెదను!'' అతను మోషేతో చెప్పెను, ''ఆ పని చేయుటకు నిన్ను పంపియున్నాను.'' మోషేకు ఒక అనుభవముండెను, అతను దేవుని సంధించెను, అతని యొద్ద దేవుని వాక్యము ఉండెను.
ప్రవక్తల యొద్ద దేవుని వాక్యము ఉన్నందు వలన దేవుడు ప్రవక్తలను పంపుచున్నాడు. దేవుని వాక్యము ప్రవక్తలకు వచ్చును. అతని (ప్రవక్త) యొద్ద దేవుని వాక్యము లేనియెడల, అతను ప్రవక్త కాడు.
45కాలాకాలములుగా అనేక వేషధారులు వారు ప్రవక్తలని చెప్పుకొనుచున్నారు, కాని వారు దేవుని వాక్యమునకు చాలా దూరముగా పోవుదురు. కాని నిజమైన ప్రవక్త ఖచ్చితముగా వాక్యముతో నిలుచును! ఇప్పుడు, ఆ కొటేషన్ ను మరచిపోకండి - ఒక నిజమైన ప్రవక్త, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" తో నిలుచును.
యేసు కడపటి కాలములో ఏమి జరుగునని మనకు హెచ్చరించియున్నాడు, కాని ఒక నిజమైన సేవకుడు, నిజమైన ప్రవక్త "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" తో ఖచ్చితముగా నిలుచుటకు ఎప్పుడును తప్పిపోడు.
ప్రభువుతో మోషే నిలచాడు. అతడు ఒక సూచన. ఇశ్రాయేలీయుల విమోచనా దినము దగ్గరగా ఉన్నప్పుడు మోషే వారికి ఒక సూచనగా ఉండెను మరియు ఐగుప్తు చివరి దినములలో అతడు వారికి సూచనగా ఉండెను, ఏలయనగా ఫరో సైన్యములన్నియు సముద్రములో మునిగిపోయెను. వారు వారి సైన్య శక్తి నశించు కాలములో ఉండిరి. ఒక దేశము యొక్క ముగింపునకు ప్రవక్త ఒక సూచనగా ఉన్నాడు.
HEB 11:24
46దానిని గూర్చి ఆలోచించండి! ఎంత గొప్ప దేవుడు ఎంత సాధారణముగా క్రియ చేయును. నిశ్చయముగా చదువు లేని పామరులు దానిని అర్థము చేసికొనినయెడల, చదువుకొన్నవారు కూడా అర్థము చేసుకొనవలెను. ఐగుప్తులో బంకమన్ను గుంటలలో ఉన్న బానిసలు ఆ కాలమును అతనిని దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవక్త అని గ్రహించినయెడల, ఫరో యొక్క అంతఃపురములో ఉండువారు మరి ఎంత ఎక్కువగా గ్రహించి ఉండవలెను. కాని అటువంటి వారే దానిని గురించి తెలిసికొనలేరు. ఆ విధమైన వారు ఎలప్పుడు ఆ కార్యమును వదిలి వేయుదురు.
ఆ అంతఃపురపు కిటికీల ద్వారా మోషే ఇశ్రాయేలీయుల బిడ్డలు పోవుచుండగా చూచాడు. ఇశ్రాయేలీయులకు ….. ఫరోకు వారు బానిసలు మరియు కుక్కలు; మోషేకు, వారు దేవునిచే ఎన్నుకొనబడినవారు. బైబిలు చెప్పుచున్నది, మోషే ఎన్నుకొనెను, తన సొంతముగా కోరుకొనెను, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొనెను, అందువలన అతనికి బహుమతిగా ప్రతి ఫలముండెను.
EXOD 4:2
47మోషేకు తెలియును వారు బురదలో పని చేయువారు కారు; వారు వాగ్దానముతో కూడిన ప్రజలు. అతను ఎవరని అతడికి తెలియును, అయితే ప్రజలకు చెప్పలేడు. వారే దానిని గుర్తించవలసినదిగా ఉండెను. అతనికి తనను గూర్చి ఏ కార్యమును చేయవలెనో తెలియును. అతనికి తెలుసును, దేవుడు తన సంకల్పము కొరకు తనను లేపినాడని, కాని దానిని ప్రజలకు చెప్పలేడు. దానికి వారు గ్రుడ్డివారుగా ఉన్నంత కాలము, దానిని వారు గుర్తుంచువరకు తన్నుతాను బహిరంగముగా ఎన్నడు బయలుపరచుకొనలేదు. అటు తరువాత వారు ఆ సూచనను చూచి దానిని తెలుసుకున్నారు.
ఆయన చెప్పెను, ''ఇశ్రాయేలీయులకు ఒక సూచన నిచ్చెదను. ఈ కర్రను తీసుకొనుము, దానిని సర్పముగా మార్చుము. వారు దానికి చెవి యొగ్గనియెడల, నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుము, వెలుపలికి తీయుము; కుష్ఠము స్వస్థతయగును, అప్పుడు వారు నమ్మెదరు. అయినను వారు దానిని వినకుండిన యెడల, నైలు నది నుండి నీళ్ళు తీసి, పొడి నేలపై పోయుము, అప్పుడు నీళ్ళంతయు రక్తమగును." అది ఒక దేశపు సూచన. ఆ ప్రజలు దానిని నమ్ముదురు. దేవుని సూచన రుజువగునప్పుడు అంగీకరించుటకు తయారుగా ఉన్నవారు దానిని నమ్ముదురు. కాని దేశమునకు వేరే విధమైన కార్యము కావలసియున్నది. అందువలన ఆయన వారికి ఒక సూచన నిచ్చాడు.
MATT 10:28•
LUKE 12:4,5
48దేవుడు ఒక మనిషిని ఉపయోగించుకొనెను, ఒక సాత్వికమైన మనిషిని దేశము యొక్క వినాశ కాలములో ఒక ప్రవక్తను సూచనగా అక్కడ ఉపయోగించెను. దేవుడు ఇంకొకరిని పంపును, ఇంకొకరిని లేపును! ప్రజలలో అటువంటి భారము ఉండవలయును. వారు మేల్కోనవలెను, వారు గుర్తించవలెను. వారు ఏ విధమైన దినములలో జీవిస్తున్నారో, వారు ఎటువంటి పరిస్థితులలో బంధింపబడియున్నారని వారు మేల్కొనక ముందు తెలుసుకొనవలయును. మీరు ఎప్పటివలె జీవించుచుందురు: "దేవుడు నాకొక మంచి గృహమును కట్టించును. జోనసస్ కంటే నాకు మంచి కారు ఉండవలయును. ఇది చెయ్యవలెను…" ఓ, చాలా ఉన్నది, ఈ విధముగా మీరు గుర్తించితే పరవాలేదు… అది సరియే, కాని మీరు గుర్తించవలయును, సహోదరుడా, ఈ విధమైన కార్యములన్నియు నశించును! యేసు చెప్పెను, ''శరీరమును చంపువారికి భయపడకుడి [రష్యా అటామిక్ బాంబు]. ఈ శరీరమును కొన్ని నిమిషములలో అగ్నిచే భస్మము చేయువారికి భయపడకుడి, కాని శరీరమును ఆ విధముగా మార్చి ఆత్మను పాతాళములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి." అది అంతే!
49నా తల్లి హాస్పటల్ లో ఉన్నప్పుడు డాక్టరుతో మాట్లాడుచుంటిని. ఆ వైద్యుడు విజ్ఞాన శాస్త్రము ఎంత గొప్పది, అది ఏ విధముగా శరీరములోని ప్రతీ భాగములపై పని చేయుచున్నది, మందు ఔషధములను శరీరమునకు ఉపయోగించినప్పుడు, దానిని గమనిస్తే అది కొన్ని సూక్ష్మజీవులను చంపును. అది జీవకణములను కాపాడును. నేను చెప్పాను, "అది అద్భుతము. అది చూడ చక్కగా ఉన్నది." అతను చెప్పినది కొంత సేపు విన్నాను, కాని నేను చెప్పాను, "డాక్టరుగారు అది మంచిదే. నేను దానిని అభినందించుచున్నాను. అది చాలా బాగున్నది. నిశ్చయముగా అందుకొరకై దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాను. కాని చూడండి, మీరు మీ జీవిత కాలమంతయు సృష్టి పైన ఏదో కనుగొనవలెనని మీ జీవితమును వెచ్చించుచున్నారు, కానీ ఎందుకని ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను గూర్చి కొద్ది సేపు ఆలోచించరు? ఎవరు దానిని చేసారు? దానికి రూపమునిచ్చినది ఎవరు? దేవుడు దానికి రూపము నిచ్చెను. తను సృష్టించిన సృష్టి కంటేను దానిని సృష్టించిన ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడు! ఆయన భూమిని, ఆకాశమును మరియు శరీరమును, జీవమును సృష్టించి దానిని ఏ సమయములలోనైనను దేవుడు తన కోరిక చొప్పున నాశనము చేయగలడు, ఏలయనగా సమస్తము ఆయనవే."
50మనిషి శరీరము పై పని చేయుట చాలా అద్భుతమైన కార్యముగా ఉన్నది. దానిని మనము అభినందించుచున్నాము. వారు ఒక మనిషి కళ్ళను ఇంకొకరికి అమర్చగలరు. ఆ చిన్న త్రాడు తీసుకొని మనిషి కంటిని బయటకు తీసి, ఆ కంటిని అలాగే ఇంకొక మనిషి అమర్చగలరు, అప్పుడు అమర్చబడిన ఆ కంటి నుండి ఆ మనిషి చూచును. అది అద్భుతమైన కార్యము.
ఒక తల్లి గర్భవతిగా ఉండి బిడ్డను ప్రసవించు సమయములో, బిడ్డను సులభముగా ప్రసవించలేకపోయినయెడల, తల్లి మరియు బిడ్డ ఇద్దరు మరణించుదురు. అది సరియే. కాని ఎప్పుడైన ఆ విధముగా జరుగకుండా ఉండి ఉండవచ్చును, అది వేరే - బహుశ ఆ విధముగా జరుగదు. కాని ఈ రోజులలో అటువంటి గర్భిణి స్త్రీలకు, ప్రసవించు వేళలో ఆ తల్లిని గదికి తీసుకొనిపోయి మందులు ఇచ్చి బిడ్డను బయటికి తీయుదురు. సాధారణముగా ప్రసవించిన విధముగా ఉండును. మనము దానిని అభినందించుచున్నాము.
51ఒక పద్ధతిని నాకు చెప్పండి… ఈ పట్టణములో నీరు సరఫరా చేయు పైప్లలో ఒక వాల్వును మూసివేసిన యెడల, ముఖ్యమైన వాల్వు దగ్గర చొచ్చుకొని నీళ్ళు ఉబికి బైటకు వచ్చును. అయినను మనము ఒక కాలును విరిచి, చేతిని విరగ గొట్టుకొనిన అద్భుతమైన దేవుని వలన కొన్ని క్షణములలో రక్తమును ఇచ్చి అతనికి జీవమునివ్వగలము. ఎవరు దానిని చేయగలరు? నాకు చెప్పండి.
రక్తనాళమును కోయండి, నీరు సరఫరా చేయు ప్రధానమైన మార్గమును కోసినయెడల ఆ నీరంతయు వాల్వు దగ్గర వచ్చి ఎక్కువ శక్తితో వేగముగా బైటకు వచ్చును. అది ఏమి చేయును? మరల ఆ విధముగా చేయండి మరియు వేసిన ఆ నీటిని వేరే దారి లేక వాల్వు యొద్ద నీళ్ళు ఎక్కువ వేగముగా వచ్చును. దేవుడు కాని రక్తము తిరిగి పోవుటకు దారి పెట్టకుండ ఉండిన యెడల, రక్తమంతయు హృదయమునకు పోయి మనము చనిపోవుదుము. ప్రతిసారి మీరు వేళ్ళను కోసుకొనినప్పుడు అది క్షణమే మరణము. ప్రతిసారి మీరు శరీరములలో ఎక్కడైనా తెగినప్పుడు, రక్త నాళములు తెగి ఆ క్షణమే మరణము. వ్రేళ్ళు కోసుకొనిన మీరు మరణించుదురు. అది అంతే. ఆ రక్తమంతయు గుండెకు పోయి అది మిమ్ములను చంపును. అయితే దేవుడు…
మనము ఇప్పుడు తలచినయెడల అద్భుతము. వైద్యశాస్త్రము ఏ విధముగా రక్తము తిరిగి గుండెకు పోకుండా రక్త నాళములను కట్టుకట్టి, రక్తము కారకుండా చేయుచున్నారు. అది అంతయు బాగున్నది. దానిని ఆ విధముగా సృష్టించినది ఎవ్వరు? చూశారా, మనము సృష్టిపై దృష్టి నిలిపి దానియొక్క సృష్టికర్తను మరచిపోవుచున్నాము, చూచారా. మనము ఇహలోక కార్యములను చూచుచునే, ఆత్మీయ కార్యములను మరచిపోవుచున్నాము. అదియే మనము చేయుచున్నాము.
JER 28:9
52దేవుని ప్రవక్తలగా ఉన్నవారి యొద్ద ఆయన వాక్యము ఉన్నది. అందువలననే ప్రజలు వారిని నమ్ముచున్నారు. ఆ కార్యము వలననే దేవుడు మోషేతో చెప్పెను… ఆదికాండములోను, నిర్గమకాండములోను అన్ని చోట్ల, ''మీ మధ్యలో ఎవరైన ప్రవక్తవి, ఆత్మతో నింపబడివానని వచ్చిన యెడల…" మనము ఏ విధముగా ఈ కార్యములను తెలిసికొనవలెను? ఆయన చెప్పెను, ''అతడు ఏమైనా చెప్పి, అది నెరవేరినయెడల, ఏదైన కార్యమును చెప్పి అది జరిగినయెడల, అప్పుడు నమ్ముడి,'' చూచారా. అది ఒక సూచన. కావున ఆయన, ఆయన యొక్క వాక్యమును - నాయకులకు ఇవ్వలేదు, నియంతలకు ఇవ్వలేదు - కాని ప్రవక్తలకు ఇచ్చెను.
కృశ్చేవ్ ఈ ప్రపంచమునకు ఒక సూచన కాదు. కాదయ్యా! హిట్లర్ ప్రపంచమునకు ఒక సూచన కాదు. కాని ఎక్కడో ఒక చోట దేవుని ప్రవక్త సాత్వికముగా ఆ ఘడియ కొరకు వేచియున్నాడు. అతడే సూచన. అతడు ఈ ప్రపంచమును ఖండించి మరియు సంఘమును రక్షించును - ఒక ప్రవక్త.
53ఏలియా అతని రోజులలో ఒక సూచన, ప్రవక్త అయిన ఏలియా. అతడు దేవుని వాక్యము యొక్క సూచన అయి యుండెను - ఐగుప్తుకు న్యాయతీర్పు మరియు ఇశ్రాయేలు అతనిని నమ్మినయెడల వారికి విమోచన.
ఏలియా ఉన్న ఆ పాపపు దినములలో ఇశ్రాయేలు సమస్తము దేవుని నుండి వెనుదిరిగి పాపము వైపుకు తిరిగిరి. వారు క్రమమును మరచినారు. దేవుని చేత నడిపింపబడినామని మరచిపోయినారు, మరియు గొప్ప యెహోవా ఎర్ర సముద్రమును తెరచి ఐగుప్తు నుండి బయటికి తీసికొని వచ్చెను అని, మరియు మోషే వంటి గొప్ప ప్రవక్త వారి మధ్య ఉన్నాడని మరచిరి. దానిని వారు మరచిరి. మనము మరచితిమి. మెతడిస్టులైన మీరు, జాన్ వెస్లీని మరచిరి. లూథరన్లు అయిన మీరు, మార్టిన్ లూథర్ను మరచిరి. బాప్టిస్టులైన మీరు, జాన్ స్మితను మరచిరి. మనలో అనేకులు చార్లెస్ ఫిన్నీని మరచిపోయినాము. వీరందరిలో గొప్పవాడైన చార్లెస్ ఫిన్నీని మనలో అనేకులు మరచిపోయినాము.
54ఈ విధముగా చెప్పబడుచున్నది. ఫిన్నీ ద్వారా దేవుని యొద్దకు నడిపింపబడిన అనేకులలో నూటికి తొంబై యేడు మంది శాతము అలాగే దేవుని సత్యములో ఉన్నారు. మూడీ వలన మారిన వారిలో, నూటికి డెభై అయిదు శాతము ఆ సంవత్సరములోనే దిగజారినారు. ఆ విధముగా వెస్లీ మార్చిన వారిలో అనేకులు సత్యము నుండి వెనుదిరుగుచున్నారు. కాని ఫిన్నీకి తొంబైయేడు శాతము అట్లే యున్నారు. పొట్టిగా, బట్టతలతో, బక్కపలచగా ఉన్న అతను, ప్రసంగ పీఠము దగ్గరకు పోయి ప్రజలను అట్లా చూచునప్పుడు, వారు మూర్చపోవుదురు, ఏలయనగా అతడు ఒక రోజంతయు పరిశుద్ధాత్మ అతని పైకివచ్చు వరుకు అతడు పొదలలో ఉండెను. ఆ కార్యము అదియే. 'రెండు వందల సంవత్సముల క్రితము వెస్లీ ఉజ్జీవ కూటములు జరుగుచున్నప్పుడు న్యాయతీర్పు వచ్చు చున్నప్పుడు, ఆ కడపటి కాలమునకు అతడు ఒక సూచన. అతడు ఒక సూచన… ఆ పాపపు సంతతి…
55ఏ విధముగా ఏలియా ధైర్యముగా, దీటుగా అక్కడ అతను మాత్రము నిలుపబడ గలిగెను, ఎవ్వరు అతనితో లేరు - అయితే అతడు దేవుని యొక్క సూచనయైయుండెను. సవీన కాల మార్గము వలె మత గురువులు అందరు అహాబుతో వెళ్ళారు. ఆ సంతతిలో వాళ్ళు నవీనముగా ఉన్నారు. అయితే ఆ పాత అహాబు అతని కూడా ఉన్న వారందరు ఆ కాలపు సంఘములను కాదెల్… కాధలిసమ్ కాదు, అయితే అటు వంటి కార్యము - విగ్రహారాధన. కొందరు ఈ విధముగా ఆరాధింపవచ్చు, మరియు స్వేచ్ఛ - "మీరు కోరిన విధముగా చేయవచ్చును," అను స్థానమునకు వారిని తీసుకొని వచ్చెను. అటువంటి పరిస్థితిని తీసికొని వచ్చెను.
1KGS 17:1•
1KGS 19:10,18
56అయితే "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" తో ఏలియా ఎంత ధైర్యముగా నిలిచెను." ఓ, దేవా! అటువంటి మనుష్యులను మాకిమ్ము, అతడు యెజెబెలు యొక్క స్థితిని ఆమెకు చెప్పుటకు భయపడలేదు. అతడు అహాబును గూర్చి భయపడ లేదు. అతడు తప్పుగా ఎంచబడినందులకు భయపడలేదు. అతడు ధైర్యముగా నిలబడి, అహాబు నొద్దకు వెళ్ళి - "నా మాట ప్రకారము మంచైనను పడదని,'' చెప్పెను. ఆమేన్!
అతను ఏమైయున్నాడు? పాపపు సంతతికి ఒక సూచన. ఇశ్రాయేలు దానిని చూచినదా? లేదు! అతడిని చూచి నవ్విరి, పరిహాసము చేసిరి. అతడు ముందుగా చెప్పెను, కరువు వచ్చును కలవరములు కలుగును, ఆకలి, పస్తులు. "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" తో ధైర్యముగా నిలచి ప్రవచించెను, "ప్రభువా, వారు సత్యమునంతయు చంపిరి. వారు అంతయు నిర్మూలము చేసిరి. నేను ఒక్కడినే నీ యొక్క వాక్యముతో నిలచియున్నాను!" అని చెప్పెను.
ఈ యొక్క శ్రమ దేనికొరకు? దేవుని యొక్క వాక్యము.
1KGS 17:2
57ఏలీయా దేవుని వాక్యముతో నిలువ వలెనని యున్నాడు. అతడు ఒక నిజమైన ప్రవక్త. తక్కిన ఇతర ప్రవక్తలు చెప్పిరి, "ఓ, మంచిది, అదేమంత వ్యత్యాసమును తీసుకొని రాదు. నీకు తెలుసా, యెహోవా పట్టించుకోడు," అనిరి. యెహోవా నిశ్చయముగా పట్టించుకొనును! అది ఆయన వాక్యమైయుండవలెను. ఏలీయా ఆ వాక్యముపై, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" తో ధైర్యముగా నిలచాడు. ఒక రోజు ఒక చిన్న రహస్యమును దేవుడు అతనికి ఇచ్చాడు. "ఇక్కడ నీవు ఇచ్చిన సాక్ష్యము వలన నాకు ఏడు వేల మంది ఉన్నారు. ధైర్యము లేక వారు బయట చెప్పుకున్నారు. నీ సాక్ష్యమును పొందుటకు వారు అధైర్యులుగా ఉన్నారు. ఈ పొదలలో ఎక్కడో వారు దాగియున్నారు. అయినను వారి హృదయములో వారు నా దాసులు. విగ్రహములకు వారు మోకాళ్ళు వంచలేదు. వారు దానిని చేయుటకు (విగ్రహారాధనకు) భయపడ్డారు; అయితే నేను నీకు ఒక సూచన ఇచ్చుచున్నాను మరియు నీవే ఒక సూచన నీవు వాక్యముపైన నిలువుము. అక్కడ నిలువుము. నేను నిన్ను కాచెదను వారికి ఒక సూచననిచ్చెను." హల్లేలూయా! దేవుని వాక్యమే సూచనగా ఆలాంటి కార్యమును మాకు పంపుము. దేవుడు యొక్క వాగ్దానములు అన్నియు అతనిలో దృఢపరచబడును, ఏలయనగా అతడు ఒక సూచన, మరచి పోయిన ఒక సూచన.
ఓ, అహాబు గొప్ప రాజని, అన్ని రాజ్యములు అతనికి భయపడుచున్నవని వారు తలంచిరి, అందువలన అది చాలును. కాని ఏలీయా వాక్యమునకు సూచనయై యున్నాడు. ఆయన ఒక నిజమైన ప్రవక్త, వాక్యము యొక్క సూచన. కావున అతడు వాక్యము యొక్క సూచనగా ఉన్నప్పుడు, వారు అతనిని నమ్మలేదు, అతనివలన వారికి ఉపయోగము లేకపోయినది.
1KGS 17:11,12
58దేవుడు అతనిని కర్మెలు పర్వతము నుండి పంపినప్పుడు, కెరీతు వాగు దగ్గర నుండి పంపినప్పుడు, కాకోలముల ద్వారా అతడు పోషింపబడిన పిమ్మట, ఆ వాగు ఎండిన పిదప, ఒక విధవరాలికి అతడోక సూచనగా ఉండెను. అతడోక విధవరాలి ఇంటికి వెళ్ళెను. ఒక ప్రసంగీకునికి అది ఎటువంటి స్థలము. దేవుడు అతనిని అక్కడికి వెళ్ళు, అని చెప్పినందు వలన, అతడు వెళ్ళెను. అయితే అతడు అక్కడకు వెళ్ళెను. చెప్పెను, ''నిన్ను పోషించమని ఆమెకు ఆజ్ఞాపించియున్నాను.''
ఆమె ఒక సూచనగా తగును…. అతడు ఒక సూచనగా తగును. ఆమె అక్కడ ఉన్నప్పుడు ఒక రొట్టె చేసుకొనుటకు పట్టెడు పిండి ఆమెకు, ఆమె బిడ్డ తినుటకు మాత్రమే చాలును. అప్పము చేసికొనుటకు బుడ్డిలో కొద్దిగా నూనె ఉండెను. ఆమె చెప్పెను, "రెండు పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.''
1KGS 17:10-13
59ఆ భయంకరమైన, వేడి, ఎండలో భయంకరమైన ఆ రోజు గొర్రె రోమముల వలె అగుపించు ముఖముతో నెటిసిన వెంట్రుకలు వ్రేలాడుచుండగా, అతని బట్టతల ప్రకాశించుచుండగా, ఆ ద్వారము యొద్ద ఆనుకుని నాకు కొద్దిగా నీళ్ళు తీసికొని రమ్మని చెప్పెను. మరియు నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసికొని రమ్మని చెప్పెను.
ఆమె చెప్పినది, "నా యొద్ద చాలినంత అప్పము లేదు. నేను నా కుమారునికి చిన్న రొట్టెను చేసుకొనుటకు రెండు పుల్లలు ఏరుచున్నాను. మా ఇద్దరికి తలా చెరియొకటి చేయుటకు కావలసిన పిండి వున్నది. అది తిని మేము చావబోవుచున్నాము."
అతడు చెప్పెను, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, భయపడకుము. అటువంటి మనిషి మనకు అవసరమైయున్నాడు. అప్పుడు కాదు. "ఇప్పుడు ఆ కార్యము జరుగ వచ్చును, సోదరీ. అది నెరవేరవచ్చును. నాకు తెలియదు." కాదు, కాదు! ఏలీయా రూఢిగా యున్నాడు. "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," ఈ భూమి మీద దేవుడు వర్షము కురిపించు వరుకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు." ఆమేన్! అక్కడే మీరున్నారు. అది ఆమెకు సరియైన సూచనగా తగును.
