ఈ బండతో మాట్లాడుము
1. ప్రభువు మిమ్మును దీవించునుగాక!. మీరు కూర్చొనవచ్చును.దీనికొరకై మరో రెండు వారములు మాకు లేనందుకు నన్ను మన్నించండి. నేనిప్పటివరకు కలిగివున్న అత్యుత్తమ ఉజ్జీవము లేక కూడికలలో ఇదొకటని చెప్పాలనుకుంటున్నాను. ఈ కూటము నాకొక చిరస్మరణీయమైన, ప్రత్యేకమైనది. ఈ కూటములో నేను కలిగి యున్నట్లుగా, చాలా స్వేచ్ఛగా ప్రసంగించే సమయాన్ని నా జీవితంలో ఎన్నడూ పొందలేదు, నా హృదయంయొక్క నిశ్చయతను భోదించడానికి నేను చాలా స్వేచ్ఛను కలిగి యున్నానని భావించితిని, మరి ఇదొక అద్భుతమైన సమయం. మేము వ్యాపారవేత్తల యొక్క సహవా సమున అద్భుతమైన సమయంను కలిగియుంటిమి. అదేవిధముగా ఈ ఉదయకాల సమయములో సహోదరుడు సుల్లీవాన్యొక్క సంఘమందు అద్భుతమైన సమయము గడిపితిమి. మేము చాలా మంది మంచి ప్రజలను కలుసుకున్నాము. మేము వీటన్నింటిని బట్టి అభినందిస్తున్నాము. మేము దీనిని చెప్పాలని... (ఆ కూటములో పాల్గొన్నవారు ఇచ్చట కొంతమంది ఉండవచ్చును లేదా లేకపోవచ్చును), మంచి ఉద్దేశ్యముతో ఈ చటౌక్వా స్థలమును మాకిచ్చిన వ్యక్తులకు మేము ధన్యవాదములు చెప్పాలని కోరుచు న్నాము. నా స్నేహితులను, మేము దానిని అభినందిస్తున్నాము, ప్రభువునకు సేవచేయ్యా లనే ఉద్ధేశ్యంతోచేసిన ఈ కార్యం దీర్ఘకాలంగా నిలిచియుండును. మా హృదయమంత టితో మేము దీనిని ఇప్పుడు అభినందిస్తున్నాను.
2. సహోదరుడు సుల్లీవన్, సహకరించిన సంఘ కాపరులందరికి, ప్రియమైన ప్రజలగు మీరందరు నాకొరకు చేసిన సమస్తముకొరకు, ఇచ్చిన ప్రేమ కానుక మరి వాటన్నింటి విషయమై నేను మీకు ధన్యవాదములు చెప్పాలని కోరుచున్నాను... ఎప్పుడో ఒకసారి మాత్రమే కానుకలను వారు తీసిరని, సహోదరుడు డుప్లెసిస్ ఇప్పుడే నాకు చెప్పెను. నా కొరకు, నా భార్య నా కుమారుని కొరకు చేసినవాటన్నింటినిబట్టి నేను మీ అందరికి వందనములు మరియు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. సహోదరుడు డుప్లెసిస్, సహోద రుడు సుల్లీవన్, జీన్, లియో మొత్తం సిబ్బందికి నా ధన్యవాదములు తెలుపుచున్నాను. నిశ్చయముగా మీకు మేము చాలా ధన్యవాదములు తెలుపుచున్నాను.
మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము,మీకేదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు లేదా ఏ కార్యములోనైన మేము మీకు సహాయము చేయవలసివచ్చిన... రాత్రి చాలా చీకటిగా మారకపోదు లేదా వర్షం గట్టిగా కురవకపోదు. మీరు మమ్మును పిలవచ్చును. నేను మీయొద్దకు వచ్చెదనని చెప్పుట నాకు అలవాటు, కానీ ఇప్పుడు అనేకులు నాకొరకు వేచియున్నారు. నేను అది చేయలేను, ఎందుకంటే, రోజు, రోజుకి
అనేకులు,లక్షలకొలదని నేను ఊహించుచున్నాను, కేవలం ఇక్కడ మాత్రమే కాదుకాని, ప్రపంచమంతటా వేచివున్నారు. మీకర్థమైనదా? అది మిక్కిలి కఠినముగా మారిపోయెను, కావున దానిని నేను చెప్పలేను. దాన్ని చేయుటకు నేను ఇష్టపడుచున్నాను, కాని దానిని నా హృదయమంతటితో చెప్పలేను. ఎట్లనగా, దానిని చెయ్యుటకు నాకు సాధ్యమవ్వదు,
3. కాబట్టి మీకు ప్రార్ధన అవసరత ఉంటే, “విల్లియం బ్రాన్హాం జెఫర్సన్విల్, ఇండియానా" అని ఎప్పుడైనా నాకు ఉత్తరం వ్రాసి పంపండి, తపాల కార్యలయంయొక్క నెంబర్ 325,కాని మీకు దానితో కలిగి అవసరం లేదు; అదెలాగైన వచ్చును. మరి మీకు ఏదైనా సహాయముగాని, మేము చేయగలిగినదేమైనా ఉన్నను, ప్రార్థించిన గుడ్డలు అవసరమైనా,వాటిని నిశ్చయముగా ఉచితంగానే పంపబడును, దేనికెలాంటి రుసుము చెల్లించనవసరములేదు, మీకు ఈ పరిచర్యను చేయుటకు మేము సంతోషించెదము.
మావద్ద పుస్తకములు గలవు. వారు వాటిని అమ్ముతారు, అవి మరొకరికి చెందినవి, దానికి సంబంధించిన ఒక భాగమును సహోదరుడు లిండ్సే, మరొక దానిని సహోద రుడు జూలియస్ స్టాడ్స్లేవికి చెందినవి. ఒక పుస్తకంయొక్క ధరకంటే మేము తక్కువ ధరలో వాటిని నలభై సెంట్లుకు కొనుగోలుచేస్తాము. మేము వాటిని కొనుటకు డబ్బును చెల్లించవలెను. కనుక వాటిని డబ్బుకు అమ్మెదము, వాటి నష్టాన్నికూడా భరిస్తున్నాము. కావున మేమేమి చేయుచున్నామో చూచారా. ఈ పుస్తకాలు ఎప్పుడు ప్రత్యేకమైనవి. ప్రతీసారి మేము దాని జాబితాను సవరించుచు, ఎల్లప్పుడు వాటిపట్ల శ్రద్ధవహించెదము.
4. ఆ పుస్తకములను అమ్మే బాలురకు, అందరికి నేనిట్లు చెప్పాను, ఈ పుస్తకము కొనుటకు ఎవరిదగ్గరైనా డబ్బులు లేనియెడల, అయినా ఫర్వాలేదు, వారికి పుస్తకమును ఇవ్వండి, వారిని ఆ పుస్తకం తీసుకోనివ్వండని చెప్పాను. మేము పుస్తకాలను అమ్ముటకు ప్రారంభించిన మొదటి రాత్రి నేను చూచినదేమనగా, ఒక దీన తల్లి వెనుక నిలబడి తడబడుచూ, జేబులోనుండి అరవై సెంట్లు తీయుటకు ప్రయత్నిస్తున్నది, కాని ఆమె యొద్ద అరవై లేవు, కాని నలభై సెంట్లు మాత్రమే ఉన్నవి. పుస్తకములు అమ్ముచున్న స్త్రీని, “అవి అరవై సెంట్లు" అని చెప్పుటను నేను గమనించాను. నేను తిన్నగా అచ్చటకు నడిచివెళ్ళి, ఆమెను రెండు లేక మూడు పుస్తకములు తీసుకొనమని చెప్పి, ఆమెకు వాటిని ఇచ్చాను, చూచారా. కనుక నాకు తెలుసు... అదే నా తల్లి అయితే?
5. మరొక విషయం, వ్యాపారము నిమిత్తం పుస్తకములు అమ్మబడవు. అవి ఎవరికై సహాయపడుటకొరకే వారు ప్రయత్నిస్తున్నారు. బాలురు, ఇక్కడ టేపులను విక్రయిస్తారు ఇక్కడ కొంతకాలం క్రితం జీన్ మరియు లియోలను నేను తనిఖీ చేసాను. జీన్ వర్తమాన టేపుల పనికి బాధ్యతవహించును, లియో నా పరిచర్యయొక్క కార్యదరి వారియొద్దనే వర్తమాన పుస్తకములు మరియు వర్తమాన టేపులయొక్క వివరము గలవు. ఆ వర్తమాన టేపులను ఎంత ధరకు అమ్ముచున్నారో చూచుటకు నేనే స్వయం
తనిఖీ చేసాను. ఎందుకంటే నేను ఒక సువార్తికుడు నుండి ఒక టేపును కొనుగోలు చేసాను,దాని ధర ఆరు డాలర్లు. వారు దానిని రెండు డాలర్లకో, ఎంతకో పొందుచు న్నారు. కాబట్టి వారు వాటికొరకు ఎంత చెల్లించిరో దానిని నేను చూచాను. కాబట్టి వారు కేవలం కొద్ది లాభంకు మాత్రమే అమ్ముచున్నారు. వారు పొందగలిగే అత్యుత్తమ టేపును పొందమని నేను వారికి చెప్పాను. దానిని స్కాచ్ టేపును ఉపయోగించారు, ఏ వర్తమానమునైనా లేదా ఏదైనా వారు దానిమీదనే ఆ టేపులను రికార్డు చేసారు.
6. ఇప్పుడు కొన్ని సార్లు ... నేను దీనిని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రతీ మనిషికి తనకంటు స్వంత ఆలోచనుండును. మనకు మన స్వంత సిద్ధాంతంగలదు. సంఘశాఖల మధ్య నేనున్నప్పుడు, ఇతర పరిచర్య సోదరుల మధ్య నేను పరిచర్య చేయునప్పుడు, మిక్కిలి గొప్ప ప్రాధమిక కార్యములనుగూర్చి, సువార్తయొక్క సిద్దాంతములనుగూర్చి నేను ప్రసంగించుటకు ప్రయత్నించను. మరి పరిచర్య చేస్తున్న సహోదరులు దీనిని తెలుసుకోవలెనని నేను కోరుచున్నాను. కొన్నిసార్లు నా స్వంత సంఘములో ఆ విషయాలగూర్చి నా స్వంత ఒప్పుకోలునుబట్టి నేను బోధిస్తాను. అనేకులు ఈ వర్తమాన టేపులను తీసుకుంటారు మరియు కొన్నిసార్లు వారు నిరాకరించెదరు. నేను నమ్ముచున్న దానిని ఎవరిపైన రుద్దడం నాకిష్టం ఉండదు. నా స్వంత మనస్సులోనున్న ఒక చిన్న విషయము, అది నా తలంపులో ఈవిధంగా ఉన్నప్పుడు మరియు దానిని నేనేవిధముగా తలంచుచున్నానో అట్లే దానిని బోధించకపోతే, నేను వేషధారినగుదును. కాబట్టి ఆ విషయమును అట్లే విడిచిపెట్టెదను మరియు నేనేదైతే ఎరుగుదునో దానిని ప్రసంగించి నప్పుడు దానితో ఇతరులు ఏకీభవిస్తే(మీకు అర్థమైనదా?) ముందుకు సాగిపోయెదను.
7. కాని ఇప్పుడు మీరొక కార్యమును గ్రహించుట జరిగిన... నా సంఘమునుండి వచ్చిన వర్తమాన టేపులోని విషయములను విని, సభ్యులలో కొందరు, సహోదరుడు, దానిలో ఏదైనా ఒకదానితో మీరు నాతో ఏకీభవించకపోయిన, దయచేసి ఆ విషయమై నాయెడల అభ్యంతర పడవద్దు, నేను మీ సహోదరుడను. నేను మిమ్మును ప్రేమిస్తున్నాను. వారిని త్రోసివేయుట నా భావం కాదు, కాని ఇరవై లేక ముఫ్పై టేపులు రికార్డుచేసి యుండి, సమస్త విషయములు దానిలో ఉండగా, ఆ కార్యములో మీరేమి చేయలేరు. కాబట్టి మేము వాటిని సాధ్యమైనంత ఉత్తమంగా నివారించుటకు ప్రయత్నిం చెదము. నా కూటములో యవ్వనస్థులు టేపులను రికార్డింగుచేయుచు వాటిని భద్రపరచుటకు ప్రయత్నించెదరు, సంఘమే తనకుతానుగా దానికొరకై బాధ్యత వహించును, కాబట్టి, అది యేసు క్రీస్తుయొక్క ఒక గొప్ప శరీరముగా ఏర్పడుటకై నేనిక్కడ సహకరిస్తున్నాను. వాట న్నింటికంటే,ఆ గొప్ప పునాదియొక్క భాగమేమనగా, పశ్చాత్తాపము (మారు మనస్సు), బాప్తీస్మం, దేవునిపట్ల విశ్వాసం, రక్షణ, దైవీక స్వస్థత. ఆ విషయాలపై మనమందరం ఏకీభవించగలమని నేను భావిస్తున్నాను (అర్థమైనదా?), ఆ విషయాలయందు.
8. ఇప్పుడు కొన్నిసార్లు, దాన్ని సమీపించు విధానంలో కొద్దిగా భిన్నమైన కోణంలో నేను ఉండవచ్చు,కాని నేను జెఫర్స్ల్సోన్విల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకసారి నేనిట్లు తలంచాను. నేను పబ్లిక్ సర్విస్ కంపెనీలో పనిచేస్తుండగా, అక్కడ శ్రీ బోహన్సన్, విడిది గదులయొక్క పనిలో అనుభవజ్ఞుడగు పర్యవేక్షకునిగా ఉండెను. నేను బాప్టిస్టు బోధకు దీని, మేపెల్ వీధిలోనున్న మెథడిస్ట్ సంఘమునుండి రెవ. ఆర్నీ క్లెగ్, ఆ పిదప కాతలిక్ మత గురువు ఫాదర్ హల్పెన్లోనికి వచ్చిరి. మంచిది, అతను చెప్పిన దానిని నేను ఉదాహరించి చెప్పవచ్చునా? సరే, "మనమంతా ఇక్కడ ఉన్నప్పుడే మనము పాచికల ఆట(జూదము)ను ప్రారంభించాలని"కాథలిక్ మత గురువు మాట్లాడుతూ చెప్పెను.
9. కాబట్టి అంతట అతడు ఏదోకటి చేయగా, నా హృదయంలో ఏదోకటి కదులు చుండుటకు ప్రారంభమైనది. అతడు మూడు వరుసలు గీసాడు. అతడు ఇలాగు చెప్పేను, "ఇదిగో, ఇది పెన్సీల్వేనియాకు పోవు మార్గము, బిల్లీ," అది నేనే. "ఆ వరుసగుండా నీవు వెళ్ళవలెను, ఇక్కడ దక్షణమున మరొక వరుస ఉన్నదని" చెప్పెను. "శ్రీ బ్లాగ్ ఈ వరుస ప్రకారముగా అచ్చటకు వెళ్ళును, ఇదిగో ఇక్కడే మరొకటి ఉన్నదని" చెప్పెను. "అవి పరలోకమునకు దారి చూపినంత కాలం, నీ వరుసవద్దనే నీవు నిలిచి వుండుడని" అతడు చెప్పెను. ఒక మత గురువుగా అతడు చెప్పినది చాలా మంచి విషయమని తలంచాను. "నీ వరుసయందే నీవు నిలిచి ఉండమని" అతను చెప్పెను. అదే సరియైనది. ప్రభువైన యేసు క్రీస్తునందు మీరు మారుమనస్సు పొంది, విశ్వసించునంత కాలం, మీ పూర్ణ హృదయంతో ముందుకు కొనసాగిపోవుచూ ఉండండి, అప్పుడు ఆయన మిమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తాడు. నాలో ఉన్నదానంతటితో దానిని నేను విశ్వసిస్తున్నాను.
