గుర్తింపు

గుర్తింపు

గుర్తింపు

64-0216 టులారే, కాలిఫోర్నియా అమెరికా,

1. ఇప్పుడు మనం వాక్యం చదువుచుండగా, గుర్తుంచుకోండి, ఈ మధ్యాహ్నం ఈ కూడిక ముగిసిన అనంతరం, బహుశా మీరు రాత్రికాల కూడికకు మీ మీ సంఘాలకు వెళ్ళెదరు. మీరట్లు చేయుటకు మిమ్మల్ని త్వరగా వదిలిపెట్టుటకు ప్రయత్నిస్తాను.

2. వినండి. నేను ఈ పట్టణములో నివాసమున్నట్లయితే, ఈ చుట్టు ప్రక్కనున్న సంఘాలకు వెళ్ళెదను. నేను నిజంగా వెళ్తాను నేను దీనిని ఊరికే చెప్పడం లేదు. దీన్ని చెప్పమని ఎవరు చెప్పలేదు. మంచి మనుషులు, నిజమైన సహోదరులు ఇక్కడ వున్నారు. మరియు క్రీస్తును అంగీకరించిన మీరంతా, మీలో ఎవరి పేరైనా వారి నొద్ద లేకపోతే, క్రైస్తవ బాప్తిస్మము కొరకు మీరెందుకు వారిని కలవకూడదు. మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు మిమ్మల్ని వారు నడిపించనియ్యండి.

3. మీకంటు ఒక సంఘము లేకపోతే మీరు ఖచ్చితంగా ఒక సంఘాన్ని కలిగియుండవలెను. లేదంటే మీరు ఆత్మీయంగా చనిపోతారు, మీరు క్షీణించి పోతారు. మరియు మీకు ఒక సంఘము లేనట్లయితే, మీరెందుకు వారిని వెళ్లి కలవకూడదు, మీకు సహాయం చేయుటకు వారు సంతోషిస్తారు. వారు క్రీస్తులో సహోదరులై యున్నారు. మరియు మీకు సహాయం చేయటానికి వారు సంతోషిస్తారు. అది సరియేకదా సహోదరులారా? (సరేనని సేవకులనుచున్నారు - సంపా॥) మీకు సహాయం చేయుటకు, సహయం చేస్తూ వుండుటకు సంతోషిస్తారు, మీ కోసం చేయగలిగింది ఏదైనా చేస్తారు. వారు మంచి నమ్మకస్తులై, మీ ఆత్మను కాయుదురు మరియు మీ యెడల శ్రద్ద చూపుదురు, మీరది చేయండి.

4. మరియు మీరు క్రీస్తును అంగీకరిస్తే, మీరు ఇక్కడే ఎక్కడో మీ కుర్చీలో ఇప్పుడే ఆయన్ని అంగీకరిస్తే, మరియు వారి దగ్గర మీ పేరు లేకపోతే, బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి వారి యొద్దకు ఇప్పుడే వెళ్లి మీరెందుకు మాట్లాడకూడదు. దానినిప్పుడే చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

5. ఈ మధ్యాహ్నం ఫిలిప్పీ పత్రిక నుండి చదవగోరుచున్నాము. ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయం 5వ వచనముతో మొదలు పెట్టాలనుకుంటున్నాను.

"క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి, ఆయన దేవునిస్వరూపము కలిగినవాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్నుతాను రిక్తునిగా చేసికొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా, విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలోగాని, భూమిమీద వున్నవారిలోగాని, భూమిక్రింద ఉన్నవారిలోగాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి
నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను.

ఒక్క క్షణం తలలు వంచుదాము.

6. మా ప్రభువా, పరలోకంలో వున్న మరియు భూమ్మీదున్న కుటుంబానికి వుండిన పరిశుద్ద నామంలో మేమిప్పుడు నిన్ను సమీపిస్తున్నాము. మరిక్కడ వున్నప్పుడు ఆయన మాతో అన్నాడు. "నా నామములో మీరు తండ్రిని ఏది అడిగినను, నేను దానిని అనుగ్రహించెదను" ప్రభువా, మేము నిమిత్తమాత్రులం, కాని అది సత్యమని నమ్ముచున్నాం. మేము అడిగిన దానిని పొందుదమని నమ్ముచున్నాం. ఎందుకంటే, మేము చేసిన దుష్క్రియలను బట్టి మా మనసాక్షి మమ్ము ఖండించకపోతే, ఏ దురుద్దేశములు లేకపోతే దేవుడు మా మొర వింటాడనే నిశ్చయత మాకు వున్నది. కావున, ఈ మధ్యాహ్నం మా అందరి కొరకు కనికరమును అడుగుచున్నాము.

7. మరిప్పుడు, దైవీక సన్నిధిలో వున్న ప్రతీ ఒక్కరి స్వస్థతను, వేచియున్న ఈ సభకు నీవు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాము. మేము చూచిన అన్ని స్వస్థతా కూడికల కంటే, ఈ కూడిక అతి గొప్పదిగా వుండును గాక. ప్రభువా, ఏదో ఒకటి జరుగును గాక్ష అదెలా జరుగునో మాకు తెలియదు, ఏమి జరగాలో మాకు తెలియదు, కాని ప్రతిఒక్క హృదయంలో మరియు ప్రతిఒక్క మనస్సులోకి చొచ్చుకొని పోవునట్లుగా, ఈ మధ్యాహ్నం, పరిశుద్ధాత్మ ప్రాధాన్యత పొందునట్లుగా మేము ప్రార్థించుచున్నాము. మేము ఇప్పుడే చదివినట్లుగా, "క్రీస్తునందు కలిగిన ఈ మనస్సును మీరునూ కలిగి వుండుడి" మనస్సే మానవుని నియంత్రించే గోపురమై వుందని, అదే మమ్మల్ని నిర్దేశిస్తుందని మేము చూస్తుండగా, ప్రభువా, క్రీస్తు మనస్సు మాలోను వుండునట్లు ప్రార్థించుచున్నాను. మరి ఆయన (క్రీస్తు) ఎప్పుడు వాక్యాన్ని నమ్ముతాడు. మరిప్పుడు ఆయన సన్నిధి గొప్పగా మా మీద కుమ్మరించబడును గాక.

8. మరియు ఈ కూడిక కోసం సహకరించిన ఈ సేవకుల నిమిత్తం నేను ప్రార్ధించుచున్నాను. ప్రభువా, ప్రతీ సంఘము గొప్పగా ఆత్మీయ మరియు భౌతిక మేలులను పొందును గాక. ఎందుకనగా, వారికి తెలిసినంతమట్టుకు సత్యమగు రీతిలో బోధించుచున్న సువార్తను, వారి ప్రజలకు వారందించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. మరి తండ్రి వారిని మీరు దీవించమని ప్రార్దించుచున్నాను. ప్రజలు వారిని మెచ్చుకొందురు గాక - వారు దానిని వారి కోసం మరియు సువార్త కోసం చేస్తున్నారని ఎరుగుదురు గాక, తద్వారా ప్రతిస్పందనగా వారు తమ భుజములను చక్రమునకు ఆనించి, ప్రభువైన యేసుని ఈ భూమ్మీదికి తెచ్చుటకు మేము చేయుచున్న ప్రయత్నంలో పాలిభాగస్థులగుదురు గాక.

