అన్యుల కాలముయొక్క ఆరంభము మరియు ముగింపు
స్నేహితులారా, శుభసాయంకాలము. ఈ రాత్రి మరొకసారి ఇక్కడ వుండటను బట్టి. నేనెంతో కృతజ్ఞుడను. ఇంతకముందే నేనిక్కడ నుండి నిష్క్రమించితిని. సుమారు నాలుగు గంటల ప్రాంతంలోనని నేను అనుకొనుచున్నాను. మరప్పుడు నేను... కొంతమంది మిత్రులను చూచుటకు మేము వెళ్ళితిమి. ఇక్కడికి తిరిగి వచ్చుటకు. మరి ఏడు గంటల 5 నిముషాలకి తిరిగి వెనక్కి వచ్చితిమి, కావున నేను ఒక అంశం కొరకు ఒకవిధంగా వేటాడవల్సివుంది బ్రదర్ నెవిల్,
2. మరి ఇప్పుడు టెన్సిస్సీ రాష్ట్రం చట్టనూగ ప్రాంతం నుండి ఒకరు తమ విన్నపమును తెలియపర్చారు, మూడువారాల క్రితం ప్రమాదానికి గురై ఇప్పటికి అచేతనంగా పడియున్న ఒక ప్రియుడు వున్నాడు. ఇక్కడున్న సంఘము ప్రార్ధింపవలెనని వారు విన్నపమును చేసియుండిరి. మరి...
3. ("బ్రదర్ బిల్ ?" అని బ్రదర్ నెవిల్ పిలుచుచున్నాడు సంపా) చెప్పండి బ్రదర్? (ఒక ప్రకటనను నేను చేయవచ్చా? అని నెవిల్ అడుగుచున్నాడు - సంపా) నిశ్చయంగా చెప్పొచ్చును బ్రదర్నెవిల్ దయచేసి రండి. ("మన్నించండి బ్రదర్ బిల్.") పర్వాలేదయ్య చెప్పండి (దాదాపు నేను దాన్ని మర్చిపోయాను. ఈ రాత్రి దానిని నేను ప్రకటన చేస్తానని నేను వాగ్దానం చేసాను.” బ్రదర్నెవిల్ ప్రకటనను చేయుచున్నాడు (టేపు మీద ఖాళీ)
4. మెల్కీసెదెక్ గురించి మేము మాట్లాడుచుంటిమి, ఆయన ఎవరనేదాని గురించి, ఇంకా అనేక విషయాలను ప్రస్తావించలేదు, బహశా ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు హెబ్రీ పత్రికలో నుండి విషయాలను ప్రస్తావించెదము.
5. కానీ ఈరాత్రి దానియేలు గ్రంధము వైపు మనం తిరిగెదము. బైబిళ్ళను తెరిచి దానియేలు 12 వైపుకి త్రిప్పండి. అక్కడ కొంత బాగాన్ని చదివి, బహశా దానియేలు గ్రంధంలో నుండి కొంత దేవునివాక్యన్ని చెప్పుకొందాం.
6. ఇప్పుడు, వారిలో దానియేలు... రాజైన నెబుకద్నెజర్ ద్వారా యెరుషలేము నుండి బబులోనికి కొనిపోబడిన వారిలో అతడు ఒకడైయున్నాడు, అతడొక ప్రవక్త. బబులోనికి కొనిపోబడినప్పుడు అతడొక యవ్వనస్థుడిగా వుండెను. గొప్పదగు ఆ పాతకాలపు విశ్వాసమును కలిగినవారు ఎక్కువ మంది లేరండి. అక్కడ ఉన్నవారిలో దానియేలు ఒకడైయున్నాడు.
7. దానియేలు అంటే నాకిష్టం. ఎందుకంటే అతడు... అతడు తన హృదయమందు గొప్ప నిశ్చయత (యోచన)ను కలిగివుండెను, అతడు బబులోనికి వెళ్ళినప్పుడు అతడు ఇంకను విశ్వాసిగానే వుండెను, రాజు యొక్క భోజనం మరింకా అటువంటి వాటిద్వారా తనను తాను ఆపవిత్రపర్చు కొనకుండెను.
8. ఇప్పుడు, అసలు సంగతి ఏమిటంటే దానియేలు అన్యులకి ప్రవక్తగా వుండెను. దానియేలు అన్యులకాలము పడుట లేచుట చూచెను. అన్యులకి ప్రవక్తగా వుండిన వారిలో దానియేలు ప్రధముడని మనం అనవచ్చును. అయితే అతడు మాత్రం అన్యుడు కాదండీ. కానీ అతడు
మాత్రం అన్యులకాలమును ఆరంభంనుండి ముగింపు వరకు చూచెను. శిరస్సుబంగారముగా వుండుట మొదలుకొని పాదములు ఇనుము మట్టి మిళితమై వుండటను అతడు చూచెను.
* 9. మరి అక్కడ వుండినప్పుడు రాజుయొక్క భోజనపదార్దముల ద్వారాను, రాజా చర్యల చొప్పున గానీ తన్సుతాను అపవిత్రపరు) కొనకూడదని అతడెంతో దృఢ నిశ్చయతను తన హృదయంలో కలిగియుండెను.
10. మరలాగే మరొక సహోదరగుంపు కూడా అచ్చట వుండెను, వారే షద్రకు మేషాకు, అబేద్సెగోలు, వారు అచ్చట వారితోవుండిరి, వారైతే ప్రవక్తలు కాదు గానీ వారు కేవలం విశ్వాసులై యుండిరి. వారు కూడా తమ హృదయమందు ఎంతో దృఢ నిశ్చయత కలిగియుం^రి. ఆ నలుగురు విశ్వాసులు ఒకటిగా కూడుకొన్నప్పుడు, తరచుగా వారు తమమధ్య చక్కని ప్రార్ధన కూడికలను కలిగివుండేవారిని నేను ఊహించుకొనుచున్నాను.
11. మనం చేసినట్లే అది వుండెను, మనమిరువురం ఒకే సంగతుల(విషయాల)ను కలిగివున్నందున మనం ఒకటిగా కూడి వచ్చుచుంటిమి. మీకుతెలుసా పాత సామెతె ఒకటివుంది అదేమిటంటే, "ఏ జాతిపక్షి ఆ గూటికే చేరుతుంది. (ఒకజాతి ఈకలున్న పక్షులున్ని ఒకేసారి కలిసి ఎగురును )" అది చాలా పురాతన పొడుపుకథ. అదెంతో వాస్తవం కూడా, ఏ జాతిపక్షి ఆ జాతికే చేరుతుంది. అందును బట్టి మీకు సంతోషంగా లేదా? (సమాజము ఆమేన్ చెప్పుచున్నది - సంపా). నిశ్చయంగా. ఏ జాతిపక్షి ఆ జాతితోనే కలిసి ఎగురును.
12. కొద్దికాలం క్రితం, నేనొక కూటంలో కూర్చోనియున్నాను, అక్కడున్న ఒకవ్యక్తి దేని గురించో చర్చిస్తున్నాడు. మరి అతడు ఇలా అన్నాడు "మంచిది..” చెరలోనికి వెళ్ళిన, చెరలోనున్న ఆత్మలను గూర్చి, యేసు మరణించిన తర్వాత వారి యొద్దకు వెళ్ళి వారికి ప్రకటించెనని అతడు మాట్లాడుచున్నాడు. "మంచిది, దానిగూర్చి మీరేమి అనుకొనుచున్నారు?" అని అతడు అడిగెను.
13. ఒక వర్ణజాతి సహోదరుడు లేచి నిలబడి ఇలా అన్నాడు "మంచిది, బైబిల్ దానిని అలాగే చెప్పియున్నది. ఆయన వెళ్ళి చెరలోనున్న ఆత్మలకు బోధించెన”ని అతడు అనెను. “మరి నీవేమి అనుకొనుచున్నావు." అని అతడు అడిగాడు.
14. అందుకు అతడు ఇలా అన్నాడు " నోవాహు దినాలలో ఓడ సిద్ధమగుచుండగా ఎవరైతే మారుమనస్సు నొందకుండా వుండిరో అట్టి ఆత్మల నిమిత్తం ఆయన దీర్ఘశాంతము కలిగి వారి యొద్దకి వెళ్ళి బోధించెనని బైబిల్ చెప్పినట్టుగానే అది వుండెనని నా భావం."
15. అందకతడు "లేదు అదికాదు. ఈ సంఘము, శాఖలలోవున్న ఆ పెంతెకోస్తుప్రజలు మొదలగు ప్రజలకు బోధించి, చెరలో నుండి వారిని రప్పించుటయైయున్నద"ని అనెను.
16. అంతట అతడు ఇలా అన్నాడు. "ఇప్పుడు ఇలా చూడు బ్రదర్, పెంతెకోస్తు అనేదే అసలు అక్కడ ప్రస్తావించబడనేలేదు. దానిని ఆయన అలా చెప్పాడంటే. ఆయన వెళ్ళి చెరలోనున్న ఆత్మలకి ప్రకటించెను."
అప్పుడు నేనన్నాను " ఆమేన్, అది అంతే."
17. అంతట ఆసేవకుడు నాముఖం వైపేచూసి "అవున్లే ఏ జాతిపక్షి ఆ జాతితోనే ఎగురుతుందిలే" అని అన్నాడు .
18. నేను అన్నాను "అవును అది నిజం, ప్రశస్థ విశ్వాసానికి చెందిన సహోదరులు, ఏది సత్యమని లేఖనము చెప్పుచున్నదో దానిని వున్నది వున్నట్టుగా నమ్ముచుందురు." అటువంటి ముగ్గురు సహచరులను దానియేలు తనతో కలిగియుండెను.
19. నీకు తెలుసా, నీవు ఇంటికి దూరముగా వెళ్ళినప్పుడు ఎవరో ఒకవ్యక్తి నీతో వుండుటను ఒకవ్యక్తిని నీ పక్షమున నిలబడి వుండే నిజమైన ఒక మంచి స్నేహితున్ని నీవు కనుగోవటం చాలా మంచిది. ఓ, మై, తెలియని చోట్లకి వెళ్ళినప్పుడు, నీకు సన్నిహిత మిత్రునిగా ఒక వ్యక్తిని నీవు కనుగొనప్పుడు, అతడు నిన్ను ప్రేమిస్తూ, నీ పక్షమున నిలబడి వుండుట అదెంతోనీకు ఉపయుక్తము. విశేషంగా, ఈ సహోదరులు తమ పట్టణము నుండి దూరముగా తీసికొనపోబడిరి.
20. మరియు వారి పట్టణము అగ్నితో కాల్చబడెను. మరియు వారి ఉపకరణములన్ని మరియు దేవుని యొక్క పరిశుద్ద వస్తువులన్నియు బబులోనికి తీసికొనబడి, రాజైన నెబుకద్నేజర్ యొక్క ఖజానా (బొక్కసము)లో పెట్టబడినవి. ఇవన్ని ఒక గొప్ప అన్యరాజగు అతడే పట్టుకొనిపోయెను. ఇప్పుడు, వారి పట్టణము అగ్నితో కాల్చవేయబడునట్టు, వారి సంఘము అగ్నికి ఆహుతి అగునట్లు, అన్యపట్టణములోనికి వారిని చెరగా కొనిపోబడుటకు దేవుడే స్వయంగా వాటిని అనుమతించాడు, ఎందుకనగా వారు దేవునికి దూరమైపోయారు (దేవున్ని విడిచిపెట్టారు).
21. "ఇతడు నా సేవకుడు" అని ఆయన తన చేతులుంచి చెప్పుటకు ఆయన ఇంకను ఒక విశ్వాసిని కలిగియున్నాడు.
22. దేవుడు ఎల్లప్పుడు ఏదో ఒక చోట తనకోసం ఒక సాక్షిని కలిగియుండును. ఒక సాక్షి లేకుండా ఆయన ఎన్నడు లేడు. ఏదీ ఏమైన సరే, అది... కొన్నిసార్లు ఆయన కనీసం ఒక్క సాక్షినైన కలిగియుండేవాడు, "ఇతడు నా సేవకుడు, నేను చెప్పినట్టు ఇతడు చేయును” అని ఎవరి మీదనో ఆయన తన చేతులుంచి చెప్పేందుకు దేవుడు "ఏదో ఒక మూలన ఎల్లప్పుడు తన కొరకు ఒక సాక్షిని కలిగి యున్నాడు. ఇప్పుడు మనం దానిని యిష్టపడుదుము.
23. ఇప్పుడు గమనించండి, ఈ సహోదరులు అక్కడ పెట్టబడినప్పుడు, వారొక పరీక్షను ఎదుర్కొను నిమిత్తం అక్కడ పెట్టబడిరి.
24. ప్రభువైన యేసును తన సొంత రక్షకునిగా నిజంగా అంగీకరించిన నిజమగు విశ్వాసికి బహుచక్కని మాదిరిగా ఇది వుండెను. సాతాను ఇంకను పరీక్షలు పెట్టే వ్యవహారాన్ని (వ్యాపారాన్ని) కలిగివున్నాడు. అయితే అదంతయు నీకు సహాయపడుటకే, నీ మంచికొరకే .
