కొంత మంది ప్రజలు తమ విజయమును ఎందుకు కాపాడుకోలేకపోవు చున్నారు?

కొంత మంది ప్రజలు తమ విజయమును ఎందుకు కాపాడుకోలేకపోవు చున్నారు?

కొంత మంది ప్రజలు తమ విజయమును ఎందుకు కాపాడుకోలేకపోవు చున్నారు?

1. కన్సాస్లోలో గల విచ్చిటాలో శుక్రవారం నుండి కూటములను ప్రారంభించుటకు మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయమున వెళ్ళాలని మేము చర్చించుకొను చున్నాము. మంచు కురియుటవలన నేను ఉత్తరవైపుగా ప్రయాణించి వెళ్ళలేనని నేను వారితో చెప్పాను. “కేవలము నమ్ముము" అనే పాటను ప్రారంభించుటను మేము ఆలకించుచు దానిని గూర్చి ఆలోచించుచుంటిమి. "అనేక దేశములలోను, అనేక భాషలలోను ప్రజలు గత పది సంవత్సరములుగా లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరములుగా ఆ పాటను పాడుచు నన్ను ప్రసంగ వేదిక పైకి ఆహ్వానించు చుందురు"అని నేను అతనివైపు చూచి చెప్పాను. మరియు ప్రభువైన యేసు రాకడకు ముందుగా నేను అవతల గట్టుకు వెళ్ళిపోయిన యెడల, నన్ను మట్టిలో పూడ్చి పెట్టునప్పుడు, అచ్చట నిలబడిన వారందరూ నా శరీరమును ఆ మట్టి గోతిలోలోకి దింపుచున్నప్పుడు, "కేవలము నమ్ముము" అని పాడుచుందురు. అలాగే నేను పరలోకమునకు వెళ్ళినప్పుడు, నాకంటే ముందుగా మరణించి అచ్చటకు వెళ్ళిన వారితో కలిసి మనము ఆ పాటను పాడెదమని నేను నమ్ముచున్నాను". కారణమేమ నగా, నిజంగా నేను దేనిని విశ్వాసించుచున్నానో అది ప్రభువైన యేసేయగును.

2. ఇప్పుడు...ఇచ్చట ప్రార్ధనకొరకు చేతి రుమాళ్ళు మరింకా కొన్ని ఉన్నవి... ఇది ఈ రూపమున ప్రజలయొక్క విశ్వాసమును గొప్పగా వ్యక్తపరుచుటకు సూచనగా ఉన్నది. వీటినిగూర్చి నేను చెప్పుటకు అనేక విషయములు గలవు... నా పరిచర్యలో అత్యధికమైన భాగము, దాదాపు, ఈ చేతి రుమాళ్ళను మరియు ఇతర వాటికొరకు ప్రార్ధించి పంపించుటయై యున్నది. ఎందుకనగా (నేను అనేకమంది జనులతో సంబంధమును కలిగియున్నాను. అనేకసార్లు ఈలాగు చెప్పుట జరుగు చున్నది, “బ్రాన్హాం సహోదరుడు, సహోదరుడు రాబర్ట్స్ లేదా సహోదరుడు అలెన్ లేదా అటువంటి కొంతమంది ఐదువందల మందికి ప్రార్థించెదరు. మీలో ముగ్గురు లేదా నలుగురుగా వచ్చినయెడల వారు ప్రార్థించెదరు". మందిచి, బహుశా, అది నిజమేయై ఉండవచ్చు. కాని మీకు తెలుసా, దేవుడు వారికి ఏమి చెయ్యమని చెప్పుతో దానిని వారు చేసెదరు. నేనుకూడా దేవుడు నన్ను ఏమి చెయ్యమని చెప్పుతో దానినే నేను చేసెదను. నా పరిచర్య కొంచెం వ్యత్యాసమైనది. కాని ఈ చేతి రుమాళ్ళును, పని చేసేటప్పుడు మురికి కాకుండా నడుమునకు కట్టుకునే
గుడ్డలు, చిన్న చిన్న వస్త్రములకు ప్రార్ధించుట ద్వారా అనేక ప్రజలతో సంబంధం.. కలిగియుందును. ఆ మార్గము ద్వారానే నేను వారితో సంప్రదించెదను. వాటిన మీరు నా గృహమునకు పంపించుకోరువారు వాటిని పంపించవచ్చును. వాటిని నేను ఆహ్వానించుచున్నాను. నా చిరునామా: జెఫర్స్న్ విల్, ఇండియానా, పోస్ట్ బాక్స్ నెం. 325 కి పంపించండి. లేదా జెఫర్సన్ విల్ అని వ్రాసి పంపించిన అవి నా వద్దకు వచ్చి చేరును. మేమెంతో సంతోషించెదము. ఎందుకనగా, ఆవిధముగా ప్రతీ వారము ప్రపంచమంతటా ఉన్న వేలకొలది మంది ప్రజలకు, వాటిని పంపించు చున్నాము. తమ స్వస్థతకొరకు దేవుని యందు విశ్వాసము కలిగి, విశ్వాసముగల ప్రజలవలన ఒక గొప్ప జయమును పొందుకో గలుగుచున్నది.

3. ఇప్పుడు, మనము ఈ మధ్యాహాన సమయమున వెళ్ళుటకు ముందు వీటి పై చేతులను ఉంచి ప్రార్ధించుదాము. తర్వాత మీరు వాటిని తీసుకోండి. ఒకవేళ ఇచ్చట వాటిని పెట్టుటకు మీకు సాధ్యమవ్వనియెడల నా చిరునామాకు వ్రాసి పంపించండి. వాటిని నేను మీకు ఉచితముగా పంపించెదను. అందుకొరకు మీరు ఏ ఖర్చులను చెల్లించనవసరము లేదు. ఏదికూడా చెల్లించనవసరము లేదు. ఈ సేవలకొరకు ఏదీ వసూలు చేయము. దేనికొరకు ఏ డబ్బులను చెల్లించనవసరము లేదు. మావద్ద కొన్ని పుస్తకములు గలవు. సోమవారమునకు... దాదాపుగా పెట్టెలో సగం మిగిలిన పుస్తకములు గలవని ఆ బాలురు కొన్ని నిమిషముల ముందు నాతో చెప్పిరి. వాటిని మేము ఆదివారమున అమ్ముట లేదు. సోమవారము మరియు మంగళవారమున ఇచ్చుటకు కొన్ని ఫోటోలు, ఇంకా కొన్ని మాత్రమే మిగిలివున్నవి. వాటిని మేము ముద్రించు వారియొద్ద నుండి వెలను చెల్లించి కొనుచున్నాము. మేము వాటిని నలుబది సెంట్స్కన్నా తక్కువ వెలనుయిచ్చి కొని,ఆ వెలకే వాటిని మేము అమ్ముచున్నాము. ప్రజలవద్ద డబ్బులు లేవు. అయినప్పటికీ వాటిని ఎలాగైనా కొనాలని కొనుచున్నారు. మేముకూడా వాటిని ఎంత తక్కువ వెలకు యిచ్చుటకు సాధ్యమగునో అంత తక్కువకే ఇచ్చుచున్నాము. ఆలాగు ఇచ్చుటకు దేవుడే మార్గమును ఏర్పరచును.కాబట్టి దేనికికూడా ఏటువంటి ధరను పెట్టి అమ్ముట లేదు. కాబట్టి మీరు దేనికి సంశయించకుండా స్వేచ్చగా ఉండునట్లు అనుభూతిని కలిగి ఉండండి లేదా మీ జీవితమున ఇంకా కొంచెం చక్కగా మీరు ఉండుటకు మాకు సాధ్యమైనంత వరుకు ఏదైనా సహాయము చేయుటకే మేము ఉన్నాము. మీ శోధనలలో కొంచెం సాఫీగా మీరు కొనసాగుటకు చేయగలిగిన దేనినైనా చెయ్యుటకే నేను ఇచ్చట ఉన్నాను. దానిని చెయ్యుటకే నేను యిచ్చట ఉన్నాను.
4. మీ ఒక్కొక్కరి ఇంటికి వచ్చి వ్యక్తిగతంగా కొద్దిసేపు మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నేను అలాగు చెయ్యాలని కోరుచున్నాను. కాని దానిని అలాగు చెయ్యలేకపోవు చున్నాను. నేను అలాగు చెయ్యలేను. కాని దానిని మీరు అర్థము చేసుకోగలరని నిశ్చయముగా నేను నమ్ముచున్నాను. కావున మీరు నాకొరకు చెయ్యవలసినదంతా ఒకటి ఉన్నది. అదేమనగా, నా కొరకు ప్రార్ధించుటయే. ఎందుకనగా నాకు తెలిసినవాటిల్లో అన్నింటికన్నా నా కొరకు మీరు ఎక్కువగా ప్రార్థించుటయే నాకు అవసరమైయున్నది. మేన్ "

నా గొంతుకు చాలా బొంగురు పోయినది. నేను మీతో చెప్పినట్లుగా, దాదాపు ఒక రాత్రికూడా విరామము లేకుండా ఇంతవరకు నాలుగు నెలలుగా ఎడతెగక సుదీర్ఘమైన ప్రసంగములను చేయుచు, రోగులకొరకు ప్రార్థించుచూ మరియు ఎల్లప్పుడూ ప్రయాణం చేయుచున్నాను. అలాగు సుదీర్ఘముగా అనేక దినములు ప్రసంగించిన తరువాత మీలో కలుగు మార్పును ఖచ్చితముగా మీరు చెప్పగలరు. కావున ప్రసంగించిన పిదప ఎంత కఠినముగా ఉండునో అలాగే స్వస్థతా ఆరాధన లలో అంతకన్నా రెండురెట్లు కఠినముగా ఉండునని మీరు ఉహించి చూడండి.

5. కాబట్టి ఈ మధ్యాహానమున, ప్రభువు చిత్తమైతే, కొద్దిసేపు ప్రజలతో మాట్లాడు టకు మేము ఒక చిన్న అంశమును ఎన్నుకున్నాము. పిదప, రేపు స్వస్థత ఆరాధనలు మరియు మొదలగునవి మరలా ప్రారంభమగును. మన ప్రభువు ఏమి చేయునో ఎరుగము. ఒకవేళ ఈ మధ్యాహానమున దేవుడు దిగి వచ్చి, ఇంతవరకు జరుగని అద్భుతమైన రీతిలో గొప్ప స్వస్థతా ఆరాధనను మనము పొందుకొనునట్లు చేయ వచ్చును.) అది మనకు తెలియదు. ఆయన తన స్వకీయ మార్గమున కార్యమును చెయ్యును. కావున ఆయన ఏవిధముగా మనలను నడిపించినా దానిని అట్లే వెంబడించుటకు మనము ప్రయత్నించుదాము,

6. మరిప్పుడు, మనమెప్పుడూ చదువు విధముగా దీవెనకరమగు ఆయన వాక్యము తెరచుటకు ముందుగా మన తలలను వంచి కొద్దిసేపు మనము ఆయన వద్ద ప్రార్థనద్వారా మాట్లాడుదాము. దీవెనకరమగు మా పరలోకపు తండ్రీ, ఈ గొప్ప చక్కని స్థలములోకి ఈ మధ్యాహాన సమయములో వచ్చుటకు చేసినదానిని నిమిత్తము, మా తలలపైయున్న కప్పుకొరకు, మీ కుమారుడగు ప్రభువైన యేసు నామములో మేము సమకూడివుండుటకు అనుగ్రహించిన భాగ్యముకొరకు మీకు మేము వందనములు చెల్లించుచున్నాము. ఈ గాడాంధకారములో మరియు భయంకరమైన ఘడియలలో, అంత్య కాలములో మేము జీవించుచున్నామని ఎరిగినట్లు చేసితివి. ఇప్పటికీ ఇంకా వేల కొలదిమంది ప్రజలు మీపై విశ్వాసమును
కలిగి మరియు మీ రాకడ త్వరలో వచ్చునని, అందుకొరకు ఎదురు చూచుచున్నారు. మరియు కోతయొక్క శ్రేష్ఠమైన ఫలము, ఎన్నుకొనబడినవారగు వీరు, ఒక్లాండ్ నుండి మరియు దాని చుట్టు ప్రాంతములనుండి సమకూడి వచ్చిరని మేము ఈ దినమున నమ్ముచున్నాము. వారు ఒక్క ఉద్దేశ్యముకొరకు ఇచ్చటకు వచ్చిరి. దేవుని వాక్యమును వినుటకు మరియు దాని చుట్టూ సహవాసమును చేయుటకై వారు వచ్చిరి. "

7. మా తండ్రీ, ఈ ఆరాధనను మీ స్వహస్తములలోకి, మీ స్వంత అదుపులోకి తీసుకొని మీరే మహిమను పొందుకోమని మేము వినయముతో ప్రార్ధించు చున్నాము. మాట్లాడుచున్న స్వరమును పరిశుద్ధపరచుము. తండ్రీ, నాకున్న, సమస్తము, నిశ్చయముగా అవన్నీ మీకు చెందినవే. కాబట్టి వాటన్నింటిని మీకే సమర్పించుచున్నాను. వినుచున్న చెవులను శుద్ధీకరించుము, ప్రతీ హృదయమును దీనిని అంగీకరించునుగాక!ఇదొక మనిషియొక్క వర్తమానమని తలంచకుండునట్లు ఇది దేవునినుండి వచ్చిన ఒక వర్తమానముగా ఉండునట్లు చేయుము. ఎందుకనగా, అతి శీఘ్రముగా సమీపించబోవు ఆ ఘడియలో మేము మీఎదుట పరిశుద్ధులము గాను, దోషము లేనివారుగాను నిలబడుటకొరకు యివ్వబడు సూచనలను పొందు. కొనునట్లు మేము ప్రతీ కార్యమును జాగ్రత్తగా ఆలకించుటకు వేచియున్నాము. ఈ దీవెనను మేము యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమే

8. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము, ఈ భాగమును నేను చదివెదను. (ఒక ప్రవచనము ప్రవచింపబడెను-సంపా॥) ఆమేన్. ఈ వాక్యము కొరకు దేవునికి కృతజ్ఞతలు. ఇది ఎల్లప్పుడూ మనకు ధైర్యమును యిచ్చుచున్నది. ఇప్పుడు మనము ఒక పాటను పాడుట మనకు అలవాటు. “మనమందరమూ ధైర్యంను కలిగి ఉందాం. ఎందుకనగా, మనము ఒంటరిగా విడువబడలేదనే పాట", అది నిజము. ప్రభువు ఇచ్చట ఉన్నాడు. దానిని నేను విశ్వసించుచున్నాను.

నూతన హృదయము మీకిచ్చెదను. నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడలననుసరించు వారినిగా నా విధులను గైకొనువారినిగాను మిమ్మును చేసెదను. ప్రభువు చదివిన ఆయన వాక్యముతో తన దీవెనలను చేర్చునుగాక! యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ మరియు 27వ వచనములు.

ఇప్పుడు ఈ గొప్ప శక్తివంతమైన ప్రవక్తయగు యెహెజ్కేలును గూర్చి మరియు అతని ప్రవచనమును గూర్చి ఈ మధ్యాహానమున మాట్లాడవలెనని మేము. కోరుచున్నాము. ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తలు దేవునియొక్క పక్షి రాజులుగా భావించబడుచున్నారని మనకు తెలుసు.
9. ఇప్పుడు, నేను మీకు ప్రసంగించిన ప్రకారముగా, ప్రకృతినిగూర్చి చదువు చుండగా, ఎందుకనగా, నన్ను క్రీస్తువద్దకు నడిపించిన మొదటి పరిశుద్ధ గ్రంథము ఈ ప్రకృతియగును. అప్పట్లో మా ఇంట్లో ఒక్క పరిశుద్ద గ్రంథముకూడా ఉండని దినములవి. నాకు తెలిసినంత వరకు నాకు ఇరువది వయస్సు వచ్చువరకు మా ఇంట్లో పరిశుద్ధ గ్రంథమును మేము చూడలేదు. మేము ఒక భక్తిగల కుటుంబం కూడా కాదు. దీనికి ముందు మా కూటుంబ సభ్యులు కాతలిక్కు చెందినవారు. వారు సంఘమునకు వెళ్ళేవారు కాదు. ఎవ్వరూ సంఘము లోపల వివాహమును చేసుకోలేదు. సంఘమును వదిలివేసిరి. కావున వాళ్ళకు అసలు భక్తియనేది లేదు. పిదప (దేవుని కృపద్వారా ప్రభువు నన్ను పట్టుకున్నాడు.) అది ఆయనను నేను ప్రేమించునట్లు చేసెను. ఓ, నేనెప్పుడు... నాలో ఉన్న ఏదో ఒకటి నేను దానిని పట్టుకొని ఉండునట్లుగా చేసినది. అది దేవుని ప్రేమ తప్ప మరేమి కాదు.

మరిప్పుడు, ప్రకృతిని గూర్చి ధ్యానంచేయుచుండగా, అందులో దేవుని యొక్క గొప్ప జ్ఞానమును చూడగలుగునట్లుగాను, ప్రకృతియొక్క కార్యములనుగూర్చి నేను అర్థము చేసుకొనునట్లుగాను, ఏ విద్యా జ్ఞానము లేకుండానే సహజాతీతమైన విషయములను గూర్చి నేను గ్రహించగలుగునట్లుగా చేయుచున్నది. ప్రకృతిలోగల సమస్త కార్యములు లేదా సహజాతీతమైన సమస్త కార్యములన్నీ మనకు ఒక మాదిరిగా ఉన్నవి. దానిని మీరు అర్థము చేసుకున్నారో లేదో నాకు తెలియుటలేదు. కాని అది నిజము. భూమిమీదవున్న సమస్తము పైన ఉన్న ఏదోక కార్యముతో తయారు చేయబడినవి. అవి ఒక సాదృశ్యముగాను మరియు ఛాయలుగాను, మొదలగువానివలె ఉన్నవి. ఈ భూమి పై మన స్వంత ఛాయవంటి కార్యములు... అనగా ఇప్పుడు మనమేలాగు ఉన్నామో - దానియొక్క మాదిరిగా ఆ అద్భుతమైన పునరుద్ధాణములో మనమేమై ఉందుమో, ఈ పాపములు, వ్యాధులు, దుఃఖములు, మరియు మరణము వంటివన్నీ సమసిపోవునప్పుడు ఉందుము.

10. అలాగే పక్షిరాజు ప్రవక్తకు ఒక మాదిరిగా ఉన్నది. అది ఒక బలమైన పక్షి, ఒక దినమున సిన్సిన్నటి అనే జంతు ప్రదర్శన శాలలో నేను చూచిన దృశ్యములలో అదెంతో విచారకరమైన దృశ్యముగా ఉండెను. నా కుమారుడు కొన్ని నిమిషముల ముందు నాయొద్ద చెప్పుచుండెను. ఇచ్చటున్న ఒక చెరువుకు అవతల ప్రక్కన,ఒక చిన్న స్థలములో, ఒక జంతు ప్రదర్శన శాల ఉన్నది. దాంట్లో కొన్ని జంతువులు ఉండెను. గూటిలో పెట్టి బంధించే దేనినైనా నేను చూచుటకు ఇష్టపడను. అట్లు మాచుట నేను అసహ్యించుకొనెదను. అలాగే క్రైస్తవులుకూడా గూటిలో బంధింప డి ఉండునట్లు చూచుటకు నేను ద్వేషించెదను. అలాగే కనరీ పక్షి (పిచ్చుక
లాంటిది)ని మీరు తీసుకొని వచ్చి ఒక గూడులో బంధించి, దానికి మీ ఆర్తోవాలి మత సంబంధమైన ఆహారమంతటిని పెట్టుచూ, అలాంటి ఆహారముతో పోషించును అది బలమైన రెక్కలను కలిగి ఉన్నట్లు తయారు చేసి, దానిని స్వతంత్రంగా ఎగురు నియ్యకుండా మీ గూటిలోనే బంధించి ఉంచినయెడల దానివలన ఏమి ప్రయోజ నము గలదు? ఆ చిన్న పిట్టవలె సంస్థలలో బంధింపబడియున్న క్రైస్తవులనుగూర్చి నేను అలాగే ఆలోచించెదను. స్వతంత్రులుగా ఉండుటయే మనకు యుక్తమైనది. దేవుని వాక్యమును ధ్యానించుచూ, ఆ వాక్యమును విశ్వసించునప్పుడు మనకు నిశ్చయముగా విడుదల కలుగుచున్నది. కాబట్టి మనము అలాంటి గూడునుండి వెలుపలికి వెళ్ళి, ముందుకు సాగిపోవుచు, మన విశ్వాసమును ప్రయోగించుదాము.

11. ఆ తర్వాత నేను గమనించినప్పుడు. ఈ గొప్ప, బలమైన పక్షిరాజు, తన పెద్ద రెక్కలను చాచి ఎగురుటకు ప్రయత్నించగా, గూటిలో బంధింపబడియున్న ఆ పక్షిరాజు, ఆ గూటిపై వరకు ఎగిరి దానియొక్క కప్పుకు తగిలి క్రింద పడిపోయెను, అది తన కనులను పైకెత్తి ఆకాశమువైపు చూచెను. అది మరలా, మరలా అలాగు ప్రయత్నిస్తూ, తన రెక్కల ఈకలన్నీ ఆ గూడుయొక్క ఊచలకు కొట్టుకుంటూ, దాని తల ఆ ఊచలకు కొట్టుకుంటూ తన శక్తినంతా కోల్పోవువరకు అది అలాగు ప్రయత్నిస్తూ క్రిందకు పడిపోయి వాలిపోయెడిది. అది తన కన్నులను ఎత్తి ఆకాశము వైపు చూచుచు పైకి ఎగురుచు, ఆ ఇనుప ఊచలకు కొట్టుకుంటూ అలసిపోయి, బలహీనముతో, గాయములతో ఆ ఆకాశము వైపే చూచుచుండెడిది. ఎందుకనగా, అది ఎతైన స్థలములలో నివాసము చేయు ఒక గొప్ప పక్షి. ఏ పక్షి ఎగురలేనంత చాలా ఎత్తుగా అది మాత్రమే ఎగురగలదు. ఎందుకని? అసలు గద్ద(డేగ)లుకూడా ఆ పక్షిరాజుకు సాటికాలేవు. ఈ భూమిపై ఉన్న పక్షులలో ఏదీకూడా పక్షిరాజు ఎగిరేంత ఎత్తుకు ఎగురలేవు. అది ఆకాశమున గాలిగుండా మిక్కిలి పైకి ఎగిరి పోవును. అంత పైకి ఏ పక్షి ఎగిరి దానితో పోటీపడలేదు. ఎందుకనగా మిగిలిన పక్షులు ఆవిధమైన ఔన్నత్యముతో రూపింపబడలేదు. పక్షిరాజు ఎగిరేంత ఎత్తుకు మిగతా పక్షులు ఎగిరితే అవి మరణించును. అచ్చట గాలి పరిమాణము చాలా తక్కువ స్థాయితో ఉండుటవలన అవి శ్వాసించలేవు. మిగిలిన పక్షులు అలాగు ప్రయత్నించిన ముక్కలు ముక్కలైపోయి పైనే చనిపోయి భూమిమీద పడిపోతాయి. కాని పక్షిరాజు మిక్కిలి ఉన్నతమైన వీధులలో ఎగురుటకే రూపించబడినది.

12. ప్రభువు మాట్లాడుటకు నాకు అనుమతించు ప్రకారముగా ఈ మధ్యాహాన సమయమున నా మాటల ఉద్దేశ్యమును మీరు గ్రహించినట్లయితే, అవి ప్రజలకు
ఒక పాఠముగా ఉందునని నేను భావించుచున్నాను. మీరు గమనించండి, వరములు మరియు పిలుపు ఒక వ్యక్తి మారుమనస్సు (పశ్చాత్తాపము) పొందుటకు ముందే అనుగ్రహింపబడు చున్నది. మనకు ఇతర పక్షులవలె అనుకరణ చేస్తూ కూసే పక్షి(mocking bird) అవసరమై ఉండవచ్చు. మనకు జీనువాయి పిట్టలాంటి (wrens)చిన్న పక్షులు అవసరమై ఉండవచ్చు. అలాగే ఇంకా అనేక రకములైన ఇతర పక్షులు మరియు పక్షిరాజులు మనకు అవసరమై ఉండవచ్చు. అలాంటి పక్షులు ఎన్ని ఉన్నా, ఒక పక్షిరాజు తానేవిధముగా రూపింపబడినదో అది అట్లే ఉందును. ఎందుకనగా, దేవుడు దానిని ఒక పక్షిరాజుగా సృజించెను. కాని ఇతర పక్షులు పక్షిరాజులవలె పైకి ఎగిరి వెళ్ళుటకు ప్రయత్నించవలసిన అవసరములేదు. ఎందుకనగా, వాటివలన అంత పైకి అవి ఎగురలేవు. అలాగే పక్షిరాజులు కూడా చిన్న తేనెపిట్టల (humming bird) వలె చాలా వేగంగా కదులుచు మరియు తీక్షణంగా పని చెయ్యుటకు ప్రయత్నించకూడదు. (కాని ప్రతీ పక్షికి వాటికంటు ఒక స్థానము గలదు.) అలాగే సంఘములో కూడా ప్రతీ వరమునకు దానికంటు ఒక స్థానము గలదు. కాబట్టి అది పక్షినాడైనా, వేరొకటి ఏదైనా, మరొకటి ఏదైనాగాని, అవన్నీ దేవునియొక్క గొప్ప ప్రణాళికను యుక్తమైన రీతిలో సమస్తము సమకూడి చేయుచున్నది. కాని ఇప్పుడు, తేనె పిట్ట పక్షిరాజువలె చేయుటకు ప్రయత్నించిన యెడల అది తననుతానే నాశనము చేసుకొనును. అలాగే పక్షిరాజు ఒక తేనెపిట్ట వలె చేయుటకు ప్రయత్నించినయెడల అది తననుతానే నాశనము చేసుకొనును. అర్థమైనదా? అలాగే పాపురము ఒక కాకివలె చేయుటకు ప్రయత్నించిన పావురము నకు మరణమే కలుగును. అర్థమైనదా? అలాగే కాకి ఒక పావురమువలె ఉండలేదు. కావున అదే ప్రకృతియొక్క నైజము, అలాగే మనముకూడా ఒక్కొక్కరము వ్యత్యాస ముగా ఉన్నాము. దేవుడు మనల్ని ఈవిధముగా ఉండుటకు రూపొందించెను.

