ఒక వాడబడిన దుప్పటి
1. నేను కాపరితో మాట్లాడుతున్నాను. నేను చెప్పాను... నిన్న అతనిని నాకు ఫోన్ చెయ్యమని చెప్పాను, మరియు నేను కనుగొనుటకు వచ్చాను, నేను కేవలం... రోజంతా ఎక్కడనూ ఏ ఫోనుకాల్స్ లేవు, మరియు నేను అనుకున్నాను, "మంచిది, ఏం తప్పు జరిగిందా అని ఆశ్చర్యపోయాను? ఏదో... ప్రతియొక్కటీ చాలా శాంతియుతముగా ఉన్నది." మరియు కొద్దిసేపటి తరువాత సహోదరి ఉడ్స్ తన చేతి నిండా కాల్స్తో వచ్చింది, నా ఫోను బయటకు వెళ్ళింది. కాబట్టి మీలో ఎవరైనా ఫోను చేసినట్లయితే... ఫోను మ్రోగుతుంది, కానీ అక్కడ ఆ ప్రతిధ్వని వినిపించదు, సమస్యంతా స్విట్చ్ బోర్డులో అడుగున ఉన్నది. గత రాత్రి 8 గంటలకని వారు నిర్ధారించారు, లేక బహుశా దాని కన్నా కొద్దిగా ముందు అయ్యుండవచ్చును, మరియు ఆ ఫోను... ఇప్పటి నుండే ఆ ఫోనులో కాల్స్ వస్తున్నాయి.
2. ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో ఉండుట మాకు సంతోషముగా ఉన్నది. నేను భయంకరమైన జలుబును కలిగియున్నాను, నేను సహజముగా నా ఇంటికి వచ్చినప్పుడే అలా జరుగుతుంటుంది. సుమారుగా మీ నదుము వరకు ఉన్న మంచులో నడుచుట, మరియు బయట నిద్రించుట, ఇక్కడ నుండి దూరముగా వెళ్ళిన తరువాత దాన్ని గురించి ఆలోచించను, కానీ అక్కడ ఆ కొండ దగ్గరున్న న్యూ ఆల్బనీ దాటగానే మీరు తప్పనిసరిగా ఈ లోయలోకి రావలసినదే, తరువాత నాకు ఈ చెడుదైన జలుబు వచ్చింది. మరియు అది... నాకు తెలియదు, ఆ లోయలో ఏదో ఉండి మమ్ములను క్రిందుగా ఉంచుతున్నది, చాలా క్రిందకి, మరియు ఈ విషయమై నాతో అందరూ ఒప్పుకొనరు.
ఇప్పుడు, సంఘములో ఉన్నందుకు మాకు సంతోషముగా ఉన్నది, నేను చెప్పినట్లుగా, మరియు ప్రభువైన యేసుకి, మన మంచి కాపరి మన కొరకు వాక్యపు విజ్ఞాపన
చేయుటను వినుట, మరియు -- మరియు వినుటకు... చాలమంది అవసరత మరియు బలహీనముగా ఉన్నారని తెలిసినందుకు బాధగా ఉన్నది, మరియు ఆ దెయ్యము క్రూరమైన కోపముతో ఉండి ప్రతి ఒక్కరినీ బలహీనులుగా చేస్తున్నది.
మరియు -- మరియు అక్కడ తన సహోదరి వెనుక లేచి నిలబడిన ఒక చిన్న స్త్రీ ఉన్నది. మరియు సహెూదరి సైరెస్ అక్కడ దిగువనున్నదని నాకు తెలుసు, ఆమెతో ఉన్నది. ఇప్పుడు మరణించుటకు డాక్టరు ఆమెను ఇంటికి పంపివేశాడు, మరియు ఆమె స్వస్థపరచ బడుతుందని ఆమె ఇంకనూ నమ్ముచున్నది. మరియు ఆమె చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నది, చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నది, నా అత్తగారు, అదే విధముగా ఉన్నారు. ఇప్పుడు వారికి 70 సంవత్సరములు వయస్సు, ఆమె చాలా చెడ్డస్థితిలో ఉ న్నది. మరియు అకస్మాత్తుగా దేశమంతా చాలా బలహీనతతో నిండిపోయింది. అటుతరువాత దేశము చుట్టూ పరిశుద్ధాత్ముడున్నాడు (మీరు చాశారా?) అది మన బలహీనతలను స్వస్థపరచును, మనము ఆయనకు అనుకూలమైనది కనుగొన్నట్లయితే అది మనలను స్వస్థపరచును..
3. మరియు ఇప్పుడు, నా గొంతు మంటగా ఉన్ననూ, మంటగా కాదు, కానీ అది సరిగా లేదు, మరియు నేను ప్రసంగించటానికి ప్రయత్నము చేయుటలేదు కానీ వాక్యము నుండి మీతో కొద్దిసేపు మాట్లాడతాను, అటుతరువాత ఏదైతే నేను చేస్తానని వాగ్ధనము చేసియున్నానో ఆ బలహీనుల కొరకు నేను ప్రార్ధన చేస్తాను. కానీ కేవలం ఇది చేయుటకు ముందుగా, నేను రాబోవు కూటములను గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను. నేను... నా పరిచర్యలో నాకొక చిన్న వ్యతిరేకత ఉండేది, వ్యతిరేకత కాదు, కానీ అవి కేవలం తప్పుగా అర్ధం చేసుకున్న చిన్న సంగతులు మాత్రమే. మరియు చాలాసార్లు నేను -- నేను, పొలములో ఉన్నప్పుడు మిగిలిన సహెూదరులందరు కలిగియున్నట్లుగా, నా పరిచర్యను బయటకు తీసుకువెళ్ళే మార్గము కలిగిలేను, ఒక రేడియో, మరియు టెలివిజన్, మరియు మాసపత్రికలు మరియు మొదలగునవి, నేను కలిగిలేను. మరియు నేను ఆవిధముగా చేస్తున్నాను, ఎందుకు, ఎవరో ఒకరు నన్ను ఇలా అనవచ్చును, “బ్రదర్ బ్రన్హాం ఇక్కడ ఉండవలసినవాడు."... ఇప్పుడు, ఈ దినమే నేను ఈ వారము కొరకు 3 చోట్ల ప్రకటించబడ్డాను, 3 విభిన్నమైన ప్రాంతములలో, కెంటకీలోని దిగువ ప్రాంతములో ఒకటి, రెండవది కాలిఫోర్నియాలో, నాకు అది తెలుసు. మరియు నీవు దాని గురించి ఏమియూ చేయవలసిన అవసరం లేదు, కారణమేమంటే నాకు ఏవిధమైన ప్రత్యేకమైన బయటకు మార్గాలు లేవు, కాబట్టి అది నాకు కొద్దిగా కష్టతరముగానే ఉంది.
4. మరియు కెంటకీలోని దిగువ మాడిసన్ విల్ నందు ఎవరో ఒకరికి ఆ విధముగా జరిగినట్లయితే, ఇక్కడ, గత వారము నేను అక్కడ దిగువున ప్రకటింపబడియుండాలి, మరియు నాకు దాని గురించి ఏమియూ తెలియదు. నేను ఇంటికి వచ్చాను, మరియు మరియు వారు దానిని చాటించారు, మరియు ఈథింగ్స్ అనే సహోదరుడు దానిని చేసియున్నాడు, అతని పేరు అదేనని నేను నమ్ముతున్నాను, అతని మంచి విశ్వాసమంతటితో దానిని చేశాడు. దిగువకు వెళ్లి దీవించి మరియు వారి ప్రజల నుండి దీవెనలు అందుకోవాలని అతడు నన్ను పిలిచి అడిగాడు. మరియు అతడు నన్ను పిలిచాడు, సహోదరుడు మూర్ ని అడగమని నేను చెప్పాను. మంచిది అయితే, నేను వెళ్ళవలసి యున్నది. అదే దినమందు నేను వెళ్ళవలసియున్నదని నేను అతనికి చెప్పాను. మంచిది, సహెూదరుడు మూర్ దాన్ని తెలియజేయటలో విఫలం చెందాడు. మరియు ఎప్పుడు... లేక నాకు తెలుసు లేక నా భార్యకు తెలుసు. కావున నేను పైన ఇడహెూలో ఉన్నాను మరియు కేవలం వెనుకకు తిరిగి వచ్చాక మరియు కూటమి ప్రారంభమైంది. కావున కావున ఆ సమయంలో నేను చూశాను... ఇక్కడ జరుగుతున్న కార్యములకు లూయిసియానా నుండి ఏర్పాట్లను చేయలేదు. కావున ఆ ఏర్పాట్లను నా అంతటగా నేను తీసుకున్నాను, నా కూటములున్నంత వరకు ఆ కూటములకు నా స్వంతగా నేను ఏర్పాట్లు చేసుకున్నాను... నేను కేవలం దయతో...
ఓహ్, నాకు తెలియదు, ప్రాణమునకు ఒప్పుదలే మంచిదని నేను భావిస్తాను, మీరు ఆలాగే ఆలోచిస్తారా? కేవలం ఇటువంటి కార్యములను గురించి నేను చాలా జాగుచేసే వాడిని. మరియు కేవలం ప్రతిచోటా ప్రతివారిని దైవాధీనంగా వెళ్ళనిమ్ము. మరియు అది ఏదియూ చెల్లించదని నేను కనుగొన్నాను. చాలాకాలం తరువాత మీరు ఉంచితే... మీరు దానికి ఒక పద్ధతిని కలిగియుంటారు.
5. మరియు నేను ఆ ఏర్పాట్లు చేయుటకు ప్రయత్నము చేస్తున్నాను, మరియు నేను -- మరియు శ్రీమతి ఆర్నాల్డ్ని చూడబోవుతున్నాను. ఇక్కడ నేను కూటములు కలిగియున్నప్పుడు ఇక్కడ లూయిస్ ్వల్ నందు ఒక మనిషి ఉండేవాడు, అది చాలా మంచిది. మరియు అతని పేరు బ్రదర్ డుర్వాన్, మరియు అతనికి ఒక లేక రెండు ఆరాధనలు కావాలని కోరుకునేవాడు. నేను ఆమె యొక్క చిన్న టెడ్డీని ఒక రాత్రి చూడబోతున్నాను, ఈ వారములో కొద్ది సమయము కొరకు టెడ్డీ ఆర్నాల్డ్ని చూస్తానని నేను నమ్ముతున్నాను.
మరియు రాబోవు శనివారము మరియు ఆదివారము, ప్రభువు చిత్తమైతే, నేను చేయగలిగితే, నేను దిగువ మాడిసన్విల్ లో ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ వారు సుమారుగా 25, 30 మంది సేవకులను కలిగియున్నారు, వారంతా అక్కడ కూర్చుని ఉన్నారు, వారిలో ఒకరు కేవలం 6, 7 వందల మైళ్ల నుండి వచ్చారు.
మంచిది, వారిలో ఎవరూ లేరు, కావున... అక్కడ లేరు... దానిలో నా స్వంత తప్పిదము ఒక వాడబడిన దుప్పటి ఏదియూ లేదు, కానీ నేను కేవలం అది కేవలం తప్పుగా అర్ధము చేసుకొనుట ద్వారా వచ్చింది లేక అతడిని పిలుచుటలో నిర్లక్షము చేయుటవలన వచ్చినది. ప్రభువు చిత్తమైతే వచ్చేవారాంతములో నేను దిగువన ఉండుటకు ప్రయత్నము చేస్తాను.
తరువాత 5 నుండి 6 వరకు, నేను న్యూయార్లోని బ్రూక్లిన్ లో ఉంటాను. మరియు అటు తరువాత... 14, 15 మరియు 16 వెస్ట్ వర్జీనియాలోని పార్కర్స్బర్గ్ ఉంటాను, ఆ రెండు ఏర్పాట్లను మాత్రమే గత రాత్రి మరియు ఈ ఉదయం చేశాను, ఇప్పుడు, సౌత్ కారోలినాలోని ఛార్లెట్ కూడా ఆ జాబితాలో ఉన్నది, కానీ నాకు తెలియదు. తరువాత సెలవు దినములు... (టేపు మీద ఖాళీ ఉన్నది -- సంపాదకుడు.) తరువాత మేము వెస్టికోటుకి వెళతాము, అక్కడ వారు ఒక -ఒక పెద్ద ఆడిటోరియంను వారు ముందుగానే నిర్ణయించారు. ఇప్పుడు, ఇవన్నీయూ ఉన్నత పాఠశాలలోని వాటివలె చిన్న చిన్న కూటములు. వెస్ట్కటులో ఉండే ఆ కూటమి రెండు నగరములలో ఉ ంటుంది, జంట నగరములు కలిసే ఒక నగరము, ఓక్లాండ్ మరియు శాన్ ఫ్రాన్సిస్కో కూటమి.
ఆ తరువాత, ఫీనిక్స్ నందు అప్పగించుట, అందుచేత బ్రదర్ రాబర్ట్స్ అక్కడ ఈ సంవత్సరము ఉండుటలేదు, దిగువ ఫీనిక్స్లోలో మారికోపా ప్రదేశ కూటములన్నీటిలో అతని స్థానమును నేను తీసుకొనబోవుచున్నాను. అది ఐకమత్యము యొక్క ప్రయత్నము, మరియు నా కొరకు ప్రార్ధించండి, ఎందుచేతనంటే నాకు నాకు దాని అవసరత ఉన్నది. మరియు అది ప్రతిసారి విశ్వాసము తనను తాను ఎప్పుడూ పైనే ఉ ంచుకుంటుందని నేను తెలుసుకున్నాను, ఆ దెయ్యము పాతాళములోని ప్రతి తుపాకినీ దానివైపు ఈ విధముగా త్రిప్పి ఉంచుతుంది. మీరు చూశారా? కావున అది దానిని మరింత కష్టతరము చేస్తుంది.
6. కావున ఈ ఉదయము బలహీనుల కొరకు ప్రార్ధించబడును... ఇప్పుడు, మనము దేవుని యొక్క నిత్యమైన కొద్ది వాక్యములను చదువుకుందాము, మరియు లేఖనముల నుండి కొద్ది సందర్భములు మాట్లాడుకుందాము, ఆ తరువాత రోగుల కొరకు ప్రార్ధన చేద్దాం.
ఓహ్, అతని గురించి నేను మాట్లాడుటను నేను ఎంత ప్రేమిస్తానో, మీకు తెలియదా? అతని గురించి మాట్లాడుటను నేను ఎంతో ప్రేమిస్తాను. ఇప్పుడు, నేను పరిశుద్ధగ్రంథము నుండి చదవాలని కోరుకుంటున్నాను. 2వ రాజులు 2వ అధ్యాయము, 12వ వచనములోని కొద్ది భాగము.