10. అదంతా చాలా బాగానే ఉన్నది, స్త్రీలు సంగీతం వాయించుట, ప్రత్యేక పాటలు పాడుట అన్నీ చాలా చక్కగానే ఉన్నవి. కాని చాలామంది జనులు ఉండుటవలన వారు నా మాటలను వినలేరేమోనని నేను ఊహించితిని, కాని వెలుపలనున్న వారిని లోపలికి పంపిస్తూ, కార్లంటిని వరుస క్రమములో పెట్టుచు పోలీసులు అచ్చట మాకు సహాయము చేసిరి, నిశ్చయముగా వారు అద్భుతమైన పనినిచేసిరి, చక్కగా పనిచేసిరి. అందరూ చాలా చక్కగా ఉండిరి. దానిని మేము నిశ్చయంగా అభినందిస్తున్నాము. అదే
మన నిరీక్షణ, మన ప్రార్ధనలు, మన ఆశలైయున్నవి. మీకొరకు అదే మేము చేసితిమి
లేదా చెప్పినది అదే. లేదా మాద్వారా దేవుడు ఏదోక దానిని చేయుటను మీరు
చూచిరి. తద్వారా మీ విశ్వాసాన్ని అది బలపరచినది. మరి అది మిమ్మల్ని యేసును
ఇంకా అధికముగా ప్రేమించేటట్లు చేసెను; మీరు వ్యాధితో ఉండగ, మీరు స్వస్థతపొందిరి
-ఎందుకనగా, అదే మా దీనమైన హృదయపూర్వకమైన యధార్థమైన కోరికైయుండెను.
అందుకొరకే మేము ఇక్కడ ఉన్నాము. మేమిచ్చటకు వచ్చుటద్వారా దానిని మేము సాధించిన, మా హృదయములంతటితో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము.
11. 8వ పెన్ స్ట్రీట్ నందు మాకొక చిన్న గుడారము గలదు. ఇచ్చట జరుగు ఆరాధన లలో అప్పుడప్పుడు నేను ప్రసంగిస్తూ ఉండెదను. కాబట్టి మీరెప్పుడైనా జెఫర్సన్ట్ఫిల్ చుట్టు ప్రక్కల ఉన్నట్లయితే, లేక వెలుపల ప్రాంతములలో జరుగు నా కూటములోనైన మీరు వచ్చినట్లైతే మరల మనము కలుసుకొని, కరచాలనం చేసుకుందాం: ప్రభువు చిత్తమైతే, వచ్చే ఏడాది మరల నేను ఇక్కడకు వస్తానని నమ్ముచున్నాను. (సమాజము చప్పట్లు కొట్టుచున్నారు) ధన్యవాదములు, ధన్యవాదములు. నేను సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు, మీలో ఎంతమంది నాకొరకు ప్రార్దించెదరు? అదే ప్రాముఖ్యమైనది. మీరు ప్రార్థించెదమని వాగ్దానము చేసిరి, అలాగుచేసిన బాగుండును- అదే నా బలము. దేవుడు మిమ్మును దీవించునుగాక. పరిశుద్ధాత్మద్వారా, దేవునినుండి దానిని నేను పొందెదను.
12. నేను చెప్పాలంటే అనేక విషయములు గలవు. నా స్నేహితులు అనేకమంది జెఫర్సన్విల్ నుండి, వివిధ ప్రాంతములనుండి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. డౌన్నింగ్స్ అనే ప్రాంతమునున్న పలు చోట్లనుండి మరియు ఈ దిగువ టేనస్సీలోనుండి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు, నేను వారిని ఎన్నడు చూడలేదు, కానీ వారివైపు నా చేయిని మాత్రము ఊపితిని. సహోదరుడు వెల్స్ ఇవాన్స్, అతని భార్య, మరియు కుటుంబము ఇక్కడే ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు నేను వారిని కనుగొనలేకపోతున్నాను. సహోదరుడు బాంక్స్ ఉడ్, అతని తండ్రి, తల్లి మరియు తన సహోదరుడు, వారందరు యెహోవా సాక్షుల సంఘమునుండి మార్పుచెంది వచ్చిరి. వారు ఇక్కడ కూటములో ఉన్నారు.ఓహ్, సహోదరుడు హిక్కర్సన్ గత రాత్రి పరిశుద్దాత్మను పొందుకున్నాడని నేను విన్నాను. ఓహ్, దేవునికి స్తుతి కలుగునుగాక!. అతను మరియు అతని భార్యకూడా. సహోదరుడు కాలిన్స్, మెథడిస్టు బోధకుడు, అతను, అతని భార్య మరియు అతని సోదరుడు, అతని భార్య అందరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఓహ్, కార్యములు అద్భుతంగా జరుగుచు సాగిపోవుచున్నవని నేను మీకు చెప్పుచున్నాను. మరి ఈ వ్యక్తులతో కలసి ప్రార్దించుటలో సహాయపడటానికి ప్రార్ధన గదుల్లో ఉన్న ప్రియమైన ప్రజలకు మేము ధన్యవాదములు తెలుపుచున్నాము. దాని భావమేమనగా, ఆలాగు అది నా సంఘమును మిక్కిలిగా బలపరచుచున్నదగును. ఎవరైతే బాప్తిస్మమును పొందుకోవాలని కోరితిరో వారు, అనగా సహోదరుడు ఉడ్ మరియు తదితరులుకూడా పరిశుద్ధాత్మను పొందితిరని ఎవరో నాతో చెప్పిరి. అందుకు నేను చాలా కృతజ్ఞుడను. ప్రభువు ఆ సహోదరులను ఆశీర్వదించునుగాక!. వారి జీవితాలలో ఏదో ఒక నూతనమైనదానిని పొందుకున్నారని నేనెరుగుదును. అది వారికి వాస్తవమైనదిగా ఉండునుగాక!. ఆమేన్.
13. మేము వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించవలసియున్నది, కనుక మేము మిమ్మల్ని ఎక్కువ సమయం ఉంచాలని కోరుట లేదు. ఈ రాత్రి తిరిగి మీరు మీ సంఘములకు
వెళ్ళవలెనని మేము కోరుచున్నాము. మీరు దర్శించాలనుకుంటే, మీరెందుకు కొన్ని సంఘములను సందర్శించకూడదు?. ఈ ఉదయమున వారున్న ప్రాంతములో చాలా అద్భుతమైన సమయాన్ని వారు గడిపితిరని సహోదరుడు డేవిడ్ డుప్లెసిస్ ఇప్పుడే చెప్పెను. నేను సహోదరుడు సుల్లివాన్యొద్దకు వెళ్ళగా, అచ్చట మేము ఆ సంఘముతో అద్భుతమైన సమయాన్ని గడిపాము. ఇక్కడున్న ఈ చిన్న సహోదరుడు, బ్రదర్. పాట్ టైలర్,నా సోదరులు మరియు సహాచరులలో ఇతను ఒకరు. న్యూయార్క్ నుండి వచ్చిన సోదరుడు అంథోనీ, నీవు గ్రీకు ఇటాలియన్? న్యూయార్క్లోని ఒక చిన్న ఇటాలియాన్ సంఘస్తుడు. ప్రపంచమంతటా, ప్రతీ చోటా, అనేక స్థలములలో ఉన్నారు, నేను వారందరి పేర్లను పిలవలేను, కానీ దేవుడు మిమ్మును గొప్పగా దీవించునని నేను నమ్ముచున్నాను.
14. ఇప్పుడు ఇక్కడ స్వస్థత పొందుకొనని ప్రతియొక్కరికి, ఇది స్వస్థత పొందుకొనే ఘడియగా ఉండనివ్వండి. వారికి ఇదే ఆ సమయముగా ఉండనివ్వండి. గత రాత్రి చక్రాల కుర్చీలలో కూర్చొనివున్న వారు ఈ చుట్టూ ప్రక్కల ఉండిరి. ఇక జనులనుకూడా చూచుటకు చాలా కఠినముగా ఉండునంతగా నేను వివేచనా ఆత్మతో మిక్కిలిగా నింపబడి యుండుటచేత, దాదాపు బయటకు వెళ్ళుటకు నా అడుగులు వేయలేనంతగా స్పృహను కోల్పోగా, ఆ స్పృహలోనుండి నేను వచ్చుటకు బిల్లీ లేదా ఎవరో నా చెంపలపై రెండు ప్రక్కలా తట్టిరి. కానీ నేను... అచ్చట ఒక నల్ల రంగు జాతి చిన్న బిడ్డపట్ల నాకు చాలా ఆశక్తి ఉండెను. ("ఆ బిడ్డ ఇచ్చటే ఉన్నదని" ఎవరో చెప్పిరి-సంపా.,). ఆ బిడ్డకు ఏమి జరిగినదో నేను చూశాను. వైద్యునియొక్క తప్పిదమువలన ఆ బిడ్డకు ఒక లోపము ఏర్పడెను. కాని ఆ బిడ్డ బాగవునని నేను నమ్ముచున్నాను. అది నిజము. ఇక నేను వేదిక పిలుపు ఇవ్వలేనంతగా నా స్థితినుండి తొలగిపోతిని. అవతలి గట్టున నేను ప్రజలను కలుసుకునేంతవరకు వారికి నేను చెప్పే నా పరిస్థితి అర్థమవ్వదు. అర్ధమై నదా? సహోదరుడా, సోదరీ అది చాలా కష్టము. దానిని మీరు అర్థము చేసుకోలేరు... 15. నజరేయుడైన యేసుయొక్క వస్త్రపు చెంగును ఒక స్త్రీ ముట్టగా, ఆయననుండి ప్రభావము వెడలిపోయి తాను బలహీనుడనైతినని చెప్పిన మాటనుగూర్చి ఒకసారి ఆలోచించండి. అది నిజమేకదా? ఆయన, దేవుని కుమారుడు, కాని నేనేమో, కృపచేత రక్షించబడిన ఒక పాపిని, మరి నా సంగతేంటి? సమయం వెంబడి సమయం, ప్రతీసారి ఇచ్చట జరుగుచున్న కార్యములను ఇచ్చటకు వచ్చి నిలబడి గమనించండి. "నేను, తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను గనుక, నేను చేయు క్రియలు మీరును చేయుదురు దానికంటే గొప్పవియు చేయుదురు” అని ఆయన వాగ్ధానమును చేసెను, కాబట్టే అచ్చట
జరుగుచున్న కార్యములకు అదే కారణమగును. ఇచ్చట “గొప్పవి” అనే పదమును
నేనెరుగుదును. కాని దానియొక్క సరైన అనువాదం "ఎక్కువ”. “నేను తండ్రి యొద్దకు
వెళ్ళుచున్నాను, మీరు వీటికంటే మరి ఎక్కువ క్రియలు చేయుదురు”.
16. ఇప్పుడు, తండ్రియొక్క వాక్యమును మనము చదువుటకు ముందుగా, ప్రార్థన కొరకు మన తలలు వంచుదాం. మా కృపగల, ప్రేమగల, గౌరవప్రదమైన మరియు తండ్రీ, దీన మనస్సు కలిగిన చిన్న బిడ్డలవలె మేము మీయొద్దకు వచ్చెదము. మరియు మేము మా సహోదరులకు మరియు మాస్నేహితులకు ఈ కూటములో వారు చేసిన పరిచర్యనుబట్టి ధన్యవాదములు తెలియజేయుచున్నాము. ఇప్పుడు మేమందరము కలిసి, మా తలలను, హృదయములను వంచి,మీ మంచితనముకొరకై మా ప్రేమగల తండ్రికి మేము మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. బాధింపబడినవారు బాగైరి. రోగులు స్వస్థత పొందిరి, పాపులు రక్షింపబడుటకై మీయొద్దకు వచ్చిరి, ఈ కార్యములన్నీ నీ ద్వారానే సాధించబడినవి. రక్షింపబడిన వారు వచ్చి మీ ఆత్మతో నింపబడిరి. మేము భోదించిన వాటిల్లో ఏ ఒక్కటైనను మీరు విడిచిపెట్టలేదు. ప్రతీ మాటను నిరూపించుటకై సూచనలు వెంబడించినట్లు నీవు చేసితివి. తండ్రీ, అందుకు మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
17. ప్రతి ఒక్కరిని స్వస్థపరచుటకు, ప్రతి ఒక్కరిని రక్షించుటకు, ప్రతి ఒక్కరిని పరిశు ద్ధాత్మతో నింపుటకు మీ సంకల్పమని మేమెరుగుదుము. తండ్రీ, ఇచ్చటెవరైనా విడిచిపెట్ట బడి ఉంటే, ఇది వారి ఘడియని, ఈ తరుణమే వారికి కావలసియున్నదని, ఎవ్వరని విడిచిపెట్టబడుట మీ చిత్తము కాదని వారు గ్రహించునట్లుచేయుమని మేము ప్రార్ధిస్తు న్నాము. ఎందుకంటే, మీరిచ్చట ఉంటు, వారి హృదయ కోరికనుబట్టి ఇచ్చుటకు మీ చిత్తమై, కోరికయై, అభిలాషయై ఉన్నది. ఎవరికొరకు మీ జీవమును అర్పించిరో వారు మీ పిల్లలు. వారికి సహాయపడుట మీ చిత్తమై, అందుకొరకు మీరు సిద్ధంగా వున్నారు.
18. చదవబడిన వాక్యమును దీవించండి. మేము మాట్లాడుచుండగా, దీవెనకరమగు ఈ వాక్యమును పరిశుద్ధాత్మ ఈ జనుల మధ్యకు తీసుకొని వెళ్లి,వారికి అవసరమగు విధంగా ప్రతీ ఒక్కరి హృదయ లోతులలోనికి వెళ్లనివ్వండి. మేము ఈ మధ్యాహ్న వేళ కూటమును ముగించి, లేదా మీరు ఈ మధ్యాహ్న కూటమును ముగించి, వివిధ ప్రదేశములు, వివిధ పట్టణాలు, వివిధ రాష్ట్రాలు మరియు వివిధ దేశాలలోనున్న మా గృహములకు తిరిగి వెళ్ళునప్పుడు, మేము ఆ మొదటి ఈస్టర్ ఉదయమున ఎమ్మాయి నుండి వచ్చిన వారివలె చెప్పుదుముగాక!. "ఆయన మార్గంలో మనతో మాట్లాడి నప్పుడు, మన హృదయములు మనలో మండలేదా." తండ్రి, మేమెల్లప్పుడు మిమ్మును స్తుతించెదము. మీ ప్రేమగల కుమారుడగు ప్రభువైన యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్. (టేపులో ఖాళీ స్థలమున్నది.)... త్రాగుటకు నీళ్ళు లేవు. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోని వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను. నీవు నీ కఱ్ఱను తీసుకొని, నీవును, నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నులయెదుట
ఆ బండతో మాటలాడుము. అది ఆయన నీళ్ళనిచ్చును. నీవు వారికొరకు నీళ్ళను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. 19. ప్రభువు తన పరిశుద్ధ గ్రంథములోని వాక్యమును దీవించునుగాక! అదొక
భయంకరమైన వేడిగల ఉదయమై ఉన్నది. వారికి ఆ రాత్రంతయు నిద్రలేదు. వారొక చిన్న నీటి బుగ్గయొద్దకు చేరారు. పశువులు అరుపులు, గుఱ్ఱపు సకిలింతలు, పిల్లల ఏడ్పులు, త్రాగుటకు నీళ్ళు లేక, వారు రాత్రంతయు గొణుగుచుండిరి... వారు ఎదారిలో ఒంటరిగా ఉన్నారు. వారున్న ప్రదేశమంతటను నీటి బుగ్గకొరకు వెతికారు. కాని నీటి బుగ్గలన్నియు ఎండిపోయి, అక్కడ నీరు లేకుండెను. వారి పాపమే వారిని ఈ స్థితికి తీసుకొని వచ్చెను. దేవుడు వారికి చేసినదంతయూ మర్చిపోయిరి. వారికొరకు చేసినది మర్చిపోయి, దేవునికి మరియు తన ప్రవక్తకు విరుద్ధంగా గొణుగుచున్నారు. ఆ గొణుగుడే వారిని ఈ ఎడారిలోకి తీసుకొని వచ్చెను. అక్కడ నీరు లేదు, వారి పిల్లలకు ఏమియు దొరకలేదు, తినుటకు ఆహారము లేదు, త్రాగుటకు నీళ్ళు లేవు. ప్రజలు పాపము చేయున ప్పుడు అదొక భయంకరమైన విషయంగా ఉండును. కాని నేటి లోకములో వారి దృష్టిని ఆకర్షించే ఒక బలమైన కార్యముగా అది ఉన్నది. అద్భుత, ఆశ్చర్య కార్యములను, సూచక క్రియలను వారి మధ్యచేసిన మరియు ఆ దేశమునకు తీసుకొని వెళ్ళెదనని వారికి వాగ్దానముచేసిన దేవుడిని చాలా శులభంగా మర్చిపోయిరని కనుగొన్నాము. 20. మనము నిలిపిన (నిలుపుటకు మాకు ఇష్టమే, కాని మేము నిలుపలేము). దానిపై కొన్ని నిమిషములు ఆగుదాము. దేవుడు ఒక వాగ్దానము చేసినప్పుడు, పిదప ఆ పలికిన మాటలన్నింటిని కాచుకొనుటకు, దానిలో తననుతానే కనబరచుకొనుటద్వారా ఆయన చేసిన వాగ్ధానమును ఆయనే నెరవేర్చటకు దాన్ని రూఢిపరచును. సరిగ్గా ఇచ్చటున్న ఈ చటొక్వాలో దేవుడు అదే క్రియలను చేయుట ఎంత అద్భుతమైనది. కాని మీరు చూడండి.... వాగ్దానం చేయబడిన భూమికి వెళ్ళు మార్గమున మనము ఉన్నాము. ఈజిప్టు నుండి వాగ్దాన భూమికి చేరువరకు వారి అవసతరలన్నింటినీ తీర్చుదునని దేవుడు వాగ్దానము చేసెను. అట్లే మనము వాగ్దాన భూమికి చేరునంతవరకు మన అవసరముల న్నింటిని తీర్చుదునని దేవుడే మనకు వాగ్దానము చేసెను. దేవుడు మనకు చేసిన వాగ్దానాలను మనము నమ్మినయెడల, మన మధ్య ఎలాంటి వ్యాధులు అసలు వుండవు. కాని మనము పాపమును చేసితిమి. పాపం అనగా ఏమిటి? అప నమ్మకం. అవిశ్వాసము మాత్రమే పాపంమైయున్నది. మద్యపానం, ధూమపానం, జూదం, వ్యభిచారం చేయుట పాపం కాదు. అది అవిశ్వాసముయొక్క గుణ లక్షణములు, అర్థమైనదా? నీతిమత్వము రక్షణయొక్క గుణ లక్షణము. కాని ప్రజలు ధూమపానం, మద్యపానం, ప్రతీది మానివేయ గలరు,అయినప్పటికీ అది రక్షించబడినట్లు కాదు. అర్థమైనదా? పాపమును ఏ వ్యక్తియైతే చేయునో అతడు విశ్వాసి కానేరడు, అదొక పాపపు గుర్తుగా అతనిపై ఉండును.
