ఈస్టర్ ముద్ర

ఈస్టర్ ముద్ర

ఈ ఫోనిక్సులో ఈ సంపూర్ణ సువార్తికుల సమాఖ్యా యొక్క పుట్టుక దిన సందర్భముగా ఈ ఉ దయమున ఉండుట నిశ్చయముగా ఒక భాగ్యమే. ఈ సహావాసములో చిన్న భాగముగా నేనుండుటకు ప్రభువు నాకు కృపచూపెను. సహో. కార్ల్ విలియమ్స్, అతని భార్యను, సహా, స్ట్రోమీ, సహో, షోర్, సహో, అవుల్లా, తదితర సేవకులను, వేదిక మీద ఉన్న వారందరినీ, ఈ వచ్చిన వారందరినీ అభినందించగోరుచున్నాను.

గతవారంలో కూడా ఒక పుట్టిన రోజుకు హాజరయ్యాను. అది నా జన్మదినము. ఈ సమఖ్యా కంటె కొద్దిగా నేను పెద్దవాడను. అయిదేండ్లు నేను పెద్దవాడినని వారు చెప్పారు.

ఒక రోజున ఎవరో " నీ వయసెంత? బ్రెన్హాం సోదరుడా?" అని అడిగినపుడు. "ఇరవై ఆరు" అని చెప్పాను. మొదటి ఇరవై అయిదేండ్లు నేను తుడిచివేశాను. అప్పుడు అంతగా నేనాయనను సేవించలేదు. " ఆయన కూడా వాటిని తుడిచివేసి యుండుననుకొనుచున్నాను." అన్నాను ఆ విధంగా ఆయనను చేయమనుట నేను వేరే సంగతి.

2. అయితే ఇక్కడుండుట మంచిది. మీ సమయము ఎక్కువగా తీసికొనగోరుట లేదు. ఎంతో మంచి సాక్ష్యములు, సంగతులు, చక్కని పాటలు వినిన తరువాత నేను ఎదో చెప్పి వాటి ప్రభావమును పోగొట్టగోరుటలేదు. దానికి మరేదో నేను చేర్చవలెనని మాత్రమే ప్రయత్నించుచున్నాను.

ఆ సోదరుడు ఉదయము పాడిన పాటను నేను ప్రశంసించుచున్నాను. (ఆ వర్ణ సోదరుడు నల్లజాతి సోదరుడు) "ఆయన కన్నులు పిచ్చుక మీద ఉన్నవి." ఈ సోదరీలు పాడిన పాట నాకెంతో ఊతమిచ్చిన పాటలలో ఒకటి. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పటి నుండి అది నాకు సహాయపడుచున్నది. దానిని రికార్డు చేసి విన్నాను. "దానిని నేను ఆయనతో చెప్పగోరుచున్నాను." ఆ సోదరీలు ఇంకా భూమి మీద ఉండిన యెడల ఈ ఉదయమున మరల ఆ పాట వారిచే పాడించమని నా స్నేహితుడగు సహో. డాసన్ రైలీని అడిగాను. టెర్రి దానిని రికార్డు చేశాడని తలంచుచున్నాను. ఆ పాట నాకు నిజముగా నాకెంతో ఇష్టము గనుక రికార్డు చేసి యుంచుకొందును. ఆది నా కోరిక ఆయనతో నేను చెప్పుకొందును. మనమందరము అది చేయగోరుదుమని నేననుకొనుచున్నాను. అందుకే ఈ ఉదయము ఇచ్చట చేరియున్నాము.

3. వచ్చే వారము జరగబోవు కూటములను గూర్చి చెప్పవచ్చునా? ఈ వచ్చే వారము నేను ఈస్టర్ కూటములకు ఆలయమునకు వెళ్ళెదను. అందుకొరకు ఇంటికి చేరెదను. శనివారము రాత్రి, ఆదివారము, ఆదివారము రాత్రి యుందును. ఆ తరువాత కాలిఫోర్నియోకు వెళ్ళెదను. కాలిఫోర్నియో చుట్టు ప్రక్కల నున్న వారు ఆ కూటములకు రావలెనని సంతోషముగా ఆహ్వానించుచున్నాము. బిల్లీ తప్పు ప్రకటన చేసినట్లు తెలిసినది. బిల్ట్ ్మర్ హోటల్ అని అతను చెప్పెను. ముందు అక్కడే అనుకొన్నాము. కాని అది కుదరలేదు. ఎంబసీ హోటల్ యొద్ద జరుగును.
సంపూర్ణ సువార్తను నమ్ముజనులు ఆ మార్గములో యున్నచో తప్పక తెలియజేతుము.

అక్కడినుండి తిరిగి వచ్చిన తరువాత నేను దక్షిణాఫ్రికాకు వెళ్ళెదను. సరిగ్గా ఇంకా నెలకు దక్షిణాఫ్రికాకు బయలుదేరుదుము. అక్కడ మూడు దేశములు పర్యటించెదము. ప్రభువు గొప్ప సమయముగా దానిని చేయునని నేను నమ్ముచున్నాము. మీ ప్రార్ధనలు ఎంతో అవసరము. మీకు ట్రిపులయొక్క సంగతులను (గొప్ప రిపోర్ట్) అందించుటకు తిరిగి వచ్చెదమని నేను మరల తిరిగి వచ్చు వరకు బహుశా నేను మిమ్మును చూడలేనని తలంచుచున్నాను. ఆశించుచున్నాను.

4. గతసారి నేనక్కడ వున్నప్పుడు. ప్రభువు ఎన్నడూలేని గొప్ప కూటములను జరిగించెను. ఒకసారీ వేదిక పిలుపునకు ముఫైవేల మంది వచ్చి క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిరి. "బ్లాంకెట్ ఎందుకగా ఒకసారి ఇరవైఐదు వేలమంది బాగయిరి. ఆ మరుసటిరోజు డర్బన్ మేయరు ఇట్లు నేటివ్స్" వచ్చినది వేరే చోట. వారు బహుశ శరీర స్వస్థత అని పొరబడుచున్నారేమో అనుకొన్నాము. చెప్పెను,(సిడ్నీ స్మిత్ అతని పేరు) "మీ గది కిటికీలో నుండి ఆ వీదిలోని జనమును చూడండి." ఎన్నో లారీలు పట్టు చేతి కర్రలు, ఊతకర్రలు గుట్టలుగా పడియున్నవి. ఆ స్థానికులు వీదిలో "నమ్మిక మాత్రంముంచుము" అను పాటను పాడుకొంటూ వచ్చుచుండిరి. (అంతకు ముందు వారు పోరాడుకొనెడి వారు)

5. నా హృదయము పులకించినది. బ్రదర్ షార్స్ అటువంటిది నీవు చూచినపుడు నీవు చేసిన పని వ్యర్ధము కాలేదని. నీకు రుజువగును. చూడు నీవు ప్రయత్నించు.

దేవుడు అలాగే మరల జీవించునని నిరీక్షించుచున్నాను. అక్కడికి మనం వెళ్ళుచున్నడున కాదు గాని ప్రభుని రాకకొరకు మనము కనిపెట్ట చూచుచున్నందునే ఇది జరుగుచున్నది. తప్పిపోయిన ఆ చిన్న గొర్రెపిల్లను మనము వెదకుచున్నామని ఆ పాటలో యున్నది. ఆ గొర్రెపిల్ల లోపలికి వచ్చువరకు ఆయన రాడు. అందరూ లోనికి రావలెను. ఆ చివరి వ్యక్తి వచ్చు వరకు ఆయన తలుపు మూయడు.

కాబట్టి సేవక సోదరులారా, అ తప్పిపోయిన గొర్రెపిల్ల కొరకు వెదకండి. అది ఈ ఉదయమున ఫోనిక్సులో యున్నదేమో. నాకు తెలియదు. కాని ఆ చివరి గొర్రెపిల్ల రాగానే కాపరి తలుపు మూయును(బ్రదర్ బ్రెన్హామ్ నేనొకమాట చెప్పొచ్చ? తదుపరి చెప్పాల్సిన ప్రకటనను అతడు మరిచిపోయాడు, దాని గూర్చి మాట్లాడవచ్చును.)

6. నేను చెప్పబోవు దానిని వ్రాసికొందును. ముసలివాడినగుచున్నాను. గనుక నేను గుర్తుంచుకొనుట చాలా కష్టముగా నున్నది. నా లేఖనములు వ్రాసియుంచాను. నా మనస్సులో 50 వచనములు గుర్తుంచుకోలేను. గతించిన దినములలో ఎంతో కరుకు త్రోవగుండా పయనించాను.

మనము ప్రభువు రాక కొరకు ఎదురు చూచుచున్నాను. ప్రభువు మనందరినీ దీవించును. గాక! ఇక్కడ కూర్చొని జనులు సాక్షమిచ్చుట వింటూంటే నాకుకూడా లేచి ఏదో చెప్పవలెననిపించుచున్నది.చెప్పవలిసింది చాలాయున్నది. దినమంతయూ చెప్పవ లెను. కాని నిశ్చయముగా మిమ్మును
ప్రశంసించెదను, ఈ చిన్న సమాఖ్య ఎదుగుచుండవలెను. యేసు వచ్చువరకు పోనిక్సులో నున్న ప్రతి సంఘము వర్ధిల్లుచుండ వలెను. అది నా యదార్థ ప్రార్ధన మనము ప్రార్ధించుచుండగా నిలబడుదుము. కొంత విశ్రాంతి దొరకును.

7. సర్వ శక్తుడవగు దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రీ, ఆయనను మృతులలో నుండి లేపి మా బలిగాను, ప్రభువుగాను, రక్షకునిగాను అనుగ్రహించితివి. విమోచింపబడిన నీ జనులతో, నీ సన్నిదిలో ఈ ఉదయము నిలబడు భాగ్యము. ఇచ్చినందుకు మేమెంతో కృతజ్ఞత చెల్లించుచున్నాము. ఆయన యొక్క మహిమకరమగు రెండవ రాకడ కొరకు ఎదురుచూచు చున్నాము. ఆయన వచ్చి మనలను చేర్చుకొనును.

ప్రభువా, మా మధ్య పాసమున్నచో నీ హిస్సోపుతో శుద్ది చేయుము. పరమ తండ్రీ మా మద్య ఉన్న ప్రతి రోగిని స్వస్థపరచుమని ప్రార్థించుచున్నాము. బహుశ నిన్ను గూర్చి ఎరుగని వారు ఉ ండవచ్చును. మేము ఎంతగానో పోరాడుచున్న ఈ పరిశుద్దాత్మ బాప్తీస్మము గూర్చియు ఎరుగని వారుండియుందురు. కాని అది తప్పని సరి అని ఈ చివరి దినములలో వాక్యము చెప్పుచున్నది. నేడు ఆయన మా అందరి మీద దిగునట్లు ప్రార్ధించుచున్నాము. మమ్మును నూతనముగా నీ శరీరంలోనికి బాప్తిస్మము ద్వారా చేర్చుము, తండ్రీ, బయట ఉన్నవారిని లోనికి తీసికొని రమ్మని ప్రార్ధించుచున్నాము.

నీ వాక్యము చదివి, నీ వాక్య సత్యమును చెప్పుటకు ప్రయత్నించుచుండగా, మా ప్రయత్నములను దీవించుము. అసత్యము చెప్పకుండా మా నోరు మూయుము. మమ్మును మేము నీకు సమర్పించుకొనుచుండగా మా హృదయములను, నోళ్ళను నీ సత్యముతో నింపుము. మాట్లాడునట్లుగా మా నోళ్ళను, వినునట్లుగా మా చెవులను, చేర్చుకొనునట్లుగా మా హృదయములను వాడుకొనుము. ఇందుకొరకు మమ్మును నియమించి అభిషేకించిన యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

8. బైబిలులోని మూడు చోట్ల నుండి పరిశుద్ద వాక్యమును నేను చదవగోరుచున్నాను. మీరు వాటిని గుర్తు చేసికొని ఇంటికి వెళ్ళి చదవండి. దానిన బట్టి నేను సంతోషించెదను. మత్తయి 28 :1- 10: ప్రకటన 1: 17- 18: రోమా 8:11. మరల దానిని చెప్పెదను. మత్తయి 28: 1- 10: ລ້ 1:17-18; 55 8:11

ఇప్పుడు మనము ఈస్టరును సమీపించుచున్నాము. సంవత్సరములోని అన్ని వారముల కంటె ను ఈ వచ్చేవారము అతి చారిత్రక వారము. ఈ వచ్చే వారము ఒక అతి గొప్ప సంగతిని గుర్తు చేసికొందుము. భూమి మీద జరిగిన అన్ని సంఘటనలలోను అతి గొప్పది ఇది. దానినెవరూ కాదనలేరని తలంచుచున్నాను. మీరు "సిలువ మరణము" గొప్పదని అనవచ్చును. అవును గొప్పదే. కాని చాలా మంది మరణంచారు. చాలా మంది సిలువ మీద చనిపోచయిరి. మన ప్రభువు చనిపోయిన దినములలోనే వారును చనిపోయి యుందురు. కాని తిరిగి లేచిన వాడు ఒక్కడే దానికి ముద్ర పడినది
9. ఇప్పుడు చదవగోరుచున్నాను. ఇది చిన్న ఈస్టరు ముందు వాటి వర్తమానము. ప్రభుని చిత్తమయితే 40 నిమిషములు మాట్లాడెదను. ఇపుడు మత్తయి సువార్త 28 వ అధ్యాయము.

విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు, వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిది.

ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి, రాయి పార్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను.

అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి.

దూత ఆ స్త్రీలను చూచి- మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియును.

ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు. రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి.

త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిశ్యులకు తెలియజేయుడి, ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు.

అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీకు చెప్పితిననెను.

వారు భయముతో, మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి,

ఆయన శిశ్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా

యేసు వారిని ఎదుర్కొని - మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి,

ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా -

యేసు - భయపడకుడి. మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను.

10. అలాగే ప్రకటన 1అధ్యాయము 17 మరియు 18 వచనములు చదువుదుము.

 

నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని.

ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము.

నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృత్రుడనైతినిగానీ

ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్క తాళపు చెవులు నా స్వాదీనములో ఉన్నవి.

అలాగే రోమా పత్రిక 8వ అధ్యాయము పదకొండవ వచనము వరకు ఆరంభం నుండి చదువుకొందుము
మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది.

11. ఇప్పుడు చదవబడిన ఈ మాటలకు ప్రభువైన యేసు తన దీవెనలను జోడించునని నమ్ముచున్నాను.

ఈ ఈస్టరును... సంవత్సరములో ఇదొక గొప్ప సంఘటన అని గొప్ప కూడిక అని నా హృదయములో స్టాంపు(ముద్ర) వేసికొన్నాను. (ఒక నిమిషం మన్నించండి. మీకు చక్కగా వినబడుచున్నదా? సరిగా వుందా? మంచిగా వినగలుగుచున్నారా? లేదా, మరిప్పుడు అలాగేనా? మరీ దగ్గరికి రావాలనుకోట్లేదు.)

12. ఇప్పుడు, దీనినెందుకు చెప్పుచున్ననంటే బైబిలులో ఈ ఈస్టరును గూర్చి దేవుడేమి చెప్పెనా, దానిని ఆయన ఆ రోజున నెరవేర్చెను. ఏమైతే చేయాలని ఆయన గూర్చి లేఖనాలు వ్రాయబడ్డాయో. అవన్నియు ఆయన మృతులలో నుండి లేచుట మామూలుగా ఆయన ముద్రించాడు మెస్సీయాగా రుజువు పర్చాడు. అదే ఈస్టర్ ముద్రంటే

నేడు మనకే అది ఉండెను. ఈస్టరు ముద్రను చెప్పే వస్తువులను కొనుట గూర్చి మనమెక్కుగా చెప్పుకొంటాము. మంచిది ఈ ఉదయమున నేను ఈస్టరు ముద్రను గూర్చి చెప్పగోరుచున్నాను. డబ్బుతో మనము కొనే అక్షరము ముద్రల కంటే ఇది ఎంతో భిన్నమైనది. అని నేననుకొనుచున్నాను. దేవుని పిల్లలమని చెప్పుకొనే క్రైస్తవులగు మనకి ఈస్టరనేది సంవత్సరములోనే అతి గొప్పది. ఈ ఈస్టరు ముద్రను తెరచి క్రీస్తు కొరకు చేసిన ఈ గొప్ప కార్యముతో మనము ఏ విధముగా సహవాసము చేయగలమో నేను చెప్పగోరుచున్నాను.

13. ఆయన శ్రమ పడుటను గూర్చి, సిలువ మరణమును గూర్చి పునరుత్థానమును గూర్చి వందాలాది సంవత్సరాలకు ముందే దేవుని వాక్యము తెలియజేసినది. ఈ సంగతలబహువ మనం వచ్చే వారమంతా రేడియో ద్వారా వినవచ్చును. సంఘాలలో సేవకుల ప్రసంగాల ద్వారా వినవచ్చును. యేసు చేసిన ఆ కార్యాలకంటే, అన్ని దినముల కంటే ఇది ఎంతో గొప్పదని... ఆయన యొక్క రుజువు పర్చబడిన దైవ కార్యము. ఆయనదానిని నేరవేర్చు సంగతి అంచటిని నేను నిశ్చయముగా అభినందించుచున్నాను. రోగులను స్వస్థపర్చుట, మృతులను లేపుట, దయ్యములను వెళ్ళగొట్టుట, బీదలకు సువార్త ప్రకటించుట. ఆయన రాకను గూర్చి చెప్పబడిన ప్రతి లేఖనము ఆయన నెరవేర్చుట, మరలాగే మనకుబదులుగా మనస్థానంలో ఆయన సిలువనెక్కుట (ఆయన తప్ప మరేవరు దానిని మనకొరకు చేయజాలరు.) ఇవన్ని ఎంతో అభినందనియము. అయితే

వీటన్నిటికి పైగా ఈస్టర్ ముద్ర అనేది ఇంకా ఎంతో గొప్పదని నేననుకొనుచున్నాను. సిలువ మన పాప పరిహార బలిగా మరణించెను. ఆయన తప్ప మరెవరూ ఆ కార్యము చేయలేరు.

14. అన్నింటికి సైగా, ఈస్టరు యున్నది. అది ముద్ర వేసినది. ఆయన కంటె ముందుగా ప్రవక్తలు భూమి మీదకి వచ్చి ఆయనను గూర్చి ప్రవచించిరి. ప్రవక్తలు వచ్చి రోగులను స్వస్థపరిచిరి.
మృతులను సహితము లేపిరి. యేసు చేసిన కార్యములనే చేసిరి, ఈస్టరు దానిని రుజువు చేసెను. నిజమైన విశ్వాసికి దేవుని వాక్యమును అది ముద్రించి ఇచ్చినది. ఆ దివెనకరమగు ఉదయమున

చీకటి, సందేహము యావత్తు పటాపంచలయినవి. ఈదినమునకు ముందు మానవుడు చెరసాలలో మూయబడి యున్నట్లుండెను. మతనిష్ట గలవారు కూడా అలాగే యుండిరి. వారు ఎన్నో గొప్ప ఉద్యమములను చూచిరి. పరిశుద్దాత్మ కదిలింపును చూచిరి. కాని ఒక మనిషి మరణము అన్నిటికి సమాప్తమని తలంచిరి. కాని ఆయన వచ్చి ఇట్లనెను, "నా జీవమును ఇచ్చుటకు తిరిగి దానిని లేపుటకు నాకు అధికారమున్నది." ఆయన తాను చెప్పిన దానిని రుజువు చేసెను. ఒకటి చెప్పినపుడు దానిని తిరిగి నిరూపించవలసి యుండును.

15. భూమి గుండ్రముగా యున్నదని కొలంబస్ చెప్పెను. ఓడలు వచ్చుట అతడు గమనించెను. (మనకు తెలియును) ఓడ చాలా దూరములో యుండగానే అనగా ఓడ కంటే ముందు దాని ఛాయలను చూచెను. భూమి గుండ్రముగా యున్నదని అతనికి తెలిసెను. ఆనాటి జనులు దానిని నమ్మలేదు. కాని అతడు ఒక దర్శనము గల వ్యక్తి. తాను చూచిన దానిని రుజువు చేయుటకు అతడు బయలుదేరెను. అది సత్యమని నిరూపించగోరెను. దేవుడు తన మాటను సత్యముగా నిరూపించబద్దుడై యున్నాడు. ఆలాగు చేయగలిగిన వాడు ఒక్కడే యున్నాడు. ఆయన యేసు. ఆయన వచ్చి సత్యముగా నిరూపించెను.

దానికి ముద్ర పడినది. ప్రతి చీకటిని అది తొలగించెను. ఇతర మతముల యొక్క మూఢత్వమునంతటిని అది చెదరగొట్టెను. గొప్ప వ్యక్తులు లేచి ఎన్నో గొప్ప సంగతులు, గొప్ప మాటలు చెప్పిరి. కాని వారందరు సమాధిలో యున్నారు. క్రైస్తవ మతమునకు మాత్రమే ఖాళీ సమాధి యున్నది. అందును బట్టి ఆయన మృతులకును సజీవులకును దేవుడై యున్నాడని నాకు రుజువగుచున్నది. ఆయన మృతులను తిరిగి సజీవులుగా లేపగలడు. ఈ మేల్కొలుపు శక్తి, ఆయన ఆత్మ యొక్క జీవపుశక్తి ఎన్నో సంవత్సరముల నుండి రుజువగుచున్నది. మృతులను తిరిగి సజీవులుగా ఆయనే లేపగలడు.

16. ఆయన తన వాగ్దానము ద్వారా ఈ గొప్ప జయించు శక్తిని ఈస్టరు ద్వారా నిరూపించెను. ఆయన మరణమును, పాతాళమును, సమాధిని జయించగలనని నిరూపించెను. “నేను మృతుడనై యున్నాను. గాని ఇదిగో యుగా యుగములు సజీవుడనై యున్నాను. మరణము యొక్కయు, పాతాళముయొక్కయు, సమాధియొక్కయు తాళపు చెవులు నేను కలిగియున్నాను." ఎవరు ఆ మాట చెప్పగలరు! ఆయన మాట చెప్పుట మాత్రమే కాదు గాని దానిని ముందుగానే రుజువు చేసెను.

క్రైస్తవులముగా మనము బైబిలు నమ్ముచున్నాను. చెప్పుచున్న దానిని మనము నిరూపించగలము. అందువలన మనము భూమికి ఉప్పగా యున్నాము. కొద్దిసేపటి క్రితం ఆ సోదరి చెప్పినది. అది నిజము. ఈ ఉప్పు కొరకు లోకము చూచుచున్నది. మన జీవితముల మన బైబిలు ద్వారాను దానిని రుజువు చేయగలము. ఆ ద్వారాను, మన వాక్యము నేడు సజీవముగా
మన జీవితములలో జీవించుచున్నది. ఆ దినము కొరకు మనము చూచుచున్నాము.

17. వాక్యమే ఆత్మయై యున్నది. రోమా 8: 11 చెప్పుచున్నది. గదా! "యేసుక్రీస్తును తిరిగి లేపిన ఆత్మ మీలో ఉన్న యెడల మీ మార్త్య శరీరములను కూడా అది తిరిగి లేపును." ఆయన విమోచకుడగు యెహోవా, మరణము, పాతాళము, సమాధి మీద ఆయనకు శక్తి యున్నది. దానిని మనకు ఆయన రుజువు చేయుట మాత్రమే కాదు గాని మనమును అదే ఆత్మను పొంగలభాగ్యమునుగ్రహించెను. అదే ఆత్మ ద్వారా మనము తిరిగి లేచి యున్నామను నిశ్చయతను పొంది యున్నాము. ఎందుకనగా మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీ శరీరములో నివసించుచున్నది. అది మీ మర్య శరీరములను కూడా మేల్కొలుపును.

మరణము తరువాత జీవించబడుటయే మేల్కొలుపుటకు అర్ధము. మృతి చెందిన తరువాత అది బ్రతికించబడును.

18. ఇది రుజువగు వరకు ప్రపంచము ఎన్నో యుగముల నుండి సందేహములో కొట్టుకొనినది. చెప్పుట మాత్రమే కాదు గాని నిరూపించబడినది. ఇంతకన్న యోగ్య మైనది మరేదీ లేదు.

యేసు చెప్పెను, "మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుని శక్తిని వారికి వెల్లడి చేయుడి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును." వాగ్దానము నమ్మిన వారికి ఇది జరుగును. "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును." అని ఆయన ఖచ్చితంగా చెప్పెను. అది వారి సాక్ష్యమునకు రుజువు.

"మేము నమ్ముదుము" అని మీరనవచ్చును. అది రుజువు కావలెను. అందుకు గురుతు కనబడవలెను. మనము కేవలము మాటకే విశ్వాసులము గాని విశ్వాసుల స్థానములో లేము.

19. కొన్ని రోజుల క్రితం టూసాన్లో ఒక రేడియో కార్యక్రమము నేను వింటిని. ఆ బోధకుడు మనకు వ్యతిరేకి. పెంతెకోస్తు మతము అస్థిరమైనది; దానిని నమ్మవద్దని చెప్పెను. ఇంకా ఇట్లనెను : “భాషలలో మాట్లాడుట, ప్రార్ధన ద్వారా రోగులను బాగు చేయుట మొదలగునవి చేయుచున్నామని చెప్పుకొను వారు ఆ పేద ప్రజల కొరకు, రోగుల కొరకు వెళ్ళి ప్రార్ధన చేయవచ్చును గదా! వారు భ్రమలో యున్నారు. వారిలో ఏదో తప్పు యున్నది." ఆ సోదరునితో కొద్ది సేపు నేను మాట్లాడి యున్నచో ఎంత బాగుండును!