25. "దేవుని యొద్దకు వచ్చే ప్రతీ కుమారుడు పరీక్షంపబడాలి (విమర్శింపబడాలి) తీవ్రంగా శిక్షించబడాలి (దండించబడాలి, మందలించబడాలి), ముప్పుతిప్పలు పడాలి" మరొక మాటలో చెప్పాలంటే నూర్చబడాలి (బాధపడాలి, కొట్టబడాలి), సరాళం (నిటారు) చేయబడాలి. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు, దాన్ని మనం తట్టుకోలేకపోతే(నిలబడలేకపోతే) అప్పుడు మనం దేవునికి కుమారులుగా కాక అక్రమసంతానమగుదుము.”
26. ఇప్పుడు, పరలోకము తట్టు తన ముఖమును (దృష్టిని) నిజముగా నిలుపుకొనిన ఒక వ్యక్తికి ఈ భూమ్మీద ఏదీ జరిగినా అతడు లెక్కచేయడు, అతడు ఇంకను తన ముఖమును (దృష్టిని) పరలోకము తట్టే నిలుపుకొని యుండును. స్నేహితులు అతడిని విడిచిపెట్టి పోవచ్చును,
అతని కుటుంబం అతనికి దూరం కావొచ్చును, అతని పాస్టర్ అతడిని వదిలివేయవచ్చును. కానీ అతడెంత మాత్రం చలించడు, ఎందుకంటే అతడిని విడువని ఒక వ్యక్తి అతడికిపున్నాడు. అది దేవుడే. నీమనస్సు దానితో తయారైవుండాలి. అది నాకిష్టం.
27. దానియేలు తన వెనుకున్న బ్రిడ్జీలన్నిటిని కాల్చివేసాడు. ఏదేమైన అతడు ఇంకెంత మాత్రం వెనక్కివెళ్ళాలనే వుద్దేశ్యమును కలిగిలేడు. తన వెనకున్న తన కష్టాలను తాను మనస్కరించుట్లేదు. గతకాలపు సంగతులన్నిటిని అతడు త్యజించి (విడిచిపెట్టి) ముందుకు చూచుచుండెను. అతడు తన యొక్క ఉన్నతపిలుపుకు కలుగు బహుమానము మీద దృష్టి నిలిపియుండెను. ఖచ్చితంగా మనం చెయ్యాల్సింది కూడా అదేనండీ. ఖచ్చితంగా సంఘము చెయ్యాల్సింది కూడా అదేనండి.
28. మరి నేను గమనించితిని, అదేమనగా అతడికి పరీక్షపెట్టుటకు దేవుడే సాతానుకి అనుమతి నిచ్చాడు. మరి, ఓ, అగ్నిద్వారా వారు పరీక్షించబడ్డారు. మరి అలాగే సింహాల బోనులో వేయబడుట ద్వారా వారు పరీక్షించబడ్డారు. మరి ప్రతి పరిస్థితి నుండి దేవుడే వారిని గొప్ప విజయశీలులుగా బయటకి తీసికొని వచ్చుచుండెను.
29. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపించు ను." అదెంత అద్భుతంగా వుందోచూడండి. అదెంత అభినందనీయంగా వుందో చూడండి. శ్రమలు, పరీక్షలు, కష్టాలు ఇవన్నియు మంచి కొరకే జరుగుచున్నవి. కొద్దికాలం తరువాత దేవుడు నిన్ను చూసి, నీయందు నమ్మికయుంచి తదుపరి నీ కొరకు ఆయన గొప్పకార్యములను జరిగించును.
30. దానియేలు ఇప్పుడు తన స్వజనులకి, తన పట్టణమునకు, తన సంఘమునకు దూరమై దేవుని చేతిలో ఒక పాత్ర (సాధనం)గా అయ్యెనని మనం కనుగోగలము. ఒక క్రొత్త దేశమందు దేవుడు అతడిని వాడుకొనెను.
31. ఇప్పుడు, నీకున్న దానంతటి నుండి నువ్వు దూరమైపోవచ్చును. నీ ప్రియులైన వారి యొద్దనుండి నీవు దూరమైపోవచ్చును. లేక నీ సంఘమునుండి నీవు ఎడమైపోవచ్చును అయినను నీవింకా దేవుని చేతిలో ఒక పాత్రగా ఉండొచ్చును. ఒక సాక్ష్యార్ధంగానే లేక తన కిష్టమైనట్టుగా ఆయన నిన్ను ఏదోరకంగా వాడుకోగలడు (వాడుకొంటాడు).
32. చాలా చక్కని మాదిరులవి. బైబిల్లో నీవు ఎటువైపు తిరిగినా నీకు ఇటువంటి ఎన్నో గొప్ప మాదిరులు కనబడును (బైబిల్ ఇటువంటి అనేకమైన వాటిని కలిగి నెమ్మదిగా ముందుకి కదులుచున్నది.) వాక్యాన్ని చదువుటను మీరు ప్రేమించలేరా? (సమాజము ఆమెన్ చెప్పుచున్నది. - సంపా) ఓ, కొన్నిసార్లు నేను కేవలం చదివి ఏడ్చేవాడిని.
33. ఇక్కడే కొన్నిదినాల క్రితం, నేను గదిలో వుండి పఠించుచుంటిని, నేను అలా కూర్చిండిపోయి చంటి బాలునివలె ఏడ్చితిని.నేను పైకి లేచి నిలబడి నా కుర్చీ చుట్టు తిరుగుచూ, నా కుర్చీమీదు చేతులుంచితిని, మరలా నా బైబిల్ తట్టు చూచాను, నేను అలా బ్రద్దలైపోతిని. మరలా కుర్చీ చుట్టు తిరిగి, మరలా దానివైపు చూచి ఇలా అనుకొన్నాను “ఓ దేవా, దానియందు నిత్యజీవము కలదు, దానియందు తమ విశ్వాసముంచిన ప్రతి స్త్రీ పురుషునికిని అది కలదు. దానిని నమ్మిన ప్రతిఒక్కరికి కలదు." నిత్యజీవము,
34. మరి తాయనిలా అన్నాడు "లేఖనములను పరిశోధించుడి, దానియందు నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు. అయితే అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి" లేఖనాలను పరిశోధించండి.
35. "దేవుని వాక్యము మన పాదములకు దీపమునైయున్నది," అందును బట్టియే మనం నడిపించబడుదుము. విజయంనుండి అత్యదిక విజయంవైపు మనల్ని నడిపించే మన త్రోవేకి 4 అది వెలుగై యున్నది.
36. ఇప్పుడు నీకు విజయం దక్కాలంటే దానికి ముందు నీకు యుద్ధము (పరీక్ష) వుండాలి. యుద్ధమే లేకపోతే విజయం మనకి వుండదు (రాదు) కనుక యుద్ధములు (పోరాటాలు), పరీక్షలను బట్టి మనమెంతో కృతజ్ఞలుగా వుండాలి. ఎందుకనగా విజయములను పొందుకొనుటకు అవి దేవుడు మనకిచ్చు గొప్ప అవకాశములనై వున్నవి. ఓ, మై. అవి నిన్ను మరికొంచెం మెరుగుపర్చవా? చూచారా. నీ గూర్చి ఎవరో ఏదో తప్పుగా పలుకుతారు, వ్యాధులు నీ మీదికి వస్తాయి తద్వారా యుద్ధములు వచ్చును. బహుశా దేవుడే ఆ చిన్నపాటి శ్రమలు నీకిచ్చును. తద్వారా ఆయన నిన్ను స్వస్థపర్చి మరియు తన దయను నీయెదుట కనబర్చును, అందును బట్టి (వాటి ద్వారా) ఆయన నీ యెడల ఏమై యుండెనో నీవు చూచెదవు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసికొందువు.
37. యెరుషలేములో ఒక పురాతన గొట్టెల కాపరియగు బాలుని కథ వున్నది. ఆ పరిశుద్ద ప్రాంతములో ఒక గొట్టెల కాపరి తన గొట్టెను తనపై ఎత్తుకొని వచ్చుచుండెను. అప్పుడు ఒకరు "నీవెందుకు దానిని మోసికొని వచ్చుచున్నావు?" అని అడిగారు అందుకతడు "ఇది కాలునందు గాయపడినది” "అవునా అదెలా జరిగింది, ఒక రాయి మీద పడిపోవుటచేతనా?" అని అడిగాడు. అందుకతడు " లేదండి నేనే దానిని గాయపర్చాను" అని బదులిచ్చాడు.
38. "ఎందుకు, నీవొక కఠినుడవగు కాపరివి కనుకనే నీవు దాని కాళ్ళు విరుగొట్టావు" అని అన్నాడు.
39. అందుకతడు "లేదండి, నేను దాన్ని ప్రేమించాను. అయితే అది దారి తప్పిపోవుచుండెను, దానిని నేను తాళలేకుంటిని అందుకే నేను దాని కాళ్ళు విరిచితిని. కావున అది నన్ను ప్రేమించి నన్ను వెంబడించు టకు దాని మీద మరెక్కువ దృష్టి నిలుపుటకు అలా చేసితిని" అని పలికెను.
40. కొన్నిసార్లు మనం ఆరోగ్యవిషయంలో బ్రద్దలగునట్టు దేవుడే అనుమతించును, మనమీద మరికొంత దృష్టినిలుపుటకు, మనల్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొనుటకు, తన కౌగిలిలో లాలించుటకు ఆయనే అలా మనల్ని గాయపర్చును, ఇక మా వల్ల కాదు లాభంలేదండి అని వైధ్యులు అన్నప్పుడు. ఆయన మనల్ని తన భుః కాల మీదకి తీసికొని ఇలా అనును "చూడుము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు పూర్తిగా బాగు అగునట్టు నేను చేయబోవుచున్నాను." చుశారా? ఓ, జీవితాన్ని అది ఇంకొంచెం మెరు గుపర్చదా? (సమాజము ఆమేన్ అనుచున్నది - సంపా) ఓ, ఆయనెంతో గొప్పవాడు ఆయన ఎంతో అద్భుతమైన కాపరి. కాదంటారా?
41. “యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు" అని దావీదు చెప్పుటలో ఏమాత్రం ఆశ్చర్యంలేదండీ. ఆయన మనల్ని శాంతికరమగు జలముల చెంత ఎలా నడిపించును, వారి
ప్రాణములను సేదదీర్చును, మన గిన్నె నిండి పొర్లునట్లు చేయును. మరియు శత్రువుల యెదుట మనల్ని అభిషేకించును. నీ శత్రువులమధ్య నీవెన్నడైనా అభిషేకంనొందితినా? కేవలం సాక్ష్యార్ధముగా మీ పాత్ర నిండుకొని ఉడికి(కాగి) వుండెనని మీకు తెలుసా మీ శత్రువుల మధ్యలో మీరు అభిషేకించబడుటనునేది ఎంతో ఆ ద్భుతంగా వుంటుంది.
42. ఇప్పుడు గమనించండి, అప్పుడు రాజైన నెబ్బ కట్నేజర్ని దేవుడు తీసికొని తన చేతిలో అతడిని ఒక పాత్రగా వాడుకొనెను. రాజైన నెబుకడ్నేజర్ మరణించిన పిదప, అతడి తర్వాత.... గడ్డి మొలిసినట్టు, అతడి వెంట్రుకలు పెరిగినవి (చింపిరి జుట్టు అయ్యెను), సింహమువలె, లేదా పక్షిరాజుల యొక్క ఈకలవలే అవి అయ్యెను. అతని వ్రేళ్ళుగోర్లు పక్షిరాజు యొక్క గోళ్ళు వలె అయ్యెను. నిజమైన రాజు ఎవరో అనేదాన్ని తెలిసికొనునట్టు దేవుడే అతడిని అలా అవ్వనిచ్చెను.
43. అతని మరణానంతరం, బెల్తెషాజర్ అనే అతని మనమడు అతని స్థానంలో రాజయ్యెను. రాజైన నెబుకద్నెజర్ కంటే ఇతడు మరీ అధికంగా దుష్టుడాయెను. మరి ఒకరాత్రి అచ్చట వారొక పెద్దవిందు పార్టీని కలిగియుండిరి. వారు తాము ఏర్పాటుచేసికొన్న ఆ గొప్ప ఆనందోత్సవాలతో కుడిన విందుకి తన రాజ్యమందున్న న్యాయధిపతులను మరియు అధికారులందరిని పిలిచెను. వారంతా ఆనందోత్సవాలతో కూడిన ఈ విందులో వుండగా, వారు... వెళ్ళి బయటకి పిలిచిరి. పాత్రలు పట్టుకొని, దేవుని పరిశుద్ధ పాత్రలను పట్టుకొనిపోయిరి, దేవున్ని పరిహసించటానికి (సరదాకోసం) తమ దే వుళ్ళకి వాటితో త్రాగించటానికి, త్రాగటానికి ప్రభువు యొక్క పాత్రలను తెప్పించి వాడిరి.