13. కాని పక్షిరాజు... ఇప్పుడు మనము దానికి సంబంధించిన దానిని గూర్చి మాట్లాడుకొనుచున్నాం. దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులతో పోల్చుటకు ఇష్టపడు చున్నాడు. ఆయన అలాగు ఇష్టపడుటకు కారణమేమనగా, మీరు చాలా పైకి వెళ్ళే కొలదీ ఎంతో దూరమైన వాటన్నింటిని మీరు చూడగలరు.కావున ఈ భూమిమీద నుండి అత్యంత ఎత్తుకు వెళ్ళి, అచ్చటనుండి మీరు చూచినప్పుడు ఈ భూమియం గుండ్రముగా కనిపించును. కాబట్టి మిక్కిలి పై, పైకి వెళ్ళేకొలదీ చాలా దూరముగా ఉన్నవాటన్నింటిని మీరు చూడగలరు. పాత నిబంధనలో తన ప్రవక్తలనుగూర్చి దేవుడు ఈలాగు చెప్పుచున్నాడు." పూర్వ కాలమందు నానా సమయములలోను, నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ
దినముల అంతమందు తన కుమారునిద్వారా మనతో మాటలాడెను, యేస ద్వారా" అని చెప్పెను. పాత నిబంధన కాలములోని ప్రవక్తలు ఆత్మలో పరవశులై ఉన్నత స్థానమునకు వెళ్ళి, సుదూరముగావున్న కార్యములను దివ్య దృష్టితో చూచి భవిష్యత్తులో జరుగబోవు కార్యములనుగూర్చి చెప్పిరి. దేవుడు ఆ ఉన్నతమైన స్థితికి వారిని తీసుకొని వెళ్ళెను.

కాబట్టి పక్షిరాజు చాలా ఎత్తుగా పైకి ఎగురుచూ వెళ్ళి, దానియొక్క సామర్థ్య ముతో చాలా ఎత్తుకు ఎగిరి, ఎంతో దూరంగా ఉన్నవాటిని తన కళ్ళతో చూడలేక పోయినయెడల, అనగా అదంత ఎత్తుగా ఎగిరి, అంత ఎత్తుకు తగినవిధముగా దూరముగావున్న కార్యములను తన దృష్టితో చూడలేకపోతే, అదంత ఎత్తుకు ఎగిరి వెళ్ళుటవలన దానికి ఏ ప్రయోజనము ఉండదు. కాని ఇతర పక్షుల శరీరముకంటే భిన్నముగా తన శరీరాకృతి ప్రకారముగానే దాని కళ్ళు దానికి రూపొందించబడినవి. కాబట్టి అది పైకి ఎగిరే కొలదీ ఎంత దూరముగా ఉన్న వాటినైనా చూడగలదు. అనగా బహు దూరముగా ఉన్నవాటిని అది తన కళ్ళద్వారా స్పష్టంగా చూడగలడు.

14. అలాగే పాత నిబంధన కాలములలోయున్న ప్రవక్త ఆత్మలో పరవశుడై, పైకి వెళ్ళి, భవిష్యత్తులో రాబోవుచున్న కార్యములను అతడు చూడగలడు. అలాగే దేవుని ప్రవక్తలలో ఒకరైన యెహెజ్కేలు కూడా దేవునియొక్క పక్షిరాజులలో ఒకడు. అతడు ఉన్నవాటన్నింటిని దాటుకొని పైకి వెళ్ళి, బహు దూరములోవున్న విషయములను చూడగలిగెను. మరియు ఇప్పుడు మన కాలములోవున్న కార్యములనుకూడా చూచేంత ఎత్తుకి వెళ్ళి అతడు చూచెను. అతడు దేవుని ఆత్మద్వారా పరవశుడై కొనిపోబడి ఇంచుమించు ఇరువది ఐదువందల సంవత్సరములను దాటి జరుగ బోవు కార్యములను చూడగలిగెను మనము జీవించుచున్న ఈ దినమును అతడు చూచెను. అందుచేతనే ఆ కార్యములను గూర్చి అతడు వ్రాయగలిగెను. వ్రాసిన ప్రకారముగానే అవి నేరవేరుటను మనము గమనించగలము. కావున పరిశుద్ధ గ్రంథములోని ప్రవక్తలు ఏమి చెప్పితిరో, వారియొక్క ప్రతీమాట నిశ్చయముగా నెరవేరును. కొన్నిసార్లు మనము వాటిని విశ్వసించుటకు మనకు కఠినముగా ఉండును. కాని ఎలాగైనా దేవుడు దానిని నెరవేర్చును. ఎందుకనగా, అది ఆయన వాక్యమైయున్నది. అది ఆయనయొక్క జ్ఞానము. ఆయన అనంతుడు. ఆయన సర్వమును ఎరిగినవాడు. ఆయన జరిగినవాటిని మరియు జరుగబోవువాటిని గూర్చి ఖచ్చితముగా ఎరిగినవాడు. అందుచేతనే, తన మేలుకొరకై సమస్తము క్రియ చేయునట్లు ఆయన వాటిని ముందుగానే నిర్ణయించెను.
15. ఇప్పుడు మానవులు, వ్యక్తియొక్క స్వేఛా నైతిక విలువలను ఆధారముగా చేసుకొని జీవించును. దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని, "నీవు దీనిని చేయునట్లుగా చేసి, తద్వారా నిన్ను నేను కోల్పోవునట్లు చేసుకొని, పిదవ నేను నిన్ను రక్షించ బోవుచున్నాను"అని చెప్పలేడు. అది దేవునియొక్క స్వభావము కాదు. ఏ ఒక్కరుకూడా నశించిపోవుట ఆయనయొక్క సంకల్పము కాదు. క్రాని అందరూ మారుమనస్సును పొందుకోవాలన్నదే ఆయన సంకల్పమై యున్నది కాని ఆయన... ఆయన అనంతుడై యుండుటవలన ఎవరు నశించెదరో, ఎవరు నశించరో ఆది నుండి ఆయనకు తెలుసు. ఎందుకనగా, ఏమి జరుగబోవునో దానిని ఆయన ఎరిగినవాడు. ఇప్పుడు అది ఆలాగు ఉండాలనేది ఆయనయొక్క సంకల్పము కాదు. అందరూ మరలా తనవద్దకు తిరిగి రావలెననదే ఆయన సంకల్పము కాని ఆయన వద్దకు ఎవరు వస్తారో మరియు ఎవరు రారో ఆయనకు తెలుసు. కాబట్టి, ఆయనయొక్క భవిష్యత్ (ముందు) జ్ఞానముద్వారా, తన ప్రణాళిక ప్రకారముగా, ఖచ్చితముగా సమస్తము క్రియ చేయునట్లు ఆయన కార్యమును రూపొందించును.ఓ అటువంటి ఒక తండ్రిని మీరు కలిగియుండుటను బట్టి మీరు సంతోషించగలుగు చున్నారా?

16. ఈ దినమున ఇచ్చటున్న మీలో ప్రతీ ఒక్కరు మీ పేరు గొట్టెపిల్లయొక్క జీవ గ్రంథములో వ్రాయబడియున్నదానిని గూర్చి ఆలోచించుడి. ఎట్లనగా మీరు మీ పేరును ఆ గొట్టెపిల్ల జీవ గ్రంథములో వ్రాయలేదు. మీ బోధకుడు మీ పేరును దానిలో వ్రాయలేదు, లేదా మీ సంఘము మీ పేరును దానిలో వ్రాయలేదు. కాని దేవుడే మీ పేరును ఆ గొట్టెపిల్ల జీవగ్రంథములో వ్రాసెను. దానిని దేవుడు ఎప్పుడు చేసెను? అది గొట్టెపిల్లయొక్క రక్తముద్వారా వ్రాయబడెను. దానిని మీలో ఎంత మంది విశ్వసించుచున్నారు? దానిలో వ్రాసిన పేర్లును చెరిపివేయుటకు తగిన సిరా లేదు, లేదా వేరేదియు ఈ లోకమున లేనేలేదు. గమనించండి. జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు మీ పేరును జీవ గ్రంథములో వ్రాసినని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. వాస్తవముగా మనము ఒట్టివారము. నీ పేరును దానిలో వ్రాయుటకు అసలు నీలో ఏదియు లేదు. నాలోను ఏదియులేదు. దేవుడు, తనకుతానే గొట్టెపిల్లను జగత్తుకు పునాది వేయబడక ముందు వధించినప్పుడు దానిని ఆయన చేసెను. తన భవిష్యత్ జ్ఞానముద్వారా క్రీస్తు ఇచ్చట ఉండునని, ఆయన దేవునియొక్క గొజ్జెపిల్లగా పిలువబడునని, జగత్తుకు పునాది వేయబడక ముందే ఆ గొట్టెపిల్ల వధింపబడెనని ఆయన ఎరిగియుండెను. భూనివాసులు దరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొట్టెపిల్లయొక్క జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో వారిని ఆ మృగము మోసగించును.
17. పెంతెకోస్తు ప్రజలగు మీరు దానిని చూడాలని నేను కోరుచున్నాను. ఆ ఒక్క విషయములోనే మీలో కొదువగలదు. అదే మీకు భయమును మరియు సమస్యను తీసుకువచ్చు చున్నది. ఓ, మీరు, "బ్రాన్హాం సహోదరుడా, నీవు అన్ని విషయములను వదిలి పెట్టి నిత్యత్వపు భద్రతను గూర్చి లోతుగా, అట్టడుగు వరకు వెళ్ళిపోతావని నేను భయపడుచున్నాను" అని చెప్పవచ్చు. ఓ, కాదు. మీరు మీ హృదయమును పరిశుద్ధ గ్రంథముమీద ఉంచినట్లయితే దానిని గూర్చి భయపడనవసరము లేదు. అలాగు అది జరుగదు. అది నిజము. అది దేవునియొక్క వాక్యము,

మరియు ఒక వ్యక్తి ఈవిధముగా "మంచిది. నేను రక్షింపబడితిని, కావున నేనేమి చెయ్యాలనుకుంటానో..." నేనెల్లప్పుడు నేనేమి చెయ్యాలనుకుంటానో దానిని నేను చేసెదను. నా ఉద్దేశ్యములు తప్పైనవని నేనెరిగినపుడు, ఆ సమయమున నేను బలిపీఠమువద్దకు వెళ్ళుటయే సమంజసమైనది. ఎందుకనగా, దేవుడు నాలో ఉన్నయెడల, దేవునికి ఏవైతే ప్రీతికరమైనవో వాటిని మాత్రమే నేను చెయ్యాలను కుంటాను. తాను చెయ్యదలచు కార్యములను చెయ్యుటయే ఒక వ్యక్తి యొక్క నిజ స్వభావమైయున్నది. అతడి స్వభావమే అలాగు చేయునట్లు చేయుచున్నది.

18. ఈ భూమిమీదకు రాక మునుపే ఆదిలోనే, అనగా ప్రతీ మనిషినిగూర్చి ఆదిలోనే దేవుడు ఎరిగియున్నాడు. ప్రతీ ఈగనుగూర్చి, ప్రతీ మిణ్ణల్లిని గూర్చి, మరియు ఈ భూమిమీద ఉండబోవు సమస్తమనుగూర్చి ఆయనకు తెలుసు. ఆయన అంతములేనివాడు. మరియు ఆయనకు సమస్తము తెలుసు. అందునుబట్టి, జగదుత్పుత్తికి ముందే మన పేర్లును గొట్టెపిల్లయొక్క జీవ గ్రంథమునందు వ్రాయబడిన ఆ దినమును కూడా ఆయన ఎరిగినవాడు.

యేసు చెప్పినట్లుగా, ఈ ప్రపంచమున ప్రసంగించబడుచున్న సువార్తయనే ఈ వలను ఒక పెద్ద చెరువులోకి విసిరినపుడు ఆ వలలో పడిన చేపలను మాత్రమే తీసుకొని మిగిలినవాటిని ఆ చెరువులోకి వదిలివేయుట తప్ప వేరేమియు చెయ్య లేము. దేవునియొక్క రాజ్యమనేది... అట్టైతే ప్రసంగించుటవలన ప్రయోజనమేమి గలదు? అని మీరు అడుగవచ్చు. ఒక బోధకుడు తాను చెయ్యవలసిన కర్తవ్యము అతడికి గలదు. అతడికి అది యివ్వబడినది... దేవుని రాజ్యమనేది సముద్రములో వలను వేసినపుడు అందులో పడిన నానా విధములైన వాటిని పట్టుకొని లాగే వలకు మాదిరిగా ఉన్నది. ఇప్పుడు, ఆ పెద్ద చెరువులో చాలా చేపలు ఉన్నవి.సువార్త అనే వలద్వారా ఆఖరి చేపను పట్టుకునేంతవరకు, ఆ తర్వాత దానియొక్క పని సమాప్తమగును. ఆవిధముగా ఒక బోధకుడు సువార్తయనే వలను వేసి బోధించి తద్వారా పడిన చేపలను అతడు తీయును. పరిశుద్ద గ్రంథము మనకు బోధించిన
ప్రకారముగా, ఆ సువార్తయనే గొప్ప వలలో సమస్తము పడును. వాటిల్లో నీటి సాలె పురుగులు, కప్పలు, పాములు, బల్లులు, తాబేళ్ళు, తల కప్పలు(చిరు కప్పలు) మరియు చేపలు పడగా, బోధకుడు వాటిని తీసుకొని వేరుపరచును. కాబట్టి ఏవి చేపలు మరియు)ఏవి చిరు కప్పలని తీర్మానించుట లేదా తీర్పు తీర్చి చెప్పుట నాకు పనికాదు. కాని మీరు వాటిని గమనించిన యెడల... అవి ఏమైయున్నవో, వాటి స్వభావమే వాటినిగూర్చి ఋజువుపరచునని మీరు గమనించి తెలుసుకో గలరు. అది నిజము. అది ఖచ్చితముగా నిజమే.

శ్రీ మన్

19. సువార్త వర్తమాన కూటములు జరుగునప్పుడు మీరు చూడండి. అనేకమంది బలిపీఠము వద్దకు వచ్చి చుట్టూ నిలబడెదరు. నిశ్చయముగా, సువార్తనే వల వారిని పట్టుకొనెను. కొద్దిసేపటి తర్వాత అచ్చటున్న వారిలో, వృద్ద సహోదరుడు తాబేలు 5 వలె తన తలను పైకి ఎత్తి, "ప్రారంభము నుండే నేను దానిని విశ్వసించుటలేదు" అని చెప్పును. అతడు ప్రారంభమునుండి ఒక తాబేలువలె ఉండెను. ఇక అంతే.

రాము పిదప

ప్రాము. “ఆ పాత పరిశుద్ధ గుండ్రాళ్ళలో ఏదోక వ్యత్యాసము గలదు,వాళ్ళ వద్ద నేను నిలువబడలేను" అని చెప్పును. పాము ఆవిధముగా ప్రారంభములోనే... అది నిజము. మరియు నీటి సాలె పురుగు ఫ్లాప్, ప్లాప్, క్లంగ్, క్లంగ్ అని నఆపి ప్రారంభించి మరలా దాని పాత స్థలమునకే తిరిగి వెళ్ళిపోవును. ఎందుకనగా, అది ప్రారంభము నుండి అలాగే ఉన్నది. సువార్తనే వల వాటి పై విసిరినప్పుడు, అవి ఆ స్వభావమునే కలిగియున్నవి. అదే ఖచ్చితముగా నిజము. కాని వాటిపై పడిన అదే వల చేపలపై కూడా పడినప్పుడు అది చేప గనుక, ఆ చేపయొక్క స్వభావమునే అది కలిగియుండెను./కాబట్టి మనము ఆ చేపలకొరకే సువార్తనే వలను వేయు చున్నాము. అదేమైయుండునో దానిని తీర్మానించువాడు దేవుడు మాత్రమే.

20. మరియు అది... ఈ క్రైస్తవ మార్గము, లోక సంబంధమైన మేధావులయొక్క సామర్థ్యంను ఆధారము చేసుకొని దృఢముగా నిలబడగలినట్టైతే, ఇక మనకు పరిశుద్దాత్మ అవసరమే ఉండదు. అది నిజము. అలాగే క్రైస్తవుల యొక్క విశ్వాసము విద్యా సంస్థలయొక్క పధకములపై, సంఘ శాఖలపై మరియు మొదలగువాటి పై మరియు గొప్ప భవనములపై, ఈ దినమున మనము ఏమేమి కలిగి యున్నామో వాటిపైన ఆధారపడియున్నట్లైతే ఇక దేవునియొక్క సంఘమును నడిపించుటకు మనకు పరిశుద్ధాత్మ అవసరమే ఉండదు. అది నిజము. అలాగైతే, మనము చేయవలసిన శ్రేష్ఠమైన కార్యమేమనగా, అది ఆవిధముగా ఉండునట్లయితే, మనము సరియైన ప్రణాళికలోనే ఉన్నామని అర్థమగును. కాబట్టి సంఘ శాఖలను ప్రారంభిం
గొప్ప భవనములను నిర్మించి సంఘములను కట్టుకుందాము. అలాగే చనకు చాలని కోరుకునే ప్రతీ వ్యక్తి, అలాగే ప్రారంభించవచ్చు, కావున సాధ్యమైనంత మరియు మంచి విద్యార్హతగల విద్యావంతులైన వారిని మన సంఘమున మనము సాధ్యమైనంతవరకు మంచి మేధావులగు బోధకులను నియమించుకుందాము చేర్చుకుందాము. సంఘము జ్ఞానవంతులగు మేధావులద్వారానే నడిపింపబడున్నట్లై దరిద్రులను, వీధులలో జీవించే నిరు పేదలవంటి వారిని వెలుపలికి త్రోసివేసి. మంచి వస్త్రములను ధరించుకొనువారిని, మనకు సాధ్యమైనంతవరకు చక్కని మానసిక స్థితిగల ప్రజలను, శ్రేష్ఠమైన జ్ఞానవంతులను సభ్యులుగా చేర్చుకుందాము.

21. కాని సహోదరుడా, మనము ధ్యానించబోవుచున్న ఈ గొప్ప నూతన ఆత్మన్ను యెహెజ్కేలు ఇచ్చట కనుగొనిన ఈ గొప్ప నూతన ఆత్మను జ్ఞానవంతులైన మేధావులద్వారా నడిపింపబడుటకు సాధ్యమవ్వదు. ఈ గొప్ప నూతన ఆత్మను పరిశుద్ధాత్మయే నడిపించునట్లయితే సంఘ శాఖలనుగూర్చి, మరియు లోక సంబంధమైన మేధావులనుగూర్చి, ఎవరైతే చాలా చక్కగా "ఆమేన్" అని చెబుతారో, ఎవరైతే మంచి వస్త్రములను ధరించుదురో వారిని గూర్చి వివాదము పడనవసరము లేదు. అది మనకు అవసరము లేదు.

అలాగైతే యేసు ఏమి చెయ్యమని మనకు చెప్పెనో దానినే మనము చేద్దాము. క్రీ వీధులలోకి, కూడలివద్దకు వెళ్ళి కుంటివారిని, వంకర కాళ్ళుగల వారిని, గ్రుడ్డివారిని, పేదవారిని, ఇంకా ఎవరెవరు ఉన్నారో వారినందరిని లోపలికి తీసుకు రండి. ఎందు కనగా రాబోవు ఈ దినములలో ఏదోక దినమున గొప్ప విందు జరుగబోవుచున్నది. మనకు కావలసినదదే. అలాంటి మత మార్గమే మనకు కావలసియున్నది. అప్పుడు దానిని మనమేవిధముగా పొందుకున్నామో దానినిగూర్చి ఆశ్చర్యపడుదుము.

7.

ہی 1° 22. ఇప్పుడు ఫలమును ఉత్పత్తి చేయవలెనని మనకు ఎన్నడూ ఆజ్ఞాపించబడలేవు. లేదండీ,ఫలమును ఉత్పత్తి చేయమని ఎచ్చటా దేవుడు చెప్పలేదు (మైనము ఫలమును ఇవ్వాలి. కావున ఉత్పత్తి చేయుటకు మరియు ఫలింపజేయుటకు మధ్య చాలా వ్యత్యాసము గలదు. ఇప్పుడు మనము విద్యను ఉత్పత్తి చేయుచున్నాము. మనము మానసిక తత్వమును తయారు చేయుచున్నాము. మనము మేధావులను తయారు చేయుచున్నాము. మరియు బాహ్య సంబంధమైన వాటన్నింటిని మనము ఉత్పత్తి చేయుచున్నాము కాని ఫలమును ఫలింపజేయాలి.) అనగా అది నీ అంతరంగములో నుండి వెలుపలకు వచ్చు కార్యముగా ఉన్నది. కాని మనము దానిని బాహ్యముగా పూతపూయుటకు ప్రయత్నిస్తున్నాము. కాని దేవుని యొక్క సంఘము ఆవిధముగా
కొంత మంది ప్రజలు తమ విజయమను ఎందుకు కాపాడుకోలేకపోవు దన్నారు

13

కట్టబడదు. అది లోపలి (అంతరంగము)నుండి వెలుపలకు వచ్చి బాహాటముగా కనబడు కార్యముగా ఉన్నది. ఆపిల్ పండు వృక్షముయొక్క వెలుపలి వైపు నుండి రాదు. అది వృక్షములోనుండి వెలుపలికి వచ్చుచున్నది. అనగా ఆ వృక్షముయెక్క "జీవము దేనిని ఫలింపజేయుచున్నదో దానిని అది బాహటంగా చూపించనున్నది. చ ఫలించిన ఫలములద్వారా అదేమైయున్నదో అది ఎరుగబడు చున్నది.

Anul

ఆవిధముగా ఈ దినమున సంఘము దేనిద్వారా ఎరుగ బడుచున్నదనగా... బాహ్యపరమైన వేదాంత పాఠశాల అనుభవమునుగల మేధాశక్తిని వాస్తవనకు ఎన్నడు లేని మెరుదిద్దబడిన శ్రేష్టమైన విద్యా పాండిత్యముగల వారిని సంఘము చూపించుచున్నది. ఏ కాలములోన లేనంతగా ఈకాలమున సంపుములో బహు బలహీనమైన బలిపీఠములను కలిగివున్నదో అది నిజము. ఎందుకనగా, జ్ఞానవంత లగు మేధావులద్వారా సంఘమును నియంత్రించుటకు మనము ప్రభుత్నించ చున్నాము అది దేవునియొక్క ప్రణాళిక కాదు. దేవుడు ఆ ఉద్దేశ్యమును కలిగిలేదు.

ఇప్పుడు గమనించండి, "బ్రాహం సహోదరుడా అలాగైతే మేమేమి చెయ్యు వలెను? ఆ ఫలములను ఏది ఫలింప చెయ్యగలరు?" అని మీరు అడుగవచ్చునేను ఈ మధ్యాహనమున, "కొంతమంది ప్రజలు తమ విజయమను ఎందుకు కాపాడు కోలేక పోవుచున్నారు" అనే అంశము మీద మాట్లాడబోవుచున్నాను.

28. ఇప్పుడు గమనించండి, కావున సంఘమునకు మిళమిళ మెరిసే చెరువులు అవసరము లేదు. అలాగే సంఘమునకు నూతన తేజస్సు అవసరము లేదు. 2. సంఘమునకు మరలా నూతన జన్మతో జన్మించటమే అవసరమైయున్నది. దానికి జై మారుమనస్సు కావలెను. అందుకొరకు సంఘమున ఏదోక కార్యము సంభవించి తీరవలయును. సంఘము యొక్క సరిహద్దులను బలపరచుకొనుని కాడ కొ (సభ్యులను దానిలోకి తీసుకొని వచ్చుటకాడు. నము క్రొత్త సభ్యులను తీసుకొని రాదు) ఉజ్జీవమనేది ఇదివరకు మనము దేనినైతే పొందుకున్నామో దానిని పునరుద్ధరింపజేయును. అదే మనకు అత్యంత అవసరమైన కార్యముగా ఉన్నది

నె

24. రికాగోలో కొంత కాలము క్రితము, ప్రసిద్ధిగాంచిన ఒక పెద్ద మిచిగన్) అనే చెరువుగలదు. దానివద్ద నేను నిలబడి దాని నీళ్ళను గమనించుచుండగా, ఆ నీళ్ళలోని అలలు పైకి లేస్తూ ఎగిసిపడుచున్నది. 12 ఈ చెరువు నేడు ఉజ్జీవమును కలిగియున్నది" అని నేను తలంచాను. నేను అచ్చట నిలబడి యుండగా నాతో ఇంకా కొంత మంది అచ్చట నిలబడి యుండిరి.

"నన్ను క్షమించండి, సహోదరుడు బ్రాహంగారు", అని చెప్పెను
ఈ చెరువు ఉజ్జీవము కలిగియున్నది" అని నేను చెప్పాను.

ఎలుకతవమును గురించి వీరేమి తలంచుచున్నారని?" అతడు అను "చూడు, దానిలో నీళ్ళు ఎలాగు పైకి లేస్తూ, దూకుడూ, దానివి అలలు క్రిందికి ఎగసిపడుచూ, ఒకదానితో ఒకటి గుద్దుకొనుచూ, సురగను క్రక్కులున్నడ చూడుము" అని నేను చెప్పాను.

అతడు లే ఉజ్జీవమును గురించి మీరేమి, భావించుచున్నారు?" అని అను "అదొక సంతోషకరమైన సమయమును కలిగివుండట. కాని అది ప్రశాంతముగా ప్రవహించుచున్నప్పుడు ఉన్నట్టుగానే, దానిలోని అలలు పైకి ఎగిసి పడునప్పుడు దానిలోని ఒక్క చుక్క నీటి బొట్టుకూడా ఎక్కువ అవ్వలేదు" అనే విషయమును మీరు గుర్తించాలని నేను చెప్పాను. అది నిజము.

ఇప్పుడు, అలాగే మనము ఎగిరి గంతులు వేయుచూ పరవశముతో వేరే. పరిణామమునకి వెళ్ళినా, ఆ చెరువులో ఎక్కువ తక్కువ కాకుండా ఎన్ని నీళ్ళు ఉన్నవో, అలాగే మనయొక్క గంతులు, బిగ్గరగా అరిచే అరప్పులు, దేవునిని స్తుతించే స్తుతులు అద్భుతముగా ఉండవలెను అది నిజము కావున ఆనందించుచూ, పరవశ ముతో నాట్యమాడుటనే దాని పైన సంఘము కట్టబడలేదుగాని, సంఘము ''పరిశుద్ధాత్మ అభిషేకము పైన మరియు దేవుని ప్రేమ పైనే కట్టబడినది.

