దేవుడు మాకు తోడైయుండినయెడల అద్భుత కార్యములన్నియు ఏమాయెను?

దేవుడు మాకు తోడైయుండినయెడల అద్భుత కార్యములన్నియు ఏమాయెను?

1నెవిల్ సోదరుడా, నీకు వందనములు. స్నేహితులారా, శుభ సాయంకాలము. మరలా ఇచ్చటున్నాము … ఎన్నడూ లేనట్లుగా ఈ ఉదయము నాలుగు గంటలు మాటలాడితిని. అది అవమానకరము. నాలుగు గంటలు మాటలాడిన పిమ్మట నన్ను బట్టి మీరు చాలా విసుగు చెంది యుందురు, నన్ను వేదికమీద నుండి తరిమి వేయవలెనని అనుకొని యుందురు.

[బిల్ సహోదరుడా! "ఎన్నడూ చెప్పనటు వంటి చాలా సంగతులను నేడు చెప్పినారని ఒకరు చెప్పుట జ్ఞాపకము వచ్చుచున్నదని, సహోదరుడు బ్రెన్హాం యొక్క సహోదరుడైన డాక్ చెప్పుచున్నారు." అయితే, ఈ రాత్రి మీరు కోరినంత సమయాన్ని తీసికొనవచ్చును. దానిని బట్టి "మీరు చెప్పదలచుకున్న దేనిని వదిలిపెట్టరు" అని డాక్ చెప్పుచున్నాడు.] నేను దాదాపు పరిశుద్ధ గ్రంథములోని సగం లేఖనములను వ్రాసికొని యుంటిని ["ఈ రాత్రంతయూ మీరు బోధించవచ్చును అని ఎవరో చెప్పుచున్నారు."] ఇక్కడ అనేకమంది ప్రశస్త సహోదరులను మనము కలిగియున్నాము. వారి నుండి వినవలెనని మేము కోరుచున్నాము.

2ఈ ఉదయం ఆరాధనను ఎంత మంది ఆనందించి యుంటిరి, వాస్తవముగా, నాలుగు గంటలు ఆ ఎంతవరకు వెళ్ళి యున్నదో నాకు తెలియదు.

" ఆరాధన జరిగిన పిమ్మట నా సహోదరి నన్ను పైకి పిలిచి యుండెను, మరియు అది ఎవ్వరికో అయియుండదు, అది కేవలం నన్ను గూర్చే అన్నట్లుండెను," అని చెప్పెను. నేను చెప్పాను "ఆమె భర్తతో జూనియర్ నీవేమని తలంచుచుంటివి? "అని చెప్పాను. "ఓ నేను వినిన దానిని బట్టి సహోదరుడు బ్రెన్హాం చెప్పినది అంతకంటే ఉన్నతమైనదిగా నుండెను," అని అతను చెప్పెను." అయితే అదంతయూ నన్ను గూర్చే వచ్చెనను నిశ్చయత నేను కలిగి యున్నాను," అని ఆమె చెప్పినది.

ఆమె ఆ వెనుక ఉన్నదని నేను నమ్ముచున్నాను, లేదా నేను ఆమె గూర్చి చెప్పెదను, అయితే నేను దానిని ఆ విధంగా వదిలి వేసెదను. డెలోరిస్, నీవెక్కడవున్నావు? ఆమె ఇక్కడ లేదు. మంచిది, అలాగైనచో నేను దానిని చెప్పెదను. "కొద్దిగా రంగులు పులుముకొనుటను గూర్చియు, జుట్టు కొద్దిగా కత్తిరించుకొనుటయను విషయములోను దోషినై యున్నాను," అని ఆమె చెప్పెను. అది "అది గతించినది," అని చెప్పెను. ఆమె ఇంకనూ మృతి చెందలేదని ఆమె గ్రహించియున్నది. మీరు చూశారా. నూతన సంవత్సరమునకు అది ఒక వర్తమానముగా నుండునంతగా మీరు మృతి చెందవలసియున్నది. ప్రభువు తన దీవెనలను దయచేయును గాక!

3కావున, ఈ రాత్రి లోపల చాలా మందిని చూచుటకు చాలా మంచిగా ఉన్నది. మరియు "మనము సీయోను కొండపై నివసించుటకు వెళ్ళెదము," అను ఆ పాత పాట పాడుటను సహోదరుడు గ్రహాం స్నెల్లింగ్ ముగించుచుండగా సరిగ్గా అదే సమయానికి నేను వచ్చియుంటిని.

చిన్న "రబ్బీలాసన్" ఇక్కడ ఎవ్వరికీ గుర్తు లేడని నేను ఊహించుచుంటిని. ఎవరికైనా ఆయన జ్ఞాపకమున్నాడా? అవును, మీలో ఇద్దరు లేదా ముగ్గురు. సహోదరుడు గ్రహాం మరియు సహోదరుడు స్లాటర్, అతనే సహోదరుడు లాసన్ గూర్చి నేను తలంచునట్లు చేసెను. అతను ఎట్లు పాడే వాడో మీకు జ్ఞాపకమున్నదా? చిన్నవాడు, నేను అతనిని "రబ్బీ" అని పిలిచేవాడను ఎందుకనగా అతను చిన్న సమతలంగా ఉండే నల్లని టోపీని ధరించేవాడు. అతను ఒక పెంతెకోస్తు బోధకుడు. అయితే తాబేలు చిప్పలాంటి పెద్ద కండ్లద్దాలను ధరించేవాడు, మరియు నీవు సరిగ్గా "రబ్బీవలె" ఉన్నావు? అని నేను చెప్పాను, మరియు కావున మేము ఎల్లప్పుడూ అతనిని "రబ్బీ లాసన్," అని పిలిచేవారము, ఒక అద్భుతమైన చిన్న సహోదరుడు మరియు అతను … చాలా వృద్ధుడై పోయాడు, అతను వంగి నడుచుచూ వచ్చును. (కారు అతని మీద నుండి పోవుటవలన అతని మోకాళ్ళు వంగిపోయినవి.) అతను తన చంక-కర్రను లేదా తన చేతి-కర్రను ఇక్కడ ఈ ప్రక్కగా వ్రేలాడదీసెడివాడు. నేను ఒక కుర్చీలో కూర్చుండేవాడను మరియు అతను పాటలోని "ఆ క్షయమైన జీవిత చట్రములన్నియు లేచును," అను భాగమునకు వచ్చినప్పుడు, అతడు తన కర్రను చేత పట్టుకొని, భుజము నొద్దకు వచ్చి మరియు నన్ను మెడ చుట్టూ కౌగిలించుకొని, మరియు నన్ను బయటకు తీసుకొనివచ్చి, తన చేయి నా చుట్టూ వేసి మరియు "మనము సియోను కొండపై నివసించుటకు వెళ్ళుదము," అని పాడేవాడు.

1CH 16:22•

PS 105:15•

GAL 6:7

 

4ఇక్కడున్న ఎవరికైనా రబ్బీలాసన్ తెలియునా? మీలో కొంతమందికి మాత్రమే తెలియును. అటువంటప్పుడు నేను దీనిని మీకు చెప్పగోరుచున్నాను అతనికి ఒక ఆశ్చర్యకరమగు సంగతి జరిగినది. అతను నిజమైన చిన్న బోధకుడు, చక్కని సహోదరుడు. మరియు అతనికి అతనికి పెద్దగా వేతనము ఉండేదికాదు — అది అతని (mission) సంస్థ కాదు. అయితే అతనికి ఏదైతే అప్పగించబడినదో దానికి అతను సత్యముగా జీవించెనని నేను నమ్ముచున్నాను, అదే ముఖ్యమైన కార్యమైయున్నది.

మరియు అతడు బోధించుట ద్వారా సరిపడినంత డబ్బు సంపాదించుట లేదని అతని భార్య తలంచెను, కావున అతడు ఒక ఉద్యోగమును సంపాదించుకొనవలెనని కోరెను. సమయమంతయు అతడు పరిశుద్ధ గ్రంథమును చదువుచుండెను. అందుచేత ఒక దినమున ఆమెకు అతనియెడల బహుగా కోపము వచ్చెను; అతని ఒడిలో నుండి ఆమె పరిశుద్ధ గ్రంథమును లాగుకొనెను, దాని తీసికొని, మరియు పొయ్యి మంట ఎక్కువ చేసెను. మరియు దానిని పొయ్యిలోనికి త్రోసివేసినది, మరియు దానిని కాల్చివేసినది. దానికి కొన్ని నెలల తర్వాత సరిగ్గా అదే స్థలములో ఆమె కొన్ని క్రిస్‌మస్ దీపములు పెట్టుచుండెను, క్రిస్‌మస్ చెట్టు యొక్క మంట ఆమెకు తాకెను మరియు ఆమెను కాల్చివేసెను. చూడండి, నీవు దేనిని విత్తుదువో దానినే కోయుదువు. "నేను అభిషేకించిన వారిని ముట్టవద్దు నా ప్రవక్తలకు ఏ కీడును చేయవద్దు," చూశారా.

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

5దేవుని వాక్య విషయము. అక్కడ ప్రమాదము జరిగిన జనులు, మరియు పిదప సాతాను వారి… నాశనము చేయుటకు ప్రయత్నించెను. ఎవరినో లోనికి రానిచ్చుటకు అక్కడ వెనుక తట్టున వారు లేచుటను నేను చూచుచున్నాను. వారి స్థలము భౌతికంగా ఆ గదిలోనిది ప్రతిదీ మసై పోవునంతగా కాలిపోయెను. నేను అచ్చటకు వెళ్ళి యుంటిని. నేను తలంచిన ప్రకారము అక్కడ కాలకుండా ఉన్నది కేవలం ఆ పాత ఆశీర్వాదకరమైన పరిశుద్ధ గ్రంథము, మరియు నా పుస్తకము మరియు సహోదరుడు ఆస్‌బార్న పుస్తకము అయి యున్నదని నేను తలంచు చున్నాను. ఆ స్థలములో ప్రతిదీ ముడుతలు పడునంతగా కాలిపోయెను. నేను ఆ పరిశుద్ధ గ్రంథమును తీసుకొంటిని దాని వెలుపల కేవలం కొద్దిగా పొగ వాసన పట్టి యుండెను. నేను సహోదరునికి మరియు సహోదరికి ప్రభువు చిత్తమైతే ఒక దినమున, నేను ఈ వేదికపై నుండి "భూమి ఆకాశములు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు," అను అంశముపై ప్రసంగించ గోరుచున్నానని చెప్పితిని. అక్కడ అదంతయు పోయినను, వాక్యము అచ్చట నిలిచియుండెను. దేవుడు తన వాక్యము పట్ల ఎంతగా శ్రద్ధవహించునో అనునది ఆశ్చర్యముగా లేదా? మరియు అలాగైనచో ఆ వాక్యమును నీలో ఉంచుకొనుము. ఆయన నిన్ను గూర్చి శ్రద్ధ వహించును. అది నిజము.

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

6వరద వచ్చు సమయమున, ఇక్కడ ఒక రాత్రి నేను బోధించుచుంటిని, నా పరిశుద్ధ గ్రంథమును వదిలితిని. దాదాపు రాత్రికి రాత్రి 1937లో వరద వచ్చెను, అది గుడారమును తుడిచి వేయుచుండగా, ఇదే వేదికను పైకి తేలజేసెను, (అప్పుడు ఇచ్చట మరే పై కప్పును లేకుండెను), మరియు దానిని సరిగ్గా పై కప్పుకి ఎదురుగా తేలజేసెను. వాక్యము వేదిక క్రింద నుండుటవలన, అది మునుగుటకు బదులుగా అది పైకి తేలెను — దానిని అది నేరుగా పై కప్పు వరకు తీసుకొని వెళ్ళెను. మరియు ఈ ప్రాంతమంతయూ ఒక పడవలో నేను తిరిగి యుంటిని. మరియు వరద నీరు అంతయూ ఇంకి పోయినప్పుడు, అది క్రిందకి వచ్చి నేను చదువుచున్న అధ్యాయము వద్దనే తెరవబడియుండెను. "భూమ్యాకాశములు గతించును గాని నా వాక్యము గతించదు." అది వాస్తవము. ఆయన అద్భుతకరుడై యుండెను, కాడా?

7యధార్థముగా, నేను నేను చాలా త్వరగా ఇచ్చటనుండి వెళ్ళగోరుచున్నాను, ఏలయనగా చాలా మంది మంచి సేవకులిక్కడున్నారు. నేను వారందరిని వేదిక యొద్దకు పిలువ తలంచితిని, కానీ వారికై ఇక్కడ కుర్చీలు లేదు; ఏలయనగా ఇక్కడకు వారు ఒక వర్తమానమును కలిగియుంటిరి. మనము మన సంఘకాపరి నుండియు, ఇతరుల నుండియు, ఈ రాత్రికై వారి హృదయములో నున్న వర్తమానమును వినగోరుచున్నాము. మరియు నేను చాలా క్లుప్తముగా ఒక చిన్న అంశమును చెప్పుటకు ప్రయత్నించెదను.

8మరియు పిదప ఈ రాత్రి మనము ఏదో ఒకటి మొదలు పెడుతున్నాము, లేదా ఈ రాత్రి ఏదో జరుగనున్నది. ప్రభువు చిత్తమైతే, నేను, నా జీవితకాలములో ఎన్నడూ చేయనిది. గడిచిన దినమున దాని గూర్చి ఆలోచించి, మరియు సహోదరుడు నెవిల్‌ను పిలిచితిని మరియు అది ఒక గొప్ప ఆలోచనయని అతడు తలంచెను. ఈలలు వేయుట ద్వారా మరియు గట్టిగా అరచుట ద్వారా, మరియు పట్టపగాలు లేకుండా ప్రవర్తించుట ద్వారా, మరియు త్రాగుట మరియు నూతన సంవత్సరపు త్రాగుడు పోటీలు మరియు ఆ విధంగా అల్లరి చేయుటకు బదులుగా, మనము బలిపీఠము యొద్దకు వచ్చి, మరియు అర్థరాత్రి ప్రభురాత్రి భోజనమును తీసుకొనబోవుచున్నాము, … మరియు మనలో ప్రతివారు, మనము ఈ రాత్రి అనేకమంది సేవకుల నుండి వాక్యములు వినుచుండగా, మనము నిజముగా మర్యాదతో నుండెదము.

9ఇప్పుడు, గడిచిన ఆదివారపు రాత్రి నేను ఒక క్రిస్మస్ర్ వర్తమానము అందించితిని మరియు నేను సంఘమునకు, జార్జియా నుండి మరియు ఇతర స్థలముల నుండి వచ్చు జనులకు "రావద్దు" అని చెప్పితిని. ఎందుకనగా అది వారి పిల్లలను క్రిస్మసు నుండి విరమింప జేయును. వారు వారు దాని కొరకు ఎదురు చూచెదరు; వారు కేవలం పిల్లలై యున్నారు. మరియు నేను మీ కొరకు తెచ్చెదను. ఇప్పుడు, మరి ఎవరైతే రాలేదో, సహోదరుడు ఉడ్‌కి తెలియజేయుడి, మరియు వారు తెలుసుకొనెదరు, మరియు నేను మీకొరకు దాని విషయమై శ్రద్ధ వహించెదను, మరియు తీసికొనండి.

10మరియు ఇప్పుడు, ఈ రాత్రి నేను నా పాఠమును చదువు ముందు మొదటిగా ఈ ఒక కార్యమును మీకు చెప్పగోరుచున్నాను.

మరియు అవకాశమున్నయెడల, మధ్యరాత్రి వరకు ప్రసంగములో ఉండెదము. మరియు పదకొండు గంటల 40 నిమిషములు లేదా 45 నిమిషములకు మనము వచ్చి రొట్టెను తీసుకు వచ్చెదము — ప్రభువు రాత్రి భోజన, పస్కా గొర్రె — మరియు దానిని అక్కడ ఉంచి, రొట్టెను, మరియు దేవునికి కతజ్ఞతా స్తుతులు చెల్లించెదము మరియు వేదిక వద్ద నిలబడి, శిరములు మరియు హృదయములు వంచిన వారమై ప్రభురాత్రి భోజనమును తీసుకొనెదము. మరియు గది అంతయూ రికార్డర్‌లతో నిండి ఉండెనని నేను తలంచుచున్నాను. మరియు ఆ విధముగా నాకు తెలియదు. బహుశా మనము … ఏమి చెప్పితిని? ఆ సమయమునకు వారు బయటకు వెళ్ళుదురు. కావున మనము పాద పరిచర్యను కూడా జరిగించెదము. మరియు రేపు సోమ వారమైయున్నది, మరియు పట్టణము వెలుపలనుండి వచ్చిన వారికి వారు గృహముకు వెళ్ళుటకు చాలా సమయము కలిగియుండెదరు. మరియు ఇప్పుడు దేవుడు మిమ్మును దీవించునని నమ్ముచున్నాను.

11మరియు నేను తిరిగి పశ్చిమము నుండి వచ్చువరకు బహుశా మీతోనుండుటకు ఇది చివరి సమయము కావచ్చును. నేను ఆరిజోనాకు వెళ్ళుచున్నాను; బహశా మొదటిగా లూసియా నాకు, పిదప ఆరిజోనాకు మరియు కాలిఫోర్నియాకు వెళ్ళెదను. మరియు నేను తిరిగి వచ్చిన వెంటనే మరలా మీతోనుండెదనని నేను నిరీక్షించుచున్నాను. అప్పటి వరకు ప్రార్థించండి.

నేనెప్పుడూ ఎటువంటి ప్రయాణముల పట్టికను చేసుకోను. నేను ఈ రాత్రి కూటములో సహో. బోర్డర్స్‌ను చూసియున్నానని నమ్ముచున్నాను. ఈ ఉదయం తన ఆలోచనను కేంద్రీకరించవలెనని నేను చెప్పితిని మరియు అతను సంఘటనలను పొందుపరచుచుండెను, మరియు వివిధమైన ఆహ్వానములతో కూడిన ఒక వస్త్రమును అతడు గత రాత్రి నాకు సమర్పించెను. అయితే ఏదో రీతిగా ఈ సమయమున, పరిశుద్ధాత్మ నాతో ఇట్లు చెప్పెను, "ఒక స్థలమునకు వెళ్ళాము, మరియు నీవిక్కడ ముగించిన పిదప, అక్కడి నుండి నీవెక్కడికి వెళ్ళవలెనో నేను నీకు తెలియజేసెదను!" చూడండి, తరువాత ఏమి చేయవలెనో అనుదాని కొరకు, సరిగ్గా ఆ విధముగా నడిపింపబడుట. కావున ఆయన దానిని చేయుట ప్రారంభించినప్పుడు మనము ఆ గీతకు చాలా సమీపముగా నుండవలెను, మీరు చూశారా; ఎక్కడైనా ఎవరైనా పిలిచినప్పుడు కేవలము తెలిసికొనవలెను మరియు కనిపెట్టవలెను.

12ఏదో నూతన సంవత్సర నిర్ణయముల కొరకు కాదు, ఏలయనగా మనము వాటిని చేయము. అవి ఎటువంటి మంచి చేయవు, మీరు వాటిని తప్పిపోయెదరు. మా నాన్న గారు ప్రతి నూతన సంవత్సర రాత్రి పొగాకును పడవేయుట నేను చూశాను. తద్వారా మరుసటి దినమున దానిని తీసుకొనునట్లు ఎక్కడ విసిరివేసారో గమనించుకొనే వాడు, చూశారా. మరి అది ఆ విధానములో వెళ్ళుము. మరియు నిర్ణయములు చేసుకొనకూడదు. మనము కనికరము మరియు కృపల కొరకు వేడుకొందుము. దేవుని కృపకై వేడుకొనుడి.

EPH 5:27

 

13మరియు బహుశా తొందరవలన ఆ సమయములో సంస్కారమును ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము అవకాశం దొరకనియెడల, నేను…ఈ ఒక్క కార్యమును నేను చేయగోరుచున్నాను: నా ఆశలలో ఒకటి ఏదనగా మచ్చైనను లేదా ముడతయైనను లేని ఒక సంఘమును చూచుటయైయున్నది, పరిశుద్ధాత్మ … సహోదరుడా గ్రాహాం, పాపము ప్రవేశించకుండు నంతగా దేవునితో నింపబడిన ఒక సంఘమును చూచుటయే నా హృదయములో ఉన్న నిరీక్షణయైయున్నది, అది ఎక్కడ ఉన్ననూ దేవుని ఆత్మ సరిగ్గా దానిని బయటకు పిలచుచున్నది. నేను దానిని చూడగోరుచున్నాను.

మరియు నేను ఆశపడునట్టి ఒక కార్యమేదనగా, నేనెల్లప్పుడూ ప్రభువు యొద్ద నుండి ఆశించినట్లుగా, ప్రభువు యొద్దనుండి ఒక గొప్ప దర్శనమైయున్నది. గడిచిన దినమున ఉదయం 10 గంటలకు ఆయన దానిని నాకిచ్చియున్నాడు. మరియు అది నా కోరికను తప్తిపరచెను! నేను సేవకుడిగా ఉన్నప్పటినుండియు, సంవత్సరాలు, సంవత్సరాలుగా నేను దానిని చూడవలెనని కనిపెట్టియుంటిని, మరియు తుదకు అది నెరవేర్పు జరిగినది. ఇప్పుడు, నేను దేవునికి ఎంతగానో కతజ్ఞుడనై యున్నాను. దాని గూర్చి నేనేమియూ చెప్పలేదు, కేవలం దానిని వ్రాసియుంచితిని, మరియు నేను ఎల్లప్పుడూ దేనినైతే అడుగుచుంటినో ఖచ్చితంగా అది అదేయై యున్నదని నేను ఎరిగియున్నాను.

14మరియు ఇప్పుడు, నేను ప్రార్థించుచు మరియు దేవునియెడల నమ్మిక కలిగియున్నాను మరియు ఈ రాత్రి, ఈ వేదికపై ఒక క్రొత్త నా జీవితమును ఆయనకు ప్రతిష్టించుకొనుచున్నాను, నా జీవితములోని ఒక గొప్ప ఆశ ఏదనగా దేవుని ఎదుటను మరియు ఆయన జనుల ఎదుటను ఎంతో దీనుడనై యుండుటయైయున్నది. జనులతో ఆ విధంగా వ్యవహరించుట నా యొక్క గొప్ప తప్పిదమై యున్నదని ఎరిగిన పిమ్మట, అది నాలో నుండి ఎంతో బయటకు తీసివేసినది, అది అక్కడ ఉండవలసియున్నది. నాకు ఒకప్పుడు కలిగివున్న ఆనందమును దేవుడు మరల పునరుద్ధరించునని నేను నమ్ముచున్నాను. నేను ఆనందమును పోగొట్టుకున్నానని కాదు, కాదు; అయితే నా భావమేమనగా నాకు అది అధికముగా కావలసియున్నది, అధికముగా, దేవుని సేవించుటకు ఎక్కువ దీనత్వము కావలసియున్నది. ఈ రానున్న సంవత్సరములో,నేను దేవునికి వాగ్ధానము చేసి యుంటిని ఆయన నన్ను జీవింపజేసి మరియు ఆరోగ్యమును మరియు బలమును ఇచ్చినయెడల నేను దేవునికి ఒక సేవకునిగాను, మరియు మనుష్యులకు ఒక సహోదరునిగాను ఉండుటకు నా హృదయమంతటితో ప్రయత్నించెదను.

ఇప్పుడు ప్రభువు మిమ్మును దీవించును. ఒక్కక్షణము మన శిరములు వంచెదము.

15తండ్రి, మాకు చెప్పబడినట్లుగా, భూమి తీవ్రముగా కంపించి భూమధ్యరేఖను తాకుచుండగా, ఇప్పుడు మరలా అది వెనుక వైపు తిరుగును. సంవత్సరములోని అది చిన్న రోజు నుండి అతి పెద్ద రోజు వరకు. మరి కొద్ది సమయములో ఈలలు మ్రోగును, జనులు కేరింతలు పెట్టెదరు, గంటలు మ్రోగును మరియు పాత సంవత్సరము గతించి, ఒక నూతన సంవత్సరము ప్రవేశించును. మరియు తండ్రీ, నీవు మమ్మును 1961వ సంవత్సరమును చూచునట్లుగా అనుమతించినందుకు మేము మీకు ధన్యవాదములు చెల్లించుచున్నాము. మరియు మేము ఈ సంవత్సరమంతయు చేసిన పాపములను క్షమించవలెనని నిన్ను ప్రార్థించుచున్నాము. మరియు మేము చేసిన దానిలో ఏ ఒక్కటైనను మంచిదైయున్నచో, నీ నామము స్తుతింపబడును గాక. ఏలయనగా అది అయోగ్యమైన మేము కాదు కాని అది నీవే అయియున్నావు. పరిశుద్ధాత్మ చివరిగా మా తిరుగుబాటు స్థితినుండి విడిపించి మా జీవితములో దేవుని ఘనపరచు ఏదో కార్యమును చేసియుండెను. ఆయన దానిని చేసినందుకు మేము కతజ్ఞులమై యున్నాము. తండ్రీ, ఆయన ప్రతీసారి మా లోనికి చొచ్చుకొని వచ్చునట్లుగా, మరియు దేవుని చిత్తము మా జీవితములో నెరవేరునట్లుగా చేయవలెనని మేము ప్రార్థించుచున్నాము.