44. ఇప్పుడు, ఒక మనిషి సుధీర్ఘముగా ప్రయాణించుటకు అనుమతించబడ్డాడు. కానీ జీవమును మరణమును వేరుచేసే గీత ఒకటి వున్నది. నీ వెన్నడూ దానిని దాటలేను. చూచారా? కొంత దూరం వరకు నీవు నీతెలివి తక్కువ తనంతో ముందుకు వెళ్ళగలవు. అయితే ఆ గీత ఎచ్చట వున్నదనే దానిని నీవు తెలిసికోటం వంంచిది. ప్రభువు ఎన్నడైనా దేని విషయము లోనైన నిన్ను తనిఖీ (నిరోదించాడా, అడ్డుకొన్నాడా) చేసాడా? ఆయన చేస్తాడు, మనమంతా, తనిఖీ పగ్గాలు చేతబట్టి "ఇప్పుడది చాలినంత (దూరములోవుంది."అని అంటాం. అప్పుడు నీవు చేసే వాటి గురించి నీవు గమనించుట మంచిది), ఒకవేళ నీవు ఆ గీత దాటే సమయమందు వున్నట్లైతే నిన్ను నీవు గనునించుకొనుము
45. దేవుడు ఆ రాత్రి అతని తనిఖీ పగ్గాలను (ముక్కు కళ్ళెంను) లాగినప్పుడు అతడు ఏ మాత్రం ఖాతరు చేయలేదు. అలానే మూర్ఖంగా ముందుకి వెళ్ళి ప్రభువు ప్రతిష్టిత పాత్రలను బయటకి తెచ్చి వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగకుట ఆరంభించెను, అంతేకాక తమ దేవతలకి కూడా తాపించుచుండెను. అప్పుడు పరలోకమనుండి ఒక చేయి క్రిందికి దిగివచ్చి గోడమీద వ్రాసెను, "మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్" అని వ్రాసెను. దానర్థం ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువుగా కనబడితివి. అయితే అక్కడ దానిని ఏ ఒక్కరు అనువదించ లేకపోయారు. అది ఎవ్వరికి తెలియని బాషలో వుండెను.
46. అక్కడొక మనిషి ఉన్నాడు, అనువదిం; వివరము (దానర్ధం చెప్పేవరం)ను అతడు కలిగియున్నాడు. అతడి పేరు దానియేలు, కను। 5 అతడు అక్కడికి వచ్చి, దానిని అనువదించి,
ఏమి జరుగనైయున్నదో దానంతటిని రాజుకి తెలియజెప్పెను, మరి అక్కడ దేవుడు ఆ బబులోను రాజ్యమును పతనం చేసెను.
47. దానియేలు అచ్చట వుండినప్పుడు, అతడు అక్కడ గొప్పదర్శనములను చూచెను, నేడు మనం కలిగియున్న ఈ గొప్ప ఊరడింపు(ఆదరణ లేక ఓదార్పు) తెలిసికోవటం, క్రమములో ఉంచటం, అన్యరాజ్యము యొక్క ముగింపు అను వాటికి సంబంధించిన వాటన్నిటిని అతడు వ్రాసెను.
48. ఎంత చక్కగా అదివుందో గమనించుము. అది ముగింపుకి వచ్చియుండెను. రాజు యొక్క కలను అతడు అనువదించినప్పుడు ప్రతిమ మైదానమందు నిలబడియుండుటను అతడు చూచెను.
49. అతడొక ఆత్మ సంబంధి. అతడు కలలుపొందుకొనెను, దర్శనములను చూచెను, ఆ కలలకు బావం(అనువాదం) చెప్పెను. దేవుడు అతనితో వుండెను, ఆ సంగతి ప్రతి ఒక్కరు ఎరిగియుండిరి.
50. మరి దర్శనంలో అతడు ఆ ప్రతిమకి వున్న శిరస్సు బంగారముగాను, రొమ్ము వెండిగాను, తొడలు ఇత్తడిగాను, కాళ్ళు ఇనుముగాను వుండుట చూచెను, ప్రతీరాజ్యం కొద్దికొద్దిగా గట్టిపడుట (కఠినముగా ఉండుట) ను గమనించగలరు. రాజైన నెబుకద్నేజరు యొక్క రాజ్యమే ఆ ప్రతిమలో బంగారు శిరస్సు అయివున్నది. దానిని అతడు అనువధించి చెప్పెను, అంతము వచ్చువరకు ఆ రాజ్యములు ఒక దాని మీద మరొకటి ఎలా జయం పొందెనో అనే దానిని అతడు ఖచ్చితంగా చెప్పెను. పిదప గమనించండి. బంగారం మృదువు (మెతక)గా వుంటుంది. వెండి దానికంటే కొంచెం గట్టిగా వుంటుంది. మరి ఇత్తడి దానికంటే ఇంకొంచెం, ఇనుము దానిమీద మరికొంచెం గట్టిగా వుంటుంది. అవి ఒక దానికంటే మరొకటి దృఢంగా (గట్టిగా) వుంటాయి. గట్టిగా, గట్టిగా, చల్లగా, పోయేకొద్ది అలాగుండును।
51. గమనించండి, అప్పుడు వాటన్నిట మధ్య, చేతిసహాయం లేకుండా, పర్వతము నుండి తియ్యబడిన రాయి వచ్చి ఆ ప్రతిమను పగులుగొట్టుట దానియేలు చూచెను. అది దొర్లుకొంటూవచ్చి ఆ ప్రతిమ మీద పడి వేసవికాలమందు గోదుములను దుళ్ళగొట్టినట్టు దానిని పగులగొట్టెను, మరియు కళ్ళములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకక గాలి వాటినికొట్టి కొనిపోయెను, ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూమి సముద్రమంత మహాపర్వతమాయెను." అది ప్రభువైనయేసు యొక్క రాకడైయున్నది. అది ఇప్పుడే సమీపించియున్నది.
52. అతడు అలా వెళ్తుండెను. ఒకనాడు అతడు నది ఒడ్డున వుండెను, అపస్మారకస్థితిలోకి వెళ్ళి ఒక దర్శనమును చూచెను. అయితే అతనితో వున్న వారందరికి ఆ దర్శనం కనబడలేదు, అది కేవలం దానియేలుకి మాత్రమే ఇయ్యబడెను. మీరు దాన్ని చూచారా?
53. నీ ప్రక్కనే ఎవరో ఒకరు నిలబడివుండవచ్చును, మరియు నీ జీవితాన్ని రక్షించుటకై నీవు చూడలేనివాటిని తాను చూడవచ్చును, అది నిజం, కొందరు ఇలా అందురు, "దానిని నేను నమ్మను. నేనెన్నడు దేనిని చూడలేదు." వారు అలా అనుటకు కారణం అది వారు చూచుటకొరకు కాదండీ.)
54. పౌలుతో వెళ్ళిన వారు, గుఱ్ఱము మీద నుండి పౌలు కొట్టబడి క్రింద నేలమీద పడినప్పుడు,
అతడు అక్కడ ఆ నేలమీద పొర్లుచుండెను, అయితే పౌలుతో వున్నవారు లేదా ఆ దర్శనము చూడకుండిరి. పౌలు దానిని చూచెను. ఆ స్వరమును
55. ఆ నక్షత్ర జ్ఞానులు తప్ప నక్షత్రశాలలో వున్న ఏ ఒక్కరు ఆ నక్షత్రమును చూడలేకపోయిరి.
561 అలాంటివి అనేక సంగతులు కలవు, మిగతావారు చూడకుండునట్లు కొద్దిమంది జనులు చూచునట్లు దేవుడే అటువంటి వాటిని నియమించెను, నేను దానిని ఇష్టపడుదును. దేవుడు తన అనంత జ్ఞానమందు కొన్ని కార్యములు జరుగునట్లు ముందుగానే నియమించాడు. ఏర్పాటు చేసాడు, నీప్రక్కన కూర్చొన్నవానికి అది జరుగవచ్చు. అయినను దానిగూర్చి నీకు ఏమి తెలియదు. )
57. దాతాను తట్టు చూడుము, ఏలియా దాతాన దగ్గర వున్నప్పుడు, వారంతా అక్కడ లోనికి వచ్చే పరులతో అనగా సిరియా సైన్యముతో చుట్టు ముట్టడి వేయబడిరి, ప్రవక్త ఏలియా కొరకు వెదికిరి. వారు కనుగొనప్పుడు, యుద్ధము చేయుటకు ఇశ్రాయేలీయుల మీదికి సిరియా సైన్యం వచ్చిన ప్రతీసారి ఇశ్రాయేలీయులు వారి కోసం పొంచివుండి దాడి చేయుదురు.
58. కనుక సిరియా రాజు వారిని పిలిచి ఇలా అనెను, "ఇప్పుడు ఒక్కనిముషం ఆగండి. మన పక్షాన వున్నది ఎవరు, ఇశ్రాయేలు పక్షమున వున్నది ఎవరు? నా గుంపులో ఎవరో ఒకడు వేగులవాడై వుండి, మనం వెళ్ళు జాడను ముందుగానే వారికి చేరవేస్తున్నాడు, అందుకోసమే వారు ఎల్లప్పుడు మనకోసం ఎదురుచూస్తున్నారు.
59. అయితే అతని యొద్ద కొద్దిగ ఆత్మీయత వున్నవాడు వుండెను. అతడు ఇలా పలికెను, "లేదు నా తండ్రీ. వేగులవాడు ఎవరో కాదు. అది ప్రవక్త ఏలియా అయివుండెను. నీవు ఏ పడకగదిలో వుండి నీవు చేయబోయే తదుపరి కదిలిక ఏమిటో అనే దాన్ని అతడు పూర్తిగా ఎరిగియుండెను.” ఆమేన్. )
60. ఓ, అణుశక్తి కదలటం ఆరంభమైనప్పుడు, ఎక్కడికి వెళ్ళవలెనో అనే దానిని దేవుని రాజ్యం నాకు చెప్పుచున్నందున నేనెంతో ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు అనే బండయొద్దకి పారిపోండి. ప్రతీ మనిషి అచ్చటకే వెళ్ళాలి, అదే క్షేమకరమైన, సురక్షితమైన స్థలము, ఏదీ నీకు హానిచేయలేదు. ఏ అణుబాంబు, ఏ అయస్కాంత వస్తువు. మరేది కూడా దేవుని సంరక్షణలోవున్న వ్యక్తిని తాకలేదు, ఎందుకనగా అతడు సురక్షితమైన, క్షేమకరమైన, లంగరువేయబడిన దానియందు వుండెను. యేసుక్రీస్తు నందు మనకున్న శుభప్రదమగు నిరీక్షణ ఎంత అద్భుతమైనదో చూడండి. Amen
61. గమనించండి, అతనితో (ఏలియాతో- అను) ఒకడు వున్నాడు. వాడు అతని యొక్క దాసుడు, వాడొక ఆత్మీయ బాలుడు. నడుస్తూ మరియు ప్రవక్త చేతుల మీద నీళ్ళు పోయుచూ వుండెను, గొప్ప స్థానమును అతడు కలిగివుండెను. అయితే సిరియా సైన్యము దాతాను చుట్టు ముట్టడి వేయుట అతడు చూచినప్పుడు, అతడిలా పలికాడు "నా తండ్రి, అక్కడ చూడు, ఎంతో పెద్ద సంఖ్యలో సైన్యం మనల్ని మోహరించించుటను, చూడండి|"
62. ఇప్పుడు, ప్రతీది - అనుకొన్నట్టు జరగకపోవటం అనేది సహజం. అలాంటప్పుడు వారు నీ మీద వ్రేళెత్తి చూపెడుతూ ఏదేదో అంటుంటారు. నీకు నయంకాదనో ఏదేదో వైద్యుడు అనును. “ఓ, మై ఇదే ఇక చివర (అంతం)" అని నీవు అనుకోవటం సహజం.
63. కానీ ఏలీయా ఇలా అన్నాడు" వారితో వున్నవారికంటే మనతో వున్నవారే ఎంతో ఎక్కువ"
64. ఆ ప్రవక్త, లేదా ఆ దాసుడగు గేహేజీ ఏ విధంగా భావించాడో అనే దానిని మీరిప్పుడు ఊహించగలరు. అతడు తన్నుతాను చూచుకొన్నాడు. ఈ విధంగా అనుకొన్నాడు "ఏంటీ, ఎవరు నాకు కనబడుట్లేదే." అందుకు ప్రవక్త ఇలా అన్నాడు "దేవా ఈ బాలుని యొక్క కన్నులు తెరువుము."
65. దేవుడొక కార్యంను జరిగించిన వెంటనే, అదక్కడ వుండెను. అతని యొక్క ఆత్మీయ నేత్రములను దేవుడు తెరిచినప్పుడు అతని చుట్టు, ప్రవక్త చుట్టు, అక్కడంతా అగ్నిరధములు మరియు అగ్ని దూతలు వారి చుట్టు నిలిచియుండెను. ఎందుచేత, ఆలాగు చూచాడు... ఎందుచేత, వేలాదిమంది సిరియా సైన్యముకంటే విస్తారంగా అగ్నిరధములు వారిచుట్టు వుండుటను అతడు చూచాడు. ఆ పర్వతములచుట్టు అగ్ని, అగ్ని దూతలు, అగ్ని గుఱ్ఱములు, అగ్నిరధములు వుండెను.
