లోయలో చాలా గోతులను త్రవ్వించుట

లోయలో చాలా గోతులను త్రవ్వించుట

"అత్యున్నతముగా, మరి మన హృదయములలో ఇప్పుడు, అది వర్తమానకాలం (ప్రస్తుతకాలం)... అందును బట్టి ఎంతో సంతోషము. గతరాత్రి మేమొక అద్భుతమైన స్వస్థత కూడికను కలిగియుంటిమి. మన ప్రభువైన యేసు మనలో ఉండి ఊహించని ఎన్నో అద్భుతమైన సమృద్ధి కార్యములను మన కనుగ్రహించెను. ఇప్పుడు, రేపు మరొక స్వస్థత కూడిక ప్రభువుచిత్తమైతే రేపు రాత్రికి ఉండును. ఇప్పుడు రేపు ఉదమయున ఒక ప్రచారకార్యక్రమము వున్నదనుకుంటు న్నాను, అది ఏ సమయానికి బ్రదర్? తొమ్మిదిగంటలకు అది కెఈబియస్లో ప్రచారమగును. కొద్ది నిమిషములు పాటు నేను మాట్లాడెదను, దానిని చేయుదునని నేను మాట ఇచ్చాను గనుక దాన్ని చేయుచుంటిని. మరటు పిదప రేపు పదిగంటల ముప్పైనిమిషములకు లోకములోనే అతి చిన్ననావ అనే నాటకప్రదర్శన ఉంటుందని నేననుకొనుచున్నాను, దానిని బ్రదరమూర్ చెప్పియున్నాడు. మరిప్పుడు మీకు శక్యమైతే రేపు ఉదయం రండి, లోకములోనే అతి చిన్ననావ ఏమిటో చూచుటకు రండి. ప్రత్యేకించి అది చిన్న పిల్లలకోసం ఏర్పాటు చేసినది. ఎనిమిదేళ్ళ నుండి ఎనబై ఏళ్ళ పిల్లల కొరకు, దానిని నేను ఒక రాత్రి చెప్పితిని. మరి అక్కడ ప్రభువు మనల్ని కలుసుకుంటాడు అని మనము నిరీక్షించుచుంటిమి. పిదప. రేపు రాత్రికి, లేదా రేపు సాయంకాలము ఇక్కడ ఏడున్నరకి తిరిగి కూటముండును. ఆరున్నరకి ప్రార్ధనా కార్డులు పంచిపెట్టబడును. మరి ప్రభువు చిత్తమైతే రేపురాత్రి రోగులకొరకు ప్రార్ధించుట అనేది వుండును. మరిప్పుడు మీరంత గొప్ప ఆశతో ఎదురుచూస్తూ, అన్ని రకాలుగా సిద్ధపడి ప్రార్ధనపూర్వకముగా రండి.

2. మరి ఇప్పుడు, ఈ రాత్రి ఒక చెడ్డరాత్రి, శనివారము రాత్రి. మీకు తెలుసా ఇది దయ్యము యొక్క రాత్రి అని, దయ్యము ప్రధాన రహదారుల పైకివచ్చును మరియు త్రాగుబోతులు మరియు అన్నిరకముల మద్యమును సేవించిన గుంపులకి మరి అలాగే తైతక్కలాడేవారికి, మరలాగే బూగివూగి నాట్యమాడే వారికి మరియు రాక్అండ్లోల్ చిందులేసే వారికి మరలాగే దొర్లుకుంటు చిందులేసుకుంటు ఉండేవారికి ఈ శనివారం రాత్రి అనేది ఒక పండుగ. వందలాది మంది హతులైయ్యే రాత్రి ఇది.

మొన్న నేను చూచాను ఒక చోట వారు ఒక పెద్ద ఆనందోత్సవాలతో కూడిన ఒక పెద్ద శిబిరము కలిగియుండిరి.. అటువంటి ఒక ఆనందోత్సవాలతో కూడిన శిబిరములను వారు ఇక్కడ కలిగియుండిరి. వాటిని వారు కెనడాకు కూడా తీసికెళ్ళిరి. అమెరికా నుండి కెనడాకి వారు తీసికొచ్చిన ఈ భూగి-వూగి, రాక్అండ్లోల్ వ్యవహారములో పాల్గొనిన పిల్లలు ఎందరు పిచ్ఛాస్పత్రి పాలయ్యారో ఆ సంఖ్యను నేను మర్చిపోతిని. ఇటువంటి వాటిని (నాట్యములను)
అనేక దేశములవారు, ఐక్యరాజ్యసమితిలోని అనేక దేశములు నిరోదించారు(నిలిపివేసారు). అయినను మన ఆమెరికా వారు మాత్రం వాటిని వదలకుండా గట్టిగా పట్టుకొనిరి (చెలరేగి పోవుచుండిరి).

3 ఇక్కడ మొన్న ఒకయవ్వనస్థుడిని చూచుట జరిగినది. అతడు రాక్అండ్లోల్ లో ప్రఖ్యాత గాంచిన వాడు, అతడు చేయు విన్యాసములన్ని (యుక్తులన్ని) తాను పెంతెకోస్తు చర్చిలో నేర్చుకొన్నానని చెప్పియున్నాడు. దానిని ఆలోచించినప్పుడు అది చెఱిపివేయబడినదని. బాలుని యొక్క మనస్సు చెడిపోయినది అని, తిక్క ఎక్కువైనదని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు. ఎంచుకని, దేవుడు అతడిని ఖచ్చితముగా శిక్షించును. మరియు అటువంటి వాటిని చేసినందుకై ఆయన తప్పక అతడిని శిక్షించును. అది దైవద్రోహం (సంఘములో నేర్చుకున్నవి లోకములో తప్పుగా ఉపయోగించుట అనేది దైవద్రోహం-అను). అది పూర్తిగా(బొత్తిగా) పరిశుద్దాత్మను తృణీకరించుటే (దైవదూషణే) జీవముగల దేవుని పనిని జనులు అరకొరగ చేయటను చూచుట అనేది ఎంతో భయంకరము "నీవు ఏమి విత్తుదువో దానినే కోసెదవు" దానిని గుర్తుపెట్టుకో.

4. ఇప్పుడు, కెనడాలో అనుకుంటాను, అది ఎంతమందో నాకు గుర్తులేదు, ఎంతమంది పిల్లలు, (మొదటిగా ఇక్కడ వారు నిండుగా దుస్తులను ధరించిరి) అటువంటి ఆ పిల్లలు అక్కడ ఒక సభకి హాజరయ్యారు, ఆ యవ్వన పిల్లల మనస్సు చెడిపోయినది (మతిపోయినది) పిచ్ఛాస్పత్రిలో చేర్పించబడిరి, ఇప్పుడు వారికి నిరీక్షణ అనేది లేదు. దేవుడు లేడు, ఎవరు లేదు. వారక్కడ ఆ స్థితిలో పడివుండి కేకలు పెట్టుచూ మరియు ఆక్రందనలు చేయుచు. పైకి కిందికి నడుచుచు, గోడలకేసి తమ తలలుబాదుకొనుచు అటువంటి వెర్రిచేష్టాలలో ఉ ండిపోయిరి. అయితే అటువంటి వెట్టి నాట్యములను మనము చట్టపరమైనవిగా చేయుచుంటిమి.

5. త్రాగుట, పేకాట ఆడుట... అనేక చోట్ల సంఘాలలో లేదా పాఠశాలలో పరీక్షలకు ముందు పిల్లలకి వారి నరములు ఉద్రిక్తతనుండి నిమ్మళపర్చుట కొరకు ధూమపానమును (పొగత్రాగుట) మరియు అటువంటి వాటిని అనుమతించుచుండిరి. (అదెంతో భయంకరము కదా?) నిజానికైతే వారు ఒక ప్రార్ధన కూటమును కలిగియుండవల్సివుంది. నాకు తెలిసినంతవరకు నీ నరముల ఉద్రిక్తత నుండి నిన్ను నిమ్మళపర్చుటకు ఉత్తమమైన విధానం అదేనండి (ప్రార్ధనే). కానీ మీకు తెలుసా, ఆకలిగొన్న జనులు ఆ కోరిక(వాంఛ)ను దేనితోనో ఒక దానితో నింపుకోవాలి. ఒకవేళ నిత్యజీవపు ఊటలోని జలమును వారు త్రాగని యెడల ఆడించుతోక( పట్టేందకు గాలముకి కట్టే వస్తువు- అను) అనే వాటితో వుండిన, ప్రవహించకుండా నిలకడగా వుండిన తొట్టిలోని నీటిని అపవాది వారికిచ్చును. అది నిజం. కనుక వారు ఎక్కడి నుండో త్రాగుతారు. నీ కోరికను దేవునితోనైన లేక దయ్యముతోనైనా తీర్చుకోవాల్సివుంది. =చేపలను

ఒక వ్యక్తి అటువంటి చోట్లకి వెళ్తూ, అటువంటి నీచమైన కార్యాలలో పాలుపొందుచున్నాడంటే, అతడు ఒక ఆకలి హృదయగలవాడైనప్పటికి ఉచితముగా దొరికే నిత్యము ఊరే ఊటలోని జలమును త్రాగుటకు తిరస్కరించిన వాడే అయివుంటాడు.
-నేను మీతో చెప్పుచున్నాను, అటువంటి వారివి బట్టి అనగా అలా దిగజారిపోయే వారినిబట్టి మరలాగే నేటి అధునిక ఆసచిత్ర (భ్రష్టుపట్టిన) సంఘాలను బట్టి నేను ఎంతగానో జాలిపడుచున్నాను. ప్రజలు బోధించే సామాజిక(కలిసి మెలిసిపోయే సువార్తను నేను బండించేది అందుకేనండి.

అంతేందుకు. మా సొంతపట్టణమైన జపర్సన్వెలో ఒక పాస్టర్ పున్నాడు. అతడు ప్రతి =పాశ్చాత్యదేశాలతో స్త్రీ పురుషులు శనివారము రాత్రి చర్చిలో చదరపునాట్యం( ఒకటై గుంపుగా వేసే డాను) - అను) అను దానిని వేయించేవాడు. అవునండి. చదరపు నాట్యందు వారికి నేర్పించేవాడు. అది ఒక ప్రఖ్యాతగాంచిన శాఖకి చెందిన సంఘము. ఒక చదరపు ...

6. అప్పుడు నన్ను అడిగిన అదే పాస్టర్, టెలిఫోను స్థంబము వెంబడి వచ్చుచూ, నేనెలా అనేకమంది ప్రజలను మందిరములోనికి రాబట్టితినో అనే దానిని అప్పుడు అడిగియుండెను.

అతడు చెప్పాడు "అతడు సంతకం... ఒక కార్డు మీద వారిని సంతకము చేయించుదునని వెయ్యిమందిని, వారు కనీసం సంవత్సరములో ఒక్కసారైనా పండేస్కూల్కి హాజరైతే చాలునని అతడు చెబుతాడట. కనీసం ఒక్కసారైనసరే సంవత్సరంలో కనీసం ఆరు మాసములకైనా ఆవిధముగా అతడు జనులను రాబట్టును. అతడు అన్నాడు "ఎంతమంది జవాబిచ్చారో మీకు తెలుసా?" "ఇద్దరు" అన్నాడు.

నేనన్నాను "అందులో ఆశ్చర్యమేముంది. వారిని నేను నిందించను. కనీసం నిందించబోను కూడా" నిశ్చయంగా అది వాస్తవం. లోకసంబంధమైన విందులు వినోదాలు(తైతక్కులు) సంఘములో వుండటము, అది పాపమే అగును. అటువంటివి దేవుని మందిరమునకు చెందినవి కావు. అటువంటి వాటి ద్వారా నేను జనులను నా వైపుకి ఆకర్షించుకొనటం అంటూ ఒకవేళ జరిగితే, అప్పుడు నేను నిశ్చయంగా సువార్త పొలములోనుండి. సువార్త ప్రకటించుట అమ దానిలోనుండి పూర్తిగా వైదొలగి పోతాను.

పాపులైన వారిని నేను తప్పుపట్టుట లేదండీ. పాపులు బయటికి వెళ్ళి హీనాతి హీనమగు స్థితిలో, నీచమగు అదమ స్థితిలో జీవించుటను నీవు చూచినట్లైతే, అప్పుడు నేను వారిని నిందించను మంచిది. ఎందుకంటే ఆ విధంగా జీవించుటే వారికి తెలిసిందల్లా, కానీ చర్చీలకి వెళ్ళే మీరు కూడా క్రైస్తవులుగా మిమ్మును మీరు పిలుపించుకునే మీరు కూడా అటువంటి పనులే చేస్తున్నారంటే...

7. ఒక పంది వెళ్ళి మురికి సెంటకుప్పలో దొర్లుటను నేనెంత మాత్రం తప్పుపట్టను. ఎందుకంటే దాని స్వభావం అదే కాబట్టి. నిశ్చయంగా అది అంతే పెంటకుప్పలో పంది దొర్లుచూ అక్కడే కాలం గడుపుటను చూచుటనేది క్రొత్త(వింత) సంగతేం కాదండీ, నిశ్చయంగా కాదండీ. అది దాని యొక్క సహజ సిద్ధమైన జీవితం, అది చేసేదంతా అదేనండీ. దానికి సైగవుండేదేమిటో అంటే దానికి తెలీదు. కానీ అదే స్థానంలో ఒక గొజ్జె అయివుండి అలా చేస్తూ వుండుటను
నేను చూచినప్పుడు అది ఎంతో విదూరంగా వున్నట్టుగ నాకనిపిస్తుంది. అసలు మొట్టమొదటిగా చెప్పాలంటే అది అలాంటి వాటిని చెయ్యదు. సాపుల పరిస్థితి కూడా అంతేనండీ. అతడిని వెళ్ళనివ్వండీ. అతడికి తెలిసిందల్లా అదే.. త్రాగగల్గినంత సారాయిని, త్రాగనివ్వండీ, దిగ శారగల్గినంతగా అతడిని నీచస్థితిలోకి దిగజారనివ్వండీ, పనికిమాలిన స్థితిలోకి వెళ్ళనివ్వండీ, మరియు కపు చెత్తంతటిని అతడిని విననివ్వండీ, ఎందుకంటే వాడికి తెలిసిందంతా అదేమరి.

ఇంకొంచెం మెరుగైన వాటిని తెలు: న ప్రజలైన మీరు... మీరు దానితట్టు మళ్ళినట్లైతే, ప్రభువు యొక్క ఊటలోనిది మీరెన్నడూ త్రాలేరని నాకు అర్ధమగుచున్నది. అది కేవలం-కేవలం మిగతావాటన్నిటిని అది నరికివేయును. అర్ధరాత్రి చీకటి వలే అది మృతతుల్యమగును. దానియందు ఎట్టి ఆనందంవుండదు. మరి ఆ కార్యాలు... కనీసం నీవు అక్కడ నిలబడనే లేవు.

కొద్దికాలం క్రితం నేనొక రెస్టారెంటికి వెళ్ళాను. సాధారణంగా నేను రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత నేను చూచే మొట్టమొదటి సంగతేంటంటే చుట్టూకలియ చూస్తాను. ఎందుకంటే లోకపు సంగీతం వినిపించే యంత్రాలు( ) ఆ గోడలమీద ఎక్కడ వున్నాయో అని చూస్తాను. ఎందుకంటే అలాంటి సంగీతం వినిపించే యంత్రాల వల్ల నాకొక రకమైన నరములు ఒత్తిడి కలుగుతుంది గనుక నేను కుదరుగా కూర్చొని తినలేను. అలాంటి చెత్త సంగీతపాటలు విని బయటికి వచ్చినప్పుడు నా కడుపు అంతా చెడిపోయినట్లుగావుండును. అసలు విషయం ఏమిటంటే క్రైస్తవులనే వారే వాటిని వినిపింపజేస్తున్నారు. క్రైస్తవులుగా ఉండవల్సినవారే... 8. సహోదరుడా, ఫలములను బట్టి నీవు దానిని తెలిసికొనగలవు. మంచిది, ఈ రాత్రి నా అంశం అదికాదు. కానీ నేను చెప్పుచున్నాను. బలిపీఠము నుండి అటువంటి వాటిని ఇంకొంచం కరుకుగా గద్దించకపోవటమనేది ఏమాత్రం అసలు మంచిదే కాదండీ. అలా ఖండించడం చాలా అవసరం.

మంచిది, నేనొక సంఘానికి కాపరిగా వున్నప్పుడు, అది ఒక బాప్టిస్టు సంఘమైనప్పటికి, మీరనుకొన్నట్టుగా, ఏదో ఒక కరచాలనం చేస్తేనో లేక, పుస్తకములో పేరు వ్రాసుకొంటేనో సరిపోతుందని చెప్పేసంఘం మాది కాదండీ. సహోదరుడా, మేము బలిపీఠము యొద్ద పడి, విజయం పొందేవరకు ఒకరికొకరం పురికొల్పుకొనే వారం. అటువంటి ఒకదానిని మేము కలిగియుంటిమి. అవునయ్యా.

చెడ్డస్థితిలో చిక్కుకొనిపోయిన వారిని బలిపీఠము యొద్దకి తెచ్చెదము. మరి వారు అక్కడ పూర్తిగా పశ్చాత్తాపపడి పాపాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ వారు అలాకాకపోయినట్లైతే సంఘములో నుండి బహిష్కరించే వారం. అటువంటి వారిని ఎంత మాత్రం సహించము. అవిశ్వాసులతో విజ్జోడిని అస్సలు ఒప్పుకోము. వారి నడిస్తే ఇరుకమార్గంలోనైనా నడవాలి, లేదంటే విశాలా మార్గం లోనైనా నడవాలి. అంతే తప్ప...