పెంతెకోస్తు దినమున అపోస్తలులకు మాత్రమే అది ఇయ్యబడినదని అతడు చెప్పెను. ముప్పది సంవత్సరముల తరువాత పౌలు ఈ వరములను సంఘలో అభిషేకించెను. ( 1కొరింధీ 15) భాషలు మాట్లాడుట, అద్భుతములు చేయుట, ఇంకా ఇతర వరములను అతడు సంఘములో స్థిరపరచెను. సంఘములో ఇవి యున్నవి.

20. “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి" అని యేసు చెప్పెను.

"ఎంత వరకు?" సర్వలోకమునకు.

"ఎవరికి?" సర్వసృష్టికి, ఇంకా ఎందరో దానిని వినవలిసియున్నారు.

"నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును."

"ఎంత కాలము?" యుగ సమాప్తి పర్యాంతము
"ఎవరికి?" సర్వ సృష్టికి, సర్వ లోకములో, సర్వ సృష్టికి ఈ సూచక క్రియలు కనబడును. ఈ సూచక క్రియలు జరుగును.

నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. సర్పములను ఎత్తి పట్టుకొందురు. విషకరమైనదేదయినా త్రాగినను అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులుంచగా భాగవుదురు." అధి సంఘమునకు ఆయన ఇచ్చిన చివరి ఆప్లై. (మార్కు 16)

21. ముప్పై సంత్సరముల తరువాత పౌలు ఈ వరములను సంఘములో అభిషేకించెను. గలతీ 1:8 లో చెప్పెను, "ఇంతకు ముందే మీరు చేర్చుకొనిన, బోధించబడిన ఈ సువార్తను గాకమరి ఏ ఇతర సువార్తనయినా గాని పరలోకము నుండి దూత దిగి ప్రకటించినా గాని అతడు శాపగ్రస్తుడవును."

పెంతెకోస్తు ప్రారంభమే గాని అంతము లేదని నేను నమ్ముచున్నాను. సర్వ సృష్టికి, సర్వ స్థలములలో, సర్వ కాలములలో అది వాగ్దానము చేయబడినది. పెంతెకొస్తు నిరంతరము నిలిచి యుందును. జనుల మీద పెంతెకోస్తు దీవెనలు నిలిచి యుండును.

22. అసలు ఈ పెంతెకోస్తు దీవెన అనగా ఏమిటి? పునరుత్థానమునకు స్థిరమైయున్నది. సువార్త అనగా "శుభ సమాచారము." ఇందులో ఆశ్చర్యము లేదు. దేనిని గూర్చిన శు భ సమాచారము? ఆయన మృతులలో నుండి లేచెను. "నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు." ఒకపుడు మీరు మీ అపరాదములలో చచ్చిన వారైయుండగా, దేవుడు తన ఆత్మచేత మిమ్మును బ్రతికించెను. దేవుడు తన ఆత్మ ద్వారా మనందరిని ఏకము చేసెను. యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపెను. ఇప్పుడు మనము ఆయనతో కూడా పరలోక స్థలమందు కూర్చొని యున్నాము. ఆయనతో సహావాసము చేయుచున్నాము. ఆయనతో మాట్లాడుచున్నాము. మనము సత్యమని నమ్మిన ఈ గాధను జనులకు చెప్పినపుడు ఎంత ఆనందము కలుగుచున్నది! 23. జరుగుచున్న దానిని చూచి నేడు నేను ఆశ్చర్యపడుచున్నాను. నిజంగా జనులను మనము దేవుని యొద్దకు తీసికొని వచ్చుచున్నామా? లేక కేవలము సంఘములోనికి వారిని తీసికొని వచ్చుచున్నామా? క్రీస్తునొద్దకు వారిని మనము తోడుకొని రావలెను. ఆయనలో పునరుత్థాన శక్తి యున్నది. సంఘమునకు వెళ్ళుట నిశ్చయంగా మంచిదే. కాని అంత మాత్రమే చాలదు. మీరు సంఘమునకు వెళ్ళుట మంచిదే కాని సంఘమునుండి క్రీస్తు నొద్దకు మీరు వెళ్ళవలెను. ఆగొప్ప పునరుత్థానములో మనము ఉండగోరిన యెడల తప్పక పునరుద్ధాన శక్తిని మనము పొందవలెను. అది మాత్రమే ఎప్పటికైనా మృతులలో నుండి మనలను లేపును.

"యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించి యెడల మీ మార్య శరీరములను కూడా అది జీవింపచేయును." ఎంత గొప్ప వాగ్దానము!

24. చూడండి! యేసు మృతులలో నుండి లేచెనని చూపించి, చెప్పుటయే ఈ పునరుత్థానము యొక్క సారాంశము, ఆయనచనిపోలేదు గాని జీవించియున్నాడు. ఆయన ఇక్కడ జీవించియున్నాడు.
ఆయన మనలో యున్నాడు. "నేను మీలోను, మీతోను యుందును. ఇక కొంచెము కాలము తరువాత ఈ లోకము నన్ను చూడదు గాని మీరు నన్ను చూచెదరు. ఏలయనగా నేను మీలోను, మీతోను యుగ సమాప్తి పర్యంతము ఉన్నాను."

క్రైస్తవులముగా మనమందరము ఆయన సజీవునిగా యున్నాడని చెప్పెదము. ఎందుకనగా మనము ఆయనాత్మ ద్వారా మరణములో నుండి జీవము లోనికి దాటి యున్నాము. మనము తిరిగి లేపబడని యెడల సజీవులము కాము.

25. ప్రభుని చిత్తమయితే కొద్ది నిమిషముల పాటు ఈ అంశమును చర్చించుదము. మనమెట్లు

మేల్కోలపబడియున్నామో చూద్దాం. ఇది సత్యమని నిశ్చయంగా ఎరుగవలెను.

ఇది మీ స్వంత జీవము. ఇది నా జీవము

ఇది సత్యముకాని యెడల నేను చెప్పబోవునది నాకే వర్తించదు. ప్రపంచములో నా కంటె బుద్దిహీనుడు మరోకరుండరు. అలాగయితే నేను శూన్యము కొరకు ప్రయాసపడుచున్న వాడినగుదును. మీకు శూన్యమే బోధించిన వాడనగుదును. కాని అది సత్యమైన యెడల నాకున్న సమస్తము దాని కొరకు ధారపోసెదను. దాని కొరకు ఏమయిన ఇచ్చెదను. అందుకొరకు మనము నిలబడియున్నాము. మన ఆసక్తిని మనము కోల్పోరాదు.

ఈస్టరు సమీపించుట మనము చూచుచన్నాము అది నా లోపల ఏదో చేయుచున్నది. దేవుని దృష్టిలో ఈ సంగతి నిత్యముగా ముద్రించబడియున్న దినము ఇదేనని నాకు తెలియును.

26. ఆయనను మృతులలో నుండి లేపిన ఆత్మ మనలో జీవించుచున్నదని గ్రహించవలెను. దేవుడగు యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మనలో ఎట్లు జీవించగలదు? అది జీవింపజేయు ఆత్మ. వాక్యము తిరిగి లేపదు గాని వాక్యమును తిరిగి లేపునది ఆత్మయే. వాక్యమునకు అది జీవమిచ్చుచున్నది. దానికి ఎగురు రెక్కలు ఇచ్చుచున్నది. దానికి జీవమును ఆత్మయే దయచేయుచున్నది.

27. గోధుమ గింజ ఒంటరిగా యున్నచో గోదుమ గింజగానే యుండును. కాని మేల్కొలుపు శక్తి దానిలోనికి వచ్చునపుడు అది జీవించును. ఒకపుడు మనము చనిపోయాము. దేవుని స్వరూపమందు చేయబడితిమి అయినా గాని అతి క్రమములు, పాపములో చనిపోయి యున్నాము. మీ మర్త్య శరీరములోనికి దేవుడు ఒక విధానములో ఈ మేల్కొలుపు శక్తిని ఇచ్చును.

ఇప్పుడు నేను మీ శరీరము గూర్చి మాట్లాడుచున్నాను. యేసు వాక్యమై యున్నాడు. మీరది నమ్ముదురు. కదా? యోహాను! "ఆది యందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను."

28. వాగ్దానము చేయబడిన మెస్సీయా తనను గూర్చి ప్రవచింపబడిన ప్రతి మాటను నెరవేర్చెను. ఆయన ఏమి చేయునని చెప్పబడెనో వాటన్నింటినీ చేసెను. రోగులను స్వస్థపరచెను. ఆయన కన్యకకు జన్మించెను. అది సత్యమని నిరూపించెను. ఆయనే ఈ భూమి మీద ప్రత్యక్షమయి వాక్యము. ఒక మానవునిగా ఆయన దీనిని చేయజాలడు. ఆయన ఈ వాగ్దానములన్నింటిని సజీవపరచుటకు
దేవుని ఆత్మ ఆయనలో నివసింపవలసి వచ్చెను.

ఇప్పుడు దీనిని మరింత విశదముగా మనము తెలిసికొనవలెనని ఆశించుచున్నాను. యేసు మానవునిగాను ఉండెను. కాని ఆయన శరీరమందు ఆత్మ యుండెను. "ఈ క్రియలు చేయునది నేను కాదు. నా తండ్రి నా యందు నివసించుచున్నాడు. ఆయనే ఈ కార్యములు చేయుచున్నాడు." యేసే వాక్యమై యున్నాడు. ఇది చెప్పుటకు బాగాలేదు. అదేమనగా ఆయన దేవుని ముందు జ్ఞానము ద్వారా ముందుగా నిర్ణయించబడెను. అది దేవుని పథకము. ఆయన ఒక విమోచకుని పంపెను. ఆ విమోచకుడు ఆయన స్వంత కుమారుడే.

యేసు ఇక్కడికి వచ్చునని ఏదెను తోటలోనే దేవుడు వాగ్దానము చేసేను.

ఆయన నరునిగా ఒక కన్యకకు జన్మించెను దేవుని ఆత్మ వలన ఆయనలోని మాట సజీవమాయెను. ఆ ఘడియకు చెందిన వాక్యము ఆయనలో జీవమును దాల్చెను.

ఒక విమోచకుని పొందవలసిన సమయము మీకు వచ్చి యున్నది. ధర్మశాస్త్రము విఫలమాయెను. మిగతావన్నియూ విఫలమాయెను. ఇప్పుడు ఒక విమోచకుడు అవసరమాయెను. ఆయన వాగ్దానము చేయబడిన విమోచకుడు ఆయన దేవుని వాక్యము ద్వారా సజీవుడాయెను. 29. ఆ కాలములో ఆత్మ ఆయన మీద ఉండి ఆయనను విమోచకునిగా చేసెను. ఆయనను మనము స్వీకరించాము. ఈ చివరి దినములలో వాగ్దానమును చూడండి. ఆ వాక్యములో మీరు పాలి భాగస్తులైనచో ఆయనతో పాటు మీరు విమోచించబడుదురు. ఎందుకనగా క్రీస్తులో నివసించుచున్న ఆత్మ మీలో నివసించుచున్నది. ఈ కాలములో మిమ్మును మేల్కొలుపు చున్నది. అంత్య కాలమందు మీ మార్త్య శరీరములను కూడా అది మేల్కొలుపును. వాటిని పునరుద్ధానము చెందించి మరల జీవింపజేయును. ఆ విధముగా మనము చూచునపుడు మనలోని చీకటి దూరమగును. అదియే సత్యము.

30. రోమా పత్రికలో పౌలు దానిని మనకు రుజువు చేసెను. "యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో జీవించుచున్న యెడల మీ మర్య శరీరములును అందువలన తిరిగి లేపబడును." ఆ ఆత్మ ఆయనను లేపెను. అదియే విశ్వాసికి నిత్యజీవమును అనుగ్రహించును. యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో జీవించుచున్నది. అందువలన మీరు నిత్యజీవము పొందిరి.

31. ఒకే ఒక జీవమున్నది. ఒకే నిత్య ఆత్మ యున్నది. ఒకే నిత్యజీవమున్నది. అది దేవుడే. దేవుడు మాత్రమే నిత్యుడు. ఆయన పిల్లలమగు మనము ఆయనలో భాగమై యున్నాము. ఆయన ఆలోచనలో భాగమై యున్నాము. ఆలోచన వ్యక్త పరచబడినది. అదియే వాక్కు నిత్యజీవము పొంది ఇక్కడున్న ప్రతి ఒక్కరు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఆలోచనలో ఉన్నారు.

ఆ విధముగా మాత్రమే అది జరుగగలదు. ఎందుకనగా నీవు ఆయన పోలికవై యున్నావు. వ్యక్తపరచబడిన ఆలోచనయే మాట అగును. ఆ మాట జీవమును పొందినది. అది నిత్యమైనది.
ఆ కారణము చేతనే మనము నిత్యజీవము పొందియున్నాము. ఆ సూత్రము ననుసరించియే విమోచకుడు వచ్చెను. ఆయన దేవుని యొక్క కుమారుడు. అదే ఆత్మ ద్వారాను అదే దేవుని యొక్క ముందు జ్ఞానము ద్వారాను మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలము అగుచున్నాము.

32. యేసు ఈ భూమి మీద ఉండినపుడు ఎన్నో మిలియనుల మంది ఆయనను చేర్చుకొనలేదు. కాని ఈరోజు ఎంతో కృతజ్ఞత మనము చెల్లించవలెను. ఈ ఉదయమున మనము ప్రత్యక్ష రుజువును చూచి యున్నాము. రానున్న ఈ గొప్ప పునరుత్థాన ఉదయమున మనమును పాలు పొందుదుమనుటకు బైబిలు రుజువు. అది గొప్ప ఈస్టరు. ఇపుడు మన మర్త్య శరీరములో దాని యొక్క సంచకరువు పొంది యున్నాము. ముందుగా నిర్ణయించబడిన వారు మొదట లేచెదరు. పరిశుద్దాత్మ తన స్వకీయులను చేర్చుకొనును.

ఒకగొప్ప మాట చెప్పవలెను. నా తోటి సహోదరులగు సేవకులు దీనిని అర్థం చేసికొనవలెను. ఆదియందు దేవుడు నిత్యుడు. "దేవుడు" అనగా ఆరాధనకు పాత్రుడు. ఆయనను ఆరాధించుటకు అపుడెవరూ లేరు. దేవదూతలు గాని, మరెవరూ గాని లేరు. దేవుడొక్కడే యుండెను. ఆయన మాత్రమే నిత్యుడు. ఆయన దేవుడుగా ఉండవలెనన్నచో ఆయనను ఆరాధించు వారుండ వలెను. కాబట్టి ఆయన దేవదూతలను, జీవులను, కెరూబులను తనను ఆరాధించుటకు సృజించెను. ఆయన గొప్ప సంకల్పము విడమరిచి చూపబడెను.

33. కాని గుర్తుచుకొనండి. ఆయన ఆలోచనలో మీరు లేని యెడల ఈ దినమున ఇచ్చట ఉ ండి యుండెడి వారు కారు. అందుకే ఈ ఉదయమున ఈ వ్యక్తిత్వములో యున్నారు. మీలో ఒక భాగము నిత్యమైనది. నిత్యమైనది మాత్రమే దేవునికి చెందును.

ఇపుడు మీరు కూర్చొని యుండుట అపుడే దేవుని ఆలోచనలో యుండెను. ఆయన ఆలోచనలో నేను ఈ ఉదయమున వేదిక యొద్ద నిలబడుటను చూచెను. ఎందుకనగా ఆయన అనంతుడు. అన్నియూ ఎరిగిన వాడు. ఆదిలోనే ఆయన అంతమును గూర్చి కూడా చెప్పగలడు. ఎందుకనగా ఆయన అనంతుడు. దేవుని కుమారుడవు లేదా కుమార్తెవై యున్న నీవు ఆదిలోనే ఆయన ఆలోచనలో ఉంటివి.

34. పరిశుద్దాత్మ వచ్చినపుడు నీవు భూమి మీద యుంటివి. ఈ కేంద్రములో సంచరించుచుంటివి. నీ జీవితములో ఏదో యున్నది. ఏమి జరుగుచున్నదో నీవు ఎరుగవు గాని ఆకలితో యున్నావు.

ప్రెస్పిటేరియను సోదరుడు, బాప్టిస్టు సోదరుడు మాట్లాడుట నేను విన్నాను. అతడు ఫ్రీవిల్ బాప్టిస్టు. అతడు బోధించుచున్నాడు. నీలో ఏదో యున్నది. దానిని నీవెన్నడూ యుంచలేదు. నీవు కోరినదే నీలో యున్నది. అది నీ స్వభావమునకు విరుద్దము. దేవుని యొక్క ముందు జ్ఞానము వలన ఇది జరుగుచున్నది.

35. దేవుని కుమారుడుగా యేసు ఇమ్మానుయేలుగా ఉండుటకు జన్మించెను. దేవుని యొక్క పూర్తి ప్రత్యక్షత మానవుని యందు వెల్లడాయెను. యోర్దాను నది యొద్ద ఆయన పరిపూర్ణ
విదేయత చూపించి ప్రవక్త ద్వారా బాప్తిస్మము పొందెను. ఆయన లోబడి, నీటిలో నుండి బయటకు వచ్చిన వెంటనే ఆకాశములు తెరువబడుటయు పరిశుద్దాత్మ ఆయన మీదకి దిగి వచ్చుటయు యోహాను చూచెను. "ఈయన నా ప్రియ కుమారుడు" అని పరలోకము నుండి ఒక స్వరము పలికెను. ఆయన పరిపూర్ణ విధేయత చూపెను. ఆత్మ ఆయన విదేయతను చూచెను.

ఓ! ఈ ఉదయమున దారి తప్పిన స్త్రీ, పురుషులు ఎవరైనా ఇచ్చట కూర్చొని యున్నచో ఏదో మీలో యుండి మాట్లాడుచున్నదని గ్రహించండి. పరిశుద్దాత్మ మిమ్మును వెదుకుచున్నది. మనము జీవించుచున్న ఈ ఘడియ యొక్క సత్యమును గూర్చిన జ్ఞానమును మీకు తెలియచేయుచున్నది. ఎపుడో గతించిపోయిన ఘడియ కాదు. ఇప్పటి ఈ ఘడియ

36. గతించిన ఘడియలో విశ్వసించిన వారు వేలాది మంది యుందురు. కాని ఈ వర్తమాన ఘడియ గూర్చి మాట్లాడుచున్నాము. ఆ ఘడియలోనే యేసు ప్రత్యక్షము కావలసియున్నాడు. అక్కడ వాక్యము నిలబడెను. ప్రజలు అచ్చట నిలబడి యుండిరి అది సత్యమని తెలియజేయుటకు దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ బయలుపడెను. నేడు పెంతెకోస్తు జనులతో ఇది చెప్పుచున్నాను. "మనము ఈ చివరి దినములలో నిలబడియున్నాము. దేవుడు సర్వ శరీరుల మీద తన ఆత్మను కుమ్మరించెదనని వాగ్దానము చేసియున్నాడు. మీ కుమారులు, కుమార్తెలు దర్శనములు చూతురు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును." ఆ ఘడియ ఇదే. అదే మీలో దీనిని సృష్టించి యున్నది.

37. కొద్ది కాలము క్రిందట నేను మాట్లాడాను. (అది కొద్దిగా విపరీతముగా వినబడవచ్చును గాని వింత కాదు) ఒక రైతు తన కోడి పెట్ట క్రింద పక్షిరాజు గ్రుడ్డును ఉంచెను. కోడి రెక్కల క్రింద పొదగబడి బయటకు వచ్చిన ఈ పక్షిరాజు పిల్ల కథను మీలో చాలా మంది ఎరుగుదురు. చూడండి. దానికి కావలసినది ఉష్ణోగ్రత. ప్రెస్పిటేరియను చర్చి, మెతడిస్టు చర్చి, బాప్టిస్టు చర్చి, మరి ఏ చర్చి (క్రిందనయినా గాని ఈ పక్షిరాజు పిల్లలు పోదగబడి పుట్టుట జరుగును. నిశ్చయంగా ! దానికి ఆ వాతావరణము కావలెను. ఒక కోడి గ్రుడ్డును కుక్క మెడ క్రింద ఉండునట్లు చేసిన యెడల ఆ కుక్క వేడి వలన కూడా కోడిపిల్ల పొదగబడి బయటకి వచ్చునని డాక్టర్ బోస్వర్త్ తరచుగా అనుచుండెడి వాడు. ఎందు వలన? వేడి చాలును, ఒక సంఘము లేదా ఒక గుంపు తన సిద్దాంతములను, ఆచారములను బయటకు త్రోసి దేవుని ముఖములోనికి సూటిగా చూచి ప్రార్ధించిన యెడల, ఇక్కడ నేను నిలబడి యున్నంత నిశ్చయముగా పక్షిరాజులు బయటకు వచ్చును.

38. ఈ పనివారల గుంపు అదే చేయుచున్నదని తలంచుచున్నాను. వాతావరణమును బ్రద్దలు చేయ ప్రయత్నించుచున్నది. మనము మరీ సంకుచిత బుద్దిగలవారమై యున్నాము. ఒక్కొక్కరము ఒక్కొక్క దానికి చెందియున్నామని చెప్పుకొనుచున్నాము. ఆ వాతావరణము మనము బ్రద్దలు చేసి పధలోక వాతావరణములో ఆరాధన చేయుదుము. సరయిన వాతావరణమును కలిగించ వలెను.
ఏ సంఘములో నుండి అయినా గాని, ఎక్కడ నుండి అయినా గాని పక్షిరాజులు జన్మించ వచ్చును. కాని పిల్లల స్వరములు దానికి వింతగా తోచెను. ఆవరణములోని గాదె వద్ద గింజలను త్రవ్వి పిల్లలను తినమని చెప్పుచున్న కోడి పెట్ట భాష దీనికి అర్థము కాలేదు. అది దాని ఆహారము కాదు. అవి పురుగులను తినుచుండెను. గాని పక్షిరాజు వాటిని తినలేకపోవుచుండెను. కాబట్టి అది దానికి వింతగా తోచెను. వాటితో కలువలేకపోయెను.

39. కాని ఒకనాడు ఆ పక్షిరాజు తల్లి తన గ్రుడ్డును గూర్చి ఆలోచించెను. ఎక్కడో ఆ గ్రుడ్డు ఉ oడి యుండునని తలంచెను. అది తన పెద్ద రెక్కలను గాలిలోనికి చాచి పైన ఎగురుచూ, కేకలు వేయుచూ, కేకవేయుచూ ఎంతో వెదుకు చుండెను. ఒకనాడు ఒక ధాన్యపు గాదె పై నుండి దాటి పోవుచుండగా ఈ చిన్న పక్షిరాజు పిల్ల ఆ స్వరము వినెను. అది దానికి పరిచితముగా తోచెను. అంతకు ముందెనడూ అట్టి స్వరమును అది వినలేదు. గాని ఆ స్వరము తనకు తగినట్లు యున్నదే అనుకొనెను. అది తన తల్లి స్వరమే అనుకొనెను. ఆ పై నుండి ఆ తల్లి కూడా దాని కొరకే వెదకు చుండెను.

ఆ విధముగా దేవుడు కూడా ప్రతి యుగములోను ఒక వర్తమానమిచ్చి ఒక సంఘమును అభిషేకించుచున్నాడు. వారికి ఏవేవో చట్టములు శాసనములు ఉండవచ్చును. కాని ఆ ఘడియ వచ్చినపుడు దేవుని యొక్క ఆత్మ ఆ కాలములో మాట్లాడును. పరిశుద్దాత్మ ఆ గ్రుడ్డు కొరకు వెదకెను. ఆ వర్తమానము వినబడినపుడు దానిని ఏ శాఖ, ఏ సంస్థ ఆపజాలదు. అది ఉవ్వెత్తుకు ఎగురును. అది ఆలాగు ప్రతిస్పందించును.

అది వేరగు పక్షి. అది వేరే జీవి. అది పక్షిరాజు. స్వరమును పసిగట్టును. "నాగొర్రెలు నా స్వరము వినును." ఎవరో చెప్పిరి.( సహో. విలియమ్స్) "గొర్రెల ఆహారము" "నా గొర్రెలు నా స్వరము వినును. ఒక క్రొత్త వానిని అవి వెంబడించవు.”

ఒక సంఘము ఎంత విధేయతగా యున్నా గాని, ఎంత పెద్ద పేరు సంపాదించినా గాని, వాక్యము అను ఆ "గొర్రెల కాపరి స్వరము" వినగానే ఆయనను వెంబడించును. క్రొత్త వానిని అవి వెంబడించవు. తిన్నగా ఆ వాక్యము నొద్దకు అవి నడిచి వెళ్ళును. ఆయస్కాంతము వలె అది పని చేయును.