9. ఇప్పుడు, తండ్రీ, మేము చదివిన వాక్యాన్ని తీసికోమని ప్రార్ధించుచున్నాము. నీ వాక్యానికి నీవే అనువాదకుడవైయున్నావు గనుక దీనిని మా హృదయాలకు నేడు నీవు అనువదించమని ప్రార్ధించుచున్నాము. మరియు మేము వెళ్ళేటప్పుడు ఆ ఎమ్మాయి వారివలె “దారి పొడవునా ఆయన మనతో మాట్లాడుచుండగా, మన హృదయములు మండలేదా?" అని చెప్పుదుము గాక,
10. దేవా, నీ యొద్దకి తెచ్చిన ఈ పసివారిని దీవించండి. వారు తమ మృదువైన మార్గంలో, నిష్కళంకమైన సువార్త అను పాలతో పోషింపబడి, క్రీస్తు యొక్క గొప్ప పోలికలుగా ఎదిగి, ఆయన నోటి బూరలుగాను అలాగే సేవకులుగాను వుండునట్లు, మేము జీవించుచున్న సాయంకాలపు వెలుగులో ఈ గొప్ప సంధ్యవేళ ఆయన్ని సేవించేవారిగా వుండాలని ప్రార్థించుచున్నాను. తండ్రీ, దయచేయండి, యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చు.

11. (ఒక సహోదరి అన్యభాష మాట్లాడుచున్నది. ఒక సహోదరుడు అర్ధం చెప్పుచున్నాడు. - సంపా॥) ఆమేన్. ఆమేన్, ఆ సందేశం పరిశుద్ధులకు ఓదార్పుగాను, క్రొత్తగా మారుమనస్సు నొందినవారికి హెచ్చరికగాను, దేవునికి ఇంకొంచెం దగ్గరగా వచ్చుటకు, విశ్వాసంలో కొనసాగుటకు ఉపయోగపడుతుందనుకొంటున్నాను. దేవునికి స్తోత్రం.

12, ఇప్పుడు, కొద్దిసేపు, ఈ అంశంను తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఇంచుమించు ఐదువందల ప్రార్థనా కార్డులున్నవి. వారందరికి ప్రార్ధన చేయాలి. కావున మనకు ఎక్కువ సమయం లేదు. కొద్దిసేపు మాత్రమే నేను మాట్లాడతాను.

13. ఇప్పుడు, ఇది సహాయపడుతుందని దీనిని చేస్తున్నాను. నా స్వరము ప్రతిధ్వనించడం లేదని అనుకుంటున్నాను. ఆ వెనుకున్నవారు నా స్వరాన్ని వినగలుగు తున్నారా, సరేనా? ఇక్కడైతే నా స్వరము ప్రతిధ్వనిస్తున్నట్లుగా వుంది. గతరాత్రి నేను వేదిక పిలుపు ఇచ్చినప్పుడు దీనివల్ల ప్రజలకు అర్థం కాలేదని అనుకొంటున్నాను.

14. ఇప్పుడు ఈ మధ్యాహ్నం “గుర్తింపు" అనే అంశాన్ని తీసుకోదలిచాను.

15. ఇప్పుడు, ఎవరైనా, ఖచ్చితంగా గుర్తింపబడవల్సిన కాలంలో మనము న్నాము. నీకు సరైన తగిన గుర్తింపు లేకపోతే బ్యాంకులో చెక్కుని డబ్బుగా మార్చుకోలేవు.

16. నాకు తెలుసు, నా భార్య చెక్కును డబ్బుగా మార్చుకోలేదు. అయితే, మాకు ఏదైనా చెక్కు వస్తే బ్యాంకులో వేస్తాము. ఐతే, ఆమె దానిని డబ్బుగా మార్చుకోలేదు. కారణం, ఆమె బండి నడపదు, ఏ సాంఘీక భద్రతా సంఖ్య ఆమెకి లేదు. ఆమెను ఆమెగా గుర్తించుటకు ఆమె యొద్ద ఏమీ లేదు. కాబట్టి, చెక్కుని డబ్బుగా మార్చుట ఆమెకు కష్టం. నీకొక అధికారిక గుర్తింపు వుండి తీరాలి. అటువంటి ఒక కాలంలో మనం జీవిస్తున్నామని నేననుకొంటున్నాను.

17. మీరు గమనించండి, మెథడిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరన్, లేదా మరేదైనా, సంఘశాఖ చర్చికి వెళ్ళి, నీవు మాట్లాడాలనుకుంటే, అక్కడ నీకొక గుర్తింపును నీవు కలిగి వుండాలి. నీవెక్కడ నుండి వచ్చావో లేదా, వేదికపై ఏం చెప్పబోతున్నావో వారు తెలిసికొనుటకు నీ యొద్ద దస్తావేజుకాని, కార్డుకాని, ఫెలోషిప్ కార్డుకాని, నీ గుర్తింపుకై నీ యొద్ద వుండాలి. నీవు గుర్తించబడాలి. మరిధి గుర్తింపు కాలమై వున్నది.

18. ఇప్పుడు, ప్రకృతిలో జరిగేదంతా, కేవలం ఆత్మీయంగా జరిగే దానికి మాదిరి. క్రైస్తవ సంఘంగా మనం కూడా ఏ మతశాఖకూ చెందనివారిగా వుండి ప్రకృతికి మాదిరిగా వున్నాము. అది మర్మమైయున్న క్రీస్తు శరీరమై వున్నది. అలాగే అదియు గుర్తింపును
కలిగియున్నది. యేసు తనకుతానే దానితో గుర్తింపబడెను.

19. మరిప్పుడు, ఈ మధ్యాహ్నం బైబిల్లోని పాత్రలను గుర్తింపులను చూద్దాం. వేరొక కాలంలో వున్న బైబిల్ పాత్రలను మన ప్రస్తుత పరిస్థితిని గుర్తించబోవుచున్నాము,

20. ఇప్పుడు, మనమెలా వున్నామో చూచుకోవాలంటే అద్దంలో చూచు కొంటాం, ఒకసారి నేను విస్న ఒక చిన్నకథను ఇది గుర్తుకి తెస్తున్నది. నా సొంత ఊరు, కొండ ప్రాంతమగు కెంటకీలో వున్న ఒక కుటుంబంను గూర్చినది.

21. మంచిది, మా బామ్మ నూటపదేళ్ళు బ్రతికింది. అయినా ఒక్క వాహనాన్ని కూడా చూడలేదు, మరియు, ఆ పాత మెట్టదారి గుండా మేమున్న చోటుకి చేరాలంటే నాలుగు మైళ్ళు వెళ్ళాలి, ఇంచుమించు ఎనిమిది గంటలు పడుతుంది. వాగు దాటడానికి మొద్దులను మరటువంటి వాటిని వేసే వాళ్ళం. ఆమె అంత వృద్ధురాలైనప్పటికి ఒక రైలును కూడా చూడలేదు. కొన్నేళ్ళ క్రితం ఆమె చనిపోయింది, నూట పదేళ్ళు బ్రతికిన ఆమె అధ్యక్షుడగు లింకన్ యొక్క హత్యను గుర్తు చేసుకుంది.

