సాక్షులు
VGR PARA COUNT-267 స్నేహితులారా శుభ సాయంకాలము. ప్రభువును సేవించుటకు ఈ రాత్రి ఇక్కడ ఉండుటను బట్టి చాలా సంతోషముగా నున్నది. గడిచిన రెండు వారాలుగా, ఇది మనకు మహిమకరమగు వారముగా నున్నది. సహోదరుడు నెవిల్ నన్ను గది లోనికి తీసికొనివెళ్ళి మరియు నాతో మాటలాడుచుండెను. మరియు ఇంచుమించు వందమంది మార్పుచెంది, ప్రభువు చెంతకు వచ్చిరనియు, మరియు దాదాపు యాభై మంది నీటిలో బాప్తిస్మము పొందిరనియు చెప్పెను. అది యోగ్యమైన సమయముగా నున్నది. అది ఆ విధముగానే కదా? దానికొరకై మనమెంతగానో సంతోషించుచున్నాము.
ఈ రాత్రి ద్వారమునొద్ద క్రొత్తవారు ఉండుటను బట్టి సంతోషించుచున్నాను, మరియు దేవుడు మిమ్మును అత్యధికముగాను, విస్తారముగాను దీవించునట్లు ప్రార్ధించుచున్నాను. దేవుని నామ మహిమార్ధమై ఏదైన ఒక కార్యము చేసేటట్టుగా ఈ కూటములో ప్రయాసపడిన ఒక్కొక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేయగోరుచున్నాము.
మన సహోదరుడైన థామ్ కి మేము కృతజ్ఞతలు తెలియజేయగోరుచున్నాము.
2
మరియు వారు పాటలు పాడుటను బట్టియు, సంగీతమును బట్టియు, సహోదరుడు టామ్ మెరిడిత్ మరియు సహోదరి మెరిడిత్ మరియు చిన్న మెరిడిత్ వారివురికి మరియు వారందరికి మా కృతజ్ఞతలు; మరియు వారు ఏ సమయములోనైనా సరే, బ్రెన్హాం గుడారమునకు తిరిగి వచ్చుటను మేము నిశ్చయముగా ఆహ్వానించుచున్నాము. అటు అనుభూతి చెందువారందరు “ఆమేన్” అని చెప్పండి. మెరిడిత్ సహోదరుడా, మేమెట్లు అనుభూతి చెందుచున్నామో నీకు తెలియునా, ఇటీవల కాలంలోనే నేను సహోదరుడు వెురిడిత్ ను కలిసాను, మరియు అతడు నాకు చాలా దగ్గర స్నేహితుడయ్యాడు.
సహోదరుడు నెవిల్, మరియు సహోదరుడు మెరిడిత్, వారిరువురు, వారియొక్క ధైర్యవంతమైన బోధ నిమిత్తము మరియు దాని నిమిత్తము నిలబడుటను బట్టి, మరియు వారు చేసిన దానినంతటిని బట్టి కృతజ్ఞతలు.
3
నెవిల్ సహోదరుడా, నిన్ను ఇక్కడ ఈ సంఘములో మాకు సంఘకాపరిగా కలిగియున్నందుకు మేము సంతోషించుచున్నాము. మా యొక్క లోతైన ప్రేమ నీకొరకేయని నీవు తెలుసుకొనవలెనని మేము కోరుచున్నాము. మరియు సహోదరుడు నెవిల్ పై నాకు నమ్మకమున్నది. అతని గత జీవితమును వెంటాడి అతనిని కనుగొనియున్నాను. మరియు “నాకు ఒకటి ప్రసంగించుటకన్నా, ప్రసంగముగా జీవించుట మంచిది” అను పాత సామెత మీకు తెలియును. దానిలో ఎంతో సత్యమున్నది. మరియు కావున, సహోదరుడు నెవిల్ ఇక్కడ మనతో వుండి, ఇప్పుడే దొడ్డిలోనికి తీసుకురాబడిన ఈ గొర్రెలకు కాపరత్వపు పనిని తీసికొన్నందుకు నేను చాలా సంతోషించుచున్నాను. మన సహోదరుడిని ప్రభువైన యేసు దీవించును గాక!
మరియు పరిచారకుల కొరకు మరియు, ప్రతిఒక్కరు, మనము దానిని అభినందించుచున్నాము.
4
మనకు సహోదరుడు కిడ్ ఉన్నాడు, ఆయనేయని నేను నమ్ముచున్నాను, మరియు ఇంకనూ ఇతర వివిధ సేవకులు, మరియు సహోదరుడు హోవర్ ఇక్కడున్నారు. సహోదరుడు హోవర్ ఈ రాత్రి ఇక్కడ వున్నాడో లేదో నాకు తెలియదు కాని ఆయన ఈ ఉదయం మాతోనే వుండి మరియు బాప్తిస్మము పొందియున్నాడు.
మీరు గనుక ఈ రీతిగా చెప్పుటను మన్నించినయెడల సువార్తలో మన స్నేహితుడు మరియు సహవాసి అయిన సహోదరుడు బీలర్ యొక్క సహకారమును బట్టి మరియు అతడు ఇక్కడ ఉండుటను బట్టి ఆనందించుచున్నాము. అతడు కూటములలో జరిగే సంగతులను మరియు ఇతర విషయములను పొందుపరచుచుండెను. మరియు అతడు చాలా కాలంగా దానిని అంతటా జీవించుచున్నాడని నేను ఊహించుచున్నాను.
కావున మేము ప్రతిఒక్కరి నిమిత్తము సంతోషించుచున్నాము, ప్రత్యేకమైన పాటలు పాడినవారు మరియు ప్రతిదాని కొరకు. ప్రభువైన యేసు మిమ్మును దీవించుననునదియే నా ప్రార్దనైయున్నది.
5
ఈ రాత్రి కొద్దిగా అలసియున్నాను. నాకు ఎక్కువగా విశ్రాంతి లేదు. గడిచిన రాత్రి రెండు ప్రసంగములైనవి, మరియు సుమారు ఒంటిగంటకు పడకలోనికి వెళ్ళి యుంటిని. మరియు తిరిగి ఈ ఉదయం పెందలకడనే లేచి మరియు ప్రాతఃకాల కూటము మరియు ఆదివారపు బడి, తర్వాత దాదాపు రెండు గంటలు బాప్తిస్మమిచ్చుచు నీళ్ళలోనే యుంటిని.
ఆ నీళ్ళు చల్లగా ఉన్నవి. అవునా, స్నేహితులారా? ఓ, అవి నేనింతవరకు చూడనటువంటి, తాకనటువంటి చాలా చల్లని నీళ్లుయై ఉన్నవి. మై, నేనెన్నడూ ... నీళ్ళలో నుండి బయటికి వచ్చునప్పుడు కనీసం నేను పైకి అడుగువేస్తున్నానో లేక క్రిందికి దిగుచున్నానో తెలియనంతగా నేను మొద్దుబారిపోయాను.
కావున నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సాధారణ ఉష్ణోగ్రత స్థితిని పొందలేకపోతిని మరియు “భోజనం సిద్ధముగా నున్నది” అని భార్య చెప్పియుండెను. మరియు నేను వేడి నీళ్ళతోనున్న స్నానపు తొట్టిలోనికి దుమికి, మరియు కొద్దిగా వెచ్చబరుచుకొని, మరియు నా బట్టలు ధరించుకొని ఒక సమాధి కార్యక్రమమునకు వెళ్ళియుంటిని మరియు భూస్థాపనారాధన జరిగియున్నది.
6
తిరిగి నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఆసుపత్రినుండి అత్యవసర పిలుపు వచ్చి యున్నది, కావున నేను తిరిగి ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చినది.
రాత్రి భోజనం ఏమియూ చేయలేదు, కావున నేను.. సహోదరుడు మెక్-స్పాడిన్ను మేము కొంతమంది కలిసి, ముగించిన తరువాత, ఇంతకుముందే కొద్దిగా రాత్రి భోజనం చేసియుంటిమి.
మరియు ఈ ఉజ్జీవము ముగింపులో తిరిగి ఇప్పుడు సాయంకాల కూటమునకు వచ్చియుంటిని. ఈ భాగ్యము కొరకై మనము నిశ్చయముగా సంతోషించుచున్నాము. కొద్దిగా గొంతు బొంగురుపోయినది, కావున మీరు నాతో కొంచెం సహించుకొనుడి.
7
నేను ఈ రాత్రి 'విశ్వాసిని వెండించుచున్న సూచనలు' అనుదానిపై మాటలాడెదనని ఈ ఉదయం నేను చెప్పియున్నాను.
ఈ ఉదయం నేను లోనికి వచ్చునప్పుడు, లేదా... బహుశా ఈ సాయంత్రము “బిల్ సహోదరుడా, నీకు జ్ఞాపకమున్నదా, ఈ రాత్రి ప్రభురాత్రి భోజనపు రాత్రి” అని సంఘములోని ధర్మకర్తలలో ఒకరు చెప్పేంతవరకు నాకు తెలియదు.
ఓ, మై, ఇప్పుడు మరలా మనము ఇక్కడ ఉన్నాము! అని నేను తలంచాను. కావున నేను తిరిగి వెళ్ళి “ప్రభువా, ఇప్పుడు నేను దేనిగూర్చి మాటలాడబోవుచున్నాను?” అని తలంచాను.
'విశ్వాసీని వెంబడించుచున్న సూచనలు' అను దానిపై ఇక్కడ వ్రాసియుంచిన చాలా లేఖనములు నేను కలిగియుంటిని మరియు దానిపై అనేక లేఖనములను నేను చూపించబోవుచుంటిని. కావున నేను దానిలో కొద్ది మార్పులను చేయవలసినదైనది. కావున ఇప్పుడు, మనకు సంస్కార ఆరాధన కలదు. మరియు మీరు మాతో పాటు ఈ గొప్ప విందులో ఉండియున్నారని మేము నిరీక్షించుచున్నాము. పునరుత్థానము జరిగిన వెంటనే సంస్కారము తీసికొనుట అనునది ఎటువంటి ఒక చక్కని సమయముగా ఉన్నది. మరియు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుటకు కూడా ఇది ఒక చక్కని సమయముగా ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడుటకు సరిగ్గా అదే ఋతువులైయున్నవి.
8
బిల్లి గ్రహమ్ సువార్తికులు తీసిన “అమెరికా సంయుక్త రాష్ట్రముల ఆయిల్ టవర్” అను చిత్రము, లూయిస్విల్లోని మెమోరియల్ ఆడిటోరియమునందు ఏపిల్ 20న ప్రదర్శించబడును. కావున ఈ రాత్రి ఆ టికెట్లు నేను పోగొట్టుకొనలేదని నేను తలంచుచున్నాను. ఈ రాత్రి నేను గనుక దానిని ప్రకటించినయెడల, బిల్లీ గ్రాహమ్ సహచరులలో ఒకరు దానిగూర్చి నా సంఘములో ప్రకటించగలరా అని నన్ను అడిగి యుంటిరి. అతను తన యొక్క కార్డును నాకు ఇచ్చియుండెను. కావున నేను... అది మీకు అసౌక్యరముగా లేనియెడల మీరు దానిని చూడగోరుచున్నాను. మరియు అది బాగుంటుందని నేను నమ్ముచున్నాను. “శ్రీ. టెక్సాస్,” అనే చిత్రము ఈ మధ్యనే ప్రదర్శించబడినది, మరియు మీలో చాలామంది దానిని చూచియుంటిరి, అది నిజముగా చాలా మంచి చిత్రమైయున్నది. మరియు ఆ రెంటిలో దేనినీ నేను చూచియుండలేదు, కాని నేను వాటిగూర్చి చాలా వ్యాఖ్యానాలు వినియుంటిని. అది ఏప్రిల్ 20న లూయిస్విల్లో మొమోరియల్ ఆడిటోరియమునందు ప్రదర్శించబడును.
9
మరియు ఇప్పుడు, ఈ వారంలో ఆడిటోరియమునందు కూడా గొప్ప ఉజ్జీవము ఉండబోవుచున్నదని నేను నమ్ముచున్నాను. ఒక యవ్వన సువార్తికుడు ప్రసంగించుటకై అక్కడ యున్నాడు. మరియు మీరు గనుక దానిలో పాల్గొనుటకు వీలుచేసుకున్నయెడల, వారు మిమ్మును అభినందించెదరని నేనెరుగుదును. నాకు తెలియును... దానిలో నేను చేయునది ఏమియూ లేదు, కేవలం ఒక ఉజ్జీవము నుండి మరొక ఉజ్జీవము లోనికి వెళ్ళినట్లు అది ఉండును. అటువంటి అగ్నిలోనే ఎల్లప్పుడూ ఉండి వేడిగా ఉండవలెనని నేను కోరుచున్నాను. మీకు ఆ విధంగా లేదా? అది మంచిది.
మెరిడిత్ సహోదరుడా నీ యొక్క రేడియో కార్యక్రమం ఎక్కడ వచ్చునో మరియు ఆ సమస్త కార్యమును జనులకు ప్రకటించితివా? [“లేదు, బ్రెన్హాం సహోదరుడా” అని సహో, మెరిడిత్ చెప్పుచున్నాడు.] మంచిది, నీవు ఇక్కడకు వచ్చి మరియు ఇప్పుడే దానిని చేయుదువా? సహోదరుడు మెరిడిత్ ప్రకటించెదరు, అతనియొక్క ...
[సహోదరుడు టామ్ మెరిడిత్ తన రోజువారి రేడియో కార్యక్రమమును ఉదయం 11:50 నిమిషములకు డబ్లు.టి.సి.ఒ. వద్ద వచ్చునని ప్రకటించుచున్నారు.]
టామ్ సహోదరుడా మీకు కృతజ్ఞతలు.
మరియు ప్రకటించుటకు ఎవరైనా, ఏ సేవకులైనా ఉజ్జీవమును లేదా ఏదైనా ప్రత్యేకమైన కార్యమును కలిగివున్నారా? మరియు మన సహోదరులను మరియు వారి సేవలను గుర్తించుటకు మనమొల్లప్పుడూ సంతోషించెదము. ఇప్పుడు ప్రభువు మిమ్మును దీవించును గాక.
10
మరియు ఈ కూటము, ప్రసంగ కూటము జరిగిన వెంటనే ప్రభురాత్రి భోజనము మరియు పాదశుద్ధి కొరకై మీకు వీలైనయెడల మాతో ఉండవలసినదని మరచిపోకండి. పాదశుద్ధి గురించి ఎంతమంది వినియున్నారు? మంచిది, ఒక అంగీకి జేబు ఉన్నట్లుగానే మీరును ఇచ్చట మీ గృహములలో ఉన్నంత స్వేచ్చగా యుండుడి. ఇప్పుడు, మనము దానిని నమ్ముచున్నాము, ఎందుకనగా పరిశుద్ధ గ్రంథము దానిని భోధించుచున్నది. కావున మీరు ఇచ్చటనే నిలిచి మాతో కూడా ఉందురని మేము కోరుచున్నాము.
కెంటకీలోవున్న పాత - నాగరీక బాప్టిస్తులారా, ఎలాగ మేము నేలమీద కూర్చొని రాత్రి భోజనము చేసెడివారమో జ్ఞాపకము చేసుకొంటున్నారా? జనులు లేచి పోర్క్స్ ఆఫ్ గ్రీక్ లో మేము పాడే విధంగా పాడేవారు. (మీకు జ్ఞాపకమున్నదా?) “అద్భుతమైన కృప, ఎంత చక్కగా అది ఉన్నది!” సహోదరులందరూ అక్కడ ఆ చెట్ల నీడకు వెళ్ళి, పాదశుద్ధి చేసుకొనుచూ, అరుచుచున్నట్లుగా వుంటారు. ఈ దినాల్లోని బాప్టిస్తులైన మీవలే మేము కరచాలనం చేసెడివారము కాము. అతడు సరియైన దారిలోనికి వచ్చే వరకు మేము ఒకరినొకరము వెన్ను తట్టేవారము. వారు నిజముగా దేనినో కలిగియున్నారు. ఆ బాప్టిస్తులకంటే మనము అధికముగా కలిగియుండవలెను. ఆ విధముగానే కదా? అది నిజము.
పాదశుద్ధిని, ఇంకనూ మనము ఇక్కడ ఆచరిస్తూ వస్తున్నాము. మరియు ఈ రాత్రి వీలైనయెడల మీరు మాతో ఉండుటను మేము ఇష్టపడుచున్నాము. కావున ఇక నేను మాట్లాడుటను ఆపుటకు ప్రయత్నించెదను, ఎందుకనగా నాకు కొద్దిగా బొంగురు పోయినది. కావున, ఇప్పుడు నా కొరకు ప్రార్ధించండి.
11
మరియు ఇప్పుడు, క్రొత్త నిబంధనలోని అపోస్తలుల కార్యములలోని 1వ అధ్యాయంలో నుండి నేను కొంత చదువగోరుచున్నాను. దీనిని అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ కార్యములు అని పిలువవలెనని నేను తలంచుచున్నాను. ఆయన వచ్చిన తరువాత, అపోస్తలులు క్రియచేయునట్లు అది పరిశుద్ధాత్మ చేసిన మార్గమైయున్నది. ఇప్పుడు, 8వ వచనములో, దీనిని మనము చదివెదము.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు ... మీరు శక్తి నొందెదరు: గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్ష్యులై యుందురని వారితో చెప్పెను.
మరియు ఇప్పుడు కేవలం కొద్ది నిమిషముల కోసం, 'సాక్ష్యులు' అను పాఠ్యాంశమును నేను ఉపయోగించుకొనగోరుచున్నాను.
12
మరియు ఇప్పుడు, మీరు ఇష్టపడినయెడల ఒక నిమిషం ప్రార్ధనకై మన శిరములను వంచెదమా.
మన సహోదరి నన్నెడబాయకు, లేదా అలాంటి ఒక శృతిని మనకు వినిపించినట్లైతే నాకు చాలా అద్భుతంగా వుంటుంది, సహోదరి, నీవు ఇష్టపడినయెడల.
ఇప్పుడు, ఇక్కడున్న ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఒక అవసరతయున్నది. మీ చెయ్యి పైకెత్తుట ద్వారా దానిని దేవునికి తెలియపరచగలరా? “నాకు ఒక అవసరత యున్నది, ప్రభువా,” అని దేవునికి సూచనగా తెలియజేయండి. నాకు కూడా కలదు. ఆయన మీలో ప్రతిఒక్కరినీ దీవించి మరియు మీ హృదయ వాంఛలను మీకు దయ చేయును గాక, ప్రతి వ్యక్తియూ ఇప్పుడు తమ స్వంత విధానములో, సంఘములో ప్రార్ధించినట్లుగానే, మీరు ప్రార్ధించవలెనని నేను కోరుచున్నాను.
13
మా పరలోకపు తండ్రీ, మరొక దినము ముగింపులో మేము నీ యొద్దకు వచ్చియున్నాము. ఈ ఉదయం ఉదయించుచున్న అందమైన సూర్యుడు ఇప్పుడు అస్తమించి మరియు దిగి వెళ్ళెను, మరియు చీకటి మేఘములు ఆకాశమును కమ్మియున్నవి. ఈ దినము కొరకై మరియు ప్రభువైన యేసు మృతులలో నుండి లేచిన ఆ గొప్ప జ్ఞాపకార్థ దినము యొక్క జ్ఞాపకముల కొరకై నీకు వందనములు చెల్లించుచున్నాము.
వాస్తవముగా, ప్రకృతి వున్నట్లే అది ఆ విధముగానే వుండును, సూర్యాస్తమయ సమయం ముగియుచున్నది. చీకటి పడటానికి ఇక ఎంతో సమయము లేదు. ఆ సమయముగుండా వెళ్ళుటకు ఇక్కడ అనేకులు విడిచిపెట్టబడెదరు. అదే విధముగా ముగించిపోయిన పాత నాగరీక పునర్జీవనము కొరకై ఎటువంటి ఒక ఆకలి దప్పిక వుంటుంది.
