క్షమించబడని పాపము
1. మనము ఆ పాటలు పాడుదము, మరియు అది మన ముఖములను వెలిగించును; పదివేల సంవత్సరముల గూర్చి ఆలోచించినపుడు మనకు సమయము కొంచెము కూడా ఉండదు. కాని మీరు తెలిసికొనండి. ప్రభువు కొరకు పని చేయుటకు ఇదే సమయము. కాదా? మనము కలిగియున్న ఆ సమయము ఏదనగా ఈచిన్న మర్త్య జీవితకాలము. ఇక్కడ మనము ఉండగానే అది దొరుకును. ప్రభువు యొక్క సేవలో ఏదో చేయుటకు అది మనలను అప్రమత్తము చేయుచున్నదని నేను నమ్ముచున్నాను. అది పాడుట అయినా, సాక్ష్యమిచ్చుట అయినా, దేవుని మహిమ కొరకు ఏదో చేయుట కావలెను. ఏదయినా పరవాలేదు. ఆలోచన కొరకు మాత్రమే. అక్కడికి వెళ్ళిన తరువాత పదివేల సంవత్సరములు కేవలము పాడుట మాత్రమే చేయుదుము. అనగా అది సంగీత సేవ. ఇంకా అది పూర్తిగా అయిపోలేదు. మీకు తెలియును. పదివేల సంవత్సరములు. కావున అది అద్భుతమగు సమయముగా ఉండబోవుచున్నది.
ఇప్పుడు ఈ రాత్రివేళ మేము ప్రకటించబోవునది, కేవలము... ఉదయము నేను ఐడహోకు వెళ్ళవలసి యున్నాను. కొద్ది దినములక్కడుందును. అప్పుడు దేవుని చిత్తమయితే పాత కాలపు ఉజ్జీవమును ప్రారంభించ గోరుచున్నాము. ఇక్కడి ఈ ఆలయము నుండియే ఆరంభమగును. తరుపరి కొద్ది వారముల గూర్చి మనము తెలిసికొందుము. అది దేవుని చిత్తము. ఒక మంచి ఉపదేశ ఉజ్జీవము ఈ ఉదయము తేనె జాడీపై మనము మన చేతులుంచాము. ఒక అద్భుతమగు, మహిమకరమగు సమయము దొరికినది. మీరెరుగుదురా? ఇక్కడికి రాని వారికందరికి చెప్పుచున్నాను. మీరు నిశ్చయంగా ఒక విస్తార చిత్రమును తప్పిపోయి యున్నారు. అది ఒక దీర్ఘ కూడిక, రెండు గంటలు, నేను బోధించుచునే ఇక్కడున్నాను. నేనెంతో చక్కని అనుభూతిని పొందాను. ఈ మధ్యనే నేను కొలరాడో నుండి వచ్చి యున్నాను. అద్భుతమగు అనుభూతిని పొందితిని.
ఉజ్జీవ సభలు వెనువెంటనే ప్రారంభించగోరుచున్నాను. కొందరు నా ప్రియ స్నేహితులు ఇమిడియున్నారు. వారికి నేను కాదని చెప్పలేను. సహో॥ ఆర్గన్ బ్రయిట్
ఇంకా చాలా మంది కాలిఫోర్నియా నుండి వచ్చిరి. క్రైస్తవ వ్యాపార వేత్తలు నన్ను ఐడహోలో కలిసికొమ్మని అడిగారు. నేను ఉదయమున కాలిఫోర్నియాకు వెళ్ళుదును. మంగళవారమునకు ఐడహో వెళ్ళెదను. స్నేక్ రివర్ తదితర చోట్లకు వారు వెళ్ళెదరు. వారితో రమ్మని కోరిరి. నాకు కూటములు కార్యక్రమములు లేవు. కావున మీరెరుగుదురు. కొందరు నీకు మేలు చేయుదురు. వారిని నీవు ప్రేమించెదవు. అది సరియే. వారు నా పట్ల మంచిగా ఉన్నారు. కావున నేను లోనికి వెళ్లి ప్రభువును అడిగాను. నేను వెళ్లుట సరియేని ఆయన చెప్పినట్లు అనిపించినది. కావున వారితో నేను వెళ్లు చున్నాను.
2. తరువాత తిరిగి వచ్చుదును. దేవుని చిత్తమయితే ఉజ్జీవ కూడిక ప్రారంభించెదను. ఒక మంచి పాత కాలపు క్రమమిది. మీరు దాని గూర్చి ఆలోచించగోరుచుండవలెను. దాని గూర్చి ప్రార్ధించండి. దేవుడు పరలోక కిటికీలు తెరచి మనమీద ఉజ్జీవపు ఆత్మను కుమ్మరించును.
ఈ ఉదయం మనం చెప్పుకొనినట్లు జలములు గూర్చి మీరెరుగుదురు. నది అని నేను చెప్పగలను. కొన్నిసార్లు నది చాలా భీకరముగా నుండును. ఉరకలు వేయుచుండును. ఎగురు చుండును. ఇక ఏ మాత్రము నీరు లేనపుడు అది చెప్పజాలనంత నిమ్మళముగా నుండును. కాని ఉజ్జీవముతో ఎగసి పడుచున్నప్పుడు చూడండి. దానిమీద గాలి విసరుచుండును. అది క్రిందికి పైకి ఎగసిపడును. ఉరకలు వేయుచుండును. దానిని గూర్చిన మంచి ఆలోచన, కర్రలు, చెత్త దానిపై తేలియాడును. నేను చెప్పినట్లు ఒడ్డుకు కొట్టుకుపోవును.
ఉజ్జీవము అదే జరిగించును. మనచుట్టూ అది ఉరకలు వేసి మనలను వశపరచుకొనును. ఎగిసి పడుచుందుము. పైకెగరుచుందుము. అటు ఇటు పడుచుందుము. దాని కొరకు ప్రార్ధన చేయుచుందుము. పొరుగువారి యొద్దకు వెళ్లుదుము. మీరు చూడండి. మీరు తెలుసుకోవలసిన మొదటి విషయము ప్రభువు మనకు బయలుపరచును. "నీవు పొరుగువారి గూర్చి ఆలాగు మాట్లాడరాదు. ఆలయమునకు రమ్మని అతనిని నేను వెళ్లి అడిగెదను”.
ఆ విధమగు ఉరకలు చిన్న మెలిక కలుగజేయునని ఒక విధంగా మీకు తెలియును. రానున్న కాలములో అదే మనము చేయబోవుచున్నాము.
3. మీ సమయమును మరీ ఎక్కువగా తీసికొనను. రేపు సోమవారమని నాకు తెలియును. పనిరోజు ఉజ్జీవ కూటముల సమయములో దేవుని చిత్తమయితే ఒక గంటన్నర సేపు లేదా రెండు గంటలు రాత్రిలో తీసికొందము. పాటలు కూటము తరువాత నేరుగా దేవుని వాక్యమును బోధించుదము,
పాటలు ఎంతో బాగున్నవి. కాని పాటల ద్వారా నీవు ఒక కూటమును పాడు చేయవచ్చును. చూడండి.. చాలా పాటలు ఎక్కువ పాడెదరు. మనము చాలా పాడవచ్చును. చూడండి. దేవుని ఆలయము సరిదిద్దుటకు అని చూడము. వాక్యము కొరకు అవగాహన కొరకు. ఉపదేశము కొరకు ఎట్లు మనము ప్రవర్తించవలెనో ఎరుగుదము. మీరు పాడుట మంచిదే. అది చాలా చక్కగా యుండును.
ఈ సమయములో మనము కొన్ని ప్రత్కే పాటలు పాడుదము. ఒక్క రాత్రిలోనే అన్నీ పాడలేము. ప్రతి రాత్రి మనము ప్రత్యేక పాటలు పాడెదము.
జనులు వచ్చునట్లు మీరు చేయవలెనని కోరుచున్నాను. తిరిగి వచ్చినప్పుడు మనము ఒక్కసారి ప్రకటించగలము. దాని కొరకు చూడండి. మనము కాగితముపై చిన్న ప్రకటన చేయుదము. మీరందరు రండి. అది స్వస్థతా కూటము కాదు. అది ఒక ఉజ్జీవ కూటము.
ఒక ఉజ్జీవ కూటము కొత్తగా మార్పు చెందిన వారిని తెచ్చుట అని అర్ధము కాదు. ముందే మారిన వారిని ఉజ్జీవింజేయుట అని ఉజ్జీవ కూటమునకు అర్ధము. చూడండి. “పెంచుట” “తిరిగి జీవము పోయుట” అని అర్ధము. సంఘము చిన్న కుదుపుకు లోనయింది.
ఇంతకు మునుపు మనకుండిన పాత కాలపు కూటముల కొరకు చూచుచున్నాము. చాలా కాలం క్రితం అలాగే ఉండినది.
కొద్ది సేపటి క్రితం జెర్టీ నన్ను పిలిచినది. ఆమె మరియు ఆమె చెల్లి ఏంజీహేంప్ మీటింగు సమయంలో వచ్చి (నలభై సంవత్సరాల క్రితం) నా కొరకు
పాడుమనిరి, కావున మేము ఎదురు చూచుచున్నాము. ఇతర సంఘ రోగర్ట్స్ సోదరులను ఆహ్వానించుచున్నామని చెప్పండి.
4. ఈ రాత్రి చాలా లోతయిన అంశమును మనము చదుపుచున్నాము. ఈ ఉదయం ప్రకటించాము. మన సోదరుడు నెవిల్ యొక్క ఆతిధ్యమును మరియు దయను నిశ్చయంగా మెచ్చుకొనుచున్నాము. ఎల్లప్పుడు వెనుక కూర్చొనుటనే ఇష్టపడును, మనలను ముందుకు పంపించును. నిజమగు సోదరుడు. బలిపీఠమును నేరుగా ఇచ్చును, మరేమి నాకు చేయవలసినది లేదన్నట్లుండును. కావున నేసు సహోదరుడు నెవిల్స్న అభినందించుదును. అన్ని విషయములలోను అతడు సహకరించును. ఎప్పుడు నేను ఏది చెప్పినా తిరస్కరించడు. అతడు పనిమీదనే యుండును. అలాటి సోదరుని నేను మెచ్చుకొందును.
ఈ ఉదయము మనము చదువుకొనుచున్నాము. గత నాలుగు మాసముల నుండి లేదా దాదాపు అలాగే హెబ్రీ పత్రిక 9, మరియు 10 అధ్యాయములు అధ్యయనం చేయుచున్నాము. 8వ వచనము నుండి ప్రారంభించాము. 25 వరకు ముగించాము. ఈ ఉదయం ఆలాగు తలంచాను. అయితే ఈ రాత్రి దేవుని చిత్తమయితే నేను బోధించెదనని చెప్పిన అంశము క్షమించబడని పాపము అని ప్రకటించాను. క్షమించబడని పాపమనగా ఏమిటి?
ఇప్పుడు వెనుకటి తలంపు నెమరు వేసినచో లేఖనపు భాగము దగ్గరకు వెళ్ళుదము. ఒకటిలేదా రెండు విషయములు సమీక్షించుదుము. ఆ తరువాత ఈ అంశము 25 వచనము దగ్గరకు... లేదా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము లేదా 26 వచనము నొద్దకు వెళ్ళుదం. 19వ వచనము నుండి ప్రారంభించి కొన్ని విషయాలు కనుగొందము.
5. ఇక్కడ పౌలు మాట్లాడుచున్నాడు. కృపను మరియు ధర్మశాస్త్రమును వేరు చేయ ప్రయత్నించుచున్నాడు. అంశము... లేదా ప్రధానంశము కృపనుండి ధర్మశాఇస్త్రమును వేరుచేయుచున్నాడు. ధర్మశాస్త్రము ద్వారా క్రీస్తును సమీపించుటను బయటకు తెచ్చుచున్నాడు. వాటిని కలిపి వేరుచేయుచున్నాడు. ఏ భాగము ఏమి పోషించుచున్నదో చూపించుచున్నాడు. క్రీస్తు ద్వారా దేవుని సమీపించుచున్నాడు.
అంతా .... సువార్తలలో యున్నది. అవన్నియు ఒకే భాగమును పోషించుచున్నవి. కాలములు మాత్రము వేర్వేరు.
ఆరాధకుడు బలి అర్పించుటకు వచ్చెను. రక్తము చిందించుచున్న బలిని ఇచ్చును. ఈ ఉదయం యోబును చూచాము, మానసికంగా మాట్లాడుచున్నాను. యోబు బలులు అర్పించు కాలములో యున్నాడు. దహనబలి. అతని పిల్లలు ఏమయినా పాపము చేసిరేమోనని తలంచెను. అయితే అది వారికి తెలియదు. యోబు తన పిల్లల కొరకు దహనబలి ఇచ్చుచున్నాడు. నిశ్చయంగా నాకది ఇష్టము. మీరును కదా? మీ పిల్లల పట్ల ఆసక్తి ఉన్నది. దహన బలి అర్పించుచున్నారు. ఒక ప్రార్థన చేసి, గొర్రెపిల్లను బలిగా అర్పించును. ఒకవేళ తన పిల్లలు పాపము చేసినచో వారు నశింపకుండునట్లు. దేవుడు వారి పాపములను క్షమించి వేయును.
యోబును గూర్చి చదివి కనుగొందము. చివరకు అదెట్లు చెల్లించబడినదో చూద్దాము. దేవుడు... యోబు తన శిక్షా కాలము గుండా దాటి పోయిన పిదప శోధనలు ముగిసిన పిదప చివరలో ఇది చేసెను. యోబు తన పిల్లలెవ్వరిని పోగొట్టుకోలేదు. అతడు తన పశువులను, గొర్రెలను, ఎద్దులను, ఒంటెలను రెండు రెట్లు పొందెను. దేవుడు తిరిగి ఇచ్చెను. పిల్లలందరూ చనిపోయి సమాధిలోనికి పోయిరి. కాని వారు మహిమలో ఎదురు చూచుచున్నారు. చూడండి. ఎవరూ లయము కాలేదు. దేవుడు యోబునకు తన కుమారులను, కుమార్తెలను తిరిగి ఇచ్చెను. ఆయన వెలుగులో జీవములో ఉండుట అనగా ఏమిటో చూడండి. ఆయన పాలన చేయునప్పుడు అన్ని కాలములలోను నీవు అలాగే నడువవలసి యున్నావు. ఆయన కట్టడల ప్రకారము జీవించవలెను. ఆలాగే నడువవలెను.
6. బైబిలులో ఈలాగు కనుగొందుము. బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రియగు జెకర్యా నీతిమంతుడు. యేసుకు అతడు రెండవ నాన్న అగును. లేఖనములలో నీవు గమనించావా? నీతిమంతుడు ధర్మశాస్త్రము క్రింద ఉన్నాడు. అతని గృహములో నిరతము ప్రార్థనలు కొనసాగుచున్నవి. అతని భార్య ఎలీసబెతు గొడ్రాలు పరిశు ద్ధాత్మ ప్రధాన దూతయగు గాబ్రియేలు రూపములో వచ్చెను. అతడు ఆ సమయములో ధూపము వేయుచు అల్లాడించు బలిలో యున్నాడు. ఆలయములో ప్రార్థనలు
జరుగుచున్నవి. అప్పుడు ప్రధాన దూత గాబ్రియేలు అక్కడికి వచ్చెను. ఎందుకనగా అతడు తాను నడువవలసిన వెలుగులో నడుచుచున్నాడు.
మనందరి నుండి దేవుడు అదే కోరుచున్నాడు. మన వెలుగులో మనం నడువవలెను.
7. అక్కడే సువార్త యున్నది. సువార్త యొక్క మానసిక లక్ష్యము, అన్యుల రాజ్యములో విఫలమయినది. దానికి కారణము మనము ఒకే సిద్ధాంతమును వారి యొద్దకు తీసికొని వచ్చాము, లేదా ఒకరకమగు వేదాంతము చెప్పాము. అది ఒక మానసిక తయారు. దానిలో నుండి వారికి మనం నూరిపోశాము. అది వారి యొక్క స్వంత ఆరాధనకు ఏ మాత్రము భిన్నంగా లేదు.
ఇంకో మాటలో చెప్పవలెనన్న సూర్యుడు మహా శక్తి అనియు అది భూమిని అదుపులో ఉంచుచున్నదనియు వారికి నేర్పించబడినది. ఒక విధమగు విధానము ప్రకారము అది అలాగే యున్నది. కాని వారు సూర్యుని శక్తి వున్నదని వారు నమ్మిరి. సూర్యుని ద్వారా శక్తి వచ్చుచున్నది. సూర్యుని ద్వారా జీవము వచ్చుచున్నది. సూర్యుని ద్వారా అది అక్షరాలా నిజమే. కాని సూర్యుడు సృష్టికర్తయొక్క సృష్టిలో ఒకటి మాత్రమే.
8. అక్కడ వేదికపై ఒకరు నిలబడి యున్నారు. మీరు అందుకు సంబంధించి ఉత్తరములో పొందియుందురు. మీలో చాలా మంది ఎరుగుదురు. మిషనెరీలు ఇతరులు వెళ్ళిరి. ఒకరు వచ్చి అక్కడ కూర్చొని కండ్లు పోయేంత వరకు దానిని చూచుచుందురు. సూర్యుడు తమ కండ్లను బయట పెట్టునని వారనుకొందురు. అప్పుడు వారిక పాపము చూడరు. లోక సంగతులు ఎరుగకుందురు. వారు లోకమునకు గ్రుడ్డివారు. ఆలాగు చేయుట వలన వారు రక్షింపబడు దుమనుకొందురు. దేవుని గూర్చివారికున్న జ్ఞానమంతా అదే. వారాలాగు బోధింపబడిరి. ఒక బలి అర్పించుటకు ఆలాగే చేయవలెనని విశ్వసించెదరు. తమ కన్నులను సూర్యుని ద్వారా అలాగే చేయవలెనని విశ్వసించెదరు. తమ కన్నులను సూర్యుని ద్వారా పోగొట్టుకొందురు. వారు రక్షింపబడుదుమనుకొందురు.
నిప్పులపై నడిచేవారున్నారు. తమ చేతులు పైకెత్తెదరు. శాంతి కనుగొనువారకు చేతులు క్రిందికి దించమని శపధము చేసెదరు. వారి చేతి వ్రేల్లు గోరులతో కప్పబడియుండును. వాటిని పెంచెదరు. సంవత్సరముల తరబడి వ్రేళ్ళు గోరులు పెంచుదురు. తమ చేతులను ఎన్నడూ క్రిందికి దించరు. పైకి ఎత్తుకొని యుందురు. ఆ విధంగానే నడుచుచుందురు. యధార్ధముగా ఉందురు. పూర్ణమగు యధార్థము. కాని వారికి సువార్తే లేదు.
9. ఇప్పుడు. .. ఆ మానవ శరీరులు మన వంటివారే. వారు మనకు సోదరులు. శరీరము లెక్కలోనికి తీసుకోబడినది. వారిని చూచుట మన విధి. దేవుడు ఒకే రక్తముతో మానవులందరినీ తయారు చేసెను. ప్రతి మనిషి, ప్రతి మానవుడు వృక్షము నుండి వచ్చాము. క్రైస్తవ సోదరులముగా మనము వారి యొద్దకు నిజమగు సజీవ సువార్తను తీసుకొని వెళ్ళవలెను. ఒకరు చిన్న జంతువులను ఆరాధించెదరు. పురుగులను ఆరాధించెదరు. చాలా చూచాం. సృష్టికర్తకు బదులు సృష్టిని ఆరాధించెదరు. ఒక్కసారి వారు యేసుప్రభువుని సువార్త వినినచో... మిషనెరీల ద్వారా వారు వినిరి. కరపత్రములు పంచిరి. వారంటారు...
మీలో ఎంతమంది పెద్దమనుష్యలు ప్రభువైన యేసుగూర్చి విన్నారు? వారిలో ప్రతి ఒక్కరును... "ఆయన దేవుని కుమారుడని మీలో ఎందరు నమ్ముదురు. ఎవరూ లేరూ, చూడండి, ఆయన ఎవరని మీరు తలంచుచుచున్నారు?
"ఓ! ఆయన ఒక బోధకుడు, మనకున్నవారిలో ఒకరివలె... చూడండి. ఇది ఎందుకనగా, వాటి దైవములుగా ఎంచుచున్న దేనివలనను ఎటువంటి ఫలితము లేదు. కాని యేసుక్రీస్తుయొక్క సువార్త వలన ప్రతి మాటయు నెరవేరుచున్నది. అది నిజము. అది తేడాను కనబరుచుచున్నది.
ఈ గ్రుడ్డివాడు అక్కడ నిలబడి యున్నాడు. సంవత్సరాలు తరబడి అతనికి చూపులేదు. ఇతనికి నీ మతం ఏమి చేయగలదు? అని నేనడిగాను, ఏమి చేయజాలదు, నేనన్నాను, "యేసుక్రీస్తు అతనికి చూపును ఇవ్వగలడు. ఇప్పుడే, ఆయన ఇచ్చెను, కావున అది సువార్త యొక్క వాస్తవము.
యేసుక్రీస్తుయొక్క రక్తము చిందు బలిద్వారా దేవుడు అందుబాటులో ఉన్నాడని 10. ఇక్కడ పౌలు హెబ్రీయులతో మాట్లాడుచున్నాడు. ప్రభువైన జనులకు చెప్పు ప్రయత్నము చేశాను. ఆలాగే ఆయనను నీవు సమిపించగలవు యేసు ద్వారానే ఎందుకనగా ఆయన లోక పాపమును మోసికొనుపోవుచున్న దేవుని గొఱ్ఱపిల్ల. దేవుడు దానిని గుర్తించెను. ఇప్పుడాయన ఇట్లనెను.
పాత నిబంధనలో వారు గొర్రెపిల్లను తీసికొని వచ్చినప్పుడు వారు తమ అర్పణను అర్పించిరి. గొర్రెపిల్ల తలను పట్టుకొని అదికొట్టుకొనుచూ మృతిపొందు చుండగా ఆ చిన్న ప్రాణియొక్క జీవ నాళయు కోయబడుచుండగా ఆ చుట్టూ రక్తము ప్రోక్షించబడుచున్నది. వారికి ప్రతిగా ఆ గొర్రెపిల్ల చనిపోవుచున్నదని వారు గ్రహించిరి. అయితే వారు మరల తిరిగి వెళ్లి అదే హృదయ క్రూరత్వమును ముందువలెనే కలిగి యుండిరి. వ్యభిచారము చేయుటకు అదే కోరిక కలిగియుండిరి. అబద్ధమాడు ఆత్మ అలాగే యున్నది. దొంగిలించు కోరిక అలాగే యున్నది. హత్యచేయు కోరిక అలాగే యున్నది. అంతా అంతే.