16మరియు ఈ రాత్రి, మా సహోదరి సంఘాలు, వాటి సంఘ కాపరులు ఇక్కడ కూర్చొని యున్నారు, (మా సహోదరుడు గ్రాహాం, మరియు దేశములో ఇతర స్థలాల నుండి వచ్చిన సహోదరులు: యుటికా, సెల్లెర్స్‌బర్గ్, మరియు జార్జిటౌన్, ఎక్కడి నుండైనప్పటికి), పాటలు పాడుటకును, ప్రార్థించుటకును మరియు దేవుని వాక్యమును వినుటకును మేము సమయమును త్రిప్పి ఈ గొప్ప ఉత్సవమును ( jubilee) జరుపుకొనుచుండగా; మరియు ఇతర దేశముల నుండి సైతం ప్రశస్తమైన ఆత్మలు మాకు సహాయము చేయుటకు ఇచ్చట కూడుకొనియుండగా. ప్రతి హృదయమును నింపండి. ప్రతి సందేహమును తొలగించండి. ప్రతి భయమును తీసివేయండి. ప్రతి అలసటను తీసివేయండి. పరిశుద్ధాత్మ మా హృదయములో కదిలింపబడి మరియు వాక్యమును విత్తనీయండి. వాక్యము విత్తబడి, రానున్న సంవత్సరములో ఫలములను తెచ్చునట్టి పొలముగా మమ్ములను ఉండనీయండి. ప్రభువా దీనిని అనుగ్రహించండి.

17ఇది నా సమయమైయుండగా, మాటలాడుటకు ఇప్పుడు ఈ సమయములో నా వంతు వచ్చియుండగా నాకు ఇప్పుడు సహాయము చేయండి. చెప్పబడు మాటలను మీరు అభిషేకించ వలసినదిగా ప్రార్థించుచున్నాను. మరియు ప్రభువా నిన్నెరుగని జనులు నీయొద్దకు తీసుకు రాబడునట్లు అవి ఎదురు చూపుతో పరిశుద్థాత్మ అభిషేకము క్రింద బయలు వెడలును గాక; నీకు మరియు అక్కడ ఉన్నవారు, నిన్ను సేవించుటకు వారు అధిక విశ్వాసమును కలిగి యుండెదరు గాక. ప్రభువా దీనిని అనుగ్రహించండి. మరియు బాగా జలుబు చేసియుండినందున మరియు ఈ ఉదయం నాలుగు గంటలు వర్తమానము వలన అలసట చెందుటవలన నా స్వరమునకు సహాయము చేయండి, నీవు నాకు సహాయము చేయుదువని నేను ప్రార్థించుచున్నాను. ఇప్పుడు మా అందరికి సహాయము చేయండి, మరియు రానున్న కూటముకై మరియు సంస్కారమునకై మమ్మును సిద్ధపరచండి.

ఈ సంఘమును మరియు దాని సంఘ కాపరియైన సహోదరుడు నెవిల్‌ను, ధర్మకర్తలను మరియు సంఘ పెద్దలను ఆశీర్వదించండి, మరియు వారు ఇంతకు ముందుకన్నా ఈ సంవత్సరము బహుధైర్యముగా సేవించెదరు గాక. వారి సేవకై, ధైర్యమునకై మరియు నా ప్రక్క ఎవరైనా ఒకరు నిలబడవలసిన అవసరతను నేను కలిగి యున్నప్పుడు వారెట్లు నిలబడిరో దానికై నీకు కతజ్ఞతలు చెల్లించుచున్నాను. సహోదరుడు నెవిల్ మరియు సహోదరుడు రాయ్రాబర్‌సన్ మరియు ప్రశస్త సహోదరులందరూ శ్రమల సమయములో మా పక్షమున నిలబడిరి మరియు పరిశుద్ధాత్మ నాయకత్వములో వారికి తెలిసినంత వరకు ఉత్తమమైన నిర్ణయములు చేసిరి. మరియు వారి నిర్ణయములు, నీ చిత్త ప్రకారముగా వున్నవని రుజువు చేయబడియుండెను, ఏలయనగా నీవు వారి నిర్ణయములను ఆశీర్వదించియున్నావు. దేవా, వారితో ఉండుటను కొనసాగించుడి. ఇప్పుడు మా అందరికి సహాయము చేయండి. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

18ఇప్పుడు, పాఠమును వ్రాసుకొను మీరు, మరియు నా కొరకు ప్రార్థించుచుండెదరని నమ్ముచున్నాను… మరియు కొద్ది నిమిషములకై, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము నుండి మీ ఏకాగ్రతను ఉంచవలెనని మీకు చెప్పగోరుచున్నాను. నిశ్శబ్దముగా వినుడి మరియు వాక్యమును వినుడి.

ఆ వెనుకనున్నవారు, వినగలుగుచున్నారా, అది సరియేనా? వినగలిగినయెడల మీ చేతులు పైకెత్తుడి. మంచిది. మరియు ఈ మైక్రోఫోను ఇంజనీర్లు గమనించినయెడల, అది వినిపించుచున్నదాయని గమనించుడి. వినిపించుచున్నదా?

JUDG 6:7-14

 

19న్యాయాధిపతులు 6వ అధ్యాయము, 7వ వచనము ఇప్పుడు, జాగ్రత్తగా వినుడి, ఏలయనగా కొద్ది క్షణములలో దీనిని చూపించబోవుచున్నాను.

మిద్యానీయులవలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను

ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చితిని.

ఐగుప్తీయుల చేతిలో నుండియు మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని మీ దేవుడనైన యెహోవాను నేనే.

మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యెహోషునకు కలిగిన ఒప్రాలోని మసక్తి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా

యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా.

గిద్యోను చిత్తము నా యేలినవాడా, "యెహోవా మాకు తోడై యుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నియు" ఏమాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.

అంతట యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము: నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా.

అది దేవునికి సంతోషకరముగా నుండినయెడల, అక్కడ ఒక పాఠ్యాంశమును నేను తీసుకొనగోరుచున్నాను, 14వ వచనమని నేను నమ్ముచున్నాను, ఇట్లు చెప్పబడినది, "దేవుడు మాకు తోడైయుండినయెడల, అద్భుత కార్యములన్నియు ఏమాయెను?"

20ఇప్పుడు, ఇశ్రాయేలు యొక్క న్యాయాధిపతుల గూర్చి మనమందరము అవగాహనగల వారమై యున్నాము. మరియు ఫిలిష్తీయులు, మిద్యానీయులు అమ్మోరీయులు మరియు ఆ ఇతరులందరు ఇశ్రాయేలీయుల పట్ల ఏ విధముగా చేసిరో ఎరిగియున్నాము. వారు వచ్చి వారు కలిగియున్న దానిని మిడతలవలె తినివేసిరి. మరియు దానిని తీసికొని వెళ్ళిపోయిరి. అయితే మీరు గమనించారా, మొదటిగా ఇశ్రాయేలీయులు దేవుని యొద్ద నుండి పడిపోవువరకు వారు దానిని చేయలేకపోయిరి.

మొదటిగా నీవు దేవుని యొద్ద నుండి దూరమవ్వనంత వరకూ, దయ్యము నిన్ను బాధించుటకు నీపై అడుగు వేయజాలదు, మీరు మొదటిగా దానిని గుర్తుంచుకొనవలెను. ఏదైనా జరిగినప్పుడు పరీక్షించుకొనవలెను, చూచారా మీరు విశ్వాసములో ఉన్నారో లేదో చూచుకొనవలెను, మీరు దేవునితో సరిగ్గా ఉన్నారో లేదో చూచుకొనవలెను, పిదప గుర్తుంచుకొనండి, దయ్యము మిమ్మును ఎంతమాత్రము బాధించడు; మీరు క్రీస్తులో ఉన్నారు.

JUDG 4:6•

JUDG 5:1

 

21మరియు ఇక్కడ ఈ స్థలంలో, మనము కొద్దిగా… దీనికి కొద్ది సంవత్సరముల క్రితం ప్రవక్తినియైన దెబోరా మరియు బారాకులు ఉండి యుండిరి; మరియు ఆమె ఎట్లు ప్రవచించి మరియు వారేమి చేయవలెనో చెప్పుచుండెడిది, మరియు అది ఖచ్చితముగా సరియే. (బారాకు, గొప్ప యోధుడు), మరియు వారెట్లు శత్రువుపై విజయోత్సవముతో జయగీతము పాడిరి. అయితే వారు గందరగోళము నుండి బయటకు వచ్చిన వెంటనే, మరలా తిరిగి నేరుగా అదే గందరగోళము లోనికి వారు వెళ్ళిపోయిరి.

అది నేటి సంఘము యొక్క పరిస్థితివలె లేదా? ఒక గలిబిలి నుండి బయటికి వచ్చిన వెంటనే మరొక దానిలోనికి అది వెళ్ళుచున్నది. అయితే కార్యసాధకము చేయవలసిన సమయము వచ్చియున్నది. మరి ఇప్పుడు అది అదే విధముగానున్నది, కార్యసాధకము చేయవలసిన సమయము వచ్చియున్నది. ఆటలాడుతున్న సంఘము అట్లు చేయక దేవునితో ఉండవలసిన సమయము వచ్చియున్నది. ఇక ఆటలాడు సంఘము అనునది లేదు. మనము కార్యనిర్వహణ లోనికి దిగవలసియున్నది. ఇక సంఘము ఆటలాడుట ఆపివేయవలెననియు, మతపరమైన కార్యములు ఆపివేయవలెననియు, నీతిపరమైన నటన కార్యములు ఆపవలెననియు మరియు ఇది కార్యనిర్వహణకు సమయమనియు అదే దేవుడు ఈ రాత్రి ప్రజల హృదయములో దీనిని ఉంచునని నేను నమ్ముచున్నాను.

నేను ఈ ఉదయము క్రొత్తజన్మ అంటే ఏమిటి? మరియు మనమెట్లు దానిలోనికి వచ్చితిమి అను అంశముపై మాటలాడుచుండగా నిశ్చయముగా అది ఇంకనూ మీ హృదయములో చొచ్చుకొని పోవుచుండెను. ఇప్పుడు మీరు తెలిసికొనిన సత్యము ఏమైయున్నదో దాని ప్రకారము జీవించుటకు సమయము వచ్చియున్నది. మీరు ఏమి చేయుచున్నారో మొదటిగా మీరు ఎరుగనియెడల మీరు విశ్వాసముతో కార్యనిర్వాహకులు కాలేరు. మీరు దానిని చేయుటకు మీరు విశ్వాసము కలిగియుండుటకు మునుపు మొదటిగా మీరు ఏమి చేయుచున్నారో మీరు తెలిసికొనవలసియున్నది.

22ఒకసారి ఎవరో నాతో చెప్పిరి, ఒక గుర్తింపు ఉన్న వైద్యుడు ఒక వ్యాధిగ్రస్తునికి సంభవించిన అద్భుతమును గూర్చి మాటలాడుచుండెను. మరియు అతడు నాతో బోధకుడా ఆ ప్రజలతో వెలుపలికి వెళ్ళి ఒక చెట్టుని తాకుడి లేదా ఒక స్థ౦బమును తాకుడి అని నీవు చెప్పినయెడల, అదే కార్యము సంభవించునని నీవు నమ్ముటలేదా? అని చెప్పెను.

"లేదండి," అని నేను చెప్పాను. ఎందుకనగా "ఒక చెట్టును లేదా ఒక స్థంబమును తాకుటలో మీరు విశ్వాసమును కలిగియుండలేరు," అని నేను చెప్పాను.

విశ్వాసమనునది అటువంటి వదులు కార్యము కాదు. అది ఏదైనా తెలియబడిన వాస్తవముపై ఆధారపడి యుండవలసియున్నది. మీరు దాని యందు విశ్వాసముంచుటకు ముందు మీరు దేని గూర్చి విశ్వాసము కలిగియున్నారో దాని గూర్చి ఏదైనా తెలిసికొనవలసియున్నది. కావున మొదటిగా ఎట్లు మరియు ఏమిటి అని మనము తెలిసికొనవలసి యున్నది — దేవుని కోరిక ఏమైయున్నది, దేవుని ప్రణాళిక ఏమైయున్నది, మరియు ఆ ప్రణాళిక ద్వారా దేవునిని ఎట్లు సమీపించవలెను అని తెలిసికొనవలసియున్నది. మరియు అప్పుడు మనము ధైర్యముగా కృపాసింహాసనము నొద్దకు నడిచి వెళ్ళగలము, మరియు మనకు వాగ్ధానము చేయబడిన ప్రణాళికను గూర్చి వేడుకొనగలము.

EPH 4:13

 

23ఇప్పుడు, వారు ఒక ఆటలాడు సంఘముగా నుండిరి. వారు ఒక గందరగోళము నుండి బయటకి వచ్చిన వెంటనే … దేవుడు వారిని విడిపించెను. అప్పుడు వారు నిజముగా దేవుని సేవించుచు ఆయనయొక్క బలిష్టమైన హస్తమును చూచుచు మరియు ఆ విధముగా ముందుకు కొనసాగుటకు బదులు వారు మరలా తిరిగి నేరుగా లోకపు కార్యములలోనికి మరలియుండిరి. కావున దేవుడు ఆగిపొమ్మని చెప్పునటువంటి సమయము వచ్చెను. మరియు అది ఆ విధముగా ఉండవలసియున్నది.

మరియు ఇప్పుడు ఇది ఆగుటకు పిలుపునిచ్చు సమయమని నేను తలంచుచున్నాను. మనము దేవుని వాక్యమును లోకములోనున్న ప్రతి సంఘ సంస్థకును, ప్రతి మనుష్యుడు చేయుటకు నిశ్చయించిన ప్రతి పధకమునకును (ఆలోచనలకు) సరిపోవునట్లు మలచి యున్నాము. ఈ విధముగా చేయునట్లు మనము వాక్యమును మలచియున్నాము, ఆ విధముగానే చేయుటకు మనము వాక్యమును మలచియున్నాము, మరియు అది మరొక విధముగా ఒక పధక మునకు సరిపోవునట్లు దానిని మలచియున్నాము. అయితే ఆగిపోవుటకు సమయము వచ్చియున్నది. సంఘము ఆటలాడుటను ఆపివేయవలెను. "ఆత్మలో నాట్యమాడుటకు సరిపడు ఆత్మను నీవు కలిగివుంటే చాలు, నీ కన్నుల ఎదుట సరిపడు కాంతులను నీవు చూడగలిగితే చాలు, లేదా నీ వెన్నులో స్పర్శ, లేదా కొద్దిగా వణకు, కొద్దిగా కదిలింపు, కొంత ఉద్రేకము వుంటే చాలు — నీవు దానిని కలిగియున్నావు!" అని జనులు చెప్పినప్పుడు, సమయము వచ్చియున్నది. నీవు దేనినో కలిగియుంటివి, అయితే నేను అది ఎటువంటి ఫలమును మొలిపించెనో చూచునంత వరకు నీవు కలిగియున్నదేమిటో నేను చెప్పజాలను.

ఈ ఉదయము మనము దానిగుండా వెళ్ళిన ప్రకారము, ఒక బిడ్డ ఒక ఎదిగిన మనిషిగా జన్మించుట మీరు ఊహించలేరు. ఆ బిడ్డ అంతవరకు ఎదగవలసియున్నది. మరియు మనము క్రీస్తులో పూర్తి స్వరూపమునకు ఎదుగుచున్నాము. ఏదో … ఈ రాత్రి ఎవరో ఒకరు మార్పు చెంది మరియు రేపు సువార్త ప్రకటించుటకు బయలువెళ్ళునట్లు కాదు. మనము క్రీస్తు యొక్క స్వరూపమునకు ఎదగవలసియున్నది.

ROM 3:21

 

24ఇప్పుడు, దేవుని ప్రజలు సమస్యలోకి చిక్కుకున్నప్పుడు, దేవుడెల్లప్పుడూ వారిని బయటకు రప్పించుటకు సత్య వాక్యముతో నిండిన ఒక ప్రవక్తను వారియొద్దకు పంపును. దేవుని ప్రజలు సమస్యలో చిక్కుకొనిన ఏ పరిస్థితిలోను దేవుడు తన వాక్యమును పంపించని సమయము లేదు. మరియు ఈ ఉదయము మనము వినినట్లుగా ఆయన వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. మరియు దానిని మీరెట్లు పరీక్షించెదరనగా అది వాక్యానుసారముగా ఉన్నదో లేదో చూచుటవలనైయున్నది. అది వాక్యానుసారముగా నున్నయెడల అప్పుడు దేవుని వాక్యము సజీవమగును.

ఇప్పుడు "ఇతడు మా సంఘమునకు ప్రవక్త," ఇతడు "మాసంఘమునకు ప్రవక్త" అని చాలామంది చెప్పవచ్చును, మరియు వారిరువురు ఒకరికి ఒకరు వ్యతిరేకముగా నుండిరి, అప్పుడు ఖచ్చితముగా ఏదో తప్పిదమున్నది.

మన మందరము ఒకే కార్యమును మాటలాడవలసియున్నది. అప్పుడు మనము వ్యతిరేకముగా కాక, ఖచ్చితముగా ఈ వాక్యప్రకారమే మాటలాడవలసియున్నది. ఆ ప్రకారమే ఒక నిజప్రవక్త వాక్యమును కలిగియున్నాడో లేదో పరీక్షించబడును. "వారి సాక్ష్యము, ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల ప్రవచనముల ప్రకారము లేనియెడల వారిలో ఎంత మాత్రము వెలుగు లేదు," అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అది సరియే. అది ఖచ్చితముగా వాక్యప్రకారమే ఉండవలసియున్నది.

EXOD 14:21•

JUDG 6:7-10

 

25మరియు దేవుడెల్లప్పుడూ, ప్రతిసారి ప్రజల యొద్దకు నిజమైన దేవుని వాక్యమును తీసికొనివచ్చు ఒక నిజ సేవకుని, ఒక నిజ ప్రవక్తను పంపును. మరియు ప్రజలను ఎల్లప్పుడూ విడిపించునది దేవుని యొక్క వాక్యమే అయియున్నది.

ఇప్పుడు, మనము గనుక వెనుకకు వెళ్ళి 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదివినయెడల, 7 నుండి 10 వరకు, ఇశ్రాయేలు దేవుని తట్టునుండి మరలా లోకము తట్టునకు తిరిగిపోయెనని మనము కనుగొనెదము. మరియు ఎచ్చటినుండో ఒకరు వచ్చెను, కనీసం అతని పేరైనను తెలుపబడలేదు … ప్రవక్త అతని పేరుప్రఖ్యాతుల కొరకు ఆసక్తి చూపెనని నేను అనుకొనుట లేదు. అతను ఒక్క విషయములో ఆసక్తి కలిగియుండెను: దేవుడు అతనిని అభిషేకించెను. అతను వారి గుంపులలో, వారి సంస్థలలో, లేక మరి దేనిలోనైనా ఒకనిగా ఎంచబడెనో లేదో అని గాని లేక అతను ఒక బిషప్పు లేక ఆర్చి బిషప్పు అయియుండెనా యను విషయములు అతనికి ఏ బేధము కలిగించలేదు. అతను కేవలము అతని హృదయములోనున్న వర్తమానము పైనే ఆసక్తి కనబరచెను. మరియు అతడు ప్రజలను తిరిగి పశ్చాత్తాపము వైపునకు మరియు అద్భుతములు చేయు దేవుడనియు, ఐగుప్తీయుల చేతుల నుండి విడిపించువాడని, ఎర్ర సముద్రము పాయలు చేయువాడనియు, మరియు అరణ్యములో వారిని పోషించిన వాడని మరియు ఎవరి యొద్ద నుండియో దేశమును తీసికొని మరియు వారికి ఇవ్వగల బలవంతుడైన దేవుడనుగ్రహింపునకు వారిని తిరిగి పిలిచెను. ఆమేన్. అది నిజ ప్రవక్తకు నిదర్శనమైయున్నది. అతడు అభిషేకించబడినవాడు మరియు ఆ ప్రజలకు అతడు దైవస్వరమై యుండెను. అది అట్లుండునని అతడు పలికెను, ఎందుకనగా వారు సమస్యలో నుండిరి.

JUDG 6:3-5•

LUKE 24:49•

ACTS 1:8

 

26ఈ మిద్యానీయులు మరియు అమ్మోరీయులు మొదలగువారు వచ్చి వారి దేశమంతటిని తినివేసితిరి. మరియు కావున శత్రువు సవాలు చేసియుండెను మరియు అతడు ఎదుర్కొన వలసియుండెను. వారి సైన్యములు దానిని చేయలేక పోయెను, మరియు వారి యాజకులు దానిని చేయలేకపోయెను, మరియు వారి సంఘములు దానిని చేయలేకపోయెను. కావున వాని సవాలును ఎదుర్కొనుటకు దేవుని యొక్క వాక్యమునకు తరుణమై యుండెను.

ఈ రోజు కూడా శత్రువు మాటలాడుచున్నాడు. అద్భుతములు జరుగుకాలము గతించెననియు, అసలు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనునదియే లేదనియు, మరియు అది కేవలం ఉద్రేకం అనియు, అది వట్టిది అని చెప్పుటకు శత్రువు ప్రయత్నించును. కావున శత్రువు సవాలు చేసియుండెను మరియు అతని సవాలును ఎదుర్కొనవలసి యుండెను. ఎప్పుడైతే సంఘశాఖలు ప్రజలను పిలిచి మరియు మరియు వారిని సంస్థగా మార్చునో అప్పుడే మనము ఆ సవాలును ఎదుర్కొనవలసియున్నది. ఆ సంస్థ స్త్రీలు జుట్టు కత్తిరించుకొనుటకు మరియు రంగులు పులుముకొనుటకు, మరియు పురుషులు అన్నివిధాలుగా జీవించుచు మరియు ట్రస్టీలుగా, సంఘ పెద్దలుగా మరియు సంఘకాపరులుగా ఉండునట్లు అనుమతించును, ఎందుకనగా వారికి పిహెచ్.డి లేదా ఎల్‌ఎల్.డి అనునవి ఉన్నవి.

అటువంటివి ఒక మానవుడు కలిగియుండవలెనని యేసు ఎన్నడూ కోరలేదు. యేసుకు కావలసినది ఏదనగా, మీరు పైనుండి శక్తి పొందువరకు యెరూషలేము పట్టణములోనే వేచియుండుడి, అప్పుడు మీరు నాకు సాక్ష్యులుగా ఉండెదరు వాని సవాలును అది ఎదుర్కొనెను. అదే శత్రువు యొక్క సవాలును ఎదుర్కొనెను. అదే ఆ కాలములో దానిని ఎదుర్కొనెను. అది ఈ దినమున దానిని ఎదుర్కొనును.

JUDG 6:7-10

 

27ఇప్పుడు, మీరు గమనించవలెనని నేనుకోరుచున్నాను. 7 నుండి 10వ వచనాలలో ప్రవక్త వచ్చుటను మనము చూచుచున్నాము. 1 నుండి 7 వరకు ప్రజలు పడిపోవుటను మనము చూచుచున్నాము. మరియు 7 నుండి 10 వరకు ప్రవక్త వచ్చి మరియు ప్రజలకు పరిహారము ఇచ్చుటను మనము చూచుచున్నాము. గమనించండి. అతను ఎచ్చటనుండి వచ్చునో మనకు తెలియదు. అక్కడ ఒక మనష్యుడుండెను, లేదా ఒక పరిసయ్యుడు లేదా కొంతకాలము యాజకునిగా ఉండెను అని అక్కడ చెప్పబడలేదు. అతని పుట్టుపుర్వోత్తరాలేవి అక్కడ తెలుపబడలేదు. ప్రవక్తలైన, వారు ఎచ్చటనుండి వచ్చెదరో తెలియదు.

2KGS 2:11

 

28ఏలియా వైపు చూడండి. బలమైన ప్రవక్తలలో, గొప్ప ప్రవక్తలలో ఏలియా చివరి వాడు మరియు ఆరవవాడై యుండెను. అతని పుట్టుపూర్వోత్తరాలు మనకేమియూ తెలియదు. అతడు ఏ పాఠశాలకి వెళ్ళియున్నాడో మనకు తెలియదు. అతను ఎటువంటి కుటుంబము నుండి వచ్చియున్నాడో మనకు తెలియదు. మనకు తెలిసిన ఒకే ఒక కార్యమేదనగా, దేవుడు అతనితో నున్నాడు. మరియు అతను వచ్చియుండెను, మరియు అతను ఎంత మర్మయుక్త ముగా వచ్చెనో అదే విధముగా వెళ్ళిపోయెను. అతను ఎక్కడో అరణ్యములో నుండి వచ్చెను, మరియు తిరిగి అరణ్యములోనికి వెళ్ళి యుండెను, మరియు వాయు రథములో పట్టబడి మరియు అగ్నిచేత పరలోకమునకు కొనిపోబడెను. అతను మర్మయుక్తముగానే వచ్చెను, మరియు అతను మర్మయుక్తముగానే వచ్చెను, మరియు అతను మర్మయుక్తముగానే విడిచి పోయెను. అతనికి ఎటువంటి పాండిత్యము లేదు. అతను ఎక్కడి నుండి వచ్చెనో, అతని తండ్రి ఎవరో, అతని తల్లి ఎవరో, అతని సహోదరులు మరియు సహోదరీలెవరో మనకు తెలియదు. మనకు తెలిసిన ఒకే ఒక కార్యమేదనగా అతను ఒక దైవజనుడై యుండెను. దేవుడు అతనిని ఎక్కిడినుండో తీసికొని మరియు అతనిని వాడుకొనెను, మరియు అతనిని తిరిగి ఎక్కడికో తీసికొని వెళ్ళెను. ఆయన సన్నిధిలోనికి. అతను ఒక దైవజనుడై యుండెను.