దేవా, ఆ హాస్పిటల్లోనున్న ఆ యవ్వన స్త్రీ కొరకై నేను ప్రార్ధించుచున్నాను. ఆమెకు ప్రమాదం జరిగినది. ఒక ఉపిరితిత్తి దెబ్బతిన్నది. మరియు ఆమె భర్త చీల్చబడి నలగగొట్టబడినాడు. ఆమె హృదయం మరొక ప్రక్కకి త్రోసివేయబడినది, వైద్యులకు పూర్తిగా అసాధ్యమైపోయినది. ఇప్పుడే నీవు కనికరింపవా?
ప్రభువా, ఊపిరి ఆడటం కష్టమై మరణావస్థలో అక్కడ పరుండియున్న శ్రీ. పిచార్ట్ ను జ్ఞాపకము చేసికొనండి. ఆ ఆక్సిజన్ గుడారము వద్ద శ్వాస పీల్చుకొనుట కష్టమైన స్థితిలో అతను క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించెను.
14
ఈ దినమున భూస్థాపన కార్యము వద్ద ఆ గదిలో మోకరించినప్పుడు దాదాపు 80 సంవత్సరముల ఆ వృద్ధ స్త్రీ తాను అంతవరకు క్రీస్తుని ఎన్నడూ తన స్వంత రక్షకునిగా అంగీకరించలేదని తెలిపినది. మరియు అక్కడ ఆ భూస్థాపన గృహమునందు ఆమె మనుమరాలి భూస్థాపన కార్యము వద్ద క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించినది. దేవుడు ఆమెకు తోడైయుండును గాక.
ప్రభువా, ఈ రెండు వారాలుగా నీ యొద్దకు వచ్చిన ఈ గుడారము వద్దనున్న వారందరిని ఆశీర్వదించండి. వారితో ఉండండి. ఈ ఉదయం బాప్తిస్మము పొందిన వారిని ఆశీర్వదించండి. వారు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ స్వారూప్యములోనికి మారునంతవరకు ప్రభువు యొక్క కృపలోను మరియు జ్ఞానములోను వారు ఎదిగెదరు గాక, ఇప్పుడు ఏదో ఒక దినమున ఆయనను మధ్యాకాశములో కలిసికొనుటకు మేఘములో ఆయనతో పట్టబడి, మరియు నిత్యము ప్రభువుతో ఉండెదరు.
ప్రభువా, ఈ రాత్రి ఇక్కడున్న వారందరిని ఆశీర్వదించండి. మరియు నిన్ను ఇంతవరకు తమ రక్షకునిగా ఒప్పుకొననివారు ఎవరైనా ఇక్కడ ఉండినయెడల, వారి తీర్మానానికి ఇదే సరియైన ఘడియగా ఉండును గాక, వారు ప్రేమతోను, దీనత్వముతోను వచ్చి మరియు ఆయనను తమ వ్యక్తిగత రక్షకునిగా ఒప్పుకొనెదరు గాక. ప్రభువా, అనుగ్రహించండి.
15
మరియు ఇప్పుడు, ఈ దీన, అయోగ్యమైన, పనికిరాని నీ యొక్క సేవకునికి మరలా ఈ రాత్రి నీ యొక్క వాక్యపు రొట్టెను ప్రజల కొరకు విరుచుటకై నా వంతు వచ్చినటున్నది. ప్రభువా, ఈ రాత్రి నీవు సహాయము చేయుదువని నేను ప్రార్ధించుచున్నాను. పరిశుద్ధాత్మ త్రిత్వము యొక్క మూడవ వ్యక్తి వచ్చి దేవుని యొక్క వాక్యమును తీసికొని మరియు దాని అవసరతను బట్టి ప్రతి హృదయములో దానిని ఉంచును గాక. పిదప అది విశ్వాసము చేత నీరు కట్టబడి, మరియు సమృద్ధిగా ఫలమును తీసికొని వచ్చును గాక. ప్రభువా, దానిని అనుగ్రహించండి.
మేము నిన్ను ప్రేమించుచున్నాము, మరియు మేము నిన్ను నమ్ముచున్నాము. మరియు నిన్ను సేవించుచున్నాము. ఇప్పుడు, మా కృతజ్ఞతలను స్వీకరించండి, ఏలయనగా నీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
16
ఈ రాత్రి దేవుని వాక్యము యొక్క చిన్న పాఠ్య ధ్యానమును ప్రారంభించుచున్నాము. మరియు ఇప్పుడు నేను దానిని చేయుచుండగా, ప్రతి విశ్వాసి నా కొరకు ప్రార్థన, లోతైన ప్రార్ధన చేయవలసిందిగా నేను కోరుచున్నాను. ఈ దేవుని వాక్యమును తెరచుటకు ఏ మనుష్యుడూ లేడు. మనము పేజీలను త్రిప్పగలము, కాని దాని తెరచుటకు పరిశుద్ధాత్మడు కావలెను. మానవుడు దానిని చేయలేడు. అది మన సామర్థ్యతను మించినది. పరలోకములో పరిశుద్ధ గ్రంథమును యోహాను చూచెను. “మరియు పరలోకములో గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని, దానిని తెరచుటకు లేదా ముద్రలను విప్పుటకు ఏ మనుష్యుడు యోగ్యుడు కాడు” అని చెప్పెను. మరియు తరువాత “జగత్తు పునాది మొదలుకొని వధింపబడినట్లుండిన ఒక గొర్రెపిల్ల వచ్చి ఆ సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలో నుండి గ్రంథమును తీసికొని, ముద్రలు తెరచి, మరియు పుస్తకమును విప్పి మరియు ప్రజలకు దానిని తెరచుటను” అతడు చూచెను. మరియు ఈ రాత్రి ఆయన వచ్చి మరియు అదే విధముగా చేయును గాక.
17
సాక్షులుగా వెళ్ళడానికి ముందు పరిశుద్ధాత్మ యొక్క అర్హతను పొందుటకు యేసు ఇక్కడ ఆయన యొక్క అపోస్తలులను నియమించుచున్నాడు. మరియు ఈ రాత్రి నా అంశము ఏదనగా “ఒక సాక్షి.”
ఇప్పుడు, న్యాయస్థానములలో, ఒక సాక్షికి ఏదో ఒకటి తెలిసియుండవలెను. ఎవరో ఒకరు లోనికి వచ్చి మరియు ఒక సాక్షిగా ఉండలేరు. అది ఎవరో ఒకరు ఏదో కార్యము తెలిసినవారై యుండవలెను. మరియు ప్రభువు కొరకు మనము సాక్షమిచ్చుచున్నప్పుడు, అది ఆ విధముగానే యున్నది. ఏదైన ఒక కార్యము తెలిసికొనిన ఎవరైన ఒకరిగా యుండవలెను.
కావున యేసు ఆలోచించి దీనిని చెప్పెను, అదేదనగా, వారు ఆయనకు సాక్షులుగా ఉండడానికి ముందు “వారు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములోనే వేచియుండవలెను,” తరువాత వారు ప్రపంచమంతట యెరూషలేములో, యూదయ, సమరయలో, మరియు భూదిగంతములో సాక్షులుగా ఉండెదరు.
18
న్యాయస్థానములలో రెండు రకములైన సాక్ష్యములు చెల్లును, అవి కన్ను లేదా చెవి. ఇప్పుడు మీరు గనుక ఒక గదిలో కూర్చొని మరియు ఒక అద్దములో నుండి ఒక ప్రమాదమును చూచినయెడల, మీ సాక్ష్యము, మీ మాట చెల్లదు, ఎందుకనగా మీరు ఒక అద్దములో నుండి చూచుచున్నారు. మీరు ఒక సాక్షిగా ఉండటానికి ముందు మీరు దేనిగూర్చి మాటలాడుచున్నారో నిజముగా తెలియడానికి సరిగ్గా మీరు అక్కడ సమీపమున ఉండవలెను. న్యాయస్థానములలో ఒక తీవ్రమైన విచారణలో మీరు సాక్షిగా ఉండటానికి ముందు మీరు దానిని వినియుండవలెను లేదా దానిని చూచి యుండవలెను.
“కుమారి ఫలాన-ఫలాన ఆమె నాతో చెప్పినది, లేదా శ్రీ. ఫలాన-ఫలాన లేదా గౌరవనీయులైన ఫలాన వ్యక్తి నాతో చెప్పెను” అని మీరు చెప్పలేరు. అలాగైనచో ఆయనే సాక్షియగును, కాని మీరు కారు.
కావున పరిశుద్ధాత్మవలన తప్ప ఏ మనుష్యుడు క్రీస్తు యొక్క పునరుత్థానమునకు ఖచ్చితమైన సాక్షిగా ఉండలేడు. నీకు నీవుగా అక్కడ వుండి దానిగూర్చి నీకు ఏదైనా తెలిసియుండి, నీవు మాట్లాడుచున్నది ఏదో తెలిసియుండి, ఒక వ్యక్తిగతమైన సాక్షిగా నీవు ఉండవలెను.
19
మరియు మనుష్యులు వారేమైయున్నారో ఆ విధముగానే యుండు దినమును చూచుటకు దేవుడు సహాయము చేయును. మీకు తెలియును, ఇప్పుడు చాలా గౌరవముతో నేను దీనిని చెప్పుచున్నాను. మనలను బాధపరచునది త్రాగుబోతులతో నిండియున్న మన పట్టణము కాదు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా మనలను బాధపరచుచున్నది ఇక్కడ వున్నది, క్రైస్తవులమని చెప్పుకొనుచూ మరి ఆ విధంగా జీవించనటువంటి ప్రజలవలన అది కలుగుచున్నది. అదేయై యున్నది, చూడండి. వారు సరియమైన సాక్షులు కారు.
వారు ఒక అనుభవమును కలిగివుండేతవరకు వారు సాక్ష్యమివ్వలేరు. మరియు వారు ఒక అనుభవమును కలిగియున్నయెడల, అప్పుడు వారు తమంతట తామే ఒక సాక్షిగా వుండెదరు, ఎందుకనగా వారు తిరిగి జన్మించినవారు. “మరియు ఈ లోక కార్యములన్నియు, పాతవన్నియు గతించిపోయెను, మరియు సమస్తము క్రొత్తవాయెను.” అప్పుడు మీరు యేసుకు ఒక సాక్షిగా ఉండెదరు.
20
ఈ అపొస్తలులు బయటికి వెళ్ళి సరియైన సాక్ష్యులుగా ఉండుటకు ముందు, వారు దేనిగూర్చి సాక్షులుగా వున్నారో దాని గూర్చిన అనుభవము వారికుండవలెనని యేసుకు తెలియును. ఈ దినమున ప్రతి పేద పాఠశాల అదే విధముగా చేసినయెడల, ప్రతి క్రైస్తవుడు అదే కార్యమును చేసినయెడల, అది ఎంత బాగుండును కదా? సంఘమునకు వచ్చి మరియు ఇటు చెప్పుడి, “ఇప్పుడు నేను యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించుచున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందువరకు సరిగ్గా నేను ఇక్కడే వేచియుండెదను, మరియు ఆ తరువాతే నేను సాక్షిగా ఉండుటకు బయటికి వెళ్ళుదును.” అప్పుడు కార్యములు వ్యత్యాసముగా నుండును. మీరునూ ఆ రీతిగా తలంచుట లేదా? ఇక అటువంటి వదులైన చెదరిన సాక్ష్యములు మనకు ఉండవు.
ప్రజలు సాక్ష్యమిచ్పుదురు మరియు తాము క్రైస్తవులమని చెప్పుదురు, మరియు బయటికి వెళ్ళి ఇతర జీవితాలు జీవించెదరు. మరియు ఒక అవిశ్వాసి లోనికి వచ్చి దానిని చూచును, “సరి, ఇక్కడ చూడండి! ఇదేనా వారి విధానం... ?” అని అతడు చెప్పును. మరియు దయ్యము కూడా ఎల్లప్పుడూ వారినే ఎత్తి చూపించును. మీరు కేవలం దానిమీద ఆధారపడవచ్చును. అతడు ఒక వ్యాపారవేత్త. వానియొక్క సామర్థ్యతను మరియు వాని వ్యాపార పరిమాణాన్ని తక్కువగా అంచనా వేయకండి, ఎందుకనగా అది ఏమైయున్నదో అదంతా వాడికి తెలియును.
21
ఇప్పుడు, నేను చెప్పినట్లుగా, మీరు ఒక సాక్షిగా ఉండుటకు ముందు మీకు దానిగూర్చి ఏదైనా తెలిసియుండవలెను. మీరు నిజంగానే ఒక సాక్షిగా ఉండవలెను.
పాత నిబంధనలో దేవునికి ఒక సాక్షి ఉన్నాడు. ఆయన యొక్క సాక్షులలో నోవహు మొదటివాడైయున్నాడు. నోవహు ఒక సాక్షియై యున్నాడు, ఎందుకనగా ఒక జలప్రళయము వచ్చుచున్నదనియు, మరియు అతను ఒక ఓడను కట్టవలెననియు అతనితో చెప్పిన దేవుని యొక్క హెచ్చరికా స్వరాన్ని అతడు వినియుండెను. మరియు ఈ ఓడను తయారు చేయుటయనగా అదే సమయములో సిద్ధపడుటయై యున్నది, మరియు ప్రజల యొక్క రక్షణార్ధమై అతడు ఒక స్థలమును సిద్ధపరచుటయై యున్నది. ఎందరైతే లోనికి రావలెనని అనుకొందురో, వారు రావచ్చును. మరియు అతను దేవునికి ఒక సాక్ష్యియై యుండెను.
ఇప్పుడు, అతనికి తెలిసిన ఒకే ఒక కార్యమేదనగా, అతనితో దేవుడు చెప్పినట్లు, వర్షము పడనైయున్నది అనునదియే. అదివరకు ఎన్నడూ భూమిమీద వర్షము పడియుండలేదు, కాని వర్షము పడనైయున్నదని దేవుడు చెప్పెను. కావున దేవుడు వర్షము పడనైయున్నదని చెప్పినయెడల దాని అర్థము ఏదనగా వర్షము పడును. కావున దేవుని వాక్యమునకు అతడు ఒక సాక్షియై యుండెను. మరి అందుకొరకే అతడు పిలువబడెను, మరియు వర్షము పడుట ప్రారంభమవ్వడానికి ముందే అతడు వెళ్ళి ఒక ఓడను తయారు చేసెను మరియు వర్షము కొరకు సిద్ధపడెను. తరువాత, దేవునికి ఇంకొక సాక్షి కలడు.
22
ఒకానొక సమయంలో యూదులు అనే జనులున్నారు. యూదా అనే గోత్రము నుండి వారికి ఆ పేరు వచ్చినది. దేవుని యొక్క ఆదేశముల ననుసరించి నడవకపోవడమును బట్టి, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించకపోవడమును బట్టి, దేవుడు నెబుకద్నెజరు రాజును పిలిచి, అతను వచ్చి వారిని బబులోను దేశమునకు చెరగొని పోవునట్లుగా చేసెను. వారు సీయోను పాటలను పాడకుండునట్లు వారేవిధంగా వారి తంతివాయిద్యములను ఆ ఏడ్పు విల్లో చెట్టునకు వ్రేలాడదీసిరో, అ ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన గాధ మనలో చాలామందికి జ్ఞాపకముండి యుండును. వారి విజయమంతా వెళ్ళిపోయెను, అది వారినుండి దేవుడు తీసివేయగోరినందుకు కాదు, కానీ వారి పాపమును బట్టియే, అదే వారిని దేవుని నుండి వేరుచేసియున్నది.
ఆ కారణమును బట్టియే, ఈ రాత్రి ఎందరో క్రైస్తవులు ఇంకనూ విజయమును పొందియుండలేదు, అది ఎందుకనగా వారి పాపములు వారిని ఆశీర్వాదము నుండి వేరుపరచెను. తెగిపోయి, ఎడారిలో ఒంటరిగా నున్నట్లు వారున్నారు. మరియు సంఘము యొక్క పాటలను మనము ఆనందించలేకపోవుచున్నాము గనుక మన హృదయములు ఆ ఏడ్పు విల్లో చెట్టునకు వ్రేలాడుచున్నవి.
23
చాలాకాలం క్రిందట మనము ఇక్కడికి లోనికి వచ్చుట నాకు జ్ఞాపకమున్నది. మందిరము యొక్క గంట మ్రోగినప్పుడు, వారు సిలువ చెంతకు అనే పాటను పియానోపై వాయించుచుండగా, మరియు లోనికి వచ్చేవారు. కంటతడి పెట్టకుండా ఎవ్వరూ ఉండేవారు కారు, ప్రతిఒక్కరూ మాధుర్యముగా, నెమ్మదిగా పాడుచూ ఏడ్చుచుండేవారు. మాధుర్యముగా, తీయగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి బ్రద్దలవునటువంటి ఆ పాత విధానమును మాత్రమే నేను ఇష్టపడుదును. మనము ఏదైనా అభివృద్ధిలోనికి వచ్చుటకు ముందు మొదటిగా మనము నలుగగొట్టబడవలెను. మీకు తెలియును, నలుగగొట్టబడి, తిరిగి నిర్మించబడుటకు ప్రవక్త కుమ్మరి ఇంటికి వెళ్ళుచుండెను. మరియు నలుగగొట్టబడుట అనునది లేనియెడల తిరిగి చేయబడుట అనునది ఉండదని మీకు తెలియును. మీరు మొదటగా నలుగగొట్టబడవలెను.
మరియు అది ఎట్లున్నదనగా, భూమి వలెనే అది వున్నది, రైట్ సహోదరుడా నీవు గనుక పంటను పొందవలెనన్నచో, మొదటగా నీ నేలను పగులగొట్టవలెను, ముక్కలుగా దున్నవలెను. మరియు పిదప విత్తనమును నాటవలెను, మరియు అది పైకి వచ్చును. అది పగులగొట్టబడినప్పుడు ఇక అది ఏ రకమైన విత్తనము నాటబడినదో దానిపై ఆధారపడియుండును. కావున పిదప ఆ పంట... నేల పగులగొట్టబడిన తరువాత, ఇక అది విత్తుటకు సమయమైయున్నది.
24
పిదప, వాగ్దాన దేశము నుండి వెళ్ళిపోయిన ఈ సహోదరులు బబులోనుకు చెరగొనిపోబడినారు, ఎందుకనగా వారి పాపములు వారిని దేవునినుండి వేరుపరచి యుండెను.
మరియు ఈ రాత్రి సంఘము లేదా ఏ వ్యక్తియైనా లోకములతో వ్యవహరించుటకు మరియు ఆడుటకు ప్రారంభించిన వెంటనే, వారు కూడా అదే అనుభవములోనికి వెళ్ళెదరని నేను చాలినంత ఆ పాత పద్ధతిని మాత్రమే కలిగియున్నవాడనై నమ్ముచున్నాను: దేవుని నుండి తొలగిపోవుట, సత్యము నుండి తొలగిపోవుట; అది వాక్యమైయున్నది. మరియు నేను దానిని నమ్ముచున్నాను. అది సత్యమని నాకు తెలియును.
ఇప్పుడు, ఇరవై సంవత్సరాలుగా నేను పరిచర్యలో ఉన్నాను మరియు ప్రపంచ మంతటా వేర్వేరు పద్ధతులను, వివిధ రకాలవారిని నేను చూచియున్నాను. అయితే స్నేహితులారా, మీరు తక్కువవారిగా ఎంచబడవచ్చును, కాని నేను ఆ పాత నలుగ గొట్టబడే కూటమునే ఇష్టపడుదునని మీతో చెప్పుచున్నాను.
25
ఒక దినమున నేను ఇక్కడ ప్రసంగించుచుండగా ఎవరో ఒకరు నా దగ్గరకు వచ్చి, “ఆ స్త్రీ... బిల్లీ, ఆ స్త్రీ వెనుక కూర్చొని కఠినముగా మాట్లాడుచూ, ఎడ్చుచూ, ”ఆమేన్“ అని కేకలు వేయుచూ ఆటంకముగా వుండగా, నీవెట్లు ప్రసంగించగలుగుచున్నావు?” అని అనిరి.
నేను చెప్పాను, “బహుశా నేను ప్రసంగించుటకు అదియే కారణమైయుండ వచ్చును. అవును. నిజము.” నేను చెప్పాను, “ఒకవేళ ఆమె ... ”
“మంచిది, నేను మాట్లాడుటకు ప్రయత్నించుచుండగా మరియు ఎవరైనా ఆ విధంగా చేయుచుండగా అది దాదాపు నన్ను చంపివేసినట్లుండును” అని అతడు చెప్పెను.