ఎలీషా అది చూచి, మరియు... నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలు వేసెను.
మరియు ఇప్పుడు, వాక్యము మార్గము కొరకు లేక అంశము కొరకు, నేను “ఒక వాడబడిన దుప్పటి (లేక వస్త్రము)" అను అంశము మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను. కావున ప్రభువు ఈ ఉదయమున మనం మాట్లాడుకున్నట్లుగా తన దీవెనలను అందించును గాక. మరియు మా కొరకు మీరు ప్రార్ధనలో ఉండండి.
7. ఆ ప్రదేశములో ఇశ్రాయేలు తిరిగి కూడుతున్న ఈ సమయములో, ఇశ్రాయేలు ఒక దేశము. మరియు అది ఒక బలమైన దేశము, మరియు వారి దేశములో సైన్యము ఒక భాగముగా ఉండుట వలన వారు సమాధానకరముగా ఉన్నారు, కానీ ఆత్మీయ పరముగా, అది అనుకరిస్తున్న సమయము మాదిరిగా ఉన్నది. మరియు మనము పాత నిబంధనలోకి చూసినట్లయితే, ఈ దినము జరుగేవాటిని మనము కనుగొనగలము. అన్నిసార్లు ఇప్పుడు జరుగుతున్న కార్యములు పరిశుద్ధగ్రంథములో ప్రారంభములో ఏవైతే ఉన్నాయో వాటికి ఇవి కేవలము దృష్టాంతములుగా ఉన్నాయి.
ఇప్పుడు, ఈ దినము ప్రపంచములో ఉన్న ప్రతిదాన్ని ఆదికాండము ఉత్పత్తి చేసియున్నది. ఆదికాండములో ప్రారంభం కానిదేదో అది ఏదీ లోకములో లేదు, ఎందుకంటే అదియే ఆరంభము కాబట్టి. అక్కడనే ప్రతి తత్వము ప్రారంభమైంది. ఆది కాండములోనే అన్నీ ఆరంభమైయ్యాయి. మరియు నిజమైన సంఘము ఆది కాండములోనే ప్రారంభమైనది. మరియు అబద్ధపు విశ్వాసులు ప్రారంభమైంది ఆది కాండములోనే. మరియు నిష్పక్షపాతం ప్రారంభమైనది ఆదికాండములోనే. ఆదికాండమే అన్నీటికి ప్రారంభము.
8. మరియు ఇప్పుడు, ఏలియా ఉన్న కాలములో, లేక భూమి మీద ఏలియా పరదేశిగా ఉన్నప్పుడు, ఆ ఘడియకు అతడే దేవుని యొక్క ప్రవక్త... మరియు దేవుడు భూమి మీద ఎల్లప్పుడూ తనకు ఒక్క సాక్షి కూడా లేకుండా ఉండలేదు. దేవుడు అన్నీ కాలములలో ఒక సాక్షిని కలిగియున్నాడు, ఎక్కడో ఒకచోట, ఏదో స్థలములో, తన చేతులను ఒక వ్యక్తి మీద ఉంచి ఒక సాక్ష్యమును ఆయన కలిగియుంటాడు. కావున, ఆయన ఆవిధముగా ఆదికాండము నుండి చేస్తున్నట్లయితే, ఆదియందును, ఇప్పుడునూ ఆయన నిశ్చయముగా ఎక్కడో ఒకచోట దేవుడు ఒక మనిషిని కలిగి అతని మీద తన చేతులను ఇప్పుడు ఉంచుతాడు. అతని అతని కోసము... ఇప్పుడది ఒకరికంటే ఎక్కువగా ఉన్నది. ఆయన తన చేతులను ఉంచిన అనేకమందిని ఆయన కలిగియున్నాడు, ఎందుకంటే మనమందరము కూడుకునే సమయానికి దగ్గరగా వస్తున్నాము, అదే కోతకాలమైయున్నది.
ఆదికాండము విత్తనమును నాటు కాలమైయున్నది, మరియు ఈ 6 వేల సంవత్సరములు పంట ఎదుగుతున్నది, ఇప్పుడు ఆ విత్తనము తనంతట తానే విత్తనముగా మారింది. అది వెనుకకు వెళ్లి పువ్వుగా మారి మరియు పువ్వు నుండి ఫలముగా మారింది. మరియు ఇప్పుడిది కూడుకునే సమయము, కోతకాలము, అన్ని గొప్ప కార్యములు ప్రారంభమైయ్యాయి. ఆది కాండములో ప్రారంభమైన ఆ నిజసంఘము ఇప్పుడు ఫలించే కాలమునకు వచ్చియున్నది, ఆత్మ యొక్క ఫలము, మరియు అంత్యక్రీసు ఆదికాండములో ప్రారంభించినది కూడా దాని ఫలములను ఇచ్చుకాలము వచ్చినది. మరియు ఈ లోకములోని తరములన్నీ అంతమయ్యే సమయములో మనమున్నాము, మానవ జాతి యొక్క అంతములో ఉన్నాము.
మరియు మనము... అన్నిటిలోకి ఇదియే గొప్పదైన సమయము, లేక జీవించిన కాలములన్నీటిలోకి, ఇదియే గొప్పదైన సమయమైయున్నది. ఇది కుదిపే (వణికించే) సమయము. ఈ సమయము పాపులకు కష్టతరమైన కాలము. కానీ క్రైస్తవులకైతే ఇది అద్భుతమైన సమయము, ఎందుకంటే మనకు తెలుసు మనము పైకి వెళ్ళబోవుచున్నాము, లేక మనము కలసి కూడుకొని గృహమునకు వెళ్ళుటకు మరియు ప్రభువును కలియుటకు చేయు చివరి చిన్న ప్రయత్నములు. ఇప్పుడు, ఈ దినము ప్రజలు మీ చుట్టూ ఉన్న గొప్ప శ్రమలు మరియు దేశము ఎదుర్కొనుచున్న ఇబ్బందులు చూడండి, ఎక్కడ...
9. కొద్ది రాత్రుల క్రితం నేను ఒకరితో మాట్లాడుతున్నాను, వారు ఇక్కడ ఉండి గమనించే ఏజెంట్లలో ఒకరు మరియు వారన్నారు, "బ్రదర్ బ్రాన్హాం, మరెన్నడూ ప్రజలకు ఏ ఒక్కటీ క్రిందపడవేసే దాని గురించి సలహాలు ఇవ్వకూడదని ప్రభుత్వము చేత మాకు చెప్పబడింది... కిటికీ నుండి దూరంగా నేల మీద బాంబ్ పడినట్లయితే, లేక అడుగు భాగమునకు ఎన్నడూ వెళ్ళరు, ఎందుచేతంటే వారు రేడియో ద్వారా ఈ క్రొత్త బాంబ్ మాస్కో నుండి లూయిస్్వల్ లోని 4వ వీధిని నేరుగా కొడుతుంది. పైకి కాల్చిన తరువాత, దానిలోపలే గురి ఎక్కడ తగలాలో ముందుగానే నిర్దేశించబడ్డాయి, అదే దాన్ని విస్పోటనం చేస్తుంది, దాన్ని చాలా వేల, చాలా వేలు, అది నక్షత్రముల మరియు రాడార్ ద్వారా మార్గనిర్దేశం చేస్తాయి, మరియు అది రష్యాలోని మాస్కో నుండి లూయిస్ ్వల్ లోని 4వ వీధి మీద ఖచ్చితముగా పడుతుంది. మరియు అదక్కడ ఎప్పుడు పడుతుంది, దాన్ని కలిగిలేరా...? మరియు విమానము గానీ మరేదీ ఉ పయోగించలేదు, కేవలం ఇక్కడ నుండి దానిని పేల్చితే మరియు అదక్కడ క్రింద పడుతుంది. మరియు అదక్కడ ఒక ప్రదేశములో నేల మీద పడి విస్పోటనం చెంది ఒక గొయ్యిని 175 అడుగులు లోతుతో ఏర్పరుస్తుంది... మరియు 15 నలుచదరపు మైళ్ళ దూరం అది వెళుతుంది, 15 చదరపు మైళ్ళు."
పై అంతస్తులో ఉన్న విమానములో వెళ్ళుటకు సిద్ధపడుటకు తప్ప (మనకు) మరేదీ చేయటకు లేదు, సమయము వచ్చినప్పుడు కేవలం అది మాత్రమే చేయుటకున్నది. కేవలం ఆలోచించుము, వారు కోరుకున్నట్లయితే వారి దగ్గరున్న వాటిలో నుండి ఏభైది కానీ లేక వంద కాని ఒకేసారి పేలుస్తారు. అదంతా కొద్ది సమయములోనే అయిపోతుంది, అది 60 లేక 80 నిముషాలని, లేక క్షణములని నేను నమ్ముతున్నాను, లేకపోతే అక్కడ నుండి ఇక్కడకు, ఆ కార్యము ఆక్రమించుకొని పూర్తి నాశనము అవుతుంది. లూయిస్విల్ మరియు హెన్రీవిల్ మధ్యలో ఏదియూ మిగిలియుండదు, మరియు లూయిస్విల్ మరియు మరియు బార్డ్స్ టౌన్, లేక అక్కడ దిగువన, కానీ నేలలో ఒక గొయ్యి ధూళితో నిండి ఉంటుంది, ఇక మిగిలియున్నది అదే, ప్రక్కన ఉన్న ప్రదేశాల నుండి అది కాల్చుకుంటూ మైళ్ళు మరియు మైళ్ళు మరియు మైళ్ళు దాని తరువాత ఉన్నది. మరియు అక్కడ ఒక దానిని క్రిందకు జార విడిచినప్పుడు, మరొక దానిని మరోచోట జారవిడిచినప్పుడు అది దానితో కలుస్తుంది.
10. మనకు ఆశ్రయమును కలిగియున్నందకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. "ప్రభువు యొక్క నామమే బలిష్టమైన గోపురం, నీతిమంతులు లోపలికి పరుగెత్తుతారు, మరియు వారి రక్షించబడుదురు.” ఎన్ని బాంబులు పడినా సమస్యలేదు, లేక ఎంతమంది ఎదైనా మిగిలి ఉన్నా, మనము అక్కడ సురక్షితముగా ఉన్నాము, కావున లోకమునకు మరియు పాపులకు అక్కడ ఆశ్రయములేదు, లేక ఈ రక్షణస్థలము, ఇది కుదిపే సమయం. నేను నమ్ముతున్నాను నేను క్రైస్తవుడిని కాకపోయినట్లయితే, ఏ సమయములో ఏమి జరుగుతుందో అని ఆలోచించుకుంటూ నేను పిచ్చివాడిగా వెళతాను, మరియు ఒక ఇంటి నిండా చిన్న పిల్లలు మరియు అన్నిటితో నిండివుంది, ఏమి చేయాలో నాకు తెలియదు. కానీ నేను నా ఇంటిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఎన్నడూ ఏ బాంబు తాకలేని ఒక ఆశ్రయమును వారికి పరిచయం చేయాలి, లేక మరేదీ లేదు. ప్రభువైన యేసు యొక్క రక్షణ కలిగిన రెక్కల క్రింద ఉండుటయే, "బలము చేత కాదు, శక్తిచేత కాదు, కానీ నా ఆత్మచేత, అని ప్రభువు చెప్పెను." చూశారా? అదియే మన రక్షణ.
మరియు జీవితము యొక్క పాపమంతా మరియు సమస్యలు మరియు శ్రమలు అన్నియూ అంతమగుట తెలియజేసే ఈ సమయం ఎంతో గొప్పదైనది మరియు విశిష్టమైన సమయము. ఈ దినములలో ఏదో ఒక దినమందు ఇవన్నీయూ అంతమగుతాయి, మరియు మనమందరమూ ప్రభువుతో ఉండుటకు గృహమునకు వెళతాము. ఇప్పుడు, సమయము మిగిలున్నది కేవలం సువార్తను ప్రకటించి మరియు వీలైనంత ఎక్కువ మందిని, ఎంతమందిని సాధ్యమైతే అంతమందిని మనము ఈ గొప్ప గోపురం క్రిందకు తీసుకుని రావడమే.
11. అటు తరువాత, ఈ దినపు మాదిరి మన పాఠమును చూస్తున్నట్లుగా, ఏలియా తాను ఉన్న కాలములో, అతను -- లేక అతను భూమి మీద పరదేశిగా ఉన్నాడు. ఎందుకు, అతను గొప్ప మరియు బలిష్టమైన మనుష్యుడు. అతడిని దేవుడు శక్తిగల విధానములలో బలిష్టమైన శక్తితో ఉపయోగించుకున్నాడు. దానిని మనము ఆ కాలములో కనుగొంటాము, అక్కడ ఏలియాని అనుకరించే ఒక గుంపున్నది, వారు ఏలియాను అనుకరిస్తారు, వారు ఏలియా చేసిన కార్యములనే చేయాలని ప్రయత్నిస్తారు. మరియు కావున మనము ఈ దినమున దానినే కనుగొంటాము, క్రైస్తవమును కూడా అనుకరిస్తున్నారు, ఎవరైతే ప్రజలు క్రైస్తవులవలె నటించుటకు ప్రయత్నిస్తున్నారో, వారిని వారే క్రైస్తవులని చూపించుకొనుటకు ప్రయత్నము చేస్తున్నారు. మీరు ఆలాగు చేయలేరు. దేవుడు అలాగు చేశాడు. చూశారా? ఆయన ఒక్కడు మాత్రమే దాన్ని చేయగలిగినవాడు.
వారే ఒక పాఠశాలగా మారి దానికి ప్రవక్తల పాఠశాల అని పేరు పెట్టారు. మరియు వారందరూ ప్రవక్తల పాఠశాలకు వెళ్ళి మరియు వారిని వారు విద్యావంతులుగా చేశారు. మరియు నేను ఊహిస్తున్నాను ఆ ప్రసంగీకులందరూ పైకి వెళ్ళి ఏలియా ఏవిధమైన కోటును ధరించుకున్నాడో అదేవిధమైన దాన్ని వారునూ ధరించుకున్నారు. వారు అతని యొక్క స్వరమును కూడా అనుకరించుటకు ప్రయత్నించేవారని నేను ఊహిస్తున్నాను, అతను ఏ విధముగా మాట్లాడుతున్నాడో ఆవిధముగా, మరియు మరియు తనను తాను ఏ విధముగా చూపుకుంటున్నాడో ఆ విధముగా, ప్రతి ఒక్కరూ ఆలాగే ఉండుటకు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుచేతనంటే దేవుడు ఉ పయోగించుకుంటున్న ఏలియా గొప్ప మనుష్యుడుగా ఉన్నాడు.
