భారతదేశ యాత్రా నివేదిక INDIA TRIP REPORT

భారతదేశ యాత్రా నివేదిక INDIA TRIP REPORT

1. ఇటువంటి చక్కని ప్రజలతో సమావేశం అగుట ... మరియు నేను ... ఇక్కడ ఈ ఉదయం ఈ పురుషులు మరియు స్త్రీలతో సమావేశము కొరకు కూడుకొనుట ఎంతో మర్యాదగా నేను అనుభూతి చెందుతున్నాను. మరియు మేము అల్పాహారము తినేటప్పుడు నేను ఎల్లప్పుడూ దీనిని ఆలోచిస్తాను.... ప్రతీ ఒక్కరూ వారి సాక్ష్యము ఇవ్వడం నేను వింటాను. మరియు కొన్నిసార్లు, ఇక్కడ ఆ బల్లచివర ఉన్న వ్యక్తి చెప్పడం నేను విన్నాను, నేను గతరాత్రి ఆ వ్యక్తికి ఏదో చెప్పాను లేక ఏదో అది ఆ వ్యక్తులలో ఒకరు. నేను నమ్ముచున్నాను అక్కడ కూర్చున్నది అతడే. మరియు నేను ఆమెకు ప్రార్ధన చేసాను అని ఇక్కడ కూర్చొనియున్న స్త్రీ చెప్పుచున్నది. ఇప్పుడు, నేను కలగనినట్లు అది ఉన్నది. అది ఖచ్చితముగా ఆ వెనుక ఉన్నది. కొద్ది క్షణములలో ఎంతో ఉన్నతముగా దానిని వివరించడానికి నేను ప్రయత్నించేదిగా అది ఉన్నది.

... 2. కానీ నేను ఇక్కడ కూర్చొనియుండగా మరియు నేను అక్కడ ఉన్న ఆ వైద్యుని గూర్చి ఆలోచించాను ఆయన సాక్ష్యము అక్కడ జైలులోని సేవలు మరియు ఈ వ్యక్తి నా తల్లి యొక్క సంఘమువాడైన మెథడిస్టు, మరియు దేవుని సంఘము (Church of God) అక్కడ అని, ఆ సహోదరుడు చెప్పాడు. మరియు వేరు వేరు సేవకులు

3. అక్కడ ఆ యవ్వనస్తుడు, మరియు ఇక్కడ ఈ సహోదరుడు మరియు మీలో అనేకులు, మీరందరూ, ఇక్కడ మన నల్లజాతి సహోదరుడు... మరియు ఏదోలా అది ఒక దానిని నీకిచ్చుచున్నది. మరియు ఈ ఉదయకాలమున మేము అక్కడ కూర్చొని ఉండగా అని నేను తలంచుచున్నాను, స్త్రీపురుషులుగా, మేము ఒక ఉద్దేశ్యాన్ని కలిగియున్నాము, మరియు అది క్రీస్తు కొరకైన కారణమును ముందుకు తీసుకొని వెళ్ళుట అయియున్నది. అందుకే మేము ఇక్కడ ఉన్నది. మరియు మేము వేరు చేయబడలేదు, మా శాఖాపరమైన సంస్థలు బహుశా వేరైనప్పటికీ, కానీ ఆయన యొక్క కృపలో మేమందరము ఒక్కటే.

4. ... నా సమయమును ఎక్కువగా గడుపుదును. నా యొక్క అమ్మమ్మ కొండ ప్రాంతముల నుండి వచ్చియున్నది, మరియు అటువంటి బయటి ప్రాంతములను ప్రేమించేదేదో నాలో ఉన్నది. మీకు తెలిసినట్లుగా, నేనొక వేటగాడిని,
మరియు నేను స్వారీ చేసి మరియు ఎక్కువ స్వారీ చేసాను. నా తండ్రి ఒక స్వారీ చేయువాడు. మరియు కొలరాడాలోని, క్రెమ్లింగ్లో, ఆ ట్రబుల్సమ్ (వేదనపరచు) నదిపై, మేము ఆ ట్రబుల్సమ్ నదీ లోయ దగ్గర ఆ హెర్ఫోర్డ్ అసోసియేషన్ వారు మేతను (పశువులకు) మేపెదరు. మరియు గతములో సంవత్సరాల క్రితము నేను ఎక్కువగా అక్కడ స్వారీ చేసియున్నాను. మరియు అసోసియేషన్ వారందరూ తమ పశువులను స్వారీ చేసుకొనుటకు మేము ఒక కదిలించబడే కంచెను (మార్చుకొనే విధమైన) కలిగియున్నాము. ఒకవేళ మీరు ఒక టన్ను గడ్డిని పెంచినట్లయితే, అరాపాజో అడవిలో ఒక ఆవును మీరు మేపగలరు. మరియు కావలివాడు అక్కడ నిలబడి ప్రతీ వ్యక్తిని మరియు అక్కడ వెళ్ళుచున్న అతడి జాతులను (పశువులు) లెక్కించుచుండుటను నేను గమనించాను.

5. మరియు నేను ఆ జీను కొమ్ముపై నా కాలు ఉంచి చాలాసార్లు అక్కడ కూర్చొని నేను అతడిని గమనిస్తూ ఉండేవాడిని, మరియు అవి వెళ్ళుచుండగా ఆ పశువులను లెక్కించడం నేను చూస్తూ ఉన్నాను, వారు ఆ మూడు కాళ్ళ కర్రతో (tripod) రావడం నేను చూచాను; అది మాదే అయివున్నది. టర్కీట్రాక్, అది ఆ నది దగ్గర మరో గడ్డిబీడు అయి వున్నది. డైమండ్ టీ, లేజీ ఆర్, మరియు చాలా వేర్వేరు రకాల జాతులు. ప్రతీదీ వెళ్ళియున్నది, మరియు వారు వేరువేరు జాతులను కలిగియున్నారు, కానీ అవి అన్నియూ హెర్ఫోర్డ్కు చెందినవే.

6. అదే ఈ రోజు నేను తలంచుచున్నాను, చూడండి. మనము వేరు వేరు జాతులకు చెందినవారమై యుండవచ్చు, కానీ హృదయములో మనమందరమూ క్రైస్తవులము. అది ఒక నమోదు చేయబడిన హెర్ఫోర్డ్ కానంతవరకూ ఏదియూ లోపలికి వెళ్ళలేదు. అతడు ఒక నమోదు చేయబడిన హెర్ఫోర్డ్ కానంతవరకూ ఏదియూ లోపలికి వెళ్ళలేదు. అతడు ఒక నమోదు చేయబడిన హెర్ఫోర్డ్ కానంతవరకూ అతడు ఆ తలుపుల గుండా లోపలికి వెళ్ళలేడు. మనము తిరిగి జన్మించిన క్రైస్తవులముగా ఉన్నంతకాలము, మనము ఏ జాతికి చెందినవారమైనా, మనము ఆ తలుపులలోనికి వెళ్ళవచ్చు.

7. మరియు ఇక్కడ ఆ బల్లగుండా నేను చూచినప్పుడు కొంతమంది మనుష్యులు నాకంటె వృద్ధులుగాను, మరికొందరు నాకంటే యవ్వనస్తులుగాను ఉండి, నేను రంగము మీదకి రాకమునుపే మనము పిలిచేటి ఈ అద్భుతమైన సంపూర్ణ సువార్తను బోధిస్తున్నారు. మరియు ఆ ఫలితములు మరియు గౌరవములు వినునట్లుగా మీరు ఒక మనుష్యునిగా నాకు చెప్పవద్దు అని నేను గ్రహించుచున్నాను;
ఆయన దయ యొక్క ఆయన వరము కొరకు మీరు వాటిని దేవునికే ఇస్తూ ఉన్నారు, అది సేవ చేస్తూ నేను మీతో ఉన్నాను.

8. కానీ నేను ఇప్పుడు సవారీ చేయు ఈ మార్గము ఎంతో మెత్తగా (తేలికగా) ఉన్నది, సంవత్సరాల క్రితము వీధి మూలలలో మీరు గిటారు పట్టుకొనియున్నప్పుడు దానికి మీరు పునాది వేశారు మరియు స్తంభము నుండి స్తంభమునకు గెంటివేయబడ్డారు అని మీరు గ్రహించారా? పురుషులు మరియు స్త్రీలైన మీరు వేసిన పునాదిపై, కేవలము నేను కట్టుటకు ప్రయత్నించుచున్నాను. మరియు ఋతువు కాని సమయములో (out of season) జన్మించిన ఒకనిగా నేను ఇక్కడ నిలబడియున్నాను, మరియు మీరున్న ఆ పరిచర్య యొక్క వయస్సులోనే నేను ఒక యవ్వననిగా ఉన్నాను. మరియు ఇక్కడ, నిజానికి పునాది వేసిన వారు మీరైయుండగా, మీరు నన్ను మీతో మాట్లాడనిచ్చుచున్నారు, చూశారా?

9. నేను ఈ ఉదయకాలమున చూచినప్పుడు మరియు ఈ వయస్సుపైబడిన పురుషులు మరియు స్త్రీలను చూస్తూ, నేను ఒక చిన్న బాప్టిస్టు బోధకునిగా లేక బహుశా దానికి ముందు వారు ప్రసంగించినట్లుగా, మరియు మీరు నన్ను మీ సహోదరునిగా అంగీకరించుచున్నారు. మరియు ప్రజలు నీవొక దయ్యమో, లేక ఒక దెయ్యపు ఆత్మో, లేక మరేదో అనుకొనక, నీవొక సహోదరుడవని, మరియు వారు దానిని అర్ధము చేసుకొని ఒకరితో ఒకరు కలిసియుండుట ఎంత గొప్ప అనుభూతిని తీసుకొని వచ్చును. మరియు అది చాలా మంచి అనుభూతి ఇచ్చినట్లుగా చేయుచున్నది. మరియు నా పిలుపునకు నమ్మకముగా ఉండాలని అది నా హృదయములో ఉన్నది, మరియు నేను ఉండాలి, నేను ఉండగోరుచున్నాను. మరియు ఎవరైనా నిన్ను స్వాగతించడం నేను చూసినప్పుడు, మరియు ఏ విధముగా అది మీరు అనుభూతి చెందేలా చేస్తుందో అప్పుడు మీరు తెలుసుకొనండి, చూశారా. ఓ, ఆ విధమైన ప్రేమ ఒక సహోదరుడు మరియు సహోదరినికి ఆ విధముగా ప్రవహించును. మీరు ఎప్పుడైతే మీకు తెలిసినదేదో అది దేవుని దగ్గర నుండి వచ్చినదని అనుభూతి చెందెదరో, దానిని ప్రజలకు ఇచ్చుటకు మీరు ప్రయత్నించుచున్నప్పుడు, మరియు ఒక హృదయముతో వారు దానిని హత్తుకొనెదరు.

10. మరియు ఇక్కడ ఆ బల్ల చుట్టూ నేను చూచినప్పుడు అది అల్పాహారమని నేను తలంచాను. మనము తిరిగి ఈవిధముగా ఎప్పుడు ఉంటామో నాకు తెలియదు. ఈ జీవితములో తిరిగి ఎన్నడూ ఈ విధముగా తిరిగి ఉండము. మరియు తొమ్మిది గంటలు మరియు వ్యాపారము గూర్చి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అక్కడ కూర్చొని
ఉన్న ఒక వ్యాపారస్తుడు చెప్పాడు ... వచ్చి మరియు చెప్పాడు, "సహో, బ్రన్హాం. నేను తొమ్మిదికి వెళ్ళవలసియున్నది. ఎందుకనగా నాకు కొన్ని క్రైస్తవ సంగతులు ఉన్నవి", అతడు క్రైస్తవ ప్రజలకు చేయవలసియున్నది. మరియు నేను తలంచాను, "మంచిది, కొంచెము సేపటి తరువాత మరియు అప్పుడు మేము మళ్ళీ వేరు చేయబడెదము.” కానీ కవి చెప్పినట్లుగా, "మనమింకనూ హృదయములో ఐక్యమై ఉంటాము, మరియు మరొక్కసారి కలుసుకొనుటకు నిరీక్షిస్తున్నాము.” మీరు ఆ పాత పాట పాడుదురు, మీలో చాలా మంది, "కట్టుచున్న తాడు దీవించబడును గాక.”

11. మరియు నేను తలంచాను, "అప్పుడు మనము తిరిగి కలుసుకొనెదమా?" అవును, సహోదరులారా, మనము తిరిగి కలుసుకొనేదము. మరియు అదంతయూ కలిసి ఒక అల్పాహారము కాదు గానీ, అది రాత్రి భోజనము అని మనకు చెప్పబడినది. మరియు ఆఖరున, అదంతయూ ముగించబడిన తరువాత, మన శ్రమలు ముగిసాయి, మరియు మనము ఆయన గృహమునకు ఎక్కిపోవుదము, మరియు మనము ఆయనతో భుజించబోవుచున్నాము, ద్రాక్షారసమును త్రాగబోవుచున్నాము మరియు ఆయన యొక్క రాజ్యములో క్రొత్తదిగా తినువరకు ... అంతా ముగించబడిన కాలమును గూర్చి నేను తలంచినప్పుడు మనము ఇప్పుడు దినము యొక్క మధ్యలో ఉన్నాము మరియు ఎక్కువగా శ్రమపడుచున్నాము, మరియు అదంతా ముగిసిన తరువాత మరియు ఆ బల్లగుండా చూసినప్పుడు మరియు పురుషులైన మిమ్ములను చూసి, ఓహ్, మనము ఒకరినొకరు చూసుకొన్నప్పుడు అది ఏ విధమైన అనుభూతిగా ఉండబోతున్నది. మరియు నాకు తెలుసు అదంతయూ ముగిసినది, మరియు మనము, సందేహము లేదు, బల్ల యొద్దకు చేరి మరియు ఒకరి చేతులు మరొకరు కలుపుకొనెదము. మన యొక్క చెంపల గుండా ఒక చిన్న ఆనందభాష్పములు క్రిందకి జారును, రాజు తన యొక్క సౌందర్యములో నుండి బయటకు వచ్చి మన యొక్క కళ్ళ నుండి ప్రతీ భాష్పబిందువును తుడిచివేయును ఆనందములో ప్రవేశించుడి". నేను ముందుకు చూచే సమయము అదే అయియున్నది. అని తలంచి, “బిడ్డలారా, ఇక ఏద్వవద్దు, అంతయూ ముగిసినది. ప్రభువు యొక్క అది, "భలా! నా నమ్మకమైన మంచిదాసుడా. ఇప్పుడు ప్రభువు యొక్క ఆనందములో ప్రవేశించుము", అని ఆయన చెబితే వినే సమయము కొరకు నేను చూస్తున్నాను. ఆయనతో పాటు నిత్యమూ జీవించి మరియు పాలించెదమని మనము తెలుసుకొని.
ఆ నెరిసిన వెంట్రుకలు వాడిపోయి తిరిగి యవ్వనస్తుడుగా అగుట చూచుట ఎంత గొప్ప సమయముగా ఉండును.

12. ఇప్పుడు, ఈ రోజు మనందరమూ కలిసియుండే ఈ భాగ్యములో ... కొంత, ఇక్కడ ఉన్న సహోదరుడు కెనడా నుండి అని నేను నమ్ముచున్నాను, మరియు వేరే ... నుండి, టెన్నెస్సీ, మరియు ఈ చిన్న గుంపు చుట్టూ ఉన్న ప్రతీ చిన్న లోయ నుండి వచ్చియున్నది. మరియు మేము ఏకత్వముతో ఈ విధముగా కూర్చొనియుండుటను చూచుట, అది తిరిగి పెంతుకొస్తు యొక్క కాలముగా ఉండును, చూడండి : తాజా అభిషేకము కొరకు ఆ పెంతుకోస్తు ఆశీర్వాదము ఇక్కడ ఉన్నదని నేను అనుభూతి చెందుచున్నాను.

చాలా మంది తరచుగా నాకు చెప్తూ ఉండేవారు, "సహోదరుడు బ్రాన్హాం, నీవు పెంతుకొస్తు సంఘానికి చెందినవాడవా?”

13. నేను చెప్పాను, "పెంతుకొస్తు అనేది ఒక సంఘశాఖ కాదు. మనుష్యులు ప్రతీ చోటా పొందుకొనుటకు పెంతుకొస్తు ఒక అనుభవమైయున్నది. మరియు మిగిలిన సంఘముల నుండి దానిని వేరుపరచలేము. మరియు అది ప్రతీ హృదయములోనూ ఉండవలసిన ఒక ఆశీర్వాదమైయున్నది. మరియు మనుష్యులు దాని కొరకు ఆకలిగొనెదరు.

14. మరియు సహో. వైల్ చెప్పాడు ఈ ఉదయకాలమున మనము ఒక సేవకుల అల్పాహార విందును కలిగియున్నామని, మరియు సహోదరీసహోదరులలోని కొందరు కొద్ది సమయము యొక్క సహవాసము కొరకు ఒకచోట సమకూడబోతున్నారు. మరియు, మీకు తెలుసు, అది ఒక అద్భుతకరమైన సంగతి, ఇంకనూ ఒక సైనికునిగా, నేను నా ఖడ్గమును గృహము దగ్గర విడిచిపెట్టాను. కనుక నేను కేవలము అదే నా బైబిలు అయియున్నది. కనుకనే నేను ఎరిగియున్నాను మేము ... ఏవిధముగానైనా పరలోక స్థలములలో కలిపి కూర్చొని యున్నాము, క్రీస్తులో, మరియు నేను తలంచాను బహుశా ఈ ఉదయకాలము కొద్ది క్షణముల యొక్క మాటల కొరకు ... రాబోయే కొద్ది క్షణములలో మనకు పూర్తిగా తేటతెల్లము అవునని నేను ఊహించుచున్నాను. కానీ సహోదరులు లేక సేవకులుగా ఉన్న మీరు, మరియు నా కంటే ఎక్కువగా వాక్యమును మాట్లాడు సామర్ధ్యము కలవారు, ఎందుకనగా నేనొక అదనపు టైరును ... చూడండి, కేవలము ఒక అదనపు టైరును ఎందుకు ఉపయోగించెదరో మీకు తెలుసు, మీరు చూడండి.
కనుక ఈ ఉదయము మనము ఎటువంటి పంక్చరును కలిగిలేము, కావున మనకు ఖచ్చితముగా అదనపు టైరు యొక్క అవసరము లేదు.

15. కానీ మన యొక్క పరలోకపు తండ్రి ఆయా స్థలములలో చేయుచున్న కొన్ని సంగతులపై మీకు సమాచారమిచ్చుటకు ప్రయత్నించెదనని నేను అనుకొన్నాను, ఏదో ఒక అంశము లేక ఏదో తీసుకొని దాని నుండి మీతో మాట్లాడుటకు ప్రయత్నించుట బదులు, అది సహోదరులైన మీకు మరింత ఆసక్తిని కలిగించునని నేను తలంచాను.

16. మరియు నా మనస్సులో నేను ఆలోచించే అంశము, ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే, అది మార్కు 16. మరియు అది ఎటువంటి అద్భుతమైన అంశము. అది సంఘమునకు ఆఖరి ఆజ్ఞ అయి యున్నది. దేవుడు తన సంఘమునకు మొదట ఆజ్ఞ ఇచ్చినప్పుడు, మత్తయి 10 లో క్రీస్తు. ఆయన వారికి అపవిత్రాత్మలపై శక్తిని ఇచ్చెను మరియు రోగులను స్వస్థపరచుట మరియు అటువంటివి. అది ఆయన మొదటి ఆజ్ఞ. ఆయన చివరి ఆజ్ఞ ఏదనగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇప్పుడు, జనులు ఆ దినము ముగిసినదని చెప్పుటకు ప్రయత్నించెదరు. కానీ ఇప్పటివరకు లోకములో మూడవభాగము మాత్రమే క్రీస్తును గూర్చి వినియున్నది. సర్వలోకమునకు మరియు సర్వసృష్టికి. "నమ్మినవారిని ఈ సూచకక్రియలు వెంబడించునని", యేసు చెప్పెను.

17. మరియు అది మంచిదికాదని నాకు తెలుసు, మరియు సువార్త అనగా చతురోక్తులు (జోక్స్) చెప్పడము అని నేను అనుకోవడము లేదు, కనుక ఇది ఒక చతురోక్తిగా పరిగణించవద్దు అని నేను మిమ్ములను కోరుచున్నాను. కానీ ఈ మధ్యనే జరిగిన సంఘటన ఒకటి నా మనస్సుకు వచ్చుచున్నది. ఒక సేవకునిగా అగుటకు విద్యనభ్యసించుటకు పాఠశాలకు వెళ్ళుచున్న ఒక యవ్వనస్తుడు ఉన్నాడు, అతడికి మంచి సరైన సంగతులను బోధించే సరైన రకమైన పాఠశాల అయితే అంతా సరియే. మరియు కనుక మన వారైన చాలా మంది మంచిది, నేను కలిగి మీకు తెలుసు నాకు చదువు లేదు. నేను ఏడవ తరగతి విద్యను కలిగియున్నాను, కనుక మీవంటి సామర్ధ్యమున్న జనుల ముందు నేను మాట్లాడలేను మరియు సరైన పదములను ఉపయోగించలేను, కానీ నేను ఏమని చెప్పుచున్నానో దానిని

పరిశుద్ధాత్మ మీకు తెలిసికొనునట్లు చేయునని నేను ఆశిస్తున్నాను. 18. పాఠశాలలు సాధారణమైన మరియు మార్పులేనివిగా ఉండి, అవి ఒక రకమైన సాంఘిక సువార్త (కలగలుపు) వలె ఉండి మరియు వారు పూర్తి దేవుని
యొక్క వాక్యమును బోధించరు. ఆ బాలుడు బహుశా ఇంటి దగ్గరే నిలిచి మరియు తన మోకాళ్ళపై ఉండుట మంచిది.

అతడు 19. కానీ ఈ యవ్వనస్తుడు తన పాఠశాల విద్యలో వెళ్ళిపోయినప్పుడు అతని తల్లి రోగగ్రస్తురాలైనది, మరియు ఆమె న్యూమోనియా వ్యాధి వలన చాలా బలహీనురాలైనది. మరియు ఆమె ... సహాయముగా ఉండుటకు ఆమె యొక్క కుమారునికి వారు కబురు పంపించియున్నారు; అతడు ఏ సమయములోనైనా ఇంటికి పిలువబడవచ్చును. ఎందుకనగా అతడు చేయుటకు ఏమీలేదని డాక్టరు చెప్పియున్నాడు. అతడు ఆమెకు పెన్సిలిన్ మందును ఇచ్చి, మరియు ఆమెను ఆక్సిజన్ గుడారములో ఉంచెను. ఇంకనూ ఆమె నీరసించుచున్నది. మరియు ఒక ప్రఖ్యాతమైన కళాశాల నుండి బయలుదేరి మరియు ఇంటి దగ్గరనున్న తన తల్లి యొద్దకు వచ్చుటకు ఆ బాలుడు సిద్ధపడియున్నాడు. మరియు హఠాత్తుగా ఆమె కోలుకొన్నది మరియు అంతా సరిగానే ఉన్నది అని అతడికి ఒక టెలిగ్రామ్ వచ్చినది.

20. కనుక విరామ సమయములో, ఆ యవ్వనస్తుడు తన తల్లిని చూచుటకు ఇంటికి వచ్చియున్నాడు. మరియు అతడు లోపలికి వచ్చి; అతడు చెప్పాడు, “తల్లీ, నేను నిన్ను ఒకటి అడుగగోరుచున్నాను”. చెప్పాడు, “నీవు బాగా రోగముతో ఉన్నప్పుడు, ఒక్కసారే ఏమి జరిగినది? అంత త్వరగా బాగవుటకు ఆ వైద్యుడు నీకు ఏమి ఇచ్చాడు? నేను పూర్తిగా సిద్ధముగా ఉన్నాను, నా సూటుకేసును సర్దుకొన్నాను, అప్పుడు నీవు బాగానే ఉన్నావని టెలిగ్రామును నేను అందుకొన్నాను” మరియు చెప్పెను, “నీవు నాకు ఎప్పుడునూ దానిని వివరించలేదు.”

