పాపము యొక్క క్రూరత్వం, మన బ్రతుకులలో నుండి పాపమును తీసివేయుటకు ఖర్చగు అపరాధ రుసుము
VGR PARA COUNT-221 తామ్ సహోదరుడా, నీకు వందనములు. నీకిష్టమైతే, అక్కడ నీ దగ్గరున్న ఆ చిన్న వస్తువు యొక్క వాల్యూములు నీవు ఇవ్వగలవా? నేను రమారమిగా ఇక్కడకు ఈ రాత్రి వచ్చాను. నాకు ప్లూజ్వరం వచ్చింది. ఇక్కడ ఉంటానని వాగ్ధానం చేశాను. సహోదరుడు నెవిల్‌ని రమ్మని, అతనితో చెప్పమని సహోదరుడు కాక్స్‌కు నేను చెప్పాను. నేను అన్నాను, “ముందుకు వెళ్ళి మరియు ఆరాధన జరిగించమని సహోదరుడు నెవిల్‌తో చెప్పు, కారణం నా గొంతు బొంగురు పోయింది. నేను కష్టముగా సన్నని కీచుమనే శబ్దం మాత్రమే చేయగలను.”
అతడన్నాడు, “వెనుకకు వచ్చి, మరియు అనెను, బిల్లీ సహోదరుడా, నీవే వచ్చుట మంచిది. అది మంచిదై ఉండునని నేను నమ్ముచున్నాను.” కనుక నేను-నేను ఎల్లప్పుడూ ఏదో విధమైన ప్రయత్నం చేయుటకు ఇష్టపడుచున్నాను. అది అలా ఉండగా... నిజానికి నేను మీకు బోధించుటకు గొంతు చాలా బొంగురు పోయింది, అయితే కేవలం కొంచెం సేపు నేను మాట్లాడగలను, ఇక్కడున్న ఈ చిన్న యంత్ర పనిముట్టు సహాయంతో మాట్లాడగలను.
నేను ఇండియానాకు వచ్చు ప్రతి సమయంలో, నాకు గొంతుక బొంగురు పోవును. ఎందుచేతనో నాకు తెలియదు, అయితే నేను - నేను అలా వచ్చినప్పుడు, ప్రతి సమయంలో జలుబు చేయును. అది ఇక్కడ చాలా గుంట అయినది. ఇక్కడ దిగితే అది చాలా ఓర్చుకోలేనిదై యున్నది. నేను ప్రార్ధన చేశాను, అది ఎలాగైనా వచ్చుచున్నట్లు కనిపించుచున్నది. అయితే - అయితే నేను దానితో ఏమి చేయవలెనో నేను చేయగల అత్యుత్తమమైన దానిని చేయుటకు ప్రయత్నించెదను. కనుక ఆ పద్ధతిలో మనం చేయగల శ్రేష్టమైనది. నేను ఎల్లప్పుడూ చేయుటకు ప్రయత్నించెదను. దేవుడు గౌరవించునది అంతా
అదే...నన్ను క్షమించండి, తరచుగా, ఎదురు చూచుట; ఆయన ఎదురు చూచేది అంతా అదే.
2
నేను ఇప్పుడు ఈ విధంగా నమ్ముచున్నాను - ఇలా ప్రభువు మీ అందరినీ దీవించును. మరియు ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం ఆరాధనలు ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదం మీకు ఇచ్చును. ఆరాధనలు ఈ రాత్రియు జరుగును, రేపు రాత్రియు ఉండును. సహోదరుడా నెవిల్, అది సరియేనా? (సహోదరుడు నెవిల్ “అవును” అనుచున్నారు-ఎడిటర్) ఆ విధముగా రేపు రాత్రియు జరుగును.
నేను ఇక్కడకు రావలసియున్నది, మరియు అప్పుడు ఇక్కడ విడచి పెట్టి మరియు లూయీస్‌విల్‌లో ఉన్న ఒక మిషనెరీ గుంపుతో మాట్లాడుటకు వెళ్ళుదును. నేను అనుకుంటున్నాను-ఒక మిషనెరీ ర్యాలీలో అది పదిహేడు లేక ఇరవై-ఏడు దేశాలు ప్రాతినిధ్యము వహించునని నేను అనుకొనుచున్నాను. రేపు రాత్రికి అక్కడ కొన్ని నిమిషాలు ఉండవలెనని వారు నన్ను కోరారు. ఆదివారం ఉదయం అయి ఉన్నది...
3
అది ఏమైయున్నది? (ఒక మనిషి చెప్పుచున్నాడు, “ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ మనిషి కొరకు నీవు ప్రార్ధించగలవా?”-ఎడిటర్) సహోదరుడా, సరిగా వాని మీద నీ చేయి ఉంచుము.
“మా పరలోకపు తండ్రీ, యేసు అను మీరు ప్రేమించిన కుమారుని నామములో మేము ప్రార్థించుచున్నాము, ఈ సమయంలో ఆ విధముగా ఈ రాత్రి మాకు మీ కరుణను విస్తరింప జేయండి, ఈ సమయంలో అక్కడ చాలా వ్యాధితో కూర్చొని కనబడుచున్న ఆ మనిషి, మా సహోదరుని స్వస్థతా విధానంలో కరుణించండి. మీరు అన్నారు, ”మీ పొరపాట్లు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మరియు మీరు స్వస్థత పొందునట్లుగా ఒకని కొరకు మరొకరు ప్రార్ధించండి.“ మరియు ఈ రాత్రి ఈ ప్రజలతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధించుచున్నాను, అలా ఈ సమయంలో మీరు మా సహోదరుని స్వస్థపరచగలరు. మా ప్రభువైన యేసుక్రీస్తు చేతికి ప్రతినిధిగా అక్కడ మా సహోదరుడు నిలబడి చేతులుంచగా, మరియు మేము మా ప్రార్థనలలో ఏకమై కలసి మరియు అతనికి కలిగిన వ్యాధి నుండి త్వరగా మా సహోదరుడు కోలుకొనునట్లుగా వాటిని క్రీస్తు నామములో మీకు అర్పించుచున్నాము. ఆమెన్.”
సహోదరుడా, ప్రభువు నిన్ను దీవించును. మీరు అతనికి కొంచెం గాలి తగల నివ్వండి, అతడు అక్కడ కొంచెం ఒక విధంగా గుచ్చుకుపోయాడు. ఆ కారణం చేత అతని బయటకు వెళ్ళనివ్వండి. అయ్యా, మీరు బయటకు నడచివెళ్ళ గోరినయెడల, ఆ కారణంచే, సరిగా ముందుకు వెళ్ళి మరియు ఎక్కడ గాలి వచ్చునో అక్కడ భవనం వెనుక మీరు ఒక సీటు పొందండి.
ఇప్పుడు, ప్రభువైన యేసు మన కష్టములన్నియూ ఎరుగును. ఆయన మన భారములను భరించువాడు.
4
మరియు ఇప్పుడు ఆదివారం, పెందలకడనే, ఆరు గంటలకు, సూర్యోదయ ఆరాధన. ఈస్టరులో సూర్యోదయ ఆరాధనలు ఎందరు ఇష్టపడుచున్నారు? మనము ఒక గొప్ప ఆశీర్వాదము కొరకు ఎదురు చూద్దాము. కనుక అప్పుడు, ప్రభువు చిత్తము అయిన యెడల, నేను సూర్యోదయ ఆరాధనలు కలిగి ఉందును. అవి ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు. అప్పుడు తిరిగి వెనుకకు మీ అల్బాహారమునకు ఇండ్లకు తిరిగి వెళ్ళవచ్చును. మరియు తొమ్మిదిన్నరకు యధావిధిగా జరిగే ఆదివారపు బడి ఆరాధన కొరకు సహోదరుడు నెవిల్ ఇక్కడ ఉండును. మరియు ఆదివారపు బడి ఆరాధన తరువాత వెంటనే, ఈస్టరు ఆదివారం ఉదయమే, ఎవరు బాప్తిస్మం పొందుదురో వారి కొరకు నేను బాప్తిస్మపు ఆరాధనలు కలిగి ఉందును.
ముంచుట ద్వారా మీరు బాప్తిస్మం పొందని యెడల మరియు ఆ విధముగా కోరిన యెడల, మరియు దేవుని కుమారుడయిన యేసుక్రీస్తు, - నీవు ఒక కైస్తవుడవు అయిన యెడల దేవత్వము నందు విశ్వాసము ఉంచెదవు. మరియు మీరు కోరిన యెడల బాప్తిస్మం పొందుటకు మా సహవాసంలో మీ స్థానము, ముంచుట కొరకు, పదిన్నరకు, ఇక్కడ ఈస్టరు ఉదయాన మీతో ఉండుటకు మేము సంతోషించుచున్నాము. మీ వస్త్రములు తెచ్చుకొనండి. మీకేమియు లేనియెడల...ఆ కారణంచే ప్రత్యేకించి స్త్రీలు, వారు స్త్రీల కొరకు వివిధ సైజులలో అక్కడ బట్టలు కలిగి ఉన్నారు. ఇక పురుషులందరి కొరకు ఉన్నాయని నేను అనుకొనుట లేదు. అయితే మనము... ఈస్టరు ఉదయాన ఇక్కడ మాతో మీరుండుట చాలా సంతోషము.
5
అప్పుడు ఆదివారం మధ్యాహ్నము ఒక సమాధి ఆరాధన జరుగును, ఇక్కడే ఏ చోట నుండో వచ్చి, లేక ఆ గ్రామంలో ఎవరో బయట నివసించుచున్నారు. అది అలాగు ఉండెను... ఇక్కడ చాలా కాలం క్రితం సహోదరుడు నెవిల్ బోధవలన ఇక్కడ మార్చబడినాడని నేను నమ్ముచున్నాను. నేను ఆ పేరు ఈస్ట్ అని నమ్ముచున్నాను, లేక మరొకటి. వారు నన్ను సమాధి గృహము నుండి పిలిచారు మరియు నేను మరియు సహోదరుడు నెవిల్ మరియు మనలో ఒక కొందరు వచ్చి మరియు పాడి మరియు మాటాజ్ సమాధి గృహము యొద్ద, రెండు గంటలకు, ఆదివారం మధ్యాహ్నము కొరకు ఆరాధనలు కలిగి ఉందురా అని అడిగెను.
నేను ఆ స్త్రీని, ఈస్ట్, యేట్స్ లేక ఈస్ట్ అని జ్ఞాపకము ఉంచుకొనలేను. మీలో అనేకులు అది పత్రికలో చూచి ఉంటారు, నేను చూచాను. మరియు… (ఒక సహోదరి చెప్పును, “సహోదరుడా బిల్లీ?”-ఎడిటర్) అవును (ఎడ్నా జస్టిస్‌గా పిలుస్తారు ఆమె ఇక్కడకే సరిగా వస్తూ ఉండేది. ) ఎడ్నా జస్టిస్, మీరు ఆమెను ఎరిగి ఉండవచ్చును. ఆమె బహుశా ఒక యవ్వన స్త్రీ అయి ఉండవచ్చును. ఆమె అవునా? సహోదరీ, అది సరియేనా? (“ఇరవై తొమ్మిది. హ-హు”) ఒక యవ్వన స్త్రీ. నేను ఈ విధంగా నమ్ముచున్నాను... ఆమె తల్లి నన్ను పిలుస్తూ మరియు ఆమె ఇద్దరు లేక ముగ్గురు చిన్న పిల్లలను విడచినట్టు చెప్పెను. కచ్చితంగా అది బాధకరమైన విషయమే.
6
ఈ మర్య్యమైన జీవితమును గూర్చియు కేవలం అది చెడ్డదని తెలుపుచున్నది. అది కాదా? అయితే లోపల ఉంటే...ఆమె క్రీస్తులో ఉండినయెడల, ఈ రాత్రి ఈ భవనంలో కూర్చున్న ఏ వ్యక్తి కన్నను ఆమె చాలా మంచిగా ఉన్నది. అలా మర్త్యులైన అందరూ వెళ్ళవలసిన మరణచ్భాయల లోయగుండా ఆమె వెళ్ళెను. మరియు ఏదో రోజున నీవు మరియు నేను కూడా ఆ మార్గములోనే ప్రయాణించవలసి ఉన్నది. అయితే మనం ఒంటరిగా యొర్దాను దాటనక్కరలేదు, ఎందుకంటే ఆయన మన రక్షకుడై ఉండెను.
వాల్‌నట్ మధ్య, ఏదైతే మాపిల్ స్రీట్‌లో ఉన్నదో మాటోజ్ సమాధి గృహానికి మీరు కోరినయెడల రండి మరియు...కాదు, మీరు పడమరకు వెళ్ళుచుండగా అది లోకస్టు మరియు వాల్ స్ట్రీట్, కుడిచేతివైపు గలదని నేను నమ్ముచున్నాను. వారిది ఎక్కడో..నేనెరుగను...ఆ నంబరు ఏమై ఉన్నది? (ఎవరో అన్నారు, “221”-ఎడిటర్) 221. అది ఎక్కడ ఉన్నదంటే ఆ పాత ఓల్డ్ స్కాట్ మరియు కూంబ్స్ సమాధి గృహం అని నేను చిన్నవానిగ ఉన్నప్పుడు పిలిచారు. మరియు అది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు.
7
మరియు అప్పుడు ఆదివారం సాయంకాలము, ఇక్కడ మరల యధాతదంగ జరుగు క్రమముగా జరుగు ఆరాధనలు ఉంటాయి. మనము బహుశా మరణము సమాధి మరియు పునరుత్థానమును గూర్చి-భోధించుదుము. అది ఆదివారం రాత్రి కొరకు అయిఉన్నది. మరియు రానున్న వారము కొరకు ప్రభువు ఏమి చేయునో మనము ఎరుగము, ఆరాధనలు కొనసాగుటయా లేక రానున్న వారము కొరకు ఏమిటి అనునది. అలా వీలయితే, ఇక్కడ ఆదివారం రాత్రి-మీరందరు ఉండగలరని మేము నమ్ముచున్నాము.
చుట్టూ అనేక మంది బోధకులుండుట నేను గుర్తించాను. మిష్టర్ పుల్లర్ ఇక్కడే ఉండెనని ఎవరో నాతో చెప్పారు, తరచుగా వచ్చేవాడని...లేక మన మీటింగ్స్‌కు వచ్చాడని. ఆ మనిషి ఇక్కడ ఉన్నాడా? పుల్లర్ సహోదరుడా, న్యూయార్ములో స్థలము నుండి స్థలానికి దిగువకు మీటింగునకు నన్ను తీసుకు వెళ్ళిన మనిషివి నీవు కాదా? పుల్లర్ సహోదరుడా, నిన్ను చూచుట సంతోషమై ఉన్నది. ప్రభువు నిన్ను దీవించును గాక.
అప్పుడు ఇక్కడ మరో చిన్న దైవ సేవకుని చూశాను-అది తామ్ సహోదరునికి తెలియదు. ఆ బాలుని ఆఖరి పేరు కూడా నాకు తెలియదు, అయితే అక్కడ వెనుక అతనిని జూనియర్ అని పిలుచుట నాకు తెలియును. జాక్‌సన్, సహోదరుడు జాక్‌సన్, జూనియర్ జాక్‌సన్, కేవలం నీ ఆఖరి చేయి ఎత్తి చూపించు, సహోదరుడా జాక్‌సన్ నీవు మాతో ఉండుట వలన మేము సంతోషించుచున్నాము. అతడు ఈ చుట్టూ ఎలిజబెత్ నుండి వచ్చాడు, అక్కడ దిగువన మెథడిస్టు చర్చి, మనము సువార్త పొలములోనికి వెళ్ళేముందు, ప్రభువు చిత్తమయితే ఎక్కడ త్వరలో నేను ఒక ఆరాధన చేయవలసి ఉండునో అది.
ఇప్పుడు, ఇండియాకు ఆ గొప్ప పిలుపు ఉన్నది. మరియు ప్రతీ సంగతియు, ప్రతీ రోజు కఠినంగా, మరీ కఠినంగా మారుచున్నది. నా కొరకు ప్రార్ధించండి.
8
ఇప్పుడు, ఈ రాత్రి, ఇది శుభ శుక్రవారము అయిఉన్నది. అది రాత్రి అలా మనము...ఓ, ఈ సమయంలో, యెరూషలేములో నేను ఊహించుచున్నాను, అది... శనివారం ఉదయవేళ ఇప్పుడు బాగా అందముగా సూర్యుడు పైకి వచ్చును. అయితే రోజంతా, ఆ ప్రజలు ఎక్కడ ఆ సిలువ రక్తముతో కూడిన పాదముద్రలు ఉన్నవో అక్కడ అదే పురాతన మార్గంలో పైకి ప్రాకివచ్చెను; వారి ఆత్మలో, మొర పెట్టుచూ కన్నీళ్ళతో బాధ నొందుచున్నారు. చాలా గొప్పవయిన కేధడ్రల్స్ (దేవాలయములు) మరియు మొదలైనవి, ఈనాడు, ఈ గొప్ప జ్ఞాపకార్ధ సమయమును పండుగగా జరుపుకొంటున్నారు. ఆ ప్రపంచం ఉత్సవం జరుపుకొనవలసిన, అక్కడ ఏదైనా ఒక సమయం ఉండవలెనన్న అది ఇప్పుడే, ఈ కష్టమైన ఘడియలోనే అయిఉన్నది.
మరియు నేను ఈ చిన్న సహోదరిని, ఇక్కడ ఆ చిన్న ఆ పాత ఆర్గన్ చూస్తూ ఆశ్చర్యపడుచున్నాను...నేను-నేను ఆర్గన్‌ను ప్రేమించుచున్నాను. కేవలం నేను పాతకాలపు పద్దతివాడను. మరియు నేను - దాని మీద ఒక శృతి మనము పొంది ఉన్నయెడల నేను ఆశ్చర్యపోవుచున్నాను.
యేసూ, నన్ను సిలువచెంత నుంచుము.
కేవలం కొంతకాలం కిందట మనం పాడుచున్న హృదయాను సారమైన పాటలు, పాతకాలపు పద్ధతిలో మంచివైన వాటిలో ఒకటై ఉన్నది. మరియు దానిలోనికి మనమందరం కలసిన యెడల ఆశ్చర్యపడుదును. నేను దానిని ప్రేమించుచున్నాను.
అక్కడ ఒక ప్రశస్త ఊట కలదు,
అందరికి ఉచితము, స్వస్థపరచు ఒక ప్రవాహము,
అది కల్వరి కొండ నుండి ప్రవహించును.
