పరిశుద్ధాత్మ యొక్క కార్యములు (క్రియలు)
1. .... మందిరము చుట్టూ. ఈ మధ్యాహాన సమయమున ఇప్పుడే మనకు ఒక సమాధి కార్యక్రమము జరిగెను. మరలా రేపటి ఉదయమున మరొక సమాధి కార్యము గలదు. కాబట్టి "త్వరగా ఇప్పుడే మనము మందిరముకు వెళ్లాము. అందుచేత మనము ఏ ఆరాధనను విఫలమవ్వము" అని నేను చెప్పాను.
2. "వేదిక పైకి వచ్చి కొద్దిసేపు ఇచ్చట మాట్లాడుము" అని సహోదరుడు నెవిల్ నాతో చెప్పునని అసలు నేనెరుగను. ఆయన ప్రేమకొరకు, దయకొరకు, మనందరి పైయున్న కనికరము కొరకు మరియు యేసు ప్రభువు నామమున మరలా మీకు వందనములు చెప్పుటకు నాకొక అవకాశము లభించినందుకు నేనెంతగానో సంతోషించు చున్నాను. మరి మన సంఘకాపరి, మన సహోదరుడిచ్చట ఉన్నాడు.
3. అనేకమంది సేవకులకంటే సహోదరుడు నెవిల్ కొంచెం భిన్నంగా ఉంటాడని మీకు తెలుసు. ఒక సేవకుడు తన ప్రసంగ పీఠమును మరొకరికి ప్రసంగించుటకు ఇచ్చుట ఒక సాధారణమైన విషయం కాదు. దానిలోనున్న విశిష్టమైన కార్యమును మీరంతగా గ్రహించలేరు. కాని నేనిచ్చటకు వచ్చునప్పుడల్లా సహోదరుడు మిక్కిలి ప్రేమతోను మరియు సాత్వికముతోను తన ప్రసంగ పీఠమును ఎల్లప్పుడూ నాకు ఇచ్చివేయును. "సహోదరుడు బిల్... నీవు ఇచ్చటకు వచ్చి ప్రసంగించగలరాని అడుగుట మాత్రమే కాదు, నీవు వచ్చి తీరాలన్నట్లుగా నన్ను ఒప్పించునని మీకు తెలుసా! అదెట్లుండుననగా, మిక్కిలి బలవంతంగా ఆహ్వానించునట్లుగా ఉండుటవలన ఇక తప్పదన్నట్లుగా మీకనిపించును. కాబట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. అర్థమైనదా? అంతగా ఆహ్వానించే ఆ ఆహ్వానమునకు, "నేను రాలేను" అని మీరు తిరస్కరించలేరు. వారు ఎంతో దీనత్వముతో మరియు చాలా చక్కని వారుగా ఉండెదరు.
4. అతని చిన్న కుమార్తె అనారోగ్యంతో వాంతులు వచ్చుచున్నవని నాతో చెప్పుచుండగా నేను విన్నాను. సహోదరుడు జూనియర్ కుమార్తె కూడా కొద్దిసేపటి క్రితం దగ్గుచుండు టను నేను విన్నాను. అది అతని కుమార్తెయని నేను నమ్ముచున్నాను. జూనియర్, ఆవిధంగా దగ్గుచున్న బిడ్డ నీ బిడ్డనే కదా? అనేకులు జలుబు మరియు దగ్గులతో బాధపడుచున్నారు. ఇంకా కొద్దిసేపటిలో మనము రోగులకొరకు ప్రార్థించెదము.
5. ఇప్పుడు, అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము నుండి ఈ ఉదయ కాలమున తీసుకొని ప్రసంగించిన అంశంను, నేనెచ్చట విడిచి పెట్టానో మరలా అచ్చటనుండి
నేను ప్రారంభించెదను. కాబట్టి ఆ 4వ అధ్యాయము 10వ వచనములో అపొస్తలుల కార్యములుగూర్చి లేదా అపొస్తలులలోనున్న పరిశుద్ధాత్మయొక్క కార్యములు (క్రియలు) లనుగూర్చి చెప్పబడియున్నవని నేను నమ్ముచున్నాను. కాబట్టి వాటినిగూర్చి ప్రసంగించు టకు ప్రారంభించెదము. అర్థమైనదా? వాటినిగూర్చి మనమెల్లప్పుడూ తలంచెదము. వాటిని ఇట్లు పిలిచెదము. "అపొస్తలులయొక్క కార్యములు" కాని అవి అపోస్తలులయొక కార్యములు కాదుగాని, అవి అపోస్తులలోనుండి పరిశుద్దాత్మ చేసిన కార్యములు, క్రియలు, మీకు అర్థమైనదా? వారు కూడా సామాన్యమైన మానవులే. వారివలన ఏ కార్యములు చేయుటకు సాధ్యమవ్వడు. ఇంకా నేను ముందుకు సాగుటకు ముందుగా...
6. సరిగ్గా కొద్దిసేపటి క్రితం నేను సహోదరుడు ఉడ్తో కలిసి వెనుక కూర్చొని యుంటిని, ఒకానొక వ్యక్తి, అతడు ఈ మందిరమునకు ఎంతో కాలంనుండి వచ్చు చున్నాడు. తనయొక్క స్థానమేమిటో కనుగొను విషయమును అతడు ఎల్లప్పుడు కోరుకొనేవాడు. నేను చెప్పే విషయము అతడు చేసినట్లయితే నేను దానిని గూర్చి చెప్పెదను. నీవు పాడుచూ ఉండవలెను. టెంపుల్ సహోదరుడా, నీవు ఇదీ మరియు అదీ చేస్తూ ఉండవచ్చునుగాని, నీవొక మంచి గాయకుడివి. కాబట్టి దానిని నేను నిశ్చయంగా అభినందించుచున్నాను. దేవుని కొరకు పాడుటకు నీ స్వరమును నీవు సమర్పించుకొనిన యెడల దేవుడు నిన్ను ఉపయోగించుకొనును. నీవు చేయవలసిన కార్యమును విడిచి పెట్టి వేరే ఏదేదో కార్యములను చేయుచున్నావు. గనుక పాడుటకు ప్రారంభించుము. దానిలోనే నీ ప్రతిభ గలదు. ఆ ప్రతిభను నీవు ఉపయోగించుము. అది అద్భుతముగా ఉండును. పాతకాలపు పాటలు పాడుట నాకెంతో ఇష్టం. మీకు ఇష్టం లేదా? అవునండీ. సహోదరుడా నెవిల్, ఆ పాత కాలపు పాటలు వినుటకు మరియు వాటిని పాడుట నాకెంతో ఇష్టం. నిశ్చయంగా అవంటేనే నాకు ఇష్టం.
7. అలాగే సహోదరుడు నెవిలెయొక్క ప్రసంగము మరియు సమస్తము నాకు ఇష్టమైనవి.
ఆ రేడియో కార్యక్రమములో అతడు మరియు అతడి సహోదరీలు పాత కాలపు రీతిలో పాడే చక్కటి పాటలను ఆలకిస్తూ ముమ్మాటికి నేను ఆనందించెదను. మీలో అనేకమంది ఇంకా వాటిని ఆలకించకుండా ఉండవచ్చును. గనుక ప్రతీ శనివారము ఉదయము ఆ రేడియోలో వచ్చే పాటలను మీరు ఆలకించండి. అందువలన మీరు నిశ్చయంగా దీవించబడెదరు. అంతేకాకుండా నా భార్య మరియు పిల్లలు, మరియు ప్రతీ ఒక్కరు ఆ కార్యక్రమము గూర్చి ఎదురుచూచు చుందురు. ఆ కార్యక్రమములో నేనే పాల్గొనేలాగు, దానిలో నేను ఉన్నట్లుగా తలంచుచూ వాటిని గూర్చి ఎదురుచూచె దము. మా కుటుంబంలో అందరూ ఆ కార్యక్రమమును ఇష్టపడెదరు. ఆ శనివారము
ఉదయము ఆ బలిపీఠము వైపు లేదా ఆ కార్యక్రమము కొరకు మేము ఎదురుచూస్తూ ఉండెదము. మరియు అందుకొరకు మేమెంతో సంతోషించెదము.
8. ఈ ఉదయమున ఇచ్చట ఒక కార్యము సంభవించినది, దానిలో నుండి ఇంకా నేను బయటపడలేదని మీకు తెలుసా? అది ఆ బాలిక గురించియై యున్నది. దాని గురించి అత్యంత మర్మయుక్తమైన అనుభూతి నాకు కలిగియున్నది. దానిగురించి నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ ఉదయమున నేను మేల్కొనినప్పుడు, నేను నా భార్య వైపు చూచాను. మరియు "ప్రియమైనదానా, నాకు స్వప్నము లేదా ఒక దర్శనము కలిగినది. నేను నిద్రలో ఉండుటవలన అది ఒక దర్శనమని నేను చెప్పుటలేదు.కాని అదెంతో వాస్తవమైనదిగా ఉన్నది. ఆ దృశ్యము కనబడుట అదృశ్యమైనప్పుడు నేను ఆ గదిలో కూర్చొని యుంటిని" అని నేను చెప్పాను. మరియు “ఆ దర్శనము. నాకు ఎప్పుడు వచ్చినదో అది నాకు తెలియదు" అని నేను చెప్పాను.
9. కాబట్టి నేనిచ్చటకు వచ్చి చూచినప్పుడు నేను చూచిన ప్రకారమే సమస్తము జరుగుచుండుటను చూచాను. ఏ రూపమున ఒక శిశువును నేను చూచానో అదే రూపమున ఉండు శిశువునిగూర్చి కొన్ని దినముల క్రితం సహోదరి కాక్స్ని పిలిచి నేను చెప్పాను. అది ఆ శిశువుగానే ఉండితీరవలెను. ఆ చిన్న శిశువుయొక్క కనులను కేన్సర్ తినివేసెను. ఆ శిశువుయొక్క ఒక కన్ను పూర్తిగా తినివేయుటవలన ఆ భాగమున కేవలం గుల్ల(లొట్టలు)గా మాత్రమే ఉండెను. ఇప్పుడు మరొక కన్నుకూడా వ్యాపించెను. మరి ఆ శిశువు నిర్జీవముగా పండుకొని ఉన్నది. గనుక ఆ సమయమున శిశువు కొరకు ప్రార్ధించుటకు ఇచ్చటకు నావద్దకు తీసుకొని వెళ్ళండని లూయిస్విల్లీలోనున్న ప్రఖ్యాతి గాంచిన ఒక శస్త్ర వైద్యుడు ఆ శిశువు తల్లి దగ్గర చెప్పెను. ఆ కారణము చేత... గనుక ఆ శిశువు నిమిత్తమే ఆ దర్శనము దేవుడే ఇచ్చెనని నేను నమ్ముచున్నాను. ఈ రాత్రి ఈ ప్రసంగ వేదికయొద్ద నేను నిలబడియుండుట ఎంత నిజమో, అంత నిశ్చయముగా ఈ శిశువు స్వస్థపరచబడినదని నేను నమ్ముచున్నాను. అవునండీ, కాక్స్ సహోదరుడా, ఈ రకమైన కార్యములలో ఎల్లప్పుడూ కార్యములను తారుమారు చేయుదురు. ఇలాంటి వాటికొరకు నేను ప్రార్థించుట చాలా అరుదైన కార్యము.
10. ఇప్పుడు, ఈలాంటి కార్యమువంటి దానికొరకు నేనొకసారి ప్రార్థించాను. అప్పుడు సహోదరడు జార్జ్ వైట్ ఉండెను. కాని దానిగురించి స్పష్టంగా నాకు కార్యము తెలియుట లేదు. తన విషయము కొరకో లేదా చార్లీ యొక్క తల్లికొరకో ప్రార్ధించుటకు వెళ్లామని సహోదరుడు మెక్డోవల్ నన్ను పిలిచెను. ఆ తల్లి వైద్యశాలలో దాదాపు నిర్జీవంగా పడియుండెను. కాబట్టి ఆ తల్లిని వెళ్ళి చూడాలని సహోదరుడు
మెకోవల్ మరియు నేను ఇద్దరం కలిసి వెళ్ళాలని అతడు ఆశించెను. కాని నేను ఆ శిశువును చూచుట కొరకై వెళ్ళాను. నాలుగు దినములకు పిదప జార్జ్ సహాదకుడిని వెళ్ళి కలిసాను. నేను అతడిని ప్రేమించెదను. కాని అతడు అవతలి గట్టుకు వెళ్ళబోవు చున్నాడని నేను నా హృదయమంతటితో నమ్ముచున్నాను. అది నిజము. అతడు బాగవుటకు ఏ అవకాశము లేదు. అతడి గుండెలోని రక్త నాళములలో రక్తము గడ్డ కట్టుకు పోవుచున్నది. కావున ఇక ఏదైనా చేయుటకు ఏ మార్గము అచ్చట లేదు.
11. శ్రీమతి వైట్ ఇచ్చట కూర్చొని ఉన్నది. మన సహోదరి, ఆ విషయుమును గూర్చి నేనేమి తలంచుచున్నానో నన్ను ఆమె అడిగెను. అప్పటికే నాలుగు దినములుగా అతడి కొరకు ప్రార్ధించిన పిదప ఆమె అడిగెను. "అతడు వెళ్ళిపోవుటకు సిద్ధముగా ఉన్నాడని నేను నమ్ముచున్నానని" ఆమెతో నేను చెప్పాను.
12. దానిగూర్చి ఎడిత్ నావద్ద అడిగెను. ఆమెవద్ద నేనేమి చెప్పలేదు. ఆమె ఇంకా విశ్వాసిస్తున్నది. ఆమె నమ్మెను. ఆ విశ్వాసమును ఆమె దృఢముగా పట్టుకొని వున్నది.
13. షెల్బై సహోదరుడు అచ్చట కూర్చొని ఉన్నాడు. అతడు నా తోబుట్టువు వంటి సహోదరుడు. అతడు నన్ను వెలుపల కలుసుకొని, "నాన్న గురించి నీవేమని తలంచు చున్నావు" అని అతడు నన్ను అడిగెను.
14. షెళ్ళై, అతడు వెళ్ళిపోవుటకు సిద్ధంగా ఉన్నాడని నిజంగా నేను నమ్ముచున్నాను. అతడు మనలను విడిచి దూరంగా వెళ్ళిపోబోవుచున్నాడు. మంచిదే, అతడికి 73 సంవత్సరములు, తన కాలం వరకు అతడు జీవించెను. అతనికి మూడు ఇరవైలు మరియు ఒక పది సంవత్సరములు, అనగా 70 సంవత్సరములు మాత్రమే దేవుడు అతనికి వాగ్ధానము చేసెను. గనుక ఇక అతడు వెళ్ళిపొవుటకు సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముచున్నాను" అని అతడితో చెప్పాను.
15. ఆ రోజు రాత్రి నేను నా గృహమునకు వెళ్ళియుండగా, సహోదరుడు మాక్ నేను అచ్చటకు రావాలని నన్ను బలవంతము చేసెను. కాబట్టి చార్లీ అచ్చటకు నన్ను తీసుకొని వెళ్ళెను. అతడు అచ్చటకు వెళ్ళి ఆ రాత్రంతా అచ్చటే ఉండెను. లేదా తెల్లవారు జామునవరకు అక్కడే ఉండెను. నేను అచ్చటకు వెళ్ళి ఆమె కొరకు ప్రార్థించాను. అంతవరకు మాత్రమే నేను చేయగలిగినది.
16. నేను నా గృహమునకు వచ్చి నా వస్త్రములను మార్చుటకు నా గదిలోకి వెళ్ళి, నిద్రపోవుటకు సిద్ధమయ్యాను. నేను అట్లు సిద్దపడుచుండగా, ఎవరో మాట్లాడుచున్న శబ్దంను నేను విన్నాను. ఆ శబ్దం వచ్చుచున్న వైపు నేను చూచాను, అచ్చట నెరసిన
వెంట్రుకలతో ఒక స్త్రీ ఉండెను. ఆమె వంట గదిలో నిలబడి ఫోనులో ఎవరో ఒకరితో మాట్లాడుచున్నది. అది ఆ అబ్బాయి యొక్క తల్లి. అది విజము. నేను....
17. పిదప జార్జ్ సహోదరుని యొక్క గృహమునకు ప్రక్కన ఒక పాత విల్లో వృక్షము ఉండుట నేను చూచాను. మరియు మంటి పెళ్ళలు లేదా ధూళివంటిది. క్రింద పడుటను నేను చూచాను. అది చూచుటకు బంక మట్టివలె ఉండెను. అది ధూళి మరియు బురద వంటిది. “అది సమాధి” అని అతడు చెప్పెను. సమాధినిగూర్చి ఏదో కార్యము చెప్పబడెను. "మరియు" అనేకులు అతని వైపు చూస్తూ, అతడు మరణించుటకు ముందుగా వారు సమాధిలో ఉంటారని చెప్పుచూ ఎగతాళి చేయుచున్నారు" లేదా అది అలాంటిదేదో ఒక కార్యమైయుండెను. అప్పుడు నేను దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఇక వెంటనే సహోదరి వైట్కి నేను ఫోను చేసి పిలిచి ఇట్లు చెప్పాను. (అది సహోదరి ప్రైట్ అని నేను నమ్ముచున్నాను) ఆ దర్శనములోని విషయము లనుగూర్చి మరియు దాని భావముగూర్చి ఇప్పుడు సరిగ్గా అర్థం కాలేదని చెప్పాను.
18. అలాగే, చార్లీయొక్క తల్లి తన గృహమునకు వెళ్ళెను, తన గృహములో ఎవరితోనో ఫోట్లో మాట్లాడెను. అవన్నీ దర్శనములో చెప్పబడిన రీతిగా జరిగెను. ఆమె ఇప్పుడు, వెళ్ళిపోయినదని నేను తలంచుచున్నాను. కాని రేపు ఉదయము వరకు ఆమె ప్రాణంతో ఉండుట కష్టం అని వారు చెప్పినను. ఆ దర్శనములో చెప్పిన ప్రకారము ఆమె తన గృహమునకు వెళ్ళినది. ఆదేమనగా మనము ప్రార్ధించే ప్రార్థనలకు దేవుడు మనకు జవాబు ఇచ్చుచున్నాడని మనము ఎరుగునట్లుగా ఆయన చేయుచున్నాడు.
19. ఒక దినమున ఎవరో ఒకరు ఇట్లు అడిగిరి లేదా ఒక సమస్య కొరకు ఒక వ్యక్తి ఇటీవల ఉత్తరము వ్రాసెను. 'ఒక వ్యక్తికి వీర్య గ్రంథి సమస్య ఉండము. అతడు బాగయ్యెను. మరలా ఒక సంవత్సరము పిదప అతడు అదే అనారోగ్యంతో బాధ పడుచున్నాడు" అని చెప్పెను.
