అప్పటి నుండి

అప్పటి నుండి

మనము తిరిగి ఇక్కడ వుండుటయు, సహోదరుడు, కాపరియైన అతడు తన చిన్న బాలిక యెడల దేవుడు చూపిన కృపను గూర్చి సాక్ష్యమివ్వడము ఎంతో మంచిగావుంది.
అది ప్రభువైన యేసు జరిగించు కార్యము రీతిగానే వున్నది.
నిశ్చయముగా అది అంతేవున్నది.
2.
'నూతన సంవత్సరములోనికి ప్రవేశించు కూటముగా' మనము పిలిచే ఈ రాత్రి కాలకూటములోనికి, ప్రభువైన యేసుక్రీస్తు తట్టు త్రిప్పబడినవారిలో ఒకడును, కృపయొక్క జయసూచకముగా నున్న సహోదరుడు ఎర్నీ ఫాండ్లర్ అనే నా మంచి స్నేమితుడు మన మధ్య వుండటం మనకెంతో సంతోషం.
జన్మత: అతడు స్విడ్జర్లాండ్ వాసి.
అక్కడ నుండే మనమధ్యకి వచ్చియున్నాడు.
మరలాగే అతనితో కూడా జన్మరిత్యా జర్మనీ వాడైన స హెూదరుడు వాటర్స్ కూడా ఈ రాత్రి మన మధ్యలోకి వచ్చియున్నాడని నేననుకొంటున్నాను.
వారక్కడ షవనా లో వుంటున్నారు.
వారు మనతో వుండటం మనందరికి సంతోషం.
3.
మరియు అలాగే ఈ రాత్రి మనతో ఉండుటకు దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన విశ్వాసమునందు మన ప్రశస్త సహోదరుడగు డేవిడ్ డూప్లెసిస్ ను బట్టి కూడా మనమెంతో సంతోషించుచున్నాము.
మేము.
డేవిడ్ మరియు నేను రాబోయే సంవత్సరమందు ఆఫ్రికాలోను, ఇంకా ప్రపంచమందు అనేక చోట్ల మేమిరువురం కలసి జరిగించుటకు ప్రభువు కొంత గొప్పపనిని అనుగ్రహించునట్లు ఆసక్తి కలిగి ఎదురుచూచుచున్నాము ప్రార్థించుచున్నాము.
దాని నిమిత్తం చర్చించుటకు, ప్రార్థించుటకు బ్రదర్ డేవిడ్ ఇక్కడ వున్నాడు, ఆఫ్రికాలోను మరియు ఇంకా ప్రపంచంలోని వివిధ చోట్ల ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ కూటములను జరుపవలయునో నిర్ణయించుటకు అతడు ఇప్పటి నుండి సోమవారం వరకు వుండును.
సార్వత్రిక పెంతికోస్తు కూటమీ నందు బ్రదర్ డేవిడ్ ఎంతో ప్రముఖమైన స్థానం కలిగియున్నాడు, అంతేకాక విశ్వవ్యాప్తిగా అతడు ఎంతో మంది గొప్ప మతనాయకులకు సుపరిచితుడునైయున్నాడు.
సంఘశాఖల యొక్క విశ్వాసము (భోద) లన్నిటిలో నుండి యేసుక్రీస్తు శరీరమును ఒక్కటిగా తెచ్చుటకు, ఇప్పటివరకు మనం సహాయపడుచున్న లాగునే అతడు కూడా సహాయపడుచూ, తన భోద ద్వారా ఒప్పింపచేయుటలో ఎంతో ప్రభావశాలి.
వారు ఏ సంఘమునకు చెందినవారైనప్పటికి, వారు ఏ గుంపుకు (లేక) ఏ తరగతికి చెందినవారైయున్నప్పటికి.
కేవలం అది సార్వత్రిక సంఘమునై యున్నది.
క్రీస్తు దానికొరకు మరణించెను.
4.
దీని విషయమై నేను తరచుగా ఆలోచించేవాడిని.
పశ్చమానికి బయట అనేక పర్యాయములు నేను పశువులన్నిటిని గుంపు చేయుటకు సహాయపడేవాణ్ని మేము పైకి వెళ్ళేవారం, బ్రదర్ డేవిడ్, మరి మేము అచ్చట కూర్చొనేవారం.
అక్కడ మందను తోలుకొని పోయే ముఖద్వారం కంచె గుండా వారు మందలను మేపుటకొరకు కొండల మీదికి వాటిని తోలుకొనిపోయేవారు.
అయితే దిగువన పచ్చిక బయళ్ళు(లేక) మైదానాలు వేపుగా పెరిగేవి.
అప్పుడు వారు పెరిగిన ఆ గడ్డినికోసి, కొండలమీద హిమవృష్టి అధికంగా వున్నప్పుడు, శీతాకాలమందు దానిలో పశువులను మేపేవారు.
5.
రెండు కొండల మధ్యనున్న గాడి మీద తరచుగా కూర్చొనుచూ, దానిగుండా పశుసంరక్షణాధికారి (లేక) కాపలాదారుడు వాటిని తోలుకొని వచ్చుటను గమనించటం జరిగేది.
దిగువున వున్న పశుసంరక్షక క్షేత్రంలో కనీసం ఒక టన్ను మేతను పెంచేవారు.
యాబై పశువులను మేపుటకు సరిపడా గడ్డి (మేత) కావాలంటే యాబై టన్నులు గడ్డిని పెంచేవారన్నమాట.
వెయ్యిటన్నుల గ్రాసము వుంటే వెయ్యి పశువులు వెళ్ళి మేయవచ్చన్నమాట.
వాటిని తోలుకొని వచ్చే ప్రతిఒక్కడు తన పశువుల మీద ఒక ముద్రను కలిగివుండును.
ఏఏ పశు క్షేత్రం నుండి ఏఏ పశువులు వచ్చుచున్నాయో వాటి మీద వేయబడిన ముద్రను (లేక) వాత బట్టి వారు గుర్తించేవారు, అంతేకాక ఒక దానియొక్క ముద్ర మరో దానితో కలువకుండా రకరకాలుగా ముద్రలను(వాతలను) వేసేవారు.
మరప్పుడు.
6.
పశుసంరక్షణాధికారి ఎలాంటి ముద్రను కలిగినవి లోపలికి ప్రవేశించుచున్నవో అనే దాని మీద అతడు ఆసక్తి చూపడు, ఎందుకంటే అక్కడ అన్ని రకముల ముద్రలు (లేక) వాతలు గలవి వుంటాయి.
కానీ క్షుణ్ణంగా అతడు చూచేది మాత్రము ఒకటి వున్నది, అదే రక్తపుబిళ్ళ (చిహ్నము=Blood Tag).
హియర్ ఫోర్డ్ నమోదు కేంద్రంలో వారు వాటిని నమోదు చేసికోవలసివుంది.
అలా లేనట్లయితే కంచె గుండా వాటిపి ప్రవేసింపనివ్వరు.
ఒకవేళ వచ్చినా, వెనక్కి పంపివేస్తారు.
చూశారా?
7.
తీర్పు యొద్ద కూడా నిశ్చయంగా అలాగే వుండునని నేను తలంచుచున్నాను.
మనము ఏరకమైన గుర్తులను ధరించామో అనేది కాదు గానీ 'రక్తపుబిళ్ళ' వుందా, లేదా అనేది మాత్రమే పరిగణలోనికి తీసికొనబడుతుంది.
మరి అది మాత్రమే లెక్కలోకి వస్తుంది, రక్తపు బిళ్ళ తప్పనిసరిగా వుండాలి.
బ్రదర్ డేవిడ్ మనతో వున్నందుకు నేనెంతో సంతోషించుచున్నాను.
8.
కొద్దిసేపటి క్రితం బ్రదర్ ఎస్టిల్ బీలర్ ని చూచాను.
వెనుక ఎక్కడో అతడు చేయి ఎత్తి చూపుటను చూచాను.
మరలాగే ఈ రాత్రి వినడానికి వచ్చిన మరికొంత మంది సేవకులను కూడా చూచాను.
వారిలో బ్రదర్ రడెల్ ఇంకా మరికొందరు లోపలికి వచ్చారనుకొంటాను, అర్థరాత్రి వరకు వారు మనతో వుండును.
9.
ఏదేమైనా గానీ బ్రదర్ డేవిడ్ అర్థరాత్రి వరకు మనతో ఉండలేడు.
ఎందుకంటే అతడు అందరికి బాగా అవసరమైనవాడు.
అతడిక్కడ వున్నాడన్న సంగతి బ్రదర్ రాడ్డర్స్ విన్న వెంటనే పదిగంటలకల్లా అతనిని తమ యొద్ద ప్రసంగించుట కొరకు తగిన ఏర్పాటును చేసికొనెను.
గనుక మరి కొద్ది సేపట్లోనే అతడు మనలను విడిచి, దక్షిణలూయిస్ విల్ కి ప్రయాణమగును.
10.
బ్రదర్ డేవిడ్ ఇష్టపడినట్లయితే, అతడు ఇచ్చటికి వచ్చి, ప్రభువు తన హృదయమందు ఉంచిన దానంతటిని మనకు భోదించుట ఎంతో బాగుండునని అనుకొన్నాను.
దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన బ్రదర్ డేవిడ్ డూ ప్లే సెస్ భోదను వినుటకు మనమంతా ఇష్టపడుచున్నాము.
11.
నేనొక విషయం చెప్పుదును.
నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు, అక్కడ ప్రభువు మాకు గొప్పకూటములను అనుగ్రహించెను, మరి ఆ కూటములలో అతని సహోదరుడు బ్రదర్ జెస్టస్ నాయొక్క అనువాదకునిగా ఉండెను.
అతని పేరు బెస్టస్ అని నేననుకుంటున్నాను.
ఈ డూప్లెసెస్ కుటుంబము నిజమైన, చక్కని జనులుగా వున్నారు.
నేను అనుకొంటాను.
వారి కుటుంబములో ఉన్నవారందరు దైవసేవకులేనని నేననుకుంటున్నాను.
నాకు తెలిసినంతవరకు వారి తండ్రి కూడా ఒక సేవకుడేనని అనుకుంటున్నాను.
వారు ఒక చక్కని కుటుంబము నుండి వచ్చినవారైయున్నారు.
ప్రపంచవ్యాప్తిగా వున్న సంఘములన్నిటిలోను, శాఖలన్నిటిలోను బ్రదర్ డేవిడ్ కి గొప్ప పేరున్నది.
12.
బ్రదర్ డేవిడ్, మీరిప్పుడు ఇక్కడికి వచ్చి, మీ హృదయములో ప్రభువు ఉంచిన దానంతటిని మీరు భోదించమని మిమ్మును కోరుచున్నాను.
మీరిప్పుడే పైకి రండి.
ఈ రాత్రి నా సంఘమునకు నిన్ను పరిచయం చేయటం నాకెంతో సంతోషం.
ఇతడు బ్రదర్ ఆర్మన్ నెవిల్ మాయొక్క సంఘకాపరి.
సంఘమా ఇతడు బ్రదర్ డేవిడ్ డూప్లెసెస్, దక్షిణాఫ్రికా నుండి వచ్చియున్నాడు.