22. నాకు తెలిసినంతమట్టుకు ఆమె తన జీవితకాలమంతటిలో మూడు లేక నాలుగు చెప్పుల జతలు కూడా వేసికోలేదు. నీటిఊట నొద్దకు పోయే ఆ పాత దారిలోనున్న గుర్తులు (పాదముల యొక్క జాడలు) నాకు జ్ఞాపకమే. ఆమె ప్రొద్దుపొడవక ముందే ఇత్తడి కట్లు వేసిన ఒక పెద్ద దేవదారు చెక్క బకెట్తో అక్కడికెళ్ళి నీళ్లు పట్టుకొని, వంట చేయడానికి మరలా క్రిందికి వస్తుండేది. ఆమె యొక్క కాళ్ళపై పెద్ద పెద్ద పగుల్లు ఏర్పడి వాటిగుండా, రక్తము కారుతూ ఉండేది, ఆమె పొయ్యిముందు అలానే కాళ్ళు చాపుకొని కూర్చొనేది.

23 ఆమె చనిపోయేటప్పుడు, ఆమె నాచుట్టూ తన చేతులను వేసింది, నేనామెను నా చేతులతో ఇలా పట్టుకొని ఆమె కోసం ప్రార్ధన చేస్తూ ఏడ్చాను. ఆమె చెప్పిన ఆఖరి మాటలను నేను విన్నాను, ఆమె, "దేవా, ఈ చిన్నఆత్మను ఇప్పటకి మరి ఎప్పటికి దీవించండ"ని అన్నది. నేనప్పుడు చిన్నవానిగా వున్నాను. క్రీస్తుని ఆమె రక్షకునిగా ఆమె ఎరిగినది, భౌతిక సంబంధమగు వస్తువులు వారికెక్కువుగా లేవు.

24. కావున, ఈ కథ నుండి ఇది వస్తున్నది, అదేమనగా ఈ ప్రజలు చూసుకొనే ఒక అద్దాన్ని కూడా కొనే స్థోమత లేనివారు. వారికొక అద్దం కూడా లేదు, నాన్న గడ్డం గీసుకోవడానికి చిన్న అద్దంముక్కను బయట చెట్టుకి తగిలించాడు. వారికొక చిన్న పిల్లవాడున్నాడు. ఆ అద్దం ముక్కలో తన్ను చూసుకోవడానికి ఆ పిల్లవాడు అక్కడ పైకి ఎక్కలేకపోయేవాడు. సరే, ఆ పిల్లవాడు పట్టణంలో వున్న తన చిన్నమ్మల్లో ఒకామెను చూడటానికి ఆమె ఇంటికి వెళ్ళెను. ఆమె పెళ్లి చేసుకొని ఇండియానాలో కాపురముంటుండెను. అక్కడ వారికొక ఇల్లు వుంది.

25. పాతకాలపు ఇళ్ళలో, వారికి తలుపుమీద పైనుండి క్రిందిదాకా వుండే పెద్ద అద్దము వుంటుంది. కొన్నిసార్లు, వాడు పడక గదులకు వెళ్తుండేవాడు. నిలువటద్దం వున్న పాత తలుపులు మీలో ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలీదు.
26. ఆ చిన్నపిల్లవాడు, తన చిన్నమ్మ ఇంటికి వచ్చి, అందరి బాలురువలే అటు ఇటు చుట్టూర పరిగెత్తుతుండెను, అందరు ఆ చిన్నవాడిని గమనిస్తున్నారు. మరియు వాడు మెట్టులెక్కడం ఆరంభించాడు. వాడలా చేస్తు, మెట్ల పైభాగానికి వెళ్లేసరికి, మరొక చిన్నపిల్లవాడు తన దగ్గరికి రావడాన్ని చూసాడు. ఆగి, అ చిన్నవాడిని చూసాడు. వానివైపు చెయ్యి ఊపాడు. అద్దంలో కనబడిన వాడు కూడా తిరిగి చెయ్యి ఊపాడు. ఆ చిన్నవాడు తదేకంగా గమనిస్తు దగ్గరకు వెళ్లాడు. మొదటిగా తన చెయ్యి చూపాడు. చుట్టూ చూసాడు. వాడు ఇదివరకు ఎన్నడు అద్దాన్ని చూడలేదు గనుక వాడి తల్లిదండ్రులు దానిని గమనించుచుండెను. అద్దములో కనబడేవాడిని "నేనే" అని అన్నాడు.

27. కాబట్టి నేడు, మనం బైబిలులో చూచి, "అది నేనే" అని అనకపోవడం నాకు ఆశ్చర్యంగా వుంది. బైబిల్లో ఏ పాత్రవలె మనమున్నామో ఆలోచించాలి. దీనినే ఒక చిన్న పాఠ్యాంశముగా తీసుకొని, కొద్దిసేపు ధ్యానిద్దాం మరియు దేవుని వాక్యములోకి చూడబోతుండగా, ఇతరులను మనకు మాదిరిగా ఇచ్చినందున, మనలను మనము గుర్తించుకొందాము. ఇప్పుడు, గమనించండి, దేవుడెన్నడు తన మనిషిని తీసుకుంటాడే గాని అతని ఆత్మను కాదు. సాతాను తన మనిషిని తీసుకుంటాడే గాని అతని ఆత్మస్తు కాదు. కాబట్టి, ఇప్పుడున్న మన ప్రస్తుత పరిస్థితిని తీసికొని బైబిలులోని పాత్రలతో గుర్తించగలమో లేదో చూద్దాం. ఇప్పుడు, బైబిలు ఈవిధంగా చెప్పుచున్నది, "గతంలో జరిగినవన్నియు మనకు దుష్టాంతములుగా వున్నవి" వారే మనకు మాదిరి.

28. మనమేమైయుంటిమో మరి ఆ రూపాన్నే మన గుణలక్షణం మలుస్తుంది. అదే మనలో వున్న మన జీవము యొక్క గుణలక్షణం.

29. ఇప్పుడు, ఒక చిన్న జీవకణాన్ని తీసుకోండి. అదొక పక్షియొక్క జీవకణమైతే, ఒక పక్షినే అది ఉత్పత్తి చేస్తుంది. మరది గోధుమదైతే- గోధుమనే ఉత్పత్తి చేస్తుంది. ఒక మొక్కజొన్న కణము మొక్కజొన్ననే ఉత్పత్తి చేస్తుంది. చూడండి, దానిలో వున్న జీవమే దాని గుణాలక్షణాన్ని మలుస్తుంది.

30. మరదేరీతిగా క్యాన్సరు యొక్క కణము చూడండి. ఒక క్యాన్సరు కణము క్యాన్సరుని మలుస్తుంది. అది చెడు జీవమై వుంది. కణితి కణం కణితిని మలుస్తుంది.

31. చూసారా, మన లోపల ఏమున్నదో అదే మన గుణాన్ని మలుస్తుంది, మరియు మన లోపల ఏమున్నదో దానిని మాత్రమే మన పైరూపము వ్యక్తపరుస్తుంది. మనమేమిటో, మనమెలా నడుస్తున్నామో, మనం చెప్పాల్సిన పన్లేదు, మన జీవితమే మన మాటలకంటే బిగ్గరగా చెబుతుంది.

మనం ఒకవేళ, "నేను దేవునియందు విశ్వాసిని" అని చెప్పవచ్చు.

