నీవు తప్పుక తిరిగి జన్మించవలెను

నీవు తప్పుక తిరిగి జన్మించవలెను

1…ప్రభువు యొక్క పరిచర్యలో, ఈ ఉదయకాల వేళలో, సహోదరుడు నెవిల్ మరియు నేను కలిసికొనుటకు ప్రమత్నించాము. ఏమి చేయాలో మాట్లాడుకున్నాము. ఆయన ఇక్కడకు వచ్చి ఆ ఉదయకాలములో అందరికొరకు బోధించాలని నేను ప్రయత్నించాను. రాత్రి నేను బోధింతునని చెప్పాను. కావున ఆయన పని నాకు బదలాయించబడినట్లుగా జరిగినది. నేను ఈ ఉదయకాలము, మరియు ఈ రాత్రి, రెండు సమయములలోను ప్రసంగించవలసియున్నది. కావున ఆయన ఒక మంచి వ్యాపారవేత్త. కావున, ఆ తరగతి ప్రార౦భించుటకు ముందు ఈ ఉదయం ఇక్కడ అనేకులు లేనందున కూడా, మనం ఒక తరగతిగా ఉండవచ్చని నేను ఆయనకు చెప్పాను. ఒక తరగతిని కలిగియుండటానికి — దీనిని చేయకముందు, నేను ఒక చిన్న ప్రకటన చేయ ఇష్టపడుచున్నాను.

2మాతో ప్రయాణించుటకు న్యూ-యార్కు నుండి వచ్చిన కొందరు జనులను కలిగియున్నాము. ఆ ప్రజలను ఎన్నడూ కలుసుకొనలేదని అనుకొనుచున్నాను. సహోదరుడు నెవిల్ ఇపుడే దాని గూర్చి మాట్లాడెను. గత రాత్రి అది జరిగినట్లు విన్నాను… వారి బండి ట్రైలర్ కి (పెద్ద వాహనం వెనుక సామానుల కొరకు ఉండు చిన్న వాహనము) నిప్పు అంటుకొన్నట్లును, వారి బండి నాశనమయినట్లును విన్నాను. నేను ఆ ప్రజలను చూచుటకు బయటకు వెళ్ళాను. వారు చక్కటి క్రైస్తవులుగా ప్రేమించబడేవారిగా కనిపించారు. మనందరివలెనే వారు ఒక విధముగా బీద జనులు. సహోదరుడు ఉడ్, మనలో ఇద్దరు - ముగ్గురు కలిసి వెళ్ళారు. మనం మరియొక బండిని కొనలేమని చూచి చెప్పిరి. వారు చాలా మాధుర్య జనులు. వారు ఇలా చెప్పారు, వారు — దానికి భీమా కట్టుచున్నట్లును, వారు ఇబ్బందికి గురియై దానిని కట్టుట మానినట్లు చెప్పిరి. అయితే ఏమైనప్పటికీ ఏజెంటు భీమా పథకమును మరలా చెల్లించెను. బహుశా బండి తిరిగి పొందటానికి వారు భీమాను పొందిరి. వారికి తెలుసునని అనుకొనుచున్నాను. సోమ లేక మంగళ అలా ఏదో రోజున, అది మంగళవారమని నేను అనుకొనుచున్నాను. కావున మనం చేయగలిగిన ప్రతీది సహాయం చేయుటకు వారితో పాటు విచారించుచున్నాము. ఒకరి కొరకు ఒకరం అటువంటి భావం కలిగి క్రీస్తునందు మనమందరం సహోదరీ, సహోదరులమని వారు ఎరుగునట్లు అలాగు చేయుచున్నాము. ఈ సమయంలో వారికి కొంచెం సహాయము చేయుటకు, ప్రతి ఒక్కరూ ఆ విధంగా భావించుదురని తలంచుచున్నాను. అది కొంచెం అసాధారణమైనది అని నేను అనుకొనుచున్నాను. నేనెన్నడూ నా జీవితంలో కానుక తీసుకోలేదు. నేను సహోదరుడు నెవిల్ ని చేయనిచ్చుచున్నాను. అది పనిని బదలాయించుట, అది కాదా? అది పరవాలేదు. బెన్ సోదరుడా, వందనాలు. ఎవరో ఒకరు… మీకు కలిగిన ఏదో కొంచెం వారికి మీరు ఇవ్వండి. నేను దానిని, నిశ్చయముగా ప్రశంసించుదును. నెవిల్ సోదరుడా, ఇక్కడకు రమ్ము. అది ఎలా చేయాలో నాకు తెలియదు. నీవు ఏమి అనుకొందువో దానిని చేయుము. [సహోదరుడు నెవిల్ ప్రార్ధించి, అర్పణ తీసుకొన్నారు]. ఆమేన్.

3వారు అది చేయుచుండగా నేను తలంచాను. ఈ ఉదయకాలం మాట్లాడునది తీయుటకు అది నాకు ఒక అవకాశం ఇచ్చినది. ఒక కాగితం పై మునుపటి కొన్ని పాఠములు, సంగతుల నుండి నేను వ్రాసియుంచాను. అందరు బోధకులు అలా చేస్తారని నేను తలంచుచున్నాను. ఇప్పుడు ఈ జనుల పేరేమిటి? ఇలియాట్, ఈ ఉదయం ఈ భవనంలో సహా ఇలియాట్ సహోదరి మరియు ఇలియాట్ వారి కుమారుడు ఉన్నారా? వారున్నట్లయితే, లేచి నిలబడి, ప్రజలకు ఇలా చెప్పండి, "మేము మీకు వందనములు చెప్పుచున్నాము." అది సరియే. సహోదరుడు ఇలియాట్ మరియు సహోదరి ఇలియాట్ ప్రజలకు చెప్పగోరు ఒక మాట చెప్పండి? [సహోదరుడు ఇలియాట్ వారు కృతజ్ఞతను వ్యక్తపరుచుచున్నారు.] ఇలియాట్ సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. అది చాలా శ్రేష్ఠమైనది. మీకు వందనములు, నీవు, సహోదరి ఇలియాట్, మీ కుమారుడు మరియు దేవుడు మీతో ఉండును గాక.

PS 34:19•

HEB 10:32

 

4ఆ ప్రజలు న్యూ-యార్క్ నుండి వచ్చారు, వారు ఇక్కడ ఉన్నట్లు నాకు తెలియదు. ఒకసారి, వారితో ప్రార్థించుటయై లేక వారితో ఇంటర్వ్యూ కలిగియుండుటయై లేక ఏదో జరిగినదని వారు చెప్పిరి. నిన్న వారిని కలిసేవరకు నేను వారిని ఎరుగను, వారు మాధుర్య జనులై సొగసైన క్రైస్తవులుగా ఉన్నట్లు కనుగొంటిని. హడ్సన్ నది లోయలో, ఎక్కడో పైగా వారు న్యూ-యార్క్ లో నివసించి, బహుశా ఒక టేపు ద్వారానో, లేక ఏదో విధంగా వారు వర్తమానము నమ్మిరి. వర్తమానము కొరకు సమర్పించుకొని ముందుకు సాగి, వారి జీవితాలను మరియు సమయాలను క్రీస్తుకే ఇచ్చిరి. ఇలియాట్ సహోదర, సహోదరి మేము కూడా ప్రయాణికులమేనని మేము మా చిన్ని అభిప్రాయమును వ్యక్త పరుచుచూ మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఈ లోకములో మనము యాత్రికులము, ప్రయాణికులము. దేవుడు దేనికి సృష్టికర్తయు నిర్మాణకుడై ఉన్నాడో, ఆ పట్టణమును మనం వెదకుచున్నాము. ఈ విషయాల్లో దురదృష్టం మీ మీద పడినది. దయ్యం మిమ్మును భయపెట్టి, మిమ్మును కాల్చుటకు ప్రయత్నించుచున్నది. తిరిగి మీ కాళ్ల మీద మీరు నిలబడునట్లు, ప్రతి విషయములోను, నూటికి నూరుశాతం మీతో మీ వెనుక నిలచియున్నాము. ప్రభువైన యేసు నామంలో లేచి ముందుకు సాగిపొండి. క్రిందనే ఉండవద్దు, వద్దు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయితే దేవుడు వాటన్నిటి నుండి వారిని విడుదల చేశారు. మనలను విమోచించిన ఆయనలో మనము ఉన్నాము. ఈ సంగతులు జరుగుట చూతుమని మనం ఎరుగుదుము. అయితే జయశీలుని కంటే ఎక్కువైన రక్షకుని గూర్చి ఎదురు చూచుచున్నామని కూడా మనము ఎరుగుదుము, మనలను విమోచించిన ఆయనలో మనము ఉన్నాము.

5ఇది ఒక విధమగు సంపూర్ణ దినము, ఈ ఉదయాన కొంచెం సేపు ఆదివారపుబడి పాఠమును బోధించవలెనని తలంచుచూ, ఈ ఉదయాన దానినుండి ఒక ఆదివారపుబడి పాఠమును సిద్ధము చేసితిని. ఈ రోజు రాత్రి 7:30 కు అది దేవుని చిత్తమైతే, నా నూతన సంవత్సర వర్తమానమును ఇయ్యవలెనని కోరుచున్నాను. గత ఆదివారం లేక ఆదివారం రాత్రి నేను క్రిస్మసు వర్తమానము బోధించితిని. ఈ రాత్రి 7:30 కు ప్రభు చిత్తమైతే, నా నూతన సంవత్సర వర్తమానమును బోధింతును. నెవిల్ ఆయన నూతన సంవత్సర వర్తమానమును ఇచ్చును. నేను ఇక్కడ సహోదరుడు స్టిక్కరును చూచుచున్నాను. మరియు సహోదరుడు కాలిన్స్, మరియు, ఓ, చుట్టూ ఉన్న ఇతర సేవకులు సహోదరుడు పామర్ ఇక్కడ మనతో ఉన్నాడు, మరియు చుట్టూ ఉన్న ఒక్కొక్కరు. అందరి సేవకుల బోధలను ఈ రాత్రి మీరు వినవచ్చును.

6నేను నిన్న సహోదరుడు నెవిల్ ని పిలిచితిని, ఈ నూతన సంవత్సరాన్ని చూస్తున్నప్పుడు నా హృదయంలో ఏదో తట్టినది. మొదటి ఆదివారం ఒక పెద్ద సమూహంగా కూడి, కేకలువేస్తూ మిగతా లోకంవలె వెళ్ళుటకు బదులుగా ఈ మధ్యరాత్రి ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోకూడదు, చూశారా. ప్రభువుకు సేవ చేయుట. నెవిల్ ఆలోచించి అది ప్రశంసించదగినదని ఒప్పుకొన్నాడు. ఈ రాత్రి ప్రభువు చిత్తమైతే 12 గంటలకు సహవాస సేవా కార్యక్రమంలో ఉందును. కేకలు పెట్టుటతో మనం నూతన సంవత్సరం ప్రారంభించము. వారు కోరినట్లయిన, అది సరియే, అయితే అది సమర్పితమైన, యథార్థమైన మరియు క్రీస్తుకు నిజ మార్గములో ఈ సంవత్సరాన్ని సమీపించుదము. మనకు ఉన్నదంతటిని ఇచ్చివేసి, ప్రతిజ్ఞ చేయుదము. ఒక క్రొత్త పేజీ తిరిగవేయుట లేక అలాటిది ఏదో దానితో నూతన సంవత్సరం ప్రారంభించుట, అలాంటి సంగతులయందు మనకు నమ్మకం లేదు, ఆ మర్నాడే మరల మరచి పోవుట - నీవు కేవలము కొత్త పేజీ తిరగేయుదువు. కావున ఆయన వైపు మన జీవితాలను మళ్ళించి, ఈ అర్థరాత్రిలో సహవాసంలో పాలుపొందుదము. ఇది మొదటిసారని నమ్ముచున్నాను. దానిని చేయుటలో ఎప్పడూ జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నెవిల్ సోదరుడా? నీకు జ్ఞాపకముందా? అయితే మనకు ఏదో కొత్తది ఉన్నది. ఈ విధంగా నూతన సంవత్సరం వచ్చుట అది చాలా అరుదు. అది నాకు తట్టినదని మీకు తెలుసు. అది అలా తాకుచున్నట్లు తలంచాను.

7ప్రభువు సేవలో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ బయట పొలములలోనికి వెళ్ళుచూ, ఇప్పుడు మీతో కొంత సమయం మాట్లాడగలనని, ఇది చివరిసారని నేను తలంచుచున్నాను. నేను వచ్చేవారం వెళ్ళుదును, లేక వచ్చేవారం మొదట్లో పోయనిక్సు కు, సూటిగా 15-16 సమావేశాలు అన్నీ లోయలలోనే మరియు ప్రకాశించు ఏటవాలులపైకి, మరియు స్కాట్స్-డేల్, మరియు అక్కడ ఉన్న అన్ని లోయలగుండా వెళ్ళనై ఉన్నాను. మరియు అప్పుడు ఈ సమావేశముల తరువాత క్రైస్తవ వ్యాపారుల కన్వెన్షన్, అనగా ఐదు రోజుల కన్వెన్షన్ అక్కడ మనము కలిగియుందుము. పోయనిక్స్ లో మారికోప లోయ మొత్తం మహానగర ప్రాంత మంతటి నుండి వారి సంఘాలలో ప్రతి ఒక్కటి హాజరవుతారు. అలా సమస్త సంస్థల వారితో నేను మాట్లాడునట్లు వారు ఏర్పాటు చేశారు. వారు 15న ప్రారంభిస్తారు. కావున ఇక్కడ నుండి నేను 10 రోజులు ముందుగా బయలుదేరుదును. నా మంచి స్నేహితుడగు సహూదరుడు మూర్ ను చూచుటకు బహుశా ఆగుదును. వారిలో చాలా మంది వెళ్ళెదరు. అప్పుడు అది మంచుతో మరియు మొదలైన వాటితో కప్పబడి ఉండును, మరి సకాలంలో వెళ్ళాలి. అప్పుడు నేను… మీలో చాలా మంది ప్రజలు సేవకులై ఉన్నారు.

8మరియు సహోదరుడు రాయ్ బోర్దెర్స్ ఇక్కడ ఉంటే, వారు సమావేశములకు పిలిచినప్పుడు అతడు మామూలుగా సమావేశములను క్రమములో ఉంచును. మరియు ఈ క్రిస్మస్ సెలవులలో చక్కగా నేను మామూలుగా సంవత్సరంలో ఎక్కడ ఉండునో సంచార చరిత్రను చెప్పెడివాడను, అయితే ఈ సంవత్సరం ఏ విధంగానైనా చేయలేకపోయాను. నేను వెళ్ళబోతున్నట్లు భావించాను; ఒక సమావేశంలో ఉండి, మరియు తరువాత సమావేశమునకు అప్పుడు ఆయన ఎక్కడికి నడిపించునో అక్కడికి వెళ్ళెదను. మరి అక్కడ నుండి ఆ తరువాత సమావేశమునకు అది ఎక్కడ అయినప్పటికి కేవలం ఆయన నన్ను నడిపించునట్లు వెళ్ళడమే.

9మరియు ఇప్పుడు ఈ సంవత్సరం ఏదో జరుగనైయున్నదని చూచుచున్నాను. నాకు ఈ మధ్యకాలంలో చాలా దర్శనాలు వచ్చినవి. మరో ఉదయాన ఒకటి మరల ఘనమైనది, ఒక గొప్పది ఏదో జరుగనైయున్నట్లు కనబడుచూ మరియు సమస్తమునకు సంబంధించినదై ఉన్నది. కాబట్టి, నేను ఆయన యందు నమ్మిక యుంచియున్నాను. వాటిలో కొన్నిటిని నేను అవగాహన చేసుకొనలేదు. మరియు మనము దర్శనములు అవగాహన చేసుకొనలేము, అవి ఎక్కువగా గురుతులతో ఉండును. మనం కొన్ని సమయాలలో వాటిని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేము. అయితే, ఏ విధంగా అయిననూ అవి సత్యమైనవి అని మనం ఎరుగుదుము. కనుక అవి జరుగనైయున్నవి. నేను వాటిని వ్రాయుదును.

10రేపు రాత్రి 7 గంటలకు ట్రస్ట్ బోర్డు, డీకన్ బోర్డు కలసి ఇక్కడే ఈ టేబర్నికల్ దగ్గర ఐక్యతగా సమావేశమగుటకు ఐక్య సమావేశమునకు అది కూడా ప్రకటింపబడినదని నేను తలంచుచున్నాను. మరల దానిని ప్రకటించుచున్నాము. డీకన్ ఎక్కడున్నప్పటికి వారు ఆ మరో గదిలో వుండేవారు ఆ చిన్న మైకులో వినవచ్చు. రేపు రాత్రి 7 గంటలకు పాస్టరు, డీకన్ బోర్డు, మరియు ట్రస్టీలు ఇద్దరూ ఇప్పుడే వారు రేపు రాత్రికి కలుసుకొననైయున్నారని నేను కొన్ని క్షణముల ముందు చెప్పియున్నాను. సహోదరుడు నెవిల్, ఆ డీకన్ బోర్డును చూసి వారితో మాట్లాడవలెననియున్నారు. ట్రస్టీలు మామూలుగా సమావేశమగుదురు, రేపు రాత్రికి వారు కలిసికొందురు.

11ఇప్పుడు, ఈ ఉదయాన, మనం వాక్యమును సమీపించక మునుపు ఇప్పుడు, ఓ, ఏ సంగతిని గూర్చి ఏ తొందర పడవద్దు. ఈ రోజంతా పగలు, రాత్రి మరియు రేపు మీరు కలిగియున్నారు. మనం మన సమయాన్ని తీసుకొందాం మరియు ఈ విషయముల యందు మనం తొందరపడవద్దు. ప్రజలు అలసిపోయారని, లేక ఆయాసపడ్డారని నాకు తెలుసు. మరియు ఇంటికి వెళ్ళగోరుదురు. వారి యొక్క తొందర, వారి మధ్యాహ్న భోజనము కొరకు వారి భర్తలు ఎదురు చూస్తుంటారు. అది నిజమే, అప్పుడు నెమ్మదిగా వెళ్ళండి. మరియు ఉండదలచిన వారందరు నిలిచియుండగలరు, పరవాలేదు. మరియు మనం రేపు పనిచేయనవసరము లేదు, కావున మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొందాం. మరియు ఆ కారణం చేత 3 లేక 4 గంటలు ఉపదేశించడానికి బదులుగా నేను 8 లేక 10 గంటలు బోధించుటకు తీసుకొని యందునని తలంచాను.

12జార్జియా మరియు అలబామా నుండి వచ్చిన ఈ ప్రజలందరితో మరో రాత్రి గొప్పగా గడిపితిమి. కార్యలయములో నేను బయట ఉన్నానని అనుకుంటున్నాను. అందరూ బయటకు పోయిరి, అయితే బిల్లీ ఇలా అన్నాడు, సోదరుడు వెస్ట్ మరియు వారు చాలా మధురమైన విధేయత గల స్నేహితులు. (నేను ఇక్కడ వారిని చూడలేదు, అయితే ఇక్కడే ఉన్నారని అనుకొనుచున్నాను), పిలిచి ఇట్లు అడిగిరి, "మంచిది, ఆదివారం ఉదయాన బ్రెన్హాం సోదరుడు ఆదివారపుబడి జరిపెదరా? లూయస్విల్ లో శీతగాలులు వీచుచున్నవి. రాజమార్గాలలో అడ్డముగా ఉండి రోడ్డు మంచుతో ఉన్నట్లు వార్తలు చెప్పుచున్నవి.

బిల్లీ చెప్పెను, "అవును, అది సాధ్యమే. అక్కడకు వెళ్ళును," అని చెప్పెను. సహోదరుడు నెవిల్ లేక ఆయన, ఎవరో ఒకరు చెప్పెను.

"మంచిది, ఆ అవకాశం చాలా మంచిది. ఇక్కడకు మేము వచ్చెదము," అని చెప్పెను. అలబామా నుండి మార్గమంతటిలో జారుచున్న మంచు రోడ్ల మీదుగా, మరియు ఆ విధముగా నేను స్నేహితులను కలిగియుండుటకు ఇష్టపడను. అది సత్యము. దాని గూర్చి అక్కడ ఏదో ఉన్నది. మరియు నేను ఆ సమావేశ ప్రకటన చేయుటకు ఇష్టపడలేదు. ప్రజలు ఆ వర్తమానము నమ్మి మరియు వచ్చి వారు నన్ను ప్రేమించినవారని ఎరుగుదును.

MARK 10:30

 

13మరియు నేను ఎప్పుడూ ప్రేమించబడాలని కోరియున్నాను. చిన్న బాలునిగా ఉన్నప్సుడు ఎవరిచేతా నేను ప్రేమించబడలేదు. నా వలన ఎవరికీ లాభం లేదు. నేను ఇక్కడ ఇండియానాలో ఉన్నాను, కెంటకీలో పుట్టాను, కావున ఇక్కడ ఉన్న పిల్లలకు నేను ఒక కార్న్ క్రాకర్ గా ఉన్నాను. కుటుంబంలో బాలురందరూ ఇంచుమించుగా, పొగ త్రాగుదురు, త్రాగుదురు, ప్రతీది చేయుదురు. నేను అలా చేయును. మరియు నేను కుటుంబములో తిరస్కరించబడినవాడను. తుదకు నన్ను నిజముగా ప్రేమించిన ఒక ఆయనను కనుగొనినప్పుడు - యేసు - ఆయన ఇలా చెప్పెను, "నేను నీకు తండ్రులు, తల్లులు, సహోదరులు, సహోదరీలు, మరియు స్నేహితులను ఇచ్చెదను."

14మరియు ఆయన సిద్ధపరచిన ముందుజ్ఞానము ద్వారా ఎలా పని చేస్తారో అనునది వింతైన సంగతి. ప్రేమ ఒక విచిత్ర భావన కలిగియున్నట్లు కనిపించినది. ఒక భావన కాదు గాని, ప్రతిస్పందన. అప్పుడు నేను ప్రజలవైపు చూచినప్పుడు, ఆయన సేవకునిగా ఉండుటకు పిలిచెను. నేను ప్రజల మధ్యలో పాపం ప్రాకుట చూచినప్పుడు, నాలో ఉన్నదానినంతటితో దానిని చీల్చవలసి యున్నది, మీరు చూడండి, దానిని చీల్చవలసియున్నది. చూచుటకు అది కఠినముగా ఉంది. నేను నా పద్దతిలో దానిని చూచినప్పుడు, ఆ సంగతులు అలా చెప్పవలసి వచ్చింది. అయినను, హృదయ అంతరంగంలో అడుగున, నిజప్రేమ ఆ విధంగా ఉరకలేయుచున్నది. చూడండి, నిజమైన ప్రేమ.

15ఇప్పుడు, మీ చిన్న బాలుడు లేక బాలిక, కారు పరుగెత్తుచున్న వీధిలో ఆడుచున్నట్లయిన, త్వరలోనో లేక ఆ తరువాతనో వారు బాధకు లోనగుదురని నీవు ఎరుగుదువు. ఇప్పుడు, "నాన్నా, నేను ఇక్కడే బయట ఉండగోరుదును," అని వారు చెప్పినప్పుడు - నీ హృదయం దీవించబడును గాక. చిన్నవాడా ముందుకు వెళ్ళి వీధిలో ఆడుకొనుము, అని చెప్పుదువా? అలా చెప్పితే అతను నిజమైన తండ్రి కాడు. నీవు నీవు ఆ చిన్న వానిని పైకి లేపి, దెబ్బలు కొట్టి, గద్దించుచు, వానిని బంధించి, మరి ఏదైనా చేయవలసి ఉన్నది. ఆ వీధిలో అలా ఉన్నయెడల, అతడు మరణించును. అది నిజమేనా? మంచిది, అదే విధంగా నీవు సువార్తలో చేయవలసి ఉన్నావు. నీవు కదిలించవలసియున్నది. మరియు లాగి, ఆ ప్రజలను సరియైన మార్గములో ఉండుటకు నీవు చేయగలిగిన ప్రతీది చేయుటకు ప్రయత్నించుము. ఇప్పుడు అది ఆ విధముగా ప్రతీ మనిషి చేయుటకు ప్రయత్నించుము. ఇప్పుడు అది ఆ విధముగా ప్రతీ మనిషి అవగాహన చేసుకుంటాడు. ఇది అంతా అయిన తరువాత ఏదో ఒక రోజున ఆ ముసుగు ముఖము మీద నుండి తీసుకొనబడినప్పుడు, అప్పుడు మనము అవగాహన చేసుకొందుమని నేను నమ్ముచున్నాను.

16సహోదరుడైన "వె" - నీవు మరియు సహోదరి "వె" కలసి క్రిస్మస్ బహుమానముగా మీరు ఇచ్చిన చక్కని బైబిలు — ఈ విధమైన పుస్తకమునకు బదులుగా, అది నేను టైపుకు ఇచ్చు అవకాశం ఉన్నప్పుడు, కేవలం నా నోట్స్ ఉండుటకు చాలా బాగుండును. నేను వ్రాయగోరుటలేదు, ఏలయనగా నేను స్వంతంగా అలా వ్రాయలేదు. మరి ఇతరులు ఎవరైనా ఎలా వ్రాయుదురో? నేను నా స్వంత షార్ట్ హేండ్ (త్వరగా సంక్షిప్తంగా వ్రాయు పద్ధతి) కలిగియున్నట్లు నేను వారికి చెప్పాను. మరియు నేను ఏమి చెప్పానో నా యంతట నేనే దానిని పరిశీలించవలసియున్నది. నేను ఏదో రోజున దానిని టైపు చేయించెదను ( Loose leaf bible) అది ఒక విడి కాగితముల బైబిలు (ఎన్ని పేజీ లైనా చేర్చగలిగిన బైబిలు) ఇక్కడ నీవు ఇలా తీసుకొనగలవు. ఈ ఉదయాన నేను ఇక్కడ రెండు పాఠములు కలిగియున్నాను. రెండు స్థలముల నుండి చదువగోరుచున్నాను. ఆయన నాకిచ్చిన ఈ బైబిలులో నీవు ఈ విధంగా ఆదికాండము నుండి ఒకటి, ప్రకటన నుండి ఒకటి, ఎక్కడ నుండి అయినను తీసికొని, వాటి రెండిటిని కలిపి, ఆ విధంగా చదవవచ్చును, చూడండి. అప్పుడు వెనుక భాగంలో, వెనుక కొద్ది స్థలం ప్రత్యేకముగా ముద్రింపబడినపుట ( fly leaf)తో ఉన్నది. మీరు వర్తమానమును గూర్చి వ్రాయబడిన సమస్త లేఖనముల వద్దకు మరియు విషయముల వద్దకు ఆ విధముగా వెనుకకు వెళ్ళగలరు. అది అద్భుతము, కావున దాని సహాయముతో క్రీస్తుకు చాలా ఆత్మలను, సంపాదించగలనని ఆశించుచున్నాను.

17మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. నాకు ఇవ్వబడిన చక్కని ప్రతీ క్రిస్మసు బహుమానము కొరకు నేను మరల వందనం చెప్పగోరుచున్నాను. సంఘం వారు నాకొక క్రొత్త సూటును ఇచ్చారు. ఓ, నేను దానిని ఎంతగానో ప్రశంసించుచున్నాను. నేను క్రిస్మసు కొరకు రెండు క్రొత్త సూటులు పొందాను. నా సహోదరుడు జార్జియాలో, మెకాన్లో ఉన్న చిన్న సంఘం సోదరుడు పామర్, నాకు ఒక క్రొత్త సూటు పంపిరి. మరియు టేబర్నికల్ వారు నాకు ఒక క్రొత్త సూటు ఇచ్చిరి. మరియు చాలా సొగసైన వస్తువులు ఇయ్యబడినవి. మరియు ద్రవ్యముగా ఇవ్వబడిన క్రిస్మసు బహుమానములు ఇన్కమ్ టాక్స్ విభాగం వారు నాకు ఇలా చెప్పారు. అది క్రిస్మసు బహుమానము అయితే "క్రిస్మస్ బహుమానం," లేక ఒక "పుట్టిన రోజు" బహుమానం ఏదైనను వ్రాయమన్నారు. అలా నీవు దానిని అంగీకరించగలవు. మరో విధంగా అయితే - అది పనిలోనికి వెళ్ళును, అది పరవాలేదు. మీలో ప్రతీ ఒక్కరికి నేను, నా భార్య, పిల్లలు మేమంతా నిశ్చయముగా వందనములు చెల్లించుచున్నాము. మరియు మీలో ప్రతి ఒక్కరికి మేమంతా కృతజ్ఞతలు వ్యక్తపరుచుచున్నాము - అది ఎంతో చక్కనిది. మేము తిరిగి వెళ్ళి, మీ ప్రతీ ఒక్కరికి ఒక బహుమానం తిరిగి ఇవ్వవలెనని మేము కోరుచున్నాము, కాని అది మీరు కోరుటలేదు. నేను అది చేయలేనని మీరు ఎరుగుదురు. నేను చేయవలెనని కోరుదును, కాని నేను చేయలేను. మీరు అర్థము చేసుకొనుచున్నారని నేను నిజముగా ఎరుగుదును. మరియు ఇక్కడ కూర్చున్న ప్రశస్త సోదరి యొక్క భావమును కూడా నేను ఎరుగుదును. ఆ విధముగా ప్రేమించు ప్రజల ప్రేమను మేము అనుభవించుచున్నాము, వారిని మేము ప్రశంసించుదుము.

JOHN 14:13,14•

JOHN 15:7,16

 

18ఈ ఉదయన కాలమున వర్తమానం ప్రారంభించుట కొరకు సిద్ధపడుచూ, ఇప్పుడు ప్రార్థన కొరకు మన తలలు వంచుదుము.

జీవించుచున్న దేవుని సన్నిధిలోనికి మనము ఇప్పుడు వచ్చియున్నాము, స్థిర బుద్ధి కలిగి ఆయన యందు భయముతో ప్రభువైన యేసు నామములో మేమందరము వచ్చియున్నాము. ఇప్పుడు, తండ్రీ, ఇక్కడ విలియం బ్రెన్హాం లేక ఆర్మన్ నెవిల్ ఉన్నాడు, అని చెప్పుచూ మేము అలాగు వచ్చియుండలేదని ఎరిగియున్నాము. మేము ఎవరమయినప్పటికిని మేము త్వరగా తలక్రిందులయ్యెడివారము. అయితే ఆయన ఇలా చెప్పిన నిశ్చయత మేము కలిగియున్నాము, "మీరు నా నామమున ఏమి అడిగినప్పటికిని, అది అనుగ్రహించబడును." కావున నేను నా పేరును ఉపయోగించుచూ, మరి ఆయన నుండి ఏదైననూ పొందుదునని నేను అనుకొనుటలేదు. అయితే ఆయన పేరును ఉపయోగించునప్పుడు, నేను ఆయన యందు నమ్మికయుంచుట ద్వారా నేను అడిగినది పొందుదునని ఎరుగుదును. అది ఆయన యందు మనము జీవించి, మన ఉనికిని కలిగియుండుట అయి ఉన్నది. ఆయనే మనకు సమస్తము అయి, మనకు పరిపూర్ణ జీవితం, ఉనికి అయి ఉన్న దేవునికి మనము ఈ ఉదయమున కృతజ్ఞత కలిగియున్నాము.

19ఈ చిన్న సంఘ సభ్యులందరి కొరకు డీకన్స్, ట్రస్టీస్, దాని పాస్టరు కొరకు ఈ సంఘము కొరకు నేను వందనములు చెల్లించుచున్నాను. మరియు వారిని కాయుచున్న పరిశుద్ధాత్మ కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. పరిశుద్ధాత్మ వారిని ఎడతెగక నడిపించును గాక. పరిశుద్ధాత్మ తన మార్గములలో వారికి మార్గదర్శిగా ఉండి నడిపించును గాక. నైసియా కాలములో కూడా పాత, క్రొత్త నిబంధనలు చదువుచూ, పరిశుద్దులకు వ్యాధులు సోకినప్పుడు, ఆ సంఘమంతా కలిసి ఏకహృదయముతో దేవుని పిలిచినప్పుడు, ఆ విజ్ఞప్తి అనుగ్రహించబడినది. క్రీస్తు శరీర సభ్యులుగా వారిలో ప్రతి ఒక్కరూ, ఉపవాస ప్రార్థనతో ఉన్నప్పుడు, దేవుడు విని జవాబిచ్చాడు. తండ్రీ, ఈ చిన్న సంఘము ఒకరి కొకరు ప్రేమ బంధములతో మరియు పరిశుద్ధాత్మలో బంధించబడి, వారిలో ఒకరి వలె ఈ సంఘం అయ్యే వరకు, ఈ రానున్న సంవత్సరంలో, దేవా, మా మధ్య ఏ విధమైన సంఘర్షణలు లేకుండా ఉండును గాక. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గములో నడుస్తూ అలసిన అనేకమంది యాత్రికులు ఆ మార్గములోనికి వచ్చి రక్షింపబడుదురు గాక. ఈ చిన్న భవన ద్వారములలోనికి మీరు ప్రవేశించినప్పుడు, మాధుర్య ఆహ్వానంతో దేవుడు సన్నిధి కలుసుకొనెనని చెప్పబడును గాక. ప్రభువా, మా మధ్య నుండి వ్యాధులను తీసివేయండి.