దాని వచనము ఎందరు ఎరుగుదురు? మంచిది, ఇప్పుడు నాతో సరిగా మీరు కలవండి మరియు ఇప్పుడు మన చుట్టూ ఉన్న తెరలను కేవలం కిందకు లాగండి, మరియు ఈ మధ్యాహ్నము, పంతొమ్మిది వందల (1900) సంవత్సరాల క్రితం మన మనస్సులు స్థిరము చేసుకొందము. ఎలాంటి బలి! ఆ ప్రపంచం ఎన్నడూ అలాంటి దానిని ఎన్నడూ ఎరుగదు. మొత్తం ప్రపంచాన్ని వణకించినది! ఇప్పుడు నీవు అక్కడ ఆ సహవాసపు స్థలములో మరియు ఆయనతో ఆశీర్వాదములు ఆ స్థలానికి దగ్గరలో నిలచి ఉండటానికి మీరు కోరుటలేదా?
9
ఇప్పుడు మనమందరం పాడుదము, కేవలం ఇప్పుడు పాతకాలపు పద్దతిలో ఇప్పుడు, కాదు...కేవలం నీవు పాడి ఉండే విధానంలో పాడండి, ఇప్పుడు నీవు ఏ విధంగా పాడతావో ఆ విధంగా పాడుము. మంచిది. తామ్ సహోదరుడా అది నడిపించుచూ నాకు సహాయం చెయ్యండి, మీరు చేయగలరా? ఇప్పుడు నాకు ఎక్కువ స్వరము లేకుండెను. మరియు అప్పుడు మంచిది. మంచిది. (సహోదరుడు రాబర్ట్ థామ్ సిలువ చెంత అను పాట పాడుటలో
సహాయం చేయును-ఎడిటర్)
యేసూ, నన్ను సిలువ చెంత నుండనిమ్ము
అక్కడ ఒక ప్రశస్తమైన ఊట కలదు,
అందరికి ఉచితము, ఒక స్వస్థపరచు ప్రవాహము,
కల్వరి కొండ నుండి ప్రవహించును.
సిలువలో, సిలువలో,
ఎన్నడైనా నాకు మహిమగా ఉండును.
నదికి అవతల నా ఎత్తబడిన ఆత్మ విశ్రాంతిని కనుగొనగలుగును.
మీ కిష్టమైనయెడల, మీరు మీ తలలు వంచెదరా, కేవలం ఇప్పుడు నిజముగా నెమ్మదిగా ఝు౦కారము చేయుదము. (సహోదరుడు బ్రాన్హాం మరియు సమాజము సిలువ చెంత అను పాట ఆలాపనతో ప్రారంభించెదరు-ఎడిటర్)
సిలువ చెంత నేను కనిపెట్టెదను...
నిరీక్షించుచూ, నమ్ముచూ, ఎన్నడైనా,
బంగారపు నదీ తీరపు అంచును నేను చేరునంత వరకు.
(సహోదరుడు తామ్ సిలువ చెంత అను పాటను, మారలా మృదువుగా పాడుచు కొనసాగించుచున్నారు-ఎడిటర్)
ఇప్పుడు కేవలం నీవు కోరి ఉండినయెడల నేను ఆశ్చర్యపడుదును...మీ కొరకు అది ఎవరూ చేయలేరు. మీరు కేవలం అలాచేసి ఉండని యెడల నేను ఆశ్చర్యపడుదును... క్రీస్తుకు నీ జీవితమును తిరిగి ప్రతిష్ట చేయగోరిన యెడల, మరియు “ప్రభువా, నన్ను జ్ఞాపకముంచుకొనండి. నేను మిమ్మును కొనియాడుదును... అలసిన, మరియు బాధపడుచూ, రక్తము చిందించుచూ నా కొరకు చనిపోవుచున్నారు. నేను అయోగ్యుడను, అయితే ఇప్పుడు, ప్రభువా, నేను నా చేయిని పైకెత్తనై ఉన్నాను. మరియు మీరు నన్ను చూడండి. నేను నా జీవితమును తిరిగి ప్రతిష్ట చేసికొనగోరుచున్నాను. దేవుడు మిమ్మును దీవించును. దేవుడు మిమ్మును దీవించును. అంతా బాగుంది. ”ఇప్పుడు ప్రభువా, ఈ శుభ శుక్రవారం రాత్రి మీకు నేను నా యంతట నేను తిరిగి ప్రతిష్ట చేసికొనుటకు కోరుచున్నాను.“ దేవుడు మిమ్మును దీవించును గాక.
10
తండ్రీ, ఈ ఎత్తిన చేతులను మీరు ఆశీర్వదించవలెనని నేను ప్రార్ధించుచున్నాను. మరియు అలా చేయుటకు ధైర్యము లేని వారిని కూడా దీవించండి. ఈ రాత్రి, వారిలో ప్రతి ఒక్కరినీ దీవించమని అలా అన్నిటికి చాలిన ఆయనను మేము ప్రార్ధించుచున్నాము.
మన రక్షకుడైన, దేవుడు సిగ్గుపరచబడెను. కిందకు దించబడి, పిలాతును ప్రాధేయబడి అడిగిన తరువాత, ఆయన శరీరమును ఎవరు తీసుకొన్నారో ధనవంతుడైన ఆ మనిషి చేతులలోనికి ఇవ్వబడ్డారు. మరియు అది తీసుకొని మరియు శుభ్రమైన నారవస్తములోనికి చుట్టబడి మరియు ఆ శరీరం సమాధిలో పెట్టబడెను. ఓ దేవా, ఆ దీన శిష్యులకు అది ఎలాంటి ఒక భావన అయిఉన్నది; ఆ సమయంలో వారు ఓడిపోయినట్టుగ కనిపించెను. వారు చాలా ఎక్కువగా నమ్మిన ఆ ఒకరు ఇప్పుడు వెళ్ళి ఉన్నారు, అయితే ఎంతో కాలము కాదు. కేవలం రక్తం కారుచున్న ఒక బలి అయిఉండెను, అదంతా అదే. ఏదో రోజున, కొన్ని గంటల తరువాత, ఆయన లేచెను మరియు అప్పుడు సంతోషం వచ్చెను.
11
ప్రభువా, ఈ రాత్రి, మాకు సహాయం చెయ్యండి, మేము ఈ తగిన సమయంలో, అది మాపై ఉండునుగాక, మా విమోచన కొరకు అలా చెల్లించబడు వెల యొక్క శ్రమను మేము చూచెదము, మేము సంతోషముగ ఉండునట్లు మా కొరకు అది చెల్లింబడిన విచారమును మేము చూచెదము. మరియు మా ఆత్మలు ఈ రాత్రి, ప్రభువా, మేము మా అంతట మేమే నీకు సమర్పించుకొందుము గాక. మరియు మా ఆత్మలు బాధతో ఉండును, సుదూరమునకు చూచి మరియు అది ఏమిటో, ఓ దేవా, ఎంత ఒక భయంకరమైన చావు అనునది చూచెదము. పాపము ఎంత క్రూరమై ఉన్నది! మరియు తండ్రీ, ఇప్పుడు కలసి ఉన్న మమ్ములనందరిని మీరు దీవించండి.
మరియు ఓ దేవా, నాకు మీరు సహాయం చెయ్యండి, ఇక్కడ మీ సేవకుడు చాలా అల్పమైన స్వరముతో నిలచి ఉండగా, మరియు మీ పిల్లలు వాక్యము నుండి ఏదో వినుటకు కనిపెట్టుచుండగా, సహాయం చెయ్యండి. ప్రభువా, నాకు సహాయం చెయ్యండి మరియు ప్రతి ఒక్కరికి, ఉచితముగా, నీ జీవపు వాక్యమును తెరవండి. మరియు మేము మా జీవితములను మరియు మా హృదయాలను తిరిగి ప్రతిష్ట చేసికొనుచుండగా సహాయం చెయ్యండి. బలిని గూర్చి మేము ఆలోచించునప్పుడు, మా రొమ్ము కిందగా, మా హృదయంలో కన్నీళ్ళు కిందకు జారుచున్నవి. ఇప్పుడు మాకు సహాయం చెయ్యండి, ఎందుకనగా మేము అది క్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమెన్.
12
చెదరని మీ శ్రద్ధను కొంచెం సేపు నాకిచ్చినయెడల కేవలం ఇప్పుడు కొంచెం చదువ గోరుచున్నాను, మరియు నా కొరకు ప్రార్ధించండి. యెషయా 53వ అధ్యాయము.
ఈ రోజు మనము బహుశా రేడియో ప్రచారం మరియు మొదలైనవి విన్నాము.
నేను ఈ రోజు క్రీస్తును గూర్చి ఆలోచించాను. నేను ఏదో ప్రదేశానికి వెళ్ళి మరియు కేవలం క్రింద మోకాళ్ళు వంచలేకపోయాను. మరియు నేను ఆలోచించగా...కేవలం నేను ఏడ్వవలసి వచ్చెను. అక్కడ కల్వరి యొద్ద ఏమి జరిగినదో చూచుటకు నా మనస్సు వెనుకకు వెళ్ళెను.
నేను ఏ రేడియో కార్యక్రమములు వినలేదు, అయితే బహుశా సువార్త నుండి వారు బోధించారు. మరియు రేపు రాత్రికి ఆ నిర్ణయ ప్రమాణమును దానిని మనము సమీపించెదము.
13
అయితే ఈ రాత్రి పాతనిబంధన లోనికి వెళదాము. పాపముయొక్క క్రూరత్వము మన జీవితములలో నుండి పాపమును తీసివేయుటకు ఖర్చగు అపరాధ రుసుము. యెషయా 53లో ప్రభువు రాకడకు ఏడువందల స౦వత్సరం క్రితము ప్రవక్త అభిషేకి౦చబడి అతడు ఈ మాటలు చెప్పియున్నాడు.
మేము తెలియచేసిన సమాచారము ఎవ్వడు నమ్మెను? యెహోవా భాహువు ఎవనికి బయలు పరచబడెను?
లేత మొక్కవలెను ....ఎండిన భూమిలో మొలిచిన వేరు వలెను.... అతడు ఆయన యెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతనిని చూచి అపేక్షించునట్లుగా అతని యందు సురూపము లేదు.
అతడు త్రుణీకరింపబడిన వాడును ఆయెను. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడుగానూ వ్యసనాక్రాంతుడుగానూ వ్యాధి ననుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగానూ ఉండెను. అతడు త్రుణీకరింపబడినవాడు గనుక మనమతనిని ఎన్నిక చేయకపోతిమి.
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవుని వలన భాదింపబడినవానిగాను శ్రమ నొందినవానిగాను మనము అతనిని ఎంచితిమి .
మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.
మనమందరమూ గొఱ్ఱెలవలే త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను.
అతడు దౌర్జన్యము నొందెను భాదింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు, బొచ్చ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెయు, మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు.
అన్యాయపు తీర్పు నొ౦దినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల యతిక్రమములనుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరమువానిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు?
అతడు మరణమైనప్పుడు, భక్తిహీనులతో అతని సమాధి నియమి౦పబడెను ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు.
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను అతడు తనను తానే అపరాధ పరిహారార్ధ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు ధీర్గాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును.
ఈ రాత్రి నేను దానిని ఒక లేఖనంగా పిలిచి ఉండినయెడల, నేను 6వ వచనమును తీసికొందును.
మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను.
14
నేను కేవలం కొన్ని క్షణాలు మాట్లాడగోరుచున్నాను. మన మధ్యలో ప్రభువు ఆనందము కలిగి ఉండినప్పుడు మనం ఎల్లప్పుడూ సంతోషించెదము; మరియు నేను ఎంతో గొప్పగా మీతో ఆనందించెదను. అయితే దానికి చెల్లించే వెల ఎంతో ఆలోచించుటకు నీవెన్నడయినా ఆగితివా? దాని వెనుకనున్న ఆ ఖరీదు ఎంతో కేవలం నీవు ఎన్నడైనా గుర్తు ఎరిగితివా? తీర్పు ఏమై ఉండెను? మరియు ఆ పాపం యొక్క అపరాధ రుసుము ఏమై ఉండెను? కల్వరికి దేవుని కుమారుడు వెళ్ళుటకు అది కారణమైనప్పుడు, తప్పక ఆ పాపము ఎంత క్రూరమైనది, మరియు దేవుడు ఆయనను మొత్తెను, మరియు ఆయనవైపు చూడకుండ ఆయన ముఖం త్రిప్పెను, మరియు ఆయనను మొత్తెను. మరియు- మరియు ఆయన బాధింపబడి ఉండెను. ఆయన ఎవరయి ఉండెనో చూడండి.
ఇప్పుడు నేను మాట్లాడుచూ, మీకు నేను ఒక చిత్రమును (గీయాలని) చూపించగోరుచున్నాను. ఈ రాత్రి, ఒక చిన్న ఓడ మీద, మనమందరం ఒక చిన్న యాత్ర చేయుదము, మరియు చేయుదము... ఒక చిన్న శూన్యపు ఓడ లేక గాలి ఓడ (విమానం) అక్కడ ఒక జగత్తు, అక్కడ ఒక నక్షత్రం కూడా లేక ఏదైనను దానికి ఒక వంద మిలియను సంవత్సరాల వెనుకకు వెళ్ళుదము, మరియు అక్కడ నీవు శూన్యము తప్ప ఏదియు చూడలేదు. మరియు ఆ శూన్య మంతయు దేవుడయి ఉండెను. ఆదియందు దేవుడు ఉండెను.
మరియు ఇప్పుడు ఒక చిన్న తెల్లని వెలుగు ఉనికిలోనికి వచ్చుట మనం గమనించగలము. మనం దానిని ఒక హేలోగా (ఒక ఆత్మీయ పురుషుని శిరస్సు పై ఉన్న కాంతి పుంజము) పిలిచెదము. మరి అది దేవుని కుమారుడయి ఉండెను, ఆదియందు, దేవునిలో నుండి బయటకు వెళ్ళిన లోగోస్ అయిఉండెను.
15
మరియు అప్పుడు అలా అక్కడ ఆయన ఆ విధముగా నిలబడి ఉండెను. మరియు ఆయన ఆయన మనస్సులో, ఆయన ఆ ప్రపంచం ఏ విధంగా ఉండునో ఆలోచించుటకు ఆయన ప్రారంభించెను. మరియు ఆయన మనస్సులో ఈ చిత్రమంతయు గీచెను. మరియు ఆయన చెప్పెను, “వెలుగు కలుగును గాక.”
మరియు అణువు చీల్చబడెను, మరియు పగిలి ముందుకు వచ్చుట కారంభించెను, మరియు ఒక అణువు వెళ్ళెను, మొదటి అణు ప్రేలుడు జరిగెను. మరియు అప్పుడు ఆ అణువులు అది అగ్నికణములుగా అగునంత వరకు పోగుగా అవుటకు ప్రారంభించి, అది ఏమై ఉండెననగా తడిగా నుండి, పగులుటకు ప్రారంభమై మరియు అణువులను చీల్చెను. మరియు కొంచెం సేపటికి అక్కడకు ఒక నక్షత్రము వచ్చెను, లేక...అలా ఒక క్షిపణి ఎగురుచు ఒక ముక్క దానినుండి... (విసరిన బాణమువలె) మరియు గాలిలోనికి ప్రయాణించెను. ఆయన దానిని కొన్ని మిలియను సంవత్సరములు గమనించి ఉండవచ్చును, మరియు అప్పుడు అది ఆగెను. ఆయనకు తొందర లేదు. ఆయనకు ఎన్నడైనా సమృద్ధియైన (ఎంతో) సమయం గలదు. ఆయన ఆది నుండియు అంతము వరకు ఉండెను. అక్కడ ఆయనకు సమయం అనేది లేదు. మరియు అప్పుడు మరొకటి ఎగిరెను, మరియు ఆయన దానిని ఈ మార్గము మీదుగ ఆపును.
16
ఆయన ఏమి చేయుచుండెను? ఆయన తన మొదటి బైబిలును వ్రాయుచుండెను. ఆ మొదటి బైబిలు వ్రాయబడినప్పుడు రాశి చక్రము అయిన, ఆకాశములలో వ్రాయబడి ఉండెను. అది కన్యకతో ప్రారంభమయి, ఆయన ఆ విధముగానే వచ్చెను. అది రెండవ రాకడ అయిన పులి-సింహముతో అంతమాయెను. మరియు ఆయన ఆయన మొదటి బైబిలు వ్రాయుచున్నాడు.
రెండవ బైబిలు వ్రాయబడెను, హనోకుచే వ్రాయబడి ఉండెను, మరియు పిరమిడ్ లో ఉంచబడెను.
మూడవ బైబిలు వ్రాయబడెను. మరియు ఈ ఒకటి, చివరది (సహోదరుడు బ్రాన్హాం ఆయన బైబిలును చూపించుచున్నారు -ఎడిటర్)
దేవుడు ఎల్లప్పుడూ మూడింటిలో కార్యములు చేయును. దేవుడు మూడులో పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు. (సహోదరుడు బ్రాన్హాం తన గొంతును సవరించుకొనెను-ఎడిటర్) నన్ను క్షమించండి. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో పరిపూర్ణుడు అయి ఉండెను. ఆయన నీతీకరణములో, శుద్ధీకరణములో, పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో పరిపూర్ణుడై ఉండెను. ఆయన మూడింటిలో ఆయన పరిపూర్ణుడై ఉండెను.
మనము ఆయన తయారు చేయుటలో ఉన్నాము, కనుక మనము మూడులో పరిపూర్ణులమై ఉన్నాము; ప్రాణము, శరీరము, మరియు ఆత్మ. మరియు మన శరీరము వీటి స్వాధీనములో ఉన్నది. నరములు, రక్తము, మరియు కణములు (శరీరము) మూడు. సమస్తము మూడులో పరిపూర్ణము.
17
అప్పుడు ఆయన చెప్పెను, ఆయన సమస్తమును చేసిన తరువాత, ఆయన ఎన్నడైనా ఏ ఇతరమైనదియు చేయక ముందు...