మరప్పుడు నేనడుగుతాను, "అవునా, మరి నీవు పూర్తి బైబిల్ని నమ్ముతావా?"

32. "సరే, నాకు తెలియదు" అప్పుడు, చూడండి, నీ పెదవులే... నీ జీవితమే నీ మాటలకంటే బిగ్గరగా మాట్లాడుతుంది.
33. "నేను క్రైస్తవుడిని, దీనిని చేయుటను నమ్మను.. మరి దేవుడు చెప్పినదంతా సత్యమని నమ్ముతాను" అని నీవు చెప్పి. అంతట ఏదేదో జీవితాన్ని జీవిస్తే? చూడండి, నీ సాక్ష్యమును నీవు చెప్పుదానికంటే బిగ్గరగా నీ జీవితం చెబుతుంది.

34. మరి మీకు తెలుసా, దేవుని సంఘానికి వున్న అతి గొప్ప ఆటంకమదేనని. దొంగసార కాచేవారు, జూదమాడేవారు - వారంతా ఎక్కడికి వెళ్తారో మనకు తెలుసు, వారికి కూడా తెలుసు, కాని క్రైస్తవుడనని చెప్పుకునే వ్యక్తి, క్రైస్తవురాలనని చెప్పుకునే ఒక స్త్రీ. భిన్నమైన వేరొక జీవితం జీవిస్తే, బయట లోకానికి అదే అతిగొప్ప అడ్డుబండగా వుండును. క్రైస్తవునిగా వుండాల్సిన వ్యక్తి, అలా వుండకుండా వేరొక జీవితాన్ని జీవించువాడిగా వుంటే, దానికంటే ఘోరమైనది ఈ లోకంలో మరేది లేదండి. అబద్దమాడటం, దొంగిలిడటం, మోసగించడం, మొదలైన చేయకూడని కార్యాల్ని చేస్తుంటే, అది వాని సాక్షానికే అపకీర్తి. మనలో జీవమే మన గుణమును మలుస్తుందీ.

35. "నశించిన దానిని రక్షించడానికి యేసు వచ్చాడని" మనం చెప్పవచ్చు. ఆయన చేసింది అదే, నశించిన వీరిని రక్షించుటకు ఏదో వుండవలసి వుంది. కాబట్టి, ఈ నశించిన దానికంటే భిన్నమైన గుణాన్ని అది కలిగి వుండవలసి వుంది. కాబట్టి, మనం చూచినప్పుడు, దేవుడు తన సృష్టిని చూచినప్పుడు, ఆయన చేసిన దీనిని అనగా ఈ భూమి యొక్క గుణలక్షణాలను; ప్రేమించే ఆయన గుణం. తనకు తానుగానే, ఈ లోక రక్షకునిగా వుండడానికి యేసుక్రీస్తు అనే వ్యక్తిలోకి మలచబడెను. ఆయన... మరణమునకు వెల చెల్లించి మనల్ని విమోచించుటకే ఆయన దీనిని చేసాడు. ఇది నిశ్చయంగా యోహాను 3:16ను నెరవేర్చింది. చూశారా, "దేవుడు" తప్ప మరెవ్వరు దానిని చేయలేరు. యేసు కాక వేరొకరు చేయజాలరు. స్వయంగా దేవుడే తప్ప మరి ఏ ఒక్క పాత్ర కూడా యేసుక్రీస్తులాంటి వ్యక్తిని ఉత్పత్తి చేయలేదు.

36. పరలోకంలో వున్నదేది దాన్ని చేయలేదు. మీకు తెలుసా, యోహాను ఆ గ్రంథాన్ని, బైబిల్ని చూసాడు. ఆ గ్రంధాన్ని, ఆ విమోచనా గ్రంధాన్ని తీసికొనుటకు భూమిపై ఎవ్వరికి యోగ్యత లేదని మరియు పరలోకంలో ఎవ్వరికి యోగ్యత లేదని యోహాను చూసాడు. ఆ గ్రంధాన్ని తీసికొనుటకు, ముద్రలను విప్పుటకైనా లేదా కనీసం చూచుటకైనా, భూమిక్రిందను లేదా ఎక్కడైననూ, ఎవరికి యోగ్యత లేకుండెను. మరంతట అతడు ఏడ్చాడు. ఎందుకనగా అది విమోచనా గ్రంధముగా వుంది. తన పేరు అందులో వుంది. విమోచించుటకు ఎవ్వరికి యోగ్యత లేదు.

37. అప్పుడు పెద్దలలో ఒకరు, “భయపడకుము, ఎందుకనగా, యూదా గోత్రపు సింహము జయించి వున్నాడు మరియు ఆయన యోగ్యుడు" అని చెప్పెను.

38. సింహాన్ని చూచుటకు యోహాను తిరగ్గా గొర్రెపిల్లను అక్కడ చూసాడు. మరియు అది వధింపబడిన గొర్రెపిల్లగా వుండెను. అది రక్తసిక్తమైన గొర్రెపిల్ల. దాని ఒంటినిండా రక్తమే వుండెనని అతడు చెప్పాడు, ఎందుకంటే, “అది వధింపబడిన గొర్రెపిల్ల" మరియు వధింపబడిన గొర్రెపిల్ల ఖచ్చితంగా రక్తసిక్తమై వుంటుంది. “మరియు జగత్తు పునాది
వేయబడకమునుపే అది వధింపబడెను. ఆయన వచ్చి గ్రంధమును తీసికొనెను." దీనిని చేయుటకు ఇంకెవరునూ లేరు.

39. ఎందుకంటే, మరులు తీగె (పల్లేరు మొక్క) వంటి ఏదైన మొక్కను భూమిలో నాటితే... అర్కాన్సాస్ వారికి మరులు తీగె అంటే ఏమిటో తెలియును. మరియు దానిని భూమిలో వుంచితే మొక్కజొన్న పంటను దాని నుండి కోయలేవు. లేదు, నీవు చేయలేవు. మరులు తీగెతో ఉమెత్త మొక్కని ఫలదీకరణ చేస్తే, నీకు ఏమీ రాదు, చూసారా? మరక్కడ ఏ గుణము లేదు, కాని ఉన్న గుణాన్నే అది ఉత్పత్తి చేస్తుంది, చెడు నుండి చెడు.

40. కాబట్టి, యేసుక్రీస్తు లాంటి గుణమును ఉత్పత్తి చేయడానికి, చెడుకానిదేదో అది అవసరమై వున్నది. మరియు దేవుడు తన సృష్టిని చూస్తున్నాడు. మరియు ఆయన యొక్క ప్రేమించు గుణము, ఆయన స్వరూపములో ఆయన మహిమ కోసం చేయబడిన వారి తప్పిపోయిన స్థితిని చూస్తుండెను. మరియు ఆయన ప్రేమయే యేసుక్రీస్తుని మనకు అందించెను. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను” అది, తప్పిపోయిన వారిని విమోచించడానికి, స్వయంగా దేవుడే శరీరరూపంలో వ్యక్తపరచుకుంటూ వున్నాడు, వేరొక వ్యక్తిగా కాదు, దేవుడుభూమిని చూచినప్పుడు, అది చేసినందుకు సంతాపపడ్డాడు. అదెంతో విచారకరమైనదనుటలో ఆశ్చర్యం లేదు.