PS 42:1

 

20మరియు మీ వాక్యము వినుటకు మాకు గల ఆకలి హృదయాల కొరకు మేము కృతజ్ఞత కలిగియున్నాము. ప్రభువా, నీ వాక్యము కొరకు మా హృదయాలకు గల ఆకలిని కొనసాగించండి. దావీదు చెప్పియున్నట్లు, "దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది." దుప్పిని గూర్చి ఆలోచించినచో (ఈ రోజున దానిని లేడి అని పిలుచుచున్నాము), అది అడవి కుక్కల చేత చీల్చబడి, దానికి రక్తం కారుచుండగా, అది తన ప్రాణం పోవుచున్నప్పుడు, అది బ్రతకవలెనని అనుకొనినయెడల, అది తప్పక నీటిని కనుగొనువలెను. ఒకసారి అది నీటిని కనుగొనినప్పుడు, దాని ప్రాణమును నిలుపుకొనును. ప్రభువా, మేము బ్రతుకవలెనన్న, క్రీస్తును తప్పక కలిగియుండి, ఆ విధంగా మేము దప్పిగొందుము గాక. మేము అడుగుచున్న ఆ సంఘముగా అగుటకు మేము తప్పక క్రీస్తును కలిగియుండవలెను. మేము బ్రతుకుటకు కోరుచున్న ఆ జీవితముల ప్రకారం జీవించుటకు మేము తప్పక క్రీస్తును కలిగియుండవలెను లేదా మేము చనిపోవుదుము.

ఇప్పుడు ఈ ఉదయవేళ మేము నీ వాక్యమును తెరచుచుండగా ఆయనకు సమీపముగా మమ్మును తీసుకొనిపోవుటకు ఎక్కే మెట్లను కనుగొని, ఓదార్పు పొందుటకు, తండ్రీ, మీ పరిశుద్ధాత్మ మాకు వాక్యము ఇచ్చునట్లుగా నేను ప్రార్ధి౦చుచున్నాను, ప్రభువా, నీ సేవకులుగా నూతన సంవత్సరమును ఎదుర్కొనుటకు అత్యుత్తమమైన అవసరమైనవాటిని సమకూర్చగలరని యేసుక్రీస్తు నామములో దానిని అడుగుచున్నాము. ఆమేన్

21ఇప్పుడు, అది నూతన సంవత్సరం అయినందున ఈ ఉదయవేళ ఆలోచించుచూ, ఈ రాత్రి వరకు నా నూతన సంవత్సర వర్తమానమును నేను ఒక ప్రక్కకు ఉంచిన అది మంచిగా ఉండునని నేను అనుకొన్నాను. మరియు ఇక్కడ కొన్ని ఆదివారపుబడి లేఖనములలోనికి వెళ్ళి, బైబిలులో నాకు తెలిసిన అతి ముఖ్యమైన అంశములలో ఒక దాని మీద కొద్ది సమయం మాట్లాడుటకు ఒక పాఠ్యాంశమును తీసుకొంటిని. అది మన ప్రభువు ఉపదేశించిన ఒక మొదటి సిద్ధాంతమైయున్నది. అది యేసు ఉపదేశించిన మొదటి సిద్ధాంతము, మరియు అది ఈ సంవత్సరం మొదటి ఉపదేశముగా చేయుటకు మంచిదై ఉండునని నేను అనుకొనుచున్నాను.

22ఇప్పుడు, మీలో ఎవరికైనా అది చల్లగా ఉన్నదా, కొంచెం అలా భావించినయెడల మీ చేయిని పైకెత్తండి? ఇక్కడ పైన నేను అలా భావించుచున్నాను. డాక్, నీవు ఎక్కడ ఉన్నను, వేడి స్థలం వైపు కొంచెం సరిగా త్రిప్పు, ఎందుకనగా ఇక్కడ నా చుట్టూ అది కదులుచున్నది. మీలో కొందరు ప్రజలు, పిల్లలతో ప్రత్యేకంగా, మీరక్కడ ఉన్నారని నేనెరుగుదును.

EPH 4:11,16

 

23ఇప్పుడు ఈ ఉదయాన మన బైబిలులో ఎఫెసీ పత్రిక వైపు తిప్పుదాము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము నుండి చదివెదము. అప్పుడు అక్కడ నుండి మనం యోహాను 3:1-12 వైపు త్రిప్పుదాము, ఇప్పుడు ఎఫెసీ 4వ అధ్యాయము నుండి చదువుచూ, మరియు 11వ వచనం ప్రారంభము నుండి:

మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, సంపూర్ణ పురుషులమగువరకు, అనగా ఆయన ఈలాగు నియమించెను.

పరిశుద్ధులు సంపూరులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపోస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను.

అందువలన మనమికమీదట పసిపిల్లలమైయుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొను పోవునట్లు, కల్పింపబడిన

ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదుము.

ఆయన శిరస్సయి యున్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పని చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన గలిగిన బలము చేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.

JOHN 3:1

 

24ఇప్పుడు, నేను అలా చదివినందున మీరు ఇంటికి వెళ్ళిన తరువాత, పరిశీలించుటకు అది మీకు తోడ్పడును. ఇప్పుడు నేను నా పాఠమును యోహాను 3వ అధ్యాయము నుండి చదవగలను, చాలా బాగుగా తెలిసిన ఒక లేఖనము. (యోహాను 3:1-12)

యూదుల అధికారియైన నికోదేమను పరిసయ్యుడొకడుండెను.

అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి - బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము, దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.

అందుకు యేసు అతనితో — ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాననెను.

అందుకు నికోదేము - ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా?

యేసు ఇట్లనెను - ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.

మీరు క్రొత్తగా జన్మించవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు!

గాలి తన కిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను.

అందుకు నికోదేము - ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా?

యేసు ఇట్లనెను - నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైయుండి వీటిని ఎరుగవా?

మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు?

JOHN 3:7

 

25ఇప్పుడు, దేవుడు ఆయన వాక్యమును దీవించును. ఈ ఉదయకాలమున క్రీస్తు మొదటి సిద్ధాంతము గూర్చిన అంశమును తీసుకొనగోరుచున్నాను. ఆయన యొక్క మొదటి సిద్ధాంతము ఏమనగా, "నీవు తప్పక తిరిగి జన్మించవలెను." అది ఆయన యొక్క మొదటి సిద్ధాంతమైయుండెను. ఇప్పుడు, ఆదివారపుబడి మాదిగిరిగా చెప్పుదును, కావున నేను బోధించి మరియు ఈ రాత్రి నా యొక్క గొంతును బొంగురుచేసుకొనకుండా ఉందును. నేను నా హృదయములో అనుకొన్నాను, ఈ విషయము జనులకు అయోమయంగా ఉన్నది. అన్ని సమయములలో దీని గురించి మనము ఎంతో వింటాము, మరియు నేను అనుకొన్నాను మనము ఈ అంశము ఈ ఉదయము తీసుకొని, దానిని తేటగా చేయుదము. మరియు అది మొదటి ప్రారంభము: "నీవు తప్పక తిరిగి జన్మించవలెను." మరియు అది ఎంతో లోతైనది.

26మరియు మనము ప్రజలు అనేక వివిధ అర్థములు దానికి చెప్పుట అక్కడ మనము కనుగొనగలము. దాదాపుగా అన్ని సంఘములు తిరిగి జన్మించవలెనని చెప్పును, అయితే ప్రతి ఒకటి, తిరిగి జన్మించుట అనగా ఏమిటో వారు వివిధ అనువాదములు చేసిరి. ఈ ఉదయకాలమున మెథడిస్టు సంఘమునకు వెళ్ళిన, "తప్పక తిరిగి జన్మించవలెనని మేము నమ్ముదుము," అని చెప్పును. నీవు దానిని ఎలా అనువాదం చేయుదువు. నేను బాప్టిస్టు సంఘమునకు వెళ్ళిన, "నీవు తప్పుక తిరిగి జన్మించవలెనని మేము నమ్ముదుము." దానిని నీవు ఎలా అనువదింతువు? నీవు ప్రతి సంఘమునకు వెళ్ళినప్పుడు, మనము కనుగొందుము, ఒకవేళ మనము 900 సంఘ సంస్థల యొద్దకు వెళ్ళినట్లయితే, అక్కడ 900 అర్థములు అనువదాములు ఉండును. కావున, అలా చాలా అనువాదములను చూస్తున్నప్పుడు, ఇంకనూ బైబిలు సిద్ధాంతమైయుండి, అక్కడ తప్పక, మరియు ఉన్నది, ఒక సత్యము ఎక్కడో ఉండవలసియున్నది.

JOHN 3:7

 

27కావున, ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, "నీవు మరల జన్మించవలసియున్నది," అని అది చెప్పలేదు; అయితే "నీవు తప్పక." ఇప్పుడు, మనం తెలుగు మాట్లాడు జనులముగా, "తప్పక" అంటే ఏంటో అర్ధం చేసికొనగలం. అది ఇదే అయి ఉన్నది. అది సంపూర్ణంగా నీవు అది చేయవలసి ఉన్నావు. చూడండి, అది "తప్పక" అయి ఉన్నది. నీవు చేయవలసినది కాదు, నీవు దానిని చేస్తే ఇంకా బాగుందువు కాదు. అయితే "నీవు క్రొత్తగా జన్మించితేనే గాని!" ఓ, దాని అర్ధం ఏమిటో, ఎలా అది అసాధ్యమో… ఈ ఉదయకాలమున దానిని పరిశోధించుటకు, కేవలం మనం ఆ మాటనే తీసుకొందాము. అది అతి ముఖ్యమైనది మరియు నీవు క్రొత్తగా తిరిగి జన్మించేవరకు, దానిని చూచుటకు అయినను, పరలోక రాజ్యంలో ప్రవేశించుట అయినను పూర్తిగా అసాధ్యం. తిరిగి జన్మించుట అనే మాటకు చాలా అనువాదములు ఉండుటచే, దాని అర్ధ౦ ఏమిటో కనుగొనుటకు మా హృదయమంతటితో దానిని వెతకవలసియున్నది.

28బాధపరచబడగోరే మనిషి ఇక్కడ ఒకడూ లేడు. అక్కడ ఎవ్వరూ లేరు. వందల మైళ్ళు నడుపుతూ, మంచు మార్గములగుండా, మీ జీవనములను, డబ్బును ఖర్చు చేస్తూ, వచ్చి బాగుంది అని కరచాలనం చేయుటకు వచ్చుట లేదు. (దానిని మీరు ప్రేమించుచున్నప్పటికిని), పాస్టరు మరియు నేను మరియు ఇతర సేవకులు మాట్లాడునది వినుటకు కాదు. మావలె క్రీస్తు సేవకులు- పాస్టరు—పరిచారకులు మీరెక్కడైనా కలిగియుందురు. అయితే ఏదో మిమ్మును ఇక్కడకు ఈ ప్రత్యేక స్థలానికి ఆకర్షించుచున్నది. కాబట్టి పాస్టరుగా మా బాధ్యత, మంద పోషి౦చబడేల చూచుట, ఎందుకనగా బలవంతుడైన దేవుడు మీ రక్తమును మా చేతులలో ఉంచియున్నాడు. తీర్పు దినమున, మేము మీ కొరకు జవాబుదారులమై ఉందుము. కావున ఈ గొప్ప అద్భుత బాధ్యత మాపై ఉంచబడుట చూస్తున్నప్పుడు, మమ్మును ప్రేమించి, మేము చెప్పినది విని, మా దగ్గరకు వచ్చిన దేవుడిచ్చిన ప్రజలను చూసి, మీ ప్రాణముల కొరకు ఎడతెగక కనిపెట్టుచూ, మేము మా సమయమును గడుపుచున్నాము. సరికాని ఏదైనా చిన్న విషయము మేము చూసినప్పుడు, ఆ వ్యక్తి దగ్గరకు వచ్చుట మా బాధ్యత అయి ఉన్నది, ఎందుకనగా ఆ గొర్రెలను కనిపెట్టు కాపరులమైయున్నాము. మరి దానిని చంపే గురుగును ఆ గొర్రె తినుట చూచినప్పుడు, నేను దానిని ఆ గురుగు నుండి తొలివేయుట మేలైనది; తటాలున సరిగా ఆ గురుగును దాని దగ్గర లేకుండా దూరంగా జరిపిన, అది దాని దగ్గరకు చేరలేదు, ఎందుకనగా ఆ గొర్రెను అది చంపును.

29అక్కడ పశ్చిమ దేశాలలో ఒక జంతువు తినే కలుపు మొక్క ఉన్నదని తెలియును. దాని లోకో వీడ్ (locoweed - విషపూరిత మొక్క) అందురు. దానిని గూర్చి ఎవరైనా విన్నారో లేదో నేనెరుగను — ఒక విషపూరిత మొక్క. అవును. ఒక గుర్రం దానిని తినినట్లయితే, మరియు దానితో ఇక నీవు ఏ పని చేయించలేవు. అది కేవలం బహిష్కరింపబడెను. నీవు దానిపై జీను వేయలేవు. మరియు నీవు దానితో ఏమీ చేయలేవు. అది "కలుపు మొక్క" గా పిలువబడెను. మరియు ఆ కలుపు మొక్క నుండి నీ జంతువులను తప్పక దూరముగా ఉంచవలెను. గుర్రం ఆ కలుపు మొక్కను తినినట్లయితే నరముల ఈడ్పునకు గురవును. నీ గుర్రమును ఆ విషపూరితమైన కలుపు మొక్కను తిననిచ్చినట్లయితే, నీవు తగిన నిజాయితీ కలిగిన పశువుల కాపరివి కావు. నీవు శ్రద్ధ వహించుటలేదని అది చూపించుచున్నది.

ఒక గొర్రె ఏదో తినుటకు దూరముగా పోవుట చూసి అనుమతించినయెడల, మరియు దేవుని ముందు బహిష్కరింపబడినవానిగా చేసి, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును విచ్చిన్నం చేయుట ఒక నిజ పాస్టరు, ఒక నిజ క్రీస్తు సేవకుడు క్రీస్తు మాదిరికి తక్కువ వానిగా ఉండును. నీవు అది చేసియుండవలసినది కాదు. నీవు దానిని చాలా సన్నిహితముగా కనిపెట్టవలసియున్నావు.

JOHN 3:7

 

30బైబిలులో, ఈ గొప్ప క్రీస్తు సిద్ధాంతము మన ముందు వ్రాయబడియున్నది, "నీవు తప్పక తిరిగి జన్మించవలెను." ముందు చెప్పినట్లుగా, అక్కడ చాలా పాఠాంతరములు గలవు. అది ఏమిటి? ఎలా వారు నిజ క్రైస్తవులు కాగలరు? అని చాలా మంది అడిగిన మూలంగా, ఈ విషయమును సమీపించవలెనని తలంచాను. ఎంత బాగా ఎరిగితినో, అంత స్పష్టంగా మీకు చూపించవలెనని అలా తీసుకొన్నాను. ఒక ఉపదేశ రూపంలో కాదు గాని, ఆ ప్రజలు వర్తమానం బాగా పొందునట్లుగా ఆదివారపుబడి పద్ధతిలో బోధించుట అయి ఉన్నది. ఇప్పుడు "తిరిగి జన్మించుట" అను దానికి చాలా అనువాదములు గలవు…

1COR 12:13

 

31ఇది నేను టేపు చేయబడినదని ఎరిగి చెప్పుచున్నాను. బహుశా ఈ టేపు కాపరులు తీసుకొందురు కాబట్టి చెప్పగోరుచున్నాను. అది మామూలు సంఘములు బోధించే దానికి కొంచెము వేరుగా ఉండునని తలంచుచున్నాను. నేను బోధిస్తూ, మరియు లేఖనము ద్వారా విశదముగా రుజువుపరచుదునని నమ్ముచున్నాను. అలా ఆత్మ ద్వారా మీరు జన్మించి, అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా శరీరంలోనికి బాప్తిస్మం పొందిరి.

ఇప్పుడు, వారిలో చాలా మంది వచ్చి మరియు సమాజం ముందు ఒక పాపిగా ఒప్పుకొని, యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించుచున్నానని చెప్పినప్పుడు, అదియే నూతన జన్మ అని బోధించుచున్నారు. చాలా మంది నీటి బాప్తిస్మమే నూతన జన్మ అని నమ్ముదురు. కొందరు నీటిలో బాప్తిస్మం పొందినప్పుడు, నీటి ద్వారా జన్మించారని నమ్ముతారు. దానికి అక్కడ చాలా పాఠ్యభాగములు గలవు. వారిలో చాలా మంది ఒక మత కార్యమును కంఠస్థము చేసి అప్పగించుటయే అని నమ్ముదురు. కేవలం ఒక సంఘ సిద్దాంతమును నమ్మి, అంగీకరించి ఇలా చెప్పుదురు. నేను ఫలాని-ఫలాని పరిశుద్ధ సంఘము నందు విశ్వాసముంచాను. దేవుడు మానవులను రక్షించువాడైయున్నాడనియు [మొదలగునవి] నమ్ముచున్నాను. ఈ రోజు నుండి - ఈ సంఘ సభ్యుడను అయ్యాను. క్రైస్తవులతో సహవాసం చేయుదును. దీనినే వారు తిరిగి జన్మించుట అని నమ్ముచున్నారు.

32వారు మత కార్యమును కంఠస్థం చేసి చదివినను, మనం దానిని విమర్శించుదుమని నేను అనుకొనుటలేదు. వారిలో కొందరు పవిత్రులు - పరిశుద్దులు - వారిలో కొందరు నిజంగా లేఖనముతో ఉన్నవారు. అయితే ఆ లేఖనం సరియైన విధంగా అన్వయించలేదు, మరియు లేఖనము అన్వయించినను, నూతన జన్మ అనునది, దానికి అవతలగా ఉన్నదని నమ్ముచున్నాను. ఎంత బాగుగా నీవు దాని అర్థమును కలిగినను, నూతన జన్మ మీ మంచి ఉద్దేశ్యములు, ఆలోచనలు, మనస్సుకు అవలగా ఉన్న ఏదో అయి ఉన్నదని నమ్ముచున్నాను. అది దానికి అవతల ఉన్నది.

33ఒక భక్తిహీన వ్యక్తిగా ఉండునట్లు, నేను దీనిని చెప్పగోరుట లేదు, మరియు నేను ఏ సంఘ శాఖకు వ్యతిరేకముగా విసురుటలేదు, అయితే నాకు ఒకటి బాగా జ్ఞాపకమునకు వస్తున్నది. ఒక యూదుడు, కొంచెము అది ఒక పరిహాసము. మరి ఈ వేదిక పై పరిహాసములు చెప్పబడుటను నేను నమ్ముటలేదు. ఇది పరిహాస స్థలం కాదు. కాబట్టి నా మనస్సులో ఉన్న ఈ వివరణను తీసుకొనివచ్చుటకు, అది ఎగతాళి కాదు గాని, నేను ఉద్దేశించిన దానిని చూపించుటకు అయి ఉన్నది. ఒక కథోలిక్ పాదిరి నూతన విశ్వాసితో ఒక శుక్రవారం ఇంటికి వెళ్ళెను. కథోలిక్ విశ్వాసి ఒక జంతు తొడ మాంసం వండుకొని ఇట్లు చెప్పెను "తండ్రీ, ఈ రోజు శుక్రవారమని నాకు జ్ఞాపకం వచ్చిన దానిని బట్టి, నేను విచారపడుచున్నాను. అయితే మన గొప్ప సంఘ సిద్దాంతమును బట్టి, నేను ఇలా నమ్ముచున్నాను. ఒకసారి యూదుడవై ఉన్నాను. మీరు నాపై శుద్ధ జలమును చల్లి యూదుని నుండి కథోలిక్ గా మార్చిరి. ఇప్పుడు నేను అదే శుద్ధజలం కొంచెం ఈ మాంస వంటకంపై చల్లి, దానిని ఒక చేపగా చేయుదును. ఇప్పుడు అది అలా చెప్పుటచే అది చేప కాలేదు. అబద్ధంగా వాదించి, ఎలా ఆ శుద్ధజలం చల్లిననూ ఏమి మార్పు లేదు, అది ఇంకా మాంస వంటకమే.

34ఒక మత విశ్వాసము సరిగా వల్లించుచూ లేక ఒక సంఘంలో చేరుచూ, ఎంత ఎక్కువగా మనం ఆలోచించ ప్రయత్నంచుచున్నామని కాదు. దేవుని ఆత్మ ద్వారా క్రొత్తగా జన్మించు వరకు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. అది నిన్ను మార్చదు. నీ మత కార్యము, సంఘంలో చేరుట వారి ఉద్దేశ్యములను మార్చుట, లేక మీ మంచి అభిప్రాయములు, అవి ఎంత మంచిగా కనబడుచున్నప్పటికిని, అది ఇంకా సరిగా లేదు. అక్కడ ఏదో జరగవలసి ఉన్నది. ఏదో ఒకటి ఆ స్థానమును ఆక్రమించి జరుగునట్లుగా నూతన జన్మ ఒక అనుభవమై ఉన్నది. కావున నూతన జన్మను తీసుకొని వచ్చినది అది కాదు. ఇప్పుడు, వివిధ సంఘాల వారు చెప్పుదురు, "మంచిది, నీవు దీనిని అంగీకరించు లేక అది నమ్ము, మరియు అది పరవాలేదు." కాని అది కాదు.

PS 51:5•

PS 58:3•

MATT 6:27•

LUKE 12:25

 

35ఇప్పుడు, మొదట వెనుకకి వెళ్ళి, ఆ కారణంచే తిరిగి జన్మించవలసి ఉన్నది, ఏలయనగా మనమందరం పాపంలో పుట్టి - అతిక్రమాలతో రూపుదాల్చి మరియు అబద్ధాలాడుచూ ఈ లోకములోనికి వచ్చితిమి. అది మన స్వభావము. మొదట ప్రారంభములోనే పాప భూయిష్టమైనదని చూపించుచున్నది. మనం ప్రారంభములోనే మంచివారము కాము. కావున మన సూక్ష్మబుద్దితో గాని నిర్దోషత్వముతో కాని, లేక ఎంత గొప్పవారమైనను, లేక ఎంత చిన్న వారమైనను, ఏమైనప్పటికిని ప్రారంభంలోనే మనమంతా పొరపాటులో ఉన్నాము. దాని విషయమై మనం చేసేది అక్కడ ఎంత మాత్రమూ ఏమీ లేదు. నీవు చేయలేవు. యేసు చెప్పెను, "ఎవడు ఆలోచించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు?" నీవు ఆలోచనలన్నిటిని తీసుకొని, ఆ విషయమై కలలు కనుచు, చదివి, పరిశీలన చేసి, పరీక్షించి మరియు ప్రతి ఇతరమైనది చేసి, ఒక రవ్వంత కూడా నీకు నీవు సహాయం చేసుకొనలేవు. కావున అది కేవలం అంతా బయటకు త్రోసివేయును. అది అలా ఉన్నందుకు నేను సంతోషించుచున్నాను, ఏలయనగా సూక్ష్మబుద్ధితో ఏదో ఆలోచన ద్వారా తెలుసుకొనుట అయిన, బీదలైన మనం విడిచిపెట్టబడి ఉండేవారము, అందువలన ఇక మనకు అవకాశం ఉండదు. అయితే దేవుడు దానిని మార్చెను… లేక ప్రారంభములో అది అ పద్ధతిలో ఉండి ఉండలేదు. సంఘములు ఎల్లప్పుడు దానిని సమస్యగా చేసిరి; దేవుడు దానిని సామాన్యముగా చేయును. కావున మనం అందరం చూచుచున్నట్లు మరియు దానిని కలిగి యుండునట్లు అది ఒక స్థలమునకు తేబడెను. అది ఎవరంగీకరించుదురో వారికే.

PS 51:5•

PS 58:3

 

36ఇప్పుడు, ఒక మనిషి మరొక మనిషిని రక్షించలేడు. ఒకనినొకడు ఏ మనిషీ రక్షించలేడు. అలా రక్షించెదనని ఎవడైనా ఒకడు ఏమి చెప్ప ప్రయత్నించినను, అది ఏ ఫలితమును కలుగచేయదు. ఎంత మృదువుగా ఉన్నా, అతడు ఏ కార్యాలయం కలిగి యున్ననూ, పాస్టరు, యాజ కుడు, బిషప్పు, కార్డినల్, లేక ఒక పోపు, ఎవరైనా అతని జీవితం రక్షించుటకు అతని దగ్గర ఏమియూ లేదు, ఏలయనగా అతడు కూడా పాపంలో పుట్టి అతిక్రమాలతో రూపు దాల్చి, అబద్ధాములాడుచూ పాపిగా వచ్చాడు. చెప్పాలంటే అతడు అబద్ధికుడు, మరియు దేవుని ప్రణాళికకు మరియు ఆయన వాక్యముకు విరుద్దమైన ఏ మాట అతడు చెప్పియున్నప్పటికిని, అది అబద్ధమైయుండును.

ROM 3:4

 

37అయితే మానవుని రక్షించుటకు దేవుడు ఒక ప్రణాళికను తయారు చేసెను. మరియు మానవుడు దానికేమి చేర్చలేడు. అది దేవుని ప్రణాళికయై యున్నది. మరియు ఈ ఉదయకాలమున ఆ ప్రణాళికను గూర్చిన పరిశీలన చేయబోవుచున్నాము. దేవుని ప్రణాళిక ఏమైయున్నది? ప్రతి మనుష్యుని మాట అబద్ధము, నా మాట సత్యము," అని యేసు చెప్పెను. కాబట్టి అది మరో విధముగా ఉండునట్లు, మనం ఒక మాటను మార్చే ధైర్యము లేనివారమైయున్నాము. ఎన్ని సాంప్రదాయాలు కలిగి మొదలగునవి చదివినామని కాదు, అది మనం మరచిపోవలసియున్నది. ఇది దేవుని వాక్యమైయున్నది. మరో విధంగా చేయబడు ఏ మార్గము లేదు. దేవునికి ఒక ప్రణాళిక కలదు, ఆయన ఒక ప్రణాళికను తయారు చేసెను.

JOHN 3:3,5

 

38మరియు మొదట జ్ఞాపకముంచుకొనవలసిన విషయం, నీవు తిరిగి జన్మించువరకు అవగాహన చేసుకొనలేవు. ఆయన రెండు సార్లు అన్నారు, "ఒకడు క్రొత్తగా జన్మించితేనేగాని, దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు." "ఒక మనిషి క్రొత్తగా జన్మించితేనే గాని, దేవుని రాజ్యమును చూడలేడు." ఇప్పుడు, అది వ్రాతలో విరామ స్థానమందు క్రమమైన గురుతులతో కూడా ఉంచబడినది. వారు ఆ మాటలు నిర్మించి వ్రాసినప్పుడు క్రమమైన గురుతులతో "ప్రధానమైనదిగా," నిశ్చయంగా అని చెప్పిరి. "నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను." మరియు ఒక చోట ఆ పదము లేక చాలా స్థలములలో "సంపూర్ణంగా" అని అది అనువదించబడను. "సంపూర్ణముగా, నేను మీతో చెప్పుచున్నాను." అది ఎవరు చెప్పెను? ఒక ప్రధాన అధికారి, యాజకుడు, పాదిరి, సువార్తికుడు, పోపు చెప్పెనా? స్వయముగా దేవుడే! ఇప్పుడు, అక్కడ మినహాయింపులు లేవు. అతడు ఎంతమాత్రం అది చేయగూడదు, ఎంతమాత్రం చేయగూడదు, మరే ఇతర మార్గం లేదు, అతడు ఎంత గొప్పవాడైనను, ఎంత గొప్ప పేరు కలిగినను, ఎంత పెద్దవాడైనను, లేక ఎంతగా అతడు జనులందరికీ ఇష్టముగా ఉన్ననూ, అది ఏమీ కాదు. అతడు తిరిగి జన్మించువరకు దేవుని రాజ్యమును అవగాహన చేసుకొనలేడు. అది ఒక గొప్ప అంశము. "నిశ్చయంగా, నేను మీతో చెప్పుచున్నాను!" గమనించు. వెళ్ళి, గ్రీకు అనువాదము తీసుకొని రమ్ము, నీవు కనుగొందువు. నీ కన్నులతో చూచుట కాదు; నీ హృదయముతో చూడుము, చూచారా. దేవుని రాజ్యమును నీ కన్నులతో చూడలేవు, ఎందుకనగా అది ఒక ఆత్మీయ రాజ్యము, చూశారా. మరో మాటలో, నీవు తిరిగి జన్మించువరకు నీవు దేవుని రాజ్యమును ఎన్నటికి అర్ధము చేసుకోలేవు. అది ఒక వివరింపబడిన మర్మము. నీవు క్రొత్తగా జన్మించినప్పుడు, దేవుని రాజ్య ప్రణాళికలు, దేవుని రాజ్యమే నీకు వాస్తవముగా మారును.

39ఒక కాంట్రాక్టరు ఒక భవనమును కట్టినప్పటి వలె అతడు బ్లూ-ప్రింటిను (Blueprint - చేయవలసిన పనికి సంబంధించిన సవివర పథకము) అవగాహన చేసుకొననియెడల దానిని చదివే వరకు, అక్కడ భవనమును కట్ట ప్రయత్నించనవసరం లేదు మరియు అతడు బ్లూ-ప్రింటును అవగాహన చేసికొనినయెడల, అప్పుడు అతడు ఆ భవనమును ఎలా కట్టవలెనో ఎరుగును. ఆ విధంగానే ఉన్నది. దేవుని రాజ్యమును, ఆ నిర్మాణం గూర్చి ఆ విధంగానే చేయవలసి ఉన్నది. నీవు ఆ బ్లూ-ప్రింట్ అవగాహన చేసుకొనుటకు దానిని కలిగియున్నావు. నీవు తిరిగి జన్మించు వరకు ఆ బ్లూ-ప్రింటును గూర్చి ఎరుగవు. మరియు నీవు తిరిగి జన్మించినప్పుడు మరియు అప్పుడు ఆ బ్లూ-ప్రింటును తిరస్కరించినయెడల, ఏమి జరుగును?

40ఈ మధ్య ఒక ప్రియమగు చిన్న బాలిక. మేము యవ్వనులుగా ఉన్నప్పుడు, ఆమె తల్లితో వెళ్ళెవాడను. ఆమె సుందరమైన, అందమైన స్త్రీ. ఆమె పేరు ఇప్పుడు "హఫ్ఫ్," ఆమె పేరు పెళ్ళి కాక మునుపు, "లీ" నేను మిల్టవున్ బాప్టిసు సంఘ పాదిరిగా ఉన్నప్పుడు, వారు యునైటెడ్-బ్రదరన్ సంఘానికి చెందిరి. అయితే, ఓ, వారు నిజంగానే నేనంటే చాలా ఇష్టపడిరి. మరియు నేను ఆమెతో వెళ్ళేవాడను. ఇక్కడే రైట్ సహోదరుని ఇంటి వెనుక వారు నివశించుచున్నారు. నేను వారి ఇంటికి వెళ్ళెడి వాడను. ఆ చిన్న బాలిక చాలా ప్రియమైన చిన్న బాలిక, ఆమె నాకు ఒక చిన్న బాల్య స్నేహితురాలు. సహోదరుడు "లీ" ఒక చక్కని మనిషి-సంఘమునకు విధేయుడు. యునైటెడ్-బ్రదరన్ సంఘ భావము గలవాడు. ఒక రాత్రి అతడు తనతో ఇంటికి రావలసినదిగా ఆహ్వానించాడు. రాత్రంతా ఉంటిమి. నేనన్నాను "సహోదర మారియన్, నేను దానికి సంతోషించుచున్నాను. కావున ఆరాధన అయిన తరువాత ఆ బాలిక మరియు నేను కారులో వెళ్ళాము. నేను 12 ద్వారములు తెరవవలసివచ్చినదని అనుకొంటున్నాను. కొండ చుట్టూ వెళ్ళుచూ, ఆ పెద్ద పాత ఇంటికి వెళ్ళుటకు మంచిది. ఆమె తల్లిదండ్రులు - చిన్న సహోదరి కొరకు, వారు వచ్చేవరకు పెరటిలో కనిపెట్టాము. వారు వచ్చినప్పుడు మేమంతా లోపలికి వెళ్ళి - ఆ రాత్రి ఒక చిన్న అల్పాహారం తీసుకొంటిమి. ఆ తల్లి దగ్గర కొన్ని పదార్థములు ఉన్నవి. మేము తిన్నాము మరియు ఆ తండ్రి, నేను క్రింద మెట్ల దగ్గర పక్షి ఈకెల పరుపుపై మరియు దాని క్రింద గడ్డిపరకలతో ఉన్నది, చాలా బాగా నిద్ర పట్టునని నీవెరుగుదువు. నీవు పొందిన ఈ పాత అందమైన మెత్తని విశ్రాంతి పరుపుల కంటే అది మంచిది, నేను అది మీకు చెప్పుదును. మరియు కావున మనం ఆ తల్లి మరియు ఇద్దరు బాలికలు మెట్ల పైకి వెళ్ళిరి.

