నీ యింటివారు.

నీ యింటివారు.

నేను మీకు చెబుతున్నాను... అది... అది... నా మాటలు వినడానికి మీరు రాలేదని నాకు తెలుసు. చూశారా, ఎందుకంటే కేవలం ఒక ప్రసంగీకుని చెప్పేదాని కోసం వినడానికి అంతదూరం నుండి ఎవ్వరు రారు. మీరు క్రీస్తునందు విశ్వాసముంచుచున్నారు. అలాగే వర్తమానమును నమ్ముచున్నారు గనుకనే మీరు ఎంతదూరం నుండైనా రాగలుగుతున్నారు. మరియు అందును బట్టి నేను మిమ్మును మెచ్చుకొనుచున్నాను.

ఇటువంటి స్నేహితులను నేను కలిగియున్నందుకు నేనెంతో కృతజ్ఞడను. మీయొక్క మీయొక్క వ్యయప్రయాసలను అనగా మీరు చేయుచున్న ప్రయత్నాలను మెచ్చుకొనే అటువంటి వారిని, పరిస్థితులను లెక్కచేయక ఎంతోదూరం నుండి కారు నడుపుకొని వస్తున్న వారిని కలిగివుండటమనే దాని విషయమై నేనొక్కటే చెప్పగలను. అది వారిని అభినందించుట. (మెచ్చుకొనుచున్నాను)... మెడాతో నేను చెప్పాను; నేను ఇలా అన్నాను, "యాభైమైళ్ళ దూరం నుండి విందుభోజనానికి ఒకరు ఇంటికి వస్తే ఆశ్చర్యం కలగదా? చూశావా? వారికి ఏం చేస్తామో నాకు తెలియదు. మీకర్థమైందా?

నా అంచనా ప్రకారం మన సంఘానికి వచ్చు వారిలో అధికశాతం, జనులగు మీలో ఎనభైశాతం మంది అలా వస్తున్నవారే. మిస్సిసిప్పి, ఆల్బమా, జార్జియా తదితర రాష్ట్రాలనుండి మీరు వస్తున్నారు. మరియు దానిగూర్చి మీరు అనుకొనుచు...

అంతేకాదు అలా వస్తున్నవారంతా మరి ధనవంతులేం కాదు, మరి వారు సామాన్య జనులే. అలా రావటానికి మీరు పైసాకి పైసా కూడబెట్టుకొని వచ్చుట ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ విధంగా వచ్చిపోవటానికి ఎంత ఆయిల్ (కారుకి) ఖర్చుఅగునో నాకు తెలుసండి. దానికితోడు ఒకసారి వచ్చిపోవటం ఎంత ప్రయాసతోకూడుకొన్నదో ఓ, ఒక ప్రసంగం కోసం పదహారు, పదిహేడు వందల మైళ్ళ ప్రయాణం అయివుండునని నేను అనుకొనుచున్నాను. ప్రతీవారం ఆ విధంగా వచ్చుటను గూర్చి తలంచండి, చూశారా ?

2. నేను -నేను కొంచెం దాని విషయమై ఫీల్ అవుతున్నాను. యదార్థత (నిజాయితీ). మిమ్మును ఎంతగానో అభినందించాలని, అందుకోసం మీ ముందు ఒక అరంగుళం ఎత్తు నిలబడి దాని విషయం మీకు నిజంగా చెప్పాలనిపిస్తుంది -నేనెలా దానిగూర్చి మెచ్చుకోగలను అనేదాని గూర్చి నేను నా భార్యతో మాట్లాడుచుంటిని, మందిరం (టబర్నికల్)లో నేను కూటం ఏర్పరచిననప్పుడు ప్రజలగు మీరే రాకపోతే, నేను అక్కడికి వెళ్ళే పన్లేదండీ. జనులగు మీరు గనుక అక్కడకి రాకపోతే ఇదిగో ఇప్పుడు ఈ గదిలో వున్నవారే అక్కడ కూడుకొన్న వారికంటే ఎక్కువగా వుండును. అది నిశ్చయంగా వాస్తవమండీ,

లేఖనము చెప్పుదానిని అది నెరవేరుస్తుంది. మన సొంత దేశంలో, మన స్వజనుల మధ్య.... నీకు -నీకు-నీయొక్క గౌరవం (మర్యాద) మరియు పరపతి (గొప్పతనము, కీర్తి) అనేవి ఎప్పుడైనాసరే బయటి నుంచే వచ్చును. నేను అందుకొరకే. బయటి నుండి అంటే నాభావం... నీ సొంత ఇంటి బయట నుండి అనేది నాభావం. అలా అది, అలా అని మీరంతా బయటవారని కాదండి నాభావం, దేవుని రాజ్యంలో మీరందరు నా తోటి సహోదరులు మరియు సహపౌరులు.
3. మరిక్కడ కొద్దికాలం క్రితం, నేనొక చిన్న తల కలిగిన పెద్ద మొసలిరకపు జంతువు (ALLIGATOR)ను ఇచ్చట కలిగియుంటిని. దానిని పొందుకొనుటకు నేను వచ్చుచుంటివని నేను బ్రదర్ వెల్స్కి తెలియజెప్పాను, మరి పిల్లలకి సెలవులు కూడా అయిపోలేదు. ఉదయానికల్లా నేను వారిని ఫ్లోరిడాలో దిగువనున్న సెయింట్ పీటర్స్బర్గ్కి తీసికెళ్ళాలని నేను అనుకొన్నాను. మరి ఆ దిగువున, నేను మీయామికి వెళ్ళి తదుపరి టమియామి దారి గుండా చుట్టివచ్చి తిరిగి ఇంటికి వెళ్ళాలని అనుకొన్నాను. మరి వారు వున్నపాటునే బడికి వెళ్ళవల్సి వున్నది, మరియు ముసలి కోసం ఆగడం ఇది మంచి తరుణమని నేను అనుకొనుచున్నాను.

మరి కావున బ్రదర్ వెల్చ్ - బ్రదర్ ఫ్రెడ్ మరియు బ్రదర్ ఉడ్ నాతో కలిసి వచ్చారు. కనుక పిల్లల్ని తెచ్చుటకు వారు నాకొక అవకాశమిచ్చారు. వారు నా మొసలిని తిరిగి తీసికొనిరాబోవు చున్నారు కనుక నేను ఇక్కడ వున్నపుడు, చిన్న గుంపుగా మీరు కూడుకోవాలని, మిమ్ములను ఎంతో అభినందించుచు, మీ ప్రయాసను ఎంతగానో మెచ్చుకోవాలని నేను భావించాను.

4. మరి బ్రదర్ మరియు సిస్టర్ ఈవాన్స్, అలాగే- బ్రదర్ మరియు సిస్టర్... నేను - నేను పొందుకొన్నాను... యస్.టి అని నేను దానిని పిలువగోరుచున్నాను. నిజానికి అది టి. యస్.వి అని నాకు తెలియును... అక్కడ ఒక -ఒక పుక్కలించి ఊసే ఒక పదార్థం (GARGLE)వుండెను, నోరు శుభ్రము చేసికొనే ఆ పదార్థమును వారు యస్.టి37 అని పిలుస్తారు, అందుకే నేను మిమ్మును అలా యస్. టి అని సంబోధింస్తాను. వేరే ఉద్దేశ్యంతో కాదండీ... మరి అది - మరది మంచి ఉద్దేశ్యంతోనే. అదొక అదునాతనమైనది (DANDY) అది మిగతా వాటన్నిటి కంటే మిన్నయైనదని నా అభిప్రాయం, సైన్యంలో కూడా వారు దానిని ఉపయోగిస్తారు, మరియు నేను -నేను అన్నింటికి దానిని వాడతాను. నోటి శుభ్రతకోసం, పుక్కలించి ఊసే ఆ పదార్ధాన్ని నేను వేటకి వెళ్ళేటప్పుడు నాతో పాటు దానిని తీసికెళ్తాను. అక్కడ ఒకవేళ నా గుఱ్ఱానికి ఏదైన దెబ్బతగిలి గాయమైతే, ఆ పదార్థాన్ని నేను దాని మీద పోస్తాను మీకు తెలుసా. దేనికైనా దేనికైనా సరే మరి అన్నిటికి అది మంచిదండి. సరిగ్గా అతడు కూడా అటువంటివాడేనని నేను అనుకొనుచున్నానను. సహోదరీ కాదంటారా? మరి అంతే కాదండీ, కొన్నిసార్లైతే పాత్రలు కూడా కడిగి శుభ్రం చేస్తాడు మరి అటువంటివి కూడా చేస్తాడు...

5. కావున మరి, బహుశా నేను అనుకొనుచున్నాను... అడుగు ఈ రాత్రి అడిగాను, బ్రదర్ వెలిని అడిగాను, "జనులందరు కూడివచ్చినట్లైతే నీవేమి చెబుతావు- మనమేమి చెప్పాలి. నీవేం అనుకొనుచున్నావు..." బహుశా నీ మనస్సులో ఏదో ఒక చిన్న ప్రశ్న వుండవచ్చును. నీవు అడుగగలిగే ఏదో ఒక చిన్నఅంశం, దానికి నా చేతనైనంతమట్టుకు జవాబిచ్చుటకు ప్రయత్నించెదను, అటువంటి ఒక ప్రశ్నను కలిగి టబర్నికల్కి రావచ్చునేమో అని మేము బావించాము. అందుకోసమే నేను ఇక్కడికి రావటం జరిగినది.

కాబట్టి, రేపు ప్రొద్దున్నే మీరు తిరిగి మీ పనులకి వెళ్ళెదరని మాకు తెలుసును. ఇప్పుడు తొమ్మిదిదాటి పది నిమిషాలైంది. కాబట్టి తిన్నగా దానిలోకి వెళ్లాం. దానిని చేయడానికి ముందు మనం ప్రార్థన కొరకు శిరము వంచుదుము.

6. మా ప్రియ పరలోకపు తండ్రీ, పాపజీవితం నుండి మా ఆత్మలను విడిపించి, తన రాజ్యవాసులు గా మమ్మును చేసికొన్న యేసుక్రీస్తుని బట్టి మేమెంతో ఆనందించుచున్నాము.
మా కృషి మరియు మాక్రియల మూలముగా కాక కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే మేము రక్షించబడియు న్నాము. కేవలం ఆయన కృపచేతనే మేము రక్షించబడితిమి.

కనుక ఈ రాత్రి అందును బట్టి మేమెంతో ఆనందించుచున్నాము. మరి ఒక దినాన మేము ఆయనను చూచెదమని మేమెరిగి యున్నాము. ఆయనలాంటి మహిమ శరీరమునే మేమును కలిగి యుండెదము, అలాగే ఆయన వున్న విధముగానే ఆయనను చూచెదము. అయితే ఇప్పటి వరకు అదెలా జరుగునో మాకు తెలీదు. తెలిసికోవల్సిన పనికూడా లేదు. విశ్వాసమును బట్టి మేము దానిని చూచుచున్నాము. నడక అంతయు విశ్వాసమే, వీటి నిమిత్తం మేము నీకు కృతజ్ఞులం. ప్రభువా, ఈ జనులను నీవు దీవించమని మేము ప్రార్ధించుచున్నాము. నేను ఇచ్చటికి వచ్చుచుండగా, గతరాత్రి నేను నా భార్య ఇచ్చటికి వచ్చుచుండగా మార్గములో మేము మాట్లాడుకొన్నాము. మా హృదయములలో ఏమున్నదో నీవు ఎరిగియున్నావు. దేవుని కుమారుని యొక్క మహిమగల సువార్తను, వారు కేవలం ఒక్క వర్తమానం వినుటకే రాత్రింబవళ్ళు వందలాది మైళ్ళు ప్రయాణంచేస్తు వచ్చుచున్నారు.

7. దేవా, రాజ్యమందు వారిలో ప్రతిఒక్కరికి ఒక మహిమగల గృహమును అనుగ్రహించండి. ఈ భూమ్మిద వారుండుగ వారిని దీవించండి. వారు చేయునదంతా వర్థిల్ల చేయండి. అది సఫలమగును గాక,

మరియు ఈ చిన్న పిల్లలు, ప్రభువా వారింకా చిన్నపిల్లలుగానే వున్నారు. ఇక్కడున్నవారిలో అనేక మంది యవ్వన ప్రాయంలో వున్నారు, అయినను వారు కూడా పెద్దలతో కలిసి భయభక్తిగా, గౌరవముగా కూర్చొనివున్నారు. దేవా, ఈ ప్రదేశం (దేశం)లోనే వారు అత్యున్నతమైన వారని నేను బావించుచున్నాను. ప్రభువా నీవు వారిని దీవించమని ప్రార్థించుచున్నాను. వారికెన్నడూ లేమి కలుగకుండను గాక. దూరాన వున్న గొప్పరాజ్యంలో కుటుంబమంతయూ ఒకటిగా కూడుకొన్నప్పుడు, తండ్రీ వారచ్చట వుందురని నేను రూఢిగా నమ్ముచున్నాను. వారిలో ప్రతిఒక్కరిని నీవచ్చట కలిగి వుండునట్లుగా ప్రార్థించుచున్నాను. ఆ గొప్ప ఇరుకు మార్గములో మేము వుండి నడుచుటకు బోధింపబడినవారం, మరెన్నడూ దానిలోనుండి తొలగిపోకుందుముగాక, దానిని దయ చేయుము ప్రభువా.

8. ఇప్పుడు, తండ్రీ ఈ రాత్రి మేము జనుల అంతరంగములో వున్న సంగతులను తెలిసికొనని మ్ము, వారి హృదయాలను నీవెరుగుదువు. తండ్రీ, వారు అడిగే ప్రశ్నలకు తగిన జవాబును నేనిచ్చునట్లు నాకు సహాయం చేయమని నీకు నేను ప్రార్థించుచున్నాను. అది మాకు మంచిగా వుంటుంది. అది మేము ఇక్కడ వుండటం మంచిగా వుండును, అంతేకాక మేము తిరిగి వెళు నపుడు"ఆయన సన్నిధి మనమధ్య వుండుట వలన మన హృదయాలు మనలో మండలేదా?" అని చెప్పుకొందుము.

ప్రభువా ఇప్పుడు దయతో రండి. కుర్చీలమధ్య సంచరించండి. ప్రతీ భుజం మీద నీ హస్తముంచండి. అలాగే మేకుల ద్వారా నీవు పొందిన గాయాల మచ్చలు గల నీ చేతితో ప్రతీ హృదయమును తాకుము, తద్వారా మా ప్రభువు మాకు అతిసమీపముగా వుండెనని మేము తెలిసికొందుము. ఈ మనవులన్ని యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్.
9. ఇచ్చట బైబిల్ వుందని నేను అనుకొనుచున్నాను, పాఠములోనికి లేదా ప్రశ్నలలోనికి మనం వెళ్ళక ముందు, ఆరంభించుటకు ముందు కొద్దిసేపు ఒక లేఖన భాగాన్ని నేను చదవగోరుచున్నాను. హా, దీన్ని నేను చదవాలనుకొంటున్నాను, ఒక- ఒక చోట దీనిని నేను ఈ మధ్యహ్నం కనుగొన్నాను (చూచాను) బ్రదర్ వెల్స్తో కలిసి నేను ఈ మధ్యాహ్నం బ్రదర్ సాద్మాన్ యొక్క ట్రక్కులో ప్రయాణించుచున్నాము. నేను ముందు సీట్లో కూర్చొన్నాను. నేను దేనినైతే చదివానో దానిమీద కొద్దిసేపు మాట్లాడాలని నేను అనుకొన్నాను, దానిని నేను ఆయన యొక్క కనుగొనగల్గితే... ఓ, అవును, అది దొరికింది.

అపాస్తులుల కార్యములు 16 అధ్యాయం 37 వచనం నుండి ఆరంభిద్దాం.

కానీ పౌలు వారితో అనెను, వారు మమ్మును బహిరంగంగానే కొట్టించిరి... "దయతో మన్నించండి, అక్కడనుంచి కాదు నేను చదవాలనుకొంటున్నది అక్కడ నుండి కాదండి)

ఇక్కడ ఒక చోట నేను దాన్ని చదివాను, తొందరగానే... త్వరగానే నేను కనుగొంటాను. ఆ, అది దొరికింది, అది 29వ వచనము నుండి- 28 నుండి ఆరంభిద్దాం. అది.

అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసికొనవద్దు. మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణుకుచూ పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణపొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యం బోధించిరి. మెలిక(సంక్లిష్ట)ప్రశ్నలలో ఇదొకటని నాభావం, దాని గూర్చి నేను కొద్దిసేపు మాట్లాడాలని అను కొంటున్నాను, అది "నీ ఇంటి వారు" అనే దాని విషయం, ఎందుకనగా మీలో ప్రతిఒక్కరు ఎంతో చక్కగా మీ ఇంటిని క్రమపర్చుకొన్నారు (చక్క పెట్టుకొన్నారు) మీ మీ పిల్లలు రక్షింపబడి వున్నారు, మరియు- మరియు, అది అది మీ కుటుంబములో అందరు క్రైస్తవులు అవ్వడం ఎంతో శ్రేష్టం, ఎందుకంటే నా... మనకి- మనకి మన కుటుంబములు ఎంతో ప్రాముఖ్యం. మనలో ప్రతిఒక్కరం మన బిడ్డలను గూర్చి శ్రద్దకలిగివున్నాం. ఇక్కడున్న మీరు మంచివారు (శ్రేష్టమైనవారు), అలాగే మీపిల్లలెంతో సుందర (మనోహర)మైన వారు, వారందరిని మీరెంతో క్రమములో పెట్టుకొనియున్నారు మరియు ప్రతిఒక్కటి అలాగే వుంచియున్నారు కావున నేను మిమ్మును ఎంతో మెచ్చుకొనుచున్నాను. నేను...

10. సహాదరీ, ఎలా వున్నారు? నేను భావిస్తున్నాను, ఈమె... లోపలికి ఇప్పుడే ప్రవేశించిన తల్లి ఈమె కాదా? ప్రభువు నిన్ను దీవించునుగాక. ఈ రాత్రి మరోసారి నిన్ను చూడటం నాకెంతో సంతోషం మరియు ఈమె బ్రదర్ విల్లీస్ యొక్క భార్య అని నేను అనుకొంటున్నామ, అది నిజమేనా? ఈమె అక్కడ కుటుంబానికి యజమానురాలని నాకర్ధమైంది. అది... లేదా మన ఇళ్లలో కూడా అలాగునే వుండును.

మీ గృహాలు అలాగున వుండాలి. ఇప్పుడు, పౌలు ఇక్కడ రోమా శతాధిపతిలో చెబుతున్నాడు. అతడు వున్నప్పుడు... అంతకమునుపు సాయంకాలమున పౌలు దెబ్బలు తిన్నాడని మనం కనుగొనవచ్చును, న్యాయమూర్తుల ద్వారా ఆజ్ఞాపించబడి బెత్తములతో కొట్టబడ్డాడు, అతడు ఏ నేరము చేయలేదండి అతడు చేసినదంతా అచ్చటవుండి సువార్తను ప్రకటించుటే. మతమౌఢ్యంగల
పీఠాధిపతులకు అది నచ్చలేదు. పౌలుకి వ్యతిరేకంగా లేచారు. పౌలు సువార్త ప్రకటించడం వారికి నచ్చలేదు గనుకనే వ్యతిరేకించారు. అతడు భూలోకమును తలక్రిందులు చేస్తున్నాడని వారన్నారు. 11. మరి అతడు వీధి మూలకి వెళ్ళాడు. అక్కడ ఒక సోదె చెప్పే చిన్నది వున్నది. పుతోను దయ్యము (సోదెచెప్పే ఆత్మ) దయ్యంపట్టింది ఆ చిన్న దానికి. ఆమె సోదె చెప్పుటచేత బహు లాభము సంపాదించుచున్నది. వారు వీధిలో వెళ్ళుచుండగా, ఆమె పౌలు వెంటపడి, ఇలా కేకలు వేసింది" ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవునిదాసులు, వీరు మనకి రక్షణమార్గమును ప్రచురించువారై వున్నారు".

పౌలుకి ఏ విషములోను దయ్యము యొక్క సహాయసహకారాలు అవసరం లేదు, కనుక అతడు దానివైపు తిరిగి ఆ స్త్రీలో వున్న ఆ దయ్యన్ని గద్దించాడు. మరి దానిని అతడు చేసినప్పుడు, ఓ, విడిచివెళ్ళిపోయెనని, అటుపిమ్మట ఆ చిన్నది ఎటువంటి సోదె చెప్పలేక పోయెనని వారు గ్రహించారు. కనుక ఎవరైతే అక్కడ ఆమెను అరువు తీసికొనెనో, బహుశా వాడే ఆమె బాగోగులు చూచుకొనేవాడై వుండొచ్చును, ఆ కార్యం వలన గొప్ప అల్లరి పుట్టెను, గనుక వారు కొట్టబడి చెరసాలలో వేయబడిరి. ఆ కరుకు చెరసాలలో దూరాన ఒక మూలన పౌలు సీలలు పడియుండుటను నేను ఊహించుచున్నాను. దానికి వెలుపల ఒక మోస్తరు కొద్దిగ మంచివారైన ఖైదీలను వుంచుతారు. కాని వారు లోపల వేయబడి యున్నారు. వారి కాళ్ళకి బొండ వేసి బిగించెను.

12. నేనెరుగను... మీరెన్నడైన బొండవేయుట అనేదాన్ని చూశారా? వాటిని చూసే అవకాశం నాకు కలిగింది. వాటిని ఎలా వేస్తారంటే నీ రెండు కాళ్ళు ఒక చోటకి చేర్చి తాళ్ళతోనో, గోలుసులతోనో కడతారు, అలా వాటిని చేతులకి కూడ వేసి బిగిస్తారు, అంతేకాదు చివరికి మెడకి కూడ వాటిని చుట్టుతారు. ఆ విధంగా నిన్ను కట్టిపడేస్తారు.

మరి చైనీయులు వేసే శిక్షలు అత్యంత కఠోరమైనవిగా క్రూరమైనవిగా వుంటాయి. వారు ఒక శిక్షపడ్డ వ్యక్తికి ఆ విధంగా బొండవేసి బిగించి అతనితలకి పైగా నీటి చుక్కలు కారనిస్తారు(పడునట్లు చేస్తారు) ఆ విధంగా నీరు అతనిపై కారుట వలన అతడు స్పహ కోల్పువునట్లు చేస్తారు. వారు అలా అతడ్ని అక్కడే వుంచుతారు. తినటానికి త్రాగటానికి కూడ కనీసం ఏమీ పెట్టరు. వారు- వారి కళ్ళు బయిర్లుకమ్ముతాయి, ఒళ్ళంతా మైకం అగునట్లు చేస్తారు. అదెంతో భయంకరంగా వుండును.

మొదటిరోజైతే కేవలం కొన్ని నీటి బిందువులే (చుక్కలే) అని వారంటారు, అది ఆరంభం గనుక పెద్దగ కష్టముండదు కానీ అలా కొన్నిరోజుల తర్వాత నీటి చుక్కల మోతాదును పెంచుతారు, సుమారు యాభైటన్నుల నీటి చుక్కలు అతనిపై కుమ్మరిస్తారు, మీకు తెలుసా ఒకేచోట ప్రతిసారీ అంత పెద్ద మోతాదులో పడుతంటో అదెంతో భయంకరంగా వుంటుంది అంతేకాదు కనీసం తలకూడ త్రిప్పే పరిస్థితి వుండదు ఎందుకంటే బొండలేస్తారు కదా.

13. కేవలం సువార్తను ప్రకటించినందుకే పౌలుసీలలు ఆ మురుగు కంపుకొట్టు చోట పడియుండు టను ఒకసారి ఆలోచించండి. మరి బహుశా అచ్చట ఎలుకలు, పందికొక్కులు, క్రిమికీటకాలు లాంటి మొదలైన వన్ని వారి మీదికి ఎక్కివుండొచ్చును. సువార్త ప్రకటించిన ఒక వ్యక్తికి దక్కిన చోటు ఎలావుందో చూడండి. మరి నేడు మనం అనుకొంటాం, కొద్దిగా కష్టం వస్తేచాలు పిర్యాదులు చేస్తుంటాం. కానీ వారేంచేశారో వారి వంక చూడండి. బహుశా మరుసటి
ఉదయం ఉరిశిక్షపడే అవకాశం వుందని తెలిసికూడా వారు వీంచేస్తున్నారో చూడండి.

వారు నమ్మకస్టులు, వారు- నమ్మకముగా వుండిపోయారు. అక్కడ అర్థరాత్రి సమయం అని వారి వీపులు (వెనుకతట్టు) ఆ మురికి నేలకి అతుక్కుపోయినవి, అక్కడి ఖైదీలు. ఆ గడిచింది, మరి నేను, నేను ఊహిచగలను వారిపరిస్థితి ఏమిటో, వారెలా వాటిని అనుభవిస్తున్నార దినాలలో కుస్తు ఇంకా అనేక రోగాల బారిన ఖైదీలు ఆ పాత మురికి కరుకైన నెలకి అతుక్కుపోయి వుండొచ్చును.. అది మురికిగా వున్న నెలయై యుండవచ్చును, దాని మీద అంతటా ఎలుకలు సంచరిస్తు వుండొచ్చునను...

14. కానీ వాటన్నిట మధ్యలో, బహుశా తిండికూడా తినకపోవచ్చునండి. రక్తం కారేటంతగా వారు కొట్టబడి వున్నారు. నాలుగగొట్టబడ్డారు. ఒంటినిండా గాయాలే, ఆ గాయాలు కడగటానికి అక్కడ ఏ డాక్టరు లేదు. నేడు మనం ఇన్ఫెక్షన్ చేరుద్ది అంటుంటాం, అలాంటిదే వారు అనుభవించారు. వారు అలా కఠినంగా విసిరివేయబడ్డారు, బొండ బిగించబడ్డారు. అటువంటి పరిస్థితిలోకి నెట్టి వేయబడ్డారు.

ఇన్ని జరిగినా సరే వారు మాత్రం ఏ ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదండి. వారి యొద్దనుండి ఒక్క ఫిర్యాదు (అభియోగం) బయిటికి రాలేదు. మరుసటి ఉదయం న్యాయనిర్ణేతలు వారిని రాజు యెదుటికి లేక సన్ హెద్రిన్ యెదుటికి పిలువవచ్చును, మరియు వారు చేసివుండొచ్చును, మరియు ఆ దినాలలో వారు వీరు ప్రకటించిన సువార్తను అబద్దబోధ అని పిలిచి, దానిని ప్రకటించిన నేరమును బట్టి వారిని ఉరితీయొచ్చునేమో, వీటన్నిటినివారు ఎరిగే యున్నారు. నేడు మనం కూడా అదే సువార్తకోసం, అదే బోధ (విశ్వాసం)కోసం, ఆసక్తితో నిజంగా పోరాడుచున్నాం.

దాని విషయమై మనం తలంచినపుడు, మన మధ్యవున్న మైళ్ళదూరం తగ్గుతూ వస్తుంది (చూశారా?) దాని గూర్చి ఆలోచించిన ప్రతిసారి మన మధ్యదూరం తగ్గును.

15. ఆ తరువాత మనం కనుగొన వచ్చును ఆ అర్థరాత్రి పౌలుసీలలు ప్రభువు గురించి అర్థ రాత్రి వరకు మాట్లాడుకొని వుండొచ్చును. అటు తరువాత వారు పాటలు పాడటం ఆరంభించారు, కొన్ని పురాతన క్రైస్తవ కీర్తనలు. ఓ, నేడు మనం పాడగలిగితే, "రక్తంలో శక్తివుంది" లేదా "నేనెట్లు యేసును ప్రేమింతును"అటువంటి పాటలను మనం పాడతాం.

వారు పాడటం ఆరంభించినప్పుడు, అకస్మాత్తుగా మాహా భూకంపం ఆ చోటును తాకింది. మరి అదెలా జరిగిందో దాన్ని గమనించండి. ఆ భూకంపం సంభవించినప్పుడు ఆ పురాతనగోడలు కుప్పకూలి వారి మీద పడి వారిని చింద్రవంద్ర చేసి చంపటానికి బదులు అని కదిలి వారికి ఏ హాని కలుగజేయకుండా వారికి దూరంగా పడిపోయినవి. అంత మాత్రమే కాదు, ఆ మహా భూకంపం ధాటికి వారికివేయబడిన బొండ(బంధకములు)సహితం తెగిపోయినవి. మరి వారు స్వేచ్చగా అయిరి.