41. ఒకసారి, నా కుమార్తెను వెంటపెట్టుకొని సిన్సినాటికి వెళ్ళాము. అక్కడ జంతుశాలకి వెళ్ళి జంతువులను చూస్తున్నాము. బోనులో బంధించబడిన తోడేల్లు మరియు పులులు యొక్క గొప్ప శబ్దాలను విన్నాము. నేనక్కడికి నడుచుకుంటూ వెళ్లాను. అక్కడ ఒక పెద్ద ఎత్తైన పంజరాన్ని చూసాను. ఈ పైకప్పు అంత పెద్ద పరిమాణంలో అది వుండొచ్చును. మరియు వారు అప్పుడే ఒక పక్షిరాజుని తీసుకొని వచ్చారు. కొద్దివారాల క్రితమే దానిని తెచ్చి బంధించారు. పాపం ఆ పక్షిరాజు నిమిత్తం నేనెంతో విచారించాను. అదొక పెద్ద పక్షి, మనిషి ఏదేదో చేసి, దాన్ని ఉచ్చులో పడవేసి, పంజరములో బంధించాడు. "

42. మరి ఆ పెద్ద పక్షి తలనుండి, ఆ గొప్ప తెల్లని తలనుండి రక్తం కారుతూ వుంది. అది తన రెక్కలతో ఎంతగానో కొట్టుకొంటు వుంది. పాపం ఆ పక్షి పడుకొని, తన అలసిపోయిన కళ్ళతో వుండెను. అది లేచి పంజరము యొక్క మరొక ప్రక్కను నడుచుకుంటూ వెళ్లి ఆకాశముపైవు చూస్తు వున్నది. అక్కడి నుండే అది వచ్చింది.

43. అది ఆకాశపు పక్షి. దానిని ఏదీ వెంబడించలేదు. ఒకవేళ దాన్ని వెంబడిస్తే గ్రద్ద ఓడిపోతుంది, ఏ గ్రద్ద ఆ పక్షిరాజును వెంబడించలేదు. అదెంతో ఎత్తుకు వెళ్తుంది. దాని ఎత్తులో దాని కళ్ళు సమము, అక్కడ వుండి కూడా అదెంతో తేటగా చూడగలదు. నీవు చేసేదాన్ని చూడలేకపోతే ఎంతెత్తుకు వెళ్ళిన ఏమి లాభం.

44. అందుకే, జరగకముందే కార్యాలను చూచే ప్రవక్తలను దేవుడు పక్షిరాజులతో పోల్చాడు.

45. మరియు అది రక్తం కారుతూ వుండటం గమనించాను. అది దాని వీపు మీద
పడుకొని పైకి చూస్తూ వుంది. అది అక్కడికి చెందినదే, కాని మానవుడు దానిని పంజరములో వేసాడు. “ఎంత దయనీయమైన దృశ్యమ" ని నేను అనుకున్నాను. “అది కడ్డీలకు తన తలను కొట్టి మరలా నేలపైకి పడిపోయింది. అక్కడ అలసిపోయి పడుకొని చుట్టూ చూస్తూ వుంది, చూడండి ఆకాశంలో ఒకప్పుడు స్వేచ్ఛగా వున్న అది, ఇప్పుడు పంజరములో వుంది.

46. నేనక్కడ నిలబడి ఏడ్చాను, దానిని నాకు అమ్మితే బాగుండునని, అప్పుడు దానిని నేను విడిచిపెట్టేవాడినని అనుకొన్నాను, పంజరములో (బోనులో) బంధించుట చూచుట! ఆ కార్యము. ఆరుబయటను ప్రేమించే వ్యక్తిని (నేను ఆరుబయటను ప్రేమించేవాడిని) కంటతడి పెట్టిస్తే, అది ఎంతో దయనీయమైన దృశ్యము.

47. ఆయన గుణలక్షణమును ధరించుకొనుటకు దేవుని స్వరూపములో చేయబడిన స్త్రీ, పురుషులు వేరే కార్యాలలో బంధింపబడడం మరియు ఈ లోకపు ఉచ్చులో బంధింపబడుటనే కడు దయనీయమైన దృశ్యమును మీకు చెప్పనివ్వండి. వీధిలో నడుచుకుంటూ వస్తున్న అందమైన యవ్వనస్త్రీని చూడండి, ఆమెంతో చక్కని స్త్రీ, అయితే ఆమె తన యొక్క అందమైన వెంట్రుకలన్నిటిని కత్తిరించటాన్ని గూర్చి చక్కని రూపంగల ఆమె ముఖంకి ఎక్కువ రంగును పూసుకోటాన్ని గూర్చి నీవేమి చెప్పగలవు. ఆమె ముఖం అందహీనంగా తయారైనట్టుగా కనిపించును, కళ్ల క్రింద మచ్చలు పడి, ఆమె కళ్లు తోడేలువలె లేక బల్లివలె వుండును. నాలుగు గోడల మధ్య అనగా కనీసం పడకగదిలో కూడా ధరించకూడని వస్త్రాలను ఆమె ధరించి వీధుల్లో నడవటాన్ని చూచుట ఎంతో విచారకరం. అలాగే బయట వీధుల్లో నడుచు స్త్రీలను తమ సహోదరులుగా బావించవల్సిన దేవుని కుమారులు, ఈల వేస్తూ చెడ్డ కార్యాల కోసం ఆమెను తీసికెళ్ళటం దయనీయమైన దృశ్యం. మానవజాతిని సాతాను బంధించి వుండటాన్ని చూడటం.

48. దీనంతటికి పైగా వున్న ఒక గుణలక్షణం కాక మరేది దీనిని రక్షించలేదు. సర్వశక్తిగల దేవుని యొక్క స్వచ్ఛమైన ఊటనుండి వచ్చేది తప్ప ఏది లేదండి.

49. అలసిపోయిన బోధకునికి ఆ చక్కని స్త్రీ, అతనికి ఆమె ఒక నిజమైన చిన్న రాణిగా వుండి, అతడు అలసిపోయి వచ్చినప్పుడు అతన్ని ఆమె తన ఒడిలో చేర్చుకొని, అతని చుట్టూ చేతులు వేసి అతన్ని సేదతీరుస్తుంది, ఏది కూడా ఆ స్థానాన్ని తీసికొనలేదు. అది పురుషుని భాగమై యున్నది. నీవు అలసిపోయి వున్నప్పుడు, ఒక నిజమైన దయగలిగిన, మృదువైన, అర్ధం చేసుకోగల భార్య చేతి స్పర్శ తప్ప ఏదీ నిన్ను నిమ్మల పరచలేదు, పురుషునికి అది తెలుసు.

50. మరియు ఆమెను ఆవిధంగా చూచినప్పుడు, హాలీవుడ్ వేసిన పంజరములో ఆమె చిక్కుకొన్నది. చాలాసార్లు ఆ స్త్రీలు క్రైస్తవులమని చెప్పుకొనుచూ, గాయక బృందములో పాడుచూ తమకి కనబడని ఆత్మలో బంధింపబడిరి. నీవు దానిని వారికి ఎత్తి చూపిన ఏం లాభం లేదు, ఎందుకంటే అదింకా ఇంకా పతనమగుచున్నది. చూసారా? అక్కడ వారు వీధిలో నడిచే నవీన యెజెబేలుగా వున్నారు. మరి ఆమె ఇలా అనును “అర్ధం
చేసికొనుటకు నేను ఇచ్చెదను, నేను దీనికి చెందియున్నాను... నేను" చూచారా, ఇంకా అది అనగా ఆమె దేనికి చెందియున్నదో అది ఆమెను జీవధాత యొక్క సంపదకు వేరుచేసెను. ఒక పురుషునికి ప్రియరాణిగా వుండుటకు పుట్టిన స్త్రీ లేదా దేవుని కుమారునిగా వుండుటకు పుట్టిన పురుషుడు, వీరికి ఏమి జరిగిందో ఆలోచిస్తే, ఓ ఎంతో ఘోరమైన కార్యముగా వుండును.