41మరియు ఆ రాత్రి మేము అక్కడ ఉండగా సహోదరుడు 'లీ' ఒక కల కనెను. మరియు అతడు ఎల్లప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీటి బాప్తిస్మమును గూర్చి వాదించెను. అతడు దానిని నమ్మలేదు. అతడు ఒక కాంట్రాక్టరు. కావున అతడు అన్నాడు, "సహోదరుడు బ్రెన్హాం, నేను ఒక కల కన్నానని ఇలా చెప్పెను." నేను న్యూ-ఆల్బనీ వెళ్ళినట్లు కలకన్నాను. నేను ఒక మనుష్యుని ఇంటిని కట్టుచున్నాను. అతడు నాకు బ్లూ-ప్రింట్ ఇచ్చాడు. అయితే అతడు కిటికీలు ఒక విధంగా నిర్మించి, ఒక నియమిత స్థలంలో నిలిపినప్పుడు అది సరియైనది కాదని నేను చెప్పితిని. కావున సరియైనదని నేను తలంచిన విధంగా నేను కట్టితిని. అతడు ఫ్లోరిడా నుండి విశ్రమకాలం తరువాత వచ్చినప్పుడు, నేను అతని ఇంటిని దాదాపుగా సిద్ధం చేశాను.

"అతడు ఇంటి వైపు చూసి, వెళ్ళి బ్లూ-ప్రింట్ తెచ్చి చూసి నీవు నా ఇంటిని తప్పుగా కట్టావు అన్నాడు."

మరియు నేను వానికి ఇలా చెప్పితిని, "లేదు, నీ ఇంటిని తప్పుగా కట్టలేదు."

"సరే, ఈ విధంగా ఉన్న ఈ స్థలం సంగతి (కిటికీలు తప్పుగా పెట్టుట) ఏమిటి?"

"అది అలా నిజంగా అక్కడ అలా లేదు," అని అతడు చెప్పెను.

అతడు చెప్పెను, "దానిని క్రింద పడగొట్టు! నేను నీకు డబ్బు చెల్లించాలంటే ఆ బ్లూ-ప్రింట్ చెప్పిన పద్ధతిలో నీవు దానిని కట్టుము."

మరియు అతడు చెప్పెను, "బ్రెన్హాం సోదరుడా, దానిని గూర్చి నీవేమి అనుకొనుచున్నావు?"

నేను చెప్పాను, "ఇక్కడ ఇంటికి దిగువున అక్కడ ఒక నది ప్రవహించుచున్నది." మేము దాని దగ్గరకు వెళ్ళాము.

అతడు ఇలా అన్నాడు, "నేనేమీ ఈ రోజు పడగొట్టగోరుటలేదు."

నేను ఇట్లు అన్నాను, "ఇప్పుడు దానిని సరియైన విధంగా చేయుము, ఆ బ్లూ-ప్రింట్ ప్రకారం దానిని చేయుము!"

42అది ఎలా నెరవేరును? ఈ మధ్య అతని వారిలో ఒక బాలిక ఒక చక్కని అబ్బాయిని వివాహమాడింది. సొగసైన మనిషి ఇక్కడ పడవ పనుల దగ్గర యంత్రాలతో పనిచేయువాడు. ఆ బాలుని వ్రేళ్ళు ఈ విధంగా తెగిపోయినవి. నాజుకైన మనిషి, వారికి ప్రేమ గల కుటుంబం… ముగ్గురు చిన్న బాలికలు, వారిలో ఒకరు… అందరూ క్రైస్తవులు, ముగ్గురూ కలిసి పాడుదురు. ఇక్కడ మేము ఎప్పుడైనా కూడికలలో ఉన్నప్పుడు, వారు మా కొరకు పాడుటకు వచ్చుచున్నారు. ఆ చిన్న బాలికలలో ఒకామె పియానో సంగీతంలో పట్టబద్రురాలు. 15-16 సంవత్సరముల వయస్సు గల బాలికగా ఉన్నప్పుడే మంచి సంగీత ఉపాధ్యాయినిగా ఉన్నది. ఆమె ఒ క్రైస్తవురాలుగా మరియు వివిధ సంగతులను గూర్చి పాఠశాలలో పిల్లల ద్వారా బాధింపబడినది. ఆ సంగతి ఆమె నరములపై పని చేసినప్పుడు, అవి విచ్చిన్నమై మానసిక వ్యధకు గురి అయినది. వారు ఆమెను లూయిన్-విల్ లో పెట్టారు. వచ్చే సోమవారం ఆమెను మానసిక చికిత్సాలయమునకై తీసుకొని వెళ్ళనైయున్నారు. డాక్టరులు నన్ను ఆమెను చూడనివ్వలేదు. వారు ఒప్పుకొనలేదు. నేను దర్శించువానిగా వెళ్ళి, ఆ తల్లిదండ్రులతో పడక ప్రక్కగా కూర్చున్నాను. అక్కడ కూర్చునప్పుడు, పరిశుద్ధాత్మలోనికి కదిలి వచ్చెను. వారికి ఇంకనూ ఆశ ఉనప్పుడు, లూయిస్-విల్లో మన లేడి-అప్-పీస్ శానిటోరియంలోనికి, నరముల ఒత్తిడికి గురి అయిన రోగులను తీసుకొందురు. వారేమీ చేయలేనప్పుడు, ఇండియానా లోని - మాడిసన్ పంపుదురు. ఆ బాలిక ఆ వారం మాడిసన్ వెళ్ళనైయున్నది. ఆమె వైద్య చికిత్సను పొందగలిగే స్థితిని దాటిపోయినది. అక్కడ కూర్చుని ఉండగా, మా ముందుకు ఒక దర్శనం వచ్చింది. ప్రభువైన యేసు నామములో ఆ బాలికతో మాట్లాడెను. తల్లి నా మోకాళ్ళు పట్టుకొని, పైకి లేచి, తన భర్త చేయి పట్టుకొని అన్నది, "అది ఎన్నడూ పొరపాటు కాదు!"

నేను చెప్పాను, "ఇక తొందర పడవద్దు. ఆమె పూర్తిగా బాగుపడెను." నేను త్వరగా ఆ భవనం విడిచి పెట్టాను.

43ఆ రాత్రి 9 గంటలకు ఫోను మ్రోగింది; లేక తొమ్మిది కొంత సమయము ముందు అని నమ్ముచున్నాను. ఆదివారం రోజున ఆ రాత్రి సంఘానికి వచ్చేముందు అయి ఉన్నది. ఆ తండ్రి హృదయ పులకితుడై ఇట్లు అన్నాడు, "బ్రెన్హాం కు ఈ శుభవార్త చెప్పేవరకు ఇంటికి వెళ్ళలేను." అతడు ఇట్లు అన్నాడు, "ఆ వైద్యుడు లోనికి వచ్చి, నా కుమార్తెను పరీక్షించెను." అతడు అన్నాడు, "ఆమెకు ఏమి జరిగినది? ఆమె రేపు ఇంటికి వెళ్ళవచ్చును." అక్కడ ముగ్గురు ఉన్నప్పుడు ఆ తల్లి కొన్ని వారాల క్రితం శవంగా పడియుంది. ఆ చిన్న బాలిక ఆమె ఉండగలిగినంత చక్కగా ఉంది. ఆమె మరియు ఆమె మగ స్నేహితుడు ఆనందంగా ఉన్నారు. ఓ, నేను మీకు ఆ బ్లూ-ప్రింట్ ను గూర్చి చెప్పుదును! మనం ఎలా తిరిగి జన్మించవలెనో, ఆ కార్యక్రమమును విశదీకరించుటకు ఒకే ఒకటి ఉన్నది. అది దేవుని వాక్యమే.

JOB 14:1•

PS 51:5•

PS 58:3

 

44మొదట మనమంతా మనం పాపులుగా ఎంచి, శిక్షకు పాత్రులమని లెక్కించవలెను. మనమందరం పాపంలో పుట్టి, అతిక్రమాలతో రూపు దాల్చి అక్కడ ఏ కొంచెం మంచి లేకుండా ఉన్నాము. మన మనస్సులు చెడ్డవి. మన ఆత్మ చెడిపోయినది. మన నిరంతర ఆలోచన చెడ్డది. ఒక పాపియైన, ఒక మనుష్యుని యొక్క మనస్సులోని ఊహ ఎల్లప్పుడు కేవలం చెడ్డది. మరియు మన శరీరం కూడా బలహీనమైనది మన ఆత్మ మంచిది కాదు. మనం పూర్తిగా చెడిపోయినవారము. చెడిపోయినది, ఎలా ఆ చెడినదానిలో నుండి మరొక మంచి విషయాన్ని తీసుకొని రాగలదు? నన్ను దీనిని చెప్పనివ్వండి. యోబు 14వ అధ్యాయములో, అతడు అనెను, "స్త్రీకి పుట్టిన నరుడు చూచినప్పుడు, విచారం, కష్టాలలో ఉన్నాడు. అయినను అతడు పుష్పం వలె వికసించి, వాడిపోవును." ప్రవక్త ఇంకా మాట్లాడుచూ, ఇలా అనెను, "అపవిత్రమైన దాని నుండి పరిశుభ్రమైన దానిని ఎవరు తేగలరు? ఒకటి లేదు!" నీవు బావిలో ఒక బకెట్టు వేసి లాగితివి. అది నిలువ ఉండి, వాసన కొట్టును. నీవు దానిలోనికి చూచిన - అది బురద, చిన్న క్రిములు ఆ నీటిలో ఉన్నవి. నీ బకెట్ మరల బావిలో వేసి, శుభ్రమైన బకెట్ లాగుటకు అక్కడ ఏ మార్గం లేదు. మొత్తం ప్రపంచమంతా మలినమైనది. మరియు మొత్తం ప్రాణము, మనస్సు, మనుష్య శరీరమంతా పాపంతో కలుషితమైనది. శారీరకంగా పాపంలో పుట్టి, అతిక్రమాలతో రూపుదాల్చి మరియు అబద్ధాలాడుచు, ఈ లోకములోకి వచ్చాము. కావున అతని స్వంత ప్రాణము కలుషితమై ఉన్నది. మంచి ఏమీ లేదు. ఒకడు మరొకనిని రక్షించలేడు, ఎందుకనగా అదంతా తప్పు. ఇక్కడ నీవు ఒక బకెట్ నీరు తీయలేవు. అది మలినమైనది, మరియు మరొక బకెట్ కూడా మలినమైనదే. వాటిని రెండూ కలిపినా మరి ఇంకా ఎక్కువ మలినం పొంది ఉన్నావు. అక్కడ దానికి ఏ శుద్దీకరణం లేదు.

NUM 5:8•

NUM 27:11•

ROM 6:23

 

45అయితే దేవుడు మనిషిని రక్షించుటకు తీర్మానించుకొనెను. "ఆయన మన అందరి దోషములను ఆయనపై మోపెను." ఆ పాపం యొక్క దండన (ఇప్పుడు శరీరంతో ఉన్న జన్మ), ఆ పాపం యొక్క దండన మరణమై ఉన్నది. ఆ శిక్ష మనము ఒకరికొకరం సహాయం చేసుకొనుటకు, అక్కడ ఏ ఒక్కరూ లేనంత గొప్పదై ఉన్నది. కావున ఆ శిక్షకు పరిహారం చెల్లింపగల ఒకరు అక్కడ ఉండవలసి ఉన్నది.

ఈ గదిని విడచుటకు ఒక 100 బిలియనుల డాలర్లు పరిహారమైన ఎడల ఈ ఉదయవేళ ఏమిటి? అక్కడ మనలో ఎవ్వరూ విడిచి వెళ్ళలేము, ఎందుకనగా దానికి తగినవారు మనలో ఎవ్వరూ లేరు. అయితే అప్పుడు మనందరి కొరకు చాలినంత చెల్లింపగల ఒకాయన వచ్చెను.

అది ఒకని కోరును… మనం దానిని చేయలేము. యోగ్యత గల ఒకాయనను తీసుకొనెను. ఓ, అలా కొంచెం సేపు ఇక్కడ నేను ఆగి వెనుకకు వెళ్ళి, రూతు, నయోమిని తీసుకొని, రక్తసంబంధి అయిన విమోచకుడు ఎలా అయ్యెనో చూపింతును. పోయిన సొత్తును విమోచించుటకు, మొదట యోగ్యుడై, సమీప బంధువునిగా ఉండుటకు అలా ఉండెను. కాబట్టి దేవుడు, ఆ ఆత్మ యెహోవా శరీర రూపము దాల్చి, మనకు సమీప బంధువుడాయెను. అతడు సమీపబంధువుడాయెను. ఆ విధంగానే ఉండును. అప్పుడు ఆయన యైగ్యుడైనవాడై ఉండెను. ఇమ్మానుయేలు నరముల నుండి రక్తంతో నిండిన ఊటను ఉత్పత్తి చేయువాడు ఆయన ఒక్కడే అయియున్నాడు. మన దోషాలను భరించువాడు ఆయన ఒక్కడే.

JOHN 3:14

 

46సంఖ్యాకాండము లో ఇక్కడ ఒక రమ్యమగు మాదిరిని కలిగియున్నాను. నేను ఇక్కడ లేఖన ములు వ్రాసియుంచాను. సంఖ్యాకాండములో అందమైన మాదిరి అక్కడ ఉన్నది. అది, ఓ, సొగసైన దానినంతటిని కలిపి నీవు చూచినయెడల, అది అరణ్యములో ఎత్తబడిన ఇత్తడి సర్పమై ఉన్నది. అక్కడ ఏ స్వస్థత లేక మరియు ఆ సర్పము వారికి మరణకాటు అయినప్పుడు ఇశ్రాయేలు ఎలా ఉన్నది. అక్కడ వారి మధ్య కుదురుబాటు, లేక స్వస్థత కలిగియున్న వైద్యుడు ఒక్కడూ లేడు. వారి మధ్యలో వైద్యులు ఉన్నారు, అయితే ఆ మరణకాటుకు లేరు. నేను ఇప్పుడు చెప్పినట్టు, ఆ పాపమునకు పరిహారము నిచ్చు వైద్యులు అక్కడ మనలో లేరు. అది ఒక మరణకాటు. మరియు మనమంతా నేరస్తులమై, దోషాలతో రూపుదాల్చాము. మనమంతా నేరస్తులమే. అయితే దేవుడేమి చేసెను? వారు నేరస్తులైనప్పుడు మరణమునకు శిక్ష వేయవలసి ఉండెను, మరణ శిక్ష. అయితే దేవుడు ఇత్తడి సర్పమును నిలుపుటకు మోషేను కలిగియుండెను. దానిని ఒక స్తంభంపై ఉంచెను. ప్రజలు ఏమీ చేయనక్కరలేదు. వారు డబ్బు చెల్లించనక్కరలేదు. ఎంత మాత్రము ఏమీ అక్కరలేదు. వారు చెప్పుటకు ఏ మత కార్యములు లేవు. వారు చేరుటకు సంఘాలు లేవు. కేవలం చూచుట, బ్రతుకుట, ఎంత సామాన్యమైనదో మీరు చూశారా? చూచుట - బ్రతుకుట! సంఘంలో చేరుట కాదు. అనుభూతి కాదు. నీవు వింతైన భావన అనుభవించుట కాదు. కేవలం చూచుట - బ్రతుకుట! అంతే. ఎంతో సామాన్యమైన కార్యము. నీవు పది ఆజ్ఞలు అన్నీ జ్ఞాపకముంచుకొని జీవించుట కాదు. అన్ని కట్టడలను ఎరిగి ఉండుట కాదు. కేవలం చూచి-బ్రతుకుట — నీవు చేయవలసినది అంతా అదే. మరియు ఆయన వైపు చూచిన ప్రతీవాడు, జీవించెను.

GEN 4:4,8•

JOHN 3:14

 

47యేసు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన చెప్పెను (ఇక్కడ నికోదేముతో మాట్లాడుచూ) ఆయన చెప్పెను, "అరణ్యంలో మోషే సర్పమును ఎలా ఎత్తెనో, మనుష్యకుమారుడు తప్పక ఎత్తబడవలెను." తప్పని సరిగా! ఎందుకు? అదేవిధంగా, అదే సంగతి కొరకు, అదే ప్రయోజనం కొరకు అదే పని చేయుటకు ఆ సర్పము యేసుకు ప్రాతినిధ్యం వహించుట చూచినప్పుడు, చాలాసార్లు ప్రజలను ఇది కలవరపరుచుచున్నది. దీనిలో ఎక్కువగా యేసుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ సర్పము. ఆ సర్పము చనిపోయినదని గుర్తించితివా? అక్కడ దానిలో జీవము లేదు. యేసు చనిపోయెను. కయీనువలె, అతడు హేబేలును చంపినప్పుడు, హేబేలు తన అర్పణతో బలిపీఠంపై చనిపోయెను. హేబేలు తన అర్పణ అర్పించిన తర్వాత, అతని పాపం కొరకు అతని అర్పణను చంపెను. అప్పుడు అదే బలిపీఠంపై అతని అర్పణతో అతడు చనిపోయెను. తిరిగి జన్మించు క్రమమునకు ఆయన చనిపోయినట్లు, నీ అర్పణతో నీ బలిపీఠంపై నీవు చావవలసి ఉన్నది. నీవు క్రొత్తగా జన్మింపవలెను. ఆ సర్పానికి దానిలో జీవము లేదు.

NUM 21:8,9

 

48మరియు నీవు అందువు "అది ఎందుచే ఇత్తడి అయి ఉన్నది?" ఇత్తడి తీర్పుకు దైవిక తీర్పుకు ప్రాతినిధ్యం వహించును. అర్పణ దహించబడుచోట, బలిపీఠం ఇత్తడితో చేయబడి ఉన్న చోటును బైబిలులో పాతనిబంధనలో గుర్తించితివా? ఇత్తడి తీర్పును గూర్చి మాట్లాడును. ఏలియా వలె ఆయన రోజులలో, ప్రార్థన తర్వాత, ఏమైన వర్షం వచ్చుచున్నదేమో చూచుటకు ఆకాశంవైపు చూడవెళ్ళెను. అది ఇత్తడితో కూడిన దైవిక తీర్పు అయి ఉండెను. అతడు చెప్పెను, "ఆకాశం ఇత్తడి వలె కనిపించుచున్నది." అది ఏమై ఉన్నది? దేవుని విడిచిన అవిశ్వాస దేశం, అవి శ్వాస ప్రజలపై దైవిక తీర్పు అయి ఉన్నది. మరియు ఆ సర్పము తనంతట తానే దాని రూపంతో తీర్పు తీర్చబడిన పాపమునకు ప్రాతినిధ్యం వహించుచున్నది, ఏలయనగా ఏదేను తోటలో ఆ సర్పానికి తీర్పు తీర్చబడెను, మరియు ఆయన… సర్పము, తీర్పు తీర్చబడెను.

1TIM 3:16

 

49మనం క్రీస్తు వైపు చూచినప్పుడు, పరిహారంవైపు నీవు చూచుదువు. దేవుడే తనంతట తాను ఒక్కడే శరీరం దాల్చెను. దేవుడు భూమి మీదకు వచ్చి మనందరి పాపాలను ఆయన మీద వేసుకొనెను. ఆ తీర్పు సర్వశక్తుడైన ఆయన ఉగ్రత, ఆయన శరీరంపై కుమ్మరించబడెను. అక్కడ కల్వరి వద్ద చీల్చబడెను. అది నిజమైన తీర్పు. ఆయన ఒంటరిగానే దేవుని ఉగ్రత అను ద్రాక్షల మధ్యపు తొట్టెని త్రొక్కెను. ఒంటరిగా ఆయన మార్గమున నడిచెను. ఆయన దూత నుండి ఒక మనిషి నుండి, ఆయన సంఘము నుండి, ఆయన తల్లి నుండి ఆయన సహోదరుల నుండి, ఆయన తండ్రి నుండి సహాయం లేకుండా ఒంటరిగానే మరణించెను. మనిషి మరియు ప్రకృతి, దేవునిచే విడిచిపెట్టబడెను. ప్రకృతి కూడా తనంతట తానే ఆ మరణ ఘడియలో మనకు సహాయం చేయలేదని చూపించుటకు, ఆయన ఒంటరిగానే చనిపోయెను. అక్కడ స్నేహితుడు లేడు, యాజకుడు లేడు, పోపు లేడు. అది మరణము. అయితే మన కొరకు దానిని తీసికొనిన ఒకరు అక్కడ ఉన్నారు.

MATT 27:45,54

 

50ఆ సర్పములో జీవము లేదు. అది సంపూర్ణముగా స్థిరమైన రూపురేఖలుగలదిగా మారినది. ఆదియే జరిమానా. భూమి తన గురించి తాను సిగ్గుపడేటంతగా ఆయన మరణించెను. నక్షత్రములు సిగ్గుపడేటంతగా ఆయన మరణించెను. సూర్యుడు ప్రకాశించలేనంతగా ఆయన శ్రమనొందెను. చంద్రుడు తన వెలుగును ఇవ్వలేనంతగా ఆయన శ్రమనొందెను. భూమి యొక్క భూతములు చాలా నల్లగా, మరియు అంధకారముగా మారుటంతగా అర్థరాత్రిగా మారేటంతగా నీవు స్పర్శించగలిగినంత చీకటిగా మారేటంతగా ఆయన శ్రమనొందెను. అక్కడ ఏమీ లేదు. ఆ విధంగా ఎన్నడైనా బాధింపబడిన ఏ ఒక్కరూ లేరు లేక ఆ విధంగా బాధపడిన వారు లేరు. అక్కడ అలా దాని గుండా వెళ్ళు ఏ జీవి లేదు. అయితే ఆయన దానిని అనుభవించెను. దేవుడు మనందరి దోషాలను ఆయనపై మోపెను. మరియు తీర్పులు ఆయన మీదుగా పోనిచ్చెను, మరి ఏ సహాయం లేకుండా, దేవుని ఉగ్రత మధ్యపు తొట్టిని ఒంటరిగానే త్రొక్కెను. ఆయనకు సహాయం చేయుటకు అక్కడ ఏమి లేదు. దేవుడు ఆ శిక్షను ఉంచెను. ప్రతీ సంగతి ఆ శిక్ష క్రింద ఉండెను. ఆయనకేమియూ సహాయం చేయలేదు, కారణం మనమంతా నేరస్తులమే. ఆయనకు సహాయం చేయుటకు అక్కడకు ఏ ప్రధానయాజకుడు వచ్చి ఉండలేదు. ఆయనకు సహాయం చేయుటకు అక్కడ ఏమిలేదు, పోపు లేడు, దూత లేడు. ప్రతీదియు వెనుక నిలబడెను మరియు దానిని గమనించెను. ప్రపంచ చరిత్రలో, ఎన్నటికీ అవి గొప్ప క్షణాలై ఉన్నవి. గడ్డకట్టుకు పోయిన స్పటికం వంటి సాధనంగా సిలువపై వ్రేలాడుచూ, ఇత్తడి సర్పము వలె మారి, ఆయనలో అక్కడ, ఒక బొట్టు జీవము విడిచిపెట్టబడనంతగా, ఆయన మరణించెను.

GEN 4:4•

1COR 2:16•

PHIL 2:5

 

51ఇప్పుడు, నూతన జన్మకు సమీపించుటకు, అక్కడ దానికి సమీపించేదిగలదు. ఈ పుట్టుకకు సమీపించడానికి, నీవు ఒక విధానంలో వెళ్లవలసి ఉన్నది. జీవించే ఏ జీవి అయినను మరల పుట్టుక నిచ్చుటకు మొదట చనిపోవలసియున్నది. నీవు ఇప్పుడున్న ఆత్మను అలా ఉంచలేవు, ఆ అలవాట్లు నీవు ఉంచలేవు, ఇక నీ ఆలోచనలు ఆలోచించలేవు. నీవు చనిపోవలసియున్నావు. ఆయన చనిపోయినట్లుగా నీవు చనిపోవలసి ఉన్నావు. తన గొర్రెపిల్ల హేబేలు చనిపోయినట్లు, ఆయన బలిపీఠంపై నీవు చావవలసియున్నావు. నీ గొర్రెపిల్లతో నీవు చనిపోవలెను. నీవు చావవలెను. ఆయన ఆలోచనలోనికి తిరిగి జన్మించుటకు, నీ స్వంత ఆలోచనకు చనిపోవాలి. క్రీస్తు మనస్సు నీలో ఉండ నియ్యాలి. ఆయన ఆలోచనలను నీవు ఆలోచించవలెను. మరియు ఇప్పుడు, సహోదరీ, ఎంత విశధముగా చెప్పనెరిగియుందునో, అలా నన్ను చెప్ప నియ్యండి. ఆయన వాక్యమును విడిచి, తిరిగి జన్మించితినని చెప్పుకొనుచూ, ఇంకా ఇలా ఆయన ఆలోచనలు ఆలోచించగలవు? నీ యంతట నీవే ఆ ప్రశ్న వేసికొనుము. నీవు దానిని ఎలా చేయగలవు? నీవు చేయలేవు. నీవు తిరిగి జన్మించినయెడల, ఆయన ఆలోచనలు పొందినావు. క్రీస్తు యేసు మనసు నీలో ఉన్నయెడల, అప్పుడు నీవు ఒక నూతన సృష్టివి. బైబిలు దానిని బోధించును. ఏ సహోదరుడైనా ఇష్టపడినయెడల, సరే, నీవు ఆ "సృష్టి"ని కనుగొని, లెక్సికన్లో, "సృష్టి" అను పదాన్ని చూచినట్లయితే మరియు సృష్టి అను పదం ఒక "నూతన సృష్టి," అని అనువదించబడుట లేక బాషాంతరీకరణము చేయబడుట నీవు కనుగొనగలవు. కారణము ఏమి అనగా నీవు ఒక సృష్టివి. ఇక్కడ భూమి మీద కామ కోరికతో పుట్టిన ఒక మానవ జీవివి మరియు ఇప్పుడు నీవు ఆత్మ ద్వారా జన్మించిన ఒక నూతన సృష్టివి. నీ స్వంత ఆలోచనలు చనిపోయినవి. ఇత్తడి సర్పము వలె జీవంలేనంతగా అవి స్ఫటికము వలె చనిపోయినవి, లేక భూమ్యాకాశములు ప్రతీదియు ఆయన చనిపోయాడని సాక్ష్యమిచ్చినప్పుడు, ఆయన చనిపోయినట్లుగానే, నీ ఆలోచనలు చనిపోయినవి.

MATT 27:54•

JOHN 19:34

 

52ఆయన రక్తము మరియు నీరు ఆయన దేహములో విడిపోయేంతగా ఆయన మృతతుల్యమైపోవువరకు ఆయన మరణించాడు. ఆయన మరణము ఎంత అద్భుతకరమైనది అంటే ఈ లోకము నరముల ఉద్రిక్తతకు లోనగువరకు అని నేను చెప్పుచున్నాను. అది కంపించినది, పర్వతముల మీద నుండి బండలు దొరలు వరకు అది వణికినది. ఎవరైన అలాగు చనిపోగలిగినారా? ఏ మతాధ్యక్షుని మరణము అది చేయదు, ఏ సంఘ కాపరి మరణము అది చేయదు. కాని శరీరధారియైన దేవుడు సిలువ పైన మరణించినప్పుడు భూమి, ఒక నరముల ఉద్రిక్తతకు గురియైనది. భూమిమీద ఉన్నటువంటి దేవుని పలుకబడిన వాక్యము — బండరాళ్ళు మరియు మట్టి, కర్రలు, దుడ్డు కర్రలు, చెట్టు మరియు నక్షత్రములు మరియు చంద్రుడు, ఆయన పలుకబడిన వాక్యము చూచినవి. వారి సృష్టికర్త శరీరధారియగుట, పాపము ఆయన మీద కుమ్మరించబడుట, చంద్రుడు వెలుగును ఇవ్వనంతగా దేవుని ఉగ్రత ఆయన మీద కుమ్మరించబడుట, సూర్యుడు తన ప్రకాశమును ఆపివేయుట, భూమి నరముల ఉద్రిక్తతకు గురియగుట…… విచ్చిన్నమగుట చూచినవి. అది మన కొరకు ఒక భవిష్యత్తు కాకపోయినట్టితే, తునాతునకలుగా అయిపోయి ఉoడేడిది.

ROM 6:1

 

53భూమి మీద ఆయన మూలపదార్థములు, ఏమి జరిగినదో చూస్తూ, పైకి చూస్తూ, ఆ పరిస్థితికి అది అలా కంపించగా నీకు మరియు నాకు అది ఏమి చేయనైయున్నది? దేవుడు మనకొరకు చేసినది మనం చూసి, బ్రతుకునట్లుగా మన ప్రాణములకు ఏమి చేయవలసియున్నది? మరియు అది అంతా మీ కొరకు మరియు నా కొరకు అది మనకు ఏమి చేయనైయున్నది? పాపములో కొనసాగుటయా దేవుడే వద్దని ఆపును. అయితే పాపములను వదులుకొనుట మరియు పాపమునకు చనిపోవుట. ఆయనకు పాపము ఏమి చేసియున్నదో నీవు చూడలేదా? పాపము ఆయనను చంపినది. నీకు మరియు నాకు దేవుని నీతిని తీసికొని వచ్చునట్లుగా, మరియు ఆయనే పాపమునకు పరిహారం చేసెను. కావున దేవుని నీతిని మనకు వచ్చినప్పుడు, మన మర్త్య శరీరములలో పాపము చనిపోయినది. ఓ, దానిని మీరు గమనించారని ఆశిస్తున్నాను.

54అవును. ప్రతీ సంగతికి జరుగుచున్నట్లుగా, నీవు తిరిగి జన్మించుటకు, ఒక మరణ విధానములో తప్పక వెళ్ళవలసియున్నది. నీవు ఒక ధాన్యపు గింజను తీసికొనుము. అది తిరిగి మొలచుటకు అది మొదట చావవలసియున్నది. ఒక గోధుమ గింజ తిరిగి ఉత్పత్తికాబడుటకు ఉద్దేశించిన… అది పూర్తిగా అసాధ్యం, ఏలయనగా ఆ గింజ, ఆ గోధుమ, ఆ పుష్పము, ఆ చెట్టు, ఆ గడ్డి, ఆ కూరగాయలు… తిరిగి మొలిచే ప్రతిది మొదట తప్పక చావవలసియున్నది. అప్పుడు నీవు దానిని తప్పించుకొనుచూ ఎలా వెళ్ళుచున్నావు? నీవు మొదట చావనైయున్నావు. నీవు చావవలెను. ఎలా చనిపోవాలి? కావున నీవు మరల తిరిగి జన్మించగలుగునట్లు, నీ మట్టుకు నీవే ప్రతీ దానికి చనిపోవలెను. అది నీవు చేయవలసియున్నావు. నీవు చనిపోనియెడల, నీవు మరల తిరిగి ఎన్నడూ బ్రతుకవు.

55మరియు, చూడు, నీవు జీవించగలుగునట్లు ప్రతి రోజు ఏదో ఒకటి చనిపోవలసియున్నది నీవు ఎరుగుదువా? ఇప్పుడు మన మధ్యలో ఉన్న సెవెంత్-డే అడ్వెంటిస్టులగు, మీలో చాలా మంది ఇలా చెప్పుదురు? "బ్రెన్హాం సోదరుడా, నేను ఉడతలను వేటాడాను. ఒక జింకను లేక కుందేలు, చేపను నేను చంపియుండలేదు, కారణం మనము ఆ జీవులను చంపుటను నేను నమ్ముటలేదు." నా సహోదరుడా, నీవు తినే కూరగాయలు, ఆ వస్తువులు కూడా ప్రాణంతో ఉన్నవని నీవెరుగుదువా? నీవు దానిని చంపవలసియున్నావు. మరియు ఈ జీవితంలో బ్రతికి ఉండుటకు, కావున చనిపోయిన జీవంచేత నీవు జీవించునట్లు ఏదో ఒకటి చనిపోవలసియున్నది. ఆ పద్ధతి మాత్రమే. మర్త్యమైన జీవితం జీవించుటకు ఇక్కడ భూమి మీద దాని మర్త్యమైన జీవం చేత నీవు జీవించగలుగునట్లుగా, ఇప్పుడు ఏదో చనిపోవలసినయెడల, దాని జీవము చేత నీవు నిత్యముగా జీవించునట్లు ఏదో ఒకటి చావవలసి లేదా? నీకు నీవే ఆ ప్రశ్న వేసికొనుము. మరియు ఆ ఒక్కడు క్రీస్తే అయియున్నాడు, కారణమేమనగా అమర్త్యమైనవాడు మరొకడు లేడు. కుమారుడు మాత్రమే అమర్త్యత కలిగియున్నాడు. మరియు నీవు కేవలం ఆయనను అంగీకరించుట ద్వారా ఆయనంతట ఆయనే నీకు ఇచ్చును.

56ఇప్పుడు, అది తప్పక చావాలి.

