క్రైస్తవ్యము మరియు అన్యత్వము
1నెవిల్ సోదరుడా, వందనములు. ప్రభువు నిన్ను దీవించును!
స్నేహితులారా, శుభోదయము. ఈ ఉదయము మరల ఆలయములోనికి వచ్చుట గొప్ప భాగ్యమే. చాలా తాజాగా, మంచిగా ఉన్నది. మొన్న నేను అసలు మాట్లాడలేకపోయాను. చిన్న పురుగు గొంతులోనికి వెళ్ళి బొంగురు పోవునట్లు చేయును. మీరు దానిని ఎరుగుదురు, కాని ప్రభువు నాకు సహాయము చేసి ఆ పరిస్థితులో నుండి విడిపించెను. కావున ఈ ఉదయము నేను మీతో మాట్లాడగలుగుచున్నాను.
చక్కని ఆలయము మనకున్నందుకు చాలా సంతోషించుచున్నాను, జనులతో క్రిక్కిరిసి యున్నది. చాలామంది నిలబడియున్నారు. కొన్ని సీట్లు మనకు ఇంకా ఉంటే బాగుండును. నిలబడిన వారికి చోటిచ్చినచో బాగుండును. వారు కూర్చొన్నచో మనము సంతోషించుదుము, కాని అంతా నిండిపోయినది. మీరు ఈ వేదిక మీదికి వచ్చి పిల్లలతో కూడా కూర్చొందురని నేను తలంచుట లేదు, ఎందుకనగా ఇచ్చట వెనుక వైపు తిరిగి కూర్చొనవలెను.
2ఇప్పుడు, కొన్ని రోజుల నుండి నేను చరిత్రను చదువుచున్నాను. ఈ ఉదయము నేను బోధించుటకు బదులుగా, దేవుని వాక్యమును పాఠముగా ఉపదేశించవలెనని కోరుచున్నాను. బహుశా మనకు కొద్దిగా ఆలస్యమగును. మీలో కొందరు నిలబడిన వారికి కూర్చొను అవకాశము ఇయ్యండి. వారికి కొద్దిగా విశ్రాంతి కల్పించినచో, మిమ్మును ప్రశంసించెదము.
చాలా మంది నా స్నేహితులు వచ్చియున్నారు. కొందరు చాలా దూరము నుండి వచ్చియున్నారు. జార్జియా నుండి, ఓహియో నుండి, టెన్నిస్సీ నుండి, ఇల్లినాయ్ నుండి, మిస్సోరి నుండి, మిచిగాన్ నుండి, చికాగో నుండి, ఇంకా చాలా స్థలముల నుండి ఈ చిన్న ఆలయములోనికి వచ్చియున్నారు. ఇటువంటి కూటమునకు వచ్చి యున్నారు. ఇందును బట్టి నేనెంతో జనులకు కృతజ్ఞత చెల్లించుచున్నాను. అంతే గాకుండా మరో సంగతి కూడా చెప్పగోరుచున్నాను. దేవుని వాక్యములో వారికి ఆసక్తియున్నది. దాదాపుగా అందరును తమ దశమ-భాగములను కూడా తమతో తెచ్చియున్నారు. ఆలయము నిమిత్తము వారు సహాయపడుచున్నారు.
ఇప్పుడు, వారు విధేయులగు స్నేహితులు. అటువంటి ప్రజలను మీరు మరువజాలరు.
HEB 11:38
3కొన్నిసార్లు నేను చెప్పినది వారిని బ్రద్ధలు చేసినట్లుగా యుండును, కాని దాని భావమును మీరు చూడవలెను. మీ హృదయములో ఆలాగు చేయగోరరు, కాని ఏదో మీతో చెప్పుచున్నది. "మీరు తప్పక దానిని చేయవలెను." చూడండి, అది మీకు తప్పని సరి.
ప్రభువును సేవించుటకు వారు చాలా చోట్ల నుండి వచ్చుటను నేను చూచుచున్నాను. ప్రభువు నాకనుగ్రహించిన పరిచర్యను వారు నమ్ముచున్నారు. నేనాయన దాసుడనని వారు విశ్వసించుచున్నారు. వారికి నేను ఏ తప్పు చెప్పను. నేను బహు యధార్థతతో చెప్పుదును. జనుల యొక్క ఆత్మలకు నేను కాపరిని. నాకు తెలిసినంత వరకూ శాయశక్తులా యధార్థముగా ఉందును. వారు మంచు కొండలలో నుండి, చల్లని పర్వతములలో నుండి కారు నడుపుకొని వచ్చుచున్నారు. ఖాళీ లేని రోడ్ల మీద కారు నడుపుకొని వచ్చుచున్నారు. వారి పిల్లలకు తిండి, నిద్ర యుండదు, మరియు వారి పెట్టె ఆ కారు వెనుక భాగమున ఉండును. వారు ఏదో చూచుటకు ఇక్కడికి రారు, చాలా కష్టపడి వచ్చుచున్నారని మీరెరుగుదురు.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో అట్టి జనుల గూర్చి బైబిలు చెప్పుచున్నది. "అట్టి వారికి ఈలోకము యోగ్యమైనది కాదు." నా హృదయములో దీనిని అనుభవించి ఈ మాట పలుకుచున్నాను.
4న్యూ-ఆల్బనీ, లూయిస్‌విల్, కెంటాకీ, ఇంకా చుట్టు ప్రక్కల స్థలముల వారు ఇక్కడ చాలామంది యున్నారు. వారు విధేయతతో వచ్చిరి. మంచును, చలిని దాటుకొని వచ్చియున్నారు. ఇక్కడికి రావలెనంటే చాలా కష్టపడవలెను.
ఇప్పుడు, వచ్చే ఆదివారము క్రిస్మస్ వచ్చును. ఆలయములో క్రిస్మస్ సందేశము అందించవలెనని తలంచుచున్నాను, కాని చిన్న పిల్లలు చాలామంది తమ క్రిస్మస్‌ను తప్పిపోవుదురు. వారి పట్ల నాకు సానుభూతి యున్నది. ఇంటి నుండి దూరమగుట పిల్లలకు చాలా కష్టముగా యుండును.
5ఇక్కడున్న మనము మన పిల్లలకు శాంతా క్లాస్ యొక్క కట్టు-కథను చెప్పము. ఎవరికీ మనము అబద్దమును చెప్పరాదు. మీరు మీ పిల్లలకు అబద్దము చెప్పరని నాకు తెలియును. క్రిస్మస్‌లో క్రీస్తు ఉండవలెను గాని అటువంటి కట్టు-కథలు కాదు.
క్రిస్మస్‌ను ఒక ఆరాధనగా జరుపుట లేదు, ఒక పండుగగా ఆచరించుచున్నారు. త్రాగుడు, జూదము, అల్లరితో కూడిన ఆట పాటలు, అన్యవిధానము కొనసాగుచున్నది. క్రిస్మస్ తరువాత కూడా నేను క్రిస్మస్ గూర్చి మాట్లాడుదును. చిన్న పిల్లలకు కట్టు-కథలు చెప్పరాదు. క్రిస్మస్ రాత్రిలో చిన్న పిల్లలకు కానుకలు ఇచ్చుచుందురు. దానిని వారు అర్థము చేసికొనలేరు. చూచారా, వారు చాలా చిన్నవారు. వారిని మనము జ్ఞాపకము చేసికొనవలసి యున్నాము. చిన్న పిల్లలకు మనము అసలు విషయములను చెప్పవలెను.
(సోదురుడా, ధ్వని మరీ ఎక్కువగా వచ్చుచున్నాదా? ఆ వెనుక నున్న వారు నా మాటను సరిగా వినగలుగుచున్నారా? ఆగండి, నేను మరీ దగ్గరగా నిలబడి యున్నాను. రెండు మైకులు పని చేయుచున్నవా లేక ఏదో ఒక్కటే పని చేయుచున్నదా? అది మంచిదని నేను తలంచుచున్నాను. ఏది ఇందులో మంచిది? సరే.)
6ఇప్పుడు, చిన్న పిల్లల అర్థము చేసికొనవలెను. వారు చిన్నవారు. ఒకప్పుడు మనము కూడా చిన్న పిల్లలముగా యున్నామని గుర్తుచేసికొనవలెను.
మనము చిన్న పిల్లలముగా యుండుట మనకు గుర్తుండును. ఎక్కడికో వెళ్ళి సరుగుడు కొమ్మను నరికి తెచ్చెడి వారము. మా తల్లి దానికి ఏవేవో వ్రేలాడదీసెడిది. ఆ చెట్టు మాత్రమే మనకు తెలియును. పాత మేజోళ్ళు అక్కడ వ్రేలాడెడివి. చిన్న తీపి పదార్థములు వ్రేలాడెడివి. (నాకు రెండు, హంపీకి రెండు ఆ పదార్థములు ఇచ్చెడిది.) అవి చిన్న తీపి ముక్కలు. దినమంతా వాటిని మేము చప్పరించుచూ ఉండేవారము, మీకు తెలుసా; ఇంకా మిగిలిపోతే మేము వాటిని చిన్న కాగితములో కట్టి, జేబులో పెట్టుకొనెడివారము. మాకు చిన్న బొమ్మ పిస్టల్, చిన్న ఊదుకొను బూర ఉంటే ఇక చెప్పలేనంత ఆనందముగా ఉండెడిది, అదే చాలా గొప్ప.
7ఈ రోజున అంతా మారిపోయినది. పేదవారి యొద్ద కూడా డబ్బున్నది. తమ పిల్లలకు మంచి బహుమానములను ఇచ్చుచున్నారు. చక్కని దుస్తులు ధరింపచేయుచున్నారు, బాగా తినుచున్నారు, చక్కగా జీవించుచున్నారు. మొత్తం మీద చాలా బాగున్నారని తలంచుచున్నారు.
నేడు జీతములు చాలా బాగున్నవి. చిన్న పిల్లలకు అన్నియూ సమృద్ధిగా యున్నవి.
కాని శాంతాక్లాస్ అనేది అబద్ధమని మీరు తప్పక చెప్పవలెను. ఎల్లప్పుడు దీనిని గుర్తుంచుకొనవలెను, ఎందుకనగా అది మంచిది కాదు. "వారు యేసు ఎవరో తెలియని పరిస్థితికి వచ్చెదరు." చూచారా? కావున వారికి సత్యము చెప్పండి, ప్రతివారితోను యధార్థము చెప్పండి. సత్యవంతులుగా యుండండి. ముఖ్యంగా మీ పిల్లలకు తప్పును చెప్పవద్దు. మీరు క్రైస్తవులని వారు నమ్ముచున్నారు. మీరు చెప్పేది సత్యమని వారు తలంచుచున్నారు. మీరు నిశ్చయంగా వారికి సత్యము చెప్పవలెను. వారప్పుడు సరియగుదురు.
8ఈ ఆలయములో మరియొక రాత్రి లేక పగలు గడపవలెనని నేను కోరుకొనుచున్నాను. రాబోయే సంవత్సరములలో నా సేవ ఎట్లుండునో తెలియదు.
అది దేవుని చిత్తమయితే, ఈ సంవత్సరము ఎక్కువగా విదేశములకు వెళ్ళవలెనని ప్రయత్నించుచున్నాను. నాకు దాని అవసరత కనబడుచున్నది. ముఖ్యంగా నార్వే మరియు స్వీడెన్ తదితర స్కాండినేవియన్ దేశములకు, ఆసియాకు వెళ్ళవలెను. ఈ సంగతులను గురించి ఎంతో ఎక్కువగా మనము ప్రార్థించవలెనని కోరుచున్నాను. పరిశుద్ధాత్మ యొక్క విధానమును మనము నేర్చుకొనవలెను. ఆయన ఎట్లు నడిపించునో తెలిసికొనవలెను. మనము చేయవలసిన సంగతులను తెలిసికొనవలెను.
9సంఘము యొక్క ఆది చరిత్రను అధ్యయనము చేయుచున్నాను. బ్రాడ్ బెంట్, హాజల్‌టయిన్, ఇంకా ఇతరులు వ్రాసిన నైసిన్ ఫాదర్స్ యొక్క వ్యాఖ్యానములను అధ్యయనము చేయుచున్నాను. పరిశుద్ధ మార్టిన్ యొక్క జీవితమును నిన్న నేను పూర్తిగా చదివాను. కాతలిక్కు చర్చి దానిని పరిశుద్ధుల జాబితాలో చేర్చుటకు నిరాకరించెను. దేవుడే ఆ కార్యము చేసెను. అతనిది గొప్ప జీవితము. అతని జీవితములో అద్భుతములు మరియు సూచక క్రియలు ఎన్నో చూడగలము; ఇద్దరు చనిపోయిన వారినతడు బ్రదికించెను, దురాత్మలను పారద్రోలెను, తెలియని భాషలు మాట్లాడెను, దర్శనములను చూచెను, చాలా గొప్ప మనిషి. దేవుని యెదుట దీనునిగా యుండుటలోనే ఇతని శక్తి యొక్క రహస్యమంతయూ ఇమిడి యున్నది. ఈనాడు సంఘమును చూడండి — విశ్వాసిలో శక్తి మరియు సూచక క్రియలు వెంబడి౦చును అని చెప్పుచున్నది, కాని వారు గర్వముతో నిండిపోవుచున్నారు, "నేను గొప్ప, నీవు చిన్న." ఆది సంఘము ఆ విధంగా లేదు, మీరు చూచారా. వారు ఎంతో దీనులు, ఒకరిపట్ల ఒకరు దయను కలిగియుండిరి, మాధుర్యమును, అవగాహనను వారు కలిగి యుండిరి. ఈనాడు చాలా వ్యత్యాసమున్నది. ఈ నిజవర్తమానానుసారము నుండి ఏదీ మనలను ప్రక్క త్రోవ పట్టించదు; కాగా మనలను మనమే తగ్గించుకొనవలెను. నీవు ఎంత దీనునిగా యుందువో, అంత ఎక్కువగా దేవుడు నిన్ను వాడుకొనును.
10ఈ కట్టు-కథలన్నిటిని గూర్చి అధ్యయనము చేయుచున్నాను. క్రిస్మస్ ఒక కట్టు-కథ క్రిస్మస్ యొక్క వాస్తవమును వారు చెప్పుట లేదు. బైబిలులో క్రిస్మస్‌ను అసలు ప్రస్తావించనే లేదు. క్రీస్తు పుట్టుక దినమును వారెన్నడూ ఆరాధించలేదు. అటువంటిది లేదు. అది రోమను కాతలిక్కు సిద్ధాంతము. క్రైస్తవ ఉపదేశము కాదు. బైబిలులో దాని యొక్క ఏ లేఖనమును లేదు. మొదటి వంద సంవత్సరములు అసలది లేనే లేదు, చూడండి. అది ఒక కట్టు-కథ. శాంతా క్లాస్ ఒక వ్యాపారము. ఇదంతా ఒక పెద్ద గందరగోళముగా తయారయినది.
మీరు అదెట్లు ప్రారంభమయినదో చూడండి. దానిని గమనించండి, మనం ఎక్కడున్నామో అర్థమగును. ప్రభువు యొక్క రాకడ తప్ప మరేమియూ ఇక మనకు మిగిలి లేదు. అంతే. ప్రభువు యొక్క రాకడ తప్ప మరేదియూ ఈ అగాధములో నుండి మనలను తప్పించజాలదు.
11(ఆ టేపు సరిగా యున్నవో లేవో ఈ చిన్న మాట పరీక్షించును. నేను ఈ విషయమునంతటినీ కాకుండా చూడవలెనని కోరుచున్నాను, ఎందుకనగా ఇది చాలా కఠినముగా యుండును. ఇప్పుడు టేపు తయారగుచున్నదా? ఇవి అమ్మవద్దు. ఇవి అమ్మకానికి కాదు, ఆలయములో పంచిపెట్టుదము, ఎందుకనగా దీని వలన గందరగోళము కలుగుట నిశ్చయము, చూచారా. కావున దీనిని మార్చి మరో విధంగా దిద్దు వరకు అమ్మవద్దు.)
మనము వర్తమానమును సమీపించు ముందుగా అందరును వీలయినంత విశ్రాంతిగా యుండండి — మరీ ఎక్కువ సమయమును నేను తీసికొనను, కావలసినంత సమయమును తీసికొందును. దానిని మీరు నిజంగా చూడగలరు. దారిలో అడ్డంకుల నన్నింటినీ తొలగించుకొంటూ ముందుకు వెళ్ళుదము.
12[కొన్ని సీట్లు ఖాళీగా యున్నవని నెవిల్ సోదరుడు చెప్పెను.] ఆ ప్రక్కన నిలబడియున్న స్త్రీలు ఇటు వైపు రావచ్చును. సోదరీలకు ఇచ్చట కొంత స్థలమున్నది. ఈ ముందు కొంత చోటున్నది. ఈ వెనుకన ఒక కుర్చీ కలదు. వేదిక మీద పిల్లలు కూర్చొని యున్నారు. చిన్న పిల్లలు గాని కుర్చీ మీద కూర్చొనియున్నచో, లేచి పెద్దలకు స్థలమియ్యవలెను. పెద్దవారు నిలబడియున్నారు. ఈ వేదిక మీద పిల్లలకు చోటున్నది. పెద్దవారికి కుర్చీలు ఇయ్యవలెను. ఆ వెనుక కొందరు స్త్రీలు నిలబడి యున్నారు. బాగా మూలన కొందరు నిలబడి యున్నారు. కావాలని నిలబడితే నిలబడండి.
13వేదిక మీద కొందరున్నారు. కొందరు సోదరులు ఇచ్చటకు రాగోరినచో, రావచ్చును. సహోదరుడు వే ప్రక్కన కొందరు కూర్చొనియున్నారు. మీరు వచ్చి కూర్చొనండి. ఇంటి యొద్ద ఉన్నట్లుగా యుండండి. ఇది మీ స్వగృహముగా ఎంచుకొనుడి. షెల్బీ సోదరుడా, ఈ వేదిక మీద చోటున్నది. నీవు ఇష్టపడినచో, వచ్చి మా యొద్ద కూర్చొనవచ్చును. సహోదరులు ఇవాన్స్ మరియు చార్లీలు ఇక్కడికి వచ్చి కూర్చొవచ్చును. ఇద్దరూ ఇచ్చటికి రండి. సోదరులారా, వచ్చి చక్కగా కూర్చొనండి. కూటము జరుగుచున్నప్పుడు వీలయినంత నెమ్మదిగా యుండండి. నిలబడినచో మీరు అలసిపోయి విసుగుదలకు గురియగుదురు.
14హాలులో చివరన కొందరు నిలబడియున్నారు. ఇంకా చోటున్నది. ఇక్కడున్న పియానో బల్లను కొందరు వాడుకోవచ్చును, వచ్చి కూర్చొనండి. ఆ వెనుకనున్న ఒక స్త్రీ కూర్చీ ఖాళీగా యున్నదని చూపించుచున్నది. మీరు ఆ సీటును ఉపయోగించుకొని హాయిగా కూర్చొనండి. డిసెంబరు నెల పదిహేడవ దినము పది గంటలు దాటి ఇరవై-మూడు నిమిషములయినది.
ఈ ఉదయము జెఫర్‌సన్-విల్‌లో వర్షము కురిసినది. బయట వాతావరణము ఏమీ బాగో లేదు, కాని ఈ లోపట చాలా చక్కగా యున్నది. దేవుని యొక్క రాకడను సమీపించుచున్నామని ఎరిగి చాలా ఆశ్చర్యము కలుగుచున్నది. నిత్యత్వమును సమీపించుచున్నాము. ఈ ఉదయమున దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలెను. సజీవ దేవుని యొక్క వాక్యము విశ్వాసికిని, అవిశ్వాసికిని అందుబాటులో యున్నది. ఈ దినము ప్రభువు యొక్క గొప్ప సంగతులను అర్థము చేసికొను మహాదినముగా యుండునని నమ్ముచున్నాను.
15ఇప్పుడు ఒక నిమిషము ప్రార్థనకు శిరములు వంచుదము. మనము శిరములు వంచి యుండగా, ఎవరయినా ప్రార్థనలో జ్ఞాపకము చేసికొనవలెనని కోరువారు దేవుని వైపుకు మీ చేతులు ఎత్తి మీ విన్నపమును హృదయములో గుర్తుంచుకొనండి. మీకు వందనములు.
REV 22:20
16మా పరలోకపు తండ్రీ, ఇప్పుడు మేము నీ ఆలయములో కూర్చొని యున్నాము. మైక్రోఫోనులు పలుకుచున్నవి. రికార్డింగు కొనసాగుచున్నది. క్రైస్తవులు ప్రార్థించుచున్నారు. విన్నపములు ముందుంచబడినవి. ఈనాటి వర్తమానము కొరకు రెండు లేదా మూడు వారముల నుండి విరామము లేకుండా చదువుచునే యున్నాను. కొద్ది మాటలను పరిశుద్దాత్మ వాడుకొని జనుల హృదయములలో నాటించును గాక! తాము జీవించుచున్న కాలమును జనులు చూచెదరు గాక! ప్రభువగు దేవుని కలిసికొనుటకు సిద్ధమగుదుము గాక! అంతటనూ ఉన్న రోగాలు మరియు శ్రమపడుచున్న వారి కొరకు ప్రార్థించుచున్నాము.
ఓ యేసూ, నీ సంఘమును, విశ్వావ్యాప్త సంఘమును జ్ఞాపకము చేసికొనుము. ఈ ఉదయము ప్రపంచమంతటా జనులు కూడియున్నారు. కొందరు అడవులలో కూర్చొని యున్నారు. కొందరు తీర్మానపు లోయలలో కూర్చొని యున్నారు. మరి కొందరు కొండ శిఖరముల మీద ఉన్నారు. ప్రపంచమందంతటనూ నీ పిల్లలు నీ మీద ఆనుకొని నీకు ప్రార్థించుచున్నారు. ఆనాటి యోహాను పత్మసు ద్వీపములో కూర్చొని "ప్రభువైన యేసూ రమ్ము!" అని పలికిన విధముగానే.
17మేము శత్రువు ముందరనే యున్నామని గ్రహించుచున్నాము. ఆటంకపరచుటకు, ఆపుటకు వాడు ఎల్లప్పుడూ శతప్రయత్నములు చేయుచున్నాడు. కాని ఓ, ప్రభువా, ఈ ఉదయమున నీ పిల్లలకు విశ్వాసమును దయ చేయుము. శత్రువును జయించు శక్తిని దయచేయుము. వారి హృదయములను తెరువుము, వారి ఆత్మను మంచి నేలగా చేయుము, అందులో జీవ వాక్యము విత్తబడవలెను. గొప్ప సంతోషమును, నిండు పంటను దయచేయుము.
ప్రభువా, నీ వాక్యమును, నీ దాసుని నీవు దీవించమని ప్రార్థించుచున్నాను. నా బలహీన స్వరమునకు సహాయము చేయుము. పరిశుద్ధాత్మాభిషేకము ద్వారా నేను బలవంతుడునగునట్లు కృప చూపుము. ప్రభువా, ప్రార్థన వరుసలో నిలబడి యుండగా విశ్వాసమును దయచేయుము. ఈ కూటానంతరము మా మధ్య ఏ ఒక్క బలహీనుడును లేకుండునట్లు చేయుము. ప్రభువా, కృప చూపుము.
మేము అంత్యకాలములో జీవించుచున్నామని ఎరుగుదుము. ఇంకా మేము నీ కొరకు ఎదురుచూచుచూ, నీ వాక్యమును చదువుచుండగా, మమ్మును దీవించుమని అడుగుచున్నాము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.