25. "సరే. అలాగైతే ఒక ఉజ్జీవమువలన ప్రయోజనమేమిటని?" మీరు అడగ వచ్చు. సముద్రములో లేదా పెద్ద చెరువులో ఒక ఉజ్జీవమును పొందుకున్న ప్రతీసారి, మీరు గమనించిన, దానిలోవున్న సమస్త చెత్తను బయటకు త్రోసివేయుటకై దానిలోని నీళ్ళు ముందుకు వెనకకు కొట్టుకొనుచు, గిరగిర తిరుగుచు వాటన్నింటిని గిలకొట్టు నట్లు త్రిప్పును దానిలో ఆ ఉజ్జీవము ముగించిన తర్వాత వ్యర్థమైన ఆ చెత్తంతా ఒక చోటకు చేరి దాని ఒడ్డుకు వెళ్ళిచేరును. కాబట్టి ఒక ఉజ్జీవము కలుగునప్పుడు అది తననుతాను(సంఘమును) శుభ్రపరచును. జీవముగల దేవునియొక్క సంఘము నాకు దానిలోవున్న సమస్త కలుషితమును) బుద్దిలేని చెత్తనంతా గిరగిర త్రిప్పి సంఘము నుండి వెలుపలికి త్రోసివేయుటకు ఒక ఉజ్జీవము దానికి అవసరమై ఉన్నదని దేవునికి బాగా తెలుసు. అది నిజము

ఒక ఉజ్జీవమును ఏది కలుగజేయుచున్నది? ఆ చెరువులోని నీళ్ళను ఏది గిరగిర త్రిప్పుచున్నది? దానికి కారణమేమనగా, గాలి దానిపైన వీచుటవలన.అది నిజం. అలాగే గాలి పరలోకమునుండి దిగి వచ్చి ఒక ఉజ్జీవమును కలుగజేసెను. అదే సంఘమును రూపుదిద్దు చున్నది. ఒక దినమున శక్తివంతమైన గాలి పరలోకము బండి వీస్తూ వచ్చినప్పుడు, ఒక పెంతెకోస్తు ఉజ్జీవము బ్రద్దలైనది. ఈ దినమున
మనకుకూడా అదే కావలసియున్నది. ఎట్లనగా, మరొక శక్తివంతమైన గాలి వీస్తూ అనగా శక్తివంతమైన గాలి పెంతెకోస్తు సంఘము మీద వీచినప్పుడు దానిలోయున్క చిన్నిచిన్న సిద్ధాంతములను దాన్నచిన్న విభేదములను దానినుండి వెలుపలికి త్రోసివేయుట వలన దేవునియొక్క ప్రేమ స్వేచ్ఛగా దానిలో క్రియచేసెను. సమస్త పనికిమాలిన చెత్తనంతా వెలుపలికి పారద్రోలి, సంఘము శుద్దీకరించబడి, మరల్లా దానిని నూతనముగా ప్రారంభించుటయే మనకు కావలసియున్నది. శ్రీ మేన

26. పరిశుద్ధ గ్రంథపు కాలములలో లోహములను కరిగించు పరికరములను కనుగొనుటకు ముందు బంగారమును తీయుటకు ఉపయోగించే పద్ధతి ఏదనగా, బంగారముయొక్క ముడి లోహమును తీసుకొని, ఆ బంగారపు ముద్దను బాగా నలుగగొట్టుచు, దానిని గట్టిగా కొట్టుదురు. ఆ లోహమును ముందుకు వెనకకు త్రిప్పుచూ కొట్టెదరు. ఆవిధముగా బంగారమును కొట్టి, కొట్టి దాంట్లోవున్న వ్యర్థ పదార్ధములన్ని బయటకు వచ్చువరకు దానిని కొట్టుచుందురు. ఆ బంగారమును కొట్టు కంసాలి దానిని బాగా కొట్టుచు దానిలోవున్న చెకుముకి రాళ్ళను మరియు నకిలీ బంగారమును మరియు దానిలోవున్న సమస్త వ్యర్థ పదార్ధములన్నింటిని కొట్టి, కొట్టి తీయుచు, కంసాలి ఆ బంగార లోహములో తన ముఖము ప్రతిబింభిం చేంత వరకు దానిని అతడు కొట్టుచూ వాటినన్నింటిని తీసివేయును. ఇకప్పుడు ఆ బంగారము శుద్ధమైన సువర్ణమని అతడు ఎరుగును. నా ప్రియమైన స్నేహితుల్లారా ఆలకించండి(ఈ) దినమున పరిశుద్ధాత్మ (ఆయనే కంసాలివలె కొట్టువాడై యున్నాడు) యేసు క్రీస్తుయొక్క బింభము సంఘములో ప్రతిబింభిస్తూ ప్రకాశించువరకు ఈ సువార్తాతో కొట్టుచుండిన యెడల అప్పుడు ఆమె (సంఘము) మరలా శుద్ధమైన సువర్ణముగా మారును) అది నిజము కాని మనలో ఇంకా అధికమైన చెకుముకి రాళ్ళు, రాగి మరియు ఇంకానేక వ్యర్థమైన కార్యములు ఇప్పటికే ఉన్నవి. మీలో ఉన్న వ్యర్థ పదార్ధములన్నీ మీలో నుండి వెలుపలికి రావాలంటే బంగారమును కొట్టు కంసాలివలె ఆయన మిమ్మల్ని కొట్టునప్పుడు మాత్రమే అవి మీలో నుండి వెలుపలికి పోవును. అటువంటి ఒక ఉజ్జీవమే మనకు కావలసియున్నది. మే

27 అప్పుడు, మిక్కిలి నూతన వర్తమానమగు ఈ పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మమును కన్నీళ్ళు లేని కళ్ళతోను, సాంప్రదాయక, సిద్దాంతములను వెంబడించే సంఘములోకి మీరు తీసుకొని రాలేరు. దానిని చెయ్యుటకు అసలు మీకు సాధ్యమవ్వదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, నేను నా హృదయమంతటితో ప్రేమించుచున్నాను. దేవుడు దానిని మీకు బయలుపరచునని నేను నమ్ముచున్నాను. మరియు నా గృహములో రెండు
సంవత్సరముల వయస్సుగల చిన్న బాలుడు నాకు ఉన్నాడు. అతడు తప్పు టను నేను చూచికూడా దానిని దిద్దకపోయినయెడల నేను అతడిని ప్రేమించులు లేదని అర్ధము. అది నిజము. మీ పిల్లలను మీరు..

నేను దీనిని మీకు చెప్పాలని కోరుచున్నాను. అదేమనగా ఈ దేశమున జీవముం గల మన దేవునియొక్క సంఘమున గొప్ప కదిలిక అది రెండు చీలికలు (వర్గము గా చీలి వెళ్ళుచున్నది. దానిలో ఒకటి చాలా మొండివారుగా, పెడసరముగా మరియు డ లోక సంబంధమైన మేధావులుగా ఉన్నారు. రెండవ చీలికవారు మిక్కిలి లోతైన, అట్టడుగు భాగమగు వేరొక ప్రక్కకు తొలిగిపోయిరి. సహోదరుడా, అదే ఖచ్చితముగా సత్యము. అదే నిజము అనగా మత సంబంధమైన మూఢులవలె వేరే ప్రక్కకు తొలగిపోయి... రహదారియొక్క మధ్యలో ఉండకుండా ఒక ప్రక్కగా తొలిగిపోయిది.

28. కొంతకాలము క్రితమే దానిని నేను సూచించుచూ చెప్పాను. అసంబ్లీస్ ఆఫ్ గాడ్ సంస్థయొక్క ఇండియానా రాష్ట్రముయొక్క యాజకుడు (గురువు),నా మంచి స్నేహితుడు రాయ్ వీడ్ ఈలాగు చెప్పెను, "రహదారి యొక్క మధ్యలో వాహనమును నడుపుకుంటూ వెళ్ళాలని నీవు చెప్పినట్లుగా ఎవరోకరు నాతో చెప్పుటను నేను. విన్నాను, నీకు తెలుసా, అది మంచి నీతి (అలవాటు) కాదు. రహదారి మధ్యలో ప్రయాణించువానిపై ఇతర వాహనములు ఢీకొనును" అని నాతో చెప్పెను వీదవ నేను అతడిని కలిసినపుడు, "నా ప్రియమైన సహోదరుడా చూడు, లోక సంబంధమైన దానిగూర్చి ఎక్కువగా ఆలోచించుట వలన, వాటిపై నీ దృష్టిని నీవేవిధముగా ఉంచి తీర్మానించుదువో దానినే తలంచెదవు' అని నేను చెప్పాను. నేను చెప్పిన రహదారిలో ఒక్క వైపే మార్గము ఉండును. అనగా ఒక వైపే వాహనములు వచ్చు మార్గమది. ఆ మార్గమున వెళ్ళువారు మరలా వెనుకకు త్రిప్పుకొని ఎవ్వరూ రాలేరు. ఆ మార్గమున వెళ్ళేవారు అదే మార్గమున ముందుకు సాగిపోతూ వెళ్ళాడు. లేదా ఆ మార్గము నుండి ప్రక్కకు తొలగిపోవలెను. అది నిజము. ఒకటి వేళ్ళాలను కుంటే ఆ ఒక్క మార్గముగుండానే వెళ్ళవలెను లేదా వేరే మార్గమునైనా వెళ్ళవలెను మీరు ఒకటి మూర్ఖులవలె, ఆనవాయితిగా వెళ్ళుచు, చివరవరకు లోతు7 ప్రయాణించి, మార్గమును తొలగి వెళ్ళిపోయెదరు, లేదా క్రీస్తుతో ముందుకు సాగిపోయెదరు. మీరు ముందుకు వెళ్ళుచు ఉందురుగాని మరలా వెనక్కి తిరిగి రాలేరు. మీరు వెళ్ళే ఆ మార్గము మరలా వెనుకకు తిరిగి వచ్చు మార్గము కాదది. మీరు అలాగే ముందుకు కొనసాగిపోవుచూ ఉండండి. ఈ మార్గమువ ఏ ఒక్కరు వెనుకకు తిరిగి రారు.
29ఇప్పుడు స్నేహితుడా, గమనించుము, యదార్ధముగా సమర్పింకొనిన ఒక నూతన ప్రజల సమూహము నేడు మనకు కావలసివున్నది మనకు కావలసినది అదే. ఈ దినమున వర్తమానమును, బహంగా మనము ఒకవేళ రాష్ట్రపతి పట్టణ నకు వచ్చి, "ఇచ్చటున్న ఈ చెరువును తీసివేయవలెను" అని, మరియు అలాంటి ఐదు కార్యములనుగూర్చి చెప్పినయెడల, ఆ చెరువులోని నీటిని తోడేసి, ఎండిపోవు నట్లుగా చేయుటకు మీరు ప్రారంభించెదరు. ఎందుకనగా, రాష్ట్రపతి దానిని చెప్పినందువలన అట్లు చేయుదురు. "ఎందుకనగా, ఇచ్చట స్వరంగ మార్గమును లేదా ఏదోక దానిని చెయ్యుటకు నిర్ణయించాము" అని రాష్ట్రపతి చెప్పెను. కాబట్టి రాష్ట్రపతి దానిని చెప్పినందువలన వారు దానిని అలాగు చేయుదురు. కాని సహోదరుడా, రాష్ట్రపతి మాటలకంటే గొప్పదైన పుస్తకములో నుండి ఈ దినమున మనము చదువుచున్నాము. మన రాష్ట్రపతి మనపట్ల శ్రద్ధవహించును మన రాష్ట్రపతిని నేను ప్రేమిస్తున్నాను. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన ప్రజలకొరకు అనేక రకముల కార్యములను చేయును,కాని అవన్నీ దేశమునకు సంబంధించిన విషయములు. కాని నా భావమేమనగా, ఈ పట్టణమునకు చేయవలసిన కార్యములను చేయుటకు బాధ్యతను వహించు అధికారులనుగూర్చి నేను మాట్లాడుట లేదు. కాని దేవుని వాక్యముద్వారా దేవునియొక్క సంఘముతో మాట్లాడుచున్నాను. ఇచ్చటే మనకు మార్పు కావలసి ఉన్నది.

30. ఇప్పుడు, మీరు వర్తమానమును పాత కాలపు విశ్వాసము గల వారియొద్దకు అంత శులభముగా తీసుకొని వెళ్ళలేరు. పరిశుద్ధ గ్రంథమున దానినిగూర్చి చాలా కాలమునకు క్రితము యేసు చెప్పెను. "క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో పోయరు" అని ఆయన చెప్పెను. ఆ మాటల్లో భావమేమిటని నేను అనేకసార్లు > ఆశ్చర్యము చెందుచుండేవాడిని. "క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో పోయుట?" అని ఆయన చెప్పినప్పుడు మన ప్రభువు దానిని ఏ భావముతో చెప్పెను? మంచిది, ” అదే వ్యత్యాసమును కలిగించుచున్నదని నేను తలంచితిని. ఎందుకనగా,ఈ దినము లలో మనము గాజు సీసాలను మాత్రమే ఉపయోగిస్తున్నాము. కాబట్టి క్రొత్తదా. లేదా పాతదా అనే మాటకు ఇచ్చట ఏ అర్థము లేదు. కాని నేను తూర్పు దేశములలో గల, అనగా ఆసియా ఖండముయొక్క తూర్పు ప్రాంతములకు వెళ్ళినప్పుడు, ప్రాచీన కాలములలో వారి నీళ్ళ సీసాలు జంతువుల చర్మముతో చేయబడి ఉండుటను నేను కనుగొన్నాను. కాబట్టి ఆ జంతువుల చర్మము తాజారై మరియు క్రొత్తరైతే. లేదా జంతువు చర్మముతో చేయబడిన ఆ తిత్తు బాగా ఎండిపోయి, పాతదై వాడబడు
టకు సిద్ధముగా ఉన్నప్పుడే, ఇంకా పులియని ద్రాక్షారసముతో తయారు చేయబడిన క్రొత్త ద్రాక్షా మద్యమును అందులో పోసి ఉంచుదురు. అది పులియు అందులో ఉప క్రిములు ఉండును. ఆ ద్రాక్షా మద్యము పులియుటకు ప్రారంభించు నప్పుడు అది పాత తితులలో ఉండిన యెడల బాగా ముడుచుకుపోయి మరియు బిగుసుకు పోయి ఉండుటవలన పిగిలిపోవును. ఆ క్రొత్త ద్రాక్షామద్యము యొక్క ఒత్తిడిని అది భరించలేదు. కాబట్టి అది పిగిలిపోయి, కారిపోవును. ఆ ద్రాక్షామద్యము దానిలో నుండి కారిపోవును మరియు ఆ తిత్తుకూడా పాడైపోవును.

31. కాబట్టి ఈ దినమునకూడా అది ఆవిధముగానే ఉన్నది. పరలోకము నుండి దిగి వచ్చిన ఈ నూతన, అనగా తాజాదైన నూతన పెంతెకోస్తు ద్రాక్షా మద్యమును తీసుకొని ఏదోక పాత కాలపు సిద్దాంతముతోను పాత కాలపు ఆచారపు మార్గము నకు అలవాటుపడిన మరియు మూర్ఖత్వపు విధానముతో మరణించే వాటిక కలుపకూడదు. ఎందుకనగా, మీరు అట్లు చేసినయెడల, అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మమునుగూర్చి, దైవిక స్వస్థతనుగూర్చి మరియు సూచక క్రియలను, అద్భుత కార్యములనుగూర్చి మీరు వారివద్దకు వెళ్ళి బోధించినప్పుడు, అది పాత తిత్తు కాబట్టి దాని చర్మము సాగుచూ అది బ్రద్దలై పోవును) మరియు "అద్భుతములు జరుగు దినములు గతించిపోయెను. నేను దానితో ఇక సమ్మతించ లేను. అసలు ఈ ప్రసంగముతో నేను ఏకీభవించలేను" అని వారు చెప్పుచు, అది బ్రద్దలైపోయి, కారిపోయి దాని ద్వారముగుండా వెళ్ళిపోవును. అది నిజము. మీరు దానిని చెయ్య లేరు.కాని నూతన పెంతెకోస్తు ద్రాక్షా మద్యమును పోయుటకు మీరు నూతన తిత్తులను కలిగి ఉండవలెను) నిజము. క్రొత్త తిత్తులు క్రొత్త చర్మతో ఉండుటవలన ఆ చర్మములో ఇంకా ఆ జంతువుయొక్క నూనె పదార్ధము ఉండును. అందువలన ఆ క్రొత్త చర్మము సాగుతాది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి, దేవుని ప్రేమనుగూర్చి, సూచకక్రియలు, అద్భుతకార్యములనుగూర్చి బోధించుటకు మీరు ప్రారంభించునప్పుడు, నూతన చర్మము. "యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంత రము ఏకరీతిగా ఉన్నాడని" వాక్యము చెప్పినప్పుడు ఆ నూతన చర్మపు తిత్తు, "ఆమేన్" అని చెప్పును. నిజము. ఆ వాక్యమునకు అది సాగుచూ అంగీకరించును.

కాని ఆ పాత చర్మపు తిత్తు, "Dr. జోన్గారు మీరు అలాంటి వాటిని బోధించ వద్దు" అని చెప్పును. అర్థమైనదా? అది అలాగే చెప్పును. దానికి, దీనికిగల బేధము అదే. కాబట్టి ఈ దినమున పెంతెకోస్తు వర్తమానమును ప్రసంగించుటకు నూతన పెంతెకోస్తు చర్మములు మనకు కావలసి ఉన్నవి.
32. పెంతెకోస్తు అనగా మీ సంఘశాఖనుగూర్చి నేను మాట్లాడుటలేదు గాని,ఆ పెంతెకోస్తుయొక్క అనుభవమునుగూర్చి చెప్పుచున్నాను. అదేదో ఒక సంఘశాఖ కాదు. పెంతెకోస్తు అనగా మీరు దేనినైతే స్వీకరించిరో అదేయగును అదే నిజము. అది మెథడిస్టులకు, బాప్తిస్టులకు, లూథరన్లుకు మరియు కాతలిక్కులకొరకు మరియు ఆవిధముగా చెప్పుకొనువారి కొరకు, కొన్నిసార్లు పెంతెకోస్తులకంటే ఇంకా మేము గొప్పవారమని చెప్పుకునే వారికొరకు, అలాగే పెంతెకోస్తులకు అందరికీ చెందినది. అది నిజము. మీరు దానిని అంగీకరించగలిగినట్లైతే, అదొక అనుభవము.ఓ, ఆ నూతన జీవము మీలో క్రియ చేయుటకు ప్రారంభించినప్పుడు, “నిన్ను స్వస్థపరచు ప్రభువు (యెహోవా)ను నేనే" అని మీరు పరిశుద్ధ గ్రంథములో నుండి చదివినప్పుడు, అప్పుడు నూతన తిత్తులో, ఆ జీవము ప్రవేశించుటకు ప్రారంభమై, అది తనను సాగదీసుకొని, “ఆమేన్" ప్రభువా, దానిని నేను విశ్వాసించుచున్నాను"అని చెప్పును.

33. ఇప్పుడు, మృత దేహములను భద్రపరచుటకు ఉపయోగించే తైలపక్వపు ద్రవమనే ఉపదేశమును మీ అందరిలోకి ఎక్కించినయెడల ఏమగును? మొదటగా మీరు తెలుసుకోవలసిన విషయమేమనగా, నేనెల్లప్పుడూ చనిపోయిన వ్యక్తి కొరకు బాధపడతానని మీకు తెలుసా, ఇచ్చటున్న మృత దేహాలను భద్రపరచే కొన్ని గదు లకు వెళ్ళి వాటిని గమనించాను. ఒక వ్యక్తి మరణించిన పిదప ఆ మృత దేహాన్ని ఇచ్చటకు తీసుకొని వచ్చినప్పుడు, ఆ మృత దేహమును తైలపక్వము చేయుటకు దానిలోకి వారు చాలా ద్రవమును ఎక్కించెదరు. ఎందుకనగా, అతడు మృతమైన స్థితిలో ఉండుటవలన దానిని ఎక్కించెదరు. నేడు అమెరికా చుట్టూవున్న కొన్ని సంఘములలోని పరిస్థితి అలాగే ఉన్నది. వారు ఆరంభంనుండి మృతి చెందిన స్థితిలోనే ఉన్నారు. మీరు గనుక అలాంటి సంఘములలోకి వెళ్ళినయెడల, మీరు కూడా వారివలె నిశ్చయముగా మృతి చెందినట్లు ఉండుటకు వారియొక్క పాత ఆచారములను మరియు లౌకిక జ్ఞానమనే తైలపక్వము చేయుటకు ఉపయోగించే ద్రవమును మీలో పూర్తిగా ఎక్కించి మిమ్మల్ని కూడా వారివలె నిర్జీవులుగా చేసెదరు.

ఈ దినమున మనకు కావలసినదేమనగా, పాత కాలపు భక్తి, పెంతెకోస్తు అనుభవమనే పరిశుద్ధాత్మయొక్క శక్తి మనకు అవసరము. నిజము. ఎదిగేటప్పుడు కలిగే నొప్పులు మనకు అవసరమైవున్నవి. అప్పుడే ప్రభువు మనలో ఉండి క్రియ చేయుటకై, విశాల హృదయముతో మనలను సమర్పించు కోగలము. ఓ, “ఆమేన్” అని చెప్పలేని మీలోవున్న సమస్త సంకుచితమైన కార్యములను నేను ద్వేషించు చున్నాను(అవునండీ), లేదా మీరు... (సహో॥ బ్రాన్హాంగారు రెండుసార్లు గుర్రుమను చున్నారు-సంపా॥) ఓ, దానిని చేయుటకై నా నరములు ఉద్రేకము చెందుచున్నవి.
34. కొన్ని దినముల క్రితము ఇచ్చట కెంటకీలో, చిన్న పాత మెతడిస్టు సంఘము గలదు. అచ్చట నిజముగానే పరిశుద్ధాత్మను పొందిన క్రొత్తగా వివాహము చేసుకొనిన ఒక యవ్వన దంపతలు అచ్చట నుండి వారు ఉత్తరమును తీసుకొని లూయిస్్వల్లీ అనే ఊరుకు వచ్చిరి. ఆ నగరములోగల ఒక గొప్ప, పెద్ద సంఘములో వారు తమను సభ్యులుగా చేర్చుకొనిరి (ఓ,నాకు తెలియదు) ఆ సంఘమున జనులు బిగుసుకుపోయి మరియు సంప్రదాయములతో మునిగిపోయి ఉండెదురు.

35. ఒక దినమున ఒక చిన్న పల్లెటూరులోవున్న తల్లి తన కుమారుడిని మరియు కోడలిని చూచుటకై ఆ పట్టణమునకు వెళ్ళెను. వారు తాము వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే సంఘమునకు వెళ్ళుచుండెదరు. తన కొడుకు, కోడలు ఆదివారము దినములలో ఇంట్లోనే ఉండిపోతూ తమ సమయమునంతా టెలివిజన్ చూచుటకు వెచ్చించుచు కాలమును గడుపుచూ ప్రార్థన కూటములకు వెళ్ళకుండా, వాటికి దూరంగా ఉంటూ, కేవలము అనవాయితీగా, నామకార్థ క్రైస్తవులవలె జీవిస్తూ, ఈ దినమున మన అమెరికావలె లోక సంబంధమైన అనేక కార్యములతో వారు మునిగిపోయిరి. అలాగే మెథడిస్టులు, బాప్తిస్టులు, పెంతెకోస్తులు మరియు ఇంకా అనేకులు ఆ స్థితికే దిగజారిపోయిరి. నిజము. అదే ఖచ్చితముగా నిజము, సంఘము లోని ఆరాధనకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయి దానిని చూస్తూ లేదా దీనిని చేస్తూ లేదా కారులో అటుఇటు తిరుగుచూ, పనికిమాలిన వాటిని చేయుదురు. సంఘమునకు వెళ్ళాలంటే, అబ్బా, చాలా ఎండగా, వేడిగా ఉన్నాదంటు, లేదా అటువంటి ఏదోక వ్యర్థమైన కార్యములు చేయుచు, ఈ దినము నాకేమి బాగోలేదు అని సాకులు చెప్పుచుందురు. కాబట్టి రాబోవు ఆ దినములలో ఏదోక దినమున ఆ ఉగ్ర తీర్పుకు గురియై, దోషిగా ఆ బోనులో బంధింపబడి, శిక్షింపబడు దినమున ఈ దినము కంటే అప్పుడు ఇంకా ఘోరముగా మీరు బాధపడెదరు. అది నిజము.

ఆ పట్టనమునకు తన కుమారుని యొద్దకు వెళ్ళిన ఆ వృద్ధ తల్లి ఆదివారమున సంఘమునకు వెళ్ళుటకు కోరుకొనెను. "బాబూ, మీరు ఇచ్చట ఏ సంఘమునకు వెళ్ళుచున్నారు?" అని ఆమె అడిగెను.

వారు, “అమ్మా, మేము అదిగో అచ్చట ఆ మూలలో ఉన్న గొప్ప మెథడిస్ట్ త్రిత్వపు సంఘమునకు వెళ్ళెదము” అని చెప్పిరి.

“ఓ, అలాగా, ఈ ఉదయమున నేను ఆ సంఘమునకు వెళ్ళెదను, ఈ రోజు సబ్బాతు దినము గనుక నేను ఖచ్చితముగా వెళ్ళాలి" అని ఆమె చెప్పెను.

ఆ తర్వాత, ఆదివారము ఉదయమైనపుడు, వారు తమ తల్లిని తీసుకొని సంఘమునకు వెళ్ళిరి. ఆమె వస్త్రమును మెడవరకు కప్పుకొని, పొడవైన చేతులు
కలిగిన వస్త్రమును ధరించుకొనెను. ఆమె లోపలికి అడుగుపెట్టగానే అచ్చటున్న ద్వారపాలకులు, ఆమెతో ఏదో చెప్పుటకు ఆమెవద్దకు వెళ్ళి, "ఈ పొడవైన వస్త్రము లను ఎచ్చట కొన్నావు? పాత వస్తువులను అమ్ము ఏ దుకాణంలో వీటిని కొన్నావు?" అని అడిగిరి. ఆమె తిన్నగా లోపలికి వెళ్ళి, తన వెనుకవున్న వెంట్రుకలను చక్కగా దువ్వుకొని, మరియు ఉల్లిపాయ పైన ఉండు నున్నని ఉల్లిపాయ పొరలవంటి ముఖముతో ఆమె ముందుకు వెళ్ళి అచ్చటయున్న కుర్చీలోకి వెళ్ళి కూర్చొనెను.