16. ఇప్పుడు, తలంచండి. వారి కాళ్ళకి, వారి చేతులకి, వారి మెడలకి వున్న బంధకాలు తెగిపోయాయి, వారిలో ప్రతిఒక్కరు స్వేచ్చగా వుండిరి. ఇప్పుడు ఆ పాత గొప్ప రోమా చెరసాల కూలి వారి మీద పడటానికి బదులు, అది వారికి ఈ విధంగా దూరంగా పడిపోయెను. మరి అంతమాత్రమే కాదు, వారికున్న సంకెళ్ళు. మిగతావన్నియూ ఊడిపోయెను, చూచారా, మనం నమ్మకంగా వుంటే మన దేవుడు ఆ విధంగా తన కార్యాలను జరిగిస్తాడు. చూచారా. మనం
నిశ్చయంగా నమ్మకమైన వారిగా నిలబడాలి. మనం నమ్మకస్థులుగా వున్నంత కాలం -మరియు-ລ້ລ້...

ఇప్పుడు, మనమటువంటి రూపంలో ఉండకపోవచ్చును. మనం మనలో ప్రతి ఒక్కరు పొందక పోవచ్చును... మన మావిధమైన దానిని పొందుతామని నేను భావించడంలేదు. అయితే మనకి వచ్చే వాటి విషయంలో మనం నమ్మకస్థులుగా నిలబడాలి. బహుశా అవి శ్రమలు(హింసలు) కావచ్చును. బహుశా అది ఎవరో నిన్ను చూచి హేళనగా నవ్వ వచ్చును. బహుశా ఎవరో నీగూర్చి ఇలా అని వుండొచ్చును "నీవు పాతకాలపు వాడివి, నీవొక పరిశుద్ద బండరాయిని" లేదా వారు నిన్ను ఏ పేరుతోనైన హేళన చేసి పిలువచ్చును. లేదా నిన్ను ఆట పట్టించవచ్చును. అయితే ఏదేమైనా నమ్మకంగా నిలబడదాం, ఎందుకంటే వారిని ఎలా అయితే వారి నమ్మకత్వాన్ని బట్టి ఘనపర్చాడో అలానే దేవుడు మన నమ్మకత్వాన్ని కూడా ఘనపరుస్తాడు.

17. మరప్పుడు, అకస్మాత్తుగా రోమా ఖైదీ - లేదా శతాధిపతి ఖచ్చితంగా... ద్వారమునొద్దనున్న చెరసాలనాయకుడు (ద్వారపాలకుడు), అతడు ఆ రాత్రి పౌలుసీలలు లేఖనాలను గూర్చి మాట్లాడుకోవటాన్ని విని వుండవచ్చును, అతడు కొంత తెలిసికొని వుండొచ్చును. ఎందుకంటే వారి గురించి అతడికి ఏమీ తెలియదు. కానీ అతడు ఖచ్చితంగా కొంత నేర్చుకొని వుండొచ్చును. లేదా వారు ఆలపించిన గీతములు విని వుండవచ్చును, లేదా అటువంటిది, అదే వారు పరిశుద్ధ ప్రజలని తెలిసికొనేటట్టు అతడిని చేసింది.

ఎందుకంటే మీరు గమనించండి, అతడొక రోమీయుడు. వారేమో యూదులు, అతడొక అన్యుడు, వారేమో క్రైస్తవులు. కానీ మరొక సంగతి గమనించారా, ఆ చెరసాల తెరువబడుటను అతడు చూచినప్పుడు, దాని విషయమై అందున్న ఖైదీల విషయమై అతడు జవాబుదారియై యుండెనని అతడు ఎరిగి యుండెను.

ఏలియా కాలంలో జరిగినది మీకు గుర్తుందా? అతడు మారువేషంలో అక్కడ ఆహాబును ఎదుర్కొని అన్నాడు "నేనొక ద్వారపాలకుడిని, మరియు నా జీవితం ఒక మనిషిలో పేర్చబడి యున్నది. అయితే అతడు వైదొలిగిపోయాడు."

మరి -అతడన్నాడు "మంచిది, నీ జీవితంలో దానికి తగిన మూల్యం నీవు చెల్లించుకొంటావు. అదేనండీ కావల్సిన ఒక జీవితం". కనుక అతడు తన్నుతాను కనపర్చుకొని తాను ఏలియానని చెప్పెను. ఇంకా అన్నాడు "నీవు రాజును, ఆహాబును వెళ్ళనిమ్ము." మరి అతడు పలికాడు “దానికి తగిన మూల్యం నీవు ఖచ్చితంగా నీ జీవితంలో చెల్లిస్తావు”. అతడు దానిని చేసాడు.

18. మరప్పుడు, ఈ రోమా శతాధిపతి జరిగిన దానంతటికిని జవాబుదారియై యున్నాడని (ఉత్తరవాదియై) తాను ఎరిగినవాడై ఖైదీలందరు వెళ్ళిపోయారని భావించి వెంటనే తన ఖడ్గమును దూసి తన్నుతాను పొడుచుకోబోయెను. దానికి తగిన శిక్షపొందుటకు బదులు అతడు తన జీవితంను తీసికొనుటకు మొదలు పెట్టబోయెను. వాటిలో కొన్ని... అదే కుప్పలలో బహుశా తనను కూడా వుంచునేమో ఆ విధంగా అతడు తలంచియుండవచ్చును. కనుక తానే తన జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసికొని తన ఖడ్గమును దూసి తన్నుతాను చంపుకొనబోయాడు.
కానీ వెంటనే పౌలు దానిన చూసినప్పుడు, గట్టిగా కేకవేసి, ఇలా అన్నాడు "నీ హాని నీవు. తలపెట్టుకొనవద్దు మేమంతా ఇచ్చటనే వున్నాము." చూశారా? అప్పుడు ఈ మనుష్యుడు ఒక సంగతిని గుర్తించాడు, ఏదో ఒక ప్రత్యేకమైన కార్యం జరుగుట వలన ఈ మనుష్యులు పరిశు ద్దులని, క్రైస్తవులని అతడు గుర్తించాడు. వెంటనే అతడు వారి పాదముల మీద పడ్డాడు.

19. వారు పాటలు పాడుటలో అతడు విన్నట్లుగా నేను ఊహించగల్గుచున్నాను. వారు సాక్ష్యములు చెప్పుటను అతడు విన్నాడు. వారి మార్పును గూర్చి అతడు విన్నాడు. పిల్లలారా, ఒక క్షణం దాన్ని గూర్చి ఆలోచిద్దాం, కొట్టబడిన ఇద్దరు ఖైదీలద్వారా ఆ రోమా శతాధిపతి సంగతులు విని గ్రహించి వాటినిబట్టి ఒప్పింపబడెను.

ఇప్పుడు, మనమింకా స్వేచ్ఛపరులము (సంకెళ్ళు లేనివారము). మనం కొట్టబడలేదు, చెఱసాలలో వేయబడలేదు. వారి సాక్ష్యాలు విని వాటిద్వారా ప్రేరణపొంది ఇలా అడిగాడు "రక్షింప బడుటకు నేనేమి చేయవలెను ?" మరి మన ప్రేరేపణ సంగతులేమిటి? గమనించారా?

మనం నిశ్చయంగా సాక్ష్యం ఇవ్వవలసిన వారమై యున్నాం. యవ్వన బిడ్డలారా, మిగతావా రులారా మీరు ప్రసంగించాల్సిన పన్లేదండీ. ప్రకటించుటకు దేవుడు నిన్ను పిలిచి యుండక పోవచ్చును, కానీ నీవు... నీనొకవేళ గృహిణి కావచ్చును, లేదా ఇంకేదైనా కావచ్చును, ఒక యవ్వనుడివి ఒక యవ్వనస్థురాలవు కావచ్చును. ఏదో చూద్దాం, మీకు తెలుసా, అది... "మంచిది, అదిగో అక్కడ వెళ్ళుచున్నది ఒక క్రైస్తవుడు (క్రైస్తవురాలు)- అది- అతడు ఒక క్రైస్తవుడు” అని జనులు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చే జీవితాన్ని జీవించుము.

వారి పాటను బట్టి కానివ్వండి, లేక ఇంకేవిధంగానైన సరే గానివ్వండి ఇతడు, వారు క్రైస్తవులని గుర్తించి వారినుండి ప్రేరణ పొందియున్నాడని మనం తెలిసికోవచ్చును. గనుక అతడు వెలుగు పొందాడు. అతడు లోనికి వచ్చి చూచినప్పుడు అక్కడ పౌలు సీలలు, మరలాగే మిగతా ఖైదీలందరు వుండుటను చూచాడు, వారిలో ఏ ఒక్కరు తప్పించుకొని పోలేదు. ప్రతిఒక్కరు అక్కడనే వున్నారు. గనుక అతడు తన కత్తిని దించి, పౌలుసీలల పాదముల చెంతపడెను "అయ్యలారా రక్షణపొందుటకు నేనేమి చేయవలెను" ?

20. ఇప్పుడు, మీరు గమనించారా. నేడు నీవు నేను, అలాగే సేవకులందరు, ఇంకా మిగతా వారంతా ఒక వ్యక్తి ఏం చెయ్యకూడదో అనేదాన్ని మనం ఎల్లప్పుడు చెబుతుంటాం. మనం ఇలా అంటాం "పొగత్రాగుట మానుము. అబద్దాలు ఆడుట మానుము, దొంగిలించుట మానుము. దీనిని దానిని చేయటం మానుము" ఇప్పుడు, ఆ మనుష్యుడు అడిగినది అది కాదండి "నేను రక్షించబడుటకు నేను ఏమేమి మానివేయాలి" అని అతడు అడుగలేదండీ. అతడు ఇలా అడిగాడు "నేను రక్షించడడుటకు ఏమి చేయాలి?"

చూశారా, వారు దేనిని మానివేయాలో అనే దానిని మనం చెప్పుటకు ప్రయత్నింస్తుంటాం. చూశారా, అంటాం "మంచిది, నేను ఖచ్చితంగా దీన్ని దాన్ని ఇంకొదాన్ని చేయాలి” అలా కాదు. అది అసలు ప్రశ్నేకాదండీ. ప్రశ్నేమిటంటే "నేనేమి చేయాలి", "నేనేమి చేయకూడదు అనేది కాదు" నువ్వు చెయ్యాల్సిందాన్ని నీవు చెయ్యుము, మిగతాది దానంతటికి అదే జరుగుతుంది. నీవు అబద్దము లాడుచున్నావు, దొంగిలించ్చుచున్నావు, లేదా త్రాగుచున్నావు, జూదమాడుచున్నావు. చెడు పనులు చేయుచున్నావు. "రక్షించబడుటకు నేనేమి చేయాలి ?" అని అతడు అడిగిన
ప్రశ్నకు పౌలు చెప్పిన జవాబు వాటన్నిటిని చేయకుండా అపుచేస్తుంది.

అతడు(పౌలు) చెప్పాడు "ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడుదురు".

21. ఇప్పుడు, దీని గూర్చి నేను చెప్పుటలో నా ఉద్దేశ్యము ఏదనగా ఇక్కడున్న ప్రజలగు మీరును, మీలో చాలామంది, మీరును- మీ పిల్లలును రక్షింపబడియున్నారు. చూశారా? వారు క్రైస్తవులు. బ్రదర్ ఈవెన్స్ కుటుంబమును ఇక్కడున్న యవ్వనులను నేను మెచ్చుకొనుచున్నాను (ప్రశంసించుచున్నాను). సాధారణంగా కుర్రపిల్లల్ని కూర్చోబెట్టి బోధకుడు చెప్పే వాక్యం వినేటట్టు చెయ్యడం కొంచం కష్టమే, ఎందుకంటే, వారస్సలు మాట వినరు, అటు ఇటు షికార్లు చేస్తారు. చిన్న బాలికలు కూడా అంతేనండీ...

నేను బ్రదర్ ఫ్రెడ్ ను మరియు అతని పిల్లలతోను చెప్పాను, ఎందుకు- నేనొక చిన్న తప్పును చెప్పినా వారు దానిని విన్నప్పుడు దానిని ఆపుటకు వారు సంసిద్ధులుగా వుండెదరు ఇప్పుడు, మీరు చూశారా? మరి, వారు నాపట్ల గొప్ప(ఎనలేని)గౌరవముతో ఇక్కడ కూర్చొనియున్నారు, లేదంటే వారు ఎక్కడో కార్ల షికారులోను లేక సరదాగానో ఎక్కడెక్కడో తిరుగవచ్చును. వారు... నీవు సువార్త చెప్పుట వారు విన్నట్లేతే, ఎన్ని పనులున్నా ప్రక్కనబెట్టి అక్కడే కూర్చొని శ్రద్దగా దానిని వింటారు. చూశారా?

22. ఇప్పుడు, మన పిల్లలు తిరుగుబాటు చేయుదురేమోనని మనమంతా తలుస్తాము. కానీ-దానిని మనము ఖచ్చితంగా ఆపాలి. నేను-నేను నమ్ముచున్నాను, అదేమనగా ఈ పిల్లలు లోకమంతటిలో అతి శ్రేష్టమైనవారని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే వారు మన పిల్లలు, మరియు మనము వారిని దేవుని కోసం పరిగణించాము (పేర్కొన్నాము).

ఇప్పుడు, మీరు పొందిన రక్షణ మీ పిల్లల్ని రక్షింపలేదు. కానీ ఇప్పుడు, సౌలు అన్నాడు, అన్నాడు "ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, మరి నీవు నీ యింటివారు రక్షింపబడుదురు" ఇప్పుడు, అతడు ఇప్పుడు, దానిని చెప్పుటలో అతని ఉద్దేశ్యము ఏమై వుండొచ్చును ? వారు రక్షణపొందారు గనుక దాన్ని బట్టి అనగా(వారు నొందిన రక్షణను బట్టి) వారి పిల్లలు కూడా రక్షింపబడుదురు అనేది కాదండీ అతని ఉద్దేశ్యము. అతని ఉద్దేశ్యము ఏమిటంటే -వారు పొందనం దున... తన రక్షణ కొరకు ఒకడు తగినంత విశ్వాసమును కలిగివున్న యెడల, అంతే పరిమాణములో వున్న అతని విశ్వాసము అతని పిల్లల రక్షణ కొరకు కూడా పనిచేస్తుంది. చూశారా, నా భావం గ్రహించారా?

23. ఇప్పుడు, నాకు కూడా పిల్లలున్నారు. అక్కడ నా చిన్న కుమారుడు జోసఫ్ మరియు బిల్లీ, శారా, రెబ్కాలు వున్నారు. మంచిది, ఇప్పుడు, వారిలో ప్రతి ఒక్కరు సువార్త పనిలో వుండుటను, అదే రీతిగా పనిచేయుటను నేను చూడగోరుచున్నాను. వారు రక్షింపబడి, పరిశుద్దాత్మతో నింపబడు టను నేను చూడనపేక్షించుచున్నాను.

ఇప్పుడు, వారిని నేను దేవునికి అప్పగించి ఇలా చెప్పుదును "నేను వారివి దేవుని కొరకు సమర్పించితిని"చూశారా వారంతా, వారిలో ప్రతిఒక్కరు రక్షింపబడుదురని నేను నమ్ముచున్నాను. చూశారా ? వారు రక్షించబడి, ఆవలిగట్టున వారందరిని నేను కలిసికొందునని నేను నమ్ముచున్నాను మరి -నా రక్షణ వారి కోసం పనిచేస్తుందని నేను అనుకోవట్లేదు. లేదండీ, కానీ దేవుని యందు
నా నమ్మకం (విశ్వాసమే)దానిని చేయును, మీరు చూశారా, దేవుడు దానిని చేయుననే విశ్వాసమును నేను కలిగియున్నాను, అందు మూలముగానే (నా విశ్వాస పరిమాణంచొప్పునే)వారు క్రీస్తునొద్దకు వచ్చునట్లు చేయును.

ఆ విధముగా ప్రజలగు మీరు మీ పిల్లలకోసం ఆ విధంగా ప్రార్థించుదురని నేను నమ్ముచున్నాను అందువలనే మీ పిల్లలు సభ్యత (మర్యాద)గలవారై, మనం జీవిస్తున్న ఈ ఆటవిక కాలములో నిజమైన స్త్రీ, పురుషులుగా వారు బ్రతుకుచున్నారు. నాకు తెలిసినంతమట్టుకు నీ పిల్లలు కలిగియుం డని ఒక దానిని వారు ఒక బాగాన్ని కలిగివున్నారని నా నమ్మిక. మరి మీరు వారిని దేవునికి అప్ప గించి, గట్టిగా పట్టుకొని యున్నారు.

24. ఇప్పుడు, చూడండి, రోమియుడు పలికాడు "నేనేమి చేయాలి ?"అతడు తనకు తనే ప్రశ్నించుకొన్నాడు. అతడు అన్నాడు, "నేనేమి చేయాలి”,

అందుకు అతడు (పౌలు) చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, మరప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు”. చూశారా ?

ఇప్పుడు -ఇప్పుడు, మనం చెయ్యాల్సింది ఒకటి వుంది, నా అంశాన్ని పొందుకొనుటకు ఒక నిమిషం మనం వెనక్కి వద్దాం. ఇప్పుడు, అది ఇదే. బైబిలు గ్రంథములో నేనెరిగిన ఒకవ్యక్తి వున్నాడు, అతని పేరు యోబు, అతడిని తీసికొందాం.

ఇప్పుడు, యోబు ఒక ప్రముఖుడు (గొప్పవాడు). అతని దినాలలో అతని వంటి వాడెవడును లేడు. యోబు ఒక ప్రవక్త, సుదూరం నుండి జనులు అతని మాటలు వినుటకు వచ్చుచుండేవారు. మరి దేవుడు అతనిని దీవించాడు. మరి అతడు- వర్థిల్లాడు (సంపన్నుడయ్యాడు), అతడు ధనవంతు డయ్యాడు. ఓ, అతనికి వేలాది పశువులు మరియు గొట్టెల మందలుండెను, అతడు మిక్కిలికలిమి కలిగి యుండెను.

మరి, ఎందుకని, తాను వీధుల్లోకి వెళ్ళినపుడు, తూర్పునుండి వచ్చిన యవ్వన రాజకుమారులు (వారు తూర్పుదేశపు జ్ఞానులు, నక్షత్ర పండితులు (ఖగోళశాస్త్రజ్ఞులు) అని మీకు తెలుసా) మరి వారు వచ్చి అందురు. అన్నారు అతని పెదవుల నుండి వెలువడే జ్ఞానవాక్కులు వినుటకు వారు వచ్చి అతని యెదుట మోకరించెదరు. చూశారా? అతడు చురుకైన (పదునైన)వాడు, దైవీక జ్ఞాన సంపన్నుడు. అతడొక - అతడొక ప్రవక్త.

25. మరి కాబట్టి, అపవాది క్రిందికి చూసాడు. యోబు చురుకైన (దైవీక జ్ఞానసంపన్నుడు) వాడని చూసాడు. కనుక ఒక చురుకైన (దైవీకజ్ఞాన సంపన్నుడు) వాడు కార్యాలు ఏలా చేస్తాడో నేను మీకు చూపుతాను. ఇప్పుడు, పాఠ్యాంశానికి తిరిగి వద్దాం, నీవు నీయింటివారు, యోబు అన్నాడు. ప్రతీది ఒక చక్కని క్రమంలో వుండుటను యోబు చూచినప్పుడు, అతడన్నాడు. "మీకు తెలుసా, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి, వెళ్ళిపోయారు." ఇంకా అన్నాడు, "బహుశా వారిలో ఒకడు... ఒకవేళ పాపము చేసినట్లైతే”

ఇప్పుడు, దేవుడు కోరుకొనేది ఒకటున్నది. అది ఒక దహనబలి. అతడన్నాడు, "ఇప్పుడు, తాను కాను,” తన పిల్లలు తప్పు(పాపము) చేసారని అతడు అనుకోవట్లేదు, అందుకే అతడన్నాడు, "ఒకవేళ వారు పాపము చేసి వుండొచ్చునేమో ఎందుకంటే వారు ఒకరినొకరు తరచూ దర్శించు
కొనుచుచున్నారు, ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లలో తరచూ విందులు, అలాంటివాటిని జరుపుకొనుచున్నారు, కలిసి వుంటున్నారు. అతడన్నాడు "వారిలో ఒకరు పాపము చేసినట్లైతే... ప్రభువా, దహనబలిని నేను అర్పించుచున్నాను. నా బిడ్డల కొరకు దహనబలిని అర్పించుచున్నాను" చూశారా ? చేయుటకు అతనికి తెలిసినదంతా అదియే. దేవుడు కోరుకొనేదంతా అదియే. ఒక దహనబలి. ఆయన కోరుకొనేది మరి అదియే.

సరే, ఒక గొప్ప అర్థరాత్రి గడియ వచ్చి ఆ దీన యోబుని అతడు వుండిన స్థితిలో అతడిని తాకినది, అతడు.... మీకు తెలుసా, అతడు తన పశువులన్నిటిని, తన గొట్టెలన్నిటిని పోగొట్టు కొనెను, అంతేకాదు, ఒక వరద (తుఫాను) వచ్చి అతని బిడ్డలనందరిని చంపివేసెను. అగ్ని దిగివచ్చి అతని సేవకులను దహించివేసెను. మరి- మరి అతని సహో... అతని ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది, మరి అతడు తన ఇంటి వెనుక పెరట్లో కూర్చొనెను. మరి అతని దేహం కురుపులతో మొత్తబడెను, ఆ బాధ తాళలేక మట్టిపెంకుతో తన పుండ్లను గోకు కొనుచుండెను. చివరికి అతని భార్య సహితం అతని విషయమై అభ్యంతరపడి వచ్చి అతనితో అన్నది, “యోబు ..”

26. ఇప్పుడు, ఆమె మాట్లాడిన తీరును దయచేసి ఆలోచిద్దాం. ఇప్పుడు, యెబు అచ్చట కూర్చొండుట చూడండి. రాత్రంతా అతడు అక్కడ కూర్చొని యున్నాడు. అక్కడ అతన్ని ఓదార్చేవారు అతని వైపు తమ వీపు వెనుక బాగాన్ని చూపుతూ కూర్చొన్నారు. మరి అతడు పాపం చేసెనని అతనితో వారన్నారు. వారు సంఘసభ్యులుగ వున్నారు. అది సంఘ పెద్దల బోర్డు, లేక సంఘమందున్న దాన్లో ఒక విభాగమువారు అతన్ని పరామర్శించుటకు వచ్చారు. వారక్కడ ఏడు దినములు కూర్చొన్నారు, వారు ఇంకను అతడితో ఇలా అనుచుండిరి " యోబూ, బహుశా నీవు ఒప్పుకోవటం మంచిది. నీవు పాపము చేసావు, లేకపోతే దేవుడు నీతిమంతడుగు ఒకడిని ఈ విధంగా హింసపెట్టడు."

కానీ దేవుడు ఒక నీతిమంతున్ని అట్టి విధంగానే హింసబెడతాడు. చూశారా, కొన్నిసార్లు దేవుడు... మనము పాపము చేసినప్పుడు అటువంటి కార్యాలు సంభవిస్తాయి. కానీ మరికొన్ని సార్లు అయితే ఒక పరిశుద్ధున్ని పరీక్షించుటకే, శిక్షించుటకే స్వయంగా దేవుడే వాటిని అనుమతిస్తాడు.

27. కనుక, యోబు నీతిమంతుడని మనం తర్వాత కనుగొనగలం. దేవుడు అతన్ని పరీక్షించు చున్నప్పుడు, ఎందుకంటే సాతాను అన్నాడు, "ఓ, నిశ్చయము...” దేవుని కుమారులతో కలిసి అతడు దేవుని యెదుటికి వచ్చినప్పుడు, అతడు అన్నాడు...

దేవుడు అతనితో అన్నాడు "నీవు ఎచ్చటి నుండి వచ్చుచున్నావు ?"

అతడన్నాడు, “ఓ, భూమ్మీద నుండి అటు ఇటు తిరుగుచూ, క్రిందికి పైకి తిరుగుచు వచ్చుచున్నాను.

ఆయన అడిగాడు “నా సేవకుడగు యోబు సంగతి నీకు తెలుసా ? అతడు పరిపూర్ణుడు. భూమి అంతటిలో అతని వంటివాడు ఎవడును లేడు" దానితో దేవుడు సంతోషపడుచున్నాడు. ఓ, తాను నమ్మదగిన ఒక సేవకుడు తనకుండుటను ఆయన ఇష్టపడుచున్నాడు. ఆయన అన్నాడు. "భూమ్మీద అతని వంటి వారు ఎవ్వరూలేరు" చూశారా, అన్నాడు "అతడు పరిపూర్ణుడు" మరది
యేసుక్రీస్తు రక్తం చిందింపబడక పూర్వం వుండినది. చూశారా ? మరి ఆయన అన్నాడు "అతడు పరిపూర్ణుడు, అతడు నీతిమంతుడు, అతడు యదార్థపరుడు. అతనివంటివాడు ఎవ్వరూ లేరు.”

సాతాను అన్నాడు, "ఓ, నిజమా, చూడు, నీవు అతనికి ఏమేమి చేసావో, అతనికి అన్ని ఇచ్చావు. అతనికి ఇళ్ళు వున్నాయి, పిల్లలున్నారు, అతనికి పశువుల మందిలిచ్చావు; అతనికి అవసరమైనవన్ని నీవు అతనికి అనుగ్రహించావు. నిజం, అలా అన్నీ ఇస్తే ఎవరైనా నిన్ను సేవిస్తారు" ఇంకా అన్నాడు "ఒక్క అవకాశం నాకివ్వు. నీ ముఖం మీదనే అతడు నిన్ను శపించేటట్టు చేస్తాను."అందుకాయన అన్నాడు "అతన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, కానీ నీవు అతని జీవాన్నీ మాత్రం ముట్టవద్దు." ఇప్పుడు తన ప్రవక్త తన విషయంలో విఫలమవ్వడనేదే దేవునికివున్న నమ్మకం. చూశారా ? ఆయన విషయంలో మనము తప్పిపోము (విఫలమవ్వము) అనేదే నీ నా యెడల దేవునికున్న నమ్మకం.

28. మరప్పుడు ఆయన... మరి ఆయన చెప్పాడు "అతని ప్రాణమును ముట్టకుము", మరి

అతని ప్రాణంను తప్ప అతనికి కలిగినసమస్తం సాతాను తీసివేసెను. అతని పిల్లల్ని చంపాడు.

అతని మందలు చంపివేయబడెను. మరి ప్రతిఒక్కటి... అతని సంపద అంతా సర్వ నాశనమాయెను.

అతని ఆరోగ్యం దెబ్బతినెను మరియు అతని ప్రాణం తప్ప అంతయు హరించుకుపోయింది,

అతడు అక్కడ కూర్చొని మట్టిపెంకుతో తనకు కలిగిన కురుపులను గోకుకొనుచుండెను.

మరి అతని భార్య తలుపునొద్దకి వచ్చినది, మరియు మరియు సాతాను ఆమె

హృదయములోనికి వచ్చెను ఆమె అన్నది, “నీవు" అతనివైపు చూచి ఇలా అన్నది. "నీవు ఎందుకు

దేవున్ని శపించి చావ కూడదు ?"అన్నది. "ఘోరమైన వానిగా నీవు కనబడుచున్నావు."

అతడన్నాడు, "మూర్ఖురాలువలె నీవు మాట్లాడుచున్నావు" చూశారా, ఇప్పుడు, ఆమె మూర్ఖురాలని అతడు అన్లేదు, మూర్ఖురాలువలె మాట్లాడుచున్నావని మాత్రమే అన్నాడతడు." యెహోవా ఇచ్చాడు యెహోవా తీసికొన్నాడు యెహోవా నామమునకే మహిమ కలుగును గాక." చూశారా ? మరోమాటలో, "దిగంబరిగా నేను ఈ లోకములోనికి వచ్చాను, మరి ఆలాగే దిగంబరి గానే నేను ఈ లోకము నుండి వెళ్ళిపోతాను. ఏదిఏమైన ప్రభువునామమునకే మహిమ కలుగును గాక. ఇక్కడికి నేనేమి తేలేదు, ఇక్కడి నుండి నేనేమి తీసికొనిపోలేను, అయినా ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక." ఓ, మై.