18ఇప్పుడు, లేఖనములలో నుండి రెండు లేదా మూడు భాగములను చదివెదను; ఈ దినము నేను మాట్లాడు అంశము గూర్చి గత ఆదివారమే ప్రకటించాను: "క్రైస్తవ్యము మరియు విగ్రహారాధన." ఈ ఉదయకాలపు మన అంశము అదే. నేను వేదాంత పండితుడను కాను. బైబిలు విద్యార్థిని కాను — ప్రభువైన యేసును పూర్ణ హృదయముతో ప్రేమించు విద్యలేని వాడిని. నేను గొప్ప పండితుడనని చెప్పుకొనుట లేదు. ఎవరి స్థానమును తీసికొనుట లేదు. పరిశుద్ధాత్మ నాకు బయలుపరచిన సంగతులను దీనముగా వివరించగోరుచున్నాను. దీనిని నా సంఘమునకు తప్పక అందించవలెను. ఈ సంఘము ఎదుగవలెనని నా ఆశ. ఈ ఆలయము ఆత్మ సంబంధముగా సరియైనది. ఈ సంఘముపట్ల దేవునికి శ్రద్ద కలదు. ఆయన శ్రద్దయే నా శ్రద్ద. కావున నేను దీనిని నెరవేర్చవలెను
19ఆది చరిత్రకారుల గ్రంథములలో ఐరేనియస్ ఇంకా తదితరుల గూర్చి చదివాను. వారెట్లు సంఘమును లోకపు సంగతులతో అపవిత్రము కాకుండా కాపాడిరో చూచును. ఆనాటి బోధకులు సువార్తతోనే నిజంగా నిలబడి యుండిరి. ఇప్పుడు మనకున్న రూపములో ఈ బైబిలు వ్రాయబడలేదు. సంస్కరణ కాలము వరకు ఆలాగు జరుగలేదు. లూథరు దానిని ముద్రించెను. కాని వారు దీనిని సువార్త మరియు అపోస్తలుడు అని పిలచిరి. వారు ఆ సువార్త మరియు అపోస్తలుడుతోనే నిలచియుండిరి.
JER 7:10,17
20ఈ ఉదయము రెండు చోట్ల నుండి చదువగోరుచున్నాను, అందులో ఒకటి యిర్మియా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 18వ వచనము వరకు చదువుదము. మరియొక భాగము అపోస్తలుల కార్యములు 7:49. ఈ వాక్యభాగములను వ్రాసికొనండి. మూల అంశము: యిర్మీయా 7వ మరియు 18వ వచనము. 10వ వచనము నుండి ఆరంభించగోరుచున్నాను
అబద్ద సాక్ష్యము పలుకుచూ, బయలుకు ధూపము వేయుచు మీరెరుగని దేవతలని అనుసరించుచున్నారే? అయినను నాదని చాటబడిన ఈ మందిరములోకి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందియున్నామని మీరు చెప్పుదురు; ఈ హేయ క్రియలన్నియూ జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి?
నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగ గుహయైనదా? ఆలోచించండి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు.
నేను మీతో మాటలాడినను, పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నిటిని చేసితిరి గనుక.
నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమైనాదని చాటబడిన ఈ మందిరమునకును మీకును మీ తల్లిదండ్రులకును, నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.
ఎఫ్రాయీము సంతానమగు మీ సహోదరులనందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును.
కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము. వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుము. నన్ను బతిమాలుకొనకుము. నేను నీ మాట వినను.
యూదా పట్టణములలోను, యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా?
JER 7:16,18
21ఈ చివరి వచనమును చదువు ముందుగా, ఆగుదును. మరల ప్రారంభించెదను. దేవుడు ఈ జనులను గద్దించుచున్నాడు. "వారి కొరకు ప్రార్థించవద్దని చెప్పుచున్నాడు." 16వ వచనము నుండి 18వ వచనము వరకు ఇప్పుడు చదువుదము. జాగ్రత్తగా వినండి:
కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను, ప్రార్థననైనను చేయకుము. నన్ను బతిమాలుకొనకుము: నేను నీ మాట వినను.
యూదా పట్టణములలోను, యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా?
నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెననియు, అన్యదేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు. తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు. స్త్రీలు పిండి పిసుకుచున్నారు.
ACTS 7:44,49
22ఇప్పుడు నాతో కూడా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము తీయండి. 44వ వచనము నుండి 50వ వచనము వరకు చదువుదము.
అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను.
మన పితరులు తమ పెద్దలచేత దాని తీసికొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు యెహోషువాతో కూడా ఈ దేశములోకి దాని తీసికొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను.
అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవునికి నివాస స్థలము కట్టగోరెను.
అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను.
అయినను ఆకాశము నా సింహాసనము. భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్త కృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు.
23చదువబడిన లేఖనమును బట్టి ఈ ఉదయకాలము నేను విగ్రహారాధన అను అంశమును వివరించగోరుచున్నాను. విగ్రహారాధన గూర్చి కొద్దిగానే వ్రాయబడెను. విగ్రహారాధనను వివరించుటకు గ్రంథములు ఎక్కువ లేవు. విగ్రహారాధన అనగా ఏమిటో చెప్పగల గ్రంథములు పెక్కులేవు, కానీ ప్రపంచము దానితో నిండియున్నది. దానిని గూర్చి జనులకు నిజంగా వివరించగల విధానము లేదు, అదేమిటో ఎరుగరు. నేను ప్రయాణము చేసినందు వలన, విగ్రహారాధనను చూచాను. అదేమిటో తెలిసికొన్నాను. నా జీవితంలో దీనిని గొప్ప భాగ్యముగా ఎంచుచున్నాను.
గత కొద్ది వారముల నుండి విగ్రహారాధనను గూర్చి అధ్యయనం చేశాను. గ్రీకు పురాణములను, రోమను పురాణములను చదివాను. ఈ విగ్రహారాధన అనునది ప్రారంభమున యున్నట్లే, ఇప్పుడును ఉన్నదని నేను తలంచుచున్నాను. ఆది కాలములో అదెట్లు ప్రారంభమాయెనో చదివాను. అది ఏ మాత్రమును మారలేదని నేను చూచాను.
24నేను ఇండియా దేశములో యున్నాను. ఇండియా దేశము పూర్తిగా విగ్రహారాధన దేశము. నిప్పుల మీద నడిచే వారచ్చటున్నారు. ఒక మధ్యాహ్నము నేను బొంబాయిలో దిగాను. నన్ను ఆ సమయములో తీసికొని వెళ్ళారు. (అక్కడ నాకు ఏమీ తెలియదు, జైనుల మందిరము అక్కడ చూచాను.) పదిహేడు లేదా ఏడు రకముల మతములున్నవి. వాక్యమును సవాలు చేయుటకు నా యొద్దకు పదిహేడు మంది వివిధ మత నాయకులు వచ్చిరి. వారందరూ క్రీస్తుకు బలమైన శత్రువులు. పదిహేడు మతముల వారున్నారు! వారు మా పాదరక్షలు తీసి దేవాలయములోనికి రమ్మని చెప్పిరి. వారు మమ్మును తలగడల మీద కూర్చొబెట్టిరి. అన్ని ఆచారములను మేము దాటుటకు చాలా సమయము పట్టినది. అవన్నీ మేము చూచుట జరిగినది. ఆ పట్టణ మేయరు మమ్మును తీసికొనిపోయెను. అతడు హిందువుడు, మహమ్మదీయ మతమును కూడా నమ్మును.
మహమ్మదు ఒక ప్రవక్త అందురు, ఇష్మాయేలు వంశములో నుండి అతడు వచ్చెను, అబ్రహాము యొక్క కుమారుడే.
25ఈనాడు ప్రపంచములో ఉన్న ప్రముఖ సువార్తికుడు వీరి ద్వారా సవాలు చేయబడెను. వాక్యమును రుజువు చేయుమని వారిలో ఒకడు సవాలు చేయగా ఇతడు పారిపోయెను. నా ఉద్దేశ్య ప్రకారమయితే ఆ సువార్తికుడు ఈలాగు చెప్పవలసి యుండెడిది, "నాకు స్వస్థత వరము లేదు, కాని మా విశ్వాసులకు అది యున్నది. నాకు కొన్ని గంటల వ్యవధి ఇమ్ము, వారిలో ఒకరిని తీసికొని వచ్చెదను." అయితే ఈ సువార్తికుడు ఆ విధంగా చేసి తన సంస్థను బయట పెట్టినచో, ఆ సంస్థ వారు అతనిని త్రోసివేయుదురు, దానికి భయపడెను.
DAN 3:17,18
26దాని గూర్చిన రెండవ ఆలోచన నాకు కలిగినది, దేవుని వాక్యము మీద అవిశ్వాసికి విజయము కలుగునని నేను నమ్ముట లేదు. నేను ఓడిపోయినా గాని, అక్కడే ఇంకా నిలబడియుండి, నా విశ్వాసమును చూపించుదును. మారని దేవుని యందు నమ్మిక యుంచుదును. హెబ్రీ పిల్లలు ఇట్లు చెప్పిరి, "ఈ మండుచున్న అగ్ని గుండములో నుండి మా దేవుడు మమ్మును తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పింపక పోయినా గాని, మేము నీ విగ్రహమునకు మాత్రము నమస్కరింపము." అది చాలా ధైర్యము గల మాట అని నేను నమ్ముచున్నాను.
27అతడు గొప్ప సువార్తికుడు, వేదాంతములో డాక్టరు డిగ్రీ యున్నది, లేఖనము చాలా బాగుగా తెలియును — చాలా గొప్ప వ్యక్తి — నేనయితే వాక్యము విషయములోను, యేసు, క్రీస్తా కాదా అను విషయములోను మహమ్మదు ప్రవక్త అయితే రుజువు చేయమని నేను సవాలు చేయుదును. సువార్తికుడయితే బైబిలును వివరించి నిరూపించవలసిన అవసరమున్నది. పారిపోవుటకు బదులుగా, నేను ఆ పనినే చేసి యుందును. నిజమైన క్రైస్తవ ధైర్యము అదే. బ్రదికినా, చనిపోయినా దేవుని కొరకు నిలబడవలసియున్నాము. దేవుడు విడిపించగల సమర్థుడు. ఆ సమయములో దేవుని హస్తము కొరకు ప్రార్థించి యుందును.
28బొంబాయిలో గ్రుడ్డివాడు చూపు పొందిన సంగతిని వారు మరచి పోయిరి. (మహమ్మదీయులు), మరిచిపోయిరి. ఆ రాత్రి కూటములో అతడు చూపు పొందెను, దానిని వారు ప్రస్తావించలేదు.
ఏది ఏమయినా గాని ఈ జనులు వేషధారులు కారు. వారు వాస్తవము కొరకు ఎదురుచూచుచున్నారు. నీ వలె, నా వలె వారు యధార్థవరులు. అమెరికాలోని వీరికంటె వారు ఎంతో యధార్థవంతులు. వారు వేషధారులు కారు. వారు నిజంగా నమ్ముదురు, వారు నమ్మకముగా ఆచరించుదురు.
29విగ్రహారాధన గూర్చి కొద్దిగా చెప్పెదను. ఆ దేవుని పేరు మరిచిపోయాను, వారు ఆ దేవుని పేరు మీద నిప్పుల పైన నడిచిరి. అది పెద్ద విగ్రహము. మానవ ముఖము వలెనె యున్నది. వారి పాపములన్నియూ వినుటకు పెద్ద చెవులు ఆ విగ్రహమున కున్నవి. పెద్ద చెవుల రింగులున్నవి, చాలా ఖరీదయిన రాళ్ళతో చేసిరి. ఒక్కొక్కటి దాదాపు అర-మిలియను ఖరీదు ఉండును. ఈ అంచనా తక్కువ కావచ్చు లేదా ఎక్కువ కావచ్చు. కాని ఆ విగ్రహమునకు అంత వెల గల అభరణాలు అమర్చిరి.
30ఆలయపు మతగురువు ఒక పేద వ్యవసాయకుడు. అతడు ఏమీ ప్రత్యేకమైన వ్యక్తి కాడు. ఒక సామాన్య మనిషి. ఆ సామాన్య రైతు తనకు బాగుగా పండిన పంటను కానుకగా ఆలయమునకు తీసికొని వచ్చి వందనములు చెల్లించుచుండెను. ఆ విధముగా అతడు వారి దేవుని యందు విశ్వాసమును చూపించుచుండెను. దేవాలయమునకు వచ్చి పూజలు చేసి దీవెనలను పొందగోరును.
కణకణమని మండుచున్న నిప్పుల మీద నడచుటకు సిద్ధపడుచుండెను. అది చాలా అడుగుల లోతుగాను, చాలా అడుగుల వెడల్పుగాను ఉండెను. బాగా గాలి విసరుచుండిరి, నిప్పులు మెరయుచున్నవి. ఇది అతిశయోక్తి కాదు — అది సత్యము. అతడు విగ్రహము ఎదుటకు వెళ్ళుచున్నాడు. తన పాపములను పూజారికి ఒప్పుకొనుచున్నాడు. వారతని మీద నీళ్ళుపోయుచున్నారు — అది పవిత్ర జలమనిరి, మరియు ఆ విధముగా. దానిని పూజారి ఆశీర్వదించెను.
31వారు ఒక పెద్ద గాలపు ముల్లును తీసికొనిరి, అది చేపలను వేటాడు పెద్ద ముల్లు, దాదాపు అరంగుళము లేదా ముప్పాతిక పొడవుండును. చాలా సూది మొన కలిగిన గాలపు ముల్లు. వారు ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టిరి. క్రిస్మసు చెట్టుకు అలంకరణ చేసినట్లు అది యున్నది. నీటి బంతి వలె అది బరువుగా యున్నది. అక్షరాలా అటువంటి వాటిని వేల కొలదిగా తీసికొని తమ శరీరములకు గుచ్చుకొని బయటకు లాగుచుండిరి. వారావిధముగా చిత్రహింసలు పొందుచుండిరి. వారి దేవుడు, అనగా ఆ విగ్రహము ఆనందించునని వారనుకొనుచుండిరి. వారు వేషధారులు కారు.
32వారు చాలాసార్లు తమ నాలుకను బయటకు చాచుచుండిరి. వారి నాలుకలను సూది మొనగల ఇనుప దండముతో గుచ్చుకొనుచుండిరి. తమ నాలుకను, ముక్కను ఆ విధముగా గుచ్చుకొనుచుండిరి. ఆ రెండింటినీ కలిపి కుట్టుకొనుచుండిరి. సూది దారముతో కుట్టుకొనుచుండిరి. తాము చేసిన తప్పుకు అదే శిక్ష అనుచుండిరి. ఎట్టి చిత్రహింసయో చూడండి!
ఈ మహా అగ్నిగుండము ప్రక్కన వారు కూర్చొని యుండిరి. విగ్రహమునకు అర్పించుటకు వారు ఒక మేకను చంపిరి. తమ పాపపరిహారము కొరకు ప్రాణిని చంపిరి. ఆ చంపబడునప్పుడు, మేక ఎట్లు అరిచెనో మీరు వినవలసినదే గాని చెప్పలేను. వారు దాని మీద తమ పాపములను మోపిరి, మేకను చంపిరి. రక్తమును ప్రాయశ్చిత్తముగా అంగీకరించిరి.
33అగ్ని మీద నడచు వ్యక్తి గాని భయపడి పారిపోయిన యెడల అతని మీదికి నింద వచ్చును. అతడు ఈ నిప్పు కణముల మీద మెల్లగాను, నిలకడగాను నడువవలెను. కొన్నిసార్లు ఆ నిప్పులు పదిహేను అడుగుల లోతుండును. దాదాపు పదిహేను అడుగుల లోతుగాను, ముప్పది లేదా నలుబది గజముల వైశాల్యములోను అగ్ని ఉండినది. అది దాదాపు ఎనిమిది లేదా పది అడుగుల వెడల్పుగా ఉన్నది. అవి కణకణమని మండుచున్నవి. అతడు చిన్న పంచె చుట్టుకొనియుండెను. మరేమీ వస్త్రములు లేవు. గాలపు ముల్లులు గుచ్చుకొనుట వలన శరీరమంతా రక్తమయమై యుండెను. దేహమంతయూ గాయములతో నిండి యుండెను. అతని నోటిలో నుండి తెల్లని నురుగు వచ్చు వరకూ, వెర్రిగా కష్టపడెను చాలా భయంకరముగా కనిపించెను.
అతడు అగ్నిగుండము గుండా నడచి వచ్చుచుండెను. అటు నుండి ఇటుకు, ఇటు నుండి అటు వైపుకు ఏమీ బాధపడకుండా వచ్చుచుండెను. అతని కాళ్ళు చాలా లోతుగా దిగిపోవుచున్నవి. (పాదములే కాదు) నడచుచుండగా కాళ్ళు రెండడుగుల లోతునకు పోవుచుండెను. ఆ మానవ శరీరమును ఎర్రని నిప్పు కణములు కాల్చుచుండెను. ఆ అగ్ని మీద నుండి ఏమీ బాధపడకుండా నడిచి వెళ్ళుచుండెను. అతని పాదములను మీరు చూచినచో అసలు గాయము గాని, బొబ్బ గాని ఏమీయూ లేదు.
దానిని చూస్తూ, నేను ఆలోచించసాగాను, అన్యులు విగ్రహమునకు బలి ఇచ్చుచున్నారు, మేక యొక్క రక్తముతో అలంటి దానిపై విశ్వాసము ఉంచి, అగ్ని వారిని కాల్చకుండా రక్షించినచొ; అయితే సజీవ దేవుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన విశ్వాసికి ఆయన రక్తములో ఇంకెంత కాపుదల యుండునో గదా? అనుకొంటిని.
34ఇప్పుడు, విగ్రహారాధన అనునది చాలా వింతైనది. తరతరముల నుండి అది మనకున్నది. కాలారంభము నుండి అది ఉన్నదని తలంచుచున్నాను. ఈ విగ్రహారాధనకు ఒక క్రమమున్నది. ఒకడు విగ్రహమును నిలబెట్టును, విగ్రహమును బిగించును, ఈ గొప్ప ఆరాధన చేయుటకు తన్నుతాను సిద్ధపరచుకొనును. ఇప్పుడు, ఏదో ఒక దైవము యొక్క స్వరూపమే ఈ విగ్రహమని అతడు తలంచును. ఆ దైవమును అతడెన్నడును చూడలేదు. అది నిరాకారముగా యున్నది, ఆ దైవము ఈ విగ్రహములో యున్నదని అతడు నమ్మి ఈ దేవునిని పూజించును.
ఇప్పుడు, మీరు దీనిని మరువరాదు! ఆ స్వరూపము ఈ విగ్రహములో యున్నదని అతడు నమ్మును.
అది పురాణములోని దైవమని తలంచును, ఆ తరువాత ఇతడు ఆ విగ్రహము ఎదుట సాష్టాంగపడును, అదృశ్యుడగు దేవుడు ఈ విగ్రహములోనికి వచ్చునని అతడు నమ్మును. ఈ విగ్రహము ద్వారా అతడు దేవునితో మాట్లాడగలననుకొనును. ఆ దైవము ఈ విగ్రహములోనికి వచ్చి జవాబు ఇచ్చుననుకొనును. ఇక్కడ చాలా మంది వేదాంత విద్యనభ్యసించిరి. ఆ దైవములకు కూడా యుద్ధములయినవని వారందురు. ఆ రోజులలో వారు ఒకరితో ఒకరు యుద్ధము చేసికొనిరని చెప్పెదరు.
ఇప్పుడు, ఇంకో విధంగా చెప్పెదను, ఆ దేవుడు ఈ విగ్రహములోనికి వచ్చి అసాధారణమగు క్రియలు చేయునని నమ్ముదురు. ఈ విగ్రహము ద్వారా ఆ దేవుడు ఆరాధకునితో మాట్లాడునని నమ్ముదురు. ఆరాధికుడు, ఒక విధమగు ఉద్రేకమును కలిగి యుండును, విగ్రహము తనతో మాట్లాడునని నమ్మును, అతని హృదయముతో మాట్లాడును, మరియు అతని పాపములకు క్షమాపణ దొరకును అని నమ్మును. ఈ విగ్రహము అపవాది అని తేటగా బయలుపడుచున్నది. దీనిని చేయునది అపవాదియే.
35వారు త్వరపడి ఈ కార్యములను చేయరు. వారిలో కొందరు ఆలాగు చేయుదురు, కాని కొందరు వాటిని నిజముగా ఆరాధించెదరు. ఆ విగ్రహములలోయున్న దయ్యములు ఎట్లు కార్యములు చేయునో ఎన్నో ఉదాహరణలు చెప్పగలను, రక్తము కారునట్లుగా చేయును, మరియు ప్రతియొక్కటి. అవి దయ్యములు!
నిజముగానే అపవాది యున్నది. దేవుడున్నాడని మీరు నమ్ముచున్నారు గదా? ఆ విధంగానే దానికి వ్యతిరేకమైనదియు ఉన్నదని నమ్మి తీరవలెను. నిజమగు అపవాది యున్నది, మరియు వాడు ఒక వ్యక్తి. ఒక ఆలోచన కాదు; అతడు ఒక వ్యక్తిగా ఉన్నాడు.
"అపవాది అనగా, నీ యొక్క చెడు ఆలోచనయే," అను ఒక బోధ, ఇప్పుడు మనము వినుచున్నాము. లేదు, లేదు, అది కాదు. అపవాది ఒక వ్యక్తి.
ఒక మంచి ఆలోచనయే పరిశుద్ధాత్మ అని కూడా వారు బోధించుచున్నారు. కాని మీరు దానిని నమ్మవద్దు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. అది ఆత్మ స్వరూపములో యున్న క్రీస్తు వ్యక్తిత్వమే.
36(ఈ సందర్భములో కొన్ని లేఖనములను నేను తీయగోరుచున్నాను. కావున మీరు సిద్ధముగా యుండండి.) ఈ విగ్రహారాధికులు బొమ్మ ముందు సాగిలపడుదురు. తాము ఆరాధించుచున్న దేవతకు ఈ బొమ్మ ప్రతినిధియని వారు తలంచెదరు. ఆరాధికుడు వేషధారి కాడను విషయమును మీరు గుర్తుంచుకొనవలెను. అతడు నిజంగానే ఈ విగ్రహంలో ఒక శక్తిని పట్టుకొనియున్నాడు, ఎందుకనగా విగ్రహములో యున్న శక్తిని ఇతడు పొందును, అతడు ఎదో చేయును; అది తప్పుడు-దైవము, నిజమైనది కాదు.
చాలాసార్లు అపవాది ఆ విగ్రహములలో దూరును. కొన్నిసార్లు అపవాది కూటములలో చొరబడి, దేవునివలె అనుకరణ చేయును. నా సేవలో నేను దీనిని చూచాను.
37ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఈ ఉదయము పాఠము చెప్పుచున్నాను. ఇక్కడి సంఘ కాపరితోను, ఇక్కడ చెప్పబడుచున్న పాఠములతోను ఈ సంఘస్థులు నిలచి యుండవలెనని కోరుచున్నాను. నేను సేవ కొరకు విదేశములకు వెళ్ళవలసియున్నాను. ఈ వాక్యముతో నిలచి యుండుడి, దీనిని విడిచిపెట్టరాదు! ఏది ఏమయినా గాని మీరు మాత్రం వాక్యముతోనే నిలచియుండండి. దేనినీ లెక్క చేయవద్దు. వాక్యమునే పట్టుకొనండి. నేను ఈ సంఘ కాపరులలో ఒకడిని. నేను చెప్పిన దానినే సహోదరుడు నెవిల్ బోధించును, ఆలయమునకు వచ్చి వాక్యమును వినుడి.
ఆయన ఎక్కడికి నన్ను నడిపించునో నాకు తెలియదు. ఈ ఉదయము బల్ల యొద్ద నేను నా భార్యతో ఇట్లు చెప్పాను, "ఇన్ని సంవత్సరముల నుండి నాలో ఏదో కేక వేయుచున్నది. అదేమిటో కనుగొనుటకు నేను వెళ్ళుచున్నాను." అది ఎటు వైపు నడిపించునో నేనెరుగను; కాని ఆయన నన్ను నడిపించుచోటునకు నేను వెళ్ళెదను.
38నేడు ఇంకా విగ్రహారాధన యున్నది. జనులు బలిపీఠము యొద్దకు వచ్చుచున్నారు. గ్రుడ్డి బోధకులు గ్రుడ్డి దానిని బోధించుచున్నారు. అంతా మరచిపోయి మీ మనసును ఖాళీగా యుంచుకొనండని వారు చెప్పుచున్నారు. మీరు ఏలియా వలె లేదా మరొకరి వలె మారెదరని అనుచున్నారు. ఎంత అబద్ధము! మీరు దేవునికి చోటియ్యక, మీ హృదయమును తెరచిన యెడల అన్ని రకముల దయ్యములు అందులో ప్రవేశించును. ఆలాగును చేయరాదు. అపవాది యున్నదను సంగతిని మీరు మరువరాదు, వాడు అక్షరాలా క్రీస్తును అనుకరణ చేయును.
