సమస్తమైన అవిశ్వాసమును జయించుటకు ఏమి కావలెను: మన విశ్వాసము
ఈ పట్టణమునకు వచ్చి ఇక్కడున్న ప్రియమైన ప్రజలకు పరిచర్య చేయుటకు, మహిమకరమైన ఈ గొప్ప అవకాశము కొరకు చాలా కాలము నుండి ఎదురుచూస్తున్నాను. (టేపులో ఖాళీ ఉన్నది సంపా) మా సువార్త ప్రారంభ దినములలో నేను సహెూదరుడు. లిండ్సేను పంపించినప్పుడు యాకిమా నా హృదయములో ఉన్నది, మరియు నేను స్పోకేన్ లో గాయపడ్డాను. కాబట్టి నేను మరలా యాకీమా వెళ్ళుటకు పంపాను కాని ఏదో విధముగా మేము దానిని దాటిపోయి మరి ఎక్కడికో వెళ్ళాము. కాబట్టి ఈ రాత్రి, చాలా కాలము నిరీక్షించిన తర్వాత, ఈ పట్టణమునకు వచ్చే అవకాశము కొరకు నేను పది లేక పన్నెండు సంవత్సరములు కనిపెట్టుకొనియున్నాను. మరియు మన ప్రియమైన అధ్యక్షుడు డ్వైట్ ఐసన్హెూవర్ పేరు పెట్టబడిన ఈ చక్కటి పాఠశాల భవనము లభించిన అవకాశమును బట్టి నేను చాలా సంతోషించుచున్నాను. మరియు ఈ పది దినముల కూటములలో మనము ఊహించువాటి కంటే మరియు చేయుదాని కంటే అత్యధికముగా సమృద్ధిగా ప్రభువు మనకు అనుగ్రహించునని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ఈ దేశములో నశించిన ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించుట దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అయితే, దేవుడు ఇక్కడే వారిని రక్షించాలని కోరుచున్నాము.
2. ప్రభువైన యేసు రాకడ అతి సమీపముగా ఉన్నదని నేను నిజముగా నమ్ముచున్నాను. మరియు నేను నమ్ముచున్నాను. ఒకవేళ మనము ఆయన రాకడ నీడలో జీవించుచున్నట్లయితే, ప్రవచించబడిన ఆ గొప్ప కార్యము కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుటకు నాకు తెలిసినంత వరకు నేను చేయగలిగినంత చేస్తాను. ఆయన వెళ్ళినప్పటి నుండి ప్రజలు ఆయన రాకడ కొరకు ఎదురుచూస్తున్నారు. రాజకీయ ప్రపంచము మరియు సైనిక ప్రపంచము రెండింటిలో జరుగుచున్న పరిస్థితులను మరియు మత ప్రపంచములో జరుగుచున్నవాటిని మనము చూస్తున్నాము, మరియు ఇప్పుడు సమస్త సూచనలు ఆయన రాకడ సమీపముగా ఉన్నదని సూచిస్తున్నాయి. సంఘము తక్కువ సంఖ్యలో ఉన్నది, ఆత్మీయ విశ్వాసులు, ఆయన చెప్పినవన్ని జరుగుటను మనము చూస్తున్నాము.
3. ఇప్పుడు ప్రపంచములో ఏమూలనుండి అయినా మన కొరకు బాంబులు ఎదురుచూస్తున్నాయని మనకు తెలుసు. వారు పెద్ద దేశములవైపు చూడవలసిన అవసరము లేదు. చిన్న దేశములు కూడా వారు కోరిన సమయములో ప్రపంచమును నాశనము వేయగలిగిన క్షిపణులు కలిగియున్నారు. మరియు ఆ క్షిపణులు పాపాత్ముల చేతులలో ఉ ద్నాయి. ప్రతి రాడార్ తెరలు అమర్చబడియున్నాయి, ఆ తెరల మీద ఒక క్షిపణి జాడ నబడుటకు వారు కనిపెట్టి, కనిపెట్టి చూస్తున్నారు, మరియు వారికి అది కనబడినప్పుడు రు తమ క్షిపణులు ప్రయోగిస్తారు. ఆవిధముగా సమస్తము సంభవించినప్పుడు, అప్పుడు మీ జరుగబోతుంది?
ప్రభువైన యేసును నా రక్షకుడిగా ఎరిగియున్నందుకు నేను ఎంతగానో సంతోషించుచున్నాను. దానిని బట్టి నేను ఏంతో ఆనందించుచున్నాను. నేను అనుభూతి చెందుచున్నట్లుగా అనుభూతి చెందుచున్న ప్రజలు లక్షలాదిమంది ఉన్నారని ఎరుగుటను బట్టి నేను ఎంతో ఆనందించుచున్నాను. వారందరూ ఆ గొప్ప సమయము కొరకు ఎదురుచూస్తున్నారు.
4 మనము మానవులుగా ఈ జీవమును మాత్రమే ఎరిగియున్నాము, ఎందుకనగా మనము మానవులుగా మాత్రమే యున్నాము మరొకటి మనకు తెలియదు. కాని మనము తిరిగి జన్మించినప్పుడు, పైనుండి వచ్చిన జీవము ఒకటి ఉన్నది. అది మనలోనికి వచ్చినది. నేను అనేక దేశములను దర్శించి అనేకమంది ప్రజలను చూసిన భాగ్యమును నేను కలిగియున్నాను. వాటినన్నిటిని కలిపినట్లయితే ప్రపంచము మొత్తమును అనేకమార్లు తిరిగినట్లు అవుతుందని నేను ఊహించుచున్నాను. నేను సుమారుగా ప్రపంచములోని ప్రతి దేశమును ఒక మిషనరీగా దర్శించాను. మరియు నేను గమనించాను. నేను ఒక దేశమును తాకినప్పుడు, వింతైన సంగతి ఏమనగా ఆ దేశము ఒకవిధమైన ఆత్మను కలిగియున్నది. ఆ దేశము యొక్క ఆత్మ ఆ దేశము మీద ఆధిపత్యము చెలాయించుచున్నట్లుగా కనిపించుచున్నది.
మేము జర్మనీ వెళ్ళాము, మరియు అది ఫిన్లాండ్లో ఉన్న ఆత్మవలె లేదు. మేము ఫిన్లాండ్ వెళ్ళాము. మరియు అది ఆస్ట్రేలియాలోని ఆత్మవంటిది కాదు. మరియు మీరు ఆస్ట్రేలియా వెళ్ళండి, అక్కడున్న ఆత్మ జపాన్లోని ఆత్మవలె యుండదు. తర్వాత తిరిగి అమెరికా రండి, అది అమెరికా ఆత్మను కలిగియున్నది. మీరు ఎక్కడికి వెళ్ళినను, మీరు ఒక వ్యత్యాసమైన ఆత్మను కనుగొంటారు. ప్రజలు వ్యత్యాసముగా జీవిస్తారు, వ్యత్యాసముగా ప్రవర్తిస్తారు, కాని నేను ఒక గొప్ప సంగతిని కనుగొన్నాను. ఒకవేళ మీరు ఒక జర్మనీ పౌరుని అమెరిగా సంయుక్త రాష్ట్రములకు పంపినట్లైతే, అతడు త్వరలోనే సంయుక్త రాష్ట్రముల ఆత్మను పొందుకుంటాడు. ఒక అమెరిగా పౌరుని తీసుకొని జర్మనీ పంపండి, అతడు జర్మనీ ఆత్మను పొందుకుంటాడు. కాని మీరు ఏ దేశమునకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తిరిగి జన్మించిన క్రైస్తవుని మీరు కనుగొనినప్పుడు, అది ఎక్కడైనను వారందరూ ఒకేవిధముగా ఉంటారు.
5. నేను కూటములకు వచ్చిన ప్రజలను చూశాను... మా బొంబాయి సభలలో విస్తారమైన సమూహము వచ్చారు. సుమారుగా ఐదు లక్షలమంది ప్రజలు హాజరయ్యారు, దాని తర్వాత అత్యంత గొప్ప బలిపీఠము పిలుపును నేను దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో కలిగియున్నాను, ఒక మధ్యాహ్నము వేదిక మీద జరిగిన కార్యమును చూసిన అన్యజనులు సుమారుగా ముప్పై వేలమంది తమ హృదయములను ప్రభువైన క్రీస్తుకు సమర్పించారు. పదివేలమంది మహమ్మదీయులు దానిని వెంబడించారు
ఇప్పుడు, నేను గమనించాను, ఏది ఎడమ చేయి ఏది కుడి చేయి అనేది తెలియని ఆ అడవి మనిషిని, స్థానిక తెగల మనిషిని చూడండి. వారు ఏ వస్త్రములు ధరించలేదు. వారికి ఒక్క ఇంగ్లీషు పదము కూడా తెలియదు. వారి తెగ భాష తప్ప వారికి మరేమీ తెలియదు కాని వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తారో వారు కూడా ఖచ్చితంగా అదే విధముగా ప్రవర్తించారు, అదేవిధంగా ప్రవర్తించారు. దేవుడు విశ్వవ్యాప్తముగా ఉన్నాడని అది చూపించుచున్నది. దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, అనంతుడు, ఆయన అందరితోను ఒకేవిధముగా పనిచేయుచున్నాడు.
6. ప్రతి ఒక్క మానవుడు అతని రంగు ఏదైనప్పటికీ, అతడు ఎవరైనా సరే, అతడు పెద్దవాడైనా లేక చిన్నవాడైనా, అతని రంగు ఏదైనప్పటికీ వారందరూ ఒకే రక్తమును కలిగియున్నారు. దేవుడు ఒక్క రక్తముతో సమస్త దేశములను చేశాడు. జర్మనీ, స్విట్జర్లాండ్, ఆఫ్రికా, ప్రతి ఒక్కరూ మరొకరికి రక్తమును దానము చేయవచ్చును. మన శరీరము యొక్క రంగు లేదా మన ఆకారమునకు దానికి సంబంధము లేదు. కాని ప్రతి మానవుడు. తన హృదయములో ఒక చిన్న గదిని కలిగియున్నాడు, మరియు దానిలో ఒక్క రక్త కణము కూడా లేదు. అనేకమైన సంవత్సరముల క్రితము విమర్శకులు ఈ విధంగా అనేవారు, "మనుష్యుడు తన హృదయములో ఆలోచించినట్లుగా, అని దేవుడు చెప్పినప్పుడు ఆయన చాలా పెద్ద తప్పు చేశాడు, ఎందుకనగా అతడు ఆలోచించుటకు అతని హృదయములో ఆలోచన సామర్ధ్యము లేదు.”
కాని రెండు సంవత్సరముల క్రితము అని నేను తలంచుచున్నాను. నేను చికాగోలోని కూటములో ఉన్నప్పుడు, వార్తాపత్రికలలో ఒక వార్త ప్రముఖముగా ప్రచురించబడినది, మానవుని హృదయములో ఆలోచించు మానసిక సామార్ధ్యము కలదని వారు కనుగొన్నారని ప్రకటించబడినది, అతని హృదయములో ఒక చిన్న గది కలదు, అది జంతువుల గుండెలో లేదు. వారు గుండె మీద పరిశోధనలు చేసినప్పుడు దానిని కనుగొన్నారు. అక్కడ ప్రాణము నివసించును అని వారు అందులో చెప్పారు. "మనుష్యుడు తన హృదయములో యోచించినట్లు," అని దేవుడు చెప్పినప్పుడు ఆయన చెప్పినది నిజమే.
7. ఇప్పుడు మనము మనస్సులో తర్కిస్తాము, కాని హృదయము తర్కించదు. హృదయము కేవలము విశ్వసించును. మనము కళ్ళతో చూస్తాము, కాని హృదయముతో గ్రహిస్తాము. మీరు చూశారా...మీరు ఒక క్లిష్టమైన దానిని తీసుకొనండి, మీరు చెప్తారు, "నేను దానిని చూడలేకపోవుచున్నాను.” దాని భావము మీరు దానిని అర్ధము చేసుకొనలేకపోవుచున్నారు. చూశారా? నీవు హృదయములో గ్రహిస్తావు. నీవు ఆవిధముగా గ్రహిస్తావు.
ఇప్పుడు, అనేకమారులు, క్రైస్తవులు అందరూ దీనిని ఎరిగియున్నారని నాకు తెలుసు, ప్రజలు ఈవిధంగా ఆలోచిస్తారు. “మంచిది. అది జరగదు, అయినప్పటికీ, అది జరుగుతుంది.
అని నా హృదయములో ఏదో చెప్పుచున్నది." క్రైస్తవులారా మీకు ఎప్పుడైనా అలాంటి అనుభము కలిగినదా? నిశ్చయముగా మీరు దానిని కలిగియుంటారు. అది అంతరంగములోని పురుషుడు ఆలోచించుట. అది తర్కములను పడద్రోయును. దానికి తర్కములతో ఎట్టి సంబంధము లేదు, ఎందుకనగా దేవునితో, వాక్యము విషయములో మనము తర్కించకూడదు. మనము దేవునితో తర్కించకూడదు. విజ్ఞానశాస్త్రము ద్వారా దేవుడిని ఎన్నటికీ తెలుసుకొనలేవు, మానసిక శక్తులు ద్వారా దేవుడిని ఎన్నటికీ తెలుసుకొనలేవు. దేవుని కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే తెలుసుకుంటావు. జ్ఞానము ఎన్నటికీ మానవుని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళలేదు. జ్ఞానము అతడిని దేవుని మరింత దూరము తీసుకొని వెళ్తుంది.
8. అది ఏదేను తోటలో ప్రారంభమైనది. అక్కడ రెండు చెట్లున్నాయి, ఒకటి జీవ వృక్షము, మరొకటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. మానవుడు మొదటిగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తిన్నాడు. అతడు తన్నుతాను జీవవృక్షము నుండి దూరము చేసుకున్నాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును అతడు తిన్న ప్రతిసారి అతడు జీవ వృక్షమునుండి మరింత దూరముగా వెళ్లిపోవుచున్నాడు, ఎందుకనగా ఎలా ఆలోచించాలో లేక తర్కించాలో తనకు తెలుసని అతడు అనుకొనుచున్నాడు. నీవు దేవునితో తర్కించలేవు. నీవు తిరిగి సామాన్యమైన ఆ జీవవృక్షము దగ్గరికి తిరిగిరావాలి, మరియు ఆ వృక్ష ఫలమును భుజిస్తూ ఆ వృక్షము క్రింద నివశించాలి.
యాకిమాలోని మీకొరకు ప్రభువు నాకిచ్చిన పరిచర్యను మీవద్దకు తీసుకొని వచ్చుటకు మేము ఇక్కడికి వచ్చాము. మీలో అనేకులు ఇతర స్థలములలో జరిగిన కూటములకు హాజరయ్యారు, కాని బహుశా ఈ నగరము కొరకు, ఆ ఇతర కూటములకు హాజరు కాని వారిలో అనేకులు ఈ వారము ఇక్కడికి వస్తారు.
9. ఇప్పుడు, అనేకమారులు ప్రజలు చెప్తారు. "సహోదరుడా బ్రన్హాం, నీవు దైవిక స్వస్థతను గూర్చి ప్రదర్శిస్తున్నావు." లేదు. అది తప్పు. నేను యేసుక్రీస్తును ప్రదర్శించుచున్నాను. చూశారా? దైవిక స్వస్థత అనేది చిన్న కార్యము, నీవు చిన్న కార్యమును ఎన్నడూ పెద్దదిగా చేయలేవు. మరియు క్రీస్తు మన ప్రధానమైన అంశము, మరియు క్రీస్తును విశ్వసించుచున్నాము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మరియు ఆయన మన పాపముల నిమిత్తము మరణించాడు, మరియు లేఖనముల ప్రకారము ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు మరియు ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైయుండి మన ఒప్పుకోలును బట్టి మన ప్రధానయాజకుడిగా మన నిమిత్తము విజ్ఞాపనము చేయుచున్నాడు.
ఒక దినమున ఆయన ఆ మహిమను విడిచి భూమి మీదికి దిగివచ్చి, చనిపోయిన వారిని జీవింపచేసి మరియు సజీవులమైన మనలను మహిమ శరీరములోనికి రూపాంతర పరచి మూడున్నర సంవత్సరములు ఆయనతో నివసించుటకు ఆయన ఆకాశమునకు
తీసుకువెళ్తాడని మనము నిరీక్షణతో కనిపెట్టుచున్నాము. ఆ కాలములు భూమిమీద శ్రమల కాలము. తర్వాత శుద్ధి చేయబడిన భూమిమీద తన సంఘముతో వెయ్యి సంవత్సరములు జీవించుటకు తిరిగి వచ్చును, ఆయన దావీదు సింహాసనము మీద ఆసీనుడైనప్పుడు ఎల్లప్పుడూ ఆయనతోనే మనము ఉంటాము. ఇప్పుడు మనము ఎదురు చూస్తున్నాము, ఆ గొప్ప సమయము కొరకు ఎదురు చూస్తున్నాము.
10. మరియు మా గుడారములో మరియు సభలలో మన ముఖ్య అంశము యేసు క్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటేరీతిగా యున్నాడు. ఇప్పుడు ఆయన ప్రతి నియమములోను మారనివాడిగా ఉన్నాడని మనము నమ్ముచున్నాము. ఇప్పుడు హెబ్రీ 13:8 మన మూల అంశము. ఇప్పుడు దానిని మీరు ఈ కూటములలో మరచిపోవద్దు. ఒకవేళ అనాలోచితంగా ఏదైనా లేచినట్లయితే, ఆ వాక్యముతో గట్టిగా నిలబడియుండండి, మరియు దానిని లేఖనముల దగ్గరికి తీసుకొనివెళ్ళండి. యేసు క్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరమూ ఏకరీతిగా యున్నాడు.
ఇప్పుడు మనము దేవుని వాక్యమును తృణీకరించలేము, ఎందుకనగా సమస్త లేఖనములు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇవ్వబడ్డాయి అని యేసు చెప్పెను (మనము దానిని ఎరుగుదుము), మరియు భూమి ఆకాశములు గతించునుగాని ఒక్క లేఖనము కూడా తప్పిపోదు ఎందుకనగా అది దేవుని వాక్యమైయున్నది.
ఇప్పుడు, దేవుడు తన లేఖనములలో వ్రాయని కార్యములు కూడా చేయగలడని మనము విశ్వసించుచున్నాము. కాని మనము ఆయన ఏమి వ్రాసియించాడో దానితోనే నిలచియుండగోరుచున్నాము, ఆయన వాక్యములో వ్రాసిన దానితో మనము నిలిచినట్లయితే అప్పుడు మనము నిశ్చయత కలిగియుంటాము.
11. ఈ పది దినములలో ఒకవేళ దేవుడు మనలను అనుమతించినట్లయితే, మీరు తర్కమునకు అందని కార్యములను చూడబోవుచున్నారు. ఒకవేళ అది మీకు కొద్దిగా ప్రశ్నార్ధకముగా కనిపించినా, నేను మాట్లాడుచున్నప్పుడు నేను ఎల్లప్పుడూ దేవుని వాగ్దానముల వాక్యము మీదనే నిలబడతాను. అది మనకు చాలును. ఒకవేళ మనము ఆయన వాగ్దానముల మీద నిలబడినప్పుడు, దేవుడు ఆయన వాగ్దానములు అన్నింటిని నెరవేర్చినట్లయితే, అది మనకు ఎంతో మేలు. మీరు ఆవిధంగా తలంచుట లేదా? ఒకవేళ దేవుడు తన వాగ్దానముతో నిలిచినట్లయితే అది మనకు చాలును.
ఎందుకనగా మనము మర్మయుక్తమైన కార్యములు జరుగు దినములలో జీవించుచున్నామని నేను నమ్ముచున్నాను, ఆ కార్యములు ఇంకా జరుగుతాయి, మరియు అవి క్లిష్టముగా మారును, ఎందుకనగా బైబిల్ చెప్పినట్లుగా మోషే మరియు అహరోనులను ఎదిరించుటకు చివరి దినములలో యన్నే మరియు యంబ్రేలు లేవవలసియున్నది. వారు కలిగిలేని దానిని ఉన్నట్లుగా కనిపించుటకు వారు నటించుచున్నారు.
కాని దేవుని వాక్యము ఎల్లప్పుడూ సత్యము. నేను ఎల్లప్పుడూ దానినే పట్టుకొనియుంటాను అదేమనగా దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిత్యమూ సత్యమైయున్నది. ఏ మనుష్యుడు కాని ఏ మనిషి మాట కాని దానికంటే గొప్పది కాదు. ఒకవేళ నామాట నేను నిలబెట్టుకొనకపోతే, అప్పుడు నేను అల్పుడను. మరియు ఒకవేళ దేవుడు తన వాక్యమును నేరవేర్చనట్లైతే, ఆయన దేవుడు కాడు. కాని దేవుడు తన వాక్యమును నెరవేర్చినట్లయితే, ఆయన ఎల్లప్పుడూ దేవుడైయుండును, దేవునిగా ఉండుటకు ఆయన తన వాక్యమును నెరవేర్చాలి. మీరు గ్రహించారా, ఆయన తన వాక్యమును నెరవేర్చాలి.
12. ఇప్పుడు వీటి మీద... బహుశా ఈ రాత్రి, ఈ ఆడిటోరియంలో ఉన్న ప్రజలతో పరిచయము పెంచుకొనుటకు కొద్ది సేపు మాట్లాడుతాను, మరియు రాబోవు కూటముల కొరకు సిద్ధపడదాము. కొద్ది నిమిషముల క్రితము దైవిక స్వస్థతకు ప్రాముఖ్యత ఇచ్చుట లేదని నేను చెప్పాను, అయినప్పటికీ అది బైబిల్ సత్యములలో ఒకటిగా మేము భోదించుచున్నాము, యేసు క్రీస్తు మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడ్డాడు, మరియు ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందియున్నాము.