మాకు అక్కడ ఒక నల్లబోర్డు పెట్టబడి వుంటుంది. బాదలు (కష్టాలు) ఉన్నవారు ఎవరైనా
ఉంటే వారు వారి పేరున వాటిని నల్లబోర్డు మీద రాసెద్దరు. ఆ విధముగా వాటిని ప్రార్ధన గదిలోనికి తీసికెల్లెదరు. జోన్స్లంటి వారు ఎగువున, స్కాట్లాంటి వారు దిగువున అక్కడ ఉండెదరు. "మంచిది, బ్రదర్ జోన్స్, బ్రదర్ స్కాట్ నాతోపాటు లోనికి రండీ" అది నిజం, వారు వాటిని అక్కడ చక్కదిద్దెదరు. అవి సరైనవిగా చేయబడవలసి ఉండెను. సంఘము ఆ విన్నపములు మీద దొర్లాడును (ప్రార్ధించును-అను).

9. మనకి అవసరమైనదంతా ఆ పాతకాలపు భక్తి 'అరణ్యమందు ఏకాంతంగా గడిపేభక్తి, పాపమును చంపగలిగే భక్తి. నీలిరంగు భక్తి, పరిశుద్దాత్మ శక్తియందు శుద్ధిచేయబడి తెలుపుచేయబడుట, (అవునయ్య) మరియు కడగబడిన, తెలుపుగా చేయబడిన పరిశుద్దులు, సున్నం కొట్టిన గోడలు వంటి వారు కాదండీ, కానీ నిజముగా తెలుపుగాచేయబడుట. సున్నంకొట్టి తెలుపుగా చేయబడుటికి, వాస్తవంగా తెల్లగా మారుటకి బోలెడంతా వ్యత్యాసం వుందండి. ఆమేన్. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు కూటమునందు ఇక్కడ కొన్ని లేఖనములను చదువుటకు మనం ఆయన వాక్యంను తెరిచి, ఆ వాక్యం మీద మాట్లాడుచుండగా ప్రభువు మనల్ని ఆశీర్వదించుగాక.

మరి ప్రతి ఒక్కరు ప్రార్ధనపూర్వకముగా హృదయపూర్వకంగా నమ్ముచూ వుండుడి. మరి ఈ రాత్రి నేను ఆశ్చర్యపడుచున్నాను...

గతరాత్రి చివరిగా ప్రార్ధన చేయించుకొనిన చిన్నబాలుని గూర్చి ఎవరో నాకు చెప్పుచుండిరి. చిన్నబాబు ఏడ్వటం ఆరంభించాడు. మరి ఆ చిన్నబాలుడు ఈ రాత్రి ఇచ్చట వున్నాడా? మంచిది. ఆ చిన్నబాలుడు ఒకవేళ ఇక్కడ వుండినట్లైతే ఒక్క నిమిషం అతడిని ఇచ్చటికి వేదికమీదికి తీసికొని రావల్సిందిగా కోరుచున్నాను. అతడు వున్నట్లైతే బహుశా అతడు వెళ్ళిపోయాడేమోనని నేను అనుకొనుచున్నాను...

నాకు తెలీదు. వారు నన్ను తీసికెళ్ళారు.... కొద్దిగా సృహలో వున్న పరిస్థితి అది. బయటకి వెళ్ళుచున్నప్పుడు నా కుమారుడు చెప్పుచున్నాడు, ఇలా అన్నాడు "నాన్న. అదెంతో అద్భుతమైన సంగతి" ఇంకా అన్నాడు "అక్కడ వరుసలోకి ఒక చిన్నపిల్ల వాడు వచ్చాడు" అతనికి మెల్లకన్నులు అని చెప్పాడు మరియు ఒక చీలిక(పగులుట) లేక అటువంటిది ఒకటుండెను.

మరి అతడు చెప్పాడు "నీవు బాలున్ని పట్టుకొన్నప్పుడు, నీవు నీచేతిని ఆ చోట వుంచుటను నేను చూశాను, వెంటనే అది కనపడకుండాపోయినది. మరి ఆ బాలుడు తన కన్నులు తెరిచినప్పుడు, నీవు అతడి మీద నీ చేతిని వుంచినప్పుడు, నేను గమనించాను, అతడి కన్నులు చక్కగా పరిపూర్ణంగా బాగు అయినవి, నీవు అతడిని ప్రేక్షకులకి చూపించాలని ప్రయత్నించావు.”

ఈ రాత్రి అతడు ఇక్కడి తిరిగివుంటే బావుండును. బహుశా వచ్చి వుండొచ్చును. అతడి స్వస్థతకొరకు మేము ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము.

10. ఇప్పుడు ఆయన చేయగలడని మనం నమ్మినట్లైతే ప్రభువు సమస్తరోగములను స్వస్థపర్చగలడు. ఆయన అనేక కార్యములను చేయుట నాకు తెలుపును, నేను వాటిని చూచితిని,
మనం అడిగిన ప్రతిదానిని మనం పొందెదమని మనం నమ్మవలెనని నేను కోరుచున్నాను. అది నిజం. మనమా విధంగా 'నమ్మవల్సివుంది, మరిప్పుడు. ప్రభువుదీవిస్తాడని మనం నమ్ముదాం.

ఇప్పుడు, ధన్యకరమగు ఈ గ్రంధం అన్ని గ్రంథాలకంటే మించిన గ్రంధం. ఈ గ్రంథాన్ని అనువదించ(వివరించ)గలవాడు ఒకే ఒక్కడు వున్నాడు. అది పరిశుద్దాత్మయే, దాని గ్రంధకర్త ఆయనే, కేవలం ఆయన మాత్రమే దానిని అనువాదించి చెప్పగలడు.. అది మనకి బాగా తెలుసునని మనం ఎంత అనుకొన్నా స్వయంగా పరిశుద్దాత్మయే వచ్చి దానిని మనకి బయలుపరిస్తేనే తప్ప మనకంటూ ఏమి తెలీదండి. ఎందుకంటే అదంతయు మర్మయుక్తముగా వుండెను. అది మర్మములు గా ముక్కలు ముక్కలుగా కోయబడివున్నది. కావాలనే(ఉ ద్దేశపూర్వకముగానే) ఆయన అట్లు చేసెనవి దేవుడు చెప్పియున్నాడు. తద్వారా దానిని ఆయన జ్ఞానులకి, చరుకుదువంగలవారికీ మరుగుచేసి, నేర్చుకోగల బాలురకి చంటిపిల్లలకి దానిని

ఆయన బయలుపర్చును. ఇప్పుడు, ఈ రాత్రి మనము ప్రభువునందు పసిబాలురుగా వుండగోరుదుము. నీవు వుండగల్గినంత సామాన్యముగా వుండుము.

మరి రేపు రాత్రి ప్రభువు చిత్తమైతే దానిమీద ఒక వర్తమానమును నేను కలిగియున్నానని నేను అనుకొనుచున్నాను, సామాన్యత మీద.

11. కావున ఇప్పుడు,, ఆయనతో మాట్లాడుటకు మరొక పర్యాయం మన తలలు వంచుదాం. ఈ రాత్రి మీలో ఎంతమందికి అవసరత వుంది? దయచేసి మీరు మీ చేతిని ఎత్తి ఇలా చెప్పగలరా, "బ్రదర్ బ్రెన్హామ్ నన్ను జ్ఞాపకముంచుకోండి ఈ విషయంలో. ఇప్పుడు ప్రభువు యెదుట నీవు నన్ను గుర్తుచేసికోవాలని నేను కోరుచున్నాను."

మా పరలోరపు తండ్రీ, నీ ప్రియ కుమారుడగు యేసు నామమున మేము మాకు తెలిసినంతదీన ముగా వుండి నీ యొద్దకి వచ్చుచున్నాము. మా దోషములును అపరాదములను మన్నింపమని అడుగుచున్నాము. నేటి వరకు మేము చేసినదంతటిని మరియు మేము పలికినదంతటిని, అలాగే మా జీవితకాలమంతటిలో జరిగించిన పలికినదంతటిని ఈ రాత్రి మాకు విరోధముగా వున్నదంతటిని బట్టి దీనులుగా వంగి నీ యెదుట ఒప్పుకొనుచున్నాము.

తమ చేతులెత్తిన ఈ ప్రేక్షకుల కొరకు ప్రార్థించుచున్నాము. తండ్రీ, వారిలో చాలా మంది పాపక్షమాపణ నొందుట కొరకు తీవ్రమగు నిరాశలో వుండివుండోచ్చును. కొందరు పాపము చేత చుట్టుకొనియుండొచ్చును, కొన్ని అలవాటు చేత, కొందరు రోగములతో వుండొచ్చును. ఇంకొందరు వ్యాధిలచేత పీడింపబడియుండొచ్చును. కష్టాల్లో వారి ప్రియలు కొందరు వుండి వుండొచ్చును, అది ఏది ఏమైనా, తండ్రీ, నీవు వారి పాపమంతటిని క్షమించి, మరిచిపోయి, వారి యొక్క సమస్త రోగరుగ్మతల నుండి వారిని స్వస్థపర్చమని ప్రార్ధించుచున్నాము.

ఈ రాత్రి నీ వాక్యమును చదివి, వాక్యమును భోదించుచుండగా నీ ఆశీర్వచనములు మా
మీద క్రుమ్మరించుము. నీ ప్రియ కుమారుడు క్రీస్తు పేరట ప్రార్ధించుచున్నాము. ఆమేన్.

12. రాజుల రెండవగ్రంధము, మరి రాజులు రెండవగ్రంధల 3న 3వ అధ్యాయం మరియు

16వచనం... అతడు ఈ మాట ప్రకటన చేసెను, యెహోవా పిలవిచ్చునదేమనగా ఈ లోయలో చాలా 4

గోతులను త్రవ్వించండి,

ఇప్పుడు, చదవబడిన ఆయన వాక్యమునకు ఆయన ఆశీర్వచనములను ప్రభువు జతచేయును గాక. ఇది రాజుల రెండవగ్రంధం మూడవ అధ్యాయములోనిది, కావాలంటే మనం ఇంటికి వెళ్ళినప్పుడు...

మీలో ఎంతమంది బైబిల్ చదివెదరు. మీ చేతులను చూపించండి, ఓ, అది అద్భుతం, దానిని చదవండి. ధ్యానించండి. ప్రత్యేకించి తిరిగి జన్మించిన క్రైస్తవులగు మీకు అది పరిశు ద్దాత్మ ఇచ్చే రొట్టయు, మాంసంమునై యున్నది. "మనుష్యుడు రొట్టె వలననే మాత్రమే కాక దేవుని నోటనుండి వచ్చే ప్రతీమాట వలన బ్రతుకును.”

13. మరి ఈ రాత్రి నేనే ఒక వైద్యుడనైతే, గొప్ప దేహధారుడ్యముగల ఒక యవ్వనస్థుడు చూడటానికి అతడు చాలా బలహీనంగా, నీరసంగా వుండి నా యొద్దకి వచ్చినట్లైతే, మరి నేను "కుమారుడా ఏమిటి సంగతి (ఏమైంది నీకు అను)" అని అడుగుదును.

అతడు ఇలా చెప్పును "డాక్టర్ నేను చాలా బలహీనంగావున్నాను, కనీసం నిలబడలేకుండా వున్నాను" అప్పుడు నేను కొన్ని ఒంటిని గూర్చిన సంగతులు అడుగుదును. "మంచిది". "వారంతా బాగున్నారు" నేను అడుగుతాను "మంచిది, నీ బలహీనత కారణం ఏమిటి" "డాక్టర్, నాకు తెలియట్లేదు" మరలా నేను అడుగుతాను "సరే రాత్రి ఏం తిన్నావు?" "మంచిది, నిన్న కాక మొన్న కొన్ని క్రాకర్స్ (సాల్ట్ున్నుతో కాల్చిన బిస్కెట్లు లాంటివి) తిన్నాను".

సరే నేను చెబుతాను "నీకు అవసరమైనదంతా సమతూల్య ఆహారం. నీకిప్పుడు రక్తహీనత(రక్తంతో హిమోగ్లోబిన్ శాతం తగ్గుట) వచ్చినది, అందుకే నీవు బలహీనమయ్యాను."

14. మరి మన యొక్క పరిస్థితి కూడా సరిగ్గా అంతే వుందండీ. ప్రతిదినము పుష్టికరమైన, పోషక విలువులున్న మంచి సువార్తఆహారమును నీవు భుజించవల్సివుంది. ఒకవేళ తినకపోతే, నీవు రక్తహీనత(రక్తంలో వుండాల్సినంత హిమోగ్లోబిన్ శాతం వుండక పోవుటయే రక్తహినత అంటే - అను) పాలౌతావు. నీవు డీలా పడిపోతావు. ఆయన వాక్యములో నుండి అన్ని రకములగు విటమిన్ను నీవు తీసికోవాలి. అప్పుడు అది నిశ్చయంగా నీ ఆత్మను పైకి తీసికొనివచ్చును, అంతేకాక నిన్ను తాజాదనముగాచేస్తుంది. పునరుద్దరుణచేస్తుంది (నూతనపరుస్తుంది. శక్తివంతముగా చేస్తుంది)

ఇప్పుడు, ఒక గొప్ప సంఘటన జరిగియుండెను. మరి అక్కడ ఇశ్రాయేలులో ఒక గృహశు ద్ది సమయము వచ్చెను. కానీ దానిలోని చెడ్డ భాగము ఏదనగా ప్రజలే (నాయకుణ్ణి) ఎన్నిక చేసికొనుట, వారు వారికిష్టమైనట్టు ఎన్నిక చేసికొనుచుండిరి, అటువంటి ఒక చెడ్డకార్యము నేటి మన దినాలలో ఒక పాస్టరు సంఘమును విడిచితే, డీకనుబోర్డు వారు మరొకరిని పాస్టరుగా
ఎన్నిక చేసికొందురు. అది ఎలాంటిదంటే ఒక మంచివ్యక్తిని తొలగించి, ఒక చెడ్డవ్యక్తిని లోనికి తెచ్చుచుండుట (ఎన్నుకొనుట) లాంటిది.

అయితే దేవుడు ఒక వ్యక్తిని పంపినటైతే, అతడు సరైనవాడిగా (మంచివాడిగా) వుండును. మీ పాస్టర్సి మీరు ఎన్నుకొనే విషయంలో ఈ విధంగా ఎన్నికొనే మీరు ఎల్లప్పుడు ప్రార్ధించి దేవుడు మొగ్గుచూపే(అనుకూలపేర్చిన) వ్యక్తి కొరకే కనిపెట్టవలెను.

15. కానప్పుడు, అది ప్రభువు యొక్క గొప్ప ప్రవక్తయగు ఏలీయా - ఏలీయా దినములవి. ఓ దేవా, ఖాళీలో నిలిచి, ప్రజలకోసం విజ్ఞాపణచేయు దైవసేవకులు లోకమందు మనమిప్పుడు కలిగియుండకపోతే మనమేమి చేయగల్గుదుము. వారు ప్రజలకి తప్పొప్పులను సూటిగా చెప్పగల్గిన తెగువగలవారు, అలా చెప్పుటకు తగినంత కృపను పొందినవారు. చెప్పగల్గిన సేవకులు

అసలు సంగతంతా అదేనండీ, నేటి సమస్య అదేనండీ, అలా కొదువుగా వున్నారు... అలా అని నేను నా సహోదరులను ఖండించుట్లేదండీ, నిశ్చయంగా అలా చెయ్యట్లేదు. అయితే సత్యమును వున్నది వున్నట్లు చెప్పుటకు నేను ప్రయత్నించుచున్నాను. నేడు పరిస్థితులు అలా అవ్వుటకుగల ఏకైక కారణం ఏదనగా...ప్రతీ యొక్క పాస్టరు వాక్యము మీద స్థిరముగా నిలబడి, దేనికి లొంగకుండా, ఎక్కడా రాజీపడకుండా వుండినట్లైతే, నేడు వున్నట్లుగా అది వుండేదు కాదు సుమా. అయితే రాజీపడే స్వావలంభన సంఘశాఖలు మరలాంటివి ఎల్లప్పుడు పరిశుద్దాత్మ యొక్క స్థానాన్ని తీసికొనుటకు ప్రయత్నించుచున్నవి. 16. మరి దేవుడు ఎన్నడు కూడా పలాని గుంపు మనుష్యులు మాత్రమే తన సంఘమునకు నాయకత్వం వహించి నడిపించాలని కోరడు. సంఘమును నడిపించేది ఎల్లప్పుడు పరిశు ద్దాత్మయే. అది ఆయన (పరిశుద్దాత్మ) యొక్క విధి. అందుకొరకే ఆయన ఇక్కడ వుండియున్నాడు. అందుకొరకే దేవుడు ఆయనను పంపియుండెను. ఆయన నీకు భోదిస్తాడు. ఆయన నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. రాబోయే సంఘటనలను తెలియపరుస్తాడు. మరియు ఈసంగతలను బయలుపరుస్తాడు. “నావాటిలోనివే ఆయన తీసికొని వాటిని మీకు బయలుపరుస్తాడు" సెమినరీ కాదండీ అవి మంచివేకావొచ్చును, చర్చికాదండీ, అది ఉ ండగల్గినంత మంచిగా ఉండొచ్చును. కానీ బయలుపర్చేది మాత్రం కేవలం పరిశుద్దాత్మ, ఆయనే బోధకుడు.