మీకు తెలుసా, చాలాకాలం (దూరం) మనల్ని శోధించునట్లు దేవుడే సాతాన్ని అనుమతిస్తాడు, మరి చివరికి వాడే చేసేదేమి లేక అలసిపోతాడు. మీరు చూశారా ? కనుక, తాను ఏం చేయలేనని వాడు చూచినప్పుడు... సాతాను అతనిని వదిలిపెట్టి వెళ్ళవల్సి వచ్చెను. కానీ బిల్దాదు మరియు మిగతా వారంతా అక్కడ నిలిచి అతనితో ఇలా అనుచుండెను, “ఎందుకు, నీవొక రహస్యపాపివి".

అతడు యోబు ఇలా బదులిచ్చాడు, "నేను రహస్యపాపిని కాను"చూశారా ?

29. “యోబూ, నీవు చేసావు... నీవు చేసావు... దానిని నీకు ఒప్పుకోబుద్ది కావట్లేదు (చూశారా), ఎందుకంటే నీవు రహస్యపాపివి. దాపిరకంగా నీవు దానిని చేసావు, అందుకే దేవుడు నిన్ను దాన్ని బట్టి శిక్షిస్తున్నాడు, అందుకే ఇవన్ని నీవు అలా జరిగాయి.” కానీ అతడన్నాడు, "లేదండీ, నేను
పాపిని కాదు." అతడు దేవునినీతిని ఆధారముగా చేసికొన్నాడు, ఆ దహనబలిని అర్పించాడు. దానిని అతడు అర్పించాడు. అతడు అర్పించాల్సిందంతా అదేనండీ, దేవుడు కోరేదంతా అదే.

మరి మీరు గమనించారా, దేవుని ఆత్మ ప్రవక్తమీదికి వచ్చిన తరువాత, అంతయు సరైన తర్వాత (మీరుచూశారా) దేవుడు యోబుని పునరుద్ధరించాడు? ఆయన అతని... పునరుద్దరించాడు. గతంలో అతనికి పదివేల పశువులుంటే, ఇప్పుడు వాటిని ఆయన రెట్టింపుచేసాడు అనగా ఇరవైవేలు చేసాడు. గతంలో అతనికి నలభైవేలు గొట్టెలుండగా, ఇప్పుడు వాటిని ఆయన ఎనభైవేలుగా రెట్టించాడు. చూశారా? అతనికి కలిగిన దానంతటిని ఆయన తిరిగి రెండింతలుగా అనుగ్రహించాడు.

అలాగే మీరు గమనించారా ? అలా చెప్పబడింది. "మరి ఆయన అతని, అతని యొక్క ఏడుగురు పిల్లల్ని కూడా తిరిగి ఇచ్చివేసాడు," చూశారా? ఆయన యోబుకి అతని ఏడుగురు సంతానాన్ని తిరిగి ఇచ్చివేసాడు. ఏడుగురికి మరో ఏడుగురిని కలిపి ఇవ్వలేదండి, కేవలం అతని పిల్లల్ని మాత్రమే తిరిగి ఇచ్చివేసాడు. ఇప్పుడు, అదేమి? అతని గృహము, "నీవును నీ ఇంటివారును.” అతడు నీతిమంతుడు గనుక మనం నీతిగా వుండుటకు ఆయన మనకి ఇచ్చిన దానంతటి మీద అనగా దహనబలిని అర్పించిన దాని మీద అతడు నిలబడినందున నీతిమంతుడాయెను.

మరి అది దేవుని వాక్యమని, అదెన్నడు విఫలమవ్వదని అతడు ఎరిగియున్నాడు. కనుక, అతని పిల్లలు ఎక్కడ వుండితో నీ వెన్నడైనా గమనించితివా? వారు పరలోకములో వుండి అతనికోసం ఎదురుచూచుచుండిరి. చూశారా? నేడు అతడు వారితో అచ్చట వుండెను. మరి దేవుడు యోబు పిల్లల్ని రక్షించెను. వారు పరలోకములో అతని కోసం కనిపెట్టుచుండిరి. చూశారా? 30. ఇప్పుడు, అతడు నీతిమంతునిగా పరిగణించబడుటకు దేవుడు దేనినైతే చెయ్యమని అతన్ని అడిగెనో అనగా బలిఅర్పణ అడిగెనో, దానంతటి మీదనే యోబు పనిచేసినందున, అతడు నీతిమంతునిగా తీర్చబడెను. మరి ఆయన యోబుని అతని ఇంటి వారిని రక్షించాడు, పిమ్మట దేవుని యెదుట నీతిమంతులుగా ఎలా అగుదురు? "ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షించబడుదురు".

కావున, నాయింటి వారి నిమిత్తం నేను నమ్మితే, అలాగే మీ యింటివారికోసం మీరు నమ్మితే, దేవున్ని విశ్వసిస్తే నమ్మితే, పిమ్మట దేవుడు మన సొంత విశ్వాసాన్ని బట్టి నీతిని వారికి ఆపాదిస్తాడు. అబ్రహాము, యోబు మరియు మిగతా వారందరి వలే నీతిమంతుల జాబితాలో చేరుస్తాడు. మీరు చూశారా? అది మనల్ని నీతిమంతులుగా పరిగణించును, ఆవిధంగా నీవును నీ యింటి వారును రక్షింపబడుదురు.

ఓ, అది అత్యుత్తమైన సంగతిగా నేను బావిస్తున్నాను. మరి అప్పుడు. అంతమాత్రమే, కాదు,కానీ ప్రతిఒక్క సహోదరుని నిమిత్తం, సహోదరి, సహోదరులందరి నిమిత్తం దానిని నేను అలాగే ఎత్తిపట్టుకొందును. కేవలం వారి మట్టుకే కాక, నా సంఘములోవున్న ప్రతి ఒక్కరికోసం నేను ఎత్తిపట్టు కొందును. మీ అందరి నిమిత్తం ఎత్తిపట్టుకొందును. అలాగే మీరు కూడా నన్ను ఎత్తి పట్టుకోవాలని నేను కోరుచున్నాను, విశ్వాసము వలన కలుగు నీతిని, మనం దహన బలున్ని అర్పించాల్సిన పన్లేదు. ఎందుకంటే క్రీస్తే మన దహన బలి. అందుచేత క్రీస్తు చేసి ముగించిన బలి అర్పణ కార్యమునందు మనము నమ్మకముంచాలి, ఆయన ఇటువంటి ఒక వాగ్దానమును
చేసాడు "నా పేరట మీరు తండ్రిని ఏమి అడిగినా నేను చేస్తాను. మీరు ప్రార్థించినప్పుడు, మీరు అడుగు వాటినెల్లా పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అని మీకు కలుగును."

31. ఇప్పుడు, ఈ యవ్వన పిల్లల్ని దేవుడు రక్షించునట్లు నేను ప్రార్థించి, హృదయపూర్వకముగా దానిని ఆయన చేస్తాడని యోబునకు వలే నేను నమ్ముదును. అయితే ఇలా అంటారేమో 2 ఈ బిడ్డను చూడు, అతడు ఏవిధంగా జీవిస్తున్నాడో" ఆమె లేక అతడు ఏమి చేస్తున్నాడో నేను మనస్కరించను. నేను చేయవల్సిందంతా ఆ బిడ్డను నేను సర్వశక్తిగల దేవుని చేతిలో పెట్టడమే. మై, నేను నా యింటివారు రక్షించబడుదురు. చూశారా ఎందుకంటే నేను...

వారు రక్షణలోకి రాక ముందే నేను వెడలిపోయినట్లైతే, వారు ఈ లోకాన్ని విడువకముందే దేవుడు ఏదో రీతిగా వారి మార్గాన్ని తలక్రిందులు చేసైనా సరే వారిని రక్షణలోకి తెస్తాడు. నేను -నేను దాన్ని నమ్ముతాను... ఏదో ఒక రీతిగా ఆయన చేస్తాడు. వారు దానిలోనికి ప్రవేశించడానికి ఆయన ఎంతటి భీకరమైన దానినైనా సరే వారి పట్ల జరిగిస్తాడు. (ఏదో రీతిగా వారు దాన్ని పొందు కొనేటట్టు ఆయన చేస్తాడు) చూశారా ?

దానిని నేను అలా నమ్ముతాను, అది "నీవు నీ యింటి వారు రక్షించబడుదురు"

32. నేను చూసాను అటువంటి వాటినెన్నో... నా కూటాలలో అటువంటివి జరుగుట నేను పలుసార్లు చూశాను. తన జీవితకాలమంతటిలో ఎంతో కఠినంగా బ్రతికిన ఒక పెద్దబాలుడు అక్కడికి వస్తాడు. వాడు మోకాళ్ళ మీదపడి, ఏడ్చి, లేచి, ఇలా అనును, "సరే, నాకొక వృద్ధ తల్లి వున్నది. ఓ, ఆమె ఆ లోకములో వున్నది, ఆమె క్రిందికి చూసి, నేను ఈ బలిపీఠము నొద్ధవుండుట చూసి ఆమెంతో సంతోషించును" చూశారా? అదేమిటి, ఆ వృద్ధ తల్లి ప్రార్థించినది, నమ్మినది. చూసారా, ఆమె ఎప్పుడో వెళ్ళిపోయింది, కానీ ఆమె చేసిన ఆ ప్రార్థనలు ఫలితాన్ని ఇస్తున్నవి. ఎందుకంటే నీతి... చూశారా, నీవు నీ యింటివారు రక్షింపబడుదురు. ఎలా పనిచేయాలో దేవునికి తెలుసు. ఎలా చేయాలో ఆయనకి తెలుసు. ప్రతి దానిని దాని కాలంలో ఎలా చెయ్యాలో ఆయనకి తెలుసు.

33. దీనిని నేను మొన్న ఒకరోజు చెప్పాను. మనం దేవుని ఆత్మద్వారా తిరిగి జన్మించినప్పుడు, ఒకచోట బలహీనంగా, మరో చోట బలంగా దేవుడు వుండడు. దేవుని యొక్క చిన్న నీడను నీవు నీలో కలిగివుంటే దేవుని బిందువు నీలో వుంటే, అప్పుడు నీకు సర్వాధికారం వుంటుంది. నీవు ఒక లోకాన్ని సృష్టించి దానిలో జీవించుటకు కావాల్సినంత అధికారం(శక్తి) నీవు పొందుకొంటావు.

అయితే, ఆ అధికారము(శక్తి) విశ్వాసము చేతనే నియంత్రించబడును. ఒకవేళ అది అలా కాకపోయినట్లైతే మనమంతా లోకములో కలిసిపోయి జీవిస్తుండేవారము. నీవొక దేవుని కుమారునివి, దేవుని కుమార్తెవి అయితే దేవుని శక్తి (అధికారం)ని నీవు నీలో కలిగి వుంటావు. చూశారా, మరప్పుడు, నీవు... ఆ నియమము విశ్వాసాన్ని ప్రత్యేక కార్యాలకోసం పట్టుకొని వుండును.

34. ఇప్పుడు, ఉదహరణకి తీసికొందాం, మనలో అందరు, మనం చెప్పుకొన్నట్లైతే, మనమంతా ఒకప్పుడు అబద్దములాడాము, మనం దొంగిలించాము, మనం-మనం శపించాము, ఒట్టుబెట్టు కొన్నాం, ప్రతి తప్పుడు పని చేసాము. సరే, ఒకనాడు మనం క్రీస్తుని అంగీకరించాము, ఆయన మనకి ఏంచేసాడు? మనం ఆయన్ని అంగీకరించిన వెంటనే ఆయన తెరిచాడు... అది విశ్వాస సంబంధమైనది, "విశ్వాసముంచుము" అని రోమీయుడితో పొలు చెప్పినట్టు. సరిగ్గా యోబు
అదే చేశాడు. నమ్ముము, చూశారా? క్రీస్తుని మన రక్షకునిగా మనం అంగీకరించిన వెంటనే కావల్సినంతా విశ్వాసాన్ని మనం పొందుకొంటాం, ఇక అప్పటి నుండి మనం ఎంతమాత్రం అబద్దములు చెప్పము, ఎన్నడూ దొంగిలించము, ఎన్నడూ మోసము చేయము. చూశారా? లేదండీ... చెయ్యలేం, ఎందుకని?

ఒకప్పుడు నడిచిన తప్పుడు మార్గంలో ఇక ఎన్నడు మనం నడవలేం. మనకి సరిపడేటంతా విశ్వాసం మనలో పెట్టబడినది. ఎందుకు? ఎందుకంటే మనం రక్షించబడ్డామని మనం విశ్వసించాము. అది నిజమేనా? రక్షించబడ్డాము అనే విశ్వాసమును బట్టి మనమిక్కడ వున్నాం. కనుకనే మనం పాపానికి పైగా జీవిస్తున్నాము, ఎందుకంటే మనం రక్షించబడియున్నాము.

35. ఇప్పుడు, ప్రశ్నల యొద్దకి మనం వెళ్ళకముందు దీనిని మీరు జాగ్రత్తగా గమనించమని కోరుచున్నాను. చూశారా ? బ్రదర్, సిస్టర్, నన్ను గూర్చిన ఒక రహస్యాన్ని మీకు చెప్పబోవుచున్నాను. చూశారా? నేనెలా ఆ దర్శనములను చూస్తాను, ఆ కార్యాలు ఏలా జరుగుతాయని మీరు తరచూ ఆశ్చర్యపోదురు అని నేను అనుకొనుచున్నాను. అందులో ఏమి లేదు, ఆయన నన్ను ఆ రాత్రి కలుసుకొని, చెబుతాడు (చూశారా) ఇది జరుగును అని. దానిని నేను నమ్ముతాను, నిస్సంకోశంగా నేను నమ్ముతాను.

ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తే, మరి వారు బాగుపడుటకు అది నిర్ణయించబడినప్పుడు మరి నేను రోగుల కొరకు ప్రార్థించుటకు సంసిద్ధుడనగుదును. మంచిది, అదెల్లప్పుడు సరే. మన కుటుంబాల విషయాల్లో కూడా సరిగ్గా మనం అలానే చెయ్యాలి, మనం ఏది అడిగినా పరే, మనం ఖచ్చితంగా ప్రార్థించాలి, దేవుడు విశ్వాసమును గౌరవిస్తాడు. (మీరు చూశారా?) దానిని నమ్ముటకు, అది సరైనదని మనం ఖచ్చితంగా నమ్మితీరాలి.

36. ఇప్పుడు, దేవున్ని నీవు కొద్దిగానైన కలిగి వుండి, ఇలా అందువు "అవును ప్రభువైన యేసూ, నేనొక పాపిని నీప్రేమకు నేను యోగ్యుడను కాను. అయినా నీవు నన్ను ప్రేమించావు కనుక నేను నిన్ను నా రక్షకునిగా అంగీకరించుచున్నాను." తక్షణమే, అందులోనుండి నీవు బయటకి నడిపించెదవు, మరి అదేమిటి? నీవు అబద్దములాడుట ఆపుదువు. మోసము చేయుట ఆపుదువు. దొంగిలించుట ఆపుదువు. చేయకూడని వాటిని చేయుటను నీవు మానివేసెదవు. ఎందుకని? నీవు క్రైస్తవుడవని నీవు నమ్ముదువు. మరి నీవొక క్రైస్తవుడవని నీవు నమ్మినందున, వీపు వాటిలో నుండి పైకి లేచెదవు, మరో ఉన్నతమైన స్థాయిలోకి ఎక్కెదవు. ఇప్పుడు చూశావా?

ఇప్పుడు, నీవు రోగివైతే, ఇక్కడే నీకు స్వస్థత వున్నది. నీవు కేవలం దానిని నమ్ముము. ఇప్పుడు, నీకు నీవుగా దానిని నమ్మలేవు. నీవు మార్పునొందునట్లే ఏదో ఒకటి నీలో జరగాలి అది జరిగితీరాలి.

37. మొన్న ఒకరోజు నా భార్యను వేనెంతగా ప్రేమిస్తున్నానో చెప్పాను. కనుక, దాని గూర్చి నేను మాట్లాడాలని ఆమె నా నుండి ఆశించునని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు, బహిరంగముగా దానిని నేను చేయవలెనని అనుకొని దానిని రహస్యము (ఏకాంతము)గా చేసాను. వేనెంతగా ఆమెను ప్రేమిస్తున్నావో అనే సంగతిని నేనామెకి చెబుతున్నాను, అంతే కాదు మొదట్నుంచి నేనెలా ఆమెను ఎల్లప్పుడు ప్రేమిస్తున్నానో చెబుతున్నాను. నేనన్నాను. "నాకు ఏ తేడా అనిపించట్లేదు.."
ఆమె అన్నది, "ఓ, బిల్" ఆమె అన్నది ఎలా... ఆమె ఎంత లావు అవుతుందో, ఆమె వెంట్రుకలు ఎలా తెల్లబడుచున్నవో (నెరిచినవిఅగుచున్నాయో) దానిగూర్చి ఆమెతో మాట్లాడుచుంటిని.

నేనన్నాను, "ప్రియా, నువ్వు ఎంత లావు అయినా సరే, నీ వెంట్రుకలన్ని ఊడిపోయినా సరే నేను నిన్నింకా ప్రేమిస్తూనే వుంటాను" (నా ప్రేమలో ఏ మార్పువుండదు) చూశారా ? ఆ రకంగా ప్రేమించాలి అంటే నీలో ఏదో వుండి తీరాలి, అప్పుడే నీవు ఆ రకంగా ప్రేమించగలవు. మరియు ఆ వ్యక్తి ఇంకొకరిని ప్రేమించాలంటే...

38. పెళ్ళికాని యవ్వన బాలురగు మీకు, బాలికలగు మీకు ఇది చెబుతున్నాను. నీవు ప్రేమించుచున్న బాలికను నీవు కలిసికొన్నప్పుడు, ఆమెను గూర్చి ఏదో నీలో వుండును, అదే ఆమెను ప్రేమించునట్లు నిన్ను చేస్తుంది, మరియు అది అక్కడ వుండుటను బట్టే, నీవు అతన్ని ప్రేమించుదువు. అతడు అందగాడిగా ఉండొచ్చును, ఉండకపోవచ్చును, పైరూపాన్ని చూచుకోవు గానీ లోపలున్న దానిని బట్టే నీవు ప్రేమిస్తావు. అందం, పైరూపం లాంటి వాటిని నీవు అసలు పట్టించుకోవు. వారిని ప్రేమించుటలో ఏ మార్పువుండదు. ఇప్పుడు, నీవు ఇంకొంచెం మెరుగ్గా గమనిస్తావు, దానిని నీవు అమితంగా పట్టుకొంటావు, ఎందుకంటే నీవక్కడ గృహానికి చేరుకొనుటకు సమీపముగా వున్నావు.

మరి నేను... అది... దానికి బయటికి జరిగే ఏ వివాహమైన పతనమగును, అదెన్నడు సఫలీకృతం కాలేదు. వారెన్నడు సంతోషముగా ఉండలేరు. ఇప్పుడు, అది నేను చెప్పగోరే ఒక కార్యంచుట్టు వుండునట్లు నేను చెప్పాను.

39. మిత్రులారా, ఒక మార్పునొందిన జీవితం, లోపల ఏదో లేకపోతే, అది కూడా కలకాలం నిలువలేదు. అవును. అది నిలబడాలంటే లోపల ఏదో వుండి తీరాలి. నీవు చర్చికి వెళ్ళినప్పుడు, మరి నీవు అంటావు, "మంచిది నేను సంఘములో కలవబోతున్నాను. నేను బాప్తిస్మం తీసికొనగోరు చున్నాను.” నీవు చెప్పే ఆ మాటలు దాని కోసం హృదయంలో వున్న ప్రేమని బట్టి రాకపోతే ప్రయోజనమేమి వుండదు, నీవు కేవలం... నీవు చెయ్యగలిగినంతా, దేవుని యెడల నిజమైన ప్రేమలేకపోయినా మీరు సంఘములో చేరవచ్చును, బాప్తిస్మం తీసికొనవచ్చును.

కానీ నీవు క్రీస్తుయెడల నిజమైన మార్పునొందితే, క్రీస్తుకోసం ప్రేమను పొందితే, అప్పుడు నీవు నీ భార్యను లేక భర్తను నిజంగా అభిమానించు రీతిగానే క్రీస్తునందు నీ విశ్వాసాన్ని దృఢపర్చు కొంటావు (పోగుచేసికొంటావు, సేకరిస్తావు). నీవొక విశ్వాసాన్ని సేకరిస్తావు. అందులో నడుచుటకు నేనెరుగను, నీవు కేవలం - నీ గూర్చి ఏదో, నీవు పొందినది ఏదో - అది నిన్ను అక్కడ లంగరు వేయును, మీరు చూచారా ?

మంచిది, క్రీస్తు విషయంలో కూడా అదే సరిగ్గా అలానే వుండును. క్రీస్తు చెప్పే ప్రతిదానిని నీవు నమ్ముతావు. నీవు కేవలం దానితోనే నిలిచి వుంటావు. మరి అదే రీతిగా... అది కేవలం నిన్ను దానికి పైగా అది లేపుతుంది, ఆయన చేసిన వాగ్దానము "నీవు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వస్తే, నీవును నీయింటివారును రక్షింపబడును" అనే దానిని దేవుడు ఉనికిలోకి తెస్తాడు.

కావున ఇప్పుడు, దానిని నేను చెప్పాననుకొంటున్నాను మరి నేను - దీనికోసం నేను
ఎక్కువ సమయం, దాన్ని చెప్పుటకు ముఫ్పై నిమిషాలు పట్టింది. ఇప్పుడు అర్థమైందా నా మాటల భావం దాని గూర్చిన సంగతి అంతా అదే మరి.

40. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, కేవలం నీ రక్షణ కోసమే కాదు, నీ ప్రియులగు వారికోసం, బిడ్డ స్వస్థతకోసం లేక తల్లి స్వస్థతకోసం, సరైనది ఏదైనా సరే దానికోసం కూడా విశ్వాసముంచవచ్చు... నీకు తెలుసా, తప్పైన దానికోసం నీవు ఆశపడితే, నీకు- నీకు మొదటి స్థానములో దానిని అడుగుటకు తగినంత విశ్వాసముండదు, ఎందుకంటే అది నీకు తెలుసు అది సరైనది కాదని, చూశారా? నీవు యదార్థముగా వుండి నీవు అడిగేది సరైనదని ఎరిగితే, అప్పుడు నీవు నిష్కళంకమైన హృదయముతో దేవున్ని అడుగగలవు. అడిగేదాంట్లో ఏ స్వార్థపూరిత లక్ష్యం లేదని తెలిసికొని వుంటే, నీ ఉద్దేశ్యం, నీ లక్ష్యం సరైనవేనని ఎరిగివుంటే అప్పుడు నీవు దాన్ని ధైర్యంగా అడుగగలవు. బిడ్డవలే దానిని పొందుకొందువని నమ్మితే దానిని పొందుకొంటావు. అది నాకు తెలుసు.

ఇప్పుడు, ఇక్కడున్న బాలురలో ఒకని వయస్సంత వయస్సులో నేను క్రీస్తుయొద్దకి వచ్చానని నేననుకొనుచున్నాను. నాకప్పుడు ఇంచుమించు ఇరవై ఏళ్ళు వుండొచ్చు. మరి నేను ఇంతకాలము ఆయన్ని సేవించుచున్నాను. ఇప్పుడు నావయస్సు 52సం॥లు, 53వ పుట్టిన రోజులోకి ప్రవేశించ బోవుచున్నాను, ఇప్పుడున్నట్టు దేనికోసం నేనెన్నడు క్రీస్తుని అడగలేదని యధార్థముగా చెప్పగలను, యధార్థముగా ఆయన్ని అడిగితిని, సరైంది ఏదైన సరే, కానీ ఆయన నాకేమి ఇచ్చాడో లేదా ఎందుకు దానిని ఆయన నాకివ్వలేదో. అయితే తర్వాత కాలంలో దానిని నేను పొందకపోవటమే మంచిదని నాకర్థమైంది. చూశారా?

41. కానీ గుర్తుంచుకోండి, నీవు ఆయనని నమ్మినయెడల, ఆయన యందు విశ్వాసముంచుము, ఆయన్ని నమ్ముము, నీ స్వశక్తి మీద ఆధారపడి చెయ్యడానికి ప్రయత్నించకము. ఆయనతోనే నిలిచియుండుము. మరియు దాని హేతువులను తెలిసికొనుము.

అదెలా అంటే నువ్వు - నేను ఒకవేళ పదివేల డాలర్ల అప్పుకోసం ఇక్కడున్న బ్రదర్ వెల్చ్ వద్దకి వచ్చాననుకోండి. వాటిని నేను నొందకపోవచ్చును, ఎందుకంటే అంత పెద్దమొత్తం బహుశా అతని వద్ద లేకపోవచ్చునేమో. అయితే ఒకవేళ అతని వద్ద అది అందుబాటులో వున్నట్లైతే, మరి నేను- నేను పొందుకోగలను. ఇప్పుడు, వెనుకాముందు ఆలోచించకుండా నేను అతన్ని అడిగితే అతడు మాత్రం తన వద్ద లేకపోతే ఎక్కడ నుండి తెచ్చి సర్దగలడు, నేను వచ్చి, "వెల్చ్, నాకు ఒక వెయ్యి డాలర్లు ఇవ్వు"అని అడిగితే సరిపోతుందా, అసలు అడిగే పద్ధతే అది కాదు. దేవున్ని అడిదే పద్దతికూడా అది కాదు. నేను వచ్చి. బ్రదర్్వల్స్ తో ఇలా అందును, నేను ఇలా అడుగుతాను "బ్రదర్ వెల్చ్ నీతో కొద్దినిమిషాలు మాట్లాడవచ్చా ?''

"తప్పకుండా, బ్రదర్ బ్రెన్హామ్ ?" ఒకమూలకి తీసికెళ్ళి, తాపీగా కూర్చొని, ఇలా అడుగుతాను "బ్రదర్ వెల్స్, నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను, అదేమిటంటే, నీకు అవకాశముంటే నాకేదైనా ఒక వెయ్యిడాలర్లు సర్దుబాటు చేయగలవా?" సరే, అతడు... మరి అతడు... మేము పొందు... మేము స్నేహితులం, ఈ విధంగా అతడు నన్నైనా అడగొచ్చును, లేక నేనైనా సరే
అతన్ని లేక సహోదరులైన మీలో ఒకర్ని అడగొచ్చును. ఎవరైనా సరే అది అంతే, మనం అంటాము "అవును" "ఇప్పుడు, ఇక్కడ ఎందుకని - నాకవసరమైనదంతా" నేను కూర్చోబెట్టి అడగాల్సిన పద్దతిలో అడుగుతాను, నేనిలా అంటాను "బ్రదర్ వెల్స్, నేనిక్కడ ఒక కూటములో వున్నాను, కానీ దానికి నేను పూర్తిగా వ్యతిరేకం. నేను-నేను త్వరగా పట్టణాన్ని విడిచిపెట్టవలెను. అయితే నేను ఒకనికి వెయ్యి డాలర్లు బాకీపడ్డాను. నేను-నేను ఏదో రకంగా దాన్ని తీర్చేవెళ్ళాలి. ఇప్పుడు నిన్ను అడగమని ప్రభువు నన్ను ప్రేరేపించాడు" మరి, విషయమంతా అతనికి వివరిస్తాను. "ఇప్పుడు -ఇప్పుడు వేరేచోట జరిగే కూటాల్లోనుండి నాకు నాకు వెయ్యి డాలర్లు రావల్సివుంది అయితే అది వచ్చేటప్పటికి ఇప్పటినుండి సుమారు మూడునెలలైనా పట్టవచ్చును. అది వచ్చిన వెంటనే నీకు తిరిగి ఇవ్వగలను, ఒకవేళ నీవు కోరితే దానిమీద వడ్డి కావాలాన్నా, వడ్డీతో సహా దానిని నీకు ఇవ్వగలను" అని విషయాన్ని పూర్తిగా స్పష్టంగా తెలుపుతాను. ఎందుకని. బాకీ తీర్చకుండా నేను ఆ పట్టణాన్ని విడిచి పెట్టను. ఒకవేళ అలా వెళ్తే నాకు చెడ్డపేరు వస్తుంది. మరి అంతట వారు ఇలా చెప్పుకొంటారు. "అతడొక మోసగాడు, దొంగ తప్పమరేం కాదు, మరి -డబ్బులు ఎగ్గొట్టి పట్టణమునుండి పారిపోయాడు?" చూశారా, నా భావం అర్థమైందా? మీకు సంగతిని వివరించి చెబుతాను. ఒక సహోదరుని వలే కూర్చొని దాని గురించి మాట్లాడెదను.