JUDG 6:8

 

29మరియు ఇక్కడ ఆ ఘడియకు చెందిన ఒక ప్రవక్త వచ్చెను. మరియు వారికి ప్రభువు యొక్క వాక్యము నిచ్చెను. గుర్తుంచుకొనండి, అతను వారికెన్నడూ ఏదో మానవ కల్పిత పాండిత్యమును నేర్పలేదు. ఆయన చెప్పెను "ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన ప్రభువును నేనే, నా బలమైన హస్తమును కనబరచితిని, నా శక్తిని కనబరచితిని." గిద్యోను సరిగ్గా అక్కడే కూర్చొని ఆయన చెప్పునది వినుచుండెనని నేను ఊహించుచున్నాను. "ఈ కార్యములు చేసిన దేవుడను నేనే. మరియు ఇదంతయు నేను మీ కొరకే చేసియున్నాను, అయిననూ నా ఆజ్ఞలకు లోబడక యుంటిరి. దీనంతటిలో, దానిని మీరు చేయకపోతిరి."

JUDG 6:11

 

30ఇప్పుడు, బహుశా మిమ్మును ప్రోత్సాహపరచగల మరియొక కార్యమును మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను. ఆ ప్రవక్త యొక్క వర్తమానము ముగిసిన వెంటనే ప్రభువు రంగము మీద ప్రత్యక్షమాయెను. ఆమేన్. అతను తన వర్తమానమును ఇచ్చిన వెంటనే, ప్రభువు ఒక వక్షము క్రింద ప్రత్యక్షమాయెను. ప్రవక్త వర్తమానము తరువాత ప్రభువు వచ్చెను, వృక్షము క్రింద కూర్చొనియుండెను. ప్రవక్త ఇచ్చెను… ప్రజలు పడిపోయిరి,వారి వారి సిద్ధాంత ములలోనికి వెళ్ళియుంటిరి. దేవుడు తన ప్రవక్తను పంపెను. ప్రవక్త తన వర్తమానముతో వెళ్ళిన వెంటనే విడుదల కొరకై ప్రభువు ప్రవక్త యొక్క వర్తమానమును వెంబడించెను.

ఓ మనము గొప్ప సమయములో జీవించుచున్నాము. ప్రవక్త రంగము మీద నుండి వెళ్ళిన వెంటనే, ఏమి జరిగినది? ప్రభువు రంగము మీదికి వచ్చెను. యోహాను రంగము మీదనుండి వెళ్ళిన వెంటనే, ప్రభువు రంగము మీదికి వచ్చెను! దేవుడెట్లు క్రియ చేయునో అది చాలా అసాధారణముగా నుండును, అయితే ఆయన దానిని చేయును — మర్మయుక్తమైన విధానములో క్రియ చేయును.

JUDG 6:11

 

31ఇక్కడ మనము లేఖనమును చదివి యుంటిమి, గిద్యోను భయపడి, ఫిలిష్తీయులు లేదా మిద్యానీయులు తనను కనుగొనకుండవలెనని గానుక చాటున గోధుమలను దుళ్ళగొట్టు చుండెను. అతను మరియు అతని తండ్రి వారి శీతాకాల ఆహారమునకై వారికి మరుగై యుండునట్లు రహస్యముగా దుళ్ళగొట్టుచుండెను, ఎందుకనగా వారు కేవలం మిడుతలవలె వచ్చిరి మరియు వారు కలిగియున్నదంతయు తీసికొనిరి.

32దయ్యము ఆ ప్రకారమే చేయును మనము చిన్న సంఘమును ప్రారంభించెదము, అంతయూ చక్కగా కొనసాగుచుండును. ఇది సత్యమని ఎంతమంది బోధకులకు తెలియదు? ప్రతిదియూ చక్కగా కొనసాగే సమయములో, ఎవరో ఒక అనుకరించువాడు సరిగ్గా ఆ గుంపులోనికి వచ్చును, మరియు దానిని ముక్కలుగా చీల్చును. అది నిజము, తనకు చేతనైతే ఒక వ్యక్తి నుండి సంఘమును లాగివేయును, చూడండి. అది దయ్యమైయున్నది — మిడతలవలె లోనికి వచ్చి మరియు ఏదైతే ఇవ్వబడెనో దానిని తినివేయును. ఇప్పుడు, ఎప్పుడైతే …

GEN 18:1,2•

JUDG 6:12

 

33ఖచ్చితముగా గిద్యోను లేఖనానుసారమైన వ్యక్తియైయుండెను. ప్రభువు దూత అతనితో చెప్పినప్పుడు …

మరియు మీరు గమనించినయెడల, ఇక్కడ అది ప్రభువు దూత కాదు. అది ఇట్లు చెప్పబడినది, మరియు ప్రభువు పెద్దక్షరముల ప్ర-భు-వు (L-O-R-D) అది ఒక దూత కాదు; అది "దేవుడై" యుండెను. అరణ్యములో అబ్రహాముకు ప్రత్యక్షమై మానవునివలె కన్పించినట్టు, అది ఒక మానవునిలో దేవుని రూపములోనున్న ఒక థియోఫనీ అయియుండెను. కావున, వర్తమానికునిగా ఉండుటను బట్టి, ఆయన ప్రభువు దూతగా నుండెను.

మరియు ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. మరియు ఆయన ఇట్లు చెప్పెను, "పరాక్రమముగల బలాఢ్యుడా," ఆయన తీసికొని మరియు అతని ద్వారా ఇశ్రాయేలును విడిపించబోవుచుండెనని చెప్పెను.

JUDG 6:12-14

 

34మరియు గిద్యోను ఆ ప్రశ్నను అడిగి యుండెను. అతను ఎటువంటి ఒక లేఖనాను సారమైన మనుష్యుడైయుండెను. ఎవరైతే ఎరుగుదురో అటువంటి మనుష్యుని యొద్దకే దేవుడు వచ్చును. గిద్యోను ఇట్లు చెప్పెను, "దేవుడు మాకు తోడైయుండినయెడల, నీవు వర్తమానికుడవైనయెడల, అలాంటప్పుడు ప్రవక్త మాకు చెప్పినటువంటి అద్భుతకార్యములు ఏమాయెను"? దేవుడు వెళ్ళిన ప్రతిచోట, ఆయన అద్భుతములు ఆయనను వెంబడించునని అతనికి తెలియును. దేవుడు ఎక్కడ వుండునో, అక్కడ అద్భుత కార్యములుండునని అతనికి తెలియును.

మరియు ఈ దినమున కనీసం అద్భుత కార్యములను నమ్మని ప్రజల మధ్య దేవుడు క్రియ చేయునని మీరు ఎట్లు ఊహించగలరు? అది ఎట్లు జరుగును?

మరియు ఆయన "అతనిని పరాక్రమముగల బలాఢ్యుడా," అని పిలిచి ఇప్పుడు, "దీని ద్వారా, నీవు ఇశ్రాయేలును విడిపించుచున్నావు," అని చెప్పెను.

ఇప్పుడు, చూచుటకు అక్కడ ఒకమనుష్యుడు కూర్చుండినట్టుగా అది ఉండెను, మరియు అతను మనుష్యుడై యుండెను. మరియు అతను ఆయన వైపు చూచెను. మరియు అతను ఇట్లు చెప్పెను, కాదు ప్రభువా, "దేవుడు మాకు తోడైయుండినయెడల, ఈ శ్రమంతయూ మాకేల సంభవించెను? మరియు మాకు చెప్పబడిన అద్భుత కార్యములు ఏమాయెను? దేవుడు చేయునటు వంటి కార్యములు ఏమాయెను"?

JUDG 6:13•

HEB 13:8

 

35ఇప్పుడు, వర్తమానికుడు సరియో కాదో నమ్ముటకు ఒక మంచి మార్గము కలదు. అతడు ఒక భక్తి ముసుగును వేసుకొన్నయెడల, అతను ఆ అద్భుతకార్యములు చేయు శక్తిని నిరాకరించును. అతడు దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానికుడైనయెడల, అతను కేవలం మాటలాడుట మాత్రమే కాదు కాని దానిని అతను ఉత్పత్తి చేయవలసియుండెను, మరియు తాను ఏ దేవుని గూర్చియైతే మాటలాడుచున్నాడో, ఆయన తనతో ఉన్నాడనియు మరియు తనలో ఉన్నాడనియు చూపించవలసియున్నది.

ఆయన చెప్పెను, "దేవుడు మాతో నున్నయెడల, ఆయనయొక్క మహత్తరమైన అద్భుతములు ఏమాయెను?" ఎందుకనగా మేము అర్థము చేసికొనుచున్నాము… గిద్యోను ఎంత లేఖనానుసారముగా వున్నాడో వినండి. ఇంకొక విధానములో, అతను చెప్పెను ఒకవేళ… దేవుడు మహత్తరమైన కార్యములు చేయు గొప్ప దేవుడని మేము గ్రహించియుంటిమి. ఆయన అద్భుతములు చేయు గొప్ప దేవుడై యుండెను. మరియు "ఆయన మా పక్షాన ఉండినయెడల, మరియు ఆయన మాతో ఉండినయెడల, ఆయన నిన్నా, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నయెడల, ఆయన అద్భుత కార్యములన్నియు ఏమాయెను? క్రియారూపములో దేవుని నేనెక్కడ చూడగలను? ఆయన మా పక్షమున ఉన్నయెడల ఆయన ఎక్కడ నున్నాడు"?

36పరాక్రమము గల బలాఢ్యుడు వెనుక పురాతన వాక్యమును పరిశీలించి అది నిజమేనని తెలిసికొనెను, ఎందుకనగా అతను దీనిని ఎరిగియుండెను, అదేదనగా దేవుడు సహజాతీతుడై యున్నాడు. మరియు ఎక్కడైతే సహజాతీతమైన వ్యక్తి యుండునో, ఆయన సహజాతీతమైన సూచనలు చేయును, ఎందుకనగా సహజాతీతమైనది ఆయనలో నుండెను. మీరు దానినుండి బయటకి వెళ్ళలేరు.

గాలిలావీచుట అనునది లేకుండా మీరు గాలిలో ఎట్లు నిలబడగలరు? తడవకుండా మీరు నీటిలోనికి ఎట్లు దిగగలరు? నీరు తడిగా వుండును. అది దానియొక్క రసాయనమై యుండెను. అది తడిగా నుండును. మరియు మీరు నీటిలోనికి దిగినప్పుడు, మీరు తడిచెదరు. నిజము.

మరియు మీరు సహజాతీతమగు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, అక్కడ సహజాతీతమగు దేవుని యొక్క సహజాతీతమగు సూచనలు మరియు సహజాతీతమగు కార్యములు ఉండును.

JUDG 6:13

 

37కావున, దేవుడు మాకు తోడైయుండినయెడల కార్యములు ఏమాయెను, అద్భుత కార్యములుండును. "దేవుడెక్కడ వుండునో అక్కడ దేవుని యొక్క సూచన ఉండును."

మహిమ! అది అదేయైయున్నది! చూడండి, దేవుడెచ్చటనుండునో అక్కడ అద్భుత కార్యములుండును. దేవుడెక్కడవుండునో అక్కడ దేవుని యొక్క సూచన ఉండును.

మరియు గిద్యోను ఎంతో లేఖనానుసారముగా ఇట్లు చెప్పెను, "ఈ కార్యములు ఏమాయెను"? ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ విధముగా నేను ఒక నరుడను, బహుశా యాభై సంవత్సరముల వాడను, అతడిట్లు చెప్పవచ్చును. "మరియు వారు అద్భుత కార్యములు చేయు దేవుని గూర్చి మాటలాడుట నేను వినియున్నాను. మరియు నేను సంఘమునకు వెళ్ళియుంటిని, మరియు నేను యాజకులను నమ్మియుంటిని, మరియు నేను ప్రవక్తలను నమ్మియుంటిని, మరియు నేను వ్రాయబడిన వాక్యమును, గ్రంథపు చుట్టలను నమ్మి యుంటిని. మరియు దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చునప్పుడు, ఏదో సంభవించునని నేను గ్రంథపు చుట్టలలో చదివియుంటిని." మరియు మస్తకి వృక్షము క్రింద ఒక మనుష్యుడు కూర్చుండి యుండెననుట తప్ప గిద్యోనునకు మరేమియు తెలియదు. ఆమేన్. అతడు ఎరిగినదంతయూ అదేయైయున్నది. అతను ఒక మనుష్యుడై యుండెను. అతడు ఇట్లు చెప్పెను, ఇప్పుడు, "దేవుడు మాతోనున్నయెడల, అతని అద్భుత కార్యములు ఎక్కడనున్నవి? మేము వాటిని చూడగోరుచున్నాము."

అది ఎంత లేఖనానుసారముగా నున్నది! ఎందుకనగా సహజాతీతమైనది ఎక్కడ ఉండునో, దేవుడు మరియు ఆయన సూచన అక్కడ ఆయనతో ఉండును. దేవుడెక్కడ ఉండునో, దేవునితో దేవుని యొక్క సూచన ఉండును. దానిని మనము ఎరుగుదుము. ఆయన తన ప్రజలతో ఉన్నయెడల, వారు ఆయన యొక్క సూచనలను చేయుదురు. ఖచ్చితముగా ఆ రీతిగా.

JUDG 6:11-13,21

 

38గిద్యోను కలిగియున్న ప్రశ్న అదేయైయున్నది, "దేవుడెక్కడ ఉన్నాడు? దేవుడున్నట్లైతే, దేవుడు మాతో నున్నయెడల, అప్పుడు ఆయన సూచన ఎక్కడ వున్నదో నన్ను చూడనివ్వండి. ఆయన వాటిని చేయునని మాకు చెప్పబడియున్నది; మరియు ఈ గొప్ప పని నా ముందున్నయెడల…"

బహుశా వృద్దుడచ్చట నిలబడి యుండవచ్చును, మరియు అతను చూచుటకు వృద్ధునివలె ఉండెను. అతని చేతిలో ఒక కర్ర ఉండెను అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా రేపు ఏదో సమయమున 6వ అధ్యాయమంతయు చదవండి.

ఆయన తన చేతిలో ఒకకర్రను కలిగియుండెను, ఆ వృక్షము క్రింద కూర్చొని చూచుటకు వృద్ధునివలె నుండెను. మరియు ఆయన అతనిని "పరాక్రమముగల బలాఢ్యుడా," అని పిలిచెను. మరియు దేవుడు ఈ కార్యమును చేయబోవుచున్నాడని అతను చెప్పెను. మరియు, "దేవుడు నీతోనున్నాడు," అని ఆయన చెప్పెను.

అలాగైనచో "ఆయన అద్భుతకార్యములు ఏమాయెను? సహజాతీతమైన దేవుడు ఇక్కడ ఉండినయెడల, దేవుని యొక్క సహజాతీత క్రియలు ఎక్కడ? అని అతను అడిగెను."

JUDG 6:13•

HEB 13:8

 

39ఈ రాత్రి దానిని మన సంఘముల నడుమ తేలికగా చెప్పవచ్చును. "ఒకప్పుడు జీవించిన ఆ దేవుడెక్కడ? ఆయన మరణించియున్నాడా? ఆయన వెళ్ళిపోయాడా? దూరమున నున్నాడా? ఆయన ఏదైనా ప్రయాణములో నున్నాడా."

లేదండీ, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా నున్నాడు. మరియు మేము దేవునివారమని మనము చెప్పుకొనినయెడల, అప్పుడు దేవుడు ఎక్కడ నున్నాడో మనము చూద్దాం. దేవుని సూచనలను మనము చూద్దాం. ఈ గుడారము దేవుని కొరకు నిలబడినయెడల, దేవుడు మన మధ్యలో కదలుటను మనము చూడగలము. రాజ్యములోనికి ఆత్మలు జన్మించుటను మనం చూడగలము. జీవితములు తిన్నవగుటను మనం చూడగలము. వ్యాధిగ్రస్తులును, మరియు గ్రుడ్డివారిని, చెవిటివారిని చూడండి ఆయన బలమైన కార్యములు నిర్వహించుటను మనము చూడగలము. దేవుడు మన మధ్యలో ఉండుట!

"దేవుడు మా పక్షమున ఉన్నయెడల, ఆయన అద్భుతకార్యములు ఏమాయెను"? అని అతను ప్రశ్నించెను.

DEUT 18:15•

MATT 9:2-7•

MARK 2:2,5-12•

LUKE 5:20-25•

JOHN 10:33,37,38•

1JN 2:15

 

40ఇప్పుడు, దేవుడు తన ప్రజలతో, మరియు తన ప్రజలలో ఉండినయెడల, అతను … ఆ వ్యక్తి సహాయము చేయుట కాదు కాని, దేవుడు చేసిన అదే కార్యమును చేయును, ఎందుకనగా ఇక అది ఆ వ్యక్తి ఎంత మాత్రము కాదు; అది దేవుడు మానవునిలో ఉండుటయైయున్నది. ఆ మనుష్యుడు పాపము చేసినయెడల, అప్పుడు అక్కడ దేవుడు లేడు. అతను లోకమును ప్రేమించినయెడల, అప్పుడు దేవుడెక్కడ లేడు. మరియు పాపముతో దేవునికి ఎటువంటి సంబంధము లేదని మనకు తెలియును. ఇప్పుడు ఒక్క క్షణములో దీనికి ఒక లేఖనమును నేను మీకిచ్చెదను.

యేసు, భూమి మీదనున్నప్పుడు, ఇదే ప్రశ్న ఆయనను అడిగిరి. "నీవు మనుష్యుడవైయుండిన, నిన్నునీవు దేవునిగా చేసికొనుచున్నావు?" వారు తెలిసికొనగోరిరి.

ఆయన పక్షవాయు రోగముగల వానిని స్వస్థపరచినప్పుడు, " నీ పాపములు క్షమించబడినవి," అని ఆయన చెప్పెను.

అతడు చెప్పెను, "ఇప్పుడు, ఒక్క నిమిషము ఆగుము. నీవు మనుష్యుడవై యుండి పాపములు క్షమించుచున్నావా?"

"మనుష్యకుమారునికి పాపములు క్షమించుటకు లేదా స్వస్థపరచుటకు భూమిపై అధికారమున్నదని మీకు తెలిసియుండవచ్చును; ఏది సులభమైనది, 'నీ పరుపు నెత్తుకొని నడువమని చెప్పుటయా, లేదా నీ పాపములు క్షమించబడినవని చెప్పుటయా?"' అని ఆయన అడిగెను. మరియు పిదప ఆయన ఆ మనుష్యునితో పలికెను, అతను లేచి నిలబడి మరియు నడిచి వెళ్ళెను.

మరియు పరిసయ్యులు ఆయనను ప్రశ్నించిరి.

41"మరియు, మీరు నన్ను నమ్మనియెడల, నేను చేయు సూచనలు నమ్ముడి," అని యేసు చెప్పెను. చూడండి, మోషే వంటి ఒక ప్రవక్త లేచును, మరియు ఆయనే మెస్సీయాయై యుండును అని వారికి చెప్పబడియుండెను. మరియు "నేను నా తండ్రి క్రియలు చేయనియెడల, అప్పుడు నన్ను నమ్మకుడి; నాది తప్పు అనుకొనుడి. అయితే నేను నా తండ్రి క్రియలు చేసినయెడల, మీరు నన్ను నమ్మనియెడల అప్పుడు ఆ క్రియలను నమ్ముడి. ఆ క్రియలు ఏమిచేయును? నేనెవరినో అవి మీకు చెప్పును. అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. అవియే నాకు సాక్ష్యము. నేను ప్రెస్బిటేరియన్ సంఘమునకు చెందినవాడను లేదా పెంతెకోస్తుకు చెందినవాడను అను నా సాక్షాధారములు కాదు, నేను నా సహవాసపు కార్డును చూపగలను — అయితే నేను చేయ క్రియలు, దేవుని యొక్క సూచనలు, మెస్సీయా యొక్క సూచనలు, అవియే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చునవైయున్నవి," అని ఆయన చెప్పెను.

DEUT 18:18,19•

JUDG 6:13•

JOHN 5:39•

JOHN 14:12

 

42యోహాను 14:12లో, (మీరు గనుక లేఖనమును వ్రాసుకోదలచినయెడల), పరిశుద్ధ యోహాను 14:12లో "నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలను చేయను," అని యేసు చెప్పెను. ఆమేన్.

సహోదరులారా, అదేమైయున్నది? దేవుడు మన పక్షమున వున్నయెడల ఆయన అద్భుత కార్యములు ఏమాయెను? దేవుడు మనలో నున్నయెడల, అప్పుడు మనతో వచ్చిన సమస్య ఏమిటి? ఎక్కడో ఏదో తప్పిదమున్నది. అవును.

"మీరు నన్ను నమ్మనియెడల, నేను చెప్పునది నమ్మనియెడల, నన్నుగూర్చిసాక్ష్యమిచ్చున దేదో గమనించుడి, ఎందుకనగా అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చునవి. మోషేవంటి ప్రవక్త లేచునని ప్రభువైన మీ దేవుడు చెప్పెను. మరియు ఈ ప్రవక్త మాట ఎవడు వినకుండునో వాడు జనములలో నుండి కొట్టివేయబడును. మెస్సీయాను ఒక సూచన వెంబడించుచుండవలెను." మరియు "మెస్సీయా యొక్క ఆ సూచన నన్ను వెంబడించనియెడల, అప్పుడు నన్ను నమ్మకుడి," అని యేసు అనేక మాటల్లో చెప్పెను. అయితే "మెస్సీయా సూచన నన్ను గూర్చి సాక్ష్య మిచ్చినయెడల, అప్పుడు సూచనను నమ్ముడి. ఎందుకనగా నేను తప్పు అని మీరు తలంచినయెడల, సూచన నిజమైయున్నది, ఎందుకనగా అది లేఖనానుసారమైయున్నది." హల్లేలూయా!

JUDG 6:18-21

 

43గిద్యోనుకు కావలసినది అదేయైయున్నది. గిద్యోను నిలబడినది అక్కడేయైయున్నది. "ఓ, మాతో నున్న దేవుడు ఒకరుండినయెడల, ఆయన దేవుడు అను సూచనను మేము చూడగోరుచున్నాము." దేవుడేమి చేసెను?

ఆగుము, "నేను వెళ్ళి అర్పణమును తెచ్చెదను," అని గిద్యోను చెప్పెను. మరియు అతడు బయటికి వెళ్ళి మరియు ఒక ఆవును లేదా ఒక గొర్రెపిల్లను వధించి మరియు దానిని వండెను. అతను రొట్టెలను మరియు గొర్రెపిల్లను తీసికొనివచ్చి అక్కడుంచెను.

మరియు దూత ఇట్లు చెప్పెను, "నేనిక్కడ వేచియుండెదను." సమస్త కార్యములు రుజువు చేయుదును. వాక్యముతో దానిని పరీక్షించుము. మరియు బహుశా రెండు లేదా మూడు గంటలు, "నేనిక్కడ వేచియుండెదను," అని ఆయన చెప్పెను.

గిద్యోను పిండితోను, మరియు మాంసముతోను మరియు అది వండిన నీళ్ళతోను వచ్చెను మరియు "ఇప్పుడు, దీని ద్వారా నీవు గ్రహించెదవు. దానిని ఇది రుజువు చేయును," అని దూత చెప్పెను.

అతడు ఆ వండిన నీళ్ళను పానార్పణముగా నుండునట్లు నేలపై పోసెను. మరియు అతను పిండిని మరియు మాంసమును తీసికొని అతను ఎక్కడైతే ధాన్యమును దుళ్ళగొట్టుచుండెనో, అక్కడ ఒక రాతి మీదనుంచెను.

మరియు ఆయన వృద్దునివలె తన చేతిలోనున్న కర్రను తీసికొనెను మరియు దానిని తాకెను. మరియు ఆయన దానిని తాకినప్పుడు, అగ్ని ఆ రాతి నుండి వెడలెను మరియు ఆ అర్పణమును కాల్చివేసెను. అదేమైయున్నది? ఆయన ఏమైయున్నాడో రుజువు చేసికొనుటకు అతనిని తిరిగి లేఖనము నొద్దకు తీసికొని వచ్చెను.

44ఈ ఉదయం నేను చెప్పినట్లు అదే, అదే దేవుడు కర్మేలు పర్వతము మీద ఏలియాతో నుండెను. మీరు మీ ప్రాణమును ఆయన తీర్పు యొక్క ఇత్తడి బలిపీఠముపై ఉంచినప్పుడు ఏమి జరుగును? ఆయన అదే దేవుడైయున్నయెడల, ఆయన అర్పణమును స్వీకరించును. మీరు దానిని యదార్థతతో ఆయన బలిపీఠముపై అర్పించిరి గనుక ఆయన ఆ అర్పణమును కాల్చివేయును, మరియు లోకము మీలో నుండి వెళ్ళిపోవును. కేవలం అదంతయూ కాల్చివేయబడును, అర్పణము స్వీకరించబడును. అవును.

"నీవు దేవుడవైనయెడల, మరియు మా పితరులు చెప్పినట్లు అద్భుత కార్యములు చేయు పరిశుద్ధ గ్రంథము యొక్క దేవుడు నీవేయైనయెడల, నీవు ఒక అద్భుతము చేయుట నన్ను చూడనిమ్ము, లేదా దేవుడు నన్ను కలిసికొనెను అని నేను తెలుసుకొనునట్లు ఏదో ఒక అద్భుతమును నన్ను చూడనిమ్ము."