నా ప్రశస్త స్నేహితులలో ఇతడు ఒకరైయున్నారు, మరియు దేవుని సేవలో నాతోటి యోధుడై ఉన్నాడు.
బ్రదర్ డేవిడ్ దేవుడు నిన్ను దీవించును గాక.
13.
(బ్రదర్ డేవిడ్ డూప్లెసెస్ మాట్లాడుచున్నాడు ఖాళీ టేపు - సంపాదకుడు.
) అంటున్నాడు.
ఆమేన్.
మేమంతా దానిని చేశాం.
సరే బ్రదర్ డేవిడ్, సాధ్యమైనంత త్వరగా తిరిగి వచ్చి మాతో వుండండి.
అదిచాలా మంచిది.
మేమంతా నిశ్చయముగా ఆనందించెదము.
14.
బ్రదర్ డేవిడ్ కొన్ని సంగతులను అక్కడ చెప్పియుండెను, నా దగ్గర పెన్ వున్నట్లయితే వాటిని వ్రాసికోవాలని అనుకొన్నాను.
అయినా ఎల్లప్పుడు అవి నాకు జ్ఞాపకమే.
“మనవళ్ళు, మనోసంతానం.
15.
మంచిది, మన స హెూదరుడు మనల్ని దర్శించుటను మనం నిశ్చయముగా అభినందించుదుము.
మరియు అతడు ఇదివరకు.
మరి అలాగే ఇప్పుడును “పెంతికోస్తు విశ్వాసుల సార్వత్రిక కూటమి”తో అనుబంధం కలిగి, ప్రపంచ వ్యాప్తిగా గొప్పపనిని కలిగిన ప్రముఖుడు.
ఈ రాత్రి బ్రదర్ డేవిడ్ మనమధ్యకి వచ్చి, ఈ నూతనసంవత్సరపు రాత్రి కూడికలో మనతో మాట్లాడటాన్ని మనము గొప్ప భాగ్యముగా ఎంచుచున్నాము.
మన ప్రభువును గూర్చి వారు ఎలాగున తలంతురో మీరు చూడవచ్చును.
అలాగే ఆయన గొప్ప సేవకులను గూర్చి తలంచవచ్చును.
16.
మరికొద్ది గంటల్లో మనం నూతనసంత్సరములోనికి ప్రవేశించ బోవుచున్నామని నేననుకొంటున్నాను.
పెందలటకడనే మిమ్మును నేను వదిలి పెట్టాలి గనుక బ్రదర్ నెవిల్ కి బ్రదర్బిలర్ కి, మిగతా సేవకులందరికి ఇష్టమైతే కొద్దిగా మాట్లాడాలని అనుకొనుచున్నాను.
('చెప్పండి', ఆమేన్ అని నెవిల్ అంటున్నాడు.
) మనము “ఆమేన్” అని, ఇంటికి వెళ్ళే, అది అద్బుతమగు వర్తమానముగా వుండునని నేననుకొనుచున్నాను.
ఈ రాత్రి మనం కలిగియున్నదానిని బట్టి ప్రభువుకి మనము కృతజ్ఞులమైయున్నాము.
17.
ఇప్పుడు ఇది నూతన సంవత్సరపురాత్రి కూడికగా వున్నందున, నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టే వరకు మనం ఒకరినొకరం దేవుని రాజ్యమును బట్టియు మరలాగే ప్రసంగమును బట్టియు ఉత్సాహపరుచుకొందుము.
నేను లేచాను.
వేకువనే, ప్రొద్దు పొడవక మునుపే లేచితిని.
డేవిడ్ వలె నేను కుర్రవాణ్ణికాను.
బహుశా.
అతని వంటి హుషారు నాకు లేదని అనుకొంటాను.
నిజానికి డేవిడ్ నాకంటే కొంచెం పెద్ద వయస్కుడు.
బహుశా ఏడు లేక ఎనిమిదేళ్ళు లేక పదేళ్ళు కావచ్చును.
అతడు నిజంగా దేవునికొరకు మండే నిప్పుకణమైయుండి, ఈ సంవత్సరం దేవుని రాజ్యంకొరకు యాబైవేల మైళ్ళు ప్రయాణించాడు.
ఇప్పుడు బ్రదర్ రాడ్జర్స్ చర్చిలో భోదించుటకు, రేపటిదినాన మరొకచోట, మరొకచోట, తర్వాత మరొకచోట, ప్రయాణించి, ఆ తదుపరి సోమవారానికల్లా మనమధ్య వుండును.
రాబోయే ప్రపంచ వ్యాప్త యాత్రకు తగిన ఏర్పాట్లను చేసికొనుటకు నేనతనిని కలువవలసియున్నది.
18.
రాబోయే ఈ మార్చి నెలలో మేము ఆఫ్రికాలో ఉండవల్సివుందని ఈ మధ్యాహ్నమే నాకుతెలిసినది.
ఈ వారంలో, వచ్చేవారంలో లేక ఈవారపు ఆరంభంలో నేను పుల్గాస్పెల్ క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్లో ఒకరైన క్లేటన్ సాండ్ మోర్ ను కలసి జమైకా, హైతీ దేశాల పర్యాటనకు సంబంధించిన ఏర్పాట్లను చేసికోవల్సివుంది.
వచ్చేవారం నేను కెంటకి వెళ్తాను, లేదా జార్జియా దిగువునకు కూటముల నిమిత్తం వెళ్లుచున్నాను.
తిన్నగా అక్కడ నుండి వచ్చి, కెంటకీ గుండా వచ్చి, ఒక రాత్రి ఇక్కడ, మరో రాత్రి అక్కడ సంఘములన్నిటిని కలుసుకొందును.
తర్వాత తిన్నగా అక్కడనుండి ఇంటికి తిరిగి ప్రయాణమౌదును.
ఇక 27వ తేది నుండి 30వ తేది వరకు అట్లాంటిక్ సిటీలో జగనైయున్న కూటములలో ఉందును.
మరి అక్కడనుండి మొదటి తేది ఉదయాన బయలుదేరి జమైకా దేశంలోని కింగ్ స్టన్ నందున్న రేస్ ట్రాక్ లో ఏర్పాటు చేసే పది దినముల కూటములలో వుందును.
వాటిని ముంగించుకొన్న తరువాత హైతీకి లేక ఎక్కడుంటే అక్కడికి వెళ్లేదను.
మరి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో నాకింకా తెలియదు.
అయితే ప్రభువు మమ్మును నడిపించు దానిని బట్టి అది వుండును.
19.
ఇప్పుడు ఇవన్ని సిద్దపాటు దశలో వున్నవి.
చూశారా?
అయితే నేనింకా వాటికి సరే అని అన్లేదు.
డేవిడ్ ఇక్కడే వున్నాడు, క్లెయిట్ వచ్చుచున్నాడు.
గార్డెన్, బ్రదర్ గార్డెన్ లిండ్సే మాతో పాటు దక్షిణ అమెరికాకు వచ్చుచున్నాడు.
మిగతా వారు అనగా క్రిస్టియన్ బిజినెస్మెన్ వారు, లాటిన్ భాష మాట్లాడే అమెరికా ప్రాంతానికి వచ్చుచున్నారు.
స్విడ్జర్లాండ్, జర్మనీ, దిగువ ప్రాంతాలకు డేవిడ్ వున్నాడు.
సంగతులు మాకింకా పూర్తిగా తెలియదు.
అయితే వాటి కొరకు ఇంకను ప్రార్థించుచున్నాము.
నాకు తెలిసినంత వరకు వెళ్ళుము అని దేవుడు చెప్పేటంతవరకు నేను ఎక్కడికి వెళ్ళను.
ఒకవేళ వెళ్ళుటకు దేవుని అనుమతి దొరికి, అక్కడ విమానం దిగిన తర్వాత… నాకు ఎంతటి గొప్ప వ్యతిరేకత వచ్చినా లెక్కచేయను, “ప్రభువైన యేసు నామములో వచ్చుచున్నాను.
” అని ధైర్యంగా చెప్పగలను.
20.
మా ఇద్దరి మధ్యనున్న స్నేహము కొరకు నేను డేవిడ్ కి వందనస్థుడను.
ఎందుకంటే అతడు చాలా ప్రాముఖ్యమైనవాడు, అంతేకాదు అతడు, నిశ్చయముగా ఈ ప్రభువుయొక్క పరిచర్యను నమ్ముచున్నాడు.
నిశ్చయముగా అతడు నమ్ముచున్నాడు.
మరియు మా ఇద్దరి పేర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏకముగా కలిపి వినబడుచున్నవి.
నాది మరియు బ్రదర్ డేవిడ్ది.
21.
అటువంటి వ్యక్తితో కలసి సహవాసంచేయటం నాకెంతో సంతోషంగా వుంది.
అవును స్నేహితులారా దానిని అభినందించుచున్నాను.
అయితే గొప్పవాడును, దేవునికుమారుడును అగు యేసుక్రీస్తుతో కూడా సహవాసం చేయడము అన్నిటికంటే మరెంతో గొప్పకార్యమైయున్నది.
22.
ఇప్పుడు బ్రదర్ నెవిల్ మరియు వారిలో కొందరు కొద్దినిముషములు మాట్లాడెదరు, దానికి ముందుగా నేను లేఖనములలో నుండి కొంతభాగాన్ని ఇప్పుడు చదువగోరుచున్నాను.
23.
నూతనసంవత్సరపు రాత్రి కూటములో విభిన్నమైన బోధకులను, అంశమును వారు బోధించు పద్దతిని, సంగతులను వారు చెప్పే విధానమును, ఇంకా అలాంటి వాటిని చూడటం చాలా బాగుండునని నేననుకొనుచున్నాను.
ప్రతి బోధకుడు తనదైన శైలిలో బోధించుటకద్దు.
మీకు తెలుసా, అందరం ఒకేలా వుండునట్లుగా దేవుడు మనల్ని సృజించలేదు.
ఆకారంలో అనేక తేడాలు వుండునట్లుగా మనల్ని సృజించాడు.
అందరిని ఒకే పోలికలో(ఒకేరకంగా)ఉండునట్లుగా చేయలేదు.
మరలాగే సృష్టిని కూడా ఆయన విభిన్నంగా చేసాడు.
కొన్ని పర్వతములను ఎంతో పెద్దగాను, మరికొన్నిటిని చిన్నవిగాను, కొన్ని ప్రాంతాలను పచ్చికబయళ్ళుగాను, మరికొన్నింటిని ఎడారులుగాను, కొన్ని తెలుపుగా వుండు పుష్పములుగాను, మరికొన్ని నీలిరంగుగాను, ఇంకా వివిధ రకములుగా వుండునట్లు చేసాడు.
ఒకరిపోలికలు మరొకరు కలువకుండునట్లుగా ఆయన మనల్ని సృజించాడు.
అంతయు అంతే.
ఎజ్జజుట్టు వారిగా కొందరిని, నల్ల జుట్టువారిగా ఇంకొందరిని, గోధుమరంగు జుట్టువారిగా మరికొందరిని, తెలుపు జుట్టు వారిగా ఆయన మనల్ని చేసెను.