ఇప్పుడు, ఈ నూతన సంవత్సరాన ఒక క్రొత్త పేజి తిరగవేయుట దాని ఉద్దేశ్యం కాదు. నీవు ఇలా అందువు, "బ్రెన్హాం సోదరుడా, చాలా కాలం నుండి ఇక్కడకు నేను వచ్చుచున్నాను. ఈ సంఘ సభ్యుడనై యున్నాను. ఈ నూతన సంవత్సరాన, ఒక కొత్త పేజి తిరగవేయవెళ్ళుచూ, మరియు క్రొత్తది ప్రారంభించుచున్నాను. అది దాని అర్థము కాదు. ఒక కొత్త పేజీ తిరగవేయుట కాదు, అయితే నిజంగా చనిపోయి, తిరిగిపుట్టుట. ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు, నీవు నేరస్తుడవుగా భావించబడుదువు. నీవు మెథడిస్టు పద్ధతిలో వెళ్ళినను, లేక బాప్టిస్టు పద్ధతిలో వెళ్ళినను లేక ఏ పద్ధతిలో నీవు వెళ్ళినను నీవు నేరస్తుడవుగా ఉండవలసియున్నావు. అది నిన్ను చంపేవరకు అలా నీవు నేరస్తుడవుగా భావన కలిగి యుందువు. అది నిజము. అది నిన్ను చంపును. నీ లోకజీవితము సరిగా అక్కడ చనిపోవును. అక్కడే నీ లోకజీవితము చనిపోయేవరకు, దేవుని సమక్షంలో నీవు నేరస్తుడవని నీయంతట నీవే పశ్చాత్తాపపడవలసియున్నది. ఆయన సన్నిధిలో నీవు నిలబడినప్పుడు పాపపు ప్రశ్న ఇక లేదు. నీవు ఆ విధంగా చూసినప్పుడు, నీవు ఖచ్చితంగా జీవించుదువు, కారణమేమనగా నీవు చనిపోవుదువు. మరియు నీవు తిరిగి జీవించుటకు ఒక పద్ధతి మాత్రమే గలదు. నీవు తిరిగి జీవించుటకు మొదట చావాలి.

ఇప్పుడు నేను ఏమి చెప్పుచున్నానో నీవు చూడు, చూడలేదా? ఆ పుట్టుక ఏమైయున్నదనగా, నూతన జన్మము. తిరిగి జన్మించుటకు, మొదట చావవలెను. మరియు ఇంకనూ లోక సంగతులు, నీలో ఉన్నయెడల, నీవు తిరిగి జన్మించలేదు. ఇంకనూ లోకసంగతులతో వ్రేలాడుతూ మరియు తిరిగి జన్మించితినని చెప్పుకొనుచూ నీవు ఎలా వెళ్ళుచున్నావు? ఎలా నీవు దానిని చేయగలవు?

57మరో దినాన యవ్వన క్రైస్తవుడు, ప్రజల గుంపు… వారు కాదని నేను చెప్పును. అయితే కొన్ని చిత్రములు చూస్తూ క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ మనుష్యులు, అందరూ తమ చుట్టూ, ఒకరి చుట్టూ ఒకరు ప్రేమింపబడేవారు, స్నానపు దుస్తులతో ఈతలో ఉన్నారు, చూశారా. "అది నిజమైన ప్రేమ," అని వారు చెప్పుదురు. అది నిజమైన రోత! అది ప్రేమ కాదు. ప్రేమ దానికంటే వేరుగా వ్యక్తము చేయబడెను.

1KGS 18:29•

ROM 6:11•

EPH 1:13•

EPH 4:30•

COL 3:3

 

58దేవుని తీర్పు అయిన ఆయన ఇత్తడి బలిపీఠంపై విశ్వాసం ద్వారా మన ప్రాణములు ఉంచబడినవి. మరియు మన అర్పణ దహించబడియున్నది. ఇప్పుడు గుర్తించండి, ఏలీయా ఆ ఇత్తడి ఆకాశముల క్రింద దేవుని అర్పణను బలిపీఠంపై ఉంచినప్పుడు, ఆ అర్పణ దహించబడినది. బిలాము అతని అర్పణను దహించియుండలేదు. (నేను ఇది చెప్పగోరుటలేదు, కాని నేను ఇది తప్పక చెప్పవలెను.) మరియు నీవు సంఘానికి వెళ్ళి మత కార్యములను అంగీకరించి, వారి వివిధ బాప్తిస్మములను, మరియు నీ అర్పణను, నీయంతట నీవే అనుకొని అక్కడ ఉంచినప్పుడు, నీవు వణకుచూ పైకి లేచి ఏడుస్తూ ఉండవచ్చును. అయితే ఆ అర్పణ దేవునిచే గ్రహింపబడినయెడల, అది దహించబడినది. నీకు ఆ లోకము చచ్చియున్నది. ఇక నీవు లేవు, మనకు మనమే చచ్చినవారమై మరియు పాతిపెట్టబడినవారముగా భావింపబడుదుము. మనము చనిపోతిమి మరియు… మనము క్రీస్తునందు దాచబడి ఉన్నాము. క్రీస్తునందు భద్రపరచబడితిమి. మరియు, అది గాక, అప్పుడు మనము చనిపోయి, సమాధి చేయబడి, క్రీస్తునందు దాచబడిన తరువాత, అప్పుడు పరిశుద్ధాత్మ చేత మనము ముద్రించబడియున్నాము.

ROM 6:3

 

59ఇప్పుడు నేను ఏమి ఉద్దేశించితినో మీరు చూశారా? మీరు చనిపోతిరి. మన ప్రాణములు ఆయన దైవిక తీర్పుపై ఉంచబడియున్నవి. అది యిత్తడి అయియున్నది. దైవిక తీర్పుకు సంబంధమైన బలిపీఠం పైన మన ప్రాణములు ఉంచబడినప్పుడు, పరిహారము ఏమైయున్నది? మరణము. మరియు దేవుని బలిపీఠంపై నిన్ను నీవుంచుకొనినప్పుడు పాపియైన నీపై మరణము విధించబడియుండగా, దేవుడు నీ బలిని అంగీకరించినయెడల, పాపంలో జీవిస్తూ అక్కడ నుండి ఎలా లేవగలవు? ఇప్పుడు అది స్పష్టమయినదా? నీవు చనిపోయావు! నీవు నిజముగా దహింపబడ్డావు, మరియు నీవు రాయిగా అయిపోతివి. అక్కడ ఇక నీకు ఏదీ విడిచిపెట్టబడలేదు, అయితే కేవలం ఇత్తడి సర్పమువలె, లోపల నిలువబడియున్న నీ రూపము వారు చనిపోయి చల్లబడిన వానిని సిలువ నుండి క్రిందికి తీసికొనిన క్రీస్తు వలె, ఉండును. నీవు చనిపోయియున్నావు. ఏ కారణం చేత? నీవు దేవుని తీర్పు బలిపీఠంపై ఉన్నావు. ఆయన తీర్పు ఏమిటి? న్యాయాధిపతి తన మాటను జారీచేసినప్పుడు, ఆయన పరిహారం యొక్క మాట ఏమిటి? మరణము మరియు తీర్పుతో కూడిన ఆయన బలిపీఠంపై నీ ప్రాణమును ఉంచినప్పుడు, అది నీకు చావు అయి ఉన్నది. ఇప్పుడు నీవు దానిని పొందావా?

60ఓ, నీవు అక్కడ నుండి లేచి మరియు ఏదైనా చేయవచ్చు. ఆత్మలో బాగా నాట్యం చేసినను, ఎవరైనా ఒకరు అరచినట్టు, నీవు బలంగా కేకలు వేసినను, నేలపై క్రింద - పైన బలంగా పరుగెత్తిననూ, ప్రతీ సంఘములో చేరినను, నీవు కోరిన ఏది బాగా చేసిననూ, (ఇప్పుడు నేను పెంతుకోస్తు వారితో మాట్లాడుతున్నాను), మరియు సరిగా వెనుకకు బయటకు వెళ్లి, ఒక మనుష్యుని భార్యను అపవిత్రము చేసి, మీలో కొందరు స్త్రీలు ఒక మనుష్యుని ఇంటిని ముక్కలుగా చేయుదురు. మరియు ఆ సంగతులు సరిగా చేయుటకు, ఎంతగా వాక్యము నీ దగ్గరకు వచ్చినను, ఏమీ చేయకుండా, నీవు సరిగా వెనుకకు పోవుదువు. నీవు దానిని గుర్తించి ఉండవు. స్త్రీలు మీ తలలను ఎన్నడునూ ఎదగనియ్యరు లేక మీరు ఎన్నడూ సరిగా దుస్తులు ధరించరు. నీవు ఇంకా, సరిగా, కేవలం లోకం వలే ఉన్నావు, ఎందుకనగా ఇంకా నీవు లోకమునకు చనిపోలేదు. ఆ లోకముతో బ్రతికే ఉన్నావు.

మీలో కొందరు మనుష్యులు ఎన్నడూ త్రాగుట, పొగత్రాగుట మానరు. అసభ్యంగా దుస్తులు వేసికొనిన, చెడు స్త్రీలవైపు చూస్తూ మోహపు చూపు చూచుట మానరు. వారిని వీధులలో చూసినప్పుడు, వీపు వెనుకకు త్రిప్పి దూరంగా నడుచుటకు బదులుగా, అలా చేయుదురు. మీరు అదే విధముగా, ఇంకనూ కేవలం అలా మోహపు దృష్టి కలిగియుందురు. అలా జరుగుట ఎందుకనగా, ఇంకనూ మీరు లోకముతో బ్రతికే ఉన్నారు. అయితే ఆ బల్యర్పణ పరిగ్రహించబడినప్పుడు, నీవు చచ్చినవాడవు. అది నిజము. నా అభిప్రాయము ఏమిటో మీరు విన్నారా? నేను దేని గూర్చి మాట్లాడుచున్నానో మీరు గ్రహించితిరా?

EZEK 18:4,20•

MATT 7:22,23

 

61ఇప్పుడు, నీ ప్రాణము దేవుని ఇత్తడి తీర్పు బలిపీఠంపై ఉంచబడి ఉన్నది. అప్పుడు దేవుడు బల్యర్పణను… ఇప్పుడు, నీవు ఇంకా లోకముతో బ్రతికే ఉన్నయెడల, ఇంకా దానిని నీవు పొందనట్లుగా అది చూపించుచున్నది. దేవుడు ఎన్నడూ దానిని తీసికొనలేదు. ఇప్పుడు, ప్రజలైన మీరు మాట్లాడుకొనుచున్నారు, మీరు ఇక్కడ ఉండి పరిశుద్ధాత్మను పొందుటను గూర్చి ఏ విధంగా అంతకాలం మీరు కనిపెట్టవలసియున్నదని, ఇక్కడే మీరు ఉన్నారు. దేవుడు ఆ బల్యర్పణను పరిగ్రహించువరకు, అక్కడ ఆయన తీర్పులపై పెట్టబడేవరకు, ఆయన తీర్పు నిజముగా నీ జ్ఞానేంద్రియములలో పాపమును చంపేవరకు… నీవు ఇలా బాగా చెప్పుదువు, "సరే, నేను ఒక క్రొత్త పేజి తిరగవేయ వెళ్ళుచున్నాను." అది, అది కాదు. "మంచిది, నేను కాల్చుచున్నానని నేను ఎరుగుదును. నేను సిగరెట్టు కాల్చుట మానుదును." అది, ఇంకా కాదు, ఆయన ఇత్తడి బలిపీఠంపై, దేవుడు అర్పణను పరిగ్రహించును ఆయన బలిపీఠం తీర్పు అయి ఉన్నది. ఆయన తీర్పు ఏమిటి? మరణము. అదియే ఆ పరిహారము.

"పాపము చేయు ప్రాణము [అది దానిలో నిలిచి ఉండును] చనిపోవును." నీవేమి చేసినను నేను లక్ష్యము చేయను.

ఆ రోజున అనేకులు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పుదురని యేసు చెప్పెను, "'ప్రభువా, ఇది నేను చేయలేదా? అది చేయలేదా?' అప్పుడాయన, 'అక్రమము చేయువారలారా, నా దగ్గర నుండి తొలగిపొండని, ఆయన చెప్పును.'"

PS 51:5

 

62అగ్ని చేత ఆ బల్యర్పణ తీసికొనబడినప్పుడు, మరియు అది ఆవిధంగా పైకి వెళ్ళును, మరియు పొగ పైకి పోవును. నీవు నీ బల్యర్పణతో ఆకాశములలోనికి లేపబడెదవు. మరియు అప్పుడు లోక సంగతులు నుండి దూరముగా ముద్రింపబడుదువు. మన ప్రాణము ఆయన బలిపీఠముపై ఉన్నది.

నీవు చనిపోయిన తరువాత, అప్పుడు నీవేమి చేయనైయున్నావు? అప్పుడు నీవు నూతనముగా భావములు కలిగియుందువు. నీవు క్రొత్త తలంపులతో ఉందువు. నీవు మొదట అక్రమములో ఉన్నట్లు భావించబడితివి. ఇప్పుడు ఏదో మరో కొత్త దానిలో తలంచబడి ఉన్నావు. అది ఏమైయున్నది? జీవించుచున్న వాక్యము. ఓ, ఇప్పుడు అది దానిని మార్చును. అది కాదా? అది అలా ఏమి చేయవలసి ఉన్నదో చూసిన తర్వాత పోరాటములో ఉన్నాము కదా? ఇప్పుడు ఏమి జరిగినది? జీవించు వాక్యములో నీవు నూతనముగా భావములు పొందితివి. అది ఏమై ఉన్నది? ఆ వాక్యము నీలో సజీవముగా యున్నది. నీవు సంగతులు వేరుగా ఉండుటను చూడ ప్రారంభించుదువు. ఒకప్పుడు నీవు ఎక్కడ దానిని చూడలేకపోతివో, ఇప్పుడు దానిని నీవు చూచెదవు. ఇప్పుడు అక్కడ ఏదో వేరయినది గలదు. లేఖనములను అన్నింటిని కలిపి ఏకీభవింపజేయును, ప్రతీది సరిగా జతపరచబడునట్లు తయారుచేయును. అప్పుడు, అప్పుడు, ఇప్పుడు ఏదో ఒకటి జరుగనారంభించినది. ఇప్పుడు నీ స్వంత ఆలోచనకు నీవు చావవలసి ఉన్నది. ఇప్పుడు నీవు భావనతో ఉన్నావు, ఎందుకనగా మనము దేవుని వాక్యము చేత కడుగబడితిమి. అది నిజమేనా?

JOHN 3:7•

EPH 5:26

 

63పుట్టిన వెంటనే ఒక శిశువును నీవేమి చేయుదువు? అతనిని కడుగుదువు. అది సరియేనా? మరియు ఒక మనుష్యుడు తనంతట తానే చనిపోయినప్పుడు, దేవుని ద్వారా జన్మించి ఉన్నాడు. అతడు దేవుని వాక్యపు నీటిచే కడుగబడి ఉన్నాడు. ఆమేన్. అది "యేసు నామము," అని చెప్పినయెడల, "యేసు నామము," అని నీవు చెప్పుము; "నీవు తప్పక తిరిగి జన్మించవలెను," అని చెప్పినప్పుడు, నీవును అదే విధముగా చెప్పుము. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు, నీవు వాక్యము అనే నీటిచే కడుగబడియున్నావు. ఆమేన్.

ఇప్పుడు నీవు జీవము కొరకు సిద్ధంగా ఉన్నావు. నీవు అలా ఉండటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు, ఇప్పుడు ఒక క్రొత్త తండ్రితో దేవుని ఇంటిలో క్రొత్తగా జన్మించితివి. నీ యొక్క ఉపాధ్యాయులు… ఇప్పుడు నీవు ఆ ఉపాధ్యాయులను కలిగియున్నావు. నీవు ఒక క్రొత్త తండ్రిని పొందితివి. ఇప్పుడు అది ఇక్కడ ఉన్నది. తండ్రి లేకుండా నీవు జన్మించలేవు. కావున ఒక సంఘం యొక్క సహోదరత్వంలో జన్మించినయెడల, నీవు పొందినది అదే. నీవు ఒక మతవిశ్వాసంలో జన్మించిన యెడల, నీవక్కడే ఉన్నావు. అయితే దేవుని మూలముగా జన్మించి, ఆయన వాక్యభావన కలిగి, నీవు ఒక క్రొత్త తండ్రిని పొందిన — ఆయన దేవుడు — మీ మధ్య ఆయన వాక్యము తెలియజేసి, మీతో మీ ద్వారా మాట్లాడును. ఓ, ఒక క్రొత్త తండ్రి — ఆ తండ్రి దేవుడే అయి ఉన్నాడు. ఇదివరకు పలుకబడిన, ఆయన వాక్యము తీసికొనసిద్ధంగా ఉన్నాడు. మరియు అది నీలో ఉంచబడి, అది జీవముగా చేయుటకు వచ్చును, చూశారా. ఇప్పుడు నీవు ఒక శిక్షణ కలిగియున్నావు. నీవు సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు నీవు శిక్షణలోనికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నావు. బాల శిక్షణ అది. నీవు ఇది చేయవలసినదని ఆలోచించు. అది కఠినమగు భాగము. మరియు "వాక్యము" నీ చుట్టూ ఉన్నదానిని నరికి మరియు ఏదో మరొకటి ప్రతి ఇతరమైనది నీకు చూపించును. "ఎందుకు, వారు అది ఎక్కువగా నమ్ముదురు…" వారేది నమ్మినను అది ఏ బేధమును కలిగించదు. దేవుడు చెప్పినది ఇదే! నీవు తండ్రి పని మీద తప్పక ఉండవలెను. ఇప్పుడు నీవు తిరిగి మరల జన్మించుచున్నావు. ఇప్పుడు నీవు సరియైనది పొందుచున్నావు, సరియైనవానిగా అవుచున్నావు. నీవు ఒక క్రొత్త తండ్రిని కలిగియున్నావు.

HEB 11:37

 

64నీవు ఒక క్రమములో… నీవు తిరిగి జన్మించినట్లయితే మరియు ఒక క్రొత్త తండ్రిని పొంది, అప్పుడు నీవు ఒక నూతన స్వభావం పొందితివి. ఆ పాత స్వభావం చనిపోయింది. మరియు నీవు ఒక నూతన స్వభావం పొందావు. నీవు ఒకప్పుడు ఈ దారిన ఇలా వెళ్ళావు. ఇప్పుడు నీవు మరో పద్ధతిలో వెళ్ళుచున్నావు. నీవు ఒకప్పుడు ఈ మార్గం గుండా క్రిందకు వెళ్లావు; ఇప్పుడు నీవు ఈ మార్గం ద్వారా పైకి వెళ్ళుచున్నావు. మీ ప్రేమలు ఇప్పుడు పైనున్న వాటి మీదనే ఉన్నతముగా స్థిరపరచబడినవి. ఒక నూతన ప్రేమ. ఇక నీవు ఈ లోక సంబంధ వస్తువులను ఇక ఏమాత్రం ప్రేమించవు. నీ ప్రేమ దేవునిదై ఉండును. మనుష్యుడు ఏమి చెప్పుచున్నది నీవు లక్ష్యముంచవు. వారెలా నిన్ను చూచి నవ్విననూ మరియు నీవు "ఒక పాత పద్ధతి," లేక అది ఆ విధముగా ఏమైయున్నప్పటికిని నీవు లక్ష్యముంచవు, ఎందుకనగా నీవు పై నుండి జన్మించితివి. నీ ప్రేమలు వీటన్నింటికీ పైగా స్థిరపరచబడినవి. దేవుడు నిన్ను గూర్చి సిగ్గుపడడు. ఆయన గూర్చి నీవు సిగ్గుపడవు. అది నిజము. కావున నీవు… ఇక్కడ సరిగా హెబ్రీ 11వ అధ్యాయము చదవండి. ఆ రోజుల్లో ప్రజలు ఎలా చేశారనునది. (నేను ఇక్కడ వ్రాసియుంచాను), వారు ఎలా మేక చర్మాలతో, అరణ్యాలలో, దరిద్రులైయుండి మరియు అది గాక ప్రతీ ఇతరమైనదానిలో, ఈ లోకము ఎవరికి యైగ్యము కాదో, చూశారా. దానిని చదవండి, అది నీకు బాగుండును. మరియు ప్రజలు వారి స్వభావము మారినప్పుడు ఏమైయున్నారు, ఏమి జరిగినది, నీవు అక్కడ చూడగలవు.

2COR 5:17•

GAL 6:15

 

65ఇప్పుడు, బ్రెన్హాం సోదరుడా, అప్పుడు నీవు పొంది ఉన్న స్వభావము ఏ రకమైనది? ఆయన యొక్క స్వభావమే. నేను నా తండ్రి స్వభావమును కలిగినయెడల, అప్పుడు నేను నా తండ్రి చేయు పనులు చేయుదును. అయితే ఇప్పుడు నేను తిరిగి జన్మించియున్నాను. అది నా తండ్రి ఎవరు? అనే దానిపై ఆధారపడి ఉన్నది. కేవలం నీవు ఒక సంఘములోనికి జన్మించిన ఎడల, నీవు ఒక సంఘ తండ్రిని పొంది ఉన్నావు. మరియు నీవు కోరినయెడల ఆయనను, "తండ్రి" అని పిలువగలవు. నీవు కోరిన విధంగా ఆయనను పిలువవచ్చును, కారణమేమనగా అతడు నీ యొక్క తండ్రి. అయితే నీ తండ్రి దేవుడు అయిన యెడల, మరియు నీవు దేవుని కుటుంబములోనికి జన్మించితివి. అప్పుడు నీవు దేవుని బిడ్డవు. నీ స్వభావము దేవుని స్వభావము. అప్పుడు వారిలో కొందరు ఇలా చెప్పుట విందువు, "ఓ, అద్భుతాలు జరుగు రోజులు గతించాయని మా సంఘం నమ్మును." దేవుని స్వభావము నీలో ఉన్నయెడల, అద్భుతాలు జరుగు రోజులు గతించాయని ఎలా నమ్ముదువు? అప్పుడు ఆయన, అంతా ఒక పూర్తి అద్బుత౦. అతని స్వభావం ఒక అద్భుతం. అతని అలవాటు ఒక అద్భుతం. అతని వ్యక్తిత్వమంతా ఒక అద్భుతం. అద్భుతంగా గాక ఎలాగు మరియొక విధంగా ఉండగలవు? నీ క్రొత్త జన్మయే అద్భుతం. నీ క్రొత్త జీవమే అద్భుతం. నీ స్వభావం కూడా అద్భుతమే. "ఆ కార్యములు చనిపోయినవి, ఇది సరి అయినది," అని వెనుకకు చూచి అలాగు చెప్పగలవు. నీవు ఒక నూతన జీవివి - నూతన సృష్టివి - నిశ్చయముగా.

66కొద్ది రోజుల క్రితము ఒక చిన్న పిల్ల పక్షిరాజు గురించి నేను బోధించిన విధముగా. మీకు ఆ కథ జ్ఞాపకము ఉన్నది అని అనుకొనుచున్నాను, ఒక వ్యవసాయము చేయువాడు ఎలా పక్షిరాజు గ్రుడ్డును కోడి క్రింద పెట్టెను. మరియు పిల్లలు పుట్టినప్పుడు ఒకటి తప్ప అన్నీ కోడిపిల్లలే. అతడు పక్షిరాజు. అతడు వింతైన చిన్న జీవి. అతడు పూర్తిగా మరొకలా ఉండెను, కాని చూడండి, అతడు మరొక వర్గంలో పుట్టెను. ఆ ఇంద్రియం మరియు గూడు వేరుగా ఉండెను. అది మరో విధమైన పక్షిని చేసినది. నిశ్చయముగా అతడు వింతగా కనబడెను. మిగిలిన వాటికన్నింటికి అతడు విడ్డురముగా ప్రవర్తించెను. అయితే అతడు సహజముగానే ప్రవర్తించెను, ఎందుకనగా ఇక అతడు ఎక్కువ ఏమియూ చేసియుండలేదు, కారణం అతడు ఒక పక్షిరాజై ఉండెను. అతని యొక్క స్వభావం పక్షిరాజు అయి ఉన్నది. కావున, అతడు ఆ విధముగానే ఉండి, పక్షిరాజు అయి ఉండెను. అయితే అక్కడ వారిలో గొప్ప సమూహము ఈ శాఖలలో ఉన్నది. అవి నిజముగా పక్షిరాజులు, అయితే కేవలం ఆ బురదలో వారు సోమరితనముగా ఒరిగి ఉండి, మరియు లోకసంగతులను సరిగా గ్రహించుటలేదు. చూడు, అది మన పని, వెళ్ళి వారిని తీసుకురండి.

67ఒక రోజు ఆ ముసలి పక్షిరాజు తల్లి పైకి వచ్చినది, ఆ కోడిపెట్ట భూమి మీద ఏదైనా కొంతకాలం, ఆ పక్షిరాజును ఎన్నటికీ అలాగే ఉంచునని నీవు ఆలోచించవా? ఎంతగా ఆ కోడి "కొక్ కొ కోక్" శబ్దంలో పిలిచినను ఏమీ కాదు. ఎంత మంచిగా పిలిచినను, అది అనెను, "ప్రియమైనదానా, ఇక్కడకు రమ్ము, నేను ఇక్కడ ఏదో సరియైనది కనుగొన్నాను, రమ్ము." ఓ మై! అతని ప్రేమలు ఈ లోకసంగతుల కన్నా పైగా ఉన్నవి. మరి దానిని కలిసికొనుటకు అతడు వెళ్లెను. అతని కొరకు ఇక ఏ శాఖలూ లేవు. దాని నుండి అతనిని దూరముగా పిలువలేవు.

మరియు ఒక మనిషి దేవుని మూలముగా జన్మించినప్పుడు, నీవు అతనిని వెనుకకు, ఆ క్రుళ్లిన పాపపు మురికిలోనికి, ఇక ఏ మాత్రం పిలువలేవు. అతడు చనిపోయెను, మరియు అతడు తిరిగి జన్మించి ఉన్నాడు. అతడు ఒక నూతన జీవి. అతడు పక్షిరాజు స్వభావమును పొందెను. అతడు ఆకాశములోనికి వెళ్లి, ఎగురును. తన తండ్రి అయి ఉన్న తల్లి ఎక్కడ ఉన్నదో, అక్కడకు అతడు పైకి లేవనై ఉన్నాడు.

ఆ విధముగా నమ్ము ఒక మనిషి, ఇట్లు చెప్పును, "ఓ, మా సంఘానికి వచ్చి చేరుము, ఇప్పుడు, అది మూఢభక్తి. ఆ రోజు…"

HEB 13:8

 

68ఇప్పుడు, ఆ చిన్న పక్షిరాజు అక్కడ బయట నిలబడియున్నయెడల, ఆ తల్లి కేకలు విని, మరియు అతడు చుట్టూ చూసి ఇలా చెప్పెను, "అది ఎక్కడ ఉన్నది?" ఇక్కడ ఆ చిన్న పక్షిరాజుకు ఏదో కొంత ఈ విధంగా ఆమె కేక వేసి ఉండవచ్చు. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు."

తల్లి చెప్పెను, "అద్భుతాలు జరుగు రోజులు గతించాయి, "కొక్ - కొక్, కొక్ - కొక్." అద్భుతాలు జరుగు రోజులు గతించాయి. అటువంటిది ఏదీలేదు! అది మూఢభక్తి! ఓ మై!

ఎందుకు, ఇంకా ఎంతమాత్రమూ నీవు అతడిని పట్టియుంచలేవు. అతడు కేవలం ఇలా చెప్పుట నేను వినగలను, "అమ్మా, అక్కడకు నేను ఎలా పైకి రాగలను?"

"ప్రియా! కేవలం నీ రెక్కలు ఆడించుము. నీవు చేయవలసినదంతా అదే. నీవు పక్షిరాజువై ఉన్నావు. కేవలము విశ్వాసంతో నడువుము."

"ఏ విధంగా అది అలా జరుగును, అమ్మా?"

"నేను ఎరుగను. కేవలం నడుస్తూ ఉండు." ఇక్కడకు అతడు వచ్చును. అతడు మొదట కొద్దిగా రెక్కలు చాచి, కంచె స్తంభంపై ఆనుకొనెను. ఏదో విధంగా ఆ ఎత్తుకు అతడు వెళ్ళెను. ఆమె ఇట్లు చెప్పెను, "సరే, రమ్ము, నేను నిన్ను పట్టుకొందును." అంతే.

ROM 3:4

 

69ఒక క్రొత్త స్వభావం, ఒక క్రొత్త ఉనికి, ఒక క్రొత్త సృష్టి, నీ తండ్రి యొక్క స్వభావం. మరియు అతడు చెప్పిన ప్రతీ వాక్యమును నమ్మి మరియు ప్రేమించుదువు. ఈ వాక్యానికి విరుద్ధంగా ఉన్న ప్రతీ మనుష్యుని మాట ఒక అబద్ధమే. ఇది దేవుని వాక్యమై ఉన్నది, చూశారా. బైబిలు మాట యధార్థమైనది. సంఘము ఏమి చెప్పినను, నేను లక్ష్యముంచను. నీకు బైబిలు చెప్పినదే ఇంకా సరియైనది, కారణం నీ స్వభావం మార్పుచెందియున్నది. ఇప్పుడు, నీవు ఒక సంఘ తండ్రిని కలిగియుండినయెడల, నీవు ఆ సంఘ తండ్రి యందే నమ్మిక వుంచగలవు. అయితే నీవు దేవుని నీ తండ్రిగా పొందినయెడల, నీవు దేవుని వాక్యమునందు నీవు నమ్మిక వుంచగలవు. సంఘములోని ఒక తండ్రిని నీవు పొందినయెడల నీవు వానియందే నమ్మికవుంచగలవు, ఎందుకనగా నీవు వాని స్వభావమును కలిగియున్నావు, అతడు నీ యొక్క తండ్రి. అయితే నీ తండ్రి దేవుడైనయెడల, అప్పుడు నీవు దేవుని వాక్యమును నమ్మగలవు. నీవు సంఘమునకు చెందినవాడవైనయెడల, నీవు ఆ సంఘ తండ్రి వాక్యమునే నమ్మగలవు, నీవు సంఘ వాక్యమునే నమ్మగలవు, సంఘము ఏమి చెప్పునో నీవు అదే నమ్మగలవు. అయితే నీవు తిరిగి జన్మించినయెడల, అప్పుడు నీవు దేవుడు ఏమి చెప్పెనో దానినే నమ్మగలవు, ఎందుకనగా దేవుడే నీ తండ్రి అయి యున్నాడు — లోకము కాదు లేక సంఘ మత విశ్వాసములు కాదు.

70మరియు వారు ఒక రోజున పెరటిలో, వారికి ఒక బాతు కలదని చెప్పుట నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. కొన్ని కోడిపిల్లలు ఆ బాతును అనుసరించుచున్నవి. మరియు ఆ బాతు, ఆ కోడిపిల్లలకు ఒక హాస్యమైన ఒక చిన్న జీవి అని నీకు తెలుసు. ఆ బాతు ఒక విధమైన పై బరువు కలిగి, మరియు పెద్ద ముక్కు ఉండునని నీకు తెలుసు. అయితే ఆ విధంగా పైబరువుతో ఉన్న అది, అతనికి ఒక ప్రయైజనం కొరకు ఆ ముక్కు అక్కడ కలిగియున్నది. మరియు అదే విధంగా క్రైస్తవుడు కొన్నిసార్లు కొంచెం తక్కువవానిగా వెర్రి తనముగా ఉండునట్లు కనబడుచున్నాడని ఊహించుచున్నాను. అయితే, అతడు, కోడిపిల్లలతో పరుగెత్తినంత కాలం అది హాస్యంగానే కనబడును. మరియు టర్కీ కోళ్ళు మరియు ఇతరములు, అవి చిన్న పొట్టి ముక్కు కలిగియుడును. మరియు ఆ జీవులు ఆ పనులు చేయును. మరియు ఆ బాతు వలె అవి నిర్మించబడలేదు. ఒక రోజు ఆ తల్లి వానిని, ఆ కోడిపిల్ల గుంపును, వానిని బయటకు తీసుకొని వచ్చినది. ఒక విధంగా ఆ కోడి ఎల్లప్పుడూ ఆ వెనుక ఉండునని నీకు తెలుసు. వాటివలె అతడు మాట్లాడలేడు. అతని భాష వేరయినది. అవి ఒకదానినొకటి అర్ధం చేసుకొనలేవు.

71క్రైస్తవుడు తిరిగి జన్మించినప్పుడు, అదేవిధంగా ఉండును, చూడు. అతడు వేరైనా గ్రుడ్డులో నుండి బయటకు వచ్చాడు, అంతా అదియే, చూశారా. బహుశా అతడు పొంది యుండును… ఈ సంఘశాఖలలో వారిలో చాలామంది అక్కడ గలరని నేను నమ్ముచున్నాను, అవి అసలైన బాతులు; అయితే వారు ఒక పెట్ట నాయకుని కలిగియున్నారు. (అది నిజము), ఆందుచేత వారు కేవలం దానిని పొందలేదు. అది మొరటుగా కనిపించును. ఆ విధముగా దానిని భావించవద్దు, అయితే నేను ఒక విషయమును తెలియచేయుటకు ప్రయత్నించుచున్నాను.