40. ఒక రోజున ఇండియానాలో నేను ఒక స్టీలు మిల్లును దర్శించుచుంటిని. సైనపు మ్రోగెను. అందరూ తమ తమ దుస్తులు ధరించి తమ లేతు యంత్రముల యొద్దకు, మధ్యలో నున్న యంత్రముల యొద్దకు వెళ్ళి ఆ దిన కార్యక్రమమును నిర్వహించుచుండిరి. నన్ను ఒకాయన తీసికొని వెళ్ళి వాటిని చూపించుచుండెను. అతడు నాతో "దీనిని గమనించు" అనెను అందరూ తమ పని బట్టలను బల్లల మీద విడిచి వెళ్ళిపోయిరి. మేము ఆ వెనుకకు వెళ్ళి ఒక బటన్ నొక్కగానే పెద్ద ఆయస్కాంతము వచ్చినది. చెక్కబడి ఆ ఇనుప ముక్కలన్నింటిని అది ఆకర్షించుచుకొన్నది. వాటన్నిటిని కరిగించి మరల ఇనుముగా చేసి ఆ పరికరములను పోత పోయుటకు వాడిరి. నేను
తన్మయుడనై దానంతటినీ చూచుచుంటిని.

"ఒక దాని గూర్చి నేను ఆశ్చర్యపడుచున్నాను." అని చెప్పాను.

"ఏమిటండీ అది?" అనడిగాడు.

కొన్ని ముక్కలు ఆ అయస్కాంతముతో వెళ్ళలేదు గదా?"అనడిగాను.

"అవి అల్యూమినియం ముక్కలు. అయస్కాంతము వాటిని పట్టుకొనదు" అని చెప్పెను.

"అలాగా? కాని అక్కడ ఒక ఇనుప ముక్క కూడా ఉన్నదే? అన్నాను.

"కాని అది మరొక దానితో కలిసి తల క్రిందులుగా యున్నది" అన్నాడు.

" అయితే వెళ్ళిపోయినవన్నీ ఏమగును?" అనడిగాను.

"అవన్నీ మరల మిల్లు లోనికి వెళ్ళి పోత పోయబడి ఇంకొక చక్రము తయారగును" అని

చెప్పెను.

"ప్రభువుకు స్తోత్రము" అన్నాను.

41. చూడండి. ఆకాశమందు ఒక గొప్పా ఆయస్కాంతము కూర్చొనియున్నది. దేవుడు తన వ్రేళ్ళతో ఒక రోజున అంటుకొనును. ఆయన వచ్చు సమయమును ఏ మానవుడు ఎరుగడు. పరలోకమందలి దూతలు కూడా ఎరుగవు. దేవునికి మాత్రమే తెలియును. కాని బైబిలు నుండి కొన్ని ముక్కలు క్రిందకి పడియున్నవి. బైబిలు క్రైస్తవులు, ఈ ఘడియలోని విశ్వాసులు దానిని నమ్ముదురు. అందులో ఒకటి గతించిన దినములలో ఇరుసువా ఉండి యుండును. ఇది మరో పని ముట్టు అయి యుండును. అవన్నియూ కలిసి దేవుని యొక్క పెద్ద రాజ్యమును తయారు చేయుచున్నవి. దేవుని యొక్క గొప్ప కొలిమిలో అవన్నియూ మలచబడును. మరల దేవుని స్వరూపము లోనికి వచ్చును. ఆకర్షించబడిన వారే పైకి లేపబడెదరు. ఓ! మనకు ఒక పునరుద్దానమున్నదని ఎరుగుట ఎంత గొప్ప భాగ్యము!

42. ఇప్పుడు చూడండి. దేవుని వాక్య పిలుపును గుర్తించండి పక్షిరాజుకు అది పక్షిరాజుగా యున్నది. ఆ తల్లి కాకి వలె కావు కావు మన్నచో ఎన్నడూ ఆ పిల్ల దానిని గుర్తించి యుండెడిది. కాదు. అది ఆ ధాన్యపు గాదె యొద్దనే మిగిలి యుండెడిది. కాని అది ఒక పక్షిరాజు స్వరము. తాను పక్షిరాజునని ఆ చిన్న దానికి లోపల ఏదో తెలియ చెప్పినది. ప్రతి నిజ విశ్వాసియూ ఆ విధంగానే యున్నాడు.

దేవుని వాక్యము బోధించబడుచుండగా, బయలుపరచబడుచుండగా, అది ఈ ఘడియకు చెందిన దేవుని వాక్యమని రుజువు కాబడుచుండగా విశ్వాసిలో ఒక క్రియ జరుగుచున్నది. అతని తండ్రి ఒక సంఘమునకు ఎంత విదేయుడైనా గాని, అతని తల్లి, తాతలు దానికి ఎంత లోబడినా గాని, ఆ సంఘము ఈ ఘడియ యొక్క పరిశుద్దాత్మ బాప్తిస్మపు వర్తమానమునకు విరోధముగా భోధించుచున్నది గనుక అతడు ఆ ధాన్యపు గాదెను విడిచి పెట్టును. అతని లోపల ఒక కేక వినబడుచున్నది. కాబట్టి విడువకుండా యుండలేడు. ఆ కోడిపిల్లలతో ఒక రోజు బాగానే కలిసియున్నది. కాని ఇది పక్షిరాజు ఘడియ! ఇది వేరుగా ఉన్నది. దానిని తప్పక వదిలిపెట్టవలసినదే.
నీలాకాశములోనికి ఎగిరిపోవును, ఈ భూసంబంధమగు శరీరము మేల్కోలపబడును. జీవమిచ్చు ఆత్మ ద్వారా దేవుని వాక్య విధేయత యొద్దకు నడిపించబడును. Amen

43. ఈ పరిశుద్దాత్మ ఆ ఎగురుచున్న పక్షిరాజుకు సాదృశ్యముగా ఉన్నది. అది పైన ఎగిరి విశ్వాసిని కనుగొనుచున్నది. "ఎవడును నాయొద్దకు రాడు రావాలనుకొన్నగాని రాలేడు. తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు. ఎవడును తనంతట తానుగా రాలేడు." నీ స్వంత ఆలోచన కాదు. నీవు స్వంతగా వచ్చుట కాదు. దేవుడు లాక్కు రావలెను. "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు.‘

44. ఇప్పుడు పరిశుద్దాత్మ భూమి మీద ఉండి ఈ కాలములో ఎవరిని దేవుడు జీవమునకు నిర్ణయించెనో ఆ వ్యక్తులను వెదకుచున్నది. వారిని కనుగొనిన వెంటనే తన నివాస స్థలమునకు వారిని తీసికొనిపోవును. మనలనందరినీ విమోచించిన ఆ గొప్ప దైవ కుమారుడగు యేసు క్రీస్తుకు కూడా అలాగే జరిగెను.

చూడండి. ఇపుడు పైకి లేపు శక్తి వచ్చి యున్నది. ఆ మేల్కొలుపు శక్తి యేసు మీదికి వచ్చి ఆయనను జీవింప జేసెను. ఆ దినమునకు వాగ్దానము చేయబడిన ప్రతి వాగ్దానమును బయలుపరచెను. ఈ దినమున మన మీదకిని పరిశుద్దాత్మ వచ్చి ఆ ప్రకారమే చేయును. పరిశు ద్దాత్మను వెక్కిరించు దయ్యములు కొన్ని ఉన్నవి. కాని నిజమగు పరిశుద్దాత్మను గూర్చి నేను మాట్లాడు చున్నాను. ఈ ఘడియ యొక్క వాగ్దానమును అది బయలుపరచును.

అది లూధరు మీద పడినపుడు ఈ ఘడియ యొక్క వాగ్దానమును అది వెల్లడి చేసెను. అది వెస్లీ మీద పడినపుడు ఆ ఘడియ యొక్క వాగ్దానమును వెల్లడి చేసెను. ఈ దినమున అది పడినపుడు ఈ ఘడియ యొక్క వాగ్దానమును అది వెల్లడి చేయును. అది మోషే మీద పడినపుడు ఆ ఘడియ యొక్క వాగ్దానమును బయలుపరచెను. నోవాహు మీద అది పడినపు ఆ ఘడియ యొక్క వాగ్దానమును అది బయలుపరచెను. యేసు మీద అది పడినపుడు ఆ ఘడియ యొక్క వాగ్దానమును అది బయలుపరచెను.

45. (చూశారా? రాకడలో ఎత్తబడునట్లు దేవుని ద్వారా ముందుగా అభిషేకించబడిన జనులను పరిశుద్దాత్మ జీవింపజేయుచున్నది. అది నిజమగు పక్షిరాజు అయినచో ఈ ఘడియ యొక్క వర్తమానమును అర్ధము చేసికొనును, అది నిజమగు పక్షిరాజు అయి యుండవలెను. ఆ చిన్న పక్షిరాజు గాదె యొద్ద ఏవో గింజలు తినుచుండెను. కాని అది దాని ఆహారము కాదని ఎరిగి యుండెను. కానీ అది సత్యమును విని దానిని చేర్చుచున్నది. )

యోహాను 5:24 లో యేసు ఇట్ల చెప్పెను: "నామాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. అట్టి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడు."అదెంత తేలికగ యున్నదో ఆలోచించండి. "విశ్వాసముంచు వాడు." దీనిని సరిగా చెప్పవలెనన్నచో "అర్థము చేసికొనినవావడు" అనవలెను.

46. ఇక్కడ నుండి మీరు ఆ వీధిలో నున్న వేశ్యతో "నమ్ముచున్నావా?" అని అడిగినచో ఆమె
ఏమనును?

"నిశ్చయం"గా నమ్ముదుననును.

"ఆయన దేవుని కుమారుడని నమ్ముచున్నావా?"

"నిశ్చయంగా!"

"బాప్తిస్మము పొందెదవా?"

"తప్పకుండా."

ఒక త్రాగుబోతు యొద్దకు వెళ్ళి ఆ బోధకుడు చెప్పినది విన్నావా? అని

అడిగినచో ఏమనును?

"విన్నాను."

"అది నమ్ముదువా?"

"తప్పకుండా."

47. చూడండి. దానిని అర్థము చేసికొనవలెను. ఈ ఘడియలో తన స్థానమును అతడు గుర్తించవలెను. నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచు వాడే నిత్యజీవము గలవాడు. (వర్తమాన కాలము) వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.

ఈ క్రొత్త నిత్య జీవమును నీ లోనికి వచ్చి నివాసము చేసినపుడు నీ మర్త్య శరీరము అమర్త్యతగా మార్చు ఆ జీవపు శక్తి యొక్క సంచకరువు పొంది యుందువు. దీనిని మరల చెప్పెదను. ఆత్మ నిన్ను వెదకి కనుగొని, వ్యక్తి గతముగా నీ మీదకి వచ్చును. అది నీ నిత్య స్వాస్థ్యమునకు హామీని ఇచ్చును. దీనిని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నీ గూర్చి ఆలోచించి నీ కొరకు ఇవి తయారుచేసి యుంచెను. అదే నీ యొక్క శక్తి. మీరు నన్ను ఓక్ చెట్టు అడిగితే నేను ఆకార్న్ చెట్టు ఇయ్యారాదు ఓక్ చెట్టు యొక్క జీవము ఆకార్న్ యున్నది. కాని నీవది ఎదుగు వరకు కనిపెట్టి చూడవలెను.

48. మనమును అలాగే యున్నాము. దేవుని యొక్క పరిశుద్దాత్మ శక్తిని మీరు పొందినపుడు దేవుని చేత మీరు ముద్రించబడియున్నారు. క్రీస్తు శరీరములోనికి వచ్చుదురని దేవుని వాగ్దానము చేయుచున్నాడు. దేవుని యొక్క శక్తి నీ మీద యున్నదని నీవు గుర్తించవలెను. దేవుడు కల్వరి యొద్ద యేసు చనిపోవుటను చూచెను. ఆయన తన పెండ్లి కుమార్తె కొరకు చనిపోయెను. ఆయన శరీరమైయున్న ఆ సంఘ కాలమునకు చెందిన దేవుని వాక్యమును నమ్మును. అది పాదము శిరస్సు. శరీరము లేదా మరేదయినా కావచ్చును.

క్రీస్తు రక్తము కార్చి చనిపోయెను. ఆయనను దేవుడు చూచెను. ఆయన పునరుద్ధానమును చూచెను. ఈస్టరు నాడు ఆయనతో కూడా సంఘము కూడా లేచెను.

మీరందరూ దీనిని గుర్తించవలెనని కోరుచున్నాను. ప్రభుని చిత్తమయితే నేను చెప్పవలసినది ఇక్కడ కొంత యున్నది
49. గమనించండి. మీ పునరుద్దాన శక్తి ఇది సంచకరువుగా యున్నది. పరిశుద్దాత్మను మీరు పొందునపుడు ఆ మేల్కొను శక్తి పొందెదరు. దాని యొక్క శక్తి మీలో నివాసము చేయును. ఇప్పుడు మీరు పూర్తి పునరుద్ధానమునకు వెళ్ళు మార్గములో వున్నారు.

ఏ చెట్టు ఒక్క రాత్రిలో పుట్టదు. అది ఎదుగ వలయును. మనము దేవుని యొక్క కృప మరియు జ్ఞానములో ఎదుగవలెను మీరు పరిశుద్దాత్మలోనికి బాప్తిస్మము పొంది యున్నారు. పెంతెకోస్తు సంఘము ఎదుగ నారంభించినది, కొమ్మలు ఎండిపోయినవి. కొన్ని కొమ్మలను కత్తెరించిరి. కాని ఇంకా ఆ చెట్టు ఎదుగుచున్నది. అది ఇంకా ఎదుగుచున్ననది. ఎందుకనగా అది ఒక పునరుద్ధానము యొద్దకు రావలసి యున్నది.

ఆత్మ మిమ్మును నడిపించుట వలన వాక్యమును నమ్ము విశ్వాసులుగా మేల్కొలుపబడి యున్నారు. మొదటి కొమ్మ తొడిగిన రీతిగానే వాక్యము మీలో జీవించినందున ఎదుగనారంభించిరి. ఆ విధంగా రెండవ కొమ్మ, మూడవ కొమ్మ వచ్చినవి అది ఇంకా మేల్కొలుపుచునే యున్నది.

దేవుని ఆత్మ ఇంకా మిమ్మును జీవింప చేయుచునే యున్నది. Amen

50. పెంతెకోస్తును గమనించండి. వారి శరీరములు వారు పొందిన నూతన జీవము వలన మేల్కొలుపబడును. అది నన్నెంతో ప్రోత్సాహాపరచుచున్నది. ఆలోచించండి!

ఒక జాలరీ యున్నాడు. ఒక సుంకపు గుత్తాదారుడున్నాడు. ఒక దీన స్త్రీ యున్నది. వీరందరూ సామాన్యులే వారు గృహిణులు. చిన్న కన్యలు. వారు విశ్వాసులు. ఇది సత్యమని వారు నమ్ముచుండిరి. యేసు మరణించినగాని నారాయన యందు విశ్వాసముంచిరి ఆయన మృతులలో నుండి తిరిగి లేచెను. అది నిశ్చయముగా దేవుని యొక్క సాక్ష్యమని వారు నమ్మిరి. ఆయనను జీవమిచ్చు శక్తి మేల్కొలిపినది.

వారు పెంతెకోస్తు నాడు శక్తి పొందుటకు పైన కూడి యుండిరి. అదేమిలో మీకు తెలియునా? దేవుడు ఒక దీవెన ఇయ్యబోవు చుండెను. వారు దానిని పొందుటకు పైన కూడి యుండిరి. వారు జీవింపచేయబడిరి. ఎంత గొప్ప ఆశ్చర్యము వారు భూమిని కొనిరి. అది వారి కొరకే కొనబడినది. దానిని వారు పొందిరి.

ఇది నిజమా కాదా? ఆయన తిరిగి లేచుట మేము చూచాము. కాని ఇపుడు మన మాట ఏమిటి? మనము అందుకు సాక్షులము. ఆయన సిలువ వేయబడుట మేము నిలబడి చూచాము. భూమిని చీకటి మేఘాలు కమ్ముట చూచాము. భూకంపము వలన భూమి దద్దరిల్లెను. అది ఉ ద్రిక్తత సమయము. వారాయనను ఈటెతో పొడిచిరి. వారాయన శరీరమును క్రిందికి దించి అరిమత్తయి యోసేపు యొక్క సమాధిలో యుంచిరి. మూడవ దినమున ఆయన తిరిగిలేచెను. "దీనికి మేము సాక్షులము" అని శిష్యులు చెప్పిరి. ఆయన తిరిగి లేచుట మేము చూచాము. ఆయన సజీవుడని మేమెరుగుదుము.

51. అందువలన మానకేమి లాభము? భయమునంతటిని తొలగించినది. "భయపడకుడి. ఇదిగో మృతుడనయితిని గాని సదా జీవించుచున్నాను."అని యేసు చెప్పుటలో ఆశ్చర్యము లేదు.
అందువలన వారిలోని భయమంతయు తొలగిపోయెను. వారు పెంతెకోస్తునాడు పైన కూడి యుండగా ఆ పైకి లేపు శక్తిని పొందిరి. అది వారిని సజీవులనుగా చేసెను.

(ప్రెస్పిటేరియనులు, మెతడిస్టులు, సహోదర సంఘము వారు ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి యున్నారు. కాని ఇంకా సంచకరువును పొందలేదని నేను తలంచుచున్నాను. ఇంకా అది వారి మీదకి దిగి రాలేదు. అది వచ్చి ప్రకటన చేయును.

52. దేవుడు అబ్రహామునకు ఒక వాగ్దానము చేసెను. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. కాని ఆయన నిబంధనను సున్నతి ద్వారా ముద్రించెను. దానిని నీవు పొందుదువను వాగ్దానమును ముందే దేవుడు అనుగ్రహించెను. నీవు పైకి లేపబడెదవు. అంత్య కాలములో ఈ శరీరము ఆయనతో కూడా మహిమపరచబడును. కాని చూడండి మీరు ముందు ఆ విషయములో సందేహమును వీడవలెను. నీకు విరోధముగా ఉన్నదంతయూ కొట్టివేయబడెను. దానికి నీవు సంచకరువు పొందియున్నావు. నీవు ముద్రను పొందియున్నావు. అది నీది. ప్రతిదీ నీకె చెందును. ఆమెన్!

మన రక్షకునిగా యేసు క్రీస్తును మనము నమ్మి మారుమనస్సు పొంది బాప్తిస్మము పొందియున్నాము. ఆయనను నమ్ముటకు వచ్చియున్నాము. దేవుని పట్ల మనకు గల విశ్వాసమును, మారు మనస్సు ఆయన గుర్తించును అందుకు సంచరకువును ఆయన పంపును. నిశ్చయతే ఆ సంచకరువు. నీకు విరోధముగా ఉన్న ప్రతిదియు కొట్టి వేయబడినదనుటకు హామీని అది ఇచ్చుచున్నది. హల్లెలూయా! సొత్తును కొనెను. ఆ నిశ్చయతకు సంచకరువును పొందియున్నావు. 53. ఒక భూమి నీకు చెందలేదని చెప్పి నిన్ను అక్కడి నుండి వెళ్ళగొట్టుటకు ఎవరైనా ప్రయత్నించినచో నీవు వెంటనే నీ చేతిలో యున్న పత్రమును చూపించెదవు. ఆవతలి వ్యక్తి ఎన్ని ప్రయత్నములు చేసినాగాని దేశములోని చట్టము అందుకు అంగీకరించదు. ఎందుకనగా నీ చేతిలో ఆ హక్కు పత్రమున్నది. దేవుని యొక్క రుజువును. యేసు క్రీస్తు నందు నీవున్నట్లుగా గుర్తించిన పరిశుద్దాత్మ బాప్తిస్మమును ఏ దయ్యము, ఏ సంఘము, ఏ వేదంతము కొట్టి వేయజాలదు. దేవుని హద్దులేవరను దాటలేరు.

తిరిగి లేచుదుమను నిశ్చయత మనకున్నది. ఎందుకనగా ఆయన తిరిగి లేచెను. ఆయన యందు మనమును వేచి యున్నాము. ఆమేన్.

మన మర్త్య శరీరములకు ఇదేమి చేయును? అది మన అభిప్రాయములను, మన ఉ ద్దేశ్యములను మార్చును. అది పైనున్న వాటి మీద మన ఆశలను నిలుపుచున్నది. ఇంతక ముందు మీరు పోగ త్రాగుడుకు, త్రాగుటకు, జూదమునకు అలవాటు పడిరి. కాని ఇప్పుడవి చచ్చిపోయినవి. అది మీ క్రింద యున్నది.

54. మీరిపుడు పైకి లేపబడియున్నారు. ఆ శక్తి మీలోనికి వచ్చినది. ఇప్పటికే అది మీ శరీరములను ఎత్తబడు స్థితిలోనికి తీసికొని వచ్చినది.

మనించండి. పెంతెకోస్తు వారు అక్కడ పరిశుద్దాత్మ వలన తిరిగి లేపబడిరి. నా మాట
వినండి. ఆ పెంతెకోస్తు దినమున ఆ గుంపు దేవుని సంచకరువును పొందిరి నిశ్చయముగా అది వారి ఆత్మలను మహిమపరిచినది. వారు అరచిరి. ప్రతి ఒక్కరి మీద అగ్ని వంటి నాలుకలు వ్రాలుట వారు చూచిరి. వారు ప్రత్యేకించబడిరి. వారి శరీరములు సజీవ శక్తితో లేపబడినందున వారు భూలోక భాషను కూడా మాట్లాడ లేక పోయిరి. వారి శరీరములు పరలోక భాషను మాట్లాడునట్లుగా తిరిగి లేపబడినవి. వారక్కడకు వెళ్ళనై యున్నారు.

దేవుని యొక్క మేల్కొలుపు శక్తి వారి మర్త్య శరీరములను కదిలించినందున వారి మొత్తం మర్త్య భాష రూపాంతరము చెందినది. ఒక అమర్త్య భాష వచ్చినది. ఎట్టి జీవపు శక్తి! యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీ మార్య శరీరములో నివసించిన యెడల మీ మార్త్య శరీరములు కూడా తిరిగి లేపబడును.

సజీవుడగు దేవుని శక్తి ద్వారా మనము తిరిగి లేపబడి యున్నాము. ఒక క్రొత్త పరలోకపు భాష మాట్లాడుటకు మనము మేల్కొలుపబడి యున్నాము. పైకి లేపు ఆనందమది. వారు జీవించి న వాతావరణము కంటె వేరయిన స్థితిలోనికి వారు లేపబడి యున్నారు. వారిలోనికి ఒక నూతన మేల్కొలుపు శక్తి వచ్చి యున్నది. అది వారి భాషను మేల్కొలిపి యున్నది. వారు క్రొత్త భాషలో మాట్లాడిరి. అవును.

55. ఇప్పుడు దానిని గమనించండి దేవుని వాక్యమగు బైబిలులో ఇవ్వబడిన ప్రతి వాగ్దానమును ఆయన వారి ఇచ్చెదననియు చెప్పెను. వారికి ఆ వాగ్దానమును సజీవము చేయునట్లు పైకి లేపు శక్తి ఇవ్వబడినది. కాబట్టి వారు రోగుల మీద చేతులుంచగా స్వస్థత పొందిరి. వారు క్రొత్త భాషలు మాట్లాడిరి. వారు గొప్ప సూచక క్రియలు, అద్భుతములు జరిగించిరి, ఎందుకనగా అది దేవుని యొక్క వాగ్దానములో యున్నది. యేసు వారిని విమోచించుటకు చనిపోయెను. అది ఆయన కుమారులకు ఇపుడు చెందినది. దేవుడేమై యున్నాడో ఆయన విశదపరచెను. దానిని వారు ఎంత ధైర్యముగా సాంఘీక విషయంగా తయారుచేసి ఒక సంస్థలో ఉంచిరో చూడండి! అది చేయు హక్కు మనకు లేదు.

56. ఆ వర్తమానమును నమ్ము నిజమగు హృదయముల కొరకు పరిశుద్దాత్మ నేడు వెదుకుచున్నది. బైబిలులో వాగ్దానము చేయబడినవన్నియూ విశ్వాసికి చెందును. దానిని సంపూర్ణముగా నీవు స్వీకరించవలెను. అది నీవు చేయుదువో లేదో దేవునికి తెలియును. దానిని బట్టి ఆయన నీకు సంచకరువును దయచేయును. చేయబడిని ప్రతి వాగ్దానము నీ స్వాస్థ్యముగా అగును. దానిని పరిశుద్దాత్మ నీకు అనుగ్రహించును. ఓ! మనము ఎటువంటి జనులము? దేవుని యొక్క గొప్ప పరిశుద్దాత్మ ఎంత అద్భుతమగు శక్తిని కలిగి యున్నదో చూడండి. దానిని గురించి ఆలోచించండి

ఈ ఘడియ గూర్చి సాక్ష్యమిచ్చుటకు పరిశుద్దాత్మయే ఇక్కడికి వచ్చియున్నది. యేసు అలాగు చెప్పెను. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాడు. దానిని చెరిపివేయగల ధైర్యము ఎవరి కున్నది?

57. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు." (యోహాను 14:12) "నమ్ము వారి వలన
ఈ సూచక క్రియలుకనబడును" అదియే నిశ్చయత.

ఒక గుంపు జనులు కూర్చొని యుండుట మనము చూచుచున్నాము. ఆ సూచనలు ప్రత్యక్షమగుచున్నవి. ఆ నిశ్చయత ఒక సంచకరువుగా ఇయ్యబడినది. దేవుని సొత్తును అది వెల్లడి చేయుచున్నది. ఆమేన్!