మంచిది, ఆ విధంగా నేను పద్దతి ప్రకారం, వున్న వాస్తవాన్ని వివరించి చెబితే - నా మాటలు నీకు నచ్చితే, ఇవ్వాలని మనస్సు కుదిరితే (అవకాశం వుంటే) నీవు అప్పుడు ఏదైనా చెయ్యగలవు. అవసరమైతే నీవు వెళ్ళి నీవాహనాన్ని లేక నీఇంట్లో ఏదైనా వస్తువునైన తీసికెళ్ళి కుదువబెట్టి డబ్బులు తీసికొనివచ్చి నాకిస్తావు. ఇప్పుడు, చూశావా, నీవు అలా చెయ్యగలవు, మీలో ఎవరైనా చేస్తారు. అలాగే నేను కూడా మీకు అలానే చేస్తాను.

42. వచ్చికూర్చొని దాని గూర్చి ఒకరితో ఒకరు తేటగా మాట్లాడుకోవటమే చాలా మంచి సంగతి, విషయం పూర్తిగా నీ దృష్టికి రావాలి (మీరు అర్థ చేసికొనుచున్నారా?) మన భావములను తేటగా పంచుకోవాలి "నీవు నాకు మిత్రుడవు, అందుకోసమే నేను నీ దగ్గరికి వచ్చాను".

ఇప్పుడు, క్రీస్తు విషయంలో కూడా సరిగ్గా అలాగునే వుండును. ఇలా చెప్పుము "నీవు నా ప్రభువు, నేను-నేను జబ్బు పడియున్నాను. నే... తానేమి చేయవలెనని వైద్యుడు నా విషయంలో చేతులేత్తేసాడు కానీ- కానీ నీవలన అది జరుగగలదని నానమ్మకం, ఎందుకంటే నీవే నా ప్రభువు" నీవు దానిని పొందుకొన్నావనే భావన నీలో కలిగేటంత వరకు దాని విషయమై ప్రభువుతో చెప్పుము -కేవలం చెప్పుము. మరి అదే నీ విశ్వాసము. "విశ్వాసమనునది అదృశ్యమైనవి వున్నవనుటకు ఋజువును, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమునై యున్నది".

మరి - నేను దానిని ఆవిధంగా అనుభూతి చెందితే, అది నేను పొందినంత మంచిగా వుండును. నిశ్చయము, నేను ముందుకు వెళ్ళెదను, ఎందుకంటే దానిని నేను పొందాను చూశారా, నేను చేసాను... నేను పొందినట్టుగా ఆయన దానిని నాకు వాగ్దానము చేసాడు. గనుక అది -అది అక్కడ స్థిరమగును మరి నేను దానిని నిరంతరం పట్టుకొనుచు ఎదురుచూచుచున్నాను.

చివరిగా, మొదటి సంగతి మీకు తెలుసా, పరలోకపు వసారా నుండి అది కుమ్మరింపబడి, క్రిందికి వచ్చుచున్నది. మరి నీవు - నీవు దానిని పొందుకొన్నావు. దానిని నీవు చూస్తావు "నీవు నీ యింటివారును రక్షింపబడుదురు”. నీవు భూమిని విడిచి పెట్టేలోగా వారంతా రక్షింపబడుటను
నీవు చూడకపోతే, నీవక్కడికి చేరుకొన్నప్పుడు సమయం వచ్చినప్పుడు... గొప్ప రాకడ వచ్చినప్పుడు, వారచ్చట వుంటారు.

43. ఇప్పుడు, నా భావం మీకు అర్థంమైందా ? చూశారా? విశ్వాసమును బట్టే మనం ప్రతి దానిని చేస్తాం. ప్రభువునందు విశ్వాసముంచుము, ఉద్యోగం నిమిత్తం ప్రభువును విశ్వసించుము. ప్రభువును విశ్వసించుము వేటకోసం... నీకు అవసరమైన (తగిన) భార్యను ఇస్తాడు. నీవు వివాహాము చేసికొనుటకు తగిన భర్తను నీకిచ్చునట్టుగా ప్రభువునందు విశ్వాసముంచుము, కొన్ని క్రొత్త గృహోపకరణములను ప్రభువు నీకు దయచేయునట్లు ప్రభువుని నీవు విశ్వసించుము. లేదా ఖాళీ అయిపోయినా, తైలము లేక ఎండిపోయినా, తినుటకు ఆహారము లేకపోయినా, పిల్లలు లేదా సీసా ఆకలితో పస్తులుండినా అందుకోసం ప్రభువుని విశ్వసించుము.

దేని కోసమైనా సరే ప్రభువును విశ్వసించుము. చూశారా? అది సరైనది అయినంత కాలం నీవు ప్రభువునే విశ్వసింపవచ్చును చూశారా ? అది నీకు కలుగును (ఉనికిలోకి వచ్చును) అది నా జీవితంలో ఎన్నడూ అది తప్పిపోవుటను నేను చూడలేదండి! గాడ్ బ్లెస్ యూ.

మీరు నా కొరకు కొన్ని ప్రశ్నలను చదవటం ఎలా, నా కోసం వాటిని చదవగలరా ? వీటిని నేను సరిగ్గానే విందునని నేననుకొనుచున్నాను. మిమ్మును ఎక్కువసేపు వుంచాలని ఇప్పుడు నేను అనుకోవట్లేదు. బహుశా ఇంకో పది నిమిషాలు మరియు - మరియు అక్కడ వాటిని చదువుటకు కొద్ది సమయాన్ని జిమ్మీకి, అతనికి ఇచ్చెదము, అలాగే వీలైతే నేను... మరి వారు నన్ను సూటిగా తేటగా అడుగుదురు మరి నేను వారికి చెప్పలేకపోతే, సరే మీరు గ్రహిస్తారు.

44. కానీ మీకు అర్థమైందా నమ్మటం అని నేను చెప్పిన దాని బావం ? "ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము మరి నీవును నీ యింటి వారును రక్షింపబడుదురు" నీకొరకు నమ్ముము, నీ ఇంటివారికోసం నమ్ముము, వాటిని పొందుకొంటావు, నీవిలా అనవచ్చును, "మంచిది, నాకు భాగవదని వైద్యుడు అన్నాడు" సరే, నీవు ప్రభువును విశ్వసిస్తే నీకు తప్పక బాగవుతుంది.

"మంచిది, నాకు ఏ పనిలేదండీ," అయితే ప్రభువును విశ్వసిస్తే నీవు చేయటానికి పని నీకు దొరుకును, చూశారా, "ఇటువంటి పరిస్థితుల్లో నేనేం చెయ్యాలోనాకు పాలుపోవట్లేదు." ప్రభువునందు విశ్వాసముంచుము. అది ఇప్పుడు నాతోను మరియు అక్కడ భార్యతోను వుండుటను చూడుము. జఫర్సన్విల్ వదిలి వెళ్ళమని ప్రభువు నన్ను కోరుచున్నాడని నేను ఎల్లప్పుడు తలంచుచుంటిని, ఇప్పుడు, అదొక చోటుకి చేరుకొన్నది. గనుక నన్ను నేను ఆయనకి సమర్పించు కొనవల్సి వుంది.

కావున, నేనిక్కడ వున్నాను. ఈ రాత్రి నేనెచ్చట వుంటినో ఆయన ఎరిగియున్నాడు కాబట్టి ఆయన నన్ను ఎక్కడికి పంపినా, నేను అక్కడికి వెళ్ళెదను. ఆయన నన్ను ఏమి చేయమన్నా నేను దానిని చేసెదను. ఆయన చెప్పిందే నాకు శిరోధార్యము, మీరు చూశారా?

45. మంచిది, జిమ్మీ, నా బాలుడా వాటిని (ప్రశ్నలు-జవాబులు) నీవు కలిగియున్నావా? (సహోదరుడు ఒక ప్రశ్నను చదువుచున్నాడు "ఎత్తబడుట (కొనిపోవుట) జరిగినప్పుడు, విశ్వాసుల యొక్క కుటుంబమంతయు, భార్య మరియు పిల్లలు అందులో ఉండెదరా? వారు యేసుక్రీస్తును తమ రక్షకునిగా నమ్మి విశ్వసించారు? -సంపా)
అవును, అవును, కుటుంబమంతా ఎత్తబాటులో వుండునా? ఆవును గడసంచండి. అవును వుండును, చూశారా? ఇప్పుడు మీరు గమనించినట్టైతే, ఎత్తబడుట(కొనిపోబడుట) అనే విశ్వవ్యాప్తంగా జరుగబోయే కార్యం. మరి ఎలా ఆదివారం చెప్పేన పాఠమును పీఠంతో పొందుకొన్నారా? "దానియేలు డెబ్బది వారములు" ప్రకారం మనం మన కాలానికి అరతములో వున్నామనే సంగతిని మీరంతా బాగా గ్రహించారా (తేటగా అర్ధంచేసికొన్నారా??

మీరంతా ఆదివారం నాడు వచ్చారా? వచ్చారు కదా? అవును, మంచిది, సరే సహోదరు వెల్చ్, దానియొక్క టేపులను నీవు కలిగియున్నావా? మీలో కొందరు దాన్ని వినగలిగారా ? మరి దానికి సంబంధించిన మ్యాప్(రేఖాచిత్రము)ను మీరు కలిగియున్నారా? మీరు తీసికోలేదని నేననుకొనుచున్నాను. మరి దానిని గీయుదును తద్వారా ఇక్కడ లేని వారికి, దానిని వివరించి చెప్పవచ్చును. (మీరు గమనించారా?) తద్వారా వారు కూడా దాన్ని తెలిసికొందురు. నా సొంత మాటలు కాదు గానీ ప్రతీది అది లేఖనానుసారముగానే వున్నదన్న సంగతిని మీరు చూడాలని నేను కోరుకోనుచున్నాను, కాలము యొక్క అంతమందు మనము వున్నామని, దానిని లేఖనమే ఋజువు చేసినది.

46. ఇప్పుడు, సహోదరులగు మేము నేడు మాట్లాడుకొనుచుంటిమి. మీరనవచ్చు "మంచిది సహోదరుడా బ్రెన్హామ్ ఎత్తబాటు అనేది అంత సమీపంగా వుందని నీవే చెప్తున్నావు. మరి నీవు చేపలవేటకు వెళ్ళుట ఎందుకు? నిరంతరం నేను దాని మీదనే మనసు పెట్టాననుకోండి, అది దాదాపు నీ మనస్సును విపరీతమగునట్టు చేయును. క్రీస్తు నెరుగక ఇక్కడ పాపములో బ్రతుకుచున్న వేలాదిమందిని గురించి నీవు ఆలోచించుము. మరి నేను అనుకొంటాను "నేను ఇక్కడ వున్నాను, నేనేమి చేయగలను ?”

కానీ నేనిలా అనుకొందును. దేవుడు పిలువకపోతే నేను ఒక్కరిని కూడా రక్షించలేను. చూశారా? నేను దాన్ని చెయ్యలేను. నేనేమి చేసినా ఒక్కరిని కూడా రక్షణలోనికి నడిపించలేనండి. కానీ "తండ్రి నాకు అనుగ్రహించిన వారందరు నా యొద్దకు వత్తురు" పలాని చోటుకి వెళ్ళమని ఆయన నాకు చెప్పకపోతే నేనేమి చేయగలను? చూశారా?

కనుక నేనేమి చేయుదునంటే, దాని గురించి, దాని విషయమై నేనేమాత్రం విచారించను. ఒకవేళ అలా చేస్తే అదింకా అధ్వానంగా అగును. దాని విషయమై నేను సంతోషిస్తాను. అది వచ్చినప్పుడు నేను కేవలం సిద్దపడి సర్దుకొని వెళ్ళిపోతాను, మీకుతెలుసా, ప్రభువా ఇచ్చట నేవున్నాను నేను కేవలం ఎదురుచూస్తున్నాను.

47. మరిప్పుడు, ఏమి జరుగునో చూడండి. ఎత్తబడిన విశ్వాసులు, ఆదివారం గీసిన చార్టులో మీరు గమనించినట్లైతే... ఆదిమ పెంతెకోస్తు సహోదరులు- లేదా ఇటీవల పెంతెకోస్తు సహోదరులు దానిని ఇవ్వరు- ఆ వెనుకటి సంఘాలు అక్కడ అవసరమైన చోటు ఇవ్వరు, దానిని నే నమ్మను. అయితే నా నమ్మకం ఏమిటంటే తిరిగి జన్మించిన ప్రతిక్రైస్తవుడు... మరి మనమెలా తిరిగి జన్మించాము? ప్రభువైన యేసుక్రీస్తునందు మనము విశ్వాసముంచినప్పుడు (చూశారా), మరి అంగీకరించినప్పుడు...

ఇప్పుడు, నేను నా మనస్సులో నమ్మాను అని నీవు చెప్పినంత మాత్రానా నీవు నమ్మినట్లే
అని నేను అనుకోవట్లేదు. నీవు నిజంగా క్రైస్తవుడవా కాదా అనే సంగతి నీ జీవితమే చెబుతుందని నేను నమ్ముదును. నేను - నీవు ఇలా అనొచ్చును, “ఏమి...”

ఈ దినమున అక్కడ దిగువున వున్న స్త్రీ ఒకరి కోసం లేక క్రైస్తవుడగు ఒక వ్యక్తి కోసం, మరొకరి కోసం అన్నది. మరి ఆమె అన్నది. "మీరు ఏ శాఖకి చెందియున్నారు ?" చూశారా

క్రైస్తవుడు అనగానే ఏ శాఖకి చెందినవాడై వుంటాడో అని వెంటనే తెలిసికొనగోరుతారు. అందుకు నేను అన్నాను “నేను ఏ శాఖకి చెందినవాడిని కాను, నేనొక క్రైస్తవుణ్ణి అంతే" మీరు చూశారా ఒక క్రైస్తవుడు...

48. మీరు అంటారు, "మంచిది, ఒక క్రైస్తవుడు అంటే ఒక క్యాంప్బెల్కి చెందినవాడా (పునరుద్ధరణ ఉద్యమకారుడైన క్యాంప్బెల్ను వెంబడించువాడే క్యాంబెలైట్)" లేదండి, అది -అది... తమ్మును తాము క్రైస్తవులుగా పిలుచుకొంటారు, కానీ వారు కారు. చాలామంది జనులు తాము క్రైస్తవులు కానప్పటికి క్రైస్తవసంఘమునకు తాము చెందియున్నామని అనుకొనుటను నేనెరిగియున్నాను. క్రైస్తవసంఘమును గూర్చి క్రైస్తవసేవకులు కూడా అదే చెబుతారు, అలాగే క్రైస్తవులు కానీ అనేక మంది సభ్యులను తాము కలిగియున్నామని చెబుతారు.

క్రైస్తవుడు అనగా నీవు వెళ్ళె ఒక సంఘము కాదండి, గానీ దేవుని కుటుంబములో జన్మించిన ఒక అనుభవమై అది వున్నది.

49. ఇప్పుడు, గమనించండి, ఎత్తబడుట అనేది విశ్వవాప్తంగా జరిగే ఒక కార్యము, అందుకే ఆయనిలా అన్నాడు, "పొలములో ఇద్దరుందురు, మరి నేను ఒకని కొనిపోతాను. ఒకరు విడువబడును, ఇద్దరు ఒక మంచము మీద పరుండెదరు. వారిలో ఒకరిని నేను కొనిపోతాను, మరొకరు విడువబడును" మీరు గమనించారా, భూమికి ఒక ప్రక్కన చీకటిపడును, అప్పుడు ఇద్దరు ఒక మంచము మీద నిద్రింతురు, భూమికి ఒక ప్రక్కన అది కోతకాలముగా వుండును, అప్పుడు ఇద్దరు ఒక పొలములో వుందురు. చూశారా? ఒక పెద్ద ఎత్తబాటు వచ్చును అనే దానిని అది చూపిస్తుంది. అది అనగా లోకములో నుండి తీసికొనిపోబడుటై యున్నది. చూశారా? "పొలములో ఇద్దరుందురు, నేను ఒకరిని తీసికొనిపోతాను మరియు ఒకరు విడువడుదురు. ఇద్దరు మంచము మీద వుందురు, నేను ఒకరిని తీసికొనిపోతాను, ఒకరు విడువబడుదురు.”

50. ఇప్పుడు, మనం -మనం చూస్తాము, అదేమనగా... ఆ గొప్ప మహాశ్రమకి ముందు గ్రంథములో కనుగొనబడిన ప్రతిఒక్కరు ఆ దినమున విమోచింపబడతారు (తప్పింపబడతారు). గనుక, మీ పిల్లలుగానీ, మీతల్లీ మీ ప్రియమైనవారు గానీ, వారెవరైనా సరే, వారిపేర్లు గొఱ్ఱపిల్ల జీవగ్రంథములో వారి పేర్లు వున్నట్లైతే నా ప్రశస్థపిల్లలారా, మీరందరు అచ్చట వుంటారు.

మనం ఎక్కడున్నా పర్వాలేదు, అయితే- అయితే నేను... విదేశాలకి విమానయానం చేసినా, మరి విమానాలు గాలిలో పేలిపోయినా, ఈ శరీరములో ఒక చిన్నబాగం కూడా కనబడక పోయినా, ఎత్తబాటుకి ఏమాత్రం సంబంధం లేదండి. చూశారా? ఎట్టి మార్పు అందులో వుండదు. నిశ్చయంగా నేనచ్చట వుండుట ఖాయం. దాని గురించి నీవేమాత్రం కలవరపడకు (ఆందోళన చెందకు) నీతో కరచాలనం చేయడానికి, నీతో కలిసి ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుల ప్రభువుగా రాజులరాజుగా ఆయనకి పట్టాభిషేకము చేయటానికి నేనచ్చట వుంటాను, చూశారా?.
బహుశా పౌలు దేహంలో రవ్వంత మట్టియైనా కనీసం దొరక్కపోవచ్చును. కానీ అతని దేహంలో తయారైన పదార్థములన్ని ఎక్కడో ఒకచోట వుండి వుండవచ్చును. కావున ఆ దినమందు అవన్ని తిరిగి సమకూర్చబడును.

51. నీవు మరణించినప్పుడు, నిజానికి నీవు మరణించవు. ఒక క్రైస్తవుడు మరణించడు. బైబిల్ నందు ఒక క్రైస్తవుడు మరణించుట అనేదే లేదండి.

అది లాజరు... ఆయన అన్నాడు - వారన్నారు "మన - మన స్నేహితుడు లాజరు నిద్రించి యుండెను" యేసు అన్నాడు, చూశారా, అతడు చనిపోయెనని ఆయన ఎన్నడూ అట్లేదు. అన్నాడు "అతడు నిద్రించుచుండెను.” వారన్నారు "ఓ, సరే అతడు నిద్రించుచున్నట్లైతే, అప్పుడు అతడు బాగానే వున్నాడని నేను భావించుచున్నాను. అతడు మెరుగ్గా కుదటపడుచున్నాడు" కనుక, ఆయన వారి భాషలో మాట్లాడవల్సి వుండెను.

ఆయన అన్నాడు. "ఇప్పుడు, ఇంకోరీతిగా... మీ సొంతభాషలో, అతడు చనిపోయాడు. మీ నిమిత్తం అతడు అక్కడ లేనందుకై నేను ఆనందించుచున్నాను. నేను వెళ్ళి అతన్ని మేల్కొల్పు తాను (లేపుతాను)" చూశారా? ఓ, అవును. చూశారా? నిద్రించుట, ఆయనింకా ఆయన సొంత -చూశారా?" మీనిమిత్తం మీకు తెలిసిందల్లా అతడు చనిపోయినట్టు. కానీ నాదృష్టిలో అతడు నిద్రించుచున్నాడు, మరి నేను అతన్ని లేపబోవట్లేదు (RAISE) కానీ నిద్రలో నుండి మేల్కొల్పబోవు చున్నాను(WAKE) చూశారా, నేను అతన్ని మేల్కొల్పబోవుచున్నాను.

52. మరి అలా -మీరు మీరు గమనించండి, స్వయంగా యేసు మరణించినప్పుడు... చూశారా అక్కడ దేహము యొక్క మూడు భాగాలు. ఒక ఆత్మ (SOUL) మనలో మూడు భాగాలున్నాయి. ప్రాణం ఆత్మ శరీరము (SOUL, SPIRIT, BODY). ఏడు సంఘకాలాలను గీసినట్టుగానే, నేను వీటిని అక్కడ గీసాను, దేహంలోకి ప్రవేశించే ఐదు ద్వారాలు. చూశారా, అవి రుచి, అనుభూతి, వాసన, గ్రాహ్యం(వినికిడి) మరియు మనసాక్షి. సరిగ్గా ఆత్మకి కూడా ఈలాగుననే ఐదు వున్నాయి. మరి - ఆత్మలో ఒక గది వుంది, అది సొంత (స్వేచ్చ)గా నిర్ణయాలు తీసికొనే సామర్థ్యం. మీరు చూశారా ? దానిని కాదనవచ్చును- అవును అనవచ్చును, అది నీ ఇష్టంమీద ఆధారపడివుంది.

మరి ఇప్పుడు, ఒకవ్యక్తి క్రీస్తుని అంగీకరించినప్పుడు రక్షించబడతాడు, మీ కుటుంబమంతయు, మీ ఇంటివారందరు, భూమ్మీద ప్రతి కుటుంబము (క్రీస్తునిఆంగీకరించిన కుటుంబము -ఆము) రక్షించబడును, ఇప్పుడు... లేదా లోపలికి.

53. క్రీస్తు మరణించినప్పుడు, ఆయన పిలువమీద నుండి తీయకమునుపు ఆయన తవ ఆత్మమ దేవునికి అప్పగించాడు. ఆయన ఇలా పలికాడు, "నీ చేతికి నా ఆత్మము (SPIRIT) అప్పగించు చున్నాను". ఆయన ఆత్మ (SOUL = ప్రాణము లేక అంతరాత్మ లేదా ఆయన మవసాక్షి) పాతాళంలోకి వెళ్ళి ప్రకటించెనవి బైబిల్ చెప్పుచున్నది. మరి ఆయన దేహం సమాధిలోకి వెళ్ళెను. "చెజలోవున్న ఆత్మలయొద్దకి అనగా ఇప్పుడు చూడండి, లేఖనాల యొక్క అడ్డుకట్టడ (BARRICADE) వెనుకనే ఆయన వున్నాడు. అందుకే మూడు దినముల వరకు ఆయన లేవలేదు. మరి ఆయన ఆత్మ దేవుని సన్నిధిలో వుండిపోయెను. ఇప్పుడు మూడు దినములు తర్వాత ఆ అడ్డుకట్టడ తొలగించబడినది. ఆ విధముగా లేఖనము నెరవేరినది. అప్పుడు ఆయన పునరుద్దానుడాయెను. తాను చనిపోకముందే ఆయన ఇలా పలికాడు. అన్నాడు "నా ప్రాణము
పెట్టుటకును నాకు అధికారము కలదు, తిరిగి తీసికొనుటకు నాకు అధికారము కలదు".

ఇప్పుడు, దాని గూర్చి ఆలోచించండి. ఈ రాత్రి నాకు తెలిసినంతమట్టుకు ఇక్కడ వున్న మీరంతా క్రైస్తవులే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీలో వున్నది అనగా మీలోవున్న ఆత్మయే. మిమ్మును లేవనెత్తే (పునరుద్దానం ఇచ్చే) ఆత్మ అయివున్నది. నీ ప్రాణము పెట్టుటకు నీకు అధికారము కలదు. క్రీస్తుకోసం ఇప్పుడు నీవు దానిని చేయుచున్నావు. మరటు పిదప దానిని తిరిగి తీసికొనుటకు నీకు అధికారము కలదు. చూశారా? దానిని పెట్టుటకు నీకు అధికారమున్నది, దానిని తిరిగి తీసికొనుటకు నీకు అధికారము కలదు.

నీలో వుండి నిన్ను లేవనెత్తే అదే దేవునిఆత్మ, క్రీస్తులోవుండి క్రీస్తుని మరణంలో నుండి పైకి లేవనెత్తెను. కనుక చూశారా?దానిని పెట్టుటకు, దానిని తిరిగి తీసికొనుటకు నీకు అధికారం కలదు.

54. మరి నీవు చనిపోయినప్పుడు, లేదా - మరి నీవు- నీ ప్రియులు లేదా మనకంటే ముందుగా వెళ్ళినవారు, వారు చనిపోలేదు. వారి ఆత్మలు దేవునివద్ద వున్నవి, వారి ప్రాణం లేక అంతరాత్మ(SOULS)లు దేవుని బలిపీఠము క్రింద వున్నవి. వారి శరీరములైతే సమాధిలో వున్నవి, మరి అవెక్కడున్నవో వారు దానిని సరిగ్గా ఎరిగియున్నారు. కనుక ఏమి జరుగును? లేఖనాలన్ని నేరవేరినప్పుడు, బైబిల్ నందు ఇలా చెప్పెను, "బలిపీఠము క్రిందున్న ఈ ఆత్మలు మొట్టి పెట్టుచు న్నవి,” “ప్రభువా ఇంకెంత కాలం, ఇంకెంత కాలం?" వారు భూమ్మీదికి దిగివచ్చి శరీరముల యందు వుండగోరిరి. ఆయన అన్నాడు "క్రీస్తు విషయమై మీరు ఎలాగైతే శ్రమపడి సాక్ష్యము పొందారో, ఆలాగే మీ సహదాసులు కూడా పొందే వరకు, కొంచెం కాలం మాత్రమే వుండుడి" మరి ఆ లేఖనము నెరవేరిన వెంటనే, అప్పుడు వారి ఆత్మలు తిన్నగా అక్కడ బలిపీఠము క్రిందికి దిగివచ్చి, ఆ అంతరాత్మలను తీసికొనును. మరి ఆ అంతరాత్మలు తిన్నగా దిగివెళ్ళి దేహములను పట్టుకొనును, అక్కడ నీవు వుండి, తిరిగి లేస్తావు (పునరుద్ధానము చెందుతావు). దాన్ని తలంచుము. ఈ రాత్రి ఈ భవనములో వున్న ఇదే పరిశుద్దాత్మ, ఇక్కడ నా హృదయములో ఇప్పుడున్న ఇదే పరిశుద్దాత్మ అంత్యదినమందు నన్ను లేపును.

55. ఇప్పుడు నాలోవున్న ఈ పరిశుద్దాత్మ. ఒక యవ్వన అక్షయ శరీరము నాకు వుండుటను చూచును మరియు ఎన్నడు వెళ్ళ... నీలో వుండిన అదే పరిశుద్దాత్మ నీ యొక్క నెరిసిన జుట్టును, లేక అటువంటి దేనినైనా లేకండా పోవుటను చూచును. మరి నీవు ముసలిప్రాయం, నీవు బాగా వృద్ధుడవైపోయి, గడ్డం మీసాలు బాగా పెరిగిపోయి, ఒంగిపోయి నడుచుచు వుండినా, అది నాకు రవ్వంత వ్యత్యాసము కూడా వుండదు. ఎందుకంటే అది పరిశుద్దాత్మ దానిని తాకి ఆ దినమందు ఒక యవ్వనస్థునిగా యవ్వనురాలుగా మార్చును. అదే బైబిల్. అది వాస్తవం. మనలో ఇప్పుడు, ఇప్పుడు వున్న ఆత్మ. రాబోయే వ్యక్తి కాదండి, మనలో వున్న అదే వ్యక్తి. అది నీలో వున్న దేవుడే. మరి ఆయన లేపుతాడు... నీ అంతట నీవే లేవ వచ్చును. అలాగైతే మరి ఇప్పుడెందుకు అది జరుగుటలేదు? ఎందుకంటే, చూడండి, అక్కడ నిన్ను లేఖనాలు ఎత్తిపట్టుకొన్నాయి. (ఆపుతున్నాయి). ఎత్తబాటు జరిగే వరకు నీవు వేచి వుండాలి.

చూసారా, నీవున్నది అక్కడే. నీవక్కడ వేచివుండాల్సిందే. చూశారా? దీనికంటే ఉన్నతమైనా దాన్ని
నీవు పొందుకొనుటకు అనుమతించబడలేదు. ఒకవేళ అదే అయితే, ఎందుకు, మన మంటాము-నేనంటాను - మనకోసం మన సొంత లోకాన్ని నిర్మించుకొందాం. నీవొక ప్రపంచములో నివసిస్తూ, నేనొక ప్రపంచములో నివసిస్తు వుండినట్లైతే, మరి ప్రభువైన యేసు ఆగమన మనేదే వుండదు మరి. మరి అది ఏ విధంగా వుండును? చూశారా?