13. యేసు క్రీస్తు కల్వరిలో మరణించినప్పుడు, మన విమోచన ఆశీర్వాదములు అన్నింటిబట్టి ఆయన మన కొరకు వెలను చెల్లించాడు. దేవుని యెదుట మానవుని పాపములను తీసివేయుటకు యేసు కల్వరిలో మరణించినప్పుడు, దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళిక, దేవుని పని మరియు ప్రతి విమోచనా ఆశీర్వాదము కల్వరిలో సంపూర్తి చేయబడినది, దానిని అంగీకరించిన ప్రతి మానవునికి దేవుని యొక్క వాగ్దానములు అన్ని అందుబాటు లోనికి వచ్చాయి. కల్వరిలో యేసు మరణించినప్పుడు, ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు రక్షించబడ్డాడు అని నేను విశ్వసించుచున్నాను. యేసు కల్వరిలో మరణించినప్పుడు, ఈ లోకములో ఉన్న ప్రతి రోగి స్వస్థపరచబడ్డాడు. ఇప్పుడు అది ముగించబడిన కార్యము. ఇప్పుడు పని ఏమనగా ప్రజలు దానిని గ్రహించి దానిని అంగీకరించునట్లుగా మనము చేయగలుగుచున్నామా. కాబట్టి దైవిక స్వస్థత ఏదో ఇంద్రజాలము మీద ఆధారపడిలేదు, అది ఎవరి చేతులలోనో, లేదా పరిశుద్ద నూనెలో, లేదా ప్రజల మీద చిలకరించు నీళ్ళలో లేదు. వాటిని నేను నమ్మను. యేసు క్రీస్తు యొక్క రక్తము మన యొక్క ప్రతి అవసరమునకు చాలునని నేను నమ్ముచున్నాను. చూశారా? మరియు దాని వెల ముందుగానే చెల్లించబడినదని నేను నమ్ముచున్నాను.
14. ఇప్పుడు, దేవుని వాక్యమును వినుటయే ఏ విమోచన ఆశీర్వాదమునైనా స్వీకరించూ అసలైన మార్గము, ఎందుకనగా వినుటవలన విశ్వాసము కలుగును, సేవకులు బోధించుచుండగా, దేవుని వాక్యమును వినుట వలన. ఒకవేళ అది మీరు, నేను అయినా అది చాలును. ఒకవేళ ప్రజలు మనలను విశ్వసించుటకు ఇష్టపడనట్లయితే, మనము వారిని అలాగే చేయనిద్దాము. కాని దేవుడు మంచివాడు మరియు కృపాపూర్ణుడు, ఆయన
తన వాక్యము అంతటిని పంపిన తర్వాత కూడా ఆయన సంఘములో వరములను పంపియున్నాడు. మనమందరం దానిని నమ్ముచున్నాము. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయం, అక్కడ సంఘములు తొమ్మిది ఆత్మ వరములున్నవి. ప్రతి ఒక్క స్థానిక సంఘములో, లేక ప్రతి స్థానిక సంఘములో ఉండాలి, స్వస్థత వరము, వివేచన వరము, మరియు మిగిలిన వరములు సంఘములో ఉన్నాయి. ప్రతి ఒక్క స్థానిక సంఘములో తొమ్మిది ఆత్మీయ వరములు ఉన్నాయి.
మరియు దేవుడు తన ముందు జ్ఞానము ద్వారా ప్రతి కాలములోని సంఘములో తన వరములను పెట్టియున్నాడు. మరియు అక్కడ ఐదు వరములను మనము కనుగొన్నాము. వాటిలో మొదటి అపోస్తులు లేదా మిషనరీలు. "అపోస్తులుడు," అనే మాటకు అర్ధము “పంపబడినవాడు.” “మిషనరీ" అనే పదమునకు అర్ధము "పంపబడినవాడు.” ఒక మిషనరీ పంపబడినవాడు, ఒక అపోస్తులుడు పంపబడినవాడు. దేవుడు తన మిషనరీలను పంపుచున్నాడు. దేవుడు తన అపోస్తులును పంపుచున్నాడు.
15. మొదటిగా అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు, కాపరులు, అవి దేవుడు సంఘమునకు ఇచ్చిన వరములు. కాబట్టి దైవికమైన సంఘకాపరిని కలిగియున్న మీలో ప్రతి ఒక్కరూ మీ సంఘములో కాపరి అనే దేవుని బహుమానమును కలిగియున్నారు. “పాస్టర్” అనగా “కాపరి” మందను కాయుట కొరకు మరియు వారికి దేవుని వాక్యమును బోధించుటకు.
సంఘమును పరిశుద్ధముగా ఉంచుటకు మిగిలిన తొమ్మిద ఆత్మీయ వరములు సంఘములో పనిచేయవలసియున్నది. అననీయ మరియు సప్పీరా వలె, దేవుని ఆత్మ లేచి ఏవరో ఒకరిని పిలిచి వారు తప్పులో జీవించుచున్నారని చెప్పి బహిరంగంగా పాపమును గద్దించెను, మరియు సంఘములో అందుకొరకే పరిశుద్దాత్మ ఉన్నది, సంఘమును పరిశు ద్దముగా ఉంచి ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధము చేయుచున్నది. మనము దానిని నమ్ముచున్నాము.
16. మరియు దాని తర్వాత సంఘములో ఇతర వరములు కూడా ఉన్నాయి. ఇప్పుడు, సంఘకాపరి తర్వాత, సువార్తికులు వస్తున్నారు. మరియు తర్వాత ఉపదేశకులు వస్తారు, తర్వాత ప్రవక్తలు వస్తున్నారు. తర్వాత అపోస్తలులు వస్తున్నారు. వీరందరూ కలిసి, వరములుతో కలిసి పనిచేయుచూ, సంఘమును పరిపూర్ణతలోనికి నడిపించుచూ దానిని పరిశుద్ధముగా ఉంచుచూ ప్రభువు రాకడ కొరకు సిద్ధము చేయుచుండెను. మరియు ఒకవేళ ప్రభువు కొరకు ఎదురుచూస్తూ ఒక సంఘకాలము నిద్రించినట్లయితే, మరియు రెండవ సంఘ కాలము కూడా నిద్రించినట్లయితే, చివరికి ఏడవ గడియ వరకు ఎన్ని సంఘకాలములు నిద్రించినట్లయితే, ప్రభువు రాకడ సమయములో వారందరూ తిరిగి లేస్తారు మరియు సజీవులమై నిలిచియుండిన వారితో కలిసి మధ్యాకాశములో ప్రభువు కలుసుకుంటారు. మనము ఆ మహిమకరమైన దినము కొరకు ఎదురుచూస్తున్నాము, ఈ వారము ముగింపుకు
ముందుగా ప్రభువు మనకు సహాయము చేసినట్లయితే, మనము వాటిని ఎన్నడూ లేనంత తేటగా వాటిని చూస్తాము. అనేక కార్యముల విషయములో నాకన్నులు కూడా తెరువబడునని నేను నమ్ముచున్నాను ఎందుకనగా నేను కూడా ఇక్కడికి ఇతరులవలె నేర్చుకొనుటకు వచ్చాను. నాకు సహాయము చేయగలిగిన ఏదో ఒక దానిని మీదగ్గర నుండి పొందుకొనుటకు నేను ఇక్కడికి వచ్చాను.
సువార్తికునికి ఏ సహాయము అవసరము లేదని అనేకమంది ప్రజలు తలంచుదురు. మీరు పొరబడ్డారు. సమాజము అంతటి కంటే ఎక్కువ సహాయము అతనికి అవసరము, ఎందుకనగా అతడు సంఘమునకు మరియు శత్రువుకు మధ్యలో నిలబడియున్నాడు.
17. మీకు అపరిచితుడనైన నేను, మీరు వీటిని ఎరుగునట్లుగా ఈ విషయములు తీసుకొని బోధించాలని నేను తలంచాను, అప్పుడు ఈ ప్రాంతములో మనము గొప్ప కూటములను కలిగియుండగలము. ఈ కూడిక ముగించబడిన తర్వాత, రక్షించబడి లోపలికి వచ్చిన నూతన సభ్యుల ద్వారా ఈ ప్రాంతములో ఉన్న ప్రతి ఒక్క సంఘము పూర్తిగా నింపబడుతుందని నేను దేవునిని నమ్ముచున్నాను. ఆ కార్యము ద్వారా ఇక్కడున్న లోయలో గొప్ప పాత కాలపు ఉజ్జీవము వ్యాపించి, దేశవ్యాప్తంగా ప్రజలు దానిని వెదకుచూ ఇక్కడికి వస్తారని నమ్ముచున్నాను. కాబట్టి నేను అమెరికా సంయుక్త రాష్ట్రములకు తిరిగి వచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా మనము కలిగియున్న గొప్ప కూటములు తర్వాత కూడా ఆకలిగొనియున్న ప్రజలను కనుగొనుచున్నాను.
మన దేశవ్యాప్తంగా మనము అనేకమంది గొప్ప వ్యక్తులను కలిగియున్నాము: బిల్లీ గ్రాహం, ఓరల్ రాబర్ట్స్, మరియు ఆ గొప్ప విశ్వాస వీరులు, గొప్ప వ్యక్తులు, నా వ్యక్తిగతమైన స్నేహితులు. వారు దేవుని ఆత్మ ద్వారా నింపబడిన అద్భుతమైన ఉపదేశకులు, మంచి వ్యక్తులు అని నేను ఎరుగుదును.
18. మరియు నేనైతే, నేను నిరక్షరాస్యుడను. నేను విద్యావంతుడను కాదు. దానిని బట్టి నన్ను క్షమించండి. నేను చదవలసినంతగా పాఠశాలకు వెళ్లి చదవలేదు. నేను పదిమంది పిల్లలున్న పేద కుంటుంబంలో పెరిగాను, నేను పెద్దవాడను. కుటుంబము యొక్క పోషణ నిమిత్తము నేను పనిచేయవలసివచ్చినది. కాని దేవుడు తన ముందు జ్ఞానము ద్వారా, తన గొప్ప జ్ఞానయుక్తమైన అనుగ్రహము ద్వారా మీ ఎదుట నిలబడుటకు నన్ను యోగ్యునిగా ఎంచి నాకు ఒక చిన్న స్థానమును అనుగ్రహించియున్నారు. దానిని బట్టి మీ సహోదరునిగా నా హృదయము అంతటితో మీకు పరిచర్య చేయగోరుచున్నాను. మరియు సంఘములో చీలికలు లేదా ఘర్షణలు కలుగచేయుటకు నేను ఏ మాత్రము ఇక్కడికి రాలేదుగాని, ఘర్షణలను తీసివేసి, క్రీస్తు శరీరమును ఐక్యపరచుటకు ప్రయత్నించుచున్నాను, మనందరమూ సహోదరులము అని ఎరుగుదుము, మనము అందరమూ కలసియుందాము.
ప్రభువు దూత నాకిచ్చిన వర్తమానమును విశ్వసించిన పెంతుకోస్తు ప్రజల మధ్య పరిచర్యను జరిగించుటకు నా స్వంత బాప్తిస్టు సంఘము నుండి వచ్చినప్పుడు, మరియు
వారు కూడా బాప్తిస్ట్ వారంత చెడ్డగా ఉన్నారని నేను తెలుసుకున్నాను. వారు కూడా అనేకమైన భిన్నమైన సంస్థలను కలిగియున్నారు. వాటిలో ప్రతిదానిలో గొప్ప మరియు చక్కటి సహోదరులు ఉన్నారని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈ రాత్రి నన్ను నేను అసెంబ్లీస్ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్ కు చెందినవాడనని చెప్పుకొనుటలేదు. అయినప్పటికీ నేను వారికి సంబందించినవాడినే. ఎందుకనగా నేను వారి హెూదాలలో చేరలేదు గాని, కాని నేను పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారి హెూదాలలో ఒక సహోదరునిగా జన్మించాను. నేను ఆ ఖాళీలో నిలబడియుండి ఇరు వైపుల వారికి ఇలా చెప్పాలని ప్రయత్నము. చేయుచున్నాను, “సహోదరులారా వాదులాడవద్దు. మనము సహోదరులము. మనము ప్రభువును ప్రేమించుచూ, కలసి కవాతు చేయుచూ ముందుకు సాగుదాము..."
19. నేను జన్మతా కెంటకీ పౌరుడను, కెంటకీ యొక్క గుర్తు లేదా నినాదం మీరు అందరూ ఎరుగుదురు, ఈ విధముగా అడ్డముగా పెట్టిన చేయి. ఐక్యత కలిగినప్పుడు మనము నిలబడతాము, మరియు విడిపోయినప్పుడు మనము కూలిపోతాము. కాబట్టి సంఘములు విడిపోవుట మాకు ఇష్టము లేదు. మనము కలిసి నిలబడగోరుచున్నాము. మనము చిన్న చిన్న సాంకేతికమైన విషయములలో మనము విభేదించవచ్చును. అయినప్పటికీ ప్రాముఖ్యమైన సూత్రములను విశ్వసించుదాము: మనందరినీ రక్షించుటకు యేసు మరణించాడు. ఆయన మనందరికీ నూతన జన్మను అనుగ్రహించాడు, మనము ఆయన రాకడ కొరకు కనిపెట్టుచున్నాము, మరియు ఆయన రాకడ వరకు ఆయన మరణము యొక్క ఫలితములను అనుభవించుచున్నాము. అంతే, మనము దైవిక స్వస్థత మరియు పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించుచున్నాము. ఒకవేళ యేసుక్రీస్తు మారనివాడు... "ఒకవేళ ఆయన అయితే" అనే మాటను వాడినందుకు దేవుడు నన్ను క్షమించునుగాక, ఆ విధముగా మాట్లాడుట దైవ ద్రోహం. కాని ఆయన నిన్న, నేడు మరియు నిరంతరమూ ఏకరీతిగా ఉన్నాడు, ఎందుకనగా ఆయన మారనివాడని వాక్యము చెప్పుచున్నది. మరియు ఆయన మారనివాడైతే, ఒకవేళ ఆయన ఈ రోజు భూమి మీద ఉన్నట్లయితే ఆయన ఎలా ప్రవర్తిస్తాడు? ఒకవేళ ఆయన మారనివాడైతే, ఆయన నిన్న ప్రవర్తించినట్లే ఈ దినమున కూడా ప్రవర్తించును. మీరు దానిని నమ్ముచున్నారా, మీరు అందరూ? ఆయన అలాగే చేయును. ఒకవేళ ఆయన అదే విధంగా ప్రవర్తించినట్లయితే, ఆయన నిన్న చేసిన కార్యములను నేడు కూడా చేయును. మీరు దానిని నమ్ముచున్నారా?
20. ఇప్పుడు లేఖనములు చెప్పుచున్నాయి... యేసు తానే స్వయముగా యోహాను 14:7 లో చెప్పెను, "నా మాటను వినువాడు..." కాదు, "నేను చేయు కార్యములు..., నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు కార్యములను అతడు కూడా చేయును." ఇక్కడ ఆంగ్ల అనువాదము ఈవిధంగా చెప్పుచున్నది, "మరియూ వీటికంటే గొప్పవి చేయును. ఏలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను." కాని మీరు దానిని గూర్చిన అసలైన అనువాదమును
చూసినట్లయితే, “అతడు ఎక్కువ చేయును." ఇప్పుడు, ఏమానవుడు కూడా ఆయన కంటే గొప్ప కార్యములను చేయలేడు, ఎందుకనగా ఆయన మృతులను లేపాడు, ప్రకృతిని ఆపాడు, మరియు ప్రతి కార్యమును చేశాడు. కాని అది ఏమిటి, ఆయన చెప్పాడు, “ఇంకా కొంత కాలము తర్వాత లోకము నన్ను చూడలేదు, (ఇప్పుడు ఇక్కడ కాస్మోస్ అనే పదము వాడబడినది, దాని అర్ధము 'లోకము యొక్క క్రమము') అది నన్ను చూడలేదు, అయినప్పటికీ మీరు (సంఘము) నన్ను చూతురు, ఏలయనగా నేను (మరియు "నేను” అనేది వ్యక్తిగతమైన సర్వనామము అని మనకు తెలుసు,) నేను మీతో ఉందును (ఆయన ఇంకా చెప్పారు) మీలోను యుగాంతము వరకు ఉందును.”
అది ఏమైయున్నది? దేవుడు ఒక్క మనుష్యుని ద్వారా తనను తాను బయలుపరచగలడు, ఒక మనుష్యుడు, యేసు అను తన కుమారుడు ద్వారా. ఇప్పుడు దేవుడు ఆ యేసులోని ఆత్మను తీసుకొని తన పిల్లలలోనికి పంపెను, వారు యేసు క్రీస్తు ద్వారా స్వీకరించబడి, అదే ఆత్మను అదే శక్తిని వారు లోకములో ప్రత్యక్షపరుస్తారు. అది మనలో ఉన్న దేవుడు, మనలో ఉన్న ఇమ్మానుయేలు.
21. మనము యేసు రక్తము ద్వారా శుద్ధిచేయబడ్డాము, మరియు నేను పవిత్రమైన, పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ మతమును నేను నమ్ముచున్నాను. పాపము జీవితము నుండి శుద్ధిచేయబడిన మానవుడు, తన త్రాగుడు, అబద్ధములు, దొంగతనము, మొదలైన కార్యములను విడిచిపెట్టునని నేను నమ్ముచున్నాను. అతడు దేవుడు కొరకు జీవిస్తాడని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా అతనిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. మరియు ఆ ఆత్మ అతడిని నీతి మరియు పరిశుద్ధతలోనికి నడిపించును. తద్వారా దేవుడు అతడిలో నివసించి, తన చిత్తమును అతడిలో జరిగించును.
ఇప్పుడు, యేసు గలలీయలో నడిచినప్పటికీ, ఈ రాత్రి మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నదానికి ఒకే ఒక తేడా మాత్రమే ఉన్నది... ఇప్పుడు గుర్తుంచుకోండి, నేను మాట్లాడుచున్న యేసు మూడవ వ్యక్తి, ఆయనే పరిశుద్దాత్మ, ఆయన మనలో ఉన్నారు, దేవుడు మనలో ఉన్నాడు.
22. దేవుని కుమారుడు... దేవుడు ఒకప్పుడు అగ్ని స్థంభములో నివసించి ఇశ్రాయేలు సంతానమును నడిపించాడు, తర్వాత ఆయన క్రిందికి దిగివచ్చి ఒక మనుష్యునిలో నివసించాడు, తన స్వంత కుమారునిలో, సృష్టించబడిన శరీరములో జీవించాడు. అప్పుడు ఆయన మనకు మరింత సమీపముగా వచ్చాడు. సంఘమును శుద్దీకరించుటకు మరియు శుద్ధీకరణ కొరకు ఆ రక్తమును అంగీకరించిన ప్రతి ఒక్కరి హృదయములో ఆయన నివసించునట్లుగా కన్యక ద్వారా జన్మించిన రక్త కణమును విరగగొట్టుటకు ఆయన ఆ శరీరమును బలియిచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయములో ప్రవేశించారు అని పౌలు చెప్పాడు. అప్పుడు దేవుడు మనలో కార్యము జరిగించుచున్నాడు
యేసు క్రీస్తు యొక్క భౌతికమైన శరీరము ఈ రాత్రి ఇక్కడ ఉండలేదు. బహుశా అది రావచ్చును. అది గొప్ప ఘడియగా యుండును, కాదా? ఒకవేళ ఈ రాత్రి దేవుడు కుడి పార్శ్వమున ఉన్న యేసు క్రీస్తు యొక్క భౌతికమైన శరీరము అక్కడి నుండి దిగి భూమి మీదికి వచ్చినట్లయితే, మనకు ఇక స్వస్థత కూటములు మరియు ప్రసంగ కూటములు అవసరము లేదు. అప్పుడు అది అంతా ముగించబడును.
అది ఎప్పుడు జరుగుతుంది? నాకు తెలియదు. ఎవరికైనా తెలుసని నేను నమ్మను, ఎందుకనగా ఎవరు దానిని ఎరుగరు అని యేసు చెప్పెను. కాని ఈ దినమున మనము చూస్తున్న సూచనలను చూసినప్పుడు, కాలము సమీపముగా ఉన్నదని తెలుసుకోండి అని ఆయన చెప్పారు.
23. మరియు ఆయన చేయు కార్యములు అతడు చేయును అని ఆయన వాగ్దానము చేశాడు, దానిని గూర్చి నేను తర్వాత వర్తమానములలో చెప్తాను. ఈ రాత్రి మనము సిద్ధపడుటను గూర్చి మన తలంపులు పెడదాము, ప్రజలతో పరిచయము పెంచుకొనుటకు... మనకు పది రాత్రులున్నాయి, అనేకమార్లు ప్రజలు... ఒకవేళ మీరు ఏమి చేస్తున్నారో తెలియకుండా దేనిలోనికి అయినా త్వరపడి వెళ్ళినట్లయితే, అప్పుడు మొదటిగా ఏమి జరుగుతుందో మీకు తెలుసా మీరు తికమకపడతారు. కాని దేనిని గూర్చి ఎదురుచూడాలో ఖచ్చితంగా తెలుసుకొని వరుసలోనికి వచ్చినట్లయితే, అప్పుడు మీ స్వస్థతను ఎలా పొందుకోవాలో మీకు తెలుస్తుంది.
క్యాన్సర్, కణుతులు, లేక ప్రమాదకరమైన గడ్డలు లేక ప్రమాదరహితమైన గడ్డలు కలిగిన ప్రజలు అనేకమార్లు, వారు అంతకుముందు ఒకసారి పొందిన తర్వాత కూడా తమ స్వస్థతను పొందుకొనుటలో విఫలమగుచున్నారు.