ఈ ప్రపంచం మీదుగా - ఒక చిన్న కాంతి పుంజము పైగా కదలుచుండుట నేను చూడగలుగుచున్నాను, అది ఒక నిప్పు కణముగా ఉండి, గడ్డ కట్టిన, సముద్రంలోని ఒక గొప్ప మంచు కొండవలె అక్కడ వ్రేలాడుచున్నది. మరియు ఆయన సూర్యునికి దగ్గరగా పైన దానిని కదిలించెను. మరియు సూర్యుని చుట్టూ ఆ విధముగ దానిని ఆయన త్రిప్పుటకు ఆరంభించెను. అది కరగుటకు ప్రారంభించెను, మరియు ఆ పెద్ద ఐసుతో గట్టిగా ఉన్న మంచు కొండలు వదులుగా చీల్చబడెను. టెక్సాస్ ఉనికిలోనికి రూపొందించబడెను. మరియు అక్కడ మైదానాలు ఉన్నవి. అక్కడ నుండి ఆ మంచు కొండలు ఎలా కిందకు దిగి వచ్చినవో మనకు బోధించబడినట్టే, ఉత్తమమైన దినచర్య శాస్రజ్ఞులు అది లెక్కించగలరు. మరియు అప్పుడు మొత్తం ప్రపంచం అది మెక్సికో యొక్క గల్ప్‌లోనికి, మొదలైనవి, వాటిలోనికి అది పరుగెత్తిన తరువాత, సన్నని త్రోవల లోనికి నీరు వచ్చుట ప్రారంభమాయెను. “మరియు ఆ ప్రపంచము, (భూమి) నిరాకారముగాను, శూన్యముగా ఉండెను,” ఇప్పుడు మనము ఆదికాండము 1లో ఉన్నాము, చూడండి. ఇప్పుడు, అప్పుడు, దేవుడు కదిలెను మరియు నీళ్ళ నుండి ఆకాశ విశాలమును వేరు చేసెను. మరియు ఆయన వెలుగును చేసెను.
మరియు అప్పుడు ఆయన సమస్త సృష్టిని చేసెను. అప్పుడు, ఆయన అది చేసిన తరువాత, సమస్త వృక్షాలు పైకి వచ్చెను. మరియు మొక్కలు మరియు మొదలైనవి. ఆయన ఎలాంటి అందమైన మనోహరమైన నిర్మాణము కలిగి ఉండెను. ఆయన దానిని ప్రేమించెను. అది మనోహరమై ఉండెను. మరియు ఆయన అది చక్కగా ఉన్నట్టు తలంచెను.
18
కాబట్టి ఆయన దానిని ఆ స్థితిలోనే ఉంచలేదు. ఆయన దానితో ఏదో ఉంచెను. కనుక ఆయన చెప్పెను, “మనము (బహువచనంలో) నరులను చేయుదము.” బహువచనంలో మన స్వరూపములో “మన స్వరూపములో నరులను చేయుదము” కాబట్టి అప్పుడు దేవుడు ఆయన మొదట మనిషిని, అతడు ఒక ఆత్మ మనిషి ఆయెను. అతడు ఏదో దేవుని క్రమములో ఉండెను. లేక లోగోస్, దేవుని కుమారుడై ఉండెను. అలా అతడు మొదట మనిషి ఆయెను. అప్పుడు ఆయన మనిషికి సృష్టిపై ఏలుబడిని ఇచ్చెను... ఈనాడు విశ్వాసిని పరిశుద్ధాత్మ నడిపించునట్టే, సమస్త జంతుజీవమును నడిపించుటకు ఇచ్చెను. “ఇక్కడకు వెళ్ళుము. ఇది చేయుము”
ఇప్పుడు మనం పరిశుద్ధాత్మకు పరిపూర్ణముగా లోబడినయెడల ఆ రోజు ఆదాము జంతువులను నడిపించినట్లే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలను నడిపించును.
19
కనుక ఆయన - ఆయన వాటిని చేసెను. మరియు అప్పుడు, ఆయన చేసినప్పుడు, ఆయన దాని మీద కదలనారంభించెను-అప్పుడు ఆ ఉద్దేశ్యం మీద అలా - ఆ విధంగా భూమి మట్టి నుండి ఆయన మానవుని చేసెను. భూమిని సేద్యపరచుటకు, పని చేయుటకు శరీరంతో ఉన్న ఏ మనిషి లేడు. కనుక ఆయన మనిషిని భూమి మట్టి నుండి చేసెను.
ఇప్పుడు నేను అనుకొన్నది అక్కడే ఉన్నది. అది ఒక వృక్ష శాస్త్రవేత్త లేక-లేక విజ్ఞాన శాస్త్రవేత్త మరియు క్రైస్తవ్యము, ఒకరితో ఒకరు పోరాటం చేయరు. ఎందుకనగా, విజ్ఞాన శాస్త్రం (సైన్సు) ఆ మనిషి వివిధ జీవితముల నుండి వచ్చునని చెప్పెను. మరియు మనం చెప్పెదము, నీవు ఇక్కడ ఒక మనిషివైపు చూచినప్పుడు, అతడు దేవుని స్వరూపములో ఉన్నాడు. ప్రారంభంలో, ఇది దేవుని స్వరూపము కాకుండ ఉండెను. ఇది జంతు జీవితం యొక్క స్వరూపములో ఉన్నది. మరియు అతడు... మరియు మనం ఇలా ఉన్నామని ఆ పరిణామ శాస్త్రజ్ఞులు వాదిస్తారు. ఆ విధంగా వారు నమ్మిన దానిని నేను నమ్మను. సమస్తం ఒకే కణము నుండి అని వారు అన్నారు. అయితే నిశ్చయముగా మనం పరిణామమును గూర్చి ఒక మనిషి నుండి మరొక మనిషికి అని నేను నమ్ముదును. అయితే అప్పుడు దేవుడు అదంతా చేసినప్పుడు, మరియు చేశాడు...ఆ మనిషిని అందులో ఉంచాడు.
20
భూమి మట్టిలో నుండి అతని చేసెను, ఇప్పుడు, ఆయన సొంత రూపములో కాదు. ఆయన అప్పటికే మనిషిని చేసెను. అప్పుడు ఆయన వానిలోనికి జీవవాయువు ఊదగా మరియు అతడు జీవాత్మ ఆయెను. కనుక, మనిషి యొక్క ప్రాణము ఆత్మ యొక్క స్వభావము అయి ఉన్నది.
ఇప్పుడు, నీవు తిరిగి జన్మించినప్పుడు, నీవు ఒక నూతన ఆత్మను పొందలేదు. నీవు ఆత్మ యొక్క ఒక నూతన స్వభావము పొందెదవు. అది అదే ఆత్మ అయితే అది దాని యొక్క నూతన స్వభావము. నీవు ఇద్దరు మనుష్యులను తీసికొని, కలసి నిలబెట్టినా, ఇద్దరూ ఒకేలా కనబడతారు; మరియు వారిలో ఒకరు ఒక పాపి, మరియు వారిలో ఒకడు కైస్తవుడు. ఒక మనిషి అంటాడు, “నీకున్న అదే ఆత్మను నేను పొందాను,” చూడండి. అయితే వారిలో ఒకరు అతని ఆత్మ భేదమైనది. అతని స్వభావం వ్యత్యాసకరమైనది. అతడు మార్పు పొంది ఉన్నాడు.
21
కనుక అప్పుడు ఈ మనిషిలోనికి ఆయన ఊదాడు. ఇప్పుడు ఎలాగో నేను ఎరుగను, ఎలా అతని చేశాడో నేనెరుగను. ఆయన-ఆయన వానిని అతని భూ సంబంధమైన వాటితో సంబంధము కలిగి యుండునట్లు ఐదు జ్ఞానేంద్రియాలలో ఉంచాడు, మరియు చూచుట, రుచి, స్పర్శ, వాసన, మరియు వినుట. మరియు ఆయన వానిని ఆ పద్ధతిలో చేసెను. ఇప్పుడు, ఆ జ్ఞానేంద్రియాలు దేవుని సేవించుటకు కాదు.
దేవుని సేవించే అతని ఇంద్రియం, అతని ఆత్మ అయిఉండెను, అతని ఆత్మ ఇలా ఉన్నది. పాపము చేసిన ప్రాణము చావవలెను.
ఇప్పుడు, ఏదో పొందడానికి నేను చాలా దూరం వెళ్ళాను. అయితే దేవుడు కల్వరి వద్ద కచ్చితంగా ఏమి చేశాడో అలా మీరు చూడగలిగినట్టు దాని ప్రతి విషయాన్ని మీరు పొందవలెనని నేను నిరీక్షించుదును.
22
ఇప్పుడు ఈ మనిషి, ఆయన అతనిని వాని జ్ఞానేంద్రియాలలో ఉంచినప్పుడు, అతని ఐదు జ్ఞానేంద్రియాలలో అప్పుడు ఉంచెను. మరియు అప్పుడు, ఆ మనిషి, అతడు ఒంటరిగా ఉన్నాడు, కనుక ఆయన అతనికి, ఒకసాటి అయిన సహాయముగా ఒక భార్యను, చేసెను. అతని ప్రక్కటెముకను తీసికొని మరియు ఒక స్త్రీని చేసెను.
అక్కడ ఒక అందమైన మాదిరి ఉన్నది, అంతా మాదిరిలోనే, దేవుడు క్రీస్తు ప్రక్కనుండి, ఒక పెండ్లి కుమార్తెను తీయుచుండెను. చూశారా? దేవుడు ఆదాము ప్రక్కను తెరచెను, ఒక ఎముకను తీసెను; ఆ శరీరము-ఆ నిర్మాణములో ఏదనగా ఒక మనిషికి ఒక స్తీ కంటె ఒక ఎముక తక్కువాయెను. మరియు ఇప్పుడు దేవుడు క్రీస్తు ప్రక్కను తెరచెను, కల్వరి యొద్ద, మరియు వధువును బయటకు తీసెను. క్రీస్తు శరీరములోనికి, క్రీస్తు రక్తం ద్వారా సంఘం వచ్చును.
అలా ఆ విధముగ-మనము లోనికి వచ్చాము మరియు మరో మార్గము లేదు; ఎలాంటి సంఘానికి నీవు చెందావన్నది ఏమియు కాదు, నీవు ఎంతమంచి వాడవయినను, ఎంతమంచి స్త్రీగా ఉన్నను ఏమియు కాదు. నీవు తప్పక దేవుడు ఏర్పరచిన విధానంలో, దేవుని యొక్క అన్నిటికి చాలిన బలిని అంగీకరించవలెను. లేకపోతే నీవు నశించెదవు. అది సరియైనది. ఆ విధానములో మాత్రమే, అక్కడ దాని ద్వారా నీవు లోనికి రాగలవు. ఇప్పుడు, అక్కడ ఒకే ఒక మార్గము కలదు, మరియు అది ద్వారము అయిఉన్నది.
23
ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆ ప్రఖ్యాతిగాంచిన ఉపమానమును గూర్చి బోధించెను. పెండ్లి విందు సిద్దమయినదని ఆయన చెప్పెను. మరియు -మరియు ప్రతి మనిషికి ఒకటి ఇవ్వబడినది-ఒక వస్త్రము, మరియు ఆయన అక్కడ ఒక వస్త్రం లేకుండ ఉన్న ఒక మనిషిని కనుగొనెను. ఆయన అనెను, “స్నేహితుడా, నీవు ఏమై ఉన్నావు...ఎలా, ఒక వస్త్రం లేకుండా ఎలా నీవు రాగలవు?”
ఇప్పుడు, ఆ తూర్పు జనుల ఆచారము, పెండ్లి కుమారుడు ప్రతి వ్యక్తిని ఆహ్వానించినప్పుడు, అతడు ఉంచును... అతడు ఆహ్వానించెను. అతడు యాభై మంది ప్రజలను ఆహ్వానించిన యెడల అప్పుడు అతని దగ్గర యాభై అంగీలు కలవు. మరియు ఎక్కడో ద్వారం దగ్గర అతడు నిలబడి, మరియు గొప్పవాడైనను లేక బీదవాడైనను, ఒక మనిషి వచ్చు ప్రతి సమయంలో, అతడు అంగీ వానిమీద ఉంచును. అప్పుడు, వారు గొప్పవారా లేదా పేదవారా ఏ ఒక్కరికీ తెలియదు. అతడు, అందరూ, ఒక అంగీ ద్వారా ఒకే విధముగా కనబడుదురు.
మరియు ఈనాడు దేవుడు ఆ విధముగ చేయును. ఆయన పరిశుద్ధాత్మ నిచ్చును; అది ఒక మాదిరి. ఆయన ఆహ్వానించు ప్రతి మనిషి, మనం అంతా సమానంగా ఒకేలా ఉంటాము. ఆ మరొకని కంటె ఇతడు కొంచెం మంచిగా ఉన్నాడన్న కారణం కాదు, మరియు ఆ ఒక్కడు ఇతని కంటె కొంచెం ఎత్తుగా ఉన్నాడనియు కాదు. దేవుని దృష్టిలో మనం అంతా ఒకేలా ఉన్నాము, ఆ పెండ్లి విందుకు ఆహ్వానించబడిన ప్రతీ ఒక్కరూ ఒకేలా ఉన్నారు.
24
అతడు లోనికి వచ్చినప్పుడు, మరియు ఇప్పుడు ఆయన ఒక మనిషిని కనుకొనెను... ఇప్పుడు, అక్కడకు వచ్చుటకు ఒకే ఒక ద్వారము గలదు, ఎందుకనగా అక్కడే పెండ్లి వస్త్రాలు ఇవ్వబడును. మరియు ఒక మనుష్యుడు పెండ్లి విందులో, పైన వస్త్రం లేకుండా ఒక మనిషిని కనుగొనెను. ఆయన అనెను, “స్నేహితుడా, ఇక్కడ నీవేమి చేయుచున్నావు? ఎందుచేత నీ పై వస్త్రము లేకుండా ఉన్నావు?” ఆ మనిషి మాట్లాడ లేకపోయెను. ఏదో మరో మార్గము గుండా, అతడు ఒక కిటికీ గుండా వచ్చెను.
మరియు క్రీస్తు ద్వారా వచ్చు ప్రతి మనిషి, అంగీ(వస్తము) అయిన పరిశుద్ధాత్మను పొందుకొని, క్రీస్తు శరీరములోనికి వచ్చును. ఆయన కేవలం నీవు లోనికిరాగానే, అది నీ మీద ఉంచుటకు, అక్కడే సరిగా నిలబడి ఉండెను. ఆయన వాగ్ధానము చేసినది అదే మరియు అలా ఆయన చేయునదీ అదే.
25
ఇప్పుడు, వెనుక అక్కడ... ప్రారంభములో, ఏదెనులో, అప్పుడు ఆయన వాని కొరకు ఒక భార్యను చేసెను లేక సాటియైన సహాయముగా చేసెను.
ఇప్పుడు కొందరు కళాకారులు, కొన్ని సమయాల్లో, మేగజైన్లులో ఈ చిత్రాలు వేసినవి మీరు చూడండి. ఇప్పుడు, అది చాలా అల్పమైన ప్రేరణ. నీవు ఆ జుట్టు అలా బయటకు అతికించబడినట్లుగా ఉండుట చూచినప్పుడు మరియు, ఓ చూచుటకు ఎంతటి భయంకర సంగతి, మరియు అందురు, “ఆమె మన తల్లి,” ఎందుచేత, అక్కడ ఆ లోకంలో శ్లాఘించే వారు ఏ ఒక్కరూ లేరు. భూమి మీద ఎన్నడైనా అత్యంత అందమైన స్త్రీ హవ్వయై ఉండెనని నేను నమ్ముచున్నాను. అది సరియైనది. ఆదాము ఆమె వైపు చూడగా, అతని యొక్క-అతడు-అతడు...కేవలం అది, ఎందుకంటే, ఈనాడు స్ట్రైన్ (వేదన) మానవ జీవులగుండా అలా వచ్చుచున్నదని అది చూపించుచున్నది. అది అలా కాని యెడల, అది తల్ల క్రిందులగుచున్నది.
26
కనుక, ఆదాము హవ్వను తన భార్యగ చేసికొనెను. మరియు అప్పుడు పాపములోనికి వచ్చునప్పుడు... మరియు అది ఏమై ఉండెనో నాకు నా ఉద్దేశ్యము గలదు. నేను అది సంఘంలో బయటకు చెప్పను, ప్రారంభంలో పాపము ఏమై ఉండెనో, కేవలం అది ఏదో విధమైన ఒక చిన్న తరగతిగా కలిగి ఉంటేనేగాని. అయితే, ఏ విధముగ అయినను, అది జరిగినప్పుడు, అది దేవునితో సహవాసము నుండి వారిని వేరు చేసినది.
ఇప్పుడు నేను పొందగోరు చిత్రము ఇక్కడ ఉన్నది. ఇప్పుడు దేవుడు అది గ్రహించెను, లేక ఎవరో దూత లేక ఏదో పైకి వచ్చి మరియు దేవునితో చెప్పెను, అలా, “నీ కుమారుడు తప్పిపోయాడు. అతడు, అతడు పాపము చేశాడు. అతడు పడిపోయాడు.”
ఇప్పుడు ఆ మనిషి వేదన గమనించండి, మొదటి సంగతి, తనకు తాను ఒక మతమును తయారు చేసికొనెను. ఒక మనిషి, అతడు ఏదో విధమైన ఒక మతమును పొందెను.
మరో దినాన, ఇక్కడ పట్టణంలో నేను ఒక ప్రఖ్యాతి గాంచిన మనిషితో మాట్లాడుచున్నాను. చెప్పెను, “ బ్రాన్హాం సహోదరుడా, నా మతము, నీకు తెలియునా, బంగారు చట్టమును కాపాడుటయే. అది మంచిదే.
అయితే, సహోదరుడా, ఒక మనిషి తిరిగి జన్మించనంత వరకు, అతడు నశించగలడు. అవును, అతడు జన్మించవలెను, అతడు తిరిగి జన్మించవలెను. ఇప్పుడు, ఆ బంగారు చట్టము సరియైనదే; అలా, ఒక నీతిమంతుడైన మనిషి అది చేయగలడు. అయితే అది అదంతా సహజాతీతమైన వరుసలో పొందవలసి ఉన్నది. మరియు అలా మనము సహజాతీతముగ జన్మించు క్రమములో దేవుడు ఏమి చేసెనో నీవు చూడగలవు.
27
ఇప్పుడు, అప్పుడు, వారు పాపము చేసెను, అతడు తనంతట తాను ఒక మతము... మతము అను మాటకు అర్ధం కప్పుకొనుట ఏదో దాని కప్పిన దాని వలె ఉన్నది. నాకు ఈ కోటు ఒక-ఒక-ఒక నైతిక ప్రవర్తనా ప్రమాణము. ఎందుకనగా అది నా ఉనికిని కప్పును. మరియు మీ బట్టలూ అదే విధముగ ఉన్నవి. మరియు అది ఒక... అది ఒక-కప్పుకొనుట.
