పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలము

పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలము

1స్నేహితులారా, శుభోదయము. వానతో, మంచుతో కలగలుపయిన ఈ ఉదయాన తిరిగి ఇక్కడ ఉండుట బాగున్నది. చాలామంది చాలా దూరము నుండి కారు నడుపుకొని వచ్చారని తెలిసినది. ఈ ప్రశస్త స్నేహితులు షికాగో, అలబామా, జార్జియా, టెనిస్సీ, మరియు ఇల్లినాయి ఇంకా ఆయా ప్రాంతముల నుండి వచ్చారు. మీరు ప్రయాణించుచుండగా దేవుడు తన కాపుదలను ఈ దినములన్నిటను ఇచ్చునని నమ్ముచున్నాను. శీతాకాలములో రోడ్లు జారుచుండును. ఇట్టి కష్టతరమగు రోడ్ల మీద దేవుడు తన కాపుదలను అనుగ్రహించునని ప్రార్థించుచున్నాము. శీతాకాలములో ఇది చాలా చెడ్డ దేశము. వసంతకాలము లేదా ఆకురాలు కాలములో ఇది చాలా సుందరమగు దేశము. కాని శీతాకాలము, ఎండాకాలములో ఇది చాలా కఠినముగా ఉండును.

2గత ఆదివారం వర్తమానానికి సంబంధించిన ఒక విషయాన్ని గూర్చి చెప్పాలనుకొంటున్నాను. వారింకా రికార్డింగ్ చేయుట లేదనుకొంటాను. నేను ఆ టేపును నిలిపియుంచి, దానిని అమ్ముటకు వారిని అనుమతించకపోవుటకు ఇదే కారణము. మొదటగా నేను దానిని చూడవలెను. అక్కరలేనిది తీసేస్తాను. చాలాసార్లు నేను ఈ సంఘములో చెప్పిన విషయాలు అదే రీతిగా బయటవారికి చెప్పినచో, కొన్నిసార్లు అట్టి సంగతులు వారికి అడ్డుబండలుగా ఉండును. కొన్నిసార్లయితే ఈ ఆలయంలో ఉన్న వారికి కూడా ప్రశ్నార్ధకముగానే యుండును.

3ఈ విషయాలను నేను విభేదంతో చెప్పుట లేదు, గాని కొన్నిసార్లు అభిషేకము క్రింద నీవు చేయరానివి చేసినట్లుగా వెల్లడియగును. జనులకు చెప్పే ధైర్యము నీకుండదు. అభిషేకము క్రింద నున్నప్పుడు కొన్ని విషయాలు గమనించకుండానే జారి వచ్చుచుండును. అట్టివానిలో ఒకటి నేను గత ఆదివారం చెప్పాననుకొంటాను. కొందరికది బాధ కలిగించవచ్చును. వేదిక పిలుపులలో నాకు నమ్మకం లేదని అందులో చెప్పాను, చూచారా.

మీరు అర్ధము చేసికొనునట్లుగా దానిని నేను చెప్పి స్పష్టపరచగోరుచున్నాను. బైబిలులో ఎన్నడూ ఈ వేదిక పిలుపు అనునది ప్రస్తావించబడలేదు. వాక్యములో అటువంటిదెక్కడా లేదు. సుమారు రెండు వందల సంవత్సరాల క్రితము అనగా మెథడిస్ట్ కాలము రానంతవరకు ఏ యుగంలోనూ అట్టిది లేదు.

వేదికి పిలుపు అనగా ప్రజలు వచ్చి వేదిక పైకి జనులను ఒప్పించి, లాక్కొని వెళ్ళుట. "జాన్, రా! నీ తల్లి చనిపోయింది. నీ కొరకు ప్రార్ధించుచున్నది. రా, జాన్! స్నేహితులారా, అది మార్పు కాదు. బహు అరుదుగా ఒకరు మాత్రమే అలా ఒప్పుదల కడవరకు నిలబడును. అందులో నీవు సమస్తమూ పొందుకోవచ్చును. ఆ కారణం వల్లనే ఈనాడు సంఘము అంతగా గందరగోళ స్థితిలో యున్నది, ఎందుకనగా అలంటి విషయాలను బట్టి.

ACTS 10:44

 

4సోదరుడా, నీవు ఏదో చెప్పితేనేగాని ఒప్పించబడుదురని అనుకోవద్దు; దేవుడక్కడ నుండి క్రియ జరిగించెను. "ఇంకా పేతురు ఈ మాటలు చెప్పుచుండగా, వాక్యమును వినిన వారి పైకి పరిశుద్ధాత్మ దిగెను." చూచారా? చూచారా? వేదిక పిలుపు అనేదేదీ అక్కడ లేదు.

వేదిక అనునది ప్రార్థనా స్థలము. సంఘానికి వచ్చు ప్రతి వ్యక్తి మొదటగా వేదిక యొద్దకు వెళ్ళి, మోకరించి, మౌనంగా దేవునికి ప్రార్ధించి, వారి ప్రార్థన విన్నపమును అర్పించుకోవలెను. వారి ప్రియుల విన్నపమును అర్పించుకోవలెను. దేవుడు తమకు చేసిన దానిని బట్టి కృతజ్ఞత చెల్లించుకొని, తమ స్థలములోనికి వెళ్ళి కూర్చోవలెను.

దేవుని వాక్యము ప్రకటించబడు స్థలమే సంఘము. "తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగును." దేవుని వాక్య తీర్పు బయలు వెళ్ళు స్థలమది. అయితే కాని ఈనాడు దానిని మనం చాలా మార్చేశాం.

JOHN 6:37•

ACTS 2:38,41

 

5వేదిక పిలుపులు ఇచ్చే వారిపై ఇప్పుడు నాకు ఏమీ లేదు. నేనే ఇప్పటికి చాలా వేదిక పిలుపులిచ్చాను. ఇంకా రాబోవు కాలములో ఇచ్చెదను. మీరెంతో పొందారు. దానికి వ్యతిరేకము ఏమీ లేదు, హాని అంతకన్న లేదు. అది మంచిది, చూచారా.

ఎందుకనగా, యేసు ఈలాగు చెప్పెను, వినండి, "మొదట తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు." అది నిజము. అది మీ వేదిక పిలుపును పూర్తిగా బయటకు విసరి వేయుచున్నది, చూచారా. "తండ్రి నాకు…"

వాక్యమును బోధించుటయే మన బాధ్యత. "ఎందరు నమ్మి బాప్తిస్మము పొందిరో వారు." "మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి," అని బైబిలు చెప్పుచున్నది. ఏమిటి? పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుట, చూచారా, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందెదరు.

ACTS 2:38

 

6నీవు నమ్మించి, లాక్కొచ్చి, ప్రజలను భయపెట్టి ప్రజలతో మాట్లాడుట కాదు. ప్రజలు మంచి బుద్ధితో, మెళుకువతో, మార్పుతో, వచ్చి క్రీస్తును చేర్చుకోవలెను. క్రీస్తును అంగీకరించి తమ స్థానములలో కూర్చొనినవారు ఆ తరువాత వారు ఏ విషయములలో తప్పు అని ఒప్పుకొన్నారో, ఆ విషయములకు పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు వచ్పుదురు. ఎందుకనగా వారు మారుమనస్సు పొందారు; "నేను క్రీసును నా స్వరక్షకునిగా అంగీకరించాను," అన్నదానికి జ్ఞాపకార్ధముగా ప్రజల ఎదుట నుండుటకు బాప్తిస్మము పొందుదురు; అప్పుడు నీవు పరిశుద్ధాత్మ పొందుటకు అర్హుడవు.

ఇప్పుడు, చాలామంది ఒప్పించుచు వేదిక యొద్దకు పిలుస్తున్నారు. ఈ విధమైనది ఇంకా కొనసాగుచున్నది. అటువంటివే ఇంకా ఉన్నవి. అది మంచిదే. నేను దానితో ఏకీభవించుదును. నాకు తెలిసినంతవరకు అది పరిపూర్ణముగా మంచిదే. దానిని ఎవరు చేయగోరినా మంచిదే. కాని నాకు అది వాక్యానుసారము కాదు, మీరు చూచారా, కావున నేను వాక్యముతోనే నిలచియుండుటను కోరుదును.

7ఆ కారణమును బట్టియే ఆ టేపును నేను నిలిపియుంచాను. దానిని బయటకు విడుదల చేసినచో, వారానికి అయిదు వందలు ఉత్తరాలకు జవాబు నియ్యవలసియుండును. ఎవరిదో అయిన ఒక చిన్న సంప్రదాయము మీదికి మీరు అడుగుపెట్టారు. మీరు చేసినదంతా అదే. అది మరలా అంతా తిరిగి వెళ్ళుతుంది.

చాలాసార్లు నేను అట్టి చిన్న విషయాల గూర్చి విమర్శనాత్మకంగా ఉన్నానేమో ననిపించును. ఆ విధంగా ఉండాలన్నది నా అభిమతం కాదు, కాని కొన్నిసార్లు పనులు ఆ విధంగా లాక్కొని వెళ్ళును, మీరు చూడండి. ఆ విధంగా నీవు అనుకొనేటట్లుగా అవి చేయును. దానిని ప్రజలు అర్ధము చేసికొందురని నిశ్చయంగా నేనెరుగుదును.

ROM 4:20

 

8ఇప్పుడు, మన తప్పులను చూచి, వాటిని లెక్కించని ఒక దయగల పరమ తండ్రిని ఇంకను కలిగియున్నందుకు మనము చాలా కృతజ్ఞలమైయున్నాము.

రోమా 4వ అధ్యాయము నేను చదువుచున్నాను. అబ్రాహాము జీవితము యొక్క దైవిక వ్యాఖ్యానమును పౌలు వ్రాసెను. అబ్రాహాము మనవలె చాలాసార్లు ఆశాభంగమునకు గురయినట్లుగా ఇప్పుడు మనకు తెలియును. కాని అతని గూర్చి వ్యాఖ్యానము వ్రాయబడినప్పుడు అందులో అతడు పొందిన ఆశాభంగముల గూర్చి ఎన్నడూ ప్రస్తావించలేదు, చూచారా. ఎన్నడూ వాటిని గూర్చి ఎత్తలేదు. ఇట్లనెను: "అబ్రాహాము అవిశ్వాసమును బట్టి దేవుని వాగ్దానములను గూర్చి సందేహించక, బలముగా నిలిచియుండి, దేవునికి స్తుతులు చెల్లించుచుండెను." చూచారా.

ఆ విధంగానే నాది కూడా వ్రాయబడియుండునని నేను నమ్ముచున్నాను. అక్కడ నా తప్పిదములు, మరేమీ ఉండవుగాని నేనేమి చేయ యత్నించానో, దేవుని జనుల నిమిత్తమై నేనేమి చేయ ఉద్దేశించానో, ఆ హృదయ ఉద్దేశ్యము అక్కడుండును.

HEB 11:32

 

9మరియు ఇప్పుడు, జనులకియ్యమని ప్రభువు నా హృదయములో ఉంచిన ఒక చిన్న వర్తమానమును అందించవలెనని మేము ఈ ఉదయకాలము వచ్చాము. మీకు, నాకు అది మేలు చేయునని నమ్ముచున్నాను, ఎందుకనగా మనమంతా ఒక వింతయిన కాలము, అనగా చివరి దినములలో జీవించుచున్నాము. కనుక మనము ప్రార్ధించక ముందు వాక్యములోని రెండు భాగములను చదువగోరుచున్నాను. ఒకటి ప్రార్థనకు ముందు, ఒకటి ప్రార్ధన తరువాత, మన ఆరాధనను హెబ్రీ గ్రంథములోని ఒక భాగము నుండి తెరచుదము, హెబ్రి 11వ అధ్యాయము 32వ వచనము. విశ్వాసము గూర్చి మాట్లాడుచున్నది.

ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను…, బారాకు…, సమ్సోను…, యెప్తా… దావీదు… సమూయేలు, వారిని గూర్చి ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు.

వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్ళను మూసిరి.

అగ్ని బలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమ శాలులైరి; అన్యుల సేనలను పారద్రోలిరి.

స్త్రీలు మృతులైన తమవారిని పునరుత్థానము వలన మరల పొందిరి… కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి.

మరికొందరు తిరస్కారములను… కొరడా దెబ్బలను మరి బంధకములను, ఖైదును అనుభవించిరి:

రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసికొని దరిద్రులై యుండి శ్రమపడి హింస పొందుచు;

ఈ బ్రాకెట్ లో ఉన్న దానిని గమనించండి:

(అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు:) అడవులలోను, కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి.

… వీరందరు తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము

దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింప లేదు.

10ఆ మహాయోధుల గాధలు నేను చదివినప్పుడు, ఆ దినమున ఆ జనులతో పాటుగా మన చిన్న సాక్ష్యము ఎక్కడ నిలబడునో అని ఆశ్చర్యపడుచుందును.

ప్రార్థనకు ముందుగా, దేవుని చేత జ్ఞాపకము చేయబడగోరువారెవరైనా ఉన్నారా? దయచేసి చేతిని ఎత్తండి. మీకేది అవసరమైననూ, ఆయన అది చూచి, విని ఇప్పుడు మనము తలలు వంచియుండగా ఆయన దానిని అనుగ్రహించును.

HEB 12:1

 

11మా కృపగల ప్రేమగల తండ్రి, నీ కుమారుడగు యేసు నామమున ఈ ఉదయకాలమున మా కొరకు, ఇతరుల కొరకు ప్రార్ధనలు అర్పించుటకు నీ సింహాసనమును వినయముగా సమీపించుచున్నాము. ప్రభువా, నీవు మొదట మా పాపములను, దోషములను అన్నింటినీ క్షమించుము. ప్రభువా, ఇప్పుడు మేము ఇతరుల కొరకు ప్రార్ధించుచున్నాము. వారు కూడా క్షమించబడునట్లు కృప చూపుము.

నీ సంఘము నీకు దగ్గరగా వచ్చునట్లు దయచూపుము. నిజంగా ప్రభువా, నీ సంఘముతో నీవు పని చేయుటకు సిద్ధంగా ఉన్నావని మా హృదయాలలో నమ్ముచున్నాము, లోకములోనుండి దానిని బయటకు తీసి, దేవుని రాజ్యములోనికి ఎత్తబాటు చేయనైయున్నావు. కాని, ప్రభువా, ఆ ఘడియ కొరకు మేము సిద్ధపడునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, ఈ ఉదయకాలము మేమందరము, "సుళువుగా చిక్కులుబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి, మా ముందుంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తునట్లు," కృప చూపుము.

12పరమ తండ్రీ, ఈ రోజు రోగులను, బాధపడుచున్నవారిని బాగుచేయుమని ప్రార్ధించుచున్నాను. దేశమంతటా ఎందరో తెగుళ్ళు మరియు "వైరస్" లతో బాధపడుచున్నారు. వైద్యులు ఈ విధంగా చెప్పుచున్నారు. ఆ జనులకు ప్రభువా, నీ స్వస్థత ప్రభావములు దొరుకునట్లు నేను ప్రార్ధించుచున్నాను.

ఇక్కడి ఈ సమాజములోనికి ఈ ఉదయమున దిగిరమ్ము గత రాత్రి ఆలస్యంగా బయలుదేరి రాత్రంతాను, ఉదయాన కారు నడుపుకొని ఈ ఆలయానికి అనేకులు వచ్చియున్నారు. వందలాది మైళ్ళ ప్రయాణించి వచ్చారు. రోడ్డు మీద మంచు పడుచున్నది. ప్రభువా, ప్రత్యేకంగా వారిని దీవించమని మేము ప్రార్ధించుచున్నాము. ఇక్కడకు వచ్చుటకు చాలామంది తమ మరుసటి వారపు ఆహారము నుండి వస్తువుల నుండి గాసోలిన్ కొరకు మరి ఇతర వాటికొరకు అధిక భాగమును ఖర్చుపెట్టి యందురని నిస్సందేహముగా నేను చెప్పగలను.

దేవా, నీ యొద్దకు ఖాళీగా వచ్చువాడు నిండుగా వెళ్ళును. అది నీ వాగ్దానము. దేవుని యొక్క మంచి సంగతులతో వారి హృదయాలను మరియు వారి ప్రాణముల గంపలను నీవు నింపమని నేను ప్రార్ధించుచున్నాను. చెప్పనాశక్యము కాని సంతోషము, నిండు మహిమతో పొంగి వెళ్ళునట్లు చేయుము. ఈ ప్రశస్త జనుల గిన్నెలు దేవుని యొక్క ఆత్మీయ, మంచి సంగతులతో నిండి పొర్లిపారును గాక!

13ప్రతి హస్తమును దీవించుము. ప్రభువా, ఆ హస్తము వెనుకనున్న అక్కరను నీవెరుగుదువు. ప్రత్యేకముగా వారిని దీవించమని నేను అడుగుచున్నాను. అత్యవసర సమయాల్లోను, జబ్బులు, వ్యాధులు గలవారి పట్లను కొద్ది క్షణాల్లో ఎంత అద్భుతకరంగా నీవు ఈ గతించిన వారములో జవాబు ఇచ్చితివో మేము చూచాము. నీవు దేవుడవు. అంతటా ఉండువాడవు. నీ దాసుల ప్రక్క నిలబడియుందువు. దేవా, ఈ ఉదయాన వీరి ప్రక్కన నీవు నిలిచియుండుమని ప్రార్ధించుచున్నాను. ప్రభువా, వారి హృదయ వాంఛలను దయచేయుము. అదేదీ తన స్వార్ధము కొరకు గాని, ఏదైనా చెడు ఉద్దేశ్యముతో గాని అడుగుటలేదని నేను నమ్ముచున్నాను. వారిని దీవించుమని ప్రార్ధించుచున్నాను.

తండ్రి, ఈ రోజు నన్ను గుర్తుచేసికొనుము. మార్గమంతటిలో నుండి నన్ను నేను తొలగించుకొందును. సంఘకాపరి మొదలుకొని చిన్న బిడ్డల వరకు మేమందరము దేవుని బలిపీఠము మీద మమ్ములను మేముంచుకొని, మా హృదయాలను తెరచి, పరిశుద్ధాత్మ మాతో మాట్లాడుచుండగా, వినుటకు శక్తినిమ్ము. మా గిన్నెలు నిండుగా నీ ఆశీర్వచనములను పొందునట్లుగా ఆశీర్వదించుము. వారిలోనికి అభిషేకపు నూనెను, శక్తిని కుమ్మరించుము. ప్రభువా, ముందున్న దినములకు అవసరమగు బలమును మాకనుగ్రహించుము. ఈ ఆశీర్వచనమును అనుగ్రహించుము. యేసు నామమున దీనిని అడుగుచున్నాము. ఆమెన్.

14[ఒకరు సహోదరుడు బ్రెన్హాంతో మాట్లాడుచున్నారు.] సహోదరుడు జాక్ మూర్ ఫోన్ చేసి ఈ వారము అక్కడుండమని ఇంకా బ్రతిమాలుచున్నాడు, చూచారా. దానిగూర్చి సరిగా నాకు తెలియదు, కావున ఏమి చేయలో నాకు తెలియదు.

సహోదరుడు జాక్ ను నేను ప్రేమించుచున్నాను. అక్కడ పెద్ద సమావేశము జరుగనున్నది. బూత్-క్లిబ్బర్న్ లాంటి మనుష్యులనే ఆయన త్రిప్పికొట్టాడు. నన్ను రమ్మని కోరుచూ ఇంకా ఆ ప్రకటనలు చేయుట మొదలగునవి నిలిపియుంచాడు. నిజంగా వెళ్ళవలెనను ఒత్తిడి కలుగుచున్నది, మీరు చూచారా.

2COR 12:9

 

15ఇప్పుడు II కొరింథీయులు 12వ అధ్యాయము 9వ వచనములోని రెండో భాగము నుండి చదువదము.

అందుకు నా కృప నీకు చాలును. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది, అని ఆయన నాతో చెప్పెను.

ఆ వాక్యము మీరందరు గ్రహించునట్లుగా మరలా ఆ వచనమును చదివెదను.

అందుకు, నా కృప నీకు చాలును. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. [పౌలుతో దీనిని దేవుడు చెప్పుచున్నాడు.]

16దీనిని నేను ఈ విధమగు అంశముగా పిలచుదును: "పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలము." మనకు బలహీనత ఉన్నచో బలముండును. పెంతెకోస్తు కూటమిలో బలహీనతను గూర్చి మాట్లాడుట అసహజము, ఎందుకనగా ఎప్పుడూ మనము చాలా బలంగా ఉన్నాము అని సాక్ష్యమిచ్చుచున్నాము.

నేను ముందే చెప్పాను, జనులకు ఏది చెప్పితే బాగుండునో అన్న విషయమును వారమంతా ప్రార్ధించి కనుగొందును. కేవలము ఏదో వినిపించుటకే నేను వచ్చినచో, ఈ ఉదయాన ఇక్కడ నిలబడియున్న ఎవరు చెప్పినదయినా నేను విందును.

17రెండు రోజుల క్రితం కెంటకిలో సహోదరుడు గేబ్హార్ట్ జనులతో ఉన్నాను. నేను వారి స్థలము విడిచిపెట్టినప్పుడు ఈ ప్రశస్త సోదరుడు, ఆయన భార్య, కుటుంబము ఉన్నది. అప్పుడీ ఆలోచన నాకు వచ్చినది.

దానికి కొద్ది ముందుగా నేను ఒక ఇంటికి వెళ్ళాను. నేను బయట నిలబడి యుండగా, ఒకామె నాతో అన్నది, "ఆ సేవకునితో నేను మాట్లాడగోరుచున్నాను." ఆ చిన్న ఇంటిలోనికి నేను వెళ్ళాను. అక్కడామె… ఆమె అన్నది, "మీరు సహోదరుడు బ్రెన్హాం?"

"అవునమ్మా," అని నేను అన్నాను.

నేన్నందుకు నేను చాలా సిగ్గుపడుచున్నాను," అని చెప్పి ఆమె ఏడ్వనారంభించినది. "కాని, అటువంటి అక్కర నాకున్నది. మీయందు నాకు నిజమైన నమ్మికయున్నది," అని ఆమె అన్నది.

మన కాక్సు సోదరి ఇక్కడే ఉండేదని నేను తెలుసుకొన్నాను. ఆ మామ్మ టేపు రికార్డరు తీసికొని ప్రక్కవారికి టేపులు వినిపించుచుండెడిది. అదే! అదే అభిప్రాయము!

18ఆ చిన్న సామాన్య గృహం నేను పెరిగిన గృహంవలె యున్నది. కాని గోడ క్రీస్తు పటాలతో నిండియున్నది. అక్కడ బల్లపై బైబిలు ఉన్నది. "నా జీవితంలో ఇటువంటి గృహంలోనికి నడిచి వచ్చుటకంటె ఘనత మరెక్కడా ఎన్నడూ దొరకదు," అన్నాను. ఆమె ఎవరికొరకో ఒక విన్నపము కోరినది. మేము అప్పటి నుండి, ఐదు గంటల సేపు, కలిసి ప్రార్ధించాము - ఆ మామ్మగారు, నేను కలిసి ప్రార్ధించాము - దేవుడు జవాబిచ్చెను.

మేము, అనగా తల్లి కాక్పు, నేను మేమంతా ఆ ఉదయాన బల్ల చుట్టూ చేరి ప్రార్ధించాము. ఆమె చేసిన ప్రయత్నములకు ఏదో చేయుటకు ఒక అవకాశము నిమ్ముని మోకరించి దేవునిని అడిగాము. ఆ విధంగా, అడుగుట ద్వారా దేవుడొక మార్గమును తెరచెను, చూచారా. ఆయన దేవుడు!

19మనము మన బలహీనతను సాకుగా చెప్పుదుము. మనమెంత పెద్దవారిమో, ఎంత గొప్పవారిమో చెప్పుకొనగోరుదుము. దేవుడు నాకీ అంశమును ఇచ్చుటలో అదొక కారణమని తలంచుచున్నాను. దానిని మనసులో నుండి తీసివేయుటకే, చూచారా.

మనము చేసే చిన్న పనులున్నవి. మన తప్పులేమిటో గ్రహించుటకు, ఇంకా చక్కగా పనులు చేయుటకు, మనము ఆలయమునకు వచ్చెదము. దీనికంటె భిన్నమైన ఉద్దేశ్యముతో మనము సంఘమునకు వచ్చినచో, మనము సంఘమునకు వచ్చుట వలన ఏమీ ఎక్కువ పొందజాలమని నేను భయముతో హెచ్చరించుచున్నాను. మన బలహీనతలు, మన చెడు పనులు, కనుగొనుటకే తప్పక మనము రావలెను. మనమెంత అల్పులమో గుర్తించి, బలవంతుడైన ఆయనలో నమ్మకముంచవలెను. కాని మనకు బలహీనతలున్నప్పుడే…

20మనలో అనేకులు చాలినంత స్థితిలో లేమని తలంచి సాక్ష్యమియ్యగోరుదురు. ఆ విధంగా మనము ఒక నెపము చెప్పెదము: "నాకు విద్య లేదు. బలము లేదు. అది నేను చేయజాలను? నీవాలాగే యుండి, ఆ విధంగానే కొనసాగుచూ, అలాగే ఉన్నచో నీవు దేనికి సరిపోవు. ఏ బలహీనతలను బట్టి మనము సాకులు చెప్చెదమో, వాటి ద్వారానే దేవుడు పనులు చేయును, చూచారా. ఆయన ఉపయోగించుకొనునట్లుగా మనము ఆ స్థితిలోనికి రావలెనని ఆయన కనిపెట్టుచున్నాడు. మనమయితే, "ఆ, ఇది నేను చేయలేను. నేను సరిపోను. అది నావల్ల కాదు," అని నెపములు చెప్పుదుము. దేవుడు ఆ విషయమునే తీసికొని పని జరిగించును. ఇది సత్యము.

ఆ కారణమును బట్టియే ఆయన మనలను ఎన్నుకొనెను, ఎందుకనగా మనము ఆ స్థితిలో ఉన్నాము. ఇప్పుడది వింతగా వినిపించవచ్చును, కాని కొద్ది నిమిషాల తరువాత, దేవుని చిత్తమైతే దానియొక్క కారణములోనికి వచ్చెదము.

బలహీనతలు, తిరస్కారములు గూర్చి ఇప్పుడే మనము చదివాము. బలహీనులయిన ఆ జనులు, బయటి లోకము ద్వారా విసర్జించబడినవారు, దేవునికి కధానాయకులయిరి. అయోగ్యులమని ఎంచుకొనినవారు అగ్రశ్రేణిలో నిలబడి జయశీలులయిరి.

21ఒహాయో లేక ఉత్తర ఇండియానా నుండి ఈ ఆలయానికి వచ్చు మెథడిస్ట్ సహోదరులు ముగ్గురున్నారు. కొద్దికాలం క్రితం వారు నాతో ఇట్లు చెప్పిరి, "బ్రెన్హాం సోదరుడా, మేము ఈ మధ్యనే పరిశుద్ధాత్మ పొందాము. ఇప్పుడు మేము మా సేవకొరకు వరములు వెదకవలెనా?"

"అదేమీ చేయవద్దు! దాని జోలికి పోవద్దు," అని చెప్పాను.

అతడు నా వైపు తిరిగి చూచి ఇట్లు చెప్పెను, "పరిశుద్ధాత్మ పొందిన తరువాత పరిశుద్ధాత్మను ఉపయోగించుకొనుట కొరకు వరములను వెదుకవలెనని ఒక సోదరుడు వ్రాసిన పుస్తకంలో చదివాను."

"అప్పుడు ఒక నింపబడిన చొక్కా వలె అవుదామనా!" అని నేను అన్నాను. చూచారా?

22బైబిలులో మీరు గమనించినచో, ఎల్లప్పుడూ దానినుండి దూరంగా పోవు యత్నించిన వారినే దేవుడు వాడుకొనును. ఒక మనిషి ఏదో చేయాలని అనుకొన్నంత కాలం, ఆ పనిని తను చేయగల సమర్దుడునని అనుకొన్నంతకాలం, ఆ మనిషిని దేవుడు ఎన్నడూ ఉపయోగించుకొనడు. మోషేను చూడండి, పారిపోయాడు; పౌలును చూడండి, పారిపోయెను. తక్కినవారంతా ఆలాగే దానినుండి దూరంగా పోసాగిరి.

"ఏదీ వెదుకవద్దు. నీ కొరకు ఏదైనా దేవుడుంచినచో, దానిని ఆయన నీకిచ్చును," అని చెప్పాను, చూచారా. దాన్నిగూర్చి దేవుడు జాగ్రత్త వహించనీ. అప్పుడు ఈనాడు మనకున్నట్టి గొప్ప కాలమును నీవును పొందుదువు. అందరూ ఇది చేసి, అది చేసి ఒక గొప్ప వ్యక్తి కాగోరుచున్నారు. దానితో మనమేమి పొందుదుమో చూడు, చూచారా.

గొప్పగా అగుటకు బదులుగా, ఎంత అల్పమైనది మనము పొందునర్హత కలిగియున్నామో కనుగొనుటకు ప్రయత్నించాలి, చూచారా. అప్పుడు దేవుడు మనలను వాడుకొనగలడు. తిరగేయవలసిన లేఖనములు చాలా నాకున్నవి, కాని దానికి సమయము బహుశా ఉండదు.

23గమనించండి, అత్యంత బలహీనుని మరియు విసర్జించబడినవారిని దేవుడు వాడుకొనును; మరియు దాదాపు ముందు వరుసలో దేవుడు కలిగియున్న ప్రతి కధానాయకుడు అట్టివారే. విసర్జించబడిన వ్యక్తి, సామర్థ్యము లేదనుకొనిన వ్యక్తి, అసలు శక్తి లేని వ్యక్తి దేవునిచే వాడబడుటకు మంచి ఆకారములో ఉన్నాడు, దేవుడు అతనిని వాడుకొనుట ప్రారంభించును. అది నిజము. చేయలేమని వారనుకొనినప్పుడు, వారికేదీ లేనప్పుడు, దేవుడు వారిని పట్టుకొని వారితో ఏదో చేయును, చూచారా. దానిని చేయగలమని మనమనుకొనినప్పుడు దేవుడు మనలను వాడుకొనడు, ఎందుకనగా మనంతట మనమే దానిని చేయగలమనుకొనుచున్నాము.

24మరొక వైపు చూద్దాం, ఈ ఆలోచనలు మనలో నున్నప్పుడు, మనము చాలిన వారము కామని అనుకొన్నప్పుడు, దానిని అసలు మనము చేయగోరము; కాని దేవుని పిలుపును మనము వినినచో చాలును, అది మాత్రమే మనము చేయవలెనని ఆయన కోరుచున్నాడు, ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన వాడుకొనగలడు.

