కృపా వర్తమానము
కృపా వర్తమానము
(MESSAGE OF GRACE)
ວ໖ 21, 1963
సియెరావిస్టా, ఆరిజోనా, అమెరికా
" దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరుడు నెవిల్, మీకు కృతజ్ఞతలు. స్నేహితులారా, ఉదయకాలపు నమస్కారములు. మనము ప్రభువు ఆరాధనలో మరలా ఈ ఉదయకాలమున ఇచ్చట యుండుటమనేది నిశ్చయముగా ఒక భాగ్యమైయున్నది. ఈ చిన్న సంఘములో ప్రజలు కూర్చుండుటకు కూడా స్థలమును యివ్వలేకపోవుచున్నందుకు చాలా చింతించుచున్నాము." ఇచ్చట ఎక్కువమందికి స్థలము ఉండదు. అయినా గాని మీరందరూ యిచ్చటకు వచ్చి, మాతో సహనముగా వేచియుండుటకు, త్యాగము చేయుటకై ముందుకు వచ్చినందుకు మేమెంతో సంతోషించుచున్నాము. మాకు సాధ్యమైనంత వరుకు ఏ విధముగా బహు శ్రేష్టమైన రీతిలో ప్రభువు వాక్యమును మీకు తీసుకొనిరాగలమో అంతటి శ్రేష్టముగా మేమెరిగిన విధానములో దానిని చేసెదము. ఇప్పుడు నేను కేవలము.....
2. లోపలకు నడుస్తూ వచ్చిన ఈ చిన్న స్త్రీ, ఒక బిడ్డను ప్రతిష్టించుటకై ఆమెయొద్ద యుండెను; : అయితే కొంచెము ఆలస్యము యగుటను ఆమె చూచి, నేను వేచియున్నాను అని ఆమె చెప్పెను. ఈ స్త్రీని నేను ముందెన్నడూ చూడలేదు, కాని ఆమె సహనముతో వేచియుండుట వలన దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆయనయొక్క ఆశీర్వాదములలో విలువలైన వాటిని ఆమె తన హృదయములో కలిగియుండునట్లుగా నేను ప్రార్ధించితిని.
3. సంవత్సరమునందు చల్లని వాతావరణమును కలిగియుండే కాలము ఇప్పుడు సమీపించుట వలన ఈ విధముగా మనము సంఘములో చాలామందిమి కూడియుండు నప్పుడు అది వేడిమిగా యుండదు. దేవుడు మనలందరిని బహుగా ఆశీర్వదించునని మనము నమ్ముచున్నాము.
4. ఇప్పుడు, నేను మాట్లాడుటకు ముందుగా ఇచ్చట నేను కొన్ని విషయములను చెప్పవలయునని ఆశించుచున్నాను. నేడు ఉదయకాలమున ప్రభువు చిత్తమైనయెడల, "గాలులలో యున్న నుడిగాలి" అనే అంశముపై మాట్లాడుదునని ముందుగానే ప్రకటించితిని. కాని ఆయన నాకోసము దానిని మార్చివేసెను. ఇచ్చట కూటమునకు వచ్చుటకు ముందు కొన్ని నిమిషములకు ముందు ఎరుగుదును, దానికి ముందు నేను ఏమి మాట్లాడబోవు
చున్నాననేది నాకు తెలియనే తెలియదు. నేను అ అంశముపై ప్రసంగించవలెనని రెండవసారి ప్రయత్నించినప్పుడు దేవునియొద్దనుండి దానికి జవాబును పొందుకోలేక పోయాను. ఎందుచేత అని నేనెరుగను. ఏమి మాట్లాడబోవుచున్నాననేది, దానికోసము మీరు ప్రభువుయొద్ద వేచియుండవలెనని, ఇచ్చటయున్న సేవకులందరూ దానిని ఎరుగ వలెనని నేను ఎల్లప్పుడూ ఆశించెదను.
5. గత సాయంకాలమందు ఫోనులో, ఆర్కాన్సాస్లో ఎచ్చటోయున్న స్థలమందు నాకు - ఒక ఫోను వచ్చినది, కొంతమంది జనులు ఈ వచ్చే వారమంతా ఇచ్చట ఏడు ముద్రలపై ఒక కూటమును ఇచ్చట మీరు ప్రారంభించబోవుచున్నారని మేము విన్నాము అని వారు చెప్పిరి. నేను ఇప్పుడే ఏడు సంఘకాలమును ముగించితిని. ఆమె భర్త లూయిస్విల్లికి వచ్చే సోమవారము ఒక ఉద్యోగమును వెదుకుటకు వచ్చుచుండెను; అందువలన ఆ ఏడుముద్రల ప్రసంగము వినుచు ఉద్యోగము చేసుకుంటూ దగ్గరగా యుండవలననే ఉద్దేశ్యముతో అతడు ఆ విధముగా వచ్చుచుండెను. “దానికి ఇంకా మూడు నెలలు పట్టును, ఆ కూటములను ప్రకటించుటకు తదితర కార్యములను చేపట్టుటకు ఇచ్చట మనకు ఏ స్థలము లేదు, జనులను కూర్చొపెట్టుటకు, వేరే సదుపాయములను చేయుటకు ఈ పట్టణమందు ఇచ్చట ఏదియూ లేదు" అని నేను ఆమెతో చెప్పితిని.
6. దేవుని చిత్తమైనయెడల, దానిని ఎక్కడో ఒకచోట వెలుపల స్థలమందు కూటములను పెట్టవలెనని నేను తలంచుచున్నాను. ఒక మూడు నెలలకు ఎచ్చటైనా అద్దెకు తీసుకొని ఈ ఏడు ముద్రల కూటములను వెలుపల స్థలమందు పెట్టవలెనని తలంచుచున్నాను. అప్పుడు జనులు అచ్చటనే వుండి వాటన్నింటిని వినవచ్చును.
7. ఇచ్చట ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము వరుకు అవి యున్నవి. కాబట్టి వాటిలో ఏడు ముద్రలు, ఏడు తెగుళ్ళు, మూడు 'అయ్యో'లు (woes), రక్తవర్ణము గల మృగముపై కూర్చొనియున్న ఒక స్త్రీ, 1,44,000 మంది ఈ మొదలగునవి వచ్చుచున్నవి. ఓ, ఏడవ ముద్ర తెరువబడుటకు ముందు, ఏడవ తెగులు క్రుమ్మరింపబడుటకు ముందు, ఏడవ బూర ఊదబడుటకు ముందు, ఎన్నో విషయములు ఒక్కటిగా కట్టబడవలెను. అవన్నియూ ఒక్కటిగా మిళితమవుచున్నవి. అవి ఒక్కొక్కటి పేరు వేరుగా ప్రతీ దినము ఒక పెద్ద పాఠ్యాంశముగా యుండును.
8. ఇప్పుడు, మనము ప్రార్ధనకొరకు మన తలలను కొద్దిసేపు వంచెదము. మనము ప్రార్ధించుటకు ముందుగా, ఈ ప్రార్ధనలో ఇచ్చటయున్నవారిలో ఎవరైనా నన్ను జ్ఞాపకము చేసుకొనండి అని చెప్పుటకు ఆశించినయెడల మీ చేతులను మీరు పైకెత్తుట ద్వారా మిమ్మల్ని ఎరుగునట్లుగా చేయును. ఇప్పుడు మీ అవసరత ఏమైయున్నదో దాని
నిమిత్తము మీ హృదయములలో దేవుడిని తలంచుడి. దానిని అయన మీకు అనుగ్రహించు నట్లుగా నేను ప్రార్ధించెదను.
9. సర్వశక్తిమంతుడా, మరియు కృపగల దేవా, విన్నపములకు జవాబునిచ్చు దేవుడవు, నీయొక్క 'బిడ్డలందరికీ అవసరతలు గలవని ఎరిగిన తండ్రీ..... మేము జన్మించుటకు ముందే నీవు మమ్మల్ని ఎరిగినవాడవు, మా అడుగుజాడలయొక్క సంఖ్యను నీవు ఎరిగిన వాడవు, మా తలవెంట్రుకలన్నియు లెక్కపెట్టబడినవి, మా మాటలన్నియు మీ త్రాసునందు తూచబడినవి కాబట్టి, ప్రభువగు దేవా, ఈ కార్యములన్నింటికి మా ముందున్న ఈ సవిత్రమైన భక్తిగల కర్తవ్యమునకు ఈ ఉదయకాలమందు మేము లక్ష్యమును ఉంచెదము.
10. ఇచ్చట ఉన్న ఈ చిన్న సహవాసములో ఎత్తబడిన చేతులు స్వస్థతకొరకయో, లేదా వారు ప్రేమించు ఎవరికొరకైనా ఉండవచ్చును, నీవు వారి హృదయములను, వారిలో యుండు సమస్తమును నీవెరుగుదువు! ఎందుకనగా, మా ప్రభువు యేసు అని పిలువబడి, మానవ రూపములో ఈ భూమిమీద నీవు నిలబడినప్పుడు, వారియొక్క హృదయములో ప్రతీ రహస్యములను ఎరిగినవాడివిగా యుంటివి. జనులు తమ తలంపులతో ఊహించే కార్యములన్నింటినీ, నీవు వాటిని అట్లే వారు తలంచుచున్న విధముగానే, "ఈ కార్యములను గురించి మీరు మీ హృదయములలో తలంచుచున్నారు" అని చెప్పితివి. వారి తలంపులను యేసు ఎరిగియుండెను. మేము దేవుని వాక్యములో నీవు నిన్న, నేడు, నిరంతరము మారనివాడిగా యున్నావని చదువుచున్నాము. "ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారిమధ్య ఉందునని చెప్పెను" అందుచే ఈ ఉదయకాలమందు నీవు పరిశుద్ధాత్మ రూపములో ఇచ్చటయున్న జనుల హృదయములలో కనబడు సమస్త వాంఛనలను ఎరుగుము.
11. తండ్రియగు దేవా, "అది సమాప్తమాయెను నీ విన్నపమునకు జవాబు ఇయ్యబడినది. మీరడిగిన సమస్త కార్యములు మీకు అనుగ్రహించబడినవనే నిశ్చయమును ఈ దినమున నేను మీకు పంపించుచున్నాను." అని నీవు వీరియొద్ద మాట్లాడవలెనని నేను ప్రార్ధించుచున్నాను.
12. దేవా, రక్షణ పొందని వారిని, తన చేతులను పైకి ఎత్తిన వారిని ముఖ్యముగా మేము జ్ఞాపకము చేసుకొనుచున్నాము. క్రీస్తును వారు తమ స్వంత రక్షకుడుగా అంగీకరించుటకు వారికి ఇది తరుణమై యుండునట్లుగా చేయుము.
13. ఆనాడు గలిలయలో నడచిన అదే యేసు నేడు ఆయనయొక్క జనుల మధ్యలో నిలిచియున్నాడని గ్రహించునట్లుగా చేయుటకు, మీ ప్రసన్నత వారిని ఇంకా మీకు సన్నిహితముగా తీసుకు వచ్చి చేర్చునట్లుగా ప్రభువా ఏదైన ఒక కార్యమును ఈ కూటము ముగియుటకు ముందుగా నీవు చేయవలెను, ఆనాడు ఏమ్మాయికి వెళ్ళే శిష్యులు
'పొందుకున్న రీతిగానే కూటము ముగించిన పిదన నేడు ఇచ్చటయున్న జనులు వేళ్ళేటప్పుడు కూడా అదే నిశ్చయతను పొందుకొనునట్లు చేయుము. త్రోవలో వెళ్ళుచున్నప్పుడు దినమంతా వారు ఆయనతో నడిచిన తరువాత, ఆయన వారితో మాట్లాడుచూ, వారు ఆయనతో మాట్లాడుచూ యున్నాగాని వారికి తమతో మాట్లాడుచున్నది ఆయనే అనే తలంపే కలుగకపోయినది.
14. ఓ దేవా, అనేక సమయములలో మేముకూడా అదే విధముగా యున్నాము. సూర్యుడు అస్తమించుటలో, పక్షులు పాడుచుండుటలో, ఆకులు కదులుచు ధ్వనించుటలో, పుష్పములు వికసించుటలో, సంఘము పాడు పాటలలో నీవు మాతో మాట్లాడుచున్నావు, అయినా గాని ఆ మాటలు నీవేయని మేము దానిని బహు స్వల్పముగా గ్రహించుచున్నాము. వైద్యశాలలలోని వ్యాధిగ్రస్తుల గదులలో ఇంకా అనేక స్థలములలో నీవు మాతో మాట్లాడు చున్నావు, మాట్లాడేది నీవేయని మేము బహు స్వల్పముగా దానిని గ్రహించుచున్నాము.
15. ఇప్పుడు, ప్రభువా, ఈ ఉదయమున మేము గృహములకు తిరిగి వెళ్ళుచున్నప్పడు, వారు చేసినట్లుగా, మేముకూడా నిన్ను గుర్తించునట్లుగా, నీవు ఆనాడు అచ్చట చేసిన రీతిగా నేడుకూడా మామధ్య ఏదైనా కార్యమును చేయుము. వారి ఎదుట నీవు అచ్చట చేసిన కార్యమును వారు ఎరిగితిరి. నీ శిలువ శ్రమలకు ముందుగా దానిని నీవు చేసితివి; తద్వారా అది పునరుద్ధానుడైన ప్రభువు అని వారు ఎరిగితిరి. వారు సంతోషించుచు, దేవుడిని స్తుతించుచు వారియొక్క గుంపుల యొద్దకు తిరిగి వెళ్ళిరి, ఎందుకనగా ఆయన జీవముతో యున్నాడని వారు ఎరుగుట వలన, "ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా?" అని వారు చెప్పిరి. ప్రభువా, నీవు అచ్చట ప్రత్యక్షమై మరియు శిలువలో నీవు మరణించుటకు ముందు చేసిన కార్యమును అచ్చట చేయుట వలన నీవు అదే యేసువనే దానిని నీ పునరుద్ధానము దానిని నిరూపించినది, వారు నీతో మాట్లాడిన కార్యములన్నింటిని అది జ్ఞాపకము వచ్చునట్లుగా చేసినది. ప్రభువా, వారమంతా నీవు మాతో మాట్లాడుము. ఇప్పుడు, నీవు మా మధ్యలో ప్రత్యక్షమై, అవసరతగల ఒక్కొక్క హృదయమునకు నిన్ను ఎరుగునట్లు చేయుము. మేము దీనిని యేసుని నామములో అడుగుచున్నాము. ఆమేన్.
16. (ఒక సహోదరి అన్య భాషను మాడ్లాడుచున్నది ఒక సహోదరుడు దానికి అర్ధము చెప్పుచున్నాడు - సంపా.,) ఇప్పుడు, సంఘస్థులు ప్రార్ధన చేసెదరు;
17. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా బుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా బుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక
దుష్టునినుండి మమ్మును తప్పించుము. రాజ్యము, ఘనతయు మరియు మహిమయు ఎల్లప్పుడూను మీదేయగును గాక! ఆమేన్.
18. నా కలము ఒక శిల్పియొక్క ఉలిగాను మరియు నా కాగితము ఒక చెకుముకి రాయిగాను యుండినయెడల నేను చెప్పుచున్న ఈ మాటలు దానిపై చెక్కబడి ఇది సమస్త ప్రజలయొద్దకు వెళ్ళవలయునని కోరుచున్నాను.
19. దేవునియొక్క పరిశుద్ధాత్మ ఆయనయొక్క జనులతో వ్యవహరించుటకు వింతైన మార్గములను అవలంభించును. అనేక సమయములలో దేవుడు తన పిల్లలకు ఆయనయొక్క కృపచేత అద్భుతములను, వరములను మరియు పిలుపును వారు పశ్చాత్తాపము చెందకుండానే అనుగ్రహించుచుండెను.
20. నేను ఇప్పుడు ఏదో విశ్రాంతి దినములలో నా గృహములో యున్నట్లుగా యున్నాను. నేను సాధారణముగా ఈ దినములను గృహములో గడుపుటకు తీసుకొందును; ఎందుకనగా సంవత్సరములో ఈ కాలమందు నేను అహ్లాదముగా యుండాలని ఆశించినప్పుడు ఊడుతలను వేటాడుటకు వెళ్ళుదును. ఊడుతలను వేటాడుటకు నాకు ఎంతో ఇష్టమైన కెంటకీ అనే స్థలమున ఈ వారములో నా స్నేహితులతో నేను కలిసియుందును. కాని ఏదో విధముగా నాకు నిరుత్సాహము కలిగినది, నాకు ఊడుతలు ఏవి దొరకలేనందువలన కాదు గాని ఎందుకో కొంచెము నిరుత్సాహమునకు లోనైతిని. ఏదో ఒకటి నేను గృహమునకు తిరిగి వెళ్ళవలెనని నాకు అంతరంగములో చెప్పుచున్నది. నేను తిరిగి వచ్చేటప్పుడు కారులో నిద్రపోతిని.
21. ఆ సాక్ష్యము ముద్రింపబడి మరియు టేపులలోను యుండుట మీకందరికీ తెలిసినదే. గత సంవత్సరమున, ఇండియానా అనే ఒక స్థలమందు నేను అచ్చట కూర్చొని యుండగా, అచ్చట దేవుడు వచ్చి నాతో మాట్లాడెను, అది నా సేవయొక్క రెండవ దశ గురించి. రాబోవు సమీప కాలములో అది జరుగుటకు సిద్ధముగా యున్నది. అచ్చట పలికినప్పుడు మూడు ఊడుతలు సృష్టించబడినవి. ఆ కథను మీరందరూ ఎరుగుదురని నాకు నిశ్చయముగా తెలుసు. ఏదో విధముగా, ఆ దారిలో వెళ్ళుచుండగా నేను మిగిలినవారిని వేటకు వెళ్ళుటకు వదిలివేసితిని, నాకు - మరలా ఈ స్థలమునకు వెళ్ళాలనే ఒక వింతైన తలంపు నాకు కలిగినది. అది పగటి వెలుగుకు ముందు వర్షము కురియుచున్నది, నేను వేటాడగలనో లేదో అనేది కూడా నాకు తెలియదు, కాని నేను అచ్చట మైదానమునకు వెళ్ళిపోతిని. వేట అనగా ప్రార్ధన కొరకు నిన్ను నీవు ఏకాంతముగా చేసికొనుట యగును. నేను కారు నిలిపివేసి, రహదారిని దాటి, పొదలోనికి వెళ్ళితిని, మరియు పగటి వెలుగునకు కొంచెము మబ్బుగా అది యున్నది
22. నేను అది ఎప్పుడూ చేయు విధముగా, ఒక చిన్న ప్రార్ధనను, తండ్రియొద్ద నాకు ఏదైతే అవసరమో దానిని అనుగ్రహించవలెనని విజ్ఞాపన చేసితిని. దేనినైనా వ్యర్ధము
చేయుటయందు గాని లేదా నాశనము చేయుటయందు గాని నాకు నమ్మకము లేదు;" సరిగ్గా యున్నదో లేదో చూచుటకు కూడా నా జీవితములో నేనెన్నడూ ఒక పక్షిని గాని లేదా దేనినైనాగాని నేను తుపాకీతో కాల్చి చంపలేదు. దేనినైతే నేను వేటాడుదునో దానినే నేను తినెదను లేదా తినే వారికి దానిని యిచ్చెదను. దేనిని వ్యర్ధపరచుటయందు నేను నమ్మను. అటువంటి కార్యములయందు నాకు నమ్మకము లేదు, ఎందుకనగా అది సరియైనది కాదు.
23. పిదప నేను తిరిగి బాగా తెలిసిన దారిలో, నా అనుభవమంతటిలోను, అటువంటిది నాకెన్నడూ సంభవించనే లేదు. నేను నిలబడియున్న స్థలమందు నాకు ఎడమ వైపు కొండ పై భాగమును చూచితిని, కొండ పై భాగమునుండి వెలుపలికి వచ్చుచున్నట్లుగా మూడు వర్ష ధనస్సులు వచ్చినవి. అవి సుమారుగా ముప్పది అడుగుల ఎత్తులో వున్నవి. మొదటగా నేను చూచినప్పుడు వెలుగును చూచి నేను అట్లే వెనుకకు తిరిగాను, ఎందుకనగా అది సూర్యుడు ఉదయించుచున్నదని నేను తలంచితిని. అది సూర్యుని వైపునుండి వచ్చుట లేదు, అది దక్షిణము వైపునుండి వచ్చుచున్నదని రెండో తలంపు కలిగినది. మరియు ఇంకొక కార్యమేమనగా మబ్బుగా యుండి, వర్షించుచూ, అది చక్కగా, అన్నిచోట్లా వర్షము కురియుచున్నది. అది ఆగష్టు 25, గత శుక్రవారము ఉదయము, అది అన్ని ప్రాంతములందు మేఘములు ఒక్కలాగ యుండి, ఏ విధముగా వర్షము కురిసినదో దానిని మీరెరుగుదురు.
24. నేను మరలా చూచితిని, ఇంకా ఎత్తుగా మరియు ఎత్తుగా ఎదుగుచూ మూడు వర్ష ధనుస్సులుగా అది అచ్చటనే యున్నది. నేను నా టోపినీ తీసివేసితిని. నా తుపాకీని నేను క్రింద పెట్టితిని. నా చేతులను పైకెత్తి దానివైపుగా నేను నడుస్తూ వెళ్ళితిని. ఏదో ఒకటి నాతో "ఇంత సన్నిహితముగా వచ్చినది చాలును" అని చెప్పుచున్నట్లుగా యుండెను, చూచుటకు ఇంకా కొంచెము ముందుగా నడిచి వెళ్ళగలనా అని నేను క్రింద కూర్చొని, వేసుకొనియున్న బూట్లను విప్పవలెననికొంటిని. కాని కొన్ని గజాల దూరము వరుకు దాని దగ్గరకు వెళ్ళి దాని రంగును నేను చూచితిని, ఒక పొగ మంచు చుట్టూ క్రమ్మియున్నట్లుగా యున్నది. కొన్ని నిమిషముల వరుకు నేను అచ్చట నిలబడియుంటిని. అది ఆ చిన్న కొండపై భాగమునుండి తిన్నగా వెలుపలికి వచ్చుచున్నది. ఆ మూడు (ఒకటి కుడివైపుగా, ఒకటి ఎడమవైపుగా ఇంకొకటి మధ్యలో యున్నది) కదులుచూ అవి ఒక గిన్నెవలె మారుటను నేను గమనించుచుంటిని. అది ఏదైనా గాని, అది జీవముతో యున్నది. అది ముందుకు జరుగుచూ మరియు అది కదులుచూ యున్నది. అది అట్లే మసకపుచున్నట్లుగా యుండుటను నేను అచ్చట నిలబడి చూస్తూ యుంటిని.
25. నేను తిరిగి మరలా చూచితిని, "ఓ, దేవా, నీ దాసునికి తెలియజేయునట్లుగా నీవు దేనిని కలిగియున్నావు.” అని నేను బిగ్గరగా అరచితిని.
26., పిదవ వెంటనే ప్రభువుయొక్క ఆత్మ లోపలికి వచ్చి, "నూతన నిబంధన యొక్క యేసు పాత నిబంధన యొక్క యెహోవాయై యున్నాడు, ఆయన ఆత్మనుండి మానవుడనే ముసుగును మాత్రమే ఆయన మార్చెను." అని చెప్పెను. అది నిశ్చయముగా ఆయనను గురించిన నా వర్తమానమును రుజుపుపరచునదిగా యున్నది. ఈ ముప్పది ఒక్క సంవత్సరములు వ్యర్ధమవ్వలేదని నిశ్చయముగా నేను ఎరుగునట్లుగా చేసెను.
27. నేను సమీపించుటకు ప్రారంభించినప్పుడు అది వెళ్ళిపోవుటకు ప్రారంభించినది, ఈ గిన్నెవలెయుండు ఆ ఆకారము వెళ్ళిపోతూ పిదప మరుగైపోయినది. ఇంకా సమీపముగా వెళ్ళితిని. ఇంకా సమీపముగా వెళ్ళుటకు భయపడితిని, ఎందుకనగా నేను అంతవరుకు వెళ్ళుటకు ముందుగానే ఆయన నన్ను నిలిపివేవెను.
28. నేను తిరిగి మరియు ఆ వెలుగును గమనించితిని. గత సంవత్సరమున నేను ఏ చెట్టు దగ్గర కూర్చొనియుంటినో, ఆ ఉడుతలు ఎచ్చట కనబడెనో, వాటికి తిన్నగా ఆ వెలుగు కనబడినది. సుమారు ముప్పది ఐదు లేదా నలుబది నిమిషములకు తరువాత ఆ అరణ్య మార్గముగుండా, కాలువ అడుగు భాగములగుండా, మరియు మొదలగు వాటిగుండా వెళ్ళుచూ, ఇంకా ముందుకు వెళ్ళుచూ నాలుగు దిశలును వేరుపరచు (తూర్పు, ఉత్తరము, పడమర, దక్షిణము) నాలుగు కొమ్మలువలె విభజించియున్న చెట్టు యొద్దకు వెళ్ళితిని. నేను ఆ చెట్టుపైకి ఎక్కి కూర్చొన్నాను. "ఈ కొండను చూచి - "నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి" అనే లేఖనములను ఆయన నా దగ్గర చెప్పినప్పుడు - నేను కొద్దిసేపు అచ్చట నిలబడియుంటిని, ఆ వర్ష ధనస్సును గురించి ఆలోచనయే లేకుండా, అది నా మనస్సులో నుండి వెళ్ళిపోయినది. అచ్చట నేను నిలబడి యుంటిని. ఈ సంవత్సరము ఉడుతల వేటకు అంతగా బాగోలేదు, సమస్తమునకు ఆలస్యమైయ్యెడిది, ఉడుతలు లేవు.
29. "గత సంవత్సరమున ఇదే స్థలమందు నేను పలుకగానే ఉడుతలను సృష్టించి దేవుడు వాటిని నాకు అనుగ్రహించెను." అని నేను తలంచితిని. నేను నా టోపిని మరలా తీసివేసి., "ప్రభువగు దేవా, నీవు యింకా అదే యేసుగా యున్నావు. నీవు యింకా దేవుడై యున్నావు." అని నేను చెప్పితిని.
30. "ఈసారి నీకు ఎన్ని కావలెను?" అని ఏదో ఒకటి నాతో చెప్పెను.
31. "ఆనాడు నేను చేసినట్లుగానే, అన్ని చాలు" అని నేను చెప్పాను. పిదప "గతసారి నాకు యిచ్చినన్నే నేడు పది గంటలకు ముందే నాకు కావలెను" అని నేను చెప్పాను. అది చూచుటకు బహు వింతగా యుండినది, ఆ సమయమునందు దోమలు ఎక్కువగా యుండు స్థలమందు నేను యుంటిని, అది ఒక రకమగు చిత్తడి నేల స్థలము, ఒక పెద్ద
దోమ నా కంటి ప్రక్కన కుట్టుటకు వచ్చినది, "నేడు వీటిలో ఒక్కటికూడా నన్ను ఇబ్బందిపరచకూడదు" అని నేను చెప్పితిని, నా దగ్గర దోమలు కుట్టకుండా నివారించుటకు ఏ మందు లేదు. నేను దానిని ఎరుగుటకు ముందే, "సూర్యుడు ముప్పది నిమిషములలో ప్రకాశించవలయును" అని నేను చెప్పితిని.
32. నేను దానిని చెప్పి ముగించులోపే నాకు వెనుక, పోయిన సంవత్సరము దొరికిన అదే ఒక ఉడుత వంటి యవ్వనిది, ఎఱ్ఱనిదై, డెబ్బది గజాల దూరమున కొమ్మ పైకి దూకి అరచుచున్నది. అట్లే చుట్టూ నేను తిరిగితిని. అంతటి దూరమున నాయందుగల శక్తివంతమైన బైనాక్యులర్తో కూడా అంత స్పష్టముగా దాని కన్నులను చూడలేము. సరిగ్గా గురినికూడా చూచిపెట్టకుండానే, ఒక దెబ్బతోనే, అంతే, ఉడుత అసలు తప్పించుకోనే తప్పించుకోలేదు. గత సంవత్సరము నా తుపాకీ గుండు ఏ విధముగా దానికి తగిలినదో అదే విధముగా దాని కన్నులకు అది తగిలినది.
33. అరణ్యము గుండా నేను అలాగే వెళ్ళితిని. ఖచ్చితముగా పది గంటలకు ఇంకా మూడు నిమిషములున్నప్పుడు నేను మూడవ ఉడుతను కాల్చితిని, గత సంవత్సరము నందు ఉన్నరీతిగానే అది యుండినది. పదిగంటలకు ఇంకా మూడు నిమిషములు మాత్రము యున్పప్పుడే, తూచి చూచుటకు వీలైనయెడల అనేక టన్నుల దోమలుగల ఆ స్థలమునందు ఆ దినమంతా ఒక్క దోమకూడా నాయొద్దకు రాలేదు. దేవుడే నేను చెప్పినదానికి తీర్పరైయున్నాడు. నేను ఒక్కదానిని కూడా చూడను లేదు. దాని ఘీంకారమును వినను లేదు. దానిని నేను వినగలనా అని నేను జాగ్రత్తగా కనిపెట్టి చూచితిని. ఒక ఝంకారమును నేను విన్నాను, "ఎచ్చటో ఒకటి యున్నది." అని నేను తలంచితిని, ఆ రహదారి మీదుగా ఒక సరుకుల బండి వచ్చుచున్న శబ్దమును నేను వింటిని. ఖచ్చితముగా ఆ సమయమునుండి ముప్పది నిమిషములలో సూర్యుడు చక్కగా ప్రకాశించెను.
34. నేను మరలా ఆ స్థలము యొద్దకు వచ్చితిని, నేను ఆలోచించుచూ "ఇంతమట్టుకు" (limit) అని నేను చెప్పినప్పుడు, ఇండియానాలో కాల్చుటకు నిర్ణయించబడిన కొలత ప్రకారము ఐదు ఉడుతలని నేను తలంచితిని, కాని గత సంవత్సరమున భుజించుటకు నీకు ఎన్ని కావలెనని ఆయన నన్ను అడిగినప్పుడు "నేను మూడు" అని చెప్పినది నాకు జ్ఞాపకము యున్నది, మరియు నాకు మూడు మాత్రమే లభించినవి. కాబట్టి నేను తిరిగి నిన్న మరలా అదే స్థలముయొద్దకు వెళ్ళితిని, "వెళ్ళవద్దు, రహదారిని దాటి వెళ్ళకు," అని ఏదో నాతో చెప్పినది.
35. ఖచ్చితముగా పది గంటలకు అదే సమయమున నాచేతి గడియారమున పది గంటలు అయ్యినది, ఇండియానా కొలత ప్రకారము నేను ఐదు ఉడుతలను కాల్చి చంపితిని. మీరు గమనించవలసినదేమనగా అచ్చట మూడు వర్ష ధనస్సులు యుండెను,
మూడు సంగతులు చెప్పబడినవి, మూడు ఉడుతలు లభించినవి. అచ్చట మూడు కార్యములు, పది గంటలలోపు మూడు ఊడుతలు, దోమలు లేవు, ముప్పది నిమిషములలో సూర్యుడు ప్రకాశించెను. దీనిని గురించి సాక్ష్యమిచ్చుటకు అచ్చట ముగ్గురు వ్యక్తులు గలరు, సహోదరుడు బాంక్స్ ఉడ్, నా కుమారుడు బిల్లీ పాల్ మరియు అతడి కుమారుడు డేవిడ్, దానిగురించి సాక్ష్యమిచ్చుదురు.