ఈస్టరు వలన మనము ఆ ప్రకారముగానే మారితిమి. ఆమేన్. ఇపుడు మనము మన ఈస్టరులో యున్నాము. ఇంతకు ముందే మనము లేపబడి యున్నాము. హల్లెలూయా! లోక సంగతుల నుండి వేరై దేవుని యొక్క వాగ్దాన విషయముల వైపుకు తిరిగి యున్నాము. ఇక ముందుకు ఆగుదుము అని కాదు గాని అయియున్నాము. అదిమే సంచకరువుగా పొందాము. 58. అది దేవుని యొక్క వాగ్దానము. ఆయన చివరి దినములలో తన ఆత్మను కుమ్మరించును. అందుకే వారాలాగు యున్నారు.

గమనించండి. వారు రోగుల పై చేతులుంచిరి. దేవుని యొక్క ప్రతి వాగ్దానమును వారు నమ్మరు. "అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ వృద్ధులు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూచెదరు.." ఈ వాగ్దానములన్నియూ ఆయన చేసెను. అన్నియూ దేవుని యొక్క వాగ్దానములోనే యున్నవి.

యేసు దానిని మనకు విమోచించి యుంచెను. ఆ స్థానములో మనము నిలబడుటకు నిర్ణయించబడితిమి. (పక్షిరాజు పిల్ల కోడి పిల్ల గూడులో యున్నట్లే యున్నది.) నీవు ఆ స్థానములో యుండుటకు నిర్ణయించబడిన యెడల, పరిశుద్దాత్మ నిన్నువెదకి కనుగొనును. ఆయన నిన్ను కనుగొనినపుడు నీవాయన పిలుపును గుర్తించెదవు. నీవు ఏ ఘడియలో జీవించుచున్నావో ఎరుగుదువు. ఇవన్నియూ నీవు కలిగి యుండవలసి యున్నావని తెలిసికొనుము. వెంటనే నీవు రాకడలో ఎత్తబడెదవు. ఇపుడు నీవు యేసు క్రీస్తులో యుండి పరలోక స్థలము లందు కూర్చొని యున్నావు. ఓ! ఎట్టి వాగ్దానము! ఇవన్నియూ అనుగ్రహించు ఎంత గొప్ప పరలోక తండ్రి మనకున్నాడు!

59. దేవునితో సహవాసము కలిగి యుండునట్లు ఆత్మ నిన్ను జీవింపజేయును ఆనాడు వారు మృతులను బ్రతికించిరి. వారు చనిపోయిన వారిని తాకగా తిరిగి బ్రతికిరి.

జాగ్రత్తగా వినండి. యేసు చేసిన క్రియలనే వారును చేసిరి ఎందుకనగా ఆయన మీద నున్న ఆత్మయే వారి మీద ఉండెను. ఒక వ్యక్తి ఆ విధముగా పని చేయునట్లుగా చేసిన ఆత్మ మరొక వ్యక్తిని కూడా అలాంటి క్రియ చేయునట్లు ప్రేరేపించును.

నీవు దేవుని ఆత్మను కలిగి యున్నావని చెప్పుకొనుచూ దేవుని క్రియలను ఎట్లు తిరస్కరించ గలవు? అది సాధ్యము కాదు.

60. గమనించండి. దేవుని జీవమును గ్రీకులో జో అందురు. ఆ జీవము వారిలో ప్రవేశించి వారు దేవుని వాక్యమును నమ్మునట్లు శక్తిని ఇచ్చినది. దీనిని నేను బహు నెమ్మదిగా చెప్పెదను. జనుల మధ్య సంచారము చేసిన దేవుని ఆత్మ, వారి మనస్సులను మేల్కొలిపి దేవుని వాగ్దానమును
వారు నమ్మునట్లు చేసినది.

చూడండి నేనుమీకు దానిని చూపించ ప్రయత్నించుచున్నాను. నేను సంఘము గూర్చి మాట్లాడుచున్నానని మీరు గ్రహించండి ఆయన యందు జీవమునకు మిమ్మును లేపును. వారు ఆది యందు ఆయన స్వరూపులుగా ఉండిరి. దేవుడు ఈనాడు ఇట్లు చెప్పితే ఎట్లుండును? (ఆదిలోనే అది యున్నది) "జాన్ డో నాకు దాసుడగును." ఆ మాట చాలా సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పెను. ఇప్పుడు జాన్లో పాపములో పుట్టి, అతి క్రమములో పెరిగెను. అబద్దములాడుచూ లోకములోనికి వచ్చెను. ఎందుకనగా అతడు మర్యుడు. అతనికి కొద్దిగా భక్తి యుండ వచ్చును. అతడు ఒక సంఘములో చేరును. బహుశ అతడు పెంతెకోస్తు సంఘములోనే చేరును. నాకు తెలియదు. అతడు ఎందులోనయిన చేరవచ్చును. కాని అతడు ఒక్కసారి దేవుని యొక్క వాతావరణము లోనికి వచ్చినచో చాలును. జాన్లో తన తండ్రిని గుర్తించును. ఆ పక్షిరాజు పిల్ల తన తల్లిని గుర్తించినట్లే యుండును.

దానిని గ్రహించవలసి యున్నాము. ఆ జాన్ డో మాత్రమే దేవుని యొక్క స్వరూపముగా ఉ న్నాడు. అతడు పలుకబడిన దేవుని వాక్యముగా మారును. అప్పుడు పరిశుద్దాత్మ ఆ మాటను బయటకు పలుకును. అది ఇచ్చటున్నది. ఆయన అతనిని పిలచి నిత్య జీవమును ఇచ్చును. దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని వాక్యములోనికి అతనిని తీసికొని వచ్చును.

61. చూడండి. దేవుడు అతనిని చూచును. ఆయన యేసును అలాగే చూచెను. అది ఒక ముగించబడిన కార్యము. యేసుతో దేవుడీ పనిని నేరవేర్చెను. "సమాప్త మైనది" అని ఆయన చెప్పెను. పధకమంతయూ సమాప్తమైనది. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినపుడు మీరు నిజంగా దేవుని పోలికలోనికి వచ్చుదురు. లేని యెడల మీరు ఇక్కడికి అక్కడికి పరుగెత్తెదరు. ఎన్నడూ సత్యమును గూర్చిన జ్ఞానములోనికి రాలేరు.

వారిలో ఒకనిగా నీవుండ వలెను. వెంటనే ఆ పాత సంఘతులు గతించును. నీవు క్రొత్తవాని వగుదువు. రక్షణ పధకము సమాప్తమాయెను. నీ గూర్చి దేవుడు పలికిన ప్రతి మాటకు నీవు లోబడుటకు సిద్ధపడెదవు. ఎందుకనగా నీవాయన వాక్యమునకు విధేయుడవగుదువు.

ఆ ఒప్పందమునకు బయాన ఇవ్వబడినది. ఆ వస్తువు నీవే చెందును. అప్పులన్నియూ చెల్లించబడినవి. అంతా కొట్టివేయబడినవి. పెంతెకోస్తు దినమున అదే జరిగెను.

62. ఇప్పుడు ఇతర జనుల మీద ఉండిన ఈ మేల్కొలుపు శక్తిని గమనించుదుము. ఎక్కువ సేపు నేను మాట్లాడలేను. 20 నిమిషములు మాట్లాడెదను. ఒక గంటసేపని ముందు అనుకొన్నాను.

63. ఈ మేల్కొలుపు శక్తి వచ్చినపుడు చాలా హేళన జరుగును. కాని చాలా మంది జనులు దానిని పొందకుండానే పొందామని తలంచుచున్నారు. చాలామంది ఆ అభిప్రాయములో యున్నారు. ఇతర క్రైస్తవులు చేయు దానిని చూచి వీరు తప్పు అభిప్రాయములో యున్నారు.

సాతాను దేనినయినా అనుకరించగలదు. అది మనమెరుగుదుము. మిషనెరీలయిన మీకు అది తెలియును. కేకలు, నాట్యము, భాషలు మొదలగునవన్నియూ వారు అనుకరించుట చూచాను.
ఎక్కడయినా మీరు ఈ అనుకరణను చూడగలరు. యేసు క్రీస్తు దేవుని కుమారుడు కాడని పలుకు అన్యుల మధ్య కూడా ఈ అనుకరణను మీరు చూడగలరు.

వారు అవన్నీ వారికి వారే చేయుచున్నారు. కాని నిజమగు మేల్కొలుపు శక్తి విశ్వాసి యొద్దకు వచ్చి దేవుని వాక్యమును అతని పట్ల జీవింపజేయును. అది పక్షిరాజు ఆహారము. దాని వలన అతడు జీవించును. "మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును."

64. ఈ జీవింపజేయు శక్తిని గూర్చి ఇపుడు మనము గమనించుదుము. పెంతెకోస్తు దినమున వచ్చినట్లే అది ఇతరుల మీదకిని దిగి వచ్చి యున్నది. పెంతెకోస్తును ఇపుడు మనము గమనించుదుము. వారెట్లు ప్రవర్తించిరో, ఎట్లు ఈ మేల్కొలుపు శక్తి ద్వారా జీవింప చేయబడిరో చూద్దాం. ఈ శక్తిని గూర్చి మాట్లాడు కుందాం.

పెంతెకోస్తు దినమున వారందరూ అక్కడ కనిపెట్టి ఎదురు చూచుచుండిరి. వారు భయముతో అపుడుండిరి. యూదులకు వారు ఎంతో భయపడుచుండిరి. అయితే ఏమి జరిగినది? పరలోకము నుండి ఈ మేల్కొలుపు శక్తి వారి మీదికి దిగినపుడు వారు ధైర్యవంతులయిరి. అంతకు కొన్ని గంటలకు ముందు వారికి లేని నిశ్చయత ఇప్పుడు వచ్చినది. వారు గ్రహింపును పొందిరి.

ఆయన చనిపోయెననియు, ఆయన తిరిగి లేచెననియు వారికి తెలిసెను. వారు మార్గములో ఆయనతో మాట్లాడిరి. కాని అది యేసుని మట్టుకేనా? లేక వారికి కూడా చెందునా? కాని ఇక్కడ పెంతెకోస్తు దినమున సంచకరువుగా నుండుటకు పరిశుద్దాత్మ విశ్వాసుల మీదకి దిగెను. అందువలన వారాయన పునరుద్ధానములో పాలిభాగస్థులయిరి. ఆయనతో వారు సహావాసము పొందునట్లు జరిగినది. పరిశుద్దాత్మ వచ్చి వారును తిరిగి లేపబడుదురను నిశ్చయతను

అనుగ్రహించెను. ఎందుకనగా వారు పిరికితనము నుండి ధైర్యమునకు ముందే లేపబడిరి. 65. వారు తమ ఆలోచనలో యున్న ఆ వాక్యమును గురించే భయపడిరి. దీనిని మీరు తప్పిపోవద్దు వారు భయపడిరి.

ఆయనే వాక్యమని వారికి తెలియును. యూదులు కూడా దానిని ఒప్పుకొనిరి. నికోదేము ఇట్లనెను. "రబ్బీ, నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు తోడై యుంటేనే గాని ఎవడును ఇట్టి కార్యములు చేయలేడు. దానిని మేము ఇపుడు తెలిసికొని గుర్తించాము."

శిష్యులు కూడా అలాగే అనిరి. పేతురయితే ఆయన ముందు ప్రజమాణము చేసెను, వారందరునూ ఆయన సిలువ మరణము సమయములో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిరి. కాని ఇప్పుడు వారు మేడ గదిలో యుండిరి. అది దేవుని సన్నిది.

అంతట ఆకస్మత్తుగా పరలోకము నుండి పరిశుద్దాత్మ దిగి వచ్చి వారిని జీవింపజేసెను. ఆ మేల్కొలుపు రాగానే వారు తాము విశ్వసించి, సత్యమని ఎరిగిన వర్తమానమును గూర్చి
సాక్ష్యమిచ్చుటకు భయపడలేదు. లేని యెడల వారందుకు భయపడి యుండెడి వారు.

66. సత్యమును ఎరిగి యుండియు ఈనాడు ఎంత మంది ప్రెస్పిటేరియనులు, ఎంత మంది మెతడిస్టులు, ఎంత మంది బాప్టిస్టులు, ఎంత మంది పెతెకోస్తు వారు ఆ సత్యము కొరకు నిలబడుటకు భయపడుట లేదు? మీ మీద పడినది. ఏమిటో నాక అర్థమగుచున్నది. మీరాయన పునరుద్దానములో పాలిభాగస్తులా? మీరు నిర్భయముగా చెప్పగలరా? మానవ కల్పిత ఉద్దేశ్యమునకు మీరు భయపడుచున్నారా? మీకు నిజమయిన సంపూర్ణత వచ్చి యున్నదా? నిజమగు పౌరుషమున్నదా? తప్పును తప్పు అని, ఒప్పును ఒప్పు అని మీరు నిలబడి చెప్పగలరా?

మీరాయన పునరుద్దానములో పాలి బాగస్తులయిరా? లేక మీరు ఏవో కొన్ని మూఢ నమ్మకాలను, ఆరాధించువారిగా ఉన్నారా? మీరు సంఘ సభ్యులా? అక్కడ మీ పేరుండియు పాపములలోను, అతి క్రమములోను. చచ్చిన వారై యున్నారా? దేవుని పూర్తి వాక్యమును నమ్మని వాడు పాపియై యున్నాడు.

67. ఆ పరిసయ్యులు ఎన్నో సంగతలు సత్యమని నమ్మియున్నారు. " మేము దేవుని పిల్లలము." అని వారనిరి. ఆ వాక్యము బోధించబడు వరకు వారలాగే అనిరి. కాని ఆ వాక్యము బోధించబడి, ప్రత్యక్షపరచబడినపుడు వారు పాపులుగా మారిరి. ఎందుకనగా వారు తాము సత్యమని నమ్మిన దానిని నిరాకరించి యున్నారు. "నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుదము. దేవుడు తోడై యుంటేనే గాని ఎవడును ఇట్టి కార్యములు చేయలేడు" అని వారు పలికారు.

68. నేను నాకు ఆశ్యర్యము కలుగుచున్నది. మనం ఎక్కడున్నాము? నేను అడుగుచున్నాను. దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా తీసికొను ధైర్యము మీకున్నదా? మనలను పునరుద్ధానము కనుగొన్నదా? బయటకు వచ్చు దైర్యము మీకున్నదా? మీరు జీవమును నిర్ణయించబడిన వారయితే తప్పక మీరలాగు చేయగలరు. మీర పక్షిరాజులయితే మీరాలాగు చేయకుండా యుండలేరు. నీలో ఒక శక్తి పని చేయును.

ఎక్కడో ఉన్న ఒక ఆచారమును. నీవు సేవించగోరుచున్నావా? "నేను సంఘమునకు వెళు చున్నాను. నేను మంచిగా యున్నాను." అనుకొనుచున్నావా? నీవు ఈ జన్మహక్కును. కలిగియుండనంత వరకు ఎన్నడూ దానిని చూడజాలవు అది నీలో భాగము గనుక దానిని నీవు చూడకుండా ఉండలేవు దానిలో నీవు భాగముగా యున్నావు.

నాకు జన్మనిచ్చిన తల్లిని నేనెట్టు తెలియదని చెప్పెదను? నా తండ్రి యొక్క రక్తము నాలో యుండగా నా తండ్రిని నేనెట్లు కాదనగలను.? చార్లెస్ బ్రెన్హాం నా తండ్రి కాడని నేనెట్లు అనగలను? ఆ పని నేను చేయలేను. నేనాయన కుమారుని గనుక ఆయన నిందను కూడా భరించుటకు సిద్దపడి ఇష్టపడుదును. హల్లెలూయా! ఆయన దేవుని కుమారుడు. ఆయన వాక్యమై యున్నాడు. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతం ఒకే రీతిగా యున్నాడను బైబిలు సత్యమును. ఎట్లు కాదనగలను? మనము జీవించుచున్న ఘడియను చూడండి. మన సంఘములో ఒక ఈస్టరు పునరుద్ధానము
అవసరమై యున్నది. శక్తి గల విశ్వాసము కొరకు మనకు పునరుధ్ధానము అవసరమై యున్నది. దేవుని యొక్క బయలుపరచబడిన వాక్యము కొరకు స్త్రీ పురుషులు నిలబడవలెను.

69. "మాకు క్రైస్తవ యువత యున్నది." అని మీరందురు. మంచిదే."మా సంఘమునకు కూడిక యున్నది. మాకు చాలా మంది సభ్యులు కావలెను." అందురెమో దానికి నేను వ్యతిరేకిని కాను. మంచిదే కాని అది ఒక వేడివంటిది. మాత్రమే అది ఒక ముసలి కోడి రెక్కల క్రింద ఉ న్నట్లుండును. కాని నీవు సరియగు వేడి ద్వారా పొదగబడవలెను. నీవు పక్షిరాజువైనచో పక్షిరాజు ద్వారానే పొదగబడుదువు. దానిని చూచుటకు నీవు ముందుగా దేవునిచే నిర్ణయించబడిన యెడల నీవు దానిని చూడకుండా ఉండలేవు. నీవు ఒక పునరద్ధానములో తిరిగి లేచెదవు.

ఆ విధంగానే బాప్టిస్టు జన్మించెను. ఆ విధంగా ఒక పునరుద్దాన దినమున మెతడిస్టు జన్మించెను. కాని వారు పక్షిరాజుగా ఉండుటకు బదులుగా కోడిపిల్లలుగా మారిరి.

70. కొంత కాలము క్రిందట ఈ సంగతి చెప్పాను. నేను టూసాన్ నుండి వచ్చుచూ ఒక వింత సంగతి చూచాను. ఒక తీగె మీద గ్రద్ద కూర్చొని యున్నది. అది ఎప్పుడో తన గుర్తింపును కొల్పోయినది. అది పక్షిరాజు తరువాత వరుసలో ఉండేది. అది పక్షిరాజును అనుకరించలేదు. ఏ విధముగా కూడా పక్షిరాజును అనకరించలేదు. అయితే అది ఒక గ్రద్ద. క్రీస్తు పక్షిరాజుగా ఉ న్నాడు. సంఘము కనీసము గ్రద్దగానయినా ఉండాలి. అవి మిగతా ఏ ఇతర పక్షుల కంటెను ఎత్తున ఎగురును. కాని ఆ గ్రద్ద మొత్తబడిపోయినది. అది తన గుర్తింపును కోల్పోయెను. అది టెలిఫోను వైరల మీద కూర్చొని చచ్చిన కుందేళ్ళ కొరకు ఎదురు చూచుచున్నది. గ్రద్ద వలె ఎగురుటకు బదులుగా అది రాబందు వలె ఎగిరి నడుచుచున్నది.

71. సోదరీ, సోదరుడా, పెంతెకోస్తువారలారా, మీరు నాకు ప్రియలు. సంఘము తన గుర్తింపును పోగొట్టుకొన్నది. పరలోక సంబందమగు తాజా మన్న కొరకు ఉన్నతముగా ఎగురుటకు బదులుగా క్రిందికి దిగి ఏదో చచ్చిన మత అలవాటు కొరకు వెదకి దాని మీద ఆధారపడుచున్నది.

గ్రద్ద తన సొంత ఆహారము కొరకు వేటాడేది. కాని ఈనాడు అది కార్ల క్రింద పడి చచ్చిన కళేభరములను రాబందులతో కలిసి తినుచున్నది. దాని వలె అడుగులు వేయుచున్నది. దాని వలె కనబడుచున్నది.

మన ఆధునిక లోకంలో ఎంతో ఆలంకరణ చేసికొనుచున్నాము. మన స్త్రీలు జుట్లు కత్తెరించుకొని, పొట్టి బట్టలు వేసికొనుచున్నారు. మన పురుషులు వేదిక మీద నిలబడి సత్యమును చెప్పు వెన్నెముక లేనివారిగా ఉన్నారు. ఎప్పుడో మనం వాక్య విషయంలో మెత్తబడిపోయాము.

ఓ దేవా, పరిశుద్దాత్మను పంపుము, ఇపుడు ఏమి జరిగినా గాని నిలబడుటకు సిద్దపడు కొన్ని పక్షిరాజులను వెదకుము. టెలిఫోను తీగల మీద కూర్చొని ఆదివారపు బడి సాహిత్యము కొరకు ఎదురు చూచువారిని కాదు. వాక్యమునే చెప్పవలెను. అది ప్రశస్తమగు శక్తి గలది. పరిశుద్దాత్మ ప్రత్యక్షతకావలెను.

మాకు ఒక ఈస్టర్ అవసరము. ఒక పునరుద్ధానము కావలెను
వినోదములతో నీవు సంతృప్తి చెందుచున్నచో నీలో ఏదో పోరపాటున్నది.

72. నా సోదరీ, నాసోదరుడా, దీనిని నేను దైవ భయముతో చెప్పుచున్నాను. మరల ఈస్టరును ఉన్నాడూ చూడనేమోనని జీవించుచున్నాను. కాని ఒక సంగతి నిశ్చయము దేవుని వాక్యము ద్వారా నిజంగా దేవుని అభిషేకము పొందిన కుమారుడు. దేవుని స్వరము విని, పైకి లేచి మనలను కలిసికొనును. అతడు నిజమగు సజీవ వాక్యమును సంచకరువుగా పొందును. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కలిసికొనును. ఆమె ఆయన శరీరములో ఒక భాగము.

73. చూడండి. మనము మన గుర్తింపును పోగొట్టుకొనుచున్నాము. మనలో కొందరే బుధవారము రాత్రి కూడుకొనుచున్నారు. తక్కిన వారు ఇంటి వద్ద ఉండి "సుసీని ఎవరు ప్రేమించిరి?" అను లోక సంబంధమగు వినోదములను టెలివిజనులలో చూచుచున్నారు. రక రకాల వినోదములు మిమ్మును ఆలయమునకు దూరము చేయుచున్నవి. ఎప్పుడో మనము చెడిపోయాము.

మన సెమినరీలు, మన పాఠశాలలు ఎంతో వేదాంతము, వినోదము బోధించుచూ "రికీ" లను తయారు చేయుచున్నవి. ప్రార్ధన కూటము స్థానములో సంఘములో ఎన్నో కార్యక్రమములు వచ్చినవి.

మనము ఆధునిక దుస్తులను ధరించ ప్రయత్నించుచున్నాము. ఆ విధమగు దుస్తులను దరించి బయటి వారిని లోనికి తీసికొని రాగోరుచున్నారు. ఆ విధంగా ఎన్నడూ వారిని మీరు సంపాదించలేరు. వారికి నీ కంటె ఎక్కువగా తెలియును. నీకు వారి స్థలములో నిలబడు ధైర్యములేదు. ప్రకాశించు నిజమగు బాప్తిస్మము, నిజమగు పునరుద్దాన బాప్తిస్మము, వారికి కనబడవలెను.

వారి వలె ఒక సంఘము కట్టుటకు ప్రయత్నించ వద్దు. అటువంటి సంఘ కాపరిని నియమించుటకు ప్రయత్నించ వద్దు. ఇది, అది మరేదో చేసి లోకముతో చేతులు కలుప వద్దు. వారు హాలివుడ్లో వెలుగుచున్నారు.

74. నిజమగు సువావర్త శక్తితో వెలుగును. దానిని పక్షిరాజులు వినును వారు మెరుపు కొరకు చూచుట లేదు. వారు ఒక మంట కొరకు చూచుచున్నారు. దీనత్వము, ప్రేమ, శక్తితో నీవు వెలుగుచుండవలెను. నిజమగు పక్షిరాజులు వాటి కొరకు వేటాడుచుండెను. నీవు ధాన్యపు గాదెను తవ్వుకొని ఆనందించలేవు. ఆ విధముగా ఆనందించుట సాధ్యముకాదు. దానిని నమ్మని పక్షిరాజు ఎన్నడూ అంటుకొనదు. ఆకాశమునుండి ఆ స్వరము వినబడును. "మృతుడనైతిని గాని, ఇదిగో సజీవుడనై యున్నాను." అది వినగానే ఏదో జరుగును. "నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాను. చివరి దినములలో సర్వ శరీరుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను.” దేవునికి మహిమ! "మీ మర్త్య భాషను నేను సజీవమగు దానిగా చేయుదును. మీ మర్త్య నాలుకను నేను బ్రతికించెదను. నాతో కూడా మిమ్మును పునరుద్ధానములోనికి తీసికొని వచ్చెదను.” హృదయపూర్వకమగు ఆశ, ఆకలి గల పక్షిరాజులు ఎంత కష్టపడి అయినా గాని దానిని చేరుకొనును. అది గొప్ప వెలగల ముత్యము. తనకు కలిగినదంతయూ అమ్మి దానిని అతడు కొనును. దేవా,
మాకు సహాయము చేయుమని అడుగవలెను. మన సంఘములు వాటి గుర్తింపును. కోల్పోచున్నవి. త్వరగా మనము చెప్పు కొందుము.

75. శిష్యుల యొక్క పనిని చూడండి. యేసే సత్యమని వారెరుగుదురు. కాని చూడండి అది వారిపేరు ప్రతిష్ఠలకు,ఆనాటి మతము, అభిప్రాయములకు విరుద్దము. పరిసయ్యులది, సదూకయ్యలది. చాలా కఠినమగు మతము (క్యు క్లుక్సు మరియు శాఖలు) వారు దైవదూషణను సహించలేరు. కాని యేసే గుర్తించబడిన వాక్యము. యేసే పరిశుద్దాత్మ. "ఇక కుంచెము కాలమైన తరువాత లోకము నన్ను చూడదు. గాని మీరు నన్ను చూతురు." శరీరము కాదు గాని ఆయనలో ఉన్న జీవమును చైతురు.