21. ఆమె చెప్పెను, “హనీ”, ఆమె చెప్పెను, "అవును ఆ పట్టణపు దిగువ భాగమున ఆ వీధి మూలలో, అక్కడొక చిన్న మిషను (సంస్థ) ఉన్నది, దాని పేరు సంపూర్ణ సువార్త." మరియు చెప్పెను, “అక్కడొక స్త్రీ చెప్పెను, ఆమె నిజముగా ఖచ్చితముగా వచ్చి మరియు నన్ను చూచుటకు నడిపించబడిన అనుభూతి కలిగియున్నది. మరియు ఆమె నన్ను అడిగినది ఒకవేళ నేను ప్రార్ధనయందు నమ్మిక కలిగియున్నానా, రోగుల కొరకు ప్రార్ధించుట. మరియు నేను ఆమెకు చెప్పాను, అవును, ఒకవేళ బైబిలు ఆవిధముగా చెప్పినట్లైయితే, నేను దానిని నమ్మాను. మరియు ఆమె చెప్పెను, మా పాష్టరు రోగుల కొరకు ప్రార్ధించును”. కనుక చెప్పెను, “వారు పాష్టరును కబురు పెట్టిరి, మరియు ఆయన నాకు పరిశుద్ధ గ్రంధములోని మార్కు సువార్త 16వ అధ్యాయము మరియు చెప్పెను, 'నమ్మినవారిని ఈ సూచకక్రియలు
వెంబడించును". "ఆయన నాకొరకు ప్రార్ధించి మరియు చేతులు నాపై ఉంచెను." మరియు చెప్పెను, "హనీ, జ్వరము నన్ను విడిచినది, మరియు నేను బాగయ్యాను.”

22. ఓహ్, అతడు చెప్పాడు, "అమ్మా, అవును..." చెప్పెను, "నీవు ఇంక మరెక్కువగా వారితో సంబంధము కలిగియుండుట లేదు కదా, ఉంటున్నావా?" మరియు చెప్పెను, "మనము సంబంధము కలిగియున్న దానికన్నా వారు ఒక తక్కువ సామర్ధ్యము నుండి వచ్చినవారు." మరియు "ఓహ్”, ఆమె చెప్పెను. “హానీ దేవునికి స్తోత్రము," ఆమె చెప్పెను, "అది కేవలము ఆశ్చర్యము. ఇప్పుడే నేను ఆ సంస్థకు వెళతాను."

23. "ఓహ్", అతడు చెప్పాడు. "అమ్మా", ఎందుకు, నీవు దానిని చేయకూడదు, నీవు దానిని అర్ధము చేసుకోవాలి, ఆ ప్రజలు మరింత నిరక్ష్యరాసులు వంటివారు, నీవు చూడుము.” అతడు చెప్పాడు, "నీవు దానిని చేయకూడదు.” "ఎందుకు", ఆమె చెప్పెను, "మంచిది, హల్లెలూయా, కుమారుడా."

24. అతడు చెప్పాడు, “అమ్మా, నీవు ఆ విధముగా చెప్పకూడదు." అతడు చెప్పాడు, "నీవు ఆ ప్రజల వలె ప్రవర్తించుట ప్రారంభించావు.” అతడు చెప్పాడు, "నీవు ఆ విధముగా చెప్పకూడదు". మరియు అతడు చెప్పాడు. "ఇప్పుడు, నీవు చూడుము,” చెప్పాడు, "అంతవరకు ...”

25. ఆమె చెప్పినది, “మంచిది, హానీ”, చెప్పెను. "వారు దైవిక స్వస్థతలను కలిగియున్నారు." మరియు చెప్పెను, "వారు సేవలు కలిగియున్నారు. మరియు, ఓహ్, ప్రభువు ఏ విధముగా వారిని ఆశీర్వదించునో నీవు చూడాలి."

“ఓహ్”, అతడు చెప్పాడు, “అమ్మా”, చెప్పాడు. “ఇప్పుడు, అతడు నీ కొరకు చదివిన ఆ లేఖనము మార్కు 16వ అధ్యాయము నుండి ..."

ఆమె చెప్పినది, “అవును, ఇదిగో ఇక్కడ ఉన్నది. ఇదిగో ఇక్కడే. బైబిలు ఆ విధముగా చెప్పినది.”

26. “ఓహ్”, అతడు చెప్పాడు, “నీవు చూడుము”, చెప్పాడు, “అటువంటి సామర్ధ్యము కలిగిన ఆ సేవకులు”, చెప్పెను. "వారు చదువుకున్నవారు కాదు". మరియు అతడు చెప్పాడు, “మన శ్రేష్టమైన పండితులు ఆ మార్కు 16, 9వ వచనము నుండి ప్రేరేపించబడినది కాదు అని గ్రహించియున్నారు”. చెప్పెను, "అది కేవలము వాటికన్ మరియు అటువంటి వారిచే కలపబడినది మాత్రమే,” “అది నిజముగా ప్రేరేపించబడినది కాదు”, “అది కలిపియున్నారని లేక అక్కడ
పెట్టియున్నారని ఏ చరిత్ర కూడా చెప్పుట లేదు", అని చెప్పెను. మరియు చెప్పెను, "అది కేవలము కలపబడినది. 9వ వచనము నుండి ప్రేరేపించబడలేదు."

మరియు ఆమె చెప్పెను, "మంచిది, హల్లెలూయా",

27. మరియు, "ఎందుకు" అతడు చెప్పెను. "అమ్మా, ఆ ధైర్యమే", అతడు చెప్పెను, "ఎందుకు నీవు ఎందుకు", అతడు చెప్పెను. "అది ... ఎందుకు, నిన్ను చూసి నేను సిగ్గుపడుచున్నాను."

ఆమె చెప్పెను, "కుమారుడా, నేను మరేదో ఆలోచించుచున్నాను."

"అమ్మా, నీవు ఏమి ఆలోచించుచున్నావు," అని చెప్పెను.

28. “మంచిది”, చెప్పెను, "ఒకవేళ ఆ ప్రేరేపించబడని లేఖనము నుండే దేవుడు నన్ను స్వస్థపరచగలిగినట్లయితే, మరి నిజముగా ప్రేరేపించబడిన దానితో ఆయన నాకేమి చేయును?" కేవలము అది ఆ రీతిగానే ఉండును అని నేను తలంచుచున్నాను, మీరు చూశారా. అది ప్రేరేపించబడినది... మరియు జరిగియున్న ఒక గొప్ప సంగతి అది.

29. మోరిస్ రీడ్ హెడ్ను గూర్చి ఎవరైనా ఎప్పుడైనా ఎరిగియున్నారా? చాలా మంది కలుసుకొనియున్నారు మీలో కొంతమంది అని నేను ఊహించుచున్నాను. సుడాన్ దేశములో బాప్టిస్టు యొక్క సువార్త పరిచర్యలకు అతడు ఉపాధ్యక్షుడు. మీరు ఎరిగియుండవచ్చు... మీకు రీడ్వైడ్ తెలుసు, మీకు తెలియదా? మరియు డాన్ వెల్స్, అతడు పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత, మరియు చట్టనూగా నుండి వచ్చిన వాడైన డాన్వెల్స్ మీకు తెలుసు. ఖచ్చితముగా, అతడు అక్కడ ఒక పెద్ద బాప్టిస్టు ఆలయమును కలిగియున్నాడు. అతడు రీడెడ్ క్రింద పరిశుద్ధాత్మ బాప్తీస్మమును పొందుకొన్నాడు. మరియు డాక్టర్. రీడెడ్ నా గృహమునకు వచ్చియున్నాడు, మరియు అతడు చెప్పాడు ... ఇప్పుడు, అతడు చెప్పాడు, “సహో. బ్రన్హాం”, నేను నిన్ను ఒకటి అడగగోరుచున్నాను." మరియు ఎవరో యూదుడైన సహోదరుడు మరియు వారు ఓహియో నుండి వచ్చిన కొంతమంది వ్యక్తులతో ఉన్నారు. ఈ యూదుడైన సహోదరుడికి ఇక్కడ ఓహియోలో ఒక వ్యాపారమున్నది. అతడి పేరేమిటో నేను మరిచిపోయాను, అతడు హైమన్ ఆపిల్మేన్కి వ్యక్తిగత స్నేహితుడు. అందుకే వారు నా గృహమునకు వచ్చారు మరియు అతడు చెప్పాడు.

30. ఇప్పుడు, 'బాప్టిస్ట్ అయివుండియు ... ఇప్పుడు అది ఏమియూ పనిచేయదు, చూడండి. ఇప్పుడు, గుర్తించుకొనండి. నేను ఒక రకముగా బాప్టిస్టు
సంఘముతో అతుక్కొని ఉండుటకు గల కారణము అది స్థానిక సంఘము యొక్క సార్వభౌమాధికారము అది అపొస్తలులది అని నేను అనుకొనుచున్నాను, మీరు చూడండి. బాప్టిస్టుగా, మేము అక్కడ ఉండుట కాదు నేను కనీసము సహవాసమునకు కూడా హజరుకాను, కానీ బాప్టిస్టు సంఘము అనేది ఒక శాఖ కాదు. అది ఒక సహోదరత్వము. మరియు అది స్థానిక సంఘము యొక్క సార్వభౌమత్వము. మరియు ఒకవేళ దేవుడు ఎన్నడైనా తన మనుష్యునికిగానీ, తన పెద్దకు గానీ ఇవ్వాలనుకుంటే, బైబిలు ప్రకారము, స్థానిక సంఘములో ఉన్నతమైన కార్యాలయము ఏదనగా ఒక పెద్దైయున్నాడు. మరియు ఇప్పుడు, వస్తూ, పెద్ద ఒక రాష్ట్ర ప్రెస్బిటర్ దగ్గరకు వెళ్ళాలి, మరియు అటువంటి వారి యొద్దకు, మరియు తిరిగి బిషప్ యొద్దకు. మరియు అప్పుడు ఈ విధముగా వ్రాయబడినది, “మనము దీనిని నమ్ముచున్నాము", కాలము. అంతే.

31. వైద్యుడైన బోయే ఒక్కసారి ఇక్కడ చెప్పియున్నాడు, "మన కర్మను మనమే వ్రాసుకొన్నాము (లేక వారి యొక్క నమ్మకము ఏదైనప్పటికీ); దానిని ఒక కామాతో ముగించెదము. మనము దీనిని నమ్మెదము, మరియు ప్రభువు ఎంతవరకైతే మనకు చూపిస్తాడో." కనుక, ఆ విధముగానే నేను దానిని ఇష్టపడెదను.

32. మరియు అప్పుడు దీనిలో... డాక్టరు. రీడెడ్ లోపలికి వచ్చాడు. అతడు చెప్పాడు, “ఇప్పుడు, సహోదరుడు బ్రన్హాం, ఒక బాప్టిస్టు నుండి వచ్చినవానిగా, మా వర్తమానమును గూర్చి నీవు ఖచ్చితముగా ఏదో ఎరిగియున్నావు.”

నేను చెప్పాను, "అవునయ్యా".

33. అతడు చెప్పాడు, “ఇప్పుడు, నేను ఏడేండ్ల చిన్న బాలునిగా ఉన్నప్పుడు, ప్రభువు నన్ను పిలిచియున్నాడు." మరియు నేననుకొనుచున్నాను ఇక్కడనున్న డాక్టర్. వైల్ ... డాక్టర్. రీడెడ్ మీకు తెలుసు, అతడు బాగా తెలుసు.

34. అతడు చెప్పాడు, "ఒక చిన్న బాలునిగా, నేను పరిచర్యకు పిలువబడ్డాను.” అతడు చెప్పాడు, “అప్పుడు నేను చదువుకొన్నాను, మరియు నేను ఎదురుచూచాను, నా చిన్ని హృదయము దేవుని కొరకు ఆశతో ఎదురుచూచుచున్నది." అతడు చెప్పాడు. “అప్పుడు చివరకి నేను నా B.A. పట్టా పొందుకొన్నాను," చెప్పాడు, "నేను కోరుకొనిన దానిని ఖచ్చితముగా నా B.A. లో ఆ సంగతిని కనుగొనెదనని. నేను అనుకొన్నాను. కోరుకున్నది నేను పొందుకొనలేదు." అతడు చెప్పాడు, ఆ ఇతర డిగ్రీలు అతడికి మరియు చెప్పాడు, "కానీ నా B.A. ని నేను పొందుకొన్నప్పుడు", చెప్పాడు. “నేను ఇవ్వబడినప్పుడు, అతడు చెప్పాడు. "బహుశా ఈ ప్రతీ డిగ్రీలలోను నేను క్రీస్తుని
కనుగొనెదనని నేను తలంచాను." అతడు చెప్పాడు. "మరియు గౌరవప్రదమైన డిగ్రీలు మరియు అటువంటివి," చెప్పాడు. "వాటన్నిటితో దాదాపుగా నేను నీ గోడను నింపివేయగలను". అతడు చెప్పాడు, "కానీ వాటన్నిటిలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు?" అతడు చెప్పాడు, "సహోదరుడు బ్రన్హాం. ఆ బోధకులు తప్పు చెప్పారా?"

నేను చెప్పాను, "నేను దానిని చెప్పను."

35. చూడండి, ఏదో ఒక దానిని తీసుకోవాలని నేను కోరుటలేదు, ఎందుకనగా ఏదో ఒక దానిని చెప్పుట వలన చంకకర్రల ద్వారా నీ అజ్ఞానమును బలపరచుటకు ప్రజలు ఆ నమ్మకమును నీలో ఉంచగోరుదురు; నేను దానిని చేయగోరడము లేదు. నేను చెప్పాను, "లేదు. ఆ బోధకులు తప్పు మరియు అటువంటివి నేను చెప్పగోరడము లేదు. కానీ క్రీస్తు B.A.లో కానీ DDలో కానీ LDలో కానీ ఉండడు, చూడండి. క్రీస్తు ఒక దీనమైన హృదయములో ఉండి మరియు దానిలో నివాసము చేయును." చూడండి.

36. మరియు అతడు చెప్పాడు. "నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో మీకు చెప్పియున్నాను". ఆయన చెప్పాడు, "కొంతకాలము క్రితము, ఒక యవ్వనస్తుడైన భారతీయ బాలుడు, అక్కడే చదివి మరియు తన దేశమునకు సహాయము చేయుటకు భారతదేశమునకు తిరిగి వెళ్ళిపోతున్నాడు..." ఆయన చెప్పాడు. "ఈ యవ్వన భారతీయుడు అతడు వెనుకకు తిరిగి వెళ్ళుచున్నప్పుడు, నేను అతడితో చెప్పాను, 'అయ్యా, నీవు ఎందుకు ..." అతడొక హిందువు. అతడు చెప్పాడు, "నీవు ఎందుకు ఆ పాత చనిపోయిన ప్రవక్త అయిన మహ్మద్ను విడిచిపెట్టి మరియు నజరేయుడైన యేసును, పునరుద్ధానుడైన క్రీస్తును అంగీకరించవచ్చు కదా?”

37. మంచిది, అతడు చెప్పాడు ఆ మహ్మదీయుడు కొంచెము క్రిందకు చూచి, మరియు అతడు పైకి చూచి చెప్పెను, "అయ్యా, నా ప్రవక్త చేయునదాని కన్నా ఎక్కువగా యేసు నాకేమి చేయును?" ఇప్పుడు, క్రైస్తవ సహోదరీ మరియు సహోదరులారా, దీనిని వినండి. చెప్పాడు, “నా ప్రవక్త చేయునదానికన్నా ఎక్కువగా యేసు నాకేమి చేయును?" చెప్పాడు, "మీరు బైబిలు అని పిలిచే ఒక గ్రంధమును ఒకరు వ్రాసారు. మీరు దానిని చదివి మరియు దానిని నమ్మెదరు. ఇంకొకరు ఖురాన్ అనే గ్రంధమును వ్రాసారు. మేము దానిని చదివి మరియు దానిని నమ్మెదము". అతడు చెప్పాడు. “ఇప్పుడు, ఇద్దరూ మరణము తరువాత జీవమును వాగ్ధానము చేసారు మరియు మనమిరువురము దానిని నమ్ముచున్నాము”. అతడు
చెప్పాడు, "ఇప్పుడు, మా ప్రవక్త చేసిన దానికన్నా ఎక్కువగా, మీ ప్రవక్త లేక మీ క్రీస్తు మాకేమి చేయును?"

38. మంచిది, డాక్టర్ రీడెడ్ చెప్పాడు, “మంచిది”, చెప్పాడు, “ మీ ప్రవక్త అక్కడ చనిపోయి సమాధిలో పడియున్నాడు." మరియు బహుశా, యాత్రికులైన మీలో కొద్ది మంది నేను చూచినట్లుగానే చూసారు. వారు సమాధి దగ్గర ఒక తెల్లని గుర్రమును ఉంచి, మరియు రెండు వేల సంవత్సరముల నుండి, మహ్మద్ లేచి మరియు ప్రపంచమును జయించునని ఎదురుచూచుచున్నారు. ప్రతీ కొన్ని గంటలకు ఆ గుర్రమును కాయువారు మారుదురు. మరియు అతడు సమాధిలో ఉన్నాడు. మరియు అతడు దేవునిలో ఒక విశ్వాసి. కేవలము ఆ మహ్మదీయుల యాజకుడు, ఆ భవనముపై అతడు పెద్ద గంటను మ్రోగించినప్పుడు, అతడు చెబుతాడు, “ఒక నిజమైన మరియు సజీవుడైన దేవుడు ఉన్నాడు, మరియు మహ్మద్ ఆయన యొక్క ప్రవక్త."

“ఒక నిజమైన మరియు సజీవుడైన దేవుడు ఉన్నాడు, మరియు యేసు ఆయన యొక్క కుమారుడు," అని మేము చెబుతాము. మరియు అదే వ్యత్యాసము.

మరియు కనుక, అతడు చెప్పాడు, "ఇప్పుడు, అతడి కన్నా ఎక్కువగా నీ యేసు నాకేమి చేయును?"

“ఎందుకు”, అతడు చెప్పాడు, "మా యేసు సమాధి నుండి లేచియున్నాడు, మరియు మీ ప్రవక్త సమాధిలో ఉన్నాడు". అతడు చెప్పాడు, “అదే వ్యత్యాసము.”

“ఎందుకు” అతడు చెప్పాడు, "ఆయన సమాధి నుండి లేచియున్నాడా?" అతడు చెప్పాడు, నీవు దానిని రుజువు చేయుట నేను చూడగోరుచున్నాను”.

“ఓహ్”, అతడు చెప్పాడు, “ఎందుకు, సమాధి ఖాళీగా ఉన్నది.”

39. చెప్పాడు, "ఓహ్, భారతదేశములో, అటువంటివి వేలాదిగా కలిగియున్నాము.” వారు కలిగియున్న వాటిని. అది నిజము, వారు చెప్పుచున్నారు. కన్యక జన్మలు? ఓ, మై, మై. కన్యక జన్మలు మరియు అటువంటి వాటిపై నీవు చాలా సాహిత్యమును పోగు చేయగలవు. మరియు క్రీస్తుతో పాటు అనేక కన్యక జన్మలు గలవు. జన్మించిన ప్రతీ తేనెటీగ, దాదాపుగా రెండవ మగ తేనెటీగ తరువాత వచ్చేది కన్యకే, ఎటువంటి పురుష సంయోగం లేనిది. మరియు ప్రజల యొక్క మనస్సులలో కన్యక జన్మ ఎందుకు అంత ప్రశ్నగా ఉన్నది, ఇంకా అనేక కన్యక జన్మలుండగా ... మంచిది అప్పుడు, క్రీస్తు కన్యక ద్వారా జన్మించిన దేవుని కుమారుడు, మరియు కావున అప్పుడు, మేము
ఆయన చెప్పాడు. "అప్పుడు నేను అతనికి చెప్పాను. 'మంచిది. మీరు చూడండి ..." ఆయన చెప్పాడు, “ఇప్పుడు, నా ప్రవక్త ఇచ్చిన దానికన్నా నీ క్రీస్తు మరెక్కువ ఏమివ్వగలడు?"

మంచిది, అతడు చెప్పాడు, "ఇప్పుడు, మరణం నుండి ఆయన లేచియున్నాడని మేము నిరూపించగలము." చెప్పెను, "దానిని మేము నిరూపించగలము."

"మంచిది,” చెప్పాను, “దానిని నీవు చేయుటను నేను ఇష్టపడెదను, మరియు అప్పుడు దానిని మేము నమ్మెదము". అహ్-హహ్.

ఆయన చెప్పాడు, "మంచిది, ఆయన నా హృదయంలో నివశిస్తున్నాడు."

"మంచిది", అతడు చెప్పాడు. నాలో మహ్మద్ నివశిస్తున్నాడు."

ఆయన చెప్పాడు, "కాని మీరు చూడండి, మేము సంతోషమును, మరియు ఆనందమును, మరియు విజయమును కలిగియున్నాము మరియు ...'

40. ఆయన చెప్పాడు, "ఇప్పుడు, ఒక్క క్షణం, శ్రీ రీడెడ్" చెప్పెను, "క్రైస్తవ్యం తీసుకురాగలిగిన మానసిక శాస్త్రంను మహ్మదీయ మతం కూడా తీసుకురాగలదు." మరియు ఇప్పుడు, సహోదరులారా, అది సత్యమని మీకు తెలియును, చూడండి. చెప్పెను, "మనము ఆ విధంగా ఉండగలము ..."

41. ఓ ప్రవక్తల యొక్క పండుగలో వారు ఒక ఊసను ఆ విధముగా ముక్కు గుండా గుచ్చుకుని మరియు వెనుకకు లాగినప్పుడు ఒక్క చుక్క రక్తము కారకుండా, వారు చేస్తున్నప్పుడు నేను వారిని చూసాను. అరుస్తు మరియు కేకలు వేస్తూ మరియు ప్రతిదానితో కొనసాగుతున్నారు, ఓ, నిశ్చయముగా, ఖచ్చితం. మరియు చూడండి, మానసికశాస్త్రం అంతా: అది నిజము. దయ్యపు ఆరాధనను కలిగియున్న, ఆఫ్రికాలో కూడా, మానవ పుర్రెలో నుండి వారు రక్తము త్రాగుచూ మరియు దయ్యపు శక్తిని పిలుచుచున్నారు మరుగైయున్న సంగతిగా చుట్టూ ఉన్నది, చూడండి. అక్కడ ఏవిధముగా ఆ మంత్రవైద్యులు నీకు సవాలు చేసియున్నారు. నీవు ఏమి మాట్లాడుచున్నావో నీవు ఎరుగుట మంచిది. నీవు ఇక్కడ దానిని నడిపించి మరియు దానికి అనుగుణంగా ప్రవర్తించెదవు. కాని నీవు ఆ సంగతికి ముఖాముఖిగా వచ్చినప్పుడు, నీవు ఏమి మాట్లాడుచున్నావో నీవు ఎరుగుట మంచిది, చూడుము. మరియు ఎందుకు, అది ఒక

42. ఈ ఉదయకాలమున నా సహోదరులతో అది చెప్పుటకే ప్రయత్నించు చున్నాను. సహోదరులారా, గెంతుతూ నాట్యమాడుచున్న సంఘములను చాలా కాలము కలిగియున్నాము, మీరు చూడండి. ఏదో నిజమైన దానియొద్దకు మనము
రావలసియున్నది. చూడండి. అప్పుడు సంగతులన్ని సరియగును. చాలాసార్లు ప్రభువు యొక్క శక్తికి బదులు ప్రభువు యొక్క ఆనందమైయుందును, చూడండి, చూడండి,

కాబట్టి అప్పుడు, శ్రీ రీడెడ్ చెప్పాడు, "మంచిది," అతడు చెప్పాడు,

43. ఆ హిందువు చెప్పెను. "శ్రీ రీడెడ్ నీవు చూడుము" అతడు చెప్పాడు, "మహ్మద్ తనను వెంబడించు వారికి ఎన్నడు ఏ వాగ్దానము చేయలేదు: కేవలం మరణం తర్వాత జీవితము.” కాని చెప్పెను, "మీ యేసు ఇతర వాగ్ధానములను చేసెను ఆయన చేసిన అదే సంగతిని బోధకులైన మీరు చేసేదరని అతడు చెప్పెను." మరియు అతడు చెప్పెను, "అప్పుడు, బహుశా, ఒకవేళ జనులైన మీరు దానిని రుజువు చేసిన యెడల, అప్పుడు ఆయన చనిపోయి లేచెనని మేము నమ్మెదము."

44. “ఓ”, మరియు శ్రీ రీడెడ్ చెప్పాడు, ఆయనను మీరందరూ ఎరిగియున్నట్లయితే... ఆయన అతడిని అదే లేఖనం యొద్దకు తీసుకొని వెళ్ళెను, చెప్పెను, "ఓ, మీరు పరిశీలిస్తారని నేను ఊహించితిని... మీరు బైబిల్ చదివారని చూస్తున్నాను."

చెప్పెను, “ఓ”, అతడు చెప్పాడు. నేను దానిని చాలాసార్లు చదివియున్నాను," మహ్మదీయుడు చెప్పాడు.

ఆయన చెప్పాడు. "మంచిది, బహుశా మీరు మార్కు 16ని పరిశీలించియున్నారు."