51. అంతట, చూడండి, దేవుడు దిగివచ్చెను. దేవుని గుణముగా, ఆయన ప్రతిబింబముగా క్రీస్తు వున్నాడు. ఆయన అవతారమూర్తి, ఆయన దేవుడు. గమనించండి, దేవుడు సశరీరుడిగా కనబడెను.

52. “ఆదియందు దేవుడుండెను" అప్పుడింకా ఆయన దేవునిగా కూడా లేడండి. లేదండి. దేవుడనగా “పూజార్హుడు". ఆయన కేవలం "నిత్యజీవి"గా వుండెను. ఆయనలో గుణలక్షణములుండెను. మరవి తలంపులుగా వుండెను. ఆ తలంపులు వాక్యముగా వ్యక్తపరచబడెను. మరియు వాక్యం ప్రత్యక్షపరచబడెను.

53. అది ఏమిటి? అదంతా దేవుడే, తాకడానికి వీలుగా మారుచున్నాడు నీవు దేవునిలో భాగమైతివి. జగత్తుపునాది వేయబడకమునుపే గొర్రెపిల్ల జీవగ్రంథంలో వుంచిన వారిని విమోచించుటకు యేసు వచ్చెను. అది దేవుని తలంపులలో వుండెను. దానినే ఆయన విమోచించునుటకు వచ్చెను. మరి వారిని, వారిని అది సంధించినప్పుడు వారు దానిని చూచెదరు. కారణం జీవం వారిలో వుండెను.

54. అయితే జీవం వారిలో లేనట్టైతే, వారేమి చేయగలరు? చూసారా? వారు దానిని (వాక్యం) చూడలేరు. వారు ఎన్నటికీ చూడలేరు. చూసారా?

55. మరియు ఆ సమస్త కార్యము. యేసు చెప్పినట్లు, "ఆ దినమున నేను నా తండ్రియందును, తండ్రి నాయందును నేను మీయందును, మరియు మీరు నా యందును వున్నామని తెలుసుకొందురు”. అదంతా దేవుడే, వస్తురూపం దాల్చుచుండెను ఒక భర్త మరియు భార్య ఏకమవుచున్నట్లు, దేవుడు ఆయన సంఘము ఏకమగుచున్నది.

56. ఇప్పుడు, ఈ పడిపోయిన స్త్రీని విమోచించుటకు ఏదో ఒకటి అవసరమై వుండెను. ఈమె పడిపోయిన హవ్వను సూచించుచున్నది. “ఆదాము మోసపోలేదు, కాని స్త్రీ మోసపరచబడి అతిక్రమములో పడెను”. ఆదాముకు తెలుసు తాను చేసేది తప్పు అని, కాని ఆమెకి తెలీదు. అందుచేతనే...

57. మీ భావాలను కించపర్చటలేదు, కాని మీకు తెలుసు నేనేప్పుడు దానికొరకే నిలబడితినని, స్త్రీ బోధకులతో నేను అంగీకరించను, ఎందుకంటే అది అలా వుండాల్సింది కాదు. చూడండి, ఆమె బలహీనమైన పాత్ర. వాడు వాక్యాన్ని వల్లిస్తూ, దానిని కొద్దిగా మార్చినందున ఈ స్త్రీ మోసపోయెనని మనం చూసాం, అదే దీనంతటికి కారణమయ్యింది. అందుకే పౌలు, "ఆమె మౌనముగా వుండవలసినదే కాని సంఘము లో మాట్లాడకూడదు” అని చెప్పెను. ఇప్పుడు గమనించండి.

58. కాని, చూడండి, ఉన్నవన్నీ, బైబిలు అంతటిలో అవన్నీ ఒక మాదిరిని ప్రదర్శిస్తూ
వుండెను. దేవుడు తన విమోచింపబడిన భార్యతో, జగత్తుపునాది వేయబడక మునుపు ఆయన మనస్సులో ఉన్న ఒక వధువుతో కలిసి వస్తున్నాడు. అది దేవుని యొక్క గుణలక్షణములు ప్రదర్శించుట అయియున్నది. మరిప్పుడు ఈ స్త్రీని విమోచించ గలి ఒక పాత్రను చేయాలంటే, అది ఆమె కంటే ఏదో ఒకటి గొప్పగా వుండాలి. ఆమెను విమోచించాలంటే... మీరు ఎప్పుడైనా గమనించారా...

59. ఇప్పుడు ఆర్మేనియన్ సహోదరులైన కొందరు, చట్టబద్ద సిద్ధాంతం కలిగిన వారు బహుశా నాతో ఏకీభవించకపోవచ్చు. కొద్దిసేపు నన్ను క్షమించండి, నన్ను దీనిని వివరించనీయండి. ఆయన విమోచకుడైతే... మిమ్మల్ని బాధపెట్టడానికి దీనిని చెప్పడం లేదు. విభిన్నంగా వుండటానికి చెప్పడం లేదు. నేను సిద్ధాంతాన్ని బోధించను, కాని మిమ్మల్ని ఒకటి అడగనివ్వండి.

60. ఆయన విమోచకుడైతే, ఆయన వచ్చి... “పడిపోయిన దానిని లేపును" విమోచన అనగా ఆదిలో అది ఎక్కడైతే వుందో దానిని తిరిగి అక్కడికి తేవడమే. ఆదిలో ఆయన తలంపుల్లో ఎవరైతే వుండిరో వారు తప్ప ఇంకెవరూ లేవనెత్తబడరు, క్రైస్తవులమని చెప్పుకొనే ఈ ఫిరంగి మేతను విమోచించుటకు ఆయన రాలేదు గాని, ఆదిలో దేవుని తలంపులలో వున్న వారినే విమోచించుటకు ఆయన వచ్చెను. ఈ మిగతాదంతా, అసలైన రూపమును చూపించడానికి అలంకారమై వున్నది. చూసారా? అదొక తోటగా, పూదోటగా వున్నది. దానిపాత్రను అది పోషిస్తుంది. నీవు చూడాలను కొంటున్నరూపం క్రీస్తురూపం, దేవుడు దానిని మానవరూపంలో భూమ్మీద ప్రదర్శించెను. ఆమేన్! నీవు చూడగోరే రూపమదే. మిగతావన్నీ అలంకరణే. చూసారా?

61. ఇప్పుడు ఈ ప్రేమగల, ఘనమైన గుణలక్షణాన్ని క్రీస్తు అనబడిన మనిషిలో దేవుడు ప్రతిబంబించాడు. కేవలం ఆయన మాత్రమే దీన్నిచేయగలడు. దేవుడు తప్ప పరలోకములో మరి ఏ పాత్ర కూడా దీనిని చేయలేదు. ఆయనది పాపరహిత స్వభావం, ఆయన వాక్యమై వున్నాడు, దేవుని యొక్క పాపంలేని స్వభావమై యున్నాడు. ఆయన వాక్య వ్యక్తీకరణగా వున్నాడు. అది ఆదిలో వున్న వాక్యమే.