పరిశుద్ధ గ్రంధము ఇలా చెప్పెను, "దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాస ముంచనివాడు ఇదివరకే తీర్పు తీర్చబడెను." కాబట్టి మీ జీవితములో ఎన్నడు అబద్ధం చెప్పకపోయిన, దొంగిలించక పోయిన లేదా ఏమీ చేయకపోయినా, అయినప్ప టికీ మొదటినుండే నీ జీవితము పాపముతోనే ప్రారంభమైనది. క్రీస్తుకు వెలుపల అసలు మీకు ఏ అవకాశములేదు. ఆయనే మార్గమైయున్నాడు.
21. మరి ఈ జనులు దేవునినుండి పూర్తిగా దూరముగా తొలగిపోయిరి. కనుకనే ఆయన వారి నీటి సరఫరాను, భోజన పదార్దముల సరఫరాను నిలిపివేసేను. అది నేటి దినమునకు ఒక సాధృశ్యముగానున్నది. ఆయన సంఘమునకు వాగ్దానముచేసిన ఆ గొప్ప ఆశీర్వదములను దేవుడు సంఘమునుండి తీసివేసెను. ఆయన వారితో ఉండవచ్చు... వినండి. ఆయన మనతోను, మనలోను, అంతమువరకు ఉండును. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను, యుగ సమాప్తివరకు మార్గమంతా నేనెల్లప్పుడు మీతోనే యుందును."
"ఆయన ఈ రోజు సంఘములో లేడని, చరిత్రయొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు, తిరిగి లేచిన ఆ దేవుడు ఎక్కడని" జనులకు ఎందుకు బోధిస్తున్నారు? ఆయనయొద్దకు తన ప్రజలు తిరిగి రావాలని, వచ్చి తమని చక్కదిద్దుకోవాలని మాత్రమే ఆయన ఎదురు చూచు చున్నాడు. ఎప్పుడైతే జనులు తమను చక్కదిద్దుకొనెదరో, అప్పుడు చరిత్రయొక్క దేవుడు మరలా లోపలికి వచ్చుటను మీరు చూడగలరు.
22. ఐగుప్తులో తెగుళ్ళు చుట్టిముట్టినప్పుడు, వాటి నుండి తాము రక్షించబడితిమని వారు చాలా తేలికగా మర్చిపోయిరి! ఐగుప్తులో ప్రతీ చోటా ఈగలు ఎగురుచు చుట్టూ ఉన్నప్పుడు, కాని వారున్న స్థలంలో ఒక్క ఈగకూడా లేదు. పేలు పడకల నిండుగాను, బట్టల నిండుగాను ఐగుప్తులో ఉండగా, వారివద్ద ఒక్క పేనుకూడా లేదు. అలాగే కప్పలు ఐగుప్తులోని అవిశ్వాసులందరి అల్మారాల్లోను, వారున్న ప్రతి చోటను ఉండెను, కాని దేవుడు తన ప్రజలపట్ల దయ చూపుటవలన వారు వాటినుండి రక్షించబడిరి. చూడండి, ఆ చివరి మరియు గొప్ప రాత్రి వచ్చినప్పుడు, దేవుడు చెప్పెను, "ఇది ఐగుప్తుకు నా యొక్క చివరి దెబ్బ, కాని నేను ఈ దెబ్బతో తాకుటకు ముందుగా, నేను నా పిల్లలను రక్షణలోనికి తీసుకొని రావలసివున్నది. కనుక బలి అర్పించబడుటకై గొట్టెపిల్ల చంపబడి నది. ద్వారముయొక్క నిలువు కమ్ములకు మరియు అడ్డ కమ్ములపై రక్తము పూయబ డెను. కాబట్టి రక్తము క్రిందకు సమాజము వెళ్ళినది. ఐగుప్తును తాకిన చివరి తెగులు అదేయని గుర్తుంచుకొనుము. మరి ఆవిధముగానే నేటి సంఘమును తాకే చివరి తెగులు అదే రీతిగానే ఉండును. అదేమనగా, అదొక ఆత్మీయ మరణమగును. ఎట్లనగా, వాస్తవంగా దేవుడే వారిని నడిపించిన రీతిగా ఆయనే మనలను ఆత్మ సంబంధముగా నడిపించును. శత్రువుకు మరణమే చివరి దెబ్బగా ఉండెను. ఆ రీతిగానే రక్తము క్రింద సహవాసము లేనివారందరు పరిశుద్ధాత్మచేత బహిష్కరించబడిరి.
23. అందుచేతనే ఇప్పుడు సంఘములో మనకు ఆత్మ సంబంధమైన మరణము ఏర్పడుచున్నది. ఆత్మ సంబంధమైన మరణమనేది విడుదలను పొందుకొనే ఘడియకు ముందుగా ఇవ్వబడు చివరి సూచనగా ఉన్నది. యేసు అదే విషయమును చెప్పలేదా? వారు, "అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవునికంటే సుఖానుభవమునెక్కు వగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము." ఈ లోక సంఘము తెగులుతో ఆత్మీయంగా మరణిస్తున్న ఆ ఘడియలోనే ఇప్పుడు మనము జీవిస్తున్నాము.
కాని దేవుడు వారిని కాపాడుచున్నాగాని వారు దానిని మర్చిపోయారు. అలాగే ఆయన కృపచేత మీరు రక్షించబడిరని మరియు ఆయన ఆత్మతో మీరు నింపబడిరనే విషయమును మన పెంతెకోస్తు విశ్వాసులుకూడా ఎంత త్వరగా మర్చిపోవుచున్నారు. సంఘమునకు ఇదొక గొప్ప భయంకరమైన మరణకరమగు సమయముగా ఉన్నదని, కనుక మీరు జీవించుటకు మరియు మీ జీవిత ప్రయాణములో ప్రయాణించుటకు దేవుడు మీకు పరిశుద్దాత్మను ఇచ్చుటవలన మీ మార్గములో మీరు వేసే ప్రతీ అడుగు నందు ఆయన మీతో ఉన్నాడనే కార్యమును మీరు మరచిపోవద్దు. కాని మనము దానిని చాలా త్వరగా మర్చిపోవు చున్నాము. ఇది చాలా దారుణం.
24. ఆ దేవుడు వారిని ఎలా బయటకు తీసుకొనివచ్చెను. ఆ భయంకరమైన రాత్రిలో ఆయన వారిని ఎలాగు దాటి వెళ్ళెను. ఆ గొప్ప పస్కా బలి... ఆయన వారికొరకు ఈ గొప్ప కార్యములును ఎన్నో చేసినాగాని వారు ఐగుప్తునుండి వెలుపలికి వచ్చిన, పిదప సణగుటను ప్రారంభించిరి. వారు వెలుపలికి వచ్చి మృత సముద్రమువద్దకు వచ్చిరి.
అచ్చట వారు ముందుకు సాగుటకు ఏ మార్గము లేనప్పుడు దేవుడే ఒక మార్గాన్ని తెరిచెను. దేవుడే వారికి మార్గమయ్యెను!నా జీవితములో నేను కనుగొన్న మార్గం అదే. మార్గమేలేని ప్రదేశమునకు చేరుకున్నప్పుడు, మార్గంను సరాళముచేయుటకు ఏ మార్గములేని చోట, యేసే మార్గమును సరాళము చేయును. “నేనే మార్గం, నేనే సత్యం మరియు జీవము." వారిని విడుదల చేయుటకు అచ్చట ఏ మార్గం లేనప్పుడు దేవుడే ఒక మార్గమును సరాళము చేయునని మనము కనుగొంటిమి. మీరు ఇప్పుడు ఆత్మ సంబంధమైన వస్త్రమును ధరించుకొని వినుటకు సిద్ధంగా ఉన్నారని నమ్ముచు న్నాను. సున్నతి చేయబడనివారు-పరిశుద్ధాత్మను పొందలేదని అర్ధము... సున్నతిచేయబ డని వారు...పరిశుద్ధాత్మనగా సున్నతియని ఎందరికి తెలుసు? మీరెప్పుడైన పరిశుద్ధ గ్రంథమును చదివినవారైతే,దాన్ని మీరెగుదురు. ఈ ఉదయం నా వర్తమామున... స్టెఫెన్ యాజకులతోను మరియు వారితోను ఇట్లు చెప్పెను, "హృదయములందును, చెవుల యందును సున్నతి పొందనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశు
ద్ధాత్మను ఎదిరించుచున్నారు." పరిశుద్ధాత్మ హృదయమును సున్నతిచేయును.
25. అంతట, దేవుడు ప్రయాణంలో వారియెడల జాగ్రత్త వహించుదునని వాగ్దానము చేసెను,కాబట్టి ఆయన వారియెడల జాగ్రత్త వహించెను. ఆయన ఎన్నడూ విఫలమ వ్వడు. అవిశ్వాసులు వారిని అనుకరించుటకు ప్రయత్నించగా, వారు మునిగిపోయిరి.
ప్రజలు లోపలికి వచ్చి అనుకరణచేయుటకు ప్రయత్నించెదరు లేక పరిశుద్ధా త్మను పొందినట్లు నటించుటను మీరంతట మీరే చూడగలరు. వారు చెత్త కుప్పపై పడియుండుటకు ఇంకా ఎంతో కాలములేదని మనము కనుగొనెదము. ఖచ్చితంగా సరియే. మీరు దాన్ని అనుకరణచేయలేరు. ఒక అసలైన ఎదోకదాన్ని నీలో నీవు కలిగి వున్నావని నీవెరుగుదువు. కావున నీవు లోపలికి ప్రవేశించి ఒక క్రైస్తవునివలె నటించ లేవు. నీవు పొందుకోవలసిన దానిని నీవు పొందుకున్నావు. దానిని నీవు కలిగి వుండే ఏకైక మార్గమేదనగా తిరిగి జన్మించుటద్వారా మాత్రమే. జనులు లోపలికి వచ్చి భాషలు మాట్లాడటం మనము విన్నాము. మొదటగా మీరు తెలుసుకోవలసిన విషయమే మనగా, వారు చెత్త కుప్పలో ఉన్నారని కనుగొనగలము. వారు పరిశుద్ధాత్మను పొంద లేదు; వారు భాషలయొక్క గందరగోళాన్ని పొందుకొనిరి. తన హృదయంలో తానేమై యున్నాడో ఆ రీతిగానే పరిశుద్ధాత్మ అతనిని చేయును. ఆయనలో దైవీక ప్రేమగలదు.
26. వారు వీటన్నింటినీ మరిచిపోయి, మోషేమీద మరియు దేవునిమీద మిక్కిలిగా సణగుచు, "మమ్మల్ని ఇక్కడికెందుకు తీసుకు వచ్చావు? మేము ఇక్కడెందుకు ఉండాలి? దీనికంటే మేము ఇప్పుడైనా ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఇక్కడ మేమెందుకు చనిపోవాలి? ఇక్కడుండుట కంటే అక్కడే బాగుండును. కనుక ఫరో మమ్మల్ని చంపితే చంపనివ్వుమని" నిందించిరి. "నేడుకూడా సంఘము అలాంటి ఫిర్యాదులనే చేయుటలేదా? కాబట్టి వారు దేవుని హస్తం క్రింద ఉన్నామనే విషయమును చాలా సునాయసంగా మర్చిపోయిరి. అవును, అది వారికి చాలా సుళువు. వినండి. ఏమి జరిగెను? "దీనికంటే మేము అక్కడే చనిపోయుంటే మేలని" వారు చెప్పుట, ఓహ్, చాలా భయంకరమైన కార్యము. గమనించండి, ఐగుప్తులోని ఉల్లిపాయలను, వెల్లుల్లి పాయలను తినిన వాటిని వారు విడిచిపెట్టి, దేవుడు పరలోకమునుండి దేవ దూతల ఆహారమగు రొట్టెను కురిపించి వారిని పోషించెను. అయినప్పటికీ వారింకా ఫిర్యాదు చేస్తూనేవున్నారు. దేవుడు సంఘమునకు దేవదూతల ఆహారమను, పరిశుద్ధాత్మనిచ్చెను, అయినా వారు ఇప్పటికి ఏదోక దానిగూర్చి నిరంతరం ఫిర్యాదు చేస్తూనేవున్నారు.
27. దేవ దూతలయొక్క ఆహారమును భుజించుటకొరకు వారు ఉల్లిపాయలను, వెల్లుల్లి పాయలను విడిచిపెట్టిరి. ఆ దేవదూతల ఆహారమును పరలోకంలో వారికి సిద్ధపరచి, కురిపించెను, దానినే వారు భుజించిరి, అయినా వారు ఫిర్యాదు చేయుచున్నారు.నైలు
నదుల పాత బురద నీటిని త్రాగుచు... వారచ్చట మురికి బురద నీటిని త్రాగేవారు, కాని ఇప్పుడు ఆత్మ సంబంధమైన బండలోనుండి వచ్చే స్వచ్ఛమైన రక్షణ జలమును త్రాగుచుండినాగాని, దానినిగూర్చి ఫిర్యాదు చేసిరి. అవును. వారికి స్వల్పమైన, కఠినమైన కార్యములు ఎదురైనప్పుడెల్లా ఫిర్యాదు చేయుచుండిరి. ఓహ్, నీవు కూటమునకు వచ్చి పరిశుద్ధాత్మ సంచరించుటను చూచికూడా, తిరిగి వెళ్ళేటప్పుడు, కడుపు నొప్పియనే మొదట శోధన వచ్చిన వెంటనే, "ఏమో, నాకిక బాగవ్వదేమో” అని చెప్పెదవు. నీకు సిగ్గుండాలి! నీవు నమ్మినయెడల, నిశ్చయంగా, నీవు బాగయ్యావు. నీవే నొప్పితో బాధప డినను దానితో ఏ సంబంధములేదు. నీవు దేనిని విశ్వాసించావో దానినే మేము చూచాము. దానినే దేవుడు చూచెను. అది నీ విశ్వాసమేగాని, నీ భావములు కాదు.