ఒక రోజు ఆ ధాన్యపు కొట్టుకు వెనుక కొంచెం దూరం ఆమె (వానిని) తీసికొని వెళ్ళినది. ఆ ధాన్యపు కొట్టు వెనుక అక్కడ కొన్ని నీళ్ళు అలా ప్రవహించుచున్నవి. అవును. ఒక ఊట, వెళ్ళుచున్నది. అది చిన్న సెలయేరు. మరియు అది ఏమైయున్నదో అని ఆశ్చర్యపడుచూ, అది అక్కడకు వెళ్ళుచున్నది. ఆ కోడిపెట్ట వెంట అది ఎలా వెంబడించునో నీకు తెలుసు. మరియు కావున వారు తినుచున్న ఆహారమును కూడా ఆ పక్షిరాజు ఇష్టపడదు. అతనికి సరిగా కన్పించుట లేదు. వారు చేయుచున్న ఈ పాత సంగతులు వానికి అవి సరిగా కన్పించుటలేదు. కావున కొంచెంసేపటి తరువాత, ఒకసారి ప్రాణవాయువును పీల్చెను. అది పీల్చిన అనుభవం కలిగెను. "అది సరిగా వాసన చూచెను. అది ఎక్కడ నుండి వచ్చినది?" ఓ, అది పరలోకపు చిన్నఊపిరి — హుమ్! తాజాదనముతో సేదదీర్చుచున్న ఏదో చిన్న ప్రాణవాయువును పీల్చెను. నీకు అన్వయించబడిన ఒక ధర్మోపదేశము. అది లోపల క్రింద భాగానికి చొచ్చుకొని, వాక్యము దానంతట అదే లంగరు వేయబడు భావన కలిగియుందువు — హుమ్, పరలోక స్తూర్య ప్రకాశము! అతడు ఇలా అనుకొనెను, "ఓహూ! ఏ విధముగా అయినను అక్కడ మరియొకటి, నా స్వభావమునకు సరిపోవు ప్రాణవాయువును పొందాను." అతడు దానిని మరల పీల్చెను. "అది ఎక్కడో ఒకచోట ఉన్నది. ఇప్పుడు, నీవు నాకు చెప్పలేవు. అది ఎక్కడో ఒకచోట ఉన్నది. ఏదో ఒక చోట అక్కడ ఏదో నాకు చెందినది ఉందని నాకు తెలుసు." (ఈ ఆచారము చెందినది కాదు — నా ఉద్దేశ్యమేమిటో తెలుసుకున్నారా?) అతడు నీటిని వాసన చూచెను. మరియు అతని స్వభావము ఒక బాతు అయి ఉన్నది. కావున ఒక బాతు మరియు నీరు కలసి వెళ్ళును. అదే పద్ధతిలో ఒక విశ్వాసి మరియు దేవుడు కలిసి వెళ్ళును. తిన్నగా అతడు మరియొక పెద్దవాసన పీల్చి ఇంకా ఎక్కువ బలము పొందెను. కొంచెం సేపటికి గాలి వీచుటకు ఆరంభించెను. శబ్దముతో బలముగా వీచు గాలి వలె, నీవెరుగుదువు. ఆ నీళ్ళ నుండి తనకు చలి గాలులు వీచుట ఆరంభించెను. అతడు ఎక్కువసేపు నిలబడలేకపోయెను. ఆ కొండకు దిగువగా అతడు (బాతు) అటు ఇటు ఊగుతూ - అటు ఇటు ఊగుతూ - అటు ఇటు ఊగుతూ - అటు ఇటు ఊగుతూ వెళ్ళెను. సరే, నీవెరుగుదువు హాంక్-హాంక్ (అడవి బాతు యొక్క అరుపు) ఆ చిన్న ముక్కు గాలిలోనికి పైకి పెట్టి, నీవెరుగుదువు. అతడు నీటిని వాసన చూచెను!

ఆ పెద్ద కోడిపెట్ట చెప్పెను, "నీవు వెర్రివాడవు, ఇక్కడకు వెనుకకు రమ్ము!" ఎంత మాత్రము మంచిది కాదు, అతను నీటిని వాసన చూచెను. అతడు ఆ నీళ్ల కొరకు తన మార్గములో ఉండెను!

72"అక్కడ ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట ఉన్నది. పాపులు అందులో మునిగి తమ పాపములను పోగొట్టుకొందురు." ఒక నిజ క్రైస్తవుడు లోకముతో కలిసి ఏమి చేయగోరడు. వారు ఇక్కడ చుట్టూ అకస్మికముగా నివసింపగోరరు. మరియు వారు ఎక్కడ ఉన్నను, అక్కడ ఉండి ఆశ్చర్యపడరు. మరియు వారు ఈ రోజు మెథడిస్టు, రేపు బాప్టిస్టు మరియు ప్రెస్బిటేరియను మరియు పెంతెకోస్తు మొదలైనవి. ఓ, సహోదరుడా, అది దిక్కుమానలిది! ఒక నిజ క్రైస్తవుడు ఆత్మ యొక్క తాజాదనము పొందగోరును. ఆ దేవుని యొక్క తాజాదనము ఆయన జీవములో ఉండి అదియే ఏదో విధముగా ఒక నూతన సృష్టిగా వానిని చేయును. అతడు ఆ బయట ద్వారం దగ్గరకు రాగలిగిన వెంటనే, అతడు మంచు మైదానముల గుండా ప్రయాణించును లేక దానిని పొందుటకు అదిగాక ఇతరమైన దేనిగుండానైనా గుండా ప్రయాణించును. అతడు దూరముగా పోవును, ఎందుకనగా ప్రారంభంలోనే అతడు బాతు. అవును. ఒక మతవిశ్వాసము కాదు. కాదు-కాదు, కాదు-కాదు.

73"మరియు నీవు ఇంకనూ లోకసంగతులను ప్రేమించుచున్నయెడల, నీవు మోసగింపబడితివి. ఇంకా నీ బల్యర్పణ అంగీకరింపబడలేదు. నీ స్వభావము మార్చబడలేదు. ఇప్పుడు తిరిగి జన్మించుట అనగా ఏమిటో నీవెరుగుదువా? చూడు, నీ స్వభావము మార్చబడినది. నీవొక నూతన సృష్టి అయ్యావు. నీవు మొదట చనిపోవలసియున్నది. మరియు అప్పుడు తిరిగి జన్మింతువు. (ఇది పూర్తి చేయు సమయమని నేనెరుగుదును, కాని నాకు కొద్ది నిమిషములు ఇవ్వండి. నేను త్వరగా ఈ మూలగ్రంథములను పూర్తి చేయవలసియున్నది, చూచారా.) నీవు ఇంకనూ లోకమును ప్రేమించుచున్నయెడల, మరియు నేను తిరిగి జన్మించితినని చెప్పుకొనినయెడల, నీవేమి చేసినను అదేమీ కాదు, నీవు బాగా మొరపెట్టి ఉండవచ్చు. నీగుండా శీతలవాయువులు పరుగులెత్తియుండవచ్చు. అవి అన్నియూ సరియే. దానికి వ్యతిరేఖముగా నేనేమీ చెప్పుట లేదు. క్రైస్తవులు మొరపెట్టుదురు. వారిగుండా శీతలవాయువులు వెళ్ళును. మరియు నీవు చెప్పుదువు. "సహోదరుడా బ్రెన్హాం, నేను భాషలలో మాట్లాడితిని…" అది పరవాలేదు, మరియు అది ఎల్లప్పుడు చాలా మంచిది.

ROM 6:2,8

 

74ఒక దర్శనము లేక కలతో ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన, ఒక చిన్న స్త్రీని నేను చూచుచున్నాను. మరియు దాని అనువాదమును నేను పొందాను. ఆమె పరిశుద్ధాత్మ పొందలేదని, ఆ చిన్న పెంతెకోస్తు బోధకుని భార్యకు వెళ్ళి చెప్పుట. ఇంకొక రకమైన కష్టమైనది; అయితే ఆమె పొందలేదు. అయితే అప్పుడు ఆమె దానిని పొందినది. అవును.

అది వ్యత్యాసమైనది, చూడు. అవును. అది భాషలలొ మాట్లాడుట కాదు, అది ఆత్మలో నాట్యము చేయుట కాదు. దానికి అక్కడ చేర్చడానికి అక్కడ అలాంటివి ఏమీ లేవు. అది ఒక చావు మరియు ఒక పుట్టుక, మార్చబడిన ఒక స్వభావము, మార్చబడి అతడు దేవుని దయ పొందెను. సమస్తము కొత్తవాయెను. లోకము చనిపోయినది, మరియు దేవుడు భాగము ఒక నూతనము. దేవుడు నీ జీవమైయున్నాడు. మరియు నీలో లోకము చచ్చియున్నది. ఇప్పుడు నీవు దానిని గ్రహించితివా? మంచిది.

1COR 11:15•

1TIM 2:9

 

75ఇప్పుడు వినండి. ఇక్కడ కొంచెం సేపు ఆపనైయున్నాను. మీరెరుగుదుదు. మార్గంలో నుండి ముళ్ళను తీసివేయండి. స్త్రీ మరియు పురుషులు తిరిగి జన్మించితిమని చెప్పుకొనిన తరువాత, దేవుని వాక్యమును ఆయన బోధను వెంబడించనియెడల, అక్కడ వానిలో ఏదో పొరపాటు ఉన్నది. నేను ఒక నిమిషము స్త్రీలతో మాట్లాడగోరుచున్నాను. దేవుని వాక్యము ఒక స్త్రీ జుట్టు కురచగా కత్తిరించుటను, మరియు పొట్టి దుస్తులు ధరించుటను, వదులైన బట్టలు ధరించుట, అవినీతిగా కనబడు వస్త్రధారణను, ఖండించునని ఎరిగియుండి మరియు క్రైస్తవురాలుగా కనిపించు బట్టలు వేసుకొని, తన తలను బాగా పెరగనిచ్చుటకు చాలినంత సభ్యత కలిగియుండని యెడల, నీవు మోసగింపబడి ఉన్నావు. నీవు ఏమి కలిగియున్ననూ నేను లక్ష్యముంచను. ఎండిపోయిన ఒక ఆవు తోలుపై బఠానీలను కుమ్మరించినప్పుడు కలుగు శబ్దము వలె నీవు భాషలలో బాగా మాట్లాడియుండవచ్చు. ఈ భవనమంతయూ దద్దరిల్లేవరకూ, నీవు ఆత్మలో బాగా నాట్యము చేసి ఉండవచ్చు. దీనికి దానితో ఏ మాత్రము పనిలేదు. దేవుడు దానిని ఖండించుచుండగా, లోక ప్రేమ ఇంకనూ నీలో ఉన్నట్లు అది తెలుపుచున్నది! ఆయన చెప్పెను, "అది కాదు… ఒక స్త్రీ తన జుట్టును పొడవుగా ఉంచుకొనవలెను. మరియు ప్రకృతి తనకు తానే మనుష్యుడు పొట్టి తల కలిగియుండవలెనని బోధించుచున్నది, ఎందుకనగా దేవుడు మానవునికి పైగా ఉన్నాడు, మరియు మనుష్యుడు స్త్రీకి పైగా ఉన్నాడు." మరియు ఒక స్త్రీ తన తలను కత్తిరించినయెడల, ఆమె తన భర్తయైన తన తలను అవమానపరచుచున్నది. ఒక మనుష్యుడు, తన తలను పెరగనిచ్చిన యెడల, అప్పుడు అతడు తనకు శిరస్సు అయి ఉన్న క్రీస్తును అవమానపరచును, చూశారా.

MATT 7:22•

JOHN 1:1,14

 

76"మీ స్త్రీలను ఆధునిక సాధనములుగా వారంతటవారిని అలంకరించుకొననీయుడి," శుభ్రమైన స్త్రీవలె, చూడండి.

మరియు సామాన్య జ్ఞానము లేకుండా దానిని చేయుటకు మనము ఇలా చెప్పుదుము, "దేవునికి మహిమ! హల్లెలూయ! నేను భాషలలో మాట్లాడాను. హల్లెలూయ! దేవునికి మహిమ!" అక్కడ ఉన్న ఆత్మ పొరపాటులో ఉన్నదని అది చూపించుచున్నది. అది వాక్య స్వభావమైనయెడల, ప్రతీసారి, అది వాక్యమును అంగీకరించును. మరియు ఆ వాక్యము శరీరధారియైనది. మరియు ఆ వాక్యము నీలో ఉన్నయెడల, ఆయన వాక్యమును నమ్ముచూ ఆయన సంతానమై యుండి, దేవుని కుమారునిగా లేక కుమార్తెగా చేయును.

బాప్తిస్మమిచ్చుటకు ఆ పాత్ర ప్రభు యేసు నామమును నేను నమ్మను. హల్లెలూయ! నీవెంతగా విశధీకరించ ప్రయత్నించుచున్ననూ, నేను లక్ష్యముంచను, నేను నా పాస్టరును నమ్ముదును. అలాగే కానిమ్ము, అతడు నీ తండ్రియే. అయితే దేవుడు నీ తండ్రి అయినయెడల, నీవు దేవుని వాక్యము యొక్క వరుసలో నీవు ఉండగలవు.

ఉపదేశకుడు, "ఆ రోజున అనేకులు నా యొద్దకు వచ్చి ఇలా చెప్పుదురు, 'ప్రభువా, నేను నీ నామమున దయ్యములను వెళ్ళుగొట్టలేదా? [ఉపదేశకులు] నీ నామమున అద్భుతములు చేయలేదా? [పొలములో సువార్తికులు] అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపొండి," అక్రమ సంబంధమగు పిల్లలు. అది నిజము.

MARK 16:17

 

77నీవు దేవుని మూలముగా జన్మించినయెడల, లోక సంగతుల నుండి వేరుగా ఉండి, వాక్య జలములచే నీవు కడుగబడి, మరియు దేవుని నమ్ముదువు. నీవు చనిపోయావు. నీ స్వంత ఆలోచనకు చనిపోయావు. నీ స్వంత ఉద్దేశ్యములకు చనిపోయావు. దేవుని వాక్యమునకు తప్ప ఇతరమైన ప్రతిదానికి చనిపోతివి. మరియు అది నీలో జీవించుచూ, నీ ద్వారా మరల పనిచేయుచూ అది దేవుని వాక్యమైయుండెను, అని రుజువు చేయుచుండెను. నీవు అలా చెప్పుదువు, "సహోదరుడు బ్రెన్హాం, నేను లోకమునకు చనిపోయాను. నేను లోకమునకు చనిపోయాను." మరియు దేవుని వాక్యమును తిరస్కరించుదువా?

యేసు చెప్పెను, "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును." ఇప్పుడు మనము తిరిగి జన్మించుట అనగా ఏమిటో అనుదాని దగ్గరకు చేరుచున్నాము, చూశారా.

2TIM 3:5

 

78ఇంకనూ కోపముతో, ఇంకనూ నీచముగా, గర్వముగా ఉన్నావు. ఎవడో ఒకడు నీ గూర్చి ఏదైనా చెప్పినప్పుడు, ఉద్రేకపడి యుద్ధం చేయుటకు నీవు సరిగా సిద్ధమవుదువు. మరియు అప్పుడు, దేవుని ఆత్మ మూలముగా జన్మించితివా? కాదు. దేవుని ఆత్మ ఆ విధంగా చేయదు. కాదు. దేవుని ఆత్మ దీనత్వము, సాత్వీకము, మాధుర్యము, దీర్ఘశాంతము, ప్రేమ, దయ, క్షమాపణ, అది దేవుడే అయి ఉండి ప్రేమించుచూ, దయ చూపుచూ, క్షమించుచూ, అదియే దేవుని యొక్క ఆత్మ అయియున్నది. ఓ, అవును.

అయితే వారు ఆ సంఘ శాఖను పట్టుకొని, బాషలలో మాట్లాడి, ప్రవచించి అన్ని రకముల పనులు చేయుదురు. వారు అలా చేయుదురని యేసు చెప్పెను. "పైకి భక్తి గలవారివలె ఉండుట." ఆ సంఘ శాఖను పట్టుకొని ఉందురు, ఎందుకనగా అది వారి యొక తండ్రి. వారు సంఘ శాఖ యొక్క తండ్రి వలన జన్మించిరి. అయితే నీవు దేవుని మూలముగా జన్మించినయెడల, ఆయనే నీ తండ్రి. ఆయనే ఆ వాక్యమైయున్నాడు — వాక్యము. నీవు ఎన్ని అనుభూతులు పొందినను అదేమీ కాదు, మరియు నీవు క్రీస్తు యందు జీవించి, లోకమునకు చనిపోయేవరకు నీవు ఇంకనూ సాతాను బిడ్డవే. (వినండి, ఇప్పుడు త్వరగా.)

JOHN 5:24•

1COR 12:13•

GAL 3:27

 

79ఒక ప్రాణము, మంచిదైననూ లేక చెడ్డదైననూ మరణం వలన ఏ మార్పు ఉండదు. "ప్రాణము అనగానేమి?" అను ఈ ఒక్కదానిని విశధపరచగోరుచూ, దీనిపై ఒక వ్రాయబడిన లేఖనముల గుత్తిని, ఇక్కడ కలిగియున్నాను. ప్రాణము అనగానేమి? అది నీవే. నీవు ఒక ప్రాణము అయి యున్నావు - నీ లోపల వున్న భాగము. మరియు నీవు చనిపోయినప్పుడు లోపల ఉన్న ప్రాణము ఏ రూపములో ఉన్నదో అదే విధముగా అది వెళ్ళును. అది దాని అంతమునకు వెళ్ళును. ఎంత దానికి ఎక్కువ నీవు చేసియున్నప్పటికిని ఏమీ జరుగదు. దానిని నీవు పైకి లాగలేవు. ఆ ప్రాణము ఇక్కడ తిరిగి జన్మించి, మార్పును పొందవలసియున్నది.

"సహోదరుడా బ్రెన్హాం, పరిశుద్ధాత్ముని గూర్చి ఏమిటి?" అని నీవు చెప్పుదువు?

పరిశుద్ధాత్మ క్రీస్తు శరీరములోనికి, సేవ కొరకు నీకు బాప్తిస్మమిచ్చును, అయితే నీవు నిత్యజీవమును నమ్మవలెను. "నా మాటలు విని, నాయందు విశ్వాసముంచువాడు, నిత్యజీవముగల వాడు," చూశారా. అప్పుడు ఆ శరీరములోనికి, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందితివి, ఎందుకనగా వరముల ప్రత్యక్షత, మొదలగువాని కొరకు, అయితే నీవు నిత్యజీవమును నమ్మవలెను. నమ్మినవానికి నిత్యజీవము ఉండును. మరియు నీవు నమ్మినప్పుడు చనిపోతివి మరియు జన్మించితివి, తిరిగి జన్మించితివి, ఒక నూతన జీవివి. మంచిది.

80ప్రాణము, ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, మంచి లేక చెడు మరణానికి దానితో ఏమీ పని లేదు. మరణం కేవలం దానియొక్క అంతమునకు తీసుకొనిపోవును. నీవు దానిని విన్నావా? మరియు ఇంకను నీవు లోకాన్ని పొందియున్నయెడల, మరియు లోక ప్రేమ అందులో ఉన్నది, అది నీతో చనిపోవును, కారణం లోకము తప్పక చావాలి. దేవుడు లోకమును శిక్షించెను (ఆ లోక క్రమమును). దేవుడు దానిని శిక్షించెను మరియు అది చావవలెను; మరియు ఆ లోకము నీలో ఉన్నయెడల, నీవా లోకముతో చనిపోవుదువు. మై, అది ఎలా స్పష్టంగా ఉన్నదో నేను చూడలేదు, చూశారా. మరియు అది లోక సంబంధమైనదయితే, అది నిలిచి లోకముతో పాటు నశించును. అది దేవుని సంబంధమైనదైతే, అది విద్య కలిగిననూ, లేకపోయిననూ, అది దేవునితో నివసించును. చదువు కలిగిననూ, చదువు లేనివాడయిననూ, ఆ లోకం ఇంకా అక్కడ ఉన్నయెడల, అది తప్పక చావాలి. మరియు ఆ లోకము నీ ప్రాణములో ఉన్నయెడల మరియు నీ కోరిక ఆ లోక వస్తువులలో ఉన్నది. నీవు ఆ లోకములో నశించెదవు. అది స్పష్టముగా ఉన్నది, లేదా? అది అర్ధము కావలి. చనిపోయిన ఈ లోకమునకు నీవు ఒక భాగము, మరియు లోకము చనిపోయినట్లు, నీవు ఈ లోకముతో చనిపోయియున్నావు.

MATT 6:24•

LUKE 16:13•

JOHN 5:24•

COL 3:2,3•

JAS 4:4•

1JN 2:15

 

81అయితే నీవు తిరిగి జన్మించినయెడల, నీవు క్రీస్తుతో జీవించితివి, మరియు నీ ప్రేమలు ఈ లోక వస్తువులపైగాక, పై సంబంధమైనవై ఉన్నవి. అయితే దేవుని అత్మమూలముగా నీవు జన్మించినయెడల, నీవు దేవునిలో ఒక భాగమైయ్యావు. మరియు ఆయనతో నిత్యజీవంతో ఉందువు. అప్పుడు నీవు తిరిగి జన్మించినప్పుడు, చావు నిన్ను ముట్టదు. నీవు నిత్యజీవము పొందినవాడవు. నీవు ఒక కాలసృష్టి నుండి నిత్యజీవార్ధ సృష్టిగా నీవు మార్పునొందితివి. నేను నిత్యత్వమును గూర్చి మాట్లాడుచున్నాను. నిత్యమరణం నుండి నిత్యజీవమునకు, నీవు లోకానికి చెందినవాడవైనచో, నీవు ఇక్కడే దానితో చనిపోవుదువు. నీవు ప్రేమించిన… యోహాను సువార్తలో బైబిలు చెప్పెను, "నీవు లోకమును లేక లోక వస్తువులనైనను ప్రేమించినయెడల, అది అలా ఉన్నది, ఎందుకనగా దేవుని ప్రేమ నీలో లేదు." నీవు లోకమును ప్రేమించలేవు. మరియు యేసు చెప్పెను, "నీవు దేవునిని మరియు సిరిని ప్రేమించలేవు. సిరి అనగా లోకము అయి ఉన్నది. నీవు లోకమును మరియు దేవునిని ఒకే సమయంలో ప్రేమించలేవు. "మరియు నన్ను ప్రేమించుచున్నానని చెప్పువాడు, నా ఆజ్ఞలను పాటించవలెను." [అది బైబిలు], అతడు ఒక అబద్ధికుడు, మరియు ఆ సత్యము వానిలో ఉండదు." అక్కడే నీవు ఉన్నావు.

82ఓ బ్రెన్హాం టాబర్నికల్, మరియు మంచి ప్రజలైన మీరందరూ ఆ జాబితాను తీసుకొనండి! ఇది క్రొత్త సంవత్సరం ప్రారంభించుదం, మనలో నుండి లోక వస్తువులను బయటకు తీయడానికి ఏదో చేయుదము. అది ఇంకా అక్కడే ఉన్నయెడల, అది విడిచిపెట్టుదము. అవునయ్యా.

83మంచిది, ఈనాటి ప్రజలు (నేను తొందరపడవలసియున్నది), ఈనాటి ప్రజలు అన్నిరకములైన ఆత్మలు తీసికొనుచున్నారు. వారు వెళ్ళి ఒక సంఘ ఆత్మను తీసుకొనుచున్నారు. "తిరిగి జన్మించిన దేవుని ఆత్మలు" అని తమంత తామే పిలుచుకొనుచున్న ఆత్మలు కూడా తీసుకొనుచున్నారు మరియు వారు సత్యమైయున్న దేవుని వాక్యమును కాదనుచున్నారు. దేవుని ఆత్మ తన స్వంత మాటను కాదనునని నీవు ఊహించి యుంటివా? రోమన్ కాథలిక్ ప్రజలైన మీకు, నా ఉద్దేశ్యము, బైబిలుకు వ్యతిరేకమయినది, "ప్రతి వారు తప్పక ఇదే నమ్మాలి," అనే మొండి భావనను తీసికొని, దేవుని వాక్యమును కాదని, దేవుని ఆత్మ ద్వారా జన్మించితిమని నిజంగా చెప్పుచున్నారా? మరియు దేవుని ఆత్మ మీలో ఉన్నట్లుగా చెప్పుచున్నారా? బైబిలు వ్రాసిన ఆ ఆత్మ దానిని కాదనునా? నేను నిలబడి, అది అలా ఉండునని ఏదో చెప్పుచూ, దానికి వ్యతిరేఖముగా అబద్ధమాడుచున్నాను. దేవుడు ఏదైనా చెప్పి, అప్పుడు వెనుదిరిగి మరియు దానిగూర్చి అబద్ధమాడునా? "అబద్ధమాడుట దేవునికి అసాధ్యము," అని బైబిలు చెప్పెను. "కారణం సమస్త సత్యమునకు ఆయనే ఊటయై ఉన్నాడు."

84మెథడిస్టు, బాప్టిస్టులయిన మీరు, "తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలలో," బిరుదులలోనికి బాప్తిస్మం పొందారు. అయితే ఆ బేధమును గమనించితిరా? మీరు బైబిలును పొందారు. మీరు కేవలం సంఘంలో చేరి, కరచాలనం చేయుదురా? మీరు ఒకరి నుండి మరొకరు సిఫారసు పత్రికలు తీసుకొనుచూ, దేవుని ఆత్మ వలన తిరిగి జన్మించినావని చెప్పుకొనుచున్నారా? తిరిగి జన్మించిన క్రైస్తవునిగా నీకు నీవే పిలుచుకొనుచూ, అప్పుడు దేవుని వాక్యము వైపు చూస్తూ దానిని నీవు ఎలా చేయగలుగుచున్నావు? సంఘానికి, మతాచారములకు, లోకమునకు, ఇతరమైన ప్రతి దానికి చచ్చినవాడవు, అయితే దేవుడు మరియు దేవుడే ఆ వాక్యమైయుండెను! అక్కడే నీవు ఉన్నావు. మనము చూద్దాము. వారు ప్రతివిధమైన ఆత్మ తీసికొనిరి. ఓ, వారు సంఘ ఆత్మలను పొందిరి. వారు అన్ని రకముల ఆత్మలను పొందిరి. ఇప్పుడు శ్రద్దగా వినండి.

AMOS 3:7

 

85ప్రవక్తలు - దేవుని వాక్యము ప్రవక్తలు దగ్గరకు వచ్చును. బైబిలు ఆ విధముగా చెప్పెను. (ఇప్పుడు, ముగింపులో, ఇక్కడ నేను రెండు కంటె కొన్ని వివరణలు పొందాను, నేను ముందుకు వెళ్ళుచున్నాను, మరియు అప్పుడు నేను ఆపుచేయుదును.) దేవుని వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. ప్రవక్తల దగ్గరకు ఏమి వచ్చును? సంఘ వాక్యము ప్రవక్తల దగ్గరకు వచ్చునా? మత విశ్వాసము యొక్క వాక్యము ప్రవక్త దగ్గరకు వచ్చునా? ప్రభువు వాక్యము! అది ఏమైయున్నది? ఆ ప్రవక్త దేవుని వాక్యము బయలుపరిచెను, చూశారా. వారు ప్రవక్తలు, నిజ ప్రవక్తలు. ఇప్పుడు, మనము అబద్ధ ప్రవక్తలను కలిగియున్నాము, మనము ఒక నిమిషంలో వారిని గూర్చి చెప్పుకుంటాము. అయితే నిజ ప్రవక్త - నిజవాక్యము నిజప్రవక్త యొద్దకు వచ్చును. అతడు మరో విధంగా అయి ఉండడు. ఇప్పుడు ఒక మతవిశ్వాసం ప్రవక్త దగ్గరకు రాదు, ఒక శాఖ ప్రవక్త దగ్గరకు రాదు. లేదు. అయితే ప్రభువు వాక్యము ప్రవక్త దగ్గరకు వచ్చును. మరియు అతడు దానిని ప్రజలకు బయలుపరుచును. నిజ ప్రవక్త - నిజవాక్యమును కలిగియుండెను.

AMOS 3:7•

ROM 3:4

 

86నిజ ప్రవక్తను ఎలా పరీక్షించగలవు? అతడు ఎప్పుడు నిజవాక్యము పొందుతాడో అప్పుడు. అప్పుడు అది ఒక నిజవాక్యము కానిచో అది ఒక అబద్ధమయినదిగా ఉండును. అది వాక్యమునకు వేరైనది చెప్పినచో మరియు ఈ వాక్యము దేవుని వాక్యము, ప్రతి ప్రవక్త మాట అబద్ధము మరియు దేవుని మాట సత్యముగా ఉండును. మరియు ఆ వాక్యము ప్రవక్త నుండి వచ్చినట్లైతే, అది దేవుని వాక్యమై యుండును. అప్పుడు అతడు నిజప్రవక్త, ఏలయనగా వాక్యము ప్రవక్తల దగ్గరకు వచ్చును, నిజ ప్రవక్తలు మనము ఎల్లప్పుడూ అబద్ధికులను కలిగియున్నాము. నిజ ప్రవక్తలు, నిజ వాక్యము. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ వాక్యము — "మన మతాచారములు మన సంఘ శాఖలు, ఇందులో చేరుట, ఇది చెప్పుట, ఇది నమ్ముట, ఇది చేయుట."

AMOS 3:7

 

87అయితే నిజ వాక్యము, నిజ ప్రవక్త దగ్గరకు వచ్చును. మరియు అతడు నీకు నిజ వాక్యము చెప్పును. నీవు నిజ వాక్యమును వెంబడించెదవు, నీవు వాక్యము యొక్క నిజ అనుభవం పొందెదవు, ఏలయనగా వాక్యము నీలో శరీరం దాల్చి నీవు దేవుని కుమారుడవగుదువు. మరియు దేవుని వాక్యము, దేవుని నుండి నీలోనికి దూసికొనిపోవును, ఎందుకనగా నీవు ఆయన స్వభావానివి. ఆయన ఆత్మనీలో ఉన్నది. మరియు నీవు దేవుని క్రియలు చేయుదువు. హల్లెలూయ! బైబిలు ఆ విధముగా చెప్పెను. ఓ, మై!

1TIM 3:5

 

88అబద్ధ ప్రవక్తలు, అబద్ధ వాక్యము తెచ్చుదురు. వారేమి చేయుదురు? చెడ్డవైన అనుభూతులు కలిగియుందురు. అబద్ధ ప్రవక్తలు అబద్ధముగా ఉండుటకు చాలినంత నిజవాక్యము పాటింతురు. అది చేయకుండా వారు ఉపయోగింపబడిరి, అయితే బైబిలు ఇలా చెప్పెను… నీవు కోరినయెడల II తిమోతి 3వ అధ్యాయంలో లేఖనం చూడు. అబద్ధంగా ఉండుటకు అబద్ధ ప్రవక్తలు చాలినంత నిజ వాక్యము కలిగియుందురు, ఎందుకనగా వారు, "పైకి భక్తిగలవారివలె," ఉందురని బైబిలు చెప్పెను. పైకి భక్తిగలవారివలె ఉండి, దాని శక్తిని ఆశ్రయించనివారు." ఆ శక్తి ఏమిటి? నిన్ను సరియైనవానిగా చేయుటకు, వేరుగా యుండుటకు దేవుని సేవించి, బైబిలు ఖండించు నాట్యములకు, లోక సంగతులకు వెళ్ళక, వెంట్రుకలు కత్తిరించక ఉండవలెను. అబద్ధ ప్రవక్తలు అది ఏమి బేధము కలుగచేయదు, అని చెప్పుదురు.

JOHN 3:12

 

89ఎవరో ఈ మధ్యనే చెప్పిరి (ముందుగా ఇక్కడ అది పేర్కొన్నానని నమ్ముచున్నాను, నాకు తెలియదు), నాతో చెప్పెను, "నీవు ఈ లోకములో ఆ స్త్రీ మరియు పురుషులను ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టుటలేదు." వారు నిన్ను ఒక ప్రవక్తగా నమ్ముచున్నారు.

"నేను కాదని చెప్పితిని."

"అయితే ప్రజలు ఆ విధముగా నమ్ముచున్నారు. ఆ దర్శనము ఎలా పొంది, దేవుని క్రియలు ఆ విధంగా ఎలా చేయవలెనో ఎందుకు నీవు వారికి బోధించకూడదు?"