56. కానీ అది చెయ్యడానికి నీకు అధికరమున్నది. ఆఖరికి దేవుని యొక్క చిన్న నీడ కూడా దేనైన్న చేయగలదు. ఎందుచేతనంటే, గమనించండి, ఆయన -ఆయన సర్వశక్తిమంతుడు. మీకు తెలుసా, సర్వశక్తిమంతడు అంటే... ఆయన అనంతుడు, అనంతుడు, అనంతుడు మరియు సర్వశక్తిమంతుడు. ఆయన అనంతుడు (అపరమితుడు) ఏమిలేదు... సరే నీవు - నీవు - నీవు దానిని వివరించలేవు అని మీకు తెలుసా. ఒక కెమెరా వలే అనంతము, అనంతము. అది అలా ముందుకి వెళ్తునే వుండును.

మరి సర్వశక్తిమంతుడనగా మహా బలశౌర్యము గలవాడు. ఆయన సుదూరాన... అక్కడ అవతల నిలబడి, ఒక అద్దము ద్వారా చూచుచుండెను, ఆ రాత్రి ఆ ఖగోళశాస్త్రవేత్త (నక్షత్రశాస్త్రజ్ఞడు) ఆ పెద్ద అద్దము గుండా చూచుటకు నన్ను లోనికి తీసికొనిపోయాడు, మరి నేను అక్కడ నిలబడి అంతరిక్షంవైపు అమర్చియున్న పెద్ద అద్దము గుండా నూటిరవై మిలియన్ల కాంతి సంవత్సరాల దూరాన్ని నేను చూడగలను, విశాలమైన ఆ ఆకాశములో నూట ఇరవై మిలియన్ల కాంతి సంవత్సరాల్ని చూడగలిగితిని...

57. మంచిది, ఇప్పుడు చూస్తున్న బృహస్పతి (JUPITER) గ్రహం గూర్చి, అంగారక లేక కుజుడు (MARS) గ్రహం గూర్చి నక్షత్రముల గురించి మీరు మాట్లాడుచున్నారు. మంచిది, మై, ఆలోచించండి, ఒక వంద గురించి మరియు... కాంతి ప్రయాణం గూర్చి... ఏమిటది? ఎనభై... ఒక సెకనుకి, మరి నూటిరవై మిలియన్ల సంవత్సరాలు, దానిని నూట ఇరవై మిలియన్ల సంవత్సరాలతో లెక్కగట్టండి. అప్పుడు మీకేమి వస్తుంది? అది మైళ్ళు. ఓ, మై మీలాగనే... కేవలం మీలానే... అది మమ్మును మీలా అనిపిస్తుంది- చూశారా ?

కానిప్పుడు, మరి దానికి పైగా, అక్కడ వుండవల్సినవన్ని నక్షత్రాలు, చంద్రుడు వున్నవి... మరి ఆయన వాటన్నిటిని తన సొంత వాక్కుశక్తి చేత పట్టుకొని యున్నాడు. వాటిని ఏదైతే పట్టుకొని యుండెనో క్రైస్తవులగు మీలో అదే వుండియుండెను. ఓ,మై, చూశారా, చూశారా, నీవున్నది అక్కడే. కనుక అక్కడ నీవు ఎవరివో చెబుతున్నది.

58. చూశారా, ప్రజలు ఇలా ఆలోచించ ప్రయత్నించుదురు "మంచిది, నేనొక క్రైస్తవుణ్ణి, నేను అత్యల్పుడను అని నేననుకొంటున్నాను" లేదండి, నీవు అలాకాదు. నీవొక క్రైస్తవుడివి, సహోదరుడా అది ఉన్నతమైనది... నీవొక దేవుని కుమారునివి. మన తండ్రి ఒకరాజు, నిశ్చయంగా, ఆమెన్ మన తండ్రి ఒక రాజైయుండగా, మనము-మనము ఆయనకి పిల్లమై వున్నాము. మనం ఆ రాజుకి రాజకుమారులము, రాజ కుమార్తెలమునై యున్నాము(ఆమెన్) చూశారా ? వుండాల్సినంత ఉన్నతముగా అది వుంది. స్వయంగా మన దేవుని యొక్క ఆత్మయే మనలో వున్నది. అంతే.

కనుక ఇక్కడ జరుగుచున్న వాటి విషయమై మనం మనస్కరించాల్సిన పన్లేదు, చూశారా, లెక్కలోకి వచ్చే ఒకచోటు వుంది. ఇది కేవలం ఒక పరీక్షసమయం మాత్రమే. తండ్రి తన కార్యమును
ముగించిన వెంటనే వెళ్ళెదము, మనం గృహానికి వెళ్తాం. చూశారా? దానిలో ఏ వ్యత్యాసం లేదు. 59. గనుక, దానియందు, అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, నీ పిల్లలు ఇంకా రక్షింపబడకపోతే, వారు రక్షణపొందేటంత వరకు విశ్వసిస్తూనే వుండుము, మరి యేసు చెప్పాడు, (ఇప్పుడు యెహాను 5:24 గుర్తుంచుకోండి) అన్నాడు " నా మాటలు విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవము కలిగివుండి తీర్పులోకి రాడు." అప్పుడు అతడు తీర్పులోనికి రాకపోతే మరెక్కడికి వెళ్తాడు? ఎత్తబాటులోకి, చూశారా? ఎందుకంటే ఎత్తబడుట అనంతరం తీర్పు వచ్చును. చూశారా? "తీర్పులోకి రాక, మరణంలో నుండి జీవములోకి దాటును" ఎందుకనగా వాడు ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించాడు. అది అద్భుతంగా లేదా? కనుక వారు, నీ పిల్లలు నీతో కూడా అచ్చట వుందురు. నీ ప్రియమైన వారు అచ్చట నీతో వుందురు. మరి నీతో కలిసి నేను కూడా అచ్చట వుండ నిరీక్షిస్తున్నాను. ఆమెన్. 60. మంచిది, జిమ్మీ బాలుడా నీ యొద్ద మరొకటి వుందా? (బ్రదర్ జిమ్మీ తరువాత ప్రశ్నను చదువుచుండెను; "విశ్వాసమును బట్టియే ప్రపంచము నిర్మించబడియున్నది. విశ్వాసమును గూర్చి కొంచం దయచేసి వివరించగలరా?" -సంపా)

ప్రపంచము రూపుదిద్దుకొన్నది... ఇప్పుడు, హెబ్రీ పత్రికలో మనం దానిని కనుగొనగలం... అదృశ్యమైన వాటిచేత ప్రపంచము తయారైనదని మనం అర్ధంచేసికొనగలం.

ఇప్పుడు, నేను-నేను త్వరపడెదను. ఎందుకంటే, ఆ చిన్న - అక్కడ అన్ని ప్రశ్నలున్నవని నేను గమనించలేదు. ఇప్పుడు మనం తీసికొందాం, చిన్న ప్రయాణానికి (యాత్రకు) తిరిగి వెళ్ళాలి. మరి-మరి ఇప్పటికే పది అయ్యింది. నేను అమ్మతో చెప్పాను, పదికల్లా నేను సిద్దంగా వుంటాను వెళ్ళడానికి, మీరు- మీరు ఒకనిముషంపాటు వేచివుండగలరా, నిద్రమత్తుగా వుందా? అలసిపోయారా ? గమనించండి?

61. సరే. చూడండి ఏది లేక ముందే, ఒక వెలుగు అనేది లేకముందే, ఒక ప్రపంచం లేకముందే, ఒక నక్షత్రం అనేది లేకముందే, ఒక అణువు లేకమునుపే, ఒక పరిమాణువు లేకమునుపే, దేవుడు వున్నాడు. దేవుడనే ఈ వ్యక్తి ఎవరు? ఆయన ఒక గాలినా? ఒక కాంతినా, ఆయన... ఆయన దేవుడు. నీవు చెప్పగల్గిందంతా అదే. చూశారా

أ

కొద్దిగా ఆలోచించు, ఒక పరిమాణువు... ఒక అణువు వున్నట్లైతే, దానిలో అనేక పరమాణువులుంటాయి, చూశారా? మరి ఆ పరమాణవులకి పైగా, వాటిలో ఒక్కటైనా లేకమునుపే, అక్కడ దేవుడు ఇంకా వున్నాడు. ఆయన అన్నిటిలో అంతటా నిండియున్నాడు. చూశారా?

ఇప్పుడు, ఈ దేవునియందు... ఇప్పుడు, మనం చూద్దాం - మనం చూద్దాం, ఆయన్నీ ఒక రూపములో అర్థం అవ్వటం కోసం. ఇప్పుడు, దేవుడనే ఈ వ్యక్తిలో... ఈ వ్యక్తిలో గుణలక్షణాలు వున్నాయి. ఆ గుణలక్షణాలు ఏవనగా ఆయనొక తండ్రి కావాలని, ఆయనొక వైద్యుడు (బాగుచేయు వాడు) కావాలని, ఆయన ఒక రక్షకుడు కావాలని అనే గుణలక్షణాలు. ఆ గొప్పవ్యక్తిలో ఇప్పుడు ఆ గుణలక్షణాలే వున్నవి, పరమాణువు లేక ఇంకేమి లేకమునుపే ఈ వ్యక్తి వున్నాడు, పరమాణువులు లేనపుడే దేవుడు వున్నాడు.

62. ఇప్పుడు, అందులో తండ్రిగా, కుమారునిగా, రక్షకునిగా అన్నిటిలో వుండే గుణలక్షణాలున్నాయి. ఇప్పుడు, వీటిని కలిగివున్న ఈ వ్యక్తి, ఇప్పుడు ఈ వ్యక్తియగు దేవుడు...
ఇప్పుడు, అయనేమి చేసాడు... చేసిన పిమ్మట మొదటి కార్యం, ఇలా చెప్పుకొందాం. ఆయన చేసిన మొదటి కార్యం పరమాణువులను చేయుట (మనకి తెలిసినంతమట్టుకు మనం విడగొట్టగల్గిన వాటిలో అదే సూక్ష్మమైనవి, అవే) మరి పరమాణవును ఆయన చేసిన తరువాత, ఒక్క సెకనులో ఆయన వందబిలియన్ల పరమాణువులను సృజించాడు. ఆయన చేసింది ఏమిటి ? అవి ఉనికిలోకి వచ్చునట్టుగా తన మాటను పలికాడు. మరిప్పుడు, మారు... ఇక్కడ ఒక చక్కని పాఠము వుండినది, దానిని తెలిసికొనుటకు మనకి సమయమున్నట్లైతే, చూశారా ?

ఇప్పుడు, ఆయన దానిని పలికాడు. ఆయన పలికినప్పుడు పరమాణులు మలుపు తిరిగాయి. అప్పుడు ఆయన అన్నాడు. "అణువులు కలుగునుగాక" మరప్పుడు అణువుల నియమాలు వచ్చినవి. అవి ఇంకను వాటి ధర్మ(నియమం)లోనే నిలిచివున్నాయి, అవింకా నడుచుచునే వున్నాయి మరియు ప్రయాణిస్తూనే వున్నాయి. సమస్తము దేవుని నియమాల ప్రకారమే పనిచేస్తువున్నాయి.

63. ఒకసారి నేను బ్రదర్ బాంక్స్ ఉడ్తో కలిసి ఒక వృద్ధుని యొద్దకి వెళ్ళాము, మీకు తెలుసా, అతన్ని చూడటానికి, నేను అతని గూర్చి మీకు చెప్పామ. అతడు వాతో సంభాషించుచుండెను... నేను అతన్ని అడిగాను అది ఇలా అని... అతడొక వాస్తికుడు (హేతువాది), అతన్ని అడిగాను, " ఏ విధంగా చెట్టులోవున్న దాని వనరు (రససారము,కణద్రవ్యము) ఆగస్టుమాసంలో చెట్టును విడిచి వేర్లలోకి వెళ్తుంది, అది అలా ఎలా వెళ్ళగలుగుతుంది?... దాని ఆకులు గోదుమ వన్నెలోకి ఏది మారుస్తుంది?"

అతడన్నాడు, "ఎందుకంటే పసరు..."

"ఏమిటి... పసరు ఎందుకు క్రిందికి దిగిపోతుంది ?"

అతడన్నాడు, "మంచిది, అది అంతే అది దిగిపోతుంది."

నేను అడిగాను, "ఒకవేళ అప్పుడు అది క్రిందికి దిగిపోకపోతే ఏం జరుగుతుంది.?"

అన్నాడు, "చెట్టు చనిపోతుంది(ఎండిపోతుంది)"

నేను అన్నాను. "మంచిది, చెట్టులో వున్న జీవం (పసరు) చెట్టు క్రిందువ్న వేర్లులోనికి దిగిపోవునట్లు ఏ తెలివి తేటలు (అవగాహనా జ్ఞానం) పనిచేసాయి? క్రిందికి దిగిపో అని ఏదో దానికి బోధించింది, లేకపోతే అది- అది- అది గడ్డకట్టి (స్థంభించి) చనిపోవును, ఆ చెట్టు చనిపోతుంది. చూశారా? మరి మనకింకా చలికాలం రాలేదు లేదా అటువంటిది లేదు. కానీ ໙໖..."

అతడన్నాడు, " మంచిది, అది- అది కేవలం ప్రకృతి"

చెప్పు"చూశారా "అవునా, అయితే ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటో వాకు

ప్రకృతి అనగా దేవుని నియమమే(చట్టం), అవును, అది దేవునియొక్క చట్టము (నియమము).

64. ఇప్పుడు, విశ్వాసమే దేవుని నియమము (చట్టము) (చూశావా), సరిగ్గా అదే మను చెప్పుకొనుచున్న ఈ దేవుని శక్తి అంతయు విశ్వాసం ద్వారా మనకి అందుబాటులో వున్నది
"సమస్తం సాధ్యమే. ఏమాత్రం సందేహింపక కదిలిపొమ్ము అని ఈ పర్వతముతో చెప్పుము, నీవు దేనినైతే పలికావో అది ఉనికిలోకి వచ్చునని, దానిని నీవు కలిగివుండెదనని నమ్ముము." సులభమే, అక్కడ వున్న నియమాన్ని నీవు పొందుకొన్నట్లైతే, చూశారా? సమస్తమును నియంత్రించే నియమమే విశ్వాసము.

ఇప్పుడు, దేవుడు తన నియమాన్ని (చట్టాన్ని) బట్టి పరమాణువులు చేసాడు. అది దేవుని నియమము. పిమ్మట దేవుడు అణువులను కలుగజేసాడు. అటు పిమ్మట దేవుడు దాని ద్వారా సూర్యున్ని సృష్టించాడు. మరి అందును బట్టి, సూర్యునిలోనుండి నక్షత్రములను సృజించాడు. నక్షత్రములలో నుండి... సూర్యునిలోనికి ఆ చిన్న ముక్కలు ఎగురుకొంటూ, ఆయన దేనిని కలిగివుండెను ? ఇంతకమునుపే ఆయన తన గుణలక్షణములు వాటికవే బహిరంగముగా ప్రదర్శితమై యున్నవి.

65. అప్పుడు లోకమనేది ఉనిలోకి వచ్చింది. లోకము వచ్చిన తదుపరి ప్రకృతి వచ్చెను. మరి ప్రకృతి(సృష్టి) వచ్చిన తర్వాత, ప్రకృతి నియమము వచ్చినది. లోకము వచ్చిన తరువాత... లోకము (సృష్టి) ఇచ్చటికి ఎలా వచ్చింది? దీనిని ఎవడైనను ఎలా వివరించగలదు ?నీకిష్టమైన రీతిలో నీవొక బంతిని త్రిప్పుము. దానిని గాలిలో విసురుము, అది రెండు రీతులుగా తిరుగదు, లేక సెకనుకు కోట్లసార్లు తిరుగదు, ఒకేచోట అది రెండురీతులుగా పరిభ్రమించదు. మరి, ఆరు సంవత్సరాల నమోదు పట్టికను మనం కలిగి యున్నాం. ఈ సృష్టి పరిభ్రమించుటలో ఒక్కసారి కూడా పొరపాటు పడలేదు, అది ఖచ్చితంగా పూర్తి పరిభ్రమనానికి ఇరవైనాలుగు గంటలే పట్టును, ఉన్నచోటునే అది స్థానమందు వుండినది చూశారా?

ఏమిటది? లోకమనేది లేనప్పుడు ఈ గొప్పవ్యక్తి వున్నాడు- ఒక లోకమనేది లేనప్పుడే, అక్కడ ఆ గొప్ప వ్యక్తి వున్నాడు. ఒక దేవుని నియమము దానిని నడుపుచున్నది. అదే దేవుని నియమము, ఆయన కేవలం దానిని ఉనికిలోనికి వచ్చునట్లు పలికాడు. ఆయన సృష్టికర్త. ఆయన సృష్టించాడు. చూశారా? మరి అందుకోసమే ఆ లోకము సృష్టించబడినది, లేకుండాయి

విశ్వాసమును బట్టి దేవుడు లోకమును సృజించాడు, అందుచేత ఆయన కలిగియున్న సొంత విశ్వాసమే లోకమును సృజించినది. మరి అది అలా... ఇప్పుడు, ఆయన...

66. చూశారా, పాపము అనే దాని యొద్దకి వచ్చుటకు ముందే - ఆయన క్రిందికి దిగివచ్చి వరున్ని మరియు అలాగే సమస్తజంతువులను సృజించాడు. ఆయన పాపాన్ని సృజించలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, నీతిదాత (తండ్రి) అయివుండి పాపమును సృజింపలేడు, మీకు తెలుసా, ఆయనేమి చేసాడో? ఆయన నరుని తన స్వరూపమందు చేసాడు, అతడు పడిపోవునని ఆయనకి ముందే తెలియును, అయినప్పటికి స్వేచ్చగా నిర్ణయం తీసికొనే నైతిక హక్కు(FREE MORALAGENCY) ను ఆయన అతడికి ఇచ్చాడు. ఆయన అన్నాడు, “ఇప్పుడు, ఈ వృక్షమును ముట్టవద్దు.”

ఇప్పుడు, ఆయన చెప్పజాలడు... ఇప్పుడు, అతడు దానిని తాకుతాడని ఆయనకి తెలుసును. కానీ ఆయన తాకజాలడు?... దానిని తాకకుండా అతడు. ఎందుకంటే ఆయన అన్నాడు." ఈ వృక్షమును తాకితే నీవు బ్రతుకుతావు, ఈ వృక్షమును తాకితే నీవు చస్తావు" చూశారా?
ఆయన మనిషి విఫలమౌతాడని ఆయనకి తెలుసు, అయినప్పటికి అతడు పడిపోవునట్లుగా అతన్ని సృజించలేదు. వాడు తనంతట తానే దానిని చెయ్యవల్సి వుండెను... అది దేవున్ని నీతిమం తున్ని చేస్తుంది. మీరు చూశారా? మనిషి తనంతటకు తానే పడిపోవును, అతడిని ఆయన తనకి దగ్గరగా వుండునట్లు సృజించాడు, అయినా అతనికి స్వేచ్చగా నిర్ణయాలు తీసికొనే నైతిక హక్కును ప్రసాదించాడు. కనుక, అతడు తాను తీసికొనే స్వేచ్చా నిర్ణయాలవల్లే పతనమయ్యెను. అతడు తనసొంత స్వేచ్చా నిర్ణయాలను తీసికొనే నైతికహక్కును బట్టియే పతనమయ్యెను.

మరినేడు, పిల్లలు పెద్దలగు మీలో ప్రతిఒక్కరి యెదుట ఆ రెండు వృక్షములు వున్నవి. మనం జీవాన్ని అంగీకరింపవచ్చును లేక తృణీకరింపవచ్చును. చూశారా? దేవుడు కేవలం పలికాడు అవి ఉనికిలోకి వచ్చాయి, లోకము రూపుదిద్దుకొన్నది. ఈ నేల దేవుని వాక్యమును బట్టియే వున్నది. ఇక్కడున్న ఇది దేవుని వాక్యమువలనే కలిగినది. మన దేహములు దేవుని వాక్యము. మరి ప్రతీది దేవుని వాక్యమువలనే ఉనికిలోకి వచ్చినది. చూశారా? ఇదంతయూ దేవుని నుండే ఉద్భవించినది.

మంచిది. అయ్యా. ఇప్పుడు - ఇప్పుడు, నేను చెప్పినది సరియైనదికాకపోతే, అది స్వస్థత ఇవ్వకపోతే ఎందుకు, నీవు - నీవు దానిని చీటి మీద రాసి నా గమనమునకు తెమ్ము. సంఘములోకి తెమ్ము?

67. సరే, సహోదరుడా జిమ్మీ (బ్రదర్ జీమ్మి తర్వాత ప్రశ్నను చదువుచున్నాడు. “కొరింథి మొదటి పత్రిక 16..12 ను వివరించండి..."- సంపా)

మనం చూద్దాం కొరింథి మొదటి పత్రిక 16:22, సరే, అయ్యా. ఒక్కనిమిషం. ఈ చిన్న - ఈ చిన్న లేఖనపు పాఠాలు నిజంగానే మనకి సహాయపడతాయి. అది- అది మిమ్మును బలపరుస్తాయి మరియు బలవంతుని చేస్తాయి, బలమైనవారిగా చేస్తాయి.

కుమారుడా, నీవు చెప్పినది పదహారా? (టేపు మీద ఖాళీ-సంపా)... అతని ఉండనియ్యుడి.." ఓ, మై గుడ్నెన్ (నామంచితనము). నేను చదవలేను- దానిని నేను ఉచ్చరించలేనని అనుకొంటున్నాను. (A-n-a-t-h-e-m-a M-a-r-a-m-a-t-h-a). మీలో ఎవరినొద్ద అయినా మరో బైబిల్ వుందా, చూచారా. ఏమిటి... అది ముక్కలైనట్టువుంది. అది అంత... ఎలా పలకాలి? అది ఎలా సంభోదించాలి... అది ఏమిటి ఫ్రెడ్ తీసుకోండి- మరొకటి... ఎవరినొద్దనైన వేరొక బైబిల్(మరో అనువాదం-అను) ఉందా? అందులో అది ఉందేమో చూద్దాం.

అనాతమా.మంచిది, అనాతమా అనగా ఏమిటి? ఇప్పుడు మీరు నన్ను పొందుకొన్నారా? మీకు తెలుసా, ఫ్రెడ్? ఎవరికైనా... అనాతమా ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా? మీవద్ద నిఘంటువు ఉందా, కొద్దిసేపట్లో దాని అర్ధాన్ని తెలుసుకొంటాం. ఒక నిఘంటువు తీసుకొని రండి.

68. మంచిది, దానిని అతడు తెచ్చేలోపు, బహుశా దానిని జవాబునివ్వగలను. మంచిది, అయ్యా. (బ్రదర్ జిమ్మి మరొక ప్రశ్నను చదువుచున్నాడు.. "ఆయన అన్నాడు సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని. దీనిని వివరించుము” - సంపా)

"మరి నేను చూచాను, తాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచాను" లూకాలో అది ఉంది... అది ఏ లేఖనంలోవుందో వ్రాసారా? సరే... మంచిది. అదక్కడే వుందని నేననుకొనుచున్నాను.
"సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుటను చూచానని ఆయన అనుచున్నాడు" ఇప్పుడు, అది... ఇప్పుడు దీని గురించి కొంత నేపద్యాన్ని చెబుతాను. ఇంకను మీకు గ్రహింపు కాకపోతే నాకు తెలియపర్చండి, ఇంకా తేటగా వివరిస్తాను. మీకు గుర్తుండా, మనం మనం వారి విషయం, లేఖనాలులో మన పాఠానికి మనం వచ్చినప్పుడు దాని గూర్చి ఇంకా తేటుగా తెలిసికొంటాం... మీకు తెలుసా, యేమా...

69. అపవిత్రాత్మల మీద తన శిష్యులకి యేసు అధికారమిచ్చిన వెంటనే సంభవించిన కార్యమది.

మరి వారు బయటికి వెళ్ళి దయ్యములను వెళ్ళగొట్టిరి. వారిని ఇద్దరిద్దరుగా పంది, ఆయన ఇలా చెప్పాడు. "అన్యుల నొద్దకు వెళ్ళొద్దు. కానీ ఇశ్రాయేలులో వశించిన గొర్రెల యుద్దకే వెళ్ళు డి. మీరు వెళ్ళి పరలోకరాజ్యమును ప్రకటించుడి, రోగులను స్వస్థపర్చుడి, దయ్యాలను పారద్రోలుడి," మరి ఇంకా. మంచిది, అప్పుడు... మరప్పుడు, వారు సంతోషముతో తిరిగి వచ్చి, ఆనందిస్తూ, (ఇప్పుడు, ఇది ఎక్కడ వుందో దీనిని, ఈ ప్రశ్నను అడిగిన వారికి తెలియును. చూశారా? ) సంతోషముతో తిరిగి వచ్చుచుండిరి. మరి ఆయన అన్నాడు - ఆయన "సంతోషించుడి మీ పేర్లు లేనందున.. దయ్యములు మీకు లోబడుచున్నందువ కాక పరలోకములో మీ పేర్లు వ్రాయబడియున్నవని ఆనందించుడి. ఆయన అన్నాడు "సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట నేను చూచాను."

చూడండి, ఆ సంఘమునకు ఇవ్వబడిన అధికారము ముందుకి సాగుచూ పాతాను రాజ్యాన్నంత టిని తలక్రిందులు చేయుచుండెను. మీరు చూశారా? అతడు తన చోట్లనుండి పడవేయబడుటను ఆయన చూచాడు. దేవుడు మరలా తన సంఘానికి అధికారము అనుగ్రహించాడు వెళ్ళుటకు...

ఆకాశము నుండి వాడు మెరుపువలే పడుటను ఆయన చూచియున్నాడు, పరిశుద్ధ స్థలాలు, మరటువంటి వాటిలో నుండి వాడు గిరా గిరా తిరుగుచు ఆ అధికారమును బట్టి, సంఘమునకు ఇవ్వబడిన అధికారం, వారు కలిగియున్న అధికారమునుబట్టి వాడు పడిపోవుట ఆయన చూచాడు (మీరు గమనించుడి?)

యేసు అన్నాడు "అపవిత్రాత్మల మీద మీకు అధికారమిచ్చాను" చూశారా? వారు నిజంగానే సాతాను రాజ్యాన్ని తలక్రిందులు చేసారు. నేడు దానితో మనమేమి చెయ్యగలము? ఓ ప్రైజ్ లార్డ్.

70. మంచిది, సహోదరుడా జిమ్మీ, బహుశా నీ వద్ద మరొకటి వుందనుకొంటాను (బ్రదర్ జిమ్మీ మరొక ప్రశ్నను చదువుచున్నాడు" గుఱ్ఱము యొక్క కళ్ళెమునకు రక్తము అనే దానిని వివరించుము" -సంపా)... కళ్ళెము తగిలించుట (అదువులో పెట్టుట), హర్మగిట్టోన్ (నా చా ప్రకటనలోనిది...

ఇప్పుడు, అంత్య దివాలలో, మనము ఒక చోటుకి వచ్చాము, అదేదనగా క్రీ.శ 70లో తీతు యెరూషలేము యొక్కగోడలను చెఱపట్టి, గోడలను ద్వంసం చేసాడు. ఆ గోడల లోపల లక్షలాది మంది యూదులు, అంతకంటే ఎక్కువ మంది. చివరికి స్త్రీలు, పిల్లలు సహితం చంపబడ్డారు, తమ రక్తము ఎంతో ఎక్కువగా చిందించబడినవి వారు ఆరోపించుదురు... మరి
సరే. అది అత్యంత హేయమైన చర్య... వారు- వారు పరిశుద్దాత్మను తృణీకరించినందునే అది వారికిజరిగినది.

చూడండి, ఇప్పుడు, దేవుడు, అతడు - వారు క్రీస్తుని తృణీకరించి ఆయన్ని బయెల్జబూబ్ అని పిలిచారు. ఆయన అన్నాడు. "దాన్ని బట్టి నేను మిమ్మును క్షమిస్తాను" కానీ అన్నాడు, "ఒక దినాన పరిశుద్దాత్మ వచ్చుచున్నాడు" తాను చేసిన అదే కార్యములను చేయుటకు. అన్నాడు, "దానికి విరోధముగా ఒక్కమాట పలికినా క్షమాపణ వుండదు."