పరిశుద్దాత్మ స్థానాన్ని మనిషి తీసికొనుటను మనం అలవర్చుకొన్నాము. సంఘములోవున్న అపోస్థలులు, ప్రవక్తలు తదితరులు స్థానాన్ని వేరే కొన్ని తీసికొనేటట్టుగా మనం అలవర్చుకొన్నాము. కానీ దేవుడు సంఘములో వరములను పెట్టియున్నాడు అయితే దేవుని వరముల స్థానంనకు బదులు మనంమనుష్యులను ఉంచి, వారినే వరములుగా చేసియున్నాము. నేడు మనమలా వుంటిమి,

ఇప్పుడు, ఏలీయా గొప్ప మనుష్యుడు, తాను భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోబోయే సమయం అతనికి వచ్చినది, మరి అతడు ప్రభువు యెదుట నడిచియున్నాడు. ప్రభువు అతడితో ఇలా
చెప్పాడు "వెళ్ళి మరో వ్యక్తిని అభిషేకించుము"

17. దానిని నేను' (ప్రేమిస్తున్నాను(అదంటే ఇష్టం) మీరు ప్రేమించారా (మీకిష్టం లేదా?). ఒక సాక్షి లేకుండా దేవుడెన్నడూ లేడు. లోకము ఆరంభమునుండీ దేవుడు ఎల్లప్పుడూ ఒక సాక్షిని కలిగి యుండెను. కొన్నిసార్లు అది ఒక్కడి యొల్లికి వచ్చును. దేవుడెల్లప్పుడు ఒక వ్యక్తిని కలిగియుండి, అతని వైపు ఆయన వ్రేలు చూపెట్టి "ఇతడు నా సేవకుడు" అన్నికాలాల్లో అది ๒๐.

ఇప్పుడు, ఏలీయాని తాను తీసికొనపోబోవుచుండుటను ఆయన చూచినప్పుడు, తిప్పియుడైన ఏలీయా వెళ్ళి ఎలీషాను కనుగొన్నాడు. ఎలీషా భూమిని దున్నుచుండెను, అప్పుడు ఏలీయా వెళ్ళి తన దుప్పటి(వస్త్రము)ను తీసి అతనిపై విసెరెను. అతడు ప్రవక్తగా పిలువబడతాడని ఏలీయాకి తెలుసును.

ఒక ప్రవక్త ఏమి చేస్తాడో అనే దానిని అది చూపెడుతుంది. మనం చెప్పునట్టు అతడు తన వెనుక వున్న ప్రతీ బ్రిడ్జి(వంతెనను)ని కాల్చివేసెను. అతడు ఎద్దును చంపి, కాడిని అరకలను తీసి - మరి ప్రభువుకి బలిగా అర్పించెను. దానర్థం అతని భూసంబంధమైనవన్ని ముగించబడినవని అది చూపుతుంది. అతడు సంపూర్ణముగా ప్రభువుకి అప్పగించుకొనెను(అమ్ముడుపోయెను విక్రయింపబడెను). మరి క్రీస్తు యొద్దకి వచ్చే ప్రతి స్త్రీ పురుషుడు పూర్తిగా ఆ విధంగా పాపమునకు అమ్ముడైపోవాలి, మరలాగే అతని వెనుకున్నదంతా అమ్ముడైపోవాలి, మరి విభాగించే ఆ రేఖను వారు దాటినప్పటినుండి కేవలం దేవుని పైనే చూడవలెను. ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు అలా చేస్తే ఎంతో వ్యత్యాసమైన జీవితంను జీవించగలరు.

మరటు పిమ్మట అతనికి పరీక్షసమయం ఆరంభమగును... ప్రభువు పెట్టే పరీక్షలు శ్రమలు, ఉపద్రవములను మీరు నమ్ముదురా? దేవుని యొద్దకి వచ్చే ప్రతీ కుమారుడు, ఏతేడా లేకుండా ప్రతీ కుమారుడు మొదటిగా పరీక్షింపబడాలి, ఇబ్బందులపాలవ్వాలి. బాలురు తర్ఫీదునొందాలి. 18. మీరు మీ తర్ఫీదును ఎలా పొందుకొన్నారో మీకు గుర్తున్నదా? నా తర్ఫీదును నేను పొందుకొన్న సంగతి నాకు గుర్తేవున్నది. నా తండ్రీ కలిగియున్నాడు... అతడు బంగారు(ఉ త్తమమైన సూత్రాలు) నియమాలను నమ్మేవాడు. వాటిని అతడు కలిగియున్నాడు. దానిని తలుపుకి బిగగొట్టియుంచెను. దాని మీద పది ఆజ్ఞలన్ని వుండెను. ఇంతపొడువున వుండి, దాని కొసన ఒక బ్రస్సు(కుంచె)వున్న ఒక పొడవైన హికరీ కర్ర వుండేది.

చిన్న బ్రెన్హామ్ తప్పు చేసినప్పుడు వారికోసం ఒక బంగారం నియమము (ఉత్తమమైన సూత్రం) వున్నదినే సంగతి మీకు చెప్పుచున్నాను. మా నాన్న దానిని ఎక్కడినుండి తెచ్చాడంటే?.... నాన్న ఇలా అనే వాడు "ఇక్కడికి కుమారా, రేపు నీ సంగతి చూస్తా"

"నాన్న, ఇప్పుడే కానిచ్చేయి, దానిని తీసికొని దండించుము"

"వద్దు, రేపటి వరకు నేను వేచియుండెదను
అతడు తన రాత్రి భోజనము చేసిన తర్వాత ఇలా అనేవాడు "బిల్లి, ఇక్కడికి రా"

"సరే వస్తున్న నాన్న"

"దానిని చేసినందుకు నీకు సిగ్గుగాలేదా?"

"వుంది నాన్న"

"దానిని బట్టి నేను నిన్ను కొట్టుగును,(సరైనా పద్ధతిలో తెలిపెదను)".

ఆ రాత్రి నేనిలా దానంతటిని గూర్చి ఆయన నాకు చెప్పేవాడు. నేను బయట పొలములోనికి వెళ్ళి గడ్డితో చేసిన టోపీని పెట్టుకొని, భయముతో చచ్చేటంతగా ఒణికిపోయేవాణ్ణి. అనుకొనేవాణ్ణి "ఈ రాత్రి నేను తప్పించుకోలేను. ఎలాగైన సరే నాన్న కొడతాడు". కానీ సహోదరుడా, చింతించనవసరంలేదు, ఆయన ఎన్నడు దానిని మరిచిపోయేవాడు కాడు. నన్ను కొట్టేవాడు. నిజానికి అదొక చక్కని క్రమశిక్షణ(మంచి తర్ఫీదు).

మరి అటువంటి కఠినమైన చక్కని క్రమశిక్షణ నేడు మనకి వుండిన యెడల మనకి ఇటువంటి దుర్భరమైన పనికి మాలిన సంగతులు జరిగియుండేవి కాదు. దీనిని నేర్పించుట గూర్చియేనా నీవు మాట్లాడుచున్నది...

19. అనారోగ్యముతో వున్న ఒక వ్యక్తిని దర్శించుటకు ఈ మధ్య నేనొక గృహమునకు వెళ్ళితిని, మరి అచ్చట చిన్న జూనియర్ అస్వాల్ట్ అనే బాలుడు ఆ ఇంట్లో వున్నాడు. వాడు నడుచుకొంటు లోపలికి వచ్చాడు, వాడు అడిగాడు "అమ్మా, తినటానికి నాకింకా భోజనం సిద్ధపర్చలేదా?",

ఆమె చెప్పినది "కుమారా, నాకు ఆరోగ్యం బాగో లేదు, ఇదిగో ఇతడు బ్రదర్ బ్రెన్హామ్."

వాడు అడిగాడు "సరే, నాకింకా భోజనం ఎందుకు సిద్ధంచేయలేదు?"

ఆమె చెప్పినది "నాకు ఒంట్లో బాగో లేదని చెప్పానుగా. నిజంగా అసలు బాగోలేదయ్యా"

వాడు అన్నాడు "అలాంటి కుంటి సాకులు చెప్పకు"

ఆమె చెప్పినది "అదిగో అక్కడ ఒక ఆరంజ్ వుంది. తిను.”

వాడు దానిని తీసికొని, దానివైపు చూసి ఇలా అన్నాడు "నువ్వు చెయ్యగల్గినదంతా ఇదేనా,

వాడు దానిని గోడకేసి విసిరికొట్టాడు, అది పగిలి దాని రసమంతా గోడమీదంతట చిందికొట్టెను, అంతట ఆమె "జూనియర్, జాగ్రత్తగా నడుచుకో(ప్రవర్తించు)" అని అన్నది.. వాడు దేని మీదో గట్టిగా బాది బయటికి వెళ్ళిపోయాడు.

అప్పుడు నేను ఆ తల్లి వైపు చూచాను. నేను అనుకొన్నాను "అమ్మా (స్త్రీ), కొద్దిసేప వాడిని నాకు అప్పగించు. ఈసారి వాడు ఇంట్లోకి వచ్చేటప్పుడు వ్యత్యాసముగా నడిచేటట్టు (ఆలోచిం

చేటట్టు)చేస్తాను"

ఓ మనమెందుకు చూచి చూడనట్టు వుంటున్నాము. నీవొకరకమైన... నేటి దినాలలో నీవు
పిల్లల పట్ల ఉదారత చూపుచున్నావు. మరీ అంతమంచి తనం కూడా సనికిరాదండీ. అది నిజం. నీవే వారిని అలా వెనుకేసుకొస్తున్నావు అయితే బైబిల్ చెప్పినదాని కంటే పైగా నువ్వు వెళ్ళకూడదు. బైబిల్ ఇలా అంటుంది" శిక్షాదండము (బెత్తము)ను నీవు వాడకపోతే, నువ్వే బాలున్ని చెడగొట్టిన వాడివగుదువు" మరి అది నిజమండి.

మా నాన్న పాత తుపాకీ యొక్క గొట్టపు కర్రను వాడేవాడు(దండించుటకు). అది ఏమిటనేది మీకు తెలుసో లేదో నాకుతెలీదు, దాన్ని మీరు లోడు(ఎగుమతి) చేయుటకు ఉపయోగించే పరికరం.

(ఒక సహోదరుడు "రామ్రాడ్" అని చెప్పుచున్నాడు-సంపా) అవును. రామ్రాడ్. అది సరియే. బ్రదర్ నేను అట్టి దానితో నేర్పించబడ్డాను. తన చుట్టు అతడు నన్ను త్రిప్పుకోలేదు.

ఈ రాత్రి అతడు సమాధిలో వున్నాడు. నాన్న చనిపోయి అక్కడ పడుకోబెట్టియున్నప్పుడు, అతని చుట్టు నల్లతాలాలు బిగించబడి, బూడద రంగులో కనపడుచున్నాడు, వారిలో ప్రతి ఒక్కరి గూర్చి తలంచితిని, ఆయన కొట్టిన ప్రతీ దెబ్బను నేనెన్నడు మరిచిపోను. ఆయన నన్ను కొట్టుట నాకు మేలే. అది వాస్తవం. ఆయన నాతండ్రీ, నేనాయనను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నన్ను సరిదిద్దుటకే ఆయన ప్రయత్నించాడు. నేను సరైనది చేయాలన్నదే ఆయన ఉద్దేశ్యము.

20. మరి ఇప్పుడు మీలో కొందరు కెంటకీలోని కొండజాతి వారి నిరక్షరాస్యతను గూర్చి మాట్లాడుదురు. ఆ ముసలి అవ్వలు తమ తలమీద గుడ్డను గడ్డంక్రిందవరకు బిగించుకునే పొడవాటి టోపీలను ధరింతురు మరి అలాటి... మీకు తెలుసా అదేమిటో? పట్టణప్రజలగు మీలో కొందరు ఏ విధముగా ప్రవర్తించాలో అనే దానిని వారు మీకు బోధించగలరు. అది వాస్తవం.

మీ యొక్క చిన్న మార్తఅన్నే రాత్రిపూట వచ్చును, తన ముఖమంతా గజిబిజి చేసికొనును, కొద్దిగ త్రాగి సిగరెట్ పొగత్రాగుచూ, ముక్కులోనుండి కూడా దానిని వదులుతూ,తన కాళ్ళతో చిందులు పెడుతూ మిమ్మును చూచి వెట్టి కేకలు పెట్టును. అలాంటి తిక్క పనులు ఒకసారి ఆ పాత కెంటికీ తల్లులముందు చెయ్యమనండి. ఆమె హికరిచెట్టు కర్ర తీస్కాని దాన్ని సన్నగా చెక్కి దండించుటకు వాడును. ఆమె దానిని వాడినప్పుడు తల్లి యొక్క ప్రతా:సము ఏమిటో ఆమెకి తెలుస్తుంది.

నీవు గనుక అలా చేస్తే ఈ రాత్రి లోకమందుండే చెడ్డ పురుషులు బాలబాలికలు నీకుండేవారు కాదు. నీవు నీ పిల్లలు ధరించుకొనుటకు అనుమతించే ఆ చిన్ని పొట్టిబట్టలు మరియు పలుచటి దుస్తులులాంటి వాటిని వారి పిల్లలకి ఎవరైన ధరింపచేయుదురేమో చూడుము. ఒకవేళ వారు ఒకసారి ధరిస్తే వారెంత మోటివారో నీవు చూస్తావు. అటువంటి అసభ్యదుస్తులు ఆ పాతకెంటకీ తల్లుల యొక్క పిల్లలు పొరపాటున ధరిస్తే ఆ తల్లులు
ఊరుకోరు. అవసరమైతే పిల్లలు నింపాదిగా దుస్తులు ధరించే వరకు కొట్టెదరు. వారి వస్త్రధారణను నీవు ఎంతమాత్రం తప్పుపట్టలేనంత నిండుగా వుంటుంది. క్ష

ఈ రాత్రి జరుగవలసింది కూడా అదేనండీ. అది వాస్తవం.

2 21. మరి పిరికి ప్రసంగీకులుగా కొందరు మధ్యాహ్నర ప్రసంగ వేదికలమీద నిలబడెదరు. వారి గాయకబృందం పాడెదరు, తరువాత వారు బయటకు వెళ్ళి చెడ్డకార్యములలో పాల్గొనెదరు. నిన్ను నీవు ఒకదైవసేవకుడవని పిలిపించుకొనుచు అటువంటి వాటిని ఖడింపక, వాటిని అనుమతించుచున్నావు. అందుకై వీ ునొందాలి. నీకు వెన్నుముక్క లేదు కానీ ( ) ఇష్టంవచ్చినట్లు తిరిగే ఎముక మాత్రమే వున్నది. నీవు పరిశుద్దాత్మ పొందుకొనిన వాడివైతే, అది నిన్ను దానికి భిన్నమైన వానికి పనిచేయనిస్తుంది, దానికి భిన్నమైన వానిగా మాట్లాడనిస్తుంది. నలుపుని నలుపని, తెలుపుని తెలుపని అనేటట్టు నిన్ను చేస్తుంది. అవునండీ. కానీ సమస్య ఏమిటంటే... ఓ. మై, నీవు ఎంతో భయస్థుడుని, చిన్న శిశివి(పిరికివాడివి). మరి నీవు వెన్నుముక్కను ఎందుకు పొందకూడదు. పరిశుదాత్మను ఎందుకు పొందకూడదు. మొట్టమొదటి గా పరిశుద్దాత్మను పొందినవాడు (క్రొత్తనిబంధనలో అను) బాప్తీస్మమిచ్చు యోహాను, అప్పుడతడు తిన్నగా ఆ ముసలి హేరోదు ముందుకి నడిచిపోయి ఇలా అన్నాడు "నీవు నీ తమ్ముడి భార్యను వుంచుకొనుట న్యాయసమ్మతం కాదు".

సహోదరుడా, సరిశుద్దాత్మతో నిండిన వ్యక్తి అలా వుంటాడు. ఏదైనా సరైనది కానట్టు అతడు చూచితే, అది సరైంది కాదు(తప్పు) అని అతడు నిర్మొహమాటంగా అంటాడు. అది నిజమండి. నిశ్చయంగా అంటాడు.

22. ఇప్పుడు, ఏలీయా మరి అలాంటివాడే. మరి అతని యొక్క స్థానాన్ని తాను తీసికొనబోవుచున్నాన ని ఎలీషా తెలిసికొన్నప్పుడు, ఏలీయా అతనికి ఒక పరీక్షపెట్టాడు. అతడు అన్నాడు "నీవిక్కడ నిలచివుండుము ఎందుకంటే నేను మరొక పట్టణమునకు వెళ్ళుచుంటిని". అతడిని జాగ్రత్తగా కనిపెట్టాలనే సంగతి ఎలీషా ఎరిగియుండెను.

అతడు ప్రేరేపించబడ్డాడు. అతడు అన్నాడు "ప్రభువు జీవించుచున్న ప్రకారం, నీ ఆత్మ ఎన్నడు నశింపుకాదు, నేను నిన్ను విడిచిపోను."

చిట్టచివరి పరీక్ష వచ్చేటంత వరకు వారు అలా వెళ్తూనే వుండిరి, మరి వారు యోర్దాను దాటారు. అతడన్నాడు "ఇప్పుడు, నేను నీకేమి చేయాలనుగోరుదువు?"