"వారికి వారి ఎ, బి, సి (అ, ఆ) లు రానిదే వారికేలాగు భీజగణితమును ( algebra) బోధించగలనని" నేను చెప్పితిని. ఎలా ఒక పిల్లవానిని నర్సరీ స్కూలు నుండి తీసికొని వానికి ఈ రోజు కాలేజి విద్య ఎలా బోధించగలం? ఎలా చదరపు పరిమాణపు కొలతను బోధించగలవు. అ, ఆ లు రానిదే వానికి అది ఎలా బోధించగలను. ఎ.బి.సి.లు అనగా అర్థం ఏమిటో మీరెరుగుదురా క్రీస్తును ఎల్లప్పుడూ నమ్మవలెను. (Always Believe Christ), అది నిజము. సంఘాన్ని నమ్మవద్దు. మతాచారమును నమ్మవద్దు. వారి సిద్దాంతమును నమ్మవద్దు. క్రీస్తును నమ్ముము! ఎందుకు? "ఆయనను ఎరుగుట, ఆయనను ఎరుగుటయే జీవము." అది సరియేనా? మతాచారము తెలిసికొనుట కాదు. అతడు ఏ మతాచారము పొందలేదు. ఆయన వాక్యము తెలిసికొనుట కూడా కాదు. ఆయన వాక్యము తెలిసికొనుట కాదు, నీవాయనను ఎరుగుటకు, నూతన జన్మలో ఆయనను నీ రక్షకునిగా తెలిసికొనవలెను. యేసు నికోదేముతో చెప్పినట్లు, "నేను మీతో చెప్పిన భూసంబంధమైన సంగతులు నమ్మనియెడల, పరలోక సంగతులను మీరు ఎలా నమ్ముదురు? వారు భూసంబంధమైన సంగతులను కూడా నమ్మునప్పుడు - ఆత్మలో ప్రవేశించి, తెలిసికొనుచూ, మరియు దర్శనములు చూస్తూ, మరియు అటువంటి సంగతులు — అలా క్రమమైన ఒక పాఠశాలలో ఎలా మీరు ఆత్మీయ సంగతులు నమ్మనైయున్నారు? వస్త్రములు సరిగా వేసికొనవలెనని కూడా నమ్మలేవు, పొగ త్రాగుట మానవలెనని కూడా నమ్మరు మరియు వారు అబద్ధమాడుట మానురు, వారి మానసిక స్వభావం ఒక ప్రక్కకు పెట్టి, ఆ సంగతులన్నియు, అక్కడ ఈ కార్యములు చేయుదురు, తీవ్రమైన శరీరేచ్చలను విడిచిపెట్టవలెను. ఈ సంగతులన్నియు ఇంకనూ వారిమీద నుండి ఊగిసలాడుచుండగా, ఆత్మలో ప్రవేశించుటకు, ఆ ప్రజలకు ఏ విధంగా నీవు బోధించగలవు? అవును. ఓ, మై.

MATT 7:16,20

 

90అబద్ధ ప్రవక్తలు - అబద్ధ వాక్యములు, మతాచారములు, శాఖలు అనుభూతులు కలిగియుందురు. "ఓ, దేవునికి స్తుతి! నీవు చేయవలసినది ఏమనగా… నీవు ఏలియా వస్త్రము ధరించగోరుచున్నావా? దేవునికి మహిమ! నీవు చేయవలసినది ఏ విషయాన్ని గూర్చి ఆలోచించక కేవలం నీ మనసు ఖాళీగా ఉంచడమే! మరియు 'ఓ, నన్ను నింపుము, నన్ను నింపుము,'" నన్ను నింపుము అని చెప్పెదవు. దయ్యము నిశ్చయముగా దానిని చేయును. మరియు దానిని నమ్ముకొని యుందువా? "ఓ, బ్రెన్హాం సహోదరుడా, అది నా మీద నుండి దొర్లి పోయినది. దానిని నేను అనుభవించాను. ఓ, దేవునికి మహిమ, హల్లెలూయ! (ఆ విధముగా పైకి క్రిందకు ఎగురుచూ), ఓ, నేను దానిని పొందాను అని చెప్పి, మరియు నీకు నచ్చిన విధంగా జీవించుదువా?

"వారి ఫలముల వలన వారిని తెలిసికొందువు," చూడండి. అనుభూతులు కాదు.

"ఓ, సహోదరుడా, నీవు పరిశుద్ధాత్మను పొందగోరుచున్నావా? కేవలం బలిపీఠం దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పు, "మహిమ, మహిమ, మహిమ, మహిమ, మహిమ, అలా భాషలలో మాట్లాడే వరకు." హ-హ్హ. మరల బయటకు వెళ్ళి అబద్ధం, దొంగతనంతో, ఏవిధమైన జీవితమయిననూ జీవించుదురా? వారు నీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుట గూర్చి చెప్పినప్పుడు, "అది మూఢభక్తి, నా సంఘము మరో విధంగా బోధించును!" అని చెప్పుచూ, వాక్యపు నీరు చేత కడుగబడి మరియు తిరిగి జన్మించితినని చెప్పుదువా? ఎక్కడో ఏదో పొరపాటు ఉన్నది, చూడండి.

2PET 1:20

 

91ఇక్కడ వ్రాయబడిన విధముగా ప్రతి మాటను నమ్మగలవు. మనకు అవసరం లేదు… మరియు బైబిలు ఇట్లు చెప్పెను, "దానికి ఇతర అనువాదం అక్కర లేదు." దేవుడు దానిని అనువదించెను, మరియు అది ఉన్న విధముగానే ఉన్నది, ఇక్కడ ఆయన వాక్యము. బైబిల్ చెప్పలేదా, రెండవ పేతురులో అని నమ్ముచున్నాను, "బైబిలుకు ఇతర అనువాదం అక్కరలేదు." నిశ్చయముగా వద్దు. ఇతరమైనది ఏమీ అవసరము లేదు. కేవలం ఏ అర్థము కలిగినదో సరిగా ఆ పద్ధతిలో అలాగే వ్రాయబడెను. ఇక్కడ వ్రాయబడిన విధముగా అది విడిచిపెట్టుము, అది అదే ఫలితములను తీసుకొని వచ్చును.

MATT 7:16,20

 

92ఇప్పుడు…

అబద్ధ బోధకులు, అబద్ధపు పుట్టుకలు తీసుకొని వచ్చెదరు. నిజ ప్రవక్తలు వాక్యమును, వాక్యపుట్టుకను, క్రీస్తును తీసుకొని వచ్చెదరు. అబద్ధ ప్రవక్తలు చెడు జన్మను తీసుకొని వచ్చెదరు, సంఘ పుట్టుకను, మతాచారపు పుట్టుకను, శాఖా పుట్టుకను తీసుకొని వచ్చెదరు. మరియు ఇక్కడ ఉన్న పెంతుకోస్తు సహోదరులారా, అబద్దమైనది… లేక అనుభూతులతో కూడినది మరియు ఒక మనిషి పరిశుద్ధాత్మ పొందినట్లు చెప్పుదురు, కారణం అతడు భాషలతో మాట్లాడుచున్నాడు. నేను దయ్యాలు భాషలలో మాట్లాడి, పెన్సిలు క్రింద ఉంచినప్పుడు మరియు తెలియని భాషలతో వ్రాయుట చూశాను. అది అర్థం లేని విషయం. చూడు, అది ఒక జీవముగా ఉండవలసియున్నది. "వారి ఫలముల ద్వారా వారిని తెలిసికొందువు." బ్రెన్హాం సోదరుడా, భాషలతో మాట్లాడుట నీవు నమ్ముచున్నావా? అవునయ్యా." "కేకలు వేయుటను నీవు నమ్ముచున్నావా? అవునయ్యా." నేను ఒక క్రైస్తవునిగా అది నమ్ముదును. నేను దేవుని వాక్యమును నమ్ముదును. అయితే దాని పైకి లేపుటకు అక్కడ జీవము లేనియెడల…!

93ఆడంబరముతో కూడిన ఒక ప్రదర్శనతో, అక్కడ బయటకు వెళ్ళి "దేవునికి మహిమ! హల్లెలూయ!" అనుచూ, అప్పుడు అది క్రీస్తేనని నాకు చెప్పుదువా? క్రీస్తు విధేయత, సాత్వికము, మరియు సాధుత్వము అయి ఉన్నాడు. ఒక పట్టణములోనికి వెళ్ళిన, కేవలం నీవు భుజములను నిమరవలసి యుందువని నీవు ఎరుగుదువు. చొక్కాలో ఒక ముడత లేకుండా మరియు ప్రతిదీ సరిగా ఉండవలెను; నీవు చాలా మంచిది కలిగియుండవలసియున్నావు, అది కాకుండా నీవెంత మాత్రమూ రావు; ఒక కూటము ఏర్పాటుకు ఎక్కువ డబ్బుకు అభయం కావలెను. నీవు ఒక సమావేశము కలిగియుండవు. ఓ, ఓ, ఓ, ఓ, మై! అన్ని శాఖలు, వారు నీ వెనుక తట్టుదురు. నీవు వాక్యమై ఉండినందున నీ వెనుక తట్టువాడు, అక్కడ వారిలో ఒక్కడూ లేడు. అది నిజము.

ROM 8:19

 

94అబద్ధ ప్రవక్తలు పైకి భక్తిగలవారివలె ఉండుటకు చాలినంత సత్యాన్ని పాటింతురు. వినండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏదో చెప్పుబోతున్నాను. నేను మిమ్మును వినవలెనని కోరుతున్నాను. ఆ విధమైన అబద్ధ భావనలు (నీవు అబద్ధ భావన అంటే ఏమిటో ఎదుగుదువా?) మిలియనుల మంది ప్రజలను అబద్ధ పుట్టుకకు నడిపించుటయే. అబద్ద బోధకులు ప్రజలను ఒక అనుభూతి నమ్మునట్లు నడిపించుదురు. "కారణం ఒకేసారి తటాలున పైకి ఎగిరి దానిని పొందావు. ఓ, ఎందుకనగా ఒక నిజ విచిత్ర భావన నీ మీద నుండి పోయినది. నీవు నీ ముందుగా వెలుగును చూచితివి. గ్రుడ్డివాడిపై సంశయించితివి. నీ మీద ఆ ఏలీయా వస్త్రం ఉంచిరి. అది సరియైనది నీవు దానిని పొందితివి. ఓ, నీవేమైయున్నావో నీవెరుగుదువా? నీవు ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుడివి. "నీవు ఎక్కడ ఉన్నావో కనుగొంటివా? ఓడింపబడితివి. అది నిజము. "దేవునికి మహిమ! నేను ఒక రాత్రి వెళ్ళాను, ఒక కల కన్నాను!" ఓ, అవును. "ఓ, నేను ఇది అది చూశాను." అవును. "నీవు కలలను నమ్ముటలేదా?" అవునయ్యా, నేను నిశ్చయంగా నమ్ముదును. అయితే ఆ కల దేవుని వాక్యముతో ఏకీభవించనియెడల, అప్పుడు అది పొరపాటు. ఇక్కడ నిలిచి ఉన్నదే సత్యమైనది. దీనిలో నిలిచి ఉండండి. అవునయ్యా. అబద్ద పుట్టుకకు మిలియనుల మందిని నడిపించుదురు. కాస్త ఆలోచించండి!

95నాతో ఒక కాగితం ముక్కను తీసుకు వెళ్ళుచున్నాను. సమస్త గ్రీకు అర్థడాక్స్ మరియు అర్థడాక్స్ చెందిన ప్రపంచ సంఘ తండ్రి మరియు అర్థడాక్స్ సంఘాలు పోప్ జాన్ 22తో మాట్లాడెను. మరియు అతడు ఇట్లు చెప్పెను, "ఈ తరములో దానిని మనం చూడకపోవచ్చును, అయితే ఆ గొప్ప సహోదరత్వం ప్రొటెస్టెంటులు మరియు క్యాతలిక్ లు రెండూ కలసి వచ్చుట ద్వారా బయటకు వచ్చుచున్నది."

నేను తలంచాను, "దేవునికి స్తోత్రం!" ఎవరో ఒకరు దానిని పత్రిక నుండి కత్తిరించి, ఆ విధంగా నాకు రాశారు. సహోదరుడు నార్మన్ లేక ఎవరో ఒకరని నేను నమ్ముచున్నాను. "సహోదరుడా బ్రెన్హాం అది మనం అనుకున్న దానికంటే ఆలస్యం," అని చెప్పెను. ఈ రోజు చూడుము, యుద్ధపు మంత్రి మరియు ఓ, చాలా వివిధ కార్యములు మరియు అధ్యక్షులు మరియు ఈ దేశమంతా క్యాతలిక్ స్వాధీనపరచుకొనిరి.

వినండి.

96నీవు చెప్పుదువు, "సరే, వారు క్రైస్తవులు అయి ఉన్నారు." క్రైస్తవులుగా ఉండుటకు క్రీస్తువలె వుండి, ఆయన ఆత్మ కలిగియుండవలెను. అది సరియైనదా? ఇక్కడ మొరటుగా కనిపించు ఏదో ఉన్నది, అయితే అది నేను చెప్పగోరుచున్నాను. నీవు ఒక పందిని, ఒక గొర్రెగా పిలిచిన యెడల, అది వానిని ఒక గొర్రెగా చేయనా? ఎందుకనగా నీవు ఇలా చెప్పినయెడల, "పంది, నీవు పందిగా ఉండుట వలన నేను విసిగి అలసిపోయాను. నేను ఒక గొర్రెపిల్ల కావాలని కోరుచున్నాను. కావున నిన్ను ఇక్కడ బయటకు తీసుకెళ్ళి, నిన్ను మెత్తం శుభ్రంగా తొమి, నేను నీ పళ్ళు శుభ్రంగా కడిగి మరియు నేను నీ జుట్టు సరిగా దువ్వనై ఉన్నాను. నేను నిన్ను ఒక చిన్న గొర్రెపిల్లగా చేయుచున్నాను. నేను ఒక చిన్న పింకు రిబ్బను నీ మెడకు కట్టి, నీవు పందిగా ఉండుటకు బదులుగా ఒక చిన్న గొర్రెపిల్లగా ఉండనైయున్నావు." నీవు ఇటుగా వచ్చి అందువు, "గొర్రెపిల్లా, గొర్రెపిల్లా, గొర్రెపిల్లా," అయిననూ వాడు ఇలా అనుచూ వెళ్ళెను. "హూయింక్, హూయింక్" దానిని పందుల గుడిసెల లోనికి మరల్చిన, అతడు తినగలిగినంత పొట్టును తినును. సరియే! మరియు వాని మీద నీటిని జల్లుట కాదు. అతనిని నీటిలో ఉంచుట కాదు, అది ఒక చావు మరియు ఒక పుట్టుక. అవునయ్యా. నేను నిన్ను, "అల్ఫాల్ఫా" తోనే కాని మరి దేనితోను పోషించుట లేదు. నేను నిన్ను గొర్రె ఆహారంతో పోషించబోవుచున్నాను, అని చెప్పుదువు. అతనిని అల్ఫాల్ఫా లతో పోషించినప్పటికీ, అతడు ఇంకా పందియే. అంతా అదే. అది నిజమేనా? నిశ్చయంగా అది సరియైనది. ఎందుకు, నిశ్చయంగా అతడు ఒక పందియమై ఉన్నాడు, ఎందుకనగా అతని స్వభావం ఒక పంది అని చూపించుచున్నది.

1JN 2:15

 

97నీవు లోకమును గాని లోక సంగతులను గాని ప్రేమించినయెడల, నీవు ఇంకా పందిపై ఉన్నావు. అది సరియైనది. నీ ప్రాణము రూపాంతరం పొందుటకు, అది దేవుని శక్తిని తీసుకోవలసియున్నది. పందిగా చావు, నీ పంది అలవాటు బలిపీఠంపై పెట్టుము. నీ యంతట నీవే అక్కడ పెట్టుకొనుము. మరియు దేవుని అర్పణగా ఉండు… లేక, తీర్పు అగ్ని క్రిందకు వచ్చి, ఒక పందిగా నిన్ను దహించును. మరియు ఒక గొర్రెపిల్లగా నిన్ను పుట్టించును. అప్పుడు నీవు ఒక మురికైనది తినవు. నీవు తినలేవు, నీ జీర్ణవ్యవస్థ దానిని జీర్ణించుకొనలేదు. నీవు సరిగా లేవు. అది నిశ్చయంగా పంది అని చెప్పుటకు అలా చేయదు… లేక, అతను ఒక గొర్రెపిల్ల అని చెప్పుటకు అతనిని గొర్రెపిల్లగా చేయలేదు.

JOHN 3:27

 

98కాబట్టి ఒక వ్యక్తి మత విశ్వాసం లేక కొద్ది అనుభూతి వలన ఒక క్రైస్తవునిగా పిలువబడెను… నీవు చెప్పుదువు, "బ్రెన్హాం సోదరుడా, దేవునికి మహిమ, నేను ఆ రాత్రంతా నాట్యం చేసాను. నేను భాషలలో మాట్లాడాను. ఓ, మై, బ్రెన్హాం సోదరుడా!" అని నీవు చెప్పుదువు. నేను ఇప్పుడు పెంతుకోస్తు వారితో మాట్లాడుచున్నాను. "నేను ఆత్మలో నాట్యం చేసాను. ఓ, నేను అనుభూతులు అలాంటి ప్రతి విధమైనది కలిగియున్నాను. అయితే నేను ఇప్పుడు నీకు సరియైనది చెప్పుదును, అక్కడ ఉన్న యేసు నామ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు." ఇటు రమ్ము, పంది. నీవు ఇంకా పందివే. అంతే.

"నా గొర్రెలు నా స్వరము వినును!" నేనిట్లు అడుగుచున్నాను, "అయితే చూడు, బైబిలులో ఎక్కడైనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకొనినట్లు ఒక స్థలమును చూపించండి."

"అదేమి చేసినను నేను లెక్క చేయను, హల్లెలూయ, ఆ పురాతన యేసు మాత్రమే సంగతి గూర్చి నాకేమి అక్కరలేదు." యేసు మాత్రమే సంగతిని గూర్చి ఏదైనా ఎవరు చెప్పిరి? నేను బైబిలు గూర్చి మాట్లాడుచున్నాను. యేసు మాత్రమే అనునది ఒక మతాచారముల గుంపు మరియు ఒక శాఖల గుంపు. ఒకరు మరొకరిని మరొక విధంగా పిలువలేరు, కారణం వారిద్దరూ అందులోనే ఉన్నారు.

అయితే నేను అసలైన, దేవుని ఆత్మ ద్వారా జన్మించిన నూటికి నూరుపాళ్ళు క్రైస్తవులను గూర్చి మాట్లాడబోవుచున్నాను. మరియు వారి జీవితాలలోని పరలోక ఆశీర్వాదముల గూర్చి నేను మాట్లాడబోవునది అదే. నీవు ఒక మెథడిస్టువై ఉండి, అది పొందినయెడల, ఆమెన్! నీవు చేయవలసినది వాక్యమును చూపించుటయే. బాతు నీళ్ళలోనికి వెళ్ళినట్లుగా, నీవు దానిని వెంబడించ గలవు. చూడండి. అది నిజము.

ISA 28:8•

2PET 2:22

 

99నేటి ప్రజలు సులభమైన దారులు కోరుచున్నారు. వారు కోరుటలేదు… వారు దానిని కేవలం ఒక నిమిషంలో పొందితిరని తలంచుచున్నారు. "దేవునికి మహిమ!" అది ఏమిటై ఉన్నది? వారు చేయుచున్నది ఏమిటి? ఈ రాత్రి వారు… వారు ఆవల బయట ఎక్కడో దూరాన ఉన్నారు… ఇక్కడ ఉన్న కొందరి వలె ఒక విధమగు జనులను కలిగియున్నారు. నేను వారి పేర్లను పిలుచుదును, కాని నేను దానిని చేయను ఏలయనగా ఇది టేపు పై ఉన్నది, అయితే ఈ రాత్రి చేతిలో వీణ పట్టుకొని రాత్రి క్లబ్బులో ఉండి, వాయించుచు మరియు రేపు ఉదయం ఎక్కడో ఒక సంఘములో నిలబడి, అదే వీణను వాయించుదురు. రోత! యెషయా 20వ అధ్యాయములో బైబిలు ఇలా చెప్పెను, "బల్లలన్నియూ వాంతితో నిండియున్నవి. ఒక కుక్క తిరిగి వాంతికి మరియు పంది తిరిగి బురదకు వెళ్ళినట్లు వారు చేయుదురు." ఎందుకు? వారు ఇంకా కుక్కలు లేక పందులే! వారిని అలా వాంతికి మరియు బురదకు తిరిగి వచ్చునట్లు తయారు చేయునది అదే. వారు తిరిగి జన్మించలేదు. వారు తిరిగి జన్మించినయెడల, వారు నూతన సృష్టియే!

100అది ఏమిటో నీవు ఎరుగుదువా? నీవు ఎంతగా ప్రయత్నించినా ఏమియూ కాదు… కాకియే. ఒక పావురముకు ఉన్న ఒలీవ రంగుగా రంగువేసినను, ఒక పావురము వలెనే బూడిద రంగుగా, తెల్లగా మొత్తం రంగు వేసినను, అతడు ఇంకనూ లోపలి భాగంలో కాకియై ఉండును, చూడండి. అతడు ఇంకనూ తల తిరుగునంత అసహ్యమైన వాసనతో ఆ రాబందు, చెత్త, మురికి శుభ్రము చేయు పాకివానివలె కాకి వలే భూమి మీద చచ్చిన వాటిని తినును. అది నిజము. అది ఏమిటో నీవు తెలుసుకొంటివా? ఒక పావురం స్నానం చేయనక్కరలేదు. ఓ, హల్లేలూయ! ఒక పావురం శరీరం, ఎందుకనగా అది ఒక పావురము, తన ఈకెల ద్వారా అది నూనెను పొంది, ఎల్లకాలము దానిని శుభ్రంగానే ఉంచును, ఎందుకనగా అది లోపల నుండి బయటకు వచ్చును. ఓ! ఎందుకు? ఆ రాబందు ఇలా చెప్పెను, "నేను కూడా! వానిపై కొంత శుద్ధజలమును ఉంచుదును. సోదరుడా, అది దానికి సరిపోవును." వద్దు, అది పనిచేయదు. అది లోపల నుండి బయటకు రావలసియున్నది, బయట నుండి లోపలకు కాదు. అది ఒక పుట్టుక. "దేవుడు ఆశీర్వదించును, నీవలె నేను సంఘముకు వెళ్ళుచున్నాను. హల్లెలూయ, నా సంఘము, నీ సంఘము అంత మంచిది. హల్లేలూయ, మేము కేల్వలము… మంచిది, నీవు రాబందువు. చూడుము, అది నిజము, చూశారా? అయితే ఒక పావురము లోపలి భాగము నుండి నూనె కలిగియున్నది, అక్కడ ఒకటి ఉన్నది, ఏ ఇతర పక్షిలో లేనటువంటి ఒక ప్రత్యేకమైన గ్రంధి కలదు, గువ్వ లేక పావురము మరియు అది తనకు తానే లోపలి నుండి నూనెను కలిగియున్నది. వెలుపల, అది ఎల్లవేళలా శుభ్రముగా తనకు తాను శుభ్రముగా ఉండును. అది దానికదే శుభ్రముగా చేసుకొననక్కరలేదు; అక్కడ ఏదో లోపలి నుంది ఏదో దానిని శుభ్రముగా ఉంచును. ఓ, సహోదరీ వే, హల్లెలూయా! వాని లోపలి భాగములో నుండి ఏదో వానిని శుభ్రముగా ఉంచును.

101"గతవారంలో నేను సంఘములో చేరానని నాకు తెలుసు. నేను తప్పక నీతో కలిసి త్రాగుట ఇష్టపడుచున్నాను. అయితే, హుమ్! ఆ చుట్ట వలన మంచి వాసన వస్తుంది," అని చెప్పుదువు. "ఓ, సహోదరీ, నేను పాతకాలపు దానినని నాకు తెలుసు. నేను నా వెంత్రులకలను ఇప్పుడు ఎదుగనిచ్చుచున్నాను. అది భయంకరము కాదా?" "నేను ధరించి, వాడే అందమైన చిన్న వస్త్రాలు నీవు ఎరుగుదువు, మరియు ప్రతియొక్కరు, "వ్యూ-వ్యూ,' నేను ఇప్పుడు దానిని తీసివేయవలసి ఉన్నాను. గత వారం నేను సంఘంలో చేరానని నీవెరుగుదువు." నీవు దౌర్భాగ్యురాలవు! ప్రపంచంలో ఉన్న పరిశుద్ధ నీరంతా నిన్ను శుభ్రం చేయలేదు.

కాని, సహోదరుడా, నీవు లోపలి భాగములో ఏదో పొందినట్లయితే, అది ఎల్లవేలలా శుభ్రం చేయును. నీవు అలా నిలబడి ఉండు మరియు అది శుభ్రం చేయును.

102"నీవు ఉన్ని తయారు చేయమని," నీవు ఒక గొర్రెకు చెప్పనవసరములేదు. ఈ రోజు పెంతెకోస్తు ప్రజల సంగతి అదే. క్రైస్తవత్వంలో ఉన్న సంగతి అంతా అదే. ఏదో తయారుచేయ ప్రయత్నించుచున్నారు. ఉన్నిని తయారు చేయుటకు ఒక గొర్రెను అడగనక్కరలేదు. అది ఉన్నినిచ్చును. నీవు ఆత్మఫలములను ఫలించాలి. "దేవునికి మహిమ, నా ముఖమంతా నల్లబడి ఉన్నది, నేను ఇది చేయుదును. నేను అనుభూతి పొందవలసి యున్నాను. నేను ఆత్మలో నాట్యం చేయుదును. మరియు నేను దానిని పొందాను," అని అలా చెప్పవద్దు. కాదు, కాదు. హ-హ్హ, కేవలం తిరిగి జన్మించు మరియు అది వాస్తవముగా దానికి అదే కార్యము చేయును. "నేను ఈ రాత్రంతా చదువనా? నేను ఇది చేయాలా? అది చేయాలా? నేను దీనిలో చేరుదునా? ఈ మత కార్యము చేయాలా? ఈ ప్రాయశ్చిత్తం చేయుదునా? అని నీవు చెప్పనవసరంలేదు. కాదు, కాదు. కేవలం చనిపోవుటయే, అంతే, చూశారా. తిరిగి జన్మించు, మరియు అది లోపలి భాగం నుండి వచ్చును, బయట దాని గూర్చి శ్రద్ధ వహించును, చూశారా. కొంచెం నీళ్ళు చల్లుట వాటిని శుద్ధి చేయుట. కేవలం ఒక పందిని గొర్రెగా మార్చుట వంటిది, నీవు అది చేయలేవు. అయితే లోపల భాగమున అది ఒక గొర్రె, అయితే అప్పుడు ఇక పందిగా ఉండడు, చూశారా. అది మర్యాద లేని విమర్శే - అయితే నేను చదువుకున్నవాడను కాను, నేను దానిని అలాగే చేయవలసియున్నది…

MATT 3:7,9•

LUKE 3:7,9

 

103మరో దినాన బాప్తిస్మం ఇచ్చు యోహాను జీవితం గూర్చి చదువుతుండగా అతడు ఏమి చెప్పెను, ఆయన ఏమని పిలిచెను? దానిని మీరెరుగుదురు. "మీరు సర్పసంతానము!" ఎందుకు? అతడు అడవులలో పెంచబడెను. వారు ఏమై ఉన్నది ఆయన ఎరిగి ఉన్నాడు. నీ పాదముతో నేలను గట్టిగా రుద్దుము మరియు వారు దాగుకొందురు. "మీరు సర్పసంతానము." మరియు "గొడ్డలి కూడా చెట్ల వేరున ఉంచబడెను." చెట్లు, సర్పాలు, గొడ్డలి అతనికి ఏమి తెలిసెనో దాని మీదే మాట్లాడెను. ఆ విధంగా నీవు ఏమి ఎరుగుదువో దానిని బట్టి ఆ పద్ధతిలోనే దేవుని గూర్చి నేర్చుకోవలసియున్నావు. నీవు ఒక పందిని మరియు ఒక గొర్రెను చూడుము. అక్కడ ఎంత మాత్రము ఏమీ లేదు. నీవు తయారు చేయలేవు. ఆ చిన్న పురాతన పందిని శుద్ధిచేసి నీవు కోరిన దానినంతటిని చేసినను, అతడు ఇంకనూ పందియే. అది ఒక గొర్రెగా ఉండుటకు ముందు తిరిగి పుట్టవలసియున్నది.

104సులభమైన దారులు! ఈ రాత్రి, వారు ఈ రోజు ఇక్కడే బయట ఉన్నారు. వారు వెళ్ళుచున్నారు. ఓ, మై, మరియు రేపు వారు బోధించగోరుచున్నారు. పెంతెకోస్తు ప్రజలు కూడా, వారిని అలా చేయనిచ్చుచున్నారు. అవును. వారు పరలోకానికి సులభ దారులు కోరుచున్నారు. "హల్లెలూయ, ఇక్కడ ఉండండి నేను చేయవలసినది కేవలం ఎంత మాత్రం ఏమీ ఆలోచించను," అని ఇలా చెప్పుదురు, "హల్లెలూయ, హల్లెలూయ, నేను ఏలియా వస్త్రం పొందాను. రేపు నేను దయ్యమును వెళ్ళగొట్టనై యున్నాను. హల్లెలూయ, హల్లెలూయ, నేను దానిని పొందాను! దేవునికి స్తోత్రం! నేను ఇక్కడకు వెళ్ళుదును." వారు తీసుకొనగలిగినంత లోకమును తీసుకొని, పరలోకానికి సులభ దారి కోరుదురు. నీవు దానిలో ఏదియూ తీసుకొనకూడదు, అక్కడ సులభమైన దారులు లేవు. నీవు కల్వరి మార్గమున రమ్ము. నీవు ఇత్తడి బలిపీఠపు పద్దతిలో రమ్ము. నీవు కొట్టబడిన ఇత్తడి సర్పము పద్ధతిలో రావలెను. నీవు చనిపో! నీవు నిజముగా చనిపో! నీ మట్టుకు నీవే నిజముగా చనిపో! నీవు లోకపు సంగతులకు చనిపోవలెను మరియు క్రొత్తగా తిరిగి జన్మించవలెను. ఆమేన్. లోకము లేదు, లోక సంగతులు చనిపోయెను. అక్కడ సులభ దారులు లేవు. చూశారా, వారు త్వరగానే రాగోరుదురు. వారు ఎదుగుకు ఆసక్తి చూపరు. మనం ప్రభువునందు ఎదుగవలెను. అది ఎదుగుటను మరియు అనుభవమును తీసుకొనును.

ROM 8:19

 

105ఇప్పుడు, పశ్చిమ తీరంలో బయట ప్రజలు ఇలా చెప్పుచున్నారు, "ఓ, మేము అక్షయమగు బాప్తిస్మం పొందాము. మేము మీకు నీటిలో బాప్తిస్మమిచ్చాము. మీరు అక్కడే సరిగా ఒక యవ్వన స్త్రీ, పురుషులుగా మార్చబడ్డారు. అవునండి. నీవు పొందవలెను…" వారు ఏలియా వస్త్రం పొందారు, వారు ప్రత్యక్ష్యపరచబడిన దేవుని కుమారులను పొందారు. "అవునయ్యా, సహోదరుడా, దేవుడు ఇప్పుడు ప్రత్యక్ష్యపరచబడిన కుమారులను సరిగా కలిగియున్నాడు — ప్రత్యక్షపరుచుచున్నాడు." దీనినంతటిని గూర్చి వారికి చెప్పుము, "ఈ రాత్రి నీవు ఒక పాపాత్ముడవు, రేపు ప్రత్యక్ష్యపరచబడిన దేవుని కుమారులు." బుద్ధిహీనత! వాక్యములో ఎక్కడ నీవు అది పొందుదువు? శిశువులు పెద్ద మనుషులుగా పుట్టుట లేదు. వారు శిశువులుగా పుట్టియున్నారు మరియు మునుషులుగా పెరుగుదురు.

EPH 4:12

 

106ఇక్కడ వినండి, ఒక నిమిషం నన్ను మరల చెప్పనివ్వండి. మరియు ఎఫెసీయుల నుండి మీకు చదువుదును, 11వ వచనం, 12… 15, ఇక్కడ అది ఎక్కడో ఉన్నదని నేను నమ్ముచున్నాను. 12వ వచనం నుండి ప్రారంభించుదం.

మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయంలోను ఏకత్వం పొంది, సంపూర్ణ పురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, ఆయన ఈలాగు నియమించెను.

పరిశుద్దులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపోస్తులులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తీకులనుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను.

అందువలన మనమికమీదట పసిపిల్లలమైయుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచూ అలలచేత ఎగురగొట్టబడిన వారమైనట్లు౦డక, [వినండి, ఏ సిద్దాంతము?]

ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ, [మరియు, ఏమిటి?] సత్యము చెప్పుచూ [ఆయనే సత్యము], ప్రేమ కలిగి [వినండి! మీరు వినుచున్నారా? "ఆమేన్" చెప్పండి, ఏమిటి?]," ఆయనవలె ఎదుగుదుము [ఏమిటి, రేపా? కాదు, ఆయన లోనికి ఎదుగుదుము], ఆయన లోనికి ఎదుగుదుము. క్రీస్తే, ఆయన శిరస్సు అయి యున్నాడు: [ఆయన వలె అన్ని విషయములలో ఎదుగుచుండవలెను.]

107నేను బోధించిన మొదటి ప్రసంగం జ్ఞాపకము చేసికొందును. నేను అక్కడకు వెళ్లి, అంతా సరిగా బాగానే చేశానని తలంచాను. చుట్టూ ఉన్న వృద్ధ స్త్రీలు, కొంచెం ఏడ్చి, వారీలాగు చెప్పుట మీరు ఎరుగుదురు. "ఓ, ఎలాటి చక్కటి బాలుడు."