45ఇప్పుడు, ఇది నన్ను చెప్పనివ్వండి. దేవుడింకనూ దేవుడిగా నుండిన యెడల, దేవుడు గతించిన దినములలో నుండినట్లుగా ఆయన అదే దేవుడిగా నుండినయెడల, మీరు వెళ్ళి బోధకునితో కరచాలనము చేయవలసిన పనిలేదు. మీరు వెళ్ళి ఒక పుస్తకములో మీ పేరు నమోదు చేసికొనవలసిన పనిలేదు. అవన్నియు సరియే — దానికి ఎటువంటి వ్యతిరేకత లేదు. అప్పుడు నీవు తిరిగి వెళ్ళి పుస్తకములో నీ పేరును బట్టి ఒక సంఘసభ్యునిగా మారెదవు. మరియు వారు నీకు ఒక ఉత్తరము ఇచ్చెదరు మరియు నీవు దానిని కలిగియుందువు. మరియు ఏదైనా తప్పిదము జరిగిన వెంటనే, మీరు ఎట్లు మండిపడెదరో నాకు తెలియదు, మరియు నీవు దానిని వేరొక సంఘమునకు తీసికొని వెళ్ళెదవు. మరియు అక్కడ ఏదైనా తప్పిదము జరిగిన వెంటనే, అప్పుడు నీవు వేరొక సంఘమునకు దానిని తీసికొని వెళ్ళుదువు. మీరు చూడండి, మీరు మొదటి స్థానములోనే సరియైనది చేయలేదు. దేవుడు దేవుడిగా వుండినయెడల, నీ పాపపు ఆత్మను ఆయన యొక్క బలిపీఠముపై నుంచుము, మరియు ఆయన తన వాక్యముతో మరియు తన శక్తితో దానిని తాకును. మరియు ఆయన దేవునిగానే వున్నయెడల లోకము మీలో నుండి వెళ్ళిపోవును, మరియు అప్పుడు మీరు ఒక నూత సృష్టిగా మారెదరు.

HEB 13:8

 

46ఆయన పాత నిబంధన యొక్క దేవుడైయుండెను. ఆయన క్రొత్త నిబంధన యొక్క దేవుడైయుండెను. "ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు."

మరియు అప్పుడు సహజాతీతుని ద్వారా సహజాతీతమైన క్రియ జరిగి యుండెనని మీ హృదయాంతరంగములో మీకు తెలియును. మీరు ఒకప్పుడు త్రాగి, ప్రేమించిరి, ముఖమునకు రంగులు పులుముకొనిరి, మరియు పొట్టిజుట్టు కలిగియుంటిరి, మరియు ఇతర కార్యములను మీరు చేసిరి మరియు ఏదో జరిగెనని మీరు తెలుసుకొనియుంటిరి, మరియు పాతాళములోనున్న దయ్యములన్నియు తిరిగి ఆ కార్యములు మీతో చేయించలేక పోయినవి. ఏదో జరిగినది, దేవుడు, ఒక అద్భుతము జరగించెను.

ఆయన ఏమి చేసెను? మీ రోత హృదయమును మార్చివేసెను, మీ కోరికలను మార్చివేసెను, మీ స్వభావమును మార్చివేసెను. సహజాతీతమైన దేవుని ద్వారా, సహజాతీతమైన వాక్యము ఒక కాలబద్ధుడైన జీవిని నిత్యత్వపు జీవిగా మార్చెను. ఆమేన్! లోకమును మీలో నుండి తీసివేసి మహిమ నిరీక్షణయగు క్రీస్తును మీలో ఉంచెను. మరియు మీరు ఆయన ఆత్మతో నింపబడి ఆయనను కలిసికొనుటకు సిద్ధముగా నుండిరి.

JUDG 6:13

 

47దేవుడు దేవుడిగా నుండినయెడల, ఆయన అద్భుతకార్యములు ఏమాయెను? దేవుడు మనతో నున్నయెడల, ఆయన అద్భుతకార్యములు ఏమాయెను?

దేవుడు మెతడిస్టు సంఘముతో నుండినయెడల, ఎందుకు స్త్రీలందరూ పొట్టి జుట్టును కలిగియున్నారు? దేవుడు బాప్టిస్టు సంఘముతో నున్నయెడల ఎందుకు (వారిలో అనేకులు) సంఘకాపరులు సిగరెట్లు కాల్చుచున్నారు? ఎందుకొరకు వారింకనూ రోగులను స్వస్థపరచుటకు, మృతులను లేపుటకు, మరియు భాషలతో మాటలాడుటకు మరియు భాషలకు అర్థము చెప్పుటకు మరియు ప్రవచన వరములు కలిగియుండుటకు దేవుని యొక్క శక్తిని నిరాకరించుచున్నారు? పాత నిబంధన యొక్క దేవుడు మరియు క్రొత్త నిబంధన యొక్క దేవుడు ఇంకనూ ఒకే దేవుడైయున్నయెడల వారింకను దానిని ఎందుకు నిరాకరించుచున్నారు? క్రొత్త నిబంధన యొక్క దేవుడైన పరిశుద్ధాత్మ ఇంకనూ దేవుడిగా వుండెనని పెంతెకోస్తువారు చెప్పుకొనుచుండగా మరి వారెందుకొరకు అడ్డు గోడలను కూల్చివేసిరి, ఒకరి గూర్చి ఒకరు సణుగుకొనుట మాని, తిరిగి జన్మించిన క్రైస్తవులుగా మారు౦డ లేదు? నిశ్చయంగా. లేదు, కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. చూడండి, వారి అర్పణ దహించబడలేదు (అంగీకరించబడలేదు). వారు మనోభావాల గుండా వెళ్ళుదురు దానిని వారు చేసిరి యుగములన్నిటను దానిని వారు చేసిరి. విగ్రహముల ద్వారా వారు మనోభావాలు కలిగి యుండిరి.

JOHN 5:39

 

48అయితే పరిశుద్ధ గ్రంథము యొక్క దేవుడు, దేవుడైయుండి — నిన్నా, నేడు మురియు నిరంతరము ఏకరీతిగానుండి — లోకమును మరియు భేదములను, దహించివేసి, మనలను క్రీస్తులో నూతన జీవులుగా చేయును. అవును. "ఇవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చి నేనెవరినో మీకు చెప్పును," అని యేసు చెప్పెను.

దానిలోని కార్యమేదనగా, ఈ కార్యములన్నియు మనము కలిగి యుండుటకు కారణమేదనగా, మనమింకనూ సంఘశాఖ విభేదములు, సిద్ధాంతములు, సణుగుళ్ళు, పేరు ప్రఖ్యాతులు మరియు లోకము యొక్క దయ్యములు, దేవుని యొక్క సత్యము నుండి మనకు గ్రుడ్డితనము కలిగించునట్లు మనము అనుమతించుచున్నాము. అది వాస్తవము.

49పరిశుద్ధాత్మను పొందుకొనుటలో అనేకులు మోసపోవుచున్నారు నేను చెప్పినట్లు, ఏలియా వస్త్రములు, బయలుపరచబడిన దేవుని కుమారులు, ఇంకా భిన్నమైన సిద్దాంతములు, ఇంకా లోకములోనున్న ఇతర కార్యములు ఈ దినాల్లో వారు కలిగియున్నారు. వాటికై ప్రజలు గ్రుడ్డిగా పడిపోవుచున్నారు మరియు ఏదో ఒక విధమైన మనోభావములగుండా వెళ్ళుచున్నారు, తిరిగి ఒక పొగరు పట్టిన ఆత్మతో, భేదములతో, సణుగుళ్ళతో కోపావేశులై లేచుచున్నారు. అది దేవుని యొక్క ఆత్మ కాదు. క్రమము తప్పి కొనసాగుచునే యుందురు, సంఘము యొక్క క్రమమేమిటో ఎరుగరు, దేవుని గహములో ఎట్లుండవలెనో ఎరుగరు, ప్రవర్తనా విధానము ఉండదు, లేదు, కనీసం ఎటువంటి వివేకము ఉండదు, దేవునియెడల ఎటువంటి భావము ఉండదు, వారు ఆలోచించేదంతయూ "నా సంఘము అను దానిగూర్చియే." వారు దేవుని ఆత్మ కాదు, కానీ ఒక సంఘపు ఆత్మను పొందిరని అది చూపించుచున్నది, ఎందుకనగా దేవుని ఆత్మ మీలో వున్నదంతటిని కొట్టివేయును, దానంతటిని కాల్చివేయును. నిశ్చయంగా.

చుడండి, వారందురు, "ఆయన ఎక్కడ?" మాకు హక్కు ఉన్నది.

50అయితే చూడండి, మేఘములు సూర్యుని కమ్మినయెడల, సూర్యుడెల్లప్పుడూ ప్రకాశించుచునుండును. అయితే అది మీపై ప్రకాశించకుండునట్లు చేయు ఒకే కార్యమేదనగా మేఘములై యున్నవి. మరియు మేఘముల నుండి బయటపడినయెడల, సూర్యుడు ప్రకాశించుచుండును. ఆమేన్!

సహోదరుడా, మన పాపమంతటి నుండియు, మరియు మన సందేహముల నుండి మరియు మన గలిబిలినుండి తొలగిపోవుడి, పెంతెకోస్తు దినము నుండియు సూర్యుడు ప్రకాశించుచున్నాడు. ఎప్పుడూ ఉన్నట్లుగానే పరిశుద్ధాత్మ ఈ దినమున కూడా గొప్పగా ఉన్నది. అయితే మన సంఘశాఖలు దేవుని వాక్యమును తేలిక చేయుచూ, "అది వేరొక దినము కొరకు, ఓ, అది… వెయ్యేండ్లపాలనలో దైవిక స్వస్థత ఉండును." లేదా "దైవీక స్వస్థత అప్పుడెప్పుడో జరిగినది; అది ఈ దినమునకు వర్తించదు అనుచున్నారు."

JUDG 6:13•

EPH 4:11

 

51దైవీక స్వస్థత లేనియెడల, ఆయన నిన్నా, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఎట్లుండగలడు? ఎట్లు శక్తి, ఎట్లు… ముందుగా అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు, కాపరులు, సువార్త ఇంకనూ జీవించుచున్నదనుటకు రుజువై యుండునట్లు, పరిశుద్ధ గ్రంథము క్రమములో ఉంచియున్నది. మరియు దేవుడు వారిని నేరుగా మన మధ్యకు నడిపించుచుండెను, మరియు దానికి మన వీపును త్రిప్పుచున్నాము. దేవుడు తప్పిపోడు; ప్రజలే తప్పిపోవుచున్నారు.

"అలాగైన, మా మధ్య అద్భుతకార్యములు ఏమాయెను? అవి ఎక్కడనున్నవి?" దేవుడు ఈ మనుష్యునితో మాటలాడుచుండెను, ఆయన బయటికి వెళ్ళునట్లు సిద్ధపరచుచున్నాడు.

మేఘములను తొలగించుడి, సూర్యుడెల్లప్పుడూ ప్రకాశించుచునే యున్నాడు. అది వాస్తవము. సందేహములన్నియు వెళ్ళిపోయిన తరువాత, కార్యములన్నియు సరిచేయబడిన పిమ్మట, సూర్యుడక్కడ ఉన్నంత నిశ్చయముగా అద్భుత కార్యములును ఉండును.

దేవుని ఆజ్ఞను బట్టి సూర్యుడు ప్రతి దినము ప్రకాశించుచున్నాడు. అది ఎక్కడ ఉన్నది, ఏలయనగా దేవుడు దానిని అక్కడ నుండునట్లు ఆజ్ఞాపించెను. పగలు మరియు రాత్రి ఉన్నంతవరకూ సూర్యుడక్కడ వ్రేలాడుకొని యుండును. నిశ్చయముగా. అన్నివేళలా దానిని నీవు చూడక పోవచ్చును, ఏలయనగా మేఘములు దానిని క్రమ్మును పొగమంచు, మేఘములు, కొద్దోగొప్పో, దానిని కప్పివేయును. అయితే అది ఎల్లప్పుడూ అక్కడే యున్నది, చూశారా.

MATT 18:20•

MATT 28:20•

HEB 13:8

 

52మరియు ఈ దినమున అద్భుత కార్యములు చూడగోరినయెడల, మీరు చేయవలసిన ఒకే ఒక కార్యమేదనగా, దేవుని అద్భుత కార్యమును మీరు చూడగోరినయెడల, కేవలం మీ సందేహమంతటిని తొలగించుడి. మీ సిద్ధాంతములన్నిటిని తొలగించుడి, మీ సంఘశాఖలన్నిటిని తొలగించుడి, మరి అప్పుడు కుమారుడు తనంతటతానే ప్రకాశించును.

అది దేవుని యొక్క ఆజ్ఞయైయున్నది, ఏలయనగా ఇట్లు చెప్పబడెను "ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు." కావున, ఆయన అక్కడ నిత్యము ఉండినంతవరకు అది అక్కడ వుండును. ఇక దాని గూర్చి ఎటువంటి ప్రశ్నయు లేదు, ఆయన అక్కడ ఉన్నాడు. అద్భుతకార్యములు ఎక్కడనున్నవి? అద్భుతకార్యములు జరుగకుండా ఆటంకపరచునది ఏది? దేవుడు క్రీస్తును పంపెను. క్రీస్తు ఎల్లప్పుడు సజీవుడైయున్నాడు! "నా నామమున ఎక్కడ ముగ్గురు కూడుకొందురో, నేను వారిమధ్యలో ఉండెదను." ఆమేన్. "ఇదిగో, యుగ సమాప్తివరకు సదాకాలము నేను మీతో ఉన్నాను." అక్కడే ఆయన ఉన్నాడు — అది ఆయన వాగ్ధానమైయున్నది!

53అప్పుడు ఇక సమస్య ఏమున్నది? మనము సందేహము, అతికాంక్ష, కోపము, స్వార్థము, సంఘశాఖలు మరియు ఇతర కార్యములను మేఘములకు అవకాశమిచ్చి యున్నాము, అవి మనలోనికి వచ్చి మనలను బ్రద్ధలుచేసి మనలను వాక్యము నుండి తొలగింపజేయుటకు అనుమతించి యున్నాము. "అవి ఎక్కడో ఉన్నవి"అని చెప్పుచూ, క్రీస్తును నిరాకరించుచు, యేసుక్రీస్తు నామము యొక్క క్రైస్తవ బాప్తీస్మమును నిరాకరించుచు, ఇతర కార్యములు, పలు విధములైన కార్యములగు మన సిద్ధాంతములు పరిశుద్ధ గ్రంథము నుండి మనలను దూరము చేసియున్నవి.

ROM 2:16

 

54అయితే సహోదరుడా వే, వీటన్నిటి ముందు, అన్ని సంఘశాఖల ముందు, అన్ని విమర్శల ముందు, పరిశుద్ధ గ్రంథము ఇంకనూ ఒకే రీతిగా ఉన్నది అనునది ఒక వింతైన కార్యముగా, ఒక అద్భుతకార్యముగా లేదా? దేవుడు ప్రతి వ్యక్తిని పరిశుద్ధ గ్రంథము ద్వారా తీర్పు తీర్చుటకు నిర్ణయించెను. మరియు పరిశుద్ధ గ్రంథము వాక్యమైయున్నది, మరియు వాక్యము క్రీసైయున్నాడు. ప్రతిఒక్కరూ, ప్రతి వ్యక్తియూ దాని ద్వారా తీర్పు తీర్చబడును.

అది వాటన్నిటిని ఏలాగు అధికమించెను? మేఘములను తొలగించుడి. అప్పుడు ఏమి జరుగును, సూర్యుడక్కడనే ఉన్నాడు. ఈ దినమున మీరు చేయవలసిన ఒకే కార్యమేదనగా, "ఓ యేసు వచ్చి నన్ను స్వస్థపరచుము, ఓ యేసు, నాకు పరిశుద్ధాత్మను ఇమ్ము!" అని చెప్పుట కాదు, కేవలము మేఘములను తొలగించవలెను — ఆయన ముందుగానే అక్కడ ఉన్నాడు. ఆయన పందొమ్మిది వందల సంవత్సరముల క్రితమే వచ్చెను. మరియు ఆయన ఇంకనూ అచ్చటనే యున్నాడు. మరియు ఆయన ఎల్లప్పుడు అచ్చటనే యుండును. "నేను సజీవుడను, నిన్నా, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉండువాడను." అది నిజము.

55ఇప్పుడు, గిద్యోను మరియు అక్కడనున్న ఆ ప్రజలు, వారు దేవుని యొక్క అద్భుతకార్యములు చూచుటకు ముందు వారు ఒక షరతును ఎదుర్కొనవలసి యుండెను. వారు ఎదుర్కొనుటకు, అద్భుతకార్యముల శక్తిని చూచుటకు, వారు నమ్మవలసియున్నది. వారు దేవునియొక్క అద్భుతకార్యములు చూచుటకు నమ్మవలసియున్నది. మరియు ప్రవక్త యొక్క వాక్యమునకు విధేయులై యుండవలసియున్నది. ప్రవక్త ఏమి చెప్పెనో దానికి వారు విధేయత చూపవలసియున్నది.

మరియు మనము కూడా దేవుని అద్భుతకార్యములను చూచుటకు ముందు, ప్రవక్త ఏమి చెప్పెనో దానికి మనము విధేయత చూపవలసియున్నది. పరిశుద్ధ గ్రంథము మనకు ప్రవక్త. అది నిజము!

56ఒక మనుష్యుడు — బాప్టిస్టుయొక్క, మెథడిస్టు యొక్క, పెంతెకోస్తు యొక్క దేవుని ప్రవక్తనని తనకుతాను ఎంత చెప్పుకున్నను పరవాలేదు, అతడేమైయున్నను, అతడు తన గూర్చి తాను ఏమి చెప్పుకొన్నను, ఈ వాక్యము గనుక అతనిలో జీవించుచుండనియెడల అతడు ఒక ప్రవక్త కాదు. అతడు ఒక ప్రవక్తయై యుండవచ్చును, అయితే ఒక అబద్ధ ప్రవక్తయై యుండును. నిజప్రవక్త ఈ నిజవాక్యమును గూర్చి మాటలాడును, మరియు దేవుని ఖచ్చితముగా అదే దేవుని గాను, అదే శక్తిని, అదే వాక్యములను, ప్రతీది అదే రీతిగా నుంచును, నిజవాక్యము.

ఇప్పుడు, వారు నమ్మవలసియున్నది. వారు దేవుని అద్భుతకార్యములను చూచుటకు ముందు వారు ప్రవక్త యొక్క వాక్యమును నమ్మి మరియు దానికి లోబడవలసియున్నది.

మరియు ఈ దినమున "యేసుక్రీస్తు నిన్నా, నేడు మరియు నిరంతరము ఏక రీతిగా లేడు; అద్భుతకార్యములు గతించెను; మరియు పరిశుద్ధాత్మ బాప్తీస్మమనునది ఏదియూ లేదు అనుచు," తప్పుడు ప్రచార ముసుగులో వెళ్ళుచు మరియు దేవుని అద్భుతకార్యములకై ఎదురుచూడలేరు. దానికి విధేయుడవై యుండవలసియున్నది. మరియు నీవు దానికి విధేయుడవైనయెడల తక్కిన కార్యమును గూర్చి దేవుడు శ్రద్ధవహించును

57మీరు మేఘములన్నిటిని తొలగించినయెడల సూర్యుడచ్చటనే యున్నాడు. అది అక్కడ వ్రేలాడుచుండెను. మనకు చెప్పబడినట్లు, సూర్యుడు కదలడు. సూర్యుడు ఒకే స్థానములో స్థిరముగా నుండును.

మరియు క్రీస్తు స్థిరముగా నున్నాడు! మరియు అది నిజము. మనము ఆయన యొద్ద నుండి కదిలిపోవుదుము, అయితే ఆయన స్థిరముగా నుండును. అది నిజము. మీరు చేయవలసిన ఒకే కార్యమేదనగా ఒక్కసారి వెనుకతట్టు తిరిగి ఆయన వైపు చూచినయెడల, ఏమి సంభవించునో మీరు చూచెదరు క్రీస్తు వైపు చూడుడి. సంఘము వైపు కాదు, ఒక సిద్ధాంతము వైపు కాదు, బిరుదుల వైపు కాదు; క్రీసు వైపు చూడుడి. సెమినరీ వైపు కాదు; వాక్యము వైపు చూడుడి! క్రీస్తే వాక్యమై యున్నాడు. నిశ్చయముగా అదియే. ఖచ్చితముగా అదియే.

JOHN 15:7

 

58వాక్యమునకు విధేయులవ్వుడి. మనకు… వారు వాక్యమునకు విధేయులై యుండవలసియున్నది.

మరియు మనకైతే మనము కూడా వాక్యమునకు విధేయులమై యుండవలసియున్నది.

మీరు దానిని తెలుసుకొనగోరినయెడల, ఇక్కడ ఒక లేఖనమును వ్రాసియుంచితిని, ఇట్లు చెప్పబడెను, "మీరు నా యందును, నా మాటలు మీలోను నిలిచియున్నయెడల, మీ కేది ఇష్టమో అడుగుడి," చూశారా. అది ఏమైయున్నది? దేవుని వాక్యము మనలో ఉండిన యెడల మరియు అక్కడ ఆయనలో మనమున్నయెడల, అది కేవలం ఇక మాటలాడుటయైయున్నది. మీకేది ఇష్టమో అడుగుడి, మరియు అది మీకివ్వబడును. ఇప్పుడు, మీరు గుర్తుంచుకోదలచినయెడల అది యోహాను 15:7లో నున్నది. చూడండి, "మీరు నా యందును, నా మాటలు మీలోను నిలిచిన యెడల," అని యేసు చెప్పెను.

ఈ రోజు ఒకటై యుండుట కాదు; రేపు, మరుసటి దినము, వేరొకటైయుండి మరియు పడిపోయి మరియు అక్కడ, మరియు ఇక్కడ, మరియు అక్కడ. నీవు సరియైన ప్రారంభమును కలిగిలేవు, అని అది చూపించుచున్నది.

59ఓ, "నేను భాషలలో మాటలాడుదును," అని నీవు చెప్పెదవు. మంచిదే, అయితే ఇంకనూ నీవు దేనిని కలిగిలేవు, చూశారా. "నేను ఆత్మలో నాట్యమాడితిని," అని నీవు చెప్పుదువు. మంచిది, అయితే ఇంకనూ నీవు ఏ విధమైన ఆత్మలో నాట్యమాడితివో నేనెరుగను, చూశారా.

మీరు ఒక దినమున ఒకటైయుండి, మరియు మరుసటి వారము మరొకటై యుండినయెడల; మరియు తరువాత చిన్న వడ్రంగి పిట్ట వచ్చి, బోలుగా వున్న చెట్టును ముక్కుతో పొడిచినయెడల మీరు దానికై పరుగెత్తెదరు; మరియు మరొకటి ఇక్కడ దానికై గెంతెదరు, మీరెక్కడికి చెందినవారో, మీరెరుగరు, ఆలాగైన క్రీస్తు మీలో ఉండనేరడు. ఆయన మాటలు అక్కడ ఉండనేరవు, ఏలయనగా అవి స్థిరమైనవి; మీరు చీకటి వైపునకు మరల్చలేరు!

JOSH 10:12

 

60"నమ్మలేని నిజం" అను దానిపై గడిచిన దినమున నేను ప్రసంగించినట్లు, యెహోషువా సూర్యుని ఆపినప్పుడు, ఆ వెనుక బెక్కి ఇట్లు చెప్పెను, "డాడీ, అతను సూర్యుణ్ణి ఆపలేడు," ఇట్లు చెప్పెను, "లోకము ఆగిపోవును, అతడు లోకమును ఆపెను."

"అతడు సూర్యుణ్ణే ఆపెను," అని నేను చెప్పాను. "తన పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎటువంటి పొరపాట్లు చేయడు."

"అతడు సూర్యుణ్ణి ఎట్లు ఆపెను, కనీసం సూర్యుడు పరుగిడడు కదా? సూర్యుడు స్థిరముగా ఎలా నిలచును," అని చెప్పెను.

నేను చెప్పితిని. "అయితే అది ఆయన మాటలాడుచున్నది అక్కడ ఉన్నటు వంటి క్షిపణి గురించి కాదు. భూమిపై నుండి దాటి వెళ్ళుచుండిన సూర్యుని ఆ వెలుగును, ఆయన ఆపినది ఆ సూర్యుడినే."

దేవుడు దానిని జరిగించుటకు ఏమి చేసెనో నేనెరుగను, అయితే ఆయన సూర్యుడిని ఆపెను. సూర్యుడు ఈ దిశగా వెళ్ళుచుండెను — భూమిపైనున్న సూర్యుడు, సూర్యుని యొక్క ప్రకాశము, అక్కడనున్న క్షిపణిని, మనము ఒక మిలియను మైళ్ళ దూరములో చూడలేదు, లేక కొన్ని మిలియన్ల మైళ్ళ ఆవల. అయితే ఉదయము మొదలుకొని రాత్రి వరకు భూమిపై ప్రయాణించుచున్న సూర్య ప్రకాశమునే, యెహోషువా నీవు అక్కడనే నిలువుమని ఆజ్ఞాపించెను మరియు అది ఆగెను. ఒక నమ్మలేని నిజం ఏదనగా అది నమ్మశక్యము కానిది, అయినను సత్యము. అయితే అది నమ్మశక్యము కానిది, అయినను సత్యమైనదే

JOHN 15:7

 

61దేవుడు ఒక పాపిని, పొగరుబోతును, అది కోపిష్టిని, సందేహపరుని, తీసికొని మరియు అతనిని ఒక దేవుని పరిశుద్ధునిగా ఎట్లు చేయగలడు? ఆయన కనీసం వీధిలోని కుక్కలు సహితం ఆమె వైపు తిరగనటువంటి ఒక నీచమైన స్త్రీని తీసికొని మరియు ఆమెని ఒక దేవుని పరిశుద్ధురాలిగా ఎట్లు చేయగలడు? నేను మీకు చెప్పలేను. అయితే ఆయన దానిని చేసెను! అది ఒక నమ్మలేని నిజము. నిశ్చయముగా అదియే. దేవుని గొప్ప కార్యములన్నియు నమ్మలేని నిజములై యున్నవి.