ఇప్పుడు గమనించండి అప్పుడు, ఆదాముకు, అతని అంజూరపు ఆకులు దేవుని ముఖాముఖిగ కలియనంత వరకు అంతా సరియే. అయితే అతడు దేవుని ఎదుటకు వచ్చినప్పుడు, అతని అంజూరపు ఆకులు మంచిగా లేవని అతడు గ్రహించెను. మరియు ఇప్పుడు, స్నేహితుడా, నీవు చాలా మంచి వ్యక్తివని నీవనుకొని ఉండవచ్చు; చూడండి, మరియు నీవు మంచివాడవు కావచ్చు. అది యధార్ధము. అయితే నీవు దేవుని ఎదుటకు వచ్చినప్పుడు, నీ యొక్క... దేవుడు నీ కొరకు ఏర్పరచిన బలిని నీవు అంగీకరించని యెడల, నీవు నశించినవాడవు మరియు నీవు అది తెలిసికొనగలవు.
28
వారు చనిపోవుచుండగా నేను వారి ప్రక్కన నిలబడి గమనించితిని; వారిని ప్రశాంతంగా ఉంచుటకు, వారి చేతులలో హైపో (ఇంజక్షను) గుచ్చుట చూచితిని. మరియు వారు కేకలు వేస్తూ మరియు అలాగే అంటున్నారు. “ఓహ్, వారి ప్రక్కనే వారు ఉన్నారు” అని అందురు.
నేను అంటిని, “డాక్టరూ, ఒక నిమిషం అది దయచేసి దానిని అలా ఉంచండి.” చూశారా? మీరు సరిగా ఉన్నారని వారు అనుకున్నప్పుడు- వారు అలా ఉన్నప్పుడు వారి నుండి మీరు వినగలరు.
“అక్కడ ఒక మనిషికి సరియైనదిగా కనబడు మార్గము గలదు, అయితే చివరకు అది మరణమునకు దారి తీయును.”
మరియు తిరిగి జన్మించని ప్రతి మనిషి, దేవుని మూలముగా తిరిగి జన్మించనివాడు నాశనకరమగు ఆ మార్గంలో వెళ్ళును. నీవు దానికి సహాయం చేయలేవు. నీ సొంత ఆత్మయే (ప్రాణము) నిన్ను నడిపించును. నీవు తిరిగి జన్మించిన యెడల, నీవు పైకి వెళ్ళుటకు బద్దుడవు. నీవు తిరిగి జన్మించని యెడల, నీవు కిందకు వెళ్ళవలసి ఉన్నావు. కేవలం నీ యొక్క-నీ సొంత ఆత్మయే చేయగలదు. కేవలం ఇలా-ఎక్కడో ఒక చోట ఒక ద్వారమును ఒక మాంత్రిక దండము తెరవగలదు; నీవు ఆ దండమును పొందనియెడల, ఆ ద్వారము తెరువబడదు. మరియు నీవు తిరిగి జన్మించనియెడల, కేవలం నీవు, నీయంతట నీవే తిరస్కరించబడినావు. ఇప్పుడు, అంతా అదే.
29
మరియు అప్పుడు నేను-నేను అక్కడ చూచెదను, అప్పుడు, వారు బయటకు వచ్చినప్పుడు, మరియు ఆయన ఎదుట వారు నిలబడలేరని దేవుడు ఎరుగును. మరియు ఆయన ఎరిగెను. మరియు వారు దాగుకొనుచున్నారు, కొన్ని పొదలలో వెనుక దాగుకొన్నారు. అయినను కప్పుకొన్నారు, అయితే వారు కప్పుకొనినది చాలదని వారు ఎరిగి ఉండిరి.
మరియు చర్చికి వెళ్ళు ప్రతీ స్త్రీ పురుషుడు... ఈనాడు ఆ గంటలు మ్రోగించబడుట మొదలైనవి, కేథడ్రల్ (దేవాలయాలు) గలగలలాడుట నేను ఆలోచించుచున్నాను; మరియు ప్రజలు సంఘానికి వెళ్ళుచు మరియు సిద్ధపడుచు, మరియు స్త్రీలు ఈస్టరు టోపీలు కొనుచూ మరియు మొదలైనవి. ఇది ఎందుకు వచ్చియున్నది? మై! ఒక కుందేలుకు పునరుత్దానముతో ఎక్కడైనా చేయుటకు ఏదైనా ఉన్నదా? చూడండి (లేదండి, అయ్యా) ఏలాగు ఒక క్రిస్మసు చెట్టు క్రీస్తు పుట్టుకతో చేయుటకు ఏదైనా ఉన్నదా. స్నేహితులారా, అది అన్యత్వము. మనము ఎక్కడో ఒక చోట దారి తప్పిపోయాము. అది యధార్థం. అయితే ఇప్పుడు ఒక తిరిగి జన్మించిన మనిషి లేక స్త్రీ ఎరిగి ఉండును. ఏలయనగా అక్కడ నీలోనే జీవముండి అది పొరపాటని అలా నీకు చెప్పును. అది సరియేనా? (సమాజం “ఆమెన్” చెప్పును-ఎడిటర్)
30
ఇప్పుడు గమనించండి; ఆదాము మరియు హవ్వ. ఓహ్, మై! నేను దాని గూర్చి ఆలోచించినప్పుడు, నేను కలిగి ఉన్ననా ఇన్‌ప్లాయెంజా (జ్వరము) ఆలోచనలు (తలంపు) పోగొట్టుకున్నాను. వెనుక మార్గం ప్రారంభంలో నేను ఆలోచించాను. గమనించండి! మీరు రక్తమును గూర్చి మాట్లాడారా?
కొంత కాలము క్రితం వారు ఇప్పుడు ఆ గొప్ప మెధడిస్టు కౌన్సిల్‌లో మెథడిస్టు (కీర్తనలు) నుండి రక్తమును గూర్చిన పాటలన్నియు తీసివేయుటకు వారు లెక్కించారు, “ఇది వధశాల మతం కాదు” అని చెప్పెను. చెప్పెను, “మేము కోరము...మేము చక్కని మరియు గౌరవముగా ఉన్న దానిని కోరుదుము. ”సహోదరుడా, దేవుడు పొందుకొనే మార్గము అది కాదు. అదొక్కటే ఆ మార్గము.
“నేను రక్తం చూచినప్పుడు, నేను దాటిపోవుదును.” రక్తము! దేవుడు మాత్రమే అక్కడ ప్రత్యామ్నాయము. దానిలోనే ఉన్నది...“జీవము రక్తములో ఉన్నది. కాబట్టి నీవు మాంసమును తినవచ్చును. అయితే అక్కడ ఉన్న రక్తము, అక్కడ జీవమై ఉన్నది. నేల మీద పోయవలెను.” చూడండి, ప్రాణమును తినుటలేదు.
గమనించండి ఎంత అందమైనదో! దాని గూర్చి నేను ఎంతగానో ఆలోచిస్తున్నాను! అప్పుడు దేవుడు ఆలోచించెను, “ఇప్పుడు ఆదాము మరియు హవ్వ ఇక్కడకు రండి. మరియు నేను మిమ్మును బయటకు తెచ్చుటకు ముందు, నేను ఏదో ఒకటి చేయనై ఉన్నాను.” కనుక ఆయన అక్కడ కొండ ప్రక్కగా వెళ్ళెను మరియు ఒక గొఱ్ఱెను పొందెను, దానిని చంపెను, దాని నుండి చర్మమును లాగెను, దానిని చావనిచ్చెను.
31
ఎందుకనగా, దేవుడు ఆయన వాక్యమును కాపాడుకొనును, నీవు ఎంత మంచి మనిషిగా ఉన్నను ఏమియు కాదు, ఎంత మంచి స్త్రీగా ఉన్నను, నీవు ఏమై ఉన్ననూ ఏమియు కాదు. అది, దేవుడే, దేవుడు తన వాక్యమును కాపాడుకొనును.
ఆ కారణం చేత కన్య మరియ పెంతెకోస్తు రోజున మేడగది పైకి వెళ్ళవలసి ఉండెను, మరియు మిగతావారందరు పొందినట్టే, పరిశుద్ధాత్మ పొందెను, ఎందుకనగా ఆమె ఇక్కడ ఒక మర్త్యురాలిగ పుట్టెను మరియు పరలోకానికి వెళ్ళి ఉండే ముందు తిరిగి జన్మించవలసి యున్నది. ఆమెన్.
32
స్త్రీ, ఇప్పుడు చూడండి, నేను మీకు చెప్పనియ్యండి. కేవలం ఎందుకంటే ఆ కాలములు మారాయి, దేవుడు మారలేదు. దానికి ఏది కొదువుగా ఉన్న నీవు నశించినవాడవు. చూశారా? ఇప్పుడు, నేను పంతొమ్మిదివందల సంవత్సరముల క్రితం దేవుడు ఏమి చేసెనో నేను మాట్లాడుచున్నాను, ఈనాడు, కల్వరి మీద, ఇది చెల్లించుటకు ఎలాంటి బలి చేయబడినదో మీకు చూపించుటకు మరియు అది దేవుని విధానము. ఇప్పుడు అక్కడ సరియైనదిగా కనిపించు మార్గము కలదు; అయితే దేవునికి ఏర్పరచబడిన మార్గము కలదు. నీవు ఎల్లప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతిలో వెళ్ళిన యెడల, నీవు ఎన్నడునూ పొరపాటులోనికి వెళ్ళవు.
33
నీవు ఇండియానా పోలీస్‌కు బయలుదేరిన దానివలె, లేక ఆ బ్రిడ్జి ద్వారా వెళ్ళునప్పుడు మరియు నీవు అందువు, “సరే, ఇక్కడ, ఆ లూయిస్ విల్లా అక్కడ ఉన్నదా?” “అవును” మరియు కేవలం సరిగా ఈ మార్గమునే తీసుకో; నీవు అతి త్వరగా చేరుకుంటావు. అది యధార్ధం. నీవు పటము, ఆ బ్లూఫ్రింట్ (నమూనా పటము) తీసికొనుట చాలా మంచిది, అది పరిశీలన చేసి మరియు ఏ మార్గము గుండా వెళ్ళుచున్నావో చూడుము.
మరియు, అప్పుడు మహిమకు తీసుకువెళ్ళే దేవుని నమూనా పటము (బ్లూఫ్రింట్) ఇక్కడ ఉన్నది. దానిని పరిశీలన చేయండి. అది అక్కడే ఉన్నది. ఆ మార్గమంతయు రక్తముచే అది చల్లబడెను. నీవు రక్తమును వెంబడించిన యెడల, నీవు మార్గము తప్పిపోవు. ఆమెన్! ఇప్పుడు నీవు చూడగలవు. చూశారా? కేవలం రక్తముతో సరిగా కాపాడుకొనుము. మరియు నీవు అంతా సరిగానే ఉందువు, ఎందుకనగా మార్గమంతటిలో ప్రతి అడుగు అక్కడ రక్తమయమైన ఒక పాదముద్ర అయిఉన్నది.
34
ఇప్పుడు, గమనించండి ఆయన అది చేయకముందు అక్కడ ఎలా వెనుక, ఇప్పుడు ఆయన నిలచి ఉండును లేక...వారు పొందుటకు నిలబడినప్పటికీ కూడా, ఇప్పుడు సరిగా ఆయన వారిని చంపి ఉండును. ఆయన చేసియుండెను, ఎందుకనగా ఆయన సార్వభౌముడు, ఆయన ఆయన వాక్యమును కాపాడుకొనును. ఆయన చెప్పెను, “మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు.” అది దానిని ఎన్నటికి సర్దుబాటు చేస్తుంది. అప్పుడు అక్కడ వెనుక నేను ఆయనను చూడగలను ఆయన ఈ గొఱ్ఱెలను చంపినప్పుడు, నీవు అందువు, “బ్రాన్హాం సహోదరుడా, అవి గొఱ్ఱెలేనా?” నేను అది నమ్ముచున్నాను. ఆయన జగత్తుపునాది వేయబడినప్పుడు వధించబడిన గొఱ్ఱెపిల్ల అయిఉన్నాడు.
మరియు అది ఒక గొఱ్ఱెచర్మము అయిఉండెను; తీసుకొని మరియు వాటిని వెనుక పొదలలోనికి విసరి వేసెను, మరియు వారికి చెప్పెను, “వీటితో చుట్టుకొనుడి, మరియు బయటకు రండి, మరియు పొందుకొనుట కొరకు.”
35
మరియు ఆదాము మరియు హవ్వలు రక్తముతో వారి చుట్టూ కదలుచున్న చర్మాలతో, లాగుకొనుట నేను చూడగలను. నీవు ఊహించి ఉందువా! ప్రేమామయమయిన, ఆ రెండు పరిపూర్ణమైన మానవ జీవుల అందమైన దేహములు, ఇప్పుడు రక్తమయమైన గొఱ్ఱెచర్మంలో చుట్టబడెను. అక్కడ బయట వారు నిలబడుట నేను చూడగలను.
దేవుడు చెప్పెను, “ఆదామా, ఎందుకనగా నా మాట వినుటకు బదులుగా నీ భార్య మాట నీవు విన్నావు, అప్పుడు, నేను నిన్ను మట్టిలో నుండి తీశాను, మరియు నీవు తిరిగి మన్నైపోదువు.”
మరియు, “హవ్వ, ఎందుకనగా నా మాటకు బదులుగా నీవు సర్పము మాట విన్నావు, ఏలయనగా, నీవు జీవమును తీసికొని వచ్చావు...నీవు లోకంలోనికి జీవమును తీసుకొని రావలెను, నీవు లోకంలో నుండి జీవమును తీసివేశావు.” నీ గర్భవేదనను నేను హెచ్చించెదను. నీ భర్త యెడల నీకు వాంఛ కలుగును మొదలైనవి.
మరియు వారు సరిగా అక్కడే ఉన్నారు; తీర్పు . దేవుడు తన తీర్పును జరిగించును, కారణం ఆయన అది పలికెను. మరియు ఆయన దేవుడు; ఆయన దానిని వెనుకకు తీసికొనడు. ఆయన నిలచి ఉండును.. ఒక క్రమమైన పద్ధతిలో ఆయన దేవుడయి ఉండునట్లు, దేవుడు ఆయన వాక్యమును కాపాడుకొనును. అది యధార్ధము.
36
కనుక ఆమె ఆదామువైపు చూచినప్పుడు, అక్కడ ఆ చిన్నదైన బీద హవ్వను చూడగలిగి ఊహించగలను, ఆమె పొడవైన లేత వర్ణములో ఉన్న తలవెంట్రుకలు ఆమె వెనుక వ్రేలాడుచుండెను. ఆ పెద్ద, ప్రకాశవంతమైన, ఆకాశం వలె కనిపించు నీలిరంగు కన్నులు, దేవుడు చేసిన వాటి నుండి, కన్నీళ్ళు కింద కారుచుండగా; వస్తములపై రక్తంతో, మరియు హవ్వ అయిన ఆమె శరీరం చుట్టూ కొట్టుకొనుచుండెను. ఆదాము, అతని బలిష్ట శరీరంతో, ఆమెను పట్టుకొని మరియు ఆమె రొమ్మున ఆనుకొని ఉండగా, మరియు అక్కడ కన్నీళ్ళు, కన్నీళ్ళు, పడుచుండగా, గొఱ్ఱె చర్మాల మీదుగ అది పరుగిడుచూ, రక్తం కారుచున్నది. మొత్తం మార్గమంతయూ, రక్తమే. అక్కడే! ఇప్పుడు ఆయన అన్నారు, “నా సన్నిధిలో నుండి తొలగిపొండి.”
నేను ఆదాము మరియు హవ్వను ఒకరికొకరు చేతులతో పట్టుకొని వారి కాలికి వ్యతిరేకంగా గొఱ్ఱె చర్మాలు రక్తమయమై, వారి కాళ్ళకు కొట్టుకొనుచుండగా ఈ విధంగా బయటకు కదలుచూ, వెళ్ళుచున్నారు. (సహోదరుడు బ్రాన్హాం ఒకసారి ఆయన చేతులతో చప్పట్లు కొట్టారు-ఎడిటర్)
37
అప్పుడు దేవుడయి ఉన్న ఆ మొత్తం అగాధమును, నేను చూడగలను. దేవునికి రోజుల ప్రారంభం లేదు, సంవత్సరముల ముగింపు లేదు. ఆయన ఎన్నటికీ శాశ్వత కాలము ఉండును. నేను ఆ గొప్ప అగాధము ఈ విధంగా కలసి కదులుటకు ప్రారంభించుట నేను చూడగలుగుచున్నాను, ఆ విధముగ ఒక శంఖు ఆకారంలో కిందకు దిగివచ్చుచు, మరియు అది సరిగా క్రిందకు కదిలి, వారి కాలికి విరుద్ధంగా రక్తంతో కూడిన చర్మాలు కొట్టుకొనుచుండగా, ఆయన ఆ చిన్న దంపతులు ఏదెను తోట గుండా వెళ్ళుచుండగా ఆయన కంటితో చూడ ప్రారంభించగా, రక్తంతో ఉన్న చర్మాలు వారికి విరుద్దంగా కొట్టుకొనుచుండెను. ఆయన అది చూడలేక పోయాడు. మరియు అది క్రిందనుండి కదిలెను. ఓహ్, అది ప్రేమను ఉచ్చరించెను, అది దేవుని హృదయము యొక్క లోపల భాగమును కదిలించెను, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను...” కేవలం వారు వెళ్ళుచున్నప్పుడు ఆయన చూడలేకపోయెను.
ఆయన వారిని వెనుకకు పిలిచెను అనెను, “నేను నీ సంతానమునకు మరియు సర్ప సంతానమునకును వైరము కలుగ చేసెదను. అప్పుడు, అది సరిగ్గా కల్వరి యొద్ద, జరిగి ఉండెను. దేవుడు తనకు తానుగా ఒక స్త్రీ ద్వారా కిందకు దిగివచ్చి, ఒక కన్యక ద్వారా జన్మించెను.
38
ఏదెను తోటలో, అక్కడ కొంచెం వ్యవహరించుటకు ఎంతగానో నేను ఇష్టపడుచున్నాను. గమనించండి వారు అతిక్రమములు మూలముగ తోటలో నుండి తోలివేయబడెను. అతిక్రమములు కారణాన సమస్త ఆశీర్వాదాలు త్రెంచివేయబడెను.