స్థూలకాయులుగాను, సన్నగాను, పొడవుగాను, ఓ.
రకరకాలుగా చేయడం.
చూశారా?
కేవలం భిన్న విభిన్న రీతులుగా సృజించెను.
దేవుడు వెరైటీ దేవుడైయున్నాడు.
నేను కూడా ఆ కోవకు చెందినవాడినే, మరి మీరుకారా?
(సమాజము 'ఆమేన్' అనుచున్నది - సంపాదకుడు).
ఎల్లవేళలా అది ఒకేలా వుండును?
మై!
మై!
అది నా కిష్టం.
24.
సరే ఇప్పుడు మనం లేఖనములను త్రిప్పి, పరిశుద్దమత్తయిసువార్త, పరిశుద్ధమత్తయిసువార్త పుస్తకం, నాల్గవవచనం నుండి ఆరంభింతుము.
నేను చదువగోరుచున్నాను.
మన అంశం కొరకు, ప్రభువు సహాయము చేత పరిశుద్ధ మత్తయి 4వ అధ్యాయమును చదువగోరుచున్నాను.
వాక్యపఠనమునకు ముందు మనము ప్రార్థించుకొందుము.
25.
కృపగల పరలోకపుతండ్రి, మరొకసారి మేము కృతజ్ఞతగల హృదయము గలవారమై, ఈయొక్క నూతనసంవత్సరమును సమీపించుచున్నాము.
మేమిప్పుడు నిన్ను సమీపించుచున్నాము.
గతకాలపు వ్యసనములను తీసికొని నీయొద్దకు వచ్చుచున్నాము, మరి నీవు వాటన్నిటిని 'మతిమరుపు అను సముద్రము'లో పడద్రోయమని, మరెన్నడు వాటిని జ్ఞాపకంచేసికోవద్దని అడుగుచున్నాము.
మరియు మేము మాఅంతరంగపురుషున్ని మాత్రమే కాదుగానీ, మా… నీతో మాకున్న సహవాసమును కూడా పరీక్షించకొనగోరుచున్నాము.
మాదోషములన్నిటిని క్షమించుము.
ఈరాత్రి నీఆత్మ మమ్మును సంధించనీయమని అడుగుచున్నాము.
మాలో ఎట్టి అపవిత్రతవున్నా, ప్రభువా, తూర్పుకి పడమర ఎంతదూరమో అంత దూరముగా వాటిని దూరపర్చుము.
మరలాగే మతిమరుపు అను సముద్రములో వాటిని పడవేసి, మరెన్నటికి వాటిని జ్ఞాపకం చేసికొనకుము, తద్వారా మేము గొఱ్ఱపిల్లరక్తము చేత కడగబడి, శుద్దిచేయబడి, సిద్దపాటు కలిగి ఈ నూతనసంవత్సరములోనికి ప్రవేశింపగలుగుదుము.
26.
ఇదివరకెన్నడు సేవించనంతటి గొప్పసంవత్సరముగా ఈ 1960.
మాకుండునుగాక.
సమృద్ధిగా, విస్తారముగా మాకు అనుగ్రహించుము.
ప్రభువా, మా ముందున్న కూటములన్నిటిని, ప్రపంచవాప్తిగా, ఆసియాలోను, యూరప్ అంతటా, అలాగే విశ్వవ్యాప్తిగా బ్రదర్ డేవిడ్ డూప్లెసెస్ తో కలిసి చేయవలెనని తలంచుచున్నాము.
ప్రభువా, నీచిత్తప్రకారముగా నీశక్తినిబట్టి వీటన్నిటిని నడిపించుము.
నీవు ఏర్పరచిన నీ దైవీక మార్గములోనుండి ఎప్పుడు మేము తొలిగినా, పరిశుద్దాత్మ మరి ఆమార్గములోకి వచ్చి, అక్కడ మమ్మును ఆపునుగాక.
ప్రభువా నీకిష్టమైన స్థానములోనికి మమ్మును తీసికొని వచ్చునుగాక.
దానిని దయచేయుము.
27.
ప్రభువా ఈ చిన్ని సంఘమును దీవించుము.
ముప్పై ఏళ్లు కావస్తుందను కొంటాను.
ఈసంవత్సరములన్నిటిలో ఈసంఘము నీకృపకు గుర్తుగా ఈ దీనజనులకు నిలిచియున్నది.
తండ్రీ, మాకాపరి నెవిల్స్ దీవించుము.
సంఘమును దీవించుము.
ధర్మకర్మ(Trustees)లను, పెద్దలు (Deacons)ను, పాటలు నడిపించువారి (Song Leaders)ని, పియోనాను వాయించువారిని, ఇంకా మిగతా వారిని, ప్రతి ఒక్కరిని, సండేస్కూల్ టీచర్స్ (Sunday School Teachers)ను, ప్రతి ఒక్కరిని దీవించుము.
ప్రభువా దైవ కృపలో ఈసంవత్సరమంతయు ఎదుగుదుముగాక.
మాసంఘ సభ్యత్వపుసంఖ్య గొప్పగా ఎదుగునుగాక.
తండ్రీ, గతకాలము కంటే మరిఅధికముగా నీకృపను మాకు అనుగ్రహించుము.
28.
నీవాక్యములోనుండి చదివి ఒక అంశమును సమీపించుచుండగా మాకిప్పుడు సహాయము చేయుము.
ప్రభువా కేవలం నీవు మాత్రమే దానికి అనువాదము చెప్పగలవు.
దేవుని రాజ్యము నిమిత్తం దీనిని మాకు అనుగ్రహింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము.
ఆమేన్.
29.
రాబోయే కొద్దినిమిషముల కొరకు నేను ఎంచుకొన్న నాయొక్క అంశమును నేనిప్పుడు చెప్పుచున్నాను.
లేఖనములయందు ఇది వున్నది.
దీనిని నేను చదువుచున్నాను.
“అప్పటినుండి “ అనేదానిగా దీనిని నేను పిలువగోరుచున్నాను.
30.
నాగొంతు బొంగుర పోయినందున నేనిక్కడకి వచ్చి ప్రసంగించలేనేమోనని ఒకరాత్రి అన్నాను.
నిన్న లేదా మొన్న నాభార్య నన్నిలా అడిగింది.
“అలాగైతే నీవు చర్చికి వెళ్లడం లేదా?
31.
“ప్రియా (Honey), అవును, నా గొంతు పచ్చిపుండులా వుంది.
బహుశా వెళ్లకపోవచ్చునేమో.
32.
మరి అప్పుడు ఆరాత్రి నేను కూర్చొని లేఖనములను తెరిచినప్పుడు ఈ అంశం నా దృష్టిలో పడింది.
33.
తర్వాత బ్రదర్ సోత్ మన్ (Sothmann) వచ్చి నన్ను అడిగెను "రేపు రాత్రికి నీవు చర్చికి వెళ్ళుచున్నావా?

“అవును.
నేనక్కడ వుందును” అని బదులిచ్చాను.
34.
మెడా (Meda)నావైపు చూసి, ఇలా అన్నది నిన్ను నేను అర్థం చేసికోలేకపోతున్నాను.
అందుకు నేనన్నాను“నేను నీకే కాదు, మరెవ్వరికి అర్థంకాను.
35.
36.
మనప్రభువు కూడా వారికి అర్థం కాలేదు.
ఒకసారి ఒకరకంగా మాట్లాడినట్టు మరొకసారి మరోకరకంగా మాట్లాడినవానివలే వారికి అగుపించెను.
ఇంకో చోట ఇంకో రకంగా ఆయన మాట్లాడెను.
కొన్నిసార్లు యేసుగా మాట్లాడినట్టు మరికొన్ని సార్లు దేవుడిగా మాట్లాడినట్టుగా వుండెను.
మీరు చూశారా?
చివరికి శిష్యులు కూడా ఆయన్ని ఇలా అడిగెను.
“ఇదిగో స్పష్టముగా మాతో చెప్పుము, అప్పుడు మాకు అర్థమగును.
” చూశారా?
37.
యేసు అడిగెను “మీరు.
మీరిప్పుడు నమ్ముచున్నారా?
” చూశారా ఆ తదుపరి.
38.
ఆత్మ చేత నీవు నడిపించబడుచున్నందున, దానిని నీవు చేయజాలవు, ఏదో చేయటం ఆరంభిస్తావు, నీవు చేసే దానిని తెలిసికొని.
దేవుడేమో నిన్ను ఎక్కడో వాడుకోవాలనుకొంటాడు.
నీవు చేసే దాన్ని ఆపి, దేవునిఆత్మ నిన్ను నడుపుచోటుకి వెళ్ళేదవు.
అట్టివారు వింతవ్యక్తులు (Old) గాను, మరియు దేవునికి ప్రతిష్టించుకొన్న ప్రత్యేకమైనజనులు(Peculer) గాను వుండెదరు.
39.
నేనెల్లప్పుడు ఇలా అంటుంటాను “ప్రభువు చిత్తమైతే దీనిని నేను చేస్తాను.
చూశావా?
నేనెవరికైనా మాట ఇస్తే “ప్రభువు చిత్తమైతే దానిని చేస్తాను” అని వారితో అంటాను.
ఒకవేళ అది ప్రభువు చిత్తం కాకపోతే అక్కడే దానిని ఆపివేస్తాను.
ప్రభువు చితమును బట్టి నేను ఈవర్తమానమును భోదించుచుండగా, మధ్యలోనే ప్రభువు దీనిని ఆపివేసి, ఈ వర్తమానమునే కాలిఫోర్నియాకి తీసుకెళ్ళి చెప్పమని నన్ను కోరినట్లతే అప్పుడు నేను ప్రతిదానిని ప్రక్కకునెట్టి, ఎంతకష్టమైనా సరే దానిని కాలిఫోర్నియాకు తీసికెళ్ళిద చెప్పుదును.
40.
ఆవిధముగా నేను జీవించగోరుచున్నాను.
ఎట్టవిధమైన బంధకములు నాకుండాలని నేను కోరుకోవట్లేదు.
నాకు ఏరకమైన పేరుప్రఖ్యాతులు వద్దు.
ప్రతి దినము లక్షలకొద్దీ ధనముచేత నేను చుట్టబడాలని ఆశించట్లేదు.
దేవుడు నాతో “ఈ ప్రజల యొద్దకు వెళ్ళుము.
కేవలం అయిదుగురుమాత్రమే అక్కడవున్నారు.
కానీ నీవు వెళ్ళి, వారిని వదలి రమ్మని నేను నీతో చేప్పే వరకు నీవు నిలువుము” అని సెలవిచ్చినటైతే, నిశ్చయముగా నేను అట్లే వుందును.
అలా చేయుట నాకిష్టము.
విదేశములకు వెళ్ళుము అని ఆయన చెబితే, అక్కడికి వెళ్ళుటకు నాకెటువంటి నిర్భందములు(అభ్యంతరములు) లేవు.
41.
ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు, జర్మనీకి లేక ఆఫ్రికాకు వెళ్ళుటను గూర్చి, ఆఫ్రికా వెళ్ళుటకు దేవునిఆత్మ నాలో భారమువుంచగా ఒక ధనవంతురాలైన స్త్రీ వచ్చి “నీ ప్రయాణ ఖర్చులు, మరలాగే ప్రతీ ఖర్చును నేను భరించుదును” అని చెప్పును.