ROM 11:29
39నేను కొంత సమయమునకు ముందు, పరిశుద్ధ మార్టిన్ జీవిత గాథ చదువుచున్నాను. అతడు బాలుడుగా ఉన్నప్పుడు నిజంగానే ఒక సన్యాసి. దేవుడతనిని ప్రవక్తగా యుండుటకు పిలచెను. నేను ఆలాంటి ప్రవక్తలలో ఒకనిని గనుక నా మాట వినుమని అతడు చెప్పెను. మార్టిన్‌తో సహా ఎవరూ అటువంటి కార్యమును ముందు వినియుండలేదు. మనుష్యులు అతనిని నమ్మలేదు, ఎందుకనగా అతని జీవితము అందుకు సరిపోలేదు. కాని చివరిగా అతడు తాను వృద్ధ ప్రవక్తనని అతడికి రుజువు చేయుదునని చెప్పెను. కేవలము ఆ యువకుడు చెప్పెను, "కాని నేను పిలువబడియున్నాను."
చూడండి, "వరములు మరియు పిలుపులకు మారుమనస్సుతో సంబంధము లేదు." చూడండి, వారు వాక్యమును మీరియున్నారు; వాక్యమును దాటిపోయినచో, ఏమైనా జరుగును.
40ఈ రాత్రికి, అనగా "అర్థరాత్రికి దేవుడు నాకు ఒక తెల్లని వస్త్రము ఇయ్యబోవుచున్నాడు గనుక నేను మీ మధ్య కూర్చొని ప్రవక్తగా కనుపరచుకొందునని," అతడు చెప్పెను. ఆ రాత్రి వారందరూ వినుచుండిరి. ప్రజలు గుసగుసలాడుకొనుచూ వచ్చుచుండిరి. ఆ బాలుడు తెల్లని అంగీని పొందెను. వారందరూ దానిని చూచిరి. అది నిజమైన తెల్లని అంగీ. చాలా మంచిగా కనబడినది. వచ్చిన వారందరూ దానిని చూచిరి.
కాని ఆ ముసలి బిషప్పుకు ఇది అర్థము కాలేదు. అది అతనికి సరిగా కనబడలేదు, ఎందుకనగా అది లేఖనానుసారముగా కాదు (తెల్లని అంగీ).
ఈ అంగీని తీసికొని దైవజనుడగు పరిశుద్ధ మార్టిన్ ఎదుట నిలబడమని అడిగిరి, కాని అందుకతడు ఒప్పుకొనలేదు. ఆ నిజమగు ప్రవక్త ముందు నిలబడు ధైర్యము లేదు. వారతనిని బలవంతముగా తీసికొని వచ్చిరి. అతని యొద్దకు రాగానే ఆ వస్త్రము మాయమైపోయెను, అదెక్కడికి వెళ్ళెనో వారికి అర్థము కాలేదు. చూడండి, అసలయిన పరీక్షకు తీసుకోని వచ్చినప్పుడు!
MATT 16:18
41నీ యొద్ద నిజమగు బంగారమున్నచో, అది మంచిదో కాదో అని నీవు ఏమీ దిగులుపడనవసరము లేదు. అది కొలిమిలో రుజువగును. నిజమగు దేవుని ఆత్మ శోధనను జయించును, ఎందుకనగా అది దేవుని వాక్యముతో శోధింపబడినది. "ఈ బండ మీద నేను నీ సంఘమును కట్టుదును."
మంచి జనులు కూడా కోపపడుట నేను చూచాను. (ఈ టేపు ఎందుకు అమ్మరాదని చెప్పానో, ఇప్పుడు మీకు అర్థమై యుండును.) మంచి జనులు, పెంతెకోస్తు వారు, సంఘ కాపరులు అర్థము చేసికొనలేకపోవుట నాకు కనబడుచున్నది. వారు గందరగోళములో పడిపోవుచున్నారు. అయోమయంగా ఉంటున్నారు. అటువంటి కార్యములే చేయచున్నారు. చివరకు వారు పిచ్చాసుపత్రికి పరుగిడుచున్నారు. వారు తమ హృదయములను తెరచుచున్నారు, వారు అమాయక ప్రజలు, దయ్యములు వచ్చి వారికి ఆవరించుచున్నవి. అది నిజమైన దయ్యము.
42ఐరేనియస్ మరియు మార్టిన్‌ల గురించి చదివి యున్నాను. (ఈ విషయములో నా కంటె ఇంకా ఎక్కువగా తెలిసిన విద్యార్థులు చాలామంది ఇక్కడున్నారు), అతని మీద బంగారు కిరీటమున్నది, తెల్లని వస్త్రము ధరించెను, బంగారపు చెప్పులు ధరించెను. అతడు వచ్చి, "నేనే క్రీస్తును గనుక ఒప్పుకొనుమని," చెప్పెను. ఆ పరిశుద్ధుడు దానిని వినలేదు. దేవుని యొక్క నిజప్రవక్త అక్కడ నిలబడియుండెను, కనిపెట్టి చూచుచుండెను. "నేను క్రీస్తును గనుక నన్ను ఒప్పుకొనుమని," రెండు లేదా మూడుసార్లు
అతడు పలికెను, "మా క్రీస్తు ఆలాగున రాడు" అని అతడనెను.
అది నిజము, మీకు వాక్యము తెలిసియుండవలెను! వాక్యముతోనే నిలచి యుండుము. చూడండి, గొప్ప యుద్ధము సమీపించుచున్నది. సంవత్సరాల తరబడి సంఘమును నడిపించుచున్నాము, కాని ఇప్పుడు ఆ ఘడియ వచ్చి యున్నది. బైబిలు చెప్పినట్లుగా యన్నే యంబ్రేలు మోషేను ఎదిరించిరి. వారు మరల వచ్చుదురని చెప్పబడినది. ఇది ఆత్మ సంబంధమగు యుద్ధము మరియు పోరాటము. నీతిమంతులు కొందరు ఉండక మానరు. శాఖాసంబంధమగు సంఘము అన్నింటినీ అధిగమించును. ఎప్పటి వలెనె అది ముందుకు పోవును. కాని నిజమగు విశ్వాసి ఆ పోరాట రంగములో కొనసాగునని నేను చెప్పుచున్నాను. నీవేమి చేయుచున్నావో తెలిసికొనియుండవలెను. నీవు నీకు తెలియకుండానే దురాత్మను స్వీకరించెదవు. ఈ వాక్యమునకు విరోధమయిన దానిని విశ్వసించవద్దు! వాక్యముతోనే నిలచి యుండుము!
43విగ్రహారాధన చాలా పురాతనమైనది. ఈ అమెరికా దేశములో కూడా అది పురాతనమైనదే. చాలా సంవత్సరమురాల క్రితమే ప్యూబ్లో ఇండియనులు ఆరిజోనాలో ఉండిరి. వారికి ఒక విగ్రహారాధన యున్నది. వారికి ఒక వాన దేవుడు ఉన్నాడు. వారు మట్టి తాబేలును తీసికొని ఒక రూపమును తయారు చేసిరి. తాబేలు విగ్రహమును వారు తయారు చేసిరి. అది మట్టిలో నుండి వచ్చినప్పుడు ఎట్లు మచ్చలు మచ్చలుగా యుండునో ఆలాగుననే దానికి బొట్లు పెట్టిరి. వారు ఈ నీటి తాబేలు యెదుట సాష్టాంగపడిరి. వాన దేవుడు ఈ మట్టి తాబేలు యొక్క గుల్లలోనికి వచ్చి, దాని ద్వారా వారితో మాట్లాడునని వారు నమ్మిరి. వారి దేవుడు ఈ బురదలోను, తేమలోను జీవించెను. ఎందుకనగా అతడు వాటిపైన దేవునిగా యుండెను అని వారు నమ్మిరి. అది ఒక కట్టు-కథ. అది ఒక మూఢ నమ్మకము, కేవలము అదే నిజమని నమ్మిరి.
వారావిధముగా దయ్యములను ఆరాధించుచుండిరి. వారు మట్టి తాబేలును ఆరాధించుచుండిరి. అది వానదేవుడని వారు తలంచిరి. వారి మీదికి ఆత్మ వచ్చును. నిశ్చయంగా! ఎందుకనగా వారు దానికి తమ హృదయములను తెరచిరి. కాని అది తప్పుడు ఆత్మయై యున్నది.
44ఈనాడు చాలామంది జనులు దురాత్మకు తమ హృదయములను తెరచుచున్నాడు. నీకు ఆత్మ వచ్చియున్నది, కాని చాలాసార్లు అది వాక్యమునకు విరోధముగా యుండినది. అద్భుతములు జరుగు దినములు అయిపోయినవనియు, ఇది లేదు, అది లేదు అనియు వారందురు. గుర్తుంచుకొనండి, అది క్రైస్యవ్యపు ముసుగులో యున్న దయ్యము. దీనిని మనము అర్థము చేసికొనుటకు దేవుడు సహాయము చేయును. మీరు దానిని చూడవలెను. క్రైస్తవ్యపు ముసుగులో దురాత్మ పనిచేయుచున్నది. కాని అది క్రీస్తు ఆత్మ కాదు, ఎందుకనగా క్రీస్తు యొక్క ఆత్మ ప్రతిసారి వాక్యమునే ఎత్తి చూపును. ఆయన తన స్వంత వాక్యమును కాదనడు.
45ఇప్పుడు, క్రైస్తవ్యము రోమ్ యొద్దకు వచ్చినప్పుడు — రోమ్ లోపట ఏడు మైళ్ళ పొడవుగల గోడ లోపలనే, నాలుగువందల అన్యదేవాలయములు ఉండినవి. నాలుగువందల అన్య దేవాలయములున్నవి. దేవతలకు, దేవుళ్ళకు వారా దేవాలయములను నిర్మించిరి. దేవుళ్ళు మరియు దేవతలు. స్త్రీలు మరియు పురుషులు. నాలుగువందల మంది దేవుళ్ళుండిరి. ఆలోచించండి, నాలుగు వందలమంది!
ఇప్పుడు, పౌలు రోమ్ యొద్దకు వచ్చినప్పుడు వీటిని కనుగొనెను. అకుల మరియు ప్రిస్కిల్ల అనువారిని అక్కడికి పంపెను.పెంతెకోస్తు తరువాత వారచ్చటికి వెళ్ళిరి. రోమ్‌లో ఒక సంఘమును స్థాపించిరి. వారందుకే వచ్చిరి. విగ్రహారాధన అక్కడ ఎక్కువగా యుండెను. రోమ్‌లో దాదాపు రెండు మిలియనుల మంది జనులుండిరి, రోమ్ మెట్రో పాలిటన్ నగరము — ఆ నగరమునకు వెలపట బానిసలుండిరి, దాదాపు రెండు మిలియనల మంది జనులుండిరి. రోమ్ చుట్టూ ఉన్న గోడలు ఏడు మైళ్ళ పొడవున్నవి. ఆ ఏడు మైళ్ళ లోపట నాలుగు వందల అన్యదేవాలయములున్నవి, అవి కొండ దిగువన ఉన్నవి, అవి అన్య దేవతలు మరియు దేవుళ్ళు.
46చరిత్రలలో నేను చదివిన కొన్ని విషయములను ఇచ్చట చెప్పగోరుచున్నాను, ఒక సంగతిని వినండి. వారే విధముగా ఆరాధనలో ప్రవేశించెడివారు? వారెట్లు ఆరాధన జరిపెడివారు? అన్యుడు ఎట్లు ఆరాధించెడివాడు? మొదటగా అతడు ఆలయమునకు వెళ్ళి పూజరిని కనుగొనును. అతడు అన్యపూజారి. అతనికి కొంత డబ్బును అర్పణగా చెల్లించెడివాడు. ఆ తరువాత ఒక జంతువును బలిగా అర్పించెడివాడు. తాను మాట్లాడనై యున్న దేవునిని సంతోషపరచుటకే ఆలాగు చేసెను.
కొన్నిసార్లు కొన్ని దేవాలయములలో ఒకటి కన్న ఎక్కువ విగ్రహములుండును, దేవుళ్ళు మరియు దేవతలు ఉండిరి, అందరూ ఒకే దేవాలయములో ఉండిరి.
ఆరాధికుడు అన్యపూజారి యొద్దకు వెళ్ళి కొంత డబ్బు ఇచ్చును. అన్యపూజారి అతనికి ఒక క్రొవ్వొత్తిని ఇచ్చును. అది ఒక మామూలు క్రొవ్వొత్తి. ఆరాధికుడు ఆ క్రొవ్వొత్తిని తీసికొని ఆ దేవుని యొక్క బలిపీఠము యొద్దకు వెళ్ళును. అతడు పూజారికి కానుక ముందే చెల్లించెను. అతడు ఆ దేవతతో మాట్లాడగోరును. ఈ బలిపీఠము మీద అగ్ని యున్నది. అక్కడే బలిని దహించెను. ఆ విగ్రహము యొక్క పాదముల యొద్ద ఈ క్రొవ్వొత్తిని వెలిగించి పెట్టెదరు. అది పెద్ద ఇత్తడి విగ్రహము లేదా కంచు విగ్రహము. దాని పాదముల యొద్ద దీనిని పెట్టెదరు.
47ఎన్నో దేవతలు వారికున్నవి, కాని ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమగు దేవతయుండును. ఆ విగ్రహములోనికి దేవుడు వచ్చునని వారు నమ్ముచుందురు. దేవుడు ఆ విగ్రహములోనికి వచ్చి, దాని ద్వారా తనతో మాట్లాడునని నమ్మును. ఆ క్రొవ్వొత్తి ఎందుకో నాకు తెలియదు. కాని అతడు క్రొవ్వొత్తిని వెలిగించి క్రింద పెట్టును, బలిపీఠము మీద అది వెలుగుచుండును.
అతడు ఆ తరువాత మందిరపు వెనుక స్థలములోనికి వెళ్ళును. అతడు ఆ నేల మీద సాష్టాంగపడును. తన ఆత్మనంతటినీ, తన బలమునంతటినీ అతడు అక్కడ కుమ్మరించి ప్రార్థన చేయును. అది ఒక మూఢ నమ్మకము, అది ఒక కల్పిత దైవము. ఆ దేవుడు ఈ విగ్రహములోనికి వచ్చి దాని ద్వారా తనతో మాట్లాడునని నమ్మును.
48అపొల్లో విగ్రహము ముందు మహాచక్రవర్తి ఒకరు ఈలాగున సాష్టాంగపడినప్పుడు ఆ విగ్రహము నిజంగా మాట్లాడినట్లు చరిత్రలో చెప్పబడినది. సాష్టాంగ నమస్కారము!
"అతడు స్వరమును వినెనా? బ్రెన్‌హాం సోదరుడా," అని మీరు ప్రశ్నించ వచ్చును. ఆ విషయములో నేనేమీ సందేహపడలేదు, కాని అది అపవాది యొక్క స్వరము. జూపిటర్ అను దేవుడుగాని, ఇంకా ఈ ఇతర దేవతలు గాని లేవు.
వారు సాష్టాంగపడిరి, వారక్కర పడియుండి ఆరాధించిరి, ఈ మర్మయుక్తమగు దేవునికి పూజలు చేయుచుండిరి. ఆ దేవుని గూర్చి వారికేమీ తెలియదు, కాని ఆ దైవాత్మ ఈ విగ్రహములో యున్నదని వారు తలంచిరి. వారందుకే ఆ బొమ్మను తయారు చేసిరి, అది వారికి మేలు చేయునని తలంచిరి.
49వారు ఒక అర్పణను అర్పించెదరు. అతడు మహా ఉద్రేకముతో పని చేయుచుండును. విగ్రహము ముందుకు వెళ్ళును. ఈసారి ఈ అన్యపూజారి కొంత తీపి పదార్థమును, ఒక రకమగు పానీయమును ఇచ్చును. దానిని విగ్రహము యొక్క పాదముల యొద్ద పెట్టుదురు. (నేనిది ఇక్కడ వ్రాసి ఉంచాను. దానిని చదువుచున్నాను, చూచారా.) ఈ విగ్రహము యొక్క పాదముల యొద్దకు అతడు వచ్చును. ఈ పానీయమును కొద్దిగా త్రాగును. ఆహారమును కొద్దిగా భుజించును. ఆ మిగిలిన దానిని విగ్రహము యొక్క పాదముల యొద్ద పోయును.
అతడు చేయుచున్నది ఏమిటి? దయ్యములతో సహవాసము చేయుచున్నాడు. అపవాదితో భోజనము చేయుచున్నాడు. దేవతలతో సంభాషించుచున్నాడు. క్రైస్తవుడు క్రీస్తుతో సహవాసము చేయుటకు ఇది పోలికగా యున్నది. ప్రభురాత్రి భోజనము వలె యున్నది. మొదటి సంఘము లేదా మొదటి సువార్త యాత్రికులు రోమ్‌కు వచ్చినప్పుడు ఇటువంటి ఆరాధనను వారు చేయుటనే కనుగొనిరి.
50బయలు చాలా పేరు పొందిన దేవత. అన్ని కాలములోను, అన్ని విగ్రహముల కంటెను బయలు ప్రసిద్ధి పొందెను. (బయలు) అది సూర్య-దేవుడు. అతనికి ఒక భార్య యున్నది. అదే చంద్ర-దేవత. ఆష్టారోతు దేవత. ఆష్టారోతు. దానినే అష్టార్తే అని కూడా పిలచిరి. రోమను నాణెము మీద అది ఉన్నది. ఆమెను చంద్ర-దేవత అని పిలచిరి. ఆకాశ రాణి లేదా దైవములకు తల్లి అనిరి, చంద్ర-దేవత; సూర్య-దేవుడు, బాలిమ్.
దాదాపు అన్యులందరూ సూర్యుని ఆరాధించిరి. ఇండియనులు కూడా అదే ఆరాధన చేయుచుండిరి. మనము వచ్చి ఈ అమెరికాను కనుగొన్నాము. మొదటగా మన పితరులు వచ్చిరి. వారు వచ్చు సరికి సూర్యుని ఆరాధించు వారు అక్కడ యుండిరి. వారి ఆరాధన ఆలాగే యుండినది.
రోమ్‌లో కూడా వారు దేవుళ్ళను, దేవతలను ఆలాగే ఆరాధించుచుండిరి. క్రైస్తవులు వచ్చు సరికి రోమ్‌లో ఆలాగే వారుండిరి.
JER 7:18
51ఇప్పుడు, నా పర్యటనలో, ఆ విగ్రహారాధనను నేను చూచాను, అదేమీ మారలేదు. నిజక్రైస్తవ్యము కూడా ఆలాగే మారలేదు. ఆ రెండూ ఆ విధంగానే యున్నవి. ప్రభువైన యేసు వచ్చువరకు ఆలాగుననే యుండును. దీని మీద నేను కొద్దిగా మాట్లాడగోరుచున్నాను, కావున మీరు దానిని గ్రహింపగలరు; మీరు ఆత్మ సంబంధులయినచో, దానిని తప్పక గ్రహింపగలరు.
బయలు అనగా సూర్య-దేవుడు, యిర్మియా దానిని గూర్చి చెప్పెను. కొద్ది క్షణముల క్రితం దానిని మనం చూచాము. స్త్రీలు బయలునకు పిండి వంటలు తయారు చేయుచుండిరి. సూర్య-దేవునికి తయారు చేసిరి. అదే అధ్యాయములో ఇంకా మీరు క్రిందికి చదివినచో, విషయము అర్థమగును. "బయలును పూజింపని యెడల పంటలు పండవని వారనుకొనిరి," ఎందుకనగా బయలు ఫలవంతము చేయు దేవత. మరో రకంగా చెప్పవలెనన్నచో, "సూర్యుని వలననే పంటలు ఎదుగును."
కాని ప్రవక్త చెప్పినది వినండి, "మీరు దేవుని మరచిపోయిరి గనుక మీ పంటలు ఎదుగుట లేదని" ప్రవక్త పలికెను.
కాని మీరు బయలును ఆరాధించిరి, వారు ఆరాధించి, బలులు దానికి అర్పించిరి.
JER 7:18
52(దీనిని గమనించవలెను, ప్రతి మాటను గ్రహించవలెను. ఆలాగయితేనే మీకు వర్తమానము యొక్క చివర అర్థమగును.) బయలు దేవత గుండ్రముగా నుండును, సూర్యుడు గుండ్రముగా యుండినట్లే. వారియొద్ద పెద్ద ఇత్తడి ప్లేటులుండెను, అది సూర్యుని ప్రతిబింబించుచుండెను, అగ్ని వలె కనిపించుచుండెను. యిర్మియా ఇక్కడ చెప్పిన విధంగా స్త్రీలు బయలుకు పిండి వంటలు చేయుచుండిరి, అవి సూర్యుని వలె గుండ్రముగా యుండెను. వాటిని బలిపీఠము మీద పెట్టిరి, అది అన్యుల బలిపీఠము, అది వారి భోజనము. సూర్యుని వలె లేదా చంద్రుని వలె గుండ్రని పిండి వంటలను వారు తయారు చేసిరి, ఎందుకనగా అవి సూర్య-దేవునికి లేదా చంద్ర-దేవునికి నిదర్శనములు.
53సమస్త అభివద్ధికి అది దేవతయనియు, అన్నింటినీ అది ఎదుగునట్లు చేయుననియు వారు నమ్ముచుండిరి.
ఇప్పుడు, ఆది సంఘము రోమ్ యొద్దకు వచ్చినప్పుడు వారు దీనిని ఎదుర్కొనిరి. దానిని రోమను సంఘము నమ్మినది. ఈనాడు కూడా రోమను కాతలిక్కు సంఘము దానిని నమ్ముచున్నది. దానిని "కాతలిక్కు" అని పిలచిరి.
మనందరమూ కాతలిక్కులమే. మనము కాతలిక్కు సంఘము, మనము అపోస్తలిక్ కాతలిక్కులము. కాతలిక్కు అను మాటకు "విశ్వవ్యాప్తము" అని అర్థము. మనము అపోస్తలిక్ విశ్వాసము గల విశ్వవ్యాప్త సంఘముగా యున్నాము. అవునండి. రెండు సంఘముల మధ్య తేడా యున్నది: ఒకటి కాతలిక్కు, విశ్వవ్యాప్తమైనది, అపోస్తలిక్; మరియొకటి రోమను కాతలిక్కు సంఘము.
ACTS 18:2
54రోమను సంఘమును పేతురు స్థాపించెనని వారు నమ్ముచుందురు. నాకు వాక్యములో చూపండి, ఏ పరిస్థితులలో నయినాగాని పేతురు రోమ్‌లో యుండెనేమో నాకు వాక్యములో చూపించండి. "41 నుండి 46 వరకు అతడు అక్కడుండెనని" రోమను సంఘము చెప్పెను.
ఆ సమయములో క్లౌదియ చక్రవర్తి రోమ్‌ను పరిపాలించుచుండెను, అందువలన యూదులందరూ పారిపోయిరి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము చదవండి. పౌలు ఎఫెసుకు వెళ్ళి అకుల మరియు ప్రిస్కిల్లలను కనగొనెనని గ్రహించెదము. వారు వాస్తవంగా యూదులు. హింస కాలములో వారచ్చటికి తీసికొని పోబడిరి. వారు మరల పాలస్తీనాకు వచ్చిరి, ఎందుకనగా యూదులందరూ విడిచి వెళ్ళిపోవలెనని క్లౌదియ ఆజ్ఞాపించెను. క్రైస్తవులు, సనాతన వాదులు కూడా విడిచి పెట్టిరి. అకుల మరియు ప్రిస్కిల్లలు రోమ్‌లో సంఘమును స్థాపించిరి, కాని క్లౌదియ పాలన వలన వారు విడిచిపెట్టవలసి వచ్చెను. రోమ్‌లో నుండి క్రైస్తవులు మరియు యూదులు బహిష్కరించబడిరి.