మరియు మనము ఈ దినము అదే క్రియను కనుగొనుచున్నాము. కొద్దికాలము క్రితం నేను రేడియో ప్రసారములను వింటున్నాను, బిల్లీ లూయిస్విల్లో ఉన్న దగ్గర నుండి ఈ దేశమంతా బిల్లీ గ్రాహంను పట్టుకున్నారు, ప్రతి ఒక్కరూ అదే కార్యములను అనుకరణ చేయుటకు ప్రయత్నము చేస్తున్నారు, వారు జుట్టును ఆవిధముగానే దువ్వుట, మరియు -- మరియు అదే విధమైన వస్త్రములను ధరించుట, మరియు అదే విధమైన స్వరమును అనుకరించుట మొదలైనవి. కానీ మీరది చేయలేరు. మీరు ఎవరో కేవలం మీరు అలాగే చేయగలరు మరియు దేవుడు మిమ్ములను ఏవిధముగా చేసియున్నాడో ఆవిధముగా, అది నిజము. మరియు కావున మనం వారి దినములలో బహుశా అవే కార్యములు ఎలా ఆక్రమించుకున్నాయో మనము కనుగొనవచ్చును.
12. ఇప్పుడు, దేవుడు చూస్తున్నాడు, ఏలీయా యొక్క దినములు అయిపోయినవని ముందుగానే చూచాడు, అతను అప్పటికే చాలాకాలము భూమి మీద నివసించాడు
(ప్రతి ఒక్కరికన్నా), కావున ఆయన, ఏలియాకు బదులుగా ఒకడిని కలిగియుండాలి. అనుకున్నాడు. మరియు అతను చేసినప్పుడు, దేవుడు ఈ మనుష్యుడను పిలిచాడు, అతడిని పిలిచినప్పుడు అతను సెమినరీలో లేదు, అతను పొలములో ఎద్దు అరకతో వ్యవసాయము చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, లేక తన తల్లి మరియు తండ్రి పట్ల శ్రద్ధను చూపిస్తున్నాడు. మరియు దేవుడు అతనిని ఎలీషాకు లేక ఏలియాకు బదులుగా పిలిచాడు. బహుశా ఆ పాఠశాలలోని చాలామంది మేము ఖచ్చితముగా చేస్తామని అనుకున్నారు, అతడికి (ఎలిషాకు) బదులుగా తాము ఉంటామని అనుకున్నారు, అతడికి తన వస్త్రముతో పని అయిపోగానే వారు దానిని ధరించుటకు సిద్ధముగా ఉ న్నారు. కానీ పిలుపుని దేవుడే పిలుస్తాడు. ఎంపికను దేవుడే చేస్తాడు. ఎన్నుకొనుటను దేవుడే చేస్తాడు. దేవుడే అన్నిటిని క్రమములో ఉంచుతాడు.
దేవుడు సంఘములో, కొందరిని అపోస్టలులుగానూ, కొందరిని ప్రవక్తలుగానూ, కొందరిని ఉపదేశకులుగానూ, కొందరిని సువార్తీకులుగానూ, మరియు కాపరులుగానూ ఉంచాడు. దేవుడే తనంతట తానుగా దానిని చేశాడు. మనము ఒక్క వెంట్రుకను నలుపుగానూ లేక తెలుపుగానూ చేయలేము, ఒక్కదానిని కూడా మనము ఆలోచనను తీసుకొనుట చేత విగ్రహమునకు జత చేయలేము. దేవుడు తన అనంతమైన కృపలో ఉన్నాడు, మరియు ఆయన తన ఎన్నిక చేత, మరియు తన ముందటి జ్ఞానము చేత ఈ క్రియలన్నీటిని క్రమములో ఉంచాడు, మరియు ప్రతియొక్క వృత్తము తన పని సక్రమముగా చేస్తుంది. నేను దాన్ని ఇష్టపడతాను. ఒకవేళ దేవుని ఎంపికను మరియు పిలుపును నేను నమ్మనట్లయితే ఈ ఉదయకాలమున నేను చాలా అధైర్యపడినవాడిని అవుతాను.
13. మనుష్యుని శక్తి చేత, మరియు మనుష్యుని జ్ఞానము చేత యునైటెడ్ నేషన్స్ (అమెరికా) వారి పెద్ద బలగము చేత, ఎవరైతే ఎన్నడూ దేవుని పేరు చెప్పనివారు, ఈ లోకము వాటన్నిటిని విడిచి బయటకు వస్తుందని నేను ఆలోచించినట్లయితే, ఆ అధైర్యపడే వ్యక్తిని నేనే. కానీ అదంతయూ బయటకు రాబడుతుందని నేను చూచుటలేదు. ఇక్కడున్న ఈ పాత గ్రంథములోకి నేను చూస్తాను, ఎక్కడైతే దేవుడు దానిని వ్రాసియుంచాడో, మరియు ప్రతిదీ ఆయన చెప్పినట్లుగా ఖచ్ఛితముగా అలాగే బయటకు వస్తుంది, మరియు అదంతా అంతే. కావున నాకున్న ఏకైక కార్యమేదనగా వారితో నేను వరుసలో ఉండ కుండుటయే, కానీ కల్వరితో వరుసలో ఉండుటకు, దేవునితో వరుసలో ఉండుటకు, ఆయన వాక్యముతో వరుసలో ఉండుటకు, ఆయన యొక్క వాక్యములో ఉండుటయే నాకు ఉన్న ఏకైక కార్యము. చూచుటకు అది ఎలాగున్నా
అది సమస్యకాదు అది ఆ విధముగానే వెళ్ళిపోతుంది, దేవుడు ఉద్దేశించిన ప్రకారం ఒక వాడబడిన దుప్పటి అది వెళ్ళిపోతుంది. అది ఎప్పటికీ ఏదియూ కాదు. ఆయన కోసం, అనంతుడై యుండి ఆదియందే అంతమును ఎరిగినవాడు, మరియు ఆయన ప్రతి ఒక్కటి ఆయను మహిమ పరచుటకే చేస్తాడు. అది నిజము. అన్నీ కార్యములు కలసి పనిచేయవలసియున్నది. ప్రతి ఒక్కటీ దానియొక్క రూపములోకి వచ్చి దాని స్థానములో ఉండవలసియున్నది.
నా, అది క్రైస్తవుడిని ధైర్యవంతుడిని చేయనట్లయితే. ఏ ఒక్కటి తప్పిదము అప్పుడు. కేవలం, ఇది మన పరిశుద్ధగ్రంథము కాదు, ఇది ఆయనది. ఇది మన జ్ఞానము కాదు, ఇది ఆయన జ్ఞానము. మరియు మన నమ్మకమును మరియు విశ్వాసమును అక్కడ పెట్టుటయే మనము చేయవలసిన ఒకే ఒక్క కార్యమైయున్నది, మరియు అక్కడే కూర్చుని దేవుని మహిమను చూడుము. దాని స్థానములో అది ఎట్లు కదులుతుందో చూడుము, మరియు ప్రతి చక్రము దానిలో కదులుతుంది. బహుశా అది చిందరవందరగా అటుఇటూ ఉండి యుండవచ్చును, కానీ దేవుడు వాక్యమును పలుకునప్పుడు అది సరిగ్గా కదిలి సరైన స్థానములోనికి వచ్చును. ఆయన ఆది నుండే అంతమును ఎరిగినవాడు. అయన ఎవరినైతే ఎంచుకొనబోవుచున్నాదో ఆయనకు తెలుసు. ఏలియా యొక్క స్థానమును ఎలీషా తీసుకుంటాడని ఆయనకు జగత్తుపునాది వేయబడక ముందే తెలుసు. ప్రతియొక్కటీ కేవలం ఖచ్చితంగా వాటి ప్రకరమే జరుగుతాయి.
మరియు మనము మన ప్రియమైనవారి కోసం మొదలైనవారి కొరకు చింతిస్తుంటాము, వారు ఎప్పుడైనా లోపలికి వచ్చారా? వారి పేర్లు, జగత్తుపునాది వేయబడకముందే గొర్రెపిల్లయొక్క జీవ గ్రంథములో వ్రాయబడినట్లయితే, వారు అక్కడనే కార్యమును చేయవలసియున్నది, కేవలం అది ఒక్కటి మాత్రమే చేయగలదు. దీపం వెలుగుతుందని మరియు మనము సాక్ష్యము ఇస్తున్నాము, దేవుడు ఏర్పరిచినవాడు దానిని వారి కొరకు తీసుకువస్తాడు.
14. ఇప్పుడు, ఏలీయాను గమనించుము. అటుతరువాత తన దుప్పటిని అతని మీదవేసి మరియు దానితో అతని మీద ప్రయత్నము చేశాడు... మరొక మాటలలో, ప్రవక్తయైన ఏలియా, దేవుని యొక్క పైదుప్పటి అతడి భుజముల మీద ఉండేది, అతను క్రిందకు దిగి మరియు దాన్ని ఎలీషా మీద కప్పెను, అది అతనికి సరిపోయేట్లుగా ఉందా అని చూచుటకు ఆ రైతు మీద కప్పియున్నాడు. మరియు ఆ దుప్పటి అతనికి సరిపోవటానికి అతనికి 10 సంవత్సరములు పట్టింది. మీకు తెలుసా, దేవుడు సాధారణంగా మనలను కత్తిరించే దుకాణములో ఉంచి కత్తిరించుతాడు. ఇప్పుడు, ఎలీషాకు సరిపోవునట్లుగా ఆయన యొక్క దుప్పటిని సరిచేయలేదు, ఎలీషానే ఆ
దుప్పటికి సరిపోవునట్లుగా ఆయన సరిచేశాడు. ఆయన ఈ దినమున కూడా అలాగునే చేయును. ఆయన మనలను ఆ దుప్పటికి సరిపోవునట్లుగా సరి చేస్తాడు. ఆ దుప్పటి మనకు సరిపోవునట్లుగా కాడు. కొన్నిసార్లు మనము ఆ దుప్పటి మనకు సరిపోవాలని కోరుకుంటాము. కానీ మనము దాన్ని చేయలేము. నీ అంతట నీవుగా ఆ డుప్పటికీ సరిపోవునట్లుగా అనుమతిని ఇవ్వాలి. అది దేవుని దుప్పటి మరియు ఆయన దాన్ని పరిపూర్ణముగా తయారుచేశాడు. మరియు మనము పొందుకున్నాము... ఆయన మనలను ఆ రాజ్యములోకి తీసుకొనివచ్చుట ద్వారా ఆ దుప్పటిని మనకు సరిపోవునట్లుగా చేస్తున్నాడు.
కావున మనంతట మనముగా పరిపూర్ణులుగా అప్పలేము, మనకు తెలుసు మనము అవ్వలేము. మనము ఆలాగు అగుటకు మనకు మార్గమేదియూ లేదు, మరియు ఆయన మనకు ఇంకనూ చెప్పవలసియున్నది. కావున, కానీ ఆయనేమి చేసెను, ఆయన మన కొరకు ఏర్పాటు తయారుచేసెను, ప్రభువైన యేసు క్రీస్తు మరియు ఆయన యొక్క నీతి. అక్కడనే మన స్వంత పవిత్రతను దాటి పరిపూర్ణత వస్తుంది, అయిననూ మనమేమియూ కలిగిలేము, మరియు మన స్వంత ఆలోచనలు అవి యేదైనా, కానీ మనము ప్రభువైన యేసు యొక్క కార్యం పూర్తిచేసి మన విశ్రాంతిని రూఢి చేసుకొనుచున్నాము. దేవుడు ఆయన్ని భూమి మీదకు పంపియున్నాడు, మరియు మన విశ్రాంతి ఆయనలో ఉంది.
15. గమనించుము, ఈ సంవత్సరములన్నీ, మనకు తెలిసినంతవరకు, కేవలం అతనికి దుప్పటి అతని మీద కప్పబడుటనే ఒకే ఒక్క బాప్తీస్మమున్నది. కానీ సంవత్సరముల వెంబడి దేవుడు ఈ మనుష్యుని స్వభావమును ఒక స్థలములోకి మార్చాడు, అతను పిలవబడిన తరువాత, అతను ఆ దుప్పటికి సరిపోయి మరియు ప్రభువుకు సేవకుడు అయ్యాడు. అటుతరువాత ఏలియా వెళ్ళునప్పుడు మరియు దాన్ని అతని మీద విసిరెను, మరియు వారు గిల్గాలుకు వెళ్ళుట ప్రారంభించారు, మరియు చాలా ఇతర స్థలములకు, వారు మార్గములో ప్రయాణము చేయుచున్నప్పుడు, వారు ప్రవక్తల పాఠశాలకు వెళ్ళిరి. మరియు ఏలియా చివరకు ఎలీషాను వెనుకకు తిరుగునట్లుగా చేయుటకు ప్రయత్నము చేస్తున్నాడు, మీరు దాన్ని గమనించారా? వెనుకకు త్రిప్పుటకు ప్రయత్నము చేస్తున్నాడు, ఇలా అన్నాడు, "నేను... కుమారుడా, నీవు నడుచుటకు మార్గము చిన్న చాలా నెట్రముగా ఉంటుంది. బహుశా ఇది చిన్నది నీవు నడుటకు ఇరుకైనది." ఏలియా ఎక్కడున్నాడో మీకు తెలుసా, అదే ఋజుత్వము. మరియు ఎక్కడైనా నిజమైన సేవకుడు సువార్తను ప్రకటిస్తే, అది సరియైనదే. నిష్కల్మషమైన సువార్త, అది ఎక్కడ ప్రసంగించినను అది అటువంటిదే అయ్యున్నది.
16. మంచిది, ఒకదినము అతను పైన ఉన్న ప్రవక్తల పాఠశాలకు వారిని చూచుటకు వెళ్ళాడు, మరియు వారతడిని వెళ్ళిపొమ్మని అడిగారు. వారన్నారు, “మా చుట్టూ ఉన్న ఇది మాకు చాలా సరియైనది.” మనకు ఈ దినమున కావలసినది మరెక్కువైన సరియైన సువార్తలను ప్రకటించుటయే, అదియే గోధుమను తొక్క నుండి వేరుచేస్తుంది లేక తప్పు నుండి ఒప్పును వేరు చేస్తుంది. ఏది ఒప్పో అది ఒప్పే మరియు ఏది తప్పో అది తప్పే. ఈ అందరు మనషులు వారికున్న అనుభవంతో, మరియు వారందరు, వారు దేనినో తినుట కొరకు బయటకు పంపబడ్డారు, మరియు వారిలో ఒకరు అడవి ద్రాక్షాలు తెచ్చారు, మరియు కొందరు వెర్రి ద్రాక్షలు తెచ్చారు మరియు వారు దాన్ని వండినప్పుడు వారి కుండలో మరణమున్నది. మరియు మొదటి సంగతి మీకు తెలుసా, వారు "కుండలో విషమున్నదని" అరుచుటకు ప్రారంభించారు. కానీ ఎలీషా రెండుపాళ్ళు కలిగి ఏమి చేయవలసియున్నాడో ఎరిగియున్నాడు, కావున అతను చేతి నిండుగా పిండిని తీసుకొని కుండలో కలిపి, ఇలా, “ఇప్పుడు, భోజనము చేయుడని” చెప్పెను. మరో మాటలలో, వారు...