45. ఆయన చెప్పాడు. "అవి వాటిలో ఒకటి", కేవలం వాటిలో ఒకటి. మార్కు 11:24 సంగతి ఏమిటి, మరియు అటువంటివి, మరియు మిగిలినవి? పరిశుద్ధ యోహను 14:12, చాలా ఇతరమైనవి, మీరు చూడండి, ఆ లేఖనములను అతడు ఎక్కడ చెప్పెను, క్రీస్తు ఈ వాగ్దానములను చేసెను? చెప్పెను, మహ్మదీయులైన మేము క్రైస్తవులైన మీరు వాటిని ఉత్పత్తిచేయుటకు ఎదురు చూచుచున్నాము, అప్పుడు మీ యేసు మరణము నుండి లేచెనని మేము నమ్మెదము." ఆయన చెప్పెను, "అంతవరకూ, ఒక మహ్మదీయునికి మీ మానసికశాస్త్రమును అమ్మ ప్రయత్నించవద్దు, ఎందుకనగా మేము మరింత మెరుగైన దానిని కలిగియున్నాము", చూడండి.

46. మరియు అతడు చెప్పెను, "సహో॥ బ్రన్హాం", అతడు చెప్పెను, "నేను నా కాలితో ధూళిని ఆ విధముగా తన్ని మరియు అంశమును మార్చాను, నేను కేవలం నేర్చుకొనుచున్న వానితో మాట్లాడుటలేదని నేనెరుగుదును. అతడేమి
మాట్లాడుచున్నాడో అతడు ఎరుగును". మరియు అతడు చెప్పాడు. "నీ బైబిల్ ఏమి ఉత్పత్తి చేయుచున్నదో నీవు ..."

47. మరియు కనుక శ్రీ రీడెడ్ చెప్పెను, "మంచిది, ఒకవేళ మార్కు 16ని మీరు సూచిస్తున్ననట్లయితే," చెప్పెను, "మేము కనుగొనెదము... మేము నిజముగా ఎరిగియున్నాము అది... ఆ లేఖనము యొక్క భాగము, ప్రత్యేకముగా ప్రేరేపించబడలేదు.

48. సహోదరులారా, మీరు దానిని విన్నారు. మరియు వారు మార్కు 16ని అక్కడ విసిరి వేయగోరుచున్నారు. కనీసం మీరు చదివిన స్కోఫీల్డ్ నోట్స్లో, సూచికలో, మరియు చాలా మంది పండితులు దానిని విసిరివేయుటకు ప్రయత్నించుచున్నారు. మరియు ఆ మహ్మదీయుడు ఏమి చెప్పెనో మీకు తెలుసా? అతడు చెప్పెను, "అదికాదా? అంటే 9వ వచనము నుండి ప్రేరేపించబడినది కాదు అని నీ అర్ధమా"

అతడు చెప్పాడు, “లేదు. అది ప్రేరేపించబడినది కాదు."

చెప్పెను, "అప్పుడు, మీ బైబిల్ ఎటువంటి గ్రంధము?" అతడు చెప్పెను, "ఖురాన్ అంతయూ కూడా ప్రేరేపించబడినది”.

49. మై, అది ఏమిటి, సహోదరులారా, ఆ సంగతిని ఒక ముగింపునకు పిలుచుచు వారెక్కడ నిలబడియున్నారో ఎరిగియున్న పురుషులు విశ్వాసమును సవాలు చేయుదురు. ఆ బైబిలు యొక్క ప్రతీ వాక్యము ప్రేరేపించబడియున్నది లేక దానిలో ఏదియూ ప్రేరేపించబడలేదు. ఒకవేళ ఇదికాకపోతే, మరియు అది కాకపోతే, ఏ భాగమును నీవు నమ్మెదవు? దానిని అంతయూ నమ్ముమూ లేక ఏదియూ నమ్మవద్దు. ఈ ఉదయకాలమున నీవు నా సహోదరుడవై యుండవచ్చు లేక నీవుకాదు. నేను నీ సహోదరుడను లేక నేను కాదు. దేవునితో ఎటువంటి సగభాగము (అడ్డు మార్గము) ఉండదు. మనము క్రీస్తు యొక్క ఉద్దేశ్యములను ముందుకు తీసుకువెళ్ళుటకై ఇక్కడ ఉన్నాము లేక మనము లేము, చూడండి. మరియు ఆ విధముగానే లేఖనము నేర్పించబడి మరియు అభ్యసించబడి మరియు నమ్మబడవలెను.

50. మరియు అతడు చెప్పాడు. "నేను చెప్పాను, 'ఒక రోజు నేను వచ్చి నిన్ను దర్శించెదను," మరియు చెప్పాను "ఇక్కడ నేను ఉన్నాను." అతడు చెప్పాడు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందుకొనువంటిది ఏదైనా ఉన్నదా?"

నేను చెప్పాను, "అవునయ్యా".

ఆయన చెప్పాడు, “దానిని నీవు ఎప్పుడు పొందగలవు?”

నేను చెప్పాను, "దానిని నీవు కావాలనుకున్నప్పుడు" చూడండి.
51. మరియు మోరిస్ రీడెడ్ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందుకొనియున్నాడు మరియు స్వయముగా స్వస్థపరచు కూడికలను కలిగియున్నాడు. మరియు అక్కడే ఉన్నది, సహోదరులారా, ప్రపంచము, క్రీస్తు యొక్క పేరును ప్రపంచంలో మూడు వంతులలో రెండు వంతులు ఎన్నడు వినియుండలేదు...

52. ఆయన చెప్పాడు. “ఇప్పుడు, యేసు మరణించి తిరిగి లేచాడని నిరూపించడానికి మీరు రెండు వేల సంవత్సరాలను కలిగియున్నారు, మరియు రెండు వేల సంవత్సరాలలో ప్రపంచములోని మూడవ వంతు మాత్రమే దానిని వినియున్నారు." అతడు చెప్పాడు. "మహ్మద్ను మరణము నుండి లేవనివ్వండి, మరియు ప్రపంచమంతా ఇరవై నాలుగు గంటలలోనే తెలిసిపోతుంది." అతడు నిజము.

53. సహోదరులారా, అది ఎవరి తప్పు? అది ఎవరి తప్పు? ఇప్పుడు, ఒకవేళ మీరు నన్ను క్షమిస్తే... పండితులైన మీరు ... నా మట్టుకు, నేను చదువుకున్న వ్యక్తిని కాను. నేను దీనిని చెప్పవచ్చా? అది మన తప్పే (అది నిజము), ఎందుకనగా క్రీస్తు మనలను ఏమి చేయమని చెప్పియున్నాడో దానికి మనము వ్యతిరేకముగా చేసియున్నాము.

54. ఇప్పుడు, సంఘములను కలిగియుండుట మంచిదే అని మనకు తెలుసు. అది అద్భుతము. సంఘశాఖలను కలిగియుండుట మంచిదే అని మనకు తెలుసు. అవి అద్భుతములు. సెమినరీలను కలిగియుండుట మంచిది. అవి అద్భుతములు. కానీ క్రీస్తు ఎన్నడూ మనలను ఏ సెమినరీలనైనా నిర్మించమని లేక అటువంటి వేదైనా చేయమని చెప్పలేదు. ఆయన చెప్పాడు, సువార్తను ప్రకటించు."

55. మరియు సువార్త అనగా కేవలము మాట మాత్రమే కాదు, కానీ శక్తి ద్వారా మరియు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత, అది మార్కు 16 యొక్క సూచనలను ఉత్పత్తి చేయును. ఆయన చెప్పినప్పుడు, "సర్వలోకమునకు వెళ్ళి; సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ సూచనలు వారిని వెంబడించును." వాక్యము క్రియా రూపముగా మారి మరియు జీవమును ఉత్పత్తి చేసేంతవరకూ అది మృతమే.

56. గోధుమగింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును. మరియు అప్పుడు వాక్యము విశ్వాసమనే హృదయములోనికి తీసుకొని రాబడినప్పుడు, అది బైబిలులోని ప్రతీ వాగ్ధానమును తిరిగి జీవించునట్లు చేయును. అది జీవించవలయును. అది ఒక మొలకెత్తిన వాక్యము, మరియు ఒకవేళ అది
సరైన స్థానములో స్వీకరించబడిన ఎడల అది జీవించవలయును. సరైన పరిస్థితుల క్రింద ప్రతీ విత్తనము తిరిగి జీవించును, ఒకవేళ అది సరైన స్థితి క్రింద ఉంచినప్పుడు.

57. మరియు సహోదరులారా, నా సహోదరుల వలె గొప్ప గౌరవముతోను మరియు మర్యాదతోను నేను మీకు దీనిని చెప్పవచ్చా, మనందరికి తెలిసి బహుశా రాత్రికి ముందు పరలోకములో క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట మనమందరము నిలబడితే ... మరియు చూడండి, నేను దీనిని చెప్పనా: అది ఆ వాతావరణమే ఎల్లప్పుడూ ఆ ఉత్పత్తిని తీసుకొని వచ్చునది, చూడండి.

దానిని ఒక 58. కోడి, కోడి తన పిల్లలను కలిగియుండే అసలైన మార్గము. అది ఆ కోడి గుడ్డును పెట్టి మరియు తన యొక్క దేహముతో దానిని పొదగవలెను. మరియు ఆ కోడి శరీరము యొక్క వెచ్చదనమే ఆ గుడ్డు పొదిగేలా చేస్తుంది. కానీ మీరు పొదిగే యంత్రములో. అదే వాతావరణము మరియు అదే వెచ్చదనము, చూడండి. అదే మాదిరిగా ఆ కోడిని ఉత్పత్తి చేయును. అది మెథడిస్టు క్రింద, లేక బాప్టిస్టు, లేక ప్రెస్బిటేరియన్, అన్నది నేను పట్టించుకోను, వాక్యము యొక్క వాతావరణము ... ఒకవేళ వాక్యము, అదే గుడ్డు, మరియు ఒకవేళ సరైన వాతావరణము ... ఒకవేళ అది ప్రెస్బిటేరియన్లోయైన లేక అది ఎక్కడైనా, అది అవే ఫలితాలను ఉత్పత్తి చేయును. అది తిరిగి జన్మించిన బిడ్డను ఉత్పత్తి చేయును. సహోదరులారా, మీకు తెలుసా అది సరైనది. అది పెంతుకొస్తు క్రిందైనా, సంపూర్ణ సువార్త, లేక అది ఎక్కడైనా, అది దేవుని యొక్క దైవిక వాక్యముపై మనము తీసుకొను వైఖరియై యున్నది.

59. ఇప్పుడు, జాన్ స్టౌల్ గూర్చి మీలో చాలా మంది విన్నారు. అతడు నాకు మంచి స్నేహితుడు. అతడు లోరైన్లోని, ఆల్సాస్లో చెప్పాడు, ఒకసారి ఒక గైడ్ ద్వారా అతడు ఒక తోటలోనికి బయటకు తీసుకొని వెళ్ళబడినప్పుడు, మరియు అతడు క్రీస్తు యొక్క గొప్ప విగ్రహమును చూసెను. మరియు అతడు నిలబడి దానిని విమర్శించియున్నాడని చెప్పాడు అతడు చెప్పాడు. "ఆ శిల్పము యొక్క అర్ధము ఏమిటి?" చెప్పాడు, "అక్కడ చూడుము. ఎందుకు, ఎటువంటి బాధలు లేవు. ఏమి లేదు. అది కేవలము మామూలుగా కనిపించుచున్నది. కేవలము ఒక..."

60. మరియు అతడు తన భార్యకు దానిని విమర్శిస్తున్నప్పుడు, ఆ గైడ్ నడుచుకొని వచ్చి మరియు చెప్పాడు, "శ్రీ సౌల్, బహుశా నీవు ఆ శిల్పము యొక్క పనితనమును విమర్శిస్తున్నావు”.

అతడు చెప్పాడు, “అవును, అది ఎందుకు అతడు అక్కడ వ్రేలాడదీసి
యున్నాడని నేను చూచుట లేదు. అది క్రీస్తు యొక్క ఏ బాధలను చూపించుచున్నట్లుగా అది కనిపించుట లేదు.”

61. అతడు చెప్పాడు, "అయ్యా, నీవు దానివైపు చూచుదానిలో అది ఉన్నది.” అతడు చెప్పాడు, “ఇప్పుడు, ఇక్కడ దానికి ఒక బలిపీఠము ఉన్నది.” చెప్పాడు, "ఇప్పుడు, నీవు ఇక్కడికి రమ్ము, మోకరించుము". మరియు అతడు మోకరించాడు. చెప్పాడు, "ఇప్పుడు పైకి చూడుము." ఓహ్, అతడు చెప్పాడు నీ హృదయము పగిలిపోవును. అతడు పైకి చూసినప్పుడు బాధ యొక్క అనుభూతులు మరియు క్రీస్తువన్నీ అక్కడ ఉన్నవి. అతడు చెప్పాడు. "అయ్యా, మీరు చూడండి. మీరు దానిని చూచు విధానములోనే అది ఉన్నది."

62. సహోదరులారా, మరియు దేవుని యొక్క వాక్యము ద్వారా అది ఆ విధముగానే ఉన్నది. మీరు దానిని చూచు విధానములోనే అది ఉన్నది. ఒకవేళ దానిని గమనించు మరియు విమర్శించుటకు ఒక అంశమును మాట్లాడే స్థానములో నీవు నిలబడిన ఎడల, "ఈ వ్యక్తి దానిని పొందుకోలేదు, మరియు ఆ వ్యక్తి దానిని పొందుకోలేదు", అది పనిచేయదు. అది క్రిందకు దిగి మరియు దానిని చూడవలెను. అది ఫలితములను తీసుకొనివచ్చును. అప్పుడు మీరు విభిన్నమైన వైఖరిని కలిగియుందురు, మరియు నీ సహోదరుల ఎడల ఒక విభిన్నమైన వైఖరి, నీవు ఏదైతే చేయుటకు కష్టపడి ప్రయత్నించుచున్నావో అదే సంగతి కొరకు కష్టపడుచున్న వ్యక్తుల పట్ల ఒక విభిన్నమైన వైఖరిని కలిగియుందువు, చూడుము. అప్పుడు అన్ని అవరోధములను అది పగులగొట్టును.

63. మరియు ఇప్పుడు, నేను మీతో ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు, మరియు నేను మీకు బోరు కొడుతున్నానని నేను అనుకోవట్లేదు, కానీ ప్రభువైన యేసు మరియు ఆయన మంచితనము మరియు దయను గూర్చి కేవలము ఒక చిన్న సాక్ష్యము, కనుక ఈ అద్భుతమైన సువార్త మారలేదు అని మీరు తెలుసుకొనెదరు. సహోదరులారా, క్రీస్తు ఇంకనూ జీవించుచుండెను.

64. మరియు ఈ ఉదయకాలమున ఆ సంగతి కొరకు నమ్మకముగా పోరాడుచున్న వ్యక్తులైన మీరు, ఎందుకు, అది అంతకు ముందెన్నడూ లేనంత వాస్తవముగా ఉన్నది ఈ రోజు ఆయన ... పౌలు ప్రసంగించిన, పేతురు ప్రసంగించిన, ఆ ప్రవక్తలు కలిగియున్న మరియు అటువంటివి అయియున్న అదే దేవుని యొక్క వాక్యమైయున్నది. అది దేవుని యొక్క నిత్యవాక్యము, మరియు అది ఎన్నడూ విఫలమవ్వదు ఎందుకనగా అది దేవుడే.
65. మరియు ఈ ఉదయకాలమున ఎవరో, పుస్తకములో ఆఫ్రికా ప్రచారమును గూర్చి మాట్లాడుచున్నారు. (నేను నమ్ముచున్నాను, సహో, బోయె మరియు చాలా మంది ఇతరులు) ఒక వ్యాసమును గూర్చి ఎవరో చదువుచున్నారు. లేక ఏదో అని నేను నమ్ముచున్నాను. అది చక్రము తిరుగుటను ప్రారంభించినది లేక ఏదో మంచిది, ఏవిధముగానైనా... నేను అనుకొన్నాను. బహుశా జరిగియున్న ఏదో సంగతిని గూర్చిన ఒక చిన్న సాక్ష్యమును నేను మీకిచ్చెదను; మరియు ఒకవేళ మీరు ఆ వ్యాసము చదివి, మరియు ఏమి జరిగినదో తెలుసుకొని, ఇండియాలో జరిగిన ఒక సాక్ష్యమును మీకు ఇచ్చెదనని నేను తలంచాను. బహుశా మీరు మన ప్రభువు యొక్క పనియందు ఆసక్తిని కలిగియుండవచ్చు, ఎందుకనగా మనము ఈ కోతపనిలో కేవలము పనివారై యుండి ఈ ఉదయకాలమున కలసి ఒక సహవాస సమయము కొరకు మరియు ఒక చిన్న విశ్రాంతి కొరకు సమకూడియున్నాము.

66. భారతదేశమునకు వెళ్ళుటకు నేను చాలా బలవంతము చేయబడ్డాను. మరియు ఇంకా, మీలో చాలామందికి తెలిసినట్లుగా, భారతదేశయాత్ర అది పొందతగినంత విజయాన్ని పొందుకొనలేదు, ఎందుకనగా నేను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వెంబడించుటలో విఫలమయ్యాను, ఆయన నన్ను మొదటిగా ఆఫ్రికాకు మరియు తరువాత భారతదేశమునకు వెళ్ళమని దర్శనము ఇచ్చిన తరువాత కానీ ఎన్నడూ దానిని గుర్తించలేకపోయాను.

67. మరియు సహోదరులలో కొంతమంది చెప్పారు, “ఓహ్, కేవలము మనము కలిపి ఆఫ్రికాకు వెళ్ళలేము, కనుక... సహో. రాబర్ట్స్ ఇప్పుడే అక్కడకు వెళ్ళి వచ్చియున్నాడు, కనుక భారతదేశమునకు వెళ్ళు". మరియు నా సహోదరుల యొక్క ప్రభావము క్రింద, బహుశా బాగా చెప్పడం వలన ... కానీ ఎవరు నీపైన ప్రభావమును చూపించియున్నారని కాదు, ఒకవేళ దేవుడు నీకు విభిన్నముగా ఏదైనా చెప్పినట్లయితే... మరియు ఇప్పుడు, వాక్యముతో సరిచూడు, వాక్యముతో, మరియు అప్పుడు వెళ్ళు.

68. మీకు తెలుసా, మనము చేయకూడదు. ప్రవక్తలందరూ కలిసియున్నట్లుగా, మనము ఒకరినొకరు సహాయపడుటకు ఉన్నాము, కానీ ఏమి చేయవలయునో ఎన్నడూ ఒకరికొకరు చెప్పవద్దు. మీలో చాలామంది 2వ రాజలు 13 చదివియున్నారు, సందేహము లేదు. అక్కడ ఎక్కడ సమస్య వచ్చినది. మరియు ఒక సింహము ప్రవక్తను చంపినది ఎందుకనగా అతడు వినియున్నాడు ... ఒక అసలైన నిజప్రవక్త, ఎందుకనగా దేవుడు అతడికి ఆజ్ఞాపించాడు. ఎల్లప్పుడు దేవుడే
మొదటిగా వచ్చును. మరియు అప్పుడు అదే జరుగును ... ఒకవేళ అది దేవుడా కాదా అని నీవు తెలుసుకొనగోరితే, ఎల్లప్పుడూ దానిని వాక్యముతో సరిచూడుము. ఒకవేళ ఖచ్చితముగా అది వాక్యముతో ఉండనట్లయితే, దానిని నమ్మవద్దు, చూడుము.

69. సహోదరులారా, మనము ఒక భయంకరమైన కాలములో జీవించు చున్నాము, ఎన్నే, ఎంబ్రేలు మోషేను వ్యతిరేకించినది, చూడండి. ఇప్పుడు అది ముందుగా ఊహించబడినది. సహోదరులారా, మనము దానిని ఆపలేము. మరియు మన అమెరికన్ ప్రజలు, ఎక్కువగా టి.వి. హాస్యములయందు, మరియు ఆశ్చర్యములందు, మరియు మన హలీవుడ్ సువార్త మాదిరిలుగా, మరియు ఎక్కువ వినోదముతో పాత పద్ధతిలో, బలపరుస్తూ, పూత పూసిన ప్రసంగము, మీకు తెలుసు. నాకు ఈ రంగు ఇష్టము లేదు మరియు అవన్నీ... అమెరికన్లను శాంతింపజేయుటకు మిగతా ఇతర దేశములలో కూడా, మిషనరీలైన మీకు తెలుసు, వారు నాకు అక్కడ చెప్పారు, “అమెరికాలో ఏ మంచి స్త్రీ అయినా ఉన్నదా? మీ పాటలన్నీ మీ స్త్రీలను గూర్చి చాలా అసభ్యకరముగా ఉన్నవి". మరియు మన సంగతులన్నీ, అవి ... నేను ఏ పేర్లను పిలుచుట లేదు (వీరు సహోదరులు), ఆర్ధర్ గాడ్ వంటివారు, మరియు ఎల్విస్స్లీ, మరియు వారి బుద్ధిహీనతంతా అది ఉత్పత్తి చేసినది మరియు బయటకు వచ్చినది. అమెరికన్ ప్రజల యొక్క మనుసులన్నీ అటువంటి వాటితో కలుషితమైపోయినవి, మరియు అప్పుడు అది ఇంకా పరిచర్యలోనికి కూడా వచ్చి మరియు వారు బలిపీఠమును అలంకరించుటకు ప్రయత్నించుచున్నారు. ఖచ్చితమగా కయీను చేసియున్నదానిని మీరు గ్రహించియున్నారా? అది ఎక్కడ నుండి వచ్చినదో మీకు తెలుసా? కయీను. హేబేలు కలిగియున్నటువంటి అదే బలిపీఠమును అతడు కలిగియున్నాడు. హేబేలు చేసినట్లుగానే అతడు ఆరాధించియున్నాడు, కానీ దానిని అతడు అలంకరించాడు.

సాతాను ఏమి చేసినదో గమనించండి; పరలోకములో ఉన్న లూసీఫర్ మంచిదైన మరియు మరింత అందమైన రాజ్యమును కోరుకున్నాడు, మీరు చూశారా? అది ఎల్లప్పుడు ఆ విధముగానే ఉండును.

70. మీరు గమనించారా ఆపర్వతముపైన మోయాబు మరియు ఇశ్రాయేలు, పరిశుద్ధ బండరాయి, ఆ లోయలో క్రింద? చూడండి, ఏ విధముగా వారిద్దరూ ఏడు బలిపీఠములు, ఏడు బలియర్పణలు కలిగియున్నారో, వారిరువురూ ఏడు ఎడ్లతో, మరియు వారిరువురూ ఏడు పొట్టేళ్ళతో, క్రీస్తు యొక్క రాకడను గూర్చి మాట్లాడుతూ ... సూత్రప్రకారముగా, మోయాబువారు, ఇశ్రాయేలు వారు
ఇక్కడున్నట్లుగా, వారు సరైనవారే. కానీ, సహోదరులారా, ఇక్కడ విశ్వాసులను వెంబడించుచున్న సూచనలు మరియు అద్భుతములను చూచుటలో బిలాము విఫలమయ్యెను, మీరు చూడండి. శిబిరములో దేవుడు ఉన్నాడు. వారు ఒక కొట్టబడిన బండను, ఒక ఇత్తడి సర్పాన్ని, ఒక అగ్ని స్తంభాన్నీ కలిగియున్నారు. ఆ సహజాతీతమైనది వారితో ఉన్నది, మరియు అంతయూ అలానే ఉన్నది; మరియు ఎన్నే మరియు ఎంబ్రేలు మోషేను వ్యతిరేకించినట్లుగా, చివరిదినములలో ఆవిధముగానే ఉండునని ముందుగా చెప్పబడినది. మనము దానిని కలిగియుండవలసినదే.

71. కానీ ఈ ఉదయకాలమున మీ గూర్చి నేను మంచి ఆశలు కలిగియున్నాను సహోదరులారా, అది దేవుని యొక్క వాక్యముతో నిలిచే దేవుని యొక్క పురుషులుగా మీరు ఉండెదరు. మరియు ప్రతీదీ కుడి నుండి ఎడమకు పడిపోనివ్వండి, కానీ ఆ వాక్యముతోనే సరిగా నిలిచియుండండి. కదలవద్దు. ఒకవేళ నీవు అక్కడ ఒక ద్వారము దగ్గర తివాచీ అయినా, ఒక మంచి తివాచీ వలె ఉండు. ఎవరితోనో పోటీపడాలని చూడవద్దు లేక ఇది చేస్తూ. కేవలము వాక్యములో సరిగా ఉండి, మరియు అక్కడే సరిగా నిలిచియుండుము, మరియు దేవుడు నిన్ను తన యొక్క రాజ్యములో ఒక స్థానములో ఉంచుతాడు, అక్కడ నీవు శ్రేష్టుడుగా ఉంటావు.