55"సంఘమునకు పేతురు బిషప్‌గా యుండెనని" వారందురు. పేతురు దాదాపు డెబ్బది సంవత్సరముల పాటు అసలు పాలస్తీనా విడిచి బయటకు రాలేదని వాక్యములో నేను చూపించగలను. పేతురు ఎన్నడూ పాలస్తీనాలో నుండి బయటకు రాలేదు. వాక్యములో ఇది యున్నది. పేతురు రోమ్‌లో హత్య చేయబడెననియు, పౌలు రోమ్‌లో శిరచ్ఛేదము చేయబడెననియు మీరందురు. అది కేవలము కట్టు-కథ. నేను నాకు దొరికిన హతసాక్షుల చరిత్రలన్నియూ చదివాను. పేతురు లేదా పౌలు రోమ్ నందు హతసాక్షులయినట్లు ఎక్కడను పేర్కొనబడలేదు. ఏ ఒక్కరూ అక్కడ మరణించ లేదు. హతసాక్షుల గూర్చి నేను చదివిన ఏ గ్రంథములోను ఆ విషయము లేదు. దానిని గూర్చి ఎక్కడనూ మనము చదువము. అది ఒక సిద్ధాంతము.
ఇక్కడ నేను అన్యత్వమును గూర్చి చెప్పదలంచుకొన్నాను. ప్రభుని సహాయమును బట్టియు, ఆయన వాక్యమును బట్టియు దానిని నేను చెప్పగోరుచున్నాను. సంఘము ఎట్లున్నదో మీకు చూపించగోరుచున్నాను… మీరు కాతలిక్కు అని గోల చేయుచున్నారు, కాని కొద్ది నిమిషములు ఆగండి.
ACTS 18:2
56ఇప్పుడు, అకుల మరియు ప్రిస్కిల్లలు రోమ్ నుండి బయటకు వెళ్ళగొట్టబడిరి (వాక్యము ప్రకారము) చిన్న సంఘము ఒక అనాధగా మిగిలిపోయెను. వారందరును మార్పు పొందిన అన్యులు. వారు రోమా క్రైస్తవ సంఘములో ఉండిరి. అకుల మరియు ప్రిస్కిల్ల, ఇంకా మరి యొక జంట సంఘమును స్థాపించిరి మరియు దానిని వారు పోషించిరి.
వారు బయటకు వచ్చిన వెంటనే వీరు తమ స్వంత బిషప్పును, స్వంత సిద్దాంతమును పొందించుకొనిరి. చక్రవర్తియగు కాన్‌స్టాంటయిన్ యొక్క ప్రాపకమును సంపాదించుకొనగోరిరి. దేశము యొక్క రాజకీయాధికారములో పాలుపొందుటకు వారు కార్యక్రమము రూపొందించుకొనిరి. వారు సంఘసభ్యులను చేర్చుకొనిరి. ఒప్పుకొనుట ద్వారా వారిని సభ్యులుగా చేసిరి… పరిపూర్ణులనిరి ఈనాడు అమెరికా దేశములో యున్న వారికి దేవుడెంతగా తెలియునో వీరికిని అంతే తెలియును. ఒప్పుకొంటే చాలుననిరి. క్రీస్తును ఒప్పుకొనుటయే గొప్ప సంగతిగా వారు ఎంచుకొనిరి. తమ స్వంత దేవుడు గాక మరియొక దేవుడే ఈయన అని తలంచిరి, వారు సంఘములోనికి అన్య ఉత్సవములను తీసికొని వచ్చిరి.
57ప్రభురాత్రి భోజనమును రోమను మతాధికారి నిర్వహించెను. మొదటగా వారు చేసిన పని ఇదే. ప్రభురాత్రి భోజనమును ప్రారంభించిరి. క్రీస్తు యొక్క శరీరమును విరచుట అను అర్థమునకు బదులుగా వారు రొట్టెను సూర్యుని వలెను మరియు చంద్రుని వలెను గుండ్రముగా చేసిరి. ఈ రోజు వరకును వారు గుండ్రముగానే దానిని తయారు చేయుచున్నారు. నిశ్చయంగా! ఇంకా వారు గుండ్రని రొట్టెనే తయారు చేయుచున్నారు. అది ఆయన యొక్క విరువబడిన శరీరము కాదు. అది గుండ్రముగాను, మెత్తగాను ఉన్నది. రోమను మత గురువులు ఈనాటికిని గుండ్రని రొట్టెను తయారు చేసి, బలిపీఠము మీద పెట్టి, దీనిని క్రీస్తు యొక్క అక్షర శరీరము అనుచున్నారు.
58ఈ కొందరు ఉన్నత ఎపిస్కోపలియనుల మధ్య చాలా గొప్ప పూర్వగాధ యున్నది. కాతలిక్కు చర్చి ఆ అంశము మీదనే కట్టబడినది. వారు దానిని అక్షర శరీరము లేదా శరీర సాదృశ్యము అనుచున్నారు. ఇది అక్షర శరీరమని రోమను కాతలిక్కు సంఘము చెప్పుచున్నది, ఎందుకనగా అది బయలు యొక్క అక్షర శరీరము. (సూర్య-దేవుడు) దానిని ఇత్తడి పళ్ళెము మీద ప్రతిబింబించిరి, దానిని గుండ్రముగా తయారు చేసిరి. ఏ క్రైస్తవ బల్ల మీదను గుండ్రని రొట్టె ఉండదు!
ఆ తరువాత వారు తూర్పు వైపుకు తిరిగెదరు, అన్య ఆరాధనలో ఆలాగే చేయుదురు; స్త్రీలను లోనికి తెచ్చెదరు, అన్యులు దేవతల యొద్ద ఆలాగు చేయుట పరిపాటి. వారిప్పుడు అష్టార్తేను తీసివేసి మరియను ప్రతిష్ఠించిరి, వారామెను ఆకాశ రాణిగా తయారుచేసిరి. జూపిటర్‌ను వారు తీసివేసి పేతురును ప్రవేశపెట్టిరి. వారు ఒక సిద్ధాంతమును రూపొందించిరి.
క్లౌదియస్ యొక్క పదమూడేండ్ల పరిపాలన తరువాత, అకుల మరియు ప్రిస్కిల్లలు తిరిగి వచ్చిరి. వారి సంఘము పూర్తిగా విగ్రహారాధన లోనికి పోవుటను వారు కనుగొనిరి, అయితే ధనికంగా అది చాలా ఎదిగినది.
59దీనిని వారు ప్రవేశపెట్టుటకు గాను బైబిలును పూర్తిగా తొలగించవలసి వచ్చెను. నేను ఐరీష్ వాడిని. మన విశ్వాసపు వాస్తవములు అను పుస్తకమును చదివాను. అది మత గురువులకు మాత్రమే చెందినది. మత గురువులతో నేను సంభాషించాను. మత గురువులు బైబిలుతో వాదించరు. ఎందుకనగా బైబిలు వారి దృష్టిలో ఒక పుస్తకము మాత్రమే. దాదాపు రెండు సంవత్సరాల క్రితం బిషప్ షీన్ ఈలాగు చెప్పెను, బైబిలు నమ్ముటకు ప్రయత్నించు వారు బురదలో నడచుటకు ప్రయత్నించుచున్నట్లే యుందురు. వారు దానిని నమ్మరు. "దేవుడు తన సంఘములోనే యున్నాడు గాని వాక్యములో లేడని" వారందురు.
ISA 66:1•
MATT 5:34,35
60ఈ మధ్యనే ఈ మత గురువు సంభాషించుటకు మార్గ మధ్యములో కలిసికొనెను. సేక్రెడ్ హార్ట్ అను ఒక చర్చి ఈ దారిలోనే యున్నది. దానిని సేక్రెడ్ హార్ట్ అని వారందురని గుర్తున్నది. అతడు బాప్తిస్మమిచ్చు సందర్భములో నా యొద్దకు వచ్చెను. మేరీ ఎలిజబెత్ ఫ్రేజర్ వెనుకకు జారిపోయి కాతలిక్కుగా మారినది. ఆమెకు నేను బాప్తిస్మమిచ్చానో లేదో కనుగొనుటకు వచ్చెను.
"అవును" అన్నాను.
"నీవామెకు ఎట్లు బాప్తిస్మమిచ్చావు?" అనడిగెను.
"క్రైస్తవ బాప్తిస్మములో" అని చెప్పాను.
"నీ భావములో ఆ విధానమేమిటి?" అనడిగెను.
"ఒకే ఒక బాప్తిస్మము క్రైస్తవులకున్నది" అన్నాను.
"ముంచుట ద్వారా నా" అనడిగాడు.
"అవును" అన్నాను.
"తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మయు నామములో నీవామెను ముంచితివా?" అనడిగాడు.
"అది క్రైస్తవ బాప్తిస్మము కాదన్నాను." "ప్రభువైన యేసు క్రీస్తు నామములో ముంచుటయే క్రైస్తవ బాప్తిస్మమని చెప్పాను."
దానినతడు తిరస్కరించెను. "నీవు ప్రమాణము చేయించుదువా లేక దీనిని బిషప్పుకు తెలియచేయుదువా" అని నన్నడిగెను.
"నా మాట నమ్మితే నమ్ము లేనిచో పొమ్ము" అన్నాను. నేను ప్రమాణము చేయనని చెప్పాను. చూచారా. "నేను కఠినముగా ఈ మాట పలుకుట లేదు గాని భూమి మీద గాని, ఆకాశము మీద గాని తోడని ప్రమాణము చేయరాదని బైబిలు పలుకుచున్నది. అది ఆయన పాద పీఠము. ఆలాగు మేము చేయవలసిన అవసరం లేదన్నాను. "కాతలిక్కు సంఘము కూడా ఆలాగే బాప్తిస్మమిచ్చుచుండెడిది." ఇది వింతగా యున్నదే అన్నాడు.
"ఎప్పుడు? ఎప్పుడు?" అనడిగాను. చూచారా? కాని వారట్లు చేసినట్లు వారే చెప్పుకొనిరి.
నిజంగానేవారది చేసిరి. ఆదిలో అందరూ ఆలాగే చేసిరి. మూలము పెంతెకోస్తు నాటి నుండి వచ్చెను. అది మొదటి సంఘము యొక్క ప్రారంభము. దీనిని ఎవరైనా గాని చెప్పగలరు. క్రైస్తవ సంఘము పెంతెకోస్తు దినమున ప్రారంభమయినది. పెంతెకోస్తు అనుభవము, పెంతెకోస్తు జనులు, పెంతెకోస్తు బాప్తిస్మము ఇవన్నియూ ఆదిలోని పెంతెకోస్తు నాటి సంఘములో నుండియే వచ్చినవి.
61ఇప్పుడు గమనించండి. చక్రవర్తులను సంతోషపరచవలెనని ఆశతో వారు బైబిలు బోధను త్రోసివేసి ఈ సంగతులను ప్రవేశపెట్టిరి, అన్యత్వమును వారు తీసికొని వచ్చిరి.
ఇటు చూడండి. పేతురు ఒక యూదుడు. అది నిజమేనా? సంఘములో విగ్రహములను నెలకొల్పుటకు పరిశుద్ధుడగు పేతురు సమ్మతించునని మీరనుకొనుచున్నారా? యూదులు అసలు విగ్రహము వైపే చూడరు. కావున అతడు ఇట్టి కార్యములు చేయ ప్రోత్సాహించుననుకొనుచున్నారా? పేతురు చేయడు! అతడు ఈలాగున చెప్పునని తలంచుచున్నారా? "ఆది యందు నేను వ్రాసిన వ్రాతలన్నియూ తప్పు. వాటిని నేనిప్పుడు పారవేసెదను. ఈ రోమా సంఘములో ఇప్పుడు నేను ఒక ఆత్మగా జీవించెదను, ఆలాగయినచో అతడు మారిన మనిషి యగును."
వారది చేయగోరిరి గనుక అందుకు ఒక సిద్ధాంతమును ప్రారంభించవలసి వచ్చెను. పేతురు సంఘములో సమాధి చేయబడెను. వారికి ఆజ్ఞలన్నియూ వదిలి వెళ్ళెను. వారిది అసలయిన కాతలిక్కు చర్చి. కాని అది తప్పు! అందుకు ఏ వాక్యాధారమును లేదు. దానిని రుజువు చేయుటకు ఏ చరిత్రయూ లేదు. వారిది అబద్ధము.
62మొదటి రోమను చర్చి యొక్క అన్యపూజారి ఈనాటి పూజారి వలెనె యున్నాడు. రొట్టె క్రీస్తు యొక్క శరీరమని వారు నమ్ముచున్నారు. క్రీస్తు ఏలాగో ఆ రొట్టెలోనికి దిగి వచ్చి యున్నాడని నమ్ముదురు. ఆ బల్ల మీది రొట్టెలో ఆయన ఉన్నాడనుకొందురు. (దానిని ఒక రాత్రిలో ఎలుకలు తినివేయును), చూచారా. ఆ కారణము చేతనే నీవు ఆరాధించుటకు తప్పక ఆలయమునకు వెళ్ళవలెనని కాతలిక్కులు చెప్పెదరు, ఎందుకనగా తమ సంఘమే దేవుడని చెప్పెదరు. అందుకే వారు సిలువకు మ్రొక్కుదురు. ఆ రొట్టె ముక్కను దేవుడందురు. అది బిలాము యొక్క సూర్య-దేవునికి ప్రతినిధి తప్ప మరేమియూ కాదు. దానికి ఎట్టి వాక్యాధారము లేదు! ఆ గుండ్రని రొట్టె బల్ల మీద పడియుండును.
REV 1:9
63కాబట్టి వారు క్రైస్తవ బోధను అంగీకరించరు, ఐరేనియస్, పొలికార్పు, పౌలు ఇంకా అనేకమంది సోదరులు అక్కడుండిరి. ఎక్కువ కాలము జీవించిన శిష్యుడు యోహాను. అతడు దేశము నుండి బహిష్కరించబడి మూడు సంవత్సరములు పత్మసు ద్వీపమును యుండెను. అతడు దేవుని వాక్యమును సమాకూర్చు పనిలో యుండెను. పత్రికలన్నింటినీ కలిపి యుంచెను. అతడు, అతని సహచరులు ఆ పని చేయుటను వారు కనుగొని మూడు సంవత్సరముల పాటు దేశము నుండి వెళ్ళగొట్టిరి. (చక్రవర్తి చనిపోయిన తరువాత వారతనిని తిరిగి తీసికొని వచ్చిరి), ఆ తరువాత అతడు ప్రకటన గ్రంథమును వ్రాసెను.
JOHN 1:1,14•
REV 22:18,19
64"దేవుడు తన సంఘములో యున్నాడా? లేక దేవుడు తన వాక్యములో యున్నాడా?" అను సంగతి చూద్దాం. వాక్యము దేవుడై యున్నాడని బైబిలు చెప్పుచున్నది. "ఆది యందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను."
అంతే కాకుండా వాక్యమును అక్షరాలా బోధింపని ఏ సంఘమయినా గాని తప్పు అని చెప్పుచున్నాను (అది బాప్టిస్టు కావచ్చు, ప్రెస్బిటేరియను కావచ్చు, మెతడిస్టు కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, లేక ఏదయినా గాని) వాక్యమే బోధించవలెను. ఎందుకనగా పత్మసు ద్వీపమందు యోహాను అదే చెప్పెను, పరిశుద్ధాత్మ లేదా క్రీస్తు అతని ద్వారా మాట్లాడుచుండెను. "ఈ గ్రంథములోని ఏ మాటను తీసివేయరాదు మరియు ఏ మాట దానికి చేర్చరాదని చెప్పెను." ఈ అన్యవిగ్రహారాధన చిహ్నములను మీరెట్లు చేర్చగలరో చూపించండి? ఒక్క దేవునిని ముగ్గురు దేవుళ్ళుగా తయారు చేయుచున్నారు. ఈ అన్య ఆచారములను ఆది సంఘము ఎన్నడునూ బోధించలేదు. వాటికి అది విరోధియైయున్నది.
65నైసియన్ కౌన్సిల్ యొద్ద ముగ్గురు దేవుళ్ళా లేక ఒక్క దేవుడా అని గొప్ప వాగ్వివాదము జరిగినది. కొందరు అక్కడ హతసాక్షులయిరి. రోగుల మీద చేతులుంచిన ఒక బోధకుని చేతులను ఎర్రగా కాలిన ఇనుప దండముతో కాల్చిరి. మరొకరు వచ్చి ఖడ్గముతో అతని కండ్లను ఊడబొడిసిరి. ఆ విధముగా కొందరు వాక్యము కొరకు నిలబడి హతసాక్షులయిరి. హల్లెలూయా! వారు పాతకాలపు ప్రవక్తల రక్తముతో వీరి రక్తమును మిశ్రమము చేసిరి. సోదరుడా, ఈ వాక్యము, దేవుని యొక్క వాక్కు
66ఈ అన్యులు మార్పు పొందిరి, వారు ఈ ఆచారములను క్రైస్తవ్యములోనికి మళ్ళించిరి. వారు బైబిలును ఇక వాడుట లేదు, ఎందుకనగా బైబిలు వీటిని నిషేధించును. ఈ రోజుకు కూడా వారు అందుకే వాక్యమును అంగీకరించరు. "ఏది ఏమయినా గాని సంఘమే మహోన్నత వాక్యమని అందురు."
పెంతెకోస్తులో కూడా అదే మనము కనుగొందుము. కాతలిక్కులని చెప్పి గోల చేయవద్దు. మెతడిస్టు, బాప్టిస్టు, తదితరులందరూ అదే రకమగు దోషులుగా యున్నారు.
మెతడిస్టు వారు పరిశుద్ధులమని చెప్పుకొనుచున్నారు, అయితే జోసెఫ్ స్మిత్‌ను ఎందుకు చంపిరి? ఇది అమెరికా దేశము, ఆరాధించు హక్కు ఇక్కడున్నది. జోసెఫ్ స్మిత్ చెప్పిన దానిని నేను నమ్మను గాని అతడు మార్మన్ అయినందున చంపే హక్కు మీకు లేదు.
బాప్టిస్టువారలారా, మీరెందుకు వారిని చంపిరి? మిగిలిన వారు కూడా అంతే!
పెంతెకోస్తు కూడా ఇతరుల వలెనె దోషిగా యున్నది. మీరు నేత నేసిన దుస్తులు ధరించి, వేషధారుల గుంపుగా తయారయిరి. దీనత్వము మరియు ఆత్మ యొక్క శక్తిని కలిగి యుండుటకు బదులుగా, ఆత్మ లేని మాటను చేర్చుకొనిరి. మిగిలిన వారి వలె మీరున్నప్పటి కంటె ఇప్పుడే ఇంకా ఎక్కువ అపకారము చేయుచున్నారు. మీరు అన్య ఉత్సవములను, త్రిత్వ ఉద్దేశ్యములను వాటికి కలిపియున్నారు. మీరు వాక్యము ద్వారా దానిని రుజువు చేయలేరు. వాక్యము దానికి వ్యతిరేకమై యున్నది. ఎంత విచారకరము! ఎంత విషాదము!
67కాబట్టి రోమ్‌లో మొదటి సంఘమును స్థాపించేటప్పుడు, ఈ ఉత్సవములను స్వీకరించుటకుగాను, క్రైస్తవులే బైబిలును నిరాకరించవలసి వచ్చినది. వారికి కొంత ఆధారమును ఏర్పాటు చేసుకొనుటకై రోమ్‌కు మొదటి పోపు పేతురే మరియు అతడు ఆ విధానములో ఇంకనూ నిలచియున్నాడు అని చెప్పెదరు. మంచిది. అతడు అలా ఉన్నాడనుకుందాం, పెంతెకోస్తు దినమున తాను చెప్పిన మాటలనే పేతురు వెనక్కి తీసుకున్నాడా? ఒక యూదుడు విగ్రహములను అంగీకరించడం మీరు ఊహించగలరా?
బైబిలులోని వ్రాయబడిన వాక్యము నుండి దీనిని మీకు రుజువు చేయగలను. అక్షరాలా దినములను మరియు సంవత్సరములను చెప్పగలను. ఒక్కసారి తప్ప పేతురు ఎన్నడును పాలస్తీనాను విడిచిపెట్టలేదు. (యూఫ్రటీసు ద్వారా బబులోనుకు అతడు వెళ్ళెను) ఎన్నడూ రోమ్‌కు వెళ్ళలేదని వాక్యము ద్వారా నిరూపించెదను. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." ఇది పూర్తిగా అన్య సంకల్పము.
కాని ఇప్పుడు దీనిని మనము ప్రొటస్టెంటిజమ్ లోనికి తీసికొని వచ్చుచున్నాము. వాక్యమును తీసికోకుండా పెంతెకోస్తును చూడండి, వాక్యమును తీసుకోకుండా ఉండెను. వాక్యముతో నిలచియుండుడి అప్పుడు మీరు ఎల్లప్పుడును సరియే; వాక్యమును తీసివేయుము, మీరు ప్రక్కకు తప్పుదురు.
ROM 3:4•
1COR 14:32
68ఇక్కడి పెద్ద పెంతెకోస్తు స్కూలులో ఒకసారి కూటము జరిగినది. అప్పుడు ఒకామె గంతులు వేయుచూ భాషలు మాట్లాడినది. వేదిక పిలుపును ఆటంకపరచినది. ఆ రాత్రి నేను తిరిగి వచ్చాను. నన్ను బయట బిల్లీ కలసికొనెను, "మీకు తెలుసా? ఆ స్త్రీ ఈ రాత్రి మరియొక వర్తమానమియ్యనున్నదని చెప్పినదని నాకతడు చెప్పెను."
నేనా స్త్రీ వైపు చూచాను. (జుట్టు కత్తిరించుకొనినది, చాలా బిగుతయిన దుస్తులు ధరించినది. అంటించుకొనినట్లున్నది, కూర్చొని తల దువ్వు కొనినది, మోకాలి వరకు మేజోళ్ళు ధరించినది.) ఆమె గంతులు వేయబోవుచున్నదని నాకర్థమయినది. "ఆమె గంతులు వేయలేవగా నేను కూర్చోమన్నాను. ఆమె వినలేదు. "నా మాట వినబడుచున్నాదా? కూర్చో" అన్నాను.
ఆ రాత్రి ఆమెతో పాటు నాతో పాటు బయటకు వచ్చిన కొందరు వ్యక్తులు, "నీవు ఆత్మను దుఃఖపరచితివనిరి."
నేనిట్లన్నాను, దేవుని వాక్యముతో నేను దుఃఖపరచిన ఏ ఆత్మ అయినా గాని దుఃఖపడును. ప్రవక్తల యొక్క ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో యున్నవని బైబిలు చెప్పుట లేదా? ఆమె సాక్ష్యమిచ్చుచున్నచో అది ప్రవచనము. భాషలతో మాట్లాడుట అనగా ప్రవచనమే, దానికి అర్థము చెప్పవలెను. "నేనది ముగించు వరకూ ఆమె ఎదురుచూచి, ఆ తరువాత మాట్లాడవలెను."
"వాక్యమును బోధించుచున్నావు" అన్నాడు.
"నేను దానితోనే నిలబడియున్నాను," అన్నాను.
అతడిట్లనెను, "ఆమెకు తాజాగా ఉన్నది, క్రొత్తగా పరలోకము నుండి వచ్చినది యున్నది. నీకు లేనిది ఆమెకు అందినది." అది రోమను కతోలిజం తప్ప మరేదీ కాదు అన్నాను.
ప్రతివాడు అబద్దికుడే, ప్రతి ఆత్మ అబద్దమాడవచ్చును, గాని దేవుని వాక్యము మాత్రమే సత్యము. దేవుని వాక్యమే మొదట ఉండవలెను!
69ఈనాడు అదే సమస్య, వారికి చాలా ప్రత్యక్షతలు మరియు అబద్ధ సంగతులు ఉన్నవి. వారు దయ్యముల ఎదుట సాగిలపడి, తమ హృదయములను తెరచుచున్నారు. దేవుని వాక్యముతో నిలచియుండుట లేదు. అదే అసలు సమస్య. ఇది నేటి సమస్య. ప్రజలు — నిజయితీపరులు, యధార్థపరులు, మంచివారే — కాని వారికి నీవు చెప్పలేవు.
"మేము పెంతెకోస్తువారము గనుక దీనిని నమ్ముచున్నాము."
"మేము బాప్టిస్టువారము గనుక ఇది నమ్ముచున్నాము" అనుచున్నారు.