ఆయనకు విధేయులగు కుమారులు సంఘములో ఆయన వలె పని చేయుదురు. " నా తండ్రికి ఇష్టమగు దానినే నేను ఎల్లప్పుడూ చేయుదురు" " నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు?" మరో మాటలో చెప్పవలెనన్న అవిశ్వాసమే పాపము." నాగూర్చి వాక్యమేమి చెప్పినదో దానిని నేను చయలేదని ఎవరు అనగలరు?" "నా గురించి వాక్యమేమి చెప్పెనో దానిని నేను చేయలేదని ఏ విషయంలో తప్పు మోపగలరు?" "ఎవరు నా మీద నేరము మోపగలరు?" "ఎవరు తమ వ్రేలు చూపి నేను తండ్రి మాట నేరవేర్చలేదని అనగలరు?"

పెంతెకోస్తు సంఘము ఆ స్థానముకు ఎప్పుడు వచ్చును? "నాలో అవిశ్వాసమున్నదని ఎవరు నేరము మోపగలరు?"

76. ఓ క్రైస్తవులరా, గద్దల వలె కాక పక్షిరాజువలె గుర్తించబడుడి. గద్ద చాలా మెత్తనిదయి పోయినది. అది క్రిందకు దిగిపోయినది పక్షిరాజు ఆ విధముగా చేయుట మీరెన్నడూ చూడలేరు. అదెన్నడూ అలాగు చేయదు. నీలాకాశములో ఎగురుచూఅది తన ఆహారమును వేటాడును. అది ఆ విధముగా చూడ కలుగునట్లు దేవుడు దానిని సిద్ధపరచెను. చచ్చిన దానిని కాదు గాని తాజామన్నాను అది తినును.

వారు అరణ్యములో వెళ్ళూచూ కుళ్ళిన మన్నాను తన ప్రయత్నించిరి. అది మురిగిపోయినది. దానిలో పురుగులు కనబడినవి. దాని భావము మీరెరుగుదురా? అది చెడిపోయి, కుళ్ళిపోయి పురుగులు పట్టినది.

ఎన్నో సంవత్సరాల క్రితం చచ్చిన ఆహారమును నేనెందుకు తినవలెను? దాని రూపము, ఆకారము చక్కగా కనబడవచ్చును. కాని అది తాజాగా లేదు. ప్రతి తరములోను మనము నూతనంగా ఆహారమును సంపాదించుకొనవలెను. మనము యాత్రలో యున్నాము. పక్షిరాజు ప్రతిసారి నూతన ఆహారమునే వేదకి తినును.

77. కొందరు జనులను తీసికొని చూద్దాం. కొందరు పాత నిబంధన ప్రవక్తలను తీసికొని వారేమి చేసిరో చూద్దాం. మొదటిగా స్తెఫనును చూద్దాం. సన్హెద్రిను సభ మధ్యలో సైఫను నిలబడెను. విశ్వాసులు గుంపుగా ఆ సన్హెద్రిను సభ వారుపిలవబడిరి. వారే అతనిని తీసికొని వచ్చి శిక్ష విధించిరి. “మూర్ఖులారా, సున్నతి చేయబడని హృదయములు, చెవులుగల వారులారా! మీరెల్లపుడూ
పరిశుద్దాత్మను ఎదిరించుచునే యున్నారు." (అదే నిత్య జీవము) "మీ పితరులు ప్రక్తలకు చేసినట్లే నేడు మీరు వీరికి చేయుచున్నారు." వారు అతని మీద పళ్ళు కొరికిరి.

వారది వినుటకు ఇష్టపడలేదు. అది వారి ఆచారమునకు విరోధముగా యున్నది. అది వారి శాఖకు విరోధముగా యున్నది. అతనిని వారు రాళ్ళతో కొట్టి చంపిరి. అతడు ఆకాశము వైపు తన చేతులెత్తి "పరలోకము తెరువబడుటయు, కుడి పార్శ్వశమున యేసు కూర్చొండి యుండుటయు నేను చూచుచున్నాను." అని పలికెను. ఎందువలన? అతనిలో పునరుద్దాన శక్తి యున్నది. ఆ మేల్కొలుపు శక్తి అతనిని యేసు రొమ్మున అనుకొనునట్లుగా తీసికొని వెళ్ళినది.

78. ఫిలిప్పును చూడండి. అక్కడ గొప్ప ఉజ్జీవము వచ్చినది. అక్కడ సంఘముల సహకారము కుదిరినది. వారికి గొప్ప ఉజ్జీవము కలిగినది. దేవుని యొక్క మేల్కొలుపు శక్తి వారితో మాట్లాడినది. "మీరు గొప్ప ఉజ్జీవమును కలిగియున్నారు. కాని నేను మాట్లాడుటకు ఒక వ్యక్తి మాత్రమే నాకున్నాడు." అని చెప్పి యుండును. ఎంత విమర్శ వచ్చినా, ఏమి అయినా గాని స్తెఫను మాత్రము విధేయునిగా ఉండును. "ఓ! సైఫనూ! నీవు వెళ్ళజాలవు!

"నేను వెళ్ళగలను. ఎందుకనగా దేవుడాలాగు చెప్పెను." అతడు ఎడారి లోనికి వెళ్ళెను. అక్కడ ఈ నంపుంసకుని కనుగొనెను. ఏమి జరిగినది? "యేసు దేవుని కుమారుడని నీవు నీ పరిపూర్ణ హృదయముతో విశ్వసించిన యెడల నేను నీకు బాప్తిస్మము ఇచ్చెదను." అని అతడనెను. అతనికి బాప్తిస్మము ఇచ్చిన తరువాత ఈ పైకిలేపు శక్తి అతని లోనికి వచ్చినది. ఒక గొప్ప ఉ జీవము కలిగినది. ఆ ఎడారిలోని ఒక మనిషి యొద్దకు వేలాదిమంది వచ్చిరి.

ఓ! అది ఆలోచనకు అందదు ఇక్కడ పదివేలమంది నిన్ను కోరుకొనుచుండగా అక్కడ ఒక్క మనిషి కొరకు ఎందుకు వెళ్ళావు? ఆ సైకిలేపు శక్తి అతనిని దేవుడేర్పరచిన స్థలమునకు పంపించినది. హల్లెలూయా!

79. స్త్రీ, పురుషులారా! లేచి మీరు నిలబడండి. అందువలన మీరు దేవుని కిష్టమగు కార్యములను చేయుదురు. దాని గూర్చి ఏవరేమి చెప్పినా నేను వినను. పొరుగువారు నా మతి పోయినదనవచ్చును. దివా రాత్రులు ప్రార్ధించుట, బైబిలు చదువుట వారికిష్టముండదు. వారేమన్నాగాని నేను లెక్కచేయను. దేవుడు దీనిని చేయుటకే నిన్ను పిలిచెను. ఇది నిజము ఈ పాతకాలపు పెంతెకోస్తు ఉజ్జీవ కూటములు మనకు వద్దని వారందురు. లేదు. మనకవి చాలా అవసరము. నీలో నీవె దానిని కలిగియుండవలెను. తక్కిన వారు ఏమనుక్కున్నాగాని నీవె దేవునిలో గొప్పవాడవు.

80. ఇపుడు జాగ్రత్తగా వినండి. దేవుని మాటకు మీరు లోబడవలెను. ఆయన తన పనిని నేరవేర్చును. పెంతెకోస్తు దినమున ఆ పైకి లేపు శక్తి వారిని పట్టుకొన్నది. అతని శరీరము పైకి కొనిపోబడినది. ఎన్నో మైళ్ళ దూరము అతడు ఆత్మలో కొనిపోబడెను. అతనిని మరొక దేశములో వారు కనుగొనిరి. అది దేవుని మేల్కొలుపు శక్తి! మనము పెంతెకోస్తు అనుభవమును పొందినచో, యేసుని మృతులలో నుండి లేపిన శక్తి మన మర్త్య శరీరములోను నివసించును.

81. ఈ జీవపు శక్తి గల మరొక వ్యక్తిని చూద్దాం. చాలా కాలము క్రిందట హానాకు అను ఒక మనుష్యుడుండెను. ఆనాడు ఎన్నో క్రొత్త సిద్దాంతములు, క్రొత్త బోధలు వచ్చి యుండును. కాని హానుకు మాత్రము దేవునితో నడిచెను. దేవుడు చేయమన్న దానిని హనోకు మాట తప్పకుండా చేసెను. అతడు దేవునితో కూడా నడిచెను.

అతడెవరు? దేవుని కుమారుడు. ఆ దినమునకు పిలవబడిన ఒక పక్షిరాజు ఆ సమయము వచ్చినపుడు అతడు పూర్తి జీవశక్తితో నిండి యుండెను. గుర్తుంచుకొనండి అతడు దేవునితో అయిదు వందల సంవత్సరముల కంటె ఎక్కువ కాలమునడిచెను. ఒక్కసారి కూడా అతడు దేవుని యొక్క ఒక్క మాటను కూడా తప్పిపోలేదు. ఎన్నడూ అతని ప్రవర్తన చెడిపోలేదు. తన సాక్ష్యమును అతడు కాపాడుకొనెను. దేవుడు తనతో చేయమని చెప్పిన ప్రతి దానిని అతడు చేసెను. దాని గూర్చి ఏమి వాదించలేదు. ఎవరు ఎమనుకొన్నా అతడు లెక్క చేయలేదు. ఎందువలన? అతడు పైకి లేపు శక్తితో నిండి యుండెను.

ఆ ముసలి వాడు చనిపోవు కాలము వచ్చినపుడు దేవుడు ఒక నిచ్చెనను పంపి ఇంటికి కొనిపోయెను. అతనిని పైకిలేపి అతని మర్త్య శరీరమును ఎత్తబడునట్లు చేసెను. ఆమేన్! అదియే జీవపు శక్తి.

82. ఏలియాను చూడండి. భూమి మీద అతని పని ముగించబడిన తరువాత అతడు గొప్ప పైకిలేపు శక్తితో నింపబడి యుండెను. అతని దినము నాటి జాకీ కెనెడీ జుట్టు కత్తెరింపును అతడు ఖండించెను. ఆ ముసలి యెజెబెలు గూర్చి తన వైఖరి ఏమిటో తెలిపెను. ఏది తప్పో, ఏది ఒప్పా ఆ కాలపు బోధకులకు, యాజకులకు అతడు తెలియజేసెను. వారతని మాట నమ్మలేదు. రంగులు పూసికొనిన స్త్రీలను అతడు ఖండించెను. ఆ చెడ్డ పనులను ఖండించెను. ఏది అతనిని హాని చేయలేకపోయెను. ఎందుకనగా అంత సజీవ శక్తితో అతడు నిండియుండెను.

దేవుడతనిని ఆకాశ పక్షులతో పోషించెను. అతనిని ఒక ప్రత్యేక రీతిలో యుంచెను. అతడు జీవశక్తితో నిండి యుండెను. అతడు చనిపోవు సమయము వచ్చినపుడు యోర్థాను పాయలయెను. ఒక రధము పంపబడెను. అతడు గృహమునకు అందులో కొనిపోబడెను. అట్టి జీవశక్తితో అతడు నిండి యుండెను. అతడు అసలయిన దేవుని కుమారుడు.

83. చూడండి అతనికి వారసుడు ఒకడున్నాడు. అతని పేరు ఎలీషా. ఎలీషాకు ఈ పైకి లేపు శక్తి రెండు రెట్లు వచ్చెను. చూచారా? అతనిక రెండు రెట్లు వచ్చెను. అతడు దాదాపు 80 సంవత్సరములపాటు బోధించెను. లేదా 80 సంవత్సరముల వయస్సు వరకు బోధించెను. అతడు వ్యాధిగ్రస్తుడై చనిపోయేను. అతడు ఏలియా వలె గృహము చేరలేదు.

చూడండి. వారిద్దరూ సంఘమునకు సాదుృశ్యముగా ఉన్నారు. కొందరు పరిశుద్ధులు ఎత్తబడుదురు. కొందరు విశ్రాంతి పొందుదురు. కాని చూడండి. ఏలియా ఎత్తబడెను. ఎలీషా సంపూర్ణముగు జీవపు శక్తితో దేవునతో నిద్రించెను. చనిపోవు ముందు అతడు పలికిన ప్రవచనము చూడండి.

84. దానిని మీకు చూపించెదను. మీరు చనిపోయినా పరవాలేదు. ఆ పైకి లేపు శక్తి ఎన్నడూ
మిమ్మును విడువదు. అతడు చనిపోయి కొన్ని సంవత్సరములయినది. ( అతని శరీరము క్రుళ్ళిపోయినది. పురుగులు దానిని తినివేసెను) ఒక రోజున వారు ఒక శవమును పాతిపెట్టుచుండిరి. ఈ ఎలీషా ఎముకలు అతనికి తగిలి అతడు మరలా సజీవుడాయెను. ఆ ఎముకలలో అంత జీవశక్తి యుండెను. హల్లెలూయా! మృతుని సజీవునిగా చేసెను. ఎందుకనగా ఆ దైవజనుని మీద ఉన్న జీవపు శక్తి ఎన్నడూ తొలగిపోలేదు. ఆ ఎముకలలో అది ఉన్నది.

85. ఓ గుర్తుంచుకొనండి. మనము ఆయన పెండ్లికుమారైము గనుక ఆయన మాంసములో మాంసము గాను, ఆయన ఎముకలలో ఎముకగాను యున్నాము. ఆ జీవశక్తిని మరణము ఏ మాత్రము నాశనము చేయజాలదు. "ఆ శరీరమును పురుగులు నాశనము చేసినాగాని నేను శరీరముతో దేవుని చూచెదను." దేవునికి మహిమ! ( పైకెత్తబడుదువు)

నా వంటి ముసలి వానికి ఇది నిరీక్షణ ఇచ్చును! నా అంతము సమీపమందున్నదని నాకు తెలియును. నా వయస్సు 56 ఏండ్లు

చిన్న బాలునిగా ఉన్నప్పటి నుండి దీనిని నేను ప్రకటించుచున్నాను. నాలో మంచి ఏది నివసించదని నేనెదుగుదును. నా వలన ఏమీ జరుగదు. కాని నాలో ఆ జీవపు శక్తి యున్నది.

యువకునిగా ఉండగా ఆ శక్తి నన్ను ఈ లోక క్రియల నుండి లేపి నిత్యజీవమును ఇచ్చినది. నేను దర్శనములు చూచాను. ఎన్నో ప్రవచనములు చెప్పాను. ఏ ఒక్కటి ఆయన తప్పనీయలేదు. నేను ఇతర భాషలలో మాట్లాడాను. నేను ప్రవచించాను. నా యందు నివసించియున్న దేవుని ఆత్మ ద్వారా నేను ఆ క్రియలు చేశాను. అదియే ఆ పైకి లేపు శక్తి.

86. ఇపుడు నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. ఒక దినమున ఆయన వచ్చినపుడు ఆయనను మధ్యాకాశములో ఎదుర్కోనుటకు ఈ ఎముకలు తిరిగి లేచును. మీరు వాటిని లోతుగా పాతిపెట్టవచ్చును. లేదా కాల్చవచ్చును. మీ ఇష్టమొచ్చినట్లు చేయవచ్చును. కాని ఆ పైకిలేపు శక్తి అనంతమైనది!

ఇపుడే ఆ ఈస్టరును నేను అనుభవించుచున్నాను. అవును. ఎన్నో ఏండ్ల నుండి దానిని నేను ఎరుగుదును. అది నాలో యున్నది. అది మీలో యున్నది. మృతులలో నుండి యేసును లేపిన ఆ ఆత్మ మీ మర్త్య శరీరములో నివాసము చేయుచున్నది. అది మిమ్మును లోక సంబంధవిషయములలో నుండి పైకి లేపి దేవుని వాక్యము లోనికి తీసికొని వచ్చినది. ఈ జీవితము నుండి మిమ్మును లేపి నిత్య జీవమును దయచేసినది.

ఒకప్పుడు మీరు పాపములలో, అపరాధములోను చనిపోయిరి. ఇప్పుడు పైకిలేపబడి క్రీస్తు యేసుతో కూడా పరలోక స్థలమందు కూర్చొండ పెట్టబడి యున్నాము. పై నుండి వచ్చు మన్నాతో పోషించబడుచున్నారు. దేవుని హస్తము ఈనాటి వాగ్దానమును బయలుపరచి నిరూపించుట మీరు చూచుచున్నారు.

87. "నోవహు దినములలో ఉండినట్లే, మనుష్యకుమారుని రాకడలోను ఉండును.”

వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. లోతు దినములలో
ఉండినట్లుగానే మనుష్య కుమారుడు భూమిద ప్రత్యక్షమగు దినములలో యుండును. ఇక మీదట ఆయన దేవుని కుమారుడు కాడు. చివరి దినములలో ప్రవచనాత్మక వర్తమానము అందించుటకు మనుష్య కుమారుడు తిరిగి వచ్చెను. పక్షిరాజు ఎగురుచుండెను. సింహాము కాదు. ఎద్దు కాదు. బలి అర్పించు యుగము అయిపోయినది.

చూడండి, ఈ ప్రపంచ రాజకీయ శక్తిని ఎదుర్కొనుటకు,సవాలు చేయుటకు ప్రతి కాలములోను ఒక మత శక్తి బయలు వెళ్ళెను. సింహాముగా ఒక మత శక్తి బయలు వెళ్ళెను. అది రోమను అధికారమును ఎదుర్కొనెను. బలి అర్పించు ఘడియ వచ్చినప్పుడు ఎద్దు బయలు వెళ్ళెను ఎందుకనగా అది ప్రభువునకు బలి పశువు. ఆ తరువాత సంస్కరణ కాలములో మానవులు బయలువెళ్ళిరి, వారే లూథర్, వెస్లీ, కాల్విన్ మొదలగు వారు. చివరి వర్తమానము.బయలు వెళ్ళు చున్నది. ఇది ఎగురుచున్న పక్షిరాజు. ఇది పక్షిరాజు కాలము. ప్రత్యక్షతా కాలము. దేవుని వాక్యము బయలుపరచబడినది. దేవుని వాక్యము రుజువయినది.

ఓ! పిల్లలారు! పరిశుద్దాత్మ బాప్తిస్మము లోనికి నడిచి రండి. వచ్చి మీ పరిపూర్ణ హృదయముతో విశ్వసించుడి. దేవుడు మిమ్మును పంపును.

88. ఇటు చూడండి. గుర్తుంచుకొనండి. మనమాయన మాంసములో మాంసము, ఎముకలో ఎముకగా యున్నాము. సమాధిలో నుండి దేవుడు ఆయన శరీరమును, ఎముకలను తిరిగి లేపెను. శక్తిగల ఆయనను ఏదియూ దాచజాలదు. మరణమాయనను తీసికోలేకపోయెను.

యేసు చెప్పెను, "తండ్రి నా కనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. అంత్య దినమున వారిని నేను లేపెదను." ఓ! అదే ఈస్టరు. మనము ఈస్టరులోనే యున్నాము. ఆయన లేచినపుడు మనమును ఆయనలో లేచాము. ఆయన సంచకరువును పంపెను. దానిని మనము పట్టుకొని యున్నాము. అదే పరిశుద్దాత్మ బాప్తిస్మము. ఆయన సదాకాలము జీవించియున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాడు. హెబ్రీ 13:8 ఆయన ఆలాగున్నాడని నిరూపించుచున్నది.

89. ఆయనే మెస్సీయా, అభిషిక్తులు దానిని నమ్మెదరు. మెస్సీయా అనగా ఏమిటి? మెస్సీయా అనగా అభిషిక్తుడు.

ఆయన మెస్సీయా అయినచో ఆనాటి దేవుని వాక్యమును నేరవేర్చుటకు అభిషేకము పొందును ఆయన విమోచకునిగా అభిషేకించబడెను. దేవుడు ఆ శరీరమును పైకి లేపెను. ఆయన పెండ్లి కుమార్తె ఈ దినమునకు అభిషేకించబడినది ఆయనతో పాటుగా పునరుద్దానమందు లేచి యున్నది. ఎందుకనగా ఈ ఇద్దరు ఒక్కటై యున్నారు. ఆమెన్!

నేనే దానిని చూచిన రీతిగా మీకు చెప్పగోరుచున్నాను. అందుకు కావలసిన విద్య నాకుండిన . నా భావమును మీ హృదయములో బాగుండును. దానిని మీరు చూతురని ఆశించుచున్నాను. ఉంచుటకు దేవుని పరిశుద్దాత్మ దిగి వచ్చునని నిరీక్షించుచున్నాను.

90. అది పునరుద్దానము. ఇప్పుడు మనము పునరుద్ధానములో యున్నాము. పునరుద్దానమందు
ఆయవతో మనము కూర్చొని యున్నాము. వారికి మాత్రమే జీవమున్నది. జీవములేని వారు ఆయనతో కూర్చొనరు. వారిరుగనే ఎరుగరు దారెన్నడూ తెలిసికొనజాలరు. పరిశుద్దాత్మను పొందియున్నామనియు, రక్షించబడియున్నామనియు, రాకడ వచ్చినచో ఎత్తబడుదుమనియు వారముకొందురు, కాని ఆయన ఇట్లనెను, "ఏలియా వచ్చి వెళ్ళిపోయెను గాని మీరెరుగరు."

దేవుని యొక్క సైకిలేపు శక్తిని మరణము ఆపజాలదు. మరణము దానిని ఆపజాలదు. "నాతల్లి ఆత్మ పూర్ణురాలు నా తండ్రి వలె ఆత్మ పూర్ణుడయిన వానిని నేనెన్నడూ చూడలేదు. కాని బ్రెన్హాం సోదరుడా, వారు చనిపోయిరి" అయినా గాని పైకి లేపు శక్తి వారిని లేవదీయును.

మోషేలో జీవపు శక్తి యుండెను. దానిని మీరు నమ్ముదురా యేసు తప్ప మరెవరు అటువంటి వారు లేరు. ఎందుకనగా అతడు దర్శనములను మాత్రమే చూచుట కాదు గాని దేవునితో ముఖా ముఖిగా మాట్లాడెను. ఒకనాడు ప్రవక్తినియగు మిర్యాము కూడా అతని మాటను ఎదురించెను అందుకు దేవుడిట్లనెను. " నీవు దేవునికి భయపడవా? నా సేవకుడగు మోషేను గూరి ఆలోచించుము. ఈ ఘడియలో అతని వంటి వారు ఈ ప్రపంచములో మరెవరూ లేరు. మో వంటి వారెవరూలేరు. నేను మోషేతో మాట్లాడాను. అతడు ఎన్నడైనా అసత్యము చెప్పెనా? నేన మోషేతో మాట్లాడాను నీవు దేవునికి భయపడవా? అతనికి విరొధముగా మాట్లాడవద్దు," వెంట ఆమె కుష్ఠు రోగముతో మొత్తబడెను. మరణదశలోనికి వచ్చెను. ఆ తరువాత ఆమె ఎం. కాలము బ్రతుకలేదు. మోషే ఆమె కొరకు ప్రార్ధించెను.

91. మోషే 120 సంవత్సరాల వయస్సులో తన 80వ సేవ సంవత్సరము కొండ మీదకి ఎక్కె అక్కడతడు చనిపోయెను. లోయలో సమాధి చేయబడెను. కాని పైకి లేపు శక్తి అతని మీదు న్నది. 800 సంవత్సముల తరువాత అతడు రూపాంతర కొండ మీద నిలబడి యునా ఏమిటది? అతడును పునరుద్ధానములో పాలు పొందెను. దేవుని యొక్క జీవపు శక్తి అతనికి డెను. ఇక్కడతడు నిలబడి యున్నాడు.

92. యోబు, అబ్రహాము, ఇస్సాకు మొదలగు పరిశుద్దులను. ఆ గొప్ప పునరుద్దాన ఉదయ చూడండి. యోబుకు ఆ దినము వచ్చునని తెలియును. "నా విమోచకుడు సజీ వా నేనెరుగుదును." క్రీస్తు వచ్చుటకు అనేక వందల సంవత్సరముల ముందు అతడీ మాట పక్ ఆదికాండము కంటె యోబు గ్రందము ముందుగా వ్రాయబడెను. బైబిలులోని ప్రాచీన గ్ర యోబు.

అతని శ్రమలను మనమెరుగుదుము. భూమి మీద అతనికి మిక్కిలి సన్నిహితు భార్య కూడా వచ్చి "నీవు దేవుని శపించి చావరాదు?" అన్నది.

"నీవు మూర్ఖురాలి వలె మాట్లాడుచున్నావు. యెహోవా ఇచ్చెను యెహోవా తీసిన యెహోనామమునకు స్తుతి కలుగును గాక!" అని అతడు చెప్పెను. దేవుని ఆత్మ అతని రాగా అతడు ప్రవచించసాగెను. " నా విమోచకుడు సజీవుడు. అంత్య దినములలో భూమిద నిలుచును. శరీరమును పురుగులు తినివేసినా గాని నా దేహముతోనే నేను దే
చూచెదను." అని చెప్పెను. అతడు తన్ను తాను సమాధి చేసికొనుటకు ఒక స్థలము ఏర్పాటు చేసికొనెను. ఒక పాలమును కొనెను. అందులో అతడు తన్ను తాను పాతిపెట్ట గోరెను.