20. ఆలాగు జరుగుటకు ఖచ్చితముగా అవకాశము గలదు. మీరు ఈ రోజు స్వస్థత నొంది మరలా అదే సమస్యతో రేపు ఉదయం అనారోగ్యంతో ఉండవచ్చును. ఈ రోజు నీవు ఒక పాపిగా ఉండి... నీవు ఈ రాత్రి ఒక పాపిగా ఉంటూ, కాని రేషటి ఉదయమున ఒక క్రైస్తవునిగా మారిపోవచ్చును. అలాగే ఈ రాత్రి నీవు ఒక క్రైస్తవునిగా ఉండి, రేపటి ఉదయమునకు ఒక పాపిగా మారిపోవచ్చును. నిశ్చయముగా
21. జలుబుతో విపరీతంగా బాధపడు లేదా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడు ఒక మనిషికి వైద్యుడు పెన్సిలిన్ ఇంజక్షన్ వేయుట వలన అప్పటికి అతడు బాగవ్వచ్చును.
పిదప పరీక్ష చేసి అతడు జలుబు లేదా ఊపిరితిత్తుల వ్యాధి లేదా జారము వంటిడి ఏమి లేక అన్ని చక్కగా బాగయ్యాయని వారు నివేదిక ఇవ్వవచ్చును. కాని మరుసటి దినమున అదే ఊపిరితిత్తుల వ్యాధితో అతడు మరణించవచ్చును. అది నిజమే కదా? దానికి, దీనికి అసలు ఏ సంబంధం లేదు.
22. అర్థమైనదా? అదేలాగు ఉండుననగా, "దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు" అనే పాతకాలపు సామెతలాంటిది.
23. కాని ఎలాగైతేనేమి, నాకు మరలా దర్శనము వచ్చెను. ఆ దర్శనములో సహోదరుడు జార్జెట్ అచ్చట వెనుక ప్రక్క కూర్చొని ఉండుటను మరియు నేను ఆ ద్వారము గుండా వచ్చుటను చూచాను. మరి అతడు ఈ మధ్యలోనున్న దారిగుండా వచ్చుటను, మరియు అతడు ఈ మథ్యలోనున్న దారిగుండా తిన్నగా నడుచుకుంటూ వచ్చి,నాకు కరచాలముచేసి నడుచుకుంటూ వెళ్ళుటను చూచానని సహోదరి ప్రైట్ దగ్గర చెప్పాను.
24. అతడు నడువలేదని, అతడి పరిస్థితినిగూర్చి మీకందరికి తెలుసు, రక్తం గడ్డకట్టుట వలన అతని కాళ్ళు ఆవిధంగా చచ్చుపడిపోయినవి. "ఆ రక్తం గడ్డకట్టుట అతని గుండె వరకు ప్రాకుచున్నది, గనుక ఏ సమయములోనైనా అతడు మరణించునని" వైద్యుడు చెప్పెను. కాబట్టి డెబ్బది మూడు సంవత్సరముల వృద్ధుడగు అతడు ఈ భూమి మీద జీవించుటకు ఏ అవకాశము లేదు.
25. నేను మందిరమునకు తిరిగి వచ్చి సహోదరి వైట్ని పిలిచి చెప్పాను. ఆది మాత్రమే కాదు, కాని నేను అచ్చటకు వెళ్ళాను. అతని గృహంలో జనులు... ఆ ఉదయమున అతని గృహములో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉండిరని నేను నమ్ము చున్నాను. అది నిజమే కదా, జార్జ్ సహోదరుడా? ఆ ఉదయమున నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉండిరి. దానిలో ఒకరు మీ ప్రక్క ఇంటి వ్యక్తి, మరొకరు లావుగా ఉండే వ్యక్తి. "ఓ, అవును..." అని నేను చెప్పాను, (సహోదరుడు జార్జెట్, "నీవు వారితో మాట్లాడి ఉండవచ్చును. కాని నాకు జ్ఞాపకము లేదు” అని చెప్పెను -సంపా..) అయ్యా? (నీవు వారితో మాట్లాడి ఉండవచ్చును కాని నాకు జ్ఞాపకము లేదు) అనుకుంటున్నాను... ఎడిత్, అది నిజమే కదా? అవును. అచ్చట ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉండిరి. అవును. అతడు చాలా ఘోర పరిస్థితిలో ఉండెను.
26. కాని, "దేని గురించి నీవు బాధపడవద్దు. ఎందుకనగా, సహోదరుడు వైట్ నడుచుకుంటూ మరలా మందిరమునకు వచ్చును. ఇది ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని నేను చెప్పాను.
27. ఇందులో నాకు అర్థంకాని విషయం ఒకటి గలదు. "అచ్చట సమాధివంటి ఒక కార్యము ఉండెనని"నేను చెప్పాను. అట్లయితే దాని భావమేమిటి?పిదప అదేమిటని, ఆ దర్శనముయొక్క భావము స్పష్టముగా నాకు తెలుపబడెను. అదేమనగా, అతడు వెళ్ళే మందిరమునుండి అతడు విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు, అతనిని చూచి కొందరు ఎగతాళి చేసిరి. వారు దైవీక స్వస్థతను నమ్మరు. అతనికి ముందే వారు మరణించి, వారియొక్క సమాధులను త్రవ్వుటను అతడు చూచునని దాని భావము.
28. దానిలో ఇంతవరకు ఇంకా ఎంతమంది బ్రతికి ఉన్నారు. ("నేను స్వస్థతనొందిన పిదప దానిలో నలుగురు లేదా ఐదుమంది ఇంతవరకు సమాధి చేయబడిరి. నన్ను సంఘము నుండి వెలివేసిన ఆ బోధకుడు కూడా రెండు వారము క్రితం మరణించెను -సంపా..). ప్రభువు సరిగ్గానే చెప్పెను కదా? అవునండీ, నిశ్చయముగా అది అట్లే జరిగెను. నలుగురు... ఆ నలుగురు మరియు ఐదుమంది మరణించిరి. అది ఐదుమంది. జార్జ్ సహోదరుడా, ఇంకా ఒక్క సంవత్సరం కూడా అవ్వలేదు కదా? (“ఇంచుమించు ఒక్క సంవత్సరము అవుచున్నది”). ఈ సమయమునకు కేవలం ఒక్క సంవత్సరము అయినది. అది అట్లే నెరవేరును. అర్థమైనదా? ప్రభువు పలికినపుడు, ఆ మాటలు ఖచ్చితముగా పరిపూర్ణంగా ఉండును. అవి ఖచ్చితముగా నెరవేరుటను మీరు చూడ గలరు. దానిలో ఒక్కటి కూడా విపలమవ్వుటను నేనెన్నడూ చూడలేదు. అది ఏలాంటి సమస్యయైనా గాని దానితో ఏ సంబంధం లేకుండా...
29. మన ప్రియమైన వైద్యులు ఆ శిశువు కొరకు సాధ్యమైనంత కృషి చేసి వైద్యమును చేసిరి... నేను ఖచ్చితముగా దానిని చెప్పలేను, కాని అది, ఇది దాదాపుగా అలాంటి దేనని నేను ఖచ్చితముగా చెప్పగలను. ఎందుకనగా, తన పెదవులకు ఎర్రని రంగును వేసుకొని, మరియు ఆ రకమైన అలంకరణతో ఆ స్త్రీ అచ్చట నిలబడి యుండుటను నేను చూచాను. ఆ నిలబడిన స్థలమెచ్చటనగా సరిగ్గా నా భార్య యొక్క సమాధి కార్యమున ప్రసంగించిన అదే స్థలము. ఆ శిశువు చూచుటకు నా కుమార్తె శారా ఉన్నట్లుగానే ఉండెను. అర్థమైనదా? ఆ శిశువు ఆడ పిల్లయని నేను ఖచ్చితముగా చెప్పగలను. అది సత్యమైతే దానిని అడ్డుకొనుటకు ఈ ప్రపంచమున ఏదీ లేదు... కాని నేను ఆ శిశువు మరణము నుండి జీవమును పొందుకొనుటకు చూచాను. అర్థమైనదా? ఈ రాత్రి దేవుడు పరలోకమున ఉండుట ఎంత నిశ్చయమో మరియు ఆయన మాటలు ఎంత సత్యమైనవో అట్లే ఆ శిశువు జీవముతో జీవించుటకూడా అంత సత్యమైనది. ఆయన... అవునండీ. దానిని నా హృదయ పూర్వకముగా నేను విశ్వాసించుచున్నాను. కాబట్టి మనము దానిని వేచియుండి, గమనించి చూద్దాము.
ప్రభువు అద్బుతమైనవాడు. ఆయన అద్భుతమైనవాడేనా? (సమాజము "ఆమేన్" అని చెప్పుచున్నది- సంపా..). ఆయన మనపట్ల ఎంతో మంచివాడుగా ఉన్నాడు.
30. ఇప్పుడు, ఈ ఉదయమున మనము ధ్యానించుచున్న అంశము ప్రకారము, దేవునియొక్క మహిమతో సంఘము ఘణ, ఘణమని ఎట్లు మండుచున్నదో అపోస్తులుల కార్యముల పత్రికలో మనము చూచాము. తాను దేవుని యొక్క కుమారుడునని ఈ భూమిమీద సాక్ష్యమిచ్చుటకే యేసు ప్రభువు వచ్చెను. ఆయన యందు వారు ఎంతో గొప్ప ధృఢమైన నమ్మకమును కలిగియుండిరి... ఆయన శరీరమున ఈ భూమిమీద ఉన్నంతవరకు ప్రతీ ఒక్కొక్కరిలోకి ప్రవేశించుట అసాధ్యమని, తాను ఒక్క శరీరములో మాత్రమే ఉండగలనని ఆయన వారికి చెప్పెను. కాని ఆయన ఈ భూమిని వీడి పరమునకు వెళ్ళినయెడల, మరలా ఆయన ఆత్మ రూపమున తిరిగి వచ్చును.పిదప ఎవరైతే ఆయన కొరకు ఆకలి మరియు దప్పిక కలిగియుందురో మరియు ఆయన కొరకు ఆకలిగొనియున్న హృదయములోకి ఆయన వచ్చును. ఈ భూమిమీద ఆయన ఉన్నప్పుడు ఆయన చేసిన అదే కార్యములను ఈ ప్రపంచము యొక్క అంతము వరకు తన సంఘము ద్వారా వాటిని ఆయన కొనసాగించును.
31. ఈ రాత్రి సంఘమున మీరు ఉండుటకు సంతోషిస్తున్నారా? నేను ఈ సంఘము గురించి చెప్పుటలేదు... ఈ సంఘమనే పై కప్పు క్రింద కాదు. నా భావమేమనగా సంఘమున, ఒకే ఒక్క సంఘము గలదు. మీరు దానిలో చేరలేరు. మీరొక కాగితమును తీసుకొని దానిపై మీరు ఆ సంఘ సభ్యత్వంలో నమోదు చేయలేరు. దానిలో మీరు కేవలం నూతనముగా జన్మించవలెను. దానిలో నూతనముగా జన్మించుట ద్వారానే చేరగలరు. మీరు ఆ సంఘములో నూతనముగా జన్మించి తీరవలయును. మరియు దానిలో కృపద్వారా మీరు జన్మించిరి. దానిలోనికి రావాలని మీరు ఆకలిగొని యుండ లేదు, అందుకొరకు మీరు కోరుకోలేదు. దానిలోనికి చేరుటకు నీ తలంపులే నీకు అసహ్యమనిపించును. ఆ సంఘములో నీవు ఉండవలెనని దేవుడే నిన్ను నియమింపక పోతే నీవు అందులో ఉండవు. అందులో మీరు... ఆ సంఘములో మీరు ఉండవలె ననినయెడల, నీవు ఆ సంఘంలో ఉండెదవని ఈ ప్రపంచమునకు పునాది వేయబడకముందే దేవునికి తెలుసు. ఆ సంఘములో నీవు ఉండవలెనని ఆయన నిన్ను నియమించెను మరియు ఎన్నుకొనెను. అది అద్భుతముగా ఉన్నది కదా?
32. “నా స్వరమును వినువారందరు నా యొద్దకు వచ్చెదరు" అని నిజమే కదా! "తండ్రి నాకు అనుగ్రహించువారందరును నా యొద్దకు వత్తురు. అంత్య దినమున మరలా వానిని నేను లేపుదును".
33. చూడండి, ఇప్పుడు ప్రజలు ఇలాగు చెప్పెదరు. "ఆ విషయమును నేను నమ్మను", వారిని తృణీకరించవద్దు. వారికొరకు చింతించండి. అర్థమైనదా? వారికొరకు ప్రార్థిం చండి. వారు పొందుకొనుటకు ఏదీ లేదు. బహుశా వారు విశ్వసించుటకు ఇచ్చట వారికేదీ లేదు. వారు దీనిని వేదాంత దృక్పధంతో నమ్మెదరు. వారు, "సరే, అవును,దానిని నేను నమ్మెదనని”చెప్పెదరు. కాని నా భావమేమనగా, దేవుడు వారి హృదయములో నిజంగా ఉంటే మాత్రమే దానిని విశ్వాసించగలరు. అర్థమైనదా? మీకు సాధ్యమవ్వ....
34. “నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు" అని యేసు చెప్పెను. అతడు సంఘమున చేరుటవలన కాదు, అతడు బాప్తిస్మము పొందుట వలన కాదు, అతడు దీనిని చేయుట వలన కాదు, అతడు గట్టిగా అరుచుట వలన కాదు. అతడు దీనిని చేయుట వలన కాదు. సంఘములో చేరుట, బాప్తిస్మము పొందుట, అరుచుట, ఆ కార్యములన్నీ మంచివే. కాని “అతడు నమ్ముట వలన, అతడు నిత్య జీవమును కలిగియుండును" అని ఆయన చెప్పెను.
35. ఇప్పుడు, అపొస్తులుల కార్యములు 2:38లో పేతురు, "మీరు మారుమనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు" అని చెప్పెను.
36. ఇన్ని సంవత్సరములుగా నేను ఆ వాక్యమును చూచి, చదివేటప్పుడు ఆశ్చర్యము చెందెదను. “ప్రభువా, ఇచ్చట పురుషులు మరియు స్త్రీలు వచ్చియున్నారని" నేను తలంచాను. వారు ఈ బలి పీఠముయొద్దకు వచ్చి మోకాళ్ళూని, ఏడ్చుచూ, ప్రార్ధించి వెళ్ళి యేసు ప్రభువు నామమున బాప్తిస్మమును తీసుకొనుటను నేను చూచెదను. పిదప ఒక వారములోనే వారు మరలా వెళ్ళి లోక కార్యములలో మునిగి పోతున్నారు. "ఓ, దేవా! నిశ్చయముగా నీ వాక్యము అసత్యమైనది కాదు. నేను దానిని అసలు అర్ధంచేసు చేసుకోలేదు. కాని ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తూ వచ్చినయెడల, నీ వాక్యము నా యందు ఉండునని నీవు చెప్పితివని" నేను తలంచాను. కాబట్టి దానిలోని విషయమేమి టనే దానిని నేను చూచేవరకు అట్లే ఆయనను ఎడతెగక అడిగితిని. దానిని ఆయన నేనెరుగునట్లు చేసెను. అర్థమైనదా? అది నాకు సమీపముగా, నా ముందే ఉన్నను, ఒక దినమున ప్రభువు దానిని తెరచి చూపించేవరకు దానిని నేను ఎరుగకపోతిని. మొదట్లో ప్రజలు ఈ రీతిగా ఉండేవారు కాదని నేను గ్రహించాను. అర్థమైనదా? “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించకపోతే యెవడును నాయొద్దకు రాలేదు".
37. అది పొందుగోరువానివలన కాదు గాని, అతడు అట్లు ఉండాలని దేవుడే అతనిని ఎన్నుకొనెను. ఆ విషయంలో దానిని నీవు కోరుకొనుట వలన కాదు లేదా
కోరుకొనని వలన కాదు. దానికి నీవు చేయగలిగినది ఏదీ లేదు. అది కేవలం దేవుని యొక్క ఎన్నికయై యున్నది. "ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును". అది నిజము, నీనెవరికైనా గాని, నీవు ఏ ఉన్నత పదవిలో ఉన్నాగాని, నీవు రాష్ట్ర అధ్యక్షుడనైనా, వీరులలో దేశ దిమ్మరివియైనా గాని, అందులో ఒక్క రవ్వంత బేధమును కలిగి యుందదు. "దేవుడు ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును".
38. ఎవరెవరు రక్షింపబడుదురో ఈ యుగములగుండా ఆ ప్రజలందరిని ఈ లోకము ప్రారంభమగుటకు ముందే ఆయన వారిని నిర్ణయించెను. ఆయన నిర్ణయించిన ప్రతీ ఒక్కొక్కరు ఆయనయొద్దకు వచ్చెదరు. అది నిజము. ప్రతీ ఒక్కరు వచ్చెదరు. వారిలో ఎవ్వరు కూడ తప్పిపోరు. ఏ మచ్చ లేని, ఏ మడత లేని ఒక సంఘము ఉండునని ఆయన చెప్పెను. మరియు దానిని ఆయన నియమించెను.
39. ఇప్పుడు యుగములు గతించిపోవుచుండగా, ఆ గొప్ప సాంప్రదాయకమైన (Orthodox) ఉపదేశకులను గురించి ఉదయమున ధ్యానించిన మన అంశములో మనము చూచితిమి. ఈ భూమిమీద వారెంత నాజూకుగాను మరియు ప్రసిద్ధిచెందిన వారుగాను ఉండాలో మరియు ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఉంటు... పరిశుద్ధ గ్రంథమున... ఆలకించండి. పరిశుద్ధ గ్రంథము, "వారు కళంకము లేనివారుగా కనుగొన బడిరి" అని చెప్పెను.ఎందుకనగా, "ఓ, దానిని నేను తాకను. దీనిని నేను చేయను" అని వారు చెప్పిరి. చూచారా, కాని అది కృప కాదుగాని, అది క్రియలై యున్నవి.
40. మనము క్రియలు ద్వారా రక్షింపబడలేదు. మనమేమి చేసెదము? నేను చేసిన క్రియలు వలన నేను రక్షింపబడలేదు గాని, క్రీస్తు నాకొరకు ఏదైతే చేసెనో అదే నన్ను రక్షించెను. అర్థమైనదా? ఏదీ... నాలో ఏ పరిశుద్ధత లేదు.
41. “సరే, నేను మధ్యం త్రాగుట మానేసాను. పొగ పీల్చుటను నేను మానేసాను. నేను దొంగతనం మానేసాను; అబద్దములు చెప్పుట మానేసాను. మొదలగువాటిని చేసాను" అని నీవు చెప్పుటకు ప్రయత్నించవచ్చును. వాటినే నేను చేసాను. అర్థమైనదా?వాటిని నా స్వకీయంగా చేసాను. అందుకొరకు నేను వాటినిగూర్చి డంభముగా చెప్పుకోగలను.
42. కాని నాయంతట నేను వాటిని వదిలివేయలేదు, ఆయనే నాలోనికి వచ్చి వాటిని నాలోనుండి తీసివేసెను. అర్థమైనదా? ఆయనే దానిని చేసెను. నా యంతట నేను చేసినది ఏదియు లేదు. అదంతా ఆయన చేసినదే.