చూశారా?
మరి అదిఅంతే.
నా తండ్రి సమస్తమునకు కర్త అయి వుండగా ధనము(ఖర్చుల)కొరకు, ఇంకా మిగతా వాటికొరకు నేనెందుకు చింతించాలి?
గమనించారా?
ఆయన ఈ ధనవంతునితోనో, లేక ఆ ధనవంతునితోనో, ఈజనులతోనో లేక ఆ జనులతోనే ఆయన మాట్లాడును, ఇక దాని కోసం నేను చింతించాల్సిన పనే లేదు.
చూశారా?
ఇక దాన్ని గూర్చి దేవుడు పూర్తిగా బాధ్యత తీసికొనును.
42.
బ్రదర్ రాయ్ (Roy), జీవితమును ఆ విధముగా జీవించాలి.
ఆయన్ని బాధ్యతను తీసికోనిమ్ము.
అది అలా వుండటం చాలా మంచిది.
43.
ఇప్పుడు మన యొక్క లేఖనములను నాల్గవధ్యాయమునకు త్రిప్పుదుము.
పరిశుద్ధ మత్తయి నాల్గవ అధ్యాయం పండ్రెండవ వచనం నుండి ఆరంభించుదుము.
మత్తయి 4:12-17 వచనం యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.
జెబూలూను దేశమును, నఫాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలోకూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి.
మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.
) అప్పటినుండి యేసు - పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టేను.
44.
“మరియు అప్పటి నుండి” అనే అంశం మీద నేను మాట్లాడాలనుకొంటున్నాను.
మానవులుగా మనము కొన్ని కార్యాలను ప్రత్యేకంగా గుర్తుంచుకొంటాం.
పలాన, పలాన సమయంలో ఇదిజరిగెను, మరి అప్పటినుండి అది అలా వుండెను.
మరిప్పుడు, అనేకసార్లు మీరు వృద్ధులను కలిసికొన్నప్పుడు, వారు పలాన సమయమందు పలానిది సంభవించియున్నది అంటూ గతకాలపు సృ్మతులను ఖచ్చితమగు కాలమందు జరిగినట్టుగా నొక్కి చెబుతూ “అప్పట్లో అది అలా” జరిగెనని చెప్పుదురు.
45.
ఇప్పుడు సహజంగా ఈ రాత్రి మనలోని ప్రతి ఒక్కరం ఒకప్రత్యేక సమయమందు జరిగిన ఒకప్రత్యేక సంగతిని గుర్తుచేసుకొంటాము (జ్ఞప్తికి తెచ్చుకొంటాము).
అప్పటి నుండి ఏదో మార్పు.
పలానీ, పలాని విషయం.
ఇది అప్పుడు జరిగెను.
మరి అప్పటి నుండి ఇది భిన్నంగా వుండెను.
అలాగు చేయటం మంచిదే (స్మరణకు తెచ్చుకోవటం మంచిదే).
కాని వాటిలో కొన్ని సృ్మతులు స్మరించుకొనుటకు యోగ్యమైనవి, మరయితే మరికొన్ని ఉన్నవి వాటిని జ్ఞాపకములోనికి తెచ్చుకోవటం మంచిది కాదు.
46.
ఉదాహరణకు ఒకచెడ్డ పేరుగలస్తీ (ill-Fame woman) ని తీసికొందాం.
ఆమె అంటోంది “ఒకప్పుడు నేను కూడా మంచి, నీతి, సత్ప్రవర్తన గల అమ్మాయినే కాని విశ్లేషించి ఆరాత్రి, ఆచోట పలాని కార్యం నాకుజరిగెను.
"ఇక అప్పటి నుండి ఆమె ఆచెడ్డ త్రోవలోనే కొనసాగుచుండెను.
అంతేకాదు ఆమెకొరకు దేవుని ఉగ్రత (తీర్పు) కాచుకొనియున్నది.
పలాని సమయంలో జరిగిన ఆ కార్యమునుబట్టి తాను ఎంచుకొన్న చెడ్డమార్గము, దాని తాలూకా గుర్తులు నిత్యం ఆమె గమనంలో తిరుగుతుంటాయి.
47.
ఈ రాత్రి వీధుల్లో పడియున్న త్రాగుబోతులు తమ బాధలను మరచిపోవటానికి త్రాగుచుందురు.
నీవు ఒకవేళ అతన్ని కదిలించినట్లయితే నాకు కలిగిన అనుభవమే నీకు కూడా ఎదురవవచ్చును.
కొంతకాలం క్రితం న్యూయార్క్లో నేను మరొక సేవకునితో కలిసి త్రాగుబోతులు ఎక్కువగా ఉండే బౌరీ ప్రాంతానికి వెళ్ళాము.
అక్కడ ఒకరు కాదు ఇంకా చాలామంది తాగుబోతులు పడియున్నారు.
ముందుభాగం తడిచి , ముఖం నిండా పెరిగిన గడ్డాలతో భయంకరమైన పరిస్థితుల మధ్య వారు ఆ ప్రాంతమంతట పడివుండిరి.
వారు నిశ్చయముగా హానిపరులు కారు.
48.
నాతోవున్న సేవకుడు నన్ను అడిగాడు “వారిలో ఒక్కన్ని కదిలించి, కొద్దిగా వానితో మాట్లాడుము.
49.
ఒక కాలును కారు బంపరు మీదుంచి, రోడ్డుమీద తలను పెట్టి విశ్రాంతి గదులలోనికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్న ఒకతని యొద్దకు వెళ్ళాను.
ఓ, అతడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు.
నేనతని చేయిపట్టి, అడిగాను“నీవు మాట్లాడగలవా?
"కానీ అతడు నాకే జవాబు ఇవ్వలేదు.
50.
అప్పుడు నాతో ఉన్న సేవకుడు క్రిందికి వంగెను.
అతనితో ఎలా వ్యవహరించాలో అతనికి బాగా తెలుసు.
గనుక ఆ సేవకుడు అతన్ని అడిగాడు “నీ వెవరివి?
” .
51.
ఆ సేవకుడు ఎట్టకేలకు అతన్ని మాట్లాడునట్టుగా మేల్కొల్పియున్నాడు.
అతడు ఇలా అడిగెను “మీరు నాకు మధ్యం తాపిస్తానంటే చెబుతా.
” తాను ఒకప్పుడు ప్రెసిడెంట్గావున్న బ్యాంక్ వైపు తన వేలును చూపుటనుబట్టి విషయం కొంచెం అర్థమయ్యింది.
52.
“మంచిది, మేము భోదకులం (Preachers), అసలు నీకు ఏమి జరిగిందో చెప్పగలవా?
” అని అడిగెను.
"మద్యం తాపిస్తారనీ మాట ఇస్తే చెబుతా” అని అతడు జవాబిచ్చాడు.
53.
మంచిది, మేమాపనిని చేయలేం అని నేను అన్నాను "అసలే నీవు దుఃఖంలో మునిగియున్నావు, మరలా నీకు తాపించి మరెక్కువ దుఃఖంలోనికి నిన్ను నెట్టలేము.
అయితే నీకు ఏలాగైనా సహాయం చేయగోరుచున్నాను.
54.
ఇదే అతని కథ.
ఒక రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు.
అక్కడ టేబుల్ మీద ఒకటున్నది.
దానిని అతడు "ప్రియమైన జాన్” అనే వుత్తరముగా పిలిచేది దానిమీద ఉన్నది.
అతని భార్య తనను విడిచి వెళ్ళిపోయే ముందు దానిని వ్రాసి, టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయింది.
అతనికి ఆమె అతనికి ఎంతో ఇష్టం (ప్రేమ).
పోతూ పోతూ తనతో పాటు పిల్లల్ని కూడా తీసికెళ్ళింది.
అతనికి విడాకులిచ్చి వేరొకనితో ఆమె వెళ్ళిపోయింది.
అతడన్నాడు” ఏం చేయాలో పాలుపోలేదు, తన్ను తుపాకీతో కాల్చుకోవాలో, మరింక ఏదైనా చేయాలో అర్థం కాలేదు.
గనుక సెలూన్ షాపుకి వెళ్లాను.
” మరి అప్పటినుండి అతడు ఆ స్థితిలో అక్కడే పడివుండెను.
లోకమంతా ఇదే తంతు.
55.
ఒక అబద్దికుడగు ఒకన్ని కదిలించండి.
ఒక దినాన నేను ఒకతనితో సంభాషించుచున్నాను.
జోక్స్(సరసోక్తులు)చెబుతున్నాడని అనుకొన్నాను.
అయితే అతడు చెప్పేవన్నీ అబద్ధములని నాకు అర్థమైయింది.
అప్పుడు నేను అతనితో“నీవు ఇలా తయారవడానికి కారణం ఏమిటి?
” అని అతనితో కూర్చొని “నిన్ను ఒకటి అడగాలని అనుకొంటున్నాను.
నీవు చెప్పే అబద్ధాలన్నీ నమ్మలేనంత విడ్డూరంగా వున్నాయి” అని అన్నాను.
56.
“అప్పుడు అతడు ఇలా చెప్పెను నేను చెప్పిన మొట్టమెదటి అబద్దం నాకింకా గుర్తోవుంది” ఒక మంచి గృహములో పెంచబడిన బాలుణ్ణి నేను, అయితే ఒకరోజు మాయింటి వెనుకవున్న పొగగొట్టం (Chimney) దగ్గరకు వెళ్ళి, Mసరదాకోసం కార్న్ సిల్క్ సిగరెట్లు కాల్చాను.
ఎవరికి అనుమానం రాకుండ వుండుటకు నోట్లో కొన్ని కాఫీ గింజలు వేసికొన్నాను.
కానీ అమ్మ నన్ను గమనించి, “సన్నీ(Sunny)ఒకసారి నీవు శ్వాస ఊదుము” అని అడిగేను.
నేను అలా చేసాను.
ఆమె అన్నది "సిగరెట్ వాసన రాకుండా వుండుటకు కాఫీ గింజలు నోట్లో వేసికొన్నావా?
, సిగరెట్ తాగావు కదూ?
” అని నిలదీసింది.
57.
ఆ సమయమందు “నిజం చెప్పమని ఏదో నాకు చెప్పియుండెను” కానీ మాట మార్చి "లేదు అమ్మ నామీద ఒట్టు, నేను సిగరెట్ పీల్చలేదు” అని బుకాయించాను.
అలా చెప్పిన అప్పటినుండి నా అబద్దాల జీవితం ఆరంభమయ్యింది.
58.
ప్రతీకార్యము ఒక నిర్దిష్టమైన కాలపరిధిలో ఆరంభమగునని మనం తెలిసికోగలం.
మరప్పటి నుండి ఆకార్యములలో మార్పు చోటు చేసుకొనును.
వాటిలో మనం జ్ఞాపకము తెచ్చుకొనుటకు యోగ్యమైనవి కొన్నివుండును.
మంచి ఉద్దేశ్యము గలవారు కార్యాలను కొంగొత్తగా ఆరంభింతురు, నిర్దిష్ట కాలపరిధిలో చేయుదురు.