36. నేను ఆ వర్ష ధనస్సులను చూచినప్పుడు, అవి ప్రభువుయొక్క దూత ప్రత్యక్షమైన ప్రకాశమైన వలయాకారమునకు సమానమైన వైశాల్యమును కలిగియుండినవి. కాని అచ్చట అవి మూడుగా యుండి అవి ఒకదానిలో ఒకటి ఏకమై పోయినవి, ఓ, నా హృదయములో ఆ దేవుడిని నేను ఎరుగుటకు అది నాకు ఎంతగానో ఉపయోగపడినది, జనులు తలంచు విధముగా యేసు ఒక సాధారణమైన మానవుడు కాదు, ఒక ప్రవక్త, నేటి ఈ నవీన తలంపులలో యేసును ఒక సాధారణమైన ప్రవక్తగా తలంచుచున్నారు. ఆయన పాత నిబంధనపు యెహోవాయై యుండి మరియు మనమధ్య శరీరధారియై నివాసము చేసెను. అచ్చట అది నిశ్చయముగా నాకు ఓదార్పును కలుగ జేసినది. పిదప ఆ అంశము మీద నేను ఆలోచించినప్పుడు, దేవుడు అనేకమంది ప్రజలను వెదకుచూ
37. ఇప్పుడు, అచ్చట ఒక గుంపు ప్రజలు వారిని తాము "ఏకత్వము" లేదా "యేసు మాత్రము"నకు చెందినవారమని చెప్పుకొనుచున్నారు. వారియొక్క వాదమును నేను అంగీకరించుట లేదు. ముగ్గురు వేర్వేరు దేవుళ్ళు గలరని చెప్పు త్రిత్వవాదులయొక్క వేదాంతమును కూడా నేను సమ్మతించుట లేదు. అది త్రిత్వవాదులయొక్క హద్దుమీరిన అభిప్రాయము. కాని నేను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేవి ఒక్కటే, ఆ మూడు ఒకే దేవునియొక్క కార్యములై యున్నవని చెప్పితిని. ఆయన పితృత్వములో అగ్ని స్తంభములో జీవించెను, యేసు క్రీస్తులో ఆయన కుమారత్వములో జీవించెను మరియు ఇప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మలో ఆయన తన సంఘములో జీవించుచుండెను. శరీరధారియై మనమధ్యలో నివాసము చేసిన అదే ప్రభువగు యేసు నేడుకూడా మనతోను, మనమధ్యలోను పరిశుద్ధాత్మ రూపమున యున్నాడు.
38. నాకున్న అనుభవమంతటిలోను, నేను మొదటగా తిరిగి దానిని చూచినప్పుడు, సూర్యుడు ఎచ్చటనుండియో మేఘములలోనుండి తొంగి చూచుచున్నాడని అనుకున్నాను, కాని అది సూర్యుడు ఉదయించుటకు ముందుగా యుండినది. పిదప నేను మరలా తిరిగి చూచినప్పుడు అది ఒక వెలుగు కాదు, అవి వర్ష ధనస్సులు; దాని తరువాత నేను క్షుణ్ణంగా దానిని చూచినప్పుడు నేను పూర్తిగా మొద్దుబారి పోయినట్లుగా అయిపోతిని,
39. "కేకలు వేయాలని నీకు అనుపించుట లేదా" అని ఎవరో నాతో చెప్పిరి. లేదు, నాకు కేకలు వేయాలనిపించుట లేదు. ఆ అనుభవములు ఎప్పటికీ నిన్ను కేకలు వేయునట్లు
చెయ్యదు, అవి నిన్ను అట్లే లంగరు వేయునట్లు చెయ్యును; ఒక సంతృప్తిని పొందినట్లుగా, * ఏదో ఒకటి నీతో చెప్పుచున్నట్లుగా నీవు అచ్చట దానిని ఎరుగుదువు.
40. ఇప్పుడు, ఆ కార్యములన్నీ సత్యమైనవి. "ఓ, అటువంటి కార్యములను నేను నమ్మను" అని అనేకసార్లు కొంతమంది జనులు చెప్పే సంగతులు మనయందు కలనని నేనెరుగుదును. దానిని నేను ఋజువుపరచలేను, నాకు తెలియదు. ఏదైతే సత్యమని నేనెరుగుదునో వాటిని మాత్రమే నేను ఋజువుపరచగలను. పరిశుద్ధ గ్రంథమును వ్రాసిన సర్వశక్తిమంతుడగు దేవుడు, నేను ఆయనయొక్క దాసుడను, అది సత్యమని ఆయన దానిని ఎరుగును.
41. దానిని గురించి ఆలోచించండి, మనము జీవించుచున్న ఈ దినములలో, ప్రభువు రాకడకు ముందు, యేసు "ఆకాశములోను, భూమిలోను, సూచకక్రియలు, గొప్ప దృశ్యములు, ఎగిరే పళ్ళెములు, ఆయుధములు, దిగ్భ్రాంతి కలిగించు కాలము, దేశముల మధ్య బాధలు, మరియు భూమిమీద భయంకరమగు దృశ్యములు కలుగును" అని చెప్పెను. ఆ కార్యములన్నింటిని చూచునట్టి ఈ దినములో మనము జీవించుచున్నాము.
42. ఇప్పుడు, ఈ ఉదయమున వర్తమానము కొరకు ఎన్నుకొనినదేమనగా, మీరు నాతో లేఖనముల కొరకు జెకర్యా గ్రంథమునకు త్రిప్పవలెనని నేను కోరుచున్నాను. ఇది నా ..... జెకర్యా 4వ అధ్యాయము
43. ఈ సంగతులను గూర్చి మీకు చెప్పవలెననేది నా వాంఛయైయున్నది. అనేకసార్లు కార్యములు సంభవించుచుండెను. దానిని నేను వాటిని గురించి నేను చెప్పుట లేదు. దానిని నేను చెప్పుట లేదు. కాని ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా యుండుట వలన సంఘమునకు దానిని చెప్పకుండా ఉండలేను. దీనిని నేను చెప్పే తీరవలయును, దేవునికి ముందు నిలబడి అది సత్యమని నేను చెప్పుచున్నాను. దేవుడు వున్నాడని నేను ఎరుగుదును, యేసు క్రీస్తు దేవునియొక్క కుమారుడని నేనెరుగుదును, ఇమ్మానుయేలు, పరిశుద్ధాత్మ రూపమున నేడు ఆయన తన జనుల మధ్య నివాసము చేయుచున్నాడు. సూచకక్రియలు మరియు అద్భుతకార్యములు కనబడుచున్నప్పుడు "ప్రభువు రాకడ దగ్గరగా సమీపించుచున్నదని నేనెరుగుదును."
44. ఏడు సంఘ కాలముల ద్వారా, మనము చివరి మరియు లవొదికయ సంఘ కాలములో యున్నామనే దానిని మనము తెలుసుకొంటిమి, సంఘము నిర్లక్ష్యముగా యున్నప్పుడు, చల్లనిదై, శాఖగా మారి తనను స్థాపించుకొనును. సంస్థలు దానిని వశపరచుకొని, దానిని అది తినివేయును. కాని ఒక చిన్నగుంపు వుండునని ఒక వాగ్దానము చెయ్యబడినది. ఒక సంఘము అచ్చట యుండి, అది ప్రపంచమంతటా ప్రతీ స్థలములో చెదరి ఒక సంఘముగా యుండును. కాని దేవుడు దానిని మహిమలో ఎత్తబడుటకై
వాటన్నింటిని ఏకము చేయును. శుద్ధీకరించబడియున్న ఒక చిన్నగుంపు ఎచ్చటనో ఒకచోట ప్రభువు కొరకై కనిపెట్టుకొనియున్నది.
45. కొన్ని దినముల క్రితము దానియేలుయొక్క డెబ్బది వారముల గురించి నేను ఇదే వేదికనుండి నిలుచుండి చెప్పుచున్నప్పుడు ఏదో ఒకటి నా మనస్సులో తోచినది, మనము జీవించుచున్న ఈ సమయమునే దానిని చూచినప్పుడు అసలు నేను దానినుండి తొలగిపోలేకపోతిని. ఎచ్చటకన్నా వెళ్ళిపోయి, ఏదైనా చెయ్యాలనే తలంపు కలిగి, నా మనస్సులోనుండి దానిని తీసివేయలేకపోతిని. నేను ప్రేమించే అనేకమంది రక్షింపబడనివారు గలరు. తెలిసికూడా, వారు రక్షింపబడుటకై నేనేమి చెయ్యగలను? నేను చెయ్యవలసినది ఏమి యున్నది? నేను సువార్తను ప్రసంగించితిని. ఈ లోకము ప్రారంభమునుండి గాని, ప్రభువగు యేసు క్రీస్తుయొక్క దినములు తరువాత గాని మరియు సమస్త చరిత్రకాలములన్నింటి మొదలుకొని ఆయన ఇటువంటి గొప్ప సూచకక్రియలు మరియు అద్భుతకార్యములను ఆయన ఈ కాలమునందు చేసినట్లుగా ఎన్నడూ చెయ్యలేదు. ఈ లోకమంతా ఇవి వెళ్ళినవి. అయినాగాని ఈ లోకము ఇంకా కూడా దిగజారిపోతూనే యున్నది. దిగజారిపోతూ యుండే కాలమగు లవొదికయ సంఘకాలమందు మనము జీవించుచున్నామని, వారు ఆ విధముగానే యుందురని చెప్పబడినట్లుగానే నేను జ్ఞాపకము చెయ్యవలసియున్నది.
46. నేడు ఈ ఉదయకాలమందు నేను ఎన్నుకొనిన ఈ వర్తమానము జనులద్వారా ఎక్కువగా విమర్శకు గురియగును, కాని కృపను గురించి ప్రసంగించుట ఎక్కువగా నన్ను ఆకర్షించినది. దానిని గురించి ఈ ఉదయకాలము నేను మాట్లాడాలని ఆశించుచు, నేను చదివిన విధముగా జెకర్యా 4వ అధ్యాయములోని ఒక భాగమును చదివెదము.
నీకు ఏమి కనబడుచున్నదని యడుగగా నేను - సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమెదయును, దీప స్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి.
మరియు రెండు ఒలీవచెట్లు దీప స్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి
- నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాట్లాడుచున్న దూత నడిగితిని.
నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదాయని నన్నడుగగా నేను - నా యేలినవాడా నాకు తెలియదంటిని, అప్పుడతడు నాతో ఇట్లనెను - జెరూబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
47. మీకు అర్ధమైనదా? వర్తమానమనునది ఏదో గొప్ప శక్తిచేతనైనను లేదా బలము చేతనైనను ద్వారా కాదు గాని దేవునియొక్క ఆత్మద్వారానే వచ్చును. చివరి 7వ వచనము...
గొప్ప పర్వతమో, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపుదానవు? నీవు చదును భూమివగుదువు; - కృప కలుగును గాక కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. (కృప కలుగును గాక, కృప కలుగును గాక)
48. పరిశుద్ధ గ్రంథమును చదివిన మనకందరికి ఈ లేఖనము తెలిసినదే. దేవాలయము మరలా నిర్మించుటకు సిద్ధపడుచున్న కాలమందు ఇది జరిగెనని మనమెరిగెదము. ఆ కట్టడమునకు పునాదిని వేసిన జెరుబ్బాబెలు జనుల మధ్య ఒక గొప్ప రాజకుమారుడివలె యుండును. అతడు ఆలయమునకు పునాదిని వేసెను. ఇప్పడు మీరు, అభిషేకించబడిన వస్త్రమును, ఆత్మీయ సంబంధమగు వస్త్రమును మీరు ఉదయకాలమున ధరించుకొనవలెనని నేను ఆశించుచున్నాను. ఈ గొప్ప రాజకుమారుడు ప్రభువుయొక్క గృహమును మరలా నిర్మించవలెనని తీర్మానించుకొనెను. అతడు తీర్మానించినప్పుడు, పునాది రాయిని వేసెను.
49. మనము దానిని చదువుచు వుంటే, "జెరుబ్బాబెలు తన చేతులతో పునాదిని వేసెను, అతడు తల(సై) రాయిని కూడా తీసుకొని పెట్టించును.” అని దేవుడు చెప్పుటను మనము కనుగొనగలము. మీరు గమనించాలని నేను ఆశించుచున్నాను. అతడు మూలరాయిని తీసుకొని పెట్టునని ఆయున చెప్పనే లేదు. అతడు తలరాయి (పై)ని తీసుకొని పెట్టును అని చెప్పెను.
50. యేసే ప్రధాన మూలరాయి అనియు ఆయనే తల(పై) రాయి అని లేఖనములు చెప్పుటను మనము ఎరుగుదుము. ఇప్పుడు మనము కొద్ది నిమిషములు ఆలోచించిన యెడల, ఏడవ సంఘకాలపు దూత పిల్లల విశ్వాసమును తండ్రుల వైపు త్రిప్పును, మరొక విధముగా చెప్పాలంటే, ఆత్మయొక్క శక్తిక్రింద సంఘమును మరల కట్టును. 'శక్తిచేతనైనను, బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే" అని ప్రభువు సెలవిచ్చెను. శాఖ చేతనైనను, సంస్థ చేతనైనను కాక పరిశుద్ధాత్మ చేతనే దేవుడు తన సంఘమును చివరి దినములలో తీసుకొని వచ్చును.
51. యెహోషువాతోయున్న రాజకుమారుడగు జెరుబ్బాబెలు, అతడే తలరాయని తీసుకొని రావలయును. అతడు పునాదిని వేసెను, అతడు జనులను పునాదియొద్దకు తీసుకొని వెళ్ళుటకు సాదృశ్యముగా యున్నది.
52. ఈ దీపస్తంభములు మరియు ఇతర కార్యములు యూదులు మరియు సంఘము అనే ఈ రెండింటిని సూచించుచున్నవని మనమందరము ఎరుగుదుము. వారు
"ఒలీవ చెట్లు" అని ఇచ్చట పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అన్యజనులమైన మనము ఆ మంచి ఒలీవ చెట్టుయొక్క వేరుతో అంటుకట్టబడిన అరణ్యపు చెట్టుకొమ్మవలె యున్నాము. ఈ రెండు కొమ్మలనుండి, గొట్టములు బయలుదేరి ఏడు సువర్ణ దీపస్తంభముల యొద్దకు వెళ్ళి, ఇవి ఏడు సంఘ కాలములకు వెలుగును కలుగజేయుచున్నవి.
53. ఇప్పుడు, మీరు గమనించండి; ముగించిన పాఠములలోని ఉపదేశములలో, పెద్ద పిరమిడ్లు గురించి చదివితిమి, హనోకు వాటిని నిర్మించెను, తల(పైకప్పు) రాయి పిరమిడ్పై పెట్టనేలేదు. అచ్చటికి నేను వెళ్ళితిని. నేటి దినము వరుకు ఆ శిల్పమునకు సాటియైనది ఏదియు లేనేలేదు. ఒక పిరమిడ్ను కట్టుటకు కావలసిన యంత్రము మనయొద్ద లేవు, ఒక పిరమిడ్ను కట్టుటకు శక్తి (అణుశక్తి కాకుండా) లేదు; ఎందుకనగా అది చాలా బ్రాహ్మాండమైనది. టన్నుల టన్నుల కొలది బరువుగల పెద్ద బండలను పైకి ఎత్తిపెట్టి అవి గాలిలో నిలబడియున్నట్లుండి, అవి ఒకదానిపై ఒకటి ఆ విధముగా అమర్చబడి ఒక బ్లేడునుకూడా వాటిమధ్య పెట్టలేని అంత చక్కగా అవి చేయబడియున్నవి బండలను సిమెంటుతో ఒకదానితో ఒకటి అతుకబడి యుండునట్లుగా పూయబడలేదు, అని ఆ విధముగా ఒకదానితో ఒకటి అతుకబడి యుండునట్లుగా వాటిని అమర్చుటకు వారు ఎంతో చక్కగా ఆ బండలను చెక్కిరి. A
54. యేసు క్రీస్తుయొక్క శరీరముకూడా ఆ విధముగానే యుండును, పరిశుద్ధాత్మ ద్వారా దేవునియొక్క గొప్ప సాధనముతో మరియు ఆయుధముతో మనమందరమూ ఒకే వ్యక్తివలె యుండునట్లుగా చెక్కబడవలయును. మనము విభజించబడలేము. మనము ఒకే వ్యక్తిగా యుండవలెను. ఏ యంత్రముతోను దీనిని చెయ్యలేమని ఇది చూపించుచున్నది. దేవుడే దీనిని తీసుకొని చేయును. యంత్రములుగా యున్నటువంటి ఏ శాఖగాని, ఏ విడిది గృహము గాని, వారియొక్క ఉద్దేశములు ఎంత మంచివైనా గాని ఇటువంటివి ఏవికూడా దీనిని చెయ్యలేవు. వారు దానిని చెయ్యనే చెయ్యలేరు. ఎందుకనగా దేవుని పరిశుద్ధాత్మయే ఆ పని చేయును.
55. నా జేబులో ఒక డాలర్ ఉంటుందని నేను అనుకోలేదు. అయితే వున్నది . ..... అవును, నేను చేసెదను. ఒక డాలర్ నాయొద్ద గలదు. క్షమించండి, ఈ డాలర్ యొక్క వెనుక భాగమున ఎడమ చేతివైపు మిమ్మల్ని చూస్తున్నట్లుగా యునైటెడ్ స్టేట్స్ యొక్క ముద్ర యుండుటను మీరు చూడగలరు. నావైపునుండి అది ఎడమ ప్రక్క గలదు. మీ వైపునుండి అది కుడిప్రక్క గలదు. అది పక్షిరాజు, కోటుయొక్క చేతులు మరియు ఇంకా తదితర కార్యములు గలవు. కాని ఈ ప్రక్క ఇచ్చట, నావైపు కుడ్రిపక్క పిరమిడ్ను మీరు చూడగలరు. ఆ పిరమిడికి పైన తలరాయి (పైకప్పు)ని మరియు దానికి క్రింద "గొప్ప ముద్ర" అని అచ్చట చెప్పబడి యుండుటను మీరు గమనించగలరు. మనము వాడే ద్రవ్యమునందు కూడా అది యుండుటను మనము గుర్తించగలము... ఏ నాస్తికుడు కూడా
క్రైస్తవ మార్గమును నిర్మూలించలేడు. ఒక్కొక్క ఉత్తరములోను నీవు వ్రాసే తారీఖు మన ప్రభువుయొక్క పుట్టుకను తెలియజేయుచున్నది. ప్రతీ కాలండరు, ప్రతీదీ ఆయనను గురించే మాట్లాడుచున్నది. మనమ వాడే ద్రవ్యము (currency) నందుకూడా తలరాయి కలదు, అది క్రీస్తు.... ఎందుచేత వారు తలరాయిని పిరమిడ్ పైన పెట్టలేదు? ఎందుకనగా ఆ తలరాయి వచ్చినప్పుడు, వారు దానిని నిరాకరించిరి.
56. కానీ ఇప్పుడు, ప్రవచనము ప్రకారము, తలరాయి రావలయును. మీరు గమనించాలని నేను ఆశించుచున్నాను, ఆ తలరాయి వచ్చినప్పుడు వర్తమానమును చెప్పే రాజకుమారుడు, "కృప కలుగును గాక! కృప కలుగును గాక!" అని ఆర్భటించుచు చెప్పును. ఏ మానవుడు గర్వించకుండా యుండుటకై క్రియల వలన కాకుండా మనము కృష్ణ ద్వారానే రక్షింపబడితిమి. కృపా వర్తమానమనునది మానవునియొక్క కాళ్ళ క్రింద త్రొక్కబడి అవమానించబడినది. వానిలో కొందరు నిత్యభద్రత అనే దాని లోనికి వెళ్ళిపోయిరి. మరికొందరు వేరే కార్యములకు వెళ్ళిపోయిరి. అయితే నిజమైన కృష్ణా వర్తమానము మారనిదిగా యున్నది. వాటిల్లో కొందరు నిత్య భద్రతనుండి వెళ్ళుచున్నారు; కొన్ని సమస్తమైన వాటినుండి వెళ్ళుచున్నవి. అయితే నిజమైన కృపా వర్తమానము అదే విధముగా అట్లే యుండును. అచ్చటే దయ్యము సంఘమునుండి దానిని దెబ్బతీయునట్లు చేయుటకు ప్రయత్నించుచున్నది. కాని మనమందరము దేవునియొక్క కృప వలననే రక్షింపబడితిని.
57. కావున, యేసు క్రీస్తు దేవుడనే విషయమునందు దేవుడగు ప్రభువు అచ్చటకు వచ్చి అది సత్యమని స్ధిరపరచెను, అంతేకాకుండా, ఆయన తన వాక్యము ద్వారా దానిని ఆయన సత్యమని స్థిరపరచును, సూచకక్రియలు మరియు అద్భుతకార్యముల ద్వారా ఆయన దానిని సత్యమని స్థిరపరచును. ఆ విధముగానే కృపకూడా సత్యమై యున్నది. అట్లయిన, ఎందుకని కొందరు కృప తప్పు అని విమర్శించుచు, క్రియల వలననే మనము రక్షింపబడితిమని చెప్పుచున్నారు? క్రియల వలన కాదు గాని, విశ్వాసము మూలముగా, మనము కృప ద్వారా రక్షింపబడితిమి. నీవు రక్షింపబడితివనే దానిని క్రియలు చూపించుచున్నవి కాని నిన్ను రక్షింపబడినదేదైయున్నదో అది దేవుని యొక్క కృపయేయగును. కృప మాత్రమే నిన్ను రక్షించినది. దేవుడు నీకోసము ఏదైతే చేసెనో అదే కృపయగును. దేవుడు నీకొరకై చేసిన దానిని నీవు ఎంతగానో కొనియాడుచూ అందునిమిత్తమై దేవుని కొరకు నీవు చేయు కార్యమే క్రియగా దానిని చూపించుచున్నది. కాని నీవు కృప వలన రక్షించబడితివి.
58. "నేను ఆ సంఘములో చేరితిని, నా పేరును ఆ పుస్తకములో నమోదు చేసితిని, నేను చెయ్యవలసినదంతా అంతే" అని కొంతమంది జనులు తలంచుచున్నారు. “నేను కేకలు వేయుచున్నాను, నేను చెయ్యవలసినదంతా అంతే" అని కొంతమంది జనులు తలంచుచున్నారు. “నేను అన్యభాషలో మాట్లాడుచున్నాను, నేను చెయ్యవలసినదంతా అంతే.” అని కొందరు తలంచుచున్నారు. "వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు శక్తి నాకు గలదు,
నేను చెయ్యవలసినదంతా అంతే" అని కొందరు అనుకుంటున్నారు, అది కానేకాదు. అది దేవునియొక్క కృపయే నిన్ను రక్షించినది, అది దేవునియొక్క ఆశ్చర్యకరమైన కృప. ఏ. యోగ్యతలయందు నాకు నమ్మకము లేదు. "ఓ, అక్కడ ఒక వ్యక్తియున్నాడు, అతడు, అతడు నిలబడి దీనిని చేయును అని వినబడినదని, అతడు నిలబడి దానిని చేయును అని వినబడినదని" అని కొందరు చెప్పేదరు.
59. 1 కొరింధీయులు 13, "మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమలేనివాడనైతే నాకు ప్రయోజనము లేదు" అని పౌలు చెప్పెను. దేవుడే దానిని చెయ్యవలయును. నీవు ఈ కార్యములన్నియు చేసినను, అయినప్పటికిని నీవు తప్పిపోయెదవు. మిమ్మల్ని రక్షించినది కృపయే. మానవ జాతికొరకై దేవునియొక్క కృప గలదు.
60. ఆయనను గురించి అలోచించుచూ ఆనాడు ఒక దినమున ఉదయ కాలమందు సూర్యుడు ఉదయించుటకు ముందు, ఒక చెట్టు మొద్దుమీద నేను కూర్చొని యున్నప్పుడు శుక్రవారము దినమున నాకు కనబడిన దృశ్యమును చూచి వెంటనే నేను కృపనే తలంచితిని, అటు తర్వాత నా కన్నులలోనుండి కన్నీరు కారుచు యుండెను. “ఓ దేవా, నన్ను రక్షించుటకై నీ కృప ఎంతగానో తనను తగ్గించుకొనెను, విద్యలేని పామరుడనైన, దౌర్భాగ్యుడనైన నావంటి వాడిపై ఎందుకని నీవు ఇంతగా నాపై కనికరమును చూపితివి?'' దీనస్థితిలో యున్న ఈ చిన్న గుడారములోనికి నీవు వచ్చుటకు ఎట్లు తలంచితివి? అచ్చట సమాధానము కలుగచున్నది. అచ్చట జనులు, ఈ ప్రపంచమున యుండు ఐశ్వర్యమును మరియు దేనిని లేనివారై, చూచుటకు జీవితమున అల్పులుగా కనబడుచున్నవారు వచ్చుచున్నారు; అయినప్పటికిని నీయొక్క కృష్ణ మా హృదయములలో పరిశుద్ధాత్మతో కుమ్మరించబడినది. నీవు మమ్మల్ని, మా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచితివి, మా పాపములనుండి మమ్మల్ని రక్షించి మమ్మల్ని మీ జనులుగా చేసుకొంటివి. మాతో వ్యవహరించుము.” అని చెప్పితిని.
61. పిదప నేను దావీదును గురించి తలంచితిని, ప్రభువునకు ఒక నివాస స్థలమును నిర్మించవలెననే ఉద్దేశ్యమును కలిగినప్పుడు, "నా దేవునియొక్క మందసము గొజ్జెల చర్మము క్రింద ఒక గుడారములో నుండగా నేను దేవదారు మ్రానులతో కట్టబడిన ఒక గృహములో నివాసము చేయుట సరికాదని" చెప్పెను.
62. "నీవు వెళ్ళి, నా సేవకుడు దావీదుతో ఈలాగు చెప్పుము - "గొజ్జెల కాపరివైన నిన్ను నీ తండ్రియొక్క గొట్టెల దొడ్డిలోనుండి తీసి మరియు లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను" అని ప్రభువు ప్రవక్తతో చెప్పెను.
63. ఆయన దానినెట్లు చేయగలిగెనని, నేను దేవునియొక్క కృపను గురించి దీర్ఘంగా ఆలోచించుచుంటిని - అత్యంత కడపటి వరుకు రక్షించును! అటు పిదప ఒక పేద, దౌర్భాగ్యుడైన నావంటి ఒకడిని తీసికొని, ఈ సువార్తను ప్రకటించుటకు ఒక తరుణమును అనుగ్రహించి ఇతరులు రక్షింపబడునట్లు చూచుటకును, స్వస్థతను పొందుటను చూచుటకును, బ్రద్దలైపోయిన కుటుంబములు మరలా చక్కబడునట్లు చూచుటకును, నశించిపోయిన జీవితములను మరలా సరిదిద్దబడునట్లు చూచుటకు భాగ్యమును ఆయన నాకు కలుగచేసెను. నాకు కృపను అనుగ్రహించెను; “ఓ, ఇది ఆశ్చర్యకరమైన కృప. పిదప ఎంతో హీనమైన, దీనుడవైన ఉడుతల వేటగాని యొద్దకు అరణ్యములో ఆయన వర్షధనస్సు వంటి ఆకారములో వచ్చెను, అదేమనగా "ఒక ఒడంబడికకు," ఒక ఆనవాలుగా యున్నది. ప్రసంగించుటకు ఆయన నాకు అనుగ్రహించిన ఒక వర్తమానముతో అచ్చట దానిని ఒక ఒడంబడికతో రూపుదాల్చి ఆయన దానివెనుక ఉన్నాడని రుజువు పరచునట్లుగా ఆయన ఆ విధముగా ప్రత్యక్ష మాయెను. ఆయన దానికి వెనుక యున్నాడు. ఎందుకనగా ఆ వర్తమానము యేసు క్రీస్తును మరియు ఆయన మహిమను గురించినదై యుండును.
64. ఆయన ప్రపంచము చుట్టూయున్న దేశములకును, లక్షోప లక్షల ప్రజల యొద్దకు నన్ను వెళ్ళునట్లు చేసెను, లక్షలకొలది జనులు ప్రభువు యొద్దకు వచ్చుటయు మరియు ఆయన తమ స్వంత రక్షకుడుగా అంగీకరించుటను చూచునట్లుగా, ఆయన దయతో వారు నింపబడియుండునట్లు మరియు, ఆయన శక్తిద్వారా శుద్ధీకరించబడుటను చూచుటకు, ఆయనయొక్క గొప్ప సర్వశక్తి ద్వారా వారు స్వస్థతనొందుటను నేను చూచునట్లు చేసెను. పిదప ఆ ప్రవక్త కేకలు వేసినట్లుగా, "శక్తిచేతనైనను బలముచేతనైనను కాక దేవుని ఆత్మచేతనే." నేనుకూడా విద్యచేతనైనను, వేదాంతము చేతనైనను కాదుగాని దేవునియొక్క ఆత్మచేతనే అని కేకలు వేసెదను. ఆయన తన ప్రజలను రక్షించును. దేవుని యొక్క ఆత్మచేతనే ఆయన తన ప్రజలను స్వస్థపరచును, దేవునియొక్క ఆత్మచేతనే వర్తమానమును ఆయన ప్రజలకు యిచ్చును. దేవునియొక్క ఆత్మచేతనే ఆ వాక్యమును ఆయన స్థిరపరచును.
65. నేడు మనకు వేదాంత పండితులు గలరు; దైవత్వ శాస్త్రములో పాండిత్యము గలవారు మనకు గలరు, తెలివిగలవారు, మేధావులు, విద్యావంతులు వంటి గొప్ప పేరుప్రఖ్యాతులు గలవారు ప్రపంచమంతటా మనకు గలరు. ఆయన వాక్యమును మాట్లాడి, యేసు క్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడని
చూపించుటకు దేవుని యందు సామాన్యమైన విశ్వాసమే అందుకు కావలసియున్నది. యేసు క్రీస్తును వర్తమాన కాలమునకు తీసుకొని వచ్చుటకు దేవునికొరకై సమర్పించుకొన్న ఒక నమ్రత గల హృదయము కావలసియున్నది. ఆమేన్. ఒకవేళ అది వేదశాస్త్రముతో వచ్చినయెడల ప్రెస్బిటేరియన్, మెథడిస్టు, బాప్టిస్టు, కాథలిక్ మరియు ఇతరవి పరిస్థితి ఏనుగును. విద్యలేని పామరులమైన దీన ప్రజలమగు మనకు ఒక అవకాశము లేకండా పోయెడిది. కాని దానికి మానవుని జ్ఞానము అక్కర్లేదు.
66. "శక్తిచేతనైనను, బలము చేతనైనను కాదు గాని నా ఆత్మచేతనే, నేను ఈ మర్మమును బయలుపరచెదను" అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. "కృప, కృప అని అరచుచూ, కేకలు వేయుచు" అతడు దానియందు ఆర్భటించును. నేడుకూడా అదే విధముగా యున్నది, దేవునియొక్క ఆశ్చర్యకరమైన కృప ఆయనయొక్క జనులకు కలదు. విద్యలేనివాడిని, ఏమి తెలియనివాడిని ఆయన తీసుకొని యేసు క్రీస్తు మారని వాడని చూపించుచున్నాడు.
67. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు, ఆయన ఎన్నడూ గొప్ప వేదశాస్త్రుల యొద్దకు వెళ్ళలేదు. ప్రధాన యాజకుడగు కయప దగ్గరకు వెళ్ళలేదు; అతడిచే నిందింప బడుటకు మాత్రమే ...... కాని ఆయన బెస్తవారిని తీసుకొనెను, బీద మనుష్యులును మరియు సామాన్యమైన జీవితమును జీవించే వారియొద్దకు వెళ్ళి అచ్చట ఆయన తనను బయలుపరచుకొనెను మరియు, "నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని” వారితో చెప్పెను. ఆయనయొక్క కృప యూదులనుండి అన్యజనులయొద్దకు ఇప్పుడు వెళ్ళి, మనము ఇప్పుడు చూచిన విధముగా, ఈ అంత్యదినములలో ఆయనయొక్క నామము కొరకు ఒక గుంపు జనులను ఆహ్వానించు చుండెను. ఆశ్చర్యకరమైన కృప, ఆ శబ్దము ఎంత మధురముగా యున్నది.