అతడడిగాడు "నీకున్న ఆత్మలో రెండతల పాళ్ళు నా మీదికి రానిమ్ము." ఇప్పుడు చూడటానికి అది వింతగా వుండొచ్చును. ఒక మనిషి ఆత్మ మరొక మనిషి మీదికి వచ్చుట."నీ ఆత్మ రెండు పాళ్ళు నాకు కావాలి."

అందుకతడు నువ్వు అడిగినది కష్టంగా వుంది. అయినప్పటికిని నేను వెళ్ళుటను నీవు చూచినట్లైతే, నీవు దానిని పొందుకొనెదవు”.

కావున వారు అలా నడుచుకొంటూ పోవుచుండిరి. కొద్దిసేపైన తర్వాత, అగ్నిరధములు
అగ్ని గుఱ్ఱములు దిగివచ్చెను. అంతట ఏలియా దానిలోకి అడగువేసాడు, తన వస్త్రమును విడిచిపెట్టాడు, దానిని ఎలీషా మీదికి విసిరెను. మరి ఇతడు దానిని తన మీదికి వేసికొని, నది యేద్దకి రెండంతల ఏలీయా ఆత్మతో నడిచిపోయెను, అది సంఘమునకు చక్కని మాదిరిగా వున్నది.

"యేసు చెప్పాడు "నేను చేయు క్రియలు మీరును చేయుదురు. వాటికంటే మరి గొప్పవి చేయగలరు. నేను పొందిన బాప్తీస్మమును మీరు పొందగలరా? నేను త్రాగినగిన్నెలో నుండి మీరు త్రాగగలరా?" అవును. మీరు చేయగలరు(పొందగలరు, త్రాగగలరు)", పరిశుద్దాత్మ రెండంతలుగా సంఘము మీదికి రావల్సియుండెను. (దాన్ని మీరు చూశారా?). యేసు చేసిన కార్యములను రెండంతలుగా సంఘము చేయవల్సివుంది.

ఓ, సంఘము యొక్క ఈ విశ్వాసం ఈ రాత్రి ఎక్కడ వున్నది? అది భయపడుచున్నది. ఒక తాబేలు భయపడి తన చిప్పలోకి వెళ్ళి దాగుకున్నట్టు అది వున్నది. ఇప్పుడు వినండి, నీవు చేయవల్సినదల్లా నీవు దానిలోనుండి బయటకి రావటమే.

23. గమనించండి. అతడు నడిచి వెళ్ళనారంభించినప్పుడు, అతడు అద్భుతాలను చేయుట ఆరంభించెను. ఒకరేమో ఎనిమిది చేసారు, అది ఏలీయా. ఎలీషా దానికి రెంటింపుగా అనగా పదహారు చేసాడు, ఎందుకనగా రెంటింపు పాళ్ళు ఆత్మ అతని మీద నిలిచియుండెను.

ఆ కాలమందు, పాత ఆహాబురాజు చనిపోయియుండెను ఎందుకంటే అతని అంతము ఎలా వుండబోతున్నదనే సంగతిని ప్రవక్త తెలియచేసియుండెను. అలాగే రంగులు పులుముకున్న ముఖముగల తన భార్య కూడా మరణించెను. ప్రభువు సెలవిచ్చిన మాట ప్రకారముగానే కుక్కలు ఆమెను తినెను. ఆ భోధకుడిని ఆమె ఎంతో హీనముగా అసహ్యించుకొన్నది, ఎందుకంటే అతడు ఎల్లప్పుడు ఆమె యొక్క పాపముల సంగతిని ఆమెకు తెలియచేయుచుండెను. దీనిని చెయ్యకుండా అతడెలా దేవునికి యదార్ధముగా, నిజాయితీగా వుండగలడు? ఆమెను కుక్కలకు మాంసముగా తాను వేయుదునని దేవుడు అతనికి చెప్పెను. ఆమె కుక్కకి మాంసంగా కాక మరి దేనికి పనికిరాదు.

24. మరి ఆమె ఎంతో అందముగా వుండియు, ఎంతో ఎక్కువరంగులు పూసుకొనియుండియు, ఎంతో గులాబి పెదవులు కలిగియుండి పైన నిలబడినా ఏం లాభం లేదు. ఆ పాత యెహు అన్నాడు "ఆమెని కిటికీలోనుండి పడవెయ్యండి." మరి కుక్కలు ఆ విధిలో ఆమెను తినివేసెను. පයි 2සO.

25. మరటు పిదప వారు మరొకరిని ఎన్నుకొనుటకు వెళ్ళిరి, అతడియొక్క, ఆమెయొక్క కుమారుడగు యెహోరామును వారు పొందుకొనిరి. ఇప్పుడు, అటువంటి ఒక వివాహాం ద్వారా మరెక్కువేమి నీవు ఆశించలేవ్వండి. తదుపరి యెహోరాము సింహాసనం అధిష్టించెనని చూడగలం, అతడొక సరిహద్దు విశ్వాసి అని, అరకొర భక్తుడు, నులివెచ్చని విశ్వాసి అని మనం తెలుకొనవచ్చును. అటువంటి వారు అనేకమంది నేడు జగమందు వున్నారు.
యెహోరాము అలా స్వేచ్ఛగా అతడు వెళ్ళేవాడు. తన తెరచాపను వుంచెను గనుక ఎటుగాలి వీస్తే అటువైపు

సరిగ్గా సంఘము యొక్క పరిస్థితి కూడా ఈ రాత్రి అలానే వున్నది. ఏ౦ చెయ్యాలో, ఎక్కడ నిలబడాలో తెలియక ప్రతి సిద్ధాంతానికి వారు తమ తెరచాపను లేపుచున్నారు. స్థిరత్వం లేకుండా అటుఇటు మరుగొల్పపడుచున్నారు.

కొద్దిపాటి శ్రమకి, చిన్న చిన్న బాధలకి రుగ్మతలకి వారు కదిలిపోవుచున్నారు. వారు నేడేమో మెతడిస్టుగా వుంటారు, రేపు బాప్టిస్టుగా వుంటారు, మరుసటి రోజు పెంతెకోస్తుగా, ఆ మరుసటి రోజు ఒక లూధరన్, సెవెంత్తో అడ్వంటిస్టుగా, యెహోవా సాక్షిగా వుంటారు. తమెక్కడ నిలబడి యుండిరో వారెరుగరు. తికమక పడతారు. సరిహద్దు స్థితి. చర్చిలో నుండి సిఫారుసు లేఖను తీసుకొని ఒకచోటనుండి మరోచోటికి వెళ్ళుట వలన అది ఏ రకంగా నీకు ప్రయోజనకరముగా వుంటుంది చెప్పు? దానిని పరలోకములో వుంచుట మంచిది, ఎందుకంటే అది గుర్తించబడ గలిగిన ఏకైక చోటు అదేనండీ.

26. గమనించండి, అప్పుడు. ఒక నులివెచ్చని భోధకుడు, లేక నులివెచ్చిని ఒక విశ్వాసి చాలామంది ఈ రాత్రి అలాగే వున్నారు. వారు గుంపులతో వుండిపోయారు. గుంపులో వుంటే, గుంపు ఏం చేస్తే వారు కూడా అదే చెయ్యవచ్చుననే భావనవారిలో వుంది. అటు పిమ్మట బాటపడుతారు.

కొద్దికాలం క్రితం ఒక యవ్వనస్థుడు నాతో అన్నాడు "బోధకుడా, నేను క్రైస్తవుణ్ణి కాను, క్రైస్తవుణ్ణి అని గుర్తించబడటం (అనిపించుకోవటం) నాకు అవమానకరం."

అందుకు నేనన్నాను "సరే, అదినీకు అవమానకరమని నీవు అన్నప్పటికి నీకింకా నిరీక్షణ(అవకాశం) వుందయ్య." అతడన్నాడు "నేను క్రైస్తవుణ్ణి కాదు, క్రైస్తవుణిగా గుర్తించబడటం నాకు అవమానకరం. పలాన ఒకరాత్రి నేను ఒకబాలిక యొద్దకి వెళ్ళితిని, ఒకబాలుడు, మరొకరు ఇప్పుడు కలిగియుండెను, మరి ఆమె నడవలేనంతగా బాగా తాగినది. అప్పుడు మేమే ఆమె యొద్దకు వెళ్ళి, త్రాగినదంతా కక్కుటకు ఆమెకు ఉప్పునీరు ఇచ్చాము. మరుసటి రోజు చర్చికు హాజరవుటకు ఆమె మత్తులోనుండి కోలుకొనునట్టు అలా చేసాను. మీరు చూడండి, వారు ఆరాధనాకూటము ముగిసిన అనంతరం బయటకు వచ్చి మరో సీసా మద్యంసేవించి, మళ్ళీ రోడ్డ మీద పడిపోతారు." అంతమాత్రమే కాదు ఆమె సంగీతబృందంలో పాటలుపాడే అమ్మాయి కూడా. ఆమె యొక్క అక్క సండేస్కూలు టీచరు, కానీ ఏం ప్రయోజనం, వారి బ్రతుకులు బాగుపడలేదు.

27. స్వమతదూషకులు (విశ్వాసద్రోహులు), విశ్వాసరహితులు (సంశయవాదులు), సగంవిశ్వాసులు, వేషదారులు లాంటి తదితరులు గుంపులకొద్ది మనకి వున్నారనుటలో సందేహం లేదండీ. అయితే నేడు సంఘానికి కావాల్సింది ఏమిటంటే పాతకాలపు ఉజ్జీవం, పరిశుద్దాత్మ, దేవుడుపంపిన ఉజ్జీవం మరియు ప్రసంగవేదిక మీద నిలబడి ఇటువంటివి కావాలని పిలిచే
బోధకులు, అది వాస్తవము. దేవునినీతియుక్తమగు ఉగ్రత వర్షమువలె మనమీద పడునుగాక, నరకాగ్ని మరియు అగ్నిగంధకములు గూర్చిన మాటలు ప్రసంగములుగా మన ప్రసంగ వేదికల మీదనుండి పోయబడును (కురియును) గాక. అయితే సిగ్గుపడాల్సిన సంగతి ఏమిటంటే నేడు వారు అటువంటి వాటి నుండి పూర్తిగా తొలిగిపోయారు. ఖండించి చెప్పలేనంత పిరికివారయ్యారు.పరిశుద్దాత్మ ఒకవ్యక్తిని విడిచిపోయినప్పుడు వాడికి మెరుగవుట అనేది ఏమిటో తెలీదు(పరిశుద్దాత్మ వదిలేస్తే జీవితాలు ఆదో:గతి పాలవుతాయి - అను). పరిశుద్దాత్మ వద్దకి తిరిగి మనము వచ్చుట మనకి అవసరమైవుంది. అవునండీ. ఇప్పుడు సరిహద్దు స్థితి... 28. కొద్దికాలం క్రితం ఇక్కడ, మా పట్టణములో ఒక స్త్రీ ఉండేది, ఆమె ఎలాంటిదో ఆమె గురించి అందరికి తెలుసును. ఒకసారి ఒక చిన్న దీన బాలిక చర్చికి వెళ్ళింది. ఆమెజుట్టు పొడవుగా వుంది. జుట్టును శుద్దిగా వెనక్కి వ్రేలాడదీసుకొని... ఆమె-ఆమెముఖము తొక్క తీసిన ఉల్లిగడ్డవలె చక్కగా (ఏ రంగులు పులమకుండా) శుద్దిగా ఉండినది, అనుకొనుచున్నాను. ఆమె నిజంగా తిరిగి జన్మించిన నిజ క్రైస్తవరాలు.

ఈ దీనబాలిక దిగువున వున్న నవనాగరికమైన వ్యవహారాల యొద్దకి వెళ్ళినది. అక్కడ ఆ దీనబాలికను ఒక స్త్రీ కలుసుకొన్నది, ఆ స్త్రీ అడిగినది "లోయిస్ నీకుతెలుసా, దీన్నికొద్దిగా దాన్ని కొద్దిగా వాడితే నీవు చాలా చక్కగా (అందముగా) కనబడుతావు, అలాగే ఈ రకమగు ఆ రకమగు దుస్తలు ధరిస్తే బాగా కనబడుతావు."

అందుకు దీనబాలిక(తిరిగి జన్మించిన నిజక్రైస్తవరాలు - అను) చెప్పినది "నేనేమి ధరించాలో సరిగ్గా వాటినే ధరించాను. అది చాలు నాకు." ఆమేన్. ఓ. ఆమె అలా చెప్పుట ఎంత బాగుందో. స్త్రీ ఇలా అన్నది దీనంతటికి కారణం(చిక్కు) ఆ మనిషే, నా బోధకుడు, పాస్టర్ బిల్లీ, ఇక్కడ అతడు వున్నాడు" "అతడు నిజంగా పిచ్చాసుపత్రిలో వుండాల్సినోడు." అని అన్నది ఆ చిన్న దీనబాలిక అన్నది "సరే, అక్కడ మేము దేనినైతే కలిగియున్నామో దానిని నీవు స్వీకరిస్తే (కలిగివున్నట్లైతే), నీవిప్పుడు ఎలాగైతే కనబడితున్నావో అలాగున ఎన్నడు కనపడవు.” దాని గూర్చి ఆమెకు చెప్పినది. అవును, పైగా ఆమె ఒక సండేస్కూల్ టీచరు.

ఇప్పుడు, జఫర్సన్వల్లో నాకు ప్రియమైన మిత్రుడొకరు వున్నాడు. అతడి పేరు శ్రీ పార్కిన్స్, అతడు కూట్స్ నడిపే చాపల్నందు శవాలని కుళ్ళిపోనియ్యకుండా సుగంధద్రవ్యలతో కాపాడు పనిచేసేవాడు. సండేస్కూల్ టీచరగు ఈ అమ్మాయి వ్యాధిగ్రస్తురాలు అయినది. అదేమి రోగమో వారికి తెలియలేదు. అదొక సుఖవ్యాధి, బయటికి పొక్కితే తమ పరువు ఎక్కడపోతుందోనని కుటింబీకులు ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనియ్యలేదు... మరి ఈ అమ్మాయి రోగముతో కృషించి కృషించి చావుకి దగ్గర పడుచున్నది, అప్పుడు కొని పాటలు పాడుటకు తన సంఘపాస్టర్ని మరియు విశ్వాసులను పిలువనంపించింది. వారు వచ్చి పాటలు పాడుచున్నప్పుడు, ఆమె కూడా వారితో కలిసి పాడుచున్నప్పుడు మరణము ఆమెను తాకినది.
29. నువ్వు దేవునితో ఎప్పుడు సరైతావో తెలుసా, సరిగ్గా చావు నిన్ను సమిపించే గడియనందు అప్పుడు నీవు ఆయనతో సఖ్యపడాలని ప్రయత్నిస్తావు. సరే మరణము ఈమెను సమిపించినప్పుడు, పాస్టరు... ఆమె కేకలు పెట్టడం మొదలుపెట్టినది, ఆమె ఇలా కేకలు పెట్టినది, "నేను నశించితిని".

అప్పుడు పాస్టర్ అన్నాడు “చూడు, చూడు, చూడు నువ్వలా అనకూడదు, నువ్వు రక్షింపబడ్డావు అని నీకు తెలుసుగా" కానీ ఆమె మాత్రం "నేను నశించిపోయాను" అని కేకలు వేస్తుండెను.

అంతట ఆ పాస్టరు వైద్యున్ని పిలిచాడు, వైద్యుడు వచ్చి వైద్యం చేయనారంభించెను. ఆమె ఇలా అనుచున్నది పాస్టరును చూచి "నువ్వు మోసగాడివి నేను నశించాను. నరకానికి వెళు తున్నాను, దీనిఅంతటికి కారణం నువ్వే" అని కేకలు పెట్టినది.

ఇంకా అన్నది "ఆ చిన్న మహోని అనే ఆ బాలిక (తిరిగిజన్మించి, సభ్యతగా వస్త్రధారణ

అందం కోసం రోడ్డు మీద ఈమెను నాగరికమైన వాటిని ధరించమని, పూసుకోమని ఈమెతో చెప్పించుకొన్న బాలిక - అను)ను పిలిపించండి. సాధ్యమైనంత త్వరగా రప్పించడామెని, ఆమె వచ్చి నాకు ప్రార్ధన చేస్తుంది". కానీ వారాబాలికను తీసుకొని రాలేకపోయారు. ఈలోగ ఆమె చనిపోయినది.

మరి శ్రీ పార్కిన్స్ నాతో చెప్పాడు, ఇలా అన్నాడు "బిల్లీ. ఆ బాలికలోనికి నేను ఆ ద్రవమును ఎక్కించుచున్నప్పుడు, మేము ఒక సంగతిని గమనించాము, నాకు వాసనరానారంభించినది, అదేమి వాసన అనగా మద్యం వాసన. ఆమె ఎక్కువుగా మద్యం సేవించినది, కావున మేము ఆమెను పరీక్షించాము." వారు దానిని చేసినప్పుడు లోపల అంతట రంధ్రాలే, ఆ సుఖవ్యాధి ఆమెను తినివేసినది, అక్కడ ఆమె చనిపోయినది.

30. ఓ. మై అంతటి అవమానానికి (అపకీర్తికి) కారణం ట్యాపుడాన్సులు, మరి ఇంకా పాపభరతమగు ఆ చెత్తపనులు ఇటువంటివాటిని చేసినా ఏమి పర్వాలేదులే, పడిపోయిన జీవితమైన ఏమీకాదులే అని ఆ వెనక్కి జారిపోయిన బోధకుడే స్వయంగా వాటిని ప్రోత్సహించాడు. దానంతటికి కారణం అతడే. ఆమె తన మరణసమయమునందు ఆ బోధకుని ముఖము మీద ఉమ్మిఊసినది.