36. వెనుక తోకవలె వ్రేలాడే పొడవైన కోటును ధరించికొని అచ్చటకు సేవకుడు వచ్చి నిలబడెను. ఆ కోటుని గురించి మీకు తెలుసు. ఆ కోటు అతడి మెడ చుట్టు గుండ్రని కాలరుతో ఉండెను. అతడు అచ్చట నిలబడి, “ఇప్పుడు, నా ప్రియమైన సంఘమా, ఇపుడు మనము ఆరాధానలోకి ప్రవేశించుదాము” అని అతడు చెప్పెను. "మంచిది, మహిమ” అని ఆ వృద్ధురాలు చెప్పెను. ప్రతీ ఒక్కొక్కరు చుట్టూ చూస్తూ, పొడవైన మెడలను కలిగిన కెనడా దేశపు బాతులువలె తమ మెడలను సాగదీసుకొని, తలను వెనుకు త్రిప్పి ఏమి జరుగుచున్నదని వింతగా చూచిరి. ఏమి జరుగుచున్నదాయని వారు ఆశ్చర్యపోయిరి.

ఆ సేవకుడు... (సహోదరుడు బ్రాన్హాంగారు తన గొంతును సరిచేసుకొను చున్నారు-సంపా.)"దీనిని నేను మరలా ప్రయత్నిస్తాను,సరే, ఇప్పుడు, గౌరవనీయులైన స్త్రీల్లారా మరియు పురుషుల్లారా, ఈ దినమున యేసుక్రీస్తు, ఒక మహామహుడైన ఒకనిగా మన మధ్య ఉన్నాడని మనము విశ్వాసించుచున్నాము" అని చెప్పెను. “అవును, దేవునికే మహిమ. ఆమేన్" అని ఆమె చెప్పెను. అచ్చట కూర్చొని యున్న ఆ వృద్ధరాలియొక్క కుమారుడు మరియు కోడలు తమ తలలను క్రిందకు దించుకొనిరి. ఏమి జరుగుచున్నదో వారికి తెలియుట లేదు.

ద్వారపాలకుడు ఆమె వద్దకు వచ్చి, "అమ్మా, నీవు సేవకుడిని అభ్యంతరపరచు చున్నావు, అతడు ప్రసంగించలేక పోవుచున్నాడు" అని చెప్పెను.

37. ఖచ్చితముగా అతడికి మరియు నాకు మధ్య చాలా వ్యత్యాసము గలదు. ఇచ్చటున్న మీరు “ఆమేన్” అని గట్టిగా చెప్పకపోతే నేను ప్రసంగించలేను. అలాగు చేయుట మాత్రమే నాకు తెలుసు. నేనెచ్చట నిలబడియున్నానో నాకు తెలియదు. “ఆమేన్” అని చెప్పుటకు నేనెంతో ఇష్టపడెదనని నేను నమ్ముచున్నాను. “ఆమేన్” అనే మాటకు అర్థమేమనగా “అలాగే జరుగునుగాక!” అని అర్ధము. ఆ వాక్యము తన పట్టును కలిగి, అది హృదయములోనికి వెళ్ళుచున్నది. మీకు తెలుసా, "ఎవరెవరు?" అని ఎరగనివారై, ఆమె పేరు ఈ భూమిలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండక
పోవచ్చు. కాని ఆమె పేరు గొట్టె పిల్లయొక్క జీవగ్రంథములో వ్రాయబడి యున్నడ) నేను ఊహించుచు ఆశ్చర్యపోవుచున్నాను. ఈ లోకములో "ఎవరెవరు" అనే పుస్తక ములో నా వివరములను నమోదు చేయబడి ఉండుటకంటే గొల్డెపిల్ల యొక్క జీవగ్రంథములో నా పేరు వ్రాయబడి యుండుటయే నేను కోరుకొనుచున్నాను నిజము. అచ్చటే నా పేరు వ్రాయబడి యుండుట చాలా ప్రాముఖ్యమైనది, అవును.

38. కొన్ని దినములకు క్రితం నేను ఉత్తర బ్రిటిష్ కొలంబియాలో ఉన్నప్పుడు, ఒక దృశ్యము నా కళ్ళెదుటకు వచ్చెను. అది నన్ను ఒళ్ళు జలదరించునట్లు చేసెను. మొదట, ఒక వృద్ధ బూడిదరంగు ఎలుగు బంటిని గుఱ్ఱముపై నుండి నేను తరుముచు వెళ్ళాను. ఆ వృద్ధ ఎలుగుబంటి తనను నేను ఫోటో తీయకూడదని నిర్ణయించుకొన్నట్లుగా అది పరిగెత్తుచున్నది. దాని ఫోటోను తియ్యాలని నేను తలంచాను. కాని దానికి దగ్గరగా నేను సమీపించలేకపోయాను. కొద్దిసేపటి తరువాత, ఆ చిన్న మూడు సంవత్సరముల వయస్సుగల గుఱ్ఱమునకు దెబ్బతగిలి, దానిని భరించలేక అది నన్ను క్రిందకు తోసేయాలని ప్రయత్నించెను. ఈ వృద్ధ ఎలుగుబంటుకు నన్ను మరుగుచేసుకోవాలని నేను ప్రయత్నించుచు గుట్టలలోకి, చిన్న సంధులు గల వాటిగుండా, దూరుచూ నేను వెళ్ళుటకు ప్రయత్నించాను.ఇక దానిని నేను చూడలేననుకున్న తరుణములో నేను తిరిగి చూడగా దానిని చూచాను,

కావున నేను తిరిగి చూచినప్పుడు, ఆ సమయమున చీకటి పడుచున్నది. నేను కొండ అంచు పైకి వెళ్ళి చుట్టూ చూచాను. "ఏ మార్గమున వచ్చానని?" ఆలోచిస్తూ చుట్టూ చూచాను. ఇపుడు, మీకు తెలుసా, అచ్చట పైకి వెళ్ళుటకు మీరు కోరుకొనరు. ఎందుకనగా, ఐదు వందల మైళ్ళ దూరమునకు అవతలకు మీరు వెళ్ళినప్పుడు ఇక ఏ రహదారి లేదా వేరేదియు ఉండని స్థలమునకు వెళ్ళి పోవుదరు. కావున "ఏ మార్గమున వచ్చానని ఆశ్చర్యపోతిని”. ఆ సమయమున మబ్బుగాను మరియు కొంచెం పొగ మంచుతో కమ్ముకొని ఉన్నట్లుగా ఉండెను. అందువలనే నేను ఆ వృద్ద ఎలుగుబంటుకు దగ్గరగా వెళ్ళి ఫోటో తీయ్యాలను కున్నాను. ఆ చుట్టూ చూచి, “సరే, నేను వెళ్ళుటకు ఇదే సరైన మార్గము" అని నేను ఆలోచించి,కొంత దూరం స్వారీ చేయుచు వెళ్ళుచుండగా మంచు పొగ తగ్గి మార్గము తేటగా కనబడుచున్నది. చంద్రుడు మేఘమునుండి బయటకు వచ్చెను, మంచిది, సరియైన మార్గము వైపు స్వారీ చేయుచు వెళ్ళుటకు,నా మార్గమును నేను తేటగా చూడగలుగు చున్నాను. కాని వాతావరణం విపరీతముగా మారిపోవుచున్నది, కాబట్టి మంటను వెలిగించి, ఈ రాత్రికి నేను ఇచ్చట ఉండిపోవుటయే మంచిదని" నేను తలంచాను.
39. కాబట్టి ఆవిధముగా కొంత దూరము వెళ్ళిన తరువాత నా చిన్న గుఱ్ఱము నోటిలోనుండి నురగ క్రక్కుచున్నది. గాలి వీచుటవలన, ఆ గాలి ప్రభావమునకు ఊగుచూ నేలకి ఒరిగిపోయిన వృక్షములు పిదప కాలిపోవును. అటువంటి వాలిపోయి క్రింద పడివున్న ఒక వృక్షపు మొదుదగ్గరకు వచ్చి గుఱ్ఱమును కట్టితిని. ఆ స్థలము బలమైన గాలులు వీచుటవలన ఆ గాలి తీవ్రతకు అనేక వృక్షములు నేలపై పడియుండి, వాటిల్లోని జీవము పోయి, వాలిపోయి,ఒకదానిపై ఒకటి పడి యున్న స్థలముయొద్దకు వచ్చి అచ్చట నిలబడియుండి, ఆ గుఱ్ఱము విశ్రాంతి తీసుకొనుటకు కట్టివేసితిని. గుఱ్ఱము నుండి దిగిన పిదప, అచ్చట క్రింద నేను కూర్చున్నాను. పెద్ద, తేటతెల్లని మేఘములు, అవి నన్ను దాటికొని వెళ్ళుచున్నవి. వాటిగుండా చంద్రుని వెన్నెల ప్రకాశించుచున్నది. ఆ మేఘములు ఏట్లున్నవనగా, "పాల మజ్జిగవంటి తెల్లని మేఘముల గుంపు" అని నేను పిలిచెదను.

“సరే, ఇక్కడే ఉండిపోతే బాగుంటాది" అని నేను తలంచాను. గాలులు వీచ్చు. చున్నవి. ఆ గాలులు వలన పొగమంచు చెదిరి పోయెను. పిదప నేనెన్నడూ వినని విధముగా మిక్కిలి దు:ఖముతో మూలుగుచున్న మూలుగును నేను ఆలకించాను. “ఏమిటి ఈ శబ్ధము?” అని నేను ఆలోచించాను. మరల కొంతసేపటికి ఆ శబ్దము నాకు వినబడెను. (అదేలాగు వినిపించుచున్నదో బ్రాన్హాం సహోదరుడు వినిపించు చున్నాడు-సంపా॥) “మ్-మ్-మ్-మ్”, “ఇది దయ్యములు ఉండు స్థలము” అని నేను తలంచాను. ఆ తర్వాత మేఘముల చాటునుండి చంద్రుడు బయటకు వచ్చెను. గొప్ప, పాతవైన, పెద్ద దేవదారు వృక్షములు అచ్చట నిర్జీవముగా నిలబడి ఉన్నవి, అందువలన అవి తెల్లని సున్నం కొట్టినట్లుగా అచ్చట నిలబడి ఉన్నవి, చంద్రుని వెన్నెల వాటిపై పడుచున్నందువలన అవి చూచుటకు సమాధుల పై కట్టే పాలరాయివలె కనబడు చున్నవి. మిక్కిలిగా అలసిపోయిన లేదా విసిగిపోయిన ఒక శబ్దంవలె అది ఉన్నది, దాని నేనెన్నడు ఆలకించియుండలేదు. "నేను నిలబడిన ఈ స్థలము ఎలాంటిది?" అని నేను తలంచాను. సరే, “ప్రభువా, నేను ఇచ్చట ఉండాలని నీవు కోరుచున్నావా?” అని ఆలోచించాను.

40. కట్టివేయబడిన చిన్న గుఱ్ఱము నా వద్ద ఉన్నది. నేను అలాగే క్రింద కూర్చొని విభ్రాంతి చెందుటకు ప్రారంభించాను. "విసిగిపోయినట్లుగా మూలుగుచున్న ఈ పాత వృక్షముల శబ్దంను వింటుంటే ఈ మార్గమున వెళ్ళేవారికి భయము కలుగును కదా?” అని నేను తలంచాను. ఈ ప్రక్కగా ప్రయాణము చేయువారిని ఆ శబ్ధము ఖచ్చితముగా భయపెట్టునని నేను తలంచాను. నేను అక్కడే కొంతసేపు కూర్చొని యుండగా ఒక చిన్న పాత దృశ్యము గమనించుట జరిగినది. ఆ తర్వాత మరల
కొంతసేపటికి గాలి గొప్ప శబ్దంతో మరలా వీచుచు వచ్చుచుండెను. ఆ వృక్షములు తద్వారా దుఃఖించుచున్నట్లుగా మరియు విసిగిపోయినట్లుగా మూలుగుచు శబ్దము చేయుటను నేను గమనించాను. “సరే, అసలు దీని అర్ధం ఏమిటని?" ఆలోచిం చాను. యోవేలు గ్రంథములో వ్రాసిన కొన్ని వచనములు నా తలంపులలోకి వచ్చినవి. "గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసియున్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసియున్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి", మరియు ఈ పురుగులన్ని, వివిధ రకముల పురుగులన్నీ ఒక్కటేయని, మరియు ఆ ఒక్క పురుగే తన దశలను మార్చుకొనుచున్నదని నేను తలంచాను. అది ఒకే రకపు పురుగుగా ఉండి, మరలా ఆ దశనుండి వేరొక రకపు దశకి వెళ్ళు పురుగుగా మారుచున్నది. గొంగలిపురుగు,.. మిడతలు, పసరు పురుగు, చీడ పురుగు అవన్నీ ఒకే రకపు పురుగే. అదొక్కటే గాని ఒక్కొక్క దశలో దాని జీవ దశను మార్పు చెందుచు వెళ్ళు చున్నది.

41. "అవును. అదే నిజము. సరే, అసలు ప్రభువు నన్ను ఇచ్చటే ఎందుకు నిలచివుండునట్లు చేసెననే విషయమును ఇప్పుడు నేను గమనించాలి" అని నేను ఆలోచించాను. జీవములేని నిర్జీములైన ఈ గొప్ప పెద్ద పాత వృక్షాలన్నీ ఒకప్పుడు వాస్తవముగా జీవముతో చక్కగానే ఉండెడివి. ఈ దృశ్యము నాకు దేనిని సూచించ చున్నవనగా, గొప్పవైన పెద్ద బిర్రబిగుసుపోయినట్లుండు కొన్ని సంఘములు నాకు జ్ఞాపకములోకి వచ్చినవి. అవి తెలుసు. ఆ వృక్షములవలె ఈ సంఘములుకూడా అందని ఎత్తులో నిలబడి యున్నట్లుండును. ఓ, దేవా, ఈటెల వంటి ఆకారముగలా ఎత్తైన గోపురములవలె చాలా అందని ఎత్తుగా కట్టబడి, అవి ఎత్తైన ఒక శిఖరమువ ఆ పట్టణమంతటికి కనబడేలాగు నిర్మించబడి ఉండును. ఎట్లనగా, జీవములేని చచ్చిన వృక్షములు ఎలాగు నిలబడియున్నవో అట్లే ఈ సంఘముయొక్క భవనములఙ కూడా ఉండును.కాని అవన్నీ ఒకప్పుడు జీవముతోవున్న వృక్షములే. అలాగే ఈ సంఘములుకూడా, అనగా లూథరన్, మెథడిస్టు మరియు మొదలగువన్నీ వాటి కాలములో అవన్నీ పరిశుద్ధాత్మతో నింపబడియుండెను. కాని లూథరన్ విడిచి దానిని మెథడిస్టు తినివేసెను. మెథడిస్టులు విడిచిన దానిని బాప్తిస్టు తిని ఫేసెను బాప్తిస్టులు విడిచిన దానిని పెంతెకోస్తు తినివేసెను. ఓ, ఆ దీనమైన వృక్షమును అవి తిని వేసినవి. వాటినిగూర్చి చెప్పుటకు అది తప్ప వేరేదియు లేదు.

42. గత కాలములో ప్రారంభ దశలో, ఆయనయొక్క వృక్షము, ఆయన యొక్క ద్రాక్షావల్లి, అనగా దేవునియొక్క వారసత్వమును కలిగివున్న ఈ ద్రాక్షావల్లి, అది
-ఒక నూతన సంఘముగా ఉండి, ప్రేమతోను మరియు సహోదర సహవాసమును కలిగియుండెను. ఆ సంఘమున పరిశుద్ధగ్రంథము యొక్క ఉపదేశము మాత్రమే. ఉంటు, సమస్తము చక్కని రీతిలో ఉండెను. అట్లున్న సమయమున లోపలికి ఒక పురుగు ప్రవేశించి దానిని తిని వేసినది. దాని తరువాత వేరొకటి వచ్చి మిగిలినది. తినివేసేను. చివరకు దానిలోయున్నదంతా తినివేసి ఏమీ లేని ఒట్టిదై, గొప్పగా, పెద్దదిగా, పాతదైన ఏమిలేని చూచుటకు దయ్యముల గృహమువలె ఆ స్థలము మారిపోయినది. ఆ సంఘ పరిస్థితి నిజముగా అలాగే ఉన్నది.

పిదప, గాలి బలంగా వీచు ప్రతీసారి అది దుఃఖముతో మూలుగుచుండెను. అవి, "అది నిజము, ప్రతీసారి దేవుడు పెంతెకోస్తు అనుభవమును మరలా తీసుకొని వచ్చునప్పుడు, ఈ పెద్ద,పాత మృత దేహములను భద్రపరచు గదులు చేసే కార్యమే. మనగా అవి అచ్చట నిలబడివున్న రీతిగా, "అం-మ్-మ్-మ్ అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి. అం-మ్-మ్-మ్ అసలు అలాంటివి ఏమీ లేవు" అన్నట్లుగా అవి మూలుగుచున్నవి. ప్రజలను భయపెట్టుచు అచ్చటనుండి తరిమివేయుచు, దయ్యములు తిరుగు స్థలములుగా ఆ సంఘములు మారిపోయెను. 43. "సరే, అట్లైతే ప్రభువా, నీవెందుకు గాలిని పంపించితివి? ఆ గాలిని పంపించు.

టకు కారణమేమిటి?" అని ఆలోచించాను. ఇక వారు చేయగలిగిన దేదియులేదు.

వారి పని ముగించెను. వారు ఎన్నడూ దానిని స్వీకరించలేదు. బాగా ఎండిపోయి

బిగుసుకుపోయిన ఆ పాత ఎద్దు చర్మమువలె వారు ఉన్నారు. వారికి చెప్పుటకు

ఏదీ, ఏ మార్గము లేదు. ఎందుకంటే దానిని వారెన్నటికీ నమ్మరు.వారు బాగా

ఎండిపోయి,బిగుసుకు పోయి అతుక్కుపోయారు. ఇక వారినేమి చెయ్యలేము. అంతే,

కాని "అట్లుండగా, ప్రభువా మరలా ఎందుకు గాలిని పంపించావని?" తలంచాను.

కాని పిదప యోవేలు గ్రంథములో చెప్పిన విషయము నాకు గుర్తుకు వచ్చెను. మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.

"ప్రభావా, అదెచ్చట?" అని ఆలోచించాను. ఆ వృక్షములయొక్క అడుగు భాగము నుండి ఒక చిన్న గుంపు మొక్కలు మొలకెత్తి వచ్చుటను నేను గమనించాను. అవి. చాలా పచ్చదనంతో ఉన్నవి. అది నిజము. సంఘము ఆ చిన్న పచ్చని మొక్కలవలె ప్రవర్తించవచ్చు. కాని సహోదరుడా, దేవునియొక్క గాలి వీచునప్పుడు, ఆ గాలికి తగినవిధముగా అవి మృదువుగా తమను సమర్పించుకొనును. కాబట్టి గాలి వీచే ప్రతీసారి ఈ చిన్న చెట్లు కేరింతలు కొట్టుచు, ఎగురుచూ, సంతోషించును. వాలుదా,
"అది చూచుటకు పాతకాలపు భక్తినిచేయు పెంతెకోస్తు కూటమువలె లేదా? అలాంటి ఒకదాన్ని నేనెన్నడూ చూడలేదని" చెప్పాను. అది నిజము. ఖచ్చితముగా నిజమే.

44. ఓ, ఆ చిన్న చెట్లు మృదువుగా ఉండుటవలన గాలి వీచునప్పుడు అటు, ఇటు ఊగుచుండును.

"నేను ఆ కూటమునకు వెళ్ళను. నేనొక ప్రెస్బిటేరియన్. నేను అసంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘమునకు చెందినవాడిని. ఓ, వారు చెప్పే వాటన్నింటితో నేను ఏకీభవించ లేను" అని చెప్పుదురు. పాత బిగుసుకు పోయిన మొద్దువలె, కొయ్యబారిపోయిన వారివలె, సగం చచ్చిన వారివలెయున్న మీకు... మీకు ఏమైయ్యింది? ఈ దినము నకు కావలసినదేమనగా మనల్ని మరలా పూర్వ స్థితికి తీసుకొని వెళ్ళే స్వచ్ఛమైన పెంతెకోస్తు అనుభవమును జీవముగల దేవుని సంఘములో క్రుమ్మరింపబడవలెను. “ప్రభువా, దానిని నీవు చేయుదువా?" అని తలంచాను.

స్థిరములేని ఒక చిన్న గుంపును నేను చూచాను, వారు మనల్ని ఏమని పిలుచుదురో మీకు తెలుసా? వెలివేయబడినవారు లేదా ఏమని పిలిచినాగాని, కాని వారు..."మంచిది. అవి చాలా పచ్చగా ఉన్నవి” అని మీరు చెప్పెదరు. అవి పచ్చగానే ఉండవచ్చు కాని గాలి వీచునప్పుడు రెళ్ళువలె అటు,ఇటు ఊగుచూ ఉండును. అవి ఆవిధముగా తమను ఒంగి సమర్పించుకోవచ్చును. కాని ఏమైనా గాని అవి జీవమును కలిగియున్నవి. వాటిల్లోవున్న మంచి కార్యము అది ఒక్కటే.

“అట్లయితే దానిని మీరెందుకు అంత గట్టిగా కదిలించవలెను?” అని నేను తలంచాను. గాలి వీచుచున్నప్పుడు ఆ చెట్టు ప్రతీసారి అటు ఇటు ఊగును. అప్పుడు దాని వేర్లు కదిలింపబడి వదులై అవి ఇంకా భూమిలో క్రింద వరకు చొచ్చుకుంటూ వెళ్ళి గట్టిగా పాదుకొని చక్కగా ఎదుగుటకు ఉపయోగపడును. మన హృదయమును అలాగే తెరచి యిచ్చు ప్రతీసారి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి, మన జీవితములో వేర్లును గట్టిగా కదిలించి, వదులుగా చేసి తద్వారా అవి బాగా లోతుగా చొచ్చుకొని పోయి గట్టిగా పాదుకొని క్రీస్తు యేసుపై దృఢముగా నిలబడి ఎదుగునట్లు చేయును.

విఫలమవ్వని (కదల్చబడని) ఆ బండపై లంగరు వేయబడి, బాగా లోతుగా రక్షకునియొక్క ప్రేమలో భద్రముగా నాటుకొని ఉన్నాను.

"

45. ఈ దినమున సంఘమునకు కావలసినదేమనగా తనను తెరచి సమర్పించు కొని పచ్చ(జీవము)దనమును పొందుకోవలెను. నేనొక డాక్టర్ Ph.D.. మా సంఘ కాపరి ఒక... అని మిమ్మల్నిగూర్చి చెప్పుకొనుటకు ప్రయత్నించవద్దు... సరే, దాని అర్థమేమిటి? ‘D.D' పరిశుద్ద గ్రంథములో 'D.D' అనే దానికి అర్థమేమనగా,
మూగ కుక్క (Dumb Dog) అని అర్ధము. ఆ అర్ధము ఆనాటి నుండి ఈనాటివరకు అలాగే మారకుండా ఉన్నదని నేననుకుంటున్నాను. అది నిజము. సహోదరుడా, మనకు D.D అవసరములేదు. జీవముగల దేవుని సంఘములో మనకు కావలసిన దేమనగా పరిశుద్ధాత్మ అభిషేకముయొక్క అనుభవము. అదే సత్యమని మీకు తెలుసా? పచ్చదనమనే జీవముతో జీవించుటయే మనకు అవసరము. ఆ జీవము మీలో జీవముగల (పచ్చదనము) గాలిగా క్రియ చేసినట్లేతే, మీరు అలాగే ముందుకు సాగిపోతూ ఆ జీవమును పొందుకొనండి. అది నిజము.

ఆ జీవపు రేఖ కత్తిరించబడలేదు, దానిని మిడతలు తినివేయలేదు. ఓ, సహోదరుడా, రాబోవు ఈ దినములలో ఏదోక దినమున దేవుడు తనయొక్క క్రిమి సంహారిణిని తీసుకొని క్రిందికి దిగి వచ్చును. ఆ పాత మొద్దు పై ఆయన దానిని చల్లబోవుచున్నాడు. ఈ ప్రపంచము ఎట్లు వర్ధిళ్ళెనో అలాగే ఈమెకూడా వర్థిళ్ళబోవుచున్నది. ఆమె ఖచ్చితముగా అలాగే వర్థిళ్ళును. అవునండీ. మిడతలు మరియు గొంగలి పురుగులు ఈ సంవత్సరములన్నింటిని తినివేసిన పంటను దేవుడు మరలా ఇచ్చును (పుణరుద్దరించును).

46. ఇప్పుడు, ఆ పెంతెకోస్తు దినమున అచ్చట గొట్టె చర్మముతో చేయబడిన నూట ఇరువది తిత్తులు ఒకచోట సమకూడి ఉండిరి. అది నిజము. మేకల చర్మము కాదుకాని, అది గొట్టెల చర్మము. అదే శ్రేష్ఠమైనది. అవునండీ. మేడ గది పై పచ్చదనపు తిత్తులగు నూట ఇరువది మంది అచ్చట సమకూడి ఉన్నారు. అచ్చటున్న వారందరూ తమను ఆ వాక్యమునకు తగిన రీతిగా సాగుచూ (విశాల పరచుకొనుచు మరియు ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు తగిన నొప్పులను కలిగి ఉండిరి. దేవుడు క్రుమ్మరింపబోవు సమస్తమును పొందుకొనుటకు వారు తమ హృదయములను విశాలపరచి తెరచి ఉంచిరి. అవునండీ. ఈ దినమున మనము, "నేను అచ్చటకు వెళ్తానుగాని అదేమిటో నేను మీకు చెప్పెదను, దానిని నేను నమ్మను. పరిశుద్ద గ్రంథములో నుండి అతడు ఎన్ని వివరణలను తీసి చూపించి చెప్పినా దానిని నేను పట్టించుకోను, అసలు దానిని నేనెన్నడూ నమ్మను” అని చెప్పెదము. మంచిది, మీరు ఆ పాత ఎండిపోయిన ఎద్దు చర్మమైయున్నారు. అసలు మీకేమి జరిగినది?