68. కృప ప్రాచీనమైనది, ప్రపంచము ఎంత ప్రాచీనమైనదో కృప అంతటి ప్రాచీనమైనది. మనము ప్రారంభించినప్పుడు కృప మొట్టమొదటగా మానవ జాతికి కనుపరచబడినది. ఏదేను తోటలో మానవ జాతిని మొదట సృజించినప్పుడు, ఆ చీకటి ఉదయమున ఆ చిన్న స్త్రీ వేరుపరచు గీతను దాటినప్పుడు, దేవునియొక్క అజ్ఞలను ఉల్లంఘించి, మరియు తాను చేసిన అ చెడు కార్యమును తన భర్త చేయునట్లుగా అతడిని మరులు కొలుపుటచే, అప్పుడు ఆ నియమము బ్రద్దలైనది. నియమమునకు ఒక శిక్ష యుండవలెను, అట్లు లేనియెడల అది నియమము కాదు, ఆ నియమము అనునది "నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.”
69. జ్ఞాపకముంచుకొనండి. మొదటి తీర్పు తీర్చు సింహాసనము భూమి మీదే యుంచబడినది. అది ఏదేను తోటలో యుంచబడినది. చివరి తీర్పు తీర్చు సింహాసనము భూమిమీదే అంత్యకాలమందు యుంచబడును, ధవళ సింహాసనము.
'70. కాని యెహోవా క్రిందికి వచ్చినప్పడు, ఒక్క నక్షత్రముకూడా ప్రకాశించుటకు అచ్చట లేకపోవుటను నేను ఊహించగలుగుచున్నాను; ఒకప్పుడు వెలుగుగా యుండు ఆ చిన్న ఏదెను తోట ఎంతో చీకటితో నిండిపోయినది, ఎందుకనగా పాపమనునది దానిని కప్పివేసి, వానిమధ్యయున్న వెలుగును తీసివేసినది.
71. నేడు సంఘములో యున్న కార్యములు ఈ విధముగానే యున్నవి. నేడు జనులతో నుండు కార్యములు కూడా అదే విధముగానే యున్నవి. యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఇంకా ఏకరీతిగా యున్నాడనే దానిని, అత్యంత కడపటి వానినికూడా రక్షించుటకై ఆయన జీవించుచున్నాడనే దానిని, ఎంతో అధముడైన వ్యాధిగ్రస్తుడనైనను ఆయన స్వస్థపరచుననే దానిని చూపించుటకు, జీవించుచున్న దేవుని వెలుగును పాపమనేది మూసివేసినది.
72. ఓ, అంధకారము తోటలో వ్రేలాడుచు యుండుట ఉదయకాలమున అది ఎంతటి భయంకరముగా యుండును. నల్లటి ముతుక బట్టవంటి పొగమంచు యున్నట్లుగా యుండునని నేను ఊహించుచున్నాను. ఒక్క ఆకుకూడా కదలకుండా యుండుటను, అచ్చట గాలివీచే శబ్దము లేకుండుటను నేను ఊహించుచున్నాను. అంధాకారముతోను మరియు భయంకరముగాను అది యున్నది, ఎందుకనగా పాపమనేది వెలుగును మూసివేసియున్నది.
73. యెహోవా క్రిందికి దిగి ఒక గర్జించు ఉరుమువలె అచ్చటకు వచ్చెను. "తోటగుండా సంచరించుచు ఆదామా, నీవు ఎక్కడ యున్నావు?" అని కేకలు వేసెను. తాను దిగంబరినని మరియు దేవుని ముందు పాపము చేసితినని ఆదాము గ్రహించినప్పుడు, తనను తాను మరుగుపరచుకొని మరియు తనంతట తానే ఒక మార్గమును ఏర్పరచుకొనుటకు ప్రయత్నించెను; కాని అది సాధ్యము కాలేదు. దేవుడు కొన్ని గొజ్జెలను చంపి, వాటియొక్క చర్మమును తీసి మరియు పాపమును కప్పుటకు ఏదో ఒకటి మరణించాలనే దానిని చూపించెను.
74. సంఘములో చేరుటయనేది పాపమును కప్పదు. తడిలేని కళ్ళతో కూడిన ఒప్పుదల ఎప్పటికీ పాపమును కప్పదు. దుఃఖము, పశ్చాత్తాపము మరియు దేవుని కృ పయే పాపమును కప్పును, కల్వరిలో దేవునిచే చంపబడిన యేసు క్రీస్తుయొక్క రక్తమే పాపమును కప్పును.
75. అచ్చట తోటలో ఆ ఉదయకాలమున, పాపమనేది బహు అంధాకారముగా యున్న సమయమందు, యెహోవా లోపలికి ప్రవేశించెను. అచ్చట ఆయనయొక్క ఆ దంపతులు నిలబడియున్నారు. శిక్షకు పాత్రులుగా నిలబడియున్నారు. అటు తరువాత మానవ జాతియే ఇక ఉండదు; వారు మరణించే తీరవలయును, మృత్యువు మానవ
జాతిపై యున్నది, లోకమును మరలా అడవి మృగములకు ఇవ్వవలయును మరియు ఇక .. అచ్చట మానవజాతి యుండదు. కాని అంతటి అంధాకారపు సమయమందు, సమస్త నమ్మకమును కోల్పోయిన ఆ సమయమందు, క్రుమ్మరింపబడిన కృప వచ్చి, "నేను నీకు ఒక రక్షకుడిని, ఒక మెస్సీయాను అనుగ్రహించెదను అని వాగ్దానము చేసెను. ఓ, దేవుడు ఏ విధముగా దీనిని చేయగలిగెననేది ఒక అద్భుతముగా యున్నది. ఏదెను తోటలో దేవునియొక్క ఆశ్చర్యకరమైన కృప అనేది స్త్రీద్వారా రానైయున్నవానిని గురించి వాగ్దానమును వారికి ఇచ్చెను. "స్త్రీ సంతానము సర్పముయొక్క తలమీద కొట్టును," అపరాధియైన అతడు, "అతడి తల, ఆమె మడిమెమీద కొట్టును." ఇది సంఘమునకు ఆపదను కలిగించుననే దానిని చూపించుచున్నది. కాని ఆయన ఒక జయోత్సాహమును వాగ్దానము చేసెను. ఒక రక్షకుడిని ఏది సిద్ధము చేసినది? కృప!
76. కృపను పొందుకొనేలా అర్హులగుటగు వారు దేనిని చూపించగలరు? దానిని చేయుటకు వారు దేనిని చూపించగలరు? సైన్యములో (రాణువ), ఈ విధముగా చెప్పుచున్నందులకు, క్షమించవలెను, నేను ఒక విషయమును చెప్పాలనే ఉద్దేశ్యముతోనే ఈ వేదికనుండి దీనిని చెప్పుచున్నాను, "ఇంకొకరిపై త్రోసివేయుట" ఆదాము, "నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే దీనిని చేసెను” అని చెప్పెను. స్త్రీ, "సర్పము నన్ను మోసపుచ్చెననెను." అని చెప్పను. ఒకరు ఇంకొకరిపై దానిని మోపుట.
77. వారికి నమ్మకమనేది లేకుండా పోయెను, కాని దేవుడు కృపను సిద్ధపరచెను; అది ప్రవహించుచూ వచ్చెను. ఆయన, "కాని, ఏదో విధముగా నేను మీకు ఒక మార్గమును కల్పించెదను. ఏది ఏమైనను నేను మిమ్మల్ని రక్షించెదను. మీరు తప్పిదము చేసిరి; మీరు నా నియమములను అతిక్రమించిరి. నా నియమములకు పాటించవలెను ... ? ... నా నియమములనుండి అమలు చేయబడిన తీర్పును తీర్చబడవలెను. కాబట్టి దానిని మీరినప్పుడు 'మరణము' సంభవించునని నేను చెప్పినందువలన, మరణము సంభవించే తీరవలయును. ("సహో. బ్రాన్హాంగారు వేదికమీద తట్టుచుండెను - సంపా.)
78. ఇప్పుడు, "నా క్రైస్తవ స్నేహితుల్లారా (ఇచ్చట చేయబడు ఈ టేపులు లోక మంతటికీ వెళ్ళును) ఒక విషయమును నేను మిమ్మల్ని అడుగవలయును, దేవుడిని మూడు దేవుళ్ళుగా చేయుటకు ప్రయత్నించేవారులారా, లేదా ఆయన మీ చేతివ్రేళ్ళల్లో యున్న ఒక చేతి వ్రేలుగా చేయుటకు ప్రయత్నించుచున్నవారలాలా, ఆయన వ్యక్తిత్వములో ఒక్కడే.
79. ఒక దూతను మరణించునట్లు చేయుటనునది దేవునికి సమంజసముగా యుండదు. ఒక మానవుని కోసము ఆయన ఒక దూతను మరణించునట్లుగా చేయుటమనేది, ఒక నీతిమంతుడైన న్యాయాధిపతిగా ఆయన యుండలేడు, దానివలన ఏ ప్రయోజనము
యుండదు. ఎందుకనగా ఆయనయొక్క గొప్ప నియమము మరణమును అధికారముతో అడుగుచున్నది, మరియు ఏదో ఒకటి మరణించే తీరవలయును, కాని అందునిమిత్తము ఒక దూత మరణించకూడదు. "హవ్వ, దీనిని ఆదాము చేయుటకు నీవే కారకురాలివైతివి, నేను నిన్ను మరణించునట్లు చేసెదను, ఆదామును జీవముతో ఉంచెదను." అనికూడా ఆయన చెప్పలేడు, ఎందుకనగా ఆదాముకూడా ఆ తప్పిదములో భాగస్వామియే.
80. ఎవరో ఒకరు, "పిలాతు నీతిమంతుడాయెను, అతడు తన చేతులను కడుగు కొనెను." అని చెప్పినట్లుగా యేసు క్రీస్తు రక్తమును నీ చేతులతో కడిగి వేయలేవు. ఈ ఉదయకాలమున ఈ భవనమును విడిచి నీవు వెళ్ళి, మీ పాపములలో మీరు మరణించిన యెడల పరలోకమునకు మీరు ఎన్నడూ వెళ్ళలేరు. అది నీ చేతులలో యున్నది. ఆ విధముగా చెప్పుట సమంజసము కాదు.
81. ఒకేఒక్క మార్గము మాత్రమే యున్నది. దేవునియొక్క గొప్ప నియమము చెప్పుదానిని నెరవేర్చవలయును. ఆయనే దానిని అంగీకరించి నెరవేర్చవలసియున్నది. ఆయనే దానిని చెయ్యవలసినదిగా యున్నది. దేవుడు ఒక ఆత్మగా యున్నందువలన ఆయన మరణించలేడు. కాబట్టి దేవుడే మానవునిగా రావలసి వచ్చినది. మరియు ఒక మానవుడుగా పిలవబడే “యేసు క్రీస్తు" అనే మానవ శరీర రూపములో ఆయన మరణించెను. అది వాగ్దానమును చేయబడిన మెస్సీయాను తీసుకొచ్చిన కృపయగును. అచ్చటే దేవుడు మరియు క్రీస్తూ ఒకే వ్యక్తి అనే దానిని నీవు చూడగలవు; దేవుడు క్రీస్తులో నివసించెను. "నేను మరియు నా తండ్రి ఏకమైయున్నాము, నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుట లేదు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు." క్రీస్తులో దేవుడు నివసించెను, నిశ్చయముగా
82. కాని ఏదెను తోటలో కృప వాగ్దానము చేయబడినది, కృప వచ్చెను, ఆదాముకు మరియు హవ్వకు కృప వచ్చినది. ఎచ్చటకు వెళ్ళుటకు వారికి మార్గము లేకపోయెను, ఏ నైపునకు తిరుగుటకు మార్గము లేకపోయెను. అయినప్పటికిని ఒక మార్గమును కల్పించెను.
83. పాపియైన నా స్నేహితుడా, నేను దీనిని చెప్పవలెను. ఈ ఉదయమున ఇచ్చట నీవు ఒక వ్యభిచారిగా వుండవచ్చు, ఈ ఉదయమున ఇచ్చట నీవు స్త్రీల వెంటబడే ఒక వేటగాడిగా యుండవచ్చు, ఇచ్చట నీవు ఒక త్రాగుబోతుగా వుండవచ్చు లేక ఒక జూద గాడిగా వుండవచ్చును, లేదా ఒక హంతకుడిగా యుండవచ్చు, నీవు బహుశా ఇచ్చట కళంకము గల ఒక భర్తగా యుండవచ్చు, కళంకమైన భార్యగా యుండవచ్చు, నీవు నికృష్టమైన పాపిగా యుండవచ్చు. "విమోచించబడుటకై వచ్చిన ఘట్టమును నేను దాటిపోతిని" అని నీవు చెప్పవచ్చు. లేదు. నీవు దానిని దాటిపోలేదు, లేదా, అట్లుండినయెడల, నీవు ఈ ఉదయమున సంఘములో యుండకపోదువు. ఇప్పుడే దీనిని నీవు అంగీకరించిన
యెడల ఈ చీకటి సమయమందు కృప నీకు ఒక మార్గమును కల్పించును. దానిని అంగీకరించుటకు ఆదాము ఇష్టపడును, ఆ విధముగానే నీవుకూడా చేయవలెను, దానిని అంగీకరించుము.
84. దేవుని కృప నోవహుయొక్క దినములలో పోయి చేరినది. నోవహు ఒక సామాన్యమైన మానవుడు; అతనికి కుటుంబము యుండెను; కాని నోవహు దేవుని యందు భయమును కలిగియుండుటవలనను, దేవునియందు నమ్మకమును అతడు కలిగియుండుట చేతనే! నమ్మకము లేకుండా నీవు దేవునియందు భయమును కలిగియుండలేవు. నీవు నమ్మకము లేనిదానియందు నీవు ఏ విధముగా భయమును కలిగియుండెదవు? దేవునియందు భయమును నీవు కలిగియుండవలెను. "దేవునియందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము" అని సొలొమోను చెప్పెను. ఇప్పుడు, దేవునియందు భయభక్తులు కలిగియుండుట, నీ జ్ఞానమునకు ఆది మూలమై యుండును. దేవునియందు భయము కలిగియుండవలెను, ప్రభువుకు నోవహు భయపడెను మరియు అతడు ప్రభువును నమ్మెను. దేవుడు దానినే గౌరవించుచున్నాడు; ఆయనపైన నీకున్న విశ్వాసము, అది నిజము. దేవునియందు భయము నోవహుకు వచ్చినప్పుడు, దేవుడు అతడిని కృపద్వారా పిలచెను, అతడిని మరియు అతడి కుటుంబమును రక్షించెను; ఎందుకనగా దానిని చేయునది కృపయేయగును. ఆనాటి కాలములో యున్న వారందరికంటే నోవహు ఒక గొప్ప మంచి అందమైనవాడనే కారణము చేతకాదు, ఆ దేశములో అచ్చటయున్న మంచి సంఘమునకు నోవహు వెళ్ళినందువలన కాదు, అతడు శ్రేష్టమైన శాఖకు చెందినవాడై నందువలన కాదు, మంచి వస్త్రములను అతడు ధరించుకొనుట వలన కాదు, ఎంతో డబ్బున్నవాడైనందువలన కాదు, అతడు ఏదో ఒక విశేషమైన వ్యక్తి అయినందువలన కాదు, గాని దేవుని కృప వలననే. దేవుడు నోవహును రక్షించెను. కృప నోవహును రక్షించెను. (అతడి క్రియల వలన కాదు గాని ఆయన కృప వలన మాత్రమే) మరియు అతడి కుటుంబము కూడా రక్షించబడెను.
85. దేవునియొక్క కృపను చూపబడిన ఇంకొక గుణమును మనము పిలిచెదము, అనేకులకు కృప చూపబడినది. కొద్దిమంది గురించి మాత్రము మనము చెప్పుకొనెదము. అబ్రాహాము. అబ్రాహాము విశేషమైన మానవుడు కాదు. బాబెలు గోపురమునుండి వచ్చినవాడు; బహుశా విగ్రహారాధికుల గుంపునుండి (అతడి తండ్రి) వెలుపలికి వచ్చినవాడు, షినారు అను ప్రదేశములోనున్న ఊరను పట్టణములో నివసించుచు వచ్చినవాడు. అతడు అచ్చట యున్నప్పుడు కృపద్వారా దేవుడు అతడితో మాట్లాడెను, అతడు వ్యత్యాసమైన వాడైనందువలనన కాదు, అతడు ఒక మంచి వ్యక్తి అయినందువలన కాదు గాని దేవుడు కృపద్వారా అతడిని పిలిచెను. పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా దానిని ఎరుగునట్లు చేసెను.
ఓ, అబ్రాహాము, దేవునియొక్క ఓర్పును అబ్రాహాము ఎంతగానో శోధించెను!" "అబ్రాహామా ఈ దేశములోనే నిలిచియుండుము, దీనిని వదిలి వెలుపలికి వెళ్ళకు." అని అతడితో చెప్పెను. కాని ఒక కరుపు ఏర్పడినప్పుడు అబ్రాహాము ఆ దేశమును విడిచి వెళ్ళిపోయెను.
86. అబ్రాహాము మనకు ఒక సాదృశ్యముగా యున్నాడు. దేవుడు ఎన్నుకొని దేవుడు కృపద్వారా అబ్రాహామును తీసుకొని మరియు అతడిని రక్షించెను. ఆ విధముగానే కృపద్వారా ఆయన నిన్ను ఎన్నుకొనెను. మనమెట్లు ఆయన ఓర్పును శోధించెదము? నేడు మనము ఎంతో పైన ఉండెదము కాని రేపు ఎంతో క్రింద ఉండెదము. ఒక దినమున మనము నమ్ముచున్నాము, మరుసటి దినమున మనము ఆశ్చర్యపడుచున్నాము. నేడు మనము దైవీక స్వస్థతను నమ్ముచున్నాము, రేపు కడుపు నొప్పి వచ్చినదంటే దానిని నమ్ముచున్నామో లేదో మనకే తెలియదు. అయినప్పటికిని వీటన్నింటి మధ్యలో మనము ఆ విధముగానే వుండాలని దేవుడు ఆశించుచున్నాడు. ఎట్లున్నాగాని ఆయన మనల్ని రక్షించెను. దేవుని కృప మాత్రము లేకపోయినయెడల మనమందరమూ నశించిపోయి యుండెడివారము. నిశ్చయముగా. దేవుడు తన కృపద్వారా మనలను రక్షించెను.
87. అబ్రాహాము ఆ దేశములోనే ఉండవలసియుండెను, కాని అతడు కల్దీయుల దేశమునకు వెళ్ళెను లేదా కల్దీయుల దేశము కాదు, కాని ఫిలిష్తీయుల దేశమునకు వెళ్ళెను, ఒక కరువునుండి తప్పించుకొనుటకై అతడు కొంత కాలమునకు అచ్చట నివాసము చేసెను. అతడు నివాసము చేయుచున్న దేశమందు కార్యములు కొంచెము ఇబ్బందికరముగా యుండెను; కాబట్టి అచ్చటకు వెళ్ళి వారితో కలిసి నివాసము చేయుటకై ప్రయాణమై వెళ్ళెను, ఏదైతే చేయవద్దని దేవుడు అతడితో చెప్పెనో దానినే అతడు ఖచ్చితముగా చేసెను; అయినప్పటికి ఫరో రాజు అతడి భార్యను తీసుకొనకుండునట్లు కృప అతడికి ప్రత్యక్షమై కాపాడెను. దేవుని కృప ..... "ఆమె నా చెల్లెలు," అని అబ్రాహాము చెప్పినప్పుడు, దానినిబట్టి అతడు అబద్ధమును పలికెను. అయినప్పటికిని దేవుని కృప అతడిని పట్టుకొని యుండెను; ఎందుకనగా అతడు పశ్చాత్తాపము చెందెను. అతడు పశ్చాత్తాపము నొందుటకు ఇష్టపడెను.
88. ఎవరైనా పశ్చాత్తాపము నొందుటకు ఇష్టపడుచున్నారా, దేవుని కృప ఇంకా మీ కొరకు యున్నది. దేవుని కృప మీకొరకు వెదకుచున్నది. కావున వెనుకడుగు వేసినవారులారా మీకొరకు ఈ ఉదయకాలమున కృప యున్నది. దేవుని కృప ఇంకా నీకొరకు ఎదురు చూచుచున్నది. నీవు పశ్చాత్తాపము నొందినయెడల, దేవుని కృప చాలినంతగా మీకొరకు యున్నది.
89. ఏ విధముగా ఆ మంచి వృద్ధ అబ్రాహామును, వెనుకకు తీసుకొని వచ్చెను. గుర్తుంచుకొనండి, అబ్రాహాము అతడి క్రియల వలన రక్షించబడలేదు; కృప వలననే అతడు
రక్షించబడెను. అబ్రాహాము విశ్వాసము ద్వారా రక్షించబడెను. విశ్వానమనగా కృప. దేవుడు అబ్రాహామును ఆయన కృపవలననే రక్షించెను, అతడి ప్రవర్తన వలన కాదు. ఆయన అతడిని కృపవలననే రక్షించెను. ఓ, ఎంత చక్కగా యున్నది. అతడు కృపద్వారా రక్షించబడెను.
90. మనము ఇశ్రాయేలీయులను తీసుకొనెదము. నేను ఒక లేఖనమును ఇచ్చట వ్రాసుకొనియున్నాను. నేను దానిని వ్రాసియుంచుకొని దానిని నా మనస్సులో ఆలోచించుచు యుండెదను. మీరు దానిని వ్రాసుకొనవలెననినయెడల, మీరు ఇష్టపడినయెడల అది మీకు జ్ఞాపకముంచుకొనుటకై మంచిదిగా యుండును. ద్వీతీయోపదేశ కాండము 7:7. దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేసెను, లేదా అబ్రాహామునకు కాదు నన్ను మన్నించండి, ఇశ్రాయేలుకు వాగ్దానము చేసెను, "నీవు విగ్రహారాధికులతో సహవాసము చేయనియెడల, మీరు వారి కార్యములను చెయ్యనియెడల, ఈ అన్యదేవతల ఆచారములనుండి నీవు దూరమైనయెడల, నీవు ఈ కార్యములన్నింటినుండి దూరముగా వైదొలగియున్నయెడల, అప్పుడు నేను నిన్ను ఒక మంచి దేశమునకు తీసుకొని వెళ్ళెదను, నేను నిన్ను కాపాడెదీను, నేను నిన్ను పోషించెదను. నేను నిన్ను నడిపించెదను. నీవు ఈ - ఈ కార్యములు చేసిన యెడల, నేను ఈ కార్యములు చేసెదను. నీవు నన్ను ప్రేమించినయెడల, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను నీవు అనుసరించినయెడల, నా ఆజ్ఞలను అనుసరించుచు మరియు నన్ను ప్రేమించి, నీవు చేసినయెడల నేను నీకు ఈ కార్యములను చేసెదను.
91. ఒక భర్త తన భార్య దగ్గర చెప్పునట్లుగానే, "నీవు ఒక మంచి స్త్రీయైనయెడల, గృహమును నీవు చూచుకొనినయెడల, నీవు నాయందు సత్యముగా యున్నయెడల, నీవు నా వస్త్రములను ఉదికినయెడల, మనకు పిల్లలు యుండిన, వారికి ఒక తల్లిగా నీవు యుండిన, ఆ కార్యములను నీవు చేసినయెడల, నా చేతులలో రక్తము కారునంత వరకు నేను పనిచేసి నిన్ను కాపాడుదును, నీవు దానిని చేసినయెడల." కాని పిదప, ఒకవేళ ఆ స్త్రీ తప్పిదమునకు మరలినయెడల సోమరిగా జీవించుచు పని చేయకుండ, దేనిని చేయనిదైతే, ఆలోచించి చూడు? ఆ కుటుంబమును ఒక్కటిగా యుంచుటకు కృప అవసరమైయున్నది.
92. ఓ దేవా, అతడి కుటుంబమును ఒక్కటిగా యుంచుటకు యెహోవాయొక్క కృప కావలసియున్నది. ఆ ఒకే మార్గమునందు మాత్రమే నేడు మనము యెహోవాయొక్క కుటుంబమైయున్నాము. యేసు క్రీస్తు కృపయే అందుకు కారణమైయున్నది; మనమందరము నశించిపోయెడివారము. కాని అది కృపయైయున్నది, ఓ, కృప.
93. కాని, ఇప్పుడు, వారు దానిని కాపాడుకోలేదు. కాని వారు ..... పూర్తి వాగ్దానము యొద్దకు వారు రానేరాలేదు; ఆ తరము వారు రానేరాలేదు. లేదు, ఎవరికి వాగ్దానము చేయబడినదో ఆ తరము వారు అరణ్యములోనే నశించిపోయిరి, కాని దేవుడు వారిని
పోషించెను, దేవుడు వారిగురించి శ్రద్ధవహించెను, దేవుడు వారిని ప్రేమించెను, వారిచుట్టూ సంచరించెను, ఎందుచేత? ఆయన కృప దానిని చేసినది, ఆయన వారికి చేసిన వాగ్దాన నిమిత్తమైన ఆయన కృప దానిని చేసినది, ఆయన కృప ఆయన చేసిన వాగ్దానముతో వెళ్ళినది. కాని వాగ్దానము చేయబడిన దేశముయొక్క సంపూర్ణమైన విలువయొద్దకు వారు రానే రాలేకపోయిరి.
94. ఈ సంఘశాఖ కూడా ఆ సంపూర్ణత విలువయొద్దకు అది రాలేదు. దేవుని యొక్క కృప మనలను భరించుచున్నది. మీ సంఘశాఖలు ఏమి చెప్పుచున్నను లెక్కచేయకుండా, ఆయన వాక్యమును తీసుకొని మరియు "అది సత్యమని" చెప్పే ఒక ప్రజలు, ఆయనకు లోబడే ఒక సంఘము ఆయనకు కావలసియున్నది. "మంచిది, నీవువలె నేనుకూడా మంచివాడిని. నేను ప్రేస్బిటేరియన్, నేను మెథడిస్టును, నేను కాథలిక్. నీవు ఎంతటి మంచివాడివో నేనుకూడా అంతటి మంచివాడిని." అని చెప్పని ఒక జనము ఆయనకు కావలసియున్నది. అది కృప కాదు, అచ్చట ఏదో తప్పిదము గలదని అది చూపించుచున్నది.
95. కాని, ఏ వ్యక్తియైనాగాని, ఏమైయున్నాగాని, దేవునియొక్క వాక్యమును చదివి మళ్ళీ జన్మించిన అనుభవమును నీవు పొందుకొనిన వ్యక్తిగా యుండి, మరియు పరిశుద్ధాత్మతో నింపబడియుండవలెను. వారు దానిని నమ్మెదరు, వారు దానిని వాక్యము ద్వారా తీసుకొని, వాక్యము ఏమని సెలవిచ్చుచున్నదో ఖచ్చితముగా దాని ప్రకారమే వారు దానిని గైకొనెదరు.
96. బాప్తిస్మములలో చిలకరింపు బాప్తిస్మము వలె, బాప్తిస్మము సరియైనదే. కాని, పరిశుద్ధ గ్రంథములో ఏ ఒక్కరుకూడా చిలకరింపు బాప్తిస్మము తీసుకొన్నట్లుగా ఎచ్చటా లేనేలేదు; అటువంటి ఒక విషయము అసలు లేఖనములలో లేదు. అదే విధముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములలో ఎప్పుడూ ఏ ఒక్కరికికూడా బాప్తీస్మము యిచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో లేదు. ప్రతీఒక్కరు యేసు క్రీస్తు నామములోనే వారు బాప్తిస్మమును పొందిరి. కాబట్టి అచ్చట ఒక్కరుకూడా లేరు, చరిత్రలో కూడా ఒక్క ఆధారము లేదు . మూడు వందల సంవత్సరముల తరువాత చివరి అపోస్తలుడు మరణించేత వరుకు, కాథలిక్ సంఘము వచ్చేంత వరుకు, చరిత్రలో ఎచ్చటైనా గాని, ఆ విధముగా బాప్తిస్మము పొందినట్లుగా, పరిశుద్ధ గ్రంథములో ఏ వ్యక్తియైనా ఎచ్చటైనా గాని పొందినట్లుగా, ఎవరైనా ఎచ్చటైనా చూపించినయెడల, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, లేదా చిలకరింపు బాప్తిస్మము గాని కాథలిక్ సంఘము వచ్చేంతవరుకు ఎచ్చటైనా, ఎవరైనా, ఎప్పుడైనా అటువంటి బాప్తీస్మము పొందినట్లుగా ఎవరైనా ఒకరు చూపించినయెడల, దానిని వచ్చి నాకు చెప్పుటకు నీ ఆత్మకు జవాబుదారిగా నీవు యున్నావు. అది అచ్చట లేదు. కాని మనము ఏమి చేయుచున్నాము?
97. వారు దానిని చెయ్యవలసిన అవసరత ఎచ్చట కలిగెనో మనము సంఘ కాలములంతటా దానిని చూచితిమి. కాబట్టి మీరు చూచారా, దేవునికి విధేయత చూపే ఎవరో ఒకరు ఆయనకు కావలసియున్నది. అది లేఖనములలో లేనియెడల, పిదప అది మానవునిదై - అది ఒక మానవ సిద్ధాంతము మరి అది పరిశుద్ధ గ్రంథములో యుండే ఒక సిద్ధాంతము కాదది. చూచారా? కాబట్టి సంఘము ఏదైతేనేమి, నీవు ఎంతటి తప్పిదములో యున్నావో గ్రహించకుండా యుండుటము, అందువలన ఏ ప్రయోజనము గలదు? ఇప్పుడు నీవు ఎంత సరిగ్గా యున్నావనే దానిని గురించే కార్యమైయున్నది. దేవుని యొక్క కృప నీకు దానిని చూపించును, అట్లైన దానిలోనికి ప్రవేశించు, దేవునియొక్క
98. ఆ గొప్ప నాయకుడగు మోషేను కూడా గుర్తించుకోండి, అచ్చటకు వెళ్ళి ఆ బండను కొట్టుట ద్వారా తనను మహిమపరచుకొనునట్లుగా చేసి, "మీరు చూడండి. నేనేమి చేయగలను" అని చెప్పిన మాటలను బట్టి ఆ సమయమందే దేవుడు మోషేను చంపివేసియుండును. ఇంకా మాటలలో చెప్పాలంటే, “ద్రోహులారా వినుడి, మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్ళు రప్పింపవలెనా?" అనెను. అతడు ఆ బండను కొట్టెను, నీళ్ళు రాలేదు, అతడు మరలా దానిని కొట్టెను. అతడు ఏమి చేసెను? యేసు క్రీస్తు బలహీనముగలవానిగా తెలుపుచున్నట్లుగా అతడు సాక్ష్యమును పలుకుటకు ప్రయత్నించు చున్నట్లుగా అది యుండెను. ఎందుకనగా క్రీస్తే ఆ బండగా యుండెను. అది తలరాయిగా యుండెను. మాట్లాడుటకు బదులు దానిని కొట్టెను..... అది ఒకసారి కొట్టబడినది.
నీకంటే ముందుగా ఆ బండపై 99. "వెళ్ళు, నేను నీకు ముందుగా నిలబడెదను నిలబడెదను. మరియు నీవు ఆ బండను కొట్టు." అని దేవుడు మోషేతో నిర్గమ కాండములో చెప్పెనని జ్ఞాపకముంచుకోండి, అతడు బండను కొట్టెను, దానిలోనుండి నీళ్ళు బయలుదేరెను. వెళ్ళి, ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును." అని దేవుడు చెప్పెను.
100. కాని మోషే తన దగ్గర కొంచెం అధికారము గలదనే దానిని, కొంచెము శక్తి గలదనే దానిని చూపించుకొనుటకు అతడు అశించెను. కాబట్టి అతడు, "నేను ఈ బండనుండి మీకు నీళ్ళు రప్పించెదను" అని అనెను. అందుకొరకు దేవుడు అతడిని చంపివేసియుండును; దేవుడు అచ్చట అతడిని వేరుపరచియుండవలసినది, దేవునియొక్క నియమమును సరిగ్గా అచ్చటే అతడు బ్రద్దలు చేసెను; ఎందుకనగా క్రీస్తు బలహీనమైనవాడను విధముగాను, ఆయన రెండవసారి కొట్టబడవలెననే విధముగాను జనులకు అతడు చూపించెను. క్రీస్తూ ఒకేఒక్కసారి మాత్రమే కొట్టబడవలయును. ఇప్పుడు, మనము ఆ బండయొద్ద మాట్లాడు చున్నాము, దానిలోనుండి నీళ్ళు పొంగి పొరలి వచ్చుచున్నవి.