24. గడ్డ అనేది కణములు అత్యధికముగా విస్తరించుటైయున్నది. నీవు కుడా అదే అయియున్నావు, కణములు సంఖ్య పెరుగుట. మీ జీవము ఎక్కడినుండి వచ్చినదో మీకు తెలుసు, ఎందుకనగా అది పరిశుద్ద వివాహము నుండి వచ్చినది. మరియు స్త్రీలో హిమోగ్లోబిన్ ఉండదని మనము గ్రహించాము. అది పురుషుడి నుండి వచ్చును. మరియు రక్తకణములు పురుషుడు ఉత్పత్తి చేయును. ఇప్పుడు మీలో ఇక్కడున్నవారిలో అనేకులు వ్యవసాయదారులు, మరియు మీరు కోళ్ళు కలిగియున్నారు, మీరు ఆ పెరటిలోని పక్షులను చూడండి...
తల్లి పక్షి తన గూటిని నిర్మించి దాని నిండా గుడ్లు పెట్టవచ్చును, మరియు ఆమె ఆ గుడ్లను పొదగవచ్చును, దాని శాయశక్తులా వాటిని మంచిగా చూడవచ్చు, అది ఆకలితో ఉండి బలహీనమగునంతగా ఆ గూటిలోనే యుండి, తన శరీరమును బలపరిచే ఆహారమును భుజించి, అవి పొదగబడుటకు, వాటిని వెచ్చగా ఉంచుటకు ప్రతి కొద్ది నిమిషములకు ఒకసారి ఆ గుడ్లను తిరగవేస్తుండవచ్చును. ఆమె ఆ గుడ్లు విషయములో నమ్మకముగా ఉన్నది. కాని ఒకవేళ ఆ పక్షి మగ పక్షితో కలిసియుండకపొతే, ఆ గుడ్లు ఎన్నటికీ పొదగబడవు. అవి గూటిలోనే కుల్లిపోతాయి. ఒక కోడిపెట్ట, మీ కోళ్ళు గుడ్లు పెట్టవచ్చును, పెట్టలు పెట
వచ్చును. ఆమె వాటిని అదేవిధంగా పొదగవచ్చును, కాని మగపక్షితో ఆ పెట్ట కలవకపోతేఆ గుడ్లు పొదగబడవు.
25. ఇప్పుడు నేను ఈ దినములో ఉన్న సంఘమును గూర్చి అదే ఆలోచిస్తున్నాను. చూశారా? మనము ఎంతమంది సభ్యులను కలిగియున్నప్పటికీ, మనము వారిని ఎంతగా బుజ్జగించినప్పటికీ, పసిబిడ్డలవలె సాకినప్పటికీ, ఒకవేళ వారు జత అయిన యేసుక్రీస్తుతో కలిసియుండకపోతే, తిరిగి జన్మించనట్లయితే, వారు ఎన్నటికీ దైవిక స్వస్థతను లేదా మరేదానిని విశ్వసించలేరు. నీవు గూటినిండా కుళ్ళిపోయిన గుడ్లు కలిగియున్నావు. ఆ గూటిని శుభ్రము చేసి మరలా నూతనముగా ప్రారంభించుట మంచిది. వారు గూటిని శు భ్రము చేయు సమయము ఆసన్నమైంది అంటే, అమెరికాలో ఇప్పుడే ఆ సమయము వచ్చినది. అది నిజం. మనము పొరపాటు చేత అనేకమంది ప్రజలను లోపలికి తీసుకొనివచ్చి సంఘము యొక్క పుస్తకములలో వారు పేర్లు వ్రాశాము, అది మంచిదే. వారు వీధిలో ఉ ండుట కంటే వారు సంఘములో ఉండాలని నేను కోరుకొనుచున్నాను, అయినప్పటికీ, మనకు ఉజ్జీవము కావాలి.
ఇప్పుడు ఉజ్జీవము అనగా అనేకమంది నూతన సభ్యులను సంఘములోనికి తీసుకొనివచ్చుట కాదు, కాని ఇప్పటికే లోపల ఉన్నవారు ఉజ్జీవింపబడాలి. చూశారా? ఇక్కడ ఉన్న మీ సముద్రమువలె. ఒక దినమున నేను దాని తీరమున నిలబడ్డాను. ఒకరోజు సెలవు తీసుకొని చేపల వేటకు వెళ్లాను, అక్కడ ఆ అలలు పైకి క్రిందికి ఎగిసిపడుట చూశాను. నేను అనుకున్నాను, "అతడు ఎందుకు అంత చికాకుగా ఉన్నాడు? ఎందుకు అలలు అలా ఎగిసిపడుతున్నాయి?" నేను అనుకున్నాను. "అది ప్రశాంతముగా ఉన్నప్పటికంటే, అలలు ఎగిసిపదినప్పుడు ఒక్క చుక్క నీరు కూడా ఎక్కువ రావడం లేదు." అది నిజం. అదె పరిమాణములో నీటిని కలిగియున్నది. అంతే మొత్తములో నీరు ఉండును. ఎక్కువ నీ ఎంతమాత్రము రాదు. కాని అది ఎందుకు అలలు కవ్వముతో కదుపుచున్నట్లుగా ఎగసిపడుచున్నాయి? నేను తలంచాను, "అది ఉజ్జీవము కలిగియున్నది." అది ఏ చేయుచున్నది? నీటిలో ఉన్న చెత్త అంతటిని ఒడ్డునకు త్రోయుచున్నది.
కాబట్టి సంఘమునకు ఈరోజు కావలసినది అలాంటి ఉజ్జీవము. మనము ప ద్ధముగా మారు వరకు మనలో ఉన్న అవిశ్వాసమును కుదిపి బయటకు నెట్టివేయా మీరు ఆవిధంగా తలంచుటలేదా? నా ఉద్దేశ్యములో పాపము అంటే అవిశ్వాసము. ఒక పాపము ఉన్నది అదే అవిశ్వాసము అని మనము గ్రహించాము. మనము దా నమ్ముచున్నాము. "విశ్వసింపని వాడు ఇంతకు ముందే తీర్పు పొందియున్నాడు."
26. నేను ఒకసారి చెప్పినట్లుగా, కొద్ది కాలము క్రితము మెథడిస్ట్ సంఘ ప్రసంగించుచుండగా, నేను చెప్పాను, "సిగరెట్లు త్రాగుట, విస్కీ త్రాగుట, వ్యభి చేయుట, అబద్దమాడుట, దొంగతనము చేయుట మొదలైనవి పాపము కాదు."
మరియు ప్రశస్తమైన ఒక చిన్న సహోదరి అక్కడ కూర్చొనియున్నది, ఆ గుండ్రని కాలరు ధరించియున్నవారు, ఆమె జీవిత కాలము అంతా పరిశుద్ధతను గూర్చి బోధించినది, ఆమె అడిగినది, "నేను ప్రార్ధించుచున్నాను, పాపము అంటే ఏమిటో నాకు చెప్పుము?"
నేను ఆమె ప్రక్కనే ఉన్నాను. నేను చెప్పాను, "పాపము అనగా అవిశ్వాసము." నీవు విశ్వసించుట లేదు గనుక మీరు ఆ కార్యములు చేయుచున్నారు. ప్రభువు నందు విశ్వాసముంచువారు ఆ కార్యములు చేయరు. అతడు మరణము నుండి జీవములోనికి దాటి యున్నాడు.
యోహాను 5:24 లో యేసు చెప్పారు. "నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. (మరియు నిత్య జీవము ఒకే ఒక రూపములో ఉన్నది, అది పరిశుద్ధాత్మ. చూశారా?) నిత్యజీవము కలిగియుండును. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు (భూతకాలము)." ఓ, నేను దానిని ఇష్టపడుచున్నాను, మీరు ఇష్టపడుటలేదా? విశ్వసించువాడు...
27. ఇప్పుడు మనము... కూటములు ఎల్లప్పుడూ మూడు రకముల ప్రజలను ఉత్పత్తి చేయును: అవిశ్వాసి, వేషధారి మరియు విశ్వాసి, మనము దానిని కలిగియున్నాము, మనము ఎల్లప్పుడూ కలిగియుంటాము, మరియు ఎల్లప్పుడూ వారిని కలిగియుండబోవుచున్నాము. కాబట్టి అవిశ్వాసి విశ్వాసిగా మారాలని, వేషధారి నిజమైన విశ్వాసిగా మారాలని మనము కోరుకొనుచున్నాము. ఆకాశము నిజమైన దానితో నిండియుండగా మనము ప్రత్యామ్నాయంను ఎందుకు అంగీకరిస్తాము? మనము కల్పితమైన దానిని లేక భావోద్వేగములను ఎందుకు కోరుచున్నాము?
ఇప్పుడు గుర్తుంచుకోండి, పరిశుద్దాత్మ విస్తారమైన భావోద్వేగములను కలిగియున్నాడని నేను నమ్ముచున్నాను. ఏదైనాసరేతనలో జీవము లేనిది ఏదైనా సరే అది మృతమని నేను మీకు ఋజువు చేయగలను. కాబట్టి సంఘములో ఆ కొద్ది జీవము లేనట్లయితే, అప్పుడు ఆ సంఘములో ఏదో తప్పిదము ఉన్నది. దానికి పునరుద్ధానము కావాలి. కాబట్టి మనము భావోద్వేగములు కలిగియుండాలని నేను నమ్ముచున్నాను. మనము కలిగియున్నాము.
మనము బాస్కెట్ బాల్ మైదానములో ఉన్నామని చూస్తున్నాను. ఇప్పుడు మీలో అనేకమంది ప్రజలు, ఇక్కడున్న పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు, ఈ అందమైన పాఠశాలను బట్టి నిశ్చయముగా దేవునికి కృతజ్ఞతలు తెల్పుచున్నాను. నేను చూసిన వాటిలో ఇదే అందమైనదని నేను నమ్ముచున్నాను. నేను అనేకమైన ఆడిటోరియంలను చూశాను. కాని నేనుఇక్కడ...ఒకవేళ ఇక్కడ బాస్కెట్ బాల్ పోటీ జరుగుచున్నట్లయితే, మరియు మీ జట్టు గెలుచుచున్నది, ఓమై! మీరు ఆ బాల్కనీలో కూర్చొనియున్నారు. మీరు చెప్తారు. "నేను చూసినవాటిలో ఇది అత్యంత నిర్జీవమైన ఆట." ఖచ్చితంగా ఎందుకు.
మంచిది, మన యజమానుడు పోటీలో గెలుస్తుండగా, నేను మీకు చెప్పుచున్నాను, ఆయన మనకు ఇచ్చిన విజయమును బట్టి ఆయనను అభినందిస్తున్నాము అని ఆయన తెలుసుకోవాలని మనము మధ్యలో కేకలు వేస్తాము. అది నిజము. కాబట్టి అది చచ్చిన
కూటమువలె ఉండుట మనకు ఇష్టము లేదు. ఒక చచ్చిన సంఘమువలె. అది దేవుని సంచారము కలిగి, నిజమైన జ్ఞానముతో, సువార్త మార్గములో గొప్ప అద్భుత కార్యములు మరియు సూచక క్రియలు జరిగించుచూ, మెస్సయా సూచనలు మన మధ్యలో ఉన్నాయని చూపిస్తూ జీవము కలిగియుండాలని మనము కోరుచున్నాము.
28. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వాగ్దాన దేశములోనికి ప్రయాణించినట్లుగా, వారు ప్రయాణములో ఉన్నప్పుడు, ఆ శిబిరములో రాజు యొక్క స్వరము ఉన్నదని బిలాముకు ఏమాత్రము తెలియదు. అతడు కొట్టబడిన బండను, ఇత్తడి సర్పమును, వారి రాజు యొక్క విజయనాధమును చూచుట మరచిపోయాడు.
మనము ఈరాత్రి దానినే కోరుచున్నాము, శిబిరములో మనము కొట్టబడిన బండను కలిగియున్నాము. మీరు దానిని నమ్ముచున్నారా? ఆ బండ క్రీస్తు యేసు. దేవుని యొక్క తీర్పు కర్రతో ఆరణ్యములో ఆ బండ కొట్టబడినట్లుగా ఆయన కొట్టబడ్డాడు, ఆయన మన శిక్షను భరించాడు, నశించిపోవుచున్న ప్రజలు ఆ బండ నుండి వచ్చిన నీటిని త్రాగి బ్రతికినట్లుగా సంఘము జీవించుచున్నది. అది ఆ బండతో మాట్లాడిన ప్రతిసారి, అది నూతనమైన జలములు పొందుకున్నది. నూతన జీవము పొంది మరలా ఉజ్జీవించబడినది.
మరియు వారు చేసిన పాపములన్నిటి నిమిత్తము ప్రాయశ్చిత్తంగా ఆయన ఇత్తడి సర్పమును కలిగియున్నాడు. శిబిరము వెలుపల తయారు చేయబడిన వేరుపరచు జలములు అవిశ్వాసము నుండి అవిశ్వాసిని వేరు చేయుచున్నవి. వారు వాటన్నింటిని కలిగియున్నారు, మరియు వాటి అన్నింటి మధ్యలో, శిబిరముమధ్యలో ఎల్లప్పుడూ రాజు యొక్క విజయ ధ్వనిని కలిగియున్నారు. కాబట్టి ఈరాత్రి మనము మన ప్రయాణములో ఉన్నాము, కాబట్టి మన హృదయము అంతటితో మన ప్రభువును సేవించుదాము.
29. ఇప్పుడు ప్రతి రాత్రి మేము ప్రయత్నిస్తాము మీరు.... ఈ రాత్రి మనము ఎనిమిదిన్నరకు ప్రారంభించామని నమ్ముచున్నాను. బహుశా రేపు మనము కొంచెము ముందుగా ప్రారంభించుదాము. రేపు రాత్రి దైవిక స్వస్థత అనే అంశము గూర్చి మరింత లోతుగా మాట్లాడుతాను, అప్పుడు మీరు దానిని పూర్తిగా అర్ధం చేసుకుంటారు.
ఇప్పుడే ఒక చిన్న విషయమును మీఎదుట పెట్టాలని కోరుచున్నాను, ఒకవేళ రేపు రాత్రికి నేను దానిని మరచినట్లయితే... ఉదాహరణకు తీసుకొనండి, ఒక గడ్డ లేక కణితి, కాన్సర్, అది ఏమైనప్పటికీ. అది ఎలా ప్రారంభమైనది? ఇక్కడున్న నా చేతివలె, ఇప్పుడు నా చేతి మీద ఏమీలేదు, బహుశా ఒక దినమున ఒక గడ్డ లేక కాన్సర్ కణితి రావచ్చును. ఆ కణితి ఏమిటి? అది... ఎక్కడో ఒకచోట మరొక చిన్న జీవకణము దానిలోనికి ప్రవేశించి కణములను తయారుచేస్తుంది మరియు ఆ కణములు విస్తరిస్తాయి. నీవు తల్లి గర్భములో ప్రారంభం అయినట్లుగా, నీవు ఒక మానవునిగా ఎదిగావు. కుక్క కుక్కగా ఎదుగుతుంది. మరియు కోడి కోడిగా మారుతుంది
కాని ఒక కణితి, కాన్సర్ లేక ఆ గడ్డలు, వాటికి ఒక ప్రత్యేకమైన రూపురేఖలు ఉండవు, ఎందుకనగా అవి మానవుని రూపములో తయారుచేయబడలేదు. వాటిలో కొన్ని కాళ్ళు కలిగియుంటాయి, వాటిలో కొన్ని కేకులు వలె గుండ్రముగా ఉంటాయి, కొన్ని దీర్ఘచతురస్రాకారములో ఉంటాయి. అది ఏమిటి? అవి దయ్యములు. యేసు వాటిని దయ్యములు అని పిలిచాడు. ఆయన చెప్పినది నిజమేనా? ఖచ్చితంగా ఆయన నిజమే చెప్పారు. ఎందుకనగా "దయ్యము," అనే పదమునకు అర్ధము "బాధించువాడు," కాన్సర్, కణుతులు, వ్యాధులు మిమ్ములను బాధిస్తాయి.
30. యేసు తన సంఘమునకు ఇచ్చిన చివరి ఆజ్ఞ ఏమనగా, "మీరు సర్వలోకములోనికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మనివాడు శిక్షించబడును. విశ్వసించినవారిని ఈ సూచకక్రియలు వెంబడించును: నానామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు (మీరు దానిని నమ్ముచున్నారా?), దయ్యములను వెళ్ళగొట్టుదురు.”
ఆ కణితిలోని జీవము వెళ్ళిపోతే అప్పుడు ఏమి జరుగుతుంది? మంచిది మనము దానిని ఒక కణితి లేక కాన్సర్ అని పిలుస్తాము. అది గొప్ప హంతకురాలు. ఒకవేళ ఆ కాన్సర్ లోని జీవము వెళ్ళిపోతే ఏమి జరుగుతుంది, వెంటనే, మీలో నుండి జీవము వెళ్ళిపోతే ఏమి జరుగుతుంది? మొదటి దినము లేక తర్వాత మీ శరీరము కుషించుకుపోతుంది.
దుప్పులు లేక జంతువులను వేటాడే వేటగాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సరే మంచిది? ఇప్పుడు ఈరోజు మీరు ఒక దుప్పిని చంపారు, లేక అంగడిలో జంతువును వధించు వ్యక్తి, లేక మీరు ఎవరైనా సరే లేక సంరక్షకులు... చూశారా? మీరు చెప్తారు. “ఆ శరీరమును కాటాలో పెట్టారు, దాని బరువు నూట పదిహేను కేజీలు బరువున్నది.” మీరు ఉదయము దానిని బరువు తూచిన తర్వాత బాలురకు ఏమి చెప్తారో జాగ్రత్త వహించండి. తర్వాత దాని బరువు తగ్గిపోతుంది. మీకు అది తెలుసు, కాదా? ఒక్క రాత్రిలోనే అది చాలా కుంచించుకుపోతుంది. మానవ శరీరము కూడా అదే విధముగా కుంచించుకుపోతుంది. ఏ శరీరము యొక్క కణములైన ఆవిధంగానే జరుగుతాయి, ఎందుకనగా అది చనిపోయినది. ఇప్పుడు దానిని మూడు లేక నాలుగు దినములు ఎండలో ఉంచండి. అప్పుడు దానిని పైకి తీయండి.
ఒక్క చిన్న కుక్క మీద వీధిలో ఏదైనా వాహనము ఎక్కినట్టైతే, దానిని సూర్యుని ఎండలో మూడు లేక నాలుగు రోజులు ఉండనీయండి. అప్పుడు ఏమి జరుగుతుందో గమనించండి. దాని పరిమాణము కంటే రెట్టింపు పరిమాణములో ఉంటుంది. ఎన్నడూ లేనంత బరువుగా అది ఉండును.
31. ఇప్పుడు, ఒక మానవుడి వలె, ఈ ఆత్మ, చూశారా, అప్పుడు ఆ కణితితో వ్యవహరించుటలేదు. వైద్యులు దానితో వ్యవహరిస్తారు. వైద్యుడు తానూ చూడగలిన లేక
అనుభూతి చెందగల దానితో వ్యవహరిస్తాడు. తన ఐదు జ్ఞానేంద్రియములలోని రెండింటితో అతడు పని చేయును: అవి అతడి స్పర్శ లేక అతడి దృష్టి. ఇప్పుడు అతడు ఆ కణితిని స్పర్శిస్తాడు. అతడు శస్త్ర చికిత్స చేస్తాడు. మరియు అతడు దానిని చూస్తాడు, మరియు బయటికి తీసివేస్తాడు. ఒకవేళ ఆ వేరులో ఏదైనా చిన్న భాగము మిగిలిపోయినట్లయితే, అది ఇంకా పెరుగుతుంది. చూశారా?
32. ఇప్పుడు దైవిక స్వస్థతలో మనము ఎంతమాత్రము కణితితో వ్యవహరించము. ఆ కణితిలోని జీవముతో వ్యవహరిస్తాము, ఆ జీవము, ఆ దయ్యముతో వ్యావహరిస్తాము. ఆ జీవము బయటికి వచ్చినప్పుడు, వెంటనే లేదా కొద్ది గంటలు తర్వాత, ఆ రోగికి ఉ పశమనం కలుగుతుంది, మంచి అనుభూతి కలుగుతుంది, వెళ్లి సాక్ష్యము ఇస్తాడు. సాధారణముగా మూడు లేక నాలుగు రోజులు తర్వాత, నేను పట్టణములో నుండి వెళ్ళిపోతాను. చూశారా?
మంచిది తర్వాత, బైబిల్ చెప్పుచున్నది. "ఒక మనుష్యుడి నుండి అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత, అది నీళ్ళు లేని స్థలములలో తిరుగును.” దానికంటే మరి చెడ్డవైన ఏడు దురాత్మలను వెంటబెట్టుకొని వచ్చును మరియు ఆ ఇంటిని కాపాడుటకు ఆ ఇంటి యజమానుడు అక్కడ లేనట్లయితే, ఆ దయ్యములు నేరుగా మరలా ఇంటిలోనికి వస్తాయి, మరియు ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఎనిమిది రెట్లు చెడ్డగా ఉ ంటుంది. చూశారా? అతడు మరి ఏడు భిన్నమైన కార్యములు కలిగియున్నాడు. ఇప్పుడు మనము దానిని నమ్మాలి ఎందుకనగా దేవుడు దానిని చెప్పాడు, మరియు అది ఆయన వాక్యము. మనము దానిని ఆధారము చేసుకొని మన వర్తమానమును తయారు చేయాలి (చూశారా?) అది సత్యము ఎందుకనగా అది దేవుని వాక్యము.