మనంతట మనము చాలనివారమని గుర్తించినప్పుడు, దేవుని ఆత్మకు లోబడుటకు మనము వంగుదుము. దానిని చేయగలమని మనము అనుకొన్నంత కాలము దానిని మనము చేయజాలము. దానిని చేయజాలమని తెలిసికొను స్థానమునకు మనము వచ్చినప్పుడు, మనలను మనము దేవునికి లోబరచుకొందము. ఆయన పని చేయును. దానిని చేయవలెనని మనము ప్రయత్నించినచో, మనము విఫలమగుదుము. దేవునికి మనము లోబడినప్పుడు, దేవుడు విఫలము కాడు. దేవుడు చేయలెనిని ఒకే ఒకటున్నది, అది విఫలమగుట. ఆయన తప్పిపోవుట తప్ప మరేదైననూ చేయగలడు. కాని ఆయన తప్పిపోలేడు.

మనంతట మనము చేయాలని ప్రయత్నించిన ప్రకారము మన స్వంత సామర్ధ్యముల మీద ఆధారపడినంతకాలము మనము ఏమీ చేయజాలము. కాని మనము ఎందుకూ పనికిరానివారమని ఎరుగు స్థలమునకు వచ్చినప్పుడు, దేవుడు మనలను ఉపయోగించును.

25మనము నిర్వహించవలసిన ప్రాముఖ్యమైన వాటిలో ఒకటి (ఇప్పుడు, దీనిని గుర్తుంచుకొనండి, ముఖ్యంగా యవ్వన బోధకులు, సామాన్య సభ్యులు కూడా.) మన జీవితములో దేవుని కోరికను తీర్చవలెనన్నచో, మనము అదుపులో పెట్టుకొనవలసినది ఒకటున్నది. మానవ సామర్ధ్యము యొక్క ఆలోచనను మనము ఆధీనములో పెట్టుకొనవలెను. మన స్వంత జ్ఞానము, మన స్వంత సామర్థ్యములతో ఏదైనా చేయగలమను స్థితికి ఎప్పుడైనా వచ్చినచో, దానిని వదిలించుకొని, ప్రక్కకు నెట్టి దేవుడు మనలను ఉపయోగించుకొనునట్లుగా మనలను మనము అదుపులో పెట్టుకొనవలెను. అది నిజము.

26పూర్తిగా లొంగిపోవలెను! ఒక్క సామర్థ్యమును కూడా మనము ఉపయోగించుకొనరాదు. మనము పూర్తిగా లోబడిపోవలెను; దేవుని యొద్దకు వచ్చుటకు - నీవు, నీ యొక్క ఆత్మ, శరీరము, మరియు ప్రాణమున సమర్పించవలెను. నీకున్న ప్రతిది దేవునికి సమర్పించవలెను. అప్పుడే ఆయన నీలోను మరియు నాలోను, తన చిత్తమును జరిగించగలడు.

అది కష్టమని నాకు తెలుసు, ఎందుకనగా ఎల్లప్పుడూ మనము ఎంతో కొంత మనకు తెలిసినది, మనము చేయాలని ఆశిస్తాము. "ఈ విధంగా అది జరిగియుండ వలసినది అని నాకు తెలుసు," అని మనము అనుచుందుము. కాని ఆ విధంగా నీవు చేసినంతకాలము అది పొరపాటే జరుగును. ఆ ప్రయత్నమును దేవుడెన్నడూ ఉపయోగించుకొనడు. ప్రభుని సహాయముతో, కొద్ది నిమిషములలో దానిలోనికి వచ్చెదము, నీ సామర్థ్యమును దేవుడెట్లు ఉపయోగించుకొనజాలడో మీకు కొద్ది నిమిషములలో చూపించెదను.

27ఈనాడు లోకము సంగతి అదే. సెమినరీ అనుభవాలు చాలా ఉన్నవి. విద్యపై ఎంతో కేంద్రీకరించుచున్నారు. శాఖలో సంబంధముతో ఈ సహవాసములపై ఎంతో దృష్టి నిలుపుచున్నారు. ఒకరిపై ఒకరము మనము ఆనుకొనుచున్నాము. సామర్థ్యమున్న మనిషిపై మనము ఆధారపడుచున్నాము.

బైబిలు చెప్పెను, "నీవెట్లు విశ్వాసమును పొందగలవు?" ఆ వాక్యమేమిటో చూద్దాం. "మీరు ఒకనినొకరు గొప్పగా భావించుచుండగా, విశ్వాసమునెట్లు పొందగలరు?"

"ఈయన గొప్పవాడు. ఈయన ఘనమగు వ్యక్తి, నేనాతనిపై ఆధార పడుదును," అని చెప్పుచూ, మనము ఊహించుచున్నాము. నీవది చేసినప్పుడు, అది దేవుని నిరాశపరచును. కేవలము దేవుని మీదనే మనము ఆధారపడవలెను! మన సామర్థ్యములను గాని, లేక మరెవరిది గాని మనము నమ్మరాదు. మనము తప్పక పూర్తిగా దేవునికి లోబడవలెను.

28సామర్థ్యము కాదు, అదెవరిదైనా గాని నేను లెక్కచేయను. దేవుని దృష్టిలో అదెన్నడూ ఉపయోగము కాదు. ఆయన తన ఉద్దేశ్యమును సాధించుటకు ముందు మనలో నున్న సామర్థ్యములన్నింటిని దేవుడు బయటకు తీసివేయవలసియుండును. మనము చేయవలసినది ఏదైనా ఆయన యొద్దనున్నచో, దానికొరకు మనము చాలా మంచి పని చేయుచున్నామని తలంచినంతకాలము దేవుని ద్వారా ఆ పని చేయబడుటకు వాడబడజాలము.

"నీవు చాలా భయంకరమగు సూటియైన ప్రకటనను చేయుచున్నావు, బ్రెన్హాం సోదరుడా," అని నీవందువు. అది సూటియైననదే; కాని అది సరియైనదో కాదో చుట్టుప్రక్కల చూసి కనుగొనండి.

మనము గొప్పగా సాధించితిమనుకొన్నవాటిని ఈనాడు చూడు. అమెరికాలో క్రైస్తవ్యం ఎక్కడున్నది? మన సంఘములు, శాఖలు, మన సువార్తికులు, స్వస్థతా కూటములు, మనకున్నవన్నీ చూడండి. అవి ఏమిటి? ఆదిలో నున్నదానికంటె అధ్వాన్నముగా నున్నది! ఎన్నడూ లేనంత దరిద్రంగా అది ఉన్నది, ఎందుకనగా మానవ సామర్థ్యముతో దానిని మనం చేయ ప్రయత్నించాము.

వారంతా కలిసికొని దీర్ఘమైన ప్రార్థనలు చేసి ఇక్కడనుండి బయటకు పోవుదురు. ఒక రోజున చాలామంది, అనగా నూట-యాభై వేలమంది, లేక ఆ విధంగా చాలామంది పోగయిరి. ప్రొటస్టెంటు, కాథలిక్కు వారిద్దరూ ఉన్నారు. కొన్ని ప్రార్థనలు చెప్పారు. కొన్ని ప్రార్థనలు ప్రార్ధించారు, ఏవేవో చేశారు. వారంతా పోగవక పోయినా బాగుండును. దేవుని దృష్టిలో దానికి ఏ విలువ లేదు.

ఇప్పుడు, నేను విమర్శనాత్మకంగా ఉన్నచో క్షమించండి, చూచారా. నీవు లోపలున్న దానిని కక్కివేయాలి, చూచారా. దానిని నీవు సూటిగా మేకుకు కొట్టాలి.

29దానివలన ఏమి మేలు జరుగును? ఏమీ లేదు. క్రైస్తవుడనని చెప్పుకొనుచున్న ప్రతి వ్యక్తి తన స్వంత సామర్ధ్యమును విడిచిపెట్టి, తన్నుతాను దేవునికి సమర్పించు కొంటేనేగాని ఆయన క్రియ చేయజాలడు.

అప్పుడు దేవుడు తన ఉద్దేశ్యమును సాధించుటకు… ఒక ఉజ్జీవమును పంపుట కాదు, కాని, సోదరుడా మనము ఉజ్జీవింపజేయబడునట్లు ఆయన ముందు హతమార్చుటను పంపుట అవసరము. నీవు తిరిగి జన్మించుటకు ముందుగా చనిపోవలెను. మనంతట మనము చంపబడుట ఆయనకు అవసరము. ఈ గుడారమునకు చంపబడుట అవసరము, దానితో పాటు నాకు కూడ అది కావలెను. ఒక నూతన జీవము, ఒక నూతన పట్టు, ఒక నూతన ఆశ, ఒక నూతన అనుభవములో మనము ఉజ్జీవింపబడవలెనన్నచో మన అందరికి ఈ చంపబడుట అవసరము. ఒక సంతాప దినము మొదట మనకవసరము.

30పాఠశాలల మీద, మన కార్యక్రమముల మీద, మన కూటముల మీద, ఇంకా మనకున్న వాటన్నిటి మీద మనమెంతో ఆధారపడుటకు బదులుగా, ఆత్మకు లొంగు స్థలమునకు రావలసిన అవసరత యున్నది. అనేకులగు విభిన్న బోధకుల తోడ్పాటుతో నున్న సహకారము మీద మనము ఆధారపడుచుందుము. చాలా మందిని మనము అనుమతించుదము… చాలామంది లేనిచో, దానిని అసలు మనము చేయము. అది లేకుండా పట్టణములలోనికి మనము వెళ్ళము. తరువాత, మనము దానిని చేసినప్పుడు, కార్బన్ కాఫీ ముద్రలను చేయు గొప్ప యంత్రము మీద దానిని మనము తయారు చేయుచున్నాము, చూచారా.

కనుక మనము ఆ మానవ సామర్థ్యము నుండి దూరముగా పోవలెను. మన ఆత్మలను మరియు జీవితములను, మనము గృహిణియైనను, వ్యవసాయదారుడైనను, మెకానిక్కైనను, మనకున్న ప్రతిదానిని దేవునికి సంపూర్ణముగా ఇచ్చివేసి, "మనము వట్టివారము," అని ఎరుగవలెను. ఆ స్థానమునకు మనము రావలెను. అప్పుడు అక్కడ నుండి దేవుడిని ప్రారంభించనీయండి. అప్పుడాయన కదలుటకు, పనిచేయుటకు ప్రారంభించును. అందులో మనందరము చేరియన్నాము. మనము చేయవలసిన పని అదే.

31చరిత్ర రుజువు చేయును, (చరిత్ర రుజువు చేస్తున్నది) దేవుడెప్పుడూ అనామకులను తన నాయకులుగా ఎన్నుకొనెను. వట్టివానిని దేవుడు తీసికొనును.

ఈనాడు, నీకొక మంచి వేదాంత విద్య లేనిచో పట్టణమును సమీపించడానికి కూడా ప్రయత్నించవద్దని, ఒక కూటమునకు కూడా సమీపించకుండుట మంచిదనియు చెప్పుచున్నారు. కాని, ఆ గొప్ప అనుభవములు, గొప్ప తర్ఫీదులు, మొదలగునవి నీకున్నచో నీవు ఏ పట్టణములోనికైనా వెళ్ళి, సహకారమును సంపాదించి ఒక గొప్ప కూటమును ఏర్పాటు చేయవచ్చును. మంచిది, అది దైవ కూటము కాదు గాని… ఒక మామూలుగా ఎవరైనా కలిసికొనే సభ వంటిది. కాని దానివలన ఏ మేలు జరుగును? ఈ బాల బాలికలు నోట్లో ఆ జిగురు నములుచూ వేదికపైకి ఎక్కుచున్నారు. "వేదిక పైకి వెళ్ళాము," అని చెప్పుకొనుటకు స్త్రీ పురుషులు వేదిక నెక్కుచున్నారు. ఉపదేశముల కొరకు గదిలోనికి వెళ్ళుచున్నారు. బయటకు వచ్చి చిలకరింపో, మంచుటయో, లేక వారేదయితే అది పొందుచున్నారు. అక్కడనుండి ఒక సంవత్సరములో…

32సంవత్సరమునకు పది శాతము తనద్వారా మార్పుచెందువారిని పొదుపు చేసియున్నచో, అప్పుడు సంతోషముగా ఉందునని మన గొప్ప సువార్తికులలో ఒకరు చెప్పారు. ఒక సంవత్సరము వేయిమంది మార్పు పొందుచున్నచో, వచ్చే ఏడాది పది వేలమంది ఉండవలెను. చూచారా, మనము మన గురిని తప్పిపోవుచున్నాము, ఆ ఉద్దేశ్యమును తప్పిపోవుచున్నాము.

మనలో కొందరు దానిని తెలివిగల అభిప్రాయము మీద నిర్మించారు. ఓ, అదేమనగా, "ఇతనికి అంతా తెలియును. ఈయన ఒక శిక్షణ పొందిన పండితుడు. మనం మనవారిని పాఠశాలల్లో చేర్పించి తర్ఫీదు నివ్వాలి."

మరియొకడు దానిని ఒక అనుభూతి, కదలిక, కుదుపు, ఏడ్చుట, గట్టిగా అరచుట, ఆత్మలో నాట్యము చేయుట, లేదా మరేదో ఆధారము చేసికొని నిర్మించుచున్నాడు. బయటకు కనబడే ఒక ఉద్రేక కార్యము మీద నిర్మించుచున్నారు. అది కూడా విద్య ఎంత చెడ్డదో అంత చెడ్డది! ఈ ప్రక్క దయ్యము నిన్ను పడద్రోయజాలనిచో, ఆ ప్రక్క అది నిన్ను త్రోయును.

కాని అసలు విషయమేమనగా, నీలోనున్న దేనిమీద నీవు ఆధారపడకూడదు. ఏదీ చేయగలనని అనుకోకూడదు. నీ బలహీనతను పూర్తిగా దేవునికి సమర్పించుకోవలెను. "ఇదిగో ఇక్కడున్నాను," దేవా, అని చెప్పవలెను. నీవు నమ్మికయుంచు ఏ సామర్ధ్యమూ నీకుండరాదు, దేనినీ కలిగియుండరాదు.

ACTS 4:13

 

33లేఖనములు పరిశోధించి వెదకండి, నేనిక్కడ కొన్ని వాక్యములు ప్రస్తావించెదను. అనామకులను దేవుడు పేరుగల వారిగా వాడుకొనుటను వాక్యములో మనము చూడగలము. లోకము విసర్జించినవారిని, ఆధునిక యుగము తిరస్కరించినవారిని, అట్టి రకమగు వారినే ఆయన వాడుకొనుటకు ఏరుకొనెను.

అపోస్తలులు గూర్చి ఆలోచించండి. జాలరియగు పేతురు గూర్చి ఆలోచించండి. తన పేరు కూడా వ్రాసికొను విద్య అతనికి లేదు. యోహాను చదువు లేనివాడు, మోటువాడు. ఓ, ఆ మనుష్యులు!అతడు గొప్పవారిని విద్యగల యాజకులను, ఆనాటి గొప్పవారిని, పండితులను, సంఘ సభ్యులను తామేదో అయిపోయామనుకొన్నవారిని మించిపోయాడు. ఏమీ కాని వారిని ఆయన ఎన్నుకొని వారిని ఉపయోగించుకొనెను.

1KGS 18:35

 

34ఇప్పుడు, తామేదో అయిపోయామని తలంచు వారిని కూడ ఆయన తన ప్రజలనుగా చేసికొనగలడు. వారు ఆ తమలో ఉన్నది మరచిపోయి సిద్ధముగా నున్నచో దేవుడు వారిని ఉపయోగించుకొనును. నీ పేరు ప్రఖ్యాతులు మరచిపోయి అనామకుడుగా నుండుటకు సిద్ధపడినచో దేవుడు నిన్ను వాడుకొని నీలోనుండి ఏదో చేయగలడు. కాని నీవు నీలోనున్న ఆ ప్రాముఖ్యతను మరచిపోవలెను.

మనలో చాలామంది ఆ విధంగా చేయుచుండిన, కొందరు క్రైస్తవులయిన వెంటనే గర్విష్టులుగా వేరుగా నుందురు. వారు ఆ విధమైన మార్గమును చేపట్టనిచో అది సరియే. వారు ముందుకు సాగుటకు బదులుగా వెనుకకు వెళ్ళుచున్నారు. నీలో నున్న స్వచిత్తమును ఎంత ఎక్కువగా బయటకు నెట్టుదువో అంత ఎక్కువగా పరిశుద్ధాత్మ వచ్చుటకు స్థలమును ఇచ్చుచున్నావు.

యెహోషాపాతు తదితరులకు ఏలీయా ఆ విధముగా చెప్పెను, "ఈ స్థలము నిండా గోతులను త్రవ్వ౦డి. ఎంత లోతుగా త్రవ్వితే అంత ఎక్కువ నీరు నీకు వచ్చును." మన స్వంత అహమును, మన స్వంత సామర్థ్యముల చెత్తను ఎంత ఎక్కువగా మనము బయటకు త్రోసివేయుదుమో, అంత ఎక్కువగా దేవుని ఆత్మ నింపును. మనము ఆ విధంగా చోటిచ్చినప్పుడే జరుగును.

1COR 2:1

 

35ఇప్పుడు II కొరింథీయులకు వ్రాసిన పత్రికలో పౌలు చాలా గొప్ప వ్యక్తి అని మనము కనుగొన్నాము. అతడు ఒక పండితుడు, ఒక గొప్పవాడు. కాని క్రీస్తును తెలిసికొనుటకు అతడు తనకు తెలిసినదంతయూ మరువవలసియుండెను.

మీరు నాతో చదువునట్లుగా ఈ వాక్య భాగమును తీయుదము. I కొరింథీ 2వ అధ్యాయము 1వ వచనము. ఒక్క నిమిషము ఆగండి. ఈ గొప్ప పండితుడగు పౌలు తనను గూర్చి ఏమి చెప్పుకొనెనో ఏమి చేయవలసియుండెనో ఇక్కడ ఒక నిమిషం చదువుదము. I కొరింథీ 2వ అధ్యాయము 1వ వచనము నుండి ఆరంభించుదము. ఈ పండితుని వినండి.

36ఈయన శిక్షణ పొందినవాడు. లోకములోనున్న ఏ భాషనైననూ దరిదాపు ధారాళంగా మాట్లాడగలడు. దానిగూర్చి అతడు అతిశయించవలెను. అతడు పరిసయ్యులలోని ఒక కఠినమైన తెగలో పెరిగెను. అతని తండ్రి పరిసయ్యుడు. తరువాత అతడు పరిసయ్యులకు పరిసయ్యుడాయెను, అనగా అతడు పూర్తిగా పరిసయ్యులందరిలో కఠినమైన నిష్టగలవాడాయెను. అతడు గొప్ప వ్యక్తి, అతనికి అధికారముండెను. చాలా చురుకైనవాడు.

ఆ దేశమంతటిలోను అత్యుత్తమ ఉపాధ్యాయుడగు గమలియేలు దగ్గర అతని తండ్రి అతనికి తర్ఫీదునిప్పించెను. ఆ కాలములోని పాఠశాలలన్నింటిలో చాలా గొప్ప ఉపాధ్యాయుడు. పౌలు ఆ మాదిరి మనిషే ఆయెను. ప్రతి భాషను అతడు నేర్చుకొనెను. మానసిక శాస్త్రమును అభ్యసించెను. ఎటువంటి విషయాలు నేర్చుకొనవలేనో అటువంటివన్నీ అతడు అభ్యసించెను. యాజకుల ఆలయములోను, గొప్పవారితోనూ అతడు తీవ్రముగా నేర్చుకొనెను. చాలా గొప్పవాడు. సంఘమును దద్దరిల్ల చేయుచూ అతడు సంచరించుచుండెను.

1COR 2:1,2

 

37ఆయన క్రీస్తును అంగీకరించిన తరువాత, తన విద్య అంతటితో, ఆ మనిషి చెప్పినది వినండి. తానెంత బలము, గొప్పతనము కలిగియున్ననూ దానిని మరచిపోవలసియుండెను. తనపై తాను నిలబడజాలనని అతడు గ్రహించెను. తన చదువు వట్టిదని అతడు గ్రహించవలసియుండెను. తాను పొందిన తర్ఫీదు యావత్తు మరచిపోవలసియుండెనని గ్రహించెను. ఇప్పుడాయన మాట వినండి:

… సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని, జ్ఞానాతిశయముతోగాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. [చూచారా?]

"నేను ఫలాని పాఠశాల నుండి వచ్చిన డాక్టర్ సౌలును. ఈ శాఖయొక్క గొప్ప భాగము నుండి నేను వచ్చాను," అని నేను ఎన్నడూ మీతో చెప్పుటకు రాలేదు. ఆ విధంగా నేనెన్నడూ రాలేదు.

నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనినీ మీ మధ్యను ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని.

ఆ గొప్పవాడయిన మనిషి యొక్క సాక్ష్యమును వినండి; "సామర్ధ్యములను గూర్చి ఏమియూ ఎరుగకుండుటకు నేను నిశ్చయించుకొంటిని. మీలో ఏమియూ లేదని నేనెరుగుదును; కేవలము ఒక్క విషయమును నేను మీలో చూచి ఎరుగుటకు నేను నిశ్చయించుకొంటిని, సిలువ వేయబడిన యేసుక్రీస్తును. మీ మధ్యనున్న సిలువ వేయబడిన రక్షకుడు, నేను గుర్తించవలసినది అది మాత్రమే."

1COR 2:3

 

38అతని మాటలు వినండి:

మరియు బలహీనతతోను, భయముతోను, ఎంతో వణుకుతోను మీయొద్ద నుంటిని. [గొప్పతనమా? ఎందులో?]

పరిసయ్యులకు పరిసయ్యుడు, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుడు, బాల్యము నుండి తర్ఫీదు పొందినవాడు. తెలివిగల చురుకైన వాక్చాతుర్యము గలవాడు. కొరింథీయులవంటి ఒక ప్రజల యొద్దకు వచ్చి, "నేను బలహీనతతోను, భయముతోను, ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని," అని చెప్పుచున్నాడు. లోకమును తలక్రిందులు చేసినవాడు. మునుపెన్నడూ లేని గొప్ప మిషనెరీ, బలహీనతతో. శిక్షణ పొందిన పండితునిగా కాదు, కాని బలహీనతతోను, భయముతోను వచ్చితినని చెప్పుకొనుచున్నాడు. లేనిచో ఎక్కడో చోట మార్గంలో అడుగుజారును. "ఎంతో వణుకుతో, ఎందుకనగా తన స్వంత సామర్ధ్యము మీద తనకు నమ్మకము లేదు.

1COR 2:3,4

 

39దేని గూర్చియో భీతితో "భయపడుట" కాదు కాని, దానిలోనికి తన స్వంత సామర్థ్యమును కలిపినచో దేవునిని సంతోషపరచునని అతడు భయపడెను. అతడు నేర్చుకొనినది అందులో కలుపరాదు. "నేను వాక్చాతుర్యముతో మీ యొద్దకు రాలేదు (నేను భయముతో వచ్చాను. ఆ విధంగానే నేను రావలెను), కాని సిలువ వేయబడిన క్రీస్తును తప్ప, మరి దేనిని ఎరుగకుందునని నిశ్చయించుకొని వచ్చితిని.

మరియు బలహీనతతోను, భయముతోను, ఎంతో వణుకుతోను మీ యొద్దకు వచ్చితిని.

నేను మాటాలాడినను, సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు, దేవుని శక్తియు…

యోధుడగు ఈయన ఏమీలేనివానిగా చెప్పుకొనుచున్నాడు. వినండి. ఆమేన్! ఈనాడు మన పాఠశాలలకు అవసరమయినది ఏదైన ఉన్నదంటే, ఈనాడు మన సంఘములకు అవసరమైనది ఏదయినా ఉన్నదంటే, అది తమ్మును తాము రిక్తులుగా చేసికొని స్వంత ఆలోచనలు, స్వంత సామర్ధ్యము విడిచిపెట్టుటయే. దేవుని ఎదుట మిమ్మలను మీరు ఒలిచి వేసికొనుడి, లేనిచో మీయంతట మీరే ఏదో చేయగోరుదురు.

40ఇక్కడున్న మనకు, టేపులు వెళ్ళిన లోకమునకు ఇది లోతుగా నాటునని ఆశించుచున్నాను. నీవు ఏమీ లేని వ్యక్తివి కావలెనని గ్రహించవలెను. అంతా తెలిసిన వ్యక్తిగా కాదు, ఏదో గొప్పవానిగా కాదు, కాని అనామకునిగా, ధూళిగా రావలెను. నేను ఏమీకానను చోటికి నీవు రావలెను. దానికి పైగా నీవెన్నడూ లేవవద్దు. దానికి పైగా నీవు లేచావంటే దేవునికి పైగా నీవు లేచెదవు. దమస్ముకు వెళ్ళే మార్గములో, ధూళిలో నీవుండవలసియున్నావు. నీ ఎత్తయిన గుర్రముల నుండి నీవు దిగవలసి యున్నావు. ఇక్కడున్నవారికి, టేపులు వెళ్ళిన లోకమునకు అన్ని చోట్ల ఉన్నవారికి అది అవసరమే.

1COR 2:4,5•

2COR 12:9,10

 

41"నా వాక్చాతుర్యము కాదు." మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక పరిశుద్ధాత్మయు, దేవుని శక్తి కనుపరచుచూ వచ్చితిని."

ఇప్పుడు గమనించండి! "పౌలూ! ఎందుకు నీవీలాగు చేయుచున్నావు?"

శక్తి మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని.

ఓ, ఏమి బోధకుడండీ! ఈ గొప్ప వ్యక్తి దేవుని వెదకెను. "దేవా, నేను బలహీనుడను. ఏమి చేయాలో నాకు తెలియదు. నన్ను బలపరచుమనియు, నా బలహీనతలను నాలోనుండి తీసివేయుమనియు, నేను బలవంతునిగా నుండునట్లు చేయుమనియు ప్రార్థించుచున్నాను," అని చెప్పెను.

దేవుడు తిరిగి అతనితో మాట్లాడెను. "పౌలా, నీ బలహీనతలోనే నా బలము పరిపూర్ణమగుచున్నది."

అప్పుడు పౌలు పలుకుచున్నాడు, "నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను." అవును, నేను నా బలహీనతలలోను అశక్తతలలోను ఆనందించుదును. నాలోనుండి ఉన్నదంతా బయటకు పోయినందుకు దేవునికి వందనములు చెల్లించుచున్నాను. నాలోనున్న సమస్తము బయటకు పోయినప్పుడు దేవుడు లోనికి వచ్చును. కాని నేను అను కొంత స్వంతది ఉన్నంతకాలము దేవుడు లోనికి రాలేదు.

అది ఉన్నచో, ఆయననది బయటకు గెంటివేయును. మన స్వంత అహములను బట్టియే దరిద్రుల నుండి, ధనికుల వరకు, చిన్నవాని నుండి గొప్పవాని కొరకు మనందరమును మన జీవితములలో నుండి దేవుని బయటకు నెట్టివేయుచున్నాము.

42నేను తరచుగా ఈలాగు చెప్పుచుందును, "నాకున్న గొప్ప శత్రువు విలియం బ్రెన్హాంమే." దేవుని మార్గానికి అడ్డు వచ్చువాడు అతడే. సోమరిగా అయ్యేవాడు అతడే. ఏదో చేయగలనని కొన్నిసార్లు ఆలోచించి నిర్ణయము తీసుకొనువాడు అతడే. అతడు పని చేసినప్పుడు దేవునిని అసలు రంగములో లేకుండా బయటకు త్రోసివేయును. అతనిని నేను వదిలించుకొన్నప్పుడు, మార్గములో నుండి అడ్డముగా నున్న అతనిని తొలగించ కలిగినప్పుడు, దేవుడు వచ్చి అసలు విల్లియం బ్రెన్హాంకు ఏమీ తెలియని కార్యములను చేయును.

అప్పుడే దేవుడు నిన్ను వాడుకొనగలడు. మీలో ఎవరినైనా ఆయన ఉపయోగించుకోగలడు. మార్గము నుండి తొలగిపోయినచో ఎవరినైననూ ఆయన ఉపయోగించగలడు. కాని మనము త్రోవలో అడ్డముగా నిలుచున్నంతకాలము ఏమీ చేయజాలము. అది నిజము.

43ఇప్పుడు, మనము కనుగొందుము, పౌలు అను ఈ గొప్ప వ్యక్తి, ప్రసంగీకులలో అగ్రగణ్యుడు. ప్రతి శాఖ ద్వారా అతడు గౌరవించబడెను. అతడు ఏ పట్టణములోనికైనా వెళ్లి ఎక్కడైనా కూటము పెట్టగలడు. ఎందువలన? అధికార పత్రములున్నవి. ఎందువలననగా అంత గొప్పవాడు. బలహీనులయిన జనులను తుత్తునియలుగా చేయుటకు నిశ్చయించుకొనెను. ఉన్నత అధికారుల నుండి, ప్రధానయూజకుని నుండి అధికారము పొందెను. ఆ క్రైస్తవులనందరినీ బంధించు రాజకీయాధికారము పొందియుండెను! ఓ, అతడు బలవంతుడు! క్రైస్తవులను కట్టి చెరసాలలో విసిరివేయగలడు, ఎందుకనగా వారు అతని వేదాంత సిద్దాంతములతో ఏకీభవించుట లేదు. పరిసయ్యుల, సద్దూకయ్యుల బోధతో సమ్మతించుట లేదు. అతడు క్రైస్తవులను బంధించుచుండెను.

కాని అతనిని గమనించండి, అసలు అతడే బంధింపబడవలసియుండెను. దానిని పోగొట్టుకొనవలసియుండెను. తన బలము, అధికారము పోగొట్టుకొనవలసి యుండెను. బంధించుటకు తనకుండిన అధికారమును పోగొట్టుకొనుటకు అసలు తానే బంధింపబడవలసియుండెను. బంధింపబడుటకు తనకున్నదానిని అతడు కోల్పోవలసియుండెను.

44దేవుడు ఘనులను దాటును, ఆయన యాజకులను దాటిపోయెను. మూర్ఖులను ఆయన దాటిపోయెను. ఆయన ఈ గొప్ప వ్యక్తియగు పౌలును ఏర్పరచుకొనెను. భూమిమీదనున్న ధూళిలో అతడు పడునట్లు చేసెను. తక్కిన ఇతరులవలె ఆలాగు చేయవలసియుండెను. తాను బంధించుచున్న వారికి జరిగిన రీతిగానే తనకును జరుగవలసియుండినట్లు ఆయన క్రియ చేసెను. దేవుని ఆత్మచే పౌలును ఆయన బంధించెను. క్రైస్తవులను ఏ శక్తితో బంధించుచున్నాడో ఆ శక్తి నుండి విడిపించుటకు ఆలాగు చేయవలసియుండెను. దేవుడు తానేమి చేయుచున్నాడో ఆయనకు తెలియదు అని నాకు చెప్పవద్దు. అతని పట్టును తొలగించుటకు దేవుడతని బలమును తీసివేసెను.