101. కాబట్టి అది ఏమిటది? ఆ వృద్ధుడిని మనము కొంచెం చూద్దాము. అతడు నూట ఇరువది సంవత్సరముల వయస్సుగలవాడు.
102. కొన్ని రోజుల క్రితము ఎవరో నా దగ్గర, "దేవుడు, అన్యాయమైన దేవుడు, ఎందుకనగా ఆయన మోషేను ఎడబాసెను. అతడు అచ్చట నలుబది సంవత్సరములు ఆ హెబ్రీయులతో అరణ్యములో కస్టపడిన తరువాత, ఆయన అతడిని ఎడబాసి, వాగ్దానము చేయబడిన ఆ దేశములోనికి వెళ్ళుటకు అతడిని అనుమతించలేదు" అని చెప్పెను.
103. "ఓ, బుద్ధిహీనత" అని నేను చెప్పాను. లేదు, ఆయన మోషేను ఎడబాయలేదు. అతడు వాగ్దానపు దేశమునకు వెళ్ళెను. ఏడు వందల సంవత్సరములకు తరువాత, ఎప్పుడూ యున్నట్లుగానే అతడు జీవముతో రూపాంతరపు కొండపైన ఎలియాతో కూడా యేసు కల్వరికి వెళ్ళేముందు అచ్చట నిలబడి మాట్లాడుచుండెను... మోషే మరియు ఎలియా, యేసుకు, పేతురుకు, యాకోబుకు మరియు యోహానుకు రూపాంతరపు కొండమీద కనబడిరి. అతడు మరణించలేదు. అతడు జీవముతో యున్నాడు. దేవుడు అతడిని విడిచిపోలేదు. అతడు పాలస్తీనాలో యుండెను.
104. అతడు చనిపోవుటకు ముందుగా, ఇప్పుడు చూడండి, తాను వెళ్ళిపోతున్నాడనే దానిని అతడు ఎరిగినప్పుడు, ఆ ఉదయమున అతడు నెబో శిఖరమున కెక్కేను. అతడు అహరోను వస్త్రములను తీసి, వస్త్రములను ఇంకొకరికి వేసెను. అతడి స్వంత అంగీని తీసి దానిని యెహోషువా పై వేసి దేవుని ఆజ్ఞలయందు జాగ్రత్తగా నిలిచి యుండుమని అతడికి ఆజ్ఞాపించెను. అతడు నెబో శిఖరము పైకి ఎక్కి వెళ్ళినప్పుడు, చదునైన పల్లపు భూమిగుండా వెళ్ళి, అచ్చట పైన తాను చనిపోబోతానని అతడు ఎరిగియుండి, నెబో శిఖరమునకు ఎక్కి పిస్కా వరుకు వెళ్ళెను. అతడు అచ్చట నిలబడియుండగా, దేవుడు అతడితో, "ఆ దేశమును చూడుము, నీవు దానిని చూడవలెనని నేను ఆశించుచున్నాను. మోషే, నీవు అచ్చటకు వెళ్ళియుండవచ్చును. కాని ఆ దినమున, అచ్చట బండయొద్ద నీవు ఏమి చేసితివో నీవెరుగుదువు కదా? నిన్ను నీవు మహిమపరచుకొన్నావు." మనవంటి అనేకులకు యుండే గొప్ప బాధ అదేయని నేను అనుకుంటున్నాను. "అచ్చట ఆ బండ యొద్దకు వెళ్ళి, నిన్ను నీవు మహిమపరచుకొన్నావు." కాని ఎప్పుడైతే అతడు మరణించుటకు సిద్ధపడెనో, అచ్చట ఆ బండ నిలబడినది. పిస్కా కొండ దగ్గర బండపై వరుకు అతడు దాటి వెళ్ళియుండును. దేవుడు అతడిని సమాధి చేసెను. మరలా అతడు ఎచ్చటో మరణమునుండి లేచెను; ఎందుకనగా అతడు జీవముతో యుండెను. అతడు క్రీస్తుకు ఒక సాదృశ్యముగా యున్నాడు. వందల సంవత్సరములకు తరువాత రూపాంతరపు కొండమీద అతడు నిలబడియుండెను, అచ్చట (పాలస్తీనాలో) చూచారా, దేవునియొక్క కృప బండను సిద్ధపరచెను. ఓ,
105. నేను అబ్రాహామును గురించి తలంచుచున్నప్పుడు, అతడు చేసిన సమస్త పొరపాటులను మరియు మోషే చేసిన పొరపాటులను, కాని అబ్రాహామును గురించి వ్యాఖ్యానమును వ్రాయబడినప్పుడు, దైవీక వ్యాఖ్యానమును వ్రాయబడినప్పుడు, పౌలు అబ్రాహామును గురించి వ్యాఖ్యానమును వ్రాసినప్పుడు, అబ్రాహాముయొక్క అవిశ్వాసమును గురించి ఒక్కదానిని కూడా చెప్పలేదు, లేదు, లేదు, ఏదీకూడా అతడు గురించి లెక్కించనే లేదు. అతడు "అబ్రాహాము దేవుని వాగ్దానమును గురించి అవిశ్వాసముతో సందేహించలేదు గాని దేవునికి స్తుతులు చెల్లించుచు విశ్వాసమునందు బలపడెను." అని వ్రాసెను.
106. ఈ ఉదయకాలమందు ఇచ్చట దేవునియొక్క కృప ముందు నా వినయముతో కూడిన ప్రార్ధన ఏమనగా, నా గురించి ఆ విధముగా వ్రాస్తున్నప్పుడు, ఆయన నా పొరపాటులను చూడడని నేను నమ్ముచున్నాను. నా గురించి వ్యాఖ్యానము వ్రాయబడు చున్నప్పుడు, నేను మరణించిన తరువాత నా గురించి వ్రాయబడు వివరములతో నేను చేసిన తప్పిదములను మరియు నేను చేసిన పొరపాటులను దానియందు చదువబడదు, కాని నేను ఆయన కోసము చేయుటకు ప్రయత్నించిన ఆ కార్యములను మాత్రమే ఆయన చూచును. అవి ..... అది ఏమి చేయుచున్నది? నేను నమ్ముచున్న ఆ దేవుని యొక్క కృపను ఆయన తీసుకొనును. అచ్చటే దానిని మాత్రమే నేను పూర్ణముగా విశ్వాసించుచున్నాను. నా స్వకీయ అర్హతలో నేను ఇంకొకరు వెళ్ళిన దానికంటే ఎక్కువగా వెళ్ళలేను, కాని నేను దేవుని కృపపై భారము వేసియుండుటవలననే, అవును, ఆ కృపయందే నేను ఆశ్రయించుకొనియున్నాను.
107. అచ్చట మోషే చనిపోవుటకు సిద్ధపడినప్పుడు అచ్చట ఒక బండయున్నది.
108. దావీదు గురించి మనము ఏమని చెప్పగలము? దేవుని కృప..... ఆ యుద్ధ వీరుడు గురించి దేవుడు తానే, ..... "అతడు నా చిత్తానుసారమైన మనస్సుగల ఒక మనిషి ....." అని ఆయన చెప్పెను. దావీదు గొప్ప యోధుడు, ఆ గొప్ప యుద్ధ వీరులలో ఒకడైన ఊరియాను చంపించిన అటువంటి ఒక కార్యమును అతడు ఏ విధముగా చేయగలిగెను? కొద్దిసేపు జాగ్రత్తగా ఈ చిన్న కథను మీరు వినవలెను. వారి సైన్యము అచ్చట యున్నప్పుడు ఊరియా దావీదుతో కలిసియుండెను. ఊరియా అన్యమతములో నుండి.. యూద మతములోనికి ప్రవేశించినవాడు. అతడు ఒక హితీయుడు, యూద మతములోనికి ప్రవేశించిన ఒక అన్యమతస్థుడు. ఆ మనుష్యులు దావీదును ఎంతగానో ప్రేమించిరి అతడు ఒక - అతడు భయపడి దేశమును వదిలి పారిపోయిన వాడైనప్పటికిని అతడిపై అభిషేకము యుండుటను వారు చూచిరి; అతడు తన స్వకీయ దేశమునుండి పారద్రోలబం ఫిలిష్తీయులుతో కలిసి జీవించవలసి వచ్చెను. సౌలు అతడిని వెంటాడుతునే యున్నాడు. అయినప్పటికి ఆ మనుష్యులు, అతడిపై అభిషేకము యుండుటను వారు చూచి అతడు ఏదో ఒక దినమున అధికారములోనికి వచ్చునని వారు ఎరిగియుండిరి, దేవు మహిమ కలుగును గాక!
109. నేనుకూడ భయపడి పారిపోయిన ఒకనివలె యుండుటకు ఎంతో సంతోషించెదను, ఎందుకనగా క్రీస్తు రాజుగా రానైయుండుటను నేను చూచెదను. మీరు కెనడీ మరియు ఇంకా సమస్తమైన వాటిని మీకు కావలసిన దానినంతటిని ఎన్నుకోగలరు. కాని క్రీస్తే రాజుగా యుండబోవుచున్నాడు. అభిషేకము ఆయనపై, మరియు ఆయన రాబోవుచున్నాడనే వర్తమానముపై యున్నది. ఆయనే రాజుగా యుండును.
110. వారు ఏమి చేసిరి? గొజ్జెలకు, మందకు నీళ్ళు పెట్టుటకు అతడు ఎచ్చట మామూలుగా ఉపయోగించెడివాడో, ఒకరోజు నీళ్ళు త్రాగుటకై దాహము కలిగినవాడై ఆ బెత్లహేము గనినికి వెలుపల అచ్చట అతడు నిలబడియుండెను. అదేమిటో మీరెరుగుదురా? అతడియొక్క ఇద్దరు వీరులు ఖడ్గమును చేతిలో తీసుకొని సుమారు పదునైదు మైళ్ళ దూరము వరుకు నిలబడియున్న సైనికుల దండులోకి ప్రవేశించుటకై దారిని చేసుకొని పోయి బేత్లహేము గనిని దగ్గరనున్న బావినీళ్ళు చేది దావీదు నొద్దకు తెచ్చిరి. ఎందుకనగా, అతడి స్వల్పమైన కోరిక వారికి ఒక అజ్ఞాగా యుండెను. దానిని గురించి ఆలోచించండి. అతడెచ్చట నిలబడియున్నట్లు చెప్పబడెనో ఆ పర్వతముయొక్క శిఖరమున ఆ దారి పొడుగునా, దాదాపు పదునైదు మైళ్ళ దూరమున, ఆ మనుష్యులందరినీ చేధించుకొని వారు వెళ్ళిరి. ఆ విధముగా చివరవరుకు వారి వెళ్ళిరి. అచ్చటయున్న ప్రతీ మనిషి లేచిరి, వారితో వారిద్దరూ పోరాడుచూ, వారిని చంపుకొంటూ, ముందుకు కొనసాగిపోవుచూ మరియు ఒకడు చేద తీసుకొని నీళ్ళు తోడుచుంటుండగా, మరియొక్కడు వారితో పోరాడుచూ యుండగా, ఒక చేద (Bucket) నిండుగా నీళ్ళు తీసుకొని, సరిగ్గా శత్రువుల యొక్క స్థావరములోనే, ఇద్దరే వ్యక్తులు, వారి రాజుకొరకు, వారి సహోదరుడు కొరకు వారు వారి ప్రాణములను తెగించి తెచ్చిరి, ఏలయనగా ఆ బెత్లహేము బావి నీళ్ళు త్రాగాలనే కోరిక అతనికి కలిగినందువలన, అతడు యుండు స్థలమున త్రాగుటకు నీళ్ళు ఉన్నప్పటికినీ అచ్చటి నీళ్ళు త్రాగాలని అతడు ఆశించెను.
111. ఓ దేవా, వాక్యమనే ఖడ్గమును నేనుకూడా తీసుకొని ప్రతీ సంఘశాఖ గుండా వెళ్ళి సమస్తమును చేధించుకొంటూ యేసు క్రీస్తుయొక్క నామములో బాప్తిస్మము యొద్దకును, పునరుత్థానపు శక్తియొద్దకు మరియు పరిశుద్ధాత్మ యొద్దకును జనులను తిరిగి తీసుకొను వచ్చునట్లుగా చేయుము, ఏమైనప్పటికినీ ...? ... ఎందుకనగా ఆయన అధికారములోకి వచ్చుచున్నాడు, ఆయన శక్తితో వచ్చుచున్నాడు. ఆయన ఒంటరిగా నిలబడును. కాని అది ప్రతీ సంఘశాఖను తుదవరకు నరికివేయును, ప్రతీ సిద్ధాంతమును తుదవరుకు నరికి వేయును, ప్రతీ మానవ కల్పితమైన మత సిద్ధాంతములను తుదవరుకు నరికివేయును, దారితప్పిపోయిన ఒక గొజ్జను నీవు రక్షకుని యొద్దకు తిరిగి తీసుకొను వచ్చువరకు, యేసు క్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడనే పరిశుద్ధ గ్రంథముయొక్క సిద్ధాంతములను ఎవరైనా ఒకరు మరలా తిరిగి తీసుకొని వచ్చువరకు సమస్తమును ఛేదించుకొంటూ ముందుకు కొనసాగిపోవలెను. దేవుని కృప......
112. దావీదు వైపు చూడండి. అతడు ఏ విధముగా చేసియుండును గొయ్యిలోకి దూకి ఒక సింహమును చంపెను. తనకు సొంతముగా ఐదు వందలమంది భార్యలు అతడికి యున్నప్పుడు, ఊరియాయొక్క భార్యయగు అందమైన బత్తెబను ఏ విధముగా దావీదు తీసుకోగలడు; కాని ఆమె స్నానము చేయుచుండుటను చూచెను, అచ్చటే అజాగ్రత్త యున్నది. ఇప్పుడు, రాజు మిద్దెమీద ప్రతి దినము నడుచుచు వెళ్ళునని, అచ్చట ఆ గోడ ప్రక్కగానే వెళ్ళునని తెలిసియుండియు, ఆమె స్నానము చేయుటకు వెళ్ళేటప్పుడు తెరను క్రిందకు లాగుటకు ఆమె మరచిపోయినది.
113. విషయము అది ఆ విధముగానే యున్నది. నేడు స్త్రీ అజాగ్రత్త వలన ఆ విధముగా యుండుట లేదు. సామాన్యమైన పొట్టి పాత వస్త్రములను ధరించుకొని, నగ్నముగా వీథులలో వారు అంత అజాగ్రత్తతో తిరుగుచున్నారని నేను తలంచుట లేదు దానిని గురించి ఆమెకు తెలిసే, దానిని చేయాలని చేయుచున్నది. (అది అంతే) అది ఒక తలవంపుగా యున్నది, అందుచేత పురుషులు దానిని చూచి ఈల కొట్టుటలో ఆశ్చర్యమేమి లేదు. ఎందుచేత? వారు ఆ విధముగా ఈలకొట్టునట్లు చేయులాగ నీవే ప్రవర్తించుచున్నావు. వారికి అది తెలుసు; వారా విధముగా చేయుదరనే జ్ఞానము వారికి గలదు. వారు ఆ విధముగా వుండాలనే ఇష్టపడే వారా విధముగా ఉంటున్నారు. అది వారి హృదయములో గలదు. నీ ప్రవర్తన చెడ్డదిగా యున్నదని నీవు వారితో చెప్పిచూడు, వెంటనే వివాదమునకు వచ్చెదరు. లైంగిక సంబంధమనే విషయములలో వారు ఒక లిల్లీ పుష్పమువలె పవిత్రముగా, వారి ప్రవర్తనలో ఎటువంటి చెడతనము లేకుండా యుండవచ్చును. కాని గుర్తించుకోండి, కొంతమంది పురుషుల ఆత్మలను పాతాళమునకు పంపించుటకై ఒక విధమగు దెయ్యపు ఆత్మ అభిషేము వారిపై యున్నది. జ్ఞాపకముంచుకొనండి, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును." అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.
114. సహోదరీ జ్ఞాపకముంచుకో, నీ జీవితకాలమంతటిలో నిజముగా నీవెన్నడూ వ్యభిచారము చేయకపోయినను గాని నీవు ధరించుకొను వస్త్రముల విధానమునుబట్టి ఆ పాపి నిన్ను దాని నిమిత్తమై ఆ విధముగా చూచినందువలన, వ్యభిచారము చేసినందుకు, దోషిగా నీవు ఆ వ్యభిచారము కొరకు జవాబు చెప్పుకోవలసియుండును. న్యాయతీర్పు దినమున వ్యభిచారము కొరకు నీవు జవాబు చెప్పే తీరవలయును. ఆయన చెప్పిన విధముగా
ఆయన ఇచ్చట చెప్పుచున్నాడు, "వ్యభిచారము చేసెను" అని ఆయన గ్రంథమందు ఆయన వ్రాసెను.
"ఎవరితో!"
"శ్రీమతి జాన్ డేతో,"
"అట్లైన శ్రీమతి జాన్ డే దానిని గురించి ఏమిటి?"
115. "నేను ప్రమాణము చేసెదను, నేను . నా గురించి నీకు తెలుసు. నా భర్తతో తప్ప నేను ఏ ఇంకొక వ్యక్తితోను ఎన్నడూ జీవించలేదు.”
116. "కాని ఈ మనిషి వ్యభిచారము చేయునంతగా నీవు నీ వస్త్రములను ధరించుకొనిన విధానము అందుకు కారణమైనది. నీవు అతడితో వ్యభిచారము చేసిన దోషిగా యున్నావు. అదే అతడు చేసినది. నింద మోపవలసినది నీపైనే. నీవే నిన్ను నీవు ఆ విధముగా కనబరచుకున్నావు."
117. హవ్వ తప్పిదము చేసిన విధముగానే బత్తెబ చేసినది, కాని ఆదాము దానిలో చేర్చబడెను. మనము ఎప్పుడూ స్త్రీ గురించే ఎక్కువగా మాట్లాడుతూ వుంటాము. పురుషులగు దేవుని కుమారులైన మీరు బలమగు గుంపుయని, మీరు బలమగు జాతియని నేనెరుగుదును. (అది నిజము). నీవు స్త్రీకంటే బలమైనవాడవు, అది నిజము; కాబట్టి ఆ విధముగానే మీరు ప్రవర్తించండి. ఏదో ఒక చిన్న బాలికను తీసుకొని ఆమె జీవితమును నాశనము చేయుటకు ఆ బలమును ప్రయోగించుటకు ప్రయత్నించవద్దు. కాని, నీవు ఒక దేవుని కుమారుడుగా యుండవలెను, ఆమె తప్పిదములో యున్నదని ఆమె దగ్గర చెప్పు, నీవు ఒక దేవుని కుమారుడుగా ప్రవర్తించవలెను, ఆమె నీ సహోదరి. అవునండీ. మనము దేనిని చేయుటకు ప్రయత్నించుచున్నాము, నేడు దేవుని కుమారులుగా చెప్పుకునేవారు, సంఘమునకు చెందినవారని చెప్పుకునేవారు, ప్రతీ చిన్న బాలికను వీలైనంత వరుకు బయటకు తీసుకొని వెళ్ళుచున్నారు. గుర్తుంచుకోండి, వివాహితుడైన ఎవరైనా ఒక పురుషుడు ఆమె జీవితమును నాశముము చేయుట వలననే అచ్చట ఆ విధమైన చెడు ప్రవర్తనగల ఒక స్త్రీగా ఆమె తయారవుచున్నది. కాబట్టి కుండ, నీళ్ళు కాచు పాత్రను చూచి నలుపు అని పిలువలేదు; కాబట్టి జ్ఞాపకముంచుకోండి, దానిని చేయునదంతా అది పాపమై యున్నది. మనమందరమూ మరణమునకు పాత్రులుగా యున్నాము, అందుకొరకై మరణించవలయును.
118. దావీదు ఆ పాపము కార్యమును చేసినప్పుడు, అతడి స్వకీయ తీర్చే అతడిని చంపవలెను. ఆ ప్రవక్త అచ్చటకు వచ్చినప్పుడు, అది మరుగుచేయబడినదని అతడు తలంచెను. ఆ ప్రవక్త అచ్చటకు వచ్చి, అతడి ముందు నిలబడినప్పుడు, అతడు, “దావీదు, అంతా క్షేమముగా సాగుచున్నదా?" అని అడిగెను. "అంతా క్షేమమే" అని చెప్పెను.
119. దావీదు తన రాజ వస్త్రములను ధరించుకొని, మరియు పెద్ద కిరీటమును అతడు పెట్టుకొనియుండెను, అతడి గొప్ప సేనాధిపతియి యోవాబు, అందరూ యుద్ధమునకు
వెళ్ళిది. అతడు శత్రువులందరిని సరిహద్దును దాటకుండా చేస్తూ అటువంటి కార్యములను-వేయుచుండెను. సమస్తము క్షేముముగానే యున్నది. బత్తెల ద్వారా అతడికి ఒక చిన్నబిడ్డ కలిగెను. పేద దీనుడైన ఊరియాను ఆ యుద్ధము జరుగు స్థలముయొద్దకు పంపించి, యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతడియొద్దనుండి వెళ్ళిపొమ్మని యోవాబుతో చెప్పెను. సూర్యుడు అస్తమించుచుండగా మరణించెను, అతడి చేతిలో యుద్ధ ఖడ్గముతో, అతడి కవచముపై రక్తముతో నిండినవాడైన ఊరియా, యూద మతములోనికి ప్రవేశించిన ఒక అన్యుడై యున్నప్పటికిని, ఇశ్రాయేలు కోసము అతడు అచ్చట యుద్ధమున పోరాడెను.
120. అటు తరువాత యోవాబు తిరిగి వచ్చి, ఆ - ఆ ఊరియా మరణించెనని దావీదుతో చెప్పెను, "ఇప్పుడు సమస్తము క్షేమముగానే యున్నది, అతడి భార్యను నేను పొందుకొన్నాను, సమస్తము బాగుగానే యున్నది, ఒక బిడ్డకూడా యున్నది." అని దావీదు తలంచెను. కాని ఆ బిడ్డ బహుగా జబ్బుపడెను. ఆ బిడ్డ మరణించుటకు ప్రారంభించినది. బిడ్డయొక్క ప్రాణమును కాపాడుటకై అతడు తనకు సాధ్యమైనంత వరుకు సమస్తము చేసెను; బహుశా ప్రతీ వైద్యుడు వచ్చియుండవచ్చు, ఆ బిడ్డ మరణించినది. పిదప సమస్తము మరుగుచేయబడినదని అతడు తలంచెను. కావున బత్తెబను అతడు ఓదార్చెను. ఇతర భార్యలనేకమంది యున్నప్పటికినీ తరువాత, ఆమెను ఇదివరకే అతడు తన భార్యగా చేసుకొనెను.
121. ఈ వృద్ధ ప్రవక్త, బట్టతల వృద్ధుడైన అతడు, వృద్ధుడైన నాతాను, అరణ్యములలో నుండి లోపలికి ప్రవేశించి, వచ్చి కూర్చొని, "దావీదు, సమస్తము ఏ విధముగా కొనసాగు చున్నవి?" అని అడిగెను.
122. "బాగున్నది, బాగున్నది. ఓ, దేవునియొక్క ప్రవక్త, నీవు నిరంతరము జీవించుదువు గాక! హల్లేలూయా" అని చెప్పెను. ఓ, అతడు... అంతా బాగానే యున్నదని అతడు తలంచెను; అతడు దానిని మరుగుపరచితినని అతడు తలంచెను. కాని నీవు దేవునియందు మరుగుపరచలేవు. నీవు ఇప్పుడు ఈ క్షణమందు ఏమి ఆశించుచున్నావని ఆయన ఎరుగగలడు. నీ తలంపులను ఆయన ఎరుగగలడు. ఎందుకనగా ఆయన దేవుడు. ఉదయకాలమున నీ తలంపులను, నీవు ఎవరివి, నీవు ఎక్కడనుండి వచ్చుచున్నావని, నీవు ఏమి చేయుచున్నావని ఈ కట్టడములో యున్న పరిశుద్ధాత్మకు తెలుసు. ఎందుకనగా యేసు క్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడు.
123. దేవుడు దానిని ఆ ప్రవక్తకు బయలుపరచెను. అతడు, "ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర వంతునికి విస్తారమైన గొజ్జెలును గొడ్లును కలిగియుండెను. అయితే ఆ దరిద్రునికి తాను
కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొట్టెపిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వానియొద్దను, వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వాని కుమార్తెవలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్తునికి ఆయత్తము చేయుటకు తన గొజ్జెలలోగాని గోడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొజ్జెపిల్లను పట్టుకొని, తనయొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను." అని చెప్పెను.
124. ఇప్పుడు, అది దావీదుయొక్క కామ కార్యములు. అతడికి ఐదు వందల భార్యలుండిరి, అయినాగాని ఊరియాయొక్క భార్యను అతడు చూచినప్పుడు, తనకు యున్న ఐదు వందల భార్యలలో ఒకదానితో తన కామోద్రకములు అణచుకొనుటకు లేదా తృప్తిపరచుకొనుటకు బదులుగా, అతడు వెళ్ళి ఇంకొకరియొక్క భార్యను తీసుకొనెను; పిదప ఆమె గర్భవతియైనప్పుడు అతడు ఊరియాను చంపెను. అతడేమి చేయుచున్నాడో దావీదుకు తెలియలేదు; ఎందుచేత, దావీదు నాయ్యతీర్పును చెప్పుటకు నిశ్చయించుకొనెను. ఆ విధముగానే మనము యున్నాము. మనము ఎల్లప్పుడూ ఇంకొకరిని తీర్పు తీర్చుచున్నాము, కాని అదే కార్యము మనకు సంభవించినప్పుడు, ఓ, అది వేరొక విధముగా యుండును.
125. "ఈ కార్యము చేసిన ఆ మనుష్యుడు మరణమునకు పాత్రుడు" అని దావీదు చెప్పెను.
126. ఆ వృద్ధ ప్రవక్త, తన కళ్ళను చిట్లించుచూ క్రిందకు చూస్తూ, అతడు, “దావీదు, నిశ్చయముగా నీవు చావవు." వెంటనే కృప అప్పటికప్పుడు క్రియ చేయుటను గమనించండి. ప్రవక్తను ఆత్మ తాకుటచే దావీదుయొక్క జీవితమును రక్షించినది. కృప, “నిశ్చయముగా నీవు మరణించవు, కాని నీ హృదయమును అది సంపూర్ణముగా పరిశుద్ధము చేయు వరుకు ఖడ్గము నీ గృహమును విడిచిపోదు; ఎందుకనగా ఆ ఐశ్వర్యవంతుడవు నీవే” అని అనెను. ఓ, అప్పుడది వ్యత్యాసముగా యుండెను, అది ఆలాగు లేదా?
127. "ఆ మనుష్యుడు మరణమునకు పాత్రుడు. అతడు దానికంటే ఎక్కువగానే చెల్లించవలెను; మరియు అతడు అందునిమిత్తము తన ప్రాణమును మూల్యముగా చెల్లించవలెను" అని దావీదు తన సొంత తీర్పును తానే చెప్పినప్పుడు దావీదును ఏది రక్షించినది.
128. ప్రవక్త, “నిశ్చయముగా (కృప) నీవు మరణించను. దావీదు, నీవు మరణించవు. కృప నిన్ను రక్షించినది." అది దావీదుకు కృపయై యుండెను; అది అతడిని రక్షించినది.
129. అది కృపయై యుండనియెడల, మనమందరము ఎచ్చటకు వెళ్ళగలము! అది నిజమే కదా! నిశ్చయముగా,
130. శ్రేష్టమైన ఒకరునుండి శ్రేష్ఠమైన కృప లభించినది. శ్రేష్ఠమైన కృప ఒక శ్రేష్ఠమైన ఒకరి నుండి వచ్చినది, శ్రేష్ఠమైనది. అదేమి చేయును? ఆ శ్రేష్ఠమైనది ఏమేమి చేయవలెనని ఆశించునో దానిని అది చేయును. దీనిని ఇప్పుడు గమనించండి. శ్రేష్ఠమైన ఈ కృపను శ్రేష్ఠమైన ఆ ఒకరివలన మాత్రమే ఇవ్వబడును. దేవుడే శ్రేష్ఠమైన వాడు; కాబట్టి శ్రేష్టమైనదిగా అది యుండుటచే కృప ఎవరిని అడుగదు, దానికి గల ... అది ఏమి చేయాలనుకుంటాదో దానిని అది చేయును. అది అద్భుతముగా లేదా?" "నేను దీనిని చెయ్యనా? లేదా, నేను దీనిని చెయ్యవలెనా? నేను చెయ్యాలా?" నేను చేయవలసిందేనా? నేను చెయ్యనా?" అని అడుగవలసిన పని దానికి లేదు. ఆ విధముగా అది చెయ్యుట లేదు. తనంతట తానే దానిని అది చేయుచున్నది. కృప శ్రేష్ఠమైనదిగా యున్నది. అందువలన; నికృష్టమైన వానినైనను ఆయన రక్షించగలడు. కల్మషమైనవానినైనను ఆయన రక్షించగలడు, అయోగ్యమైన వానినైనను ఆయన రక్షించగలడు. వ్యాధిగ్రస్తునినైను ఆయన స్వస్థపరచగలడు. హల్లేలూయా!
131. నావంటి ఒక దౌర్భాగ్యుడ్ని ఆయన రక్షించగలడు. ఆయన చేసెను. అది ఏమిటది? కృప! విల్లియం బ్రాన్తాం ఒక త్రాగుబోతుయొక్క కుమారుడు. అది ఏ వ్యత్యాసమును కలిగించదు; దేవునియొక్క కృప నన్ను రక్షించినది.
132. "నేను ఒక నీచ స్త్రీయొక్క కుమార్తెను." దానితో నీకు సంబంధము లేదు. దేవునియొక్క కృప నిన్ను రక్షించినది. అది శ్రేష్టమైనదిగా యున్నది, ఎవ్వరిని ఏదీ అది అడుగనవసరము లేదు. ఆమేన్. అందునిమిత్తము నేనెంతగానో సంతోషించుచున్నాను. హల్లేలూయా!
133. నికృష్టమైన పాపిని తీసుకొని అతడిని హిమముకంటే తెల్లగా చేయగలడు, దానిగురించి ఎవ్వరి దగ్గరగా అడుగనక్కర్లేదు. ఓ, అది దానిని చెయ్యగలదు, ఎందుకనగా అది శ్రేష్టమైనదిగా యున్నది.
134. ఇప్పుడు, త్వరగా ఆలకించండి, అది సిలువయందు నిరూపించబడినది. అచ్చట బహ దుర్మార్గుడైన ఒక దొంగ వ్రేలాడుచుండెను. అతడు మరణమునకు పాత్రుడుగా యుండెను. అతడి తలంపులో దేవుడిని గురించి ఎన్నడూ తలంపే రాలేదు. దానిని గుంచి అతడు అసలు ఏమీ తలంచనే లేదు. అచ్చట ఆయన సిలువపై యున్నప్పుడు, రక్తము ఆయన పెదవులపై నుండి కారుచుండగా, అచ్చట ఆ మూలుగుల మధ్య "ప్రభువా, నాయందు కృప కలిగియుండుము" అనే ఒక శబ్దము వచ్చినది.
135. కన్నీళ్ళు కారుచు, అత్యంత బాధను అనుభవిస్తూ, రక్తము కారుచున్న దానిగుండా అచ్చట మరియొకరిని కృపతో తీసి పట్టుకొని, "నేడు నీవు నాతోకూడా పరదైసు
ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను" అని చెప్పెను. కృప దానిని చేసినది. తనకు తానుగా ఆ దొంగ ఏ విధముగా సహాయము చేసుకోగలడు? ఆదాము తనకు తానుగా సహాయము చేసుకోలేడు, హవ్వ తనకు తానుగా సహాయము చేసుకోలేదు, నీవుకూడా నీయంతట నీవు సహాయము చేసుకోలేవు, నాయంతట నేనుకూడా సహాయము చేసుకోలేను. మనము ఆ నక్షత్ర వీధుల మార్గముగుండా తటాలున మన కాళ్ళజోడుల వారుతో మనకు మనమే వెళ్ళలేము. మనము దానిని చెయ్యలేము. కాని దేవునియొక్క కృప అందునిమిత్తమై ఏదో ఒకటి చెయ్యగలదు. మరియు అది దానిని చెయ్యును. దేవుని యొక్క కృప, తనయొక్క విశేషమైన అధికారముతో, దేవుని కృప మరణించుచున్న ఆ దొంగయొద్దకు వచ్చి, "నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని" చెప్పెను. ఓ, దానిని గురించి ఆలోచించి చూడండి, అది అద్భుతమైనది.