59.
ఉదాహరణకు, మొట్టమొదటిగా కరెంటును (విద్యుత్శక్తి)ని బెంజిమెన్ ఫ్రాంక్లిన్ కనుగొనెను.
దాని ద్వారా వారు ఆరంభించిరి.
“ఇప్పటి నుండి, ఇక ఎన్నటికి యుద్ధములనేవి వుండవు.
ఎందుకనగా ఈ విద్యుత్ శక్తిని కంచెలకు సరఫరా చేయుదుము తద్వారా ఎంతో ఎక్కువ వోల్టేజి ఆ కంచెల గుండా ప్రవహించును గనుక ఇక ఎవ్వరు కంచేదాటే అవకాశం వుండదు.
” సరే వారి భావం మంచిదే.
60.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే, కెయిజర్ విల్ హెమ్ శాంతి ఒప్పందం మీద సంతకం చేసెను.
ఇక్కడ అమెరికాలో వున్న మనకి అది చెప్పబడింది.
అప్పుడు నా వయస్సు తొమ్మిదేళ్ళు.
అప్పుడు జనులు ఏమి అన్నారో నాకింకా గుర్తెవున్నది.
"ఇక ఎన్నడు మనకు యుద్దముండదు.
ఇప్పటినుండి, ఇది మొదలుకొని అంతా పరిష్కారమయింది ఎన్నటెన్నటికి.
” అయితే తర్వాతేమైంది?
మనకు మరొక యుద్ధం రానే వచ్చింది.
61.
ఐక్యరాజ్యసమితి అనేది స్థాపించబడక మునుపు నానాజాతిసమితిగా పిలిచే ఒక దానిని స్థాపించారు.
అప్పుడు వారన్నారు"ఇక ఇప్పటి నుండి మనకింక యుద్దములే వుండవు.
ఎందుకంటే ప్రపంచ పరిరక్షణ కోసం మనం ఈ నానాజాతిసమితిని కలిగివున్నాము (ఏర్పాటుచేసుకున్నాము)
“ప్రపంచంలో ఏమూలన సమస్య తలెత్తినా దీనిలోని బాగస్థులైన ప్రతి దేశము నుండి సభ్యులు అక్కడికి వెళ్ళి, శాంతిభద్రతలను కాపాడతారు.
” ఐతే అది విఫలమైంది.
దాని వెంటనే వారికి యుద్దములు రానే వచ్చెను.
నానాజాతిసమితి విఫలమైనట్టుగానే ఐక్యరాజ్యసమితి కూడా విఫలమగును.
62.
మనకు చెప్పబడియున్నది ఒక జ్యోతిష్యము భవిష్యతను సూచించు ద్వారా, అదేదనగా రేపురాత్రికి లేదా ఆదివారపురాత్రికి.
పలాన సమయానికి పెరల్ హార్బర్ మీద బాంబులదాడి జరుగునని చెప్పిన ఆ మనుష్యుడే” ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో 75% (డెబ్బై అయిదు శాతం)మంది అమెరికా ప్రజలు బూడిదలవుదురు.
వచ్చే ఈ ఆదివారం రాత్రి 12గంటలకు రష్యాదేశం అమెరికా మీద బాంబులవర్షం కురిపించును.
” అని చెప్పియున్నాడు.
పెరల్ హార్బర్ ను గూర్చి ప్రవచించిన ఇతడే దీనిని కూడా ప్రవచించాడు.
అయితే దానిని వారు బహిర్గతం చేయట్లేదు.
కారణం జనులు ఆందోళన చెందుదురని లేక భయకంపితులగుదరని.
నేనైతే దీనిని నమ్మను.
చూశారా?
అణుబాంబుయుద్దంను ఇది భరింపలేదు.
వారు ధ్వనిహద్దు గుండా ఈ మార్గాన వస్తే, మార్గంలోనికి వారిని మనం విసిరివేయుదం, లోకం ముక్కచెక్కలగును.
యేసురాకడకు ముందు ప్రాముఖ్యమైన ఒక కార్యం ఇంకను జరుగవలసి యుండెను.
అది నిజం.
63.
ఉదాహరణకు, ఒక యవ్వనదంపతులు వారు వివాహం చేసికొనుటకు ఒక నిర్దిష్టమైన సమయము ఉండెను.
మరి వారు-ఒకరితో ఒకరు కలసి పెళ్ళి ప్రమాణాలు చేసికొందురు.
ఒకరితో ఒకరు నమ్మకముగా ఉందుమని నిబంధన చేసికొందురు.
వారు ఇలా అందురు“మనము కలిసి జీవించినంతకాలం ఒకరినొకరం ప్రేమించుకొందుము, ఘనపరచుకొందుము, సంతోషపరచుకొందుము కానీ వారిని విచ్చిన్నం చేసే కాలం ఒకటి వచ్చును.
64.
ఈ కార్యములన్నియు స్థంబించే ఒకకాలం వుండును.
వారి ప్రమాణాలు, నానాజాతి సమితి మొదలగు వాటి యొక్క ఉద్దేశ్యములు మంచివే అయివుండొచ్చును.
కానీ క్రమేపి అవి కూడా ముగింపుకు వస్తుంటాయి.
అవన్ని నలిగిపోతాయి (చదును చేయబడతాయి) మరియు మనిషి కాళ్ళక్రింద తొక్కివేయబడతాయి.
మన ఉద్దేశ్యములన్ని మంచివే అయివుండవచ్చు, కానీ అవన్నీ ఒక ముగింపునకు నిశ్చయంగా రావలసియుంది.
65.
ఒక కాలమున్నది, ఆ కాలమున మనిషి నిత్యత్వము అనే దాని యొద్దకు తప్పక రావలసియుండెను.
మనిషి దేవున్ని కలుసుకొనేదే ఆ కాలము.
నిత్యత్వమునకు సంబంధించినది ఏదో అతని యందు జరుగును.
66.
మనం పొరపాట్లు చేస్తాం.
నూతనసంవత్సరం వస్తే చాలు క్రొత్తక్రొత్త తీర్మాణాలు తీసుకొంటాం కానీ మరుసటి రోజునే వాటని చేయుటలో తప్పిపోతాం.
క్రొత్త పేజీలు త్రిప్పి వాటి మీద సంతకాలు చేస్తాం.
యాజకులుయొద్దకు వెళ్లి.
మనము కాదు, కేథలిక్కులు అలా వెళ్తారు.
ఒప్పుకోలులు చేస్తాం, క్రొత్త తీర్మాణాలమీద సంతకాలు చేస్తాం, బలిపీఠము యొద్దకు వెళ్లి క్రొత్త పేజీలు మరియు అవి ఇవి చేస్తాం.
కానీ అవన్ని వ్యర్థమే.
తరువాత ఎవరో మన దారిలోకి వచ్చెదరు మరి ఏదో జరుగును, వెంటనే ఆ పాతఉద్రేకం బయటకు తన్నుకొనివచ్చును.
ఇక పాతదే తిరిగి పునరావృతమగును.
67.
మనిషి రాగలిగిన, తప్పిపోయినటువంటి ఒక చోటు ఉన్నది, అతడు అక్కడికి వచ్చినపుడు ఆ సమయమందు శాశ్వతముగా అది అతనిని నిత్యత్వము కొరకు మార్చివేయును.
"నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను” అని యేసు చెప్పెను.
ఒకడు దేవునియొద్దకు వచ్చినపుడు, అతని యొక్క నిత్యత్వమునకు సంబంధించిన గమ్యస్థానమే పూర్తిగా మారిపోవును.
ఒకడు దేవునిని కలుసుకొన్నపుడు మునుపటి వలె ఇక ఎన్నడూ ఉండలేడు.
దేవున్ని కలుసుకోకపోతే నీలో మార్పు అనేది ఉండదు.
(దేవున్ని కలుసుకున్న తరువాత నీవు మారకుండా ఉండలేవు) ఆయనలో నుండి నీవు వైదొలగితే ఇది వరకు ఉన్నదానికంటే మరీ హీన స్థితిలోనికి నీవు దిగజారిపోతావు.
నీవు ఆయనను చేర్చుకొంటే నిత్యజీవమును కల్గివుంటావు.
ఆయన చేసిన వాగ్దానమును బట్టి అంత్యదినమున ఆయన నిన్ను లేపును.
68.
ఒకానొకప్పుడు అబ్రహాము అనే మనుష్యుడుండెను.
అతడు కల్దీయుల దేశములో నుండి బయటకు వచ్చెను.
అది వరకు అతడు 'ఊరు' అనే పట్టణములో ఉండేవాడు.
కేవలము అతడొక మనిషి మంచివాడు.
బహుశా అతడు కలిగి వుండెను.
బహుశా అతని తండ్రి విగ్రహములను ఆరాధించేవాడై ఉండవచ్చును.
ఎందుకంటే వారు బబులోనులో నుండి వచ్చినవారు.
అబ్రహాము ఒక సాధారణమైనమనిషి, ముసలిప్రాయం పైబడుచుండెను.
అతనికి డెభైఐదు ఏళ్ళు(75), తన భార్యకేమో అరవైఐదుఏళ్ళు (65) ఉండెను.
69.
ఒక దినాన అబ్రహాము, బహుశా అతడు పొలములో వుండవచ్చునేమో, లేదా వేటాడుచువండెనేమో, లేదా బెర్రీపండ్లు ఏరుచునుండునేమో లేదా తనవృత్తి ఏదైతేవుందో ఆ పని చేస్తూ వుండెనేమో, కానీ అక్కడ అతడు దేవున్ని కలుసుకొనెను.
అప్పటినుండి అతడు మారిపోయెను.
లేని వాటిని ఉన్నట్టుగా అతడు పిలువగలడు కారణం దేవున్ని కలుసుకొన్నాడు.
దేవున్ని కలుసుకొన్న క్షణాన్ని, గడియను అతడు ఎరిగివుండెను.
అదే అతన్ని మార్చెను.
అనేక జనములకు తండ్రిగా వుండుటకు దేవుడు అతనిని పిలిచెను.
దేవున్ని కలుసుకొన్నందున అతడు దేవున్ని, ఆయన చేసిన వాగ్దానమును నమ్మియుండెను.
ఇరువది ఐదేళ్ళు గడచిన తరువాత, వారు సంబాషించుకొనుచుండిరి.
అతనితో సంభాషించుటకు ప్రయత్నించుచూ, తాను తప్పైనది నమ్మియున్నట్లుగా అతనితో చెప్ప ప్రయత్నించిరి.
కానీ బైబిల్ అంటోంది “అంతకంతకు అతడు బలమునొందుచూ, దేవుని స్తుతించుచుండెను” కారణం వాగ్దానం చేసిన దేవుడు దాని నెరవేర్చుటకు సమర్థుడని, తప్పిపోడని తాను ఎరిగియుండెను.
70.
ఒకవ్యక్తి దేవున్ని కలసికొన్నప్పుడు, అతడు పూర్తిగా మారిపోతాడు (సరిచేయబడతాడు).
ఆ కలియక అతనికి అతీత జ్ఞానేంద్రియమును కలిగించును.