మరియు సంఘంతో అదే సంగతి అని, ఈ రాత్రి, నేను తలంచుచున్నాను. అతిక్రమములు మూలముగ సమస్త ఆశీర్వాదాలు త్రెంచివేయబడినవి. నీవు అక్కడే ఉన్నావు.
39
ఏదెను తోట నుండి తోలివేయబడెను! ఇప్పుడు నేను మిమ్మును గమనించాలని కోరుచున్నాను. ఇటు రమ్ము...ఆదాము మరియు హవ్వ కుమారులు కయీను, మరియు హేబెలు, అర్భణ అర్పించుటకు ముందుకు వచ్చారు. ఆ తూర్పు ద్వారము దగ్గర ఆ గొప్ప కెరూబు ఉండెనని నేను నమ్ముచున్నాను, మరియు ఆ ఖడ్గము ఏదెనులో ప్రవేశించు ఆ ద్వారమును కాయుచు, ముందుకు మరియు వెనుకకు తిరుగుచుండెను. గమనించండి, అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని ఆ ద్వారమును కాయుచుండెను.
మరియు, ఈనాడు, ఆ ద్వారమును కాయునది అదే. నీవు పరిశుద్ధాత్మకు మరియు అగ్నికి భయపడిన యెడల, నీవు ఎన్నడూ లోనికి ప్రవేశించలేవు. అగ్నిమయమైన, దేవుని ఖడ్గము! దేవుడు దహించు అగ్నియై ఉన్నాడు, ఆ జీవ వృక్షమును కాయుచు, ఆ వృక్షమును గమనించుచుండెను.
40
మరియు ఇప్పుడు గమనించండి, అప్పుడు, ఇది ఒక అందమైన చిత్రమయి ఉన్నది. ఓ, మై! నేను ఆదామును చూడగలుగుచున్నాను లేక… కయీను మరియు హేబెలు, లేక ఒక అర్చణ అర్చించుటకు బయటకు వెళ్ళుచున్నారు. వారు ఎక్కడ ఆరాధించగలరో, ఆ సింహాసనము వద్ద, ద్వారము కుడి ప్రక్క, వారు వారి బలిపీఠము నిర్మించిరని నేను నమ్ముచున్నాను.
గమనించండి, ఇక్కడకు కయీను వచ్చెను. అతడు బహుశా సంవత్సరం అంతా పనిచేసెను, ఆ చాలా పెద్దవైన ఆపిల్స్ పొందుటకు శ్రమపడి, చేయగల ప్రతీదియు చేసెను లేక చాలా పెద్దవైన గుమ్మడికాయలు లేక అతనికి ఏమి ఉండెనో, దానిని ద్వారమునకు పైకి తెచ్చెను. దేవుని సన్నిధిలో, ద్వారానికి ప్రక్కగా సరిగా అక్కడ అతనికి బలిపీఠమును కట్టుకొనెను. అతని సమస్త పండ్లను, మరియు ఆ పెద్ద కల్లా లిల్లీలు మరియు ప్రతిదియు ఉంచెను. మరియు సరియైన విధంగా బలిపీఠము మీద వాటిని ఉంచెను, అప్పుడు మోకాళ్ళూని మరియు దేవుని ఆరాధించెను.
41
ఇప్పుడు నేను మిమ్మును కోరుచున్నాను... ఇది మీరు పొందేవరకు, ఇది ఇంతకుమునుపు ఎన్నడూ లేని విధముగ, కేవలం అడుగునకు ఇది నానవలెనని నేను కోరుచున్నాను, చూడండి. ఇప్పుడు గమనించండి.
దేవుడు నీవు సంఘానికి వెళ్ళవలెనని మాత్రమే కోరినయెడల, కయీను, హేబెలు ఎంత నీతిగా ఉండెనో కేవలం అంత నీతిగా ఉండెను. కయీను ప్రభువునకు బలిపీఠము నిర్మించెను. నీవు అందువు, “సరే, బ్రాన్హాం సోదరుడా, నేను అది చేయుట మాత్రమే కాదు, గాని నేను ఒక అర్పణ అర్చించుచున్నాను. నేను విదేశ మిషనులకు ద్రవ్యము చెల్లింతును, మరియు నేను...”ఆ సంగతులూ సరియైనవే. అయితే దేవుడు ఇంకా ఎక్కువగా కోరుచున్నాడు.
కయీను అది తనకు తానుగ అలా చేసెను. చూశారా? అతడు ఒక బలిని తెచ్చాడు. అతడు ప్రభువును ఆరాధించాడు. అతడు మోకాళ్ళూని మరియు ప్రభువుకు స్తుతులు అర్పించాడు. మరియు అనెను, “ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నాను, మరియు నేను నీకు అర్పణ తెచ్చాను. నేను బలిపీఠం నిర్మించాను.” ఆమెన్.
కనుక అనేక మాటలలో, “నేను ఒక సంఘంలో ఒక సభ్యుడనయి ఉన్నాను. అది అడుగునకు వెళ్ళినదా? చూడండి. ”నేను ఒక సంఘంలో ఒక సభ్యుడనయి ఉన్నాను. నేను నీయందు నమ్మిక ఉంచాను. అది ఇప్పుడు అడుగునకు వెళ్ళును. అది చాలా లోతుగ నాననివ్వండి. “నేను దేవునిలో ఒక విశ్వాసిని అయి ఉన్నాను. నేను బలిపీఠం నిర్మించాను. నేను ఒక బలిని తెచ్చాను. మరియు ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను. నేను నిన్ను ఆరాధించుచున్నాను.” మరియు దానికి దేవుడు తన వీపు తిప్పెను. మంచిది.
42
“ఈస్టరు ఉదయమున,” ఈ నగరము యొక్క ఒక కాపరి అనెను, “బోధకుడా, ఈస్టరు ఉదయాన నేను ఏమి చేయుదునో నీకు తెలియునా?”
నేను అన్నాను, “ఏమిటి?”
అన్నాడు, “నేను నా ప్రజలందరికి, నేను వారికి క్రిస్మసు శుభములు అని చెప్తాను.”
అన్నాను, “ఎందుచేత?”
అనెను, “నేను ఇక తరువాత ఈస్టరు వరకు వారిని నేను చూడలేను.”
ప్రతి వ్యక్తి ఈస్టరు నాడు వత్తురు, కొత్త టోపీలు కొనుట, మరియు కొత్త దుస్తులు కొనుట, అంతా అదే. మరియు అది అలా చేయుట క్రీస్తుకు సంబంధం ఏమిటి? ఓహ్! మరియు అక్కడ ఈ సంవత్సరం మిలియను డాలర్లు ఖర్చుచేయుదురు, రేపు, ప్రొటెస్టంటుల పరిధిలో, లిల్లీపుష్పాలు, గొప్ప అందమైన లిల్లీలు, ప్రతి సభ్యుడు చుట్టూ వచ్చి మరియు బలిపీఠముపై అది ఉంచుదురు. దేవుడు బలిపీఠంపై ఉంచిన లిల్లీని గూర్చి ఆయన లెక్కచేయడు. ఆయన బలిపీఠంపై నీవు ఉండవలెనని కోరును. అది లిల్లీకాదు అది నీ అర్పణకాదు. ఆ బలిపీఠంపై ఉండవలసిన వ్యక్తివి నీవే అయిఉన్నావు. అదే వ్యత్యాసము. దేవుడు బలిపీఠంపై ఉంచవలెనని కోరునది, నీవే అయిఉన్నావు.
43
ఇప్పుడు, అది ఏ విధముగా ఆ వేదన, కయీనులో ఉన్న సాతాను అని మీరు గమనించాలని నేను కోరుచున్నాను. మరియు అదే దానిని గమనించండి.....
ఆ విధముగ పిలిగ్రిమ్‌కు చెందిన మీలో కొందరు మరియు మార్గములో ప్రయాణించు యాత్రికులై ఉన్నారు. ఇప్పుడు ఇది మిమ్మును నిజమైన మంచి బావన పొందినట్లుగా చేయును. మరియు మనం ఇలా చెప్పవచ్చు, “సరే, నేను మనం మన సంఘంలో ఇది మరియు అది చేయవలెనని కోరెదను.” సంతృప్తి చెందినవాడనై ఉందును. హల్లెలూయ! నేను తరచుగా దేవుడు దానిలో లేని ఒక కేతడ్రల్ (దేవాలయము) కంటె, దేవుడు దానిలో ఉన్న మరియు ఎక్కడో వెనుక సందులో ఒక చిన్నపాత గదిలో ఆరాధించెదను. అది యధార్ధం. నిశ్చయముగ అక్కడే అతడు ఒక సరియైన వానిగ ఉండెను. గమనించండి. అప్పుడు అతడు అతని అర్పణ తెచ్చెను. కయీను తెచ్చెను మరియు దానిని అక్కడ ఉంచెను. ఇప్పుడు, గమనించండి, అతడు సాతాను వరుసలో నుండి వచ్చెను. ఎందుకనగా అతడు అది దేవుడు గ్రహించుననుకొనెను, ఎందుకనగా అది అందమైన ఫలమై ఉండెను, అతడు తనకు తానే, చేసిన ఏదో అయి ఉండెను.
44
మరియు అనేక మంది ప్రజలందురు, “సరే, నేను పలాని ప్రత్యేక క్రమములకు చెంది ఉన్నాను. మరియు నేను-నేను రెడ్‌క్రాస్‌కు ఇచ్చుచున్నాను. మరియు నేను దయతో, ప్రేమతో బీదవారికి సహాయం చేయుదును. నేను చర్చిలకు డొనేట్ (విరాళం ఇచ్చుట) చేయుదును. సహోదరుడా బ్రాన్హాం, దాని గూర్చి ఏమిటి?” అదంతా మంచిదే.
అయితే, “ఒకడు కొత్తగ జన్మించితేనేగాని, అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అది గమనించండి.
ఆ ప్రేమతో కూడిన సంగతులు చక్కనివే, అయితే, అవి బయటే ఉన్నవి...ఇంకనూ అది దేవుడు ఏర్పరచిన మార్గం కాదు. కయీను వాని సొంత మార్గంలో వచ్చెను. మరియు చాలా మంది, ఈ రాత్రి, వారి సొంత మార్గంలో వచ్చుచున్నారు.
45
నీవు దానిని తర్కించలేవు. ఎందుచేత అనగ తర్కాలు నిలబడవు, నీ తర్కములు సమర్ధమైనవి కావు. దానిని తర్కించుటకు నీవు యోగ్యుడవుకావు. నీవు దానిని తర్కించి ఉండిన యెడల, అది ఇక ఏ మాత్రము ఎక్కువ విశ్వాస సంబంధమైనది కాదు. నీవు దానిని విశ్వాసం ద్వారా అర్చించవలసి ఉన్నావు.
ఇప్పుడు, నీవు అందువు, “సహోదరుడా బ్రాన్హాం, నీ ఉద్దేశ్యం నేను అక్కడకు వెళ్ళి మరియు-మరియు పరిశుద్దాత్మచే నింపబడి మరి మిగిలిన వారితో సాగుటయేనా?” నీవు మిగిలిన వారితో వెళ్ళవలెననుకొనిన యెడల, నీవు అలా చేయవలెను. అంతా అదేనండి. నీవు చేయగలవు...
నయమాను అలాగే ఉన్నాడు. దేవుడు ప్రవక్తతో చెప్పెను, “దిగువకు వెళ్ళి మరియు ఏడు సార్లు మునుగుమని చెప్పుము.”
అతడు అన్నాడు, “ఈ నీళ్ళు శుభ్రంగాను మరియు చాలా మంచివిగా లేవా?” అయితే అది యొర్దాను నీరు అయి ఉండెను. కొన్నిసార్లు చాలా చెడ్డగ కనిపించును.
46
అయితే ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరూ కల్వరి వైపు చూడవలెను, మరియు పంతొమ్మిది సంవత్సరముల క్రితం దేవుడు ఆ వెల చెల్లించెను. మరియు నీ చేతిని పైకెత్తి, చెప్పు, “నేను తిరస్కరించబడిన ప్రభువు యొక్క కొద్ది మందితో ఉంటాను?”
నీవు అంటావు, “నేను సహోదరుడు తామ్‌తో ఉన్న వ్యక్తులతో నేను చేరతాను మరియు వారిలో కొందరు పరిశుద్ధ గుండ్రాయి అని పిలుస్తారు?”
సహోదరుడా, నేను ఇంచుమించుగా మూడుసార్లు ప్రపంచం చుట్టి వచ్చాను, మరియు నేను ఇంకా ఒక పరిశుద్ధ గుండ్రాయిని ఎన్నడూ చూడలేదు. లేదండి. నేను పరిశుద్ధతను చూశాను, కాని పరిశుద్ధ గుండ్రాయిలను చూడలేదు. దయ్యము ఆ పేరును సంఘమునకు తగిలించినది. దేవుడు చెప్పెను, “పరిశుద్ధత లేకుండ ఎవడును దేవుని చూడలేదు.” దానిని గూర్చి, అలా అనుసరించగలుగుచున్నావా? చూచుకొనుము. అది దేవుని పద్దతి.
47
నీవు అంటావు, “ప్రజలు అరచి మరియు కేకలు వేయుచున్నారు?” సహోదరుడా, అది ఏమంటే అదే. “ఎందుచేత,” నీవు అంటావు, “అది, నాకు పిచ్చితనముగ కనిపించును.”
ఆ కారణం చేతనే నీవు మరల జన్మించవలసి ఉన్నది. నీవు తిరిగి జన్మించినప్పుడు, అప్పుడు, అది “పిచ్చితనము” గ ఉండి ఉండదు. మీరు మాతో ఉండగలరు. ఒకప్పుడు మీరు చేసిన విధముగనే వారు అనుకున్నారు, వారంతట వారే దానిలోనికి వచ్చువరకు అలా తలంచారు. అది ఒక మార్పు. మార్పు చెందుట. మార్పు చెందుట అనగా ఏదైనను మార్పు చెందుట. మరియు ఒక మనిషి తనకు తానే చనిపోయినయెడల... మరియు ఇలా అనవలెను, “ప్రభువా, దానిగూర్చి నాకేమి తెలియదు. కేవలం నన్ను లోపలకు తీసికొనండి.” ఆమెన్. అప్పుడు దేవుడు దానిని చేయును. చూశారా?
48
ఇప్పుడు, కయీను అనెను, “నేను ఇదంతా కింద పెట్టాను. దేవుడు దానిని తిరస్కరించెను. అతడు దానిని అంతా అందముగా చేసెను.
నీవు ఇలా తలంచి ఉండవచ్చు, “సరే నేను సూర్యోదయ ఆరాధనకు వెళ్ళుచున్నాను. నేను ఒక టోపి పొందవలసి యున్నది. ఒక బాలిక నా కూటంలో పాడబోవుచున్నది. మరియు ఆమె అన్నది, ”బ్రాన్హాం సహోదరుడా.....“ జీవించుటకు ఆమె తల్లి తొట్లు కడిగెను. మరియు ఆమెకు వాటిలో ఒకటి ”కింకింగ్“ (తలవెంట్రుకలలో పెట్టుకొనేది.) ఆమె తల వెంట్రుకలలో ఉండవలెను. మీకు తెలియును.
మానిక్యుర్ అది ఏమై ఉన్నది? లేక దానిని మీరు ఏమని పిలుస్తారు. ఆమె జుట్టులో ఎన్నడూ ఉండే వస్తువు ఏమిటి? పొరపాటని నాకు తెలియును. నేను దాని పేరు ఎన్నడూ తలంచలేను. నేను దానిని గూర్చి ఎక్కువగ ఎరుగను, (“టోని”? ఎవరో అంటున్నారు.) “లేదు పర్మనెంటు దానిలోనిది అది ఏమై ఉండెనో అదే.”
ఆమె క్వయరులో పాడుటకు ముందు ఆమె జుట్టులో ఒకటి కలిగి ఉండును. ఆమె జీవించడానికి, బీదరాలైన వృద్ధురాలైన ఆమె తల్లి తొట్లు కడుగుచూ ఉంటుంది. ఆమె వెళ్ళి మరియు ఒక పర్మనెంటు (తల వెంట్రుకలలో పెట్టుకొనేది) తెచ్చుకున్నప్పుడు, ఆమె పాడుటకు నేను అనుమతి ఇచ్చుటలేదని నేను చెప్పాను, ఎందుకనగా ఆమె అది ఆ విధముగ చేసినప్పుడు ఆమె పాడుటకు యోగ్యురాలు కాదు. నిజమే!
49
ఏ విధంగ అయినను, బలిపీఠం శుభ్రంగా ఉంచుటకు దేవుడు మనకు సహాయం చేయును. ఈనాడు లోకంలో ఉన్న సంగతి అదే, వారిలో..?.. సహోదరుడా, ఇప్పుడు వినండి. నేను పాతకాలపు ఉజ్జీవపు అనుభవములో నమ్మకముంచుచున్నాను. వెనుక దూరాన పొదలలో, చెట్టు నుండి ఔషధం చేయుటకు, నేలను దున్ని మరియు అక్కడ ఆ ప్రదేశంలో చేదైన వేళ్ళు పెరికినప్పుడు, అది సరియైనది, అప్పుడు విత్తనము నాటవలెను.
ఇప్పుడు, ఇప్పుడు గమనించినచో, కయీను, అతడు తలంచాడు, “ఆ సౌందర్యము.”
వారు తలంచారు “సరే ఇప్పుడు మన సంఘము మేము ఒక కొత్త చర్చి కట్టగలము. అదంతా సరియే. అందంగా ఉన్న ప్రతిదియు సరియే నీవు దానితో ప్రభుయేసును తీసుకు వెళ్ళినట్లయిన యెడల అప్పుడు కేవలం మొదట ఆయనను పొందినయెడల దాని యొక్క మిగిలినదంతటికి ఆయన శ్రద్ధ వహించును.
50
ఎవరో అనెను, “సహోదరుడు బ్రాన్హాం ఈ అమ్మాయి బలిపీఠం దగ్గరకు రావచ్చునని ఈ విధంగ కనబడుచు రావచ్చునని నీవు నమ్ముదువా?
నేను అన్నాను, “సహోదరుడా వచ్చుచున్న అది వసంతకాలము ఇక్కడ బయట ఉన్న ఓక్ పొదలన్నియు వాటిలో ప్రతి ఒకటి వాటిమీద ఉన్న ఆకులు గతించిన ఆకురాలు కాలంలో సరిగా ఉన్నవి. అయితే మనం ఆకులు లాగనవసరం లేదు కేవలం నూతనజీవము కొత్త ఆకులు వచ్చునట్లుగా పైకివచ్చును. మరియు ఆ పాత ఆకులు రాలిపోవును. అది యధార్ధం. ఆమెన్.