17. ఈ దినమును అదే మాదిరిగా ఉన్నదని నేను అనుకుంటున్నాను చాలా మంది మనకున్నారు వారిలో మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బటేరియన్, లూథరన్, పెంతెకోస్తులు, మరియు మిగిలిన వారందరు, అందరూ కలసి ఒక్కటిగా అయ్యారు, ఒకరు ఇంకొకరి మీద యుద్ధము చేస్తుంటారు. మరియు మనకు వాటి అన్నిటిని త్రోసివేయనవసరము లేదు మరియు వాటికి దూరముగా చేయవలసినదిలేదు, మనకు చేతి నిండైన మరోక భోజనపు అవసరమున్నది. అదే సంఘములో ఉండండి. భోజనము గృహము నుండి వచ్చును, లేక ఆ పాఠశాల అక్కడున్నది, ఏదైతే ప్రజలు బయట నుండి లోపలికి తెచ్చారో దానినే వారు పెట్టుచున్నారు, మరియు ఆ పంట యొక్క మొదటి ఫలములు, ఏవైతే స్థాపితమైనవో అవి ఒకదానికి ఒకటి అతుక్కుని భోజనములోని ప్రతియొక్క గింజ ఒకే మాదిరిగా ఉంటుంది.
అటు తరువాత, ఎప్పుడైతే ఈ భోజనము ఒకే విధముగా ఉన్నదో, అది క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. భోజనము అంటే జీవితము. మరియు క్రీస్తుకు సాదృశ్యమైనదో, ఆ భోజనము, పిండి చేసి, అదే అర్ధమును ఇచ్చును, యేసు క్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరం... మరియు ఆ భోజనము మరియు భోజనము పెట్టుట... మరియు వారు ఎప్పుడైతే ఈ భోజనమును అక్కడ పెట్టియున్నారో, క్రీస్తుని పెట్టి మరణము నుండి జీవమును తెస్తున్నారు. అదియే వ్యత్యాసమును చూపిస్తున్నది. మనం మరణించినప్పుడు మన వ్యత్యాసములలో, మన ఆచారసంభంధమైన వాగ్వాదములలో (ఇక్లెషియాస్టికల్ ఇది రోమన్ క్యాథలిక్ ఫాదర్లకు చెందిన మాట) మరియు అన్నిటిలో, మనము
వాటన్నీటిలోకి క్రీస్తుని తీసుకొని వచ్చినట్లయితే, అది మరణమును మార్చివేసి మరియు జీవములోనికి వేరుచేస్తుంది, మనము కేవలం దానినే చేసినట్లయితేనే.
అమెరికాలో 19 మిలియన్ల బాప్టిస్టులున్నారు, 13 మిలియన్ల మెథడిస్టులు అమెరికాలో ఉన్నారు. 11 మిలియన్ల లూథరన్స్ అమెరికాలో ఉన్నారు, మరియు 10 మిలియన్ల ప్రెస్బటేరియన్లు అమెరికాలో ఉన్నారు, మరియు ఎంతమంది క్యాథలిక్కులున్నారనేది దేవునికి మాత్రమే తెలుసు, అది ఏ సంఖశాఖలనైనా మించిపోతుంది. కానీ వాటి అన్నీటిలోకి, మనకు ఏమి అవసరమున్నది? ఒక చేతినిండైన భోజనము. మనము సంఘమునకు జీవమును తీసుకొని రావలసియున్నది. మరియు క్రీస్తే జీవము. మనకు జీవమును తెచ్చుటకే ఆయనే వచ్చెను.
18. కావున, వారికి వారి వాదనలు ఉన్నాయి మరియు వారికి పాఠశాలలు మరియు వారికి ధియాలజీలు మొదలగునవి ఉన్నాయి. అటుతరువాత ఏలియా, ఎలీషాతో చెప్పెను, “నీవు వెనుకకు తిరుగుట మంచిది, ఎందుచేతనంటే బహుశా వెళ్ళే మార్గము కొద్దిగా కష్టతరముగా ఉంటుంది.” కానీ దేవుని మనష్యుడు ఎవరైతే ఒకసారి దానిని ఎదుర్కొన్నాడో, లేక దేవుని యొక్క ధర్మమైన మరియు శక్తివంతమైన ఆ దుప్పటి (వస్త్రం), అతని భుజముల చుట్టూ విసరబడినదో, అప్పుడు వెనుకకు తిరుగుట అంత సులభం కాదు.
ఈ ఉదయం ఎప్పుడైతే కాపరి ఆ ఘడియ... చెపుతున్నప్పుడు, చాలామంది అధైర్య పడతారు. సహోదరుడా మనకు కావలసినది కేవలం ధైర్యమును తీసుకొనుటయే. మరియు అది సరైనదే. శ్రమలు రావచ్చును, మనము వాటి నుండి రక్షించబడతామనే వాగ్ధనమును కలిగిలేము, కానీ వాటి నుండి వెళ్ళుటకు ఆయన తన కృపను ఇస్తాడు. పర్వతములు దాటి వెళ్ళుటకు అవి బహుఎత్తుగా ఉన్నట్లయితే, క్రిందగా వెళ్ళుటకు అది చాలా లోతుగా ఉన్నట్లయితే, చుట్టూ తిరుగుటకు అది బహు విశాలముగా ఉ న్నట్లయితే, దానిగుండా వెళ్ళుటకు ఆయన తన కృపను ఇస్తాడు. అది సరైనదే. కేవలం చింతించవద్దు, కానీ మీ కన్నులను లేక దృష్టిని క్రీస్తు మీద ఉంచండి, కేవలం ఆయనొక్కడు మాత్రమే మనలను వాటిగుండా తీసుకొని వెళ్ళగలడు.
19. ఇప్పుడు, వారు ప్రయాణము చేస్తుండగా అతన్ని మనము చూశాం, పాఠశాలకు వచ్చాడు. మరియు అతను ఇలాగు చెప్పెను, "ఇప్పుడు నీవు ఇక్కడే ఉండుము. నీవు ఇక్కడే ఉండి మరియు నిశ్చింతగా ఉండుము మరియు ధియాలజీలో మంచి భోధకునిగా ఉండుము, మరియు మొదలైనవి. మరియు బహుశా నీవు ఒకదినాన ఇక్కడ ఉన్న ఈ కళాశాలకు పెద్ద భోధకుడివి (డీన్) అవ్వవచ్చును. కానీ నేను దిగువకు ఇంకనూ
కొద్దిగా ముందుకు వెళ్ళవలసియున్నది." అతను నిలబడియున్న చోట చుట్టూ దేవుని ఒక వాడబడిన దుప్పటి యొక్క శక్తి ఉన్నప్పుడు దేవుని యొక్క మనుష్యుడు కేవలం ఒక కళాశాలకు పెద్ద భోధకునిగా (డీన్) ఉండి సంతృప్తి చెందగలగుతాడని అని మీరు ఊహించగలరా? లేదయ్యా, అతను ఇలా అన్నాడు, “యెహెూవా జీవము తోడు, మరియు నీజీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను." నేను దాన్ని ఇష్టపడతాను. నీ తల్లి నుండి నీకు ఎంత నిరుత్సాహము వస్తున్నా ఏ సమస్యలేదు, నీవు దానియందు ఉండుము, నీ తండ్రి, లేక నీ కాపరి నుండి వస్తున్నా, ఆయనతో ఉండుము.
20. వారు యోర్దానుకు వెళ్ళారు. వారు దానిని దాటి యున్నారు మరియు ఏలియా ఇలా అన్నాడు, “ఇప్పుడు, నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు?"
అతను "నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్ళు నా మీదకు వచ్చునట్లు దయచేయ"మని అడిగెను. అతనొక కార్యము చేయవలసియున్నదని అతనికి తెలుసు. అతను చెప్పెను, “రెండుపాళ్ళు,” కేవలం ఒక వెచ్చని అనుభవం కాదు, కేవలం ఒక మంచి షేక్యండ్ కాదు లేక మిగిలిన సంఘముతో మంచి సహవాసము కలిగియుండుట కాదు, కానీ నాకు కావలసినది ఏమిటంటే ఇప్పుడున్నదానిలో ఏది ఉత్తమమైనదో దానిలో రెండుపాళు ఏ కావాలి.
నేను చెపుతున్నాను, దేవుడు ఎప్పుడైతే లోకపు కార్యము కొరకు ఒక మానవుడిని సిద్ధం చేస్తాడో, లోకము కలిగిన దానికన్ననూ ఇంకేదో శ్రేష్టమైన దాన్ని అతడు కలిగియుండాలి. సంఘము కలిగియున్న దానికన్ననూ ఇంకేదో శ్రేష్టమైన దాన్ని అతడు కలిగియుండాలి. అతడు రెండుపాళ్ళ కోసం వెళ్ళవలసియున్నది. మరియు ఎన్నడైననూ రెండుపాళ్ళు అవసరమైన సమయము ఆసన్నమైనట్లయితే, అది ఈరోజు ప్రజల యొక్క రాజ్యములలో ఉన్నది. ఏదో శ్రేష్టమైనది, ఏదో ఉన్నతమైనది... నేను...? చిక్కుళ్ళు మరియు గోధుమలతో చేసిన రొట్టె చాలా మంచిదని నేను అనుకుంటున్నాను, కానీ కొన్నిసార్లు నేను దానికన్నా కొద్దిగా ఉన్నతమైన దాన్ని చేరుకోవలసియున్నది. మరియు మనము అలాగు చేస్తాము. మనమందరమూ దానినే పొందుకున్నాము. మనము పైకి ఎక్కుతూనే ఉండాలి. ఇశ్రాయేలు వారు అదే దేశములో ఉన్నట్లయితే వారు వెనుకకు జారిపోయుండేవారు. అతను ముందుకు కానీ లేక వెనుకకు కాని కదులుతుండాలి. సంఘము కూడా ఆలాగునే ఉంటుంది.
21. కావున, వారు వెళుతున్నప్పుడు, వెంటనే కాదు కానీ కొద్ది నిముషముల తరువాత అతడు ఇలా చెప్పెను, “నీవు అడిగినది ఘనమైనది, అయినప్పటికీ, నేను వెళ్ళునప్పుడు నీవు నన్ను చూచినట్లయితే, నీవు అడిగినది ఏదో అది నీకు కలుగును.”
ఇప్పుడు, అది అభిప్రాయము యొక్క నిష్కాపట్యము, హృదయము యొక్క నిష్కాపట్యము కన్ను యొక్క నిష్కాపట్యము, నీ దృష్టిని వాగ్ధానము మీద ఉ ంచవలసియున్నది. నీవు ఈ ఉదయకాలము అనారోగ్యముగా ఉన్నట్లయితే, నీవు బాధ పడుతున్నట్లయితే, నీకొక గొప్ప వాగ్దానమున్నది, అది ఎలీషా వలన కాదు, కానీ దేవుడు తనంతట తానుగా చేసెను. “నీవు నాయందు విశ్వాసముంచినట్లయితే... నీవు ప్రార్ధించినప్పుడు, నీవు దేని కొరకైతే ప్రార్ధించావో దానిని పొందుకున్నావని విశ్వాసముంచుము.” వైద్యుడు ఏమి చెప్పాడో దానియందు లక్ష్యముంచవద్దు, ఇది ఏమౌతుందో లేక అది ఏమోతుందో, ఒక్క వాగ్ధానము మీదే ఉండుము.
ఏలియా అతడికి ఒక షరతును పెట్టాడు. "నేను వెళ్ళునప్పుడు నీవు నన్ను చూచినట్లయితేనే, అది నీ మీదకి వచ్చును." అక్కడ వాగ్ధానమున్నది. "నీవు విశ్వాసముంచినట్లయితే, నమ్మినవారికి అన్ని కార్యములు సాధ్యమే.”
22. కొన్నిసార్లు నన్ను నేను చూసుకొని మరియు నా జీవితములో నేనొక ఒక జెల్లీ చేప అయ్యున్నానని అనుకుంటాను. నేను ఎదురుచూచాను మరియు దేవుని రాజ్యములోకి వచ్చే చాలా వేలకొలదీ ఆత్మలను కోల్పోయాను, ఎందుచేతనంటే నేను ఎదురుచూచి ఇలా అన్నాను, “దేవా...” ఆత్మీయ బహుమతి మీద చాలా అధికముగా ఆధారపడ్డాను, మరియు చెప్పాను, "ప్రభువా, కేవలం నీవు నాకు చూపించినట్లయితే, మరియు నేను ఏమి చేయాలో నీవు నాకు దర్శనము ఇచ్చినట్లయితే.” మరియు దేవుడు దర్శనమును ఇచ్చెను, తరువాత నేను చుట్టూ తిరిగినప్పుడు వేరే దేనిని గురించో కొంతమంది నాతో మాట్లాడినీయుము. మరియు ఓహ్, నేను ఇంకనూ ఆ స్థలము దగ్గరకు రాలేదు, నేను -- ఈ సమయములో నేను కలిగియుండేంత వరకు, నేనది విశ్వాసమని అనుభూతిని చెందుతున్నాను, అక్కడనే మనము అడుగును బయటకు పెట్టవలసియున్నది, ఎందుకంటే అదొక వాగ్ధానము. మరియు అతను చేసిన కార్యములు, మరియు అతను చేసిన స్వస్థతలు, మరియు ఆ అద్భుతాలు, చివరకు చాలామంది క్రిందకు దిగివచ్చి మరియు అతని ఫోటోను మన ప్రక్కనుండే తీసుకున్నారు, మరియు మొదలైనవి, అవి ప్రపంచము ప్రారంభమైనప్పటి నుండి ఎన్నడూ తెలియబడలేదు. అటుతరువాత ఒక జెల్లీచేప మాదిరిగా నిలబడితే, అది చివరకు నా అంతటగా నాకు అధైర్యనిస్తుంది. ఇది వాగ్ధనము మీద నీ దృష్టిని నిలుపవలసిన సమయము. మరియు అది ఏమిటి, దేవుని కృపచేత, నేను చేయాలని లక్ష్యం (గురిని) కలిగియున్నాను. మరియు నేను తెలుసుకున్నాను పాతాళములోని ప్రతి దయ్యము దాన్ని కాల్చుతుందని, కానీ దేవుని కృపచేత, నేను ఆ వాగ్ధానము మీద నా దృష్టిని ఉంచాలనే లక్ష్యం కలిగియున్నాను.