ACTS 26:17

 

45సంస్థలు, శాఖల బలము నుండి విడిపించబడి ఆయన వాక్యము, మరియు ఆయన శక్తితో వారిని దేవుడు బంధించునట్లు తావిచ్చినచో ఈ ఉదయ కాలమున దేవుడు ఎంతమంది సేవకులను ఉపయోగించుకోగలడో పౌలువలె ఒక దేవుని ప్రేమ బానిసగా వారు తమ్మును తాము తమపైయున్న శక్తినుండి విడిపించబడినచో, ఈ ఉదయమున ఈ పట్టణములోని ఎంతమంది యదార్థవంతులను, ఈ గొప్ప సంఘ సంస్థలలోనికి వెళ్ళు వారిని ఆయన తన పరిశుద్ధాత్మతో నింపి ఈ దేశమును సువార్తతోను దేవుని శక్తితోను మండింపచేయునో గదా!

దేవుడు పౌలును తీసికొని ఒక బానిసగా చేసి తనకు తనను బంధించి తాను ద్వేషించిన అన్యజనులయొద్దకే అతనిని పంపెను. కాని చూడండి, అతడు ఆ వాక్చాతుర్యపు శక్తి నుండి విడిపింపబడి దేవుని శక్తితో బంధించబడవలసియుండెను. దేవుని శక్తిని పొందుటకు, దేవునికి కట్టబడియుండుటకు, దేవుడు ఏమి చెప్పునో, అది చేయుటకు, అతడు బలహీనుడై వట్టివాడు కావలసి వచ్చింది.

ఈనాడు అదే మనము చేయవలసియున్నాము. నాకదే అవసరము. తన్ను తాను, తన సామర్థ్యమును, తానేమైయున్నాడో, దానిని ప్రతివాడు నష్టపరచుకొని, పరిశుద్ధాత్మకు పూర్తిగా లోబడవలెను. ప్రతి మనిషికి అవసరము అదే. గృహిణికి అది అవసరము. బడిపిల్లవానికి అది అవసరము. మన చిన్న బిడ్డలకు సహితము అది అవసరము.

46నిన్న మధ్యాహ్నము లేక మొన్న ఒక రోజు ఒక చిన్న బాలుని గూర్చి ఆలోచించుచుంటిని. అతడు వెళ్ళి తన పాఠమును తన పెద్దక్కతో త్వరగా వ్రాయించుకొని బయటకు వచ్చి తన తోటి పిల్లలతో "హూ! ఆ లెక్కలు చాలా సులభమైనవి," అని చెప్పసాగెను. చూచారా, దరిదాపు మోసమును వారు నేర్చుకొనుచున్నారు.

వారు ఒక సంఘములో స్తంభములు, తండ్రి ఉదయకాలము అల్పాహారము తీసికొను సమయములో, "ఈ రోజు జాన్ పరీక్ష వ్రాయబోవుచున్నాడు. ఓ దేవా, జాన్ తో ఉండుము! జాన్ కు సహాయము చేయుము! ఈ ఉదయాన పడక గదిలో అతడు నాతో "నాయనా, నా పరీక్షలో నిలబడేటట్లుగా ఈ రోజు ప్రార్ధన చేయి. నా కొరకు ప్రార్ధించు," అని అడిగాడు అని ప్రార్ధించినచో అది ఎంత బాగుండును.

నా పిల్లవాడు మోసము చేసి "A" గ్రేడు సంపాదించాడని తెలిసికొనేకన్నా తన కారు మీద "F" గ్రేడు చూచుటయే నాకానందము. అవును! మనలను మనము పూర్తిగా నష్టపరచుకొని, సంపూర్తిగా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుటయే నేడు మనకు అవసరము.

2COR 12:9

 

47ఇప్పుడు, బంధించబడి. దేవుడు ఘనులను అలక్ష్యము చేసి బలహీనులను తీసికొనెను. తామేదో అయిపోయామనుకొన్నవారిని దేవుడు దాటిపోయి, తమ జీవితములలో ఆయన ఉద్దేశ్యమును నెరవేర్చుటకు ఎట్లో ఎరుగని కొందరిని ఆయన ఏర్పరచుకొనెను. అదే మనము పొందవలసియున్నది.

దేవుడు పౌలుతో చెప్పెను, "నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగుచున్నది. నీవెంత ఎక్కువగా బలహీనుడవగుదువో అంత ఎక్కువగా నా బలము పరిపూర్ణమగును. ఎంత హెచ్చుగా నీవు లోబడుదువో, అంత గొప్పగా నిన్ను నేను వాడుకోగలను. ఎంత ఎక్కువగా నీ విద్యను నీవు మరచిపోదువో, ఎంత ఎక్కువగా నీవు నీ శాఖను మరచిపోదువో, ఎంత ఎక్కువగా నీలోనున్న సంగతులను నీవు మరచిపోదువో, నీవు ఎంత ఎక్కువగా నాకు లోబడుదువో, అంత ఎక్కవగా నిన్ను ఉపయోగించుకొనగలను. నీవు బలహీనుడవయినప్పుడు, నేను నా స్వంత ఉద్దేశ్యమును బలపరచుదును."

దేవుడు బలహీనతలో నుండి బలమును తయారుచేయగలడు. అందుచేతనే ఆయన ఎల్లప్పుడు దానిని చేయును.

LUKE 2:7,12

 

48ఆయన తన శిష్యులను ఏర్పరచుకొన్నప్పుడు, ఎవరనుకొన్నారు…?

ఒక పశువుల తొట్టిలో, పేడ కొట్టములో, ఆవుల సావిడిలో, ఆయన జన్మించి పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఆయన స్వంత కుమారుని తగ్గింపు గూర్చి ఎవరు ఆలోచించగలరు. చూడండి, ఆయన ఒక రాజభవనము ద్వారా రాగలడు. పరలోక వాకిండ్ల ద్వారా దూతగణము యొక్క పూర్తి వందన సమర్పణతో భూమికి రాగలడు. కాని మనకు, మాదిరిగా నుండుటకు, క్రీస్తును ఎన్నుకొని దీనత్వముతో ఆయనను తెచ్చెను.

ఈ లోక పాఠశాలలలో ఎన్నడూ ఆయనకు తర్ఫీదు నివ్వలేదు. ఆయన పూర్తిగా తన్నుతాను లోబడునట్లు. మానవుల ఆలోచనలను, ప్రపంచ బలమునకు కాక, దేవుని శక్తికి తన్నుతాను సమర్పించుకొనునట్లు ఆయనకు తన సొంత శక్తి ద్వారా తర్ఫీదు నిచ్చెను.

HEB 11:34

 

49నేడు మనమును అదే అయి యుండవలెను, గొప్ప శాఖలకు మరియు అధికారములకు ఈనాడు మనలను మనము అప్పగించుకొనియున్నాము. మనలను మనము శాఖలకు సమర్పించుకొనియున్నాము. దానిగూర్చి వారేమి చెప్పినాగాని వారినే నమ్ముచున్నాము. కాని దేవుని చిత్తమునకు అది విరోధము. మనలను దేవుని ఆత్మకు లోబరచుకొని, ఆత్మ ఎక్కడికి వెళ్ళమనునో అక్కడికే వెళ్ళవలెను. అది నిజము.

దేవుని వారైన హెబ్రీయులు, "కధానాయకులు" దేవుని సైనికులు హెబ్రీ పత్రికలో ఉన్నారు. (హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము ఇప్పుడే మనము చదివితిమి), "…బలహీనులుగా నుండియు బలపరచబడిరి."

వారు బలవంతులగుటకు ముందుగా బలహీనులు కావలసియున్నారు. తమ బలహీనతలలో నుండియే వారు బలపరచబడిరి. వాక్యములు వ్రాసుకొనువారు, హెబ్రి 11:34 చూడండి.

JOHN 21:16,17

 

50ఇక్కడ మనలను ఓదార్చునది ఒకటున్నది. ఇక్కడ మనలను ధైర్యపరచునది ఒకటున్నది. బలహీనత, తగ్గింపులో నుండి, దేవుడు జనులను ఎన్నుకొని వారితో తన రాజ్యమును నిర్మించుచున్నాడు. మనమెప్పుడైనా పరలోకమునకు వెళ్ళితే, దేవుని సన్నిధిలో సంఘముతో పాటు ఎన్నడైనా నిలబడినచో, మనము బలహీనులును, లోకము చేత విసర్జించబడి, త్రోసివేయబడి, ఏమీ ఎరుగని వారి మధ్యనే యుందుము.

దేవుడు గొర్రెలనుగా మనలను పోల్చుట వింతగా లేదా? గొర్రె ఉన్న వాటన్నింటిలోను నిస్సహాయురాలు. తనను తాను రక్షించుకొనజాలని గొర్రె సాటియైనది మరొకటి లేదు. ఒక కుందేలు పరుగెత్తగలదు, ఒక ఉడుత చెట్టు పైకి ఎక్కగలదు, ఒక కుక్క కరువగలదు, ఒక సింహము చీల్చగలదు, ఒక గుర్రము తన్న గలదు, ఒక పక్షి ఎగురగలదు - కాని ఒక గొర్రె నిస్సహాయముగా నిలబడిపోవును.

ఆ విధంగానే మనముండవలెనని దేవుడు కోరుచున్నాడు. మనము పూర్తిగా నిస్సహాయులమని గ్రహించాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తీసికొని తానే ఆ వ్యక్తిలోనికి మలచుకొనుటకు ప్రారంభించును; దేవుని చేతులు ఏమి చేయవలసియుండునో, అతని చేతులతో అదే చేయును; దేవుని పెదవులు ఏమి మాట్లాడునో, అతని పెదవులు అదే మాట్లాడుట చేయును, ఎందుకనగా అవి అతనివి కావు, అవి దేవునివి. ఆయన ఒక వ్యక్తిత్వమును నిర్మించ నారంభించును, ఈ బలహీనతను ఆయన తీసికొని తనదిగా చేసికొనును.

GEN 4:25

 

51ఆయన ఈ భూమి మీదకు మనలను తెచ్చియున్నాడు, మనము విద్యావంతులము, చురుకుగలవారము. నీవెప్పుడైనా వంశావళులను గ్రహించావా? హేబెలు వంశావళి తీసికొందాము. ఉదాహరణకు హేబెలు నుండి షేతు; షేతు వంశావళి నుండి నోవహు వరకు అందరూ దీనులగు వ్యవసాయకులే. కాని కయూను పిల్లలు తెలివి, చరుకుదనము, విద్యగల గొప్పవారు, గొప్ప నిర్మాణకులు, వృత్తులు గలవారు.

కాని దేవుని వైపు వారు బలహీనులు మరియు దీనులు. ఆ విధంగానే దేవుడు వారిని వాడుకొనెను. అది దేవుని తరుణము. ఆ విధంగానే దేవుడు మన యొద్దకు వచ్చును. మనము బలహీనులుగా నున్నప్పుడే ఆయన వచ్చును. అప్పుడు ఏదో మనము పొందెదము. ఇది ప్రోత్సాహపరచును, ఎందుకనగా దేవుని రాజ్యమంతా ఈ విధమగు జనుల చేతనే నిర్మించబడినది. నీవును ఆ విధముగా వచ్చినప్పుడు ఆయన రాజ్యములో నుండెదవు.

మన సంగతి ఏమనగా మనము బలహీనులముగా లేము గాని, బలవంతులముగా ఉన్నాము. మనము చాలా బలముగలవారము. అంతే! మనము చాలా గర్వాంధులము. అది నిజము, మనము చాలా తలబిరుసుగలవారము. మనకు చాలా తెలియును. అది మనలో నుండి బయటకు పోవలెనని దేవుడు కోరుచున్నాడు. అది నిజము. మనము చాలా బలవంతులము. ఆయనకు లోబడలేనంత బలము గలవారము. మనకు మనమే లోబడతాము. "మంచిది, ఇప్పుడు, ఇక్కడ, నాకు అది తెలిసికోగల జ్ఞానమున్నది," అని మనము ఆలోచించవలసియున్నది.

52అమ్మ వైద్యశాలలో నుండినప్పుడు కొన్ని రాత్రులు నేను ఆశ్చర్యపడితిని, ప్రక్కింటిలోనే ఒకావిడ ఉన్నది. ఆమె ఇప్పుడు ఇక్కడున్నచో క్షమించు సోదరీ! ఆమె కెంటకీ నుండి వచ్చినది. అది ఆమె అత్తగారే. ఆ రాత్రి ఆమెతో నేను, నా భార్య మాట్లాడుచూ ఉదయం ఒంటిగంట వరకు అక్కడే ఉన్నాము. ఆమె భర్త నేల మీద పరుండి నిద్రపోయాడు. ఆమె అన్నది, "ఇక్కడి నుండి వెళ్ళిపో! నీవు మీ అమ్మకేమీ మేలు చేయజాలవు." ఆమె తన భర్తను గదిలో నుండి తరిమివేసినది, ఎందుకనగా నర్సులుగాని, మరెవరూ గాని రాకుండా తలుపు దగ్గర అడ్డంగా పరుండెను. నేల మీద గురకపెట్టుచున్నాడు. కాబట్టి ఆమె అతనిని లేపి పంపివేసెను.

53ఆమె మాట్లాడుచున్నది. ఆమెకు ప్రభువును గూర్చి ఇంకా ఆయా సంగతులు చెప్పాను. ఆమె ఇట్లు చెప్పినది, "నాకు తెలిసిందంతా ప్రాద్దుటే కలుపు పీకుటకు వెళ్ళి, పోగాకును పీకుటయే. మమ్మలనందరినీ మా తండ్రి బడికి పంపించాడు గాని మాకేమీ జ్ఞానము రాలేదు."

"అదీ అసలు కారణము," అని నేననుకొన్నాను.

లోకపు సంగతులు నీవు బయటకు పారవేయవలసియున్నావు. నేను మొరటుతనమును బలపరచుట లేదు, అది కాదు. కాని ఎవరికీ ఏమీ తెలియదు, అంతా నాకే తెలుసు అను అనుభవము నుండి దూరము కావలెను. దేవుని వాగ్దానములతో విభేదించనంత వరకు నీ జ్ఞానము సరియే.

54మనము అయిదు జ్ఞానముల అధీనములో నున్నాము. (చూచుట, రుచి, తాకుట, వాసన, వినుట) విశ్వాస జ్ఞానముతో అవి విభేదించనంత వరకు మంచివే. అవి విశ్వాసమునకు ఎదురుగా వచ్చినప్పుడు. మరియు ఏది సరియో నీకెట్లు తెలియును? విశ్వాసము ఎల్లప్పుడూ వాక్యముతో ఏకీభవించును. నీ విశ్వాసము వాక్యమునకు విరుద్ధమైనచో, ఆ విధంగా నీవు తలంచినచో నీకు విశ్వాసము లేదన్నమాట. నీకు కల్పిత-విశ్వాసమే ఉన్నది. నీవు నీ జ్ఞానములను బట్టి అతిశయించుచున్నావు. నీవు నేర్చిన పాండిత్యమును గూర్చి, లేక దేనిగూర్చియో అతిశయించుచున్నావు. కాని ఎప్పుడయితే నీవు దానినుండి దూరమయి పూర్తిగా విశ్వాసము మీద ఆధారపడుదువో అప్పుడు మాత్రమే విశ్వాసము దేవుని వాక్యము మీద నిర్మించబడగలదు - సరైన విశ్వాసము.

55ఒక వైద్యుడు నాతో అనెను, "బిల్లీ, నేను నమ్ముచున్నాను. నీవు వారిని అక్కడి నుండి వెళ్ళిపొమ్మని చెప్పి, ఆ స్తంభమును, ఆ చెట్టును తాకినచో బాగుపడుదురని చెప్పినచో వారు ఎప్పటివలెనే బాగవుదురు."

"లేదండీ! అది జరుగదు. డాక్టరుగారూ ఒక విషయం. అది స్తంభమని ఆ జనులకు తెలుసు. ఆ స్తంభములో ఏ ప్రభావము, ఏ బలమూ లేదని వారికి తెలుసు," అన్నాను.

మానసికంగా సరయిన స్థితిలో ఉన్న ఏ వ్యక్తి అయినా గాని అది సజీవుడగు దేవుని వాక్యము అని ఎరుగును. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడను" దాని మీదనే నేను నా విశ్వాసమును ఆధారము చేసికొందును అని ఎరుగును! దానికి భిన్నమైనదేదైనా, నా జ్ఞానమును నమ్మను. అవును. దాని జోలికిపోవద్దు. నీ మరియొక్క జ్ఞానము అనగా విశ్వాసము ద్వారా నీవు నడువుము.

56అవును, దేవుడు అట్టి జనులను చేయుటకు తీసికొనును… వారు తమ్మును రిక్తులుగా ఎంచుకొని ఆయనకు లోబడినచో చాలును.

షికాగో వాడగు డి.ఎల్. మూడీ. బోస్టన్ వాసి. ఒక చెప్పులు కుట్టు వ్యక్తి, చిన్న వాడు, చాలి చాలనివాడు, తనపై తాను ఆధారపడలేదు. అక్కడున్న ఆ గొప్ప మూడీ పాఠశాలలు మీరు చూడండి, ఒకవేళ డ్వయిట్ మూడీ మరల బ్రతికి ఆ పాఠశాలను చూచినచో, మొదటగా డ్వయిట్ మూడీ చేసే పని ఏదనగా, ఆ పాఠశాలను లేకుండా చేయును.

మార్టిన్ లూథర్ తిరిగి లేచినచో, మొదటగా అతడు చేయు పని ఆ లూథరన్ సంస్థను మూసివేయుటయే. జాన్ వెస్లీ దానినే చేయును. వారెన్నడూ ఆ సంస్థలను కనుగొనలేదు; వారిని వెంబడించిన మనుష్యులే దానిని చేశారు.

MATT 23:24•

1TIM 4:1

 

57పౌలు ఎన్నడూ ఏ సంఘమును స్థాపించలేదు. అతడీలాగు పలికెను, "నేను వెళ్ళిపోయిన తరువాత మీ మధ్య అనేక స్వంత గుంపులు లేచి, వంకర సంగతులు మాట్లాడుదురు." పౌలు మరణించిన తదుపరి, ఓ వంద (లేక రెండు) సంవత్సరముల తరువాత, వారు కాథలిక్కు సంఘమును రూపొందించిరి, అదే మొదటి సంస్థ.

మనిషి లేచాడు. మూడీ మరణము తరువాత వారు మూడీ పాఠశాలను స్థాపించారు; వెస్లీ మరణము తరువాత వారు వెస్లీ సంఘమును స్థాపించిరి. లూథర్ మరణము తరువాత వారు లూథరన్ సంఘమును స్థాపించిరి. దేవుడు కధానాయకులను పంపును; వారు కట్టుదురు…

యేసు చెప్పిన దానిలో ఆశ్చర్యము లేదు, "మీరు సున్నము కొట్టిన గోడలు!" "మీరు ప్రవక్తల సమాధులు అలంకరించుదురు గాని, వారిని అక్కడ ఉంచినది మీరే!" అని ఆయననెను. అది నిజము.

ఈ గొప్ప వ్యక్తులు లేచిరి. అప్పుడు వారికొక జ్ఞాపకార్ధము వారు నిర్మించిరి. దావీదువలెనె అని నేను తలంచుచున్నాను, తన స్వంత తరములో దేవుని బాగా సేవించెను, ఆ విధముగానే చేయవలెను. నిన్ను దూరపరచు సంస్థలను, సంగతులను విడిచిపెట్టుము.

58ఆ అల్పుడగు చెప్పులు కుట్టుకొను మూడీ బలహీనుడు. అతడు బలహీనతకు ఒక మాదిరి. మూడీ చేసిన వాటిలో మొదటి సంగతి… అతనికి అసలు చదువే లేదు. అతని వ్యాకరణము బహు ఘోరముగా నుండెడిది. ఒకసారి ఒకడు ఆయన యొద్దకు వచ్చి "మూడీగారూ, నా జీవితంలో మీయంత అధ్వాన్నంగా వ్యాకరణము మాట్లాడే వారిని చూడలేదండీ," అని అన్నాడు.

"నా అవివేకముతోనే ఆత్మలను సంపాదించుచున్నాను. నీ విద్యతో నీవేమీ చేయకలుగుచున్నావు?" అని మూడీగారు ప్రశ్నించారు. అది చాలా మంచి జవాబని తలంచుచున్నాను. నిశ్చయంగా!

ఇప్పుడు, మీరు ఆ పాఠశాలలో సభ్యులై నిశ్చయంగా మెరుగుదిద్దబడిన పండితునిగా ఉండవలసియున్నారు. అది నిజము. [ఒక సోదరుడు "దానిని తిరగేస్తే చాలు," అని చెప్పుచున్నాడు.] ఇప్పుడు, వారు దానిని తిరగేశారు, మరొక మార్గానికి వారు వెళ్ళారు.

59ప్రజలు చేసేది అదే, నా వర్తమాన ఆరంభములో చెప్పాను. క్రైస్తవులు తమ్మను తాము తగ్గించుకొని, ఖాళీ చేసుకొని, దేవునికి మరి ఎక్కువ స్థలమును కనుగొనుటకు బదులుగా, ఇంట్లో తయారయిన జ్ఞానముతో లేక ఏదో సాంకేతిక పాఠశాల తెలివితో, లేక వారు ఆరంభించినప్పుడు ఉండిన స్థితిలో నుండి దేవునికి బాగా దూరము చేయు పద్ధతితో తమ్మును తాము కట్టుకొన ప్రయత్నించుచున్నారు.

ఈ కృత్రిమ వేదిక పిలుపులను గూర్చి నేను ఆలాగే తలంచుచున్నాను. నీవు లోనికి అతనిని తీసికొని రమ్ము, మరుసటిసారి తిరిగి అతనిని లోనికి తెచ్చుట పదిరెట్లు కష్టమగును. దేవుడతనికి ఏదో చేసేవరకు అతనిని కూర్చొని విననీ! ఆ తరువాత అతనిని వచ్చి, దానిని ఒప్పుకొని, లేచి, ప్రభువు నామము పేరట వేడుకొననిమ్ము. అది సరి.

60మూడీని గమనించండి, చదువులో బలహీనుడు, మాట్లాడుటలో బలహీనుడు, ముక్కుతో మాట్లాడేవాడు. ఒక రోజు ఆయన చరిత్ర నేను చదువుచుండగా, "ఆయనలోని ఒక బలహీనత వలన ముక్కుతో మాట్లాడెడివాడు," అని గ్రహించాను. శారీరకంగా చిన్నివాడు, బట్టతల మనిషి, గడ్డము వ్రేలాడుచూ, శారీరకంగా చిన్నవాడు. అతడు ఎప్పుడూ బలహీనతలోనే కొనసాగెను. కాని ప్రపంచమును ఆ దినమున కదిలించుటకు దేవుడాయనను వాడుకొనెను!

ఒక రోజున ఒక పత్రికా విలేఖరి ఆయన కూటమునకు వెళ్ళెను, (నేను చదివాను), ఈయన ఏలాటి మనిషియో గమనించుటకు విలేఖరులు వెళ్ళారు (ఒక గొప్ప మనిషి, ఒక మహా వ్యక్తి).

(టేపును ఆపు చేయు చిన్న మీట ఏది? ఇదేనా? ఇక్కడ కొద్దిగా ఆపు చేయుదును.)

61మూడీ ఒక మహావ్యక్తి చాలా చక్కని వ్యక్తి ప్రజల దృష్టిని ఆకర్షించేవాడు. వారు నోరు విప్పకుండా చేసేవాడు. ఒక విలేఖరి మూడీ యొద్దకు వెళ్ళి ఏ విధమగు ఏర్పాట్లతో ఇంత జనాంగమును ఆకట్టుకొనుచున్నాడో పరీక్షించసాగిరి.

ఆ విలేఖరి ఈ మధ్యనే మరో గొప్ప సువార్తికుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెను, "ఆయన వక్త, దైవ సంబంధమగు డిగ్రీలు కలిగినవాడు. ఆయనంత అత్యుత్తమ వ్యాకరణము ఎవరూ వాడుట నేను వినలేదు. తన మానసిక శాస్త్రముతో అతడు జనులను నిలబెట్టుచున్నాడు. మనుష్యులను నిశ్చేష్టులనుగా చేయగలడు."

62ఆ విలేఖరి ఆయన యొద్దకు వెళ్ళి వచ్చిన తరువాత ఇట్లు చెప్పెను, "ఆయనలో ఏమి అకర్షణ కనబడుచున్నదో గాని డ్వయిట్ మూడీలో నాకేమీ విశేషము గోచరించ లేదు. మొదటగా ఆయన చాలా అందవిహీనుడు అని చెప్పాలి. తరువాత శారీరకంగా బహు బలహీనుడు. ఇంకా చెప్పాలంటే, ఆయన విద్యలేనివాడు. నేను అంత అధ్వాన్నమగు వ్యాకరణము ఎక్కడా వినలేదు! ఆయన బోధించుచున్నప్పుడు ముక్కులో నుండి మాట వస్తుంది. ప్రజల దృష్టిని ఆకర్షించేది ఏదీ ఆ డ్వయిట్ మూడీలో నాకు కనబడుటలేదు."

మూడీ యొద్దకు ఆ ప్రచురించిన వ్యాసము తేబడినది. ఆయనది చదివెను. తనలోతాను ఒక విధంగా నవ్వుకొని, "నిశ్చయగా నాలో ఏమీ లేదు; అది దేవుడే," అని చెప్పాడు. నిశ్చయంగా! డ్వయిట్ మూడీని చూచుటకు జనులు రాలేదు. వారు దేవుని చూచుటకు వచ్చారు.

నీవెంత సాక్ష్యమిచ్చెదవో అన్నదానిని కూడా జనులు పట్టించుకోరు. దేవుడు నిన్ను పట్టుకొన్నాడన్న ఏదో రుజువును నీ జీవితములో ప్రజలు చూడగోరుచున్నారు. నీవు మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు మరెవరివయినా కావచ్చు. వారు దేవుని చూడగోరుచున్నారు. అది నిజం. ఆ గొప్పవారు బలహీనులే. తమ బలహీనతను గుర్తించినవారు.

63తెలివిగల యువకుడగు మోషేను చూడండి. ఓ, అతడు ఒక పండితుడు. ఐగుప్తు జ్ఞానమంతటితో తర్పీదు పొంది హెబ్రియులకు బోధించకలిగిన వాడాయెను. ఐగుప్తీయులకు అతడు బోధించగలడు. ఎవరికయినా బోధించగలడు, ఎందుకనగా మోషే గొప్పవాడు, చురుకైనవాడు. ఓ, అతడు శక్తిగల మనిషి.

పది ఆజ్ఞలను చలన చిత్ర నిర్మాత సిసిల్ డిమెల్ యొక్క అభిప్రాయమును ఆ విషయములో చూడండి. మోషే పాత్ర ధరించిన వ్యక్తి పేరు మరచిపోయాను. పెద్ద కండరములు, బలము కలిగిన పెద్ద మనిషి. మోషే బహుశా అలాగే యుండియుండ వచ్చును.

64ఆయన బలవంతుడు మరియు చక్కగా శిక్షణ పొందినవాడని మనకు తెలుసు. కనుక ఆ బరువు తానే ఎత్తుకొనెను. ఆ దినపు అవసరతను చూచి బాధ్యత వహించెను. (ఓ, దేవుడు దీనిని మునిగిపో చేయును గాక!) ఆ దినపు అక్కరను చూచి, మోషే తన తెలివితేటలతో, తన సామర్థ్యముతో దానిని చేయగోరెను… అతడు చాలా తెలివిగలవాడు. అతడు తంత్రముగల ఫరో, అతనికి మానసిక శాస్త్రము తెలియును. అతనికి అధికారమున్నది. అతనికి శారీరక బలమున్నది. అతనికి సమస్తమూ ఉన్నది. "నేను అన్నీ కలిగియున్నాను. అంతా నాకు తెలుసు. ఈ దేశంలో దానిని చేసే వారెవరైనా ఉన్నారంటే ఆ మనిషిని నేనే. నేనే ఈ ఘడియకు అవసరమగు వ్యక్తిని. నేను బయటకు అడుగుపెట్టెదను," అని అనుకొన్నాడు. సరిగానున్న పనిని పూర్తి చేయుటకు, దేవుని చిత్తమయిన పనిని జరిగించుటకు అతడు తన సహజ సామర్థ్యములను ఇచ్చుటకు అంగీకరించెను. దానిని దేవుడు నిరాకరించెను! మోషేకు కలిగిన ఒక్కదానిని కూడా ఆయన వాడుకోజాలడు.

అప్పుడు ఆయన వాడుకోజాలకపోయెను; ఇప్పుడును ఆయన వాడుకొనజాలడు. దేవుడు మన సహజ సామర్థ్యములను వాడుకొనజాలడు. మన అహములను, మన సామర్ధ్యములను మార్గమున కడ్డము రాకుండా తీసివేసికోవలెను. దేవుని యొక్క శక్తి మరియు చిత్తములకు సమర్పించుకొనవలెను.

JOHN 14:26

 

65"నేను బోధించగలను సోదరుడా," అని నీవనవచ్చు. నీవు బోధించినంత కాలము ఆయన నిన్ను వాడుకోజాలడు. "నేనిది చేయగలను. నేను అది చేయగలను." నీవు ఏది చేయలేవు. ఆలాగన్నచో దేవుడు దానిని వాడుకోజాలడు. కాని నీవు దేవునికి లోబడి ఆయనను చేయనిచ్చినచో చాలును!

"బ్రెన్హాం సోదరుడా, నాకు తెలుసు, నేను బోధకుడిని," అని నీవనవచ్చు. నీవు బోధకుడవైయునంత కాలము, ఎందుకు, నీవు ఎంతో దూరము వెళ్ళవు. కాని పరిశుద్ధాత్మ మన బోధకుడు. నిశ్చయంగా, సంఘమునకు ఉపదేశించుటకై దేవుడు పరిశుద్ధాత్మను పంపెను.

కొందరు సంవత్సరాల తరబడి, పాఠశాలలకు వెళ్ళుచుందురు. వారేమి చేసెదరు? మేడ గదిలోని వ్యాసములు మొదలగునవి చదువుదురు. ఓ, అది మంచిదే. జాతీయ ఆదివారపు బడి పాఠములను నీవు తీసికొనుము. దానికి నేనేమియూ వ్యతిరేకిని కాను. అవి దేవుని మాటలు, సంగతులు, కాని అది మేధావులతో సమకూర్చబడినది! అది శక్తితోను మరియు క్రీస్తు పునరుత్థానముతోను రావలెను, నీవు నీ సహజవనరులపై ఆధారపడకూడదు.

66ఈ యువకుడగు, చక్కని, బలముగల, తెలివిగల యోధుడగు మోషే ఒక మంచి పనిచేయుటకు ఆరంభించెను; కాని దేవుడు అసలు దానిని వాడుకొనజాలడు. అతని సహజ వనరులను ఆయన వినియోగించుకొనడు.

ఈనాడును అంతే! దేవుడు మన సహజవనరులను వాడుకోజాలడు.