66. "తనయందు భయభక్తులు గలవారి చుట్టు దేవుని దూతలు కావలియుండి కాయును" అని బైబిల్ చెప్పుచున్నది. Amen
67. ఈ రాత్రి కూడా అది అలానే వుంది. ఈ రాత్రి ఒక మనిషి ఇక్కడ నీ కన్నులు మీద బాది(కొట్టి) “ఈ రాత్రి ఈ మందిరం చుట్టు నిల్చొనివున్న వారిని చూడుము" అని అన్నట్లైతే ఏమగునోనని నేను ఆశ్చర్యపోవుచున్నాను. అలా అయినట్లైతే, నీవు నీ జీవితకాల మంతయు ఇక్కడ సభ్యడవగుదవు. నిశ్చయంగా,
68. కొన్నిసార్లు నీ భౌతిక నేత్రములతో దానిని నీవు చూడలేవు, కానీ అది వున్నట్టు, అది నీకు సమీపముగానే వున్నట్టు నీవొక ప్రేరణ మాత్రం పొందగలవు. ఇక్కడ దగ్గర్లో ఏదో వున్నట్టు నీ ఆరవ ఇంద్రియం అనేది నీకు తెలుపును.
69. ఆయనను గమనించండి, ఈ ఉదయవేళ, చెవులు తెరుచుచుండుటను, పోలియో చేత అవిటి వారైనవారు గతంలో వారికి ఏదీ లేనట్టుగా ఇప్పుడు చక్కగా ఇక్కడ నడుచుటను గమనించుము, ఏమిటది? అది ఇంద్రియము, నా బావం ఇంద్రియమంటే, ఆరవ ఇంద్రియము మనసాక్షి, ఆత్మ, సమీపమున ఏదో వున్నది. దేవునియందు విశ్వాసముంచుము.
70. ఇప్పుడు, వారు చూడలేదు, మొదటిగా అతడును చూడలేదు. బహూశా ఏలియా చూచివుండక పోవచ్చును, కానీ ఆ బాలుని కన్నులు దానిని చూడలేదని మాత్రం అతడు చెప్పాడు. వారు అచ్చట వుండిరని మాత్రం ఎలీషా మనసునందు తెలిసికొనియుండెను.
ఆమెన్. ఒకసారి తోమా “ఆయన ప్రక్కలో నా చేతులుంచితినే” అని అన్నాడు. 71. ( యేసు చెప్పెను, "మీరిప్పుడు చూచి నమ్మారు. అయితే ఎన్నడు చూడకపోయినను నమ్మిన వారి యొక్క ఫలము ఎంతో గొప్పది (చూచినమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారెంతో ధన్యులు-అను)” చూడకుండా ఎవరైతే మనలో నమ్ముదురో వారే ఆ ధన్యులైయున్నారు.
72. మరియు గమనించండి. అంతట ఏలీయా అక్కడికి ఈ సంఘటన జరిగినచోటుకి నడిచివెళ్ళి వారితో మాట్లాడెను. మొదటిగా అతడు అక్కడికి వెళ్ళెను, మరి బైబిల్ ఇలా చెప్పెను, " వారిని అతడు గ్రుడ్డితనము (అంధత్వము)తో మొత్తెను" గ్రుడ్డితనము, వారి యొద్దకి నడిచిపోయెను. నాకు తెలిసినంతమట్టుకు వారిలో ప్రతి ఒక్కరు పరిపూర్ణ దృష్టి గలవారే. కానీ లేఖనము చెప్పుచున్నది. “వారు గ్రుడ్డివారైరి”.
73. కొన్సిరాత్రుల క్రితం ఒక చిన్నవాడు నాతో ఇలా అనెను, " నీవు దైవజనుడవైతే నన్ను గ్రుడ్డితనముతో మొత్తుము". అందుకు నేను "నీవు ఇదివరకే గ్రుడ్డివాడివి" అని అన్నాను. చూచారా? చూచారా? ఇది వరకే గ్రుడ్డితనము.)
74. గమనించండి. మరి అతడు అక్కడికి అనగా ఈ గొప్ప సంభవం జరిగిన చోటికి, ఈ సంఘటన జరిగిన దగ్గరికి నడిచి వచ్చెను, మరియు అతడు ఇలా అడిగెను. "మీరు ఏలీయా కొరకు చూస్తున్నారా (వెదకుచున్నారా)?" అందుకు వారు "అవును" అనెను.
75. "రండి, నన్సు వెంబడించండి అతడున్న చోటుకి మిమ్మును తీసికెళ్లాను" అని పలికెను. ఏలీయా వారితో అన్నాడు. వారు దేనికి గ్రుడ్డివారయ్యారు? అతడు దేవుని ప్రవక్త అయివున్నాడు అనే సంగతికి వారు గ్రుడ్డివారయ్యారు. వారు దానికి గ్రుడ్డివారయ్యారు. అతడు వారిని తిన్నగా ఆ దిగువునకు నడిపించెను. మరలా ఆకస్మికంగా వారి యొద్దకు వెళ్ళి "రండి, మీకు ఏలీయాను చూపిస్తాను"అని పలికెను. వారిని అచ్చటికి తీసివెళ్ళింది స్వయంగా ఏలీయానే,
76. మరియు వారు చుట్టూ చూచినప్పుడు వారు చుట్టుముట్టడివేయ బడినట్టుగా తెలిసికొనిరి, రాజు ఇలా అడిగాడు, "నా తండ్రీ, నేను వారిని కొట్టమంటావా?”
77. అందుకు ప్రవక్త అన్నాడు. "చెరగా వచ్చిన వారిని శిక్షించుదువా? తినుటకు వారికి ఏదైనా ఇవ్వుము వారిని వారి స్వదేశమునకు తిరిగి పంపుము.”
78. యుద్ధములను పరిష్కారించు విధానమదే. అది సరైంది కాదంటారా? నిశ్చయముగా సరైనదే. ఓ, మై! నీ యొక్క శత్రువుకు భోజనము పెట్టడం వంటి మంచి సూత్రమును నేట్లు మనం అవలంభిస్తే ఎంత బావుంటుందో. "నీకు కీడు చేసే వారికి నీవు మేలు చేయటం" ఆమెన్
79. అక్కడ, ఇప్పుడు గ్రుడ్డితనము, ఇప్పుడు ఏలియా..... కాదు కాదు నా భావం ఏలియా అని కాదు. ఇప్పుడు
80. కానీ, దానియేలు, దానియేలు ముందుగానే చూచాడు. అతడొక ప్రవక్త. ప్రభువు రాకడను అతడు చూచాడు. అంత్యకాలము వచ్చుటను ముందుగానే చూచాడు. అన్యుల ఆరంభమును అతడు ముందుగానే చూచాడు.
81. మరియు మీరు గమనించినట్లైతే, అన్యులు ఒక-ఒక విగ్రహారాధనతోనే ఆరంభమైయ్యిరి. మైదానంలో వుంచబడిన ఒక విగ్రహంను, ఒక మనిషి యొక్క విగ్రహంను వారు ఆరాధించు చుండెను, అది స్వయంగా దానియేలు యొక్క విగ్రహమని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే రాజైన నెబుకద్నెజర్ అతనికి బెల్తెషాజర్ అనే తన యొక్క దేవుని పేరు పెట్టెను. అతడు ఒక నీతిమంతుని, పరిశుద్దుని యొక్క విగ్రహమును ఆరాధించుట ఆరంభించాడు. మరి దానియేలు దానిని చేయుటకు తిరస్కరించెను. మరి అలాగే షడ్రక్, మేషాక్, అబేద్నెగో అనే హెబ్రీ పిల్లలు కూడా దానిని చేయుటకు తిరస్కరించారు.
82. ఆ విధంగా అది జారీచేయబడింది. అది ఖండించబడింది. ఏమనగా బంగారు శిరస్సు అనేది ప్రతిమ ఆరాధన యందు జారీ చేయబడెను, దాని కోసం బలవంతం చేయబడెను, అది ఒక సహజాతీతమైన హస్తము గోడ మీదకి వచ్చి ఒక సహజతీతమైన వారు మాత్రమే గ్రహించ గలిగే ఒక సహజతీతమైన భాషను వ్రాయుట యందు ముగించబడినది. ఆమెన్.
83. ఆ విధంగా అన్యరాజ్యము జారీ చేయబడెను, సహజాతీతమైన కార్యముల ద్వారా, సహజాతీతమైన అనువాదం ద్వారా అది అదే రీతిన వెళ్ళిపోవును, అది నిజం. నేను దేని
గురించి చెప్పుచున్నానో మీకు అర్థమౌతుందా? అతీతమగు కార్యములు జరుగుట ఓ, ఎంతో శ్రీ అత్భుతమైనది. అతీతమైన వాటిని నమ్మినందున ఈ రాత్రి నీకు సంతోషముగా లేదా? (సమాజము ఆమెన్ చెప్పుచున్న ది -సంపా). అవును
84. ఇప్పుడు, ఈ దర్శనములు పొందిన అనంతరం, దేశములన్ని ఎచ్చట నిలబడియుండునో అనే దానిని ఆయన అతనికి చూపెను. యూదులకి ఇంకెన్ని సంవత్సరములు మిగిలియున్నవో అనే దానిని కూడా ఆయన అతనికి చూపించెను. ఆయన ఇలా అనెను "మెస్సీయా వస్తాడు డెబ్బైయవ వారమందు అనగా మూడున్నర సంవత్సరములకాలం ఆయన ప్రవచించును. దాని మధ్యలో (డెబ్బైయవ వారం మధ్యలో అనగా చివరి ఏడు సంవత్సరకాలపు మధ్యలో) ఆయన కొట్టివేయబడెను. నీ జనుల కొరకు డెబ్బది వారములు విధించబడెను, యూదులకి ఏడు సంవత్సరములు ప్రవచించుట". ఆయన ఇలా అన్నాడు "అభిషక్తుడగు అధిపతి (రాకుమారుడగు మెస్సీయా -అను) వచ్చి ప్రవచించును. ఏడు వారముల మధ్యలో, ఏడు దినములు, ఆయన కొట్టివేయబడెను. ఏమియు లేకుండా నిర్మూలమగును (నిర్జీవమగును లేక పాడగును) హేయమైనవస్తువు ఆ చోట నిలుచును. మరియు వారు అనగా అన్యులు ఒక కాలము, కాలము మరియు అర్థకాలము యెరూషలేము యొక్క గోడలు త్రొక్కుదురు.”
85. ఇప్పుడు, మెస్సీయా, అనగా యేసు వచ్చినప్పుడు, ఆయన సరిగ్గా మూడున్నర ఏండ్లు మాత్రమే వారికి బోధించాడు, తరువాత బలిగా కొట్టివేయబడ్డాడు. నిత్యబలి (అనుదిన బలి) తీసివేయబడినది. మరియు నిర్మూలము, నిర్మూలము (నిర్మానుష్యము)గా చేయు హేయమైనది తురకుల యొక్క ఓమర్మసీదు, నేడు కూడా అది పరిశుద్ద ఆలయమున్న స్థానమందు వుండినది. తురకుల యొక్క ఓమర్మసీదు ఖచ్చితముగా పరిశుద్ద ఆలయమున్న స్థానమందే నేడు నిలిచి యున్నది.
86. ఆయన చెప్పినదేమనగా “వారు యెరూషలేము గోడలను అన్యుల కాలము ముగించే వరకు త్రొక్కుదురు. కానీ అన్యుల ముగింపునందు యూదులకి యింకా మూడున్నర ఏండ్లు మిగిలిన కాలమున్నది".
87. ప్రవచనాత్మక చరిత్రలో అత్యంత రసవత్తర సంభవాలలో ఒక దానిని ఇప్పుడు గమనించాము.
88. బైబిల్ యొక్క ప్రవచనము నాకు తెలుసునని నేను నొక్కి ఒక్కాణించట్లేదు. కానీ ఇది దినపత్రిక చదివినంత స్పష్టంగా (తేటగా) వున్నది. ఇక్కడ మనము ఏదైతే చదువుచుంటిమో అది సత్యమని రూఢిగ మనమెరుగుదుము.
89. గమనించండి, రెండువేల సంవత్సరాలు, అవును రెండువేల అయిదు వందలసంవత్సరాల క్రితం యూదులు ఆకాశం క్రిందనున్న ప్రతీ దేశమునకు చెదిరిపోయిరి. దేవుడు ఫరో హృదయాన్ని ఆనాడు కఠినము చేసి వారిని వెనక్కి తీసికొని వచ్చినట్లే, హిట్లర్, ముస్సోలిని తదితరుల హృదయాల్ని కఠినం చేసి ఆయన వారిని తిరిగి పాలస్తీనాలోకి తీసికొనవచ్చెను. వారు అలా తిరిగి వచ్చుట వలన వారొక దేశముగా ఆవిర్భవించారు. 1947 మే6న యూదుల జెండా ఇరవైఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అది ఇశ్రాయేలు దేశము మీద రెపరెపలాడినది. ఇరవై ఐదువందల సంవత్సరాల తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచంలోని అతిపురాతన పతాకము (జెండా)రెపరెపలాడుచుండెను, అంత్యదినముల యందు
ఆయన ఇలా అనెను, ఆదేమనగా "యెరూషలేము మీద ఒక ద్వజము(జెండా)ను క లేపెదను."తద్వారా కాలము సజీవమై యున్నదని అందును బట్టి తెలుపబడెను.
90. మరియు గమనించండి, కొద్దికాలం క్రితం ఇచ్చట నేనొక ప్రవచనాత్మకమగు దృశ్యమాళిక(రీల్) చిత్రమును తిలక్షించితిని, మరి వారు ఆ యొక్క యూదులను విమానాలలో వేలకొలదిగా తరలించుచుండిరి. దానిని మీరు పేపర్లో తదితర వాటిల్లో ప్రచురితమైనట్లు చూచారు. లుక్ మరియు లైఫ్ మేగిజైన్లు కూడా దానిని ప్రచురించెను. వేలాదిమంది యూదులు తిరిగి వచ్చుచుండిరి. మరియు వారు అడిగిరి వారిని, ఇలా అడిగిరి “మీరెందుకు తిరిగి వచ్చుచున్నారు?" వృద్దులు, అవిటివారు తమ వీపులమీద చిన్నపిల్లల్ని మోసుకొంటు వచ్చుచుండగా వారిని అడిగిరి, “చనిపోవు నిమిత్తం మీరు మీ సొంత భూమికి తిరిగి వచ్చుచున్నారా?"
అందుకు వారు “లేదండీ, మేము మెస్సీయాను చూచుటకు తిరిగి వచ్చుచున్నాము"అనిరి. 91. యేసు అనెను, “అంజూరపు చెట్టు చిగురించుటను మీరు చూచినప్పుడు, అలాగే మిగతా చెట్లు చిగురించుట చూచినప్పుడు సమయం సమీపించినదని తెలుసుకొనుడి, వసంతకాలం, వేసవికాలం సమీపమాయెనని గుర్తుంచుడి. కనుక ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు మీరు మీ తలలు పైకెత్తుడి మీ విమోచన (విడుదల) సమీపమాయెను".
92. ఈ రాత్రి, లోకమంతా కమ్యూనిజం అనేది తేనెతెట్టలాగా వ్యాపించినది, ఓ కొద్దిసేపటి క్రితం నేనొక వ్యక్తితో ముచ్చటించుచుంటిని... నేనెరిగిన అధికారులలో ఉత్తమమైన ఉన్నత అధికారి అతడు. ఈ దేశమును గురించి, కమ్యూనిజంను గురించిన సంగతులను అతడు నాతో పంచుకొను చుండెను, అవి మీరు వింటే, అది ఎలా నిజంగా తేనెతెట్టలాగా లోకమంతటిని ఆవరించిందో వింటేనే మీ మోకాళ్ళలో వణుకు పుడుతుంది. ఇంకెంత మాత్రం గట్టిదనేది వుండదు, కనీసం మన దేశంలో సహితం లేదు.
93. నాకు తెలిసినంత వరకు ఎప్పటికి స్థిరంగా నిలిచివుండే ఒకే ఒకటున్నది, అదే బండ, యేసుక్రీస్తు. ఎన్నడూ కదలని ఒక రాజ్యమును మనం పొందుకొని యున్నాం. ప్రతీది పడిపోవుచున్న ఈ దినాలలో మనమొక గట్టి పునాదిని అనగా ప్రభువైన యేసుక్రీస్తు అనే గట్టి పునాదిని మనం కలిగి యున్నాం. మిత్రులారా దానిలోనికి రండి. గాలి తుఫాన్ల మధ్యలో అదొక ఉత్తమమైన ఆశ్రయం. అదెంత అద్భుతమైందో. అన్నియు జరగుటను అతడు చూచాడు.
94. ఇప్పుడు మనం యూదులను చూస్తున్నాం. యెరూషలేమును గురించి బైబిల్ చెప్పుచున్నది. -అది ఒక రోజాపువ్వు (గులాబి పుష్పము) వలే వికసిస్తుందని. ఆ భూమిని వారు ఏ విధంగా చదును చేసి సేద్యం చేస్తున్నారో చూడండి. మరియు అలాగే వారు... ప్రవక్త ప్రవచించి ఇలా చెప్పాడు "ఆ దినమందు, ఉత్తరదిక్కు నుండి నీరు ఉబికి వచ్చును" అయితే నిజానికి అప్పటి వరకు ఆ దిక్కువ నీరు, నీటి ఊట అనేదే లేదండీ, కానీ గత కొద్ది సంవత్సరాల నుండి ఒక పెద్ద నీటి ఊట పైకి ఉబికి లోయలన్నిటిని నీటితో తడుపుచుండెను. వ్యవసాయం చేయుటలో వారు ప్రపంచములోనే అత్యంత ముందు వరుసలో వుండిరి.
95. మరియు ఈ గొప్ప రసాయనాలన్ని సరిగ్గా ఆ మృతసముద్రంలో నిక్షిప్తమై యున్నవిఆ సముద్రము యొక్క అడుగు భాగాన ఈ ప్రపంచ సంపదంతా వెచ్చించినా కొనలేనంత గొప్ప రసాయనాలు కావల్సినంతగా అందు వుండెను; రసాయనాలు, యురేనియం (ధార్మిక
శక్తిగల తెల్లని లోహకము. ఇదెంతో ఖరీదైనది -అను) మరియు ప్రతీది ఆ యొక్క మృత సముద్రపు అడుగు బాగానే నిక్షిప్తమై యున్నది, ఆ మృత సముద్రం ఇప్పుడు ఇశ్రాయేలుకి చెందియుండెను.
96. "అంజూరపు చెట్టు లేతదై చిగురించుచుండెను." మరి అదొక్కటి మాత్రమే కాదండీ, మిగతా వృక్షాలు కూడా చిగురించుచున్నవి ఇప్పుడు, కమ్యూనిష్టులు చిగురించుచున్నారు. క్రీస్తు విరోధి చిగురించుచున్నాడు.
97. దేవుని సంఘ సంఘము చిగురించుచున్నది. ఆమె తిరిగి తన శక్తి(అధికారము)తో వికసించున్నది. గొంగళి పురుగు(ఆకు పురుగు) దానిలో కొంత తినివేసెను, పసరపురుగు మరి కొంత దానిలోనిది తినెను. మిడత దానిలోని దానిని తిని వేసెను, చీడ పురుగు దానిని తిని వేసెను కానీ మరలా అది బ్రతుకునని దేవుడు సెలవిచ్చియున్నాడు. ఆ ప్రకారమే అది ఇప్పుడు చిగురించుచున్నది.
98. చెట్లు చిగురించుచున్నవి. దానియేలు దానిని ముందుగానే చూచి ఆనందించెను. ఇప్పుడు, ఈ సమయమందు, ఆయనిలా పలికెను "అంత్యకాలమందు..." 12వ అధ్యాయం.
ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అదిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు.
99. 'ఓ, మై! ఆయన గ్రంథములో నీ పేరు వుండినందుకు నీకు సంతోషముగా లేదా? (సమాజము “ఆమెన్” చెప్పుచున్నది -సంపా) దానియేలు, ఆయన వచ్చుటను చూచుచున్నాడు, "ప్రాచీన దినములయందు ఆయన యొక్క తల వెంట్రుకలు శుద్దమైన గొట్టెబొచ్చువలె తెల్లగానుండెను. మరియు ఆయన గ్రంథమును తెరిచెను. ఆ గ్రంథములలో వున్న దాని ప్రకారం ప్రతీ మనిషి తీర్పుతీర్చబడెను," గొప్ప దవళ సింహాసనపు తీర్పు అది.
100. ఇప్పుడు, అన్యుల కాలము యొక్క ముగింపునందు దానియేలుకి ఈ నిశ్చయత ఇవ్వబడెను. చదవండి... మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, రేపటి దినాన మీరు 11వ అధ్యాయమును చదవండి ఉత్తర దిక్కునున్న రాజు ఏవిధంగా దండెత్తి వచ్చుచున్నాడో అక్కడ చూడవచ్చును, అది రష్యా తప్ప మరేది కాదండీ, సుడిగాలివలే అది వచ్చి దానికి విరోధముగా నిలుచును. యెరూషలేము ద్వారముల సమీపమున ఆ గొప్ప హర్మగిద్దోను యుద్ధము జరుగును. గమనించండి, ఓ, దానిని ఇష్టపడుదును.
ఆ సమయమందు నీ జనులు విమోచించబడుదురు(తప్పించబడుదురు). గ్రంథమందు, గొట్టెపిల్ల జీవగ్రంథమందు కనుగొనబడిన ప్రతి ఒక్కరు విమోచించబడుదురు. 101. మిఖాయేలు అను గొప్ప రాకుమారుడు (అధిపతి) నిలువబడును, (ఎవరి కొరకు) "నీ జనుల కొరకు" మంచిది.
మరియు సమాధులలో నిద్రించు వారిలో అనేకులు మేలుకొనెదరు (ఎప్పుడు?) ఈ కాలములు జరుగునప్పుడు, కొందరు నిత్యజీవమును అనుభవించుటకు, మరియు కొందరు నిందలపాలగుటకు నిత్యముగా హేయులగుట (దిక్కరింపబడుట) కు మేలుకొందురు 102. నిత్యజీవమనేది ఎంత వాస్తవంగా (నిశ్చయం)గా వుందో నిత్య ఎడబాటు (నిష్క్రమణ) అనేదియు అంతే వాస్తవం(నిశ్చయం)గా వున్నది. యేసుక్రీస్తు విషయమై నీ వైఖరి ఏమిటనే
దాని మీదనే అది ఆధారపడి వుంటుంది. నీవు ఆయనను ప్రేమించినట్లైతే, తిరిగి జన్మించినదాన. అలా కానష్టత సీ ఆయన ఆత్మను పొందినట్లైతే నీవు నిత్యజీవమును పొందుకొందువు. నీ పేరు వ్రాయబడినట్లేతే నీకు అక్షయ నిత్య జీవమనేదే వుండదు. గొట్టెపిల్ల జీవగ్రంథమందు నీ జీవితం వుండును. అది అక్కడ వ్రాయబడనట్లేతే నీవు గుర్తించబడలేవు.
103. ఏమిటది? ఆ ప్రవచనములన్ని నెరవేరినవి, ప్రతీది ఈ కాలము వరకు,
104. దానియేలు చెప్పినట్టు బంగారు శిరస్సు గతించిపోయింది, అది బబులోను రాజ్యము.
105. అతడు చెప్పినట్లే మాదీయులుపార్శీకులు దానిని జయించిరి. బబులోను సామ్రాజ్యమును
వారు స్వాధీనపర్చుకొనిరి. 106. మరియు వారు పడిపోయిరి. (ఎవరికి?) గ్రీకులకి, అలెగ్జాండర్ మహారాజు,
107. మరి వారు ఎవరికి పడిపోయిరి? రోమన్లకి. రోమన్లు లోకమంతట విస్తరించిపోయిరి. తూర్పు పశ్చిమ రోములుగా, రెండుపాదములుగా వుండిరి.
108. మరి అతడన్నాడు. "ఇనుము మరియు మట్టి అనేవి పాదము యొక్క వ్రేళ్ళుగా వుండినవి. పదివ్రేళ్ళు, అనగా పదిరాజ్యములు." అవి ఒకదానికొకటి కలవవు అని అతడు చెప్పెను. వారు తమలోతామే వివాహబంధం ద్వారా ఏకమైరి. రోమనిజం మరియు ప్రొటంస్టిజం. "
109. “మరి ఆ దినమందు,” ఇది సంభవించినప్పుడు "చేతి సహయంలేని పర్వతము నుండి తీయబడిన రాయి, దొర్లుకొంటు వచ్చి ఆ ప్రతిమను ముక్కలు ముక్కలుగా పగులగొట్టెను." ప్రతిమ యొక్క స్థానమున అది(రాయి) ఆక్రమించెను.
110. కనుకనే, నాసహోదరులారా, ఈరాత్రి మనకి సమస్యలున్నవి “యుద్ధములు, యుద్ధమును గూర్చిన సమాచారములు, అక్కడక్కడ భూకంపములు, కలవరపడే కాలములు, దేశాల మద్య చిచ్చులు(బాధలు)" ఈమధ్యనే నేను విదేశీ పర్యటనను చేసి వచ్చాను. వెన్నులో వణుకు పుట్టని దేశమును నేను నేను చూడలేకుంటిని. తర్వాత ఏం జరుగునో వారికి తెలియకుండెను.
111. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసును. అందునుబట్టి ఈ రాత్రి మనం కృతజ్ఞలుముగా ఉందామా! ప్రభువైన యేసుక్రీస్తు రెండవ సారి మహిమతోను, మహాత్యముతోను వచ్చును. గొఱ్ఱపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడి కనుగొనబడిన ప్రతీ స్త్రీ పురుషుడు ఆకాశమందు ప్రభువును ఎదుర్కొనుటకు తమ ప్రియులతో కలిసి పునరుత్థానమందు తిరిగి లేతురు. ఓ ఎంత అద్భుతమైన సంగతి అది ! అందును బట్టి మనమిలా చెబుతాం.
మరి దేనిమీద కాళ యేసు రక్తముమీదను, నీతిమీదను
మన నిరీక్షణ కట్టబడి యుండెను.
నా హృదయాంతరంగమంతా యిచ్చెదును (అప్పగించుకొందును)
ఆయనే మన నిరీక్షణ మరియు ఆశ్రయము.
112. “ఆ దినమందు గొప్ప అధిపతియగు (రాకుమారుడగు) మిఖాయేలు నిలువును." మిఖాయేలు యేసుక్రీస్తుయై యుండొచ్చును, అతడే ఆకాశమండలమందు అపవాదితో పోరాటం చేయును. సాతాను మరియు మిఖాయేలు ఇద్దరు ఒకరి విరోధంగా ఒకరు పోరాడుదురు.
113. మరి, ఇప్పుడు, "ఆ దినమందు గ్రంథమందు దాఖాలైన వారందరు నీతిజరిగించిన వారు ఎవరైతే వుందురో వారందరు తప్పించబడుదురు (విమోచించబడుదురు)" అని అతడు
చెప్పెను. దీనిని గమనించండి.
బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గమును అనుసచరించునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ నక్షత్రముల వలే నిరంతరము ప్రకాశించెదరు.
114. నేను దానిని చూచితిని, కొంతసేపు, మరి సహోదరులారా నేననుకొనుచున్నాను. వేకువనే (పెందలకాడనే)నేను బయటకి వెళ్ళుదును. పెందలకడనే నిద్రలేవటం నాకిష్టం, వేకువనే లేవటంను మీరు ఇష్టపడరా? (ఆమెన్ అని సమాజము అనుచున్నది -సంపా)
115. సహోదరులతో కలిసి నేను పర్వతముల మీద వుండినది నాకు జ్ఞాపకమున్నది. బాగా వేకువనే, సుమారు నాలుగు గంటలకే మేము నిద్రనుండి మేల్కొనెదము. ఆ వెనుక అక్కడ వ్రేలాడిన దానిని చూచితిని అక్కడ వేకువ నక్షత్రం వుండెను. ప్రొద్దుపొడుచుటకు ముందు అది చాలా నలుపెక్కును.
116. చీకటిని సమకూర్చుటను మనమిప్పుడు చూచుచున్నాము. అది ఏమిటి? చీకటికి విరోధంగా వెలుగు ప్రచరించుట అది. ఒకటి వెళ్ళిపోవల్సిందే.
117. రాత్రిపూట ప్రాకే పురుగులన్ని ప్రొద్దుపొడిచినప్పుడు, వెలుతురు వచ్చినప్పుడు అవన్ని తమతమ నివాసాలకి తిరిగి వెళ్ళును. రాత్రి మరియు చీకటి... చీకటి మరియు వెలుతురు ఒక భవనంలో వుండలేవు. వుంటే చీకటైనా వుండాలి లేదా వెలుతురైనా వుండాలి. చీకటి కంటే వెలుతురు ఎంతో బలీయమైనది.
118. మరలాగే ఈ లోక శత్రువులందరికంటే క్రీస్తు ఎంతో శక్తిమంతుడు.
119. ఇప్పుడు, మనం శాస్త్రజ్ఞుల ద్వారా ఒక సంగతిని నేర్పబడ్డాము. అదేమనగా వెలుగు వచ్చుట ఆరంభమైనప్పుడు, అది చీకటిని సంగ్రహించును(కుద్రించును) అని. చీకటి తన పెద్ద దండునంతటిని వెలుతురికి విరోదముగా పోరాడుటకు సమకూర్చునని, కానీ వెలుతురు దానిని చేధించి ముందుకు వచ్చువని.
120. అంత్యదినములయందు "పాతాను గర్జించు సింహంవలే వచ్చునని" బైబిల్ సెలవిలిచ్చినది. వాడు తన శత్రువులనందరిని, తన మిత్రులందరిని, మన శత్రువులను ఒకటిగా సమకూరుస్తాడు, అందరిని ఒక పెద్ద సమూహముగా కుప్ప చేస్తాడు. క్రైస్తవ సంఘలోకమంతటిని సమాఖ్యగాను, సంఘములను సమితిగాను మృగము యొక్కముద్రగాను చేస్తాడు. కథోలిజం ఎలాగైతే గొప్ప సంస్థ అయ్యిందో, అదే రీతిన మిగతా సంఘములన్నిటిని గొప్ప సంస్థ (సమితి)గా ఐక్యపరుస్తాడు.
121 మరియు లోక చక్రవర్తులు తమంతట తామే ఏకమైపోవుచున్నారు. రాజకీయ ప్రపంములో వారంతా కమ్యునిజం అనుదానియందు అక్కడ వారొక పెద్ద శిరస్సును రూపొందించుచున్నారు.
122 మరియు దేవునియొక్క వెలుగు బలముగా ప్రసరించుచున్నది. దానిని చేయుటకు, అదే సమయంలో ఏమి జరుగుచున్నది. క్రైస్తవసంఘము, జీవంగల దేవుని సంఘము అభిషేకించ బడుచున్నది. శక్తి దానికి వచ్చుచున్నది. ఆమె పరిశుద్దాత్మను పొందుకొనుచున్నది.
123. గత సంవత్సరం, పదిహేను లక్షలమంది మార్పునొందినట్లు సంపూర్ణసువార్త లోకం ప్రకటించింది. సంవత్సరములు గడిచేకొద్ది అది గొప్పగా భూమిని తుడిచిపెట్టుకొని పోవుచున్నది. మనమిక ఎంతమాత్రం సందులలో లేము గానీ పైన హల్లెలూయ విశాలమందు వుంటిమి. మనము ఇక ఎంతమాత్రం కొట్టం(పాక)లో లేము. గడిచిన సంవత్సరం సంపూర్ణ సువార్త
ద్వారా పదిహేను లక్షలమంది జనులు కథోలికు, మరింకా అనేకమైన వాటినుండి బయటికి వచ్చి రక్షించబడిరి. ఓ, మై,
124. అది ఏమిటి? వెలుగు ఒక సమకూరు) (వెలుగు సమకూర్చుచున్నది-అను). గొప్ప స్వస్థత కూటములు భూగోళాన్ని దువ్వినది. హల్లెలూయ. దిగువున్ ఫర్మాసాలో ఇప్పుడుస్వస్థత మహాసభలు జరుగుచున్నవి. అలాగే జపాన్లో కూడా స్వస్థతమహాసభలు జరుగుచున్నవి. మరలాగే అతి శీతల ప్రాంతమైన ఉత్తర ప్రాంతంలో కూడా స్వస్థత మహాసభలు జరుగుచున్నవి. ప్రపంచమంతా స్వస్థత మహాసభలు! హల్లెలూయా! ప్రతీచోట పురుషులు (జనులు) పరిశు ద్దాత్మను పొందుకొనుచున్నారు. మనము అంత్యకాలమందు వున్నాం.
125, ఆదేమి చేయుచున్నది? అప్పుడు అపవాది ఇలా అనుచున్నాడు "ఇది నా సమయము". అపవాది తన శక్తులన్నింటిని గుంపుచేయుచున్నాడు. సంఘాల సమాఖ్య దానిని ఆపుచేయుటకు ప్రయత్నించుచున్నవి, ఇలా అంటున్నవి "వారు కేవలం గోల పెట్టె గుంపు కాక మరేమి కాదు. వానికంటూ ఏమీ లేదు, అదంతా మూఢభక్తి, సహజతీతమైనవి జరగటమంటూ ఏమీ లేదు ".
126. మరదే సమయంలో, అమెరికా యొక్క శిరస్సు... మెడికల్ అసోసియేషన్ వారు పేపర్లో ఒక వ్యాసాన్ని వ్రాసారు, వారు ఇలా అన్నారు "సర్వశక్తి గల దేవున్ని విశ్వసించని వారు, తమకి సహాయకునిగా ఆయన్ని అంగీకరించని వారికి రోగులున్న గదిలోనికి వచ్చి రోగులకి పరిచర్య చేసే హక్కు అట్టివారికి ఏ మాత్రం లేదు." గతనెలలో క్రిష్టియన్ హెరాల్డ్ వారు కొంతమంది వైద్యులను ఇంటర్వూ(ముఖాముఖి సమావేశము) చేసెను, స్వయంగా నేను కూడా వ్రాయలేని గొప్ప సంగతులను వారు చెప్పినట్లు ఆ పత్రిక వ్రాసినది. ఏమిటి అది? ప్రతీదాని మద్యలో దేవుడు తన శత్రులు సహితం తన మహిమను గూర్చి సాక్ష్యం చెప్పునట్లు చేస్తాడు. అవునండీ "మేము కేవలం రోగికి సహయం మాత్రమే చేస్తాం. కానీ దేవుడే స్వస్థపర్చువాడు."
తెలివిలేని అసమర్థులమగు మనకెల్లప్పుడు తెలిసిన దాన్ని ఆ గొప్ప మనుష్యులు ఇప్పుడు కనుగొనుచున్నారు"అది సరియే.
127. మహిమ గల ఈ దినాలలో, వేశ్యలను సభ్యత గల స్త్రీలుగా, త్రాగుబోతులను మృదువుగల వారినిగాను, క్రైస్తవులనుగా మార్చే ఈ శక్తి సముదాయము మహిమగల ఈ దినాలలో ఒక దినాన వారిని ఈ భూమ్మీద నుండి పైకి లేవనెత్తి ఎత్తబాటులో వారివి గృహమునకు, మహిమలోనికి తీసికొనిపోవును. అది బాగా ఆలస్యమవ్వచ్చును, అనేకులు కొరకు అది బాగా ఆలస్యమౌవచ్చును.
128. “ఆ దినమున మిఖాయేలు ప్రజల నిమిత్తం నిలబడును". ఆయన దేశముల నిమిత్తం నిలబడుట కాదండీ. ఆయన ప్రజల నిమిత్తం నిలబడును. "నేలమంటిలో నిద్రించిన వారిలో అనేకులు మేల్కొనెదరు, కొందరు నిందల సాలగుటకు హేయులగుటకు మేల్కొందురు. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము ననుసరించి నడుచునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలే నిరంతరము ప్రకాశించెదరు." హల్లెలూయ!
గుడారములో లేదా చిన్న ఇంటిలో జీవించెనా నేనెందుకు బాధపడాలి (లెక్కచేయను -అను)
అక్కడ వారు నాకొక రాజ భవనమును కట్టుచున్నారు. (నన్ను మాచుటకై ఒకనాడు వచ్చెదరు 1)
129. ఏమిటి అది? నేను బయటకి నడిచి వచ్చి, ఆకాశమందు కదులుట ఆరంభించుచున్న ఆ వేకువచుక్కను చూచితిని. వేకువచుక్క ఏమి బోధించుచున్నది? రాబోయే సూర్యుని యొక్క మహోన్నత కాంతినే వేకువచుక్క ప్రతిబింబిస్తుంది. అది నిజమేనా? వేకువచుక్క, అది అంతగా దగదగ మెరియుటకు కారణం మీకు తెలుసా? అది సూర్యునికి ఎంతో సమీపముగా వుంటుంది. మార్యుని ప్రభావం వేకువచుక్కమీద పడును. సూర్యుని ఆగమనాన్ని వేకువ చుక్క ముందు జూపును(ముందస్తుగా అరిచి చెప్పుచున్నది - అను).
130. మంచిది, వేకువచుక్కలారా, ఆయన రాకడను గూర్చి మీరు గట్టిగా అరిచి పిలిచే సమయమిది ప్రకాశించండి, వేకువచుక్కలారా! వేకువనే మేల్కొనండి! "కుమారుడు అతిశీఘ్రముగా ఇచ్చట ఉండబోవుచున్నాడ"ని అది చెప్పుచున్నది.
131. వేకువచుక్క ఆకాశమందు నిగనిగలాడుట (మెరియుట)ను మనం చూచినప్పుడు, అతి శీఘ్రముగానే సూర్యుడు ప్రకాశించబోవుచున్నాడని దాని వలన అర్ధమగును.
132. దేవుని వేకువచుక్కలు లేచి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన మహిమను ప్రకాశించు చున్నప్పుడు అది సర్వోవతుని యొక్క శీఘ్ర ఆగమనాన్ని చూపించుచుండెను) వెలుగు కాంతులు సమకూర్చబడుచున్నవి. కానీ వేకువచుక్క ఈ విధంగా గట్టిగా కేక వేయుచున్నది, "ఆగండి, ప్రొద్దు పొడుచుటకు ఇక ఆలస్యముండదు." ఆగండి! పగటి వెలుగు వచ్చుటకు ఇక ఆలస్యముండదు. కేవలం అలా పట్టుకొని యుండండి. సిస్టర్ మర్ఫీ మరియు వారు ఇలా పాడినట్లుగా వుంది, "అలానే పట్టుకొనే వుండండి, పగటినెలుగు అతిత్వరగా వచ్చుచున్నది." వారు వచ్చేటంత వరకు... గొప్ప చీకటికి ముందు, మరియు ప్రభువు యొక్క ఆగమనము అనే ఆకాశమునుండి పడే పిడుగు వచ్చుటకు ముందు ఉదయనక్షత్రములు (వేకువ చుక్కలు)ఇప్పుడు లోకమునకు ప్రకాశించుచున్నావి. లోకమంతా మెరియుచున్నావి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన అనెను...
133. వేకువచుక్కవైపు నేను చూచితిని మరియు ఇలా తలంచితిని," ఓ, వేకువ నక్షత్రం” నేను క్రిందికి చూచితిని...