ఇది దేవుని వాక్యము గనుక దీనిని నమ్ముచున్నాము. దీని విషయములో నన్ను సరిచేయు వారిని రమ్మని సవాలు చేయుచున్నాను, చూచారా. ఇది సత్యము. ఇది వాక్యము! దీనితోనే నిలచి యుండండి, ఇది నిజము!
70వారు మొదటి సంఘమును రూపొందించిరి, మొదటి రోమను కాతలిక్కు సంఘము. వారు మునుపు బిషప్ అని పిలచెడి వారు గాని ఇప్పుడు "తండ్రీ" అని పిలవసాగిరి. "ఇంకా అదే వారు చేయుచున్నారు. ఆ గుండ్రని రొట్టె ముక్క క్రీస్తు శరీరమని వారు చెప్పుచున్నారు. వారికి మత గురువే దేవుడు. మత గురువు మాటను దేవుడు వినుననియు, ఈ గుండ్రని రొట్టెను అక్షరాలా క్రీస్తు యొక్క శరీరముగా మార్చుననియు" నమ్ముదురు. ఆ తెలివిగల వారు దానిని వీరి గొంతులో త్రోయుదురు. ఓ, మై! ఓ, ఎలా…?
కాని నిజమగు ఆరాధికులు మరియు నిజమగు బిషప్పులు వాక్యముతోనే నిలచి యుండిరి. వారు నైసియన్ కౌన్సిల్‌లో యుండి కూడా వాక్యమును పట్టుకొని యుండిరి. వారు హతసాక్షులయిరి. అయినా గాని వాక్యమును వారు విడిచిపెట్టలేదు. వారికి విగ్రహారాధన అవసరము లేనే లేదు.
71సెయింట్ పాట్రిక్ రోమను కాతలిక్కు అని రుజువు చేయు వారిని నాకు చూపించండి. అది అబద్ధము! అతడు రోమన్ చర్చిని ఎదిరించెను. అతడు పరిశుద్ధ మార్టిన్‌కు మేనల్లుడు. శ్రీమతి హేజెల్ టైన్ వ్రాసిన పుస్తకం నేను చదివాను. నైసిన్ కౌన్సిల్‌లోని ముఖ్యాంశములు అను గ్రంథం చదివాను. పరిశుద్ధ మార్టిన్ యొక్క జీవితము అను పుస్తకము కొరకు ఆమె ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్ళి అడుగగా అక్కడున్న వ్యక్తి ఆమెతో ఇట్లు చెప్పెను, "రోమను చర్చితో అతనికి సంబంధము లేదు." అది నిశ్చయంగా నిజము. దానినతడు ఎదిరించెను. పరిశుద్ధ పాట్రిక్ కూడా అదే చేసెను. అతడు దేవుని వాక్యముతో నిలచి యుండి, తన స్వంత స్కూలును స్థాపించెను, వారు దానిని ఇష్టపడలేదు.
MATT 26:27
72నేడును ఇది ఆ విధంగానే యున్నది. రోమను సంఘము ఆ గుండ్రని బిస్కట్టుతోనే కొనసాగిపోవుచున్నది. క్రీస్తు దిగి వచ్చి అందులో దూరుచున్నాడని నమ్ముచున్నది. వినండి, ఆ మత గురువు మద్యము త్రాగునని మీరెరుగుదురా? "వారు ఒకరికి ఇంకొకరు ఆ గిన్నెను అందించుకొనుచుందురు." అన్య ఆచారము ప్రకారము ఆ మత గురువు మద్యమును త్రాగును. చూచారా, ఇది పూర్తిగా అన్యాచారము. సందేహము లేదు. వారికది తప్పు కాదు.
"బైబిలు గురించి చెప్పవలసిన పని మాకు లేదని వారందురు." ఒకసారి ఆ మత గురువు నాతో ఇట్లనెను, శ్రీ, బ్రెన్‌హాం, నీవు బైబిలు గూర్చి చెప్పుటకు ప్రయత్నించుచున్నావు; నేను సంఘము గూర్చి చెప్పుచున్నాను."
"దేవుడు వాక్యమైయున్నాడు" అన్నాను. అది మంచిది.
రోమను కాతలిక్కు సంఘము ఆరాధన కొరకు సంఘమునకు ఎందుకు వెళ్ళునో ఈనాడు కూడా మనము గ్రహించగలము. గుండ్రని రొట్టెలో దేవుడున్నాడనియు, ఆలయములో సైన్యాధిపతి ఉన్నాడనియు వారికి నేర్పించుచున్నారు, చూచారా. అందులో మీకు అన్యత్వము కనబడుట లేదా? నిశ్చయంగా అది అన్యుల సాంప్రదాయమే.
REV 17:4,5
73ఈ వాక్యమునకు వ్యతిరేకముగా యున్నదానిని అనుసరించు వారెవరైనా గాని అదే పొరపాటులో యున్నారన్న సంగతిని మీరు గ్రహించుటలేదా? బైబిలులోని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో కాతలిక్కు చర్చిని ఒక వేశ్యగా పిలువలేదా? అది వేశ్యలకు తల్లి అని చెప్పబడినది. ప్రొటస్టెంటు సంఘములు అదే పనిని చేయుచున్నవి! దాని చేతిలో ఒక గిన్నె యున్నది. అందులో దాని జారత్వము యొక్క అపవిత్రత మరియు హేయమైయున్నది. అందులో మురికి, అపవిత్రత ఉన్నది. కల్తీ చేయబడని, నిజమైన సజీవ దేవుని వాక్యమునకు బదులుగా, మానవ కల్పిత సిద్ధాంతములున్నవి.
"ఓ! దేవా, మా మీద కృప చూపుము అని ప్రార్థించుచున్నాను."
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
74ఐరేనియస్ చెప్పిన దానిని ఇచ్చటనేను వ్రాసి యుంచాను. వినండి, "దేవుని యొక్క వాక్యము, ఒక చక్కని అందమగు పెద్ద ఆభరణముల గుత్తి వలె యున్నది." ఒక మహా బలము గల రాజు యొక్క విగ్రహమును తయారు చేయుటకు అది ఉద్ధేశించబడియున్నది. "కాని వారు ఆ అందమగు ఆభరణమును తీసికొని ఒక కుక్క రూపమును తయారు చేసి, వాక్యము తెలియని వారిని మోసము చేసిరి." హల్లెలూయా!
నీ సంస్థకు తగిన రీతిగా యుండవలెనని నీవు దేవుని వాక్యమును మలచుకొనుచున్నావు. ఆ మహారాజు యొక్క శరీరము పైన గల ఆభరణములను నీవు లాగివేసికొని, ఒక కుక్క లేదా నక్క లేదా పంది యొక్క రూపమును తయారు చేయుచున్నావు. వాక్యము తెలియని వారిని నీవు మోసగించుచున్నావు.
హల్లెలూయా! దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు కొందరున్నారు. అవతారమూర్తియైన వాక్యము కొరకు వారు నిలబడుచున్నారు. దేవా, మా శ్రేణిని వృద్ధి చేయుము. వాక్యము, మరేదో కాదు, కేవలము వాక్యము. యేసు చెప్పిన వాక్యమును మీరు తీసికొనండి. "భూమ్యాకాశములు గతించిపోవును గాని నా మాటలేమాత్రమును గతించవు."
ACTS 2:38
75"యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని చెప్పితే వారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని చెప్పుచున్నారు." ముగ్గురు దేవుళ్ళను తయారు చేయుచున్నారు. ఎన్నో సిద్ధాంతములను రూపొందించిరి. మరెన్నో ఆచారములను నెలకొల్పిరి. ముంచుటకు బదులుగా చిలకరించుచున్నారు. క్రీస్తు అను మహారాజు యొక్క ఆభరణమును తీసివేసి, దానిని మానవ కల్పిత నీచ జంతువుగా నిర్మించుచున్నారు. ఓ, హల్లెలూయా! దేవుడు నరరూపి అయ్యెను. ఆయనే క్రీస్తు!
వారు దేవుని యొక్క మార్గములను చెడగొట్టిరి. సంఘములలోనికి వచ్చు జనులను చూడండి. స్త్రీలు జుట్టు కత్తిరించుకొనుచున్నారు, రంగులు పూసికొనుచున్నారు, అసహ్యముగా కనబడుబట్టలు ధరించుచున్నారు; మగవారు చాలా వరకు ఆడంగివారయిపోవుచున్నారు, వారి చెవులు పట్టుకొని స్త్రీలు ఆడించుచున్నారు. ఆలయమునకు వచ్చి బంకో, బింగో ఇంకా తదితర చెడ్డ ఆటలు ఆడుచున్నారు. బోధకులు నదియొడ్డున అక్కడ దిగంబర స్త్రీలతో స్నానపు బట్టలు వేసికొని ఈతకొట్టుచున్నారు, వారు సిగరెట్లు త్రాగుచున్నారు, దేవుని దాసులమని చెప్పుకొనుచున్నారు; ఈ ఆలయము దేవుని యొక్క ఆలయము, దేవునికి సమర్పించబడినది, దానిని అపవిత్రపరచరాదు. ఇది నిజము. కాని వారు దేవుని ఆభరణమును తీసివేసి దానితో ఒక పందిని, లేక ఒక నక్కను, ఒక కుక్కను, పిల్లిని, మరో దానిని తయారు చేసి విద్య లేని పామరులను మోసగించుచున్నారు.
76(డాక్, నీకు వందనము. ఇక్కడ ఒక చేతి గుడ్డ యున్నది గాని దానిని వాడవలెనను తలంపు రాలేదు.)
అవును. వారాలాగే చేయుచున్నారు. ఐరేనియస్‌దే సరి.
దీనినంతటిని గూర్చి దేవుడేమని తలంచుచున్నాడు? "దీని సంగతి ఆయన కెందుకులే" అని మీరందురుగదా? ఇది ఆయనకు కావలెను. ఇది ఆయన విషయమే.
ఆయన యిర్మీయాకు ఆ సంగతులు ఎందుకు తెలియచేసెను? ఎందుకొరకు ఆయన చెప్పవలసి వచ్చెను. అది ఆయనకు కావలెను. దేవునికి ఒక మార్గమున్నది.
"నా చెప్పులు తీయుటకు బదులుగా, నా టోపిని తీయుదునని" మోషే చెప్పినచో ఎట్లుండేది? ఎన్నడూ ఆ దర్శనమును అతడు చూచి యుండెడివాడు కాడు. నీవు దేవుని యొక్క మార్గములోనికి రావలసియున్నావు. దేవునికి ఒక మార్గమున్నది.
NUM 25:1,5
77మనము చాలా చెప్పుకోవచ్చును. ఇక్కడ మనము ఒక లేఖనమును తీయుదము. చాలా వాటిని ఇక్కడ వ్రాసి యుంచాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయము తీయుదము. దేవునికి ఇది వర్తించునో లేదో చూద్దాం. ఒక్క నిమిషముపాటు సంఖ్యాకాండము 25 చూద్దాం. ఈ ఆచారములు, మత విశ్వాసములు మొదలగు వానిని గూర్చి దేవుడేమి తలంచుచున్నాడో చూద్దాం. "ఆయన మంచి దేవుడు గనుక దేనినీ పట్టించుకోడని మీరందురు." కాని ఆయన చూచి చూడనట్లు ఉండడు. ఆయన ఒక గీతను గీయును. నీవు దానిని దాటిపోజాలవు.
ఇశ్రాయేలీయులు షీత్తీములో దిగి యుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. [వినండి!]
ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా, వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ["ఇటువంటి ప్రజల కొరకు ప్రార్థించవద్దని" దేవుడు చెప్పుటలో ఆశ్చర్యము లేదు. చూచారా?)
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరిని తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను.
కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను.
NUM 25:5•
MATT 3:9•
LUKE 3:8
78"వారి ప్రతి ఒక్కరిని చంపవలెనని" చెప్పెను. దేవుడు దేవుడుగానే ఉండగోరుచున్నాడు. ఆయన దేవుడు కానియెడల రెండవ స్థానములోనికి వెళ్ళుటకు ఇష్టపడును. తన మార్గములో బయలు నిలిచి యుండుట ఆయన కిష్టముండదు. మానవులు కల్పించిన సిద్ధాంతములు, మానవ ఆచారములు, ఉద్ధేశములు, మత ప్రమాణములు, శాఖ యొక్క అభిప్రాయములు ఆయనకు అక్కరలేదు. ఆయన దేవుడు గనుక ఈ రాళ్ళ ద్వారా అబ్రహామునకు పిల్లలను పుట్టించగల సమర్థుడు. మీ శాఖలు ఆయన కవసరము లేదు. మీ పెద్ద సొసైటీలు, మీ పాఠశాలలు మొదలగునవి ఆయనకవసరము లేదు. ఆయన తన చేతికందిన దానిని తీసికొని లేదా శూన్యమును తీసికొని అందులోనికి జీవ వాయువును ఊది ఏదయినా చేయగలడు. తన పనిని చేయించుకోగలడు. అందువలననే ఆయన దేవుడాయెను. తప్పకుండా దేవునికి ఈ సంగతి కావలెను.
"అది ఆయనకు అక్కరలేదని మీరనుచున్నారు." కాని నిశ్చయంగా అది ఆయనకు కావలెను.
79మహాపోప్ లియో 440 నుండి 461 వరకు పరిపాలించెను. తాను సరియైన దానినే చేయుచున్నానని అతడు తలంచెను. అతనికి ముందు విక్టర్ యుండెను, అతడు కూడా ఒక ఎలుకే. అతడు వచ్చి క్రైస్తవులను నానా హింసలు పెట్టి చంపించెను.
చట్ట సమ్మతమగు హత్యలను ఎవరు ప్రారంభించిరి? అదెవరో మీకు తెలియునా? హిప్పోవాసియగు సెయింట్ అగస్టీన్. ఇది అక్షరాలా నిజము.
గొప్పవాడయి, పరిశుద్ధాత్మతో నింపబడుటకు సెయింట్ అగస్టీన్‌కు ఒకసారి అవకాశము దొరికెను. ఆలాగని చరిత్ర చెప్పుచున్నది. ఫ్రాన్సులోనిలయన్సులో వెనుక ఆవరణలో అతడు కూర్చొని యుండెను. ఆ గొప్ప పాఠశాలలోనే ఐరేనియస్ భోధించెను. సెయింట్ మార్టిన్ కూడా అక్కడే బోధించెను. ఇతడు ఈ స్కూలు ఆవరణలో కూర్చొని యుండగా పరిశుద్ధాత్మ అతని యొద్దకు దిగి వచ్చెను, కాని అతడు దానిని అంగీకరించుటకు తిరస్కరించెను.
ఆ తరువాత అతడేమయ్యెను? ప్రారంభములో కంటె రెండురెట్లు దుష్ట వ్యక్తి అయ్యెను. అతడు ఆఫ్రికాలోని హిప్పోకు వెళ్ళి పాఠశాల నెలకొల్పెను. మరియు అది….
"నాకు చూపించండి."
80మీకు చరిత్రను చూపించెదను. రోమను సంఘము యొక్క విశ్వాస సిద్ధాంతములతో సమ్మతించక విశ్వాసభ్రష్టులయిన వారిని చంపుట చట్టసమ్మతమేయని అతడు స్థిరపరచెను. అతడే హిప్పోవాసియగు పరిశుద్ధ అగస్టీన్‌గా పేరొందెను. ఈ సత్యమును చదివిన బైబిలు విద్యార్థులు, లేదా ఈ చరిత్రను చదివినవారెవరైనా ఇచ్చటున్నచో చేతులు ఎత్తవలెను. నిశ్చయంగా ఇది సత్యము. హిప్పోవాసియగు సెయింట్ అగస్టీన్ ఈ శాసనమును జారీ చేసెను. రోమను చర్చి యొక్క మత విశ్వాసములతో ఏకీభవించక వ్యతిరేకించు వారిని చంపుట చట్ట సమ్మతమేనని అతడు నిర్థారించెను. అన్యబోధను నూరిపోసెను. బైబిలును దూరము చేసెను. సూర్య-దేవుని ఆరాధనను నెలకొల్పెను. దానికి కారణమును మీరెరుగుదురా?
81క్రిస్మసు ఎక్కడ నుండి వచ్చినదో మీకు తెలియునా? క్రీస్తు ఏప్రిలులో జన్మించెను, కాని వారేమి చేసిరి? సూర్యక్రమము రాను రాను నెమ్మదియగుచున్నది. ప్రతి దినము తక్కువగుచున్నది. రాను రాను కొద్దిగా తగ్గుచున్నది. ఇరవై నుండి ఇరవై-అయిదుకు సూర్య-దేవుని పుట్టుక దినము వచ్చును. అక్కడ అయిదు రోజులున్నవి. ఆ సమయములో రోమను ఉత్సవము జరుగును. ఆ రోజులలో సూర్య-దేవుని యొక్క పుట్టుక దినమును జరుపుకొందురు. ఇప్పుడు మీకు అర్థమయినదా? వారు సూర్య-దేవునిని (SUN-GOD) తీసికొని దేవుని కుమారునిగా ( Son of God) చేసిరి. అసలు దీని ప్రారంభము మొత్తం అన్యులలోనిదే. వీధులలో జనులు ఎత్తు మడమ చెప్పులు వేసికొని అటు ఇటు వంకరలు తిరుగుచూ, షాపులలోనికి పరుగిడుచున్నారు.
ఒక రోజు నాకు ఒక సంగతిని నా భార్య చెప్పినది. "ఎవరో తన తండ్రికి క్రిస్మసు కానుకగా సిగరెట్లు పాకెట్ బహుకరించినదని చెప్పినదట. ఆమె సోదరుడేమో విస్కీని, ఇంకొకరేమో మరో మత్తు పదార్థమును కానుకగా ఇచ్చిరట. క్రిస్మసు ఉత్సవము అనగా, అన్యులదే. అది దయ్యపు ఆరాధన." అది సరి.
82అగస్టీన్ దానికి సమ్మతించెను. దీనిని మీరు స్మకర్స్ వ్రాసిన గ్రంథములో చూడగలరు. S-C-H-M-U-C-K-E-R-S. స్మకర్స్ వ్రాసిన గ్లోరియస్ రిఫర్మేషను అను గ్రంథమును చదవండి. అందులో ఇట్లు వ్రాయబడియున్నది, కాతలిక్కు చర్చికి ఈ శాసనమును సెయింట్ ఆగస్టీన్, అనగా హిప్పోవాసి జారీచేసినది మొదలుకొని ఈ అన్య-ఆరాధనను తిరస్కరించిన వారిని చంపుటకు విశాలముగా తలుపులు తెరువబడినవి. సెయింట్ అగస్టీన్ యొక్క ఆ కాలము మొదలుకొని, అనగా దాదాపు క్రీస్తు తరువాత మూడు వందల సంవత్సరములకు మొదలై 1850 వరకును ఐర్లాండులో గొప్ప హత్యాకాండ జరిగెను. కాతలిక్కు చర్చి ద్వారా ఎనభై-ఆరు-మిలియనులు మంది ప్రొటస్టెంటు వారు చంపబడిరి. ఇది రోమను హత సాక్షుల పుస్తకములోనే యున్నది. ఎనుబది-ఆరు-మిలయనులు. చరిత్రకారుడే దీనిని చెప్పెను, గనుక అడగండి. అతని మాటను నేను తిరిగి చెప్పుచున్నాను. కాతలిక్కు సిద్ధాంతముతో సమ్మతించని వారిని చంపిరి!
కాతలిక్కు కాదు. కాతలిక్కు అను పేరు అసలు వారికి తగదు. వారు రోమను అన్యులు.
ప్రశస్తమగు జనులున్నారు. వేలాదిమంది యధార్థపరులు అందులో చిక్కుబడిరి, విగ్రహారాధికులై పోయిరి. వారు దేవునినే ఆరాధించుచున్నామని తలంచుచున్నారు. (వాక్యము యొద్దకు రండి) అన్నిచోట్ల వారు విగ్రహములను నిలబెట్టి యున్నారు. చూచారా!
83రోమను మత విశ్వాసములు గూర్చి వినండి. నేను ఒక విషయము దాటిపోయాను. ఇక్కడ దానిని చెప్పగోరుచున్నాను.
1640వ సంవత్సరములో, ఐర్లాండు వధ జరిగినది. రోమను జూరిస్టీయులు, మతాధిపతులు 1640వ సంవత్సరములో వంద వేలమంది సెయింట్ పాట్రిక్ అనుచరులను చంపిరి. సెయింట్ పాట్రిక్ రోమను కాతలిక్కు అయినచో, అతని అనుచరులను ఎందుకు చంపెదరు? వారు ఫ్యాక్టరీలలో పని చేయు కార్మికులు. ఇది నిజము. ఒక-వంద-వేలమందిని చంపిరి. హతసాక్షుల గ్రంథములోయున్నది, ఎందుకనగా వారి బోధతో సమ్మతించనందున వీరిని చంపిరి.
ఉత్తర ఐర్లాండులోని కొన్ని సెయింట్ పాట్రిక్ సంఘములను నేను దర్శించాను. దానిని చూచు భాగ్యము నాకు దొరికినది. అది ఒక పెద్ద సంతవలె యున్నది. వారు విగ్రహములను నిలబెట్టి, వాటి పాదముల మీద నీళ్ళు పోసి, జనులకు తిరిగి వచ్చుటకు ద్రవ్యము చెల్లించుచు. వారు ఇట్లనుచుండిరి, దేవుని "తల్లియగు మరియ ధన్యురాలు, మరియా, స్తుతి." అష్తార్తేకి చేసినట్లే వీరు మరియ ఆత్మకు చేయుచున్నారు.
84దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం కాతలిక్కు చర్చి ఒక క్రొత్త సిద్ధాంతమును రూపొందించినది. మరియ తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళినది అనుచున్నారు. ఇది ఎందరికి తెలియును? నిశ్చయంగా మీ అందరికి తెలియును, పేపర్లలో ప్రచురించబడినది. మూఢ సిద్ధాంతములు! అది అట్టి అబద్ధముల మీదనే నిర్మించబడినది. ఎక్కడా చిన్న సత్యము కూడా లేదు.
ప్రొటస్టెంటు వారును అంతే చెడిపోయి యున్నారు, దేవుని వాక్యమును స్వీకరించుటకు నిరాకరించుచున్నారు. కాతలిక్కు చర్చి సిద్ధాంతముల వలెనె ప్రొటస్టెంటు చర్చి వారి సిద్ధాంతములును ఉన్నవి. సజీవ దేవుని యొక్క వాక్యము నొద్దకు తిరిగి వచ్చు వరకు మనందరమూ తప్పులోనే యుందుమని గ్రహించవలెను. నిజము.
85అసెంబ్లీస్ ఆఫ్ గాడ్‌కు చెందినవారు, ఫోర్ స్కేర్‌కు చెందిన వారు, పెంతెకోస్తువారు, ఏకత్వము వారు, త్రిత్వము వారు మరెవరయినా గాని దేవుని యొక్క వాక్యము నొద్దకు తిరిగి రావలెను. శాఖా సంబంధమగు ఈ విగ్రహములను విడిచిపెట్టండి. వారు ఈ శాఖలను విగ్రహములను పూజించుచున్నారు. (అపవాది ఆత్మ) మీరది ఎరుగుదురా? శాఖ అనునది ఒక విగ్రహము!
"నీవు క్రైస్తవునివా?" అని ప్రశ్నించండి.
"నేను ప్రెస్బిటేరియనును."
"నీవు క్రైస్తవునివా?"
"నేను మెతడిస్టును."
"నీవు క్రైస్తవునివా?"
"నేను పెంతెకోస్తును."
దాని వలన ఏమియూ అర్థము లేదు. కుక్క , పంది, నక్క అనుట కంటె ఆ మాటలేమియూ గొప్పవి కావు. ఇది నిజము. దేవుని యొక్క వాక్యము నొద్దకు తిరిగి వచ్చుటయే ఈనాడు మనకు అవసరము.