1KGS 17:17-19,23,24
60ఆమె ఈ రోజు సంఘమునకు పోలికగా ఉన్నది. ఏలీయా అక్కడ ఆమె యొద్ద కొంత కాలము ఉండెను. ఆమెకు ఒక చిన్న కుమారుడు ఉండెను. అతడు జబ్బులో పడెను. అతడు అనారోగ్యముతో ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగ్రస్తుడయ్యెను; అతడు చనిపోయెను. అప్పుడు ఆమె ఏమి చేసినది? సంఘము ఆ సూచనలను ఇదివరకే చూచినది. అయితే ఏమి? ఆ చిన్న ఆపద వచ్చిన వెంటనే ఆమె సంఘమును తప్పు పట్టనారంభించెను. ఆమె ఏలీయాను తప్పుపట్టనారంభించెను. ఆమె చెప్పెను, "దైవజనుడా, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి, నా కుమారుని ప్రాణము తీయుటకు ఇప్పుడు నీవు ఇక్కడకు వచ్చితివనెను."
ఏలీయా ఆ బిడ్డను తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి వెళ్ళి, తన మంచము మీద వానిని పరుండ బెట్టి, అతనిపై పరుండి "ప్రభువైన దేవా, [హల్లెలూయా], ఈ చిన్న వానికి ప్రాణము మరల ఇమ్మని" చెప్పెను. ఆ చిన్న బిడ్డ మేల్కోనెను.
అతడు ఆ బాలుని క్రిందకు తెచ్చినప్పుడు, ఆమె బిడ్డను చూచెను మరియు మరల అతనిని చూచెను. ఆమెకు తెలిసినది అక్కడ ఎదో ఉన్నదని, ఆమె చెప్పెను. ''దీనివలన దేవుని యొక్క వాక్యము నీ నోట ఉన్నదని నాకు తెలియును." ఆమేన్! ఆ విధవరాలికి అతడొక సూచన. దేవుని యొక్క శక్తి జీవింపచేయుటయు, చంపుటయు, చనిపోయిన ఆ బిడ్డకు ప్రాణము ఇచ్చుటయు ఆమె చూచినప్పుడు, ఆమె చెప్పెను, ''నీవు దైవజనుడవని దీనివలన నేను తెలుసుకున్నాను.'' ఆమెకు అది తెలియును. ఈ రోజు దేశములు ఆ విధమైన కార్యమును చూచి నవ్వుచున్నది. ఆ రోజులలో చేసిన విధముగానే వారు నమ్మరు. అయితే ఆ స్త్రీ వేరే విధముగా తెలిసుకొనగలిగినది. అది అక్కడ ఒక సూచనగా ఉండెను, ఏలనగా చనిపోయిన ఆమె కుమారునికి జీవమునిచ్చు సూచనగా అతడు ఉండెను. ప్రవక్తలు ఎల్లప్పుడు దేవుని యొక్క సూచనలుగా ఉన్నారు.
1KGS 18:21
61అప్పుడు ఏలీయా కడపటి బలపరీక్షకు పిలిచి, చెప్పెను, "దేవుడు దేవుడైనయెడల, ఆయనను సేవించుడి; ఒకవేళ బయలు గాని దేవుడైతే, అతనిని సేవించుడి!" ఈ రోజు ఆ విధముగా ఏలీయాకు ఒక అద్భుతమైన రోజు కదూ? రాజకీయములు దేవుడైతే, దానిని సేవించుడి! రాజకీయములలో మనకు ఏమి ఉన్నది? మనము ఏమి చేసియున్నాము? మనము అవినీతి గుంపు తప్ప మరొకటి కాదు. మనము ఏమి పొందలేదు, కాని మనకు స్నేహితులుగా ఉన్న దేశములను కమ్యూనిజమునకు కోల్పోయినాము. మనము ప్రజలపై అధిక పన్నులు వేసి, వారి డబ్బులు అంతయు తీసికొని, ఇతరులకు పంపించుచున్నారు. వారు అమెరికనుల డబ్బుతో పెరిగి కమ్యూనిజమునకు తిరిగి పోవుచున్నారు. అది వేషధారణ. అది నిజము!
62మనము (అమెరికనులు) క్రైస్తవులమని చెప్పుకొనుచున్నాము. అలాగైన క్రైస్తవులుగా ఉండవలయును - ఏదో ఇతరులను పోషించుట అటువంటి కార్యములు అవి చిన్న కార్యములు… అవి… సాధారణముగా మంచి హృదయమున్న వ్యక్తి ఆ కార్యమును చేయును. అది మతము; అది రక్షణ కాదు. అనేకులు మతమును మరియు రక్షణను కలిపివేయుచున్నారు. మతము అనగా విధవరాండ్రను, బీదవారిని పోషించుట మొదలగునది. అది మతము. కాని రక్షణ అనునది, నూతన జన్మ, మరల జన్మించుట. అది వేరైనది. మతము, మహ్మదీయుడు ఒక మతము. ఎన్నో మతములు ఉన్నవి.
1KGS 18:19,20,23,24,26•
ROM 4:21
63కర్మేలు పర్వతము పైన ఆ రోజు అతను బలపరీక్షకు అహాబును సంస్థ శాఖలకు చెందిన వేలకొలది మతాచార్యులను పిలిచాడు. కర్మెలు పర్వతముపైన వారిని పిలిచి చెప్పెను, "పైకి ఇక్కడికి రండి! నన్ను ఇక్కడ సంధించుడి! మీ అందరి ఎదుట నేను నిలిచెదను!" అతడు ఏమి చేసెను? అతని యొద్ద "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ఉన్నది. అతడు భయపడ లేదు. అతను చెప్పెను, "ఒక ఎద్దును బలి ఇయ్యుడి, బయలును పిలవండి. అగ్ని మూలముగా బదులిచ్చు దేవుడే దేవుడు.''
కావున రోజంతయు ఉదయము నుండి భోజన సమయము వరుకు బలిపీఠముపై ఎగిరి, వారు ఈటెతో పొడుచుకొనిరి, వారు అరచిరి, వారు గంతులు వేశారు, ఏలీయా ఇటు అటు తిరుగుచు చెప్పెను, ఇంకా శబ్దముగా గంతులెయ్యండి. అతడు చేపలు పట్టుటకో దేనికో పోయి ఉండవచ్చును, అయితే అతనికి "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ఉండెను. అతడు తృప్తితో ఉండెను, అతనికి దేవుని వాక్యము ఉండెను. సహోదర, సహోదరిలారా, దేవుని యొక్క వాగ్దానమునకు మించి ఏ మనుష్యునికైనను వేరే ఏమి కావలయును? ఆయన దానిని చేసెదనని దేవుడు చెప్పెను. ఆయన చెప్పిన దానిని నెరవేర్చగల దేవుడని అబ్రాహాము వలె అతడు ఎంచెను. దేవుడు చేయగలుగునని అతడు ఎరిగియుండెను, ఏలయనగా దేవుడు అలాగు చెప్పెను.
1KGS 18:26,31,32•
ACTS 2:4
64అలాగు వారినందరిని పైకి అతడు పిలిచెను. మరియమ వారు ఆ రోజంతయు, సాయంకాలము బలి వరుకు ఈటెలతో పొడుచుకొనుచు, గంతులు వేయుచు, అరుచుచుండిరి. అప్పుడు ఏలీయా గమనించండి, అతడు ఏలాగు చేసెనో చూడండి, అతడు చేసిన మొదటి కార్యము పన్నెండు రాళ్ళను ఒకటిగా పేర్చెను. దేవుడు విభజింపబడలేదు. సంఘములను సంస్థలు విభజించును, అయితే దేవుడు కాదు.
ఒకడు చెప్పెను, ''మీరు క్రైస్తవులా?''
''నేను ఒక బాప్టిస్టును.'' సరి, అది నేను ఒక పంది అని చెప్పుట కంటే వేరే ఏమి కాదు.
''నేను ఒక మెథడిస్టును,'' అని చెప్పుట కూడా దేవునికి పంది అని చెప్పుట.
నేను చెప్పెదను, "నీవు ఒక క్రైస్తవుడవా?'' క్రైస్తవుడుగా ఉండుట ఆనగా - మీరు క్రీస్తు వలె వుండుట, దైవత్వము మీలో నివసించుట, పెంతెకోస్తు దినమున కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ వలె పరిశుద్ధాత్మను కలిగియుండుట. ఏదో కొంత ఉద్రేకము కాదు, కాని నేను చెప్పునది నిజమైన పెంతెకోస్తు. అది సరియే.
"నేను పెంతెకోస్తును!'' ''నేను ఏకత్వమునకు చెందినవాడిని!" "నేను త్రిత్వమునకు చెందిన వాడిని!" "నేను … ఓ, మై! నేను ఏదో ఒకదానికి చెందినవాడిని, అని చెప్పుట కంటె వేరే ఏదియు కాదు. అది దేవునికి లెక్క కాదు. అది విభజించును!
మతాచార్యులలో జరిగిన కార్యము అదే. కాని ఏలీయా దేవుడు అందరికి ఒక్కడే దేవుడని నిరూపించుటకు వన్నెండు రాళ్ళను ఒకటిగా దొర్లించి, ఒకటిగా ఒకే చోటకు దొర్లించాడు.
1KGS 18:32,35
65అలాగు అందరిని ఒకటిగా కూడులాగున చేసిన పిదప, ఆ ఎద్దును చంపి దానిని బలిపీఠముపైన కట్టెలపై పెట్టాడు. అతడు చెప్పెను, ''నిశ్చయముగా ఇప్పుడు ఇందులో ఏ కపటము లేదు, వెళ్ళి నాకు పన్నెండు తొట్టెల నిండా నీళ్ళు తీసుకు రండి.'' అతడు ఆ కట్టెలను ఆ నీళ్ళతో తడిపాడు. ఓ, హల్లెలూయా! అతడు దేవుడు దేవుడని నిరూపించవలెనని ఉన్నాడు. ఎందులకు? "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అతని యొద్ద ఉండెను. అతడు ప్రవక్త. అతని యొద్ద దేవుని వాక్యము ఉండెను.
ఆ రోజులలో ఒకవేళ వారిని సంఘము నుండి వెలి వేయుదుమని వారు చెప్పినయెడల, వారు దానిని చేయుదురు, ఇది, అది, లేక వేరొకటి. ఒకవేళ యేసు నామములో మీరు బాప్తిస్మము పొందినయెడల, అలాంటి కార్యములు - అది బుద్ధిహీనత! అయితే అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు."
GAL 1:8,9
66గత రాత్రి ఒక మంచి వ్యక్తి నాతో మాట్లాడుచు వారి చేతులను నా చుట్టూ వేసి, చెప్పెను, "సహోదరుడా బ్రెన్హాం, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నీవు ప్రసగించుచున్న ఆ కార్యములలో కొద్దిగా రాజీ పడిన యెడల…"
నేను చెప్పాను, "ఏమిటీ?"
అతను చెప్పెను, "ఈ బాప్తిస్మములాటి కార్యములు." ఈ చికాగోలోను పరిసరములలో అన్ని సంఘముల వారు నిన్ను కోరుచున్నారు, కాని దానిని గూర్చి చెప్పెదవని భయపడుచున్నారు."
నేను చెప్పాను, "తప్పకుండా నేను దానిని గురించి (బాప్తిస్మము) చెప్పెదను. నిశ్చయముగా, నేను దానిని చెప్పెదను."
అతడు చెప్పెను, "సరి ఆ ఒక్క కార్యములోనే (బాప్తిస్మము) వారందరు నీకు వ్యతిరేకముగా వున్నారు."
నేను చెప్పాను, ''అలాగైన వారు నాకు వ్యతిరేకముగా లేరు. నేను కాదు దానిని చెప్పినది; దేవుడు దానిని చెప్పెను. అది ఎవరైనా తప్పు అని నిరూపించమని నేను సవాలు చేయుచున్నాను," చూశారా.
చెప్పెను, "మంచిది, మీరు చూచారా, మీరు అన్నిటికి ఒప్పుకొని సహవాసములో ఉండాలి.'' అదే విధముగా ఆయన చేయాలి అని వారు కోరిరి. దేవుడు రాజీపడడు. లేదయ్యా! ఆయన ఎప్పుడు రాజీపడడు.
అతడు చెప్పెను, "బ్రెన్హాం సోదరుడా, ఇప్పుడు నేను ఒక కార్యము నిన్ను అడగాలనుకుంటున్నాను. ఆ ప్రభువు దూత…?" "ప్రభువు దూతను మేమందరము నమ్ముచున్నాము. ఆ ప్రభువు దూత దీనిని నీకు చెప్పినదా?" అని అతను నన్ను అడిగెను.
అప్పుడు నేను చెప్పినదేమనగా, "ఓ ప్రభువు దూత ఏమి చెప్పునో నాకు అక్కర లేదు. అతడు ప్రభువు దూతైనయెడల, దానిని చెప్పును. ఆయితే అతడు విరుద్ధముగా తప్పుగా చెప్పినయెడల, ప్రభువు దూత కాదు!" నేను చెప్పినదేమనగా, "ఏ దూతైనను లేక ఎవరైనా చెప్పినను, పౌలు చెప్పినదేమనగా, "పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను వేరొక సువార్త మీకు ప్రకటించిన యెడల, అతడు శాపగ్రస్తుడవును గాక."
ROM 3:4
67దూతలు మరియు అందరు ఇక్కడ ….. అడ్వెంటిస్టు మత శాఖకు చెందిన జోసఫ్ స్మిత్, బ్రిగ్ హామ్ యంగ్ మరియు అనేకులు దూతలను గూర్చి ఇహలోక కార్యములు మాదిరి కార్యములను జోడించి ఏవేవో కార్యములు వారు చూచుచున్నారు, అయితే వారు చెప్పినవన్నియు వాక్యమునకు విరుద్దముగా ఉన్నవి. అయితే దేవుడు తన వాక్యముతో నిలచును. అది ఆయన వాక్యము.
నేను చెప్పాను, ''అది ప్రభువు యొక్క వాక్యము! నిజముగా. నాకు తెలిసినదంతయు నాకు బోధించినది ఆయనే. నేను ఎప్పుడు సెమినరీ లేక పాఠశాలకు వెళ్ళలేదు. అది ఆయన దగ్గర నుండి వచ్చినది." అయితే నేను చెప్పాను, "అది విరుద్ధమైనా… అది విరుద్ధమైయుండినయెడల, అది ఆయనే అని నేను నమ్ముదును, ఎందుకనగా అది… మొదట దేవుని వాక్యము; తక్కినవన్నియు అబద్దము." దేవుని వాక్యము, దానితో నిలిచియుండుము.
1KGS 18:33,39
68కావున ఏలీయా అక్కడకు వెళ్ళి, పన్నెండు తొట్టెల నీటిని ఆ కట్టెల పై పోసి వాటిని తడిపి, ఏ ఉద్రేకము లేక ప్రశాంతముగా బయట ఉండెను. ఎందువలన? దేవుడు అబద్దమాడలేడు. దేవుడు అతనితో చెప్పెను. అతడు చెప్పెను, "ప్రభువా, అబ్రాహాము యొక్కయు, ఇస్సాకు మరియ ఇశ్రాయేలు దేవుడా, నీవు దేవుడని ఈ రోజు తెలియును గాక, మరియు నేను నీ యొక్క దాసుడను, నేను నీ ఆజ్ఞ ప్రకారము దీనిని చేసియున్నాము, ఎందుకనగా ఇది 'ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు!' నీవు చెప్పినందు వలన నేను దీనిని చేసితిని, ఎందుకనగా ఇది నీ వాక్య ప్రకారము ఉన్నది! నీవు దేవుడవని ఇప్పుడు తెలియబడును గాక!" అప్పుడు ప్రభువు యొక్క అగ్ని దిగి, దహనబలి పశువును తడిచిన కట్టెలను, రాళ్ళను సమస్తమును దహించి, అన్నింటిని తీసుకొనిపోయెను. అప్పుడు ఆ ఏడువేల ఇశ్రాయేలీయులు కేక వేసిరి, ''దేవుడు దేవుడుగా ఉండును గాక!''
69ఏలీయా వృద్ధాప్యుడై, బలహీనుడుగా, ముడతలుబడ్డ తోలుగల శరీరముతో, చేతిలో చిన్న కర్రతో, ఒక చిన్న గిన్నెలో నూనె అతని ప్రక్క వేలాడుచుండగా, గొర్రె తోలుతో అతడు చుట్టబడి యుండుట చూచుట ఎంత ఆనందమయము. ఆ విధముగా ఈ రోజు వీధిలో నడిచినయెడల, వారు చెరశాలలో వేయుదురు. అయితే వారు స్త్రీలు సగము దుస్తులతో ఉండుట అనుమతించుదురు, కాని వారిని ఆ విధముగా చేయరు, చూశారా. కావున మరి… అయితే ఆ ప్రక్క అతడు దిగి వచ్చెను, ఆ కొండ ప్రక్క. చేతి కర్రతో…
1KGS 18:42,43
70ఇప్పుడు, కర్మెలు పర్వతము ఎడారి మధ్యలో ఉన్న చిన్న ఖాళీ స్థలము కాదు. అది ఒక పెద్ద పర్వతము. అది ఈ విధముగా ఉండును, ఎంతో ఎత్తుగా వెళ్ళి సముద్రపు దిక్కున చూచునదిగా ఉన్నది. మరి ఏలీయా, గేహాజీ ఆ కొండపైకీ పరుగెత్తి పోయిరి. అప్పుడు తన శరీర వెనుక భాగము పడమటిగా పెట్టి సూర్యుని వైపు బోర్లపడి ముఖమును నేల మోపి దేవునితో మొర్రపెట్టసాగెను. మూడున్నర సంవత్సరములు మంచైనను పడలేదు. అతడు, "నీవు వెళ్ళి సముద్రముపైన మేఘములేమైనా కనబడుచున్నవా, చూడమని," గేహజీతో చెప్పెను.
ఈ పర్వతము పైన నిలుచుకొని, ఆ ప్రక్క చూచుచు, చెప్పెను, "నేను ఏమియు చూచుట లేదు.''
అతడు అక్కడే నిలిచియుండెను! ''దేవా, ఈ ప్రజలు పశ్చాత్తాపపడిన యెడల, ఈ ప్రజలు మరల నీ యొద్దకు వచ్చినయెడల, ఈ వెర్రితనము నుండి తప్పిదమైన కార్యములు నుండి బయటకి వచ్చి, నీ వాక్యము వైపుకు తిరిగినయెడల, అప్పుడు నీ వాక్యమునకు బదులిచ్చు దేవుడవు నీవు.''
71అదే కార్యమును నేను ఈ రోజు చెప్పునివ్వండి. ఈ సంఘ శాఖలను పగుల గొట్టుదుము. సంఘ శాఖల బేధములను మరచి నలుగుగొట్టపడి ప్రజలు దేవుని వాక్యము వైపుకు వచ్చిన యెడల, అగ్నితో ఇప్పుడు కూడా దేవుడు బదులిచ్చునని నేను మీకు నిరూపించెదను.
నేను ప్రజలను అడుగుదును, దేవుని పిలువండి. [స్పష్టత లేని మాటలు] ఒక మనుష్యుని పిలుచుచున్నారు. ప్రజలు ప్రవక్తను పిలిచినయెడల; దేవుడు అతనిని రంగముపై నిలుపును. రాజ్యములు ఆ కార్యమును చేయవలసినదిగా సవాలు చేయుచున్నాను. మీరు సాగిలపడి ముఖమును నేలమోపి ఒక విమోచనకుని పంపవలయునని దేవుని కోరినయెడల, ఏమి జరుగునో గమనించండి. ఒకసారి ఆ కార్యమును చేయుడి. దేవుడు బదులిచ్చును. దేవుడు ఎల్లప్పుడు చేయును.
1KGS 18:38,40
72సాగిలపడి చెప్పెను, "దేవా, ఈ రోజు జరుగును గాక. ఈ ప్రజలు నీకు విరోధముగా ఉన్నారు. ఈ ప్రజలందరు పలు విధములైన సంఘ శాఖలలో చెదరియున్నారు. కాని ఈ రోజు నీరు దేవుడవు అని, నిన్నునీవు నిరూపించుకుంటివి. "బయలు (దేవుళ్ళను) పారవేయుము!" అని ప్రజలు చెప్పిరి. మరి నేను వేలాది మతాచార్యులను చంపివేశాను. ప్రభువా, వారు మార్గము తప్పియున్నారు. మమ్ములను విభజించు చిన్న అడ్డంకులు, అడ్డుబండలు అన్ని పోయినవి." ఒక మెతడిస్టు, బాపిస్టుతో ఆరాధించుటకు ఇష్టపడుచున్నాడు; బాప్టిస్టు, పెంతెకోస్తు వారితో వచ్చుటకు ఇష్టపడుచున్నారు - హృదయాంతరంగములో సత్యము గలవారు ఉన్నారు, ఆ విశ్వాసులైన ఏడు వేల మంది - అయితే వారు దానిని చేయలేరు. వారు చేసినయెడల, వారి సంఘముల నుండి వారు నెట్టివేయబడుదురు. కొందరు దానిని గూర్చి లెక్క చేయరు - వారు ఎలాగైనా వస్తారు. అది సరియే.
EXOD 2:24•
1KGS 17:1•
1KGS 18:42•
MATT 9:37,38•
LUKE 10:2
73అయితే మనము పక్షపాతము అంతయు నలుగగొట్టి ఒక్కటిగా కూడి చెప్పెదము, "మనము చదువుచున్న మత శాఖలను కాథలిక్కుల తప్పు మార్గమునన్నిటిని మరచి మరల ప్రభుని వాక్యము నొద్దకు వచ్చెదము." అప్పుడు ఏమి జరుగునో గమనించండి. దేవుడు ఒక ప్రవక్తను వారికి లేపును - ఖచ్చితముగా ఆయన చేయును - వారు అంగీకరించుటకు సిద్దముగా ఉన్నయెడల, వారి ముందు దేవుడు ప్రవక్తను పంపును. మొదట వారు ప్రార్థించవలయును. దేవుడు వేచి యుండును.
దేవుడు ప్రజలను దానిలో భాగస్థులుగా ఉండమనుట ఆశ్చర్యముగా ఉన్నది. ఆ పంటను యేసు చూచినప్పుడు, ఆయన చెప్పెను, "పంట కోతకు వచ్చియున్నది, పని వారు కొద్ది మంది. మీరు కోత యజమానుని ప్రార్థిచుడి, (అది ఆయనే), మీరు నాకు ప్రార్ధన చేయుడి, పంట కోతకు పనివారిని పంపుదును." ఆ విధముగా మీ భాగము మీరు చేయవలసి యున్నది. దేవుడు తన సంఘము ఆయనను పిలుచు వరుకు వేచియుండును. అతడు ఎల్లప్పుడు ఆ విధముగా చేయుచున్నాడు. ప్రజలు ఆయన సేవకుని రంగములో దిగమని చెప్పు వరుకు ఈ రోజు దేవుడు కాచుకొనియున్నాడు. ఆ దాసుడు ప్రజలు ప్రార్థించువరుకు కార్యములో దిగడు.
ఇశ్రాయేలు విమోచకుని కొరకు ముఖము నేలమోపి (సాగిలపడి) ప్రార్థించు వరుకు సూచనలు, అద్భుతములతో నిండిన కార్యములతో వారు దిగలేదు. ప్రార్థించువరుకు వారు దేవుని సూచనను చూడలేక పోయిరి. దేవుడు ఆయన యొక్క విమోచకుని కలిగియన్నాడు. దేవుడు ఆ ఎడారిలో ఒక ప్రవక్తను వేచి యుండేటట్లు చేసి, ఆ ప్రజలు సరిగ్గా ప్రార్థనలో నిమగ్నమయ్యే వరుకు ఆ ప్రవక్తను నలుబది యేండ్లు అక్కడే (ఆ ఎడారిలో) పెట్టెను. వారు సరిగా ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు, క్రమములో పడినప్పుడు, అప్పుడు దేవుడు విమోచకుని పంపెను. ఈ రోజు ప్రజలు కూడి ప్రార్థించినయెడల, దేవుడు అలాంటి కార్యమును చేయును. మంచిది.
అతడు అబద్దపు ప్రవక్తలకు, అహాబునకు తాను దైవజనుడను సూచనగా ఉండెను. అతడు దేవుని ప్రవక్త. అతడు ఇశ్రాయేలుకు సూచనగా ఉండెను. అతడు తలంచినప్పుడు ఆకాశమును మూయగలడు, తేరువగలడు. అతడు నిజముగా చేయగలడు. ఎవ్వరైనా ఆకాశమును మూయగలరా నాకు చెప్పండి. దేవుడు తప్ప వేరే ఎవరైనా ఆకాశములను తెరువగలరా, నాకు చూపండి. మరియు దేవుని వాక్యము ఆయన ప్రవక్తల యొద్ద ఉన్నది.
1KGS 22:6-8•
2CH 18:6,7
74మీకాయా, యెహోషాపాతుకు ఒక సూచన. దేవుడు ఒక నిజ ప్రవక్తను ఎల్లప్పుడును ఉంచును అన్న కార్యమునకు మికాయా యెహోషాపాతునకు ఒక సూచన.