"మీరు నా యందును, నా మాటలు మీ యందును, నిలిచి యుండినయెడల, మీకు ఏది ఇష్టమో అడుగుడి, మరియు అది మీకు ఇవ్వబడును." పరి., యోహాను 14 లేదా పరి., యోహాను 15, నన్ను మన్నించండి. పరి., యోహాను 15:7. అది సరియే.

GEN 2:5

 

62ఒక్క క్షణము తిరిగి ఆదికాండములోకి వెళ్ళెదము. నోవహు నిబంధనలను ఎదుర్కొనవలసి యుండెను. అతడు దేవుని అద్భుత కార్యము చూచుటకు ముందు నోవహు దేవుని వాక్యమును నమ్మవలసి యుండెను. మరియు దాని ప్రకారము చేయవలసియుండెను. అది నిజము. ఆదికాండములోని గొప్ప ప్రవక్తయైన నోవహు అతడు దేవుని అద్భుత కార్యమును చూచుటకు ముందు దేవుని వాక్యమును నమ్మవలసి యుండెను. మరియు దాని ప్రకారము చేయవలసియుండెను. అదివరకు ఎన్నడూ వర్షము పడలేదు, మీకు తెలియును అంతకు ముందెన్నడూ వర్షింపలేదు.

మరియు మీరేమి తలంచుచున్నారు? ఇప్పుడు విజ్ఞానపరంగా మనము జీవించుచున్న కాలము కన్న ఆ కాలమెంతో గొప్పదని వారు మనకు చెప్పెదరు. మనము పిరమిడ్‌ను లేదా స్పింక్స్‌ను నిర్మించలేము. మమ్మీని తయారుచేయు మార్గములు మనకు లేవు; మనమట్లు దానిని శిలవంటి పదార్థంగా మార్చలేము. వారు చేసినట్లు ఎప్పటికి ఉండునట్లు వస్త్రముపై రంగువేసినట్లు మనము చేయలేము. మనకు కనీసం అటువంటి కార్యములు లేవు. మరియు అవి మన ఆధునిక విజ్ఞానశాస్త్రం కనుగొనలేని కార్యములై యున్నవి. అయితే దానిని వారు కలిగి యుండిరి!

63మరియు వారు కలిగివున్న ఇంజనీర్లు మనకు లేరు. ఐగుప్తులోని ఆ గొప్ప పిరమిడ్ ఎంతో పరిపూర్ణంగా భూమికి మధ్య నున్నది. సూర్యుడు ఎక్కడ ఉన్నప్పటికి దానిచుట్టూ ఎటువంటి నీడ పడదు. మనము అటువంటి కట్టడమును ఉంచలేము. దానిని ఎట్లు చేయవలెనో మనకు తెలియదు. మనము ఒక్క పిరమిడ్‌నైననూ నిర్మించలేము. మరియూ ఆ పైనవున్న, ఆ తలరాయి చుట్టూ మరియు దానిలో దాదాపు ఒక సగ పట్టణము వైశాల్యముగల స్థలము దానిలో నుండును. అచ్చట రాళ్ళు ఆ పైన వ్రేలాడుచుండును, బిలియనుల కొలది బరువు వుండును, వందల టన్నులు కావచ్చును. ప్రపంచములో మనము కలిగివున్న యంత్రములన్నియూ వాటిని పైకి లేపలేవు.

స్పింక్స్ యొక్క పాదము యొద్ద పదహారు ఫ్లాట్ కార్లు పట్టునని వారు నాతో చెప్పియుంటిరి. వారెట్లు దానిని అక్కడ చేయగలిగిరి? అది ఎట్లు సంభవించెను. వారు గొప్ప శాస్త్రవేత్తలై యుండిరి.

HEB 11:7

 

64మరియు ఆకాశము నుండి రానున్నది అని ప్రవక్త చెప్పినప్పుడు వారు ఆ వ్యక్తిని ఒక వెఱ్ఱివాడని పిలచుటను గూర్చి మీరేమి తలంచుదురు?

"మేము మా పరికరములను తీసికొని మరియు నక్షత్రములలోనికి పంపితిమి, మరియు ఎక్కడైననూ నీటి బిందువైననూ లేదు. అది ఎక్కడ నున్నది?" అని వారు చెప్పుటను నేను వినగలుగుచున్నాను.

"వర్షము పడునని దేవుడే చెప్పియుండెను," అను దానితో నోవహు తిరిగి వచ్చియుండవచ్చును. అది చాలును. అది సరిపోవును. దేవుడు అది జరుగునని చెప్పెను, కావున ఖచ్చితముగా జరుగబోవునది అదే అయియున్నది. అది సరియే. (నేను త్వరపడవలెను ఇతర సహోదరులు వేచియున్నారు) అవును, నోవహు, వర్షము పడనున్నది అని అతను చెప్పెను.

"నీకెట్లు తెలియును?"

"అది దేవుని వాక్యమైయున్నది. అది ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు."

"నోవహు, దాని గూర్చి నీవేమి చేయబోవుచున్నావు?" "కేవలం చుట్టూ తిరగుచు మరియు దాని గూర్చి ప్రసంగించెదవా?"

"లేదండి. దాని కొరకు నేను సిద్ధపరచెదను," చూశారా.

"ఓ, అది ఒక అద్భుతమైయుండ వచ్చును. అద్భుతములు జరుగు దినములు గతించెను."

"కేవలం ఓపిక కలిగియుండుము, కొంతకాలమైన పిదప నీవు దానిని చూచెదవు." అవునండి.

మరియు అతడు ఏమి చేసెను? వర్షము పడకముందే అతడు ఓడను కట్టెను. అతడేమి చేయుచుండెను? వాగ్థానముపై ఆనుకొని దాని ప్రకారము చేయుచుండెను. ఆమేన్! నేను ఒక రకమైన పెంతెకోస్తువలె సరిగ్గా ఇప్పుడే భావించుచున్నాను, ఆత్మవశుడనౌచున్నాను.

HEB 12:1•

HEB 13:8

 

65అవును, దేవుని తన వాక్యము నొద్దనే స్వీకరించుడి ఏమి సంభవించును, వాగ్థానము మీదనే ఆనుకొనుము. మిగిలిన కార్యము చేయుట దేవుని పనియైయున్నది. ఆటంకపరచువాటిని కొట్టివేయుటకు ఆరంభించండి! "మిమ్మును సులువుగా చిక్కుల పెట్టు ప్రతిదానిని ప్రక్కనపెట్టుడి." మీ అభ్యంతరములన్నిటిని, మీ భయములన్నింటిని, మీ మతశాఖలన్నిటిని, మీ సిద్ధాంతములన్నిటినీ, దేవుని వాక్యమునకు విరోధముగానున్న దేనినైననూ, ప్రక్కన పెట్టుడి. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కేవలము మీ సిద్ధాంతములను ప్రక్కన పెట్టుడి, మీ సంఘశాఖలను ప్రక్కకు పెట్టుడి మీ సందేహములన్నిటిని ప్రక్కకు పెట్టుడి మీ గందరగోళములన్నిటిని, (మీ విచారములన్నిటిని) ప్రక్కకునెట్టి కేవలము ముందుకు కొనసాగుడి. మొదటి కార్యము మీకు తెలియునా, మీరు ఆ ఆఖరు కార్యమును జరిపెదరు. మరియు ఆయన అక్కడ నిలబడియుండును. మీరు ఆయనను కలుసుకొందురు.

1JN 2:15

 

66"నేను ఓడకట్టుట ముగించిన పిదప, ఆయన వచ్చును. వర్షము పడుట ప్రారంభమగును," అని నోవహు చెప్పెను.

"నీవు ఓడ కట్టుట ముగించిన అదే దినమునా?"

"అది యాభై సంవత్సరములు ఆలస్యమైనా గాని, నేను ఓడలోనే కూర్చొని దాని కొరకై కనిపెట్టెదను. అది వచ్చును, ఏలయనగా దేవుడు ఆ విధంగా చెప్పెను."

చూడండి, మొట్టమొదటిగా తనను తాను సిద్ధపరచుకొనవలెను. దేవుడు అద్భుత కార్యములు చేయు దేవుడని అతను ఎరిగియుండెను, కావున అతను ఆయనను సందేహింపలేదు. దేవుడు తనతో మాటలాడెను, మరియు దానిని అతను ఎరిగి యుండెను.

దేవుడు తన వాక్యములో నుండి మీతో మాటలాడినప్పుడు, మీ హృదయములో దానిని మీరు తెలుసుకొందురు. మీ వద్ద నుండి లోకమంతయూ వెళ్ళిపోయినప్పుడు, మరియు లోకపు కార్యములన్నియు మృతతుల్యమైనప్పుడు మీరు దానిని తెలుసుకొందురు. మీరు లోకమును గాని లేదా లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించుచున్నయెడల, మీరు సరిగా లేరని మీ హృదయములో తెలిసికొందురు. అది వాస్తవము. కావున ప్రతిదీ ముగిసిన పిదప దేవుని కలుసుకొనుట తప్ప చేయునది ఏమియూ లేదు. ఆయన అక్కడ నిలబడియుండును. ఆయనే నిత్యముండును.

MARK 16:17,18•

HEB 13:8

 

67ఆ సూర్యుడు నిలిచియుండినట్లే కుమారుడునూ నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా నిలిచియుండును. ఇప్పుడు ప్రకాశించుచున్న సూర్యుడే, ఆదికాండములో ప్రకాశించిన సూర్యుడు, పర్వతముపై ఏలియా మీద ప్రకాశించిన సూర్యుడు, సిలువ వేసిన దినమున అస్తమించిన సూర్యుడైయుండెను. హల్లేలూయా! అది ఆ విధముగానే ఉన్నది. మరియు అదే దేవుని కుమారుడు, నిన్న, నేడు, మరియు నిరంతరము శక్తిలోను, ప్రేమలోను, సూచనలలోను మారనివాడై ఉన్నాడు.

ఈ రోజున ఒక క్రైస్తవునికి గురుతు ఏమైయున్నది? "ఓ, అతను సంఘమునకు వెళ్ళును, పుస్తకములో తన పేరు నమోదు చేసికొనును, ఒక పత్రమును కలిగియుండును." యేసు చెప్పిన గురుతు అది కాదు.

"నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొనినను, లేదా మరణకరమైనదేది త్రాగినను అది వారికి హానిచేయదు. రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు," అని ఆయన చెప్పెను.

దేవుడు మాతోనున్నయెడల, ఆయన యొక్క సూచక క్రియలు ఏమాయెను? నిశ్చయముగా, ఆయన వాక్యము నొద్దకు రండి మనము దేవుని వాక్యము నొద్దకు వచ్చిన వెంటనే సూచనలు వాటంతట అవే వెంబడించును.

EXOD 2:12,23•

EXOD 3:1

 

68నోవహు, దేవుని యొక్క అద్భుత కార్యములను చూచుటకు మునుపు, గిద్యోను వలె ప్రశ్నించవలెనా, అతడు దేవుని వాక్యప్రకారము చేయవలసి యుండెను. గిద్యోను దేవుని వాక్యప్రకారము నడవవలసినవాడై యుండెను

ప్రతి ఒక్కరు దేవుని వాక్యప్రకారము చేయవలసినవారై యున్నారు. దేవుడు ఉన్నాడు అని నేను చెప్పుటకు ముందు, నేను తన వాగ్థానముపై ఆనుకొనియుంటిని, అప్పుడు ఆయన తననుతాను బయలుపరచుకొనెను. మీకు స్వస్థత కావలెననిన, ఆయనను నమ్ముడి! ఆయన వాక్యప్రకారము జీవించుడి — అప్పుడది జరుగును.

మోషే, దేవుని యొక్క అద్భుకార్యములు ఎన్నడూ చూడక మునుపు అతడు మొదటిగా దేవుని వాక్యప్రకారము చేయవలసి యుండెను. ఒక ప్రత్యేకమైన రీతిలో అతడు జన్మించెనని తన తల్లి చెప్పుట ఆయనకు తెలియును అతడు జమ్ములో దాచబడెను. దేవుడు తనను పిలిచెననియు మరియు తనను ఏర్పరచుకొనెననియు తన తల్లి చెప్పెను.

"మంచిది, ఒక మంచి సైనికుడినైన నేను, నేను వెళ్ళి ఈ ఐగుప్తీయుని చంపి మట్టితో కప్పి దాచెదను. మరియు నేను చేయగోరినదేదైనను చేయగలను. అయితే అది జరిగిపోవును, అని అతడు తలంచెను." అయితే మీరు చూడండి, అతను ఆ విధముగానే చేయుటకు ప్రయత్నించుచుండెను. అది అతని ఆలోచనైయున్నది. ఆ సమయమునుండి తనను కాపాడుటకు దేవుడు అద్భుతమును చేయుటను అతడు ఎన్నడూ చూడలేదు.

అయితే ఒక దినమున, అతనికి ఎనభై సంవత్సరముల వయస్సు దాటిన తర్వాత, అతను గొర్రెలు మేపుచుండెను, పచ్చిక బయలు గుండా వెళ్ళుచుండెను, అది గొర్రెలు పరుగెత్తి వెళ్ళే దారి అయి యుండవచ్చును. మరియు ఆ వద్ధుడైన గొర్రెలకాపరి తన చేతిలో ఒక వంకి కర్రతో ఆ వైపుగా వెళ్ళుచుండెను, మార్గమును కొట్టుచూ వెళ్ళుచుండెను; కొద్దిగా కుంటుతూ ఉండవచ్చును, ఎనభై సంవత్సరముల వృద్ధ వయస్సులో; అతని గడ్డము నడుము వరకు వ్రేలాడుతూ ఉండవచ్చును, బహుశా అది అతను మేపుచున్న గొర్రె బొచ్చువలె బూడిద వర్ణముగా ఉండవచ్చును — మరియు అతడు దేనినో చూచెను. ఓ దేవా! అది అతనికి మర్మయుక్తముగా నుండెను.

EXOD 3:3•

EXOD 4:1,2•

JUDG 6:13,20,21

 

69ఈ రాత్రి మీకు ఏదో కార్యమును చూపించగలనని ఆశించుచున్నాను. మరియు మనకు ఇచ్చట నీటి కొలను సిద్ధముగా నున్నది.

అతడు ముందెన్నడూ చూడని దానిని దేనినో చూచెను. "నేను దానిని పరిశోధించుట మంచిది" అని అతడు అనుకొనెను. కావున అతడు ప్రక్కకు తిరిగెను, మరియు ప్రభువుయొక్క వాక్యము అతని యొద్దకు వచ్చెను. మహిమ! హల్లేలూయా! ప్రభువు యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చెను. ఇప్పుడు, అతడు వెళ్ళుటకు ముందుగా, అతడు ప్రభువు యొక్క వాక్య ప్రకారము చేయవలసియుండెను.

మరియు ప్రభువు యొక్క వాక్యము ఎల్లప్పుడూ అద్భుతకార్యములను జరిగించునని గుర్తుంచుకొనుడి. "నీవు నాకు తోడైయుండి మరియు నన్ను పంపితివని నేను ఎట్లు గ్రహించవలెను," అని అతడు అనెను.

"నీ చేతిలోనిది ఏమిటి?" అని అడిగెను.

" ఒక ఎండిన కర్ర," అని అతడు చెప్పెను.

"దానిని నేల మీద పడవేయుము," అని మొదటి ఆజ్ఞ దేవుడు మోషేకు సెలవిచ్చెను. నేను దేవుడనని నీవు తెలిసికొనగోరినయెడల, నీ చేతిలో ఒక కర్ర ఉన్నది, దానిని నేలపై పడవేయుము."

"దేవుని అద్భుతకార్యములు ఏమాయెను?" అని గిద్యోను అడిగెను.

"ఆ రొట్టెను బలిపీఠముపై నుంచుము; దేవుడెవరో నీకు కనపరిచెదను," అని ఆయన చెప్పెను. మరియు దానిని ఆయన తన చేతి కర్రతో తాకెను, మరియు పొగపైకి లేచెను, మరియు అది దహించివేయబడెను.

EXOD 3:13•

EXOD 4:2,3

 

70"నన్ను ఎవరు పంపితిరని నేను చెప్పవలెను? నీవు దేవుడవని నేనెట్లు ఎరుగుదును?" అని మోషే చెప్పెను.

"నేను జీవమునకు కర్తను, నేను అద్భుతకార్యములు చేయు దేవుడను, నీ చేతిలోనిది ఏమిటి?" అని ఆయన చెప్పెను. మరియు సమస్త కార్యములను జరిగించిన దేవుని శక్తిని చూచుటకు మునుపు అతడు మొదటిగా దేవునికి లోబడియుండవలెను. అతడు కర్రను నేలపై పడవేసెను అది పాముగా మారెను. ఓ, మై! ఏమిటి? ఆయన యొక్క అద్భుతకార్యములు చూచుటకు ముందు విధేయత వచ్చును.

JOHN 3:3

 

71మంచిది, అద్భుత కార్యములన్నియు ఏమాయెను? ఎవరైనను ఒక అద్భుతము చేసినయెడల మేము ఒక వెయ్యి డాలర్లు ఇచ్చెదము అని ఈ రోజున దేశములలో సంఘములని పిలువబడుచున్నవన్నియు అడుగుచున్నవి. దరిద్రుడవు, స్వయం కృతాపరాధుడవు, పడిపోయినవాడవు, రెండు సార్లు మృతిచెందినవాడవు, వేళ్ళతో పెకలించబినవాడవైన నీవు.

నీకునీవే ఒక అద్భుతముగా మారనియెడల నీవు ఏ విధంగా ఒక అద్భుతమును చూచెదవు. మహిమ! దేవుని యొక్క అద్భుతమైన కృప సందేహించు ఒక అవిశ్వాసిని తీసికొని పరిశుద్ధాత్మతో నింపుటయైయున్నది. "ఒకడు తిరిగి జన్మించితేనేగాని దేవుని రాజ్యమును చూడలేడు," అని యేసు చెప్పెను. నీవు ఒక అద్భుతమును చూడదలచినయెడల, నీవే ఒక అద్భుతముగా మారవలెను. మొదటిగా దేవుడు నీ యెడల కార్యము జరిగించనిమ్ము. ఆయన కొంత మరమ్మత్తు జరిగించవలసియున్నది. నీ కళ్ళపై వేరే కటకములు పెట్టవలసియున్నది, ఏలయనగా నీవు అంధుడవు, పాపములోను అతిక్రమములోను చనిపోయినవాడవు, ఆత్మీయ గ్రుడ్డితనముగలవాడవు, రెండుమారులు చనిపోయినవాడవు. అది నిజము. దేవుడు నీకు జీవము నీయవలసియున్నది, నీవు చూచునట్లుగా నీ కన్నులను తాకవలసియున్నది, ఒక అద్భుతకార్యము చేయవలసి యున్నది, నిన్నే ఒక అద్భుతముగా చేయవలసియున్నది — అప్పుడు నీవు అద్భుతకార్యములు చేయు దేవుని చూడగలవు. అది మొట్టమొదటి కార్యమైయున్నది.

ACTS 2:38,39

 

72మోషే ఆయనను నమ్మవలసియున్నది. మోషే దాని ప్రకారము నడువవలసియున్నది. దేవుని వాక్యము ఏమి చెప్పెనో దాని ప్రకారము నడువవలసియున్నది. అది దేవుడో కాదో అతడు చూడగోరెను. మంచిది, మోషే నేను చెప్పిన ప్రకారము చేయుము అని ఆయన చెప్పెను.

సహోదరుడా, సహోదరీ, ఇప్పుడు, ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరో నీవు తెలుసుకొనగోరినయెడల, కేవలం, ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారము జరిగించండి. మీలో ప్రతివాడును పశ్చాత్తాపపడి మరియు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందినయెడల, మీరు ఒక అద్భుతముగా మారెదరు అది ఆయన వాగ్థానమైయున్నది. ఆయన చెప్పినది అదియే. ఆయన వాక్యప్రకారము జరిగించుము. మరియు మీరు పరిశుద్ధాత్మయను వరమును పొందెదరు ఈ వాగ్థానము మీకును మీ పిల్లలకును చెందును.

"ఓ, అది కేవలం అపోస్తలుల కొరకు మాత్రమే."

"మరియు అది దూరస్తులకును మరియు ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలచువారందరికిని చెందును." వాగ్థానము ఎవరికో అక్కడ యున్నది.

EXOD 4:3

 

73ఆయన వాక్యప్రకారము నడువుము, అప్పుడు నీవు ఒక నిజమైన అద్భుతమును చూచెదవు. నీవు ఆయన వాక్యప్రకారము నడుచునప్పుడు ఏదో ఒక కార్యము జరుగును. గిద్యోను చేసినట్లుగా — ఆయన చెప్పిన రీతిగా అతడు జరిగించెను. నోవహు చేసినట్లుగా — ఆయన చెప్పిన రీతిగానే అతడు జరిగించెను. మోషే చేసినట్లు — ఆయన చెప్పిన రీతిగానే అతడు జరిగించెను.

"నీ కర్ర పడవేయుము!" అని చెప్పెను. మరొక విధముగా చెప్పవలెననిన, "నీ చుట్టునున్న ప్రతి దానిని వదిలివేయుము!" ఆమేన్. "దానిని నాకిమ్ము."

"నాకు తీవ్రమైన కోపము కలదు," అని చెప్పవచ్చును. దానిని దేవుని కిమ్ము; దానినెట్లు నిమ్మళపరచవలెనో ఆయనకు తెలియును. నాకు తీవ్రమైన కోరికలున్నవి. దానినెట్లు తీసివేయవలెనో ఆయనకు తెలియును, చూశారా. దానిని కేవలం ఆయన చేతుల్లో పెట్టుడి మరియు ఒక అద్భుతము ఏమి చేయగలదో గమనించండి. అది నిజము. మంచిది

EXOD 4:20

 

74మోషే దేవుని వాక్యప్రకారము నడువవలసియున్నది, అతడు దేవుని అద్భుతకార్యములు చూచుటకు ముందు దేవుని వాక్యమునకు లోబడవలసియున్నది. అయితే దానిని అతడు ఒక్కసారి చూచిన తరువాత, సహోదరుడా, అప్పుడు అతనిని ఆపునది ఏదియూ లేదు.

ఆ మరుసటి రోజున సిప్పోరాతో ఆ గాడిదపై, మరియు మరియు తన ఒడిలో చిన్న గెర్షోముతో ఆమె ఒడిలో, బహుషా, గడ్డము ఆ విధముగా వ్రేలాడుచుండగా నేను అతనిని చూచుచున్నాను. సహోదరుడా, ఆ ముఖము నవ్వుచున్నది, వారి కన్నులు ఆకాశము తట్టు తిరిగి నాట్యము చేయుచున్నవి. గొర్రెల కాపరత్వము నుండి దేవుని కొరకై ఒక బలమైనవానిగా — ఒక పరాక్రమశాలిగా, విడిపించుటకై బయలు వెళ్ళెను. గిద్యోనును చూడండి. ఏమి జరిగినది? అవునండీ, ఒక వంకి కర్రతో ఒక దేశమును స్వతంత్రించుకొనుటకై బయలువెళ్ళుట. అతడు దానిని చేసెను. నిశ్చయముగా, అతడు దానిని చేసియుండెను. దేవుడు అతనికి అట్లు చెప్పియుండెను.

అది ఎంత అసత్యముగా కనిపించినను, నీవు కేవలము దేవుడు చేయుమని నీతో చెప్పిన దానినే చేయుము. ఆయన వాక్యము ఇంకను ఒకే రీతిగా ఉన్నదని నీవు కనుగొనెదవు. కేవలము మేఘాలను వెనుకకు నెట్టుము కుమారుడు ప్రకాశించుచునే యున్నాడు.

JOSH 1:5

 

75ఓ, ఆ గొప్ప జయశీలుడైన యెహోషువా! ఓ, మోషే తర్వాత ఎన్నుకోబడినవాడు, దేవునిచే ప్రేమించబడిన ఒక మనుష్యుడు, ఒక బలమైన యోధుడు, దేవునిచే ప్రేమించబడిన ఒక మనుష్యుడు, "నేను మోషేతో ఉండినట్లు, నేను నీతో కూడా ఉండెదను," అని దేవుడు అతనికి చెప్పెను. అయతే గోడలు పడిపోకముందు, ముఖ్య సైనికాధికారి ఆజ్ఞల చొప్పున యెహోషువ ప్రదక్షిణము చేసెను — దానిని దేవుని శక్తి తాకుటకు ముందు గోడచుట్టూ పదమూడు సార్లు — దేవుని వాక్యప్రకారము, ముఖ్య సైనికాధికారి అతనిని బయట కలిసినప్పుడు చెప్పిన ప్రకారము అతడు గోడచుట్టూ తిరిగెను మరియు బూరను ఊదెను. దేవుని వాక్యప్రకారము అతడు తిరిగెను. అతడు ఏమి చేసెను? అతడు అద్భుత కార్యమును చూచుటకు ముందు దేవుని వాక్య ప్రకారము జరిగించెను.