ఇప్పుడు, ప్రజలు దానిలోనికి సరిగా వెళ్ళినట్లయితే, మరియు మూడు రాత్రులు కూటములు కలిగియున్నట్లయితే, ప్రజలు దానిలోనికి ప్రవేశించి ప్రార్ధన చేస్తారు. “ఓ, నేను స్వస్థత పొందాను నాకు ఎంతో చక్కగా ఉన్నది." మంచము మీద నుండి పైకి లేచి, ఇంటికి నడిచివెళ్ళిన తర్వాత, మూడు లేక డెబ్బై రెండు గంటలు తర్వాత, అది క్షయమైపోవుట మొదలవుతుంది, చనిపోయినది ఉబ్బుట మొదలవుతుంది, అప్పుడు వారు చెప్తారు, “ఓ, నేను నా స్వస్థతను పోగొట్టుకున్నాను. ఓ, నేనునేనునేను స్వస్థతను పోగొట్టుకున్నాను." నీవు స్వస్థతను పొందుకున్నావనుటకు అది ప్రపంచములో ఉన్న అత్యున్నత సూచనగా ఉ న్నది. చూశారా? నీవు దానిని పొందావనుటకు అది ఒక సూచన, నీవు దానిని పోగొట్టుకొనలేదు. ఇలాంటి చిన్న చిన్న విషయములు సంఘమునకు బోధించాలి. చూశారా? దానిని ఎట్లా పట్టుకోవాలో తెలిసియుండాలి. అవిశ్వాసమునకు చోటు ఇవ్వవద్దు, “ఓ,
నేను దానిని పోగొట్టుకున్నాను" అని చెప్పిన వెంటనే, సాతానుడు తిరిగి వస్తాడు. అది నిజము. అప్పుడు మీరు గతంలో కంటే అధ్వాన్నంగా ఉంటారు. చూశారా?
33. నేను దానిని విరంచి ప్రజలు దానిని బాగుగా గ్రహించునట్లు వారికి చెప్పుటకు నా కూటములలో తగినంత సమయము నాకు దొరుకుటలేదు. మరియు ప్రభువు చిత్తమైతే, ఈ దినములలో ఒకానొక దినమున నేను ఒక పెద్ద గుడారమును వేసి, అది పూర్తిగా పోయినది, ఎందుకనగా దేవుడు మనుష్యులను లక్ష్యపెట్టువాడు కాదు అని నిరూపించగలుగునట్లుగా, ఆ రోగి మరలా వచ్చే వరకు మూడు లేక నాలుగు లేదా ఐదు వారముల వరకు కూటములు పెట్టాలని ఆశించుచున్నాను. ఒక వ్యక్తిని స్వస్థపరచిన ఆయన, అదే వైఖరితో అదే ఆధారముతో వచ్చిన మరొక కాన్సరు రోగిని కూడా ఆయన స్వస్థపరచగలడు. ఎందుకనగా మీరు మీ పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు వారిని భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టి, “ఇప్పుడు మీరు చావకుండా ఒక గ్లాసు పాలు తాగండి. కాని జాన్ నీవు తాగకూడదు. తాగవచ్చు," అని చెప్తారా. మీరు ఆవిధంగా చేయరు. మీరు సరియైన తల్లిదండ్రులు అయితే జో గూర్చి చేసినట్లుగానే జాన్ కు కూడా చేస్తారు. మంచిది, మీరు మీ పిల్లలకు మేలు చేయుట, మేలైన బహుమానములు ఇవ్వడం ఎరిగియున్నప్పుడు, తన పిల్లలకు మేలైన వాటిని ఇవ్వాలని మీ పరలోకపు తండ్రి మరి ఎంత ఎక్కువగా ఎరిగియున్నాడు. కాబట్టి చూశారా, మనలో ప్రతి ఒక్కరమూ స్వస్థత పొందగలము.
34. ఎన్నో గొప్ప కార్యములు జరుగుటను నేను చూసియున్నాను, స్నేహితులారా, నేను మీకు చెప్పుచున్నాను, దేవుడు సమస్తమును చేయగలడని నేను ఎరుగుదును. చివరి దశలో ఉన్న కుష్టు వ్యాధి బాగుపడుటను నేను చూశాను. నేను అనేకమంది ప్రజలను చూశాను... చనిపోయారని వైద్యుల చేత ప్రకటించబడిన ప్రజలు, వారు వైద్యుల ద్వారా పరిక్షించబడ్డారు. విశ్వాసము ద్వారా తిరిగి బ్రతుకుటను నేను చూశాను, కేవలము దానిని నమ్ముముట ద్వారా. చూశారా?
ఒక చిన్న తల్లి తన బిడ్డను వా చనిపోయిన ఆ బిడ్డ సుమారుగా ఈ మధ్య కాలములోనే మెక్సికో వైద్యుని సంతకము చేయనీయండి. దానికి ఆధారము ఉండవలసియున్న.. ప్రచురించనీయలేదు, ఎందుకనగా నేనునేను బ... పెద్ద కార్యములు, ఎందుకనగా...
మీకు తెలుసు, అమెరి- సజలమైన మనము పెద్ద కా గొప్ప కార్యములు, దానిని గూర్చి గొప్ప చప్పుడు చేస్తున్నారు.
17
ము తొమ్మిది గంటలకు తిరిగి బ్రతికినది, అది 5 దానిని చెప్పవద్దు కటన చేసినప్పుడు, మేము దానిని మీకు తెలుసు
న్నాము,
Para no 33 nundi print sarigga ledu
నిండియున్నది. దానిని నుండి దూరం అయి సువార్త దగ్గరికి వచ్చునట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. అది నిజము. క్రీస్తును ఎరుగకుండానే లక్షలాదిమంది ప్రజలు మరణించుటను చూస్తున్నప్పుడు హాలీవుడ్ సువార్తికరణ బట్టి నేను ఎంతో విసికి వేసారిపోయాను. చూశారా? అది నిశ్చయముగా అనారోగ్యమును కలిగిస్తుంది. అది దేవునికి ఏంటో వ్యతిరేఖంగా ఉన్నది.
ఏలియా, బలముగా వీచిన గాలి అతడిని ఆకర్షించలేదు ఆ ఉరుము యొక్క శబ్దం అతడిని ఆకర్షించలేదు. భాకంపము అతడిని ఆకర్షించలేదు, కాని అతడు నిమ్మళమైన మెల్లని స్వరమును విన్నప్పుడు, అప్పుడు ప్రవక్త తన ముఖమునకు ముసుగు వేసుకొని బయటికి వెళ్ళాడు. అది అతడి దృష్టిని ఆకర్షించినది. మరియు సహెూదరి, సహోదరుడా ఈ వారము ఆ నిమ్మళమైన మెల్లని స్వరమును విందాము. చూశారా?
35. ఇప్పుడు మనము దేవుని వాక్యమును సమీపించి చదువుటకు ముందుగా, మనము ఒక్క నిమిషము తలలు వంచి ప్రార్ధన చేద్దాము.
ఇప్పుడు, తండ్రివైన దేవా, ప్రభువైన యేసు నామములో మీ వాక్యమును సమీపించుచున్నాము, ఎందుకనగా ఆయన నామములో మేము ఏది అడిగిననూ మేము దానిని పొందుకుంటామని మీరు వాగ్ధానము చేసియున్నారు. మరియు మీ వాక్యము సత్యమని మేము నిశ్చయముగా ఎరిగియున్నాము, ఎందుకనగా మమ్ములను ఇక్కడికి ఆహ్వానించిన దయగలిన ఈ చిన్న పట్టణమునకు మేము వచ్చియున్నాము.
మీ మంచి సేవకులు అందరూ ఇక్కడ కూడియున్నారు, ఈ ప్రశస్తమైన సేవక సహోదరులు నా వెనుక నిలబడి ప్రార్ధించుచున్నారు, నీ మందను నమ్మకముగా కాయుచున్న కాపరులు, తండ్రి వారిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అనారోగ్యములో ఉన్న అనేకమైన గొర్రెలు మీ విడుదల గడియ కొరకు కనిపెట్టుచున్నారు. ప్రభువా వారు ఇంకా ముందుకు సాగలేరు వారిలో అనేకులు వైద్యులు విడిచిపెట్టారు, బహుశా వారి గుండెలు పనిచేయలేనంత రోగముతో ఉన్నాయి, కాన్సర్లు వారిని చంపివేస్తున్నాయి. వైద్యులు తాము చేయగలినంత వారు చేసియున్నారు. అందును బట్టి అతడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము, మీరు అతడికి ఇచ్చిన జ్ఞానమును బట్టి వందనములు.
36. కాని ఇప్పుడు తండ్రీ, మేము మరొక అడుగు వేయవలసియున్నది. అందుకొరకే మేము ఇక్కడికి వచ్చాము. ప్రభువా ఇక్కడున్న వారిలో పాపము అనే రోగముతో బాధపడుచున్నారు. ప్రభువా, నిన్ను సేవించుటలో ఉన్న సంతోషము వారికి తెలియదు. నిన్ను స్వంత స్నేహితునిగా ఎరిగియుండుట, నీతో కలిసి కారులో ప్రయాణించుట,
రహస్యమైన స్థలములో నీతో మాట్లాడుట, బల్ల దగ్గర నీతో కలిసి భుజించుట వారికి తెలియదు. ఓ దేవా, ఈ ప్రాంతం అంతటా ఈ పట్టణములోని ప్రతి ఒక్క కుటుంబంలో, యేసు వ్యక్తిగతమైన స్నేహితుడుగా, కుటుంబలో ఒక సభ్యునిగా అవునుగాక.
37. మా విలువైన స్నేహితుల ముందు సువార్తను ఉంచడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు మా బలహీనమైన ప్రయత్నాలను మీరు ఆశీర్వదించాలని ఇప్పుడు ప్రార్థిస్తున్నాము. మరియు, ప్రభువా, మీరు మాకు సహాయము చేస్తారా, ప్రభువా నాకు కూడా సహాయము అవసరమైయున్నది.
ఒకవేళ నేను ఏదైనా చెప్పవలసియుంటే, లేక మీ చిత్తమునకు లేదా వాక్యమునకు ఏదైనా వ్యతిరేకముగా చెప్పుటకు ప్రయత్నము చేసినట్లయితే, తండ్రీ, నీవు ఇంకనూ దానియేలుతో పాటు గుహలో ఉన్న సింహముల నోళ్ళు మూసిన దేవునిగా ఉన్నారు, మీరు నానోటిని కూడా మూయగలరు. ప్రభువా మీ సంఘమునకు మరియు మీ ప్రజలకు మేలుకరమైన దానిని తప్ప మరొక మాట నేను మాట్లాడకుందునుగాక.
మరియు ప్రతి ఒక్క రోగి స్వస్థత పొందునుగాక. నశించిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడునుగాక, వెనక్కి జారిపోయిన ప్రతి వ్యక్తి తిరిగి సహవాసములోనికి వచ్చునుగాక. ఈ రాత్రి మేము చదవబోవుచున్న మీ లేఖనములను దీవించండి, రాబోవు రాత్రులలో నిజమైన సమయము కలిగియుండుటకు మీ సేవకులలో అది కొద్ది సిద్ధపాటును అనుగ్రహించును గాక. మరియు కూటములు ముగించబడిన తర్వాత, మేము విధేయతతో మాతలలు మరియు మా హృదయములు వంచి, సమస్త మహిమ ఘనతను మీకు చెల్లించుదుము. నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ మనవులు అడుగుచున్నాము. ఆమెన్.
38. ఇప్పుడు నోట్సు వ్రాయువారికి, లేఖనములు మరియు స్థలములు గూర్చి వ్రాసుకొను వారి కొరకు, ఈ రాత్రి మనము మొదటి యోహాను 5వ అధ్యాయములో 4వ వచనమునుచదువుదాము. ఇందులో నుండి ఒక చిన్న అంశమును తీసుకోవాలని అనుకుంటున్నాను.
39. మరియు మీరు వాటిని త్రిప్పుచుండగా, మేము సాయంకాలము రోగుల కొరకు ప్రార్ధనలు చేస్తామని చెప్పగోరుచున్నాను, దానిని క్రమములో ఉంచుటకు, ఆరాధన ప్రారంభం కావడానికి ఒక గంట ముందు బాలురు ఇక్కడ నిలబడి కాలసిన వారికి ఆప్రార్ధనా కార్డులు ఇస్తారు. వారు ప్రార్ధనా కార్డులు తీసుకొని ప్రజల ముందుకు వస్తారు, మరియు వారు ఆ ప్రార్ధనా కార్డులు అన్ని కలిపివేసిన తర్వాత వాటిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఎవరికి
కావాలంటే వారికి కార్డులు ఇస్తారు. మీరు వాటిని రాత్రికి ఉపయోగించాలి. మీరు వాటిని ఎవరికీ ఇవ్వవద్దు. మీరు ఆ సూచనలు విన్నారా. ఆ ప్రార్ధన మీకొరకే ఇవ్వబడినది. మరియు మీ స్నేహితులకు ఎవరికైనా ప్రార్ధనా కార్డులు కావాలంటే వారిని ఇక్కడి రమ్మని చెప్పండి, వారు వచ్చి సహెూ, బోడర్స్ మరియు ఇతర సేవకులు ఇచ్చే సూచనలు వింటారు. మరియు ఆ ప్రార్ధనా కార్డులను మార్పిడి చేయకూడదు, అవి ప్రతి ఒక్కరికి ఒకటి ఇవ్వబడుతుంది, తర్వాత ఆ సంఖ్యను బట్టి వేదిక మీదికి పిలువబడతారు. దానిని బట్టి ప్రార్ధనా వరుస ఎక్కడి నుండి మొదలవుతుంది అనే విషయము ఎవరికీ తెలియదు, ఏ కార్డు నుండి ప్రారంభిస్తారో ఎవరికీ తెలియదు... నాకు ఒకటి సంఖ్య ప్రార్ధన కార్డును ఇవ్వండి అంటారు. మంచిది మీదగ్గర మొదటి ప్రార్ధనా కార్డు ఉన్నది, మేము పదిహేను నుండి ప్రారంభిస్తాము.
40. ఎందుకనగా నేను దీని ప్రయత్నించాను. ప్రార్ధనా కార్డులు లేకుండా మేము ప్రయత్నించాము, అక్కడ పెనుగులాటలు జరిగాయి. ఇది నిజముగా ఒక పందెరంగముగా మారుతుంది. మరియు తర్వాత మేము...మేము దానిని ప్రయత్నించాము. తర్వాత సహకారము అందించుచున్న ప్రతి ఒక్క కాపరికి వంద ప్రార్ధనా కార్డులు పంపాను. అప్పుడు మొదటి కాపరి తన గుంపుతో లోపలికి వచ్చిన తర్వాత, కూటము జరిగే సమయంలో మిగిలినవారు లోపలికి వచ్చే అవకాశము దొరికేదికాదు, అంతా బాగున్నదని మేము నిర్ధారించుకునే వరకు వారిని పంపేవారిమి కాదు కాబట్టి ఆ వరుసలు నెమ్మదిగా కదిలేవి. కాబట్టి మీరు ఆవిధానమును కోరుచున్నారని నేను తలంచుచున్నాను. అది నిజమేనా?
మరియు తర్వాతుతర్వాత, వేదిక మీద ఒక్క వ్యక్తి స్వస్థత పొందిన సమయములో వేదిక క్రింద యాభై మంది స్వస్థతలు పొందేవారు. కాబట్టి అది అంత ముఖ్యము కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రజలలోనికి వెళ్లి వారు ఎంత దూరములో ఉన్నప్పటికీ వారిని అదేరీతిగా స్వస్థపరచును. కాని కార్డులు...
41. తర్వాత మేము ఏమి చేశామో మీరు చూశారు... మేము దానిని చేయలేకపోయాము, వందకార్డులు కలిగిన సంఘ కాపరి మూడు రోజుల కూటములలో మొదటిగా లోపలికి వచ్చేవారు. అది దానిని పరిష్కరించినది. తర్వాత నేను ఏమి చేశాను అంటే, నేను వెళ్లి ప్రార్ధన కార్డులు ఇచ్చేవాడిని, నేను చెప్పేవాడిని, "ఒక్క చిన్న పిల్లవాడిని తీసుకొని అంకెలు లెక్కపెట్టమందాము, అతడు ఎక్కడ ఆపుతాడో అక్కడ నుండి మొదలుపెడదాము." మీరు దీనిని నమ్మండి, నమ్మకపొండి, తల్లి తన కార్డు దగ్గర ఆ పిల్లవాడిని ఆపించేది. కాబట్టి మనము మానవులము, దానిని మనము గ్రహించాము, మరియు దానిని బట్టి మాకు ఫిర్యాదులు వచ్చాయి.
తర్వాత నా కుటములలో ఒక వ్యక్తి, ఖచ్చితంగా ప్రార్ధనా వరుసలోనికి వచ్చే కార్డును
అమ్ముచూ దొరికాడు. ఒక రాత్రి అతడిని ఆపివేశారు. కాబట్టి నా స్వంత కుమారుడు ప్రార్ధనా కార్డులు ఇస్తున్నాడు, మరియు అది అతనితో ఉండదని నాకు తెలుసు. మరియు ప్రార్ధనా వరుస ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందో అతనికి తెలియదని ప్రజలు తెలుసుకొనునట్లు నేను దానిని ఏర్పరిచాను. అతడు ప్రజలు ఎదుటకు ప్రార్ధనా కార్డులను తెచ్చి వాటిని కలిపివేస్తాడు, అక్కడే కావలసిన వారికి వాటిని ఇస్తాడు. కాబట్టి అతడికి కూడా తెలియదు. మరి ఎవరికీ తెలియదు.
తర్వాత నేను కూటము దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ఎక్కడికి నడిపించునో... నేను అనేకమార్లు చేశాను, ఈ వరుసలో ఎంతమంది ఉన్నారో లెక్కించి, దానిని నుండి ఈ వరుసను తీసివేసి, లేక ఈ వరుసతో భాగించి ఆవిధంగా చేసేవాడిని. లేదా ఎక్కడి నుండి ప్రారంభం చేయమని పరిశుద్ధాత్మ నడిపిస్తాడో అక్కడి నుండి ప్రారంభం చేసేవాడిని. తర్వాత మేము... మరియు ఆరాధన ముగించక ముందు, కూటములకు వచ్చిన వారందరి కొరకు ప్రార్ధన చేసేవాళ్ళం. మేము ఎల్లప్పుడూ దానిని చేసేవాళ్ళం.
42. మీరు కూడా దానిని తెలుసుకోవాలని మేము కోరుచున్నాము, మేము "ఇప్పుడు సువార్తికుడు ఇక్కడ ఉన్నారు. ఆయన స్వస్థతలు చేస్తారు." అని చెప్పాలని ప్రయత్నం చేయుటలేదు. మీ సంఘకాపరి ఒక దైవజనుడని మీరు తెలియపరచాలని మేము కోరుచుచున్నాము, నేను లేదా మరో సేవకుడు లేదా ఓరల్ రాబర్ట్స్ లేదా టామీ అసిస్బన్ వంటి దైవజనులు ఈ రోజున సువార్త పొలములో పనిచేయుచూ రోగుల కొరకు ప్రార్ధనలు చేస్తున్నారు వారికి ఎంత అధికారము ఉన్నదో మీ సంఘకాపరికి కూడా అంతే అధికారము ఉన్నది. మీ సంఘకాపరి కూడా అదే అధికారమును కలిగియున్నాడు. ఒకవేళ అతడు అదే వరము క్రింద పనిచేయకపోవచ్చును. అయినప్పటికీ అతడు దేవుని సేవకుడు, దేవుడు తనకిచ్చిన వరము క్రింద కార్యములు చేస్తున్నాడు.
మరియు ఇప్పుడు, మీరు రండి... నేను... మీరు కూటమును ఎప్పుడు ప్రారంభం చేస్తారు...?...? ఏడు గంటల ముప్పై నిమిషములకు, అయితే మీరు ఆరు గంటల ముప్పై నిమిషములకు ఇక్కడ ఉండాలి. అప్పుడు కూటమునకు అభ్యంతరము కలిగించరు. వారు వచ్చి ఆ సమయము వరకు ప్రార్ధనా కార్డులు ఇస్తారు కాబట్టి మీరు రాగలిగినంత ముందుగా రండి, అప్పుడు మీరు వచ్చేసరికి అవి మిగిలియుంటాయి. ప్రతి రాత్రి మేము రోగుల కొరకు ప్రార్ధన చేయుటకు వారు కార్డులు ఇస్తారు. ఆ విధంగా చేయుట వలన రద్దీ తగ్గుతుంది ప్రజలు ఒకరి మీద ఒకరు పడరు.
43. మేము విదేశాలకు వెళ్ళినప్పుడు మీరు దానిని చూడాలి, మీరు సైన్యము సహాయము తీసుకోవాలి. వారు అడ్డముగా నిలబడిన ఐదుగురు సైనికుల మీదుగా ఎక్కివెళ్ళుటను నేను
చూశాను, ఒక స్త్రీ ఆ పురుషుల భుజముల మీదికి ఎగిరి భుజముల మీద నడచివెళ్ళినది. సైన్యము అంతటిని చికాకు పరిచారు, ఒకేసారి ఐదువేలమంది త్రోసుకొని వచ్చారు, వారి కాళ్ళ మధ్యలో నుండి దూసుకువచ్చారు, నిన్ను తాకుటకు ప్రయత్నించుచూ మీ వస్త్రములు చింపివేస్తారు. కాని మనము ఇక్కడ, ఇలాటి చిన్న కూటములలో మనము క్రమమును కలిగియుంటాము, మనము దీనిని మర్యాదగా క్రమముగా జరిగిస్తాము. మీరు దానిని నమ్ముటలేదా?
44. సరే మంచిది, ఇప్పుడు, మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనము చదువుదాము:
దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.
చదవబడిన వాక్యమును ప్రభువు దీవించునుగాక. ఈ రాత్రి నేను "సమస్తమైన అవిశ్వాసమును జయించుటకు ఏమి కావాలి: మన విశ్వాసము" అనే అంశము మీద మాట్లాడాలని ఆశించుచున్నాను.