11. కాని ఒకవ్యక్తి ఒకసారి తన చేతులు పెట్టియున్నాడు. ఓ! ఒకడు తన చేతులను యేసుక్రీస్తు శిరస్సు మీద పెట్టి, తన పాపములను ఒప్పుకొనియున్నాడు. కల్వరి యొక్క వేదనను మరియు బాధను తాకి యున్నాడు. ఒక మనిషి పాపము నుండి విమోచించబడుటకు అతడు చెల్లించవలసినది అదే. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క రక్తములో నుండి బయటకు వచ్చినది. ఆమనిషిని శుద్ధి చేయుటకు వచ్చెను. అతడు నూతన సృష్టిగా బయటకు వచ్చును. ఇది ఎప్పటికీ ఒక్కసారే జరుగును. అతడు వేరే వ్యక్తిగా వచ్చును. పాపపు సమస్య అంతా పరిష్కారమయినది. లేఖనము ఈలాగు చెప్పుచున్నది. ఒక్క బలివలన వారిని పవిత్రపరచెను. వారిని నిత్యముగా పరిపూర్ణ పరచెను. ఆయన ఇట్లనెను. “దాని గూర్చి పరిశుద్ధాత్మ అదే సాక్ష్యమును ఇచ్చుచున్నది" చూడండి.
ఆ ఒక్క బలిని నిత్యముగా చాలును. ఆయన తన అర్పణ చేసెను. తన స్వంత జీవమును ఇచ్చెను. ఉన్నతమైన స్థలములో ఉన్న కుడిపార్శ్వమున కూర్చుండి
యుండెను. మహా సృష్టికర్త యొక్క సన్నిధిలో ఉన్నాడు. మనం ఒప్పుకొను దానిని బట్టి ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు.
ఇప్పుడు 19వ వచనములో ఆయన చెప్పుచున్నాడు.
కాబట్టి సహోదరులారా, యేసు రక్తమును బట్టి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము కలిగియుందము.
దాని గూర్చి ఆలోచించుము. భయము లేదు. ఈనాడు క్రైస్తవ సంఘములో ఉన్న గొప్ప జబ్బు అదే. "భయము, వారు భయపడుటకు కారణము ఏమనగా వారు సరిగా బోధింపబడలేదు. సువార్తపై సంపూర్తిగా అనుకొనలేదు.
12. ఇక్కడున్న చిన్న స్థలం దేవుని యొక్క శక్తికి తేనెపట్టు కాకపోవుటకు కారణం అసలు లేనే లేదు. దేవుని శక్తితో నింపబడి దేవుని మహిమలో ఎదుగుట లేదు. ఇక్కడున్న గోడలోని చిన్న రంధ్రము దాదాపుగా మొత్తం లోకమునకు తెలిసినదే. ఈ చిన్న స్థలములో ఈ రాత్రి మీరు కూర్చొని యున్నారు. ఎందుకనగా... విలియం బ్రెన్హాంను బట్టి కాదు. గాని దేవుని కుమారుడగు క్రీస్తును బట్టియే. ఆ సువార్త కొరకు ఒక్కసారే వారు పోరాడిరి. కాదండీ! దానితో నాకు ఎట్టి సంబంధము లేదు. అసలు కానే కాదు. దానిని చేసిన వాడు ఆయనే. అసలు ఏమీ కాని స్థలమునకు ప్రపంచములో ప్రసిద్ధియగు దానిగా మార్చబడినది. ఒక చిన్న పదిహేను వందల డాలర్ల నిర్మాణమది. అలాటిదే ఇక్కడ అమర్చబడినది. దీనికి నేల లేదు. కాని ఇది దేవుని యొక్క మహాశక్తి. ఆయనే కార్యములు చేయుచున్నాడు.
ఇప్పుడు ఆయన....
మనము యేసు రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము కలిగి యున్నాము.
ఒక నూతనమగు సజీవ మార్గము ద్వారా...
పురాతన మార్గము కాదు.. "ఒక నూతనమగు సజీవమగు మార్గము. అది ఒక మృతమార్గము. ధర్మశాస్త్ర క్రమము. కాని ఇప్పుడు మనము కృపద్వారా
ప్రవేశించియున్నాము. పరిశుద్దాత్మ ద్వారా, ఓ, దానిని మీరు చూడగలరని ఆశించుచున్నాను. మీరు చేయగలిగింది ఏదియూ లేదు. ధర్మశాస్త్రము పనిచేయు చున్నది. అంటుకొనవద్దు. ముట్టుకొనవద్దు. రుచి చూడవద్దు. మాంసము తినవద్దు. సబ్బాతును ఆచరించుడి. అమావాస్య అన్ని రకముల ఆరాధనలు. మనిషి చేసెను. కాని ఈ నూతనమగు, సజీవమగు మార్గములో అది మనము చేయగలిగింది. కాదు. దానిని ఆయన మనకొరకు చేసెను. కృపద్వారానే, దానిని కేవలము మనము అంగీకరించియున్నాము. క్రీస్తు పాపమును తీసికొనిపోయెను. దానిని మనము నమ్ముచున్నాము. సువార్తను వినండి. దానిని నమ్ముడి. దానిని అంగీకరించుము. మన హృదయాంతరంగములో నుండి అప్పుడు నిజముగా అంగీకరించుదము. మన హృదయము లోతులలో నుండి నిజంగా అంగీకరించినచో దానికి సాక్ష్యముగా పరిశుద్ధాత్మతను దేవుడు ఇచ్చును.
నీ పాపములు పోయినవి. నీవు లోకమునకు చనిపోయిన వ్యక్తివని పరిశు ద్ధాత్మ నీకు సాక్ష్యము ఇచ్చును. నీవు నూతన జీవిముతో తిరిగి లేచెదవు. నూతన జీవముతో నడిచెదవు. నూతన జీవితము జీవించెదవు. దేవుని యొక్క సన్నిధిలో శక్తితో జీవించెదవు. ప్రతి దాని వలన కొట్టుకొని పోక ఆత్మననుసరించి నడచెదవు. దేవుని యొక్క కుమారులుగాను, కుమార్తెలుగాను ఉందురు. రోమా 8:1. “ఇప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. వారు శరీర సంబంధముగా నడుచుకొనుట లేదు. కాని ఆత్మ సంబంధముగా నడుచుకొనుచున్నారు.
13. ఇప్పుడు ఇక్కడున్న చాలామంది జనులకు చెప్పుచున్నాను. సంఘముల నుండి సందర్శకులు వచ్చిరి. ఇతర సంఘములను దెబ్బతీసే వ్యక్తిని కాను. ఈ సంఘమును మెచ్చుకొనగోరుచున్నాను. ఈ సంఘములో నుండి శరీరత్వమును బయటకు తీసివేయ ప్రయుత్నించుచున్నాను. అదే ప్రధాన విషయము. నేను ఎంతో చేయవలసి యున్నాను. దానిని చేయుట కొరకు ఇక్కడ మన తలువులు శు భ్రము చేయవలెను. ఆ పని చేయుటకు ఇతర ఉదాహరణలను ఉపయోగించుదము. సోదరులారా, మీరెరుగుదురు. మీ సంఘము నుండి తుడుచుట మనందరికి అవసరము. అంతా ఊడ్చవలెను. అది మీకు అర్థమగును.
14. కావున విషయమేమనగా దేవుడు ఏ సంస్థను గాని ఏ జనుల గుంపును గాని గుర్తించడు. నీవు మెతడిస్టువైనచో నీవు మెతడిస్టువని ఆయన గుర్తించడు. నీవె పెంతెకొస్తు అయినచో నీవు పెంతెకోస్తు అయినందుకు ఆయన నిన్ను గుర్తించడు. ఆయన వ్యక్తిగతంగా నిన్ను గుర్తించును. (ఆమేన్) పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించి క్రీస్తుయేసునందు నూతన సృష్టివి కావలెను.
ఆయన సంస్థలను గుర్తించడు. గొప్ప కూడికలను ఆయన గుర్తించడు. దేవుడు గొప్ప గుంపులను గుర్తించడు. ఎందుకనగా అది పెద్ద కూడిక. ఆయన వచ్చును. ఎందుకనగా ఒకే ఆత్మ మరియే ఒకే మనస్సు కలిగిన హృదయాలు అవసరము, ఆయన రావలెనని ఆశించుచున్నారు. యేసువైపు చూడండి. దీనమనస్సు గల సంఘము. “... నా నామములో ఇద్దరు ముగ్గురు కూడియున్నచో....”
ఇప్పుడు నేను ఉదయం చెప్పాను. ఇపుడే దానిని మరల చెప్పుచున్నాను. ఇక్కడున్న తన చిన్న సంఘము, మనకు సంబంధించినంతవరకు కల్తీకలుపబడని దేవుని వాక్యముపై నిలబడుటకు ప్రయత్నించుచున్నాము. అది ఇక్కడ నుండియే రావలెను.
15. సంఘములు, వారు సంఘములను సంస్థలుగా మార్చినపుడు వారు చేయుచున్నదేమనగా దేవుని యొక్క దీవెనలను వారు అడ్డుపరచుచున్నారు. వారియొక్క వేదాంతముబట్టి దేవుడు ఆటంకములను తొలగించలేకపోవుచున్నాడు. ఆయన జనులను దీవించలేదు. వారు సంఘమును జీవములేనిదిగా చేయుచున్నారు. మెడ వంచనివారుగా ఉన్నారు. పిండివలె ఉన్నారు. పరిశుద్ధాత్మ సంఘములోనికి రాజాలదు. అది జరుగుటను అపవాది చూచియున్నది. ఏలాగయినా బ్రద్దలు చేసి లోనికి రాగోరుచున్నది. సువార్త కాని మార్గమును వారు తెరచుచున్నారు. వారు ఉ న్మాదము వైపు పరుగులెత్తుచున్నారు. అది నిజము చూడండి. వారు ఉన్మాదులుగా గాని లేక పిండివలె గాని మారిపోవుచున్నారు. కాని రహదారి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త ఉన్నది.
ఈ ఉదయమున నేను మాట్లాడుచుండగా కొద్ది నిమిషములలో నేను అడగాల్సిన నిశ్చయించుకొనిన గొప్ప ప్రశ్నకు ఆధారముగా దీనిని చెప్పుచున్నాను.
అదేమనగా మనుష్యులు ఒకరి ఆత్మను మరొకరు పొందుదురా? ప్రభువు ఆత్మను పొందుకొనుటకు బదులుగా నీవు మరొక వ్యక్తి ఆత్మను పొందుకొనకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనుము. ఒక సంఘములోనికి వెళ్లి సంఘకాపరి ఎలా ప్రవర్తించుచున్నాడో చూడుము, ప్రజలు అదే విధంగా ప్రవర్తించుటను మీరు చూస్తారు, చూశారా? ఒకవేళ సంఘకాపరి బిరుసుగా లోబడని స్వభావమును కలిగి యుంటే ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. మీరు దుష్టత్వము, మతమూఢత కలిగిన స్థలమునకు వెళ్ళండి, ప్రజలు కూడా అదే విధంగా ఉ ంటారు.
కావున సోదరులారా, ఒక మంచి బుద్ధిగల, జ్ఞానముగల సంఘకాపరి కొరకు మనము వందనములు చెల్లించుచున్నాము. సువార్తను ప్రకటించుము. అది సూక్ష్మము, సంపూర్ణము. ఉచితము. శక్తిగలది - అవునండి.
ఈ ఉదయము నేను మాట్లాడుచుండగా ఈ గొప్ప ప్రశ్న కొరకు ఇపుడిది మద్దతు పలుకుచున్నాను. కొద్ది నిమిషములలో నేను సరిచేయగోరుచున్నాను.
16. నేను ఒక బైబిలు క్రైస్తవునిగా ఉండగోరుచున్నాను. బైబిలు ఏమి చెప్పుచున్నదో దానిని నేను నమ్మగోరుచున్నాను ఈలోకములో నేను దేనికయినా ప్రాతినిధ్యము వహించగోరుచున్నయెడల మానవత్వమునకు నేను ప్రతినిధిగా ఉండను. ఆ యేసుక్రీస్తును మరియు ఆయన జీవమును ప్రాతినిధ్యముగా చూపగోరుచున్నాను. ఎవరు అంగీకరించినా లేకపోయినా, వారితో నాకు పనిలేదు. నేను బైబిలును నమ్మగోరుచున్నాను. ఇది దేవుని వాక్యము. ఇది దేవుని రక్షణ సంకల్పమని నేను నిజంగా నమ్ముచున్నాను. ఎన్నటికిని నిలిచి యుండు ఒకే బండ దేవుని యొక్క వాక్యము. యుగముల తరబడి నిలచి చూచును. అది దేవుని వాక్యము. యేసు చెప్పెను "భూమ్యాకాశములు గతించును గాని నా మాటలేమాత్రమును గతించవు. కావున ఇది సత్యమని నేను నమ్ముచున్నాను.
దేవుడు... నా చిన్న సంఘము ఎదుట దీనముగా దీనిని చెప్పుచున్నాను (పెద్ద కూటములలో నేను దీనిని చెప్పజాలను. ఎందుకనగా వారది ఎత్తి పట్టుకొందురు. కాని ఒక దీర్ఘ దర్శిగా దేవుడు దర్శనములు చూపించును...
ఒక పది నిమిషాల క్రింత ఎక్కడో త్రాగిపడి మార్పు పొందిన అధమునికంటే నేను గొప్పవానిని కాను. ఇది నిజం. నా వలెనే అతడు క్రైస్తవుడే ఒకే పరలోకమునకు వెళ్ళెదము. అవే ఆశీర్వచనములు అనుభవించెదము. నేను వాటినే అనుభవించెదను. అందరూ అంతే దేవుని రాజ్యములో పెద్దవారు. గొప్పవారు అనునది లేదు. మనందరమూ ఒక్కటే. ఇది నిజము అందరమూ సోదర సోదరీలము. ఒకే రకముగు వ్యక్తులము, మీరు పసుపయినా, నలుపయినా, మనం ఏమయినా, యేసుక్రీస్తునందు మనము ఒక్కరిగా ఉన్నాము. డి.డి. లేదు. ఎల్.ఎస్. లేదు. చిన్నవాడని కాదు. పెద్దలు ద్వారపాలకులు ఎవరయినా భేదము లేదు. అందరూ యేసు క్రీస్తునందు ఒక్కడిగా యున్నారు. ఒకరిపై ఒకరు ఎక్కువేమీ కాదు. అందువలన యేసుక్రీస్తునందు. మనము సోదర సోదరీలుగా ఉన్నాము.
17. పరలోక స్థలములందు మనము కూర్చొను సమయము వచ్చినప్పుడు ఏకాత్మ ఏక హృదయము కలిగి కూర్చొండము. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి, మనలను దీవించును. మనకు ప్రశస్తమగు దేవుని వాక్యము అందించును. అంతట ఇందులో చాలాసార్లు దర్శనములు, ఇతర సంగతులు చూతుము.
ఎవరైనా నాతో ఏదైనా చెప్పినట్లయితే, లేక నేను దర్శనమును చూశాను లేక ఏదైనా ముందుగా చెప్పినట్లయితే, నేను ముందుగా చేయునది ఏమనగా, అతని దర్శనమును గూర్చి నేను ఏదైనా చెప్పుటకు ముందుగా, నేను ఆ దర్శనమును వాక్యముతో పరీక్షించుదును.
ఒకవేళ వాక్య ప్రకారము లేనట్లయితే... నేను చెప్తాను... నేను చెప్పాను... ఇప్పటి వరకు నేను చెప్పినవి ఎల్లప్పుడూ వాక్య ప్రకారమే యున్నవి అందుకు దేవునికి కృతజ్ఞతలు, కాని ఎప్పుడైనా అదే దేవుని వాక్యమునకు వ్యతిరేఖముగా ఉన్నట్లయితే, “దానిని వినవద్దు ఏలయనగా అది అబద్ధము" అని నేను చెప్తాను. ఇక్కడ దేవుని వాక్యము మాత్రమే సత్యము.
18. ఎప్పుడయితే దేవునికి మనం పుటము వేసినట్లు కనబడుదుమో ఎటువంటి మలినము లేకుండా ఎట్టి అరమరిక లేకుందుమో హృదయమును తెరచి యుందుమో నేర్చుకొనుటకు ఇష్టపడుదుమో, దేవుడు బోధింప సమర్థుడు
- మనము నేర్చుకొనుటకు ఇష్టపడవలెను. మొదట మనము ఆచారములను ప్రక్కన పెట్టవలెను. మనము నేర్పించబడిన అభిప్రాయములను దూరంగా పెట్టవలెను. మీ తల్లి మంచి విషయములను నేర్చినదని నాకు తెలియును. కాని కొన్నిసార్లు తల్లి కూడా పొరపాటు చేసి యుండవచ్చును.
ఇక్కడ ఈ వైపున ఒక తల్లి నాకున్నది - కొద్ది నిమిషములలో ఆ అంశము
దగ్గరకు వచ్చెదను. సంవత్సరాల క్రితం ఆ తల్లి నాకు చెప్పినదేమనగా క్షమించబడని పాపము అనగా గర్భమును తీసివేయుట. అనగా పుట్టని శిశువు యొక్క ప్రాణమును తీసివేయుట. దానికి క్షమాపణ ఎట్లు దొరుకును? అదెట్లు ఆమెకు క్షమించబడును? అమ్మ తన జ్ఞానము విషయములో గొప్పదే. అది నిజము. చూడండి. కాని అది దేవుని వాక్య ప్రకారము సరికాదు. కావున తేడా వచ్చియున్నది.
కావున ఒకరు చెప్పారు. నేను కాతలిక్కుగా జన్మించాను. నా తల్లి ఒక కాతలిక్కు నన్ను కాతలిక్కుగా ఆమె పెంచినది, నేను కాతలిక్కుగానే యుందును.
సరే. నేను ఒక బాప్టిస్టుగా పెంచబడ్డాను. కాని బాప్టిస్టుగా లేను. బాప్టిస్టు సిద్ధాంతము చెప్పిన దానికి విరోధమయిన దానిని దేవుని వాక్యము చెప్పుటకు నేను చూచినపుడు నేను దేవుని వాక్యమును విశ్వసించాను. ప్రతి మనుష్యుని యొక్క మాట అబద్ధము. కావున మనుష్యులతో నేను పడిపోను. “నేనన్నాను” సోదరుడా, ఇది నేను నమ్మినది నేను ఇంకా మీ సోదరుడినే, కాని ఇది దేవుని వాక్యమని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు! నీవు స్థిరపడిన పిదప, పునాది రీత్యా, నిజమే. అపుడు నీవు లోనికి ప్రవేశించుటకు ధైర్యము కలిగి యుందువు.
19. ఇప్పుడు నేను జనులను ఎరిగి యున్నాను. మీరందరు అంగీకరించ వలసియున్నారు. హోలీనెస్ గుంపులలో మనము జనులను కలిగియున్నాము. పెంతెకొస్తు గుంపులలో మనము జనులను కలిగి యున్నాము. నజరీన్ గుంపులలో జనులను కలిగియున్నాము. పిలిగ్రిం హోలీనెస్, మెతడిస్టు, బాప్టిస్టు గుంపులలో మనము జనులను కలిగి యున్నాము. క్రైస్తవులు కానివారు కూడా క్రైస్తవులుగా నటించుచున్నారు. వారు తమ హృదయాంతరంగములలో వారది ఎరుగుదురు.
ఏ స్త్రీ అయినా, పురుషుడయినా, ఏ గుంపులో ఉన్న వారయినా ముఖాముఖిగా యేసుక్రీస్తును ఎప్పుడయినా కలుసుకొని నిజంగా తమ పాపముల నిమిత్తము పశ్చాత్తాప పడినచో పూర్ణ హృదయముతో ఒప్పుకొని, "ప్రభువా, నేను నిజంగా నమ్ముచున్నాను" అని చెప్పినచో ఆ సమయములోనే పరిశుద్ధాత్మ బాప్తీస్మము ఇచ్చును.
20. ఇపుడు నీవు విశ్వాసివి. కాని దేవుడు నీ విశ్వాసమును గుర్తించడు. దానిని ఆయన రుజువు చేయును. ఆమేన్. ఓ సోదరుడా, ఒక సంగతిని నీకు చెప్పవలెను. నీ విశ్వాసము... నీ స్వంత ఆలోచనలలో అది గుర్తింపబడవచ్చును. కాని దేవుని ఆలోచనలోనికి వచ్చినప్పుడు దేవుడు ఆ విశ్వాసమును పరిశుద్ధాత్మ బాప్తీస్మము ద్వారా ముద్రవేయును.
"అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను" ఆయన దానిని అంగీకరించినట్లుగా సున్నతిని ఒక ముద్రగా ఇచ్చెను. హల్లెలూయా!
ఈనాడు దేవుని యొక్క సజీవ ముద్ర ఏమనగా (లేఖనములను పరిశోధించుడి) మానవ హృదయము మీద పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమే. ఆమేన్. ఎఫెసీ. 4:30. “దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మీ విమోచనా దినము వరకు పరిశుద్ధాత్మ బాప్తీస్మమును మీ శరీరములమీద ముద్రించియున్నాడు. దేవునియొక్క ముద్ర. నిన్ను విశ్వాసిగా దేవుడు గుర్తించి యున్నాడు.
21. ఒక సిద్ధాంతమును నమ్ముట నీవు మోసపుచ్చబడనిచో, ఒక అనుభూతి, అలాటి మరొకటి... అంతా మంచిదే... దానికి నేను వ్యతిరేకిని కాను. దేవుడు ఏ విధంగా ఇచ్చినచో ఆ విధంగానే ఇచ్చును. అది ఆయన పని, నీ పని. ఒక మనిషి దేవుని ఆత్మ మూలముగా ఎన్నడయినా జన్మించినచో అతడు ధైర్యముగాను, దీనునిగాను ఉండుట నీవు కనుగొందువు. కృప సింహాసనము నొద్దకు నడిచి వచ్చెదవు. జీవవృక్షఫలమును తిను హక్కును కలిగియుందువు. ఆయనతో అనుభవము కలిగిన వ్యక్తికి ఏదో జరిగినది. అలాంటి అనుభవమును అతడు ప్రపంచములో ఇంకెక్కడా పొందుకొనలేడు.