136. దానిని గురించి ఆలోచించండి. ప్రేమ మరియు కృప సహోదరిణులై యున్నారు, కవలలు వంటి సహోదరీలు...... అది ఖచ్చితముగా సరియే. కృపను నీవు పొందుకొని యుండుటకు ముందుగా నీవు ప్రేమను పొందుకొనియుండవలెను. మీరు ఒకరి పట్ల దయను చూపుటకు ముందుగా నీవు వారిని ప్రేమించెదవు. సరియా లేదా తప్పో, ఏమైనా గాని నీవు వారిని ప్రేమించవలెను, అట్లు లేనియెడల నీవు దానిని చేయలేవు. చూచారా? కాబట్టి ప్రేమ మరియు కృప రెండూ ఒక్కటే. వారు కవల సహోదరీలు (అది అంతే), ప్రేమ మరియు కృప. వారు..... ఒకరు లేకుండా ఇంకొకరిని మనము చూడలేము. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిని యిచ్చెను.'' పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తనయొక్క కృపను మన హృదయమంతటలోకి క్రుమ్మరించెను. చూచారా? అవి ఒకదానితో ఒకటి కలిసి క్రియ చేయకపోతే, అచ్చట నీవు చేయవలసినది ఏమియు యుండదు. కృప, దేవునియొక్క కృపయే మనలను రక్షించినది.
137. ఇప్పుడు, అచ్చట మరణించుచున్న ఆ దొంగకు కృప వచ్చినట్లుగా మనము కనుగొంటిమి. దానిని వారు చూచినప్పుడు కవులను అది ప్రేరేపించుటలో ఆశ్చర్యమే లేదు. ఒక కవి ఈలాగు చెప్పెను.
అతడి దినమున ఆ నీటి ఊటను చూచి మరణించుచున్న ఆ దొంగ ఆనందించెను.
అతడివలె నీచమైన వాడినైన నేనుకూడా
నా పాపములన్నింటిని కడిగివేయుదును.
నీయొక్క గాయము నుండి కారుచున్న రక్తపు ప్రవాహమును నేను నా విశ్వాసము ద్వారా చూచినప్పటినుండి విమోచించే ప్రేమయే నా అంశమై
నా మరణము వరుకు దానిని ప్రస్తావించెదను.
రక్షించిన నీ శక్తిని ఒక గంభీరమైన, మధురమైన గానముతో నేను పాడెదను.
ఈ దీన మాటలు తడబడుచు నాలుక నతైనప్పుడు సమాధిలో మౌనముగా యుండెదను.
కృప, ఆశ్చర్యకరమైన కృప...... హల్లేలూయ. ఒకరు దీనిని ఈ విధముగా వ్రాసిరి.
ఓ దేవుని ప్రేమ, ఎంతటి ఐశ్వర్యమైనది, స్వచ్ఛమైనది!
ఎంత లోతు అందనిది మరియు బలమైనది!
దాని సహనము శాశ్వతమైనది
పరిశుద్ధులు మరియు దేవదూతల పాటగా యున్నది.
సముద్రమును సిరాగా మనము చేసినయెడల ఆకాశమును తోలుచుట్టవంటి కాగితముగా చేసి ప్రతీ చెట్టు బోదెను వ్రాసే కలముగా చేసి ఒక్కొక్క మనిషి ఒక కవియై దేవుని ప్రేమను గురించి వ్రాసిన
సముద్రమే ఎండిపోవును
లేదా ఆకాశము నుండి ఆకాశమునకు ఆ
కాగితపు చుట్టలన్నియు పరచినను అది చాలనే చాలదు.
138. దేవునియొక్క కృపయనేది అదియేయగును. దేవుని కృప, దేవుని ప్రేమ ఒక నీడను తీసుకొని వచ్చినది ఆయన ప్రేమద్వారా మన జీవితములో దేవుడు కృపను మనకొరకు తీసుకొని వచ్చెను; కృప చేయగలిగిన దానిని ఇచ్చట వేరేదియూ చేయలేదు; కృపను కొనలేము, కృపను అమ్మలేము. అది కృపయై యున్నది. అది ఒక శ్రేష్టమైన వానిద్వారా కలిగినది. అవునండీ. దానిని నీవు బేరమాడలేవు. “దేవా, నీవు పలానిది - పలానిది చేసినయెడల, నేను పలానిది పలానిది చేస్తాను." అని నీవు చెప్పవచ్చును. నీవు దానిని చేయలేవు. దేవుడు దానిని చెయ్యడు. నీవు దేవుని నుండి ఏదీకూడా అపహరించలేవు. దేవుడు దానిని నీకు ఆయన కృప ద్వారానే యిచ్చును. ఓ, ఓ, ఓ. "పొందగోరు వారివలనైనను, ప్రయాసపడు వానివలనైనను కాదు గాని, కరుణించు దేవుని వలననే అగును." అది నిజము.
139. ప్రజలు సాష్టాంగముగా పడుచున్నారు. ఆ బాలురలలో ఒకరిని నేడు ఈ కట్టడములో నేను చూచితినని నేను నమ్ముచున్నాను. ఒక మెథడిస్ట్ బాలుడు ఇప్పుడే లోపలికి వచ్చి పైనుండి పరిశుద్ధాత్మను పొందుకొని.... మరియు ఆ బాలురు నా దగ్గరకు వచ్చి, “ఇప్పుడు, బ్రాస్లాం సహోదరుడా, ఇప్పుడు రక్షించబడి మరియు పరిశుద్ధాత్మను పొందుకొంటిమి, మేము వరములను వెదకుటకు వెళ్ళవచ్చునా?" అని అడిగిరి.
140. "దానిని చెయ్యవద్దు, దానిని చెయ్యవద్దు" అని నేను చెప్పాను.
141. దేవుడు తన విశేషమైన అధికారముతో వరములును యిచ్చును. వరములు మరియు పిలుపు పశ్చాత్తాపము లేకుండానే పొందునవిగా యున్నవి. నీవు దేనినో ఒకదానిని వెదకుటకు వెళ్ళుచున్నావు. దానిని మొదటగా నీవు ఎరుగవలెను. “దేవా, నన్ను ఒక బోధకుడిగా చెయ్యుము, దీనిని నీవు నాకు చెయ్యుము." అని అంటున్నావు, నీవేమై యుండాలని ఆశించుచున్నావు? ఒక గొప్ప పనికిమాలినవాడవుగా యుండాలనా? అది అంతే. మానవునియొక్క సిద్ధాంతములచే ఏర్పరచబడిన ఒక వేదశాస్త్ర పాఠశాలకు వెళ్ళి తర్ఫీదు పొందుకొని, ఒక సంఘశాఖయందు చేరి, అచ్చటయే ఒక స్తంభమువలె స్తంభించి పోయినట్లుగా యుండి, నీయంతట నీవే నశించిపోయెదవు. దేవుడు మిమ్ములను పిలువ నివ్వండి. దేవుడు మిమ్ములను పిలుచును; దేవుడు మిమ్ములను శుద్ధీకరించును. ఆయన యిచ్చుటకు నీకు ఏదైతే అవసరమైయున్నదో దానిని ఆయన నీకు యిచ్చును. అవునండీ.
142. కృప కొరకు నీవు బేరమాడలేవు. లేదండీ, దానిని నీవు అమ్మలేవు. దానికొరకు బేరమాడలేవు, లేదా దానిని కొనలేవు, దానిని వ్యాపారముగా చెయ్యలేవు. నీవు, "సరే, ఇప్పుడు, ప్రభువా, నేను వెళ్ళి ఈ గొప్ప పెద్ద బాప్టిస్టు సంఘములో చేరెదను, నేను ఈ పెద్ద మెథడిస్ట్ సంఘములో, లేదా ఈ పెద్ద పెంతెకోస్తు సంఘములో లేదా ఈ పెద్ద నజరేతు సంఘములో చేరెదను, నీవు నాకు దీనిని చేసినయెడల నేను దీనిని నీకు చేసెదను." అని చెప్పలేవు. అది బేరమాడలేనిది, లేదండీ.
"తండ్రి, నాకు అనుగ్రహించు వారునందరును నా యొద్దకు వత్తురు. నా తండ్రి ఒకడిని ఆకర్షించకుండా ఎవడును నాయొద్దకు రాలేడు.”
143. ఆ పెద్ద సంఘమున నీవు ఒక సంఘ సభ్యునిగాయగుచున్నావు అంతేగాని నీవు రక్షించబడవు. కృపయే నిన్ను రక్షించవలయును.
144. మన తలాంతులు దానికి ఆధారపడిలేదు; మరియు మన తలాంతులు వలన మనకున్న తలాంతులు, మన తలాంతుల ద్వారా కృపను మనము సంపాదించలేదు.
145. దేవుడు నన్ను ఒక బోధకుడుగా చేసినయెడల, దేవుని కృప నాతో యున్నదని చెప్పుట కాదు. కాదు. కాదు. అది ఆయన కృప మాత్రమే నన్ను రక్షించినదిగా యున్నది. యువార్తను నేను ప్రసంగించుట వలన నేను రక్షించబడుట లేదు. అన్యభాషలను నీవు మాట్లాడుట వలన నీవు రక్షించబడలేదు. ఓ, కాదు. నీవు అందువలన కాదు ..... నీవు సంగించినందువలన, నీవు ప్రసంగించుచుండినను అసలు నీవు రక్షించబడనే లేదు. నీవు - నీవు అన్యభాషలతో మాట్లాడినను నీవు రక్షించబడవు. ఈ కార్యములలో దేనిని నీవు వేసినను గాని వాటివలన నీవు రక్షించబడలేవు. 1 కొరింధీ 13 అలాగే నిరూపించుచున్నది,
"మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు, జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను." ప్రేమ అనగా కృపయై యున్నది. దేవునియొక్క కృప సమస్తము చేయుచున్నది.
146. కొంతమంది ప్రజలు, ఈ రాక్ ఆన్ రోల్ (rocks and roll) అనే దానియందు మొనగాళ్ళవంటి ప్రజ్ఞ (talents)ను నీవు కలిగియుందువు. అది నాకు అసహ్యతను కలుగుజేస్తున్నది, నాకు తెలియదు, నా ఆత్మీయ సంబంధమైన దానికి అది నాకు ఇబ్బందికరముగా యున్నది. శనివారము రాత్రియంతా రాక్ అన్ రోల్ పాటలు పాడి, గెంతుచూ యుండి మరుసటి దినము ఉదయమున జనుల ముందుకు వచ్చి సద్భక్తిగలవానివలె ముఖమును పెట్టుకొనుటకు ప్రయత్నించుచు అచ్చట జనుల ముందుకు వచ్చి నిలబడి కొన్ని క్రైస్తవ పాటలను పాడితే పరలోకమునకు వెళ్ళిపోతామని వారు తలంచుచున్నారు. ఆ విధముగా చేయుచున్నవారి అనేకమంది పేర్లను నేను చెప్పగలను, కాని నేను అలాగు చెయ్యను. ఈ టేపులు ప్రతీ స్థలమునకు వెళ్ళుచున్నవి. మీకందరికి తెలుసు. సమీపకాలమందు హాలీవుడ్ (Holly Wood)లో యున్న ఒక అబ్బాయి, అతడి "మత మార్గమునకు" అది విరుద్ధముగా యున్నదనే కారణము చేత ఒక అమ్మాయిని ముద్దుపెట్టుకొనుటకు తిరస్కరించెను. అది తన మత మార్గమునకు విరుద్ధమైనదా? కాని, అదే సమయమునందు అతడు అసభ్యముగా కనబడునట్లుగా రాక్ అండ్ రోల్ చిత్రములను తీయుచున్నాడు. ముప్పది వెండి నాణెములు తీసుకొని, నీవు దేవునియొక్క కృపలో ఏదో విధముగా పాత్రుడనవుతానని నీవు తలంచుచున్నావా! యూదాస్కరియోతు? దేనిని నీవు కొనలేవుగాని పాతాళములో ఒక స్థలమును నీకొరకు నీవు కొనెదవు.
147. దేవునియొక్క కృపను క్రయము కొరకు బేరమాడలేవు లేదా వరములతో దానిని పొందుకోలేవు. అది శ్రేష్ఠమైన కృష్ణ "నా చేతులతో నేనేమియు తీసుకొని రాలేదు, నా సిలువను నేను విడువకుండా పట్టుకొనెదను," నగ్నముగా, గాయములతో, ఉన్నపాటున నేను ఉన్నట్లుగానే వచ్చుచున్నాను.
ఒక్క నెపము లేకుండా ఉన్నపాటున వచ్చుచున్నాను ఎందుకనగా నాకొరకు నీ రక్తమును చిందించితివి. నాయొద్దకు రా అంటూ నన్ను నీవు పిలచితిని. ఓ దేవుని గొజ్జెపిల్లా, నేను వచ్చెదను!
148. అంతే చాలు, నన్ను తీసుకొని వచ్చినది ఆ కృపయే. కృపయే దీనిని చేసినది. కృపవలె ...... ఇంకొక విధముగా దానిని నేను చెప్పుటకు ఆశించుచున్నాను, కొన్ని సమయములలో కృప......
149. ఈ పెద్ద సంఘములు, నీవు అచ్చటకు వెళ్ళగలవని వారు దానిని తలంచు చున్నారు, వారసుకొనుచున్నారు, "ముంచిది, మనము ఈ నగరములోనే పెద్ద సంఘమును నిర్మించితిమి. స్త్రీలకు సహాయము చేయుటకు మనకు ఒక సమాజము గలదు, అది పేదలకు -- ఇచ్చట పేదలకు వస్త్రములను తయారుచేసి సముద్రములకు అవతలయున్న దేశములకు వాటిని పంపించుచున్నాము. పేదలకు ఆహారము సెట్టుచున్నాము. వీటన్నింటిని మేము చేస్తున్నామని" వారు తలంచుచున్నారు.
150. పౌలు ఈ విధముగా, "నేనుకూడా అవే కార్యములను చేసినను అందువలన నాకు ప్రయోజనమేమియు లేదు" అని చెప్పెను.
151. "మంచిది, మేము, మేము ప్రాచీన సంఘశాఖవారము. మేము ఇచ్చట రెండు వేల సంవత్సరములుగా యుంటున్నాము. మేము ఐదు వందల సంవత్సరములనుండి యుండే పాతవారము. జాన్ వెస్లీ, అలెగ్జాండర్ కామ్బల్, అచ్చట ఈ గొప్ప వ్యవస్థాపకలు, మాకు మా సంఘమును స్థాపించిరి. హల్లేలూయ" అని వారు చెప్పెదరు.
మంచిది, ఈ సంఘమును యేసు క్రీస్తు స్థాపించి, పరిశుద్ధాత్మ అభిషేకమును అభిషేకించి, పైనుండి శక్తి పొందుకొనువరుకు, పెంతెకోస్తు దినము వరకు నిలిచియుండుడని వారితో చెప్పెను.
152. నీవు యింకా పెంతెకోస్తు సంఘమునకు చెందినవాడవైనప్పటికీ నీవు నశించి పోయెదవు, ఇతర సంఘములవలె పెంతెకోస్తు సంఘము కూడా ఆలాగే యున్నది, దానిలో ఏమి లేదు. అది నిజము.
153. ఒకే ఒక సంఘము మాత్రమే యున్నది. పరిశుద్ధాత్మ బాప్తీస్మమునందు నీవు తిరిగి జన్మించుచున్నావు. 1 కొరింధీ 12:13, “మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి." అది నిజము ... 1 కొరింధీయులు 12. ఇప్పుడు మనము ఆ సంఘముయందు బాప్తీస్మము పొందినవారమైతిమి.
154. కాని ప్రజలు తమ యోగ్యత ద్వారా దానిని పొందుకోవాలని తలంచుచున్నారు. "ఎందుకని, మేము --- నేను - నేను పాఠశాలకు వెళ్ళి మరియు నేను దీనిని నేర్చుకొంటిని, నేను వేదపాఠశాలకు వెళ్ళి మరియు దీనిని నేను చేసితిని....." దానివలన ఏ ఒక్క ప్రయోజనము లేదు. నీవు దేవునియొక్క కృపను కొనలేవు.
155. దేవునియొక్క కృస దీనివలె యున్నది. చివరలో నేను మీకు ఒక కథను చెప్పెదను. దేవునియొక్క కృప దీనివలె యున్నది. ఒకసారి అచ్చట ఒక పరాక్రమవంతుడైన రాజు యుండెను, మరియు ఈ పరాక్రమవంతుడైన రాజుకు ఒక కుమారుడు యుండెను; అతడు అతనికి ఒకేఒక్క కుమారుడు. ఒక దినమున ఒక హంతకుడు ఆ కుమారుడిని
చంపివేసెను. రాజుయొక్క ప్రతినిధులు ఆ దేశమంతటా ఆ హంతకుడి కొరకు వేటాడుచుండిరి. చివరకు వారు హంతకుడిని కనుగొనిరి. వారు అతడిని కనుగొన్నప్పుడు, వారు అతడిని తీసుకొని వచ్చి చెఱశాలలో వేసిరి. అట్లు వారు చేసిన తరువాత, ఒక విచారణను జరిపి మరియు తీర్పును కూడా అతడికి యిచ్చిరి. ఓ, అది ఒక భయంకరమైన కార్యముగా యుండెను. అతడు రాజుయొక్క కుమారుడిని హత్యచేసెను మరియు అందునిమిత్తమై అతడికి ఏమి సంభవించుననేది అతడు ఎరిగియుండెను.
156. వారు అతడిని లోపలయుండు చెఱశాలలో వేసిరి, తలుపులకు తాళమును వారు వేసిరి, వాటికి వారు గడియలను పెట్టిరి, కాబట్టి ఎవ్వరు కూడా దానిచుట్టూ కాపలాదారులను యుంచిరి. ఎటువంటి ఒక భయంకరమైన శిక్షను ఇతడు పొందుకో బోతాడని మనమెరుగుదుము, ఎందుకనగా ఇతడు రాజుయొక్క కుమారుడిని హత్య చేసెను. రాజుయొక్క రాజవంశపు కుమారుడు. తలుపుల చుట్టూ కాపలాదారులను నిలబెట్టిరి. అతడిని లోపలి చెఱశాలలో యుంచిరి. నడుమునుండి మోకాలు వరుకు ఒక ఒక గుడ్డను చుట్టుకొనుటకు మాత్రము యుంచి మిగతావన్నింటిని తీసివేసిరి. భుజించుటకు అతడికి ఏమీ ఇవ్వకుండ, ఆకలితో కృశించిపోతున్న స్థితిలో అతడు అచ్చట కూర్చొనియుండెను. ఆ స్థితిలో అతడు అచ్చట యుండెను.
157. పిదప విచారణ చేయుటకు వారు అతడిని తీసుకొని వచ్చిరి. అతడు నేరస్తుడని కనుగొనిరి మరియు నేరస్థుడుగా నిరూపించబడెను. అతడిలో ప్రాణము ఉన్నంత వరకు అణువణువుగా అతడిని చంపవలెననే భయంకరమైన మరణ దండనను అతడికి వారు తీర్పును తీర్చిరి. అతడు మరణించవలెనని న్యాయాధిపతి ద్వారా తీర్పును తీర్మానించిరి. అతడు ఏడుస్తూ మరియు బ్రతిమాలుకొనెను, "నేను నేరస్తుడినే, నేను నేరస్తుడినే, నేను చేసినదానికి నేను చింతించుచున్నాను. దానిని నేను అసలు చేసియుండకూడదే. నేను చేసినదానికి నేను చింతించుచున్నాను. తీవ్రమైన కోపములో యున్నప్పుడు, ఒక్క క్షణములో దానిని నేను చేసితిని. దానిని ఆ విధముగా నేను చెయ్యాలనే భావముతో దానిని నేను చెయ్యలేదు.” అని అతడు చెప్పెను.
158. ఒకరోజు అతడు వుండే ఆ చెఱశాల యొద్దకు అతడిని చూచుటకు రాజు వెళ్ళెను, అతడితో చెప్పుటకు, అతడితో మాట్లాడి మరియు తనకున్న ఒకేఒక్క కుమారుడగు తన సొంత కుమారుడిని అతడు చంపిన దానిని గురించి అడుగుటకు వెళ్ళెను. అతడు నా కుమారుడిని చంపెను. "అతడితో మాట్లాడుటకు నేను వెళ్ళెదను" అని అతడు చెప్పెను.
159. రాజు అచ్చట క్రిందికి అతడు యుండు స్థలము యొద్దకు వెళ్ళి, ఆ బోనునుండి అతడిని చూచినప్పుడు, ఆ హంతకుడు బోనులో బంధించిన ఒక మృగమువలె యుండెను. ఎముకలకు అతుక్కుపోయిన చర్మముతో ఆ శరీరము అచ్చట ఒక మూలలో
పండుకొనియుండి, ఏడుస్తూ, ముడతలుతో నిండిన ముఖముతో, అతడి దవడలు క్రిందికి దిగిపోయినట్లుగాను, కన్నుల దగ్గర గుంతలు పడి, కళ్ళనిండా కన్నీళ్ళతో నిండియుండి, నోరంతా ఎండిపోయి, నీళ్ళు లేక, దాహముతో, బొర్లా పడుకొని, ఏడుస్తూయుండెను. "లేచి నిలబడు" అని రాజు చెప్పెను. రాజు ఆ హంతకుడి యొద్దకు వెళ్ళి, అతడినే చూస్తూ, "నా కుమారుడిని నీవెందుకు చంపితివి, నా కుమారుడు నీకేమి చేసెను? వాడియైన ఒక ఈటెతో అతడిని పొడిచి చంపితివే, అటువంటి ఒక మరణమునకు పాత్రుడగునట్లుగా నీవు అతడిని చంపుటకు అతడేమి చేసెను?" అని రాజు అతడిని అడిగెను.
160. "ఏమీ లేదు. నా ప్రభువా, ఒక్క కారణము కూడా లేదు. ఒట్టి నా స్వకీయ అవివేకము; నా స్వకీయ దుర్మార్గతనము: అతడిపై అసూయవలననే అతడిని నేను చంపితిని" అని అతడు చెప్పెను. "నేను మీ న్యాయప్రకారము మరణించవలెను; అయ్యా, నేను దానిని చేసినందులకు ఈ శిక్షకు అర్హుడనని (దానిని నేను గ్రహించుచున్నాను;) ఆ రాజవంశపు కుమారుడు వంటివాడిని ఏ కారణము లేకుండా నేను క్రూరముగా చంపివేసితిననే ఒకేఒక్క కారణముతో నేను ఏడుస్తూ యున్నాను." అని అతడు చెప్పెను.
161. ఆ రాజు వెంటనే తిరిగి గంభీరముగా వెలుపలికి వెళ్ళి, ఆ బల్లయొద్దకు వెళ్ళి, "నమోదుచేయబడిన పుస్తకములో అతడి గురించి వ్రాసినవన్నింటిని చింపివేయండి, వాటన్నింటిని చింపివేయండి (మరచిపోవు అనే సముద్రములో వాటిని పడవేసెనని మీరెరుగుదురు). కడిగి శుభ్రముగా స్నానము చేయించండి, అతడిని బయటకు తీసుకొనిరండి, అతడికొరకు సేనొక అంగీని పంపించెదను." అని చెప్పెను.
162, కొద్దిసేపు తరువాత, తలుపుయొద్దకు ఒక గొప్ప పెద్ద వాహనము వచ్చి ఆగినది. ఒక తివాసి చెఱశాలకు వెలుపట పరచబడినది. రాజు ఆ గొప్ప పెద్ద వాహనము దగ్గర నిలబడియుండి, “రా, నా కుమారుడా, నాతో రాజ గృహమునకు రమ్ము" అని రాజు చెప్పెను. రాజు వస్త్రమును అతడి భుజముల చుట్టూ వేసి "ఇక మీదట నీవు నా కుమారుడవు" అని చెప్పెను. ఎందుకనగా అతడియందు దయ యుండెను. అది కృపయై యున్నది.
163. అది నేనే, అది నీవే. మన పాపములతో దేవుని కుమారుడిని మనము చంపితిమి. మనము అన్యులము, మలినముతో నిండినవారము, అసహ్యమైనవారము, లోకమనే చెఱశాలలో యున్నవారము. తన స్వకీయ కుమారునియొక్క రక్తముతో దేవుడు మనలను కడిగెను; మనలను శుద్ధీకరించెను; పరిశుద్ధాత్మనే వస్త్రమును మనపై ధరింపజేసెను. ఏదో ఒక దినమున ఆ తలుపుయొద్దకు దేవుడు గొప్ప రథముపై తిరిగి వచ్చి నిలుచును, మనము ఆయనతో జీవించుటకు గృహమునకు వెళ్ళెదము. మన తప్పులన్నింటిని నమోదు చేయబడిన ఆ పుస్తకమును ఆయన నిర్మూలము చేయును, మరెప్పుడూ
మనము తీర్పు తీర్చబడము, దానిని కాల్చివేసి, మన్నించు అనే సముద్రములో ఆయన వాటిని పడవేసి మరియు ఇకమీదట దానిగురించి జ్ఞాపకము చేసుకొనడు. కాబట్టి మనము ఈ విధముగా పాడుటలో ఆశ్చర్యమేమీ లేదు.
ఆశ్చర్యకరమైన కృప! ఎంతటి మధురమైన శబ్దమది, నీచుని వంటి నన్ను, అది రక్షించినది!
ఒకప్పుడు నేను తప్పిపోతిని కాని ఇప్పుడు కనుగొనబడితిని.
గ్రుడ్డివానివలె యుంటిని, కాని ఇప్పుడు చూడగలుగుచున్నాను.
కృవ నా హృదయమునకు భయమును నేర్పించినది.
కృప నా భయములను తొలగించినది.
నేను నమ్మిన ఆ మొదటి ఘడియలలో
ఆ కృప ఎంతో అమూల్యమైనదిగా కనబడినది!
164. పాపియగు స్నేహితుడా, కొద్ది నిమిషములు మేము ప్రార్ధించుటకై మా తలలను వంచియుండగా ఇదియే నీ ఘడియని, ఇదే ఖచ్చితమైన నీ సమయమని నీవు ఈ తరుణమును ఉపయోగించుకోవా? ఇప్పుడే, నీవు మొట్టమొదటగా నమ్మిన ఘడియగా యిది యుండనివ్వు. నీ మనస్సులో నీవు తీర్మానించుకొని మరియు, "ప్రభువైన దేవా, నేను అపరాధిని. కృప నన్ను రక్షించుననే దానిని నేను గ్రహించితిని. నన్ను నేను రక్షించుకోలేను. నేను నశించితిని. నేనేమి చేయలేను. నేను ఏ ఒక్కదానినికూడా చెయ్యలేను. నేను - నేను సంపూర్ణముగా నిస్సహాయుడిని, నమ్మికలేనివాడిని, దేవుడు లేనివాడిని, కృపలేనివాడిని, క్రీస్తులేనివాడిని, ఈ లోకములో మనస్సు విరిగినవాడిని. పాపమనే ఈ చెఱశాలలో బంధీగాయున్న నాకు, నీవు కృప చూపించి మరియు నీవు నన్ను వెలుపలికి తీయవా, ఓ ప్రభువా, నాయందు దయ కలిగియుండుము. నేనొక పాసిని? నీ చేతులను పైకెత్తి, “ప్రభువగు దేవా, నీ కృప అవసరమైయున్న ఆ వ్యక్తి నేనే" అని చెప్పగలవా?" నీ చేతులను పైకెత్తి, బ్రాస్లాం సోదరుడా నేనిప్పుడు నమ్ముచున్నాను, నాకొరకు ప్రార్ధించుము'' అని చెప్పగలవా, వెనుకనున్న నా సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక!
165. ఎవరో ఒకరు, "బ్రాస్లాం సోదరుడా, ఇప్పుడు నన్నుకూడా జ్ఞాపకము చేసుకో, ఓ, సహోదరుడా నీ ప్రార్ధనలో దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో." అని చెప్పుచున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, స్త్రీ. "ప్రార్ధించెదను....." సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక! సహోదరీ, దేవుడు నిన్ను ఆశీర్వదించును; ఆ కిటికీ దగ్గరయున్న సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదించును. అచ్చట వెనుకయున్న సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదించును, ఇచ్చటయున్న సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదించును. "నన్ను జ్ఞాపకము చేసుకో బ్రాన్హాం సహోదరుడా!" అచ్చటయున్న నా సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదించును, అవును, ఇచ్చటయున్న ఇంకొకరు. సహోదరీ దేవుడు
నిన్ను ఆశీర్వదించును. ఇచ్చటయుండు సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఆయన నిన్ను కనిపెట్టిచూచుచున్నాడు. ఇప్పుడు, నిజముగా గ్రహించి దానిని చెప్పుము. గోడప్రక్కనయున్న సహోదరీ దేవుడు నిన్ను ఆశీర్వదించును. యవ్వనస్థుడా దేవుడు నిన్ను ఆశీర్వదించును, ఆయన చూచు చున్నాడు,..... సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఇచ్చట క్రిందయున్న నిన్ను దేవుడు ఆశీర్వదించును, సహోదరుడా. గోడకు వెనుకప్రక్కనయున్న సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదించును.
నెపము లేకుండా, ఉన్నపాటున వచ్చు.... (అచ్చట వేరే ఎవరైన ఉన్నారా? దేవుడు నిన్ను ఆశీర్వదించును.. అచ్చట వెనుకయున్న నీ హస్తమును నేను చూచు చున్నాను.)
నాకొరకు నీ రక్తమును చిందించితివి, (అవును ప్రభువా, సహోదరీ దేవుడు నిన్ను ఆశీర్వదించును.)
నాయొద్దకు రా అంటూ.... ఆ (సహోదరీ దేవుడు నిన్ను ఆశీర్వదించును, దారిలో వెనుకయున్న నిన్ను దేవుడు ఆశీర్వదించును... ? ...) నేను వచ్చెదను!
ఆలస్యము చేయక ఉన్నపాటున వచ్చుచున్నాను.
నా ఆత్మయొక్క మలినమును
నా ప్రతీ మరకను నీ రక్తముతో కడిగి
నన్ను విమోచించుము
ఓ దేవుని గొట్టెపిల్లా..... (కృప, ఓ, కృప) నేను వచ్చెదను! నేను వచ్చెదను!
166. ఇప్పుడు, అచ్చట చుట్టూ పదునైదు లేదా ఇరువది చేతులు పైకి ఎత్తబడి యున్నవి. ఇప్పుడు, మీ తలలు పంచియుండగా, చేతులను పైకెత్తియున్న మిమ్మల్ని నేను అడుగబోవుచున్నాను, ఇప్పుడు నిశ్శబ్దముగా మీ కాళ్ళపై నిలబడియున్న మీ కొరకు నేను ప్రార్ధించెదను. దైవపీఠము యందు మనకు కావలసినంత స్థలము లేదు. మీరు లేచి నిలబడవలెనని నేను మిమ్మల్ని కోరుచున్నాను. చేతులను పైకెత్తినవారందరూ, ఇప్పుడు ప్రార్ధన కావలసినవారందరూ, నేను ప్రార్ధించుచుండగా ఇప్పుడే మీరు లేచి నిలబడండి. ప్రతీచోటా యున్నవారు లేచి నిలబడండి.
నాకోసము రక్తము చిందించితివి,
ఆ (అది మంచిది, దేవుని నిన్ను ఆశీర్వదించును.) నా యొద్దకు రా అంటూ
నన్ను పిలిచితివి
ఓ దేవుని గొఱ్ఱపిల్లా, నేను .....