అట్టివారంత అవతల దేవుని సముఖమునందు నిలువబడితారు, చేసిన ప్రతిదానికి లెక్క అప్పగించవల్సివచ్చినప్పుడు, వారి పరిస్థితి ఎలా ఉండును, ఆమె ఏమి చేయును. ఆ బాలిక యొక్క ఆత్మను గూర్చిన లెక్కను దేవుడు ఆ సేవకుడిని అడుగును(ఆ బాలికఆత్మను దేవుడు ఆ సేవకుని చేతిలోవుంచెను) నిశ్చయంగా అతనిని దేవుడు లెక్క అడుగును. అది వాస్తవము.

ఓ, సహోదరడా, ఈ రోజు మనకి సంఘములో అవసరమైనదంతా మేల్కొల్పు. లెమ్ము విద్రనుండి మేల్కొనుము, మిమ్మును మీరు విదుల్చుకొనుడి మరియు మనము జీవిస్తున్న
దినమును గుర్తుంచుడి. ఇప్పుడు, ఈ మధ్య అది జరిగినది... ఆ అమ్మాయి ఎలా చనిపోయినదో * అనే సంగతి జెఫర్సన్విల్నందు అదింకను వ్రేలాడుచూనే వున్నది.

ఇప్పుడు, ఒక సరిహద్దు, నులివెచ్చని... వారు దానిని నునుపుచేయ ప్రయత్నిస్తున్నారు. యెహోరాము అనే ఇతడు కూడా ఆ వెనుక్కి జారిపోయిన సేవకుడులాంటివాడేనండీ. మరి అతడు, జనులు ప్రతీ మార్గమందు... వారు దీనిని చేయాలనుకోండి, సరే పర్వాలేదు చెయ్యొచ్చు అని అంటారు, వారు దానిని చెయ్యలనుకోండి. సరే పర్వాలేదులెండీ అని అంటారు. అవి ఇవి చేసికూడా వారు తమ్మును తాము క్రైస్తవులని లేదా విశ్వాసులని అనిపించుకొందురు.

31. మొట్టమొదటి విషయం మీకు తెలుసా మోయాబు ఇశ్రాయేలు మీద తిరుగబడిరి. కనుక అప్పుడు అతడు సహాయం కోరాడు.

ఇప్పుడు, యూదావారికి యెహోషాపాతు రాజుగా వున్నాడు. యెహోషాపాతు ఒక నీతిమంతుడు. ఇప్పుడు, మీరొక సంగతిని గమనించాలి, అదేమనగా ఒక క్రైస్తవుడు కొన్నిసార్లు సానుభూతి కోసం వెళ్ళి చెడ్డ సహవాసములో ఎంతో సుళువుగా చిక్కుకొనుటకు ఒప్పించబడతాడు. "మంచిది. నేను చెబుతున్నాను. నేను కాలక్షేపం కోసం దంతపు గుండ్లాట(ఒక టేబుల్ మీద నిమ్మపండ్లంత రెండుతెల్లని గుండ్లు, ఒక ఎఱ్ఱని గుండు వుంటాయి, వీటిని టేబుల్కి మూలన వున్న రంధ్రలోకి తోసేసే కర్ర వుంటుంది. దీనినే దంతపుగుండ్లాట అంటారు-అను) గదికి వెళ్ళుచున్నాను, నేను ఆట ఆడను, కానీ ఊరికే వెళ్తాను. సుచీతో నాట్యమాడుటకు నేను వెళ్తాను. ఎందుకంటే ఆ అమ్మాయి మంచిది, అలా వెళ్ళి ఆమెను నేను ప్రభువు యొద్దకి నడిపిస్తాను." ఇలా నీవు అమాయకంగా అంటావేమో, వెళ్తావేమో కానీ దానిని నీవు ఎన్నడూ సాధించలేవు. అది నిజం. నీ అసలు రంగు బయటపడును. అది నిజం. చెడ్డ నేలమీదకి వెళ్ళ ప్రయత్నించకు.

32. ఈ రాత్రి పెంతెకోస్తు చేసినది అదేనండీ. వారు చెడ్డనేలమీదికి అడుగుపెట్టారు. ఆ కారణమును బట్టే సంఘము ఈ రాత్రి, ప్రజలు... కొన్ని పనులు ప్రజల దృష్టిలో సరికానివిగా(తప్పుగా) వుంటాయి. ఇప్పుడు, అని వాస్తవానికి తప్పుకావు, కానీ వారు ఏదో రకంగా అవి చేస్తారు. మీరు తప్పుడి నేలమీదికి వెళ్ళారు, మీరు తప్పుడి గుంపుతో మిళితమైపోయారు.

నీ సహవాసం(స్నేహం) ఎవరితోనే నాకు తెలుపుము, అప్పుడు నీవు ఎలాంటివాడివో అనే దాన్ని నీకు చెబుతాను. మీ ఇంటిలోకి నన్ను రానివ్వండి. మీ బల్లమీద ఏమేమి పెట్టబడినవో నన్ను చూడనివ్వండి. మీ బైబిలు ఎలా గుర్తులు పెట్టబడ్డాయే నన్ను చూడనివ్వండి, "నిజమైన గాధలు" అని ఎక్కడ అయినవో నాకు చూపండి. ఏ రకమగు సంగీతమును నీవు రేడియోలో వింటున్నావో నాకు చూపించండి. మీ ఇంట్లో ఏరుకమగు బొమ్మలు వ్రేలాడి దీసి వుంచారో నన్ను చూడనివ్వండీ. అప్పుడు నీవు ఎలాంటి వాటితో తయారుచేయబడ్డావో అనే దానిని నేను ఇట్టే చెప్పేస్తాను. అవునండీ. నీ ఆత్మ అటువంటి చెత్తతో పోషింపబడుచున్నది. నీ
సాక్ష్యం ఏదైనప్పటికి, నీ ఫలములే నీవు ఏమిటి అనేదాన్ని ఋజువుచేస్తాయి. అది నిజం.

ఓ, ఇది సత్యం, నీ ఆత్మ దేనితోనే పోషించుబడుచుండెను. నీ ఆత్మ యొక్క గుణలక్షణాలు ఏమైయుండినో అనే బయటికి వస్తాయి. అందుకే యేసు ఇలా అన్నాడు "వారి ఫలములను బట్టి వారిని మీరు తెలిసికొనెదరు". నీవు దానితో సొంతన లేకపోతే (సరిపడకపోతే) నీవు పొందనట్టే. బహుశా నీవొక దయ్యమునో లేక శరీరకార్యమునో పొందావేమో. నేను పెంతెకోస్టు జనులకి చెప్పుచున్నాను. ఇప్పుడు బాప్టిస్టులైన మీరు, ప్రెస్పిటేరియన్లగు మీరు ఇంకొంచం గట్టిగా అరవ వల్సివుంది. నిజం. నిశ్చయంగా అలా చెయ్యవల్సివుంది.

ఇప్పుడు ఏ విధమగు సూచన అయినా నేను లెక్కచేయును... బహుశా నీవు ఒక ముసలివలే కన్నీళ్ళు పెట్టొచ్చును, బెంచి మీద పడి వేదనపడుతూ మూల్గవచ్చును. దానర్ధం నీవు రక్షింపబడ్డానని కాదు సుమా. నీవు ఏమిటి (ఎవరో) అనేది నీ నడక ( జీవితం) చెబుతుంది.

33. ఒక మేకకూతను నీవెన్నడైనా విన్నావా? గొట్టె, మేక ఇవి రెండు ఇంచుమించు ఒకేలా వుంటాయి మేకలు ఏడ్చుటను నేను విన్నాను. ఎప్పుడనగా గొజ్జెలవలే అవి నటించనప్పుడు. ఈ రెంటి మధ్య తేడా తెలియాలంటే అది కేవలం నిజమైన కాపరికి మాత్రమే తెలియును. ఒకవేళ కూత నీవు విన్నట్లైతే అది సరిగ్గా ఒక గొట్టెలాగానే వుంటుంది. కానీ దాని స్వరాన్ని కాపరి పసిగట్టగలడు. అది వాస్తవం.

ఇప్పుడు, ఒక కార్యం సంభవించినది. ఈ యెహోషాపాతు ఏది చేయాలనుకొన్నా ముందుగా దాని విషయమై ప్రార్దించేవాడిని మనం కనుగొన్నాము.

సహోదరీ, నీవు నీవెంట్రుకలు కత్తెరించుకొనుటకు ముందు నీవు కొద్దిగా కూర్చొని దాని విషయమై ప్రభువు ఏమి చెప్పాడో అనే దానికోసం ప్రార్ధించగలవా? నీవు నీ ఒంటి మీద ధరించే ఆ మురికి చండాలపు దుస్తులు విషయమై ప్రభువు ఏం చెప్పాడో అని దాని నిమిత్తం కొద్దిగా ప్రార్దించగలవా? ఆయన నిన్ను ఖండించుటలేదా? దానిని నీవు ఖాతరు చేయనందుకు నేను భయపడుచున్నాను. నీవు ప్రార్దించుటకు ముందుగానే నీవు నీ మనసును దానితో సిద్ధపర్చుకొన్నావు. అది వాస్తవం.

ఒక రాత్రి నేను బోధించాను, అదేమిటంటే దేవుడు నీ నుండి అటువంటి వాటన్నిటినిబొత్తిగా కత్తిరించివేయును. నీ హక్కులన్నిటిని, నీవు వాటిని విడిచిపెట్టుటకు సిద్దపడితే? నీవిలా అంటావు "ఇది నాకున్న హక్కు, నేను అమెరికాదానిని. నేను కావాలనుకొన్నదానిని నేను చేస్తాను" అది సరే, దేవుని రాజ్యము నిమిత్తం వాటన్నిటిని వదులుకోవాటినికి నీవు సిద్ధమేనా? నీవొక గొట్టెవైతే నీవు నిరభ్యంతరముగా వదులుకొంటావు. ఒకవేళ మేకవైతే నీవు ఏమాత్రం వాటిని వదులుకోలేవు. మరి నిర్ణయం నీదే.

34. అట్లా ఇప్పుడు, నీవు కూతపెట్టి ఏడ్వవచ్చును మరియు అట్లానే నటించవచ్చును. మేక మరియు గొజ్జె ఏ గడ్డినైతే తింటుందో అదే గడ్డిని నీవును తినవచ్చును, పరిశుద్దభూమిలో వుండే ఒక కాపరిని నేనీమధ్యకాలంలో ఇక్కడ చూశాను. అతడు గొట్టెలను మేకలను గాడిదలను
మరియు ఒంటెలను అన్నింటిని ఒకే గడ్డి ప్రాంతమందు ఒకటేగుంపుగా సమకూర్చెను. నేను అడిగాను"కాపరి అనగా ఏమిటి అని?"

అతడు. చెప్పాడు "కాపరి అనగా నాటిని పెంచి అమ్మేవాడు. అమెరికాలో మీరు వారిని కౌబాయ్ అంటారు."

అంతట మరో సంగతి కూడా అడిగాను "సరే అతడు ఎందుకు మేకలను, మిగతా వాటిని అన్నిటి కలిపి మేపుచున్నాడు" అతడు అన్నాడు "అది మంచిదేనా?" "ఓహో అలాగా" అని అన్నాను.

అతడు అన్నాడు "కానీ బ్రదర్ బ్రెన్హామ్, రాత్రి వచ్చినప్పుడు (చీకటి పడినప్పుడు...గొజ్జె తప్ప మిగతావన్ని పచ్చికలోనే వుండిపోతాయి. గొట్టెను కంచెలోకి తోలుతారు, కాపరి వాటిని నీ హాని జరగకుండా వాటి ద్వారము దగ్గర పడుకుంటాడు".

"ఓహో అలాగా" అని నేనన్నాను. అది సంఘమునకు చక్కని పోలికగావుంది. నీవు కూడా అదే సంఘములో వుంటావు. అదే సువార్తను బట్టి అర్బటిస్తావు(ధ్వనిస్తావు). కానీ నీ స్వబావము అనే దాన్ని నిగ్రహించుకొనకపోతే, నీవెన్నడు నిజమైన కుమారునిగా గుర్తించబడలేవు. అది నిజం. అది నీ మనస్సులోకి కాదు. నీ హృదయములోకి ప్రవేశించాల్సివుంది.

35. నీవు అంటావు. “దానిని చేయటం నాకిష్టం, కానీ దాన్ని నేను చేయకపోవటమే మంచిది, ఎందుకంటే సంఘమునకు అది ఇష్టముండదు." నేను... సంఘము ఏదైతే చెబుతుందో అనే దాన్లో ఏ తేడా లేదండీ. అది దేవుడు చేర్చే దాన్నిబట్టి, నీ మనసాక్షి చెప్పేదాన్ని బట్టి, నీలోవున్న పరిశుద్దాత్మ చెప్పేదాన్ని బట్టి అది వుంటుంది. అవును. ఆయన అన్నాడు "నీవు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకములో వున్న కార్యాలను ప్రేమిస్తున్నావు కనుకనే దేవునిప్రేమ నీలో నిలిచియుండుటలేదు". కనుక నీవు సరిహద్దు విశ్వాసిగా వుండొద్దు. బయటికి వచ్చి ఒక ప్రక్కన మాత్రమే వుండుము. నీ రంగు ప్రకాశింపనిమ్ము.

ఇప్పుడు, మీరొక సంగతిని గమనించాలని నేను కోరుచున్నాను. యెహోషాపాతు చుట్టు గజిబిజి గందరగోళము ఆవరించినది. అతడు ఆ గుంపుతో కలిసిపోయాడు. వారన్నారు "నీవు మాతో వస్తావా? నీవు వచ్చి మా సంఘములో చేరుతావా?”

అతడన్నాడు "నుంచిది, మీ సమైఖ్యలో కలవటం మంచిదేనని నేననుకొంటున్నాను. అది మంచిదని బావిస్తున్నాను. ఇక్కడ నాకు ఇంకొంచం స్వేచ్చ వున్నట్లు అనిపిస్తుంది, ఈ అసోసియేషన్(కూటము)లో నేను చేరితే అది నాకు ఇంకొంచం మెరుగ్గా వుంటుందనిపిస్తుంది. తద్వారా ఇశ్రాయేలు వారితో సహవాసం చేసినట్టు వుంటుంది. (అప్పుటికే రాజ్యం రెండు బాగాలుగా విడిపోయినది, 1 .యూదా రాజ్యం 2. ఇశ్రాయేలు రాజ్యం. యెహోషాపాతు యూదాకి రాజుగా వున్నాడు -అను), మరి నేను.. ఇప్పుడు, ఇక్కడ ఈ అనుభవజ్ఞులగు (పాతతరము) వారు వున్నారు కాబట్టి నేను వారి అసోసియేషన్ (కూటము)లో కలిస్తే నాకు బాగుంటుంది" అని అనుకొన్నాడు
కొన్నిసార్లు నీవు దానిని చేయుట ద్వారా తప్పు చేసినట్టు అగను. అసోసియేషన్(సమాఖ్య, కూటము) అనే దానికి నేనేం వ్యతిరేకంగా మాట్లాడుట లేదండీ, కానీ నీవు మాత్రం దేవునితో ఇదివరకు ఎలాగైతే వున్నావో మరి అలాగే ఎల్లప్పుడు నిలిచియుండుము.

36. ఇప్పుడు, మొదటి సంగతి మీకు తెలుసా, అతడు అక్కడికి వెళ్ళాడు. మరి కొద్దికాలం తర్వాత, అతడు యెహోషాపాతుని అడిగాడు "నాతో కలిసి యుద్ధమునకు వచ్చెదవా?"

అందుకు ఇతడు "తప్పకుండా వస్తాను. ఏదేమైన మనం క్రైస్తవులం కదా, ఏదేమైన మనం విశ్వాసులం కదా...? అక్కడ". అతడు మిశ్రితమవ్వాలని కోరాడు (కలిసిమెలిసిపోవాలని కోరాడు) ఈ దినము లోకమంతా మిశ్రితమవ్వాలనే (కలగలసిపోవాలనే) చూస్తుంది. కానీ వేరై ప్రత్యేకముగా వుండేవారిని దేవుడు కోరుచున్నాడు.

37. మీకు తెలుసా, కొద్దికాలం క్రితం ఇక్కడ ఇండియానా ఉత్తర భాగాన ఒక సంఘము వుంది. దాని సభ్యులే ఆ సంఘకాపరిని ఎన్నుకొనే ప్రక్రియను గూర్చి నేను విన్నాను. వారంతా, నూటికి నూరు శాతం మంది అందముగా కనపడే, గొప్ప, పెద్ద, చక్కని రూపంగలిగిన ఒక వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.