దేవుని ఆత్మ వలన జన్మించిన ప్రతి స్త్రీ, పురుషుడు ఆయనలో తాము ఒక అనుభవమును కలిగియున్నారు. అది సంభవించినప్పుడు, అది ఎలా జరిగినది,
అది వారిమీద ఎలాటి ప్రభావమును చూపినది వారు నేరుగా ఎరుగుదురు. దేవున ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి స్త్రీ, పురుషునికి ఏదో జరిగినది, ఏదో మార్పు, జరిగినది అది ఏమిటి? అది మార్పు.
22. ఈ ఉదయం మనము చెప్పుకొనిన రీతిగానే, నీ పాత వస్త్రము అక్కడున్నది. చాలా మురికిగా యున్నది. సిరాతో నిండియున్నది. ఎవరూ తీసివేయజాలరు. దానిని చెరిపివేయు బానలో నింపియున్నారు. లేదా టబ్లో నింపితివి. దానిని వీలయినంత తెల్ల దనముతో వెనక్కి తేవలెను. పాపమును ఒప్పుకొను విశ్వాసికి యేసుక్రీస్తు అలాగే చేయును.
అక్కడ ఒక ఊట రక్తముతో నిండియున్నది. ఇమ్మానుయేలు యొక్క నరములలో నుండి ప్రవహించినది పాపులు ఆ ఊట క్రింద మునిగినచో వారి దోషపు మచ్చనంతయూ పోగొట్టుకొందురు.
అపుడు దేవుడు తెరను విదిలించును. దేవుని యొక్క పరిశుద్ధ గాలుల ద్వారా అది ఎండి యుండుటను ఆయన చూచును. ఈ గాలులు పరలోకము నుండి వీచిన బలమైన గాలుల వలె వచ్చుచున్నవి. ఆయన పరిశుద్ధాత్మను తీసికొని విమోచనా దినము వరకు దానిని భద్రపరచును.
అపవాది ఆ ముద్రను చూచును. దాని యొద్దకు రాజాలడు. దానిని చూచి వెకిలిగా నవ్వును. దానివైపు వ్యంగ్యముగా చూచును. దానిని అందుకొనలేడు. ఇది నిజం దానిని అందుకోలేడు. ఎందుకనగా వానిని దేవుని ముద్ర నిషేదించును (హల్లెలూయా) దానిని అంటుకోజాలడు. అది దేవుని స్వంత ఆస్తి (హల్లెలూయా) అవును అదియే మనుష్యులను ధైర్యముగా నడిపించకలిగినది. వారు వెనుకకు జారిపోవుట గూర్చి భయపడలేదు. అపవాది ఏది చెప్పినా వారేమి భయపడలేదు.
23. దాని గూర్చి ఒక సంగతి ఉన్నది. నీవు నీ కారణములను ఎంచి చూచుకోవచ్చును. నీవు నీ కారణమునకు నిన్ను నీవే ఆపాదించుకోవచ్చును. దాని గూర్చి కారణమును వెదకుటను ప్రయత్నించవద్దు. నీవనవచ్చు. "ఇపుడు నన్ను
చూడనీ" దీనిని నేనే చేయవచ్చును" దానికి కారణం చూడవద్దు. దానిని నమ్మ దేవుడు హేతువును బట్టి రాడు, ఇదంతా నిష్కారణము ఏ మనిషి దేవునిని బయటపెట్టలేదు, నీవెన్నడూ చేయలేదు. వారెన్నడూ చేయలేరు. నీవు దేవునిని కారణము ద్వారా తెలిసికొనలేవు.
నీవు దేవునిని బిడ్డవంటి విశ్వాసము గల సామాన్య విశ్వాసములో తెలిసికొనగలవు. అది సత్యము దానినినమ్ము, ఆయన బాక్యమును అంగీకరించుము. అ విధంగానే నీవు దేవునిని తెలిసికోగలవు. విశ్వాసము ద్వారానే 'హేతువు ద్వారాకాదు. నీ హేతు పూర్వక శక్తి నీలోనే యున్నది. కాని విశ్వాసము దేవుని నుండి వచ్చును. విశ్వాసమనగా అది నీలో జన్మించినది. అది నీకు దేవుడు ఇచ్చినది. "అది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము" "హేతువాదము కాని దాని యొక్క నిజస్వరూపము, "హల్లెలూయా”
అక్కడ నుండి వచ్చునది అదియే. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కల్తీ లేని శక్తి, ఒక నూతన సృష్టిని, ఒక నూతన వ్యక్తిని తయారుచేయును. పరిశుద్ధాత్మలో క్రొత్తగా ఒక సృష్టిని తయారు చేయును. అపుడుతడు నిలబడును. ఎక్కడున్నదీ ఎరుగును. నరకములోనున్న పిశాచములన్నియూ దాని నుండి అతనిని కదపజాలవు. ఒక మర తుపాకీ నీవు వాని మీద గురి పెట్టుము.
24. ఇప్పటికే ఆ ప్రయత్నము జరిగినది. కొద్దివారాల క్రితం శ్మశాన భూమిలో నడుస్తూ యున్నాను. పాత ఎముకలో మరియు పుర్రెలు (అక్కడ విడిచిపెట్టబడినవి) పరిశుద్ధులు మరియు హతసాక్షులు చనిపోయిరి. ఆ బహిరంగ స్థలములో నిలబడియున్నాను. సింహములకు వారిని పారవేసిరి. వారు రెప్ప కదల్చకుండా మరణములోనికి పోయిరి. ఇది ఎరుగుదురు. "వారాయనను ఎరుగుదురు. పునరుద్దాన శక్తి ఎరుగుదురు". ఒక రోజున నేల బ్రద్దలై కదులుదురు. వారు సజీవమగు దేవుని యొక్క రక్తము చేత కడుగబడిన పరిశుద్ధులు. ఓ సోదరుడా దేవునిని సంధించిన మనుష్యుడు ఇక ఎన్నడూ అదే రీతిగా ఉండలేదు. నిజము
ఆ పాతకాలపు సేన ముసలివాడు యేసుక్రీస్తును కలిసికొనుటకు అక్కడికి వచ్చెను. అతని మనస్సు చెడిపోయెను. దయ్యములు ఒక సేనగా అతనిని స్వాధీన
పరచుకొనినవి. ఒక్కసారి క్రీస్తు సన్నిధానములోనినికి వచ్చెను. అతనికి ఏయే మంచిపనులు దేవుడు చేసెనో తన ఇంటికి వెళ్లి చెప్పెను.
మతం నిన్ను పిచ్చివానిగా చేసిందని వారందురు. కానేకాడు. యేసు క్రీస్తును నీవు కలుసుకొను వరకు నీవు సరైన మనస్సులో ఉండజాలవు. ఆయన మాత్రమే జీవమునకు ప్రదాత. నీకు సరైన మనస్సును ఇవ్వ కలిగిన వాడు ఆయనే. యేసుక్రీస్తు రక్తము ద్వారా (ఆమేన్) అతి పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా మనము ప్రవేశించగలము. ఒక క్రొత్తదగు సజీవ మార్గము. ఆయన మన కొరకు దానిని ఇచ్చెను. తెరిచినిగెను. చెప్పాలంటే ఆయన శరీరము చినిగెను.
25. శరీరము ఏమి చేయను? శరీరము రక్తమును మాత్రమే బహిర్గత పరచును. రక్తమే ప్రాణము. నా శరీరములో ప్రాణమును ఉంచుటకు అది మాత్రమే మార్గము. చర్మము మరియు మాంసము, కణజాలములు, అమరికలు మొదలగునవి. రక్తమును వానివాని స్థలములో ఉంచును. నేను నివసించుచున్న గుడారములో జీవమును ఇచ్చును. అది నిజమే కదా!
మానవునిలో నుండి దేవుని ముసుగును ఏర్పరచినది అదే. రక్తము, కణజాలము, దేవుని కుమారుడగు యేసుక్రీస్తు శరీరము అయ్యెను. కల్తీలేని ఆయన జననము తండ్రియగు దేవుడు కన్య మరియను కమ్ముకొనెను. ఆయన తన యొక్క రక్తకణమును ఆమెలో సృజించెను. అది సృష్టి ఆయన చర్మము మానవుని నుండి వేరుచేయబడినది.
కాని ఒక రోజున మానవుని పాపము ఒక ఖడ్గములో ఆయన హృదయమును తెరచెను. ఆయన రక్తము భూమిమీద ప్రవహించినది. లోకము యొక్క పాపము కొరకు అది ఉచితముగా ఇయ్యబడినది. ఈనాడు అది బయలు పరచబడినది. ఆలాగు రక్తము బయటకు వచ్చుచుండగా ఆత్మయు వచ్చెను. నీటి ద్వారా కడుగుట వలన రక్తము మరియు ఆత్మ ద్వారా తుడువబడుటవలనను మనము దేవుని రాజ్యములో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా జన్మించియున్నాము.
దేవుడు ఆ మృత శరీరమును తీసికొనెను. ఆ శరీరము సమాధిలో పడియుండెను. మన నీతీ కరణము కొరకు దానిని తిరిగిలేపెను. ఈ రాత్రి ఆయన తన ఉన్నతమగు కుడి హస్తము నొద్ద కూర్చొని యున్నాడు. విజ్ఞాపన చేయుచున్నాడు.
మనము ఎటువంటి మనుష్యులముగా ఉండవలసియున్నాము. వీరికి తనముతో, క్రింది చూపు చూడవలెనా? నీపైనున్నవానికి రక్షించబడినావా లేదా తిరిగి జన్మించావా అని చెప్పవలెనా? అందుకు భయపడుచున్నావా? త్రాగుబోతువానికి సాక్ష్యమిచ్చుటకు భయపడుచున్నావా? "మనము ధైర్యము కలిగియున్నాము." హల్లెలూయా! యేసుక్రీస్తు రక్తము వలన అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించు ధైర్యమున్నది.
26. ఓ వారు నిన్ను పరిశుద్ధ బండ అని వ్యంగ్యముగా పిలువ వచ్చును. నిన్ను ఏమో రకమగు పేర్లతో పిలువవచ్చును. దాని వలన ఏమి తేడా కలుగును? వారు ఆయనను "బయల్లైబూబు" అని పిలచిరి, చూడండి నిన్నువారేయని పిలిచినా? ఏమి తేడా కనబడును? దేవుడు నిన్ను ఏమని పిలిచునో అదియే ముఖ్యము లోకము నిన్ను పరిశుద్ధ బండ అనియు. తెలివి లేనివాడనియు అని పిలుచును. ఉన్మాది అందురు. సంఘము ఇట్లన్నది. "అతడు తప్పు త్రోవలో పోవుచున్నాడు". అతనికి మతిపోయింది అనవచ్చును.
కాని దేవుడు ఇట్లనెను, "ఇతడు నా కుమారుడు. మనుష్యుల యొక్క పొగడ్త అంతటి కన్నను అదే నాకు కావలెను. జనులు నా వెనుక వీపు నిమురుట నాకు వద్దు. క్రీస్తు నన్ను చేతిలో పట్టుకొనుట నాకు ఇష్టము. ఆమేన్... అది నీ సాక్ష్యమా?
27. ఆ చిన్న దావీదు నాకు గుర్తుకు వచ్చుచున్నాడు. ఒకసారి మందనము ఫిలిష్తీయుల యొద్ద ఉండిపోయెను. ఇశ్రాయేలీయులో నుండి ఉజ్జీవము పోయినది ఒక రోజున దావీదు నిలబడియున్నాడు. కొండవైపు చూచెను. మందసము వచ్చుట కనబడెను. అతడు పరిశుద్ధ బండయే అయి ఉండును. నాట్యమాడుచుండెను. పరుగు పెట్టుచుండెను. బలమంతటిలో ఎగురుచుండెను. "ఏమిటీ? మీకు ఇష్టము లేదా? హూ! దీనిని గమనించండి. మందసము వైపు నాట్యమాడుచూ పరుగులిడు చుండెను. శాయశక్తులా మందసము వైపు కదలుచుండెను.
అతని భార్య తనమీదకు తాను అవమానము తెచ్చుకొనెను. ఆమె గొడ్రాలుగా చేయబడినది. ఆమె ఎన్నడూ బిడ్డలను కనలేదు. ఇశ్రాయేలులో ఆమె పేరు ఎండిపోయినది.
కాని ఇక్కడ ఇది జరిగినది. దేవుడు పరలోకములో నుండి క్రిందకు చూచి, "దావీదు, నీవు నా హృదయానుసారుడవు" అని చెప్పెను.
28. అవునండీ!
ఈ భూమి మీద ఉన్న స్త్రీలు, పురుషులు లేదా మరెవరికి ఉన్న పేరు కంటెను నేను దానిని ప్రేమించెదను. నేను దేవుని ఎదుట ఇష్టమును కలిగియుందును. దేవుడిట్లు పలుకును. "నేను ఒక దాసుని కలిగియున్నాను. నా వ్రేలును ఉంచగలను. అతడు నన్ను నమ్మును. విశ్వసించును “అది సరియైనది"
సగం మధ్యలో నీవు దానిని చేయజాలవు. చేయబడిన మనసుతో దానిని నీవు చేయజాలవు. దానిని నీవు కల్తీలేని విశ్వాసములో యేసుక్రీస్తు యొక్క రక్తముతో దానిని నీవు స్వచ్ఛముగా చేయవలసియున్నావు. అక్కడికి నీవు ప్రవేశించియున్నావు. హస్తము ద్వారా తాకబడియున్నట్లు నీవు ఎరుగుదువు. నీవాయన దాసుడవు. అయితే నీవు దేనికి భయపడనవసరంలేదు. మనము నూతనమయిన, సజీవమైన మార్గములోనికి వచ్చియున్నాము. ఆయన రక్తము ద్వారా, దానిని తీసివేసిన తెరగుండా వచ్చియున్నాము" ఇంకొద్దిముందుకు వెళ్ళుదము కలిగియుండి...
దేవునికి ఇంటిమీద ఒక ప్రధాన యాజకుని కలిగియున్నాము. (ఆయన క్రీస్తు ( ఇక్కడ వినండి)...
ఒక నిజమగు హృదయముతో దగ్గరకు వచ్చుదము. మనస్సాక్షితో విశ్వాసము... మన మన స్యాక్షి ప్రోక్షించబడినది... చెడుతనము మన శరీరములు శుద్ధజలముతో కడుగబడినవి.
29. ఈ ఉదయమున దానిగుండా మనము వెళ్లియున్నాము. ఇపుడు నీరు... ప్రోక్షించబడినది. అర్ధము ఏమనగా “విదిలించడినది. పాపపు సమస్య, దుష్టత్వము మరియు చీకటితో నిండిన మనస్సాక్షి నుండి అది విదిలించి వేసినది. మన శరీరములు శుద్ధ జలముతో కడుగబడినవి. యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము ద్వారా కడుగబడినది.
దేవుని యొద్దకు స్వేచ్ఛగా, ధైర్యముగా వెళ్ళదము, దీనిని ఎరుగుదుము. ఒకపుడు నేను ప్రేమించిన దుష్టత్వము గతించిపోయినది. ఒకపుడు నేను జీవించిన జీవితము రద్దయినది. నేనేదో చేసినందు వలన కాదు గాని ఏదో నాలోనికి వచ్చినది. దానిని చేసినది. కృప ద్వారా ఆయన నన్ను రక్షించెను. ఆయనను నేను నమ్మితిని, ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చెను. ఒకప్పుడు నేను అసహ్యించుకొనినవి ఇవుడు ప్రేమించుచున్నాను. అదే త్యాగము, చర్చికి వెళ్లుట నాకు కష్టముగా ఉండెడిది. ఇపుడు ప్రేమించుచూ వెళ్ళుచున్నాను, ఏదో నన్ను మార్చినది. ఇప్పుడు నాకు ఒక నూతనమగు సజీవమగు మార్గము ఏర్పడినది. ఇక్కడికి ఏదో ఒకటి నన్ను నడిపించినది. నీటిలోనికి ఎప్పుడు వెళ్లానో నేనెరుగుదును, వారు నాకు ప్రభువైన యేసుక్రీస్తు నామములోనికి బాప్తీస్మము ఇచ్చిరి,
ఆయనిట్లు చెప్పెను “మారుమనస్సు పొంది పాపక్షమాపణ కొరక ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి, అపుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందెదరు"
30. నేను వాదించాను, నన్ను తృణీకరించారు, మీదికి వచ్చారు. ఎగతాళి చేశారు. ఏ మాత్రము తేడా లేదు. "దేవుడు ఆలాగు చెప్పెను. దానిని నమ్ముచున్నాను. అది ఖచ్చితము. అక్కడే నిలబడియున్నాను. క్రిందికి వెళ్ళుచునేయున్నాను. చేతులూపుచున్నాను.
“నీవు యేసుమాత్రమే" అను వ్యక్తివి అన్నారు. నీవు ఏకత్వము వ్యక్తివి. నీవు ఇది అన్నారు.
వారేమి అన్ననూ నేను లెక్క చేయను. దేవుని వాక్యము సత్యమని నేను నమ్ముచున్నాను. అదెంత పేరు ప్రఖ్యాతులున్నా నాకు తెలియదు. ఇక్కడ నీవు ఎంత గొప్ప వానివైనా భేదము కలుగచేయదు. అక్కడ నీవు ఎంత పేరు సంపాదించావనునది ముఖ్యము.
ఒక గొప్ప వ్యక్తి ఒకరు ఈ మధ్య దానిని బోధించమని అడిగాడు. అతడనెను "అది సత్యము. కాని దానిని నేను చెప్పినచో నా సంఘము బయటకు వెళ్లిపోయెదరు.
నేనన్నాను, "నేను సత్యమును నాలుగు గోడలకే బోధించెదను” దేవుడు అబ్రహామునకు ఈ రాళ్ళద్వారా పిల్లలను పుట్టించగల సమర్ధుడు "సువార్తతో రాజీ పడుటకంటె అది ముఖ్యము". అవునండీ..
ఒక దినమున ఈ గ్రంథము నన్ను విమర్శించును. అది నిజము ఆ తీర్పు దినమున దేవుని యొక్క మాటలు నాకు న్యాయము చేయును. సత్యము ఎంత బాధపెట్టినా, ఏమీ బాధపెట్టినా నేను తప్పక బోధించవలెను.
31. ఇప్పుడిది వినండి... ఇపుడు మనము ముందుకు పోవుచున్నాము.
తొట్రుపాటు లేకుండా... మన విశ్వాసపు వృత్తిని గట్టిగా పట్టుకొందము. వాగ్ధానము చేసినవాడు నమ్మదగినవాడు.
ఒకరినొకరు పరిగణనలోనికి తీసికొనుటలో ఒకరిని ఒకరము ప్రేమ మరియు మంచి క్రియలకును ప్రేరేపించుకొనుటకు ముందుందము.
32. ప్రేరేపించుకొనుట అనగా "ప్రోత్సహించుకొనుట అని అర్ధము. ప్రేమ మరియు మంచి క్రియలు చేయుటకు ప్రోత్సహించుకొనుడి”. సంఘములో ఒక సోదరుడు మరియొక సోదరుడికి విరోధముగా ఏదయినా మాట్లాడినచో వానిని ఇంకా ఎగ ద్రోయుటకు మరేమి చెప్పవద్దు. కాని వారిని ఏకముగా చేయు విషయమును చెప్పుము. "ప్రేమ కలిగియుండుటకును, మంచి క్రియలు చేయటకును ఒకని నొకడు ప్రోత్సహించుకొనుడి”. ఆలాగు మనము తప్పక చేయవలెను. అదేమిటి? అది తిరిగి జన్మించినవాని స్వభావము.
సోదరుడా, నీవు గాని రాత్రి నీ సోదరుడు పడిపోవుట నీవు చూచినపుడు ఆ విధముగా తలంచవద్దు. ఒకరి మధ్య ఒకరు కఠినముగా మాట్లాడుకోవద్దు. వారిని ఏకము చేయుట నీవు కుదరనిచో నీవు బలపీఠము నొద్దకు వెళ్లవలసిన సమయము అదే. అది సరి. నీ జీవితములో ఏదో జరిగియున్నది. నిన్ను ఏదో మోసపుచ్చిరి. నీవు ఏ అనుభవము కలిగి యుండవలెనని దేవుడు కోరుకొన్నుచున్నాడో ఇంకా నీవు కలిగిలేవు.
యేసును చెడ్డగా మాట్లాడినపుడు తిరిగి ఆయన ఎదురు చెప్పలేదు. ఆయనను చెడ్డగా అన్నపుడు తిరిగిమరల చెడ్డగా మాట్లాడలేదు. వారాయనకు చెడు చేయగా ఆయన వారివైసే తిరిగ మేలు చేసెను. వారాయనను హింసించిరి. సిలువకు మేకులతో కొట్టిరి. ఆయన క్రిందికి చూచి ఇట్లనెను. " తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”.
ఆ రకమగు ఆత్మనీలో లేనిచో ఇంకా నీలో పరిశుద్ధాత్మ ప్రవేశించలేదు. క్రీస్తు యేసునందు ఆ రకమగు ఆత్మయే ఉండెను. "క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగియుండుడి.”
33. బ్రెన్హామ్ ఆలయమా ఇక్కడ మీరు గుంపుగా యున్నారు. మనము ఒక సంస్థను కలిగిలేము. గుర్తింపు కార్డులు లేవు. ఇక్కడ మనము కలిగియున్నది ఒకే ఒకటి అదే మనగా సహవాసము. ఈ రాత్రి యేసుక్రీస్తుతో సహవాసము చేయుచున్నవారు. ప్రతి రాత్రి మరియు ప్రతిసారి సహవసించుచున్నవారు ఇక్కడికి మీరు వచ్చుట ఎల్లప్పుడూ మాకు సంతోషమే. మీరిక్కడ ఉండవలెనని మా కోరిక మాలో మీరు చేరుట కాదు. మీరు మాతో చేయవలసిన ఒకే పని ఏమనగా మాతో కలిసి ఆరాధించుట మీ హృదయములో మీరు ప్రతి ఒక్కరు దేవుని యొక్క నిజమర్మమును పట్టుకొని యుండవలెనని మేము ఆశించుచున్నాము. తొట్రిల్లవద్దు. ఆరాధనకు రండి బలిపీఠము నొద్దకు రండి. ఒకరి నొకరు ప్రేమిచుడు. ఒకరితో ఒకరు సఖ్యత కలిగియుండుడి!
ఒక సోదరుడు మార్గము నుండి తొలగిపోవుట నీవు చూచినచో అతని యొద్దకు వెళ్లి సాధ్యమయితే అతనితో సమాధానపడుము అది సరి స్నేహితులారా, మీరు ఎప్పుడయినా.. ఏమి చేయుచున్నారు?... ఆలాగున మీరు చేయనిచో నిన్ను నీవు దుఃఖకరమగు జీవిగా మార్చుకొనుచున్నావు క్రైస్తవుడువు కావు (అది సరి) నీవు చేయ ప్రతిదియు నిష్ప్రయోజనము.