43. పిదప, పరిశుద్ధాత్మ నీలో నివసించుచు మరియు అనుదినము నీలో ఎదుగు చుండును. ఆ పరిశుద్ధాత్మ నీలో ఎదుగుచూ, అంతకంతకు శక్తివంతమైనదై నీ
భారములను, ప్రలోభాలను మరియు పనికిరాని కార్యములన్నింటిని నీలోనుండి బయటకు త్రోసివేయును. వాటిని నీవు జయించుకుంటూ ముందుకు సాగిపోయి నప్పుడు, పరిశుద్ధాత్మ తాను తీసుకోవలసిన స్థానమును తీసుకొనును. ఏమి చేయునో మీకు తెలుసా..? మంచిది కాని ఏదోక దుష్ట శోధనకు నీవు గురైనప్పుడు, కొన్నిసార్లు నీవు దానిని జయించుకొనినప్పుడు, పిదప నీ సాక్ష్యము ఎంత చక్కగా వికసించునో లేదో నీవు దానిని గమనించి చూడుము.
44. సమ్సోను వైపు చూడండి. ఒక కొదమ సింహము సమ్సోనును చంపుటకై అతనివైపు పరిగెత్తుకుంటూ వచ్చుచున్నప్పుడు, అతని చేతిలో ఏమియు లేకపోయినను దేవునియొక్క శక్తి అతని పైకి వచ్చినందువలన, దాని దవడలను పట్టుకొని చీల్చి చంపెను. సమ్సోను చూచుటకు చాలా చిన్నవాడిగా, రొయ్యలవలె గిరిజాల తల వెంట్రు కలను కలిగినవాడై, చెప్పుకోదగిన ఎత్తుకూడా లేనివాడై, చిన్న ఆకారముతో, సన్నగా ఉండి వీధులలో నడిచి వెళ్ళేటప్పుడు, అతనికిగల ఏడు జడలు వ్రేలాడుచూ చూచుటకు ఒక ఆడంగివలె ధృఢమైన శరీరము లేనివాడై ఉండెను. దేవుని యొక్క ఆత్మ అతనిపైకి వచ్చేంతవరకు సమ్సోను చూచుటకు ఆడంగితనము గలవానిగానే కనబడెను.
45. ఇప్పుడు, ఒక మహా గొప్ప బలాఢ్యుడు వట్టి చేతులతోనే ఒక సింహమును పట్టుకొని చంపెనను మాటను నమ్ముటకు ఏమంత ఆశ్చర్యముగా ఉండదు. అలాంటి వాడు దానిని చేయగలడని నేను నమ్ముచున్నాను. కాని సన్నంగా, చిన్న బాలునివలె ఉండువాడు ఒక సింహమును చంపెనను మాటను వినుటకు వేడుకగా ఉన్నది.
46. కాని ప్రభువు యొక్క ఆత్మ అతని పైకి వచ్చుట వలన, అతడు సింహమును చంపి, దానిని ఎత్తి ఒక ప్రక్కగా విసిరివేసెను. ఆ సింహముయొక్క కళేబరములో తేనె టీగలు గూడు కట్టెను. సమ్సోను... తాను చంపి పడవేసిన ఆ సింహపు కళేబరములో నున్న ఆ తేనె సమ్సోను రుచి చూచిన తేనెలకంటే చాలా మధురంగా ఉండెను. అది నిజమే కదా? ఎందుచేత? దేవుని యొక్క శక్తితో సమ్సోను దానిని జయించెను.
47. అలాంటి మధురమైన తేనెను తినుటకు మీవద్ద ఏదోకటి ఉన్నయెడల దానిని దేవునియొక్క శక్తితో జయించుకొనుము. అది నిజము. అదెంత యుక్తమైనదో దానిని గమనించి చూడండి. ఓ, దేవా! బహుశా, నీవు ఒక తాగుబోతుగా ఉండవచ్చును. విస్కీని లేదా బీరిని లేదా అలాంటి ఏదోక దానిని నీవు వాసన చూచే ప్రతీసారి,దానిని త్రాగాలనే కోరిక నీకు కలుగును. గనుక దానిని దేవునియొక్క శక్తితో జయించుకొనుము; అట్లు ఒక్కసారి నీవు దానిని జయించునప్పుడు అలాంటి కార్యములన్నీ చచ్చి మరియు తొలగిపొయి, అవన్నీ నీనుండి గతించిపోయినప్పుడు, అప్పుడు నీ హృదయములో
కలిగే ఆ మధుర అనుభూతిని గమనించి చూడుము. ఓ, దేవా! ఆ మధురమైన తేనెను దానినుండి నీవు పొందుకొనెదవు...
48. ఇప్పుడు, ఈ ప్రజలు నిజంగా దానిని జయించుకొనిరి. ఆ పెంతెకోస్తు దినమును వారందరూ పరిశుద్దాత్మతో నింపబడి, దేవునియొక్క శక్తులు వారిపైకి దిగెను. అన్య బాసలలో మాట్లాడుట మరియు సమస్యమైన వరములు వారికి ఇవ్వబడెను. సంఘము అగ్నిజ్వాలలతో మండుచూ అచ్చట వారొక అద్భుతమైన సమయమును కలిగియుండిరి.
49. ఇప్పుడు నేను నా మూల అంశమునకు తిరిగి నెళ్ళేంతవరకు, ఇచ్చట వేరొక దృక్పధంతో సమీపించుటకు ఈ సమయమున నాకు సాధ్యమైన యెడల స్తెఫనునుండి. తీసుకొనెదము. అచ్చట వారి మధ్య సైఫను అను ఒక మనిషి ఉండుటను గమనించండి. అతడు అపొస్తులలో ఒకడు కాదు. అతడు ఒక సంఘ పెద్ద (డీకను) మాత్రమే. కాని ఓ, సహోదరుడా, అతని హృదయములో ఏదోక విశిష్ఠమైనదానిని కలిగియుండెను. కనుక అతడు చేతులు కట్టుకొని ఒక మూలన ఊరకే కూర్చొని ఉండలేకపోయెను.
50. ఏ మనిషియైతే తన హృదయములో దానిని పొందుకొనునో అలాంటి ప్రతీ మనిషి ఊరకే అలాగే కూర్చొని ఉండలేడు, తాను పొందుకొనిన విశిష్ఠమైన దానిని గురించి ఎవరికో ఒకరికి చెప్పి తీరాలనే ఆసక్తిని అతడు కలిగియుండును.
51. ఇదిగో ఇచ్చట వారు వీధులలో సంచరించుచు, ఉజ్జీవముతో రగిలిపోవుచూ ఒక మహిమకరమగు సమయమును కలిగియుండిరి. ఎందుచేత? భయంకరమైన వీచే గాలుల మధ్య నిప్పు అంటుకొని భగభగమని మండుచున్న ఇల్లువలె అది ఉన్నది. అట్లు అగ్నితో రగిలిపోతున్న అతనిని నీవు ఆపలేవు. అదట్లే ఉండును.
52. కాబట్టి వారు స్తెఫనును పట్టుకొని వీధులలోకి ఈడ్చుకొని వెళ్ళి మహా సభఎదుట త్రోసివేసిరి. “సహోదరుడా, మనము ఇలాంటి మతి పిచ్చిని నిర్మూలముచేయుటకు ఇతడిని హతము చేద్దాము” అని వారు చెప్పిరి. కనుక వారు స్తెఫనుని ఉదయంవరకు చెఱసాలలో ఉంచిరి. ఆ మహా సభయొద్ద బహుశా, ఐదులక్షల మంది లేదా అంతకన్నా ఎక్కువ మందే అచ్చట కూడిరి. ఆ మహా సభ ఎదుట వారు స్తెఫనును త్రోసిరి.
53. స్తెఫను చెఱసాల నుండి వెలుపలికి వచ్చినప్పుడు అతని ముఖము చూచుటకు దేవ దూత ముఖమువలె తేజోవంతముగా ఉండెను. సహోదరుడా, ప్రకాశవంతమైన కాంతివలె, దానిని నేను ఊహించి చెప్పుట లేదు. కాని తానేమి మాట్లాడుచున్నాడో దానిని అతడు ఎరిగినందువలన అతని ముఖము తేజోవంతముగా ఉండెను. ఒక దేవ దూత అట్లు ప్రకాశించుచున్నాడని లేదా ఒక వెలుగు లేదా ఏదోకటి అలాగు
ప్రకాశించుచున్నదని నేను ఊహించుట లేదు. కాని దాని భావమేమనగా, తానేమి మాట్లాడుచున్నాడో దానిని గురించి గ్రహింపుగలవాడై యుండుట వలన ఆ వెలుగుతో అతని ముఖము ప్రకాశించుచున్నదనేదే దాని భావము.
54. స్తెఫను ధైర్యముతోను, గంభీరముగా వారెదుట నిలబడి, "ఓ, ఇశ్రాయేలీయుల ప్రజలారా..." అని మాట్లాడెనని పరిశుద్ధగ్రంథము చెప్పెను. స్తెఫను రక్తమును త్రాగుట కొరకు పండ్లుకొరుకుచూ ఆకలితోయున్న పది వేల తోడేళ్ళ మధ్య అతడు నిలబడియున్న ట్లుగా ఉండెను. “ఇశ్రాయేలీయుల ప్రజల్లారా, యూదయ జనులారా, తండ్రుల్లారా, మొదలగువారులారా, ఈ విషయము మీరెరుగునట్లుగా దీనిని వినుడి, అబ్రాహాము యొక్క దేవుడు... మన పితరుల యొక్క దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యెను. కల్దీయుల దేశమునుండి అతనిని వెలుపలికి తీసుకొని వచ్చెను. ఈ దేశమును దేవుడు అబ్రాహామునకు వాగ్ధానము చేసి ఇచ్చెను. అబ్రాహాం యేసుక్రీస్తును తీసుకొని వచ్చెను. ఆ యేసుక్రీస్తునే మీరు మీ దుష్ట చేతులతో సిలువవేసి చంపిరి"అని చెప్పెను.
55. స్తెఫను అలాగు చెప్పుచు తన మాటలను కొనసాగించుచు, 'ఓ, ముష్కరులారా, హృదయములయందు మరియు చెవులయందు సున్నతి పొందనివారాలారా, మీరెల్ల ప్పుడూ మీ పితరులవలె పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారని”చెప్పెను. ఓ, దేవా! ఆ ప్రసంగము రికార్డుచేయబడి, దానిని ఆలకించుటకు నేను ఇష్టపడుచున్నాను. బీలర్ సహోదరుడా, అలాంటి ప్రసంగంగల దానిని నేను వినుటకు కోరుచున్నాను. అవునండీ. “ఓ, ముష్కరులారా చెవులయందు మరియు హృదయమునందు సున్నతి పొందని వారులారా, మీ పితురులవలె మీరెల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. గనుక మీరును అట్లే చేయుదురు" అని స్తెఫను చెప్పెను. సహోదరుడా, తానట్లే రక్తమును చిందించుచు మరణించబోవుచున్నానని స్తెఫను ఎరిగి ఉండికూడా వారెదుట అంత ధైర్యంగా మాట్లాడుట అంత సులభమైన విషయం కాదు.
56. “స్తెఫను పూర్తిగా నింపబడిన ఒక వ్యక్తి...” అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. పూర్తిగా దేనితో నింపబడెను? పూర్తిగా మూర్ఖత్వంతోనా? లేదండీ. పూర్తిగా తత్వంతో నింపబడెనా?లేదండీ. “అతడు పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడెను”, స్తెఫను పరిశు ద్ధాత్మతో పూర్తిగా నింపబడి యుండుటవలననే ఇలాంటి గొప్ప కార్యములు మరియు మంచి గుణములన్నీ అతనిలో ఉండెను. ఈ లోకము అతనిని వెలుపలికి త్రోసివేసినా, పరిశుద్ధాత్మ అతనిలో ఉండెను. అతను పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడియున్న మనిషిగా ఉండెను". ఏదైనా అతడిని ఆటంకపరచినదా? మీరు దానిని ఆటంకపరచ లేరు. అతనిని ఆటంకపరచుటకు ఏదీలేదు. సహోదరుడా, అతడు అగ్ని జ్వాలలతో
గణ,గణ మండుచుండెను. గనుక సెఫను సువార్త ప్రకటించి తీరును. అతడు సువార్తను ప్రకటించుచు, అద్భుత కార్యములను మరియు సూచక క్రియలను చేయుచుండెను.
57. పిదప కొద్దిసేపటికి వారు మండిపడి, అతనిని చూచి పండ్లుకొరుకుచూ, అతని మీదపడి ఆ మహా సభ నుండి పట్టణపు వెలుపలికి ఈడ్చుకొని వెళ్ళి వారు సెఫను మరణించు వరకు అతడిపై మంటి గడ్డలను మరియు రాళ్ళను రువ్వి చంపిరి. దానికి సాక్షిగా అచ్చట పౌలు నిలబడి యుండెను. మరియు పౌలు క్రింద చూచినప్పుడు స్తెఫను మరణించుచుండగా, స్తెఫను తన కనులను పైకి ఎత్తి చూచి "ఆకాశము తెరవబడుటను నేను చూచుచున్నాను. ఆకాశము తెరువబడుటయు మరియు దేవుని కుడిపార్శమున యేసు నిలబడియుండుటను నేను చూచుచున్నాను" అని చెప్పెను.
58. పౌలు క్రింద చూస్తూ, తన తలను గీరుకొనుచు, “ఏమి జరిగినది” అని తలంచు టను నేను ఊహించుచున్నాను.
“ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో” స్తెఫను చెప్పెను.
59. కాబట్టి సెఫను పై వారు రాళ్ళు రువ్వుచున్నప్పుడే, అతడు దేవునియొక్క చేతులలో నిద్రపోవుచుండెను. ఎందుచేత? ఆ మరు క్షణము మరొక రాయి అతడిపై పడినా దానివలన ఏ నొప్పి అతనికి కలుగలేదు. అదెట్లున్నదనగా, ఒక పసి బిడ్డకు తల్లి తన పాలను ఇచ్చునట్లుగా అది ఉండెను. దేవుడు సైఫనుని క్రీస్తుయొక్క రొమ్ము పైన ఎత్తుకొని పరమున శాంతితో విశ్రమించునట్లుగా దేవుని సింహాసమునకు అతడు కొనిపోబడెను. మరియు హత సాక్షులలో అతడుకూడా ఒకడుగా లెక్కింపబడెను. ఆ రాత్రి అతనికి హత సాక్షులయొక్క కిరీటము ఇవ్వబడెను. “అమర్త్యత”తో మనుష్యుల మధ్య నిలిచియుండెను. అతడే పరిశుద్ధాత్మతో నింపబడిన స్తెఫనై యుండెను. అది నిజము. ఆ మట్టి గడ్డలు అతనిపై పడినను, పెద్ద రాళ్ళుతో వారు అతని తలపై విసిరి కొట్టుచున్నను అవేవీ అతనిని బాధించలేదు. ఎట్లనగా, దేవుడు అతనిని తన చేతులలోకి తీసుకొని లాలించుచు నిద్రపోయేలా చేసెను. అతడు మరణించెనని పరిశుద్ధ గ్రంథము చెప్పలేదు. అతడు నిద్రలోకి జారెనని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. ఆమేన్. క్రైస్తవులు మరణించే విధానము ఆవిధముగానే ఉండును. ఆమేన్. సరే మంచిది.
60. వారు అద్భుతమైన సమయమును కలిగివుండిరి. దాని నివేదిక తిరిగివచ్చెను. అది కొద్దిసేపటి క్రితం సహోదరుడు నెవిల్ చెప్పినట్లు, ఆ నివేదిక అపోస్తులులను ఉబ్బి పోవునట్లుగా చేయుటకుకాదు. సరిగ్గా వారు మరలా అదే అభిషేకముతో వెళ్ళి,వారికి సాధ్యమైనంత బలంగా సువార్తను ప్రసంగిస్తూ వెళ్ళిరి. పేతురు, యోహాను, ఇద్దరు అమాయకులు, విద్యలేనివారు, శృంగారమను దేవాలయపు ద్వారము వైపుగా వెళ్ళిరి.
61. అపవాది, “ఆ,ఇప్పుడే కదా ప్రసంగించుటకు ప్రారంభించిరి,గనుక అది నన్నేమి గాయపరచదని" చెప్పెను. పిదప ప్రజలందరూ ఆ బోధయందు విశ్వాసముంచిరి,
62, కాని శృంగార దేవాలయపు ద్వారమని పిలువబడే స్థలమునొద్దకు వారు వెళ్ళి నప్పుడు, అచ్చట ఒక మనిషి పడియుండెను. "పేతురు, ఆ మనిషిలో విశ్వాసముగలదు, గనుక అతడు స్వస్థతను పొందుకోగలడని" పరిశుద్ధాత్మ చెప్పెను. పేతురు అతనిని తేరి చూచినప్పుడు స్వస్థతను పొందకోగలిగే విశ్వాసము అతనికి గలదని గ్రహించి, "నీ పాదముల మీద లేచి నిలబడుము" అని చెప్పెను. వాని చీల మండలు బలమును పొందుకునేంత వరకు పేతురు వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తును. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు, గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడా దేవాలయములోకి వెళ్ళెను. అదేమిటో మీకు తెలుసా? వారు చేసిన ప్రసంగము మరియు అన్నింటికంటే ఈ కార్యమే అత్యధికమైన సమస్యను ఏర్పరచినది.
63. సహోదరుడా, మీరు అసాధారణమైన కార్యము వైపుగా ఏదోక దానిని చేయుటకు ప్రారంభించినప్పుడు, పాతాళంలోనున్న ప్రతీ దుష్ట వేట కుక్క ఏవిధముగా మీపై విరుచుకుపడునో గమనించి చూడండి. మీ రక్తమును త్రాగడానికి ఆతృతతో అవన్నీ కాచుకొని ఉండును. అది నిజమే కదా? నిజము.
64. మీకు నేను చెప్పెదను, పెంతెకోస్తు దినమున పేతురు ఒక వర్తమానమును ప్రసంగించగా అచ్చట మూడు వేలమంది రక్షింపబడిరి. "సరే, మంచిదే. వాళ్ళను అలాగే విడిచిపెట్టు, ఏం ఫర్వాలేదు” అని చెప్పుచూ అపవాది తన మంచం మీద నుండి అస్సలు ఏమి కదలకుండా దానిని పట్టించుకోలేదు. అది నిజము. అర్థమైనదా?