“సహోదరుడా, అది నన్ను గాయపరచుట లేదు, అది నన్ను ప్రోత్సాహపరచుచున్నది” అని నేను చెప్పాను.
“ఆమె ఒక భయంకరమైన పాపియై యున్నదా లేదా ఏదైనా అయి యున్నదా?” అని అతను అనెను.
“లేదు, ఆమె పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక క్రైస్తవురాలైయున్నది” అని నేను చెప్పాను.
“మరి ఆమె ఏడ్చుచున్నదేమిటి?”
“అవును, కన్నీటితో వెళ్ళువాడు నిస్సందేహముగా తనతోపాటు ధాన్యపు కట్టలను తిరిగి తీసికొని వచ్చును అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది” అని నేను చెప్పాను.
ఆమేన్. అది నిజము. “విత్తుచు వెళ్ళుచున్నవాడు,” చూడండి, “మరియు కన్నీటితో విత్తువాడు నిస్సందేహముగా తనతో ప్రశస్తమైన ధాన్యమును తెచ్చును, అతడు సంతోషముగా తిరిగి వచ్చును.” నలగగొట్టబడుట, తయారు చేయబడుటయను మొదటి కార్యములను ముందుంచవలెను. ఆ పిదప సంతోషము వచ్చును. ఆమేన్. అది నిజము.
26
ఈ ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళిరి, వేరొక రాజు క్రిందికి తీసికొనిపోబడిరి. వారి స్వంత రాజు కూడా వారితోపాటు తీసికొనిపోబడెను. నెబుకద్నెజరు రాజు అనే క్రూరమైన వేరొక రాజు క్రిందికి వారు వెళ్ళియున్నారు. కావున ఒక దినమున, అతడు చెప్పెను, ఒకవేళ ఏ ప్రజలైనా... అతడు మైదానములో ఒక ప్రతిమను చేయించి నిలువబెట్టించినప్పుడు, “ఆ ప్రతిమకు నమస్కరించని లేదా సాగిలపడని ఏ వ్యక్తియైనా అగ్నిగుండములో పడద్రోయబడవలెను మరియు దహించబడవలెను” అని అతను చెప్పెను. ఈ బాలురు దహించబడవలెనను ఎటువంటి ఒక ఒప్పందమును చేసియున్నారు, ప్రతిఒక్కరు!
మరియు ప్రార్ధనకు ఇంతకు ముందే జవాబు కలిగియున్న షద్రకు, మేషాకు, మరియు అబెద్నగో అను పేరుగల ముగురు అచ్చట నున్నారు. వారు ఆ ప్రతిమకు తమ వీపులను త్రిప్పియున్నారు. మరియు “ఓ రాజా, ఇది నీకు తెలియును గాక...” అని వారు చెప్పియున్నారు.
మీరు దీనిని గమనించవలెనని నేను కోరుచున్నాను. దేవుడు తనయొక్క సాక్షులు దృఢమైన వారిగా వుండవలెనని కోరుచున్నాడు. ఈ దినమున ఒక సాక్షిగా వుండి, మరియు రేపటి దినమున బలహీనులుగా ఉండుట కాదు.
27
ఈ రోజు నేనొక భూస్థాపనారాధనలో ప్రసంగించుచుంటిని మరియు దానిగూర్చి చాలా కఠినంగా మాట్లాడియుంటిని; ఎవరో నన్ను అడిగియున్నారు “చాలామంది జనులు పాపులుగా ఉన్నారు, క్రీస్తును అంగీకరించనివారిగా నున్నారు అని నేను తలంచుచున్నాను” అని చెప్పిరి. బహుశా చాలా ఎక్కువగా బాధపరిచానని నేను తలంచాను.
మరియు ఆ భూస్థాపనారాధన ఏర్పాటు చేసినవాని కారులో నేను వెళ్ళుటకు బయటికి రాగా, అతను సమీపించి, మరియు నన్ను భుజముపై తట్టి, “బోధకుడా, నేను నా అభిప్రాయమును తెలియజేయగోరుచున్నాను” అని చెప్పెను. నేను “ఆహ్ ..హ్” అని తలంచాను.
“అది ఆ రీతిగానే ప్రసంగించబడవలెనని నేను తలంచుచున్నాను” అని అతను చెప్పెను. “శక్తిహీనమైన మతమును నేను ఇష్టపడను” అని అతను చెప్పెను.
“అబ్బాయి, నీ విషయమై నీరీక్షణ ఉన్నది” అని నేను తలంచాను. అది సరియే. అది నిజము. అది దేనికి చెందునో అక్కడే నిజముగా నీవు దానిని ఉంచవలెను. అది ఖచ్చితముగా సరియే.
28
అప్పుడు ఈ ఇశ్రాయేలు పిల్లలు, ఈ షడ్రకు, మేషాకు, మరియు అబేద్నగో దేవునికి సాక్షులుగా వున్నారు.
దేవుడు ఒక సాక్షిని కలిగిలేకుండా, ఎన్నడూ లేడు. ఆయనకు ఎల్లప్పుడు సాక్షులున్నారు... ఇప్పుడు మీరు దీనిని చాలా జాగ్రత్తగా వినవలెనని నేను కోరుచున్నాను. దేవుడు ఏ సమయములోనైనా భూమిమీద ఒక సాక్షి లేకుండా ఉండలేదు. ఆయన తన చేతులను పైన ఉంచి “ఆయనే నాకు సాక్షి” అని చెప్పుటకు కనీసం ఒక్క మనుష్యుడినైనా ఆయన ఎల్లప్పుడూ కలిగియున్నాడు. ఒకానొక సమయమున అది ఒక మనుష్యునికి వచ్చెను; మరియు యోబు ఆయన యొక్క ఒకే ఒక సాక్షిగా వున్నాడు. మరియు అబ్రహాము ఆ దేశములో; అయితే దేవునికి ఒక సాక్షిగా వున్నాడు. ఎవరో ఒకరు ఏదో ఒక చోట దేవునికి సాక్షిగా ఉండెదరు.
ఇప్పుడు, కొద్ది సమయములో ఈ దినమునకు, నిజముగా ఒక సాక్షియనగా ఏమిటో కనుగొనగోరుచున్నాము. అది సరియే. గమనించండి.
ఈ మనుష్యులు, వారు అక్కడికి వెళ్ళిన పిదప, వారు రాజుయొక్క ఆహారమును తినుటకును, అతని యొక్క ద్రాక్షారసమును త్రాగుటకును, మరియు అతని యొక్క ప్రతిమకు సాగిలపడుటకును వారు నిరాకరించియున్నారు. వారు ఒక వాస్తవమైన, దేవుని యొక్క నిజసాక్షులైయున్నారు.
29
కొన్నిసార్లు ఒక సాక్షి శిక్షననుభవించవలసివచ్చును. కొన్నిసార్లు, నీవు దేవుని కొరకు సాక్ష్యమిచ్చనప్పుడు, నీవు కొద్దిగా బాధననుభవించవలసి వచ్చును.
మీరు పరిశుద్ధ గ్రంథమును చదువునంతవరకూ మరియు అటువంటివి కొనసాగించునంత వరకు మీరు ఇంటిలో ఉండరాదని తల్లి మీతో చెప్పినప్పుడు ఎట్లు౦డునో, మీకు జ్ఞాపకమున్నదా? లేదా నీవు ఒక నిజసాక్షివైనందుకు “నీవు ఒక మత ఛాందస్సుడవు” అని ఇరుగుపొరుగు వారు లేదా పాఠశాలలోని పిల్లలు చెప్పినప్పుడు, మీకు జ్ఞాపకమున్నదా? నీవు నిజమైన సాక్షిగా ఉన్నందువలన నీ ఉద్యోగము దగ్గర మనుష్యులందరు నిన్ను గూర్చి నవ్వినప్పుడు, నీకు జ్ఞాపకమున్నదా? చూశారా? నీవు ఒక సాక్ష్యమిచ్చినప్పుడు, నీవెట్లు వీధులలో ఎగతాళి చేయబడుచున్నావు? అయితే అది ఒక సత్యమైన నిజ సాక్షికి ఒక వాస్తవమైన గురుతుగా ఉన్నది. దేవుడు సాక్షులను కోరుచున్నాడు.
“నేను సంఘములో సాక్ష్యమిచ్చెదను” అని ఇప్పుడు కొందరు ప్రజలు చెప్పుదురు. అది మంచిదే.
అయితే, సహోదరుడా, ఎక్కడైతే అది నిజముగా అవసరమైయున్నదో, అటువంటి కంచెలలో, మరియు రహదారులలో, త్రాగుడు స్ధలములలో, బయట వీధులలో చీకటి స్ధలములలో నీ వెలుగును ప్రకాశింపజేయవలెను. నీవున్న ప్రతి స్థలములో ఒక సాక్షిగా నీ వెలుగును ప్రకాశింపజేయుము. ఆమేన్.
గమనించండి! పిదప అగ్నిపరీక్ష వచ్చియున్నది.
మరియు దేవుని కొరకు సాక్ష్యమిచ్చే ప్రతి మనుష్యుడు అగ్నిపరీక్షలగుండా వెళ్ళవలసివచ్చును. దేవుడు తన ప్రజలను ఎట్లు నడిపించుచున్నాడో అది వింతగా లేదా? చాలా వింతగా నుండును.
30
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే, అపవాది చేత శోధింపబడుటకు ఆయన అరణ్యములోనికి వెళ్ళియుండెను.
ఇశ్రాయేలు రక్తము క్రింద, సున్నతిగలవారై బయటకి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ వెలుగు రూపములో వారిని నేరుగా ఎర్ర సముద్రము నొద్దకు నడిపించెను. మరియు వారు అక్కడ క్లిష్టమైన పరిస్థితులలో చిక్కుకున్నారు, ఒక ప్రక్క పర్వతములు, మరో ప్రక్క ఎడారి; ఫరో సైన్యము వచ్చుచున్నది, మరియు ఎర్ర సముద్రము వారి దారిని అడ్డగించుచుండెను. దేవుడు సరిగ్గా అటువంటి స్థలమునకు వారిని నడిపించెను. ఎందువలన? మహిమ పొందుట కొరకు. అప్పుడు మోషే ప్రార్ధించియున్నాడు; మరియు తనకు ముందుగా తన కర్రను చాచి పట్టుకొని సరిగ్గా ఎర్ర సముద్రము వైపుగా అడుగు వేయమని దేవుడతనితో చెప్పియుండెను. మరియు అతడు నడుచుచుండగా, ఎర్ర సముద్రము ఒకవైపు నుండి మరొక వైపునకు కదిలెను, సరిగ్గా ఎర్ర సముద్రము దగ్గర. ఎందువలన? దేవుని మార్గము దానిద్వారా నడిపించినది.
వారు అక్కడి నుండి బయటికి వచ్చిన వెంటనే, వారు నేరుగా పాపమనే అరణ్యములోనికి వచ్చియుండిరి. వింతగా నున్నది. దేవునికి వ్యతిరేకముగా వారు సణిగినప్పుడు, దేవుని మార్గము సరిగ్గా ఆ గొప్ప శోధనగుండా వారిని నడిపించియున్నది. వారు అక్కడి నుండి బయలుదేరి ఒక సణుగుడు నుండి ఇంకొక చోటికి, ఒక పరీక్ష నుండి ఇంకొక పరీక్షలోనికి వెళ్ళియుండిరి.
“కొందరు నీట ద్వారా, కొందరు వరద ద్వారా, కొందరు లోతైన పరీక్షల ద్వారా, అయితే అందరూ రక్తము ద్వారా” అను పాత పాటవలె అది వున్నది. దేవుడు ఆయన సాక్ష్యములను, ఆయన సాక్షులను నడిపించు విధానము అదేయైయున్నది.
31
ఇప్పుడు, అగ్నియొక్క పరీక్షకు, సమయము వచ్చినప్పుడు, “మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి మమ్మును విడిపించుటకు సమర్ధుడు; అయితే ఒకవేళ ఆయన విడిపించకున్నను మేము ఈ ప్రతిమకు సాగిలపడము” అని షద్రకు, మేషాకు, అబేద్నగోలు చెప్పియున్నారు. “మీ యొక్క సాక్ష్యమునకు మేము సాగిలపడనున్నాము.”
నేను దానిని ఇష్టపడుచున్నాను. ఆ పాత ధైర్యమును నేను ఇష్టపడుచున్నాను. బడ్డీ రాబిన్సన్ చెప్పినట్లే అది వున్నది, “ప్రభువా, నాకొక పెద్ద మొద్దులాంటి వెన్నెముకను దయచేయుము” అని అతను చెప్పెను. సాక్షి ఆ విధముగానే ఉండవలెను. ధైర్యముగా! మనము ధైర్యవంతులముగా నుండుటను దేవుడు ఇష్టపడుచున్నాడు.
32
అతడు నదిని దాటుటకు ముందు ఆయన యెహోషువాతో చెప్పియున్నాడు, “నీవు ధైర్యముగా వుండుము, ఏలయనగా ప్రభువైన దేవుడు నీవు వెళ్ళు ప్రతిచోట నీతో వున్నాడు.”
“మంచిది, యెహోషువాతో చెప్పినట్లు దేవుడు నాతో చెప్పినయెడల నాకు కూడా కొంత ధైర్యము వచ్చును” అని నీవు చెప్పవచ్చును.
ఆయన ప్రతి విశ్వాసితోను అదే విషయమును చెప్పియున్నాడు. “నిన్ను విడువను, ఎడబాయను, యుగ సమాప్తివరకు ఎల్లప్పుడూ నేను నీతో ఉంటాను.” ధృడమనస్సుతో వుండండి! అలాగైన, మనము వెళ్ళి వాగ్దానమును స్వతంత్రించుకొనెదము. దేవుడు మనకు వాగ్దానమును ఇచ్చియున్నాడు. ఒక నిజమైన సాక్షిగా ఉండెదము.
33
కావున వారు ఇంతకు ముందున్న వేడిమికన్నా అగ్నిని ఏడు రెట్లు వేడిమిగా చేసియుండిరి.
దయ్యము దానిని ఆ విధముగానే చేయును. మరియు, సహోదరుడా, వాడు దేనినీ సగము పనిగా చేయడు. వాడు, వానికున్న ప్రతీదీ నీలోనికి నెట్టును. అయితే, దేవునికి స్తోత్రము, దేవుడు కొంత వెనుకకు లాగే దానిని కలిగియున్నాడు, దేవుడే దానిని స్వయంగా చేయుచున్నాడు. అది నిజము. మంచిది. ఆయనవైపు చూడండి.
ఇప్పుడు, గమనించండి. రాజైన నెబుకద్నెజరు ఆ మండుచున్న అగ్నిగుండము మరియు ఆ పొగ ప్రక్కన కూర్పునియుండుటను నేను చూచుచున్నాను, ఆకాశములు ఎర్రగా నున్నవి.
34
ఆ రాత్రంతా అక్కడ ఒక ప్రార్ధనా కూటము కొనసాగుచుండుటను నేను ఊహించుచున్నాను. మీకు తెలియును, మీరు ఒక పరీక్షకు వచ్చుచున్నయెడల....
అది ఇక్కడ వున్నది. సంఘముతో ఈ రోజున వచ్చిన సమస్య అదియే. ప్రార్ధన ద్వారా ప్రభువు చెంతకు దానిని తీసుకువెళ్ళడానికి బదులు మీరు మీ యొక్క సొంత ఇంద్రియములపై మరియు సామర్థ్యతపై ఆధారపడుచున్నారు. అది నిజము. ఈ దినాన ఎవరో ఒకరిని ఏదో ఒక స్థలమునకు మనము పంపుటకు ప్రారంభించి, మంచిది, మనము చిన్న సమావేశమును కలిగియుండి, మరియు కలిసియుండి, “మనము దీనిని చేయవలెను, లేదా ఇక్కడికి వెళ్ళవలెను లేదా దానిని చేయవలెను” అని చెప్పుదురు.
అయితే పరిశుద్ధ గ్రంథములో, వారు అపోస్తలులను పంపుటకు ముందు దినాల్లో వారంతా కలిసికొని ఉపవాసముండి మరియు ప్రార్ధించెడివారు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పెను, “పౌలును మరియు బర్నబాను నా కొరకు వేరుపరచుడి.” పరిశుద్ధాత్మ! మీరు గమనించండి: ఏ మనుష్యుని అభిప్రాయము కాదు, అయితే పరిశుద్ధాత్మయే మార్గదర్శకత్వము చేయుచు, నడిపించుచునుండెను. ఆమేన్. గమనించండి.
ఇప్పుడు, రాత్రంతా ప్రార్ధనా కూటము, దానిని బట్టి వారు ఏమైయున్నారో దానిని వారు చూపించవలసియున్నారు. మరియు, సహోదరుడా, క్రైస్తవుడను అని చెప్పుకొను ప్రతి మనుష్యుడు ఏదో ఒక సమయమున మీరు ఏమైయున్నారో దానిని చూపించవలసివచ్చును. దయ్యము మిమ్ములను సవాలుకై పిలుచును.
35
చిన్నవాడైన టామి ఆస్బర్న్ అతను మీలో చాలామందికి తెలియును, నేను వసారాలో కూర్చొనియుండగా వచ్చెను. అతడు చెప్పెను, “సహోదరుడా, బ్రెన్హాం,” “నేను కూటములో ఉండియుంటిని. ఆ పిచ్చివాడు నీ పాదములు యొద్ద పడుట నేను చూసియుంటిని” అని అతడు చెప్పెను. “నేనేమి చేయగలను?” అని చెప్పెను.
“ఇప్పుడు, టామి నీవు దేనితోనైతే నిలబడలేవో దానిని కనపరచుకొనవద్దు. దానిని బట్టి దయ్యము నీతో సవాలు చేయుటకు సిద్ధముగా నుండును. అవును, అతడు చేయును, మరియు వాడు దానిని వెంటనే చేయును” అని నేను చెప్పాను. “పిదప నీవు దానితో నిలబడనియెడల, ఏమి సంభవించునో నీకు తెలియును. అది ఒక నిందగా నుండును. కావున నీవు నీ అభిప్రాయమును తెలియజేయుటకు ముందు నీవు సరిగ్గా నుంటివన్న నిశ్చయతను కలిగియుండుము” అని నేను చెప్పాను.
36
మరియు, క్రైస్తవుడా, అది కూడా సత్యమైయున్నది. దేవుడు మిమ్ములను లోకపు సంగతుల నుండి వేరు చేశాడనియు మరియు మిమ్ములను నూతన సృష్టిగా చేశాడనియు మీ హృదయాంతరంగములో నిశ్చయతను కలిగియుండుడి, పిదప వెళ్ళి నేను క్రైస్తవుడిని అని ప్రజలకు తెలియజేయండి. అది జరిగేంతవరకు, సరిగ్గా వేదిక దగ్గరే వేచియుండుడి మరియు మీకు సాధ్యమైనంతవరకు చచ్చినట్లుండుడి. అది సరియే. మీరు చనిపోయేరనేటట్లుగా చనిపోండి. మీవలన ... మంచిది, అది సరియే, చనిపోవుట!
మీకు తెలియునా, ఈ దినమున మనము సజీవులుగా ఉన్న చాలామంది ప్రజలను పాతిపెట్టుచున్నామని నేను తలంచుచున్నాను.
ప్రజలు చనిపోయిన తరువాత మీరు వారిని పాతిపెట్టెదరు.అది నిజమేనా? అవునయ్యా. ఆలకించండి, సహోదరుడా, ఒక చనిపోయిన వ్యక్తి మీరు కోరినట్లుగా అతనిని ఏమైనా అనవచ్చును, అనేక రకముల పేర్లతో పిలువవచ్చును, అతడు ఒక్కమాటైనా పలుకడు. ఎందువలన? అతడు చనిపోయివున్నాడు కాబట్టి.