యేసు చెప్పలేదా మీరు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు. హిత బోధను బోధించక మానవుల ఆజ్ఞలను బోధించుచున్నారు.
నీవనవచ్చు, నేను సంఘములో చేరాను. పుస్తకములో నాపేరు వ్రాసాను. ఈ పని చేశాను. వాటివలన ఒక్క ప్రయోజనము కూడా లేదు
"ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని పరలోక రాజ్యములో ప్రవేశించలేడు”.
34. గమనించు చివరి వచనము దగ్గరకు వచ్చుచున్నాను. ముగించెదను. లేక నా ప్రధాన అంశము యొద్దకు వచ్చెదను. మిమ్మును మరి ఎక్కువసేపు ఉంచను.
సమాజముగా కూడుటమానక... ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా కూడుకొనుడి.
జనులు సంఘమునకు వెళ్లుట మానుచున్నారు. ఇపుడు ఆలయములను ఖాళీ చేయవలసివచ్చినది. యుద్ధము ముగిసినది. అందరూ బాగా నిండియున్నారు. వస్త్రమార్పిడి చేసికొనిరి. మంచి ఉద్యోగాలు పొందిరి. బాగుగా పాతుకుపోయిరి.
నీవు అంగడికి వెళ్లినప్పుడు నీతో మాట్లాడు సమయం కూడా వారికి లేదు. నా పొయ్యిని అమర్చుటకు ఈ మధ్య ఒకరోజు పిలిచాను. దానిని మేము చేయాలా? అని అడిగారు.
మరెవరయినా చేయండి గాని అమరిక మామూలే" అన్నాను. చూడండి. వ్యాపారములో పోగొట్టుకొనిన జనులు "అవును, చింతలేదు ఈ మధ్యనే, గత కొద్ది సంవత్సరాల క్రితం తమకున్న ప్రతి వ్యాపారమునువారు మూసివేసిరి కాని వారికి సరిపడడబ్బున్నది. వారికి లెక్కలేదు పోనీయండి.
కాని ఒక సంగతిని మీతో చెప్పనీయండి. కాని అది నీలోపల తూట్లు పొడవ వచ్చును. అందుకు ఆయనిట్లనెను,”
ఈ లోకము యొక్క వ్యర్ధ సంపదను ఆశించవద్దు
అది చాలా త్వరగా గతించును;
పరలోక నిధులను సంపాదించుటకు వెదకుము
అవి ఎన్నడును గతించవు
35. నేను గడ్డుకాలము గుండా పయనించాను. అభివృద్ధి గుండా పయనించాను. వాటిని కలిసిచూశాను. కాని యేసుక్రీస్తు యొక్క హస్తమును నేను విడువలేదు. ఈ భూమిమీద నీవు సంపదను, ఐశ్వర్యమును నీవు ఎంతైనా కూడబెట్టవచ్చును. కాని నేను దివాలా తీసినపుడు ఆయనే నా స్నేహితుడు. నాకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఆయనే నా స్నేహితుడు. నేను ఆకలిగా ఉన్నపుడు ఆయననే నేను ప్రేమింతును నేను నిండియున్నపుడు ఆయనను ప్రేమింతును దుఃఖములో ఆయనను నేను ప్రేమించెదను. నేను సంతోషముగా ఉన్నపుడు ఆయనను ప్రేమించుదును. ఆయనను నేను ప్రేమించెదను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను. ఆమేన్. హల్లెలూయా!
నేను వ్యాధితో ఉండినపుడు పరుండయుండి చనిపోవుచున్నపుడు ఆయనే నాకు స్నేహితుడు. ఆయన ఇప్పటికిని నా స్నేహితుడే. ఆయన ఇప్పటికిని నా స్నేహితుడే. నేను అక్కడెక్కడో మరణ స్థితిలో ఉన్నాను. నా చేతులలో నుండి గడ్డకట్టిన నరములు బయటకు వచ్చినవి. అపుడు కూడా ఆయనే నా స్నేహితుడు, నేను నడుచున్న ఈ సూక్ష్మపు పోగులు బ్రద్దలైపోయినవి. నేను నిత్యత్వములోనికి మునిగిపోయాను. అపుడును ఆయనే నా స్నేహితుడు. పదివేల సంవత్సరముల తరువాత యుగయుగములు దొర్లుకొంటూ పోవుచున్నపుడు నీ సంతోష గీతములు నీవు పాడుచుందువు. ఆ సునాద గీతములలోను ఆయనే నాకు స్నేహితుడు. అవును. చంద్రుడు ఇక లేనపుడు, సూర్యుడు లేనపుడు, భూమి లేనపుడు, యుగయుగములు దొర్లుతూ ఉన్నపుడు ఆయనే నాకు స్నేహితుడు. ఓ! ఎంతగా ఆయనను మనము ప్రేమించవలసియున్నాము!
36. నీ పని ఏమిటి? ఏమిటి నీవు సంపాదించినది? నీ పేరు ఏమిటి? నీయొక్క... నీవెవరవు? అసలు ఏమిటి? ఇది నిజం. దేవునికి నీ వీపు చూపెట్టుటకు నీవెవరవు? ఆయన చెప్పు ఒక్క మాటనయినను తృణీకరించుటకు అవిధేయత చూపుటకు నీవెవరవు? ఎవరో ఒక బోధకుడు లేదా మరెవరో ఇది ఈ రోజుకు కాదని చెప్పినంత మాత్రమున దేవునికి బదులుగా మనుష్యుని నమ్ముదువా? దేవునితో స్నేహముగా ఉండవలెనన్న అంతే!
37. ఇపుడు గమనించు. దీనినంతటిని చూచుచూ పౌలు ఒక గొప్పమాటను పలికెను. ఇక్కడ ఆ గొప్ప జవాబున్నది. ఇదిగో వచ్చుచున్నది. చూడుమూ
"సత్యమును గూర్చిన జ్ఞానము ఎరిగి యుండియూ... స్వచిత్తముతో పావము చేసినచో ఆ పాపమునకు ఒక ఏ మాత్రము బలి ఉండదు.
ఒక్క నిమిషములో ముగించబోవుచుండగా దానిని క్లుప్తంగా చెప్తాను. దీనిని మీకే విడిచిపెట్టుచున్నాను. ఇక్కడే నేను నా ఉజ్జీవమును స్థాపించుచున్నాను. ఈ లేఖనము మీదనే నేను పునాది వేయుచున్నాను,
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత కూడా మనము ఇష్టపూర్వకముగా పాపము చేసిన యెడల ఆ పాపమునకు ప్రాయశ్చిత్త ముండను, (చూడండి)
కాని ఒక ప్రత్యేక భయంకర చూపు తీర్పు కొరకు మరియు అగ్నికోపము కొరకు ఎదురుచూచుచున్నది. అది ప్రత్యర్ధిని మ్రింగివేయును.
మోషే యొక్క ధర్మశాస్త్రమును తృణీకరించిన వాడు ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు ఎదుట కృప లేకుండా చంపబడెను.
మరి ఈ శిక్ష ఇంకెంత భయంకరము!..... యేసుక్రీస్తు యొక్క రక్తమును నిబంధన క్రింద త్రొక్కివేసెను. దానితో నీవు పవిత్ర పరచబడితివి అపవిత్ర విషయము కృప జరిగించిన కార్యమును తృణీకరించితివి.
ఆ శిక్ష మరింత భీకరముగా ఉండును చనిపోవుచున్న గొర్రెపిల్ల క్రింద ఒక మనుష్యుడు తృణీకరించబడెను. మరియు తిరస్కరించబడెను. మోషే ధర్మశాస్త్ర ప్రకారము అతడు కృప లేకుండా చనిపోవలెను. ఎందుకనగా గొర్రెపిల్ల అతనికి బదులుగా చనిపోయినది. అయితే యేసుక్రీస్తు యొక్క రక్తమును త్రోసివేసి, తిరస్కరించినవారికి ఇంకెంత శిక్షపడుచున్నది!
38. ఇపుడు మొదటి విషయం మనం తెలిసికొనగోరుచున్నాము. క్షమించ బడిన పాపమునగా ఏమిటి! కొందరన్నారు, "ఆత్మహత్య" అని మరికొందరన్నారు, “బిడ్డను తల్లి చంపుట” అని గర్భస్రావము అని మరికొందరన్నారు, “ఒకప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందితివి. వెనక్కు జారితివి. అది క్షమించబడని పాపము
అని అది కాదండీ దానిని విచక్షణతో చూద్దాం. దేవుని వాక్యము ద్వారా చూద్దాం మత్తయి సువార్త పన్నెండవ అధ్యాయము. యేసు మూగ మరియు గ్రుడ్డి దయ్యమును వెళ్ళగొట్టెను.. లేదా చెవిటి మరియు మూగ దయ్యమును వెళ్ళగొట్టెను ఒకనిలో నుండి పార ద్రోలెనని నమ్ముచున్నాను. అతనిలో నుండి అది పోయినపుడు అతడు మాట్లాడెను. జనులు అటు తిరిగి అతని చూచిరి. "ఏమిటి? బయల్డెబూబు ద్వారా ఇతడు దయ్యములను వెళ్ల గొట్టుచున్నాడే” అది దయ్యములకు ప్రధాని యేసు వారి వైపు తిరిగి ఇట్లనెను...
వారెట్లు నమ్మగలరు? వారి హృదయములు పూర్తిగా దుష్టత్వముతో నిండియున్నవి. వారావిధముగా ఉండిరి. ఎందువలన? వారినెందుకు ఆయన ఖండించెను? ఎందుకు? కారణమేమనగా దేవుని వాక్యము వారిని ఖండించెను. ఏలగానగా యేసు..
పెంతుకొస్తు దినమున పేతురు చెప్పలేదా? అపొ.కా. 2:23,24 వచనము ఇశ్రాయేలువారలారా, నజరేయుడగు యేసు ఆయన మీ మధ్య నిరూపించబడెను. అద్భుతములు సూచక క్రియలు ద్వారా దేవుడు నిరూపించెను. మీ ఎదుటనే ఆయన చేసెను. అందుకు మీరే సాక్షులు.
39. ఇక్కడ మనము మొదటి సంగతి ఆలోచించవలెను. మనము పన్నెండవ అధ్యాయములో యేసు పరిసయ్యులకు చెప్పెను. మనుష్యకుమారునికి విరోధముగా ఒకడు మాట్లాడినచో క్షమాపణ కలదు. కాని ఎవరు పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడునో ఈ లోకములో గాని, రాబోవులోకములో గాని ఎన్నడను క్షమించబడడు.
“దేనికి విరోధముగా మాట్లాడుట” “పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు..... విరోధముగా మాట్లాడుట... ఇప్పుడు నీవు పొరబడి యుండవచ్చు. పరిశుద్ధాత్మ క్రియ ఎవరో గట్టిగా అరచుచున్నారు”. అది పరిశుద్ధాత్మ కావచ్చును. కావచ్చు లేదా కాకపోవచ్చు. "భాషలతో మాట్లాడుట”... భాషలతో మాట్లాడుట ద్వారా పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడుచుండవచ్చును. కావచ్చు కాక పోవచ్చు. ఇది అక్షరాలా నిజం. నేను అలాంటికాలంలో జీవించాను. పరిశుద్ధాత్మ యున్నవారే భాషలలో మాట్లాడవలెనని లేదు. నేనది ఎరుగదును. భాషలలో మాట్లాడేవారందరిపైన పరిశుద్ధాత్మలేదు.
దయ్యములు భాషలతో మాట్లాడుట నేను చూచాను. క్షుద్రవైద్యులు భాషలతో మాట్లాడుట చూచాను. మానవ పుర్రెలో నుండి రక్తమును వారు త్రాగిరి భాషలతో మాట్లాడిరి బల్లమీద పెన్సిళ్ళు వేసిరి. ఎరుగని భాషలో వారు వ్రాసిరి. క్షుద్ర శక్తుల వారు చదివిరి. వారు క్రైస్తవులని దాని అర్ధము కాదు.
కేకలు వేయుట, క్రిందికి పైకి ఎగురుట దేవునికి స్తోత్రము అనుట చూచాను. దొంగతనములు అబద్ధములు, మోసములు మామూలే, అది దేవుని యొద్దనుండి రాలేదని ఎరుగుదుము.
40. కాని సోదరుడా ఒక మాట చెప్పుచున్నాను. ఎక్కడయితే దైవికమగు పరిపూర్ణమైన దేవుని ప్రేమ హృదయములో ఉండి ముద్రించబడునో అది నిన్న నేడు నింతరము ఏకరీతిగాయుండును. చలించును. నీవు దానిని గూర్చి ఆలోచించుట ఆరంభించవచ్చు. యేసు చెప్పెను. "మీరు ఒకనినొకడు ప్రేమించుటను బట్టి మీరు నా శిష్యులని మనుష్యలందరూ తెలిసికొందురు.
"భాషలైనను నిలిచిపోవును. జ్ఞానము మరుగైపోవును. విశ్వాసము తప్పిపోవును. ఇవన్నియూ ఇక్కడున్నవి. పరిపూర్ణమైనది అనగా ప్రేమ వచ్చునపుడు ఎన్నడును గతించదు. అది నిజం. క్రీస్తు యొక్క ప్రేమ.
మీరు చేయు పనిని బటి నేను మీకు తీర్పుతీర్చలేను. సర్వశక్తుడగు దేవుడొక్కడే న్యాయాధిపతి "వారి ఫలములను బట్టి వారిని తెలిసికొందురని" యేసు చెప్పెను.
41. ఇపుడు ఒక సంగతి మనకు తెలియును. ఇటు చూడండి బైబిలులో ఉన్న ప్రతి మాటను తీసి ఉంచాము. కొద్ది నిమిషములలో మీకు చూపించెదను ప్రతిచోటను అది మాట్లాడబడినది. క్షమించబడని పాపము... క్షమింపబడని పాపము. పౌలు వచ్చి దానిని విశేషము చూపెను. ఇట్లనెను. "సత్యమును గూర్చిన జ్ఞానమును గూర్చి ఎరిగిన పిమ్మట కూడా ఇంకా పాపములో నిలచియున్నచో ఆ పాపమునకు ఇంక బల్యార్పణలేదు అదే క్షమించబడని పాపము. ఇష్టపూర్వకముగా పాపము చేయుట "నిజమే కదా?” ఇష్టపూర్వకంగా పాపము చేయువాడు"
ఇపుడు పాపమనగా ఏమిటి? పాపమనగా ఏమిటో మీరు కనుగొనవలసిన తదుపరి సంగతి. అవిధేయతయే “పాపము” తిరస్కరించుట" పాపము ఇప్పుడిటు చూడండి మొదటి పాపము...
42. ఇక్కడ ఒక చోటున్నది. దానిని మీకు చూపించగోరుచున్నాను. స్కోపిస్టు బైబిలులో అడుగున అతడు ఏమి వ్రాసెనో చూడండి. దానిని రోమా 38వ అధ్యాయములో కనుగొందుము. అని నమ్ముచున్నాను వెటెస్టర్ ద్వారా దానిని అనువదించి ఇక్కడ ఇట్లనెను క్రింద ఉన్నది "బయలు పరచబడిన దేవుని చిత్తమును విసర్జించుటయే పాపము అని ఆయన చెప్పెను.
పాపము దాని ప్రారంభ రూపములో ఉండుటయే బయలు పరచబడిన దేవుని వాక్యమును తిరస్కరించుటయే దేవుడు.. లేక దేవుని యొక్క చిత్తము అనగా దేవుడు తన ఇష్టములో దేనిని బయలుపరచెనో దానిని నిరాకరించుట దేవ దూషణ అయి యున్నది. లేక దేవునిని విసర్జించుట అయియున్నది.
మొదటి పాపము ఏమై యుండెను? దాని వైపుచూద్దాం. ఆదికాండము 3 వద్దకు వెళ్ళుదాం. మీరు ఇంటికి వెళ్లిన పిదప చదవండి. దేవుడు ఏదేను తోటను నిర్మంచెను. ఆదామవ్వలు అచ్చట నుండిరి. వారికి ఆయన కొన్ని సంగతలు చెప్పెను. అది ఆయన వాక్కు వారేమి చేయుదురో ఏది చేయలేరో చెప్పెను. ఒపుడు సాతాను అవ్వ యొద్దకు వచ్చినపుడు గమనించండి. ఆ ఫలము తినకూడదని ఆయన ఖచ్చితముగా చెప్పెను. నిశ్చయముగా చనిపోదువని చెప్పెను. దానిని చూచారా? అంతట అవ్వ ఇష్టపూర్వకంగా... గ్రహించండి. దేవుడు చేయరాదని చెప్పిన దానిని అవ్వ ఇష్టపూర్వకంగా చేసెను. మొదటి పాపమును ఇష్టముతోనే జరిగించెను. అది నిజమే కదా? అవ్వ ఇష్టముతో చేసెను. దేవుని చిత్తమును ఎరిగియుండి చేయుటకు నిరాకరించలేదు. అవును కదా? అదే మొదటి పాపము.
43. అయితే పాపమనగా ఏమిటి? యోహాను సువార్త 3వ అధ్యా 18వ దీనిని యేసుక్రీస్తు చెప్పెను. విశ్వసించనివానికి ముందే శిక్ష విధించబడెను. అవునా? కావునా పాపమనగా అవిశ్వాసమే.
సాతాను తన మోసముతో అవ్వకు దేవుడిట్లు చెప్పెనని తెలిపెను. కాని దాని భావము అదికాదు. వాడెట్లు వాక్యమునకు సున్నము వేసెనో చూడండి. సరే ఇట్లు చెప్పెను. "ఇపుడు దేవుడాలాగు చెప్పెను. కాని అది ఆయన భావము కాదు|| మరో మాటలో చెప్పవలెనన్న "మన కన్నులు తెరువడును. మీరు ఇంకా ఎక్కువ జ్ఞానము తెలిసికొందురు",
ఇపుడు అదే కుళ్లిపోయిన అబద్దమును సాతాను బోధకులకు సంఘసభ్యులకు చెప్పుచున్నది. "దేవుని వాక్యము ఈలాగు చెప్పుచున్నది. కాని దాని భావము అది కాదు. దేవుని వాక్యము అక్షరాలా ఆయన చెప్పినట్లే యుండును. అది నిజము.
44. కొద్ది కాలం క్రితం ఇక్కడ నేను నా సంఘసభ్యులతో మాట్లాడుచున్నాను. వారు నా స్వంత జనులు పట్టణము వెలుపల నుండి వచ్చారు. (ఆ స్పష్టపు మాటలు) స్వస్థత కూటములు. నేను ఎటువంటి సిద్ధాంతములు అక్కడ చెప్పను. ఎందుకనగా అది మిశ్రిత గుంపు కాని నా స్వంత సంఘములో నేను సత్యమని నమ్మునది చెప్పెదను నేను బోధిచునందంతయూ సత్యమే. కాని ఆ వరములలోనికి వెళ్లను. ఇక్కడ ఎవరైనా ఒకరు నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చుట చూశారనుకోండి. వారంటారు, "బ్రెన్హాం సోదరుడా, నీవు త్రిత్వవాదివనుకొన్నాను. ఎప్పుడూ ఆలాగే భావించాను”
నేనంటాను, "నాకు చాలా ఆలోచనలు వచ్చుచున్నవి. బైబిలు ఈలాగు చెప్పుచున్నది”. ఒక్కచోట కూడా యేసుక్రీస్తు నామములో తప్ప మరోలాగు బాప్తిస్మమిచ్చుట కనబడదు. ఎవరికీ మరో దారిలేదు.
“సరే” అన్నాను. కాని మీరెరుగుదురా.?
నేనన్నాను, "అది మీ ఎదుటనే ఉంచబడియున్నది".
45. ఒక ఏడవదినపు ఆరాధన జరిగించు సోదరుడు, ఇపుడిచ్చటనే యున్నాడు ఒకసారి నా ఇంటికి వచ్చెను. ఈ సంగతిమీదనే సవాలు చేయుటకు వచ్చెను. నా సోదరుడు అతనితో ఇట్లనెను, "సోదరుడా, చూడు, నీవు సరికాని దానిని ఏదో వినుచున్నావు”.
“నాకు చెప్పటానికి బిల్ బ్రెన్హాం ఎవరు? అని అన్నాడు.
"సరే. రా వచ్చి దేవుని వాక్యమును విను"
కావున అబ్బాయి వచ్చాడు. మేము బైబిలు తీసి ఉంచాము. "సోదరుడా, ఇప్పుడుచూడు మీ పాఠ్యపుస్తకమును క్రింద పెట్టండి. మనము బైబిలు తీసికొందం అన్నాను.
"అవును బైబిలు"
నేనన్నాను, "నీది తప్పు అని దేవుని వాక్యము చెప్పినచో నిన్ను నేను యేసుక్రీస్తు నామములో బాప్తీస్మమునకు ముంచవచ్చునా? నీవు నాకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ప్రకారము బైబిలులో బాప్తీస్మమిచ్చిరని నీవు రుజువు చేసినచో నీవు నాకు బాప్తిస్మము ఇయ్యవచ్చును." దానికతడు అంగీకరించెను.
అతని యొక్క మొట్ట మొదటి వచనము అతననిని ఖండించుట ప్రారంభమాయెను. అతడు నన్ను బాప్తిస్మమిచ్చుటకు నిరాకరించెను. దాని భావము ఏమిటి? మనము పాపము చేసిన ఎడల బాప్తిస్మమిచ్చుటకు నిరాకరించెను. దాని భావము ఏమిటి? మనము పాపము చేసిన యెడల విశ్వసింపని యెడల సత్యమును గూర్చిన జ్ఞానము పొందిన తరువాత కూడా ఇష్టపూర్వకముగా ఎదురు తిరిగినచో ఆ పాపమునకు ఇక బలి ఉండదు." అదే క్షమించబడని పాపము.
46. సువార్త సత్యము ఏమిటో నీకు తెలిసిన యెడల అది నీ ముందుంచ బడినపుడు దానిని దేవుడే నీకు బయలు పరచెను. అది సత్యమని నీవెరుగుదువు. కాని ఒక సంఘమును లేక ఒక అందమైన బోధకుని సంతృప్తి పరచుటకు కేవలము లేదా పేరు ప్రఖ్యాతలు పొందాలని దేవుని వాక్యమునకు హత్తుకొని ఉండవలసినది పోయి ఇతర సంగతులకు హత్తుకొనియున్నావు పౌలు చెప్పెను, "సత్యమును గూర్చిన జ్ఞానము ఎరిగిన తర్వాత కూడా అతడు పాపము చేసిన యెడల లేదా అపనమ్మక ముంచినచో ఆపాపమునకు ఇక బలినిలిచియుండదు. అదే నీ యొక్క క్షమించబడని పాపము. సత్యమని ఎరిగియు దానిలో నడచుటకు నీవు నిరాకరించితివి. ఆమేన్. ఇపుడది నిజమని నీవు నమ్ముచున్నావు. అదే బైబిలు చెప్పెను. "పాపము చేసినవాడు..." అవిశ్వాసమే పాపము.