ఇప్పుడు, గమనించండి! అతని యొద్ద నాలుగు వందల ప్రవక్తలు ఉండిరి. అహాబు కలిగియుండెను. అతడు ఆ నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించెను మరి వారందరు ఏక మనస్సుతో అతనితో (అహాబుతో) చెప్పిరి. అయినను యెహోషాపాతు: ఒక దైవ మనుషమ్యడు. అతని హృదయములో ఎక్కడో తప్పు ఉన్నదని ఎరిగెను అక్కడ నాలుగు వందల మంది (ప్రవక్తలు) ఉన్నప్పటికిని నీ యొద్ద ఇంకా ఒకరు ఎవ్వరైనా ఉన్నారా అని (అహాబును) అడిగెను.
అతడు చెప్పెను, "వీరందరు ప్రవక్తలే, యెహోవా ప్రవక్తలు. వీరందరు మెతడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్పిటేరియన్లు, ఏకత్వమునకు చెందినవారు. త్రిత్వమునకు చెందినవారు, ఆ విధముగా పలు శాఖలకు చెందినవారు. అందరిని ఇక్కడ మనము కలిగియున్నాము. ఏక మనస్సుతో వారు చెప్పిరి, ఇది గొప్ప దేశము మనము భయపడనవసరము లేదు [అది ఏ విధముగా ఉన్నదనగా, ఒక చిన్న పిల్లవాడు సమాధిని చూచినప్పుడు భయపడును, ఆ భయమును పోగొట్టుటకు ఈల వేయును. లోపల భయమున్నను ధైర్యవంతులుగా కనపడుట]. దానిగురించి నీవు ఏమి భయపడవద్దు."
అడిగెను, "అయితే నీ యొద్ద వేరొకరు ఉన్నారా?"
అతడు చెప్పెను, ఓ, ఇంకొకతను ఉన్నాడు, అయితే అతనిని నేను ద్వేషించుచున్నాను!" అని చెప్పెను. అతడు ఎల్లప్పుడు ఈ దేశమును గూర్చి చెడ్డగా చెప్పును. మాకు ఏదో చెడు సంభవించునని చెప్పును."
1KGS 21:19,23
75యెహోషాపాతు, ''అతని యొద్ద నుండి వినవలయునని,'' ఆశపడుచున్నాను అని చెప్పెను. ఓ, సరి! అతడు ఏమైయున్నాడు? ఒక సూచన. ఎన్ని పలువిధములైన సంఘములున్నను, సంఘ శాఖలు ఉన్నను, వాక్యముతో నిలిచి యుండు ప్రవక్తను దేవుడు ఇప్పటికిని కలిగియున్నాడు.
అహాబు నశించబోవుచున్నాడని యెహోషాపాతుకు తెలియును, ఎందుకనగా నిజ ప్రవక్త ఏలీయా దేశములకు ఒక సూచనగా ఉండెను, అతడు ''కుక్కలు నీ రక్తమును నాకును,'' అని చెప్పెను. అది సరి. యెజెబెలు మరియు అతని పైన ఆ కార్యము వచ్చుచున్నదని అతనికి తెలిసియుండెను. అతనికి తెలియును, చూశారా.
1KGS 22:13,17,24-28•
2CH 18:12,16,23-27
76మికాయా దానిని చెప్పెను… వారు అతని యొద్దకు వచ్చి చెప్పిరి, "ఇప్పుడు నేను చెప్పుచున్నాను, ఆ సహవాసములో నీవు ఏమి చేయవలెనో నేను చెప్పుదును: ఈ బోధకులు అందరు సరి అని ఒప్పుకొనవలయును, చూశారా. నీవు అతనికి చెప్పుము, "పొమ్ము. యుద్దమునకు పొమ్ము నీవు అన్నిటికి ఒప్పుకొనవలయును." "మేము ఏమి చేయుదుమో నేను చెప్పెదను. మేము మా సహవాసములో నీవు వచ్చునట్లు చేయుదుము. నీవు ఆ కార్యమును చేసినయెడల, చూడుము, నీవు మాటలాడు కార్యములలో కొంచెము రాజీపడినయెడల, నీవు వెళ్ళి వారితో ఒప్పుకొని పొమ్ము." హా-హా! ఒక నిజమైన దేవుని ప్రవక్త దేవుని వాక్యము నుండి తొలగి దూరముగా పోగలడు అని మీరు ఊహించగలరా? మీరు..?
సరి, వారు చెప్పిరి, "అయితే మేము ఒక దర్శనమును చూచాము," ఈ నాలుగు వందల ప్రవక్తలు చెప్పిరి. ''మాకు తెలియును, ఎందుకనగా మేము ప్రవక్తలము!"
మికాయా చెప్పెను, "మీ యొక్క దర్శనమును నేను సందేహపడుట లేదు. మీరు దర్శనముగా చూచిన దానిని నేను ఒక్క ఏ మాత్రమూ సందేహించుట లేదు. అయితే అది దేవుని వాక్య ప్రకారము లేదు." ఆమేన్! ''నేను కూడా ఒక దర్శనము చూచాను,'' అని చెప్పెను. ఆమెన్! ఓ, కృప. అతడు ఒక సూచన. అతడు ఒక సూచన. ''నేను ఒక దర్శనమును చూచితిని. ఇశ్రాయేలీయులందరును కాపరిలేని గొర్రెల వలెనే కొండల మీద చెదిరియుండుట నేను చూచితిని,'' అని చెప్పెను.
అంతట ఆ పెద్ద విచారణ చేయు గురువు, బిషప్ లేచి వచ్చి అతని నోటిపై కొట్టి, "నా యొద్ద నుండి ఆ దేవుని ఆత్మ ఏవైపుగా పోయెనని,'' చెప్పెను.
మరియు అతడు చెప్పెను, "నీవు చేరశాలలో ఉన్నప్పుడు నీవు చూచెదవు. నీవు చూచెదవు."
అహాబు చెప్పెను, "ఇతనిని బందీ గృహములో ఉంచి అతనికి కష్టమైన అన్నమును, కష్టమైన నీళ్ళు ఇవ్వండని ఆజ్ఞాపించెను. నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు, అతని సంగతి చూచుకొనెదను," అని చెప్పెను.
ఆ వృద్ధ మీకాయా ''ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" తో నిలువబడియున్నాడు. నీవు ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల, దేవుడు నాతో మాట్లాడ లేదు,'' అని చెప్పెను. అది అంతే! అతడు ఏమైయున్నాడు? అతడు ఒక సూచన, యెహోవా ప్రవక్త. దేవుని ప్రవక్తలు దేవుని వాక్యముతో నిలిచియుందురు.
77మీరు ఒక ప్రవక్తను కలిగియున్నయెడల, అతడు - మీరు తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మ అను బిరుదులలో బాప్తిస్మము పొందుడి, అని చెప్పినయెడల, అతడు అబద్దపు ప్రవక్త. మీ మధ్యలో ఒక ప్రవక్త వచ్చి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, అని చెప్పినయెడల, అతడు అబద్ధపు ప్రవక్త. దానికి తగినట్లు ఎక్కడా లేఖనాధారము లేదు. అది సరి. అయితే నిజమైవ ప్రవక్త దేవుని యొక్క ఆ వాక్యముతో నిలిచియుండును. మరియు అతని దర్శనములు ఆ వాక్యమునకు విరుద్ధముగా ఉన్నయెడల, అతడు దేవుని యొద్ద నుండి వచ్చిన నిజమైన ప్రవక్త కాదు.
బైబిలులో ఎక్కడను, ఎవ్వరుమ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను బిరుదులలో బాప్తిస్మము పొందలేదు.
1TIM 2:11,12
78చెరశాలలో ఉన్న పౌలు , వంగిన ముక్కుతో, బట్టతల కలిగి ఆ రోమను చెరశాలలో ఇరువది సంవత్సరములుగా ఉండెను. అతడు ఈ పత్రికలను వ్రాసెను. స్త్రీలు సంఘములో నిశబ్ధముగా వుండవలయును, నేను వారు మాటలాడుటకు అనుమతించను." అతడు ఈ విధముగా చెప్పినప్పుడు, ఆ స్త్రీ ప్రసంగీకులు ఏ విధముగా పౌలును గూర్చి యోచించుదురని మీరు తలంచుచున్నారు? నేను తలంచుచున్నాను, వారు నిజంగానే అతనిపై ఏమైనా చేయవలెనని చేసియుందురు. పౌలు ఈ విషయాలు చెప్పినప్పుడు, ఆ బిషప్పులను ఏమని తలంచారని మీరు అనుకుంటున్నారు? "అక్కడ కొంచెము దానిని చెప్పకుండా వదలండి, మరియు ఇక్కడ కొంచం, ఇది అంతా, అది…"
"అయినను చెరశాలలో వేయబడిన అతడు మనకు చెప్పుటకు ఇతడెవరు?" అని చెప్పిరి. అయితే పౌలు యేసును సంధించెను. అతడు ఏమి చెప్పుచున్నాడో దానిని అతడు ఎరుగును. పౌలు చనిపోయిన పిదప అదే సమూహమునకు చెందిన (పౌలు బోధనలను ఎదిరించిన) వారి నుండి వారు సంఘ అధికారులను ఉత్పత్తి చేసుకొని, అదే బిషప్పులు, అధికారులు నైసియా ఆలోచన సభగా మారి, అదే నైసియా సంఘము దేవుని వాక్యము నుండి దూరముగా పోయి కాధలిక్ సంఘముగా రూపొందినది. అక్కడ నుండియే మీ - తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తిస్మము వచ్చినది. ఎవరైనా, ఎక్కడైనా ఏ దేశమైనా దీనిని నిజము కాదని రుజువు చేయగలరా, అని నేను సవాలు చేయుచున్నాను.
ACTS 19:2,3
79"ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, 'తండ్రి, కుమార , పరిశుద్ధాత్మ బిరుదులలో ఇచ్చు బాప్తిస్మము తప్పిదమైనది.' ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు." ఇక్కడున్నవారెవరైనా, లేక టేపు వినుచున్న వారెవరైనా, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందకుండా ఉండినయెడల, మరల యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి," అని నేను ఆజ్ఞాపించుచున్నాను.
అపోస్తులుల కార్యములు 5:9… లేక 19:5, పౌలు చెప్పెను, "మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా?"
వారు చెప్పిరి, "పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి."
అలాగైతే, "మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరి?" అని అడిగెను.
వారు చెప్పిరి, "మేము బాప్తిస్మము పొందితిమి." అయితే క్రైస్తవ బాప్తిస్మము కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ క్రైస్తవ బాప్తిస్మము కాదు. బైబిలులో గాని బైబిలు తరువాత నాలుగు వందల సంవత్సరముల వరకు ఏ క్రైస్తవుడు కూడా ఆ విధముగా బాప్తిస్మము పొందలేదు. అది కాథలిక్కుల ఆచారము మరి క్రైస్తవ సిద్ధాంతము కాదు. బైబిలులో దానిని నాకు చూపుడి. అది వంచన. అది సాతాను యొక్క వంచన. ఆ విధముగా బాప్తిస్మము పొందిన వారంతా దానికే చెందినవారని నేను చెప్పుట లేదు. ఈ రోజులలో దానికంటే మంచి మార్గమును తెలియనివారిని ఎంతో మందిని దేవుడు కలిగియున్నాడు.
అయితే ఆ ఘడియ వచ్చియున్నది, ఆ రోజులలో మాదిరి దేవుడు ఈ రోజు కూడా చేయవలెనని మనము ఎదురు చూచినయెడల, మనము వాక్యము తట్టుకు తిరుగవలసినవారమై యున్నాము.
80నా తల్లి చనిపోవుచున్నప్పుడు నేను నా తల్లితో చెప్పాను - ఆమె చనిపోక మునుపు - "అమ్మా, నేను క్రైస్తవుడుగా మారినప్పుడు, నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు నేను వెదకి కనుగొనుటకు ఆరంభించాను అని చెప్పితిని. దర్శనముల వలన నీకు తెలియును, దేవుడు ఉన్నాడని నా జీవితములో జరుగుచు వస్తున్న అనేక కార్యముల గురించి నీకు తెలియును." నేను చెప్పాను, "కాథలిక్ సంఘమువారు ఈలాగు చెప్పుట కనుగొన్నాను, 'మేమే సంఘము. బైబిలు ఏమి చెప్పినా అది లెక్క కాదు - అది పరవాలేదు అని మేము నమ్ముచున్నాము - అయితే మేము సంఘము. మేము ఏది చెప్పినా, దేవుడు దానిని పరలోకములో దానిని జరిగించును.' అందువలన ఈ కార్యములు ఆ విధముగా చేయుచున్నారు. అది ఒక సంస్థ. లూథరనులు చెప్పుచున్నారు, 'వారు తప్పు (కాథలిక్కులు తప్పు) - మేము ఈ విధముగా నమ్ముచుచున్నాము. 'బాప్టిస్టులు చెప్పుచున్నారు, వారందరు తప్పు - మేము ఈ విధముగా నమ్ముచున్నాము!' ఆ విధముగా వందలకొలది సంస్థలు ఉన్నవి." ఎందువలన, ఏ విధముగా మీకు విశ్వాసముండును? వారిలో ఎవరు సరైనవారు?
81ఒక సరియైన కార్యమున్నది. అప్పుడు నాకు దానిని గూర్చి తెలియదు. నేను చెప్పాను, ''అమ్మా, నేను బైబిలులో తిరిగి పోయి ఆది అపొస్తులుల యొక్క మార్గము కనుగొన్నాను, మరియు వారు ఏ విధమైన సంఘమును కలిగియున్నారని తెలుసుకున్నాను, వారు ఏ విధముగా బోధించిరి, వారు చేసిన కార్యములు, బైబిలులో చెప్పిన ప్రకారము, వారు చేసిన ప్రకారమే నేను చేసాను, మరియు వారు పొందిన అదే ఫలములను నేను పొందాను.'' ఆమేన్! ఆ విధముగా వ్యక్తపరచినందులకు మన్నించండి, "అయితే పిండి వంట యొక్క నిదర్శనము ఏమనగా, దానిని తినుటయే." అది నిజము! వారు పొందిన అదే ఫలములను పొందాను. అవును.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33•
ROM 3:4•
REV 22:18,19
82అటు, ఇటు పోవుచున్న తొమ్మిది వందల వేర్వేరు మార్గముల ద్వారా మీ యొక్క విశ్వాసమును కట్టలేరు. తదుపరి బైబిలులో కనుగొన్నాను, యేసు తానే చెప్పెను, ఏ మనుష్యుడైనా ఒక వాక్యమును తీసివేసిన యెడల, లేక ఈ గ్రంథములో మార్చినయెడల, ఎవరైనా దేనినైనను చేర్చిన యెడల, అట్టి వారికి జీవగ్రంథములో పాలు పొందకుండ చేయును. ఈ కార్యము దేనిని చూపించుచున్నదనగా, అతని పేరు జీవగ్రంథములో ఉండెను, అది సరి, అయితే అది తీసివేయయబడును.
ఓ, ఈ వాక్యము యొద్దకు మనము మరల రావలసినదిగా యున్నది. "ఈ ఆకాశమును భూమియు గతించుమ, గాని నా వాక్యము ఎప్పుడును తప్పిపోదు.'' అవునయ్యా! "ప్రతి మనుష్యుని మాట అబద్ధము మరి నా మాట సత్యముగా ఉండును గాక," అని యేసు చెప్పెను. మనము వాక్యముతో నిలిచియుండెదము! అవును. ఓ, మై. అవును.
83యెహోషాపాతుకు తెలియును, దేనితో రాజీపడని దేవుని వాక్యముతో నిలిచెడి నిజమైన ప్రవక్తను దేవుడు వుంచునని.
అది కాదండి, నాలుగు వందల మంది అతనికి విరోధముగా ప్రవచించినప్పటికిని, అతడు ఉత్తమముగా దేవుని వాక్యముతో నిలిచెను, అయితే అదే సూచనతోను అదే కార్యములతోను అతనిది దేవుని వాక్యమైయుండెను. మరి ఈ రోజు నేను చెప్పునదేమనగా, మన మధ్య సంఘ శాఖలు ఏమి చెప్పినను, ఎవరేమి చెప్పినను దేవుని వాక్యముతో నిలిచియుండు ఒక మనుష్యుడు, ఒక ప్రవక్త, మనకు కావలెను.
84మికాయాకు ఏ సహకారము లేదు. మోషేకు ఏ సహకారము లేదు. నోవాహుకు ఏ సహకారము లేదు. వారిలో ఎవ్వరికిని ఎవరి తోడులేదు. అందరు వారికి విరోధముగా ఉండిరి. అయితే దేవుని న్యాయతీర్పు పంపక ముందు ఆ పాపపు దినములలో వారు సూచనలుగా ఉన్నారు. మరి దేవుడు తన వాక్యముపై నిలుచువాడై యున్నాడు, అంతే కాదు తన ప్రజలు ఆయన వాక్యముపై నిలవాలని ఆయన కోరుచున్నాడు. ప్రభువుకు స్తోత్రము!
ఇప్పుడు, ముగించుటకు ముందు, కొన్ని నిమిషములు. ఇప్పుడు, జాగ్రత్తగా వినుడి.
ISA 40:3•
MAL 3:1•
MAL 4:6•
MATT 3:3•
MATT 11:10•
MARK 1:2,3•
LUKE 1:17
85యోహాను అను పేరు గల దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, ఒక ప్రవక్త సూచన. యేసు ఈ భూమిలో రాక మునుపు తనను తెలియజేయుటకు ముందు ఆయన ఒక ప్రవక్తను తనకు ముందు పంపెను. ఆయన అది చేసెనా? అతడు ఒక ప్రవక్తను పంపెను. పాత నిబంధనలోని ఏలీయా ఆత్మతో (శక్తితో) పాత నిబంధనలో ఏలీయా మరల వచ్చునని ప్రవచింపబడెను. మెస్సీయా వచ్చుననుటకు, యేసు వచ్చుననుటకు అతడు యోహను ఒక ప్రవక్త సూచనగా ఉండెను.
ISA 40:3•
MATT 3:3•
MARK 1:2•
LUKE 3:4•
GAL 1:8,9
86అడవిలో నుండి యోహాను వచ్చినప్పుడు, మెస్సీయా మార్గములో ఉన్నాడనుటకు అతడొక సూచనగా ఉండెను. ఇశ్రాయేలు తమ ప్రవక్తల ద్వారా ఆ కార్యమును తెలిసికొని ఉండవలసినది.. అక్కడే ప్రజలు దానిని తప్పిపోయారు. వారి ప్రవక్తలను వారు నమ్మరు. వారు నమ్మరు… "పెంతెకోస్తు దినమున పేతురు చెప్పినది సరి అని వారు నమ్మలేదు." అది సరి, అని వారు నమ్మలేదు. పేతురు చేసినదే పౌలు చెప్పినప్పుడు, వారు నమ్మలేదు. పౌలు చెప్పెను, "పరలోకము మండి ఒక దూత వేరొక వాక్యమును ప్రసంగించిన యెడల, వాడు శాపగ్రస్తుడగును." దానిని కూడా వారు నమ్మలేదు, చూశారా. దానిని వారు నమ్మలేదు. మరి వారి ప్రవక్తలను వారు నమ్మలేదు. అది వారికి తెలిసియుండినయెడల, యెషయా చెప్పిన, "ప్రభువు మార్గము సిద్ధపరచుటకు అరణ్యములో కేక వేయు నొకని శబ్దము," వారు దానిని తెలుసుకొనియుండ వలసినవారైయున్నారు. అతడు ఒక ప్రవక్త, ప్రవక్తలకు రాజు. అతడు వారికి చెప్పెను, కాని వారు నమ్మలేదు. కాదు, కాదు. అతడు చెప్పెను, "ఒక మెస్సీయా వచ్చుచున్నాడు."
87ఈ మనుష్యుడు దేవుడు పంపబడిన మనుష్యుడు. ఓ, సహోదరుడా. అతనిని అనుసరించువారు ఎవరు లేరు. ఏలీయాకు ఇచ్చినట్లే, ఒక చిన్నగుంపును, అతనిని వెంబడించునట్లుగా దేవుడు అతనికి ఇచ్చాడు. అతనిని వెంబండించుటకు దేవుడు అతనికి ఇచ్చాడు. అతడు ఒక రాజకీయ సంస్థ నుండి దానిని పొందలేదు. అతడు వాక్యమును ప్రసంగించెను, దేవుని వాక్యముపై నిలిచియుండెను, మరి దేవుడు అతనికి ఒక చిన్న మందను ఇచ్చెను. ఏలీయా దేవుని వాక్యముపై నిలిచియుండెను. దేవుడు అతనికి ఒక చిన్న మందను ఇచ్చెను.
ఈ మనుష్యునికి ఏ సహకారము లేకుండెను. అతనిని వెంబడించువారు ఎవ్వరు లేరు, ఏ సంఘ శాఖలకు చెందినవాడు కాడు, ఏమియు అడగ లేదు, దేనికి భయపడలేదు. అతడే యోహాను. ఎందుకు? అతడు దేవునిచే పంపబడిన మనిషి. ఆ కారణము వలననే అతడు నిలువగలిగెను. మెస్సీయా వచ్చునని ప్రజలకు నిరూపించుటకు అక్కడ నిలిచియున్న ఏలీయా. యెషయా ప్రవక్త చెప్పినట్లు, "అరణ్యములో కేకవేయు నొకని శబ్దము నేను," అని అతడు చెప్పెను. ప్రభువును సంధించుటకు సిద్ధపరచుచున్నాను!"
MATT 3:13•
MARK 1:9•
LUKE 3:21,22•
JOHN 1:29,32•
JOHN 3:30
88పరిసయ్యులు, సద్దూకయ్యులు అక్కడ నిలువబడి వారి వస్త్రములను గురించియు, ఇతర కార్యములను గురించి వివాదించునప్పుడు, అక్కడే వారు వివాదము మరియు గందరగోళము చేయునప్పుడు, నేరుగా వారి మధ్యలో మెస్సీయా నడచి వచ్చెను. యోహాను చెప్పెను, "చూడుము, ఆయన అక్కడ ఉన్నాడు." హల్లేలూయా!
అతనిని గమనించండి! ఆయనను అతడు పరిచయము చేసెను. "ఇక్కడే ఆయన ఉన్నాడు. ఆయన నేరుగా మీ మధ్యలో నిలబడియున్నాడు. ఆ సమయములో ఆకాశములు గర్జించినవి, యేసు నీళ్ళ లోపలికి నడిచెను, మరియు దేవుని ఆత్మ పావురము వలె దిగివచ్చుటయు, ఒక శబ్దము ధ్వనించుచు, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను," అన్న కార్యమును చూచుటకు యోహాను సాక్ష్యమును కలిగినవాడుగా ఉన్నాడు. ఓ, మై!
యోహాను చెప్పెను, "ఇప్పుడు, నేను తగ్గించబడవలయును; ఆయన హెచ్చింబడవలయును." ఓ, ఎటువంటి ప్రవక్త! ఇశ్రాయేలుకు ఒక సూచన. అవునయ్యా.
LUKE 1:5
89అతని తండ్రి ఒక యాజకుడైనప్పటికిని, అతడు దేవుడు పంపబడిన ఒక మనిషి. ఓ, అవును, అతని తండ్రి జెకర్యా, ఒక యాజకుడు. అయితే మీరు గమనించారా, దేవుడు ఆ ప్రవక్త వారి యొక్క సంస్థలతో కలువుటకు అనుమతించలేదు. అతని తండ్రి, అతనిని వేద పాఠశాలకు తీసికొని పోయి ఉండవచ్చును. పెద్ద ఫలానా, ఫలానా సంఘ శాఖలకు తీసుకొని పోయి ఉండవచ్చును. చక్కని బోధకునిగా తయారు చేసి ఉండి ఉండవచ్చును. మీకు తెలియునా, అతనికి తగని కార్యములలో తర్ఫీదు ఇచ్చి ఉండ వచ్చును. అయితే దేవుడు తన ఆత్మను మలినము చెందనియ్యడు. మీకు అర్థము అయ్యినదా? ఆ మనుష్యుని సంఘ శాఖతో చేర్చుటకు దేవుడ అనుమతించలేదు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, లేక హేరోదీయులతో నైనను లేక ఏ ఇతర శాఖ అయినను, ఏ తెగ అయినను, ఏ తెగ వారితో అయినను వారితో సంబంధించినవాడు కాడు. దేవుడు దానిని అనుమతించడు.
ISA 40:3•
MAL 3:1•
MAL 4:6•
MATT 3:3•
MATT 11:10•
MARK 1:2,3•
LUKE 3:4
90అతనిది వింతైన పుట్టుక. అతడు ఒక వింతైన బిడ్డ. అతడు ఒక ప్రవక్త. అతని తండ్రి ఒక యాజకుడైనను, అతడు యోహానుని ఆ వేషధారులతో, పరిసయ్యుల మతముతో, ఇతర కార్యములతో కలువనియ్యలేదు. అతడు ఏమి చేసెను? అతడిని ఆయన అరణ్యమునకు తీసుకొని పోయి, ఆ ఎడారిలో తర్ఫీదు ఇచ్చెను.