62. మరి మీరు గొర్రెపిల్ల జీవగ్రంథములో వుండినట్టైతే, దేవుని తలంపులలో ఉండి మీరు దేవుని వ్యక్తీకరణై యున్నారు. ఒక అణువైనా లేక మరేదైనా లేకమునుపే ఆయన నిన్ను, నీ వాంఛను చూసాడు. మరియు వాక్యమైన ఆయన తలంపువు నీవే, మరియు నీవిప్పుడు వుండినట్టుగా వ్యక్తపరచబడితివి. ఆమేన్. అది నేడు నీలో వుండిన దేవుడు క్రీస్తుగా ప్రతిబింబిస్తున్నాడు. నా భావము మీకు అర్థమయ్యిందా?

63. ఇప్పుడది దేనికి అడ్డు తగలదని అనుకొంటున్నాను, చూసారా; మీకు బోధింపబడిన దానికి వ్యతిరేఖంగా దేనిని చెప్పడం నాకిష్టం లేదు.

64. కానిక్కడ నేను చెప్పబోవుచున్న కార్యం అర్థం చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. ఒక ప్రతిబంబం, నీవు గుర్తించబడాలి. ఆదిలో నీవు దేవుని తలంపులలో వున్నట్లయితే, మరిక్కడ ఈ భూమిపైన ఆయన ప్రతిబింబముగా వున్నట్లయితే, ఆయన ఏవిధంగానైతే
పరలోక సంబంధమైన వాటికి సాక్ష్యమిచ్చెనో, అదేవిధంగా నీవును పరలోకసంబంధమైన వాటికి సాక్ష్యమిస్తావు. సమాధినుండి తిరిగి లేచినప్పుడు ఆయనకు ఒక శరీరం ఇవ్వబడినట్లే, మనం లేచినప్పుడు కూడా, ఆయన మహిమ శరీరంవలె మనకును ఒక శరీరము ఇవ్వబడును.

65. పునరుత్థానమనేది నిశ్చయం. అదొక హామి. దానియొక్క సంచకరువును మనమిప్పుడు కలిగియున్నాము, దేవునిచేత విమోచించబడిన వానిగా మనల్ని గుర్తించుటకు పరిశు ద్ధాత్మ మనలోనికి వచ్చెను. ఆమేన్! నీవు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ప్రయాణం ముగిసేటంత వరకూ నీవు ముద్రింపబడి వున్నావు. నీవు పట్టుకొనే ఆనవాలు అదే, అదే నీ రుసుము (వెల) చెల్లించబడినదని చూపిస్తుంది. నీవొక విమోచించబడిన పాత్రవి. నీతో సాతానుకు ఏ పని లేదు. ఏదేమైనా "నా స్వస్థతకు వెల చెల్లింబడింది” అని కేవలం నీ ఆనవాలును ఎత్తి వాడికి చూపించుము.

66. బస్సులో కాని, విమానంలో కాని ప్రయాణం చేయుటకు ఒక ఆనవాలును వాడతారు. నీ టికెట్టే నీ ఆనవాలు (గురుతు). చూసారా?

67. నీ ఆనవాలును తీసుకో, నీవు విమోచించబడ్డావు; పరిశుద్దాత్మ, అదే ఆశీర్వాదం. మరి సాతాను నీ మీదికి ఏది వేసినా, కేవలం దాన్నే చూపించు. అదే నీ గుర్తింపు. ఆమేన్. క్రీస్తు పునరుత్థానములో నీవు గుర్తించబడ్డావు. నీవు చనిపోయినప్పుడు ఆయన మరణములో గుర్తించబడ్డావు; ఆయన పునరుత్థానములో గుర్తించబడ్డావు. మరి దానిద్వారా, జగత్తుపునాది వేయబడక మునుపే నీవు ఆయనతో వున్నావని అది నిన్ను గుర్తిస్తుంది. ఎందుకనగా, నీవు విమోచించబడ్డావు. అనగా “తిరిగి తెచ్చుట” అయియున్నది. "తండ్రి నాకు అనుగ్రహించిన వారంతా నా యొద్దకు వచ్చెదరు, మరియు తండ్రి ఇవ్వనిదే ఎవరును నా యొద్దకు రాలేరు చూడండి.

68. ఇప్పుడు గమనించండి, ఆయన పాపరహితముగా... పాపి స్థానమును తీసికొనుటకు పరిహారమై యుండెను. పాపులను విమోచించగలుగుటకు ఆయన పాపము లేనివాడిగా వుండెను. దేవుడు ఆయనలో వ్యక్తపరచబడెను మరియు ఆయనలో తన్నుతాను చక్కగా గుర్తించబడెను. ఇప్పుడు గమనించండి.

69. “సహోదరుడా బ్రెన్హామ్, దేవుడు తన్నుతాను గుర్తించుకొన్నాడా?" అని మీరు అడగొచ్చును. అవును ఆయన గుర్తించుకొన్నాడు.

70. ఇప్పుడు, "ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద యుండెన”ని యోహాను1 చెప్పెను. ఇప్పుడు, ఒక వాక్యం (మాట), వాక్యంగా వుండక మునుపు, ఒక తలంపుగా వుండవలెను, ఎందుకంటే, వాక్యము, వ్యక్తపరచబడిన తలంపుగా వున్నది, 'ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద యుండెను. ఆ వాక్యము దేవుడై యుండెను" చూడండి, “దేవుడై యుండెను మరియు వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను"

71. ఎలా గుర్తించబడెను? ఇప్పుడు హెబ్రీ4 చూడండి, “దేవుని వాక్యము వాడిగలదై
రెండంచుల గల ఖడ్గము కంటెను బలముగలదై, విభజించుచూ” వచ్చునని వెళ్ళునని, “రెండిటిని విభజించుచూ, తలంపులను, హృదయాలోచనలను వివేచించు నదియై వున్నది" మరి ఆయన దానిని (వాక్యము) చేసినప్పుడు, అలాగునే ప్రవక్తలు గుర్తించబడిరి, దేవుడు పలికి, సమస్యను దాని పర్యావసానంను చెప్పును. చూసారా? ప్రత్యక్షపరచబడిన ఈ గడియ వర్తమానమును అది గుర్తించుటై యున్నది.

72. ఆయన దేవుని వాక్యము యొక్క సర్వ సంపూర్ణతై యున్నాడు. ఎందుకంటే, దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించెను. ఆయన మానవరూపంలో వున్న దేవుడై యుండెను; మరిటువంటి ఒక పాత్రను వ్యక్తపరచుటకు దేవుడే దానిని చేయవలసి వచ్చెను. మరియు ఆదిలో, నీగూర్చి, నాగూర్చి, తలంపులను కలిగిన దేవుని ముందుజ్ఞానం చూచిన వీరిని విమోచించుటకు, ఆ ప్రియమైన ప్రాణమును ఆయనలో నుండి తీసివేయబడవలసి వచ్చెను. యేసు దానినే చేయుటకు వచ్చెను. ఆయన పరిపూర్ణమైన జీవం ఆ వ్యక్తిని విమోచించుటకు బలిగా అర్పించ బడవలసి వచ్చెను. అప్పుడు, ఆదిలో నీవు దేవునితో, ఆయన తలంపులలో వుండిన యెడల, ఆయన వాక్యము సర్వమై వుండగా, ఆయన వాక్యములో భాగముగా వుండి, ఎలా నీవు తృణీకరించగలవు. ఆమేన్. ఎటువంటి పొరపాటు వుండదు. "ఈ క్రియలు చేయునది నేను కాదు, నాలో నివసించుచున్న తండ్రే దీనిని చేయుచున్నాడు" అని ఆయన అన్నాడు.