72. ఒకవేళ నా వ్రేలు ఒక భావమును తీసుకొన్న ఎడల ఏమి, ఎందుకనగా అది ఒక కన్ను కాదు, అది ఒక ఎన్నటికీ వ్రేలుగా ఉండలేదు? నేను ఆ వ్రేలును పోగొట్టుకొనుటను ద్వేషిస్తాను. బహుశా నా కన్ను చాలా విలువైనదిగా ఉండవచ్చు, కానీ నేను ఆ వ్రేలును ప్రేమిస్తాను. అది నాలో భాగము. నేనేమి చెప్పుచున్నానో మీకు అర్ధమైనదా? ఖచ్చితముగా మీకు అర్ధమైనది. కనుక అది ఏ కార్యాలయమైనా, అది ఏమైనప్పటికీ, నీవు ఏమైయున్నప్పటికీ. దేవుడు ఏ స్థానములో అయితే నిన్ను ఉంచాడో, అక్కడే నిలిచియుండి మరియు ఏ విధముగా ఉండాలో నీవు ఎరిగియున్నట్లుగా వాక్యమునకు అంత విధేయునిగా ఉండుము. దేవుడు దానిని దీవించును. ఒకవేళ మరిదేని గూర్చి అయిననూ ఆయన నిర్ణయము తీసుకొంటే, ఆయన ఎక్కడ కోరితే అక్కడ ఆయన నిన్ను ఉంచును.

73. కానీ నేను భయపడతాను అది చాలాసార్లు మన కదలికలలో మన ... మన సహోదరులలో చాలా మంది, ఇశ్రాయేలుతో పాటు ఒక మిశ్రమ జనాంగము వెళ్ళినప్పుడు వారు ఎంతో మానవీయతను కలిగి ఉన్నారు. ఎందుకు,
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వెళ్ళినప్పుడు, అక్కడ ఒక మిశ్రిత జనాంగమున్నది, మరియు వారు వెళ్ళిరి... ఆ ప్రక్రియ ముగించబడినది, మరియు అది ... అది ఒక మానవీయ కోణము. మరియు ఒకవేళ మనము కేవలము ఆ మానవ అంశము నుండి దూరమగుతే చాలును,

74. మరియు ఈ ఉదయకాలమున అదే, నాకు అల్పాహారము, మీ వలె ఇక్కడ కూర్చొని ... బహుశా, డా.వైల్ అల్పాహారము కొరకు తను తీసుకొని రాగలిగిన వారందరినీ ఆహ్వానించాడు. కానీ ఎందుకనగా ప్రభువు సహజాతీతమైన దానిలో కదులును కాబట్టి, ఓహ్, అది భయానకము, "చూడుము, దానితో నేను చేయగలిగినది ఏదియూ లేదు. అటువంటి వారితో సంబంధము కలిగియుండుటకు నన్ను నేను హీనపరచుకోను." మీకు తెలుసా అదే పరిసయ్యలు యొక్క వైఖరి? వారు చేసినది అదే అని మీరు గ్రహించారా?

75. మీకు తెలుసా, దేవుడు తన ఆత్మను ఎన్నడూ తీసుకోడు? ఆయన తన వ్యక్తులను తీసుకొనును, కానీ తన ఆత్మను కాదు. ఆయన ఆత్మ వచ్చును... ఆత్మ ఏలియాపై ఉండెను, ఎలీషా పైకి వచ్చెను, బాప్తీస్మమిచ్చు యోహాను పైకి వచ్చెను, మరియు మొదలగు వారిపై మరియు వాటన్నిటి యొక్క నెరవేర్పు క్రీస్తులో ఉన్నది. ఆయన కొలత లేని ఆత్మను కలిగియుండెను, మరియు అది తెలుసా, దెయ్యము తన వ్యక్తిని తీసుకొనును, కానీ అతడి ఆత్మను కాదు? అతడి బోధకుడు? అతడి తత్వవేత్త? ఆవిధముగా క్రిందకు వచ్చుచున్నది, కయీను యొద్ద నుండి బైబిలు అంతటి గుండా, ఆవిధముగా క్రిందకు, తిరుగుతూ. మరియు మీకు

76. కానీ సహోదరులారా, దానిని అనుసరించి, ఎన్నిసార్లు నేను ఆ స్థలములకు వెళ్ళి కూడికలు పెట్టినప్పుడు ప్రశ్నించాను, ఎక్కడైతే ఆ వ్యక్తులను నేను తలస్తున్నానో, సాధారణముగా ఒక బైబిలు విద్యకు సంబంధించిన పండితుడు, దేవుని యొక్క వాక్యముపై ఖచ్చితముగా నిలబడేవాడు, మరియు చూడండి ఆ అద్భుతములనేవి అన్ని రకముల సంగతులలోనూ వచ్చేశాయి... బైబిలు చెప్పినట్లుగా మరియు తమ నొసటియందు మచ్చలు కలిగిన ప్రజలు, మరియు వారి ముఖములపై రక్తము, మరియు వారి చేతులలో నుండి అన్ని రకముల నూనెలు కారుతూ, మరియు అన్ని రకముల అద్భుతములు. మరియు వారు ఆ విధముగా వచ్చెదరు, మరియు మీకు తెలుసా, ప్రజలు దాని కొరకు పోగుపడెదరు? మరియు నేను అనుకొన్నాను, “ఓ, దేవా, మరియు కలుషితము కాని సువార్త ప్రసంగించబడుతుంటే మరియు కేవలము కొద్దిమందే వినెదరు”.
77. కానీ ఆయన నాకు చెప్పెను, "అది నీకు ఏమి? నీవు నన్ను వెంబడించుము", చూడండి. అది సరే. ఈ సంగతులు జరగవలయును, చూడుము. కనుక అప్పుడు, మనము ఆ దినమునే జీవించుచున్నాము.

78. సహోదరులారా, మన కళ్ళను కల్వరిపై ఉంచుదాము. మన హృదయములను వాక్యముతో ఒక్కటిగా ఉంచుదాము. వాక్యమును ప్రసంగించుము; సమయమందును, అసమయమందును. ఆ మార్పు చెందని వాక్యమును పట్టుకొనియుండుము మరియు నిలిచియుండుము.

79. మేము భారతదేశములో అడుగుపెట్టినప్పుడు, చాలా ఇబ్బందుల క్రింద, మెథడిస్టు సంఘము యొక్క బిషప్ నాయొద్దకు కలవడానికి వచ్చాడు, మరియు చాలా మంది. మరియు వారు నాకు చెప్పారు నా ప్రయత్నమంతా తప్పు అని, లోపలికి వచ్చి, ఒక తప్పుడు గుంపు వారు నాకు స్పాన్సర్ చేశారని మరియు అటువంటివి, మరియు నా యొక్క స్పాన్సర్షిప్ను వారి నుండి ఈ ఇతర గుంపునకు మార్చేయమని నన్ను కోరారు. మరియు నేను చెప్పాను, "సహోదరులారా, గౌరవప్రదమైన వ్యక్తిగా, నేను నా మాటను నిలబెట్టుకోవాలి". అది సరియే. చాలాసార్లు అనేకమైన స్థలములలో నా గూర్చి చెడ్డగా ప్రచారము చేయబడినది, కానీ సహోదరులారా, అది జరుగుటకు గల కారణము ఏదనగా నాకు నేనుగా ఏ పత్రికను కలిగిలేను. నాకు ఒక టెలివిజన్ కార్యక్రమము లేదు. నాకు అదిగాని మరియు ఇదిగాని లేదు. నాకుగా ఎక్కడికైనా ఒక చిన్న సంఘమునకు నేను వచ్చుటకు, లేక ఒక పెద్ద సంఘము, లేక ప్రభువు నన్ను ఎక్కడికైతే నడిపించునో అక్కడకు వెళ్ళుటకు నేను ప్రయత్నించుచున్నాను.

80. ఇప్పుడు, గతదినమున ఎవరో చెప్పారు.... నేను మీకు చెప్పానో లేదో నాకు తెలియదు. నేను మాట్లాడుచున్న ఒక స్థలములో ఒక వ్యక్తి చెప్పాడు. “ఇప్పుడు, సహోదరుడు రాబర్ట్స్ ని రమ్మని మేము అడిగాము”.

అతడు చెప్పాడు, “నీవు చాలా చిన్నవాడివి". వేరొక సహోదరుడిని రమ్మని అడుగుము. “నీవు చాలా చిన్నవాడవు".

మరియు వేరొక సహోదరుడు, “నీవు చాలా చిన్నవాడవు". ఎందుకనగా వారు కేవలము ఒక చిన్న సంఘము. మరియు చెప్పాడు, "కానీ సహోదరుడు బ్రన్హాంను రానివ్వు".

81. నేను గదిలో ఉండగా మరియు దానిని విన్నాను. కనుక నేను బయటకు నడిచాను. మరియు నేను చెప్పాను. "వినండి, సహోదరులారా, దానిని చెప్పుట
యందు సహోదరుడు చాలా మంచివాడు, కానీ సహోదరుడు రాబర్ట్స్ రాకపోవుటకు గల కారణము, అతడు రాకూడదని కాదు, కానీ ఎందుకనగా ఒక బాధ్యత క్రింద ఉన్న ఒక మనుష్యుడు, సహోదరుడు రాబర్ట్స్ కలిగియున్న ...”

82. ఇప్పుడు, దేవుడు ఎరిగియున్నాడు ఒక కార్యక్రమమును ఏ విధముగా కలిపి ఏర్పాటు చేయాలనే దానిని సహో. రాబర్ట్స్ ఎరిగియుండవలసినట్లుగా ఆ జ్ఞానము నాకు లేదు, కానీ అతడు టెలివిజను యందు ఉంటే ఆ వ్యక్తి ఏమి కలిగి యుండవలసియున్నదో చూడండి. ఒకవేళ అతడు రేడియో నందు ఉండవలసియుంటే అతడు ఏమి కలిగియుండవలసినదో చూడండి. ఆ వ్యక్తి కలిగియున్న బాధ్యతను చూడండి. మరియు ఎందుకనగా అతడు చాలా ధనము కలిగియుండవలసియున్నది, దాని కొరకు ఆ వ్యక్తిని నిందించవద్దు. ఆ దొంగ వ్యాపారము చేయువారు దానిని తీసుకొని, మరియు దానితో వారేమి చేసెదరు, మరియు ఇతరమైన సంగతులు జరుగును, ఆ వ్యక్తి సహాయము చేయును. అతడొక దేవుని సేవకుడు, మరియు నేను చేయలేని విధముగా అతడు సువార్తను వ్యాప్తి చేయుటలో అతడు తన శాయశక్తులా ప్రయత్నించుచున్నాడు. ప్రతీ ఒక్కరూ ఒక పరిచర్యను కలిగియున్నారు, చూడుము. ప్రతీ ఒక్కరూ తన పరిచర్యను కలిగియున్నారు.

83. నేను చెప్పాను, "మరియు సహో. రాబర్ట్స్ మరియు ఈ ఇతర సహోదరులు రావడానికి ఆనందించెదరు, కానీ వారు రాలేరు ఎందుకనగా...” కానీ నేను చెప్పాను, "నాకు నేనుగా? నాకు ఎక్కువగా తెలియదని దేవుడికి తెలుసు. కనుక నేను ఎక్కడ చిన్నవానిగా ఉండగలనో ఆయన నన్ను అక్కడికి పంపించెను మరియు ఏ ధనమును కలిగియుండకుండా, మరియు ఆ విధముగా నేను కొనసాగెదను. అప్పుడు ఒకవేళ ఆయన నన్ను అక్కడికి పంపగోరిన ఎడల, ఆయనే ఎవరో నన్ను వెనుక నుండి బలపరిచేలా చేసి మరియు నన్ను పంపును. కనుక ఒకవేళ ఆయన నన్ను పంపగోరితే, నేను వెళ్ళగలను, ఎందుకనగా ఆ ఒక్కసారికి నాకు స్పాన్సర్ చేయమని ఆయన ఎవరి హృదయముపైనో దానిని పెట్టును. కనుక దానిని అది ముగించును, మీరు చూడండి.

కనుక అప్పుడు, ఇక్కడ, మేము ఆ స్థలమునకు వెళ్ళినప్పుడు, వారు చెప్పారు, "నీ స్పాన్సర్షిప్ను విడిచిపెట్టుము.”

మరియు నేను చెప్పాను, "లేదు. గౌరవప్రదమైన వ్యక్తిగా, నేను నా మాట నిలబెట్టుకొనవలెను.”

"మంచిది,” వారు చెప్పారు, "నీవు భారతదేశములో చాలా హాని చేయబోతున్నావు”.
నేను చెప్పాను, "కానీ చూడండి ..."

చెప్పారు, “వెనుకకు తిరిగి వెళ్ళిపో", మరియు వారు నాకు చెప్పనారంభించెను, ఓహ్, ఏ విధముగా అది అడ్డుబండను తీసుకొని వచ్చును మరియు ఆ విధముగా.

84. కానీ నేను చెప్పాను, “చూడుము, బట్టలుతికే స్త్రీలు, ఉతికెడి రాళ్ళపై ఉతికేవారు నన్ను ఇక్కడకు పంపియున్నారు. కర్మాగారాలలో పనిచేస్తూ ఉన్న పురుషులు తమ గ్రీజు పట్టిన మురికి చేతులను తమ జేబులలో ఉంచి మరియు నన్ను ఇక్కడకు పంపుటకు ఒక డాలర్ను తీసియున్నారు. మరియు చిన్నపిల్లలను కలిగిన తండ్రులు, బహుశా బూట్లు అవసరమైనవారు, ఆ డాలరు తీసుకుంటే ఆ బిడ్డ కొరకు బూటు కొనుక్కొనవచ్చు మరియు నన్ను ఇక్కడకు పంపియున్నారు. నేను చెప్పాను, "గౌరవనీయులైనవారలారా, నా క్రైస్తవ హృదయములో, ఈ ప్రజల కొరకు సువార్తను ప్రకటించుటకు పంపబడియున్న ఆ ధనమును నేను దుర్వినియోగపరిచానని నేను ఎరిగితే వారి యొక్క ముఖములోనికి నేను తిరిగి చూడలేను. నేను చెప్పాను, “ఒకవేళ మీ యొక్క కొన్ని రాజకీయములు మరియు అటువంటి వాటిలో ఒకవేళ నేను కలిసిపోతే మీరు నన్ను క్షమించండి. అది నాకు తెలియదు. అది మేనేజరు పని. దానితో నేను చేయుటకు ఏమీ లేదు. నేను కేవలము వచ్చాను.” నేను చెప్పాను, "కానీ నేను సువార్తను బోధించుటకు వచ్చాను మరియు అవసరతలో ఉన్నవారికి సహాయము చేయుటకు.” నేను చెప్పాను, “పేదవారికి వ్యక్తిగతముగా నేను ఇవ్వగలుగుటకు నా జేబులో కొంత ధనమును నేను కలిగియున్నాను 'ఎందుకనగా పేదప్రజలకు వ్యక్తిగతముగా ఇచ్చుటకు ప్రజలు దానిని నాకు ఇచ్చియున్నారు, మరియు నేను దానిని ఖచ్చితముగా చేయాలి.”

85. నేను ఆ విధముగా వీధిలోనికి వెళ్ళినప్పుడు నేను ఎన్నడూ దానిని మరచిపోను, మరియు డాలర్లను రూపాయలలోనికి మార్చి, మరియు వీధిలో ప్రారంభించాను, నన్ను పట్టుకొనుటకు దాదాపుగా పోలీస్ వారు వచ్చియున్నారు. అది ఒక ... ఓహ్, మై. మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ పేదవారిని చూసేంతవరకూ ఆ సంగతులు ఏవిధముగా కనిపించుచున్నవని మీరు ఎన్నటికీ తెలుసుకొనలేరు మరియు ... కానీ ఇక్కడ చేసినది ఇది. ఆలోచన ఇదిగో.

86. మరియు సేవకులారా, దీనిని వినండి. మనము ఒక చిత్రమును గీద్దాము. ఇక్కడొక ముసలివాడు తన నడుముకు బట్ట కట్టుకొని అక్కడ కూర్చొన్నాడు, ఒక చిన్న పాత్ర, ఒక చిన్న మడుగులో నీళ్ళు. త్రాగుటకు దానిలో నుండి నీళ్ళను తీసుకొనుచున్నాడు, మరియు అతడి భార్యకు ఒకవేళ గిన్నెలు కడుగుటకు, లేక
ఏదైనా. లేక వందుటకు కావలెనన్న వాటిని ఇంటికి మోసుకొనుపోవుచున్నది. మరియు అతడు పెంచుతున్న కొని మొక్క కాడలను ఆహారము కొరకు అతడు కలిగియున్నాడు. మరియు మేము అతడికి చెప్పాము మేము సహోదరులమని, అతడి చర్మము నలుపుగా ఉన్నది, మరియు వచ్చినది తెలుపువారు. మరియు వచ్చి పడవలాంటిదైనా ఒక గొప్ప పెద్ద బంగారపు గీతలు కలిగియున్న కాడిలాక్ నుండి దిగి మరియు వీధిలోనికి వచ్చినప్పుడు, మరియు ఆ ముష్టివాడైన సహోదరుడు వీధిలో ఉండి మరియు ఒక నాణెమును అడుగుచున్నాడు (నేను నా సొంత కళ్ళతో చూశాను:

ఏవిధముగా అమెరికన్ ప్రజలు తమ వెనుకను త్రిప్పుతున్నారో.

87. ఒకరోజు నేను చూసినదేదో నన్ను ఆశ్చర్యచకితుడను చేసినది. ఒక పెద్ద పాదమును కలిగిన ఒక చిన్న బాలుడు, దాదాపుగా అంత పెద్దది, తన యొక్క చిన్న అవిటి కాలును ఈడ్చుకొనుచున్నాడు. కుష్టువ్యాధి ద్వారా మోచేతులు లేని ఒక వ్యక్తి. నేను అనుకొన్నాను, “బిల్లీ", నా కుమారునితో చెప్పాను, “ఏవిధముగా ఆ పేదవాడు దాని నుండి పైకి లేచును, మరియు వారు అరుస్తూ, తల్లులు తమ చిన్న పిల్లలతో, మరియు ఆకలితో చనిపోవుటకు సిద్ధముగా ఉన్న ఆ చిన్న వాచిన కడుపులు. ఆమె ఏదైన చేయును, ఆమె చనిపోవుటను కూడా పట్టించుకొనదు, కానీ, ఓహ్, ఆ బిడ్డను పోషించును. అక్కడ నలభై ఏడు కోట్ల మంది ఉన్నారు. మరియు దాదాపు నలభై కోట్ల మంది ముష్టివారు. మరియు ఈరోజు ఇక్కడ మనము, దుస్తులు ధరించి... దేవుని యొక్క సేవకులు ఇక్కడ కూర్చొని మరియు మన సంఘశాఖలోని చిన్న భేదాభిప్రాయములను గూర్చి సణుగుతూ మరియు వాదించుకొనుచున్నాము, మరియు ఒక్కసారి కూడా సువార్తను వినక కోట్ల మంది ప్రజలు అక్కడ ప్రతీరోజూ చనిపోవుచూ ఉన్నారు.

88. గత రాత్రి నేను నా ఫిల్మ్లను ప్రదర్శించి మరియు ఆ పేద చిన్న ఆఫ్రికా బాలురను అక్కడ చూసినప్పుడు, వారి యొక్క జీవితములో వారు ఎన్నడూ ఒక్కసారైనా కడుపు నిండా భోజనము చెయ్యలేదు, మరియు గజ్జితో దిగంబరముగా ఉన్న వారి చేతులు, మరియు అన్నిరకములైన పరిస్థితులు, వారి చేతులను పైకెత్తి వారిని విడిచి వెళ్ళే ముందు మరియొక్కసారి యేసును గూర్చి వారికి చెప్పమని నన్ను కోరుచున్నారు... మనము ఇటువైపు ఉండాలో లేక అటువైపో అని మనము వాదించుకొనుటను గూర్చి ఇప్పుడు ఆలోచించండి, లేక మనము ప్రెస్బిటేరియన్ వారమా లేక బాప్టిస్టు. ఓహ్, దేవుని యొక్క మనుష్యులారా, మనకు సిగ్గు కలుగునుగాక.
ఏవిధముగా మనము వేరై మరియు ఆలోచనలు మరియు విడిపోయి, మరియు అటువంటివి కొనసాగుతూ, మరియు యేసు మరణించెను. ఆ చిన్నబాలుడు కూడా. నా యొక్క పిల్లలు మరియు మీ యొక్క పిల్లలు కలిగియున్నట్లుగా మంచి దుస్తులు ధరించి మరియు మంచి ఆహారము తినే హక్కును కలిగియున్నాడు. అతడు దేవుని యొక్క ఒక ఉత్పత్తి, దేవుడు సృజించినవాడు, మరియు అతడొక దేవుని సృష్టి

89. మన యొక్క గొప్ప అందమైన ఆలయములు, మరియు లక్షల డాలర్లతో సంఘములు నిర్మించుట, మరియు వాటిలో వేల డాలర్ల వాయిద్యాలు పెడుతూ, మరియు ఆ సువార్తను తీసుకొని పొలములోనికి వెళ్ళుటకు మిషనెరీ ధనము కొరకు అడుక్కొనుట మనకు సరైనది కాదు, మరియు ప్రభువు త్వరగా వచ్చుచున్నాడని ప్రసంగిస్తూ... సహోదరులారా, ఏదో తప్పున్నది. మీకు తెలుసు అది నిజము.

90. మరియు ఇక్కడ చూడండి. గౌరవమర్యాదలతో నేను మీకు ఒకటి చెప్పుటకు ఇష్టపడుచున్నాను. అది ఏమైనా... ఒకవేళ మీరు గమనించని ఎడల భారతదేశము అతి త్వరలో కమ్యునిజముగా మారిపోబోతున్నది. అలా ఎందుకు? ఎందుకనగా మిషనెరీ వెళ్ళుటకు మనము పెన్నీ మార్చ్ (డబ్బులు పోగుచేయు పాదయాత్ర)ను పెట్టియున్నాము, మరియు మన డబ్బును అధికారులకు మరియు అటువంటి వారికి ఇచ్చుచున్నాము, మరియు ఈ దేశములో ఆటలు అటువంటివాటికి. మరియు మనము త్రాచులో తూయబడి మరియు దొరుకుట కొరకు కనుగొనబడ్డాము.

91. ఆ వ్యక్తి అక్కడ కూర్చొని మరియు చేతులు కట్టుకొనియున్నాడు, మరియు ఈ వ్యక్తి వచ్చి మరియు అతడిని ఆపి మరియు నడుచుచున్నాడు... మరియు ఇంకనూ ఆ మిషనెరీ అతడు మా సహోదరుడే అని అతడికి చెప్ప ప్రయత్నించుచున్నాడు. మరియు అతడి యొక్క రంగును బట్టి ఒక సహోదరుడితో ఆవిధముగా వ్యవహరించవచ్చా? అతడి యొక్క జాతీయతను బట్టి? ఓహ్, సహోదరుడా. అదే గర్వపు ఆత్మ సంఘశాఖలలోనికి వెళ్ళి మరియు క్రైస్తవ సహోదరత్వమును అదేవిధముగా తిరస్కరించుటను నీవు చూడలేవా.

92. మనము దేవుని యొక్క ఉత్పత్తులము, మనలో అందరూ, మరియు మనము సహోదరులుగా ఉండాలి, సువార్త ద్వారా దగ్గరకు జత చేయబడ్డాము. మన ఉద్దేశ్యములలో, మరియు మన ఆలోచనలలో, మరియు అన్నీ, సువార్తను ముందుకు కొనసాగించుటకు మరియు సహాయము కొరకు మనము దేవునికి ఇవ్వవలెను, మరియు సహోదరత్వమును దగ్గరకు తీసుకొని వచ్చుట మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ.
93. ఆ మధ్యాహ్నము బొంబాయి యొక్క మేయరు... వారు కొన్ని లక్షల మంది సమకూడియున్నారని వారు అంచనా వేశారు. నేను ఒక వేషధారి వలె అనుభూతి చెందాను, ఒకవేళ కనీసము కొద్దిసార్లైనా వారికి ప్రసంగించకుండా నేను గృహమునకు వస్తే ... కనుక వారు నాకు చెప్పారు. ఏదో చేసియున్న ఒక స్త్రీ అక్కడ నా ముందు నిలిచియున్నది, మరియు కొద్దిమందిని కలిగి... ఆ తోపులాటలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరియు కనుక వారు కూడికలను పట్టణమునకు బయట పెట్టుటకు అనుమతివ్వలేదు. అది ఆ పట్టణము శాసనమునకు వ్యతిరేకము, నేను వెళ్ళి ఢిల్లీలో దిగేంతవరకూ, న్యూఢిల్లీ, మరియు దేవుని చిత్తమైతే ఈ సంవత్సరము నేను అక్కడికి వెళ్ళుచున్నాను, అక్కడ వారొక ఆంఫీధియోటర్ు కలిగియున్నారు, దానిలో వారు పది లక్షల మంది ప్రజలను పెట్టగలరు. కనుక వారు అంచనా వేశారు దాదాపుగా అయిదు లక్షల మంది ఇక్కడ బొంబాయి కూడికలో ఉన్నారు. ఓహ్, వారందరూ ప్రతీ చోట నుండి వచ్చారు. ఆఫ్రికా మరియు ఆచోట్ల రోడ్లపై చల్లబడినట్లుగా.