86ఇప్పుడు, ఉత్తర ఐర్లాండులో షాపు పనివారు ఇంకా ప్రశస్తమగు జనులు సెయింట్ పాట్రిక్ స్కూలులో చదివిరి. అతని పేరు పాట్రిక్ కాదని మీరెరుగుదురా? అతని పేరు సుకాటస్. చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే అతనిని దొంగిలించిరి. అతని సోదరీలను చంపిరి. అతడు తిరిగి వచ్చెను, ఎందుకనగా అతని యొద్ద శిక్షణ పొందిన కుక్కలుండెను, పందులను మొదలగు వాటిని పట్టుటకు. ఆ విధముగా అతడు తిరిగి తన తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వచ్చెను. ఒక పాఠశాలను ప్రారంభించెను. ఉత్తర ఐర్లాండులోని స్కూలు పోపును దేవుని ప్రతినిధిగా ఎన్నడూ అంగీకరించలేదు. దానిని వారు నమ్మలేదు. వారు వాక్యముతోనే నిలచియుండిరి. మహావ్యక్తియగు సెయింట్ పాట్రిక్‌ను దేవుడు దీవించెను.
87ఐర్లాండులోని సర్పముల నన్నింటినీ సెయింట్ పాట్రిక్ తరిమి వేసినట్లు ఆ జనులు చెప్పెదరు. చరిత్రను చదివి తెలిసికొనండి మరియు సెయింట్ పాట్రిక్ భాషలు మాట్లాడుటను విశ్వసించెను. సర్పములను ఎత్తిపట్టుకొని, విషకరమైనది ఏదయినా త్రాగినను హాని చేయదను మాటను సెయింట్ పాట్రిక్ విశ్వసించెను. అతడు పామును పట్టుకొని త్రోవలో అడ్డము లేకుండా పారవేయుచుండెను. ఐర్లాండులో నుండి పాములను అతడు తరిమి వేసెనని అందుకే వారు చెప్పుచుందురు. ఎందుకనగా సర్పములను ఎత్తి పట్టుకొన్నా గాని హాని చేయవను మాట నమ్మెను. అవును, ఓ, కచ్చితము.
MATT 15:14•
LUKE 6:39
88ఈ పెద్ద గోపురములను చూడండి. ఈనాడు ఐరేనియస్ ఉన్నచో ఏమి చేయును? ఈనాడు సెయింట్ పాట్రిక్ ఉన్నచో ఏమి చేయును? కతోలిసిజం వారు పెద్ద ఆలయములను నిర్మించుటకు, విగ్రహములను తయారు చేయుటకు వందలాది మిలియనుల డాలర్లు ఖర్చు చేయుచున్నారు. ప్రొటస్టెంటు వారును అదే చేయుచున్నారు.
ఒక రోజు నేను పలికిన మాట అందరినీ కదిలించి వేసినది. అందుకే ఈ టేపును నేను పట్టుకొని యున్నాను. వారిని ఆలాగే పోనీయండి, గ్రుడ్డివారు గ్రుడ్డివారిని నడిపించుచున్నారు, వారిని గోతిలో పడనీయండి. అదొక్కటే మీరు చేయగలిగినది, చూచారా. వేదిక పిలుపులు గూర్చి వారికి నేను చెప్పినప్పుడు, వేదిక పిలుపు అనునది బైబిలులో కనబడదు.
HEB 12:10
89[టేపు మీద ఖాళీ యున్నది.] ఆయన పరిశుద్ధతలో, భాగస్వాములుగా మనము చేయబడ్డాము. ఆయన మరణమును చూచి మనలనుమనము తగ్గించుకోవలెను, మనమసలు ఏమీయూ కాము అని లేక్కించుకోవలెను, అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మనలను లేవనేత్తును. మనయందు మనము విశ్వసించ రాదు, ఎందుకనగా మనమేమియూ చేయలేము, కాని ఆయనతో యున్నప్పుడు సమస్తము చేయగలము.
90సజీవ దేవుని యొక్క సజీవ రూపమును మనము పొందెదము. నిన్నునీవు దేవునికి సమర్పించుకొన్నప్పుడు, దేవుడు నీలోనికి వచ్చును. అప్పుడు నీవేమగుదువు? దేవుని యొక్క సజీవ రూపముగా మారుదువు. ఎక్కడో మూలన నిలబెట్టిన చచ్చిన విగ్రహముగా ఉండవు. వాషింగ్‌టన్‌లోని ప్రధాన కార్యాలయమునందు గల శాఖగా ఉండవు. సంఘముల సమాఖ్యలో యుండవు. అది చచ్చిన విగ్రహము, అది చచ్చిన ప్రతిమ. అది చచ్చిన విశ్వాసము — కాని నీవు సజీవ రూపము గల వ్యక్తివి కావలెను.
LUKE 17:34
91ఒక రోజున ఒకరు బోధించుచూ చెప్పిన చిన్న మాటను విన్నాను. ఒక కుటుంబములో భర్త రక్షించబడి, భార్య రక్షించబడనిచో రాకడలో ఎత్తబడుదురా? అని అడిగిరి. ఆ స్త్రీ రాకడలో ఎత్తబడదు. వారిద్దరు ఏకమై యున్నారు గనుక ఎత్తబడుదురను మాట నిశ్చయముగా అబద్ధము. "ఇద్దరు మంచము మీద యుందురు, ఒకరు కొనిపోబడుదురు మరియొకరు విడిచిపెట్టబడుదురు" అని యేసు చెప్పెను. ఇది దేవునికి, నీకు మధ్య జరుగు వ్యక్తిగత సంబంధము. నీ శరీరమును సమర్పించవలెను. నీ తల్లి, తండ్రి, పిల్లలు దానిని చేర్చుకొన్నా, చేర్చుకొనకపోయినా నీవు చేర్చుకొనుము. ఆమేన్!
ఓ దేవా! ఇది చెడిపోయిన, అపవిత్రమైన, మురికి లోకము: ఈ సంఘములు కలుషితముతో, మురికితో నిండిపోయినవి, ఇవి నామకార్థ సంఘములు; ఇవి చెడిపోయిన అపవిత్ర సంస్థలు; ఇవి చెడిపోయిన, అపవిత్రపు మత విశ్వాసములు. ఇవి దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా ఉన్నవి — ఓ దేవా, ఎక్కడి నుండియో ఒక చిన్న దీనుని లేపి దీనినంతటినీ శుభ్రము చేయుము. వారిని పరలోక స్థలములలోనికి లేపుము. సర్వశక్తుడవగు దేవా, నిన్నునీవు చూపించుకొనుము. ఆమేన్. ఇది ఎంత కలుషితమగు దానిగా మారుచున్నది!
EPH 2:6•
HEB 12:10
92మనము ఆయన యొక్క పరిశుద్ధతలో పాలిభాగస్థులమయినాము. మనము ఆయన రూపములో యున్నాము. మనము సజీవ దేవుని యొక్క సజీవ రూపములుగా యున్నాము. స్వయముగా చనిపోయి, ఆయనతో పాటు లేపబడ్డాము. (ఇప్పుడు దీనిని వినండి), ఆయన వాక్యము మనలో మరల శరీరము ధరించియున్నది. చూడుము! ఇదేమిటి? ఒక బొమ్మ వలె, కథ వలె కూర్చొనియున్న దేవుడు కాడు. కాని ఈయన సజీవగు దేవుడు. సజీవమగు దేవుడనగా ఏమిటి? నీలో నున్న వాక్యము వాస్తవ రూపము ధరించుచున్నది. నన్ను మీరు హేళన చేయుదురని నాకు తెలియును. నేను ఆలాగే యున్నాను. కాని ఓ, సోదరుడా, దీనిని నీవు చూచుచున్నావా? ప్రతి శాఖను, ప్రతి అన్యత్వమును జయించి యున్నాము. సజీవుడగు దేవుడు సజీవమగు దేవాలయములో ప్రత్యక్షపరచబడియున్నాడు. దేవుని యొక్క వాక్యము (దేవుడే) నీలో శరీరధారి అయినది. ఎందువలన? నీవు పరలోక స్థలములందు కూర్చొపెట్టబడియున్నావు. క్రీస్తు యేసులో అన్నింటినీ జయించి యున్నావు. ఆమేన్. ఓ! దానిని నేను ప్రేమించుచున్నాను. నేను కొద్దిగా ఇక్కడ దాటిపోవలసి యున్నాను.
EPH 5:23
93ఇప్పుడు వినండి. ఆయన యందు విశ్వాసముంచిన అల్పుడయిన వ్యక్తి కూడా సమస్త కీడును జయించి యున్నాడు. నీవెంత చిన్నవాడివైనా లేదా అల్పుడవైనా కావచ్చును. ఆయన విశ్వాసులలో మిక్కిలి అల్పులు కూడా ఆయనలో జయశీలురే. చూచారా. చూడండి! క్రీస్తే శరీరమునకు శిరస్సు అయియున్నాడు. అది నిజమేనా? శిరస్సు ఎక్కడుండునో శరీరము కూడా అక్కడేయుండును. మహిమ! నా శిరస్సు వెళ్ళు చోటకల్లా నా శరీరము వెంటవచ్చును. యేసు ఎక్కడుండునో ఆయన సంఘము అచ్చటుండును. ఆమేన్. ఆయన తన వాక్యములో నుండి బయటకు రాడు. ఆయన తన వాక్యములోనే నిలచియుండును. దానిని కాపాడును, దానిని ఆయన బయలుపరచును. ఆయన సంఘము ఆయనతో కూడా ఉండును.
94"నేను చాలా అల్పుడను, బ్రెన్‌హాం సోదరుడా" అని నీవు చెప్పవచ్చును. నీవాయన పాదము యొక్క అరికాలువలె యున్నావు. గుర్తుంచుకొనుము, ఆయన నీతో కూడా జయించును. ప్రతి దానిని ఆయన నీతో కూడా జయించును. నీవాయన అరికాలువే కావచ్చును. ప్రతి వ్యాధి, ప్రతి అపవాది, ప్రతి శక్తి, మరణము సహితము నీ పాదము క్రిందయున్నది. నీ క్రింద ఉన్నది. మహిమ! ఈ ఉదయము నేను ఏబది-రెండేండ్ల వాని వలె కనిపించుటలేదు. ఇది సత్యము. సోదరుడా, దీనిని నేను సంఘమునకు అర్థమగునట్లుగా చూపగలిగినచొ, మనము జయము పొందు సంఘమై యున్నాము. ఆయన యందున్న విశ్వాసులు సమస్త కీడును జయించెదరు. ఓ! మహిమ!
నేను కొద్దిగా సరి చేయుదును, నేను వచ్చేసారి మరల ప్రారంభించెదను.
దీనిని వినవలెనని కోరుచున్నాను. "బ్రెన్‌హాం సోదరుడా, నాకు శక్తి లేదు" అని నీవందువు. నాకు కూడా శక్తి లేదు. కాని నేను నా బలము మీద ఆధారపడలేదు, అది నా శక్తి కాదు, చూడండి, నాకు అధికారము ఇయ్యబడినది. నా బలము కాదు. నేను బలవంతుడను కాను; ఆయన బలవంతుడు, నేను ఆయనవాడను.
95చిన్న ఉదాహరణను చూడండి, ఈ వీధిలో నుండి ట్రాఫిక్ వచ్చుచున్నది, ఇది లూయిస్-విల్‌లోని బ్రాడ్-వే నాలుగవ వీధి. వారు ఎంతో వేగముగా వచ్చుచున్నారు, గంటకు అరవై మైళ్ళ వేగంతో వీధిలో వచ్చుచున్నారు. అందరూ చాలా వేగముగా వెళ్ళిపోవుచున్నారు. ఒక చిన్న మనిషి లేచి తన చేయిని ఎత్తియున్నాడు. సోదరుడా, బ్రేకులు అకస్మాత్తుగా పడును. ఆ చిన్న మనిషికి ఒక్క కారును ఆపు శక్తి కూడా లేదు, కాని అతనికి ఒక అధికారమున్నది. మహిమ! అది అతని అధికారము కాదు. అందులో ఒక కారు గాని, అతనిని గుద్దినచో అతడు ముక్కలయిపోవును. కాని అతడు చేయిని ఎత్తి, ఆగు, అని అతడు కేక వేయును, ఏ కారును ముందుకు దూసికొనిపోవుటకు ప్రయత్నించదు. ఎందుకు? ఆ కారు డ్రైవరు ఆ దుస్తులను గుర్తుపట్టును.
ఓ, సోదరుడా, వారు ఆ యూనిఫారంను గుర్తించి బ్రేకులు వేసిరి. ఎందువలన? అతని అధికారమును చూచిరి. అతని వెనుక ఏమి యున్నదో చూచిరి. పట్టణము యొక్క వ్యవస్థ అంతయూ అతని వెనుకనున్నది. పట్టణము యొక్క చట్టము మొత్తం అతని వెనుక కలదు. దానికి ఆ యూనిఫారము నిదర్శనము. అతడు వేరుగా ఉన్నాడు, ఎందుకనగా అతడు ఆఫీసరు.
వారు బ్రేకులు వేసి ఆగిపోవుదురు. అతడు ఒక్క మాట కూడా చెప్ప నవసరము లేదు. చేయి ఎత్తితే చాలును. నిశ్చయంగా అది చాలును. చట్టము ద్వారా ఈ అధికారము అతనికి సంక్రమించియున్నది. అది అతని వెనుకన యున్నది. అతడు బలహీనుడే, కాని అతని వెనుక ఏమున్నది? అతని దుస్తులు అతని అధికారమును చూపించుచున్నవి.
ROM 6:11•
EPH 6:13,16,17
96… విగ్రహమునకు కాదు, నీవు ఆ దుస్తులు ధరించవలెను. దేవుని యొక్క సర్వాంగ కవచము మనము ధరించుకొందము. ఆమేన్. రక్షణ శిరస్త్రాణమును, విశ్వాసమను గొప్ప డాలును పట్టుకొందము, ఈ తలుపంత పెద్దది. ఓ సోదరుడా! అతడేమై యున్నాడనునది కాదు గాని, అతడు ఎవరి ప్రతినిధియనునది చూడవలెను.
ఆ నిలబడిన వ్యక్తి చాలా చిన్న వానిగా కనిపించ వచ్చును. అతడు సామాన్య మానవుడే — కాని అతడు ఒకరి ప్రతినిధి!
యేసు క్రీస్తే మన యొక్క సర్వాంగ కవచము. అవును. దానిని చూచినప్పుడు దయ్యములన్నియూ బ్రేకులు వేయును. దేవుని యొక్క సర్వాంగ కవచనమును అవి చూచును. పరిశుద్ధాత్మ యొక్క నిజ బాప్తిస్మమును చూచును. ఆమేన్. దేవుని యొక్క సింహాసనము యొద్ద నుండి తిన్నగా వచ్చుటను అవి చూచును. ఆయన పునరుత్థానము యొక్క సర్వాంగ కవచము ధరించుకొనుటను చూచును.
నీవు బలముగా ఉన్నావనునది కాదు. నీవేమియూ కావు, కాని నీ వెనుక ఒకరున్నారు. ఎందువలన? నీవు చనిపోయినావు. నీవు సైన్యములో చేరి యున్నావు. నీవు పోలీసు బలగములో చేరియున్నావు. నీవు చట్టమును అమలు చేయుదువు. ఈ దయ్యములను లోబరచుదువు. ఇది నిజము. నీవు పోలీసు బలగములో యున్నావు. వారందరూ నీ వెనుక ఉన్నారు. చూడు, నీవు చనిపోయిన వానివని ఎరుగుము. నీవేమీ కావు, నీవు దేనినీ ఆపజాలవు, కాని నీకు అధికారము ఇయ్యబడినది, ఎందుకనగా నీవు లేపబడియున్నావు. క్రీస్తు యేసుతో కూడా పరలోక స్థలములందు కూర్చొని యున్నావు. దానిని అపవాది గుర్తించినది. ఆ చేతులు పైకెత్తబడిన వెంటనే బ్రేకులన్నియూ పడిపోవును.
97సెయింట్ మార్టిన్ ఒకసారి కోర్టులో యుండెను. అక్కడ ఒకతను దయ్యములను మంత్రములతో వెళ్ళగొట్టుటను అతడు చూచెను. జనులు పారిపోవుచుండిరి. అతడు వారిని చంప ప్రయత్నించుచుండెను. అతడు పళ్ళు బయటకు చూపించి, నాలుక చాచి చాలా భయమును కలిగించుచుండెను.
REV 3:20
98[టేపు మీద ఖాళీ యున్నది]… ఇటువంటివి జరుగునని ఆయనకు ముందే తెలియును. తనను తన స్వంత సంఘము నుండి వారు త్రోసివేయుదురని ఆయన ముందే ఎరుగును. ఇది లవొదికయ సంఘము. "ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నానని ఆయన చెప్పెను." ఆ సంస్థ ఆయనను వెలివేసినది. ఈనాడు వారు అదే చేయుచున్నారు, కాని ఆయన తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు.
ఈనాడు మేము జయము పొందు సంఘములో ఉన్నామని ఆయన శరీర సభ్యులు గ్రహించునట్లు చేయుము. మనము క్రీస్తులో యున్నాము. ఈ లోకములో ఉన్న వాటన్నింటికి పైన మనము కూర్చొనియున్నాము.
99మన స్త్రీలు ఎందుకు జుట్టు కత్తిరించుకొనగోరుచున్నారు? అది ఒక తప్పును చూపించుచున్నది. వారెందుకు తమ శరీరమును వికారముగా కనుపరచుకొనుచున్నారు? ఎల్విస్ ప్రేస్లీ వంటి దయ్యపు ఆత్మ గలవారి పాటలు వినుటకు మన జనులు ఎందుకు తమ హృదయములో ఆకలి కలిగియున్నారు? అసహ్య సంగీతమును గిటారు పట్టుకొని వినిపించుచున్నారు. వారు పెంతెకోస్తు వారని చెప్పుకొనుచున్నారు. క్రీస్తు సంఘమునకు చెందిన దానినని చెప్పుకొను పాట్ బూన్‌ని చూడండి. ఎంతో అసభ్యముగా యున్నది. "క్రీస్తు సంఘమని చెప్పుకొనుట ఎంత సిగ్గు చేటు."
2TIM 3:5
100దేవా, శాఖయొక్క పేరును తగిలించుకొని అధికారమున్నదని తలంచుచున్నాము, కాని లేదు. క్రీస్తుయొక్క పునరుత్థాన శక్తి ప్రతి వ్యక్తిలో ఉండవలసియున్నది. దేవా, ఈ ఉదయము ఇక్కడున్న మనుష్యులు దానిలో ప్రవేశించుటకు పోరాడునట్లుగా చేయుము. ప్రభువా, ఈ ఏ దేశములోనికి వెళ్ళునో, ఆ దేశపు జనులు దీనిని గ్రహించుదురు గాక. దీనిని వారు మరో విధంగా అర్థము చేసికొనకుందురు గాక. సంఘము జయమును పొందవలెను. దాని స్థానమును గ్రహించవలెను. కాతలిక్కు చర్చి తేటగా కనబడుచున్నది. వారు విగ్రహమును తయారు చేసిరి. ప్రొటస్టెంటువారు ఒక సంస్థను తయారు చేసిరి, రెండూ చెడిపోయినవి, వాక్యమును త్రోసివేయుచున్నవి. "పైకి భక్తి కలిగి యుండియూ దాని శక్తిని ఆశ్రయించని వారు." ఓ! దేవా, నీ మాట ఎంత సత్యము! ప్రతి మాట!
101తండ్రీ, మా పాపములను క్షమించుమని ప్రార్థించుచున్నాము. ఈ వర్తమానము మా హృదయములలో లోతుగా పాతుకొనును గాక! ఈ చిన్న ఆలయము నిర్మాణ క్రమములో యున్నది. ఏదో అందమైన కట్టడము కొరకు మేము చూచుట కాదు, జనులు కూర్చొను చోటు కొరకే చూడవలెను. మాది చాలా "పెద్ద ఆలయమని జనులు అతిశయించకుండునట్లు చేయుము." దేవా, ఇది ఒక ఖాళీ ఆశ్రయ స్థలముగా చేయుము. యేసుక్రీస్తు అను గురిని వారెన్నడునూ పొగొట్టుకొనకుండా చేయుము. ఆయనే వారి ఆలయమును నింపునట్లు చేయుము. వారి హృదయములను బలి పీఠముల మీద పరిశుద్ధాత్మ అగ్ని మరియు శక్తి దిగి వచ్చును గాక!
ప్రభువా, ప్రతి వ్యక్తి యొక్క హృదయమే నిజమగు బలిపీఠమై యున్నది. ప్రతి హృదయపు బలిపీఠము మీద ఈ వాక్యము ఈ ఉదయమున బరువుగా పడవలెనని ప్రార్థించుచున్నాను. దాని నుండి వారెన్నడునూ దూరము కాకుండునట్లు చేయుము. వారు సువార్త యొద్దకు స్వస్థబుద్ధితో వచ్చునట్లు చేయుము. ఈ మాటలను నమ్మునట్లు చేయుము. దయ్యపు శక్తులకు వారి హృదయములను తెరువనీయకుము. ఉద్రేకము, కేకలు, గంతులు, ఏదో శరీర అలజడి కాదు, నిజమయిన క్రీస్తు యొక్క ప్రేమాత్మను పొందునట్లు చేయుము. ఆయన తన ప్రేమను, శక్తిని అక్కడ వెల్లడిచేయును.
ప్రభువా, కృప చూపుము. రోగులను, బాధపడుచున్నవారిని బాగుచేయుము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
102నేనాయనను ప్రేమింతును, ప్రేమింతును,
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను;
నా రక్షణను కొనెను,
కల్వరి మ్రాను మీద.
నేనాయనను ప్రేమించెదను
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను,
కల్వరిమ్రాను మీద.
మన తలలు వంచుదము. మీలో ఎందరు మీ హృదయములను బలిపీఠము మీద ఉంచుదురు? దానిని దేవుని పొలముగా చేయండి. మీ హృదయమును బలిపీఠముల మీద ఆయన తన వాక్యమును విత్తును. అపుడు క్రీస్తు యొక్క పునరుత్థానపు పంట పండును. మీరు మీ చేతులెత్తి, "దేవా, నేను నా హృదయపూర్తిగా దానిని కోరుకొనుచున్నారని" చెప్పండి. మీ ఆకలిగల హృదయములను దేవుడు తప్తిపరచును. డజనుల కొలదిగా చేతులు లేచి యున్నవి.
అక్కడే దానిని విడిచిపెట్టుము, అక్కడే దానిని విడిచిపెట్టుము,
నీ భారమును ప్రభువు యొద్దకు తీసికొని వెళ్ళి
విడిచిపెట్టుము;
మనము నమ్మి సందేహించరాదు, ఆయన నిశ్చయంగా మనలను బయటకు తెచ్చును;
మన భారమును ప్రభువు యొద్దకు తీసికొని వెళ్ళి
అక్కడే విడిచిపెట్టవలెను.
2COR 5:17•
GAL 6:15•
EPH 2:6
103మీ హృదయములో గుర్తుంచుకొనండి, క్రీస్తే రక్షకుడని గుర్తుంచుకొనండి. ఆయన నీ కొరకు చనిపోయెనని మరచిపోవద్దు. నీ కొరకు నీవు చనిపొమ్ము, అప్పుడు నీ శరీరము ఖాళీ యగును, నీ ఆత్మ ఖాళీ యగును. నీ హృదయములో నుండి లోకము ఖాళీ యగును. లోకపు సంతోషములు నీలో నుండి పోవును… నీవు ఆయనతో కూడా తిరిగి లేచెదవు.
నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందని యెడల నీటి కొలను సిద్ధముగా యున్నది. నీవు ఆ నీటిలో నుండి బయటకు లేచిన వెంటనే, నీవు నూతనజీవముతో క్రీస్తుతో నడచుటకు లేచుచున్నావు. నీవు చనిపోయినావు. నీ లోని కోపము, సమస్తము తొలగిపోయినవి. నీవు క్రీస్తు నందు నూతన సృష్టివి. ఆయన నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా పైకి లేపి, ఆయనతో కూడా పరలోక స్థలములందు కూర్చోబెట్టును. ఈలోక శక్తులన్నింటికన్న పైగా నిన్నుంచును.
104నీవు ఎంత అల్పమైన వ్యక్తివైనా పరవాలేదు. నీవు చిన్న చాకలి పనిచేసికొను వ్యక్తివి కావచ్చు. నీవు అ, ఆలు కూడా నేర్చుకొనని సోదరునివి కావచ్చును. ఏమీ పరవాలేదు. నీవు క్రీస్తులో యున్నావు. అన్నింటినీ జయించి యున్నావు. నీకు ప్రతి అపవాది మీదను అధికారమున్నది. అపవాది యొక్క ప్రతి శక్తి మీదను నీకు అధికారమున్నది. నీవు క్రీస్తులో జయశీలునిగా యున్నావు.