47. కాబట్టి ఇందుకొరకు మనము ఏదోక క్రియను చేయవలసివున్నది. పరిశు ద్ధాత్మ క్రియ చెయ్యుటకు ముందు, దానితో ఏదోక కార్యమును ఆయన చేయవలసి వున్నది. అది సత్యమని మీకు తెలుసు. ఓ, పైకి భక్తిగలవారివలె వేషము ధరించు కాలములో మనము జీవించుచున్నాము. "నేను మీకు చెప్పుచున్నాను, కేవలము
ఏడవ తరగతి మాత్రమే చదివిన ఈ పనికిరానివాడు ప్రసంగించుటను నేను అనుమతించను. నేను ఫలానా-ఫలానా స్థలము నుండి వచ్చాను. నేను కళాశాలలో విద్యను అభ్యసించాను." కాని దానిని ఎట్లు అణుచుకోవాలో తెలుసుకునే తగినంత జ్ఞానము మీలో లేదు. సహోదరుడా, దాని అర్థము పూర్తిగా వ్యత్యాసముగా ఉండ వచ్చు.నేను మీకు చెప్పెదను, పౌలులోకూడా అలాంటి ఒక కార్యము ఉండెడిది. కాని క్రీస్తునుగూర్చి కనుగొనుటకు తాను అభ్యసించిన సమస్త జ్ఞానమును త్రోసివేసితి నని పౌలు చెప్పెను. కాని దానిని చెయ్యనివ్వకుండా అడ్డుకునే సమస్య ఏదనగా, మనము మరలా నూతనముగా నింపబడుటకు మనలోయున్న పనికిరాని సమస్త కార్యములను బయట పారవేయవలెను. నేడు సంఘమునకు అదే కావలసివున్నది.

ఇచ్చట నూట ఇరువది పచ్చదనపు తిత్తులు కూర్చొని ఉన్నవి. అకస్మాత్తుగా వేగముగా వీచు బలమైన ధ్వనివలె పరలోకము నుండి నూతన ద్రాక్షా మద్యము దిగి వచ్చెను. ఎదిగేటప్పుడు కలిగే నొప్పులను పొందుకునేంత వరకు అచ్చటున్న దీనమైన పాత పచ్చదనపు తిత్తులలో ఆ నూతన ద్రాక్షామద్యము నింపబడెను. మరియు పిదప వారు, వారు త్రుళ్ళి గంతులు వేయుచు దేశమంతటా సంచరించి "ఇదే అది" అని వారు చెప్పిరి. సహోదరుడా, ఇది అదికానియెడల, అది వచ్చు వరకు నేను దానికొరకు వేచియుందును. ఆ ఒక్క కార్యమే నిశ్చయమైయున్నది.

(48) యేసు క్రీస్తుయొక్క పునరుద్దారణద్వారా కలిగిన ఈ అద్భుతమైన, మహోన్నత మైన పరిశుద్ధాత్మ అనుభవము, ఆయన అదే వ్యక్తిగా, ఆయనే మనలో, మనద్వారా, సమస్తములో ఉంటు క్రియ చేయుచున్నాడు. కాని అది ఎటువంటి ఒక కార్యమై యున్నది. అదెంత అద్భుతమైన కార్యము. దానిలో జీవము గలదు. జీవము గల దేవునియొక్క సంఘము సంపూర్ణముగా జీవముతో నింపబడియుండును. అది పులియని ద్రాక్షామద్యమై యున్నది. దానిలో ఇంకా సూక్ష్మ క్రిములు ఉంటు, అది నింపబడుచు, అది ఎదుగుచూ, అది త్రోయుచు మరియు అది నెట్టబడుచున్నది. క్రీస్తును మీలో కలిగియుండు అనుభవమును.. దేవుడే దానిని చేయుచున్నాడు.

(49. నేను అటవీ శాఖలో పర్వవేక్షకునిగా ఉద్యోగం చేయుచున్నపుడు, అచ్చటున్న ఒక చిన్న స్థలముయొద్దకు వెళ్ళుట నాకు అలవాటు. నా జీవితములో చూచిన ఊటలలో అదే చాలా సంతోషముగా ఉప్పొంగే ఊటయని నేను తలంచుచున్నాను. అచ్చటున్న ఆ చిన్న ఊట ఎల్లప్పుడూ ఊప్పొంగుచూ మరియు ఉరకలు వేస్తూ ఉండును. కావున ఒక దినమున ఆ ఊటవైపుగా వెళ్ళాను. నేను దాని దగ్గర కూర్చొని, “ఓ, చిన్న ఊటా, నీవు ఈవిధముగా, ఆనందంగా ఉండునట్లు నిన్ను
చేయుచున్నది ఏది? నీవు ఎల్లప్పుడూ ఉప్పొంగుచూ మరియు ఉరకలు వేయుచూ ఎట్లు ఉండగలుగు చున్నావు? ఒకవేళ నీలోనుండి నీళ్ళను జింకలు త్రాగుటవలన అలాగు ఉరకలు వేయుచున్నావా?" అని నేను అడిగాను.

ఒకవేళ అది మరలా మాట్లాడగలిగి, నాతో ఈవిధముగా చెప్పవచ్చు, “లేదు, బ్రాన్హాం సహోదరుడా, ఉహ్, హ్."

"సరే, బహుశా, ఎలుగు బంటులు నీలోనుండి నీళ్ళు త్రాగుటవలనా, నిన్ను సంతోషంగా ఉండునట్లు చేయుచున్నది?" అని అడిగాను.

ఆ ఊట, "లేదు, బ్రాన్హాం సహోదరుడా, దానికి కారణం అది కాదని" చెప్పును.

"సరే, నేను నీ నీళ్ళు త్రాగుటవలన నీవాలాగు ఉప్పొంగుచున్నావా?" అడిగాను.

"లేదు, అదికూడా కారణంకాదు" అని అది చెప్పవచ్చు.

"అలాగైతే, ఏది నిన్ను ఉప్పొంగునట్లు చేయుచున్నది?" అని అడిగాను.

అది నాకు జవాబు యివ్వగలిగితే, "బ్రాహం సహోదరుడా, ఉప్పొంగుచున్నది నేను కాదు. నాలో ఉన్న ఏదోకటి నన్ను ముందుకు నెట్టుచూ మరియు నేను ఉప్పొంగునట్లు చేయుచున్నదని" అది చెప్పును. మరలా నూతనముగా జన్మించిన ప్రతీ దేవుని కుమారుడు మరియు కుమార్తె ఆవిధముగానే ఉప్పొంగుచుందురు. అదేదో మీ ఉద్రేకము కాదు, మీలోవున్న ఏదోకటి మీలోనుండి త్రోయుచు, తద్వారా నిన్ను ఉప్పొంగునట్లు చేయుచున్నది. నిజము. సత్యము. ఆమేన్

50. అవును. ఆ నూతన జన్మయొక్క అనుభవములే ఈదినమున మనకు అవసరమై ఉన్నవి. ఇప్పుడు, యెహెజ్కేలు దానిని తీసుకొచ్చిన క్రమమును మీరు గమనించ వలెనని నేను కోరుచున్నాను. "నేను మీకు నూతన హృదయమును యిచ్చెదను, నేను మీకు నూతన ఆత్మను యిచ్చెదను మరియు నా ఆత్మను మీలో ఉంచెదను"ఆయన 'చెప్పెను. అచ్చట మూడు విషయములుగలవు. వాటిని మీరు గమనించాలని నేను కోరుచున్నాను. ఒక నూతన హృదయము, "మీలోవున్న పాత రాతి గుండెను నేను తీసివేసెదను". అది మీలోగల భిన్నమైన పాత్ర గుండె(హృదయము) "నేను మీకు ఒక నూతన ఆత్మను యిచ్చెదను". ఇప్పుడు అనేకసార్లు ఆవిషయములో భయంకర మైన పొరపాటు జరుగుచున్నది. ఎట్లనగా, ఆ నూతన ఆత్మనే పరిశుద్ధాత్మని ప్రజలు తలంచుచు అనేకసార్లు పొరపాటు పడుచున్నారు. కాని అది పరిశుద్దాత్మ కాదు, అదొక నూతన ఆత్మయైయున్నది. దేవుడు ఒక నూతన... ఎందుకని? మీలోవున్న మీ పాత ఆత్మతో మీకు మీరే ఏకీభవించలేక, మీరు ముందుకు సాగిపోలేనియెడల పరిశుద్ధాత్మతో మీరెట్లు ఏకీభవిస్తూ సాగిపోగలరు? కాబట్టి దేవుడు మీకొక నూతన ఆత్మను యిచ్చినప్పుడే, మీరు ఆయన ఆత్మతో ఏకీభవిస్తు సాగిపోగలరు. కొన్నిసార్లు
ప్రజలు...?... "నూతన హృదయము మీకిచ్చెదను, అనగా ఒక మాంసపు (గుండె) హృదయమును మీకిచ్చెదను. కాబట్టి మీరు దానిని స్వీకరించినప్పుడు ఒక నూతన ఆత్మ ఆ హృదయములోకి ప్రవేశించును. అప్పుడు దానిలో నేను నా ఆత్మను ఉంచెదను”. మీకు అర్థమైనదా? నూతన హృదయము. నూతన ఆత్మ మరియు “నా ఆత్మ” అనే ఈ మూడు విషయములను గూర్చి ఆయన చెప్పెను.

51. ఇపుడు, అనేకసార్లు దానిని ఈవిధముగా చేయుటకు మనము ప్రయత్నిస్తూ... మంచిది, మీరు నూతన ఆత్మను పొందుకున్న వెంటనే, దొంగతనము చేయుటను విడిచిపెట్టెదరు, అబద్దములు చెప్పుటను విడిచెదరు. అటువంటి వాటన్నింటిని మీరు విడిచి పెట్టెదరు.“ఓ, హల్లేలూయా, నేను దానిని పొందుకున్నానని” మీరు చెప్పెదరు. సరే, ఇప్పుడు, ఎవరైనా మీ మార్గమునకు కొంచెం అడ్డుపడినయెడల,ఓ, కనికరము, అప్పుడు మీ ప్రవర్తనబట్టి మీలో జరిగిన బేధమును మొదటిసారిగా అప్పుడు మీరు కనుగొనెదరు. అప్పుడు నిశ్చయముగా మీరు దేనిని పొందుకున్నారో మీకే తెలియును. ఎట్లనగా, ఆ సమయమున తుపాకీకి ఉపయోగించు సీసపు తూటాను మ్రింగిన కప్పవలె బ్రద్దలగునట్లు నీవు బ్రద్దెలైపోవుదువు. కాని సహోద రుడా, నేను మీకు చెప్పెదను. అందుచేతనే మీరింకా దేవుని ఆత్మను పొందుకో లేదని నేను చెప్పుచున్నాను. అది నిజము. “ఓ, అతడు నా కాలి బొటన వ్రేలును త్రొక్కాడు, దానిని నేను భరించలేకపోయానని” మీరు చెప్పెదరు. సరే మంచిది. ఆ ప్రవర్తనే మీరు దేనిని కలిగియున్నారో దానిని తెలుపుచున్నది. అదే నిజము... "నేను" మీలో నూతన ఆత్మను పెట్టి పిదప నేను నా ఆత్మను మీలో ఉంచెదను".

మానవునియొక్క ఉద్రేకము (ఆవేశము)లకు హృదయమే కేంద్రబింభము. మీ హృదయము మీకు మధ్యలో ఉన్నది. ఖచ్చితముగా నిజము. కావున పాత మనిషి/యొక్క మధ్య భాగమున దేవుడు నూతన హృదయమును పెట్టెను. పిదప నూతన ఆత్మను ఆ నూతన ఆత్మ లేదా హృదయముయొక్క మధ్యలో ఆయన పెట్టెను. //పిదప ఆయన తన ఆత్మను ఆ నూతన ఆత్మయొక్క మధ్యలో పెట్టు చున్నాడు.

52. ఇప్పుడు, అది ఖచ్చితముగా ఏలాగు ఉన్నదనగా, ఒక ప్రఖ్యాతి గాంచిన గడియారమునగల ప్రధాన స్ప్రింగ్ (చక్రం) వలె ఉన్నది. మీకు అర్థమైనదా? ఇచ్చట అది టిక్, టిక్మని శబ్దము చేయుచు పనిచేయుటకు ఉపయోగపడును. చిన్న, చిన్న స్ప్రింగులన్ని కలిసి చక్రములవలె తిరుగుచు టిక్, టిక్ మని శబ్దమును కలిగించుచు, ఆ గడియారమున పని చేయుచుండును. కాని వాటన్నింటిని ఈ ప్రధాన ముళ్ళ చక్రం (స్ప్రింగు ద్వారానే నియత్రించబడు చున్నది. ఇపుడు మీరు...
సహోదరుడా, నేడు మనకున్న సమస్య ఏమనగా, ఏదైతే ఉండాలో ఉండవలసిన ఆ ప్రధాన స్ప్రింగు మనలో లేదు. మనల్ని మనము మెథడిస్టులమని, బాప్తిస్టులమని, ' ప్రెస్బిటేరియన్లమని మార్చుకొని పెద్ద,గొప్ప సమాజ మందిరములను నిర్మించుకొని, "ఇదిగో ఇక్కడ చూడండి, ఎంత చక్కటి అందమైన గడియారము మా వద్ద గలదు, గడియారములోని ఆ అందమైన ముళ్ళును మేము కలిగివున్నాము,దాని ఆకారము వైపు చూడండి. ఎందుచేత? దానిలో మాణిక్యములు గలవు. దానిలో విలువైన వజ్రాలు గలవని” పొగుడుచు చెప్పెదరు. కాని చూపించవలసిన సమయమును అది చూపించనియెడల ఒక్క నాణెంకుకూడా తగదు. అది పనికిరానిది. నిజము.

ఈ దినమున అది ఆవిధముగానే ఉన్నది మనము మెథడిస్టు, ప్రేస్బిటేరియన్, బాప్తిస్టు, పెంతెకోస్తు సంస్థలను స్థాపించుకొనుటకు మనము ప్రయత్నిస్తున్నాము. ఒక చాలా అందమైన మందిరమును నిర్మించుకొనుటకు, శ్రేష్టమైన సంఘ కాపరిని నియమించుకొనుటకు, మిక్కిలి మేధావులను కలిగి ఉండాలని మరియు అలాంటి వాటన్నింటిని కలిగివుండాలని ప్రయత్నించెదము. దేవునియొక్క పరిశుద్ధ గ్రంథము ప్రకారము మన సంఘము చూపించవలసిన సరియైన సమయమును చూపించుట లేదు. మనకున్న సమస్య అదే. అర్థమైనదా? మీరు ఆయన ఆత్మను విడిచి పెట్టిరి.

53. "ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను, ఆ మాటను మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా?" అని యేసు అడుగలేదా? ఖచ్చితముగా, ఆ ప్రధాన స్ప్రింగ్...

ఇప్పుడు, గడియారములోవున్న ప్రధాన ముళ్ళ చక్రం (స్ప్రింగ్), స్వయంగా తనకుతానే తిరిగే ముళ్ళ చక్రం( స్వయం వలయిత) కాదది. అది దేవుని ద్వారా తిరిగి దేవునియొక్క వలయిత(గుండ్రగా తిరుగుట)యగును. ఈ గడియారం, దీనిలో మీరు చెయ్యవలసిన ఒకే కార్యం, దానిని మీరు ఒకే ఒక్క మార్గంలో మాత్రమే చేయగలరు. స్వయం వలయిత, అనగా ఆ గడియారంలోని లోపలి ముళ్ళ చక్రాలు ఒక దానితో ఒకటి కలిసి తిరుగునట్లు మీ భావోద్వేగాలను చేయవలెను. ఎట్లనగా, మీరు దేవుని యొక్క వాక్యమును అంగీకరించి, మీ భావోద్వేగాలను దేవునియొక్క వాక్యానుసారముగా ఏకీభవిస్తూ, ఆ ముళ్ళ చక్రాలవలె ఒకదానితో ఒకటి కలిసి తిరుగుచున్నట్లు పరిశుద్ధాత్మతో మీ భావోద్వేగాలు ఏకమై పనిచేయవలెను. అదే నూతన గడియారము పనిచేయు విధానమై యున్నది.

54. యెహెజ్కేలు మరలా దానిని చూచెనని మీకు తెలుసా? ఈ ప్రవక్తే, ఇతడే, చక్రము లోపల చక్రము ఉన్నట్లుగా చూచెను. ఆ చక్రము, ఆకాశ మండలములో
తిరుగుచున్నట్లు చూచెను. ఇప్పుడు చక్రము... మొదటగా అచ్చట ఒక చక్రము గలదు. చట్రము (టెరు), దాని లోపలి చట్రము, పిదప ఆ చట్రమునకు బిగించి యుండు చువ్వలు,పిదప ఆ చువ్వలు ఇరుసును ఆధారము చేసుకొని ఉండును.

ఇప్పుడు, లూథర్ ప్రారంభించినపుడు, "నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును" నీతీకరణ. మొదట అతడు దాని చుట్టూ చక్రము (టైరు)ను అమర్చెను. అవును. అది నిజము. అయినప్పటికీ అదింకా ఒక సంపూర్ణమైన చక్రంగా రూపించ బడలేదు. సరే మంచిది. ఆ తర్వాత దానివెనుకనే శుద్ధీకరణ అంటూ మెథడిస్టులు వచ్చారు. లూథర్ అమర్చిన చక్రమునకు అధారముగా దానిచుట్టూ చట్రమును వారు బిగించారు. దానిని వెంబడించుచూ పెంతెకోస్తు వచ్చెను. లూథర్ నీత్రీకరణను గూర్చి బోధించెను. అనగా వెలుపలి భాగమగు చక్రమును వారు అమర్చిరి. పిదప మెథడిస్టులు శుద్దీకరణనే బోధతో చక్రమునకు లోపల చట్రమును బిగించిరి, ఆ తరువాత వారిని వెంబడించుచూ వచ్చిన పెంతెకోస్తువారు చట్రమునకు చుట్టూ చువ్వలను బిగించిరి. అనగా అన్యభాషలను మాట్లాడుటను తీసుకొని వచ్చిరి.

55. అవును, సహోదరుడా, నేను మీకు చెప్పనివ్వండి, వాటిని మనము మాత్రమే om కలిగివుండుట సరిపోదు. కాబట్టే మనమింకా ఎగురుచూ, పైకి క్రిందికి దూకుచూ మన మార్గమున వెళ్ళుచున్నాము. ఆ చట్రమునకు ఉన్నది కేవలం ఒక్క చువ్వ మాత్రమే కాదుగాని, సంఘములో క్రియ చేయుటకు తొమ్మిది ఆత్మ వరములు ఇవ్వబడినవి. కేవలము ఒక్క వరము మాత్రమే క్రియ చేయుటకాదు. సరే అవన్నీ మంచిదే. బయట చక్రము (Tire) ఉండుట బాగానే ఉన్నది, ఆ చక్రము లోపల చట్రము(Rim) ఉండుట బాగానే ఉన్నది. ఆ చట్రమునకు చువ్వలు (Spokes) బిగించి ఉండుట బాగానే ఉన్నది. కాని ఒక నల్ల జాతి పురుషుడు పుచ్చకాయ తినునట్లుగా, "అందులో ఇంకా అధికముగా ఉన్నది”. ఆ భావముతోనే నేను ఈ దినమున మీతో మాట్లాడుచున్నాను. దానికన్నా అందులో ఇంకా అధికముగాగలదు.

ఆ చక్రములో తొమ్మిది ఆత్మ సంబంధమైన చువ్వలు గలవు. చువ్వలన్నింటిని ఒక దానితో ఒకటి కలుపుచు ఈ చక్రం తిరుగుటకు మధ్యలో చక్రనాభి(hub)అనబడే ఇరుసుకూడా గలదు. ఓ, నేను భక్తి పరవశము నొందుచున్నాను. నిశ్చయముగా, నేను అలాగే అనుభూతి చెందుచున్నాను. అవును సహోదరుడా, మంచి విషయమే మనగా, మనమేమి చేయుచున్నామో అదికాదు ముఖ్యము, కాని దానిని ఏలాగు చేయుచున్నామో అదే చాలా ప్రాముఖ్యమైనది, లేనియెడల మీరు గాలితో పోరాడు చున్నట్లు ఉందురు. ఎందుకనగా దేవుడు, "నేను మరల తిరిగి యిచ్చెదనని ప్రభువు ఈలాగు సెలవిచ్చు చున్నాడు.” అది ఖచ్చితముగా జరుగవలసి యున్నది.
ఇప్పుడు, చక్రముయొక్క నాభి అనబడే ఆ ఇరుసును ఆధారము చేసుకునే అవన్నీ తిరుగును. అనగా గడియారములోని ప్రధాన ముళ్ళ చక్రమును ఆధారము చేసుకొని మిగిలిన చక్రాలు తిరుగుచు గడియారము పని చేయును (టేపులో ఖాళీ గలదు-సంపా||)ఆ ప్రధాన చక్రము తిరుగుచూ టిక్,టికామని సరిగ్గా సరియైన ధ్వని ధ్వనించుచు, ప్రతీ దీవెనకు ఖచ్చితముగా నెరవేరునట్లు కాపాడుచున్నది.

56. ఇపుడు, ఈ వరములు... అన్య భాషలలో మాట్లాడే మీ వరము అద్భుతమైనదే. విశ్వాస మూలముగా నీతీకరణ అద్భుతమైనదే, శుద్ధీకరణ మంచిదే. అన్యభాషలలో మాట్లాడుట అద్భుతమైనదే, దానికి అనువాదము చెప్పుట మంచిదే, దేవుని నుండి వచ్చు వర్తమానములు అద్భుతమైనవే. ప్రవచనములు మంచివే... సహోదరుడా, వాటన్నింటికి అనుసంధానముగా ఉండు నాభివంటి ఇరుసు దానిలో లేనట్లయితే దానివలన కలుగు ప్రయోజనమేమిటి? మీ వరములనే చువ్వల ఒకదాని తరువాత ఒకటి వంకరైపోవును. అవన్నీ ఒకదానితో ఒకటి అడ్డుపడుచు, వివాదించుచు, పోట్లాడుచు,వేరైపోయి, ఒకదానితో ఒకటి పళ్ళుకొరుకుకొనుచు, మరియు ఒకరిని ఒకరు గాయపరచుకొనెదరు. జరిగేది అదేయగును.

అందుకే మనకు ప్రధాన ముళ్ళ చక్రము (స్ప్రింగ్) అవసరము. దానిలోని ఈ చిన్న, చిన్న ముళ్ళ చక్రములు, చిన్న, చిన్న యంత్ర పరికరములతోపాటు ఏకంగా తిరిగే ముళ్ళ చక్రములు మరియు అలారంవలె ముఖములు, పెద్ద చేతులు, మరియు ఇవన్నీ ఉండికూడా, వాటన్నింటిని పనిచేయుంచుటకు తగిన ప్రధాన మైనది ఏదోకటి దానిలో లేకపోతే అందువలన ప్రయోజనమేమిటి?

57. పెంతెకోస్తు సంఘము పరిశుద్దాత్మను పొందుకొనివున్నదని నేను విశ్వాసించు చున్నాను. అలాగే మేముకూడా దానిని పొందుకొని ఉన్నామని హక్కుతో చెప్పుకొను చున్న ఇతరులనుకూడా నేను నమ్ముచున్నాను. మీరు అన్య భాషలలో మాట్లాడుట సరియైనదేనని నేను విశ్వాసిస్తున్నాను. మీరు ప్రవచించే ప్రవచనకూడా సరియైన దేనని నేను విశ్వాసిస్తున్నాను. మీరు చెప్పే వాటన్నింటితో నేను...?... ఒక బాప్తిస్టునై యుండి, నేను దానిని విశ్వసిస్తున్నాను. నిశ్చయముగా దానిని నేను విశ్వాసించు చున్నాను. కాని ఇచ్చట ఒక విషయము గలదు. సహోదరుడా, ఆ గడియారము చూపించవలసిన సరియైన సమయమును చూపించుట లేదు. దానినిగూర్చి చెప్పుటకే నేను ప్రయత్నించుచున్నాను. కాబట్టి అది సరిగ్గా పనిచేయాలంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మానవుని హృదయములోకి రావలసియున్నది.

అప్పుడే అది సరిగ్గా పనిచేయగలదు.,
దేవునియొక్క ప్రేమ. దేవుడే ప్రేమయైయున్నాడు. కావున ఈ ఒక్కొక్క వరమును సరిగ్గా కేంద్ర బింధువగు ప్రేమలో పెట్టక పోయినయెడల, ఇక అది స్వార్ధముతోను, అలక్ష్యముగా, దానంతట అదే తొలిగిపోయి, తనను తాను వేరుపరచుకొని ఎదుటి వారిని గాయపరుస్తూ, వివాదిస్తు మరియు ప్రతీకారమును తీర్చుకొను విధముగా మారిపోవును.కాని ఆ వరములు సరిగ్గా ప్రేమను కేంద్రముగా చేసుకొని లంగరు వేయబడియున్నప్పుడు, అప్పుడది ప్రతీ చోటా సహవాసమును కలిగి యుండును. అదే నిజము. మనకు ఖచ్చితముగా అదే కావలసివున్నది. సహోదరుడా, సంఘములో ప్రేమ లేకపోవుట వలన అది మరణించుచున్నది.

58. మన వరములన్నీ సరియైనవే. మన సంఘ శాఖలన్నీకూడా మంచివే.వాటికి వ్యతిరేకముగా ఏదియులేదు. కాని మన నమ్మకమును సంపూర్ణముగా మన సంఘ శాఖల పై పెట్టుచున్నాము. అలాగే మీ నమ్మకములను సంపూర్ణముగా వరములపై పెట్టుచున్నారు. “ఆ దినమున అనేకులు నావద్దకు వచ్చి ప్రభువా, నీ నామమున నేను ప్రవచింప లేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, గొప్ప కార్యము లను నేను చెయ్యలేదా?” అని అనేకులు చెప్పుదురని యేసు చెప్పెను.

"అక్రమము చేయువారులారా, నాయొద్ద నుండి తొలగిపోండి, నేనెన్నడూ మిమ్మల్ని ఎరుగను" అని ఆయన చెప్పును.