వినండి నేను ఇది కూడా చెప్పవచ్చును. ఆ పాత ఆకురాలి పడని యెడల క్రొత్త జీవము వచ్చి ఉండలేదని అది తెలుపుచున్నది. నాతో కోపపడవద్దు. నేను యేసును గూర్చి మాట్లాడుచున్నాను. అంతా మంచిది. అది అంతే. అంతా మంచిది.
51
గమనించండి. మన పరలోకపు తండ్రి ఎంత వెల చెల్లించవలసి వచ్చినదో ఇప్పుడు ఆయన ఏమి చేశాడో చూడండి.
మరియు అక్కడకు కయీను వచ్చెను. మరియు అతడు బలి అర్చించాడు. అతడు ఆరాధించాడు. అతడు చర్చికి వెళ్ళాడు. కేవలం అతడు ఆ తరువాత వ్యక్తి ఎంత మంచిగా ఉన్నాడో అంత మంచిగా ఉన్నాడు.
ఏశావు అలాగే ఉన్నాడు. ఏశావు తన గుణశీలములో యాకోబు కంటె చాలా మంచిమనిషి, ఒక పెద్దమనిషి కంటె అధికమైనవాడు. అతడు తన తండ్రిని ప్రేమించెను. మరియు అతడు చేసిన వస్తువులను ప్రేమించెను. అయితే దేవుడు యాకోబును ఎన్నుకొనెను.
52
గమనించండి, ఇప్పుడు హేబేలు తన అర్పణ అర్చించుటకు వచ్చినప్పుడు, సరే, అది హేబెలు వచ్చినప్పుడు, అది పూర్తిగా వేరయి ఉండెను. ఇక్కడకు హేబేలు వచ్చాడు. అతడు పనిచేయలేదు, పట్టణంలో వెళ్ళుటకు చాలా పెద్ద సంఘమును కనుగొనుటకు ప్రయత్నించలేదు. అతడు చాలా చక్కని ప్రజా గుంపుతో కలసి ఉండటానికి కనుగొన ప్రయత్నించలేదు. ఆమెన్. అతడు కేవలం అతనికి కలిగి ఉన్నది ఏదో తీసుకొనెను మరియు ముందుకు వచ్చెను. అంతా అదే. అతడు ఒక గొఱ్ఱెల కాపరి. కనుక అతడు కేవలం వచ్చి మరియు ఒక గొఱ్ఱెపిల్ల పొంది, మరియు కట్టెను...ఆ దినాన ఏ జనపనార వారికి లేవని నేను అనుకొంటున్నాను, కనుక అతడు తప్పక ఒక ద్రాక్ష తీగె తీసుకొని మరియు ఆ గొఱ్ఱె మెడ చుట్టూ చుట్టెను.
అయితే అది ఏమి మాట్లాడుచున్నది? వారు ఆయనను కల్వరికి నడిపించెను. ఆయన గొఱ్ఱెపిల్ల అయిఉండెను. అనెను, “ఆయన ఎందుచేత బేరన్(పశువుశాల)లో పుట్టెను?” సరే, గొఱ్ఱె పిల్లలు ఇళ్ళలో పుట్టవు. అవి బేరన్లలో పుట్టును. మరియు అవి నడిపించబడెను.. అవి వధకు తేబడిన గొఱ్ఱెపిల్లవలె నడిపించబడినవి. మరియు వారు ఆయనను నడిపించారు, కల్వరికి ఆయనను నడిపించారు. జగత్తు పునాది వేయబడినప్పటి నుండి ఆయన దేవుని గొఱ్ఱెపిల్ల అయి ఉండెను, ఆమెన్. సహోదరుడా, నేను దానిగూర్చి ఆలోచించగా! అక్కడకు హేబెలు చిన్న గొఱ్ఱెపిల్ల వచ్చెను. అక్కడకు దేవుని గొఱ్ఱెపిల్ల వచ్చెను.
53
నేను దానిగూర్చి యోచించినప్పుడు, నా హృదయం కేవలం తిరిగి తిరిగి పోతున్నది. నేను ఆలోచించగా, నేను, ఒక బీదవాడను, అయోగ్యుడను, దేవుడులేని పాపిని, దేవుడు లేకుండ చనిపోవుచుండగా, క్రీస్తు లేకుండా, ఈ లోకంలో, ఏ ఆశయు లేకుండ చనిపోవుచుండగా,“ మరియు సరియైన సమయంలో క్రీస్తు నాకు బదులుగా, అందమైన ఆయన మరియు తృణీకరించబడెను. మరియు విసర్జింపబడెను, అలా ఆయన దృష్టిలో నేను అంగీకరించబడునట్లుగా, నాకు బదులుగా! ఓహ్! కేవలం నేను దానిని ఆ సంకట స్థితి నుండి బయటపడలేకపోయాను. నా కొరకు అది ఆయన ఎలా చేసి ఉండెనో నేను కేవలం ఊహించలేను. నేను ఎవరినై ఉంటిని? అప్పుడు, నీవు అంటావు, ”ఆయన అది నీ కొరకు చేసి ఉన్నాడా?“ అవును.
పరిశుద్ధాత్మ వచ్చెను. నన్ను ఒక రోజున వెదికెను, మరియు అనెను, “ఆయన అది నీ కొరకు చేసెను.” మరియు నేను ఆయనను నమ్మాను. నేను ఆయనను నమ్మాను. అవునండి. నేను ఆయనను అంగీకరించాను, మరియు అది అలా ఉండెనని నేను కనుగొన్నాను. “వారు వెర్రివారని” ప్రజలు ఏమి అనినా గాని ఏమియు కాదు. లేక వారు ఏమై ఉండెను అనినను, నేను దేవుని నమ్మాను. మరియు నేను...మరియు కేవలం ఆయన ఏమి చెప్పెనో అదే ఆయన చేసెను.
54
నేను చిన్న హేబెలును చూడగలను. ఇప్పుడు గమనించండి. మై! హేబెలు వెళ్ళి మరియు ఈ చిన్న ద్రాక్షతీగెను పట్టుకొనుట నేను చూడగలను, బయటకు వెళ్ళి మరియు ఒక మగ గొఱ్ఱెపిల్లను తీసుకొని, తల్లికి మొదటగా పుట్టినది, తన మెడచుట్టూ ఈ ద్రాక్ష తీగె చుట్టబడెను. ఇక్కడకు అది వచ్చుచున్నది, దానిని ఈడ్చుచున్నారు. దానికి బహు సౌందర్యం లేదు, అక్కడ ఉన్నదా? అక్కడ పైకి దానిని ఈడ్చుచున్నారు. అప్పుడు అతడు దానిని ఒక పెద్ద బండపై అక్కడ ద్వారమునకు తూర్పున ఉంచెను. ఇప్పుడు గమనించండి.
కయీను బహుశా సంవత్సరం అంతా శ్రమపడి, అతడు పండించ గలిగినంత మంచి పంట పండించి, దాని ద్వారా దేవుని సంతోషపరచగలనని అనుకొనెను.
55
మరి చాలామంది ప్రజలు అంటారు, “నేను అబద్దం ఆడుట మానుచున్నాను. నేను దొంగతనం చేయుట మానేశాను. నేను పొగత్రాగుట మానేశాను. నేను ఒక మంచి తరగతి ప్రజలవైపు తిరిగాను. నేను ఏదో సొసైటీలో చేరగలను.”
అది ఇక్కడే ఉన్నది! దేవుడు నీవు ఒక కొత్త పేజీ తిరగేయడం గూర్చి లెక్కచేయడు. ఆయన నీవు క్రీస్తువైపునకు నీ హృదయం తిప్పి మరియు నీవు కాకుండ ఆయనను చేయనిచ్చుటయే. నీవు ఏమి చేయగలవని కాదు. “మనము మంచికార్యములు చేయుట వలన రక్షించబడలేదు, కాని ఆయన కనికరము ద్వారా కొనబడితిమి.” క్రియలు ద్వారా కాదు, అలా కానియెడల, ఏ మనిషి అయినను ప్రగల్బములు పలుకువాడే. ఎందుకనగా మనము... ఎందుకనగా మనము దేవుని వారము ఎందుకనగా... నేను ఏమై ఉన్నాననునది కాదు, అది నాయంతట నేను ఏమి చేయుచున్నాను అనేది కాదు. దేవునియందు, క్రీస్తు నా కొరకు మరియు నీ కొరకు ఏమి చేశాడు అనునదియే.
56
గమనించండి, అందమైన మాదిరి. అతడు ఇక్కడకు అతడు వాని వెంట లాగుచూ, ఆ చిన్న గొర్రెపిల్లను ఈడ్చుకుంటూ వచ్చెను. ఆ చిన్న జీవి పడిపోవుచూ, బహుశా తన చిన్నపాదము ఈడ్చుకొనుచూ త్వరలో ఏమి జరుగునో ఎరిగెను. క్రీస్తుకు పరిపూర్ణ మాదిరి సిలువను ఈడ్చుచు, దేవుని గొఱ్ఱెపిల్ల యెరూషలేము గుండా, బలహీనతతో, పడిపోవు చుండెను.
ఇక్కడకు వెంటబడి వచ్చుచున్న ఆ చిన్న జీవి, వణకుచున్న శబ్దం చేయుచు అరచుచుండెను. ఆ పెద్ద బండపైకి అతడు పైకి తెచ్చి బండ మీద దానిని పెట్టి, ఒక వాడియైన రాతిముక్కను తీసికొని...నాకు తెలియదు, ఆ రోజులలో కత్తులు వారికి లేవని ఊహించుచున్నాను. అలా దానిని ఉంచారు. దాని తల వెనుక భాగం పట్టుకొని మరియు దానిని ఈ విధముగ లాగెను, తీసుకొనెను ఒక ...లేక రాయి, మరియు దాని చిన్న గొంతుకను నరుక ప్రారంభించెను, మరియు ఆ రాయి దాని గొంతుకపై కొట్ట నారంబించెను. ఆ బండపై గొఱ్ఱెపిల్ల చనిపోయి రక్తం కార్చుచు, మరకలుగా మారుచున్నవి దాని యొక్క చిన్న శుద్ధ రక్త నాళములు తెగి, రక్తం చుక్కలుగ చిందుచూ, మొత్తం అంతా రక్త్రమయమై చనిపోయెను. దాని చిన్న తెల్లని ఉన్ని అప్పుడు రక్తంతో ఎఱ్ఱగా మారెను. దేవుడు పరలోకము నుండి చూచెను, మరియు అనెను, “అది అదే. ఇప్పుడు నీవు అధి పొందావు. అదే పద్ధతి.” ఆ రక్తం దాని చిన్న నరముల నుండి చిమ్ముచుండెను.
57
అది ఏమై ఉండెను? దేవుని కుమారుడు పంతొమ్మిది వందల (1900) సంవత్సరముల క్రితము, ఈ మధ్యాహ్న సమయంలో, ఆయన చెఱసాల నుండి నడిపించబడెను. ఆయన తీర్పుపీఠము దగ్గరకు కొనిపోబడెను. మరియు అక్కడ నుండి, శిక్ష విధించుటకు కారణమైన తీర్పు హాలు దగ్గరకు అక్కడ నుండి గొల్గొతాపైకి, ఆ కొండపైకి లాగబడెను. కురేనీయుడైన, సీమోను, ఆ సిలువను మోయుటకు ఆయనకు సహాయం చేయుచుండెను. మరియు అక్కడ, ఆయనను కొట్టినప్పుడు వచ్చిన ఆయన రక్తముతో, యుగముల బండపై, చనిపోయెను. ఆయన ' శరీరము చీల్చివేయబడెను. హల్లెలూయ! నోటి నుండి బంక జారుచుండగా గొప్పగా అపహాస్యం చేయుచున్న ఆ వృద్ధ సైనికులు ఆయన ముఖంపై ఉమ్మివేసిరి. మరియు ఆయన అనెను, “నా రాజ్యము ఈ లోక సంబంధమైనదయితే, నేను నా తండ్రిని అడుగుదును, ఆయన నా కొరకు పోరాడుటకు దూతలు సైన్యము నిచ్చును. అయితే ఇది నా రాజ్యము కాదు.”
అయితే “నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తమే నెరవేరును గాక” మరియు అది త్వరలో ఇక్కడే ఉండును. “నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము నెరవేరును గాక.” ఓ మై!
58
ఒక సమయములో, బిల్లీ సండే ఇలా చెప్పాడు, ఎట్లనగా, ప్రతిచెట్టు మీద ఒక దూత ఉన్నది.“ ఆయన చెప్పాడు, కేవలం ఆయన బంధములో నుండి నీ చేయిని లాగి విడిపించును. మరియు నీ వేలిని గురి పెట్టి చూపుము, నీవు చేయవలసిన దంతయూ అదే. ఇక్కడే మనం ఆ ప్రశ్నను పరిష్కరించి స్థిరపరచుకొనగలము. ఆహా, అది సత్యము కాదా!
కయప చూచెను మరియు అనెను, “ఆయన ఇతరులను రక్షించెను; తనను తాను రక్షించుకొనలేదు.” అది ఆయనకు ఆపాదించబడిన అతి గొప్ప పిర్యాదు అయిఉండెను. ఆయన తనను తాను రక్షించుకొనినయెడల, ఆయన ఇతరులను రక్షించి ఉండలేడు. కనుక అలా ఇతరులను రక్షించగలుగునట్లు, ఆయన తన ప్రాణమును ఇచ్చెను. హల్లెలూయ! ఆమెన్.
“మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి; దేవుడు మన అందరి దోషమును ఆయన మీద మోపెను. ఆయన వధకు తేబడిన గొఱ్ఱెవలె నడిపించబడెను, మరియు బొచ్చుకత్తిరించు వారిఎదుట, ఆయన నోరు తెరువక, మౌనముగా ఉండి, ఒక గొఱ్ఱె వలె నడిపించబడెను. అయినను మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడెను, మన దోషములు నిమిత్తము నలుగ గొట్టబడెను, మన సమాధానార్ధమైన శిక్ష ఆయన మీదపడెను. మరియు ఆయన పొందిన దెబ్బలవలన మనకు స్వస్థత కలిగి ఉన్నది.” నీవు ఎలా ఆ కొలతలేని ప్రేమను తిరస్కరించి ఉందువు? ఆయన ఆ కొండపై భాగమునకు వీపుపై బరువుతో, తడబడి నడచివెళ్ళు చుండగా, ఆయనను చూచినప్పుడు; ఆ చిన్న అల్పమైన, నీరసించిన, బలహీనమైన ఆ శరీరం ఆ బరువు క్రింద వంగిపోవుచుండెను.
59
ఆ రోజున అక్కడ కూర్చున్న ఆ కవిని గూర్చి నేను ఆలోచించినప్పుడు, అతడు దాని యొక్క అంతః దృష్టిని పట్టుకొని మరియు అతడు ఇలా వ్రాశాడు.
కరగిపోవుచున్న బండలు, కారు చీకట్లు కమ్ము ఆకాశములు
నా రక్షకుడు తన తలవంచి,.. చనిపోయెను;
తెరవబడిన తెర మార్గమును బయలు పరచెను.
పరలోక ఆనందము మరియు తరగని దినము.
ఎలాంటి రక్షకుడు! ఓ మై! మనం ఎన్నడైనా, ఎలా నేను, అలాటి కొలతలేని ప్రేమను ఇచ్చిన ఒకరు అది నా కొరకు మరియు మీ కొరకు చేసి ఉండిన ఎలా తిరస్కరించగలము?
60
ఈ రాత్రి, నా సహోదరుడా, సహోదరీ, అలా నీవు రాగలవని నేను నమ్ముచున్నాను. దేవా, అది దేవుడు ఏర్పరచిన మార్గము అయిఉన్నది. మీ కొరకు అది మార్గము అయిఉన్నది. మీతో ఎవరైనను ఏదైననూ చేయుటకు అది మాత్రమే అయిఉండెను. నీ స్థానమును తీసికొనినది ఆయన ఒక్కరే. ఈ రాత్రి ఒక పునరుత్ధానపు విమోచకునిగా నిలచినది ఆయన ఒకరే, ఈ రాత్రి, తండ్రి కుడిపార్వమున నిలబడి ఉన్నాడు; మిమ్మును చూచి ఈ భవనంలో ఉన్న ప్రతి పాపియు, ఆయన దగ్గరకు రావలెననియు, వారి కొరకు ప్రాధేయపడుచు మరియు విజ్ఞాపన చేయుచున్నాడు. నేను ఆయన మిమ్మును గూర్చి వాదించి మరియు అడుగుచుండుట చూచుచున్నాను. మీరాలాగు చేయుదురని నేను నమ్ముచున్నాను. ఈ ఈస్టరు పోనియ్యకుండ మనం ఉండవలెనని నేను నమ్ముచున్నాను.
ప్రియ స్నేహితులారా, మనం రహదారి చివరన ఉన్నాము. నా పూర్ణ హృదయంతో, మనం అలా ఉన్నామని నేను నమ్ముచున్నాను. మనము రహదారి చివరకు వచ్చాము. ప్రభువైన యేసు మిమ్మును దీవించును గాక. ఈ రాత్రి ఆయన మిమ్మును ఆయన యందు ఒక నూతన సృష్టిగా చేయును గాక అనునదే నా ప్రార్ధన అయిఉన్నది. ఆయన మిమ్మును నడిపించును గాక. ఒక సమయములో...
61
అక్కడ బైబిలులో గుడ్డివాడైన ఒక వృద్ధ మనిషి ఉండెను. అతని పేరు బర్తిమయి. వృద్ధ గుడ్డి బర్తిమయికి, అతనికి రెండు చిన్న పావురాలు ఉండెనని, అది మనకు చరిత్ర ద్వారా చెప్పెబడెను. అలా ఈ చిన్న పావురాలు అక్కడ బయట కూర్చుని మరియు ఒక దాని మీద ఒకటి పడి మొగ్గలు వేయుచుండెను, మరియు ఆ ప్రజలు-వారు ఆకర్షించ బడుదురు, అతడు అతని పాత్రను ఎత్తిపట్టుకొనగా, మరియు అప్పుడు ప్రజలు వచ్చినప్పుడు, వారు ఈ చిన్న పావురాలు చిన్న విన్యాసాలు చేయగా, మరియు ఆ వృద్ధుడైన గుడ్డి బిక్షకునికి వారు నాణెములు వేయుదురు. అతడు పెళ్ళయిన ఒక వివాహితుడు మరియు ఒక చిన్న బాలిక ఉన్నది. అతడు ఎన్నడూ తన జీవితంలో ఆ చిన్నబాలికను చూడలేదు. ఆమెకు పన్నెండు సంవత్సరములు, పద్నాలుగు సంవత్సరములు వయస్సులో, ఆ దశలోనే ఆ విధముగా ఇప్పుడు మనము ఆయన జీవితములోనికి ప్రవేశించుచున్నాము. మరియు అతడు కూర్చుండగా...