45. ఇప్పుడు, నిన్నటి దినమున అమెరికా దేశములు రెండు గొప్ప ప్రచార సభలు ముగించబడ్డాయి. వాటిలో ఒకటి డెమోక్రాట్ వారిది. కాలిఫోర్నియాలో జరిగినది, వార్తాపత్రికలు పూర్తిగా వాటితో నిండిపోయాయి. మీరు రేడియో పెట్టినప్పుడు వాటిని గూర్చి తప్పక వింటారు. అది నిజము. అది ఒక రాజకీయ పార్టీ. వారు తమ పార్టీలో తాము ఉత్తమమైన వ్యక్తి అని తలంచిన వానిని ఎన్నుకుంటారు, వారు శ్రీ. కెనడీని ఎన్నుకున్నారు. వారి సభలో శ్రీ. కెనడీని ఎన్నుకొనినప్పుడు, ఈ దినమున ప్రపంచములో అతడు గొప్ప వ్యక్తిగా హెచ్చించుటకు వారు అతనికి ఒక వేదిక నిర్మిస్తున్నారు. వారు ఎన్నుకోవాలని కోరుకున్న వ్యక్తిని చివరికి ఎన్నుకొనిన తర్వాత, వారు సంతోషముతో కేకలు వేస్తూ శ్రీ. కెనడీని ఘనపరచారు.
మరియు నిన్నటి దినమున లేదా మొన్నటి దినము, లేదా మరొక దినమున మరో పార్టీ, రిపబ్లికన్ పార్టీ శ్రీ. నిక్సన్ గారిని ఎన్నుకున్నది. మంచిది వారు అనేక దినములు ప్రచారము చేశారు, శ్రీ.నిక్సన్ కొరకు వేదికను నిర్మించారు మరియు ప్రచారము చేశారు. అమెరికా దేశము అధ్యక్షుని పదవికి పోటి చేయుటకు వారు అనుకున్న వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత వారు సంతోషముతో గంతులు వేశారు, కేకలు వేశారు, ఎందుకనగా ఏ వ్యక్తిని ఎన్నుకోవాలని వారు సభలకు వచ్చారో ఆవ్యక్తిని వారు ఎన్నుకున్నారు.
46. ఇప్పుడు, ఒక వ్యక్తిని ఎన్నుకొనుటకు ఈరాత్రి మనము ఇక్కడికి వచ్చాము, ఆ మనుష్యుడు ప్రభువైన యేసు. మరియు ఈరాత్రి ఆయన కొరకు నేను ఒక వేదికను కట్టుటకు
ప్రయత్నించుచున్నాను, అందును బట్టి రాబోవు రాత్రులలో మనము సంతోషించి ఆయన నామమును స్తుతించగలము, ఎందుకనగా మన దేవునిగా, రక్షకుడిగా మరియు స్వస్థపరచువానిగా ఆయనను మన హృదయములో ఎన్నుకున్నాము. మొదటిగా, ఆయన కొరకు ఒక వేదికను ఏర్పాటు చేయగోరుచున్నాము.
మరియు ఇప్పుడు మనము విశ్వాసము మరియు విజయము గూర్చి మాట్లాడుదాము. మరియు ఈ లోకములో ఎన్నో గొప్ప విజయములు సాధించబడ్డాయి. అక్కడ... ఈ రాత్రి నేను వాటిని అన్నింటిని లెక్కించినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా సాధించిన విజయాలు అనేకమైన వేలల్లో ఉంటాయి: పురాతన రోమ్, గ్రీకు మరియు ఇతర యోధులు అందరూ గొప్ప విజయములు సాధించారు, మరియు అమరవీరుల రక్తములో భూమి అంతా స్నానము చేసినది. నేను దానిని ప్రారభించుటకు రెండు లేదా మూడు కార్యములను మీ దృష్టికి తీసుకొనివస్తాను, వారు ఆ విజయమును సాధించినప్పుడు వారు ఎలా ప్రవర్తించారో మీకు చెప్తాను.
47. ఉదాహరణకు, మొదటి లేదా రెండవ ప్రపంచ యుద్ధములో జర్మనీ వారు ఫ్రాన్స్లో విజయము సాధించినప్పుడు, అంతటిని సురక్షితముగా మార్చిన తర్వాత హిట్లర్ కొరకు వారు ఒక వేదికను నిర్మించారు. హిట్లర్ విజయ స్తూపము దగ్గర నిలబడ్డాడు అని వారు చెప్తారు. నేను కూడా అనేకమార్లు అక్కడ నిలబడ్డాను. మరియు అతడు అక్కడ నిలబడియున్నప్పుడు, లక్షలాదిమంది జర్మన్లు నెమ్మదిగా అడుగులు వేయుచూ తమ మార్గదర్శికి వందనములు చెప్పుచూ కవాతు చేశారు, ఆకాశములో అరగంట సమయము మేఘమువలె తమ విమానములతో కప్పివేశారు. ప్రజలు కేకలు వేశారు, తుపాకులు కాల్చారు, ఈలలు వేశారు, గంటలు మోగించారు, ఎందుకనగా వారు ఫ్రాన్స్ ను స్వాధీనము చేసుకొని విజయము సాధించారు.
ఇక్కడ కొంతకాలము క్రిందట ప్రపంచ మహాసభలో, ఇంగ్లాండ్లోని లండన్లో జరిగిన పెంతుకొస్తు ప్రపంచ మహాసభలో వారు ష్టాలిన్ గూర్చిన చలనచిత్రము చూపించారు, జర్మనీ కూలిపోయిన తర్వాత ష్టాలిన్ను బెర్లిన్కు తీసుకొనివచ్చారు. అది చూచుటకు ఏంతో రమ్యముగా ఉన్నది, ఆ రష్యా యుద్ధ ట్యాంకులు మరియు ఫిరంగులు ఒక్కసారి పేల్చారు. వారు జర్మనీలోనికి ప్రవేశించుచున్న ఆ భయంకరమైన దృశ్యమును ప్రపంచము ఎలా తట్టుకున్నదో నాకు తెలియదు. ఆ తుపాకులను ఒకదాని మీద ఒకటి పెట్టి నిరంతరం వాటిని పేల్చారు, వారు జర్మనీని ముక్కలుగా చీల్చారు.
మరియు వారు చివరికి దానిని స్వాధీనము చేసికొనిన తర్వాత, వారు దానిని సురక్షితమైన స్థలముగా చేసి, విమానములో స్టాలిన్ను తీసుకువచ్చారు, అతడు విమానములో నుండి
దిగిన వెంటనే రష్యా సైనికులు వింతగా కొద్దిగా వంగి, వేలాది మంది సైనికులు ముందుకు వెనుకకు కదులుచూ కేకలు వేస్తూ గంతులు వేశారు, ఎందుకనగా వారు జర్మనీ మీద విజయం సాధించారు. వారిని అణగద్రొక్కారు.
48. మనము హిరోషిమా మీద అణుబాంబును వేసినప్పుడు, లక్షలాది మంది ప్రజలు ముక్కలైపోయారు, వారి కనుగుడ్లు బయటికి వచ్చాయి, జపాన్ లొంగిపోయారు, ఆ దినమున శాంతి ఒప్పందము మీద సంతకాలు చేసినప్పుడు కూడా అలాగే జరిగినది. వారు ఈలలు ఊదారు మరియు తుఫాకులు కాల్చారు. కేకలు వేశారు. యుద్ధము ముగించబడినందుకు అనేకమంది తండ్రులు ఏంతో సంతోషించారు, ఎందుకనగా వారికి కొంచెము విశ్రాంతి దొరికినది. తమ కుమారులు మరలా ఇంటికి వస్తారు కాబట్టి అనేకమంది తండ్రులు మరియు తల్లులు సంతోషించిరి. మరియు అది ఒక గొప్ప దినము. మరియు విజయము సాధించుట అనగా దేనినో జయించుట. వారు దేనికి వ్యతిరేకంగా పోరాడుచున్నారో దానిని లోబరుచుకున్నారు.
49. సింహములను వేటాడునప్పుడు నేను ఆఫ్రికా అడవుల్లో నిలబడ్డాను, నేను ఒక్కప్పుడు సింహమును తక్కువగా లెక్కించేవాడిని కాని ఇప్పుడు అతడిని నేను గౌరవిస్తాను ఎందుకనగా దానికి చంపుటకు ఏంతో బలము ఉన్నప్పటికీ కేవలము ఆహారము కొరకు మాత్రమే చంపును. అది ఆహారము తిన్న తర్వాత రోజంతా ఇతర జంతువులు దాని మీద ఎగరవచ్చు. అది ఏమాత్రము వాటిని లక్ష్యపెట్టదు. కాని అది దేనినైనా చంపినట్లయితే, అది చూచుటకు దయనీయమైన విషయంగా ఉంటుంది. అది కరజంతువులు లేదా జీబ్రాను చంపుతుంది. అది కాలును ఆ జంతువు మీద పెడుతుంది, రాజసముతో కూడిన తన పెద్ద తలను గాలిలోనికి ఎత్తి, మెడ చుట్టూ జూలు వ్రేలాడుచుండగా బిగ్గరగా గర్జించును. అది విజయ గర్జన చేసినప్పుడు కొండ మీద నుండి చిన్న మట్టిగడ్డలు క్రిందికి రాలడం నేను ఐదు వందల గజముల దూరము నుండి చూశాను. దానికి తినుటకు ఆహారము దొరికినది, దానిమీద తన కాలును పెట్టి, దానిని నాకుచూ అడవిలో గర్జిస్తుంది.
50. ఇవన్నియూ ఎక్కువ కాలము నిలువవు. ఈ యుద్ధములు మరియు రక్తపాతములు మరలా తిరిగి వస్తాయి ఎందుకనగా అవి తప్పు మార్గములో గెలవబడ్డాయి. అది ఎక్కువ కాలము నిలవదు. యేసు వచ్చి తన రాజ్యమును స్థాపించే వరకు శాంతి సమాధానము ఉ ండదు, అప్పుడు ఇక ప్రపంచములో యుద్ధములు ఉండవు. కాని అప్పటి వరకు, పరిశుద్ధ గ్రంధము చెప్పినట్లుగా దేశములు దయ్యము ద్వారా పాలించబడుచున్నాయి. మరియు యేసు వచ్చే వరకు వారు ఒకరితో ఒకరు యుద్ధములు చేస్తారు. ఆ దినమున సాతానుడు ఆయనను ఎత్తైన పర్వతము మీదికి తీసుకువెళ్ళి ఆయనతో చెప్పాడు, “నీవు దేవుని కుమారుడవైతే, సాష్టాంగపడి నన్ను ఆరాధించుము, నేను ఈరాజ్యములు అన్నింటినీ నీకు
ఇచ్చివేస్తాను. అవి నావి. నాకిష్టము వచ్చినట్లుగా వాటితో చేస్తాను. నీవు కేవలము నన్ను ఆరాధించినట్లయితే నేను వాటిని నీకు ఇస్తాను."
వెయ్యేండ్ల పరిపాలనలో వాటికి తాను వారసుడను అవుతానని తెలిసిన యేసు ఇలా చెప్పారు, “సాతానా, నా వెనక్కి పొమ్ము, ఇలాగు వ్రాయబడియున్నది, 'ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను." సాతానుడు ఆయనను విడిచి వెళ్ళాడు.
51. ఒక పాత కాలపు సామెత ఉన్నది, అది సామెత కంటే ఎక్కువ. ఏదేమైనప్పటికీ, మొదటిగా ఎవరు వచ్చినప్పటికీ, నీవు నియమము ప్రకారము ఆటను ఆడాలి లేనట్లయితే నీవు ఎప్పటికీ గెలవవు. క్రీడాకారుడు తన వరసలో పరుగెత్తుచుండగా, ఒకడు అడ్డదారిలో మైదానములో పరుగెత్తి మరొక వ్యక్తి కంటే అరగంట ముందుగా గమ్యము చేరినప్పటికీ ఆ పందెము చివరన అతడు అనర్హుడవుతాడు. అతడు ఆట యొక్క నియమములను బట్టి ఆడాలి లేనట్లయితే అతడు అనర్హుడగును.
అలాగే మనము ఇప్పుడు పరుగెత్తుచున్న జీవితమనే పందెములో మనము కుడా పరుగెత్తాలి, దానిని దేవుని యోగ్యతల ప్రకారము ఆడాలి లేనట్లయితే మనము అక్కడికి చేరినప్పుడు ఓడిపోతాము. మనము రాష్ట్రపతి అయినా, మనము గవర్నరు అయినా లేదా సేవకుడు అయినా లేదా ఏ సంఘమునకు చెందియున్నా, లేక ఏ మతశాఖ అయినా, ఆట యొక్క నియమములను పాటించాలి. మనము దానిని సరిగా ఆడాలి. మనము ఆట యొక్క నియమములను పాటించాలి. మనము తప్పక దేవుని వాక్యమును పాటించాలి. మనము ఇష్టపూర్వకముగా దానిని చేయాలి.
నేను నమ్ముచున్నాను, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు చెప్పాడు, “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున, మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” పౌలు గ్రీసు మరియు రోమ్లో జరిగే ఒలింపిక్స్ గూర్చి మాట్లాడుచున్నాడు. మీరు ఆటను నియమము ప్రకారము ఆడాలని అతనికి తెలుసు, ఎందుకనగా ఒకవేళ నీవు అలా ఆడనట్లయితే నీవు అనర్హుడవు అవుతావు.
మరియు ఈరాత్రి తిరిగి జన్మించిన విశ్వాసులుగా, అంత్య కాలములో ఉన్న విశ్వాసులము, ఆట యొక్క నియమముల ప్రకారము మనము పోరాడాలి. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు క్రీస్తు వైపు చూస్తూ మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తాలి.
52. దాని వెంటనే లేదా దానికి ముందుగా, దానికి ముందుగా, అతడు హెబ్రీయులకు
వ్రాసిన 11వ అధ్యాయంలో, అది గొప్ప అధ్యాయం, అతడు విశ్వాస వీరులను గూర్చి వ్రాశాడు, "విశ్వాసము ద్వారా మోషే, విశ్వాసము ద్వారా అబ్రహాము, విశ్వాసము ద్వారా హనోకు, విశ్వాసము ద్వారా నోవహూ." గొప్ప విశ్వాస వీరులు అందరూ, తర్వాత అతడు చెప్పాడు. "ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున, మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును (అవిశ్వాసమును) విడిచిపెట్టి."
ఈరాత్రి మనము ఇక్కడ దేవుని కుమారుని రాకడ చాయలలో ఉన్నాము, అయినప్పటికీ సంఘము రక్తహీనత కలిగిన స్థితిలో ఉండుటను చూస్తున్నాము. మనము దేశమును కదిలించగలిగిన గొప్ప బలమైన విశ్వాస యోధులుగా ఉండవలసియున్నది. దేవుడు దానిని మనకు ఇచ్చుచున్నాడు. మనము దానిని పొందగలము. మన మీద ఉన్న చిన్న విషయములు మనలను పరుగెత్తనీయకుండా ఆపుచున్నాయి. ఇప్పుడు ఆ చిన్న చిన్న బరువులను క్రింద పెడదాము, ఎందుకనగా మన విశ్వాసమునకు కర్తయు మరియు కొనసాగించువాడైన యేసు క్రీస్తు వైపు మనము చూస్తున్నాము, ఆయన భూమి మీద మానవునిగా జీవించాడు, మన మధ్యలో జీవించాడు, ఆయన నీతి ద్వారా మన పాపములు క్షమించబడునట్లుగా ఆయన పాపముగా మారాడు. మనము ఆయన నీతిగా మారునట్లుగా ఆయన పాపులమైన మనవంటివాడు ఆయెను. మరొక విధముగా చెప్పాలంటే, నేను ఆయనగా మారుటకు ఆయన నావలె మారాడు. నేను దేవుని కుమారుడిగా మారుటకు ఆయన నాస్థానమును తీసుకున్నాడు, పాపిగా మారాడు.
మనము దానిని చూచినప్పుడు, అది ప్రతి పురుషుని మరియు ప్రతి స్త్రీ యొక్క దృష్టిని ఆకర్షించాలి. ప్రతి సంశయాత్మక చర్చను ప్రక్కన పెట్టాలి. ఓ, నేను దానిని ప్రేమించుచున్నాను. ప్రతి భారమును సుళుగుగా చిక్కుబెట్టుచున్న ప్రతి చిన్న అవిశ్వాసమును ప్రక్కన పెట్టండి. ఏదో చిన్న కార్యము ఎదురుగా రాగానే మనము చెప్తాము, "మంచిది, దానిని గూర్చి అంతకు ముందు నేను వినలేదు." దానిని లేఖనములలో వెదకు, ఒకవేళ అది బైబిల్ లో ఉన్నట్లయితే, దానితో నిలిచియుండుము.
53. ఇక్కడున్న ప్రజలు ఆపిల్ పండ్లు పండించుటలో ప్రసిద్ధి చెందినవారు, ఈ లోయలో రుచికరమైన ఆపిల్స్ మరియు ఇతర పండ్లు కూడా పండిస్తారు. మీరు ఆ చిన్న చెట్టును నాటినప్పుడు అది చాలా చిన్నగా ఇంత సన్నగా ఉంటుంది. ఆ చెట్టులో కాయబోవు ప్రతి ఒక్క ఆపిల్ అప్పుడే దానిలోనే యున్నది. ఖచ్చితంగా దానిలో ఉన్నది. ఒకవేళ దానిలో లేనట్లయితే అవి ఎక్కడి నుండి వచ్చాయి? అది ఆ చెట్టులో ఉన్నవి. మరియు మీరు చెట్టును భూమిలో పాతుతారు. మీరు దానికి నీరు కడతారు, నీరు పోస్తారు. ఆ చిన్న చెట్టు ఏమి చేస్తుంది? అది పెరుతుంది, మరియు ఎందుకు... అది ఎలా పెరుగుతుంది, అది నీటిని
త్రాగుతుంది, భూమి నుండి నీటిని లాగుతుంది. అది దాని భాగము కంటే ఎక్కువగా లాగుకొనుచున్నది, దానిని నింపుటకు కావాలసిన దానికంటే ఎక్కువగా తీసుకుంటుంది. అది లాగుకొనుచూ చివరికి రెమ్మలు, కొమ్మలు, ఆపిల్స్ ను బయటికి తీసుకువస్తుంది, తర్వాత శీతాకాలములో క్రిందకి వెళ్లి దాగియుంటుంది. ఆ చెట్టులో ఉన్న జీవము చనిపోనీయకుండా కాపాడుతుంది. ఏ జ్ఞానమును బట్టి అది నేలలోనికి వెళ్లి, శీతాకాలము అంతా దాగియుంటుంది?
ఒక తగరపు కప్పులో నీళ్ళు పోసి కంచె మీద పెట్టండి, శీతాకాలము వచ్చినప్పుడు అది క్రిందికి వెళ్తుందేమో చూడండి. ఖచ్చితంగా అవి వెళ్ళవు. ఏదో జ్ఞానము దానిని క్రిందికి తీసుకొనివెళ్తుంది. అక్కడ నీటిని క్రిందికి నడిపించు అదే జ్ఞానము, అదే దేవుని ఆత్మ ఈ కూటములకు మనందరినీ సమకూర్చినది, మన ఎదుట ఉన్న గడియలో ఆయన మంచితనమును మరియు కృపను కనుగొనుటకు, అదే ఆత్మ మనలను క్రీసు యేసులో పరలోకపు స్థలములో సమకూర్చినది. ఓ, దేవుడు వాస్తవమైయున్నాడు.
54. ఇప్పుడు మనము కనుగొన్నాము ఈ చిన్న చెట్టు అది బయటకు తోస్తుంది. అది పెరుగుచున్నప్పుడు అది బయటకు తోస్తుంది. మరియు నీవు దేవుని రాజ్యములో జన్మించినప్పుడు, క్రీస్తులో ఒక చిన్న బిడ్డవలె, ఈ జీవిత యాత్రలో నీవు అవసరమైనదంతా, నీవు పరిశుద్ధాత్మను పొందుకొనినప్పుడు అది నీలోనే యున్నది. ఓ, అయితే నీవు ఏమి చేయాలి, త్రాగుము, త్రాగుము, త్రాగుచూ ఉండుము. నీవు సంఘములో చేరి బాప్తీస్మము పొందినప్పుడు ఆగిపోవద్దు. నీవు దీని కొరకు విశ్వాసము కలిగియుండు వరకు త్రాగుము, దాని కొరకు విశ్వాసము, దీని కొరకు విశ్వాసము, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు అన్ని సంఘములో జీవించువరకు దానిని బయటికి త్రోయుము,
(టేపులో ఖాళీ యున్నదిుసంపా)... ఆయనను శ్రద్ధగా వెదకు వారికి బహుమానమును అనుగ్రహించును.
55. ఇప్పుడు, మనము ఎలా నాటబడ్డాము? మనము క్రీస్తు యేసులో నాటబడ్డాము. ఆయనను గూర్చి నాకున్న అవగాహన బట్టి నేను దానిని నమ్ముచున్నాను. ఆయన ఎన్నటికి క్షయముకాని జీవపు ఊట, నీవు ఆయన మంచితనమును ఎన్నటికీ పోగొట్టలేవు. కొంతమంది ప్రజలు ఇలా తలంచుదురు, "ఓ, దేవునికి ఎక్కువగా మొర్రపెట్టుట నాకు అసహ్యం." నీవు దానిని చేయాలనే ఆయన కోరుచున్నాడు.
“మీరు నన్ను అడుగుటలేదు గనుక మీరు పొందుకొనుటలేదు. మీరు విశ్వసించుటలేదు గనుక మీరు అడుగుటలేదు. మీ సంతోషించునట్లు అత్యధికముగా అడగండి.” దేవుడు అదే
కోరుచున్నాడు: పెద్ద కార్యములను అడుగుము. నేను ఈ కూటములో వందలాది ఆత్మలను అడుగుచున్నాను. ఆ ద్వారములో ప్రవేశించు ప్రతి ఒక్క రోగి స్వస్థత పొంది తిరిగివెళ్ళాలని నేను మనవి చేయుచున్నాను. నేను దానిని విశ్వసించుచున్నాను. నేను నమ్ముచున్నాను మనము ఎత్తబడువరకు ఇది మరొక కూడికగా ఉండదు గాని, కాని యాకిమాలో ఇది ఒక ఉజ్జీవముగా ఉండును. సాతానుడు, నన్ను ఇక్కడికి రానీయకుండా చాలా కాలము ఆపాడు, కాని ఈ దేశములో ప్రతి సంఘములో నిజమైన ఉజ్జీవము వ్యాపించు సమయము వచ్చియున్నదని నేను విశ్వాసించుచున్నాను.