23. ఎలీషా ఇలా అన్నాడు, “నీవైతే..." ఏలియా అన్నాడు, "నేను వెళ్ళునప్పుడు నీవు నన్నుచూచినట్లయితే, నీవు అడిగిన దాన్ని నీవు కలిగియుంటావు." అది సరైనదే. నీ దృష్టిని నీవు దాని మీదనే ఉంచాలి, వాగ్ధానమును గమనించుము. ఇప్పుడైతే...
పాఠశాల నుండి ఇప్పుడేమిటి, అతడు వెనుకకు తిరిగి ఇలా అన్నాడా, "హేయ్, బాలులలారా, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను ప్రవక్త వెనుకాల నేరుగా వెళుతూ అనుసరిస్తున్నానా?" బహుశా అలా వెళ్ళినట్లయితే అతను విఫలం చెందేవాడు. కానీ అతను ఆ పాఠశాల వారి ఆలోచనను లెక్కచేయలేదు, లేక మిగిలిన భోధకుల ఆలోచనను లెక్కచేయలేదు. అతను చుట్టూ ఉన్నవారి ఆలోచనలను అతను లెక్క చేయలేదు, లేక ఆ ఇళ్ళవారి ఆలోచనలు, లేక అతనిని ఎవరు చూస్తున్నారో వారి ఆలోచనలను లెక్క చేయలేదు. అతను వాగ్ధానమందే తన విశ్వాసముంచాడు.
దేవుని వాగ్ధానమందు విశ్వాసముంచుటయే ఈ దినము మనకు కావలసినది, ఇదే ఏమి చెప్పింది లేక అది ఏమి చెప్పింది అనే వాటియందు ఏ ధ్యాసా ఉంచవద్దు. ఒక సహోదరుడు చెప్పినట్లు, ఒక సేవకునికి మూగవారైన ఇద్దరు బాలికలున్నారు. మరియు వారికి అక్కడ... దైవీక స్వస్థత మీద విమర్శయున్నది. అందుచేత ఆ పిల్లలు స్వస్థపరచ బడలేదు." విమర్శకులయందు ఏ ఆసక్తిని ఉంచవద్దు. నీ విశ్వాసమును వాగ్ధానము మీద ఉంచుము. దేవుడు ఆలాగు చెప్పెను. “విశ్వాస సహితమైన ప్రార్ధన బలహీనులను కాపాడుతుంది, మరియు దేవుడు వారిని పైకిలేవనెత్తుతాడు." ఆయన ఒక చెవిటి వాడిని వినునట్లుగా చేసినట్లయితే ఆయన మరొక చెవిటివాడిని వినునట్లుగా చేస్తాడు. ఆయన దాన్ని చేశాడని నిశ్చయమైన రుజువు చేత మనము తెలుసుకున్నాము. మన విశ్వాసమును వాగ్దానము మీద ఉంచుదాము, మన దృష్టి (కన్ను) ఒక్కటే, మనము వినేది (చెవి) ఒక్కటే, మన హృదయము ఒక్కటే, మరియు క్రీస్తునందు ఒక్కటే కార్యము, మరియు ఆయన ఏదైతే వాగ్ధానము చేశాడో దాన్ని నెరవేర్చగల సమర్థుడు ఆయన. ఓహ్, మనము దాన్ని గురించి ఆలోచించినప్పుడు, మనము దాన్ని పొందుకున్నప్పుడు, అది దృశ్యమంతటినీ మార్చుతుంది.
దేవుడే వాగ్దానము చేసెను. దేవుడొక్కడే దాన్ని చెప్పెను. ఇప్పుడు, ఇక్కడ దేవుని ప్రతినిధి దాన్ని చెప్పాడు. మరియు దేవుడు తనంతట తానే దాన్ని చెప్పాడు. అయితే మనమేమి చేయగలము? కానీ మన ఆలోచన దాని మీదనే ఉంచుట తప్ప మరేమి చేయగలం.
చెప్పెను, "నేను వెళ్ళునప్పుడు నీవు చూసినట్లయితే, నీ వాగ్ధానమును నీవు పొందుకుంటావు." ఎలీషా తన కళ్ళను ఏలియా మీద ఉంచాడు. ప్రతి దిక్కునుండి
ఎంత గట్టిగా ఏమి అరిచిననూ పట్టించుకోవద్దు, ప్రతి వైపు ఏమి ఆక్రమించిననూ, దానికి ముందుగా అక్కడ ఏమి ఆక్రమించిననూ, వెనుక, అతను వాటివైపు చూడను కూడా చూడలేదు. అతను తన దృష్టిని (కన్నులను) వాగ్ధానము మీద ఉంచాడు. నీవక్కడే ఉన్నావు. నీ దృష్టిని (కన్నులను) వాగ్ధానము మీద...
సహోదరి స్టైలర్, వేరొక రాత్రి మేము దర్శించిన ఆ స్త్రీ గురించి నేను ఆలోచిస్తున్నాను, మరియు ఆమె ఎంతగా పాడైపోయిందోనని వైద్యుడు తనకు చెప్పాడు. మరియు ఆమెకు ఎన్నడూ చెప్పలేదు. ఆమెకు ప్రియమైనవారికి చెప్పాడు, మరియు ఆమె ఎల్లప్పటికి తిరిగి కోలుకోవటం ఎంతో అసాధ్యమని చెప్పారు. ఇప్పుడు, సహోదరుడా... ఆమె యొక్క అల్లుడు దాన్ని గురించి నన్ను అడిగాడు. నేను చెప్పాను, "ఆమె తన దృష్టిని (కన్నులను) వాగ్దానము మీద ఉంచినట్లయితే..." అక్కడ ఏమి ఆక్రమించుకున్ననూ అది లెక్క కాదు, నీ దృష్టిని (కన్నులను) వాగ్ధానము మీద ఉ ంచుము.
2 24. కొద్ది వారాల క్రితం సహోదరి ఉడ్ మరియు సహోదరుడు ఉడ్ ఇక్కడున్నారు, మా యొక్క ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఇక్కడ సంఘములో ఉన్నారు. నా స్నేహితులైన లియో మరియు జీనే లతో నేను మిచిగాన్లో ఉన్నాను. మేము చికాగో కూటములను వదిలి మరియు వారిలోని కొంతమంది ప్రజల దగ్గరకు, మరో రెండుదినములలో మేము జింకలను వేటాడుటకు విల్లు మరియు బాణములతో వెళ్తున్నాం. మరియు నా మార్గములో వెనుకకు వస్తుండగా. నా భార్య నన్ను పట్టుకొని, మరియు ఆమె ఇలా, “శ్రీమతి ఉడ్ యొక్క తల్లి కొరకు ప్రార్ధన చేయుము. ఒక కాన్సర్ ఆమె ముఖమును తినివేస్తున్నది." మరియు ఇలా అన్నది, “సహోదరి ఉడ్ అంతగా భయపడుట నేను ఎన్నడూ చూసియుండలేదు, ఆమె ఏడ్చుచున్నది.”
సహోదరి ఉడ్ తన కుమారుడిని దేవుడు కుంటికాలు నుండి స్వస్థపరచిన దగ్గరనుండి, మరియు ఆమెను టి.బి. నుండి స్వస్థపరచినప్పటి నుండి, మరియు మొదలైనవాటి నుండి, ఆమె ఎల్లప్పుడూ విశ్వాసమునకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఆమె ఇప్పుడు క్రిందకు దింపబడింది. ఆ రాత్రి మేము అక్కడున్న ఆ గదిలో ప్రార్ధన చేశాము. లోపలికి వస్తు శ్రీమతి ఉడ్ ఇలా అన్నది, “బ్రదర్ బ్రాన్హాం, మనము మీదకు వెళదాము..." మరియు మేము ఆమె తల్లి దగ్గరకు వెళ్లాము, అది లూయిస్్వల్లో ఉన్నది. మరియు ఆమెకు తన ముక్కుకు ప్రక్కన కాన్సరున్నది. మరియు ఆ డాక్టరు దాన్ని అటూ ఇటూ రుద్దాడు, ఆమె కన్ను దగ్గర నుండి అంగుళములో 8వ వంతు దగ్గరలో అది ఆమె ముక్కు ప్రక్కన చిన్న వృత్తము వలె చిందరవందరగా అయ్యింది, కేవలం అక్కడ ఎముక మాత్రమే ఉన్నది, అది ఎంత వేగముగా తినగలదో అంత వేగము అది దాన్ని తినుచున్నది.
25. నేను ఆ గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని, నేను చెప్పాను, "నేను ఆమెతో ఒంటరిగా మాట్లాడాలని కోరుకుంటున్నాను." మరియు నేను ఆ గదిలోకి ఆమెతో ప్రార్ధన చేయుటకు వెళ్ళాను. మరియు ఆ గదిలో ఉండగా, నేను ఆలోచించాను, “ఓ దేవా, నీవు నాకు కేవలం దర్శనంలో ఆమెకు ఏమి జరగబోతున్నదో చూపించినట్లయితే.”
శ్రీ మరియు శ్రీమతి ఉడ్ దర్శనము ఏమి చెపుతుందోనని బయట ఎదురు చూస్తున్నారు... కానీ నేను అక్కడ ఉండగా, నేను నిషేధించబడ్డాను. ఒక దర్శనము కొరకు ఎదురుచూచుటకు నేను నిషేధించబడ్డాను, ఏదో వెనుకటిది గుర్తుచేస్తున్నట్లుగా అనిపించింది, “అది పిలుపుకాదు. వాగ్ధానము ఇవ్వబడినదని చెపితే ఇంకా దర్శనము యొక్క అవసరమేమున్నది." కావున నేను మోకరిల్లి ప్రార్ధించాను. మరియు నేను ప్రార్ధిస్తుండగా వాగ్ధానము యొక్క విశ్వాసము, (నా) లోపల ఏదో జవాబు చెప్పింది.
బయటకు వచ్చి మరియు శ్రీమతి ఉడ్, నేను ఆమెతో దీన్ని గురించి చెప్పినప్పుడు, ఆమె ఇలా అన్నది, “బ్రదర్ బ్రాన్హాం నీవు దేనినైన చూశావా?”
నేనన్నాను, “నేను ఖచ్ఛితముగా ఏదియూ చూడలేదు, కానీ ఆయన వాగ్ధానము నిజమని ఏదో నాకు చెప్పినట్లుగా నేను అనుభూతిని చెందాను, మరియు ఆయన దాన్ని చేయబోవుచున్నాడు. మరియు ఆయన దాన్ని చేయబోవుచున్నాడని నేను నమ్ముచున్నాను."
మరియు 24 గంటల లోపలే కాన్సరు యొక్క అంతము ముక్కలగుట ప్రారంభమైనది మరియు ఒక పొర దాని మీద తయారయ్యింది. అది మరణిస్తే తప్ప, కాన్సరు ఒక పొరగా అవ్వదని మీకు తెలుసుగా. కావున ఇప్పుడు అదే అయ్యింది, మరియు ఆ స్త్రీ స్వస్ధపడి ఇంటికి వెళ్ళింది. క్రీస్తు ఎంత అద్భుతమైనవాడు. దేవుడు చెప్పినట్లుగా, వాగ్ధానము మీద మన దృష్టిని (కన్నులను) ఉంచుట చేత...
26. కానీ కొన్నిసార్లు మనము ప్రార్ధన చేసినప్పుడు, మనం వెళ్ళి ఇలా అంటాము, "మంచిది, ఇది కేవలం వెంటనే జరిగిపోదు, కాబట్టి, బహుశా మనము తిరిగి వెనుకకు వెళ్ళవలసియున్నది.” ఓహ్, లేదు. నీ దృష్టిని (కన్నులను) వాగ్ధానము మీద ఉంచుము. దేవుడు అలా చెప్పెను, అది నిలకడగా ఉంటుంది. అదంతయూ అంతే. దేవుడు ఆలాగు చెప్పినట్లయితే, దేవుడు తన వాగ్ధనమును నిలబెట్టుకుంటాడు లేక ఆయన దానిని ఎన్నడూ చేయడు.
అబ్రహాము వేటినైతే పిలిచాడో అవి ఆవిధముగా లేవు, మరియు 25 సంవత్సరములు అసాధ్యమైనదాని మీద ఉన్నాడు, ఎందుచేతనంటే దేవుడు ఏదైతే అతనికి వాగ్ధానము
చేశాడో దాన్ని ఆయన చేయగల సమర్థుడని ఎదురుచూస్తున్నాడు (లెక్కిస్తున్నాడు). ఆమేన్. మరియు మనము విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానము. నిశ్చయముగా ఏలియా తన దృష్టిని (కన్నులను) దాని మీద లేక ఎలీషా, ఏలియా మీద.
27. మరియు వారు వెళుతుండగా... కొద్దిసేపటి తరువాత రథము వచ్చి మరియు వారిని విడదీసింది, ఒకరు ఒక ప్రక్కకు మరియు ఇంకొకరు ఇంకొక ప్రక్కకు. అటు తరువాత... ఆయన ఏలియాను పైకి తీసుకొనిపోయెను... అతడు రధములో అడుగుపెట్టాడు మరియు పైకివెళ్లాడు మరియు తన భుజముల మీద నుండి ఆ దుప్పటిని తీశాడు, మరియు దాన్ని ఎలీషా మీదకు విసిరివేశాడు, ఎందుచేతనంటే ఎలీషా దానిలో ఎదిగియున్నాడు (మీకు తెలుసా?), కావున అది అతనికి సరిగ్గా సరిపోతుంది. మరియు మీరు దాన్ని ఊహించగలరా...
ఓహ్, మీ విడిపోని ఆసక్తిని మీరు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, నేను నా గొంతు చక్కిలిగింతలు పెడుతున్నట్లుగా అనుభూతిని చెందుతున్నాను. నేను మిమ్ములను ఏదో అడగాలని అనుకుంటున్నాను. ఎలీషా ఈ దుప్పటిని పైకి ఎత్తుతున్నప్పుడు ఎలా అనుభూతిని చెందాడో మీరు ఊహించగలరా, తన స్వంత భుజముల మీద దాన్ని ఉంచుకొని, ఓహ్, అది ఎటువంటి అనుభూతి.
28. ఇది వ్యక్తిగతమని నేను అనుకోవటం లేదు, కానీ 10 సంవత్సరముల క్రితం ఇక్కడ ఈ పుల్పీట్ నుండి, నేను ఒక వర్తమానమును ప్రసంగించాను, “దావీదు, యుద్ధవీరుడు, తన ఎదురుగా గొల్యాతు ఉండగా తనచేతిలో వడిసెలని కలిగియున్నాడు.” మనకు తెలిసినంత వరకు, ఆ రోజుల్లో అక్కడ పొలములో స్వస్థతా కూటములు లేవు. మరియు, ఓహ్, దైవీక స్వస్థత మీద ప్రజలు ఎంతో క్లిష్టంగా ఉంటారు. కానీ ఒక జీవిని కలిసిన తరువాత, అక్కడ ఏదోవున్నది.