65. కాని పేతురు శృంగార దేవాలయపు ద్వారమని పిలువబడే స్థలము వద్దకు మరుసటి దినమున వెళ్ళినప్పుడు, అచ్చట తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనిషిని స్వస్థతపరిచిన వెంటనే సమస్త పాతాళము పేతురుపై దాడిచేసినది. అది నిజము. గనుక పేతురును బంధించి ఆ రాత్రంతా చెఱశాలలో వేసెను. అవునండీ. పేతురుని తీసుకొని వెళ్ళి కఠిన చెఱశాలలో వేసెను. ఎందుకనగా, పేతురు ఒక అసాధారణమైన కార్యము చేసెను. గనుక అపవాది, “ఈ దైవీక స్వస్థత వంటి కార్యములన్నీ ఇప్పుడు ప్రారంభమగుటకు నేను ఒప్పుకోను. ఒకవేళ మరలా వాళ్ళు చేసినయెడల, నిజంగా వారు నా మూలాధారంలన్నిటినీ నా నుండి నాశనము చేసెదరు. అప్పుడప్పుడు వేదాంతంతో వారిని నేను మోసగించవచ్చును. కాని ఒక అసలైన కార్యము వారినుండి బయలుదేరి వచ్చుటను ప్రజలు చూచినయెడల ఇక వారిని నేను మోసగించలేను. గనుక మరొక గుంపు ప్రజలు దానిని చూచినయెడల ఇకవారిని నేను మోసగించలేను. గనుక మరొక గుంపు వారు దీనిని చూచుటకు
అడ్డుకోవలెను" అని చెప్పెను. అది నిజము. రంగం మీదకు వచ్చుటకు ముందే వీరు చేసే ఈ అసాధారణ కార్యమును నేను
అపవాది దీనిని ఆటంకపరచలేడు. అది నిజము. దేవునియొక్క సువార్త అట్లే ముందుకు 66, అయినప్పటికీ ఆనాడు దానిని అపవాది ఆటంకపరలేకపోయెను. ఇప్పుడుకూడా సాగిపోవుచు, సాగిపోవుచు, కొనసాగిపోవుచు. దూసుకుపోతునే ఉండును. ఆకాశ ములు లేదా భూమి గతించిపోయినను, ఆ వాక్యము నిత్యము అట్లే మారని వాక్యముగా నిలిచియుండును, "ఆకాశమును, భూమియు గతించునుగాని నా మాటలు ఏ మాత్రము గలించవు". వాక్యము ఎన్నటికీ గతించిపోదు. ఆ వాక్యము దేవునివలె నిత్యమైనది. అది గతించిపోదు. కనుకనే ఆ వాక్యములోవున్న ప్రతీ దానిని నేను విశ్వాసించెదను. యేసు ఏ. ఏ కార్యములన్నిటిని అప్పుడు కలిగియుండెనో, ఇప్పుడుకూడా అదే కార్యములను ఆయన కలిగియున్నాడు. ఎల్లప్పుడూ ఆయన అదే విధముగా సమస్త కార్యములను కలిగియుండును. అది నిజము. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.
67. పెంతెకోస్తు దినమున ఏ పరిశుద్ధాత్మ క్రుమ్మరింపబడెనో అదే పరిశుద్ధాత్మ ఈ దినమునకూడా క్రుమ్మరింపబడియున్నది. ఆ పరిశుద్ధాత్మ అణగద్రొక్కబడినదని, ఎగతాళి చేయబడినదని, తప్పుగా చిత్రీకరింపబడినదని మరియు ఆవిధముగా అనేక కార్యములనుచేయుచు ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచిరని నేను అంగీకరించెదను. అలాంటి దుష్ట, నకిలీ కార్యములన్నీ అపవాది మాత్రమే చేయును. కాని ఒక అసలైన, నిజమైన పెంతెకోస్తు దినమున ఏ ఫలములను అది తీసుకొని వచ్చినదో అదే రకమైన ఫలములను పరిశుద్ధాత్మయొక్క అభిషేకము తీసుకొని వచ్చును. అదే నిజము.
68. నిశ్చయముగా, సాతాను ఇదివరకే అనేకసార్లు చావు దెబ్బలు తినియున్నది. నేను నిజమే చెప్పుచున్నాను. ఆ దిష్టి బొమ్మను మీరు చూసే ప్రతిసారి దానిచుట్టూ ఏదోక మంచి విషయమే గలదని గుర్తుంచుకోండి. ఖచ్చితముగా అది నిజము. మీరు పాత అనాస పండ్లు పండే... లేదా హెడ్ ఆపిల్స్ (చూచుటకు పనస పండువలె ఉండు ఫలము-తె. త)పండే స్థలములో ఈ దిష్టి బొమ్మలను మీరు చూడలేరు. మంచి తియ్యని ఫలములు పండే వృక్షములు గల స్థలములందే ఈ దిష్టి బొమ్మలు ఉండును. ఎందుకంటే ఈ దిష్టి బొమ్మ ఇతరులను భయపెడుతూ, పంటకు దూరంగా తరిమివేయునట్లు ఉపయోగపడును. ఆ విధముగానే ఒక మంచి అసలైన పరిశుద్ధాత్మతో నింపబడిన భక్తి ఎచ్చట ఉండునో దానిని చుట్టూ ప్రతీ దిష్టి బొమ్మలను ఈ సాతాను పెట్టుచున్నది. ఎందుకనగా, సరిగ్గా అలాంటి స్థలములోనే, అనగా వారి మధ్యలోనే పునరుర్థాణుడైన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు తన నిత్యమైన శక్తితో నిన్న నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆమేన్. దాని అర్థమేమనగా. “అది అట్లే జరుగునుగాక!". సరే మంచిది.
69. వారిని చెఱశాలలో బంధించి ఉంచిరని మనము కనుగొన్నాము.మరుసటి దినమున వారిని కొరడాలతో విపరీతంగా కొట్టి అచ్చటనుండి పంపించి వేసిరి.
70. ఇచ్చట 4వ అధ్యాయములో ఆ మరుసటి ఉదయము వారి మధ్య పేతురు నిలబడి యుండుటను మనము చూడగలము. పేతురు, “ఇశ్రాయేలీయుల ప్రజల్లారా, యూదయలో నివసించుచున్న ప్రజల్లారా, దీనిని బట్టి మీరు తెలుసుకోవలసినదేమనగా, నజరేయుడగు యేసు దేవునియొక్క మనిషని ఆయన నిరూపించెను. సమస్త సూచక క్రియలు మరియు అద్భుత కార్యములను ఆయనద్వారా దేవుడు చేసి, యేసుక్రీస్తు దేవునియొక్క మనుష్యుడని ఆయన నిరూపించెను" అని చెప్పెను. వారుకూడా ఆయన దేవునియొక్క మనుష్యుడని ఎరిగియుండిరి. పిదప పేతురు, “మీరు మీ దుష్ట చేతులతో ఆయనను సిలువవేసి మరియు జీవాధిపతిని చంపివేసిరి. ఆయనను దేవుడు జీవముతో లేపెను, దానికి మేము సాక్ష్యులమై యున్నాము" అని చెప్పెను.
71. “ఆయన నామమున ఈ వ్యక్తికున్న విశ్వాసముద్వారా ఇతడు సంపూర్ణంగా స్వస్థతనొందెను. ఈ దుర్భలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేనివలన స్వస్థతను పొందెనని నేడు మిమ్మును విమర్శించుచున్నారు. గనుక మీరందరును, ఇశ్రాయేలు ప్రజలందరును తెలుసుకోవలసినదేమనగా, యేసుక్రీస్తు నామము ద్వారానే ఈ మనుష్యుడు స్వస్థతనొందెను” అని పేతురు చెప్పెను.
72. “మీరే మత సంబంధమైన గుంపుకు చెందినవారు? మీరు దేనిక్రింద సేవకులుగా ఎచ్చట నియమింపబడిరి? వారు ఏ సమాధినుండి వెలుపలికి వచ్చిరి? లేదా అలాంటి మరొక ప్రశ్న, ఎచ్చటనుండి వీరందరూ వచ్చిరి? ఇలాంటి క్రియలు చేయుటకు మీరెచ్చట నుండి అధికారమును పొందుకొనిరి? మీరే గుంపునకు చెందిన ప్రతినిధులో మాకు చూపించిన యెడల, దానిని బట్టి మేము మా పెద్దలయొద్దకు వెళ్ళి ఈ కార్యములన్నీ మీరెందుకు చేయుచున్నారో మేము కనుగొనెదము. అవునయ్యా, ఈ రకమైన వెఱి కార్యములను ఈ చుట్టు ప్రక్కలనున్న ఏ సంఘము బోధించుచున్నదో మీరెచ్చట నుండి వచ్చితిరో మేము కనుగొనవలెనని కోరుచున్నామని” వారిని చూచి ప్రశ్నించిరి.
73. పేతురు, “యేసుక్రీస్తు నామమున, ఆయన నామమునవున్న విశ్వాసము ద్వారా ఈ మనుష్యుడు సంపూర్ణ స్వస్థత నొందెను" అని చెప్పెను. ఆమేన్.
74. ఆ మాటలను ఆలకించిన పిదప ఇక వారేమి దాని గురించి మాట్లాడలేక పోయిరి. ఎందుకనగా స్వస్థత నొందిన ఆ మనుష్యుడు అచ్చటే నిలబడి యున్నాడు. మరియు వారికి కూడా అది తెలుసు. ఆమేన్. ఆమేన్.
75. చూడండి, ఇప్పుడు ఇచ్చట పేతురు చెప్పిన దానివైపు చూడండి. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తల రాయి ఆయెను. మరి ఎవని వలసను రక్షణ కలుగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులకు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణపొందలేము.
తృణీకరించబడెను. ఎందుచేత? 76. ఓ, ఆ రాయిని తృణీకరించిరి. ఆ రాయి సొలొమోను దేవాలయమును కట్టుచున్నప్పుడు వారు...
77. ఇచ్చటున్న ఒక అందమైన చిత్ర పటమును మీరు చూడవలెనని కోరుచున్నాను. వారు సొలొమోను యొక్క దేవాలయమును కట్టుచున్నప్పుడు, దానికి ఉపయోగించిన రాళ్ళు వేర్వేరు స్థలములలో కోసి తీసుకొని రాబడినవి. అచ్చటకు ఉపయోగబడు విధముగా అవి కోసితీసుకొని రాబడినవి. వారు వాటన్నింటిని అచ్చటకు తీసుకొని వచ్చినప్పుడు... పరిశుద్ధ గ్రంథమున చెప్పిన... దేవాలయమును నిర్మించుటకు నలుబది సంవత్సరములు పట్టెనని నేను నమ్ముచున్నాను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని ఆ నలుబది సంవత్సరములలో ఎంత మాత్రమును వినబడలేదు. ఆ రాళ్ళని అచ్చటకు సమకూర్చి తీసుకొని వెళ్ళినా, ఆ రాళ్ళు ఒక దానిపై ఒకటి చక్కగా అమర్చబడెను. అమర్చబడిన రాళ్ళకు మధ్య పూత పూయుటకు కొంచెం సున్నంవంటి దానిని ఉపయోగించి వాటిని చక్కగా అమర్చిరి. అవి ఒక రాయిమీద ఒకటి అమర్చబడి, అతుకబడినవి. దాని గురించి ఆలోచించండి.
78. సహోదరుల్లారా, ఇది నా ఆలోచన, అచ్చట నిర్మింపబడిన ఆ దేవాలయము మనమిప్పుడున్న ఆత్మ సంబంధమగు ఈ దేవాలయమును సూచించుచున్నది. అచ్చట ఆ దేవాలయములోకి వారియొక్క దీవెలనలను పొందుకొనుటకు వారు వచ్చిరి.కాని మనము దేవుని ఆలయములోకి, దేవుని శరీరములోకి, యేసుక్రీస్తు యొక్క శరీరములోకి బాప్తిస్మము పొందితిమి? I కొరింథీయులు 12 "కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. (రోమా 8:1). అనగా శరీరముననుసరింపక ఆత్మనను సరించియే నడుచుకొనువారికి... "వారు ఆత్మ సంబంధమైన విషయములనే వాంఛించు దురు. శరీర(మాంస) సంబంధమైన కార్యములనుగూర్చి వారే మాత్రము పట్టించుకోరు.
79. శరీరము, "నాకు చాలా అలసటగా ఉన్నాదని" చెప్పును. కాని ఆత్మ, "నీకు అలసట ఏమీ లేదు,నేను నీ యాజమానుడను, నన్ను వెంబడించమని" చెప్పును. ఆమేన్.
80. అలాగే బలహీనముగావున్న ఒకరి విషయమును చూద్దాం. "ఆ వ్యక్తి విషయము చూస్తే అతడు బాగవ్వడు. అతడు చనిపోతాడని" వైద్యులు చెప్పెదరు. నేను ఆమె వైపు చూడగా, “అది నిజమే” అని నేనుకూడా చెప్పెదను.
81. కాని పరిశుద్ధాత్మ వచ్చి ఒక దర్శనమును నాకు యిచ్చి, "అతడు స్వస్థత పొందుకొని బాగవ్వునని" చెప్పినప్పుడు, అప్పుడు, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ మనుష్యుడు బ్రతుకును" అని నేను చెప్పెదను.
82. కాబట్టి మనము ఇక ఎప్పటికీ శరీరానుసారమైన విషయములను అనుసరింపక, ఆత్మ సంబంధమైన విషయములనే అనుసరింపవలెను. అదే నిజము.
83. వేర్వేరు ప్రాంతముల నుండి మలిచి సిద్దపరచబడి సమకూర్చబడి తీసుకొని వచ్చిన ఈ రాళ్ళు... కలప మరియు లెబానోను నుండి సరళ మ్రానులు, దేవదారు మ్రానులను కొట్టించి, వాటిని ఎద్దుల బండి మీద వేసి సముద్ర తీరమునకు తీసుకొని వచ్చి తెప్పలుగా యొప్పెకు తీసుకొని వచ్చి పిదప వాటిని దేవాలయము నిర్మించు స్థలమునకు తీసుకొని రాబడినవి. కాని అవన్నీ సమకూర్చి తీసుకొని వచ్చినప్పుడు...
84. దీనిని మీరు చూడాలని కోరుచున్నాను. ఒక రాయి ఈవిధముగా, మరొక రాయి మరొకవిధముగా మలచబడి ఉండెను. ఆ రాళ్ళను తాపీ పనివాళ్ళు మలిచేటప్పుడు బహుశా, వారి మధ్య వివాదము, మనస్పర్థలు, ఇంకా అలాంటివి వచ్చి వుండవచ్చును.
85. అదెట్లున్నదనగా నేడు ఒక గుంపు బోధకులు, "నేను మెథడిస్టుని, నేను చర్చ్ ఆఫ్ గాడికి, నేను అసెంబ్లీస్్క చెందినవాడిని, నేను దీనికి చెందినవాడినని” విభేదించు కొనునట్లు ఉన్నది. దేవునికి మహిమ, మీరట్లే మీలో మీరు విభేదించుకుంటు ఉండండి. మలిచే కార్యమును దేవుడే చేయుచున్నాడనే విషయమును మీరు జ్ఞాపకముంచుకోండి.
86. ఆ రాళ్ళు వేర్వేరు విధముగా మలచబడుచున్నప్పుడు దానిని వారు అర్థం చేసు కోలేకపోయిరి. ఆ మలచిన రాళ్ళంటిని ఒక్కటిగా చేర్చి నేలమీద ఉంచబడి, పిదప వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి తాపీ పూత పూసినప్పుడు, అవన్నీ చక్కగా అమర్చబడి నవి. ఆ రాయిని ఇక ఎంత మాత్రము కొట్టి కోయలేదు.
87. మహికరమగు ఈ దినములలో ఏదోక దినమున ప్రవచనా ప్రకారముగా ఈ ఐక్య సంఘ సమాఖ్యద్వారా సంఘములన్ని సమకూడి, అమెరికా సంయుక్త రాష్ట్రము లలోనుండి ఒక క్రొత్త పోపును నియమించుకొనును; ఇకప్పుడు వారందరూ ఏకమై మృగము వంటి ఒక ప్రతిమను రూపొందించెదరు. మెథడిస్టు, బాప్తిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు, నజరేను, పిలిగ్రం హోలినస్, వారెవరైనాగాని వాటినుండి బయటకువచ్చిన నిజమైన, అసలైన విశ్వాసులందరూ సమకూడి దేవునియొక్క ప్రేమద్వారా స్థిరపరచ బడుదురు. ఆ నిజమైన విశ్వాసులందరూ, వారే యేసుక్రీస్తు యొక్క శరీరమగుదురు. నాస్తికులు మరియు అవివేకులందరూ ఒక ప్రక్క చేరుదురు. వీరందరూ ఆ ఐక్య సంఘ సమాఖ్యలోకి వెళ్ళి చేరిపోయెదరు.
88. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘము వారుకూడా ఈ ఐక్య సంఘ సమాఖ్యలోకి వెళ్ళి చేరిపోయారని ఒక దినమున నేను చదివాను. ఓ దేవా! వారి సువార్త యొక్క బోధలన్నింటిని ప్రక్కకు త్రోసివేసిన తరువాతే వారు అట్లు దానిని చేసియుందురు. అది నిజము. ఆ ఐక్య సంఘముల సమాఖ్యలోకి వెళ్ళి చేరాలంటే పెంతెకోస్తు సూచక క్రియలను, అద్బుత కార్యములను, ఆ సిద్ధాంతములన్నింటినీ వారు నిరాకరించవలెను. ఓ, సహోదరుడా, గౌరవంకొరకు వాటన్నింటినీ నిరాకరించవలెను.
89. నేను అనేకసార్లు చెప్పినవిధముగా, నాకున్న వాటికంటే ఈ లోకమిచ్చే శ్రేష్టమైన కార్యములను పొందుకొనుటకై, ఆయనయొక్క పరిశుద్ధ గ్రంథములో చెప్పే విషయము లలో మరియు ప్రభువైన యేసు క్రీస్తునందున్న నా విశ్వాస విషయములో నేను రాజీ పడుటకంటే దేవునియందు ఒక సామాన్యునిగా ఉండుటకై ఆకలితో నా కడుపు కాలిపోవుచున్నను దాన్ని లెక్కచేయుకుండా చాలా చవకైన బిస్కెట్లను తిని, సెలయేరులో పారే నీళ్ళను త్రాగి దేవుని యొక్క సేవకునిగా ఉండుట నాకు ఎంతో ఉత్తమమైనది. ఇది అమోఘమైన (ఏ పొరపాటు లేని) దేవుని యొక్క వాక్యమని నేను విశ్వాసించెదను. మరియు దీనిలోని ప్రతీ మాట సరైనది - (సత్యమైనది) - అవునండీ.