కాని మోషేను గూర్చి పొగడవలసినది ఒక్కటున్నది. తాను పూర్తిగా విఫలమయితినని గుర్తించు జ్ఞానము కలిగియుండెను. కాని ఆ బుద్ధి మనకు లేదు. అంతే! "మేము ఒక క్రొత్త శాఖ రూపొందించుకొందుము. స్వస్థతా వరము, లేదా మరేదో కలిగిన ఒక వ్యక్తిని మేము తెచ్చుకొందుము." పెంతెకోస్తువారలారా, మీరు చూచారా. చూచారా? మనము పూర్తిగా విఫలమైతిమని మనకు తెలియుట లేదు. పెంతెకోస్తు సంఘము, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్, యునైటెడ్, మొదలగు వారు తాము పూర్తిగా విఫలమయిపోయామని గ్రహించు జ్ఞానము కూడా కలిగియున్నట్లుగా కనిపించుట లేదు. (హల్లెలూయా! ఓ, ఇది మీ మనసులలో స్థిరమగునట్లు చేయుటను కోరుచున్నాను.) వారు తప్పిపోయారు. సంఘసంస్థ విఫలమయినది. భయము, వణుకు, వారికొరకు బాంబులు వ్రేలాడుచున్నవి. అమెరికా కూడా అలాగే విఫలమయినది. వారు నాట్యము చేసి తమ జీవితమును నరకమునకు అప్పగించుకొన్నారని వారెరుగుదురు. వారు విఫలమయ్యారు. వారిలో నుండి ఆత్మ పోయినది. యువకులను సైన్యమునకు పంపాలంటే నీవు చెట్లును గాలించాలి. ఏమి జరిగిందో వారు చూచారు. మనము విఫలమయ్యాం! సంఘము విఫలమయినది. వారికది తెలియును.

EXOD 4:25,26

 

67మోషే దానిని గ్రహించెను, అతడు తగినంతగా ఎరిగియుండినప్పుడు… దేవుడు అరణ్యములోనికి అతనిని తీసికొనిపోయి కొన్ని మానవ బలహీనతలను నేర్పించెను. అదంతా ఏమిటో ఆయన అక్కడ నేర్పించెను. కాబట్టి అతడు బాగుగా నేర్చుకొనెను! ఓ, అతడు పాఠం నేర్చుకొనెను! అతనితో దేవుడు కొంత సమయం అక్కడ తప్పక గడిపియుండును! మోషేకు కోపమున్నదని మీకు తెలుసా? దేవుడాతని కిచ్చిన భార్య సిప్పోరాకు కూడా కోపమే. కొంతకాలము వరకు ఆ ఎడారిలో వారి జీవితములు బాగుగా లేవనుకొంటాను. అదే సమయములో వారిరువురి కోపములు ఆధీనము తప్పినవి.

ఒక వ్యక్తిని మానసిక శాస్త్రము ఎంతవరకు అదుపులో పెట్టగలదో, దానిని గూర్చిన జ్ఞానము, అతనికున్న అభిప్రాయము ఏమీ మేలు కలుగజేయలేదు, అని నేను తలంచుచున్నాను, ఎందుకనగా అతడు ఐగుప్తునకు వెళ్ళు మార్గములో ఉన్నాడు. ఇంకా సిప్పోరా కోపము వదలలేదు. తన కుమారునికి సున్నతి చేసి ఆ చర్మమును కోపముతో దానిని మోషే ఎదుట పడవేసి, "నీవు నాకు రక్త సంబంధమైన భర్తవు," అంటున్నది.

దేవుడు చివరలో అతని కొరకు వచ్చియున్నాడు, అతని పట్ల చాలా కోపముతో ఉన్నాడు, అతనిని కనుగొనియుంటే తప్పక చంపియుండేవాడు. కాని అక్కడ చిన్న విషయాలు దేవుడు మరల నేర్పవలసియుండెను. చూచారా, అతడొక నరుడు. అతని యొక్క ఐగుప్తు జ్ఞానమంతయు, తనలోని మేధాశక్తులన్నియు నిరుపయోగము, దేవుడు అతనిని వాడుకోలేకపోయెను.

68"నేను ఇప్పటికి నలుబది సంవత్సరాలు పాఠశాలలో విద్యనభ్యసించాను. నేను తెలివిగల విధ్యార్థిని. నేను కండ్లు మూసికొని బైబిలు చెప్పగలను," అని నీవు వచ్చి అనవచ్చు. దానిలో ఒక్క ముక్కను కూడా దేవుడు ఉపయోగించుకొనజాలడు. లేదు.

"ఓ, నేను దేశములోని పెద్ద దేవాలయానికి హాజరవుచున్నాను. ప్రభువా, నేను ఫలానివాడిని. ఓ, నేను పెంతెకోస్తువాడిని. దేవునికి మహిమ! ఒక రాత్రి నేను ఈ మధ్యనే పరిశుద్ధాత్మను పొందాను. హల్లెలూయా! ఆయా కార్యములు చేయుటకు నీవు నన్ను ఉపయోగించుకోనై యున్నావు." దేవుడు అందులో ఒక్కదానిని కూడా ఉపయోగించుకోజాలడు. లేదు.

నీవెప్పుడు ఓడిపోయి, ఓడిపోయానని గ్రహించుదువో అప్పుడు వెనుకకు వచ్చి దీనుడవు కమ్ము. బలహీనుడవైన మానవమాత్రుడనని ఎరుగుము. నీలోని ఏ తెలివితేటలు పనికిరావు. దేవునికి మానవ బలహీనతలు ఎన్నడూ ఉపయోగకరము కావు. దేవుడు, మానవ బలహీనతల ద్వారా తన్నుతాను నీ లోనికి కుమ్మరించుకొనును. అప్పుడు తన్నుతానే వాడుకొనును. నీవు కేవలము ఒక సాధనముగా ఉండెదవు. నిశ్చయంగా! నిన్నునీవు మార్గములో అడ్డుపడకుండా తొలగించుకొనుము.

69మోషే, ఓ, అతడు నేర్చుకొన్నవాడు. అతడు వాస్తవంగా మానవ బలహీనతలను గూర్చి చక్కగా నేర్చుకొనెను. అతడెంత బాగుగా నేర్చుకొన్నాడంటే, దేవుడతనిని పిలచినప్పుడు ఏడు బలహీనతలను కలిగియుండి, దేవుని పిలుపునకు వ్యతిరేకంగా వాదించినాడు. నిర్గమకాండము మొదటి భాగములోని ఏడు బలహీనతలను నీవు చదివావా? నేను ఇక్కడ వాటిని వ్రాసియుంచాను. మీరు వాటిని వినవలెనని కోరుచున్నాను. మొదటి బలహీనత, అతడు వర్తమానమును లేకుండెను. రెండవ బలహీనత, అతడు అధికారమును లేకుండెను. మూడవ బలహీనత, వాక్చాతుర్యమును లేకుండెను. నాలుగవది, సర్దుబాటును చేసికోలేని స్థితిలో యుండెను. అయిదవది, విజయము లేకుండెను. ఆరవది, అంగీకారము కొరతగా నుండెను.

EXOD 2:12•

EXOD 4:10

 

70ఇప్పుడు, అతని బలహీనతలతో నీ వాటిని పోల్చుకొని నీవు వాటితో రాగలవేమో చూచుకొనుము. అతనంత బలహీనునిగా ఉండగలవేమో చూడుము. "ప్రభువా, నేనేమీ మంచివాడిని కాను. నేను మాట్లాడలేను. నేనొక ఐగుప్తియుడ్ని చంపాను. నేను తిరిగి వెళ్ళలేను. నేను మాట్లాడజాలను. నేను నోటిమాంద్యము గలవాడను.? అతడెట్లుండునో చూడండి? అతడు ఎందుకూ కొరగానివాడు! సోదరుడా, అతడు స్వస్థత పొందినాడు. అవును, బాగయిన తరువాత దేవుడతని వాడుకొనగలిగెను, చూచారా. అవును.

మనము బాగయిన తరువాత దేవుడు వాడుకోగలడు. "నా పిహెచ్.డి, ఎల్ఎల్.డి, డబుల్ ఎల్.డి., ఏదయినా గాని, నా డిగ్రీలన్నియు వ్యర్ధములు." దేవుడు వాటిని ఉపయోగించుకోజాలడు!

ISA 6:5

 

71"మంచిది, నేను అసెంబ్లీ-ఆఫ్-గాడ్ కి చెందినవాడను. నేను ఏకత్వవాదిని. నేను బాప్టిస్తును. నేను ప్రెస్బిటేరియనుని." అయితే ఒక్క భాగాన్ని కూడా ఆయన అందులో వాడుకోజాలడు! నీవెంత త్వరగా దానినుండి దూరమైతే, నీకంత మంచిది. నిన్ను దేవునికి సమర్పించుకొనుము.

ప్రవక్త చెప్పినట్లు చెప్పవలెను, "నేను అపవిత్ర పెదవులుగలవాడిని. అపవిత్ర జనుల మధ్య నివసించుచున్నాను." దూత వెళ్ళి బలిపీఠము యొద్దనున్న అగ్ని కణములను తీసికొని వచ్చి అతని పెదవులు కాల్చినది. అప్పుడతడు, "ప్రభువా, ఇదిగో, నేనిక్కడున్నాను; నన్ను పంపుము," అని చెప్పెను. అతడు గ్రహించిన తర్వాతనే… అతడు ప్రవక్త అయిననూ అపవిత్ర పెదవులు కలిగియుండెను.

మనము వట్టివారమని మనము గ్రహించిన వెంటనే, దేవుడు పట్టుకొనును! మనము వట్టివారము. నీవు వట్టి వ్యక్తివి. నీవు భూమి మీది ధూళివి. నీ బలహీనతలన్నియూ మోషేకు జతకాబడకపోవచ్చును. అతనికి ఆరు వేర్వేరు బలహీనతలున్నవి, అతడు మానవ బలహీనతలను నేర్చుకొనెను.

72ఇప్పుడు, మోషే దేవుని కలిసికొనుటకు, దేవుడు మోషేను చూచుటకు మధ్యనున్న తేడాను చూడండి. నేటివలె ఉన్నది. "మనకు ఫలానిది అవసరము! దేశములో మనకు ఉజ్జీవము అవసరము. నేనేమి చేయబోవుచున్నానో చెప్పెదను. నేను బి.ఎ. పట్టా పుచ్చుకొనే వరకు వెళ్ళి చదివెదను. హూ-హూ! నేను ఎల్-ఎల్.డి. గా అభిషేకము పొందువరకు వెళ్ళి చదువుకొందును. నేను సాహిత్యము చదివెదను. ఇదంతా చేసిన తరువాత, నేను బయటకు వెళ్ళి సమయానికి తగిన వ్యక్తినవుదును. ఇక్కడ బయలుదేరిన వారినందరినీ నేను తొక్కివేసెదను." [ఓ, సోదరుడా!] మూడు మిలియను డాలర్ల భవనమును నిర్మించుదును. ఒక డజను కాడిల్లాకు కార్లు సంపాదించుకొందును. [ఓ, సోదరుడా!] నీవు అసలు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది, ఎందుకనగా అసలు ప్రారంభించుటలోనే నీవు విఫలమైపోయావు, చూచారా. కాని అసలు సమస్య ఏమిటంటే వారికది అసలు తెలియదు!

73నీకు ఉంగరాల జట్టు, ఖరీదైన సూటు, ఉండాలని వారు తలంచుచున్నారు. "ఓ, ఆయన చాలా అందగాడు. అందరికీ రాజులా ఉన్నాడు. అది ఒక స్త్రీకి కీలుబొమ్మ!

దేవునికి దైవజనులు కావాలి. కదిలించే మనుష్యులు కావాలి! కాని నేడు మనకు హాలివుడ్ కావాలి. కంటికి తృప్తినిచ్చేది ఏదో మనకు కావాలి. చాలా తెలివిగా మాట్లాడి, ఆదివారం ఉదయాన అయిదు నిమిషాల పాటు మనలను నిద్రలోకి తీసికొని వెళ్ళే ప్రసంగం కావాలి.

దేవుడు పాపమును వ్రేళ్ళతో పెళ్ళగించి, బయటకు త్రవ్వి మెరుపువలె వెలుగును పంపించు వారికొరకు, వేరుచేయు వారికొరకు చూచుచున్నాడు. (అది నిజము).

కాని మనకు తెలివిగల బోధకులు, కాపరులు కావాలి. "అవును, నీవు ప్రియమైన వ్యక్తివి," అని తియ్యగా చెప్పే కాపరి కావలెనని చాలామంది ప్రజలు కోరుచున్నారు.

దేవునికి పిడుగులు కావాలి! అవును.

వీపు మీద నిమిరి, పొట్టి జుట్టను, రంగులు పూసికొనుటకు, పొట్టి వస్త్రధారణను పరవాలేదను చెప్పువారు కావలెను. అసలు వాటిని గూర్చి ఎత్తకుండా ఉండేవారు కావాలి.

ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి తన ఆఫీసులోనికి నన్ను పిలిచి, (ఆయన కార్యాలయము కాదు; తను పనిచేయు బయట కార్యాలయము), "నీవు దానిని ఆపేటట్లుగా నీ మీద చేతులుంచెదనని!" కొద్దికాలము క్రిందటనే ఇక్కడ చెప్పాడు.

"నీవది చేయవద్దు. ఆలాగు చేయవద్దండీ," అని నేను చెప్పాను.

నీవది ఆపినప్పుడు, నీవు వర్తమానాన్ని ఆపినట్లే. నీవది చేసినచో దేవునిని ఆపినట్లే. అవునయ్యా. అదేదీ మాకు అవసరం లేదు.

EXOD 4:14

 

74దేవుడు మోషే యొక్క బలహీనతలన్నింటిని గూర్చి విచారించాడా? "అయ్యో! చిన్న పేద మోషే, నీకు నిశ్చయంగా ఏదో జరిగిన మాట వాస్తవమే. నీ హోదానుండి నీవు పడిపోయావు. ఓ, ఇక్కడ నీవు ఒక గొప్పవానివి. చాలా మేధావివి. నిన్నేదీ ఆపజాలదు. సోదరుడా, పిహెచ్.డి.లు, ఎల్ఎల్డిలు, అన్నీ నీవు కలిగియున్నావు. నేను వట్టివాడనని ఒప్పుకొని ఇక్కడ నీవు వచ్చుచున్నావు. నీవేమీ చేయలేవు. నీవు చాలా బలహీనుడివి," అని దేవుడన్నాడా? లేదు! అతని గూర్చి దేవుడు చింతించలేదు. దేవుడెన్నడూ అతనిపై జాలిగొనలేదు. వాటన్నింటి నుండి దేవుడాయనను బాగుచేసెను. అతని గూర్చి చింతించలేదు.

మీరు వ్రాసుకోగలిగితే నిర్గమకాండము 4:14లో చూడండి, "అతనికి విరోధముగా దేవుని కోపము రగులుకొనెను." అతడు బలహీనుడయినందున దేవుడు అతని విషయములో చింతించలేదు.

75"ఓ ప్రభువా, నేను చాలా బాధపడుచున్నాను. అది చేయగలనను నమ్మకం నాకు లేదు," అని నీవనవచ్చును. దేవుడు నిన్ను చూచి చింతించడు. కొద్దిగా నిన్ను తన్నుటకు ప్రారంభించును. చూచారా? నిశ్చయంగా, దేవుడు నీ విషయంలో సంతాపపడడు; ఆయన నీపై కోపపడును! నిన్నెక్కడ దేవుడు ఉపయోగించుకొనునో ఆ రూపానికి నీవు వచ్చుచున్నావు. అవును.

మోషే బాగుపడెను, దేవుడతనిని వాడుకోగలడు. అతనికి స్వస్థత లభించినది. మానవ సామర్థ్యముల నుండి అతడు దూరంగా వెళ్ళెను. అప్పుడిక తాను ఆధారపడునది ఏదీ లేదు, ఎందుకనగా… అప్పుడతడు సేవకు సిద్ధముగా యున్నాడు.

76దేవుడు చెప్పెను, "ఇక్కడ నలుబది సంవత్సరములు నిన్ను ఉంచాను. ఈ అరణ్యములో సిప్పోరా విసిగించినది. నీలోనున్న మానవ బలహీనతను కనుగొన్నావో లేదో చూడు. అక్కడ నీవు ఒక పెద్ద రాకుమారునిగా నిలబడితివి: 'డాక్టర్ మోషే, శుభోదయం. రెవరెండుగారూ, మోషేగారూ, నీవు కాబోవు రాకూమారునివి. మేమంతా మీ గూర్చి ఆలోచిస్తున్నాం.' ఇప్పుడు నీవిక్కడ ఎడారిలో గొర్రెల మందతో, ముక్కోపియగు భార్యతో ఉన్నావు," చూచారా. అదే అతనిని సరిచేసినది. అవును. మోషే భయంకరమగు స్థితిలో ఉన్నాడు. అవును దేవుడు ఇట్లు పలికెను, "ఇప్పుడు నిన్ను నేను వాడుకోగలను, నీవు వట్టివాడవని గ్రహించావు. ఈ మండుచున్న పొద యొద్దకు నీవు రా. నిన్ను ఆ స్థలమునకు పంపదును." ఓ, మై!

దేవుడు అలాంటివారిని మరికొందరిని అనుగ్రహించు గాక. దేవా, మరికొందరు బలహీనులను ఇమ్ము, కొందరు బలహీనులే మాకు అవసరము. నిశ్చయంగా!

GEN 27:36•

GEN 30:32•

GEN 31:8

 

77యాకోబును మీరెరుగుదురా. ఒకప్పుడు యాకోబు గొప్పవాడినని తలంచెను. మోసము చేసి ఏదయినా పొందగలననుకొనెను. తన మామ గొర్రెలు, పశువులు గర్భము ధరించియుండగా అతడు వెళ్ళి కొన్ని నిరవంజి చువ్వలను వాటిముందుంచి, రాబోవు వాటిని మచ్చలుగల వాటివిగా మార్చెను. అవి నీరు త్రాగుటకు వెళ్ళినప్పుడు ఆ చువ్వలను వాటి ముందుంచెను. మొదటగా నీవు తెలిసికోవలసినదేమనగా, యాకోబు గొప్పవాడాయెను. "అతడు యాకోబుగా పిలువబడుటలో తప్పలేదు. అతడు మోసగాడు," అని ఏశావు చెప్పెను. అతడు మోసగాడు. చక్కగా సంపాదించుకొనుచున్నాడు. గొప్ప మందలు, భార్యలు, గొర్రెలు, పశువులు, ఎద్దులు, సమస్తమూ సంపాదించెను. అన్నీ అతనికున్నవి.

GEN 32:24,28

 

78కాని ఒక రాత్రి (ఓ, మై!) ఒకసారి ఒక చిన్న సెలయేటివద్ద ఆగి దానిని దాటనైయుండగా, దేవదూత అతనిని ఒక స్థలములో పట్టుకొనెను. సోదరుడా, రాత్రంతా ఆ యాకోబు పెనుగులాడెను. నిశ్చయంగా చాలాసేపు అతడిని పట్టుకొనెను. కాని అతడు లొంగిపోగానే, బలహీనుడవగానే, ఇక పట్టుకొనలేనని చెప్పగానే దేవుడు వాడుకోనారంభించెను…

ఓ దేవా, సంఘమును ఆలాగు ఉండనిమ్ము. సంఘము ఇక ఏ మాత్రము తన సహజ సామర్థ్యములను పట్టుకొనియుండలేనని చెప్పు స్థితికి తీసికొని రమ్ము, దేవునికే ఇచ్చునట్లు చేయుము. తాము మెథడిస్టులమైయున్నందుకు సిగ్గుపడునట్లుగా మెథడిస్టువారిని చేయుము. బాప్టిస్తులు, పెంతెకోస్తవారు తమ్మును గూర్చి సిగ్గుపడునట్లు చేయుము. ఇక వాటిని పట్టుకోకుండా ఆపుము. ఆత్మకు లోబడునట్లు చేయుము.

అప్పుడు యాకోబు దేవుని రాకుమారుడు ఆయెను. అతడు ఒక రాకుమారుడు అయ్యెనని బైబిలు చెప్పినది. అతని పేరు మారినది, చూచారా. ఒక వైపు చూసినచో అతడు చాలా బలవంతుడు, జ్ఞానములో శక్తివంతుడు; మరొక వైపున అతడు కుంటుచున్న రాకుమారుడు, బలహీనుడు మరియు అలసిపోయెను, కాని దేవుని ఎదుట శక్తిని కలిగియుండెను.

79నీ సంస్థ ముక్కలుగా విరగిపోయియుండవచ్చును. పొరుగువారితో నీ గౌరవము అప్పటికన్న ఇప్పుడు తరిగిపోయియుండవచ్చును. నీవు నీ పొరుగువారికి పాతకాలపు కాకిలా కనబడవచ్చును. అది నిజము కావచ్చు. కాని నేను చెప్పునదేమనగా, దేవునితో నీవు శక్తిని కలిగియుందువు. నేను ఆలాగే ఉండగోరుచున్నాను. ఆ మార్గమును ఎప్పుడైననూ నేను వెంబడించుదును.

యేసును గూర్చిన నిందను మోయుట యేసు శిష్యులు గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఆనందము, సంతోషములతో వారు వచ్చిరి. నిశ్చయముగా. వారు నిన్ను "పరిశుద్ధ బండ," అని హేళన చేసెదరు.

80అట్టి స్థలము నుండి బయటకు రమ్ము, దానిని బ్రద్దలైపోనిమ్ము. "నేను మెథడిస్టును," లేక "ప్రెస్బిటేరియనును," లేక "అసెంబ్లీస్ను," లేక, "ఏకత్వవాదిని," "నేను నీవంటి మంచివాడిని," అన్న భావము నుండి విడిపింపబడుము. ఒకసారి అందులోనుండి బయటపడి, మార్గమును ఇమ్ము.

ఒకసారి దేవుని దూత నిన్ను పట్టుకోనిమ్ము, వర్తమాన సత్యమును ప్రభువు దూత నీ యొద్దకు తెచ్చుచున్నాడు. అతనిని ఒక్కసారి నిన్ను పట్టుకోనిమ్ము. యేసు నామములో బాప్తిస్మము పొందుటకు నిన్నునీవు తగ్గించుకొందువు. తక్కిన వాటిన్నింటికి లోబడునంతగా నిన్ను నీవు తగ్గించుకొందువు. అవును. నిశ్చయంగా నీవు చేసెదవు. అవును. నీవు అన్ని తెలివితేటలను మరచిపోదువు.

81కొద్దిరోజుల క్రిందట, నా ప్రియ స్నేహితులలో ఒకరు, చాలా మంచివాడు, కొందరు వ్యక్తులను గదిలో కలిసికొని పరిచయము చేసికొని గదిని విడిచిపెట్టుచుండగా నాతో ఈలాగనెను, "బ్రెన్హాం సోదరుడా…" అక్కడ జరిగే నా కూటములకు ఈ వ్యక్తి ఆర్థికంగా సహాయము చేయును. ఈ పని ఏలాగు చేయవలెనో ఎరుగని స్థితికి నేను వచ్చాను. కేవలము దేవుని నమ్ముచున్నాను. ఈ వ్యక్తి దానిని ఎత్తివేశాడు. అవును, అంత మంచివ్యక్తి! ఇతడు గొప్ప పట్టణం నుండి ప్రయాణము చేసి వచ్చాడు. ఇక్కడ కొన్ని రాత్రులు గదిలో వుండి వెళ్ళిపోతూ నిలబడి చెప్పాడు, "బ్రెన్హాం, సోదరుడా ఒక్క సంగతి నేను చెప్పగోరుచున్నాను. నిన్ను ప్రేమించువారిలో అతనివంటి వారెవ్వరునూ లేరు."

"దానిగూర్చి చాలా సంతోషము," అని చెప్పాను.

"సోదరుడా, అక్కడ కేవలము, ఒక్క విషయము పొరపాటు," అని చెప్పెను.

"సోదరీ, అదేమిటి?" అని అడిగాను.

"బ్రెన్హాం సోదరుడా, ఒక్క మాట. నీవు ఆ ఒక్క సిద్దాంతము విషయములో రాజీ అయితే, ప్రతి సంస్థ నిన్ను చేర్చుకొనును," అని చెప్పెను.

"ఏ సిద్దాంతము సోదరీ," అని నేను అప్పుడే చూచి అడిగాను.

"ఓ, అది యేసు నామ బాప్తిస్మము," అని చెప్పినది.

"ఓ, కాని, సోదరీ, దేవుని వాక్యముతో రాజీపడి, దేవుని సేవకునిగా నేను కొనసాగెదనని మాత్రం నీవు అనుకోవద్దు," అని చెప్పాను.

GAL 1:8

 

82"ఈ పెద్ద పట్టణములో నేను ప్రాతినిధ్యము వహించుచున్న సేవకుల గుంపు ఒకటున్నది. అందుకే నేనిక్కడకు వచ్చాను. ఈ దర్శనములను ఇచ్చుచున్న యెహోవా దూత గూర్చి నీవు వారితో చెప్పినచో, వారు యేసు నామములో బాప్తిస్మము పొందుటకు అంగీకరించెదరు," అని చెప్పెను.

"మంచిది, వారి అనుభవము మురికి నీటికంటె బలహీనమైనది. ఏ దూత చెప్పినాగాని, అది వాక్యానుసారము కానిచో, నేను దానిని నమ్మను. దానికి భిన్నంగా ఆ దూత ఏది చెప్పినా గాని ఆ దూతను నేను నమ్మను," అని చెప్పాను. నిజము! అన్ని దూతలు, ప్రతిదానికంటెను దేవుని వాక్యము మిన్నయైనది! "నిజమగు దూత వాక్యమునకు అనుకూలముగా నాకు చెప్పనిచో నేను వినను," అని చెప్పాను. అవును.

ఏమి చేయాలో ఆమెకు తెలియలేదు. "అట్టిది నేనెన్నడూ వినలేదు. దానిగూర్చి నాకెన్నడూ తెలియదు. నేను తిన్నగా ఇంటికి వెళ్ళి, క్రొత్త నిబంధన అధ్యయనం చేయుదును. నేనెన్నడూ దానిని చదువలేదు," అని ఆమె చెప్పెను. ఆమెకు ఒక వాక్యభాగము ఇచ్చాను. "ఓ, నీవు అక్కడికే రావలెను." ఓ, మై!

పట్టుకొనియుండుటకు ప్రయత్నించవద్దు. విడిచిపెట్టు! నీవదే చేయవలెను - విడిచిపెట్టు. యాకోబు, పట్టు విడిచినప్పుడు బాగయ్యెను. అతడు రాకుమారుడుగా మారి దేవునితో శక్తి పొందెను.

1SAM 17:46

 

83సౌలు యొక్క మతాచారపు దుప్పటి చిన్న దావీదు వేసికొని గొల్యాతుతో పోరాడుటకు వెళ్ళెను. ఈ పెద్ద కవచమును పైన ధరించుకొని గొల్యాతుతో పోరాడుటకు దావీదు ఆరంభించగా, అతడు ముందు వెనుకలకు, చుట్టూ కలియ జూచెను, "అతడు తక్కినవారివలె కనబడెను. ఇక్కడేదో పొరపాటు జరిగినది," అని చెప్పెను.

నీవు లోకమువలె ఉన్నంత కాలము, లోకముతో రాజీపడుచున్నంత కాలము, లోకము చేయుచున్నది చేయనంత కాలము తప్పులో నున్నావన్నమాట.

"ఇది చాలా బరువుగా వున్నది. నాకు డాక్టరు డిగ్రీ, పిహెచ్.డి.లు ఉన్నవి. నేను పెద్ద సంస్థకు చెందినట్లు ఉన్నానని," దావీదు చెప్పెను. "వీటన్నింటితో నేనేలాగు పోరాడుదును? దానిగూర్చి బొత్తిగా నాకు తెలియదు. అసలు దాని సంగతే నాకు తెలియదు! ఇవన్నీ నాపైనుండి తీసేయండి. దేవుని పక్షముగా నేను పోరాడివలసి యున్నచో, నేను ఇక్కడ నిలబడి కవచములు ధరించి, గుండె చెదరిపోయి, భీతితోనున్న పిరికి గుంపువలె కనబడుటకు నాకిష్టము లేదు." అది నిజము.

84చాలా కూటములు, చాలామంది మనుష్యులు, చాలామంది సేవకులు నా యొద్దకు వచ్చి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుట సరియే అని మేము నమ్ముచున్నామని ఒప్పుకొందురు. కాని "మా సంస్థ బయటకు గెంటివేయును," అని చెప్పుదురు. చాలా దరిద్రమగు నెపము! సౌలు యొక్క కవచమును తీసివేయుము!

పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, బలమును ఇమ్ము! దేవా, అదేమైనను, ఎంత చిన్నదైనను, నన్ను ఒక వడిసెల రాయితో పంపుము. శత్రువును క్రిందికి కొట్టెదను. అది నిజము. కాని ఆ తక్కినవారివలె ఎల్.ఎల్., పిహెచ్.డి., డాక్టరేటు, మొదలగు వాటిని నేను ధరించుకొనునట్లు చేయకుము.

85దావీదు చెప్పెను, "ఇది సరిగా కనిపించుట లేదు. దానిగూర్చి నాకేమియూ తెలియదు." "నాకు తెలిసినదంతా ఒకటే. అదే నాకున్నది. ఆ ఎడారి వెనుక నేను నా తండ్రి గొర్రెలను మేపుచున్నాను." "ఒక సింహము వచ్చి చిన్న గొర్రెపిల్లను కరచుకొని పరుగెత్తినది. అది నా తండ్రి గొర్రెపిల్ల అని నేనెరుగుదును. నాకేమీ ఆయుధములు లేవు, కాని నేను నా వడిసెలను తీసికొని దాని వెనుక పరుగెత్తాను. దానిని నేను చంపి గొర్రెపిల్లను తిరిగి తెచ్చాను." ఓ మై! వారక్కడ ఈటె పట్టుకొనియున్నారు, ఏమి చేయలేరు.

ఈనాడు కూడా విషయము అలాగే యున్నది. దారి తప్పిపోయిన గొర్రెలు దేవునికి చాలా యున్నవి. సంస్థలు మొదలగునవి వారిని బయటకు దొంగిలించుకొని పోయినవి. మానసిక శాస్త్రమునకు వారిని తీసికొని వచ్చారు. దేవుని వాక్యముతో, దేవుని శక్తితో నిండిన దావీదులను దేవుడు ఇచ్చును గాక! ఈ జ్ఞానపు రాక్షసులను ఎదురాడునట్లుగా నడిపించుము. పిహెచ్., ఎల్ఎల్.డి.లు, క్యూ.యు.ఎస్.టి.లు, లేక వేరేమైనను. దేవుని వాక్యమును, పరిశుద్ధాత్మ శక్తిని నాకిమ్ము, పొలములోని ప్రతి రాక్షసుడిని సంహరించుదునని చెప్పుచున్నాను. నిజము! అట్టి మనుష్యులు మనకు అవసరము.