JOSH 6:3,17

 

76కేవలం ఒక బూర ఊదుటవలన గుర్రపు రథములను పరిగెత్తించగల ఒక గోడ కదలిపడిపోదని మీరెరుగుదురు — ఒక బూర ఊదుట. అయితే దేవుడు చెప్పెను, "కేవలం గోడల చుట్టూ తిరుగుము, ఏడు మారులు, మరియు ఆఖరు దినమున, ఏడు మారులు తిరుగుము. మరియు పదమూడు మారులు. మరియు ఆఖరుసారి మీరు గోడచుట్టూ తిరుగునప్పుడు, యాజకులను మందసముతో ముందుగా వెళ్ళి మరియు బూర ఊదనీయుడి. మరియు బూర ఊదుచుండగా గోడలు పడిపోవును!" వారేమి చేసిరి? అతడు దేవుని వాక్యప్రకారము జరిగించిన పిదప, అతడు దేవుని యొక్క అద్భుతకార్యమును చూచెను.

మరి మీ అద్భుతకార్యములు ఏవి? మొదటిగా ఆయన వాక్యప్రకారము చేయుము.

ఒక చిన్న గృహము, ఒక వేశ్య యొక్క గృహము ఉండిన గోడ తప్ప తక్కిన గోడలన్నియు ఎట్లు పడిపోగలవు? ఎందుకనగా ఆమె దేవుని యొక్క వాక్య ప్రకారము జరిగించెను. తక్కిన వారంతయూ మృతి చెంది మరియు ఆమెనే ఎందుకు జీవించెను? ఆమె దేవుని వాక్యాను సారముగా జరిగించెను మరియు ఆమె దేవుని యొక్క అద్భుతమును చూచెను. దానిని ఆ విధముగానే కనుగొనవలెను — వాక్యానుసారముగా జరిగించుట.

EXOD 20:5•

DAN 3:17,18

 

77మండుచున్న అగ్నిగుండము వద్ద హెబ్రీ బాలురు, దేవుని యొక్క అద్భుత కార్యమును చూచుటకు ముందు వారేమి చేసిరి? వారు దేవుని వాక్యప్రకారము జరిగించిరి. ఆయన దేవుడని వారు ఎరిగిరి. వారిని ఐగుప్తునుండి బయటకు తీసుకువచ్చిన దేవుడు ఆయనే అని వారు తెలిసికొనిరి. నిత్యము ఉండిన దేవుడు ఆయనేయని, వారు తెలిసికొనిరి, ఆయనే అద్భుతకార్యములు చేయు దేవుడని వారెరిగిరి.

మరియు విగ్రహములకు నమస్కరించరాదని ఒక ఆజ్ఞను ఆయన వారికి ఇచ్చెను. ఆయన మారనివాడు. "నా వాక్యముతో నిలిచియుండుడి! మీరు విగ్రహములకు నమస్కరించరాదు."

వారేమి చెప్పిరి? "ఈ అగ్నిగుండము నుండి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించక పోయినను, మేము ఆయన మాట చొప్పుననే జరిగించెదము." అది అక్కడే యున్నది. ఏమి జరిగెను? అప్పుడు వారు దేవునియొక్క అద్భుతమును చూసితిరి, దేవుడు ఆ అగ్నిని ఎదుర్కొనెను.

ACTS 2:38

 

78మీరు వ్యాధిగ్రస్తులై యుంటిరా? ఆయన వాక్య ప్రకారము చేసి, ఆయన స్వస్థపరచునేమో చూడండి. మీరు ఒక పాపియై యుండి మరియు పరిశుద్దాత్మతో నింపబడగోరినయెడల, రండి, పశ్చాత్తాపపడుడి, యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి. ఆయన వాక్యప్రకారము చేయుడి, ఏమి జరుగునో చూడుడి. మీలో ఇంకనూ లోకము ఉన్నయెడల, మరియు స్త్రీలైన మీరు ఇంకా జుట్టు కత్తిరించుకొనినయెడల, ఇంకనూ రంగులు పులుముకొనినయెడల, పురుషులైన మీరు ఇంకనూ కోపిష్ఠులైనయెడల, మీ సంఘశాఖల పట్ల శ్రద్ద కలిగియుండినయెడల — ఆయన ఇంకనూ దేవుడేయని మీరు కనుగొనగోరినయెడల, దాని ప్రకారము నడువుము మరియు మిమ్మును ఆయన బలిపీఠముపై సమర్పించుకొనుడి, ఏమి జరుగునో చూడుడి. ఆయన దేవుడై యున్నాడు. మొదటిగా నీవు ఆయన వాక్యము చొప్పున నడువవలసియున్నది.

1KGS 8:38,39•

DAN 6:7

 

79దానియేలు, సింహాల గుహనుండి తప్పించు దేవుని అద్భుత కార్యమును చూచుటకు ముందు అతడు చేసిన మొదటి కార్యమేదనగా దేవుని వాక్యానుసారముగా నడిచెను.

"ఏ మనుష్యుడైనను ఈ ప్రతిమకు తప్ప దేవునికి ఈ నిర్ణయించబడిన దినములలో ప్రార్థించినయెడల, అతడు సింహాల గుహలో పడద్రోయబడును అను శాసనము బయలు వెళ్ళెను." రాజుకు తప్ప మరే ఇతర దేవునికి ఏ మనుష్యుడునూ ప్రార్థించుటకు వీలు లేదు — ముప్పది దినములు అతడే దేవునిగా ఉండును.

అయితే దానియేలు ఏమి చేసెను? అతడు దేవుని వాక్యప్రకారము చేసెను. ఏలయనగా, సొలోమోను దేవాలయమును ప్రతిష్ఠ చేసినప్పుడు, అతడు ప్రార్థించెను "ప్రభువా, నీ ప్రజలు ఎక్కడైనను కష్టములో వుండి ఈ దేవాలయము తట్టు తిరిగినయెడల, నీవు పరలోకమునుండి ఆలకించెదవు," అని చెప్పెను. అది నిజము.

DAN 6:10,22

 

80మొదటిగా, దానియేలు చేసెను. "నీవు సింహముల గుహలోనికి వెళ్ళెదవు అనునది బెదిరింపైయున్నది." అయితే దానియేలు దేవుని వాక్యప్రకారము నడిచెను. గిద్యోను ఎరిగి యుండిన రీతిగా, అతను దేవుడు ఇంకనూ దేవుడేయని ఎరిగియుండెను. దేవుడు ఇంకనూ దేవుడై యుండినయెడల అద్భుత కార్యములన్నియు ఏమాయెను? అని అతడు ఎరిగియుండెను. మరియు దానియేలు తాను ఒక ప్రవక్తయని ఎరిగి యుండెను, అతడు దేవుని ప్రేమించెనని ఎరిగియుండెను. తాను దేవుని యొక్క సేవకుడని అతడు ఎరిగియుండెను, మరియు సింహముల నుండి దేవుడు తనను విడిపించగల సమర్థుడని అతడు ఎరిగి యుండెను. అయితే అతడు సమస్యలో ఉండినప్పుడు, ఒక బెదిరింపులో ఉండినప్పుడు, అతడు తన ముఖమును దేవాలయము తట్టు త్రిప్పుకొని దినమునకు మూడుసార్లు ప్రార్థించెను ఖచ్చితముగా. అతడు దేవుని వాక్యానుసారముగా నడిచెను, మరియు దేవుడు అతనిని పరిశుద్ధాత్మతో ఎంతగా నింపెననగా అతడిని సింహములు తినలేకపోయెను. అది వాస్తవము. అది నిజము. అతడు మొదటిగా దేవుని వాక్యప్రకారము నడిచెను.

JON 1:15,17•

JON 2:5

 

81తిమింగళము కడుపులోనున్న యోనా, మొదటిగా దేవుని వాక్యప్రకారము చేసెను. భౌతికంగా అతని పని అయిపోయెనని అతడు ఎరిగి యుండెను. అతని చేతులు కట్టబడి యుండెను అతని కాళ్ళు కట్టబడి యుండెను. అన్యజనులకు బోధకుడైన ఇతడు ఓడనుండి త్రోయబడి తిమింగళము కడుపులో పడి, మరియు సముద్రపు అడుగు భాగములోనికి వెళ్ళెను. ఇప్పుడు, అతడు ఎటువంటి పరిస్థితిలో ఉండియున్నాడు. అయితే మొదటిగా అతడు తిమింగళము కడుపు అడుగు-భాగములో తనకుతానుగా తిరిగెను. సముద్రపు మొక్కలు తన మెడచుట్టూ చుట్టుకొని యుండెను తన శరీరమునకు విటమిన్ల కొరకై తిమింగళము ఈ సముద్రపు మొక్కలు తినుచుండెను, దాని విటమిను మాత్రలు — మరియు దానికి అచ్చట ఒక బోధకుడు దొరికెను. అయితే ఈ బోధకుడు తనకుతానుగా వచ్చెను. హల్లెలూయా!

ఓ సహోదరుడా, బోధకుడా, ఈ రాత్రి నీకు నీవుగా వచ్చి, ఆ పాత ఆచారపు బోధలు మరియు ఆ కార్యములను దాటి జీవముగల దేవుని యొద్దకు, జీవముగల వాక్యము నొద్దకు రమ్ము

JON 2:4,8

 

82అతడు తన స్థితిని గుర్తించి, తిరిగెను. ఒక పరిశుద్ధుణ్ణి తన ప్రార్థన నుండి నీవు మూయలేవు. అతడు తన శరీరమును త్రిప్పుకొనెను మరియు అతని చుట్టూ — తూర్పు, ఉత్తరం, పడమర మరియు దక్షిణము ఎటు చూచిననూ తిమింగళము కడుపు. ఆయన తిమింగళము కడుపులో ఉన్నాడని గ్రహించాడు, సముద్రపు మట్టమున, మరియు సముద్రము పైన తుఫాను. ఆయన నావలో ఉన్నపుడు అన్ని ఆశలు కోల్పోయాడు; ఇప్పుడు ఆయన తిమింగళము కడుపులో ఉన్నాడు అన్ని ఆశలు వదులుకొని దూరముగా. మరియు కేవలము ఆయన తిమింగళము కడుపు చూడగలడు, ఆయన అన్నాడు "అవి అన్ని అభద్దపు గర్వములు. నేను వాటిని ఎన్నిటికి నమ్మను, కాని నేను నీ పరిశుద్ధ ఆలయము వైపు చూస్తాను." పరిశుద్ధ ఆలయము — కిందికి చూడడం లేదు. అయన అన్నాడు, "అది అక్కడ ఉన్నది, కావున నేను దాని వైపు చూస్తున్నాను."

83మరియు అప్పుడు అతను దేవుని యొక్క అద్భుత కార్యమును చూచెను. ఏదో విధంగా ప్రాణవాయువు తిమింగళములోనికి వచ్చెను. అతడు అతిసాధారణముగా మూడు దినములు గాలి పీల్చుకొనెను, మరియు ఆ దుష్ట పట్టణము నందునలుబది దినములు ప్రయాణించి సువార్త బోధించుటకై అతడు కొంత మంచి విశ్రాంతి పొందుచు మరియు స్వారి చేయుచుండెను. పరలోకమునుండి కొంత నూతన ప్రాణవాయువుతో మంచి బలమును పొందుకొనెను. అది తిమింగళము నుండి రాజాలదు. మరియు అది సముద్రము నుండి రాజాలదు, కావున అది దేవుని యొద్ద నుండి రావలసియున్నది.

ఓ, ప్రభువా, ఈ చివరి దుష్ట దినమున మేము జీవించులాగున తన పునరుత్థానశక్తితో దేవుని వాక్యపు ప్రాణవాయువును మాపై ఊదుము. ఓ, పరిశుద్ధాత్ముడా, మాపై ఊదుము. సహోదరుడా, అది అంతే. ప్రభువా, ఊదుము, ప్రాణవాయువుతో మమ్మును నింపుము.

84ఈ ఉదయమున బాతును గూర్చి నేను చెప్పిన రీతిగా, అది నీటి వాసన చూచిన వెంటనే, దాని నుంచి దానిని మరేదియూ దూరముగా ఉంచలేదు కోడి కేకలన్నియు, మరేదియూ దూరపరచలేదు; అది తిన్నగా నీటి యొద్దకు వెళ్ళును, ఏలయనగా అది ఒక బాతైయుండెను.

ఇప్పుడు మీలో బాతు స్వభావము కలిగినవారెవరైనా ఉన్నయెడల, ఈ వెనుక ఒక పెద్ద కొలను మాకు ఉన్నది, చూశారా. ఆయన చేయమని చెప్పిన మొదటి కార్యము, మీరు వాసన చూడగలిగినయెడల, దేవుడుగానే యుండునని మీకు ఏ మాత్రము అగుపించిననూ, ఈ రాత్రి మీకు పరలోకము నుండి ఆ మెల్లని గాలి వీచినయెడల, మరియు మీరింకనూ పరిశుద్ధాత్మను పొందుకొననియెడల, నీటిని వాసన చూడుడి. నిశ్చయముగా. నీ హృదయాంతరంగము నుండి పశ్చాత్తాపపడుము, బలిపీఠముపై ఒక బలిగా, నిన్ను నీవు సమర్పించుకొనుము, మరియు నీలోని లోకము కాల్చివేయబడును, మరియు తిరిగి ఆత్మద్వారా జన్మించెదవు మరియు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందుము ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపును. సరియైన క్రమములో వెళ్ళుము. వచ్చి బోధకునితో కరచాలనము చేసి, పుస్తకములో మీ పేరు నమోదు చేసికొనుట కాదు, అయితే నీవు ఇక ఎన్నడూ లోకమును ఎరుగనటు వంటి విధముగా చనిపోవలెను.

85హేబేలు అదే బలిపీఠముపై తన గొర్రెపిల్లతో చనిపోయెను. మరియు నీవు ఎన్నడైననూ దేవునితో సరిగా ఉండాలనిన, నీ చుట్టూ చీకటి అవునంతగా నీవు క్రీస్తుతో కూడా బలిపీఠంపై మృతిచెందవలసియున్నది. అక్కడే మృతిచెందుము. మరియు నీవు తిరిగి లేచినప్పుడు నీవు క్రీస్తులో ఒక నూతన సృష్ఠిగా వుండెదవు. నిశ్చయంగా.

యోనా మొదటిగా దేవుని మాటను నమ్మి, దాని ప్రకారము నడువవలసియున్నది. ఇప్పుడు, అతడు తిమింగళము యొక్క కడుపులోనికి వెళ్ళినప్పుడు, అతడు బహుశా తన తలక్రిందుగా వుండియుండును, ఏలయనగా వారు అతనిని విసిరివేసిరి. నేరుగా తిమింగళము కడుపులోనికి హఠాత్తుగా జారిపోయెను. మంచిది, మనము ఇప్పుడు సముద్రపు అడుగు భాగమునకు వెళ్ళుదము అని తిమింగళము అనుకొనెను.

మరియు ఆ మూడు దినములు ఆ తిమింగళము ఏమి ఆలోచించెనోయని నేను ఆశ్చర్యపడుదును, ఒక వింతైన కార్యము జరుగుచుండెను. ఇప్పుడు, మీరు చూడండి, తిమింగళపు కట్టడము దానిని ప్రశంసించదు. సంఘశాఖలైననూ దానిని ప్రశంసించవు. అయితే, ఓ, యోనా దానిని ఎంతో ప్రేమించెను. నిశ్చయముగా, అతడు దానిని ప్రేమించెను, ఏలయనగా తాజా గాలిని దేవుడు అతనిపై విసురుచుండెను. అతడు సజీవునిగా ఉండెను. దేవా, మాపై తాజా గాలిని విసురుము!

86యోనా ఆ విధముగా భౌతికమైన ఆలయముయెడల దేవుని వాక్యముపై నమ్మికయుంచి ఒక అద్భుత కార్యమును జరిగించినయెడల, దానిని నిర్మించిన మనుష్యుడు, సొలొమోను చివరిగా విశ్వాసమును కోల్పోయెను, అయితే ఎవరైనను ఆ దేవాలయము తట్టు చూచినయెడల, వారు ఎచ్చటనున్నను, వారి సమస్యల నుండి విడిపించుమని దేవుని ప్రార్థించి అడిగెను. మరియు యోనా అటువంటి పరిస్థితులలో కూడా నమ్మికయుంచెను, ఈ రాత్రి ఒక పడిపోయిన వ్యక్తి కాక, యోనావలె మృతిచెంది సమాధిలో వున్న వ్యక్తి కాక లేక అప్పటి సొలొమోను వలె కాక, సర్వశక్తితో, మరియు అధికారముతో సర్వోన్నతుని కుడిపార్శమున కూర్చునియుండు సజీవ దేవుడు, వాక్యమును బోధించుచూ మరియు ఆయన చేసియున్నాడనుటకు సాక్షముగా పరిశుద్ధాత్మను పంపుచున్నప్పుడు పరలోకము వైపు చూచుటలో, ఈ రాత్రి మనము ఇంకెంతగా నమ్మవలసియున్నది. ఆమేన్. దేవుని వాక్యమును నమ్ముడి, మీరు దేవుని అద్భుతకార్యములు చూచెదరు. అయితే మొదటిగా నీవు దానిని నమ్మవలసియున్నది. అది నిశ్చయము. అవును.

JUDG 6:13,21

 

87గిద్యోను, చెట్టు క్రిందనున్న ఆ వ్యక్తిని చూచినప్పుడు, మొదటిగా గిద్యోను అతనిని ప్రశ్నించువానిగా నుండెను. దేవుడు ఇంకను దేవుడే అయియున్నయెడల, దేవుడు మాకు తోడై యుండినయెడల, ఆయన అద్భుత కార్యములు ఏమాయెను? మరియు ఈ మరియు చెట్టు క్రిందనున్న ఈ సందర్శకుడు, అతను ఏమి చేసెను? అతడు తన చేతిలోనున్న కర్రతో ఆ బలిని తాకినప్పుడు అది దహించబడెను. మరియు అది దేవుని కార్యమని అతడు ఎరిగి యుండెను, కావున చెట్టు క్రింద కూర్చుండి ముసలి వ్యక్తివలె కనిపించుచున్న ఆ సందర్శకుడు, శరీరధారియైన వాక్యమేనని అతడు ఎరిగి యుండెను. హల్లేలూయా! అది సజీవవాక్యమై యుండెను. అది సజీవ వాక్యమై యున్నదని అతడు ఎరిగి యుండెను, ఏలయనగా అది వర్తమాన కాలములో (ఇప్పుడు) జీవించుచూ మరియు క్రియచేయుచూ నుండెను. దేవునికి మహిమ, సహోదరుడా!

88పెంతెకోస్తు సరియే, అయితే అది నీకు నీవుగా పొందుకొననియెడల అది ఒక రంగువేసిన అగ్నియే. ఒక భూత కాలము కాదు; ఒక వర్తమాన కాలము! చరిత్రలో వున్న దేవుడు, ఈ రోజున కూడా అదే దేవునిగా లేనియెడల ఏమి ప్రయోజనము? నేను తరచుగా చెప్పినట్లు, మీ క్యానరి పక్షికి (మధుర స్వరము గల పక్షి) దాని రెక్కలు పెరుగునట్లు పోషకాహారమును పెట్టి, ఒక పంజరములో దానిని పెట్టి అక్కడ ఉంచినయెడల ఏమి ప్రయోజనము? శక్తిగల దేవుడు ఉన్నాడని బోధించి మరియు ఆయనను సేవించునటువంటి భాగ్యమును కలిగివున్న ప్రజలను తిరస్కరించినయెడల ఏమి ప్రయోజనము? ఆమేన్. నిశ్చయముగా. అర్ధరహితం.

ఒక పెద్ద పొదుగు యంత్రమువలె ఈ సెమినరీలన్నిటిని మీరెందుకు కలిగియుండిరి, బోధకులను పుట్టించుటకా?

పొదుగు యంత్రములో పెరిగిన కోడిపిల్లను గూర్చి నేనెల్లప్పుడూ చింతించెదను. దానికి నిజముగా ఏ తల్లియూ లేదు. అది ఎక్కడినుండి వచ్చెనో దానికి తెలియదు. దానికి తల్లిగా ఎవరునూ లేరు, అది యాంత్రికముగా బయటికి వచ్చెను.

వేదపాండిత్యము మాత్రమే తెలిసియున్న ఒక సెమినరీ బోధకుడును ఆ విధముగానే యున్నాడు. అతడు ఒక పండితునివలె జ్ఞానవంతుడై, తెలివైనవాడై ఉండవచ్చును, అతడు ఎన్నో భాషలలో బోధించగలవాడై యుండవచ్చును, అయితే తన తల్లి లేక తండ్రి ఎవరో అతనికి తెలియనియెడల…!

MARK 16:15-17•

JOHN 14:12•

HEB 13:8

 

89ఇటీవల కాలములో నేను చెప్పిన విధముగా ఏమియూ తెలియనిది ఏదైననూ ఉన్నయెడల, అది ఒక కంచర గాడిదయైయున్నది. దానికి తన తండ్రి ఎవరో లేక తల్లి ఎవరో తెలియదు. అది ఒక సంకరజాతియైయున్నది, చూశారా. దానికి తండ్రి, తల్లి ఎవరో తెలియదు. అతడు ఏ స్థలమునకు చెందినవాడో అతనికి తెలియదు. అది సంఘశాఖలచే పొదగబడి సంకరము చేయబడి క్రైస్తవులమని చెప్పుకొనుచున్నవారివలె వున్నది.

అయితే ఒక మంచి విత్తనము నుండి తీయబడిన గుర్రము వంశావళి కలిగినదైయున్నది అదంతయూ ఏమై యున్నదో దానికి తెలియును. మరియు ఒక సంకరము చేయబడని క్రైస్తవునికి దేవుని ధాన్యాగారము ఎచ్చటనున్నదో తెలియును. వారు వాక్యమునకు జన్మించినవారని వారెరుగుదురు. వాక్యము వారిలో శరీరధారియాయెను. దేవుడు చెప్పు ప్రతిమాటకు, దానితో వారు విభేదించరు అది నిజము. ఆమేన్ మరియు ఆమేన్! అని వారు చెప్పుదురు. ప్రతీసారి ఆమేన్ అను దానితో వారు దానిని ముగించెదరు. ఆమేన్! ఆమేన్ వారిలో ఉన్నదియేదో అదే దానిని సంపూర్ణము చేయును.

" యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు."

"ఆమేన్!"

"నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు అతడునూ చేయును."

" ఆమేన్!"

"మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీస్మము పొందిన వాడు రక్షణ పొందును. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును."

"ఆమేన్!"

"క్లక్-క్లక్-క్లక్, అద్భుతములు జరుగు రోజులు గతించినవి, అని ఆ పాత కోడిపెట్ట చెప్పెను."

"అయితే హాంక్-హాంక్, నేను నీటి వాసనను చూచుచున్నాను."

అది నిజము. చూశారా. ఎందువలన? నీవు దేవునిని పరీక్షించుచున్నావు. చూడండి, అది అదేయైయున్నది. మొదటిగా దేవుడు, ఆయన వాక్యప్రకారము చేయుము, మరియు అది నిజమో కాదో చూడుము. అది సత్యము.

LUKE 1:13,20,80

 

90బాప్తీస్మము యిచ్చు యోహాను తన పనిని తాను నిర్వర్తించుచూ వెళ్ళుచుండెను. కేవలం ఒక పిల్లవాడిగా ఉన్నప్పుడు, అతని గూర్చి అంతగా వ్రాయబడలేదు. అతని తండ్రి మంచివాడు, కాని దేవుని పై అపనమ్మకము కలిగియుండెను. ఈ చిన్న బిడ్డను ఎలీసబెతు ద్వారా తెచ్చుటకు దేవుడు నిర్ణయించుకొనెను.

కావున దాని ప్రకారము ఆయన ఆమెకు చెప్పెను. ఈ బిడ్డను గర్భమున ధరించునని ఆమెతో చెప్పెను, మరియు అతడు దానిని సందేహించెను, మరియు ఆయన అతనిని మూగవానిగా మొత్తెను. బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క తల్లి తండ్రులైన ఎలీసబెతు మరియు జకర్యా యొక్క హృదయమును నేను ఊహించగలను, తీవ్రమైన మధ్యలో నుండిరి, ఏలయనగా వారు వృద్ధులని వారెరిగి యుండిరి. మరియు జన్మించినటువంటి ఈ వాగ్ధాన పుత్రుడు, వారు వృద్ధులై వయస్సు గతించిన తరువాత, దేవుడు ఒక అద్భుత కార్యము చేసి ఈ చిన్నవాడిని లోకము లోనికి తెచ్చెను. వారి హృదయములు సంతాపము నొందినవని వారెరిగి యుండిరి, ఏలయనగా అతడు దేవుని కొరకై తన ఉన్నతమైన కార్యమును చేయుటను చూచునంత వరకు వారు జీవించి యుండలేదు. అయితే వారు అతనిని దానికై ప్రతిష్టించిరి! దేవునికి మహిమ! ఎక్కడో నక్షత్రములకు మరియు చంద్రునికి ఆవలనుండి వారు దానిని తొంగి చూడగలిగిరి. వారు ఈ చిన్న బాలుని ఎన్నటికిని చూడలేక పోయిరి. వారు మృతిచెందిరి. వారు అతడు చిన్న బాలునిగా వున్నప్పుడే మృతి చెందిరి, ఒక యవ్వనునిగా, ఒక బాలునిగా, అతడు తన గృహమును విడచి మరి అరణ్యములోనికి వెళ్ళిపోయెను. అక్కడ అతను దేవుని శక్తి క్రింద పెంచబడెను.