94. సహోదరుడా, పీనుగు ఎక్కడ ఉండునో, పక్షిరాజులు అక్కడ పోగవును, యేసు చెప్పెను, "మీరు లోకానికి ఉప్పెయున్నారు. కానీ ఆ ఉప్పు తన సారమును కోల్పోతే (ఇంకా, 'నేనొక ప్రెస్బిటేరియన్; అది స్థిరపడును. లేక, 'నేనొక పెంతుకోస్తువాడను మరియు అది దానిని స్థిరపరచును.") ... అప్పుడు అది తన సారమును కోల్పోవును," చూడుము. ఉప్పు దాహమును కలిగించును. మరియు దాహము మాత్రమే ... ఉప్పు తాకబడినప్పుడు మాత్రమే సారము నివ్వగలదు. మీరు ఉప్పగా ఉండుడి. ఒకవేళ మీరు ఉప్పగా ఉంటే, దేవుడు ఈ లోకమును దాహముగొనునట్లు చేయును. అది నిజము.

95. మరియు ఆ కూడికలలో వారు వచ్చినప్పుడు, జైనుల యొక్క ఆలయములో సమకూడుటకు ముందు ఆ మధ్యాహ్నము వారు నన్ను అడిగారు ఒకవేళ క్రైస్తవ మతమునకు ప్రాతినిథ్యము వహించుటకు నేను వచ్చాను అని. మిషనెరీలైన మీరు కొంతమంది, నేను దానిని సరిగా ఉచ్ఛరించకపోవచ్చు. ఏ విధముగా అది పలుకునని నేను మర్చిపోయాను, J-e-i-n, రెండు "n" లేక ఏదో అటువంటిది. జాన్స్ లేక జెన్స్, అది ఒక మతము. మరియు ఆ మధ్యాహ్నము, చాలా వేర్వేరు మతముల వారు అక్కడ సమకూడారు, ఎందుకనగా నేను వచ్చుచున్నానని వారికి తెలుసు. మరియు అక్కడ వారు తమ బూట్లను తీసివేసి మరియు ఈ అన్యుల ఆలయములోనికి నడిచారు. మరియు నేను అక్కడికి
నడిచినప్పుడు, మరియు వారు తలగడలపై కూర్చొన్నారు, మరియు వారి పోపు అక్కడ కూర్చొన్నాడు ... లేక, వారి యొక్క పెద్దమనిషి, అతడి కాళ్ళు పైన చాపుకొని, మరియు ఆ సన్యాసులు అక్కడ వారి యొక్క బయటకు వచ్చిన పెద్ద మీసములతో మరియు వారి యొక్క శిరస్సులపై నుండి వెంట్రుకలను లాగుకొనుచూ ఉన్నారు. చిన్న తుడిచెడి కర్రలను వారు చేస్తున్నారు. ఎందుకనగా వారు వీధులను తుడుస్తారు. ఒక చిన్న చీమపై గాని, లేక ఒక చిన్న పురుగుపై గాని అడుగు వేసెదరేమోనని వారు భయపడెదరు, మరియు అది బహుశా వారి తండ్రి లేక తల్లి కావచ్చు, లేక వారి అంటీ లేదా అంకుల్ అయినా, మరియు పునర్జన్మ, వారు నమ్మెదరు. మరియు నేను ఆ స్థలమంతా చూచాను, మరియు వారి యొక్క వేర్వేరు మతములను సూచించు వేర్వేరు ప్రత్యేకమైన దుస్తులను నేను చూచాను. మరియు నేను అనుకొన్నాను. "ఓహ్, యేసు. ఒకవేళ నీవు ఇక్కడ నడిచినట్లయితే నీవు ఏమి చేసెదవు?" చూడుము.

96. వారు పురుషులు. వారు మనవలె తినెదరు. వారు మనవలె భార్యలను కలిగియున్నారు. వారు మనవంటి రక్తమును కలిగియున్నారు. వారు రక్తమార్పిడి ద్వారా మన జీవితాన్ని రక్షించగలరు, క్రీస్తు తన యొక్క రక్తము మార్పు చేయుట ద్వారా మనందరి జీవితాలను కాపాడినట్లుగా, వారు పిల్లలను కలిగియున్నారు. వారు దేవుని యొక్క ఉత్పత్తులు. వారు కేవలము... అబద్దపు బోధ ద్వారా వారందరూ కలగలుపు చేయబడ్డారు, ఎందుకనగా మనము సువార్త ద్వారా విఫలమయ్యాము, చూడుము. ఇప్పుడు, ఒకవేళ మనము వెళ్ళి కరపత్రికలు పంచితే... కరపత్రికలు అద్భుతము. నేను దాని యందు వ్యతిరేకిని కాను, మరియు నేను వాటితో ఉందును, కానీ క్రీస్తు చెప్పినది అది కాదు. ఒకవేళ నీవు వెళ్ళి వేదాంతవిద్యను నేర్పితే, అది అద్భుతము, దానియందు ఎటువంటి వ్యతిరేకత లేదు. మనము చేయవలసినది అదే. కానీ అన్యుడి కొరకు మనము దానికన్నా ఎక్కువ దానిని కలిగియుండవలసియున్నది. దానికన్నా ఎక్కువైన దానిని తీసుకొని వెళ్ళవలెను. సంవత్సరముల తరుబడి అక్కడకు మనము మిషనెరీలను పంపియున్నాము. అది నిజము. మరియు మనమేమి పొందుకొన్నాము? లెక్కించుటకు ఏమీ లేదు.

97. ఈ మధ్య ఇక్కడ కీవాణీల దగ్గర మాట్లాడుతూ, డాక్టర్ డేవిస్, ఒక చిన్న ప్రసంగీకునిగా, ఆ మిషనెరీ బాప్టిస్టు సంఘము నందు నాపై చేతులుంచి నన్ను అభిషేకించినవాడు... మరియు ఆ రాత్రి నేను ప్రభువు యొక్క దర్శనమును చూచినప్పుడు ఆయన నాకు వర్తమానమును గూర్చి చెప్పెను, మరియు నేను వెళ్ళి
డాక్టర్. డేవిస్ గారితో చెప్పాను, అతడు చెప్పాడు. "లోకమంతా సువార్తను ప్రకటించు, ఒక పాఠశాల వ్యాకరణ విద్యతో. బిల్లీ, నీవు దానిని నమ్ముచున్నావా.”

నేను చెప్పాను,"నా హృదయమంతటితో, డాక్టర్.డేవిస్.”

అతడు చెప్పాడు, "బిల్లీ, కుమారుడా, నీకు విశ్రాంతి కావాలి.” చెప్పాడు, "బహుశా నీవు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో మంచిది."

98. నేను చెప్పాను, “డాక్టర్. డేవిస్, నేను దానిని అభినందించను." నేను చెప్పాను, "నేను బాప్టిస్టు సంఘమునకు విధేయుడైన సభ్యుడను”, కానీ "నేను నా ప్రభువైన యేసుకు విధేయుడను" అని చెప్పాను. నేను చెప్పాను, "అప్పుడు నేను నా సహవాసమును విడిచిపెట్టెదను. ఇప్పుడు, నీవు ఎల్లప్పుడూ నా సహోదరుడవై ఉంటావు, కానీ ఒకవేళ సువార్తతో పోల్చబడుతున్న దేవుని యొక్క దూత ఎడల బాప్టిస్టు సంఘము యొక్క వైఖరి అదే అయితే నేను మరొక్క సహవాసమునకు కూడా హజరు కాను, మరియు పౌలు చెప్పాడు. "ఒకవేళ ఒక్కడు దీనికి వ్యతిరేకముగా బోధించినా, అతడు శాపగ్రస్తుడగును గాక". కానీ ఈ దూత వాక్యముపై నిజసువార్తను ప్రకటించుచున్నది. మరియు డాక్టర్ డేవిస్, వాక్యములో ఎక్కడో దీనిని బహిరంగముగా వ్యతిరేకించమని నేను కోరుచున్నాను." అతడు దానిని చేయలేక పోయెను.

అతడు చెప్పాడు, "బిల్లీ, ఆ రాత్రి భోజనము కొరకు నీవు ఏమైనా తిన్నావా? నీకేమైనా పీడకల వచ్చినదా?"

నేను చెప్పాను, “అయితే సరే, డాక్టర్. డేవిస్",

99. కానీ ఎంతో కాలము క్రితము కాదు, ఒక కీవాణీల మీటింగులో నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, అక్కడ డాక్టర్లు మొదలగువారు కూర్చొన్నారు, డాక్టర్.డేవిస్ హజరయ్యాడు. మరియు అతడు ఏవిధముగా అతడు నాకు చెప్పాడు. "మొదటి సంగతి నీకు తెలుసా నీవొక పరిశుద్ధ బండరాయిగా మారబోతున్నావు,బిల్లీ",

100. అక్కడ నిలబడే భాగ్యమును నేను కలిగియున్నప్పుడు, నేను చెప్పాను, డాక్టర్.డేవిస్, నీకు అభినందనలు, కానీ నీవు ఏదైతే పిచ్చితనము అని పిలుస్తున్నావో, మన బాప్టిస్టు సంఘము మిషనెరీలను ఆఫ్రికాకు పంపుట కొరకు లక్షలాది డాలర్లను ఖర్చు పెట్టినది. వాటిని నేను ఎక్కడ కనుగొందును? బయట గోడ దగ్గర. అది నిజము. అక్కడ ఆ జాతి నుండి సమకూడిన కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నారు, మరియు లోపలికి వచ్చారు, మరియు వారి జాతికి సంబంధము లేని దానిని గూర్చి వారు ఏదో చేసియున్నారు.
101. మనము క్రైస్తవ్యమును అభ్యసించినదానికన్నా కఠినమైన మతమును వారు కలిగియున్నారు. ఒకవేళ వారు ఏదైనా చేస్తే, ఒకవేళ ఒక బాలిక అనైతికముగా లేక మరేదో దానితో కనుగొనబడితే, ఆమె ఇక ఎంతమాత్రము ఆ జాతిలో నిలిచి యుండలేదు. లేదయ్యా, ఆమె ఆ జాతి రంగును తీసివేసి, మరియు ఆ పట్టణము లోనికి వెళ్ళును; ఆమె చేసుకొనగలుగునంతగా ఆమె కొరకు ఆమె మార్గమును చేసుకొనవలెను.

102. మరియు ఒక జాతివారు, ఒకవేళ ఆమె తప్పుగా కనుగొనబడితే, దానిని ఎవరు చేసిరో ఆమె చెప్పవలెను, మరియు వారిద్దరూ కలిపి చంపబడెదరు. మరియు వారు అన్యులైయుండి మనము చేయునదానికన్నా కఠినమైన దానిని వారు కలిగియున్నారు. మరియు వారి యొక్క చిన్నవారితో నడుచుట చూచి...

103. నేను చెప్పాను నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు, మన... చాలా మంది, వారితో కనుగొనె... మరియు మన బాప్టిస్టు జనులు, వారి చేతిక్రింద ఒక చిన్న విగ్రహము. చెప్పెను, "మంచిది, ఒకవేళ అమోయ..." అమోయ అనగా "గాలి వలె ఒక కనిపించని శక్తి". "ఒకవేళ అతడు విఫలమైనా, ఇది కాదు. నాన్న దానిని బంధించాడు, మరియు దానిని క్రింద ఉంచాడు, ఒక చిన్న అగ్నిని రాజేసి, మరియు అతడు ప్రార్ధించగానే సింహము వెళ్ళిపోయెను.”

104. నేను చెప్పాను, "ప్రార్ధనను బట్టి సింహము ఎన్నడూ పారిపోదు. సింహము అగ్నిని చూసి పారిపోవును." నేను చెప్పాను, "నేనొక వేటగాడిని. జంతువులు అగ్నిని చూసి భయపడునని నాకు తెలుసు. దానితో అది చేయగలిగినది ఏమి లేదు". మరియు కనుక అతడు... కానీ ఓహ్, ఏవిధముగానైనా అతడు దానిని తీసుకొనును.

105. కానీ ఆ మధ్యాహ్నము వారు బైబిలు యొక్క దేవుడిని చూసినప్పుడు, సహోదరులారా, ఆయన కార్యరూపములోనికి రావడము, ముప్పైవేల మంది పచ్చి విగ్రహరాధికులు వారి యొక్క విగ్రహములను నేలపై పగులగొట్టి మరియు ప్రభువైన యేసుక్రీస్తును స్వీకరించారు. చూడుము. అదే ఆలోచన: కరపత్రికలు పంచుట కాదు, కానీ సువార్తను ప్రకటించు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రదర్శించు. పురుషులైన మీరు మీకు దగ్గరగా ఉండుదానిని కలిగియుండుడి. అది మీలో ఉన్నది.

106. ఇప్పుడు, గమనించండి. మరియు భారతదేశములో ఆరోజు, వారు ఆ ఆలయములోనికి వెళ్ళినప్పుడు, మరియు వారు అంతవరకు... వారు మాట్లాడుట ప్రారంభించిరి, వేరువేరు జనులు, మరియు వారు క్రైస్తవ్యమును తక్కువ చేయుట
నారంభించిరి. ఎలా చెప్పను... ఇప్పుడు, వారు చాలా మంచి అంశములను కలిగియున్నారు. ఖచ్చితముగా వారు చేసెదరు. వారు ఒక మంచి అంశమును కలిగియున్నారు. వారిలో ఒకరు చెప్పారు, “ఏవిధముగా నీవు, నిన్ను మతభక్తివాడవుగా పిలుచుకొను నీవు, క్రైస్తవులు, ఒక దేవుని యందు నమ్మకముంచువారు; మరియు మీ విజ్ఞానశాస్త్రమంతా ఒకరినొకరు ప్రేల్చువేసుకొనుటకు అణుబాంబులను తయారు చేసుకొనుటకు ఉపయోగించబడుచున్నది. మరియు మీరు మిమ్ములను మతభక్తి గల వారిగా పిలుచుకొనుచున్నారు”.

107. నేను చెప్పాను. "అక్కడ మీరొక అంశమును కలిగియున్నారు. అది నిజము. కానీ ఆ అణుబాంబులను తయారుచేయు వారందరూ క్రైస్తవులు కాదు". అది నిజము. నేను చెప్పాను, "అది నిజము. క్రైస్తవులమైన మేము ఎన్నడూ ఒకరినొకరు ప్రేల్చువేసుకొనము, తిరిగి జన్మించిన క్రైస్తవులు". కానీ వారి యొక్క అంశమును మీరు చూడవచ్చు. దానిలో అది ఒకటి (మీరు చూడండి) వారి యొక్క అంశములు ఏమిటో. కానీ వారు చెబుతూ ఉన్నారు, "మా మతము దీనికి ముందే ఉన్నది, మరియు మీ క్రీస్తు...” చెప్పారు, "క్రీస్తు తరువాత వచ్చెను..." భారతదేశ నమ్మకము, అది క్రీస్తు తన యొక్క వేదాంతశాస్త్రమును ఒక బౌద్ధసన్యాసి నుండి నేర్చుకొనెను అని (చూడండి) మరియు అదంతా

108. కనుక నేను లేచి నిలబడవలసియున్నది. ఒకవేళ నేను చేయకపోతే నేను క్రీస్తుకు ద్రోహము చేసినవాడనవుతాను. నేను ఆ ఆలయములో ఉన్నానని నేను పట్టించుకోను. నేను పైకి లేచి మరియు నేను చెప్పాను. "మీరు తప్పులో ఉన్నారు. మరియు మీరు ఎలా ఎప్పటికీ... ఒక రక్త బల్యర్పణను గూర్చి ఎన్నటికి మీకు నేను బోధించగలను, ఎందుకనగా మీరు ఒక్క ఈగను కూడా చంపరు?” నేను చెప్పాను, “ఏవిధముగా మీరు రక్త బల్యర్పణను అంగీకరించగలరు?" నేను చెప్పాను, “ఈ సాయంత్రము జరగబోవు కూడికలో ఉండమని నేను మిమ్ములను అడుగుచున్నాను”.

109. మరియు ఆ సాయంత్రము వారందరూ సమకూడినప్పుడు, మరియు ఆ రాజాలు వారి యొక్క తలగడలపై మరియు ఆ మతసంబంధమైన నాయకులు... మరియు మేము... నాకు రెండు లేదా మరెక్కువ గంటలు పట్టినది, ఆ గుంపులను దాటుకొని లోపలికి ప్రవేశించుటకు, ఆ బాయ్ స్కౌట్స్తో, మరియు మిగతా వేర్వేరు వారందరూ... వారు బాయ్ స్కౌట్స్ వలె కనిపించుచున్నారని నేను ఊహించాను, ఒక రకమైన... నేను ఊహించాను. అది జాతీయ రక్షకభటులు లేక ఏదో వారి
యొక్క కర్రలు మరియు అటువంటివి, మిమ్ములను ఆ గుంపులలో నుండి తీసుకొని వెళ్ళుటకు, ఆ స్థలముల గుండా, చివరకు నేను మాట్లాడే స్థలమునకు మేము చేరుకున్నాము. అక్కడ స్థలములో నిలబడి, ఒక అనువాదకునితో, మరియు ఆ పేద కుష్టువారు ఒకరిపై ఒకరు పడి ...

110. ఓహ్, ఎటువంటి దృశ్యము. కొంతమంది చేతులు లేకుండా, మరియు కన్నులు తినివేసి మరియు వారి చెవులు పోయి, మరియు అంత పెద్ద మానవుల గుంపు, మరియు ఊపిరాడకుండా, మరియు రాత్రి సమయము వస్తూ ఉన్నది, వారిని వారి యొక్క శిరస్సులపై మోసుకుంటూ మరియు పెనము పైకి త్రోసి వేయుచున్నట్లు, యోహాను 3:16 లేకుండా, లేక "నేనే పునరుద్ధానమును మరియు జీవమునని", దేవుడు చెప్పెను. క్రీస్తు ఎవరికొరకైతే చనిపోయెనో ఆ మానవులు (మర్త్యులు), వేలాది మంది చనిపోవుచున్నారు. ఒక చెక్కముక్క వలె వీధులలో వారిని మోసుకువెళుతూ మరియు వారి శరీరములను దహనము చేయుచున్నారు. కార్యక్రమము లేదు లేక ఏమీ లేదు, వారు ఎవరికి చెందినవారో ఎరిగి, వారిని కేవలము ఆ విధముగా గోతిలో వేస్తున్నారు. అంతటితో ముగుయుచున్నది.

111. మరియు మనము అది చేయాలి లేక అది చేద్దాము అని వాదించుకొనుచున్నాము, లేక ఏ విధముగా మన బూట్లను కట్టుకోవాలి, లేక మనము ఏ విధమైన టై ధరించాలి లేక మరేదో. సహోదరులారా, అది ఒక అవమానము. అవును. మరియు మన యొక్క మానవ... ఒకవేళ సంఘము గనుక మానవ వేదాంతముపై నడిపించబడితే, అప్పుడు అది పరిశుద్ధాత్మను తీసుకొనదు. అది నిజము. కానీ సంఘము మానవ వేదాంతము ద్వారా నడుచుట కాదు. పరిశు ద్ధాత్మ సంఘమును నడిపించవలెను. మనము విద్య ద్వారాను మరియు మానవుని యొక్క వేదాంతశాస్త్రము ద్వారాను నింపబడుటకు లేము; మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడుటకు ఉన్నాము, మరియు బిషప్ ద్వారా నడిపించబడుటకు కాదు పరిశుద్ధాత్మ ద్వారా, లేక ఏ సంఘశాఖల నాయకుల ద్వారా కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా, సహోదరులారా.

112. అక్కడే వైఫల్యము. గర్వముతో నేను దీనిని చెప్పుట లేదు. ఒక సత్యమును చూపుటకు మరియు సంపూర్తిగా ఒక అంశమును సరిగా (నిటారుగా) చేయుటకు సహోదర ప్రేమలో నేను దీనిని చెప్పుచున్నాను. దానినే నేను మీయొద్దకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుచున్నాను, అది సత్యము. ఈ ప్రపంచములో వారి ఎదుట నేను నా టోపిని తీయని (గౌరవించని) ఏ సంఘశాఖయు లేదు, అది
యెహోవా సాక్షులైనా లేక రోమన్ కాథలిక్కు అయినా, నేను నా టోపి తీయనిది. ఏ సహోదరుడైన గౌరవముతో యేసుక్రీస్తు అను నామమును పెట్టుకుంటే, ఏ విధముగా నేను ఆ సహోదరుడిని గౌరవిస్తాను మరియు నా దేహములో ఊపిరి నిలిచియున్నంత కాలము నేను అతడితో నిలబడతాను. కానీ నేను చెబుతున్నాను, మనము మన ప్రజలను వేరుపరుచుచూ మరియు విభజనలు చేయుచున్నాము, మనము దానిని చేయకూడదు. మనము కలిపి ఉండవలెను. అపొస్తులులు 2లో వారు అందరూ ఏకమనస్సును కలిగియుండిరి.

113, మరియు, సహోదరులారా, ముగించే ముందు, నేను దీనిని చెప్పవచ్చా, ఎందుకనగా నేను ఇప్పటికే సమయము దాటిపోయాను. మిమ్ములను ఇంత సేపు ఉంచినందులకు నన్ను క్షమించండి. దానిని చేయుట నా ఉద్దేశ్యము కాదు. కానీ ఒక అంశము... ఆ రాత్రి సంఘము యొద్ద, సహోదరులారా, మేమందరము అక్కడ ఆ వేదికపై నిలబడినప్పుడు, నిన్ను నీవు కూడా వినలేవు. అది ఏవిధముగా ఉండునో నీకు తెలియును. అక్కడ వందల మంది వేర్వేరు జాతులవారు మరియు ప్రతీది అక్కడ ఉన్నది. మరియు వారందరూ రోడ్లపై చెల్లాచెదురు అయిపోయారు, రెండు వారములు నేను ఉండాలని ఆశిస్తున్నారు, మూడు రోజులు మాత్రమే నేను ఉండగలిగినప్పుడు, ఎందుకనగా ఆ గుంపులు చాలా గొప్పవిగా ఉన్నవి కనుక వారిని పట్టణములో పెట్టలేకపోవుచున్నారు, మరియు నేను ఎక్కడికో వెళ్ళాలని వారు నన్ను అడిగారు, ఎందుకనగా వారు దానిని తీసివేయలేకపోయారు, మీరు చూడండి. అది చాలా భయంకరము. మరియు నేను వారికి చెప్పాను. “దేవుని కృపను బట్టి నేను తిరిగి వస్తాను”. మరియు నేను వస్తాను.

114. కనుక ఆ రాత్రి, నిలబడుతూ... నేను పరిశుద్ధాత్మ కొరకు చూస్తున్నాను, మీరు నా ఆఫ్రికా యొక్క కథను చదివారు, మీరందరూ, పుస్తకములో ఆ అవిటివాడు అతడి రెండు చేతులు క్రిందకు పెట్టి జంతువు వలె అతడు నడిచినప్పుడు ఎదురు చూస్తున్నాను, మీకు తెలుసు, ముప్పైవేల మంది క్రీస్తును అంగీకరించారు.

115. నేను ఎదురుచూచాను మరియు ఒక వ్యక్తి వచ్చాడు, అతడొక కుష్టివాడు, మొదటివాడు. మీరు ఏ ప్రార్ధనా కార్డులు అక్కడ ఇవ్వలేరు. మై, ఆ బాలురు ప్రార్థనా కార్డులు ఇచ్చుటకు ప్రయత్నించారు, మరియు వారి బట్టలు చినిగిపోయాయి, చూడండి. కనుక నేను చెప్పాను (అది ఆఫ్రికాలో లాగ), ఆ మిషనెరీలనే తీసుకోనివ్వండి... క్రిందకు వెళ్ళి మరియు ఈ జాతివారిలో నుండి
కొందరిని తీసుకురండి, మరియు కొంతమంది ఆజాతి, మరియు కొంతమంది ఈ జాతి, ఒక్కొక్క దానిలో నుండి రెండు లేక మూడు, మరియు వారిని నిలబెట్టండి.