యేసు ఎప్పుడిలా అడుగలేదు, "దానిని నీవు అనుభూతి చెందుచున్నావా?” ఆయన, "నీవు దీనిని విశ్వాసిస్తున్నావాని?" అడిగెను. అదే దానియొక్క తాత్పర్యమగును.
28. కాని ఐగుప్తులోనున్న వైద్యులు ప్రగాల్భాలు పలుకుచూ, “ఓహ్, మేము వైద్యులము, అద్భుతములు జరుగు దినములు గతించిపోయెనని" చెప్పిరి. ఇశ్రాయేలీయుల జనులతో మహోన్నతుడగు వైద్యుడున్నాడు, వారి నలభై సంవత్సరముల ప్రయాణములో, వందల, వేల సంఖ్యలో శిశువులు జన్మించిరి, అనేక రకముల వ్యాధులుండెను మరియు వృద్ధులు ఉండిరి,వారితో ఆ మహోన్నతుడగు వైద్యుడు ఉండుటవలన వారి మధ్యలో ఒక్కరు కూడా బలహీనులుగా లేరు. హల్లెలూయా! అయినప్పటికీ వారు ఫిర్యాదు చేస్తునే ఉన్నారు, "అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి" అని చెప్పుచున్న, ఆ ప్రాంతమును విడిచిరి. మీరుకూడా అలాంటి వాటినే విడిచి వచ్చిరి. అనగా, "అద్భుత ములు జరుగు దినములు గడిచిపోయాయని" చెప్పే ఆ స్థలములనే మీరు విడిచిపెట్టి వచ్చిరి. వారు ఆ పనికిమాలిన మాటలను విడిచి పెట్టి, విశ్వాసులను వెంబడించే ఆశ్చర్య కార్యములు మరియు సూచనలు క్రియలు జరుగు స్థలమునకు వచ్చిరి,అయినా వారింకా ఫిర్యాదు చేస్తూనేవున్నారు. నేటి జనులు పరిస్థితికూడా అట్లే ఉన్నది కదా?
29. దేవుడు ఈ ప్రజలపట్ల దయను చూపుచు, వారి కళ్ళెదుటే అనేక అద్భుతకార్యము లను చేసినను, దానికి విరుద్దముగా ప్రజలు సణిగినప్పుడు, ప్రవక్తయగు మోషే, ఆయన సముఖమందు సాగిలపడి, "ప్రభువైన దేవా, వారు ఖచ్చితంగా పాపం చేసిరి, వినుము... వారికి మరొక తరుణమును దయచేయుమని” ప్రార్థించెను. అంతట ఏమైనది? దేవుడు మోషేతో, “లేచి, వెళ్ళి, ఆ బండతో మాట్లాడుము, అది తన నీళ్ళనిచ్చునని" చెప్పెను.
30. బండ నీళ్ళనిచ్చుననే మాటను నీ మానసిక తెలివితో ఆలోచిస్తూ పిచ్చితనముగా నీవు భావించుటలేదా? మానసిక తెలివి (శారీరకమైన మనస్సు) ఏమి ఆలోచించును? ఖచ్చితంగా, ఆ బండ అరణ్యములో ఎండిన స్థలమున ఉండెనుకదా, అక్కడ నీళ్ళు ఉండాలంటే అది వసంత కాలమై ఉండాలి. కాని విషయము ఆ బండలో లేదు. దేవుడు
కొన్నిసార్లు మనిషి ఏది సరియని తలంచునో, దానికి విరుద్ధంగా క్రియచేయును. అందుచేతనే దేవుని ప్రజలను నడిపించే హక్కు మనిషికి లేదు, ఆత్మతో నిండియున్న సంఘమును నడిపించుటకు పరిశుద్ధాత్మయే ఆ కార్యమును గైకొనును. ఖచ్చితంగా, 31. "ఏదైన దైవీక స్వస్థత మరియు అద్భుతములు జరుగుచ్నుయెడల, అవి మా కాతలిక్ సంఘమున జరుగును, మా బాప్టిస్టు సంఘములో జరుగును, మా మెథడిస్టు సంఘములో జరుగునని" నేడు వారు చెప్పుచున్నారు. కానీ దేవుడు ఈ రాళ్ళవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టించగలడు. ఆయన ఏమి చేసెను? ఆయన ఆ అద్భుత మును చేయుటకు చాలా విరుద్దమైన ఒక స్థలమును ఎన్నుకొనెను, అదే ఆ బండయై యున్నది. నేడుకూడా అది అట్లే జరుగుచున్నది. కనుకనే వారు, "ఆ స్వస్థతలు జరుగు చున్న స్థలము ఎలాంటిదో చూశారా? వారికి కలిగే దర్శనములు ఎలాంటి స్థలములో వచ్చుచున్నవో గమనించారా?" అని చెప్పుచున్నారు. "అదొక పెంతెకోస్థుల గుంపు". కావున, అక్కడనుండి వెళ్ళిపో, అలాంటిదేదైనా దేవుడు అనుహ్రించిన, దానిని ఆయన మా సంఘముకే ఇచ్చును. చూశారా? సరే, అలాగైతే ఇసెమిటి? జరిగిన దేమిటి? మరి అక్కడ ఎందుకు నీళ్ళు లేవు? ఎందుకంటే, మానవులచే నిర్మించిన వారి నీటి బుగ్గలు ఎండిపోయెను! నేడు సంఘములలోకూడా అదే పరిస్థితి గలదు. మన మానవ కల్పిత సంఘశాఖలు, వేదాంత శాస్త్రములు ఎండిపోయాయి. అయినను ఆ బండతో మాట్లాడ మని దేవుడు ఇంకనూ ఆజ్ఞ ఇచ్చెను. ఖచ్చితంగా, అది తన నీటిని ప్రవాహింపజేయును.
అవును, అక్కడికి వెళ్ళడం చాలా పిచ్చితనం. గొప్ప, పెద్ద స్థలము(సంఘము)ను విడిచి, "పరిశుద్ధ దొర్లే గుండ్రాళ్ళని" పిలువబడే ఆ గుంపు జనుల మధ్యకు ఒక వ్యక్తి వెళ్ళుట చాలా పిచ్చితనముగానే కనిపిస్తున్నది కదా? అతడేమి చేస్తున్నాడు? కేవలం దేవుని వాక్యానికే విధేయునిగా అతను ఉన్నాడు. మోషేకూడా దానినే చేసెను. దేవుడేమి చేయమని మోషేకు చెప్పెనో దానికే విధేయత చూపెను. అతడు బండతో మాట్లాడెను. ఆ మాట ఎంతటి పిచ్చితనంగా అనిపించినను లేదా మరొక రకముగా ఉన్నను, మోషే ఆ బండతో మాట్లాడెను, ఆ బండ వారికొరకు జీవ జలములను తీసుకొని వచ్చెను. 32. ఓహ్, ఈ రోజు మనము చేయుటకు కావలసినదంతా ఒక్కటే, ఎల్లప్పుడూ దానిని అట్లే చేయవలసియున్నది, అదేమనగా, కేవలం బండతో మాట్లాడుటయే. ఊటలన్నీ ఎండిపోయి ఉన్నను, సమస్తము నాశనమై నశించిపోయినా, మనము కేవలం చేయవల సినదంతా అలాగే ముందుకు సాగిపోవుచూ, ఆ బండతో మాట్లాడుటయే, ఆ బండ ఇప్పటికీ తన నీళ్ళను ఇచ్చుటకు శక్తి గలదు. మీరు దానిని విశ్వాసించుచున్నారా? పరిశుద్ధగ్రంథములో ఒకసారి... మనకిప్పుడు బయట కొద్దిగా జల్లుకూడా పడుచున్నది, కాబట్టి ఇంకా కొంచెం లోపలికి వెళ్లాము, ముఖ్యంగా ఎచ్చటనుండి వర్షము కురియు చున్నదో దానివైపుగా కొంచెం వాలుచూ... దానివలన ఏ ఇబ్బంది ఉండదు.
33. “బండతో మాట్లాడుము. ఆ బండ తన నీళ్ళనిచ్చును." నీవు దానిని గమనిం చావా? “అది”, “అది”; “తన” (వ్యక్తిగత సర్వనామము) తన నీళ్ళనిచ్చును. ఏ రకమగు నీళ్ళునిచ్చును? జీవ జలములు. ఆ రకమగు నీళ్ళనే అది ఇచ్చును, దేవుడే వాగ్దానము చేసెను. కనుక దేవుడే దానిని చేయును. నేడు మీకు కావలసినది ఇదేయగును. నీవెంతగా బలహీనుడవై కృంగిపోయినను, నీ రోగము బాగవుటకు అచ్చటున్న ప్రతీ వైద్యశాలకు వెళ్ళి వెతికినను, అయినప్పటికీ నీకొరకు ఇక తాము చేయగలిగినదేమియు లేదని వారు చెప్పెదరు. కాబట్టి ఇప్పుడు మీరేమి చెయ్యాలో మీకు నేను చెప్పెదను. అదేమనగా, మోషే చేసినట్లుగానే మీరు చేయండి, ఆ బండతో మాట్లాడుము, దేవుడు వాగ్దానంచేసిన రీతిగా, అది ఇప్పటికీ రక్షణ జలములను, దైవీక స్వస్థతను తీసుకొని వచ్చుచున్నది. ఇక మేము ఏమీ చేయలేమని వైద్యులు చెప్పినయెడల, ఇక మీరు చేయవలసినదంతా ఒక్కటే, ఆ బండతో మాట్లాడుము, అది తన నీళ్ళను తీసుకొని వచ్చును.
34. హాగరు తానున్న ఇంటిని విడిచి వెళ్ళెను. ఆమెకు ఒక చిన్న కుమారుడున్నాడు. ఆ చిన్న బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నాడు, బిడ్డ పరిస్థితిని చూస్తూ ఆమెకు ఏమి చేయాలో తోచలేదు. తన యజమానురాలు తనపట్ల చేసిన కార్యమునుగూర్చి ఆమెకు అర్ధం కాలేదు. ఏమి జరిగెను? వారికి ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆమెయొక్క చిన్న బిడ్డ ఇష్మాయేలు నాలుక ఉబ్బిపోయెను, తన బిడ్డను పొద క్రింద పండుకొనబెట్టి, వింటి వేతదూరము వెళ్ళి ఆమె ముఖము వంచుకొని నేలమీద సాగిలపడి ఆ బండతో మాట్లాడెను, కనుక ఆ బండ నీళ్ళనిచ్చెను. అక్కడే ఒక నీటి బుగ్గ ఏర్పడెను, బెయేర్షబా. ఆయన ఇప్పటికీ దేవుడైయున్నాడనుటకు ఋజువుగా అది నేటివరకింకా ఒక నిత్య జ్ఞాపకార్ధంగా ఉన్నది. నీవు ఆ బండతో మాట్లాడగలవు, ఆయన నీకు వాగ్దానముచేసిన ఆ దేశములో నీకేది అవసరమో, ఆ సమస్తమును ఆయన నిశ్చయముగా నీకిచ్చును.
35. హెబ్రీ పిల్లలు దేవునికి యధార్ధంగా ఉండాలని కోరుకున్నారు. దేవునికి యధార్ధ ముగా వారున్నందున, సమాఖ్య (ఫెడరల్) ప్రభుత్వం వారికి జరిమాన విధించెను.
మిమ్మల్ని మండుచున్న కొలిమిలోనికి పడవేయుదమని వారు చెప్పిరి. అనగా తక్షణమే మరణము. మరి వారిని మండుచున్న కొలిమిలోనికి త్రోసివేయబోవుచున్నందు వలన వారు రాత్రంతా దేవునిని అన్వేషిస్తూ ప్రార్ధించిరి. వారిని అలాగే మండుచున్న అగ్ని కొలిమిలో విసిరివేసిరి,వారిని మండుచున్న కొలిమిలో దాదాపుగా 4 లేదా 5 గంటలు అట్లే విడిచి పెట్టిరి. రాజు వేదనపడుచు, అచ్చటకు వెళ్ళి తలుపులు తెరవండని" చెప్పెను. కనుక వారు తలుపులు తెరచినప్పుడు, ఆ ముగ్గరు హెబ్రీ పిల్లలు మండుచున్న అగ్ని
కొలిమిలోనుండి వారిని రక్షించగలిగిన ఆ బండతో కూర్చొని మాట్లాడుటను వారు
కనుగొనిరి. వారా బండతో మాట్లాడుచున్నారు, కనుక ఆ బండ మంటలను అణచెను.
36. యెహోషువా, ఒక రోజు ఇబ్బందిపడెను. దేవుడు అతనిని సముద్ర మార్గము గుండా నడిపించెను... యోర్ధను నదిని దాటవలసి వచ్చెను. అతడు ఈ భూమినెలాగు స్వాధీనపరచకొనును? అతడు యెరుకోను ఎట్లు స్వాధీనపరచకొనబోవు చున్నాడు.ఒక మధ్యాహాన వేళ యెరికో గోడలను ఎలాగు కూల్చాలని యెహోషువా అటు, ఇటు నడుస్తూ ఆలోచిస్తూ లేదా ఏదోకటి చేయుటకై ప్రయత్నిస్తుండెను. కొద్దిసేపటి తరువాత అక్కడ ఒక మనిషి నిలబడి ఉండుటను చూచెను. యెహోషువా తన ఖడ్గమును ఒరలోనుండి తీసి ఆయనను ఎదుర్కొనుటకై వెళ్ళెను. ఆ మనిషికూడా తన ఖడ్గమును తీసి యెహోషువాను ఎదుర్కొనుటకు వచ్చెను. యెహోషువా, “నీవు మా పక్షముగా ఉన్నవాడవా లేక మా శత్రువుల పక్షముగా ఉన్నవాడవా?" అని అడిగెను.
ఆయన “యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానని" చెప్పెను. యెహోషువా బండతో మాట్లాడగా ఆ యెరికో గోడలు కూలిపోయెను. మనము బండతో మాట్లాడు నంత కాలము, అచ్చట ఒక మార్గమును ఆయన ఏర్పరచును.
37. గ్రుడ్డి బర్తమయి, అచ్చట కూర్చొని... వందల, వందల సంవత్సరముల క్రితం యెహోషువా దేవుని శక్తితో యెరికో గోడలను కూల్చిన దినమునుగూర్చి కలలు కంటు,వృద్ద గ్రుడ్డివాడు గోడ ప్రక్కన కూర్చొని ఉండెను. అతడు, “ఓహ్, నేను ఆ దినము లలో జీవించియుండిన, నేనుకూడా ఆయనను చూచి ఉండేవానినని" అనుకొనెను. ఏ ఆశ లేకుండా, వైద్యముద్వారా బాగయ్యే ఏ పరిస్థితి లేకుండా,ఏ నమ్మకములేని స్థితిలో, అప్పుడే కొన్ని నిమిషములలోనే అతను ఆ బండతో మాట్లాడెను, ఆ బండ అతనికి కావలసిన చూపునిచ్చెను. విసిగిపోయున్న దేశమందు నజరేయుడైన యేసు బండగా ఉండెను... అతడు ఆయనతో మాట్లాడెను, ఆయన అతనికి తిరిగి చూపునిచ్చెను.