“మనుష్యుల భాషలతోను, దేవదూత భాషలతోను నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను" అని పౌలు చెప్పెను. నేను పరిశుద్ధ గ్రంథమును అర్ధము చేసుకొని ఎరిగియున్నను. పిహెచ్. డి.డి. మరియు ఎల్.ఎల్.డి పట్టము లను నేను కలిగియున్నను, దేవుని యొక్క రహస్యములన్నింటిని నాకు తెలిసినా, దేవుని ప్రేమనే చక్రపు నాభియనే ఇరుసుతో నేను సంబంధమును కలిగి బిగించబడి యుండకపోయినట్లైతే, ఆ గడియారమువలె చూపించవలసిన సరియైన సమయాన్ని అది చూపించదు. అర్థమైనదా? అది సరిగ్గా పని చెయ్యదు.

59. కాబట్టి, వైద్యుడు... నేను అంతగా విద్యను అభ్యసించలేదు. ఒక వైద్య పట్టాను కలిగివుండాలని నేను కోరుకున్నాను. ఒక దినమున ఎవరోకరు నాకు వైద్య పట్టాను ఇవ్వాలని తలంచిరి. “దానిని పొందుకొనుటకు నేను తెలివైన వాడినే, అవునండీ. వైద్య పట్టాకు కావలసిన జ్ఞానముకొరకే నేను ఎదుగుచున్నాను. నా పాత కెంటకీ భాషలో, 'హిస్(his), హైన్లెట్స్ (hain'ts), టోట్స్ (totes), ఫెట్చ్(fetch), టార్రీ (tarry) వంటి దక్షిణ ప్రాంతపు మాటాలతో నా భాష ఉండును”, జనులు చాలా మేధావులు. నేనొక వేషధారిగా ఉండకూడదు. ఆ వైద్య పట్టాను పొందుకొనుటకు
వారియొక్క నిబంధనలలో నావద్ద ఏదీ లేదు. అట్లుండిన యెడల నేను సంతోషించి దను. కావున నావద్ద ఏదీ లేనందున అది నాకు అవసరములేదు. నేమైయున్నాన నిశ్చయముగా అలాగే దేవునికి సేవచేయుచు ఖచ్చితముగా ప్రజలకు మరియు దేవునికి నిజాయితీగా ఉండాలని నేను కోరుచున్నాను. మీరు ప్రజల వద్ద నిజాయితీగా లేనియెడల మీరు దేవునివద్ద కూడా నిజాయితీగా ఉండలేరు.

60. మనకు దేవునియొక్క ప్రేమ అవసరమైయున్నది. ఆ ప్రేమే సమస్తమును నియంత్రించును. ఇప్పుడు మీ గడియారము బాగానే ఉండవచ్చు, మీలోనున్న ముఖ్యమైన భాగములు మరియు మీ అవయముల భాగములన్నీ బాగానే ఉండ వచ్చును. మీ వరములు మరియు సమస్తము, అన్ని మంచివే, కాని సహోదరుడా, మనము మరలా ఆ ప్రధానమైన ముళ్ళ చక్రమువద్దకే వెళ్ళుదుముగాక! ఓ,దేవా, ప్రతీ చిన్న పరికరములు, సమస్తము సమకూడి క్రియ చేయుటకు అదొక్కటే..

ఇప్పుడు గమనించండి, ప్రేమ క్రియ చేయునప్పుడే ప్రధాన ముళ్ళ చక్రము క్రియ చేయును. ఆ తర్వాత ఏమి జరుగునో మీకు తెలుసా? “బాప్తిస్టుల్లారా రండి, మనము కలిసి నాట్యమాడుదాము” అని మెథడిస్టులు చెప్పెదరు. సరే మంచిది. "ప్రెస్బిటేరియన్లారా, పెంతెకోస్తుల్లారా రండి, మనమందరం సమకూడి ఈ నగర వ్యాప్తముగా ఒక నిజమైన ఉజ్జీవమును కలిగి ఉందాము". మీరు చేయవలసినది. అదే. పిదప గడియారములోని ముళ్ళ చక్రములన్ని అదుపులోకి వచ్చుటకు ప్రారంభమగును. పిదప పరిశుద్ధాత్మయొక్క కదలిక ప్రారంభమగును. పిదప మీరు అన్య భాషలలో మాట్లాడుటనుగూర్చి బాప్తిస్టులు మీతో వివాదించరు. మరియు అలాగే మీరుకూడా దానియొక్క క్రమమునుండి తొలగిపోరు. మరియు ప్రేస్బిటేరియన్లు, మెథడిస్టులు, బాప్తిస్టులు, లూథరన్లు అందరూ ఏకమై ఒక గొప్ప పెద్ద జీవముగల దేవుని సంఘముగా క్రియ చేయుదురు. అప్పుడు ఆమె(సంఘము) పరిశుద్ధ గ్రంథము ఆదేశించిన ప్రకారముగా ఖచ్చితమైన సమయమును చూపించును. నిశ్చయముగా,

ఓ, మనము అంత్య దినమున జీవిస్తున్నాము. సూచక క్రియలు జరగవలసిన కాలమున జీవించుచున్నాము. ఆమె (సంఘము) ఈ పరిశుద్ధ గ్రంథము ప్రకారము. కాలమునకు తగిన విధముగా సమయమును చూపించవలెను. ఎప్పుడైనా ఒకసారి, ఆత్మ సంబంధమగు కార్యములలో కొద్దిగా ఎండిపోవుచున్నట్లు అనుభూతి చెందు. ప్రతీసారి, పరలోకమునుండి ఒక నూనె బొట్టును దేవుడు అనుగ్రహించి ఎండి పోయిన దానిని మరలా ఉజ్జీవింప జేయును. దానిలోని అవయములన్నింటికి నూనెను పోసి పనిచేయునట్లు చేయును. ఆతర్వాత ఆమె(సంఘము) చాలా చక్కగా క్రియ చేయును. అవునండీ. మీరు అలాగే పనిచేయుదురు.
61. ఇప్పుడు, గమనించండి. నూతన హృదయమును, నూతన ఆత్మను ఆ తర్వాత నా ఆత్మను నీలో ఉంచెదను. ఇప్పుడు, మీరు నా సమస్త కట్టడలను మరియు నా విధులను అనుసరించి గైకొనువారుగాను మిమ్మును చేసెదను. ఆ ప్రధాన ముళ్ళ చక్రముగా తిరుగుచూ టిక్, టిక్ అంటు కొట్టుకొనుటకు ప్రారంభించునప్పుడు, ఆ మూల రాయిని త్రోసివేసినప్పుడు మరియు దేవునియొక్క ప్రేమను దేవునియొక్క ప్రజల మధ్యకు మరలా తీసుకొని వచ్చినప్పుడు, అప్పుడు దేవుని సంఘమంతా, ఏ ఘర్షణలు లేకుండా ఒకరితో ఒకరు, అందరూ మంచి సహవాసమును కలిగి వుండుటను మీరు చూడగలరు. పరిశుద్ధగ్రంథములోని సేవకులు, “మన ప్రభువు యొక్క రాకడ ఆలస్యమగునని” చెప్పినప్పుడు, ఒకరినొకరు తిట్టుకొనుచు, ఘర్షణ పడుచు, గాయ పరచుకొనుచు మరియు ధ్వంసం చేసుకొనుటకు ప్రారంభించిరని మీరు గుర్తుంచుకోండి. ప్రభువు వచ్చినప్పుడు వారు అలాగు ఉండుటను కనుగొన బడినది. వారివద్ద దివిటీలు ఉన్నను దానిలో నూనె లేదు. అర్థమైనదా? వారు అలాగు ఉండుటవలన వారు గాఢాంధకారములోకి త్రోసివేయబడిరి.

సహోదరుడా, మీ చేతికి దగ్గరలోనే అసలైనది అచ్చటేవుండగా వేరొక ప్రత్యామ్నా యం (నకీలి)ను ఎందుకు తీసుకునెదవు?మీ చేయి తాకగల దూరమున అసలైనది అచ్చటే ఉండగా ఏదోక వ్యత్యాసమైన దానిని తీసుకోవలసిన అవసరమేమున్నది?

దేవునియొక్క ప్రేమయగు క్రీస్తుయనే ఆ ప్రధాన ముళ్ళ చక్రము మీ లోపల,మీ హృదయములో క్రియ చేయుచున్నప్పుడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, మంచితనము, దయాళుత్వము, సాత్వికము, విశ్వాసము, కనికరమను వంటివి టిక్, టిక్ శబ్దముతో మీలో వ్యక్తమగుటకు ప్రారంభమగును. ఓ, దేవా,టిక్, టిక్మనే, కేవలము అలాంటి శబ్దముతో సరియైన విధానమున నేను ఉందునుగాక!

62. డఆ తర్వాత మీలో ఏమి జరుగునో మీకు తెలుసా? మీరు క్రీస్తను కాడితో జతచేయబడిన కాడిని కలిగియుండుటచేత ఇక మీ మెడ ఎన్నటికీ గాయమవ్వదు.

దానిని భరించుటకు భారముగా ఉండదు. అపుడు మీరు సుళువుగా... పక్షివలె ఈకలును కలిగి, అది చాలా తేలికగా ఉండును. “భారములు చాలా కొన్ని మాత్రమే ఉండును. దానితో మీరేమి చేయుదురో మీకు తెలుసా? మీకు విరుద్దముగా, "నీవు ఆ పరిశుద్ధ దొర్లు గుండ్రాళ్ళ కూటమునకు వెళ్ళావుకదా? అచ్చటకు నీవు వెళ్ళుటను నేను చూచాను" అని ఎవరు చెప్పినా దానిని మీరు పట్టించుకోరు.

"సరే, మ్-మ్-మ్-మం, నేను నీకు చెప్పెదను", అది ఒక రకముగా మిమ్మల్ని కొద్దిగా గాయపరచును. ఎట్లనగా మీలోనున్న ప్రధాన ముళ్ళ చక్రము పనిచేయుట లేదు. నిజము. కాని ఆ ప్రధాన ముళ్ళ చక్రము పనిచేయుటకు ప్రారంభించిన...
"లిద్దీ, నీవు ఒక పరిశుద్ధ దొర్లు గుండ్రాయిగా మారిపోతివని నేను విన్నాను. కాబట్టి ఇకమీదట నీవు మా సిగరెట్ పార్టీలో పాల్గొనవు కదా?" అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, మీలో ఆ ప్రధాన ముళ్ళ చక్రము లేని యెదల, "జాన్, నేను నీకు చెప్తాను, నేను పాత సిగరెట్లను విసిరివేసాను. అది నాకు తెలుసు. నేను రేడియాలో ఆలకించాను..." అని మీరు చెప్పెదరు.

63, గత ప్రపంచ యుద్ధమున నాలుగు సంవత్సరములలో ప్రజలు మరణించిన దానికంటే ఈ సంవత్సరమున అమెరికాలో ఈ సిగరెట్లను పొగత్రాగుట వలన వారి గొంతులో (గొంతు కేన్సర్)కేన్సర్ వలన అనేక ప్రజలు మరణించెదరని ఒక దినమున నేను ఆలకించాను. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రములలో రెండు వైపులనున్న ప్రజలు దీనివలన అనేకులు మరణించెదరు. ఆ కేన్సర్ వ్యాధినిగూర్చి నిన్న రేడియో ప్రచారముద్వారా చెప్పిన విషయములను మీరు ఆలకిం చారా? సిగరెట్లను త్రాగుట వలన ఖచ్చితముగా కేన్సర్ వ్యాధి వచ్చుచున్నదని నిరూపించిరి. వారెందుకు దానిని నిలిపి వేయుట లేదు. అందుకు కారణమేమిటి? టెలివిజనులలో ఇంకానేకమైన ప్రచారసాధనములలో అలాంటి అసభ్యమైన మరియు నీచమైన ప్రకటనలతో నిండిపోయి ఉన్నవి. ఎందుకనగా, డేగలు లేదా రాబందులకు వారు కావాలి. అది ఖచ్చితముగా నిజము. సరిగ్గా అదే నిజము. అటువంటి రాబందుల వద్ద చచ్చిన వాటినిగూర్చి మీరు మాట్లాడలేరు. ఎందుకనగా, అది తినుచున్నదంతా అదే. అది నిజము. ఒక్కసారి దాని స్వభావమును మార్చి చూడండి. అప్పుడు ఆది (అతడు) నిశ్చయముగా దానినుండి తొలగిపోవును. ఖచ్చితముగా,

ఓ, నేను చాలా కఠినముగా ప్రసంగించుచున్నానని మీరు తలంచుచున్నారా? కఠినముగా ప్రసంగించాలనేది నా ఉద్దేశ్యంకాదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కాని సహోదరుడా, మీరు మరలా మలచబడుటకు ముందుగా మీరు విరుగగొట్ట బడవలెను. అదే ఖచ్చితముగా నిజము. ఏదైతే సత్యమో దానిని మనము ఎరుగ వలెను. లేఖనములలో నుండి దానిని మీకు సూచించుచున్నాను. నిశ్చయంగా.

64. ఆ తర్వాత దేవుడు... ఆ పాత కాడితో, మీరు క్రీస్తుతో జతచేయబడి కట్టబడ వలెను. ఆ ప్రధాన ముళ్ళ చక్రము నీలో క్రియచేస్తూ, దేవుని యొక్క ప్రేమ నీ హృదయములో నుండి ప్రవాహించిన యెడల, అప్పుడు ఎవరైనా ఒకరు, “నీవొక పరిశుద్ధ దొర్లు గుండ్రాయిగా మారిపోతివని, ఇకమీదట త్రాగవని మరియు పొగ పీల్చవని నేను వినబడ్డానని" చెప్పినపుడు, "అది నిజమే సహోదరీ,ఓ, నేను గొప్ప నిధిని కనుగొన్నాను. అది నా హృదయమునకు ఎంతో మాధుర్యముగా ఉన్నది.
దానినిగూర్చి నీకు చెప్పాలని కోరుచున్నానని" మీరు చెప్పెదరు. ఓ, అవును, అది శిలువ యంతటా రెక్కలును పెట్టుచున్నది. (ఎన్ని నిందించిన దానిని సుళువుగా తీసుకుంటారు-తె. ఈ॥). అది కేవలము ఆవిధముముగా మార్చివేయుచున్నది....

పిదప మీరేమి చేయుదురో మీకు తెలుసా? ఆ భారములు మీపై మోపినను, వాటన్నింటిని మోయుచూ మీరు... ఆ గాజా పట్టణపు ఇత్తడి తలుపులను, వాటి రెండు ద్వారముల బంధములను పట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని సుళువుగా మోసుకొని వెళ్ళినట్లుగా అది కనిపించును, మరియు మీ హృదయమున ప్రధాన ముళ్ళ చక్రమును మీరు కలిగియుండి, దేవుని ప్రేమ మీలోనుండి ప్రవాహించుచున్నప్పుడు, వారికి ఇష్టమొచ్చిన పేర్లును మీకు పెట్టి మిమ్మల్ని హేళనచేయుచు పిలుచినా, అలాగు వారు మిమ్మల్ని పిలుచుటవలన రవ్వంతకూడా వారికి ఏ ప్రయోజనము లేదు. వాటిని మీరు కల్వరి అను పిలువబడు కొండ పైకి మోసుకొని వెళ్ళి అచ్చట వాటిని పెట్టి మరియు ఆ వ్యక్తికొరకు మీరు ప్రార్ధించండి. నిజము, దీనికొరకు, దానికొరకు మరియు వేరే విషయముల కొరకు మీరు జనులతో ఘర్షణపడుట మరియు గాయపరచుట వంటివి మీరు చెయ్యరు.

65. ఎందుచేత, మీరు దేవుని పిల్లలుగా మారినప్పుడు, మీలోనున్న ఆ పాతవన్నీ గతించిపోవును. మీరు కాడితో కట్టబడి ఉందురు. ఓ, మీరు దేవుని రాజ్యముయొక్క పౌరులనే కాడితో కట్టబడి మరియు పరలోకములో మీరు ఆయనతో ఉమ్మడి వారుసులై ఉన్నారనే విషయమును గ్రహించినపుడు, క్రీస్తుతో జతగా మీరు కాడితో కట్టబడి, ఆ భారమును భరించుట ఎంతో సంతృప్తి చెందెదవు. అదెంతో శులువు.

ఇప్పుడది మనలోనికి వచ్చినప్పుడు, అనగా ప్రేమ మనలోకి వచ్చినప్పుడు మనమేమి చేయుదుము? ఆ ప్రేమ ఏవిధముగా ప్రదర్శింపబడినదని, ఆ భారములు చూచుటకు ఎంత సులువుగా ఉండునని, ఆ ప్రేమ భయమును ఏవిధముగా తీసివేయునని ఒక దినము రాత్రి ఇచ్చట ప్రసంగించానని నేను నమ్ముచున్నాను.

మీలో ప్రేమ ఉన్నయెడల మీరు దేనికి భయపడరు. మీరు దేవుని యొక్క వాక్యమును దాని ప్రకారముగా స్వీకరించండి. మీరు స్వస్థతను పొందుకొనెదరని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. ఇటువంటి అనేక కార్యములు మిమ్మల్ని చుట్టుముట్టినను మీలో ప్రేమను కలిగియున్నంత వరకు వాటి గురించి అసలు మీరేమి దిగులు చెందరు. మీ జీవితములో పరిస్థితులు సరిగ్గా లేనప్పటికీ దానితో ఏ సంబంధము ఉండదు. ఎందుకనగా, ఇంకా మీలో ఆ ప్రేమ ఉన్నది. కాబట్టి అది మిమ్మల్ని స్థిరముగా నిలిచియుండునట్లు చేయును. అర్థమైనదా?
66. అపొస్తులులు ప్రధాన ముళ్ళ చక్రమనే ఈ ప్రేమద్వారా వచ్చు శక్తిని చూపించుటకు కోరుకొనిరి, యేసుని వైపు చూడండి. ఆయన మనలను సమాధి వద్దకు తీసుకొని వెళ్ళెను. అచ్చట యేసు పరుండి ఉండుటను గమనించండి. ఆయన ముఖము గాయాల మచ్చలతో మరియు మరణమువలన పాలిపోయి ఉన్నది. ఆయన శరీరములో ఉన్న రక్తమంతా కార్చబడెను. ఆయనయొక్క చేతులు మరియు కాళ్ళు పొడవైన మేకులతో కొట్టబడుటవలన చీలిపోయి ఉన్నవి. అచ్చట ఆయన చలనము లేకుండా మరణించి మూడు దినములు ఉండెను. పిదప గమనించండి. ఆకస్మాత్తుగా, ఒక గుంపు సైనికులు భయ భ్రాంతులై వెట్టివారివలె అటు ఇటు అందరూ పరుగెత్తుచున్నారు. అదేమిటది? పిదప నేను గమనించుచుండగా, ఆయన పెదవులలో ఎర్రని రంగు మరలా వచ్చుటకు ప్రారంభమైనది. దేవుడేమి చేయు చున్నాడు? ప్రేమయొక్క శక్తిని ఆయన చూపించుచున్నాడు. ఆయనను జీవముతో ఆయన లేపెను. ఇదిగో ఇచ్చట సమాధివద్ద ఆయన నిలబడివుండి, "సమస్త ఘనత మరియు సమస్త శక్తి" అని పాడుచుండెను.

ఆయన అచ్చటనుండి వెళ్ళుచుండగా ఆయనను గమనించండి. కొన్ని దినము లకు పిదప ఆయన తన శిష్యులను ఆ సముద్రతీరము వద్దకు సమకూర్చి, వారికి ఆయన ప్రసంగించెను. ఇచ్చట చివరగా ఆయనయొక్క అందమైన పెదవులు క్రియ చేయుచు, మాటలు ఆ పెదవుల నుండి తీసుకొని వచ్చుచు, అవి సరళంగా దొర్లుకుంటూ వచ్చుచున్నవి. "మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మినవారి వలన ఈ క్రియలు కనబడును (వెంబడించును)".

67. ఆయన మాట్లాడుటకు ప్రారంభించిన వెంటనే తెల్లవారుజాముయొక్క వెలుగు ఆయన పాదముల క్రిందకు వచ్చుటను నేను చూడసాగాను. కారణము ఏమిటి? దేవుడు తన శక్తిని చూపించుచున్నాడు. ఆయన పైకి లేచుచున్నాడు. ఆయన ఏమైయున్నాడు? భూమ్యాకర్షణ శక్తియొక్క ప్రతీ సూత్రమును ఆయన ధిక్కరించెను. ఆ భూమ్యాకర్షణ శక్తి నుండి ఆయన పైకి లేపబడెను. అదెలాగు జరిగెను? ఆ భూమ్యాకర్షణ శక్తిని సృష్టించినవాడు ఆయనే. ఇదిగో ఆయన ఇచ్చట ఉన్నాడు. ఆయన ఉన్నతమునకు వెళ్ళేంతవరకు, ఆయన పైకి ఆరోహణుడై ఉన్నతమునవున్న మహోన్నతునియొక్క పాదములవద్దకు మెల్లగా వెళ్ళి కూర్చుండెను. దేవునికే మహిమ కలుగునుగాక! అదిగో అచ్చట ఆయన పరలోకమందున్న వాటిపైన మరియు భూమి పైనున్న వాటిపై సర్వాధికారము ఆయన చేతులలో ఉండెను. సముద్రములోని ఒక్క చిన్న అలకూడా ఆయనయొక్క అనుమతి లేకుండా కదలదు. ఆయన శక్తి అటువంటి అద్భుతమైనది. (టేపులో ఖాళీ గలదు - సంపా॥)
హల్లేలూయా, క్రీస్తులో నూతన సృష్టిగా మనము సృష్టింపబడుటకై మారని అదే శక్తి మనలోకూడా క్రియ చేయుచున్నది... ఓ, సహోదరుడా, అచ్చటనుండే శక్తి వచ్చును, మన విశ్వాసము దానిని క్రిందకు తీసుకొని వచ్చిన వెంటనే, అనగా ప్రేమ మన విశ్వాసమైయున్నది. దేవుడు తన వాక్యమును నెరవేర్చలేడేమోననే తలంపును... సమస్త భయమును మనలోనుండి అది పారద్రోలుచున్నది. ఆ ప్రేమ మరియు కృప క్రీస్తేయని నేను కనుగొనినప్పుడు, అప్పుడది ఆయనను మనలోకి ప్రవేశించునట్లుగా క్రిందికి తీసుకొని వచ్చుచున్నది. ఆ మహోన్నతమగు దేవుని శక్తి సంఘములో క్రియ చేయుటకు ప్రారంభించినపుడు, ప్రేమ దానిని జయించు చున్నది. ప్రపంచములోనున్న వాటన్నింటికంటే ప్రేమయే మిక్కిలి శక్తివంతమైనదని నేను మీకు చెప్పుచున్నాను. ప్రేమనే దానియొక్క స్థానమును వేరేదియు తీసుకోలేదు.

68. కొన్ని దినముల క్రితము ఒక చిన్న బాలిక కళాశాలకు వెళ్ళెను. కళాశాలనుండి ఆమె తిరిగి వచ్చినపుడు ఆమెతోపాటు మరొక బాలికను మరియు ఒక కుక్కపిల్లను తీసుకొని వచ్చెను. అచ్చటకు వచ్చి చేరగానే, రైలు బండినుండి ఆమె దిగుచుండగా, ఆమె తల్లి అచ్చట నిలబడియుండెను. ఈ అమ్మాయితోవున్న ఆ బాలిక, "చూచుటకే అసహ్యముగా, హీనముగానున్న ఈ వృద్ధురాలు ఎవరు?" అని అడిగెను.

ఈ అమ్మాయి సిగ్గుపడుచూ, “ఓ, నాకు తెలియదు” అని చెప్పెను.

ఈ అమ్మాయి రైలు బండి దిగిన వెంటనే ఆ వృద్ధ తల్లి ఆమెవద్దకు పరిగెత్తుకొని వెళ్ళి, “నా బంగారమా, నిన్ను చూస్తూ నేను చాలా సంతోషిస్తున్నానని...” చెప్పెను. ఈ అమ్మాయి వృద్ధురాలి మాటలను లెక్కచేయకుండా ముఖమును త్రిప్పుకొనెను.

ఆ రైలు బండి నడిపే వ్యక్తి, అచ్చట నిలబడియుండి, “మేరీ, నేను నిన్ను ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను, నీవు కళాశాలకు వెళ్ళిన తర్వాత ఇంతగా ఏలాగు మారిపోయావు? నీ తెలివి తేటలతో నీవు నేర్చుకున్నది ఇదేనా?" అతడు అడిగెను.

69. ప్రేమనుగలవారుగా ఉండుటకు బదులుగా మనము నేర్చుకున్న అనేక తెలివితేటలనుబట్టి నేను భయపడుచున్నాను. నిజము, “మేరీ, నేను చెప్పినది సత్యము.

నేనుకూడా వృద్దుడినే, నీ తల్లి ఎందుచేత అలాగు అసహ్యముగా ఉన్నదో అదికూడా నాకు తెలుసు. కారణమేమనగా, ఒక దినమున నీవు మేడమీద గదిలో ఉండగా, నీ తల్లి యింటి వెనుక పెరట్లో బట్టలను ఆరపెట్టు చున్నది, అలాగు ఆమె బట్టలను ఆరపెట్టుచున్న సమయమున మీ ఇంటిని అగ్ని మంటలు చుట్టు ముట్టాయి, ఆ విషయమును ఎవరో ఒకరు పరిగెత్తుకొని వెళ్ళి ఆమెకు చెప్పగా, అప్పటికే నీవు ఉన్న ఆ గదిలో అగ్ని మంటల మధ్య నీవు చిక్కుకొని ఉన్నావు. అందరు, "బయటకు
బయటకు రా" అని కేకలు పెట్టుచున్నారు. పనిచేసేటప్పుడు బట్టలు మురికి అవ్వకుండా ఉండుటకు కట్టుకునే పై వస్త్రమును తీసి విసిరేసి నీ తల్లి ఆ అగ్ని మంటలను లెక్కచెయ్యకుండా నీ గదిలోకి ప్రవేశించి నిన్ను తన కౌగిలిలో హత్తుకొని తన మీదున్న వస్త్రములతో బాగా చుట్టి, ఘణఘణ మండే మంటల జ్వాలలోనుండి బయటకు తీసుకొని వచ్చెను. అలాంటి ఆ తీక్షణమైన అగ్ని జ్వాలలోనుండి నిన్ను వెలుపలికి తీసుకొని వచ్చేటప్పుడు ఆమె ఒళ్ళంతా కాలిపోయి, శరీరమున మంటల గాయాలతో ఈ దినమున ఆమెను చూచుటకు అలాగు అసహ్యముగా ఉన్నది. నేడు నీవు ఇంత అందంగా ఉండుటకు కారణము ఆమెయొక్క అసహ్యమైన రూపమే. నీవు అందంగా ఉండాలని ఆమె ఆశిస్తూ ఆ అసహ్యమైన రూపముతో ఆమె మారిపోయెను. కాబట్టి నీ స్వంత తల్లియొక్క ఆ రూపమునుబట్టి నీవు సిగ్గుపడు చున్నావని నాతో నీవు ఇప్పుడు చెప్పగలవా?" అని అతడు అడిగెను.