167. గుర్తుంచుకోండి, ఒక దినము వచ్చును, అప్పుడు కృప ఇక యుండదు, నీ కొరకు ఇక విస్తారముగా కృప యుండనే యుండదు, అది చాలా ఆలస్యమై గతించిపోవును. ఇప్పుడు, దానికి ఇంకా సమయమున్నది.
168. ఓ దేవా, మా ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రీ, ఇప్పుడు జీవించుచున్న మా రక్షకుడిని మరణమునుండి మరలా తీసుకొని వచ్చినవాడా, మహిమలో సమస్తమునకు ప్రధానమైన ఆయన, పాపికి నమ్మకమును తీసుకొని వచ్చుటకై క్రీస్తుయొక్క పరిశుద్ధాత్మను మాకై పంపించితివి. దేవా, లేచి నిలబడియున్న ఈ జనులకొరకు నేను ప్రార్ధించుచున్నాను. ప్రభువా, అది సత్యము. "మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రియెదుట మరియు పరిశుద్ధ దూతలయెదుట నేనును వానిని ఒప్పుకొందును." అని నీవు చెప్పితివి. ఆ గొప్ప తీర్పును తీర్చు ఉదయకాలమున మేము నిలబడినప్పుడు, ఎటువంటి ఒక సమయముగా అది యుండునని మేమెరుగుదుము ప్రభువా, వారిప్పుడు నిలబడియున్నారు, కావున వారి పాపములు వారి ముందు వెళ్ళుచున్నవి, కొంతమంది మనుష్యులయొక్క పాపములు వారిని వెంబడించుచున్నవి. వారి పాపములను వారు ఒప్పుకొని, వారు చేసినది తప్పిదమని వారు ఎరిగి మరియు వారు నిన్ను తమ రక్షకుడిగా కోరుకొనుచున్నందువలన ఈ ఉదయకాలమున ఈ జనులు ఇచ్చట నిలబడియున్నారు. వారి హృదయములను నీవు పరీక్షించుము మరియు వారి సమస్తమును నీవు ఎరిగినవాడవు.
169. తండ్రీ నీవు వారి విన్నపములను అనుగ్రహించవలెనని నేను ప్రార్ధించుచున్నాను. వారిని రక్షించుము. దేవునియొక్క కృపను పొందుకొనియున్న వీరు ఈ ఉదయకాలపు వర్తమానముయొక్క జయసూచకములైయున్నారు; మేము ఏమి చేసియున్నను ముందుకు వచ్చి మమ్మల్ని కొనిపోవుము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. వీరి హృదయములకు కృపను అనుగ్రహించుము. వీరందరూ యేసు క్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించునట్లుగా చేయుము. వారు క్రియను చేసితిరి. వారిని లేచి నిలబడమని పరిశుద్ధాత్మ చెప్పగా వారు లేచి నిలబడిరి. వారిని లేచి నిలబడమని పరిశుద్ధాత్మ చెప్పుచుండగా, పరిశుద్ధాత్మకు వారు విధేయులై లేచి నిలబడిరి.
170. ఇప్పుడు, ప్రభువా, నీ మాటను నీవు నిలుపుకొనెదవు. "నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని" నీవు చెప్పితివి. కాబట్టి ప్రభువా, ఈ లేఖనములను ఆధారమునుబట్టి ఇవి మీయొక్క స్వంత మాటలుగా యున్నవి. ప్రభువా, వీటిని మేము పరి. యోహాను 5:12లో చదివితిమి; "నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు," ఎందుచేత? ఎందుకనగాకృప అతడిని దర్శించి, అతడిని విశ్వసించునట్లు చేసినది. "వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు. (తీర్పుకు ముందే అతడు వెళ్ళును), మరియు తీర్పులోనికి రాకుండా,
కానీ మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు." ఓ, దేవా ఇందునిమిత్తమై మేమే విధముగా నీకు కృతజ్ఞతలు చెల్లించగలము.
171. జీవితకాలమంతా నీవు వారిని కాపాడవలెనని ఇప్పుడు మేము ప్రార్ధించు చున్నాము. ప్రభువు నామమును ఉచ్ఛరించుచు వారి పాపములను కడిగి వేసుకొనుటకు ప్రతీ ఒక్కొక్కరు బాప్తిస్మమును పొందుకొనునట్లుగా చేయుము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము.
172. ఇప్పుడు, అచ్చట ప్రత్యక్షమైన ఆ గొప్ప దేవదూతను, నేను నీ సేవకుడిగా విశ్వసించుచూ, నీకు వీరిని నేను సమర్పించుచున్నాను..... మరియు తండ్రీ, ఈ శుక్రవారము ఉదయమున వేకువజామున అచ్చట కొండ పైభాగమునుండి వచ్చిన మూడు వర్తధనస్సుల ఆకారములలోయున్న ఆ గొప్ప దూత అచ్చట ప్రత్యక్షమై ఈ మాటలను చెప్పెను. ఆ కథనంతటినీ నీవెరుగుదువు..... ప్రభువగు దేవా, అచ్చట ఆ వర్త ధనస్సులలో ప్రత్యక్షమైన అదే దేవుడు, ఆయన కృపలో ఇప్పుడు ఈ ప్రజలను ఆయన రక్షించును గాక! నీవు నీ మాటను కాపాడుకొనెదవనియు, నీవు ఖచ్చితముగా చేసెదవనియు మరియు వారి ఆత్మలలో ఏ మచ్చ లేదా ముడత లేనివారిగా వారిని నేను ఆ గొప్ప దినమున సంధించెదననే నిరీక్షణగలవాడినై వారిని నేను నీకు సమర్పించుచున్నాను. దీనిని అనుగ్రహించుము. యేసు క్రీస్తు నామమున నేను వారిని నీకు సమర్పించుచున్నాను. ఆమేన్.
173. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక! ఇప్పుడు, మీరు కూర్చొండి, కూర్చునే టప్పుడు మీకు దగ్గరలోయున్న క్రైస్తవులైన వారిని మీరు కరచాలము చేయండి. సంఘమునకు వచ్చునట్లుగా వారిని ఆహ్వానించుచు మరియు ఇంకా నీవేమి మంచి మాటలను చెప్పగలవో వారితో చెప్పుము ..... ఓ., ఆయన అద్భుతముగా లేడా?
ఆశ్చర్యకరముగు కృప! ఎంతటి మధురమైన శబ్దనుది నీచుని వంటి నన్ను అది రక్షించినది! ఒకప్పుడు నేను తప్పిపోతిని కాని ఇప్పుడు కనుగొనబడితిని గ్రుడ్డివానివలె యుంటిని గాని ఇప్పుడు నేను చూడగలుగుచున్నాను. ఆ కృప నా హృదయమునకు భయమును నేర్పించినది
కృస నా భయములను తొలగించినది. నేను నమ్మిన ఆ మొదటి ఘడియలలో ఆ కృప ఎంతో అమూల్యమైనదిగా కనబడినది.
నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మినయెడల నీ చేతులను పైకి ఎత్తుము.
ఓ, నేనెంతగానో యేసును ప్రేమించుచున్నాను.
ఓ, నేనెంతగానో యేసును ప్రేమించుచున్నాను.
ఓ, నేనెంతగానో యేసును ప్రేమించుచున్నాను.
ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.
అచ్చట పదివేల సంవత్సరములు మనము యున్నప్పుడు వెలుగు సూర్యునివలె ప్రకాశించినది
దేవుని స్తుతించుచు పాడుటకు మనము మొదట ప్రారంభించిన దానికంటే
కొద్ది దినములైన మనకు యుండలేదు.
45
174. మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఇప్పుడు, ఆయన అద్భుతముగా లేడా? ఇప్పుడు .... దానిని మరల మనము పాడుచుండగా ..... ఎవరికో ఒకరికి నీవు కరచాలము చేయుచు వారితో ఎంతో నమ్రతతో ఈ విధముగా, "యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించును గాక." అని చెప్పవలెనని నేను కోరుకుంటున్నాను. ఎంతో మధురముగా మరియు పవిత్రముగా ఇప్పుడు
మనము ఆ విధముగా చేయుచుండగా...... (సహోదరుడు బ్రాస్లాం మరియు జనులు ఒకరికొకరు కరచాలము చేయుచున్నారు - సంపా.).... దేవునికి మహిమ.
మేము మొదట ఆరంభించినప్పుడు సిలువయందు, సిలువయందు నేనెచ్చట మొదట వెలుగును చూచితినో అప్పుడు నా హృదయ భారము తొలగిపోయి విశ్వాసము ద్వారా అచ్చట నేను నా చూపును పొందుకున్నాను దినమంతా ఇప్పుడు నేను సంతోషముగా యున్నాను.
ఓ, సిలువయందు, సిలువయందు నేనెచ్చట మొదటి వెలుగును చూచితినో
నా హృదయ భారము తొలగిపోయి విశ్వాసము ద్వారా అచ్చట నేను నా చూపును పొందుకున్నాను
దినమంతా ఇప్పుడు నేను సంతోషముగా యున్నాను.
మీరు సంతోషముగా యున్నారా?
యేసు నన్ను విమోచించెను నాకెంతో ఆనందము.
యేసు నన్ను విమోచించెను నాకెంతో ఆనందము.
ఓ, యేసు నన్ను విమోచించెను నాకెంతో ఆనందము.
యేసు నన్ను విమోచించెను, పాడెదను, మహిమ, హల్లేలూయా,
ఓ, యేసు నన్ను విమోచించెను నాకెంతో ఆనందము
ఓ, యేసు నన్ను విమోచించెను నాకెంతో ఆనందము
ఓ, యేసు నన్ను విమోచించెను నాకెంతో ఆనందము
ఓ, యేసు నన్ను విమోచించెను నాకెంతో ఆనందము
యేసు నన్ను విమోచించెను, పాడెదను, మహిమ, హల్లేలూయా.
175. మీరు ఆయనను ప్రేమించుట లేదా? ఆయన అద్భుతముగా లేడా? ఓ, ఆయన అద్భుతముగా యున్నాడని నేను తలంచుచున్నాను. ఇప్పుడు, ఆలోచించి చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథము ఆయన సత్యమైయున్నది. మరియు ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడని ఈ పరిశుద్ధ గ్రంథము బోధించుచున్నది. నేను మిమ్మల్ని ఏదో ఒకటి అడుగాలని కోరుచున్నాను. ఆయన నిన్న, నేడు మరియు ఏకరీతిగా యున్నయెడల .... ("ఉన్నయెడల") అనే దేవదూషణము వంటి మాటను నేను చెప్పినందుకు దేవుడు నన్ను క్షమించును గాక, - కాని ఆయన మారనివాడుగా యున్నాడు. కాని ఆయన మారనివాడుగా యున్నయెడల, నేను దానిని ఆ విధముగా చెప్పుచున్నాను, అట్లైనయెడల ఆయన ఎటువంటి ఒక వ్యక్తిగా యుండును? ఆయన ఉన్న విధముగానే ఆయన యుండును.
176. ఇప్పుడు, ఇచ్చట ఉదయకాలమున ఆయన ఉన్నదానికిని, గలిలియలో జనుల మధ్య ఆనాడు ఆయన వున్నదానికిని ఒకేఒక్క వ్యత్యాసము గలదు, అది ఆయనయొక్క స్వకీయమైన మానవ శరీరములో, ఆయన శరీరమైయున్నది, ఎందుకనగా అది లేపబడినది (నీవు దీనిని నమ్ముచున్నావా?). మహోన్నతునియొక్క కుడి పార్శమైన కూర్చొని నిరంతరము సజీవుడై యుండి మన విన్నపములకు మధ్యవర్తిత్వము చేయుచుండును. మొదట మనము ఆయనను అంగీకరించి, ఆయన ఒక ప్రధాన యాజకుడుగా యున్నందువలన, ఆయన దానిని చేయగలడని, అందునిమిత్తమే ఆయన యున్నాడనే దానిని నీవు ఒప్పుకొని దానిని విశ్వాసించనంత వరుకు నీకొరకు ఆయన ఏదికూడా చేయలేడనే దానిని నీవు గుర్తించుకోవలయును మనము విన్నవించుకొనే విన్నపముల నిమిత్తము మధ్యవర్తిత్వము చేయుచున్న ప్రధాన యాజకుడుగా ఆయన యున్నాడు.
177. ఇప్పుడు, అనేకమంది పరిశుద్ధ గ్రంథమును చదివే మీరు ఈ విధముగా చెప్పెదరు, "బహిరంగముగా చెప్పుట" అని అది చెప్పుచున్నది. "బహిరంగముగా చెప్పుట" మరియు "ఒప్పుకొనుట" అనే ఒకే మాటను అర్ధమిచ్చును. చూచారా? ''ప్రధాన యాజకుడుగా చేయబడెను," హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయములో, "మనము ఒప్పుకొనినదానికి." కాబట్టి ఆయన దానిని చేసి ముగించెనని మొదటగా మనము ఒప్పుకొనేంత వరుకు ఆయన ఏమియు చేయలేడు. చూచారా, ఈ దైవ పీఠము
యొద్దకు నీవు వచ్చి రాత్రంతయూ ప్రార్ధించినను, ఆయన నిన్ను మన్నించెననే దానిని నీవు విశ్వసించి అచ్చటనుండి నీవు లేవనంతవరకూ అందువలన నీకు ఏ ప్రయోజనము లేనే లేదు. నీవు ఎంతటి విశ్వాసమును కలిగియుందువో, అచ్చట నీవు ..... ఇచ్చట నీవు ఒకానొకప్పుడు పాపమనే పెంటలో జీవించితివి. ఇప్పుడు, నీవు ఒక యవ్వన క్రైస్తవుడిగా మారితివి, ఇప్పుడు నీవు రక్షించబడితివని విశ్వాసించుచున్నావు, నీవు విశ్వాసించుట లేదా? పిదప ఇచ్చట నీవు ఎదుగుచున్నావు, ఇంకా కొంచెం పైగా ఆత్మీయముగా ఎదుగు చున్నావు. అదేమి చేయుచున్నది? నీ విశ్వాసము, ఎందుకనగా ఇప్పుడు నీవు ఒక క్రైస్తవుడవని నమ్ముచున్నావు, ఇప్పుడు ముందుకన్నా అంతకంటే పైగానే నీవు జీవించుచున్నావు. చూచారా? ఇప్పుడు, ఇంకా కొంచెం ఆత్మీయముగా నీవు పైకి ఎదగాలంటే, ఇంకా కొంచెము విశ్వాసము అవసరమైయున్నది, ఎందుకనగా ఇది మితము లేనిదిగాయున్నది. అట్లే ముందుకు కొనసాగిపోతునేయుండవలెను.....
178. మంచిది, ఓ, అసాధ్యమైన దానిని నిజమైనదిగా చెయ్యవచ్చును. విశ్వాసించు వారికి సమస్తమును సాధ్యమే. "ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని....... " అది నిజము.
179. ఇప్పుడు; యేసు క్రీస్తు జనులలో నివసించుచున్నాడు. ఒక దినమున క్రీస్తు ఆ అగ్నిస్తంభములో యుండెను; పటము తీయబడిన దానిని మీరు చూచుచున్నారు మరియు అది యెహోవా దేవుడని మనము నమ్ముచున్నాము. దానినే దూత మన యొద్దకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించెను. ఆయన అప్పుడు పితృత్వములో యుండెను, ఒక దేశమగు ఇశ్రాయేలీయులకు ఆయన తండ్రిగా యుండెను.
180. అటు పిదప, ఆయన తన జనుల మధ్యకు క్రీస్తుగా కుమారుని రూపములో వచ్చి నివసించెను. అది నిజమేనా? క్రీస్తు దేవునియొక్క కుమారునిగా యుండెను.
181. ఇప్పుడు, అభిషేకించబడినవాడై, పరిశుద్ధాత్మయైన క్రీస్తుగా ఆయన యున్నాడు "క్రీస్తు" అనగా "అభిషిక్తుడు" అని అర్ధము. ఒక అభిషిక్తునిగా, పరిశుద్ధాత్ముడై జనులలో యున్నాడు. క్రీస్తుగా మనలో యున్నాడు. అది క్రీస్తు మనతో, మనలో యుండుట. నీవు దానిని నమ్ముచున్నావా? కొద్దిసేపు వినయముతో, నిశ్శబ్దముతో యుండుము. ఇప్పుడు, ఆయన మారనివాడుగా యున్నాడా?
182. కొద్దిసేపటికి ముందు నన్ను ఎవరో ఫోన్లో పిలిచి, ఇచ్చట జనులు కూర్చొనుటకు స్థలము కొరకు ఇటు అటు సంచరించుచు, శబ్దము చేయుచున్నారని చెప్పిరి. దానిని గురించి ఏదో ఒక సంఘ ఆరాధనలో మనము మాట్లాడాము. అటు తర్వాత బిల్లీతో నేను, వారు వ్యాధిగ్రస్తులకొరకు ప్రార్ధించుకోవాలనియు, అచ్చట ఆ విధముగా అనేకులు
యున్నయెడల వారికి నీవు ప్రార్ధనా అట్టలను యివ్వు అని చెప్పితిని. "సరే, అలాగే చేసెదనని" అతడు చెప్పెను. అతడు చేసియుండునని నేను అనుకుంటున్నాను.
183. గత రెండు లేదా మూడు నెలలలో ఇంతవరుకు లేని విధముగా ప్రత్యేకమైన ఒక సంభవమునకు పిదప, నా సేవలో ఏదో ఒకటి సంభవించినందువలన అది నా చేతులలోనుండి కొంత మట్టుకు తొలగిపోయిన స్థితి ఏర్పడినది. వారు హృదయ రహస్యములను బయలుపరచుట మొదలగు వాటిని చూచిరి. మన ప్రభువు యేసు క్రీస్తు ఈ భూమిపై యున్నప్పుడు ఖచ్చితముగా ఆయన ఏ విధముగా ప్రజలతో మాట్లాడుచూ వారి హృదయ రహస్యములను బయలుపరచెనో అవి అదే విధముగా నా సేవలో జరుగుటను మీరు చూచిరి. మీరందరూ దానిని చూచితిరని నేను తలంచుచున్నాను. ఇచ్చటయున్న వారిలో ఎంతమంది దానిని చూడనివారున్నారు లేదా ఆ క్రియ జరుగుటను చూడని వారెందరు గలరు? మీ చేతులను చూడనివ్వండి, దానిని చూడని వారు. ఓ, అది క్రియ చేయుటను మీరు చూడనే లేదా? మంచిది, దానిని చూడని వారి ఒక గుంపు ఇచ్చట కలదు. వారు అపరిచితులని నేను ఊహించుచున్నాను. ఆ ప్రజలు ఎచ్చటనుండి వచ్చితిరో మనకు తెలియదు.
184. ఇది పలు సంఘ శాఖల గుడారము. మేము సంఘ శాఖలకు విరుద్ధము కాదు. కాని మేము - మేము వారికోసమూ కాదు. వారి దారిలో వారిని వెళ్ళనిచ్చెదము. మేము నమ్ముదానియందు ప్రజలను తీసుకొని ..... వారు వారి సంఘశాఖకు తిరిగి వెళ్ళవలెనని ఆశించినయెడల, వారు ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించువరుకు, అది మంచిదే, వెళ్ళవచ్చు. మేము -- ఒక ఆత్మను రక్షించు స్థలముగా ఇది యున్నది. అందు నిమిత్తమే నా సేప వారికైయున్నది.
185. ఇప్పుడు, కాని పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయుల పత్రిక 13:8లో యేసు క్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడని బోధించుచున్నదానిని నేను నమ్మెదను. మీరు దానిని విశ్వాసించుచున్నారా? (సంఘము "ఆమేన్" అని చెప్పుచున్నది - సంపా). మంచిది, ఆయన ఏకరీతిగా యున్నయెడల .... ఇప్పుడు, మీరు కొద్దిసేపు నిశ్శబ్దముగా కూర్చొనియున్నయెడల, ఇప్పుడు నా హృదయములో ఉన్నదానిని ఉన్నట్లుగా మీతో మాట్లాడాలని నేను ఆశించుచున్నాను. అటు తర్వాత మనము స్వస్థత కూటమునకు వెళ్ళెదము.
నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా యున్నయెడల, ఆయన ఏ విధముగా క్రియచేయు ..... మనము చెప్పగలిగే ఒకేఒక్క మార్గమేదనగా, ఆయన ఒక ఆత్మగా యున్నయెడల, ఆయన నిన్న క్రియ చేసిన అదే విధముగానే నేడుకూడా ఆయన క్రియను చేయును. నిజమే కదా! ఆయన నిన్న క్రియ చేసిన విధముగానే ఆయన క్రియ చేయును.
186. నిన్న ఆయన ఏ విధముగా క్రియ చేసెను? ఆయన ఇతర మానవులకంటే బేధము గలవాడుగా యుండెనా? ఆయన ఒక మానవుడే, చూచుటకు ఒక మానవునివలె యుండెను. ఆయన ఒక మానవుడు. ఆయన జన్మించెను. ఒక మానవుడుగా ఆయన యుండెను. ఆయన రక్తము మరియు మాంసమును కలిగియుండెను. ఆయన శ్రమలను అనుభవించెను. ఆయన దుఃఖముతో మూలుగెను. ఆయన శోధనలద్వారా వెళ్ళెను. ఆయన ఒక మానవుడుగా యుండెను. అది నిజము; అది అట్లే కదా?
187. కాని ఆయనను ఏది దేవునిగా చేసినది? దేవునియొక్క ఆత్మ ఆయనపై యుండుట వలననే. ఆయన అభిషేకించబడిన మెస్సియాగా యుండెను. ఆయనే అభిషేకించబడిన మెస్సియా అని వారెట్లు ఎరుగుదురు? "నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ఒక ప్రవక్తను నీకొరకు పుట్టించును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని జనముల మధ్యనుండి కొట్టివేయబడును."
188. ఇప్పుడు, మనము కొన్ని క్షణములు దానిని గురించి చుద్దాము; కొద్ది నిమిషములు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు, మీ మనస్సును దేవునిపై వుంచండి; ఎందుకనగా దేవుడు ఏమి చెయ్యబోవుచున్నాడో మనకు తెలియదు, ఆయన నాతో ఏమి చెయ్యమని చెప్పునో మనకు తెలియదు.
189. ప్రవచనా వరమును సంఘములో మనము కలిగియున్నామని నేనెరుగుదును. మన సహోదరుడు నెవిల్, జనులపై అతడు ప్రవచనమును చెప్పును, అది చక్కగా యుండును, దానిని మనము మెచ్చుకొనుచున్నాము. దానినంతటిని మనము అన్వయము చేస్తునే యున్నాము. భాషలలో మాట్లాడేవారు ఇచ్చట కొంతమంది గలరు. పరిశుద్ధాత్మను పొందుకొనుటకు అన్యభాషను మాట్లాడే తీరవలయుననే దానిని మనము నమ్ముట లేదు. ఆ కార్యము గురించి ఆ విధముగా పరిశుద్ధ గ్రంథములో ఎచ్చటా లేదు. కాని అన్యభాషలలో మాట్లాడే (పరిశుద్ధాత్మయొక్క) వరము అచ్చట ఒకటి యున్నదని మేము నమ్ముచున్నాము. అది మన సంఘములో గలదు. కాని మేము వారిని ..... దానినే పట్టుకొని అలాగే మనము కొనసాగటము లేదు. అది దేవునియొక్క స్వరమని మనము నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు మనము మాట్లాడుచున్నాము; దానిని మనము మూడు సార్లు మాత్రమే అనుమతించితిమి. నేను ప్రసంగించుచున్నప్పుడు అది ఆ విధముగా యుండకూడదు, లేదా క్రమములో యుండవలెను; ఎందుకనగా ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. చూచారా? పరిశుద్ధ గ్రంథానుసారముగా దానిని చేయవలెను. అన్యభాషలలో మాట్లాడే పరిశుద్ధాత్మ వరము అనేటువంటి ఒక కార్యము లేనేలేదు అని ఏ ఒక్కరు చెప్పకూడదు. దానిని మనమెరుగుదుము. పరిశుద్ధ గ్రంథము దానిని బోధించు చున్నది మరియు దానిని మనము నమ్ముచున్నాము. ఇచ్చట ఈ సంఘములో మనము దానిని కలిగియున్నందులకై దేవుని కృతజ్ఞతలు. ప్రవచనా వరములను మనము
కలిగియున్నాము, మొదట అవి సరియా లేదా, తప్పా అని పరీక్షించి చూడవలెను. అటు తర్వాతే ఆ ప్రవచనా వరము.
190. తర్వాత అచ్చట ఒక ప్రవక్త గలడు. ఇప్పుడు, అచ్చట, ఇప్పుడే నీవు ఆ ఉద్యోగము యొద్దకు వచ్చుచున్నావు.
191. అవి వరములైయున్నవి, అవి భాషలలో మాట్లాడుట, అన్యభాషలకు అనువాదమును చెప్పుట, తెలివి, జ్ఞానము, వివేచించుట మరియు ఇంకా తదితరములు అవన్నియు వరములై యున్నవి.
192. ఆయినాగాని అచ్చట ఐదు ఉద్యోగములు గలవు. మొదటిది అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, సువార్తికులు, కాసరులు అని దేవునిచే నియమించబడిన ఉద్యోగములుగా యున్నవి. మనుష్యులు వాటిని కలిగియున్నారు. చూచారా? అది వారివలన సాధ్యము కాదు; దానిని ఆ విధముగా చెయ్యకూడదు ..... నీవు వాటికొరకు ఆశించకూడదు, నీవు వాటికొరకు అడుగుచూ ప్రార్ధించకూడదు. అని విశేష అధికారముతో అనుగ్రహించబడినవి; నీవు జన్మించుచున్నప్పుడే ఆ ఉద్యోగమును కలిగినవాడుగానే నీవు జన్మించుచున్నావు.
193. ఎవరో ఒకరు అతనిమీద చేతులుంచి ప్రార్ధించి అతడిని ఒక ప్రవక్తగా చేసిన యెడల ఆ ప్రవక్త అనేవాడు అసలు ఒక ప్రవక్త కానే కాదు. ఒక ప్రవక్త అనేవాడు తన తల్లియొక్క గర్భములో ఉన్నప్పటినుండియే ఒక ప్రవక్తగానే జన్మించుచున్నాడు. చూచారా? ఒక ప్రవక్త అనేవాడు వచ్చు విధానము ఎల్లప్పుడూ అట్లే యుండును. చూచారా?
194. దేవుడు యిర్మియాతో ఈ విధముగా చెప్పెను, "గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని" అని చెప్పెను. "నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని" అని చెప్పెను. అది నిజము. చూచారా? మోషే, అతడు జన్మించక ముందుగానే, అతడు ఒక యుక్తమైన బిడ్డగా యుండెను. అతడు ప్రభువుయొక్క ప్రవక్తగా యుండెను. మిగతా వారందరూ అతడి వెనుక వచ్చినవారే. ఏదేను తోటనుండియే క్రీస్తు దేవుని కుమారుడై యుండెను. అది నిజము. చూచారా? పశ్చాత్తాపమును పొందక ముందే పిలుపు మరియు వరములు ఇవ్వబడుచున్నవి.
195. కాని వరములు శరీరమునకు ఇవ్వబడినవి. ఇప్పుడు, దానిని మనము గుర్తించితిమి. వరములన్నింటిని మనము గుర్తించితిమి.
196. ఇప్పుడు, యేసు మనమధ్యలో ఏ విధముగా యున్నాడు, అప్పుడు ఆయన ఏ విధముగా యున్నారో మనము చూద్దాము. ఆయన మొదటగా తన సేవను ప్రారంభించి నప్పుడు మనము కనుగొంటిమి .... ఇప్పుడు, క్రొత్తగా వచ్చినవారు ఇప్పుడు, జాగ్రత్తగా
ఆలకించండి. మొదటగా ఆయన తన సేవను ప్రారంభించినప్పుడు, ఆయన బాప్తిస్మము తీసుకున్నదానిని పరిశుద్ధ యోహాను గ్రంథము మొదటి అధ్యాయములో మనము తరువాత చూద్దాము, ఆయన వచ్చిన తర్వాత.. ఆయన జన్మించి, ఆయనకు ముప్పది మూడు సంవత్సరములు వచ్చెను, బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా ఆయన బాప్తిస్మము పొందెను. పరిశుద్ధాత్మ పావురమువలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు - "నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని" యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. అది గ్రీకు భాషలో ఈలాగ చెప్పబడియున్నది, "ఆయనలో నివసించుటకు నేనానందించుచున్నాను....." మరియు "ఆయనలో నివసించుటకు నేనానందించుచున్నాను, ఆయనలో -- ఆయనలో నివసించుటకు నేనానందించుచున్నాను.'' కాని గమనించండి, ఆ ఉచ్ఛరించే శబ్దములు కొంచెం బేధముగా యున్నట్లు మనకు కనిపించుచున్నవి, క్రియా వచనము ముందు క్రియా విశేషణము కలదు, కాని నిజముగా ఆది, "నేను ఆయనలో నివసించుటకు ఆనందించుచున్నాను" అని యుండవలెను. ఎందుకనగా క్రీస్తు, దేవుడు క్రీస్తులో ఉన్నాడు; క్రీస్తులోనుండి లోకమును తనలో సమాధానపరచుకొనెను. దానిని మనమెరుగుదుము.
197. ఇప్పుడు, వెంటనే దెయ్యము ద్వారా శోధించబడుటకు ఆయన వెళ్ళి అరణ్యములో యుండెను. పిదప, ఆయన అచ్చటనుండి వచ్చి తన సేవను ప్రారంభించి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్దించుటకు ప్రారంభించెను.
198. అటుతర్వాత, పామరుడైన, తన స్వంత పేరును కూడా వ్రాయలేని వృద్ధ బెస్తవాడైన సీమోను పేతురు అను పేరుగల ఒక మనిషి యొద్దకు ఆయన వచ్చెను. ఆయన మెస్సియాని తాను నమ్ముచున్నదానిని గురించి అంధ్రియ అతడి దగ్గర చెప్పేను. "బుద్ధిహీనత.''
199. అతడు ఆయన దగ్గరకు వచ్చెను, "యేసుయొక్క సన్నిధియొద్దకు అతడు వచ్చిన వెంటనే, “నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడవు అని యేసు చెప్పెను." ఏదో జరుగుచున్నదని అతడు దానిని ఎరిగెను. ఆయన దేవునియొక్క కుమారుడని అతను ఎరిగెను. ఆయనయొక్క రాజ్యపు తాళము చెవులను అతడికి యిచ్చుటకును, సంఘమునకు అతడిని అధ్యక్షుడుగా నియమించుటకును అది ఆయనకు అమోదించు నట్లుగా చేసెను.
200. అచ్చట ఒక వ్యక్తి నిలబడియుండెను, అతడి పేరు ఫిలిప్పు. ఫిలిప్పు దానిని చూచెను, “అద్భుతము, నాకు తెలిసిన వేదపండితుడున్నాడు. పదనైదు మైళ్ళ దూరమున యున్న కొండకు అవతల వైపు అతడు యుంటున్నాడు. నేను అతడియొద్దకు వెళ్ళి, దీనిని గురించి చెప్పెదను. అతడి పేరు నతనయేలు!" అని అతడు తలంచెను.
201. ఆ దినమున అతడు చాలా వేగముగా పరుగెత్తుకొంటూ అచ్చటకు వెళ్ళెను. మరుసటి దినమున ఉదయకాలమున అతడు పరుగెత్తుకొంటూ అచ్చటికి వెళ్ళి తలుపును తట్టెను. "ఆయన వెలుపల తోటలలో అక్కడ యున్నాడు, ఫిలిప్పు" అని శ్రీమతి నతనియేలు చెప్పెను. అతడు అతడి స్నేహితుడు. అతడు అచ్చటికి వెళ్ళెను; నతనియేలు మోకాళ్ళపై యుండి ప్రార్ధించుచుండెను. అతడు మోకాళ్ళపైనుండి లేచిన వెంటనే “రా, నేను ఎవరిని కనుగొంటినో వచ్చి చూడుము, యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు" అని ఫిలిప్పు, చెప్పెను.