ప్రకృతి సంబంధియైన మనిషికి(భౌతికశరీరానికి) కేవలం ఐదు ఇంద్రియములు మాత్రమే వుండునని ఒకరాత్రి నేను బోధించితిని.
కానీ విశ్వాసికైతే దేవున్ని కలుసుకొన్నప్పుడు, భిన్నమైన దానినొకటి అతడు పొందును.
సమస్త చీకటి (లోకకార్యముల)లోనుండి అది అతనిని పైకిలేపును.
అసాధ్యమైనవి కూడా జరుగ గలవని నమ్మునట్లు అది చేయును.
దేవుడు దానిని చెప్పియుండెను గనుక అది తప్పక కార్యరూపం దాల్చునని ఇంకను అతడు నమ్మును.
ఒకడు దేవున్ని కలిసికొన్నప్పుడు ఏదో ఒకటి జరిగితీరును.
71.
ఒకానొకప్పుడు ఒక మనుష్యుడుండెను.
అతడు సమస్త జ్ఞానంను అభ్యసించి దేవుని వాక్యము యొక్క సకలవేదాంతంను నేర్చుకొనెను.
అక్షరార్థముగా దానిని అతడు ఎరిగియుండెను.
విద్యనభ్యసించెను.
అన్నిరకములైన పట్టాలు సంపాదించెను.
ఐగుప్తు పండితులకు, వారి బోధకులకు భోదించగల నేర్పరితనం కలగివుండెను.
అయితే దానంతటిని అతడు అక్షరార్థముగానే తెలిసికొనియుండెను.
ఇంత జ్ఞానసంపన్నుడైనప్పటికి, పిరికివానిగా పరుగెత్తుకొనిపోయి ఎడారికి వెనుక భాగాన పరదేశిగా మందను మేపుచుండెను.
కానీ ఒక సమయమొచ్చింది, అప్పుడు దేవుడు అతనిని ఆ మండుచున్న పొదలో కలిసికొనెను.
మరి అప్పటినుండి మోషే మార్పునొందెను.
కారణం మండుచున్నపొదలో అతడు దేవున్ని కలుసుకొనెను.
దేవున్ని ముఖాముఖిగా ఎదుర్కొన్నందున మునుపటి వాని వలే ఉండలేకపోయెను.
72.
ఎప్పుడైతే ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ.
నీవెన్ని ప్రమాణాలు చేసావో లేక చక్కగా బ్రతుకుతానని ఎన్నిసార్లు తీర్మానం చేసికొన్నావో నాకనవసరం.
నీవు చేసిన ప్రమాణాలు, తీర్మానాలు నిలబడాలంటే, జరగాలంటే నీవు తప్పక దేవున్ని కలుసుకోవల్సిందే.
దేవున్ని కలుసుకోకపోతే నీవు మారలేవు.
ఒక్కసారి నీవు దేవున్ని కలుసుకుంటే చాలు ఇక ఎన్నటికి మారిన వానిగానే నీవు వుంటావు.
73.
మోషే దేవున్ని కలుసుకోటం వలన కేవలం మోషే మాత్రమే ఆ మార్పును పొందలేదు గానీ, అది ఇశ్రాయేలును మార్చింది, ఐగుప్తును మార్చింది, ఆ కాలమందున్న లోకాన్ని మార్చింది.
కారణం ఒక వ్యక్తి దేవున్ని కలుసుకొని ఆయనవాక్యాన్ని పట్టుకొనెను.
74.
ఈరోజున మనకు అవసరమైనదంతా ఏమిటంటే ఒకవ్యక్తి దేవున్ని ముఖాముఖిగా కలుసుకొని, పరిస్థితిని దేవునికి చెప్పవలెను.
ఆయన ప్రజలు ఆయన్ని కలుసుకొన్నప్పుడు కార్యాలు మారిపోతుంటాయి.
నిశ్చయముగా కార్యములను కలిగివుండుటకు అదొక్కటే మార్గం.
75.
మరి అప్పటినుండి పిరికివాడైన మోషే పారిపోయిన మోషే మార్చబడెను.
అప్పటినుండి అతడు దేవునికి సేవకుడయ్యెను.
ఇది ఎల్లప్పుడు అలానే జరుగును.
ఒకడు దేవున్ని కలుసుకొన్నపుడు మాత్రమే కార్యాలు మారిపోవును.
76.
ఒకసారి ఒకచిన్నబాలిక పద్దెనిమిదేళ్ళు కూడా నిండలేదు.
బహుశా ఆవయస్సు కూడా కాకపోవచ్చును.
ఆమె ఒక ఉదయకాలాన ఆ నజరేతు ఊరిలో బక్కెట్టు నీళ్ళకొరకు బావియొద్దకు వెళ్ళుచుండెను.
ఆమె చక్కని అందమైన అమ్మాయి.
ఆమె ఒక విశ్వాసి, నమ్మినది.
అయితే ఆఉదయాన ఆమె దేవున్ని కలుసుకొన్నది.
దేవుడు ఆమెకు ఏదో చెప్పియుండెను.
దానిని ఆమె నమ్మెను.
అది ఆ స్త్రీయొక్క జీవిత విధానమునే పూర్తిగా మార్చివేసెను.
అంతేకాక ఆమెను అక్షయతలో నిలి పెను.
ఆమె పేరు మరియ.
ప్రభువైన యేసుకి తల్లి.
ఆ చిన్న బాలిక ఒక సాధారణమైన అమ్మాయి కానీ ఆమె దేవున్ని కలుసుకొన్నది.
మరి అప్పటినుండి ఏదో జరిగెను నిశ్చయంగా.
77.
పేతురు అను పేరుగల ఒక మనుష్యుడుండెను.
అతడు ముసలివాడును, విద్యలేని పామరుడును అగు జాలరిగా వుండెను.
బహుశా వారుండగలిగినంత కరుకు (మొరటుగా)అతడు వున్నాడు.
బహుశా అతడు ఒక జగడగొండి (దుడుకువాడై) అయివుండవచ్చును.
ఎందుకంటే ఇక్కడ కొంత కాలం క్రితం పెద్దజాలరీ అనే ఆటను చూసాను.
పేతురు ఎలాంటివాడో చెప్పుటకు నిశ్చయముగా అదొక మంచిమాదిరి అని నేననుకొన్నాను.
ఎందుకనగా పేతురు కూడ పెద్ద, ముసలివాడగు మొరటోడు.
దేన్ని లెక్కచేయడు.
అతికష్టం మీదతప్ప దేనిని అతడు సులువుగా నమ్మడు.
అయితే ఒకరోజున అతడు దేవున్ని కలుసుకొన్నాడు.
మరి అప్పటినుండి అతడు మారిపోయెను.
అప్పటి నుండి అతడు ప్రభువైన యేసుక్రీస్తుకి అపోస్టులడెయ్యెను.
78.
హంతకుడును, హత్యచే సేవారి వస్త్రములకు కాపలాదారుడును, హతసాక్షియైన స్టెఫను మరణంనకు సాక్షిగా వున్న తార్సువాడైన సౌలును గురించి కొద్దిసేపటి క్రితం బ్రదర్ డేవిడ్ డూప్లేసెస్ చెప్పియున్నాడు.
అధికముగా శబ్దం చేస్తూ, కేకలు వేస్తూ దేవుని స్తుతించువారందరిని బంధించుటకు సంఘముల ఆలోచన సభ పెద్దలనుండి అతడు అనుమతి పత్రాలను పొంది తన జేబులో వాటిని పెట్టుకుండెను.
పరిసయ్యుల దృష్టిలో అతడు ఎంతో గొప్పవాడు.
అతడు కూడా పరిసయ్యులలో పరిసయ్యుడు.
కానీ ఒక దినాన అతడు దమస్కు మార్గంలో దేవున్ని కలుసుకొన్నాడు.
ఒక వెలుగు అతని చుట్టు క్రమ్మెను.
మరి అప్పటినుండి అతడు ఇక ఎంతమాత్రం తార్సువాడైన సౌలులా లేడు.
కానీ దీనుడును, తగ్గింపు గలిగిన పౌలుగా అయ్యెను.
కారణం అతడు దేవున్ని కలుసుకొనెను.
అది అతనిని పూర్తిగా మార్చివేసెను.
79.
ద్వారము వద్ద ఒక కుష్టువాడు వుండెను.
ఏ ఔషదము అతనిని బాగుచేయలేకపోయెను.
పుండ్లు భయంకరముగా కుళ్ళిపోయి దుర్వాసన వచ్చుచుండెను.
అంతే కాక అతని చేతులు కుషించిపోవుచుండెను.
అతికష్టంమీద కాళ్ళు ఈడ్చుకొనుచున్న పరిస్థితి.
అతని స్థితి భయంకరముగా వుండెను.
అయితే ఒక దినాన ద్వారము నుండి బయటకు వచ్చుచుండగా అతడు దేవున్ని కలుసుకొనెను.
ఆయన యెదుట సాష్టాంగపడి, మొక్కి “నీ చిత్తమైతే నన్ను శుద్దునిగా చేయుము” అని ప్రాధేయపడెను.
80.
అందుకు ఆయన అన్నాడు “నాకిష్టమే శుద్దుడవుకమ్ము" మరి అప్పటినుండి కుష్టు సమస్య అతనిని విడిచిపోయెను, కారణం దేవున్ని కలుసుకొన్నాడు.
81.
త్రోవ ప్రక్కన కూర్చొనియున్న గ్రుడ్డివాడు ఒకడు ఉండెను.
పూర్తిగా గ్రుడ్డివాడు గనుక ఏమీయు చూడలేడు.
అతనికి సహాయపడేది ఏమీ లేకుండెను.
యెరికో నుండి నడుచుకుంటు ఒకరు బయటకు వచ్చుచుండెను.
ఆయనను అతడు కలుసుకొనెను.
మరి అప్పటినుండి అతడు చూడ నారంభించెను (చూడగలిగెను).
దృష్టిని పొందుకొనెను.
వెలుతురు కళ్ళల్లో పడినందున మరలా చూడగలిగెను.
యేసును కలిసికొన్నందున మరి అప్పటి నుండి అతడు వ్యత్యాసమైన వానిగా వుండెను.
చూపును పొందుకొనెను.
ఒక వ్యక్తి దేవున్ని కలిసికొన్నప్పుడు అతనిలో ఏదో ఒక కార్యం తప్పక జరిగితీరుతుంది.
82.
ఒకప్పుడు ఒక యవ్వనస్థుడుండెను.
నిస్సందేహముగా ఆ దేశమునకు అతడు ఒక మంచిపౌరునిగా వుండెను.
అయితే దురాత్మలు అతనిని ఆవరించాయి.
చెరసాల గదులుకూడా అతన్ని బంధించలేనంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయెను.
వారు అతనిని సంకెళ్ళతో బంధించారు.
అతనిలో సేన దయ్యములుండుటచేత సుళువుగా సంకెళ్లును తెంపుకొని స్వేచ్చగా వెళ్ళిపోయేవాడు.
అపవిత్రాత్మలు అతనిని సమాధులలోనికి తీసికెళ్ళేను గనుక అతడు ఇక అక్కడే జీవించుచుండెను.