ఒక రాత్రి, అతని చిన్న బాలిక జబ్బు పడినదని చెప్పాడు. మరియు అతడు ప్రభువు దగ్గరకు వెళ్ళాడు. మరియు అతడు అనెను, “ప్రభువా, మీరు కేవలం నా చిన్న బాలికను స్వస్థపరచిన యెడల, రేపు, నేను మీకు రెండు పావురాలు బలిగా అర్పించెదను.” కనుక వారు, “ప్రభువు తన చిన్న బాలికను స్వస్థపరచెను, మరియు అతడు ఆ రెండు పావురాలను బలిగా ఇచ్చెను. కొంచెముకాలము తరువాత, అతని యొక్క...
62
మరియు మొదటి సంగతి నీకు తెలియునా, అతని ప్రియ భార్య జబ్బు పడెను, మరియు ఆమె అనుకొన్నది ఆమె ఉందని... ఆమె చనిపోవుచున్నదని వారు తలంచారు. కనుక అతడు రాత్రి సమయంలో, ప్రభువు దగ్గరకు వెళ్ళి, అతని ఇంటి గోడ ప్రక్కగా వెళ్ళవలెనను భావము కలిగి ఉండెను. పొలములో కింద మోకాళ్ళూనెను, మరియు అనెను, “దేవా, దేవుడా, మీరు నా భార్య జీవితము కాపాడినయెడల, రేపు నేను మీ కొరకు నా గొఱ్ఱె పిల్లను అర్చించగలను.”
ఇప్పుడు, ఈనాడు ఒక కుక్కచే గ్రుడ్డి మనుష్యులు నడిపింపబడుట మీరు చూసియున్నారు. వారిని నడిపించుటకు ఆ కుక్కలకు వారు శిక్షణ ఇచ్చారు. వారి యొక్క రోజులలో, ప్రజలను నడిపించుటకు వారు గొఱ్ఱెలకు శిక్షణ ఇచ్చారు. మరియు, కాబట్టి అతనికి ఒక్కటి యున్నది... ఒక... ఆ విధముగా అతనిని ఆ చుట్టూ గొఱ్ఱెపిల్ల నడిపించెను.
మరియు అతడు అనెను, “ప్రభువా, నీవు నా భార్యను మాత్రము స్వస్థపరచినయెడల, సరే, అప్పుడు, రేపు నేను మీకు నా గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించగలను.” మరియు అతని భార్య బాగుపడెను.
63
మరియు ఆ మరుసటి రోజు తరువాత అతడు దేవాలయము పైకి వెళ్ళుచుండెను, మరియు ప్రధాన యాజకుడైన కయప, బయట నిలబడి, అనెను, “గ్రుడ్డి బర్తిమయ, నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు?”
అతడు అనెను, “ఓ ప్రధాన యాజకుడా, నా గొఱ్ఱెపిల్లను బలిగా అర్చించుటకు, నేను దేవాలయము పైకి ఎక్కి వెళ్ళుచున్నాను. ఆయన నా భార్యను స్వస్థపరచి యుండినయెడల, నేను నా గొఱ్ఱెపిల్లను ఇచ్చెదనని, నేను ఆ ప్రభువునకు వాగ్ధానము చేశాను.
అతడు అనెను, “బర్తిమయీ, ఆ గొఱ్ఱెపిల్లను నీవు ఇయ్యవద్దు, ఎందుకనగా ఆ విధముగా ఆ గొఱ్ఱె పిల్లయే నీకు కళ్ళుగా యున్నది.” అనెను, “నేను నీకు కొంత డబ్బు ఇచ్చెదను, మరియు నీవు దేవాలయములో అమ్మువారి ద్వారా నీవు నీకై ఒక గొఱ్ఱెపిల్లను కొనుము.”
అయితే బర్తిమయి అనెను, “ఓ ప్రధాన యాజకుడా, నేను ఎన్నడును ఒక గొఱ్ఱెపిల్లను దేవునికి వాగ్ధానము చేయలేదు; నేను ఆయనకు ఈ గొఱ్ఱెపిల్లనే వాగ్ధానము చేసెను.” ఓ, మై!
64
మీరు ఆ విధముగా వాగ్ధానములు చేసియున్నారా? అని నేను ఆశ్చర్యపడుచున్నాను. మరియు ఈ రాత్రి అన్నిటికి చాలిన ఆ గొఱ్ఱెపిల్లను నీవు చూచినయెడల, ఆలోచించు, “ప్రభువా,” మీరు నన్ను బాగుచేసినయెడల, నేను మీకు సేవచేయగలనని నేను మీకు వాగ్ధానము చేయగలను. నేను చేయగల ప్రతీ దానిని చేయగలను. మీరు నా బిడ్డను బ్రతుకునట్లు చేసినయెడల...“ లేక నీవు నిలబడి ఉండగా, నీవు ప్రేమించిన ఒకరు లేక మీ తండ్రి లేక నీ తల్లి ఆ సమాధిలో పెట్టుచుండగా, ఓ దేవా, నేను వారిని కలసికొందును, నేను మరల వారిని కలసికొందును!” అని నీవు నిజముగా ఆ విధమైన ఉద్దేశ్యం కలిగి ఉండిన యెడల నేను ఆశ్చర్యపోవుచున్నాను. ఆ విధముగా నీవు ఏమి వాగ్ధానం చేశావో దానిని నెరవేర్చకుండా ఈ ఈస్టరు వచ్చి మరియు పోయిన ఎడల నేను ఆశ్చర్య పోవుచున్నాను.
65
అతను పైకి వెళ్ళెను, మరియు అతని గొఱ్ఱెపిల్లను అర్పణగా ఇచ్చెను. ఎవరో ఒకరు చుట్టూ నడిపించుచుండగా, తిరిగి వెనుకకు వచ్చెను.
కనుక అతడు అప్పుడు అన్నాడు, అతడు వెనుకకు వచ్చినప్పుడు, అనెను, “బర్తిమయి, నీవు అలా చేయకూడదు.” ఆ యాజకుడు ఆ విధముగా అతని గొఱ్ఱెపిల్లను తీసికొనుటకు వెళ్ళినప్పుడు “నీవు ఇది తీసికొనలేవు, నీవు ఈ గొఱ్ఱెపిల్లను సమర్పించకూడదు.” అతడు అనెను, “గుడ్డి బర్తిమయీ, ఆ గొఱ్ఱెపిల్లయే నీకు కళ్ళుగా అయిఉన్నదని నీకు తెలియునా?”
అతడు అనెను, “అవును, అది నేను ఎరుగుదును, అయితే నేను దేవునికి వాగ్ధానం చేశాను, మరియు గ్రుడ్డివాడైన బర్తిమయ కన్నుల కొరకు దేవుడే ఒక గొఱ్ఱెపిల్లను ఏర్పాటు చేయగలడు.
66
కొద్దికాలమైన తరువాత అతడు, ఒక రోజున, చలిలో వణకుచుండెను; వారు ఒక శబ్ధమును విన్నారు. దేవుడు గ్రుడ్డి బర్తిమయ కన్నుల కొరకు ఒక గొఱ్ఱెపిల్లను ఏర్పాటుచేసెను. ఆయన ఆ వీధి వెంబడి వెళ్ళెను. అతడు అనెను,, “ఈ శబ్ధమంతా ఏమై ఉన్నది?” ఆయన ఎక్కడ ఉండునో సాధారణముగా అక్కడ శబ్దము ఉండును. అనెను, “ఈ శబ్దమంతా ఏమైయున్నది?” అతడు అన్నాడు,
“నజరేయుడైన యేసు, అను ఒకరు, ఈ మార్గంలో వెళ్ళుచుండెను.”
అది ఎక్కడ పడిపోవుచున్నదో చూడకుండా, అతడు వాని వస్త్రమును (కోటును) క్రిందకు విసరెను. అతడు అప్పుడు లెక్కచేయలేదు. దేవుడే ఒక గొర్రెపిల్లను ఏర్పాటుచేసి యుండెను, అతడు సరిగా గొఱ్ఱెపిల్ల దగ్గరకు వెళ్ళెను,“ అతడు అనెను, ”ఓ యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము! నన్ను కరుణించుము!“
“ఆ గొప్ప ప్రజలు మరియు ఆ చుట్టూ నిలబడియున్న వారు, రాజు దగ్గరకు, ప్రవక్త దగ్గరగా వెళ్లెను, అతడు అనెను, ఓ... ఊరుకో. ఆయన నీ మాట వినలేడు.” అతడు అలా మరింత ఎక్కువగా కేకలు వేసెను.
వారిలో కొందరు అన్నారు, “అద్భుతకార్యాలు జరుగు రోజులు గతించాయి. ఆ రోజున అక్కడ జరిగిన ఆలాంటి సంగతి ఏదియునూ అక్కడ లేదు.”
అతడు ఇంకా గట్టిగా కేకలు వేసెను, “దావీదు కుమారుడా, నీవు నన్ను కరుణించుము! నీవు నన్ను కరుణించుము!” దేవుడే గొఱ్ఱెపిల్లను ఏర్పాటు చేసెను.
67
అదే గొఱ్ఱెపిల్ల గ్రుడ్డి బర్తిమయి కన్నుల కొరకు ఏర్పాటు చేసి యుండెను. ఆయన నీ కొరకునూ ఏర్పాటు చేసియుండెను. పంతొమ్మిది వందలు (1900) మరియు కొన్ని సంవత్సరాల క్రితము ఈనాడు, చాలా దూరాన ఉన్న గొల్గొతా కొండ పైకి ఎక్కెను, మరియు నలుగగొట్టబడి మరియు ముక్కలు ముక్కలుగా చేయబడి తనకు తానే అర్పణగా ఆయెను.
వినండి, స్నేహితుడా, జ్ఞాపకముంచుకొనండి, హెబేలు బయట అతని మందలోనికి వెళ్లెను మరియు గొఱ్ఱెపిల్లను పట్టుకుని, మరియు బలి అర్పించు స్థలములో దానిని చంపెను. మరియు... (టేపుపై ఖాళీఉన్నది-ఎడిటర్) ఇప్పుడది పట్టుకొనుట మంచిది. అతని యొక్క గొఱ్ఱెపిల్ల చనిపోయిన అదే.
ఈ రాత్రి, నీకు నీవే చనిపోవుటకు, నీవు ఇష్టపడుచున్నావా? నీకు నీవే తలంచే ఆలోచనలు అన్నిటి నుండి చనిపోవుటకు ఇష్టపడుచున్నావా? కేవలము అక్కడ నీ గొఱ్ఱెపిల్లతో ఆ బండపై పడి ఉండి మరియు చనిపోవలెను. ఇలా చెప్పు, “ఓ దేవా, కరుణించుము.” గర్వమును గూర్చి ఆలోచించుచున్న స్త్రీ పురుషులను గూర్చి నేను ఆలోచించునప్పుడు, యవ్వన స్త్రీలు, పురుషులు ఆ సంగతులను జయించుటకు ఎవరు తమ జీవితమును ఇత్తురు, ఈ కాలపు మనిషి తమ యొక్క ఉద్యోగములను గూర్చి మరియు పేరు ప్రఖ్యాతలను గూర్చి ఆలోచించుకొనుచూ కూడా మరియు వారి పొరుగునున్న సహోదరత్వము, లేక ఆ విధమైన మరొకటి!
ఓ ఈ రాత్రి, సుదూరాన ఉన్న కల్వరి యొద్దకు ఎందుకు ప్రాకి వెళ్లవు? హల్లెలూయ! నీ సొంత జీవితం దెబ్బలు కొట్టుటచేత తూట్లు పడినట్లుగా అనుమతించుము, మరియు ఆయనలో సుదూరాన ఉన్న సిలువ మీద చనిపొమ్ము. యుగములు బండ చుట్టూ నీ చేతులు చాపి, కొంచెం దూరంగా ఉన్న నన్ను, మీతో నన్ను బద్రపరచండి. ఆ జలములు ప్రవహించుచుండగా, సమీపములో, తుఫాను చాలా ఎక్కువగా ఉండగా, నన్ను నీలో దాచండి, ఓహ్ నా రక్షకుడా, నన్ను బద్రపరచండి. వారు ఏమి చేయ గోరినను లోకమును చేయనివ్వండి. వారు ఏమి చేయగోరినను వేదాంతులను చేయనివ్వండి; వారి వేదాంతమును నేను చేయగోరను. నేను చేయగోరినది ఏమనగా యేసుక్రీస్తును నా హృదయములో ఉంచుకొనుటయే. నా గొఱ్ఱెపిల్లతో నన్ను చనిపోనివ్వండి.“
68
ఓ అక్కడ బయటనున్న రంగు జాతి మిషనులోనికి నేను నడచి వెళ్లినప్పుడు ఆ రాత్రి అది ఎంత కష్టమయినదో నేను ఎరుగుదును. మరియు అక్కడ తెలుపురంగు గల ప్రజలు అందరూ అక్కడ చుట్టూ నిలబడి యుండగా అక్కడ అతడు ఒక రంగుజాతి మిషనులోనికి వెళ్ళుచుండెను. అది కఠినమైనది అయ్యిఉండెను. నాలో ఉన్నటివంటి మొత్తము కెంటకీ గర్వముతో అక్కడకు నేను నడచివెళ్లితిని. అలా ఆ విధముగా కానీ, అయితే దేవుడు చెప్పెను, “నీవు దానిని కోరినయెడల సరిగా అక్కడకు నడచి వెళ్లుము.” మరియు నేను అక్కడకు సరిగా నడచి వెళ్లితిని. మరియు వేదిక దగ్గరగా మోకాళ్ళు వేసితిని. అక్కడ నేను ఆ గొఱ్ఱెపిల్ల ఈలాగు జరుగు వరకూ నిలిచి యుంటిని... ఇరవై సంవత్సరాల క్రితము బిల్ బ్రాన్హాం యొక్క ఆ పాత స్వచిత్తమునకు చనిపోతిని. హల్లెలూయ!
నేను క్రీస్తుతో సిలువ వేయబడియున్నాను. అయినను నేను జీవించుచున్నాను. నేను కాదు, అయితే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఏదో ఒక రోజున ఆయన మహిమకరమైన పునరుత్ధానములో ఆయన వచ్చినప్పుడు, నా శరీరము బహుశా ఆ దూరాన మట్టి క్రింద విశ్రమించి యుండవచ్చును. అయితే అది అలా జరిగినప్పుడు, ఆ గడ్డి మొలిచి వెనుకకు పెరిగినప్పుడు నీవు చూడగలవు ఆయన మహిమ కరమైన రూపములో అనేకమైన వారందరిలో నుండి, నేను రాగలను. హల్లెలూయ! ఏలయనగా ఆయన పునరుత్థాన శక్తిలో నేను ఆయనను ఎరుగుదును.
ఈ రాత్రి మీలో ప్రతీ ఒక్కరూ, దూరాన ఉన్న గొల్గోతా కొండపైకి సరిగా ప్రాకి వెళ్ళుదురని, నేను నమ్ముచున్నాను. ఈ రాత్రి ఇప్పుడు ఒక చిన్న యాత్ర చేయుదము.
సహోదరీ, నీకిష్టమైనయెడల, నీవు మాకు శ్రుతిని ఇచ్చుచుండగా, నా దేవా, సమీపముగ, నీకు సమీపముగ అను పాట పాడెదము. మనం అలా చేయునప్పుడు...
నీవు చెప్పుదువు, “అది ఒక సమాధి అయిఉన్నది.” మంచిది, సహోదరుడా, అక్కడ ఎన్నడైనా మనకు ఒక సమాధి అవసరమైన సమయము ఉండిన యెడల, అది సరిగా ఇప్పుడే అయిఉన్నది, మనుష్యులు వారి స్వార్ధమునకు, గర్వమునకు చనిపోయినప్పుడు అయిఉన్నది.
ఇప్పుడు నెమ్మదిగా ఉండగా, మనము తలలు వంచుదము, అమె ఒక చిన్న ఆలాపన ఇచ్చుచుండగా, అది అంతా సరియైనదిగా ఉండును.
69
ఓ దేవా,...ఓహ్, ఆ దూరాన ఏమి సంభవించినదో నేను అలోచించినప్పుడు హు! ఆలోచించుటకు, నా యెముకలు కూడా వణకుచున్నవి! ఆ గొఱ్ఱెపిల్లను చూచుచూ నేను ఆలోచించుచుండగా, ఆయనను వారు తూట్లు పడునట్లు దెబ్బలు కొట్టియుండగా, అవును, ఆయన తలపై ముండ్లు ఉంచినప్పుడు, మరియు అది క్రిందకు లాగెను. సైనికులు, ముఖము మీద ఉమ్మివేసిరి, మరియు అనెను, “నీవు రాజువైతే, ఇప్పుడు దానిని గురించి ఏదైననూ చేయుము.” ఆయన ప్రవక్తలందరుకూ ప్రవక్తయై ఉన్నాడు. వారు ఆయన ముఖము చుట్టూ గుడ్డ పీలిక ఉంచారు, ఒక రెల్లుతో ఆయన శిరస్సుపై కొట్టారు. అనెను, “ఇప్పుడు ప్రవచించుము, ఇప్పుడు నిన్ను ఎవరు కొట్టిరో మాతో చెప్పుము.”
అయితే ఆ ప్రవక్త చెప్పెను,...“ఆయన తన నోరును తెరువలేదు” ఆయన చెప్పినట్లే అది చేసెను..
ఆయన చేతులు, వెనుకకు కట్టబడెను. నిలబడి యుండెను. ఆయన ప్రశస్తమైన యెముకలు ఆయన వెనుక నుండి చూపించబడునంతగా ఆయనను కొరడాతో కొట్టెను; ఆయన ప్రక్క నుండి రక్తము పడుచుండగా, ఆ యొక్క నేల మీద, గుడ గుడ మంటూ పడుచుండెను. ఇప్పుడు ఆయన నడచి వచ్చుచున్నట్లుగా నేను వినగలుగుచున్నాను; ఆయన యొక్క చెప్పుల నుండి రక్తము కారుచున్నట్లు వినుచున్నాను. ఆయనే ఇమ్మానుయేలుయై ఉండెను. దేవుని యొక్క రక్తమై, అది దేవుడై యుండెను.