90. ఇప్పుడు, అచ్చట వారేవిధముగా దానిని నిర్మించిరో మనము చూద్దాం. అవి నిరాకరింపబడినవి...తీసుకొనివచ్చిన రాళ్ళంటినీ క్రిందకు దించిరి. వారొక స్థలము నకు వచ్చి చూడగ అచ్చట చూచుటకు ఒక వినోదమైన రాయి వారికి కనబడినది. వారు ఆ రాయిని ఉపయోగించలేదు. "ఆ రాయి ఏం బాగోలేదని” చెప్పిరి.ఆ రాయి ఉపయోగపడదని వారు తలచి దానిని ఒక్క తన్ను తన్ని ఎచ్చటోవున్న పనికిరాని చెత్తలోకి త్రోసివేసిరి. వారు దానిని ఉపయోగించలేదు. అది చూచుటకు వినోదము (వికారము)గా ఉన్నది. వారు దేవాలయమును కట్టుటకు ప్రయత్నించిరి. వారు ఒక స్థలమువద్దకు వచ్చి,ఆ రాళ్ళన్నింటిని ఈ వైపుగా, ఆ వైపుగా అమర్చిరి.వారు దానిని కట్టుకుంటూ వచ్చుచుండగా, ఒక మూల స్థలమునకు వచ్చినప్పుడు, ఆ మూల స్థలమునకు సరిపడే రాయిని అచ్చట వారు కనుగొనలేకపోయిరి. వారు దానిని కట్టుకొనుచూ, కట్టుకొనుచూ, కట్టుకొనుచూ వెళ్ళిరి. కాని ఇంకా దానిని కట్టుకొనుచూ ముందుకు వెళ్ళాలంటే ఆ మూలకు సరిపడే మూలరాయి వారికి కావలసి వచ్చెను. అచ్చటున్న రాళ్ళంటినీ వారు దొర్లించి చూచారు, ఎలాగైనా మూల రాయిని కనుగొని తీరాలని వారు ప్రయత్నించిరి,కాని ఆ మూల రాయి వారికి ఎచ్చటా కనబడ లేదు. ఆ సమయమున ఎవరోకరు పనికిరాని చెత్తవద్దకు వెళ్ళినప్పుడు అచ్చట ఆ రాయిని కనుగొనెను. పనికిరాదని త్రోసివేసిన ఆ రాయే ఆ మూలకు ప్రధాన(తల) రాయియైనది.
91. స్నేహితుల్లారా, ఈ రోజు ఉండే పరిస్థితి అదే. మెథడిస్టు సంఘమంతా బాగానే ఉన్నది. బాప్తిస్టు సంఘము బాగానే ఉన్నది. పెంతెకోస్తు, నజరేన్, ఫిలిగ్రం హోలీనస్,అదే సంఘమైనాగాని వారందరు బాగానే ఉన్నారు. కాని సహోదరుడా, విషయమేమనగా వారు నిజమైన మూల రాయిని నిరాకరించిరి. కాబట్టే దేవుని శక్తిని, సూచక క్రియలను ఋజువు చేయుట ద్వారా ప్రపంచమంతటా ఈ సువార్త వెళ్ళలేకపోయెను. ఎందుకనగా ఈ సంఘ శాఖలు సహజాతీతమైన శక్తిని దిగజార్చుచూ, "అద్భుతములు జరుగు దినములు గతించిపోయెను. దైవీక స్వస్థతవంటి కార్యమనేది అసలు లేనేలేదు. అలాగే అన్యభాషలలో మాట్లాడుటనేది కూడా లేదు. అసలు సహజాతీతమైన కార్యమనేది ఏదీకూడా లేదు. అవన్నీ గత కాలములోనే గడిచిపోయిన కార్యములని" చెప్పుచున్నారు.
92. సహోదరుడా, సంఘ శాఖలలోవున్న ప్రతీది అలాగే చెప్పుచూ, అటక మీదకు వెళ్ళి గురకలు పెట్టుచూ నిద్రపోతున్నారని నీవు కనుగొనెదవు. ఈ సంఘ శాఖలు విడిది ఇళ్ళువంటివి తప్ప మరిదేనికి ఉపయోగపడవు. వాటిల్లోకి ఒక గుంపు జనులు వెళ్ళి చేరిరి. అవి అంతవరకే. కాని, "పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడనై ఉండుము” అని పరి శుద్ధ గ్రంథము చెప్పెను.
93. కాబట్టి సంఘములుగా ఈ సంఘశాఖలన్నీ ఏకమై వారేమి నిర్మించవలెనని ప్రయత్నించుచున్నారనే విషయమును కనుగొనవచ్చును. యేసుక్రీస్తును మరియు ఆయనయొక్క నీతిని విడిచిపెట్టి వేరే దేనిమీద వారు దేనిని కట్టలేరు. మీరు యేసుక్రీస్తును స్వీకరించిన యెడల, ఇది బుద్దిలేని కార్యమని చెప్పిన...
“ఓ, నేను యేసును స్వీకరించాను” అని చెప్పెదరు.
94. నీవు యేసును స్వీకరించిన యెడల, నీవు దేనినైతే పొందుకున్నావో దానినిబట్టి, "ఈ రాత్రి ఆయన మారని అదే యేసు ప్రభువుగా ఉంటూ, ఆయన చేసెదనని వాగ్ధానము చేసిన అదే కార్యములను ఆయన చేయుచూ, ఋజువుపరచుచున్నాడని దేవునియొక్క వాక్య ప్రేరణద్వారా నీవు చెప్పెదవు”. నీలో ఉన్నదేదోకటి అట్లు చెప్పలేకపోయిన యెడల నీవు యేసు ప్రభువును స్వీకరించలేదని భావమగును. నీవు ఏదోక తత్వ జ్ఞానమును పొందుకున్నావేగాని యేసు ప్రభువుని పొందుకోలేదు. నీ హృదయాంతరంగమున యేసు వచ్చునప్పుడు, నీ హృదయములో ఏదోకటి సంభవించి, దేవుడు చెప్పు సమస్తమును నీవు విశ్వాసించెదవు.
95. అది మాత్రమే కాదు, కాని అది అట్లే నీలో జరుగునని నీవెరుగుదువు. గనుక నీలోవున్న కార్యమును పాతాళంలోనున్న మొత్తం దెయ్యములన్నీ ఏకమైనా దానిని
అవి కదిలించలేవు, నీనుండి తీసివేయలేవు. ఎందుచేత, నిశ్చయముగా దానిని నీవు విశ్వాసించితివి, కాబట్టి దేవుడు దానిని చెప్పెను. గనుక ఇకంతటితో అది పరిష్కరింపబ డెను. "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని చెప్పినప్పుడు, మొత్తం నీ ఆశలన్నీ దానిపైనే ఆధారపడియుండును. జీవమో లేదా మరణమో, ఏదేమైనాగాని దాన్ని అట్లే విశ్వాసించుము. ఇది సత్యమని నీవు విశ్వాసించుటవలన ఏ సమయములోనైన నీ రక్తంతో నీ సాక్ష్యమును ముద్రించుకొనుటకు సిద్ధంగా ఉండదవు. ఇది దేవుడు చెప్పెను గనుక ఇది సత్యమని నీవెరుగుదువు. నీలోనున్న ఏదోకటి ఇది సత్యమని ఎరుగును.
96. కానిప్పుడు నీవు నీ విధ్యార్హత జ్ఞానముతో వచ్చినప్పుడు,దీనినిగూర్చి, దానినిగూర్చి వివాదించెదవు. ఎందుకని అడుగుచూ, "ఇది అలాగు కాదు, అది అలాగు కాదు, మేము దీన్ని నమ్మము. దాన్ని మేము నమ్మమని” చెప్పెదరు. అది తర్కించుటని నీకు తెలుసు. “ఓ, సరే, కాని అలాంటి విషయమును నేను అసలు నమ్మనని” నీవు చెప్పుచు, ఒకవేళ ఈ రాత్రి న్యూ ఆల్బనీలో అదే విషయములనుగూర్చి బల్లగుద్దుచూ నీవు మాట్లాడుచూ దేవునికి వ్యతిరేకంగా వాదించుచూ ఉండవచ్చును. ఇదెందుకు?
97. ఇంకా కొంచెం ఆలకించండి. ఆ ప్రజలు ప్రార్ధించిన ప్రార్థనలు గురించి కనుగొని చూడండి. ... అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు?... ప్రభువా, నీ కుమారుడగు యేసుని గురించి జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు?
98. వారు ఏక హృదయముతో ప్రార్థించి చెప్పినదేమనగా, దేవుని యొక్క వాక్యమును ధైర్యముగా మాట్లాడుటకు, రోగులగు ఈ ప్రజలను స్వస్థపరచుటకు నీ కుమారుడగు యేసు యొక్క చేయి చాచి స్వస్థపరచునట్లుగా నీ సేవకులకు అనుగ్రహించుదువుగాక!.
99. ఆమేన్. అలాంటి ఒక ప్రార్థనా కూటము మనకు ఉండునట్లు దేవుడు మనకు సహయము చేయునుగాక! వారు అచ్చట ప్రార్థించుచుండగా, వారెచ్చట ఏకముగా కూడుకొని వచ్చి ప్రార్థించెరో ఆ కట్టడము కదిలెను.ఓ, దేవా! ఆ విధముగానే పురుషులు మరియు స్త్రీలు ఏక హృదయముతో, ఏక మనస్సుతో ప్రార్థించే ప్రార్ధన ఈ రాత్రి మనకు అదే కావలసివున్నది. వారి మనస్సును దీనిపైన లేదా దానిపైన లేదా ఇతర కార్యములమీద, దేనిపైన పెట్టలేదు. కావున మీరు క్రీస్తునందు నశించినవారై యున్నారు. గనుక నా నిరీక్షణ యేసుక్రీస్తు యొక్క రక్తమునందు మరియు నీతియందు మాత్రమే కట్టబడియున్నది. రేపు సూర్యుడు ఉదయించినా, ఉదయించకపోయినా, మనము యేసుప్రభువుకు సేవ చేయుచూ, ఆయన అడుగు జాడలలో నడుస్తూ ముందుకు సాగిపోవుటకు ఎంత వెలను చెల్లించవలసి వచ్చినా దాని గురించి ఏ చింత పడకుండా
మనమందరము ఏకమై ఏక హృదయముతో కట్టబడి దేవునియెదుట ప్రమాణం చేద్దాము. అప్పుడు సంఘము కదిలి ముందుకు సాగిపోవుటను మీరు చూచెదరు. ఆమేన్ మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.
100. ఒక ప్రత్యేకమైన మహిళ ఈ సంఘమునకు వచ్చును. కాని ఆమె మన సంఘ సభ్యురాలు కాదు. ఆమె మెథడిస్టు సంఘుమునకు చెందినది. కాని ఆమె మనలను ప్రేమించెను, గనుక ఆమె మన సంఘమునకు వచ్చెను.
101. ఆమెను వేరొక మహిళ, "నీవు ఏ సంఘమునకు వెళ్ళుచున్నావు”అని అడిగెను. ఈ కార్యమును నేను విన్నాను. మీరుకూడా ఆమెను అడిగి తెలుసుకోవచ్చును. అప్పుడు ఈమె, "నేను బ్రాన్హాం గుడారమునకు (మందిరము) వెళ్ళుచున్నానని" చెప్పెను.
102. దానిని విన్న ఈ మహిళ, "ఏమిటి, ఆ రకమైన సిద్ధాంతమును వినుటకా నీవు అచ్చటకు వెళ్ళుచున్నావు, అలాంటి పనికిరాని విషయములను కూర్చొని వినుటకు అక్కడకు వెళ్ళుచున్నావా?" అని అడిగెను. "ఏ రకమైన ఉపదేశము?" అని ఈ మహిళ అడిగెను.
103. "వాళ్ళు ఎప్పుడూ బాప్తిస్మము గురించి చెప్పుచు, బాప్తిస్మమును ఇచ్చేటప్పుడు ఆయన నామమును ఉపయోగించెదరు, ప్రతీదానికి ఆయన నామమునే ఉపయోగిం చుచు, యేసునుగూర్చి చాలా గొప్ప ప్రగల్బాలు పలుకుచూ చెప్పెదరు" అని చెప్పెను.
104 నా సహోదరుల్లారా, పరిశుద్ధగ్రంథమున, “మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము" అని చెప్పబడియున్నది.
105. సహోదరుల్లారా నేను మీకు చెప్పుచున్నాను, నేను వివాదములు చేయువాడిని కాదు. కాబట్టి ఏ మనిషైనా, ఎచ్చటైనా, ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథము ద్వారా నేను చెప్పిన బాప్తిస్మము తప్పని ఋజువు చేసి చూపించగలవారు ఎవరైనా ఉంటే దానిని చూచుటకు నేను ఇష్టపడెదను. "నీవు పిచ్చివాడివి" అని వారుచెప్పినా, వేరేదైనా చెప్పినా, అందులో నాకేమి బాధలేదు, వాటిని నేను పట్టించుకోను.
106. కొన్ని పుస్తకాలను కొనాలని నేను ఒక పుస్తకాలు అమ్మే కొట్టుకు వెళ్ళి, ఆ కొట్టులో నేను నిలబడియుండగా, ఒక మహిళ, "అలాంటి పుస్తకాలు మా కొట్టులో ఉండవు, నేను అలాంటి పుస్తకాలును అమ్మను. మరియు ఒక మహిళ వచ్చి ఆ
పుస్తకములన్నింటిని కొనేసిందని"చెప్పెను. ఆమెవద్ద 7 పుస్తకాలు ఉండగా ఈ ప్రక వాటన్నింటిని కొనేసింది. అలాంటి పుస్తకాలు తన కొట్టులో ఉండకూడదనే ఉద్దేశ్య ముతోనే వాటన్నింటిని ఆమె ఇచ్చివేసినదని నేను ఊహించుచున్నాను. మరియు.”
107. "దైవీక స్వస్థత" అనే అంశముమీద అచ్చట చర్చకొనసాగింది. అచ్చట ఇద్దరు మెథడిస్టు బోధకులు, (ప్రెస్బిటేరియన్ బోధకుడు నిలబడివుండెను. ఆ మెథడిస్తు బోధకులు మరియు ప్రెస్బిటేరియన్ బోధకుడు నాతో మాట్లాడుటకు ప్రారంభించిరి. "సేపు చెప్పినది. నిజమే" అని వారు చెప్పిరి. నేను అచ్చట నుండి బయటకు రావడానికి కదులుతుండగా సరిగ్గా అదే సమయమున సహోదరుడు షీర్ అచ్చట నిలబడి యుండుటను నేను. చూచి ఆశ్చర్యపోయాను. అదే సమయమున సహోదరుడు క్రీచ్ లోపలికి ప్రవేశించెను.
108. వారందరు తిరిగి వెళ్ళుటకు సిద్ధపడిరి, అట్లు వారు బయలుదేరుటకు సిద్ధపడు చున్న సమయమున,ఆ మెథడిస్టు బోధకుడు నావద్దకు నడుచుకొని వచ్చి నా భుజము లపై తన చేయివేసి, "బ్రాన్హాం సహోదరుడా, నీవు యవ్వనస్థుడుగా ఉన్నప్పుడే, కరెంటు స్తంభములపైకి ఎక్కి పనిచేయుచూ, నీ ముఖము మురికితో నిండియున్నప్పుడే నీవు దైవీక స్వస్థతనుగూర్చి నాకు నేర్పించితివి. నా వృద్ధ దీన తల్లి మూత్రపిండాల వ్యాధితో మంచంపై పడియుండెను. ఆమె ఇక భాగవుటకు ఏ అవకాశము లేదు. ఆ వ్యాధితో ఆమె అలాగే పడుకొని మరణమునకు అంచులో ఉండగా, నీవు మా ఇంటికి వచ్చి నీ బూట్లను తీసివేసి, నీ పరికరములను ప్రక్కన పెట్టి నా తల్లి మంచంవద్ద మోకాళ్ళూని ఆమెకొరకు నీవు ప్రార్ధించితివి. ఒకవారం తర్వాత ఆమె సంపూర్ణంగా బాగయ్యిండని వైద్యుడు చెప్పెను" అని అతడు నాతో చెప్పెను. అది ఇరువది మూడు సంవత్సరముల క్రితం, ఇప్పటికీ ఆమె మంచి ఆరోగ్యంతో చక్కగా ఉన్నది. అది నా సంఘమైనా లేదా అదేమైనాగాని దానిని నేను లెక్కచేయను. దైవీక స్వస్థతను నేను విశ్వాసించు చున్నాను" అని అతడు చెప్పెను. హల్లెలూయా. అసలు విషయము అదేయైయున్నది.
109. “ఈ బండమీద నా సంఘమునకు కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను" కాలములు రావచ్చు మరియు పోవచ్చును. అలాగే కార్యములు మారిపోవుచూ ఉండవచ్చును; అయితే యేసుక్రీస్తయొక్క సువార్త అన్ని యుగములలో అదేవిధముగా నిరంతరం మారనిదిగా నిలిచి వుండును.
110. “ఈ బండమీద నా సంఘమును నేను కట్టుదును." అదే సంఘము? ఆ బండ ఎలాంటి బండ?
111. ఆ బండనుగూర్చి మీరు కాతలిక్కు సంఘమువద్ద అడిగిన యెడల, “అదిగో అచ్చట పెద్ద బండ పెట్టబడియున్నది. ఆ బండమీద ఈ రాత్రి కాతలిక్కు సంఘపు
అధిపతి కూర్చొనివుండి పాపములను క్షమించుటకు తగిన శక్తిని (అధికారమును)ఇతర సంఘములకు అతడిచ్చునని" చెప్పెదరు. అదే కాతలిక్కు సంఘస్థులు ఇచ్చే వివరణ.
112. అట్లే మీరు పెంతెకోస్తు వారివద్ద "ఆ బండ ఏమిటి?" అని అడిగిన యెడల... వారు "ఆ బండ క్రీస్తేయగును" అని చెప్పెదరు. ఓ, సహోదరుడా!.
113, దానినిగూర్చి యేసు ఏమని అడిగెను? "నీవేమి చెప్పుచున్నావు..." పేతురు "నేనెవరనని మీరేమి చెప్పెదరు" ఆయన అడిగెను. అచ్చట తననుగూర్చి ఆయన మాట్లాడలేదు. ఆయన, "మీరైతే నేనెవరనని చెప్పుకొనుచున్నారని" వారిని అడిగెను. "కొంతమంది నీవు మోషేవనియు, కొంతమంది నీవు ఏలీయావని చెప్పుచున్నారు". “అయితే నీవేమి చెప్పెదవు".
పేతురు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని" చెప్పెను.
114. "సీమోను బర్యానా నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈసంగతి బయలుపరచెనేగాని రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. మానవ తత్వ జ్ఞాన ముతో దీన్ని నీవు చెప్పలేదు. దీనిని ఏ వేదాంత కళాశాలలో నీవు నేర్చుకోలేదు,కాని పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెను. ఈ బండమీద ..." యేసు చెప్పెను. హల్లెలూయా. ఏ బండ? ఆత్మ సంబంధమైన దేవునియొక్క బయలు పాటును వ్యక్తిగతంగా ఆయనే బయలుపరచి యిచ్చెను. హల్లెలూయా. "ఈ బండమీద నా సంఘమును నేను కట్టుదును. పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవు".
115. ఒక వ్యక్తి నిజమైన దేవునియొక్క ఆత్మతో ఎప్పుడైతే జన్మించునో, ఆ వ్యక్తియొక్క నడి నెత్తినుండి అరికాలు వరకు పూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాణ శక్తితో నింపబడి మార్చబడియుండును. అతనియొక్క స్వంత స్వార్థపూరితమైన ఆలోచనలన్నీ నశించిపోతాయి. ఆ వ్యక్తిని దేవుడు సంపూర్ణంగా తన స్వాధీనంలోకి తీసుకొనును. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్రాయబడిన ప్రతీ వాక్యమును అతడు విశ్వాసించును. మరియు దానిని అట్లే అభ్యసించును. (లేదా) అనుసరించును.