మరి నేను ముసలదగు ఒక అవ్వను అడిగాను. నేను అన్నాను "అలా ఎలా మీరు ఎన్నుకుంటారు?" తమకి పాస్టర్గా వుండే అవకాశము వారికిచ్చి అతడిని తమ సంఘములోనికి తెచ్చినప్పుడు వారొక బైబిల్ ని ఆ సహోదరునికి ఇచ్చుటను నేను చూచితిని. మరి నేను అన్నాను “నేనెల్లప్పుడు అంటుంటాను. అతడు (పాస్టర్) చక్కని రూపంగలవాడు (అందగాడు).” నేను అన్నాను "సహోదరి, అది సరిపోదుగా, అతడేం బోధించగలడు? దేనితో అతడు పోషించగలడు? కొన్ని ప్రతక్ష్యతకార్యక్రమములను అతడు బోధించునా? గులాబి కోసం, పుష్పముల కోసం అతడు మాట్లాడుతాడా? లేదా తర్వాత ప్రెసిడెంట్గా ఎవరుండబోవుతున్నారు అనేదానినా? కొన్ని బేస్బాల్ క్రీడలు గురించి చెబుతాడు? లేదా కొన్ని చేపలవేపుడు లేదా విందుసమావేశముల గూర్చియా, లేక అతడు దేవుని వాక్యమును బోధించి, దాని మీదనే స్థిరంగా నిలబడతాడా?" అవును, అయ్యా,

మరి నేను... ఒక యవ్వన స్త్రీ నేను అన్నాను "మంచిది, మరి నీ సంగతి ఏమటి?" ఆమె దాని గురించి సాకులు చెప్పినది.

కానీ చూడు జనులు ఆలాగునే ఎన్నుకుంటారు. వెలిచూపునుబట్టి వారు ఎన్నుకుంటారు. ఒకసారి ఇశ్రాయేలులో సౌలు స్థానంను భర్తీచేయుటకు తగిన వ్యక్తికోసం ఒక ఎన్నిక జరుగవలిసి వచ్చెను. మరి, సౌలు యొక్క తల, భూజములు తన సైన్యములో వున్న వారందరి కంటే ఎత్తుగా వుండెను. కావున ప్రవక్త లేచి కొమ్ములో తైలము నింపుకొని యెష్షయి కుమారులలో ఒకనిని రాజుగా అభిషేకించుటకు పోయెను. ప్రభువు అతనితో వెళ్ళమని చెప్పెను, అంతే కాదు "నేను పిలిచిన (ఎన్నుకొనిన) వాడు వచ్చేవరకు నీవు అభిషేకింపవలదు" అని ఆయన చెప్పెను.
మరి వారు అక్కడ పరుగులు పెట్టి పెద్దవాడైన వానిని, గొప్ప ఏడడుగుల గల ఎత్తున్న వాడిని విలువబెట్టి "మై, సరిగ్గా వస్త్రాలు ధరింపచేసి, ప్రసంగవేదిక మీద అతనిని నిలబెడితే చూడటానికి చాలా బాగుంటుంది కదా?” అని చెప్పిరి. మరి దానంతటి గూర్చి.

38. అమెరికా కోరునుదంతా నేడు అదే. పెంతెకోస్తు... అది ఇక్కడ వుంది, సిద్ధంగా వుండు. పెంతెకోస్తు నిండా హాలివుడ్ సువార్తే నిండుకుపోయివుంది. కొద్దికాలం క్రితం కెంటకీ రాష్ట్రం లూయిస్విలనందు ఒక గుంపు జనులు ఒక కూటమును జరిపిరి. నా ఆత్మపోషణ నిమిత్తం నేను కూడా ఆ కూటములు జరుగుచోటుకి వెళ్ళాను. నేను అక్కడికి చేరుకొన్నాను, అక్కడ వేదిక మీద ఒక స్త్రీ చెవులు నిండా రింగులు పెట్టుకొని, ఒక రకమగు వస్త్రము ధరించినదై వారి మధ్యలో కుమ్మిరింపబడినదానివలే మారి వేదిక మీద అటుఇటు పరుగులుపెట్టుచూ, కేకలు పెట్టుచూ "హల్లెలూయా. తర్వాత యాభై డాలర్లు ఎవరు ఇస్తారు" అంటు అడుగుచుండెను. నేనెన్నడూ అటువంటి దానిని చూడలేదు. ఇకపోతే సంగీత విషయానికి వస్తే అక్కడంతా రాక్ అండ్ రోల్, ఊగీ-బూగీ సంగీతమే. అది వేదికలా లేదు అది ఒక లోకసంబంధమైన చోటుగా తలపించినది. నేను ఉహించాను, ఇంచుమించు... బహుశా ఆ భవనం కూలిపోవునేమోనని నాకనిపించింది కనుక నేను బయటకు వచ్చేసాను. ప్రజలు దేవునికి ఎంత దూరంగా తొలిగిపోతున్నారో చూడండి... నేను పెంతెకోస్తుని కాబట్టి దేవుడు నన్ను ఆ దినాన నన్ను లోనికి తీసుకుంటాడని నీవు ఎంతమాత్రం అనుకోవద్దు. ఆయన తీసికోడు. సహోదరుడా నీలో విషయం వుండాలి. అది నిజం

గమనించండి, ఇక్కడ ఇతడు (రాజు-అను) కలిసిపోతున్నాడు, అవిశ్వాసులతో మమేకం అయి పోతున్నాడు కనుక వారు ఏకమై మోయాబు రాజుతో యుద్ధము చేయుటకై అరణ్యమందు ఏడుదినములు చుట్టు తిరిగిరి, వారక్కడ వుండగా వారికి నీటి కొరత ఏర్పడెననే సంగతి వారికి తెలిసివచ్చెను. వారి నీటి సరఫర(లభ్యత) నిలిచిపోయింది. నీరు లేకపోతే ఇక్కట్లు (అగచాట్లు) అన్నీ ఇన్నీ కావు అనే సంగతి మీకు తెలీదా?

39. ఇప్పుడు, సాధారణముగా మనం నీటి పన్నులు చెల్లించకపోతే ప్రభుత్వం వారు మనకి నీటి సరఫరాను నిలిపివేస్తారు కదా. అప్పుడు ఇల్లంతా ఎండిపోవును.

దేవుని ప్రజలకి కూడా అదే జరుగును. వారు వెల చెల్లించకపోతే, దేవుడు వారికి నీటి లభ్యతను నిలిపివేస్తాడు. అది అంతే మరి.

మీకు తెలుసా, ఆ అరణ్యమందు... నువ్వు ఏ అరణ్యము (ఎడారి)కైన వెళ్ళుము. ఆ కారణము చేతనే సంపూర్ణ సువార్త సభ్యులగు మీరు, ఇంకా తదితరులు దైవీకస్వస్థతను నమ్మలేకపోతున్నారు. మీ నీరు ఎండిపోయింది. అది నిజం. ఆ అరణ్యములో... “సంపూర్ణ సువార్త?” అని మీరు అనొచ్చును.

దైవీకస్వస్థత విషయములో ఒక పెంతకోస్తు పాస్టరు నాతో వ్యావహరించిన తీరు అత్యంత భాదాకరముగా నాకుండెను. ఒక పట్టణములో నేను భారీకూటాలు జరిగించుచుంటిని, అక్కడ
వున్న ఒక సంఘము ఆ కూటములకి ఆర్ధిక సహకారం అందించుచుండెను. కూటములకి అవసరమయ్యే కుర్చీల కోసం అక్కడున్న ఒక పైంతకోస్తు పాస్టర్ని అద్దె కూర్చీల కోసం. సంప్రదించి అడిగాను. అతడన్నాడు "దైవీక స్వస్థతను నమ్మే ఏ ఒక్కరిని కూడా నా కుర్చీలమీద కూర్చోనివ్వను" ఆ మాటలన్నిది ఒక పెంతకోస్తు పాస్టరండీ. వాస్తవం. అవును. ఈ రాత్రి నీవు కుర్చొన్న చోటు నుండి దాదాపు కూతవేటు దూరంలో చేరుకోలేకపోవుచుండిరి. అది నిజం. నేననుకొనుచున్నాను, దానికంటే ఇంకొంచం దూరంలో, రెండవందల మైళ్ళు దూరంలోనిది మనం పొందాము, కానీ చూడండి, వారు పేల్చుచున్న పెద్ద తుపాకీల వలె వేడు అది వున్నది.

కానీ గమనించండి. దానినే అతను పలికినది. వాటిని ఇచ్చుటకు అతడు నిరాకరించాడు. జనులు నిలబడివల్సి వచ్చింది. మేము ఇక చేసేదేంలేక కూటములను అలాగే జరిపించాము. 40. మీరు గమనించండీ, ఎడారి(అరణ్యమందు) నందు నీకు ఎక్కడ చూచినా పల్లేరు కాయలు, ముళ్ళపొదలే కనపడుతుంటాయి. అదొక చిన్నది కానివ్వండి, లేక ఇంకా అలాంటిది ఏదైన కానివ్వండీ నేను లెక్కచేయను, దానితో కాస్త జాగ్రత్తగా వుండాలి, ఎందుకంటే దానికి ముళు ంటాయి. అవి ముళ్ళుగా ఎందుకు అయ్యాయో మీకు తెలుసా? నీరు సరిగ్గా అందని కారణంచేతనే అవి ముళ్ళుగా మారతాయి. నీటిలభ్యత ఎక్కడ పుండదో, అక్కడ ముళ్ళు ఏర్పడును. ఎక్కడైతే నీరు వుంటుందో, ఆ చెట్టు ఏపుగా పెరిగి మృదువైన ఆకులునిచ్చెను.

సంఘముతో వున్న సంగతి కూడా మరి అదేనండీ. ఎందుకింత దూరం(హంగామా)? "నేను ఏకత్వం" "నేను అసెంబ్లీ" "నేను ఇది" "నేను మరి అది” “ఓ, నేను చర్చిఆఫ్గడ్కి చెంది యున్నాను. మేమొక గుంపును కలిగియున్నాము, వారు ఒక డేగ యొక్క ఎతైన గూటికి చెందియుండీ ఇది అది మరియు మరొకటి" అందురు, అంతేకాక "ఓ, దానిని మేము నమ్మము, ఈ రీతిన నాట్యమాడుటను మేము నమ్మెదము, ఇటువంటి వాటిని చేయుదుము. స్త్రీలకి స్వేచ్ఛ అవసరం... ఓ... దీనిని నేను చేయుదును" అందురు. ఓ. మై, ఏమిటీ సంగతి? ఇలా అనుటకు కారణం నీటి లభ్యత తెగిపోయినందునే. అది నిజం. అది వాస్తవం.

వారు అక్కడ నీరు లేని సంగతిని తెలుసుకున్నారు. నీకు నీరు లేనట్లైతే నీకు జీవములేనట్లే. అప్పుడు వారిట్లు అనిరి "దీని గురించి మనం ఏమి చేయుదుము? మనము ఒక ప్రార్ధనా కూటం ను ఏర్పాటుచేసికొందాం" అప్పుడు దానిని వారు ఆరంభించుట అనేది నిజంగా అప్రమాణికం? (టేపులో ఈల శబ్దం లాంటిది వచ్చుచున్నందున బ్రదర్ బెన్హామ్ మాటలు తేటగా వినిపించుట్లేదు - సంపా) నీవు విడిచిపెట్టే పోయేముందు నీవు ప్రార్ధించాలి. నీవు చేయవల్సింది అదే...?... నీవు వెళ్ళేముందు...దాని విషయమై నీవు ప్రార్థించాలి...?... వారక్కడికి చేరుకున్న తర్వాత...?... ఇశ్రాయేలు రాజు యొక్క మనుష్యులు అక్కడికి వచ్చిచెప్పారు. ఇలా చెప్పారు. 'మీకు ఒక సంగతి తెలుసా? ఇక్కడ ఎలీషా అనే పేరుగల ఒక మనుష్యుడు మనకున్నాడు. అతడు ఏలీయా చేతులమీద నీళ్ళుపోసిన వాడు.' మరో మాటలు అనాలంటే
"అతని సహవాసం చాలా బాగుండును. నిజ ప్రవక్తతో అతనికి సంబంధం వుండినది" ఒకే రెక్కలుగల పక్షులు ఒక్కటిగా కలిసి ఎగురును. (ఏ జాతి పక్షి ఆ జాతి గూటికి చేరును-అను). అది నిజమండీ.

41. మీరు అటు ఇటు పరుగులు పెడుతూ, మీకిష్టమైనట్లు జీవిస్తూ, తర్వాత లోనికి వచ్చి మిమ్మును మీరు క్రైస్తవులని పిలిపించుకొనుచున్నారు. ఇక మిమ్మును ఎవరు నమ్ముతారు? జనులు మిమ్మును నమ్మాలని మీరెలా కోరుకొంటారు? మీరు వచ్చి తమకోసం ప్రార్ధించందని వారు మిమ్మును పిలువకపోయినట్లైతే అందులో ఆశ్చర్యపడాల్సిన పన్లేదు. చూశారా. అది నిజం. ఇప్పుడు ఒకే రెక్కలుగల పక్షులు ఒక్కటిగానే కలిసి ఎగురును.

మరి వారన్నారు "మంచిది, ఈ మనిషి తిష్పీయుడగు ఏలీయా చేతులమీద నీళ్ళుపోసిన వాడు. అతనితో ఇతడికి మంచి సంబంధం వుంది" ఎందుచే?... పాత... యెహోషాపాతు ఒక ఆత్మీయుడు, ప్రవక్తను సందర్శించాలనేది అతనికుండే మొట్టమొదటి ఆలోచన. మరి ఒక నిజదేవుని కుమారుడు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, అతను చేసే మొదటిపని దేవుని యొద్దకు వెళ్ళుట, తిన్నగా దేవుని యొద్దకి వెళ్ళిపోతాడు.

అంతట యెహోషాపాతు అన్నాడు "సరే అతనిని త్వరగా తీసుకొనిరండీ"

కనుక వారు అచ్చటికి దిగిపోయారు. అతని యొద్దకి చేరుకున్నారు. బహుశా అక్కడ ప్రవక్త ఏలీషా లేఖనాలు చదువుచుండునేమో. రాజు మరియు వారంతా ఆ ప్రవక్త యొద్దకి వచ్చినప్పుడు... మంచిది, ఇక్కడ వారు లోనికి వచ్చారు అప్పుడు వారు అడిగారు 'మేము ఏం చెయ్యాలి?"

42. మరి. ఎలీషా న్యాయబద్ధమగు కోపము తెచ్చుకొనెను. ఓ, కొన్నిసార్లు ఎలీషా కోపం అలా చెలరేగిపోయేది. అతడు ఆ పాత యెహోరాము అక్కడ నిలబడి వుండుట చూచి మండిపడుచుండెను, అతడు ఇలా అనెను "నీ తల్లి నీ తండ్రీ ఆశ్రయించిన ప్రవక్త యొద్దకి పోకపొయ్యావా. నా దగ్గరికి ఎందుకు వచ్చావు?" హూష్, మై, నిమ్మళంగా (నింపాదిగా) లేడు, అతడు అలా వున్నాడు? "నీవు తిరిగి నీ అన్యదేవుళ్ళు వైపుకి ఎందుకు వెళ్ళకూడదు? నాదగ్గరకి ఎందుకు వచ్చావు?" అని అడిగాడు. అతడు ఒక ప్రవక్త, ప్రభువు యొక్క సేవకుడు, బలమైనవాడు, రెండుపాళ్ళు ఆత్మను పొందిన వాడు. "నీతల్లి దేవత యెదకి, మరియు నీతండ్రీ దేవత యొద్దకి ఎందుకు వెళ్ళలేదు?" అని అడిగాడు.

మరింకా అతడు ఏమంటున్నాడో వినండి. "యెహోషాపాతు మీద నాకు గౌరవభావం లేక పోయినట్లైతే నేను నీముఖం కూడా చూచేవాడిని కాదు" హూష్, రేపబడుట అనే దాని గూర్చియేనా నీవు మాట్లాడేది?

ఈ రాత్రి అదే కార్యము జరుగుచున్నదని నేను నమ్ముచున్నాను. ఈ అమెరికా క్షేమము కోసం ప్రార్దించే ఈ దేశపు నిజక్రైస్తవులను దేవుడు గౌరవింపకపోయినట్లైతే ఈ అమెరికా ఎన్నడో ముక్కముక్కలుగా పేలిపోయివుండేదని, అది మునిగిపోయి వుండేదని నేను
నమ్ముచున్నాను. ఈపాటికే అవి జరిగియుండేవని నా నమ్మకం. ఈ దేశము యొక్క తిరిగిజన్మించిన దేవునిపిల్లల యొక్క యధార్ధమగు, నిజాయితీగల ప్రార్ధనలను దేవుడు గౌరవింపకపోయిన యెడల ఈపాటికే ఈ దేశమును జపానువారో లేక ఇంకెవరో ఆక్రమించియుండేవారు. అది నిజం.

అన్నాడు, "ఆ నీతిమంతుని సమక్షం(ఉనికి)న నేను బాగా రేపబడివుంటే, ఆ విధంగా విసుగుచెందితే ప్రభువుకి ఏ పరిచర్య చేయుటకును అది సరైన సమయం కాదు".

43. అతడు ఏం అన్నాడో మీకు తెలుసా? ఇలా అన్నాడు" అయితే నీవు వెళ్ళి ఒక వాయిద్యకుడిని తీసికొనిరమ్ము, వీణె వాయించగల వాడిని వాయించటం ఆరంభించనియ్యమనండీ". ఇప్పుడు, సంఘములో వాయిద్యములు వాయించుటను నమ్మని వారలారా, మరి మీరు దాని గూర్చి ఏమంటారు? చెప్పండి, అడిగాడు "వెళ్ళి ఒక వాయిద్యకుడిని తీసికొనిరండి. నేడు నేను, నేను బాగా విసుగు చెందాను. నీతి గల నా కోసాగ్ని రగిలి పోవుచున్నది. ఆ అబ్బాయి, ఆ సరిహద్దు భోధకుడు ఇచ్చటికి వచ్చియున్నాడు. అతడు నిలబడి పిల్లల్ని బాదుచూ, పొరపడుచూ, దానిని జరిగించుచుండెను. ఓ నేను ఎలా అతనిని పట్టుకొందును అన్నాడు. ఇప్పుడు నేనొక దర్శనమును చూడవల్సివుంది కనుక ఒక వాయిద్యకుడిని తీసికొనిరమ్ము."