ఎటువంటి తర్ఫీదు అది! ఆమేన్! అనుభవముల ద్వారా అతనికి శిక్షణ ఇచ్చెను. దేవుని తెలుసుకొనుటకు అదియే సరియైన పద్ధతి. అక్కడ నుండి బయటకు వచ్చినప్పుడు, అతని పని ఏమని ఖచ్చితముగా తెలుసుకొనెను. మరి దేవుడు అతని పిలుపును నిరూపించెను. ఎక్కడ దానిని నిరూపించెను? నదిపైన. ఇప్పుడు, మీరు రెండు మరియు రెండును చేర్చినప్పుడు చెప్పుదరు, నాలుగు. ఆ నది పైన! చెప్పెను, "నేను అరణ్యములో కేక వేయువాని శబ్దము, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడి.''
91యోహాను దేవుని చేత పంపబడిన మనిషి. దేవుడు అతనిని ఆ ఇతర కార్యములతో చెడిపోవుటకు ఆనుమతించలేదు. అతనికి దేవుని ద్వారా అరణ్యములో శిక్షణ ఇప్పించెను. అతనిని వారి పాఠశాలలోను, వేద కళాశాలలోను శిక్షణ ఇయ్యలేదు. ఒకవేళ అతనికి ఆ విధముగా శిక్షణ ఇప్పించి యుండిన యెడల, ఆ విధమైన ఆ పాఠశాల నుండి బయటకి వచ్చుచున్న కలుషితమైన కార్యములతో నిండియుండెడివాడు. అన్ని రకములైన పాఠశాలలు, ప్రెస్పిటేరియను మాత్రమే కాదు - బాప్టిస్టు, మరియు మెతడిస్టు, మరియు పెంతెకోస్తు పాఠశాలలు కూడా ఆ వేద పాఠశాలల వలె తప్పిదమైన కార్యములను బయటికి తెచ్చుచున్నవి. ఓ!
MAL 3:1
92అతని రాకడ… యెషయా ఆత్మ ప్రేరణతో చెప్పియున్నాడు. అతని రాకడ, యెహాను యొక్క రాకడ, లేఖనములలో ముందుగా చెప్పబడెను. యెషయా 40వ అధ్యాయము 3వ వచనము చెప్పుచున్నది, "ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచుచున్నాను." లేక, అది మలాకీ 3వ అధ్యాయములో చెప్పెను. మలాకీ 3లో చెప్పబడెను, ఆయనకు ముందుగా ఆయన యొక్క దూతన ఆయన పంపును. ప్రవక్త, కడపటి ప్రవక్త యోహాను గూర్చి పలికెను, కడపటి కార్యము అతనిని గూర్చి పలుకబడెను. జ్ఞాపకముంచుకొనుము, పాత నిబంధనలో కడపటి పుస్తకము మెస్సీయా అగుపించుటకు ముందు ఇశ్రాయేలీయుల యొద్దకు ఏలీయా వచ్చునని పలికినది.
93మీరు సిద్ధముగా ఉన్నారా? బైబిలులో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంధము మనకు చూపుచున్నది. ఆయన కడపటి దినములలో అన్యజనుల సంఘమునకు తిరిగి వచ్చును. సూచనలు, ఏ విధముగా దానిని తప్పిపోయిరి. ఆ గొప్ప రెండవ రాకడ ముందు ఆయన మరల వస్తానని ప్రవచించెను. మలాకీ 4వ అధ్యాయము మరియు ప్రకటన 3వ అధ్యాయము మనకు చెప్పుచున్నది. అతడు చివరి దినములలో ఇక్కడ ఉండుననియు, దేవుడు అతనికి ఇచ్చిన చిన్న మందతో ఆ ప్రజల కొరకై నిలుచును. అతడు కడపటి దినములలో వచ్చును. దేవుడు చెప్పెను. అతడు (ప్రవక్త) అన్యజనుల దేశమునకు ఒక సూచనగా ఉండును మరియు ఆమెకు ఇక సమయము లేదు.
94మరి జ్ఞాపకముంచుకొనుడి, అతడు రంగములో కనిపించునప్పుడు, కాలము సమీపించినదని అని గ్రహించండి. అతనిని పంపమని దేవునిని ప్రార్థించుదుము. కాలము అతి చేరువలో ఉన్నది! అతని యొక్క వాక్య పరిచర్య ముగించిన వెంటనే, మెస్సీయా తన్నుతాను బయలుపరచుకొనెను.
ఈ కడపటి కాలములో కూడా ఆ గొప్పవాడు వచ్చి, వాక్య పరిచర్య ముగించిన పిదప, మెస్సీయా తన్నుతాను బయలుపరచుకొనును. అది అదే విధముగా ఉండును. కాలము అతి చేరువలో ఉన్నది, కనుక మనము ప్రార్థించుట మంచిది. మీరు ప్రార్థించుటకు ప్రారంభించండి.
95ఈ యొక్క కాలమునకు దేవుడు-ఇచ్చిన సూచన అతడు ఎవరు అనునది నిరూపించును. ప్రతి ఒక్కొక్కరు దానిని తెలుసుకొందురు. దేవుడు దానిని నిరూపించును. భూమిపై ఇంతకు మునుపు జరుగని విధముగా అద్భుతములు మరియు సూచనలు అతడు చేయును. నేను ఎరుగుట, వణుకుట, మరియు భాషలు మాట్లాడుట అను అర్థములో చెప్పుట లేదు. ఆ మనుష్యుని వలె ఇతడు దేవుని వాక్యముతో మరల వచ్చును. ఎందుకు? మలాకీ 4వ అధ్యాయమును మరియు ప్రకటన 3వ అధ్యాయములో అతని రాకడ గురించి ప్రవచించబడెను, కావున అతడు వచ్చును. ఏ కార్యము అతనిని ఆటంకపరచదు. అతడు వచ్చుచున్నాడు, అతడు ఇక్కడ ఉండును. ఆమేన్! ప్రజలు సాష్టాంగంగా పడి ముఖమును నేల మోపి, ఈ రోజు దేవునితో మొర్ర పెట్టనారంభించినయెడల ఏమి జరుగునో గమనించండి. అతడు శక్తితో కనబడుట మీరు చూచెదరు. అవునయ్యా!
లేఖనముల ప్రకారము అతని సూచనతో కూడిన వర్తమానమును త్రిప్పును… అతని ఏమి… అతనిని గూర్చి మనము ఏమి తెలిసికొందుము? అతడు సరైనవాడు అని మనము ఏ విధముగా తెలుసుకొందుము?
MAL 4:6
96మీకు తెలుసా, నిర్గమ కాండము 20వ అధ్యాయము 20వ వచనములో ఇశ్రాయేలు ఒకసారి అడిగెను, నేను అదే అని నమ్ముచున్నాను. చెప్పబడెను, "ఇది సరైనది అని మేము ఎట్లు తెలిసికొందుము? మేము ఎట్లు తెలిసికొందుము?" మనము తెలుసుకొందుము అని దేవుడు మనకు చెప్పుచున్నాడు. అతడు ఏమి చేయును? అతడు పిల్లల యొక్క హృదయమును ఆదిలో ఉన్న పెంతెకోస్తు వర్తమానము వైపుకు తిప్పును.
ఓ, మై! అది ఉపేక్షించబడిన ఒక సూచన. నిజ సూచన, మరి దానిని వారు తప్పిపోయిరి. వారు ఎల్లప్పుడు ఆ విధముగానే చేయుచున్నారు. నిజమైన సంఘమునకు తిరిగి వెళ్ళుట, నిజమైన వర్తమానము.
ACTS 2:1•
ACTS 4:13,18,19
97అతడు ఒంటరిగా సంఘ శాఖలకు విరుద్ధముగా, ధైర్యముగా భయపడకుండా, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" తో నిలుచును. అతడు ఏ సంఘ శాఖలతో రాజీపడడు. వాటితో అతడు చేయునది ఏమియు లేదు. అతడు ఏమిలేని దాని కొరకు దేనిని లాగడు. అతడు నేరుగా వాక్యముతో నిలుచును, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు." దేవుడు అతని పరిచర్యను సూచనతోను మరియు అద్భుత కార్యములతో నిరూపించును. ప్రజలకు గొప్పగా బయలుపడిన వాక్యమును తెచ్చును. ఎటువంటి దినము సమీపముగా ఉన్నది! ఆ విధముగా పెంతెకోస్తు దినమున పేతురు, యోహానుల వలె నిలుచును. పెంతెకోస్తు దినము తరువాత వారు పరిశుద్ధాత్మతో నింపబడి, అక్కడే బాప్తిస్మము పొంది, ఎంతటి ధైర్యవంతులుగా ఉండవలయునో, అంత ధైర్యముగా భయపడక ఆ సన్హెడ్రిన్ న్యాయసభలో నిలబడిరి. వారు చెప్పిరి, ''ఇక మీదట యేసు నామములో ప్రసంగించుటను నిషేధించుచున్నాము."
అతడు చెప్పెను, ''మేము మీ మాట వినుట సరియా లేక దేవుని మాట వినుట సరియా? మీలో మీరే తీర్పు తీర్చుకొనుడి." చదువులేని, పామరులు! ఆమేన్! వారు ప్రవక్తలు. దేవునిచే అభిషేకింపబడిన ప్రవక్తలు. పరిశుద్ధాత్మ యొక్క సూచనగా ఉన్నారు. వారు ప్రవక్తలు. వారికి తెలియును.
98వారు యోహాను వలె ఉండిరి. పెంతెకోస్తు దినమున వారు అక్కడ ఉండి దేనినో కనుగొనిరి. వారు ఈ దినములలో మాదిరి మన ప్రసంగికుల వలె కాదు - వారికి వారే హెచ్చించుకొనుచు, ఎంత గొప్ప సంఘ శాఖలకు మేము చెందియున్నామని గర్వించుకొనుచు, ఎంత మందిని మేము మా సహవాసములో కలిగియున్నామని చెప్పువారివలె వారు లేరు. "మేమొక గొప్ప సంఘ శాఖలుగా నిలిచి యున్నాము. మేము గొప్ప మత ప్రచారము చేయుచున్నాము." ఓ, కృప! "ఓ మిగతా వారి కంటే మాకు అధికమైన సమూహములున్నవి. అది ఏమిటి? అది రాజకీయముగా ఆకర్షించుట (మీరు రెండు లేక మూడు నిమిషాలు చాలా జాగ్రత్తగా వినవలెయునని కోరుచుచున్నాను.), రాజకీయముగా ఆకర్షించుట!
99నిజముగా నేను ఏమి మాట్లాడినానో మీకు తెలియును, కొద్ది నిమిషముల క్రితము నేను ఒక కార్యమును చెప్పాను - ప్రవచింపబడిన ఒక సూచన. దానిని అలాగే వదిలేసాను, దానిని మీ ఒడిలోనే వేసేసాను, చూశారా. సరి ఇది ఇక్కడున్న మీకే కాదు కాని దీనిని వినుచున్న ప్రతి ఒక్కొక్కరి యొక్క ఒడిలో అది ఉన్నది! దానితో మీరు కోరుకొనిన విధముగా ఏమైనా చేయవచ్చును. మీరు ప్రార్థించి మరియు దేవుడు తెరపై కదలాడుటను గమనించండి. ఆయన తన వాక్యమును నెరవేర్చుటను గమనించండి. ఆయన వేచియున్నాడు.
100పెంటగన్ లో అణుగుండ్లకు ప్రజలు భయపడుచున్నారు, వారికి ఏమి చేయవలెనో తోచలేదు, ఆకాశములో ఎగిరే పళ్ళెములు (Flying Saucers) వంటి రహస్యమైన సూచనలు, దేవుడు ప్రవచించిన అన్ని కార్యములు జరుగుచున్న ఈ కాలములో, ఆ ఏలీయా రంగములోనికి రావలసిన కాలముగా ఉన్నది - అతడు ఇక్కడెక్కడో వున్నాడు.
ఆ ప్రజలు, ఆ చిన్న మంద, ఆ మిగిలిన వారు (కొద్ది మంది) దేవుడు అతనికి ఇచ్చిన వారు. ఆ మిగిలిన కొద్ది మంది, దేవుని కొరకు బయటకు వచ్చి ఏమి జరుగుచున్నదో అని ఎదురు చూచుదురు. ఒక రాజ్యపు బలపరీక్ష ఉండబోవును. ఇంతకు మునుపు వారు ఎన్నడు చూడనటువంటి ఒక శక్తి వుండును. కలవరపరచే కార్యమేదనగా, ఈసారి ఆ కార్యము వారు గ్రహించులోపు చాలా ఆలస్యమగును. తలుపులు మూయబడును. కావున జ్ఞాపకముంచుకొనండి, మనము కడపటి దినములలో ఉన్నాము. ప్రార్థించండి!
101చూడండి మనము దేనిని వాక్య సేవనుచున్నాము. మనము ఏమి కలిగియున్నాము? (ఇప్పుడు ముగించునప్పుడు ఇది చెప్పవలయునని కోరుచున్నాను.) మనము ఏమి కలిగి యున్నాము? మనము ఏమి కలిగియుండలేదు. మన యొక్క గొప్ప నాయకలలో కొందరు, మన గొప్ప సువార్తికులు… మనలో యొక్క గొప్ప సువార్తికులలో ఒకడు చెప్పెను, ''నా ద్వారా మార్పు చెందినవారు పది శాతమైన ఒక సంవత్సరము పాటు నిలచియున్నట్లయితే, నేను ఎంతో కృతజ్ఞుడను," అప్పటి కాలములో మార్పు చెందినవారిని ఫిన్నీ డెబ్బై-ఏడు శాతము వారిని కలిగియుండెను. పౌలుకు నూరు కంటే ఎక్కువ. నూరు! నూటికి నూరు. ఒకడు రక్షింపబడును, అతడు ఆ విధముగా పూర్తిగా ఆత్మతో నింపబడిన సహోదరుడై, అతడు వెళ్ళీ ఇంకొకరికి చెప్పును, అతడు వెళ్ళి ఇంకొకరికి చెప్పును, మరియు అతడు వెళ్ళి ఇంకొకరికి చెప్పును, ఆ విధముగా లక్షలు, లక్షలుగా అయినది. ఎందుకు? వారిలో ఏదో ఉన్నది. వారు వాక్యముపై ఉండిరి.
102ఈ రోజు మనము గొప్ప జన సమూహములను గూర్చి తలంచుచున్నాము. అది ఏమిటి? అది ఒక రాజకీయ సంస్థ, మనము వచ్చిన… ఎవరైనా విశిష్టమైన సువార్త సేవకుడు ఒక నగరమునకు వచ్చినయెడల, మొదట ఏమి వచ్చును? ఒక గుంపు మనుష్యులు. మరియు ఒకవేళ మెతడిస్టులు వారందరు, బాప్టిస్టులు, ప్రెస్బీటేరియన్లు, వారందరు, ఒక గుంపుగా, వారందరు కలిగియున్న గుంపు… "అతడు కేవలము దీనిని మాత్రమే ప్రసంగించును, మరియు దానిని ప్రసంగించలేడు; కాని దీనిని ప్రసంగించగలడు. మీరేమి కలిగి యున్నారు? మరియు వారందరూ అక్కడికి నడిచి…
స్త్రీలు (నేను పెంతెకోసు వారి గురించి మాట్లాడుచున్నాను), స్త్రీలు లోపలికి పోవుదురు, వేదిక బలిపీఠము యొద్దకు… వారు వేడుకొనుటకు ప్రారంభించుదురు…
నేను ఎల్లప్పుడు వేదిక పిలుపుకు వ్యతిరేకిని. నేను దానిని చెప్పుదును. నేను అలాంటి పిలుపులను నమ్మను. బైబిలులో అటువంటి కార్యము లేదు. దేవుడు ఒకనిని పిలువకుండా ఏ విధముగా ఒక మనిషి వచ్చును. అతనిని మీరు దూరముగా ఉంచలేరు. దేవుడు ఒక మనిషిని పిలిచినయెడల, మీరు అతనిని పిలువనక్కర్లేదు. వేదిక పిలుపు మెథడిస్టుల యోచన. అది సరియే! వేదిక పిలుపు…. అక్కడ వారు వారిని పట్టుకొని, "యోహాను, నీకు తెలియునా, నీ తల్లి చాలా కాలము క్రిందట చనిపోయెను….
"ఓ , భూ….హు…. అవును సోదరుడా. హు…హు." అది మార్చబడుట కాదు.
MATT 3:10•
LUKE 3:9
103కొన్ని రాత్రుల క్రితము మేము ఒక స్త్రీని ఒక డబ్బాలో (గంప లాంటిది) తీసికొని వచ్చి ఆ సైనిక దళములోని తిన్నెపై పరుండబెట్టు దృశ్యమును, లూసివిల్ లో చూచినాము. వేదిక యొద్దకు పరిగెత్తుకొని పొమ్మని వందలాది ప్రజలు చెప్పిరి. సువార్త భయపెట్టునది కాదు. అది దయ చూపు అనుభూతి కాదు. అది నమ్మబడిన వారి యొక్క మార్పు.
ఈ యొక్క కూటములలో గమనించండి. ఈ యొక్క గొప్ప సువార్త సేవకులు, మరియు నా యొక్క దీన, చిన్న వాక్య సేవలో (నాతో కలుపుకొని. కొన్నిసార్లు నేను వెలుపలకు పోవుటకు సిగ్గుపడుదును. అది సరియే!) మనము ఏమి చేయుదుము? అక్కడ నిలిచి వేదిక పిలుపులను ఇచ్చి వారిని సమ్మతింప చేయుదుము. చిన్న యవ్వన స్త్రీలు, చూయింగ్ గమ్ నములుతు, అక్కడికి వచ్చి చెప్పుచుందురు. "చూశారా, చూశారా, నేను…" ఈ స్త్రీలు కత్తిరించిన వెంట్రుకలతో, రంగులు పూసిన ముఖములతో - పెంతెకోస్తులు - అక్కడకి వచ్చి, బయటకు వెళ్ళి మరియు వారు అన్య భాషలతో మాట్లాడిరి అని చెప్పుదురు; మరియు వెంట్రుకలు పెంచుకొనక మరియు అదే పాత కార్యములను చేయుచుందురు. నాకు చెప్పండి అది మార్పా? అది దేవునిని వెక్కిరించుట. వారు వెంట్రుకలు కత్తిరించుకొనుట అవమానకరము. పాపము అని బైబిలు చెప్పుచున్నది. వెంట్రుకలు కత్తిరించుకొన్న స్త్రీ, ముఖమునకు రంగులు పూసుకున్న వారిని ఏ విధముగా ఖండించగలదు? ఏ విధముగా దానిని వినగలదు. గొడ్డలి చెట్టు యొక్క వేరున పెట్టబడియున్నది, మంచి ఫలముల నియ్యని ప్రతి చెట్టు నరుకబడును. అటువంటి సమయము వచ్చుచున్నది.
ఏమి జరుగుచున్నది? అది తప్పైన కార్యము. ఏలయనగా మన నవీన ఫలానా-ఫలానా ప్రసంగీకులు అక్కడ - పెద్ద గుంపులు, నిండిన చొక్కాయలు, మరియు సంస్థలు - వారికి దేవుని గురించి ఏమి తెలియదు. అది ఏలాగున్నదనగా హాట్ అండ్ టాట్ (దక్షిణ ఆఫ్రికాలోని ఒక తెగ) ఈజిప్టు యోధుని గూర్చి ఎంత తెలియునో అంత ఈ సంఘ శాఖలకు దేవుని గూర్చి తెలియును. అది వచ్చినప్పుడు… వారు అక్కడకి పోవుదురు…
104ఒకవేళ ఆ ప్రజలు పెంతెకోస్తు దినమున పైకి పోయి ఈ విధముగా చెప్పియుండిన, ఏలాగుండును, "ఇప్పుడు, యేసు మనకు పై నుండి శక్తి వచ్చు వరుకు వేచియుండుదుమని ఆజ్ఞాపించెను. సహోదరులారా, ఇప్పటికే తొమ్మిది రోజులుగా ఇక్కడ ఉన్నాము - మనము విశ్వాసము ద్వారా దానిని అంగీకరించెదము. ఇప్పుడు, మనకు పరిశుద్ధాత్మ ఉన్నది. మనము బయటకు పోయి… ఏలయనగా మనము ఇక్కడే ఉన్నాము, యేసు ఏమి చేయమని చెప్పెనో దానిని మేము చేసితిమి." వారికి ఏ అనుభవము ఉండేది కాదు.
105మీకొక కార్యమును చెప్పబోవుచున్నాను. ఇది టేపులలో ఉన్నదని, పలు చోట్లకు పోవునని నాకు తెలియును, అయినను ఇక్కడ అది వచ్చుచున్నది. జాగ్రత్తగా వినుడి. నేను ఒక కార్యమును చెప్పబోవుచున్నాను. అది అవమానకరము, ప్రజలు ప్రయత్నించుచున్నారు… కదలుట (డాన్స్ మాదిరి) పరిశుద్ధాత్మ అని నేను ఎప్పుడు నమ్మలేదు. అన్యభాషలు మాటలాడుట లేక ఏడ్చుట లేక కేకలు వేయుట పరిశుద్ధాత్మ పొందినామనుటకు ఆధారమని నేను ఎప్పుడు నమ్మలేదు. అదంతయు ఉద్రేకముతో కూడిన అనుభవములు. పరిశుద్ధాత్మ అది చేయ గలదని నేను నమ్ముచున్నాను. అయితే పరిశుద్ధాత్మ నివసించు దైవత్వవము. అనేక మంది మేము పరిశుద్ధాత్మను పొందినామని చెప్పుకునేవారికి దాని గురించి ఏమి తెలియదు అని నేను నమ్ముచున్నాను. మీరు దేవుని సంధించుడి!
106పెంతెకోస్తు దినమున ఏ విధముగా, వారు చెప్పిరి… ఈ రోజు బాప్టిస్టుల మాదిరి, ప్రెస్బిటేరియను, మరియు మెతడిస్టు, వారిని నేను అడుగుచున్నాను, "మీరు పొందుకున్నారు అని మీరు నమ్ముచున్నారా…..?"
"ఓ, అవును, విశ్వాసము ద్వారా మేము నమ్ముచున్నాము.'' విశ్వాసము ద్వారా, ఏమి లేదు! అది కాదది. అది ఒక ఉద్రేకముతో కూడిన అనుభవము.
మీరు సూర్యాస్తమయమును చూడ ఇష్టపడినయెడల, మీరు నిలిచి సూర్యుడు అస్తమించునప్పుడు గమనించి కళ్ళల్లో కన్నీళ్ళు నిండి, ఆ కన్నీళ్ళు కారుతూ ఏడ్చుట, అది దేవుడు కాదు. నీలో ఉండు ఏదో కార్యము వలన వచ్చు ఉద్రేకము అది. ఎవ్వరో వ్యాధిగానో లేక చనిపోవుచున్నారని మీరు వినినప్పుడు, మీరు అరిచి ఏడ్చినా, అది దేవుడు కాదు. అది మనుష్యుల యొక్క ఉద్రేకము - దేవుడు ఎట్లు…
ACTS 2:1
107బంతి ఆటలో ప్రజలు చాలా ఆనందముతో ఉండి నత్తి నత్తిగా మాట్లాడుట, మరి ఏ ఇతర అనేక కార్యములు చేయుటను నేను చూచియున్నాను. నాకు చెప్పకండి. మనకు ఉజ్జీవము, రక్షణ యొక్క అవసరత ఉన్నది. పెంతెకోస్తు వారు వచ్చి ప్రజల మధ్య ఏదో కార్యములు చేసి, వారు భాషలలో మాట్లాడినయెడల, అప్పుడు పరిశుద్ధాత్మను పొందిరని చెప్పుదురు. కాని వారిలో కొందరు దాని తర్వాత పలు విధములైన జీవితములను జీవించుచుందురు. సహోదరుడా, వినుము, పెంతెకొస్తు దినమున అలాగున లేదు. వారు భాషలపై, ఇతర కార్యముల పై ఆధారపడ లేదు. వారు ఒకే చోట ఏక మనస్సుతో అక్కడ నిలిచియున్నప్పుడు, దేవుడు ఆయన చెప్పిన వాక్యము ప్రకారము దిగి వారి మధ్య వచ్చెను. అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా, వారిలో ఒక్కొక్కని తల మీద కుమ్మరింపబడినది. దేవుడు అక్కడ ఉండెను. అది ''విశ్వాసము ద్వారా అంగీకరించుట" కాదు లేక ఏదో ఉద్రేకము కాదు. వారు పరిశుద్ధాత్మతో నింపబడి వెలుపలికి పోయి భాషలలో మాట్లాడుటకు ఆరంభించిరి. అయితే మొదట వారు దేవుని సందించిరి. అదే ఈ రోజు కార్యము. ప్రజలు ఉద్రేకము, మనోభావము వంటి కార్యములలో పని చేయుచున్నారు. అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ నివసించు దైవత్వము. మీ యొక్క వాక్యములు ఆయన వాక్యము. నేను చెప్పుచున్నాను, ఈ రోజు మనకు కావలసినది పిలుపు.