MATT 3:3,7•

MARK 1:3•

LUKE 3:4,7

 

91"నీవు అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము నేను నిన్ను పంపుచున్నాను: వెళ్ళి, కేకవేయుము," అని దేవుడు అతనితో చెప్పెను.

యోహాను ప్రతీరోజు బండలలోని పాములను తరముకుంటూ మరియు రాళ్ళతో కొట్టుచూ ఏ విధముగా ఎదురు చూచియుండెనో. "ఓ, నేను ఎదురుచూడలేను."

"యోహాను నీవు దేనికొరకు ఎదురు చూచుచున్నావు?"

"నేను కేవలం ఆయన ఆజ్ఞకై ఎదురు చూచుచున్నాను అంతే. సర్పములారా, మార్గము తొలగిపొండి అవి బండల లోనికి పారిపోవును. ఆ కారణము చేతనే పరిసయ్యులు వచ్చినప్పుడు, ఓ, సర్పసంతానమా, బండలలోనికి పారిపోవుడి అని అతడు చెప్పెను."

92ఈ రాత్రి నేనూ అదే కార్యమును చెప్పుచున్నాను. సర్పసంతానమా నీటి యొద్దకు వెళ్ళుడి! నేను చెప్పునదేదో మీరెరుగుదురా. ఈ టేపులు… ఇది ప్రపంచమంతటికి వెళ్ళును. దేవుని అద్భుత కార్యములు నీవు చూడగోరినయెడల, నీటి యొద్దకు రమ్ము.

యోహాను నేరుగా వెంబడించుచుండెను, చూచుటకు ఒక మంచి వ్యక్తి వచ్చెను "అది అతడే కావచ్చును," అని అతడు అనెను. అతడు చూచి, లేదు, అది అతడు కాదు, కాదు. దేవుడు నాకు ఒక వాగ్ధానమును అనుగ్రహించెను.

యోహాను, "ఈ రోజు మెస్సీయా జీవించుచున్నాడని చెప్పుచున్నావా?"

"అవును."

"అయితే ఆయన ఎచ్చటనున్నాడు?"

"ఈ భూమి మీద ఏదో ఒక చోట ఆయన ఎచ్చటనున్నాడో నేనెరుగను, అయితే ఆయన వచ్చినప్పుడు మాత్రం నేను ఆయనను ఎరుగుదును."

"నీవెట్లు తెలుసుకొనెదవు?"

"నేను దేనికొరకై ఎదురు చూడవలెనో దేవుడు నాకు చెప్పెను."

MATT 14:4•

MARK 6:18

 

93"నీకై ప్రార్థించినప్పుడు నీవు స్వస్థత పొందుదువని నీకెట్లు తెలియును?" నేను దేనికొరకై ఎదురు చూడవలెనో దేవుడు నాతో చెప్పియుండెను. "నీవు పరిశుద్ధాత్మను పొందుకొనెదవని నీకెట్లు తెలియును?" నేను ఆయన వాక్యమును తరువాత ఏమి సంభవించునో నేనెరుగుదును, చూశారా. ఇక జరగబోవునదేదో నీవెరుగుదువా? నీవు దేవుని వాక్యమునకు విధేయుడవైనయెడల, పిదప ఆయన యొక్క వాగ్థానము వచ్చును. ఆయన అబద్ధమాడజాలడు; ఆయన దేవుడు.

"ఇక తరువాత ఏమి జరుగును?"

"ఆయన వచ్చినప్పుడు నేను ఆయనను చూచెదను," అని యోహాను చెప్పెను.

వారిట్లు చెప్పిరి, "ఓ, ఇటు వైపు వచ్చుచున్న ఈ వ్యక్తిని చూడండి, అది అతని తలపై కిరీటమున్నది, ఆ గుర్రములను నడిపించు అతడే మెస్సీయా అయి యుండును.

"అది ఆయన కాదు," అని చెప్పెను.

నేరుగా అతని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెను, "నీవు నీ సహోదరుని భార్యను ఉంచుకొనుట న్యాయము కాదు!" అక్కడ ఏదో పొరపాటు జరిగెనని వారెరిగియుండిరి? అతడు అతని యొద్దకు నడిచి వెళ్ళి మరియు అతనితో చెప్పెను — అది హేరోదు, మీరు చూశారా. ఓ, అది అతని భార్యను ఎంత పిచ్చిదానిగా చేసెను. ఆమె తన జీవితకాలమంతయు అతనిని ద్వేషించెను, చూశారా.

MARK 16:17•

JOHN 1:33

 

94యోహాను ఎదురుచూచుచుండెను. "ఓ, ఆయన వచ్చినప్పుడు ఆయనను నేనెరుగుదును," అని అతడు చెప్పెను.

"నీవెలాగు ఎరుగుదువు?"

"నేను ఒక సూచన చూచెదనని దేవుడు నాతో చెప్పెను, మరియు అది ఒక మెస్సీయా యొక్క సూచనయై యుండును. నేను మెస్సీయాను ఎరుగుదును, ఏలయనగా మెస్సీయా గురుతు అచ్చట వుండును."

దేవుడు తన సంఘమును ఎరుగును. "సూచనలు వారిని వెంబడించును," అని ఆయన చెప్పెను. వారు మెథడిస్టులకు, బాప్టిస్టులకు లేక పెంతెకోస్తు వారికి చెందుదురు, అని చెప్పలేదు. అయితే "నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును" అని చెప్పెను. విశ్వాసులను ఆయన ఎరుగును.

"నీవు ఒక విశ్వాసివా?" అని ఈ రోజు ఏదో ఒక సమయమున నీవు అడుగ వచ్చును.

"ఓ, నేను మెథడిస్టువాడను." మంచిది, అటువంటప్పుడు అది నీవు ఒక విశ్వాసివి కాదని చూపించుచున్నది, చూశారా.

"నేను పెంతెకోస్తువాడను." అది కూడా నీవు ఇంకనూ ఒక విశ్వాసివి కాదని చూపించుచున్నది.

నీవు ఒక విశ్వాసివైనయెడల, నీవు దేవుని నమ్మెదవు. ప్రతి వారు దాని నెరుగుదురు నీవు దేవుని రాజ్యముచే ముద్రించబడి యుంటివి మరియు ఒక కాగితమునకు ఇరుప్రక్కల ఒక ముద్ర వుండును, వచ్చుట మరియు వెళ్ళుట, రెండునూ. చూడండి, వారికి నీవు చెప్పవచ్చును.

JOHN 1:33

 

95మంచిది.

"ఒక సూచన వుండును గనుక, ఆయన వచ్చునప్పుడు నేను ఆయనను ఎరుగుదును. మెస్సీయా సూచనను నేను చూచెదను," అని అతడు చెప్పెను. మరియు ఒక దినమున అతడు చూచెను…

ఓ, సహోదరుడా! ఎందువలన? అతడు దాని గూర్చి ఎదురు చూచుచుండెను. మరి అందును బట్టి అతడు దానిని గుర్తించెను. అది అర్థమయినదని నేను తలంచుచున్నాను. నీవు దాని గురించి ఎదురు చూచుచున్నావా? నీవింకేదైనను జరుగవలెనని ఎదురు చూచుచున్నావా? అలాగైనచో లేఖనములను తెలుసుకొనుము!

96ఇప్పుడు, అక్కడ నిలబడిన యాజకులందరూ యోహాను కంటె ఐదురెట్లు ఎక్కువ తెలివిగలవారైయుండెను. అతడు ఒక్క రోజైననూ పాఠశాలకు వెళ్ళిన దాఖలాలు మనకు లేవు. అయితే తాత-ముత్తాతల నుండి, యాజకుల కుటుంబములో నుండి వచ్చిన యాజకులు అక్కడ నిలబడియున్నారు. ప్రవక్తల ప్రవచనములు, ఆదికాండము, మరియు దానంతటిని, లేఖనములలోని ప్రతి అంగుళమును ఎరిగియున్న వ్యక్తులు అచ్చట నిలబడియున్నారు. అయితే, మీరు గమనించండి, యోహాను మాత్రం ఒక సూచక కొరకు కనిపెట్టుచుండెను, ఒక మెస్సీయా, ఆయన దేవుడైనయెడల, దాని గూర్చి ఏదో సహజాతీతమైనది ఉండునని అతడు ఎరిగియుండెను. అది నిజము.

ఈ రోజు కూడా అది అంతే! గొప్ప క్రైస్తవుడివైనయెడల నిన్ను ఏదో ఒక సహజాతీతమైనది తాకియున్నది. అది నిన్ను తాకనియెడల, నీవు మోసగించబడితివి. నీవు ఇదివరకు జీవించిన జీవితమునే, ఇప్పుడునూ జీవించుచున్నావు; మొదటిగా ప్రేమించిన వాటినే, ఇప్పుడునూ ప్రేమించుచున్నావు, నీవు ఇంకనూ ప్రేమించుచున్నావు; నీవు మోసగించబడితివి. అది నిజము — దేవునికి ఒక కుమారునివి లేక కుమార్తెవు కాదు.

97అయితే యోహాను అక్కడ ఒక రోజు నిలువబడి యుండుట మనము కనుగొనెదము, వారు చెప్పుదురు (అతని గూర్చి ఒక కథలో చదువుచూ) ఈలాగు చెప్పెదరు, యోహాను నదికి ఒక ప్రక్కన వుండెను. మరో ప్రక్కనేమో వారు అతనిని వదిలివేసితిరి. ఒక దైవసేవకుని వారు ఆ విధముగానే చేసెదరు. ప్రతి సంఘశాఖ నుండి, ప్రతి సంస్థ నుండి, ప్రతిదాని నుండి అతనిని వదిలించుకొందురు. అతనికి నిలబడుటకు ఒక వేదికైనను లేకుండెను, అయితే అతడు తన మోకాలి లోతు బురదలో ఉండెను. అతనికి ఒకవిందు వస్త్రమైనను లేదు, అతని కాలరు మడిచి అయినను లేదు, లేదండి. అతనికి తనచుట్టూ ఒక గొర్రె చర్మము కప్పబడియుండెను, బహుశా చూచుటకు ఒక అడవి మనిషివలె అక్కడ నిలబడియుండ వచ్చును.

1KGS 21:19

 

98ఈ గొప్ప దేవాలయము, "మా గొప్ప సంస్థ కూలిపోవు సమయము ఒకటి వచ్చునని నీవు మాకు చెప్ప తలచితివి? అని ఆ యాజకులు అడిగిరి."

"ఖచ్చితముగా, అది పడిపోవును," అని అతను చెప్పెను.

"అది నీ కెట్లు తెలియును?"

"మీరు లేఖనములు ఏలాగు చదివెదరు? ఒక మెస్సీయా వచ్చును, మరియు ఆ మెస్సీయా అనుదిన బలిని తీసివేయును. దానియేలు ఆ విధముగా చెప్పెను! ప్రవక్త ఆ విధముగా చెప్పెను!" హల్లెలూయా!

ఓ, నేను ప్రతీసారి భక్తి పారవశ్యములో నున్నాను. (నేను ఇక ఆపవలెను).

"అది నీకెట్లు తెలియును?"

"ప్రవక్త ఆ విధముగా చెప్పెను."

అందును బట్టే మికాయ ఆహాబును దీవించలేనని ఎరిగి యుండెను — ఏలియా అతనిని శపించెను. అది అంతే. అతడు వాక్యముతో నిలబడవలసిన వాడైయుండెను. నీవు దేవుని కార్యములు చూడగోరినయెడల, నీవు దేవుని వాక్యమును వెంబడించవలసియున్నది. అది సంభవించదని అతడు ఎరిగియుండెను.

DAN 9:27•

JOHN 1:29

 

99అయితే తరువాత ఏమి జరిగెను? అతడు దేవుని కార్యములు చూడగోరెను. "ఆయన వచ్చినప్పుడు నేను ఆయనను ఎరుగుదును," అని యోహాను చెప్పెను.

ఒక రోజున అచ్చట నిలబడి అతడు ఈలాగు చెప్పెను, "అవున, అనుదిన బలి తీసివేయబడు ఒక దినము వచ్చును. మెస్సీయాయే అనుదిన బలియగును, మరియు నాశనము చేయు హేయ వస్తువు ఉంచబడును.

"రబ్బీ, నీవు అది ఎక్కడ నేర్చుకొంటివి? అది మా బోధకు విరుద్ధమైనది."

అయితే అది దేవుని వాక్యమునకు విరుద్ధమైనది కాదు. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలయనగా ప్రభువు యొక్క వాక్యము ప్రవక్తతో నుండెను. అది నిజము.

మరియు అతడు "ఇదిగో, లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల!" అక్కడ నిలిచియుండెను, అని చెప్పెను. ఒక సామాన్యమైన, చిన్నవాడైన, భుజములు వంగిపోయిన వ్యక్తి అచ్చట నిలబడియుండెను. నది వైపు నడుచుచూ దిగుచుండెను. లాజరుతో నడుచుచుండెను — కేవలం ఒక సాధారణ మానవుడు, సాధారణ మనుష్యుడు వేసుకొను వస్త్రములు వేసుకొనెను. యాజకుని దుస్తులు లేవు, తలపాగ లేదు, కిరీటము లేదు, ఏదియూ లేదు, కేవలం ఒక పేద బాలుడు, వడ్రంగి, బహుశా తన చేతులనిండా చెక్క ముక్కలతో నడిచి వస్తుండవచ్చును — నడచి వచ్చుచుండెను.

"మీరు నాతో చెప్పదలచితిరా ఏమిటి…?'

"ఏమిటి? మీరు అతనిని చూచుట లేదా? అక్కడ… [ఇదిగో! అనగా, "ఉన్నతముగా చూడుడి."] లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల అచ్చట నున్నది.

100వారిలో కొంతమంది, "మంచిది, అది ఎవరో నీకు తెలియునా? అతను వడ్రంగి వాని కుమారుడు. ఇప్పుడు, ఆ వ్యక్తి ప్రవక్త కాదని మేమెరుగుదుము," అని చెప్పిరి. అయితే అతడు ప్రవక్తై యుండెను. అతడు ప్రవక్తయై యుండెను. అతడు ఎరుగును. "ఎందువలన? అతడు చెప్పునది అతనెరుగడు." అవును, అతడెరుగును. "ఇతరులు చెప్పు దానికి వ్యతిరేకముగా అతడు అతనికి ఏలాగు చెప్పెను?" మెస్సీయా వ్యత్యాసముగా నుండును. "అది మన కెట్లు తెలియును?" వారు చూడని దానినేదో యోహాను చూచి యుండెను.

నీవు దేని గురించి ఎదురు చూచుచున్నావో దానిపై ఆధారపడి యుండును. నీవు ఆ రాత్రి దేనిని చూచుచున్నావు? ఒక గొప్ప సంఘశాఖలోని ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తినా, అదంతయు నీ ఆలోచన ప్రకారము వుండునట్లు ఎదురుచూచుచున్నావా, లేక ప్రభువు కొరకు తృణీకరించబడిన కొద్దిమంది యొక్క దేవుని మార్గమును అనుసరి౦చెదవా? నీవు పరిశుద్ధ గ్రంథమును చూచుచున్నావా? నీవు దేవుని యొక్క వాక్యమును చూచుచున్నావా? నీవు తిరిగి జన్మించినయెడల, దానిని చూచెదవు. నీవు తిరిగి జన్మించనంత వరకూ నీవు దానిని చూడలేవు.

JOHN 1:33

 

101అతడు అచ్చటకు వచ్చెను. అతడు చెప్పెను, "అతడు చెప్పెను నాతో అరణ్యములో చెప్పెను…" ఓ, సహోదరుడా! "కేక వేయమని ఆయన నాతో చెప్పెను… ఆరు నెలలుగా నేను ఇచ్చట కేక వేయుచున్నాను, ఐనోనులో, ఇచ్చట ప్రతి చోటను, యోర్ధానుకు ఇరు ప్రక్కల, బురదలో నడుచుచూ, మీ బోధలతో బోధకులలో అలజడి రేపుచూ, తీవ్ర ప్రతిఘటన రేపు అంశములపై మీ సంఘశాఖలను తీవ్రముగా ఖండించుచూ నుంటిని. అయితే అది ఇచ్చట నున్నది నేను దానిని చూచుచున్నాను!"

"నీవేలాగు ఎరుగుదువు?"

"అరణ్యములో కేకవేయు ఒక శబ్దముగా వుందువని ఆయనే చెప్పెను — దేవుడు నన్ను ఆ ఉద్ధేశ్యము కొరకై లేపెను — ఆత్మను ఎవరి పై నైతే చూచెదనో," అని చెప్పెను.

యోహాను ఆయనను ఎరుగును. ఆయన ఏమి చేసెను? మొదటిగా అతడు వాక్యమును బోధించెను, వాక్యమునకు లోబడెను, మరియు అతడు దేవుని గురుతును చూచెను. మరియు గుర్తుంచుకొనండి, అక్కడ నిలబడియున్న మరే వ్యక్తియూ దానిని చూచెనని వ్రాయబడలేదు. దానిని యోహాను మాత్రమే చూచెను. నీవు దేని గురించి చూచుచున్నావో దానిపై అది ఆధారపడును. ఎందుకు? యోహాను వాక్యమునకు లోబడుచుండెను. యాజకులు మరియు ఆ ఇతరులు వాక్యమునకు లోబడుట లేదు. యోహాను వాక్యమునకు అతనికివ్వబడిన ఆజ్ఞకు లోబడుచుండెను, మరియు అతడు దానిని చూచెను.

JOHN 11:21,25-27,34,39

 

102సమాధి వద్ద మార్త, ఆమె దేవుని యొక్క వాక్యమును కలిసికొనెను. ఆమె దానిని నమ్మెను. ఆమె దేవునియొక్క అద్భుతకార్యమును చూచుటకు ముందు, ఆమె దేవుని యొక్క వాక్యమును నమ్మి మరియు దాని ప్రకారము చేయవలసియున్నది. "ప్రభువా నీవు ఇచ్చట వుండినయెడల, నా సహోదరుడు చావకుండును" అని ఆమె చెప్పెను.

"మార్తా, పునరుత్థానమును జీవమును నేనే నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రదుకును బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. నీవు దీనిని నమ్ముచున్నావా?" అని ఆయన అడిగెను.

"నమ్ముచున్నాను, ప్రభువా," అని ఆమె చెప్పెను. అక్కడే నీవున్నావు — క్రియ చేయుట. నేను నమ్ముచున్నాను.

"మార్తా, నీవు దేనిని నమ్ముచున్నావు?"

"లోకమునకు రాబోవు క్రీస్తువు నీవేయని నమ్ముచున్నాను."

"అతనిని ఎక్కడ సమాధి చేసిరి," అని ఆయన అడిగెను.

అక్కడ సమాధి యొద్దకు వెళ్ళెను మరియు ఆయన అక్కడ నిలబడి యుండెను. నేనే వాక్యమునని ఆమె నిజముగా నమ్ముచున్నదోయని నేను చూడగోరుచున్నాను," అని చెప్పెను. "రాయిని దొర్లించుడి," అని చెప్పెను.

ఆమె వాక్య ప్రకారము జరిగించుటకు వెళ్ళెను. మరణము జీవముగా మారుటను ఆమె చూడవలసియున్నది.

మరియు నీవెన్నడైనను మరణము జీవముగా మారుటను చూడవలెననిన ఒకే ఒక మార్గమున్నది, అది ఆయన వాక్యమును గైకొని మరియు దాని ప్రకారము నడుచుటవలనైయున్నది.

నీవు ఒక పాపివైనయెడల, ఆయన వాక్యమును గైకొని మరియు దాని ప్రకారము నడువుము, అప్పుడు నీవు దేవునియొక్క అద్భుత కార్యమును చూచెదవు. నీవే దేవుని యొక్క అద్భుతకార్యముగా మారుదువు.

నీవు రోగివైనయెడల దేవుని వాక్యమును గైకొనుము. "నీవు మరణించెదవు," అని వైద్యుడు చెప్పును. దేవుని వాక్యమును గైకొని మరియు దాని ప్రకారము చేయుము, అది నూతన జీవమును తీసుకొని వచ్చును.

JOHN 4:7-11,14,18

 

103ఓ, మై!

మిమ్ములను ఇంతసేపు వుంచినందుకు క్షమించండి. ఇంకా కేవలం ఒక రెండు, అప్పుడు, నేను ముగించెదను. ఇంకో కేవలం రెండు… నిజముగా నేను ముగించెదను. నా సహోదరుల సమయము తీసుకున్నందుకు నన్ను క్షమించండి. చూడండి, దాని కొరకై వారికి కేవలం రెండు గంటలు మాత్రమే మిగిల్చాము.

బావి వద్దనున్న స్త్రీ, ఆమె ఒక పాపియైయున్నది. ఆమెకు ఐదుగురు భర్తలుండిరి. ఆమె ఒక రోజు నీటిని తెచ్చుటకు అచ్చటకు బయలు వెళ్ళెను. ఆమె నీటిని చేదుటకు ఆరంభించెను. మరియు ఒక మనుష్యుడు ఈలాగు చెప్పుట ఆమె వినెను, స్త్రీ, నాకు దాహమున కిమ్ము. ఆమె చుట్టూ చూచి, మరియు యూదులు సమరయులతో మాటలాడుట పరిపాటి కాదు. నేను సమరయురాలను మరియు అది వాడుక కాదు. నీవేల నాతో మాటలాడుచున్నావు? అని ఆమె చెప్పెను.

"నీదో మాటలాడునది ఎవరో నీవెరిగి యున్నయెడల, నీవు నన్ను దాహమునకడిగెదవు," అని ఆయన చెప్పెను.

"ఎందుకు అని, ఆమె బావి లోతుగానున్నది, మరియు నీకు చేదుకొనుటకు ఏమియూ లేదు అని, ఎలా నీవు నీటిని తేగలవు?" అని అడిగెను.

"మరియు నేనిచ్చు నీళ్ళు ఊరెడి నీటి బుగ్గగా వుండి, ఆత్మలో ఉబుకుచునుండును," అని ఆయన చెప్పెను.

JOHN 4:16-20,24

 

104ఇప్పుడు, "ఒక్క నిమిషము ఆగుము. నీవు ఒక యూదుడవు, నీవు యెరూషలేమునందు ఆరాధించెదవు, మరియు మా పితరులు ఈ కొండపై ఆరాధించెదరు." మరియు ఆ విధంగా ఆమె చెప్పెను.

ఆయన ఈలాగు చెప్పెను, "నన్ను నమ్ముము. ఒక కాలము వచ్చుచున్నది. మరియు ఇప్పుడు వచ్చేయున్నది, ఇక మీదట నీవు యెరూషలేమునందైనను లేక ఈ పర్వతము మీదైనను ఆరాధించవు. అయితే దేవుడు ఆత్మయై యున్నాడు మరియు ఆయనను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించవలెను."

సందేహము లేకుండా ఆ చిన్న స్త్రీ ఈ విధంగా చెప్పియుండును, "ఇప్పుడు, ఒక నిమిషము ఆగుము. ఏది ఏమైనను ఈ వ్యక్తి ఎవరైయున్నారు? ఆయన ఎవరో ఆమె తెలుసుకొనవలెనని ఆయన కోరెను, ఎందుకనగా ఆమె ఆయనను సమరయులకు పరిచయము చేయవలసి యుండెను. "ఈయన ఎవరు?" ఆమె చెప్పెను…

కొద్ది నిమిషములు ఆయన ఆమెతో మాటలాడెను. "స్త్రీ నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసికొని యిక్కడికి రమ్మని," ఆయన చెప్పెను.

అయితే ఆమె చెప్పినది, "ఇప్పుడు, ఆయన తెలివిగా ప్రవర్తించుచున్నాడు, చూశారా. నాకు భర్త లేడని ఆమె చెప్పినది." ఓ, ఓహ్.

అంతట కర్ర బలి పైకి వెళ్ళెను. చూడండి, ఏదో జరిగినది. ఏమి జరిగినది? ఆమె దేవుని యొక్క అద్భుత కార్యమును చూచెను. నీవు సత్యము పలికితివి, ఏలయనగా నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, మరియు ఇప్పుడు నీవు జీవించుచున్నవాడు నీ భర్త కాడు, అందుచేత నీవు సత్యము చెప్పితివి," అని ఆయన చెప్పెను.

JOHN 4:19,25-29

 

105ఆమె తిరిగినది! దేవుడు ప్రజలకు చాలా సంవత్సరముల నుండి అగుపించుట లేదని ఆమె ఎరిగియుండెను. వారి యాజకులు మరియు రబ్బీలు, మరియు ఇతరులు ఒక దేవుని గూర్చి వారు చెప్పుచుండెడివారు. అయితే పరిశుద్ధ గ్రంథములో ఒకడు వచ్చుచున్నాడని వాగ్ధానము చేయబడినది.