మరియు క్రీస్తులో చనిపోయిన ఒక మనుష్యునికి, నీవు తాగుటకు అతని ఎదుట పెట్టగలవు, అతనికి ఇది లేదా ఇంకేదైనా నీవు ఇవ్వగలవు, అయితే అతడు చనిపోయివున్నాడు. మరియు అతడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి దేవుని ద్వారా క్రీస్తులో దాచబడియున్నాడు. ఆమేన్. అది అంతే. ఇప్పుడు, పిదప, అతను ఆ కార్యములను చేయలేడు, ఎందుకనగా అతను వాటిని చెయ్యకుండును. అది అతని స్వభావమునకు విరుద్ధమైయున్నది. అతను ఒక నూతన సృష్టిగా మార్చబడును.
37
మీరు ఒక పందిని తీసికొని మరియు దానిని కడిగి మరియు కుంచెతో దానిని బాగా శుభ్రపరచి మరియు దాని గోళ్ళను శుభ్రము చేసి రంగులు వేసి మరియు దాని పెదాలకు రంగువేసి, మరియు మీరు కోరినట్లు నైలాన్ వస్త్రములను దానికి ధరింపజేసి; పిదప దానిని విడిచిపెట్టుడి, అది నేరుగా బురదలోనికి వెళ్ళి దొర్లును. శుభ్రపరచుట ఏ మంచి చేయదు. అది ఇంకనూ పంది స్వభావమునే కలిగియుండును.
మరియు తరువాత మీరొక గొర్రెపిల్లను తీసికొనండి మరియు బురద గుంటలో దానిని ఉంచండి, మీరు దానిని బయటకు తీసేంతవరకు అది అరచుచు నుండును. ఎందువలన? దానిది గొర్రెపిల్ల స్వభావమై యున్నది.
ఇప్పుడు, బురద నుండి పందిని దూరముగా నుంచుటకు ఒకే ఒక మార్గము వున్నది. అదేదనగా, దాని స్వభావమును మార్చుటయే. అది నిజము.
ఒక క్రైస్తవుణ్ణి చేయుటకు అదొక్కటే మార్గమైయున్నది. ఒక పాపి నుండి ఒక పరిశుద్దునిగా అతని స్వభావము మార్చబడవలెను, చూశారా. మరియు అక్కడ ఒకే ఒక ప్రాయశ్చిత్తము కలదు, అదియే పరిశుద్ధాత్మయై యున్నది. అప్పుడే నీవు ఒక సాక్షివి. ఆమేన్.
38
ఇప్పుడు, గమనించండి. మీరు దీనిని జాగ్రత్తగా వినాలని నేను కోరుచున్నాను. ఈ ప్రజలు దహించబడవలెనని రాజైన నెబుకద్నెజరు బహిరంగ ప్రకటన చేసియున్నాడు. మరియు చేతులు బంధించబడినవారై వారు ఆ ఉదయమున వచ్చిరి. అక్కడ ఆ అగ్నిగుండము పైన ఒక చెక్కతో చేయబడిన దారి కలదు. పెద్ద అగ్నిగుండము తెరవబడి యుండెను. వారు గుండములోనికి వెళ్ళుచుండిరి. వారు ఒక మృత్యునడకను నడిచిరి, “ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఒక అవకాశము కలదు. మీరు వెనుక తీసినయెడల, అది మంచిది” అని అతను చెప్పెను.
“మా దేవుడు మమ్ములను విడిపించుటకు సమర్ధుడు, అయినను, మేము వెనుదిరుగము” అని వారు చెప్పియుంటిరి. అంతము వరకు వారు నిజమైన, సత్యసాక్షులుగా వున్నారు.
సైనికులు తమతోపాటు నడుచుచుండగా, వారు ఆ బాటలో నడచుటకు మొదలుపెట్టిరి. ఆ తీవ్రమైన వేడిమి ఎంతగా ఉన్నదనగా అది సైనికులకు ఊపిరాడకుండునట్లు చేసినది. మరియు వారిని అగ్నిగుండములో పడద్రోయుటకు అతడు సిద్ధముగానున్నప్పుడు, “నీవు ప్రార్ధన చేసుకున్నావను నిశ్చయతను కలిగియున్నావా?” అని షద్రకు అడుగుటను నేను వినగలుగుచున్నాను.
“అవును. ఇప్పుడు అది సరియే అని నేను నమ్ముచున్నాను.” అది సరియే.
మరియు పిదప వారిని లోపలికి తీసికొని వచ్చిన సైనికులు కూడా చనిపోయిరి. మరియు వారిని త్రోసివేసిరి. వారింకా కొన్ని అడుగులువేసుంటే వారు వీరిని ఆ తీవ్రమైన అగ్నిలోనికి త్రోసియుండెడివారు.
39
ఇప్పుడు, ఏదైనా కార్యము భూమి మీద జరుగుచున్న ప్రతీసారీ అక్కడ పరలోకములో కూడా ఏదో కార్యము జరుగుచుండును. ఒక విశ్వాసి తన మరణములోనికి వెళ్ళుటయను భయంకరమైన దృశ్యమును ఇక్కడ ఇప్పుడు జాగ్రత్తగా గమనించవచ్చును. అయితే ఈ రాత్రి మన కెమేరాను పరలోకము వైపునకు త్రిప్పెదము. మరియు కార్యములు ఇక్కడ జరుగుచుండగా, అక్కడ కూడా ఏదో కార్యము జరుగుచునుండును. నేను దేవుని చూడగలుచున్నాను, దేవుని కుమారుడు కుడి పార్శ్వమున కూర్చుని క్రిందికి చూచుచుండెను.
తన చేతిలో ఖడ్గము పట్టుకొని 'ప్రభువా, నేను గాబ్రియేలును,“ అని ఒక దూత వచ్చి మరియు చెప్పుటను నేను వినగలుగుచున్నాను. ”ఇప్పుడు, నీవు నన్ను సృష్టించిన దినము మొదలుకొని, నేను నీ కుడి ప్రక్కన నిలబడియుంటిని. నీవు నాకు చేయమని చెప్పిన దానినే నేను చేసియుంటిని. ఈ ఉదయము క్రింద ఆ సాక్షులవైపు చూసితివా? వారు ఆ ముగ్గురు సాక్షులను దహించుటకు సిద్ధముగా యున్నారు“ అని చెప్పుచుండెను.
“రాత్రంతా నేను వారిని గమనించియుంటిని,” అని ఆయన చెప్పుటను నేను వినగలుగుచున్నాను.
“నన్ను క్రిందికి వెళ్ళుటకు అనుమతించుము.” “నేను ఆ దృశ్యమునే మార్చివేయుదును” అని అతడు చెప్పెను. అతడు దానిని చేసియుండునని నేను నమ్ముచున్నాను.
కాని ఆయన చెప్పెను, “గాబ్రియేలు, నీ ఖడ్గమును తిరిగి దాని ఒరలో పెట్టుము. నేను నిన్ను వెళ్ళనివ్వను.”
40
పిదప, మాచిపత్రియను ఒక గొప్ప బలిష్టుడైన దూత ఆయన ఎడమ వైపునకు వచ్చుటను నేను చూచుచున్నాను. అతనికి జలములపై అధికారమున్నది. మరియు అతను ఆయన ముందు సాగిలపడి, మరియు ఇట్లు చెప్పెను, “ప్రభువా, క్రిందనున్న ఆ సాక్షులను నీవు చూసితివా? ఈ ఉదయమున వారిని ఎందుకొరకు వారు దహించుటకు సిద్ధముగా ఉన్నారు, వారు దేవుని కొరకు సాక్ష్యమిచ్చుచున్నారు గనుకనే కదా.”
“అవును, నేను వారిని గమనించాను” అని ఆయన చెప్పెను.
“నన్ను క్రిందికి వెళ్ళుటకు అనుమతించుము. నేను బబులోను భూమి మీద లేకుండా నీటి ద్వారా తుడిచి పెట్టెదను.” అతడు దానిని చేసియుండునని నేను నమ్ముచున్నాను. అతడు చెప్పెను, “నీవు నాకు తాళపుచెవి ఇచ్చియున్నావు. మరియు మానవ పరిణామకాలమందు లేదా జలప్రళయ కాలమప్పుడు, నేను సమస్తమును నీ కొరకు వరదలో ముంచి కడిగివేసితిని. ఈ ఉదయమున నేను అదే కార్యమును చేయుదును. నీవు గనుక [స్పష్టతలేని మాటలు].”
“అవును మాచిపత్రి, అది నిజము, నీవు దానిని చేయగలవు. నీవు దానిని చేయగలవని నాకు తెలియును, అయితే నేను నిన్ను వెళ్ళనివ్వను” అని ఆయన చెప్పుటను నేను వినగలుగుచున్నాను.
“ప్రభువా, ఎందువలన?”
41
“నేను నిన్ను వెళ్ళుటకు అనుమతించను గనుక ఇక్కడ నా ఎడమ ప్రక్కకు వచ్చి, నిలబడుము. స్వయంగా నేనే వెళ్ళుచున్నాను. రాత్రంతా నేను వారిని గమనించియున్నాను. నా సాక్షులను నేను గమనించియుంటిని. దానిని నిర్వహించుటలో, నేను నా వాక్యమును కూడా గమనించియుంటిని. నేనెంతమాత్రము నిన్ను వెళ్ళనివ్వను. ఎందుకనగా స్వయంగా నేనే వెళ్ళుచున్నాను.”
వారు ఆ తీవ్రమైన అగ్నిగుండములోనికి వెళ్ళుటకు దాదాపు ఒక్క అడుగు మాత్రమే ఉన్నది.
అది వింతగా లేదా? మార్గము యొక్క ఆఖరి అడుగు వరకు మీరు వచ్చునట్లు దేవుడు చేయుచున్నాడు. ఆయన పట్టించుకొనడం లేదన్నట్లుగా కనిపించును; ఆయన కూర్చొనియుండెను. కాని, ఆయన మిమ్మును గమనించుచునేయున్నారు. ఆయన బబులోనులోనికి చూచుచున్నప్పుడు, నేను తలంచియుంటిని. “ఆయన కన్ను ఊర పిచ్చుకపైనున్నది, మరియు ఆయన నన్ను గమనించుచున్నాడని నాకు తెలియును.” ఆయన మిమ్మును గమనించుచున్నాడు. గమనించండి.
42
పిదప ఆయన యొక్క మహోన్నతమైన సింహాసనము నుండి ఆయన లేచుటను నేను చూడగలుగుచున్నాను. ఆయన యొక్క యాజక వస్త్రములు ఆయన చుట్టూ పడెను. మరియు ఆయన అక్కడ ఒక గొప్పదైన పెద్ద ఉరుము ఉత్తర దిక్కున కూర్చుండియుండుటను చూచెను. “తూర్పు వాయువు, పడమటి వాయువు, ఉత్తరము మరియు దక్షిణ వాయువు ఇటు రండి, ఈ ఉదయం నేను మిమ్మల్ని నడపాలనుకుంటున్నాను” అని ఆయన చెప్పుటను నేను వినగలుగుచున్నాను. ఆ వాయువులన్నియూ ఆ ఉరుము క్రిందికి వెళ్ళి, సింహాసనము ప్రక్కగా దొర్లుకుంటూ వచ్చి నిలబడినవి. మరియు ఆయన ఈ గొప్ప ఉరుములోనికి అడుగుపెట్టి, ఎక్కి వంకరటింకరగానున్న మెరుపును చేతితో పట్టుకొని దానిని ఆకాశములో చీల్చుకొంటూ, ఆ విధముగా వెళ్ళెను.
మరియు మొదటిసారిగా వారు అక్కడికి వెళ్ళుటకు అఖరి అడుగు వేసియున్నారు. ఆయన జీవ వృక్షముతో లేదా జీవపు ప్రవాహమువలె క్రిందికి వచ్చి పెద్ద కొమ్మలు లేని చెట్టును విసురుటకై పెకిలించెను. మరియు వారు ఆ తీవ్రమైన అగ్నిని తాకినప్పుడు, ఆ మండుచున్న గంభీరమైన జ్వాలలు వాళ్ళను తాకకుండునట్లు విసురుచూ, దేవుని కుమారుని పోలిన ఒకరు వారి మధ్యన నిలబడి యుండెను. అవి చాలా సేపుగా మండుచునే యున్నవి. నిజమైన, సత్య సాక్షులు!
దేవుడు ఒక నిజమైన సాక్షి పక్షమున నిలబడియుండును. అది నిజము.
43
పిదప, గమనించండి, మరియు అగ్ని మండుచుండగా, వేడంతా వచ్చుచుండగా, ఆ రాజు యొక్క హృదయం కలవరపడసాగెను. “వెళ్ళి ఆ మూత తెరవండి. మరియు బహుశా ఏమైనా బూడిద మిగిలిందో లేదో చూడండి” అని చెప్పెను. మరియు వారు తలుపును కుదిపి తెరచినప్పుడు, అతడు పైకి గెంతెను, “అక్కడ లోపల మీరు ఎంతమందిని వేసితిరి?” అని అడిగెను.
“ముగురు” అని చెప్పెను.
“నేను నలుగురిని చూచుచున్నాను. మరియు ఆ వేరొక వ్యక్తి దేవుని కుమారుని పోలియున్నాడు” అని చెప్పెను. ఆయన యొక్క సాక్షి పక్షమున నిలబడుట.
దేవుడెల్లప్పుడూ తనయొక్క సాక్షి పక్షమునే నిలిచియుండును. ఆమేన్. అది సత్యమని మీకు తెలియును. దేవుడు ఒక వ్యత్యాసమును కలిగించును, మరియు ఎవరైతే ఆయన కొరకు సాక్ష్యమిచ్చెదరో వారి పక్షాన నిలబడియుండును.
44
ఒకప్పుడు దావీదు అను పేరుగల ఒక చిన్నవాడు ఉండియున్నాడు. ఒక సమయంలో తన సహోదరులకు కొన్ని ఎండి ద్రాక్షలు తీసికొని వెళ్ళుటకు అతడు బయటికి వెళ్ళెను. అది యుద్ధములో అయియున్నది. మరియు అతని తండ్రియైన యెషయి అతనిని బయటికి పంపించెను. సౌలు రాజుగా వున్నాడు. ఫిలిస్తీయులు ఒక ప్రక్కనున్నారు, మరియు ఇశ్రాయేలీయులు మరొక ప్రక్కనున్నారు; వారివురి మధ్య నీటి ప్రవాహము పారుచున్న ఒక కాలువ ఉండియుండెను.
మరియు దయ్యము తనదే పై చేయని తలంచినప్పుడు, వాడు ఎల్లప్పుడూ అదే విధముగా చేయును, వాడు నిజముగా దానిని తీసికొనివచ్చును.
కావున అక్కడ ఏడు అడుగులు లేదా ఎనిమిదడుగుల ఎత్తు, బహుశా ఇంకా ఎక్కువ బహుశా పది అడుగులుండి, ధాన్యపు కొట్టపు ద్వారము వంటి పెద్ద భుజములు, పెద్ద ఈటె మరియు కవచము కలిగియున్న ఒక గంభీరమైన గొప్ప వ్యక్తి వాడికున్నాడు, మరియు వాడు అక్కడ నిలబడియున్నాడు. “ఇప్పుడు, మనము ఏమి చేయవలెనో నేను నీకు చెప్పెదను, ఫిలీస్తీయుల తరపున నేను ఇక్కడ ఒక సాక్షిగా వున్నాను. వారి పక్షమున కూడా ఒక సాక్షి ఉండవలెను మరియు సైన్యములు పోరాడవలసిన పనిలేదు, కానీ మేము బయటకు వచ్చి పోరాడెదము. మరియు నేను అతనిని చంపిన యెడల, మీరందరూ మమ్మును సేవించవలెను. అతను నన్ను చంపినయెడల, మేము మిమ్మును సేవించెదము” అని అతడు చెప్పెను.
దయ్యము ఎట్లు చేయునో చూశారా? వానిదే పైచేయి అని తలంచినప్పుడు, వాడు డంబముగా అతిశయోక్తులతో నుండి మరియు తీవ్రమైన మూర్ఖత్వమును ప్రదర్శించును.
45
సౌలు, ఏడు అడుగులవాడైయుండియు, వాడిని ఎదుర్కొనుటకు భయపడెను. మరియు ఇశ్రాయేలీయుల సైన్యం ఓడిపోయి, ఆ వెనుక తట్టు కొండలపై నిలబడి గమనించుచుండిరి.
కొద్దిసేపైన తరువాత, ఆ వైపుగా ఒక చిన్నవాడు నడుచుకొని వచ్చుచుండెను. చూచుటకు ఎర్రనివాడై యుండి; ఎంతో పెద్దగా లేకుండా, చిన్నగా బక్కపల్చని వానిగా వున్నాడు. అయితే అక్కడున్న ఎవ్వరిలోను లేనటువంటిది ఒకటి ఆ గొర్రె చర్మపు చొక్కాయి వెనుక మ్రోగుచునుండెను. అతను అక్కడికి నడిచివెళ్ళి తన సహోదరులకు ఎండి ద్రాక్షాలను యిచ్చెను మరియు యుద్ధమును గూర్చి వారితో మాటలాడుచు నుండెను.
కొద్దిసేపైన తరువాత, ఈ ఉన్నతదేహుడు బయటకు వచ్చెను మరియు “ఎవరు మాతో యుద్ధము చేయుదురు?” అని తప్పుడు సమయములో డంబముగా పలికెను.
మరియు “ఎవడు వీడు?” అని దావీదు పలికెను. “జీవముగల దేవుని సైన్యమును సున్నతిలేని ఈ ఫిలిస్తీయుడు ఎదిరించునని మీరు నాతో చెప్పజూచుచున్నారా? అని అనెను. ఎవరైనా అక్కడ నిలబడియుండి మరియు దేవుని శక్తుల కొరకు సాక్ష్యమిచ్చువారు మనకు కావలెను.” వారందరును భయపడిరి. “నేనే వెళ్ళెదను” అని అతను చెప్పెను. అటువంటి ధైర్యమును నేను ఇష్టపడుచున్నాను. “నేను వెళ్ళెదను. అతనితో నన్ను యుద్ధము చేయనియ్యుడి.”
46
అతను అక్కడికి నడిచివెళ్ళుచున్నప్పుడు.... వారు అతనిని సౌలునొద్దకు తీసుకొని వెళ్ళిరి, మరియు సౌలు “మంచిది, ఆ మనుష్యుడు తనయొక్క ... అతను తన యవ్వనప్రాయము నుండియు యోధుడు, మరియు నీవు కేవలం బాలుడవు” అని చెప్పెను.
“చూడండి!” హల్లేలూయా! నేను సరిగ్గా ఇక్కడ దీనిని ప్రేమించుదును. దావీదు సౌలుతో “చూడండి, మీ యొక్క సేవకుడు....” “ఈ వడిసెలతోనే నేను ఒక ఎలుగుబంటిని చంపునట్లు ప్రభువు చేసియుండెను. ఒక సింహము నోటినుండి ఒక గొర్రెపిల్లను తీసికొని మరియు దానిని చంపునట్లు ఆయన చేసియుండెను, నేను దాని జూలు పట్టుకొని విదిలించి, మరియు దానినుండి గొర్రెపిల్లను విడిపించితిని. నేను ఒక సాక్షిని,” అని చెప్పెను. హల్లెలూయా! అతను ఏదో స్థలములో ఉండి యుండెను. అతను ఏదో కార్యమును చూసియుండెను. అతను దేవుని యొక్క శక్తిని ఒక పరీక్షకు గురిచేసెను, మరియు అతడు ఒక సాక్షిగా నిలిచెను.
ఇంక కొంచెము ధైర్యము, ఈ దినమున మనకు అవసరమైయున్నది అదే అయియున్నది. అది సరియే. అవునండీ. నేను దేనిగూర్చి మాటలాడుచున్నానో దానికి నేను సాక్షిని“ అని అతను చెప్పెను. హల్లేలూయా! అనేక ప్రాంతములు తిరిగి, ఏదైనా చూచియుండి, వారు దేనిగూర్చి మాటలాడుచున్నారో దానిని ఎరిగినవారై ఒక సాక్షిగా నిలబడుట, ఈ రోజున జీవముగల దేవుని సంఘమునకు అవసరమైయన్నది అదేయైయున్నది.