మరియు ఆ కాపరి నేను నా ఆలోచనా శక్తిని కోల్పుతున్నానని నాతో చెప్పాడు, అది ఈలాగు జరుగకపోవచ్చును, కానీ ఇదే పెట్టె (వేదిక) నుండి, నేను దావీదు గురించి మాట్లాడుతూ ఇలా అన్నాను, "ఇది అదేనని మీరు నాతో చెప్పాలనుకుంటున్నారా, జీవం కలిగిన దేవుని యొక్క సైన్యం, సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు ఈ సైన్యమును ఓడించటానికి అనుమతిని కలిగియుంటాడా?”
చిన్న దీనమైన వంపైన భుజములు, ఉంగరములు జుట్టు కలిగి, మీద గొర్రెచర్మపు కోటుతో మరియు వడిసెల రాయి తన చేతకలిగి, ఇశ్రాయేలియుల సైన్యమంతా తనకు వెనుకగా అండగా నిలబడియుండగా, మరియు అతను ఒంటరిగా నడిచివెళ్ళాడు, ఒక మనిషితో
19 అడుగుల పొడవైన ఈటెతో మరియు ఒక... మరియు ఆ...
దాని చివర చాలా నాణముల (షెకల్స్) బరువు కలిగినది, సుమారుగా 20 పౌన్ల ఉక్కు మొన కలిగినది, ఒక 19 అడుగుల బల్లెం, 14 అంగుళముల పొడవైన వేళ్ళు కలిగినవాడు. మరియు దావీదు బహుశా 90 పౌండ్ల బరువుండవచ్చును, మరియు ఒక చిన్న బాండీ రూస్టర్...వలె పైకీ మరియు క్రిందకీ ఎగురుతున్నాడు. “ఆ తరువాత మీరు నేను చెప్పాలని అనుకుంటున్నారా (ఓహ్, మై. ) నీవు ఆ సున్నతిలేని ఫిలిష్తీయుడికి అనుమతినిస్తావా, అతను తన స్థానములో ఉన్నట్లయితే ఉండనిమ్ము, కానీ అతను జీవం కలిగిన దేవుని సైన్యమును ఓడిస్తాడా.” ఓహ్, మై, ఎటువంటి కథానాయకుడు. 29. “మరియు మీరందరూ యుద్ధమునకు వెళ్ళుటకు భయపడతారా?" చెప్పెను, "నేను ఆయనను కలిగియుండనీయుము.” ఓహ్, మై. అతనన్నాడు, “పరలోకపు దేవుడు ఈ వడిసెల రాయితో సింహమును చంపుటకు నాకు అనుమతిని ఇచ్చాడు. ఈ వడిసెల రాయితో ఎలుగుబంటిని చంపుటకు ఆయన నాకు అనుమతిని ఇచ్చాడు. మరియు ఎంత ఎక్కువగా ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడిని ఆయన నా చేతికి అప్పగిస్తాడు.” నిశ్చయంగా. మరియు మొదటి యుద్ధము గెలిచిన తరువాత మరియు గొల్యాతు పడిపోయినప్పుడు, ఇశ్రాయేలియుల సైన్యములన్నీ దావీదును అనుసరించాయి. మరియు వారు తలలను తెగవేశారు, మరియు ఇశ్రాయేలియులను కొట్టారు -- లేక ఫిలిష్తీయుల గుంపును వారి దేశము వరకు తరిమికొట్టారు. వారిని మూలల వరకు వెంటపడ్డారు, మరియు వారిని వధించారు, మరియు వారి నగరములను తీసుకున్నారు, మరియు ప్రతి దాన్ని తీసుకున్నారు. వారు విజయాన్ని పొందుకున్నారు.
సహోదరీ మరియు సహోదరుడా, వారు చెప్పినప్పుడు అదే కార్యము సహజాతీతమైన రాజ్యములో జరుగుతుంది, “దైవీక స్వస్థత క్రియచేయదు. అద్భుతములు చేయు దినములు గతించిపోయాయి." అద్భుతములు చేయు దినములు గతించిపోయినట్లయితే, దేవుని దినములు కూడా గతించిపోయినట్లే. ఏ సంఘమైతే అతీతమైనదాని యందు విశ్వాసముంచదో ఆ సంఘము చివరకు మరణిస్తుంది మరియు దేవుడు ఆ సంఘమును వదిలివేస్తాడు, వదిలివేయాల్సి ఉంటుంది. మరియు దేవుడు ఒక వాగ్ధానమును ఇచ్చాడు మరియు దేవుని వాగ్ధానము నిత్యమైనది.
30. ఇక్కడ కొంతకాలము క్రితం ఎప్పుడైతే కొంతమంది బాలికలు రేడియంతో పిచ్చిపనులు చేస్తున్నారో, మరియు వారి చేతులను రేడియంలో ముంచి గడియారాల మీద -- మీద -- మీద రంగు (పెయింట్) వేస్తున్నారు... వీటిలో నేను ఒక దాన్ని కలిగియున్నాను. మరియు ఒక బాలిక ఒక తప్పు చేసింది మరియు ఆ బ్రష్ ని తీసుకుని మరియు తన నోటిలో ఉంచుకున్నది. అది ఆమెని చంపివేసింది. మరియు సంవత్సరములు మరియు సంవత్సరముల తరువాత వారు ఒక సూక్ష్మదర్శిని
(మైక్రోస్కోప్)ని తీసుకొని మరియు ఆ బాలిక యొక్క పుర్రెలో (తల భాగములో) ఉ ంచారు, మరియు వారు రేడియం "బర్రె, ర్ర్, ర్5, అని ఇంకా వెళ్ళుటను విన్నారు. దానికి అంతము లేదు. అది పనిచేస్తూనే మరియు చేస్తూనే ఉంటుంది. దానికి ఆగుట అనేదే లేదు.
మరియు, ఓహ్ సహోదరుడా, రేడియమే అటువంటి అంతములేని ప్రభావమును కలిగియుంటే, దేవుని యొక్క ఘనమైనవైన నిత్యత్వము, అతీతమైనవి, అనంతమైనవి, శక్తివంతమైనవి, మరీ ఎక్కువ అంతములేనివి కదా. ఆయన ప్రారంభమునందు ఏ ప్రభావమును కలిగియున్నాడో ఇప్పుడునూ అదే ప్రభావమును కలిగియున్నాడు, దాన్ని ఆయన అన్ని సమయాల్లో కలిగియుంటాడు, లేకపోతే ఆయన ఘనమైన, శక్తివంతమైన దేవుడు కాడు. బలమైన విశ్వాసముతో బయటకు వచ్చి మరియు శత్రువుతో ఆయన వాక్యము నిమిత్తమై సవాలు చేసి మరియు అది అంతే అని చెప్పే ఎవరికోసమో ఆయన ఎదురుచూస్తున్నాడు.
31. మరియు ఇప్పుడు, ఏమి జరిగింది? ఎప్పుడైతే స్వస్థతా కూటములు ప్రారంభమైనవో, దేవుని యొక్క వేలకొలదీ సైనికులైన మనుష్యులు, ఎవరైతే చిన్న సంఘములలో వెనుక ఉంటున్నారో, ఓరల్ రాబర్ట్స్, టామీ హిక్స్, మరియు ఇంకా పొలములో గొప్పవారైన మిగిలిన చాలామంది మనుష్యులు ఉన్నారు, వారు ఖడ్గములు బయటకు తీసి మరియు వారు బయటకు వెళ్ళారు, ఈ ఖడ్గం లోపలికి వచ్చుదాన్ని మరియు బయటకు వెళ్ళుదాన్ని రెండింటిని కత్తిరిస్తుంది, పైకీ మరియు క్రిందకు, లోపల మరియు బయట, ఆలోచనలను వివేచిస్తుంది, చివరకు ఎముకలలోని మూలుగును కూడా విభజిస్తుంది. వారు వారి పరిశుద్ధగ్రంథములు బయటకు లాగారు (వారి ఖడ్గములను), అది జరుగుట ఎప్పుడైతే చూశారో అప్పుడు వారు బయటకు నడిచారు, మరియు దేవుని కృప చేత మనము శత్రువుని కొట్టాము, లోకమంతటికీ ఇంకనూ ఒక స్వస్థతా ఉజ్జీవం ఉన్నది. జరుగవలసియున్నది...
చిన్న కాపరులారా, ఎవరికైతే చిన్న రెండు లేక నాలుగు సంఘములు మొదలైనవి యున్నాయో, వారు అగ్నిని పట్టుకొని మరియు దర్శనములు చూస్తున్నారు, త్వరితముగా ఖడ్గమును లాగి మరియు ముందుకు వెళ్ళి మరియు శత్రువును ఓడించారు. అది పని చేస్తుందని మీకెలాగు తెలుసు? అక్కడొక గొప్ప మనుష్యుడున్నాడు, అతను ఇంగ్లాండ్లో ని కింగ్ జార్జిలోని కాంగ్రెస్ మ్యాన్ అప్, మరియు గొప్ప మనుష్యులు ఎవరైతే బలహీనుల మీద మరియు రోగుల మీద చేతులుంచుట ద్వారా సర్వశక్తుడైన దేవుడు తన శక్తి చేత స్వస్థపరిచాడు. కావున వారు దాన్ని గురించి ఇప్పుడు ఏమియూ చెప్పరు...? నిశ్చయంగా, ఆయన ఉన్నాడు...
32. తరువాత ఎప్పుడైతే ఏలియా, తన పూర్ణహృదయమంతా వాగ్ధానము పొందుకోవాలని కోరుకున్న తరువాత. అతను వాగ్ధానము కావాలని కోరుకున్నాడు. అది అతని యొక్క లక్ష్యం. అతనికి సమస్తమూ అదియే. అదియే అతని జీవితం. అదియే అతని ఉద్దేశ్యము. సమస్తము, అంతా, ఆ వాగ్ధానమును పొందుటకై ఆకలిగొన్నాడు. మనము మాట్లాడుచున్న దాన్ని గురించి మనము యదార్ధంగాలేమని నమ్ముటకు నేను ఒప్పించబడ్డాను. ఈ ఉదయమున నా స్వస్థతల కొరకు మీ లక్ష్యాలన్నీ దేవుడిని మహిమ పరచుటకు ఇచ్చినట్లయితే... "నేను దేవునిశక్తితో స్వస్థపడ్డానని ధృఢనిశ్చయముతో ఉన్నాను". నేనొక క్రైస్తవుని జీవితం జీవించాలని ధృఢనిశ్చయముతో ఉన్నాను. నేను దేవునితో సమాధానముగా నడుస్తానని ధృఢనిశ్చయముతో ఉన్నాను. నేను దాన్ని చేయాలని ధృఢనిశ్చయముతో ఉన్నాను. తల్లి ఏమి చెపుతుందోనని నేను లెక్క చేయటం లేదు, సంఘము ఏమి చెపుతుందోనని నేను లెక్క చేయటం లేదు, కాపరి ఏమి చెపుతాడోనని నేను లెక్క చేయటంలేదు, మిగిలిన వారందరూ ఏమి చెపుతారోనని నేను లెక్కచేయటం లేదు, లోకము ఏమి చెపుతుందోనని లెక్కచేయటం లేదు, నేను ధృఢనిశ్చయంతో నిష్కాపట్యము. అయితే నీవు పొందుకోవటానికి ఎక్కడికో వెళ్ళాలి. ఉన్నాను. అదియే నా హృదయము యొక్క
తరువాత ఏలియా ఎప్పుడైతే అతను ధృఢనిశ్చయము కలిగియుండుట చూశాడో, దాన్ని పొందుకొనుటకు... ఏలియా -ఏలియా, ఎలీషా ధృఢనిశ్చయముతో ఉందుట చూశాడు, అతను (ఏలియా) తనకు (ఎలీషాకు) వాగ్ధానమును ఇచ్చాడు. ఇప్పుడు, ఆ వాగ్ధానమేమంటే, “నేను వెళ్ళునప్పుడు నీవు నన్ను చూసినట్లయితే, నేను వెళ్ళేటప్పుడు నీవు నన్ను చూడగలిగితే..." ఇప్పుడు, అది ఎలీషా మీద ఉన్నది. అతను తన వాగ్ధానమును వినాలని కోరుకుంటున్నాడు, కావున అతను వాగ్దానమును పొందుకున్నాడు. ఇప్పుడు, దానిలో ఒక 'ఐతే' అనేది ఉన్నది. "నేను వెళ్ళునప్పుడు నీవు నన్ను చూసినట్లయితే (ఐతే),”
ఇప్పుడు, ఈ ఉదయకాలము నీవు బలహీనముగా ఉన్నట్లయితే మరియు నీవు స్వస్థత పొందుకున్నావు, క్రీస్తు నీకు ఆ వాగ్ధానము ఇచ్చాడని నేను మీకు రుజువు చేయగలను. నీవు నమ్మినట్లయితే ఆ వాగ్ధానము నీది, నీవు నమ్మినట్లయితే. ఓడిపోవద్దు.
33. ఇప్పుడు, ఏలియా యొక్క దుప్పటిలో ఎలీషా చుట్టబడ్డాడు, ఒక ప్రవక్త... ఎటువంటి జయశాలుల కవాతు అది, అతను ఎలా ఒక జయశాలి మాదిరిగా తన అడుగులు వేస్తూ నడిచాడు. అతడు వాగ్ధానమును వినియున్నాడు. అతడు శక్తిని అనుభూతిని చెందుతున్నాడు. అతడు యోర్ధాను వైపు నేరుగా ఒక యుద్ధవీరుడు మాదిరిగా నడుస్తున్నాడు. స్నేహితులారా, దేవునికే స్తుతులు. ప్రతి విశ్వానీ ఈ
ఉదయం క్రీస్తు యొక్క నీతియనే వస్త్రముతో ధరింపబడి యోర్దాను వైపుకి ఉన్న వీధిలో నడుస్తున్నారు. అది నిజము. అణుబాంబులను రానీయుము, రానిమ్ము...?... నీవు ధరింపబడి మరియు ఒక జయశాలి మాదిరిగా నడుస్తున్నావు. ఆమేన్. నేను... "భయపడను, నేను లోకమును దాటివచ్చాను." అవునయ్యా, గుర్తుంచుకొనుము, ఏమిటి? “నేను లోకమును దాటి వచ్చాను." యేసు దాన్ని చెప్పెను.