38. బావి యొద్దనున్న స్త్రీ, ఒక దినమున నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి వచ్చెను. ఆమె జీవితమే ఆమెను ఖండించుచున్నది. నీళ్ళు అవసరమైనందువలన ఆమె నీళ్ళను చేదు కొనుటకు అచ్చటకు వచ్చెను. అక్కడ ఎవ్వరో కూర్చొని ఇలా అన్నాడు, "నాకు దాహము నకిమ్మని నిన్ను అడుగుచున్నవారెవరో నీవు ఎరిగియుంటే? నీవిక్కడకు వచ్చి చేదుకొన కుండునట్లు నేను నీకు నీళ్ళనిచ్చెదను."ఆమె, "ప్రభూవా, నిరంతరము నేను కలిగియుం డునట్లు ఆ నీళ్ళను నాకిమ్ము” అని ఆమె అడిగెను. ఆమె ఈ బండతో మాట్లాడెను. ఆమె ఆ నీళ్ళను త్రాగినప్పుడు, ఆమె పట్టణంలోనికి పరుగెత్తుకొని వెళ్ళి, "మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన మెస్సీయా కాడాని?" చెప్పెను. ఖచ్చితంగా. ఆమె దాహంతో ఉండెను, గనుక ఆమె ఈ బండతో మాట్లాడెను.
మార్త, లాజరుయొక్క సహోదరి, ఒక దినమున అనారోగ్యము వారి ఇంటిలోకి ప్రవేశించినప్పుడు,మరణము వారి ఇంటిని తాకెను. కావున ఆమె సోదరుడు చనిపోయి.. సమాధి చేయబడి, సమాధిలో దుర్వాసన కొట్టుచున్నాడు. కాని ఆమె ఏదో వినినందుని
ఆమె పట్టణములోని వెళ్ళినది. వినుట వలన విశ్వాసము కలుగును. కావున ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు, ఆమె బండతో మాట్లాడెను, కాబట్టి ఆ బండ చనిపోయిన తన సోదరునికి మరల జీవమును తెచ్చి ఇచ్చెను. ఎందుకనగా, ఆమె బండతో మాట్లాడినది, కనుక ఈ బండ చనిపోయిన ఆ వ్యక్తియొక్క జీవమును తిరిగి తెచ్చింది.
39. సముద్రమున తుఫాను ఆక్రోశముతో భయంకరముగా చెలరేగిన ఒక రాత్రి వేళలో శిష్యులు చిక్కుకొనిరి, వాళ్ళందరి ఆశలను వదులుకొనిరి. ఇక తాము ప్రాణంతో ఉండుట అసాధ్యమని వారు తలంచిరి. కాని వారి పడవలో బండ ఉన్నదని వారు గుర్తు చేసుకున్నారు. హల్లేలూయా! వారు బండతో మాట్లాడిరి,కాబట్టి ఈ బండ వారికి నిత్య జీవ జలానిచ్చెను. ఆయన గాలులను మరియు అలలను గద్దింపగా అవి ఆయనకు లోబడెను. వారు కేవలం ఈ బండతో మాట్లావలసివచ్చెను.
నీకు సంతోషం కావాలనుకుంటే, ఈ బండతో మాట్లాడు. నీకు రక్షణ కావాలను కుంటే, ఆ బండతో మాట్లాడుము. నీకు దైవీక స్వస్థత అవసరమనుకుంటే, ఈ బండతో మాట్లాడుము. నీకు పరిశుద్ధాత్మ అవసరమనుకుంటే, ఈ బండతో మాట్లాడుము. మరియు ఆయన తన జలములను-రక్షణ జలములను తీసుకొని వచ్చును. నీవు కేవలం ఈ బండతో మాట్లాడితే చాలును. నీకేదైన కావాలనుకుంటే, ఈ బండతో
మాట్లాడుము. ఈ బండ, ఆయనెల్లప్పుడూ ఉన్న రీతిగానే, నేడుకూడా అట్లే ఉన్నాడు. ఆయన ఇంకనూ నిత్య జీవమును కలిగివున్నాడు. ఆయన ఇప్పటికీ నిత్య సమాధాన మును కలిగివున్నాడు. ఆయన ఇంకనూ చెప్ప శక్యముకాని ఆనందమును మరియు మహిమయొక్క సంపూర్ణతను కలిగివున్నాడు. ఆయన ఇప్పటికీ దైవీక స్వస్థతను కలిగి వున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. కేవలం ఈ బండతో మాట్లాడుటయే జనులు చేయవలసినదైయున్నది. ఆమేన్. దీనిని నమ్ముదురా? అట్టైతే ఇప్పుడు మనము తలలు వంచి ఈ బండతో మాట్లాడుటకు అందరం ప్రార్ధించెదం.
40. పరలోకపు తండ్రి, మేము ఈ బండయొక్క నామమున వచ్చాము, అలసిన ఈ భూమిలో, తుఫాను సమయములో ఈ బండే ఆశ్రయముగా ఉండెను. ఓ, ప్రభువైన దేవా,ఇక్కడున్న ప్రతీ అనారోగ్యపు వ్యక్తి ఈ రోజు స్వస్థత పొందుటకై ఈ బండ తన శక్తితోను మరియు దయతోను మమ్మల్ని ఆవరించి ఉండాలని మేము ప్రార్ధిస్తున్నాము.
వారు ఈ బండతో మాట్లాడవచ్చును. ఇక్కడ కూర్చొనివున్న పురుషులు, స్త్రీ, క్యాన్సర్ తోను,కొందరు అందత్వముతోను, మరికొందరు వికలాంగముతోను కూర్చొని ఉన్నారు. వైద్యులు వారికి ఇక ఆశలు లేవని చెప్పినా కాని వీరు ఈ బండతో మాట్లాడుదురుగాక!
వారు నీళ్ళులేని స్థలమగు అరణ్యమందు ఉన్నప్పుడు మోషేకు నమ్మకమే లేకుం డెను.కాని వారు బండతో మాట్లాడగా, బండనుండి విస్తారమైన జలములు ఉప్పొం గుచూ వచ్చెను. కనుక వారందరు ఆ నీళ్ళను త్రాగి, వారు జీవించిరి. ప్రభువైనా దేవా,
ఎప్పటికీ ఇంకిపోని ఆ ఊటనుండి ఈ దినమున మేము త్రాగెదముగాక!.ఓ, ఈజిప్ట్ యొక్క వెల్లుల్లిపాయలను మరియు కంపుకొట్టే కుండలోనున్న ఆహారమును తినుచున్న ఆ స్థలమునుండి మేము వెలుపలికి పిలువబడి, ఎక్కడైతే గొప్ప అద్భుతమైన బ్యూలా భూమిగలదో,ఎక్కడైతే బండ ఉన్నదో, ఆ బ్యూలా రక్షణ భూమిలోనికి మేము పిలువబడి, దేవదూతల ఆహారమును తినుచూ, ఆ నిత్య ఊటనుండి వచ్చే నీటిని త్రాగుచున్నాము.
పరలోకపు తండ్రి, ఈ ఆశీర్వాదమును జనులకనుగ్రహించుము. ఆ బండ ఇంకా సజీవంగానే ఉన్నదని, ఆ బండ మరణము నుండి పునరుత్థానమయ్యెనని, ఈ దినమున ఆ బండ ఇప్పటికీ ఈ భూమిలోనే ఉన్నదని వారు చూచెదరుగాక! పెను తుఫాను సమయంలో ఆయనే ఆశ్రయపురం, కావున జనులు దానిలోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండెదరుగాక! ప్రభువా, దీనిని అనుగ్రహించుము. మేము ప్రార్ధిస్తుండగా మరియు మిమ్మును పిలచుచుండగా మీ సేవకుల ప్రార్ధనలను వినుము. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్.
41. ఓ, బండతో మాట్లాడుము! నీవు అనారోగ్యముతో ఉంటే, ఆ బండతో మాట్లాడుము. డాక్టర్, "ఇక నీకొరకు నేనేమి చేయలేనని" చెప్పిన, అయినప్పటికీ బండతో మాట్లాడుము. సంఘము, “నీవు నా సంఘములో గట్టిగా అరచిన, నేను నిన్ను వెలివేయుదునని"చెప్పితే అట్లైతే ఆ బండతో మాట్లాడుము. సంఘశాఖ నిన్ను బహిష్కరించాలని కోరినయెడల, బండతో మాట్లాడుము. ఆమేన్! మీ గదిలోనికి మృత్యువు దొంగవలె ప్రవేశించినప్పుడు, బండతో మాట్లాడుము. ఆయన వారికి యోర్ధాను నదిని రెండు పాయలుగా చీల్చి, వారికొక మార్గమును ఏర్పాటు చేసెను, అట్లే నీవుకూడా ఆరిన నేల పై నడిచెదవు. మీరు చేయవలసినదంతా ఈ బండతో మాట్లాడుటయే. ఇక మీరు ఈ బండను కొట్టవలసిన పనిలేదు, మాట్లాడితే చాలును. కేవలం ఆయన నామమును ఉచ్చరించుము. “నా నామమున తండ్రిని మీరేమి అడిగినను, దానిని నేను చేయుదును. "ఆమేన్! ఈ బండతో మాట్లాడుము,అది తన నీళ్ళను నీకిచ్చును. దీనితో మాట్లాడుము. ఈ బండతో మాట్లాడిన వారివైపు చూడుము. పరిశుద్ధాత్మలేని నీవు, దీనితో మాట్లాడినవారిని చూడుము. మెథడిస్ట్, యెహోవా సాక్షులు,బాప్టిస్టు, అందరూ ఈ బండతో మాట్లాడండి, ఈ బండ ఏ వ్యక్తిపట్ల పక్షపాతము చూపడు, అదే సమయమైనాగాని దానిని ఈ బండ లక్ష్యము చేయదు.
ఆయన నిన్న, నేడు,నిరంతరము ఒకేరీతిగా ఉన్నాడు. మనమిక్కడనుండి వాగ్దాన భూమికి చేరువరకు మనకు కావలసినవన్నింటినీ సమకూర్చెదనని వాగ్దానంచేసిన ఆ బండ మనతో నిరంతరము ఉండును. ఆమేన్! మీరు దానిని నమ్ముచున్నారా?
42. (నీవు ప్రార్థన కార్డులు ఇచ్చితివా?) వారికి ప్రార్ధన కార్డులు ఇచ్చెదమని చెప్పారని బిల్లీ చెప్పెను. సరే మంచిది. చూద్దాం. అనారోగ్యంతోనున్నజనులు, ఈ మధ్యాహ్నం మీరు రండి, వచ్చి దీనిని మీరు చేయండి, మీరున్న స్థితిలోనే ఆ బండతో మాట్లాడండి.
నేను ఆ బండను కాదు; నేను ఆయనయొద్దకు మార్గము చూపువాడను మాత్రమే, అర్థమైనదా? మన సేవకులు కేవలం ఆయనయొద్దకు మార్గము చూపువారు మాత్రమే. నీళ్ళును తీసుకువచ్చు గొట్టంను (పైపు) మహిమపరచవద్దు; గొట్టంద్వారా మీరు పొందు కునే నీళ్ళను మహిమపరచండి. ఎట్లనగా, ఆ నీళ్ళు ఊటనుండి వచ్చుచున్నవి. కనుక నీటిని మహిమపరచుము. కాబట్టి నిన్ను స్వస్థతపరచువాడిని నేను కాదని గుర్తుంచు కొనుము,గొట్టం నీకు నీళ్ళును ఇవ్వదు. నీళ్ళు ఆ ఊటనుండి వచ్చుచున్నవి,ఆ గొట్టం నీళ్ళను ఇవ్వదు, అది నీటిని మాత్రమే సరాఫరా చేయును. కొట్టబడిన ఈ బండనుండి మీరు నీటిని త్రాగండి, అది ఇదివరకే కొట్టబడెను. మోషే, దేవునియొక్క తీర్పు దండముతో ఆ బండను కొట్టెను, యేసుక్రీస్తను ఆ బండను దేవునియొక్క తీర్పులతో కొట్టెను. మోషే ఈ బండను కొట్టినప్పుడు బండలో పగులు ఏర్పడెను. అప్పటినుండి ఎల్లప్పుడూ ఈ బండలో పగులును కలిగి ఉండెను. మరియు క్రీస్తు కొట్టబడినప్పుడు, ఈ బండలో చీలిక ఏర్పడెను. వారు ఆకలిగొనినప్పుడు బండలోనుండి వారికి తేనె దొరికెను. వారు దాహంగొనినప్పుడు వారికి నీళ్ళు లభించెను, ఎందుకంటే, ఈ బండ కొట్టబడెను. నేడు అదే బండ, జీవితమునకు కావలసిన పుష్కలమైన నీటిని, తేనెను, వివరించలేనంత ఆనందమును, సంపూర్ణ మహిమను, దైవిక స్వస్థతను కలిగియుండి మరియు మానవునియొక్క పాపమునుండి విడిపించు దేవునియొక్క శక్తులను గలదైయున్నది. “ఈ బండతో మాట్లాడుము", "అది" "ఆయన" "నీళ్ళనిచ్చును". ఆమేన్. 43. సరే మంచిది. ప్రార్ధన కార్డులు ఉన్నవారు... అదేమిటి? సి-1 నుండి 50వరకు, ఈ వైపున ఇక్కడ వరుసలో ఉండండి, ఓ, బండతో మాట్లాడుచున్నట్లుగా నాకనిపించు చున్నది, మీరు అట్లు అనుభూతి చెందుటలేదా? అక్కడ ఒక బండ ఉన్నందుకై నేనెంతో సంతోషించుచున్నాను. హహ్? సి-అక్కడ ఒక స్త్రీ... అదేకదా? సి, అవును,సి- సరే.
సి-1 నుండి 50వరకు. ఓ, ఈ బండతో మాట్లాడుము. ఓ, “నా కంటే ఉన్నతమున నున్న బండను నేను వెతుకుచున్నానని" ఒక రాత్రి ఒక వ్యక్తి ఆ పాటను పాడుటను నేను విన్నాను. ఈ బండనే మనము చూడాలని ఎదురుచూచు చున్నాము.
ఇప్పుడు గుర్తుంచుకోండి, “నేను ఆ బండతో మాట్లాడిన చాలునని" మీరు తలంచిన ...బండ తననుగూర్చి తానే మాట్లాడును. నాకన్నా నేను గొప్పవాడినని నేను తలంచితిని. ఈ బండ తననుగూర్చి తానే మాట్లాడును. దానిని ఎంతమంది నమ్ముదురు? ఈ బండ మూగది కాదు, ఈ బండ జీవముగల బండ. మీరు సజీవమైన రాళ్ళుగా, ఈ బండలో ఆశ్రయము చేయుటకై మీరు ఏకముగా అమర్చబడి యున్నారు. “ఈ బండతో మాట్లాడుము మరియు ఈ బండ తన నీళ్ళునిచ్చును." మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనకు విజయాన్ని అనుగ్రహించు సజీవుడైన దేవునికి కృతజ్ఞతలు. నేను ఆయనను ప్రేమించుచున్నాను.
44. ఇప్పుడు, వారు సిద్ధపడుచుండగా, ప్రార్ధన కార్డులు లేనివారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు,మరి మీరు ఈ బండతో మాట్లాడాలనుకుంటున్నారా?ఓహ్, దేవా, మంచిది. ఈ బండ ప్రార్ధన వరుసలో మాత్రమే కాకుండా-ఈ బండ అన్నిచోట్లను ఉండును. మనమిప్పుడు "నేను ఆయనను ప్రేమించుచున్నాను" పాటను పాడుదాం. ఒక మంచి పాట. సోదరి, నీకు సాధ్యమైతే మాతో శ్రుతిని కలుపుము. మేము వారికొరకు ఎదురు చూస్తుండగా, జనులు ఒకరికొకరు ఆటంకపరచకుండా, వరుస క్రమములో ఉంటే, వరుసలో నుండి వెలుపలికి రారు. ఇప్పుడు మన హృదయ పూర్వకముగా పాడుదాం.
నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.
మరియు ఆ కల్వరి వృక్షము పైన, నా రక్షణను కొనెను.
నేను (మన చేతులను పైకెత్తి), ఆయనను ప్రేమించుచున్నాను.
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.
మరియు ఆ కల్వరి వృక్షము పైన, నా రక్షణను కొనెను.
ఓహ్, నేను ఎంతగానో ఆయనను ప్రేమించుచున్నాను, మీరు ప్రేమించెదరా?
(సహోదరుడు బ్రాన్హాంగారు ఆలాపన చేయుచున్నారు- సంపా.)
ఆ కల్వరి వృక్షము పైన,
45. అదెంత అద్భుతమైనది, మహిమకరమైనది. ఇప్పుడు ఒక చిన్న ప్రార్ధనను
చేసుకొందాం. మీరు... అలాగే కొనసాగుము, సహోదరి.