56. ఈరోజు మధ్యాహ్నం బయటికి వెళ్లి వివిధ ప్రదేశములను దర్శించాను, జమ్ముతో చేసిన పాత టోపిని ముఖము మీదికి లాగుకొని బయటికి వెళ్లాను, ప్రజల యొక్క మనోభావాలు గమనించడానికి వెళ్లాను. ఇక్కడ ప్రజలు చాలా మంచివారుబీ మీరు పని చేయుటకు ఏదో ఒకదానిని కలిగియున్నారు. అది నిజము. ఇప్పుడు మనము చేయవలసినది ఏమిటంటే మనము పని చేయాలి. మన ప్రభువైన యేసును మన హృదయములలో మన రాజుగా, మన గవర్నర్, మన విశ్వాసమునకు కర్తగా, మన దేవునిగా, మనలను స్వస్థపరచువానిగా, మన రక్షకుడిగా, ఎన్నుకొనుటకు ఈరాత్రి మనము ఇక్కడ కూడియున్నాము. ఆయనను మన హృదయములలో ఎన్నుకొని, దానిని రాబోవు తీర్పు దినము వరకు తీసుకొని వెళ్లి ఆగొప్ప ఎన్నికలో ఆయనను రాజులకు రాజుగా మరియు ప్రభువులకు ప్రభువుగా పట్టాభిషేకం చేద్దాము.
57. ఇప్పుడు మనము భయంకరమైన దినమున జీవించుచున్నాము, కాని నీవు విశ్వసించినప్పుడు, నీవు అవసరమైనవి అన్నీ నీకు ఎప్పుడో అనుగ్రహించబడియున్నాయి. ఈ దినమున నేను కనుగొన్నాను, అనేకమంది ప్రజలు తాము సంఘములో చేరినప్పుడు, ప్రత్యేకముగా ఇక్కడ అమెరికాలో, వారు కేవలము మెల్లగా జారిపోయే వారిగా ఉంటున్నారు. వారు కేవలము, “మంచిది, ప్రభువుకు స్తోత్రం, నేను సహోదరుడు బ్రెన్హాంను కలిశాను, నేనునేను రక్షించబడ్డాను, మరియు నా పేరు పుస్తకములో వ్రాయబడినది, మరియు అది నేను చేశాను అంతే." కేవలము కొట్టుకుపోవుచున్నారు, మనము అలా చేయుట ఇష్టములేదు. కేవలము ఒక సంఘ సభ్యునిగా మారుటకు నీవు రక్షించబడలేదు. నీవు పని చేయుటకు రక్షించబడ్డావు. మనము చక్కటి మిలటరీ యూనిఫారం ధరించేది కేవలము ఒక మూలను అమ్మాయిలతో పరిహాసములాడుటకు కాదు. పోరాటము చేయుటకు మన సైన్యమునకు శిక్షణ ఇస్తాము. మరియు మనము విహారయాత్రలో లేము. మనము యుద్ధ రంగములో ఉన్నాము. మన ప్రభువైన యేసు యొక్కయు మరియు మన ఆత్మల యొక్కయు శత్రువును ఇప్పుడు ఎదుర్కొనుచున్నాము. మనము లేచి హృదయ పూర్వకముగా పోరాటం చేద్దాము.
ఆ జీవము కీర్తన నాకు ఇష్టము, "మూగ పశువువలె నడిపించబడవద్దు,” ఎక్కడికో అటు ఇటు నడిపించబడవద్దు. ఒక విజేతవలె ఉండుము.
విభేదములను మన వెనుక విడిచిపెట్టి
గొప్ప వ్యక్తుల యొక్క జీవితములు మనకు జ్ఞాపకము చేస్తున్నాయి మన జీవితములను గొప్పవిగా మార్చుకోగలము జీవితము యొక్క గంభీరమైన ప్రధానమైన మార్గములో ప్రయాణిస్తుండగా
కాలమనే ఇసుక మీద అడుగుజాడలు విడిచిపెట్టి.
ఆడుగుజాడలు, బహుశా మరోకరివి కావచ్చును,
నిరాశ్రయులైన మరియు ఓడ ధ్వంసమైన సోదరుడి కోసం,
మన అడుగుజాడలు చూచుట ద్వారా మరలా ధైర్యము తెచ్చుకుందురు. మనము ఏదో ఒకటి చేద్దాము. మనము వ్రాయబడిన పత్రికలము.
58. ఇక్కడ కొంత కాలము క్రితము, కొన్ని సంవత్సరముల క్రితము, నా భార్యలనేను వాక్యమును అధ్యయనము చేయుచుండగా ఆమె తలుపు దగ్గరికి వచ్చి మరియు ఆమె ఇలా చెప్పినది, "బిల్లీ, తలుపు దగ్గర ఒక దేశదిమ్మరి యున్నాడు. అతడు తినుటకు ఏదైనా కావాలని అడుగుచున్నాడు.”
నేను చెప్పాను, "అతడికి ఆహారము పెట్టుము. అతడికి ఏదైనా ఇమ్ము అతడికి ఒక మనుష్యుడు. అతడు ఎవరైనా నేను లక్ష్యపెట్టను, అతడు ఆహారము పెట్టుము. మనకున్న దానిలో అతడికి పంచి ఇమ్ము. ఆ వ్యక్తి ఆకలితో ఉన్నాడు.”
ఆమె చెప్పినది, "అతడిని చూస్తే నాకు భయంగా ఉన్నది."
నేను చెప్పాను, “ఓ, మై, తలుపు తెరిచి ఏదైనా తినమని అతడికి చెప్పుము. అతడి కొరకు ఏదైనా సిద్ధము చేసి అతడికి పెట్టుము.”
కాబట్టి ఆమె ఆహారము సిద్ధము చేసి బల్ల మీద పెట్టి అతడిని లోపలికి పిలిచినది, తర్వాత ఆమె గదిలోనికి వచ్చినది. కాబట్టి నేను... ఆమె అతడిని చూసి కొద్దిగా భయపడినది, ఎందుకనగా అతడు మురికిగా కనిపించుచున్నాడు, మరియు నేను బయటికి వెళ్లి చెప్పాను, "అయ్యా, ఎలా ఉన్నారు?"
అతడు చెప్పాడు, "మీరు ఎలా ఉన్నారు?"
మరియు అతడు ఆహారము తినుచున్నాడు, మరియు నేను అతడిని అడిగాను, “నీవు
ఎక్కడి నుండి వస్తున్నావు?"
అతడు చెప్పాడు, “ఓ, నేను ఎక్కడబడితే అక్కడ తిరుగుతాను."
నేను అడిగాను, “నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు?"
అతడు చెప్పాడు, “ఓ, అదే విషయము, నేను ఇక్కడ అక్కడ తిరుగుతాను." నేను అడిగాను, "నీకు జీవితములో ఏ లక్ష్యము కలిగియున్నావు?" అతడు చెప్పాడు. "ఏమీ లేదు."
59. మంచిది, ప్రజలు కేవలము అదే స్థితిలోనికి వెళ్లిపోవుచున్నారు. మనము ఏదో ఒక లక్ష్యమును లేక ప్రయోజనమును కలిగియుండాలి. మన హృదయములో ఒక సంకల్పము కలిగియుండాలి. మనము ఏదో ఒకదానిని చేయాలి. ఇప్పుడు మీరు చెప్తారు. "ఓ, మేము ఉజ్జీవమును కలిగియున్నాము. అవును, నేను ఐసన్ హెూవర్ పాఠశాల ఆడిటోరియంలో ఉన్నాము." నీవు అలా తేలిపోయెవానిగా కొట్టుకొనిపోవువానిగా ఉండవద్దు. నీవు అలా ఉంటే నీకు ఏమాత్రము విలువ ఉండదు. మనము లేచి దానిని గూర్చి ఏదో ఒకటి చేద్దాము. మన భుజములను ఆ చక్రమునకు ఆనించుదాము. మన సంఘము అభివృద్ధి పొందునట్లు చేద్దాము దేవుని రాజ్యమును అభివృద్ధి చేద్దాము. రోగులు ఇక్కడికి వచ్చునట్లుగా చేద్దాము. దేవుడు ప్రజల మధ్యకు వచ్చి ఈ దేశమును కదిలించు గొప్ప అద్భుతమైన కార్యములు మరియు సూచకక్రియలు జరుగునట్లు చూద్దాము. ఈ దేశమును పులకరింపజేయు కార్యములు ఇక్కడ జరుగుచున్నందుకు నేను సంతృప్తి చెందుచున్నాను, మనలో ప్రతి ఒక్కరమూ వాటి వెనుక నిలబడినట్లయితే అవి దేవుని రాజ్యము నిమిత్తము ఈ దేశమును కదిలిస్తాయి..
మనము ఏమి చేస్తున్నాము? ప్రభువు కొరకు వేదికను నిర్మిస్తున్నాము. మనము ఆయనను యాకిమాకు తీసుకురావాలని కోరుచున్నాము. గొప్ప ఉజ్జీవములోనికి ఆయనను తీసుకురావాలని కోరుచున్నాము. మరియు మన స్వంత హృదయములలో ఆయనను మనము ఎన్నుకోవాలి. మనము ఒక సంకల్పమును కలిగియుండాలి, దానితో మనము ఏదో ఒకటి చేయాలి, ఒక సంకల్పము కొరకు మనము ఏదో ఒకటి చేయాలి. నీవు కేవలము సంఘములో జేరి కొట్టుకుపోతూ ఉండకూడదు. నీవు దానిని ఆవిధంగా చేయలేవు. నీవు చేస్తున్న దానిలో ఎల్లప్పుడూ నీవు ఒక సంకల్పమును లేక ప్రయోజనమును కలిగియుండాలి.
ఒక గృహిణి చెప్తుంది. "మంచిది. నేను కేవలము ఒక గృహిణిని."
టెలిఫోన్ తీసుకొని, ఏదో ఒకటి చేయుము. ఇప్పుడు ప్రభువైన యేసుకు సహాయము చేయుటకు ఏదో ఒకటి చేయుము.
60. ఒక మనుష్యుడు తన జీవితములో ఒక సంకల్పము కలిగియుండే సమయము ఒకటి వస్తుంది. అది అతడిని మార్చివేస్తుంది. అది ఒక వ్యక్తి దేవుని కలిసినప్పుడు జరుగుతుంది. ఒకవ్యక్తి దేవుని ముఖాముఖిగా కలిసిన తర్వాత అతడు మారకుండా ఉండలేడు. నీవు దానిని గూర్చి ఏమి చేసినప్పటికీ అది అతడిని మార్చివేస్తుంది. ఒక్కసారి దేవుని కలుసుకొనిన మనిషి మారకుండా ఉండలేడు. అది నిజం.
ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుందాము. నోవహూతో మొదలు పెడదాము. నోవహూ జీవితములో ఒక ప్రత్యేకమైన సంకల్పము లేదు. అతడు ఒక సామాన్యమైన వ్యవసాయదారుడు, పొలములో పనిచేసుకునేవాడు. మరియు ఒక దినమున దేవుడు అతడిని కలిశాడు, ఆయన అతడితో మాట్లాడాడు, ఎప్పటికీ జరిగే అవకాశము లేని ఒక అసాధ్యమైన కార్యము ఒకటి జరగబోతుంది అని అతనికి చెప్పాడు. మరియు ఆ గడియ నుండి, మూరు?లు ఏమి చెప్పినప్పటికీ తాను ఓడను నిర్మించాలని సంకల్పించాడు... ఎందుకు, అంతకుముందు ఎన్నడూ ఆకాశము నుండి వర్షము కురియలేదు. భూమి మీద ఎన్నడూ తడిలేదు. భూమి మీద ఊటల ద్వారా వ్యవసాయము చేశారు. ఆకాశములలో ఎన్నడూ ఒక్క మేఘము కూడా లేదు. అతడు దానిని ఎలా చేస్తాడు? మంచిది, అది జరుగబోతుంది అని దేవుడు చెప్పాడు, కాబట్టి దేవుని కొరకు ఈ కార్యమును సాధించాలని నోవహూ తన హృదయములో సంకల్పించాడు మరియు దానిని చేశాడు. వారు అతడిని ఎంతగా హేళన చేసినప్పటికీ, లేక అలా అని ఇలా అని ఎన్ని మాటలు అనినను చేశాడు.
"వర్షము ఎలా కురుస్తుంది? నోవహూ వర్షము ఎక్కడి నుండి వస్తుంది?"
"నాకు తెలియదు."
"మంచిది, వర్షము ఎక్కడ ఉన్నదో మాకు చూపించుము.”
"నేను మీకు చూపించలేను, కాని సమయము వచ్చినప్పుడు, అక్కడ వర్షము ఉంటుంది." అది నిజం. అతడు దేవుని కలిశాడు.
61. నీ వైద్యుడు ఇక లాభము లేదని చెప్పినప్పుడు, "కాన్సరు నిన్ను చంపివేస్తుంది.” ఇక ఈ ప్రపంచములో నీవు ఎలా బ్రతుకుతావు? అది ఎలా జరుగుతుందో నేను మీకు చెప్పలేను, కాని దేవుడు చెప్పాడు, “విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అది ఆవిధంగా జరుగుతుంది." అది నిజం.
కొద్ది కాలము క్రితము ఎవరో ఒకరు నాతో చెప్పారు. నేను ఏలియాను ప్రసంగించుచున్నాను, మరియు కాకులు అతడిని పోషిస్తున్నాయి. నేను అక్కడ మొరటుగా ఒక మాటను చెప్పాను అందునుబట్టి నీగ్రో జాతి ప్రజలు నన్ను క్షమించండి. కాని నేను చెప్పాను, “అతడు చాలా మంచివాడు. అతడు ఆ చెట్టు మీద పిచ్చివాడిగా ఉన్నాడు. ప్రతి దినము సేవ చేయుటకు అతడికి నల్లజాతి సేవకులు ఉన్నారు. మరియు అతడికి నీవు కావలసినప్పుడు, అతడు అక్కడికి వెళ్లి నీళ్ళు త్రాగేవాడు. భోజనము సమయము వచ్చినప్పుడు, నల్లటి సేవకుడు, కాకి అతడికి శాండ్విచ్ తీసుకువచ్చేది.
పలాని సంఘమునకు చెందిన ఒక సేవకుడు నాతో చెప్పాడు, “నీవు నిజముగా అవి శాండ్విచ్లు అని నమ్ముచున్నావా?
నేను చెప్పాను, "ఖచ్చితంగా నమ్ముచున్నాను. అది మాంసము మరియు రొట్టె అని బైబిల్ చెప్పినది మరియు నేను దానిని నమ్ముచున్నాను.”
అడిగాడు, "అయితే నేను మరొక దానిని గూర్చి అడగాలి: దానికి అవి ఎక్కడ దొరికాయి? కాకులకు అవి ఎక్కడ దొరికాయి?"
నేను చెప్పాను, “దానిని గూర్చి తెలుసుకొనుట ఏలియా పనికాదు. తనను పోషిస్తానని దేవుడు తనకు చెప్పాడని అతనికి తెలుసు. కాకులు వాటిని తీసుకువచ్చాయి, అతడు వాటిని తిన్నాడు, దానిని బట్టి అతడు తృప్తి చెందాడు. అది మాత్రమే లెక్కలోనికి వస్తుంది.”
62. దైవిక స్వస్థత లేక దేవుని శక్తి విషయము కూడా అదే, దానిని గూర్చి ఎవరు వివరించుటకు లేదా త్రోసిపుచ్చుటకు ప్రయత్నించినా, అది అలా జరుగునని దేవుడు చెప్పాడు, అది జరుగును. యేసు క్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరం ఒక్కటేరీతిగా యున్నాడు. ఆయన శక్తి మారనిది.
ఆయన చెప్పాడు, "నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు కార్యములను అతడు కూడా చేయును.”
"మీరు దానిని ఎలా చేస్తారు?"
"మీకు దానిని గూర్చి చెప్పలేను, కాని అది జరుగుతుందని దేవుడు చెప్పాడు, మరియు అది కేవలము జరుగుతుంది, అది మాత్రము నాకు తెలుసు.” నల్లటి ఆవు పచ్చగడ్డి తిని తెల్లటి పాలు ఎలా ఇస్తుందో నేను వివరించలేను, కాని ఎల్లప్పుడూ వాటిని తాగుతాను. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, నాకు అవి పాలు అని తెలుసు మరియు వాటిని నేను త్రాగుతాను.
దానిని గూర్చి ఎవరో చెప్పారు. “ఓ, ప్రజలను నమ్మిస్తున్నావు. వారు కేవలము ఉద్రేకము చెందుచున్నారు. అది...” దానిని గూర్చి నాకు తెలియదు. అది ఎలాంటి ఉద్రేకమో నేను చెప్పలేను. నాకు ఆ ఉద్రేకము వచ్చినప్పుడు ఏదో జీవితమును మార్చినదని నేను ఎరిగియున్నాను.
ఎవరో చెప్పారు, "మీరందరూ పిచ్చివారు అయ్యారు.”
నేను చెప్పాను, "అయితే నన్ను ఒంటిరిగా విడిచిపెట్టుము, మరొక విధముగా ఉండుట కంటే నాకు ఈవిధంగానే ఎక్కువ సంతోషముగ ఉన్నది.” కాబట్టి నేను ఈవిధంగా రక్షణ పొందాను. నేను చనిపోతానేమో అన్నంతగా నేను ఉద్రేకము చెందాను, ఎందుకనగా దేవుని వాక్యమును విశ్వసించుట వలన అద్భుతమైన సమయమును కలిగియున్నాను, మరియు
తాను వాగ్దానము చేసిన ప్రతి కార్యమును నెరవేర్చుట చూసినప్పుడు సంతోషించాను. ఆయన మన ప్రభువు. ఆయనే ఆ గొప్పవాడు. ఖచ్చితంగా, మనము నమ్ముచున్నాము.
63. ఓ, దేవుడు ఒక వ్యక్తిని కలిసినప్పుడు అతడు మార్పు చెందుతాడు. నోవహు దేవుని కలిసినప్పుడు, అతని లక్ష్యము అంతయూ ఓడను నిర్మించుట మాత్రమే.
ప్రజలు బయటికి వచ్చి అడిగారు. "నోవహూ నీవు ఏమి చేస్తున్నావు?"
"ఓడను కట్టుచున్నాను."
"ఓడ అంటే ఏమిటి?"
"అది ఒక పడవ."
"పడవ అంటే ఏమిటి?"
"అది ఒక వస్తువు... ఆకాశము నుండి జలములు రాబోవుచున్నవి, ఈ పాత దుష్ట ప్రపంచమును దేవుడు నాశనము చేయుచున్నాడు. మరియు ఈ ఓడలోనికి రాని వారందరూ నశించిపోతారు."
“ఓ,” చెప్పారు. “మీరు అందరూ కలిసి ఇతడిని మానసిన వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళండి. ఈ ముసలివాని తలలో ఏదో తప్పు ఉన్నది." మంచిది. అది ఏమిటి? అతడు దేవుని విశ్వసించాడు. మరియు దేవుని నమ్మిన మనిషి లోకమునకు వెట్టివానిగా ప్రవర్తించును, ఎందుకనగా సువార్త బోధించుట అనే వెణ్ణితనము ద్వారా దేవుడు దానిని సాధించుటకు ఇష్టపడ్డాడు. ఆమెన్.
64. "క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారు హింస పొందుదురు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్దముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. (చూశారా?) సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” అది ఎల్లప్పుడూ జరుగుతుంది. నీవు ఈ దేశము యొక్క ఆత్మను పొందినప్పుడు నీవు ఒక అమెరికా పౌరునిగా మారతావు. అది మంచి దేశపు ఆత్మ. ఇప్పుడు కొన్నిసార్లు జరుగుచున్న కార్యములను చూచినట్లయితే, అది మరింత చెడ్డగా మారుతుంది.
65. నేను కొంత కాలము క్రితము రోమ్లోని శాన్ ఎంజిలోస్ దగ్గర ఉన్నప్పుడు, శాన్ ఎంజిలోస్ ప్రవేశించక ముందు ఒక పెద్ద ప్రకటన బోర్డు ఉన్నది, "అమెరికా స్త్రీలకు, మీరు ఇక్కడికి వచ్చు ముందుగా దయచేసి వస్త్రములు ధరించి మృతులను గౌరవించండి." అది చాలా ఘోరము అని నేను తలంచుచున్నాను, ఒక దేశమునకు చెందిన ఒక గొప్ప నాయకుడు ఈ దేశమును దర్శించిన తర్వాత అడిగాడు. "మీ దేశములో మంచి స్త్రీలు ఎవరూ లేరా?"
నేను చెప్పాను, "అలాటి వారు వేలాదిమంది ఉన్నారు."
"మంచిది, అయితే మీరు వారిని గూర్చి అసభ్యకరమైన పాటలు ఎందుకు పాడుచున్నారు. ప్రతి పాటలోను స్త్రీలు గూర్చి చెడ్డగా ఉన్నది."
నేను చెప్పాను, "అది కేవలము మరొకవైపు. దాని యొక్క మంచి వైపును నీవు ఎరుగలేదు. నీవు ఖాళీ పేజి చదువుచున్నావు." మరియు నేను చెప్పినట్లు, "ఖచ్చితంగా, తిరిగి జన్మించిన క్రైస్తవ స్త్రీలను మనము కలిగియున్నాము, వారు నమ్మకమైనవారు నిజమైన స్త్రీలు: యవ్వనస్తులు మరియు వృద్ధులు. నిజముగా వారు దేవుని రాజ్య పౌరులు." నిజమునకు నేను చెప్పాను, "దానిని గూర్చి చెప్పుటకు నేను మీ దేశమునకు వచ్చాను.” అది నిజము. చూశారా? నీవు ఒక ఆత్మను పొందినప్పుడు...