116. మరియు మేము అక్కడ నిలబడియున్నప్పుడు, మరియు వారు... అధికారులు కొంతమందిని తీసుకొని వచ్చుటకు పట్టుకున్నారు, వారు పట్టుకొనగలిగిన వారిని, సాధ్యమైన వారిని. అక్కడికి మొదటిగా వచ్చినది ఒక పురుషుడు, ఒక కుష్టువాడు, మరియు నిలబడి... చాలాసార్లు, మీరు మీటింగులలో చూసినట్లుగా వారి పేర్లను పిలచి మరియు వారు ఎక్కడ నుండి వచ్చారని, ఇప్పుడు, అది మీకు భయానకముగా ఉండకూడదు, సహోదరులారా. అదియే బైబిలు. దానిని గూర్చిన ఆధునికమైన భావనకు అది కొంచెము వ్యతిరేకము; కానీ అయితే ఆదినము యొక్క ఆధునికమైన భావనకు కూడా క్రీస్తు వ్యతిరేకముగా ఉన్నాడు. మరియు మనకు తెలుసు చరిత్ర పునరావృత్తమగును.

117. మరియు అక్కడ, నేను వారి పేరు చూడగలను; నేను దానిని ఉచ్ఛరించలేను. నేను దానిని చూచిన విధముగా నేను దానిని విడదీసి (అక్షరాలను) చెప్పగలను. అవి ఏమైయున్నాయో మరియు అటువంటివి వారికి నేను చెప్పగలను. నేను ఆ వ్యక్తికి ప్రార్ధన చేసినప్పుడు మరియు వారిలో సాగుతూ వెళతాడు. మరియు మీరు గుర్తించుకొనండి. నేను చేయగలిగినది ఏది లేదు. నేను కేవలము ఒక వ్యక్తిని, చూడండి. అది ఏదో అయియున్నది. మాట్లాడునది నేను కాదు. దాని కొరకు నేను చేయునది ఏమీలేదు. అది నీ విశ్వాసము దానిని చేయుచున్నది. మీరు చూడండి.

118. నిన్నటి మధ్యాహ్నము సహోదరుడు జోసఫ్ ఒక స్థలమునకు రావడం జరిగినది, నేనున్న నాగదికి, ఆలయమునకు వెళ్ళుటకు కొంచెము ముందు, మరియు ఆ విధముగా జరిగియున్నది మూడు గంటలకు నేను ప్రార్ధించుట ప్రారంభించాను. మరియు నా స్నేహితుడైన, జోసఫ్ అక్కడ కూర్చొనియున్నాడు, మేము చాలాకాలము నుండి కలిసియున్నాము. జోసఫ్ ద్వారా ఒక దర్శనము వచ్చినది, ఎందుకంటే మేము ఒకరినొకరు ప్రేమించుకొనెదము. మరియు మేము కలిసియున్న కాలము, ఎప్పుడు ఎన్నడు కూడా, కానీ పరిశుద్ధాత్మ సహోదరుడు జోసఫ్కు ఏదో బయలుపరచినది... అదిగో అతడు; అతడిని అడగండి (చూడండి), ఏమి జరిగియున్నదో మరియు మొదలగునవి చూపించుచున్నాడు. జోసఫ్, అది నిజమే కదా? చూడండి, అది ఏదో... సంఘములో జరుగున దానికన్నా బయట ఎక్కువగా జరుగును, చూడండి. కానీ అది సంఘములో ఉన్న ప్రజలు దేవుని యొక్క వరమును
ఉపయోగించుకొనుచున్నారు, చూడండి. నిన్నటి దినమున, నేను నమ్ముచున్నాను, అది వైద్యునికి వివరించునట్లుగా ఉన్నది.

119. మీరు నన్ను మరొక క్షణము భరించగలరా? కనుక, సహోదరులారా, సహోదరిలారా, మీరు దీనిని తెలుసుకొనవలసిన హక్కును కలిగియున్నారు. మీరు దీనిని తెలుసుకొనవలసిన హక్కును కలిగియున్నారు. మీరిక్కడ ఉన్నారు; మీరు కాపరులు. వెనుక పట్టుకొనుటను బట్టి నేను మిమ్ములను నిందించను. మీరు కాపరులు. నేను సేవకులను నిందించను, బాప్టిస్టు సేవకులు, మరియు ప్రెస్బిటేరియన్ సేవకులు మరియు మొదలగువారు, ఏదో దానిని చూచుట నుండి, వెనుకకు పట్టుకొని, ఎందుకనగా వారు కాపరులు. వారు ఒక మందను మేపుచున్నారు, మరియు వారి యొక్క మంద ఏమి తినునో వారు గమనించవలసియున్నది. కానీ ఒక కాపరి ఏమి చేయవలసియున్నది... పరిసయ్యలు కూడా కాపరులే, కానీ వారు నతానియేలు మరియు సమరయలోని బావి దగ్గర స్త్రీ చూచినట్లుగా వారు లేఖనమును చూడవలసియున్నది, మరియు లేఖనములను చూచి వారు ఏదినమున జీవించుచున్నారో చూడవలసియున్నది, మరియు చెప్పాడు. "ఇదే ఆ ఆహారము”, చూడండి. కానీ ఇప్పుడు, చూడండి.

120. బైబిలు చెప్పెను ... బైబిలు చెప్పెను క్రీస్తు... దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరచుకొనుచుండెను. దేవుడు మరియు క్రీస్తు ఒక్కటే. వారు ఒక్కటే. మరియు వారు మీ వేలు ఉన్నట్లుగా కాదు, మరియు వాటిపై కూడా మనము రాపిడిని కలిగియున్నాము, అది ఎన్నటికినీ జరిగియుండలేదు. మరియు ఈరోజు, మన కక్షలను కలిగియుందుము. ప్రసంగీకులు దానిని కలిగియుందురని నేను అనుకొనను. అది సమాజమే. 2వ తిమోతి 4 యొక్క క్రమమును నీవు గమనించావా? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసికొని, సత్యము, నేను భారతదేశముపై నా కథను ముగించుటకు ముందు, 'ఎందుకనగా మీరు దానిని పొందుకొనవలసియున్నది నుండి తిరిగిపోయి, (వాక్యము) కల్పనా కథలు వైపు, మరియు మొదలగునవి. అది సేవకులని నేను అనుకోవడము లేదు. వారిలో వందల మందితో నేను కలిశాను. వారు వేరే సంఘశాఖ యొద్దకు వెళ్ళి, ఒకరితో ఒకరు కరచాలనము చేసుకొని, మరియు సహోదరులుగా ఉండుట నేను చూచాను, చూడండి. గొర్రె తప్పుగా కేకలు వేయుచున్నది, చూడండి.
121. ఇప్పుడు, దేవుడు క్రీస్తుకు కొలతలేని ఆత్మను ఇచ్చియున్నాడు. అది నిజమేనా? దేవుని యొక్క సర్వసంపూర్ణత క్రీస్తులో ఉన్నది. ఆయన ఇమ్మానుయేలైన దేవుడు. మనకది తెలుసు. దానిని గూర్చి మన మనస్సులలో ఎటువంటి సందేహము లేదు. నిన్నటి దినమున నేను చెప్పినట్లుగా, "మహాసముద్రమంతా నీటితో నిండియున్నది, మహాసముద్రములోని నీరంతా క్రీస్తులో ఉన్నది. కానీ ఇక్కడ పని చేయడం మీరు చూచుచున్న ఈవరము, కేవలము ఒక చిన్న, అక్కడ ఒక స్పూనైపై ఉన్న అటువంటి చిన్నది, కేవలము ఒక చుక్క". నేను దానిని చూడగలను. కానీ క్రీస్తులో దైవత్వము యొక్క సంపూర్ణత ఉన్నది. మనము కొలతలో దానిని కలిగియున్నాము. ఆయన కొలత లేకుండా దానిని కలిగియున్నాడు, అని బైబిలు చెప్పుచున్నది, చూడండి. కొలత లేకుండా, లేదు... ఆయన కేవలము అనంతుడు. ఆయన దేవుని యొక్క ఆత్మను కలిగియున్నాడు.

122. ఇప్పుడు, అంశము నీరైయున్నది, ఇప్పుడు, ఒకరోజు, దేవుడు, ఆయన ఆత్మక్రీస్తులో సంపూర్ణముగా నివాసము చేయుచున్నది అని ఎరిగియున్నప్పుడు, ఒక మానవునిలో ఉన్న అనగా యేసు యొక్క మాంసదేహములో ఆయన వరమును ఉపయోగించాలని ఆయన కోరియున్నాడు. ఆ దేహము ఒక గుడారము. దేవుడు భూమిపై నివాసము చేయుచున్నాడు. సహోదరులారా, మీరు దానిని నమ్ముచున్నారా? క్రీస్తు, అనే దేహములో.

123. ఇప్పుడు, దేవుడు తన వరమును ఉపయోగించాలనుకొన్నాడు, అందుకే లాజరు మరియు మార్త మరియు వారి యొక్క గృహమును విడిచిపెట్టమని ఆయన తన కుమారునికి చూపించాడు, మరియు చాలా దినములకు దూరముగా వెళ్ళమని, ఎందుకనగా లాజరు చనిపోబోతున్నాడు. మరియు ఆ ఖచ్చితమైన దినముల తరువాత తండ్రి ... ఎందుకనగా యేసు చెప్పెను, "తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు", యోహాను 5:19 నేను చాలాసార్లు

దానిని సూచించాను. తండ్రి ఏదైతే చూపించెనో యేసు దానినే చేసియున్నాడు. అది నిజమేనా? బైబిలు అదే అని చెప్పుచున్నది. యేసు ఆవిధముగా చెప్పెను, మరియు అది దానిని స్థిరపరచెను. ఇప్పుడు, అయితే, దేవుడు తన యొక్క వరమును తీసుకొని మరియు ఇక్కడకు తీసుకొని వచ్చి మరియు దూరముగా ఉండెను. ఆ సమయము అయ్యేంత వరకు, మరియు ఆయన తన శిష్యులవైపు చూచి, మరియు చెప్పెను, "మన స్నేహితుడైన, లాజరు, నిద్రించుచున్నాడు”. ఆ సమయము సంపూర్ణమైనది అని ఆయన ఎరిగియున్నాడు.
ఆయన చెప్పాడు, "మంచిది, అతడు నిద్రించిన ఎడల, అతడు బాగుపడును". అతడు నిద్రించుచున్నాడు, విశ్రాంతి.

124. ఆయన చెప్పెను, "అతడు చనిపోయెను. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను". ఎందుకనగా వారు ఆయనను అతడికొరకు ప్రార్ధించుటకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుదురు, అది దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకము. చూడండి, ఆ సహోదరి తన భర్తను గూర్చి చెప్పినట్లుగా, మనము దేవునిని వెంబడించవలెను, "నీతిమంతుని యొక్క అడుగుజాడలు యెహోవా చేత స్థిరపరచబడును".

125. ఇప్పుడు, అతడు చెప్పాడు, “నేను అక్కడ లేనందుకు సంతోషించు చున్నాను, కానీ నేను అతనిని మేల్కొల్పవెళ్ళెదను". మీకు అర్ధమైనదా? సమాధిని చూసి; ఆయన చెప్పెను, "తండ్రీ, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు (చూడుము), కానీ ఈ చుట్టూ నిలిచియున్న వారి కొరకు నేను దానిని చెప్పెదను, "లాజరూ, బయటకు రమ్ము”. మరియు నాలుగు దినముల నుండి చనిపోయిన వ్యక్తి తన పాదములపై నిలబడి మరియు తిరిగి జీవించెను. మనము అది అధికారపూర్వకమైన (నిరూపించబడిన) దేవుని యొక్క వాక్యము, సత్యము అని నమ్ముదుము.

126. కొద్ది దినములలో, ఒక స్త్రీ, ఒక చిన్న స్త్రీ, గుర్తింపు లేనిది, బహుశా ఒక చిన్న వ్యవసాయదారుని యొక్క భార్య, బహుశా రుతుక్రమము ఆగిపోయే దశలో ఉన్నది, రక్తస్రావ సమస్య ఉన్నది, వచ్చినది, మరియు ఆమె నమ్మినది అది దేవుడే అక్కడ ఉన్నాడు అని. అది దేవుడే అని ఆమె నమ్మియున్నది. కనుక ఆమె చెప్పెను, "ఒకవేళ నేను గనుక..."

సహో. రాబర్ట్స్ అనేకసార్లు చెప్పియున్నాడు, "తాకగలిగే స్థలమును పట్టుకో”.

127. “ఒకవేళ నేను తాకగలిగే స్థలమును కలిగియుండగలిగితే, నేను ఆయన వస్త్రపుటంగీని తాకబోతున్నాను, మరియు నేను పూర్తి స్వస్థత పొందుకొనెదను, ఎందుకనగా నేను నమ్ముచున్నాను ఒకవేళ నేను ఆయనను తాకగలిగితే, దేవుడు అక్కడ ఉన్నాడు, “చూడండి. మరియు క్రీస్తు భౌతికముగా తాకబడితే ముఖ్యముగా ఆ స్త్రీ హస్తము ద్వారా, లోపల ఉన్న దేవుడు ఒక సాక్ష్యము ఇచ్చాడు.

128. ఆయన చెప్పాడు. "ఎవరు నన్ను తాకారు? ఎవరు నన్ను తాకారు?" ప్రతీ ఒక్కరూ దానిని ఖండించారు, కానీ దైవత్వము యొక్క సంపూర్ణత అక్కడ ఉండి, ఆ వివేచనతో ఆయన చుట్టూ చూచాడు. ఆయన వారి ఆలోచనలను చూచి
తెలుసుకొన్నాడు. అది నిజమేనా? మనమందరము కలిసియున్నప్పుడు సహోదరులారా ఏదో దానిని నేను అడుగగోరుచున్నాను. ఒక ఆలోచనను చూసి తెలుసుకోవడం లేక మనస్సును చదువుట అనే వాటి మధ్య వ్యత్యాసమేమిటి? మీరు చూడండి, మనస్సును చదివేవారు, మనోవైకల్యాన్ని చదివేవారు, వారు... అవన్ని సంగతులు నిజమైన దేవుని యొక్క వరములుగా ఉన్నాయి, కానీ అవన్నీ వంకర చేయబడ్డాయి. దెయ్యము దేనినీ సృష్టించలేదు. దేవుడు దేనినైతే చేశాడో అతడు కేవలము దానిని వంకర చేయును. నీతి అనగా ఏమిటి? పాపమనగా ఏమిటి? అది నీతి వంకర చేయబడుట.

129. నేను ఒక అంశము చెప్పాలనుకుంటున్నాను. సహోదరిలారా, నన్ను క్షమించండి. వివాహమైన పురుషులైన మీరు, అది చట్టపరము మరియు న్యాయము: మీరు వివాహము చేసుకున్న ఒక భార్య మీకున్నది, మరియు మానవ జీవితము యొక్క చట్టపరమైన పద్ధతిలో, మీరు మీ భార్యతో జీవించవచ్చు, ఆమెను ప్రేమించవచ్చు, మరియు ఆమె నీ భార్య. మరియు అది చట్టపరమైనది. మరియు బైబిలు చెప్పెను, "పానుపు నిష్కల్మషమైనది". కానీ వేశ్య, లేక అనైతికమైన స్త్రీ, నీ భార్య ఉన్నట్లుగానే అదే సంగతిగా ఉండవచ్చు; కానీ ఆమెతో వెళ్ళు నైతికమైనదానిని అనైతికమైన దానిగా వంకర చేయుటయే. నేనేమి చెప్పియున్నానో మీకు అర్ధమైనదా? ఇప్పుడు, నేను అనుకొనుచున్నాను బహుశా ఆ సూచన నేను ఏమి మాట్లాడుచున్నానో దానిని చూచుటకు మిమ్ములను అక్కడకు తీసుకొని వెళ్ళును.

130. అనైతికత అనేది నీతిని వక్రీకరించడమే. దెయ్యము సృష్టించలేదు. ఆ కారణమును బట్టే దెయ్యము స్వస్థపరచలేదు. కేవలము దేవుడు మాత్రమే సృష్టించగలడు, మరియు ఆయనే మాత్రమే ఒకే ఒక్క స్వస్థపరచువాడు, చూడండి. దెయ్యము వక్రీకరించగలదు, కానీ సృష్టించలేదు.

131. కనుక అప్పుడు, స్త్రీ ఆయన అంగీని తాకినది, మరియు ఆమె తృప్తిపడినది. ఆమె పారిపోయినది, మరియు క్రీస్తు ఆమెను కనుగొనేంత వరకూ చుట్టూ ఆ సమూహము వంక చూసెను, ఆమె సమస్య ఏమిటో ఎరిగియున్నాడు, మరియు అప్పుడు ఆమె దానిని ఒప్పుకొన్నది, అది ఆమె... ఆమె ఏమి చేసినదో.

132. ఇప్పుడు చూడండి. ఆయన చెప్పెను, "నేను బలహీనుడనయ్యాను అని తెలుసుకొనుచున్నాను”. లేక ప్రభావము... ప్రభావము అనగా “బలహీనత”. నీలో నుండి ప్రభావము తీసివేయబడినప్పుడు... ఇప్పుడు, ఏమి జరిగినది? దేవుడు తన వరమును ఉపయోగించెను. దేవుడు తన వరమును ఉపయోగించెను, మరియు
ఆయన... ఆయన తన వరమును ఉపయోగించినప్పుడు: చనిపోయి నాలుగు దినములైన ఆ చనిపోయిన వ్యక్తిని ఆయన లేపినప్పుడు, క్రీస్తు ఎన్నడూ తను బలహీనుడనయ్యానని చెప్పలేదు. దేవుడు తన వరమును ఉపయోగించెను. కానీ ఇక్కడ, ఆ స్త్రీ తన వరమును ఉపయోగించుకొనెను, దేవుడు కాదు, ఆ స్త్రీ క్రీస్తు నుండి లాగుకొనెను... క్రీస్తు ద్వారా, క్రీస్తు నుండి లాగుకొనెను క్రీస్తు ద్వారా, క్రీస్తు నుండి లాగుకొనెను క్రీస్తు ద్వారా... క్రీస్తులో ఉన్న దేవుని యొక్క వరమును ఆమె ఉపయోగించుకొనెను, మీరు చూడండి.

133. ఇప్పుడు ఆ ప్రశ్న తలెత్తబోతూ ఉన్నది. "ఎందుకు సహోదరుడు బ్రన్హాం నీవు కూడికను విడిచిపెట్టుచున్నప్పుడు బలహీనుడవగుతున్నావు”? ఇప్పుడు మీరు ఖచ్చితముగా అర్ధము చేసుకొనగలరు అని అనుకొనుచున్నాను. ఇక్కడ, గతదినమున నేను ఆ సహోదరుడుతో చెప్పాను. మనమందరము చిన్న బాలురము, మరియు మనము ఒక సర్కస్ యొద్ద ఉన్నాము. మనలో ఎవరి దగ్గరా లోపలికి వెళ్ళుటకు డబ్బులు లేవు. కానీ అది అలా జరుగుతూ ఉండును, అది బహుశా నేను నీ కన్నా కొంచెము పొడవువాడనై యుండవచ్చు. నీవు నా కన్నా కొంచెము బలమైనవాడవై ఉండవచ్చు.

134. మరియు దేవుడు మనలనందరినీ విశేషముగా (విభిన్నముగా) తయారు చేశాడు, ఎందుకనగా ఆయన విశేషమైన దేవుడు. మీరు దానిని నమ్మెదరా? ఆయన పెద్ద పర్వతములను మరియు చిన్న పర్వతములను చేయును. మరియు ఆయన ఎడారులను చేయును, మరియు ఆయన మహాసముద్రములను చేయును. మరియు ఆయన తెల్లని పువ్వులను చేయును, ఆయన నీలపు రంగు పువ్వులను చేయును, మరియు ఆయన ఎరుపు పువ్వులను చేయును మరియు ఆయన చిన్న వ్యక్తులను, పెద్ద వ్యక్తులను, ఎరుపు రంగు తల కలిగిన వారిని, నలుపు రంగు తల, నీలము రంగు తల కలిగినవారిని చేయును. ఆయన పసుపు, గోధుమ వర్ణము, నలుపు రంగు వ్యక్తులను చేయును. ఆయన విశేషమైన దేవుడు. ఆయన ఒక సియర్స్ మరియు రోబక్ హర్మనీ గృహము కాదు. ఆయన ఒక విభిన్నమైన దేవుడు, చూడండి. ఇప్పుడు, ఆయన విశేషమైన దానిని చేయును, ఎందుకనగా దానినే ఆయన ఇష్టపడును. ఆయన ఇష్టపడు విధానమును నేను ఇష్టపడెదను. ఆయన దానిని ఇష్టపడుచున్నాడు కనుక నేను దానిని ఇష్టపడుదును. మరియు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఆయన ఇష్టపడు సంగతులను నీవు ఇష్టపడెదవు. ఆ కారణమున బట్టే నేను ప్రకృతిని ఆ మొదటి స్థితిలో ప్రేమించెదను.
135. ఇప్పుడు, మనము గమనించెదము. ఇప్పుడు, ఒక ... బహుశా ఆయన నన్ను కొంచెము పొడవుగా చేసియుండవచ్చు. ఇప్పుడు, నేను పొడవుగా ఉండుటను బట్టి నేను సహాయపడలేను. నీవు బలముగా ఉండుటను బట్టి నీవు సహాయపడలేవు. నేను చేయలేని సంగతులను ఆయన కొరకు నీవు చేయవచ్చు. నీవు చేయలేని సంగతులను ఆయన కొరకు నేను చేయవచ్చు. ఓరల్ రాబర్డ్స్, నేను, నీవు, మిగతా వారందరూ, మేమందరము ఒకరి నుండి ఒకరు విభిన్నమైన వారము, కానీ మేమందరము సహోదరులము, చూడండి. మేమందరము ఒకే ఉద్దేశ్యము కొరకు సహోదరులము.

136. ఇప్పుడు, బహుశా మనము ఈ ఉత్సవమును చూడగోరుచున్నాము. ఇప్పుడు, సహోదరులైన మీరందరూ చెప్పుచున్నారు, "సహోదరుడు బ్రన్హాం, నీవే పొడగరివి." బహుశా దర్శనములు చూడవచ్చు. అది కేవలము ఒక వరము. నేను ఎన్నడూ ఆ విధముగా చేసుకొనలేదు. ఆయనే ఆ విధముగా చేసెను. అది నన్ను వేరే ఎవ్వరి నుండి విభిన్నమైన వారిగా చేయదు. లేక నా నుండి మీరు వేరుగా, మనమందరమూ ఒకే పదార్ధమైయున్నాము, కానీ దేవుడు మనలను చేసిన విధానములో ఉన్నది.

137, మంచిది, ఇప్పుడు, మీరు చెప్పండి, "ఈఎత్తు కన్నా పైనున్నది ఒక రంధ్రము. అది నాశిరస్సుకు పైన ఉన్నది." ఇప్పుడు, మీరు చెప్తారు, "సహోదరుడు బ్రన్హాం, ఆ భవనములో ఏమున్నది... అక్కడకు ఏమి వచ్చుచున్నది?"

"నాకు తెలియదు".

"మంచిది, పైకెగిరి మరియు చూడుము", మంచిది, నేను పైకి చేరి మరియు ఒక పట్టు పట్టుకొనెదను, మరియు నేను దానిని పిండెదను, మరియు నన్ను నేను పైకి లాగుకొని, మరియు నేను అక్కడ నుండి చూచెదను. “వ్యూ”,

"సహోదరుడు బ్రన్హాం, నీవు ఏమి చూస్తున్నావు?"

“ఒక ఏనుగు".

"ఓహ్, నీవు చూస్తున్నావా".

“ఊహ్”.

"సహో. బ్రన్హాం, మళ్ళీ చూడుము".

", ",

“అది సరే". పైకెగిరి మరియు దానిని పట్టుకో. నా వ్రేళ్ళతో పట్టుకో.” నీవు ఏమి చూస్తున్నావు, సహో. బ్రన్హాం?”
“ఒక జిరాఫీ.వ్యూ".

138. అవును, అది వేదికపై ఉన్నది, చూడుము. అది నీవే, ఈ స్త్రీ వలె, నీ విశ్వాసము దేవుని దగ్గర నుండి లాగుతున్నది; అది ఒక దర్శనమును బలవంతపరచుచున్నది. దానిని చూశారా? అది నీవు చేయుటైయున్నది. అది మనము చేస్తాము. అదే ఆ స్త్రీ చేసినది. అది బలహీనపరచినది, చూడుము. అది ఆయనను బలహీనపరచినది, ఎందుకనగా అది ఆ స్త్రీ ఏదో చేయుచున్నది అది ప్రభావమును తీసుకొన్నది.