ఓ దేవా,మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధాత్మయొక్క అభిషేకం మాపైన కుమ్మరిం చబడినప్పుడు, మేమింకా ఈ భూలోకంలోనే ఉన్నామనే విషయమును మరిచిపోవున ట్లుగా చేయుచున్నదని మాకనిపించుచున్నది. అది వాస్తవముకంటే మిన్నయైనదనే భావనను మాలో లోతుగా కలిగించునట్లు చేయుచు, అది మమ్మును ఏడ్చునట్లు,కేకలు వేయునట్లుగాచేసి, అద్భుతమైనదియై, అలాగే మేము చేయు వింత కార్యములను శరీర సంబంధమైన మనస్సు గ్రహించుటకు కష్టతరము. కాని మేము ఈ బండతో మాట్లాడి యున్నాము. ఈ బండ నీళ్ళునిచ్చుననే విషయము చాలా వింతైనది, కాని అక్కడ ఎక్కడో నీళ్లు ఉన్నాయి. దేవునియొక్క ఆజ్ఞలను అనుసరించునప్పుడు అదెల్లప్పుడు ఫలితములు నిచ్చును. కనుక మా తండ్రి, దీనికొరకు మేము కృతజ్ఞతలు అర్పిస్తున్నాము.
మేము ఈ ఉజ్జీవమును, ఆరాధనను ముగిస్తుండగా ఏదైతే వీరందరు పొందుకొను టకు వచ్చితిరో, దానిని పొందుకొనని ఏ వ్యక్తికూడా ఇచ్చట ఉండకూడదని మేము ప్రార్ధిస్తున్నాము, అది రక్షణకొరకైతే, వారు మిమ్మును వారి వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించె దరు గాక! వారు ఇంకా తిరిగి జన్మించనట్లయితే, పరిశుద్ధాత్మతో నింపబడినవారై, వారు మీ ఆత్మతో నింపబడునట్లుగా మేము ప్రార్ధిస్తున్నాము. అది స్వస్థతైనయెడల, ఈ
ఆరాధన ముగించు సమయమున మా మధ్య ఏ ఒక్క వ్యక్తి కూడా బలహీనుడుగా ఉండకుండునుగాక. ప్రభువా, వారిని దీవించండి. వారు వచ్చిరి, వారు చుట్టూ కూర్చొని ఉన్నారు, వారు వేచివున్నారు. ప్రభువా, ఇంతకన్నా వేరేమి చెయ్యాలో నాకు తెలియదు, బోధిస్తున్నాను, వారికి సత్యమునే చెప్పుచు, వాటిని లేఖనములనుండి చదువుచూ,వారికి ఉపమానములను ఇచ్చుచున్నాను. వీటన్నింటి కంటే, నీవు సరిగ్గా మా మధ్యకు వచ్చి, నీవిచ్చట ఉన్నావని ఋజువుపరచుచున్నావు. ఈ మధ్యహ్న వేళ వారు విశ్వాసముతో నీతో మాట్లాడుచు, “ప్రభువా, నన్ను స్వస్థపరచుము, నన్ను రక్షించుము, నీ ఆత్మతో నన్ను నింపుము" అని చెప్పిరి. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. ఇప్పుడు ప్రభువైన యేసు నామములో వారందరినీ నీ హస్తములకు సమర్పించుచున్నాము...
46. ఇప్పుడు మన సమస్యలు పరిష్కరించబడి మరియు నెమ్మదినొందిన రీతిగా... ఈ గొప్ప దైవీక కదలికలను మనము ఎదుర్కొనుచుండగా, ఇచ్చట నేను బోధించిన అంశములన్నియు మరియు ప్రతీదియు సరైనవా లేక తప్పైనవాని కనుగొనబడెను. ఇప్పుడు ఈ బండ అరణ్యంలో మాత్రమే నివసించునదైతే, ఈ దినమున అది అదే బండ కానియెడల, మాట్లాడదు- ఈ బండ పలుకదు, కానీ అది అదే మారని బండ యైతే, ఆయన అదే వాక్యముద్వారానే మాట్లాడును, అది నిజమేకదా? ఖచ్చితంగా. ఆయన అదే పలుకును. “మా పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని వారు చెప్పగా,పరలోకపు దేవునినుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, దీనిని భుజించు ఏ మనుష్యుడును ఎన్నటికి మరణించడని" ఆయన చెప్పెను. కాని వారు మోషేనుగూర్చి గొప్పగా చెప్పగా, “నేను, మోషే కంటే ముందున్నవాడను" అని ఆయన వారికి చెప్పెను. 47. కాబట్టి ఆయన అదే గొప్ప బండగా ఉన్నాడు. ఆయన తన కుమారుడైన క్రీస్తనే మనుషినిలో శరీధారియై నివసించుచు ఈ భూమిలో ఉన్నప్పుడు వారి దినములో ఆయనేమి చేసేనో మనము చూచితిమి. ఆయన చేయునదేదో దానిని దర్శనముద్వారా చూచేంత వరకు ఆయనెన్నడూ ఏదీ చేయలేదు. ఏ ఒక్క కార్యము... ఆయన తనకుతానే చెప్పెను... ఆయన మొదట జరిగే కార్యమును చూచేంతవరకు తనంతట తానే ఏమియు చేయలేదని యేసు చెప్పిన కార్యము ఎంతమందికి తెలుసు? మీరు దానిని చదువకొరిన, పరి. యోహను 5:24... లేక 5:19 క్షమించండి. “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తానే ఏదియు చేయనేరడు, ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. ” అది సరైనదైన లేక తప్పైనదైన కావచ్చును. అదే సరైనదైతే, తానేమి చేయవలెనో తనకు దర్శనము ద్వారా దేవుడు మొదట చూపితేగాని, ఆయనెన్నడూ ఏ అద్భుతముగాని లేక ఒక్క కార్యముగాని చేయలేదు. దానినే ఆయన చెప్పెను, లేదా ఆయన ఏదో తప్పు చెప్పెను. అట్లు ఆయన తప్పును చెప్పలేడు, అలాగు చెప్పిన ఆయన దేవుని కుమారునిగా ఉండలేడు.
48. మీరిప్పుడు వినుటకు కొంచెము కష్టముగా ఉండునని నాకు తెలుసు. ఇంజనీర్లు, వారెవరైనను వీలైనంతగా మైక్రోఫోన్ల శబ్దమును పెంచమని చెప్పుచున్నాను. ఎట్లనగా, దర్శనము క్రిందనున్నప్పుడు, మీరేమి చెప్పుచున్నారో మీకు తెలియదు, మీరు ఎక్కడ ఉన్నారోకూడా మీకు తెలియదు. కావున ఇచ్చటది అట్లే ఉండును. ఇంతకు ముందెన్నడూ కూటములో లేనివారు ఎవరైనా ఉన్నారా? మీ చేతులను చూడనివ్వండి, మీరందరని నేను ఊహిస్తున్నాను...ఒకరు లేదా ఇద్దరు. ఇప్పుడు యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము అలాగే ఉంటే... పరి. యోహాను గ్రంథములో, ఆయన ఒక స్త్రీని కలుసుకొనెను. ఆయన ఒక మానవునిగా,బావి యొద్దనున్న స్త్రీని కలుసుకొనెను, దానినే నేను కొద్ది నిమిషముల క్రితం బోధించాను. ఆయన ఆమెను దాహమునకిమ్మని అడిగెను. అట్లు ఆయన ఆమెతో సంభాషణ కొనసాగించెను. కొంతసేపు తర్వాత ఆయన ఆమెయొక్క సమస్య ఏమిటో కనుగొనెను. అదేమిటని ఎంత మందికి తెలుసు? నిశ్చయంగా, ఆమె వ్యభిచారములో జీవించుచుండెను. ఆయన "నీవు వెళ్లి పెనిమిటిని పిలుచుకొని రమ్మని.” చెప్పెను. “నాకు పెనిమిటి లేడని." ఆమె అన్నది.
ఆయన "నీవు చెప్పిన మాటసరియే, ఎందుకనగా నీకు అయిదుగురు పెనిమిట్లున్నారు. మరియు ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు" అని చెప్పెను.
49. పరిసయ్యులు ఆయన అలా చేయుటను విన్నారు, దానిని ఆయన చేయుటను చూచిరి,కావున వారు అదే బండను చూచి, "ఈ మనిషి బయెల్డెబూబు, దెయ్యం పట్టిన వాడని" చెప్పిరి. అది నిజమేకదా? ఒకరకమైన సోదె చెప్పువాడు లేక ఏదోనని చెప్పిరి. యేసు "అందుకు నేను నిన్ను క్షమించెదను, కాని ఒక రోజున...” అని చెప్పెను. వాక్యంలో ఈవిధంగా, “అవే కార్యములను పరిశుద్ధాత్మ వచ్చి చేయునప్పుడు, వాటికి మీరు వ్యతిరేకముగా ఒక్క మాట పలికినను, ఈ యుగమందైనను, రాబోవు యుగమం దైనను,అది ఎన్నటికి క్షమింపబడదు. " అది నిజమని ఎందరికి తెలుసు? ఈ యుగమందై నను, రాబోవు యుగమందైనను... ఎందుకనగా, వారు దేవుని ఆత్మను అపవిత్రాత్మని, దెయ్యపు ఆత్మని, సోదె చెప్పే ఆత్మని చెప్పుచున్నారు. ఖచ్చితంగా, సోదె చెప్పుటనునది దెయ్యమునకు చెందినదని ఎవరికైన తెలుసు. మాంత్రిక విద్య, సోదె చెప్పుట మరియు మానసిక వశీకరణ జ్ఞానము మరియు ఆ రకమైనవన్నియు దెయ్యము నుండే వచ్చును.
50. చివరి దినములో భిన్నమైన వ్యక్తులద్వారా అనుకూల ఆలోచనలతో మరియు మనస్సులను వశీకరిస్తూ, ఇతర కార్యములద్వారా వారు నిందించుటకు ప్రయత్నించే కార్యములన్నీ ఇచ్చట ఉండునని యేసు చెప్పిన విషయమును గుర్తుంచుకోండి, అదేమిటి? మూఢ నమ్మకముల జ్ఞానము మరియు అలాంటివన్నీ దెయ్యమునకు చెంది నవి. “యన్నే మరియు యంబ్రేలు మోషేను ఎదిరించినట్లు, వీరును చెడిన మనస్సు కలిగి సత్యమును ఎదిరింతురు” అది ఇక్కడ జరుగునని పరిశుద్ధ గ్రంధము చెప్పెను.
పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మము మరియు దేవునియొక్క శక్తియే సత్యమైనది. “సాధ్యమైతే ఏర్పచబడినవారిని సహితం మోసపరచుటకై ఆ కార్యములు చాలా దగ్గర పోలికలతో ఉండునని" యేసు చెప్పెను. కానీ ఏర్పచబడిన వారిని మోసగించడం అసాధ్యం,ఎందు కంటే వారు జగత్తుకు పునాది వేయబడకమునుపే ఎన్నుకొనబడిరి. వారి పేర్లు గొట్టె పిల్లయొక్క జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. "ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని పిలిచెను. ఆయన ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని ఇదివరకే మహిమపరిచెను”. అదే సత్యం. 51. ఇప్పుడు, ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. నేను ఎరిగినంత వరకు నేను ఆమెను ఎప్పుడు చూడలేదు. మేము అపరిచితులమని నేననుకుంటున్నాను. సరే మంచిది. ఇదిగో నేను ఎప్పుడు చూడని స్రీ. బహుశా, ఈమెకు నా వయస్సు ఉండవచ్చును. బహుశా, నేను ఆమెకంటే కొంచెం పెద్దవాడిని కావచ్చు. కాని మేము ఒకరినొకరము ఎప్పుడు
చూచుకొన లేదు. కనుక మేము ఒకరినొకరు చూడటం ఇదే మొదటి సారి.
యేసుక్రీస్తు ఎప్పటిలాగే మారనివాడైతే, అన్య జనులకు తనను కనబరచుకొనెదనని ఆయన వాగ్దానము...ఆ రీతిగానే నేను దీనిని చెప్పెదను... దీనిని నేను మీకు వివరించా లని కోరిన నేను వివరించెదను. కాని మీరు దానిని అర్ధము చేసుకున్నారని ఖచ్చితంగా నమ్ముచున్నాను. ఆయన యూదులకు, సమరయులకు తనను కనబరుచుకొనినట్లు గానే అన్య జనుల యుగం యొక్క అంతమున తనను అన్య జనులకుకూడా కనబరుచు కొనెదనని వాగ్దానము చేసెను. అదే సూచనతో అనగా, తాను పునరుత్థానుడైన మెస్సియ్య అనే సూచనతో అన్య జనులకు తనను ప్రత్యక్షపరచకొనును. అది ఎందరికి తెలియును? 52. సొదొమ దినములలో, ప్రభువైన యేసు అక్కడ ఉన్నప్పుడు, దేవుడు శరీరమందు అబ్రాహామునకు ప్రత్యక్షమై అతని భార్య ఎవరో, ఆమె పేరేమిటో చెప్పెను. ఆయన వెనుక గుడారములో ఆమె ఉండెను. అతడు, ఆమెద్వారా బిడ్డను కనబోవుచున్నాడని ఆయన అతనితో చెప్పగా, ఆమె నవ్వెను, ఆయన, "ఆమె ఎందుకు నవ్విందని?" అడిగెను.
ఆయన రాకడకు ముందు అదే కార్యము జరుగునని యేసు చెప్పెను. మనము రహదారి చివరన ఉన్నాము. ఇప్పుడు, ఆయన ఇప్పటికీ అదే మెస్సియగా ఉన్నట్టైతే, తననుతాను నిరూపించుకొనుటకు ఆయన అదే మెస్సియ సూచనలు చేయును. నేను ఆయనను కాదు. నేను మీ సహోరుడిని మాత్రమే. నేను మీవంటి వాడినే. ఆయన ఆత్మను పొందినవారిలో నేనుకూడా ఒకడిని. ఇప్పుడు, ఆ స్త్రీ, నమ్మకపోతే, ఆయనేమి చెప్పినప్పటికి, అందువలన ఆమెకు ఏ ప్రయోజనము ఉండదు. ఏదైన జరుగుటకు ముందుగా ఆమె దానిని నమ్మవలెను. ఇప్పుడు, జనులలోనున్న మీరుకూడా, నీకొరకు లేదా మరొకరికొరకు అదే విధముగా మీరు నమ్మవలెను. అదేమైనప్పటికీ, ఖచ్చితంగా, అది అలాగే జరగకపోతే, మీరు కేవలం వారికొరకు నమ్మి కనిపెట్టవలెను.
53. అమ్మా, ఒక నిమిషము ఇటు వైపు రండి. ఇప్పుడు, మేము ఇక్కడ ఉన్నాము. మీరు దీనిని గ్రహించాలని నేను కోరుచున్నాను. జీవితంలో మనము కలుసుకోవటం ఇదే మొదటిసారి, నేను నిన్ను ఎరుగను, కాని దేవుడు నిన్ను ఎరుగును. ఆ బండ నిన్న, నేడు,నిరంతరం ఒకేరీతిగా ఉన్నాడని ఇప్పుడే నేను చెప్పాను. నీవు దానిని నమ్ముచు న్నావా?సహోదరుడు, "అవును అయ్యా"అని చెప్పెను. నీవొక క్రైస్తవుడవు. నీ ఆత్మయొక్క భావము నాకు చెప్పుచున్నదానినిబట్టి నీవొక క్రైస్తవుడవు. అట్లు కానియెడల...