66. ఇక్కడ కొంతకాలము క్రితము, నేను మరియు నా భార్య ఒక షాపుకు వెళ్ళియున్నాము, అక్కడి స్త్రీలు చిన్న అసభ్యకరమైన దుస్తులు ధరించియున్నారు, అక్కడున్న వేలాదిమంది ప్రజలలో మరొకరకమైన దుస్తులు ధరించిన ఒక్క స్త్రీని కూడా చూడలేదు. మరియు నా భార్య చెప్పినది, “బిల్లీ, అది ఏమిటి? అలా దుస్తులు ధరించిన స్త్రీలకు అది వ్యతిరేకము.”
నేను చెప్పాను, “ఓ, అది కేవలము అమెరికా ఆత్మ.”
ఆమె అడిగినది, “మంచిది, మనము అమెరికా ప్రజలమే కదా?"
నేను చెప్పాను, "అవును, మనము అమెరికా ప్రజలము. అది నిజము. ప్రపంచములో అత్యంత గొప్ప దేశము. మనము దానిని ప్రేమిస్తున్నాము. అయినప్పటికీ, మనము నిజంగా అమెరికా పౌరులము కాదు.”
అడిగినది, “మనము ఎవరము?"
చెప్పాను, “మనము పరలోకపు పౌరులము. మనము ఇక్కడికి వచ్చినప్పుడు మనము అమెరికా పౌరులము. మనము మిగిలిన వారివలె దుస్తులు ధరిస్తాము, వారివలె జీవితములో ముందుకు సాగిపోతాము. కాని నీఅత్మ పైనుండి వచ్చిన తర్వాత అది పరిశుధ్ధమైనది. హల్లెలూయ! అది ప్రత్యేకమైనది. నీవు పైన ఉన్నట్లుగా ఇక్కడ ప్రవర్తించునట్లు చేయును. అది నిజము. కాబట్టి నీవు ఆత్మను పొందుకున్నప్పుడు, నీవు ఇక్కడున్న ప్రజలకు వింతగా ఉంటావు. చూశారా? నీవు వేరుగా కనబడతావు. నీవు వేరుగా ప్రవర్తిస్తావు.
67. నోవహూ కూడా అదేవిధంగా చేశాడు. అతడు దేవునితో మాట్లాడాడు, అందును బట్టి జలప్రళయమునకు ముందున్న ప్రపంచములో ప్రవాహమునకు కొట్టుకుపోయే వ్యక్తి
నుండి మారిపోయాడు. ఆ వర్తమానమును తీసుకువచ్చుటకు దేవుని రాజ్యములో జన్మించి దేవుని జీవిగా మారాడు.
యేసు చెప్పారు, “నోవహూ దినములలో ఉన్నట్లుగా మనుష్యకుమారుని రాకడ దినములలోను ఉండును." మతోన్మాద మతం, ప్రజలు పవిత్రముగా జీవిస్తున్నారు, పైనుండి ఏదో వచ్చుచున్నదని చెప్పుచున్నారు, అది నీరు కాదని మనము నమ్ముచున్నాము, ఇమ్మానుయేలు రక్తనాళాలు నుండి స్రవించి నిండిన ఊట నుండి ప్రతి రాత్రి పైనుండి జీవజలములు కురుస్తున్నాయి. పాపులు ఆ జలములలో మునిగి తమ పాపపు డాగులు పోగొట్టుకుంటారు. అక్కడున్న ఊట నుండి శక్తి మరియు మహిమ ఆయన సంఘములోనికి ప్రవహిస్తుంది. ఆయన మరణించి ఈష్టర్ ఉదయమున తిరిగిలేచినప్పుడు, ఆయన మహిమ వరకు ఒక రంధ్రమును కత్తిరించాడు, మరియు దానిలో నుండి పెంతుకొస్తు దినమున తన సంఘము మీద ఆ మహిమను కుమ్మరించాడు. మన హృదయములు అంతటితో దానిని మనము నమ్ముచున్నాము.
68. ఇప్పుడు గమనించండి, మనము ఆయన యొక్క వేదికను నిర్మించుచున్నాము. ఇప్పుడు మరిక మానవుని ముందుగా తీసుకుందాము. అక్కడ అబ్రహాము ఉన్నాడుబీ అతడు కేవలము ఒక సామాన్యమైన మానవుడు. అతడు తన తండ్రితో కలిసి బబులోనులోని షీనారు నుండి వచ్చి కల్దీయుల దేశములోని ఊరు అనే గ్రామములో నివశించాడు. మొదటిగా ఏమి జరిగినదో మీకు తెలుసా, బహుశా అతడు వ్యవసాయదారుడు లేదా గొర్రెలకాపరి కావచ్చును, అతనికి డెబ్బై ఐదు సంవత్సరముల వయస్సున్నప్పుడు, అతని భార్య శారా వయస్సు అరవై ఐదు సంవత్సరములు, ఒక దినమున పొలములో ఉన్నాడు, దేవుడు అబ్రహామును కలుసుకొని అక్కడికి చాలా దూరములో ఉన్న ఒక దేశమును గూర్చి చెప్పాడు. మరియు తన భార్యయైన శారా అతనికి కుమారుడు జన్మిస్తాడని చెప్పాడు. అప్పటికి శారా పిల్లలను కనే వయస్సు అయిపోయింది ఆమె జీవితకాలము అంతా గొడ్రాలుగా ఉన్నది. ఓ అతడి వయస్సు కూడా అయిపోయింది, కాని ఇప్పుడు ఏమి జరగబోతుంది. దేవుడు ఏదో ఒక కార్యమును జరిగించబోవుచున్నాడు, మరియు ఆవ్యక్తి సంవత్సరము వెంబడి సంవత్సరము తాను జీవించినంత కాలము దేవుడు దేనికి శిల్పి మరియు నిర్మాణకుడైయున్నాడో ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ తాను ఒక యాత్రికుడను మరియు పరదేశిని అని చెప్పుకున్నాడు. ఆమెన్. దేవుడు తనతో మాట్లాడుటను ఒక మనిషి విన్నప్పుడు అది ఆ మనిషిని మార్చివేస్తుంది.
69. ఓ, ఈ వారము వినండి, మీతో మాట్లాడుచున్న దేవుని స్వరమును వినండి. అది మిమ్మును మార్చుతుంది. ప్రభువైన యేసు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని మీరు తెలుసుకొనినప్పుడు, అది మీ మనస్సులో ఉన్న సందేహము అంతటిని
తీసివేస్తుంది. ఆయన కూటములలోనికి రావడం మీరు చూసినప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన అదే కార్యములను ఇప్పుడు ఆయన చేయుట చూసినప్పుడు ఆ చిన్న స్వరమును శ్రద్ధగా వినాలని మీరు కోరుకుంటారు. అదే మిమ్మును మార్చుతుంది. అప్పుడు మీరు చెప్తారు. "దేవా, అవును." లేఖనములు ఖచ్చితంగా అదే చెప్పుచున్నవి. వాక్యము తర్వాత వాక్యము అని లేఖనములు చెప్పుచున్నది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పరిశుద్ధ గ్రంధములను తీసుకొని అది నిజమో కాదో పరిశీలించండి. లేఖనములను వెదకండి. అది ఆదికాండము నుండి ప్రకటన గ్రంధము వరకు రావలసియున్నది. అది బైబిల్ అంతటిని కలపాలి. అది ఖచ్చితంగా మీ వాగ్దానము, మరియు దేవుని మాట వినండి. అది మిమ్మును మార్చుతుంది. నమ్ముటకు అది నీకు విశ్వాసమును ఇస్తుంది. వంగిపోయిన చేతులు విడుదల పొందును. ఆ కాళ్ళు బాగవుతాయి. కాన్సర్ అదృశ్యమవుతుంది.
ఆ కార్యములనుండి దూరమైన ప్రపంచములో మనము ఉన్నాము, కాని ఈరాత్రి ఒక మనుష్యుని కొరకు మనము ఒక వేదికను నిర్మించుచున్నాము. ఆమెన్. ఆమెన్. ఆ బావి దగ్గరి స్త్రీ చెప్పినట్లుగా, "మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఈయన క్రీస్తు కాడా?"
70. మనము ఏ మనుష్యుని మీద కట్టుచున్నామో, వచ్చి ఆ మనుష్యుని చూడండి, ప్రభువైన యేసు మీద కట్టుచున్నాము, మిగిలినవన్నీ కూరుకుపోయే ఇసుక ఊబులు, మిగిలినవన్నీ నశించిపోతాయి, కాని క్రీస్తు యేసు అనే బండ ఎల్లప్పుడూ నిలిచియుంటుంది. మీరు దానిని నమ్ముచున్నారా? అవును.
తాను ఒక యాత్రికుడను మరియు పరదేశిని అని అబ్రహాము ఒప్పుకున్నాడు. దేవుడు ఏ పట్టణమునకు శిల్పియు నిర్మాణకుడైయున్నాడో ఆ పట్టణము కొరకు అబ్రహాము తన జీవితకాలమంతయూ ఎదురు చూచాడు. అది ఎల్లప్పుడూ ఆవిధంగానే ఉంటుంది.
మోషే ఐగుప్తులో నుండి దూరముగా వెళ్ళిపోయాడు. అతడు అరణ్యములోనికి వెళ్ళిపోయాడు, అక్కడ చక్కగా జీవించాడు. అతడు పర్వతము వెనుకవైపు జీవించుచున్నాడు. ప్రియమైన భార్య, చిన్న కుమారుడు గెరోము, అతడు యిత్రో యొక్క గొర్రెలు ఆస్తికి వారసుడయ్యాడు. ఎందుకు, అతడికి అంతా బాగానేయున్నది. అతని జీవితము సాగిపోవుచున్నది, ప్రవాహములో సులువుగా కొట్టుకుపోవుచున్నాడు. అక్కడ ఇశ్రాయేలీయులు శ్రమలుపడుచున్నారు మరియు మొర్ర పెట్టుచున్నారు, మరియు తన ప్రజలను విమోచించుటకు దేవుడు అతడిని ఎన్నుకున్నాడు. కాని అతడు దాని నుండి దూరముగా వెళ్ళిపోయాడు.
71. ఈ దినమున మన సంఘములలో చాలావరకు అలాగే జరుతున్నది. దేవుడు పరిచర్య కొరకు మనలను పిలిచాడు. తన ప్రజలగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు.
సూచక క్రియలు మరియు అద్భుతకార్యములను విశ్వసించుటకు దేవుడు మనలను పిలిచాడు. అద్భుతములు మరియు సూచకక్రియలు చేయుటకు దేవుడు మనలను పిలిచాడు. దానిని చేయుటకు దేవుడు మనలను పిలిచాడు, మరియు మనము వాటి నుండి చాలా దూరము వెళ్ళిపోయాము. మరియొకసారి దేవుడు మనలను దర్శించుట మనకు అవసరమైయున్నది. దేవుడు దానిని ఐసన్ హెూవర్ ఆడిటోరియంనకు పంపడా? దేవుని ఆత్మ సందర్శనను పంపును.
మోషే చేసినట్లుగా మనము చాలా దూరము కొట్టుకుపోయాము. మోషే అక్కడ చక్కగా ఉన్నాడు. అతడు చక్కటి జీవితమును కలిగియున్నాడు. ఈ దినమున సంఘము ఎన్నడూ లేనంత పెద్ద భవనములు కలిగియున్నది, మెరుగైన సంఘములు, మెరుగైన వస్త్రములు ధరించిన ప్రజలు, ఎన్నడూ లేనంత మెరుగైన జీవనశైలిని కలిగియున్నారు. కాని, ఓ, సోదరుడా, అసలు విషయము అది కాదు. అవన్నియూ నశించిపోవును. మనము విజయము సాధించాము. మనము పోరాటము చేయాలి. మనము దేవుని రాజ్యము కొరకు ఏదో ఒకటి చేయాలి.
72. అక్కడ వెనుక భాగమును మోషే విలాసవంతమైన జీవితమును గడుపుచున్నాడు, ఒక ఉదయమున అతడు అక్కడ నడుచుచుండగా, మండుచున్న పొదలో నుండి దేవుడు అతనితో మాట్లాడాడు. అప్పటినుండి ఆ వ్యక్తి మారిపోయాడు. నీవు దేవునిని కనుగొనినప్పుడు నీలో అది తీవ్రమైన మార్పును తీసుకువస్తుంది. మోషేను చూడండి, అతడు ఒక ఐగుప్తీయుని చంపి పారిపోయాడు, అక్కడి నుండి అరణ్యములోనికి పారిపోయాడు. మండుచున్న పొదలో అతడు దేవునిని కలుసుకున్న తర్వాత ఉదయమున తన భార్యను గాడిదమీద ఎక్కించాడు, అతని కుమారుడు గెల్షము, ఆమె ఒడిలో ఉన్నాడు. అతని మీసాలు క్రిందికి వ్రేలాడుచున్నాయి, అతడి చేతిలో ఒక కర్ర పట్టుకొనియున్నాడు. తన భార్య ఎక్కిన కంచర గాడిదను నడిపించుచూ కేకలు వేస్తూ చిన్నగా గెంతుచూ దేవుని స్తుతించుచూ ముందుకు సాగాడు.
"మోషే, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు?"
"ఐగుప్తును జయించుటకు వెళ్ళుచున్నాను." ఒక్క మనుష్యుడి దాడి, కాని అతడు దానిని చేశాడు. దేవుడు ఆవిధంగా చెప్పాడు మరియు అతడు దానిని విశ్వసించాడు కాబట్టి దానిని చేయగలిగాడు.
73. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, అతడు విశ్వాసమును కలిగియుంటాడు, అతడు ఒక ఆశయం కలిగియుంటాడు మరియు అతడు ఒక లక్యమును సంకల్పమును కలిగియుంటాడు. దేవుడు ఒక మనిషితో మాట్లాడినప్పుడు, ఆయన అతడికి ఒక సంకల్పమును
ఇస్తాడు. దేవుడు ఒక మనిషితో మాట్లాడినప్పుడు, ఆయన అతడికి ఒక ఆశయమును ఇస్తాడు. దేవుడు ఒక మనిషితో మాట్లాడినప్పుడు, దానిని చేయుటకు, దానిని నెరవేర్చుటకు, లేక తన జీవితములోని సంకల్పమును, ఏపని చేయమని దేవుడు పిలిచాడో దానిని చేయుటకు కావలసిన విశ్వాసమును ఇస్తాడు. దేవుని సంఘములో ఉండుటకు ఆయన మనలను పిలిచాడు. ఆమెన్.
74. మనము దేవుని సంఘముగా ఉండునట్లు చూచుకొనుటను మన జీవితాశయముగా చేసుకుందాము. మనము ఒక ఆశయమును కలిగియుందాము, ఏదో మన చుట్టూ ఉన్న జోన్స్ కలిగియున్నాడని కాదు. మనము దేనిని గూర్చి కలవరపడుచున్నాము...?...ఒకవేళ వారు దానిని చేయనట్లయితే, ఎలాగైనా సరే మనము దానిని చేద్దాము. ఒకవేళ దేశము అంతా మునిగిపోవాలని అనుకున్నట్లయితే అది వారిష్టం. యాకిమాలో మనము దేవుని కొరకు నిలబడదాము. మనకు దేవుడు కావాలి. మనము సాధించాలి. మనము విశ్వాసమును కలిగియుండాలి. మనము ఒక ఆశయమును కలిగియుండాలి. ప్రభువైన యేసు క్రీస్తు మీద విశ్వాసముంచుదాము, ఆయన చెప్పియున్నాడు, "విశ్వసించువానికి సమస్తమును సాధ్యమే. ఎవడైనను ఈ కొండను చూచి, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపకతాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, (ఒకవేళ అని కాదు)." నా హృదయము అంతటితో దానిని నమ్ముచున్నాను. మీరు దానిని నమ్ముచున్నారా?
75. అతడు ఒక ఆశయమును కలిగియున్నాడు. దాని తర్వాత అది అంతకుముందు వలె ఎన్నడూ లేదు. అతడు ఒక ఆశయమును కలిగియున్నాడు. మరియు అతడు ముందుకు సాగించవలసిన కార్యమును ఒక దానిని కలిగియున్నాడు, మరియు దానిని చేయుటకు కావలసిన విశ్వాసమును అతడు కలిగియున్నాడు. అతడు తన జీవిత కాలము అంతయూ దేవుని సేవించాడు మరియు ఆ ప్రజల విడుదల కొరకు పనిచేశాడు. దేనిని గూర్చి లక్ష్యపెట్టలేదు... అతను బాగానే ఉన్నంత కాలం, అక్కడ బాధలు పడుచున్న ప్రజలను గూర్చి పట్టించుకొనలేదు. మరియు దేవుడు చెప్పాడు, “నా ప్రజల మొరను వినియున్నాను, నేను అబ్రహాముకు చేసిన వాగ్దానమును జ్ఞాపకము చేసికొనియున్నాను.”
మరియు ఈ దినమున సంఘము రోగముతో ఉన్నది, రోగములు కుప్పగా పోగుబడుచున్నవి, కాని ప్రజల లౌకిక జ్ఞానమును బట్టి, దైవిక స్వస్థతకు దూరముగా వెళ్లిపోవుచున్నారు, పరిశుద్ధాత్మకు దూరముగా వెళ్ళిపోవుచున్నారు, దేవుడు ఇంకనూ తన ప్రజల మొరను వినుచున్నాడు. ఎవరో ఒకరు వెళ్ళవలసియున్నది.
76. యాకిమా, ప్రభువైన యేసు నామములో లేచి ప్రకాశించుము. ఒకవేళ నీవు
రోగివైతే... నీవు చెప్తావు. "నా శరీరములో రోగముతో బాధపడుచున్నాను." దేవుడు పలికియున్నాడు. దేవుడు ఆవిధంగా చెప్పాడు. "విశ్వసించు వారిని ఈ సూచకక్రియలు వెంబడించును. నానామములో వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతను పొందుదురు." దేవుడు దానిని పలికియున్నాడు. ఏదైనా ఆశయమును కలిగియున్నారా?
"మంచిది, నేను చనిపోతానని వైద్యుడు చెప్పాడు." వైద్యునికి తెలిసినది అంతవరకే. నీ విషయములో తను చేయగలినదంతా అతడు చేశాడని ప్రతి పరిశోధన చెప్పుచున్నది. మరియు వైద్యశాస్త్రము ప్రకారము నీవు చనిపోవుచున్నావు. "కాని విశ్వాససహితమైన ప్రార్ధన రోగిని స్వస్థపరచును." నీ ఆశయమును కనుగొనుము. దేవుని మహిమ కొరకు నీవు స్వస్థపడుటకు ఒక సంకల్పమును కలిగియుండుము. అప్పుడు విశ్వాసముతో రమ్ము, "నేను దానిని పొందుకొనుచున్నాను." మరియు నీవు దానిని పొందుకుంటావు. అవునయ్యా. 77. మీరు చెప్తారు, "సహోదరుడా బ్రన్హాం. నేను దానిని అర్ధము చేసుకొనలేక పోవుచున్నాను."
మంచిది, ఇప్పుడు, నేను విదేశాలకు వెళ్ళినప్పుడు, అక్కడ ఒక పెద్ద ఓడ ఉంటుంది, ఒక పెద్ద విమానము. నేను దీని చుట్టూ ఏడుసార్లు తిరిగాను, “ఓ, పైలట్, నేను దీనిలోనికి ఎక్కుటకు ముందుగా, ఆధారములు అన్ని సరిగా ఉన్నాయా, మరియు ఈ విమానము ఎలా పనిచేస్తుందో నాకు పూర్తిగా వివరించుము. తుఫాను వచ్చిన సమయములో అది ఏమి చేస్తుంది? నీకు ఎంత శక్తి ఉన్నది? నీవు ఎంత ఎత్తుకు ఎక్కగలవు?" అని అడగను. అది పని చేయు విధానములు. నీవు ఆవిషయములు గూర్చి అడగను. మరొకరిని తీసుకొని ఆ ఓడ ఆవలికి వెళ్ళినదని నాకు తెలుసు, మరియు అది మరొకరిని తీసుకొనివెళ్ళినప్పుడు అది నన్ను కూడ తీసుకొని వెళ్ళగలదు. కాబట్టి నేను పైకి ఎక్కినా సీటులో కూర్చుంటాను. అది అక్కడికి చేరుకుంటుందో లేదో చూడాల్సిన బాధ్యత పైలట్పై ఉంది.
దైవిక స్వస్థత కూడ అలాగే యున్నది. అది పనిచేయు విధానములు గూర్చి నాకు పూర్తిగా తెలియదు. ఆ విధానము నేను మీకు చెప్పలేను. ఎవరూ చెప్పలేరు. తన వీపు అంతా చీల్చబడి మరణించిన ఒక వ్యక్తి రోగులను స్వస్థపరచు దేవుని వర్తమానికుడు కాగలడు, ఎందుకనగా అతడు దానిని విశ్వసించాడు. నేను దానిని వివరించలేను, దాని యాంత్రిక విధానం నాకు తెలియదు. నేను కేవలము ఆ వాగ్దానమును పట్టుకొని దానిని అంగీకరించి, "ప్రభువా, ఆలాగు జరుగును గాక," అని చెప్తాను. అది దానిని పరిష్కరిస్తుంది. సహోదరులారా, మీరు దానిని విశ్వసించుచున్నారా? ఖచ్చితంగా. దేవుడు ఆలాగు చెప్పిన మాటను బట్టి దానిని అంగీకరించండి. ఆయన కొరకే మనము ఈ వేదికను నిర్మించుచున్నాము.