93. ఆ తరువాత అబ్రహాము అను మనుష్యుడు వచ్చెను. (సంఘము ఎదిగి పైకి వచ్చుచున్నది) అబ్రహాముకు కూడా దేవుని యొక్క సంచకరువున్నది. నిత్య జీవము అతనికున్నది. ఎందుకనగా అతనిని దేవుడు పిలచెను. చూడండి. శారా చనిపోయినపుడు పాలస్తీనాలో అతడు కొంత భూమిని కొనెను. అది యోబు సమాధికి ప్రక్కనే యున్నది. ఆ స్థలములో శారాను సమాధి చేసెను. అబ్రహాము కూడా చనిపోయినపుడు శారా ప్రక్కనే సమాధి చేయబడెను.

అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కూడా నిద్రించినపుడు అదే అబ్రహాము భూమిలో సమాధి చేయబడెను.

ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు ఐగుప్తు మార్గములో చనిపోయెను. అతడును దేవుని సంచకరువు గల ప్రవక్త గనుక పైకి లేపు శక్తి గలవాడై ఇట్లు చెప్పెను. "యోసేపూ. నన్ను ఇక్కడ సమాధి చేయవద్దు. నా ప్రవక్తయగు కుమారుడా, ఇలాగు రమ్ము దేవుని వలన కుంటిగా మారిన ఈతొడ మీద చేయి యుంచుము. నన్ను ఇక్కడ సమాధి చేయనని పరమందున్న దేవునిని బట్టి ప్రమాణము చేయుము." అతనిలో ఏమి యుండెను? ఐగుప్తు కంటె మంచి దేశమున్నదా? అవును. అతడు ప్రవక్త. పునరుద్ధానము ఎక్కడ ఉండునో అతనికి తెలియును. అది ఐగుప్తులో యుండదు. పాలస్తీనాలో యుండును. "నా కుంటి తొడ మీద నీ చెయి వేయుము. నేను సేవించు దేవుని పేరిట ప్రమాణము చేయుము. నీవు నా ప్రవక్తనగు కుమారునివి. నా ఎముకలను ఇక్కడ సమాధి చేయవద్దు అక్కడ నన్ను పాతిపెట్టుము" అని అతడు పలికెను. 94. ప్రవక్తయై యుండిన యోసేపు కూడా తన చేతిని తన తండ్రి కుంటి తొడ మీద వేసెను. ఇట్లనెను, "అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని పేరిట నేను ప్రమాణము చేయుచున్నాను. ఇక్కడ నిన్ను పాతిపెట్టను." వారతనిని తీసికొనిపోయి ఆ దేశములో పాతిపెట్టిరి. ఎందువలన? యోసేపు కూడా తన అవసాన కాలమందు ఇట్లు చెప్పెను, "ఇక్కడ నన్ను పాతి పెట్టవద్దు ఒక దినమున ప్రభువగు దేవుడు మిమ్మును దర్శించును. ఈ దేశములో నుండి బయటకు రప్పించును. అపుడు మీరు నా ఎముకలను తీసికొని వెళ్ళుడి." ఎందువలన? దేవుడు అన్ని చోట్ల యున్నాడు గాని ఆయనకు ఒక సంకల్పమున్నది. యోసేపు ఒక ప్రవక్త. ఆ ఎముకలలో పైకి లేసపు శక్తి యుండెను.

క్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆయనాత్మ మీలో నివాసము చేయుచున్నయెడల మీ మర్త్య శరీరములను కూడా తిరిగి లేచును.

నా ఎములు ఇక్కడ ఉంచ వద్దు. వాటిని అక్కడ పాతిపెట్టుడి. అవి వాగ్దానములు.

95. ఇక్కడ ఒక వాక్యమున్నది. (మత్తయి 27 :51) యేసును మృతులలో నుండి లేపుట యోబు చూచెను. "నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. అంత్య దినములలో ఆయన ఈ భూమి మీద నిలుచును. ఈ దేహమును చర్మపు పురుగులు తినివేసినా గాని నా శరీరముతో
నే నేను దేవుని చూచెదను. ఆయనను నేను చూచెదను."

అది ప్రవక్త మాట అని వరెరుగుదురు. అబ్రహాము ఒక ప్రవక్త. ఇస్సాకు ఒక ప్రవక్త, యాకోబు ఒక ప్రవక్త. యోసేపు ఒక ప్రవక్త. వారికి దేవుని వాక్యానుసారమగు ప్రత్యక్షత యున్నది.

ఆ ఈస్టరు ఉదయమున ఆయన వచ్చి ఆయన యందు విశ్వాసముంచిన వారినందరినీ విమోచించెను. బైబిలు ప్రకారము వారు కూడా లేచిరి.

96. ఆ పైకి లేపు శక్తి యోబు సమాధి లోనికి వచ్చెను. అతని ఎముకల దూళి ఒక చెంచాడు. కూడా అక్కడ లేదు. ఎందుకనగా అప్పటికి ఎన్నో వందల సంవత్సరములయినది. ఎముకలు కూడా కరిగిపోయి భూవాయువులలో కలిసిపోయినవి. కేవలం భూమి యొక్క ధూళ్ళి మాత్రమే మిగిలెను. అయినా గాని దేవుని వాగ్దానము ప్రకారము పైకిలేపు శక్తి వచ్చెను. వందలు వేలు సంవత్సరముల నాటి యోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మొదలగు వారందరు సమాధలలో నుండి బయటికి వచ్చిరి.

ఆ విధముగా బైబిలు చెప్పెను. మత్తయి 27 :51 చదవండి. నిద్రించిన అనేకమంది పరిశు ద్దులు లేపబడిరి. ఈస్టరు ఉదయమున ఆయనతో కూడా సమాధిలో నుండి బయటకు వచ్చిరి. ఎందువలన? వారికి ఆ సంచకరువున్నది. వారికి ఆ పైకి లేపు శక్తి యున్నది. మృతులలో నుండి లేచి ఆయనతో కూడా వారు పునరుద్ధానమును అనుభవించిరి. ఎందుకనగా వారు ఆ పైకి లేపు శక్తితో నిండి యుండిరి.

వారికి నిజమగు ఈస్టరు ముంద్ర యున్నది. "నేను పాత నిబంధన కాలములో జీవించి యుండిన బాగుండును" అని నీవందువు. ఒక్క నిమిషము ఆగుము. 1 థెస్సలోనీకయులకు వ్రాసిన పత్రిక 4 :16 చదువవలెనని కోరుచున్నాను. "సోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దు:ఖ పడరాదు. ఈ నిద్రను గూర్చి మీరు తెలిసికొనవలెను. యేసు మృతి పొంది మూడవ దినమున తిరిగి లేచెనని మీరు నమ్ముచున్నారు గదా? వేషదారుల వలె నమ్ముట కాదు. దానిని మనము నమ్మిన యెడల ఆయన యందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును."

ఆ పైకి లేపు శక్తితోనే క్రొత్తనిబంధన పరిశుద్దులు ఆయన రెండవ రాకడ యందు పునరుద్ధానులగుదురు. పాత నిబంధన పరిశుద్ధులు పైకి లేపు శక్తితో లేచినంత నిశ్చయముగానే వీరును లేచెదరు. వారి ఎముకలు రూపాంతరము చెందినవి. దేవుని శక్తి వారికి ప్రచురమయినది. దేవుని వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చెను. ఆ పునరుద్దాన ఉదయమున వారును ఆయనతో కూడా పునరుద్దానులయిరి.

క్రీస్తు యేసు నందున్న వారందరూ ఆయనతో కూడా పునరుద్దానమందు తిరిగి వచ్చుదుర దేవుని వాగ్దానమున్నది. ఆ ఎముకల మీద దేవుని యొక్క మేల్కొలుపు శక్తి యున్నది.

97. మనము రోగుల మీద చేతులుంచుటలో ఆశ్చర్యము లేదు. మనము ఒకరినొకరి ప్రేమించుటలో వింతలేదు. మనము సోదరీ సోదరులము ఒకరి నొకరు అసహ్యించుకొనరాదు.
ఎందుకనగా మనము దేవుని వాక్యము చేత సరిచేయబడి యున్నాము. మనము ఒకరినొకరు ప్రేమించవలెను. ఒకరినొకరము గౌరవించుకొనవలెను. లేని యెడల మీరు నిష్ప్రయోజకులే.

98. ఇప్పుడు ఈ సంఘములో ఒకాయన కూర్చొని యున్నాడు. కొన్ని రోజుల క్రితం చెవిలోని క్యాన్సర్తో వచ్చియున్నాడు. అతడూ ఏమీ చెప్పలేదు. అతడు వేరే ఇంటి యొద్ద పనిచేయును. నేను మోస్లే సాదరులతోను, సహో, డాసన్తోను వేటకై ఆ ప్రాంతమునక వెళ్ళాను. మేముక్కడ వేటాడుచుండగా అతని చెవిని నేను చూచాను. అతని చెవి వాచినది. "డాన్ వాన్, ఆ చెవి ఏమయినది?" అని అడిగాను.

"సహో, బ్రెన్హాం, అది చాలా కాలమునుండి ఆలాగే యున్నది." అన్నాడు.

నేను అతని చెయ్యి పట్టుకొన్నాను. అతని చెవిలో పెద్ద కాన్సరున్నది. దానిని చూచి నేను ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత రెండు రోజులకు చూడగా దాని మచ్చ కూడా కనబడలేదు. అది దేవుని కార్యము. పరలోకమందున్న దేవుడు తన సజీవ శక్తితో ఆ కాన్సరు చంపి డాన్వాన్ రెజ్ యొక్క జీవమును కాపాడెను. ఇది నిజము.

99. ఈ సంగతులు ఏమిటి? ఇటు చూడండి. ఇక్కడున్న ఫోనిక్సు వారు చూడవలెను. దీనియందు విశ్వాసముంచిన వారిని మీరు చూడవలెను. విశ్వాసమున్న వారే మీ మీద చేతులుంచుచున్నారు. ఏమి జరుగునో చూడండి అది సజీవ శక్తి. "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచగా బాగుపడుదురు." అది పైకి లేపు శక్తి. పక్షిరాజు నుండి పక్షిరాజుకు ఇది వచ్చుచున్నది. ఏదో జరుగును.

పక్షిరాజుకు కాకికి ఏమీ సంబంధము లేదు. పక్షిరాజు మాత్రమే ధాన్యపు గాదె యొద్ద నుండి ఆకాశములోనికి ఎగిరిపోగలదు. "నమ్మువారి వలన ఈ సూచక క్రియలు కనబడును." ఇద్దరూ నమ్మవలెను.

100. ఏలియా, ఏలీషా అను వీరిద్దరులో దేవుడు పైకి లేపు శక్తిని ప్రచూరపరచెను. చూడండి. ఆ ఇద్దరు ప్రవక్తలను చూడండి. ఒకరు పైకి కొనిపోబడిరి. ఒకరు లేపబడిరి. దేవుడు తనతో కూడా ఒకరిని తీసికొనిపోయెను. మనమును ఆయనను మధ్యాకాశములో కలిసికొందుము. అందుకై మనము పైకి కొని పోబడుదుము.

గమనించండి పక్షికి రెండురెక్కలుండును. అందువలన దానికి సమతూకము ఏర్పడును. అవునా? ఏలియాకు రూపాంతరపు రెక్క యుండెను. ఎలీషాకు పునరుద్దాన రెక్క యుండెను. వారిద్దరును జీవించియున్న పరిశుద్దులకు, నిద్రించిన పరిశుద్దులకు సాదృశ్యముగా యున్నారు. గుర్తుంచుకొనండి. వారు తెర అవతలి దానిని చూచుటకు పైకి లేపబడిరి. వారు ఆనాడే

ఈనాటి దానిని తెర అవతలి నుంచి చూచిరి. దానికి కారణము వారిలో నున్న సజీవ శక్తియే. ఈ

కాలమును వారు అనాడే చూచిరి.

101. పౌలును చూడండి. అంత్య దినములలో జనులు ఎట్లు ప్రవర్తించెదరో చెప్పెను. అయినా వారు క్రైస్తవులుగా పిలువబడుదురు. అతడు పూర్తి సజీవ శక్తి కలిగిన ప్రవక్త. జరుగబోవు దానిని
ముందే చూచెను. దానిన మనము నమ్ముచున్నాము. లేదా? అతడు మేల్కొలుపు శక్తిని పొందెను.

ఈనాడు ఆ సజీవ శక్తిని చూడండి ముందే జరుగనై యున్న సంగతులను చెప్పుచున్నది. ఒక్కటి కూడా తప్పిపోవుట లేదు. ఏ ఒక్కసారి కూడా అది విఫలము కాలేదు. అది మానవ శక్తి కాదు. జీవపు శక్తి. అది దేవుని శక్తి. ఈస్టరు యొక్క శక్తి ముందుగానే మనకు ఇవ్వబడినది. పునరుద్దానుడగు యేసు ముందుగానే మనకు ఆ సంచకరువును అనుగ్రహించెను. ఆయన యందు ముందే మనము లేపబడి యున్నామను హామి పొందియున్నాము.

కాలపు 102. గుర్తుంచుకొనండి. సువార్తికుల గ్రంథములో ఈమాట వ్రాయబడియున్నది. తెర అవతలగా చూచుట... నేను వృద్ధుడనగుచున్నాను. నా దినములు తక్కువగుచునన్నవని నేనురుగుదును. కొద్ది సేపటి క్రితం స్త్రీలు పాడిన పాటను నేను పాడుచున్నాను. దానిని నేను 18 లేదా 20 సంవత్సరముల నుండి ఎరుగుదును. ప్రభువుతో దానిని నేను చెప్పగోనుచున్నాను. అను పాట. మీరు వెళ్ళి దాని గూర్చి ప్రార్ధించండి. ఆ పైకిలేపు శక్తి వచ్చును. నేను విశ్రాంతి పొందుచున్నాను. నేను అటు చూచి ఇట్లు పలికాను, "ఆవలకు చూడండి"

"పైకి లేపబడిన" ఆ ఉదయము నాకు గుర్తున్నది. వెనుక నా భార్య కూర్చొని యున్నది. ఆ ఉ దయమున నాతో పాటుగా ఆమె కూడా ఆ పడక మీద యున్నది. నేను మేల్కొని చూడగా ఆమె నిద్ర పోవుచుండెను. నేనిట్లు అనుకొన్నాను, "ప్రభువు కొరకు నేను ఏదయినా చేయవలెనన్న ఇదే సమయము. త్వరపడవలెను. 50 సంవత్సరములు దాటి పోయినవి." పరిశుద్దాత్మ నన్ను పట్టుకొన్నది. నేను ఆవలకు చూచాను. ఆ తెరకు ఆవల ఉన్న పరిశుద్దులు కనబడిరి. ఈ బల్ల యొద్ద నేను నిలబడి యున్నంత ఖచ్చితముగా ఆ దృశ్యమును చూచాను. సువార్తికుడనగు నా యొద్ద ఈ పరిశుద్ధ గ్రంథమున్నది. ఇది సత్యము.

103. ప్రభువు నామములో నేను జరుగునని చెప్పినది ఎన్నడైనా జరుగకుండా పోయెనా? అటువంటిదున్నచో నాకు చెప్పండి. ప్రతిసారి అది ఖచ్చితముగా జరుగుట లేదా? ఆయన చెప్పినట్లే నిశ్చయముగా అది జరుగుట లేదా? ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

అక్కడ నేను నిలబడి ఆ కాలమును చూచాను. వేలాదిమంది వచ్చుట నేను చూచాను. యవ్వన స్త్రీ, పురుషులు పరుగిడి వచ్చుచుండిరి. వారు నన్ను చేతులతో చుట్టి అరచుచుండిరి. నేను వెనక్కి చూడగా పడక మీద నేనే యున్నాను. ఓ! ప్రభువు కాలపు తెరను దాటి నేను చూడకలునట్లు కృప చూపును.

ఓ! ప్రభువా, ఆ కాలపు తెరకు ఆవలగా నన్ను చూడనిము.

ఏమిటది? అది పైకి లేపు శక్తి. అది మనలను పైకి కొనిపోవును అది గొప్ప మేల్కొలుపు శక్తి ఈ చివరి దినములలో ఆ పైకి లేపు శక్తి వచ్చియున్నది.

104. ఇప్పుడు నేను అరిజోనాలో అందుకొరకే యున్నాను. ఇక్కడ చాలా మంది కూర్చొని యున్నారు. ఈ ఫోనిక్స్లోనే కూర్చొని నేను ఈ వేదిక మీద నుండి చెప్పుచున్న దానిని వినుచున్నారు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. (ఎందరికది జ్ఞాపకమున్నది?) ఏదో జరుగనై
వై యున్నది.

ఏడుగురు, దూతలు దిగి వచ్చుట నేను చూచాను. లైఫ్ పత్రికలో దానిని ప్రచురించిరి. 27 మైళ్ళ ఎత్తున 30 మైళ్ళ పొడవున పొగమంచు ఏర్పడినది. ఆ కొండ మీద ఏడు దూతలు ప్రత్యక్షమయినపుడు ఫ్రెడ్ సాద్మన్ మరియు జీన్ నార్మన్లు అక్కడ అప్పుడు ఉండిరి. ఆ చుట్టూ కొన్ని మైళ్ళ దైరము కంపించినది. ఏడుగురు దూతలు అక్కడ నిలబడి. (చేతిలో వెండి ఖడ్గమున్నది) నాతో ఇట్లనెను. "ఇంటికి వెళ్ళి ఇవ్వబడిన ఏడు ముద్రలను తెరువు." వివాహాము విడాకులు యొక్క నిజ మర్మము, సర్ప సంతానము ఇంకా ఆయా సంగతులు వెల్లడి అయినవి. వీటి గూర్చి అందరూ ఎంతో కాలము నుండి తికమక పడుచున్నారు. ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

ఏమిటది? ఆ పైకి లేపు శక్తి సంఘము లోనికి వచ్చుచున్నది. ఈ ఘడియలో ఆమెను సిద్ధపరచుచున్నది. మనము సజీవ శక్తిని సమీపించుచున్నాము. ఓ! దేవా, దానిని పొందునట్లు మాకు సహాయము చేయుము. దానిని మేము నమ్మునట్లు సహాయము చేయమని అడుగుచున్నాము.

చూచారా? అది మీ వైఖరి మీదనే ఆధారపడి యున్నది. అది మీకు దానిని బట్టియే మేలు లేదా కీడు చేయును. దానిని మీరు నమ్మవలెను. దానిని మీరు నమ్మని యెడల దాని వలన మీకేమీ మేలు జరుగదు.

105. సమూయేలు ఆ జనుల ఎదుట నిలబడి ఈలాగు చెప్పెను. "నేను యెహోవా నామములో చెప్పినది. ఎన్నడైన జరుగక మానెనా? నేను బ్రతుకుట కొరకు మిమ్మును ఎప్పుడైనా డబ్బు అడిగానా?"

"లేదు కాని మాకు రాజు కావలెను."

నేడు సంఘము ఆలాగే యున్నది. వారికి వారి స్వంత అభిప్రాయములు కావలెను. వారే మాత్రము నీ మాట వినరు. వారు నిన్ను లక్ష్య పెట్టరు. సజీవ శక్తి వారికి లేదని అందువలన అర్థమగుచున్నది.

"నేను భాషలలో మాట్లాడాను. నేను గంతులేసి అరిచాను." అని మీరందురు.

అదంతా మంచిదే. కాని ఆ పైకి లేపు శక్తి మీకు లేని యెడల మీరు గుర్తించబడుదురు. ఆ చిన్న పక్షిరాజు తన తల్లిని గుర్తించెను. అదే వాక్యము. అదే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అదే దేవుడు వాగ్దానము చేసెను. అదే ముందు చెప్పబడెను. అదే అక్షరాలా జరిగెను.

ఇప్పుడు మనము పునరుద్దాన సంచకరువును కలిగియున్నామని నిస్సదేహాముగా చెప్పగలను. పరిశుద్దులు మధ్యాకాములోనికి ఎత్తబడుటకు సిద్ధమగుచున్నారు.

106. ఈ పైకి లేపు శక్తిని నిండుగా కలిగి యుండిన యేసు ఇట్లనెను, “మీరు ఈ దేవాలయమును 40 సంవత్సరములలో కట్టితిరి. కాని ఈ దేవాలయమును నేను మూడు రోజులలో తిరిగి లేపెదను. దానిని మీరు నాశనము చేయలేరు.”
ఎందువలన? ఎందుకు యేసు దానిని చెప్పెను? మిమ్మును అడుగగోరుచున్నాను. ఎందుకు యేసు ఆ విధముగా చెప్పెను.? ఆయనకు తెలియును. ఆమేన్! దానిని మరల చెప్పెదను. ఆయనెవరో ఆయనకు తెలియును. ఆయన గూర్చి దేవునిచే వ్రాయబడిన ప్రతి మాటను ఆయన నెరవేర్చును. దావీదు ద్వారా పలుకబడిన వాడను నేనే అని ఆయనకు తెలియును.

బైబిలు మీ గూర్చి మాట్లాడుచున్నదని మీరెరుగుదురా? క్రీస్తునందు మీకున్న స్థానమును మీరెరుగుదురా?మీరు క్రీస్తు నందున్న యెడల నూతన సృష్టి యగుదురు. ఈ వాక్యము మీలో ప్రతి దినము జీవించవలెనని మీరెరుగుదురా? నిశ్చయంగా అది మీదే మీరు పక్షిరాజులు అది మీ ఆహారము.

107. దైవ శక్తి ద్వారా దానిని తాను చేయగలనని ఆయన ఎరిగి యుండెను. ఎందుకనగా ఆయన దానిని చేయునని ప్రవచించెను. అందుకే ఆయన నిర్భయముగా ఈలాగు చెప్పెను. "ఈ దేవాలయమును నాశనము చేయుడి. నేను మూడు దినములలో తిరిగి లేపెదను. ఎందుకనగా దావీదు ఈలాగు చెప్పెను. " ఆయన ఆత్మను నేను పాతాళములో విడిచిపెట్టను. నా పరిశుద్దుని కుళ్ళుపట్టనియ్యను." ఆయన శరీరములోని ఒక్క కణము కూడా కుళ్ళిపోదని ఆయనకు తెలియును. 72 గంటలలో అది కుళ్ళిపోవును.

" ఈదేవాలయమును నాశనము చేయుడి. దీనిని నేను మూడు దినములలో తిరిగి లేపెదను." అని ఆయన చెప్పెను. ఎందువలన? ఆయన పూర్తి సజీవ శక్తితో నిండి యుండెను. ప్రతి మాటను ఆయన జీవింపజేసెను. ఆయన వెనక్కు తిరిగి దేవుడు తనను గూర్చి వ్రాసిన ప్రతి మాటను చూచెను. ఆ ప్రవక్తలు పలికిన దానిని ఆయన నెరవేర్చును. అది కూడా నెరవేరునని ఆయనకు తెలియును.

108. దేవుడు చెప్పిన ప్రతి మాటకు నీ ఆత్మ "ఆమేన్" అని చెప్పును. విశ్వాసిగా నీ జీవితములో అది నెరవేరును. నీ సంఘము అందుకు వేరుగా బోధించుచున్నదా? అయితే నీవు జాగ్రత్తపడుము. అది డేగ!

గమనించండి. పక్షిరాజులు విశ్వసించును. వారేమీ ప్రశ్నించరు. దానిని వారు నమ్ముదురు. 109. వాక్యము దానిని చెప్పెను. గనుక అది ఆలాగు జరుగునని ఆయన ఎరుగును. ఆయన గూర్చి వ్రాయబడిన ప్రతి మాట నెరవేరెను. అది దేవుని శక్తి ద్వారా వ్రాయబడినదని ఆయనకు తెలియును. ఆయన ఆ విధముగా చేయునని పరిశుద్ధ ప్రవక్త ప్రవచించెను. ప్రవచనము ఎన్నడూ తప్పిపోదు. అది తప్పజాలదు. దేవుని వాక్యము ఎన్నడూ తప్పిపోదు. అది ఆత్మ ద్వారా వ్రాయబడెను

యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించిన యెడల మీ మర్త్య శరీరము కూడా తిరిగి లేచును. దాన్ని కాల్చివేసినా, బూడిద చేసినా, దాన్ని ఏమి చేసినా గాని దేవుడు తిరి లేపును. ఎందుకనగా ఆయన ఆ విధముగా చెప్పెను.

దేవుని యొక్క ప్రతి పరిశుద్ధునికి ఈ వాగ్దానము సత్యమని తెలియును. కాబట్టి సోదరులారా భయపడవద్దు. మనము ఇప్పటికే ఈస్టరులో యున్నాము.
110. రూపాంతరపు కొండను చూడండి. ముగించుకోక ముందు రూపాంతరపు కొండను చూద్దాం. మనందరము ఆ రూపాంతరములో చూపబడినాము. నేడు మనము ఏమి గ్రహించుచున్నాము? నేటి స్థితిని చూడండి. ఇది దేవుని యొక్క మేల్కొలుపు శక్తి. మనమందరము అచ్చట ఉన్నాము.