నీవనవచ్చు, “పొగత్రాగుట పాపమా? త్రాడుగు పాపమా?" కాదు. కాదు అవి అవిశ్వాసము యొక్క లక్షణములు నీవు నమ్మలేదు గనుక వాటిని నీవు చేయుచున్నావు.
ఒక మనుష్యుడు తాను నమ్ముచున్నాననినచో అతడు క్రైస్తవుడైయుండి అతడు ఒప్పుకొనిన మార్గములో నడచుకొనవలెను. చూడండి. ఆపాదించికోవలెను. యాపిల్
ఒక వృక్షము కాదు. అది చెట్టు యొక్క మూలము. నీవు అబద్ధమాడుచూ, దొంగతనము చేయుచూ మోసము చేయుచూ పొగత్రాగుచూ అన్నింటిని కలిగి యున్నావు. క్రైస్తవునిగా పిలిపించుకొనుచున్నావు. అయితే నీవు తిరిగి జన్మించలేదు. అది నిజం నీ వెటువంటి జీవితం కలిగియున్నావో అది చూపించుచున్నది. "వారి ఫలములను బట్టి వారిని నీవు తెలిసికొందువు" అని యేసు చెప్పెను. చూడండి...
ఆ క్రియలను నీవు చేయుచున్నయెడల బైబిలు ఇట్లు చెప్పుచున్నది "మీరు లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమించిన యెడల దేవుని ప్రేమ మీలో నిలిచియుండదు. నీవు మతములో ఉన్నావు. అంతే ఏ రక్షణాలేదు మతమనగా ఒక ముసుగు కాని రక్షణ అనగా స్వాతంత్య్రము. హల్లెలూయా! రక్షణ ముసుగుకాదు. (బయటపెనట్టును) అది నిజం. నీవెవరవో చూపించును. మనము చెడు కార్యములు చేయుచున్నామనగా మనము విశ్వసించలేదని అర్థము.
కాని యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీవు నీ పూర్ణ హృదయముతో నమ్మినచో దేవుడు ఉత్తరవాదియైయున్నాడు. నీ సాక్ష్యము సత్యమైన యెడల పరిశుద్ధాత్మ బాప్తీస్మమును ఇచ్చెదము. నీ విమోచన దినము వరకు రాజ్యములో ముద్రించుటకు అది ఇచ్చెదము.
47. నీవనవచ్చు, "నేను పరిశుద్ధాత్మను పొందాను. దేవునికి మహిమ! దానిని పొందానని నేనెరుగుదును. నేను ఆత్మక్రింద ఉన్నాను. "ఆత్మను నీవు పొందినట్లుగాసూచన కాదు. ఏమాత్రము కాదు. స్నేహితులారా! ఆత్మల క్రింద అలాంటివి పడుట ఎన్నో నేను చూచాను. అందు వలన నీవు పరిశుద్దాత్మను పొందినావని ఏమీ కాదు.
కానీ నీ హృదయంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమను నీవు కలిగియున్నచో దేవుడు నీలో నుండి క్రైస్తవుని చేసినపుడు ఆయన తన రాజ్యములోనికి నిన్ను ముద్రించును. అపుడు నీవు దేవుని ఆత్మ క్రింద కూడా పడుదువు. నీవు అది ఇది మరేదో చేయవచ్చును గాని నీ జీవితము నీ సాక్ష్యమునకు సారూప్యమగును.
నీ జీవితము ఎంతో గట్టిగా సాక్ష్యమిచ్చును. ఎంతవరకనగా... నీవేది చెప్పినా పట్టించుకొనము. నీవాలాగు జీవించినచో ప్రజలు నమ్మరు. వారు నిన్ను
నమ్మజాలరు. నీకు నీవే నమ్మకము కలిగియుండవు. ప్రజలు దానిని నమ్మరు. కావున నీవు దరిద్రుడుగా నుందువు. ఒక నిజమగు హృదయముతో ఎందుకు నీవురావు? ఈలాగు చెప్పుము, “దేవా, నా తప్పులు నేను ఒప్పుకొనుచున్నాను. నా పూర్ణహృదయముతో యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. దేవా, ఇపుడు నాకు పరిశుద్ధాత్మను ఇమ్ము." దానిని ఆయన చేయును. అది నిజం. దాని యొక్క ఫలమును నీవు కలిగియుందువు. ఎందుకనగా నీవు నమ్ముచున్నావు గనుక
48. ఇప్పుడు మీరిట్లందురు. “పొగత్రాగుట మానివేశాను త్రాగుడు మానివేశాను. అది మానివేశాను. ఇది మానివేశాను. "సోదరుడా, ఏ పాపి అయినా గాని అలాగు చేయగలడు. నిశ్చయంగా చేయగలడు. అందువలన తేడారాదు....
యుద్ధకాలములలో ఒకతను అమెరికను దుస్తులు ధరించియున్నాడు. ఇపుడు సహో॥ రాబర్సన్, సహో॥ ఫంక్ చాలా మంది సైనికులు ఇక్కడున్నారు ఒకడు అమెరికను యూనిఫాం ధరించినందువల్ల అతనిని మీరు నమ్మజాలరు. ఒక గూఢచారి కావచ్చు. అతడు ఒక జర్మనీ వాడు కావచ్చు. అతను శత్రువు కావచ్చు. అమెరికన్ దుస్తులు ధరించినందువలన అతడు అమెరికా పౌరుడు కాడు. కాదు.
హల్లెలూయా! నీవు దేశములోని ప్రతి సంఘమునకు చెందియుండవచ్చు. ఈ ప్రతి నూతన సంవత్సరము ప్రతి పేజీ త్రిప్పవచ్చు. అందువలన నీవు క్రైస్తవునివి కావు. సోదరుడా, వ్రేలు ముద్ర ధరించిన అధికార పత్రము నీ కుండియుడవచ్చును. నీవు అమెరికిన్వి నిన్ను నీవు నిరూపించుకొనుటకు నీకొక పత్రము అవసరము.
49. పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీవు పొందినపుడు నీ జీవితములో దేవుని శక్తి పని చేయును. ఈ ప్రస్తుత లోకములో దీనునిగాను, సమాధానపరునిగా నీవు జీవించునట్లు చేయును. ప్రతి దినము, ప్రతివారము, ప్రతి సంవత్సరము నీవెక్కడ నిలబడి యున్నావో వారెరుగుదురు. అది సరి దావీదు చెప్పెను. నీటికాలువల యోరను నాటబడిన చెట్టువలె యుందువు. అతడు చేయునదంతయూ సఫలమగును. నీరులేనపుడు ఎండిపోడు. ఎందుకనగా అతడు నీటికాలువ ఓరను నాటబడి యున్నాడు. తన కాలములో అతడు ఫలము తెచ్చును.
భక్తి హీనుడు ఆలాగు కాదు; వారు గాలికి ఎగురుగొట్టు పొట్టు వలెనుందురు. (అది నిజం) ఒక ఉజ్జీవము నుండి ఇంకో చోటుకు పోవుదురు. మరల మరల ఉజ్జీవము పొందుచునే యుందురు. కాని ఒక్కసారి క్రీస్తునందు లంగరు వేయబడి ఆయనను ఎరిగినవారు తాను ఎక్కడ యున్నాడో ఎరుగును. అది నిజం.
50. మనము "పాపము చేసిన యెడల" పా-ప-ము! ఇప్పుడు పాపమనగా ఏమిటి? పాపమనగా "అవిశ్వాసమే” ఎందరిది ఎరుగుదురు? మీ వెబ్స్టర్ నిఘంటువును తీసి చూడండి. ఎక్కడకయినా మీరు వెళ్ళండి. ఇక్కడ బైబిలు చూడండి? మొదటి పాపము అవిశ్వాసమే. అది నిజమేనా? నమ్మనివానికి ముందే శిక్ష విధించబడెను”. లేఖన మంతయు చూడండి. ఎక్కడయినా చూడండి. "అవిశ్వాసము, అవిశ్వాసము”.
బయట రాత్రిగా ఉన్నది అంటే అర్ధము అది చీకటి. ఎంత చీకటి యున్నది? ఏ భాగము రాత్రి? రాత్రి అంతయూ. నిజమే కదా? అది చీకటి కనుకనే రాత్రి అందుము. అవునా?
గదిలో ఎంత వెలుగున్నది? ఈ భాగము మాత్రమే వెలుగా? కాదు. ఉన్నదంతా వెలుగై యున్నది. అది వెలుగు ఎందుకనగా అది వెలుగే.
నీవు విశ్వాసివైనచో నీవు క్రైస్తవుడవు. నీవు విశ్వాసి కానిచో నీవు క్రైస్తవుడవు కావు. అంతే.
51. ఏలయనగా ఏ మంచి క్రియల వలన నీవు రక్షించబడలేదు. గోల చేయుట వలన నీవు రక్షించబడలేదు. ఆత్మలో నాట్యము చేయుటవలన నీవు రక్షించబడలేదు. భాషలతో మాట్లాడుట వలన నీవు రక్షించబడలేదు. సబ్బాతును ఆచరించుట వలన నీవు రక్షించబడలేదు. మాంసము తినుటవలన నీవు రక్షించబడలేదు. సంఘములో చేరుటవలన నీవు రక్షించబడలేదు. నీటి బాప్తీస్మము వలన నీవు రక్షించబడలేదు. నీవు విశ్వాసము ద్వారా రక్షించబడినావు. మీరు కృప ద్వారానే రక్షింపబడియున్నారు”. నిజం.
నీవు నిజంగా రక్షింపబడినచో ఈ ఇతర సంతులు దానికవే లభించును. నీవు భాషలతో మాట్లాడుదువు. నీవు గట్టిగా అరవవచ్చు. నీవు దేవుని స్తుతించవచ్చు.
"ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి". సంఘ కాపరి ఏదయినా పొరపాటు జరుగుట చూచినప్పుడు ఇట్లనును, సోదరీ చూడుము, లేదా సోదరుడా అది తప్పు. నీవు లోబడవలెను. ప్రవక్తల యొక్క ఆత్మ వారి స్వాధీనములో ఉన్నవి. నీవు లోబడి ఇట్లనుము. “దేవా, నన్ను క్షమించుము, నేను క్రమములో నుండితప్పిపోదలచుకోలేదు. "నేను సిద్ధంగా ఉన్నాను.... సంఘము నొద్దకు వెల్లి ముందుకు కదులుదును. ఒక సంఘము దేవుని మహిమ కొరకు కదులుచున్నట్లు నీవు చూచెదవు. ప్రతిదినము క్రమములో యున్నది. సంఘము క్రమములో పెట్టబడినది.
52 కాని నీవు నీ తల పైకి ఎత్తిన యెడల "నేనది నమ్మను అని చెప్పినచో నేనందును, నేను కేవలము నమ్మను. అది తప్పు. దిద్దుబాటు నీవు సహించవు. నా భావము నీకు తెలియును.
లేఖనము చెప్పుచున్నది. "వాటిని గమనించండి" అది కూడా నిజము. దిద్దుబాటు నీవు తట్టుకోలేవు క్రమములో నీవు నిజంగా నలబడలేవు. దేవుని సంగతులలో నీవు నిలవజాలవు. అప్పుడు నీవు లాగివేయబడుదువు. పౌలు చెప్పెను, "వారు మన యొద్ద నుండి వెళ్లిపోయిరి. ఎందుకనగా వారు మనవారు కారు. అది నిజము ఆయన ఇట్లనెను. ఈ బోధలన్నియూ.... మరియు... ఆయన ఇట్లనెను, మీ మధ్యకు నేను వచ్చినప్పుడు ఇక్కడ అది యున్నది. అక్కడ అది యున్నది. మరేదో యున్నది... నేను విన్నాను. పరుష పదజాములున్నవి. ఒకడు స్వంత తల్లితో జీవించుచున్నాడు. తరువాత వాడు ప్రభువు యొక్క బల్ల యొద్ద త్రాగుచున్నాడు. ఈ విషయములన్నియూ వినండి అని చెప్పెను, వారాలాగు ఉండనక్కరలేదు. వారు బయటకు వెళ్ళిన తరువాత వారు మనవారు కాదని చెప్పెను. అది నిజం, వారు దయ్యములు యొక్క బల్లలమీద తిన్నారు. ప్రభువు యొక్క బల్లయొద్ద తిని క్రైస్తవులుగా స్వయంగా పిలుచుకొనుచున్నారు.
ఆయన వారిని నరికెను. ఆయన వారిని ముక్కలుగా చేసెను. కాని ఆయన వారికి సత్యమును వారికి చెప్పెను. ఆ తరము లేచినప్పుడు పౌలు నిలబడి పౌలు చెప్పగలిగినది చెప్పెను. "నేను ప్రతివాని రక్తము నుండి విడిపించబడియున్నాను. దేవుని యొక్క పూర్తి సత్యమును నేను మీకు చెప్పకుండా ఏమీ దాచుకొనలేదు.
53. పౌలు యొక్క దినము కొరకు నేను జవాబు ఇవ్వవలసిన పనిలేదు. కాని ఈ తరము పైకి వచ్చినప్పుడు నేను ఒక సాక్షిగా నిలబడవలెను. నేను గాని సత్యమును ఎరిగియు దానిని చెప్పుటకు నిరాకరించినచో పేరు కొరకు రాజీపడినచో నేను ఓ వేషధారిగా త్రోయబడుదును. ఒక అబద్ధికునిగా నేను నటించవచ్చు. నేను ఒక ఉన్మాదిగా త్రోయబడవచ్చును. లోకములోని ప్రతిపేరును నేను పెట్టి పిలిపించుకోవచ్చును. కాని ఆ రోజు దేవుడు చెప్పును. “నీవు నా మాట గైకొంటివి. శ్రమ దినమున కూడ నేను గైకొందును అని ఆ రోజు ప్రభువు చెప్పును. అది నిజం. అది చేయవలసిన పని.
54. బైబిలు గనుక పరిశుద్ధాత్మ బాప్తీస్మమును నేర్పించని యెడల, ఎప్పుడో అది ఆగిపోయింది అనినచో నేను దానినే మరల బోధించుదును. బైబిలు బోధించుచున్నది. “యేసుక్రీస్తు నిన్ను నేడు ఏకరీతిగా యున్నాడు”.
అపొస్తలులతో అద్భుతములు ఆగిపోయినవి అని చెప్పినచో నేను నమ్ముదును దేవుడు చెప్పిన చెప్పిన దానిని నేను నమ్ముదును, "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును” దానిని నేను నమ్ముదును.
ప్రజలు అపొస్తలుల కాలము వలె భాషలతో మాత్రమే మాట్లాడుదురనియు వారు అనిన యెడల, అది మాత్రమే వారు మాట్లాడు కాలము అని చెప్పిన యెడల అది నేను నమ్ముదును. కాని ఆయన ఇట్లు చెప్పెను. “ఈ సూచక క్రియలు, భాషలతో మాట్లాడుట యుగ సమాప్తి పర్యంతము ఉండును”.
యేసు నామములో నీటి బాప్తిస్మము అపొస్తలులతోను మరియు కాతలిక్కు చర్చి రూపముతోను ముగిసినట్లయిన, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎప్పుడో ఆగిపోయినవని నేనవచ్చు. దీనితోనే ఆరంభము కావచ్చు. అదే పనిని నేను చేయుదును. కాని అది అలాగే ఉన్నదని అది బోధించుచున్నది. ఒక సాక్షిగా సర్వలోకమునకు సువార్త ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చును. చిలకరించుట బైబిలులో ఉన్నట్లయితే నేను చిలకరింపునే కొనసాగించుదును. అది సరియే. అది ఏదయినా సరే!
పాదములు కడుగుట బైబిలులో లేనియెడల దానినే నేను బోధించను. కాని బైబిలు చెప్పును ఈ సంగతులను మీరు చేయుచున్నారు గనుక ధన్యులు. నేను మీతో సత్యమే చెప్పియున్నాను.
ప్రభువు యొక్క బల్ల ఆత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధముగా దానిని దీనిని ఎంచరాదు. యేసు చెప్పెను, "ఇది చేసిన యెడల మీరు ధన్యులు చేయుడి. ఆయన తిరిగి వచ్చువరకు ఆయన శరీరము యొక్క ఈ సూచికలను ఉపయోగించుడి. ఆయన దానితో నిలబడి యున్నాడు. నేనును.
దైవిక స్వస్థత అక్కడితో ఇక ఆగిపోవలసిందే అన్నచో అలాగే జరుగవలెను. వారు రోగుల మీద చేతులుంచుదురు. వారు బాగవుదురు. లోక సమాప్తి వరకు అది ఈలాగే జరుగుచుండును. అది నేను నమ్ముచున్నాను. విశ్వాసులను సూచకక్రియలు వెంబడించుట కనబడును.
55. నేను లేచి నిలబడి ఎంతో మతోన్మాదము లేచి ఆలాగు ఊపుపొందుట చూచుచున్నాను. వెక్కిరించుచున్నారు. అపహాస్యము చేయుచున్నారు. వారు గేళి చేయుట కాదు నిందను తీసికొని వచ్చుచున్నారు. వాస్తవంగా ఒక నింద, సంఘములో నిలబడి భాషలతో మాట్లాడి బయటకు పోవుచున్నారు. కేరింతలు, కేకలు, మరల ఉజ్జీవమునకు వచ్చుచున్నారు. అది దేవుడు కాదు. కాదండీ. మీ ఫలము వలన మీరు వారిని తెలిసికొందురు.
నేను లెక్క చెయ్యను... వారికి మీరు సత్యమును ఇవ్వవచ్చు. ఇదిగో “ఇదే యెహోవా సెలవిచ్చుచున్నాడు” అని వారికి చెప్పండి.
ఒకడు దానివైపు చూచును. అతడు దానికి భయపడును. అతడు వెళ్ళిపోయి ఇట్లనును “ఎన్నయినా చెప్పండి గాని దానిని నేను నమ్మను” అనును. నీవు పరిశు ద్ధాత్మను విరోధించినట్లే. నీకు ఎన్నడూ క్షమింపబడనిది ఏదో చేసినట్లే. నీవందుకు సరియిన క్షమాపణ చేసికొంటేనే గాని,
56. నేను దాదాపు ఓహియో నది యొద్దకు వచ్చాననుకోండి. అక్కడ వంతెన యున్నది. దానిని దాటి అడ్డంగా వెళ్లవలెను. నేను ఒకవేళ ఇట్లన్నానుకోండి.
"నేను మరోవైపు కారు నడుపుకొని వెళ్ళెదను. అక్కడ వంతెన యున్నది. చెల్లించవలసిన పన్ను యున్నది. నేను వంతెన దాటి వెళ్లవలయును. ఒఫర్సన్ విర్ నుండి కేంటాకీ నేను వెళ్ళవలెననుకో. నేను వంతెన దాటాలి. అవును గదా? ఓ, నేనది చేయను అన్నాననుకోండి. నేను ఒక చిన్న నావకొని దానిలో కూర్చొని అద్దరికి వెళ్ళెదను. ఎవరినయినా పెట్టుకొందును. నేను ఆలాగు చేయను అని కూడా అందురు. నా కొరకు ఒక నావ కొందును. నది దాటుదును. లేదా నేను ఒకరిని బాడుగకు పెట్టుకొందును. ఆ వంతెన యొద్ద ఒక వ్యాపారమున్నది. వినండి అవతలి దరికి నీవు వెళ్లినపుడు అధికారులు అక్కడే నిన్ను కలిసికొందురు. ఆలాగు నీవు చేసినందుకు నిన్ను అరెస్టు చేయుదురు. అది ఖచ్చితంగా నిజము.
57. యేసు ఈలాగు చెప్పుటలో ఆశ్చర్యము లేదు. "ఒకడు పెండ్లి వస్త్రము లేకుండా వచ్చెను. ఆయన ఇట్లనెను, "స్నేహితుడా ఇక్కడ నీవు ఏమి చేయుచున్నావు? నిన్ను ఇక్కడికి ఎవరు తెచ్చిరి? అతడు నిస్సహాయుడిగా నిలబడి యుండెను. అతడెందుకు? అక్కడున్న ఉపమానములో...
ఈనాడు తూర్పు దేశములందు పెండ్లి కుమారుడు పెండ్లి విందును ఏర్పరచును. ఆలాగు చేసిన తరువాత పెండ్లి వస్త్రమును అలంకరించుట అతని వంతు.
జీవితము యొక్క ముగింపులో యేసుక్రీస్తు పెండ్లి విందును ఏర్పాటు చేసెను. కాబట్టి వస్త్రముతో అలంకరించుటకు వాటిని సిద్ధపరచుట ఆయన పని.
ద్వారము నొద్ద సహాయకుడు ఆచార ప్రకారము, సన్నిహిత స్నేహితులలో ఒకడు అక్కడ నిలిచియుండెను. ఆహ్వాన పత్రికతో వచ్చు ప్రతి మనుష్యుడు ఒకే రకమగు వస్త్రములు ధరించును. వారు దానిని వానిమీద వేయుదురు. పేలిక బట్టలలో ఉన్నా, విశాలమగు వస్త్రములో ఉన్నా ఒక్కటే. అతడు పెండ్లి వస్త్రమును ధరించెను. మిగిలిన వారందరి వలెనే అతడు ఖచ్చితంగా కనబడెను. కావున ఒకేలాగు కనిపించెను. అది అక్షరాలా నిజం.
మరియు సోదరుడా, పెండ్లి విందునకు మనము వచ్చినప్పుడు ఆ వెనుక కాలములో పరిశుద్ధ పౌలు ధరించిన వస్త్రమునే కలిగియుండవలసిన యున్నాము.
ఒకే విధముగా బాప్తీస్మమును మనము కలిగియుండవలసిన యున్నాము. అదే విధమగు సువార్త మంటను మన హృదయములలో కలిగి యుండవలెను. అదే ప్రేమ కలిగి యుండవలెను. లేనిచో మనము ఇమడలేము. సోదరుడా, నేను పెంతెకొస్తును. కాదండీ. ఒక్క కొద్ది తేడా కూడా రాదు. "నేను మెథడిస్టుని”. “నేను ప్రెస్బెటేరియన్ని" నేను బ్రెన్హాం గుంపువాడిని. దానితో ఏమీ పనిలేదు నిజం.