78. ముగించుటకు ముందుగా గుర్తుంచుకోండి. దీనిని చెప్పుటకు నేను ఇష్టపడుచున్నాను: నిన్ను నీవు వైద్యునికి అప్పగించుకొనినప్పుడు ఏమి జరుగుతుంది? వైద్యుడు వచ్చినప్పుడు,
నీకొరకు ఒక ఔషధమున్నదని అతడు చెప్తాడు. నీవు ఆ ఔషధము తీసుకొని చెప్తావు, "వైద్యుడా నీవు ఇక్కడ కూర్చొని, ఈ మాత్రలో ఏమి ఉన్నదో చెప్పుము. అది ఎలా పనిచేస్తుందో నాకు తెలియాలి. ఆ మాత్ర యొక్క విశ్లేషణ నాకు కావాలి? నా కొరకు నీవు ఎలాటి ఔషధముల ఫార్ములా ఉపయోగించారు? నీకు ఇది ఎలా దొరికినది? దానిని వారు ఎలా తయారు చేశారు? అది దేనినుండి వచ్చినది? దానిని ఎవరు కనుగొన్నారు? ఈ గ్లిసరిన్ ఎక్కడ నుండి వచ్చినది? మరియు ఆ ఫార్ములాలో వాడిన ఇతర వస్తువులు ఎక్కడ నుండి వచ్చాయి?"
79. "సువార్త-మాత్రలు,” తీసుకొనుట కూడ అలాగే ఉంటుంది. దానిని గూర్చి పూర్తిగా నేను మీకు చెప్పలేను, కాని అది పనిచేస్తుందని నాకు తెలుసు. అది ఇతరులకు పనిచేయడం చూశాను. చనిపోయే సమయము వచ్చినప్పుడు, నీవు ఎలా రూపాంతరము చెంది మరొక ప్రపంచములోనికి వెళ్ళి, నీవు అక్కడ ఒక నూతనమైన సృష్టిగా ఎలా మారతావు, ఎన్నటికీ వృద్ధాప్యం రాదు, తిరిగి యవ్వనస్తుడిగా మారతావు. మీరు దానిలోనికి ఎలా వెళ్తారు? నాకు తెలియదు. నేను వెళ్ళిపోయే దినమున నన్ను నేను ఆ పైలెట్కు లోపరచుకుంటాను. నేను అక్కడికి చేరేటట్లు అతడే చూసుకుంటాడు. మిగిలినదంతా అతడే చూచుకొనును. నా భుజములు తిరిగి తిన్నగా వస్తాయి, మరియు నేను యువకుడిగా మారిపోతాను, అప్పుడు నేను వేరుగా ఉంటాను. చూశారా? ఎందుకనగా మరణము యొక్క చిహ్నములన్నీ ఈ పాత శరీరము నుండి తీసివేయబడ్డాయి, నా శరీరము కూడ ఆయన స్వంత శరీరము వలె మహిమ శరీరముగా మారిపోతుంది, ఎందుకనగా ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము. "ప్రభువా, నీవు దానిని ఎలా చేస్తారో నాకు చెప్పండి," అని నేను అనను. ఆయన దానిని ఎలా చేస్తాడో నేను లక్ష్యపెట్టను కాని కేవలము నేను దానిని పొందుకుంటాను. అదే ముఖ్యమైన విషయము. అయన దానిని వాగ్ధానము చేశాడు మరియు నేను దానిని నమ్ముచున్నాను. ఆమెన్.
80. ఆయన మనకు ఉజ్జీవమును వాగ్దానము చేశాడు. విశ్వసించిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించునని ఆయన వాగ్దానము చేశాడు. విశ్వాససహితమైన ప్రార్ధన రోగిని స్వస్థపరచును. అది ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు, ఆయన దానిని వాగ్దానము చేశాడు, అది నిజం. ఇతరులు దానిలో అడుగుపెట్టి ఆవలికి వెళ్ళుట నేను చూశాను. అప్పుడు నేను కూడ దానిలో ప్రవేశించి ఆవలికి వెళ్ళగలను, మరియు మీరు కూడ అడుగుపెట్టి ఆవలికి వెళ్ళగలరు.
ఒకవేళ వైద్యుడు వచ్చి, "నీకు కడుపులో అపెండిక్స్ వచ్చినది, నేను దానిని తొలగించాలి. నేను మెదడులో నుండి గడ్డకట్టిన రక్తమును తీసివేయాలి,” అని చెప్పినట్లయితే. "కాని వైద్యుడా, నీవు ఎన్ని నరములను కత్తిరించవలసియున్నదో నాకు చెప్పుము? నీవు దానిని ఎలా కత్తిరిస్తావు? ఎలా...?
మీరు అలా చేయరు. మీరు కేవలము మీరు రోగముతో ఉన్నారు మరియు మీరు స్వస్థత పొందాలని కోరుకొనుచున్నారు కాబట్టి మిమ్మును వైద్యునికి అప్పగించుకుంటారు మరియు అతడు పని చేయును. అక్కడ ఉన్నది అదే.
యేసు క్రీస్తు విషయములో కూడ అదేవిధంగా ఉన్నది. ఓ, మై. ఈరాత్రి మనందరి విశ్వాసము మీద ఆయన గొప్ప శస్త్రచికిత్స చేస్తాడని నేను నిరీక్షించుచున్నాను. మీరు నిరీక్షించుటలేదా? పగిలిన ఆ అపెండిక్స్ అంతా తీసివేయును, మిగిలిన కార్యములు అన్నింటినీ, మన మీద నత్తగుల్లల వలె వ్రేలాడుతున్న ఆ మురికి పక్షులు మరియు నిరుత్సాహములను ఆయన తీసివేయును. మన విశ్వాసమునకు శస్త్రచికిత్స చేయుటకు దేవునిని అనుమతించుదాము, ఆయన దానిలో నుండి సమస్తమును తీసివేయును, అప్పుడు మనము తిరిగి లేచినప్పుడు, యేసు నిన్న, నేడు మరియు నిరంతరం ఏకరీతిగా యున్నడనే సత్యమును తెలుసుకుంటాము, రాబోవు వారములో పనిచేయుటకు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగియుంటాము.
81. దేవుని సంఘమా మీరు దానిని విశ్వసించుచున్నారా? ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారా? మీయొక్క సమస్యను ఆయన చేతులలో పెట్టుటకు ఇష్టపడుచున్నారా? మీరు దానిని చేస్తారా? ఈ వేదిక మీద నేను ఎవరిని గూర్చి మాట్లాడుచున్నానో ఆయన విషయములో మీరు చేయగలినంతా చేస్తారా? యేసు క్రీస్తు మీ రక్షకుడు. మీరు విశ్వసించగలరా? ఇప్పుడే మీరు ఆయనకు ఓటు వేస్తారా? మీ రక్షకుడిగా మరియు మిమ్మును స్వస్థపరచువానిగా ఆయనను ఇప్పుడే మీ హృదయములలో ఎన్నుకొని, “ప్రభువా దేవా, దానిలోని ప్రతి మాటను మేము విశ్వసిస్తావు. మాలో ఉన్న సమస్తముతో పనిచేస్తాము, ప్రతీదీ కొనసాగుతుంది,” అని చెప్పండి. ఈ వారము కూటములలో నాకు అర్ధము కానిది ఏదైనా జరిగినట్లయితే, నేను నేరుగా ఇంటికి వెళ్ళి అది ఫార్ములా ప్రకారము ఉన్నదో లేదో అని చూస్తాను. నేను నేరుగా ఇంటికి వెళ్ళి, అది బైబిల్ ఉన్నదా, దేవుడు దానిని వాగ్ధానము చేశాడా అని చూస్తాను." ఒకవేళ ఆయన దానిని వాగ్దానము చేసినట్లయితే, అది మీదే, దానిని విశ్వసించుట మీకు ఇవ్వబడిన భాగ్యము. అది మీకొరకే. అది దేవుడు మీకు ఇచ్చిన ఫార్ములా లేదా సూత్రము.
అతడు దానిని గ్రీకులో వ్రాస్తాడు. బహుశా అతడికి కూడ వాటిని గూర్చి తెలియకపోవచ్చును. కాని అతడు వాటిని వ్రాస్తాడు. సరే మంచిది. అదే అతడికి చెప్పబడినది. కాని నీవు ఒకే ఒక్క పని చేస్తావు, నిన్ను నీవు వైద్యునికి అప్పగించుకొని ఆ మాత్రలు వేసుకుంటావు. అంతే. ఒకవేళ నీవు వైద్యుని నమ్మినట్లయితే, అది నీవు సహాయము చేసే అవకాశములు ఉన్నాయి.
82. ఒకరాత్రి నేను "ఎందుకు?" అనే అంశము మీద ప్రసంగించాను. మరియు ఎందుకు? ఎందుకు? పరిశుద్ధ గ్రంధమునకు ఒక సూత్రము ఉన్నదని వారికి చెప్పాను. ఆ సూత్రములో లేదా ఫార్ములాలో పాపమునకు మరియు రోగమునకు చికిత్స ఉన్నది. మోషేను చూచుటకు
మీరు ఇష్టపడుచున్నారా? ఎందుకు, మోషే దగ్గర ఒక చిన్న చేతి సంచి ఉన్నది. ఇరవై లక్షలమంది ఇశ్రాయేలీయులకు అతడు పరిచర్య చేశాడు. అతడు వారిని నలభై సంవత్సరములు అక్కడ ఉంచాడు, వారు బయటికి వచ్చినప్పుడు వారిలో బలహీనుడు ఒక్కడు కూడ లేడు. ఇక్కడ ఎవరైనా వైద్యుడు ఉన్నట్లయితే, మోషే ఏ ఔషధములు వాడాడో చూడాలని కోరుటలేదా? ప్రతి రాత్రి ఎంతమంది పిల్లలు జన్మించారు? చూశారా? మోషే ఏ ఔషధములు ఇచ్చాడు? అక్కడ అత్యవసరమైన పరిస్థితులలో రక్తము ఎక్కించుట మరియు శస్త్రచికిత్స చేయు పద్ధతులు అతడి దగ్గర లేవు. మరియు అతడు ఏ ఫార్ములా కలిగియున్నాడు. అది ఏమిటో మీరు తెలుసుకోవాలను కొనుచున్నారా? అది ఆదికాండము లేదా నిర్గమాకాండములోనే వ్రాయబడి యున్నది. అక్కడ ఇలా వ్రాయబడినది, "నీ రోగములన్నింటినీ స్వస్థపరచు యెహోవాను నేనే.” అదే అతడు కలిగియున్న ఫార్ములా.
మన ప్రచార సభల నిమిత్తము ఆ మనుష్యుడిని మనము ఎన్నుకోవాలని కోరుచున్నాము. మీ హృదయములలో ఆయనను ఎన్నుకోవాలని కోరినవారందరూ, ఆయనను పునరుద్ధానుడైన ప్రభువుగా, పునరుద్ధానుడైను స్వస్థపరచువానిగా, ఓటు వేయండి, ఆయన మీ కొరకు మరణించి మూడవ దినమున తిరిగి లేచాడు... మీరు ఆయనను ఎన్నుకుంటారా, ఆయనతో చెప్పండి, "ప్రభువా, ప్రతిరాత్రి ఈ భవనములోనికి రండి. మా హృదయములలోనికి రండి. మాకు విశ్వాసమును ధైర్యమును ఇవ్వండి. మాకు ఒక ఆశయమును ఇవ్వండి. మాకొరకు ఏదో కార్యమును చేయండి. నేను నీశక్తి ద్వారా ఆశీర్వదించబడాలని కోరుచున్నాను.” మీరు ఆయనను ఆవిధంగా చేర్చుకున్నట్లయితే మీరు ఎక్కడ ఉన్నాసరే మీచేతులు ఎత్తండి. దేవుడు మిమ్మును దీవించునుగాక.
83. దేవుని చిత్తమైతే రేపు రాత్రి, వారు ఆరు గంటల ముప్పై నిమిషములకు వచ్చి ప్రార్ధనా కార్డులు ఇస్తారు. ఎనిమిదిన్నరకు లేదా తొమ్మిదిన్నరకు, లేదా తొమ్మిది గంటలకు ప్రార్ధానా వరసను ప్రారంభించుదాము, మరియు తొమ్మిదిన్నరకు వెళ్ళిపోదాము. ఈరాత్రి నేను చెప్పిన దానిని బట్టి ఒక చిన్న వేదికను కట్టాలని అనుకొనుచున్నాను, ఏది నమ్మాలో మీరు తెలుసుకున్నారు. మనము ప్రభువైన యేసు క్రీస్తును మరియు ఆయన చేసిన ప్రతి ఒక్క వాగ్దానమును విశ్వసించుచున్నాము. మరియు నూతన నిబంధన పాత నిబంధనకు ప్రతిరూపము అని, అది పాత నిబంధన నుండి తీయబడినదని మనము విశ్వసించుచున్నాము. పాతనిబంధన క్రొత్త నిబంధనకు ఛాయగా ఉన్నది, రెండింటిలోను దేవుడు చేసిన కార్యములు, ఆయన ఈదినమున పరిశుద్ధాత్మ రూపములో ఇక్కడ ఉన్నాడు, అదే అగ్నిస్తంభం, అదే దేవుడు, అదే స్వస్థత, అవే ఆశీర్వాదములు, అదే రక్షించుశక్తి. ఆయన గతములో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడ అదేరీతిగా ఉన్నాడు మరియు భవిష్యత్తులో అదేరీతిలో ఉంటాడు.
మరియు ఈ కార్యములు మనిషిలో ఉన్నాయని మనము నమ్ముటలేదు. మనుష్యుడు వరములు కలిగియున్నాడు, కాని కల్వరిలో దేవుడు మన రక్షణ మరియు స్వస్థతను ఎప్పుడో
కొనియున్నాడని మనము నమ్ముచున్నాము. మరియు ఈరాత్రి ఆయనను మీ హృదయములలో ఎన్నుకొనండి, ఆయనతో చెప్పండి, "దేవా, మీశక్తిని పంపండి. మీ ఆశీర్వాదములను పంపండి. అది నీవు నాకు అనుగ్రహించిన స్వాస్త్యము అని నేను నమ్ముతాను మరియు దానిని అంగీకరిస్తాను. అది నీవు నాకిచ్చిన వాగ్దానము."
84. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఇప్పుడు ఈ భవనములో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీరు ఒకరిమీద ఒకరు చేతులు ఉంచాలని కోరుచున్నాను. మరియు ఇక్కడ ఎవరైనా రోగముతో బాధపడుచున్నట్లయితే, పరిశుద్ధ గ్రంధము ఈవిధంగా చెప్పుచున్నది, " విశ్వసించువారిని ఈ సూచకక్రియలు వెంబడించును.”
"ఈ సూచకక్రియలు కేవలము సహెూదరుడు బ్రెన్హాం, సహోదరుడు రాబర్ట్స్, లేక మీ సంఘకాపరిని, లేదా మరొకరి సంఘకాపరిని మాత్రమే వెంబడిస్తాయి." అని పరిశు ద్ధ గ్రంధము ఎన్నడూ చెప్పలేదు. "ఈ సూచకక్రియలు వారిని (బహు వచనము) వెంబడించును." నీవు విశ్వాసివా? అయితే "ఆమెన్," అని చెప్పండి. అప్పుడు ఆ సూచకక్రియలు మిమ్మును వెంబడిస్తాయి. "వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు." మీరు దానిని నమ్ముచున్నారా? అయితే నేను మీ అందరి కొరకు ప్రార్ధన చేయుచుండగా, మీలో ప్రతి ఒక్కరు... ఇప్పుడు కేవలము మీకొరకు ప్రార్ధన చేయవద్దు, మీరు ఎవరిమీద చేతులుంచారో ఆవ్యక్తి కొరకు ప్రార్ధన చేయండి. చూశారా? చెప్పండి, "ప్రభువా, నేను ఎవరి మీద చేతిని పెట్టానో ఆ వ్యక్తి యొక్క హృదయాశలను తీర్చండి." ఆవిధంగా చెప్పండి. చెప్పండి, “వారికి అనుగ్రహించండి... ఒకవేళ వారు రోగులైతే వారిని స్వస్థపరచండి." ఒకవేళ ఆవ్యక్తికి మీకు తెలిసినవారైతే, "ఈవ్యక్తిని స్వస్థపరచండి,” అని చెప్పండి. మరియు దేవుని శక్తి మీ ఇద్దరిని స్వస్థపరచును.
మరియు రేపు రాత్రి మీరు తిరిగివచ్చి, "సహోదరుడా బ్రన్హం, ఏ కార్యము జరగకముందే, పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కార్యములు జరుగుట నేను చూడకముందే, దానిని నాజీవితములో నేను ఇప్పటికే చూశాను, గతరాత్రి ఆయనను ఎన్నుకొనుటకు మనము ప్రయత్నించినప్పుడు, ఆయనను నాహృదయములోనికి స్వీకరించాను, అప్పుడు ఏదో జరిగినది, ఆయన నన్ను స్వస్థపరచాడు. నేనునేను కేవలము, గతరాత్రి ఆయన నాకు శస్త్రచికిత్స చేశాడు, మరియు నా సందేహములు అన్నీ ఆఊటలో పాతిపెట్టబడ్డాయి, ఇప్పుడు క్రీస్తు యేసులో నేను నూతన సృష్టి," అని చెప్తారు.
85. ఇప్పుడు మనము మన తలలు వంచియుండగా. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పాపి ఉ న్నట్లయితే, ఇప్పుడే నీకు సమయము ఉండగానే సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, ఎందుకనగా ఒక సమయము రాబోవుచున్నది అప్పుడు అది అనుమతించబడదు. విశ్వాసములో వెనక్కి జారిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఈరాత్రి తిరిగి దేవుని యొద్దకు రమ్ము. నీవు దానిని చేయవా? అయితే ఉదయకాలమున ఆలయము దగ్గరికి వెళ్ళి, “కాపరి
గారు, నేను ఇప్పుడు తిరిగివచ్చాను. తిరిగి నేను సహవాసములో చేరగోరుచున్నాను," అని చెప్పుము.
ఒకవేళ నీవు పాపివైతే, నీకిష్టమైన సంఘము దగ్గరికి వెళ్ళి చెప్పుము, "కాపరిగారు నాకు బాప్తీస్మము ఇవ్వండి. నేను ఈ సంఘములో సభ్యుడిగా ఉండాలనుకొనుచున్నాను. నేను దేవునిని సేవించాలని కోరుచున్నాను." అయితే నీవు వెళ్ళి రేపు రాత్రికి నలుగురు లేదా ఐదుగురు పాపులను తీసుకొని రమ్ము. పరిశుద్ధాత్మ ప్రజలలో కదలాడి, యేసు క్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరం ఒక్కటేరీతిగా ఉన్నాడని ఋజువు చేయుటను మీరు చూడండి. 86, మా పరలోకపు తండ్రీ, నీ వాక్యము ఆధారముగా, ప్రోక్షించబడిన మీ రక్తము క్రింద, కల్వరిలో మీరు అనుభవించిన కరమైన శ్రమలను బట్టి, మీరు మరణమును, సమాధిని, పాతాళమును, సాతానుని జయించుట ద్వారా, మీరు సాతానుని కార్యములన్నియూ జయించియున్నారు, పాపమును మరియు దాని గుణలక్షణములను, రోగములను, నిరుత్సాహములను, నరముల బలహీనతలను, దిగులును అలసటలను, సమస్తమైన సందేహములను...
మీ ప్రియమైన కుమారుడైను ప్రభువైన యేసు కొరకు ఈరాత్రి మేము ఒక వేదికను నిర్మించుచున్నాము. ప్రభువా, ఈ సభల నిమిత్తము మేము ఆయనను ఎన్నుకొనియున్నాము. ప్రభువా మేము సంతోషించుచున్నాము. మేము మరొకరిని కోరుటలేదు. మేము యేసును మాత్రమే కోరుచున్నాము. మేము ఆయనను ప్రేమించుచున్నాము. మా హృదయము అంతటితో ఆయనను ప్రేమించుచున్నాము. మా రక్షకుడిగా మేము ఆయనను ఎన్నుకొనియున్నాము, మరొక రక్షకుడు లేడు. నీ కుమారుడైన యేసు రక్తము తప్ప, ఏ సంఘము కాని, , ఏ సిద్ధాంతంగాని, ఏ మతసంస్థలు గాని, ఏ సంఘకాపరి, ఏ పోప్, ఏ రబ్బీ, మరి ఎవరూ రక్షించలేరు. ఆయనే మా రక్షకుడు. మేము ఆయనను ప్రేమించుచున్నాము, మీనుండి దైవిక స్వస్థత కలుగుతుందని మేము ఎరిగియున్నాము. అది మీకు చెందినది. కీర్తనలు 103:3 లో మేము చదివాము, "ఆయన నీ రోగములన్నింటిని స్వస్థపరచువాడు." కాబట్టి ప్రభువా మా సమస్యను మీకు అప్పగించుకొనుచున్నాము. మీరు మావైద్యుడు, మా గొప్ప వైద్యుడవు.
ఈరాత్రి మీరు ఇక్కడ ఉన్నారు. మిమ్ములను విశ్వసించుచున్న మీపిల్లలు, ఒకరి మీద ఒకరు చేతులు పెట్టుట ద్వారా మీ వాక్యమునకు లోబడియున్నారు, ఇక్కడ విశ్వాసులు, కాపరులు, సువార్తికులు, గృహిణులు, పిల్లలు అందరూ ఒకరి మీద ఒక్కరు చేతులుంచి యున్నారు. మేము ఎన్నుకున్న మా ప్రభువును, మమ్మును స్వస్థపరచువానిని వారు విశ్వసించుచున్నారు.
87. సాతానా నీవు ఇప్పుడు బహిర్గతం చేయబడ్డావని నీకు తెలుసు, నీవు కేవలము బుకాయిస్తున్నావు, నీవు మోసం చేయుచున్నావని మాకు తెలుసు. మేము అందరమూ ఆయనను మా హృదయములో, స్వస్థపరచువానిగా, రక్షకుడిగా, రాజుగా, ఏలికగా