అతడు కేకలువేయుచూ, తననుతానే రాళ్ళతో గాయపరుచుకోనేవాడు.
ఓ!
అతని స్థితి భయంకరముగా వుండెను.
అపవిత్రాత్మలు కొద్దిసేపు అతనిని వదిలి వెళ్ళినప్పుడు, నిస్సందేహముగా అతడనుకొనేవాడు “ఇక్కడ నేను ఏమి చేయుచున్నాను?
” అని అనుకున్నంతలోనే మళ్లీ అంతలోనే అవి మరలా అతనిలోనికి వచ్చేవి, మళ్ళీ యధాస్థితిగా తన్నుతాను గాయపర్చుకోవడం, చీల్చుకోవడం చేసేవాడు.
అయితే ఒక దినాన అతడు యేసును కలుసుకొన్నాడు.
మరి అప్పటి నుండి గెరా సేలీయుల పిచ్చివాడు మామూలు స్థితికి వచ్చి (బాగుపడి), వస్త్రములు ధరించినవాడై, ఆయన పాదముల యొద్ద కూర్చుండెను.
మామూలు మనిషగా తిరిగి యింటికి వెళ్ళగలిగెను.
నాగరికత(తెలివితేటలు)కు తిరిగివచ్చెను.
తనకు ప్రియులైన వారందరి యొద్దకు వెళ్ళి, ఈలాగు చెప్పసాగెను “అప్పటి నుండి నేను మార్చబడియున్నాను” అవును.
83.
ఒకానొకనాడు ఆ కల్వరి మీద దేవుడు మరియు మరణము ముఖాముఖిగా కలుసుకొనెను, జీవము మరియు మరణము ఒకచోటుకి వచ్చెను.
అప్పుడు జీవాధిపతియగు క్రీస్తు మరణములో నుండి ముళ్ళును తీసివేసెను.
ఇక అప్పటినుండి మరణమునకు ముళ్ళు లేకుండాపోయెను.
అందున బట్టి నేనెంతో సంతోషించుచున్నాను.
దేవుడు!
మృత్యువు మరియు దేవుడు ఒకరినొకరు కలుసుకొనెను.
ఆ కలయికలో మృత్యువు మునుపటటలే వుండలేకపోయెను(మృత్యువు మార్పునొందెను)గనుక ఇప్పుడు మరణమునకు ముళ్ళు అనేది లేకుండపోయింది.
క్రైస్తవ విశ్వాసి మరణముయొక్క ముఖానే ఇలా చెప్పగలడు “ఓ మరణమా నీ ముళ్ళెక్కడ?
పాతాళమా (సమాధి) నీవిజయమెక్కడ?
” ఎందుకని?
అవి రెండు(మరణము, పాతాళము) దేవున్ని కలుసుకొన్నాయి.
మరి అప్పటినుండి అవి అదివరకటి వలె ఉండలేకపోయెను.
84.
ఒక్కసారి దేవున్ని కలుసుకుంటే ఎవరైనాసరే, ఏదైనాసరే ఎంతమాత్రము మామూలుగా ఉండనేరదు.
నీవెన్నడు ఒకేలా వుండలేవు.
85.
ఇక్కడ ఆసుపత్రి మంచం మీద పడివుండటాన్ని నేనింకా మరచిపోలేదు.
బ్రతకడానికి ఇంకా మూడు నిముషములే అని డాక్టర్లు నాకు చెప్పేశారు.
నిముషానికి పదిహేడుసార్లు నాగుండె కొట్టుకొనుచున్నది.
నేను దేవున్ని కలుసుకొన్నాను.
మరి అప్పటినుండి నేను నేనుగా లేను.
నాకేదో జరిగింది.
ఆ మార్పును ఎవ్వరూ చెప్పలేరు.
బిల్ బ్రెన్ హామ్ చనిపోయాడు.
నేను దేవున్ని కలుసుకొన్నాను, ఏదో నాలోనికి వచ్చింది.
నేను ఆయనను కలుసుకొన్న ఆ నిముషం నుండి నాలో మార్పు సంభవించెను.
ఆయన నన్ను మార్చివేసెను.
నన్ను ఒక వ్యత్యాసమైన వానిగా చేసెను.
అదేదో నూతన సంవత్సరమున తీసికొని తీర్మానం లాంటిది కాదు గానీ నేను దేవున్ని కలుసుకొంటిని.
86.
స్త్రీ, పురుషులారా మీరు దేవున్ని కలుసుకొన్నప్పుడు మీరు మారిపోతారు.
ఈరాత్రి నూతన సంవత్సరము కోసం కొన్ని తీర్మానాలు తీసికొంటాం.
తిరిగివెళ్ళి రేపటి ఉదయానికే వాటిని అతిక్రమిస్తాం, మరుసటి దీనానికే వాటిని జరిగించుటలో విఫలమౌతాం.
నూతన సంవత్సరంనకు తీర్మానాలు తీసికోవటం కాదుగానీ దేవున్ని ముఖాముఖిగా కలుసుకొని, నిత్యజీవమును పొందటం, ఆయన ఆత్మ ద్వారా తిరిగి జన్మించడం మనకు కావాలి.
87.
ఒకసారి ఒక వృదుడు, తన మనసునందు ఎంతో ఆవేదన చెందుచుండెను.
దయ్యము తన మనుస్సును గలిబిలి చేస్తుండెను.
ఒకరోజు అతడు మైదానమునకు వెళ్ళి ప్రార్థించుటకు మోకరించెను.
అతడు ప్రార్థన చేయుచూ అపవాదిని తరిమి, అక్కడొక కర్రను పాతెను.
అతడన్నాడు "సాతానా నేను నిలిపిన ఈ కర్రను చూడుము.
ఇక్కడ నేను దేవున్ని కలుసుకొన్నాను.
నిన్ను పారద్రోలి (జయించి ఉన్నాను) మరలా తిరిగి నీవు రాకుండా ఈ కర్రను పాతాను.
గనుక ఇక నీవెప్పుడైనా నామీదికి రావాలని, గలిబిలి చేయాలని ప్రయత్నించినట్లయితే తప్పక నీవు ఈ కర్రను గుర్తు పెట్టుకోవల్సిందే".
అప్పటితో ఆ పోరాటము ముగిసిపోయింది.
మనము కూడా సరిగ్గా అలాగే చేయవల్సివుంది.
ఆ వృద్ధునివలె కర్రను నాటటం కాదుగానీ ఎక్కడో ఒక రహస్య స్థలమునకు వెళ్ళి, దేవున్ని కలుసుకొని, జయము పొందుకోవలెను.
88.
ఓ, ఈ రాత్రి వందల వేల కొద్దీ తీర్మానములు తీసికొనబడతాయి.
మరలా వచ్చే సంవత్సరం ఇదే సమయానికి వాటినే తిరిగి మరలా తీసి కోవటం జరుగుతుంది.
మనం అంటాం“ఇక నుండి అబద్ధములాడం, దీనిని చేయటం ఆపుతాం, ఉద్రేకము (కోపం) మొదలగువాటిని వదిలి పెట్టేదం, మరెక్కువగా దేవుని కొరకు చేసెదం, దీనిని దానిని, ఇంకా ఏదో ఏదో చేసెదం” తీరా చూస్తే ఏదీ చేయం (తీర్మానాలన్ని బుట్ట ధాఖాలాలౌతాయి).
89.
ఈ రాత్రి మనిషికి అవసరమైనదంతా ఒక్కటే, అదేదనగా దేవున్ని ముఖాముఖిగా కలుసుకోవటం.
అలా చేసినప్పటినుండి ఇక అతడు మార్పునొందిన సృష్టి అగును.
హల్లెలూయ!
ఓ, దీనిని నేను నమ్మినరీతిగానే చెప్పగోరుచున్నాను.
ఒకడు దేవున్ని కలుసుకొన్నప్పుడు మార్పునొందుతాడు, మరి అప్పటినుండి తన జీవితకాలమంతయు అతడు ఆ మారిన స్థితిలోనే ఉంటాడు.
అతడు మార్పునొందెను.
అందువలన అతడు నిత్యజీవమును పొందెను.
అతడు నూతన సృష్టి పాతవి గతించెను.
ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను.
క్రొత్తగా అతడు కనబడును.
90.
'ఇక బ్రతకడు' అని వైద్యులు తేల్చిచెప్పిన వ్యాధిగ్రస్థుడు దేవుని యెదుటకి వచ్చి తన దీనస్థితిని దేవునికి విన్నవించుకోవచ్చును.
అప్పుడే అతడు పూర్తి ఆరోగ్యవంతునిగా మారవచ్చును, అప్పటినుండి ఒక వ్యత్యాసమైన వానిగా వుండవచ్చును.
91.
ఓ, కాంగ్రెస్ వాడైన ఉప్షా నాకు గుర్తున్నాడు.
అతడు అరవై ఆరు(66) సంవత్సరములుగా చక్రాల కుర్చీలో కూర్చోనే వుండెను.
ఒక రాత్రి కాలిఫోర్నియాలో పరిశుద్దాత్మ దిగివచ్చి, మాట్లాడుట ఆరంభించెను, అక్కడ అతడు దేవున్ని కలుసుకొనెను.
మరి అప్పటినుండి అతడు చంక కర్రలు సహాయం లేకుండానే నడువసాగెను.
92.
కాన్సర్ చేత తినివేయబడి, జీవశ్చవంలాగా పడియున్న వారిని నేను చూసాను.
డాక్టర్లు వారికి సమీపముగా వెళ్ళి, పరీక్షించి “వారు వెళ్లిపోయారు” అని చెప్పియుండిరి.
ఆదరణ కొరకు వారి ప్రియులు కూడివచ్చి తుది వీడ్కోలు పలుకులు “పలుకుటకు చేరివచ్చెదరు.
అయితే వారు దేవున్ని కలుసుకొన్న వెంటనే మరి అప్పటినుండి వారు మార్పునొందెదరు.
వ్యత్యాసముగా వారు జీవించెదరు.
93.
అదిగో ఆ వీధిలో మలినమైనచెడ్డ స్త్రీని, ఆ సందులో ఒక త్రాగుబోతును, సంఘములో ఒక వేషదారిని నేను చూడగలుచున్నాను.
రకరకములగు ఆ జనులు ప్రతి నూతనసంవత్సరమున కొంగొత్తగా జీవితమును ఆరంభించుదురు, భిన్నముగా ఉండునట్లు కార్యములును జరిగించుటకు ప్రయత్నించుటయు, నష్ట నివారణ చర్యలు చేయుటకు ప్రయత్నించుటయు మొదలైనవి చేయుదురు.
అయితే అలాంటి వారు ఒక్కసారి దేవున్ని కలుసుకోవాలి, మరి అప్పటినుండి వారు మారెదరు.
94.
మరణప్రదేశములలోను, మరణచ్ఛాయలోను కూర్చుండియున్నవారికి అప్పటినుండి యేసు భోదించుచుండెను.
95.
ఒక వ్యక్తి తనలో నిజమైన మార్పును కోరుకొన్నట్లయితే, అతడు దేవున్ని ముఖాముఖిగా కలుసుకోవల్సివుందని ఈరాత్రి నేను చెప్పుచున్నాను.