ఇప్పుడు, ఒకవేళ ఆ బలమైన మనుష్యుడు, ఆ సర్కస్ యజమాని, అతడు ప్రక్కగా నడిచి మరియు "హలో, బిల్లీ" అని చెప్పిన ఏమిటి.

నేను చెప్పాను, "అయ్యా, మీరెలా ఉన్నారు."

"నీవు ఏమి చేస్తున్నావు?"

"నేను ఈరంధ్రము గుండా చూస్తున్నాను", ఓహ్, అవును.

"సహో.బ్రన్హాం, నీవు ఇంకేమి చూసియున్నావు?"

"ఓహ్, మై. అక్కడొక ఏనుగు ఉన్నది అని నేను చెప్పుట అతడు కోరుతూ దానితో అతడు సంతృప్తి చెందేవాడిలా కనిపించాడు".

139. ఒకవేళ ఈవ్యక్తి ఇక్కడుంటే... అది ఒక శ్రమ. ఆ స్త్రీ వచ్చుచున్నది. ఇదిగో ఈమె వచ్చెను. అక్కడ ఏదో నిన్ను కలుస్తున్నది. అది ప్రేలుచున్నది. అది ఒక స్త్రీ చేయుచున్నది, పురుషుడు దానిని చేయుచున్నాడు, నా ముందు; అది నేను కాదు. అది ఆమె చేయునది. నేను కేవలము అక్కడ నిలబడి నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. ఈ సంగతులన్నీ మూగవిగా ఉంటాయి, దానిలో నుండి ఒక సజీవమైన స్వరము పలుకుతూ ఉన్నంత వరకూ. ఆ విధముగానే మనమున్నాము. ఒక ఆర్గాను మరియు ఒక పియానో ఉన్నవి, కానీ ఎవరో వాటిని వాయించేంత వరకూ అవి నిశ్శబ్దముగానే ఉండును. మరియు అది మనమే; అది నేను. నేను దానిని చేయలేను, చూడుము. అది నీవే దేవుని యొక్క వరమును ఉపయోగించునది. చూడండి. అది కూడికలో. అది చేయకూడదు... నేను దానిని చేయకూడదు. అది కేవలము దేవుడు. ఒకవేళ మీరు గమనిస్తే, "అది దేవుడు అనుమతించుచున్నాడు” అని నేను చెప్పెదను", చూడండి.

140. అది ఒక స్వస్థతావరము కాదు. ఓరల్ రాబర్ట్స్ స్వస్థతావరమును కలిగియున్నాడు. సేవకులైన మీ వలె నేను కూడా ఒక స్వస్థతావరమును కలిగియున్నాను, ప్రజలను అక్కడకు తీసుకొని వచ్చి మరియు వారిని గూర్చి
ప్రార్ధించుట. కానీ అది కేవలము ఒక విశ్వాసము, అది ఒక వేటకుక్క విశ్వాసము అది గట్టిగా పట్టుకొని మరియు ఆవిధముగా, కానీ కొన్నిసార్లు ఆ సంగతులు జరుగుటను మీరు విడిచిపెడతారు, చూడండి, కానీ ఈ మార్గములో, అది ఒక ప్రవక్త వరము అది ప్రాణములను శోధించును, చూడండి, మరియు మీకు తెలుసు.

141. బహుశా అయిదు వందల మంది వెళ్ళకపోవచ్చు. అది నిజము. కానీ ఒక్కరు వచ్చినప్పుడు, అతడు క్రిందకు నెట్టివేయబడతాడు. మీరు కూడికలలో ఉన్నప్పుడు మరియు చూస్తారు ఏ విధముగా పాపము, మరియు చెప్తారు. “సరిగ్గా అక్కడే కూర్చొన్న వ్యక్తి, నీవు అతడితో జీవించావు, నీవు ఇక్కడ దీనిని చేశావు మరియు అటువంటివి". మీరు కూడికలలో దానిని చూశారు మరియు ఎరిగియున్నారు, చూడండి. అది నిజము, చూడండి. ఎంత వేగముగా అంటే అంత... మీరు వాటిని తీసుకొనలేరు. మీరు గమనించాలి. అది ప్రజల యొక్క సొంత విశ్వాసము. ఇప్పుడు, ఇక్కడ నుండి ఇక్కడ ఎవరో ఉన్నారు. నేను ఏమి చెప్పుచున్నానో చూడండి?

142, ఇప్పుడు, అది... ఇప్పుడు, ఒకవేళ ఆ రింగు మాష్టారు వస్తే ఏమిటి? ఇప్పుడు, నేను కేవలము... "ఓహ్, సహోదరుడా, ఇద్దరు జనులు దాని గుండా వెళ్ళి మరియు వారికి ఇది చెప్పారు. ఇంకా వారు ఏమి కలిగియున్నారు?"

మొదటివాడు అక్కడ నిలబడి, "అవును, నాకు కేన్సర్ వచ్చింది". అది నిజము.

"నీవు ఏమి చూస్తున్నావు?" ఆ వ్యక్తి...

"కేన్సరు. ఓహ్, అవును. సహోదరీ, అది నిజమా? కనీసము నాకు గుర్తు లేదు. అది కేవలము..."

"అవును, అది నిజము”.

143. మంచిది, ఎక్కడైతే ఆమె చెప్పవలసియున్నదో, "ప్రభువా, వందనములు, అది నా స్వస్థత అని నేను ఇప్పుడు అంగీకరించుచున్నాను", మరియు నడిచి వెళ్ళిపోయెను, వారు కొంచెము సేపు ఆగెదరు, చూడుము. అప్పుడు ఏదో, ఇదిగో ఇక్కడ తిరిగి వెళ్ళుచున్నది. ఇదిగో ఇక్కడ తిరిగి వెళ్ళుచున్నది. ప్రేక్షకులు కూర్చొని మరియు చెప్పెదరు, “మంచిది, అది చాలా బాగున్నది.”

144. కానీ ఆఫ్రికాలో వారు దానిని చెప్పరు. భారతదేశములో వారు దానిని చెప్పరు. వారు దానిని చూసినప్పుడు, “ఓహ్, హల్లెలూయా”, అని వారు చెప్పెదరు. “అది నిజము”, చూడండి. మరియు అదిగో వారు వెళ్ళుచున్నారు. ఆఫ్రికాలో ఒక్క ప్రార్ధనలో ఇరవై అయిదు వేల మంది స్వస్థపడియున్నారు. ఏడు వ్యానుల లోడు
కలిగిన చంకకర్రలు మరియు చక్రాలకుర్చీలు ఒక్క ప్రార్ధనలో తీసివేయబడ్డాయి. వారు దానిని నమ్మారు. వారు సాధకము చేయబడిన మన వేదాంతమంతటితోను మరియు మనము దానిలో పెట్టే పూతపూసే ద్రావణము (శవము పాడైపోకుండా), మీరు చూడండి. వారు... వారు నమ్మెదరు. ఆ అవిటివాడు మరియు అందరూ పైకి లేచి వెళ్ళిపోవడం వారు చూసినప్పుడు... ఆ సోంగాయ్ జాతిలో చాలా మంది అతడిని ఎరుగుదురు... లేక, జులు, లేక, మరియు వారు దానిని చూసినప్పుడు, సహోదరుడా, అది దానిని ముగించినది. వారు తమ చంకకర్రలను మరియు వాటిని విడిచిపెట్టారు, మరియు దేవుని స్తుతిస్తూ బయటకు నడిచారు. అది అదియే.

145. కానీ ఓహ్, మనము చెప్పెదము, "ఇప్పుడు, ఒక్క క్షణము ఆగండి. ఒక్కక్షణము ఆగండి. అది మానసికశాస్త్రము. ఓహ్, అది వశీకరణ చేసే మంత్రము. నేను నీకు చెప్తాను; డాక్టర్ జోన్స్ చెప్పాడు నేను దానిని గూర్చి జాగ్రత్తగా ఉండుట మంచిది". ఓహ్, లేదు, చూడండి. కనుక మనము ఎక్కడా కలిగియుండలేము, చూడండి.

146. ఆ కారణమును బట్టే మన హృదయములు ఆ దేశము కొరకు వెళ్ళును. అది నేను సహోదరుల మధ్య ఉన్నప్పుడు, నేను చెప్పెదను, “సహోదరులారా, ఒకవేళ మీరు మిషనరీగా పిలువబడకపోతే, మీ సంఘములో ఎవరినో తీసుకొనండి... మీరు చేయగలిగినదంతా చేసి మరియు అక్కడనున్న ఎవరినో బలపరచండి. “దాని కొరకు ఏదో ఒకటి చేయండి, చూడండి. ఒక మిషనెరీగా ఉంటూ మీరు తప్పు చేయలేరు. సాధారణమైన ఆజ్ఞలేవనగా "సర్వసృష్టికి వెళ్ళుడి”.

ఇప్పుడు, ఇక్కడ రింగుమాష్టారు వచ్చుచున్నాడు. చెప్పాడు, “బిల్లీ, నీవు ఏమి చేస్తున్నావు?"

నేను చెప్పాను, "నేను ఆ రంధ్రము గుండా చూస్తున్నాను”, చూడండి.

147. లేక, “మీరు ఏమి చూడాలనుకుంటున్నారు? మంచిది, నేను ఒకటి మీకు చూపించాలనుకుంటున్నాను, బిల్లీ". అతడు నన్ను నా మెడను పట్టుకొని లేపి, ఇక్కడకు పైకి లేపి మరియు అతడు చెబుతాడు, "ఏవిధముగా అది జరుగునో నీవు అక్కడ చూడు? అది ఇక్కడకు వెళ్ళును, మరియు ఈ గుడారము అక్కడే ఉన్నది, మరియు ఇదీ అక్కడే ఉన్నది”.

148. "ఓహ్, అవును. ఊహ్. అవును, అది అదే. ఊహ్. నీవు ఏమి చెప్పావో నేను చూశాను, ఊహ్", ఇప్పుడు, అతడు నన్ను క్రింద కూర్చొండబెట్టినప్పుడు, నేను అలసిపోలేదు. నన్ను బాధపెట్టలేదు, చూడండి. కానీ
అప్పుడు... చూడండి, అక్కడే వ్యత్యాసము. దేవుడు తన వరమును వాడుకొన్నప్పుడు, మరియు యేసును తీసుకొనిపోయెను, మరియు ఏమి జరగనైయున్నదో ఆయనకు చెప్పెను, మరియు ఆయన చనిపోయిన వ్యక్తిని లేపెను, ఆయన అలిసిపోయిన దానిని గూర్చి ఎన్నడూ చెప్పలేదు. కానీ ఆ చిన్న స్త్రీ ఆయన అంగీని తాకగానే, ఆయన చెప్పాడు, “నాలో నుండి ప్రభావము బయటకు...ఒక రక్తస్రావము". మీరు ఆ వ్యత్యాసమును చూశారా? అది దేవుడు తన వరమును ఉపయోగించుట, మానవుడు తన వరమును ఉపయోగించుట.

149. ఇప్పుడు, క్రీస్తు కొలతలేని ఆత్మను కలిగియున్నాడు. ఇప్పుడు, అది క్రీస్తు, పూర్తి మహాసముద్రము. ఇక్కడ ఉన్న నీ సేవకునిలో ఉన్న ఈ చిన్నవరము, సహోదరుడా, అది ఆ మహాసముద్రములో కేవలము ఒక చిన్న చుక్క. అది కొలతలో ఉన్నది. కానీ గుర్తించుకొనండి, ఆ పూర్తి మహాసముద్రములో ఉన్న అదే రసాయనములు ఆ స్పూనులో ఉన్నవి, ఆ చిన్న చుక్క కానీ అది దానికి తగినంత కాదు, చూడండి. కనుక మన పరిచర్యలు దేవుని యొక్క మహాప్రణాళికలో చేయబడిన అవే రసాయనములై యున్నవి. మరియు దేవుడు తనకు కావలసిన విధముగా ఆ రసాయనములను ఉపయోగించుకొనును. అది దానికి తగినంత కాదు. కానీ అంతా కలిపి, ఒక్కదానిలో ఉన్నదాని కన్నా అది మరెక్కువ. చూశారా, దేవుని యొక్క సర్వసంపూర్ణత ఆయన సంఘములో ఉన్నది. కానీ మనము కొలత కలిగిన ఆత్మను కలిగియున్నాము... కొలత కలది.

150. ఇప్పుడు, అదే బలహీనతను కలిగించునది. అదే అక్కడ జరిగియున్నది. ఆ కారణము చేతనే నేను వేదికపై ఎక్కువ సేపు నిలిచియుండను. ఆ కారణమును బట్టే వారు నన్ను గమనించెదరు. నేను దాదాపుగా స్పృహ కోల్పోయెదను. ఇప్పుడు, అది లోకములో నుండి బయటకు అడుగుపెట్టుచున్నట్లుగా ఉన్నది. నీవు వేరే లోకము నుండి బయటకు వచ్చుచున్నావు. నీవు ఇక్కడకు వచ్చుచున్నావు. కానీ అది ఏమి ప్రకటించుచున్నది? సహోదరుడా, ఆ నది ఆవల ఒక దేశమున్నది. ఎటువంటి సందేహము లేకుండా, మనము ఏమి ఏరకమైన కల్పనాకథలలో లేము. మనము ఏదో ఒక రకపు పురాణకథ, వూడో వశీకరణలో లేము. ఇది పునరుద్ధానుడైన క్రీస్తు తనను తాను రుజువు చేసుకొనుట.

151. ఆ రాత్రి వేదికపై నిలబడియుండగా ముగ్గురు లేక నలుగురు వెళ్ళిపోయిన తరువాత, ఇక్కడ ఒక గ్రుడ్డివాడు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు నేను ముగిస్తున్నాను. ఒక గ్రుడ్డివాడు వచ్చాడు. మరియు అతడు గ్రుడ్డివాడు. వారు
అతడి పేరు పిలిచారు. అతడెవరో అతడు చెప్పియున్నాడు. మరియు అప్పుడు, ఆ అభిషేకము క్రింద, ఆ ఆత్మను అనుభూతి చెందగలవు; అక్కడ ఆ కూడికలో నేను దానిని అనుభూతి చెందగలను... మీరు చెప్పగలరు ఎక్కడ ఆ చీకటి, చల్లదనము, ఆ వ్యత్యాసము ఉన్నదని (మీరు చూడండి), ఆ విధముగా. కానీ నేను దానికి అలవాటు పడ్డాను, నేను వాటిని బయటకు పిలిచెదెను. నేను చెప్పెదను, "దేనికొరకు నీవు అవిశ్వసిస్తున్నావు? నీవు ఫలానా-ఫలానా, ప్రెస్బిటేరియన్ బోధకుడవైన నీవు". మరియు ఆ మొదటి సంగతి నీకు తెలుసా, ఒకవేళ నీవు గురుగును పెళ్ళగించితే, దానితో పాటు గోధుమను కూడా నీవు లాగివేసెదవు. కనుక దానిని ఒంటరిగా విడిచిపెట్టుట మంచిది, చూడండి. ముందుకు కొనసాగు, నీ పనిని చేయి. "అది నీకేమి. నన్ను వెంబడించుము," చూడండి. నీవు ఏమి చేయవలసియున్నదో కేవలము దానిని చేసి మరియు అప్పుడు ముందుకు కొనసాగు.

152. కనుక అప్పుడు, నేను ప్రెస్బిటేరియన్లందరి గూర్చి కాదు చెప్పినది. చాలాసార్లు, పెంతుకొస్తు ప్రసంగీకులు (అది నిజము). అవిశ్వాసులు, మరి ఎక్కడ ఉన్నదాని కన్నా మరి ఎక్కువగా, సహోదరులారా అది నిజము. కనుక అప్పుడు, ఆ... ఇప్పుడు వారు నీయొద్దకు వచ్చెదరు. అదే గాయపర్చును. “సహోదరుడు బ్రన్హాం, మేము నిన్ను ప్రేమిస్తున్నాము”, అని వారు మీ యొద్దకు వచ్చెదరు. మరియు మీకు తెలుసు అది తప్పు అని వారిని అక్కడే చూసి మరియు ఆ ఆత్మను గమనించండి, దానిని అనుభూతి చెందండి. కేవలము కూర్చొని ఆ వ్యక్తితో కొద్ది నిముషములు మాట్లాడండి మరియు ఆ దర్శనము అక్కడ కార్యము చేయుటను గమనించండి. నేను దానిని చూడను. నేను దానిని ఎరుగను. అతడి యొక్క సాక్ష్యము సరైనది అని నేను నమ్మగోరుచున్నాను. చూడండి, అది నీలో ఒకదానిని సృష్టించును. దానిని నేను ఏమని పిలిచెదను? మంచిది, అది ఏదో నీవు దానిని కలిగియుండవలసిన అవసరము లేదనే ఒక అపనమ్మకమును అది సృష్టించును. ఏ విధముగానైనా నీవు వారిని ప్రేమించగోరుచున్నావు, మీరు చూశారా. మరియు ఆ కారణము చేతనే కొన్నిసార్లు నేను కొంచెము అపార్ధము చేసుకొనబడి మరియు నేనొక ఒంటరివాడను అని అనుకొనెదను. నేను కాదు. నేను నా సహోదరులను ప్రేమించెదను, చూడండి. కానీ, నేను కలిగియుండాలనుకొనుచున్నాను... ఆ ప్రేమను నాలో నిలిపియుంచాలనుకుంటున్నాను. అది ఎన్నడూ ముక్కలవ్వాలని నేను కోరుకోవడము లేదు, చూశారా? ప్రతీ వ్యక్తి నన్ను ప్రేమించును, మరియు నేను ప్రతీ వ్యక్తిని ప్రేమించెదను. ఆ విధముగానే ఇది ఉన్నది, మీరు చూడండి? నేను దానిని చేయగోరుచున్నాను.
153. అప్పుడు, మరియు ఈ మనుష్యుడు వచ్చినప్పుడు, అతడెవరో అది అతడికి చెప్పినది. చెప్పెను అతడొక బిచ్చగాడు, మరియు అతడు సూర్యుని ఆరాధించువాడు. (మీరు వినేయుంటారు). మరియు అతడు ఇరవై సంవత్సరాల నుండి గ్రుడ్డివాడిగా ఉన్నాడని అతడికి చెప్పెను. నా చొక్కా ఉన్నంత తెలుపుగా, అతడి ముఖము ఉన్నది. అది నిజము. అతడు చెప్పాడు అది నిజము. మరియు నేను ప్రేక్షకులను చూసినప్పుడు, రాజా వారు అక్కడ కూర్చొన్నారు, అది ఎవరైనా, మరియు ప్రజలు అక్కడ ఉన్నారు. వారు అనుకొన్నారు అది మానసికశాస్త్రము కార్యము చేయుట లేక మరేదో అని. మీరు దానిని చెప్పగలరు. మరియు నేను చెప్పాను, "ఆ వ్యక్తిని పరీక్షించుటకు అక్కడ వైద్యుడెవరైనా ఉన్నారా?" అక్కడ ఏ వైద్యుడు లేడు. మీరు చూడగలరు అతడు పూర్తిగా గ్రుడ్డివాడు, మీరు చూడండి. మరియు నేను అతడితో చెప్పాను, "అయ్యా, నేను నీ కొరకు చేయగలిగినది ఏమీ లేదు". చూడండి, అతడెవరో నేను చెప్పుట జరిగినది, మరియు అది నిజము. అతడికి ఇద్దరు పిల్లలున్నారని అతడికి చెప్పాను, మరియు అది నిజము. అతడు ఎంతకాలము నుండి గ్రుడ్డివాడిగా ఉన్నాడని చెప్పాను; అది నిజము. మరియు అతడికి చెప్పాను అతడు తన కళ్ళను గూర్చి ఉపశమనము కొరకు వెదకుచున్నాడు, ఒక స్వస్థత. మరియు అతడి హృదయములో, తనను బాగుచేసిన ఏ దేవుడినైనా నేను సేవించెదనని అతడు చెప్పుకున్నాడు, చూడండి. తనను బాగుచేసిన ఏ దేవుడినైనా అతడు సేవిస్తాడు. ఇప్పుడు, ఇక్కడ నేను మీ యొక్క... ఇప్పుడు మీ దేవుడిని మీరు ఎరుగుదురు, సహోదరులారా, చూడండి. ఏదేవుడైనా అది...

154. మరియు అక్కడ సుమారు పదిహేను వివిధ రకములైన మతముల వారు చుట్టూ కూర్చొనియున్నారు: ఈగలను ఆరాధించువారు, పశువులను ఆరాధించువారు, దీనిని ఆరాధించువారు, దానిని ఆరాధించువారు. మీకు తెలుసు భారతదేశము ఏవిధముగా ఉండునో. అది పూర్తిగా కేవలము మూఢభక్తి కలిగినది. మరియు అందరూ చుట్టూ, వారు ఆ స్థితిలో అక్కడ కూర్చొనియున్నారు. మరియు నేను అనుకొన్నాను, “ఓహ్, దేవా...” మరియు నేను చెప్పాను. “ఇప్పుడు, ఇదిగో ఆ వ్యక్తి. అతడు గ్రుడ్డివాడు. అతడికి సహాయము చేయుటకు ఏమీ నేను చేయలేను”. నేను చెప్పాను, "అది దేవుడికి తెలుసు". మరియు నేను చూసినప్పుడు, చుట్టూ చూస్తున్న కళ్ళతో అతడు నాకు కనిపించాడు (మీకు తెలుసు), ఆ దర్శనములో, తన కళ్ళను నలుపుకుంటూ మరియు నవ్వుతూ.
155. ఓహ్, సహోదరులారా, ఓహ్, నేను కేవలము ఆశించుచున్నాను నేను ఇప్పుడు వ్యాకరణమును కలిగియున్నాను లేక అది ఏమిటో తెలుసుకొనవలెను మరియు నాలో ఉన్న దేనినో మీరు చూచుటకు అటువంటి అనుభూతి, చూడండి. అది ఇక నేను ఉపయోగించుటకు ఎంతమాత్రము ఒక విశ్వాసము కాదు. అది ఒక నాటకము. దేవుడు దానిని ఇప్పటికే చెప్పియున్నాడు. భూమ్యాకాశములు గతించిపోతాయి, కానీ ఆయన వాక్యము గతించదు. నరకములోని అన్ని దయ్యములు దానిని ఇప్పుడు ఆపలేవు. దేవుడు ఆ విధముగా చెప్పాడు, చూడండి. అది దానిని స్థిరపరచును.

156. అక్కడ నిన్నటి ఉదయమున అతడు నాకు చెప్పినట్లుగా అది ఉన్నది. ఓహ్, నేను పట్టించుకొనను: ఆ అలలు గర్జించును గాక. అది దానితో చేయగలిగినది ఏమి లేదు. ఫిన్ల్యాండ్లో ఆ చిన్నబాలుడు, ఓహ్, చాలా స్థలములు, దేవుడు ఆవిధముగా చెప్పినప్పుడు, అది దానిని స్థిరపరచును. అప్పుడు, అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు". చూడండి. దానిని గమనించండి.

157. నేను తలంచాను, “ఓహ్, దేవా, ఏవిధముగా నేను నీకు కృతజ్ఞత తెలపగలను. నీవు ఇంకనూ యెహోవాయే. నీవు ఇంకనూ సర్వశక్తుడవే.” అప్పుడు నేను నా స్థానమును తెలుసుకున్నాను. అప్పుడు నేను ఎక్కడ నిలబడియున్నానో నేను ఎరిగియున్నాను. అతడు ఎన్ని దయ్యములు పంపించిననూ నేను పట్టించుకొనను, అప్పుడు ఏ వైఫల్యమును లేదు. దేవుడు ఆవిధముగా చెప్పెను. కర్మెలు పర్వతముపై ఏలియా వలె నీవు అనుభూతి చెందుచున్నావు, అక్కడ నిలబడి బయలు ప్రవక్తలను చూసి అతడు అరుస్తున్నప్పుడు, "బహుశా అతడు యాత్రకు వెళ్ళి ఉండవచ్చు. బహుశా అతడు పారిపోవుచున్నాడు". ఏలియా చెప్పాడు, “ప్రభువా, నీ మాటను బట్టి, నేను దీనిని చేశాను". ఏమి జరుగబోతున్నదో ఖచ్చితముగా అతడికి తెలుసు. ఆ కారణము చేతనే అతడు దానిని చెప్పగలిగెను.

158. ఓ, సహోదరులారా, మనం మతం ఒక కల్పనాకథ కాదు. అది కొంత శాంతక్లాజ్ కథ కాదు. అది ఒక నిజంగా జీవించుచున్న యేసు. ఆయన యొక్క వాక్యంపై ఆయనను పరీక్షించుటకు భయపడవద్దు ఎందుకనగా ఆయన తన వాక్యమును నిలబెట్టుకొనును. అది నిజము. ఆయన తన వాక్యమును నిలబెట్టుకొనును.