ప్రజలు లోపలికి పోవుదురు… స్త్రీలు ఆ విధముగా లోపలికి పోవుదురు, భాషలలో మాట్లాడుదురు, బయటకు వచ్చెదరు, మరియు మీరు వారు ఉన్న చర్చి స్థలమునకు పోవుడి…
108బిల్లీని ఇక్కడ కూర్చొని ఉన్నాడు అని ఆశించుచున్నాను. నాకు ఒక లెటర్ ఎక్కడ నుండియే ఆ రోజు వచ్చినది, దానిలో ఒక స్త్రీ చెప్పుచున్నది, "నేను ఒక గొప్ప సంస్థకు చెందిన దానను. (పెంతెకొస్తు వారి చాలా పెద్ద సంస్థ, పెద్ద త్రిత్వము వారి సంస్థ)…" మరియు చెప్పెను, "సోదరుడా బ్రెన్హాం, మా స్త్రీలందరు వారి వెంట్రుకలు కత్తిరించుకొందురు. నాకు పొడవైన నల్లటి వెంట్రుక ఉండెను. నేను వాటిని ప్రేమించితిని, ఏలయనగా అది ప్రభువు యొక్క కార్యమని నేను నమ్ముచున్నాను." చెప్పెను, "నేను ఎప్పుడు ముఖమునకు రంగు వేసికొనలేదు. మా సంఘము చెప్పుచున్నది, అది పాత-కాల వైఖరి." మరియు ఆమె చెప్పెను, "నేను నా వెంట్రుకలను మడిచి, వెనుక కొప్పు మాదిరి చేసికొనినయెడల, చూడండి, వెనుక టైరు మాదిరి కలిగియున్నదని వారు చెప్పుచున్నారు. నీవు నీ తల వెనుక ఒక సమమైన టైరును కట్టుకొని యున్నావని చెప్పుచున్నారు. చివరగా, నా భర్త చెప్పాడు, "నీవు ఎందుకు వెంట్రుకలు కత్తిరించుకొని ఇతరుల వలె ఎందుకు ఉండవు." ఇప్పుడు, నా యొద్ద మరల ఆమెకు పంపుటకు ఉత్తరము ఉన్నది. ఆమె చెప్పెను, "అది అలాగా (మీ టేపులలో ఒక దానిని విన్నాను) అది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము క్రైస్తవ బాప్తిస్మమా?'' మీకు తెలియునా, ఇప్పుడు ఆమె ఏమి పొందబోవుచున్నదని, తెలుసుకొన్నారా మీరు? అవును! "నాకు చెప్పండి బ్రెన్హాం సోదరుడా, నేను ఆకలిగొనుచున్నాను; నేను ఏమి చేసితినో నేను తెలిసికొనవలెనని యున్నాను," అని ఆమె చెప్పెను.
109"నీవు ఆరాధన చేయు ఆ దేవుడు లేని ఆ గుంపును గురించి, దిగజారిన నీ భర్తను గురించి సిగ్గుపడుచున్నాను. వారి మధ్య నుండి బయటికి రమ్ము,'' అని నేను ఆమెకు చెప్పబోవుచున్నాను. సరి! దేవుడు ఎల్లప్పుడు మారనివాడు. దేవుడు ఏమైనా చెప్పినయెడల, దానిని నిజముగా చెప్పుచున్నాడు. ఎంత మంది దిగజారిపోయిన ప్రసంగికులు పెద్ద సంస్థ కావలెనని, పెద్ద సమాజము కావలెనని రాజీ అయినను నేను లెక్కచేయను. మనకు కావలసినది రక్షించువారు. పురుషులారా మీరు నిలిచి మీ యొక్క భార్యలను ఆ విధమైన కార్యము చేయుటకు అనుమతించుచు, మీ యొక్క క్రైస్తవ అనుభవమునుపై నాకు చాలా కొద్ది నమ్మకము మాత్రమే ఉన్నది. నిజము! పశ్చాత్తాపపడుడి లేక నశించుడి! మై గుడ్నెస్!
110అక్కడకు పోయి, సంఘములలో చేరి - పెంతెకోస్తు సంఘములు - బయటికి వచ్చి మరియు అది ఏ విధమైన మార్పునివ్వదు, కొంచెము కూడ ముందుకు పోకుండా, అదే కార్యములో నిలువబడి యుందురు. ఓ కృప! అది ఏమిటి? నవీన కాల యెజెబెలులు. బైబిలులో ఒకే ఒక స్త్రీ ముఖమునకు రంగులు పూసుకున్నది. మరియు దేవుడు ఆమెను కుక్కలకు ఆహారముగా వేశాడు. నవీన యెజెబెలులు, వారి అహాబులను కాలర్ పట్టి లాగుచున్నారు. మగతనములేని మనుష్యుడు తన భార్యను ఆ విధముగా చేయుటకు అనుమతించును. పొట్టి దుస్తులు ధరించుకొని, వీధులలో వెళ్ళుట, చర్మానికి అంటుకొను బుగుతైన దుస్తులు ధరించుట… ఇది నేను పరిహాసము కొరకు చెప్పుట లేదు; ఇది పరిహాసము చేయు స్థలము కాదు. ఇది దేవుని వాక్యము! అది సత్యము! సరి! ఆమె అటువంటి బిగుతైన దుస్తులు ధరించి నడవను కూడా వీలు కాకుండ ఉండును, అప్పుడు మరి ఎవరైనా ఆమెను గూర్చి మాట్లాడినయెడల, మీరు అతనితో జగడమాడుటకు సిద్ధపడుదురు. మీ దవడ పైన అర చేతితో కొట్టించుకొనుటయే మీకు కావలసియున్నది (అది నిజము!) అటువంటి కార్యమును ఆమె చేయుటకు అనుమతించినందులకు, నీవు దేనితో చేయబడినావని అది చూపుచున్నది. అది ఖచ్చితముగా సరియే.
1COR 11:5,6
111మనకు కావలసినది సువార్త. తిరిగి వాక్యము వేపుకు త్రిప్పుటకు దేవా, ఎవరినైనా ఒకరిని లేపండి. ఒక స్త్రీ, తల వెంట్రుకలు కత్తిరించుకొని సంఘమునకు వచ్చి ప్రార్థించుట మర్యాదైన కార్యము కాదని దేవుడు చెప్పెను. మరియు స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకొనిన, మనుష్యునికి (ఆమె భర్తకు) ఆమెకు విడాకులు ఇచ్చుటకు పరిపూర్ణ అధికారము కలదు. ఆమె గౌరవించదగిన స్త్రీ కాదు. బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది. ఆమె భర్తకు ఆమె యొద్ద నుండి విడాకులు పొందుటకు పరిపూర్ణ అధికారము కలదు. ఆమె భర్తకు ఆమె ఆగౌరవముగా ఉండును, ఆమెకు అది తెలియకుండా ఉండవచ్చును. పొట్టి దుస్తులు ధరించు ఏ స్త్రీ అయినను అగౌరవము. ఆమెకు అది తెలియకుండా ఉండ వచ్చును. స్త్రీ, నేను నిన్ను నొప్పించుటకు ప్రయత్నించుట లేదు. నేను నిన్ను నరకము నుండి అగ్ని మడుగు నుండి రక్షించుటకు ప్రయత్నించుచున్నాను! పశ్చాత్తాప పడుము!
"మంచిది, నేను పరిశుద్ధాత్మను పొందియున్నాను," అని మీరు చెప్పుదురు. మీలో దేవుని ఆలయమును కలిగియుండి, ఆ విధముగా ప్రవర్తించుదురా? ఆ దేవుడే ఆలాగు చేయవద్దు అని చెప్పెను కదా?
1COR 13:1,2
112"సరి, నేను భాషలలో మాట్లాడాను," మీరు చెప్పవచ్చును. నేను దయ్యములు కూడా భాషలలో మాట్లాడుటను చూచి యున్నాను. ఆఫ్రికాలో మనిషి పుర్రె నుండి రక్తము త్రాగి భాషలతో మాట్లాడుచు దయ్యములను పిలచుటను చూచియున్నాను. నేను మాంత్రికులు నివసించు క్యాంపుకు వెళ్ళాను, అక్కడ వారు భాషలతో మాట్లాడి అనువదించియున్నారు. పెన్సిలు టేబిలు పైన తెలియని భాషలో వ్రాయుటయు దానిని మనుష్యులు అర్థము చెప్పుటను చూచి యున్నాను, ఇది సత్యము. నాకు అన్యభాషలు గురించి చెప్పవద్దు. ఆ విధమైన కార్యములు అధికముగా మన యొద్ద ఉన్నవి. అయినను దేవునికి ఒక తెలియని భాష ఉన్నది. దేవుడు తెలియని భాషలో మాట్లాడునని నేను నమ్ముచున్నాను. కాని, దానిపై ఆధారపడవద్దు! పౌలు చెప్పెను, "నేను మనుష్యుల భాషలోను, దేవదూతల భాషలలోను మాట్లాడినను, నాలో పరిశుద్ధాత్మ లేనియెడల, నేను శూన్యము. నేను పర్వతములను కదిలించినను…"
113అనేకులు చెప్పుచుందురు, "ఓ, ఇతడు గొప్ప దేవుని మనిషి. మీరు ఆ గొప్ప అద్భుతములను చూడవలయును." ఎందుకు, దయ్యములు బయటకు వెళ్లి ఆ విధమైన కార్యములను చేయును. ఆ విధముగా మాంత్రికులు పోయి ఆ విధమైన కార్యములు, గుడ్డలు చుట్టుకొని, ఆ విధముగా ఉండిన డబ్బులు వారు దానిలో వేయుదురు; ఆమె తల వెనుక భాగము నుండి వెంట్రుకను తీసి, రక్తముతో దానిని ఊది మరియు విసిరి వేయును… మరియు ఆ ప్రజలు, నిజాయితీ ప్రజలు దానిని నమ్ముచున్నారు… అది ఆ మనిషి కాదు; మంత్రముల ద్వారా వారు దేవుని సమీపించుచున్నాము అని ప్రజలు నమ్ముదురు.
MATT 7:22,23•
MATT 24:24
114యేసు చెప్పలేదా, "ఆ రోజు అనేకులు నా యొద్దకు వచ్చి మరి చెప్పెదరు, నేను గొప్ప స్వస్థతా కూటములను జరిపించాను.'' అది ఒక సూచన కాదు. మనము కడపటి కాలములో ఉన్నాము అనుటకు అది ఒక సూచన. యేసు ఇలా చెప్పెను కదా! మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనములో … 24:24, యేసు చెప్పెను, "అబద్దపు క్రీస్తులు అబద్దపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మరియు మహత్కార్యములను కనబరచెదరు." అయితే ఎన్నుకొనబడిన వారు వాక్యముపై నిలిచియుందురు! నిజమైన సూచన ఏమిటో వారికి తెలియును.
1KGS 21:19
115ఏ విధముగా ఒక మనిషి ఈ విధమైన కార్యములు చేయుచు, దేవుని విశ్వాసమును తిరస్కరించి, మరల తాను దేవుని ప్రవక్తనని ఏలాగు చెప్పగలడు? ఈ లోకములో ఏ విధముగా ఒక మనుష్యుడు… ఆహాబు, యెహోషాపాతు దినములలో, మీకాయా అక్కడ నిలచినప్పుడు, అక్కడున్న ఇతర ప్రవక్తల వలె అతడు ప్రవక్త కావచ్చు. అయితే వాక్యము యందు నిలిచియున్న ఒక వ్యక్తిని వారు కలిగియుండిరి - ఏలీయా. ప్రభువు యొక్క వాక్యము ఆహాబు నశించునని వ్రాయబడి యుండెను. మరియు ఏలీయా దర్శనము దానితో ఉండెను. మరి ఎవరైనను తనను ప్రవక్తని, ఆత్మతో నింపబడిన వాడని పిలుచుకొనినయెడల, అతడు ప్రతి వాక్యము సత్యము అంగీకరించును.
ఏ విధముగా అతడు త్రిత్వవాదిగా ఉండును? అతడు ఏ విధముగా ఆత్మతో నింపబడియున్నాడు అని చెప్పి - తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మలలో బాప్తిస్మము ఇచ్చును. ఎలాగ వాళ్ళు అలాంటి తప్పుడు బోధనలను ప్రజలకు బోధించుచు, మేము ఆత్మతో అభిషేకింపబడినామని చెప్పుకొందురు? అసలు అలా జరుగనే జరుగదు. అది జరుగని కార్యము.
అది ప్రఖ్యాతి కలిగినది కాదు అని నేను గ్రహించాను, అయితే ప్రఖ్యాతిని మనము కోరుటలేదు; నిజాయితీగా ఉండాలి అని మనము కోరుచున్నాము.
DEUT 22:5
116ఇప్పుడు, యెజెబెలు మరియు అహాబు… అవునయ్యా! ఎందుకు? ఎందుకని వారు దానిని చేశారు? ఎందుకని పురుషులు వచ్చినప్పుడు, ఆ స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకొని, ముఖమునకు రంగు పూసుకొని బయటికి పోయి పొట్టి దుస్తులు ధరించినారు. వారు వారి భర్తలు అది చేయుదురా? ఎందుకనగా వారి ప్రసంగ పీఠములపై సత్యమును తెలుపుటకు వారికి నిజమైన ప్రవక్తను వారు కలిగిలేరు. వారు "మంచిది, అది ఏ వ్యత్యాసము లేదు. అది పరవాలేదు. నీవు ఆ విధముగా దానితో చేయనక్కర్లేదు," అని వారికి చెప్పుదురు.
మీరు.. ఇది ప్రభువు యొక్క వాక్యము! ఏ స్త్రీ అయినను పురుషుని యొక్క దుస్తులు ధరించుట దేవుని యెదుట అది అసహ్యకరమైన కార్యమని బైబిలు చెప్పుచున్నది. దేవుడు ఎప్పుడును మారడు. ఆయన మారి మరియు ఎట్లు దేవునిగా ఉండగలడు? దేవుడు అంతము లేనివాడు!
ISA 3:16•
ZECH 14:7
117ఇది కడపటి కాల సూచన అని వారికి చెప్పగల ఒక నిజమైన ప్రవక్త వారికి కావలసియున్నది. వారు ఆ విధముగా చేయుదరని బైబిలు ఇలా చెప్పుచున్నది. స్త్రీలు అంత్యకాలమందు ఆ విధముగా చేయుదురని యెషయా గ్రంధము 8వ అధ్యాయములో చెప్పబడి యున్నది. ఖచ్చితముగా. కావున అక్కడే వారున్నారు.
కాని ప్రసంగపీఠము వద్ద వారికి ఒక ప్రవక్త కలడని వారు చెప్పుచున్నారు. దేవుని వాక్యము కొరకు భయపడుతున్నారా, కాదు… అతడు సమాజమునకు భయపడుచున్నాడు. దేవుని వాక్యముపై ఆధారపడి, వారికి సత్యము చెప్పుచు, ఆయన ఎన్నుకొనబడిన సంఘమునకు వాగ్దానము చేసిన ప్రవక్తను, వెనుకటి వెలుగును, సాయంకాలపు వెలుగును దేవుడు మనకు పంపమని దేవుని ప్రార్థించుదుము. ఆ యెజెబెలును మరియు అహాబులను… అప్పుడు అది వేరు చేయును. అది సరియే.
MAL 4:5,6•
LUKE 12:32•
LUKE 17:28
118జ్ఞాపకముంచుకొనుడి, ఆ స్త్రీలు ఆ విధముగా ప్రవర్తించుటకు ప్రారంభించినప్పుడు… ఇప్పుడు కొద్దిగా వెనుకకు పోయి వారు వెంట్రుకలు కత్తిరించుకొని ఆ విధముగా ప్రవర్తించుటను ప్రారంభించినప్పుడు. స్త్రీలు ఆ విధముగా మారినప్పుడు, అటువంటి కాలములో, అటువంటి తరుణములో, ఏలీయా అంత్యకాలపు సూచనతో తెరపై ప్రత్యక్షము కావలసియున్నది. లోతు దినములలో వలె ఒక కడపటి కాల సూచనతో తెరపై ప్రత్యక్షము కావలసియున్నది, చూచారా. అంత్య-కాల సూచన. స్త్రీలు ఆ విధముగా ప్రవర్తించుచున్నప్పుడు… అదే విధముగా ఇప్పుడును ప్రవర్తించుచున్నారు. మరియు అటువంటి సమయములో పిలిచి, సరి చేయుటకు ఎలిషా తెరపై ప్రత్యక్షము కావలసియున్నది. వారిని ఖండించుటకు, చీల్చుటకు, వారి విధానములను బద్దలు చేయుటకు (సరియే), దేవుని సూచన అతని వెనుక ఉండగా, పోవుచున్నాడు. అతడు ఇప్పుడు పెద్ద గుంపును పిలుచుట లేదు. బైబిలు చెప్పుచున్నది, "చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యమును అనుగ్రహించుటకు మీ తండ్రి ఇష్టమైయున్నది," చూశారా. అది సరి! అది ఖచ్చితముగా సరియే.
అతడు చిన్న మంద తప్ప అందరి ద్వారా నిరాకరింపబడవలెను, అది ఎట్లనగా అతడు ఏలీయా అతనితో ఏడువందల మంది మరియు యోహాను తన చిన్న మందతో ఉన్నట్లుగా. సరి.
119మనము ఎక్కడ నీలుచుకొని యున్నామో చూచారా? మనము నిజమైన పెంతెకోస్తు నొద్దకు తిరిగి పోవలసియున్నది. దేవుని కార్యముల యొద్దకు తిరిగి పోవలసియున్నది. మనము వెనుకకు పోవలయును. సహోదర, సహోదరీలారా, మీ యొక్క అనుభవముల (ఉద్రేకము మొదలైనవి) ద్వారా మోసపోకుడి.
మనము ఆ ఘడియ కొరకు వేచియున్నాము. ''నేను ఆశపడుచున్నాను, నేను నమ్ముచున్నాను, విశ్వాసము ద్వారా నేను దానిని అంగీకరించుచున్నాను," అన్న కార్యములను తీసికొనకుడి. ఆ విధముగా చేయవద్దు! మీరు దేవుడ్ని ముఖాముఖి దర్శించి మరియు ఆత్మతో మీరు నింపబడిన యెడల అప్పుడు ఏమి జరుగునో గమనించండి. మరియు నీలో ఉన్న ఆత్మ ఈ వాక్యమునకు విరుద్ధముగా ఉన్నయెడల, ఆ ఆత్మను వదిలివేయుడి. వెళ్ళి దేవుని యొద్ద… ఆ నిజమైన ఆత్మను నీకు ఇచ్చుటకు….
MATT 3:9•
LUKE 3:8
120అంత్యకాలమందు ఈ ఆత్మ లేచినప్పుడు, వారు అబద్దికులని వారికి వ్యతిరేకముగా వారిని హెచ్చరించును, చూశారా, ఎందుకనగా యోహాను చెప్పెను, "మీరు మీలోపలే అబ్రాహాము మాకున్నాడు, మా తండ్రి అని తలంచుకొని చెప్పకుడి.'' "మేము కలిగియున్నాము… మేము… మా పితురులు మెతడిస్టులు, బాప్టిస్టులు, పెస్బిటేరియన్లు, లేక పెంతెకోస్తులు." మీరు అబ్రాహాము సంతానమని తలంచుకొని చెప్పకుడి, ఏలయనగా దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహాముకు సంతానమును పుట్టించును. మీరు పెంతెకోస్తులు కాబట్టి మీరు మన్నించబడుదురు అని తలంచుకుడి. కానే కాదు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు సంతానము పుట్టించుగల సమర్ధుడు. అది ఖచ్చితముగా సరి. అవునయ్యా.
కేవలము చివరికాల సత్యము ప్రకారము దేవుని వాక్యమును పలుకవలయును. అతని ప్రవచనము…
DEUT 18:20•
EZEK 18:4,20
121ఒక్క నిమిషము నేను వెనుకకు పోవలయునని యున్నాను, మనము ఏ విధముగా దానిని కనుగొనగలమో నేను మీకు చూపెదను. అనేక లేఖనములు ఇక్కడ వ్రాసికొనియున్నాను, వాటిని మీకు చూపుచు ఉన్నాను. నేను మీకు ఒకదానిని చదివి అక్కడ నుండి… మొదట, మనము ద్వితీయోప దేశకాండము 18వ అధ్యాయము ఒక్క నిమిషములో కనుగొనేదము. ముగించుటకు ముందు ఈ వాక్యమును మీకు చదివెదను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము, మంచిది, ఇప్పుడు మనము 20వ వచనము 18వ అధ్యాయములో ద్వితీయోపదేశకాండము, 20…
ఏ ప్రవక్తయు అహంకారముతో, నేను చెప్పమని తనకాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల [బహువచనము] నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను. [అది సరి. ఆత్మీయముగా చనిపోయినది. "పాపము చేసిన ఆత్మ చావవలెను." మనకు ఒక దేవుడే వున్నాడు, దేవుళ్ళు కాదు.
మరియు ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీ హృదయములో మీరనుకొనినయెడల? ["మేము ఎట్లు తెలిసికొనగలము? వారిలో అనేకులు ఉండరు, మేమెట్లు తెలుసుకొనగలము? ఒకడు ఇది సరియనియు… ఇంకొకడు అది సరియనియు అది, ఇది అని చెప్పినయెడల…. ఇప్పుడు గనునించండి. మనము తెలిసికొనగలము.]
ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన యెడల ఎన్నడును నెరవేరకపోయిన యెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దానిని చెప్పెను గనుక దానికి భయపడవద్దు.
దేవుడు దానిని చెప్పనియెడల, మరి దానికి భయపడవద్దు. అది సరి, దానిని గూర్చి మరచిపోయి ముందుకు సాగిపోండి, చూశారా.
ACTS 2:38,39
122ఇప్పుడు, ఈ రోజు మనము ఏమి వినుచున్నామో చూడుడి - అపోస్తులుల ఆచారము, మెధడిస్టు ఆచారము, బాప్టిస్టు ఆచారము, పెంతెకోస్తుల ఆచారము, ఆచారము, ఆచారము. ఆచారము అనగా ఏమిటి? అది ఎక్కడ నుండి వచ్చినది.? అపోస్తులుల ఆచారము బైబిలులో ఉన్నదని నాకు చూపించమని నేను సవాలు చేయుచున్నాను. "నేను నమ్ముచున్నాను…." ఆ విధమైన కార్యము లేదు. అపోస్తులులు ఎప్పుడైన వారి యొక్క ఆచారము అని ఎప్పుడైనా దానికి వేలాడినయెడల, అది ఇక్కడ ఉన్నది: "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు; ఏలయనగా ఈ వాగ్దానము మీకును…" స్నేహితులారా, మనము ఎక్కడ ఉన్నామో మీరు చూచుటలేదా? మనము భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. ఒక నిజమైన సూచన ఉపేక్షించబడినది.
MAL 3:1•
MATT 11:10
123ఇప్పుడు, పురుషులారా, స్త్రీలారా మీలో అనేకులు, మరియు మీరు దేవుని బిడ్డలు. దానిని ఉపేక్షించకుడి. జ్ఞాపకముంచుకొనుడి మనము ఇటువంటి కార్యములను కలిగియుండవలయును. ఈ రోజులలో ఈ ఘడియలో మనము జీవించు కాలమున అవన్నియు నెరవేరవలసి యున్నది. మెస్సీయా యొక్క రాకడకు ముందు సమయము ఇది. దేవుని యొద్ద నుండి ఒక సూచన వచ్చి యుండవలయును. నేను అది మీ కోరకు చదివెదను. మనము మలాకీకి పోవుదుము. పాత నిబంధనలో అది కడపటి పుస్తకము. మలాకీలో అతడు ఏమి చెప్పుచున్నాడో వినుడి. ఒక్క క్షణము దీనిని వినుడి. మీరు గమనించినయెడల, మలాకీ 3వ అధ్యాయములో యేసు, యోహాను యొక్క రాకడను గూర్చి చెప్పుటను చూడవచ్చును:
ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్దపరచుటకై నేను నా దూతను పంపుచున్నాము: మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును: ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
JOHN 16:28•
ACTS 9:3-7•
ACTS 22:9
124అది యోహాను, యేసు రాకడను చాటించుచున్నాడు. మరియు ఒడంబడిక దూత ఆయన, ఆయన ఏమి చెప్పెనో అట్లే ఖచ్చితముగా ఆలయమునకు వచ్చెను. శిష్యులతో లేక ఇశ్రాయేలీయులతో ఆ అరణ్యములో ఉన్న దూత. మీరు నమ్ముచున్నారా, అతడే ఆ దూత అని? ఎందుకు, "నేను దేవుని యొద్ద నుండి వచ్చితిని, మరియు తిరిగి దేవుని యొద్దకు పోవుదును," అని ఆయన చెప్పెను.
ఇప్పుడు, పౌలును పట్టి యుంచుటకు ఏల ఆ వ్యాధి ఇవ్వబడెను? యేసు మరణించిన పిదప, పాతిపెట్టబడి, మరల లేచి, చాలా కాలమైన తరువాత పౌలు అతనిని దమస్కు పోవు మార్గములో ముఖాముఖిగా సంధించెను. ఆయన చెప్పెను, "నేను దేవుని యొద్ద నుండి వచ్చితిని, దేవుని యొద్దకు వెళ్ళాను." పౌలు పైకి చూచెను. అక్కడొక పెద్ద వెలుగు ఉండెను, అదే అగ్నిస్తంభము. నేను ఏమి మాట్లాడుచున్నానో మీకు తెలియునా? అదే అగ్నిస్తంభము….. మరియు పౌలలు ఆయనతో మాట్లాడెను, మళ్ళీ ఆయన తిరిగి పౌలుతో మాట్లాడెను. ప్రజలు ఆయనని వినలేదు. వారు ఆయన మాట వినలేదు, అయితే పౌలు ఆయన మాట వినెను.