ఇప్పుడు నీవు దేనికొరకు ఇక్కడున్నావో నాకు తెలియదు. బహుశా, నీవు మరొకరి కొరకు కావచ్చు,నీ ఆర్ధిక సమస్య కావచ్చు, నీ గృహ సమస్య కావచ్చు, నీవు అనారోగ్య ముతో ఉండవచ్చు, నీకేదైన గుండెనొప్పి లేద మరేదైనా ఉండవచ్చును. నాకు తెలియదు. అవేమైనను, ఏమి జరుగబోవుచున్నదో కనుగొనుటకై పాత నిబంధనలో ప్రవక్తలద్వారా వాటిని తెలుసుకొనుటకై వారు చేసినరీతిగానే, నేను దేవుని సేవకుడినని నాయొద్దకు వచ్చి మాట్లాడుటకు ప్రయత్నిస్తున్నావు. అది నిజమేకదా? సరే, అలాగైతే, ఆయన ఆనాడు ఉన్నట్లుగానే ఇప్పుడుకూడా మారనివానిగా ఉన్నట్లయితే, ఆయన ఆత్మ మనలోనుండిన, ఆనాడు ఆయన చేసిన రీతిగానే, ఆయన చేసినట్లుగానే మనము చేయుదుము. అది నిజమేకదా? మీలో ఎంత మంది మీ హృదయమంతటితో దీనిని ఇప్పుడు నమ్ముదురు?
సరే మంచిది. నేను అడిగేది ఒక్కటే, సందేహించక ఇటువైపు చూడుము. నీవు నన్ను ఆయన సేవకునిగా నమ్ముచున్నావా? అది మంచిది. మనము ఇదివరకు ఒకరికొ కరం సంధించలేదు.నీలో ఎదోక తప్పిదము గలదు. దానిగూర్చి దేవుడే నాకు చెప్ప వలెను. లేదా నాకు తెలిపే ఒక రకమైన శక్తిని నేను కలిగి ఉండాలి, ఎందుకంటే, నాకు తెలుపుటకు మరొక మార్గం లేదు. కాబట్టి దానిద్వారా అది నీకు చెప్పిన, అది నీకు సహాయము చేయును. అది నిజమేనా? అది నీకు సహాయము చేయును. మంచిది.
స్వస్థతకొరకు నీవిక్కడకు వచ్చావు. అది నీ కడుపులోనున్న సమస్య. నీకు కడుపులో సమస్య గలదు. క్లిష్టమైనది, ఇంకా అనేక సమస్యలు నీకున్నవి. ఖచ్చితంగా అదే నిజము. ఇప్పుడది సత్యమైతే, నీ చేయి పైకెత్తుము. ఇప్పుడు నీవు నమ్ముదువా? అర్థమైనదా? పరిశుద్ధాత్మ ఎంత ఖచ్చితమైనదో అర్థమైనదా? ఇప్పుడది సత్యం, నీవు... ఆగుము. అక్కడ ఇంకేదో ఉన్నది. ఆమె మనస్సులో ఇంకా ఏదో ఉన్నది. ఆమె ఏదో ఆలోచిస్తుంది. 54. వారి తలంపులను యేసు వివేచించెనా? అది నిజమే. అందుచేతనే ఆవిధంగానే నేనుకూడా ఆమె తలంపుని వివేచించాను. ఆమె తలంపులో ఏదోక దానిని కలిగి వున్నది. అది ఖచ్చితంగా నిజము. అదేమనగా, తన భర్తకొరకు, అనారోగ్యంతోగల తన భర్తనిగూర్చి తలంచెను. అతనికికూడా స్వస్థత అవసరము. అతనికి స్వస్థత కావలెను కదా?నీవు ఈ స్థలమునకు చెందినదానివి కాదు, నీవు కెనడాలో ఉన్నావు. నీ ఇంటికి తిరిగి వెళ్ళి,ఆ చేతి రుమాలుని తీసుకొని దానిని మీపై పెట్టుకొంటే, మీరిద్దరు బాగు పడెదరు. ప్రభువుయొక్క నామములో నీ పూర్ణ హృదయముతో నమ్ముచూ వెళ్ళుము.
55. (టేపుపై ఖాళీ ఉన్నాది- సంపా.,) నీవు నమ్మెదవా? ఇది చాలా సులభం; ఇప్పుడే ఆమె స్వస్థత పొందుకొనెను. నేను దానిని చేయలేనని గుర్తించుకొనుము. దానిని చేయు టకు నావద్ద ఏమీ లేదు. దేవుడే దానిని చేసెను. అర్థమైనదా? దేవునియొక్క మార్గమందు నీవు ఎచ్చటో భయపడితివి;సరిగ్గా దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇక్కడే నీ చుట్టూ ఉన్నాడు. ఆయన సజీవుడు, కనుక కేవలం ఆయనతో మాట్లాడుము. మనము ఒకరికొ కరము అపరిచితులమని నేననుకుంటున్నాను. ఇప్పుడు, ఇలాగు, నీవు ఈ వరుసలో వచ్చిన... ఇచ్చటున్న దానిగుండా నేను త్వరపడవలెనని నీవెరుగుదువు. కేవలం విశ్వాస మును కలిగివుండుము;సందేహించవద్దు, నీ పూర్ణ హృదయముతో నమ్ముము. బహుశా, నీవు నాకంటే కొంచెము పెద్దవానిగా ఉందువు. కాని మనం ఒకరికొకరం ఎరుగని వారము. మన ఇద్దరిని దేవుడే ఎరుగును. నీ సమస్య ఏమిటో ఆయన నాకు చెప్పిన లేదా ఏదోవిధముగా దాన్ని చెప్పిన లేదా ఆ మార్గమున చెప్పిన... (టేపుపై ఖాళీగలదు) నీకేమి జరుగుతుందో ఆయన చెప్పిన, అది నిజమో కాదో నీవెరుగుదువు. అప్పుడు ఏమి జరుగునో నీవెరుగుదువు. అది సరియైనదేనా? జనులారా, ఇది న్యాయమైనదేనా? 56. ఇప్పుడు, ఇద్దరు లేదా ముగ్గురిని తీసుకుం... "ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల నోట ప్రతీ మాటా స్థిరపరచబడవలెనని” పరిశుద్ధ గ్రంధము చెప్పెను. ఆపై మేము అనారోగ్యముతో ఉన్నవారికొరకు ప్రార్ధించడం ప్రారంభించెదము. పరిశుద్ధాత్మ మనతో ఉండుటను మీరు చూడగలుగచున్నారా?
ఇప్పుడు నీవెవరో నాకు తెలియదు. నా జీవితంలో నిన్ను నేనెన్నడూ చూడలేదు. కాని నీవెవరో దేవునికి తెలియును. అయితే, ఆయన నీ సమస్య ఏమిటో నాకు చెప్పితే, అది నిజమో, కాదో నీకు తెలియును, నీవు మూత్ర పిండముల వ్యాధితో బాధపడు చున్నావు. అది నిజం. మూత్ర పిండములు. అది నిజమే. మరొక సమస్య ఏమనగా, ఒక గడ్డలాంటిది పెరుగుచున్నది, దానినిగూర్చి నీవు ప్రార్థిస్తున్నావు. అది నిజము. అది ఎక్కడ పెరుగుచున్నదో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? ఇది నీకు సహాయపడును కదా? అది నీ కుడి ప్రక్కన ఉన్నది. అది నిజం. అది నిజమేకదా? ఊహ్. నీవు ఇక్కడ నివసించుటలేదు; నీవు పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా వంటి పర్వత దేశానికి చెందినదానివి. నీ పేరు శ్రీమతి కోల్ట్. ఇంటికి తిరిగి వెళ్లి స్వస్థత పొందుకొనుము. ఇప్పుడిచ్చట ఎలాగున్నది? అదేనా...?. సరే మంచిది, నీవు నమ్మితే, కేవలం విశ్వాస ముంచుము. అట్లే నమ్ముచు, దేవునియందు విశ్వాసము కలిగి ఉండుము.
57. సరే మంచిదే? మనము ఒకరికొకరము అపరిచితులమని నేను తలంచుచున్నాను. ఇక్కడొక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు,సరే, చూద్దాం?... (టేపుపై ఖాళీ స్థలం గలదు)... అతడు నమ్మెను; అతడు, "రబ్బీ, నీవు దేవుని కుమారుడవైన, ఇశ్రాయేలు రాజువు"అని అన్నాడు.
ఇప్పుడు, అదే దేవుని కుమారుడు మరణించలేదు; ఆయన ఈ మధ్యాహ్నవేళ ఇక్కడే సజీవునిగా ఉన్నాడు. కనుక దేవుడు మనకు సహాయము చేయునుగాక! ఆయన ఆ వ్యక్తికి ఏమీ చెప్పకపోవచ్చునేమో నాకు తెలియదు. అతనిని నేనెన్నడూ చూడలేదు; ఆయన చిత్తమేమిటో నాకు తెలియదు. కాని ఆయన చేయునని నేను నమ్ముచున్నాను. ఇదేమిటి, ఇద్దరా లేదా ముగ్గురా? ముగ్గురా? మరియు ఈ మనిషి మూడవ వ్యక్తి. సరే, ఇద్దరు స్త్రీలు మరియు ఈ మనిషి మూడవవాడని నిర్ధారణ అయితే. సరే.
58. అయ్యా, దేవునికి నీ గురించి తెలుసు; నాకు తెలియదు. కాని నాకు తెలియనిది, నీవెరిగిన విషయాన్ని ఆయన నాకు చెప్పగలిగితే, అది నీ విశ్వాసమునకు సహాయ పడునా? అక్కడున్న ప్రతీ ఒక్కరికి,మీ ప్రతీ ఒక్కరికి, ఇప్పుడిది నమ్ముటకు సహాయపడు చున్నదా?నీకున్న సమస్య నీ గొంతులో ఉన్నది; అది అన్నవాహిక. నీవు వైద్యులయొద్దకు వెళ్ళగా, నీవు దాని కొరకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని వారు చెప్పిరి. అదేకదా? అదే నీ సమస్య: అతడు సంఘమునకు వచ్చే ముందు అదే జరిగినది. నీవు నమ్మెదవా? అవునయ్య: ఇదే సమయమున నీ ఆత్మను నేను స్పర్శించినప్పుడు జరిగిన మరొక విషయమేమనగా, దేవునియందు నిన్ను పూర్తిగా సమర్పించుకొను విషయములోను, ఒక క్రైస్తవునిగా,ఆ అనుభవంతో నీవింకా సంతృప్తి చెందనేలేదు. యేసు నీ రక్షకుడిగా నీకు అవసరమైయున్నది. అది నిజం. నీవు ఇప్పుడే ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరించి, నీ జీవితమును ఆయనకు నీవు సమర్పించెదవా?
నీవు సరిగ్గా తినలేవు, మింగలేవని నేను చూచుచున్నాను. అది నిజమే. నీవు క్రమంగా క్షీణించి పోవుచు, బలహీనుడవైపోవు చున్నావు, అది నిజము. ఇది కొంత కాలంగా నీ గొంతులో నిన్ను ఇబ్బందిపెట్టుచు వచ్చచున్నది. నీవు ఇక్కడనుండి వచ్చిన వాడివి కాదు. నీవు ఓహియోలోని, సిన్సిన్నాటికి చెందినవానివి. నీవెవరో దేవుడు ఎరుగు నని నీవు నమ్ముచున్నావా? పరిశుద్ధాత్మద్వారా నీవెవరవని నేను చెప్పితే, అది మీకు సహాయపడుతుందా? జాన్ హఫ్, ఇంటికి తిరిగి వెళ్ళుము, స్వస్థతను పొందుకొనుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముము?
59. సరిగ్గా ఇదిగో అచ్చట కూర్చొనివున్న ఆ చిన్న వ్యక్తి పొగ త్రాగడం మానివేయా లని కోరుచున్నాడు. అయ్యా, దేవుడు నీ కోరికను తీర్చునని నీవు నమ్ముచున్నావా?సరే మంచిది. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును, కనుక ఇకపై నీవు ధూమపానం చేయవు. నీ దగ్గర ప్రార్ధన అట్ట లేదు, అవునా? లేదు. నీకు ప్రార్ధన కార్డు లేదు. అది నీకు అవసరం లేదు. నీకు దేవునియందు విశ్వాసము గలదా? నీవు నమ్ముచున్నావా?
అదిగో వెనుక ఆ యువతి కూర్చొని పెన్సిల్వేనియాలోనున్న తన స్నేహితునికొరకు ప్రార్ధిస్తుంది. అది నిజము. నీయొద్ద ప్రార్ధన అట్ట లేదు, నీకు ఉన్నదా? కానీ పెన్సిల్వేనియా లోనున్న నీ స్నేహితునికొరకు ప్రార్ధిస్తున్నావు. వాళ్ళు కొండల చుట్టూ వచ్చుటను నేను
చూచాను. నీ హృదయంతటితో నమ్ముము, నీవు బాగవుదువు. అది నీ ప్రియమైనవారిలో ఒకరు, నీ హృదయమంతటితో నమ్ముము అతడు బాగవును. నీ హృదయమంతటితో నమ్మెదవా?"నీవు నమ్మగలిగితే, సమస్తము సాధ్యమే." హల్లెలూయా! నీవు నమ్మెదవా?
ఆ చిన్న స్త్రీ అక్కడ వెనుక కూర్చొని ప్రార్థిస్తున్నది. ఆమె మొదటి సమస్య ఏమనగా, ఆమెకు రక్త నాళములు ఉబ్బి ఉన్నవి. ఆమె తన భర్తకొరకు ప్రార్ధిస్తున్నది, అతనికి ధూమపానం మరియు మధ్యపానం రెండు అలావాట్లున్నవి. నీ దగ్గర ప్రార్ధన అట్ట లేదు. అమ్మా,నీ దగ్గర ఉన్నదా?కాని నీవు దేవుని సహాయముకొరకు ప్రార్ధిస్తున్నావు. అది నిజమేనా? నీ స్వస్థతను పొందుకొనుము, ఇతర వాటికొరకు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము. సందేహించక, దేవునియందు విశ్వాసముంచుము, ఆయనను విశ్వాసించమని నేను నీకు సవాలు చేయుచున్నాను. ఆమేన్.
60. నేను ఏ ఒక్క మాట నీకొరకు చెప్పకుండా, కేవలం నీమీద చేతులు ఉంచుటద్వారా నీవు బాగవుదువని నమ్మెదవా? యేసుక్రీస్తు నామమున, వెళ్ళి, స్వస్థతను పొందుకొనుము. నీకున్న సమస్యను నేను చెప్పిన, నీవు స్వస్థతను పొందుకొనెదవా? నీ గుండె సమస్య బాగైనది. వెళ్ళుము, బాగుగా ఉండుము. నీ హృదయంతటితో నమ్ముము. నేనేమియు నీకు చెప్పకపోయినా, నీ హృదయమంతటితో నమ్మెదవా? ఇచ్చటికి రమ్ము, యేసు నామమున వెళ్ళి, స్వస్థతను పొందుకొనుము, విశ్వాసముంచుము. ఇప్పుడు మీరందరూ నమ్మెదరా? ప్రతీ ఒక్కరు ప్రార్థిస్తున్నారా? "నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు వెంబడించును." ప్రార్ధన అట్టలు ఉన్నవారు, ప్రార్ధన అట్టలు లేనివారు, ఈ జనులలో మీరెచ్చటున్నా దేవునియందు విశ్వాసముంచుము. ఈ బండతో మాట్లాడుము!
ప్రభువైన యేసు నామమున, మా సహోదరుడు స్వస్థత పొందుకొనునుగాక! ఆమేన్. ప్రభువైన యేసు నామములో, మా సహోదరి స్వస్థత పొందుకొనునుగాక! ఇక్కడ ఇచ్చటున్న ఎదోకటి ఈ కార్యములను నాకు చెప్పుచున్నది.
నీకున్న స్త్రీల సమస్య నిన్ను విడిచిపెట్టెనని నీవు విశ్వసించెదవా? “ప్రభువా, నీకు కృతజ్ఞతలు" అని చెప్పుచు, ప్రభువును స్తుతించుచు నీ మార్గమున వెళ్ళుము.
నీ నరముల బలహీనత నిన్ను విడిచిపోయెనని నీవు నమ్మెదవా? ప్రభువును స్తుతించుచు నీ మార్గమున వెళ్ళుము. ఇప్పుడు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? విశ్వాసమును కలిగియుండుము.
యేసుక్రీస్తు నామములో, మా సహోదరుడు స్వస్థత పొందుకొనునుగాక! ఇప్పుడు విశ్వాసమును కలిగియుండుము. కేవలం మీ హృదయమంతటితో నమ్ముము.