1SAM 17:45

 

86ఆ రంగములోని రాక్షసుడ్ని పోరాడుటకు దావీదుకు వారందరివలె ఏ సాకు దొరకలేదు. అతడు కేవలము బాలుడు. అతడు చిన్నవాడని, భుజములు వంగినవాడని, చుట్టూ గొర్రె చర్మము చుట్టుకొని యున్నాడని బైబిల్ వర్ణించుచున్నది. ఈ గొప్ప మేధావుల డిగ్రీలు కాని, మంచి తర్ఫీదు గాని అతనికేమీ లేవు. ఖడ్గము గురించి అసలు ఏమి తెలియదు. సౌలుకు, అతని వారికి ఉన్న ఈ శిక్షణ గూర్చి అసలు ఏమీ అతనికి తెలియదు.

సౌలువంటివాడు వారికెవ్వరూ లేరు. అతడు బిషప్ సౌలు. నిశ్చయంగా, తక్కిన సైన్యమందరికంటె చాలా ఎత్తయిన భుజములుగలవాడు. అతడు మాత్రమే వెళ్ళి అసలు వాడితో పోరాడవలెను - కాని అతడు భయపడిపోయాడు.

87ఒక ఉజ్జీవము అవసరమని నేడు మనకు తెలియును. ప్రజల మీద ఒక కదలిక రావలెనని మనకు తెలియును. అది డాక్టరు డిగ్రీగలవాని వలన కాదు. క్రీస్తు పునరుత్థాన శక్తితో దేవుని వాక్యమును తీసికొనిన, బలహీనుడే దీనిని చెప్పగలడు. (హల్లెలూయా!) ఆయన ఇంకనూ గ్రుడ్డివారి కన్నులు తెరచుననియు, రోగులను బాగుచేయుననియు, మృతులను లేపుననియు, వారిని చూడనిమ్ము ఆయన దేవుడు. విజయశీలుడు! ఆమేన్. వేదాంత పాఠశాలలలో శిక్షణ పొందని, దావీదు మనకు అవసరము. ఏమీ తెలియని ఒక మనిషి, చిన్న బాలుడు, భుజములు వంగిపోయినవాడు. చూచుటకు అందంగా లేనివాడు, దేవుని శక్తితో మార్గములో నడిచి వచ్చువాడు మనకు కావలెను.

88తల్లి చనిపోతూ అన్నది, "బిల్లీ, నేను నిన్ను నమ్ముచున్నాను. నీవు నా ఆత్మీయ బలము. నీవు నన్ను దేవుని యొద్దకు నడిపించావు."

"అమ్మా, నేను చిన్నవానిగా నున్నప్పుడు… మేము వెనుక ఐరిష్ వారము. కొద్దిగా కాథలిక్కులము. సంఘము నాతో చెప్పినది ఏమనగా, మేము జనుల గుంపుము. వారేదీ చేసినా సరియే. కాని అది నేను నమ్మలేను, ఎందుకనగా లూథరను వారు కూడా, మేము ఒక జనుల గుంపుము, దానిని మేము పొందాము అన్నారు. బాప్తిస్తులు కూడా మేమే ఆ సంఘానిమి, మాదే నిశ్చయము అన్నారు. సుమారు తొమ్మిది వందల రకముల శాఖలున్నవి. అమ్మా, నేను వాటిని నమ్మలేను. అందులో ఏది నిజము?" అని అడిగాను.

ACTS 2:38

 

89దీనిని నేను వినయంగా, ప్రియంగా చెప్పుచున్నాను. అందులో ఏదీ సరికాదని నేను నమ్ముచున్నాను. అది నిజం. దేవుని వాక్యము యొద్దకు నేను వెళ్ళెదను. వెనుక ఏం జరిగిందో చూచాను. దేవా, అప్పుడు అందరం వెనుకకు వెళ్ళెదము. బలహీనతతో, ఏ సంస్థ సాయము లేకుండా, ఏ సంఘము యొక్క మద్దతు లేకుండా, సామాన్యముగా, పెంతెకోస్తు దినమున దిగిన పరిశుద్ధాత్మ శక్తితో, పెంతెకోస్తు దినమున పేతురు అందించిన అదే వర్తమానముతో వెళ్ళుదము, "మీలో ప్రతివాడును మారుమనస్సు పొంది మీ పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి."

మెడ చుట్టూ కాలరుతో, ఈ వేదాంతుల గుంపువలె మీరు అలంకరింపబడి యుండకపోవచ్చును. బి.ఏ., డిగ్రీలు లేకపోవచ్చును. కాని సోదరుడా, దేవుని ఆత్మ నిన్ను దేవుని వాక్యములోనికి తీసికొని వెళ్ళినంతకాలము నీ చేతిలో ఏదో ఉన్నట్లే, దారితప్పి నశించిపోయిన గొర్రెలను నీవు తిరిగి జయించుదువు. ఆమేన్! మన బలహీనతలను ఒప్పుకొందుము! మీ డాక్టరు డిగ్రీలు పారేయండి. అంతా తెలుసునను భావం విసిరివేయండి. మీ సభ్యత్వము అవతలకు కొట్టండి! దేవుని ఎదుట మిమ్మను మీరు చింపుకొనుడి. ఆత్మీయముగా మాట్లాడుచున్నాను, అయోగ్యులమని, మిమ్మును మీరు పిలచుకొనుడి. అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకొనును. అది మీ నోటితో మాత్రము పలుకుట కాదు గాని, మీ హృదయముల నుండి తీసికొనిరండి.

90యాకోబు, దావీదులు తమ్మును తాము చింపు వేసికొనిరి. ఆ సమూహమంతటిలోను అతడే బలహీనుడు.

ఆ కొండ మీద పదివేలు లేదా వందవేలమంది సైనికులున్నారని తలంచుకొనుము. వారందరూ తర్ఫీదు పొందినవారే. వారిలో ప్రతి ఒక్కరు పిహెచ్.డి., పట్టా పుచ్చుకొన్నారు. అందరూ ఈటెలు కలిగిన సైనికులు. అందరూ సైన్యాధిపతులే. జనరల్స్, లెఫ్టినెంటులు, ఇంకా ఏవేవో బిరుదులు గలవారే. (సిపాయిలకు కూడా) "గొప్ప నాలుగు నక్షత్రముల జనరల్ సౌలు, బిషప్పు కూడా మహాఘనుడు. అవునండీ!" అక్కడ నిలబడియున్న ప్రతిఒక్కరూ తర్ఫీదు పొందినవారే.

శత్రువు కొండమీద నిలబడియున్నాడు, "పిరికి పందలారా," అని గర్జించాడు.

1SAM 17:32

 

91ఆ పాలెములో నుండి ఒక చిన్న వంగిన భుజములు గల, ఎర్రనివాడు, తన వీపు మీద వడిసెల తీసికొని, తన చేతిలో అన్నకొరకు ఎండిన ద్రాక్షగెల పట్టుకొని వస్తున్నాడు. ఆ రాక్షసుడు బయటకు వచ్చి తరుచుగా కేకలు వేయుచున్నాడు. "శిక్షణపొందిన పండితులగు మీరందరు ఇక్కడ నిలబడియుండగా, సజీవుడగు దేవుని ఆ సున్నతిలేని ఫిలిష్తీయుడు దూషించుటకు ఏమి కారణము? మీరతన్ని చూచి భయపడుచున్నారా?" అని అడిగాడు. ఆమేన్!

సౌలు అన్నాడు, "నీవు వెళ్ళగోరినచో ఇక్కడికి రా. ఇప్పటినుండి ఇరవై ఏండ్లు చదువుకొనుటకు పాఠశాలకు పంపుదును. నీకు పిహెచ్.డి. పట్టా ఇప్పించెదను. నేనేమి చేయుదునో చెప్పెదను రా. నా డిగ్రీని నీకిస్తాను."

"అవన్నీ అవతల పెట్టండి. ఓ, మై! దానితో నాకేమీ పనిలేదు. దేవుడు దీనితో ఏమి చేసెనో నేనెరుగుదును. ఏ పరిస్థితిలోనైనా నేను దేనిని ఎదుర్కొనుటకైనను దేవుని నమ్ముటకు సిద్ధముగా యున్నాను," అని అతడు చెప్పెను. ఆమేన్! అతడు దేవుని నమ్మగోరెను. అది క్రైస్తవుని అనుభవము.

1COR 15:55,56•

2TIM 4:7

 

92సౌలు కూడా తన కవచమును తీసివేయవలసియుండెను. అతడు మత కవచమును తీసివేసి దావీదు చేసినట్లే చేసెను. సౌలు తన మార్గాంతమునకు వచ్చినప్పుడు, "నేను మంచి పోరాటము పోరాడితిని," అని చెప్పెను. అదే జయించవలసిన ఆఖరి శత్రువు. "నేను మంచి పోరాటము పోరాడితిని. నా పరుగును కడమట్టించితిని. నా విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు ఒక కిరీటము ఉంచబడియున్నది. ప్రభువు, ఆ నీతిగల న్యాయాధిపతి దానిని ఆ దినమున నాకిచ్చును. నాకు మాత్రమే కాదు, ఆయనను ప్రేమించు వారికందరికిని," అని చెప్పెను.

"ఓ," మరణము అన్నది, "కొద్ది క్షణములలో నేను నిన్ను తీసికొనబోవుచున్నాను." సమాధి అన్నది, "అవతల నిన్ను కప్పిపుచ్చుదును."

అతడిట్లు పలికెను, "ఓ, మరణమా, నీ ముల్లెక్కడ? సమాధీ, నీ విజయమెక్కడ?" ఈ రోమను గుహలో గొలుసులతో బంధించబడి, మణికట్టు, చేతులు బంధించబడి, పడియుందునని నాకు తెలియును. నా వీపు మీద ఒకటి తక్కువ నలుబది దెబ్బలు గలవు. నా కన్నీటి వలన ఇక కండ్లు కనపడని స్థితిలో నేనిక్కడ ఉన్నాను. నా సహజ కంటితో నేను చూడలేను, కాని అవతల దాచబడియున్న నీతి కిరీటమును చూడగలను. నా చీలమండలు ఒరిసిపోయినవి. వారిక్కడ విసిరిన ఆ పాత రొట్టె వలన నేను ఎంతో బలహీనమయ్యాను. నామీద నుండి ఎముకలు పరుగెత్తుచున్నవి. సాలీడు, మొదలగునవి చుట్టుకొన్నవి. బలహీనుడనైపోయాను. అతడు మరణ ముఖ ద్వారమున నిలబడి కూడా నీ ముల్లెక్కడ? సమాధీ, నీ విజయ మెక్కడ?" అని చేతుల గొలుసులను విసురుతూ అడుగుచున్నాడు. హల్లెలూయా! అదే మనకు అవసరము. "సమాధీ! నీ విజయమెక్కడ?"

సమాధి అన్నది, "పౌలా, నిన్ను నేను క్రుళ్ళిపోవునట్లుగా చేసెదను."

"కాని, దేవునికి వందనములు. నేను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడో విజయము పొందాను," అని చెప్పెను.

1JN 2:19

 

93అతడు బలహీనుడుగా నున్నప్పుడు, అతని ఆచారములన్నియూ శిధిల మయినవి. అతని అభిషేకము పత్రములన్నియూ తీసివేసికోబడినవి. ఆ సమాజములకు ఇక అతడు చెందడు. ఇకమీదట వాటికి ఇతనికి పొత్తులేదు. వారికి విరోధముగా ఎంతో మాట్లాడెను. ఆ బిషప్పులు అన్నారు, "ఇరవై ఏండల్లా రోమా చెరశాలలో నుండిన నీవు మా స్త్రీలు బోధించరాదని అది మాకు చెప్పుదువా?" "మాకు బాగా తెలుసు. ఇది చేయండి, అది చేయండి అని మాకు చేప్పేవాడెవడు? మేము చేస్తున్నది మాకు తెలుసు."

"అవును," పౌలు చెప్పెను, "మీ మధ్యనే ఒకడు లేచి త్వరలోనే ఒక సంస్థను ప్రారంభించును. దేవుని ఆత్మను కలిగియుండకుండా విశ్వాసమునుండి లాగివేయబడును. వారింతకు ముందే మా మధ్యనుండి బయలు వెళ్ళియున్నారు, ఎందుకనగా వారు మావారు కారు."

94మరియు, అదేమి చేసెను? కాథలిక్కు సంఘమును తీసికొచ్చినది. కాథలిక్కు నుండి లూథరను; చివరకు అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ అంతా ఒక్కటే చేయుచున్నారు. అందరూ ఒకే త్రోవ!

కాని, బలహీనులయిన స్త్రీ, పురుషులను, బలహీనతను గ్రహించినవారిని, దేవుడు వాడుకొనును. నేను మాట్లాడుచూ పోదును. చాలాసేపు మాట్లాడుదు ననుకొనుచున్నాను.

95ఇప్పుడది ఏమిటి? ఆ గుంపులో దావీదు మాత్రమే అసలు ఏమీ నేర్పులేనివాడు. యుద్ధ పాఠశాలకు పోలేదు. దానిగూర్చి అసలేమీ తెలియదు. తన ముందుంచబడిన యుద్ధములో పోరాడుట ఎట్లో ఎరుగడు, కాని దేవుడు ఉన్నాడని గుర్తించాడు. మిక్కిలి బలహీనమగు వస్తువును తీసికొనెను. వారికి ఈటెలు, శిరస్రాణములు, విల్లులు, ఇంకా ఏవేవో ఉన్నవి. దావీదుకయితే వడిసెల, అందులో రాయి ఉన్నది. కాని దేనియందు నమ్మకమును ఉంచాలో అతడెరుగును. అతడు తన బలహీనతను, దేవునియందు విశ్వాసమును ఒప్పుకొనెను.

"ఏదీ తగలకుండా రక్షించు కేడెము నాకక్కరలేదు," అని చెప్పెను. "సోదరులారా, నాతో సమ్మతించుదురా? నేను అసెంబ్లీస్ కు చెందినవాడిని, నేను ప్రెస్బిటేరియనును, నేను మెథడిస్టును, నేను బాప్టిస్టును, సోదరులారా, మీరు నాతో సహకరించెదరా?" అని అతడు వారిని అడుగలేదు. అటువంటిదేమీ నాకు అక్కర లేదు. "ఇదిగో, ఇక్కడ నా జేబులో నుండి నా డిగ్రీలు తీస్తున్నాను చూడండి. నా డిగ్రీ నాకున్నది. ఈ మధ్యనే నా డిగ్రీ పుచ్చుకొన్నాను. నేను ఫలాని విశ్వవిద్యాలయం నుండి వచ్చాను. నేను అక్కడ చదివాను. ఓ, నేను మాట్లాడగలను! నేను ఇది అది," అని అతడేమీ చెప్పలేదు. అట్టిది అతనికి ఏమీ వద్దు!

"నేను దేవునియందు నమ్మకయుంచియున్నాను. నేను వెళ్ళుచున్నాను." అదొక్కటే నాకు చాలునని చెప్పెను. ఆ రాక్షసుడు నేలకొరిగెను. అది నిజము.

సోదరుడా, నేడు అదే మనకు అవసరము. దావీదు వంటి మనిషి మనకు నేడు అవసరము, విశ్వవిద్యాలయ అనుభవాలు కాదు.

1KGS 22:6-9

 

96ఇమ్లా కుమారుడగు మికాయాను అల్పుడని, దరిద్రుడని విస్మరించారు. దేవుని పక్షమున అతడు నిజముగా నిలబడినందున శాఖలన్నియూ అతనిని తోలివేసినవి. కాని ఒకసారి యెహోషాపాతు అను పేరుగల ఒక దైవజనుడు వచ్చి, "దేవుని నిజ వాక్కును తెలిసికొనగోరుచున్నానని" పలికెను.

సౌలు చెప్పెను, "నీకు ఎన్నడూ తెలియని నాలుగు వందలమంది చాలా మంచి ప్రవక్తలున్నారు. వారందరికీ డిగ్రీలున్నవి. వారందరూ ఇక్కడి పాఠశాలలో తర్ఫీదు పొందారు. నీవెన్నడూ వినియుండని గొప్ప ప్రసంగీకులు వారు. వారిని వెంటనే పిలిపించి, నీ నిమిత్తమై దేవునియొద్ద ఆలోచన చేయుదుము."

యెహోషాపాతు బయటకు వచ్చి, వారినందరినీ చూచి, వారు చేప్పేది విని ఇట్లు పలికెను, "వీరందరూ ఏదేదో చెప్పుచున్నారు, మీవద్ద ఇంకొకడున్నాడా? మీ వద్ద మరొకడు లేడా?"

97ఈ నిజ హృదయమునకు దేవుడొక వర్తమానమును ఇవ్వబోవుచున్నాడు. అక్కడ వారిలో ఒకడు నిలబడియున్నాడు, కాని దేవుడు అతని కొరకు ఒక మనిషిని కలిగియున్నాడు. ఆమేన్! ఎక్కడైనా ఒక్క నిజ హృదయమున్నచో, అతని కొరకు దేవుడు ఒకని పంపును. యెహోషాపాతు నిజాయితీపరుడు. దేవునియందలి భయముగల రాజు. వారి వర్తమానములు తప్పు అని గ్రహించు జ్ఞానము కలిగినవాడు. వాక్యమునకు అది విరోధమని అతడెరుగును. ఆమేన్! యొహోషాపాతు అది ఎరుగును.

అతను చెప్పెను, "ఈ సెమినరిలోని రికార్డు మొత్తం పరీక్షించి చూచాను. వారందరినీ ఇక్కడకు రప్పించాను." ఇతనికున్న డిగ్రీలు చూడు. అతనికున్న డిగ్రీలు చూడు. అతని యొక్క డిగ్రీలు చూడు. వారందరికి అధిపతి అయిన సిద్కియాను చూడు. అతడు బిషప్చు. మా అందరికి అతడు పైవాడు. నిశ్చయంగా నీవతని మాట తీసికొనవచ్చును!" అని చెప్పెను.

అందుకు యొహోషాపాతు "అవును," చెప్పెను, నేను-నేను-నేను…"

1KGS 22:7•

2CH 18:6

 

98"చూడు, చూడు, ఆ తక్కినవారంతా అతని మాటతో ఏకీభవించుచున్నారు. వారంతా ఒక గొప్ప కట్టడ! వారు హెబ్రియులు కారని నీవు చెప్పలేవు. వారు ప్రవక్తలు కారని అనలేవు. వారి డిగ్రీలే వారిని రుజువు చేస్తున్నాయి.

యెహోషాపాతు అన్నాడు, "నాకు తెలుసులే ఆహాబు. అంతా నిజమే, కాని…"

"అయితే మరి ఇంకేదో నీవు నన్నెందుకు అడుగుచున్నావు? నా పాఠశాల మొత్తం అదే! ప్రతి సంస్థ ఒకదగ్గర కలిసియున్నది," అన్నాడు.

"ఆ గుంపుకు చెందని మరొకడు నీ యొద్ద ఉన్నాడా? ఎక్కడైనా ఉన్నాడా?"

"అతడేమిటో తెలుసా? వాడు చదువులేని పామరుడు! మంచిది, అట్టివాడినుండి నీవేమి ఆశించుచున్నావు?"

"కాని, నిన్ను అడుగుచున్నాను, ఎక్కడైనా మరొకడు ఉన్నాడా?"

1KGS 22:8•

2CH 18:7

 

99"ఓ, అక్కడ అటువంటివాడు ఒకడున్నాడు. (దానికొరకు దేవునికి వందనములు!) అట్టి వాడు అక్కడొకడున్నాడు, కాని అతడంటే నాకసహ్యము. అందరూ కూడా అతన్ని అసహ్యించుకొందురు. ఆ సంస్థ నుండి అతనిని వారిలో ప్రతిఒక్కరు తన్నివేశారు. ఇక్కడ కూటము పెట్టుటకు వచ్చాడు, కాని వాడ్ని మేము పట్టణము నుండి తరిమేశాం. అవును. అతనితో మనకేమీ సంబంధము లేదు. వాడు చాలా బలహీనుడు. చాలా బీద కుటుంబము నుండి వచ్చాడు. వాడి వ్యాకరణము భయంకరము. [మూడీవలె, మీకు తెలుసా.] నేనెన్నడూ అంత అధ్వాన్న వేదాంత ప్రసంగీకుడ్ని చూడలేదు. అంత ఎన్నికలేని బోధను ఎన్నడూ నేను వినలేదు. ఓ, వాడు వారి ఆచారములను కూలద్రోయుచున్నాడు. వాడివలన ఆ అపొస్తలుల సిద్దాంతము ముక్కలయిపోయినది. అట్టిది నేనెన్నడూ వినలేదు! ఓ, వాడు అంతా చించివేసి, చిందరవందర చేసినందున, వారు, నేను, అందరూ అసహ్యించుకొని, ద్వేషించాము," అని చెప్పాడు.

"ఓ, రాజు ఆలాగు పలుకవద్దు, కాని అతని మాట నేను వినగోరుచున్నాను," అని యెహోషాపాతు చెప్పెను. ఏలీయా ఏమి చెప్పునో అతడెరుగును! ఏమిటో అతడెరుగును.

1KGS 22:14•

2CH 18:13

 

100దేవుడు ఆ గొప్ప బలమగు తెలివిగల బోధకులనందరినీ విడిచిపెట్టి ఏమీ తెలియదని చెప్పుకొనిన ఒక అల్పునిలో దేవుడు తన వర్తమానమునుంచెను. కాని అతడేమీ చేయును?

వారతనికి ఒక పరీక్ష ఇచ్చి అన్నారు, "వారు చెప్పినదే నీవు చెప్పువలెను."

"దేవుడు పలుకమని నా నోటనుంచినదే పలికెదను," అని అతడు చెప్పెను.

"నీవు మరల బలముగలవాడిగా ఉండాలంటే గుర్తుంచుకో, నిన్ను అసలు తీసికొనిరాగూడదు, కాని తెచ్చాము. నీవు ఆ సంస్థ నుండి తన్ని వేయబడితివి. నీవు ఇక్కడ ఒక రకమగు పనికిరానివాడివి, కుర్రాడా. ఇట్టి క్లిష్టకాలములో నీవు వారు చెప్పిన దానికి అంగీకరించినచో, నీ సహవాసమును గూర్చి మరల ఆలోచించుదుము. మేమంతా కలిసి గొప్ప సభ ఏర్పాటు చేయబోతున్నాం. నాతో సమ్మతించినచో చాలును," అని చెప్పెను.

"దేవుడు చెప్పినది తప్ప మరేమీ నేను చెప్పను," అన్నాడు. ఒక దేవుని బిడ్డ దేవుని వాక్యము నిమిత్తము రాజీపడునని తలంచుచున్నావా? వారిలో ఆ రాజీ లేనే లేదు.

"కాని నీవు బలహీనుడవు. నీవు పేద కుటుంబము నుండి వచ్చావు. వారెంత గొప్పవారో, నీవెరుగుదువు," అని చెప్పెను.

"వారేమి చేసినా నాకక్కర్లేదు."

"వారు నిన్ను విమానంలో దేశ దేశాలు త్రిప్పుదురు. వారేదైనా చేయగలరు, చూచారా, నీవది చేస్తే చాలు…?

"ఆలాగు కాదు. నా నోటిలో దేవుడు ఏది ఉంచునో అది మాత్రమే పలికెదను."

101ఆ గుంపునంతటినీ దేవుడు దాటిపోయెను. అవునయ్యా. అతని నిజ పట్టుదల దానిని చేసినది. నాలుగు వందల మందిని దాటిపోయి, అతనికి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును" ఇచ్చినది!

వారప్పుడు అది నమ్మారా? లేదయ్యా! "అది యెహోవా ఈలాగు సెలవిచ్చుట కాదని" వారు "అటువంటి సంగతులు మా సెమినరీ బోధించలేదు. ఇక్కడ మా బిషప్పు ఆచారకర్మను వ్రాశాడు. మేమంతా కలిసివున్నాము. మేము మా పాఠశాలలు నిర్మించుకొన్నాం. దేవుడు మాతో ఉన్నాడు! అది నీ యొద్దకు వచ్చినప్పుడు, దేవుడు మా యొద్దనుండి ఎట్లు వెళ్ళాడు?" అన్నారు.

"కొద్ది సమయంలో మీరు చూచెదరు," అని అన్నాడతడు. అది నిజము.

అతడెవరు? బలహీనుడు, కాని వారిమధ్య బలవంతుడుగా నిలచెను. ఎందువలన? యెహోవా వాక్కు అతనికున్నందున. ఓ, సోదరుడా "యెహోవా ఈలాగు నెలవిచ్చుచున్నాడని" నీవు చెప్పునంత కాలము మరేదైనా ఎట్టి భేదమును చేయును?

2COR 12:10

 

102బ్రెన్హాం సోదరుడా, యేసు నామ బాప్తిస్మవిషయములో నీవు రాజీపడినచో, చికాగోలోగాని, అట్టి మరే పెద్ద పట్టణంలో గాని మేము కూటము ఏర్పాటు చేసెదము," అని వారు చెప్పిరి. అతడది చేయునని మీరు తలంచారా? మీరెక్కడ కలిసికొన్నా ఏం చేసినా, నాకక్కర్లేదు. సోదరుడా, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" నిలచియుండుము.

అందులో ఎక్కడ తప్పున్నదో, అందులో ఎవరినైనా వచ్చి చెప్పమని కోరుచున్నాను. అందులో ఎక్కడ తప్పున్నదో దేవుని వాక్యములో చూపించమను. అవును. వారు దానిని తాకజాలరు. "కాని, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!" దానితో నిలచియుండు! వారందరూ నిన్ను బయటకు త్రోసినా కాని నీవెంత బలహీనుడవైనా సరే, నేను లెక్కచేయను. "అప్పుడే నేను బలవంతుడ నగుదును." వారు నన్ను బయటకు త్రోసినప్పుడు, దేవుడు నన్ను లోపలికి తీసికొనును. వారు నిన్ను బయటకు త్రోయుదురు. దేవుడు నిన్ను లోనికి పిలుచును.

గుర్తుంచుకొనండి, దేవుడెప్పుడూ అనామకులను తీసుకొనును. తరువాత వారిని తనకొరకు పేరుగల వారినిగా చేయును. ఈ జీవితములో దానిని ఎరుగక పోవచ్చును గాని, రానున్న జీవితములో అది వుంటుంది, చూచారా. అదొకటి.

103"యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు"ను ఎందుకతనికిచ్చెను? అతడు వాక్యముతో నిలచియుండెను. సరైన వర్తమానమును కలిగియుండెను. దేవుడతనికి ఒక దర్శనము ఇచ్చెను. తక్కిన వారెవరికీ దర్శనము లేదు, చూచారా. అతనికి దర్శనమున్నది. ఎందువలన? వాక్యముతో నిలిచియున్నాడు కాబట్టి. అక్కడే మనము సూచక క్రియలను, అద్భుత కార్యములను చూడగలము. తక్కినవారు వారివలే ఉందురు, కాని అతడు వాక్యముతో నిలిచియుండెను. (ఇప్పుడు, త్వరపడుదుము.)

104ఏలీయాను, అతని సంఘము త్రోసివేసి ఆధునిక లోకము కోసము అతనిని విడిచిపెట్టినప్పుడు ఏలీయా నిజంగా వారిని నిప్పుల మీద చెరిగియుండునని నేను ఊహిస్తాను. మీరాలాగు ఊహించుట లేదా? ఏలీయా ఏమిటో మీరెరుగుదురు. తన సేవ ప్రారంభములో అక్కడతడు నిలబడి, "మీరెందుకు ఆ తొలి స్త్రీవలె, ఎజెబెలు వలె వేషములు వేయుచున్నారు?" అని ప్రశ్నించాడనుకొంటాను. ఆధునిక స్త్రీలారా, మీరు ఆ దేశములోని తొలి మహిళవలె దుస్తులు ధరించుకొని ప్రవర్తించుచున్నారు. "బోధకులారా," అని అతడు వారిని ఏరివేశాడు. మరియు ఆయన అక్కడ ఎవ్వరూ ఉండకుండునట్లు ఎల్లప్పుడూ వారిమీద కేకలు వేస్తుండేవాడు.

105అతడు తన మార్గంతమునకు రావలసియున్నాడు. ఎవరూ అతనితో సహకరించేవారు ఇకలేరు. ఏ సంఘమూ అతనికి సహకారమీయలేదు. అతని సంఘమంతా అతనిని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయినది, ఇప్పుడున్నట్లే. అది నిజము. తిరిగి లోకములోనికి వెళ్ళిపోయారు. అక్కడొకడు, ఇక్కడొకడు, బహు కొద్దిమంది మాత్రమే మిగిలారు. ఎక్కడో దేశం మూలనుండి అతనిని చూచుటకు వచ్చేవారే ఉన్నారు. అతడు బహు అధ్వాన్న స్థితిలో ఉండెను. తన జ్ఞానము యొక్క అంతమునకు అతడు రావలసియున్నాడు.

"ప్రభువా, నీ వాక్యము మీద నిలబడియున్నాను, నేను సత్యము ప్రకటించాను, అందరూ వెళ్ళిపోయారు, ఇక్కడెవరూ లేరు, నాకు మాట్లాడేవారే కరువయ్యారు. అవును, ప్రభువా, వాక్యము మీదనే నిలబడ్డాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చూడు. ఎవ్వరూ నన్ను చేర్చుకొనుట లేదు. నేను పట్టణములోనికి వెళ్ళితే వారంతా నన్ను చూచి ఆ ముసలి పిచ్చివాడ్ని చూడండి అంటున్నారు. ఈ ఆధునిక జీవన విధానాన్ని ప్రతి విషయాన్ని ఈ ముసలివాడు ఇక విమర్మించనారంభించును అని వారంటున్నారు," అని అతడు పలికాడు.

పాస్టర్ గారూ, "వాడితో మీరు చేతులు కలుపకండి. వాడిని రానీయకండి." వద్దు.

పాస్టర్, "ఇప్పుడా ముసలి ఉన్మాది పట్టణంలోకి మరలా వచ్చాడు. చూడండి, ఆ బట్టతల, బోడివాడు ఏలీయా అక్కడున్నాడు. ఆ ముసలివాడిని అసలు లెక్కచేయవద్దు. వాడిని చూడు, అసలు యాజక వస్త్రములుగాని, అంగీలుగాని వాడు ధరించనే లేదు. [అతని టోపీ ముందు నిలబడియుండును. మెడచుట్టూ కాలరుండును, మీకు తెలుసా]. "వాడు వేరే మనిషి, అందరిలా ఉండడు," అన్నారు.