ఆయన చెప్పెను, "పౌలా, పౌలా నీవేల నమ్న హింసించుచున్నావు?"
పౌలు, "ఓ ప్రభువా, నీవెవడవని?" అడిగెను.
ఆయన చెప్పెను, "నేను యేసును. ఇప్పుడు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళుము; అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడును. నీవు ఏమి చేయవలెనో నీకు చెప్పుటకు నా యొక్క ప్రవక్త అక్కడికి వచ్చుచున్నాడు, మీరు గ్రహించారా, ఏ విధముగా…"
ACTS 9:17,18•
2COR 12:7
125పౌలు అక్కడికి కొనిపోబడి బాప్తిస్మము పొందెను, మరియు ప్రభువు నామమును పిలిచెను, పరిశుద్ధాత్మను పొందెను. మరియు పౌలు చెప్పెను, "నాకు ఇయ్యబడిన ఒక బలహీనము నా శరీరములో ఉన్నది, ఒక దయ్యము, నన్ను దెబ్బకొట్టిన దయ్యపు దూత.'' అది దెబ్బ పైన దెబ్బ తగులు విధముగా ఉండెను. కొద్దిగా బాగుగా అయినట్లు ఉండును, మరల అది అతనిని కొట్టును. ''నా యొద్ద నుండి తొలగించమని మూడుసార్లు ప్రభువును వేడుకొంటిని, అయితే ప్రభువు చెప్పెను, 'పౌలు, నా కృప నీకు చాలును.'" అప్పుడు అతడు చెప్పెను, "నాకు బయలుపడిన అపారమైనవాటి వలన నేను హెచ్చింపబడకుండా." పేతురు, యాకోబు, యోహాను లేక ఇతరులు అందరికంటెను అతనికి ఎక్కువ ప్రత్యక్షత ఇయ్యబడెను. ఆయన వెళ్ళిపోయిన రెండు లేక మూడు సంవత్సరముల తరువాత ఒక అగ్నిస్తంభముతో నిలిచి, తనతో మాట్లాడుటను అతను చూచెను. ఈ రోజు ఎంత గొప్ప కార్యము - రెండువేల సంవత్సరములు, ఆయన ఇంకనూ జీవించుచునే ఉన్నాడు. ఆమేన్!
ACTS 19:4,5•
2COR 12:7•
GAL 1:8,16
126పౌలు చెప్పెను, ''నేను హెచ్చింపబడకుండా అది నాకు ఇయ్యబడినది. ఇప్పుడు సహోదరుడా, 'నేను మీకందరికంటే పై నున్నాను. చూశారా, మృతులలో నుండి ఆయన లేచిన తరువాత నేను ఆయనను చూశాను, మరియు నేను ఆయనతో మాట్లాడాను; నేను…' నేను హెచ్చింపబడకుండునట్లు నేను విధేయుడుగా ఉండులాగున, అటువంటి కార్యము నాకు ఇయ్యబడినది."
అతడే (పౌలు) వారిని మరల యేసు నామములో బాప్తిస్మము తీసుకొనమని చెప్పెను. చెప్పెను, "ఒకవేళ పరలోకము నుండి ఒక దూతయైనను…"
"నేను వారు ఆ పాఠశాలలకు వెళ్ళలేదని," అతడు చెప్పెను. నేను నేరుగా యెరూషలేమునకు కూడా వెళ్ళలేదు - పద్నాలుగు ఏండ్ల వరకు వెళ్ళలేదు. చెప్పెను, "నేను ఈజిప్టుకు వెళ్ళి, అసియాలో సుమారు మూడు సంవత్సరములు అక్కడే ఉండి, ప్రభువుతో విచారించుచు మాట్లాడుచు, పాత నిబంధనలోని వాక్యములతో పోల్చి చూచుచుంటిని," అని చెప్పెను. పదునాలుగు ఏండ్లు తరువాత అతడు మరల వచ్చి, పేతురును మరియు వారిని సంధించి, వారు చెప్పిన సువార్తనే పొందియుండెను, వారిచ్చిన విధముగానే బాప్తిస్మమిచ్చెను, అదే కార్యములను చేసెను. ఆమేన్! అదే సరియని అతనికి తెలిసియుండెను. అవునయ్యా!
MAL 3:1•
MATT 11:1
127ఇప్పుడు మలాకీ చెప్పుట వినుడి, మలాకీ 3వ అధ్యాయము. ఇప్పుడు, దీనిని మీకు విశదపరచెదను. నేను నమ్ముచున్నాను…. మనము మత్తయి సువార్త 11వ అధ్యాయము త్రిప్పి చూసెదము. నేను పొందినానని అనుకొనుచున్నాను. నేను మొదట చూడవలసినదిగా ఉన్నది. మత్తయి 11వ అధ్యాయము. మనము చూచెదము. ప్రారంభించు……
యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారు పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను.
క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరశాలలో వివి రాబోవువాడవు నీవేనా, నేను మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. [యోహాను చేరశాలలో నుండి పక్షిరాజు కన్నులతో తెరపై చూచునట్లు చూచెను, చూశారా.]
యేసు వారిని చూచి మీరు వెళ్లి, విన్నవాటిని, కన్నవాటిని యోహామకు తెలపండి: [యోహాను, ఒక ప్రవక్త, ఇక్కడ ఏమి జరుగుచున్నదో అతడు నిన్నట్లయితే, నేను ఎవరో అతను తెలుసుకొనుచు, చూశారా. ఆయన చెప్పెను…]
గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. ["అన్ని సంఘశాఖలు ఐక్యముగా ఉన్నారు." అది వారు చేస్తామని వారు చెప్పుట లేదా? కాదు, అది చేయలేదు. అది చెప్పుచున్నది…] కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్దులగుచున్నారు… చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. [అక్కడ అది సూచన. గమనించండి!]
వారు వెళ్ళిపోవుచుండగా ……
మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. [ఇప్పుడు గమనించండి!] నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. [ఇంకొక విధముగా చెప్పవలయుననిన, లేక నా గురించి సిగ్గుపడుట. నా గురించి సిగ్గుపడనివాడు ధన్యుడు, చూశారా.]
వారు వెళ్ళిపోవుచుండగా, యేసు యోహామను గూర్చి జనసమూహముతో ఈలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? [ఈ ప్రవక్తను ఇప్పుడు గమనించండి.] మీరేమి చూచుటకు ఆరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? [యోహానును కాదు. ఓ, కాదు! "గడ్డిలో ఉన్న సర్పసంతానమైన మీరు," ఆ సంఘ శాఖ వారితో అతడు చెప్పెను, "రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ది చెప్పినవాడెవడు? 'మేము దానికి, దీనికి చెందినవారమని' చెప్పుకొనుటకు ప్రారంభించకుడి, ఎందుకనగా దేవుడు ఈ రాళ్ళవలన పిల్లలను పుట్టించగల సమర్ధుడు…" ఓ, సోదరుడా, అతనితో ఉన్నది గాలికి కదలుచున్న రెల్లు కాదు.] గాలికి కదులుతున్న రెల్లునా?
మీరు ఏమి చూచుటకు వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? [ప్రసంగించుచుండగా రెండు, మూడు సార్లు , బట్టలు మార్చుకుందురు.] ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములో నుందురు కదా? [అటువంటి సూవార్త సేవకులు వెళ్ళి చిన్న బిడ్డలను ముద్దాడుదురు, మీకు తెలియునా, మరియు చిన్నవారిని లేత వయస్సులో వున్న కన్యలను వివాహము చేసుకొందురు. మరియు పాఠశాలకు వెళ్ళి తెలివిగా మాట్లాడెదరు. మరియు మీకు తెలుసు, ఈ విధమైన ఆడంగి పనులు. చూశారా, చూశారా? అతడు మొదటి వరుసలో రెండంచులు గల ఖడ్గమును ఊపడు. "మీరు ఏమి చూచుటకు వెళ్ళిరి? అటువంటి మనుష్యునా?" ఆయన వారిని అడిగెను.]
మీరేమి చూచుటకు వెళ్ళితిరి? ఒక ప్రవక్తనా? [వినుడి) అవును, మీతో నేను చెప్పుచున్నాను, మరియు ప్రవక్త కంటే గొప్పవాడని. [అవునయ్యా! అతడేమై యున్నాడు? అతడు ప్రవక్త కంటే గొప్పవాడని చెప్పెను. అతడు ప్రవక్త మరియు ఆ కాలమునకు అతడు వర్తమానీకుడు.] మీరేమి చూచుటకు వెళ్ళితిరి? ఒక ప్రవక్తనా? అవును, నేను మీతో చెప్పుచున్నాను, ప్రవక్త కంటే గొప్పవాడు.
ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచుము, అని యెవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను.
ఇప్పుడు, మలాకీ 3వ అధ్యాయములో చూడుడి: "ఇదిగో, నాకు ముందుగా నా దూతన పంపుచున్నాను."
MAL 4:1,6•
MATT 3:3
128గమనించండి! ఇప్పుడు మలాకీ 4వ అధ్యాయము, నేను దానిని చదువబోవుచున్నాను. అతడు మరల రాబోవుచున్నాడు.
…ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కొలునట్లు అది కాలును; గర్విష్టులందరును…
అది ఈ రోజు. నేను వీధిలో నడచుచున్నప్పుడు మరియు ఈ ప్రజలను చూచుచున్నాను. మీరు వారితో మాట్లాడవచ్చును, మరియు మిమ్ములను చూచి నవ్వుదురు మరియు గేళి చేయుదురు. "అదేమిటని?" నేను తలంచుచున్నాను. మరొక రోజు మరి నేను ఆ వీధి గుండా నడచి పోవుచున్నాను. నేను కొందరితో మాట్లాడుచున్నాను, మరియు వారు చెప్పారు, "ఆ…" అని నడచి వెళ్ళిపోయారు. నాలో ఏదో చెప్పెను, "వారు అణుబాంబు బూడిద, అని తొందరలో వారు బూడిదగా మారి భూమిపై చల్లబడుదురు. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. మీ వంతు మీరు మాట్లాడినారు. మీరు సిద్దపడి మరియు ఇక్కడ నుండి బయటకు రండి. హల్లేలూయా! నేను ఈలాగు చప్పవలసియుండెను అని నేను ఉహించుచున్నాను. "మీరు సిద్దపడుడి, నడుము బిగించుకొనుడి, నేను మిమ్ములను పిలుచుచున్నాను." అందుకొరకే నేను వేచియున్నాను.
ఏలయనగా, నిర్ణయింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్టులందరును, దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు: [ఖచ్చితముగా అది అట్లు ఉండును. మీలో వ్యవసాయదారులకు తెలిసియుండ వచ్చును. పెద్ద అగ్ని గోధుమ పంటను కాల్చినప్పుడు ఏమి జరుగును? కొయ్యకాలువలె ఉండును. ఆ అగ్ని రగిలినప్పుడు అదే చేయును.] ధూళివలె అక్కడ పడి యుండును. మరియు అదే అగ్ని వారిని తగులబెట్టినప్పుడు వారిలో ఒకరివి వేరైనమ చిగురైనమ లేకుండ రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. [వారిలో ఏమి మిగిలియుండదు.]
అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును;… గనుక మీరు బయలుదేరి, మరియు క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. [అది వెయ్యేండ్ల పాలన].
నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలే ఉందురు. మీరు వారిని అణగ ద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. [వెయ్యేండ్ల పరిపాలన నుండి బయటికి వచ్చుట… దుర్మార్గుల యొక్క ధూళి.]
హరేబు కొండపై ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.
[ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినుడి.] ఇదిగో, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును.
ఇప్పుడు, అది యోహాను కాదు. అట్లు ఉండదు, ఎందుకనగా అప్పుడు ప్రపంచము నాశనమగును. అయితే మత్తయి 3వ అధ్యాయములో అతడు చెప్పెను, తనకు ముందుగా ఒక దూతను పంపును. మరియు యేసు చెప్పెను, "నాకు ముందుగా మార్గము సిద్దపరచుటకై వచ్చు ఏలీయా ఇతడే. అయితే భయంకరమైన అగ్నిచే వచ్చి భూమివి నాశనము చేయు ముందు, నేను ఏలీయా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును."
నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పును.
MAL 4:5,6
129ఈ దినముకై ప్రవచింపబడినది… మీరు ఇప్పుడు చెప్పవచ్చు, "ఓ ఆ ఏలీయా యోహానని." ఆ నిబంధన దూత యోహాను, నిజముగా. అది ఖచ్చితముగా సరియే. యేసు ఆ విధముగా చెప్పి నిజమని నిరూపించెను. "నేను అతనిని గురించియే మాట్లాడితిని." అయితే మీరు చూడుడి, రాబోవు ఏలీయా అతడు కాదు. చూశారా, ఆ విధముగా ఉండదు. ఎందుకనగా, మీరు చూడుడి, ఆ విధముగా ఉండినయెడల, ప్రవచనము తప్పైపోవును. భూమి అప్పుడు ఇంకను నాశనము కాలేదు, చూశారా. "అయితే ప్రభువు యొక్క గొప్ప, భయంకరమైన దినము రాకమునుపు నేను ఏలీయాను మీ యొద్దకు పంపెదను. మరియు అతడు [దేవుని మొదటి రాకడను గమనించండి] తండ్రుల యొక్క హృదయమును పిల్లల తట్టుకు త్రిప్పును [అదే అతడు చేసిన మొదటి కార్యము, క్రీస్తు వచ్చినప్పుడు ఆ కొత్త వర్తమానము ద్వారా పారంపర్యముగా వారు ఉన్న ఆ మత సిద్ధాంతములతో ఉన్న ఆ తండ్రులను వారి మతాచార విశ్వాసము నుండి మరల్చి, అప్పుడే జన్మించిన కొత్త విశ్వాసమునకు త్రిప్పెను. ఆయన రెండవసారి వచ్చినప్పుడు…], పిల్లల హృదయములను పెంతెకొస్తు తండ్రుల తట్టుకు త్రిప్పును, నిజమైన వర్తమానము."
MATT 24:24•
MARK 13:22
130ఇప్పుడు, ప్రకటన 3వ అధ్యాయములోకి వెళ్ళి చూస్తే దానిని అక్కడ మీరు చూచెదరు. కావున అది ప్రవచింపబడినది. నా సోదరా, మనము కడపటి దినములలో ఉన్నాము. అది సరియే.
మికాయాకు ఎదురుగా ఆ నాలుగు వందల ప్రవక్తలు ఏలాగుండిరో, వారు చెప్పుదురు… మనము కడపటి దినములో ఉన్నాము, మాకు తెలియును. అబద్దపు ప్రవక్తలు సంఘ శాఖలలో చేరి, అబద్ధపు సూచనను చూపుదురు. వారు చెప్పుదురు, "వచ్చి చేరండి." మనమందరము ఐక్యమవుదుము. మీరు వచ్చి మా సంఘములలో చేరుడి. మీ సభ్యత్వము తీసుకురండి. మీ 'సంఘము నుండి మా సంఘమునకు వచ్చి చేరుటకు ఈ ఉదయమున తెరచి యుంచియున్నాము అని చెప్పుచున్నారు. ఓ, అది బుద్ధిహీనత! మీ సభ్యత్వము మీకేమి మంచి చేయును? ఒకవేళ మీకు పరలోకములో వారసత్వమే లేనియెడల, దాని గురించి మరచిపోవుడి.
MATT 24:24•
MARK 13:22
131అబద్దపు ప్రవక్తలు తప్పుడు సూచనలు చూపెదరు. కాని చూడుడి, నిజమైన ప్రవక్తలు దేవుని వాక్యములో నిలిచియుందురు. నిజమైన సూచన, నిజమైన వాక్యమునను, నిజమైన సంఘమునకు తెచ్చును. నిజమైన సంఘము ఆ వాక్యమును గైకొని దానితో ఆనందించును. చివరి దినములలో చిన్న మందకు ఆ కార్యము ఇయ్యబడినప్పుడు, అది ఎవరనగా అన్యజనులలో మిగిలినవారు, వారు కొనిపోబడుదురు…
మరియు యేసు వచ్చినప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే నమ్మిరి. యోహాను యొక్క ఆ చిన్న గుంపువారు నమ్మిరి. యేసు వారిని తీసుకుని, వారిలో నుండి శిష్యులను చేసి వెళ్ళెను.
132ఎప్పుడైతే ఏలీయా… నాశనము వచ్చినప్పుడు, నోవాహు కాలము వచ్చినప్పుడు, అతడొక సూచన; అతడు పడవలోనికి ఆ ప్రజలను తీసికొనిపోయెను. ఏలీయా వచ్చినప్పుడు వారున్న తారుమారు స్థితి నుండి ఆ ప్రజలు బయటకు తీసుకొని వచ్చెను. అలాగే యోహాను వచ్చినప్పుడు అన్నియు ప్రవక్తల సూచనలు, సూచనలు, సూచనలు, సూచనలు. మరియు ఈ చివరి దినములలో ఒక సూచనను ఆయన మనకు వాగ్ధానము చేసెను. కడపటి దినములలో ఒక సూచన ఉండును. అది ఉపేక్షించబడిన సూచన. ప్రజలు దానిని చూడరు. దానిని చూడకుండా వదిలి వేయుదురు.
సహోదర, సహోదరీ, సంఘములో చేరవద్దు.
133ముగించుటకు ముందు నేను దీనిని చెప్పుచున్నాను. మీకు ఏదో భావము లేక ఉద్రేకము లేక అనుభవము ఉన్నయెడల, దానిపై నిలచియుండకుడి. మిక్కిలి ప్రేమ గల జనులారా దానిని చేయవద్దు. మీరు… నేను ప్రజలతో మాటలాడుచున్నను… (టేపు రికార్డులు క్లిక్ మని వారు చేయు శబ్దమును నేను వినుచుచున్నను. ఇప్పుడు నేను సంఘముతో మాటలాడుచున్నాను, చూశారా.)
వినండి, మీరు వినరా… (నేను కొన్ని సమయములలో ప్రపంచమంతటను దూరముగా ఉన్న, ప్రజల కొరకు అనేక కార్యములను చెప్పెదను…) మీ యొక్క నిజమైన సూచన కొరకు దేవునితో నిలిచియుండిడి. మీరు దానిని చూచెదరు. అది మీ చుట్టూ ఉండును. అయితే లక్షలాది ప్రజలు దాని ప్రక్కనుండే పోవుచూ దానిని చూడలేకయున్నారు. యేసు వచ్చినప్పుడు ఆయన గూర్చి వారికి తెలియకుండెను. ఏలీయాను వారు గుర్తించలేదు. మరియు ఏలీయా పైకి పోయినప్పుడు వారు ఏమని అన్నారో మీకు తెలుసా? వారు ఆ బుద్ధిహీనతను నమ్మలేదు. వారు అన్నారు, "అది బుద్ధిహీనత." అతడు ఉన్న పట్టణములో ఎక్కడైతే అతడు జీవించెనో, ప్రసంగించెనో, సూచనలు, అద్భుతములు చేసిన అదే దేశములోని బిడ్డలు ఏలీయాను కనుగొనలేదు, అతనిని ప్రభువు సుడిగాలిలో తీసుకొనివెళ్ళెను అని హెచ్చరించినప్పుడు, ఆ కార్యమును చూచి వారు పరిహాసము చేసిరి.
2KGS 2:23,24
134ఇక్కడ ఏలీయా… ఎలీషా అదే సూచనలతో, క్రీస్తు మరియు ఆయన సంఘము వలె ఏలీయాలో ఉన్న అదే సూచనలతో ఎలీషా వచ్చుచుండెను. అప్పుడు చిన్న బిడ్డలు కూడా అతనిని వెంబడించి, "వృద్ద బట్టతలవాడా, ఏలీయా వలె నీవెందుకు పైకి పోలేదని?" హేళన చేసిరి. భయభక్తులు లేని ఆ బిడ్డలకు ఏమి సంభవించినదో చూశారా? ఈ రోజు కూడా వారు హేళన చేయుచు నవ్వుచున్నారు. చింతించవద్దు, సహోదరా, ఇప్పుడే ఈ క్షణమే ఆకాశములో న్యాయతీర్పు వేచియున్నది, ప్రతిఒక్కరి ముఖాలపై వ్రాయబడి [స్పష్టతలేని మాటలు] అమెరికా. అది నిజము! న్యాయతీర్పు ఆకాశములో వేచియున్నది. సర్వోన్నతమైన దేవుని యొక్క కోపాగ్ని… [టేపుపై ఖాళీ స్థలము.]
2TIM 3:3,5
135…సజ్జన ద్వేషులు పైకి భక్తిగలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు; ఇట్టివారికి విముఖుడవై యుండుము.
మీరు అనుభవములపై ఆధారపడవద్దు. ఉద్రేకములపై ఆధారపడి వద్దు. దేవున్ని దర్శించు వరుకు, దేవుని ఆత్మతో నింపబడు వరుకు దేనిపైన ఆధారపడవద్దు. దేవుడు మీ హృదయమును మరియు ఆత్మను ప్రేమలో, శక్తితో, నింపి ప్రకాశింపజేయును.
దేవా, ఈ ప్రపంచములో రాబోవు దినములలో నా స్థానమును గుర్తించులాగున, నా యొక్క తదుపరి అడుగు ఏమిటని నేను చూచేలాగున చేయుము.
మనము చాలా సేపు వేచియున్నాము. నేను చాలా కాలము వేచియున్నాను. నేను నా యింటి వెనుక పెరడులో గడ్డి కోస్తున్నాను అని జ్ఞాపకము ఉన్నది. నేను ఈ ఇళ్ళు కట్టునప్పుడు ప్రభువు నన్ను పిలిచెను. నా భార్య తన తల్లిని విడువలేక ఏడ్చినది. ఆమెను చూచు వారు ఎవ్వరు ఉండరని చెప్పెను. "నాకును ఒక వృద్ధాప్య తల్లి," ఉండును అని తలంచాను.
నేను గడ్డి కోయుచు అక్కడే ఉన్నాను. నేను కూర్చున్నాను; ఒక స్వరము స్పష్టముగా ఇలా చెప్పెను, "నీవు వేరుపడుము, అప్పుడు నిన్ను ఆశీర్వదించెదనను."
"ప్రభువైనా దేవా, ఇక్కడే నన్ను సంతోషముగా ఉండని అని చెప్పాను. మీరు చూశారా నేను దేనికి వ్యతిరేకముగా ఉన్నానని."
ఇప్పుడు అన్ని కార్యములు ముగించిపోయినవి. తల్లి బ్రాయిస్ మహిమలో ఉన్నారు, తల్లి బ్రెన్హాం కూడా. నేను ఎటు నడువవలయును, ప్రభువా?
DEUT 30:10•
1SAM 7:3
136ఒకానొక రోజులలో న్యాయతీర్పు ఈ దేశమును దండించును. ఇంకా సువార్తను ఎరుగని ఇతర దేశములు ఉన్నవి. ఇతర స్థలములు……
మీరేమి చేసినను నా వాక్యములను మరువ వద్దు. ఈ లంగరు మిమ్ములను వదలనియకుండా… దేవుడు ఉక్కు కలవులో మీ హృదయములలో చెక్కని, దానిని మరువ వద్దు. ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, "మీ పరిపూర్ణ హృదయముతో దేవుని వైపుకు తిరుగుడి." తిరిగి రండి! మీరు ఉద్రేకము, అనుభవము లేక ఇతర కార్యములపై ఆధారపడకుడి. నీ అంతరంగమున ఉన్న సమస్తముతో దేవునిని వెదకుడి. నీలో ఏదో కార్యము జరుగు వరుకు నిన్నునీవు సరిదిద్దుకొను వరుకు, నీవు సవ్యముగా జీవించి, దేవత్వముతో నింపబడు వరుకు, దేవుని భయభక్తులతో దేవుని వెదకుము. దానిని చేయుము. దానిని మరవద్దు, ఏలయనగా మనము కడపటి కాలములో ఉన్నాము.
మనము కడపటి కాలములో ఉన్నామని గుర్తించుకొనుడి. నేను ఇంకొక్క నిమిషములో ముగించి ప్రార్థించ బోవుచుండగా గుర్తుంచుకోండి. మరువద్దు! నా మాటలు వినుడి, గుడారమా! ఈ టేపు ఇంకా పోవుచుండిన యెడల, ప్రపంచమా నా మాట వినుడి, లేక ఇది ఎక్కడికి పోయినను అక్కడ ఒక నిజమైన సూచన లేచును. ఆ సూచన ఇప్పటికే ప్రత్యక్షమై యుండి యుండ వచ్చును, మరియు అది ఉపేక్షించబడి యుండ వచ్చును. నిజమైన సూచనను దేవుడు ఎల్లప్పుడు అనుగ్రహించుచున్నను అది ఉపేక్షించబడుచునే ఉన్నది.
137మనము ప్రార్థించుదుము.
నజరేయుడైన యేసు, నేను ఆ చోట ఆ చేట్టు ప్రక్కన ఉన్న కొయ్యను దాటునప్పుడు చెట్టుపై నుండి ఆ ఆత్మ దిగి వచ్చి "క్రొత్త నిబంధనలోని యేసు పాత నిబంధనలోని యెహోవా!" అని ఆ గొప్ప శబ్దము ద్వనించినది. ఓ, దేవా, ఈ బండ మీద నేను నిలిచి యున్నాను, తక్కిన భూములన్నియు క్రుంగిపోవు ఇసుక. తక్కిన భూములన్నియు క్రుంగిపోవు ఇసుక.