47
“నేను దేవుని యొక్క శక్తికి ఒక సాక్షిని. ఒక ఎలుగుబంటి ఒక గొర్రెపిల్లను పట్టుకొనుటకై వెళ్ళినది, అయితే నేను దానిని చంపితిని” అని అతను చెప్పెను. “మరియు ఒక సింహము వచ్చినది, నేను ఎలుగుబంటిని పట్టుకొని దాని జూలు పట్టుకొని మరియు దానిని సంహరించితిని” అని అతను చెప్పెను. “మరియు ఏ దేవుడైతే ఎలుగుబంటిని మరియు సింహమును సంహరించుటకు నాకు సహాయము చేసెనో, అదే దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని మరి నిశ్చయంగా నా చేతులకు అప్పగించడా?” అని చెప్పెను. హల్లేలూయా!
“అద్భుతములు జరుగు కాలము గతించిపోయెను” అని వారు చెప్పెడి రోజులలో, “పాతకాల మతము - దానితో ఏమీలేదు; అది తాతయ్య, అమ్మమ్మలకే” అని వారు చెప్పునప్పుడు, సాతాను శక్తుల యొక్క స్వభావమును నాశనము చేసి మీ యొక్క హృదయమును శుద్ధిచేయగల ఆ పాతతరపు పరిశుద్ధాత్మ నీలిమేఘము, పాపమును చంపు మతమునకు కొందరు సాక్షులున్నందుకు, సహోదరుడా, ఈ రాత్రి నేను ఆనందించుచున్నాను. హల్లేలూయా! ఒక సాక్షి. కావున, ఓ, మై!
“ప్రజలు చాలా శబ్దము చేయువారుగానున్నారు” అని చెప్పెదరు.
ఎందుకు, వారు శబ్దము చేయుటకు ఏదో ఒకటి కలిగియున్నారు. నిశ్చయంగా, వినండి, బైబిలు మతము ఎల్లప్పుడూ ఒక శబ్దము చేయు దానిగానే ఉన్నదని నేను మీకు నిరూపించెదను. అవును. “నీవు ఎక్కడున్నావప్పుడు...” అని దేవుడు యోబుతో చెప్పెను. యోబు తాను ఒక గొప్ప వ్యక్తినని తలంచెను. “నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడవున్నావు?”
48
“సహోదరుడా బిల్లీ, నీవు కలిగివున్న ఆ కొత్తరకపు బోధను నీవు, ఇంకనూ బోధించుచునేయున్నావా?” అని గడిచిన దినమున, ఒకరు నన్ను అడిగియుంటిరి.
“లేదండి. నిజముగా అక్కడ ఉన్నటువంటి, మరియు దానిలో రక్షణను కలిగివున్న ఆ అతి పురాతనమైన మతమునే నేను బోధించుచున్నాను” అని నేను చెప్పాను.
“కొన్ని సంవత్సరముల క్రితము ఆ క్రొత్తరకపు బోధ మనకు లేదు” అని వారు చెప్పిరి.
“అది ప్రపంచము కంటె పురాతనమైనదని నన్ను చెప్పనివ్వు, సహోదరుడా” అని నేను చెప్పాను.
అది సరియే. “ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని కుమారులు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ”యోబూ,“ నీవెక్కడ ఉన్నావు?” అని అడిగెను. భూమికి పునాదులు వేయుటకు కొన్ని మిలియనుల సంవత్సరముల ముందు! ఆమేన్! వ్యూ! అది నిజము. సాక్షి!
49
ఇప్పుడు, ఆ గొప్ప యాజకుడైన అహరోను, రక్తమును తీసికొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళునప్పుడు, వారు అతనికి ప్రత్యేకమైన రీతిలో వస్త్రములు ధరింపజేయవలెను మరియు అతను ప్రత్యేకమైన రీతిలో నడవవలసియుండెను. దేవునికొరకై అతను ఒక సాక్షిగా ఉండవలెను. మరియు అతను రక్తమును తీసికొని ముందుకు వెళ్ళెను. మరియు అతని వస్త్రపు చెంగు అంచున దానిమ్మపండు మధ్యలో గంట ఉండును, దానిమ్మపండు మధ్యలో గంట. మరియు అతడు నడుస్తూ ఉండగా “పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, ప్రభువునకే” అని చెప్పబడుచునుండును. పరిశుద్ధతను గూర్చి మాటలాడుట! మరియు ఆ గంట దానిమ్మపండుకు కొట్టుకొని శబ్దం వచ్చుటను బట్టియే వారు దేవుడు అతనిని సంహరించలేదని తెలుసుకొందురు. వారు ఆ గంట మ్రోగుటను మరియు ఆ శబ్దమును వినుటను బట్టియే అతడు సజీవునిగా వున్నాడని తెలుసుకొందురు.
సహోదరుడా, ఈ రాత్రి మనకు ఒకదానిని ఒకటి తాకి సంతోషకరమైన శబ్దమును చేయు కొన్ని దానిమ్మపండ్లు మరియు గంటలు, ప్రభువునకు సాక్షులుగా ఉండుటకు అవసరమైయున్నవని నేను చెప్పుచున్నాను. దేవుడు ఇంకనూ సజీవుడై పరిపాలించుచుండెను! ఆమేన్! మంచిది! ఎటువంటి సాక్ష్యము? అక్కడ పైకెక్కి మేడ గదిలో పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినటువంటి సాక్ష్యమ. వారు దానిమ్మపండు, మరియు గంట ఒక్క దగ్గరకు వచ్చునట్లు చేసిరి. పరిశుద్ధాత్మ ప్రభావముతో వారు మద్యము సేవించినవారివలె ఊగిరి. దేవుడు ఇంకనూ సాక్షులను కలిగియుండెను, మరియు వారునూ అదే రీతిగా వున్నారు. “మీరు ఈ శక్తి యొక్క సాక్షులై యుందురు, యెరూషలేములో, యూదయలో, మరియు సమరయలో మరియు జెఫర్సన్విల్, ఇండియానాలో.” ఆమేన్! హల్లేలూయా!
గమనించండి!
50
దావీదు అనెను, మీరు నాకు చెప్పాలనుకున్నదేమిటి, “ఆ సున్నతిలేని
ఫిలిస్తీయుడు,“ వేరేవిధగా చెప్పాలంటే ”క్రైస్తవుడు కాని, ఆ మనుష్యుడు...“
సున్నతి అనగా ఏమిటి? అక్కడ పరిశుద్ధాత్మను కలిగియున్న వ్యక్తి...
“అతను కలిగివున్న అన్నీ డీ.డి.,లను బట్టి జీవముగల దేవుని ధిక్కరించగలడా?” ఓ, మై! “అతను దానినీ ఏలాగు చేయగలడు?” “అతను సున్నతిలేనివాడు,” అని అనెను.
ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందినవారము. మన సున్నతి పరిశుద్ధాత్మయే. పాతకాలపు మతము సరియైనది కాదు“ అని ఈ డాక్టర్-ఆఫ్-డివినిటి మరియు పి.హెచ్.డి, మరియు డి.ఎల్.డి, మరియు డి.డి.,లు నాకు చెప్పవలెనని మీరు కోరుచున్నారా? అయితే, అది సరియైనదని పరిశుద్ధాత్ముడు రుజువు చేయుచున్నాడు. ”ప్రజలు రారు“ అని చెప్పుదురు. అవును. వారు వస్తారు. ఆమేన్.
51
పాతకాలపు బాప్తిస్మమిచ్చు యోహాను, ఆయన బోధించుట మొదలు పెట్టినప్పుడు, యుగములన్నింటిలో ఆయనే గొప్ప బోధకుడైయుండెను. ఆయన చాలా సామాన్యమైన వ్యక్తిగా ఉండెను. అతనికి తొమ్మిది సంవత్సరముల వయస్సున్నప్పుడు అరణ్యముల్లోనికి వెళ్ళెను. అతను పి.హెచ్.డి. పట్టా పొందుకొనలేదు. అయితే అతను ఏమి చేసెను? అతను తన కాలరును పైకి మడిచి లేక, వేద పాఠటములతో గాని స్తుతి పాటలతో గాని రాలేదు, లేక అపోస్తలుల సిద్ధాంతములు అతనికి తెలియదు. అయితే అతను దేవునికి సాక్షిగా ఉండెను. అతను యూదయలోని అరణ్యము నుండి బయటికి వచ్చినప్పుడు, ఈ విధంగా, గొర్రె చర్మము కప్పుకొనినవాడై, ఒక గొప్ప సువార్తను అతడు బోధించెను. ఓ, మై! కానీ అతడు యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతములను, మరియు యూదయ మరియు యోర్దాను చుట్టుప్రక్కల ప్రాంతములను కదిలించివేసెను. ఎందువలన? అతడు క్రీస్తును బోధించెను; చారిత్రకమైన విధానంలో కాదు, అయితే వర్తమాన కాలములో జరుగుచున్న సంఘటనగా, వర్తమానకాలపు సత్యముగా బోధించెను. హల్లేలూయా!
ఈ దినమున మన పునరుత్థానమును ప్రపంచమంతటా చరిత్రను మరియు క్రీస్తు యొక్క పునరుత్థానమును బోధించుచున్నాము. అయితే వ్యక్తిగతముగా నీ విషయమేమిటి, ఆయన నీ హృదయములో నూతన జీవముతో లేచియున్నాడా? పాత జీవితము మరణించినదా?
52
“మీరు ఆ సున్నతిలేని ఫిలిస్తీయుడు అక్కడ నిలబడి అటువంటి మాటలు అనుటకు ఏల అనుమతించుచున్నారు?” అని దావీదు అనెను. “నేను వెళ్ళి అతనితో యుద్ధము చేయుదును” అని అతను చెప్పెను.
కావున, మీకు తెలియునా, మొట్టమొదటగా సౌలు చెప్పినదేమనగా, “మంచిది, నీవు వెళ్ళాలని నిశ్చయించుకొనినయెడల, నా ఆయుధములను నీకిచ్చెదను. నేను నా డాలును, శిరస్త్రాణమును, నా ఖడ్గమును నీకిచ్చెదను.” ఓ, మై!
వినండి. ఆ చిన్న దావీదు ఆ పెద్దదానిని తీసుకొన్నప్పుడు ... ఆ చిన్న భుజములు, ఆ డాలును, కవచమును ధరించుకొని ఏ విధముగా ఉండెనో ఊహించుకొనుడి. అది ఆ చిన్నవానిపై పెట్టగా, ఆతడు నడవలేకపోయెను.
53
వినండి. ఒక శిరస్త్రాణము దైవజనునికి సరిపడదని మనము కనుగొన్నాము. అది నిజము. మీ తత్వజ్ఞానమంతయూ దేవుని శక్తికి సరిపడదు. మీకు తత్వజ్ఞానము అవసరము లేదు. మీకు చదువు అవసరము లేదు. ఒక నిజ సాక్షిగా ఉండుటకు నీకు కావలసినది ఏదనగా, దేవుని వాక్యమునకు సమర్పించబడిన హృదయమైయున్నది.
అది దేవుని బిడ్డకు సరిపడదు. “ఇదంత నానుంచి తొలగించండి, మీ పి.హెచ్.డి. నాకు అవసరము లేదు” అని అతడు చెప్పెను. ఆమేన్! “నేను ఒక సాక్షిని!” అని చెప్పెను. దేనికొరకు? నేను ఈ రకమైన దానిని ఎప్పుడూ ప్రయత్నించలేదు. నాకు మీ తత్వజ్ఞానము ఏమీ తెలియదు. సింహము నుండి మరియు ఎలుగుబంటి నుండి దేవుడు నన్ను ఏ విధముగా విడిపించెనో, ఆ విధముగానే నన్ను వెళ్ళనీయుడి“ అని అతను చెప్పెను.
సహోదరుడా, నేను ఈ రోజు చెప్పుచున్నది అదేయైయున్నది. “ఏదో మానసిక శాస్త్రముతో నన్ను వెళ్ళనీయకుడి, అయితే ఆ పాతకాలపు పరిశుద్ధాత్మ బాప్తిస్మము నన్ను బాప్టిస్టు నోటనుండి బయటకు తెచ్చి మరియు విమోచించినదో, దానితోనే నన్ను వెళ్ళనీయుడి. అదే విధంగా నన్ను వెళ్ళనీయుడి.”
54
“ఓ,''ఎప్పుడూ ప్రయత్నించని దీనంతటితో నేను వెళ్ళలేను, దానిగూర్చి నాకేమీయూ తెలియదు. అక్కడ ఏ విధముగా నిలబడవలెనో మరియు ఆ సిద్దాంతములను ఏ విధముగా వల్లించవలెనో నాకెట్లు తెలియును? దానిగూర్చి నాకేమియూ తెలియదు” అని అతను చెప్పెను. “ఇదంతయూ నా యొద్ద నుండి తొలగించండి” అని చెప్పెను.
కావున వారు దానిని తీసివేసిరి. అప్పుడు అతనికి మంచిగా ఉండెను. వెనుకకు వెళ్ళి మరియు తన చిన్న వడిసెలను తీసికొనెను. అతనికి పరిగెత్తవలెననిపించెను. మీ వడిసెల మీ చేతిలోనికి తీసుకున్నప్పుడు ఏ విధమైన అనుభూతి నొందెదరో మీకు తెలియును.
అతడు అటువైపుగా చూచెను. మరియు “దానితో ఏమి చేద్దామనుకుంటున్నావు” అని గొల్యాతు అనెను.
“నేను వస్తున్నాను” అని దావీదు చెప్పెను. ఆమేన్. తనయొక్క చిన్న వడిసెల తీసికొని, ఆ ఏటివైపుగా పరుగెత్తి వెళ్ళెను మరియు తనకొరకు ఐదు రాళ్ళు ఏరుకొనెను. దానిలో ఒకదానిని అక్కడ అందులో పెట్టి, తన చేతితో త్రిప్పెను.
55
మరియు, “ఆ యొక్క చిన్న పరిశుద్ధ గుండ్రాయి లేదా ఆ విద్యలేని చిన్నపిల్లవాడు నన్ను ఎదుర్కొనుటకు అక్కడికి వచ్చునని మీరు నాకు చెప్పగోరుచున్నారా?” అని గొల్యాతు అనెను. “నేను, నాకున్న డిగ్రీలన్నిటితో, మరియు సమస్తము, అంతెందుకు - అసలు కనీసం నేను నా సమయమును తనతో వెచ్చించలేను. దైవీక స్వస్థతను గూర్చి మాటలాడుట, దేవుని శక్తిని గూర్చి మాటలాడుట, రక్షణగూర్చి మాటలాడుట; నా సమయమును అతనితో వెచ్చించలేను” అని అతడు చెప్పెను. అయితే అతడు దేనిగూర్చి మాటలాడుచున్నాడో దానికి అతడు ఒక సాక్షిగా ఉండెను.
ఏ పురుషుడైనా లేదా స్త్రీయైనా వారు మాట్లాడునది ఏదో దానికి వారు ఒక సాక్షిగా వున్నప్పుడు, మీరు విచారపడకండి. వారి సమయమును వారు వెచ్చించవలసి వచ్చును, ఎలయనగా శిక్షాకాలము వచ్చును, సహోదరుడా, అసలు రంగు బయటపడును. అది నిజము. అవునండీ. మంచిది.
56
అతను తన చిన్న రాయిని ఆ యొక్క వడిసెలలో పెట్టెను. ఆ కాలువను దాటి కొండ ఎక్కి దీనిని ఎదుర్కొనుటకు పరుగెత్తెను.
57
“ఎందువలన,” అతను చెప్పెను, “చూడుము!” నీవు నన్ను ఒక...“ ”మంచిది. నిన్ను నా ఈటె కొనతో నేను, నిన్ను పైకి లేపెదను,“ అని చెప్పెను, బహుషా అది ముప్పై లేదా నలభై అడుగల పొడవుగలది. ”దానితో నిన్ను లేపి, నీ మాంసమును ఈ దినమున తినుటకై పక్షులకు వేసెదను“ అని అతడు అనెను.
దావీదును చూడండి, ఇప్పుడు అతను ఒక సాక్షియై యుండెను. అతను దేనిగూర్చి మాటలాడుచున్నాడో అతనికి తెలియును. అతనిని వ్యతిరేకించునది అతని ఎదుటనున్నది. నిశ్చయముగా అది అతనికి విరోధముగా ఉన్నది. కాని అతడు కలిగియుండెనని అతనికి తెలియును. అతడు ఒక సాక్షియైయుండెను.
కావున అతడు, “నీవు నన్ను ఒక కవచముతో మరియు ఒక ఈటెతో ఒక ఫిలిస్తీయునిగా, ఫిలీస్తీయుని నామములో ఎదుర్కొనుచున్నావు. అయితే నేను ఇశ్రాయేలు యొక్క ప్రభువైన దేవుని నామములో నిన్ను ఎదుర్కొందును” అని చెప్పెను. ఆమేన్. అదియే వ్యత్యాసము. అదియే వ్యత్యాసమును కలిగించినది. మరియు “ఈ దినమున” అతడు 'వధించెదను' అని చెప్పెను.
ఎందుకు, ఆ ఉన్నత దేహుడు అతనిని అపహసించి, మరియు అతనిని చంపుటకు బయలు వెళ్ళెను.
58
చిన్నవాడైన దావీదు ప్రారంభించెను. అతను వడిసెలతో విసురుటకు పూనుకొనినప్పుడు, అతను... గమనించండి, అతను ఐదు రాళ్ళను కలిగియుండెను, యేసు, (J-e-s-u-s), ఐదు వ్రేళ్ళతో మూసిపట్టుకొనియుండెను, విశ్వాసము (f-a-i-t-h). సహోదరుడా, అతను తనచుట్టూ మరియు చుట్టూ సరియెన విధానములో పనిచేయు కార్యమును కలిగియుండెను.
మరియు మీరు యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగియుండి, మీ ఆత్మలో నిత్యమైన కదలికను కలిగియున్నయెడల ఏదో జరుగనున్నది. పాపము మరియు రోగము మీనుండి దూరమగును; వేసవిలో దీపము వెలిగించినప్పుడు నేలపై బొద్దింకలవలె దయ్యములు చెదిరిపోవును.
యేసునందు విశ్వాసము (f-a-i-t-h) కలిగి ఆయన ఇక్కడ వచ్చుచున్నాడు. “నేను నిన్ను ఇశ్రాయేలు యొక్క ప్రభువైన దేవుని నామములో ఎదుర్కొందును,” అనుచు ఆయన ఇక్కడ వచ్చుచున్నాడు, మరియు ఆయన తన వడిసెలను చుట్టూ త్రిప్పుట ప్రారంభించెను, పరిశుద్ధాత్మ ఆ రాయిని సరిగ్గా ఫిలిస్తీయుని యొద్దకు కొట్టెను మరియు అతనిని చంపెను. అతని ఖడ్గమునే తీసికొని అతని తలనే దావీదు నరికివేసెను, దానిని పైకెత్తెను, “అబ్బాయిలు, రండి!” అని చెప్పెను. “ఇదిగో అది ఇక్కడే వున్నది. దేవుడు దానిని చేయునని నేను మీతో చెప్పియుంటిని” అని అనెను. హల్లేలూయా!
అతను ఒక సాక్షిగా వుండెను. అతను దేనిగూర్చి మాటలాడుచున్నాడో దానిని అతడు ఎరిగియుండెను. దానిని అతడు ప్రయత్నించెను. దానిని అతడు బుజువు చేసెను. అతనికి యుద్ధ సామాగ్రి గూర్చి మరియు ఈటె గూర్చి ఏమియూ తెలియదు, అయితే అతని చేతిలో వున్నది ఏమిటో అతనికి తెలియును. దేవుడు అతనికి తోడైయుండెను.
మీ యొక్క గొప్ప ఉపాయముల గూర్చి మరియు అటువంటి కార్యముల గూర్చి నాకు తెలియదు, మనకు తెలియదు. అయితే పరిశుద్ధాత్మ ఏమైయున్నదో మనకు తెలియును మరియు అది మనకొరకు ఏమి చేయునో మనకు తెలియును. అందునుబట్టి మనము ఒక సాక్షిగా ఉండగోరుచున్నాము. ఇప్పుడు, మీరు ఒక సాక్షిగా ఉండుటకు ముందు, మీరు మొదటగా, దానిని పొందుకొనవలసినవారై యున్నారు.