కొందరు గొప్పవారు ఈ విధంగా చెప్పిరని నేనూహించుచున్నాను. "మీకు తెలియునా? అతడు పిచ్చివాడు. అడవుల్లో జీవించే వ్యక్తి. ఎక్కవ కాలం ఆ అరణ్యంలోనే గడిపాడు. గొర్రె చర్మము చుట్టుకొని వచ్చాడు. ఓ, మై! అప్పుడు స్త్రీలను ఖండించుచూ ఉండేవాడు! అట్టి వ్యక్తిని నేనెన్నడూ చూడలేదు. అతనితో మీకేమీ సంబంధము లేదు! సహకరించ వద్దు!"

106ఆ సేవకుల గుంపు మొత్తం ఒకచోట చేరింది, ఇట్లు పలికారు, "మీకేమి వానితో సంబంధము లేదు. వాడిని పట్టించుకోవద్దు. చివరకు వాడు తన గోతిలో పడును. తన స్వంత మెదడునే వాడు అరిచి అరిచి పొగొట్టుకొనును. అంతే, వాడి జోలికిపోవద్దు."

కాని ముసలి ఏలీయా, దేవునితో యధార్ధముగా నడచుచుండెను. వాక్యముతో సరిగ్గా నిలిచియుండెను. వారక్కడ చిన్న కూటము పెట్టుకొనిరి. ఆ సమూహాన్ని చూచి, "మీరంతా యెజెబెలులే!" అని అన్నాడు.

"ఓ, చాలా సిగ్గుమాలినతనం! నేను మరెన్నడూ వెళ్ళి వాడి మాట వినను. లేదయ్యా, నేను ఎన్నడు…"

అది అతనిని ఆపలేదు, అతడు ఎప్పటివలెనే అక్కడే యుండెను. తన సంఘమును పొగొట్టుకొనెను. శాఖలన్నియూ అతనికి వ్యతిరేకముగా నిలిచినవి, అప్పుడే, అతడు బలహీనుడయినప్పుడు ఇట్లనెను, "నేను ఒక్కడనే మిగిలిపోయియున్నాను. వారు నన్ను చంప వెదుకుచున్నారు. నేను దొరికితే వారు నన్ను ప్రాణముతో విడువరు. వారు నా ప్రాణమును తీయ చూచుచున్నారు. ప్రభువా, నేను ఒక్కడనే మిగిలియున్నాను. నేనేమి చేయగలను?"

అతడు బలహీనుడయినప్పుడు (ఇంకా యధార్ధంగానే నిలిచియుండి, తన బలహీనతను, సమస్తమును ఒప్పుకొనుచున్నాడు), దేవుడీలాగు చెప్పెను, "పర్వతము పైకి ఎక్కి రమ్ము, ఒక క్రొత్త వర్తమానమును నేను ఇవ్వబోవుచున్నాను. ఇప్పుడు, నేను నీనొక క్రొత్త సందేశమును పంపబోవుచున్నాను. వీటన్నిటినీ ఖండించుమని నీకు ముందే చెప్పాను కదా! అది నిజమని రుజువుచేయు ఒకదానితో ఇప్పుడు నేను నిన్ను పంపబోవుచున్నాను. ఏలీయా, నీవు మంచిపని చేశావు. ఆ మొదటి స్త్రీ గూర్చి నీవు వారికి చెప్పావు. వారేమీ చేశారో అంతా తెలియచేశావు. ఆహాబును, అతని ఆధునిక సంగతులను, ఆధునిక సంఘాలను నీవు ఖండించావు. ఆ బోధకులు దేనికి సంబంధిచినవారో ఎలుగెత్తి ప్రకటించావు. నీవు ఒక మాదిరివి. నీవు అక్కడ ఏ సహాయము, ఏ సంస్థ, వెనుక ఏదీ లేకుండా నా వాక్యముతో నిలబడియున్నావు. ఇప్పుడు నేను ఒకటి ఇవ్వబోవుచున్నాను. అక్కడికి వెళ్ళి ఆ వేషధారితో, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని" ప్రకటించుము! నేను మరల ప్రార్ధించు వరకు మంచు కూడా పడదని ప్రకటించుము." మై, మై! "ఆ కొండ శిఖరము పైకి తీసికొని వెళ్ళి ఏదో చూపించనై యుండెను.

2KGS 1:8•

2COR 3:5•

2COR 12:9

 

107ఓ, ఆ ఉదయాన, సమరయ మార్గాన నడిచి వచ్చుట నాకు కనబడుచున్నది. అతనిలో చూడదగినది ఏదీ లేదు, నిశ్చయంగా, ఆ బట్టతల సూర్యుని కాంతిలో మెరయుచున్నది. ముఖము మీద నెరసిన వెండ్రుకలు, మీసములు వ్రేలాడుచున్నవి. మొలచుట్టూ గొర్రె చర్మము చుట్టుకొనెను. అతడు వెండ్రుకలతో నిండినవాడని బైబిలు చెప్పుచున్నది. చూచుటకు చాలా గందరగోళముగా ఉన్నాడని నేను తలంచుచున్నాను. ఆ పాత చిన్న కర్ర చేతిలో ఉన్నది. ఆ చిన్న ముసలి కండ్లు ఆకాశము వైపు చూస్తున్నవి. మార్గాన నడిచి వస్తున్నాడు. ఎనభై ఏండ్ల వయస్సులోనున్న అతడు పదహారేళ్ళ బాలునిలా ప్రవర్తించి యున్నాడని నేను తలంచుచున్నాను. ఇదిగో, అతడు త్రోవలో నడిచి, తిన్నగా సమరయకు వచ్చాడు. సోదరుడా, అతడు బలహీనతలోనే బలవంతునిగా చేయబడియున్నాడు. "నా బలము చాలును. ఆ సంస్థల గూర్చి బాధపడ వద్దు, ఏలీయా వాటిగూర్చి బాధపడవద్దు. నీకు అవసరమైనది నా బలము."

2COR 12:10

 

108ఒకసారి ఒక గొప్ప దేవాలయము నొద్ద నిలబడి నేనీ విధంగా పలుకుట జ్ఞాపకమొస్తున్నది. "ప్రభువా, వారు నా కార్యాలయమునకు వచ్చుట నేను అసహ్యించుకొనుచున్నాను.

"నేను నీ భాగము, చూడు? నేను నీ వంతు," అని ఆయన పలికెను.

"బలహీనతలో, నా బలము చాలును. నా పరిపూర్ణ చిత్తము నెరవేరును [పౌలు, ఏలీయా, లేక నీవు ఎవరైననూ] నీవు త్రోవలో అడ్డముండకూడదు [చూశారా]. నీ బలహీనతలో నేను బలపరచబడుదును. నేనే! లోనికి వచ్చి నిన్ను నింప బలమైనవాడను నేనే."

1KGS 17:1,4

 

109ఆ సమరయ మార్గముగుండా నడిచి వచ్చుట నేను చూడగలను. ఆ ముసలి నేత్రములు చూస్తున్నవి. ముఖం మీద సగం చిరునవ్వు కనిపించుచున్నది. సోదరుడా, ఆహాబు సముఖములోనికి అతడు వచ్చాడు. అతడెన్నడూ నత్తిగా లేక మాటలు చెప్పుటలో తత్తరపాటుపడలేదు. లేదు, లేదు! ఆ ముసలి చర్మపు గుండె క్రిందనున్న హృదయములో పరిశుద్ధాత్మ నివసించుచున్నది. అవును, నిశ్చయంగా. ఆ మార్గమున నడిచి వస్తున్నాడు. ఆహాబు ముందుకు నడుస్తూ వెళ్ళి, "నేను మరల ప్రార్ధించువరకు మంచు కూడా పడదు," అని చెప్పెను.

తన పాదములను దులుపుకొని వెనుదిరిగి మరల అరణ్యములోనికి వచ్చాడు. "ఏలీయా, అది చాలా మంచి పని. ఇక్కడకు రా, ఇప్పుడు నిన్ను పోషించుటకు కాకులన్నింటికి నేను ఆజ్ఞాపించియున్నాను. కొద్ది సమయము ఇక్కడ కూర్చొనియుండు," అని ప్రభువు పలికెను. ఓ, మై!

అతడెప్పుడు బలహీనుడో, అప్పుడే బలవంతుడాయెను. అవునయ్యా. వర్షమును కురిపించకుండునట్లు అతడు ఆకాశములను వణికించెను. అతడు బలము పొందినప్పుడే ఇవి జరిగెను. తన సంఘమును పోగొట్టుకొన్నప్పుడు, తనకున్న సమస్తమూ పోయినప్పుడు, దేవుని వాక్యముతో అతడు నిలిచియుండెను గనుక ఆకాశములను మూయుటకు శక్తి కలిగియుండెను.

GEN 32:28•

EXOD 4:20•

EXOD 7:7•

ACTS 26:17

 

110యాకోబు తన బలము యావత్తు కోల్పోయినప్పుడు రాకుమారుడుగా మారు శక్తిని దేవుడు అతనికి అనుగ్రహించెను, చూచారా.

పౌలు తన విద్యను నష్టముగా ఎంచుకొన్నప్పుడు, అతని పాండిత్యమును నష్టపరచుకొన్నప్పుడు దేవుడు అతనిని అన్యజనులకు ఒక మిషనెరీగా చేసెను.

మోషే తన సామర్థ్యము మొత్తము పోగొట్టుకొనినప్పుడు, బలహీనుడైనప్పుడు, దేవుడతనిని శక్తిమంతునిగా చేసి, ఆత్మ శక్తితో ఐగుప్తునకు పంపెను. అప్పుడు అతనికి ఎనభై సంవత్సరములు. మీసములు వ్రేలాడుచున్నవి, తన భార్య కంచర గాడిద మీద ఎక్కినది. ఆమె ఒడిలో చిన్న కుమారుడు కూర్చొనియున్నాడు. అతను చేతిలో ఒక కర్రతో వెళ్ళి, ఐగుప్తును జయించెను. అవును, చూచారా. అతడు వెళ్ళగోరిన రీతిగా, వెనుక ఏ సైన్యమూ లేదు. కాని ఆత్మశక్తితో వెళ్ళెను. ఆమేన్! నీవెప్పుడు బలహీనుడవో, అప్పుడే నీవు బలవంతుడవు.

1KGS 18:17,19,42•

HEB 13:8

 

111ఆ మార్గము గుండా నడిచివస్తూ, అతడు తత్తరపడలేదు. అతడు తొట్రుపడలేదు. ఏమీ తొణకక ఆహాబు ఎదుటికి వచ్చెను. "యెహోవా వాక్కు నాకు వచ్చెను," అని చెప్పెను.

"ఇశ్రాయేలును బాధపెట్టవాడవు నీవేనా?" అనడిగాడు.

"ఇశ్రాయేలీయులను బాధపరచువాడవు నీవే," అని అతడనెను. అవునయ్యా ఓ, సోదరుడా! అవును, "నీకిక్కడున్న తెలివిగల యాజకులను తీసికొని రా, దేవుడెవరో చూద్దాం." అక్కడే నీవున్నావు. "కర్మెలు పర్వతము ఎక్కు పెంతెకోస్తునాడు జవాబిచ్చిన దేవుడే, మాట్లాడనీ. యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉంటే దేవుడు ఇంకా ఆ దేవుడేనా చూద్దాం." అతడు పర్వతం దిగి వచ్చాడు. అతనియొద్ద ఒక వర్తమానమున్నది. అవును. ముందు ఎంతో బలహీనుడయ్యెను. దానిని చేయకముందు అంతా పోగొట్టుకొన్నట్లే అయిపోయాడు. బలవంతుడగుటకు ముందుగా అతడు బలహీనుడు కావలెను.

MAL 3:1•

LUKE 1:52

 

112ప్రజలను ఆపు చేయునది సువార్త యొక్క సామాన్యతయే. కాని వారు దానిని ఒక గొప్ప తెలివితో నిండిన ఏదోగా తయారుచేయ ప్రయత్నించుచున్నారు. కాని అది సామాన్యముగానే ఉన్నది. కాని దేవుడు దీనత్వము, బలహీనత, సామాన్యత అను సాధనమును తీసికొని తన కార్యమును చేయును. అది దేవుని చేతిలో ఒక పనిముట్టు మాత్రమే.

యోహాను బాప్తిస్మమిచ్చుచూ క్రీస్తుకు ముందుగా తన వర్తమానము ప్రకటించెను. అదెంత సామాన్యముగా నుండినను ప్రజల తలలపై నుండి వెళ్ళిపోయెను. ఒక్క నిమిషం వినండి. (చాలాసేపు మిమ్మలను నిలిపియుంచాననుకొంటాను. మీరు గోడ ప్రక్క నిలబడియున్నారు) చూడండి, యోహానును, ఎప్పుడైతే… మెస్సీయా రాకను గూర్చి ప్రవక్తలందరూ సాక్ష్యమిచ్చిరి. "పర్వతములు చిన్న పొట్టేళ్ళవలె గంతులు వేయునని," అందులో ఒకడు చెప్పెను. ఇతరులు, "ఆకులు చప్పట్లుకొట్టును," అని చెప్పెను. మరొకరు "పల్లములన్నియూ ఎత్తు చేయబడును, ఎత్తు స్థలములన్నియూ పల్లము చేయబడును," అని చెప్పెను. ఓ, మై, ఎటువంటి దినము!

113ప్రవక్తల పాఠశాలను, వారి జ్ఞానము కలిగిన అభిప్రాయములను నీవెన్నడైన ఊహించావా? ఓ, మై, వారికి ప్రతిది చాలా చక్కగా ఉన్నది! కాని ఇది జరిగినప్పుడు, తన జీవితములో ఎన్నడూ పాఠశాలకు వెళ్ళని ఒక ముసలి బోధకుడు అరణ్యములో నుండి వచ్చెను. అతని వ్యాకరణము చాలా అధ్వాన్నముగా యుండియుండును. అతని తండ్రి ఒక యాజకుడు, కాని అతనిని దేవుడు అందులోనుండి తీసివేసెను. (గత ఆదివారపు పాఠములో అది మనం చెప్పాం.) ఆ శాఖలతో అతడు మిశ్రమము కానివ్వకుండా బయటకు తీసి, మరియు అతనిని అరణ్యములోనికి తీసికొనిపోయి, దేవుడే స్వయముగా శిక్షణ ఇచ్చెను. అట్టివారు మాత్రమే దేవుని వాక్యముతో నిలిచియందురు.

MATT 3:3,9•

LUKE 3:4,8

 

114సుమారు ముప్పది ఏండ్ల వయస్సులో అరణ్యము నుండి వచ్చాడు. అతని ముఖమంతా నల్లని గడ్డముతో నిండిపోయియున్నదని నేనూహించుచున్నాను. చుట్టూ పెద్ద గొర్రె చర్మము ధరించియుండెను. మోకాళ్ళ వరకు బురదలో నిలబడియున్నాడు. "యెషయా ద్వారా పలుకబడినవాడను నేనే," అని చెప్పెను. కొన్ని శాఖలు బయటకు వచ్చినవి. "మేము ఇది మరియు అది, అని మీలో మీరు చెప్పుకొనకుడి. దేవుడు అబ్రాహాముకు ఈ రాళ్ళవలన పిల్లలను పుట్టించగలడు," అని చెప్పెను. ఓ, మై! ఏమిటి? అతనికి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!" ఉన్నది. అతనికి వర్తమానమున్నది. అతడు వచ్చుచున్నాడని ముందే దేవుడు చెప్పెను. అతడు బహు సామాన్యముగా వచ్చెను, అందువలన అది వారి తలలపై నుండి పోయినది.

MATT 11:8,9•

LUKE 7:25,26

 

115యేసు వచ్చి, "మీరేమి చూచుటకు వెళ్ళారు? మెథడిస్టు నుండి బాప్టిస్టుకు, బాప్టిస్టు నుండి ప్రెస్బిటేరియనుకు, ప్రెస్బిటేరియను నుండి పెంతెకోస్తుకు, పెంతెకోస్తు నుండి మరో దానికి మారగల తెలివైన ప్రసంగీకుని చూచుటకా? గాలికి కదలుచున్న రెల్లును చూడడానికా? యోహానును కాదు! "సన్నని బట్టలు ధరించినవానిని చూచుటకా?" "అట్టివారు రాజ గృహములో ఉందురు. అట్టి సేవకులు అక్కడే ఉందురు." "ఏమి చూచుటకు వెళ్ళారు? ఒక ప్రవక్తనా? ప్రవక్తకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు," అని చెప్పెను.

MAL 3:1•

MATT 11:9•

LUKE 7:26

 

116యోహాను ప్రవక్తకంటె గొప్పవాడు. మరియు, చూడండి, వారందరికంటె దీనుడుగా అతడు వచ్చెను. కాని అతడు ప్రవక్తకంటె గొప్పవాడు. యోహాను ఏమై యుండెనో మీరెరుగుదురా? అతడు నిబంధన దూత. నిశ్చయంగా అదే. ఒక ప్రవక్తకంటె అధికునిగా అతడుండెను. ప్రవక్త అనగా సంగతులు చూచువాడు. యోహాను ఆలాగే చేసెను, కాని అంతకంటె గొప్పవాడు. అతడు నిబంధన దూత, "నాకంటె ముందుగా తన దూతను పంపదునని ఎవరి గూర్చి చెప్పెనో, అతడే యోహాను," అని చెప్పెను. నిబంధన దూతగా ఉండెను. నిశ్చయంగా. అతడు సామాన్యముగా వచ్చినందున తెలివిగలవారు గ్రుడ్డితనములో పడిపోయిరి.

1KGS 17:12

 

117కొన్ని నిమిషాలలో తొందరగా మనం ముగించుదం. చెప్పువలసినవి కొద్ది లేఖనములు మరియు కొన్ని నోట్స్ ఉన్నవి.

పిడికెడు పిండి ఉన్న విధవరాలి సంగతి ఏమిటి? ఆమె చాలా బలహీనురాలయినది. ఆకలి బాధతో మరణమునకు చేరువైనది. ఆమెకు భోజనము లేదు. ఆమె ఎక్కడికి వెళ్లి పిండిని అప్పు తెచ్చుకొనలేదు. ఎవరి వద్దా ఏమీ లేదు. కాని ఆమె ఒక గొప్ప విశ్వాసి స్థానమునకు వచ్చినది. ఆమె భర్త ఒక గొప్ప దైవజనుడై యుండెను, ఆమె విధవరాలు, ఒక బిడ్డ ఉన్నాడు. ఆమె వద్ద పిడికెడు పిండి మాత్రమే ఉన్నది. కాని అది చాలును, ఆమెకు అవసరమైనదంతా అదే; దేవుని చేతులలో సమర్పించబడినది. ఆ పిడికెడు పిండి వల్లనే ఆమె మూడు సంవత్సరముల ఆరు నెలలు జీవించినది.

ఆమె బలహీనురాలయినది.

118ఆమె ఆ ఉదయాన రెండు పుల్లలు ఏరుకొనుటకు బయటకు వెళ్ళినది. వాటిని విరచి ఒక చోట చేర్చును. చూచారా, ఆ రెండు కర్రలు సిలువయే. "నాకు రెండు పుల్లలు దొరుకును." "చేతినిండా తేవాలని," ఆమె ఎప్పుడూ అనలేదు, కాని రెండు పుల్లలు మాత్రమే. అది అంతే. గుర్తును చూచారా?

పాతకాలపు విధానము… నిప్పును వెలిగించడము ఎలాగనిన, కర్రలను తీసికొని వాటిని క్రాస్ (cross) చేసి మధ్యలో మండించేవారు. నేను రాత్రులందు పర్వతములలో సంచరించునప్పుడు, మంచు నుండి రక్షించుకొనుటకు ఒక పుల్లను ఈ విధముగాను, మరో పుల్లను ఆ విధముగాను పేర్చి చివరలు పట్టుకొని త్రోయుచూ కాల్చుచూ వున్నప్పుడు నేరుగా ఆ క్రాస్ ( cross) ద్వారా పైకి వచ్చెడిది.

1KGS 17:12,13

 

119"నేను రెండు పుల్లలు సంపాదించాను. నేను ఈ పిండిని, ఈ కొద్దిపాటి పిడికెడు పిండిని రొట్టెగా చేసికొని నా కొరకు, నా కుమారుని కొరకు ఒక అప్పము చేసికొనెదను. మేము తిని చనిపోవుదము." ఆమె నిజముగా బలహీనతలో యున్నది, కాదా? ఆమె తిరిగి ఇంటికి వచ్చుటకు వెనుదిరిగినది. ఓ, ఆ ఉదయము ఎండగా వుంది! ఓ, అప్పటికే తినటానికి ఏమీ లేకుండా పోయి చాలా కాలమయింది. నీరు లేదు, ప్రజలు అరచుచున్నారు, ప్రతిచోట ప్రజలు చనిపోవుచున్నారు. అప్పు ఎక్కడా దొరకదు. ఏమి తోచుట లేదు. ఆమె మార్గాంతానికి వచ్చినది. ఆమె తన బలహీనతలో ఉన్నది. "దీనిని నా కొరకు నా బిడ్డ కొరకు వండుకొని తిని ఇక చనిపోవుదము." ఆమె వెను తిరిగి చెప్పింది…

"ఒక్క నిమిషమాగుము!" ఆమె వెనక్కు చూచినది. ఒక ముసలాయన ఆ గేటు దగ్గర ఉండి అన్నాడు, "మొదట నాకు ఒక అప్పము చేసి తీసికొని రా. నీ చేతిలో కొద్దిగా నీరు కూడా తెమ్ము. రొట్టె ముక్క తీసికొనిరా, 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!'" ఓ, మై, అదొక్కటే చాలును. ఆమె తనకున్న చిన్న ముక్కను దేవునికి సమర్పించినది. తక్కిన కాలమంతయూ వారిని పోషించుటకు ఆ కొంచెము సరిపోయినది. చూచారా, ఆమె ఎప్పుడు బలహీనురాలో, అప్పుడే బలవంతురాలయినది.

120ఆ బుడ్డిలో ఆమెకు కొంచెము నూనె యున్నది. మరేమియూ లేదు. ఆమె ఇద్దరి కుమారులు దాసులుగా అమ్మబడుటకు సిద్ధంగా ఉన్నారు. ఈమె ఈ కొద్దిపాటి నూనెతో ఏమి చేయాలో తోచలేదు. ఆమె అంత్యదశలో నున్నది.

ఏలీయా ఆమెతో, "నీ ఇంటిలో ఏమున్నది," అనడిగెను.

"పాత్రలో కొద్దిగా నూనె యున్నది," అని చెప్పెను.

"నీ పొరుగు వారియొద్దకు వెళ్ళి, పాత్రలన్నీ పట్టుకొని రా," అని చెప్పెను.

అది జరుగక ముందే సిద్దపడుచున్నది. సిద్దపడు! మల్బరీ పొదలలో దావీదు ఆ శబ్దము వినెను. హస్తమంత పరిమాణములో ఒక మేఘమును ఏలీయా చూచెను. "వాన సమృద్ధిగా పడుట నేను వినుచున్నానని," పలికెను. కొన్ని ఖాళీ పాత్రలను దేవుడు కనుగొనినచో చాలును! అది సత్యము.

"వాటిని నిండుగా నింపుము," అని అతడు చెప్పెను. ఆమేన్!

దేవుడేమి కోరునో చూచారా? ఖాళీ పాత్రలు దేవునికి కావలెను. వినండి! మనకు ఎంతో బోధ, ఎంతో దైవ సంబంధమగు ప్రసంగము ఉన్నది, ఈ పనికిమాలిన వాటితో పాత్ర నిండిపోయినది. ఒక్కటే మిగిలిపోయినది, దేవుని వైపు, ఆయన వాక్యము వైపు తిరుగుట. నీవది చేసినచో ఖాళీ పాత్రలను తేవలెను. వారినుండి మెథడిస్టు నంతటనీ తీసివేయుము. పెంతెకోస్తునంతటినీ వారిలోనుండి తీసివేయుము. ఆ బాప్టిస్ట్ అంతటినీ వారినుండి తీసివేయుము. వాటిని పాత్రలుగానే ఉండనిమ్ము, ఇంటిలో పేర్చుము. అప్పుడు ఈ పాత్ర నుండి తీసి అందులోనికి పోయుము. ఆమేన్, పోయుటకు ప్రారంభించుము.

తనకు, తన బిడ్డలకు, అందరికీ, మరియు అప్పులు చెల్లించుటకు సరిపడినంత ఉన్నది. ఎందువలన? ఎందువలన? ఆమె తనకున్న కొంచెమును దేవునికి సమర్పించి ప్రవక్త మాటను అనుసరించి, ఆమె చక్కగా బయటపడినది.

121దేవా, దేవుని వాక్యమును తీసికొను ప్రవక్తను పంపించుము, ఇంకేదో తీసికొను వానిని కాదు, అయితే ఖాళీ పాత్రలను కనుగొనుము. దేవుడు ఖాళీ పాత్రలను కలిగియున్నప్పుడు, దేవుని వాక్యమును తీసుకొని మరియు ఆ వ్యక్తిలోనికి పోయుము.

"ఓ, దానిని నేను పొందినప్పుడు నేను కదిలిపోయాను. దానిని నేను పొందినప్పుడు భాషలతో మాట్లాడాను. ఆత్మలో నాట్యమాడాను," అని కొందరు చెప్పుట కాదు. దాన్ని మరిచిపో, చూచారా, మరచిపో!

అది వచ్చువరకు అక్కడ నిలిచియుండు, అంతే, పాత్రలు నిండేవరకూ ఉండు. అంతే. నీవు చేయవలసినది అంతే. అవునయ్యా, చాలా సులభము! "పాత్రలు నింపబడినవి. మనము దానిమీద ఎలా నిలవగలము."

MATT 14:17,21•

MARK 6:38,44•

LUKE 9:13,14•

JOHN 6:9,10

 

122ఒక రోజు శిష్యులు ఆశాభంగముతో కృంగిపోయారు. యేసు వారితో, "ఇదిగో అయిదువేల జనులున్నారు. వారు ఆకలి భాధతో సౌమ్మసిల్లుచున్నారు," అని చెప్పెను. [ఓ, మరో గంట నేను ఈ వాక్యభాగము మీద నిలచియుండగలను.] అయిదు వేలమంది ఆకలితో నున్నారు. వంద బిలియనుల మంది ఆకలి బాధతో నున్నారు!

"వారిని పంపి వేయుదుము," అన్నారు వారు.

"ఆలాగు చేయనవసరం లేదు. మీరు వారికి ఆహారము పెట్ట౦డి," అని చెప్పెను.

ఓ, మై! వారు ముఖాలు ముడుచుకొని కుందించుకుపోయారని నేను అనుకొంటున్నాను. ఆహారము ప్రోగు చేశారు. కాని, అంతా కొంచెముగానే యున్నది. "ఈ జనసమూహమంతటి యొద్దకు వెళ్ళాము. ఒక్కపైసా కూడా దొరకలేదు, కనుక ఈ కూటములు ఇక ఆపివేద్దాం. ఒక చిన్నపిల్ల వానియొద్దనున్న అయిదు రొట్టెలు, రెండు చిన్న చేపలు మాత్రమే మాకు లభించినదంతా," అని వారు వచ్చి చెప్పారు. దావీదు అరణ్యము నుండి వచ్చినట్లుగానే యున్నది. "మాకు దొరికినది మొత్తం అదే. ఇక ఏమీ దొరకదు. మేము ఇక నవ్వులపాలు కావలసిందే. మేమేమీ చేయలేము యోహానూ," అన్నారు. "మేం చేయకలిగినదంతా అదే. ఇంతకంటె ఇక ఏమీ చేయలేము. మేము శాయశక్తులా ప్రయత్నించాం మాకు దొరికిన ఆహారమును బట్టి ఇక మేము ఏమీ చేయజాలము," అన్నాడు పేతురు.

ACTS 2:38

 

123అపోస్తలుల కార్యములు 2:38 అను చిన్న వాక్యమును నేను తీసెదను. మీరందరూ దానికి లోబడితే చాలును. మీరు సెమినరీల్లో చదువనవసరం లేదు. ఇది, అది, మరేదో అభ్యసించవలసిన పనిలేదు. అది తీసికొంటే చాలు. మీకు కావలసింది అదే, "ప్రతివాడును మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు నూనెతో నింపబడుదురు." కేవలము ఖాళీ చేయండి, దానికొరకు సిద్ధపడండి. నీకు కావలసినదంతా అదే. దానిలో ఒక చుక్క వేయుము, అది నిండుట గమనించు.

124ఒక్కొక్క చుక్కను పాత్రలో వేయుట ఎంతో కష్టము కాదని మీకు తెలుసును. వ్రేలిని ముంచి ఒక్కొక్క దానిలో ఈలాగు వేసెనని అనుకొందాం. మరల వెనక్కి చూచేసరికి అది నిండిపోయినది. అది ఆశీర్వచనపు నూనె గనుక ఒక్క చుక్క అందులో పడితే చాలును.

ఏదో సెమినరీ అనుభవమును నీవు తీసికొనవద్దు. దేవుని వాక్యమును తీసికొని అక్కడ వేయుము. అదెట్లు నిండునో చూడుము.

"ఏ విధమగు చుక్కను మనము వేయాలి? కీర్తనల నుండి బహుశా మనము కొంత తీసికోవచ్చును," అని అతడనెను.

MATT 6:33•

LUKE 12:31•

ACTS 2:38

 

125నేను చెప్పినది నీవు తీసికొనుము, "మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుము, ఆ చుక్కనుండి నీవు నింపబడుదువు." దానిని అక్కడ జారవిడువుము, ఆ చుక్క వలన నీవు నింపబడుదువు. పెంతెకోస్తు దినమున పేతురు వాడిన చుక్క అదే. పౌలు వాడిన చుక్క అదే. శిష్యులందరూ వాడిన చుక్క అదే. దానికి తక్కినదంతయు చేర్చబడును. నీవు ఆ చుక్కను తీసికొని, దానిని అనుసరించినచో తక్కినదంతా సరియగును.

బలహీనుడవు కమ్ము! ఖాళీగా ఉండుము! అంతా ఖాళీ చేసినచో, అప్పటి నుండి చుక్కలు పడుచుండును. తక్కినదంతయూ నిండునట్లు దేవుడే చూచుకొనును. నీవది చేసినచో చాలును. నీవు నీ మోకాళ్ల మీదనుండి నీ పూర్ణహృదయముతో దానిని పొందుము. ఇప్పుడే నీ హృదయమును కుమ్మరించి, "దేవా, నా పూర్ణహృదయముతో దానిని నేను నమ్ముచున్నాను!" అని చెప్పుము. తక్కిన నింపుదల విషయములో దేవుడే చూచుకొనును. అది నిండును. "మీరు పరిశుద్ధాత్మతో తిరిగి నింపబడుదురు."