71, మంచిది, పెంతెకోస్తు దినాన ఆ ప్రజలు కేకలు పెట్టుచూ, నాట్యంచేస్తూ, మద్యంతో మత్తులైన వారివలె నాట్యమాడుచూ, గట్టిగా అరుచుచూ, కేకలు పెట్టుచూ అట్టిరీతిగా చేస్తుండుటను వారు చూచినప్పుడు వారేమన్నారు? వారు పలికిన మాట ఏమిటి? వారన్నారు "వారు పూర్తిగా మద్యంతో

మత్తులయ్యారు, వారు త్రాగుబోతులు," వారంతా అలానే అన్నారు, అపో.కా. 2లో, వారిని చూసి అపహాస్యం చేసారు, వారికి తోచినట్టు మాట్లాడారు. ఏమి జరిగింది ? దేవుని రాజ్యమునకు బయటి వుండునట్లు అది వారికి ముద్ర వేసింది. చూచారా?

మరి అంతట యెరుషలేము చెరపట్టబడుట వచ్చినప్పుడు... ఇప్పుడు, దానిని మనము ప్రకటన 7లో చూడబోవుచున్నాము, తిరిగి దాని యొద్దకి మనం తిరిగి వద్దాం, ఈ ప్రశ్న ఎవరైతే అడిగారో, దాని దగ్గరకే తిరిగి వద్దాం. మరప్పుడు మరి వారు అప్పుడు...

తీతు దాని గోడలను పట్టుకొన్నాడు. చరిత్ర చెప్పుచున్నది, ప్రభువైన యేసు దినాలలో జీవించిన ఆదిమ చరిత్రకారుడగు జోసీఫస్ చెప్పాడు. అతడొక గొప్ప చరిత్రకారుడు. రక్తము ప్రవాహముగా పారినది - దాని గుమ్మముల గుండా వరదలా పెల్లుబికినది. వారు లోపలికి వెళ్ళి ఒకేసారి చాలా మందిని సంహరించారు.

72. ఇప్పుడు, అంత్యదినములయందు క్యాథలిజమ్ను, రోమనిజమ్ను, తదితర వాటన్నిటిని ఉచ్చులో ఆయన పడవేస్తాడని బైబిల్ ముందుగానే తెలిపినది, మరియు కమ్యూనిజం వారు, ఇంకా మొదలైన వారు అక్కడున్న మెగిద్దో లోయలో కూడెదరని, వారి మధ్యలో భయంకరమైన వధ జరుగునని, తద్వారా రక్తపాతం అధికముగా జరుగునని దానినే 'గుఱ్ఱము యొక్క కళ్ళెమునకు రక్తము తాకునని' అంటారు. చూశారా, అది ప్రకటనలో... అదంతా అంతే...

అయితే పరలోకపు తండ్రికి ఎంతో కృతజ్ఞతలు, ఎందుకనగా అప్పుడు మనమిక్కడ వుండమని నేననుకొనుచున్నాను. ఆయన కృపను బట్టి, మనమక్కడ మహిమలో వుంటాము. చూశారా? ఇద్దరు ప్రవక్తలు హర్మగిద్దాను యుద్దములో ప్రవేశించిన వెంటనే అది వుండును. అప్పుడు ఈ- అప్పుడు ఈ అన్యదేశములు బహు భయంకరమగు పాపములో వుండెదరు, ఆ విధంగా ముందుకి సాగెదరు. అలాగే సంఘముల సమాఖ్య ఇవన్ని ఒకచోటుకి వచ్చును, అప్పుడు దేవుడు సంఘమును, అనగా ఎన్నుకొనబడిన సంఘాన్ని వాటి మధ్యలో నుండి తీసివేయును. అలాగే నిద్రించుచున్న కన్యక అంతయు లేచి...

ఇప్పుడు, ఆ కళ్ళెము యొక్క ముక్క నిద్రించుచున్న కన్యకలో నుండి, ఆ దినమందు వుండిన వారందరిలో నుండి వచ్చును. మరియు కమ్యునిజం, వారందరు అక్కడ కలిసికొన్నప్పుడు, గడిచిన దినాలలో ఆయన ఎలాగైతే చేసాడో అలాగే తాను వారితో వాదించెదదని (పోరాడుదునని)
దేవుడు పలికాడు, మీకు తెలుసా అక్కడ ఆ లోయలో మరి అక్కడ అది గుఱ్ఱముల యొక్క కళ్ళెములను పట్టుకొని స్వారీ చేయును.

ఆ మాటకి అర్థం మీకు దొరికిందా? వారికి దొరికిందా... ఓ వారింకా వెదుకుచునే వున్నారు... ఓ అది కొనసాగించండి( ఇంకా వెదకండి), మంచిది.

73. (మూడు అపవిత్రాత్మలకు సంబంధించిన మరొక ప్రశ్నను బ్రదర్ జిమ్మీ చదువుచున్నాడు-సంపా) అది ప్రకటన గ్రంథములో దొరుకును, అబద్దప్రవక్త మరియు క్రూరమృగము తదితర వాటి నోటిలో నుండి అని వచ్చును.

ఇప్పుడు, మన యొక్క పాఠములో మనమిప్పుడు దానిని చూడబోతున్నాం (మీరు చూడండి?) మూడు అపవిత్రాత్మలు అనగా మూడు వాదములు. ఇప్పుడు దానిని నేను మాదిరులలో చూపుతాను, మరియు అది ఎక్కడ అది ఎక్కడ ఆరంభమైనదో. అదెక్కడ ప్రారంభించబడిందో మీరు చూస్తారు. చూశారా? కమ్యూనిజం, ఫాసీజం, నాసీజం వున్నాయి. అవి ఆత్మలు. కమ్యూనిజం అనేది ఒక ఆత్మ. అది నీపైకి వస్తుంది. చూశారా? అది ఒక ఆత్మ. మరది- అది అలావుండినది. కేవలం నేను దానిని... అది అది... అది నిజంగా అది కాదు. కానీ అది దానివలె మూడు ఆత్మలుగా వుంది. అదొక రకంగా దానికి ముందుగా వెళ్ళినదిగా వుంది. అయితే, బహుశా, మీకు తెలుసా ఎక్కడ... అది క్యాథలిజంలో వుంది. మీరు చూశారా? అయితే నేను- నేను- నేను దానిని చెప్పుటకు ముందు కొన్ని సంగతులను తేట పరిచెదను. (మీరు చూశారా?), నేను నిశ్చయంగా ఎరిగిన వాటిని....

74. అయితే అవి మూడు ఆత్మలు, కమ్యూనిజం, ఫాసిజం వలె... ఎన్నో ఏండ్లకి ముందే మనం వాటిని బయటికి తెచ్చామని మీకు తెలుసు. గుర్తుంచుకోండి, నేను మీతో చెప్పాను. అది జరుగబోయే కార్యముగా వుంది, అవన్ని కమ్యూనిజంలో మిళితమౌతాయి. మరి అక్కడ అది ముగిసిపోతుంది. ఆ సమయందు అది సరిగ్గా అలాగునే వుంటుంది. మీరు చూశారా? బయటికి వెళ్ళిన మూడు ఆపవిత్రాత్మలుగా అవి వున్నవి. అవి...

నేను వాస్తవంగా, ఇప్పుడు నిజంగా నమ్ముదును, మీరు అన్యధా భావించకపోతే దాని యొక్క రూపును (ఆకారమును) నేను మీకు చెప్పగోరుచున్నాను... దానిని నేను వివరించే క్రమంలో నేనేదైనా మరి కొద్దిగ దానికి జత చేసిన యెడల, మంచిది. మీరిలా అందురు. "ఆ రాత్రి దీనంతటిని కలిపి వివరించలేదుగా," చూశారా? నేను దానిని చేస్తే.

ఇక్కడ అది దాని బావమై వుంటుందని నాబావం. అది ఒక ఆత్మ అని నేను నమ్ముదును. నిద్రించుచున్న కన్యక, సంఘ సమాఖ్య, క్రీస్తుని తృణీకరించిన యూదా మతం. దానిని నిరాకరించిన యూదులు, మరియు క్యాథలిక్కులు ఎందుకంటే ఇది అబద్ద ప్రవక్తలోనుండి వచ్చుచున్నదని మీరు చూడొచ్చును (గమనించారా?) పోపు అను అబద్ద ప్రవక్త నోట్లో నుండి మృగము యొక్క నోట్లో నుండి అది వచ్చుచున్నది, చూశారా? అదంతయు ఎక్కడి నుండి బయటకి వచ్చుచున్నదో. దాని యొక్క నేపధ్యాన్ని మీరు చూడవచ్చును.

మరి ఆ మూడు అపవిత్రాత్మలే ప్రపంచమంతటిని హర్మగిద్దోను యుద్ధములోకి లాగును. చూశారా? ఆ వారియొక్క ఆ మూడు ఆత్మలే. అప్పుడు అక్కడే ఆ మూడు అయ్యోలను నీవు చూడవచ్చును. మొన్న ఒకనాడు నేను దానిని తెచ్చిన సంగతి మీకు గుర్తున్నదా. నేను చెప్పాను...
చివరి ఏడు తెగుళ్ళు, ఏడు ముద్రలు, మరియు మూడు అయ్యోలు, మరి రెండు- మూడు అపవిత్రాత్మలు, మరి అవి- అవి దానిగుండా వచ్చుచున్నవి.

75. సరే, మరొకటి వుందా, నీ దగ్గర? (ఒక బ్రదర్ మరో ప్రశ్నను చదువుచున్నాడు "బైబిల్ అంతటిలో యూఫ్రటీస్ నది యొక్క ప్రాముఖ్యత, ఆత్మీయ అర్థం ఏమై వుంటుంది" -సంపా)

ఆవును, యూప్రటీస్నది, ఇది ఎల్లప్పుడు గొప్పనదిగా వుండినది, ఎందుకంటే యూఫ్రటీస్ నదికి బైబిల్లో గొప్పగా చెప్పుకోదగ్గ స్థానమే వున్నది. మొదటిసారిగా దానిని మనం ఏదేను గుండా ప్రవహించుటను చూడగలం. యూఫ్రటీస్ పారుతుంది దానిగుండా. అది అచ్చటనుండి ప్రవహిస్తుం దని బైబిల్ సెలవిచ్చుచున్నది. తరువాత మనం చూస్తే, యూఫ్రటీస్నది, అదే నది తిన్నగా బబులోను గుండా ప్రవహించుటను మనం చూడవచ్చును. చూశారా? యూఫ్రటీస్నది బబులోను గుండా ప్రవహిస్తుంది.

ఇప్పుడు, తన పాత్రను దూత యూఫ్రటీస్ నది మీద కుమ్మరించగా అది ఎండిపోయినదని మనం చూడగలం, తద్వారా ఉత్తర దిక్కు రాజువచ్చును. అంత్యకాలమందు వారు హర్మగిద్దాను యొద్దకి వచ్చినప్పుడు సరిగ్గా అదే జరుగునని నేను అనుకొనుచున్నాను. చూశారా, వారు లోనికి వచ్చుటకు ఐగుప్తులేకుండా తిన్నగా రావల్సి వున్నది, చూశారా. తిన్నగా దిగువునున్న ఆ దేశాల గుండా, వారచ్చటికి చేరుకోవాలంటే యూఫ్రటీస్ని దాటుకొని రావల్సి వుండెను.

76. చూశారా, నేటికిని యూఫ్రటీస్ నది పారుచున్నది. మనకి -మనకది తెలుసును. మీరు గమనించండి ? మరి- మరి దక్షిణఅమెరికాలో అమెజాన్, ఐగుప్తులో నైలునది, మరి, యూఫ్రటీస్, మరి... ఓ, ఇంకొకటి ఏమిటది? ఏదేనులోనుండి బయలు వెళ్ళేవి రెండు నదులున్నాయి... మరి -యూఫ్రటీస్ నది, ఈ గొప్ప... దిగువునకు వచ్చుటకు అది దారిని ఇస్తుంది. చూశారా, ఉ త్తరదిక్కు రాజు వచ్చుటకు, రాజులు వచ్చుటకు దారి ఇస్తుంది.

అది వుంటుంది - అంత్యదినముల యందు జరుగబోయే హర్మగిద్దాను యుద్దకాలమున అది వుంటుంది. మీరు చూశారా? ఆ యూఫ్రటీస్ నది... వారంతానా? లేదా... అది వారందరు.

77. ఇప్పుడు, వారు క్రీస్తుని నిరాకరిస్తే, ఈ వ్యక్తి ఎలా వుండునో అనేది నా మనస్సులో తలంచుచు న్నాను. అవి కేవలం... అలాగే నీకు నువ్వే నిఘంటువులో దానిగూర్చి చూడుము. ఎందుకంటే అది ఏది కాదు... దానిని నేను మాట్లాడను... దానిని ఇక్కడ బహిరంగముగా దీనిని ఇప్పుడు మాట్లాడను. అయితే మీరు చూడండి, అప్పుడు దానర్థం ఏమిటో మీకే తెలుస్తుంది. అది...నీవలా, మరో మాటలో... అటువంటి వాటిని గూర్చిన సంగతులు లేఖనాల్లో రెండు మూడు చోట్ల వుండెను.

మరో మాటలో చెప్పాలంటే, నెబుకద్నెజర్ చక్రవర్తి చెప్పినట్టు, "పలాని - పలాని దానికి మ్రొక్కే ప్రతి ఒక్కడు... దానియేలు దేవుని వలన సమస్తము, అతని కుటుంబము కొట్టివేయబడును, అతని పిల్లలు దహించబడుదురు, అతని ఇల్లు పెంటకుప్ప అగును." చూశారా? ఆ మాటల అర్థమేమిటో మనం గ్రహించియున్నాము, అవి అలా బయటికి వచ్చి అలా చెప్పబడినవి. అయితే మీరు దానిగూర్చి నిఘంటువులో చూచినట్లైతే, అది చెబుతుంది దాని అర్ధాన్ని అది చెబుతుంది. మీరు చూచారా అదేమిటో?
78. మంచిది, ఈ చిన్న పురాతన సంగతులు వెలుగులో వచ్చుచున్నవి, మరి నేను-నేను-నేను ఎక్కువగా వాటిని వారిమీద రుద్దను- అలా చెయ్యవల్సి వచ్చినా సరే. ఎందుకంటే మీరు చూడండి, అది ఒక... అది.... ప్రతిఒక్కరు... రేపు మీరంతా పనుల్లోకి వెళ్తారా, ప్రభువు చిత్తమైతే నేను రేపు మియామికి వెళ్తాను. ఇప్పుడు సమయం పదిగంటల పదిహేను నిమిషాలైంది. మిమ్మును ఎక్కువ సేపు ఉంచాలని నేను అనుకోవట్లేదు. నా పిల్లలు నిద్రబోతున్నారని అనుకొంటున్నాను. అలాగే మీ పిల్లలు కూడా, మరి కాబట్టి మనము ఇచ్చట వున్నాం. మరి- చిన్న పిల్లలు తొందరగా నిద్రబోతారు.

అయితే దీనిని నేను చెప్పగోరుచున్నాను. అవి నిజంగా, వాస్తవంగా చాలా మంచి ప్రశ్నలు, వాటిలో ప్రతి ఒక్కటి, చాలా బాగుంది. ఇంకేదైనా ప్రశ్నవుంటే రాత్రికి లేక మరొకటి, టబర్నికల్ నందు, మీరంతా... ఆ ఉదయము నేను ప్రస్తావిస్తే, వాటిని మీరు నాకు అందజేయగలరు, అప్పుడు నేను కొంత సమయాన్ని తీసికొని, వాటిని ధ్యానించి, చెప్తాను.

79. మీకు తెలిసినట్లుగా, అది అవలీలగా (ధారాళంగా) చెప్పబడినట్టు, అంతట మీరు- దాని గూర్చి

మాట్లాడుటను ఆరంభిస్తారు, నేను ఏది చెప్పాలన్నా చాలా ఎక్కువ సమయం చెప్పే ఒక గొప్పవ్యక్తిని. మరిక్కడ ప్రసంగించుటలో నా ఉపాయము (కిటుకు)ను మీరు గమనించండి, అందుకొరకే నేను మిమ్మును దినమెల్లా వుంచుదును (చూశారా?), దాదాపు. నేను దీర్ఘముగా ప్రసంగిస్తాను.

అయితే మీరు బిల్లీగ్రహంను గమనించారా? ఇప్పుడు, బిల్లీగ్రహం ఒక తర్ఫీదువొందివ ప్రసంగీకుడు, మరి అతడు గొప్పవాడు. మరి బిల్లీగ్రహాం, అతడు తన అంశాన్ని తప్పిపోనివ్వడు. దానిని వెనుక నుండి, అటు ఇటు తిప్పి అంశాన్ని గట్టిగా దిగగొడతాడు. నిలకడగా ఎల్లప్పుడు అలా చేస్తాడు, అతడు ఎన్నడు తన స్వరాన్ని దిగిపోనియ్యడు, కష్టంగా, అంశం మీద అలాగే గట్టిగా దిగగొడతాడు. చూశారా?

పరిశుద్దాత్మ అతడిని ఆ విధంగా ప్రసంగించునట్లు జేయును, చూశారా? దానిని చేయుటలో అతని ఉపాయమది. అతడు దానిని ఆ విధంగా చేస్తాడు.

చార్లెస్ పుల్లర్, అతని గూర్చి మీలో అనేకులు వినియున్నారు. అతడొక అద్భుతమగు వృద్దుడు. మరి చార్లెస్ పుల్లర్, ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త (విశదపర్చువాడు) అతడొక- బోధించుట అతనికిష్టం- మీకు తెలుసా, అతడు విశదీకరించే విధానం. మరి ప్రతీదాంట్లో అతడు క్రీస్తునే చూపిస్తాడు, ఒక గొప్ప వృద్ధ బోధకుడు. అతడు ఎలా చేస్తాడో మీరు గమనించండి. అతడు ప్రసంగించడు (PREACH)గానీ బోధిస్తాడు (TEACH).

80. మంచిది, ఇప్పుడు, మీరు గమనిస్తే, నేను అనుసరించే చిన్న, సుళువైన విధానం ఇదే. నేనొక పాఠ్యాంశాన్ని తీసికొంటాను, నా పాఠ్యాంశం ఏదైనా కానివ్వండి, మరి నేను గతానికి వెళ్ళి నా పాఠ్యాంశాన్ని తీసికొంటాను. దానిని తీసికొని, దానిని నా అంశానికి అనుబంధంగా వరుసలో వుంచుతాను. మరలా వెనక్కి వెళ్ళి ఇంకేదో ఇక్కడ పొందుకొంటాను. దానిని తీసికొని ఇక్కడ దానినిచ్చట వుంచుతాను. పిమ్మట వెనక్కి వెళ్ళి ఇంకేదో ఇక్కడ పొందుకొంటాను, ఆ విధంగా ఇక్కడికి అంతటిని సమకూర్చుకొంటాను, దీనంతటిని నా అంశానికి జోడిస్తాను. అవన్ని వరుసలో
వుంచి ఒకేసారి నడిపిస్తాను.

గతంలో నేను చెప్పిన ప్రసంగాలను నేను కలిగివుండుటలో కారణం ఏమిటంటే... వాటిని నేను ప్రసంగించుటకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాతోపాటుగా మీరు ఎంతో కాలమునుండి నా వెంట వున్నారు. మీకు తెలుసు నేను ప్రసంగీకుడిని కాదని, అయితే దీనిని నీవు నమ్ముదునా, ఆ బండతో మాట్లాడుము, రబ్బీ ఒకస్త్రీని చూడుము, అటువంటివన్నిటిని పదేపదే చెప్తాను, మీకది తెలుసు, కేవలం మూడు చిన్న పదాలు. అంతే... బావి దగ్గరవున్న స్త్రీ చుట్టు అంతటిని అల్లి అదేమిటో చూపుతాను, తరువాత దానిని చివరికి చూపెదను, అప్పుడు చూచుటకు "వచ్చి చూడండి మనుష్యుని, వచ్చి చూడండి మనుష్యుని." తర్వాత "బండతో మాట్లాడుము" ఇశ్రాయేలును నేను తీసికొంటాను, వారిని బయటకి తెచ్చి, చూశారా, నా తీసికొంటామ,దానిని నా అంశపు వరుసలోకి చేరుస్తాను, అయినను నా అంశాన్ని ఇంకా తాకనేలేదు పాఠ్యాంశాన్ని అక్కడ

81. మరి కొద్దిసేపటి క్రితం వివరించుటను, (విశదపర్చుటను మీరు గమనించారా, అదే కార్యాన్ని, అక్కడ ఆ రోమీయుని మీద నేను మాట్లాడాను, చూశారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షింపబడుదురు." చూశారా, అదొక ప్రశ్న రక్షింపబడుటమీద, చూడండి, నేను వెనక్కి వెళ్ళి. అదంతా ఏమిటో అనే దానిని తీసికొని వచ్చి, బయటికి తీసి, మరలా వెనక్కి వెళ్ళి, యెబును తీసికొని, వారందరిని తీసికొని, ఇక్కడికి లాగి ఈ దారిలోకి తీసికొని వచ్చిన తర్వాత దానిని వివరించాను. అది అంతేమరి, అది విశ్వాసము. మీరు గమనించారా? యోబు విశ్వాసాన్ని వాడాడు. రోమీయుడు విశ్వాసాన్ని వాడాడు. మనం కూడా విశ్వాసాన్ని వాడుటకు సిద్ధపడ్డాము, చూశారా...

మరియు ఆ విధంగా వేననుకొనుచున్నాను చేస్తే, నాకు వచ్చిన పద్దతిలో నేను చేస్తాను. వీవేది చెప్పాలని ప్రయత్నిస్తావో దానిని జనులు వినుటకు ఆసక్తి చూపితే, అంతట నీ ముఖ్యపాఠ్యాంశాన్ని చివరి వరకు తప్పిపోకుండా చేసి చివరికి ముగింపు ఇవ్వవలెను. అప్పుడు చెప్పు.. మిగతాది తెలియపర్చబడును, ఎందుకనగా మీరు చూస్తారు. నీవు దానిని చూస్తావు.

చూసారా, నీవు కేవలం - నీవిక్కడికి చేరుకొని, ఒదులుదారిని పొంది, ఒక దానిని లోపలికి లాగుము, మరి- దానిలో చిక్క ఏమిటంటే నేను అనేకమైన వదులు దారులని వదులుతాను. కనక నేను - దానిని పొందుకొనును.

82. మంచిది, మీరందరు ఇచ్చటకి వచ్చికూర్చొని మాతో మాట్లాడి తదితర కార్యాలు చేయుటమనేది నిజంగా చాలా మంచిగా వుంది. మరి దానిని నేను మెచ్చుకొనుచున్నాను. మరోసారి నా హృదయపూర్వకముగా నేను చెప్పగోరుచున్నాను. నాలో వున్న సమస్తముతో అనేది నా భావం. ప్రజలైన మీరు ఎంతగొప్ప వెలచెల్లిస్తున్నారో నేనెన్నడు గుర్తించలేకపోయాను. నేను-నేను కేవలం... ఒకవేళ అది మిమ్మును చూడటానికి కాకపోయినట్లైతే, మరియు మిమ్మును ప్రేమించడానికి కానట్లైతే మరి నేను చేయు ఈ విషయాలు, నేనిలా అందును "మరోసారి నేను టబర్నికల్వండు బోధించబోవుట్లేదు." కేవలం ఒక్క కూటం కోసం మీరు ఎంతో దూరంనుండి, పదిహేను, పద్దెనిమిది వందల మైళ్ళ దూరంనుండి కారు నడుపుకొంటు వచ్చి పాల్గొనుచున్నారు.

ఇప్పుడు, ఆ గొప్పత్యాగాన్ని (ఎమ్మకత్వాన్ని) వేనెంతో మెచ్చుకొనుచున్నాను. మీరు చేయచున్న దాన్ని గూర్చి నేను తలంచుచున్నాను. చూశారా? మూమ్, నది ఆవలి ప్రక్కవ
దేశంలో వున్న మీలో ప్రతిఒక్కరిని, మిమల్నిను మీ పిల్లల్ని, మీ చంటిపిల్లల్ని, ఇంకా అందరని అక్కడ చూచెదనని నేను-నేను దేవున్ని నమ్ముచున్నాను. మరి నేనచ్చట వుందునని నిరీక్షిస్తున్నాను. నేనచ్చట వుంటానని నేను నమ్ముచున్నాను.

ఇప్పుడు చూడండి, మీలోని ప్రతిఒక్కరు- మీ పిల్లల్లో ప్రతిఒక్కరు నశించకుందురు. గాక, ఆ దినాన మనమంతా అచ్చట వుండెదము గాక. అలాగే- అలాగే బయట వున్న మన చిన్న సహోదరీలు సహితం, అలాగే బయటవున్న చిన్న వర్ణ బాలిక (నల్లజాతి స్త్రీ)యు అంట్లు తోముకునే (పాత్రలు శుభ్రపర్చేవారు) వారును, మరో గదిలో అచ్చట వుండిన వారును అచ్చట వుండెదరు గాక.

a

B

ఒకరోజు నేను ఆ స్త్రీతో ఇచ్చట మాట్లాడినట్లు నాకు- నాకు గుర్తున్నది. నేననుకొనుచున్నాను... ఆ స్త్రీ ఆమెయే కదా? మరలాగే ఆమె భర్త, ఒకసారి నేవచ్చట అతన్ని కలిసికొనుచున్నాను. లేకుంటే లేదా, మీ కోసం పనిచేసే బాలుడా, అది చూడటానికి చాల చక్కని పెద్దవాడు. మరి మనమంతా అచ్చట, అనగా ఏ నిరుత్సాహములు లేని చోట కలిసికొంటామని. నేను-నేను నిరీక్షిస్తు న్నాను. అంతేకాదు రాత్రి బాగా ప్రొద్దుబోయేదాక కూర్చోటమనేదే ఇక అచ్చట. వుండదు, ఎందుకంటే రాత్రి అనేదే అచ్చట వుండదు గనుక.

83. ఓ, నా సహోదరుడా, నా సహోదరీ, ఒక ఉదయకాలమందు నేను అక్కడ నా దీన భార్య ప్రక్కన మంచము మీద పరుండి యున్నప్పుడు, ఆయన నన్ను మంచము మీద నుండి లేస్ కాలమనే తెరకి ఆవల వైపువున్న వాటిని చూచునట్లు (వెళ్ళునట్లు) నాకు అనుమతించియున్నాడు. అనే దానిన నేనెలా వర్ణించగలను- నేను ఎలా వర్ణించగలను.

మరి అక్కడ నేను చూసిన దానిని, అది ఏమై యుండెనో అనే దానిని వివరించుటకు నాకు తగినంత శక్తి వున్న యెడల ఎంతో బాగుండును... వారందరిని నేనచ్చట చూడాను. గమనించండి, వారందరు నాయొద్దకి వచ్చారు. మరియు తమ చేతులను నా భుజము చుట్టు వేసారు. అలా అంతయూ చేసారు. మరి వారు మరివారు మనుష్యుల వల్లే. చూశారా? వారు ఈకలు వున్న వారేం కాదండీ... ఒక దూత అని అందురేమో... ఒక దూతకి ఈకలుంటాయని నేననుకోవట్లేదు వారు-వారు దానిని అలా అన్నప్పటికి, నేనైతే అలా భావించట్లేదు. మీరు గమనించారా.

అయితే దూత అనగా ఒక వర్తమానికుడు. మరది- ఆ మాటకి అర్థం వర్తమానికుడు కనుక వారికి ఈకలుంటాయని నేను అనుకోవట్లేదండి. అయితే అవి కేవలం... వారంతా అచ్చట వున్నారు, మరియు వారంతా ఎంతో సంతోషంగా వున్నారు. దానికంటే ఎక్కువైనది అచ్చట లేనట్లైతే, నేను -అది మన ప్రయాసలన్నిటిని, మనం చేసిన కార్యాలన్నిటికి తగిన మూల్యం చెల్లించును- మరి అన్ని అలాగుంటాయి.

84. కానీ మీ నుండి నేను కోరే... దీనిని నేను చెప్పుగోరుచున్నాను. దాన్ని నేను కూడా నమ్ముచు న్నాను, అదేమిటనగా అంత్య దినములయందు దేశంలో కరువు వచ్చునని బైబిల్ సెలవిచ్చియున్నది. మరి ఆ కరువు అన్నపానములను గూర్చినది కాదండి. అది దేవుని వాక్యము వినుటను గూర్చినది. మరి జనులు తూర్పునుండి, పడమరనుండి, ఉత్తరమునుండి మరి దక్షిణమునుండి పరుగెత్తుతారు, దేవుని వాక్యము వినుటకు వచ్చెదురు. ఇప్పుడు మనం సరిగా
ఆ దినము యందే జీవిస్తున్నాం. చూశారా?