44. వారు వెళ్ళి మరి వారు సమస్త సంగీతమును తెచ్చిరి. వారు ఒక సంగీతమును వాయించు చుండవల్సివుంది, ఒక మంచికీర్తనను. మొట్టమొదటిగ మీకు తెలుసా, సియోనుకి తిరిగిరండీ, అనుచు వారు పాడినప్పుడు, సంగీతం ఆరంభించినప్పుడు, పిల్లలు తమ హృదయపూర్వకముగా పాడుట ఆరంభించినప్పుడు ఒక కార్యము జరిగినది, ప్రభువు ఆత్మ ప్రవక్త మీదికి వచ్చినది.

మరి ఒక నిజమైన, పాతకాలపు ఉజ్జీవము, దైవీకమగు పాటలు మరియు పశ్చాతాముల మొదలగునవి దేవుని ఆత్మను ప్రవక్త మీదికి ఆనాడు తెచ్చియున్నట్లైతే, నిశ్చయముగా నేడుకూడా అదే కార్యమును తీసికొని వచ్చును. మరి గమనించండి, మార్గము తెరువబడుటను అతడు చూడగోరాడు. ఒక ఉజ్జీవమును కలిగియుండుటకు వున్నటువంటి ఏకైక మార్గము అదేనండీ.

కావున లోనికి వచ్చిన పాపులు పశ్చాతపము నొందిరి. సంగీతవాయిద్యములు వాయించబడెను మరియు ప్రవక్త ఒక దర్శనమును చూచెను.

45. మరి నీవు నీముందున్న మార్గాన్ని తెలిసికొనుటకు ఒకే ఒక విధానమున్నది. అదేమిటనగా పాతకాలపు పద్ధతలు(భక్తి), ఆత్మీయ ఉజ్జీవమును కలిగియుండుట, అక్కడ నీ హృదయాంత రంగములో నుండి దేవునికి హల్లెలూయ శబ్దాలు పెల్లుభీకును, పాతకాలపు భక్తి, పరిశుద్దాత్మ ద్వారా పంపబడిన ఉజ్జీవము ఆ చోటును తాకును. అప్పుడు దేవుడు సంగతులను నీకు బయలుపర్చుటకు ఆరంభించును. అప్పుడు ఈ నిజక్రైస్తవులు అంతగా దానిని ఎందుకు పట్టుకొని వ్రేలాడి యుండిరో, ఎందుకు నీకొరకు ప్రార్దించుచుండిరో నీవు చూచి ఆశ్చర్యపడతావు.

ఎంతగొప్ప ఉజ్జీవమది. అతడు ఆత్మలో పట్టబడెను.
ఇప్పుడు, ఈ జనులు నాట్యమాడుటకు గతకారణం వారు నాట్యమాడకుంటే, నాట్యమాడే ఆత్మను పొందుకోవాలి. బంతిఆట ఆత్మను నీవు పొందుకొనకుంటే బంతిఆటను నీవు ఆడలేవు. నీవు దేనినైన పొందాలంటే దానికి చెందిన ఆత్మను నీవు పొందవలెను.

ప్రీప్పోర్టులో, మరి ఇతరచోట్ల ఉజ్జీమనే దాన్ని నీవు చూడాలంటే, మొదటిగా సంఘము ఉజ్జీవపు ఆత్మను పొందుకోవాలి. దేవుడు వచ్చి అద్భుతాలను చేయగలడు, ఆయన సూచకక్రియలను చూపగలడు. ఆయన చేతిని చాపి రోగులను, బాదింపబడువారిని బాగు చేయగలడు. బోధకుడు తన శక్తి అంతటిలో సువార్తను బోధించవచ్చును, కానీ సంఘము ఉ జ్జీవపు ఆత్మతో నింపబడకపోతే ఉజ్జీవమనేది సంఘములో కనబడదు.

46. అమెరికన్లు వెళ్ళారు...?.. వేలాదిసార్లు వేలకొలదిగా గొప్పఅద్భుతాలు, సూచనలు, మహాత్కార్యాలు జరిగాయి, మండుచున్న హృదయాలు గల సువార్తికులు అనేకులు లేచారు, ఈ రాత్రి తీర్మానాలు తీసికోవల్సిన పురుషులు... వారిలో కొందరు సరిహద్దులో నిలిచియున్నారు. వారిలో అనేకులు, గొప్పసేవకులు దేవునితట్టు తిరిగి పరిశుద్దాత్మను పొందుచుండిరి.

సువార్తలోకములో వున్న ప్రముఖ అమెరికా దైవసేవకుడు ఒకరోజు ఇండియానాపోలీస్కి వచ్చాడు. నేను అక్కడ వున్నాను, అతడు వచ్చి పరిశుద్దాత్మ బాప్తీస్మం పొందుకొన్నాడు. అవునయ్య.

ఓ, మై. రాజ్యములు మ్రుక్కలగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది. బైబిల్ ముందే చెప్పిన సూచనలు చోటుచేసికొంటున్నవి. మనము కాలమునకు ముగింపులో వున్నాము. నీవు నడవగోరితే అక్కడ వెలుగువున్నది.

47. మరి గమనించండి, ఈ మనిషి తనెంత సంతోషముగా వున్నాడో, తానెలా విడిపించబడ్డాడో చెప్పుచుండెను అన్నాడు "బ్రదర్ బ్రెన్హామ్, వేరొక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి యొక్క సలహామేరకు నేను వచ్చాను." మరి వారు ఎవరు అనేది నాకు చెప్పాడు. వారిలో ఒకరి పేరు మోరీస్ రీడ్హెడ్, ఇంకా ఇతరులనేకులు తామెలా పరిశుద్దాత్మను పొందుకొన్నారో, వారి జీవితాలు ఏలాగు విప్లవాత్మకముగా మారినవో తెలిపాడు. మరి ఇప్పుడు వారు గొప్పసేవ చేయుచుండిరి.

మరొక చెప్పుకోదగిన వ్యక్తి(గొప్పసేవకుడు) అతిత్వరలోనే అతడు ఏమిటో అనే దానిని తెలుపుటకుబోవుచున్నాడు. అతడొక వ్యాఖ్యను చేసాడు. "సంఘరాజకీయములు చేప్పేదానిని నేను లెక్కచేయును. నాకు మాత్రం దేవుడే కావాలి".

పెంతెకోస్తూ, నీవు నీ డాలును నీ కవచమును తిరిగి తీసికొనుట మంచిది. నీవు కనిపెట్టకపోతే బాప్టిస్టులు, ప్రెస్పిటేరియన్లు, వారాంతా నిన్ను దాటిపోదురు. “దేవుడు ఈ రాళ్ళవలన అబ్రహాముకి పిల్లలు పుట్టించగలడు". నేను అసెంబ్లీకి,లేదా చర్చిఆఫ్డ్కి, లేదా యూపిసికి చెందినవాడిని బావించకు, అందువల్లే నాకు నేను దానిని సిద్ధపర్చుకొంటిని, దానిని నీవు ఎన్నడు సిద్ధపర్చుకోలేవు అవును. మార్గమును సిద్ధపర్చువాడు దేవుడేనండీ. నీవు కేవలడా దానియందు నడవటమే
48. గమనించండి, అదొకసూచన, పెంతెకోస్తు కేవలం వేసెను....?... “ఓ, అది అద్భుతము కాదా? మై మై, ఓ, తల్లీ, మేము ఇక్కడ ఇక ఎంతమాత్రం వుండలేము. మేము ప్రార్దించవల్సివుంది" ప్రతిఒక్కరు ప్రార్ధించవల్సివుంది. మీకు తెలుసా మొదటిగా ఆయన కొద్దికాలం గమనించును, తదుపరి ఆయన ఇలా అనును "ఓ, మంచిది. అదంతా మంచిదేనని నేను అనుకొనుచున్నాను". దేవుడొక దానిని తయారు చేయుచున్నాడు, నీవుంటావు “హమ్మ్, అవును మరొక ఉజ్జీవమున్నది".

ఓ, మై, అప్పుడు ఇక్కడ బాప్టిస్టులు వచ్చుచున్నారు, అలాగే ప్రెస్పిటేరియన్లు, నాజరీన్లు, పిలిగ్రీమ్ హోలీనెస్లు, వారంతా దానితోపాటు వచ్చుచున్నారు, పరిశుద్దాత్మ బాప్తీస్మమును పొందికొనుటకు చూచుచున్నారు. వారు సాధ్యమైనంత వేగముగా కదిలివచ్చి దానిని పట్టుకొనుచున్నారు. నిజం. "దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకి పిల్లల్ని వుట్టించగలడు". నీవు దానితో కలిసి నడువలేవు, దేవుడు దానిని అటువైపుకి త్రిప్పి వేరొకరికి దానిని ఇచ్చును. అది ఖచ్చితంగా వాస్తవం. గొప్ప కార్యములు ఇప్పుడు తయారగుచున్నవి. ఆమేన్.

ఇప్పుడు, అతడు అన్నాడు "ఇప్పుడు, నేనొక దర్శనమును చూచాను. నేను దానిని చూచాను. ఏమి చేయాలో నాకు తెలిసినది."

మరి నేను మీతో చెప్పుచున్నాను సహోదరుడా, నేడు సంఘము దర్శనమును పొందుకోలేదు, వారికి ఎక్కువ ప్రార్థనపుండొచ్చును. వారున్నదానికంటే మరెక్కువ ఆత్మీయంగా వారుండవచ్చును. ఒక దర్శనమనేది లేనట్లైతే, ఎవరో ఒకరు దర్శనమును చూడకుండనట్లైతే, ప్రభువు రాకడను చూచుట, ఇప్పుడు మన చుట్టు జరుగుచున్న సంగతులను చూడనట్లైతే, అంత్యదినములయందు ఏదైతే జరుగునని చెప్పబడినవో అవి జరుగుటను చూడనట్లైతే, మరలాగే మనం వాటియందు నేడు జీవిస్తున్నామని చూడనట్లైతే...

49. బైబిల్ని చదువుటకు బదులు మనం ప్రేమకధలను చదువుచున్నాము. చదవాల్సిన దానిని చదువుటకు బదులు మిగతావన్ని చదువుచున్నాము. మనము దేవునిబైబిల్ని చదవాల్సిన వారమైవున్నాము, మోకాళ్ళ మీద పడవల్సినవారమైయున్నాము, దేవుడు మనకి సహాయం చేయునట్లు ఎడతెగక ప్రార్ధించవల్సినవారమై యున్నాము, ఆత్మలో మేల్కొల్పబడి ప్రభువుకి మొఱ్ఱపెట్టవల్సివుంది, కానీ మనం వాటిని చెయ్యట్లేదు. ఇప్పుడు, గమనించండి. అప్పుడు తాను దర్శనమును చూచితినని చెప్పినప్పుడు, దారి కనబడినది... "ఇప్పుడు" అతడన్నాడు. "మీరు చెయ్యాల్సిన మొట్టమొదటి పని ఏమనగా మీరు వెళ్ళి ఈ లోయనిండా గోతులను త్రవ్వించుడి. మీరు త్రొవ్వగల్గినంత మట్టుకు లోతుగా త్రొవ్వుడి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఏగాలిని చూడరు, ఏ వర్షమును చూడరు, కానీ ఈ లోయనిండా నీరు నిండియుండుటను చూచెదరు, ఎక్కువ గోతులు ఎక్కువ నీరు".

అతడేమి చూచాడు? ఇదివరకు మోషే మాట్లాడిన అదే ఆత్మీయబండను మోషే కొట్టిన అదే ఆత్మీయబండను గూర్చిన దర్శనమును అతడు చూచాడు. కొద్దిసేపటి క్రితమే అతడు
బండతో మాట్లాడియున్నాడు. మరి అది నీరు ఇచ్చుట(పోయుట)కు సిద్దముగా వుండినది, అయితే వారు చెయ్యల్సిందంతా ఆ లోయనిండా గోతులను త్రవ్వించడమే తరువాయి.

50. ఆ కొట్టబడిన ఆ బండే ఈ రాత్రి ఇక్కడ వుండినది. ప్రజలైన మీరు గోతులను తవ్వుచున్నట్లైతే క్లిష్టమైనవన్ని తొలిగించినట్లైతే, అది ప్రీప్పోర్టును శిట్టనిలువునా చీల్చగల పాతకాలపు పరిశుద్దాత్మ ఉజ్జీవమును క్రుమ్మరించుటకు సిద్ధముగా వున్నది.

ఒక్క సంగతికి వ్యతిరేకముగా మీరు త్రవ్వినయెడల, ఐబ్బాక్సుల్లో నిల్వవుంచిన బీరా క్యాన్లను బయటపడేసి, పరిశుద్దాత్మకి త్రోవను కలిగించుము. పైకి కనిపిస్తున్న కొనను నీవుకొట్టిన ప్రతీసారి దానిని తీసి పారవేయుము. నీవు లోతుకి త్రవ్వే కొద్దీ నీటిని పుష్కలంగా పొందుతావు. నీవు చెయ్యవల్సిందల్లా దానికి తగిన దారిని ఏర్పర్చటమే.

అక్కడ ఎంత ఎక్కువబోధ (ప్రసంగం) చేస్తున్నా ఏం వుండదు. ఎన్ని దర్శనాలున్నా ఏమీ వుండదు, ఉండాల్సిన అంశం, ముఖ్యాంశం ఏదనగా నీటికొరకు సిద్ధపాటుజరిగించుట. గోతులను త్రవ్వించుము.

ఈ రాత్రి మనం జరిగించాల్సిందే అదేనండీ, పరిశుద్దాత్మ కుమ్మరింపబడుటకు తగిన సిద్ధపాట్లును చేయాలి. దానిని నీ ఇంట్లో చేయుము. దానిని నీ సంఘములో చేయుము. నీనిమిత్తం చేయుము. ప్రతీదానిని తన్నిబయటికి నెట్టివేయుము, నీటికోసం సిద్దపడివుండుము. నీవు తగిన సిద్ధపాట్లు చేసినట్లైతే ఉదృతముగా తన్నుకొని బయటకి ప్రవహించే ఒక నీటిఊట వచ్చును. నీవు తగిన సిద్ధపాటు చెయ్యకపోతే, దానిని నీవెన్నడు చూడలేవు.

ఇప్పుడు, ఈ రాత్రి అది సంఘము మీద ఆధారపడివుంది. ఒక చక్కని టెంటువేసారు ఇక్కడ, చక్కని వరసలు, కుర్చీలు, చక్కని జనులు, చక్కని పాటలు సాడుట. మనకి ఒక అద్భుతమైన రక్షకుడు వున్నాడు. కానీ ప్రతీదానిని... ప్రతీదానిని ప్రక్కకి నెట్టుము, సుళువుగా చిక్కులు పెట్టే ప్రతీపాపమును ప్రక్కకు నెట్టివేయుము.

51. “బ్రదర్ బ్రెన్హామ్, నేను ఏదీ చెయ్యను". బహుశా అదే సంగతి అయ్యివుండొచ్చును. అదే దానికి అసలు సమస్య. అది మెరుగైనదని ( చెయ్యవల్సినదని) తెలిసిన తర్వాత కూడా దానిని చెయ్యకపోవటం ఎక్కువ పాపము. అది నిజం. "మేలైనది చేయటం తెలిసి కూడా దానిని చెయ్యకపోయే వానికి అది పాపమగును" నీవు సిద్ధపాటు చెయ్యాలి. ఏమీ చెయ్యకపోవటమనేది ఇంకా అధ్వాన్నం. దక్షణాదివారగు మీకు మీ చరిత్ర గుర్తుందా? ఇక్కడ అప్పుడు, గ్రాంట్ అనే అప్పటి మిలిటరీ అధికారి ఈ నది అంతట తిష్టవేసివున్నప్పుడు... అతడికి ఒక కొడుకు వున్నాడు. అతడు కాపలాదారుని వృత్తి పనివాడు. తిరుగుబాటు దారులు కూడా ఆ నది అంతట పొంచియున్నారు. మరి ఈ బాలుడు ఒకసారి తన ప్రియురాలి యొక్క ఆలోచన (కలలుప్రపంచం)లో పడిపోయి ఒంటరిగా తాను అక్కడ నడుచుకొన చుండెను. అతడు తన విధినిర్వహణ బాధ్యతను విడిచి తన ప్రియురాలికి కొన్ని ఊదరంగ పువ్వులను పంపునిమిత్తం దిగువునకు పోయెను. ఉద్దేశ్యపూర్వకంగా చెయ్యలేదండీ
తన ప్రియురాలికి కొన్ని పుష్పములు పంపే ఉద్దేశ్యం కొరకు వెళ్ళాడు. మరి సరిగ్గా అప్పుడే, దక్షణాది సైన్యంలోని ఒక గుఢాచారి కంట్లో అతడు పడ్డాడు. వెంటనే వారు రంగప్రవేశం చేశారు. వారు వచ్చి చుట్టు కలియచూచారు. తమకంటే రెండుమూడు రెట్లు ఎక్కువగు జనరల్ గ్రాంట్ సైన్యం అక్కడ వుండుటను వారు కనుగొన్నారు.