దేవుడు ఈ చిన్న స్త్రీని దీవించి మరియు స్వస్థతనిచ్చునుగాక! యేసు నామమున.
చిన్న బాలుడా, రమ్ము, ఇప్పుడు నీవు నమ్ముచున్నవా? నా కుమారుడా, ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరచి మరియు నిన్ను బాగుచేయును. ఆమేన్.
ప్రియమైన సహోదరి, రమ్ము, ఇప్పుడే రమ్ము, నీవు స్వస్థతనొందుకొనబోవుచున్నా వని ఇప్పుడు నీ హృదయమంతటితో నమ్మెదవా? యేసుక్రీస్తు నామమున ఈమె స్వస్థత పొందుకొనునుగాక!
పొందునుగాక!. ఆమేన్. సందేహించకుండా వచ్చి విశ్వాసించుము, యేసుక్రీస్తు నామమున ఈమె స్వస్థత
ప్రియమైన నా సహోదరుడా రమ్ము. ప్రభువైన యేసు నామములో ఈ దయ్యము నీనుండి వదిలిపోవునుగాక, మరి నీవు వెళ్ళి, బాగవ్వుము.
దేవుడు ఈ చిన్నదానినికూడా దీవించునని, యేసు నామములో నేను ప్రార్ధిస్తు న్నాను. ఈమె నీ కుమార్తెనా?... యేసుక్రీస్తు నామములో ఈమె స్వస్థత పొందునుగాక!. ఆమేన్. ఇప్పుడు నమ్మకముతో వెళ్ళుము.
యేసుక్రీస్తు నామములో, ఈమె స్వస్థత పొందునుగాక!. ఆమేన్.
నమ్ముచూ రమ్ము. యేసుక్రీస్తు నామములో ఈమె స్వస్థత పొందునుగాక!.
62. అందరు ప్రార్ధిస్తున్నారా? అందరు ప్రార్థన స్థలములో ఉన్నారా?సరే. యేసుక్రీస్తు నామమున నీవు స్వస్థతను పొందుకొనెదవుగాక! ప్రభువా, దీనిని అనుగ్రహించుము.
సోదరి రమ్ము. యేసుక్రీస్తు నామమున ఈమె స్వస్థత పొందుకొనునుగాక!. ఆమేన్.
యేసుక్రీస్తు నామమున ఆ స్త్రీ పొందుకొనునుగాక!
రమ్ము. యేసుక్రీస్తు నామమున ఈమె స్వస్థత పొందుకొనునుగాక! ఆవిధముగానే ఇది జరుగును,సహోదరి. అదిఇదే. ఆ ఆశీర్వాదంను పొందుటకు దానికి ఒక విధమైన
విశ్వాసము గలదు. యేసుక్రీస్తు నామమున నీవు స్వస్థతను పొందుకొనెదవుగాక!. ఆమేన్. సహోదరి రమ్ము. యేసుక్రీస్తు నామములో నీవు స్వస్థతను పొందుకొనెదవుగాక!.
యేసుక్రీస్తు నామములో నీవు స్వస్థత పొందెదవుగాక...?...
రమ్ము సహోదరి,ఇప్పుడు, నీ హృదయమంతటితో నమ్ముము, దానిని నీవు పొందు కొనెదవు. యేసుక్రీస్తు నామములో... సందేహించవద్దు, ద్వారమునొద్దనుండిన బర్తమయి వలె... యేసుక్రీస్తు నామములో. ఆమేన్. యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందుము.
ప్రియమైన సహోదరి,ఇప్పుడు సందేహించక, రమ్ము, విశ్వాసముంచుము, అది జరుగును. యేసుక్రీస్తు నామమున ఈమె స్వస్థత పొందునుగాక!.
సహోదరుడా రమ్ము. యేసుక్రీస్తు నామములో, స్వస్థత పొందుకొనుము.
యేసుక్రీస్తు నామములో, స్వస్థత పొందుకొనుము. యేసుక్రీస్తు నామములో, స్వస్థత పొందుకొనుము. యేసుక్రీస్తు నామములో, స్వస్థత పొందుకొనుము. యేసుక్రీస్తు నామములో, స్వస్థత పొందుకొనుము.
63. ఒక నిమిషము వేచియుండుము. అది సరే. ఇది ఏదో అని నేను తలంచితిని.
మంచిది, నీవు నమ్ముచున్నావా? మీరందరు హృదయపూర్వకముగా నమ్మెదరా?ప్రతీ ఒక్కరు నమ్ముచున్నారా? గమనించండి. చూడండి. అభిషేకము ఇక్కడ ఉండగా, జనులు దీనిని దాటిపోవుచున్నప్పుడు, కేవలం వారిపై చేతులుంచిన చాలును,ఎట్లనగా, అది ఖచ్చితంగా ఎల్లప్పుడు అలాగునే జరుగును. అదే ఆత్మ ఇక్కడున్నది, కనుక అది చాలు, అంతే. కావున మీరు జనులకు వారి కార్యములనుగూర్చి చెప్పవలసినవసరం లేదు.
ఈ రోజు వేదికపైన మనము కలిగియున్న మొదటి నల్ల రంగు జాతి వ్యక్తి ఇతడేనని నేను నమ్ముచున్నాను,నాకు తెలిసినంతవరకు ఇతడేనని నేను నమ్ముచున్నాను.సరే.
64. ఒక రోజు యెరూషలేము వీధులగుండా, సిలువ భారమును మోయుచు రక్తము కారుచున్న తన పాద ముద్రలను ముద్రిస్తూ ప్రాచీన గరుకైన సిలువను ఈడ్చుకొంటూ వెళ్ళుచుండెను. ఆయన సిలువ భారము చేత క్రింద పడిపోయినప్పుడు, కురేనీయుడైన సీమోను ఆ సిలువ భారమును మోసెను. మీ జనుల మూలము ఎచ్చటో, అతనొక ఇతియోపీయుడు. అది ఆయనకు ఇప్పటకీ జ్ఞాపకమున్నది. అదే యేసు నేటికి జీవించు చున్నాడని, నీ సమస్య ఏమిటో ఆయన నాకు చెప్పగలడని నీవు నమ్మెదవా? నీవు దానిని నమ్మెదవా? గమనించగా, నీకొరకు నీవు ఇచ్చటకు రాలేదు, గత రాత్రే నీవు స్వస్థతను పొందుకున్నావు. నీకున్న సమస్యను నేను నీకు చెప్పాలనుకుంటున్నావా? మీకు కడుపు సమస్య మరియు మధుమేహం ఉండినవి. వాటినుండి నీవు స్వస్థతను పొందుకున్నావు. మరొక కార్యమేమనగా, నీ కుమార్తెకొరకు నీవు ఇక్కడ ఉన్నావు, నీ కుమార్తెకు కడుపులో సమస్య ఉన్నది. ఆమె పేరు శ్రీమతి వెల్స్. ప్రభువైన యేసు నామమున నీవు నీ ఇంటికి వెళ్ళుచు, మార్గమున స్వస్థతపొందెదువుగాక!. మంచిది. 65. నమ్ముచూ రండి, సందేహించవద్దు, విశ్వాసమును కలిగియుండుము. ప్రభువా, యేసు నామములో ఈ స్త్రీని స్వస్థపరచుము, బాగుచేయుము. సరే, మంచిది.
దేవా, యేసు నామములో నా సహోదరుడుని స్వస్థపరచి, బాగుచేయుము. ఇచ్చట పరిశుద్ధాత్మ అభిషేకము ఇంకనూ అట్లే ఉన్నది.
ప్రభువా, యేసుక్రీస్తు నామమున మా సహోదరిని స్వస్థపరచి, బాగుచేయుము. పరలోకపు తండ్రి,మా సహోదరిని స్వస్థపరచి, బాగుచేయమని నేను ప్రార్థిస్తున్నాను.
సహోదరుడా, రండి. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? ఆ వృద్ధాప్యము యొక్క వీపు సమస్య ఇప్పుడే బాగవును, నీ హృదయమంతటితో దేవుని నమ్ముచు అలాగే వెళ్ళుచూ ఉండుము, మరియు నీవు బాగుపడెదవు. మంచిది.
రమ్ము. ఇప్పుడు, నీకు దానివలన నొప్పి ఉన్నట్లుగా అనిపించుటలేదు,కాని నీకు కీళ్ళనొప్పులు ఉన్నాయి. అయినా దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? మంచిదయ్యా. నీవు విశ్వసిస్తే, నీవు పొందుకోగలవు. సరే. "ధన్యవాధములని” చెప్పుచు సంతోషిస్తూ, నీ మార్గమున వెళ్ళుము.
ఈ మనిషి కేన్సర్యొక్క మరణ ఛాయ క్రింద ఉన్నాడు. అయ్యా, దేవుడు కేన్సర్ని స్వస్థపరచగలడని నీవు నమ్ముచున్నావా? కేన్సర్తో బాధపడుచున్న వారందరూ మీ కాళ్ళపై నిలబడండి. ఈ భవనంలో కేన్సర్తో బాధపడుచున్న ప్రతీఒక్కరూ మీ కాళ్ళపై నిలబడండి. మీరు లేచుటకు ధైర్యము చేయలేరా. మీరు ఇప్పటికే స్వస్థత పొందారు. 66. హల్లెలూయా! మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఇచ్చట కూర్చొనియున్న ఈ స్త్రీ, తన భర్తకొరకు ప్రార్ధించుచున్నది. అతనికి కళ్ళ సమస్య గలదు, అతను రక్షించ బడలేదు. దేవుడు అతనిని బాగుచేయునని, అతని కళ్ళను స్వస్థపరచి అతనిని బాగు చేయునని నీవు నమ్ముచున్నావా? సరే.దేవుడు నిన్ను దీవించునుగాక!. పరిశుద్ధాత్మ అతని పైకి వచ్చి, అతని పాపపు జీవితమునుండి అతనిని రక్షించునుగాక!.
సరిగ్గా అక్కడ నీ వెనుక, ఆసుపత్రిలో మరణావస్తలోనున్న స్నేహితుని కొరకు నీవు ప్రార్థిస్తున్నావు. ఆ యువతి... నీ హృదయ పూర్వకముగా నీవు నమ్ముచున్నావా? మంచిది. గమనించుము.మీ అందరి దగ్గర ప్రార్ధన కార్డులు లేవు. మీకు అవి అవసరము లేదు. మీరందరు నమ్మితే, దేవుడు మరణాన్ని తన హస్తంతో అడ్డుకొనును. ఇచ్చట పరిశుద్ధాత్మడు ఇక్కడ ఉన్నాడని మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. ఆమేన్. 67. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. అది ఏమిటో మీరు చూచారా? నేను నిన్ను స్వస్థపరచినయెడల, అది నేను చేసినా, నేను చేయకపోయినా, కాని దేవుడు నా ప్రార్ధనను వింటాడని నేను నమ్ముచున్నాను, నీవు నమ్మెదవా? అలాగైతే నేను ఆ దుష్ట దెయ్యమును యేసుక్రీస్తు నామమున పారద్రోలెదను. వెళ్ళుము, నీవు బాగయ్యెదవు.
ఇక్కడ, సహోదరి, నేను నిన్ను ఎరుగను. ఇప్పుడిచ్చటున్న అనేకులు వారి వైపుకు లాగుచున్నందువలన నేనెక్కడ నిలబడివున్నానో తెలియనంతగా అది నన్ను చాలా బలహీనపరుస్తున్నది. నీవు స్త్రీల సమస్యతో బాధపడుచున్నావు, స్త్రీ సమస్య. ఒక్క క్షణము ఇప్పుడే లేచి నిలబడుము. ఇచ్చట స్త్రీల సమస్యతో బాధపడుచున్న స్త్రీలందరు ఇప్పుడే మీరు మీ కాళ్ళమీద లేచి నిలబడండి, ఒక్క నిమిషము ప్రార్థనకొరకు లేచి నిలబడండి.
అయితే సరే. అమ్మా నీకు కూడా, అదే సమస్య కలదు, కాబట్టి, నీవు ఇప్పుడే లేచి ఇచ్చట నిలబడుము మరియు నీవు నీ హృదయమంతటితో నమ్ముము.
68. సరే. సహోదరి,ఇటు చూడుము, ఒక్క నిమిషము. నీకు కడుపు సమస్య కలదు. సరిగ్గా ఈ ప్రక్క నిలబడుము. కడుపు సమస్యతో ఉన్నవారందరు లేచి నిలబడండి. విశ్వాసముంచండి, సందేహించవద్దు. యవ్వనుడా, ఇటువైపు చూడుము, నీకు వీపు
సమస్య కలదు,ఇక్కడ నిలవబడుము. వీపు భాగము సమస్య ఉన్నవారందరు, మీ కాళ్ళ మీద నిలబడండి. దేవునియందు విశ్వాసముంచుము. నీ కడుపు... ఈ ప్రక్కగా నిలబడుము. దేవునియందు విశ్వాసముంచుము. నమ్ముము. ఇక్కడ కూడా నరముల బలహీనత... సరే. నరముల బలహీనతగలవారు మీరు లేచి నిలబడండి. నరముల బలహీనతతో బాధపడుచున్నవారందరు లేచి నిలబడండి. సరే, మంచిది
ఇప్పుడే అలాగే రండి. తరువాత వ్యక్తి ఎవరో చూద్దాం. ఉబ్బసముతో బాధపడు వారు. ఉబ్బసము ఉన్నవారందరు లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. మీరు దేవునియొక్క మహిమను చూడబోవుచున్నారు. రండి, కడుపు సమస్య మరియు నరముల బలహీనతగలవారు ఈ ప్రక్కగా నిలబడండి. మంచిది.
69. దీనినే మీరు తెలుసుకోవలెను. వీళ్ళందరిని నేనేమని చెప్పి పిలవగలను? కాని పరిశుద్ధాత్మకు మీ అందరిని గురించి అంతా తెలియును. ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారు?లేచి నిలబడండి. అదేమైనప్పటికి నేను పట్టించుకొనను. మీరేరకమైన అనారో గ్యమును కలిగియున్నను, ఇంకా యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. మీరు బండతో మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నారా? ఇప్పుడు,మీరు నమ్ముచూ వెళ్ళండి. మరియు మీరు నమ్ముచూ వెళ్ళుము. నీవు నమ్ముచూ వెళ్ళుము. ఇప్పుడిక్కడే ఒక్క నిమిషము నిలబడండి, మనమందరము దేవుని వైపుగా చేతుల్తెతెదము.
మా రక్షణ బండయైన యేసుక్రీస్తు నామమున రోగంతోను, బాధలతోనున్న ప్రతీ వ్యక్తిని విడిచిపెట్టమని నేను దయ్యానికి ఆజ్ఞాపించుచున్నాను. ప్రాయశ్చిత్తము క్రింద దూతయొక్క పరిచర్యద్వారా మీ ఎదుట ఈ సూచక క్రియలను మరియు అద్భుతము లను చేయుటకు, యేసు క్రీస్తుయొక్క రాకడనుగూర్చి మాట్లాడటానికి ఆ దూత నన్ను పంపించెను మరియు వీటిని యేసు క్రీస్తుయొక్క రక్తముద్వారా నేను చేయుచున్నాను.
70. ఓ పరలోకపు దేవా, సమస్త మంచి కార్యములకు సృష్టికర్త, దయ్యపు శక్తితో బంధింపబడినవారిని నేను గద్దించుచుండగా మీ జనులపై ఆశీర్వాదములను క్రుమ్మ రించుము. వేదిక పైనున్నవారిని, ఈ జనులలోనున్న వారిని, దయ్యము విడిచి పెట్టును గాక! అవిశ్వాసముయొక్క ప్రతీ ఛాయ ఇప్పుడే వీడిపోవును గాక! ఇప్పుడే వారి సమస్యను గురించి ఈ బండతో మాటాలాడుదురుగాక! ఈ బండ తన స్వస్థత శక్తిని మరియు వారి శరీరములలోనికి మరియు ఆత్మలలోనికి మహిమను క్రుమ్మరింపబడి వారు స్వస్థత నొందుదురుగాక! యేసుక్రీస్తు నామములో, మీ విషయమై నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఆమేన్