ఆయన యొక్క నక్షత్రమును చూచుట (గమనించుట)

ఆయన యొక్క నక్షత్రమును చూచుట (గమనించుట)

ఆయన యొక్క నక్షత్రమును చూచుట (గమనించుట)

లాస్ఏంజల్స్, కాలిఫోర్నియా, అమెరికా. 59-0411

ప్రార్థన కొరకు ఒక్క క్షణం నిలబడదాం. మన శిరములు వంచుదాం.

సర్వశక్తిగల దేవా, మా ప్రభువును మృతులలో నుండి తిరిగి లేపి, లేఖనముల ప్రకారం మూడవ దినమున ఆయనను లేపి, మహిమలో ఆయన్ని నీ కుడిపార్శ్పమున కూర్చుండబెట్టినది. నీవే. మేము ఒప్పుకొనిన దానిమీద విజ్ఞాపన చేయుటకు ఈ రాత్రి ఆయన అక్కడ వుండెను, తాను ఆరంభించిన ఆ పనిని కొనసాగించుటకు గొప్ప పరిశుద్దాత్మను తిరిగిపంపియుండెను, తద్వారా ప్రభువైన యేసు ప్రారంభించిన పనిని పరిశుద్దాత్మ కొనసాగించునని అదెల్లప్పుడు తెలియపర్చబడుచున్నది, అంతేకాక ఒక దినాన ఆయన తిరిగి రాబోతున్నాడని తెలుపుటకు అదొక సూచనైయున్నది.

2. మరిప్పుడు, తండ్రీ, ప్రభువు సమీపమైయుండుటకు మేము చూచినప్పుడు, అది ఈ అంత్యకాలమును చూచుటకే మేం బ్రతుకుచున్నాము. సూచనలను తెలిపే సంకేత బోర్డులు పెట్టబడినవి (చూపబడినవి). ఆయన రాకడ కోసం ప్రతి గడియ మమ్మును తలంచునట్లు చేయుచున్నది కృష్ణ. ప్రభువా, మేమింకా ఎక్కువు కష్టపడి ప్రకటించాలి, ఎక్కువు ప్రార్ధించాలి, కాలచక్రం మీద తిరిగే గడియారపు ముల్లును తాకే తుది అర్ధరాత్రి తాకిడి తగలక మునుపే కడపటి ఆత్మను రాజ్యములోకి తెచ్చుటకు మేము ప్రయత్నించుచుంటిమి. ఆ ముల్లును ఇక ఎన్నడు తాకనవసరం లేదు, ఎందుకంటే కాలము అంతము లేని నిత్యత్వములోనికి కలిసిపోవును. ప్రభువా, ఈ కూటము ముందుకిపోవుచుండగా ఈ తలంపును మేము తలంచెదము గాక, ఈ విన్నపములన్ని వాగ్దానమిచ్చిన వాని నామమున అనగా యేసునామమున అడుగుచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చొనవచ్చును.

3. కొద్దిగ అలసటగావుంది. అది చెప్పడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు, కానీ నాకు అలసటగా వుందన్న సంగతి మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పటకే నేను అనేక కూటాలలో పాల్గొన్నాను, మరలాగే రేపటికి కూడా నాకు మూడు కూటాలున్నవి, దిగువున వున్న డౌనిలో ఆర్మేనియన్ వారితో ఒక కూటంవుంది. అచ్చట నేను "మీరేమి వినుచున్నారు?"అనే దానిని చెప్పాలను కొంటున్నాను. తర్వాత రేపు మధ్యాహ్నం ఇక్కడున్న టెంపుల్నందు నా అంశం "దేవుని నిశ్చయత కల్గియుండుట". ఆ కూటము అనంతరం మేము రేపు రాత్రికి ఎప్పుడు వుండే ప్రార్ధన వరసకోసం ప్రార్ధనాకార్డులను ఇవ్వబోవుచున్నాం. రేపు మధ్యాహ్నాం కూటం అయిన వెంటనే బాలురు మీకు వాటిని పంచి ఇచ్చెదరు. ఎందుకంటే ఆదివారం రాత్రికి ఇక్కడ టెంపుల్నందు ఒక కచ్చేరినివారు కలిగియున్నారు. మరి అప్పుడు ప్రార్ధన కార్డులు పంచుట చాలా కష్టంగా వుండును. రేపు రాత్రికి వుండబోయే ప్రార్ధనావరసలోకి పిలువబడగోరు వారు ఎవరైనా వుంటే, అట్టివారు రేపు మధ్యాహ్నం కూటమునకు వచ్చి ప్రార్ధనా కార్డులను దక్కించుకొనవచ్చును.

4. మరలాగే, సోమవారం రాత్రికి ఏమీలేదనుకొంటాను, తదుపరి వారమంతా ప్రభువు చిత్తమైతే, విశ్వాసము మీద ఆదికాండము నుండి వరస వర్తమానములను మంగళవారం రాత్రినుండి నేను ఆరంభించగోరుచున్నాను. మీరు తప్పకుండా వచ్చి వాటిని వినాలని మేమెంతగానో ఆపేక్షించు చున్నాము, ఎందుకంటే ప్రభువు గొప్పకార్యములను జరిగిస్తాడని నేను ఎదురుచూస్తున్నాను.
ఆ తరువాత దేవుని చిత్తమైతే ఏడేండ్ల నుండి నేను దీనిని నేను చెప్పలేదు. అయితే దేవుని చిత్తమైతే ఆదివారం మధ్యాహ్నాం ఇక్కడ టెంపుల్నందు నా జీవితచరిత్ర(గాధ)ను చెప్పాలనుకొను చున్నాను. ఇప్పటివరకు నేను చెప్పలేదు. లేదా దానిని సమీపించలేదు. అది నన్సు కలిచి వేస్తున్నది. నా జీవిత చరిత్ర(గాధ)ను చెప్పి ఇప్పటికి ఏడేళ్ళు కావొస్తున్నదని నేను అనుకొంటున్నాను. ప్రభువు చితమైతే వచ్చే ఆదివారం మధ్యాహ్నం నేను దాన్ని చెప్పాలనే బలమైన కోరికను కలిగియున్నాను. సరిగ్గా అది నేటినుండి ఇంకా వారం వున్నది. (వచ్చే ఆదివారం).

సమయాన్ని కలిగియున్నాం. నేను అక్కడ కూర్చొని తినుచుండగా అక్కడ నాదగ్గరికి ఒక చిన్న 5. ఈ ఉదయకాలము కిషన్ నందు క్రైస్తవ వ్యాపారుల అల్పాహార విందులో మేమొక అద్భుతమగు స్త్రీ వచ్చినది. ఆ పేరును నేనిప్పుడు సరిగ్గా ఉచ్చరించలేను. అదొక ఆర్మేనియన్ పేరు. షినిస్కిన్ బహుశా అటువంటిదై వుండొచ్చును. మరి నా యొద్దకి వచ్చి....

మరికొన్ని రాత్రుల క్రితం వారికి స్విట్జర్లాండ్ నుండి ఫోన్(పిలుపు) వచ్చింది, అదేమవగా ఆమె సోదరి షుగర్ వ్యాధి మరియు న్యూమోనియా వ్యాధి బారినపడి తీవ్ర అనారోగ్యం పాలైందని, మరికొద్ది గంటల్లో ప్రాణంబోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

మరి ఈ స్త్రీ యొక్క భర్త నాకు చాలా ప్రియమైన మిత్రుడు, అతని కుటుంబానికి కూడా నేనంటే చాలా ఇష్టం. కొద్దికాలం క్రితం మేము స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు, మేముక్కడ వున్నప్పుడు వారు మమ్మును చాలా బాగా చూసుకొన్నారు. తరువాత వారు నాతో కలిసి అమెరికా సందర్శించారు. ఏదేమైనా, వారు నాకు పంపిన కబురును నేను పొందలేకపోయాను, ఎందుకంటే నేను కూటానికి వచ్చుటకు ముందు ఎవ్వరు నన్ను సంప్రదించలేకపోయారు. అయితే కూటము జరుగుచున్నప్పుడు ప్రేక్షకులలో కూర్చొనియున్న ఆమెతట్టు పరిశుద్దాత్మ నన్ను త్రిప్పేను, ఆమె తన ప్రియమైన వారి నిమిత్తం ప్రార్దించుచున్నదని, భయపడవలదని, ఎందుకంటే వారు బాగుపడెదరని పరిశుదాత్మ ఆమెకి చెప్పెను. మరి ఈ ఉదయకాలం ఆ స్త్రీ పూర్తిగా, పరిపూర్ణంగా బాగుపడి సాధారణ స్థితికి చేరిందని చెప్పడానికి సముద్ర అద్దరినుండి ఫోను కలపబడింది, అట్లాంటిక్ కేబుల్ ఈ దేశానికి అనుసంధానం చేయబడింది.

6. మీరు చూడలేరా, దేవుడు - సమస్త శూన్యమంతటిని, కాలమంతటిని నిండియున్నాడని నిత్యత్వమునుండి నిత్యత్వమునవరకు వున్నాడని మీరు చూడగలరా, సముద్రానికి ఆవలవున్న జనులకి దేవుడు అనేకసార్లు అనేక కార్యములు జరిగించుటను నేనెన్నో సార్లు చూచాను. ఆయన ఆ కార్యాలను ఎంతో అద్భుతంగా జరిగించుచుండెను...

కనుక నేడు, నాకొక గొప్పదినముగా ఈ దినము వుండెను. మరిప్పుడు, కొద్దిసేపటి క్రితం ఆ సహోదరి పాడిన "ఆయన యొక్క నక్షత్రమును గాంచుట" అనే పాటను బట్టి నేను ఆమెను ఎంతగానో అభినందించుచున్నాను. ఈ రాత్రి కొద్దిగే మనకి సమయం వున్నది గనుక “ఆయన యొక్క నక్షత్రమును గాంచుట" అనే దాని మీద కొద్దిసేపు మాట్లాడాలని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ అగుపడిన ప్రత్యక్షమైన దానికి చెందిన చిత్రపటములను వారు కలిగియున్నారు, మరి అది అదే వెలుగని నేను మీదృష్టికి తేగోరుచున్నాను (నక్షత్రమనేది ఒక వెలుగుగావున్నది). అదీ ఇది ఒక్కటేనండీ, ఇశ్రాయేలీయులను నడిపించినది అదే అగ్నిసంబము, అదే నిబంధన దూత. ఆయన తిరిగి ఈరాత్రి మనమధ్యలోకి వచ్చి క్రీస్తుయొద్దకి మనల్సి నడిపించునని మనం నమ్ముచున్నాము.
7. ఇప్పుడు ఒక పాఠ్యాంశం కొరకు మీరు పరిశుద్ధ మత్తయసువార్త 2వ అధ్యాయంనకు త్రిప్పవలెనని కోరుచున్నాను. మరిప్పుడు, ఆయన ఏమి చేయనైయున్నాడో మనకి తెలీదు. ఇక్కడ ఇప్పటికే మూడు రాత్రులనుండి కూటాలు జరుగుచున్నప్పటికి ప్రార్ధనా కార్డులనేవి మాత్రం ఇప్పటివరకు పంచిపెట్టలేదు. అయినప్పటికిని పరిశుద్దాత్మ ఈ కూటములలో వుండి, జనులను పిలుచుచూ, ప్రభువైన యేసు రూపమందు ఈ భూమ్మీద వున్నప్పుడు వారికి ఏలాగైతే చెప్పెనో సరిగ్గా మరి అలాగే చెప్పుచూ, తన రాకడకిముందు నెరవేరబోయేముందుండే చివరి సూచన అను ఒక వాగ్దానమును నెరవేర్చుటను బట్టి అవే కార్యాలను చేయుచున్నాడు. ఇక ఆ సూచనతోనే అన్యుల కాలము ముగియును(ముగించుచున్నాడు). అది మీకు జ్ఞాపకమున్నదా. అదే చివరి సూచన. వచ్చే వారం దానిని ఇంకొంచం లోతుగా చూచుటకు మనం ప్రయత్నిద్దాం. అప్పుడు సమస్త కార్యాలు ఈ గడియకొరకే జరుగుచున్నవని మనకి అర్ధమగును. ఈ సంగతులను పొందుకొనే స్థితినందు ఇప్పుడు సంఘము ఖచ్చితముగా వున్నది.

ఇప్పుడు నేను చదువగోరుచున్నాను. బహుశా మీరు లేఖనములను తీసే వుంచారనుకొంటాను.

మత్తయి2:1-2, రాజైన హేరోదు దినములయందు యూదయదేశపు బేత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి

8. అప్పుడు ఖచ్చితంగా చీకటిపడే వుండొచ్చును. అప్పటకే వారు కొండ పైబాగానికి చేరుకొన్నారు. వారు అలా మూలకి తిరిగినప్పుడు వారి యెదుట బెత్లహేము కనబడినది, దాని పశ్చమాన కొండలున్నవి. మరి అతడు తన గాడిద యొక్క పలుపు త్రాడు అలాగే పట్టుకొని, ఆ పట్టణము వైపు చూచి ఆగి, తన నుదుటనున్న చెమటను తుడుచుకొనుచున్నాడు.

ఆ పట్టణములో దీపములు వెలుగుచుండెను, ఎందుకనగా అనేకులు ఆ పట్టణం లోపల బయట క్రిక్కరిసియున్నారు. మీరు చూశారా, అక్కడొక ఆజ్ఞ (ఆదేశం) ఇవ్వబడినది, అదేమిటంటే ప్రజలందరు ప్రజాసంఖ్యలో (సుంకము లేదా పైకము లేదా పన్ను చెల్లించుటకు) నమోదగుటకు తమ తమ స్వస్థలములకి తిరిగిపోవలెను.

ఒక చిన్న గాడిద మీద నిండు సూలాలగు ఒక స్త్రీ తననివాసంను విడిచిపెట్టి అంతదూరం ప్రయాణం చేయించడాన్ని ఏ కనికరం లేని ఒక అనాగరికుడు (క్రూరుడు) చేస్తాడో తప్ప మరెవరు ఆమెను ప్రయాణం చేయించగలరు.

అయితే కాలమనేది ఆరంభం కాకమునుపే ఇదంతా దేవుని జ్ఞానమందు ప్రణాళిక వేయబడినది. దేవుడెల్లప్పుడు ప్రతీదానిని దానికాలమందు సరిగ్గా చేస్తాడు. ఆయన్ని ప్రేమించువారికి మేలుకలుగుటకై సమస్తము నమకూడి జరుగును. మనం దాన్ని ఆ విధంగానే అనుకోవాలి(తలంచాలి. బావించాలి).

9. క్రూరుడైన, నరహంతుకుడైన రాజు పరిపాలించుచున్న కాలాన్ని మనం కొద్దిగ ఆలోచించినట్లేతే.. ఆ కాలమందు సుంకమనేది యేసేపు మరియలను బెత్లహేమునకు వెళ్ళునట్లు బలవంతం చేసినది...యేసేపు దిగువునవున్న లోయవైపు చూస్తూవుండగా, ప్రతి విడిదిగృహం అప్పటికే నిండిపోవడం, తన భార్య బసచేయుటకు కావాల్సిన చోటు లేకపోవడంను అతడు చూసి ఎంతో
నిరుత్సాహం చెందాడని చెప్పుటలో ఎంతమాత్రం సందేహం లేదండీ. తలవాల్చుటకు అక్కడ చోటు లేదు, ప్రజలు అప్పటికే గోడల గోడల వెంబడి సహితం నిద్రించుచుండిరి.

క్రూరుడైన రాజు తీసికొన్న అమానుషమైన నిర్ణయం బట్టి తన ప్రియమైన భార్య తన స్వస్థలానికి రావల్సివచ్చుటనేది అతన్ని ఎంతో నిరుత్సాహపర్చెను. అదంతయు దేవుని యొక్క గొప్ప ప్రణాళిక చక్రంలో తిరుగుతున్నదన్న సంగతి బహుశా అతనికి తెలియకపోవచ్చును.

కానీ అతడు ఆ గాడిదమీదనుండి ఆమెను దింపుటకు తిరిగి ఒక సరైన చిన్నరాతిని కనుగొన్నాడు ఆ రాతిమీద వుంటే ఆమె తేటగా దిగువున వున్న తన జన్మస్థలమును చూడగలదు. మెల్లగా ఆమెను అచ్చటికి నడిపించుకొని వెళ్ళి కొద్దిగ విశ్రాంతి తీసికొనుటకు ఆమెను అచ్చట వుంచాడు. ఇది వరకెన్నడు చూడనంత ముఖ తేజస్సును ఆమె ముఖము మీద వుండటాన్ని అతడు అప్పుడు గమనించాడు. బహుశా అతడు ఆమెతో ఇలా అనివుండొచ్చును," ఓ నా * ప్రియతమా, నీవెళ్ళప్పుడు ఎంతో సౌందర్యవంతురాలవని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్నంత మృదువుగా (సొగసు)గా నీవెన్నడు నాకు కనపడలేదు".

10. సంఘము చూపునకు ఎలా వుండాలో(వుంటుందో) అనే దాన్నిబట్టి నేనెంతో ఆశ్చర్యపోవుచున్నాను, ప్రభువు రాకడయందు అది ఎంతో మృదువు(సొగసు)గా వుండాలి. దాని వస్త్రములు గొట్టెపిల్ల రక్తమందు కడుగబడివుండాలి, అంతేకాదు దైవీక నియమములన్నిటిలో అది ఎంతో చక్కగా ఇమిడిపోయివుండాలి, ఏ ఘర్షణలు వద్దు గానీ ఆ సమయం కొరకు అది ఎదురుచూస్తు వుండాలి. ఆ రీతిగా వుండునట్లు దేవుడు చేయును.

అతడు ఆమెయొక్క అందమైన ముఖమును గమనించుచున్నట్లు మనం అక్కడ చూడవచ్చును. మరి అతడు అన్నాడు "మేరి, నీ ముఖము చాలా బాగా మెరిసిపోతుంది". అయితే ఆమె అతడిని అంతగా పట్టించుకొన్నట్టుగా లేదని అది చూపెడుతుంది. అందమైన ఆమె కన్నులు ఆకాశము తట్టు చూస్తున్నవి. మరి అతడు ఆమె చూపెట్టినట్టుగా వెంబడించెను. తన జీవితకాల మంతటిలో ఎన్నడూ చూడనటువంటి ఒక అందమైన(రమ్యమైన) నక్షత్రము ఆ చిన్న పట్టణము మీద వ్రేలాడుచుండుటను అతడు గమనించాడు. బహుశా అతడు ఈ విధముగా అని వుండవచ్చును, "ఆ నక్షత్రమును నేనిప్పటివరకు గమనించనేలేదు. దాని కాంతిబింబమే నీ ముఖమును అందమైనదిగా మెరిపించుచున్నది".

ఓ, ఈ రాత్రి దేవుడు తన కృపను, మరియు తన సౌందర్యమును తన సంఘము మీద ప్రకాశింపజేయును గాక, మరియు ఆ ఘట్టము కొరకు సంఘము సిద్ధపడితే ఆయన దానిని చేయగోరుచున్నాడు.

11. ఆమె ఈ విధంగా అని వుండొచ్చును, "జోసఫ్, సూర్యుడు దిగిపోవనారంభించినప్పటి నుండే మనమింకా పర్వతమునకు దిగువున వున్నప్పటినుండే నేను ఆ నక్షత్రమును గమనించాను. మనం పర్వతము మీదికి ఎక్కినప్పటి నుండే అది నన్ను వెంబడిస్తున్నట్టుగా నాకు అనిపించింది. దానిమీద నుండి నేను దృష్టిని మరల్చలేకుంటిని".

మరియు అతడు ఆమె చేయి పట్టుకొనియుండగా, వారిద్దరు, ఆ యవ్వనజంట అక్కడ నిలబడియుండగా, ఇదివరకు ఎన్నడు భూమ్మీద నడవని మహోన్నతుని పుట్టుకకు కొద్దిగంటల ముందు వారిరువురు చేతులు పట్టుకొనియుండిరి, తూర్పు తట్టున్న బెత్లహేము మీద వ్రేలాడుచున్న ఆ నక్షత్రమునకు అభిముఖముగా వారు తిరిగారు.
12. మనం కొద్దిసేపు తూర్పువైపునకు ప్రయాణం చేద్దాం. దూరానవున్న తూర్పుతట్టునకు, లోయలు దాటి, పర్వతముల వైపునకు వెళ్లాం. తూర్పుదిక్కున కొందరు జ్ఞానులున్నారు. వారు దానియేలు కాలంలో మాదీయ పార్శీకుల సామ్రాజ్యమందు వున్నారు. వారు నిజమైన ఒక్క దేవున్నే సేవిస్తారు. ఒక పవిత్రమైన అగ్ని ద్వారా వారు దేవుని కొరకు ఎదురుచూచెదరు. వారు పర్వత శిఖరములపైకి వెళ్ళి, వారు స్వర్గలోక(పరలోక) దేహములను గురించి అధ్యాయనం చేస్తారు. నక్షత్రాల కదిలికలను గూర్చి, నక్షత్రాలకున్న పేర్లును గూర్చి వారు యోబులో నేర్చుకొన్నారు. నక్షత్రాలను బట్టి సూచన ఇవ్వబడాలని వారు సత్య దేవుని కొరకు ఆశతో ఎదురుచూచెదరు.

మనం బైబిల్ చదివినట్టుగానే వారు ఆకాశ నక్షత్రాలను గూర్చి తీక్షణంగా అధ్యాయనం. చేయుదురు. పరలోక దేహములను గూర్చిన అధ్యాయనముల తెలిపే తెలిపే గ్రంధములను లను వారు తమ పూర్వికులగు పితరుల యొద్దనుండి పొందుకొన్నారు. ప్రతీ తార ఎక్కడుండుననేది వారు చక్కగా ఎరిగియుండిరి. వాటిలో ఏ ఒక్కటి తన స్థానములో నుండి కదిలినా వారు ఇట్టే దానిని చ పసిగట్టెదరు.

13. రాత్రి తర్వాత రాత్రి వారు వేడుకలను (కర్మకాండలను) జరిగించెదరు. మరి ఇప్పుడు, నిజమైన సత్య దేవుడొకడు వున్నాడని వారు నమ్ముతారు. వారులో ఎక్కువ మందు మహమ్మద్దీయులుగా వున్నారని మనమెరుగుదుము. అప్పుడు వారావిధంగా కనిపెట్టుటకై వారు మంటలు వేసి, కనిపెట్టుచూ, పవిత్ర కీర్తనలు పాడుచుండుటను బట్టి వారు ఆ దేవున్ని ఆరాధిస్తారు. ఆ మంటను కనిపెట్టుచూ వారు లేఖనములను మరి ఇతర వాటిని గూర్చి చర్చించెదరు (వాద ప్రతివాదములు ద్వారా వివిధ కోణాల్లో పరిశీలించెదరు). నక్షత్రశాల లాంటి ఈ గొప్ప శిఖరముమీదకి వారు ఎక్కి పోవుదురు. మరియు వారక్కడవుండి రాత్రివేళ ఆకాశ నక్షత్రముల రూపములను రాత్రంతా వుండి తీక్షణంగా గమనించెదరు. అగ్నిదేవుని వలన ఆ నక్షత్రాల కదలికలు తమకి విభిన్న సూచనలిచ్చునని వారు నమ్ముదురు.

మరి ఒక రాత్రి వారు కూర్చొనియుండగా, బహుశా వారు రాజ్యములు లేచుటను గూర్చియో లేక చక్రవర్తులు కూలిపోవుటను గూర్చియో, లేక భూమ్మీద చోటు చేసికొన్న కార్యములను గూర్చియో లేక పురాతన గాధలను లేక అటువంటి వాటిని గూర్చియో చర్చించుకొనుచుండొచ్చును.. సరిగ్గా ఆ సమయమందే కాబోలు వారు దానియేలు గ్రంధపు చుట్టలను తీసికొని, దానియేలులో ఖచ్చితంగా చదువుచుండొచ్చును. ఎందుకంటే వారితో అతడు చర్చించివుండొచ్చును. అతడు వారికి ప్రధాని (అధిపతి) అని దానియేలు 2వ అధ్యాయం చెప్పుచున్నది. కనుక అతడు వారితో ఈ సంగతులను గూర్చి ఖచ్చితంగా చర్చించి(సంభాషించి) యుండొచ్చును. వారు దానియేలు ప్రవచించి చెప్పిన ఒక గ్రంధపు చుట్టను తీసికొన్నారు, అందులో అతడు చేతి సహాయం లేకుండా పర్వతము నుండి తెంపబడిన ఒక రాయి వచ్చేకాలమును గూర్చి ప్రవచించాడు. మరి ఆ రాయి లోక రాజ్యములన్నిటిని తుత్తునీయులుగా పగలగొట్టెను. వారు దానిని నిశ్చయంగా చదివి వుండొచ్చును. అంతేకాదు వారి వద్ద కొన్ని హెబ్రీగ్రంధపు చుట్టలు కూడా వున్నవి, అవి సంఖ్యాకాండములోని యాకోబులో నక్షత్రము ఉదయించును అని బిలాము చెప్పినవి వుండి వుండొచ్చును.

14. వారు ఈ సంగతులను తలపోసుకొనుచున్నప్పుడు, వీటిని చర్చించుకొనుచున్నప్పుడు ఒక అతిధి(పరదేశస్థుడు) గగనములో వారికి కనబడెను. అటువంటి జనులకి అలాంటిది కనబడితే
వారిలా బావిస్తారో మీకు తెలుసా, నక్షత్రరాశి గూర్చి వారికి బాగా తెలుసును, వాటిలో ప్రతీ వారి గమయములోకి వచ్చినది... ఆయనే అతి ప్రకాశమానమైన వేకువచుక్కని, లోయలోని పద్మము ఒక్కటిని వారు ఎరిగియున్నారు. అన్ని నక్షత్రాలకన్న ఇంకా ఎంతో తేజోమయమైన నక్షత్రము అన్ని షారోను పుష్పము అని, మన ఆత్మకి పదివేలలో అతిసుందరుడని మరి మనకి తెలుసు.

ఆకాశములో కనపడిన ఈ క్రొత్త అతిథి వారిని ఖచ్చితంగా అప్రమత్తం చేసాడు.

15. అద్భుతమగు ఆ యొక్క దృశ్యమును చూచుటకు ఆ జ్ఞానులు ఆదిక్యతగల జనులు కాదని కొందరు అనుకోవచ్చును. అయితే అపోస్టులుల కార్యములలో మీరు చదివినట్లేతే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించవచ్చును. ప్రతి జనములోను ఆయనకి భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించునని పేతురు అనెను. దేవుడు పక్షపాతి కాడు. మరియు వారు...(ఆ బ్రదర్కి ఏం కావాలో ఎవరైనా చూడండి).

అప్పుడు ఎవరో ఒకరు ఆ పరలోకపు అతిథిని చూసి ఇలా అనెను "ఓ, ఎంత అద్భుతమైనది. దాని బావం ఏమిటి" ఎందుకు ఈ జ్ఞానులు...వారికి అర్ధం కాలేదు.

నేటి దినపు జనులు కూడా అర్థం చేసికోట్లేదు. ఆ జ్ఞానులు నక్షత్రమును చూచిరని మీకు తెలుసా, అది ఆ నక్షత్రశాల(వేదశాల)కి పైగా దాటినది, జ్ఞానులు తప్ప మిగతా వారెవ్వరు. ఎన్నడు దానిని చూసిన దాఖాలాలు చరిత్రలో మనకి లేవు. ఎందుకంటే వారు దానికొరకు చూడలేదు. వారు నక్షత్రమును చూచిరని నేను నమ్ముచున్నాను. వారు (జ్ఞానులు) చూపారని బైబిల్ చెప్పుచున్నది.

16. దేవుని మర్మములు విప్పబడినప్పటికి నేటిజనులు వాటిని తప్పక చూడవల్సిన అవసరతవున్నా మరి వాటిని ఏదో కారణముచేత చూడలేకపోవుచున్నారు. ఎందుకంటే దానికోసం వారు చూడలేకపోవుచున్నారు. తనను గూర్చిన బయలపాటునొందాలని ఎవరికైతే ఆయన అనుగ్రహిస్తాడో ఎవరైతే ఎదురు చూస్తారో మరి అట్టివారికే ఆయన అనుమతినిస్తాడు.

ఓ, గడిచిన రెండు మూడు రాత్రుల కూటాలను నీవు గమనించావా, ప్రతిరాత్రి పరిశుద్దాత్మ మనల్ని అచ్చటికి తీసికొనివస్తున్నాడు. ఎదురుచూపు, ఎవరైతే నడిపించబడుచున్నారో మరి అట్టివారే ఏదో కార్యం జరుగుటను ఆశిస్తారు...

దానిలోని సంగతి ఏమిటంటే, మనం తగినంతగా ఎదురు చూడుటలేదు (ఆశపడుటలేదు).

ఈ రాత్రి ఇక్కడున్న రోగులు మరియు వ్యాధిబాధితులు ఇంటికి బాగుపడిపోతామనే నమ్మకంతో (ఎదురుచూపుతో, ఆశతో) వచ్చినట్లేతే, సరిగ్గా అలాగునే తిరిగి వెళ్ళెదరు. ఈ రాత్రి మీరిక్కడ, ఇంతకు మునుపెన్నడు పరిశుద్దాత్మబాప్తీస్మం పొందకుండ వుండినట్లేతే...ఓ. ఆదొక మర్మయుక్తముగా నీకుండునట్లు వుండును. కానీ దేవుని వాక్యం దాన్ని బోధించినంత కాలం, అది మాత్రమే సరిపోవును. దేవుడు దాన్ని పలికాడు, అది అంతే స్థిరమగును.

17. నామట్టుకైతే ఏదో కార్యం జరగాలని నేను ఎదురుచూస్తున్నాను. ఇది ఇలా వ్రాయబడింది. "నా పేరు పెట్టబడిన నా జనులు ఒకటిగా కూడుకొని ప్రార్ధించినట్లేతే, ఆకాశమునుండి నేను వారి మొఱ్ఱ ఆలకించెదను". నేటికిని నేను ప్రార్దిస్తున్నాను, ఇంకా అనేకులు ప్రార్దిస్తున్నారని నాకు తెలుసును, మరియు కార్యాలు జరగాలని నేను ఆశపడుచున్నాను (ఎదురుచూస్తున్నాను).
కొన్ని సంగతులు జరుగుతాయి కానీ అవి కొందరి తలలు మీదుగా వెళ్ళిపోతాయి. జీవమును నిర్ణయించబడని వారు వాటిని ఎన్నడూ చూడలేరు.

యేసు వచ్చినప్పుడు, వేలాది మంది అచ్చట వున్నారు, అవును, ఆయన రాకకోసం లక్షలాది మంది ఎదురు చూచారు, కానీ ఆయన మాత్రం తన్ను తాను బహు కొద్దిమందికి మాత్రమే కనపర్చుకొన్నాడు. చూశారా, అది అది కేవలం ఎవరైతే ఎదురుచూస్తారో వారికేనండీ. ఎవరి గుండె అయితే దానికోసం కొట్టుకొంటుందో, కనిపెట్టుకొనియుంటారో, కార్యం జరగాలని ఆశతో ఎదురు చూస్తారో వారికేనండీ. నమ్మిన వారికే అది జరుగుతుంది, కనిపెట్టుకొన్న వారికేనండీ, యేసు ఎవరి కోసం అయితే వచ్చాడో అది వారికేనండీ, ఆయన ప్రత్యక్షతను ఆశతో అపేక్షించు వారికేనండీ. నువ్వు ఎవరినైన ప్రేమిస్తే వారు కనబడాలని నీవు ఎదురుచూస్తావు. అందుకోసం కావాల్సిన సిద్ధపాట్లన్ని చేసిముగిస్తావు.

ఈ రాత్రి సంఘము కూడా అదేరీతిగా వుండాలి. ప్రభువు ఆగమనము కోసం అవసరమైన ప్రతి సిద్ధపాటును చెయ్యాలి, ఇవ్వబడిన ప్రతి సూచన తెలుపు బోర్డును గమనించాలి. దేవుడొక కార్యాన్ని చేయుటను నీవు చూచినప్పుడు, సంతోషంచుము, ఎందుకనగా అది ఆయన రాకడను చూపెడుతుంది. మనము ఇప్పటికే ఆఖరి సూచన బోర్డు యొద్దకి వచ్చియున్నాము. ఉదయమునకు ముందే ఆయన ప్రత్యక్షమవ్వవచ్చును.

18. మరి ఆ జ్ఞానులు, ఆ నక్షత్రము కనబడినప్పుడు, వారు గ్రంధపు చుట్టలను పరిశోధించటం ఆరంభించారు. అదొక నెరవేరిన ప్రవచనమని వారు కనుగొన్నారు. ఓ, నక్షత్రము కనబడునని (ఉదయించునని)దేవుడు చెప్పాడు, అది ఆ విధముగానే కనబడినది, దానిని వారు గాంచినప్పుడు వారెంతో అత్యానందభరితులైయుండి వుంటారు.

జ్యోతిష్యులు(ఖగోళ శాస్త్రజ్ఞలు) అని ఇంకా ఏదేదో పేర్లుతో మనం పిలిచే ఆ జ్ఞానులు చిన్న గ్రంధపుచుట్టలను చూడుటమేమిటిని మనం ఖండిస్తాం. అది నన్నెంతో ఆశ్చర్యపరుస్తుంది, మనకి బైబిల్ వున్నది, బోధకులున్నారు, మనముందు దేవుడు తన సూచనలను, అద్భుతాలను కనబరుస్తున్నప్పటికి మనం వాటిని పట్టించుకోవట్లేదు(వాటినుండి దూరంగా జరిగిపోతున్నాం). ఎందుకని, లాస్ ఏంజల్స్ యొక్క మలినమంతటిని కాల్చివేయగలిగే ఉజ్జీవము మనకి ఎంతో అవసరం. దాన్ని చేయుటకు అది చాలును. ఆయన చెప్పినట్టే సూచనలు నేడు జరుగుచున్నవి. ఓ, గోడమీదున్న గడియారాన్ని ముల్లు తాకినట్టే లేఖనాలు మనముందు తెరువబడుటను చూచుటకు నేనెంతో ఇష్టపడుదును.

19. వారు దాన్ని గమనించుచున్నారు. బహుశా వారిలో ఒకడు ఇలా అని వుండొచ్చును "చూడండి, దానియేలు గ్రంధపుచుట్టలతో దానిని పోల్చి చూడండి, సంఖ్యాకాండములో ప్రవక్త బిలాము చెప్పినట్టు యాకోబులో ఉదయించిన నక్షత్రము అది కాదా. అది అదే నక్షత్రమని నేనాశ్చర్యపోవుచున్నాను".

మరొకన్నారు "ఇటువంటి దానిని మనమింతవరకు చూడలేదు". వారు నిశ్చయంగా నిజమైన ఆనందోత్సాహమును(జూబిలీని) కలిగియుండిరి, వారు అగ్ని(మంట)ను విడిచిపెట్టి ఆకాశములో కదులాడుచున్న అందమైన(రమ్యమైన) ఆ పరలోకపు వరమును వీక్షించుటకు గోపురము మీదికి ఎక్కిపోయిరి.
-"ఒక వరమా?" అని మీరనొవచ్చును, ఆవును, రక్షకుని యొద్దకి నడిపింపబడుటకు అది వారికివ్వబడిన వరమే మరి. వారికోసం పంపబడిన వరమును వారు నమ్మారు. అయితే ఈ చివర దినాల్లో యేసు నొద్దకి నడిపించబడుటకు దేవుని వరమైయున్న పరిశుద్దాత్మను దేవుడు మనకి పంపియున్నాడు, అయినప్పటికిని మనం దానిని నమ్మలేకపోతున్నాం. నేను లోకమును గూర్చి మాట్లాడుచున్నాను.

ఆ 3

ఈ రాత్రి రేడియో పొలమందున్న మీరు దాని గూర్చి ఒకసారి తలంచాలని నేను కోరుచున్నాను. స్వయంగా ప్రభువగు దేవుడే దిగివచ్చి తన్నుతాను బయలుపర్చుకొనుచున్న ఉజ్జీవము మీ పట్టణములో వున్నప్పటికిని మీరు మాత్రం అక్కడికి వెళ్ళకుండా ఇళ్ళల్లో ఎలా కుర్చోగల్గుచున్నారు. ఒక నిజమైన ఆకలిగొన్న హృదయం దేవునికి సమీపముగా రావాలని కోరుకొంటుంది, దేవుని నుండి వచ్చే ప్రతి కదిలిక యొద్దకు వారు తెలిసినంతమట్టుకు వెళ్ళెదరు. వారు పరిశోదిస్తారు, వెదుకుతారు, ఆకలి దప్పికలు కలిగివుంటారు. దేవున్ని చూడాలని వారు ఆశపడతారు. వచ్చి జ్ఞానుల చేసినట్టు నీవును బైబిల్ తీసికొని, దానిని పఠించుము, జరిగిన దానితో లేఖనము సరిపోయిందో లేదో చూడుము. ఒకవేళ సరిపోతే అత్యానందభరితడవయ్యే హక్కును నీవు కలిగియున్నావు.

20. ఈ క్రొత్త అతిధిని గమనించుకొంటు వారా విధంగా రాత్రి వెంబడి రాత్రి వెళ్ళుచుండిరి. ఇది వరకెన్నడు అటువంటి దానిని వారు చూడలేదు. లేఖనము ప్రకారం అది అచ్చట వుంటుందని వారు ఎరిగియున్నారు, అయితే వారి జీవితంలో ఇదివరకెన్నడు అటువంటి ఒక వరము ఆకాశములో కనబడుటను చూడలేదు. ప్రతి కోణంలో వారు దానిని అధ్యాయనం చేసారు. "లేఖనము దానిని వెల్లడిపర్చింది(బుజువు చేసింది)” అని మాత్రమే వారు చెప్పగల్గిందంతా.

కావున ఒక రాత్రి, మనం చెప్పెదం. ఒకడు కూర్చొని దానిని గమనించుచూ, అధ్యాయనం చేస్తూ వుండగా అది కదలటం ఆరంభించింది. మరి అది పశ్చిమ దిశకి కదిలి వెళ్ళటం ఆరంభించింది. మరి బహుశా ఒకడేమో విశ్రాంతి తీసికొనుచుండెను, అతడు లేచి నిలబడి ఇలా అనెను "సహోదరులారా, ఆ నక్షత్రమును గూర్చి నాకిప్పుడే ఒక కల వచ్చింది. రాజు, దేవుడు జన్మించియున్నాడని తెలుపుటకు సూచనగా ఆ నక్షత్రము వెలిసింది. మరి ఆయన యూదులకి రాజు, ఆయన పరలోకమునకు(ఆకాశమునకు) రాజైయున్నాడు, అంతేకాదు ఆయనే సమస్త జనులకి రాజైయున్నాడు. మనం తప్పని సరిగా వెళ్ళి ఆయన్ని ఆరాధించవలెను”.

వారి కృత నిశ్చయతను నేను ఊహించుచున్నాను, వారు తీసికోగల్గినంత సంపదను తీసికొన్నారు. ఎవరో ఒకరు వెళ్ళి ఈ బహుమానములను తీసికొనవలెను. బహుశా వారు చాలా ఎక్కువుగా వేసారు, వాటిని మూడిటి మీద ఎక్కించిరి. వారు తమ ఒంటెల మీద బంగారము, సాంబ్రాణి, భోళమును ఎక్కించిరి. రాత్రి పూట నక్షత్రము కనబడేవరకు వారు వేచియుండిరి, అది తనచోటు నుండి కదిలిపోవుటను వారు గమనించిరి, అది వారిని పశ్చమ దిక్కుకి నడిపించుచున్నది. వారు ఒంటెలు ఎక్కారు, కొండలు గుట్టలు ఎక్కుకొంటూ...

21. మీకు తెలుసా, కొన్నిసార్లు ఆయన నడిపించే విధానం చాలా కరుకుగా (కఠినంగా) వుంటుంది. ఆయన ఎటునడిపినా పర్వాలేదండీ, ఆయన నడిపితే చాలు గమ్యం చేరిపోతాం. అదే ముఖ్యమైన విషయం, రచయిత దీన్ని ఇలా తెలిపాడు.
కొందరు నీటి ద్వారా, కొందరు వరదల ద్వారా, కొందరు అధిక శ్రమల(కష్టాలు) ద్వారా కానీ అందరు రక్తం ద్వారానే తన పిల్లల్ని దేవుడు నడిపిస్తాడు.

ఒంటెల మీదున్న వారు కరుకైన పర్వతము లెక్కుచున్నారు. దిగుచున్నారు, అలాగే లోయల గుండా ప్రయాణించుచున్నారు. మనం వెళ్ళాల్సిన పద్దతి కూడా అదేనండీ. కొన్నిసార్లు లోయల గుండా, మరికొన్నిసార్లు పర్వతముల మీద. కానీ వెంబడించటం మాత్రం ఆపకు. దేవునీ ఆత్మ నడిపింపు ద్వారా మనం నడిచినట్లేతే గమ్యం చేరుకొంటాం.

వారు పర్వతములు దాటుకొంటూ దిగువున దక్షిణదిక్కుకి వచ్చి వుండొచ్చును. వారు టైగ్రిస్ ఏటిగట్టును దాటి, మైదానంలోకి ప్రవేశించిరి, నక్షత్రము మాత్రం వారిని విడువక వెంబడించుచూనే వుండెను.

ఒక దేవుని వరమును గూర్చి అదెంతో చక్కని సందేశమైవున్నది. అది విఫలమవ్వదు, ఎందుకనగా అది దేవుడే.

22. మరి వారు దాన్ని గమనించారు. రాత్రి వెంబడి రాత్రి అది వారిని నడిపించుచుండెను, వారం వెంబడి వారం, నెల వెంబడి నెల, వారు అలా లోయల గుండా, మైదానముల గుండా, మరా విధంగా ప్రయాణం కొనసాగిస్తూనే వున్నారు. కడకు అది వారిని యెరూషలేముకి నడిపించినది. అయితే ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే, అది యెరూషలేముకి వచ్చినప్పుడు, యెరూషలేము యూదులకి మతకేంద్రం, యూదుల మత స్థావరము, అక్కడ పితురలందరు వుండెను, అక్కడ పాతనిబంధనపు గొప్ప ప్రవక్తలందరు సువార్తను ప్రకటించారు, మరియు ఈ సంగతులను ముందుగానే తెలిపారు. ఆ నక్షత్రము తిన్నగా వారినక్కడికి నడిపించినది. కానీ వారక్కడికి చేరుకొన్న తర్వాత, నక్షత్రము కనబడలేదు. ఎందుకని? యెరూషలేము దానికోసం చూడట్లేదు.

అదీ అసలు సంగతి ఈనాడు. మనం సామాజిక సువార్త మరి ఇతర వాటి దగ్గరికి నేడు వచ్చాము. సహజాతీతమగు సూచనలను వారెందుకు నమ్మలేకపోతున్నారు? వారు దానికోసం కనిపెట్టుటలేదు. వెలుగు వెళ్ళిపోయింది. కేవలం ఆచార సిద్దాంతాల ద్వారానే వారు దేవున్ని ఆరాదిస్తున్నారు. కానీ "దేవుడు ఒక ఆత్మ" అని యేసు అన్నాడు, అంతేకాక "ఆయన్ని ఆరాదించు వారు ఆత్మతోను సత్యములోను మాత్రమే ఆరాధించాలి". సిద్దాంతల ద్వారా కాదండీ, సంఘశాఖల పేచీల ద్వారా కాదండీ, కానీ ప్రేమాత్మ మరియు సత్యమందు ఆరాదించాలి. సత్యమంటే ఏమిటి? యేసు చెప్పాడు "నేనే సత్యము”.

23. ఎప్పుడైతే అది యెరూషలేము చేరుకొన్నదో, వెంటనే అది అక్కడ నుండి నిష్క్రమించింది... దానిని మీరు గమనించారా, అవసరం లేని చోట ఒక వరమనేది నిలువదు, లేక తనంతటికి తానే అది ప్రకాశించదు, తన్నుతాను కనపర్చుకోదు. అది అక్కడి నుండి అదృశ్యమగును, వెళ్ళిపోవును. మరప్పుడు జనులు ఇలా అనెదరు "ఎందుకు, పలాని పలాని వారి యొద్దకే వచ్చును, ఎందుచేతననగా అది చాలా గొప్పది, చాలా పెద్దది". దానిని ఎవరు, ఏదీ తగ్గించలేరు, పెంచలేరు.
మరప్పుడు, జ్ఞానులు బహుశా ఇలా అనుకొన్నారేమో "అది యూదుల మతకేంద్రం...ప్రధాన ప్రధాన యాజకుని గూర్చి, గ్రంధపుచుట్టల గల గొప్ప గొప్ప వారంతా వారి గొప్ప పాఠశాలలు చర్చి అక్కడ వున్నది, అతిముఖ్యమైన విశ్వాసులగుంపు అక్కడ వున్నది" వారలా బావించారు. అక్కడే వుండి వుంటాడని వారు బావించారు. అక్కడ వున్నాయి. నిశ్చయంగా రాజు

నక్షత్రము వారిని విడిచిపెట్టిపోగానే, వారు వీధుల వెంబడి వెళ్ళి పట్టణస్థుల దృష్టిని తమ వైపుకి తెచ్చుకొనుటకు ఇలా కేకలుపెట్టారు "యూదులరాజుగా పుట్టినవాడు ఎక్కడ?" దాన్ని మీరు ఊహించగలరా? ప్రతీ పెద్ద రహదారిలోను, ప్రతీ సందుగొందులలోను... దానిని వారు వారి దృష్టికి తేగోరారు? వారెంతో ధనికులు. వారిని నేను నేడున్న క్రైస్తవ వ్యాపారుస్థులని పిలువగోరుదును. చక్కగా అలంకరింపబడిన ఒంటెలమీద వారు సవారీ చేయుచున్నారు. మనుష్యుల గురించి ఏదో వుందని వారికి తెలుసును.

కానీ వారిని అప్రమత్తం చేసిన విషయమేదనగా, వారు అడిగే ప్రశ్న ఏదనగా "యూదులకి రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? తూర్పున మేమాయన నక్షత్రమును చూచితిమి, ఆయనను ఆరాధించుటకు వచ్చితిమి".

24. నిజమైన దేవుని వరము, పెంతెకోస్ట్లు దినాన పడిన నిజ పరిశుద్దాత్మను కనుగొనాలని ఈ రాత్రి అది అనేకమంది లక్షాధికారుల యొక్క ఆకలి హృదయమై వున్నది. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా వున్నాడనే దానిని మేము బైబిల్లో చదివాం. మరి అది ఎక్కడ? ఆయనే స్వస్థపర్చే గొప్ప వైద్యుడని మేము చదివాం. మరి అది ఎక్కడ? పరిశుద్దాత్మ మీకొరకు మీ పిల్లలకొరకు దూరస్థులందరికి అనగా ప్రభువగు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందియున్నదని మేము చదివాం, అయితే మరి అది ఎక్కడ?" సంఘమునుమండించి టెలివిజన్లును కట్టేసి బుదవారం రాత్రి కూటమునకు పరుగుతీసే ఆ శక్తి ఎక్కడ? మన స్త్రీలు సభ్యతగల స్త్రీలవలే వస్త్రములు ధరింప చేసే శక్తి ఎక్కడ? దేవుని మహిమ కొరకు ఎడతెగక పొలములో వుండి సాక్ష్యము చెప్పుటకు ఒక ఆత్మను మండించగల ఆ శక్తి ఎక్కడ?

చివరికి పెంతెకోస్థులోకం సహితం నేడు బహిరంగంగా సాక్ష్యం చెప్పటానికి సిగ్గుపడుతున్నారు. కానీ పౌలు అన్నాడు “యేసుక్రీస్తు సువార్త విషయమై నేను ఎంతమాత్రం సిగ్గుపడును, ఎందుకనగా రక్షించబడేవారికి అది దేవుని శక్తి". అది కేవలం ఒక సిద్దాంతాల వెల్లడి కాదు, నమ్ముప్రతి ఒక్కరిని రక్షించుటకు అది దేవుని శక్తియైయున్నది.

ఎందుకు? లేఖనము చెప్పుచున్నది, "అంత్యదినములో జనులు గర్వాందులై, సుఖానుభవములను ఎక్కువుగా ఇష్టపడేవారుగా వుందురు (వినోదం కోరుకొంటారు), దేవునికంటే కూడా ఎక్కువుగా సుఖానుభవమును ప్రేమించేవారిగా వుంటారు. పైకి భక్తిగా వుండి, దాని శక్తిని తృణీకరించెదరు”. “అద్భుతములు జరిగే రోజులు గడిచిపోయినవి" అని అందురు. "పెంతెకోస్తు దినాన జరిగినట్టు నేడు పరిశుద్దాత్మ బాప్తీస్మం పొందటంలాంటిది లేదు"అని అందురు.

దాని గూర్చి నాకు చెప్పుటకు వారు చాలా ఆలస్యంగా వచ్చారు. నేనిదివరకే దాన్ని పొందుకొన్నాను. అది సత్యమని నాకు తెలుసు, మృతుల్లో నుండి దేవుడు లేపిన అదే యేసు నాకు రక్షకుడైయున్నాడని ఆయన నా హృదయంలో జీవిస్తున్నాడని, అంతేకాక ఆయన్ని అంగీకరించే ప్రతీ విశ్వాసి హృదయంలోను జీవిస్తాడని నేనెరుగుదును. ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు.
నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. ఆయన పునరుత్థానమును గూర్చిన ఒక సాక్ష్యమును నీకిస్తాడు. 25. కానీ యెరూషలేము యొద్ద జవాబు లేదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా వున్నాడని లేఖనము చెప్పుచున్నది. దాని జవాబు సంఘము దగ్గర కూడా లేదు. వారంటారు "ఆయన ఇదివరకు వున్నదానికంటే కూడా తక్కువుగా వున్నాడు, అయినప్పటికి మనమింకా తన సువార్తను బోధించాలని ఆయన కోరుచున్నాడు. సూచనలు అద్భుతాలు జరగకపోయిన పర్వాలేదు".

యేసు అన్నాడు "సర్వలోకమునకు వెళ్ళండి" ఎంతవరకు వెళ్ళాలి? సర్వలోకమునకు వెళ్ళాలి. ఇప్పటికి ప్రపంచంలో మూడవ భాగం కూడా సువార్తను వినలేదు. అంతం ఎంతవరకు? "సర్వలోకం" ఎవరికి చెప్పాలి? ప్రతీ ఒక్కరికి చెప్పాలి. సువార్త ప్రకటించుడి. సువార్త అనగా ఏమిటి? పౌలు అన్నాడు "సువార్త కేవలం మాటద్వారా కాక శక్తి ద్వారా, పరిశుద్దాత్మ కనపర్చుట ద్వారా" "నమ్మిన వారి వలన ఈ సూచకక్రియలు వెంబడించును".

ఓ, నేడు మనకి కావాల్సింది అదే. సహోదరుడా, ఈ రాత్రి ఇక్కడ, నీ సంఘము దానియందు నమ్మీనట్లైతే, ఈ రాత్రి దానిని నీవు నీ హృదయములోకి స్వీకరించి మరి దానిని నీ సంఘము యొద్దకి తీసికొనిపొమ్ము. నేడు లోకము ఇలా అడుగుచున్నది "ఆ దేవుడు ఎక్కడ? ఇదివరకు పనిచేసిన ఆ దేవుడు ఎక్కడ? చరిత్రలో వున్న ఆ దేవుడు ఎక్కడ?" ఆ చరిత్ర దేవుడు నేడు అదేరీతిగా లేనట్లైతే, ఇక చరిత్ర దేవుని వలన నీకేం ప్రయోజనం? ఆయన ఇదివరకు వున్నట్టు నేడు లేకపోతే? ఆ గొప్ప యెహోవాకి, సర్వశక్తునికి, ఎల్షద్దాయికి, వున్నవాడను అనువాడను (గతంలో మాత్రమే వుండిన వాడని కాదండీ), ఆయనకేమైంది? ఆయనకేం కాలేదు, అయ్యిందంతా జనులకేనండీ?

26. వారి దగ్గర జవాబు లేదు, యెరూషలేము దగ్గర కూడా లేదు. కానీ వారు వీరిని నిలువరించ లేకపోయారు. వారు ఆయన్ని కనుగొనగోరుచున్నారు. సహోదరుడా, ఆయన్ని కనుగొనాలనే తపన దేవుడు నీ హృదయంలో లంగరు వేసిననట్లైతే ఇక ఏదీ నిన్ను ఆయన నుండి ఆపుచేయలేదు.

వీధుల్లో పైకి క్రిందికి, ధనవంతులగు వారు పరిశుద్దగుండ్రాళ్ళ వలే సాక్ష్యమిచ్చుచున్నారు "ఆయన ఎక్కడ? ఆయనెక్కడో మాకు చెప్పండి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేమాయన సూచనను చూచాం, ఆయన్ని ఆరాధింపవచ్చాం." కానీ వారి (యెరూషలేము జనులు) దగ్గర జవాబు లేదు. నేడుకూడా జనుల దగ్గర జవాబు లేదండీ. అది విషయం.

ఇప్పుడు గమనించండి. సంఘములోకి దేవుడు ఒక సూచనను పంపినప్పుడు, సంఘము దాన్ని చూచుటలో విఫలం చెందును. సరిగ్గా వారు కూడా అదే చేసారు, అక్కడ దాని విషయమై వారు చేసిన రచ్చ ఏమిటి? వారు దీనివిషయం తెలిసికోవాలని సన్హెద్రిన్ కోర్టును సమావేశపర్చారు.. వారు ఆ కోర్టులోకి వచ్చి బహుశా వారు చదవని లేఖనాలను తెరిచారు, ఇంతకాలం వారు తమ సొంత సిద్దాంతాలనే చదువుకొంటూ వచ్చారు. అయితే వారు లేఖనాలను చదువుచుండగా వారికి మీకా పలికిన ప్రవచనం దొరికింది. అందులో "యూదయ బెత్లహేములో నుండి..."

27. సహోదరుడా వినండి, జరుగుచున్న ఈ సూచనలకి, అద్భుతాలకి సంఘందగ్గర జవాబు లేకుంటే, దేవునివాక్యం అందుకు జవాబునిచ్చును. మీ పాస్టర్ దగ్గర జవాబు దొరకనట్లైతే దేవుని వాక్యంలో దానికి జవాబున్నది.
* దానికోసం నీవు ఆకలిగొనియుంటే, వాక్యములో దేవుడు దానిని నీకు తెలుపుతాడు. దేవుడు తన వాక్యమును నెరవేరుస్తాడు. అదెక్కడ జరిగెనో అనే చోటును వారు లేఖనాలలో తెలిసికొన్న వెంటనే వారు ఆ పట్టణమును ఆ ఆలోచన సభను విడిచి వారేం చేయబోవుచున్నారో అనే దానిని బావించి ఆ పట్టణమును విడిచిపెట్టిపోయారు. వారు దానిలో నుండి బయటపడవల్సివున్నది. ఇది ప్రజలకి తెలియకూడదనేది మతనాయకుల బావం. ఏదో రకంగా వారు దాన్ని ఆపవలెను, లేకుంటే అది వారి ఆచారాలను పగులుగొడుతుంది. దానికి వారు ముగింపు పలకాలని చూస్తున్నారు.

జ్ఞానులు పట్టణము యొక్క ద్వారము వెలుపలికి వెళ్ళగానే, ఆ మబ్బుగా వుండే చోటును వారు దాటిపోగానే ఆ నక్షత్రము తిరిగి వారికి కనబడినది. నువ్వు ఈ లోకములోనుండి, దాని ఆచారాలలో నుండి బయటకి వచ్చినప్పుడే దేవునిమహిమ నీకు కనబడి నిన్ను నడిపించును. నువ్వు నీ ఆహాన్ని విడిచి, నీ పాపన్ని విడిచి, నీ అవిశ్వాసాన్ని విడిచి, వాటన్నిటని వెనక్కి నెట్టివేసి దేవుని తట్టు నీ హృదయాన్ని లేవనెత్తినట్లైతే, దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు.

28. ఆ నక్షత్రమును వారు తిరిగి చూచినప్పుడు, వారెంతో అత్యానందభరితులయ్యారని బైబిల్ చెప్పుచున్నది. వారు కొద్దిగ కేకలు కూడా పెట్టివుండొచ్చును. అమితానందం, ఎందుకంటే వారిని రక్షకుని యొద్దకి నడిపించే సూచనను వారు వెంబడిస్తున్నారని వారు ఎరిగియున్నారు. అది సరిగ్గా దానినే చేసినది.

దేవుడు నేటికిని ఒక సూచనను కలిగివున్నాడని ఈ రాత్రి నేను చెప్పొచ్చునా. అది ఆయన ఆత్మ యొక్క సూచన, యేసు ఎక్కడ వుంటే జీవము అక్కడ వుంటుంది, ఎందుకంటే ఆయనే జీవము. యేసు ఎక్కడ వుంటే, అక్కడ సువార్త వెలుగుంటుంది, ఎందుకంటే ఆయనే వెలుగు. యేసు ఎక్కడ వుంటే అక్కడ అగ్ని వుంటుంది. ఎందుకంటే ఆయనే దహించు అగ్ని అయివున్నాడు, మరి ఆ అగ్ని నీ అవిశ్వాసమంతటిని మరియు నీ మలినమంతటిని కాల్చివేస్తుంది.

రాత్రి వెంబడి రాత్రి ఆయన రంగము మీదికి వచ్చి మొదటిగా నశించిన వారిని రక్షిస్తూ, పరిశుద్దాత్మ కొరకు ఎదురుచూచే వారికి పడిపోయిన(వెనక్కిజారిపోయిన) వారిని తిరిగి ఉద్దరిస్తూ వున్నాడు. వెంబడించుటకు అదే సూచనయై దానిని అనుగ్రహిస్తూ, వున్నది. మరి అంతేకాక రోగులను, బాధితులను ఆయన బాగుచేయుటను (స్వస్థపర్చుటను) కూడా మనం చూస్తున్నాం. వాటిని ఆయన ఇంకా చేయుచూనే వున్నాడు.

29. మరి అలాగే అంత్యకాలమందు వెలుగు కలుగునని, సంపూర్ణముగా బలము ప్రదర్శింపబడునని ఆయన వాగ్దానం చేసాడు, ప్రవక్త అన్నాడు "ఒక దినము ఉండబోవుచున్నది. అది పగలు కాదు, రాత్రి కాదు, కానీ సాయంకాలమందు వెలుగు కలుగును". భౌగోళకంగా సూర్యుడు ఉదయం తూర్పున ఉదయించి సాయంకాలం పశ్చమాన అస్తమించును. అలాగే సువార్త కూడా మొదట తూర్పున వున్న వారికి వచ్చెను.

వగలు, రాత్రి గానీ ఒక దినమును మనము కలిగియున్నాము. ఇదొక =-భయంకరమైన(దుర్భరమైన) దినముగా వున్నది. ఆయన కుమారున్ని మన రక్షకునిగా అంగీకరించుటకు మనకి దేవుని గురించి కావల్సినంత తెలుసును. కానీ తూర్పుజనుల మీద డిన గొప్ప సూచన అద్భుతకార్యాలు ఈ మధ్యకాలంలోనే (కొద్ది సంవత్సరాలక్రితం నుండే) =శ్చిమ జనులమీద పడుచున్నవి.
ఇప్పుడు, సాయంకాలపు వెలుగులు ప్రకాశించుచున్నవి. పునురుత్థానుడగు క్రీస్తుశక్తి ఆయన యొక్క దీవెనలను క్రుమ్మరించుచున్నది, ఆయన ఆత్మతో నింపుచున్నది, సూచనలు మరియు అద్భుతాలు ప్రత్యక్షపర్చబడుచున్నవి. మార్కు 16 యొక్క సూచనలు- విశ్వాసిని వెంబడించుచున్నవి. మీరు చూశారా, ఇది సాయంకాలము, తూర్పున ఉదయించిన అదే వెలుగు ఇప్పుడు పశ్చమాన నిలిచియున్నది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా వున్నాడు.

30. ఆయన మనతో, మనలో వుండుటబట్టి, మనల్ని ఆదరించుచుండుటను బట్టి, మనకి సహాయం చేయుచుండుటను బట్టి మనల్ని దీవించుటను బట్టి మెస్సీయా సూచన కనబడుచున్నది. అంతేకాదు ఆ సూచన మనల్ని చేతులయందు గాయములు, ప్రక్కలో బళ్ళెమునొందిన వాని యొద్దకి నడుపుచున్నది. ఇప్పుడు ఇక్కడ వున్న ఈ పరిశుద్దాత్మే మనల్ని ఒక దినాన దేవుని కుడిపార్శమున కూర్చొన్న వాని యొద్దకు తీసికొనిపోయి మనకి ఆయన్ని చూపునని నేను నమ్ముచున్నాను. అక్కడ మనం ఆయనతో సదాకాలం జీవింతుము, ఆయన పిల్లలమగుదుము, ఆయన మన దేవుడగును. ఆయనతో వుండటయే నా హృదయవాంఛ అయివున్నది.

"తూర్పుదిక్కున మేము ఆయన సూచనను చూచాము, ఆయన్ని ఆరాదించుటకు వచ్చాము". అని జ్ఞానులు అన్నారు. లేఖనములు వాగ్దానం చేసాయి, స్వయంగా యేసు సెలవిచ్చాడు “నేను చేయు క్రియలు మీరును చేయుదురు". ఈ కార్యాలు - అన్యుల సంఘములో కనపడవల్సివున్నది. దీనికి విరోదంగా ఒక్కమాట మాట్లాడినా పాపక్షమాపణ వుండదు. ఒకప్పుడు గతములో వుండిన అదే సూచన, అదే కుమారుడు, అదే వెలుగు ఇప్పుడును వుండెను. ఆయన ఇప్పుడు ఇక్కడ వున్నాడని నేను నమ్ముచున్నాను.

31. రోగముతో బాదపడుతూ ఇక్కడ కూర్చొనియున్న ప్రేక్షకుల నిమిత్తం ఏదో నన్ను ఆపమని చెప్పుచున్నది. ఎందుకో నాకు తెలీదు. కారణం నాకు తెలీదు కానీ ఆత్మ నడిపింపును మాత్రం నేను వెంబడింతును. చెప్పడానికి నా మదిలో ఇంకా మూడునాలుగు ఆలోచనలు (సంగతులు) లేక వ్యాఖ్యానాలున్నవి, కానీ "ఇప్పుడు ఆపుము" అని నాతో ఎవరు చెప్పుచున్నారు. ఈ ప్రేక్షకులలో ఎవరో ప్రార్దించుచున్నారేమో బహుశా. ఎవరో ఏదో బాగా చిక్కులో (కష్టంలో) వున్నట్టు వున్నారు. అది కూడా నాకు తెలీదు.

అపోస్థులుడగు పేతురు ఎవరో, అతడి తండ్రీ పేరేమిటో అప్పుడు చెప్పగల్గిన ప్రభువైన యేసుని మీరు నమ్మినయెడల, గతములో ఆయన చేసిన సూచనలన్నిటిని... ఆ సూచనలను బట్టియే వారాయనను సిలువవేసారు. ఆయన్ని చంపివేసారు - ఒక మాంత్రికుడని, దయ్యములకు అధిపతి అని, ఒక దయ్యమని ఆయన్ని పిలిచారు... యేసుక్రీస్తులో వుండిన అదే ఆత్మ ఇప్పుడు ఆయన సంఘములో వుండెను.

ఆయన ఆత్మకి మనల్ని మనం అప్పగించుకొందాం. దేవుడు అవే కార్యాలను చేస్తాడు. దానిని మీరు నమ్ముదురా?

32. మనం శిరములు వంచుదాం. సర్వశక్తిగల దేవా, ఎందుకనో, ఏ విధంగానో నాకు తెలీదు అది, కానీ ప్రభువా దానిని నీవు ఎరిగియున్నావు. భయంకరమైన రోగపీడుతులు, లేదా మరణానికి కొద్ది దూరంలో వున్నవారు బహుశా ఇక్కడ వుండివుండొచ్చును. అది నాకు తెలీదు. కానీ ఏది ఏమైనా ఆ జ్ఞానులు వెంబడించినట్లుగానే నేను కూడా వెంబడింపగోరుచున్నాను, ప్రతీ కదిలికను గమనించగోరుచున్నాను, ఒక దినాన ఈ పరిశుద్దాత్మ సదాకాలం జీవించుటకు నన్ను నీ సన్నిధిలోకి
తీసికొనిపోవునని ఆశిస్తున్నాను. దానిని నేను గౌరవిస్తున్నాను, దానిని పూజ్యనీయముగా బావిస్తున్నాను, దానిని నేను గమనిస్తున్నాను, నేను బ్రతికినంతకాలం దానికి విధేయుడునై యుండగోరుచున్నాను.

ప్రభువా, ఈ రాత్రి ఈ ప్రేక్షకుల మనోనేత్రములు తెరువబడును గాక, వారిమీద దేవుని ఆత్మ నిలబడునుగాక, ఎందుకంటే తూర్పున మేమాయన నక్షత్రమును, ఆయన సూచనను చూచియున్నాము. పరలోక వరములకై, సూచనలకై యెరూషలేములోవున్నవారి యొద్ద జవాబు లేకుండెను. మరియు ప్రభువగు దేవా, నేటి సంఘములు వద్దకూడా దానికి జవాబు లేదని ఈ రాత్రి చెప్పుటకు సిగ్గుకరముగా వుంది. వారిలో అనేకులు యొద్ద, చాలామంది దగ్గర సహజాతీతమగు సూచనల విషయమైన జవాబు లేకుండెను. వారు దానిని మనసుచదివే శాస్త్రమని, లేక దురాత్మని పిలువగోరుచున్నారు, వారావిధంగా అనుచూ తమ్మును తమనిత్యగమ్యానికి ముద్ర వేసికొనుచున్నారు.

ప్రభువా, ఈ రాత్రి నీవు దేవుడవని తెలియబడును గాక. సమాధిలో నుండి శరీర రూపమందు తిరిగి లేచిన అదే యేసు ఈ రాత్రి పరిశుద్దాత్మ రూపములో ఇక్కడ వున్నాడు.

ఈ రాత్రి నీవు ఎవరినైతే ఈ గుంపులోనుండి పిలుచుదువో అట్టి వారి నిమిత్తం మమ్మును మేము తగ్గించుకొందుముగాక, మా హృదములను దీనత్వమునకు అప్పగించుకొందుము గాక, మా ఆత్మలను, మమ్మును మేము నీకు సమర్పించుకొందుము గాక. ప్రభువా నీకే సకల స్తోత్రాలు. అదే వేకువ చుక్క, పరలోకపు వరము క్రీస్తుయేసునొద్దకి మమ్మును లోతుగా, ఎత్తుగా నడిపించుననే బావంతో ఈ రాత్రి మేము బయటికి వెళ్ళుదుము గాక. ఈ మనవులన్ని ఆయన మహిమ నిమిత్తం ఆయన నామములో అడుగుచున్నాము ఆమేన్.

33. మీరు నమ్మితే. (ఎవరో బాషలో మాట్లాడుచున్నారు, మరొకరు దానికి అనువాదం చేయుచున్నారు - సంపా) ఆమేన్. రేడియో శ్రోతలారా. అలాగే నాముందున్న శ్రోతలారా నేను దేవునివాక్యంలో నుండే నేను బోధిస్తున్నాను, బాషలు మాట్లాడుట, వాటికి అర్ధం చెప్పుటలాంటి వరములు సంఘములో పనిచేయునని నేను నమ్ముచున్నాను. ప్రసంగం ముగిసిన తరువాత ఒక క్రమం ప్రకారం అది జరిగితే దానిని ఏ బైబిల్ విధ్యార్ది ఖండించలేడు. అదంతా క్రమం ప్రకారం జరగాలి. అది ఏం చెప్పినదో మీరు చూచారు, "ప్రభువు మధ్యలోవున్నాడు", మరి ఇతర. ఇప్పుడు అదెంతో వాస్తవం. ప్రభువు తన దీవెనలు జతచేయును గాక.

ఈ కార్యాలను, ఒకప్పుడు నేనింకా యవ్వన బాప్టిస్టు బోధకుడిగా వున్నప్పుడు దానిని నేను అర్ధం చేసికోలేకపోయాను. కానీ లేఖనాలు చదివిన తర్వాత, అది సత్యమని నేను చూశాను. ప్రభువుకే మహిమ కలుగును గాక.

34. ఇటువైపు చూడండి. ఇప్పుడు మీరు మీ విశ్వాసము ద్వారా ప్రధానయాజకుని వస్త్రమును తాకండి. నేనొక క్రీస్తు పరిచారకుడినైతే క్రీస్తు మాట్లాడును గాక,

తీర్మానం తీసికొనే గడియ ఇది. తప్పొప్పులు తెలిసికొనే సమయమిది. గలలీయ సముద్ర తీరప్రాంతాలలో నిలిచి అవే కార్యాలను చేసిన చరిత్ర దేవుడు నేడును అదేరీతిలో లేనివాడుగా నేను మీకు ప్రకటిస్తే అది నాకేం లాభం. ఆయన అలా వున్నాడని నేను కూడా ఒప్పుకుంటాను.

జనులను స్వస్థపరిచేది నేను కాదు సుమా. ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ ఆత్మయైతే
మొన్న రాత్రి ఇక్కడ వుండి సముద్రాలను దాటుకొని వచ్చిన ఒక వ్యక్తితో తన ప్రియమైన వారు ఏ విధముగా బాగుపడునని చెప్పగా అది సరిగ్గా అలాగే జరిగినది, సముద్రాల అవతల వున్న వ్యక్తి సంపూర్ణముగా బాగుపడెనని కబురు కూడా వచ్చినది. దేవుడే దాన్ని చేసాడు.

స్నేహితులారా, అది జరిగించినది జీవముగల దేవుడని మీరు మేల్కోని తెలిసికోలేరా? మొన్న రాత్రి నేను చెప్పినట్టు భయపడితిని, ఎందుకంటే సంఘము యెదుటకి చాలా వరములు తీసుకొని P రాబడినవి, వారు దాన్ని చూసి బిత్తరపోవుచున్నారు. ఓ. వారి సంతోషించే వరకు, ఉత్సహించేవరకు అవి ప్రజల హృదయములను కదిలించవలెను.

35. ఇక్కడ, ఇటువైపు ఒకసారి తిరగండి. ఇదిగో ఈ దిశలో ఇక్కడ, నేనొక చిన్న స్త్రీని చూస్తున్నాను. ఆమె ఎవరో నాకు తెలీదు, కానీ ఆమె ప్రార్దిస్తున్నది. ఆమె చదునైన టోపి పెట్టుకున్నది. ఆమె బాధపడుచున్నది. ఆమెకి పైగా వెలుగు నిలిచియున్నది. ఆమె ఆమెకు కంట్లోను చెవిలోను సమస్య వుంది, దాన్నిబట్టి ఆమెంతో బాధపడుచున్నది. నేను ఎవరి గురించి చెబుతున్నానో ఆమె దానిని పట్టుకోనందున నేను భయపడుచున్నాను. ప్రభువగు దేవా, ఆమె పొందుకొనునట్లు ఏదో ఒకటి చెయ్యుము, లేక చెప్పుము. ఆమె పేరు శ్రీమతి అలెన్. అవునా, స్వస్థపడుదువని నీవు నమ్ముచున్నావా? అలాగైతే లేచి ప్రభువైన యేసు నామములో స్వస్థపడుము.

ఇప్పుడు, కృతజ్ఞలుగా వుండుడి. (టేపుమీద ఖాళీ -సంపా) దాన్ని చేసే పద్దతి అదేనండీ. ఇక్కడున్న మరో ప్రక్కన, ఒక స్త్రీ కూర్చొని తన చేతిని పైకెత్తి ప్రార్దిస్తున్నది. ఆమె బాధపడుచున్నది...ఆమె తలలో సమస్య వుంది, అలాగే గుండె సమస్య కూడా వుంది. ఇక్కడే కూర్చొని నావైపే తిన్నగా చూస్తున్నది. ఆమె పేరు శ్రీమతి హెన్రీ, ఆమె పాండియాగో నుండి వచ్చింది. ప్రభువు నిన్ను దీవించును గాక. స్వస్థపడి ఇంటికి వెళ్ళుము. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపర్చినది.

36. మీరు నమ్మినట్లైతే, ఈ జనులెవరో నాకేం తెలీదు. నా జీవితంలో నేనెన్నడు వీరిని చూడలేదు. ఇదేమిటి స్నేహితులారా? ఇప్పుడు, మర్మయుక్తమైందని తలంచుకొంటు వెళ్ళకు, ఇది దేవుని వాగ్దానం, యేసుక్రీస్తు,

నేను ఆ గోడ వైపుకి వెళ్తున్నాను, ఆ వెలుగు వలన నా నీడ దానిమీద పడును - నేను దగ్గరికిపోయే కొద్ది అది పోయి వాస్తవముగా నేను కనబడతాను. అలాగే ప్రభువు రాకడ భూమ్మీదికి అది సమీపముగా వున్నది, ఆయన సన్నిధి ఇంకా ఇంకా సమీపముగా వస్తున్నది. కడకు మనం ఆయనలో కలిసిపోతాము, ఈ ఆత్మ మనల్ని ఆయనలో వుండునట్లు చేయును.

"ఆ దినమున నేను మీలో వున్నానని, మీరు నాలో వున్నారని, నేను తండ్రిలో వున్నానని, తండ్రి నాలో వున్నాడని మీరెరుగుదురు" ఇంకా. నీకావల్సిందంతా విశ్వాసం మరియు నమ్మకం.

ఇక్కడ, ఒక చిన్న స్త్రీ కూర్చొని తన తలను ఆడిస్తున్నది, ఇక్కడ నావైపే చూస్తున్నది, అదిగో అక్కడ రెండవ వరసలో వున్నది, నీవు ముక్కు సమస్యతో బాధపడుచున్నావు. అది వాస్తవం. నిజానికి నీకు ప్రార్ధనకార్డు లేదు, వుందా? ఆమె వద్ద ప్రార్ధనకార్డు లేదు. నీవు అక్కడే కూర్చొని ప్రార్దిస్తున్నావు. నీవు తలనొప్పి, తలవిసురుడు లాంటి వాటితో బాధపడుచున్నావు. నీవు ఇలా ప్రార్దిస్తున్నావు "ప్రభువైన యేసూ, దీనిని నేను నమ్ముచున్నాను". అది నిజమైతే నీ చేయి పైకెత్తుము? ఆమె దేనికోసం ప్రార్దిస్తుందో నాకెలా తెలుసు? ఆ సమస్య నీకింక వుండదు. యేసుక్రీస్తు నిన్ను సంపూర్ణముగా బాగుచేసాడు. నీవు ప్రధానయాజకున్ని తాకినావు.
37. నా ముందే కూర్చొనియుండెను. కొన్ని వరసల వెనుక ఒక సన్నటి స్త్రీ తన చేతిని తన గొంతు మీద పెట్టుకొని...నేనామెకి క్రొత్త, అయితే ఆమె చుట్టు మరణం ఆవరించియున్నది. ఆమెకి క్యాన్సర్. ఆమెకి శస్త్రచికిత్స కూడా జరిగింది, ఆమె గొంతు మూసుకొనిపోయింది. ఆమె తిన్లేదు, త్రాగలేదు. అది యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు, నీవెవరివో నాకు తెలీదు, కానీ నీవు ప్రార్దిస్తున్నావు. నా సహోదరి దేవుడు నిన్ను స్వస్థపర్చాడు. నీ స్వస్థతను నీవు అంగీకరించుము. నీవు ప్రధానయాజకుని వస్త్రమును తాకినావు.

తిన్నగా వెనుక, ఈ చోటుకి వెనుక, ఆ దారికి మధ్యలో ఒక స్త్రీ వున్నది. ఆమె అధికరక్తపోటుతో భాధపడుచున్నది. ఆమె ఇక్కడామె కాదు, ఆమె ఒక ఫెన్నిజాతికి చెందినది. ఫిన్లాండ్ నుండి వచ్చింది. సిస్టర్, నీవు నమ్మితే నీ స్వస్థతను నీవు పొందుకొనుము. "జామాలన్ రాహూ” నీవు నీ కాళ్ళు మీద లేచి నిలబడి నీ డి నీ స్వస్థతను అంగీకరించుము, పూర్తిగా స్వస్థపడుము, గాడ్ బ్లెస్లూ. "కిట్ఫియోస్ జీసస్", హల్లెలూయా, నేనేమి అంటున్నాను, నీవు నమ్మితే.

38. కీళ్ళనొప్పులు చేత అక్కడ పడివున్న స్త్రీతో చెప్పండి, దేవునియందు విశ్వాసముంచమని, ఆ మంచం మీద నుండి లేచి ఇంటికి వెళ్ళిపొమ్ము.

పైన బాల్కానీలో వున్న ఒక స్త్రీ ప్రార్దిస్తున్నది. ఆమె చెవిలో సమస్యవుంది. ఆమె చెవి వెనుక వున్న ఎముకలో సమస్యవుంది. శస్త్ర చికిత్సకోసం ఆమె సిద్దపడింది. అది ఎవరో నీవు తెలిసికోవాలి, నీ పేరు శ్రీమతి డెలేమీ. నీ కాళ్ళ మీద నిలబడుము శ్రీమతి డెలేమీ, యేసుక్రీస్తు నామంలో నీ స్వస్థతను అంగీకరించుము.

ఆమె దేన్ని తాకినది? దేవుని గొప్ప పరిశుద్దాత్మను, మన ఒప్పుకోలు మీదున్న ప్రధానయాజకున్ని, ఆయన ఇక్కడ వున్నాడని నీవు నమ్ముదువా? అలాగైతే లేచి నిలబడి ఆయన్ని చేర్చుకొనుము, మీలో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో లేచి నిలబడి మీ పూర్ణ హృదయముతో ఆయన్ని నమ్మండి. మనం ప్రార్ధన చేయబోవుచుండగా మీ చేతులను పైకి లేపండి.

39. ఓ ప్రభువగు దేవా, వేకువచుక్కను పంపిన వాడా, యేసుక్రీస్తుని పునరుత్థానమందు మాకిచ్చిన వాడా, ఆయన శక్తి ఇప్పుడు ఇక్కడ వున్నది, అవిశ్వాసమును నేను ఖండిస్తున్నాను, దయ్యపు శక్తిని ప్రార్ధన ద్వారా విరగగొట్టుచున్నాను. పద్నాగేళ్ళ క్రితం ప్రభువు దూత నాయొద్దకి వచ్చి ఈ ప్రత్యక్షతను స్థిరపర్చినదని ఒప్పుకొనిచున్నాను. యేసుక్రీస్తు నామములో మేము నిలబడుచున్నాము. సాతానా నీవు ఓడిపోయావు. కల్వర దగ్గర ఆయన పొందిన శ్రమలద్వారా మరణంద్వారా యేసుక్రీస్తు నిన్ను ఓడించాడు. ఈ స్థలము నుండి బయటికి రా, ఈజనుల్లో నుండి వెళ్ళిపో, తద్వారా వారు యేసుక్రీస్తు నామంలో బాగుపడతారు.

లేచి నిలబడండి, ఆయన్ని స్తుతించండి. ఆయన తట్టు చేతులు పైకెత్తండి. అది ముగిసిపోయింది. యేసు మరణించాడు. యేసు తిరిగి లేచాడు. యేసు ఇక్కడ వున్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా వున్నాడు. మిమ్ములను యేసుక్రీస్తుకి, ఆయన ఆత్మకి అప్పగింంచుచున్నాను. ఇంకెన్నడు మీరు రోగులుగా, పాపులుగా వుండాల్సిన అవసరం లేదు. గాడ్ బ్లెస్యూ.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...