105మనము తలలు వంచి యుంచుదము: ఈ ఉదయ కాలమున ఒక సోదరుడు అనగా సహో॥ సింక్ వచ్చుచున్నాడని నాకు తెలియును. (వారతనిని జిమ్ సింక్ అని పిలచెదరని నాకు తెలియును), మన సోదరుడు వాక్య ఉపదేశకునిగా గుర్తించబడియున్నాడు. అది నిజమే గదా, సింక్ సోదరుడా? రోగుల కొరకు ప్రార్థించు ముందుగా ఈ ఉదయమున ఈయనను సేవకునిగా అభిషేకించవలెనని, ఆయన మీద చేతులుంచవలెనని కోరుచున్నాను. మన సోదరులలో ఒకరు, సువార్తను బోధించుటకు సంఘముల యొద్దకు వెళ్ళును.
జిమ్ సింక్ సోదరుడా, నీవు బలిపీఠము యొద్దకు వచ్చుదువా? నెవిల్ సోదరుడా రమ్ము. జూనీ జాక్సన్ సోదరుడా, నీవిచ్చటనే యున్నావా? ఈ విశ్వాసములో యున్న ఇతర సేవకులు ఉన్నారా?
MARK 16:17•
ACTS 2:38•
1COR 15:4•
HEB 7:25
106జిమ్ సింక్ సోదరుడు ఈ సువార్తను నమ్ముచున్నాడు. మేము బోధించు సువార్తను బోధించును. దేవుని కుమారుని నమ్మును. ఆయన నిజముగా దేవుని కుమారుడు, కన్యకకు జనన మొందెనని నమ్ముచున్నాడు. సింక్ సోదరుడా అది నిజమేనా? ["ఆమేన్" అని జిమ్సింక్ సోదరుడు జవాబిచ్చెను.] ఆయన చనిపోయి మూడవ దినమున తిరిగి లేచి, సమస్తమును జయించి, దేవుని యొక్క కుడి పార్శమున కూర్చొని మహోన్నతుడగు దేవుని శక్తికి మధ్యలోయుండి, మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేయుచూ సజీవముగాయున్నాడని నమ్ముచున్నావా? ["ఆమేన్"] పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిస్మమును విశ్వసించుచున్నావా? ["ఆమేన్"] దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఇచ్చునని నీవు నమ్ముచున్నావా? విశ్వాసిని అద్భుతములు, సూచక క్రియలు వెంబడించునని నీవు నమ్ముచున్నావా? ["ఆమేన్"] దానిని అతడు నమ్మును. జనుల యెదుట నిందారహిత జీవితము అతడు జీవించెనని నేను నమ్ముచున్నాను. ఈ ఆలయములో అతడు బోధించెను. తరచుగా వీరిని హెచ్చరించుచుండును. అతడు దేవుని యొక్క అద్భుతమైన వ్యక్తియని నేను నమ్ముచున్నాను.
107సహో॥ సింక్‌కు విరోధముగా ఏదయినా, ఎవరయినా ఈ ఆలయములో చెప్పు వారున్నారా? ఇప్పుడే చెప్పవలెను, లేనిచో, నిత్యమూ మౌనముగా ఉండవలెను. ఈ బోధించుచున్న వర్తమానమును, ఈ వాక్యమును సహోదరుడు సింక్ నమ్ముచున్నడని ఎందరికి ఇక్కడ తెలియును? పరిశుద్ధాత్మ ఇందుకు సాక్షిగా యున్నదని మీరెరుగుదురు. సహోదరుడు సింక్‌కు అభిషేకము కావలెను. సువార్తను బోధించు సేవకునిగా ఈ సంఘము నుండి ఇతనిని పంపించెదము. ఈ ఉదయమున బోధించినట్లుగానే, ఈ వర్తమానములను బోధించును. ప్రభువు ఎక్కడికి పంపితే అక్కడికే అతడు ప్రపంచములో వెళ్ళును. మీ చేతులు ఎత్తి ఈలాగున చెప్పండి, "సింక్ సోదరుడా, నీ కొరకు ప్రార్థించుచున్నాను." దేవుడు నిన్ను దీవించును.
108మన శిరములు వంచుదము. నెవిల్ సాహోదరుడా, సింక్ సోదరునిపై చేతులుంచుము. నీవు బైబిలు మీద చేతులుంచుము.
మా పరలోకపు తండ్రీ, ఈ ఉదయమున నీ యొద్దకు ఒకాయనను తీసికొని వచ్చియున్నాము. అతడు ఈ లోక చెడుతనము నుండి విమోచింపబడియున్నాడు, లోకము విషయములో చనిపోయి యున్నాడు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించి యున్నాడు, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది యున్నాడు, పరిశుద్ధాత్మను పొందు వాగ్ధానమును కలిగి యున్నాడు, ఇప్పుడు పరలోక స్థలములందు కూర్చొని యున్నాడు, ఈ సేవ చేయుటకు జీవితములో పిలుపు కలిగియున్నాడు.
ఓ దేవా, ఈ సంఘ పెద్దలముగా, సమాజముగా, కాపరులముగా, మందను కాయు వారిమిగా యున్న మేము సహోదరుడు సింక్ నీతిమంతుడు అని చేతులెత్తి ప్రకటించుచున్నాము. ఈ మందను కాయు పనిని పరిశుద్ధాత్మ ద్వారా పొందియున్నాము. అందువలన సహోదరుడు నెవిల్ మరియు నేను, పెద్దలముగా ఈయన మీద చేతులుంచుచున్నాము. విశ్వాసముతో ప్రార్థించుచున్నాము. యేసుక్రీస్తు యొక్క పరిచర్య లోనికి జిమ్ సింక్‌ను అభిషేకించుచున్నాము. దయ చేయుము. దేవుని యొక్క శక్తితో ఇతడు నింపబడును గాక, ఎన్నడును రాజీపడకుండును గాక. నీ కొరకు ఆత్మలను సంపాదించును గాక.
దేవా, మా యొక్క విధేయతను, సోదరత్వమును ఇక్కడ చూపించుచున్నాము. ఇతడెక్కడున్నా గాని ప్రార్థనా పూర్వకముగా సహాయము చేసి బలపరచుదుము. మాకు చేతనయిన రీతిగా దోహదపడుదుము. ఓ, దేవా, మేము నీకు ఇతనిని సమర్పించుచుండగా చేర్చుకొనుము. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్.
109నీవు వాక్యము మీద చేతి నుంచి యుండగా, నిన్ను నేను క్రీస్తునందు సోదరునిగా అభిషేకించి, మా సహవాసములోనికి స్వీకరించుచున్నాము. సింక్ సోదరుడా, యేసుక్రీస్తు నామములో ఆమేన్. దేవుడు నిన్ను దీవించును. మంచిది. జనులందరూ "ఆమేన్" చెప్పుచున్నారు. దేవుడు నిన్ను దీవించును. సువార్త ఎంతో అందింపబడవలసి యున్నది. చాలా అక్కరయున్నది. మేము నూటికి నూరు శాతము నిన్ను బలపరుచుచున్నాము. మాకు చేతనయిన సహాయమంతా చేయుదుము. దేవుడు నిన్ను దీవించును.
అద్భుతముగా లేదా? ఓ, మై! ఇటు వంటి వారిని నేను చూడగోరుచున్నాను. అది మంచిది. ఇండియానాలోని యుటికాలో గల హోలీనెస్ టాబర్నికల్‌కు సంఘకాపరిగా ఇతడు నియమింపబడెను. అతని నివాస స్థలము అక్కడికి ఎంతో దూరము కాదు.
110ఇప్పుడు చూడండి. ఇంకొకరున్నారా? ఇంకా మనము రోగులకు ప్రార్థించవలెను. మీరు ప్రార్థన కార్డులిచ్చారా? వెంటనే కొన్ని ప్రార్థన కార్డులను మనం పిలచుదము. ఒక్క క్షణము అందరూ నిశ్శబ్దముగా ఉండండి. మనకు చాలా ఆలస్యమయినది. నాకు పది నిమిషముల సమయము ఇవ్వగలరా? మంచిది. ప్రార్థన కార్డులున్నవారు రండి. ఏ నంబరు నుండి ఇచ్చారు? ఒకటి నుండేనా?
మంచిది. ప్రార్థన కార్డు నంబరు ఒకటి రండి. రెండు, మూడు, నాలుగు, అయిదు. ప్రార్థన కార్డు నెంబర్లుపిలచుచున్నాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు త్వరగా వచ్చి ఇక్కడ నిలబడండి. మీరు రాలేని యెడల మాకు తెలియ చేయండి. మేము వచ్చి మిమ్మును లేపుదుము. వీలయినంత ఎక్కువ మందికి ప్రార్థించగోరుచున్నాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది; ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, ఇద్దరు మాత్రమే లేచిరి. పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పధ్నాలుగు, పదిహేను, ప్రార్థన కార్డులున్న వారందరూ కదిలి రండి. ఇటు వైపుకు రండి. మీకిష్టమయితే ఈ ప్రక్కగా రావలెనని కోరుచున్నాను.
111ఆయనాశ్చర్యకరుడు కాడా? అందరూ మర్యాదగా ఉండవలెను. పది నిమిషాల పాటు చక్కగా ఉండవలెను. ఈ ప్రార్థన కార్డుల విషయంలో ఒక ప్రకటన చేశాము. ప్రార్థన కొరకు వచ్చువారు తమ ప్రార్థన కార్డులతో రావలెనని చెప్పాము. చూడండి, వారు ఇంకా వచ్చుచునే యున్నారు. దేవుని యొక్క వరమును అవుజా బోర్డువలె వాడుకొన ప్రయత్నించుచున్నారు, కాని దానియందు మాకు విశ్వాసములేదు.
దేవుడే తన పనిచేయునట్లుగా మనము విడిచిపెట్టుట అవసరము. దానిని మీరు నమ్ముచున్నారా? ఈ ఉదయము ఈ వర్తమానమును ఎందరు నిజమని నమ్ముచున్నారు? మీకు వందనములు. మీకు ధన్యవాదములు. దేవుడు మిమ్మును దీవించును. దీనిని నా పూర్ణ మనస్సుతోను, నా పూర్ణ ఆత్మతోను, నా పూర్ణ హృదయముతోను నమ్ముచున్నాను.
112ఇక్కడ ప్రార్థన కొరకు వచ్చినవారు ఏబది మందివలె యున్నారు. ఆ దాదాపుగానే యుందురు. ఇప్పుడు వినండి. మీ ఒక్కొక్కరు ఇప్పుడు క్రీస్తు నందున్నారు. మీరు క్రీస్తు యేసునందున్నారు. ప్రతి విధమగు రోగమును జయించి యున్నారు. ప్రార్థన వరుసలో ఉన్న వారందరూ దీనిని గమనించండి. మీలోక్రైస్తవులు, అనగా తిరిగి జన్మించిన విశ్వాసులు, ఎందరున్నారో చేతులెత్తండి. ఆలాగయితే క్రీస్తులో మీకు స్థానమున్నది. మీరెప్పుడో జయించి యున్నారు. ఇప్పుడు మీరు చేయవలసినది ఏమనగా, దేవుడు చెప్పిన దానిని నిజమని నమ్మి, అంగీకరించుటయే.
113నేను ఈ వరుసనంతటినీ వివేచన కొరకు స్వీకరించజాలను. అది నా శక్తికి మించిన పని. చాలా సమయము కావలయును. అది నా వలన కాదు. మిగిలిన రోజంతా ఇక్కడ నేనుండగలనని నమ్ముచున్నాను. నాకు చాలా బాగున్నది, మంచిగా తలంచుచున్నాను. ఇది నిజమని నాకు తెలియును. ప్రభువుకు స్తుతి! కాని ఇప్పుడు మనం క్రీస్తులో యున్నాము. ఇప్పుడు మనము క్రీస్తులో కూర్చొని యున్నాము. ఆమేన్! నేను బోధించిన సంగతులు నిజమేనా? అయితే ఆయన బయలుపరచుకొనును. ఇది నిజము.
JOHN 14:12
114ఈ ప్రార్థన వరుసలో ఉన్నవారు ఎందరు నాకు క్రొత్తవారైయున్నారు? మీలో చాలామందిని నేనెరుగుదును, కాని మీలో కొందరు క్రొత్తవారు. మీ గూర్చి నాకు అసలు ఏమీ తెలియదని చెప్పువారు చేతులెత్తండి. అందరూ వరుసలోనే యున్నారు. మంచిది. ఆయన క్రీస్తేనా? దానిని మీరు నమ్ముచున్నారా? మీకు తప్పక విశ్వాసముండవలెను. దానిని మీరు తప్పక నమ్మవలెను. మీరు నమ్మని యెడల క్రియ జరుగదు. మీ స్థానమును మీరు ఎరుగవలసియున్నారు. మీ స్వాస్థమును మీరు ఎరుగవలసియున్నారు. అది నిజమేనా వెస్ట్ సోదరుడా? అది నిజము. నీ స్థానమును తెలిసికొనుము. "నేను చేయు క్రియలు మీరును చేయుదురని క్రీస్తు వాగ్ధానము చేసెను." దానిని మీ పూర్ణ హృదయముతో విశ్వసించవలెను.
115ఆ వెనుక నిలబడియున్న వ్యక్తి యొక్క తొడ క్రింది భాగములో బాధ యున్నది. నీ పూర్ణ హృదయముతో దానిని నమ్ముము. నీవు ప్రార్థన వరుసలోనికి రాలేవు, కాని నీవు వెనుకకు వెళ్ళి కూర్చొనగలవు. ఆ వ్యాధి నిన్ను విడిచి పెట్టును. అది కాన్సరు కాదు. వెనుకకు వెళ్ళి కూర్చొము. అది పోవును. అతనిని ఎన్నడూ నా జీవితంలో చూడలేదు. సోదరుడా, మనము క్రొత్తవారమయితే, నీ చేతిని పైకి ఎత్తుము. మేము అపరిచితులము. ఏమిటి సంగతి? అతడు బాగయ్యెను.
ఈ వేదిక యొద్ద నున్న నీవు నమ్ముదువా? మీ సంగతి ఏమిటి? మనము క్రొత్తవారము. మిమ్మును నేనెరుగను, దేవుడు మిమ్మునెరుగును. నేనాయన దాసుడనని నమ్ముచున్నారా? నేను బోధించు వర్తమానమును నమ్ముచున్నారా? నీ వీపులో నున్న నొప్పిపోవునని నేను చెప్పినచో ఎట్లుండును? నీ పూర్ణహృదయముతో దానిని నమ్ముదువా? నీ పేరు బర్క్ హార్డ్. నీవు ఓహియో నుండి వచ్చావు. స్వస్థత పొంది వెళ్ళుము.
నీవు నీ కొరకు ఇచ్చటికి రాలేదు, మరొకరి కొరకు నీవిచ్చటకు వచ్చి యున్నావు. ఒకామె గూర్చి వచ్చితివి. ఆమె కూడా ఓహియో నుండి వచ్చి యున్నది. ఆమె పేరు ఆలీస్ మెక్ వాన్. అవును ఆమెకు ఆపరేషను జరిగి యున్నది. ఇది నిజము. కడుపు నొప్పి, మరియు స్త్రీ వ్యాధి, నరముల ఉద్రిక్తత ఆమెకున్నది. అది నిజమేనా? నమ్మిక మాత్రముంచుము. ఆమె బాగవును. నీ పూర్ణహృదయముతో నమ్మి వెళ్ళుము. నీ నిండు హృదయముతో నమ్మును. అది నీకు దొరకును.
116నీవెట్లున్నావు? నాకు తెలియదు. మనము అపరిచితులము. అది నిజమేనా? నేనాయన దాసుడనని నీవు నమ్ముచున్నావా? క్రీస్తులో మనము జయము పొందియున్నామని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మిన యెడల నీనరముల జబ్బు, నీ బాధలు అన్నియూ తొలగిపోవును. శ్రీమతి అలెన్, నీవు క్షేమముగా ఇంటికి తిరిగి వెళ్ళుము. మనము అపరిచితులము. కాదా? ముందెన్నడూ నిన్ను నేను చూడలేదు. ఇదే మనం మొదటిసారి కలిసికొనుట.
మనము ఒకరికి ఒకరము క్రొత్త వారము. నేనాయన ప్రవక్తనని మీరు నమ్ముచున్నారా? దానిని నీవు నమ్ముచున్నావా? నీవు మూత్రపిండపు వ్యాధితో బాధపడుచున్నావు. ఇది నిజము. అవును గదా? నీవు ఇచ్చటనుండి రాలేదు. నీవు దక్షిణాది నుండి వచ్చియున్నావు. రక్షింపబడని నీ పిల్లల కొరకు నీవు ప్రార్థించుచున్నావు. నీ వెనుక నీ భర్త యున్నాడు. తన స్నేహితుని కొరకు ప్రార్థించుచున్నాడు. నీవు నా తల్లిదండ్రులకు స్నేహితుడవై యున్నావు. ఎల్.సి లేక ఎస్.టి అని పిలువబడు నీ కుమారుడు ఇచ్చటికి వచ్చుచున్నాడు. [జె.టి అని సహో॥ నెవిల్ చెప్పెను.] ఎస్.టి. కాదు గాని జె.టి. నాకు తెలియును. చిన్న నల్లజుట్టు గల మనిషి. నీ ముందు అతడు నిలబడియుండుట నాకు కనబడుచున్నది. ఇంటికి తిరిగి వెళ్ళుము. నీ మనవికి జవాబు దొరకును. ఇంటికి వెళ్ళుము.
జార్జియా నుండి వచ్చిన ఒకాయన ఈ ఉదయము ఇచ్చట యున్నాడా? అవును. నా జీవితంలో నీ తల్లిదండ్రులను ఎన్నడునూ చూడలేదు. అది సత్యమని నీకు తెలియును, కాని నిన్ను ఇక్కడ కొద్దిసేపటి క్రితమే చూచాను. నిన్ను అప్పుడే ఎరుగుదును. నీ మనవిని ఆయన వినెను, సందేహము వద్దు.
117మీరు మీ పూర్ణహృదయముతో నమ్ముచున్నారా? ఎందరు ఇప్పుడిన్నారు? మీరందరూ క్రీస్తులో యున్నారు. అదేనా సువార్త అని మీరడుగుచున్నారా? యేసుక్రీస్తు చేసినది అక్షరాలా అదే. అపోస్తలులు చేసినది అదే ఐరేనియస్, ఇంకా ఇతరులు చేసినది అదే. కచ్చితముగా అదే.
దానిని మీరు నమ్ముచున్నారా? అయితే తలలు వంచుడి.పెద్దలు ఇటు రావలెను. చాలామంది వరుసగుండా వచ్చుచున్నారు. మేము ఇద్దరు లేదా ముగ్గురిని ఎంచుకొనియున్నాము. ఇక్కడికి రండి. ఈ నా నెవిల్ సోదరుడు దైవజనుడు. అది నేను నమ్ముచున్నాను.
ఈ వరుస గుండా మేము దాటి వెళ్ళవలెనని తలంచుచున్నాము. వారి మీద చేతులుంచుదము. మీరందరూ బాగవుదురని తలంచుచున్నారా? అందరూ దీనిని నమ్ముచున్నారా? అయితే మీరు తలలు వంచండి. మనము జయము పొందిన సంఘములో యున్నాము.
ప్రభువైన యేసూ, ఈ సోదరుని నేనెరుగుదును. ఆ కారణము వలననే నేను ఇతనిగూర్చి ఏమియూ చెప్పుట లేదు. అతని కోరిక ఏమిటో నేనెరుగుదును. ప్రభువా, అతనిని బాగుచేయుమని ప్రార్థించుచున్నాను. ప్రభువా, యేసుక్రీస్తు నామములో అతని కోరికను ఇమ్ము.
పరలోకపు తండ్రీ, ఈ చిన్న సోదరుని మీద చేతులుంచుచున్నాము. అతని విడుదల కొరకు ఈ ఉదయము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
118నీవు పరలోకపు తండ్రీ, ఈ మా డాచ్ సోదరికి ఇమ్ము. చాలా మంచి సోదరి. ఇక్కడున్న మాకు నిజమగు సోదరి. మా కుటుంబమునకు, మీ ప్రియులకు ఆమె నిజ స్నేహితురాలు. ఆమె మరియు ఆమె భర్త నీకు పిల్లలని మేము విశ్వసించుచున్నాము. ఈ ఉదయమున ఆమె కోరికను దయచేయుమని ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
దేవా, యేసు నామములో మా సోదరిని దీవించుము. ఈమె నీ దాసురాలని ప్రభువా మేమెరుగుదుము. ఆమె మనవిని ఆలకించుమని ప్రార్థించుచున్నాము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
ఓ పరలోకపు తండ్రీ, సోదరి బ్లాంకోను నీవు మాత్రమే బాగు చేయగలవని నమ్ముచున్నాను. ఆమెను దీవించి, ఆమె యొక్క మనవిని ఆలకించుమని ప్రభువా మేము ప్రార్థించుచున్నాము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
పరమ తండ్రీ, యేసుక్రీస్తు నామములో మా సోదరి మీద చేతులుంచుచున్నాము. నీ నామము మహిమపరచబడుటకే ఆమె విడుదల కొరకు ప్రార్థించుచున్నాము. ఆమేన్.
MARK 16:17
119"నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును," ఈ సోదరి మీద మా చేతులుంచుచున్నాము. బాగుచేయుము. ప్రభువా, యేసు నామములో బాగుచేయుము. ఇక్కడ నరముల ఉద్రిక్తతతో వణకుచున్న శరీరము నిలబడియున్నది. ప్రభువా, పరిశుద్ధాత్మ ప్రభావము వలన ఈ శరీరము అలసిపోయి యున్నది, కాని నీవు దేవుడవు, ఈ యువతిని యేసు నామములో ఇప్పుడే బాగుచేయుము.
సర్వశక్తుడవగు దేవా, మా సోదరుని మనవిని ఆలకించుము. తండ్రీ, దానిని దయచేయుము. ఇతని మీద చేతులుంచుచున్నాము. శత్రువును ఖండించుచున్నాము. ఇతని ఆత్మను క్షమించుము. ఇతని పేరు ముందు ఒక నల్లని మచ్చను ఉంచియున్నది. ప్రభువా, ఈ ఉదయమున విజయవంతముగా నీవు లేవవలెను. క్రీస్తు యేసులో ఇతనికున్న స్థానమును తెలియచేయుము. అతని అక్కరను తీర్చుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము.
మా పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు నామములో ఈ సోదరుని మీద చేతులుంచుచున్నాము. అతని మనవిని ఆలకించుము. ఆమేన్.
120తండ్రీ, ఇక్కడ చక్కని చిన్న పాప యున్నది. యేసు నామములో ప్రభువు ఆమెకు కృప చూపును గాక! దేవుని నామ మహిమార్థమై అడుగుచున్నాము.
దేవా, ఈ తల్లి యొక్క హృదయ ఘోషను ఎరుగుదుము. ఆ కుమార్తె యొక్క కేకను వినుచున్నాను. దేవా, ఈ ఉదయమున ఆమెకు విశ్వాసమును దయచేయుము. దానిని ఇప్పుడే ఆమె అన్వయించుకొనును గాక! ఆమెకు శక్తి కలదని ఎరిగించుము. యేసుక్రీస్తు నామములో అది జరుగును గాక!
దేవా, ఈ చిన్న బాలుని బాగు చేయుము. యేసుక్రీస్తు నామములోప్రార్థించుచున్నాము.
దేవా, మా తండ్రీ, మా సోదరి మీద ఈ ఉదయమున చేతులుంచి ప్రార్థించుచున్నాము. ఆమె మనవిని అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
మా పరలోకపు తండ్రీ, ఈ చిన్న స్త్రీ వచ్చి తన స్థానమును గ్రహించి స్వస్థత పొందగోరుచున్నది. ఆమె మీద మేము చేతులుంచుచున్నాము. ఆమె స్వస్థత కొరకు అడుగుచున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.