వృద్ధ పాస్టర్, డాక్టరు. డేవిస్, వృద్ద వకీలు. నేను క్రిందికి వెళ్లినప్పుడు, అతడు ఇలా అన్నాడు, "అక్కడ ఇంటి దగ్గర నిన్ను కలుసుకోగోరుచున్నాను."

"అలాగేనని," నేను చెప్పాను. ఆ మరుసటి రోజు నేను ఉప్పొంగిపోతూ, లోనికి వెళ్లినట్లు మీరు ఎరుగుదురు, నేనిలా అన్నాను, "నేనెలా చేశాను, డాక్టర్. డేవిస్?

"నేనెప్పుడూ అంత అధ్వాన్నమైనది వినలేదు," అని అన్నాడు.

నేనంటిని, "ఏమిటి?"

"నేనెప్పుడూ అంత చెడ్డది," వినలేదని అతడు అన్నాడు.

"ఓ, సహోదరుడా డేవిస్, ప్రతి ఒక్క మనిషి ఏడ్చెను," అని చెప్పాను.

"అవును, వారు సమాధుల దగ్గర ఏడ్చుదురు, ప్రసవ సమయం ఏడ్చుదురు. అంతేగాక ప్రతీ విషయములో అలాగే," అని అతడు అన్నాడు. "అది ఏమై ఉన్నదంటే, బిల్లీ, నీవు ఒక దేవుని మాట పేర్కొనలేదు. నీవు గతించిన ఒక తల్లిని గూర్చి మాట్లాడితివి లేక ఏదో ఈ విధంగా చేసి, మరియు ప్రతి మనిషి ఏడ్చునట్లుగా చేసితివి," అని అన్నాడు. ఇలా అనెను, "నీవు ఈ భూమి మీద సంగతులు మరియు అనుభూతులతో క్రొత్తగా తిరిగి జన్మించలేవు; నీవు వాక్యము ద్వారా జన్మించియున్నావు." ఇలా అనెను, "బిల్లీ…"

ఓ, నాలో నుండి ఒక రెక్కను కత్తిరించివేసెను. అతడు అలా చేసినందుకు నేను సంతోషించాను. చూడండి? పైకి ఎగిరి క్రింద పడుట కాదు, కేకలు వేయుట, అలా అది కాదు. జీవింపచేయునది వాక్యమే. వాక్యము జీవింపజేయును. అనుభవములు కాదు; ఆ వాక్యమే!

108అతడు చెప్పెను, "బిల్లీ, నేను ప్రయత్నించిన మొదటి సమస్యను (కేసును) జ్ఞాపకం చేసికొనుచున్నాను." అతడు అనెను, "నేను ఇనుప కమ్మీపై కొట్టాను." అతడు చెప్పెను, "నేను అన్నాను, 'ఈ బీద స్త్రీ వైపు చూడండి.'" ఓ, అతడు అనెను, "ఆమె భర్త ఆమెను సరిగా ఆదరించక ఎలా చేశాడో చూడండి." అనెను, "నేను కొద్దిగా అరిచాను, నా చేతి తువ్వాలు పైకి ఎత్తి పట్టుకున్నాను, మరియు నేను మిగిలిన న్యాయవాదులవలె ప్రవర్తించాను." చెప్పెను, "అదే ఉద్రేకముతో చేశానని నేను తలంచాను. ఇలా అనెను, "గౌరవనీయులైన, న్యాయాధిపతి, ఎందుకు మీరు ఆమెకు విడాకులిచ్చుటలేదు? అక్కడ చూడండి! ఆమె భర్త ఆమె వీపు వెనుక అడ్డముగా కొట్టినట్లు చెపుతుంది." అతడు ఆమె లోపల నుండు వస్త్రములు క్రింద చూడలేదు. "అతడు ఆమె వీపు వెనుక అడ్డముగా కొట్టెను." మరియు అనెను, ఎందుకు మీరు ఆమెకు ఇవ్వలేదు…? ఆ పురాతన న్యాయాధిపతి కేవలం అక్కడే కూర్చుని, చూచెను.

"వృద్దుడైన న్యాయవాధి అవతల ప్రక్కకు ప్రత్యక్షముగా కూర్చుని ఉన్నాడు, అతడు లేచినాడు, అతడు అనెను, "ఘనత వహించిన, న్యాయాధిపతి, మీ న్యాయస్థానము ఈ అర్థరహితమైన దానిని ఇంకెంత ఎక్కువగా భరించగలదు? ప్రయాసతో కేవలం చాలా భారము వెూసికొనిపోవుచున్నారు."

చాలా మంది ప్రజలు కూడా ఆ విధముగా చేస్తున్నారు. దాని వెనుక దానికి ఆధారముగా చాలినంత వాక్యము లేకుండా చాలా ఎక్కువ మోసికొనిపోవుచున్నారు. పైకి ఎదుగవలెను! "ఓ, బ్రెన్హాం సోదరుడా, అతడు రాత్రంతా ఆత్మలో నాట్యం చేశాడు, అతడు చేసినది సరియే." నాకైతే అది వానిని సరైనది చేసినవానిగా చేయలేదు. కాదండి. ఎదుగవలసి ఉన్నది, రుజువు చేయబడండి, పరీక్షించబడండి, ఆయన వరకు ఎదుగుడి, పరిపక్వమైనవారిగా ఉండండి.

109ఈ మధ్య నేను చరిత్ర చదువుచున్నాను. (నేను చాలా ఎక్కువ సమయాన్ని తీసుకొంటున్నానా?) నేను సంఘ చరిత్రను చదువుచున్నాను. సహోదరి ఆర్నోల్డ్ సంఘ చరిత్రను చదువుచూ ఉన్నందున మరో దినమున ఆ సంఘ చరిత్రలో ఏదో దాని గూర్చి అక్కడ వెనుక "ఆమేన్" అని చెప్పినదని నమ్ముచున్నాను. మార్టిన్ దినాలలో అక్కడ ఆ మఠములో ఒక రాత్రి ఒక బాలుని చూశాను, "పాత నిబంధన గ్రంథం నుండి ప్రభువు నన్ను పురాతన ప్రవక్తగా చేశాడు. నేను పురాతన ప్రవక్తలలో ఒకడినై ఉన్నాను." సరే, కేవలం ఇక్కడ ఈ చిన్న గుంపువలె, ఈ చిన్న పాఠశాల నుండి, అక్కడ ఆ బిషప్ పేరు పిలువలేను. ఈ సమయములో నేను అతని పేరును పిలవలేను, అయితే అతడు మార్టిన్ దగ్గర శిక్షణ పొందెను. అది సరియైనదిగా కనబడలేదు, కనుక మిగిలిన సహోదరులు వానిని ఒంటరిగానే ఉండనిచ్చిరి. అతడు ప్రత్యక్షముగా ప్రవచించెను. అతడు చెప్పెను, "ఈ రాత్రి దేవుడు క్రిందకు వచ్చుచున్నాడు మరియు మీ మధ్య కూర్చుండునట్లు, నాకు ఒక తెల్లని అంగీ ఇవ్వనై ఉన్నాడు, పాతనిబంధన ప్రవక్తలలో నేను ఒకనినై ఉన్నానని మీరు తెలిసికొందురు." కాబట్టి ఆ రాత్రి, 12 గంటలకు, అది నిజముగా జరిగెను. శబ్దములు వినబడి ఉండెను, ప్రజలు చుట్టూ తిరుగుచున్నారు, ఆ బాలుడు ఒక అంగీని పొందెను, అది ఎంత తెల్లగా ఉండవలెనో, అది అంత తెల్లగా ఉన్నదని వారు చెప్పారు. అతడు బయటకు వచ్చి, అనెను, "నేను మీతో చెప్పలేదా?" అనెను. "ఇప్పుడు మీరందరూ నా దగ్గర నుండి ఆజ్ఞలు పొందవలెను. నేను పాత నిబంధన ప్రవక్తనై ఉన్నాను."

110అయితే ఆ వృద్ధ బిషప్ దానిని చేయుటకు యదార్థంగా వెళ్ళలేదు. అది వాక్యమై ఉండలేదు. ప్రవక్తలు తయారు చేయబడలేదు; వారు ముందుగా నిర్ణయించబడెను. ఒక ప్రవక్త ప్రారంభములో అలా ప్రవర్తించడు. దాని యొక్క ఫలము అది కాదు అని రుజువు చేసెను, చూడండి. ఆ ఫలములు ఒక ప్రవక్త కాడనియు అలా రుజువు చేసెను, చూడండి. కాబట్టి అతడు చెప్పెను, "మేము ఈ రాత్రి అంతా ఉపవాసములోను, ప్రార్థనలోను, దైవ స్తుతి కీర్తనలు పాడుటలోను మేము గడుపుదుము." ఒక రోజు లేక ఆ విధంగా జరిగెను. కొంచెంసేపటి తరువాత వృద్ధ బిషప్, ప్రార్థించుచూ, అనెను, "ప్రభువా, ఆ బాలుడు ఆ వస్త్రము వైపు చూచుటకు, చెప్పెను, ఎన్నడూ ఏమియూ ఎరుగడు. అలాంటిది ఏదియూ చూడలేదు." రచయితలు వచ్చెను మరియు చూచెను, మరియు అలాటిదానిని వారు ఎన్నడూ చూడలేదు. అక్కడ అది ఉండెను. తుదకు, వారు ఒక మనిషిని ప్రవక్త అయి ఉండెనని తెలిసికొనిరి, ఆయనే మార్టిన్. వారు ఇలా అన్నారు, "సరే, ఇప్పుడొక సంగతి మాకు రుజువుపరచు, లేఖనము బట్టి నీవు పొరపాటులో ఉన్నావు. మార్టిన్ ముందుకు వెళ్ళి మరియు ఆయన ఎదుట నిలువబడి మరియు అది ఆయనకు చెప్పుట నీకు ఇష్టమేనా?"

అతడు అనెను, "ఓ, నేను మార్టిన్ ఎదుటకు వెళ్ళి నిలబడుటకు, ఆ పని చేయవద్దని ఆజ్ఞాపించబడితిని."

111మంచి బంగారము గలవాడు పరీక్షాయంత్రానికి తీసుకువెళ్ళుటకు భయపడడు [అది నిజము], అతడు ఆ సత్యమును పొందాడు. ఆ కారణముచేత నేను ఒక సవాలును చేసితిని. ఏ మనుష్యుడైనా వచ్చి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తప్పు అని నాకు చూపించుము. చనిపోయి, నీవు పొందిన జన్మను చూపించు మరియు ఇంకా నీలో లోకము ఉన్నయెడల, నీవు ఇంకా లోకసంబంధివే. ఈ సంగతులు నాకు చూపించుము. దాని గూర్చి నీవు తొందరపడవద్దు — దానిని పరీక్షా యంత్రమునకు కొనిపొమ్ము. ఇక్కడ పరీక్షా యంత్రము గలదు, చూశారా. అది నిజము.

కావున వారు చెప్పిరి, "నీవు ఏ విధంగానైనను వెళ్ళుచున్నావు." మరియు సహోదర గుంపు వానిని పట్టుకొనిరి, మరియు ఆ వస్త్రం అదృశ్యమాయెను, చూశారా. పెంతుకోస్తు ప్రజలు ఈ రోజు నాటికి దానిని చెప్పుటలేదా? ఓ, మై! అది నిజమైన దానివలె కనిపించినది, అయితే అది వాక్య ప్రకారముగా లేదు.

MATT 24:24

 

112ఒకసారి సాతాను కనబడెనని మార్టిన్ చెప్పెను, పైన గొప్ప బంగారపు కిరీటం, 3 లేక 4 అలంకరణ నక్షత్ర భాగాలు ఆ విధంగా అందులో ఉండి, మెరుస్తూ, అందమైన, పెద్ద వ్యక్తి, చక్కని, సుందరమైన, సరిగా తల దువ్వుకొని, గుర్రము మీద ఉండి, పైన గొప్ప అందమైన అంగీ కలిగియుండెను. అతని పాదముపై ఉన్న జోళ్ళు బంగారముతో ఉన్నవి. మరియు బయటకు నడచి వచ్చి ఇట్లు చెప్పెను, "మార్టిన్ నీవు నన్ను ఎరుగుదువా?"

ఇప్పుడు దర్శనములు చూడని ప్రజలు, ఇది కాకపోవచ్చును… నీవు దానిని అర్ధం చేసికొనలేకపోవచ్చు, చూడుము, అయితే ఎలా ఆ సంగతులు వివిధ ఆత్మలలో నీ దగ్గరకు వచ్చుచున్నవి? మరియు అవి ఎలా మోసగించే ఆత్మలు అయి ఉన్నవి. సాధ్యమైతే ఎన్నికైన వారిని సహితము అవి మోసపుచ్చునని బైబిలు చెప్పెను. ఎన్నికైనవారు తిరిగి జన్మించి ఆ ఉద్దేశ్యము కొరకు ముందుగా నిర్ణయించబడినవారు, చూశారా.

ACTS 1:11•

2TIM 3:8

 

113కావున ఎన్నికైన ఈయన దగ్గరకు అతడు వచ్చి చెప్పెను, "మార్టిన్, నీవు నన్నెరుగుదువా? నేను క్రీస్తును? నీవు నన్ను గుర్తించితివా?" అని అతడు చెప్పెను. మరియు మార్టిన్ సందేహించెను. అతడు ఒక నిమిషం కనిపెట్టెను. మరియు అతడు మరలా చెప్పెను. అతడు అనెను, "నీవు నన్ను చూడలేదా? నేను క్రీస్తును. నీవు నన్ను గుర్తించలేదా?" అతడు దానిని 3 లేక 4 సార్లు అతనికి చెప్పెను.

"క్రీస్తు చెప్పెను… లేక, మార్టిన్ చెప్పెను, "సాతాను, నేను నిన్ను ఎరుగుదును. నా ప్రభువుకు ఇంకా కిరీటం పెట్టబడలేదు, అయితే ఆయన పరిశుద్దులు ఆయనకు కిరీటం పెట్టుదురు." అక్కడ ఆ వాక్యము ఉన్నది.

అక్కడే రోమా సంఘము ఎక్కువ సిద్దాంతమును పొంది, దురాత్మలను లోనికి రానిచ్చెను, వాక్యమునకు విరుద్ధము; మరియు మత సిద్దాంతము కొరకు వారు వాక్యమును కాదనిరి మరియు బైబిలు నుండి దూరముగా పోయిరి. వాక్యముతో నిలిచి ఉండుము. అది ఈనాడు ప్రవహించు జీవమైయున్నది. కొంచెం సేపటిలో అక్కడ అంతటిని మోసపరుచు ఆత్మలు దాదాపుగా లేచెను. బైబిలు అలా చెప్పెను, "యన్నె, యంబ్రేలు మోషేతో నిలిచి, సత్య విషయమైన అనుభవజ్ఞానమును గూర్చి భ్రష్టమనస్కులై, అద్భుతములు మరియు అన్ని రకములైన సూచనలు చేసిరి. అయితే వాక్యములో ఉండుము. ప్రభువు వాక్యము ప్రవక్త దగ్గరకు వచ్చును. మరియు వారు దానిని తీసికొనివచ్చిరి. మరియు మేము ప్రవక్తలను నమ్ముచున్నాము.

గుర్తించుడి, అవును, అతడు చెప్పెను, "సాతానా, నేను నిన్ను ఎరుగుదును. నా ప్రభువు ఆ విధంగా పెద్ద వ్యక్తి కాడు అని చెప్పెను. నా ప్రభువు ఆయన మీద ఒక కరుకైన పాత వస్త్రముతో వెళ్ళెను. మరియు ఆయన తిరిగి వచ్చునప్పుడు, ఆయన అలాగే వచ్చును. ఆయన వెళ్ళిన విధముగానే తిరిగి వచ్చునని బైబిలు చెప్పెను." మరియు ఆ సాతాను ఆయన నుండి కనబడకుండా పోయెను. ఓ, మై!

JOHN 15:4,7

 

114అతడు ఎలా లోపలకు వచ్చి దానిని అందముగా చేయుచున్నాడు, "ఓ, వారు భాషలలో మాట్లాడినవారు. వారు నీవు ఎన్నడైనా చూచు మంచి జనులు. దానిని నీవు నమ్మ వద్దు. ఒక కంటితో కనిపెట్టి చూడుము.

(ఈ మాట నీకు విసుగు కలిగించుటలేదని ఆశిస్తున్నాను.) తిరిగి జన్మించిన క్రైస్తవులు జీవించుచూ క్రీస్తు వ్యక్తిత్వములోనికి ఎదుగుదురు. వారు తిరిగి జన్మించి ఉన్నారు. మరియు వారు ఒక శిశువు రూపం గలిగి, జీవించనారంభించిరి. అది ఆ రూపమును పొంది మరియు ఎదుగనారంభించును. మొదటి సంగతి నీవు తెలిసికొనుము, ఇక్కడ వారు పూర్తి వ్యక్తిత్వములో ఉన్నారు. ఆమేన్. అక్కడే నీవు ఉన్నావు. రోజు సంవత్సరములన్నియు వారు అలాగే నిలిచియుందురు. ఇప్పుడు వాక్యమున వద్దకు రమ్ము, "నీవు నాయందు నివసించినయెడల…"

115వారు అందురు, "నేను తిరిగి జన్మించితిని. హల్లెలూయ! నేను దీనిలో చేరాను. నేను చేరితిని… నాకు తెలియదు. గత సంవత్సరము నేను యేసు నామమును నమ్మాను, నేను ఇప్పుడు దానిని విడిచిపెట్టాను; ఇప్పుడు నేను దీనిని నమ్ముతాను. నీవు పరిశుద్దుడవుగా ఉండవలెనని నేను నమ్మాను, అయితే నేను… ఫలాని-ఫలాని అని చెప్పుదురు…" ఇటు - అటు తిరుగువారు, గాలికి ఇటు అటు చెదర గొట్టబడు సిద్దాంతము, చూశారా. అక్కడే నీవు ఉన్నావు.

అయితే ఆత్మ ద్వారా తిరిగి జన్మించి మరియు క్రీస్తు వ్యక్తిత్వములోనికి ఎదుగుదుము. నీవు దానిని చూశావా, సహోదరుడు డాచ్? క్రీస్తు వ్యక్తిత్వములోనికి ఎదుగుచూ ఉండవలెను! నీ జీవితం ద్వారా, రుజువగును. నీవు ఒక ప్రవక్తగా పుట్టిన, అలాగే ఉండు. నీవు ఒక క్రైస్తవునిగా పుట్టిన, అలాగే నిలిచియుండు. "నీవు నాయందును మరియు నా మాటలు నీ యందు నిలిచియున్నయెడల…" ఇది నిన్ను క్రీస్తు వ్యక్తిత్వములోనికి ఎదిగించును. ఎవరో ఒక యవ్వన న్యాయవాది కొట్టుచు, అరచుచు, కేకలు వేయుట కాదు, నీకు ఇది, అది లేక మరొకటి, చెప్పుట కాదు, అనేక ఉద్రేకములు కలిగియుండుట కాదు; అయితే ఎవరో ఒకడు క్రీస్తు వ్యక్తిత్వములోనికి ఎదిగినవాడు, సంవత్సరములుగా పరిపక్వత చెంది, రుజువు చేయబడి, సరియైన స్థానములో నిలబడినవాడు. మరొక మార్గము లేదు. "క్రీస్తు అను కదలని బండపై మనము నిలువబడి ఉన్నాము, మిగతా స్థలములన్నియూ మునిగిపోవును ఇసుక దిబ్బలు, సంఘ శాఖలను, మత విశ్వాసులు రానివ్వండి, పోనివ్వండి, మత సిద్దాంతములు రానివ్వండి. ప్రభువా, నన్ను దీనునిగా ఉంచండి. వాక్యముతో సరిగా నిలబెట్టండి మరియు ప్రవాహముతో పాటుగా సాగిపోయేలా చేయండి. అది మనలను తీరమునకు నడిపించును. పరిపూర్ణమైన ఎదుగుదల.

116ఇప్పుడు చూడండి, అది ఎలా త్రిప్పబడినదో మనము చూచిన యెడల, మరియు మరణం తరువాత నీకు ఏ మార్పు కలదు. ఈ లోపలకు వచ్చే ప్రజలను గమనించిన యెడల, అన్ని అనుభూతులు, సంగతులు పొంది బయటకు వెళ్లి మరియు రేపు వారు ఈ పద్ధతిలో ఉంటున్నారు. నీవు దానిని చూశావా? వారు వందల కొలది ఉన్నారు, చూశారా. మరియు ఏమి జరిగినదో మీరు చూడండి. మరియు ఇప్పుడు ఆ ప్రజలు అదే పరిస్థితిలో చనిపోయినయెడల ఏమిటి? మరణము వలన దానికి ఏ మార్పూ కలుగదు.

"ఆందుచేత, ఓ, క్రైస్తవులారా, ఈ మాటలు ముగింపులో, దీనిని నన్ను చెప్పునివ్వండి. మనలను ఆయన మరియు ఆయన వాక్యము వైపునకు యధార్థతతో తిరుగుదాము. క్రైస్తవులవలె అణుకువతో రండి, మరియు ఆయన ఆత్మ ద్వారా తిరిగి జన్మించండి. నీవు మరల జన్మించినప్పుడు నీవు పొందిన ఫలముల ద్వారా క్రైస్తవునిగా రుజువు చేసికొందువు. సహోదరి పెకిన్పాఘ్, నీవు దానిని పొందితివా? నీవు కనుపరచు ఫలముల ద్వారా నీవు క్రైస్తవురాలవు అయి ఉన్నావు. "వారి ఫలముల ద్వారా వారిని తెలిసికొందువు." అది ఒక రుజువు. నీకు ఎ.బి.సి.లు. (అ,ఆ లు) తెలియకపోవచ్చు, అయితే ఇంకా నీవు ఒక క్రైస్తవ స్త్రీవి, ఒక క్రైస్తవురాలవు. నీవు లోకం ద్వారా ద్వేషించబడవచ్చు. నీవు దానిని చేయుదువు, ఏలయనగా నీవాలాగుండునట్లు ఏదో చేసియున్నావు; అయితే నీవు ఆయన నిమిత్తము ద్వేషించబడినయెడల, అది వ్యత్యాసమైనది.

117నీవు ఒక వేదాంతివి కాకపోవచ్చు. గ్రుడ్డివానిగా పుట్టిన గ్రుడ్డి మనుష్యుని వైపు చూడుము. యేసు అతని స్వస్థపరచెను. అతడు పుట్టుక నుంచి కనుగ్రుడ్డు లేకుండా జన్మించాడు. మరియు యేసు అతనిని బాగుచేసి, వానిని స్వస్థపరచెను. ఆ మనుష్యుడు చూడవచ్చినప్పుడు, పరిసయ్యులు ఆయనను ప్రశ్నించారు. ఇలా అడిగారు ఆయన ఎవరు? "అక్కడ జరిగిన ఏదో ఒక దానిని వారు కాదనలేదు. ఇప్పుడు, ఆ మనుష్యుడు ఒక వేదాంతి కాదు. బోధకులవలె చిన్న సాంకేతిక విషయాలతో వాదించలేదు. అతడు వారికి విశధీకరించలేదు. అతనికి కొత్త నిబంధన తెలియదు. మెస్సీయా ఏ విధంగా జన్మించవలసియున్నాడో అతడు ఎరుగడు. మరియు ఆయన ఏ పనులు చేస్తాడో అని అతడు ఎరుగడు. ఆ మనుష్యుడు దానిని ఎరుగడు. అతడు వేదాంతి కాడు. అయితే అతడు ఏమి చేసెను? "దేవుని స్తుతించుము. మేము వేదాంతులము, మరియు అతడు ఒక పాపి అని మేము ఎరుగుదుము," అని వారు చెప్పెను.

118ఇప్పుడు ఆ మనుష్యుడు వారి మాటను కాదనలేదు, అయితే ఇక్కడ మరోవిధంగా మాటలలో అతడు ఏమి చెప్పెనో ఇక్కడ ఉన్నది, "అతడు పాపి అయి, ఇది చేస్తే అప్పుడు మీ సంగతేమిటి? మీ అందరి సంగతి ఏమైయున్నది." అతడు చెప్పెను, "అతడు పాపియో, కాదో నేనెరుగను. నేనది చెప్పలేను. అయితే ఒకటి నేనెరుగుదును, ఒకప్పుడు నేను గ్రుడ్డి వాడనైయున్నాను, నేను ఇప్పుడు చూచుచున్నాను." అతడు ఏమి చేయుచుండెను? అతడు రుజువుపరచబడెను. అది నిజము. అతడు రుజువు చేయబడిన వాడైయుండెను. ఏదో ఒకటి వానికి జరిగెను. అతని వ్యక్తిత్వము చీకటి నుండి వెలుగునకు, గ్రుడ్డితనం నుంచి చూపునకు మార్చబడియున్నది.

ఒక మనుష్యుడు దేవుని ఆత్మ ద్వారా జన్మించియుండెను - అలా ఒకప్పుడు పైకి భక్తి కలిగినవానివలె ఉండి, మరియు అద్భుతములు జరుగు రోజులు గతించాయని చెప్పుటకు అక్కడ వాక్యమును, దాని శక్తిని కాదు అని అనినను — అతడు తిరిగి జన్మించినప్పుడు, అతడు ఒక పండితుడు కాకపోవచ్చు, అతడు దానిని విశధీకరించ లేకపోవచ్చును; అయితే అతడు దానిని నమ్మును.

ఈ విధంగా…

119ఇక్కడ నా వర్ణ సహోదరీ మరియు సహోదరులు దీనిని చెప్పుచున్నందుకు నన్ను క్షమించండి. ఒక మంచి వృద్ధ వర్ణ సోదరుడు దక్షిణాదిన, వారు అతని గూర్చి ఒక చిన్న కథ చెప్పిరి. అతడు ఒక బైబిలు పట్టుకున్నట్లు చెప్పెను, అతడు అతని పేరును కూడా చదువలేడు. మరియు అతడు చెప్పెను, "మోస్, నీవు ఎందుకు ఆ బైబిలు పట్టుకున్నావు?"

"అది దేవుని వాక్యము," అని చెప్పెను.

వారు అడిగిరి, "మంచిది, నీవు దానిని నమ్ముచున్నావా?"

"అవునండి, అయ్యా, నేను నిశ్చయముగా దానిని నమ్ముచున్నాను." నేను దాని ప్రతి పొల్లును కూడా నమ్ముచున్నాను. మరియు ఆ పొల్లును కూడా నమ్ముచున్నాను, ఏలయనగా దానిపై "పరిశుద్ధ గ్రంథము" అని వ్రాయబడెను అని అతడు చెప్పెను.

"అది పరిశుద్ధ బైబిలు అని నీవెలా తెలిసికొన్నావు?" అని అడిగెను. "అది అలా ఉన్నదని ఎలా ఎరుగుదువు," అని అన్నాడు.

"నేను కేవలం దానిని నమ్ముదును. అంతా అదియే," అని అతడు చెప్పెను. అతడు కలిగియున్నదంతయూ అదే. అతడు కేవలం దానిని నమ్మెను. ఎందుకో అతడు ఎరుగడు, కాని అతడు దానిని నమ్మెను.

వారు అతనితో చెప్పిరి, "మోస్, బైబిలు చేయమని చెప్పిన ఏదైనా గాని చేయుదువా?"

"అవునండయ్యా" అతడు చెప్పెను, "బైబిలు అలా చేయమని చెపితే, నేను దానిని చేయుదును." అక్కడే నీవు ఉన్నావు.

"సరే, మోస్," అని అతడు చెప్పెను. ఇప్పుడు, అక్కడ రాళ్ల గోడ ఉండి అది ప్రభువు దాని గుండా గెంతమని చెప్పినయెడల ఎలా నీవు ఆ రాళ్ల గోడ గుండా గెంతగలవు?" అని అతడు చెప్పెను.

"ఆ రాళ్ల గోడ గుండా మోస్ గెంతమని బైబిలు చెప్పునా?" అని అతడు చెప్పెను.

"అయితే దేవుడు నీతో మాట్లాడిననేమి, ఆ రాళ్ల గోడగుండా గెంతమని చెప్పినప్పుడు ఏమిటి?" అని అతడు చెప్పెను.

"అది దేవుడే అయితే, ఆయన గెంతమని నాకు చెప్పిన నేను గెంతుదును."

"దానిలో, కన్నము లేకుండా ఎలా నీవు గెంతగలవు?" అని అతడు అన్నాడు.

"అది దేవుడు అయి ఉండినయెడల, మోస్ అక్కడకు వెళ్ళినప్పుడు, ఆయన ఆక్కడ కన్నము నుంచును." మరియు అది నిజము. నిజము!

ISA 53:5•

1PET 2:24

 

120నీవు ధైర్యముతో వాక్యము తీసుకొని మరియు అక్కడ నిలబడి, "ఇది ఇలా జరుగును," అని చెప్పుము. ఇక్కడ చిన్న నరముల ఒత్తిడికి గురైన బీద స్త్రీ కలదు. ఆమె చనిపోతుందని తలంచును, మరియు ఇతరమైన ప్రతి సంగతి ఆమెకు వ్యతిరేఖంగా ఉంది, చూడుము… నీవు చనిపోవుట లేదు! "దీనిని నేనెలా చేయగలను, సహోదరుడా బ్రెన్హాం," అని చెప్పుదువు. ఏమి జరుగునో చూడు. నీవు అబద్ధికుడవని దయ్యముతో చెప్పుము. నీవు 67 సంవత్సరముల వయసు కలిగి ఈ సంవత్సరములన్నియు స్త్రీ ధర్మంలో ఉన్నావు. మరియు ఆ సంగతి నుండి దూరముగా పొమ్ము, అది దయ్యము! దేవుని వాక్యము తీసికొని ఇలా చెప్పు, "ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగియున్నది." ఏమి జరిగినదనో కనిపెట్టుము. అప్పుడు గుండెపోటులు మరి ప్రతీది ఉన్నాయన్న ఆలోచనను ఆపుము. నీకు గుండెపోటులు అంతా అలాంటివి ఏమీ లేవు. అది ఒక అబద్ధం. నీవు అది కలిగి యుండలేదు. దేవుని వాక్యమునే నమ్ముము. అది నిజము.

MATT 7:16,20•

JOHN 3:5

 

121నీవు తిరిగి జన్మించినప్పుడు, దేవుడు నీకు రుజువు పరచును. దేవుడు ఆయన స్వభావమును అలాగే రుజువు చేయును. ఏమిటి? వారి ఫలముల వలన ఆ పద్దతిలో ఆయన పరిచర్యను ఆయన రుజువు చేయును. అది నిజము. ఆయన స్వభావమును రుజువు చేసిన విధముగానే ఆయన అందరి సేవకులు రుజువుపరచబడిరి. అది పీచ్ వృక్షమని ఎలా తెలిసికొనగలవు? అది పీచ్ కాయలు కాయుటను బట్టి, అది ఏపిల్ చెట్టుని ఎలా తెలిసికొనగలవు? అది ఏపిల్స్ కలిగియుండును కాబట్టి. అతడు క్రైస్తవుడని నీవెలా తెలిసికొన గలవు? క్రైస్తవుని గురుతులు అది కలిగియుండుటను బట్టి, క్రైస్తవ జీవితం దానిలో నుండి బయటకు వచ్చును. అతడు బోధకుడని ఎలా ఎరుగుదువు? ఆయన నుండి వాక్యము వచ్చును. అతడు ప్రవక్త అని ఎలా ఎరుగుదువు? వాక్యము ఆయన ద్వారా వచ్చును, గుర్తింపు కలిగినవాడై, బయలుపరచును, దానికదే రుజువు చేసుకొనును. అది అలా సంభవించుటకు అది ఎలా జరుగును? అది మృతమైనపుడు ఒకటిగా అయినది. అది నిజము. మనం చనిపోయి మరియు క్రీస్తులో నూతన జీవిగా అయినప్పుడు, అది మన పిలుపుతో ఏకీభవించును. మనము మన పిలుపుతో నిలిచి ఉందుము. ఆయన దాసులుగా ఉనప్పుడు, ఆత్మఫలములు వెంబడించును. మనము తిరిగి జన్మించినపుడు, క్రీస్తు ఫలములు మనలను వెంబడించును. అది నిజము. అది పిచ్ చెట్టు అని ఎలా ఎరుగుదువు? అది పీచ్ చెట్టుని ఎలా ఎరుగుదువు? అది పీచ్ కాయలు కలిగియున్నది. అతడు క్రైస్తవుడని ఎలా ఎరుగుదువు? అతడు క్రీస్తువలె ప్రవర్తించును. అతడు క్రీస్తు వలె నడచును. అతడు క్రీస్తు వలె మాట్లాడును. అతడు క్రీస్తువలె పాపమునకు పైగా, విజయశీలునిగా జీవించును. అతడు ఏదైనా చేసినప్పుడు, "నేనేమి చేశానో చూడు" అని చెప్పునా? క్రీస్తు అలా చేయలేదు. ఆయన తండ్రికి స్తోత్రములన్నియు చెల్లించెను. అది నిజము. ఆ విధముగానే దానిని తెలిసికొనగలవు. వారి ఫలముల వలన వారిని తెలిసికొనగలము.