ఎవరిని విస్మరించట్లేదు( మీరు చూశారా?) మన సంఘాలను విస్మరించట్లేదు, లేదండీ.... అయితే మీరు తెలిసికొనగల్గితే, ఈ సంఘములలోవున్న బలిపీఠముల (ప్రసంగవేదిక) మీద, మనం ఎంతో చక్కని వారిని కలిగియున్నాం, మంచివారు, నిజ దేవుని సేవకులు, సంస్థ చెప్పినదానికి భిన్నం (విరుద్ధం)గా దేనినైన చెబితే తమ్మును వారు తరిమి బయటికి పంపివేస్తారేమోనని వారు భయపడుచున్నారు. అందుకే వారు మిన్న కుండిపోతున్నారు (వారు చలిలో మిగిలిపోతున్నారు). అటువంటి మనుష్యులకి తగినంత ధైర్యం అవసరమని నేను నమ్ముచున్నాను. దేవుడు ఒక వ్యక్తిని తీసికొని వారి సంస్థలకి సంబంధమే లేకుండా ఆయన వారిని గూర్చి శ్రద్ద వహించుననే దానిని ఒక మాదిరిగా ఆయన చూపించగోరుచున్నాడని నేను నమ్ముచున్నాను, నేను నమ్ముచు న్నాను, నేను నమ్ముచున్నాను. గనుక దాని కొరకు నేను నా విషయంలో ఆయన దానినే చేస్తున్నాడని నా నమ్మకం, నాకు సహాయం చేస్తున్నాడు. నన్ను అనుమతించ... మరి నేనే అయితే...

85. మరి వినండి క్రైస్తవులారా, ఒక్కసారైన సరే... దేవుని యెదుట మరియు మరియు ఎన్నిక చేయబడన దూతల యెదుట నేను మీకు ఆనబెట్టి చెప్పునదేమనగా, మీరు చేసే... ఎప్పుడైన మీరు నేనేదైన పొరపాటు చేయుటను చూచినట్లైతే దయచేసి దానిని నాకు చెప్పగలరు? కారణం మీరు నన్ను ప్రేమిస్తే నన్ను సరిచేయండి. మీరు వెళ్ళుచున్న సంగతిని నేనెరుగుదును. కావున నేనెప్పుడైన తప్పిదములో వుండుటను మీరు చూసినట్లైతే, సరైనదానిని నేను చేయకపోతే, మీ మార్గములకు అడ్డుబండగా వుండే దానిని నేను చేసినట్లైతే, నేను... మీరు వచ్చి నాకు చెప్పండి.

ఇప్పుడు, అనేకసార్లు, నేనిచ్చటికి వచ్చి తిరుగుచు మరియు నవ్వుచు మిమ్మును గాయపర్చి (తగ్గించి)నట్లుగా విషయాలను అనుచుందును. నేనేమి చేయ ప్రయత్నించుచున్నాను? నాలో వున్న బావనను నేను వదిలేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీరు గమనించారా? కావాలని నేను దాన్ని చేయాలని కాదు. చూశారా? నవ్వుకోడానికి దాన్ని నేను చేయాలని కాదండి, లేదా... నేను ఇచ్చటికి వచ్చి బ్రదర్ వెల్స్ ని కలుస్తాను, తద్వారా అతని చెప్పే మరేదైన చిన్న సంగతినైనా సరే నేను వింటాను ఓ, చిన్న బాలురు- అచ్చట వున్న ఒక వర్ణ బాలుడు. మరి అతడు ఒక చేపను పట్టుకున్నాడు, తనిఖీ అధికారికి అతడు దొరికాడు. అప్పుడు ఆ బాలుడు తాను తాబేలు ఎరలను పట్టుకొంటున్నానని అధికారితో చెప్పాడు. మరి-మరి అలా.... ఒకటి మీకు తెలుసా, ఆ క్రమములో.

86. మరి ఆ చిన్ని... చిన్న బోధకుడు నాతో చెప్పాడు... నేడు చిన్న బాలికలతో, నేడు నేను వారితో చిన్ని బొచ్చు కుక్కపిల్ల యొక్క ఫెఫి, ఫైఫై ఆటను గూర్చి చెప్పుచుంటిని, మీరు చూడండి? మరి- మరి, అలా... నేనెందుకు దానిని చేయుచున్నాను? నవ్వించుటకే, నేను నవ్వటానికే, నన్ను నేను క్రిందికి తెచ్చుకోటానికే,

ఈ క్షయతలోకం నుండి అక్కడ పైనున్న వారి లోకములోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు, అది- అది నిన్ను ఒక మలుపులో వుంచునని నీకు తెలుసా, నా బావం అర్థమైందా. మరప్పుడు కొద్దిగ ఆలోచించు, అక్కడ దీన్ని కొంచం ఆలోచించు. ఈ పరిచర్యను కలిగిన నేను దేనికి సమాధానమియ్య బద్దుడనైవుంటిని? గుర్తుంచుకొండి కేవలం టిప్టన్, జార్జియా కోపమే కాదు, కేవలం ఇండియానా కోసమే కాదు, కేవలం అమెరికా సంయుక్త రాష్ట్రాల కోసమేకాదు, గానీ
ప్రపంచ వ్యాప్త పరిచర్య వున్నందున ప్రపంచమంతటికోసం నేను జవాబుదారినై యున్నాను. చూశారా? అన్యులకి నేను జవాబుదారిగా వున్నాను. అన్యుల విషయమై నేను దేవునికి ఇష్టపూర్వకముగా లెక్క అప్పగించవల్సిన వాడినై యున్నాను, చూశారా?

మరి నేను ఇంటికి చేరి కూర్చొని తలంచుదును "మంచిది, నేను నమ్ముచున్నాను - నేను నమ్ముచున్నాను. - నేను నమ్ముచున్నాను... " ఇక్కడ మొన్న ఒకరోజు నేనెంతో ఒత్తిడికి గురయ్యాను, ఇలా అన్నాను "నేను-నేను ముందుకు వెళ్ళి మరో కూటాన్ని కలిగి వుంటాను." నేను ముందుకు వెళ్ళి మరో కూటాన్ని కలిగి యుంటాను. మొదటి సంగతి మీకుతెలుసా, నేనెంతో ఉద్రిక్తకి (ఒత్తిడికి) గురయ్యాను, నేను-నేను వేటకి వెళ్ళవల్సి వుంది. నేను చేపల వేటకి వెళ్ళవల్సి వుంది. ఎవరితోనో కలిసి బయటికి వెళ్ళవల్సి వుంది. నేను నేను దేనినో చెయ్యవల్సి వుంది, ఎందుకంటే నేను కేవలం మనిషిని మాత్రమే, నేను కేవలం మానవమాత్రున్న మీరు చూశారా? మరి అది-అది... అది మీకు అర్థమైయిందా.

87. ఈ మార్గములో నుండి నేను బయటికి వెళ్ళినట్లు మీకెన్నడైన అనిపిస్తే, నిరభ్యంతరంగా నువ్వు నా దగ్గరకి వచ్చి దానిని నాతో చెప్పుము. నేను దానిని ఆపుతాను, బాలుడా, మానినై... ఏం జరిగిన పర్వలేదు. ఎందుకంటే నువ్వు- నువ్వు దాన్ని అర్థం చేసికోవాలని కోరుచున్నాను. నా దగ్గర దాపిరికాలంటూ ఏమి లేవండి. నేనెరిగిన దానంతటిని నీవును ఎరిగియున్నావు. చూశారా? ప్రభువు నాకు బయలుపర్చి, చెప్పమని అనుమతించిన దానంతటిని నేను నీకు చెప్పాను. నేను దేన్ని దాచుకోలేదు. మరి- నా జీవితం తెరవబడిన పుస్తకం, మీకు- మీకు మీకు తెలుసు నేనేమిటో, దేనికోసం నేను తయారుచేయబడ్డానో. మరి నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రతి దినము నేను నిర్మించబడిన ఉద్దేశ్యమేదైతే వుందో, దానికోసమే జీవించుటకు ప్రయత్నించుదుము.

అవును, చాలాసార్లు నేను ముఖభావంగా, దిగులుగా, అలసిపోయినట్టుగా, క్రుంగినట్టుగా మరోవిధంగా వున్నట్లు మీరు చూచి వుండొచ్చును. అవును, నాకు -పరిచర్య అన్నాక అవి సహజం, మీకు తెలుసు, దానిని మీరు గుర్తించారు, మీరు... కాలము యొక్క పేజీలను మీరు తిరిగేసినట్లైతే, ఆ వ్యక్తి ఆ విధంగా వున్నాడని, అలా చేసాడని మీరు చూడగలరు. అవన్ని సహాజమే, మనందరికి అవి వున్నవే.

అయితే సంగతేమిటంటే, మనం ఒకరినొకరం అర్థంచేసికోవల్సి వుంది. నాకున్న ఎత్తుపల్లాలు నీకున్నవని నేను అవగహన చేసికోగలను... అవి నాకు మాత్రమేకాదు, అవి నీకు కూడా వున్నవి. నీవు నీ ఎత్తువల్లాలను కలిగి వున్నప్పుడు నేను వాటిని అవగాహన(అర్థం)చేసికోవడానికి ప్రయత్నిస్తాను. మరలాగే నాకు అవి వున్నప్పుడు వాటిని నీవు అవగాహన చేసికోటానికి ప్రయత్నించు ము. నేను విదేశాలలో ఎక్కడో వున్నప్పుడు, లేక ఎక్కడో కూటములో వున్నప్పుడు, దయ్యాలు అంతట వున్నవి గనుక ప్రతిచోట నాకు సవాలు విసురుతాయి, ఇంకా ఏదేదో చేస్తాయి, అయితే మీరు నన్ను గుర్తుపెట్టుకొని నా కొరకు ప్రార్థించండి. నా కొరకు ప్రార్థిస్తారా?

88. ఇప్పుడు మనం కొద్దిగా ఆయనతో మాట్లాడదామా? పరలోకపు తండ్రీ, ఇక్కడ నిలబడి, రక్తములో కడుగబడిన పిల్లలతో మాట్లాడటం ఎంతో అద్భుతంగా వుంది. చాలా ఏండ్ల క్రితం పరిశుద్ద పౌలు చిన్న గృహకూడికలో నిలబడి వారితో మాట్లాడినట్టుగానే నేను ఈ రాత్రి
చేయుచున్నానని గుర్తించాను. మరి పౌలు అక్కడ ఆకులా ప్రిస్కిల్లా యొద్దకు వచ్చి, వారు అచ్చట జనులను సమకూర్చి యుండెదరు. మరి అతడు లోనికి వెళ్ళి... రోమాలో మరియు ఒక ఇల్లు అద్దెకు తీసికొన్నాడు. మరి తన యొద్దకి వచ్చువారిని అతడు చేర్చుకొనుచుండెను.

మరిక్కడ ఈ రాత్రి, టబర్నికల్కి వచ్చు జనులు మరి- ఎన్నో మైళ్ళదూరము నుండి కార్లు నడుపుకొంటు వచ్చుచుండిరి. వారి త్యాగాన్ని నేనెంత మెచ్చుకొనుచుంటినో ఇంత క్రితమే చెప్ప ప్రయత్నించితిని... ప్రభువా, వారికి చెప్పడానికి నా దగ్గర మాటలు కూడా లేవు, నేనెంతగ వారిని అభినందించుచున్నానో. తండ్రీ, నా బావాన్ని వారు గ్రహించునట్లు చేయమని నేను ప్రార్థిస్తున్నాను.

మరి ప్రియమైన దేవా, శక్యమైతే... దయచేసి, వారి కోసం నేను చేయు ప్రార్థనకు జవాబియ్య మని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారిలో ప్రతిఒక్కరిని రక్షింపుము. వారిలో ఒక్కరు కూడా నశించిపోకుండ చూడుము, వారి కుటుంబాలలో ఏ ఒక్కరు నశించిపోకుండ చేయుము, వారిలో ప్రతి ఒక్కరు అక్కడ వుండేటట్టు చేయుము.

89. వారి చిన్న బిడ్డలకోసం నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఈ చిన్న బిడ్డ తన తండ్రి ఒడిలో ఒదిగి వున్నాడు, అతని తల్లి కూర్చొని శ్రద్దగా వినుచున్నది. మరి వారు రాబోయే దినాల కోసం ఆలోచిస్తున్నారని నేను అనుకొనుచున్నాను. రేపు అనేది ఒకటుంటే, సువార్తని ఆ చంటి బాలుడు మోసికొని పోవునని నాకేల తెలియును? దేవా, ఆ చంటి బాలున్ని మరియ మిగతా వారందరిని, చంటి బాలికలు బాలురని దీవించుము, వారందరికి తోడుగా వుండుము. తమ గృహమును ప్రార్థనాకూటము కోసం ఇచ్చిన సహోదరుడు మరియ సహోదరి ఈవాన్స్తోడు వుండుము.

ఇప్పుడు మాతో వుండండి, మా పాపములను క్షమించండి. వారెప్పుడైనా అనారోగ్యం పాలైతే దేవా, నేను నేను ప్రార్థిస్తే నీవు వింటావని; నిన్ను నమ్మి నిన్ను అడుగుటకు అటువంటి ఒక జీవితాన్ని నేను జీవించునట్లు చేయుము. మరప్పుడు ప్రభువా వారి నిమిత్తం ప్రార్థిస్తేనా ప్రార్థనను ఆలకించుము. దానిని అనుమతించుము. మరియు వారి నిమిత్తం ప్రార్థించినప్పుడు వారి మనవి ఆలకించుము, ఎందుకనగా తండ్రి వారి ప్రార్థనలు నాకవసరం. ప్రభువా వారు నాకోసం చేసే ప్రతి మనవి ఆలకించవా? అలాగే నేను వారికోసం ప్రార్థించినప్పుడు నా మనవిని కూడా ఆలకించు ప్రభువా మేమంతా కలిసి మా జీవిత కాలమంతా నిన్నే సేవిస్తాము. ఆ గొప్ప దినమున, నీ యింటికి ఒక దినాన మేము వచ్చెదమని మేము నిరీక్షిస్తున్నాము. అచ్చట మేము తలుపు తట్టి నప్పుడు, మమ్మును లోనికి అనుమతించవా తండ్రీ. అప్పటి వరకు మమ్మును కాపాడుము, మమ్మును దీవించుము, ఎన్నటికి యదార్థవంతులుగానే మమ్మును నిలువబెట్టుము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్.

90. జనమా, మీకెంతో ధన్యవాధములు. పదిన్నర వరకు, చాలసేపు మిమ్మునుంచి నందుకు నన్ను మన్నించండి. ఈ చంటి బిడ్డ ఇక్కడ సైనికుడి వలే పడుకొనివున్నాడు. ఆ బాలుని వయస్సెంతా ? రెండా, దానితోనా?

సహోదరీ, ఎలా వున్నారు, నేను లోనికి వచ్చేటప్పుడు నీతో కరచాలనం చేసానో లేదో నాకు తెలియదు. సరే, తిరిగి నిన్ను చూచుట చాలా మంచిది, సహోదరుడా విల్లీ,
ఫ్రెడ్, ప్రొద్దుటే నీవు తిరిగి ఇంటికి బయలుదేరబోవుచున్నావని నేను అనుకొనుచున్నాను. నీవు నానా పెద్ద మొసలిని తిరిగి తీసికొనిపోవుచున్నావు. ఇంటి దగ్గర కలిసి కొంటాం సహోదరుడా ఉడ్ ప్రభువు నిన్ను దీవించును గాక. అలాగే సహోదరుడా స్కాట్, నిన్ను కూడా, తిరిగి నిన్ను చూచుట బాగుంది సహోదరుడా, నేను ఇది వరకే నిన్ను ఎక్కడో చూచాననుకొంటాను, కదూ? చూచానని నేను అనుకొనుచున్నాను నీ ముఖము సుపరిచితమే.

సహోదరుడా వేన్, ప్రభువు నిన్ను దీవించును గాక, ఈ సేవకున్ని నా యుద్దకి తెచ్చుటకు నీవు ఎనభై మైళ్ళ దూరం నుండి వచ్చావు. తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీకు ట్యాంక్సండా ఆయిల్ కొట్టించాలని నేను ఇంకా అనుకొనుచున్నాను. కుమారా, నిన్ను దీవిస్తున్నాను, సహోదరీ నిన్ను దీవిస్తున్నాను. మీతో సరదాగా మాట్లాడుచున్నాను... కొద్దిగా ఆటవిడుపు కోసం మీకు తెలుసా, అది మిమ్మును కాదని?

91, సహోదరి ఈవాన్స్, గాడ్గెస్ యూ. అది నిజంగా చాలా మంచి ఉదయకాలపు అల్పాహారము, రాత్రిభోజనము, నీ ఆతిధ్యము చాలా బాగుంది, గుర్తుంచుకోండి, యేసు అన్నాడు "మిక్కిలి అల్పులైన వీరికి మీరు చేసితిరి గనుక.." ఇప్పుడు, ఆయన ఇలా చెప్పుటను మీరు విన్లేదు"గొప్పవారైన వీరికి మీరు చేసితిరి గనుక"చూచారా? చూచారా బహుశా అది -అది ఎవరి కోసం కాదు. కానీ "మిక్కిలి అల్పులైన వీరికి మీరు చేసితిరి గనుక... "అది నేనే అని నేను అనుకొనుచున్నాను, కావున నీవు నా కొరకు చేసావు.

తిరిగి నిన్ను చూడటం చాలా బావుంది సహోదరీ, ఎల్లప్పుడు దేవుడు నీకు తోడై ఉండును గాక, నేను... ఓ, మై, ఆమె నీ తల్లి కాదని నీవెలా చెప్పగలవు? నీవు చూడటానికి అచ్చం అలానే వున్నావు.

సహోదరీ, నిన్ను చూడటం చాలా మంచిది. అక్కడున్న ఒక యవ్వనస్తునికి నీవు భార్యవని నేను అనుకొనుచున్నాను. మరియు నీవు సహోదరుడు స్కాట్నీ? మీరంతా అక్కాచెళ్లెల్లా? మంచిది, మీరు అక్కాచెళ్లెనని నేను అనుకొనుచున్నాను. నేననుకొన్నది నిజమే. మరలా నిన్ను తిరిగి చూడటం చాలా బాగుంది, నా సహోదరుడా నిబ్బరముగా ఉండుము. బహుశా ఇది క్రొత్తదై వుండునేమో అని చెప్పవచ్చును. ఈ బాలికను నేను గమనించలేదు. ఓ, మంచిది, నిన్ను కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా వుంది. ప్రభువు నిన్ను దీవించును గాక.

సహోదరీ నిన్ను చూడటం చాలా బావుంది. అతడు నీకు ఏదో రీతిగా మంచిగా వుంటాడు. కనుక ఆయన్ని స్వీకరించు. గాడ్ బ్లె యూ సహోదరుడా, బ్రదర్ ఈవాన్స్, దేవుడు నీతో వుండును గాక బాలుడా.

92. ఇప్పుడు, ప్రియా, మా చిన్న పిల్లల్ని నీవు పట్టుకొన్నట్లైతే, మేము బయల్దేరుట మంచిది. గాడ్ బ్లె యూ నా సహోదరుడా. మరిప్పుడు మనం వెళ్ళేముందు మనమంతా లేచి నిలబడి ఈ చిన్న గీతాన్ని ఆలపిద్దాం, దయచేసి మీరు నాతోకలిసి ఈ చిన్న వచనాన్ని పాడగలరా...? మీకు ఇష్టమేనా?

దేవుడు మీకు తోడైవుండును గాక తిరిగి మనం కలుసుకొనే వరకు ! ఆయన తన ఆలోచన చొప్పున మిమ్ము నడుపును, కాపాడును.
ఆయన గొట్టెగా ఆయన మిమ్మును సంరక్షించి ఎత్తిపట్టుకొనును దేవుడు మీకు తోడై వుండును గాక తిరిగి మనం కలుసుకొనే వరకు తిరిగి మనం కలుసుకొనే వరకు తిరిగి మనం కలుసుకొనే వరకు, తిరిగి మనం కలుసుకొనే వరకు తిరిగి మనం కలుసుకొనే వరకు. తిరిగి మనం కలుసుకొనే వరకు తిరిగి మనం కలుసుకొనే వరకు.

దేవుడు మీకు తోడై వుండునుగాక తిరిగి మనం కలుసుకొనే వరకు

చిన్న ప్రార్థనా కూటాల్లో మనము చేసే విధానం ఇలా వుంటుంది, మనం ఒకరి చేతుల్ని మరొకరం పట్టుకొంటాం, ఇలా దగ్గరికి వస్తాం. చూసారా? ఇప్పుడు మనమీ పాట పాడదాం. అందరు కలిసి చిన్న వృత్తాకారములోకి వద్దాం. అది విధానం. మీరు చూశారా?

మమ్మును బంధించే బంధమును దీవింపుము మా హృదయములను క్రైస్తవప్రేమతో ఐక్యత (కుటుంబ) ఆత్మ అను సహవాసమందు క్షేమముగా పైకి చేరేవరకు మన తండ్రి సింహాసనం యెదుట మన పరస్పర ప్రార్థనలను మనం కుమ్మరింతుము మన భయాలు, మన ఆశలు, మన లక్షాలు అన్నియూ ఒక్కటే అలాగే మన సుఖాలు, మన చింతలు మనం చెదరినప్పుడు (విడిపోయిప్పుడు) అది మనలోపల నొప్పి (బాధ)గా వుంటుంది, అయినా హృదయమందు మనమింకా తిరిగి కలిసికొనెదము, మరలా తిరిగి కలిసికొనెదమని ఆశపడుదాం (నిరీక్షిద్దాం)

93. ఇప్పుడు మన హృదయములను వంచుదాం, ఆ మాదిరి ప్రార్థనను మనం పలుకుదాం. పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచునట్లు భూమిమీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయుము, మా ఋణస్థులను మేము క్షమించిన ప్రకారము మా ఋణము లను క్షమింపుము. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండ తప్పింపుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీకే కలుగును గాక ఆమేన్.

మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక, ఇప్పుడు, మనం తిరిగి కలిసికొనే వరకు సహోదరుడా వెల్చ్ అక్కడ నీవు అనుకొన్నదంతా టేపులోకి వచ్చిందా? ముమ్. మంచిది, మీరంతా మాతో కలిసి ఫ్లోరిడా వస్తారని ఆశపడుచున్నాను. ప్రభువు చిత్తమైతే... నేనేమి చేస్తున్నానో దానిని నేను- నేను మీతో చెబుతాను, పిల్లల్ని బయటికి తీసికొనిపోవుటకు ప్రయత్నిస్తున్నాను. మీరు చూడండి, వారికి సెలవలు ఇంకా అయిపోలేదు వారి అవ్వకి గుండెపోటు వచ్చినందున మేము తిరిగి వెనక్కి వెళ్ళవల్సి వచ్చెను. కాబట్టి వారి సెలవులు అయిపోయేలోగా నేను వారిని బయటికి తీసికెళ్ళాలి. ఎందుకంటే సెలవులు అయిన వెంటనే వారు తిరిగి స్కూల్లో వుండవల్సి వుంది.
కావున రేవు నేను వారిని బహుశా సెయింట్ పీటర్స్బర్గ్ లేదా ఇంకోచోటికైనా తీసికొని పోవాలి.

94. బ్రదర్ ఎస్వోమ్ అనేకమందితో సంభాషించుచున్నాడు -సంపా). ఈ ఆదివారమునకు ముందే నేను తిరిగి వుండవల్సి వుంది (బ్రదర్ ఈ చాన్స్ మ్యూజియంను గూర్చి చెప్పుచున్నాడు. -సంపా) ఓ అవునా? నేను అచ్చటికి వెళ్ళి చూడగోరుచున్నాను. అవును, అయ్యా ఇంతవరకు నేను మ్యూజియంకి వెళ్ళలేదు, అది అది ఏమిటది? రిప్లే మ్యూజియం అని దానికి పేరు. మరి అది సెయింట్ పీటర్ బర్గ్ వందున్నదా? దిగువున అది సెయింట్... నా భావం సెయింట్ అగస్టీన్.

అవును, ఇక్కడున్న దాని యొద్దకి నేను వెళ్ళి... ఇది జాక్సన్విల్లే, మొదట నేనచ్చటికి వెళ్తాను, నీవు చెబుతుంది ఆ దారి గుండా ? వేక్రాస్ పట్టణం. హం- హుహ్. 95. టబర్నికల్ (బ్రెన్హామ్ టబర్నికల్-అను) తూర్పుపడమరల తట్టు వుండును. నేను

నిర్మించాను... అది... నీవు ముందునుండి లోనికి వచ్చినపుడు, మీకు తెలుసా అంది... నీవు ముందు నుండి లోనికి వచ్చినపుడు, మీకు తెలుసా, అది ఎనిమిది పెన్నీ వీధిలో వుంది, అది ఈ దిశలో వుంది? వీపు తిన్నగా అప్పుడు తూర్పు గుండా వెళ్తావు. చూశారా? మరప్పుడు... నీ వచ్చట నిలబడి వుంటే... నేను ప్రసంగించేటప్పుడు, నేను, పశ్చిమ వైపుకి నా ముఖం తిరిగి వుంటుంది, నేను తూర్పుతట్టు నిలబడి పశ్చిమతట్టు నా ముఖం త్రిప్పి బోధిస్తాను. మరిప్పుడు చూడండి, బలిపీఠం(ప్రసంగవేదిక) తూర్పువైపున వుండునట్లు నేను అలా చేసాను, ఎందుచేతనంటే యేసు తూర్పుతట్టునుండి వచ్చి యుండెను. వారంతట, అది-అది నన్ను చెప్పనివ్వండి... బలిపీఠము, మేమెల్లప్పుడు తూర్పువైపుకే వంగుతాము (తూర్పు దిక్కు వైపుకే తలవంచుతాము) చూశారా? సరే అదేంటో నాకు తెలియదు సహజంగా, అయితే నేనెల్లప్పుడు అలానే చేస్తాను. బైబిల్లో నేను దానిని చూశాను, వారు... సహజంగా గతములో అక్కడ దానియేలు అన్నాడు తాను వెళ్ళి కిటికీలు తెరిచి, మీకు తెలుసా, ప్రతీది ఆ విధంగా మరి తూర్పువైపుకి తిరిగి ప్రార్థించాడు, మరి- మరి కావున...

మరి నేను గమనించాను మోషే నిర్మించిన మందిరంలో, నేననుకొనుచున్నాను, దాని తూర్పు దిక్కుకే ముఖద్వారం, బలిపీఠం వుండి వున్నది. మరి, నీవు ఎక్కడి నుండి చేసినా సరే దేవుడు వింటాడు, అది వేరే సంగతి. మీరు చూస్తే? ఏది ఏమైనా... అవునండీ. మంచిది, ఇప్పుడు నేను ప్రార్థించినప్పుడు అంతయు చేసిన్పుడు నేను చూసాను ఒకసారి, నేను -నేను ఎరుగను-నేను చుట్టు తిరుగలేదు. చూశారా? నేను చుట్టు వచ్చాను.

96. కానీ ఇప్పుడు, నేను గమనించకపోతే, అటువంటి దేన్నైనా, అలా దిగివెళ్ళి దానిమీద దుమికితే, నాకప్పుడు... రెండు చోట్లు వున్నాయి, నాకు తెలిసిన ఆ రెంటిలో నేనెన్నడు నిఠారుగా వుండలేని ఒక చోటు. అయినప్పటికి నేనెక్కడ వున్నానో నాకు తెలిసిపోయిద్ది. అందులో ఒకటి కాక్స్ అవ్వవద్ద అలా వుంటుంది. నేనెచ్చటికి వెళ్ళగలను. మరి నేను దానిని తిన్నగా చేరుకోలేను. మరి ఒకటి ఏదో వుండబోవుచున్నది, నా వైపు చూస్తువుంటుంది, ఒక దినాన జరుగును.