58. సువార్త సత్యమును నీవు చూడుము! పౌలు ఎట్లు బాప్తిస్మమిచ్చెను? ఆది సంఘము ఎట్లు బాప్తిస్మమిచ్చెను? యేసుక్రీస్తు నామమున వారక్కడ ఏమి చేసిరి? వారు దైవిక స్వస్థతను బోధించిరి. వారు దేవుని శక్తిని బోధించిరి. వచన పూర్వక రెండవ రాకడను బోధించిరి. పాదశుద్ధిని మరియు రొట్టె ద్రాక్షారసమును తీసికొన నారంభించిరి. రొట్టె విరిచిరి ఇంటింటికి వెళ్లిరి. ఏక హృదయము కలిగి యుండిరి. అది నిజమేనా? అవునండీ.
పాపమును గద్దించుటలో వారు నమ్మకముంచిరి. సంగతులు ప్రక్కన పెట్టిరి. అననీయ, సప్పీరాలు తేలిక సంగతి కాదు. కాని పేతురు చెప్పెను. వారికేమి జరుగునో చెప్పెను.
ముసలి సీమోను విశ్వసించెను. వచ్చి పరిశుద్ధాత్మను కొనజూచెను. లేక సంఘములో గొప్ప వానినవుదుననుకొనెను. ఎక్కువ డబ్బు ఇచ్చెదననెను. ఏలాగనగా సరే నాకు కాస్త ఇవ్వండి అనెను.
పేతురు చెప్పెను, "నీ డబ్బు నీతో నశించును గాక! ఈ క్రమములో నీకు పాలు పంపులు లేవు. నిజమైన పరిశుద్ధాత్మ ఒప్పుదల కలిగినారిని దేవుడు ఆశీర్వదించును గాక! వారు దానిని చూచి సత్యము చెప్పిరి. అవును. "సీమోనూ, నీవు చేయునది తప్పు. అది తప్పు అని సీయోనునకు కూడా తెలియును.
59. అందులో నడుచుటకు నీవు తిరస్కరించినచో పరిశుద్ధాత్మను నీవు దేవదూషణ చేయుచున్నావు. ఇష్టపూర్వకముగా పాపము చేయువాడు సత్య జ్ఞానమును ఎరిగిన తరువాత ఇక ఆ పాపమునకు బలి ఉండదు.
60, (టేవు పై భాగములో ఖాళీ యున్నది) "దొంగిలించరాదు. అబద్దమాడరాదు, "ఈ ఉదయం వాటిని చూద్దాం. దానిని ధర్మశాస్త్రము అర్ధములో చూపే వరకు అది తెలియదు.
ఇక్కడ ఈ పట్టణములో ధర్మశాస్త్రము తెలియబడలేదు. ఎర్రదీపము నొద్ద పరుగిడుట తప్పు, దానికి ధర్మము వర్తించినచో సరి. న్యాయము కాదు. వేగముగా పరుగిడు న్యాయము లేనిచో వీధులలో గంటలకు తొంబది మైళ్ల దూరంలో పరుగిడుట అధర్మము. అది తప్పు,
ధర్మశాస్త్రము లేనిచో పాపమనగా ఏమిటో తెలియదు. ధర్మశాస్త్రము వచ్చినప్పుడు పాపము పెద్దగా చూపించబడెను.. లేదా బయలు పరచబడెను. అంతట యేసు కృప వచ్చెను, నీ హృదయములో నుండి పాపపు కోరికలు తీసివేసెను. చూడుము, అది పాపమును పరిహరించెను,
61. ఆకాశములందు ఉన్నతమైన విషయము దేవుడు స్వయంగా భూమిమీద తక్కువ వాడాయెను. ఒక పామునుకూడా ఆయన తనలో చూపించుకోగలడు. అది నీకు తెలియునా? ఆయన అరణ్యములో ఒక ఇత్తడి సర్పమాయెను. అది నిజమే కదా?
నిత్యత్వములో ఉన్నటువంటి ఏ వస్తువుకంటెను భూమి సృష్టిపై ఉన్న సమస్త తక్కువ దానికంటెను ఆయన తన్ను తగ్గించుకొనెను. అక్కడున్న అపరిశుద్ధమైనది, కంటెను ప్రతి మానవుని పాపమును ఆయన పరిహరించెను. ప్రతి జంతువు, ప్రతి జీవి, అన్నింటికన్న ఆయనే అధముడై అపవిత్రమైనదిగా ఆయనే మారెను.
రెండవ మనుష్యుడు రాలేడు. దైవత్వములోని రెండవ వ్యక్తి రాజాలడు. దైవత్వములోని మూడవ వ్యక్తి రాలేడు. నాలుగవ వాడు రాలేదు. దైవదూతలు రాలేరు. దేవుడే స్వయంగా దిగి వచ్చెను. ఉన్నతమైన వాడు అతి తక్కువ వాడాయెను. పాపము తీసివేయుటకే అట్లాయెను.
అంతట పురుషులు మరియు స్త్రీలు, ఆయన చెప్పిన దానిని గమనించండి. ఆయనయందు విశ్వాసముంచుడి. ఇప్పుడు బైబిలు "వారు ఇష్టపూర్వకంగా పాపము చేసినపుడు.
62. పురుషుడు వచ్చి చనిపోవుచున్న గొర్రెపిల్లపై చేతినుంచినపుడు ఇట్లనును, "నేను వ్యభిచారము చేసియున్నాను” ప్రధానయాజకుడు. ఒక్క దోషము కూడా లేకుండా ఈ గొర్రెప్లిలను నేను అర్పించుచున్నాను. క్రీస్తుకు మాదిరి, దాని యొక్క చిన్న తలపై తన చేతిని పెట్టెను. వారు గొంతును కోసిరి. అది కేకలు వేసి చనిపోయినది. నలిగిపోయినది. అక్కడనే తన పాపములను విడిచి వెళ్లిపోయినట్లు తెలియును, అతడే ఆ విధంగా చనిపోవలసింది. ఈ అమాయకపు జీవి చనిపోయినచో ప్రత్యామ్నాయంగా చనిపోవలసి వచ్చేది.
అపుడతని పేరు జాన్తో పత్రములో నిక్షిప్తమయ్యేది. అదిక్కడున్నది. లేవీయులలో ఒకడు దానిని దాచెను. లేఖకుడు ఉంచెను. అతడు అచ్చట వేరు చేయబడెను. అతడు ఈ వ్యభిచారమును జరిగించెను. దాని కొరకు ఈ బలిని అర్పించెను.
అంతట అతడు గుర్తించినది ఏమనగా దేవుని వాక్యము ఒక సంవత్సర కాలము అవసరమగును. అంతే, అతడు మరల అదే కోరికతో బయలు వెళ్ళెను. అతడు అదే స్త్రీని మరల చూచెను. మరల వ్యభిచారము చేసెను. సబ్బాతునాడు పుల్లలు ఏరెను. పాపము ఏదయినా గాని అతడు మరల గొర్రెను తీసికొని వచ్చి పరిశుద్ధ స్థలమును శుభ్రము చేయును.
అతడు మరల వచ్చినప్పుడు... "నీ పేరేమిటి?”
“జాన్ డో”.
“జాన్ డో వైపు చూచెను”, “నీవు చేసిన నేరము ఏమిటి?”
“వ్యభిచరించుట”
“ఆ అతనిని కనుగొన్నాం. కార్యములో పట్టుకొన్నాం”
"నీవు ముందే చేశావు కదా? నీకు పరిహారము దొరికినది. దేవుని వాక్యము నిన్ను రాళ్లతో చంపమని చెప్పినది. "వారతనిని ఒకచోట నుండి మరొక చోటికి త్రిప్పిరి. కరుణ లేకుండా త్రిప్పిరి. అతడు పట్టణమునకు మేయరు అయినా మా కక్కరలేదు. అతడు జాలిలేకుండా చంపబడెను. (అది నిజం) ఎందుకనగా అతడు దేవుని వాక్యమును నిరాకరించెను. దేవునికి గొర్రెపిల్ల కావలెను. దానిని అతడు తిరస్కరించెను.
63. పౌలు ఇట్లనెను, "అది మోషే ధర్మశాస్త్రము క్రిందను. మోషే ధర్మశాస్త్రమును తిరస్కరించినవాడు కృపలేకుండా ఇద్దరు ముగ్గురు సాక్షుల ఎదుట పాపములోనే పట్టుకొని చావగొట్టెడివారు. దేవుని కుమారుడగు దేవుని గొర్రెల యొక్క శిరస్సు మీద ఒకడు తన హస్తమునుంచినపుడు అది మరెంత కఠినముగా ఉండును?
ఆయన యొక్క చీల్చబడిన హృదయము! ఆయన గాయపరచబడెను. ఆయన బుగ్గల నుండి కన్నీరు కారుచుండెను. ఆయన కిరీటముపై ముండ్లుండెను. ఆయన ముఖము నుండి రక్తము కారుచుండెను. ఉప్పుతో కలిపిన ఆయన చెమట చెదరగొట్టబడిన శరీరమును బాధపెట్టినది. ఒకడు వచ్చి ఇట్లనును. "ఈయన దేవుని కుమారుడని నేను ఒప్పించబడితిని. ఆ తరువాత ఆయనవైపు తిరిగి ఆయన కృపను మరియు ఆయన వాక్యమును నమ్మకపోవును.
పౌలు చెప్పెను, “ఇష్టపూర్వకముగా దానిని చేయువాడు తన పాపమునకు బలిని కలిగియుండును. గాని భయంకరమైన దృశ్యము కనబడును. తీర్పు కొరకు అగ్ని మరియు తీవ్ర కోపము ఉండును. అది ప్రతివాదిని మ్రింగివేయును. నా సోదరుడా, నీకు సత్యము అందించబడినది.
64. రానున్న ఉజ్జీవము కొరకు దీనిని నేను ప్రధాన పునాదిగా వాడుచున్నాను. ప్రతి రాత్రి మీరు మీ బైబిలు తెచ్చుకొనుడి. పెన్సిలు తెచ్చుకొనుడి. పరీక్షించుకొను పుస్తకము తెచ్చుకొనుడి. ఎప్పుడయినా ఏదయినా మీకు అర్థము కాకపోతే, వాదించుకొందము రండి.
నేను సత్యము తెలిసికొనగోరుచున్నాను. మీ వలె నేను సత్యము కొరకు తెరవబడి యున్నాను. ఏది తప్పు, ఏది ఒప్పు అనునది తెలిసికొనగోరుచున్నాను.
ఆయన చేయమని చెప్పిన ఒక్కదానికి కూడా నేను అవిధేయుడను కాదలంచలేను. చూడండి. నా స్వంత హృదయములోనే చిన్నదానిని కూడా ఉంచకోరుచున్నాను. కాని అది వాక్యము ద్వారా రావలెను. సత్య జ్ఞానమును పొందిన తరువాత మనము ఇష్టపూర్వకముగా అవిధేయులమైతే, ఆ పాపమునకు ఇక ఏ క్షమాపణ ఉండదు.
65. ముగింపులో ఈ మాట చెప్పనీయండి. ఒక నిమిషం. చూడండి. వారు పరిశుద్ధాత్మను దేవదూషణ చేసిరని యేసు చెప్పెను. అది క్షమించబడును... క్షమాపణ లేని పాపము....
ప్రవక్తయగు యిర్మీయాను చూడండి. ప్రవక్తయైన యెషయా, ప్రవక్తలందరిని చూడండి. వారన్నారు, “మెస్సీయా వచ్చినప్పుడు, ఇది ఆయనే అగును. యేసుక్రీస్తు దేవుని వాక్యము. అవునా? ఆయనను నిరాకరించుట వాక్యమును నిరాకరించుటయే. అవునా?
"ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను". ఆ వాక్యము దేవుడై యుండి మన మధ్య శరీరధారిగా నివాసము చేసెను. ఇక్కడ దేవుని యొక్క వ్రాయబడిన వాక్యము ప్రత్యక్షమగుచున్నది. ఆయన ఆలోచించిన ప్రతి పేరాయు వ్రాయబడిన వాక్యమే. ఆయన దేవుని వాక్యము. ఎప్పుడయితే వ్రాయబడిన మాట ప్రకటింబడినదో ఆయన భూమిమీద ప్రకటించ బడెనో, బయలుపరచబడెనో, అపుడు వారు దానిని చూచియు తృణీకరించుదురో... నా భావము మీకు అర్థమయినది. వారు తమ పేరు ప్రఖ్యాతులు కోల్పోవుదురని భయం. ఎందుకనగా వారు సంఘమును విడిచిపెట్టవలసి వచ్చును.
ఎవరయినా అనవచ్చు. అలాటి తప్పు బోధలు వినవద్దు. మేము మిమ్మును సంఘములో నుండి త్రోసివేయదుము. వారాయనను నమ్మలేదు. వారు తమ హృదయములలో నమ్మిరి. కాని వారికి ఆయన వద్దు, ఆయనను వారు బహిరంగముగా ప్రకటించుకొనలేరు. వారాలాగు చేసిన యెడల వారు తమ తమ సంఘము నుండి వెళ్ళగొట్టుదురు. కావున వారు దేవుని మహిమ కన్న మానవుల మెప్పును ఎక్కువగా ప్రేమించుదురు. మా సంఘము ఆలాగు బోధించదు లెండి అందురు. అందువలన....
66. ລ້໕໕. అదే ముసలి దయ్యము ఈ రోజు కూడా బ్రతికే వుంది. నిశ్చయంగా, మీరు ఈ రోజు ఉన్నారు. మా అమ్మ కాతలిక్కు, మా అమ్మ ప్రెస్బిటేరియన్. మీతో చెప్పుచున్నాను. ఆమె నా మంచి తల్లి. (మాట సరిగా లేదు).
అమ్మ తనకు వచ్చిన వెలుగులో నడిచినది. కాని సువార్త వెలుగు ప్రకాశించుచున్న దినమున మనము యున్నాము. క్రైస్తవ సంఘముల వేదాంతములు చనిపోవుచున్నవి. అది విఫలమైనది.
ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకొనుచున్నాడు. ఆయన తనను మరల సంఘమునకు బయలుపరచుకొనుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శరీరము. సంఘత్వము నుండి అది పైకి లేపబడినది. చల్లబడిన ప్రతిమల సంఘము నుండి పైకి లేపబడినది. మతోన్మాదము నుండి లేపబడినది దేవుడు ఒక ఎముకల గుంపును బయటకు తెచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఒక చర్మమును కప్పుచున్నాడు. అది ఈ చివరి కాలములో సువార్తను తీసికొని వచ్చును. యుగసమాప్తి పర్యంతము సూచకక్రియలు మరియు అద్భుతములు కనబడును. అవి బైబిలును బోధించును అవి వాటి పక్షముగా నిలబడును. వాటిలో జీవించెదరు. వారు కుడికి గాని ఎడమకు గాని రాజీపడరు. నిజం. వారు వాక్యములోనే నిలిచి యుండి కదలుచుందురు. దేవుడు వారితో అనుదినము ఉండును. వాక్యమును స్థిరపరచుచుండును. అద్భుతములు, మరియు సూచకక్రియలు వెంబడించును. హల్లేలూయా! ఉదయ నక్షత్రములగు మీరందరూ లేచి ప్రకాశించుడి! హల్లెలూయా!
67. మరియు కనిపెట్టు గుమ్మము దగ్గర..... ఇట్లనెను. “ఓ కావలివాడా, రాత్రి ఎంత వేళయినది? అతడనుచున్నాఉ, "రాత్రియునగును, ఉదయము కూడా అగును. గమనించండి. ఎల్లప్పుడు ఉదయమునకు ముందు రాత్రి వచ్చును. అది నిజం. వారు నక్షత్రముల ద్వారా సమయమును చూచుచుండిరి. అది సరిఅయిన సమయమున వేకువ జామున ఒకచోటుకు వచ్చును. వెలుగు ముందుకు వచ్చును. చీకటి ముందుకు త్రోయును. అది చీకటి సమయము వచ్చును. అప్పుడు వెలుగు వచ్చును. పగటికి ముందు ఒక అంధకారము.
నీవు పర్వతములతో పరిచయమున్న మనిషివైనచో... అవును. నేను లెక్క చేయను. ఎటువైపు గాలి వీచుచున్నదో, అదెట్టు వచ్చుచున్నదో, అదెంత బలంగా వీచుచున్నదో నాకక్కర్లేదు. ఆ ఆకాశములకు ఆవల మొదటి సూర్య పుంజము బ్రద్దలవనీ. ఆ మార్గము గుండా తిన్నగా గాలి వీచును. ఆ లోయగుండానే వచ్చును. ఎటువంటి గాలి వీచుచున్నదో నాకు లెక్కలేదు. అది పగటి ఆరంభమందే అక్కడ ఆగును. మార్గము గుండా వచ్చును. ఓ హల్లేలూయా!
సహో॥ ఫంక్ ఒక రాత్రి అక్కడ పరుండి యున్నాడు. సోదరుడు రాజర్సన్, మరియు నేను, ఇంకా మిగతా వారిమి అక్కడున్నాము. నేను బయట నడిచాను. నా చెప్పులు ధరించి యున్నాను. అప్పుడే మరల కేక పెట్టాను. తిరిగి గుడారములోనికి వెళ్ళాను. అక్కడ నిలబడి యుండగా ఒక ప్రత్యక్షత పొందాను. తిరిగి గుడారములోనికి వెళ్ళాను. సహో॥ వుడ్స్ అక్కడ పరుండి యున్నాడు. చాలా ఎక్కువగా నిద్రపోతూ ఉన్నాడు. అక్కడ స్థలము వద్ద పరుండి యున్నాను. చాలా గట్టిగా కేకలు వేయుచున్నాను. వణికిపోవుచున్నాను. ఏదో నేను చూచాను. ఇలాగు అన్నాను, “అవును ప్రభువా, రాత్రివచ్చుచున్నది. పగలు కూడా అగుచున్నది.
68. మనము గొప్ప అణచబడు సమయము గుండా వెళ్ళుచున్నాము. వేదాంతము సంఘములు అన్నీ చెప్పుచున్నవి. "రండి. మాలో చేరండి. రండి మాతో కలవండి. కాని దినము అగుట ఆరంభమగుచున్నది. సుడిగాలివలె వీచుచున్న గాలి వచ్చుచున్నది. ఆ దారి గుండా మరల వచ్చుచున్నది. అలాగున చర్చిలోనికి వచ్చుచున్నది. ఓ! ఇది దినారంభము (హల్లేలూయా) అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి అదే సువార్తను వశపరచుకొనుచున్నది. ఆదిలో ఉన్నది అదే. ఈ రోజు తిరిగి దానిని స్వాధీనపరచుకొనుచున్నది. హల్లెలూయా! ఓ! మనము సీయోను వైపుకు పరుగిడుచున్నాము. సజీవమగు సంఘము వలెను. హల్లేలూయా! నేనది నమ్ముచున్నాను.
69. నేను గోల చేయుచున్నట్లున్నదా? నేను ఒక దాని గూర్చి గోల చేయవలసి యున్నాను. నా సోదరుడా, చెప్పనీయండి. క్రీస్తు యొక్క రక్తము సమస్త పాపము నుండి మనలను శుద్ధి చేసెను. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును ఇప్పటికి ఇరవైమూడు సంవత్సరాలు చూశాను. నన్ను నేను ఆయనకు అప్పగించుకొన్నాను. అపవాది ఏమి చెప్పినా నేను పట్టించుకోలేదు. అది నా హృదయములో లంగరు వేసినట్లయినది. నాకు నేను తెచ్చిపెట్టుకొన్నది కాదు. పరిశుద్ధాత్మయే దానిని అచ్చట పెట్టెను. దేవుడు నా కొరకు సత్యము నిచ్చెను. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నేను వెలుగులో నడచెదను. ఒకరితో ఒకరము సహవాసము కలిగి యుందము. యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధి చేయును.
ఏలననగా ఇష్టపూర్వకముగా పాపము చేయువాడు సత్యమును గూర్చిన జ్ఞానము ఎరిగిన తరువాత కూడా అలాగే ఉండిన యెడల అతని పాపమునకు ఇక బలి ఉండదు.
70. ఇక్కడ వినండి. స్త్రీలారా, పురుషులారా, ఇప్పుడు. నా స్నేహితులారా, క్రైస్తవ స్నేహితులారా, చర్చికి వచ్చినచో చాలును అని నీవు అనుకొనినచో దానినిపుడు ఆపుము. ఆ ఆలోచనను ఆపుచేయుము. నీవు ఊహజనిత మనస్సు కలిగియున్నచో, "నేను నమ్మాను గునుక రక్షించబడ్డాను" అనుకొంటావు. నీకెప్పుడూ అవే చెత్త ఆలోచనలు. లేదా నీవు ఎప్పుడు దేనిని గూర్చియో కలలు కంటావు. నీలో ఏదో పొరపాటున్నది. నీవు హృదయములో నుండి శత్రుత్వమును బయట పడవేయాలి. అలాంటిది ఏదయినా ఉన్నట్లయితే....
"మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. అది నిజం. మనుష్యుడేమి విత్తునో ఆ పంటనే కోయును. అది సత్యము. చేయవలసిన పని ఒకటున్నది. నీవనవచ్చు, "నేను పరిశుద్ధాత్మను పొంది యున్నానని నమ్ముచున్నాను.” కాని అది సాత్వికము అను ఫలమును ఫలించనిచో, లోబడనిచో దయాళుత్వము మంచితనము, క్షమాపణ మొదలగునవి లేనిచో అది నిన్నే నీవు దులుపుకోవలసిన సమయము.
“ఏలయనగా నీవు ఇష్టపూర్తిగా పాపము చేసినచో నీవు సత్య జ్ఞానమును పొందినా గాని నీ పాపమునకు బలి ఉండదు. "నీవది సరిచేసుకోవలెను. అది సరి. నీవు తప్పు చేయుచున్నావని నీవెరుగుదువు. అత్యంత మౌనముగా నీవు అక్కడికి నడిచివెళ్ళి దానిని కొనుగొనుము.
“సరే. ఈ రోజులలో ఏదో ఒక రోజున నేను చూచెదను అనవద్దు. చాలా ఆలస్యము కావచ్చు. నీవు జీవించకపోవచ్చు. అలాంటి రోజులు రావచ్చు. ఇప్పుడు వెంటనే దానిని వెదకి పరిశోధించుము, అది మంచిది దానివైపు చూచి అది సరియో కాదో వెదకుము.