ఒక్కసారి అతడు దేవున్ని కలుసుకొన్నట్లయితే అప్పుడు ఇలా అనగలడు “అప్పటినుండి.
ఆ సమయమునుండి, నేనొక మార్పు నొందిన మనిషిని, నా అనుభవమునుబట్టి దీనిని నేను ఎరిగియున్నాను.
96.
మరి కొద్దిసేపట్లో సంఘము బలిపీఠము చుట్టు చేరవచ్చును.
నూతనముగా మీరు మీజీవితములను సమర్పించుకొందురు.
కొన్నిటిని వదలి పెట్టి, మరికొన్నిటిని బలిపీఠము యొద్ద విడిచి పెట్టెదరు.
అయితే స హెూదరుడా నేను నీకో సలహా చెప్పుచున్నాను.
ఇప్పటి వరకు నీవు దేవున్ని ముఖాముఖిగా కలుసుకోనట్లయితే మీకో సంగతి చెబుతాను.
అదేదనగా దేవున్ని కలుసుకోనేవరకు ఆ బలిపీఠమును విడువవద్దు.
మరి అక్కడే వుండిపొమ్ము.
అప్పుడు నీవు నీ వేళ్ళును నూతన సంవత్సరము వైపు చూపి“నా జీవితం మెరుగ్గావుంటకు ఎన్నో ప్రయత్నాలు, ప్రమాణాలు చేసాను కానీ లాభం లేకుండాపోయింది.
అయితే నేను దేవున్ని కలుసుకొన్నాను.
నా జీవితం మారిపోయింది.
సమస్తము క్రొత్తవయ్యాయి.
కార్యాలలో తేడా వచ్చింది.
అప్పటి నుండి అనగా దేవున్ని కలుసుకొన్నప్పటి నుండి అంతా మారిపోయింది” అని చెప్పగలవు.
97.
నూతనసంవత్సరములోకి ప్రవేశించటం గొప్ప సంగతేంకాదు.
మరికొద్ది నిముషములలో దానిని మనం ఎదుర్కొనబోవుచున్నాం.
కొద్ది సేపట్లో, అనగా మరోరెండున్నర గంటల్లో, లేదంటే ఇంకా కొంచెం ముందుగానే కావొచ్చునేమోనని అనుకొంటున్నాను.
ముఖాముఖిగా మనం నూతనసంవత్సరమును ఎదుర్కొన బోవుచున్నాం.
తీర్మానాలతోనూ, నిబంధనలతోను, మంచి ఉద్దేశ్యమును గలిగి మనం దానిని ఎదుర్కొనబోవుచున్నాం.
"ఇది మొదలుకొని బాగా బ్రతుకుతాను, శ్రేష్టముగా కార్యాలను చేయుదును” అనే మాటలతో మనం దానిని ఎదుర్కొన బోవుచున్నాం.
అందంతా మంచిదే.
దానిని నేను అభినందించుదును.
98.
సహోదరుడా, మొదటిగా నీవు దేవున్ని కలుసుకోనంత వరకు అది శాశ్వతమైనదిగా ఉండలేదు.
ఎప్పుడైతే నీవు మొదటిగా దేవున్ని కలుసుకొంటావో, మరి అప్పటినుండే ప్రతీకార్యము క్రొత్తగాను, భిన్నముగాను వుండును.
99.
దేవునికుమారుడా ప్రభువైన యేసూ, నేను నిన్ను కలుసుకొన్న కాలమును ప్రభువా నేను గుర్తుంచుకొనియున్నాను.
నైతిక విలువలు గల జీవితమును అనగా త్రాగుట, జూదమాడుట, పొగపీల్చుట వంటి వాటి చుట్టు నేను తిరగనప్పటికిని నాయందు భయంకరమైన దౌర్భగ్యమైనది ఉన్నదన్న సంగతి నాకు గుర్తెవున్నది.
ఇరువై ఏళ్ళ క్రితం ఆసుపత్రి గదిలో మరణము నన్ను కబళించగా, నా జీవితమందున్న కొదువును నేను బాగుగా ఎరిగియున్నాను.
అక్కడ నేను దేవున్ని కలుసుకొన్నాను, మరి అప్పటినుండి, అప్పటినుండి ప్రభువా నిన్నే సేవించుటకు నేను ప్రయత్నించాను.
నా జీవితం మార్చబడింది.
ప్రతీది క్రొత్తగా కనబడింది.
ప్రభువా నేను నిన్ను కలుసుకొన్నందుకు నాకెంతో సంతోషం.
మరి ఈరాత్రి నూతనసంవత్సరములోనికి ప్రవేశించటం, జీవము గల దేవుని యొక్క ఆత్మ నాహృదయములో కలిగి వుండి నూతనసంవత్సరములోనికి ప్రవేశించుచున్నానని చెప్పుటకు నేనెంతో సంతోషించుచున్నాను.
100.
ప్రభువా మాకు అనుభవములు అనుగ్రహించుము.
నీ కృప కనికరములను అనుగ్రహించుము.
మా దోషములన్నియు క్షమించుము.
ఓ ప్రభువా, దేవా, మేము నిన్ను కలసికొనియున్నామని, మా జీవితము రూపాంతం చెందియున్నవనే అనుభవాలతో రాబోయే సంవత్సరమంతా మమ్ము జీవింపజేయుము.
దానిని దయ చేయుము ప్రభువా.
మా లోటుపాట్లను మన్నించుము.
నీ పరిశుద్దాత్మలో మమ్మును వుంచుము.
మమ్మును నడిపించుము, మార్గము చూపించుము.
101.
తండ్రీ, దేవా, ఈ పందొమ్మిదివందల అరవై (1960) నన్నెదుర్కొను చున్నది.
ప్రపంచవ్యాప్తిగా కూటములకొరకు పిలుపు (అవకాశము) లున్నవి, అచ్చట లెక్కలేనంత మంది అన్యులు, పచ్చి విగ్రహారాధికులు, ఇంకా మొదలగు వారు నీ యొద్దకు వచ్చునట్లుగా కనబడుచున్నది.
ఓ ప్రభువైన దేవా నా హృదయమందు నీ ఆత్మను కలిగి, నీ బలిపీఠము తట్టు నా ముఖమును త్రిప్పుకొని, ఈ రాత్రి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.
ఓ దేవా నాకు సహాయము చేయుము, నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది దానికి నన్ను అప్పగించుకొనుచున్నాను.
ప్రభువా నీ కిష్టమైన చోట్లకి నన్ను నడిపించుము.
నీ కిష్టమైన చోట్లకి నన్ను పంపించుము.
కేవలం మాటను సెలవిముమ్మ నేను వెళ్ళదను.
102.
నా సంఘమును దీవించుము.
బ్రదర్ నెవిల్ ని దీవించుము.
ఇక్కడున్న వారందరిని, గుమ్మములలో వున్న అతిధులను దీవించుము.
ఒకరి తర్వాత ఒకరు ప్రసంగించబోయే ఈ పాస్టర్లందరిని దీవించుము, దేవా వారి పరిచర్యలను దీవించమని ప్రార్థించుచున్నాను.
బ్రదర్ నెవిల్స్ దీవించుము.
బ్రదర్ జూనియర్ జాక్సన్ ని దీవించుము.
బ్రదర్ బీలర్ ని, మిగతా సేవకులందరిని తండ్రి దీవించుము.
1960.
ని గొప్ప సంవత్సరముగా చేయుము.
103.
ప్రభువా నిన్ను ముఖాముఖిగా కలుసుకొన్నామని, దానర్థం నీ ఆత్మచేత తిరిగి జన్మించియున్నామని మేము ఎరిగియున్నాము, నిన్ను సేవించుటకు మాకు శాశ్వతమైన కృపను అనుగ్రహించుము.
యేసు నామమున మేము ప్రార్థించుచున్నాము.
ఆమేన్.
104.
మీరాయనను ప్రేమించుచున్నారా?
(సమాజము 'ఆమేన్' అనుచున్నది సంపాదకుడు.
) 1960  అనేది నేను బాగా బ్రతుకుతాను, క్రొత్తగా జీవితమును ఆరంభిస్తాను అనే మాటల సంవత్సరంగా ఇది వుండకూడదు.
నేను దేవున్ని కలుసుకొన్నాను, అప్పటినుండి, మరి అప్పటినుండి నాలో జ్ఞానమునకుమించిన దేవుని సమాధానము వున్నది, చెప్పశక్యము కానంత ఆనందము నాలోకి వచ్చియున్నది, మరి అలాగే పరిపూర్ణ మహిమ సమృద్ధిగా నాలోకి వచ్చియున్నది, నాకు సంతృప్తివున్నది.
చివరికి మరణము వచ్చినా, దేవుని రెక్కల్లో నేను సురక్షితముగా వుందును నా తుది శ్వాసవరకు.
ఏది వచ్చినా, ఏదిపోయినా పర్వాలేదు అనేటట్టుగా ఈ సంవత్సరమును వుండనిమ్ము.
105.
ఆదివారం రాత్రికి వారు ఎట్టి బాంబులనైనా వేసికోనివ్వండి.
ఒకవేళ వారు వేసినా, అదిమాత్రం పేలదు (చిటపటధ్వని చేయదు), ఎప్పటి వరకంటే మనం ఆయన మహిమలోకి చేరేటంతవరకు.
ఆమేన్.
ఏదీయు మనకు హాని చేయదు.
హల్లెలూయ!
106.
దేవున్ని నేను కలుసుకొన్నందుకు నేనెంతో సంతోషించుచున్నాను.
‘అప్పటినుండి' అని చెప్పుటకు నాకు సంతోషం.
'అప్పటినుండి' అనే దాన్ని గుండు సూదితో బల్లమీద గుర్తుకోసం కొట్టగలను.
"నేను దేవున్ని కలిసినప్పుడు, నాలో ఏదో జరిగింది.
అప్పటినుండి నేను మారిపోయాను.
శాశ్వితంగా నేను మార్చబడ్డాను” .
దేవుని యొక్క శక్తికి, మహిమకు సాక్ష్యముగా నేను ఈ దారిలో వున్నందుకు ఈ రాత్రి నాకెంతో సంతోషం.
ఒక చిన్న పురాతనమైనది ఇక్కడ వున్నది, దేవుడు అక్కడికి దిగివచ్చి నాకు ఆయన తన కృపనిచ్చి, నన్ను రక్షించి, స్వస్థపరిచి, తన పరిశుద్దాత్మతో నింపెను.
లోకములోవున్న వాటన్నిటిలోకెల్లా అతి గొప్పభాగ్యము (గౌరవము)ఆయన సువార్తను ప్రకటించుటమే గనుక దానిని నేను చేయుదును.
అప్పటినుండి ఇప్పటివరకు, నాలో ఏ ఒక్క విచారము లేదు.
ఈదినములన్నిటి కొరకు, రాబోయేకాలము వరకు, నిత్యత్వములో నేను దేవున్ని కలుసుకొనేటంత వరకు ఆయనకు కృతజ్ఞుడిగా ఉందును.
బ్రదర్ నెవిల్, దేవుడు నిన్ను దీవించును గాక.
మంచిది.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...