ఆమె చెప్పెను, "అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, చూశారా. మెస్సీయా వచ్చునని మేమెరుగుదుము. (నేను ఆయనను ఇది అడిగెదను, మరియు ఆయన ఏమి చెప్పునో చూచెదను దేవుని ఎరుగని వ్యక్తి దానిని నాకు చెప్పలేడు) క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చునని మేమెరుగుదుము. మరియు ఆయన వచ్చునప్పుడు, ఆయన ఈ కార్యమును జరిగించును. మేము ఆయన కొరకు ఎదురు చూచుచున్నాము."

"నేనే ఆయనను," అని ఆయన చెప్పెను.

అది సరిపోవును. అది సరిపోవును. ఆమె పట్టణములోనికి పరుగెత్తినది. "మీరు వచ్చి నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి" అని ఆమె చెప్పెను.

ఆమె ఆ వర్తమానమును తెచ్చుటకు ముందు, మొదటిగా ఆమె దేవుని అద్భుతమును చూడవలసియున్నది. ఆమె దేవునిని తన వాక్యము ద్వారా గైకొనవలసియున్నది. అది ఖచ్చితముగా సరియే.

ఓ, మై, మనము ఇంకా కొనసాగవచ్చును. ఇంకొక కార్యములోనికి వెళ్ళుదము.

LUKE 24:49

 

106పెంతెకోస్తు. వాక్యముతో వారు నడిచిన తర్వాత, వాక్యమును వారు చూచిన తర్వాత, వాక్యమును వారు నమ్మిన తర్వాత, వారు పెంతెకోస్తు అద్భుతమును చూచుటకు ముందు, వారు వాక్యమునకు లోబడవలసియున్నది, చూశారా. "యెరూషలేము పట్టణమునకు వెళ్ళుడి మరియు మీరు పై నుండి శక్తి పొందువరకు అచ్చటనే వేచి యుండుడి, అని వాక్యము వారితో చెప్పెను."

ఇప్పుడు, ఎనిమిది దినములైన పిదప, మత్తయి మార్కు వైపు చూచి, "ఏమిటో నీకు తెలియునా? ఈ మధ్య నాకు ఒక విడ్డూరమైన అనుభవము కలిగినది, అది పరిశుద్ధాత్మయే అయియుండును అని చెప్పినయెడల ఏమైయుండును. ఆయన మనలను ఇచ్చట ఎదురు చూడమని చెప్పెను." చూడండి, అది ఇదే అయియుండును.

"ఓ, మనము మరియొక దినము ఎదురు చూచెదము."

ISA 40:31

 

107తొమ్మిదవ దినము వచ్చియున్నది. "మంచిది, ఇప్పుడు ఇచ్చటకు వెళ్ళుడని తొమ్మిది దినముల క్రితము ఆయన మనతో చెప్పెను. నిశ్చయముగా, మనము దానిని పొందుకొని యున్నామని మీరు నమ్ముట లేదా?" "మనము ఆయనను నమ్మినప్పుడు దానిని మనము పొంది యున్నామని నేను నమ్ముచున్నాను. మీరు ఆ విధముగా తలంచుట లేదా?" ఓ, మంచి బాప్టిస్టులారా! చెప్పెను, "మనము దానిని పొందియున్నామని నేను నమ్ముచున్నాను, ఏలయనగా ఇక్కడకు రమ్మని ఆయన మనకు సెలవిచ్చెను. మరియు నేనేమి నమ్ముచున్నానో మీరెరుగుదురా? మనము ఇచ్చటకు వచ్చిన వెంటనే ఆయన చెప్పిన దానికి మనము విధేయులమయ్యామని నేను నమ్ముచున్నాను."

అయితే ఆయన ఏమి చెప్పెను? అచ్చటకు మీరు వెళ్ళినప్పుడు, మీరు దానిని పొందుదురు. అని ఆయన చెప్పలేదు. ఐదు రోజులు లేదా తొమ్మిది రోజులు ఎదురు చూడండి అని ఆయన చెప్పలేదు. పొందునంత వరకు, అని చెప్పెను. అది అంతే. "యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు."

108నీవు ఏమి చేయుదువు? ఆయన వాక్యమును గైకొనుము, దాని ప్రకారము చేయుము మరియు సరిగ్గా దానితోనే నిలిచియుండుము. ప్రతి దినము దానితోనే సాతానుకి ఎదురుగా తీవ్ర ప్రతి ఘటనతో నిలబడుము. ఈలాగు వ్రాయబడియున్నది! ఈలాగు వ్రాయబడియున్నది! ఈలాగు వ్రాయబడియున్నది! ఈలాగు వ్రాయబడియున్నది! ఈలాగు వ్రాయబడియున్నది! ఈలాగు వ్రాయబడియున్నది! ఈలాగు వ్రాయబడియున్నది! అది జరిగి తీరవలసియున్నది! నీవు వాక్యానుసారముగా చేయుచున్నావు, చూశారా; అప్పుడు నీవు దేవుని అద్భుతమును చూచెదవు. అది నిజము. అయితే మొదటిగా నీవు దాని ప్రకారము చేయవలసియున్నది.

వారు అక్కడికి వెళ్ళి మరియు వాక్యమునకు విధేయులైరి, వారు అచ్చట నిలిచి యుండిరి.

తొమ్మిదవ దినము వచ్చియున్నది. "ఏమిటో మీకు తెలియునా? సహోదరులారా మీరేమి తలంచుచున్నారు?" అని పేతురు చెప్పుటను నేను వినుచున్నాను.

మార్కు లేచి నిలబడి ఈలాగు చెప్పియుండవచ్చును, "ఏమిటో మీకు తెలియునా? సహోదరులారా, దానిని మనము కేవలం విశ్వాసము ద్వారా ఒప్పుకొనెదము, ఏలయనగా మనము విధేయులమైయున్నాము." లేదు, మీరు పూర్ణముగా విధేయులు కాలేదు.

109"మీరు చెప్పవచ్చును, నేను తండ్రీ, కుమార, మరియు పరిశుద్ధాత్మ నామములో బాప్తీస్మము పొందితిని. అది అది సంపూర్ణముగా విధేయత చూపుట కాదు, చూశారా. అపోస్తలుల సిద్ధాంతమును నేను వల్లించెదను అది కూడా దానికి విధేయత చూపుట కాదు." "ఓ, సహోదరుడా నేను నా అబద్దములను మరియు దొంగతనమును వదిలివేసితిని. నేను నీచమైనది ఏదియూ చేయను" అది కూడా విధేయత చూపుట కాదు.

అది ఒక జన్మ అయియుండవలెను. అక్కడ ఏదో ఒకటి జరుగవలసియున్నది. నీవు మృతి చెందవలెను. మరియు నీలో ఏదో జన్మించవలసియున్నది.

ఓ, అన్ని రోజులు వారు ఎదురు చూచిన పిదప తొమ్మిది దినములు గడిచిపోయెను. "మనము కేవలం అంగీకరించి, మన పరిచర్యతో ముందుకు కొనసాగెదము. లోకము అక్కడ నాశనమై పోవుచున్నది మనము ఇకను ఏల ఎదురు చూడవలెను?" అని వారు అనుకొనిరి.

ISA 28:11,12•

JOEL 2:28•

LUKE 24:49

 

110పేతురు ఈ విధముగా చెప్పుటను నేను వినగలుగుచున్నాను, "అయితే మీరెరుగుదురా, ఇది ఇంకనూ సరియైనది కాదు అది ఏదో నాకు చెప్పుచున్నది. వాక్యమునకు విధేయత చూపుట ఖచ్చితముగా అది కాదు. చూడండి, దేవుడు వాగ్ధానము చేసిన అద్భుతమునకై మనము ఎదురు చూచినయెడల, తండ్రి మన పైకి పంపుదునను వాగ్ధానము కొరకు, మనము ఇచ్చట ఏదో ఒకటి జరుగువరకు ఎదురు చూడవలసియున్నది. ఏలయనగా, అది ఈ రూపములో వచ్చునని లేఖనము చెప్పియున్నది నేను సర్వశరీరులపై నా ఆత్మను కుమ్మరించుదును. మీ కుమారులు మరియు కుమార్తెలు ప్రవచించెదరు. నా పనివారి మీదను మరియు పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించుదును. పైన ఆకాశమందును క్రింద భూమి మీదను నా ఆత్మను కుమ్మరించుదును. పైన ఆకాశమందును క్రింద భూమి మీదను మహత్కార్యములును మరియు సూచకక్రియలను చూపుదును అని యోవేలు చెప్పెను. మరియు ఇదే నెమ్మది. ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను, అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి అని ప్రవక్తయైన యెషయా చెప్పెను. ఇప్పుడు సహోదరులారా, మనము ఆ విధముగా ఇచ్చట నడువజాలము, ఎటువంటి అనుభవము చూడకుండా, చూశారా? మనము తప్పనిసరిగా దేనినో ఒకదానిని పొందవలసియున్నది, ఏలయనగా మీరు శక్తితో నింపబడు వరకు ఇచ్చట వేచియుండుడి అని ఆయన చెప్పెను. ఇప్పుడు, నేను ఇక్కడికి వచ్చుటకు ముందున్న శక్తికంటె మరెక్కువ శక్తిని పొందలేదు. నేను రాత్రంతయు ఇక్కడే వున్నాను తరువాత రాత్రియు నేను ఇక్కడే వున్నాను నేను ఇచ్చట తొమ్మిది రాత్రులు ఉండి యున్నాను నేను ఇక్కడికి వచ్చునప్పుడు ఏలాగున్నానో, ఇప్పుడునూ ఆలాగే వున్నాను. మరియు మనము శక్తి పొందుదుమని ఆయన మనతో చెప్పియుండెను, కావున మనమింకను ఎదురు చూచెదము."

ACTS 2:3,4

 

111వారందరూ సంపూర్ణముగా దేవుని వాక్యమునకు లోబడగా, అప్పుడు అకస్మాత్తుగా వారు పెంతుకోస్తు యొక్క అద్భుతమును చూచిరి. వారు భవనములో అగ్ని పడుటను చూచిరి. ప్రజల మధ్యకు ఆ అగ్నిస్తంభము దిగి వచ్చెను పెద్ద అగ్ని కణములు విభజించబడి వారి పైకి దిగి వచ్చుటను చూచిరి. వారందరు పరిశుద్ధాత్మతో నింపబడినవారై ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

ఏదో జరిగినది. ఎప్పుడు? వారు ఎప్పుడైతే అప్పటికే పొందియున్నారని వారు తమ నిర్ణయమును తీసుకొన్నప్పుడా? కాదు వారు దేవుని వాక్యమునకు సంపూర్తిగా విధేయులైనప్పుడు వారు పెంతెకోస్తు యొక్క అద్భుతమును చూచిరి. ఈ రోజు కూడా అది ఆ విధముగానే ఉన్నది నీవు అదే కార్యము చేయవలసియున్నది.

112స్నేహితులారా, ఇప్పుడు, నేను నిజముగా దీనితో ముగించెదను. నేను మరొక పుటను త్రిప్పును. మంచిది, నేను దీనిని చెప్పినప్పుడు తరువాతి వ్యక్తి సిద్ధపడవలెను.

ఇప్పుడు, చెడుగా పిలువదలచిన ప్రతి దానిని పిలచినను, చెడ్డవారు, పరిశుద్ధగుండ్రాలు, పెంతెకోస్తువారు, సంఘమును విభజించువారు, వేషధారీ, బయెల్జెబూబు, కలలు కనువారు పిలువ తలచిన ప్రతీది మనము పిలువబడినాము. అయితే వారేమి చేసిరి? నిన్ను ఏమనిపిలచిరి? కలలు కనువాడు, బయల్జెబూబు, అబద్ధ ప్రవక్త, యేసు మాత్రమే అనదలచిన ప్రతి దానిని, చెడుగా అనతలచిన ప్రతిది …

అయితే సత్యమైన దేవుని వాక్యమును, ఆయన వాక్యము యొక్క నిజ ప్రవక్తను నమ్ముట ద్వారా, మనము ఏమి చేయుచున్నాము? మనము చూచె సంగతులను చూచుచున్నాము.

113ఓ, వారు తూర్పు నుండియు మరియు పడమర నుండియు వచ్చెదరు,

వారు దూరదేశముల నుండియు వచ్చెదరు,

మన రాజుతో విందు చేయుటకై,

ఆయనతో అతిధులుగా భుజించుటకై,

ఈ ప్రయాణికులు ఎంతటి ధన్యులై యున్నారు!

ఆయన పరిశుద్ధ ముఖమును తేరిచూచుట,

ప్రకాశించు దైవీక ప్రేమతో

ఆయన కృపలో ధన్యులైన పాలిభాగస్థులై,

ఆయన కిరీటములో ముత్యములవలె ప్రకాశించుటకు,

యేసు త్వరగా వచ్చుచున్నాడు,

అప్పుడు మన శ్రమలు గతించి పోవును,

ఓ, ఈ క్షణమందు మన ప్రభువు వచ్చినచో

పాపమునుండి విడుదల పొందుకున్నవారికి ఏలాగుండును

ఓ, అప్పుడు నీకది సంతోషమును కలిగించునా,

లేక విచారము మరియు తీవ్ర నిరుత్సాహమా?

మన ప్రభువు మహిమలో వచ్చినప్పుడు,

ఆయనను మనము ఆకాశములో కలుసుకొనెదము.

114ఎందువలన? మనము ఆయన వాక్యప్రకారము చేయుచున్నాము! ఆమేన్. మీరు పిలువదలచుకున్నది ఏదైనా పిలువుడి. మా మధ్యలో మేము మెస్సీయా గురుతును చూచుచున్నాము. మేము అగ్నిస్తంభమును చూచుచున్నాము! దానిని తణీకరించలేము. మమ్ములను వారు ఏమైనా అననివ్వండి. దేవుడు ఇచ్చటనున్నాడు. విజ్ఞానశాస్త్రము దాని చిత్రమును తీసియున్నది. ఎందువలన? ఆయన వాక్యమునకు విధేయులగుట, చరిత్రలో ఇది ఎన్నడూ జరుగలేదు, అయినప్పటికీ కెమెరా యొక్క యాంత్రికమైన కన్ను అది ఆయనే అని చెప్పుచున్నది, అక్కడే ఒక వెలుగు కటకమును తాకినది. ఎందుకు? దేవుని యొక్క వాక్యమును మొదటిగా తీసుకొనుట. సంఘశాఖల వారు తాము కోరినయెడల మిమ్మును బయటకు త్రోసివేయనీయుడి. మికిష్టమైనచో వారి వీపులు త్రిప్పనీయుడి. అయితే నీవు దేవుని యొక్క అద్భుతకార్యములను చూడగోరినయెడల దేవుని వాక్యప్రకారము నడువుడి.

GEN 17:5,15•

GEN 18:9-13•

LUKE 17:28,30•

ROM 4:17•

HEB 11:10

 

115సొదొమ దినములలో జరిగినట్లు, మనుష్యకుమారుని రాకడ దినములలో జరుగును అని యేసు వాగ్ధానము చేసెను.

ఆ దూత దిగి వచ్చెను, ఒక మానవ శరీరములో దేవుడు కనబరుచుకొనెను, ఆయన గుడారమువైపు తన వీపు త్రిప్పిచెప్పెను. అబ్రహాము ఎవరో ఎరుగనట్లుగా, చెప్పెను, అబ్రహాము. అబ్రాము కాదు ఆయన కొద్ది దినముల క్రితమే అతని పేరు మార్చెను. నీ భార్యయైన శారా ఎక్కడ? శారాయి కాదు, శారా. నీ భార్యయైన శారా ఎక్కడ? అతనిని తండ్రివలె పిలిచెను, మరియు ఆమెను రాజకుమారీ పేరుతో పిలిచెను… ఓ, ఆయన ఎవరైయుండెను? అబ్రహాము అప్పుడే అది ఎవరో ఎరిగియుండెను.

"శారా, నీ వెనుకనున్న గుడారములో ఉన్నది," అని అతడు చెప్పెను.

అబ్రహామా, "నేను నిన్ను దర్శించెదను (నేను) నేను నీకిచ్చిన వాగ్ధానము చొప్పున నిన్ను దర్శించెదను, ఏలయనగా నీవు ఈ సంవత్సరములన్నియు వేచియుంటివి. నీవు దాని కొరకు ఇరువది ఐదు సంవత్సరములు ఎదురు చూచితివి. నీవు కేవలం వాక్యముతోనే నిలిచి, వాక్య ప్రకారము నడుచుకొంటివి. నీవు ఈ లోక సంబంధమును నిరాకరించితివి. నీవు ఒక ప్రయాణికుడిగాను మరియు ఒక పరదేశిగాను ఉంటివి. దేవుడు ఏ పట్టణముకైతే శిల్పియు మరియు నిర్మాణకుడై యున్నాడో, ఆ పట్టణమునకై నీవు ఎదురుచూచుచుంటివి. ఈ కుమారుని ద్వారా దానిని తీసికొని వచ్చెదనని నేను నీకు వాగ్ధానము చేసితిని, అతను — నీవు అనేక జనములకు తండ్రిగా వుందువని దానిని నీకు వాగ్థానము చేసితిని. నీవు వాక్యప్రకారమే చేసితివి. ఇప్పుడు నీవు దేవుని అద్భుతమును చూడబోవుచున్నావు," అని ఆయన చెప్పెను.

"నా ప్రభువా, దానిని నేనెలాగు చూడగలను?"

"నీ భార్యయైన శారా ఎక్కడ?"

"నీ వెనుకనున్న గుడారములోనున్నది."

"జీవకాల ప్రకారము నేను నిన్ను దర్శించెదను," అని చెప్పెను.

మరియు శారా, "నేను బలము ఉడిగినదాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు కదా," అని తనలోతాను నవ్వుకొనెను.

"శారా నవ్వనేల?" అని ఆయన అనెను.

అతడు దేవుని వాక్యప్రకారము చేసెను. అతడు దేవుని యొక్క అద్భుత కార్యమును చూచుచుండెను.

"సొదొమ దినములలో జరిగినట్లే మనుష్యకుమారుని రాకడ దినములలో జరుగును," అని యేసు చెప్పెను. చూడండి. దేవుని వాక్యప్రకారము చేయుట, మరియు నీవు దేవుని యొక్క అద్భుత కార్యమును చూచెదవు.

116అది ఏమైయున్నది? ఇటీవల సంఘకాలములు బోధించుచూ మనము ఇచ్చట నిలిచి యున్నప్పుడు, మరియు వాటిని తీసికొని వచ్చినప్పుడు మరియు అక్కడ వున్న ఆ చిన్న గురుతు, ఇక్కడ వున్న బోర్డుపై గీసెను. మరియు సరిగ్గా ఇదే సమూహములో, ఇప్పుడు ఇక్కడ కూర్చొని యున్న వారికంటె ఎక్కువ మందికి ఎదురుగా, నేను ప్రసంగము ముగించిన వెంటనే, ఒక వెలుగు దిగివచ్చెను, మరియు ఆ వెనుక తట్టుగా వెళ్ళి ఆ గోడపై వ్రేలాడెను. మరియు దానిపైకి ఒక నీడ వచ్చి నిలిచెను, దానిని జనులందరూ ఉండునట్లు కొలిచెను. ఆ రోజున వున్నవారిలో ఎంతమంది ఇప్పుడు ఇక్క డ వున్నారు, మీ చేయి పైకెత్తండి… ? … మీకళ్ళతో మీరే దానిని చూచిరి. అది ఏమైయున్నది? మొదటిగా దేవుని వాక్యముపై నమ్మిక యుంచుట, దేవుని వాక్యమును బోధించుట, దేవుని వాక్యమును గైకొనుట మరియు వాక్యము సత్యమని మనము దేవుని యొక్క అద్భుతకార్యమును చూచుట ద్వారా రూఢిపరచుటయైయున్నది.

ఓ, యేసు త్వరగా వచ్చుచున్నాడు

(అందరూ, ఏకముగా)

అప్పటికి మన శ్రమలు ముగిసిపోవును.

ఓ, ఈ క్షణమున మన ప్రభువు

వచ్చినయెడల పాపరహితులకు ఏలాగుండును?

ఓ, అప్పుడు అది నీకు సంతోషము కలిగించునా

లేక విచారమును మరియు తీవ్ర నిరుత్సాహమునా?

మన ప్రభువు మహిమలో వచ్చినప్పుడు,

ఆయనను మనము ఆకాశములో కలుసుకొందుము.

JUDG 6:13•

MATT 5:16

 

117(ఆమేన్).

ఎందువలన? ఆయన వాక్యమును మనము నమ్ముచున్నాము, దీపములో నూనెను వుంచుచున్నాము, అది సరిగా వుండి మరియు వెలుగుచున్నది. నీ మంచి కార్యములు, ఫలములు ఇతరులు చూచునట్లుగా నీ వెలుగు ప్రకాశింపచేయుట, పరలోక మందున్న తండ్రిని మహిమపరచుటకు మరి అప్పుడు ఏమి జరుగును? దేవుని వాక్యమును నమ్ముట మరియు దేవుని వాక్యప్రకారము నడచుట, మనము ఆయనను ఆకాశములో కలుసుకొనెదము. ఏ మాత్రమూ సందేహము లేకుండా.

దేవుడు మిమ్మును దీవించును — నేను ఒకింట మూడవవంతును వదిలివేయుచున్నాను. దేవుని చిత్తమైతే నేను దానిని మరొకసారి పూర్తి చేసెదను. "దేవుడు మాకు తోడైయుండినయెడల, ఆయన అద్భుత కార్యములు ఏమాయెను?" దానిని నీవు నమ్ముచున్నావా?

118ఓ దేవా, మమ్మును ఆ మరుసటి సంవత్సరమును చూడనిమ్ము. ఆ మరుసటి సంవత్సరమును మనము చూచువరకు, ఒక మందిర సంఘశాఖ ద్వారా లేక ఒక ఆచారము ద్వారా, ఒక కరచాలనము ద్వారా లేక ఒక మతము ద్వారా. మా యొక్క హృదయములు తప్తిపరచబడవు. దేవుని యొక్క అద్భుత శక్తిని తాకువరకు మా యొక్క హృదయములలో లోకమును బయటకు తీసివేయుచు, మరియు క్రీస్తును రూపొందించు వరకు మేము తప్తిపరచబడకుందుము గాక. ఇప్పుడు, ఈ రాత్రి కాదు, మరియు రేపు ఏదో చేయుటకు మొదలు పెట్టుట కాదు, అయితే ఆయనలో, ఆయన స్వారూప్యమునకు ఎదుగుటయైయున్నది. మనము ఆయనను కలుసుకొనునంతవరకు మనము ఆయనవలె ఎదుగుటయైయున్నది. మన శిరములు వంచెదము.

స్థలము, స్థలము, అవును స్థలమున్నది,

ఊట యొద్ద నాకు స్థలమున్నది;

స్థలము స్థలము, అవును స్థలమున్నది,

ఊట యొద్ద నాకు స్థలమున్నది.

119మా పరలోకపు తండ్రీ, ఆత్మ మరియు ప్రాణములో దీనత్వములో, గరుకైన నా కంఠ స్వరముతో, మరియు ఈ విరువబడ్డ లేక కోయబడ్డ కొన్ని మాటలు, ప్రభువా వాటిని నీవు తీసికొని మరియు వాటిని ఒక దగ్గరకు చేర్చి, నేను దానిని ఏలాగు చేయవలెనో ఎరుగక నా మనస్సులోనికి వచ్చునట్లుగా దానిని చెప్పితిని. ప్రతి వ్యక్తి హృదయములో దానిని వుంచుము మరియు అది ఏ ఉద్ధేశ్యముతో ఇవ్వబడినదో అదే ఉద్ధేశ్యముతో వారు దానిని చూచి నమ్మునట్లుగా చేయుము. మరియు తండ్రీ, అది వారు ఆలోచించునట్లు చేయును, అది వారికి క్రీస్తును తెచ్చును. తండ్రీ, ఈ రాత్రి మమ్మును దీవించుము. దేవుని వాక్యప్రకారము చేయుచు, మేము ఎదురు చూచెదము.

ప్రభువా, ఈ సహోదరులను దీవించుము. తండ్రీ వారి సమయమును కొంత తీసికొన్నందుకు నన్ను క్షమించుము. దేవుని శక్తి ఈ భవనములో దిగివచ్చునట్లుగా, పాపులు బలిపీఠము యొద్దకు వచ్చులాగున, మరియు మరియు కల్వరి వైపు ఏడ్చుచు వెళ్ళులాగున, మరియు రోగులు స్వస్థపడులాగున, మరియు గొప్ప సూచక క్రియలు మరియు మహత్కార్యములు జరుగులాగున, సజీవుడైన దేవుని అద్భుతములు చేయు శక్తిని మేము చూచులాగున నీవు వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించమని నేను ప్రార్థించుచున్నాను. తండ్రీ, దానిపై మేము ఎదురుచూచెదము, యేసు నామములో. ఆమేన్.

120ప్రభువుకు స్తోత్రము! నీవు ఆయనను ప్రేమించుచున్నావా? దేవుడు మనకు తోడై యుండినయెడల, మనము ఆయన గురుతును చూచెదము.

నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగానున్న మెస్సీయా యొక్క సూచన ఎక్కడ? ఆ మెస్సీయా అదే రీతిగా నున్నయెడల, ఆయన అదే సూచనను కలిగియుండును. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఏ సంస్థకు చెందియుండును? మనము ఏ సంస్థకు వెళ్ళి దానిలో చేరి మెస్సీయాను, ఆయన సూచనను కనుగొనగలము? మనము ఏ గృహములోనికి వెళ్ళి దానిని కనుగొనగలము? దానిని ఆలోచించండి.

క్షమించండి, సహోదరుడా నెవిల్…

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...