134. ఒకరోజు నేను బ్రదర్డ్ అక్కడ నిలబడి యుంటిమి. అప్పుడే అతడు మంట రాజేసాడు. మేము మా ఉదయకాలపు ఆల్పాహారమును తీసికొనబోవుచుంటిమి. మరియు నేను తిరిగి వేకువచుక్క వైపు చూచితిని. అక్కడున్న దేవదారు పొదలవైపు నడుచుకొంటు వెళ్ళితిని, అక్కడున్న పచ్చటి చెట్లు గుండా చల్లని గాలులు గుసగుసలాడుచున్నవి. నేనక్కడ నిలబడి వుంటిని. మంచిగా అనిపించినది, ఆ ఉదయకాలపు చల్లని పిల్లగాలులు పీల్చుట ఎంతో ఆహ్లాదకరముగా వుండినది. అది ఒక రకముగా దట్టమైన మంచు, అక్కడ ఎంతో అతిశీతలముగా వుండినది. బక్కెటు నీళ్ళుపట్టుకొనుటకు వాగు దగ్గరకు పోవుటకు ముందే, నీవు లేచుటకు ముందే మంచు గడ్డ కట్టుకొని పోవును.
135. ఆ పచ్చటి చెట్ల మద్యలో నేను నిలబడి నా చేతులను పైకెత్తితిని. ఆ వేకువచుక్క వైపు చూపితిని. నేనిలా తలంచితిని, " ఓ, ఇక్కడ చూడుము, నలభై అయిదు సంవత్సరములు నీ కేమి చేసెను” నేనన్నాను "ఓ, ఇక్కడ చూడుము, నేను ముసలివాడిని అయిపోవుచున్నాను. (నేను
ముడతలు పడిపోవుచున్నాను) నా చేతులు ముడతలు పడుచున్నవి, నా వెంట్రుకలు కానీ" నేనన్నాను. "సుదూరమున చూడుము, ఆ వేకువచుక్క ఎంతో చక్కగా, దేవుడు తన ఊడిపోవుచున్నవి, పళ్ళు పోవుచున్నవి. ఓ, నలభై అయిదు సంవత్సరాలు నాకేం చేసినవి చేతులులో నుండి "ఉఫ్" అని ఊది "ప్రకాశించును గాక"అని పలికిన నాడు ఎంత ప్రకాశమానముగా ఉన్నదో నేడును అంతే రీతిగా అది ప్రకాశించుచున్నది.
136. అప్పుడు నేను లేఖనమును గూర్చి తలంచితిని. నేను అన్నాను. "దేవుడు వాగ్దానం చేసాడు,మనము జ్ఞానము కలిగి అనేకులను నీతి వైపు త్రిప్పితే, మనం ఆకాశమందు జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదము.”
137. నేను అనుకొన్నాను, “వేకువ నక్షత్రమా, నీవిప్పుడు ప్రకాశించుచున్నావు. మేము అక్కడికి చేరే వరకు వేచి వుండుము! హల్లెలూయ! "నిత్యము జ్యోతుల వలే ప్రకాశించెదరు !"
138. మరియు ప్రొద్దుపొడుచుచుండగా కొండగాలి వీస్తూ గుసగుస చేయుటను నేను వినగల్గు చున్నాను, అదిలా అనుచున్నది;
నదికి అవతల ఒక దేశమున్నది శాశ్వతముగా అది ఎంతో మధురమైనదని మనం పిలుస్తాం విశ్వాస పట్టా ద్వారా మాత్రమే మనం అచ్చటికి చేరుకొంటాం నీ కొరకు నా కొరకు వారు బంగారు గంటలు మ్రోగించినప్పుడు. అక్కడున్న అక్షయులతో కలిసి జీవించటానికి, ఒకరి తర్వాత ఒకరం అచ్చట వున్న ద్వారం గుండా ప్రవేశిస్తాం,
139. “జ్ఞానవంతులైన వారు అనేకులను నీతివైపు త్రిప్పుదురు. ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల వలే వారు నిరంతరము, నిరంతరము నిలిచియుందురు” అదెంత గొప్ప సంగతి!
140. ఏదేమైనా అది ఏ వ్యత్యాసమును చేయును? ఈ పాత వ్యవది దేని కొరకు? ఈ చిన్న పాతదగు నేలమన్ను(దేహము -అను) వెన్నుముక లేని క్రిమి(పురుగు), చెడిపోయే ఈ చిన్న క్షయత దేహము తిరిగి మన్నులోనికి వెళ్ళును, చర్మపు పురుగులు దానిని తినివేయును. L, మై, నాలో వున్న సమస్తముతో నేను లేచి ప్రభువు మహిమ కొరకు ప్రకాశింపనిమ్ము. ప్రతి - భారమును ప్రక్కన బెట్టుము, అందును బట్టి మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచినాడని ఋజువు చేయు నిమిత్తం సువార్త ప్రకటించుట ద్వారా, రోగులను స్వస్థపర్చుట ద్వారా పరిచ ద్దాత్మ తన యొక్క శక్తులను, మహిమను ప్రవహింపజేయును. ఓ, మై!
శాశ్వతముగా.
దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. అంతట దానియేలు అను నేను చూచుచుండగా మరిద్దరు మనుష్యులు ఏటి అవతల యొడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. (దానియేలు12:5-7.)
మరియు ఆ యిద్దరిలో ఒకడు నారబట్ట వేసికొనిన (అతడు పరిశుద్దాత్మ) వాడై యేటినీళు ఎ) (నీరు అనగా ప్రజలు మరియు జనసమూహములు)పై ఆడుచుండు వానితో చెప్పెను.-
141. ప్రజలు మీద పరిశుద్దాత్మ నిలుచుట ! ఓ హల్లెలూయ. పరిశుద్దాత్మ.
142. ప్రకటన 15:16 ఇలా సెలవిచ్చుచున్నది, "దళము మరియు జనసమూహము. జలము
అనగా దళము మరియు జనసమూహములు"అని అర్థం. (ప్రక 17:15, -అను)
143. "మరి ఇక్కడ ఒకవ్యక్తి సన్నపు నార వస్త్రములు ధరించి, తన చేతులను ఆకాశము తట్టు ఎత్తి నీటిమీద సైకి క్రిందికి కదిలాడుచూ యుగయుగములు జీవించుచున్న వాని తోడని ఒట్టు పెట్టుకొని ఇవి జరుగునప్పుడు, ఇక ఆలస్యముండదు" అని చెప్పెను. హల్లెలూయా!
144. "ఇక ఎంత మాత్రము సమయముండదు" ఈ దేశములు ముక్కలైనప్పుడు, కార్యాలు జరిగినప్పుడు, "దేవుని యొక్క మర్మము ఇదివరకే సమాప్తమైన"ని ఒట్టు పెట్టుకొనెను.
145. "దేవుని యొక్క మర్మము" అనగా ఏమిటి? “శుభప్రధమైన నిరీక్షణ కలిగించు దేవుడే నీలో వుండుట." పరిశుద్దాత్మ బాప్తీస్మంను ప్రవేశింపజేయును.
146. అంతట ఆయన చెప్పెను “ఇవి జరుగనారంభించినప్పుడు ఇక ఎంతమాత్రము సమయ ముండదు".
147. "తమ దేవున్ని ఎరిగిన వారు" అని దానియేలు అనెను. "అంత్య దినములయందు అనేకులు నలుదిశలా సంచరించుదురు, తెలివితేటలు అధికమగును అయితే తమ దేవున్ని ఎరిగిన వారు అంత్య దినములయందు శూర కార్యములు జరిగించెదరు.
148. "వారు శూర కార్యములు జరిగించెదరు." ఓ, ఈ రాత్రి ప్రపంచమంతా మళ్ళీ మళ్ళీ విశ్వాసము ద్వారా శూర కార్యములు జరుగుచున్నవి. ప్రపంచవ్యాప్తంగా గొప్ప కూటములు! గ్రుడ్డివారు చూచుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. సకల జీవనవిధానాలు గల జనులు లోనికి వచ్చుచున్నారు. వారు పరిశుద్దాత్మను పొందుకొనుచున్నారు. కేవలం బీదవారు, బిక్షగాళు మాత్రమే కాక కోటేశ్వరులు మరింకా ప్రతి ఒక్కరు పొందుతున్నారు. దేవుడు తన వస్త్రమును తీసికొని వారిలో ప్రతి ఒక్కరిమీద పెట్టుచూ పెండ్లివిందుకి వారిని ఆహ్వానించుచున్నాడు.
149. మరియు గొప్ప ప్రధాన యాజకుడగు మెల్కీసెదెకు ఒక దినాన నాన వచ్చును. మహిమకరమైన ఈ దినములలో ఒక దినాన మనము దేవుని రాజ్యములో ఆయనతో కలిపి మళ్ళీ (క్రొత్తగా) ప్రభురాత్రి సంస్కార భోజనమును భుజించెదము. ఓ, ఆ రాజ్యములో నేనునందుకు ఈ రాత్రి నేను చాలా ఆనందంగా వున్నాను. అవునయ్యా. ఒక గొప్ప దినాన, ఒక అద్భుతమైన దినాన "సమయమనేది ఇక ముగించబడును! "
150. చూశారా, పునం నిత్యత్వములో నుండి వచ్చితిమి. ప్రపంచము అనేది లేనప్పుడే మనము ఉ న్నాము. దానిని మీరుఎరిగియున్నారా? దేవుడు నరుని తన స్వరూపమందు సృజించెను.
151. యోబు కొంత తెలివిని కలిగి యున్నప్పుడు ఆయన "నీవు ఎక్కడున్నావు" అని యోబును అడిగెను. “నేను లోకమునకు పునాదులు వేసినప్పుడు, మధ్య ఎక్కడున్నావు, దేవుని కుమారులు ఏకముగా కూడా మరియు ఉదయనక్షత్రములు సంతోషముగా కేకలు బెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు! "
152, "ఉదయనక్షత్రములు ఆనంద ధ్వనులు చేసెను" ఒక దినాన వారు ఈ భూమ్మీద నివాసము(గుడారము)నకు వచ్చుటను చూచినప్పుడు ప్రకాశించువారు ఆనంద ధ్వనులు చేసిరి. మరియు రాజైన మెల్కీసెదెక్ దేవునియొక్క నీతి యందు వచ్చి మనల్ని తిరిగి విమోచించి దేవుని యొద్దకు తెచ్చుటకు, మరియు తర తరములు శాశ్వతముగా ప్రకాశించుటకు తన ప్రాణమును పెట్టెను. '
153. "జగత్తుకి పునాదికి వేసేటప్పుడు నీవు ఎచ్చట వుంటివి? అవి దేవీతో కట్టివేయబడినో తేల్చి చెప్పుము. అవి దేనిమీద నిలబడి యుండినో నాకు చెప్పుము " అని అడిగెను. “పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, ఒక మనిషివలే నేను నీతో మాట్లాడగోరుచున్నాను" అంతట యోబు చచ్చిన వానివలే ముఖము నేల మీద వేసికొనెను. అతడు నిలువలేకపోయాడు. దేవుడు అక్కడ వుండెను. నీవు అచ్చటే వుంటివి. "లోకానికి పునాదులు వేసినప్పుడు నీవు ఎచ్చట వున్నావు?"
154. పాతనిబంధన ప్రవక్తల ద్వారా ఈ మహిమ గల సువార్త ప్రవచింపబడి యుండెను. కాలముల గుండా అది ప్రయాణించి వచ్చినది. ఈ రాత్రి అది ఇచ్చట వున్నది. ఆమె లోకమును ఊడ్చివేసినది. దానిని(సువార్తను) తీసివేయాలనుకొన్నారు.
155. గాలులు బాగా వీచుచున్న రోజున అడవిలో ఎండిన చెట్లుకి అంటుకొనిన మంటను ఆర్పివేయాలని ప్రయత్నించుట, ఎందుకు, దానిని నీవు చేయజాలవు. దాన్ని నీవు ఆర్పివేయాలని ప్రయత్నం చేసేకొద్ది అదింకా ఎక్కువగా గాలుల వలన వ్యాపించును. దానిని మరేం చేయజాలం,
156. పర్వతాల మీద ఉన్నప్పుడు మేము కొద్ది మంటను కలిగి వుంటాం, ప్రాతా: కాలమందు నేను కొద్దిపాటి మంటను రగుల్చుదును. నేను లేచి బయటకి వెళ్ళి కొన్ని పుల్లలు ఏరుకొని వచ్చి దాని మీద వేసెదను. అప్పుడు పొగ వస్తుంది. అక్కడ చిన్నపాటి పొగ వస్తుందంటే అక్కడ ఇంకా నిప్పు వున్నట్టేనని నాకు తెలుసును. కనుక నేను నా టోపిని తీసి దానిని రాజేసెదను అప్పుడు అది మండుకొనును, నాకు తెల్సిందంతా అదే.
157. నేడు సంఘమునకు కావల్సిందల్లా అదేనండీ, పెంతెకోస్తు దినాన వీచిన అదే బలమైన గాలి మరోసారి వీచునట్లు చేయుట, విశ్వాసమందు అది తిరిగి మరలా వీచునట్లు చేయుట, అది ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తును తన యొక్క మహిమ గల రాకడ యందు చేరుకొనుటకు ఆ గాలి మళ్ళీ వీచుట అవసరమై వున్నది.