116. “ఈ బండమీద నా సంఘమును నేను కట్టుదును. పాతాళలోక ద్వారములు
దానియెదుట నిలువనేరవు". ఆమేన్. అది మిమ్మల్ని పరవశించునట్లు చేయును, అది మిమ్మల్ని పరవశింపజేయుట లేదా? నిశ్చయముగా అది మనల్ని పరవశింపజేయును. 117. ఈ బండ(రాయి)నే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిగా త్రోసివేసిరి... ఈ ప్రభువైన యేసు నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ పొందుకోలేము.
118. పరిశుద్ధ గ్రంధములో ఇచ్చట ఇట్లు చెప్పబడినది. "వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి",
119, "ఏ వేదాంత కళాశాలనుండి వీళ్ళు వచ్చారు? ఈ వెట్టి గుంపు ఎక్కడ నుండి వచ్చిరి, సరే, విద్యలేని మరియు పామరులు, ఈ పామరులు, ఈ పామరుల గుంపు ఎవరు?వారికి అసలు అ,ఆ, ఇ, ఈ లు కూడా తెలియవు, సరే, వాళ్ళు మాట్లాడే మాటల లోని ఉపయోగించే ఆ పదాలు ఎలాంటివో చూడు, బాదు, కాదు, లేదు,భారం; తెచ్చుకో, నశించిపోతావు" ఆ మాటలు ఏంటి?ఏ రకమైన ప్రజలు వీళ్ళు? అసలు, మీరే వేదాంత కళాశాలనుండి వచ్చారు? మీరే డాక్టరు పట్టంను పొందుకున్నారు. అర్థమై నదా? కాని వారు కలిగియున్న జ్ఞానంను చూచి, వీళ్ళు యేసుతో ఉండినవారని గురైరిగిరి.
120, సహోదరుడా, అదే ప్రాముఖ్యమైనది, కాఫీ గింజలలోనుండి కాఫీ పొడిని ఎలాగు తయారు చేయుదురో ఒకవేళ మీకు తెలియకపోవచ్చు. కాని ప్రభువైన యేసుక్రీస్తును మరియు ఆయనయొక్క పునరుత్థాణ శక్తిని మాత్రము మీరు ఎరిగియుంటే అదిచాలు,ఇక మీకేమి తెలిసినా తెలియకపోయిన ఏమి ఫర్వాలేదు?... లేదండీ, ఓ, దేవా! దానియందే నేను లంగరు వేయబడి ఉండుటకు దేవా నాకు సహాయము చేయుము.
ఊటనుండి జలములు ఎచ్చట విరివిగా ప్రవహించుచున్నవో,
ఎచ్చట గొట్టె పిల్లయొక్క వెలుగు ఉండునో,
ఆ వృక్షము క్రింద నన్ను సేద తీర్చుకోనిమ్ము.
రక్షణ పొందుకొనిన ఆత్మకు ఎన్నటికీ మరణం ఉండదు.
121. నేను అచ్చట లంగరు వేయబడి ఉందునుగాక!. ఓ, దేవా! ఈ జీవిత ప్రయాణము ముగియునప్పుడు ఆకువాడని, నిరంతరం పచ్చగా ఉండు వృక్షముక్రింద నేను కూర్చొని సేద తీర్చుకొనెదను గాక!
ఓ, ఈ ప్రపంచపు వ్యర్థమైన సంపదలను ఆశించ వద్దు,
అవి చాలా వేగంగా క్షీణించును,
ఆ పరలోకపు నిధులను సంపాదించుకొనుటకు వెదుకుము,
అవి ఎన్నటికీ క్షీణించవు,
మారని దేవునియొక్క చేతిని గట్టిగా పట్టుకొని ఉండుము!
ఎన్నటికీ మారని దేవుని చేతిని గట్టిగా పట్టుకొని ఉండుము! (అది నిజము)
ఈ జీవిత ప్రయాణము సమాప్తమగునప్పుడు,
నీవు దేవునియందు యదార్థవంతుడవై యుండిన యెడల,
మహిమలో నీ గృహము ప్రకాశవంతముగాను, రమ్యముగాను ఉండును.
పరవశించిన నీ ఆత్మ దానిని చూచును గాక!
122. ఈ రాత్రులలో ఏదోక రాత్రులలో లేదా ఈ ఉదయ కాలములలో ఏదోక ఉదయ కాలములో లేదా ఈ మధ్యాహాన వేళలలో ఏదోక మధ్యాహాన వేళలో నీ నోటిలో ఉన్న పన్నును లాగి తీసినట్లుగా నీ శరీరములో నుండి నీ ఆత్మను బయటకు లాగి తీయబడి కొనిపోబడును. సుళువుగా తెగిపోవునట్లు జండు త్రాళ్ళు పై నీవు ఏ సమయములోనైనా నడుస్తూ వెళ్ళుచుందువు. అయినా దేనిగూర్చి నేను బాధపడను? మీరు దేనిగురించి బాధపడుచున్నారు? తన నిత్యమైన రెక్కలతో అతడిని ఆయన పైకి లేపును. ఆయనే అతడిని భద్రపరచును. అతనియొక్క ఆత్మ బ్రద్దలై ఇచ్చటనుండి బయలుదేరి వెళ్ళునప్పుడు, ఆ మార్గపు అంతమున ఒకరు అచ్చట నిలబడియుండి (దేవా, దేవా!) ఆయన తన నిత్యమైన హస్తములలో అతనిని చుట్టుకొని మోయుచూ భద్రపరచును. మరియు అతనిని మరణమనే గాఢాంధకార లోయల గుండా తీసుకొని వెళ్ళి తండ్రియెదుట నిర్దోషిగాను, పరిశుద్ధునిగాను సమర్పించును. కాబట్టి మనము దేనికొరకు బాధపడవలెను? ఈ లోకము ఏమి చెప్పినా లేదా అదేమిటో లేదా ఇది లేదా మరొక దానిగూర్చి మనమెందుకు చింతించవలెను? మారని దేవుని నిత్యమైన హస్తము మనలను పట్టుకొనియున్నంత వరకు ఇక మనము దేనికొరకు బాధపడవలెను?
123. ఇచ్చటున్న ప్రజలైనా, ఎవరైనా, పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలైనా ప్రతీ ఒక్కొక్కరు ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకా ఎరుగని వారైవరైనాగాని, మీరెందుకు ఆయనను సేవించకుండా ఉండుటకు గల కారణమును నాకు తెలపండి. ఇదిగో క్రిస్మస్ రాబోవు చుండగా, ఇంకా మీరు ప్రభువు యేసుక్రీస్తును అంగీకరించకుండా ఉండుటకు గల కారణమును మీరు నాకు చెప్పుడి. దీనిని గురించి లేదా దానిని గురించి ఆలోచించుట నిలిపివేయండి. "నేను దీనిని చేయవచ్చునా లేదా దానిని చేయవచ్చునా?" అనే దానిని గూర్చి అలోచించుట నిలిపివేయండి. నేను ఒకే ఒక్క దృఢమైన విషయమును మీవద్ద అడుగగోరుచున్నారు; మీరు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసిస్తున్నారా?
124. మీరు నిజంగానే విశ్వాసించినయెడల, మీరు నశించపోకుండా నిత్య జీవమును కలిగియున్నారని పరిశుద్ధ గ్రంథముద్వారా నేను మీకు ఋజువుచేసెదను. “నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవముగలవాడు", యేసుక్రీస్తు ఈ మాటలను మాటలాడినప్పుడు... పేతురు పెంతెకోస్తు దినమున వారితో మాట్లాడినప్పుడు.. సరిగ్గా పరి. యోహాను 5వ అధ్యాయములో యేసు వారితో మాట్లాడి నప్పుడు... పరిశుద్ధ గ్రంథముగుండా వారు మాట్లాడినప్పుడు, మానవుడు దానిని వక్రీకరించెను మరియు దీనిని కల్తీ చేసాడు. దీనితో ఏదో చేయాలని, ఇది చేయాలని ప్రయత్నించి సంఘ శాఖలను మరియు సమస్తమును రూపొందించిరి,
125. వారిలో కొంతమంది, "అవును, ఆయన ప్రభువైన యేసుక్రీస్తని అట్లే విశ్వాసించి లోపలికి రమ్ము, అది చాలు" అని చెప్పిరి. ఆ దయ్యము యొక్క తంత్రమును చూడాదా?. 126. "ఓ, సహోదరుడా, మేము పరవశించి చాలా సంతోషించి కేకలు వేసామూ అని ఒకరు చెప్పిరి. దయ్యము యొక్క తంత్రము అర్ధమైనదా? "మేము అన్య భాషలలో మాట్లాడాం, కాబట్టి మేము దానిని పొందుకున్నాం" అని ఒక్కరు చెప్పిరి. దయ్యము యొక్క తంత్రము మీకు అర్థమైనదా? అవన్నీ సరే మంచిదే. అయినప్పటికీ ఆనేసి కూడ క్రీస్తుకు చెందినవి కావు. దానినే మీరెరుగవలసి యున్నది.
127. ఒక వ్యక్తి నిజంగానే ప్రభువైన యేసుక్రీస్తును సంపూర్ణంగా విశ్వాసించినప్పుడు, అతడు విశ్వాసించిన ఆ నిమిషమందే నిత్యజీవమును గలవాడై వుండును. అదేనిజము. నీవు విశ్వాసించినప్పుడు నీవెవరివో నీ జీవితమే నీ గురించి చెప్పును. ఇక అప్పటినుండి.. నీ జీవితములో కొన్ని మార్పులు జరుగును. అనగా సంతోషంతో కేకలు వేయుదువు. ఆనందించెదవు, అన్య భాషలలో మాట్లాడెదవు, రోగులను స్వస్థపరచెదవు. ఇంకా ఈ వరములన్నీ మరియు ఇతర కార్యములన్నీ నీ జీవితములో జరుగును. నీవు చేయుట వలన అవి జరుగలేదుగాని, దేవునియొక్క నిజమైన సూచన నిన్ను వెంబడిం చుట వలన వాటిని నీవు చేయుదువు. అర్థమైనదా? ఓ, "మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. అప్పుడన్నియు మీకనుగ్రహింపబడును.”
128. పడిపోవుచున్న ఈ లోకమును గురించి నేను తలంచినప్పుడు, ఈ లోకము చుట్టూ నేను చూచినప్పుడు, ప్రతీ దేశముమీద గోడమీద వ్రాయబడిన చేతి వ్రాతను నేను చూచుచున్నాను. వారిపై అణు బాంబులు గురిపెట్టియుండుటను ప్రజలు చూస్తూ వణికిపోవుచున్నారు,అలాగే గొప్ప అధిపతులు మరియు కార్యము... సంభవింపబోవు కార్యములను గూర్చి పెంటగాన్ కార్యాలయము వారు చెప్పే విషయములను మీరు చదివి తీరాలి. ఈ దేశ పరిస్థితిని మీరెరుగవలసి వున్నది. సహోదరుడా, నేను మీకు ఒక విషయమును చెప్పనివ్వండి. మనమేదో చాలా బలమైవారమని, గొప్పవారమని మనల్ని మనం చూపించుకొనుచున్నాము. కాని ఈ దేశంయొక్క సరిగ్గా ప్రాముఖ్యమైన స్థలంలోనే వారు వెర్రి భయంతో భయపడుచున్నారు. మీకది తెలిసిన విషయమే. ఆ నిజమును ఒప్పుకొని తీరవలసినదే. మీరు భయపడుటకూడా న్యాయమైన విషయమే.
129. ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే భయపడకుండా ఉండుటకు హక్కుగలవానిగా యున్నాడు. అదెవరో కాదుగాని, దేవునియొక్క ఆత్మతో మరలా జన్మించిన పురుషుడు లేదా స్త్రీయై యున్నారు. అలాగే పరలోకమునకు వెళ్ళే ఒక విశ్వాసికి అణు బాంబు ఒక ప్రయాణ చీటీ (టికెట్టు) వలె ఉన్నది. హల్లెలూయా! అవునండీ. మరణము నిన్ను ఏమీ చేయలేదు. త్వరగా చనిపోతే త్వరగా మహిమలోకి వెళ్ళిపోతాం. అది నిజము.
ఈ మాంసపు అంగీని నేను విడిచిపెట్టెదను.
31
లేచి మరియు నిత్య బహుమతిని స్వాధీనము చేసుకొని, "వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నావని" మధ్యాకాశము గుండా వెళ్ళుచూ కేకలు అది మధురమైన ప్రార్ధనా సమయము. వేసెదను.
130. మరలా యవ్వన పురుషునిగా మరియు స్త్రీగా మారిపోయే తల వెంట్రుకలు నెరసిన ఈ వృద్ధ పరిశుద్ధులను అణు బాంబులు ఏమి చేయగలవు? తమ గృహాలను ఉన్నవి ఉన్నట్లుగా అట్లే విడిచిపెట్టి, దాదాపు అందరూ అవతలి గట్టుకు వెళ్ళిపోయిన పిదప ఇక మిగిలిన ఈ గృహాలను ఆ అణు బాంబు ఏం చేయగలదు? కుటంబమంతా మరలా సమకూడి ఉండుట... దేవునికే మహిమ; సహోదరుడా! ఇంతకంటే మహా గొప్ప కార్యము వేరేదైనా నీవు పొందుకోగలవా!నీ హృదయం కల్వరియందు విశ్రాంతి పొందుకొనుననే ఖచ్చితమైన హామీ ఉండుటచేత ఈ ప్రపంచమందున్న ఏ కార్యమైనా నిన్ను కదిలించగలదా, నిన్ను మార్చునా, నిన్ను కలవరపరచునా? మీరు ఆ విమోచనా దినమువరకు ఆయనయెదుట నిర్దోషులుగా మరియు పరిశుద్ధులుగాను సమర్పించుట కొరకు క్రీస్తు యేసునందు, దేవుని యొక్క రాజ్యములో లంగరు వేయబడియున్నారు.
131. నీవు ఏమి చేసావనేది కాదు ఇచ్చట, అనగా. "నేను దీనిని విడిచిపెట్టిన, మరియు నేను దానిని విడిచిపెట్టిన యెడల, "ఇక్కడ నీవు చేసిన క్రియయనేది ఏదియే లేదు. ఆయన నీకొరకు ఏమి చేసాడనేదే ప్రాముఖ్యమైనది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీవు విశ్వాసించుచున్నావా?”
132 పేతురు వెళ్ళుచున్నప్పుడు, నేను చెప్పుచున్నదేమనగా, ఫిలిప్పు ఆ నపుంసకునికి బాప్తిస్మమిచ్చుటకు వెళ్ళుచుండగా... "ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని?" నపుంసకుడు ఫిలిప్పుని అడిగెను.
133. “ఒక్క నిమిషము ఆగుము. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీవు విశ్వాసింపవలెను. నీవు దీనిని విశ్వసించినప్పుడు..." అని ఫిలిప్పు అతనితో చెప్పెను.
134. "నా పూర్ణ హృదయముతో, ఆత్మతో, మనస్సుతో ఆ యేసుక్రీస్తే దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నాను" అని ఆ నపుంసకుడు చెప్పెను.
135. నీళ్ళు పారుచున్న స్థలమువద్ద రథము ఆగినది, పిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. అంతట ఆ నపుంసకుని కళ్ళకు కనబడనంత దూరంగా పరిశుద్ధాత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఎట్లనగా, ఆకాశమార్గం గుండా దాదాపు 200 మైళ్ళ దూరమునకు
32
ఫిలిప్పును అచ్చట నుండి పరిశుద్ధాళ్ళ తీసుకొని వెళ్ళి ఉజ్జీవ కూటములు జరుగుచున్న ఆ స్థలము వద్దకు మరలా తీసుకొని వచ్చి విడిచిపెట్టెను. అది నిజము. ఓ దేవా ఆనాడు సజీవునిగా ఉన్న ఆ దేవుడే ఈనాడుకూడా సజీవుడుగానే ఉన్నాడు.
136. ఒక రాత్రి ఓడ ప్రయాణములోవున్న ఆ పౌలును నేను తలంచినప్పుడు, వార్మ ప్రాణం మిగిలి ఉండుననే నమ్మకములన్ని వారికి పోయెను ఆ ఓడలో నీళ్ళు నింటి యుండుట వలన అది చాలా అపాయ స్థితిలో ఉండెను. వారిలోవున్న సమ్మకముంతా పోయినది. ఓడలోని ఒక గదిలో పౌలు ఆ రాత్రి కూర్చొని జహంతా ప్రార్ధించుచుం ప్రభువు దూత పౌలువద్దకు వచ్చి, "పౌలా, భయపడకుము నీవు క్రైసరు ఎదుట నిలుకు వలసివున్నది,గనుక భయపడకుము. నీవచ్చట సాక్ష్యమును చెప్పవలసియున్నది.ఇదిగో నీతోకూడా ఓడలో ప్రయాణమై వచ్చుచున్న వారందరిని నేను నీకిచ్చెదనని?" చెప్పను.
137. ఆ ఓడపైకి పౌలు పరిగెత్తుకొని వచ్చి, తన చెయ్యిని ఊపుమా, గట్టిగా అరుచుచూ, "హల్లెలూయా, సహోదరుల్లారా, ఒక్క నిమిషము ఆగండి.
138.ఒక్క నిమిషము ఆగండి" అని గట్టిగా అరుచుటను నేను చూడగలుగుచున్నారు.
139, “ఓ, హో, ఎవరికో ఒకరికి దీనివలన పిచ్చిపట్టి పిచ్చివారైపోయారు" అని. వారు చెప్పిరి. అది వారికి అట్లే కనిపించును. దైవత్వమును గురించి అభ్యసించి.. పట్టభద్రలైయున్న వారందరూ ఏం జరిగిందో చూచుటకు అచ్చటకు వచ్చిరి...
140. "ఇతడు చాలా దినములు ఉపవాసము ఉండుట వలన ఇతనికి మత చెడిపోయెను. పిచ్చివాడు, ఇతడు ఉపవాసములు, ఇంకా అలాంటి అనేక కార్యములు చేయుట వలన ఒక ఇతడి పని అయిపోయినది" అని వారు చెప్పేరు. "ధైర్యంగా ఉండండి, చక్కగా ధైర్యంగా ఉండండి" అని పౌలు చెప్పెను..
141 “చక్కగా ధైర్యంగా ఉండండి, నేనెవరిని ఆరాధించుచున్నానో, ఆ ప్రభువు దూత గత రాత్రి నావద్దకు వచ్చి నిలిచి, "పౌలా, నీవు భయపడకుము. నీవు క్రైసరు ఎదుట నిలువలసియున్నది. ఇదిగో నీతో ప్రయాణం చేయుచున్న వారందరిని దేవుడు.. నీకు ఇచ్చెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పను ప్రకారము జరుగునని నేను నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైన ఒక ద్వీపము మీద పడవలసి యుండునని" చెప్పేను. చెప్పిన ప్రకారముగానే ప్రతీ మాట ఆవిధముగానే ఖచ్చితముగా జరిగెను. అది నిజము.