సత్యమయితే అందులో నడువుము. దేవుడు నిన్ను దీవించును.
71. ఒక్క సంగతిని ముందు చెప్పనిమ్ము. ముగించుటకు ఒక్క నిమిషమున ముందు చెప్పెదను. ఈలాగు మిమ్మును ఉంచినందుకు చింతించుచున్నాను. నాకు తెలిసిన కొన్ని సంగతులు చెప్పనిమ్ము. నేను ధైర్యముగా నిలబడి సంగతుల యందు ప్రస్తావించి ఆయా విషయములు కొన్ని సమయములలో మనకు సవాలుగా నిలబడునని ఎరుగుదును. దయ్యములు, శక్తులు ఎదుట నిలబడుదును. ఒక్క సంగతి నేను నిలబడగలిగినది ఉన్నది. బాగా తృప్తిచెందుచున్నాను. ప్రధానంగా రెండు సంగతులు.
ఒక సంగతి నా హృదయాంతరంగము నుండి నేను ఎరుగుదును. నేను వాక్యమును అక్షరాలా బోధించచూశాను. దేవుడు వాక్యమును బోధించు వాగ్దానము చేసెనని నాకు తెలియును. ఎవరు బోధించినా నాకు అక్కరలేదు. ఎక్కడ నుండి అది వచ్చినా గాని పరవాలేదు. దేవుడు గౌరవించును. ఒకవేళ అది వేషధారి నుండి వచ్చినచో ఏమిటి? దేవుడు ఘనపరచును. అది నిజం. ఇది సత్యమని నాకు తెలియును. ఎందుకనగా దీనిని నేను బైబిలు నుండి చదివియున్నాను. ఇది సత్యమని నాకు తెలియును. ఆ తరువాత రెండవ సంగతి ఏమనగా దేవదూత అక్కడ నన్ను కలిసికొని ఇట్లనెను, "భయపడవద్దు. నేను నీకుతోడుగా ఉందును" అది నిజం.
72. కాబట్టి ఏలాగో తెలియక దర్శనములు లేకుండా నడిచిపోయెను. ఎన్ని సంగతుల యందు అలాగు జరిగెను. ఏం చేయాలో తెలియదు. నాకు ఒక దర్శనము వచ్చినప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. కాని ఆయన చెప్పనప్పుడు అక్కడే నేను బయటకు రావలెను. వ్యతిరేకమునకు అది ఒక సవాలు అక్కడే నేను ఆలోచించవలసి ఉండును. ప్రభువా, నేను వెనుకంజ వేయలేదు. కాని దేవుని యొక్క చిత్తమంతటినీ ప్రకటించి యున్నాను. ఈ బైబిలులో ఉన్న సమస్తము నీవు చేయమని చెప్పగా దానిని నేను వెంబడించుటకు ప్రయత్నించాను. కాబట్టి ప్రభువా, నా హృదయములో నీ వాక్యకమున్నది. నీ వాక్యమును నీవు నెరవేర్చు బాధ్యతే నీదే. నేను ఏదయినా చేయుదనని దానిని జరిగించని యెడల ప్రభువా, అది నాకు దాచబడినది. నేను నీతో నడుచుటకు ప్రయత్నం చేశాను. దానిని నీవు గౌరవించావని నాకు తెలియును. అంతా గౌరవించావు.
జనులతో చెప్పాను. కొన్నిసార్లు ఎంతో ఎక్కువగా నన్ను బాధించినప్పటికిని జనులకును చెప్పాలి. నేను వారితో చెప్పాను. ఏమనగా గాని అది వాక్యము. నా మట్టుకు నేను చేస్తేనే గాని వారిని చెయ్యమని నేను చెప్పను.
ఆ విధంగా నడిచి వెళ్ళాను. ఇంకొద్ది ముందుకు వెళ్ళాను. నేననుకొన్నాను ప్రభువు... చూడండి ఆ శక్తి అవతల నిలచి యున్నది. ఆ అపవాది నిన్ను సవాలు చేయుటకు సిద్ధముగా యున్నది. తన దగ్గరకు రమ్మని ఒక సవాలు విసరుచున్నది. “ప్రభువా, అది నామాట కాదు. అది నీది. నేనిపుడు నిలబడియున్నాను. ఆ బయట నిలబడి యున్నాను. నా సమయం తీసికొన్నాను.
అక్కడికి వెళ్ళాను. అనుకొనుచున్నాను, ఓ దేవుని దూతా, నీ సన్నిధిని దగ్గరకు రానీ అ ఘడియలలో నన్ను రక్షించుటకు పంపబడిన నీ సేవకుడు. నేను వెళ్లిన యెడల అక్కడ నీవు వాగ్దానము చేసియున్నావు. నీవు నాతో ఉన్నానని చెప్పియున్నావు.
కావున నేను అక్కడే నడిచెదను. యేసుక్రీస్తు నామమున సత్యమును చెప్పుచున్నాను. దయ్యములు కేకలు వేయుచున్నవి గమనించండి. సంగతులు జరుగుచున్నవి. ఎందుకనగా దేవుడు తన మాటకు బద్ధుడై యున్నాడు.
73. ఈ సంగతులు నిజమని నేను ఎరిగిన యెడల బాప్తీస్మములు వంటివి పొందెదను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఈ ఇతర కార్యములు మరియు సంగతులు సత్యమని ఎరుగుదురు. వీరి మధ్య నేను పేరు పొందగోరాను... ఎవరో నా వీపు నిమిరెదరు. “డాక్టర్, రెవరెండ్ లేదా బిషప్ మరేలాగయినా పిలవనీయండి. నీవు మంచి ప్రసంగము అందించావు. మనుష్యులు పొగడుదురు. నిమురుదురు.
వారు నావైపు చూచి నవ్వనీ లేదా కేరింతలు కొట్టనీ. నన్ను అన్ని రకాల అపహసించనీ. నేను దేవునికి సత్యముగా నిలచానని నాకు తెలియును. నాకు దేవుని యొక్క ప్రశంస చాలు. సత్యము ప్రకటించుటకు నేను వెనకాడలేదు. దేవుని నేను పొగడుచున్నాను. దానిని నీవు త్రోసివేసినచో అది నీ బాధ్యత చూడు ఇది నిజం.
74. రానున్న ఉజ్జీవములో సువార్త సత్యమును మీకు చెప్పెదను. “ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ఎట్టి విధముగాను ప్రవేశించలేదు. పరిశుద్ధ యోహాను సువార్త 3వ అధ్యాయములో యేసుక్రీస్తు మాటలు. గొప్ప మతబోధకుడగు వానితో ఆయన చెప్పెను. మతాసక్తిగలవాడు బాగా తెలిసిన వ్యక్తి. నీతిమంతుడు ఒక బోధకుడు. ఒక పడింతుడు. అతనిని నీవు ఎలాగయినా ఊహించవచ్చు. కాని యేసు అతనితో చెప్పినదేమనగా అతడు నిత్యజీవము కలిగియుండడు. ఎందుకనగా అతడు... అతనికి అది అర్థము కాలేదు. "ఒకడు తిరిగి జన్మించితేనేగాని" అతడు దేవుని రాజ్యమును చూడనేరడు. అతడెంత మంత భక్తిగలవాడైననూ అంతే. అతడు అతిపెద్ద సంఘమునకు చెందినవాడు. అతడు గొప్ప పేర్లలో ఒక పేరు కలిగి యున్నాడు. అతడు బైబిలు ఉపదేశకుడు. అయినా గాని అతడు క్రొత్త జన్మ అనుభవమును చూచియుండలేదు. ఈ రాత్రి నీకున్నదా?
75. నిన్ను నేను ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను. సూటిగా అడగదలచు కొన్నాను. నిన్ను సిగ్గుపరచుటకు ఇది నేను అడగదలంచ లేదు. అక్కడ నేను సిగ్గుపడుట కంటే ఇక్కడే సిగ్గుపడదలచుకొన్నాను. నీవును అలాగే చేయవా? ఈ రోజు ఇక్కడ చాలా మంది పరిశుద్ధాత్మ బాప్తిస్మమును వెదకుచున్నారు.
నన్ను బాల్యము నుండి ఇక్కడ చాలామంది గమనించుచున్నారు. ఒక చిన్న పెద్ద కుర్రాడిని. నా యుక్త వయసులో ఉన్నాను.... సువార్త క్రటించుచున్నాను. ప్రారంభము మొదలుకొని నేటివరకు చిన్న పోచకూడా నేను తప్పిపోలేదు. ఇంకా నేను అదే బోధించుచున్నాను. ఎందుకనగా ఒక సెమినరీ నాకది ఇష్టం లేదు. ఒక మనుష్యుడు నాకు దానిని నేర్పలేదు. బైబిలు ప్రత్యక్షత నుండి అది వచ్చియున్నది. అది నిజం. కాబట్టి అది దేవుని నుండి వచ్చినదని తెలియును. అదే సువార్తతో నేను నిలచియున్నాను.
76. చాలా సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నామములో నీటి బాప్తీస్మమును నేను బోధించాను. యేసుక్రీస్తు రక్తము ద్వారా మానవ ఆత్మను శుద్ధిచేయుటను
నేను బోధించాను. అదియే శుద్దీకరణ. పరిశుద్ధాత్మ బాప్తీస్మము ఒక ముద్రగా ఉండుటను బోధించాను. దేవుని ప్రజలు దూరంగా ఉండుట రాజ్యములో ఉ డుట చూశాము. అది నిజమని మీరెరుగుదురు. దైవిక స్వస్థతను బోధించాను. రెండవ రాకడను బోధించాను. పాదములు కడుగుట భోధించాను. ప్రభువు ఎదుట పరిశుద్ధముగా ఉండుట బోధించాను. ప్రారంభము నుండియే అన్నియూ నేను బోధించాను.
భాషలతో మాట్లాడుట నేను నేర్పాను. పరిశుద్ధాత్మ యొక్క సూచన కాదు. చప్పట్లు కొట్టుట నేర్పాను - పరిశుద్ధాత్మ సూచన కాదు. ఇందులో ఏదియూ పరిశుద్ధాత్మకు సూచన అని నీవు చెప్పలేవు... ఒకే రుజువు. అక్కడ పరిశుద్దాత్మ యొక్క రుజువు ఉండవచ్చును. పాడుట రుజువు కావచ్చును. మాట్లాడుట పరిశు ద్ధాత్మ రుజువు కావచ్చును. ఏ సూచన అయినా కావచ్చును. అయినా గాని అది తప్పిపోయినది కాదు. అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది అని చెప్పకలిగినవారు ఒకే ఒకరున్నారు. ఆయన దేవుడే, ఆయనే న్యాయాధిపది. వారు పాటలు పాడుట చూశాను. మాట్లాడుట చూశాను. వారు అల్లరి చేయుట చూశాను. వారు భాషలతో మాట్లాడుట చూశాను. అన్నీ చూశాను. అయినా గాని.. వారి ఫలములు వారు సరికారని చూపించినవి.
77. మీకు విశ్వాస మంతా ఉన్నది. "నాలో నమ్ముటకు దానిని కావలసి యున్నాను". దానిని దేవుడెరుగును. నీవది కలిగియున్నావని నేను నమ్ముచున్నాను. నీవు నమ్ముటకు కావలసిన విశ్వాసమంతా నీకున్నది. నీకు దయ ఉన్నది. ప్రేమ ఉన్నది. మాధుర్యమున్నది. అంతా యున్నది. మీరు క్రైస్తవ జనులని నాకు తెలియును. మీరు పరిశుద్ధాత్మ కలిగి యున్నారు. దానిని దేవుడెరుగును. నేను అవనమ్మకము లేనివాడనే ఆ విషయములో, కావున వీటి ద్వారా మనము తీర్పు తీర్చలేము. దేవునిని నొక్కి ఇది ఇదే అని మనము తీర్పు తీర్చలేము. మనం అందుకు పంపబడలేదు. మనము బోధించుటకు పంపబడ్డాము. అవును గదా! అది సరియే. బోధించుటకు!
నేను సత్యమును తీసికొని రాగలను. దానిని నీవు తిరస్కరించి, నడచి వెళ్లిన యెడల బైబిలు ఏమి చెప్పుచున్నదో ఎరుగుదును. మరల దానిని సరిచేసికొనువరకు పాప క్షమాపణ ఉండదు. అది అక్షరాల నిజం. కావున నీవు సత్యమును చూచి, నడచి వెళ్లిపోరాదు.
78. ఇప్పుడు నీవు వచ్చుచున్నప్పుడు ఒక విషయం నేను అడుగుదును. ఇక్కడున్నవారిలో ఎందరు, బిల్ సోదరుడా, పరిశుద్ధాత్మ యొక్క నిజ బాప్తిస్మము కావలెనని ఎందరున్నారు? జనుల యెదుట తేటగా ఎందరు ఒప్పుకొందురు? ప్రజలు తెలిసికొనవలెనని, ఖచ్చితముగా ఎరుగవలెనని ఎందరనుకొనుచున్నారు? నీ హస్తము ఎత్తెదవా? నిజమైనది నాకు కావలెను. దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు మనకు ఉజ్జీవమునకు ఒక అవకాశము యున్నది. స్నేహితులారా, వినండి. ఈలాగు అనకండి. నేను చాలా చల్లగా ఉన్నాను. ఆ సోదరి వలెనె నేను అయితే, అందుకొరకు ఇటు చూడవద్దు. సోదరి అలాగే పొందినది.
79. పవిత్రమైన హృదయముతో యేసు నీ రక్షకుడని నమ్ముచూ రమ్ము. ఆయనను అంగీకరించావు. దేవుడు తమను బలపరచాడని నమ్ముము. నీవు పరిశుద్ధాత్మ బాప్మిస్మము పొందుదువు. దానిని ఆయన నీకు ఇచ్చును.
ప్రభువుతో ఈలాగు చెప్పుము, "ప్రభువా, నేను, ఏలాగు నీవు దానిని నాలో పోసినప్పటికిని, నాకు కావలసింది పరిశుద్దాత్మ. నాకు కావలసినది అదే. ఈ స్వార్ధమును దూరంగా తీసివేయగలిగిన దానిని నాకు ఇమ్ము. ఈ భయము మరియు సంకోచమును తీసివేయునది ఇమ్ము. నా ప్రభువా, నన్ను ఆలాగు మరియు సంకోచమును తీసివేయునది ఇమ్ము. నా ప్రభువా, నన్ను ఆలాగు చేయకుము.... నీవు నన్ను గట్టిగా ధ్వనింప చేసినచో, ఇతరులు అలాగే చేసిరి. అది జీవించదు. నన్ను భాషలతో మాట్లాడు వానిగా చేయకుము. ఇతరులు భాషలతో మాట్లాడుట చూచాను. దానిని వారు నమ్మలేదు. కాని ప్రభువా, నాలో జీవించునది ఉంచుము. ప్రతిరోజు క్రైస్తవ నడక నేను నడుచునట్లు చేయుము. భాషలు చూచాను కాని వాటి సాధకము చూడలేదు. నా శత్రువులను ప్రేమించునట్లు చేయుదును. నన్ను
చెడ్డగా మాట్లాడువారిని గూర్చి మంచిగా మాట్లాడేదను. నేను చేసిన ఏ తప్పయినా గాని ఒప్పుకొని పశ్చాత్తాపపడుతును. తిన్నగా వచ్చి ఒప్పుకొందును. నాది తప్పు దేవా నన్ను క్షమించుము".
అలాటి ఆత్మ మనకు కావలెను. అవునా? నన్ను దీనుని చేయుము. నాలో ఏదయినా పొరపాటు నా సంఘ కాపరి చూచినచో అతడు వచ్చి సోదరుడా, సోదరీ, నీవు ఈలాటి పనులు చేయరాదు. దీనునిగా చేయుము. అవును, నా సోదరుడా, ఇప్పుడు నాకు సహాయము చేయుము. నా పైని ఆలాటి ఆత్మ ఉ ండకూడదు.
అలాటి ఆత్మ నాలో ఉండరాదు. నీకున్నదా? ఆలాగు గర్వముతో నీవు వెళ్లరాదు. "అతనికి నాకు చెప్ప పనేమి ఉన్నది? నా సంగతి నాకు తెలుసు". ఆలాగన్నచో స్నేహితులారా, దేవుని చిత్తమునకు వెలుపుట ఉన్నావు. ప్రారంభములోనే నీవు పొరపాటులో ఉన్నావు అని చూడగలవు.
80. ఎందుకు అణకువతో ఉండకూడదు? నిన్ను నీవు పరిశుద్ధాత్మకు వంచుకొనుము. ఇట్లనుము, "అవును, దేవుని యొక్క పూర్తి సజీవ సంఘముతో చేతులు ముడుచుకొందును. నేను ముందుకు సాగెదను. నా సోదరిపైన ఏదో పొరపాటు ఉన్నది. నేను ప్రార్థించుదును నా సోదరిలో ఏదో పొరపాటు కనబడుచున్నది. నేను వెళ్ళుచున్నాను. అతడు ఆలాగు కొనసాగినచో అతని ఇంటికి వెళ్ళి ఈలాగుందును. "ప్రియ సోదరుడా, ఒక్క నిమిషం నీ చేతిని పట్టుకోనీ, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రేమించుచున్నాను. అవును, నిన్ను నేను ప్రేమించుచున్నాను. నీకు తెలియును మనము వయస్సు మీరుచున్నాము. మనము... అతడు దయ్యము యొక్క నరములోనికి వెళ్ళగోరుట లేదు. నీవు ఒక ప్రత్యేక సంగతి జరిగించుట గమనించి యున్నాను. దానిని గూర్చి నీవు మరియు నేను ప్రార్థించుదం" చూడండి. అలాంటి విషయమే.
అయితే సోదరుడు నిన్ను చేర్చుకొననిచో దానికి నీవేమీ చేయలేవు. అపుడు ఒక సోదరుని నీవు కూడా తీసికొని వెళ్ళి అతడు కరుకుగా ప్రవర్తించినచో నీ
భాగము నీవు నిర్వర్తించినట్లే. అంతే, అప్పుడు వెళ్లి చర్చికి చెప్పుము. అది దానిని సరియేయును. చూడండి.
81. నీవు మంచిని మరియు క్షేమమును ఎరుగుదువు. ఇక్కడ కూర్చొని యున్న ఈ చిన్న గుంపు జనులు, సర్వశక్తుని యొక్క హస్తమును చూచి యున్నారు. ఇక్కడికి నేరుగా వచ్చిన జనులను మీరు చూచియున్నారు. పరిశుద్ధాత్మను పొందియున్నామని చెప్పుకొని యున్నారు. అది నీవెరుగుదువు. వారిక్కడికి నడిచివచ్చి కోపగించారు. మనస్పర్థలతో యున్నారు. చాలా జరిగినవి. బయటకు వెళ్ళిపోయారు.
నేను తిరిగి వచ్చినప్పుడు, సంఘకాపరి ఇట్లనెను, “ఇంకోరాత్రి” వెళ్ళి ఆయనను చూచావా?
“అవును”
మరి “ఎవరినైనా తీసికొని వెళ్ళావా?”
“అవును”
సహో॥ షెల్బీ దాని గూర్చి చెప్పుట నాకు గుర్తున్నది..... ఇతరులు వేర్వేరు మనుష్యులు జనుల యొద్దకు వెళ్లి ప్రయత్నించారు.... నేను జనుల యొద్దకు వెళ్లాను. ఓ! వారు నన్ను అపహసించిరి. అనరాని మాటలు అనిరి. నేనన్నాను, “ఇప్పుడు చూడు, నా ప్రియ స్నేహితుడా ఇది పనికిరాదు”.
“నీవు ఇప్పుడే లోకములోనికి వెళ్ళివచ్చావు. నీవు వెనక్కి జారితివి. నీవు ఈలాగున్నావు. ఆత్మలు నీకు రక్షించబడుట లేదు” “ఈలాగున్నది” “అనుకొనేదంతా వేరుగా ఉన్నది....”
“నడిపించుటకు నేను పరిశుద్ధాత్మను నాయకత్వముగా ఉపయోగించు చున్నానని నీవనుకోవటం లేదా?” అనడిగాడు.
"ఓ! నీది తప్పు!! నీవు ఇది, మరేదో. నీవు నాకు లోబడవలెను. నీవేమి చేయవలెనో నీకు చెప్పేవాడిని నేనే.
82. అప్పుడు నీకు వెంటనే అది దయ్యమని తెలియును. ఇక్కడ నుండి చూడు. ఇప్పటి నుండి చూడు. నీవు సంఘములో సమాధాన పడుటకు ఒప్పుకొననిచో (వారు నిన్ను ప్రేమించుదురు) కాని నీవు తిరిగి వెనక్కు రానియెడల గుర్తుంచుకొనుము. మీలో ప్రతి ఒక్కరి యొద్దకు నాలుగయిదు సార్లు వచ్చి యున్నాను.
అపుడు నేను ఇతరులను కూడా తీసికొని వెళ్ళియున్నాను, మిమ్మును సమాధాన పరచవలెనని ప్రయత్నం చేశాను. దానిని ఇపుడు నేను సంఘము ఎదుట చెప్పుచున్నాను. ఇకనుండి మీరు పాపులవలె, అన్యుల వలె అగుదురు, అది దేవుని వాక్యము. అదెంత తియ్యగా వినబడినా గాని అది దేవుని వాక్యము.
అంతట నేను సంఘము యొద్దకు వెళ్ళాను. ఇట్లన్నాను, “ఇక్కడి నుండి ఈ జనులు మీ సోదరులు కారు, సహోదరీలు కారు. ఎందుకనగా వారిక తమ్మును తాము మా నుండి వేరు చేసికొని యున్నారు. ఆత్మ లేనట్లు కనబడుచున్నారు. ఆరిపోయారు. “జరిగినది మీరెరుగుదురు. అది నిజం. ఏమి జరిగినదో చూచి యున్నారు.
83. నీవు దేవుని వాక్యము చుట్టూ వెళ్ళలేవు. ఒక ప్రత్యేకమగు పని చేయుమని దేవుడు నీతో చెప్పినప్పుడు అక్షరాలా దేవుడు ఆ భావమునే జరిగించును. అది నిజము.
కావును ఇపుడు మనము ఏకమగుదం. ఇక్కడ ఒక గుంపు జనులుగా మనమున్నాం. ఈ చిన్న పాత ఆలయములో, కారణము... నా పేరును ముందునుండి తీసివేసినచో వారు కేవలం దానిని అక్కడ పెట్టిరి. మీరేదయినా పిలుచుకోండి. నాకేమీ తేడా కనిపించదు. “చర్చి” అని పిలవండి. “మీ ఇష్టమది. అది బ్రెన్హాం ఆలయమని పిలువబడనక్కర్లేదు. దానికి బ్రెన్హాంతో ఏమీ సంబంధము లేదు. ఇంటి పట్టా ఆలాగున్నది గనుక అక్కడ నా పేరు మీద దానిని సిద్ధపరచారు.