158. జరుగుచున్న సూచనల వైపు, అద్భుతముల వైపు, మర్మయుక్తమగు సంగతుల వైపు చూడండి "అక్కడక్కడ భూకంపములు జరుగుచున్నవి. ఆటుపోటు తరంగాలు తీరాన్ని ద్వంసం చేయుచున్నవి.” ఏవిధముగా జరుగునని యేసు చెప్పెనో మరి ఆ విధంగానే జరుగుచున్నవి, “మనుష్యుల యొక్క గుండెలు భయంతో పగిలి పోవుచున్నవి.”
159. భయం, "ఓ ఎవరు మొదటిగా అణుబాంబును విసురుతారు? ఏం జరుగుతుందో? కొద్ది గంటల్లో ప్రపంచమంతా నాశనమైపోతుంది" ఎందుకని, విమానంలో నుండి ఏ అణుబాంబు పడక మునుపే మనము దేవుని సన్నిధిలో వుండెదము. అది నిజం. అది ఏమగును? అది ఏమీ కాదు, కేవలం శరీరమనే వస్త్రమును మనం జారవిడుచుట తప్ప. మనము దానిని విడిచెదము, లేచి మరియు నిత్య బహుమానాన్ని చేరెదము, ఆకాశ మార్గాన దానిని చేరుకొనే క్రమములో " వీడ్కోలు, వీడ్కోలు" మధురమైన ప్రార్థనా గడియ,
160. అది ముగిసిపోవును, మరియు మనం ఇంటికి వెళ్ళుదుము, ఈ పాత దేహమును ఇక్కడే విడిచి పెట్టి వెళ్ళుదుము. వాడబారని కిరీటమునకై అక్కడ దూరానా మార్పు చెందెదము. ముసలి పరుషుడు, స్త్రీ నుండి నూతనమైన ఒక యవ్వన స్త్రీ పురుషునిగా మారెదము, నిత్యము జీవించుటకై, అలాగే "సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ ! మనమధ్య ఆయన గొప్ప
కార్యాలు జరిగించెను" అని పాడుటకై మార్పచెందెదను.
161. నేడు మనం యాత్రలో వుండగా, ప్రతీది ప్రతి ఒక్కరి చేతిలో దేవునిశక్తి ద్వారా ఋజువు చేయబడుచున్నది, కావున మనం చుట్టూ చూసి, ఎక్కడ వున్నామో అనే దానిని చూద్దాం. అంజూరపు చెట్టు చిగురించుటను చూడుము. ఇతర చెట్లు చిగురించుటను చూడుము, దేశములు చిగురించుటను చూడుము. పరిశుద్దాత్మ సంఘము చిగురించుటను చూడుము. పెంతెకోస్తు తిరిగి వచ్చుటను, మరలా అవి సూచనలు, అద్భుతములను జరుగుటను చూడుము. హల్లెలూయ. మనం ప్రార్థించుకొందామా.
162. పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని బట్టి, సర్వశక్తి మంతుడైన ఆయనను బట్టి, ఆయన యొక్క పరిశుద్దాత్మ అభిషేకమును బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము ఎందుకనగా ఆయన ఇప్పుడు ఇక్కడ వుండి, జీవించుచు, నిత్యము జీవించుచూ, మేము ఒప్పుకొనిన దానిమీద విజ్ఞాపన చేయు చున్నందుకు, ఆయన యొక్క స్వస్థపర్చు శక్తిని బట్టి నీకు కృతజ్ఞతలు ఎందుకంటే అది మమ్ములను మండుచున్న సాధనములు (నిప్పుకణములు)గా చేసినది. ప్రభువా, అది మమ్ములను సమాధిలోనుండి తీసికొని, తిరిగిలేపి, మా బలమును తిరిగి పునరుద్ధరించి, మాకు శక్తిని ఇచ్చినది, తద్వారా మేము బయటకి వెళ్ళి ఈ చీకటిలో ప్రకాశించునట్లు చేసినది. ఇందును బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము.
163. తండ్రీ, రక్షించబడని ప్రతి ఒక్కరి దీవెన నిమిత్తం మేము ప్రార్థించుచున్నాము. రక్షించబడిన వారందరిని దీవించండి. తండ్రీ దానిని అనుగ్రహించండి. రోగులందరిని స్వస్థపర్చండి. మహిమ పొందండి. ఈ చిన్న గుడారము (మందిరము)ను దీవించండి. జనులను దీవించండి. నెవిల్ ప్లాస్టర్ని దీవించండి. డీకన్(పెద్ద)లందరిని, ట్రస్టీ(ధర్మకర్త)లందరిని దీవించండి, ప్రభువా దానిని అనుగ్ర హించండి. నీ స్వస్థపర్చు చేతులను వారి మీద వుంచండి. ఒకవేళ అపవాది లోనికి ప్రవేశించి, చిన్న చిన్న మనస్పర్ధలు కలుగ చేసిన యెడల, ప్రభువా ఇప్పుడు వెంటనే వాటినుండి గిలాదుగుగ్గిలముతో బాగుచేయండి. ప్రభువా దానిని ప్రసాదించండి. వారి మీద అభిషేకతైలమును పోయండి. ఆత్మలో మాధూర్యముగా, హృదయమందు దీనులుగా వారిని చేయండి. ప్రభువైన యేసు యొక్క అడుగు జాడలయందు వారు నడుచుదురు గాక. భౌతికకార్యాలు వారికి జరిగించినందున వారు రోగులయ్యారు కనుక యేసు రక్తమును వారికి అన్వయించుటకు దేవుని దూత వారి ప్రక్కన ఇప్పుడు నిలబడి యుండును గాక. దయచేయండి, రోగులందరిని స్వస్థపర్చండి.
164. సుదూరమున పొలములో వున్న వారి యొక్క గొప్ప అక్కరు చూచు నిమిత్తం నేను పగులగొట్టబడునట్లు ప్రభువా నాకు సహాయం చేయండి. ఇది గొప్ప అక్కరు గల దినము. లక్షలాది మంది చనిపోవుచున్నారు. లక్షా నలభైనాలుగువేల అన్యుజనులు నేడు క్రీస్తుని ఎరుగకుండానే చనిపోయారు. ప్రియమైన దేవా సహాయం చేయండి. మా అందరిని దీవించండి.
165. మరియు నీతో కలిసి సింహాసనము నందు కూర్చొనుటకు, క్రీస్తుయేసు నందు పరలోక స్థలములందు కూర్చొనుటకు ప్రభువా మమ్ములను ఈ భూమ్మీద నుండి ఒక దినాన లేవనెత్తుము. తండ్రీ దానిని అనుగ్రహించండి. ఆ సమయం వచ్చేటంత వరకు మమ్ములను
ఆరోగ్యవంతులుగాను బలవంతులుగాను ఉంచండి. ఎందుకంటే ఈ మనవులన్సి యేసు నామమున అడుగుచున్నాము ఆమెన్.
ఓ నేను ఆయనను చూడగోరుచున్నాను. ఆయన ముఖమును చూడగోరుచున్నాను. ఆయన యొక్క రక్షించు కృప నిమిత్తం పాడుటకు అక్కడుండెదను, మహిమ గల పుర వీదులలో నేను నా స్వరమెత్తి పాడగోరుచున్నాను, చింతలన్ని మరచి, తుదకు గృహము చేరి నిత్యము ఆనందించుటకు నేను ఈ దేశముల గుండా ప్రయాణించుచు పాడుచున్నాను, కల్వరి తట్టు సిందూర(రక్త) ప్రవాహం వైపు ఆత్మలను చూపుచున్నాను, బయటి నుండి లోపలి నుండి అనేక బాణములు నా ఆత్మను పొడుచుచున్నవి కానీ నా ప్రభువే వాటన్నింటిలో నుండి నన్ను నడిపించుచున్నాడు, ఆయన ద్వారా నాకు నిశ్చయంగా విజయము ఓ, నేను ఆయనను చూడగోరుచున్నాను, ఆయన ముఖమును చూడగోరుచున్నాను ఆయన యొక్క రక్షించు కృప నిమిత్తం పాడుటకు అక్కడుండెదను మహిమ గల్గిన పురవీధులలో నేను నా స్వరమెత్తి పాడగోరుచున్నాను. చింతలన్ని మరిచి, తదకు గృహము చేరి నిత్యము ఆనందించుటకు,
166. ఇప్పుడు ఒక్క నిమిషం వినండి, ఇక్కడ ఎంతమంది మెథడిస్టులున్నారు? మీరు మీ చేతులను ఎత్తండి. మెథడిస్టులు? ఎంతమంది బాప్టిస్టులున్నారు ఇక్కడ? ఎంతమంది ప్రెస్పిటేరియన్లు వున్నారు? మీరు మీచేతులను ఎత్తండి, ఎంతమంది నజరీన్లు వున్నారు? మీ చేతులెత్తండి. ఎంతమంది పెంతెకోస్తులున్నారు? మీ చేతులెత్తండి. ఎంత మంది లూథరన్లున్నారు? మీ చేతులెత్తండి. మంచిది, మనమంతా ఇచ్చట వున్నాము. ఒక పెద్ద గుంపు, మనమంతా మిశ్రిత జనముగా కలిసి ఒకచోట కూర్చొని యున్నాము. పరలోక స్థలములో కూర్చొని దీవెనలయందు ఆనందించుచున్నాము.
167. ఇప్పుడు మెథడిస్టులు బాప్టిస్టులతో కరచాలనం చేయాలని నేను కోరుచున్నాను. అలాగే బాప్టిస్టులు లూథరన్లతో చేయాలని కోరుచున్నాను. ఇప్పుడు చుట్టు తిరిగి ఒకరితో నొకరు కరచాలనం చేయండి. ఇప్పుడు మనం పాడుచుండగా వెనుక తట్టుకి ఇలా ఇప్పుడు తిరగండి.
కల్వరి తట్టు సింధూర (రక్త) ప్రవాహం వైపు చూపుతున్నాను, బయటినుండి లోపలినుండి అనేక బాణములు నా ఆత్మను పొడుచుచున్నవి కానీ నా ప్రభువే వాటన్నింటిలో నుండి నన్ను నడిపించుచున్నాడు.
ఆయన ద్వారా నాకు నిశ్చయంగా విజయము
ఓ నేను ఆయనను చూడగోరుచున్నాను, ఆయన ముఖమును చూడగోరుచున్నాను.
ఆయన యొక్క రక్షించు కృప నిమిత్తం పాడుటకు అక్కడుండెదను మహిమగలిగిన పురవీధులలో నేను నా స్వరమెత్తి పాడగోరుచున్నాను చింతలన్ని మరిచి, తదకు గృహము చేరి నిత్యము ఆనందించుటకు.
168. అది మిమ్ములను మంచిగా వున్నట్టు చేయుటలేదా? (సమాజము ఆమెన్ అనుచున్నది -సంపా) మీ అందర్ని అది చక్కగా చేస్తున్నట్టు అనిపించుట్లేదా? ఇక్కడ ఎంతమంది
క్రైస్తవులున్నారు? మీ చేతులను పైకెత్తండి, ఓ, మై ఎంత అద్భుతమైన సంగతి ఇది.
169. ఇప్పుడు మనం మన గృహములకు తిరిగి వెళ్ళుచుండగా ప్రార్ధనతో మనం వెళ్లాం ఇప్పుడు మనమెప్పుడు విధిగా పాడుకొనే మన యొక్క మంచి పాత వీడ్కొలుపాటను పాడుకొందాం. ఎందరికి అది తెలుసు? యేసునామమును నీతో తీసికొని సొమ్ము, అందరం కలిసి ఇప్పుడు పాడుదాం.
యేసు నామమును నీతో తీసికొని పొమ్ము వేదనతో, దుఃఖముతో నిండిన వాడా అది నీకు సంతోషమును, ఆదరణను ఇచ్చును నీవు ఎచ్చటికి వెళ్ళినను దానిని నీతో తీసికొనిపొమ్ము ప్రశస్థనామము (ప్రశస్థ నామము) ఓ ఎంత మధురము( ఓ ఎంతమధురం) భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము అవును ప్రశస్థ నామము. ఓ ఎంత మధురం భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము వినండి. యేసు నామమున వంగాలి. ఆయన పాదముల చెంత సాష్టాంగపడుడి పరలోక మందు రాజుల రాజును కిరీటమును ముందు ధరింప చేతుము, మన ప్రయాణం ముగించినప్పుడు, ప్రశస్థ నామము, ఓ ఎంత మధురం ( ఓ ఎంత మధురం) భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము ప్రశస్థ నామము, ఓ ఎంత మధురం భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము
170. ఇక్కడ మీరు ఇలా చేయాలని నేను కోరుచున్నాను, యేసు నామమును నీతో తీసికొనిపొమ్ము ప్రతీ శత్రువు నుండి అది నీకు ద్వజము శోధనలు నిన్ను చుట్టు ముట్టినప్పుడు ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును పీల్చుకొనుము ప్రశస్థనామము (ప్రశస్థనామము) ఓ ఎంత మధురము భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము ప్రశస్థనామము, (ఓ ప్రశస్థనామము) ఓ ఎంత మధురము భూలోక నీరీక్షణ మరియు పరలోక ఆనందము.