ఇచ్చటున్న ఈ గుమ్మము దగ్గరికి నేను పోతాను, మరి అది -అది దక్షిణముగా వుంటుంది, నా కుడివైపునకు తిరిగి వుంటుంది. కానీ అది అలా కాదు చూశారా? అది అలా కాదు. దీనికి భిన్నంగా (విరుద్ధంగా) వుంటుంది చూశారా? మరి నేను -నేను అలా... మరి నేను అడవిలోకి పోయినట్లైతే, నేను గానీ లేక వేరే ఎవరైనా సరే దారి తప్పిపోయినట్లైతే, మరప్పుడు చుట్టూ
తిరిగితే... ఇప్పుడు, నేను బాగా తికమకపడితే, మంచిది, నేను -నేను దానిని కనుగొనలేను. చూశారా? అయితే నీవు అక్కడ అలాగే కొద్దిసేపు నిలబడి పలుకు "పరలోకపు తండ్రీ నాకు సహాయం చెయ్యండి" మరి సహోదరుడా, నీకు అవసరమైన నడిపింపు అప్పుడు నీకు ఖచ్చితంగా కలుగుతుంది, చాలా సుళువుగా అది నిజం,

97. ఒకసారి నేను బయిటికి వెళ్ళుచుంటిని...?... సహోదరుడా ఉడ్ మరియు సహోదరి ఉ డ్తో కలిసి మేము చుట్టనూగా నుండి వచ్చుచున్నాను. మరప్పుడు సహోదరుడు ఉడ్ కారునడుపు చున్నాడు... అది 41 అని నేను అనుకొనుచున్నాను (హైవేనంబరు) మేము తిరుగు ప్రయాణములో వున్నాం, నేను చాలా అలిసిపోయాను. ఓ నేనెంతో అలసిపోయాను. కూటం అయిపోయింది, నేను కారులో వెనుక సీట్లో పండుకొన్నాను, అక్కడ వెనుక సీట్లో పరుండి నిద్రకు ఉపక్రమించాను. నేను మేల్కొన్నాను. అయితే నేను లేచినప్పుడు, నేనన్నాను... పొగమంచు, కనీసం నీ ముందు పెట్టుకొన్న నీ చేతిని కూడా నీవు చూడలేనంత మంచుపొగ దట్టంగా అలుముకొన్నది. నేనన్నాను "సహోదరుడా ఉడ్, నీవు దారి తప్పావు"

అతడన్నాడు... చూశారా, నేను అప్పుడే కూటం ముగించుకొని వచ్చి కార్లోకి వచ్చి నిద్రించాను, మరి అతడన్నాడు “ఓ, లేదు" అన్నాడు. "నేను సరైన దార్లోనే వున్నాను" అన్నాడు. "41వ నెంబర్ రహదారిలోనే వున్నాను".

అతడన్నాడు “ఇప్పుడు, ఇంత దట్టమైన పొగమంచులో నువ్వు దాన్ని ఎలా చెప్పగలవు? చూశారా, నువ్వు కనీసం రోడ్డుకూడా చూడలేకపోతున్నావు".

నేను అన్నాను “కానీ... నీవు... దక్షిణం వైపు వెళ్తున్నావని నేను రూఢిగా చెప్పగలను"

అతడన్నాడు " లేదు, లేదు, చూడు అక్కడ, అది41 రహదారే”.

"నేనన్నాను "అయినా అది తప్పే"

మంచిది, మేము అలా కొంతదూరం ప్రయాణించాము. తాను సరైన త్రోవలోనే పోవుచుండెనని అతడు తెగ వాదిస్తున్నాడు నాతో, అంటున్నాడు, "నేను సరిగా 41 లోనే వున్నాను, ఇది మెంఫీస్కి వెళ్ళేదారి." మరి నేనన్నాను "సరే, నువ్వే చూస్తావుగా గమనించు." మేము ఆయిల్ బంకులోకి ప్రవేశించాము, అక్కడ నేను వారిని అడిగాను, "మెంఫీస్కి ఇంకా ఎంతదూరం వుందండి ?"

అతడు చెప్పాడు "మీరు - మీరు త్రిప్పికొని వెనక్కి వెళ్ళండి, బాలుడా, నీవు ఇప్పుడు జార్జియాలో వున్నావు" అన్నాడు. “మెంఫీస్ వెళ్ళాలంటే మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి" మేము అనుమతించ బోము... అవును, అయ్యా. అవును అయ్యా? అవును అయ్యా, అవును అయ్యా, మంచిది మీరు గమనించకపోతే...

98. మరి ఒకసారి నాకు గుర్తున్నది. పర్వతాలలో నేను దారి తప్పిపోయాను. మరి అక్కడ అప్పుడు... నాకు అడవిని గూర్చి పూర్తి అవగహన వుంది గనుక నేను ఎటుబోయినా నేనెన్నడు తప్పిపోయే ప్రసక్తే వుండదు అని నేను అనుకొన్నాను. అయితే నేను నిజంగా తప్పిపోయాను. నాభార్య మరియు నా చంటి బాలుడు బిల్లీపాల్ అప్పుడు నాతో వున్నాడు. మరి వారు... నేను వారిని ఒకచోట వదిలి పెట్టి వెళ్ళాను. మరి నేను వెళ్ళాను...

ఒక ఎలుగుబంటిని వేటాడు నిమిత్తం నేను వెళ్ళాను. మీరు చూడండి? నేను ఎలుగుబంటిని వేటాడుచున్నాను. మరి నేను-నేను ఒకపెద్ద మగ దుప్పి వెంటపడ్డాను. మరి దానిని నేను కాల్చాను...
నేననుకొన్నాను, "మంచిది, నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం మంచిది" మరి నేను క్రిందికి దిగి వచ్చుటను నేనెరిగియున్నాను... నేనప్పుడు ఆడరాండక్ మీద వున్నాను. నేనావిధంగా ఆ పర్వతమెక్కాను, వారి నేను.., అయితే ఏదోరోడ్డు దాటుచున్నది. మరి అది- అది అడవి సింహాం అది తన చెవులను వెనక్కి త్రిప్పుకొన్నది. మరి అది నేను నా తుపాకీని ఎత్తికాల్చబోయే లోపే అది అక్కడ నుండి వెళ్ళిపోయింది. మీరు చూడండి? మరి, మెడా ఇది వరకు ఎన్నడు అడవిలో వుండలేదు, చూశారా? మరి...

మంచిది, మేము హనీమూన్ నిమిత్తం ఆ యాత్ర చేసాము, చూశారా! నేను అప్పుడు బాగా పనిచేస్తున్నాను, మీరు చూశారా? సరిగ్గా అప్పుడే నాకు పెళ్ళి అయ్యింది. మీకు తెలుసా ఆమెను నేను హనీమూన్కి తీసికెళ్ళాను, అలానే మరోప్రక్క వేట కలిసి వస్తుందని వెళ్ళాను. మీరు చూశారా? కనుక -కనుక, నేను అనుకొన్నాను... నేను...నేను "మంచిది, ఇప్పుడు నేను ఎలా బయటపడేది," నేను... మరి నేను ఈ దారిగుండా పైకి వచ్చాను, ప్రక్కకి తిరిగాను, ముందుకి అలా వెళ్లాను, ఒక శిఖరం మీదికి ఎక్కాను, అక్కడ నుండి చిన్న సొరంగం (గొయ్యి) గుండా క్రిందికి దిగివచ్చాను, ఎక్కడికో ఒక పెద్ద దానివైపు వెళ్ళుచున్నట్టు నాకర్థమైంది. కెనడా వైపుకి, అయితే అది సరిగ్గా ఎటువైపు అనేది నాకు తెలియట్లేదు. అప్పుడే ఒక తుఫాను వచ్చింది.

99. అకస్మాత్తుగా మీకు తెలుసా, మంచు తుఫాను చెలరేగింది అది, ఓ, పొగ దట్టంగా కమ్ముకొంది, కనీసం నీ ఎదురుగా నీ చేతిని కూడా నువ్వు చూడలేనంత పరిస్థితి. మరి మీరు అటువంటి ఒక ప్రాంతములో వున్నప్పుడు ఎటువెళ్ళాలో తెలియని పరిస్థితిలో చిక్కుకొన్నప్పుడు, మీరు ఒక చోటుకి చేరి ఆగటం మంచిది, లేదంటే మీ ప్రాణాలు మీరు పోగొట్టుకొనెదరు. చూశారా? మరి మీరు ఒక చోటుకి చేరి, పైకి లేచి, మరి తినటానికి ఏదైనా తీసికొని, ఒకటి రెండ్రోజులు తుఫాను తొలగి పోయే వరకు వేచివుండండి, అటు తరువాత బయటికి వచ్చి నీవెచ్చట వున్నావో అనే దాన్ని చూసుకొనుము,

గనుక, నేను అక్కడ ఆగలేకపోయాను. మెడాను అడవిలో ఒక మంచె (తాత్కాలిక సపారం) దగ్గర వదిలి వచ్చాను, ఇదివరకెన్నడు ఆమె అలా అడవిలో వుండలేదు, ఆ మంచెకి తలుపు కూడా వుండదు, అది, మీకుతెలుసా, అదొక తాత్కాలిక గది లాంటిది. అలా వుంటుంది. కావున నేను ఆ రకంగా వుండిపోతిని, మరి, ఓ, మై, నేను లేచి, తిన్నగా ముందుకు వెళ్ళి, ఇలా అలానే ముందుకి సాగాను. మరి నేననుకొన్నాను. "మంచిది, ఇక్కడే నేనెక్కడో దారి తప్పాను" తరువాత నేను ఎక్కడైతే దుప్పిని కాల్చిచంపానో సరిగ్గా అక్కడికి చేరుకొన్నాను. అక్కడ నుండి బయలు దేరాను, నేను అన్నాను "ఇక్కడే ఎక్కడో నేను తప్పిపోయిన దారిని కనుక్కొవాలి. అడవిలో నా భార్య బిడ్డ చనిపోతున్నారు" చూసారా?

100, బాగా చలి ఎక్కువైంది. మరి పొగమంచు ఎక్కువైంది, అది మంచుగా అగుతున్నది. మీరు చూశారా? మరలా నేను మెదలుపెట్టాను. మరలా ఆ దుప్పి దగ్గరకి వచ్చాను. మూడుసార్లు అలా చేసాను. మంచిది, అప్పుడు నాకు తెలిసింది... నేను అన్నాను, "మంచిది, నేను వెళు న్నాను... నేను -నేను ఎచ్చటో వున్నాను..."

చూడండి, ఇప్పుడు ఇండియావారు అటువంటి ఒక పరిస్థితిని, దానిని 'చావునడక'గా పిలుస్తారు(అభివర్ణిస్తారు), నీవు సమభూమిలో వున్నట్టు, నువ్వు వృత్తంలో చుట్టూ తిరుగుచు
తిరుగుచు వున్నట్టూ. చూశారా? ఒక చుక్కానితో నువ్వు దాన్ని చూడలేవు, చూశారా? నువ్వు వృత్తంలో నడిచినట్టే. దాన్ని ఇండియన్లు చాపు నడకగా పరిగణిస్తారు. చూశారా? వెట్టిపుట్టినట్టుగా నీకు అగును. అటువంటి పరిస్థితుల్లో వారు మతిస్థిమితం లేనివారై, ఉరుకులు బెరుకులు పెట్టుచూ, పిచ్చిపిచ్చిగా కేకలేస్తూ, మొదలగు పనులు చేస్తూ వుంటారు, చివరికి గుట్టకి గుద్దుకొని చనిపోతారు, లేదా తమ్మును తాము చంపుకొంటారు.

101. మరప్పుడు, నాకు-నాకు గుర్తున్నది నేను చెప్పినది. "మంచిది. నేను నేరుగా తిన్నగా వెళ్తు న్నాను" నేను-నేను...? నాకు భ్రమ తప్పినట్లైపోయింది. నేను అనుకొన్నాను, "కూర్చో వెఱ్ఱువాడా, నువ్వు తప్పిపోలేదని నీకు తెలుసు, నీవు -నీవు తప్పిపోవు" మీరు చూచారా? నేను అలా చెప్పుకొంటు న్నాను. సరే, చూడండి, అది- అది అక్కడలేదు. ఒకటి ఏదైన అక్కడ లేనప్పుడు, దానిని నువ్వు లేదని తృణీకరించ జాలవు, మీకు తెలుసా, ఆ విధంగా...

మరి ఆ విధంగా, నేను చెప్పుకొన్నాను "మంచిది. నేను తప్పిపోలేదు, నేను ఎచ్చట వున్నానో సరిగ్గా దానిని నేను ఎరిగియున్నాను, ఖచ్చితంగా నేను వచ్చేటప్పుడు సరిగ్గా ఇలాగే వచ్చాను. అది నిశ్చయంగా వాస్తవం" అలా వెళ్ళుచూ దారి పొడుగున నాకు నేనే మాట్లాడుకొంటున్నాను, మీకు తెలుసా, చెమటలు బాగ పడుతున్నవి. ఇప్పుడు, నేను ఒక్కడినే అయితే, ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి, చిన్న స్థలములో దాగి వుండి, తుఫాను వెలిసే వరకు వేచి వుండేవాడిని. బహుశా అది ఒకటి రెండ్రోజులైన సరే, కంగారు పడేవాడిని కాదు, నేను వేటాడి చంపిన ఆ దుప్పి మాంసం తింటూ అలా గడిపేవాడిని, కానీ మీరు చూడండి? నీవలా చేయలేవు. ఎప్పుడు, ఎందుకంటే అటు ప్రక్క భార్యని అడవిలో ఒంటరిగా విడిచిపెట్టివచ్చాను. వారిద్దరిని అలా వదిలేసి వచ్చాను. మరి వారు ఆ రాత్రిలో చచ్చిపోవచ్చును. అడవిలో ఎలా మసులుకోవాలో వారికేం తెలీదు. చూశారా?

102. కాబట్టి నేనిలా తలంచాను... నేను అలా అక్కడ వెళ్తున్నాను, ఏదో నా చెవిన పడుతున్నది, "నేను నీ ప్రభువును, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడను". నేను అలా నడుస్తూనే వున్నాను. నేను అనుకొన్నాను," ఇప్పుడు, నాకు తిక్కపుడుతుంది. మీరు చూడండి? నేను ఏదో వింటున్నట్టుగా నాకుంది" ఇరవై ఏళ్ళక్రితం ఇది, అప్పుడే ఆమెతో వివాహమైయింది. నేను అలా వెళ్ళుచున్నాను. అది చెప్పినది. "నేను ప్రభువును, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడను” ఆ విధంగా అది మూడు నాల్గుసార్లు చెప్పినది.

కొద్దిసేపటి తర్వాత నేను ఆగాను. ఇలా అనుకొన్నాను. "నాలో నేను అనుకొనుచున్నానైనా కావచ్చు లేదా సర్వశక్తి గల దేవుడు నా మీద దయచూపైనా వుండొచ్చును" మరి నేను నా తుపాకీని ప్రక్కనబెట్టి మోకరించాను మరి నేను చెప్పాను. "దేవా, నేను తప్పిపోయానని నేను ఒప్పుకొను చున్నాను" మీరు చూడండి, "నేను -నేను తప్పిపోయాను. మరి నీవు... నేనెన్నడూ... నేను బయటపడే అవకాశమే కనబడుటలేదు... అడవిని గూర్చి నాకన్ని తెలుసులే, నేను తప్పిపోటం అసంభవం అని నేను భ్రమపడ్డాను" ఇంకా అన్నాను. "నేను పూర్తిగా దారి తప్పిపోయాను, అవకాశమేలేదు..." చాలా ఒత్తిడికి గురయ్యాను, మీరు చూడండి? "కావున నా ముందు నేను బయటపడే మార్గమే నాకు కనబడకుండాపోయింది. బ్రతుకుతానన్నా ఆశ నాకు లేకుండా పోయింది. అయ్యా, కానీ నా భార్యబిడ్డలక్కడ వుండిపోయారు" చూశారా? "కనుక నన్ను వాళ్ళ
దగ్గరికి నడిపించు, లేకపోతే వారు అడవిలో చనిపోతారు" అన్నాను "నాకైతే బ్రతకాలని ఆశలేదు. కానీ వాళ్ళకోసం" మరి అన్నాను. "నీవు నాకు సహాయం చేస్తే, నీకెంతో కృతజ్ఞుడుగా వుంటాను" నేను లేచాను, ఇలా అన్నాను "ఇప్పుడు, నేను ఈ దారివైపు నా ముఖం త్రిప్పుకొందును, మరి నేను తిన్నగా మెడా మరియు వారిని నేను ఎచ్చటనైతే విడిచిపెట్టి వచ్చానో సరిగ్గా అచ్చటికే ఈ దారి నన్ను తీసికెళ్తుంది" కానీ నేను...?... వెళ్తే ఈ దారి తిన్నగా కెనడాలోకైనా వెళ్ళాలి లేకుంటే చావుదారైనా కావాలి (చూశారా) లేదా కెనడా లోకైనా తీసికెళ్ళాలి.

103. మరి, నేనిలా మొదలుపెట్టాను, అకస్మాత్తుగా, ఒక హస్తం లాంటిది నన్ను తట్టినట్టు నాకు అనిపించింది. (బ్రదర్ బ్రెన్హామ్ చేత్తో కొట్టుచున్నాడు -సంపా) "ఇది ఎవరిదై యుండవచ్చు? అని నేను అనుకొన్నాను, పైకి చూసాను. వెంటనే మళ్ళీ వెనక్కి చూసాను అప్పటికప్పుడే మంచుపొగ తొలిగిపోయింది, హరికేన్ పర్వత శిఖరం కనిపించింది. మరి వారు హరికేన్ పర్వతానికి దిగువనే వున్నారు.

మంచిది, అప్పుడు నేనక్కడ నిలిచి, చంటి బిడ్డవలే ఏడ్చుచూ, దేవున్ని స్తుతించాను, మీకు తెలుసా, నాకు సహాయం చేసినందుకు మరి అంతట, నేను ఆ దారిని తీసికోవల్సి వచ్చింది. మరి అది నాపై చీకటి బడింది. మరి- మరి దుప్పులు మరి అలాంటివి నా ముందు ఎగిరినవి. కానీ నేను తీసికోలేదు... చీకటి పడిన తరువాత, నాకు తెలుసు రేంజర్(అటవీశాఖ అధికారి) మరియు నేను... ఈ రేంజర్ క్యాబిన్ ఈ మంచెకి దగ్గరగా వున్నప్పటికి అది తాళం వేయబడింది. మరి అప్పుడు, మరి అక్కడ నుండి దిగువకి ఇరకై అయిదు మైళ్ళదూరం వరకు ఏ ఇల్లు లేదు. మీరు చూశారా? మరలాగే పర్వతము మీద, రేంజర్స్ క్యాబిన్ నుండి పర్వతము యొక్క పై భాగము వరకు, అక్కడున్న పెద్ద శిఖరము వరకు ఏమి లేకుండెను... మంచిది, నాకు తెలుసు నేను ఆ పర్వత శిఖరము మీద ఎక్కడో వున్నాను అయితే ఆ పర్వతములు ఎన్నోఎన్నో మైళ్ళ చుట్టు దూరం కలిగివున్నవి, మీకు తెలుసా, ముఫై, నలభై మైళ్ళ యాభైమైళ్ళ పరిది వరకు అవి విస్తరించి వున్నవి. మరి నేనననుకొన్నాను. "ఇప్పుడు నేను అక్కడి నుండి దిగువు వరకు వచ్చుచున్న ఆ తీగను నేను పట్టుకొంటే చాలు, ఇక నేను అక్కడికి చేరుకొన్నట్టే" అతడు నేను మాట్లాడుకోటానికి అది పెట్టబడి వుంది, మీకు తెలుసా దానిని చెట్ల మీదనుండి తీసికొనడం జరిగింది. అది అలా అతని కేంద్రం వరకు వున్నది. మరి మీకు తెలుసా, అది దాని టవర్ నుండి దిగువున వున్న కేంద్రంతో అనుసంధానం చేయబడి ప్రసారం అగుతుంది.

104. అక్కడికి అతడు మరికొద్ది దినాల్లో అక్కడికి నాతో కలిసి వేట చేయుటకు వచ్చును. మరి అప్పటికే చీకటిపడి రాత్రి అయినది. అంతట నాకేమి కనబడుటలేదు. మీకుతెలుసా. మరి ఏది ఏమైనా చీకటయ్యెను. ముఫ్పై నలభై నిముషాల్లో ప్రొద్దుగుంకి చీకటిపడెను. మరి అప్పటికి సమయం మధ్యాహ్నం రెండు లేక మూడుగంటలాయెను. మరి నేను నా చేతిని ఈలాగు పైకెత్తి వుంచాను, మరి నేను నడిచాను. మరి నేను అప్పుడే పొందుకొన్నాను... ఈ చేతిలో తుపాకి పట్టుకొని నడక ప్రారంభించాను మీకు తెలుసా, ఆ తీగ ఇంత ఎత్తులో వుందని నాకు తెలియును దాని దారిపోడవున చెట్ల మీదనే దాన్ని తగిలించుకొంటూ వచ్చాను

మరి నేను అనుకొన్నాను, "నేను ఆ తీగెను ఆధారం చేసికొని నడిస్తే చాలు" మరి నేను ఆ కొమ్మలను పట్టుకొని నడిస్తేచాలు, మీకుతెలుసా, మరి నేను అనుకొన్నాను, "నేను... లేదు,
అది ఒక కొమ్మ" మీరు గమనించండి. మరి నేను తిరిగి ప్రయత్నించాను మరి అంతట నేను మార్చినప్పుడు... నా చేయి బాగా నొప్పి చేసింది, ఎందుకంటే చాలాసేపు దానిని నేను పట్టుకొన్నాను గనుక నేను చేతులు మార్చుకొన్నాను, ఇటువైపు చేతికి తుపాకిని మార్చుకొని, కొన్ని మెట్లు వెనక్కి వేసాను, మీకుతెలుసా, దాన్ని మించిపోకుండా వుండేదుకు, నిశ్చయంగా మీరు గమనించండి ? ఎందుచేత... మరి ఆ విధంగా.

105. మరి సహోదరుడా, దానితో పాటు మరి దారిపొడవున అంతా బాగా చీకటి కమ్మెను, మీకుతెలుసా, ఆ చీకటిలో నేనలా దాన్ని (తీగను) పట్టుకొని దాదాపు గంటపాటు నడిచాను. నేను అనుభూతి చెందాను దానిని, మంచిది, నేను నా శిరము వంచి ఏడ్చాను మీకు తెలుసా. నేను అనుకొన్నాను, " అవును ప్రభువా, ఈ తీగ ముగింపున నా భార్య మరియు ప్రతీది ఎదురు చూస్తుందని నేనెరుగుదు. చూశారా" నేను అనుకొనుచున్నాను "అది నిశ్చయం" నేనక్కడ నిలబడ్డాను. అందునుబట్టి నా శిరము వంచి కృతజ్ఞతులు చెల్లించాను. మరి నేను అనుకొన్నాను. "అవును, ప్రభువా, నీ చేతుల్లో నా చేతులుంచాను. ఇదొక విద్యుత్ తీగ, ఇప్పుడు నా హృదయములో నేను పట్టుకొనియున్న ఈ తీగ మరి ఈ తీగ ముగింపునందే నా ప్రియులందరు, నాకు ప్రియమైనవన్ని, నా ప్రభువు. నా రక్షకుడు యున్నారు. ఈ తీగ ముగింపునందే నాకు ప్రియమైన వారంత వున్నారు" కావున ఆ తీగ మీదనుండి నేను నా చేతులను తియ్యను. పర్వత మార్గమంతా నేనా తీగనే వెంబడించాను.

అక్కడ కొద్దిగా దారులు లేనప్పటికి, దారులు సరిగ్గా వుండనప్పటికి, అవరోధాలు వున్నప్పటికి మీకుతెలుసా, మనం పైకి వచ్చే క్రమంలో నేను ఆ దారులను నమ్ముకోలేదు గానీ ఆ తీగను నేను పట్టుకొని వుంటిని, నేను ఒక చెట్టును తాకిన వెంటనే, దాని చుట్టూ తిరిగి అక్కడి నుండి పొడిగించబడిన ఆ తీగను తిరిగి పట్టుకొని మరో చెట్టుకి చేరేవరకు పయనించాను. ఆ తదుపరి మరోదాని వరకు అది దాదాపు మూడుమైళ్ళ దారి ప్రయాణం. ఎట్టకేలకు నేనక్కడికి చేరుకొన్నాను, మీకుతెలుసా మెడా దాదాపు అపస్మారక స్థితిలోకి చేరుకొన్నట్టుంది, అలా అవ్వబోయే పరిస్థితి. కానీ అది అంతే, చూశారా? అక్కడ ఏది లేదు, ఏ చింతన లేదు, నశించిపోయామనేది లేకుండెను. అడవిలో తప్పిపోవుటను గూర్చి ఏమిటి- అడవిలో దారి కనబడక పోయే దాని గూర్చి. కానీ దేవుని నుండి తప్పిపోవుట అనే దానిగూర్చి ఏమిటి? అది చాలా భయంకరంగా వుండును.

106. మంచిది, మెడా? ప్రియతమా రమ్ము. సహోదరడు వెల్చ్ పనికి వెళ్ళవల్సివుంది. మరి బాంక్స్ మరి మిగతా వారు పెందలకడనే బయలుదేరుచుండొచ్చును. మరి ఈ మిగతా సహోదరు లందరూ పనులకి వెళ్ళనైయున్నారు. మరి మన సహోదరీలు పిల్లల్ని శుభ్రం చేసి సిద్ధపరిచి... మీకు ధన్య వాధములు, మీకు ధన్యవాదములు.

మీతో మాట్లాడటం, దానిని మీరు నావలె ఆనందించి యున్నారని అనుకొంటున్నాను. ఇది అద్భుతమైంది. అవునండి.

సహోదరుడా వెల్చ్, ఈ మధ్యాహ్నం మనం కలిగియున్న సమయం-నన్ను ఆ పెద్ద ముసళ్ళ యొద్దకు తీసికొనిపోయి చూపించినందుకు నీకు ధన్యవాదములు, సహోదరీ, మీరందరికి, ఆ మంచి విందుకై మీకు ధన్యవాదములు. ఓ, మై,
మీకు కూడా అక్కడ చిన్న బాలిక ఉందా? ఆ బిడ్డకి చక్కని వెంట్రుకలున్నవి. నేను గమనించాను ఆమె జుట్టు ముడివేసికొని వుండెను, అదొక రకంగా పసుపు వర్ణం, బంగారు వర్ణజట్టు. అది -అది చాలా బాగుంది. సహోదరి నీ జుట్టు మీద కూడా నేను వ్యాఖ్యానం చేయగోరుచున్నాను. అవి మెరుగైనవని నేనెరుగుదును. ఒకప్పుడు నీకు పొట్టిజాట్టు అని నేను అనుకొంటున్నాను, కాదా? అది కేలవం నీ మెడ మట్టుకే వుండేవి. ఒకరకంగా కత్తిరించేటట్టు. మరి ఆ విధంగా... ఇది వరకే అలానే వున్నవా? అవును, నేను... అవును... నేను. మంచిది, ఇప్పుడు అవి చూడటానికి చాలా బాగున్నవి. చూశారా.

107. నేనిచ్చట గమనించాను ఇక్కడున్న స్త్రీలందరి జుట్టు, పొడవుగా వుండెను. అవి చూడటానికి.

ఓ, మిగతా వారివలే వారివి కూడా చాలా బాగున్నవి. అవును కదూ, కొద్దిగా వుండొచ్చు. లేక పొడవుగా వుండొచ్చు, మీకు తెలుసా అవి చూడటానికి చాలా బాగున్నవి. నా భావం మీకు అర్థమైందా. మీరి కేవలం... బహుశా అది నా వలె... కానీ...

అక్కడొక చిన్న బాలిక వుంది, ఆమె కొంచెం సిగ్గుపడేటట్టున్నది, ఆమెవి కాదంటారా?

108. ప్రియా నేను అతన్ని ఎత్తుకొనేనా? ఆమె ఇప్పుడు ఎక్కడ? ఓ... లేదు. వారు నాతో చెప్పుట మీరు విన్నారా? దానిని మీరు పొందుకొన్నారా? బెక్కి రాక కోసం మేము వేచి వుండాలని ఆమె నాకు చెప్పినది, మరి దానర్థం నీవు తిరిగి వెళ్ళి మరలా భోధించటం ఆరంభించమని కాదు.

ప్రియా, ఆ చిన్న బాలికకి కూడా జుట్టు అందంగా వచ్చింది కదూ? ఆమె జుట్టు పొట్టిగా పోనీటేల్ వలె చక్కగా వ్రేలాడుచున్నది. చిన్న ఎరుపు రాగిజుట్టు మరియు...

లేదు. నేను బయటికి వెళ్ళి, చేతనైతే ఆ పాత క్యాడలిక్ కారును స్టార్ట్ చేస్తాను సహోదరుడా వెల్చ్, మరి నేను... మన్నించండి ఒక నిమిషంపాటు, మరి నేను చెయ్యగలనేమో చూస్తాను... కొన్నిసార్లు ఆమె దగ్గుచు, కొద్దిగా శబ్దం చేస్తుంది, మీకు తెలుసా, మరి... ఏమిటి, బెర్నీ?

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...