ఒక వ్యక్తి తిరిగి జన్మించితేనే గాని, దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను."

EPH 4:30

 

12212:30కు లేక 20 నిమిషాలు తక్కువ ఒంటి గంటకు, ఇక్కడ నా క్రొత్త సంవత్సర వర్తమానం కాదు గాని, దేవుని ప్రేమించే క్రైస్తవులయిన మీకు నా సలహా అయి ఉన్నది. నీవు దేవుని న్యాయతీర్పు ఇత్తడి బలిపీఠం దగ్గరకు వచ్చి, మరియు తిరిగి జన్మించగోరి అక్కడ నీయంతట నీవే పడి ఉండుము. మరల లేచుటకు ఉద్దేశించవద్దు - నీవు చనిపోవుటకు వెళ్ళుచున్నావు. అదే నీ అంతము, అంతే. అది నీవు చేయకపోతే, దానిని చేయగలుగునట్లు, నీవు, భావించనిచో, వద్దు, అది ప్రయత్నించవద్దు. లోతుగా, వాస్తవముగా అది పనిచేయదు. (ఇక్కడ 10 పేజీలకు పైగా పాఠములో లేక ఇంకా ఎక్కువ, లేఖనములు ఉన్నవి. నేను ఆపివేయుదును.) అయితే దేవుని న్యాయతీర్పు సంబంధమైన ఇత్తడితో చేయబడిన బలిపీఠంపై నీయంతట నీవే ఉండుము. మరియు క్రీస్తువలె లోకమునకు చచ్చినవాని వలె ఉండుము, చూశారా. ఏదేను తోటలో మృతమై, తీర్పు చేయబడిన సర్పము రూపములో ప్రాతినిధ్యము వహించబడిన దానివలె. దాని జీవమంతయు పోయినది. క్రీస్తు జీవం పోయినవాడాయెను. వారు ఆయనను సిలువ నుండి తీసికొని సమాధిలో పాతిపెట్టిరి. అతడు చనిపోయెను. మరియు అప్పుడు మన నీతికరణం ద్వారా తిరిగి లేచితిమి. మనం మన గొర్రెపిల్లతో బలిపీఠంపై చనిపోతిమి, మరల మనం ఆయన నీతికరణం ద్వారా తిరిగి లేచితిమి. మనం ఎలా ఎరుగుదుము? ఏలయనగా ఆయన జీవము ఆ మృత పరిస్థితి నుండి ఆయనను లేపినది. అదే విధమైన జీవము ఈ లోక నిర్జీవ స్థితి నుండి, క్రీస్తు యేసు నందు నూతన సృష్టిలోనికి మనలను లేపినది. మరియు అప్పుడు విమోచనా దినము వరకు దేవుని రాజ్యములోనికి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడితిమి.

JOHN 3:5

 

123ఒక మనుష్యుడు తిరిగి జన్మించితేనేగాని, అతడు దేవుని రాజ్యమును అర్థం చేసికొనలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దానిని అర్థము చేసికొనుటకు ప్రయత్నించవద్దు. నీవెన్నడూ అది అర్థం చేసికొనలేవు. నీవు అలా అర్థం చేసికొనలేవని యేసు చెప్పెను. కేవలం అంగీకరించుము. ఆయన వాక్యాధారంపై అంగీకరించుము.

ఇప్పుడు గ్రుడ్డిగా నడవవద్దు, ఇలా అందువు, "ఓ ప్రభువా, నాకు ఒక అనుభూతిని "ప్రభువా, నేను నీకు చెపుతాను…" వద్దు. కేవలం ఇలా చెప్పు, "ప్రభువా, నన్ను చంపుము. నా నుండి లోకాన్ని తీసివేయుము. నేను ఇంకనూ లోకసంగతులను ప్రేమించుచున్నాను. సృష్టి అనగా నా ఉద్దేశ్యం సుర్యాస్తమయములు అందం, మరియు అలాంటి పదార్ధాలని కాదు. నేను మాట్లాడునది అది కాదు. నేను మోహపు చూపు మురికి అయిన, లోక క్రమమును గూర్చి ఆలోచించుచున్నాను. ఈ లోక సంగతులన్నిటి గూర్చి. కేవలం అవి చనిపోయాయి, కేవలం వాటంతటవే చచ్చాయి, మరియు అవి నిన్ను పట్టియుంచలేవు. అవి నీకు కంపుకొట్టునట్లుగా ఉన్నవి. "హమ్, కేవలం వాటిలో ప్రజలు ఎలా జీవించుచన్నారో చూడవద్దు!" నీవు మొరపెట్టావు. దానిని నీవు ఎక్కువ చూశావు. మరీ చెడ్డది పొందావు! అవును, అయ్యా. నీవు దానితో రాజీపడలేవు. అక్కడ రాజీపడు చోటు లేదు. అక్కడ లోకము ఉండగా నిన్ను ఉంచుకొనుటకు అక్కడ స్థలము లేదు. ఆ సంగతులకు నీవు చనిపోయి ఉన్నావు. మరియు ఎలా ఒకసారి నీవు లోకానికి చచ్చినవాడవై, మరల దాని సంగతులతో అప్పుడు సహకరించగలవు? దానిని చేయలేవు. కావున దానిని చేయవద్దు. లోక సంగతులకు చనిపొమ్ము.

LUKE 6:29

 

124ప్రభువు మిమ్మును దీవించును గాక. క్రైస్తవులారా, తిరిగి జన్మించుడి. మరల జన్మించుడి, అప్పుడు నీవు ఇలా చెప్పనవసరము లేదు, "నేను జుట్టును ఎదుగనిచ్చుట, నాకు [స్త్రీలారా, మీరు] కష్టమైన కార్యము." "నా కోపము పోగొట్టుకొనుట అది నాకు [పురుషులారా, మీరు] అత్యంత కష్టమైన కార్యము." బాలుడా, నేను నా భార్యకు చెప్పువలెను. బాలుడా, నేను ఆమెను పట్టుకొని, మరియు నేను ఆమెను కుదిపి, మరియు నేను అందును, నేను క్రైస్తవుడనని నాకు తెలుసు. ఇది నేను చేయకూడదు, కాని నీవు నోరు మూసుకొని కూర్చుని ఉండుము." అలా చేయవద్దు, చూశారా.

ఆమె చుట్టూ నీ చేతిని ఉంచి ఒక సమయం చూచుటకు ఇష్టపడుదువు. మరియు ఇలా అందువు, "ప్రియమైనదానా, అది ఒక క్రైస్తవునికి చెందినది కాదు." ఆ విధంగా ఉండవలెనని కోరుదువు, అది కాదా? నీవు ఆ విధంగానే ఉండగలవు, చూడండి. ఒక మనిషి నిన్ను ఒక చెంప మీద కొట్టినయెడల, ఒక జేబు కత్తితో వానిని నీవు నరకకూడదు. ఒక మనిషి నిన్ను చెంప మీద కొట్టినప్పుడు, "సహోదరుడా, నీవు ఏ కారణం చేత అలా చేశావు?" అని చెప్పుము. అక్కడే నీవు ఉన్నావు. అదియే క్రైస్తవ్యము. ఎవరైననూ నీ గూర్చి ఏదో చెడు చెప్పునప్పుడు, కేవలం దాని గూర్చి ఒక పెద్ద ప్రదర్శన చేయుట ప్రయత్నించుటకు బదులు, ఎక్కడో చోటకు వెళ్ళి, అందువు, "పరలోకపు తండ్రీ, ఆ మనిషి మర్త్యుడై ఉన్నాడు. అతని నుండి మీరు ఆ ఆత్మను తీసివేయాలని నేను ప్రార్థించుచున్నాను. దానిని వాని చేయనివ్వకండి. మీరు వాని జీవితమును రక్షించవలెనని నేను ప్రార్ధించున్నాను."

125దానిని అలా చెప్పువద్దు, "ప్రభువా, నేను అలా అది అనకూడదని నాకు తెలియును." సరే, అది నీ పెదవులతో చెప్పి ఉండకపోవచ్చును, అయితే అది నీ హృదయంలో కలిగియున్నావు, చూడండి. నీ హృదయములో ఉన్నది అదే లెక్కకు వచ్చును, చూడండి. నీవు దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు, నీవు వాస్తవముగా ప్రతి వ్యక్తిని ప్రేమించుదువు. ఇప్పుడు నీవు ఆ విధముగా వారి పద్ధతులను, సంగతులను ప్రేమించవు. దానిలో పాలిభాగంగా ఉండగోరవు. కాదండి. లోక సంగతులకు దూరముగా నిలచి ఉండు, అయితే కేవలం నీకు నీవే మచ్చలేనివానిగా కాపాడుకొనుము. నీవు అది చేయుటకు ఒకే మార్గము కలదు, పావురము తన ఈకెలను కలిగియుండినట్లు, అది లోపల నుండి బయటకు వచ్చును, అది వాటిని తగిలించుకొని ఇలా చెప్పనక్కరలేదు, మీరు చూచారా. "ఇప్పుడు ఈ రోజు నేను ఇదంతా తప్పుక తుడిచివేయుదును మరియు ఆ విధముగా. కాదు, దానికి లోపలి భాగములో నూనె కలిగియున్నది, ఎందుకనగా అది ఒక పావురము అయి ఉన్నది. కేవలము అదే దానిని శుభ్రంగా ఉంచును, చూడండి. అది నిజము.

126నీవు అలా చేయవా? నీవు ఆ విధముగా ఆయనను స్వీకరించవా? ఈ నూతన సంవత్సరము ముందు రోజు మీకు అది నా ఒప్పుదల అయి ఉన్నది. ఈ చిన్న గుడారమును ఒప్పించుచున్నాను. ఎంతగానో నేను మిమ్మును ప్రేమించుచున్నా, ఎంతగానో ఈ చిన్న గుంపు ప్రజలను ప్రేమించుచున్నాను! ఏదో సమయములో ఈ భవనం గుండా లోనికి నడచివచ్చి కేవలం చూచుటకు ఎంతో ఇష్టపడుచున్నాను. ఎల్లపుడూ నేను ఏది చూచుటకు ఆరాటపడుచున్నానో మీరు ఎరుగుదురు? ఆత్మతో నింపబడిన ఒక సంఘము దాని చుట్టుప్రక్కల కూడా పాపం ఉండదు. ఒక సభ్యుడు ఏదో పొరపాటు చేసిన వెంటనే, ఆత్మ దానిని బయటకు పిలుచును. దానిని ఒప్పకొనుచూ మరియు అది దిద్దుబాటు చేసికొనుటకు ముందు, అతడు తనకుతానే ఆ క్రైస్తవులతో చేరుటకు భయపడును, ఏలయనగా మీరంతా సమావేశమైనప్పుడు ఆ సమావేశములో అతడు సరిగా పిలువబడును. చూడండి అక్కడ, అది ప్రేమించదగినదిగా లేదా? అప్పుడు అపవిత్రుడు పరిశుద్ధాత్ముడు వారి హృదయములోని రహస్యములను ఒక విధమగు పద్ధతిలో వారికి చెప్పుచూ మాట్లాడును. ఇప్పుడది ఒకని మీద పనిచేసినయెడల, అది మరియొకని మీద ఉండును, చూడండి, మీరందరూ ఒకటిగా అయి, ప్రతి ఒక్కరూ ప్రార్ధనలో, ఒక వ్యక్తిగా కేవలం ఒకే వ్యక్తిగా, మన మందరం ఈ శరీరంలో సభ్యులుగా సరిగా కదలుచూ, అందరూ దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించి, అదే అత్మచే నింపబడి, అదే శరీరంలోకి బాప్తిస్మం పొందునట్లుగా ఉందుము. అది అద్భుతంగా లేదా? ఇప్పుడు, మనం అది కలిగియున్నాము. దేవుడు అది మనకు వాగ్దానము చేసెను. అయితే మొదట, మరణం, సమాధి, మరియు ఆయనతో పునరుత్థానము.

127ఇప్పుడు ప్రార్థన కొరకు మన తలలు వంచుదము. అక్కడ కొన్ని చేతిరుమాళ్ళు కూడా ఉంచబడినవి.

పరిశుద్ధ దేవా, ప్రభువా ఈ స్థలంలో పవిత్రంగా నిలబడి ఉన్నామని ఎరుగుదుము. దేవుని గృహములో మేము ఉన్నామని ఎరిగియున్నాము. దేవుని గృహమైయున్న క్రీస్తు శరీరముతో సహకరించుచున్నాము. శరీరములోని సభ్యులందరూ అంతా కలిసి ఒక సభగా కూడి ఉన్నారు. అక్కడ ఒక స్థలము నుండి ఒకరు, మరియొకరు కలసి సమకూడిరి. మరియు ఈ రోజు ఈ ఆదివారపుబడి పాఠముగా అది ఎక్కువగా చేయబడినది. అయితే, తండ్రీ, అది నీచే నియమించబడినదని నేను నమ్ముచున్నాను. పుట్టుక, పునరుత్థానము అనగా ఏమిటో, తిరిగి జన్మించుట అనగా ఏమటో మేము తెలుసుకొనునట్లు, అది ఇలాగే ఉండవలసి ఉన్నది. మేము మొదట చేయవలసినది ప్రారంభంలో సంగతులు మొదట, తిరిగి జన్మించు క్రమమునకు, మేము చనిపోవలసి యున్నాము. నీవు నీ నియమములు ఎన్నడూ మార్చవు. ప్రకృతి నియమం ఇంకా అలాగే కొనసాగుచున్నది. తిరిగి జన్మించుటకు ఏ విత్తనమైనా తప్పుక చావవలెను. అది ప్రకృతి యొక్క నియమమై ఉన్నది. మరియు తిరిగి జన్మించుటకు తప్పుక చనిపోవలెనని మేము కూడా ఎరిగి తెలుసుకొంటిమి. మరియు చాలా మంది, ప్రభువా, ఈ రోజు మమ్ములను క్షమించవలెనని ప్రార్ధించుచున్నాను. కొంత మంది వారు కలిగిన అనుభవాలపై ఆధారపడి, వారు తిరిగి జన్మించినట్లు చెప్పుకొనుచున్నారు. అయితే వారు తప్పు వృక్షానికి కొనిపోబడినట్లు వారి జీవితఫలములు చూపించుచున్నవి.

128తండ్రీ, ఆ కారణము చేత, ఈ ఉదయాన సహోదరుడు నెవిల్ ఒక వర్తమానం ఇవ్వవలెనని నాతో అన్నందున, నేను ఆదివారపుబడి పద్దతిలో బోధించుచూ అడుగుచున్నాను, కాబట్టి, తండ్రీ, ఆ ప్రజలు అది ఎరుగవలెనని నేను నా హృదయమంతటితో మరియు నేను అది ప్రేమతో చేశాను, వారికి కలిగిన కొద్ది అనుభవము మీద ఆధారపడుట కాదు, కాని వారి అనుదిన జీవితముపైన మర్యాదతో కూడిన భక్తితో ఆధారపడవలెను. వారు సంఘములో ఉన్న సమయములో ఎలాగు జీవించుదురు మరియు బయట ఒత్తిడి వచ్చినప్పుడు వారు ఏలాగు జీవించుదురు. కష్టములు వచ్చినప్పుడు సహాయము కొరకు వారు సిలువ దగ్గరకు పారిపోవుదురా? లేక వారి స్వంత ఆత్మ మరియు స్వంత ఆలోచనలలో వారు నడిచెదరా? వారు దూషించబడినప్పుడు వారు తిరిగి దూషించెదరా? తండ్రీ, అదే ప్రశ్న మాలో ఎవరైననూ మరొకనిని రక్షించుట అది పూర్తిగా అసాధ్యమని మేము చూచినప్పుడు, దేవుడు అందరికీ చాలినంత బలిని, తగిన మార్గంలో చేసెను. మేము రాగలిగిన మార్గము ఆ ఒక్క మార్గమే… ఏ సంఘం ద్వారా కాదు, ఏ మతవిశ్వాసం కాదు, ఏ సంఘ శాఖ కాదు, ఏ అనుభూతియు కాదు, అయితే క్రీస్తు మార్గము ద్వారానే. మొదటి మనిషి, నీతిమంతుడై చనిపోయెను, అతడు తన గొర్రెపిల్లతో బలిపీఠంపై చనిపోయెను మరియు ఈ ఘడియ వరకు, నీతిమంతుడైన ప్రతి ఇతర మనిషి యేసుక్రీస్తు అను తన గొర్రెపిల్లతో దేవుని ఇత్తడి బలిపీఠంపై చావవలసియున్నది. అప్పుడు మనం ఆయనతో చనిపోయాము మరియు ఒక క్రొత్త జీవితంతో నూతనముగా లేపబడితిమి. ప్రభువా, అది అనుగ్రహించండి. ఇక్కడున్న ఏ హృదయము అది పోగొట్టుకోకుండా చేయండి.

MATT 18:15•

LUKE 17:3,4

 

129ప్రభువా, ఈ మధ్యాహ్నము తిరిగి వెళ్ళుచూ, ఈ రాత్రి ఇక్కడ మరలా ఏడున్నరకు బోధించు వరుస కూటములు ప్రారంభించుటకు వెళ్ళుచుండగా, ఈనాడే అది మరలా మేము ఆలోచించునట్లు చేయండి. ప్రభువా, ఈ రాత్రి నీ సేవకులలో ప్రతి ఒక్కరిని బలమైన వార్తమానములతో మీరు దీవించవలెనని నేను ప్రార్థించుచున్నాను. అది అనుగ్రహించండి. మా ఆత్మలు నింపబడును గాక. ఇక్కడ లోనికి వచ్చుటకు చాలా దూరము నుండి నడుపుకొని వచ్చిన ఈ ప్రజలు ఈ నూతన సంవత్సర ముందు రోజున దేవుని సువార్త శక్తితో వారు నింపబడునట్లు, ఇక్కడ నుండి సంతోషించుచూ ఆనందముతో వారు వెళ్ళెదరు గాక. అది అనుగ్రహించండి, ప్రభువా, రానున్న నూతన సంవత్సరానికి వారికి ఆత్మీయ ఆహారము ఇచ్చుచూ అది అనుగ్రహించండి.

మాకు విరోధముగా పాపము చేసినవారిని మేము క్షమించినట్లు, మా అపరాధములను క్షమించుము. మీరు అన్నారు, "మీరు మీ హృదయము నుండి ప్రతీ వ్యక్తిని వాని అపరాధములను క్షమించనియెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమింపడు." కాబట్టి, ప్రభువా, మేము ప్రతి ఒక్కరిని క్షమించుచున్నాము. మేము ఈ ఉదయాన్న విశ్వసించే మా ప్రాణములను బలిపీఠంపైన ఉంచుచున్నాము. ప్రభువా, మాలో నుండి లోకజీవం యొక్క ప్రతీ చిన్న భాగమును కాల్చండి. ప్రభువా, మా బలి నుండి పొగ పైకి లేచి మీ నాసికారంధ్రములకు ఇంపైన సువాసనగా ఉండును గాక. ప్రభువా, అది అనుగ్రహించండి. మేము కాల్చబడిన గొర్రెపిల్లగా ఉండుట లేదు, కాని మాయంతటమేమే అక్కడ పాపులముగా ఉండి పాపులుగా కాల్చబడుటకు మరియు ఒక నూతన జన్మలో గొర్రెపిల్లలుగా మార్చబడుటకు అలాగు చేయుచున్నాము. దానిని అనుగ్రహించండి, ప్రభువా.

MATT 6:13•

LUKE 11:4

 

130శోధనలోనికి రాకుండా మమ్మును నడిపించండి, అయితే చెడు నుండి అనారోగ్యము కలిగించు చెడు నుండి, దుఃఖపూరితమైన దురాత్మ నుండి మమ్మును విడిపించండి. ఈ ఉదయాన ఈ భవనములో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ప్రభువా, ఈ రోజున ప్రతి వ్యాధిగ్రస్తుడూ స్వస్థపడునట్లు చేయండి. ఈ ప్రజలు ముందు ఉన్న ఈ పర్వతములు ఈ రోజున అవన్నియూ కదిలించబడవలెనని, నేను ఈ మాటలు ప్రభువైన యేసు నామములో పలుకుచున్నాను. అది అనారోగ్యమైనను, అది దురాశ అయినను, తీవ్రమైన ఉద్రేకమైనను, ఈ లోకపు ఏ సంగతి అయినను, అది మార్గములో నుండి కదిలి వెళ్ళును గాక, మరియు దేవుని వాక్యములోనికి వచ్చి వారి జీవితములో ప్రత్యక్షపరచబడును గాక. కీడు నుండి మమ్మును తప్పించుము, ప్రభువా, ఏలయనగా రాజ్యము, శక్తి, మహిమయు నీవై యున్నవి. ఆమేన్.

నేను ఆయనను ప్రేమించెదను,

నేను ఆయనను ప్రేమించెదను,

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను.

నా రక్షణను కొనెను.

కల్వరి మ్రాను మీద.

ఇప్పుడు ఒకరినొకరు కరచాలనము చేయుదుము.

నేను ఆయనను ప్రేమించెదను, నేను… (నీ చుట్టూ తిరిగి

మరియు చెప్పు, "వందనములు, నా

సోదరుడా, వందనములు!")

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను.

మరియు నా రక్షణను కొనెను

కల్వరి మ్రాను మీద (వాయించుచూ ఉండండి).

131ఈ గతించిన సంవత్సరంలో మీ అందరి దయ కొరకు మీలో ప్రతిఒక్కరికి నేను వందనములు చెల్లించగోరుచున్నాను. బహుశా ఈ రాత్రి 7:30 గంటలకు, ప్రభు చిత్తమైనయెడల, నేను వర్తమానము తెచ్చెదను. అక్కడ నేను వేటాడుతున్న సమయంలో వందనములు చెప్పుగోరుచున్నాను. నేను వారికి తండ్రిగా లేదా వారి సహోదరుడుగా ఉన్నట్లు వారు నన్ను ఆదరించారు. కాబట్టి నా యెడల దయ చూపిన ప్రజలందరికి మీకు వందనములు. సహోదరుడు మరియు సహోదరి డాచ్ మరియు సహోదరుడు రిటర్ సహోదరుడు బెన్ కూడా మరియు మీలో చాలా మంది ప్రజలు, మరియు సహోదరుడు పామర్ మరియు, జార్జియా నుండి, చుట్టు ప్రక్కల నుండి, ప్రతీ చోట నుండి వచ్చిన వారు, మీరు ఎరుగుదురు, మీకు వందనములు.

నిన్న వస్తునప్పుడు మార్గములో ప్రక్కనే, మార్గీస్ తండ్రి అతడు జబ్బుగా ఉండెనని చెప్పెను. మార్లీ మరియు రాడ్నీ ఇక్కడ ఉన్నారా? వారు లేరా? ఆ వృద్ధ వ్యక్తి ఎలా ఉన్నారు? [సమాజంలో ఒక సహోదరుడు చెప్పెను, "అతడు కొద్దిగా బాగున్నట్లు ఉండెను.] మనం… మనం ప్రార్థించెదము.

132పరలోకపు తండ్రీ, కొన్ని వారాల క్రితం కెంటకీలో రోడ్డు మీద ఒక చిన్న ఇంటి వసారా మీద నేను కూర్చున్నాను. అక్కడ వృద్ధ వయస్సులో, వణుకుచూ, అతని వెలసిన నీలి రంగు చొక్కాతో పైన వేసుకొను దుస్తులతో కూర్చుండెను. ఆయన చేయి పట్టుకుని మరియు అతని జీవితం ముగింపునకు దగ్గరగా ఉండెనని చూసాను. ఒక వృదురాలైన తల్లి కొన్ని బిస్కెట్లు మరియు మాంస ద్రవం (gravy) తీసుకొనుటకు లోపలకు ఆహ్వానించెను. ప్రభువా, వారు నీ వాక్యమును మాత్రమే గౌరవించుచున్నారు. అతడు ఇప్పుడు ఇక్కడ కేవలం ఆయన మమ్మును విడచి వెళ్ళుచున్నాడు. ఆయనను ఒక పాపాత్మునిగా చావనివ్వకండి, ప్రభువా. అది మా యొక్క… మీ సేవకుల యొక్క పొరపాటు అయి ఉండవచ్చును. ప్రభువా, ఆ బీద వృద్ధ మనిషికి ఏమియు తెలియదు, అయితే మట్టి బెడ్డలు కొట్టుచూ, తన పిల్లలు జీవించునట్లు అలా చేయుచున్నాడు, కాని అతనిలో ఒక మంచి దయా స్వభావము గల ఆత్మను కనుగొన్నాను. ఒక పాపిగా ఆయనను చావనివ్వకండి. ప్రభువా, అతని కూమార్తె మాలో ఒకరిగా ఉన్నది. ఎంతగానో ఆ వృధురాలైన మార్లీ, ఆ చిన్న భుజముల నొప్పితో భాధపడుచూ మరియు ఆమె నాకు సేవ చేసినది, అక్కడ క్రింద నిద్రించుటకు నాకు ఒక పడకను ఏర్పాటు చేయుటకు ప్రయత్నించుచూ, మరియు బల్ల మీద అల్పాహారం పెట్టినది, మరియు ఆమె, తల్లి మరియు చార్లి మరియు వారందరు, తల్లియైన కాక్స. ఆమె ఏడ్చుచున్నది, వారన్నారు, ఫోన్లో - ఆమె నాన్న వెళ్ళుచున్నాడు. అది ఆమె నాన్నగారే.

133ప్రభువా, ఇప్పుడు ఆక్సిజన్ గుడారం దగ్గరకు రండి. ఆ టెంట్ ను తట్టుట కాదు గాని, అతని హృదయ ద్వారమును తట్టండి. ఆయన దగ్గరకు మాలో కొందరు వెళ్ళుటకు మా బాధ్య తను నెరవేర్చకపోవచ్చును, ప్రభువా, అతని యవ్వన దినాలలో అతని మనసులో జాగ్రత్త కలిగియున్నపుడు మీ సేవకులలో కొందరు వెళ్లకపోవచ్చును. ప్రభువా, అందుకు క్షమించండి. ఆయనను మీ రాజ్యములోనికి తీసికొనండి. అది అనుగ్రహించుము తండ్రీ. ఇప్పుడు మేము అతనిని మీకు అప్పగించుచున్నాము. అది సాధ్యమైన యెడల, లేక అది మీ గొప్ప పధకంలో ఉన్న యెడల, మీరు అతనిని పైకి లేపినయెడల, ప్రభువా, ఇంకనూ అతనితో మాట్లాడుటకు ఒక అవకాశం మాలో కొందరికి ఉండవచ్చు, ప్రభువా, ఏమైనను అతని ప్రాణము కొరకు అది మా విన్నపము అయి ఉన్నది, ఎందుకనగా అతి త్వరలో అది ప్రయాణము చేయబోతున్నది, అది ఈ విధంగా కనిపించుచున్నది. దూరాన పొగమంచు గుండా అతనిని నడిపించుటకు ఒకడు లేకుండా, నావికుడు లేకుండా, ఓ, తెలియని దూరంలోనికి ప్రయాణించుచున్నాడు. ప్రభువా, అతడు అతని మార్గం నుండి తప్పిపోయాడు. ఈ ఉదయాన ఆ మార్గమును ఎరిగిన ఆ నావికుడు ఆ ప్రాచీన సీయోను ఓడ వైపు ఎదురుగా అతని చిన్న ఓడను లంగరు వేయుటకు వచ్చును గాక. అతడు ప్రయాణం చేయునప్పుడు అతడు నిశ్చయముగా క్షేమముగా దిగును. అది అనుగ్రహించండి, తండ్రీ, మేము మీకు అతనిని, యేసుక్రీస్తు నామములో విన్నపముతో వేడుకొనుచున్నాము. ఆమేన్.

134నేను ఆయనను ప్రేమించెదను,

నేను ఆయనను ప్రేమించెదను

(మన చేతులు పైకి ఎత్తుదము.)

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను.

మరియు నా రక్షణను కొనెను

కల్వరి మ్రాను మీద.

ఈ ఉదయాన నేను చేసిన దాని కంటె ఈ రాత్రి వర్తమానం కొంచెం త్వరగా ముగించవలెనని నేను ప్రయత్నించెదను. ఇప్పుడు బయటకు వెళ్ళుదము. నాతో మిమ్మును అందరినీ ఇంటికి తీసికొని వెళ్ళి, మీ అందరికీ ఒక మంచి విందు చేయవలెనని నేను కోరుచున్నాను. నేను చేయగలిగినప్పుడు అది నిశ్చయముగా నేను చేయుదును. అయితే ఆత్మీయముగా మాట్లాడుచున్నాను, ఆయన కృప మరియు మంచి ఫలములతో ప్రభువు మీకు నిజమైన భోజనము ఇచ్చునని నేను నిరీక్షణ కలిగియున్నాను, ఆ విధముగా నీవు ప్రేమించు, నీ రక్షకుడైన, యేసుక్రీస్తు పరిపూర్ణ వ్యక్తిత్వములోనికి ఆ విధముగా దానిని చూచి ఎదుగునట్లు చేయును. ఇప్పుడు మనం భవనం విడిచి బయటకు వెళ్ళుటకు మరియు ప్రార్థన కొరకు నిలబడియుండగా, మనం మన పాటను పాడుటకు మరియు దానికి నీవు విధేయుడవుగా ఉండి నిశ్చయత కలిగియుండగోరుచున్నాను. "యేసు నామమును నీతో తీసికొనిపొమ్ము." ఇప్పుడు మనం ఒక్క క్షణంలో ప్రకటన చేయనైయున్నాము, మనం మన పాట పాడిన వెంటనే ప్రకటన చేయుదుము. మంచిది.

యేసు నామమును నీతో కూడా తీసికొనివెళ్ళుము.

వేదన మరియు దుఃఖములతో నిండిన బిడ్డా,

అది నీకు సంతోషమును మరియు ఆదరణను ఇచ్చును.

నీవు వెళ్ళు ప్రతీచోటుకు దానిని తీసికొనిపొమ్ము

ప్రశస్త నామము (ప్రశస్తమైన నామము)

ఓ ఎంత మధురమైన (ఓ ఎంత మధురమైనది)

భూలోకము యొక్క నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము,

ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురమైన

(ఓ ఎంత మధురమైనది)

భూలోకము యొక్క నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.

యేసు నామమును నీతో కూడా తీసికొనివెళ్ళుము,

ప్రతీ ఉరి నుండి ఒక కేడెము

(ఇప్పుడు వినండి, ఏమిటి?),

శోధనలు నిన్ను చుట్టిముట్టినప్పుడు,

(నీవు ఏమి చేయుదువు?)

ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును ఊదుము.

ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురమైనది!

భూలోకము యొక్క నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము,

ప్రశస్తమైన నామము (ప్రశస్తమైన నామము),

ఓ ఎంత మధురమైనది! ( ఎంత మధురమైనది!)

భూలోకము యొక్క నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.

JOHN 3:7•

EPH 5:26

 

135ఇప్పుడు జ్ఞాపకము చేసికొనండి, యేసుక్రీస్తు ఆయన మొదటి సిద్ధాంతముగా ప్రతీ మానవజీవికి ఇది చెప్పెనని నేను నమ్ముచున్నాను: "ఒక మనిషి నీటి మూలముగా జన్మించితేనేగాని [అది వాక్యమైయున్నది, వాక్యము అనే నీటిచే కడుగబడుచున్నది] మరియు ఆత్మ మూలముగా [వాక్యమును స్థిరపరచుచున్న పరిశుద్ధాత్మ అదే పరిశుద్ధాత్మ అయి ఉన్నది], అతడు పరలోక రాజ్యమును చూడలేడు." నీవు అది నమ్ముచున్నావా? "నీటిచే," వాక్యమనే నీటిచే కడుగబడుచున్నది. వాక్యము మరియు సత్యము, ఆయనే సత్యమైయున్నాడు. "నీరు మరియు ఆత్మ," దేవుడు నాలో నివసించునట్లు చేయుటకు, ఆత్మ వాక్యమును నిర్దారించుటకు వాక్యముతో వచ్చుచున్నాడు, చూడండి. అది జరుగువరకు మనము పరలోక రాజ్యమును అవగాహన చేసికొనలేము. అది జరుగనారంభించినప్పుడు, మనము వాక్యము మనలో ఉండుట చూతుము, వాక్యమూలముగా మరియు నీటి మూలముగా వాక్యము నుండి దూరము కాకుండా నన్ను నడిపించుచూ వాక్యము తనకుతానే ప్రత్యక్షపరచుకొనుచుండెను. అత్మ వాక్యము దగ్గరకు నన్ను నడిపించును, మరియు ఆ వాక్యము నాలో జీవించుచూ, నీ జీవితములో దేవుని ప్రత్యక్షపరుచునట్లు చేయును. దేవుని రాజ్యమును నీవు ఎన్నడూ అర్థం చేసుకొనలేవు మరియు మరో విధంగా అందులోనికి ప్రవేశించలేవు. దేవుడు మిమ్మును దీవించును గాక. సహోదరుడు నెవిల్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...