159. అక్కడ నేను దానిని చూచినప్పుడు, నేను తలంచాను, “ఓ,దేవా. ఆఫ్రికాలో ఉన్నట్లుగా, ఇప్పుడు నీవు ఇండియాలో చేయబోవుచున్నావు.” మరియు
నేను ప్రేక్షకుల వైపు తిరిగాను. నేను చెప్పాను, "భారతదేశం యొక్క మత నాయకులు". వాళ్ళను నేను నా సహోదరులుగా పిలవలేకపోయాను, ఎందుకనగా వారు నా సహోదరులు కారు. “భారతదేశపు మత నాయకులారా, అక్కడ మీ దేవాలయములో మీరు నాకు చెప్పుచున్నారు..."

160. ఓ, దేవుడు ఎల్లప్పుడు ఏవిధంగా మార్గం చేయును. అవును, అయ్యా, పోట్లాడుకోవద్దు. అతడు మార్గమును అతడు కలిగియుండనిమ్ము. అతడిని ఒంటరిగా విడచిపెట్టుము. నీవు కొనసాగిపొమ్ము. అతడిని వెంబడించుము.

161. నేను చెప్పాను, "ఈరోజు మీ ఆలయములో, మీ దేవుడు ఎంత గొప్పవాడని మరియు నా దేవుడు ఎంత కల్పితమైనవాడని మీరు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఏవిధంగా ఆ వ్యక్తి ఎన్నడూ చనిపోకుండా, అతడు గుర్రమునెక్కి పరలోకమునకు వెళ్ళెను.” నేను చెప్పాను, "కాని అతడు చనిపోయెను మరియు అవును, ఆయన తిరిగిలేచెను." నేను చెప్పాను. "ఇక్కడ సూర్యుని ఆరాధించే ఒక మనుష్యుడు నిలబడియున్నాడు. ఇరవై సంవత్సరముల నుండి గ్రుడ్డివానిగా ఉన్నాడని సాక్ష్యమిచ్చుచున్నాడు." మరియు నేను చెప్పాను, "అతడు తన దృష్టిని వెదకుచు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు." నేను చెప్పాను, "ఖచ్చితంగా అతడిని చేసిన దేవుడు, తనను చేసిన సృష్టికర్త,” నేను చెప్పాను, "అతడికి తన చూపును వెనకకు తిరిగి ఇచ్చును."

162. నేను చెప్పాను, “ఇప్పుడు, అవును, సిక్కులైన మీరు, మరియు జైనులైన మీరు, మరియు మహ్మదీయులు, మరియు బౌద్ధులు, మరియు అటువంటివారు, మీరు చెప్పెదరు ఆయన తప్పు అని". కాని నేను చెప్పాను, మీరేమి చేయుదురు? మీరు చెప్పెదరు, 'మా దగ్గరకు రండి'. మీరేమి చేయుదురు? అతడు ప్రార్ధించే విధానమును మీరు మార్చెదరు". నేను చెప్పాను, "మీరేమి చేయుదురు? మీరు కేవలం అతడి వేదాంత శాస్త్రమును మార్చెదరు". నేను చెప్పాను, “మరి దేనినో అతడు ఆరాధించునట్లుగా, లేక ఏదో చేయునట్లుగా అతడు ప్రార్ధించే విధానమును మార్చబడునట్లుగా మీరు చేయుదురు.” నేను చెప్పాను. "అమెరికాలో మేము అదే సంగతిని కలిగియున్నాము”, నేను చెప్పాను. “కాని అది ఆ వ్యక్తికి సహాయపడదు”. నేను చెప్పాను, "మీరు కేవలం అతడిని మతమార్పిడి చేయగలరు".

163. మరియు నేను చెప్పాను. "ఒకవేళ సూర్యుని యొక్క ఆరాధికుడి నుండి మార్చబడుటకు అతడు ఇక్కడికి వచ్చియుంటే, మీరు చెప్పినట్లుగా ... అతడు సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించును. అదే అతడు చేసెను, మరియు అజ్ఞానం
చేత అతడు దీనిని చేసెను. కాని ఒకవేళ మీరు అతడిని జైనుడిగా చేసినయెడల మీరు ఏమి చేసెదరు? ఒకవేళ మీరు అతడిని మహ్మదీయునిగా చేసినయెడల మీరు ఏమి చేసెదరు?" నేను చెప్పాను, "ఎందుకు, అతడు బాగుపడడు. అతడు ఇంకనూ గ్రుడ్డివాడు, మరియు మీరు కేవలం అతడి వేదాంతమును మాత్రమే మార్చగలరు, అతడు ప్రార్ధించే విధానము, అతడి ఆలోచనను మార్చి, అతడి సంఘశాఖను మార్చును." నేను చెప్పాను, "మేము అమెరికాలో అదే సంగతిని కలిగియున్నాము. బాప్టిస్టులందరూ ప్రతీ మెథడిస్టును మార్చివేసి బాప్టిస్టు సంఘమునకు అతడిని తీసుకొన రాగోరుచున్నారు. మరియు ప్రతీ మెథడిస్టు బాప్టిస్టులను మార్చివేయగోరుచున్నాడు మరియు బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్, లూథరన్లు. పెంతుకొస్తు వారు వారందరిని తీసుకొనగోరుచున్నారు". మరియు నేను చెప్పాను, “ఆ విధంగానే అది వెళ్ళుచున్నది. కాని నేను చెప్పాను." అది ఏమిటి? అది పూర్తిగా మానసికశాస్త్రము". అది నిజం. కాని నేను చెప్పాను, "మేము ఒక్క దేవున్ని కలిగియున్నాము, మీరైతే అనేక మందిని కలిగియున్నారు." కాని నేను చెప్పాను, "అమెరికాలో అది ఆ విధంగానే ఉండును. వారు మతమార్పిడులు చేయుచూ, మరియు లాగుచూ, మరియు సణుగుకొనుచూ, మరియూ ప్రతీదీ దీనియొద్దకు వచ్చుటకు ప్రయత్నించుచున్నది, అన్ని ఇక్కడకు వచ్చుటకు, 44లో కొన్ని లక్షల వాటిని (సంఘాలు) ఎక్కువగా నిర్మించుట మరియు ఇవన్ని నినాదాలు మరియు అటువంటి సంగతులు". నేను చెప్పాను, "అది ఏమిటి? సంఘశాఖలను నిర్మించుటలో అది పూర్తిగా మానవ వేదాంతము.”

164. మరియు నేను చెప్పాను, "నేను సవాలు చేయుచున్నాను..." నా ఉద్రేకములను క్షమించండి." బౌద్ధ యాజకుడు ముందుకు వచ్చి మరియు అతడికి చూపును ఇవ్వాలని నేను సవాలు చేయుచున్నాను. ఒకవేళ నీవు దానిని చేస్తే, ఇప్పటి నుండి అతడు బౌద్ధుడుగా ఉంటాడు, మరియు నేను కూడా.” “నేను చెప్పాను, ఒక మహ్మదీయ యాజకుడు ముందుకువచ్చి మరియు అతడికి చూపును ఇవ్వాలని నేను సవాలు చేయుచున్నాను. ఇప్పటి నుండి అతడు మహ్మదీయుడిగా ఉంటాడు. మరియు నేను కూడా.”

165. ఓ, సహోదరుడా, మన దేవుడు సజీవుడు. ఇక్కడ అమెరికాలో, ఈ సంగతులలో ముఖాముఖి మీరు రావద్దు. మీరు ఆ భూభాగములలోనికి వెళ్ళాలి... అక్కడే వారు గమనిస్తున్నారు, చూడండి. అక్కడే మీరు ప్రదర్శనను కలిగియున్నారు. ఓహ్, మీరు చెప్పవచ్చు, "నేను రుజువు చేయగలను... నేను ఒక పెద్ద సంస్థకు
చెందినవాడిని". దీనితో చేయుటకు అది ఏమియూ కలిగిలేదు. సహోదరుడా. అది నిజము.

166. నేను చెప్పాను, “వారు వచ్చి మరియు అతడికి తన చూపును ఇమ్మని ఏ మతము వారికైనా నేను సవాలు చేయుచున్నాను. మరియు అతడు మీ మతములో చేరును, మరియు నేను కూడా". నేను చెప్పాను, "ఖచ్చితముగా, అతడిని చేసిన సృష్టికర్త, అతడు సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించడం ఒకవేళ ఆయన చూస్తే, ఖచ్చితముగా ఆయన అతడిని తిరిగి తన అసలైన స్థితిలోనికి తీసుకొని వచ్చును, ఒకవేళ అతడు తన అజ్ఞానము ద్వారా ఆరాధిస్తే, అతడిని సరైన దానికి తీసుకొని వచ్చును. మరియు నేను చెప్పాను ...

167. నేను ఇంతవరకూ మాట్లాడిన అతి నిశ్శబ్దమైన గుంపు అది. వేలాదిగా, మీరు చూడగలిగినంత దూరములో, అక్కడ ఒకరిపై ఒకరు పడి, మరియు కలిపి పోగుపడ్డారు. అది నిశ్శబ్ధముగా ఉన్నది. గొప్ప యాజకులు మరియు మొదలగువారు, ప్రతీఒక్కరూ తమ తలదిండ్లపై కూర్చొన్నారు. ఎవ్వరూ కదలలేదు.

168. నేను చెప్పాను, “అప్పుడు, పెద్ద మనుషులారా, ఎందుకు మీరు ఏమీ చెప్పరూ?” నేను చెప్పాను, "ఈరోజు జైనుల దేవాలయములో, మీరు చెప్పారు. క్రైస్తవ్యము ఎంత చిన్నదని, మరియు అది ఎంత తక్కువ సంఖ్యలో ఉన్నది." మరియు అది ఆవిధముగానే ఉన్నది. మహ్మదీయులు గొప్పవారు, మరియు కేథలిక్కులను మరియు మేమందరము కలిపి మేము మూడు లేక నాల్గవ స్థానములో ఉన్నాము. "మేమెంత చిన్నవారమో మీరు చెప్పారు. కానీ ఇప్పుడు, మీరు ఎంత పెద్దవారు?

169. ఓహ్, అప్పుడు మేమెరిగియున్నాము. నేను ఎన్నడూ దానిని చెప్పియుండేవాడిని కాదు, సహోదరుడా, అది దేవుడికి తెలుసు, ఒకవేళ ఆ దర్శనము అక్కడ లేకపోతే... లేదయ్యా. కానీ దేవుడు ఆ విధముగా చెప్పాడు, మరియు అది దానిని స్థిరపరచినది. ఆఫ్రికాలో కూడా అదే సంగతి జరిగియున్నది. ఖచ్చితముగా, అది ఇక ఎంతమాత్రము నేను కాదు అని నాకు తెలుసు. నేను కేవలము ఆయన నోరు మాత్రమే. అదిగో ఇది.

170. ఆయన చనిపోయిన బాలున్ని లేపినప్పుడు అదే సంగతి ఫిన్ల్యాండ్లో జరిగినది. మీరు ఆ కథను చదివారు. ఖచ్చితముగా అది నిజము. ఆయన దేవుడు. ఆయన తన సేవకులకు అన్ని సంగతులను చెప్పడు. కానీ ఆయన మిమ్ములను ఉపయోగించుటకు కోరుకొనినప్పుడు, ఆయన తన చేతులను మీపై ఉంచి,
మిమ్ములను ఇక్కడకు తీసుకొని వచ్చి మరియు దానిని చేయును. ఒకవేళ మీరు దీనులుగా ఉండి మరియు మీస్థానములో నిలబడితే, నేను చేయగలిగిన లేక మీరు చేయగలిగిన దానిలో నుండి ఆయన అధిక మహిమను తీసుకొని వచ్చును. అది నిజము. మీ పిలుపులో నిలిచియుండి, మరియు దేవుడు నిన్ను ఎక్కడికో కదిలించువరకు అక్కడే నిలిచియుండుము. అది నిజము.

171. అక్కడ, అతడు అక్కడ నిలబడినప్పుడు, నేను చెప్పాను, "అది భయంకరమైన నిశ్శబ్ధము". నేను చెప్పాను, "ఎందుకు? ఎందుకనగా దానిని నీవును చెయ్యలేవు మరియు నేను కూడా... పరలోకములో ఉన్న దేవుడు, యెహోవా దేవుడు తన కుమారుడిని లేపెను, క్రీస్తు యేసు, ఈ రాత్రి ఇక్కడ నా ప్రక్కన నిలబడి మరియు ఈ మనుష్యుడు తన చూపును పొందుకొనబోవుచున్నాడని ఒక దర్శనమును చూపించెను, మరియు అది 'ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు'. ఒకవేళ దేవుడు ఆవ్యక్తికి తన చూపును ఇవ్వకపోతే, నేను ఒక అబద్దప్రవక్తను". మరియు నేను చెప్పాను, "అప్పుడు నేను ప్రాతినిథ్యము వహించుచున్న నా మతము, నేను క్రైస్తవ్యమునకు తప్పుగా ప్రాతినిథ్యము వహించుచున్నాను. కానీ ఒకవేళ దేవుడు దీనిని చెబితే: అప్పుడు ఒకవేళ దానిని ఆయన చేస్తే, ఇక్కడున్న ఎంతమంది మీ యొక్క ఆచారములను విడిచిపెట్టి మరియు ఆ గ్రుడ్డివాని యొక్క చూపును పునురుద్ధరించగలిగిన సజీవుడైన దేవున్ని సేవించెదరు?" మరియు మీరు చూడగలిగినంత దూరము, ఆ చేతులు గాలిలో లేపబడ్డాయి, చూడండి.

172. అదిగో ప్రదర్శన. అదే రుజువు. పాత సామెత చెప్పినట్లుగా, "ఆహారమున్నది అన్నదానికి రుజువు అక్కడ తినుచుండుటయే". అదిగో అది. మన వేదాంతశాస్త్రము కాదు మరియు మన మానసికశాస్త్రము కాదు, కానీ భూమ్యాకాశములను సృజించిన నిజమైన అసలైన సృష్టికర్త యొక్క రుజువు. మరియు భూమిపై నున్న మనలను పరిశుద్ధాత్మ కమ్ముకొన్నట్లుగా, ఖచ్చితముగా పరిశుద్ధాత్మ యొక్క పెంపకము మనలను తిరిగి మన అసలైన స్థితిలోనికి పునరుద్ధరించును.

173. మరియు అక్కడ ఆ స్థలములో నిలబడి, నిశ్చయత కలిగిన హృదయముతో అప్పుడు తిరుగుచూ మరియు నేను ఆ మైక్రోఫోను యొద్దకు నడవగలను అని నేను నమ్మగలిగిన విశ్వాసము. అవునయ్యా. ఎందుకనగా, అది నేను కాదు. లేదు, సహోదరులారా. అది దానితో చేయగలిగినది ఏమియూ లేదు. అది యెహోవా దేవుడు రంగము మీద కదులుటకు సిద్ధపడుటైయున్నది. అది నిజము. మరియు ఒక వరము ద్వారా, ఆయన ఇప్పుడే ఒక దర్శనము ద్వారా
నాకు చూపించెను. మరియు ఆయన ఆ సమయములో దానిని ఉపయోగించగోరెను. ఖచ్చితముగా ఒక గుంపు అన్యుల ముందు ఆయన తన వరమును ఉపయోగించును. అక్కడ, అక్కడ నిలబడి, ఆవిధముగా, ఆ వ్యక్తి యొద్దకు నడిచి మరియు నా చేతులను అతడి ముఖముపై ఉంచెను.

174. మరియు నేను చెప్పాను, "పరలోకపు తండ్రీ, కొద్ది క్షణముల క్రితము దర్శనమును చూపినవాడవైన నీవు”, నేను చెప్పాను, “ఓడ పైనున్నటువంటి ఆ పాత పౌలు వలె నేను అనుభూతి చెందుచున్నాను, మరియు చెప్పాడు, 'ధైర్యము కలిగి ఉండుడి'. చూడండి. ఏలయనగా నాకు తెలుసు ఆ వ్యక్తికి తన చూపునిచ్చెదవని నాకు తెలుసు, ఎందుకనగా నీవు ఆవిధముగా చెప్పావు. మరియు నాకు కలిగియున్న జ్ఞానమును బట్టి నేను నీ వాక్యమును పలికాను, మరియు ఒకవేళ నీవు దీనిని చేస్తే, నిన్ను తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించాలని నేను ప్రతీ ఒక్కొక్కరికి వాగ్దానము చేశాను. ఇప్పుడు, దేవా, భూమ్యాకాశములను సృజించిన దేవా, ఇప్పుడు యేసును మరణము నుండి లేపినవాడా, భూమ్యాకర్షణ తన శక్తిని కోల్పోవడము మేము లేచి నిలబడి చూచెదము, ఎందుకనగా ఆయనే గురుత్వాకర్షణ కేంద్రము, ఆయన ఆ చల్లబడిన శరీరమును లేపి మరియు ఆయనను మహిమలోనికి పంపియున్నాడు. ఇప్పుడు, నీవే ఈ దినపు దేవుడవని తెలియపరచబడునుగాక. యేసుక్రీస్తు యొక్క నామములో నేను దీనిని అడుగుచున్నాను”.

175. నేను అక్కడ నా చేతులుంచినప్పుడు, మరియు ఎప్పుడు (ప్రార్ధన అనువదించబడలేదు) ..., నేను నా చేతులు దించినప్పుడు, ఆ వ్యక్తి చూచాడు. అతడు గట్టిగా కేక వేశాడు. అతడు నన్ను నడుము చుట్టూ చేతులు వేసి లాగాడు. అతడు ఆ పట్టణపు మేయరును లాగి మరియు అతడిని హత్తుకోవడము మరియు అతడిని ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. అతడు కేవలము ... ఇక్కడ కూర్చొన్న మరే వ్యక్తి కన్ననూ బాగా చూడగలడు. నేను మీకు చెప్పుచున్నాను: ఒక కలవరము, ఒక కేక ఆ ప్రజలలో నుండి వెళ్ళెను, మరియు ఆ సంగతి అంతా ఒక గందరగోళములోనికి వెళ్ళెను. రెండు లేక మూడు గంటల తరువాత, వారు నన్ను ఆ గుంపు నుండి, ఒక సైన్యము వారిని వెనుకకు నెట్టుచుండగా నన్ను తీసుకొని వెళ్ళెను. నా కోటుకు నాకు ఎటువంటి జేబులు లేవు. నా బూట్లు పోయినవి. నాపైనున్న ప్రతీ వస్త్రమును లాగివేసిరి, దాదాపుగా వస్త్రహీనుడిని చేస్తున్నారు, అరుస్తూ కేకలువేస్తూ మరియు ఏడ్చుచుండెను. మరియు మరుసటి దినమున విచారముతో నేను భారతదేశమును విడవవలసివచ్చెను, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని వాగ్దానము చేసి ...
176. కానీ, సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు ఈ రోజుకు కూడా సత్యమైయున్నవి మరియు అంతే ప్రాముఖ్యతగలవి. ఆయన ఎప్పుడూ ఉన్నదాని కన్నా ఈ రోజు కూడా ఆయన పునరుద్ధానుడైయున్నాడు. మరియు ఆయన అదే ప్రభువైన యేసు, మరియు ఈరోజు ఆయన మనతో ఉన్నాడు. భయపడవద్దు; ప్రభువును నమ్ముకొనుడి. అది నిజము.

177. ప్రార్ధించుకొందాము. పరలోకపు తండ్రీ, స్త్రీలు మరియు పురుషులు ఇక్కడ కలిపి కూర్చొనియున్నారు. మేమందరము ఈ ఆశీర్వాదములో సంబంధులమైయున్నాము. మరియు వారి యొక్క గొప్ప రక్షకుడు వేరే దేశములలో ఏమి చేయుచున్నాడు అని చెప్పుటకు ఈరోజు నిలబడుటకు నేను చాలా సంతోషపడుచున్నాను, పురుషులు ఎవరైతే... పరిశుద్ధాత్మ యొక్క గొప్ప సందర్శన యొక్క భాగ్యమును కలిగిలేనివారు... ఈ స్త్రీలను మరియు ఈ పురుషులను మీరు ఆశీర్వదించెదరని నేను ప్రార్ధిస్తున్నాను.

178. ఓ నిత్యదేవా, ఈ ఉదయకాలమున ఈ గుంపులో ఈ పరిచర్య చేయుచున్న వరములు, వారు బాప్టిస్టులు, మరియు మెథడిస్టులు మరియు ప్రెస్బిటేరియన్, మరియు పెంతుకొస్తు, వేర్వేరు దశలకు మరియు సంగతులకు చెందినవారు. ఓహ్, దేవా, ఈ ఉదయకాలమున ఒక్క సంగతిని కలిగియున్న మేమందరము ఈ సహవాసమును, ఇది ఎన్నడూ వారిని విడిచిపెట్టకుండునుగాక.

179. మరియు బహుశా, వారిని ఏ స్థానములో నీవు ఉంచినప్పటికీ, మరియు నిత్యజీవములోనికి వారిని నిర్ణయించినప్పటికీ, మరియు వారి యొక్క స్థానములు వారికి ఇచ్చి, వారు గౌరవముతో సేవించెదరు గాక. ఒక మహిమకరమైన దినమున, యేసు వచ్చును, మరియు ఈ లోకవిచారములు మరియు ఇబ్బందులన్నీ తీసి వేయబడును, మరియు మనము ఆయనను చూచెదము. ఆయన యొక్క మహిమకరమైన శరీరము వంటి శరీరమును మనమునూ కలిగియుందము. మరియు మనమందరము కలిపి ఆవలిగట్టున కూర్చొన్నప్పుడు, ఓహ్, అది ఏవిధమైన దినమై యుండును. ఓహ్, ఇక్కడ ఉన్న ప్రతీ సేవకుడు, అతడి బలిపీఠము, అతడి ప్రసంగములు, అతడి యొక్క పరిచర్య గొప్పగా ప్రేరేపించబడునుగాక. ఒకవేళ నీ దృష్టిలో నేను కృపను పొందుకుంటే దానిని అనుగ్రహించండి, ప్రభువా.

180. మరియు ఈ ఉదయకాలమున నా సహోదరులు ఇక్కడ నిలబడినప్పుడు. ఓహ్, ఇక్కడ ఉన్న ప్రతీ సేవకులు, ఈ పరిచర్య చేయుచున్న ఆత్మలు, ఆ, దేవుడు, నా ప్రార్ధన వినాలని నేను ప్రార్ధించుచున్నాను. మరియు
వారిలో ఉన్న ఆ వరమును నీవు ప్రక్షాళన చేయుదవని నేను ప్రార్ధించుచున్నాను ఒకవేళ వారు ప్రసంగీకులైతే, వారిని మంచి ప్రసంగీకుల వలె చేయండి. ఒకవేళ వారు సువార్తికులైతే, వారిని మంచి సువార్తికుల వలె చేయండి. ఒకవేళ వారు మంచి ఉపదేశకులైతే, వారిని మంచి ఉపదేశకుల వలె చేయండి. ఒకవేళ వారు పాష్టరులైతే, వారిని మంచి పాష్టరుల వలె చేయండి. దేవా, వారు దేవుని యొక్క ఆత్మతో నింపబడునట్లు దానిని అనుగ్రహించండి, మరియు ఆ గొప్ప ద్రాక్షావల్లితో శక్తిని పొందుకొని, మరియు ఈరోజు అవసరత కలిగియున్న ఈలోకము యొక్క అవసరతలను తాకుటకు, మరియు పరిచర్య చేయు శక్తిని కలిగియుండుటకు, అది వారికి నిత్యజీవమును ఇచ్చును.

181. మా అతిక్రమములను మన్నించండి. మా యొక్క అనాలోచనాత్మక నమ్మకములను మరియు చిన్న మతపరమైన ఆలోచనలను క్షమించి, మరియు ఒక పెద్ద సహోదరత్వములోనికి మేము బాప్తీస్మము పొందుదుము గాక, ఒక పెద్ద సహవాసములోనికి, ఈ దినమున మనమందరము కలిపి వచ్చుట ద్వారా దేవుని యొక్క రాజ్యము ముందుకు కొనసాగబడును గాక. క్రీస్తు యొక్క నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమెన్

182. సహోదరులారా, మిమ్ములను ఎక్కువ సమయము ఉంచినందుకు నన్ను క్షమించండి. కానీ అది ఆలస్యములోనే ఉన్నది. అది పదిన్నర. లేదు, పావు తక్కువ పదకొండు. అదనపు దాని కొరకు నేను చెల్లించెదను. నన్ను క్షమించండి, కానీ నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...