నేనక్కడికి వెళ్లి కష్టకాలములో అక్కడ పని చేశాను. వారు తమ దశమ భాగములు తెచ్చిరి. దానిని నేను ఉంచుటకు బదులు, పని చేయలేదు. నా స్వంత దశమభాగములుంచాను. నా అర్పణలుంచాను. డబ్బు వేశాను. ఇక్కడ ఆలయం
నిర్మించాను. నేను జీవించుటకు ప్రజలు తమ ధర్మమును ఇచ్చారు. నేను పనిచేసి మరల ఆలయంలోనే ఉంచాను. ఆ కారణము చేతనే వారు బ్రెన్హాం ఆలయము అని పిలుచుచున్నారు. దానితో వారికి ఏమీ సంబంధము లేదు. అది నెవిల్ ఆలయమన్నా పరవాలేదు. మీ ఇష్టము వచ్చినట్లు పిలవండి. ఏమీ బేధము లేదు. అది దేవుడు మనకిచ్చిన ఒక చిన్న స్థలం. మన తలకు ఇచ్చెను.
ఇక్కడికి మనం వచ్చి ప్రభువును ఆరాధించుదాం. మనకు తెలిసినంత సత్యముగా బైబిలులో బోధించుదం. సోదరుడా, దేశ దేశాలు దాటి ప్రతి స్థలములోను సవాలు విసరబడినది. ప్రతి స్థలములోను నానా విధములుగా చాటబడుచున్నది దేవుని వాక్యము అదే రీతిగా ముందుకు కదులుచున్నది. నిర్మలముగా వెళ్ళుచున్నది. సంపూర్తిగా వెళ్లుచున్నది. కల్తీ లేదు. నిక్కచ్చిగా యున్నది. ఇప్పుడే మీరు మాతో చేరండి. సంఘములో చేరుడి. మమ్మును కలవటం కాదు. కాని వచ్చి యేసుక్రీస్తును చేరండి. ఆయనను ప్రేమించండి. రోగులను బాగు చేయుటకు దేవుడు తన వాక్కును అంత గౌరవించి గ్రుడ్డివారిని, బాధపడుచున్నవారిని, ప్రపంచమంతా అట్లు దేవుడు తుడిచి ముట్టుచున్నచో నిశ్చయముగా ఆయన తప్పు చేయుటకు నన్ను వెళ్ళనియ్యడు. ఆలాగు ఆయన వెళ్ళనిచ్చునా? అది ఇక్కడే సూటిగా ఉన్న యెడల దేవుని వాక్యములో వ్రాయబడినచో, దానిని తిరస్కరించనిచో, నా సోదరుడా దానిని చేర్చుకొనుము. ఎందుకనగా అది ప్రభువైన యేసుక్రీస్తు.
84. మరియు మరందరూ, పరశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము పొందుడి. మనందరం ఆనందకరమగు ఒక సంతోషకర పెద్ద కుటుంబముగా ఉందం. వచ్చిమీరు ఈలాగు చెప్పకండి, "నేను పరిశుద్ధాత్మను పొందాను. దేవునికి మహిమ-ఇప్పుడు నేను వరములు కలిగి యుండబోవుచున్నాను, వరముల జోలికి వెళ్ళకండి. వాటి సంగతి అవి చూచుకొనును. చూడండి. దేవుడు ఆయన నిన్ను దేనికయినా వాడుకొనుటకు చూచినచో నీకు ఏమి చేయవలెనో ఆయన చెప్పును. అలాగు చేయును. ఒక అద్భుత కరమగు సమయము రానైయున్నదని నేను నమ్ముచున్నాను. మీరు నమ్ముట లేదా?
85. ఇప్పుడు, క్షమింపబడరాని పాపమనగా ఏమిటి? ఇష్టపూర్వకముగా పాపము చేయుట. సత్యమును గూర్చిన జ్ఞానము పొందిన తరువాత కూడా. అది నిజమేనా? "ఏలయనగా ఆలాగు పాపము చేయువాడు...." పాపమనగా ఏమిటి? అవిశ్వాసము. దానిని నీవు చూచి ఈ లాగున్నప్పుడు, "అది సత్యము” దానిని నీవు చేర్చుటకు నిరాకరించావు. "పాపము చేయువాడు, లేదా ఇష్టపూర్వకంగా అవిశ్వాసముంచువాడు సత్యమును గూర్చిన జ్ఞానమును పొందిన తరువాత కూడా అలాగున్నచో ఇక ఆ పాపమునకు బలి ఉండదు. అది సత్యము. అక్కడ అది యున్నది. అది అక్షరాలా నీవు వచ్చినట్టేయున్నది.
ఇక్కడ అదే విషయమున్నది. ఒక పెద్దపనిలో మనం చూద్దాం. తరువాత నేను ముగించెదను.
అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయనను అంగీకరించుట జీవము. ఆయనను తిరస్కరించుట మరణము. నీవేమి చేయగోరుదువో, అదే చేయుము. నేనది నమ్మను అనవచ్చు. నేను విశ్వసించనని నీవు చెప్పవచ్చు. నాకది వద్దు అనవచ్చు. నీవు వద్దన్నచో అది నీ ఇష్టం. నీకు జీవముండదు. అంతే ఎందుకనగా అది సత్యము. అది నిజం మంచిది కదా.
మరే ఇతర సత్యమునకయినా అంతే. అది నిజం. తిరస్కరించుట అనగా త్రోసివేయుటయే. దేవుని వాక్యమును అవిధేయతగా ఎంచుట. అది క్షమించబడరాని నేరం. నీకిక ఏ హక్కు ఉండదు. ఆయన క్రీస్తు అని నీవు నమ్మలేదనినచో నీవు పశ్చాత్తాపపడు వరకు రక్షించబడవు. ఆయనకు నిన్ను నీవు శాంతపరచుకొనవలెను. నీవనవచ్చు... ఇది దేవుని సత్యము అది నీకు ఇయ్యబడినది. నేను అది నమ్మను అని నీవు చెప్పవచ్చు. అయితే నీవు పశ్చాత్తాపబడి సత్యము నొద్దకు వచ్చువరకు నీవు దేవుని నుండి నరికివేయబడుదువు. అది నిజమేనా?
86. మంచి ప్రభువు మిమ్ము ఐశ్వర్యముగా ఆశీర్వదించునుగాక! నిన్ను ఆరోగ్యముగా ఉంచును గాక!
నేను వెళ్ళిపోయిన తరువాత నా గూర్చి ప్రార్ధించండి. (మీరాలాగు చేయుదురా?) దేవుడు నాకు క్షేమము ఇచ్చునట్లు. ఉజ్జీవము కొరకు మరల సురక్షితముగా తిరిగి వచ్చునట్లు. వ్రాయబడిన దేవుని సత్యము యొక్క ప్రాతిపదిక మీద క్షేమముగా తిరిగి వచ్చుదుము గాక! రానున్న ఉజ్జీవమును స్థాపించుదుము గాక! మనము శిరములు వంచి యుండగా దేవుడు మిమ్ము దీవించును గాక!
సహో॥ టెడ్డీ ఒక్క నిమిషం ఇక్కడ పియానో దగ్గరకు అడుగు వేయుదువా? ఒక విధమగు చిన్న సంగీతము అందించు. ఇప్పుడు మనం ప్రార్ధనలో ఉందము,
87. తండ్రీ! అంత దీర్ఘమగు, పొడవాటి వాక్య సందేశమును గట్టిగా ఇచ్చియున్నాను. నరికియున్నాము. మొదటిసారిగ కూటములోనికి పరిశుద్ధాత్మ వచ్చుటను అనుభవించియున్నాము. మనలను ఆశీర్వదించుయున్నాడు. ఉపదేశపు ప్రారంభములోనే ఆయన ఇచ్చట యున్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడని ఎరుగుదును. ఆ తరువాత ఆలోచించాము. వాక్యమును త్రిప్పియున్నాము. క్షమించబడని పాపము ఏమిటో అసలు కారణమును చూచాము. అనగా దేవుని వాక్యమును త్రోసివేయుట మరియు అవిధేయులగుట.
అపుడు తండ్రీ, దాని వైపు మేము చూచాం. ఆలోచించాం. ఓ దేవా, సమస్త అవిశ్వాసము నుండి పవిత్రపరచుము. ఈ బైబిలు నీ వాక్యమని నన్ను నమ్మనీ. వ్రాయబడిన వాక్యము మా యొక్క దిద్దుబాటు కొరకు, హెచ్చరిక కొరకు ఇయ్యబడినదని నన్ను నమ్మనిమ్ము. ఆలాగయితేనే మనుష్యుడు దేవుని ఎదుట నిందారహితుడుగాను, నిలబడుగలడు. ఇదే పుస్తకము నుండి తీర్పు తీర్చబడుదుమని ఎరుగుదము.
ఆయనిట్లు చెప్పెను, "ఈ గ్రంథములో వ్రాయబడినవి గైకొనువారును, వాటిని చేయువాడును ధన్యులు” అట్టివారే జీవవృక్ష ఫలమునకు హక్కు కలిగి యుందురు. కాని ఎవరైతే వాటిని చేయరో వారు కుక్కలుగాను, మాంత్రికులుగాను, ఎంచబడుదురు. వారు వెళ్ళగొట్టబడెదరు. వారి అంతము అగ్నితో కాల్చబడుటయే. ఈ మాటలను గైకొనువాడు ధన్యుడు. ఈ గ్రంథము నుండి తీసివేసినది మరొక
దానితో నింపబడినచో వాని పేరును జీవగ్రంథములో నుండి తీసివేసి పేరు కొట్టివేయబడును. కాని ఎవరైతే ఈ ఆజ్ఞలను అనుసరించుదురో, వాటిని గైకొందురో వారు జీవవృక్షమునకు హక్కు కలిగి యుందురు.
దేవా, దానిని అనుగ్రహించుము. ఈ సంఘములో ఈ రాత్రి దానిని దయచేయుము. ఎల్లప్పుడు బైబిలు వెలుగులో నడచుదురు. బైబిలు చెప్పిన కార్యములే చేయుదురు. కుడికిగాని ఎడమకు గాని చూడరు. లేదా అపనమ్మకముంచరు. ఏది అయితే నీ వాక్య సత్యమై యున్నదో, తండ్రి అది మాకు దయచేయుము.
ఇప్పుడచ్చట చాలా చేతులున్నవి. ఓ, డజను లేదా అంతకన్న ఎక్కువున్నవి. చాలామంది పైకెత్తియున్నారు. డజను కంటే ఎక్కువమంది పైకి లేపియున్నారు. పదిహేను లేదా ఇరవై మంది పరిశుద్ధాత్మ బాప్తిస్మము కోరుచున్నారు. ప్రభువా వారు ఆకలిగొని యున్నారని ఇది రుజువు చేయుచున్నది. నీవు చెప్పియున్నావు”. ఆకలిగొనిన వారు ధన్యులు. ఎందువలన? పరిశుద్ధాత్మ వారితో మాట్లాడియున్నది. వారు నిజంగా ఆకలికొనియున్నారు. దేవుడు వారితో యున్నాడని వారెరుగుదురు? దేవుడు వారికి ఏ ఆకలిని తీర్చుచున్నాడు. ఓ! వారికి తెలియును ఒకడును మనుష్యుడు ఏలాగు ఆకలికొనునో ఆ ప్రకారమే ఒకడే ఆహారము కొరకు వెదకును.
ఇప్పుడు తండ్రీ! ప్రతి ఒక్కరిని నింపుమని నేను ప్రార్థించుచున్నాను. వారు పరిశుద్ధాత్మతో నింపబడుచున్నట్లు చేయుము. ఉజ్జీవము ఆరంభము కాకముందే నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. ఈ రాత్రి కూటము అయిపోకముందే ప్రభూ దానిని అనుగ్రహించుము. ఇక్కడున్న ప్రతి మానవ మాత్రునిపై పరిశుద్ధాత్మ వచ్చునట్లు చేయుము. ప్రతి హృదయమును నీ శక్తితోను, నీ స్తుతితోను నింపుము తండ్రీ, అనుగ్రహించుము.
మా మధ్యలో ఉన్న రోగిని స్వస్థపరచుము. దేవా, మాతో ఉండుము. మమ్మును దీవించుము. మా ప్రియ సోదరుడు నెవిల్ను దీవించుము. ప్రభువా, ఆయనను ఇంకా దీనునిగా చేయుము. ఆయనకు అద్భుతమగు శక్తికరమగు ప్రసంగములు ఇమ్ము. నీవు సంఘమునకు ఇచ్చుచున్నావు. ఉపదేశములు
అనుగ్రహించుము. అది యేసుక్రీస్తు యొక్క స్వచ్ఛమగు, యుక్తమగు, కల్తీలేని సువార్త అని ఎరుగుదుము. దేదా దీవెనలను ఆయనపై కుమ్మరించుము, ఆయన భార్యను కుటుంబమును ఆశీర్వదించుము. మమ్మునందరిని ఆశీర్వదించుము. పెద్దలను దీవించుము. ప్రతి ఒక్కరిని దీవించుము. ఏలయనగా యేసు నామమున మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
ఇప్పుడు సహో॥ టెడ్డీ, మనం...
88. నెవిల్ సోదరుడా నీకు చెప్పుటకు ఏమైనా ఉన్నదా? తరువాత శనివారము ప్రసారము కొరకు ఏమైనా చెప్పవలెను? అంతా నేను అనుకొచున్నాను. (సహో॥ నెవిల్ అవునని చెప్పుచున్నాడు. వచ్చే శనివారం ప్రసారం కొరకు, ఎంతమంది ప్రసారంలో సహో॥ నెవిల్ను వినుచున్నారు? ఆయనను వినుచున్నారను కొనుచున్నాను. ఒక అరగంటయినది. అవునా? అవును, ముందుకు. (ఈ రాత్రి ప్రసారమునకు ఏమయినా ఇవ్వవలసి యున్నచో కూటము అయిపోయిన తరువాత నాకు అందియ్యండి. దానిని మేము ప్రశంసించుదము. శనివారము ప్రసారము కొరకు సరిపడు డబ్బు లేదు. కాని సమయము వచ్చినపుడు ఆమొత్తము వచ్చునని తలంచుచున్నాను. దాని కొరకు ప్రభువుకు వందనములు. ఇప్పుడు ప్రభువు మిమ్మును దీవించును గాక).
సహో॥ నెవిల్, ప్రజలు వెళ్లు దారిలో తలుపు దగ్గర నిలబడి యున్నాడు. దానికొరకు వారు ఏదయినా సంపాదించినచో సోదరుడా, మంచిది. కావున నీవు దానిని పొందియున్నావని ఇప్పుడు నీవు నిశ్చయత కలిగియుండవచ్చును. ఇప్పుడది ఆ ప్రసారము కొరకు, అతడు గాలి ద్వారా మాట్లాడ ప్రయత్నించుచున్నాడు. అతడు జనులను అచ్చట కలిసికొనును. ఆ ఆలయమునకు రాలేని వారిని అతడు కలిసికొనును.
చాలాసార్లు నేను ప్రయత్నము చేశాను.
ప్రజలు అందురు, “రెవ, బ్రన్హాం సోదరుడా, దయచేసి వచ్చి నా కొరకు ప్రార్థించుదువా?”
"ఆలయము నొద్దకు రమ్మని” నేను చెప్పుచున్నాను.
“అయితే, నాకు ఆలాగు చేయుటకు సమయము లేదు" మీరెరుగుదురు.
"అర్థమయిందా? వారు మరీ మెడవంచని మనుష్యులు. సంఘము సమయం ఈలాగు చేయుటకు తమ్మును తాము తగ్గించుకొందురు. ఇది అక్షరాల నిజం వారి సంఘ కాపరి చెప్పవచ్చును. ఇక్కడ ఎవరైనా పట్టుకొనవచ్చును. వారు తప్పు సహవాసములోనికి పోదురని భయపడుచున్నారు. వారాలాగు తలంచినచో వారు ప్రార్ధన వలన ఏలాగయినా ఏ మేలు పొందజాలరు. ఇది నిజం.
నయమానుతో ప్రవక్త ఏమి చెప్పెనో నీవెరుగుదువువా? వెళ్ళి యోర్ధానులో మునుగుము. యోర్ధానులో మునుగుము. అది మురికితోను బురదతోను నిండిన నీరు.
“నా దేశములోని నీరు వాటిన్నిటికన్న శుభ్రమైన నీరు”
నీ కుష్టరోగముతో నీవు అచ్చటికి వెళ్ళుము. (అది సరి) అయితే అతడు తనను తాను తగ్గించుకొని బురద యోర్ధానులోనికి నడచి వెళ్లెను. ప్రవక్త చెప్పినట్లే ఏడు మారులు మునిగెను. అతనికి కుష్టరోగము పోయెను. అది అక్షరాలు నిజం. దేవుడు కృప చూపెను.
89. ఓ! నా స్నేహితులారా, ఆ రోజు వచ్చుట నేను చూచుచున్నాను. ఇక్కడ నా వయస్సు జారిపోవుచున్నది. సమస్తమూ జరుగుచున్నది. నేను ఏమి చేశాను? నేను ఏమియూ చేయలేదను అనుభూతిని పొందియున్నాను. ప్రభువైన యేసుకొరకు నేనే ఏదో చేయవలెను. ఏదయినా నేను చేయవలెను. నా హృదయం నాలో చీల్చబడుచున్నది. అది నాలో నుండి బయటకు వచ్చుచున్నది. మంచిగా మరియు బలంగా ఉన్నాను. ఏం చెప్పాలో నాకు తెలియదు. నేను సంవత్సరాల తరబడి బోధించుట లేదు. ఇపుడే నేను బోధించుట ఆరంభించినట్లున్నాను. ఏం చేయాలో నాకు అంతే, నేను ఎవరినో ఒకరిని దేవునితో సరిచేయగోరుచున్నాను, అంతే ఆయనకు అనేక మిలియను మందిని దేవుని కొరకు ఆత్మలను సంపాదించాను. కాని అది చాలా తక్కువగా కనబడుచున్నది. లోకములోని బిలియనుల మందిని తలంచుకొంటే క్రీస్తులేనివారిని చూడండి.
ఇంకా ఆయనను ఎరుగవలసినవారు మిలియసులు, మిలియనులు, మిలియనుల కొలదిగా యున్నారు. స్నేహితులారా, పదండి పోదాం. బహుశా నీవు సముద్రం దాటలేకపోవచ్చు. కాని నీవు వీధిని దాటి పోగలవు. ఏదో ఒకటి చేద్దాం. దేవుని మహిమ కొరకు ఏదయినా చేద్దాం.
ఇప్పుడు మనము నిలబడి యుండగా దేవుడు మిమ్మును దీవించును!
90. ఇప్పుడు నేను మిమ్మును అడుగగోరుచున్నాను. మనం ముగింపు పాట పాడుదం. యేసు నామమును నీతో కొనిపొమ్ము, చూడు యేసునామమును నీతో కొనిపొమ్ము. ప్రతి శత్రువు నుండి కవచముగా కొనిపొమ్ము. అది నిజము. శోధనలు నిను చుట్టుముట్టినప్పుడు ఆయన పరిశుద్ధ నామమును ప్రార్థనలో ఊదుము. ఈ రాత్రికి ఎంతమంది తమతో కూడ తీసికొని వెళ్ళెదరు? ఈలాగు చెప్పండి, "దేవా నిన్ను నేను ప్రేమించగోరుచున్నాను. ప్రభువైన యేసూ నీవు నాతో కూడా రావలెనని కోరుచున్నాను. ఇప్పుడు మీ చేతులు పైకి ఎత్తండి. అది సరి. నా క్రైస్తవ సోదరీ, సోదరుడా
యేసు నామమును నీతో కూడా కొనిపొమ్ము.
దు:ఖముతోను మరియు పగతోను నిండిన బిడ్డా,
అది నీకు సంతోషమును మరియు ఆదరణను ఇచ్చును.
నీవు వెళ్లు ప్రతిచోటికి కొనిపొమ్ము;
ప్రశస్త నామము ఓ ఎంత మధురము!
భూలోక నిరీక్షణ. పరలోక ఆనందము.
ప్రశస్త నామము. ఓ ఎంత మధురము!
భూలోక నిరీక్షణ. ఆనందము....
(ఇపుడు మనము తరువాత వచనము పాడుచుండగా చుట్టూ తిరిగి తెలిసిన ప్రక్కనున్న వ్యక్తితో కరచాలనం చేయుదము)
యేసు నామమన వంగవలసినదే,
ఆయన పాదము నొద్ద సాగిలపడవలసనిదే.
పరమందు రారాజులు ఆయనకు కిరీటము ధరింపచేసెదరు. మన యాత్ర ముగిసినపుడు. ఓ! ఎంత మధురము (ఓ ఎంత మధురము) భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము!
ప్రశస్త నామము (ప్రశస్త నామము)
91. ఒక సంగతి మిమ్ము అడుగగోరుచున్నాను. మీరు నన్ను ప్రేమించు చున్నారా? మీరు ఆసంగతి చేయవలెనని కోరుచున్నాను.
ఇక్కడ ఈ ఆలయము నొద్ద చిన్న తేడా కనబడుచున్నది. మనము పెద్ద స్నేహితుల గుంపుగా ఉండవలసియున్నాము. చూడండి. ప్రతి ఒక్కరితో మనము కరచాలనము చేయుడం. ఒక మనిషి దగ్గరే ఎక్కువసేపు నిలబడకండి. త్వర త్వరగా మనుష్యులను కలిసికొనండి. "సోదరుడా, నిన్ను కలిగియుండుట సంతోషము" అని చెప్పండి. వెనక్కిరండి. సోదరీ నిన్ను కలిగియుండు సంతోషము, దేవుడు నిన్ను దీవించును గాక! ప్రతి ఒక్కరితో కరచాలనం చేయండి. మీరు దర్శించగోరినచో ఇంటికివెళ్లి దర్శించండి. కాని ప్రతి ఒక్కరితో కరచాలనం చేయండి. అందరి దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్కరితో కరచాలనం చేయండి. భవనం లోనికి వెళ్లి ఆనందంతో అందరిని పలకరించండి. మీరాలాగు చేయరా? దేవుడు నిన్ను దీవించును.
మనము శిరములు వంచి యుందము. సహో॥ రడెల్ వెనుక వున్నాడు. నీవు ముగించెదవా?