గత ముప్పది సంవత్సరములుగా, ప్రభువా, ఈ కొండల సందు పల్లపు ప్రదేశముల నుండి అరచుచున్నాను. ఆ వర్తమానము నుండి ఒక్క అంగుళమైనను కదలక ఎక్కడ మొదలు పెట్టితినో, అదే వర్తమానము, అదే కార్యములో ప్రజలను ఏదో ఉద్రేకమునకై పిలువ లేదు గాని, దేవునిని సంధించు ఆ అనుభవమునకు అతని ఆత్మతో నూతనముగా జన్మించుటకు నేను ఈ వర్తమానముతో ప్రజలను బిగ్గరగా పిలుచుచున్నాను. ఓ, న్యాయతీర్పు తప్ప ఏమి మిగిలియుండును. ఆ వర్తమానమును నిరాకరించువారికి, ప్రభువా, ఏమి మిగులదు.
JOHN 6:37,44
138మేమిక్కడ ఉన్నామనియు, నీవు మాట తప్పని దేవుడనియు, ఈ చివరి దినములలో సూచనలను నిరూపించుచు, బహిరంగంగా తెలియజేయుచు, మీ యొక్క వాక్యమును నెరవేర్చియున్నారు. పెద్ద సువార్తికులు ఆ దేశములలో లేచి మన దేశ రాజధానిలోను, ఇతర దేశములను చూపుచు అరుచుచున్నారు, భయమేయుచున్నది, ఆ గొప్ప మనుష్యుల ప్రసంగములు వినినప్పుడు, ఫ్రాన్సులోను మొదటి బాంబు లూయిస్-విల్, కెంటకీలో పడునని… అది వందల కొలది మైళ్ళు అన్ని ఊర్లను తుడిచి వేయును. ఓ, దేవా, వినుటకు వారికి అవకాశము ఉండెను, అయితే వారు వినరు.
దినపత్రికలు, సంఘ పత్రికలు, టెలివిజను, రేడియో ఈలాంటి వార్తలతో నిండియున్నది. ఇక మన్నింపే లేదు. అప్పుడు, నీవు చెప్పావు, "ప్రభువా, తండ్రి నాకు ఇచ్చిన వారందరు నా యొద్దకు వచ్చెదరు, తండ్రి ఆకర్షించితేనే గాని ఏ మనుష్యుడు నా యొద్దకు రాలేడు.''
ISA 6:6,7•
MATT 25:21,23
139తండ్రీ, ఇప్పుడు, ఈ ప్రార్థనను నా కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభువా, ఇప్పుడు నేను వృద్దునగుచున్నాను. మరి ఇంక ఎన్ని దినములు మా కొరకు మిగల్చబడియున్నవో నాకు తెలియదు. ప్రభువా, ఈ దినమున కూడా మా యొద్ద ఏమి లేకుండ ఉండవచ్చు. అయినను ఏమైనను మిగిలియున్నయెడల, ప్రభువా, మరియు నా జీవితములో ఏమైనను మిగిలియున్నయెడల, ఓ దేవా, దానిని మీరు ఎత్తి మీ మహిమార్థమై దానితో మీరు ఏమైనా కార్యము చేయుటకు మీకు సాధ్యమగును.
నా కొరకు నేను మొదట ప్రార్థించుచున్నాను, ప్రభువా, నీ చిత్తమును నాకు దయచేయుము, ప్రభువా, అది ఏమైననను - నీ చిత్తము జరుగును గాక. నేను నిన్ను సంధించినప్పుడు, ''అది బాగుగా జరిగినది,'' అని నీవు ఆ రోజు నాతో చెప్పవలయునని నేను కోరుచున్నాను. అది పెద్దదైనను, చిన్నదైనను విశాలమైన నీ హృదయములో నా జీవితము కొరకు ఏమున్నను, ప్రభువా, నేనిక్కడ ఉన్నాను.
కాలుచున్న నిప్పుతో ఒక దూతను పంపి నా పెదవులను కడిగి మరియు మమ్ములను పరిశుద్ధపరచుము, ప్రభువా, ఆ కడపటి గొప్ప కార్యము భూమిని చిన్నాభిన్నము చేయబోవుచున్నది. "దేవుని కలుసుకొనుటకు సిద్ధపడుడి," అని పాపమనే అరణ్యములో కేకవేయు స్వరముగా మమ్ము ఉండనిమ్ము."
2COR 3:2
140ఈ చిన్న సంఘము, ఈ జనులు ప్రతి దినమును వందలకొలది మైళ్ళ నుండి వచ్చుచున్నారు. ఓ, ఏ కార్యమును మరువని, ప్రేమగల, నిత్యుడవైన దేవా, అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడా, యేసును మరణము నుండి లేపినవాడా, ఇప్పుడు ఆయనను సర్వోన్నతుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు, దేవుడు శరీరములో ఉన్నాడు, నీ నామములో ఆశీర్వదించిన ఈ ప్రజలను ఆశీర్వదించుము. వారికి ఎప్పుడును ఒక సూచన ఉన్నదని గుర్తుంచుకొని మరియు తెలుసుకొని యుందురు గాక, కడపటికాల సూచన. వారు ఇతరులను సంపాదించుకొనునట్లు నీవు వారిని చేయమని నేను ప్రార్ధించుచున్నాను - వారి యొక్క పనిలో, వారు ఎక్కడ ఉన్నా, వీధి చివరన, పెట్రోల్ స్టేషన్ లో, లేక అదే ఏమైనా గాని - కూరగాయల దుకాణములో, పాలవానికి. అది ఏమైనా, ప్రభువా, ఒకవేళ ఏదైనా వారి యొక్క హృదయమును మండించినట్లైతే, వారు సాక్షులుగా ఉందురు గాక. మనుష్యులందరి వలన చదువబడు విధముగా వారు వ్రాయబడిన పత్రికల వలె వారు దైవభక్తి కలిగి, పరిశుద్ధమైన జీవితము జీవించుదురు గాక.
JOHN 6:37,44
141దేవా, మా స్త్రీలను ఆశీర్వదించుము. ఓ దేవా, యెజెబేలు ముఖమునకు రంగు పూసుకున్న విధముగా ఉండు స్త్రీలు, వారి ముఖములను కడుగుకొని, శుభ్రపరుచుకొను విధముగా మీరు వారిని మార్చవలెనని నేను ప్రార్థించుచున్నాను. వారు వారి తల వెంట్రుకలను పెంచుకొని వినయముగల స్త్రీల వలె ప్రవర్తించనీ, వారు ధరించికొని యున్న ఆ అసభ్యమైన దుస్తులను మా సహోదరీలు ధరించుకోకుండా వుండేలాగ చెయ్యి. ఇవన్నియు వారు అర్థము చేసుకునే విధముగా, దేవా, వారిని మీ ఆత్మతో నింపి, వారిని ధైర్యము గల క్రైస్తవులుగా జీవించులాగున చేయుము. బైబిలులో ఈ విధముగా వ్రాయబడియున్నది, "ఈ కడపటి దినములలో వచ్చు ఈ కార్యముల నుండి తప్పించుకొను ఆ చిన్న కొమ్మ ప్రభువు దృష్టిలో అమూల్యము." ప్రవక్త ముందు చెప్పిన విధముగా, అది దేవుని దృష్టిలో మహిమకరము!'' దేవా, దానిని దయ చేయుము!
ఇంతకు మించి నేను ఏమియు చేయలేను. సంవత్సరము వెంబడి సంవత్సరము నేను గొంతెత్తి అరుచుచునే యున్నాను, ప్రభువా; మీరు క్రియ చేస్తేనే తప్ప నేను చేయునది ఏమియు లేదు. మీరు చేయుదరని నేను ప్రార్థిస్తున్నాను. మరియు నీవు చేయుదువని నాకు తెలియును, ఏలయనగా నీ వాక్యముతో వాగ్దానము చేసియున్నావు, దానియందే నేను నిలిచియున్నాను. నేను సాక్ష్యమును మాత్రము ఇవ్వగలను, ప్రభువా, నీవు ఆకర్షించితేనే గాని ఏ మునుష్యుడు నీ యొద్దకు రాలేడు; మరియు తండ్రి ఇచ్చిన వారందరూ వచ్చెదరు. నీ వాక్యము దానిని కాపాడుకొనునని నాకు నమ్మిక కలదు.
142ప్రభువా, మమ్మును ఆశీర్వదించుము. మరియు ఉద్రేకములపై ఆధారపడి ఎవ్వరైనా ఇక్కడ ఉన్నయెడల… వారు అరిచి యుండవచ్చును. మరియు పరిశుద్ధాత్మ కలిగి యుండవచ్చును, దానిని మేము లెక్క చేయుము. ప్రభువా, ఎందుకనగా ప్రజలు బంతి ఆటలో అరచుటను మేము చూచియున్నాము. ఈ లోకపు వినోద వేడుకలలో ప్రజలు అరచుటను మేము చూచియున్నాము. మరియు వారు నేలపై నాట్యమాడుచు, గొప్పగా కేకలు వేసి సంతోషముగా ఉండుటను మరియు ఇతర కార్యములను మేము చూసియున్నాము. దేవా, అది నీవు కాదు. నిన్ను సంధించుటయు, మేము నీతో, మీరు మాతో మాట్లాడుటయు అదే మేము కోరుకునేది.
ఓ దేవా, నిన్ను నేను ప్రార్థించుచున్నాను, ఈ చిన్న వినయపూర్వకమైన స్థలములో, ఈ క్షణమే పరిశుద్ధాత్మను ఈ గదిలోనికి పంపుము. ఆయన వచ్చుటకు ఏ స్థలము అర్హతమైనది కాదు. అయితే నేను ప్రార్ధన చేయుచున్నాను, దేవా, నీ యొక్క మార్గములో, ఇప్పుడే ఈ గదిలోనికి ఆయనను పంపుము, ఆత్మలను ఒప్పింపజేయుము.
ఇంతకు ముందు నేను చెప్పిన విధముగా, ప్రభువా, ఈ వేదిక పిలుపులను గూర్చి బహుశ వారి యొక్క మార్గములో అడ్డుపెట్టుము, ప్రజలను బ్రతిమాలి మరియు అక్కడకి వెళ్ళుటకు సమ్మతింప చేసిన తదుపరి; మనము మరల వచ్చి ఆ ప్రజలను చూసిన వారు మొదట ఉన్న స్థితి కంటే రెండింతలు నరకవాసులుగా ఉండుట చూచుచున్నాము. నీవు వారిని ఒప్పింపజేసి మరియు వారిపై నేరస్థాపింపన చేయకుంటే వారు ఎట్లు నీ యొద్దకు వచ్చెదరు, ఆ గొప్ప పరిశుద్ధాత్మ?
మరియు నేను నిన్ను ప్రార్థించుచున్నాను, ప్రభువైనా దేవా, ఈ కట్టడములో ఒకవేళ ఆ పాపియైన మనుష్యుడో, లేక స్త్రీ, బాలుడో లేక బాలిక ఈ ఉదయమున ఉన్నయెడల, పరిశుద్ధాత్మ వారికి నమ్మకము పుట్టించునట్లుగా వచ్చి వారి చెంపలపై కారు కన్నీరు వారి ఆత్మలపై బొట్లు, బొట్లుగా పడి, ప్రభువా, వారి హృదయాంతరములలో నుండి వారు విశ్వసించి క్రీస్తును అంగీకరించవలయును. దానిని అనుగ్రహించుము, ప్రభువా. వారికి బలిపీఠము అక్కర్లేదు. వారి ఆత్మయే వారి బలిపీఠముగా ఉండును. దానిని అనుగ్రహించుము ప్రభువా. అప్పుడు వారు, "నేను పశ్చాత్తాపము పొందినందులకు గాను నా పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో ఇప్పుడు నాకు బాప్తిస్మము కావలయునని," వారి పరిపూర్ణ హృదయములో నీ యొద్దకు వచ్చి చెప్పెదరు. దానిని అనుగ్రహించుము, ప్రభువా. వారిని పరుశుద్ధాత్మతో నింపుము.
ACTS 10:2,44
143ఈ రోజు ప్రపంచములో మాకు సువార్తికులను దయచేయుడి, సమ్మతింపచేసి మరియు లాగి మరియు వారిని సంఘ శాఖల బిడ్డలుగా చేయుటకు కాదు. దేవా, నీ కొరకు దాసులను లేపుము. ప్రభువా, ప్రజలు ప్రార్థించులాగున చేయుము. కొర్నేలి గృహమును గూర్చి నేను తలంచు చున్నాను. అన్యజనుల ఇంటిలో ఆ విధముగా ఇంతకు ముందు జరుగలేదు, అయితే వారు ఉపవాసముతో ప్రార్థించుచు ఉండిరి. మరి ఆ దైవజనుడు, ఆ ప్రవక్త అక్కడ నిలిచి మరియు ఈ వాక్యములు పలుకునప్పుడు, ఆ వాక్యమును వినిన వారిపై పరిశుద్ధాత్మ దిగెను. దేవా, ఆ విధమైన కూడికను అనుగ్రహించుము.
పేతురు ఈ వాక్యములను చెప్పునప్పుడు… ఓ దేవా, వారు ఆయుత్తముగా ఉండిరి. వారు ఉపవాసముండిరి, వారు వేచియున్నారు, వారు నమ్మకముగా ఉండిరి. వారు ఏదో ఊరకే వేచియుండలేదు; దానిని పొందు వరుకు వారు వేచియుండిరి. ఆ అపోస్తులులు, వారికి మధ్యలో దేవుడు దిగి వచ్చు వరుకు వేచియుండిరి. మరియు ఆయనను చూచి ఆయనతో మాట్లాడిరి. వారు ప్రపంచమును మండించిగల హృదయములతో బయటికి పోయిరి. వారు నిలిచిన స్థలములో వారి తలలు ఖండించబడవచ్చు, అట్టి స్థలములోను నిలుచుటకు వారు ధైర్యశాలిలుగా ఉండిరి. "మిమ్ములను వినుట సరియా? లేక మీ సంఘ శాఖలను లేక మీ సంఘ శాఖల మనుష్యుల మాటను వినుట మాకు సరియా? లేక దేవుని మాటను వినుట సరియా? అని వారు అడిగిరి. దానిని మీరు గ్రహించండి." వారి యొద్ద నుండి వారు విడువబడిన వెంటనే తిన్నగా వెళ్ళి మరల యేసుక్రీస్తు నామమును ప్రకటించిరి.
ఓ దేవా, దానిని మాకు అనుగ్రహించండి, ప్రభువా.
144మా కొరకు లేఖనములలో మీరు చెప్పిన పవక్తను లేపుము. అతనిని అభిషేకించుము, ప్రభువా. అతని కొరకు నేను విజ్ఞాపించుచున్నాను. ప్రభువా, అతనిని పంపుము! ఓ, దేవా ఆకలితో ఉండు మా హృదయములు మొర్ర పెట్టుచున్నవి. ప్రభువా, అతనిని పంపుము. ప్రజలను మరల తండ్రుల యొక్క విశ్వాసమునకు త్రిప్పుటకును, పెంతెకొస్తు దినమందు వారు దేవునితో నిజమైన అనుభవమును పొందినట్లు, సంఘ శాఖలకు వారు కీలుబొమ్మలుగా ఉండకుండా దానినుండి దూరముగా వచ్చునట్లుగా చేయుటకును, మండుచున్న ఒక నిజమైన సంఘము మరల, అదే వర్తమానముతో, అదే విశ్వాసము, అదే బోధన, అదే బైబిలు, అదే దేవుడు, అదే సూచనలతో ఒక ప్రవక్తను మాకు పంపుము. ప్రభువా, మాకు ఒక ప్రవక్తను లేపుము.
ACTS 20:9
145ప్రభువా, ఈ రోజు మా మధ్యలో ఉన్న వ్యాధిగ్రస్థులను స్వస్థపరుచుము. అనేక అవసరతలతో మా మధ్య అనేకులున్నారు. తండ్రి, వారి కొరకు ప్రార్థించుచున్నాను. నేను ఈ ఉదయము చాలా ఆలస్యము చేశాను, మరియు ఇక్కడున్న వారు… ఒక రాత్రి అపొస్తులుడైన పౌలు రాత్రంతయు ప్రసంగించునప్పుడు ఒక యౌవనుడు మిద్దె మీది నుండి పడి చనిపోయెను. అతడు నిద్రపోయెను. అతడు ఆలాగు కావాలని చేయలేదు, కాని అతడు నిద్రపోయి మరియు పడిపోయెను, మరియు అతడి జీవము పోయెను. మరియు ఆ అపొస్తులుడు ప్రార్థించునప్పుడు, అతనిలో మరల జీవము వచ్చెను.
ఓ ప్రభువైన దేవుడా, ఇక్కడ అనేకులు వ్యాధిగ్రస్థులై యున్నారు, నేను ముగించబోతున్నానని చెప్పి చాలా సమయము అయినది, అక్కడ వ్యాధితో ఉన్నవారున్నారు. ఓ దేవా, ఆ శక్తి, ఆ అగ్నిస్తంభము ద్వారా స్వయముగా వచ్చు ఆ పరిశుద్ధాత్మతో తాను ఎవరనేది తన్నుతాను ప్రకటిచుకొని మరియు తన్నుతాను తెలియపరచి - ఆయనను మేము నమ్ముచున్నాము - ఈ రోజు ఇక్కడున్న ప్రతి ఒక్కొక్క మనిషిని నీవు పరిశుద్ధాత్మనే అభిషేకించి, రోగులను స్వస్థత పరచి, ఆత్మతో నింపి మాకు ఏ విధమైన అవసరాలు ఉన్నవో, ప్రభువా, వాటన్నిటిని అనుగ్రహించుము గాక. మా హృదయములలో దృఢమైన విశ్వాసమును, దేనితో రాజీపడని విశ్వాసమును మాకిమ్ము, మేము "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడును" కలిగియుండవలయును. ప్రభువా, దానిని దయ చేయుము.
2COR 5:1
146వారు నీ ప్రజలు, నీ వర్తమానము, నీ వాక్యము, నీ దాసులు మరియు సాతానుకు వారిపై ఏ పట్టు అధికారము లేదు. ఈ యొక్క శరీరము నశించినను వారిని సాతాను నాశనము చేయలేడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిధిలమై పోయినను, మన కొరకు ఇంకొకటి కాచుకొని యున్నది. అతడు మనకు ఏ హాని చేయలేడు, మేము నీవారమైయున్నందున మాకు శత్రువుగా ఉన్నవన్నియు నీ యొక్క శత్రువు. అమూల్యమైన యేసు రక్తముతో మేము కొనబడియున్నాము. అందువలన, ఈ ప్రజలను అస్వస్థతతో కట్టివేసిన సాతానులారా, వీరందరి నుండి బయటకు రమ్మని యేసుక్రీస్తు నామములో నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. దేవుని యొక్క దాసునిగా, ఈ వాక్యమే సత్యమని చెప్పుచున్నాను, మరియు నీవు వారిని వదిలిపొమ్ము. నీకు ఏ అధికారము లేదు. నీవు నీకున్నదని అనుకున్నదంతయు కల్వరిలో కొట్టివేయబడెను, మరియు నీవు వారిని ఇంకా పట్టియుంచలేవు.
MATT 17:20•
MATT 21:21•
MARK 11:23,24
147మరియు దేవుడా, ఇక్కడున్న ప్రతి మనిషికి, స్త్రీకి, బాలునికి లేక బాలికకు దానిని నమ్ముటకు కావలసిన విశ్వాసమును దయ చేయుము. వాక్యము పలుకబడియున్నది. "నీవు ఈ కొండను చూచి, నీవు కదిలింపబడుదువు అని నీ హృదయములో సందేహింపక చెప్పినయెడల [విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును], నీవు అడిగిన దానిని నీవు పొందుకుందువు." మనకు అది తెలియును. దేవునియందు ఆ నమ్మకము మనకు ఉన్నది. మనకు ఏమైనా నిశ్వాసమున్నయెడల, దేవుడు మనలో జీవించుచున్నయెడల, మనము దానిని నమ్ముచున్నాము. ప్రభువా, అది అట్లే అని నాకు తెలియును. కావున స్వస్థత కొరకు మరియు రక్షణ కొరకు దానిని అనుగ్రహించుము. ఓ, నేను చెప్పను… లేక మొదట రక్షణ కొరకు ఆ తరువాత స్వస్థత కొరకు అని చెప్పవలెను. దానిని అనుగ్రహించుము, ప్రభువా, ఏలయనగా శరీరము కంటే ఆత్మ అమూల్యమైనది.
మరి కొన్ని సమయములలో…. వారి ఆత్మ రక్షింపబడియుండును, మరియు ఈ పాత శరీరము ఇంకను సాతానుకు చెందినదైయుండి, మరియు సాతానుకు తెలుసు, దానిని కడపటి దశలో ఆ శరీరమును నాశనము చేయును. వాడు ఈ శరీరమును కృశింపచేసి ఆ పురుగులు ఆ శరీరముపై ప్రాకి దానిని భక్షించునట్లు మంటికి తిరిగి పంపును; అయితే వాడు ఆత్మను తాకలేడు, ఏలయనగా అది దేవుని యొక్క అమూల్య నిధి. ఒక ఆకులో జీవము పోయి, రాలిపోయి మరల వచ్చులాగున, ఈ (మానవుని) జీవమును దేవుడిచ్చెను, కనుక అతని దగ్గరకు వెళ్ళి ఇంకొక కాలములో సాతాను తాకను వీలుకాని శరీరముతో మరల వచ్చును. దానిని వృద్ధాప్యము, మరియు ఏమియు ఎన్నడు తాకదు. అది మహిమ శరీరము. ప్రభువా, దాని కొరకు మేము ఎదురు చూచుచున్నాము. ఇప్పుడు నీ ప్రజలను ఆశీర్వదించుము. వారు నీ వారు; మరియు వారిని నీ చేతికి అప్పగించుచున్నాను. యేసు నామములో నేను దీనిని అడుగుచున్నాను.
148[జనులలో నుండి ప్రవచనము ఇవ్వబడెను. "ఈ రోజు దీనిని వినుము, నేను మీతో చెప్పునదేమనగా, నేను మీ మధ్యన నడిచాను మరియు ఈ తరమునకు ఖచ్చితముగా సూచనను తిసుకొని వచ్చుటకు ఈ ఉదయము నేను వచ్చాను. నేను మీతో చెప్పునదేమనగా, మీరు విన్న ఈ మాటలు, మీరు చెవియోగ్గి వినునట్లు అవి బాగుగా మీతో చెప్పబడలేదా? నిజముగా నేను మీతో చెప్పునదేమనగా, నా దాసుడు, అవును, ఈ తరుణమున మీ యొద్దకు వచ్చుటకు నా ఆత్మలో గొప్ప శ్రద్ధను కలిగియున్నాను. ప్రారంభము కార్యముల గురించి నీవు పలికిన దానిని బట్టి, నా ఆత్మ ప్రకారము నీవు కదలియున్నావు. నిజముగా ఈ దినాన నేను మీతో చెప్పునదేమనగా, ప్రజలారా, మీరు, నేను చెప్పునదేమనగా, ఈ కార్యములకు శ్రద్ధ చూపి మరియు నా సత్యములో మిమ్ములను మీరు కట్టిపెట్టుకొనుడి. నేను చెప్పునదేమనగా, ఇప్పుడు జరుగుచున్న కార్యములు రాబోవు దినాలలో అధికమగును మరియు నశిపజేయు ఆత్మ మరియు వెర్రితనము మీలో తెలియనివారిని ఖచ్చితముగా తీసుకొనును. అవును, నేను చెప్పునదేమనగా, ఇచ్చయించువారు ఆహ్వానము పొందులాగున ఈ ఉదయాన నా మాటను లక్ష్యపెట్టుడి. అవును, నేను చెప్పునదేమనగా, ఈ ఉదయాన మీరు విన్న ఈ వాక్యమును చూడుడి, మరియు మీ సన్నిధిలోనికి తీసుకొనిరాబడిన సూచనను నమ్ముడి. ఎలయనగా ప్రభువును మరియు మీ దేవుడనైన నేను మీతో మాట్లాడుచున్నాను."]
[మరొక ప్రవచనము ఇవ్వబడినది. "ఈ ఉదయాన, నా ప్రవక్త, నేను నీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పుచున్నాను, నా జీవాహారమును నీవు బాగుగా విరిచితివి. నేను నీతో చెప్పుచున్నాను, నేను నీ హృదయమును చూచియున్నాను, మరియు నీవు అవసరతలో ఉన్నావు, ఎందుకనగా ఇంతకు మునుపు ఎన్నడు లేని విధముగా నా ఆత్మ యొక్క నడిపింపు ఈ దినాన మరియు ఈ ఘడియలో నీకు అవసరమైయున్నది, ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మరియు నేను చెప్పునదేమనగా, ఈ లోకములో నా గొర్రెలు సంచారం చేయుచున్నవి. అయితే నేను చెప్పునదేమనగా, జగత్తు పున్నది మొదలుకొని విశేషముగా నా యొక్క తప్పిపోయిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వెళ్ళుటకు నేను నిన్ను అభిషేకించియున్నాను, ఎందుకనగా వారికి ఒక సూచన అవసరమైయున్నది మరియు నేను నీకు ఆ సూచనను ఇచ్చియున్నాను. నా జనులారా, నేను మీకు చెప్పునదేమనగా, ఈ ఉదయాన ఆ సూచన మీలో పెట్టబడియున్నది. మీరు తప్పక వాక్యమును లక్ష్యపెట్టువలెను, ఎందుకనగా నేను చెప్పుచున్నాను, నా సేవకుడు, నేను ఎలా కోరుకొందునో ఆ విధముగా అతడు జీవవాక్యయమును విరచియున్నాడు. ఏలయనగా ఈ ఉద్దేశ్యము కొరకే నేను అతడిని అభిషేకించియున్నాను, ప్రభువు సెలవిచ్చుచున్నాడు."]