59
ఒకప్పుడు ఏలియా అను పేరుగల వ్యక్తి అక్కడ ఉండియున్నాడు. దేవుడు అతనితో ఉన్నాడు. అతడు గొప్ప పరీక్షలలో దేవుని చూచియున్నాడు, దేవుడు కార్యములు చేయుటను అతడు చూచియున్నాడు. కావున అతడు దేశము పైకి పాపము వచ్చుటను చూచెను. కావున “ఇప్పుడు ఒక్క నిమిషము” అని అతడు చెప్పెను.
అతను అక్కడ పైకి వెళ్ళెను మరియు ప్రార్ధించెను, మరియు దేవుడు అతనికి ఒక సాక్ష్యమును ఇచ్చెను. “నీవు వెళ్ళి రాజుతో యిట్లనుము, మంచైనను పడదు, నీవు చెప్పేంతవరకు” అని ఆయన చెప్పెను.
ఆయన క్రిందికి వెళ్ళి దానిని రాజుతో చెప్పెను మరియు అక్కడ పైకి వెళ్ళి కూర్చుండును.
మరియు మీరు ఊహించగలరా? కొందరు ప్రజలు ఇట్లు చెప్పుటను నేను వినగలుగుచున్నాను, “ఆ ముసలివాడు మతిస్థిమితం లేనివాడు,” చూశారా. ఎందువలన, “అతడు దానికొరకు పిలచువరకు అక్కడ వర్షము పడదని అతడు చెప్పుచున్నాడు.”
అయితే అతడు దేవుని యొక్క సాక్షియై యున్నాడు. అతడు దేనిగూర్చి మాటలాడుచున్నాడో అతనికి తెలియును. దేవుడు ఏమి చేయునో అతనికి తెలియును, ఎందుకనగా దేవుడెల్లప్పుడూ తన మాటను నిలబెట్టుకొనును. మరియు ఏలియా దానిని ఎరిగియుండెను. అందువలననే, వర్షము పడదని దేవుడు అతనితో చెప్పియున్నాడని అతను ఎరిగియుండెను, కావున అతడు వెళ్ళి మరియు వర్షము పడదని చెప్పెను.
60
పరిశుద్ధాత్మ బాప్తిస్మమును మీరు పొందుకొనెదరని దేవుడు చెప్పినయెడల, అప్పుడు వెళ్ళి దానిని పొందుకొనుడి. స్వస్థత మీకొరకేయని దేవుడు చెప్పినయెడల, అప్పుడు వెళ్ళి దానిని పొందుకొనుడి. మీరు ఒక సాక్షిగా వున్నయెడల, వెళ్ళండి, ఆయన కొరకు సాక్ష్యమివ్వండి. దేవుడే దానిని వాగ్దానము చేసియున్నాడు, ఆయన అబద్దమాడజాలడు. “అద్భుతములు జరిగే కాలము అయిపోయినది” అట్లు, వారేమి చెప్పినా ఫరవాలేదు, దానిని పట్టించుకొనకుడి. మనము తీసుకొనుచున్నది దేవుని వాక్యమైయున్నది, వేరెవ్వరి మాటనో కాదు.
61
మొదటగా, ఆ వృద్ద ఏలియా అక్కడికి వచ్చి పైకి వెళ్ళుటను, నేను చూడగలుగుచున్నాను.
మరియు “ఇప్పుడు ఆ వృద్దుడైన వింత వ్యక్తి వైపు చూడండి! అతడు అక్కడ ఆ కొండ మీదికి వెళ్ళియున్నాడు, మరియు ఆకెరీతువాగు ప్రక్కన కూర్చొనియున్నాడు. పొడవాటి తెల్లని గడ్డముగల ఆ వృద్దుడు అక్కడ పైన ఉండుట ఎటువంటి ఒక విచార పడదగిన దృశ్యము; మరియు అతడు దాదాపు డెభ్భై సంవత్సరముల వృద్దుడు, మరియు అతని చేతిలో ఒక కర్ర ఉన్నది. ఒక చిన్న నూనె బుడ్డి ఉండియున్నది; అంతెందుకు, అతడు ఆపైనే ఆకలిచావు చచ్చును,” అని అతడు చెప్పెను.
అయితే కొంతకాలమైన పిదప కరువు వచ్చియున్నది మరియు అది వ్యాపించుట మొదలుపెట్టియున్నది. మరియు మీకు తెలియునా, అక్కడున్న ప్రజలు ఎవరైతే అతను పిచ్చివాడని తలంచియున్నారో, వారే అతను రోజుకి మూడు పూటలు భోజనము కలిగియుండి, చక్కని సమయమును కలిగియున్నాడని గమనించగలిగిరి. అవును. ఈ రాత్రి ఇక్కడున్న అనేకమైన జనులకంటే అతడు మంచి స్థితిలో ఉన్నాడు. అతను కొంతమంది కూలీలను కలిగియుండెను. అది నిజము. ఆ కూలీలు వచ్చి, కాకోలములు ప్రతిదినము వచ్చుచుండెడివి మరియు అతని అల్పాహారమునకై రొట్టెముక్కలు తీసికొని వచ్చి అతనికి ఇచ్చుచుండెడివి.
62
ఈ మధ్యనే ఒక వ్యక్తి ఇట్లు అనెను, “సేవకుడా, నీవు దానిని నమ్ముచున్నావని చెప్పగోరుచున్నావా?”
“అవునండి” అని నేను చెప్పాను.
“అతను తినియుండుటను నీవు నమ్ముచున్నావని నాకు చెప్పగోరుచున్నావా?” అని అతడు చెప్పెను.
“అవును, అతడు తినియున్నాడు” అని నేను చెప్పాను.
“ఏలాగ చేప, ఎక్కడి నుండి అతనికి వచ్చెను?”
“నేను ఎరుగను?” అని నేను చెప్పాను.
“అతను ఒక రొట్టెలమ్ము స్థలమునకు వెళ్ళియున్నాడని నీవు తలంచుచున్నావా?” అని అడిగెను.
“నేను నీకు చెప్పలేను. అయితే, కాకోలములు వాటిని తెచ్చెనను సంగతి మాత్రమే నాకు తెలియును. అతను వాటిని తిని, దానికొరకు కృతజ్ఞతగలవాడై మరియు దేవుడు తనతో చేయమని చెప్పినదానిని చేసియుండెను” అని నేను చెప్పాను.
63
పరిశుద్ధాత్మ బాప్తిస్మము విషయములో కూడా అదే విధానమై యున్నది. “ప్రజలు అరచునట్లు చేయునది ఏమిటి?” అని మీరనవచ్చును. నాకు తెలియదు. “నీ యొక్క భావము ఏమిటి?” అది పరలోకములోనున్న దేవుని యొద్ద నుండి వచ్చు మన్నాయై యున్నది. “నీవు వాస్తవముగా ఏదైనా అనుభూతి చెందుచున్నట్లు తలంచుచున్నావా? నేనైతే దానిని నమ్మలేదు.” మంచిది, నీవు నమ్మనవసరము లేదు. పరిశుద్ధాత్మయే దానిని తీసికొనివచ్చును. నేను కేవలం దానిని తిని మరియు తృప్తినొంది మరియు కేకలు వేయుచు ఒక చక్కని సమయము కలిగియుందును. లోకమును ఎటైనా వెళ్ళనీయుడి మరియు వారు కోరినదేనినైనా నమ్మనివ్వండి. పరిశుద్ధాత్మయే! “అయితే అతడు దానిని ఎక్కడ నుండి పొందును? మన్నా ఎక్కడి నుండి వచ్చియున్నది? నీవు చూడనటువంటిది ఏదైనా గాలిలో నుండి ఎటు వచ్చుచున్నది? నాకు తెలియదు, కాని అది ఇక్కడికి వచ్చును. ఆమేన్.
నీవు దానికి ఒక సాక్షిగాయున్నావా? ప్రభువు మంచివాడని మీరు రుచి చూచియుంటిరా? మీరు దేనిగూర్చి మాటలాడుచున్నారో మీకు తెలియునా? ఈ రాత్రి మీ జీవము రక్షణ కొరకైనటువంటి దేవుని శక్తియైయుండుట ఎంత వాస్తవమో, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా అంతే వాస్తవమై యున్నది. నిశ్చయముగా, అది మంచిదైయున్నది.
64
అతను అక్కడ కూర్చొని మరియు భుజించెను. అతనికి దాహమైనప్పుడు, అతను ఆ వాగు యొడ్డునకు అడుగువేసి త్రాగును, అంతే. మరియు వారైతే అతను పిచ్చివాడని తలంచిరి. కాదండి. అతను దేవుని యొక్క సాక్షియై యున్నాడు. అది నిజము.
మరియు మొదటి విషయము మీకు తెలియునా, ఆ వాగు ఎండిపోయినప్పుడు, “ఇప్పుడు నిన్ను గూర్చి శ్రద్ధవహించుటకు నేను ఒక విధవరాలిని సిద్ధపరచియున్నాను” అని ఆయన చెప్పియుండెను. ఓ విధవరాలి ఇల్లు! ఒక బోధకుడు వెళ్ళుటకు అది ఎటువంటి ఒక స్థలమైయున్నది, అయితే “నేను దానిని సిద్ధపరచియున్నాను” అని దేవుడు చెప్పెను. కావున అతడు అక్కడికి దిగి వెళ్ళెను. అక్కడ అతను ఒక సాక్షిగా ఉండవలసియున్నది. కావున ఈ విధవరాలు ....
కావున అతను అక్కడికి వెళ్ళియుండెను, మరియు అతను వీధిలో నడుచుచు వెళ్ళుచుండెను. దర్శనము ప్రకారము, అతను పెరటిలో ఒక స్త్రీని చూడగోరుచున్నాడని, నేను భావించుచున్నాను. అతను పెరటిలో ఒక స్త్రీని చూచెను, “అది ఆమే అయియున్నది, కావున నేను నడిచిపోయెదను” అని అతడు అనుకొనెను.
అతను, “నీవు వెళ్ళి, త్రాగుటకు కొన్ని నీళ్ళు మరియు ఒక భోజనపు ముద్ద, లేదా ఒక రొట్టె” కొంచెము, “నీ చేతిలో వున్నది నాయొద్దకు తీసికొని రమ్ము,” అని అతను చెప్పెను.
ఆమె ఇట్లు చెప్పెను, “యెహోవా జీవము తోడు, మరియు ఎన్నటికి చనిపోని నీ ప్రాణము తోడు,” 'పీపాయిలో ఒక చిన్న రొట్టెను చేయుటకు సరిపడు పిండియు, మరియు బుడ్డిలో సరిపడు నూనెయు నాయొద్ద నున్నవి, అని ఆమె చెప్పెను. మరియు నేను ఇక్కడ కాల్చుటకు రెండు కట్టెలను ఏరుకొని వచ్చుచుంటిని“ మరియు, ”మరియు నేను నాకును మరియు నా కుమారునికి రొట్టె చేయుటకు వెళ్ళుచుంటిని మరియు దానిని మేము భుజించి ఆ తరువాత, మేము చనిపోవుదుము“ అని చెప్పెను.
“వెళ్ళుము నాకు మొదటిగా రొట్టెను తీసికొనిరమ్ము” అని అతడు చెప్పెను. ఆమేన్.
65
“మీరు మొదటిగా దేవుని రాజ్యమును వెదకుడి.” అది సత్యమేనని మీరెన్నడైనా దానికి సాక్ష్యమిచ్చితిరా? మొదట దేవుని ఉంచుడి. మొదటగా మీ దశమ-భాగములను చెల్లించుడి. మొదటగా ప్రతిదీ చెల్లించుడి. దేవునికి చెల్లించుడి. మొదటగా ఉదయమున ప్రార్ధించుడి. దినమంతా ప్రార్ధించుడి. ప్రతి విషయములో దేవునికి మొదటి స్థానమియ్యుడి. మీరు ఒక సాక్షియై యుండెదరు.
ఆమె నేరుగా లోనికి పరుగెత్తినది. ఆమె రెండు కట్టెలను కలిగియున్నది.
పూర్వము, తూర్పు దక్షిణాసియా దేశాలలో వారు రెండు కట్టెలను ఉపయోగించేవారు. ఆ రెండు కట్టెలు ఒకదానికొకటి అడ్డముగా, ఈ విధముగా ఉంచబడును. మరియు మధ్యలో మంట పెట్టబడియుండును. ఇండియనులు ఇంకనూ దానిని ఉపయోగించుచుండిరి. మరియు అవి కాల్చుచున్న కొద్దీ ఆ మొద్దులను ముందుకు జరిపెడివారు. మధ్యలో ఎక్కడైతే మంట మండుచున్నదో అది సిలువై యున్నది, క్రీస్తు.
వారు కొంచెము పిండిని తీసికొనియుండిరి, దానిని ముద్దగా పిసికిరి అదంతయూ, ఒక్కటేయై యున్నది. “యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.” వారు నూనెను వేసెదరు, అది పరిశుద్ధాత్మకు సాదృశ్యమైయున్నది. మరియు వారు దానిని కలిపెదరు, పరిశుద్ధాత్మ మరియు క్రీస్తు, సహోదరుడా! ఇప్పుడు వారు ఒక రొట్టెను చేయుటకు సిద్ధముగా ఉన్నారు. ఆమేన్. ఓ, నన్ను వెర్రివానిగా తలంచకండి. ఈ రాత్రి నేను కొద్దిగా భక్తిపరవశుడనై యున్నాను. మంచిది.
గమనించండి, “మొదటగా నా కొరకు ఒక చిన్న రొట్టెను చేయుము.”
66
కావున అతను క్రీస్తు అను పిండిని తీసికొని, దానిలో పరిశుద్ధాత్మను కుమ్మరించి మరియు దానంతటిని కలిపి, మరియు సిలువపై దానిని ఉంచి మరియు దానిని కాల్చెను. ఓ, సహోదరుడా, మనము ఏ రొట్టెను గూర్చి మాటలాడినను, అది అదేయై యున్నది.
వెలుపలికి వచ్చి ఆమె కలిగివున్న చిన్న రొట్టెను మరియు ఆఖరి నీటి చుక్కలను తీసికొని వచ్చెను. మరియు ప్రవక్త అక్కడ నిలబడి దానిని తినెను మరియు నీటిని త్రాగెను. “ఇప్పుడు తిరిగి వెళ్ళి నీ కొరకు మరియు నీ కుమారుని కొరకు రొట్టెను చేసికొనుము. ఎట్లనగా, ”'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' దేవుడు భూమి మీదికి వర్షమును పంపువరకు పీపాయి ఖాళీగా వుండదు, బుడ్డిలోని నూనె అయిపోదు“ అని చెప్పెను.
ఏమిటి? ఒక సాక్షి. అది నిజము. ఆ ప్రాంతములో ఆ విధవరాలు ఒక సాక్షియై యుండెను.
67
ఆ గొప్ప ప్రవక్తయైన ఏలియా తీసికొనిపోబడిన తరువాత, ఏలిషా ఏలియా యొక్క స్థానమును తీసికొనెను.
ఓ, నేను ఇటువంటి ఒక సాక్షిని ఊహించగలుగుచున్నాను. ఒక దినమున, అతడు బయలుదేరునప్పుడు, అతను ఏలియాను చూచియుండెను. మరియు ఆయన తన దుప్పటిని అతనిపై విసిరెను, మరియు అతనిని అశీర్వదించెను, మరియు లోకపు సంగతులన్నియు అతని వెనుక మృతమైనవేనని చూపించుటకు అతను ఎద్దును చంపి మరియు ఒక బలిని అర్పించెను.
దేవుని యొద్దకు వచ్చుటకు అదియే మార్గము. నీ వెనుక వున్న ప్రతీ కార్యమును చంపివేయుము. మిమ్మును వెనుకకు మళ్ళించు మార్గములన్నింటిని కాల్చివేయుడి. దానిని మీరు రేపటి దినమున కనుబడునట్లుగా ఆ సీసాని మీద పెట్టకండి. మరియు ఈ ఇతర కార్యములను రేపటి వరకు వుండనీయకుడి. అటువంటి కార్యములను వదిలివేయుడి; దానిని కాల్చివేయుడి. ఆమేన్. ఒక నిజమైన సాక్షిగా ఉండుడి. సహోదరుడా, ఉన్నపాటునే బయటకు రమ్ము, అదియే మార్గము. అటువంటి పదజాలాలను క్షమించండి, అయితే దానిని చెప్పుటకు నాకు తెలిసిన విధానము అదొక్కటే అయియున్నది. మంచిది, చెప్పెను, “ఇప్పుడు, ఈ సంగతుల మధ్యనే కార్యములు జరుగనైయున్నవి.” అది సరియే. గమనించండి.
68
తరువాత అతను గిల్గాలు నుండి ప్రారంభించి, మరియు ప్రవక్తల పాఠశాల నొద్దకు వెళ్ళెను. మరియు మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను, అతను ప్రవక్తల పాఠశాల నొద్దకు రాగా, “ప్రభువు నన్ను యోర్దానుకు నడిపించుచున్నాడు” అని అతను చెప్పెను.
ఏలిషా ఏలియాను వెంబడించుటలో మూడు దశలున్నవి. మరియు ఏలియా క్రీస్తుకు ఒక మాదిరిగా నున్నాడు — ఏలియా. ఎలిషా సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడు. మొదటిగా, విశ్వాసము ద్వారా నీతికరణ. “నేను గిల్గాలు వరకు వెళ్ళవలెను,” మరియు పిదప “ఇప్పుడు నీవు ఇచ్చటనే ఉండుము,” అని అతను సంఘముతో చెప్పెను; ఏలియా... ఏలియా, ఎలిషాతో. యవ్వనస్తుడు మరియు వృద్ధ ప్రవక్త క్రీస్తుకు మరియు సంఘమునకు ఒక సాదృశ్యముగా నున్నారు.
“నీ జీవము తోడు, నేను ఇక్కడ ఉండను, కానీ నేను నీతో వచ్చెదను” అని అతను చెప్పెను.
69
మరియు అతడు గిల్గాలునకు వెళ్ళియుండెను. మరియు అతను అక్కడికి వచ్చినప్పుడు, “ఇప్పుడు, నీవిచ్చటనే ఉండుము. ప్రభువు నన్ను ప్రవక్తల పాఠశాలకు పిలచుచున్నాడు” అని అతను చెప్పెను.
కావున “యెహోవా జీవము తోడు మరియు ఎన్నటికి చనిపోని నీ ప్రాణము తోడు, నేను నీతోనే వచ్చెదను. నేను నిన్ను విడువను” అని అతడు చెప్పెను.
అదియే సంఘమైయున్నది. మీ కనుదృష్టి యేసు మీదనే ఉంచుడి. ఆయన కదిలి వెళ్ళిన ప్రతిచోటికి, మీరు వెళ్ళుడి. ఆయన మెథడిస్టు సంఘములో నుండి బయటకి వెళ్ళినయెడల, నేరుగా ఆయనతో పాటు వెళ్ళుడి. ఆయన బాప్టిస్టు సంఘములో నుండి బయటకు వెళ్ళినయెడల, మీరు కూడా నేరుగా ఆయనతో వెళ్ళుడి. ఆయన బ్రెన్హాం గుడారములో నుండి బయటకు వెళ్ళినయెడల, నేరుగా ఆయనతో పాటు వెళ్ళుడి. “నేను నిన్ను విడువను. తల్లి దేనికి చెందినా పరవాలేదు, తండ్రి దేనికి చెందినా పరవాలేదు, ఇది జరిగినా, లేదా మరేది జరిగినా నేను నీతోనే వచ్చెదను. నేను నిన్ను విడిచిపెట్టను!” హల్లేలూయా “నేను నీ యొక్క సాక్షిని. నేను వేళ్ళలేను; నీవు నాయొక్క భాగమైయున్నావు.”
“సరి రమ్ము, మరియు నేను వెంబడించెదను.” మరియు అతను ప్రవక్తల పాఠశాల యొద్దకు వెళ్ళియుండెను.