142. ఇప్పుడు, మీరు ఒక చిన్న విషయము గమనించాలని నేను కోరుచున్నాను. అప్పుడే ఈ విషయములో మరొక ప్రక్క దాగియున్న కార్యమును మీరు చూడగలరు..
గమనించండి. ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచినప్పుడు, “ఈ ఓడలో ఉంటేనేగాని మీరు రక్షింపబడుటకు మార్గమును కలిగియుందురు" అని పౌలు చెప్పెను, నీవు ఖచ్చితముగా, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనే మాట ప్రకారముగానే దానిని చెయ్యవలెను. ప్రభువు ఒక దర్శనమును ఇచ్చెను. గనుక దానిని ఆ ప్రకారముగానే ఆయన చేయు మార్గముననే చేయవలెను. "
143, సహోదరుడా, ఈ గందరగోళంలో నుండి ఏవిధముగానైనా బయటపడుటకై దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడియున్న సంఘమును మాదిరిగా ఇచ్చెను. బిగ్-ఫోర్స్ (భారీ ఆర్థిక సంస్థలు), పెంటగన్స్ మరియు మీకు కావలసినవన్నియు ఉండవచ్చును. మీరు సంఘుములను, సేవకులను నియమించవచ్చును మరియు తత్వశాస్త్రము, గొప్ప విద్యతో వారిని విద్యావంతులుగా చేయవచ్చును. ప్రజలు మరలా దేవునియొక్క నిత్య మార్గమునకు తిరిగి వచ్చి పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మమును పొందుకొని, ఆత్మ సంబంధమైన కార్యములతో ముందుకు సాగిపోవుచూ, సువార్తను బోధించుచూ, సూచక క్రియలు, అద్భుత కార్యములు ఆ సేవతో పాటు వెంబడించే వరకు ఇతర కార్యములు ఏవి ఉన్నా ప్రయోజనం లేదు. దీనికన్నా మించినది వేరే కార్యము లేదు. దేవునికి ఒక ప్రణాళిక గలదు, గనుక నీవే ఆ ప్రణాళిక వద్దకు రావలసియున్నది.
144. ఓ, దేవా! దేవుడు ఈ రాత్రి మనకు సహాయము చేయునుగాక! దీనిని నమ్ముటకు ఈ రాత్రి ఆయన మనకు సహాయము చేయును గాక, నెవిల్ సహోదరుడా, అదే నా ప్రార్థనైయున్నది.
145. ప్రభువైన యేసు నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ ఇవ్వబడలేదు.
146. క్రిస్మస్ పండుగను జరుపుకొను సమయమునకు మనము దగ్గరగుచున్నాము.
యేసుకు బదులుగా ప్రతీచాటా శాంతాక్లాస్ బొమ్మలతో కార్యములన్ని అలంకరింప బడినవి. ఇకెన్నటికీ యేసు పేరును ఉచ్చరించకూడా విడిచిపెట్టి దానిని, “ఎక్స్ మాస్ (X-m-a-s)' అని పిలుచుచున్నారు. “క్రీస్తు" అనే పేరు "క్రిస్మస్" అనే దానినుండి ఇకెన్నడూ “క్రీస్తు” అనే మాటను ఉచ్చరింపబడదు. వారు దానిని అట్లు చేసిరి.. ప్రజలకు అసలు దానిలోవున్న నిజమైన క్రీస్తు జన్మమునుగూర్చి లేదా క్రీస్తుయొక్క ఏ విషయము లను గూర్చి అస్సలు ఆలోచించే మనస్సు కూడా లేకపోయింది. వారు క్రీస్తు స్థానాన్ని శాంతాక్లాస్ ఆ స్థానమును ఆక్రమించిన దానిని గురించే మాత్రమే ఆలోచించెదరు. దేవునియొక్క ఆత్మతో నింపబడి పరవశించుటకు బదులుగా వారు వెళ్ళి మద్యమును త్రాగి ఆనందించుచున్నారు. అర్థమైనదా? అసలు దాంట్లో ఏ అర్ధమైన ఉన్నదా?
147. కాబట్టి విషయమేమిటంటే, సహోదరుడా, సహోదరీ దానిని నేను ఆపలేను. మీరుకూడా దానిని ఆపలేరు. అది ఆవిధముగానే ఉండునని దేవుని వాక్యము చెప్పినందువలన అది అట్లే ఉండును. “మనుష్యులు ధనాపేక్షులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు”. దానిని మీరెట్లు బ్రద్దలు చేయగలరు? “పైకి భక్తిగలవారై ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై యుందురు". వారిలో ప్రతీ ఒక్కొక్కరు సంఘమునకు వెళ్ళెదరు. అవునండీ. “పైకి భక్తిగలవారై ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై యుందురు, అట్టి వారికి విముఖుడవై ఉండుము”.
148. క్రైస్తవ సహోదరుడా, ఈ రాత్రి నేను మీతో ఉండుటవలన నేనెంతో సంతోషంగా ఉన్నాను. నేను మీతో మాట్లాడుటకు నాకు లభించిన భాగ్యమును నా హృదయమంత టితో నేనెంతగానో సంతోషించుచున్నాను.
149. ఈ వర్తమానముతో నా హృదయము సంపూర్ణంగా చుట్టబడియున్నది. సరిగ్గా ఈ ఇండియానా, జెఫర్సన్ విల్లిలో, ఆ చిన్న పాత గుడారములో ఆయనను స్వీకరించి, యేసుక్రీస్తు ఆయన కుమారుడని నేను విశ్వసించినప్పుడు, నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును దేవుడు అనుగ్రహించిన ఆ దినము నుండి ఇప్పటి వరకు అది అట్లే ఉన్నది. ఆ రాత్రి ప్రభువు నామీదికి దిగి వచ్చెను. నేనున్న గదినిండా వెలుగు ప్రకాశిం చెను. ఆ వెలుగును నేను చూడగానే నేను భయముతో వణికిపోతూ అచ్చట నుండి అసలు కదలలేకపోయాను. నేను నివసించుచున్న ఆ ఒహియో అవెన్యూలో, అచ్చటున్న గడ్డితో చేయబడిన గోనె పట్ట మీద నేను మోకాళ్ళూని ప్రకాశించుచున్న ఆ వెలుగును చూచుచుండగా ఆ వెలుగు శిలువ ఆకారంగా మారిపోయి, ఆ సిలువ ఆకారంలోనుండి ఏదోకటి నాతో మాట్లాడుచుండెను. ఆ రాత్రినుండి దేవుని వాక్యముమీద, యేసుక్రీస్తు పైన, ఆయన నీతిని ఆధారము చేసుకొని నా ఆశలు కట్టబడుతూ వచ్చెను. వాటిమీద తప్ప వేరేదేనిపైన నేను నా ఆశలను ఆధారము చేసుకోలేదు. దానినే నేనే నా పూర్ణ హృదయముతో విశ్వాసించుచున్నాను. ఇప్పటికీ నా నమ్మకము(నిరీక్షణ)సరిగ్గా దాని యందే లంగరు వేయబడినందు వలన ఏమి జరిగినా, ఏం పోయినా నేను లెక్కచేయను.
150. కాబట్టి నేనేమి విశ్వాసించుచున్నానో దానిని విశ్వాసించే మరియు నేను స్వీకరించిన అదే ప్రభువైన యేసుక్రీస్తును స్వీకరించిన వారితో ఈ సహవాసము చేయుచూ ఈ వారితో కూర్చొని ఉండుట నేనెంతో సంతోషించుచున్నాను.
అనేక సంవత్సరములుగా, అనేక ప్రమాదములను, శోధనలను మరియు అనేక ఉచ్చులను దాటుకుంటూ ఇదివరకే నేను వచ్చితిని.
అది నా వయస్సును పెంచింది, నన్ను బ్రద్దలు చేసినది, అది నా చర్మంను ఒలిచినది.
అయినా కృప నన్ను కాపాడి ఇంతమట్టుకు నన్ను తీసుకొని వచ్చినది ఆ కృపయే నన్ను తన చేతులలో తీసుకొని భద్రపరచెను. ప్రకాశవంతముగా ప్రకాశించే ఆ సూర్యునివలె, మనము పది వేల సంవత్సరములు అచ్చట ఉన్నప్పుడు మనము దేవునిని కీర్తిస్తూ స్తుతించుటకు ప్రారంభించిన ఆ మొదటి ఘడియవలె దినములు గతించిపోకుండా నిత్యము ఆయనను మనము కీర్తిస్తూ స్తుతించెదము.
151. దానియేలు ఆ దర్శనమును చూచినప్పుడు, అతడు "దుర్మార్గులు అంత్య దినములలో దుర్మార్గమును చేసినను, కాని తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు (వీర కృత్యములు) చేసెదరు" అని చెప్పెను. ఈ సమయమున ఆ విషయమునుగూర్చి చూద్దాం. "గొప్ప కార్యములు (వీర కార్యములు- Exploits)అంటే ఏమిటి? విశ్వాసముయొక్క వీర కార్యములు సూచక క్రియలను మరియు అద్భుత కార్యములను జరిగించును. కాని దుర్మార్గులు ఇంకా దుర్మార్గపు కార్యములనే చేయు దురు. వారు నలు దిశలు సంచరించినందున తెలివి అధికమగును. ఓ, దానియేలు ఈ గ్రంథమును ముద్రించుము. నీవు అంత్యమువరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. బుద్దిమంతులు అనేకులను క్రీస్తు వైపుకు త్రిప్పుదురు. అనగా నీతి మార్గముననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరము ప్రకాశించెదరు" చెప్పెను.
152. నలుబది సంవత్సరములకే నన్ను తునాతునకలుగా బ్రద్దలు చేసెను. ఒకవేళ ఎనుబది సంవత్సరములకు మిమ్మల్ని తునాతునకలుగా బ్రద్దలు చేయవచ్చును. ఒక్క చిటికెను వేయు సమయములో అనగా కేవలం ముప్పది సంవత్సరములలోనే మిమ్మల్ని ఒక భిన్నమైన వ్యక్తిగా మార్చివేయవచ్చును.
153. కాని ఉదయకాలమున ఉదయించే ఆ వేకువ చుక్కను (ఉదయ కాల నక్షత్రము) మీరెన్నడైనా గమనించారా? ఆకాశములో ఉదయ కాలమున మిళమిళ మెరయుచు, ఆనందంతో కేకలు వేయుచు సంతోషించే ఆ నక్షత్రమును చూచుటకు మీరెన్నడైన వేకువ జామున లేచి చూచితిరా? దానియొక్క అందమును ఒక్క రవ్వంతకూడా అదెన్నడూ కోల్పోలేదు. దేవుడే దానిని కక్ష్యలో పెట్టెను. ఆయన ఆకాశ మండలములో దానిని కక్ష్యలో పెట్టిన దినమున అదెట్లుండెనో ఇప్పటికీ అదింకా ప్రాకాశవంతము గాను మరియు ఎంతో అందముగాను ఉన్నది. ఎన్నో వేల వేల కాలములు, వేల వేల సంవత్సరములైనా అది ఎన్నడూ, తనయొక్క సొగసును కోల్పోలేదు.
154. పరిశుద్ధ గ్రంథమున, "నీతి మార్గముననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరం ప్రకాశించెదరు" అని చెప్పబడెను. హల్లెలూయా! సహోదరుడా, ఒక బోధకునిగా ఉండుట ఎంత ఒక మంచి విషయముగా ఉన్నది కదా? అవును కదా? అవును, ఇదెంతో మంచి విషయము. అలాగే ఒక క్రైస్తవునిగా ఉండుటకూడా ఎంతో ఒక మంచి విషయముగా ఉన్నది.
155. ఇవి కఠినమైన కాలములుగా ఉండవచ్చును. పూలపాన్పు వంటి చాలా సులువైన ఒక జీవితమును దేవుడు వాగ్ధానము చేయలేదు. కాని మిమ్మల్ని తాకగల ప్రతీ శోధనలో చాలునంత కృపను ఆయన మనకు వాగ్ధానము చేసియున్నాడు.అది నిజము. అవును, వాస్తవముగా ఆయన కృప మనకు చాలునంతగా ఉన్నది. అనగా పూలపాన్పు మీద చాలా హాయిగా అతడు ఉంటాడని అర్థంకాదుగాని, ప్రతీ శోధనను ఎదుర్కొని జయించుటకు ఆయన కృపను మనకు వాగ్ధానము చేసెను.ఆ శిలువ నీకు భారంగావున్న సమయంలో క్రీస్తు నీతో ఉందునని వాగ్ధానం చేసెను. అవునండీ.
156. ఇవన్నీ సమాప్తమైనప్పుడు ఏదోక మహిమకరమగు దినమున ఆయనను సమాధానముతో మనము కలుసుకొనెదము. మీలో ప్రతీ ఒక్కొక్కరు అదే కార్యమును పొందుకొనునట్లు దేవుడు దానిని అనుగ్రహించునుగాక!
157. ఈరాత్రి ఇచ్చట అవిశ్వాసి ఉన్నయెడల, ప్రభువైన యేసుక్రీస్తును మీరు విశ్వాసిం చండి. మీరు ఆయనను విశ్వాసించు ఆ నిమిషమే దేవుడు మీగూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన రాజ్యములో మీరు నిరంతం ఉండునట్లు మిమ్మల్ని ముద్రించెను. ఇప్పుడీ సమయమున ఏదైనా మీ హృదయమును తట్టుచుండిన, మీరు దానిని అనుభవించు చుండిన,దానిని మీరు త్రోసివేసినయెడల, “అవును, ప్రభువైన యేసు" అని మీరు చెప్పేంత వరకు మీరు దౌర్భాగ్యమైన ఒక పురుషునిగాను మరియు స్త్రీగాను ఉండెదరు.
158. రాబోయే వారం క్రిస్మస్ పండుగ సమయముగా ఉన్నది. గనుక అందరూ పాటలు పాడుచూ, ప్రతీ ఒక్కొక్కరు సంతోషంగా ఉండెదరు. మీరు బహుశా, వృద్ధుడగు ఆ సుమియోనువలె, మీరు ఉండండి. ఆ అందమైన క్రిస్మస్ సమయమున ఆ మందిరము గుండా సుమియోను నడుచుకుంటూ వెళ్తూ, తన బలమైన చేతులలో, ఓ, రక్షకుడిని తన చేతులలోకి తీసుకొని, ఆయనను ఎత్తుకొని, కౌగిలించుకొని, “ప్రభువా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, నీవు సకల ప్రజల యెదుట సిద్దపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని” అని చెప్పెను. ఈ క్రిస్మస్ సమయమున బహుమతులను ఒకరికొకరు మార్చుకొనుటకు శాంతాక్లాసిని కౌగిలించుకోకుండా, మీ విశ్వాస చేతులను చాచి, నీవు ఆయనను ఆహ్వానించి, కొన్ని
సంవత్సరముల క్రితం సుమియోను తన చేతులతో ఆయనను ఎత్తుకున్నట్లుగా అదే ప్రభువైన యేసును మీ విశ్వాసపు చేతులను చూచి నీ హృదయమున హత్తుకొనుము. అప్పుడు ఆయన నిన్న దీవించి, మరియు నీకు నిత్య జీవమునిచ్చును. నీవు నశించి పోవు. ఎందుకనగా, దేవునియొక్క జీవమును నీవు నీలో పొందుకొని యున్నావు.
159. వాక్యమనగా ఏమిటని మీరెరుగుదురా... గ్రీకు భాషలోని పదమును వెతుకుటకు వెళ్ళవద్దు. అది గ్రీకు భాషలో మాట్లాడే వారిమధ్య మాట్లాడితే అది వారికవసరమగును. ఇచ్చట గ్రీకు భాషలోని కార్యములను గురించి మాట్లాడుటలేదు. ఈ మందిరమున మనము యేసుక్రీస్తు గురించి మాట్లాడుచున్నాము. మా వాక్చాతుర్యంలో మాట్లాడుటకు ఇచ్చటకు మేము రాలేదు. క్రీస్తుయొక్క పునరుత్థాణపు శక్తిని గూర్చి తప్ప మరి దేనిని మీ మధ్య నెరకకుందుము. కాని ఆ పదము, గ్రీకు భాషలోని ఆ పదముయొక్క అర్థమే మనగా, "నిత్య జీవము” అని అర్ధము. గ్రీకు భాషలోని ఆ పదము యొక్క అనువాదము... దీనిని నేను హెబ్రీయుల భాష మరియు గ్రీకు భాషలో రెండింటిలో చదివాను. దీనిలో నేను మేధావిని కాదు. దీనిలో కొన్ని పదములకు మాత్రమే నాకు అర్థం తెలుసు. అవి నాకు కొంచెం సహాయం చేసినవి. ఎవరైనా నీతో వివాదించుటకు ప్రయత్నించునప్పుడు, వారిని ఏవిధముగా మాట్లాడకుండ చేయ్యాలో నేనెరుగుదును. కాని ఇలాంటి ఒక స్థలమున ఇది వచ్చినప్పుడు... అదే గ్రీకు భాషలోని ఆ పదము, దేవునియొక్క జీవమును గూర్చి తెలుపుచున్నది. మీకు ఆయన అనుగ్రహించిన అదే జీవమును గూర్చి అది తెలుపుచున్నది. ఈ గ్రీకు మరియు హెబ్రీ భాషలలోని పదములు రెండూ దేవునియొక్క జీవము లేదా నిత్య జీవము గురించి ఆ భాషలలో జోయి (Zoe) జో - యి (Z-0- E), జోయి (Zoe), "జీవము” అని ఉచ్చరించుచున్నవి.
160. నాయొద్దకు వచ్చు వారందరికీ, వారికి నేను జోయి( Zoe )ని నేను ఇచ్చెదను; అనగా నా స్వంత జీవమునిచ్చెదను. వారికి నేను నా స్వంత జీవమునిచ్చెదను. గనుక వారెన్నటికీ నశించరు. అంత్య దినమున నేను వారిని జీవముతో లేపెదను. “మరొక మాటలలో చెప్పాలంటే, నావద్దకు వచ్చు ప్రతీ ఒక్కొక్కరిని, నేను అతనిని నాలో చుట్టుకుంటాను(మూసివేసెదను). "ఆమేన్". అతడు నాలో భాగముగా మారిపోవును. నాకు మరణంలేనట్లుగా అతడుకూడా మరణించడు. నేను అక్షయుడను, నాకు మరణము లేదు. అలాగే అతడి ఆత్మ అక్షయతను ధరించుకొనుటవలన అతడుకూడా మరణించ లేడు. అంత్య దినములలో నేను మరలా అతడిని జీవముతో లేపెదను.ఓ, దేవా!