70
మరియు ఆయన వెనుక ఆ సిలువను పెట్టి తీసుకొనిపోవుట నేను చూచుచున్నాను. ఆ పురాతన ముల్లు ముల్లుగా ఉన్న కరుకైన సిలువ మరియు ఆక్కడ ఆయన వెళ్ళుచూ, ఆ వీధి గుండా ఆయన వెళ్ళుచుండగా ఆ సిలువను అక్కడ ఉంచెను. పెద్దగా అరుపులు అరుచుచున్న గుంపు నవ్వుచూ ఆయనను అపహసించుచూ ఉండెను. అక్కడకు ఆ ప్రవక్త వెళ్లుచుండెను. ఆ గొప్ప యేసు అక్కడకు వెళ్లుచుండెను. ఆ దైవిక స్వస్థతగలవాడై అక్కడకు వెళ్ళుచుండెను. అయితే ఆయనే నా యొక్క ప్రభువు! ఓ దేవా, నేను... ఆయనతో పాటు నన్ను ఎక్కనివ్వండి.
అక్కడ ఆయన ఆ కొండపైకి వెళ్ళెను. నేను, అపహాస్యం చేయుచు, ఆ చుట్టూ పరుగిడుచున్న సగం వస్త్రాలతో ఉన్న యవ్వన స్త్రీలను చూస్తున్నాను. వారు ఆ కొండపైకి వెళ్ళుచుండగా, వారి స్నేహితులైన అబ్బాయిలు ఒకరినొరరు హత్తుకొనుచున్నారు. వార్డ్ సహోదరుడా, అది ఇప్పటికీ మారక చాలా ఎక్కువగా ఉన్నది.
నేను ఆ గొప్ప సంఘ సభ్యులను చూడగలను, ఇలా అంటున్నారు, “చూడండి మన సంఘాన్ని చీల్చడానికి వెళ్ళుచున్న ఆ వ్యక్తి అతడే అయిఉండెను. మన పాస్టరు గారికి వ్యతిరేకముగా బోధించెను. ఇప్పుడు అతనివైపు చూడ౦డి!” అయితే ఆ ప్రవక్త అది ఆ పద్ధతిలోనే తప్పక ఉండునని చెప్పెను. ఆయన దేవుని గొఱ్ఱెపిల్ల అయి ఉండెను.
71
నేను ఆయన తల తిప్పి ఉండగా, ఆయనను చూస్తున్నాను, మరియు ఉమ్మి ఆయన గెడ్డం నుండి కిందకు దిగ జారుచుండెను. ఆయన కండ్లు ఆకాశం పైకి త్రిప్పెను మూల్గుచూ మరియు ఇంకా కొంచెం దూరం వెళ్ళెను.
ప్రభువా, విశ్వాసం ద్వారా, ఇప్పుడు నేను ఆయనతో నడువగోరుచున్నాను. నేను ఆయన వెనుక భుజముపై ప్రేమతో చరచ గోరుచున్నాను, ఇలా అందును, “ప్రభువా, నేను ఇక్కడ నిలచి ఉందును. కేవలం నేను ఏమి చేయాలో నాకు చెప్పండి, నేను అది చేయగలను. ప్రభువా! నేను ఎంతగా ”ప్రశంసించగలను.“
ఆ కొండ మీద దూరాన వారు ఆయనను క్రింద ఉంచినప్పుడు, ఆయన చేతులను వెనుకకు లాగెను. ఆ చేతులను అలా జ్వరం తాకెను. ఆ చేతులను గూర్చి ఇలా చెప్పబడెను...ఆ బీద విధవరాలయిన స్త్రీ యొక్క బాలుడు, అతడు ఆ శవపేటికలో ఉన్నప్పుడు, లేక అది అతని నొసటిని తాకినప్పుడు; అతనికి జీవము వచ్చెను.
దొర్కాను తిరిగి జీవముతో ఉండమని పిలిచినది ఆయనే. యాయీరు కుమార్తెను జీవముగల దానిగ చేసినది ఆయనే. “లాజరూ, బయటకురా” అని చెప్పినది ఆయనే. ఆ పెదవులు ఇప్పుడు రక్తము కారుచున్నవి, ఎండిపోవుచున్నవి, అరుపులు అరచు చున్నవి.
72
ఆ గొప్ప క్రూరమైన మేకులు ఆయన చేతులలోనికి దిగ గొట్టబడెను. మరియు ఆయన పాదములలోనికి శీలలను దిగగొట్టబడెను! వారు నా చేతులను మరియు పాదములను పొడిచెను.“ ఏడువందల సంవత్సరాలకు అది జరుగుటకు ముందే ప్రవక్త చెప్పెను. అది ఏమై ఉండెను? అది హేబెలు గొర్రెపిల్ల అయిఉండెను. అక్కడ వారు ఆయనను భూమి మీదకు త్రోసివేసిరి. మరియు శరీరమును చీల్చెను. ఆయన అల్పమైన దేహము వణికెను.
చెప్పబడెను, “నేను దప్పిగొనుచున్నాను.” వారు ఆయనకు చేదు చిరకను ఇచ్చారు.
వారు దూషించారు మరియు ఆయనను గూర్చి అపహాస్యం చేశారు, గొప్ప అద్భుతాలు చేయువాడవైన నీవు, ఇప్పుడు దాని గూర్చి ఏదో ఒకటి చేయి“ అనెను.
అయితే అప్పుడు ఆకాశాలు చీకటిగా నుండి, మెరుపులు మెరవనారంభించెను. దేవుడు ఆయన ముఖమును మరుగుచేసెను. ఆయన ఇకదానికి నిలువలేకపోయెను. ఓ దేవా, తప్పక పాపము ఎంత క్రూరంగా ఉన్నది! అలా చేయుటకు కారణమైన ఆ ప్రశస్తమైన ఆయనకు, అది ఎంత 'క్రూరమైనది, ఎంత క్రూరమైనది. దేవుడే ఆయన ముఖమును తనంతట తాను దాచుకొనునంతగా కూడ అలాంటి ఒక వెలను చెల్లించెను. దూతలు వారి ముఖాలను కప్పుకొని మరియు ఆయనతో ప్రలాపించుటకు, మరియు వారు మరొక వైపునకు తిరిగిరి. చంద్రుడు మరియు నక్షత్రాలు ఇక ముందుకు వెళ్ళలేకపోయెను. అవి ఇక ప్రకాశించలేదు. వాటిని చేసిన ఆ దేవుడు సిలువ మీద చనిపోవుచుండెను. మరియు ఆయన ఆయన తలను వంచెను.
73
ఆయన అది చేయకముందు, ఆయన ప్రవక్త ఏమి చెప్పెనో నెరవేరునట్లు, తన వస్త్రం కొరకు అక్కడ చీట్లువేయనున్న ఆ ప్రజలవైపునకు కిందకు చూచెను. అనెను, “తండ్రీ, వీరిని క్షమించుము; వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు.” సమస్తమూ ప్రేమలో ఆదాము యొక్క గొఱ్ఱెపిల్ల, జగత్తు పునాది వేయబడినప్పటి నుండి వధింపబడిన, దేవునిచే ఏర్పాటు చేయబడిన గొఱ్ఱెపిల్ల. స్నేహితులు లేకుండా, దేవుడే స్వయముగా తనకు తాను విడచిపెట్టగా, అక్కడ ఆయన చనిపోయెను. దేవుడు, మరియు, అప్పుడు, ఆయన సొంత తండ్రి, ఆయనను విడచిపెట్టెను; రక్తము కారుచుండెను.
ఇంకా, కేవలం ఏమియు జరుగనట్లుగనే, మనం చుట్టూ తిరుగుచు, వినోదముగా, నవ్వుచున్నాము.
ఓ దేవా, అది ఆ రక్తమే అయి ఉండెను! దూరాన ఆ ఆసుపత్రిలో, డాక్టరు చెప్పెను, “అతడు చనిపోవుచుండెను,” నన్ను స్వస్థపరచినది ఆ రక్తమే అయి ఉండెను. ఒక చిన్న పాపి అయిన బాలుడు ఇక్కడ చుట్టూ పరుగెత్తుచున్నాడు, నా పాపాలను క్షమించినది ఆ రక్తమే అయిఉండెను. అలా తీసుకు నెళ్ళినది ఆ రక్తమే...నేను నివసించుచున్న నైతికంగా చెడిపోయిన ఒక స్థలము నుండి నన్ను బయటకు తీసినది అదియే, మరియు నన్ను స్థిరపరచి మరియు నీ కుమారునిగా చేసినది. ఓహ్,..? మరియు చనిపోవుచున్న గొఱ్ఱెపిల్ల, నీ (ప్రశస్త రక్తము! ప్రభువా, నన్ను సిలువ చెంతనుంచుము.
74
అదే నా దర్శనము. ఆ దూరాన అలా ఉన్నది అదే, ప్రేమ దేవుని మహా ఘనమైన హృదయము అక్కడ క్రిందకు కదలుచుండెను. మరియు ఆయన ద్వారా వచ్చిన అదంతయూ తిరస్కరించబడదు. వారందరు నిత్యజీవము ఫొందెదరు. “నా దగ్గరకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయను.”
దేవా, ఇక్కడ ఉన్న వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరూ, ఈ రాత్రి ఇంటికి వారి మనసులో, ఆలోచించుచూ, వెళ్ళుచుండగా, “ఎలాంటిటి ఒక అర్పణ! విమోచించుటకు అది ఎంత వెలను చెల్లించెను? దేవుడు దానికి ఎంత వెల చెల్లించెను?” మనము దానికి ఏమియు చెల్లించలేదు. అది దేవుడే తన కుమారుని వెలగా చెల్లించెను. అది దేవుని మహోన్నతమైన వెల చెల్లించునట్లు చేసెను. అది క్రీస్తు ఆయన జీవితమును చెల్లించునట్లు చేసెను. ఆయన షారోను పుష్పము అయిఉండెను. అయితే ఒక షారోను పువ్వు నుండి పరిమళ తైలము బయటకు తీయడానికి, నీవు దానిని నలుపవలసి ఉన్నది. మనం జీవించునట్లుగా-ముప్పై-మూడు మరియు ఒక అర్ధ సంవత్సరము (ముప్పై మూడున్నర సంవత్సరాలు) ఒక (యవ్వన మనిషిగా ఆయన అందమైన జీవితము నలుగగొట్టబడెను.
నా దేవా, నాకు సమీపముగా రండి! ప్రభువా, నాకు సమీపముగ రండి. నాకు సమీపముగ నిలచి ఉండండి. మరియు ఈ మార్గము యొక్క చివరకు వచ్చినప్పుడు, ప్రభువా, నా జీవితము ముగించబడుచున్నది. అక్కడ ఎవరు చనిపోయారో అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చును గాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విధముగనే ఉందురు గాక.
75
రేపు, ప్రభువా, లేక ఎల్లుండి, ఉపదేశము వినుచూ ఇక్కడ ఒక సమయంలో కూర్చున్న ఒక స్త్రీ శవాన్ని పాతిపెట్టాము. ఇప్పుడు ఆమెను గూర్చి సమస్తమూ మీరెరుగుదురు. ఆమె వచ్చి ఉండిన యెడల, ఆమె క్షేమముగా ఉన్నది. ఆమె రాకపోయినయెడల, ఆమె వెలుపలకు పోయినట్లే.
ఓ దేవా, కరుణించండి. ఈ రాత్రి వారు ఈ భవనమును విడచి ఇంటికి వెళ్ళుచుండగా; ప్రాముఖ్యముగా ఆలోచించుచూ వెళ్ళెదరు గాక. నా చేతులలో ఏమియు లేదు; కేవలం సామాన్యముగా సిలువపై ఆనుకొనుటయే“ మరియు ప్రతి ఒక్కరూ ఆ సిలువపై మరణించుదురు గాక.
ప్రభువా, ఈ రాత్రి ఈ వేదిక యొద్ద ఇక్కడ నేనుండగా, ఈ చిన్న పురాతన కాంక్రీటు నిర్మాణముపై, నేను నా జీవితమును నీకు సమర్పించుచున్నాను. మీరు నా కొరకు ఏమి చేశారో దాని కొరకు నేను మీకు వందనములు చెల్లించుచున్నాను. నేను నా జీవితమును ఈ సిలువ వేయబడిన రాత్రిని మీకు జ్ఞాపకార్ధముగా నాకు నేను నూతనముగా సమర్పించుకొనుచున్నాను. ప్రభువా నన్ను స్వీకరించండి. నా పొరపాట్లన్నియు మరియు కష్టములన్నియు నన్ను క్షమించండి. నేను మీ కొరకు ఆత్మలను గెలుచునట్లుగా, ప్రభువా, దేవుని ఆత్మలో, నన్ను శక్తివంతముగాను మరియు నన్ను బలవంతునిగా చేయండి.
76
మనం తలలు వంచి ఉండగా, ఇప్పుడు ఇక్కడ ఉన్న పాపి అయిన ప్రతి స్త్రీ మరియు పురుషుడు, చిన్నవారయిన బాలికలు, బాలురు అయిన మీరందరు అక్కడ వెనుక ఉన్న యవ్వన ప్రజలు, ఆ మరో రాత్రి, మీతో వాడిగా మాట్లాడి ఉన్నాను. నేను అలా చేయుటకు అసహ్యపడుచున్నాను. దేవుడు మీ హృదయాలను దీవించును. సహోదరుడు బ్రాన్హాం కరుకైన వాడని మీరు తలంచి ఉండవచ్చును, అయితే నేను-నేను మిమ్మును ప్రేమించుచున్నాను. మీరు ఎక్కడ ప్రారంభించారో నేను అక్కడ కూర్చున్నాను. అది ఏమై ఉన్నదో నేను ఎరుగుదును; ఆ కారణం చేత నేను అలా చెప్పాను, కేవలం మన ప్రభువును ప్రేమించి ఉండలేదా చూడండి నా కొరకు ప్రార్ధించండి, నా కొరకు ఇది సమర్పించుకొను సమయముగా ఉండగలదని ప్రార్ధించండి. తల్లులు మరియు తండ్రులై పెద్దవారు కేవలం ఇప్పుడే, ఇది సమర్పించుకొను సమయముగా చేయండి, మీరు చేయుదురా? మీ హృదయంలో ఆయనను అంగీకరించండి. మీ పూర్ణ మనస్సు (ఆత్మ) తో ఆయన మీద నమ్మకముంచుము.
ఇప్పుడు మన తలలు వంచి ఉండగా, ప్రార్ధనలో జ్ఞాపకముంచుకొనవలెనని ఏ వ్యక్తి అయినా ఇష్టపడుచున్నారా? మీరు ఇష్టపడిన యెడల, కేవలం నీ చేయి ఎత్తి, చెప్పు, “సహోదరుడా బ్రాన్హాం, నన్ను జ్ఞాపకముంచుకొనుము. నేను దేవునికి సమీపముగా ఉండగోరుచున్నాను. మంచిది, డజనుల కొలది చేతులు ఎత్తబడెను.
77
తండ్రీ వారినందరినీ జ్ఞాపకముంచుకొనండి. అది మీరు అనుగ్రహించాలని నేను ప్రార్ధించుచున్నాను; వారికి సమాధానం ఉండును. కన్నీళ్ళు బొట్లు-బొట్లుగా పడుచున్నవి. వారిలో కొందరు చేతి తువాళ్ళతో ఉన్నారు. వారిలో కొందరు, బాగా ధృఢంగా ఎత్తుగా, ఇక్కడ కరుకైన మనుష్యులు, వారి ముడతలు పడిన బుగ్గలతో ఉన్న ముఖాల నుండి కన్నీళ్ళు కారుచున్నవి. (ప్రభువా, మమ్మును స్వీకరించండి. ఈ దైవిక సన్నిధిలో మాలో ప్రతి ఒక్కరినీ క్షమించండి. ప్రియదేవా, ఈ రాత్రి, ప్రభువా యవ్వనులను మరియు వృద్ధులను మమ్మును క్షమించండి. ఆ రోజున మేము రక్షింపబడి మరియు నీ రాజ్యంలోనికి తీసికొనబడుదుము గాక, ఎందుకనగా మేము అది యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్.
ఇప్పుడు మీరు మీ పాదాలపై ప్రశాంతముగా నిలచి ఉండండి. ఇప్పుడు మీ తలలు వంచండి. నెమ్మదిగా;
నా దేవా ఓ, మీ యొద్దకే, మీ యొద్దకే సమీపముగా;
ఆ విధముగ నన్ను పైకి లేపిన అది ఒక సిలువగా ఉన్నప్పటికిని;
ఇంకా అదంతయూ నాకు గానముగా ఉండును...
(సహోదరుడు బ్రాన్హాం గారు ప్రజల కొరకు ప్రశాంతంగా ప్రార్ధించారు-ఎడిటర్) దేవా, “నా దేవా నా దేవా, నీ వేల నన్ను విడనాడితివి ? రండి ప్రభువా, ఈ హృదయాలను దీవించండి. (సహోదరుడు బ్రాన్హాం గారు ప్రజలతో ప్రార్ధించుట కొనసాగించారు.)
78
కేవలం నీవు, గౌరవ ప్రదముగా, ఎంతమాత్రమూ ఏ ఒక్కరితో మాట్లాడకుండా, ఇక ఒక్క మాటా చెప్పకుండ, ఇప్పుడు ప్రశాంతముగా, కేవలం భవనం విడచి మరియు మీ ఇండ్లకు వెళ్ళండి. కేవలం తిరిగి, ఇప్పుడే మీ గృహానికి వెళ్ళండి. ఒక్క మాట చెప్పకుండ, తిరిగి మరియు బయటకు వెళ్ళండి. దేవుడు మీతో ఉండును గాక.
(సహోదరుడు బ్రాన్హాం, ఆ సమాజము ప్రశాంతముగా భవనం విడచుట ఆరంభించగా విరామము కలిగి ఉన్నారు. సంపాదకులు)
మనమందరము గొఱ్ఱెల వలె త్రోవ తప్పిపోతిమి, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను.
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను ..? అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాదింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎ౦చితిమి.
(సహోదరుడు బ్రాన్హాం గారు ప్రజల కొరకు ప్రశాంతంగా ప్రార్ధించారు-ఎడిటర్)