MATT 14:18

 

126వారియొద్ద చిన్నవి అయిదు రొట్టెలు, రెండు చేపలు ఉండెను. కనుక వారేమి చేయుదురు? అందుకే వారు వచ్చి, "మేము చింతతో కృంగిపోతున్నాము. మా పని అయిపోయింది. ఎక్కడ, ఎవరి వద్ద మరో రొట్టె ముక్క కూడా దొరుకుట లేదు. ఈ కుర్రాడు బహుశా ఉదయాన బడి మనివేసి అక్కడ చేపలు పట్టుటకు వెళ్ళాడేమో. ఆ చిన్న నది దగ్గరనుండి వాడ్ని బోధ వినుటకు లాక్కొచ్చాం. వాడియొద్ద ఈ అయిదు రొట్టెలున్నవి," అన్నారు. ఆ చిన్నవాని గూర్చి దేవునికి వందనములు! అవునయ్యా. "ఈ జనసమూహమంతటిలో ఈ రొట్టెలు మాత్రమే ఉన్నవి," అన్నారు.

"అవి చాలును. ఇక్కడకు వాటిని తెండి. ఇక్కడుంచండి," అని యేసు చెప్పెను. చూశారా. "ఆ కొద్ది ముక్కల్ని నా చేతుల్లో ఉంచండి. తక్కిన సంగతి అంతా నేను చూసికొందును. ఇప్పుడు, ఈ ముక్కల నుండి నేను మీకిచ్చు వాటిని పంచిపెట్ట౦డి," అని యేసు చెప్పెను.

MATT 14:18•

ACTS 2:38

 

127ఈ ఉదయాన మీ ప్రతిఒక్కరు అపోస్తలుల కార్యములు 2:38 అను ముక్కను మీ హృదయాల్లోనికి తీసికొని, ఆయన మీ కొరకు విరచు జీవాహారమును పరీక్షించండి. మారుమనస్సు పొందండి, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మమీలోనికి వచ్చునో లేదో చూడండి. దీనిమీద పడుచూ వుండటం, దానిమీద పడుచూ వుండటం, మరొక చోట ఒకటి, ఇంకోచోట ఒకటి అలా పరిశుద్ధాత్మ నింపుదలనే అక్కడ చూచెదరు! అవును.

మీరు సెమినరీలకు వెళ్ళనవసరం లేదు. మీరు తెవివిగలవారు కానవసరం లేదు. నీకేమీ తెలియదని నీవు గుర్తించుట మాత్రమే నీవు చేయవలసినది. దేవుడు నిన్ను పట్టుకొననిమ్ము, తక్కినదంతా దేవుడే చూచుకొనును.

సరే! అప్పుడు ఆ స్వరము పలికినది, "వాటిని ఇక్కడకు తెండి." ఈ ఉదయాన దేవుడు కోరునది అదే. ఆయన యొద్దకు కొన్ని ఖాళీ పాత్రలను తేవలెను. తక్కిన సంగతి అంతా ఆయనే చూచుకొనును. అవునయ్యా.

JOHN 20:13,15

 

128గ్రుడ్డి బర్తిమయి ఆ గుమ్మము నొద్ద చి౦పిరి గుడ్డలతో, చలితో, బలహీనతతో కూర్చొనియుండగా, "అతనిని ఇక్కడకు తెండి," అను స్వరమును వినెను. అది నిజము. నీ బలహీన సమయములోనే అది జరుగును.

ఆ సమాధినొద్ద మరియ గుండె పగిలి, చనిపోయిన తన బాలుని నిమిత్తమై ఆశలన్నియూ పోయి నిలుచుచున్నది. అతనికి సుగంధ ద్రవ్యములు పూయుటకు ఆమె వెళ్ళినది. ఆయన శరీరము కూడా అచ్చట లేదు, "అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు?" అని ఒక స్వరము పలుకుటను ఆమె వినెను.

"వారు నా ప్రభువును ఎత్తుకొనిపోయిరి. మరియు నేను…" అన్నదామె. దీనమైన సంగతి ఏదనగా, ఆమె కుమారుని వారు తృణీకరించారు. మెస్సీయాగా తన్ను మెస్సియగా ప్రకటించుకొనిన తరువాత బట్టలన్నీ తీసివేసి ఆయనను సిలువ మీద వ్రేలాడదీసిరి, ఆయనను మేకులతో సిలువకు కొట్టిరి, పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొన్నది. ఆ విధముగా ఆ బిడ్డను కన్నది. ఇది ఆమె ఎరుగును. అతడు దేవుని బిడ్డ ఆమె ఆయన కార్యములను, సమస్తమును సరిగ్గా బలహీన పరిస్థితిలోనే చూచినది…

PS 22:14,17

 

129అక్కడ యేసు చెడును ప్రతిఘటించి, సంస్థలకు మరియు పరిసయ్యులకు విరోధముగా నిలచెను; బలహీనుడై తన్నుతాను మరణమునకు అప్పగించుకొనెను. సిలువ మీద పాపివలె మృతిచెందెను. మన పాపములు భరించెను. వారు నమ్మిన కీర్తనలు, ప్రవక్తలు, కొన్ని వందల సంవత్సరములకు ముందే ఆయన కల్వరిలో పలికిన మాటలనే వారు వ్రాసిరి, వారు వాటిని చూచుటలో విఫలమయిరి.

"నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి?" అని దావీదు పలికెను. కీర్తనలు 22లో, "నా ఎముకలన్నియూ ఒక్కటి కూడా విరువబడక నావైపు చూచుచున్నవి. వారు తలలూపుచూ, ఇతడు ఇతరులను నమ్మెను… మరియు ఇతడు ఇతరులను రక్షించెనుగాని, తన్నుతాను రక్షించుకొనలేకపోయెను," అని పలికెను. ప్రవక్త పలికినవన్నియూ వారి ఎదుటనే జరుగుచున్నవి. యేసు ఆ వాక్యమును పట్టుకొని తన్నుతాను అర్పించుకొనెను. దేవుడు, ఇమ్మానుయేలు, ఎంతో బలహీనుడై తన్నుతాను మరణమునకు అప్పగించుకొనెను. సమాధికి దిగిపోయెను. తన ఆత్మను పాతాళము లోనికి పోనిచ్చెను. బలహీనత! కాని ఆ పూర్తి సమర్పణవలన ఈస్టరు ఉదయాన, అట్టడుగునుండి దాని దారిని చుట్టివేస్తూ పైకి వచ్చెను.

ఆయన అందరికన్నగొప్పవాడు, అట్టడగువాడాయెను. ఆయన అట్టడుగునున్న వారియొద్దకు వచ్చెను. చిన్న పట్టణమునకు కూడా వెళ్ళెను. చిన్న పట్టణములోని చిన్న మనిషి కూడా ఆయనను చూడకలిగెను. అక్కడి నుండి మరణమునకు, మరణము నుండి సమాధికి, సమాధి నుండి పాతాళమునకు ఆయన వెళ్ళెను. అగాధములోనున్న పాతాళములోనికి, అట్టడుగునకు ఆయన దిగజారిపోయెను.

కాని, అక్కడి నుండి, దేవుడాయనను లేపనారంభించెను. పరదైసు నుండి సమాధికి, సమాధి నుండి మహిమకు, పరలోకము నుండి క్రిందికి చూడగలుగునంత ఉన్నత స్థలమునకు ఆయన వెళ్ళెను. పరలోకములో తన సింహాసనములను హెచ్చించెను!

MATT 27:54•

MATT 28:2

 

130ఆ హృదయము పగిలిన తల్లి, ఇది తెలియక అక్కడ నిలబడియుండెను. "వారు నా ప్రభువును ఎత్తికొనిపోయిరి. ఎక్కడుంచిరో నాకు తెలియదు." అంత బలహీన ఘడియ ఆమె ఎన్నడూ ఎరుగదు. ఆమె ప్రభువు పోయెను. వారాయనను సిలువవేసిరి. ఆ జనుల ఎదుట అవమానకరముగా ఆయనను వ్రేలాడదీసి సిలువవేసిరి, వస్త్రములు తీసివేసిరి; ప్రక్కలో ఈటెతో పొడిచిరి, రక్తము కార్చుచూ, ఆయన సిలువపై కేకలు వేసెను, భూమి కంపించెను, ఆయన మరణించెనని ఆకాశములన్నియూ గుర్తించినవి. ఆయనను క్రిందికి దించిరి. చల్లబడి కర్రవలె ఆయెను, మరియు ఆయనను సమాధిలో ఉంచిరి. ఆమె అనుకొన్నది, "నా ప్రియమైన బిడ్డకై నేను కడసారిగా చేయు మర్యాద ఆయనకు సుగంధ ద్రవ్యములు పూయుటయే, ఇప్పుడాయనను వారు తీసుకొనిపోయిరి." ఆమె అక్కడ ఏడ్చుచూ నిలబడినది. ఆ తల్లి కన్నీరు కార్చుచూ అక్కడ నిలబడినది. ఓ, చాలా బలహీన ఘడియ!

MATT 26:32•

JOHN 20:13,15•

2COR 12:10

 

131"అమ్మా! నీవెందుకు ఏడ్చుచున్నావు?" అన్న సర్వమును ఆమె విన్నది.

ఆ సమాధుల దొడ్డియొద్దనుండు కావలివాడని ఆమె తలంచినది. "ఓ, వారాయనను ఎత్తికొనిపోయిరి!" అని చెప్పెను. ఆమె అసలు చూడనైనా లేదు, అంత బలహీనముగా ఉన్నది. "నేను ఇక్కడికి ఈ మూడు దివా రాత్రులు వచ్చాను. సిలువ మరణమును నిలబడి నేను చూచాను. దేవుని కుమారుడని నేను ఎరిగిన నా స్వంత ప్రియ కుమారుని సిలువవేయుట గమనించాను. ఆయనే అని నేనెరుగుదును," అని ఆమె అనుచున్నది. [ఆమె ఎటో చూస్తున్నది. ఆయన వెనుకనే యున్నాడు] "వారాయనను తీసికొనిపోయిరి. ఆయనను సిలువవేసిరి. ఆయన చనిపోయి సమాధులలో నున్నవారిని బ్రతికించుట నేను చూచాను. ఆయన అద్భుతాల వెంబడి అద్భుతాలు చేయుట చూచాను. పరిశుద్ధాత్మను నేనెరుగుదును. దేవుడు నా హృదయమెరుగును. నేను అమాయకురాలను. పురుషుని ఎరుగకుండానే పరిశుద్ధాత్మ నాకు ఆ బిడ్డను ఇచ్చెను. అదెట్ల నిజమని నాకు తెలియును? ఆయన నిందింపబడుట నేను చూచాను… ఆయన వస్త్రములను ఆయన నుండి లాగివేసిరి, అక్కడ వ్రేలాడదీసి, కొట్టి క్రిందవేసిరి. ఆయన మహా ఘోరమగు మరణమును పొందెను. నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయనకేమీ చేసినా నేను ప్రేమించుట మానను. ఇంకా నేనాయనను పాతిపెట్టగోరుచున్నాను. ఆయనను సరయిన పద్ధతిలో సమాధి చేయాలని కోరుచున్నాను. కాని వారాయనను ఎత్తికొనిపోయిరి. ఎన్నో దినములనుండి నా హృదయము బ్రద్ధలవుచున్నది. ఈ స్థితిలో నేను నిలబడియున్నాను. నా ప్రభువును వారేమి చేశారో, నాకు తెలియదు."

ఆయన, "మరియా," అనెను. అప్పుడామె బలము పొందెను. ఆమేన్! "గలిలయలో వారిని నేను కలిసికొందునని, వెళ్ళి, నా శిష్యులతో చెప్పుమనెను." ఓ, మై!

వారు తమ బలహీనతతో బలవంతులైరి. నీవెప్పుడు బలహీనుడవో, అప్పుడే నీవు బలవంతుడవగుదువు.

MATT 26:34•

MARK 14:30•

LUKE 22:33,34•

JOHN 13:38•

JOHN 21:15

 

132పేతురు యొక్క వృత్తి చేపలు పట్టుట. నాకు ఈ వృత్తి అంటే చాలా ఇష్టము. అతడు చేపలు పట్టుటకు వెళ్ళి, నిరాశతో నిండిపోయాడు. క్రీస్తును నిరాకరించితినని అతనికి తెలుసును. ఓ, మై! అక్కడ ఆ ప్రవక్త నిలబడి ఈ విధముగా చెప్పుట అతడు వినెను, "పేతురూ, నీవు నన్ను ప్రేమించుచున్నావా?"

"ఓ, ప్రభువా, నిన్ను నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు." "నిన్ను ప్రేమించుచున్నాను. నీ కొరకు చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను," అని అతడు చెప్పాడు.

"పేతురూ, నీవు అలా అనుకొనుచున్నావా? కాని కోడి కూయక ముందు ముమ్మూరు నన్ను ఎరుగనని చెప్పుదువు," అని ఆయన చెప్పెను.

అది జరుగుట చూచి అక్కడ నిలబడి ఇట్లనెను! "నేనాయనను ఎరుగను! లేదు, ఆ పెంతెకోస్తు వారిగూర్చి అసలు నాకు తెలియనే తెలియదు."

MATT 26:69•

MARK 14:67•

LUKE 22:56•

JOHN 18:17,25,27

 

133(బోధించుట ఆపుటకు ఇది సమయము కాదు, నా గడియారము చూపించుచున్నది, చూచారా. నేనిప్పుడు ఆపవలసియున్నాను గాని ఇప్పుడు ఆపను. ఇది పూర్తిచేయాలి.)

"నేనాయనను ఎరుగనని చెప్పాను. పిలాతు ఎదుట నేను ఆయనను తిరస్కరించాను. ఆ చిన్నది నా యొద్దకు వచ్చి, "నీవును వారిలో ఒకడివి కావా?" అని అడిగినప్పుడు "కాదు!" అని శపించుకొనుటకు మొదలుపెట్టెను. ఓ, అతడు బహు వికృత రూపములో ఉన్నాడు. ఆయనను ఎరుగననెను. యేసు నిలబడి ఈ వైపే చూచుట అతడు చూచెను. అప్పుడే కోడి కూసెను. పేతురు వైపు చూడగా, పేతురు బయటకు వెళ్ళెను. ఓ, తనను బట్టి తానే నిరుత్సాహపడెను. "ఇక జీవించుట ఎందుకు?" అనుకొనెను.

అంతే కాకుండా, "ఇకపోయి మరల చేపలు పట్టుదుననుకొనెను. ఇక "నేను బోధించను, వెళ్ళిపోయి మరల చేపలు పట్టుకొందును," అని తలంచెను. తన వలను రాత్రంతా విసరుచునే యుండెను, అసలు చేపలు పడుట లేదు. అతడు బలహీన స్థితిలో ఉన్నాడు. ఏమీ పట్టలేదు. తనలోతాను నిరుత్సాహ పడిపోయెను. తన సామర్థ్యము ఇక పని చేయదని అనుకొనెను.

134మంచిది, తాను గొప్పవాడినని అతడు తలంచుకొనెను. ప్రధానయాజకుని కుమారుని చెవిని తెగనరికెను. గొప్పవాడినని తలంచెను, ఏదో కొంత అతడు నేర్చుకొన్నాడు. మీరెరుగుదురా? కాని అతనికి ఏమీ తెలియదు! అతడు అదంతా మరచిపోవలసి యున్నది.

అతడు అక్కడుండెను, "నాకు ఒక్క సంగతి తెలుసు, నేను జాలరిని. నేను చేపలు పట్టి బ్రదుకగలను," అనుకొనెను. రాత్రంతయూ వలవేసెను గాని ఏమీ పట్టుకొనలేదు. ఓ, ఎంత నిరుత్సాహము. వల లాగిన ప్రతిసారి ఖాళీగానే వచ్చుచుండెను. అతడెంతో నిరాశ చెందెను! అతడు బలహీన స్థితిలో ఉండెను. "నేనీ దోనెలో నుండి దూకుట మేలనుకొనెను. ఎందుకూ పనికిరాలేకపోతున్నాను," అనుకొనెను.

ఆయనన్నాడు, "పిల్లలారా, మీయొద్ద ఏమైనా చేపలున్నావా?"

ఒడ్డు వైపు చూచెను, అక్కడ ఒకాయన నిలబడియుండెను, "లేదు, మేము రాత్రంతయు శ్రమపడితిమి గాని ఏమీ దొరుకలేదు. నేను ఒక గొప్ప జాలరిని అనుకొన్నాను," అని జవాబిచ్చెను.

"సీయోనూ, నీవేనా?"

"అవును. రాత్రంతా శ్రమించాను ఏమీ దొరుకలేదు. ఇక్కడ ఏ చేపలు పడలేదు."

"సరే, అవతలి ప్రక్కన నీ వల వేయుము," అని ఆయన పలికెను.

"మేమెప్పుడో వేశాం… ఏమిటది?" అవతల ప్రక్కా? "అక్కడే వేస్తూ వచ్చాం," అని అతడు చెప్పెను.

"అవతలి ప్రక్క వేయుము."

అతడు తన వలను విసిరెను, బయటకు లాగెను. ఇప్పుడతడు బలవంతుడాయెను. తన పాత జాలరి దుస్తులు చుట్టుకొని, "సోదరులారా, ఆయనెవరు?" అని ప్రశ్నించెను. వారు సాధ్యమైనంత త్వరగా ఒడ్డునకు నడిపించిరి. తన జాలరి దుస్తులతో అతడు అందరిని మించిన వేగంతో ఒడ్డుకు చేరాడు. ఎందువలన? అతడు బలంగా ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయెను, కాని ఎప్పుడు బలహీనుడయ్యెనో, అప్పుడు బలము పొందెను. అవునండి.

135ఓ, ఖాళీ మానవ పాత్రలను తీసికొని వారితో లోకమును కదిలించుటయే దేవుని వ్యూహము. (ఇప్పుడు, కొద్దిగా చెప్పుకొని వెళ్ళదాం.) పెంతెకోస్తు వద్ద ఆయనేమి చేసెను? అంతా ఖాళీ చేయుటకు పది దినములు పట్టెను. వారు తమ పాత్రలు పైకి ఎత్తి నిలబడిరి. దేవుడు తానే వాటిని తీసికొని నింపివేసెను. అంతే! వారు లోకమును కదిలించి వేశారు… ఆయన తన్నుతాను వారిలోనికి పోసికొనెను.

ఈనాడు అదే అవసరము. ఈనాడు మనకు ఆ ఖాళీ పాత్రలే అవసరము. అవునయ్యా, అప్పుడే దేవుడు వారిని నింపగలడు. కొద్దిగా ఇక్కడ దాటవేయుదును. ముందే వారు నింపబడియున్నంత కాలము దేవుడు వారిని ఉపయోగించుకోజాలడు. వేదాంత తర్ఫీదుతో నీవు నిండుగా ఉన్నచో, దేవుడు నిన్ను వాడుకోలేడు. ఆయన నింపునట్లుగా దేవుడు ఖాళీ పాత్రలను కావలెనని కోరుచున్నాడు.

136"వెళ్ళి కొన్ని పాత్రలు పట్టుకొనిరా, చాలా నూనె అప్పు తీసికొనిరా! దానికి మంచి ధర వచ్చునో లేదో చూద్దాము. నీకు ఎక్కువగా వచ్చినచో, నీ పొరుగువానికి అప్పు చెల్లించవచ్చు," అని ఏలీయా చెప్పలేదు. "ఖాళీ పాత్రలను తెమ్ము అంతే చాలును," అని అతడు చెప్పెను.

పెంతెకోస్తునాడు వారు ఖాళీ పాత్రలుగానే యుండిరి. గనుకనే దేవుడు వారిని నింపకలిగెను. సోదరుడా, ఈ రోజు ఆలాగే ఉండవలసియున్నావు. ఈ రోజు దానిని పొందవలసియున్నావు. అది మనము కలిగియుండాలి, లేనిచో నశించెదము. ఇప్పుడు ముగింపులో వినండి. అది మనము కలిగియుండాలి లేనిచో నశించెదము. అవునయ్యా.

137మనకు గొప్ప మత యంత్రములు ఉన్నవి. గొప్ప సంఘ యంత్రములు మసిపట్టిపోయినవి. వాటికి ఆత్మీయ శుద్దీకరణ అవసరము. (సహోదరుడు కాలిన్స్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. మరియు సహోదరుడు హికర్సన్, ఎక్కడో తప్పు జరిగింది అనుకుంటా.) వారు తప్పు విధమగు గాసోలిన్ను వాడుచున్నారు. మసిపట్టిపోయారు. పరిశుద్ధాత్మకు బదులుగా వారు సెమినరీ అనుభవమును వాడుచున్పారు.

మన దేశములోని గొప్ప ఉజ్జీవములు, గొప్ప మనుష్యులు, మన స్వస్థత కూటములు అన్నియూ విఫలమయినవి. అది మనకు తెలుసు. మన గొప్ప సువార్తికుడు, బిల్లీ గ్రహంను చూడండి. అతడు దేశమును ఎన్నిసార్లు ముందుకు మరియు వెనుకకు దాటి సువార్తను ప్రకటించుచున్నాడు. అది ఏమి మంచి చేసింది? ఓరల్ రాబర్ట్స్ స్వస్థత కూటములు ప్రతిచోట జరుగుచున్నవి. ఎప్పటికంటె దుర్మార్థత పెచ్చుపెరిగిపోతున్నది.

ఎందుకనగా బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్, మొదలగు ఇతర సంస్థలన్నియూ కలిసిపోయినవి. ఏమిటది? ఒక గొప్ప మత యంత్రము, నీ కొరకు దేవుడు అందులో పూర్తిగా మసి నింపియున్నాడు. అది ఇప్పుడు, "చగ్," మని ఇక్కడ, అక్కడ కదలుచున్నది. ఆమె అయిపోయినది! ముగిసినది! గాసోలిన్ అయిపోయినది. అందులో నీవు నీళ్ళు పోశావు. అంతా అయిపోయింది. అవునయ్యా. రెండు ప్రక్కల గాలి లేని టైరులే. మనము భయంకర రూపంలో ఉన్నాము. మత స౦బంధ యంత్రము ఆగిపోయినది.

138సోదరుడా, పాతాళము యొక్క మూత ఊడిపోయినది. అది నిజము. ఎక్కడ చూచినా గాని దయ్యపు శక్తులు ప్రవాహములుగా కుమ్మరించబడుచున్నవి. అది దేశములను జయించినది. అది మూలుగ వరకు కుళ్ళిపోవునంతగా రాజకీయమును జయించినది. అది సంఘమును జయించినది. శాఖ తప్ప మరేమీ ఎరుగనంతగా సంఘములను అది జయించినది.

"నీవు క్రైస్తవుడవా," అని నీవు ప్రశ్నించినచో.

"నేను మెథడిస్టును."

"నీవు క్రైస్తవుడవా?"

"నేను పెంతెకోస్తును."

ఒక రోజు నేను చెప్పినట్లుగా ఇక దానికి అర్ధము లేదు. పంది, కుక్క, గుర్రము లేక మరేదో వలె తయారయినది. దానితో ఏమీ పని లేదు. నీవు తిరిగి జన్మించి పరిశుద్ధాత్మతో నింపబడినచో సరి. అది జరగనంతవరకు నీవు సంపూర్తిగా ఆత్మకు లొంగవు. నీవు ఆత్మకు లొంగనిచో నీవు తిరిగి జన్మించలేవు, పరిశుద్ధాత్మ నీలో లేదు. నీవు భాషల్లో మాట్లాడవచ్చు, వణకవచ్చు, గంతులేసి పరుగెత్త వచ్చు. ఏదైనా చేయవచ్చు…

MATT 15:9•

MARK 7:7•

1COR 13:2

 

139పౌలు చెప్పెను, "విశ్వాసముతో నేను కొండలను పెకలించవచ్చును, నేను రోగులను బాగుచేయవచ్చును, నేను బైబిలు జ్ఞానమును కలిగియుండవచ్చును, నేను సెమినరీకి వెళ్ళి అంతా నేర్చుకోవచ్చును," అయినను వట్టివాడనే!" హల్లేలూయా!

ఓ, మై, పాత్ర మీది మూత ఊడిపోయినది! దయ్యములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి." దయ్యపు శక్తులు, క్రైస్తవ్యపు పేరు క్రింద, మానవ పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచున్నవి." బైబిలును విడిచిపెట్టి, వేదాంత సెమినరీ సిద్దాంతములు బోధించుచున్నారు.

హల్లెలూయా! ఎవరు శక్తిగలవారు, ఎవరు తగిన బలముగలవారు. ఎవరు చాలినంత జ్ఞానముగలవారు? మన స్త్రీలను బోధకుల పేరు మీద ఈ మెథడిస్టు, బాప్టిస్ట్, పెంతెకోస్తువారు వివస్త్రులనుగా చేసినట్లు, దిగంబరియైన ఆ సేనను అదుపులో పెట్టగలిగిన శక్తిమంతుడెవరు? యొజెబెలువలె తమ పెదవులకు రంగులు వేసికొంటూ, జుట్టు కత్తిరించుకొంటూ, పురుషునివలె పాంట్లు ధరించుచున్నారు. దానిగూర్చి మన బోధకులు చెప్పగలిగిన స్థితిలో లేరు. దయ్యము పట్టినవారు! సేన అనువాడు తన బట్టలను చింపి వేసికొనెను. ఈ గర్జించు దయ్యము ఎవరు?

JOHN 14:12

 

140ఎవరు తగిన బలవంతులు? ఈ శాఖలను సమాధుల మధ్య తిరుగుచూ, "అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి, పరిశుద్ధాత్మ మనకవసరము లేదు," అని చెప్పుచున్నవాడిని జయించగల శాఖ ఏది? దేనికి శక్తి కలదు?

దయ్యము నెవరు స్వాధీనపరచుకోగలరు? దేవుడు! శాఖ ద్వారా దానిని మనము చేయజాలము. మత శక్తుల ద్వారా దానిని చేయలేము. దానిని ఒకసారి చేసిన స్వరము ఒకటున్నది, ఆమేన్, ఆ దయ్యములను సాధుపరచెను. వారిని మరల వారి సరియగు మానసిక స్థితిలో నుంచెను. వారికి వస్త్రములు ధరింపచేసెను. అదే స్వరము మనకు వాగ్దానము చేయుచున్నది, "నేను చేయు కార్యములు మీరును చేయుదురు." మసిపట్టిన కారువలెనున్న ఈ మత గాసోలిన్ తో దానిని నీవెన్నడూ చేయజాలవు. ఒక సంస్థ క్రింద ఎన్నడూ ఆ పని నీవు చేయజాలవు. నీవు ఖాళీ కాబడి, బలహీనుడవై, నీ స్వార్ధమునంతను బయటకు పారబోసి, పరిశుద్ధాత్మ వచ్చి, ప్రతి భాగమును తుడిచివేయ నిచ్చినచో నీ శరీరము యొక్క ప్రతి మూత చక్కగా పెట్టబడును. అది మాత్రమే చేయగలదు. మనకు ఏ సంస్థ అక్కర్లేదు.

141మాకేది అవసరము, ఓ దేవా, ఇప్పుడు అంతటా కుమ్మరింపు జరుగుచున్నట్లు నాకు తోచుచున్నది. దేవుని ఉరుముతో ఒక దేవుని ప్రవక్త లేచుట ఈనాడు మనకు అవసరము. ఈ లోకమును కదిలించి సిగ్గుతో ముంచు ఆత్మీయ మెరుపు అవసరము! హల్లెలూయా! ఆయనకు కావలసినది ఖాళీ పాత్రలు. అది నిజము. బయటకు పిలువబడిన సంఘము. ఆయన వర్తమానమును, దీవెనలను మరియు దేవుని శక్తిని పొందుకొను చిన్న గుంపు కావలెను. హల్లెలూయా! అదియే మనకు కావలెను.

బలము పొందునట్లుగా బలహీనుడవు కమ్ము. అది ప్రతి దయ్యమును జయించును. జ్ఞానులను అది సిగ్గుపరచును. దేవుడు పిలచిన స్త్రీ, మరియు పురుషులను అది ఒక్కచోటికి తెచ్చును, మరియు అది మాత్రమే.

MATT 24:37•

LUKE 17:26•

1PET 3:20

 

142గుర్తు౦చుకొనుము, "నోవహు దినములలో నుండినట్లుగానే, మనుష్యకుమారుని రాకడలోను ఉండును. అప్పుడు ఎనిమిది ఆత్మలు రక్షించబడినవి." ఎలియా దినములలో ఏడు వేలమంది మాత్రమే దానిని కలిగియుండిరి. ఇప్పుడు మనమెక్కడ జీవించుచున్నామో ఆలోచించండి. యోహాను రంగము మీదికి వచ్చినప్పుడు, ఆ చిన్న సంఘము అల్పసంఖ్యాకురాలిగా నున్నది, కాని నూనెను పోయుటకు అక్కడ ఖాళీ పాత్రలున్నవి. హల్లెలూయా!

దేవా, మేము ఖాళీ చేసికొనునట్లు చేయుము.

స్నేహితులారా, ఖాళీ అవ్వండి. బలహీనులు కండి! నీ స్వసామర్ధ్యమును త్రోసివేయుము! ఈ టేపులను వినువారు, అవి ఎక్కడకు వెళ్ళినను మీరు ఖాళీ అవండి. దేవుని బలిపీఠము మీద మిమ్మను మీరు "బలి"గా కుమ్మరించుకొనండి. నిప్పులను పట్టుకొని దేవుని దూతను రానివ్వండి. సర్వశక్తుడగు దేవుని శక్తితో పాత్రను నింపండి. అప్పుడాయన నిన్ను బలముగా చేయును, నిలబడు కృప నీకిచ్చును.

143ఒక్క నిమిషము మన తలలు వంచుదాం:

ఓ ప్రభువా, మరో ఆదివార ఉదయము గతించినది. ఈ చక్కని సమాజములో మేము కూర్చొనియున్నాము. నిన్నెరిగిన స్త్రీ, పురుషులున్నారు. వారి హృదయాలలో నీ ఆత్మ నివసించుచున్నది. వారు నిన్ను నమ్ముచున్నారు. మీరు మాకాజ్ఞాపించిన ప్రతి మాటను వారు జరిగించుచున్నారు. ఈ జనుల నిమిత్తము నీకు వందనములు.

ఈ టేపులు బయట చాలా ప్రదేశములలోనికి వెళ్ళును. దీనులగు స్త్రీ మరియు పురుషులు తమ గృహములలోనికి తీసికొని వెళ్ళుదురు. అనేక తెగల మధ్యకు, దేశములలోనికి అవి తీసికొనిపోబడును. ప్రభువా, వారు విని, అర్ధము చేసికొని, పరిశుద్ధాత్మ వారిని నింపునట్లుగా తమ్మును ఖాళీ చేసికొందురు గాక!

ప్రభువా, ఈ ఉదయాన కొందరు, మేము మాట్లాడుట ఆరంభించినప్పటి నుండి తమ్మును తాము ఖాళీ చేసుకొనియున్నారు. తమ స్వంత ఆలోచనలలో, స్వంత సామర్థ్యములో, తమ మానవ సామాన్య జ్ఞానములో వారు నమ్మికయుంచి యున్నారని గ్రహించాను. దేవుని ఎదుట అది కేవలము మురికిగానే యున్నది. ఓ దేవా, ఇప్పుడు వారు తమ్మునుతాము ఖాళీ చేసికొందురు గాక! తగ్గించుకొని తమ్మునుతాము నీకు సమర్పించుకొందురు గాక! ఆత్మ నింపుదలకు వచ్చుదురు గాక! కృప చూపుము, ప్రభువా!