161. ఆ పాత శోధనలు చాలా కఠినముగా ఉండి మనలను ఇబ్బందిపరచినను, "నాలో దేవునియొక్క ఆత్మ నివసించుచున్నది. ఇచ్చట ఆయన నాలో ఉండుట తప్ప
వేరేదికూడా నాకు మంచి కార్యము కాదు. నాకు నేనే స్వంతం కాదు. నేను ఆయనకు స్వంతమైనవాడను. ఈ లోక కార్యములకొరకు నేను వెతుకుట లేదు. నేను ఆయనకొరకు వెతుకుచున్నాను. నా నమ్మకములు ఆయనయందు ఆధారము చేసుకొని కట్టితిని. ఏదోక దినమున నేను ఆయనను చూచెదను. నా వాంఛంతా అదియే, ఆయనవద్దకు ప్రజలను తీసుకొని వచ్చుటకొరతే నేను జీవించెదనని" చెప్పెదము, ఆ పాత సంకెళ్ళన్నీ తెగిపోయి పడిపోవుటకు ప్రారంభమైనవి. గనుక మీరు మళ్ళీ ప్రారంభించి ముందుకు సాగిపోండి.
162. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మనము ప్రార్ధించుచుండగా మీ పూర్ణ హృదయముతో దీనిని విశ్వాసించెదరని నేను నమ్ముచున్నాను. పరలోకపు తండ్రీ,ఈ రాత్రి మీ నీతి కుమారుడగు ప్రభువైన యేసుయొక్క రక్తముకొరకు మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఈ భవనములో సరిగ్గా ఇప్పుడిచ్చట, ఆయనను సరిగ్గా ఇచ్చట దర్శించినందుకు, పరిశుద్ధాత్మకొరకు నేను కృతజ్ఞతలు తెలుపుచున్నాను. దేవునియొక్క వాక్యానుసారంగా తప్పిపోని మరియు విఫలమవ్వని ఆత్మ, యేసును సమాధినుండి పునరుత్థాణుడగా లేపిన అదే ఆత్మ ఇప్పుడు సరిగ్గా ఇచ్చట మన మధ్య ఉన్నది.
163. దేవా, ఇచ్చటున్న పిల్లలలో నిన్ను ఎవరైతే ఎరగని వారున్నారో ఈ రాత్రి వారు నిన్ను స్వీకరించెదరుగాక! మరియు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచి నిత్య జీవమును కలిగియుందురుగాక! సరిగ్గా ఈ ఘడియందే నిత్య జీవమును విశ్వాసించే విశ్వాసమును వారు కలిగియుందురుగాక! దీనిని అనుగ్రహించుము!
164. వ్యాధులలో ఉన్నవారిని, బాధలలో ఉన్నవారిని స్వస్థపరచుము, తమ ప్రియమైన వారిని కోల్పోయిన గృహములను ప్రభువా, జ్ఞాపకము చేసుకొనుము. ఓ, దేవా! ఆ శవ పేటికలు చుట్టూ రక్షింపబడని పురుషులు మరియు స్త్రీలు నిలబడియుండగా, ఎన్నో వందలసార్లు, వందలసార్లు సరిగ్గా వారు ముందే సువార్త ప్రకటింపబడుటను వారెరిగియుండియు, ఇక నీవేమి చెప్పగలవు? ఓ, తండ్రీ, ఆ పురుషులు మరియు స్త్రీలు ప్రతీ ఒక్కొక్కరు క్షయమైపోవుదరని గ్రహించు విధముగా వారికొక దర్శనమును అనుగ్రహించుమని నేను ప్రార్థించుచున్నాను. మరియు ఏ సమయమున ఆ పిలుపు వచ్చునో మేము ఎరగనివారమై మరియు ఆ తీర్పులో అవత గట్టున మేము జవాబు చెప్పవలసియున్నదని, యేసుకొరకు మేమేమి చేసితిమో ఆ లెక్కను అప్పచెప్పవలసి యున్నదని ఎరుగుదుముగాక! పిదప ఆ వ్యాజ్యం సమాస్తమగును.గ్రంథము మూయ బడును. అది మూయబడి ఉన్నది. ఇక చెయ్యవలసిన కార్యములంటు ఏమి ఉండవు. ఆయనను తీర్పు తీర్చుటద్వారా మనకు మనమే తీర్పు తీర్చుకొనుచున్నాము.
165. తండ్రీ, ఓ, నా హృదయమును ఈ రాత్రి పరిశీలించుము. “ప్రభువా, నన్ను పరిశీలించుము మరియు నన్ను పరీక్షించుము" అని దావీదు చెప్పెను.దావీడు మాత్రమే కాదుగాని నేనుకూడా దానినే చెప్పుచున్నాను. ఏదైనా దుష్ట మార్గము నాలో ఉన్న యెడల ప్రభువా, దానిని నాలో నుండి తీసివేయుము. దేవా, అది నాలోనే తిరుగుచూ ఉండుటకు అనుమతింపకుము. ప్రభువా, దానిని నేను ఇష్టపడుట లేదు. తండ్రీ, అది నాలో ఉండుటకు నేను ఇష్టపడుట లేదు, తండ్రీ, అది నన్ను వీడిపోవునుగాక!
166. నాకు మాత్రమే కాదుగాని, రాత్రి ఇచ్చటున్న ఈ ప్రజలందరి కొరకు అనగా ఈ వర్తమానమును వినిన వారందరికొరకు, తండ్రీ, ఇచ్చటున్న ఈ ప్రజలలో ఏ దుష్టత్వమున్నను,ఏ పాపమున్నను, వారిలోనున్న వాటన్నింటిని,ప్రభువా, తీసివేయుము. మీ బిడ్డలగు వీరి చుట్టూ అది వ్రేలాడుతూ ఉండకుండా చేయుదువుగాక!. దేవా, వాటిని పారద్రోలుము. ప్రతీ శోధనను జయించుటకు వారికి కృపను అనుగ్రహించుము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. దేవునియొక్క భీజము, ఇప్పుడు బుట్టలో నుండి తీసివేయబడినది, ప్రజలయొక్క హృదయములలో ఆ భీజము యొక్క వేరు లోతుగా పాతుకొని అది నిత్య జీవమును పొందుకునేంతవరకు ఎదుగునుగాక! ఈ దీవెనలను యేసుక్రీస్తు యొక్క నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్!
167. ఓ, నేనాయనను చూడగోరుచున్నాను, ఆయన ముఖమును చూడగోరుచున్నాను.
అచ్చట ఆయనయొక్క రక్షణ కృపనుగూర్చి నిరంతరం కీర్తించెదను.
ఆ మహిమకరమగు వీధులలో నా స్వరమునెత్తి నేను కీర్తించెదను.
బాధలన్నీ గతించిపోయి, నిరంతరం ఆనందించుచు ఆ గృహమున నేనుండెదను.
ఈ దేశము గుండా ప్రయాణించుచు దాటిపోవునప్పుడు
నేను పాటలు పాడుచూ దాటిపోయెదను.
నీ రక్త వర్ణమైన ఊటను చూపిస్తూ, ఆత్మలను కల్వరివైపుగా త్రిప్పెదను.
నా ఆత్మనుండి లోపల, వెలుపల అనేక బాణములతో నేను గ్రుచ్చబడి యున్నాను.
నా ప్రభువు నన్ను ముందుకు నడిపించుచుండగా, ఆయన ద్వారా నేను జయించెదను.
నేనాయనను చూడగోరుచున్నాను. ఆయన ముఖమును నేను చూడగోరుచున్నాను.
ఆయనయొక్క రక్షణ కృప గురించి నేను అచ్చట నిరంతరం కీర్తించెదను.
మహిమకరమైన ఆ వీధులలో నేను నా స్వరమునెత్తి కీర్తించెదను.
బాధలన్నీ గతించిపోయెను, నిరంతరం ఆనందించుచు, ఆ గృహమున నేను ఉండెదను.
168. ఓ, ఈ దినములలో ఏదోక దినమున నేను పాడగోరుచున్నాను. ఈ దినము లలో ఏదోక దినమున నేను పాటనుపాడుటకు ప్రభువు నాకు అనుమతి ఇచ్చునుగాక! అవును. నేను ఆ నదిని దాటి వెళ్ళినప్పుడు(అది నిజము), నేను అవతలి గట్టుకు దాటి వెళ్ళినప్పుడు, ఒకవేళ ఇవతలి ప్రక్కన... నేను పాడలేను. కాని అచ్చట నేనే పాటను పాడబోవుదునో మీకు తెలుసా?
నా ఆత్మకు మరియు నా రక్షకునికి మధ్య ఏది ఉండదు, ఈ ప్రపంచంయొక్క భ్రమ కలిగించే కలలు ఏమి ఉండవు, అన్ని పాపముల సుఖములను నేను పరిత్యజించాను, యేసే నా స్వంతం, ఆయనకు నాకు మధ్య ఏదీ ఉండదు (ఓ, దేవా!). నా ఆత్మకు మరియు నా రక్షకునికి మధ్య ఏది ఉండదు, ఈ ప్రపంచం యొక్క భ్రమ కలిగించే కలలు ఏమి ఉండవు, అన్ని పాపముల సుఖములను నేను పరిత్యజించాను, యేసే నా స్వంతం, ఆయనకు నాకు మధ్య ఏదీ ఉండదు (ఓ, దేవా!).
169. ఈ రాత్రి మీలో ఎందరు సాక్ష్యముగా మీ చేతులను ఎత్తి ఈ పాటనుపాడెదరు?
నా ఆత్మకు మరియు నా రక్షకునికి మధ్య ఏది ఉండదు, ఈ ప్రపంచం యొక్క భ్రమ కలిగించే కలలు ఏమి ఉండవు, అన్ని పాపముల సుఖములను నేను పరిత్యజించాను, యేసే నా స్వంతం, ఆయనకు నాకు మధ్య ఏదీ ఉండదు (ఓ, దేవా!).
170. మీకిది అద్భుతమైన అనుభూతి ఇచ్చుటలేదా?“నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు. నిత్య జీవముగలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటివున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”
171. ఇదిగో ఇచ్చట మనము మన చేతులను పైకి ఎత్తి ఈ రాత్రి పాడెదము. “అన్ని పాపముల సుఖములను నేను పరిత్యజించాను. యేసే నా స్వంతం. ఆయనకు మరియు నాకు మధ్య ఏదీ ఉండదు. అనగా నా ఉద్యోగము, నా స్నేహితులు, నా ప్రియమైనవారు, నా ప్రజలు, నా భార్య, నా పిల్లలు ఈ భూమిపై యున్న ఏదైనాగాని, అది ఏమైనాగాని నా ఆత్మకు మరియు నా రక్షకుని మధ్య ఏదీ ఉండదు. యేసే నా స్వంతం. మామధ్య ఏదీ ఉండదు. ఇతర కార్యములన్నీ ఏదీకూడా ప్రధానం కాదు. అది అద్భుతం కదా!
172. ఈ ఉదయకాలములో ఎవరో, "అద్భుతమైన కృప (Amazing grace) ఆ ధ్వని ఎంత మధురముగా ఉన్నది(how sweet the sound)" అనే పాటను పాడుచుండిరి. మీరు ఆ నదిని దాటి వెళ్ళినప్పుడు, మీకు తెలుసా...
173. అవతలి గట్టున మరల యవ్వన పురుషులుగా, యవ్వన స్త్రీలుగా మారిపోయి, మీకు చెందినవారందరినీ యవ్వన ప్రాయంలో అచ్చట కలుసుకొనెదరు, నీకు ప్రియమైన వారు, నీ తండ్రి, నీ తల్లితో కరచాలము చేయుచూ, "ఓ, తల్లీ, ఇదిగో ఇచ్చట మరలా నిన్ను చూచుట నాకెంతో సంతోషంగా ఉన్నది. మంచిది. అదిగో అక్కడ చూడు, సహోదరుడు జాన్ వచ్చును. ఇదిగో ఇచ్చట జో వచ్చుచున్నాడు. మంచిది, ఇక్కడ చూడు. మనకు ఒక మంచి సమయమును గడుపుచున్నాము కదా?" అని చెప్పెదము.
174. పర్వతముమీద ఎచ్చటో దాని వెనుక నుండి ఎవరోకరు, "అద్భుతమైన కృప, ఆ ధ్వని ఎంత మధురమైనదో, నీచుడనైన నావంటి వాడిని రక్షించెను”అనే పాటను పాడుటను మీరు వినెదరు. ఆ కొండపైకి వెళ్ళి అచ్చట మీరు చూచిన కొండ మూలలో పెట్టెలాంటి ఒక చిన్న ఇల్లును చూచెదరు. అచ్చట సహోదరుడు బ్రాన్హాం నిలబడి యుండి, “అద్భుతమైన కృప" అనే పాటను పాడుచుండుటను మీరు ఆలకించెదరు.
175. “మంచిది, దేవునికే మహిమ. ఆయన తన గృహమునకు వచ్చెను. అదిగో అచ్చట “అద్భుతమైన కృప” పాటను అతడు పాడుచున్నాడని" మీరు చెప్పెదరు. ఓ, దేవా!
అద్భుతమైన కృప, ఆ ధ్వని ఎంత మధురమో!
నీచుడనైన నావంటి వానిని రక్షించెను,
ఒకప్పుడు నేను నశించిపోయి యుంటిని, కాని ఇప్పుడు కనుగొనబడ్డాను,
ఒకప్పుడు గుడ్డివానివలె ఉంటిని, కానిప్పుడు నేను (టేపులో ఖాళీ గలదు -సంపా).
176. ..?... కృపద్వారా, ఈ లోకము సృజింపబడుటకు ముందే, దేవుడు తన దూతల వద్ద మాట్లాడుచూ, “విల్లియం బ్రాన్హాం అనే పేరుగల ఒకరు సువార్త ప్రసంగించుటకు నా కొరకు నేను కలిగియున్నాను” అని చెప్పెను.
నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే,
నా భయములన్నింటి నుండి ఆ కృపయే నాకు విడుదల దయచేసినది.
ఎంత అమూల్యమైన కృప ప్రత్యక్షమయ్యెను,
నేను విశ్వసించిన మొదటి గడియందే (ఇప్పుడు ఏమిటి),
ఓ, నేనెంతగానో యేసును ప్రేమించుచున్నాను,
ఓ, నేనెంతగానో యేసును ప్రేమించుచున్నాను,
ఎందుకనగా, ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను,
నేనెన్నటికీ ఆయనను విడువను, నేనెన్నటికీ ఆయనను విడువను,
నేనెన్నటికీ ఆయనను విడువను.
ఎందుకనగా, ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను,
అదిగో అవతలి గట్టున నాకొక తండ్రి గలదు, అదిగో అవతలి గట్టున నాకొక తండ్రి గలడు,
ఆ అవతలి గట్టున.
ఓ, ప్రకాశవంతమైన దినమున నేను వెళ్ళి ఆయనను కలుసుకొనెదను,
ఓ, ప్రకాశవంతమైన దినమున నేను వెళ్ళి ఆయనను కలుసుకొనెదను,
ఓ, ప్రకాశవంతమైన దినమున నేను వెళ్ళి ఆయనను కలుసుకొనెదను,
ఆ అవతలి గట్టున.
ఓ, అది ఒక సంతోషకరమైన సంధించు సమయముగా ఉండును కదా?
ఓ, అది ఒక సంతోషకరమైన సంధించు సమయముగా ఉండును కదా?
అదొక సంతోషకరమైన సంధించు సమయముగా ఉండును కదా?
ఆ అవలి గట్టున.
సరే, ఆ ప్రకాశవంతమైన దినము రేపటి దినముగా ఉండునేమో!
ఆ ప్రకాశవంతమైన దినము రేపటి దినముగా ఉండునేమో!
ఆ ప్రకాశవంతమైన దినము రేపటి దినముగా ఉండునేమో!
ఆ అవతలి గట్టున.
177. అది అద్భుతముగా ఉండునుకదా? (సమాజము “ఆమేన్” అని చెప్పుచున్నది -సంపా.)... నేను "తండ్రి” వలె ఉండెదను.
అనేక గృహములు మరియు భూములను కలిగియున్న నా తండ్రి ఐశ్వర్యవంతుడు.
ప్రపంచ సంపదనంతటిని ఆయన తన హస్తములలో పట్టుకొని యున్నాడు.
అనగా కెంపులు, వజ్రములు, వెండి, బంగారము ఆయన చేతిలో ఉన్నవి.
ఆయన ఖజానా నిధులతో నిండియున్నవి, ఆయన సంపదలు చెప్పశక్యముకానివి.
నేను రాజు యొక్క కుమారుడను!
యేసు నా రక్షకుడగుట వలన,
నేనొక రాజ కుమారుడను,
నేను ఆ రాజు యొక్క కుమారుడను.
ఒక గుడారములోనో లేదా ఒక గుడిసెలోనో నేనెచ్చటున్నను దానిగురించి
నేనెందుకు బాధపడాలి?
అదిగో అచ్చట నాకొక గొప్ప భవనము కట్టబడియున్నది.
ఈ గృహమునుండి నేను వెలివేయబడినను, అప్పటికీ నేను పాడుచూ ఉందును.
ఓ, దేవునికే మహిమ! నేను ఆ రాజు యొక్క కుమారుడను.
నేను ఒక రాజ కుమారుడను, నేను ఒక రాజ కుమారుడను, యేసుక్రీస్తు నా రక్షకుడైనందు వలన, నేనొక రాజు యొక్క కుమారుడను!
178. మా పరలోకపు తండ్రీ, అనేక అనేక సంవత్సరముల క్రితం మా సహోదరులు దర్శనములో పట్టబడి, పరిశుద్ధాత్మ ద్వారా తమ కలములను పట్టుకొని రచించిన ఆ పాత పాటలను మేము వినుచున్నప్పుడు, పాడుచున్నప్పుడు మా హృదయములు ఎంతగానో కరిగిపోవుచున్నవి. మేము ఆ పాటలను ఇష్టపడుచున్నాము. భయంకర మైన శోధనలు మమ్మల్ని చుట్టుముట్టుకొనియున్న సమయములో ఈ పాటలే మాకు ఒక ధృఢమైన పునాదిగా ఉన్నవి. దేవా, ఇప్పుడు పాపములన్ని మానుండి తీసివేయ బడునుగాక! దానిని ఈ రాత్రి మాకు అనుగ్రహించుము. మేము క్రిస్మస్ సమయము లోకి ప్రవేశించుచున్నాము. పాపమును మానుండి పారద్రోలుము;వ్యాధులను మానుండి తరిమివేయుము. ప్రభువా, దేవా, ఈ రాత్రి ప్రతీచోటావున్న వారి అవసరతలను తీర్చి వారిని దీవించుము. యేసు నామమున మేము దీనిని అడుగుచున్నాము.
179. ఇప్పుడు, బలిపీఠము వద్దకు వచ్చి అభిషేకింపబడుటకు మరియు ప్రార్ధించుటకు రావాలని ప్రజలు కోరుచున్నారు. ఈ పాటను, "రాజుయొక్క కుమారుడా” పాడు చుండగా మీరు ముందుకు రావచ్చును. అర్థమైనదా? మీలో ఎవరైనా కోరుకుంటే...