ఈ చిన్న బిడ్డ మీద యేసుక్రీస్తు నామములో మా చేతులుంచి స్వస్థత కొరకు అడుగుచున్నాము. యేసుక్రీస్తు నామములో ఈ సోదరి మీద మేము మా చేతులుంచుచున్నాము. ఇప్పుడే ఆమెను బాగుచేయుము.
MATT 6:9•
LUKE 11:2
121పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక! ఈ సోదరుని మీద మేము చేతులుంచుచున్నాము. యేసుక్రీస్తు నామములో ఇతడు స్వస్థత పొందును గాక. ఆమేన్.
పరలోకపు తండ్రీ, మా ఘనుడగు సోదరుడును, నీదాసుడును, దైవజనుడును అగు ఇతని మీద మా చేతులుంచుచున్నాము. అతని కోరిక అనుగ్రహించబడును గాక! యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అతడు తన స్థానము స్వీకరించును గాక! ఇతడు దేవుని కుమారుడు. ఇది మహిమకరమగు కాలము.
పరలోకపు తండ్రీ, మా చిన్న సోదరి భయంకరమగు చీకటిలో నుండి బయటకు వచ్చి, వెలుగులో నడచుచున్నది. ప్రభువా, ఆమె మనవిని ఆలకించుము. ఈ ఉదయమున ఆమె బలముగల ఆత్మ పైకెత్తబడునట్లు దయచూపుము. పరలోకపు వాతావరణములో ప్రవేశపెట్టుము. యేసు నామములో ఆమె విన్నపమును దయ చేయుము. ఆమేన్.
పరలోకపు తండ్రీ, ఇక్కడున్న మా సోదరుని మీద ప్రభువైన యేసు నామములో మేము చేతులుంచుచున్నాము. నీ ఆశీర్వచనము ఇతనికి దయచేయవలెనని అడుగుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
మా పరలోకపు తండ్రీ, మా గ్రేడీ సోదరి మీద మేము చేతులుంచుచున్నాము. ఆమె కోరిక అనుగ్రహించబడునట్లు దయచూపుము. తండ్రీ, యేసుక్రీస్తు నామములో మేము మా చేతులను ఈమె మీద వేయుచున్నాము.
122మా పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు నామములో మా సోదరి మీద చేతులుంచుచున్నాము. యేసు నామములో ఆమె కోరిక తీర్చబడును గాక!
మా పరలోకపు తండ్రీ, మా సోదరి ఈ వరుసగుండా దాటిపోవుచుండగా ఆమె మీద చేతులుంచుచున్నాము. దేవుని యొక్క క్రీస్తు ఆమెకు దగ్గరగా వచ్చి, ఆమె బాధను తీసివేసి, బాగుచేయును గాక. ఆమేన్.
పరలోకపు తండ్రీ, మా సోదరుని మీద చేతులుంచుచున్నాము. యేసు క్రీస్తునందు విశ్వాసముంచునట్లుగా ప్రార్థించుచున్నాను. యేసు నామములో ఈతనిని బాగు చేయుము. ఆమేన్.
పరలోకపు తండ్రీ, ఈ బాలిక మీద మేము మా చేతులుంచుచున్నాము. మా ప్రశస్త ప్రభువును అడుగుచున్నాము. యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థత కొరకు అడుగుచున్నాము. ఆమేన్.
మా ప్రశస్త ప్రభువా, దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామములో మా సోదరుని మీద చేతులుంచుచున్నాము. ఆయన ద్వారా మేము అత్యధిక విజయవంతులము. మా సోదరునికి అతని కోరికను తీర్చుమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
123మా తండ్రీ, మా సోదరి యొక్క సోదరుని మీద చేతులుంచుచున్నాము. ఇతడు చిన్న సిలువ యోధుడు. ఇతని మీదికి నీ ఆత్మ దిగి వచ్చి, ఇతని కోరికను సఫలపరచును గాక. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
మా పరలోకపు తండ్రీ, ఈ చిన్న సిలువ యోధుని మీద చేతులుంచుచున్నాము, నీ వాక్యము కొరకు నిలబడియున్నాడు, విమర్శలను తట్టుకొని యున్నాడు. వాక్యము కొరకు నిలబడెను. క్రీస్తు యేసునందు అత్యధిక విజయశీలునిగా నడచుచున్నాడు. తండ్రీ, అతని మనవిని అంగీకరించుము. నా ప్రార్థననర్పించుచున్నాను. ప్రభువా, నీ ఆశీర్వచనమును దయచేయుము. నీవతనిని స్వస్థపరచుము, అతని మనవి ఆలకించుము. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.
పరమతండ్రీ, దేవుడు లేకుండా ఈ శిశువు బ్రదుకజాలదు, కాని దేవుడామెను బాగుచేయగలడు. నేను ఈ బిడ్డా మీద చేతులుంచి, శత్రువును గద్దించుచున్నాను. యేసుక్రీస్తు నామములో దీనిని చేయుమని కోరుచున్నాను. ఆమేన్.
మా సోదరి యొక్క హృదయ వాంఛను బట్టి ఈమె మీద యేసుక్రీస్తు నామములో చేతులుంచుచున్నాము. ఆయన జయశీలుడు, శరీరధారిగా మారిన దేవుని ఆలయం, దేవుని కుమారుడు యేసుక్రీస్తూ, మా సోదరికి ఆమె విన్నపమును అనుగ్రహించుము. ఆమేన్.
124మన సోదరి కిడ్ ఆశీర్వదించబడును గాక! మా పరలోకపు తండ్రీ, ఈ వయస్సు మీరిన వృద్ధులను మా చేతులలోపట్టుకొని, ఇక్కడ నిలబడి యున్నాము. నా బాల్యము నుండి వీరు సువార్త బోధించుచున్నారు. కొద్ది రోజుల క్రితం కాన్సరుతో మరణావస్థలో యున్నారు. మేము పరుగిడి అతని యొద్దకు వెళ్ళాము. ఎనభై ఏళ్ళ వృద్ధుని మీద దేవుని యొక్క శక్తి ప్రవహించినందున బాగుపడెను. విశ్వాసము తక్కువగా ఉండిన వైద్యులు దానిని అర్థము చేసికొన లేకపోయిరి. ఈ ఉదయ కాలమున అతని మనవిని ఆలకించుమని ప్రార్థించుచున్నాను. ప్రభువా, అతని యొక్క భార్యను దీవించుము. తన భర్తను సువార్త సేవకు పంపించు నిమిత్తము ఆమె బట్టలు ఉతికినది. యేసుక్రీస్తు యొక్క ఈ రుధిర సువార్తను అతడు ప్రకటించెను. ప్రభువా, దానిని అనుగ్రహించుము.
ప్రభువా, వారి కుమారుడు జూనియర్‌ను దీవించుము. అతనిని బాగు చేసి బలముతో నింపుమని ప్రార్థించుచున్నాము. అతడు వారికి సహాయకారిగా నుండి ఒక చోటు నుండి మరొక చోటుకు తీసికొని వెళ్ళుచున్నాడు. వారు జేబు రుమాళ్ళ మీద చేతులుంచుచున్నారు. వారు బోధించుటకు ఇక బయటకు వెళ్ళలేరు, చాలా ముసలివారయిరి. వారు ఆస్పత్రులను, గృహములను, దర్శించి రోగులకు ప్రార్థించుచున్నారు. ప్రార్థనా వస్త్రములనిచ్చుచున్నారు. దేవా, నీవు దానిని ఘనపరచుము. నీవు ఘనపరచెదవని నాకు తెలియును. ఇంకా వారు చాలా దినముల పాటు పని చేయునట్లుగా దీవించి, బలముతో నింపుము. తండ్రీ, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
125మిమ్మును దీవించును. ఆలాగు జరుగును. కిడ్ సోదరుడా, అది జరుగును. [కిడ్ దంపతులు బ్రెన్‌హాం సోదరునితో మాట్లాడుచున్నారు.] దేవునికి స్తుతి. ఆమేన్. ఫోనులో ఆయన కొరకు ప్రార్థించాము.
ఎనభై సంవత్సరములు దాటిపోయిన ముసలివారు వీరు, బోధించుటకు బయటకు వెళ్ళలేరు మరియు వేదిక మీద నిలబడలేరు; ఆలాగు నిలబడి బోధించలేని ముసలివారు, అయినా గాని వారు ప్రార్థనా వస్త్రములను పంపించుచున్నారు. వాటిని రోగుల మీదను, శ్రమపడుచున్న వారి మీదను ఉంచుచున్నాము. ఆస్పత్రులలో వాటిని ఉంచుచున్నాము. వారు బయట స్థలములకు వెళ్ళి బోధించలేరు గాని తమ చేతనయినది చేయుటకు ప్రయత్నించుచున్నారు. ఇది చూచి యువకులమగు మనము సిగ్గుపడవలెను. క్రీస్తు కొరకు ఏదో చేయుచున్నారు. ఇది నిజము.
126ఈ కిడ్ దంపతులను గుర్తుంచుకొనండి. నేను పుట్టక ముందు నుండియే సువార్త బోధించుచున్నాను. ఇది నిజము. రోగుల కొరకు బోధించుచున్నారు. చాలా బలమగు సైనికుడు. కిడ్ సోదరుడా నీ వయసెంత? ఎనుబది-ఒక్క సంవత్సరము. ఇంకా దేవుని రాజ్యము కొరకు పనిచేయుచున్నాడు. వేదిక మీద నిలబడి ప్రసంగము చేయలేనంత ముసలివాడు, కాని ఆస్పత్రులకు వెళ్ళును, పడకలయొద్దకు వెళ్ళి ప్రసంగించును. అతనిని ఒక బాలుడు కారులో తీసికొని వెళ్ళును, వారు నడువలేరు, చాలా వృద్ధ దంపతులు కావున కారులో వెళ్ళి చేతి గుడ్డలుంచుచున్నారు.
వారి ఒక ప్రియమైన బాలిక చావుబ్రతుకుల మధ్యన ఒకనాడుండగా, కబురు పంపిరి. వారి మనుమరాలి కొరకు ప్రార్థించాము. ఇప్పుడా బాలిక బాగున్నది. దేవునికి స్తోత్రము!
127వారు నన్ను పిలచి దాదాపు రెండు సంవత్సరములయినదని తలంచుచున్నాను. కిడ్ సోదరుడా! డెబ్బది-ఎనిమిది లేదా ఎనభై సంవత్సరాల వయస్సులో ప్రాస్టేటు గ్రంథులలో కాన్సరు వచ్చెను. ఇక ఏమీ చేయలేమని వైద్యులు చెప్పి ఊరకుండిరి. మేము తొందరపడినాము. బిల్లీ, నేను చాలా శ్రమపడి కారు నడుపుకొని వెళ్ళాము. అతడున్నచోటుకు వెళ్ళాము. మమ్మును ఆ ఉదయము వెళ్ళమని పరిశుద్ధాత్మ చెప్పినది. మాకు నడిపింపు లేనియెడల ఆలాగు వెళ్ళియుండెడివారము కాము. "వెళ్ళమని" పరిశుద్ధాత్మ చెప్పియున్నది. మేము వెళ్ళి అతని మీద చేతులు వేసి ప్రార్థన చేశాము. ఆ తరువాత వైద్యులకు వ్యాధి చిహ్నములే దొరకలేదు. దేవునికి మహిమ! ఎందువలన? క్రీస్తుయేసు నందు మనకు స్వాస్థమున్నది. వ్యాధులన్నిటి మీదను, శత్రువు యొక్క బలమంతటి మీదను ఆయనకు అధికారమున్నది.
128ఓ! మీరాయనను బట్టి సంతోషించుటలేదా?
దాదాపు ప్రతిచోట జనులున్నారు.
వారి హృదయములు మండుచున్నవి
పెంతెకోస్తు దినమున దిగిన అగ్ని
వారిని దహించి, శుభ్రము చేసినది
ఓ! అదిప్పుడు నా హృదయములో మండుచున్నది
ఆయన నామమునకు చెప్పుటకు సంతోషించుచున్నాను వారిలో నేనొకడిని,
వారిలో నేనొకడినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
వారిలో నేనొకడిని, వారిలో నేనొకడిని,
వారిలో నేనొకడినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
ఈ జనులు నేర్చుకోపోయినప్పటికిని
లోక విషయములో అతిశయించకపోయినా గాని,
వారు పెంతెకోస్తును పొందుకొనిరి
యేసు నామములో బాప్తిస్మము పొంది అన్ని చోట్ల చెప్పుచున్నారు
ఆయన శక్తి మారలేదని.
వారిలో నేనొకడినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
వారిలో నేనొకడినని మీలో ఎందరు చెప్పగలరు?
129వారిలో నేనొకడినని మీలో ఎందరు చెప్పగలరు? ఇప్పుడు చేతులెత్తండి:
వారిలో ఒకడిని, వారిలో ఒకడిని
వారిలో నేనొకడినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
ఓ! వారిలో నేనొకడిని,
వారిలో నేనొకడినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
నా సోదరుడా, ఈ దీవెన వెదకుచూ రమ్ము.
అది నీ పాప హృదయమును శుద్ధి చేయును
ఆనంద గంటలు మ్రోగునట్లుగా అది చేయును
నీ ఆత్మను అది మండించును
ఓ! ఇది నా ఆత్మలో ఇప్పుడే మండుచున్నది
ఆయన నామమునకు మహిమ,
వారిలో నేనొకడినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
హల్లెలూయా! వారిలో నేనొకనిని,
వారిలో నేనొకనిని
వారిలో నేనొకనినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
వారు ఒక మేడ గదిలో కూడి యుండిరి
అందరూ ఆయన నామములో ప్రార్థించుచుండిరి.
వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిరి
అంతట సేవచేయు శక్తి వచ్చెను.
ఆ దినమున ఆయన వారికి చేసినదే ఈనాడు నీకును చేయును
వారిలో నేనొకనినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
వారిలో నేనొకనిని, వారిలో నేనొకనిని,
వారిలో నేనొకనినని చెప్పుటకు సంతోషించుచున్నాను. హల్లెలూయా!
వారిలో నేనొకనిని, వారిలో నేనొకనిని,
వారిలో నేనొకనినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
130ఇపుడు మనము పాడుదము, మనము ఒకరికొకరం కరచాలనం చేసుకుంటూ, చెప్పండి:
వారిలో నేనొకనిని, వారిలో నేనొకనిని
వారిలో నేనొకనినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
మీరు ఆమేన్ చెప్పండి.
వారిలో నేనొకనిని, వారిలో నేనొకనిని
వారిలో నేనొకనినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
మీరు సంతోషించుచున్నారని, చెప్పండి, "ఆమెన్"
వారిలో నేనొకనిని, వారిలో నేనొకనిని
వారిలో నేనొకనినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
వారిలో నేనొకనిని, వారిలో నేనొకనిని
వారిలోనే నొకనినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
131ఈ వచనమును మరల పాడుదమా?
వీరు విద్యలేని వారు కావచ్చును.
(వారికి డి.డి, పి.హెచ్.డి మొదలగు
పెద్ద డిగ్రీలు లేకపోవచ్చును. మీరెరుగుదురు)
వీరు విద్యలేని వారు కావచ్చు
లోకపు పేరు లేదు (పెద్ద సంస్థగా లేరు)
వారు తమ పెంతెకోస్తును పొందిరి
ప్రతి ఒక్కరూ యేసు నామములో బాప్తిస్మము పొందిరి.
ప్రతి చోటా వారు చెప్పుచున్నారు.
ఆయన శక్తి మారలేదని వారిలో
నేనొకనినని చెప్పుకొనుటకు సంతోషించుచున్నాను.
వారిలో నేనొకనిని, నేనొకనిని వారిలో నేనొకనినని
చెప్పుటకు సంతోషించుచున్నాను.
వారిలో నేనొకనిని, వారిలో నేనొకనిని,
వారిలో నేనొకనినని చెప్పుటకు సంతోషించుచున్నాను.
ఈ భూలోములోని బంగారు మిలయనుల కొరకు
ఈ ప్రశస్త స్థలమును నేను విడువను.
శోధకుడు నన్ను తరచుగా శోధించినా గాని
దేవుని స్థలములో క్షేమముగా యుందును.
ఆయన ప్రేమ మరియు కృపలలో భద్రముగా యుందును.
నేను హల్లెలూయా యొద్ద జీవించుచున్నాను.
132ఓ, మై! దానిని బట్టి నేనెంతో సంతోషించుచున్నాను. మీరు ఆలాగు లేరా? వారిలో ఒకనిగా యుండుటబట్టి మీరు సంతోషించుట లేదా? ఒకనిగా వారిలో యుండిన చాలును. ఆ దీనజనులలో ఒకరిగా ఉంటే చాలును, వారు సమర్పించు కొనిన జనులు. సజీవ దేవుని యెదుటికి దిగి వచ్చిరి. — విగ్రహము ఎదురుగా కాదు — సజీవ దేవుని ఎదుటికి దిగి వచ్చిరి. సంస్థ ఎదుటకు కాదు, ఒక పుస్తకములో పేరు వ్రాసికొనుట కాదు, చదివిన తమ సిద్ధాంతమును అప్పజెప్పుటకు కాదు గానీ; వాక్యమును నీలో శరీరధారి కానిమ్ము. చూడండి, నిన్నునీవు తగ్గించుకొనవలెను, అందువలన ఆయన నిన్ను హెచ్చించెను. గర్వము అహంకారము కాదు. నేను "ఇంత గొప్ప వానిని, అంత గొప్పవానిని అని చెప్పుకొనుట కాదు." "దీనత్వము మరియు మాధుర్యము. ఆయన నా వంటి నీచుని రక్షించెను. ఆయనెట్లు ఆ పనిని చేసెను?" నిజమగు క్రైస్తవుడు ఆ విధంగానే తలంచును. దానిని మీరు నమ్ముచున్నారా? ఆయన బహువాస్తవముగా ఉన్నాడు!
నిజము, నిజము, ఆయన నాకెంతో వాస్తవమైన వాడు!
ఓ! నిజము, ఆయన నాకెంతో వాస్తవమైన వాడు.
కొందరాయన గూర్చి సందేహించినా,
నేనాయన లేకుండా జీవించజాలను
అందుకే నేనాయనను ప్రేమించుచున్నాను,
ఆయన నాకు నిజమైనవాడు.
నిజమైన వాడు, ఆయన నాకెంతో నిజమైన వాడు. (పాడండి)
నిజము, నిజము, ఆయన నాకెంతో నిజమైనవాడు.
కొందరాయన గూర్చి సందేహించినా,
నేనాయన లేకుండా జీవించలేను.
అందుకే నేనాయనను ప్రేమించుచున్నాను.
ఆయన నాకు నిజమైనవాడు.
ఓ! నేను దానిని బట్టి సంతోషించుచున్నాను! అవునండి. ఓ, ఈ గొప్ప ప్రాచీన సువార్త మార్గమును బట్టి నేను ఎంతగానో సంతోషించుచున్నాను. ఈ మహిమకరమగు పాత సువార్త మార్గములో జీవించుచున్నాను.
133స్నేహితులారా, క్రీస్తు సింహాసనము యొద్ద మరల మనము కలిసికొను వరకూ మీరు నన్ను గుర్తుంచుకొని నా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రతి ఒక్కరిని దేవుడాశ్వీరదించును. ఇక్కడ ఎక్కువ సేపు మిమ్మునుంచినందుకు చాలా విచారమని నేను చెప్పజాలను.
ఇక్కడ కొందరు చేతిగుడ్డలుంచియున్నారు, వాటిపై నేను చేతులుంచాను, రోగుల కొరకు ప్రార్థించుచున్నాను. ఆత్మ నాకు చెప్పిన వెంటనే నేనది చేయుటకు ప్రారంభించుచున్నాను. అనేక దర్శనములలోనికి నేను వెళ్ళుట లేదు, ఎందుకనగా నేను అలసిపోయి చాలా బలహీనునిగా యున్నాను. ఇక్కడ దాదాపు రెండు లేదా మూడు గంటల పాటు ప్రసంగించుచున్నాను. వరుసలోని కొందరికి ఈలాగు ఎందుకు చెప్పుచున్నానంటే, దేవుడే దేవుడు అని మీరు గ్రహించవలెననియే. చూచారా! అసాధ్యమైనది, నమ్మలేనిది, పరిశోధింపజాలనిది జరుగుట మీరు చూచుచున్నారు.
గుర్తుంచుకొనండి, మీ ఒక్కొక్కరికి క్రీస్తు శక్తి యున్నది. మీరు శక్తిహీనులే కావచ్చు; కాని మీకు అధికారమున్నది, మీకు అధికారమున్నది. మీరు హెచ్చింపబడి యున్నారు, చాలా పై నున్నారు; మిమ్మును మీరు హెచ్చించుకొనుట కాదు, క్రీస్తు మిమ్మను హెచ్చించెను. మిమ్మును క్రీస్తు ఎంతగా హెచ్చించునో, అంతగా మీరు దీనులగుదురు, చూడండి, మీరు అంత దీనులగుదురు. కావున నావంటి నీచుని ఆయన ఎట్లు రక్షించెను? ఆయన ఏలాగు ఈ పనిని చేసెను? కాని ఆయన దీనిని చేసెను. దానిని బట్టి ఎంతగానో నేనాయనకు వందనములు చెల్లించుచున్నాను. ఆమేన్.
134యేసు నామము నొద్ద వంగును,
ఆయన పాదము నొద్ద అందరూ సాగిలపడుదురు,
పరమందు రాజాధిరాజుగా,
ఆయనకు కిరీటము ధరింపచేయుదుము,
మన యాత్ర పూర్తి అయిన పిదప
యేసు నామమును నీతో కొనిపొమ్ము
ప్రతి ఉరి నుండి రక్షణగా
శోధనలు నిన్ను చుట్టుముట్టినప్పుడు
ఆ పరిశుద్ధ నామమును ప్రార్థనలో ఊదుము.
ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును ఊదుము.
ప్రశస్త నామము. ఓ ఎంత మధురము!
భూలోక నిరీక్షణ, పరలోకానందము.
ప్రశస్త నామము (ఓ, ప్రశస్త నామము)
ఓ ఎంత మధురము!
ఇప్పుడు దీనిని మరిచిపోక వినండి. ఆ పాట మీరు పాడుడి. ఆ వచనమును నేను పాడెదను. చూచారా? నేను పాడగోరుచున్న వచనమును గుర్తుగా పాడగలనో లేదో తెలియుట లేదు.
యేసు నామము నొద్ద వంగును
ఆయన పాదము నొద్ద అందరూ సాగిలపడుదురు
పరమందు రాజాధిరాజుగా ఆయనకు కిరీటము ధరింపచేయుదుము.
మన యాత్ర పూర్తి అయిన పిదప (చూచారా?)
యేసు నామమును నీతో కొనిపొమ్ము
ప్రతి ఉరి నుండి రక్షణగా శోధనలు నిన్ను చుట్టుముట్టినప్పుడు
ఆ పరిశుద్ధ నామమును ప్రార్థనలో ఊదుము.
(అంతే. ఆ చేతిని ఎత్తగానే బ్రేకులు పడును. చూచారా?)
ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును
ఊదుము. ప్రశస్తనామము. ఓ ఎంత మధురము!
భూలోక నిరీక్షణ, పరలోకానందము.
ప్రశస్త నామము (ఓ, ప్రశస్త నామము).
ఓ ఎంత మధురము!
135మనందరము కలిసి మరల దానిని చెప్పుదము. మీరేమందురు? మరల ఆ వచనమును గూర్చి ఆలోచించుదము. "యేసు నామమును నీతో కొనిపొమ్ము. సమస్త ఉరి నుండి అది నిన్ను రక్షించును." ఇప్పుడు మనము కన్నులు మూసి దానిని పాడుదము:
యేసు నామమును నీతో కొనిపొమ్ము,
ప్రతి ఉరి నుండి అది నిన్ను రక్షించును.
(ఇప్పుడు వినండి. ఏమి చేయుదురు?)
ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును ఊదుము.
ప్రశస్తనామము. (ప్రశస్త నామము)
ఓ! ఎంత మధురము!
భూలోక నిరీక్షణ….
[సహో॥ నెవిల్‌ను ముగించమని బ్రెన్‌హాం సోదరుడు అడుగుచున్నాడు.]
భూలోక నిరీక్షణ….
ఇప్పుడు మీ సంఘకాపరి నెవిల్ సోదరుడు వచ్చి ముగించును.