202. ఇప్పుడు, ఈ గొప్ప హోదాగలవాడును, దైవభక్తిగలవాడైన ఇతడు, "నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా?" అని అడిగెను.
203. అతడు అతడికి ఒక మంచి దృష్టాంతమును యిచ్చెను, మంచి దృష్టాంతమును, "ఇంట్లోనే యుండి దానిని విమర్శించకు, దానిని గురించి మాట్లాడుచునే యుండవద్దు, వెంటనే వచ్చి మరియు నీయంతట నీవే చూడుము. రా, వచ్చి చూడుము. నజరేతులోనుండి మంచిదేదైనా రాగలదాయని వెంటనే వచ్చి కనుగొనుము." అని అతడు చెప్పెను.
204. "నీవు మెస్సీయా అని చెప్పుచున్నావా? ఎందుచేత, మెస్సీయా వచ్చినయెడల, ఆయన క్రిందికి వచ్చును, మరియు క్రింద క్రిందికి వచ్చును, ఆయన వచ్చి రాజ గృహమునకు వెళ్ళును. మన గొప్ప సంఘసంస్థ యొద్దకు ఆయన వచ్చును." వారింకాకూడా ఆ విధముగానే తలంచుచుండిరి. (మీరు గమనించారా?). ఆయన వారియొక్క సంఘసంస్థ యొద్దకు వచ్చునని “ఆయన తిన్నగా మన సంఘసంస్థ యొద్దకే వచ్చును, అచ్చట రాజగృ హములో యున్న వితానములోకి ఆయన వచ్చి, ఆ వెలుపల యుండు ఆవరణములో ఆయన సంచరించి తిన్నగా సింహాసనము యొద్దకు వచ్చును. అచ్చటనుండి మహా పరిశుద్ధ స్థలము వరుకు వెళ్ళి, "నేనే మెస్సియా" అని చెప్పుననియు వారు తలంచిరి. మెస్సియా ఆ విధముగా రానే రాడు. ఆయన ఎచ్చటకు రావాలని ఆశించునో మెస్సియా అచ్చటకే వచ్చును. ఆయన మిక్కిలి శ్రేష్ఠమైనవాడు, ఆయనకు ఇష్టమైన దానిని ఆయన చేయును.
అతడు చెప్పెను. ....... ఇప్పుడు, "మంచిది వచ్చి, చూడుము. వచ్చి, నీయంతట నీవే చూడుము" అని అతడు చెప్పును.
ఇచ్చటే నిలబడి, “ఆ పరిశుద్ధ దొర్లువారియందున్న దానిని నేను నమ్మను." అని చెప్పవద్దు. అచ్చట ఏమున్నదనేదానిని కనుగొనుటకు వచ్చి చూడుము.
205. కాబట్టి అతడు, మార్గములో వారియొక్క సంభాషణనను నేను వినగలుగు చున్నాను. అలకించెదము, వారేమి మాట్లాడుకొనుచున్నారనే దానిని గురించి మీరు వినాలని ఆశించుచున్నారా? వారేమి చెప్పుచున్నారో మనము ఆలకించెదము, మార్గములో
ప్రక్కగా నడుచుకొంటూ వెళ్ళుచుండగా, తెలుసా, "నీకు తెలుసా నతనయేలు, నీవొక వేదకళాశాలలో చదివినవాడవని నేనెరుగుదును, కాబట్టి నేను నిన్ను ఒకదానిని అడగాలను కుంటున్నాను. మనము ఒక మెస్సియా రావాలని ఎదురుచూచుచున్నాము, మనము ఎదురు చూచుచున్నాము కదా?" అని ఫిలిప్పు అడిగెను. నేను నమ్ముచున్నాను.
206. "ఓ, అవును; మనము ఈ తరముయొక్క అంత్యదినములకు వచ్చియున్నాము, మరియు ఈ తరము వారు మెస్సియాను చూచెదరని నేను నమ్ముచున్నాను." ఇప్పుడు, ఆలకించండి. “ఓ, కాని మనము ఇచ్చట యున్నాము, ఒక దేశముగా కూడా మనము లేము. మనమందరము జనుల మధ్య చెదరిపోయియున్నాము. ఏ విధముగా మనము ఎదురుచూడగలము? ఇవన్నీ" నీవు తలంచని ఘడియ యందు దేవుడు వచ్చును. అదేమనగా అప్పుడు ఆయన అచ్చట యుండును.
207. "కాని ఒక నిమిషము ఆగుము, ఈ మెస్సియా ఎటువంటి విధమగు ఒక వ్యక్తిగా యుండును." అని అతడు చెప్పెను. "ఓ, సరే, మంచిది, ఆయన ఒక ప్రవక్తగా యుండునని మన బోధకుడగు మోషే మనకు చెప్పియుండెను."
208. "నజరేయుడగు ఈ యేసు గురించి నేను నీతో చెప్పబోవుచున్నాను, ఆ సమయమున దానికొరకు నీవు చేపను ఒకాయన దగ్గర కొన్నావు కాదా, రసీదుమీద సంతకము కూడా అతడు వేయలేడు, విద్యలేని పామరుడైన అతడు, ఏమీ తెలియని ఆ వృద్ధ బెస్తవాని గురించి నీకు జ్ఞాపకమున్నదా?"
209. "అవును, ఓ, ఓ, అవును, ఆ, ఆ యోనా, యోనా కుమారుడు. అవునవును. నేను యోనాయొద్దకూడా కొన్నాను."
"లేదా 210. "సరే, ఇప్పుడు, అది నీకు తెలుసా? పేతురు అచ్చటకు వచ్చెను "సీమోను, అప్పుడు అతడి పేరు సీమోనుగా యుండెను." ఆయన కూటమునకు సీమోను వచ్చెను, అతడు అచ్చటకు వచ్చిన వెంటనే " "పంచించబడకు, నిజమైన మెస్సీయా వచ్చుటకు ముందు అనేక అబద్ధపు ప్రవక్తలు వచ్చెదరు." అని అతడి తండ్రి అతనియొద్ద చెప్పెనని అతడు మన దగ్గర చెప్పుచూ యుండే మాటలు నీకు జ్ఞాపకము యున్నవా? అది నిజము. "అనేకమైన తప్పుడు వర్తమానములు ముందు వచ్చును." కాని ఒక నిజమైన వర్తమానము వచ్చునప్పుడు నీకు తెలుసు, ఎందుకనగా గుర్తించుకో, "మెస్సీయా ఒక ప్రవక్తగా యుండునని యూదులగు మనము నమ్ముచున్నాము." మన ప్రవక్తలను మనము నమ్ముచున్నాము.
211. ఇప్పుడు ఒక యూదుడిని అడగండి. ఇశ్రాయేలు, వారు ఆ పరిశుద్ధ గ్రంథమును అచ్చటే చదువుటకు తీసినప్పుడు, ఇరాన్నుండి వచ్చుచున్న, వాటిని మరియు ఆ కార్యములను, మీరు దానిని చదివిరి. నాకు, "ఆ యేసు మెస్సియా అయినయెడల,
ఆయన ప్రవక్తయొక్క సూచకక్రియను చెయ్యుటను మేము చూడవలయును, అప్పుడు మేము ఆయనను నమ్మెదము" అని చెప్పుచున్నారు. అవునండీ. ప్రవక్తలను వారు సత్యవంతులని వారెరుగుదురు.
212. కాబట్టి నతయనేలు, "ఓ, మెస్సీయా అను వాడు ఒక ప్రవక్తగా యుండునని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా 'మన ప్రభువగు దేవుడు ఒక ప్రవక్తను లేపును' అని మోషే చెప్పెను." అని చెప్పియుండెను.
213. "సరే, అతడు ఆయనను చూచినప్పుడు -- ఆ సీమోను అను అతడిని ఆయన చూచినప్పుడు, 'నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడవు' అని ఆయన చెప్పెను."
214. "ఆయన అతడిని మాత్రమే ఎరిగియుండలేదు, దైవభక్తుడైన ఆ వృద్ధ పరిసయ్యుడైన అతడి తండ్రినికూడా ఆయన ఎరిగియుండెను."
"ఆహా, నేను దానిని నమ్మను. నీవెక్కడికో అగాధముయొక్క అంతమునకు వెళ్ళిపోయావు."
“ఓ, లేదు, నేను వెళ్ళలేదు. నీవే వచ్చి, కనుగొనుము. వచ్చి, చూడు. వచ్చి, చూడు." అని అతడు చెప్పెను. మార్గమంతటా వారు మాట్లాడుకొంటూ వెళ్ళిరి.
215. చివరగా యేసుయున్న స్థలము యొద్దకు అతడు వచ్చెను, ప్రజలలో ఎచ్చటయో "బహుశా, అతడు నిలబడియుండవచ్చును. యేసు అచ్చట నిలబడియుండెను, చుట్టూ చూచుచుండెను, కొద్దిసేపటి తర్వాత ఆయన అచ్చట చూచెను, నతనయేలు అచ్చట నిలబడియుండుటను ఆయన చూచెను, "ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటము లేదు." అని ఆయన చెప్పెను. అది అతడిని నివ్వెరపోయినట్లుగా చేసినది. బలమైన గాలికి తెరచాప పడవ కొట్టుకొని పోయినట్లుగా అది యుండినది. "ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు; ఇతనియందు ఏ కపటము లేదు."
216. "అది దేవుడు" అని అతడు చెప్పెను. "రబ్బీ (అనగా బోధకుడని అర్ధము), రబ్బీ, నన్ను నీవు ఏలాగు ఎరుగుదువు? ఇంతకు ముందెన్నడూ నేను నిన్ను కలువ లేదు, ఈ సభలో నేనొక అపరిచితుడను, ఇంతకు ముందెన్నడూ ఇచ్చటకు నేను రాలేదు. నన్ను నీవు ఏలాగు ఎరుగుదువు?" అని అతడు అడిగెను.
217. "ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచితిని." అని ఆయన చెప్పెను.
218. అదియే నిన్నటి యేసు. అది నిజమేనా? ఆయన మారనివాడైనయెడల, నేడు కూడా ఆయన మారనివాడుగా యున్నాడు. మనము వేరే దేశపు జనులను తీసకొనెదము. అచ్చట ఒక దేశపు జనులు యుండిరి
219. మూడు తెగల జనులు మాత్రమే గలరు. అది హాము, షేము మరియు యాపెతుయొక్క జనులు. గమనించారా? అది ఖచ్చితముగా అట్లే యున్నది. పెంతెకోస్తు యందు సువార్త యూదులకు వెళ్ళినది, పిదప సమరయులకు మరియు వీదప అన్యుభసులకు సువార్త పెళ్ళినది. గమనించితిరా? హాము, షేము మరియు యాపేతుయొక్క బసులు -మూడు తెగలుగా యున్నారు. ఇప్పుడు, అందులో రెండు తెగలవారు ఒక మెస్సీయ కోసము ఎదురు చూచుచున్నారు. అది మన అన్యజనుల తెగవారికి కాదు. మన వెనుక వీపుల మీద ఒక పెద్ద భారమును మనము కలిగియుండితిమి, మనము అన్యులముగా యుంటిమి, విగ్రహములను ఆరాధించితిమి, కాని హాము మరియు ము తెగవారు (ఆ విధముగా లేరు) కాదు కాదు.
220. ఇప్పుడు, వాటిల్లో ఒక తెగవారైన వారిని గురించి మనము చూచెదము, ఇంకొక తెగవారగు సమరయేలు, వారు నగము యూదులుగాను మరియు సగము అన్యులుగా యుండు తెగవారు. అచ్చట కోరహు చేసిన పాపపు కార్యము వలన, అనగా అతడి యొక్క తప్పుడు వివాహము ద్వారా వారు కలిగిరి, వారు దేవుడిని విశ్వాసించువారు, ఒక మెస్సీయకొరకు ఎదురుచూచువారు. కాబట్టి యేసు అచ్చటకు వెళ్ళి, తనంతట తానే ప్రతినిధిగా వారిముందు కనబరచుకొనెను. తన స్వకీయులైన యూదులయొద్దకు వెళ్ళవలసిన అవసరముండెను. యోహాను 4వ అధ్యాయము, మీరెప్పుడైనా దానిని చదివితరా? ఆయన సమరయకు వెళ్ళవలసి వచ్చెను. కాబట్టి సుఖారను ఊరి యొద్దకు ఆయన వచ్చెను, ఆయన తన శిష్యులను ఆహారమును కొనుటకు పంపించెను. వారు ఆ విధముగా వెళ్ళిన కొద్దిసేపటికి
221. మీరు అచ్చట యుండినయెడల అది ఒక విశాలమైన సంపూర్ణ దృశ్యముగా యుండును. ఒక బావి అచ్చట యున్నది. ఒక పట్టణములో నీళ్ళకోళాయి ద్వారా అందరికీ నీళ్ళను సరఫరా చేయునటువంటి ఒక ప్రాంతమది. ఆ నీళ్ళను లోతున బావినుండి చేదుకొనెదరు. స్త్రీలు అచ్చటకు వచ్చి చేదకు త్రాడును కట్టి, రాట్నము వంటి చక్రము ద్వారా క్రిందకు ఆ చేదను దించి నీళ్ళకుండను చేదుకొని, ఆ నీళ్ళను తలపై పెట్టుకొని వెళ్ళెదరు.
ఇప్పుడు దుష్టప్రవర్తనగల స్త్రీలతో, నీచమైన పేరుగల స్త్రీలతో, మంచి స్త్రీలు వారితో కలిసి రారు. వారికి వీరికి మధ్య ఎటువంటి సంబంధము ఆ దినములలో యుండవు. ఒక స్త్రీ నీచమైనదైతే, అటువంటి ఒక స్త్రీ వచ్చు వరుకు ఆమె వేచియుండి, అటువంటి స్త్రీ వచ్చినప్పుడే ఈ స్త్రీ, ఆ స్త్రీతో కలసి వెళ్ళవలెను. నేడు కాదు, కాని వారు...... కాని వారు ..... అది గ్రుడ్డులో మధ్యయుండు దానిని తీసువేయునట్లుగా యుండును; నీవు దానినంతటిని ఎఱ్ఱని దీపముగా చేయుచున్నావు. గమనించారా? కాబట్టి అప్పుడు
222. కాబట్టి ఈ దుష్టప్రవర్తనగల స్త్రీ హవర్తనగల స్త్రీ 11:30 నిమిషముల నుండి 12:00 గంటల లోపు బయటకు వచ్చినది. ఆ సమయములలోనే ఇటువంటివారు అచ్చటకు వచ్చెదరు. ఆమె నీళ్ళు తెచ్చుకొనుటకు ఒక చేదను పట్టుకొని అచ్చటకు వెళ్ళుచున్నది. మరియు ఆమె పట్టుకొని ... ఆమె తన చేతులలో చేదను, రాట్నంలా తిరిగెడు చక్రమును పట్టుకొని ఒక కుండ నీళ్ళు తెచ్చుకొనుటకై, ఆ బావియొద్దకు ఆమె వెళ్ళుచుండెను. దానిని నేను చూడగలుగుచున్నాను. అదే సమయమునందు, ఆమె నీళ్ళను తెచ్చుకొనుటకు బయలుదేరినది. ఎవరో ఆమె దగ్గర, "స్త్రీ, నాకు దాహమున కిమ్మని' అడిగిరి. అచ్చట ఒక యూదుడు యుండుటను ఆమె చూచినది. ఇప్పుడు, ఒకరికొకరు వారిమధ్య ఏ సాంగత్యము వారు చేయరు.
223. మధ్యవయస్సుగల మనిషిగా ఆయన యున్నాడు. ఆయనకు ముప్పది సంవత్సరములు. కాని ఆయనకు ఏబది ఏండ్లుయున్నవానివలె యుండెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. దానిని మీరెరుగుదురు. ఆయన చెప్పెను .....
224. "నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివని చెప్పుచున్నావే" ఆయన వయస్సు ముప్పది సంవత్సరములు మాత్రమే. చూచారా? చెప్పెను ... ఆయన చేసిన సేవ ఆయనను అంతగా పీల్చి పిప్పు చేసినదని నేను తలంచు చున్నాను. కాబట్టే వారు, "నీవు అబ్రాహామును చూచితివని చెప్పుచున్నావే, నీవు ఒక దయ్యము పట్టినవాడవని ఇప్పుడు మేము తెలుసుకొంటిమి." అనిరి.
ఆయన "అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నాను." అని చెప్పెను, చూచారా, ఆయన అబ్రాహాముయొక్క దేవుడు. నిశ్చయముగా. ఆయన అబ్రాహాముయొక్క దేవుడై యుండెను. ఆయన అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నాను." అని చెప్పెను. నిశ్చయముగా.
225. మరిప్పుడు, అచ్చట ఆ బావియొద్ద ఆయన కూర్చొనియుండెను; "స్త్రీ, నాకు దాహమున కిమ్ము" అని ఆయన అడిగెను.
226. ఆమె, "ఇది అలవాటు కాదు కదా, మనము ఇచ్చట వేరుచేయబడియున్నాము కదా!" అని చెప్పెను.
దక్షిణమునందు నల్లజాతివారు మరియు తెల్లజాతివారు అని వేరుచేయబడి యున్నట్లుగా...... ఇది యున్నది. చూచారా? "మనము ఇచ్చట వేరుచేయబడియున్నాము. యూదుడైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహముకిమ్మని ఏలాగు అడుగుచున్నావు. ఒకరి కొకరు మనకు సాంగత్యము లేదే, నీవు ఈ విధముగా నన్ను అడుగుట వాడుకలో లేదు కదా?" అని ఆమె చెప్పెను. ఆమె ఒక వేశ్య, మీకు తెలుసా, బహుశా ఆమె ఒక అందమైన
చిన్న స్త్రీ. ఆమెయొక్క ఉంగరాల వెంట్రుకలు ఒకవేళ ఆమె ముఖముపై పడుచుయుండగా, రాత్రంతయూ నిద్రలేనిదై, అచ్చట ఆమె నిలబడియున్నది. కాబట్టి ఆమె చెప్పినది, ఆమె, "యూదుడవైన నీవు ఒక సమరయ స్త్రీనైన నా దగ్గర ఆ విధముగా అడుగుట వాడుకలో లేదు కదా!" అని చెప్పెను.
ఆయన "స్త్రీ, నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు. అది నిన్నటి మెస్సీయాయై యుండెను. చూచారా? "నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి యుంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవజలమిచ్చునని" ఆమెతో చెప్పెను.
227. "ఎట్లు" అని ఆమె అడిగినది, "యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే, ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును." అని ఆమె అడిగినది. మరియు ఆమె "తానును, తన కుమాళ్ళును, పశువులును, ఈ బావినీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా?" అని అడిగినది. "మన తండ్రియైన యాకోబు " చూచారా, ఆమె ఒక సమరయ స్త్రీ, అయినా గాని యాకోబు తన తండ్రియని ఆమె చెప్పుచున్నది. "మా పితరులు ఈ పర్వత మందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని యూదులగు మీరు చెప్పుదురని" ఆమె చెప్పినది.
ఆయన, "ఒక కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చియున్నది, యధార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను దేవుడిని ఆరాధించుదురు, ఎందుకనగా దేవుడు ఒక ఆత్మమైయున్నాడు." అని చెప్పెను. చూచారా? "తనను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు." ఆయన ఏమి చేయుచున్నాడు? ఆయన ఆమెతో మాట్లాడుతూనే ఆమెయొక్క ఆత్మను ఆయన తాకుచుండెను. ఇప్పుడు గుర్తించుకొండి, సమరియులైన వారిముందు ఆయన మెస్సియగా యుండెను.
228. ఆమెయొక్క బాధ ఏమైయున్నదో ఆయన దానిని కనుగొనెను. అది ఏమిటని మీకెందరికి తెలుసు! నిశ్చయముగా. ఆమె తన అరవ భర్తతో జీవించుచున్నది. కాబట్టి మీరు గమనించారా? నీ భర్త జీవించుచుయుండగా ఇంకొక భర్తతో ఆ విధముగా జీవించుట, అది తప్పిదమైన కార్యము. ఏదో ఒక నెపముతో ఒక స్త్రీని త్రోసివేసి వెళ్ళి, ఇంకొక స్త్రీని వివాహము చేసుకొనుట, మరలా ఆ తరువాత ఇంకొకరిని ఆ విధముగా చేసుకొనుట, తప్పిదమైన కార్యము. నీవు ఆ విధముగా దానిని చెయ్యకూడదు. కాబట్టి ఆయన ఆమెతో చెప్పెను.,.... ఆమె వారిని వివాహముకూడా చేసుకోకుండా వారితో జీవించుచున్నదని నేను ఊహించుచున్నాను. వారిని బహుశా ఆమె వివాహము చేసుకొనియుండియుండదు.
ఒకవేళ ఆమెకెన్నడూ వివాహమే జరుగలేదేమో. కాబట్టి ఆమె చేసిన ఈ నీచమైన కార్యము అన్నింటిని మీరెరుగుదురా. ఈ నీచమైనకార్యము అన్నింటిని చెప్పినది.
229. కావున అటుపిదవ ఆయన అచ్చట నిలబడియుండి ఆమెను ఆ విధముగా చూస్తూ "వెళ్ళి, నాకు దాహమునకిమ్మని" ఆయన ఆమెను అడిగెను. మరియు ఆమె చెప్పినది...."నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెప్పటికిని దప్పిగొనడు." అటు తర్వాత ఆయన "నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్ము" అని చెప్పెను.
ఆమె, "అయ్యా నాకు భర్త లేడు" అని చెప్పెను.
ఓ, ఆయన, "నీవు చెప్పిన మాట సరియే. నీకు ఐదుగురు భర్తలుండిరి మరియు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్తకాడు, సత్యమే చెప్పితివనెను." అని చెప్పెను.
230. ఆమె...... ఆ స్త్రీని చూడండి. ఇప్పుడు, ఎప్పుడైతే .ఆయన చేసిన దానిని వారు చూసినప్పుడు ఆ యూదులు ఆయనను ఏమని పిలిచిరి? ఆయన వారి మెస్సీయని వారు గుర్తించగలిగినా? లేదు. ఆయనను వారేమని చెప్పిరి? దయ్యము పట్టినవాడనియు, సోదె చెప్పువాడనియు, ఆ శక్తి దయ్యము వలన కలిగినదనియు వారు చెప్పిరి. దేవుని ఆత్మచేయు ఆ వివేచించే కార్యమును అది అశుద్ధమైన కార్యమని వారు చెప్పిరి. ఆయన, "మీరు నాకు విరుద్ధముగా ఒక మాటను మాట్లాడవచ్చును. నేను మిమ్మల్ని క్షమించెదను, కాని రాబోవుచున్న పరిశుద్ధాత్మ కూడా ఇదే కార్యములను చేయును; మీరు ఆ పరిశుద్ధాత్మకు విరోధముగా ఒక్క మాటను మాట్లాడినను, అది మిమ్మల్ని ఎన్నటికినీ క్షమించనే క్షమించదు. అది నేడు జరిగినయెడల, నేడు మనము ఎచ్చట యున్నామో మీరు గమనించి చూడండి; పరిశుద్ధాత్మకు విరుద్ధముగా ఒక్క మాటైనను మాట్లాడినను వానికి ఈ యుగమందైనను, రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేనే లేదు. కావున ఈ తరము వారు ఏమి చేయుచున్నారనే దానిని మీరు గమనించి చూడండి. ఇప్పుడు, దీనిని గురించి ఆలోచించి చూడండి, లోతుగా ఆలోచించి చూడండి, ఈ పవిత్రమైన మాటలను తూచి చూడండి.
231. ఇప్పుడు, యూదులు, "ఈ మనిషి దయ్యములకు అధిపతియైన బయెల్లైబూబు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, అతడొక దయ్యము, సోదె చెప్పువాడు" అని చెప్పిరి. సోదెను చెప్పేది అది దయ్యమని మనకు తెలుసు. కావున అతడు, "ఈ మనిషి ఒక సోదె చెప్పువాడు" అని చెప్పెను.
232. కావున ఆయనను ఒక సోదె చెప్పువాడుగా వారు పిలిచినను ఆయన వారిని క్షమించెను. కాని పిదప ఆయన మరణించి, పరిశుద్ధాత్మ తిరిగి వచ్చినప్పుడు
అది వ్యత్యాసముగా యుండెను. గమనించితిరా? అది- అది అన్యజనుల తరములో -సంభవించును.
233. ఇప్పుడు, గమనించండి. ఇప్పుడు, యూదులు ఇంతకు ముందే దానిని చూచిరి, దానిని నిందించిరి. సమరయులు దానిని అంగీకరించిరి, మరియు ఆమె, "అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సీయ వచ్చునప్పుడు ఆయన మాకు ఈ సమస్త కార్యములను చెప్పునని మేమెరుగుదుము." చూచారా, మెస్సీయాను వారెరిగి యుండిరి, అది ఎవరైయుందురని వారు ఎరుగరు; "క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును. కాని నీవు ఎవరువు? నీవు ఆయన ప్రవక్తవా?" అని ఆమె అడిగినది.
ఆయన, "నేనే ఆయనను, నేనే ఆయనను" అని చెప్పెను.
234. ఇప్పుడు, ఆలకించండి. దానిని ఆలకించిన ఆమె తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఊరంతా పరిగెత్తుచూ, వీథులలో యున్న మనుష్యులతో, "మీరు వచ్చి నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన మెస్సీయ కాడా?" అని ఆమె చెప్పెను. ఆ స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. ఆయన వారితో చెప్పినట్లుగా, ఎందుకనగా ఆయనే మెస్సీయ.
235. ఇప్పుడు, అది నిన్నటి మెస్సీయయొక్క సూచనయైనయెడల, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడు; నేడుకూడా అదియే సూచనగా యుండును. అది నిజమేనా? ఎంతమంది దీనిని మీరు సమ్మతించెదరు? నిశ్చయముగా, అవును ..... ? .... అది మారనిది. సరే మంచిది.
236. ఇప్పుడు, అది వ్యత్యాసమైన ఏ మనిషిగానైన యుండునా? లేదు. ఆయన ప్రేమించెను, ఆయన ఏడ్చెను, ఆయన భుజించెను, ఆయన నిద్రపోయెను, ఆయన అరణ్యములలోనికి వెళ్ళెను, చేపలను పట్టుటకు వెళ్ళెను, ఎవ్వరైనా చేయు విధముగానే ఆయన చేసెను. ఆయన ఒక మనిషిగానే యుండెను. (చూచారా?), అయినప్పటికినీ ఆయన అభిషేకించబడిన మెస్సీయగా యుండెను.
237. ఇప్పుడు, ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథములో ఎచ్చటో చెప్పుచున్నదని మనకు జ్ఞాపకమున్నది, అనేక లేఖనములలో దానిని మనము నిరూపించవచ్చును. అచ్చట ఒక దినము ఉండును. అది పగలుగానైనను లేదా రాత్రిగానైనను యుండక చీకటిగా యుండు ఒక దినముగా యుండునని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, సంఘ సంస్థలు, సంఘములు మరియు రక్షింపబడిన చాలినంతమంది యుందురు. "కాని సాయంకాల
సమయమునందు వెలుగు కలిగియుండును." ఎంతమంది దీనిని పరిశుద్ధ గ్రంథములో చదివితిరి? నిశ్చయముగా, చూచారా?
238. ఇప్పుడు, వేరే మాటలలో చెప్పాలంటే, సూర్యుడు తూర్పుదిక్కులో ఉదయించి మరియు పడమట దిక్కుయందు అస్తమించును. అదే సూర్యుడు తూర్పు ఉదయించి, పడమరయందు అస్తమించును. సరే, దేవుని కుమారుడు ఎప్పుడైతే, కు-మా-రు-డు (son) తూర్పుదిక్కునయున్న తూర్పుదేశ ప్రజలపై లేచి.... నాగరికత సూర్యునితో ప్రయాణించెను, ఇప్పుడు మనము పశ్చిమ సముద్రతీరమున యున్నాము. నీవు దాటి వెళ్ళినయెడల నీవు చైనాకు వెళ్ళి, మరలా వెనుకకు తూర్పునకు వచ్చెదవు. కావున తూర్పున ప్రకాశించుచుండే అదే సూర్యుడు ఇప్పుడు పడమటియందు ప్రకాశించుచుండెను; అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మముతోను, అదే సూచనలతోను, అదే అద్భుతములతోను, అదే మెస్సీయగా ఆయన యున్నాడు. అది నిజమేనా? "సాయంకాల సమయమందు వెలుగును కలిగియుండును, మహిమకు పెళ్ళే మార్గమును నీవు నిశ్చయముగా కనుగొనెదవు." అది నిజము.
239. మనము సాయంకాలముయందు సాయంకాల వెలుగులో యున్నాము. సూర్యుడు అస్తమించుచుండెను. మెస్సీయ మనమధ్య యున్నాడు. దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ రూపములో మనమధ్య యున్నాడు. నీవు దానిని నమ్ముచున్నావా? (సంఘ సభ్యులు "ఆమేన్" అని చెప్పుచున్నారు సంపా.) నేను ఆయనయొక్క సేవకుడునని మీరు నమ్ముచున్నారా? నేనేమి చెప్పుచున్నానో అది సత్యమని మీరు నమ్ముచున్నారా? నిన్నటి ఉదయకాలమునందు, మొన్నటి ఉదయకాలమందు సంభవించిన ఆ దూతను గురించి నేను చెప్పిన కథను మీరు నమ్ముచున్నారా? దీనిని మీరు నమ్ముచున్నారా? అట్లైన పరలోకములోయున్న దేవుడు, ఆ వర్షధన్సులో నాకు ప్రత్యక్షమైన దేవుడు, ఆయనను మాట్లాడనివ్వండి, ఆయన మహిమకొరకై, నా శరీరము, నా అంతరాత్మ, నా ఆత్మ, మరియు నా మనస్సు ఆయనకు ప్రతిష్టించెదను.
రుదుల ఆ చివరి ఉడుత కోసము నేను చూచుచున్నప్పుడు, అది చివరిది అని తెలిసి యుండియు, సరిగ్గా పది గంటలకు ఇంకా మూడు నిమిషములు యుండగా అది దొరికినది. అది పది గంటలలోపు కావలెనని నేను పలికితిని. మీకు తెలుసా, ఆయన, "నీకు ఏమి కావాలెనో అడుగుము, అది ఆ విధముగానే అనుగ్రహించబడును." అని చెప్పెను. తప్పిపోడు. ఆయన ఇచ్చిన వాగ్దానమందు ఎన్నటికినీ తప్పిపోడు. అది ఏమైనా గాని .... నీకు ఏమి కావలెనో ఊరకే పలుకుము.
240. ఆ చిన్న స్త్రీయొద్ద అది ఎనిమిదవ సారిగా చెయ్యబడినది. ఇప్పుడు ఆమె అచ్చట వెనుక కూర్చొనియున్నదని నేను అనుకొనుచున్నాను. సహోదరుడు రైట్ అచ్చట కూర్చొని యుండుటను నేను చూచుచున్నాను, హాట్టీ రైట్, తన ఇద్దరి కుమారుల కొరకు ఆమె
అడిగినప్పుడు (సరిగ్గా అచ్చట ఆమె ఇప్పుడు కూర్చొనియున్నది), ఆమెయొక్క ఇద్దరి కుమారుల రక్షణకొరకు వేడుకొనెను, వారు అందుకు విరుద్ధముగా యుండిరి. నేను "నీ కుమారులను యేసు క్రీస్తు నామమున నేను నీకు యిచ్చుచున్నాను” అని చెప్పితిని. వారు సరిగ్గా ఆమె ఒడిలో పడిరి.
241. కెంటక్కీలోనుండి వచ్చి ఇక్కడకు వచ్చి కూర్చొనియున్న బాప్టిస్టుడైన ఎడ్ డాల్టన్, సరిగ్గా ఇచ్చట కూర్చొనియున్నాడు. ఎడ్ సహోదరుడా, నీకు ఎంతమంది పిల్లలు గలరు. పండ్రెండునుంది పిల్లలు ఇచ్చట నిలబడుకొనియున్నారు. అతడి పిల్లల కొరకు అతడు వేడుకొనెను. కట్టడము నుండి నేను వెలుపలికి వెళ్ళితిని. ఎడ్ నా దగ్గరకు ఇచ్చటకు వచ్చెను. నేను "ఎడ్" అని చెప్పితిని,
నా మీదయున్న పరిశుద్ధాత్మ, "అది అతడికి ఇవ్వు, అతడికి ఇవ్వు." అని చెప్పెను.