70. సహోదరుడా, మనము ఒక విషయమును ఆలోచించిన, ఒక జ్ఞానవంతుడిని పంపించకుండా, ఆయన క్రీస్తును సిలువకు పంపించి, సిగ్గుతోను మరియు అవమా నముతోను అచ్చట మరణించినట్లు చేసినది దేవునియొక్క ప్రేమేనని ఈ దినమున నేను తలంచుచున్నాను. పెంతెకోస్తు సంఘము లేదా ఇతర సంఘములు దేవుని యొక్క అసలైన ప్రేమను అంగీకరించుటకు నిరాకరించుచున్నవని మీరు నాతో చెప్పాలని అనుకుంటున్నారా? “సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడనుకాను. రక్షణ కలుగుజేయుటకు అది దేవునియొక్క శక్తియై యున్నది.” ఇంకా సరిగ్గా చెప్పాలంటే, “పరిశుద్ధ దొర్లు గుండ్రాయి" అని నీవు నన్ను పిలిచినను, దేవునియొక్క ప్రేమ నా హృదయముననున్నంత వరకు నీవు పిలుచునట్లుగానే పరిశుద్ధ దొర్లు గుండ్రాయి గానే నేను ప్రవర్తించుదునుగాక! ఖచ్చితముగా ఆ మాటలన్నీ నన్నేమి చేయలేవు.

ఓ, సహోదరుడా, దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చెను. దేవునియొక్క ప్రేమయే సంఘమును అదుపులో ఉంచును. ఏ జ్ఞానము, విద్య, ఏదీ కాదుగాని ప్రేమ మాత్రమే సంఘమును అదుపులో ఉంచును. వరములు సంఘమున క్రియ చేయునుగాని అవి సంఘమును అదుపులో ఉంచలేవు. సంఘమును ప్రేమ మాత్రమే అదుపులో ఉంచును. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను". ఆయన ప్రేమ దాన్ని చేయునట్లు ఆయన నిర్భందిం చబడ్డాడు. ఆ ప్రేమతో నిర్భందించబడినప్పుడు, సార్వభౌమ కృప అందుకొరకు నియమింపబడిన వ్యక్తిని ముందుకు త్రోస్తూ ప్రదర్శించెను. మరలా నేను దానిని చెప్పనివ్వండి. దైవీక ప్రేమ ప్రణాళికను రూపొందించినపుడు, కృప దానికి కావలసిన పదార్ధము(వస్తువు)ను ఉత్పత్తి చేయును. సార్వభౌమ కృప ఒక రక్షకుడిని లోకము
నకు తీసుకొని వచ్చునట్లుగా దేవుడు అంతగా ఈ లోకమును ప్రేమించెను. అవును, ఖచ్చితముగా, మీరు దేవుడిని మిక్కిలిగా ప్రేమించినప్పుడు, మీరు ఒక క్రైస్తవునిగా జీవించునట్లుగా, ప్రేమించునట్లుగా మరియు నిష్కటమైన క్రైస్తవునిగా ఉండుటకై సార్వభౌమ కృప మీవద్దకు పరిశుద్ధాత్మ అభిషేకమును తీసుకొని వచ్చును.

71. ఒక దినమున... ఇచ్చట ఒక తలంపును చెప్పాల... అనేక వేల సంవత్సరముల క్రితము ఈ పాత భూమి ఒక పెద్ద అగ్ని పర్వతపు విస్ఫోటనంగా ఉండెను తప్ప వేరేమి లేదు. అప్పుడు అందులో ఒక చుక్కంత జీవముకూడా లేదు. కాబట్టి అదొక అగ్ని పర్వతపు విస్ఫోటనం తప్ప అందులో ఏమీలేదు. దేవుడు, మహోన్నతమైన పరిశుద్ధాత్మ, దేవునిలో నుండి లోగాస్ (Logos) బయలు వెళ్ళెను. మనము దానిని పరిశుద్ధాత్మగా పిలిచెదము. అది దేవునినుండి బయలువెళ్ళి ఈ భూమికివచ్చెను.

నేను ముగించబోవుచుండగా ఇపుడు మీరు ఒక నిమిషము చాలా జాగ్రత్తగా, నిశ్శబ్దంగా దీనిని ఆలకించండి. ఇప్పుడు చాలా త్రికరణ శుద్ధితో దీనిని మీరు ఆలోచించవలెనని నేను కోరుచున్నాను. దీనిని జ్ఞానవంతులు చెయ్యబోవుచున్నారా? మీ సంఘ శాఖ దీనిని చెయ్యబోవుచున్నదా? మీ వ్యక్తిత్వము దీనిని చేయబోవు చున్నదా? లేదా పరిశుద్ధాత్మ దీనిని చెయ్యబోవుచున్నదా? ఆలోచించండి.

72. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇచ్చట ఇలాగు అస్తవ్యస్తతగా ఉన్నప్పుడు, అచ్చట ఏమీలేదు. ఈ అగ్ని పర్వతపు విస్ఫోటనము చల్లబడిన పిదప అచ్చట ఒట్టి రాళ్ళు తప్ప వేరేమి లేవు. అలాగే భూమి ఉండెను. కోడి తన గూటికి తిరిగి వచ్చునట్లుగా భూమి పైకి పరిశుద్ధాత్మ వచ్చి పొదుగుటకు ప్రారంభించెను. ఆమె (పరిశుద్ధాత్మ) పొదుగుటకు ప్రారంభించెను లేదా... “పొదుగుట (brood)" అనే పదమునకు అర్ధమేమనగా, “పొదిగేటప్పుడు క్కూ, క్కూ (COO) అని అంటూ తనలో నుండి వచ్చు శబ్ధము, లేదా కోడి తన గుడ్డుపై కూర్చొని పొదిగేటప్పుడు కొక్కొక్క అనే శబ్దము చేయుచు రాబోవు తన పిల్లలకు ఆ శబ్ధముద్వారా తన ప్రేమను వ్యక్తపరచుట” అని అర్ధము. "కలుగునుగాక! కలుగునుగాక!" అని అది పలుకుటకు ప్రారంభించెను... అట్లు పలుకుచున్నప్పుడు ఈ భూమిమీద ఏమీలేదు, కాని మన శరీరములు అచ్చట ఉండుటను నేను గమనించగలుగు చున్నాను.

మన శరీరములు భూమి నుండి వచ్చెనని మనకు బోధించబడెను. మనము వివిధమైన పదహారు మూలకాలు (మూల పదార్ధములు) ద్వారా రూపింపబడితిమి. అవేవనగా పెట్రోలియం, విశ్వకాంతి, క్షారము, సున్నం మరియు ఇంకా మొదలగు #నవి. పదహారు మూలకాలతో రూపొందించబడినదే ఈ శరీరము, అదేవిధముగా
ఎదుగునట్లు చేయుచున్నాము? మనము ఆహారమును భుజించుటద్వారా, ప్రతీ దినము మనము ఆహారము భుజించుటకు ఏదోకటి మరణించవలసియున్నది. ఈ దినమున నీవు ఆహారము భుజించుటకు, నీవు జీవించుటకు ఏదోకటి మరణించవలెను. మీరు గొడ్డు మాంసమును తినాలంటే, ఆవు చనిపోవలెను, మీరు మేక మాంసమును తినాలంటే మేక చనిపోవలెను. మీరు చేపలను తినాలంటే చేపలు చనిపోవలెను. మీరు రొట్టెను తినాలంటే గోధుమ చనిపోవలెను. మీరు బంగాళ దుంపలను తినాలంటే బంగాళ దుంపలు చనిపోవలెను, మీరు చిక్కుడు కాయలను తినాలంటే చిక్కుడు కాయలు చనిపోవలెను. అవి ఏమైనగాని వాటిల్లో జీవము గలదు. చచ్చినవాటి ద్వారా మాత్రమే మనము జీవించు చున్నాము.

73. ఇప్పుడు, నా సహోదరుడా, ఆలకించుము. నేను మిమ్మల్ని ఒకటి అడగాలను కుంటున్నాను. ఇచ్చట మనము జీవించుటకు ఒకటి మరణించాలంటే, అట్లయితే మనము మరలా అమర్యులుగా జీవించుటకు ఏదోకటి అనగా ఏదోక శ్రేష్టమైనది మరణించవలయును కదా? అదెంతగా దానిని చేయవలసి వున్నది, ఏదో మేధావుల వంటి బోధకులు, ఒక కాతలిక్ యాజకులు, రబ్బీవంటి వారు ఆలోచించి చేయు రీతిగా అది ఉండదు. కాని మనము మరలా జీవించుటకొరకు ఆయన తన జీవమును యిచ్చి పరిశుద్ధాత్మను తిరిగి పంపించుటకై యేసుక్రీస్తు యొక్క జీవము బలిగా తీయబడెను. “నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు" అని క్రీస్తు చెప్పెను. దాన్నిగూర్చి మీరు ఆలోచించవలెనని నేను కోరుచున్నాను. చూడండి. నీవు జీవించుటకు అనుదినము ఏదోకటి మరణించవలసియున్నది, అలాగే నీవు నిత్య జీవముతో నిత్యము జీవించుటకు నీకొరకు ఏదోకటి మరణించవలసివున్నది. మీ తెలివి తేటలుద్వారా వచ్చునది కాదు. దానిని చెయ్యుటకు మీకేది సాధ్యమవ్వదు, కాని దేవుడు అనుగ్రహించిన ఆ నిత్య జీవమును మీకు స్వీకరించితే అదే చాలును.

74. ఇపుడు, పరిశుద్ధాత్మ ఒక పావురమువలె గుర్ గుర్ అంటు శబ్ధము చేయుచు పొదుగుటను గమనించండి. ఇదిగో అదిప్పుడు భూమిమీద ఇలాగు పొదుగు చున్నది. మొదట మీరు తెలుసుకోవలసినదేమనగా ఇంధన తైలము (పెట్రోలియం) కొద్దిగా సమకూడి వచ్చుటకు ప్రారంభమైనది. అదేమిటది? మనము చూద్దాం. పెట్రోలియం, అలాగే కొద్దిగా సున్నం దానితోపాటు వచ్చుచున్నది. మరియు దానితో పాటు ఇనుము వచ్చెను. ఏం జరుగుచున్నది? భూమినుండి అందమైన చిన్న కలువ పుష్పముపైకి మొలకెత్తుచు వచ్చుచున్నది. అదేమిటది? పరిశుద్ధాత్మ గుర్ గుర్ మంటూ పొదుగుచున్నది. "సమస్త భారము..."ఆ చిన్న కలువ పుష్పము. అది...
తండ్రి దానిని చూచి, "అది అద్భుతము, ఇంకా అలాగే పొడుగుడుండును"అని చెప్పెను. దానికి తర్వాత గడ్డి పైకి వచ్చెను, వృక్షములు పైకి వచ్చెను. ఆ ధూళినుండి. పక్షులు ఎగురుచూ వెలుపలికి వచ్చెను. ధూళినుండి జంతువులు ఉద్భవించెను. అ తర్వాత ఏమి జరిగెను? మానవుడు పైకి లేచి వచ్చెను. అదేమిటది? పరిశుద్దాత్మ పొదుగుచున్నది. ఒక సంఘము కాదు పొదుగుచున్నది. పరిశుద్ధాత్మ పొడుగుచున్నది.

ఇదిగో ఇచ్చట మానవుడు పైకి వచ్చెను. దేవుడు, "అతడు చూచుటకు సరియైన రీతిలో కనబడుట లేదు". కాబట్టి... స్త్రీ మూల సృష్టికాదు, ఆమె పురుషునిలోనుండి తీయబడిన ఒక ఉప సృష్టి. కావున దేవుడు తన శస్త్ర చికిత్స బల్లమీద తన పరికరములతో పురుషునియొక్క ప్రక్క భాగముననున్న ప్రక్క ఎముకను తీసి దానిద్వారా ఒక చిన్న ప్రియమైన హృదయమును రూపొందించెను.హవ్వ మరియు ఆదాము ఒకరి చేతుల ఒకరు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిరి. మీకు తెలుసా, మొదట ఒక పెద్దగాలి వీచెను. “ఓ, ప్రియమైనవాడా, ఆ గాలి..." అని హప్ప భయపడెను. అప్పుడు ఆదాము ఆ గాలిని చూచి, "ప్రశాంతముగా ఉండు" అని చెప్పగా అది అతడికి లోబడెను. అతడు ఒక దేవుని కుమారుడు. ఓ, హల్లేలూయా. 75. ఓ, నేనొక వెట్టివానిగా ప్రవర్తించవచ్చు.నేను అలాగు చేయుటలేదని తలంచు చున్నాను. కాని చూడండి. నేను దానినిగూర్చి ఆలోచిస్తుండగా, నాలోవున్న ఏదోకటి. ఈ కార్యములనుగూర్చి నేను ఆలోచించు... ఓ, దేవా, నేను దానినిగూర్చి ఆలోచిస్తు న్నప్పుడు, ఈ వృద్ధాప్యము ఏ బేధమునైనా కలిగించగలదా? ఈ వృద్ధాప్యము ఏదైనా తేడాను కలిగించుచు ఏమైన చేయగలదా?

గమనించండి. ఆ తరువాత కొన్ని నిమిషములకు ఒక గొప్ప గర్జించే శబ్దమును వచ్చెను. ఆమెను అదేమి భయపెట్టదు. అదెవరు? సింహం. 'సింహమా, ఇక్కడకు రా” అని ఆదాము పిలిచెను. అతడు దాన్ని ఒక చిన్న పిల్లివలె నిమురుచూ వుండెను. చిరుత, పులి అచ్చటకు వచ్చెను. అవన్నీ అలాగు వచ్చుచు... ఓ, పిదప అదొక గొప్ప పరదైసువలె ఉండెను.

ఆ తర్వాత చిన్న ఆదాము, "ప్రియమైనదానా, టెలివిజన్ చూచుటకు ఇది సమయము కాదు, అదిగో సూర్యుడు అస్తమించుచున్నాడు. ఇది మనము వెళ్ళి ఆరాధించుటకు సమయమని" చెప్పెను. ఓ, దేవా. "ఇది మనము వెళ్ళి ఆరాధించు సమయము. డాక్టర్. జోన్స్, బిల్లి గ్రహంగారు లేదా ఇతరుల ప్రసంగమును వినుటకు వెళ్ళే సమయము ఇదికాదు. కాని మనము వెళ్ళి ఆరాధించబోవు చున్నాము". ఒక పెద్ద స్థలమునకు, గొప్ప స్థలమునకు, వలయాకారంలోవుండు స్థలమువంటి స్థలము నకు వారు వెళ్ళలేదుగాని వారు ఆ వృక్షముల క్రిందకు వెళ్ళిరి. అచ్చటకు లోగాస్
(Logos),పరిశుద్ధాత్మ, క్రీస్తు,ఒక అసలైన మృదువైన వెలుగుతో నిండిన అభిషేకము క్రిందికి దిగివచ్చెను. ఆయన, "పిల్లల్లారా, మీ దేవుడగు ప్రభువు ఈ భూమి పై మిమ్మల్ని ఉంచిన మీ నివాస స్థలములో మీరు సంతోషించితిరా?” అని అడిగెను.

"అవును, తండ్రీ, మీకు మేము సమస్త స్థుత్తులను చెల్లించుచున్నాము". వారు ప్రార్ధించిన తరువాత ఆయన వారి దగ్గరకు వచ్చి వారి బుగ్గల పై ముద్దును పెట్టి నిద్రపోవుటకు వారిని పడుకోపెట్టెను."

76. గమనించండి, రాత్రి సమయమున ఆవిధముగా మీ పడక గదికి వెళ్ళుటకు అదెంత అద్భుతముగా ఉండును... నా చిన్న కుమారునికి నేను అలాగే చేసెదను. నేను, నా భార్య నిలబడి, మా చిన్న జోసఫ్ని నిద్రపుచ్చుటకై పడకపై వేసి మేము ఆ ప్రక్క, ఈ ప్రక్క బుగ్గలపై ముద్దు పెట్టెదము. నేను,నా భార్యను చూచి, "అతడికి నాలాంటి కళ్ళే ఉన్నవని నీకు తెలుసా” అని చెప్పెదను.

“అవును, అతడి నోరు మొదలగువాటిని చూచినప్పుడు నీకు ఉన్నట్లుగానే అవి రూపింపబడి ఉన్నవి” అని ఆమె చెప్పును. అది పరిశుద్ధ వివాహ బంధము యొక్క పోలికల ప్రతిబింభము.

దేవుడు, ఆదామును మరియు హవ్వను చూచినప్పుడు, వారు చూచుటకు ఆయనను ప్రతిబింభించే పోలికలను కలిగియుండిరి. వారు ఆయనయొక్క పోలికతో రూపింపబడిరి. కాబట్టి ఆయన వారిని ముద్దు పెట్టుకొని ఆనందించుచు, మరియు ఆయనయొక్క గొప్ప హృదయము ఏవిధముగా అనుభూతిచెంది యుండును.

77. అచ్చట కీడు కలిగించునవి ఏమి లేవు. పులి, సింహము, నిశ్శబ్ధముగా పడుకొని ఉండెను. ఏదీకూడా హాని చెయ్యవు. ఆ తర్వాత సహోదరుడా, పాపము లోపలికి ప్రవేశించెను. ఆ అందమైన దృశ్యమును అది పాడు చేసెను. హవ్వయొక్క కాంతి వంతమైన ముఖమునకు ఎలాంటి అలంకరణ సాధనములు అవసరమై ఉండవు. లేదండీ. నిత్య జీవముయొక్క సిగ్గు అనే ఎర్రటి బుగ్గలతో మిక్కిలి సౌందర్యవతిగా ఆమెను రూపొందించినది ఆ దేవుడే. ఈ దినమున వారు చేయునట్లు ఆమె తన శరీరమునకు, ముఖమునకు అనేకమైన పదార్ధములతో అందముగా తీరిదిద్దుకునే అవసరము ఆమెకు లేదు. ఆ పాపమే మిమ్మల్ని ఈ స్థితికి దిగజార్చినది.

సహోదరుడా, నేను మీకు చెప్పుచున్నాను, ప్రతీ పురుషుడు, మరియు స్త్రీ... మనము భుజించేటప్పుడు, మన జీవమును మనము పునరుద్ధరించుకొను చున్నాము. నేను ఒక వైద్యుని వద్ద ఈలాగు అడిగాను, వైద్యుడా, నేను భుజించే ప్రతీసారి,నేను నా జీవమును పునరుద్దరించుకొనుచున్నాను కదా?" అని అడిగాను.
“అది నిజమే, బ్రాన్హాం సహోదరుడా" అని వైద్యుడు చెప్పెను.

"నేను పదహారు సంవత్సరముల ప్రాయంలో ఉన్నప్పుడు భుజించిన అదే ఆహారమునే ఇప్పటికీ భుజించుచున్నాను. కావున పదహారు సంవత్సరములపుడు భుజించుచు, ఎదుగుచూ, బలమును పొందుకుంటూ పెద్ద వాడినైతినికదా, మరి ఇప్పుడుకూడా అదే ఆహారమును నేను భుజించుచున్నా, వృద్ధుడునగుచు మరియు ఎప్పుడూ ఏదోక బలహీనతో ఎందుకు ఉంటున్నాను? దానికి కారణమేమిటో చెప్పుము. సరే, ఒక కూజాలోనుండి ఒక గ్లాసులోకి నీళ్ళుపోయునప్పుడు అది నిండు చున్నది. మరలా దాంట్లోనే ఇంకా అధికముగా మరలా నీళ్ళును పోసేటప్పుడు ఎంత ఎక్కువగా పోయుదుమో అంత ఎక్కువగా అది తగ్గిపోవుచున్నది. దానికి కారణమేమిటో విజ్ఞాణశాస్త్ర పూర్వకముగా వివరించి చెప్పండి” అని అడిగాను.

“గౌరవనీయులైన బ్రాన్హాంగారు, దానిని వివరించలేము” అని వైద్యుడు చెప్పెను.

“అవును, దానిని వివరించవద్దు డాక్టరు గారు. నన్ను మీరు క్షమించండి. కాని దానిని పరిశుద్ధగ్రంథమున ఈలాగు, “అది నరులకు పరిమితి కాలము నిర్ణయింప బడెను, మరియు నరుల ఆయుష్కాలము పరిమితి గలది" అని చెప్పబడెను, కాని, సహోదరుడా, ఆ దీవెనకరమగు పునరుద్ధాణమున ప్రతీ ముడత మరియు ప్రతీ వృద్ధాప్యముయొక్క గురుతులన్నీ కనుమరుగై పోవును. అవి పాపపు గురుతులుగా ఉన్నవి. ఈ సమస్తము...?... పాపమువలన కలిగిన ఇవన్నీకూడా కనుమరుగై పోవును. హల్లేలూయా! అచ్చట మనము నిత్య యవ్వనస్థులుగా ఉండెదము.

78. ఒక దినమున నాకున్న కొన్ని తల వెంట్రుకలను నేను దువ్వుచుండగా, నా భార్య నాతో, "బిల్లీ, మీకు బట్టతల వచ్చేసింది" అని చెప్పెను.

“నా మధుర హృదయమా, నా వెంట్రుకలలో ఒక్కటికూడా పోలేదని” చెప్పాను.

“నా, ప్రియమైనవాడా, అదెలాగ" అని ఆమె అడిగెను.

“నా వెంట్రుకలలో ఒక్కటికూడా నేను కోల్పోలేదు" అని నేను చెప్పాను.

“మరి, అవన్నీ ఎక్కడ ఉన్నవి?" అని ఆమె అడిగెను.

“నా మధుర హృదయమా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, దానికి జవాబు చెప్పు, ఆ తరువాత నేను నీకు చెప్పెదను" అని నేను చెప్పాను.

సరే మంచిది, ప్రియమైనవాడా, అడుగుము" అని ఆమె చెప్పెను.

" “అవి నా తలలో ఉండుటకు ముందు ఎచ్చట ఉండెను? అవి ఎచ్చటో ఒక చోట ఉన్నవి. నా తలలో ఉండుటకు ముందు అవెచ్చటెచ్చట ఉన్నవో, పునరుద్ధార ణలో నాకొరకు అవి అచ్చట వేచియున్నవి”అని నేను చెప్పాను. హల్లేలూయా. కేవలము... అవును సహోదరుడా, అవును, సహోదరుడా.
79. ఇప్పుడు గమనించండి. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ పొదుగుట ద్వారా మిమ్మల్ని భూమిలో నుండి వెలుపలికి తీసుకొని వచ్చినయెడల, మీరు భూమినుండి వెలుపలికి వచ్చిరి. ఇచ్చట మీరు తెలివితేటలు గల ఒక వ్యక్తిగా ఉన్నారు. “నేను ఈ విధముగా ఉండాలని" ఎన్నుకునే అవకాశమే నీకు లేకుండా, ఈ దినమున నీవేలాగు ఉండాలో అలాగు పరిశుద్ధాత్మ నిన్ను రూపొందించి, మొట్టమొదటగా ఈ భూమిలోనుండి ఏవిధముగా నిన్ను వెలుపలికి తీసుకొని వచ్చెనో, అట్లే నీ శరీరము తూర్పు మరియు పడమర దిక్కుల వరకు చెల్లా చెదిరిపోయి ఉన్నను, ఆ దిక్కులనుండి ఈ అంత్య దినములలో నిన్ను జీవముతో పైకి లేపుటనేది అత్యధికమైన నిశ్చయముగా ఉన్నది.

మొట్టమొదటగా పరిశుద్ధాత్మ పొదుగుటకు ప్రారంభించినప్పుడు మీ శరీర ములు ఇచ్చట ఉన్నవని గుర్తుంచుకోండి. అవి ఇచ్చటలేని యెడల, మరి అవెచ్చట నుండి రాగలవు? సున్నము, క్షారము, విశ్యకాంతి వెలుగు, పెట్రోలియం మీలో గలవు. దేవుడు ఆ మూలకములన్నింటిని ఏకముగా సమకూర్చి మీ జీవమును భూమిపైకి తీసుకొని వచ్చెను. దానిని చేయుటకు వేరేదేనికి సాధ్యమవ్వదు. క్షారమును, సున్న మును మరియు వీటన్నింటిని సమకూర్చి ఒక మానవుడిని తీసుకొని వచ్చుటకు మీకు అసాధ్యము. ఎందుకనగా, ఆ మానవుడు ఎట్లున్నాడో ఆవిధముగా అతడు రూపింపబడుటకు దేవుని ఆత్మయొక్క జీవము అందుకు అవసరమైయున్నది.

80. నా స్నేహితుల్లారా, మీరు మోసపోకూడదు. దేవుడు తెలివితేటలపై ఆధారపడి తన సంఘమును నడిపించడు. కాబట్టి పరిశుద్ధాత్మ సంఘములో సంచరించుచూ, పొదుకుచు, “నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను విశ్వసించుచున్నావా?" అని చెప్పుటకు ప్రయత్నించుచున్నట్లుగా ఉన్నది. నేనేలాగు ఉండాలని తీర్మాణమును చేయుటకు, నా ఇష్టప్రకారము ఎన్నిక చేసుకొనుటకు ఆయన నాకు అవకాశము ఇవ్వకుండా, నేనేమై ఉండాలో ఆయనే నా గురించి ఎన్నికచేసి నన్ను తీసుకొని వచ్చినయెడల, నిత్య జీవముగల జీవితమును ఆయన నాకు అనుగ్రహించుటకు ఎంతగానో నాపట్ల శ్రద్ధవహించి యుండును. ఆయన వద్దకు నేను తిరిగి వచ్చి, “అవును, పరిశుద్ధాత్ముడా, ఈ లోకము ఏమి చెప్పినను దానిని నేను పట్టించుకోను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను” అని చెప్పెదను. నా శరీరమునకు సున్నము మరియు క్షారము ఎంత కావలెనో ఆ గొప్ప దినమున ఆయన గమనించి ఎంతో శ్రద్ధగా దానిని చేసెను. ఆయన పలుకగా ఆ అమర్త్యమైనది మరలా తిరిగి వచ్చినపుడు, నా తలలో నున్న ప్రతీ వెంట్రుకతో, అణువణువునా నా శరీరమునగల యావత్తు బలముతో,
అమర్త్యమైన జీవమును నేను పొందుకొనెదను. అవును, సహోదరుడా, సంఘము పట్ల జాగ్రత్తతో శ్రద్ధవహించు కర్తవ్యమును పరిశుద్ధాత్మకు దేవుడు యిచ్చెను.