ఎలీషా ఒకరు పాత దుప్పటి (వస్త్రము) తో ఒక జయశాలి మాదిరిగా అనుభూతిని చెందుతూ నడుస్తున్నాడు (ఖచ్ఛితముగా.), యోర్దాను నుండి వస్తున్నాడు. సహోదరుడా, నిన్ను గౌరవిస్తూ నీకు దీన్ని నన్ను చెప్పనీయుము. మీరు వేరొకరి వస్త్రములను ధరించవద్దు అవి అన్నీయూ సందేహమనే చిమటలతో తినివేయబడ్డాయి, ఎక్కడైతే ఈ ఓటములు, మరియు మూఢనమ్మకములు, మరియు తలక్రిందులుగా దానిలో రంధ్రములు పెట్టుట, మరియు అది అన్నీంటా కారుచున్నది. నీవు జయశాలియైన క్రీస్తు యొక్క వస్త్రముని వేసుకొనుము. ఒకప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీస్మములో రక్షణ ఉన్నదని తలంచిన నీ సంఘమును నీవు నమ్మవద్దు (ఇప్పుడు లేదనే - అనువాదకుడు), ఎవరైతే ఒకప్పుడు దైవీక స్వస్థత ఉన్నదని, మరియు ఇప్పుడు దానిని వ్యతిరేకిస్తున్నారో వారిని నమ్మవద్దు, అంతయూ సందేహమనే చిమటలతో ప్రతి ఒక్కటి తినివేయబడింది. ఆయన వస్త్రములను ధరించుము అవి ఎన్నడూ ఏ యుద్ధములో ఓడిపోలేదు, నీవు యోర్దానుకు వెళ్ళు నీ మార్గములో ధరించుము. ఆమేన్.
34. ఇప్పుడు, అతను ఒకరు వాడిన దుప్పటి (వస్త్రము)ని ధరించియున్నాడు, అది నిజము. మరియు ఈ ఉదయకాలము చాలామంది ప్రజలు ఒకరు వాడిన వస్త్రములను ధరించియున్నారు. కానీ అతను ఎప్పుడైతే యోర్ధానుకు వచ్చాడో, కేవలం ఆ వస్త్రములు మాత్రమే క్రియను చేయవని అతడికి అర్థమైంది. అది సరియే. మరియు సంఘము, మెథడిస్టులు, బాప్టిస్టులు, పెంతెకోస్తులు, ప్రెస్బెటేరియన్లు, ఓహ్, మనం పాఠశాలలను కలిగియున్నాము, మరియు, మై, మనకు పరిశుద్ధగ్రంథములోని అన్ని విలువలకు సంబంధించిన పొందికైన ఉదాహరణలున్నాయి. మనము అన్ని విధములైన నేత నేసిన వస్త్రములు కలిగియున్నాము, అవి వాగ్ధానములు. దానినంతటినీ మనము పొందుకున్నాము. ఓహ్, మనము బాప్తీస్మము పొందియున్నాము, దిగువకు వెళ్ళుము, మరియు మనము అపోస్థలుల భోధకు మాదిరిగా ఉంటాము. అపొస్థలుల విశ్వాసము మీద మనమున్నాము. మనము దైవీక స్వస్థతనందు విశ్వసిస్తాము. మనము దేవునియందు విశ్వసం ఉంచుతాము. మనము దేవుని శక్తియందు విశ్వాసముంచుతాము. బాప్తీస్మము పొందాము, పరిశుద్ధ గ్రంథములో, పరిశుద్ధగ్రంథములో చెప్పిన మాదిరిగా మనము బాప్తీస్మము పొందాము. మనము పరిశుద్ధాత్మను పొందుకున్నాము. మనము భాషలలో మాట్లాడాము. మనము అవి అన్నీయూ చేశాము.
కానీ, సహోదరుడా, కేవలం అదొక్కటే నీకు కావలసినదైతే, నీవు యోర్దానుకు వచ్చినప్పుడు నీవు దేన్నో లేకుండా ఉన్నావని నీవు కనుగొంటావు. ఓహ్, నీవు ఆలోచించవచ్చును, నీవు తెలివైనవాడివి కావచ్చును. నీవు డి.డి.ని కలిగియుండవచ్చును.. డాక్టర్ ఆఫ్ డివినిటీ. నీవు పి.హెచ్.డిని కలిగియుండవచ్చును, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. నీవు ఎల్.ఎల్.డి., డాక్టర్ ఆఫ్ లాటిన్ ని కలిగియుండవచ్చును. నీవు అన్ని రకములైన డిగ్రీలు కలిగియుండవచ్చును. బహుశా నీవు మెథడిస్టు సంఘపు వస్త్రము నీమీద కలిగి ఉండవచ్చును. బహుశా నీవు పెంతెకోస్తు సంఘపు వస్త్రము నీమీద కలిగి ఉ ండవచ్చును. బహుశా నీవు అసెంబ్లీస్ సంఘపు వస్త్రము నీమీద కలిగి ఉండవచ్చును. లేక ఒన్నెస్, లేక త్రిత్వము గురించి చెప్పువారి, లేక ఏదైననూ కావచ్చును. అది కేవలం వాడబడిన వస్త్రముతో ప్రారంభము కావలసియున్నది (అది సరియైనది.), కొన్ని మనుష్యులు తయారుచేసిన సిద్ధాంతములు అలాగున్నాయి, కావున మొదలైనవి అలాగున్నాయి.
35. మరియు చివరకు నీవు క్రైస్తవుడై యున్నప్పటికీ, మరియు సంఘము కూడా క్రైస్తవుడైనప్పటికి, మరియు పరిశుద్ధముగా ధరించాలి... కానీ ఎప్పుడైతే ఎలీషా, బయట నిలబడి, ప్రకాశమైన ఆ తీరపు వరుసంతా ప్రవక్తల తోనూ మరియు విమర్శకులతోనూ నిండిపోయున్నది, అతను ఏమిచేయాలో చూస్తున్నాడు... మరియు ఏలియా దుప్పటిని ధరించుకొని ఇక్కడకు నడుచుకుంటూ వచ్చాడు. ఓహ్, మై, లేకపోతే అతను నేర్పబడేవాడు, అతను చదువుకున్నాడు, అతను లోబడ్డాడు, అతను విశ్వసించాడు. అతనిలో ఏ లోపమూ లేదు. అతను యోర్దానుకు వస్తున్నాడు. లోకము అతన్ని గమనిస్తున్నది.
ఓ దేవా, ఈ దినము మనకది ఎంత అవసరము. చాలామంది నేర్పబడినవారు మరియు చదువుకున్న విద్వాంసులు, చాలామంది మనుష్యలు పరిశుద్ధగ్రంథమును చింపి మరలా దాన్ని గణితములో కూర్చగలరు... చాలామంది భోధించు క్రమములో గొప్పవైన కార్యములు చేయగలరు, వారు పరిశుద్ధగ్రంథములోని ప్రతి ఒక్క సంఘటనకు సంబంధించిన చరిత్రను గురించి తెలిసినవారు, పాతాళము ఎప్పుడు వెలిగించబడిందో ఆ ఘడియను వారు చెప్పగలరు మరియు అది ఏ ఘడియలో బయటకు వెళ్ళినదో చెప్పగలరు. వారు నీకు ఈ కార్యములన్నీ చెప్పగలరు. మరియు వారు బాప్తీస్మము పొందారు. వారు ఆత్మీయ బాప్తీస్మము పొందారు, వారు దాన్ని పిలిచినట్లుగా, ఆ వస్త్రము. కేవలం వారు క్రమములో ఉన్న అన్నిటినీ పొందియున్నారు. వారు నీటి
36. కానీ అతను ఎప్పుడైతే యోర్దానుకు వచ్చి క్లిష్టమైన లోకమును ఎదుర్కొనేప్పుడు, అతను ఎందుకని ఏడ్చాడు? "ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు?" అది ఏలియా
యొక్క వస్త్రము దాన్ని చేయలేదు. అది ఏలియా దేవుని యొక్క శక్తి దాన్ని అలాగు చేసెను. మరియు ఈ ఉదయము లోకమునకు కావలసినది ఏలియా దేవుని యొక్క శక్తియే. బహుశా నీవు భాషలలో మాట్లాడవచ్చును మరియు గట్టిగా అరవవచ్చును మరియు నేల మీదంతా పరుగెత్తవచ్చును, కానీ మనకు కావలసినది అపొస్థలుల దినములలో ఆ ఘడియలలో జీవించిన కార్యములు మరియు దేవుని యొక్క శక్తిని ఉ త్పత్తి చేసే పెంతెకోస్తు జీవితాలు. ఒకరు వాడిన దుప్పటి మంచిదే, కానీ అతని హృదయములో దేవుడు క్రొత్తగా పిలువబడిన పిలుపుండాలి. అతడు దేవుని నుండి క్రొత్తగా అభిషేకము పొందియుండాలి. అతడు నది దగ్గరకు వచ్చినప్పుడు ఒక వాడబడిన దుప్పటిని ధరించుకున్నాడు, కానీ అతడికి ఒక క్రొత్తదైనది అవసరమున్నది, దేవుని నుండి మొదట పిలుపు అవసరమున్నది. మరియు అద్భుతము చేయుటకు దేవుని నుండి క్రొత్తదైన శక్తి అవసరమున్నది.
37. మరియు నా సహెూరుడా, దేవుడిని ఏదైనా అడుగుటకు భయపడవద్దు. నీవు దేవుడిని తప్పక అడుగవచ్చు, లేక దేవుడిని ఆయన వాగ్ధానము చేసినదాన్ని ఏదైనా అడుగుము. దేవుడిని నీకు పరిచయం చేస్తున్నట్లయితే ఆయన సర్వాంతర్యామి మరియు శక్తివంతుడు, మరియు నేను దేవుని సేవకుడినైతే, దేవుడు చేయు కార్యములను నేనునూ తప్పక చేస్తాను. మరియు నేను దేవుడు చేసిన కార్యములు చేసినట్లయితే, ఈ కార్యములను దాటి తీసుకుని వచ్చుటకు నేను దేవుని మనుష్యుడనైయున్నాను, ఎందుచేతనంటే ఆయన నన్ను అసాథ్యమైన దాన్ని అడుగుతున్నాడు. నేను ఆయన్ను అడుగవలసియున్నది. నేను ఆయన్ను పిలువవలసియున్నది మరియు అక్కడ నిలబడి మరియు ఇలా చెప్పవలసి యున్నది, “దేవా, నీవు దాన్ని వాగ్ధానము చేశావు", కావున నీవు కుడా, ప్రతియొక్క వ్యక్తి.
“పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు” (అపొస్తలుల కార్యములు 1.8). పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తరువాత, తరువాత నీవు ఒక క్రైస్తవుడిగా ధరించబడ్డావు, నీ విశ్వాసము క్రీస్తులో నిలకడగా ఉన్న తరువాత, అప్పుడు నీవు శక్తిని పొందుకుంటావు. అక్కడే నీవున్నావు. అవును.
మరియు సహోదరీ, సహెూదరులారా, ఆ ఉదయకాలము ప్రతి ఒక్కరూ... బలహీనుల కొరకు ప్రార్ధన చేయబోవు ముందు నేను దీనిని చెప్పవచ్చునా, నేను దీన్ని చెప్పవచ్చునా, దేవుని సహాయము చేత, మీరు నా కొరకు ప్రార్ధన చేయండి నేను =ఇక్కడ ఈ వేదిక మీద 10 సంవత్సరముల క్రితం నిలబడి దావీదు మరియు గొల్యాతును ప్రసంగించినట్లుగా. ఇప్పుడు, గొల్యాతు నన్ను అడ్డగించుట కాదు. దేవుడు అతన్ని నా ముందే వధించాడు. కానీ సరియైన విశ్వాసము లేకపోవుటయే నన్ను అడ్డగిస్తున్నది,
నేను ఏదో కోల్పోయాను అది నా చుట్టూనే ఉన్నదని నాకు తెలుసు. మరియు ఈ ఉ దయము తిరిగి ఈ గుడారములోకి రాక ముందు, నేను అరుస్తున్నాను, “నాకు వాగ్ధానమిచ్చిన దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ మనలను కలుసుకునే దేవుడు ఎక్కడున్నాడు? దేవా, ముందుకు రమ్ము, మరియు నాకు ధైర్యమును ఇమ్ము, నాకు బలమును ఇమ్ము, మరియు నాకు ధృఢమైన ఆలోచనను ఇమ్ము, ఏది వచ్చిననూ లేక ఏది పోయిననూ వాటితో సంబంధము లేకుండా ఇమ్ము, అది చీకటిగా కనిపించిననూ, లేక అది కనిపించిననూ, అది ఏలాగు కనిపించిననూ, ముందుకు కదులుము, వాగ్ధానము నిజము.”
38. సహోదరీ, సహెూదరుడా, ఈ దినములలో ఒక దినము... ఈ ఉదయము ఇక్కడున్న పాపియైన స్నేహితుడా నీ కోసం, మరియు ఎవరైతే ప్రజలు క్రైస్తవమును అనుకరిస్తున్నారో వారికి, నీవు సంఘమునకు చెందినవాడివి కావచ్చును. అది చాలా మంచిది. నేను దానికి వ్యతిరేకముగా ఏమియూ చెప్పుటలేదు, నీకు ఉన్న మంచివాటి గురించి చెప్పుటలేదు, విజ్ఞానకరమైన చదువు గురించి, లేక నీ ధియాలజీ గురించి చెప్పుటలేదు. నేను దానికి వ్యతిరేకము కాదు. కానీ, ఓహ్, దేవుడు ఎక్కడ ఉన్నాడు?
కేవలం అది ఏలియా కాదు. ఆ నదిని తెరచినది ఏలియా కాదు. అతని వస్త్రము తెరవలేదు. ఎలీషా దాన్ని తన భుజముల మీద నుండి తీసుకున్నాడు, అతను దాన్ని ఏలియా ఏవిధముగా దాన్ని మడత పెడతాడో ఆవిధముగా మడత పెట్టాడు. కానీ అతను దాన్ని ఊపబోవుట ప్రారంభించినప్పుడు, అక్కడ ఏ శక్తీలేదు. అప్పుడు అతడు ఏడ్చాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడని తెలుసుకున్నాడు, “దేవుడు ఎక్కడున్నాడు. ఆయన ఎక్కడున్నాడు?" అప్పుడు ప్రవక్తను ఏదో పట్టుకొని యుండాలి, అతను వస్త్రమును ఊపుతూ మరియు నీటిని కొట్టెను, మరియు అది ఇవతలకి మరియు అవతలకి తెరుచుకున్నది. మరియు ఆ దినపు సేవకుని కన్నా ముందు, ఆ దినపు విమర్శకుల కన్నా ముందు, అతని ముందు ఏలియా ఎలాగు యోర్దాను దాటి వెళ్లాడో అలాగే అతను కూడా దాటి వెళ్ళాడు.