మరియు “నీవిక్కడనే నిలిచియుండుము” అని అతను చెప్పెను.
70
మరియు ప్రవక్తలలో కొందరు ఎలీషాతో ఇట్లనిరి, అతను చెప్పెను, “నీ గురువు నీ యొద్దనుండి తీసికొనిపోబడునని నీకు తెలియునా?”
“నాకు అది తెలియును. అయితే నీవు ఊరకుండుము” అని అతను చెప్పెను. ఆమేన్. నేను దానిని ఇష్టపడుచున్నాను. “తక్కినవారు ఏమి చెప్పినా సరే, నేను సరిగ్గా అతనితోనే నిలిచియుండబోవుచున్నాను.”
మరియు ఏలియా వెనుదిరిగి మరియు ఇట్లు చెప్పెను, “ఇప్పుడు, నీవు ఇక్కడే వేచియుండుము, ఎందుకనగా దేవుడు నన్ను యోర్దానునకు పంపుచున్నాడు.”
మూడు స్థలములు: గిల్గాలు, నీతీకరణ; ప్రవక్తల పాఠశాల, శుద్దీకరణ; మరియు యోర్దాను నొద్దకు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నొద్దకైయున్నది. యోర్దాను మరణమునకు సాదృశ్యమైయున్నది. గమనించండి! మార్టిన్ లూథర్; జాన్ వెస్లీ; పెంతెకోస్తు, యోర్దాను నొద్దకు, మరణించవలసిన సమయమైయున్నది.
71
కావున, ఏలియా ఏలిషాతో పాటు నేరుగా ఆ నది వద్దకు నడిచి వెళ్ళియుండెను. మరియు వారు యోర్దాను నొద్దకు వచ్చినప్పుడు, మరణము, ప్రయాణములో ఆఖరి దశయై యున్నది; వృద్ధ ప్రవక్త తన దుప్పటిని లాగి తీసికొని, నీటిని కొట్టెను. మరియు నీరు ఇటు మరియు అటు విభజించబడినవి, మరియు ఆరిన నేలపై ఆ ఇరువురు నడచి, దాటి వెళ్ళిరి. బోధకులు నిలబడియుండి, మరియు వారు దాటి వెళ్ళుటను చూచిరి. ఆమేన్.
వారు ఆవలివైపునకు వెళ్ళిన తరువాత, ఇప్పుడు, పిదప! ఓహ్, ఇది బ్రెన్హాం గుడారములోనున్నవారి మూలుగను విభజించుచు, మనసాక్షిలోనికి చొచ్చుకొనిపోవలెనని నేను తలంచుచున్నాను. అతను గిల్గాలు వద్ద నుండినప్పుడు కాదు; అతను ప్రవక్తల పాఠశాల వద్ద నున్నప్పుడు కాదు; యోర్దానుకు ఇవతలి ప్రక్కన ఉన్నప్పుడు కాదు; అయితే అతను యోర్దానును దాటినప్పుడు కూడా, అతనిని మార్గమంతటిలో ప్రతి అడుగు వెంబడించుటయై యున్నది.
మీరు ఇష్టపడినయెడల; “నేను యేసుని నా స్వంత రక్షకునిగా అంగీకరించుచున్నాను, నేను నా చెడు అలవాట్లను విడిచిపెట్టెదను” అని చెప్పుడి. అయితే, ఎక్కడైతే మీరు చనిపోవలసియున్నదో, ఎక్కడైతే లోకములోని కార్యములన్నియు, మీ స్నేహితులందరూ మరియు ప్రతీది, మిమ్మును విడిచిపెట్టునో అట్టి యోర్దానునకు దిగిరండి. మీ కనుదృష్టి కేవలం అతనిపైనే ఉండనీయుడి.
72
పిదప ఏమైయున్నది? “సరిగ్గా యోర్దాను గుండా, నేను మీతో వచ్చెదను” అని అతడు చెప్పెను. ఆమేన్. నేను దానిని ఇష్టపడుచున్నాను. ఎందువలన? “దీనికి నేను ఒక సాక్షిగా ఉండబోవుచున్నాను,” మరియు అతడు యోర్దాను గుండా సాగి వెళ్ళెను.
గమనించండి. ఇక్కడే అది వున్నది. మీరు దీనిని గ్రహించవలెనని నేను కోరుచున్నాను. అతను యోర్దాను దాటిన తరువాత, అతను ఇట్లు చెప్పెను, “నేను నీకు ఏమి చేయవలెనని కోరుచున్నావు?” ఈ రాత్రి, సంఘము నుండి క్రీస్తు తెలిసికొనగోరుచున్నది అదియే. “మీరు లోకము యొక్క కార్యముల నుండి వేరైన తరువాత, మీరు క్రీస్తు యేసులో నూతన సృష్టిగా మారిన తరువాత, మీరు తిరిగి జన్మించిన తరువాత, పరిశుద్ధాత్మతో నింపబడి, యోర్దానును దాటిన పిమ్మట లోకపు కార్యములన్నియు మీ వెనుక చచ్చినట్లుండును; ఇప్పుడు మీ కొరకు నేనేమి చేయవలెనో అడుగుడి.” నేను దీనిని ఇష్టపడుచున్నాను.
73
“నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నామీదికి రావలయును” అని అతను అడిగెను. తాను దేనిగూర్చి మాటలాడుచున్నాడో ఆ బోధకునికి తెలియును. “రెండింతలు, ఎందుకనగా అంతగా నేను సాక్ష్యమివ్వగోరుచున్నాను.”
“నీవు అడిగినది కష్టతరముగా నున్నది. అయితే నేను వెళ్ళునప్పుడు నీవు నన్ను చూచినయెడల, అది ఆ ప్రకారమే జరుగును. నీవు అడిగినదేదో నీవు పొందుకొనెదవు” అని అతను చెప్పెను. ఇప్పుడు, సహోదరుడా, ఒక బోధకుడు మరియొకనిని గమనించుటను గూర్చి నీవు మాటలాడుచున్నావు; అతను యధార్థముగా అతనిని గమనించుచుండెను!
ఈ రాత్రి రెండింతల ఆత్మ కొరకు క్రీస్తును గమనించుచు, పరిశుద్ధాత్మ ఏ విధముగా కదులుచున్నదో దానిని గమనించుచు, సంఘము ఆ రీతిగానే చేయవలసియున్నది. గమనించండి.
74
“నీవు కష్టతరమైన దానిని అడిగియుంటివి” అని అతను చెప్పెను. అయితే అతను ఒక కన్ను లోకము మీద మరియు ఒక కన్ను ఏలియా మీద ఉంచలేడు. అతడు రెండు కన్నులు సూటిగా ఏలీయా మీదనే ఉంచి మరియు అతనిని వెంబడించవలెను.
ఈ రాత్రి దానితో వచ్చిన సమస్య ఏదనగా క్రైస్తవులమని కనపరచుకొనుచు ఒక కన్ను లోకము మీద మరియు ఇంకొకటి సిలువ మీద ఉంచు అనేక క్రైస్తవ ప్రజలు మనకున్నారు. లోకమువలె, నిశ్చయముగా మీరు పడిపోవుదురు. మీ కనుచూపు ఒక్కటిగా వుండవలెను, మీ హృదయము ఒక్కటిగా వుండవలెను, మీ తలంపులు ఒక్కటిగా వుండవలెను. ఆమేన్. సహోదరుడా, అది ఇబ్బందికరమై యున్నది, అయితే అది గాయపరచును, అయినను అది మంచిది.
75
మేము, చిన్నపిల్లలుగా ఉండినప్పుడు, మేము తరచుగా ఆముదమును తీసికొనెడివారము. అమ్మ, ఆ రోజుల్లో ఆమె నాకు ఆముదమును ఇచ్చుచుండెడిదీ. మరియు నేను నా ముక్కును మరియు నోటిని బిగబట్టేవాడిని. ఆమె ఇట్లు చెప్పుచుండెడిది, ''ప్రియమైనవాడా, అది...“
“అది నాకు వాంతి కలుగునట్లు చేయును” అని నేను చెప్పుచుండెడివాడను.
“అది గనుక నీకు వాంతి కలుగునట్లు చేయనియెడల, అది నీకు ఎటువంటి మేలు చేయదు” అని ఆమె చెప్పుచుండెడిది.
కావున, బహుశా, అదంతయూ ఇదేయైయున్నది. బహుశా, అదే విధానమును సువార్తకు అన్వయించవచ్చును. అది నిన్ను పూర్తిగా కదిలించనియెడల, అది నీకు ఎటువంటి మేలు చేయదు.
క్రీస్తుపైనే మీ కనుదృష్టి నిలుపుడి. ఆ విధముగానే కొనసాగుడి. లోకము ఏమి చెప్పినను లెక్క చేయకుడి. ఆ విధముగానే కొనసాగుడి. “దేవుని కుమారులైన వారు దేవుని ఆత్మచేత నడిపించబడెదరు.” అది సరియేనా? “శరీరానుసారముగా కాక లేదా లోకము యొక్క కార్యములను బట్టి కాక, ఆత్మ చేత నడిపించబడుచూ ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు; నడుచుటయే. ఇప్పుడు గమనించండి.
76
మరియు అతడు పైకి కొనిపోబడు సమయమున, ఒక అగ్నిరథము దిగి రాగా మరియు అతడు దానిని ఎక్కగా ఏలియా కొనిపోబడెను. మరియు అతడు పైకి వెళ్ళుచుండగా, అగ్ని రథము అతనిని తీసికొనిపోవుచుండినప్పుడు, అయన తన వస్త్రమును, ఈ విధముగా లాగి, మరియు దానిని వెనుకకు విసిరెను. మరియు అది నేలపైపడెను.
ఓ, ఇప్పుడు మీరు దీనిని గ్రహించవలెనని నేను కోరుచున్నాను. అది ఎంత చక్కని సాదృశ్యమైయున్నది! అతను కలిగియున్న శక్తియంతటికి అప్పటి యవ్వన ప్రవక్తయైన ఏలిషా సాక్షిగా వుండెను. ఏలియా చేసిన కార్యములన్నింటికి ఎలిషా అతనికి సాక్షిగా నుండెను. పిదప అతను అదే వస్త్రమును తీసికొని తన భుజములపై వేసుకొని, యోర్దాను వైపునకు సాగి వెళ్ళెను; ఒక పరిపూర్ణమైన, చక్కని సాదృశ్యమై యున్నది. యోర్దాను నొద్దకు నడచి వచ్చి, వస్త్రమును లాగి, చేతులలో పట్టుకొని, మరియు నీటిని కొట్టెను. “ఏలియా యొక్క దేవుడెక్కడ?” అని అనెను. మరియు నీరు ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు విభాగింపబడెను. ఆయన యొక్క శక్తిని చూచుచు, ఆయన యొక్క అద్భుతములను చూచుచూ, యేసును వెంబడించుచున్న సంఘమునకు ఒక సాదృశ్యముగా నున్నది.
77
మరియు అతని దగ్గర ఒక రోజున, అడుగబడెను. ఎవరో ఇట్లనిరి... ఒక స్త్రీ ఇట్లు అడిగెను, “నా కుమారులలో ఒకడు మీ యొక్క కుడిచేతి వైపునను, మరియొకడు ఎడమచేతి వైపునను కూర్చుండనిమ్ము.''
“నేను త్రాగు పాత్రలోనిది మీరు త్రాగగలరా?” అని ఆయన అడిగెను. “త్రాగగలము” అని చెప్పిరి.
“నేను పొందిన బాప్తిస్మమును మీరు పొందగలరా?”
“పొందగలము” అని చెప్పిరి.
“మీరు నిశ్చయముగా చేసెదరు; అయితే కుడిచేతి వైపున మరియు ఎడమ చేతి వైపున, నా వశములో లేదు....” మరొక మాటలో చెప్పవలెననిన, “నేను పొందిన అదే బాప్తిస్మమును, మీరునూ పొందెదరు” అని చెప్పెను.
78
మరియు సంఘము ఆయనను గమనించినప్పుడు, పెంతెకోస్తునకు ఆయన వెళ్ళినప్పుడు... ఆయన మేడగదికి వెళ్ళి మరియు రాత్రి భోజనము చేసెను. కల్వరి యొద్దకు వెళ్ళి సిలువవేయబడెను. మరియు ఆయన ఆరోహణమై వెళ్ళునప్పుడు బయటకు పిలువబడిన సంఘము ఆయనను గమనించెను. “ఇప్పుడు, నేను భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండుటకై మిమ్మును పంపబోవుచున్నాను; అయితే మీరు వెళ్ళుటకు ముందు, యెరూషలేము పట్టణములోనే వేచియుండుడి; ఏలయనగా నాపై ఉన్న ఇదే పరిశుద్ధాత్మయను వస్త్రము మీపైకి దిగిరానున్నది. నేను దానిని తిరిగి పంపబోవుచున్నాను” అని ఆయన చెప్పెను.
మరియు వారు యెరూషలేము పట్టణమునకు వెళ్ళియుండిరి, హల్లేలూయా, మరియు యేసుక్రీస్తు పైనున్న అదే పరిశుద్ధాత్మతో బాప్తిస్మమును పొందిరి. హల్లేలూయా! “పిదప యేసుక్రీసు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నలాగున మీరు నాకు సాక్షులై యుందురు.”
79
మరియు ప్రవక్తయగు ఏలియాపైనున్న అదే పరిశుద్ధాత్మ ఎలిషాపై రెండింతలుగా ఉండెను. మరియు సహోదరుడా, సహోదరీ, ఈ రాత్రి మనము దేవుని సంఘముగా వుండి పరిశుద్ధాత్మ బాప్తిస్మము మనపై కుమ్మరించబడుచు మరియు మనలను సురక్షితముగా భద్రపరచుచు ఆయన ఆత్మలోనికి మనకు బాప్తిస్మమిచ్చుట వలన ఆయన ఆశీర్వాదములతో కూడిన ఆశీర్వాదపు పాత్ర అంచును ముద్దుపెట్టుకొంటిమని తలంచుచు ఆయనకు సాక్షులుగా బయలు వెళ్ళుచుంటిమి. ఈ దినములలో ఉండినట్లు ప్రతివైపు అనైతికమైన పనికిరాని చెత్తవుండగా మనమొట్లు మౌనముగా ఉండగలము! మనము సత్యమునకై నిలబడి మరియు దానికి సాక్షులుగా ఉండెదము. ఆమేన్. అద్భుతము! ఓ, మై!
నేను ముగించవలసియున్నది. నేను సరిగ్గా ఇప్పుడే మొదలుపెట్టి మరియు బోధించవలెనన్న అనుభూతిని కలిగియున్నానని, నేను నమ్ముచున్నాను. నేను ఇప్పుడే మంచి అనుభూతిని పొందుచున్నాను.
80
వస్త్రము, రెండుపాళ్ళు! యేసు ఇట్లు చెప్పెను, “నేను చేయు క్రియలు మీరునూ చేయుదురు, మరియు గొప్పవియు చేయుదురు,” అంతకంటే అధికముగా, రెండింతలుగా, “మీరు రెండింతలుగా పొందిన తరువాత మీరు నాకు సాక్షులై యుందురు.” ఆయనను గమనించెదము. మీ కనుదృష్టి ఆయనపై ఉంచుడి. వస్త్రము క్రిందికి వచ్చినది. ఈ రాత్రి ఆ వస్త్రము ఇచ్చట నున్నది. పైనుండి వచ్చు శక్తితో ఇక్కడున్న ఏ విశ్వాసినైనా వస్త్రము ధరింపజేయుటకై యేసుక్రీస్తుపై ఉండిన అదే పరిశుద్ధాత్మ ఈ రాత్రి ఈ సంఘములో ఉన్నది. అంతట మీరు అతనికి యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దక్షిణాఫ్రికాలోను, ఆసియాలోను, మీరు ఎక్కడికి వెళ్ళినను ఆయనకు సాక్షులుగా ఉండెదరు. “నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉండినట్లు.”
“వేచియుండుడి!” ఫిలిప్పు వెళ్ళి మరియు బోధించుటలో ఆశ్చర్యమేమియూ లేదు!
వారు ఆ చిన్నవాడైన స్తెఫెనును రాళ్ళతో కొట్టుచుండగా, అతను పరలోకము లోనికి చూచుటలో ఆశ్చర్యము లేదు; మూర్ఖులు ఆయన తలను ఇరువైపులా చిదుక గొట్టుచుండగా, తన మెదడు నేలపై చిందిపడెను. అతను పైకి చూచి మరియు ఇట్లు చెప్పెను, “ఇదిగో, పరలోకము తెరువబడుటయు, మరియు యేసు దేవుని కుడిపార్శ్వమున నిలబడియుండుటయు నేను చూచుచున్నాను.” అతను ఒక సాక్షియైయున్నాడు.
81
పౌలు.... సౌలు తన మార్గములో వెళ్ళుచుండగా, తన ముందు వెలుగుపడినప్పుడు గ్రుడ్డివాడగుటలో ఆశ్చర్యమేమీయూ లేదు. మరియు అతను, “ప్రభువా, నేను హింసించుచున్నది ఎవరిని?” అని అడిగెను.
“యేసును” అని ఆయన చెప్పెను. మరియు “తిన్ననిదనబడిన వీధిలోనికి దిగి వెళ్ళము” అని ఆయన చెప్పెను.
మరియు అననీయ అను పేరుగల దర్శనములు చూచు ఒక బోధకుడు అతనికి అక్కడ ఉండియుండెను. మరియు పౌలును గూర్చిన ఒక దర్శనమును అననీయ చూచియుండెను. మరియు అతడు లోనికి వెళ్ళి మరియు అతనిపై చేతులుంచి ఇట్లు చెప్పెను, “సహోదరుడైన, సౌలు, మార్గములో నిన్ను కలిసిన ప్రభువైన యేసు, నీవు దృష్టిపొంది మరియు పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నీపై నా చేతులు ఉంచులాగున నన్ను పంపియున్నాడు, ఏలయనగా నీవు ఆయనకు ఒక గొప్ప సాక్షిగా ఉందువని నాకు చూపించెను.”
ఒక సాక్షి మొదటిగా, ఏమిటి? “నీ దృష్టిని పొందుకొని మరియు పరిశుద్ధాత్మను పొందుకొనుము.” పొరలు అతని కన్నుల నుండి రాలిపోయెను. అతడు లేచి దమస్కు నదియొద్దకు వెళ్ళి బాప్తిస్మమునొందెను. వారు ఒక అద్భుతమైన సమయమును కలిగి యున్నారని నేను ఊహించుచున్నాను! మీరు అట్లు తలంచుట లేదా?
82
సౌలు, ఆ పరిశుద్ద గుండ్రాళ్ళ గుంపునంతటిని బంధించుటకు, అధికార పత్రములు తన జేబులో కలిగియుండినవాడై ఆ మార్గముగుండా వెళ్ళుచుండెను. అది నిజము. “భయకంపితులను చేయుచుండెను....” తన ఎత్తైన గుర్రముపై నుండి దేవుడతనిని పడద్రోసెను. ఆ ప్రజలు దేనినైతే కలిగియుంటిరో దానికొరకు అతనిని ఒక సాక్షిగా చేసెను. ఓ, మై!
ఈ రాత్రి కూడా ప్రజలు అటువంటి ఎత్తైన గుర్రము నుండి పడద్రోయబడినవారై మరియు ఒక సాక్షిగా ఉండుట, నాకు ఆశ్చర్యమును కలిగించుచున్నది.
83
ఉదయకాలమందు ఆకాశము నుండి మంచుపడు సమయమున, నేను గమనించియుంటిని, మరియు ఆ చిన్న మంచు బిందువుపై సూర్యుడు ఉదయించుచున్నప్పుడు, అది ఎట్లు ఒక చిన్న నక్షత్రమువలె మెరయునో మీరు దానిని గమనించుడి. అది ఏమైయున్నది? అది ఒక సాక్షియైయున్నది. సూర్యుడు ఒక స్థలమునకు వచ్చిన వెంటనే, ఈ విధముగా, అది ఒక నిశ్చితమైన స్థలమునకు వచ్చినప్పుడు, అది మరలా పైకి వెళ్ళునని దానికి తెలియును. దానిలోని తేమ నేరుగా పైకి వెళ్ళును. ఎందువలన? అది ఒకప్పుడు అచ్చట ఉండెను మరియు అది కొద్దిసేపటి క్రితమే క్రిందపడియుండెను. అది మరలా పైకి వెళ్ళుచున్నది. అది ఈ సూర్య రశ్మి తనను పైకి తీసికొని వెళ్ళను అను దానికి ఒక సాక్షియైయున్నది. అది ఎచ్చటనో ఉండియున్నది. అది అంతయూ ఏమైయున్నదో దానికి తెలియును.