అది నా యొక్క మాట కాదు; అది ఆయన మాట. ఓ, ఈ ఘడియలో జీవించు మనకు, ఈ ఘడియలో మనకు ఏమి కావలయును! స్నేహితులారా, మీకు అర్థమైందా, దేవుడు గొప్ప పేరు ప్రతిష్టలు పొందిన వారి యొద్దకు రాడు. ఆయన వినయముగల వారి మధ్య మరియు స్వల్ప కార్యములలో జీవించును. ఇప్పుడు మన మధ్య ఏమి కదలాడుచున్నది, ఈ కట్టడములో మరియు జనులు మధ్య ఏమి కదలాడుచున్నదని మీరు గుర్తించకపోవచ్చు, బహుశ గుర్తించవచ్చు.
సహోదరుడు హిగ్గిన్ బోతమ్ ద్వారా, నేను ఏమి చెప్పక మునుపు, అని ఆత్మ ఎందుకు చెప్పెను. "ఈ వర్తమానమును గమనించండి, నేను దీనిని తీసుకొని వచ్చితిని [ఏదో కార్యమును లేక దేనినో ఆ విధముగా] రాబోవు కార్యముల గూర్చి మిమ్ములను హెచ్చరించుటకు."? ఏమి జరుగుచున్నదో గమనించండి.
ISA 40:4•
ISA 55:12•
LUKE 1:80•
LUKE 3:2,21
149నేను వ్రాసియుంచికొనిన అనేక లేఖనములను నేను తాకలేదు, అవి వారి యొద్ద నుండి పోయినవి. నేను పరిశుద్ధాత్మ ద్వారా అక్కడకి నడిపింపబడినాను, చూశారా. కొన్ని వాక్యములను నేను ఇంకను తాక లేదు - నేను ఆ వాక్యములు ఎక్కడ ఉన్నవో అని వెతుకుదును.
ఇప్పుడు ఆత్మ ప్రతి కోణము నుండి మాట్లాడుచున్నది. ఓ, జనులార నమ్మకముగా, విశ్వాసముగా ఉండుడి. ఏదో దానిపై ఆధారపడి యుండుటకు ప్రయత్నము… చూశారా, మీరు ఏదో గొప్ప ప్రకాశించువాటి కొరకై చూస్తున్నారు, ఎప్పుడైతే ప్రవక్తలందరు… మరియు దావీదు కూడా చెప్పెను, ప్రభువు రాకడ యందు ప్రతి కొండయు పల్లము చేయబడును, మరియు ప్రతి పల్లమైన ప్రదేశములు ఉన్నతముగా చేయబడును. పర్వతములు, పొట్టేలు వలె గంతులు వేయును మరియు ఆకులన్నియు వారి చేతుతో చప్పట్లు కొట్టును. ఎందువలన, యేసు వచ్చినప్పుడు ఏ విధముగా ఉండునని ప్రజల తలంచెదరు? అది ఏ విధముగా మారినది? ఒక దీన సాత్వికమైన ప్రసంగి, ఏ చదువు జ్ఞానము లేక, తోమ్మిదేండ్ల ప్రాయములో మనుష్యులచే కాక, దేవునిచే తర్ఫీదు పొందుటకు అడవికి కొనిపోబడెను. అక్కడ నుండి బయటికి వచ్చి గొర్రె తోలుతో చుట్టుకొని కప్పబడినవాడై, ముఖమంతయు రోమములతో, కోపావేశముతో, మెడ నుండి వెంట్రుకలు వ్రేలాడుచుండగా అక్కడ నిలిచెను. అతడు అడవిలో మిడుతలను తినుచు, అడవి మిడుతలను తినుచు మరియు తేనె త్రాగుచు, అతడు అడవిలో జీవించెను. అక్కడ నుండి వచ్చి ఆ నదీ తీరమున ఆ బురదలో నిలిచి, మెస్సీయా రాకడను ప్రకటించుచుండెను. మరియు మెస్సీయా ఒక సాధారణ వ్యక్తిగా ఆ జనుల మధ్య నడచి బాప్తిస్మము పొందెను.
1COR 14:27,29
150మరియు ప్రవక్తలు, జరిగిన ఎన్నో కార్యములలో అది ఒక గొప్ప సంభవమని చాటించి చెప్పిరి, చూచారా. వారు ఏదో గొప్ప తళతళ మెరియు కార్యము జరుగవలయునని ఎదురు చూచుచుండిరి, చూశారా. పరిశుద్ధాత్మ తళతళ మెరియదు; అది సాత్వికముగా ప్రకాశించును. తళతళ అని మెరిసే కార్యములు ఈ ప్రపంచమునకు సంబంధించినవి; ప్రకాశించునది దేవుని కార్యము.
ప్రభువా, నాపై ప్రకాశించుము, అదే నా ప్రార్థన. నన్ను సాత్వికునిగా చేయుము. నన్ను అంగీకరించుము, నన్ను రూపించు, నన్ను తీర్చి దిద్దుము. జీవముగల దేవుని యొక్క ఆత్మను నాపై నూతనముగా కదలాడనిమ్ము. నన్ను చేయుము, నీ చిత్తానుసారముగా నన్ను మలుచుకొనుము, మరియు నన్ను స్వీకరించుము.
క్రీస్తు ఆత్మ ఈ కట్టడములో కదలాడుచున్నదని నేను ఎరిగియున్నాను. నేను ఇక్కడ ప్రసంగ పీఠములో నిలుచుకొని యుండుట ఎంత యదార్థమో, ఈ లోకములు తీర్పు తీర్చుటకు - దేవుడు ఇక్కడ వున్నాడు అనేది సత్యము. ఖచ్చితముగా బైబిలు చెప్పిన విధముగా, ఈ వాక్యము ఒకటి, రెండు, మూడు సార్లు ఇక్కడ నిరూపింపబడినది. మీరు మూడుసార్ల విన్న తరువాత వినిన దానిని మూసి వేయుదురా? ఒకటి, రెండు, మూడు సార్లు అన్నియు ఆత్మీయ క్రమముగా, అన్నియు లేఖనముల క్రమములో. ఓ, హృదయములను తెరచి అర్థము చేసికొనుడి. ఓ, ఎటువంటి కాలము! ఈ కాలములో ఏమి జరుగనైయున్నది?
ISA 40:31
151వారు ఆ మేడ గదిలో అందరు ఏక హృదయముతో కాచుకొని యుండిరి.
ప్రభువు కొరకు ఎదురు చూచువారు,
నూతన బలము పొందుదురు.
వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి
పైకి ఎగురుదురు.
ఏదో అక్కడికి పోయి, "ఓ, ప్రభువా, నా పాపములకు దుఃఖపడుచున్నాను. ఇప్పుడు, విశ్వాసము ద్వారా నేను పరిశుద్ధాత్మను పొందాను," అని చెప్పి నడచిపోవద్దు. ప్రభువు కొరకు ఎదురుచూచువారు [రోజులు తరబడి, వారములు తరబడి, అది ఏమైనను], నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు; సోమ్మసిల్లక నడచిపోవుదురు. ప్రభువా, నాకు బోధించుము, ప్రభువా, ఎదురుచూచుటకు నాకు నేర్పుపుము." ప్రభువు కొరకు ఎదురుచూడుడి.
LUKE 2:25,26,29,30,36
152రాత్రింబగళ్ళు అన్న, విడువక ఆలయములో నిరంతరం రాత్రింబగళ్ళు ప్రార్ధించుచుండెను. యేసును అక్కడికి పిలుచుకొని వచ్చినప్పుడు ఆమె గ్రుడ్డితనముతో ఆ కట్టడములోనికి వచ్చెను. ఆ గ్రుడ్డి స్త్రీ అక్కడే తిరుగుచు - ఆమె చేతులను ఆయనపై ఉంచి దేవుని స్తోత్రించెను; ఎందుకనగా ఆమె శరీరపు గ్రుడ్డితనములో, ఆమె ఆత్మలో ఆయన ఎక్కడ నిలిచి ఉండెనో అక్కడికి ఆత్మ ద్వారా కొనిపోబడెను.
అక్కడ సుమెయోను, ప్రార్థన గదిలో ఆయన కొరకు కాచుకొని యుండెను. అతడు వయసు మళ్ళిన ఎనభై, దాదాపు తొంబది యేండ్ల వృద్ధుడు, పరిశుద్ధాత్మ ద్వారా అతడు చావడని వాగ్దానము పొందెను. అతడు ధైర్యముగా జనులతో చెప్పుచుండెను, "మెస్సీయాను చూచువరకు నేను మరణము రుచి చూడనని." మరియు ఆ క్షణములో ఒక చిన్న బిడ్డ …. అతడేమైయున్నాడు? ప్రఖ్యాతిగలవాడు కాదు. ఆ మెస్సీయాను లోపలికి చక్కగా, అందముగా చుట్టబడి, చిన్న బిడ్డలు అర్పించుటకు ముందు ఏ విధముగా వచ్చెదరో ఆ విధముగా ఆ బిడ్డ చూడ ముచ్చటగా, సూవాసనలతో తెచ్చినప్పుడు సమస్త కావలి కాయువారు నిలుచుకొనియున్నారు. చెడుగా మాట్లాడబడిన ఆ చిన్న తల్లి, ఆమె పొత్తి గుడ్డలతో (కాడి - ఎడ్ల కాడి గుడ్డలు ఆయననకు చుట్టబడెను), చుట్టబడిన ఆ శిశువుతో ఆ కట్టడములో తిరుగులాడుచున్నప్పుడు, ప్రతి యొక్కరు ఆయనకు దూరముగా ఉండిరి. అయితే ఆ చిన్న గుంపు అన్న, సుమెయోను అక్కడ ఆ వరుసలో ఆయనను చూసి, సుమెయోను కన్నులు వారిపై పెట్టి, చేతులు పైకెత్తి ''ప్రభువా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, నీ రక్షణను నేను కన్నులార చూచితిని,'' అని చెప్పెను. చూశారా?
153ఏ విధమైన ఆర్బాటము లేని, నెమ్మదిగా ప్రకాశించుచు. అందరిచే చెడ్డగా మాట్లాడినప్పటికి, అది ఒక సూచన. మరియు ఈ రోజు, ఆ సూచన తప్పుడుగా మాట్లాడబడుచున్నది. దానికి సహకారము లేదు. అది అన్ని విధములుగా చెడుగా మాట్లాడబడి, దుర్భాషలాడబడుచున్నది, అయితే ఆ సూచన ఉపేక్షించబడినది, చెడుగా మాట్లాడబడి ఆ సూచన. చెడుగా మాట్లాడబడు ఆ సూచనను గూర్చి బైబిలు చెప్పుచున్నది.
మనము ఇండ్లకు పోవుచుండగా, దీనిని గుర్తుంచుకొందుము. మీ హృదయముల నుండి ఈ వర్తమానమును చెరిపివేసుకొనకుము. మీరేమి చేసినను, దానిని తొలగించుకొనకుడి. దీనిపై రాత్రింబగళ్ళు ధ్యానించుడి. ఇప్పుడు దేవుడు తన సాక్షిని లేపవలెనని రాత్రింబగళ్ళు ప్రార్థించుడి. మనము సిద్దముగా ఉన్నాము, సమయము ఇకడ ఉండదు అని నేను నమ్ముచున్నాను. మనము వచ్చుచున్నాము…
154బ్రెన్హాం సోదరుడా, అది ఎప్పుడు జరుగును?" నాకు తెలియదు. బహుశ ఈ రోజు. అది రేపు కావచ్చు. ఈ రోజు కాకున్నయెడల, నేను రేపటి దినము కొరకు ఎదురు చూచుచుందును. మరియు ఒకవేళ ఈ సంవత్సరము, రాబోవు సంవత్సరము, పది సంవత్సరములు, బహుశ ఒక ముప్పది సంవత్సరములు. అది ఎప్పుడు అని నాకు తెలియదు, అయితే మీరు ఇప్పటి నుండి ప్రతి క్షణము సిద్దముగా ఉండవలయునని నేను చెప్పుచున్నాను.
ఇదేదో సాధారణమైన కార్యమని తలంచవద్దు. ఆ విధముగా చేయవద్దు. దేవునితో మీరు మాట్లాడువరుకు రాత్రైనను, పగలైనను విశ్రమించవద్దు. ఆ మూఢత్వము నుండి దూరముగా ఉండుడి. ఉద్రేకము లాంటి కార్యములతో మోసపోవద్దు. ఆ కార్యము చేయవద్దు. అటువంటి కార్యముల వలన ప్రజలు భయపడుదురు, ఏలయనగా మత వెర్రితనము అని అనుకొని జనులు భయపడుదురు. అటువంటి దానిని అంగీకరించవద్దు - ఏమాత్రము వద్దు. దేవునితో మాట్లాడు వరుకు అక్కడే ఉండుడి. అది మీ ఆత్మకు సంబంధించినది. మీరు అద్దరిన నిత్యజీవములో గడపవలసినవారుగా ఉన్నారు. మీరు కరచాలము చేయుట లేక లేక విశ్వాసము ద్వారా దేనినో పొండుకొనుట వంటి ఆచారములను చేయకుండా ఉండునట్లు నిశ్చయతను కలిగియుండుడి. మీరు దానిని చేయవద్దు! మీరు దేవునితో మాట్లాడుడి, మరియు దేవుడు మీతో మాట్లాడనిమ్ము. మరియు అప్పుడు ఏమి జరుగునో గమనించండి. అప్పుడు మీ కోరికలు ఏ విధముగా ఉండునో గమనించండి. అప్పుడు మీరు దేవునితో మాట్లాడారా, లేదా అని గ్రహించుదురు.
JOHN 6:37•
ACTS 19:3
155ఈ రోజు ఉదయము ఆయనను విశ్వసించినవారైన మీకు… వేదిక పిలుపుల గురించి నేను చెప్పియున్నాను. దానిని బైబిలులో వారు ఏ విధముగా చేసితిరో మీకు తెలియునా? ప్రభువును నమ్మినవారు - ప్రభువును విశ్వసించినవారందరు - వారి పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరి. ఒకవేళ నీవు… వారు ఎన్నడు వేదిక పిలుపులను కలిగియుండ లేదు. వారు జనులను ఆ విధముగా రప్పించలేదు. ఆ విధముగా చేసినప్పుడు అన్ని కార్యములు మీ యొద్దకు వచ్చును. ఇక్కడ గర్వము కలవాడు ఒకడు, బలిపీఠము వద్దకు వచ్చి, మోకాళ్ళూని ఉండెను, ఎందుకనగా ఎవరో ఒకరు అతనిని రమ్మని చెప్పిరి. అతడిని మరల ఇక్కడకు రప్పించాలంటే అది అంతకంటే బహు కఠినమైన కార్యము, చూశారా. అప్పుడు మీరు ఏమి చేయుదురు? మీరు సమస్తమును అందులో పొందెదరు. మరియు యేసు చెప్పెను, "తండ్రి నాకిచ్చిన వారందరు నా యొద్దకు వచ్చెదరు." వాక్యముతో నిలిచియుండుడి, దేవుడు మిగిలిన కార్యములను చూచుకొనును. అది నిజము, దేవుడు మిగిలిన కార్యములు చూచుకొనును.
156దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక! ఈ రాత్రికి మరల మిమ్ములను చూచుదునని తలంచుచున్నాను. మీలో ప్రతి ఒక్కరిని నేను చూచెదను అని ఆశించుచున్నాను… మీలో అనేకులు బయట కాచుకొని యుండ వలయునని నాకు తెలియును. దేవుని చిత్తమైతే, నా సహోదరుని యొద్ద నుండి వినుటకు ఈ రాత్రికి ఇక్కడ ఉందును. అతని రెండు వర్తమానములను తీసుకొనుటకు నేను ఇష్టపడుట లేదు.
సహోదరుడు నెవిల్ ఒక మధురమైన దైవజనుడు, మరియు నాకు తెలియును, అతను ప్రసంగించునప్పుడు అతని హృదయాంతరములో నుండి నేరుగా వచ్చుచున్నది. నాకు తెలియును. గతరాత్రి సోదరుడు నెవిల్ చెప్పిన విధముగా ఆ వ్యాఖ్యానముతో చెప్పుచుండగా, నేను ఈ విధముగా చెప్పితిని, ''ఒకరోజు అతనికి (నెవిల్) యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చెదను.'' అదే విధముగా నేను చేసితిని. ఎందువలన? అతనిలో నిజాయితిని, నమ్మకమును, చూచితిని. అతను చూచుటకు అతనికి ఇయ్యబడినయెడల, అతని కండ్లు తెరవబడి అతడు గైకొనునని నాకు తెలియును. నేను సంఘముతో వేచియుండి, "చింతించవద్దు, ఆ మెతడిస్టు ప్రసంగికుడు వచ్చును, పరవాలేదు," అని చెప్పుచుంటిని. మరి ఈ రోజు అతను ఇక్కడ ఒక గుడారమునకు కాపరిగా వర్తమానములో దృఢ నమ్మకముతో ఉన్నాడు. అతడు దేవుని నమ్ముచున్నాడు. మరియు సహోదరుడు నెవిల్ యొద్ద నుండి నేను ఏమైనా వినినయెడల, అది దేవుని యొద్ద నుండి వచ్చుచున్న యధార్థమైనది, అని నాకు తెలియును, ఎందుకనగా అతడు అటువంటి మనుష్యుడు.
157నేను నా హస్తములను ప్రార్థించుట కొరకు మీ చేతి రుమాళ్ళపై ఉంచియున్నాను. మీలో ప్రతి ఒక్కరు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములను పొందుకున్నారు అని నమ్ముచున్నాను, దేవుడు మీ హృదయములలో ఉన్నాడని నమ్ముచున్నాను.
మనము ఇక్కడ దేవుని ఆశీర్వాదము పొందుటకు రాలేదు. మనము ప్రతిరోజు ఊపిరి పీల్చునప్పుడంతా దేవుని ఆశీర్వాదములు పొందుతునే యున్నాము. మనము దేనికొరకు ఇక్కడకి వచ్చుచున్నామనగా, సరిదిద్దుకొనుటకు, కత్తిరింపబడుటకు, మన హృదయములు సున్నతి చేయబడుటకు, దేవుని ముందు వచ్చుటకు, హృదయమంతటితో దేవుని నమ్ముటకు ఇక్కడకి వచ్చుచున్నాము.
ప్రభువు వాక్యమును జ్ఞాపకముంచుకొనుడి, మరవద్దు, దేవుని యొద్ద నుండి పంపబడిన నిజమైన సూచనను చూచుటకు తప్పిపోవద్దు. ఇప్పుడు నేను ఆరాధనను సహోదరుడు నెవిల్ కు అప్పగించబోవుచున్నాను, అతడు చెప్పదలచినది చెప్పవచ్చును.
158[సహోదరుడు నెవిల్ జనులతో మాట్లాడుచున్నాడు.]
ఒక మంచి సహోదరుని యొద్ద నుండి దీనికంటే మంచి కార్యమును మీరు అడుగలేరు. ఆ కారణము… చూశారా, స్నేహితులారా, మీరు నన్ను ప్రేమించుచున్నారని నాకు తెలియును. మీరు నెవిల్ సోదరుని ప్రేమించుచున్నారు. మీరు దేవుని జనులందరిని ప్రేమించుచున్నారు. మనము ఒకరినొకరము ప్రేమించుచున్నాము. ఒకరినొకరి ప్రేమించుట కంటే వేరే అధికమైన కార్యము ఉండవలసిన కాలము ఒకటున్నయెడల, అది ఈ రోజు మనము నిజమైన రక్తసంబంధమైన అన్నా, చెళ్ళెళ్ళ కంటెను ఇంకను అధికమైన సహోదర ఐక్యతలో ఉండవలయును. అటువంటి గొప్ప ప్రేమను, మర్యాదను, భయభక్తులను ఒకరియెడల ఒకరికి మన హృదయములో కలిగియుండవలయును. దానిని నేను ఇష్టపడుదును. నేను ఆ నిజమైన దానిని ఇష్టపడుచున్నాను.
159సహోదరుడు నెవిల్ మరియు సహోదరుడు హిగ్గిన్ బోతమ్, సహోదరుడు… సోదరుడు ఫంక్ అని నేను నమ్ముచున్నాను (నేను పిలుచుట అతని పేరు ధ్వనించులాగు లేదు) వారిచ్చిన ప్రసంగములు దేవుని యొద్ద నుండి పచ్చిది, స్నేహితులారా వారు నిజముగానే చేసిరి. ఆత్మీయముగా వివేచించు వరము కలిగియున్న ఎవరైనా దానిని ఎరుగుదురు.
కాని అదేమైయున్నది. ఇక్కడికి వచ్చునప్పుడు, నేను సహోదరుడు నెవిల్ ను అధికముగా ప్రేమించుచున్నాను, మీరు చూశారా: దేవుని యొద్ద నుండి ఏమైనా పొందితేనే గాని నేను మీకు ఏది చెప్పుటకు ఇష్టపడను, చూశారా. మరియు నాకు గత రెండు, మూడు దినముల నుండి నా హృదయములో వచ్చుచున్నది. మరియు లేఖనము దగ్గరకు పరిగెత్తితే గాని దానిని నేను సరిగా చూడలేకపోయాను. అందుకొరకు దానిని ఇచ్చుటకు వచ్చియున్నాను. ఇప్పుడు అది నా చేతులలో లేదు, చూశారా. దానితో మీరేమి చేసినను, అది మీకే… బాధ్యలు మీరే. మీరు చూశారా? అయితే ఇప్పుడది నా చేతులలో లేదు.
160కాని సహోదరుడు నెవిల్ మరియు నేను, అదే విధముగా ఉన్నాము. నేను మాట్లాడవలెనని ఒక వర్తమానముతో ఇక్కడకి వచ్చినప్పుడు, సహోదరుడు నెవిల్ దేవుని యొద్ద నుండి ఒక వర్తమానమును పొందియుండినయెడల, నేను క్రింద కూర్చుండును. నిజముగా సరి. ఎల్లప్పుడు దేవుని వర్తమానమునకు స్థలమిచ్చెదను, చూశారా. ఒకరికొకరు మనము అలాగే చేయుదుము. ఆ కారణము వలననే నేను చెప్పెదను. "ఒకవేళ మాట్లాడుటకు దేవుడు నాకు ఏ కార్యము ఇవ్వకున్నయెడల… మరియు దేవుడు సహోదరుడు నెవిల్ కు ఏమైనా ఇచ్చినయెడల, నేను ప్రసంగపీఠములో ఆదివారము ఉదయము, ఆదివారము రాత్రి ఎప్పుడైనను… సహోదరుడు నెవిల్ ఒక మంచి సహోదరుడు, అతడు వచ్చి ఇలా చెప్పును, "బ్రెన్హాం సహోదరుడా, నీవు దేవుని దాసుడవని నమ్ముచున్నాను, అయితే ప్రభువు నాకొక వర్తమానమును ఇచ్చెను." మీరు ఆ విధముగా చేయుదురు, మీరు చేయరా?
అవును! నేను అతనికి ఆ విధముగా చేయుదును.
161ఒకవేళ అతడు మాట్లాడవలసినదిగా ఉండియున్నాప్పుడు, ''సహోదరుడా నెవిల్, నీవు నన్ను మన్నించవా?'' అని నేను చెప్పుదును. దేవుడు "నాకు ఒక వర్తమానమును ఇచ్చియున్నాడు. జనులకు ఇప్పుడు నేను దానిని ప్రసంగించ వలయును అని చెప్పినప్పుడు, సహోదరుడు నెవిల్ క్రిందకు దిగి నాకు త్రోవనిచ్చును - మాలో ఎవరైనా ఒకరికొకరము అది చేయుదుము. చూశారా, ఆ విధముగా మేము చేయుదుము. మరియు నాకు నిశ్చయమైన కార్యము లేనియెడల, అప్పుడు…
అతడు ప్రసంగించుచుండగా, నేను వినుటకు ఇష్టపడుదును. గడిచిన ఆదివారము రాత్రి అతడు ప్రసంగించుచుండగా, ఎందరు విన్నారు? అద్భుతమైన వర్తమానము. ఆ రోజు ఉదయము చెప్పబడిన కార్యములతో అది జతపర్చబడెను. మరియు జనులారా, మీరు నిజముగా సరిగా జీవించుటకు, సరిపడ దేవుని వాక్యమును పొందియున్నారని నేను మీకు చెప్పుచున్నాను, సరిగా జీవించండి మరియు క్రమముగా ఉండుడి. ఇప్పుడు, దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. సహోదరుడా నేవిల్.