52. సరే. అప్పుడు ఏం జరిగింది? ఆ బాలుడికి ఏం జరిగినదో తెలియకుండానే అతడు తన విధినిర్వహణలోకి తిరిగివచ్చేసాడు. కానీ అప్పటికే ఆ గుఢాచారి అక్కడికి చేరుకొన్నాడు. మరి అప్పుడేం జరిగినది? వారు ఉప్పెనలా ఎగిసిపడి ఆ నది తీరమంతా చుట్టుమూగి వారిని వెనక్కి తరిమివేసారు. ఒకగంట తరువాత ఆ బాలుడు కాల్చి చంపబడెను. తాను కావాలని... అది... పూలు కోసుకోటానికి వారికి ఎలాంటి అభ్యంతరం లేదు. వారికి ఎలాంటి అత్యంతరం... అతడు కావాలని అది చెయ్యలేదు, అనుకోకుండా అలా జరిగిపోయినది. నిజానికి అతడు తన విధినిర్వహణలో వుండి వున్నట్లైతే అలా జరిగివుండేది కాదు(శత్రువుకి అవకాశం దొరికేది కాదు - అను). అతడు చేసినతప్పుల్లా తన విధినిర్వహణ విడిచి బయటికి వెళ్ళుటే, తాను సక్రమంగా విధిని నిర్వర్తించి వుంటే అలా జరిగివుండేది కాదు. అక్కడంతా చెడగొట్టింది. అతడే.(అతడు బాధ్యతలను విడిచి తిరుగుట వల్లే అదంతా చెడిపోయింది).

53. మరి ఆ బాధ్యత ఈ రాత్రిలైఫ్బర్నికల్ ముందు, అలాగే మిగతా టబర్నికల్స్(చర్చీల) ముందు, మరలాగే ప్రీప్పోర్టు, లూసియానానందున్న సంఘములన్నిట ముందు ఉంచబడినది. దేవుడు ఇక్కడ వున్నాడు, ఒక ఉప్పెన తీసికొని వచ్చుటకు. అది నువ్వు ఏమి చేయుచున్నావు అనే దాన్ని బట్టికాదండీ, నువ్వు ఏం చెయ్యాలో దాన్ని చెయ్యుటలో విఫలమైనందు వలననే సూమా.

దాని విషయం మనం ఏదో ఒకటి చేద్దాం. "దేవా, నాకు తెల్సినంత మట్టుకు అతిశ్రేష్టముగానే నేను చేసాను. నేను చేసానన్న సంగతి నీకు కూడా తెలుసును" అని మనము ఆ తీర్పు దినాన దేవునితో చెప్పునట్లు మనమిప్పుడు మన పూర్ణ హృదయముతో లోతుకి త్రవ్వుదాం రండి. ఆమేన్. మనము ఏమి చేయగలమో అనేదంతా ముందే ఊహించబడును.

54. గమనించండి, వారు త్రవ్వుటను ఆరంభించినప్పుడు, అదెంతో కష్టముగా వుండెనది, అయినను వారు కష్టపడి పెద్ద పెద్ద గోతులను త్రవ్విరి. మరుసటి ఉదయము వచ్చినప్పుడు శత్రువు దానివైపు తొంగిచూచెను. సూర్యుడు ఉదయించి పైకి వచ్చెను. చూడటాని అదంతా రక్తమయమైనట్లు కనిపించినది. ఇలా వారన్నారు "సరే, వారు ఒకరిమీద ఒకరు పడిపోయివున్నారు, ఒకరినొకరు బహుశా చంపుకొని యుండొచ్చును" వారు బయటికి వెళ్ళిపోయారు.

వారు అకస్మిక దాడిచేసి చూచారు. వారిలా అన్నారు "ప్రభువు దృష్టలో ఇది అల్పమైనకార్యము, ఆయన తన నీటిని పంపుట" వారు దేశములోని వెళ్ళిపోయి. ప్రతీ బావిని మూసివేసిరి, వారు ప్రతిమంచి చెట్టును నరికివేసిరి. వారికి నిజమైన పాతకాలపు ఉజ్జీవము
కలిగెను.

మర అది ఆ చోటుకి చేరుకొన్నప్పుడు, అనగా దేవునిని ప్రేయించువారు వారికున్న సమస్తము వారు పొందిన ఉజ్జీవములో పడవేతురు. వారి ప్రార్ధన, వారి సమస్తము వేసెదరు, వారు దేవుని ముఖమును చూచెదరు, ప్రార్థించెదరు, దేవున్ని వెదికెదరు, రాత్రులయందు ఆయన కృపకొరకు మొఱ్ఱపెట్టెదరు, పొరుగువారు రక్షింపబడుటకు ప్రార్థించెదరు, నడిపించెదరు. ఇంకా తదితర కార్యాలు చేసెదరు. మనం విమర్శకుల నోళ్ళు (తప్పులుపట్టేవారి నోళ్ళు) మూయించగలమని నేను మీకు చెబుతున్నాను. అంతేకాదు మనకి విరోధముగా నిలబడిన ప్రతీదానిని మనం కూలదోయగలం. దేవుడు మన శిభిరములో వున్నాడని వారు తెలికోవలెను. మిత్రులారా, ఆ కార్యము జరుగనంతవరకు వాటిని మనం చెయ్యలేము. మనం చెయ్యలేము. 55. ఉజ్జీవము యొక్క విధానము అది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని ఏలీయా ప్రభువు పేరట పలికియుండెను.

మొన్న ఒక రాత్రి, ఇక్కడికి వచ్చే కొన్ని రాత్రులకి ముందు ప్రభువు నన్ను అక్కడ ఆ గదిలో కలుసుకొన్నాడు, ఇక్కడ, ఇతరచోట్ల ఏలాగైతే చూచుచున్నానో అంతే వాస్తవంగా దర్శనమునందు చూచాను, ఆయన అన్నాడు "ఇక్కడ సంఘము యొక్క పరిస్థితి కూడా అంతేవుంది. ప్రతీచోట వారు ఎంతో స్వార్ధపరులయ్యారు". ఊరకనే చెప్పలేదు ఆయన ఈ మాట. జీవంగలదేవుని సంఘము అనేక విభేదములతోను, మరియు వాటితోను వీటితోను నిండుకొనిపోయింది. అంతేకాక వారిలో నుండి పరిశుద్దాత్మ దుఃఖపడి ఎగిరిపోయేటట్లు వారు జీవించుచున్నారు.

అవును అది ఆయన ఏలాగైతే చెప్పాడో సరిగ్గా అలానే అది వుంది. సహోదర సహోదరిలారా, మనల్ని మనం తగ్గించుకొని, గొజ్జెలవలె మారాలి అప్పుడు పావురము తిరిగి మనమీద వెలుగును వెదజల్లును, సంతోషము, సమాధానము, సంతృప్తి, ఇతరులు రక్షింపబడి దేవుని యొద్దకు వచ్చేందుకు అవసరమైన మంటను మన హృదయాలలో మండించును, వారి రక్షనార్ధమై మనం ఏవేవో విఫలప్రయత్నలు చేస్తున్నాం. కానీ అవి పని చెయ్యవు. అది అంతే. అది వాస్తవం. మనకి ఎన్ని ఉజ్జీవములనేవి వచ్చిన...

గతరాత్రి ప్రభువు ఈ వేదికమీద నిలువబడి, తాను నిస్సందేహముగా మృతులలోనుండి తిరిగి లేచెనని ప్రతీఒక్కరికి తన్నుతాను రుజువు పరుచుకొనెను.

56. మరి ఈ రాత్రి గతరాత్రి వున్నదాని కంటే రెండుమూడు వందలమంది తక్కువుగా మంది వున్నారు... ఏమిటి సంగతి? సహోదరుడా అంతము ఇచ్చట వున్నది(ముగింపుకివచ్చియున్నాము మనం). అది ఇక్కడ వుంది, అందులో ఏ సందేహం లేదండీ. జర్మనీ, స్విట్జర్లాండ్, ఆఫ్రికా ఇంకా ప్రపంచములో అనేక చోట్ల అనేక కార్యలు జరిగినవి, లక్షాలాది మంది కూడిరి, అనేక చోట్ల కనీసం ఇరవై లేక ముప్పైవేల మంది క్రీస్తునొద్దకి వచ్చిరి. మనుసటి రోజు అంతకంటే రెంటింపు మంది వచ్చిరి, రెంటింపు కార్యలు జరిగినవి.
ఏమిటి అదంతా,మాలోనుండి పరిశుద్దాత్మ ప్రవహించినది. ఆపావురము నివసించుటకు గొజ్జెలకోసం అంతట వెదుకుచుండెను. వాస్తవంగా, ఖచ్చితంగా అదే జరుగుచున్నది. ఎంతగొప్ప సమయం. ఎంత గొప్ప విచారము, మనము... సంఘము ఎంత ఎక్కువ బోధిస్తుంటే, పరిశు ద్దులు ఎంత ఎక్కువుగా మొఱ్ఱపెట్టుచుంటే, అంత అధికముగా దేశములు దేవునికి దూరమవుతున్నాయి, ఇంకా విమానాలు గాలిలో కూలిపోతున్నాయని, సముద్రంలో ఓడలు ఒకదానికొకటి గుద్దుకొని పగిలిపోతున్నాయని చెప్పుటలో ఇంక ఎంతమాత్రం ఆశ్చర్యం లేదండీ. కలవరపడే సమయాలు వచ్చునని దేశము మధ్య విభేదాలు వచ్చునని, గొప్పసూచనలు ఆకాశములో ఎగిరే పళ్ళెములు కనబడునని, ఆకాశములోను, భూమిమీదను అనేక దృశ్యములు కనబడునని, ఇవన్ని జరిగి తీరుతాయి అని బైబిల్ చెప్పుచున్నది. అంతేకాదు అంతట సువార్త ప్రకటింపబడునని చెప్పుచున్నది.

57.మరి ఆయన చెప్పాడు "దేశములో కరువు వచ్చును, ఆహారముకొరకు కాదు పానముకొరకు కాదు కానీ దేవునివాక్యము వినుట కొదవగును, నిజమైన దేవునివాక్యం వినబడుట కొదవగును,” ఒక కరువు... ఓ, ఎంత భయంకరమైన దినములలో మనం జీవిస్తున్నాము. మనం సిద్దముగా వుండాలి. సిద్దపడాలి.

“ఇప్పుడు, బ్రదర్ బ్రెన్హామ్ నీవు ఏమి అంటున్నావు? అది నాకోసమే చెప్పుచున్నావా?" అవును, అది నీకోసమే చెప్పుచున్నాను. నీవు రక్షింపబడనివాడవైతే, నీవు క్రీస్తుని ఇంకా చేర్చుకొనకున్నట్లైతే, నేను చెప్పుచున్న ఈ పరిశుద్దాత్మ నింపుదల అంటే ఏమిటో నీకు తెలియనట్లైతే నా మాటలు నీకోసమేనండీ.

నీవొక తిరిగి జన్మించిన క్రైస్తవుడవైతే, ప్రార్థించేవాడివైతే నీవు చేయగలిగినదంతా చేయుచున్నట్లైతే, "హల్లేలూయా" అని దానికి చెప్పుటను నీవు మర్చిపోవద్దు.

58. ఒకరాత్రి నేను బోధించుచుండగా నాకు చేతినైనంత మట్టుకు నేను పాపమును ఖండించుకొంటు వచ్చాను. సమాజమంతా తిరిగి వచ్చునేమోనని దానిని నేను పదేపదే దువ్వాను, ఆశ్చర్యపోయాను నేను అనుకొన్నాను, "మై, నేను చెప్పాల్సినదంతా చెప్పేసాను. దేవా, నేను నిన్ను అక్కడ కలుసుకొన్నప్పుడు, నేను వారికి సత్యమును చెప్పకుండాదేనిని దాచిపెట్టలేదని అందును."

నేను అలా బయటికి వెళ్ళుచుండగా, అక్కడొక స్త్రీ వుండెను, భలేపెంకిపిల్ల(నోటిదుడుకు తనము) ఆమె నిర్భయంగా మధ్యదారిలో నీల్గుకొంటు వెళ్ళినది. నేనన్నాను "మంచిది, ప్రభువుకే స్తోత్రం దాన్నిబట్టి నేను నిశ్చయంగా సంతోషిస్తున్నాను ఆమె అలా వెళ్ళిపోయింది".

అక్కడ పెద్ద వయస్కులగు స్త్రీలు నిలబడి యున్నారు. నేను అడిగాను "మీకు ఆమె తెలుసా?" తెలుసని వారన్నారు. "ఈ పట్టణమంతటిలో ఆమెయే పెద్ద వదరబోతు(పుకార్లుపుట్టించేది, మాటలపుట్ట)." పుకారు గురించి నీవు ఎన్నడు ఏమి అన్లేదు. అక్కడ నీవున్నావు. చూశారా?

2.2.
కానీ గుర్తుంచుకోండి, సహోదరుడా. ఏది ఏమైనా ఏ చిన్నపాపమున్న ప్రక్కకి నెట్టివేయుము. నేను దానిని కొట్టకపోతే ఈ రాత్రి పరిశుద్దాత్మ దానిని నీ నా హృదయమందు కొట్టునుగాక. అది ఒకవేళ అవిశ్వాసంకావొచ్చును, ఆదొకవేళ సందేహం కావొచ్చును. అదొకవేళ సంశయవాదం కావొచ్చును. అదేదైనా దేవుడు నీ హృదయములోనుండి దానిని తొలగించునుగాక. రానున్న వారంలో మనం పాతకాలపు ఉజ్జీవమును కలిగివుండబోవుచున్నాము.

59. మనం శిరములు వంచుచుండగా ప్రభువు దానిని మనకి అనుగ్రహించునుగాక. ఆ చిన్న సహోదరి రాగల్గితే వచ్చి పియోనా లేదా ఆర్గాన్, ఏదైతే వుందో దానిని వాయించుటకు రావాల్సినదిగా, వచ్చి ఆ పాటకు సంగీతం అందించవల్సిందిగా నేను కోరుచున్నాను.. నేను బలిపీఠపు పిలుపు ఇవ్వబోవుచుండగా ఆ ప్రియమైన సహోదరి రావల్సిందిగా నేను కోరుచున్నాను.

ఇప్పుడు, ఈ రాత్రి కొంచెం ముందుగా ముగించుచున్నాము. మీరు మీ తలలు వంచియుండగా మీలో ప్రతీ ఒక్కరి కోసం నేను ఈ ప్రార్ధనచేయబోవుచుండగా మీరొక సంగతిని తెలిసికోవాలని కోరుచున్నాను...

ఇప్పుడు, పరలోకపు తండ్రీ, ఎంతో గట్టిగా (కఠినంగా) నేను పాపమును ఖండించుచున్నాను. నా మనసులోకి వచ్చిన ప్రతిదానిని మైక్రోఫోను ద్వారా బయటికి వెల్లడించాను. నా మనసులో నీవు పుట్టించిన ప్రతి ఆలోచనను నేను బహిరంగపరచాను. అవి కొందరికి అభ్యంతరకరముగా వుండొచ్చును, కానీ తీర్పుదినాన నేను నిరాపరాధిని అని అప్పుడు చెప్పెదను. నీవు ఏలాగైతే దానిని నాకిచ్చావో అలాగుననే నేను దానిని బోధించాను.

60. మరిప్పుడు, నిస్సందేహముగా ఇక్కడ అనేకమంది చక్కని ప్రజలు కుర్చొనివున్నారు. వారు ప్రార్దించేవారు, పరిశుద్దాత్మతో నింపబడిన వారు, వారి హృదయలలో ఏ శిక్షావిధి(ఖండన) లేదు, ప్రభువు యెదుట అనుదినము వారు జీవించుదురు. ఆయన పిలిస్తేవెళు టకు వారు సిద్ధపడి యున్నారు.

నా విధి ఏమిటంటే సువార్తను బోధించి, సువార్త యొక్క వర్ణములను పిలుచుటయే, క్రీస్తు ఎందుకు చనిపోయాడో, ఆయన తన యొద్దకు వచ్చినప్పుడు అదేమైయున్నదో చెప్పుటయే నా పని(వంతు). అప్పుడు ప్రభువైన యేసు, ఇక్కడ ఎవరైనా శిక్షావిధి(ఖండింపబడిన స్థితిలో)లో కూర్చొన్నవారు ఎవరైనా వుంటే ఆ తీర్పు మీదే తప్ప నాది కాదు. మాటలు బయటకు వెళ్ళినవి. అవే తీర్పుతీరుస్తాయి.మరి మీరే వాక్యమై యున్నారు.

ఇప్పుడు, తండ్రీ, ఇక్కడ ఎవరైనా సరిగ్గా జీవించని వారు వున్నట్లైతే, ఈ రాత్రి వారు నీవు యేసుని భూమి మీదికి పంపావన్నా సంగతిని తెలిసికొంటే, వారు ఖండింపబడి, నశించినట్లైతే... ఇదొక వింత అని వారు అనుకొనివుండొచ్చును. ఈ వేడి వాతావరణములో టెంటు క్రింద నిలబడి పాతకాలపు భక్తిని గూర్చి కఠినముగా, పాపమును చంపే విధముగా, పురికొల్పేవిధముగా బోధించడం వింతగా వారికుండవచ్చును. దానిమీద ఏ చేతితొడుగులు లేకుండా ఒట్టిచేతులతో దానిని పట్టుకొని, అది ఎక్కడికి చెందియున్నదో సరిగ్గా అక్కడే దానిని వుంచితిని...

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...