మరియు దేవుని ఆత్మ వలన జన్మించిన ప్రతి పురుషుడు లేక స్త్రీ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమునకు ఒక సాక్షిగా ఉండెదరు. ఈ రాత్రి దేవునికి కొందరు సాక్షులు కావలెను! “లోకము లోనికి వెళ్ళి, ప్రతి తరములో, ప్రతి జనమునకు నన్ను గూర్చి సాక్ష్య మివ్వుడి. నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీకు తోడైయుందును.” పరిశుద్ధాత్మ ఈ కొద్ది మాటలను మీ ఆత్మలోనికి చొచ్చుకొనిపోనిచ్చును గాక. “పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు మరియు నాకు మీరు యెరూషలేములోను, యూదయ, మరియు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా వుండెదరు.”
84
మనము మన తలలు వంచియుండగా; సహోదరీ, నీవు ఆర్గన్ వద్దకు వచ్చెదవా? ఇప్పుడొక క్షణము ప్రతిచోట ప్రార్థనలో మన తలలు వంచియుందుము. ప్రతిఒక్కరు మీకు వీలయినంత భయభక్తులుగా ఉండుడి. వేదిక పిలుపును ఇచ్చుచుండగా, ప్రార్ధనలో ఉండుడి. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమునకు సాక్షిగా, దైవిక అభిషేకము నిచ్చుచు ప్రతి రాత్రి, పరిశుద్ధాత్ముడు ఇచ్చటనున్నాడు.
ఈ రాత్రి మీరు ఇచ్చట ఉండి, ప్రభువు యొక్క పునరుత్థాన శక్తికి ఒక సాక్షిగా మారుటకు ఇష్టపడినయెడల అది ఆశ్చర్యమును కలిగించదా? శక్తితో నింపబడేవరకు మీరు నిలిచియుండలేరా? ప్రార్ధనలో మిమ్మును జ్ఞాపకము చేసికొనవలెనని కోరుచున్నారా? దేవుడు మిమ్మును దీవించును. దేవుడు మిమ్మును దీవించును. ఈ భవనమంతటిలో, ప్రతీచోట, చేతులెత్తి యుండిరి. ఓ, మై! అది అద్భుతము.
“నీతికొరకు ఆకలిదప్పులుగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడెదరు.”
85
ఈ రాత్రి ఈ భవనంలో క్రీస్తును ఇంతవరకూ తమ స్వంత రక్షకునిగా అంగీకరించనివారున్నయెడల, వారు “సహోదరుడా బ్రెన్హాం, నా ఎత్తిన చెయ్యి ద్వారా...? ఇప్పుడిక్కడ వేదిక జనులతో క్రిక్కిరిసియుండినది, అయితే నేను నా చేతిని ఎత్తబోవుచున్నాను, నేను ఒక పాపిని, నాకొరకు ప్రార్ధన చేయుము.” మరియు నేను ఆయనను నా స్వంత రక్షకునిగా అంగీకరించినట్లు, దేవుడు నా చేయిని చూచునట్లు ఇక్కడ తెలిసికొనగోరుచున్నాను, అని చెప్పువారున్నారా? స్త్రీ, దేవుడు నిన్ను దీవించును. అయ్యా దేవుడు నిన్ను దీవించును. స్త్రీ, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. నా కుడివైపునున్న ఎవరో? అయ్యా, దేవుడు నిన్ను దీవించును. అక్కడున్న మిమ్మును దేవుడు దీవించును. అది చాలా బాగున్నది. ఎవరో, ఇక్కడున్న ఒకరు, ఇంకొకరు సరిగ్గా అక్కడ, దేవుడు నిన్ను దీవించును. అది అద్భుతమై యున్నది.
“నేను ఆయనకు సాక్షిగా ఉండగోరుచున్నాను.” ఇంకొకరు మీ చెయ్యి ఎత్తి “సహోదరుడా బ్రెన్హాం, నా కొరకు ప్రార్ధించుము. ప్రార్ధనలో నన్ను జ్ఞాపకము చేసికొనగోరుచున్నాను అని చెప్పెదరా?” దేవుడు మిమ్మును దీవించును. అక్కడున్న ఆ స్త్రీ, నీవు కూడా చేయి పైకెత్తియుండుటను నేను చూచియుంటిని. ఆ చివరన ఉన్న యవ్వనస్తుడా నేను నిన్ను చూచియున్నాను. ఎత్తిన చేతితో నిన్ను నేను చూచియున్నాను.
ఈ రాత్రి ఉజ్జీవపు ముగింపులో, ఈ చిన్న జనసమూహములో, ప్రతిచోట చేతులు పైకి లేచుచున్నవి. మనకెట్లు తెలియును ...? ఇక్కడ తన చేతులు పైకెత్తిన మరొక స్త్రీ వున్నది. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. చిన్న బ్రెన్హాం గుడారము ఎన్నడూ కలిగిలేనటువంటి ఆఖరి ఉజ్జీవము ఇదేనాయని నీకెట్లు తెలియును?
86
ఈ రోజున, చల్లని గడ్డకట్టిన స్థితిలో, ఇరవైకి పైబడి వయస్సున్న యవ్వన స్త్రీ వద్ద నేను నిలబడియుంటిని. సమాధి స్థలము నొద్దకు ఆమెను తీసికొనివెళ్ళి మరియు ఆమెను పాతిపెట్టియుంటిమి. ఆమె చిన్న బాలురు అక్కడ తండ్రి యొద్ద కూర్చొని యుండిరి. ఆ చిన్న పిల్లలు శవపేటిక యొద్దకు నడిచివెళ్ళిరి. “రండీ, అమ్మకు వీడ్కోలు చెప్పండి” అని తండ్రి చెప్పెను. వారు అక్కడికి నడచి వచ్చి మరియు చనిపోయి అక్కడ పడియున్న తల్లికి తమ చిన్న చేతులను ఊపుచూ, “అమ్మా నీకిదే మా విడ్కోలు” అని చెప్పిరి. వారి చిన్న గోధుమ రంగు కళ్ళు కన్నీటితో నిండెను. మరియు వారు తమ చిన్న దుఃఖ-ముఖములను తమ చేతులలోనికి దాచుకొనిరి.
ఓ, ఆ తల్లి ఇక ఎప్పటికీ విడిచి వెళ్ళినయెడల అది విచారముగా ఉండదా? అయితే దేవుని కృపను బట్టి ఆమె ఇక్కడ ఈ గుడారములోనే మారుమనస్సు పొందియుండెను. ఇప్పుడు లెక్కలోనికి వచ్చునది ఏదనగా, ఆ రాత్రి ఆమె తీర్మానమును చేసికొనెను. మరియు ముందుకు నడిచి వచ్చెను. గత వారములో ఆమె ఇక్కడ పట్టణములో ఆరోగ్యముగాను మరియు బలముగాను ఉండి కూటములకు వచ్చుటకై ఉద్దేశ్యమును కలిగియుండెను. అయితే కొద్ది సమయములోనే వ్యాధిగ్రస్తురాలై మరియు చనిపోయెను.
87
ప్రజాసేవా సంఘము కొరకై పనిచేయుచున్న నా యొక్క ఇద్దరు స్నేహితులు, నిన్నటి దినమున ప్రమాదములో గాయపరచబడి ఇక్కడ ఆసుపత్రిలో పడియుండిరి. ఆ అమ్మాయి, ఇప్పుడు మరణావస్థలో యున్నది. నేను ఆమెతో కలిసి పదిహేడు సంవత్సరాలు పనిచేసియుంటిని; ఆమె గుండె మరొక ప్రక్కకు చెదిరిపడియుండెను. సబ్-స్టేషన్ ఆపరేటర్లలో ఒకరైన నా యొక్క స్నేహితుడు అక్కడ పడియున్నాడు; నేను అడవిలో కట్టె మొద్దుపై కూర్చొనియుండి మరియు ఎక్కువ సమయం అతనితో ప్రభువైన యేసుని గూర్చి మాట్లాడియుంటిని. కొద్ది సమయంలో జీవమును విడిచిపెట్టక ముందు, ఇప్పుడు, నేను అతనిని చూడగోరుచున్నాను, మరల అతనితో మాట్లాడగోరుచున్నాను. ప్రభువు అతని కొరకు ఏమైనా చెప్పునోయని చూద్దాం.
88
పాపులుగా ఉండి తమ చేయి ఎత్తి మరియు ఎవరైతే ప్రార్ధనలో జ్ఞాపకము చేసికొనవలెనని కోరుచున్నారో వారినిబట్టి నేను ఆశ్చర్యపోవుచున్నాను. మీరు క్రీస్తును అంగీకరించియున్నారు; మీరు ఇప్పుడు యేసు క్రీస్తుని అంగీకరించి యుంటిరని మీరు నమ్మినయెడల ప్రార్ధనలో ఉండుడి; ప్రతి తల వంగియున్నది. యేసుక్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించి, మరియు ఆయన పాపము నుండి మిమ్మును రక్షించెనని మీరు నమ్మిన యెడల, ఇప్పుడే లేచి ఒక సాక్షిగా నిలబడండి. తమ చేయి పైకెత్తిన ఏ వ్యక్తియైనా సరే, “ప్రభువా, ఎందరైతే నమ్మెదరో వారు తీర్పులోనికి రారని నీవు నాకు వాగ్దానము చేసితివని నాకు తెలియును. నేను ఇప్పుడు నమ్ముచుంటిని మరియు నిన్ను నా రక్షకునిగా అంగీకరించుచుంటిని,” అని చెప్పగలరా.
మీరు లేచి నిలబడెదరా? సమయము లేనందువలన మరియు స్థలము లేనందువలన మనము కొద్దిగా ఒత్తిడి చేయబడితిమి. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. ఆ విధముగానే నిలబడియుండుడి. నీవు నిలబడగలిగినట్లైతే ఇంకెవరైనా నిలబడగలరా? సరిగ్గా ఇప్పుడే ఇంకెవరైనా నిలబడెదరా? మీకు వీలైనయెడల, అట్లే నిలబడియుండుడి. భవనములో ప్రతిచోట, ఇప్పుడు ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్ధనలో ఉండుడి.
89
ప్రభువా, ఇప్పుడు సహాయము చేయుము. ఓ ప్రభువా, పాపులను మన్నించండి. “నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రము త్రోసివేయను” అని నీవు చెప్పియుంటివి. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నిలబడియున్నారో ...
సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. అట్లే నిలబడియుండుడి. ఇంకెవరైనా? మీలో కొందరు చేతులెత్తినవారు, “ప్రభువా నేనొక పాపిని నాపై కనికరము కలిగి యుండుము మరియు క్రీస్తును బట్టి నన్ను రక్షించుడి” అని చెప్పుడి. సరిగ్గా అక్కడే ఆయన దానిని చేయును, సరిగ్గా అక్కడే.
ఫిలిప్పు ఇట్లు చెప్పెను ....
“ఇదిగో నీళ్ళు. బాప్తిస్మము ఇచ్చుటకు ఆటంకము కలిగించునది ఏది?”
“నీవు నీ హృదయమంతటితో నమ్మినయెడల, నీవు పొందవచ్చును” అని ఫిలిప్పు చెప్పెను.
సరిగ్గా ఇప్పుడే నీవు ఆయనను నీ యొక్క స్వంత రక్షకునిగా అంగీకరించెదవా? మరియు నీవు ఆయన కొరకు నిలబడి మరియు మనుష్యులందరి ఎదుట ఆయనకు సాక్ష్యము ఇచ్చినయెడల, ఆయన మీ తండ్రి ఎదుటను మరియు పరిశుద్ధ దూతల ఎదుటను మిమ్మును గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన మీవైపు చూచుచున్నాడు. మీరు ఒక సాక్షిగా ఉండగోరుచున్నారా? ఒకవేళ నీవు పాపివైయున్నయెడల లేచి నిలబడుము. స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక, అక్కడున్న ఎవరో ఒక వ్యక్తి మరియు అతని భార్య వారి చేతులు ఒకరిపై ఒకరు ఉంచి ఇప్పుడు క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించుచున్నారు. ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు, త్వరితముగా మీ పాదములపై లేచి నిలబడెదరా, “క్రీస్తును ఇప్పుడు నా రక్షకునిగా అంగీకరించగోరుచున్నాను. నీవు నాకొరకు ప్రార్ధించవలెనని కోరుచున్నాను” అని చెప్పండి.
90
వారు చెంపల మీదుగా కన్నీళ్ళు కార్చుచూ, భవనములో నిలబడియుండగా నేను చేయబోవునది అదే అయియున్నది. మీరు లేచి నిలబడెదరా? గమనించండి. ప్రతిఒక్కరూ ఎటూ కదలకుండా గౌరవప్రదంగా నిలబడియున్నారు. దయచేసి మీరు ప్రార్ధనలో ఉండండి.
వినండి, పరిశుద్ధాత్మ ఇప్పుడు జనులతో వ్యవహరించుచున్నాడు. మీ చేయి ఎత్తునట్లు చేసినది ఏది? మీరావిధంగా చేయునట్లు దేవుడు చేయనియెడల మీరు మీ చేయి పైకెత్తియుండెడివారు కారు. “తండ్రి తనను ఆకర్షించనిదే ఏ మనుష్యుడునూ నా యొద్దకు రాడు” అని యేసు చెప్పెను.
పాపియైన స్నేహితుడా, నేను మాట్లాడిన ప్రజలు, “నేను దేవునియందు నమ్మికయుంచను. అందుకు నాకు సమయము లేదు. దానిని నేనొకసారి ప్రయత్నించాను. నేను ... దానికొరకు కనీసం నాలో ఆశలేదు” అని చెప్పుటను మాత్రము నీవు తెలిసికొనినయెడల.
మరియు ఈ రాత్రి క్రైస్తవుడవగుటకు దేవుడే నీకు ఆశను కలిగించియున్నాడు. ఆయనను త్రోసివేయకుము.
91
మంచిది, మీరు తీర్మానము చేసికొనుచుండగా, పియానిస్టు, ఆర్గనిస్టు, మీరు కోరినయెడల, “ఆయనను త్రోసివేయకుడి” అను పాటను వాయించుడి.
ఆయనను త్రోసివేయకుడి, ఆయనను త్రోసివేయకుడి.
మీరు పాపము చేసి త్రోవ తప్పినప్పటికి,
ఆయన తరిగి మరలా మీ హృదయము లోనికి వచ్చియున్నాడు. [సహోదరుడు బ్రెన్హాం మౌనముగా ప్రార్ధించుచున్నాడు.]
.... ఆ నిత్యత్వపు దినమున!
మీ హృదయములో నుండి రక్షకుణ్ణి త్రోసివేయకుడి;
ఆయనను త్రోసివేయకుడి.
ఓ, “మంచిగా చేసితివి” అని చెప్పుటకు నీకు ఎంతగా ఆయన అవసరమై వున్నాడు. ఇప్పుడు మీరు లేచి మరియు “నేను క్రీస్తును అంగీకరించియున్నాను” అని చెప్పలేరా?
అక్కడ నిలబడియున్న సహోదరి, దానిని గూర్చి ఏమిటి, ఆయన నీ పాపములను క్షమించునని నీవు నమ్ముచున్నావా? ప్రతిఒక్కరూ మీ తలలు వంచినవారై యుండుడి, మనము ఒక నిమిషములో ముగించెదము.
నీ హృదయమునొద్ద యేసుక్రీస్తు తట్టుచున్నాడు, ఇప్పుడాయనను అంగీకరించుడి. మీరు నిలబడి మరియు “నేనిప్పుడు క్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరించుచున్నాను” అని చెప్పలేరా? చిన్న ప్రార్ధనకొరకై మీరు లేచి నిలబడలేరా? అక్కడ వున్న యవ్వన్నస్తుడా, దాని విషయము ఏమిటి? దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. అక్కడ వెనకాల నీ చెయ్యి పైకెత్తియున్న యవ్వన స్త్రీ, నీ విషయం ఏమిటి? ఇప్పుడు నీవు లేచి నిలబడెదవా?
నిత్యత్వములో ఆ దినమున నీ పక్షమున వాదించుటకు ఆయన నీకు కావలెనా!
రక్షకుని నీ హృదయము నుండి త్రోసివేయకుడి;
ఆయనను త్రోసివేయకుడి.
92
మరలా ఆ పాటను మనము పాడుచుండగా, నిలబడివున్నవారు, ఈ తట్టుగా నడిచివస్తుండగా, నేను వారితో కరచాలనము చేసి ఈ వేదికపైన ప్రార్ధించుటకు సంతోషించుచున్నాను. మీరు వచ్చెదరా? ఆ మిగిలినవారందరూ వచ్చెదరా? ఆ వెనుకనున్న చేయి లేపిన వ్యక్తి, మీరు ఇక్కడకు వచ్చెదరా? కొద్దిగా ఇచ్చటకు రండి. భార్యభర్తలారా దేవుడు మిమ్మును దీవించును, ఒక్క క్షణము ఇచ్చటకు రండి. ఇచ్చటకు నడిచి రండి. సహోదరుడా, సహోదరీ, నేను మీతో కరచాలనము చేయగోరుచున్నాను.
మరలా మీ హృదయము తట్టునకు ... (సహోదరుడా, ఆమెతో రండి)
నీవు దూరముగా వెళ్ళియున్నప్పటికీ;
ఓ, దానిగూర్చి నీ పక్షమున వాదించుటకు ఆయన నీకు ఎంతో అవసరము (నీవు రాలేవా?)
రక్షకుని నీ హృదయము నుండి త్రోసివేయకుడి;
ఆయనను త్రోసివేయకుడి.
సహోదరుడా, ఇప్పుడు, దానిగూర్చి ఆలోచించుము. మరుసటి ఉదయము రాకముందే ఒక పన్నును ఊడదీసినట్లుగా నీ శరీరము నుండి నీ ఆత్మ చీల్చివేయబడ వచ్చును, అది ఒక అంతములేని నిత్యత్వములోనికి వెళ్ళును. ఆ గొప్ప భయంకరమైన ప్రభువు దినమున నీ పక్షమున ఎవరు వాదించెదరు? నీవు రాలేవా? ఈ పునరుత్థాన దినమున నీవు వచ్చి కనీసం ఈ విధముగా చెప్పలేవా, “ప్రభువైన యేసూ, నేను నిన్ను విశ్వసించెదను.”
93
[సహోదరుడు బ్రెన్హాం వేదికపైనున్న వారితో కూడ ప్రార్ధించుచునేయున్నారు. టేపులో ఖాళీ ఉన్నది] ... బోధించుడి, మరియు ఈ ఇతర వ్యక్తులు బోధించుచుండగా వినుడి. “అదియే సత్యమై యున్నదని, నేను నా ఒప్పుకోలు ముద్రను దానిపై ఉంచాను.” అది దేవుడు ఇక్కడ ఉండి స్థిరపరచుచున్నాడు. అది అతని సువార్తయైయున్నది. ఇప్పుడు మీ పూర్ణ హృదయముతో నమ్ముచున్నారా?
మేము వేదిక పిలుపు ఇచ్చుచుండగా, పడిపోయిన ఏ వ్యక్తియైనా ఇక్కడ ఉండినయెడల “సహోదరుడా బ్రెన్హాం, ఈ క్షణమందే నన్ను జ్ఞాపకము చేసికొనుము. నన్ను జ్ఞాపకము చేసికొనుము. నేను నా చేయి పైకెత్తుచున్నాను. ప్రార్ధనలో నన్ను జ్ఞాపకము చేసికొనవా?” అని చెప్పినచో నేను సంతోషించెదను. చూడండి, ఈ ఒకానొక దినములలో మీరు యేసుక్రీస్తును కలిసికొనుటకు వెళ్ళేదరు.