మృతిచెందిన పరిశుద్ధులను మోషేలో చూడగలము. అక్కడ యేసు యొక్క పునరుద్దానమున్నది. ఆయన మహిమను పొందెను. మోషే, ఏలియా, యేసు అక్కడ నిలబడి యుండిరి. మృతిచెందిన పరిశుద్దులు, ఎత్తబడిన పరిశుద్దులు, మహిమపరచబడిన యేసు అక్కడున్నారు. ఓ, మై.

111. మంచిది ఒక వ్యక్తి ఇట్లు చెప్పగా విన్నాను. "మీరు అటువంటి శక్తిని కలిగియున్నచో వెళ్ళి అందరికీ ఆ కార్యములు చేయగలమని చెప్పండి." నిజమగు క్రైస్తవుడు ఆ మాట పలుకడు నిశ్చయంగా మనకు ఆ శక్తి ఉన్నదని చెప్పుట లేదు. గాని ఒకటి చేయగలము.

వారందరి మీద ఈ శక్తి యుండుటను వారు చూచారు. వారు యేసును మాత్రమే చూచారు. ఒక నిజ విశ్వాసి తన వెనుక ఏదయినా శాఖ ఉన్నదా? లేదా అని చూడడు. ఆయన నీలో ఒకటి మాత్రమే చూడగోరుచున్నాడు. మహిమన్వితుడగు క్రీస్తును ఆయన చూడగోరుచున్నాడు. అందువలన తేడా కనబడును. నిజమగు అసలయిన రూపాంతరపు అనుభవము. మాత్రమే యేసు క్రీస్తును మహిమపరచును.

ఆయన మోషేను మహిమపరచలేదు. ఆయన ఏలియాను మహిమపరచలేదు. మరి దేనిని ఆయన మహిమపరచలేదు. మహిమపరచబడిన క్రీస్తును మాత్రమే వారు చూచిరి. నిజమగు ఏ విశ్వాసి అయినా గాని తన హృదయమందు యేసు క్రీస్తుని మాత్రమే మహిమపరచగోరును. జనులు దానిని చూడవలెననియే ఆయన ప్రయత్నించుచున్నాడు. మా సంస్థలో వచ్చి చేరండి అను మాటలు వినవద్దు. మీరు విచ్చ అది చేయండి, ఇది చేయండి అని కాదు. ఓ! అలాగు చేయవద్దు. దేవుని వాక్యమును చూడండి క్రీస్తు మహిమపరచబడి ఈ దినపు వాగ్దానమును నెరవేర్చుచున్నాడు. ఇది గొప్ప పునరుద్ధాన ఘడియా ఆయనతో మనమున్నాము. ఆయన మాంసములో మాంసము,ఆయన ఎములో ఎముకమై యున్నాము. దీనిని ఎరుగుట వలన మనకు సంతోషము కలుగును. ఎంతో గొప్ప ఆనందము!

112. నిజమగు విశ్వాసి దీనిని గుర్చి మాత్రమే జాగ్రత్త పడును. ఒక సంస్థను గూర్చి వారు జాగ్రత్త వహించరు. ఇతరు స్త్రీలు ఎమనుకొందురో అని తలంచరు. నిశ్చయముగా వారు దానిని లెక్కచేయరు.

ఇతర స్త్రీలు చేయుచున్న క్రియలను వారు చేయరు. ఈ పురుషులు అట్టి పనులు చేయరు. వారు ఒక సంస్థను ముద్దు పెట్టుకొనుచూ దానికి హత్తుకొని యుండరు. భోజనపు టిక్కెట్టు లేకపోయినా, బయటకు త్రోసివేయబడినా వారు లెక్కచేయరు. వాటి గురించి ఏమీ పట్టించుకొనరు. అది వారికి బుద్దిహీనతగా కనబడును. యేసు క్రీస్తును మహిమపరచవలెనను ఒకే ఒక కోరిక
వారి హృదయములో యుండును.

వారి ప్రవర్తన దేవునికి తగినట్లుగా యుండును. యేసు క్రీసు మహిమ కొరకు మాత్రమే వారు సంపూర్తిగా పనిచేయుదురు. యేసు అనగా ఎవరు? వాక్యము. అది నిజమేవా? ఆయన యొక్క బయలుపరచబడిన పద్దతులు. ఆయన పునరుద్దానమును. నిరూపించుచున్నివి.

ఏమిటిది? ఆయన వాగ్దాన వాక్యమునకనుకూలముగా నీ జీవితమును. చూచుకొందువు.

ఆయన విన్న నేడే నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆయన ఇంకా సజీవుడుగా యున్నాడని

రుజువగుచున్నది. 113. దేశములోని ప్రతి తలుపు నాకు మూసివేసినా నేను ఏమీ భయపడను. నావయస్సు 56 సంవత్సరాలని చెప్పాను. నేను కుప్పకూల వచ్చును. నేను గుండె పోటు వచ్చు వయస్సులో యున్నాను. అన్ని రకముల వయస్సును చూచాను. ఏమీ తేడా లేదు. నేను బాలునిగా ఉన్నపుడు ఎట్లున్నదో ఇపుడు అలాగే యున్నది. నా నంబరును ఏ ఘడియలోనైనా పిలవవచ్చును. నేను భూమి మీద జీవించానని ఎవరికి తెలియకపోయినా పరువాలేదు. అందులో నాకేమీ తేడా కనబడుటలేదు. నేను భూమి మీద జీవించితినని చెప్పుటకు ఎట్టి గొప్ప జ్ఞాపకార్థ భవనములు లేదా విగ్రహములు నిర్మించనక్కరలేదు.

114. మీరందరు ఒక సంగతిని తెలిసికొనవలెనని నేను కోరుచున్నాను. అది ఏమనగా యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా యున్నాడు. ఆయన యొక్క సంచకరువును. నా హృదయములో పట్టుకొనియున్నాను.

నేను సముద్రములో మునిగిపోవచ్చును. నేను ఆఫ్రికాలో చంపబడ వచ్చును. నాకేమి జరుగునో నాకు తెలియదు. కాని ఒక సంగతిని నేనెరుగుదును. నేను సంచకరువును పట్టుకొని యున్నాను. హల్లెలూయా! ప్రతీ ద్వారము మూయబడవచ్చును. అందువలన నాకేమీయు చింత లేదు. ఎవరినో లేదా ఏ సంస్థనో, లేదా నన్ను నేనో, మరేదో గుంపునో మహిమపరచవలెనని ప్రయత్నించుట లేదు. యేసు క్రీస్తు మృతులలో నుండి లేచెననియు, ఆయన ఆత్మ జీవించుచున్నదనియు మాత్రమే జనులు చూడవలెనని నేను కోరుకొనుచున్నాను. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాడు.

115. యేసు ఈలాగు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు, "భయపడకుడి, నేను మృతుడనైతిని గాని సదా కాలము జీవించి యున్నాను." ఇప్పుడు మనము ఆయన ద్వారా విమోచింపబడి ఆయనతా కూడా తిరిగి లేచి యున్నాము. ఆయనతో కూడా పరలోక స్థలములందు. ఇప్పుడు కూర్చొ యున్నాము.

ఈ ఆత్మ మనలో సంచకరువుగా యున్నది. సందేహములన్నియూ కొట్టి వేయబడిన అందువలన చూడగలము. క్రీస్తు జీవించుచున్నాడు. నేను కాను క్రీస్తే జీవించుచున్నాడు. జీవించున్న. మీరు కారు గాని మీలో జీవించుచున్నది. యేసుక్రీస్తు ద్వారా మెతడిస్టు. బాప్టిస్టు, పెంతెకో మొదలగు అభిప్రాయములన్నియూ కొట్టివేయబడెను
116. రూపాంతరపు కొండ వలె యున్నది. ప్రవక్తలందరు సమాప్తమయిరి. లూథరను, మెతడిస్టు, ప్రెస్పిటేరియను మొదలగునవి సరియే కాని "ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినుడి." ఈఘడియ యొక్క వాక్యము ఇదే. ముద్రల ఘడియ ఇది ఇన్ని సంవత్సరములు మర్మములుగా దాగియున్నవి. కాలము యొక్క ఆ గొప్ప పిరమిడ్ తలరాయిని తీసివేసినది. దావీదు నక్షత్రము అందువలన తిరిగి దాని స్థానములోనికి వచ్చినది. సజీవ దేవుని యొక్క గొప్ప సంఘము పక్షిరాజు రెక్కల వలె పైకి లేచును. మహిమలోనికి ఎగిరిపోవును. అవును. ఇప్పుడు మనము మన శరీరములో క్రొత్త భాషలు మాట్లాడుచున్నాము. ప్రవచించుచున్నాము, ముందుగా చూచుచున్నాము, రోగుల మీద చేతులుంచుచున్నాము. లోకము, లోక సంగతులు చచ్చినవి. మనము మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాము. ఇప్పుడు మనము శక్తిని పట్టుకొని యున్నాము. హల్లెలూయా!

ఆ పునరుద్ధాన ఉదయమున మరణపు ముద్రలు విప్పబడును. మనము లేచెదము. హల్లెలూయా! మనము లేతుము ఆమేన్.

117. మనలను లేవకుండా ఆప కలుగు దయ్యములు పాతాళములో లేవు. ఈ ఘడియ కొరకు మనము దేవునిచే ముందుగా నిర్ణయించబడితిమి. మన ద్వారా దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడును. మనము దేవుని సన్నిధిలో జీవించుదుము. దేవుని వాగ్దాన వాక్యముచే బ్రతుకుదుము.

నన్ను లేవకుండా ఆపగల అపవాది పాతాళములో లేదు. ఆ ఉదయమున నా ముఖమును కనబడనీయకుండా మూయగల ద్వారము ఉండదు. ముద్రలు తొలగిపోయెను. హల్లెలూయా! నేను స్వాతంత్ర్యము పొందాను. నేను మృతులలో నుండి తిరిగి లేచి యున్నాను. యేసు క్రీస్తులో ఒక క్రొత్త జీవము పొందియున్నాను. నేను మాత్రమే కాదు. ఇక్కడ కూర్చొని యున్న దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రతి స్త్రీ పురుషుడు, బాల, బాలికయు లేచును. క్రీస్తు నందు ఒక నూతన సృష్టిగా యున్నాడు. నీవు పక్షిరాజువు.

118. నేడు మనము సజీవులము. సదా కాలము పునరుద్ధానమును అనుభవించెదము. ఆయన జీవించుచున్నాడు గనుక మనము కూడా జీవించుదుము. ఆయన మనలో జీవించుచున్నాడు. మనలను సజీవులనుగా చేయుచున్నాడు. ఆయనను మృతులలో నుండి లేపిన ఆత్మ మనలో జీవించిన యెడల ఆ గొప్ప నిత్యత్వ ఈస్టరులో మన మర్త్య శరీరములు కూడా లేపబడును. దేవునికి మహిమ!

ఓ! ప్రపంచమునకు తీసికొనండి. మీఇష్ట మొచ్చినది నా యొద్ద నుండి లాక్కొనండి. కాని యేసును ఇవ్వండి. ఆమేన్. నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయనే నా ప్రపంచము. మీరాయనలో భాగమై యున్నారు. నేను మీలో భాగమై యున్నాను. మీరు నాలో భాగమై యున్నారు. మనమందరము కలిసి ఆయనలో భాగమై యున్నాము.

119. ఓ! క్రైస్తవులారా! ఎట్టి తరుణము మనకున్నది! పరిశుద్ద పౌలు కలలో కూడా ఎరుగని ఒక అవకాశము ఇప్పుడు మనము కలిగియున్నాము. హనౌకు, ఏలీయా తదిదరులకు లేని అవకాశమును
ఇప్పుడు మనము కలిగియున్నాము.

ఎక్కడో ఒక చిన్న గొర్రెపిల్ల యున్నది. అది కూడా మంద లోనికి వచ్చు వరకు ఆయనకు తృప్తిలేదు. దేవుని సహాయము వలన, దర్శనము ద్వారాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ద్వారాను నేను సముద్రములను దాటి తిరిగి వచ్చాను. బహుశా ఆ చిన్న చివరి గొర్రెపిల్ల ఒక వల్లది కావచ్చును. వారికి అసలు ఆత్మ ఉన్నదన్న సంగతియే తెలియదు. కానీ ఆ తేడా దేవునికి తెలియును. అది ఎక్కడున్నా గాని దానిని నా జీవితపు చివరి వరకు వెదకుదును.

120. ఈ కఠినమగు సంగతులు చెప్పుట ద్వారా నేను ఎన్నడూ నా సోదరులను బాధపెట్టలేదని తలంచుచున్నాను. మీరు సంఘమునకు వెళ్ళరాదని నేను చెప్పుటలేదు. నిశ్చయముగా మీరు సంఘమునకు వెళ్ళవలెనని చెప్పుచున్నాను. మీరెక్కడికి వెళ్ళుచున్నారో అక్కడికే వెళ్ళండి. "కాని దానికి చెంది యున్నాను." "దీనికి చెంది యున్నాను." అని చెప్పి సంతృప్తి చెందవద్దు. అది నీ నిరీక్షణగా యుండరాదు. ఓ సోదరి సోదరుడా, క్రీస్తుక చెంది యుండుము. ఆమేన్!

ఆ సంచకరువు నీలో లేని యెడల ఇపుడు జీవమునక లెమ్ము ఇపుడే నీవు దానిని పొందవా? ఈ గది దానితో పూర్తిగా నిండి యున్నది. నా అంతట దానిని నేను అనుభవించుచున్నాను. ఇక్కడ దేవుని శక్తి యున్నదని నాకు తెలియును. గొప్ప దర్శనములను ఆయన చూపించెను. ఎన్నో సంగతులను ముందే చూపించెను. వాటిలో ఏ ఒక్కటియూ తప్పిపోలేదు. ఆ మహామహుడు చెప్పిన దానిని ఎవరూ తిరస్కరించలేదు. ఎవరూ దానిని మూయలేరు. ఎవరూ దానిని తెరువలేరు. ఆయన మృతి పొందియు ఇప్పుడు జీవించుచున్నాడు. ఈ రోజున ఫోనిక్సులో ఆయన సజీవునిగా యున్నాడు. క్రొత్తగా జన్మించిన పూవ్వుల మద్య ఆయన నడుచుచున్నాడు.

121. ఆ ఈస్టరు ఉదయమున ప్రతి లిల్లీ పువ్వు. ప్రతి గూలాబీ పూవ్వు యొక్క చెంపల మీద చిన్న మంచు బిందువులు. కన్నీటి వలె జారుటలో ఆశ్చర్యము లేదు. ఎందువలన? తాము వచ్చిన భూమిలో ఎక్కడో ఒక చోట ఒక నిత్యత్వపు పుష్పము పైకి వచ్చుచున్నదని ఆ ప్రతి పువ్వు ఎరుగును. ఒక దినమున దాని స్థానమును అది తీసికొనును. ఇది నిజము

మన చెంపల మీద నుండి ఆనందబాష్పములు రాలుటలో ఆశ్చర్యము లేదు. మన హృదయములు వణకుచున్నవి. మన జీవితముల లోనికి అదే రూపాంతరపు శక్తి వచ్చుట మనము చూచుచున్నాము. అది మనలను నింపుచున్నది. పరలోకము నుండి వచ్చు భాషతో మనము మాట్లాడుచున్నాము.

ఆయన సన్నిధిలోనికి మనము ఎత్తబడియున్నాము. ప్రవచనము, ముందు జ్ఞానము సరిగ్గా వాక్యమునకు సరిపోవుచున్నది. దానికి విరోధముగా అది ప్రవచించుచున్నదో దానిని నమ్మవద్దు. కాని అది వాక్యానుసారముగా యున్నచో అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని ముందె తెలియును. "భయపడకుడి నేను మృతుడనైతిని గాని సదాకాలము జీవించి యున్నాను."

అది దేవుని యొక్క ఈస్టరు ముద్ర. ఈ వాక్యము యొక్క ప్రతి అక్షరమును మీ హృదయములో అది ముద్రించును. ముద్ర
అనగా ఏమిటి? మీరు వ్రాయబడిన పత్రికలై మనుష్యలందరి చేత చదువబడుచున్నారు. మీకది తెలియును. దేవుడు నిన్ను తన సాత్తుగా చేసికొనెను. ఈస్టరు ముద్రతో ఆయన నిన్ను ముద్రించెను. నీవు క్రీస్తుతో కూడా తిరిగి లేచి యున్నావు. నీవిప్పుడు క్రొత్త సృష్టివి. ఈ ఉ దయమున నీవు ముద్రించబడని యెడల మనము తలలు వంచునపుడు అందుకై ప్రార్ధించుడి.

(జనులలో ఒకరు ప్రవచన వర్తమానము అందించిరి -సంపా)

దానిని మీరు విన్నారా? మీ తలలు వంచి ఇప్పుడు ఆలోచించండి రోమా 8:11 -క్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో ఉన్న యెడల అది మీ మర్త్య శరీరములను కూడా పైకి లేపును.)

122. జనులారా, దేనికొరకు మనము ఎదురు చూడవలెను? ఇంకా ఏమి విడువబడి యున్నది? ఫార్మోసాను, ఇంకా మిగిలిన ప్రపంచమును చూడండి అణు క్షిపణులు ప్రపంచమును తాకుటకు సిద్దముగా యున్నవి. భయము, ఉద్రిక్తలు: కేకలు వినండి ఆ బయటి సినిమాలలో మురికి సరసోక్తులు చెప్పుచున్నారు. రాత్రి యందు సమాధి యొద్దకు వెళ్ళు బాలుడు. భయముతో ఈల వేసినట్లున్నది. అంతా బాగానే యున్నదని ఇతరులను నమ్మించుటకు ఆ బాలుడు అలాగు చేయును. మీరు మోసపోకుడి. ప్రభుని యొక్క రాకడ సమీపములోనే యున్నది.

123. ఒక రోజున ఒక జాలరి నా యొద్దకు వచ్చి గ్రీసులో వచ్చిన భూకంపమునకు ముందు చేపలు ఎట్లు కలవరపడి మేత తినలేదో చెప్పెను. ఏమిటది? అవి ఉపరితలములో లేవు. రెండవ సారి అది జరిగినపుడు కూడా అవి అలాగే ప్రవర్తించినవి. ఏదో జరుగనై యున్నదని చేపలకు తెలిసిపోయినది. అవి ఆహారము ముట్టలేదు.

చేపలు నిర్మలముగా ఆ నీటిలోని మొక్కలను తినును. అవి ఉదయకాలమున ఆహారము తినును. సముద్ర అడుగు భాగము కదిలిపోయి అలజడి రేగగానే అవి ఒడ్డుకు వచ్చి ఆ రాళ్ళ మీద ఆగిపోవును. ఆ చేపలకు జరుగక ముందె దానిని గూర్చి తెలియును.

124. ఇండియాకు వెళ్ళుచూ నేను వార్తా పత్రికలో చదివాను. "భూకంపము తప్పక అయిపోయి యుండును" అని వార్త యున్నది. కొన్ని దినముల పాటు పక్షులు రాళ్ళలోని తమ గూళ్ళకు తిరిగి రాలేదు. మండుటెండకాయుచున్నా గాని పశువులు చెట్ల నీడకు రాలేదు. గొర్రెలు పొలము మధ్యలో కూడుకొని ఒకదానికి ఒకటి హత్తుకు పోయినవి. రెండు, మూడు రోజులకు భూకంపము వచ్చుననగా అవి ఏవియూ ఆ రాళ్ళ యొద్దకు వెళ్ళలేదు. ఎందువలన? వాటికి తెలిసినది. ఏదో జరుగనైయున్నదని ఆ గొర్రెలకు తెలియును. ఏదో జరుగుచున్నదని ఆ పక్షులకు తెలియును. ఎదో జరుగనై యున్నదని. ఆ పిట్టలకు తెలియును. ఏదో జరుగనై యున్నదని ఆ చేపలకు తెలియును. ఆ దేవుడే ఓడలోనికి ఆ జంతువులను నడిపించెను.

ఆత్మ నింపుదల కలిగిన జనులారా, ఏదో జరుగనై యున్నదని మీకు తెలియదా? ఏదో విశ్వ సంచలన కార్యము కొరకు ఎదురు చూడవద్దు. ప్రభువైన యేసు రాకడ వచ్చును. గుర్తుంచుకొనండి ప్రభువు యొక్క వాగ్దానమును. జ్ఞాపకముంచుకొనండి. ఆయన మాటలు గుర్తు పెట్టుకొనండి.
125. వెంటనే మీరు రండి ఆ పెద్ద గోడలను దాటిరండి, పునరుద్ధానము సమీపములోనే యున్నది.

ఆ పునరుద్ధానములో వెళ్ళుడుమను నిరీక్షణ లేనివారు, నిశ్చయత లేనివారు. ఇక్కడ ఎవరైనా యున్నారేమో. ఆ ఎముకలలోనికి పునరుద్దాన శక్తి వచ్చును. చర్మపు పురుగులు దానిని నాశనము చేసినా గాని, అణుబాంబు నిన్ను నిలువున చీల్చినా గాని, నీలో నున్న పునరుద్దాన శక్తిని మాత్రము ఏది నాశనము చేయలేదు. సోదరీ, సోదరుడా. నీ ప్రశస్తమగు పేరు అక్కడున్న గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడి యున్నది. ఎవరూ దానిని తుడిచివేయలేరు. ఆయన తన రక్తమిచ్చి నిన్ను కొనెను. ఆ గ్రంథములో నుండి నీ పేరును తుడిచి పెట్టగల రబ్బరు ప్రపంచములో లేనే లేదు. ఆ నిశ్చయత ఇంకా నీకు లేనిచో ఇప్పుడే ఆ తరుణము!

కొన్నిసార్లు నీవు ముళ్ళ తీగె ప్రక్కనుండి పరుగిడుచూ ఎట్టి అపాయమునకు గురి కాకపొవచ్చును కాని ఈ కంచెను. నీవు ఆ విధంగా దాటజాలవు. నీవు దనికి చిక్కబడుదువు. ఆ చిక్కుకొను అవసరము నీకు లేదు. ఇప్పుడే ఆ ఎర్రని దీపము వెలుగుచున్నది. దానిని దాటి పొమ్ము. నీ స్వంత అభిప్రాయములను దాటి వెళ్ళుము. లోక సంగతులను దాటి వెళ్ళుము.

126. రమ్ము అందరము కలిసి ఈ గొప్ప పునరుద్దాన ఉత్సవములో పాలు పొంది తిరిగి లేచెదము.

ఈ వారము నీ హృదయములో ఆ ఉత్సవమును. జరుపుకొనగలవా? లేని యెడల ఇప్పుడే నీ చేతిని దేవుని వైపు ఎత్తి ఈలాగు చెప్పుము. " దేవా, ఆ నిశ్చయత నాకు లేదు. అదంతయూ నేను చేయగలనో లేదో నాకు తెలియదు. నీవు నాకు సహాయము చేయవా? ప్రభువా, నీ వైపు నా చేతులెత్తుచున్నాను. నాకు సహాయము చేయుము."

దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. అది మంచిది. "ప్రభువా, నీవు నాకు కావలెను. నాకు సహాయు చేయుము. నేను లేవగోరుచున్నాను. ఇప్పుడే ఆ సంచకరువు పొందగోరుచచున్నాను. దానిని నేను ఇప్పుడు తెలిసికొన గోరుచున్నాను. ప్రభువా, అది నిజమని నేను తెలిసికొనగోరుచున్నాను. ప్రభువా అది నిజమని తెలిసికొనగోరుచున్నాను."

నేను తప్పు చేయలేను. నేను తప్పు చేయగోరను. సమయము మించిపోవుచున్నది. నేడే అనుకూల దినము. ఆగవద్దు. ఇదే ఆ దినము.

127. కొంత కాలము క్రిందట నేను బోధించుచుండగా ఒక నల్లజాతి సోదరుడు ఆ చోట నన్ను కలిసికొనెను. ఇట్లనెను. “రెవరెండ్, నేను ఒక సంగతిని చెప్పెదను నీవు సరియైన వ్యక్తివి. నేను ఎప్పుడో నా ప్రభువుతో మాట్లాడాను. ఆ ఉదయమున నా చేతిలో ఆ టిక్కెట్ యున్నది. అది సరిగి ఉన్నదో లేదో నేను చూడగోరుచున్నాను. లేని యెడల ఆ నది యొద్ద చాలా తొందర ఎదుర్కొందును. నేను ఆ నది యొద్దకు వచ్చుచున్నాను. అక్కడ నేను కష్టమునకు గురి కారాదు. ఇక్కడే అన్ని సరిచేసికొనగోరుచున్నాను."

అది నిజము నీ వీసా యున్నదా? నీకు పాస్పోర్టు ఉండి యుండును. కాని వీసా లేని యెడల ఆ దేశములో ప్రవేశించలేవు. అది నీకు తెలియును అంతా సిద్ధముగా యున్నదా? లేని యెడల
ఇదే సిద్దపడు సమయము.

128. మనకు వేర్వేరు మార్గములున్నవి. కొందరు వచ్చి కరచాలనము చేసిన చాలనుకొనుచున్నారు. అది మంచిదే దానికి నేను ఒక్క మాటకూడా ఎదురు చెప్పను. కాని నా పద్దతి చెప్పుచున్నాను. వేదిక యొద్దకు వచ్చినందు వలన నీకు విశ్వాసము రాదు. సేవకునితో కరచాలను చేసినందు వలన నీకు విశ్వాసము రాదు. కాని నీవు దేవునిచే పిలవబడినచో పక్షిరాజుగా ఉందువు. ఒక్క కేక నీకు అర్ధమగును. నీవు నమ్ముము. నీవు నిజంగా నమ్మిన యెడల నేను నీతో కలిసి ప్రార్థించెదను.