39. మనకు భోధించనవసరం లేదు, మనము దాన్ని కలిగియున్నాము. కానీ మనకు ఏలీయా దేవుడు కావాలి. మనకు ఏలియా యొక్క దేవుని యొక్క శక్తి తిరిగి మన సంఘములోకి రావాల్సిన అవసరం ఉన్నది, ఆ శక్తి మనలను అక్కడ పట్టుకుంటుంది, మరియు ఏదియూ పట్టించుకొనకుండా, దేవుని వాక్యమును సరిగా పిలువండి. మరియు ఈ ఉదయము ఇక్కడున్న మనమందరము, మనుష్యులమైన మనము, యోర్దాను మార్గములో. మరియు అతను యోర్దానుకు వచ్చినప్పుడు... ఈ ఉదయకాలములలో ఒక ఉదయకాలము మీరు అక్కడికి చేరుకుంటారు, లేక ఈ
రాత్రులలో ఒక రాత్రి మీరు అక్కడకి చేరుకుంటారు. అతను యోర్ధానుకు ఎప్పుడు వచ్చాడో, అప్పుడు అతను ఒక జయశాలి మాదిరిగా నడుస్తున్నాడు. కానీ అతడు యోర్దానుకు వచ్చినప్పుడు, ఆ వ్యత్యాసమున్నది. అతడు ఒకరు వాడిన దుప్పటిని ధరించియున్నాడు, వేరొక మనుష్యుడు దాన్ని ఒకప్పుడు ధరించుకున్నాడు. కానీ ఒక మంచి దుప్పటి, మరియు ఆ దుప్పటిని ధరించుకున్న మనుష్యుడు ఎవరో అతడు తెలుసుకున్నాడు.
40. సహోదరీ, సహుదరుడా, ఈ ఉదయకాలములలో నేను యోర్దానుకు రావలసియున్నది. నేను ఈ మధ్యాహ్నము ఆలోచిస్తున్నాను. మను సహెూదరీ సహోదరులైన రైట్ దగ్గరకు వెళ్ళబోతున్నాము. దాన్ని మరిచిపోవద్దు, ఇది వారి 50వ వివాహ దినోత్సవము. ఇక్కడనే నేను సంఘమును విడిచి, వారితో రాత్రివిందుకు వెళతాను. నేను వేరొక దినమున ఆలోచిస్తున్నాను, 50 సంవత్సరములు. మరియు నేను చూస్తున్నాను వారిరువురు మంచి వయస్సు కలిగినవారు మరియు వయసుడిగిన వారు. నేను అనుకున్నాను, "అవును, నాకు 47 సంవత్సరములు వయస్సు, నేను పుట్టుటకు మూడు సంవత్సరములకు ముందు వారు వివాహము చేసుకున్నారు.” నలభై-ఏడు, నేను యోర్దాను వైపు కవాతు చేస్తున్నాను. నేను క్రిందకు దిగి రావలసియున్నది. నేను అక్కడకు రావలసియున్నది. నేను అక్కడకు చేరుకోవలసియున్నది. బహుశా అది రోడ్డు మీద ఒక యాక్సిడెంట్లాగా అవ్వవచ్చును. నేను విమానములో నుండి పడిపోవచ్చును. నేను ఏదో దెయ్యము చేత కొట్టబడి ఎక్కడో చనిపోవచ్చును. నేను ఎలా వెళతానో నాకు తెలియదు. కాని నాకు ఒకటి తెలుసు, అది నేను వెళతాను. కానీ నేను యోర్ధాను వైపు నడుస్తున్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు, నేను ఒక దానిని తెలుసుకొన గోరతాను, అది ఏమిటంటే నేను కూడా ఒకరు వాడిన దుప్పటిని కలిగియున్నాను. నేను నాయందు నమ్మకముంచను, ఎందుకంటే అది మంచిది కాదు.
ఎలీషా, ఏలియా యొక్క వస్త్రమును పైకెత్తిన వెను వెంటనే, తన వంటి మీద వస్త్రమును ముక్కలుగా చింపివేసి మరియు క్రింద పడవేశాడు. మరియు ఆ విధముగానే నేను కూడా క్రీస్తును కనుగొన్నాను. నేను కూడా నా స్వంతమైన దాన్ని చింపివేశాను, నా సొంత ఆలోచనలను, నా స్వంత పిచ్చితనమును, నాకు ఇష్టమైన చిన్న చిన్న వాటిని చింపివేశాను. మరియు నేనొక చిన్న బాప్టిస్టు భోధకుడిగా ఉన్నప్పుడు నా గురించి నేను వేరేవరినో అని అనుకునేవాడిని. కానీ నేను దాన్ని చింపుకుని బయటకు వచ్చాను. నేను ఆయన దుప్పటిని ధరించుకున్నాను. మరియు నేను యోర్దానుకు వచ్చినప్పుడు, నాఅంతటగా నేను ఆయన దుప్పటిలో చుట్టబడుటను కనుగొనాలి
అనుకుంటున్నాను అతను దాన్ని అనుసరిస్తాడు. మరియు ఒక దినము మనమందరమూ అక్కడకి చేరుకుంటాము. కావున మనము కొద్దిసేపు ప్రార్ధన చేద్దాం.
41. పరలోకపు తండ్రీ, మేము జయశాలుల మాదిరిగా మా యోర్దాను మార్గములో కవాతు చేస్తుండగా, మరియు ఒక దినాన్న మేము యోర్దానుకు ఏదో బహుమతిగా ఇవ్వాలి, అది మరణము, మరియు, ఓహ్, అది ఎంత భయంకరమైనది, అది దేవుని నుండి వేర్పాటైయున్నది. మనము దాన్ని దాటి వెళ్ళలేము. లేదు. కానీ ఏలియా అక్కడకు వెళ్ళినప్పుడు, అతని మీద ఎలీషా దుప్పటిని ధరించుకున్నాడు. ఏలియా యొక్క దుప్పటి ధరించుకున్నాడు. మరియు అతడు తన దుప్పటిని తీసినప్పుడు, ఆ... ఏలియా, మీ దృష్టిలో ఎంతో మంచివానిగా కనిపిస్తున్న ఆ మనుష్యుడు, మరియు మీరు అతడిని అంగీకరించియున్నారు మరియు మీతోపాటు అతన్ని పరలోకమునకు తీసుకొని వచ్చారు. మరియు ఎలీషా, అతని (ఏలియా) వస్త్రమును ధరించుకున్నాడు, కావున అతను యోర్దానుకు మరణమును బహుమతిగా ఇచ్చాడు, ఏలియా యొక్క దుప్పటి, మరియు అది అంగీకరించబడింది, మరియు యోర్దాను తెరువబడింది, మరియు అతడు దాటివెళ్ళాడు.
ప్రియమైన దేవా, ఒక దినాన మేము క్రిందకు రావలసియున్నది. మేము మా యొక్క మంచి క్రియలను బహుమతిగా ఇవ్వలేము, మాకు ఏమియూ లేవు. మేము లోకములో దేన్నీ బహుమతిగా ఇవ్వలేము. ఏదైనా బహుమతి ఇవ్వాలనే ప్రయత్నమును కూడా నేను చెయ్యలేను, కానీ యేసు యొక్క యావత్తు గుణములయందు నేను నమ్మకము కలిగియున్నాను. మరియు మరణములో నుండి ఆయన లేపబడినాడని మీరు ఆయనను అంగీకరించారు. మరియు ఆయన, దేవుని సన్నిధికి తీసుకురాబడి మరియు అక్కడ ఆయన స్థిరముగా నిరంతరమూ ఉంటాడు. మరియు, దేవా, అదియే నేను ఆయన యందుంచిన విశ్వాసము. దాన్ని నేను నీకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను, మరియు నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను. మరియు ఆయన కృప చేత తన వస్త్రముతో మమ్ములను కప్పెను.
మరియు నేను ప్రార్ధిస్తున్నా, తండ్రీ, ఇప్పుడున్న యుద్ధ దినములలో మీరు మాకు సహాయము చేయండి. మరియు దేవుని మనుష్యుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ దేవుని క్రియలు తప్పక చేయాల్సియున్నది, మీరు మమ్ములను క్రీస్తు యొక్క వస్త్రములోకి తీసుకొనమని నేను ప్రార్థిస్తున్నాను, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, మరియు అతనిలో జీవిస్తున్న దేవుని పిలువుము. ఇది దయచేయుము. దీనిని క్రీస్తు నామములో అడుగుచున్నాము.
42. మరియు మనము మన తలలు వంచియుండగా, ఈ ఉదయము ఈ వస్త్రము లేకుండా ఎవరైతే యోర్దాను వైపుకు వచ్చుటకు నడవాలని ప్రయత్నము చేస్తున్నారో కేవలం నేను వారిని వెతుకుతున్నాను. ఎవరైనా ఒక వ్యక్తి యేసు క్రీస్తు యొక్క వస్త్రమును మీ మీద ధరించుకొనకుండా ఉన్నట్లయితే, మరియు అది ఒకసారి దేవుని కుమారుని చేతకూడా ధరించబడింది, ఈ ఉదయకాలము మీరు దాన్ని కలిగిలేనట్లయితే నేను ఆశ్చర్యపోతాను, దేవునికై మీ చేతులను పైకెత్తి మరియు ఇలా చెప్పుము, "ప్రియమైన దేవా, ఈ ఘడియలో ఇప్పుడే నేను దాన్ని అంగీకరించాలనుకుంటున్నాను.” స్త్రీ, దేవుడు నిన్ను దీవించును. మీలో ఇంకెవరైనా చేతులను ఎత్తాలనుకుంటున్నారా... కుమారుడా, దేవుడు నిన్ను దీవించును. ఇంకెవరో ఇప్పుడే మీ చేతులను పైకెత్తుతున్నారు? చిన్న బాలుడా, దేవుడు నిన్ను దీవించును. యవ్వనస్తుడా, దేవుడు నిన్ను దీవించును. ఇంకెవరో ఇప్పుడే మీ చేతులను పైకెత్తుతున్నారు? అయ్యా, దేవుడు మిమ్ములను దీవించును.
43. కేవలం చెప్పండి, "ఈ ఉదయము దేవుని సహాయము చేత, నా స్వంత నీతిని విడిచిపెట్టాలని అనుకుంటున్నాను, నా స్వంత ఆలోచనలను, మరియు నా సంతోషపు జ్ఞాపకాలను మరియు గొప్ప సమయములను మరియు నేను జీవించిన పాపమును విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. మరియు ఈ ఉదయకాలమున క్రీస్తు నా మీద తన వస్త్రమును ఉంచుతాడని కోరుకుంటున్నాను, నేను ఉపయోగించు వస్త్రము ఆయనదే. అది ఒక్కటియే పరిపూర్ణమైనది.” కుమారుడా, దేవుడు నిన్ను దీవించును. ఇంకెవరో ఇలా అంటున్నారు, “నేను కేవలం పైకెత్తుతాను...” నీ చేయిని నీవు పైకెత్తి చెప్పుము, “నా జీవితంలో పరిశుద్ధాత్మను ఇప్పుడే అంగీకరించాలని కోరుకుంటున్నాను. నేను ఆయన నీతిలో ధరింపబడాలని కోరుకుంటున్నాను. ఆ దినాన నేను అక్కడకు వెళ్ళినప్పుడు, నా అంతట నేనుగా కనుపించి మరియు ఇలా అనక, 'ఇప్పుడు మంచిది, మీకు తెలుసా, నేను ఎవరినో ఏదో రాతి బొగ్గును తెచ్చాను. నేను దీన్ని చేశాను'." అది బాగున్నది, అది చాలా బాగున్నది. దాని కోసము, నీవు జీవించటానికి ఏదో మరణించవలసియున్నది. మరియు కేవలం క్రియ ద్వారానే నీవు రక్షించబడతావు. నీవు నీ చేతిని పైకెత్తగలవా, చెప్పుము, "క్రీస్తు, నా స్వంత మార్గములను ఇప్పుడు విడిచిపెడుతున్నాను, నీ మార్గములను నేను అంగీకరిస్తున్నాను. నేను మార్గము చివరకు వచ్చినప్పుడు నామీద కనికరం చూపమని కోరుకుంటున్నాను.” స్త్రీ, నిన్ను దేవుడు దీవించును. దేవుడు నిన్ను దీవించును. అంతా సరియైనదే. ఇప్పుడు, మనము ప్రార్ధనను కలిగియున్నాము.
44. ఇప్పుడు, నీతివంతమైన పరలోకపు తండ్రీ, ఏవో యేడు, ఎనిమిది, పది చేతులు పైకెత్తారు. వారి యొక్క స్థితి నాకు తెలియదు. వారందరి గురించి నీకు
తెలుసు. నాకు తెలియదు. కానీ వారు ఈ దినములో అవసరతలో ఉన్నవారు, మరియు వారు అవసరతలో ఉన్నారని వారు తెలుసుకున్నారు, మరియు వారు సమస్యలలో ఉ న్న సమయంలో వారు వచ్చి నిన్ను అంగీకరించాలని అనుకుంటున్నారు, చూచుటకు ఆ గొప్ప ఘడియ ఇప్పుడు సమీపముగా ఉన్నది, అణుబాంబులు, ఆ గొప్ప కార్యములు మన కొరకై ఎదురుచూస్తున్నాయి.
మరియు నేను ప్రార్ధిస్తున్నాను, పరలోకపు తండ్రీ, నీవు ఈ ప్రజలను దీవించుము, మరియు ఈ దినమున నీ చేతిని వారి మీద ఉంచుము మరియు వారిలోవున్న అసమానతలను మరియు సందేహాలను తీసివేయుము. మరియు వారు ధరించుకున్న చిమటలు తిన్న స్వంత నీతి వస్త్రమును ఎక్కడైతే వస్త్రములను తినే పురుగులు, మరియు చిన్న చిన్న పురుగులు, మరియు మూఢనమ్మకముల యొక్క చిమటలు మరియు సంఘత్వము దానిని అంతటిని తిని రంధ్రములను చేసింది మరియు వారు... అది ఇంకెంతో కాలము వారితో ఉండదు. కేవలం వారు దాన్ని విసిరివేయవచ్చును మరియు అక్కడకు చేరుకుని మరియు ప్రభువైన యేసు వస్త్రమును లేక దుప్పటిని పొందుకొని, చెప్పుము, "నేను ఆయనయందు నమ్మకముంచాను. నా అంతట నేనుగా చుట్టబడ్డాను, నా స్వంత నీతిలో కాదు లేక నా స్వంత ఆలోచనలలో కాదు, కానీ ఈ ఘడియ నుండి నిన్ను నేను నమ్ముతున్నాను." తండ్రీ, మీరు దయచేస్తే వారు దాన్ని పొందుకుంటారు. క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.