ACTS 2:41•

ACTS 8:12

 

144"నమ్మినవారందరూ బాప్తిస్మము పొందిరని," బైబిలులో చెప్పబడినది.

ఈ ఉదయాన ఈ భవనంలో తండ్రీ, ఒకామె బాగా వెనుక కూర్చొనియున్నది. శ్రీమతి. హిక్స్ అని నాకు గుర్తుతు. ఒక రాత్రి నా యొద్దకు వచ్చినది. ఆమె యొద్ద ఎముకలు తప్ప మరేమీ లేవు. ఎండిన చర్మమునకు నరములు అంటుకొని యున్నవి. కాన్సరు ఆమెను తినివేసినది. ఇంకా ఆమె భర్త క్రైస్తవుడు కాడు. ఆ రాత్రి నేను ప్రార్ధించిన ప్రార్థన గుర్తున్నది, "దేవా, చిన్న దావీదును ఒక మామూలు వడిసెలతో సింహము వెనుక పంపినావు. అతడు గొర్రెపిల్లను తిరిగి తెచ్చాడు." నేను చెప్పాను, "ఈ కాన్సరు నా సోదరిని పట్టుకొన్నది. వాడు ఒక దయ్యము. నీవు దేవుడవని ఎరుగుదును. ప్రభువా, నిన్ను చూచాను, నిన్నెరుగుదును. నీతో నేను మాట్లాడాను, మరియు నీవు తిరిగి నాతో మాట్లాడావు." "దేవుని గొర్రెల వెనుక నేను వస్తున్నాను; కాన్సరూ, ఆమెను నీవు వదలుము!" అప్పుడు "ఇంటికి వెళ్ళుమని" యేసుక్రీస్తు నామములో ఆమెకు ఆజ్ఞాపించాను. ఇంకా విధేయుడు కాని ఆమె భర్త ఆ మాటను విశ్వసించి తన భార్యను ఇంటికి తీసికొనిపోయెను. ఇప్పుడు ఇక్కడామె యున్నది. మంచి బలవంతురాలుగా నున్నది. కాన్సరు పోయినది. ఈ ఉదయాన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు ఆమె వచ్చుచున్నది. ఓ, దేవా, నింపబడుటకు సిద్ధమయిన ఆ ఖాళీ పాత్ర కొరకు వందనములు. దేవా, ఆ ఆత్మను ఆశీర్వదించమని ప్రార్ధించుచున్నాను.

ప్రభువా, అనేకమందిలో అదొక ఉదాహరణ మాత్రమే. దేవా, పూర్తిగా నీ దీవెనలు ఈ జనాంగముపై నుంచమని ప్రార్ధించుచున్నాను.

145తండ్రి, ఒకే ఒక విషయము విడిచిపెట్టబడినట్లు నేను చూస్తున్నాను. ఎక్కడో ఖాళీ పాత్రలను లేపి ఈ లోకమును సిగ్గుపరచుము, లేక యేసును త్వరగా పంపుము, అంతము ఇక్కడున్నది. . ప్రభువా, రెండు పనులు చేయవలసియున్నవి, మరియు దానిని ఇప్పుడు మనము చూస్తున్నాము, ఇది అంత్యకాలమని మేమెరుగుదుము: వెంటనే ఏదో మహిమగలది లేచుట మనము చూడవలెను; లేదా ప్రభుని రాకను మనము చూచెదము.

ప్రవచనమంతా నెరవేరినది. సంఘము పునరుత్థానము జరుగు ముందుగా, ప్రకటన 3వ అధ్యాయములో ఆమె ఎత్తబడు ముందుగా, లవొదికయ సంఘ కాలమునకు ఒక వర్తమానికుడు వచ్చును, అదే చివర జరుగవలెను. "ప్రజల హృదయములను ఆది తండ్రుల వైపునకు త్రిప్పును." అసలు పెంతెకోస్తు వైపునకు త్రిప్పును. వారేమి పొందియున్నామని చెప్పుకొనిరో అదే పొందుదురు. నోవహు దినములలో నుండినట్లుగానే, ప్రభువా, నశించువారు వేలాదిమందియున్నారు. చాలామంది నశించుదురు. అదిప్పటికే నెరవేరుట చూస్తున్నాము, తండ్రి.

GEN 45:5•

ZECH 12:10•

ZECH 13:6

 

146ప్రభువైన యేసూ, రమ్ము, నీ సంఘమును తీసికొని పొమ్ము ప్రభువా, అది నీ చిత్తమయితే, సంఘము ఎత్తబడు ముందుగా, శక్తి ఉద్భవించు గాక! ఓ, దేవా, ఈ పాత్రలు నింపుము. ప్రభువా, వారిని లేపుము! మరొకసారి ఈ లోకమును కదిలించుము! సమయము గతించినదని మేమెరుగుదుము. అప్పుడిక మారుమనస్సు వారికి దూరమగును. కాని ప్రభువా, నీ శక్తిని చూపించి, ఈ పాత్రలను నింపుము. ఈ లోకమును కదుల్చుము. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కదిలించుము! అప్పుడు నీ సంఘమును తీసికొనుము. లోకమును దాని నాశనములో విడిచిపెట్టము. ఓ దేవా, వారు సతమతమగుచున్నారు.

అప్పుడు యూదులకు ఆ గొప్ప పరిశుద్ధాత్మ వచ్చునని మాకు తెలుసు. సీనాయి పర్వతము మీద 144,000 మంది నిలబడుదురు. గొర్రెపిల్లతో ఉందురని మేమెరుగుదుము. కాని వధువు అప్పటికే పరమందుండును. ఆమె ఎత్తబడి పోవును. గొర్రెపిల్ల తిరిగి వచ్చినది. (యోసేపు) తన్నుతాను తన ప్రజలకు తెలియపరచుకొనును. ఆయన అక్కడ నిలబడియుండుట వారు చూచి, వారి మద్య ఒక చీలిక వచ్చునని బైబిలు చెప్పుచున్నది. ఆయన తన్ను తెలియచేసికొనినప్పుడు, "ఆ గాయములు నీకెక్కడ అయినవని," వారు ప్రశ్నింతురు.

"నా స్నేహితుల ఇంటిలో," అని చెప్పును.

"మేము సిలువ వేసినది ఈయననే," అని అప్పుడు వారందురు.

యోసేపు చెప్పినట్లుగానే ఆయన చెప్పును, "భయపడవద్దు. అన్యుల జీవితములను రక్షించుటకు దేవుడు ఈలాగు చేసెను. అది మీ తప్పు కాదు. అప్పుడు వారు తాము వేరగుదుమని చెప్పెదరు. ఒక కుటుంబము మరొక కుటుంబము నుండి విడిపోవును. గృహములో ఏకైక కుమారుడ్ని పోగొట్టుకొన్నవారు దుఃఖించునట్లు దుఃఖించుదురు.

LUKE 12:32

 

147ఓ తండ్రి, ఆ దినము దగ్గరలో ఉన్నది. ఆ డెబ్బది వారముల ముగింపు సమీపముగా ఉన్నది. ప్రభువా, సమయము సమీపించినది.

ఓ, దేవా, దేవుని యొక్క నిజ ప్రవక్తలు ఈనాటి ఆధునిక స్త్రీలకు వ్యతిరేకము గాను, ఈ ఆధునిక సంఘములకు విరుద్ధముగాను, ఈ ఆధునిక సంఘ వేదాంతమునకు వ్యతిరేకంగానూ తమ స్వరమును తెరచి ప్రకటించుదురు గాక.

నిజాన్ని చెప్పుటకు భయపడు ఈ బోధకులను కదిలించుము. ఓ దేవా, ఈ మనుష్యులను తీసికొని ముందెన్నడూ లేని విధంగా వారిని కదిలించుము. వారు తమ్మును తాము చూచుకొని సిగ్గుపడునట్లు చేయుము.

కాని ఈ ఒక్క సంగతి మాకు తెలియును. నిండు నమ్మకముతో విశ్రాంతి పొందుదుము. "తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడునూ రాడు. తండ్రి అనుగ్రహించిన వారందరూ వచ్చెదరు." నీవు ఎంతవరకు వారు చేరుకొనవలెనని ఉద్దేశించావో, అంతవరకు వారు చేరుకొందురు. "చిన్న మందా, భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమైయున్నది." అది సత్యమని మాకు తెలుసును. అందరినీ మీరు హెచ్చరించారు. ఆ సమయము వచ్చినప్పుడు సిద్ధపడువారు బహు కొద్దిమంది ఉందురు. అప్పుడు ఒక గొప్ప పునరుత్థానము జరుగును. యుగములన్నింటిలోను విమోచించబడినవారు లేచెదరు. కాని చివరి దినమున, అంత్యకాలమున సంఘము నిశ్చయంగా అల్పసంఖ్యలో నుండును.

కనుక తండ్రి, ఈ దినపు వర్తమానమును మేము చూస్తున్నాము. దానిని చూచుటకు సంతోషించుచున్నాము. చీలికలు మేము చూస్తున్నాము. ఈ సంగతులన్నీ చూస్తున్నాము.

నీ జనులు తాము, వట్టివారమని ఒప్పుకొనుట మేము కొనుగొనియున్నాము. ప్రభువా, వారు నీతో నింపబడవలెనని కోరుచున్నారు. వారితో ఈ ప్రపంచమును కదిలించుమని ఇప్పుడు, నేను ప్రార్ధించుచున్నాను. ప్రభువు రాకకు ముందుగా కొద్ది దినములే ఉన్నవి.

PS 103:2,3

 

148ఇప్పుడు మా మధ్య వ్యాధులున్నవి, శారీరక స్వస్థత అవసరమగు జనులు ఇక్కడున్నారు. వారిని మేము విడిచిపెట్టలేము. ప్రభువా, ఏలయనగా ఈలాగు చెప్పబడినది. "ఆయన చేసిన ఏ మేలును మరువకుము; ఆయన నీ పాపములు క్షమించువాడు, నీ రోగములను స్వస్థపరచువాడు." ఆయన యొక్క గొప్ప స్వస్థతా శక్తి ఇక్కడున్న ప్రతివానిపై ఉండునట్లుగా ప్రార్ధించుచున్నాను. ఒక్క కదలిక లేకుండానే నీవు ఒక ఆత్మను రక్షించగలవు. నీవైపు తన హృదయమును త్రిప్పితే చాలును. నీవు శరీరమును మరెంతగా స్వస్థపరచుదువో గదా.

ఇక్కడ జేబు రుమాళ్ళు పడియున్నవి. ఆ గొప్ప అపోస్తలుడగు పౌలు చేసినట్లుగా వీటిని ప్రభువైన యేసు నామములో ప్రార్ధించుచున్నాను. ఈ రుమాళ్ళు ధరించిన వారు స్వస్థత పొందుదురు గాక! పగిలిన గృహములు తిరిగి కట్టబడును గాక! తల్లిదండ్రులు లేని పిల్లలు, లేక వారినుండి వేరయిన పిల్లలు తిరిగి ఏకమగుదురు గాక. ప్రభువా, అనుగ్రహించుము. ఇప్పుడు రోగులనందరినీ, బాధపడుచున్నవారిని బాగుచేయుము. నీకు మహిమ తెచ్చుకొనుము.

149ప్రభువా, ఇప్పుడు, మా హృదయాలనే పాత్రలను నింపుకొనగోరుచున్నాము. పైకి కండ్లు నిలుపుచున్నాము. మా హృదయాలు నీవైపు చూస్తున్నవి. ఈ లోకములో మేము ఉన్నామన్న తలంపును కూడా తిరస్కరించాము. బైబిలు చెప్పుచున్నది, "అబ్రాహాము తన గృహము నుండి బయలుదేరెను. తన పట్టణము విడిచెను. వాగ్దాన దేశములోనికి యాత్రికునిగా వెళ్ళెను. అతడు ఈ లోకమునకు చెందినవాడు కాడని ఒప్పుకొనెను. కాని తాను, ఒక యాత్రికుడు, పరదేశినని చెప్పుకొనెను. అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును తాము ఈ లోకమునకు చెందినవారు కామని ప్రకటించుకొన్నారు. కావున దేవుడు తానే నిర్మించిన పునాదులుగల పట్టణముకై వారు కాచుకొని యున్నారు.

150తండ్రి, నేను ప్రార్ధించుచుండగా, ఇప్పుడే హృదయములు మార్పుపొందును గాక, వారి దృక్పధములు మారును గాక! బాప్తీస్మ కార్యక్రమము వచ్చినప్పుడు, ఇంతకు ముందు దీనిని గూర్చి ఎరుగనివారికి అది ప్రత్యక్షపరచబడునట్లు జనుల మధ్య ఒక కదలిక తీసికొని రమ్ము. నీవు పిలచిన వారందరినీ, నీవు పంపుదువని చెప్పియున్నావు.

ప్రభువా, ఇప్పుడు సమస్తమూ నీకే అప్పగించుచున్నాము. ప్రభూవా, ఈ అల్పమగు వట్టి పాత్ర నుండి వచ్చీరాని చిన్న వర్తమానమును అందించాను. నీవు ఆ మాటలను తీసికొని ప్రజల హృదయాలలో కరిగించి పోయమని ప్రార్ధించుచున్నాను. దానినుండి వారెన్నడూ దూరము కాకుందురు గాక! ప్రభువా, దయచేయుము. యేసుక్రీస్తు నామమున ఇప్పుడు నీకు అప్పగించుచున్నాను. ఆమేన్.

1KGS 18:21

 

151[ఒక సోదరుడు సందేశమిచ్చుచున్నాడు: "అవును, నా జనులైన మీతో, ఈ దినాన, నేను మాట్లాడుచున్నాను. సజీవుడైన దేవుని వాక్యమును మీరు వినియున్నారు. మరియు నేను చెప్పునదేమనగా, మీలో చాలా మంది నిర్ణయము అను లోయలో ఉన్నారు. ఈ దినాన, నా ప్రవక్త తెచ్చిన వాక్యమును విన్నాట్లయితే, రాబోవు దినాలలో మీరు నాతో కూడా మహిమలో ఉందురు. ఏలయనగా నేను చెప్పునదేమనగా, ద్వారము ఇరుకును మరియు దారి సంకుచితమునైయున్నది, మరియు దానిలో ప్రవేశించువారు కొందరే. ఏలయనగా నేను చెప్పునదేమనగా, ఈ ఉదయాన నా ప్రవక్త, నేను చెప్పునదేమనగా, నా జీవాహరమును నీవు చక్కగా విరిచితివి. మరియు నీ హృదయములో నీవు ఒక్కడివే ఒంటరిగా నిలచినట్లు తలంచుచున్నది, అయితే నేను చెప్పునదేమనగా, నాతో వచ్చు జనులను ఆ దినాన నేను కలిగియుందును. ఏలయనగా నేను చెప్పునదేమనగా, వీరందరు ఆ సింహాసనము చుట్టూ సమకుర్చబడినప్పుడు గొప్ప విందు సిద్దము చేయబడును, మరియు మీకంటే ముందుగా వెళ్ళిన మీ ప్రియులతో మీరు ఉందురు, ప్రభువు సెలవిచ్చుచున్నాడు."]

మీరు మీ తీర్మానములను చేయుచుండగా, నిర్ణయించుకొనండి. "రెండు తలంపుల మధ్య ఎందుకు ఊగుచున్నారు? ఆయన చెప్పినది విన్నారు. యెహోవాయే దేవుడయితే, ఆయనను సేవించుడి; లోకమే దేవుడయితే, ఆలాగే కొనసాగండి, చూచారా. శాఖా మార్గము సరైతే దానిలోనే నడువుడి; కాని బైబిలు సత్యమయితే దానియొద్దకు రండి. ఈ ఘడియలో ఎవరిని సేవించుదురో తీర్మానించుకొనండి.

MATT 26:30•

MARK 14:26

 

152ఆత్మలో ఇప్పుడు మనము ఒక పాట పాడుదం. "వారు పాట పాడుచూ వెళ్ళిరి," అని బైబిలు చెప్పుచున్నది. మన తలలు, హృదయములు ఆయనకు ముందు వంచి, "నేనాయనను ప్రేమించుదును" అనే ఈ ప్రఖ్యాత పాత పాటను పాడుదం.

నేనాయనను ప్రేమింతును,

(ఏమి చేయుదువో ఇప్పుడు నిర్ణయించుకో),

నేనాయనను ప్రేమించుదును,

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను.

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రానుపై.

[సహోదరుడు బ్రెన్హాం, నేనాయనను ప్రేమింతును" అను పాటను రాగము తీయుచున్నారు.] క్రీస్తు కొరకు నీవు నీ తీర్మానము చేసికోగలవా? తీర్మానము కాదు గాని, నిన్ను నీవు ఖాళీ చేసికొనుము. "ప్రభువా, నేను మంచివాడిని కాను. నాలో ఏదీ మంచిది లేదు. నాకు తెలిసినదంతయూ మరచిపోనిమ్ము. ఇప్పుడు రమ్ము, ప్రభువైన యేసూ, ఇది నా తలపైనుండి పోనీయకుము. దానిని చేర్చుకొని నీ ఆత్మతో నింపబడనిమ్ము ప్రభువా, ఈ రోజు నుండి పూర్తిగా నన్ను నీవానిగా చేయుము." దేవునికి ఇప్పుడు చిన్న ప్రార్ధన చేయండి; పిల్లలందరూ ఈ సామాన్య ప్రార్ధన చేయండి.

………….

కల్వరి గొర్రెపిల్లా

దైవ రక్షకుడా (నీ హృదయములో పశ్చాత్తాపపడుము);

నేను ప్రార్ధి౦చుచుండగా వినుము

నా పాపములన్నియూ తీసివేయుము,

ఓ, ఈ దినము నుండియూ పూర్తిగా నీవానిగా చేయుము!

జీవితపు చీకటి త్రోవను త్రొక్కుచుండగా,

చుట్టూ దుఃఖములు చుట్టుకొనియుండగా,

నీవే నా మార్గదర్శివి కమ్ము;

రాత్రిని పగలుగా మారుటకు సెలవిమ్ము,

దుఃఖము, భీతులు తుడిచివేయుము,

నన్ను ఎన్నడూ నీ నుండి పక్కకు తప్పనీయకుము.

153[సహోదరుడు బ్రెన్హాం, నా విశ్వాసము నీవైపు చూచును అను పాటను ఆలపించుచున్నారు.] నమ్మినవారందరూ, దేవుని ఎదుట మిమ్మును మీరు ఖాళీ చేసికొనుడి. ఇకమీదట ఏదియూ మిమ్మను ఆటంకపరచజాలదని నిశ్చయించుకొనుడి. ఏ సామర్థ్యమును ఎన్నడూ కలదని భావించకుము. నీవు దానిని స్పష్టపరచగోరినచో, దేవునితో పూర్తిగా నిజ సంబంధము కలిగియుండుము. అందులో నీటికొలను ఉన్నది. బాప్తిస్మము కొరకు సిద్ధపాటు జరుగుచున్నది. స్త్రీలను నా కుడి ప్రక్కకు రానీయండి. పురుషులను నా ఎడమ ప్రక్కకు పంపండి. ఒక్క క్షణములో బాప్తిస్మ ఆరాధన జరుగును. ఖాళీచేసికొనినవారు, సేవకులు చెప్పేది నమ్ముటకు సిద్ధపడక, మతాధికారులు, శాఖలు చెప్పేది వినుటకు సిద్ధపడక ప్రభువు యొక్క మార్గమును తీసికొనండి. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను దానిని నమ్ముము, ఇప్పుడు రండి.

జీవిత చీకటి దారి నేను తొక్కుచుండగా…

ఇక్కడ స్త్రీలు, అక్కడ పురుషులు; అది మీ వేదిక పిలుపు. "నమ్మినవారందరూ వచ్చి బాప్తిస్మము పొందిరి."

…నా మార్గదర్శివి;

చీకటిని మాపి, వెలుగుగా మార్పుము,

దుఃఖమును, కన్నీటిని తుడిచివేయుము,

నన్ను ఎన్నడూ నీ నుండి పక్కకు తప్పనీయకుము.

DEUT 22:5•

HEB 12:14

 

154ఈ ఉదయాన ఎందరు స్త్రీలున్నారు - దీనిని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పలుకుచున్నాను - మీ కత్తిరించుకొనిన జట్టును గూర్చి, దేవుని కోరుకొనువారు, ఆయన కృప ద్వారా దానిని పెంచుటకు, మీలో ఎందరు సిగ్గుపడుచున్నారు? దేవుడు మిమ్మును దీవించును గాక.

తమ భార్యలను పొగ త్రాగనిచ్చుచూ, మీకే చెందిన ఆ పురుష బట్టలను వేసికోనిచ్చుచున్న మగవారు ఎందరు సిగ్గుపడుచున్నారు?

బైబిలు చెప్పెను, "అది దేవుని దృష్టికి హేయము." దేవుడు మారడని నీవెరుగుదువా? ఆయన మారడు. ఆయనకు ఒక స్వభావమున్నది. అది పరిశుద్ధత, ఆయన మారడు. నీవు ఆయనవలె మారనిచో ఆయనను చూడజాలవు. "పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనేరడు." మగబట్టలు ధరించినచో అది దేవునికి కడుపులో జబ్బుపడి దానిని వాంతి చేయునట్లుండును. ఆయన వ్యాధిగలవాడయి, అసహ్యించుకొనును. మురికి, నీవు అట్టి ఆత్మను కలిగియుండి, ఎన్నడైనా పరలోకము చేరెదనని అనుకోగలవా? "స్త్రీ జట్టు కత్తిరించుకొనుట సిగ్గుకరమని," దేవుడు చెప్పగా, పొట్టి జట్టుతో ఏలాగున పరలోకము చేరగలవు? ఆమె భార్యగా నుండి మూల సూత్రములనే తిరస్కరించుచున్నది. దేవుడు మారడు. స్నేహితుడా, అది ఆయన వాక్యము. నీవు వినుట మంచిది.

మీ భార్యలను ఆ విధంగా చేయనిచ్చుచున్న పురుషులారా, మీరు మీ గూర్చి సిగ్గుపడుట లేదా? మీకు అవమానకరముగా లేదా?

155భూమి మీద నుండిన ఆ మొదటి స్త్రీవలె ఉండవద్దు; దేవునివలె ఉండుడి. ఈ ఆధునిక ప్రపంచ పోకడ నుండి మిమ్మను మీరు ఖాళీ చేసికొనుడి, అప్పుడు క్రీస్తు నీలోనికి తన్ను కుమ్మరించుకొనును. నీవు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడుదువు.

ఆయన అది చేయలేడు. అది ఆయన సూత్రములకు విరుద్ధము. ఆయన తన మాటకు వ్యతిరేకముగా వెళ్ళవలసియుండును. అది ఆయన చేయడు. నీవు ఆయన వాక్యముతో సహకరించనంత కాలము ఆయన ఏమియూ చేయలేడు. ఏదైనా జరుగవలెనన్నచో, ముందు మనము దీనియొద్దకు రావలెను. నీకది తెలుసు. మీ అందరు ఎరుగుదురు. మీలో ప్రతి ఒక్కరు దానిని గూర్చి జాగ్రత్తగా ఉండుడి ఎంతమంది అది నమ్ముచున్నారు? చేతులెత్తండి. నిశ్చయంగా, మీరు నమ్ముచున్నారు. ఇప్పుడు, దాని గూర్చి ఏదైనా చేయుదము.

156దేవా, మాకు దయచూపుము! ఎంతగా ఆయన అవసరత మనకున్నది! ఇక్కడ మనందరము కలిసియున్నాము. ఇప్పుడు, గుర్తుంచుకొనండి, తీర్పునొద్ద నేను నిలబడి (అది ముందు రాత్రి అనుకొంటాను) మరియు నేను చెప్పిన ప్రతి మాటను ఎదుర్కొందును. చూచారా, నేను దానిని ఎదుర్కొనవలసియున్నాను. ఇప్పుడు, గుర్తుంచుకొనండి, ఆ పాపము నా చేతుల నుండి పోయినది, నా అంతరాత్మ నుండి పోయినది, నా ఆత్మ నుండి అది పోయెను, అది దేవుని నుండి పోయినది.

ఆ పరిస్థితులలో మీరు నిలబడినచో, ఇంకా శిక్షకు పాత్రులమని ఎంచుకొననిచో (హూ!), నీవేమి చేయగోరుచున్నావు? దేవుడు నీతో బేరమాడడు. నీవు దానితో దాటిపోయావని ఎరుగుము, చూచారా. నీవు దానిని దాటితివి. నీవు చాలా మతనిష్టంగా ఉండియుందువు. సంఘములకు చెందియుండవచ్చును, కాని నీవు దానిని దాటిపోతివి. దేవుని వాక్యము ఒక వ్యక్తిలోనికి వెళ్ళి అతనిని బయటకు తెచ్చును. అదే వారిని చక్కపరచును, చూచారా. అది వాక్యము. ఏ సేవకుడినైనా, ఏ వ్యక్తినైనా, ఎక్కడైనా గాని దేవుని వాక్యమును కాదనగలరేమో అడిగెదను. అది నిజము. ఆలాగు జరుగదు, చూచారా.

157కనుక మనము నిజ క్రైస్తవులముగా ఉందుము. ప్రయత్నించు మనమైనను, ఎవరైనను, నరుకబడి కాల్చబడవలసిన అవసరత యున్నది. అవునయ్యా, మనందరకు అది అవసరము.

దేవా, నాపై కృప చూపుము. దేవా, నన్ను తీసికొని వంచుము. ఇది నా ఆకాంక్ష ఈ వారము తరువాత, ఆ తరువాత, ఏమి చేయాలో కనుగొనుటకు దేవుని ఎదుటకు వెళ్ళెదను. దేవా, నన్ను గైకొనుము. నాలో ఏది మంచిది లేదు. (చాలా ఉన్నది) దేవా, దానిని నరికివేయుము. అదే ఈ ఉదయము నా ప్రార్థన, నా హృదయము, చెవులు, వ్యక్తిత్వములకు సున్నతి చేయుము. ప్రభువా, నన్ను తయారు చేయుము. నీవు నన్ను ఏ విధముగా ఉంచగోరుదువో ఆలాగు చేయుము. అది నా ప్రార్ధన.

"నేనెట్ల ఉండుట అవసరమో, ఆలాగు నన్ను నరుకుము, వాక్యములో నాకు చూపించుము, నాకు చెప్పుము. నేను వెళ్ళి ఆలాగు చేయుదును." ప్రభువును ఆలాగు పలుకనిమ్ము దానితో నేను సహకరించుటకు సిద్ధంగా ఉన్నాను. దేవుని వాక్యము ఏది చెప్పినా, ఆలాగే నేను ఉండగోరుచున్నాను. దేవుని వాక్యములోని క్రైస్తవునిగా నేనుండగోరుచున్నాను. ప్రతివాని మాట అబద్ధము, దేవుని మాట సత్యము, నేటి కాలములో ఆలాగే లేదా? నీవాలాగు నమ్ముట లేదా?

ACTS 2:38

 

158(బాప్తిస్మమును పొందు స్థలము కొరకు చూచుచున్నావా, కుమారుడా? ఆ వెనుకనున్న సోదరుడా, ఆలస్యము చేయవద్దు. ఈ మార్గాన రండి.)

విశ్వాసులగు స్త్రీ పురుషులు చాలామంది వచ్చుచున్నారు, అనేకులు పాపములు ఒప్పుకొనుచున్నారు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు వచ్చుచున్నారు [సోదరుడా, ఇది దారి], "పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుదురు.

JOHN 20:23•

ACTS 2:38•

ACTS 7:51

 

159ఇక్కడున్న కాథలిక్కు వారికి పాపక్షమాపణ అనగా ఏమిటో చెప్పుచున్నాను. పాపములను క్షమించు అధికారము సంఘమునకు కలదని మీరు చెప్పుదురు. ఏలాగు సంఘము పాపములను క్షమించును? యేసు సంఘముతో, "మీరు ఎవరి పాపములు క్షమించుదువో అవి వారికి క్షమించబడును. ఎవరివి నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని." చెప్పాడా? ఆది సంఘములో వారు ఏలాగు పాపములను క్షమించారు? వారిని మారుమనస్సు పొందమని ఆజ్ఞాపించారు. వారి పాపములు క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చారు. ఒప్పుదల గదిలో కాదు, నిశ్చయముగా. కాని వారు దేవుని ఎదుట పశ్చాత్తాపపడిరి. వారక్కడ నిలబడి యుండగా వారి హృదయములలో విశ్వాసించిరి. "నమ్మినవారందరూ, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరి. వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి." ఆమేన్. నీవాయనను ప్రేమించుచున్నావా?

ఇప్పుడు, మనము లేచి నిలబడుదుము.

MATT 6:9•

LUKE 11:2

 

160ఇప్పుడు, బాప్తిస్మ ఆరాధన కొరకు చాలామంది వేచి ఉండగోరుచున్నారు. ఇంకెవరైనా రాగోరుచున్నారా? ఎవరైనా ఇంకా నమ్మిరా? ఏదో ప్రక్కకు రండి - మగవారు ఎడమ వైపుకు; స్త్రీలు కుడి ప్రక్కకు. నీలోనున్న సమస్తముతో, నీ పూర్ణహృదయముతో ప్రభువైన యేసును విశ్వాసించుము.

మనందరము ఇప్పుడు కలిసి తలలు వంచుదము, కలిసి ఈ మాదిరి ప్రార్థనను తిరిగి చెప్పుదము. ఇప్పుడే ఎంతో వింతగా ఇది చేయుటకు నేను నడిపింపబడితిని. తలలు వంచియుండగా నాతో మీరు ప్రార్ధించండి. [సహోదరుడు బ్రెన్హాం, మరియు సంఘము ఏకముగా ప్రార్ధించుచున్నారు.]:

… పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును.

నీ రాజ్యము వచ్చు గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకమందు నెరవేరును గాక.

మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.

మా ఋణస్టులను మేము క్షమించిన ప్రకారము మా ఋణములను క్షమించుము.

మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ యుగ యుగములు నికే చెల్లును గాక. ఆమేన్.

161ఇప్పుడు తలలు క్రిందికి వంచి యుంచుదము. సహోదరుడు నెవిల్ వచ్చి ఆశీర్వాదము పలుకునట్లుగా అడుగుచున్నాను. తన హృదయములోనిది చెప్పును. ఇప్పుడు సిద్ధము కాబడుచున్న బాప్తిస్మ కార్యక్రమమును గూర్చి ప్రకటించును.

దేవుడు మిమ్మను దీవించవలెననునదియే నా ప్రార్థన. నేను మీ కొరకు ప్రార్ధించుదును. మీరు నా కొరకు ప్రార్ధించండి. నిజముగా మీ ప్రార్థనలు నాకవసరము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...