81. గమనించండి “అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలి పోయిన తరువాత, అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. కాని అది మరలా తిరిగి వచ్చి చూచినప్పుడు అచ్చట వ్యత్యాసముగా ఉండుటను అది కనుగొనెను" అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కావున విషయము ఇచ్చటే గలదు. అపవిత్రాత్మ మరలా తాను నివసించిన స్థలమునకు తిరిగి వచ్చినప్పుడు...

ఇప్పుడు ఆలకించండి, బహుశా నేను దీర్ఘముగా ప్రసంగించవచ్చు, అయినను మీకింకా చాలా సమయము గలదు. ఆలకించండి. నేను మిమ్మల్ని ఒకటి అడగాలని కోరుచున్నాను. లోక సంబంధమైన నాట్యములకు వేడుకలకు వెళ్ళి రాత్రంతా కూర్చొని మీ సమయమును వెచ్చించెదరు. ఆలకించండి. ఇది నిత్యజీవమై యున్నది.

82. మీ జీవితము ఒకప్పుడు అందని ఎత్తులో మరియు మరొకసారి అట్టడుగునకు దిగజారిపోయినట్లు ఉండుటకు కారణమేమనగా, ఆ అపవిత్రాత్మ మిమ్మల్ని వదిలి పోయినప్పుడు, పిదప దానినుండి మీరు వెళ్ళగల దూరంవరకు వెళ్ళిన పిదప, మీరు క్రొత్త హృదయమును లేదా అలాంటి ఒక దానిని పొందుకొనెదరు. ఆ తర్వాత మీలో ఏమున్నదో దానిని బహాటంగా ప్రదర్శించకోవలసిన సమయము వచ్చును. మంచి ఆత్మ మీలో ఉన్నదని భావించుచు బయటకు పరిశుద్ధులవలె కనిపించెదరు.

కాని ఆ అపవిత్రాత్మ మరలా తిరిగి వచ్చినప్పుడు, నీవు ఇంకా ఆ పాత గృహములోనే నివసించుచు, అనగా అదే కోపముతో, అన్నింటిలోను అలక్ష్యముతోను మరియు మీ ఇష్ట ప్రకారముగా సమస్తమును చేయుచుందురు. కాని పరిశుద్ధాత్మ అందులోనికి ప్రవేశించినప్పుడు, స్థలమును శుభ్రముచేయు పెద్ద యంత్రమును (bulldozer) పరలోకమునుండి తీసుకొని వచ్చి, అచ్చటున్న పనికిరాని వాటన్నింటిని ధ్వంసం చేయుచు, పైకి క్రిందకు ఆ యంత్రమును త్రిప్పుచు సమస్తమును సమూలముగా నిర్మూలించి, సమస్తమును గోకి తీసివేసి, అచ్చటున్న చెత్త దిబ్బలన్నింటిని చదును చేయును. ఎందుకో మీకు తెలుసా? ఆయన అచ్చట ఉన్నాడు. మరియు అచ్చట ఇకమీదట ఎటువంటి పనికిరాని లౌకిక కార్యములు ఉండవు, ఉండకూడదు. అచ్చట ఇకమీదట ఏ పగ ఉండకూడదు, ఎలాంటి ఈర్ష ఇకమీదట అచ్చట ఉండకూడదు. ఇప్పుడు అచ్చట ఒక గొప్ప పెద్ద భవనములో పరిశుద్ధాత్మ నివసించుటను అతడు కనుగొనును. ఎందుకనగా, ఆయన అచ్చట నివాసమైయుండును. అచ్చట ఆయన ప్రసన్నత ఉండును. ఆ మేడ చుట్టూ అందమైన పుష్పములను తీసుకొనివచ్చి
నింపును. ఆ పుష్పములు ఏవనగా, ప్రేమ, సంతోపము, సమాధానము, దీర్ఘకాంతము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇకమీదట అదెన్నటికి ఒక పందుల దొడ్డివలె ఉండదు. అది పరిశుద్ధాత్మ నివసించు స్థలముగా ఉండును. హల్లేలూయా!. 'ఓ, సహోదరుడా నేను నా ప్రసంగమును ముగించవలెను. కాని ఇప్పుడే ఇంకా ప్రసంగించాలనే అనుభూతిని పొందుకొను చున్నాను. నేనిప్పుడు మంచి అనుభూతిని కలిగివున్నాను. అది నిజము.

83. సహోదరుడా, ఇచ్చట నేను మీకొక విషయము చెప్పెడను. నేడు ఈ సంఘము నకు కావలసినదేమనగా, ప్రేమను మరియు సహవాసమును తీసుకొను వచ్చే పరిశుద్ధాత్మయొక్క స్వాధీనములో సంఘము ఉంటూ, దేవుడు నివాసము చేయగల యధార్థమైన స్థితికి అది తిరిగి రావలసియున్నది. ఆలకించండి. ఈ ప్రపంచమునకు అది కావలసియున్నదని నేను మీకు చెప్పుచున్నాను. ఇంకా కొన్ని నిమిషములు, ఆ తర్వాత దేవునికి చిత్తమైన యెడల మనము ముగించుదాము.

84. నేను ఒక వేటగాడిని, ప్రకృతిని నేను ఇష్టపడతానని మీరెరుగుదురు. అనేక సంవత్సరముల క్రితము ఉత్తర అరణ్యములనే స్థలమునకు నేను వెళ్ళాను. అచ్చట ఒక చక్కని స్నేహితుడిని నేను కలిసాను. బహుశా అతడు ఈ దినమున ఇచ్చట కూర్చొని ఉండవచ్చు. అతడి పేరు బెర్ట్ కాల్, ఒక అద్భుతమైన వ్యక్తి అతడుకూడా మంచి వేటగాడు. అతనితో కలిసి వేటాడుట నాకెంతో ఇష్టము. ఎందుకంటే, అతడు. మంచి బలశాలి మరియు దృఢమైనవాడు. మేము ఆ కొండలపైకి ఎక్కుచూ మరియు ఆ ప్రాంతములంతా పరిగెత్తుచూ వేటాడుదుము. అతడికి మంచి, నిశితమైన దృష్టి గలదు. వేటాడుటకు జంతువులను చాలా నిశితముగా అతడు గమనించుచుందును. కావున అతనితో వేటాడుటకు నేను సంతోషించెదను. ఆ అడవిలో అతడు అంత సుళువుగా దారితప్పి పోడు. అతడిని మీరు దారి త్రిప్పలేరు. ఎచ్చటకు వెళ్ళినా అచ్చటుండు ప్రతీ చెట్టును, గురుతులను మరియు సమస్తము అతడికి క్షుణ్ణముగా తెలుసు. ఒకసారి మేము వేటాడుచూ ఆ కొండ పైన ఉన్నాము, నేను పైకి ఎక్కి వెళ్ళాను... అతడొక మంచి వ్యక్తి, మంచి వేటగాడు, కాని క్రూరమైన హృదయము గలవాడు. ఓ, అతడి హృదయమున అతడు చాలా దుష్టత్వమును కలిగినవాడు. సరదాకొరకు అతడు జింకయొక్క చిన్న పిల్లలను వేటాడి చంపును. ఎల్లనగా, నేనొక బోధకుడినని అతడెరిగి, అలాగు చేస్తూ ఆనందించును. ఆవిధముగా ఒకసారి చేయు చుండగా, "బెర్ట్, చిన్న జింక పిల్లలను అలాగు చంపుటకు నీకు సిగ్గువేయుటలేదా?" అని నేను అడిగాను. “హ, బోధకుడా,నీ పనిని నీవు చూసుకో, నీవొక కోడి గుండె గలవాడవని" అతడు చెప్పెను. "బెర్ట్, దానిని చెయ్యవద్దు" అని నేను చెప్పాను.
ఒక జింక పిల్లను వేటాడి దానిని మీరు పొందుకొనుటకు ప్రభువు మిమ్మల్ని అనుమతించినయెడల అది ఫర్వాలేదు. అది మీయొక్క సొంత విషయము. దేవుడు అబ్రాహాము ఇంటికి వెళ్ళినప్పుడు, అతడు దూడను సంహరించి దాని మాంసమును భుజించుటకు దేవునికి యిచ్చెను. అది నిజము. అదంతా మంచిదే కాని,ఇలాంటి చిన్న పిల్లయగు జింకలను చంపుట విరుద్దమైనది.

85. అతడు అలాగు చేయుటయే అతనికి అలవాటు. కాబట్టి ఒక సంవత్సరము నేను వేటాడుటకు అచ్చట వెళ్ళినప్పుడు, అతనివద్ద ఒక ఈల ఉండెను. ఆ ఈలను తీసికొని ఊదితే, ఆ ఈల శబ్దము ఒక చిన్న జింక పిల్ల ఏడ్చిన(అరిచిన) ఎట్లుండునో ఆ శబ్దము ఖచ్చితముగా అలాగే ఉండెను. ఆవిధముగా నేనెన్నడూ వినలేదు. “బెర్ట్, నువ్వు దానిని ఉపయోగించెదవా, నిజంగానే చేస్తావా?" అని నేను అడిగాను.

"హ, బోధకుడా, నీ పని నీవు చూసుకో, వెళ్ళిపో. నీవు చాలా సున్నితమైన కోడి గుండెను గలవాడవు. మీలాంటి వారితో ఇదే సమస్య" అని అతడు చెప్పెను. "బెర్ట్, నీకు సిగ్గుగా లేదా? నీవు దానిని చెయ్యకూడదు" అని నేను చెప్పాను.

మేము అలాగే ఆ అరణ్యము లోపలకి వెళ్ళాము, మేము ఇంచుమించు సగం దినము లేదా అంతకన్నా ఎక్కువ సేపు వేటాడితిమి. అచ్చట ఏ జంతువును లేదా ఏదీకూడా మా కంట్లో పడలేదు. పిదప మేము వంగి చూచినప్పుడు, అచ్చటిక స్థలము ఉండెను. అతడు తన జేబులోనుండి ఆ ఈలను తీయుటను నేను గమనిం చాను. “ఓ, వద్దు, నీవు దానిని చెయ్యకూడదని" నేను నా మనస్సులో తలంచాను. అంతలో అతడు ఈలను తీసి ఒక చిన్న పిల్ల ఏడ్చుచు అరుచునట్లుగా శబ్దమును చేయుచు ఊదెను. అకస్మాత్తుగా, సరిగ్గా అచ్చటే ఆ స్థలమందున్న ఒక పెద్ద అందమైన ఆడు జింక తన తలను పైకి ఎత్తి (అదొక తల్లి జింక), తన తలను మరలా పైకెత్తి చూచెను. పెద్ద చెవులుగలదై, పెద్ద గోధుమరంగు కన్నులను గల ఆ జింక మాకు 30 గజముల దూరములోనే ఉన్నది. బెర్ట్ నావైపు చూచి నవ్వెను. “ఓ, బెర్ట్,దానిని చెయ్యవద్దు, దానిని చెయ్యుటకు ఉద్దేశించ వద్దు" అని నేను చెప్పాలని తలంచాను.

86. ఆ తల్లి జింక అచ్చట నుండి మెల్లగా వెలుపలికి వచ్చి తన తలను పైకి ఎత్తి చూచుటను నేను చూస్తున్నాను. అందమైన జంతువు. అదేమిటది? ఆ తల్లి జింకను ఆ స్థలమునుండి ఏది వెలుపలికి తీసుకొని వచ్చెను? ఆ తల్లిలో ఏదోకటి గలదు, అదే ఒక తల్లియొక్క ప్రేమ. ఒక బిడ్డయొక్క ఏడుపును అది ఆలకించెను. పొదలలో వున్న దానిని ఆ ఏడుపు శబ్దము బయటకు వచ్చునట్లు చేసెను. ఆ బిడ్డ ఏడుపు శబ్దమే ఆమెను అలాగు చేయునట్లు చేసెనుగాని వేరేదీకాదు. అది దేనిని సూచించు
చున్నది. ఆ తల్లియొక్క స్వభావము వంశావళి నుండి వచ్చుచున్నది. ఆమె ఒక తల్లి. ఆ శబ్దంను విని, అది అట్లు వచ్చునట్లు చేసెను. బిడ్డ ఏడ్చుచున్నది. కావున ఏదోక ప్రమాదములో చిక్కుకున్న ఆ బిడ్డను ఎలాగైనా రక్షించి కాపాడాలి, ఆ బిడ్డ ఎక్కడ ఉన్నదో కనుగొనుటకు ఆ తల్లి జింక ప్రయత్నిస్తున్నది. బెర్ట్ తన తుపాకీస్ తీసుకొని తూటాలను నింపుకొని, ఆ తల్లి జింకను కాల్చుటకు దానిపై గురిపెట్టాడు. ఓ, అతడు గురి తప్పకుండా కాల్చును. “ఓ, దేవా, అతడు అలాగు చెయ్యుటకు అనుమతించ వద్దు" అని నేను నాలో ప్రార్థించాను. ఆ తల్లి జింక తనలోనున్న ప్రేమతో అమాయకురాలువలె వెలుపలికి వచ్చి ఆ బిడ్డకొరకు వెదకు చుండగా, ఇతడు దీనిని ఇంత క్రూరముగా చేయుటకు ఎలాగు మనస్సు వచ్చినది? ఆ తుపాకీయొక్క మీటను నొక్కినప్పుడు, తుపాకీలోనున్న తూటాలను ముందుకు త్రోయు గడియ తెరచుకొనును. ఆ తుపాకీలోని గురియొక్క గురుతును సరిచేసు కొని, ఆ తల్లియొక్క గుండెల్లోకి ఆ తూటా దూసుకొని పోవునట్లు అతడు తన గురిని ఎక్కిపెట్టెను. ఇంకా కొన్ని క్షణములలో ఆ తల్లి గుండెను పేల్చి దానిని చిన్నాభిన్నముగా అతడు చేయబోవుచున్నాడని నేనెరుగుదును.

87. ఆ తర్వాత కొద్దిసేపటికి, కేవలం ఒక్క క్షణంలో ఆ తల్లి జింక ఈ వేటగాడిని చూచి ఉలిక్కిపడెను. అయినప్పటికీ అది తన తలను ఇంకా పైకెత్తి చూస్తూ వెతుకు చున్నది. అది అక్కడనుండి పారిపోయినదా? లేదు. ఎందుచేత? ఒక బిడ్డ అచ్చట ప్రమాదంలో ఉన్నది. ఆ బిడ్డను ఆమె ఖచ్చితముగా కనుగొనవలెను. తన గుండె బ్రద్దలైపోయినను, ఆమె ఆ బిడ్డను కనుగొనితీరవలెను. ఎందుకనగా,ఆ చిన్న బిడ్డ ప్రమాదంలో ఉన్నది. ఎందుచేత? ఒక వేషధారి సంఘమువలె ఉండుటకు ఆ తల్లి ప్రయత్నించలేదు. ఆమెలో ఏదోకటి ఉన్నది. ఎందుకనగా, ఆమె ఒక తల్లియై యున్నది. అతడు తన తుపాకీ మీటను నొక్కి పేల్చుటకు సిద్ధమగుటను నేను చూచాను. “ఓ, దేవా...” అని నాలో నేను అరిచాను. కొన్ని నిమిషములకు నేను ఆ తుపాకీయొక్క శబ్దమును నేను వినకూడదని నా తలను త్రిప్పుకున్నాను. కొద్దిసేపటికి, "ఏమిటి సమస్య?ఏమి జరిగెనని నేను ఆశ్చర్యపోయాను". నా తలను త్రిప్పి చూచాను. నేను చూచినప్పుడు, ఆ తుపాకీ క్రింద పడవేసి ఉన్నది.

అతడు నా వైపుకు తిరిగి చూచెను. తన తుపాకీని నేల మీదకి విసిరి వేసాడు. అతడు నన్ను తన హస్తములతో చుట్టుముట్టి పట్టుకొని, "బిల్లీ, ఇంతవరకు నేను చేసినది చాలు. ఇకమీదట నేనెన్నటికీ అలాగు చెయ్యలేను. దానిని నేను భరించ లేను. బిల్లీ, నీవంటి క్రైస్తవ హృదయమును దేవుడు నాకుకూడా అనుగ్రహించునట్లు నాకొరకు ప్రార్థించుము.నేను ఇలాగు ఉండుటకు ఇష్టపడుట లేదు" అని బిగ్గరగా
అరుస్తూ అతడు చెప్పెను. వెంటనే అచ్చటే ఆ నేలమీద మోకరిళ్ళీ కనికరములేని హృదయముగల అతడిని యేసు క్రీస్తుయొక్క ప్రేమగల ఆత్మవద్దకు నడిపించాను. ఎందుచేత? ఏమి జరిగెను? ఏమి జరిగెను? ఎందుకనగా అది...?... అతడు ఆ జింకను చూచెను. ఏమి జరిగెను? నిష్కళంకమైన ఒక అసలైన ప్రేమను తన కళ్ళ ముందు కనబడుటను అతడు చూచెను.

సహోదరుడా, సహోదరీ, ఈ దినము సంఘమునకు కావలసినదేమనగా తనలోనున్నదానిని చూపించవలెను. వేషధారితనమును కాదు, జ్ఞానవంతమైన విద్యను కాదు. కాని చూపించవలసినదేమనగా, మీ హృదయముననున్న నిష్కళంకమైన దేవునియొక్క ప్రేమను చూపించుటయే కావలసి యున్నది.

88. మనము వేరే విషయమునుగూర్చి ఆలోచించుచున్న ఈ తరుణమున మనము మన తలలను వంచుదాము... అదేమిటది? ఎంతో కాలముగా మీరు మీ సంఘ సభ్యునిగా ఉండవచ్చు, కాని మీరు నిజముగా కలిగి... "నేను దీనిని వదిలి వేయవలసివున్నది. నేను దీనిని చెయ్యవలసివున్నది" అని మీరు చెప్పగలరా? మీరు ఆవిధముగా ప్రవర్తించుచున్నారా? అది లోక సంబంధమైన జ్ఞానము.కాని మీలో ఏదైన ఒక కార్యము గలదా? మీలో ఏదైన తప్పిదము గలదా? దేవునియొక్క నిష్కళంకమైన ప్రేమ మీలో ఉన్నదా? అట్లు మీలో లేనియెడల ఈదినమున దీనిని మీరెందుకు అంగీకరించకూడదు? అసలైన దానిని వదిలేసి ప్రత్యామ్నాయము (నకిలీ)ను ఎందుకు కోరుచున్నారు? ఒక క్రైస్తవునిగా జీవించుటకు సమస్త అర్హతలు నీలో ఉన్నవా లేదాని నీవు తెలుసుకోగలుగు చున్నావా? ఎందుకనగా, నీవు ఒక సంఘమునకు చెందినవాడవనా? సంఘములో బిగ్గరగా కేకలు వేయుటవలన నీవు ఒక క్రైస్తవుడవని అనుకుంటున్నావా? నీవు అన్యభాషలలో మాట్లాడుటవలన నీవొక క్రైస్తవుడవని అనుకుంటున్నావా? వీటన్నింటిని నేనుకూడా నమ్మెదను. కాని మాంత్రికులు మరియు తాంత్రికులుకూడా అన్య భాషలలో మాట్లాడుటను నేను చూచాను. వాటన్నింటిని నీవు నమ్ముచున్నావని... బహుశా, నీ చేతులలోకి నూనె వచ్చుటవలన లేదా నీ ముఖమంతా రక్తమయమైపోవుటవలన లేదా అటువంటి దేదోకటి నీలో జరుగుచున్నందు వలన నీవు ఒక క్రైస్తవునిగా గుర్తించబడితివా? నీకు తెలిసినవన్నీ అదేనా? సహోదరుడా, దౌర్భాగ్యపు స్థితిలో నీవు ఉన్నావు. అవును. ఒక అసలైన దానిని నీవెందుకు స్వీకరించకుండా... పెంతెకోస్తుయనే ఆకాశములు స్వచ్ఛమైన సంపూర్ణతతో నిండియుండగా నీవెందుకు వేరొక ప్రత్యామ్నాయం (బదులు)ను స్వీకరించుచున్నావు?
89, "భాషలైనను నిలిచిపోవును, అద్భుతములు నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును, ప్రవచనములైనను నిరర్థకమగును. కాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును. ప్రేమ శాశ్వతముగా నిలుచును". పరిశుద్ధులు మరియు దూతలు పాడు పాటలకంటే అది శాశ్వతముగా నిలుచియుండును. కవులు దీనిని వర్ణించలేరు. దీనిని వివరించి చెప్పుటకు ఏ మార్గము లేదు.

90. ఇపుడు దీనినిగూర్చి మీరు ఆలోచించండి, ఇది మీలో లేనియెడల, నిష్కళంక మైన అసలైన ఆ దేవునియొక్క ప్రేమను మీ హృదయములో మీరు యధార్ధముగా కలిగి ఉండాలని కోరుచున్నారా? దేవునితో మీరు నిజాయితిగా ఉండండి. దేవుని సేవకునిగా యేసు క్రీస్తుయొక్క నామమున నేను మిమ్మల్ని సర్వ శక్తిమంతుడగు దేవునియొక్క సన్నిధిలోకి తీసుకొని వెళ్ళెదను. మీలో ఒక్క చుక్కంత నిష్కపటమైన యాధార్థత ఉన్నయెడల, ఈ మధ్యాహానమున దేవుడు దానిని బాహాటముగా తీసుకొని వచ్చునట్లుగా నేను ప్రార్థించెదను. నిజముగానే ఆ అనుభవము మీలో లేదని మీరు ఎరుగగలరా? మీరు మీ చేతులను దేవుని వైపుకు ఎత్తి, “దేవా, క్రీస్తు నామమున, దానిని నా హృదయములోకి అనుగ్రహించుము" అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక! అది అద్భుతమైనది. ఓ, ప్రతీచోటా, అందరూ చేతులెత్తిరి.

ఆ తల్లి జింక తనలోనున్న ప్రేమను చూపించినట్లు నేనుకూడా ఆ క్రైస్తవ ప్రేమను చూపించాలని కోరుచున్నాను. ఇతరులను క్రీస్తుకొరకు సంపాదించునట్లు క్రైస్తవ ప్రేమను నేనుకూడా అట్లే చూపించాలని కోరుచున్నాను. నా ఉద్రేకముల ద్వారా కాదుగాని నా క్రైస్తవ ప్రేమద్వారా దానిని చూపించాలని ఆశపడుచున్నాను.

ఓ, దేవునియొక్క ప్రేమ, ఎంత గొప్ప ఐశ్వర్యము మరియు పవిత్రమైనది!

అదెంతో హద్దులులేని లోతైనది మరియు బలమైనది! అది పరిశుద్ధుల మరియు దూతల పాటలకంటే నిరంతరము నిలిచి ఉండును.

91. మీరు నిజముగా దానిని కావాలని కోరుకొనుచున్నారా? మీరు నన్ను దేవునియొక్క సేవకునిగా నమ్మినయెడల, మీరు నమ్మినయెడల... మీరు బాల్కనిలో ఉన్నను లేదా మీరెచ్చటున్నను అది నాకు అనవసరము. సహోదరుడా, సమయము వైపు చూడవద్దు. ఎందుకనగా, 4 గంటలై పోయినది లేదా ఆలస్యమైపోయినదని ఆలోచించ వద్దు. మీరు దానిని గూర్చి ఆలోచించ వద్దు. ఆ నిత్యత్వమనగా ఏమిటో దానినిగూర్చి ఆలోచించండి. మీలో అది లేనట్లుగా తలంచినయెడల, కుంటివారు నడుచునట్లుగాను మరియు గ్రుడ్డివారు చూచునట్లుగాను దేవుడు నా ప్రార్థన
ఆలకించునని మీరు విశ్వాసించండి. అది కేవలము ప్రార్ధన మాత్రమే. అంతే.కాని మీరు నన్ను నమ్మినయెడల... నేను దేవునియొక్క సేవకుడినని మీరు విశ్వసించుట వలన అది మీకు సహాయము చేయును. మరియు మీరు అటువంటి అనుభవ మును పొందుకోవాలని ఆశించిన... రెండు వందల చేతులు లేదా అంతకన్నా ఇంకా ఎక్కువ చేతులు పైకెత్తి ఉన్నవని నేను ఊహించుచున్నాను. మీరు తిన్నగా ఇచ్చటకు వచ్చి నాతో కలిసి నిలబడవలెనని నేను కోరుచున్నాను. నేను మీ చేతులను పట్టుకొని కరచాలముచేసి మరియు మీతో కలిసి ప్రార్ధించవలెనని కోరుచున్నాను. మనము పాడుచుండగా ఇప్పుడు మీరు ముందుకు రండి, మీరు రాగలిగిన యెడల రండి. "నేను ఉన్న ప్రకారముగా”... సరే మంచిది.

నేను ఉన్న ప్రకారముగానే (ఓ, అదే విధముగానే) నన్ను అంగీకరించుము. క్షమించి, ఆహ్వానించి,(ఆ బాల్కనిలోనుండి ఇచ్చటకు రండి...) శుద్దీకరించి,

విడుదల చేయుము.

ఎట్లనగా మీ వాగ్ధానమును నేను విశ్వసించుచున్నాను.

ఓ, దేవునియొక్క గొఱ్ఱపిల్లా, నీవద్దకు నేను వచ్చుచున్నాను! నేను వచ్చు

చున్నాను.

నేను ఉన్న ప్రకారముగానే...

నాలోనున్న ప్రతీ మచ్చను కడుగగల మీ రక్తము వద్దకు వచ్చుచున్నాను.

ఒక్క నల్ల మచ్చకూడా నా ఆత్మలో లేకుండా నన్ను విమోచించుటకు ఆలస్యము చేయకు...

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...