242. నేను, "నీ పిల్లలను నేను నీకు యిచ్చుచున్నాను." అని చెప్పితిని. వారిలో ప్రతిఒక్కరు రక్షించబడి మరియు బాప్తిస్మమును పొందుకొనిరి, అతడియొక్క యవ్వన కుమారుడు అచ్చట ఇంట్లో కూర్చొనియుండెను, వేచియుండి, ఏడుస్తూయుండెను. అతడు అచ్చటకు వెళ్ళినప్పుడు, ఆ కుమారుడు కూడా రక్షించబడియుండెను. ఈ బాప్టిస్టు సహోదరుడు అచ్చటనుండి ఓ, ఓ ఆయన మాట్లాడినప్పుడు ఎంత అద్భుతముగా ఆయన యుండెను!
243. ఆయన క్రీస్తు అనియు, నేను చెప్పుచున్నది సత్యమనియు తానే దానిని చూపించునట్లుగా ఆయన మహిమ కొరకు ఆయనను నేను ఇప్పుడు అడుగుచున్నాను.
244. ఇప్పుడు, అవిశ్వాసి ఏ విధముగాను తప్పించుకోలేడు. వ్యాధిగ్రస్థులు, అవసరతలో యున్నవారు, దేవునియొక్క సహాయము కోరువారు, ఈ ద్వారము లోపలయున్న నాకు తెలియనివారిని, నేనెరుగని ప్రజలను, అవసరతలో యున్నవారు, దేవునియొక్క సహాయమును కోరువారు, ఇచ్చట లోపలయున్న జనులను తమ చేతులను ఎత్తవలెనని నేను కోరుచున్నాను. ప్రతిచోటా జనులు గలరు, ఆ .... సరే మంచిది, సహజముగా ప్రతీచోటా యున్నారని నేను తలంచుచున్నాను. నేనెరుగని ప్రజలు గలరు. నేనెరిగిన వారిని ఎవరినైనా నేను పిలిచినయెడల, మిమ్మల్ని నేనెరుగుదునని మీకు తెలుసు; మరియు మనము ఒకరికొకరము పరిచయముగలవారమైతే, మీరు ఏమియు చెప్పవద్దు, మీరు ఊరకే నెమ్మదిగా యుండండి. ఆయన దేవుని కుమారుడైనయెడల, ఆయన దేవుని కుమారుడే. నా వర్తమానము మరియు ఆ దేవదూత సత్యమైనయెడల ......
245. పది గంటలకు ఇంకా మూడు నిమిషములు యుండినప్పుడు, నేను, “ఓ దేవా, కొద్దిసేపటి క్రితము ఆ వర్షధనస్సులో నాకు ప్రత్యక్షమైన వాడా, ఇంకా మూడు నిమిషములే యున్నవి. ఉడుత నాకు కనబడుట లేదు, ఇంకా మూడు నిమిషములే యున్నవి, నీవు
నాకు ఒకటి తీసుకొని రావలయును." అని చెప్పితివి. పరిశుద్ధ గ్రంథమును నా చేతిలో ఉంచుకొని భయభక్తితో దీనిని నేను చెప్పుచున్నాను, దేవుడే నాకు న్యాయాధిపతిగా యున్నాడు. ఒట్టుపెట్టుకొనుటలో నమ్మకము యుంచవద్దు; పరిశుద్ధ గ్రంథము ఆ విధముగా చెప్పుట లేదు, దానిని చేయవద్దని అది చెప్పుచున్నది. కాని దేవుడే నా న్యాయాధిపతిగా యున్నాడు. ఒక ఉడుత చెట్టుపై పరుగెడుతూ సరిగ్గా అచ్చట ముందే యుండినది. ఆయన ఎన్నడూ విఫలమవ్వడు, ఆయన దానిని విఫలమవునట్లుగా చెయ్యడు. ఆ సంగతులన్నియు ఎరుగునట్లుగా ఇచ్చట అనేకులు గలరు. అదే మారని దేవుడుగా ఆయన ఇచ్చట యున్నాడని నేనెరుగుదును.
246. ప్రార్ధనా అట్టలను అచ్చట యివ్వబడియున్నవి. అవి నాకు అక్కరల్లేదు. ఒక వరుస క్రమములో వాళ్ళు వచ్చెదరు, కొన్ని నిమిషములు మనము వారికొరకు ప్రార్ధించుట మంచిది. ఇచ్చటయున్న జనులను అది- అది, లేదా ఏమైనాగాని నేను కోరుచున్నాను.
247. అపరిచితులను నేను కోరుచున్నాను. నన్ను ఎరుగని ఆ జనులను నేను కోరుచున్నాను. దీనిని మీ మనస్సులలో యుంచుకోవలెనని నేను మిమ్ములను కోరుచున్నానని మీరు తలంచుచు, ప్రార్ధించుచు మరియు ఈ విధముగా, "దేవా ఆ మనిషి నన్ను ఎరుగని వాడు" అని చెప్పుచూ మీరు యుండవలెనని నేను కోరుచున్నాను.
248. ఒక గుంపు జనసమూహములో నుండి ఈ దీన స్త్రీ దూసుకు వచ్చెను. ఆమె రక్తస్రావమనే వ్యాధితో బాధపడుచుండెను. ఆమె చెప్పినది.
249. వారిలో అనేకులు, "ఆయన ఇచ్చట యున్నాడు. ఆయన వైపు చూడండి. ఆ గలిలేయుడు అచ్చట యున్నాడు." ఇంకా అనేక విధములుగా చెప్పుచూ యున్నారు. వారి బోధకులు మరియు ఇంకా తదితరులందరూ అచ్చట నిలబడుకొని, "రబ్బీ, మాకు ఒక సూచనను నీవు చేసి చూపించుము." అని చెప్పుచు, మరియు ఇంకా అటువంటి వాటిని వారు అడుగుచుయున్నారు.
250. కాని దీన స్త్రీ, "ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. ఆయన వస్త్రముయొక్క అంచును మాత్రము తాకినయెడల చాలును. నేను పూర్తిగా స్వస్థతను పొందుకోగలనని నమ్ముచున్నాను." అని చెప్పెను. ఎంతమంది దానినెరుగుదురు? ఆమె ఆయనను తాకినది. ఆ స్పర్శను ఆయన గ్రహించునట్లుగా కాదు గాని ఆయన "ఆగి, చుట్టూ క్రిందికి చూస్తూ," ఎవరు నన్ను తాకిరి? ఎవరో నన్ను తాకిరి?" అని ఆయన అడిగెను. అందరూ కొద్దిసేపు నిశ్శబ్దమై యుండిపోయిరి, "ఎవరో నన్ను తాకిరి" అని, "ఎవరు నన్ను తాకిరి?" అని ఆయన అడుగుచుండెను.
251. ఆ చిన్న స్త్రీని ఆయన కనుగొను వరుకు ఆయన చుట్టూ చూస్తునే యుండెను. ఆమె తనను ఆయనయందు మరుగుపరచుకోలేకపోయెను. దానిని కనుగొనలేకపోయెను.....
ఆమెను కనుగొని, "నీ విశ్వాసము నిన్ను రక్షించినది" అని ఆయన ఆమెతో చెప్పెను.... రక్తస్రావమునుండి, ఎందుకనగా ఆమె ఆయనను నమ్మినది. ఆమె విశ్వాసమే ఆయనయొక్క వస్త్రపు చెంగును తాకినది. నీవు దానిని నమ్ముచున్నావా? సరే మంచిది.
252. ఇప్పుడు, దేవుని యొక్క కుడి పార్శమున నేటికిని ఆయన కూర్చొనియుండి మనయొక్క విజ్ఞాపనల కొరకు మధ్యవర్తిత్వము చేయుచు ఒక యాజకుడుగా యున్నాడు. మనయొక్క బలహీనతల ద్వారా తాకగల ప్రధాన యాజకుడుగా ఆయన యున్నాడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నదా? అది సరియేనా? మంచిది, నీవు వ్యాధితో యుండిన యెడల, నీవు ప్రార్ధించుటకు ఆరంభించి, "ప్రభువగు దేవా, ఇప్పుడే నేను ఒక వర్తమానమును విన్నాను. నేను ఈ మనిషిని నేనెరుగను. నేను ఈ గుడారములో ఇచ్చట నేను యున్నాను. నేను ఇచ్చటకు వచ్చువాడిని కాదు, ఇది నేను వెళ్ళు నా సంఘము కాదు. నేను వేరే స్థలమునుండి వచ్చినవాడిని, నేను ఈ పట్టణస్తుడిని కాదు, నేను వేరే స్థలము నుండి వచ్చినవాడిని, ఈ మనిషిని నేను ఎరుగనివాడను. వీటన్నింటినీ చేయుచున్నది నీవేయని చూపించుటలో ఎంతో వాస్తవము గాను, తేటగాను అతడు దానిని విశదపరచెను; నీవు ఏ విధముగా ఈ కార్యములు చేసితివనియు, నీవు అతడికి ప్రత్యక్షమైతివని చెప్పినదియు, అతడియొక్క వర్తమానము అన్నియు సత్యమైనవి. ఇప్పుడు, ఆ మనిషిని నేను ఎరుగను, కాక నేను నిన్ను ఎరుగుదును. కాబట్టి తనను నీకు అతడు ప్రతిష్టించుకొని, అతడి శరీరమును నీవు ఉపయోగించుకొంటూ అతడి ద్వారా నీవు నీ స్వంత మాటలను మాట్లాడిన, అతడు నాతో మాట్లాడనిమ్ము. ప్రభువా, నన్ను నీ వస్త్రపు అంచును తాకనిమ్ము." అని చెప్పెదరా? ఆయన చేయునా లేదా అని చూడండి, ఆయన దేవుడైయున్నాడని చూడండి.
253. ఆయన ఇంకా దేవుడుగానే యున్నయెడల, ఆయన నా పెదవులను ఉపయోగించుకొని అదే మాటలను ఆయన మాట్లాడగలడు; నీ పెదవులు మరియు నా పెదవులు తప్ప ఆయనకు వేరే పెదవులు లేవు. మన కళ్ళు తప్ప ఆయనకు వేరే కళ్ళు లేవు. కాబట్టి ఆయన క్రిందకు దిగి మనయొక్క శరీరము ద్వారా ఆయన సంఘమును నడిపించును. (దానిని నీవు నమ్ముచున్నావా?) ఆయనే నడిపించును. దానినే ఆయన ఈ విధముగా చెప్పెను, "నేను చేయుచున్న క్రియలను, మీరుకూడా అదే క్రియలను చేయుదురు.” అది నిజమేనా? "అదే క్రియలు, నీవు చేయుదువు..." ఆయన చేసిన క్రియలే ఆయనే మెస్సీయాని ఆయనను నిరూపించెను. ఇప్పుడు, ఆయన మెస్సీయాయైన, ఆయన, అట్లైన అది సత్యమై యుండవలెను; సరిగ్గా ఇప్పుడు ఆయన తన సంఘము ద్వారా అదే క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆయన ఆ విధముగా చేయుచుండగా మీ సంఘ సంస్థలన్నియూ ఏకమై ఏమి చెప్పినను, అది సత్యమని దానిని అది నిరూపించు చున్నది. ఓ, హల్లేలూయ.
254. వృద్ధ సహోదరుడగు కిడ్ మరియు సహోదరి కిడ్ ఇచ్చట కూర్చొనియున్నారు, నేను జన్మించుటకు ముందునుండే ప్రసంగించుచున్న ఆ ఇరువురు వృద్ధులకు ఎనుబది సంవత్సరముల వయస్సు గలదు. రెండు సంవత్సరముల క్రితము ఒకానొక ఉదయకాలమున కాన్సర్ వ్యాధితో అతడు మరణావస్థలో పడకపై పరుండియుండెను. అతడి యొక్క "ప్రోస్ట్రేట్' (Prostrate) గ్రంధులలో కాన్సర్ వ్యాధి తాకుటచే దానిని తీసివేసిరి. ఒహియోలో నాకు ఎంతో ప్రియమైన స్నేహితుడతడు, సహోదరి కిడ్ నన్ను పిలిచినది, "బిల్లీ, నీవు త్వరగా వస్తే మంచిది, అతడు మరణాపాయములో యున్నాడు, సరిగ్గా ఇప్పుడే మరణించు తరుణములో యున్నాడు." అని చెప్పినది. నేను మరియు నా కుమారుడు బిల్లీ కలిసి కారు టైర్లు కాలిపోయేంత వేగముగా ఆ పాత కారులో అచ్చటకు వెళ్ళితిమి.
255. అ గదిలోకి నేను వెళ్ళినప్పుడు, నేను అచ్చటకు వెళ్ళిన వెంటనే, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని పరిశుద్ధాత్మ మాట్లాడెను.
256. అతడు అచ్చట దేవునికి మహిమార్ధముగా ఒక సాక్ష్యిగా నిలబడియున్నప్పుడు, అతడికి వైద్యము చేసిన ఆ వైద్యుడ్నికూడా అది కుదిపేసినది. అది కేవలము..... ఆయన దేవుడైయున్నాడు. నేను దానిని చేయగలనా? లేదు, లేదండీ. వేరే ఏ మనుష్యులయొక్క మాటలకంటే నా మాటలేమి ఎక్కువ కాదు. కాని అది ప్రభువు ఈలాగు సెలవిచ్చినదిగా యున్నది. ఆమేన్.
257. కొన్ని సంవత్సరముల క్రితము కెంటక్కీలలోయున్న కొండల ప్రాంతములో, ఒక చిన్న పాత దేవుని సంఘము యుండెడిది లేదా కొండల ప్రక్కన అచ్చట కొంత మంది యుండెడివారు, ఆ చిన్న వృద్ధురాలైన తల్లియగు కిడ్ ఒక గుంపు పిల్లల కోసము మొక్కజొన్నలను శుభ్రము చేసి దానితో చిన్న రొట్టెముక్కలను చేసి ఆ పిల్లలకు తినిపించేది, ఒక తొట్టెనిండా యుండు వస్త్రములను ఉదికి ఆమె తన భర్తను సేవకొరకు పంపించెడిది. ఇప్పుడు ఎనుబది సంవత్సరాల వయస్సుగలవారై (నేడు) ఇచ్చట వారు కూర్చొనియున్నారు. ఆదివారము ఉదయకాలమున ఒక వంద మైళ్ళు, ఎన్నో మైళ్ళ దూరమునుండి కారు నడిపించుకొంటూ యేసు క్రీస్తు సువార్తను విని ఆనందించుటకు వచ్చెదరు. ప్రతీ ఆదివారము నేను ప్రసంగించున్నానని వారికి తెలిసినయెడల వారు ఆ విధముగా ఇచ్చటకు వచ్చెదరు. నిశ్చయముగా, వారు వచ్చుటకు అశించినయెడల మేము వారికి ఆహ్వాన పత్రికను పంపించెదము. వృద్ధులైన వారి చిన్న హృదయములను దేవుడు ఆశీర్వదించును గాక. అది నిజము. ఇచ్చటయున్న ప్రతీఒక్కరు ఈ ఉదయకాలమున వారియొద్దకు వెళ్ళి వారితో కరచాలము చేసి వారిని ఆశీర్వదించగలిగినయెడల మీరు వారిని ఆశీర్వదించండి.
258. ఇప్పుడు ప్రార్ధించుకొనెదము. ఓ, ఆయన దేవుడై యున్నాడని ఎరుగుట బట్టి నేనెంతో ఆనందించుచున్నాను, ఎంత చక్కని అనుభూతిగా యున్నది. మీరు, “బ్రాస్లాం సహోదరుడా, ఎందుకొరకు నీవు సాగదీసుకొంటూ వెళ్ళుచున్నావు?" అని అడగవచ్చును.
నేను ఆయన కోసము ఎదురు చూచుచున్నాను. అది ఒక .... నేను ప్రసంగిస్తూనే యున్నాను; ఇది పేరొక విధనుగు అభిషేకము..
259. ఆయన వచ్చి మరియు దానిని చేసినయెడల, ఆయనను తమ స్వస్థపరచువానిగా ఇచ్చటయున్న వారెంతమంది ఆయనను అంగీకరించెదరు? వ్యాధిగ్రస్థులైన జనులందరు మీ చేతులను పైకి ఎత్తండి; ఆయన చేసినయెడల -- దానిని ఆయన చేసినయెడల; ఆ మెస్సీయ చూచునట్లుగా వ్యాధితో బాధపడు ప్రతీఒక్కరు మీ చేతులను పైకి ఎత్తండి. జనుల మధ్యలోనుండి క్రీస్తు మాట్లాడుచున్నాడా?
260. ప్రార్ధించెదము, నమ్మండి. ఈ ప్రక్కనయున్న గృహమును నేను ప్రతిష్టించు చున్నాను .... ఆ అభిషేకమును కొరకు ఆశించుచు ప్రార్ధించుచుండు అనేకమందిని నేనెరుగుదును. గమనించండి. విజ్ఞాన శాస్త్రము ఛాయా చిత్రమును తీసిన ఆ చిత్రము వాషింగ్టన్ డి.సిలో వ్రేలాడుచున్నదనేదానిని, అచ్చటయున్న ఆ - ఆ అగ్నిస్తంభమును గురించి ఎంతమంది ఆలకించిరి? మీరు దానిని ఎరుగుదురు. ఇదిగో ఆ ఛాయాచిత్రము సరిగ్గా అది యిచ్చటే యున్నది. మోషేను నడిపించిన అదే అగ్నిస్తంభము. పది అంతస్తుల భవనపు బీరువాలో ఏదో ఒకరోజున అది ఉంచబడునని విజ్ఞాన శాస్త్రము చెప్పుచున్నది. అది సహజాతీతమైనది, అటువంటి దానిని ఛాయచిత్రము ఎన్నడూ చిత్రించలేదు. ఇప్పుడు ఈ దైవపీఠము నందు అదే దూత సరిగ్గా యిచ్చట యున్నాడు. నేను ఆయనతో మాట్లాడితిని. దానిని మీరు నమ్మవలెనని నేను సవాలు చేయుచున్నాను. వేరే సంఘమునుండి వచ్చినవారైన మీరు దానిని నమ్మండి. ఇప్పుడు, అది ఎచ్చటకు వెళ్ళుచున్నదో నేను కనిపెట్టుచూ దానిని చూడవలయును. అందరూ భయభక్తితో ఉండండి, ఆయనయొక్క సన్నిధిలో దానిని భక్తిపూర్వకమైన భయముతో
261. నేను ఒక మనిషిని చూచుచున్నాను..... అది యిచ్చట యున్నది, అతడు నాకు ఎడమ చేతివైపు కూర్చొనియున్నాడు, ఇచ్చట మూలలో సరిగ్గా వెనుక వైపు యున్నాడు. అతడు జలుబుకు సంబంధించిన వ్యాధితోను మరియు కడుపు నొప్పితోను బాధపడు చున్నాడు. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? వారు, అతడు ఒక అపరిచితుడు ..... అది నిజమేనా? ..... శ్రీవెల్స్, శ్రీవెల్స్, నీ పేరు ఆ విధముగానే పిలువబడుచున్నది, నీవు యిచ్చటి వాడవు కాదు. నీవు... ఇల్లినోయిన్లోగల అరోరా అని పిలువబడు ఒక ప్రాంతమునుండి నీవు వచ్చితివి. అది నిజము. అది నిజమేనా? నేను నీకు పరిచయము లేనివాడని, అది నిజమైనయెడల నీవు నీ చేతిని పైకి ఎత్తవలెను; నీవు లేచి నిలబడవలెను; యేసు క్రీస్తు నన్ను బాగుచేయును. ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మనియెడల....
ఇప్పుడు, అచ్చట ఒక వ్యక్తి గలడు. నా జీవితములో నేనెన్నడూ అతడిని చూడలేదు. మనమధ్య అతడు ఒక అపరిచితుడుగా యున్నాడు; వేరొక రాష్ట్రమునుండి అతడు వచ్చెను. అతడి గురించి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏమి చెప్పనైయున్నదో, అంత
వరుకు నేనేమియు చెప్పలేను ... నేను ... ? ... దానిని టేపువేసి నేను ఆలకించు వరుకు, అభిషేకము నాపైకి వచ్చియున్నది, కాని అది ఆ మనిషికి తెలుసు.
నీతో ఏమి చెప్పుచున్నానో అది సత్యము. అది నిజమేనా, అయ్యా? మనము పరిచయము లేనివారము..... అచ్చట..... అతడి గురించి అతడే సాక్ష్యము చెప్పనిచ్చెదము. దానిని ఎవరు చేసిరి? మెస్సీయ; క్రీస్తు.
262. వెనుక వైపు భాగమున సరిగ్గా ఇచ్చట జనులమధ్య ఒక స్త్రీ కూర్చొనియున్నది. ఆమెపైయున్న ఆ వెలుగును చూడగలుగుచున్నారా? ఒక చర్మపు వ్యాధితో ఆమె బాధపడు చున్నది. నీ పేరు శ్రీమతి పిట్మన్, ఓవెన్స్ బోరో అను ప్రాంతమునుండి నీవు వచ్చితివి. నీవు నన్ను ఎరుగనిదానివైతే నీ చేయిని ఊపుతూ చూపించుము. చెప్పిన ఆ సంగతులన్నీ నిజమేనా? నీ చేతిని ఊపుము. దేవుడు నిన్ను స్వస్థపరచును. దర్శనములో మాత్రమే ఆమెను చూచితినిగాని నేనెన్నడూ ఆమెను చూడలేదు.
దానిని నీవు ఎరిగినదానివైతే, సరిగ్గా నీకు కుడివైపుయున్న ఒక స్త్రీ పేరు ఎల్లిస్, శ్రీమతి ఎల్లిస్, ఒక యవ్వన స్త్రీ. ఆమెకు స్త్రీలకు వచ్చు వ్యాధితో బాధపడుచున్నది. ఆమె కూడా నాకు అపరిచితురాలే. అది నిజమైనయెడల నీ చేయిని ఊపుతూ చూపించుము. అచ్చట నీప్రక్కన కూర్చొనియున్నది నీ తల్లియే కదూ? అచ్చట కూర్చునియున్న ఒక స్త్రీ ఒక భయముతో బాధపడుచున్నది, ఇబ్బందిపరచు ఒక భయము ఆమెపై గలదు. స్త్రీ, అది నిజమైనయెడల నీ చేతిని పైకెత్తి చూపించుము. నుంచిది, ఆ భయము నిన్ను విడిపోవును, నీవు నీ గృహమునకు వెళ్ళవచ్చును, చక్కగా యుండుము. నీవు దానిని నమ్మవలెనని నేను సవాలు చేయుచున్నాను.
263. దారిలో వెనుకవైపు మూలలో ఒక మనిషి మిన్నేసోట అను ప్రాంతమునుండి వచ్చిన అతడు నడుము నొప్పితో బాధపడుచున్నాడు; అతడి పేరు శ్రీ కార్సన్. లేచి నీవు నిలబడుము. నీ ... నడుము నొప్పి పోయినది యేసు క్రీస్తు నిన్ను బాగుచేసెను.
సరిగ్గా వెనుక ప్రక్కన ఇచ్చట, ఒక స్త్రీ బాధపడుచున్నది, ఆమె ఈ పట్టణస్తురాలు కాదు. బ్లూ ఐలాండ్ అను పిలువబడు ఒక ప్రాంతమునుండి ఆమె వచ్చుచున్నది. ఆమె గుండెనొప్పితో బాధపడుచున్నది. చికాగోకి దగ్గరలో ఆమె యున్నది. శ్రీమతి బ్రైడెన్, నీ చేతిని పైకి ఎత్తుము, నీ స్వస్థతను నీవు అంగీకరించుము. గృహమునకు వెళ్ళుము. మరియు యేసు క్రీస్తు నామములో చక్కగా యుండుము.
మీరు నమ్ముచున్నారా? ఈ భాగమునయున్న వారిగురించి ఏమిటి? ఆ మెస్సీయని మీరెరుగుదురా? ఒక మనిషి ఏ విధముగా ఎరుగగలడు? ఆ విధముగా పిలవబడిన ఈ ప్రజలందరూ ఎరుగుదురు. మీగురించి నాకేమియు తెలియదని, మీ చేతులను పైకి ఎత్తండి, చుట్టూయున్న ఆ విధముగా పిలువబడిన ఈ ప్రజలందరూ, అచ్చట చూచారా?
264. ఈ గదులలో ఒక గదిలోనుండి నా వెనుక భాగమున ఎవరో ఒకరు ప్రార్ధించు చున్నారు, యవ్వనస్థుడు, కన్సాస్లోయున్న కాన్సర్ వ్యాధితో బాధపడుచున్న తన బంధువు నిమిత్తమై అతడు ప్రార్ధించుచున్నాడు. తలుపు ముందుకు రా, దేవునిలో విశ్వాస ముంచుము. నీవు నమ్ముచున్నావా?
ఎల్మెర్, నీతో ఏదో సంబంధము యున్నది. నీ తండ్రి అచ్చట కూర్చొనియుండుట నేను చూచుచున్నాను. అది నిజము. అతడు రక్తపోటు వ్యాధితో బాధపడుచున్నాడు; నీవు నమ్మినయెడల, దేవుడు నిన్ను స్వస్థపరచును. నాకు తెలియదు. అది నిజము. అది నిజమేనా? నీ హృదయమంతటితో నీవు నమ్మవలెను. నీవు నమ్ముచున్నావా?
ఆ యేసు క్రీస్తే మెస్సీయ అని నీవు నమ్ముచున్నావా? ఇచ్చట ఆయన ప్రసన్నత యున్నదని నీవు నమ్ముచున్నావా? గుర్తించుకో, ఒక్క స్త్రీ ఆయనయొక్క వస్త్రపు అంచును తాకినప్పుడు ఆయన బలహీనుడాయెను, ప్రభావము, శక్తి ఆయననుండి బయలు వెళ్ళెను. నేనుకూడా ఇప్పుడు బలహీనుడునైతిని. నీవు నమ్ముచున్నావా? అట్లైన ఒక్క నిమిషము మనము మన తలలను వంచెదము.
265. ఓ యేసు, దేవునియొక్క మెస్సీయ, నీవు ఎప్పుడూ సన్నిహితముగానే యున్నావు. నీవు దేవుని కుమారుడవనియు, ఇప్పుడు ఇచ్చట నీవు యున్నావనియు జనులు ఎరిగి యున్నారు. నీ సూచనలు మరియు అద్భుతకార్యములు నిరూపించబడినవి. వారిని ఆశీర్వదించుము, తండ్రీ వారిని ఆశీర్వదించుమని నేను ప్రార్ధించుచున్నాను. నీవే మెస్సీయా అను ఒకాయనగా ఇచ్చట నిలబడియున్నాడని సరిగ్గా ఇప్పుడు వారు వారి హృదయ మంతటితో దానిని నమ్ముచున్నారు. నీవు తప్ప మరెవ్వరూ దానిని చేయలేరు, ప్రభువా, అది మానవులకు అసాధ్యమైనది, అద్భుత కార్యములను, మెస్సీయ శక్తిని, ఒక చిన్న విధేయతగల స్థలములోకి వచ్చుటను ఈ విధముగా చూచుచున్నాము; ఎందుకనగా దానిని నీవు వాగ్దానము చేసితివి, ప్రభువా, నీ కృప ఇచ్చట యున్నది. కృపను మాకనుగ్రహించుటకై యున్నది, ఎందుకనగా దానిని చేయుటకై నీవు దానిని వాగ్దానము చేసితివి. నీవు దానిని చేసితివి. నీవు నీ ప్రజలను విడువవని మేము చూచితిమి.
266. ఇప్పుడు, తండ్రియగు దేవా, ప్రార్ధనా అట్టలుగలవారు ప్రార్ధనా వరుసలోనికి వచ్చుచుండగా, వారు నమ్మి విశ్వసించునట్లుగా చేయుము. ఓ, సర్వశక్తిగల దేవా, వారిపై చేతులను ఉంచినప్పుడు, వారు ఆనందించుచు, సంతోషించుచు, దేవునిని స్తుతించుచు వారు వారి స్వస్థతను పొందుకొనునట్లుగా చేయుము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. రక్షించబడిన వీరు దేవునియందు రహస్యములను దాచలేమనే దానిని ఎరుగనిమ్ము. హృదయ రహస్యములను దేవుడు బయలుపరచును. సున తలంపులలో యుండు ప్రతీ తలంపును ఆయన ఎరుగును. తండ్రీ, దానిని అనుగ్రహించుము. యేసు క్రీస్తు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్.
267. ఇప్పుడు, జనులమధ్యయున్న ప్రార్ధనా అట్టలుగలవారు, గుడారము చుట్టూయున్న జనులగు మీరు, ప్రార్ధనా అట్టలు గలిగి ఇచ్చట చుట్టూయున్న మీరు నమ్ముచున్నారా? మీ చేతులను పైకి ఎత్తండి, ఇది ఒక మానవుడు చెయ్యలేడని, ఇది దేవునియొద్దనుండే రావలెనని నమ్మవలెను. ఇది ఒక దేవుని వాగ్దానమై యున్నదని, దానిని ఆయన చేయునని దేవుడు చెప్పినదానిని మీరు నమ్ముచున్నారా? సరే మంచిది. అట్లయిన మనిషికంటె గొప్పవాడు ఎవరో ఒకరు ఇచ్చట యున్నారనే దానిని మీరు ఎరుగవలయును.
దేవునికి ముందు ఈ వాక్యమును భయభక్తితో నేను తీసుకొనుచున్నాను, జనుల దగ్గర మాట్లాడితిని, అది ఎవరైనాగాని, వారిని నేను ఎరుగను, వారుకూడా నన్నెరుగనివారు, ఈ గుడారములో వారెచ్చట యున్నను వారు పరిచయము లేనివారు. ఈ గుడారములో ఇచ్చటయున్న ప్రజలను గురించి నేను కొన్ని దర్శనములను చూచితిని, కాని వారిని అట్లే యుండనివ్వండి, అట్లే వారిని ఉండనివ్వండి.
పిలువబడిన ఆ జనులు, నీవు ఎచ్చట యున్నను, నాకు నీవు పరిచయము లేనివాడవని వీరికి తెలియునట్లుగా నీ చేతులను పైకి ఎత్తగలవా. చూచారా? అన్యులైన అందరూ ప్రతీఒక్కరు.
268. ఏదో ఒకటి నన్ను కదుపుచునేయున్నది. ప్రతీసారి ఒక నల్లరంగు స్త్రీ నాకు ముందుగా ప్రత్యక్షమవ్వటాన్ని నేను చూచుచున్నాను; కీళ్ళనొప్ప వ్యాధితోను మరియు రక్తపోటు వ్యాధితోను బాధపడుచున్నది. అవును, మామధ్య నీవొక అన్యురాలివి. నీవు మెమఫిస్నుండి వచ్చినదానవు. శ్రీమతి, సాల్స్ అది నీ పేరైయున్నది. ఇచ్చటకు నీవు రావటము ఇదే మొదటిసారి. నీ హృదయమంతటితో నీవు ప్రభువుయందు నమ్మకమును కలిగియున్నావా? అట్లైన నీవు రక్షించబడితివి, మరియు స్వస్థపరచబడితివి, నీ గృహమునకు నీవు వెళ్ళుము. దేవుడు దానిని తీసివేసెను ...... నీ హృదయమంతటితో నమ్ముము; ప్రతీఒక్కరు నమ్మవలెను.
ప్రతీఒక్కరు, మీరు మీ చేతులను పైకెత్తుడి, నీ హృదయమంతటితో నమ్మండి. ఒకరిపై ఒకరు మీ చేతులను ఉంచండి. ఇచ్చటకు రండి, నెవిల్ సహోదరుడా, ఇచ్చటకు రండి. ప్రార్ధన చెయ్యండి.
మనము మన తలలను వంచియుండగా, సహోదరుడు నెవిల్ ప్రార్ధన చేయుదురు.