ఆ చిన్న పక్షిరాజు ఇక ఆ ధాన్యపు గాదె యొద్ద నిలిచియుండుననుకొనుచున్నారా? ఉ ండదు. స్నేహితుడా, ఇక ఏ మాత్రము ఉండదు ఇప్పుడే పైకెత్తబడుదువు, దేవుని కృప ఇచ్చటున్నది.

129. పరమ తండ్రీ, మేము ముగింప ఘడియ వైపుకు వచ్చుచున్నట్లు మా కర్ణమయినది. ఇక్కడ మరెంతో కాలము ఉండము. మా వయస్సును బట్టి కాదు గాని కాలమే సమాప్తమగుచున్నది. ఇది జరుగుటను ఇక్కడున్న యువకులు చూడగలరు. కాని అది ఈ రోజే జరుగ వచ్చును. ప్రభువా, ఆ ఘడియ, ఆ నిమిషము మాకు తెలియదు. కాని ఇవన్నీ జరుగుట చూచునపుడు గ్రహించమని నీవు చెప్పితివి. చాలా కాలము నుండి అవి జరుగుచున్నవి.

శాస్త్రజ్ఞుని ప్రకారము ఆ ఘడియ ఎప్పుడో దాటి పోయానని తెలియును. ఆరు లేదా ఏడు సంవత్సరముల క్రితమే అర్థ రాత్రికి 3 నిమిషములే యున్నదని విన్నాము. ఎంత సమయము అయినదో మాకు తెలియదు. కాని మెమందరము అక్కడుండ వలసిన సమయము వచ్చినది. ఓ దేవా, ఆ నిశ్చయత మాకు తెలియజేయుము! దేవుని యొక్క ప్రతి వాగ్దానమునకు మా హృదయము " ఆమేన్" పలుకును గాక! ఆత్మ మాలోనికి వచ్చి మమ్మును లేవనెత్తుట మేము చూచెదము. గాక!

దేవా, ఈ ఉదయమున మా సోదరులు దానిని చూచునట్లు కృప చేయుము. నా సోదరులది చూచుదురు గాక! నా సోదరీలు దానిని చూచెదరు గాక! ప్రభువా వాక్యము పట్లకు వారిని ఆకర్షించినది ఏదో వారిలో యున్నచో వారిని వెంటనే అందులో నుండి విడిపించుము. తండ్రీ దయ చూపుము.ఇదంతయూ ఇప్పుడు నీ చేతులలో యున్నది.

నేను ఎన్నో సంగతులలో తప్పి పోయానని నాకు తెలియును. ఇంకా తప్పిపోవుచూనే యున్నాను. కాని ప్రభువా, నాకు తెలిసినదంతయూ నేను చేశాను. ఇపుడిది నీ చేతులలో యున్నది. యేసు నామములో వారు నీ వారు. తండ్రీ, వారిని చేర్చుకొనుము.

130. "నా హృదయ పరిస్థితి నాకు తెలియును. నేను విశ్వాసిని." మీరు మృతులలో నుండి లేపబడితిరని ఎందరు తమ హృదయములో నిస్సందేహముగా నమ్ముచున్నారు? ఓ! ఇటువంటి కూటములో ఏమి జరుగగలదు?

ఆలస్యమయినదని నేనెరుగుదును. కాని ఇప్పుడేమి జరుగగలదు? జరుగనై యున్న దాని గురించి ఆలోచించండి! సజీవ శక్తి ఇప్పుడు మీలోనే యున్నది.

మీ చేతులు పైకెత్తుడి మీరు దేవునితో ఇట్టి ప్రమాణము చేసి యుందురు;
"నాకు ఏదో జరిగినదని నేనెరుగుదును నేను ఉండవలసిన చోట ఉండలేదు.”

131. నేను కూడా లేను. నేను ఉండ వలసిన చోటుకి చాలా దూరమై పోయాను. కాని ఒక సంగతిని నేనెరుగుదును; నేను మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాను. నాకు ఒక సంగతి జరిగినదని ఎరుగుదును.

ఒక వృద్ధునిగా ఇది చెప్పుట లేదు. చాలా సంవత్సరాల క్రితమే అది జరిగినది. హాస్పిటల్ లోనికి నడిచి వెళ్ళిన రోజును నేనెరుగుదును. నా ముందు గొప్ప సవాలున్నది. నా భార్య చనిపోవుట నేను చూచాను. ఆమె నన్ను పిలచినది. "నేను వీధి మూలన నిలబడి బోధ చేసి, రోగులకు ప్రార్ధించుట తప్ప మరేమి చేశాను?" అప్పుడు సాతాను నాతో ఇట్లన్నది, "నీ ప్రార్ధనకు ఆయన జవాబు ఇయ్యడు." నా భార్య చావును నేను చూచాను. కాని ఆమెలో పునరుద్దాన శక్తి యున్నదని నేనెరుగుదును. ఆ ఎముకలు తిరిగి లేచును.

నా చిన్న బిడ్డ అక్కడ పడియుండుట చూచాను. "దేవా. బిడ్డను తీసికోవద్దు" అని నా చేయి వేసి చెప్పాను. ఆయన తెర క్రిందకి దింపి ఈలాగు చెప్పినట్లయినది. "నీ మాట ఇక నేను వినను.” సాతాను ఇట్లన్నది, "చూచావా? ఆ ఒక్క మాట చాలును." దేవుడు లేడని నాకు చెప్పలేదు గాని ఆయన నన్ను ప్రేమించుట లేదనియు, నా గూర్చి శ్రద్ద చూపుట లేదనియు చెప్పినది. చాలా వాధించినది. “నీవు ఒక యువకునివి. 20 సంవత్సరాల ప్రాయములో ఉన్నావు. నీ భార్య చనిపోయి అక్కడున్నది. నీ బిడ్డ కూడా చనిపోవుచున్నది. నీవేమో ఆయన గొప్ప స్వస్థత నిచ్చువాడని, ఏదేదో చెప్పుచున్నావు. చూడు. ఆయనేమి చేశాడు? ఒక్క మాట కూడా కనీసము నీతో చెప్పలేదు. ఆయన తనే తల ఊపి వెళ్ళిపోయాడు. అంతే గదా జరిగినది. ఆమెను ఆయన స్వస్థ పరచగలడు. గాని ఆయన నిన్ను ప్రేమించుట లేదు. నీ గూర్చి ఆయనకు చింత లేదు. నీ బిడ్డను చావనిచ్చెను. ఈ చీకటి ఘడియలో కూడా ఆయన నీ ప్రార్ధన వినలేదు."

132. అపవాది చెప్పినదంతా నిజమే. "నీవేమి చేశావు? నీవు దినమంతా పని చేశావు అలసటలో నిలబడలేకపోతున్నావు. వీది మూలల్లో అర్థరాత్రి పన్నెండు లేదా ఓంటి గంట వరకు నీవు నిలబడి బోధించావు. మధ్యలో ఆసుపత్రికి ఫోను చేసి అడిగావు. వచ్చి కుర్చీలో కూర్చొని రెండు, మూడు గంటలు నిద్రపోయి మరల పనికి వెళ్ళిపోయావు. మరుసటి రాత్రి అంతే నీకు 21 లేదా 22 సంవత్సరాల వయస్సు నీకు తెలిసిన ప్రతి నీ స్నేహితుడు, ప్రతి యువతి. ప్రతి యువకుడు నిన్ను పిచ్చివాడని పిలుచుచున్నారు. నీవేమి చేశావు? నీకు నీవే వెర్రివానిగా ఉన్నావు. కాదా?" అని చెప్పినది.

నేను వానితో దాదాపు సమ్మతింపదలిచాను. కాని నా అంతరంమందు ఒక పైకి లేపు శక్తి యున్నది. నేనిట్లు చెప్పాను, “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనెను. ఆయననామమునకే స్తుతికలుగును గాక!

"నా ఆశలన్నీ ఆడుగంటినపుడు ఆయనే నాశ, ఆయనే నా ఆశ్రయము.
కదలని బండయగు క్రీస్తు మీద నిలబడియున్నాను. తక్కినదంతా కూలిపోవు ఇసుకయే ఆయన బూర ధ్వనితో వచ్చినపుడు నేను ఆయనలో కనుగొనబడుదును."

వన్నీ మురికి గుడ్డలే.

నా స్వంత నీతి కాదు గాని ఆయన నీతి వస్త్రమును ధరించుకొన్నాను నా

నా బోధను బట్టి నేను పరలోకమునకు వెళ్ళగోరుట లేదు. నా దర్శనముల బట్టి నేను పరలోకమునకు వెళ్ళగోరుట లేదు. నా హృదయములో ఆయన కృపను నేను పట్టుకొని యున్నాను. గనుక నేను పరలోకమునకు వెళ్ళదను అలాగే మనమందరబు వెళ్ళుదుము.

133. ఓ, స్నేహితుడా, నీవు ఈ శరీరములో ఒక భాగముగా యున్నావు. మీరు దేవుని పిల్లలు, మీ నిరీక్షణను నిర్మించుటకు ఇది చూపుచున్నాను. నేను మీ దృష్టిలో మేలు పొంది మీకు సత్యము చెప్పియున్నాను. సంవత్సరాల క్రితము ప్రవక్త చెప్పినట్లే నేను చెప్పాను. నన్ను నేను ప్రవక్తనుగా చేసికొనుటలేదు. నేను మీకు సతయ్యము చెప్పుచున్నాను. ఆయన చెప్పినది ఎన్నడైనా జరుగక మానెనా? ఈ ఫోనిక్సులో మిమ్మును 20 సంవత్సరాల నుండి నేనెరుగుదును ఆయనతో నేను చెప్పగోరుచున్నాను. పాటను సహో. అవుట్లా చర్చి యొద్ద విన్నాను. లేదా సహో. గార్సియా ద్వారా విని యుందును. నేను దేవుని పేరిట చెప్పినది ఎన్నడైనా జరుగకుండా తప్పినదా?

134. గుర్తుచుకొనండి. ఒకే ఒక నిరీక్ష యున్నది. ఈ సజీవ శక్తి పొందండి. అన్నియూ తప్పిపోవును గాని అది నిన్ను విడిచిపెట్టక పట్టుకొనును.

"బ్రెన్హాం సోదరుడా, నీ భక్తి కాపాడుకొన్నావా?" అని ఎవరో అడిగారు

నేనిట్లు చెప్పాను, "లేదు. అదే నన్ను కాపాడుకొన్నది. దానిని నేను కాపాడుకొనుట కాదు. నేను దానిని పట్టుకొన్నానా లేదా అని కాదు. ఆయన నన్ను పట్టుకొనెనా లేదా అనేది ముఖ్యము. ఆయనే నన్ను పట్టుకొనెను."

ప్రతి చెట్టు మీద దేవ దూతలు కూర్చొని యున్నారు. నీవు దానిని గమనించవలెను. దానిని నీవు సిలవ మీద నుండి తీసికొననక్కరలేదు. ఆయన నా జీవితములో క్రియ చేయనిచో నేనీరోజు సాక్ష్యమును కలిగి యుండెడి వాడిని కాను నీ విషయము కూడా అంతే కొందరు హేళన చేయుచున్నారు.

"క్రీస్తు అను గట్టి బండ మీద నేను నిలబడియున్నాను. తక్కిన దంతయూ కూలిపోవు ఇసుకయే."

135. మీరు వ్యాధి గ్రస్తులయితే ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొనండి. ప్రార్ధించుదుము. మీ ప్రక్కనున్న వారి మీద మీ చేతులు వేయండి. నీ తప్పును జ్ఞాపకము చేసికోవద్దు. విశ్వాసముంచుము. నేను మీకు కేవలము సత్యమే చెప్పుచున్నాను. యేసు చెప్పెను, "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును." విశ్వాసులు చేతులేత్తండి. సందేహించ వద్దు
ఎవరో బాధపడుచున్న వ్యక్తి మీద నీ చేయినుంచుము. నీ మీద ఎవరో చేతిని వేసిరి.

ఆ పైకి లేపు శక్తిని గుర్తుచేసికొనండి. అది యేసును సమాధిలో నుండి లేపినది. నీ శరీరములో ఉన్నదాని మీద నీకు విశ్వాసమున్నది. నీవు ఎవరి మీద చేతులుంచావో ఆ వ్యక్తి సహాయము పొందును. అది నీలో నివాసము చేసిన యెడల నీ మధ్య శరీరము కూడా పైకి లేపబడును.

136. ప్రియదేవా, ఈ ఉదయ కాలము నుండి దాదాపు మధ్యాహ్నము వరకు ఇక్కడ నేను నిలబడితిని, దాదాపు ఈ సమయములోనే యేసు ఇట్లు కేక వేసెను. "నా దేవా, నా దేవా, నన్నేలా విడిచితివి?" "నేను దప్పిగొనుచున్నాను." ప్రవక్త ముందుగానే ఈ విధముగా పలికెను. "నా ఎములకు తేరీ చూచుచున్నవి. వారు నా చేతులలో, పాదములలో గాయములు చేసిరి." ఆయన అతిక్రమకారులలో ఒకనిగా ఎంచబడెను. ఆయన మన పాపముల కొరకు గాయపరచబడెను. మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను. మన సమానాదార్థమగు శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది." దేవా. దానిని మేము స్వాధీనము చేసికొనుచున్నాము. అది మాదే.

137. ఈ పునరుద్దాన ఉదయమున ఈ బయలుపరచబడిన సత్యమును గమనించండి. ప్రభువా, నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యము చెప్పితిని. ఆయనే న్యాయాధిపతి. ఆయన మమ్మును విమోచించినట్లుగా మేమే సాక్షులము దేవుని కృప వలన ఆ పునరుద్దాన శక్తి మాలో యున్నది.

మా స్నేహితులు రోగులుగా యున్నారు. వారి మీద చేతులు వేయబడినవి. ఓ దేవా, ఈ ఉ దయమున మా విశ్వాసముతో అపవాదిని సవాలుచేయుచున్నాము. జనులు మీద చేతులు వేశాము నాతో పాటుగా జనులు తమ చేతులుంచిరి. ప్రతి వ్యాధి ప్రతి బాధ యేసు క్రీస్తు నామములో పోవు గాక! సత్యము బయలుపరచబడియున్నది. కాబట్టి జనులను అవి పట్టుకొని యుండజాలవు. నేడు జనులు స్వేచ్ఛను పొందెదరు గాక!

దేవుని మాటలున్న బైబిలు ఇట్లు చెప్పుచున్నది. "వారు రోగుల మీద చేతులంచినపుడు బాగుపడుదురు. "దేవా, మా చేతులు నీ వైపు చాపి యున్నాము."

138. నేల మీద ప్రతి మొక్క నీ ప్రవాహము నీ నీటిని త్రాగును నీ ఊటలోనిది పానము చేసిన మొక్క చిగురించును. అది ఎదుగును. అది ఏ మొక్క అయినా గాని నీ ఊటలోనిది త్రాగి బ్రదుకును. ఆ విధంగా అది పుష్పించును. నీ వైపుకే అది ఎదుగును. ప్రభువా ఈ ఉదయము కొన్ని అంగుళములు మేము ఎదిగాము. ఇంకా పైకి మేము ప్రాకుదుము. నీ ఊట నుండి మేము సేదదీర్చుకొనుచున్నాము. మేము నీ జీవులము. ప్రభువా, మాలో నీ పునరుద్దాన శక్తి యున్నది. మా సోదరి సోదరుల పట్ల నీ కృప చూపుము. వారి కొరకు మేము చేసిన ప్రార్ధన వినుము ఈ ప్రియ జనులను పట్టి పీడించుచున్న ప్రతి బాధ తొలగిపోయి వారు నిన్ను సేవించకలిగెదరు గాక. ప్రభువా, నీ చిత్త ప్రకారమే చేయుము. యేసు క్రీస్తునామములో అడుగుచున్నాము. ఆమేన్.

139. ఆయనను మీరు నమ్ముచున్నారా? ఇటువంటి దానిని మీరెట్లు విడిచిపెట్టెదరు? ఆ పని ఎట్లు చేయగలరు? మీరు మీరుగా వెళ్ళిపోజాలరు. ఆ విధంగా మీకు అనిపించుచున్నదా? నాకు
ఒక వింత అనుభూతి కలుగుచున్నది. ఇటువంటి జనుల మధ్య కూర్చొన్నపుడు నాకది కలుగుచున్నది. ఎక్కడో అదృశ్యము రేడియో, టెలివజనుల నుండి ప్రసారమగుచున్నట్లుగా క్రీస్తు ప్రసారమగుచున్నాడు. ఈ గదిలో నుండి ఆయన వెళ్ళుచున్నాడు. మన విమోచకుడు ఇచ్చటే యున్నాడు. టోనీ, ఆయనిక్కడ ఉన్నాడు. ఆమేన్! బైబిలోని దేవుని యొక్క ప్రతి మాట బయలుపరచుటకు కళ్ళారా చూచిన మీకంటె సంతోషము గల జనులు మరెవరున్నారు? అన్ని కాలములలోను ప్రవక్తలు చెప్పిన మాటలు అక్షరాలా నెరవేరుచున్నవి. ఆయన రాకడ యొక్క సాయంకాలములో మనమున్నాము. ఓ! ఎంత అద్భుతమగు సమయము!

140. ఆయనను మనమందరము చూచెదము. ఈ కాలములోనే ఆయన ప్రత్యక్షమగును. ఆయన వచ్చువరకు నాకై ప్రార్థించెదరా?

నా ముందు ఎన్నో అపాయములున్నవి. అది నాకు తెలియును. మంచి నీళ్ళు త్రాగిపట్లుగా మనుష్యులను చంపు అన్యులను నేను కలిసికొనై యున్నాను. దాని గూర్చి మీరు ప్రార్ధించండి. దయ్యములు బహు తేలికగా సవాలు చేయుట మనము బైబిలులో చూచాము. కాని ఒక్కసారి కూడా మన ప్రభువు ఓటమిని రుచి చూడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వెళ్ళు చున్నాను. నిత్య జీవపు నిరీక్షణ, పునరుద్ధానము, జీవము ఆయనే.

" బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరల బ్రదుకును. నా యందు విశ్వాసముంచు వాడు ఎన్నాడూ చనిపోడు." అది దేవుని యొక్క నిత్య మాటయని నేను నమ్ముచున్నాను. మీరు అలాగే నమ్ముచున్నారా? నా కొరకు ప్రార్థించెదరా? మీ కొరకు ప్రార్థించెదను. మరల మనము కలిసికొనువరకు ప్రభువు మనలను కాచును గాకా!

"నేనాయనను ప్రేమింతును నేనాయనను ప్రేమింతును ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను నా రక్షణను కొనెను.

కల్వరి మ్రాను మీద."

ఆ పాటను ఇపుడు మనము మార్చుదుము.

" నా విశ్వాసము నీ వైపే చూచును.

ఓ కల్వరి గొర్రెపిల్లా,

దైవా రక్షకా! నా ప్రార్ధన వినుము, నా పాపము తొలగించుము. ఈ దినము నుండి పూర్తిగా నీ వానిగా చేయుము.

2. ఇప్పుడు మనము లేచి ఒక్క క్షణము నిలబడుదుము. మన తలలు వంచుదుము. ఈ
చిన్న పాట పాడుట మనకు తగదేమో. కదా? నేనాయనను ప్రేమింతును అను పాట మీకు గుర్తున్నదా? అది ప్రతి హృదయములో ఉన్నదా? దానిని మనము పాడుదము. ప్రియ సోదరి, నీవు వాయిద్యమును ఉపయోగించుము. వందనములు!

142. దాని వలన మీకు ఒక కార్యము జరుగలేదా? దానిని నిజంగా ఎందరు ఇష్టపడెదరు? నాకు ఆనంద గీతములు ఇష్టము. కానీ మీరు ఆత్మీయారాధనలో యున్నపుడు ఆ పాత మదుర గీతములు ఇష్టపడుదురు గదా? ఎడ్డీ ఫ్రూట్ మీద పరిశుద్దాత్మ కదిలినదని నేను నమ్ముచున్నాను. అందుకే ఆనాడు వారు అంత గొప్ప పాటలు వ్రాసిరి. అది మీరు నమ్మరా? ఫానీ క్రాస్ బీ ఇట్లు వ్రాసెను.

"ఓ! దీన రక్షకా, నన్ను దాటిపోకుము నా దీన మొర వినుము. ఇతరులను నీవు పిలచుచూ నన్ను దాటిపోకు మీ! నీవె నా ఆదరణ అంతటికి మూలము నా జీవము కంటే మిన్నగా ఉన్నావు నీవు తప్ప ఈ భూమి మీద నాకెవరున్నారు? పరలోకమందును నీవు తప్ప నాకెవరున్నారు?"

అది అద్భుతముగా లేదా? అందుకే, ఆయను ప్రేమింతును అని పాడవలెనని పించుచున్నది.

అవునా? మనము ఒకరి నొకరము ప్రేమించుచూ, నేనాయనను ప్రేమింతును అను పాట పాడుదుము. మనము ఒకరినొకరము ప్రేమించకొనకుండా ఆయనను ప్రేమించలేము. నిలబడి ఒకరి దగ్గరకు ఒకరు వెళ్ళి కరచాలనము చేయండి

"నేనాయనను ప్రేమింతును, నేనాయనను ప్రేమింతును, ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను నా రక్షణను కొనెను. కల్వరి మ్రాను మీద."

143. ఇప్పుడు మనము తలలు వంచుదము. ఒక్క నిమిషము యువకుడగు సహో. విలియమ్స్్స్ను ఇచ్చటకు రావలెనని కోరుచున్నాను. ప్రార్థన చేసి జనులను పంపవలెనని అడుగుచున్నాను.

సహో విలియమ్స్ ను నేను ప్రేమించుచున్నాను. ఒక యువ క్రైస్తవుడు. నిజంగా అతడు ఒక క్రీస్తుదాసుడు అతని చిన్న కుటుంబమూ అలాగే యున్నది. వీరితోను, మోస్లీ పిల్లలతోను నాకు చాలా పరిచయమున్నది. ప్రశస్తమగు వీరితో చక్కని సహవాసమున్నది. మేమంతా కలిసి యుంటిమి ఇంకా చాలా మంది నా ప్రియ స్నేహితులు ఈ ఫానిక్సులో యున్నారా. వారందరినీ నా పూర్ణ హృదయముతో ప్రేమించుచున్నాను. ఆ ఉదయమున దర్శనములో ఆయన నాకిట్లు చెప్పెను,
"నీవు ప్రేమించెడి వారని, నిన్ను ప్రేమించెడి వారిని దేవుడే నీకు ఇచ్చెను."

144. బహుశా ఇక్కడ కొందరు పాపముల నిమిత్తము పశ్చాతాప పడుచున్నారేమో. మీద ఒక యువతి ఏడ్చుచున్నది. ఆమె కొరకు ఒక క్షణము మనము తలలు వంచుదము.

ప్రియదేవా, ఫోనిక్సులో తప్పిపోయిన చిన్న గొర్రె ఈమోయేనా? దేవా, నాకు తెలియదు కాని నీకు తెలియును. ఒక దినమున నాకును తెలియును కాని తండ్రీ, నిస్సందేహముగా ఈమెయే ఆ గొర్రె, ఇప్పుడే ఆమెకు సహాయము చేయమని ప్రార్ధించుచున్నాను. ప్రేమగా తలుపు తీయుము. "నా బిడ్డా రమ్ము. అలసిన సొమ్మసిల్లిన దారిలో నుండి లోనికి రమ్ము ఆ చీకటిలో నీవు బోర్లా పడుచున్నావు. నిన్ను వెదకుటకు నీవీ రోజు వచ్చావు. నా ఆత్మ నీతో మాట్లాడుచున్నది. నిన్ను మందలోనికి తెచ్చుచున్నది." అని చెప్పుము. దేవా, అది అనుగ్రహించుము. ఈ యువతి జీవితపు మధ్యలో యున్నది. "నా మాట విని నన్ను పంపిన వానియుందు విశ్వాసముంచు వారికి నిత్యజీవము." ప్రియదేవా, ఈ క్రైస్తవ యువతికి అది దయచేయుము.

"నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయను." ఆ యువతి ప్రార్ధించుచుండగా పరిశుద్దులు నిలబడియున్నారు. పౌలు రాళ్ళచే భయంకరముగా కొట్టబడి మరణావస్థలో యుండగా పరిశుద్ధులు నిలబడి ప్రార్ధించినపుడు జీవము వచ్చెను. ఎందుకనగా ఆ పరిశుద్దుల శరీరములో ఆ మేల్కొలుపు శక్తి యున్నది. అది పరి. పౌలుకు జీవము పోసెను దేవా, విశ్వాస సహితమగు ప్రార్ధన మరణంచు వానికి జీవమును నిశ్చయంగా ఇచ్చును. ప్రియ దేవా, దానిని దయచేయుము. నీ కొరకు కనిపెట్టుకొని యుండగా మమ్మును దీవించుము. యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. మీరు తలలు వంచి యుండండి. సహో. విలియమ్స్ ను ముగించమని అడుగుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...