73. ఇప్పుడు, నేడు దేవుని గురించి అర్ధం చేసుకొనుటలో ప్రజలు గొప్ప గందరగోళంలో పడి, దేవుడు ముగ్గురు వ్యక్తులనడం మనం చూస్తున్నాం, అయితే దేవుడు ముగ్గురు వ్యక్తులు కాదు గాని దేవుని యొక్క మూడు గుణలక్షణాలు లేదా దేవుని యొక్క మూడు కార్యాలయాలు అని మనం కనుగొన్నాము. మనపై వున్న దేవుడు, పరిశుద్ధాత్మగా అగ్నిస్తంభములో వుండెను, శరీరధారియై దేవుడు మన మధ్య నివసించెను, మనము తాకి స్పర్శించగలిగే విధంగా ఒక మానవుడయ్యెను, ఇప్పుడు సంఘములో వున్న దేవునిగా వుండెను, నీకు పైనున్న దేవుడు, నీకు తోడున్న దేవుడు, నీలోపలున్న దేవుడు. ఒక దేవుని యొక్క మూడు వేరువేరు కార్యాలయములు.

74. గమనించు, ఏ పొరపాటు లేదు. ఆయన యొక్క పాపరహిత స్వభావమే దేవుని వాక్యాన్ని వ్యక్తపరచింది. నీవు దేవునివాక్యాన్ని వ్యక్తపరిచే ఏకైక పద్ధతి ఏదనగా నీవు వాక్యాన్ని నమ్మి దానిపై క్రియచేయడమే, దేవునియొద్ద నుండి వచ్చే పాపరహితమ గు స్వభావాన్ని కలిగియుండటమే జగత్తుపునాది వేయబడక మునుపే నీవు ఆయనతో గుర్తించబడ్డావు, వాక్యము నీ ద్వారా వ్యక్తపరచబడుటకు ముందు, దానిని చేయుటకు ఒక పాపరహిత స్వభావము నీలో వుండాల్సి వుంది.

75. ఆయన పూర్తిగా వాక్యమై వుండెను. ఆయన ద్వారా దేవుని వాక్యము స్వేచ్ఛగా ప్రవహించెను, ఎంతగానంటే, ఆయన ఒక మాట పలికినా, సృష్టిజరిగేటంత, చూడండి, ఆయన ఎవరో అది చూపించింది. దేవుడు తప్ప మరి ఎవరు సృష్టించగలరు? చూశారా. దేవుడు మాత్రమే సృష్టికర్త. ఆయనెంతో లయబద్ధకముగా పని జరిగించు వాడు. ఆయన
మరియు ఆయన వాక్యం ఎంతో చక్కగా కలవగా, సృష్టి జరిగింది. ఆయన మరియు ఆయన వాక్యం ఏకమైయుండెను.

76. మరి ఏ స్వభావం దీనిని చేయలేదు. ఆయన తప్ప మరి ఏ స్వభావం చేయలేదు. ఏ పాత్ర (స్వబావం), ఆకాశాలలో ఏదియూ దానిని చేయలేదు. ఆయనే స్వభామునకు ఆరంభమై వున్నాడు. రక్షకుడు! ఒక దూత రక్షకునిగా పుట్టలేదు; దేవుని ఆరాధించుటకు ఒక జీవిగా సృష్టింపబడ్డాడు. రక్షకునిగా కాదు. కాని దేవునిలో రక్షకుడు వుండెను. ఒక సామాన్యుడు సామాన్యమైనస్త్రీ ద్వారా పుట్టి రక్షకుడు కాలేడు. ఎందుకంటే వాడి స్వభావము ప్రకృతి సంబంధమైనది. అయితే స్వయంగా దానిని దేవుడే చేయవలసి వచ్చెను! ఆమేన్. మీరు దానిని చూస్తున్నారని ఆశిస్తున్నాను. చూడండి, అటువంటి పాత్రను వెల్లడిపరచడానికి అలా వ్యక్తపరచబడెను. ఇతరులకు అదొక పడిపోయిన పాత్ర, ఎవరునూ రక్షించలేరు. అందుకొరకు దూతలు సృష్టింప బడలేదు. మానవుడే పడిపోయిన పాత్రగా ఉండెను. చూడండి, ఈ మనిషి ఎలాగు...

77. చూడండి, జగత్తుపునాది వేయబడక మునుపే వున్న తలంపులు, ఆయన ఎవరిని గూర్చి తలంచాడు, నేటి క్రైస్తవుని గూర్చియే. ఇప్పుడు, గుర్తుంచుకోండి, “మానవుడు పాపములో పుట్టి, అతిక్రమములలో రూపించబడి, అబద్దములాడుతూ ఈ లోకంలోనికి వచ్చెను. అది సరియేనా? (సంఘము ఆమేన్ చెప్పుచున్నది సంపా॥) వాడిలో అస్సలు ఏమీ లేదు. కాబట్టి మీరు చూడండి. వాడు లోకంలోకి వచ్చినప్పుడు దేవుని తలంపులలో వున్నట్లయితే, ఆయన గుణలక్షణమును ప్రదర్శించు టకు వచ్చివుండేవాడు (ఆదియందు దేవుని తలంపుల్లో). నన్ను వెంబడిస్తున్నారా? (ఆమేన్) అప్పుడు యేసు వచ్చి గుణలక్షణం ప్రదర్శించు నిమిత్తం అవరోధములన్నిటిని తొలిగించెను. ఆమేన్, అదంతే. ఆయనే వ్యక్తపరచబడిన దేవుని వాక్యము. ఇప్పుడు, మరేదియూ వెల్లడిచేయలేదు. పాత్రలన్ని (స్వభావాలన్ని) పతనమైనవే. అప్పుడు, చూసారా, ఆ పాత్రలను (స్వభావాల్ని) తిరిగి తెచ్చుటకు యేసు ఏమి చేసెను? లేదు, లేదు, వారంతా పాపంలో పుట్టి అతిక్రమములో రూపించబడ్డారు.

78. ఆయన విమోచకుడుగా వచ్చెను. దేనినైనా విమోచించడమంటే, "తిరిగి తీసికొని రావడం" ఆమేన్. తిరిగి తీసికొని రావడం! అది దేవుని తలంపుగా వున్నది. నీవు! ఆలోచించు! ఈ లోకంలో ఎవరూ నా స్థానాన్ని తీసికోలేరు. ఎవరూ నీ స్థానాన్ని తీసికోలేరు. నీవు ఇప్పుడు క్రైస్తవునిగా వుండి ఆత్మచేత నింపబడ్డావు. దేవుడు జగత్తుపునాది వేయబడక మునుపే ఆయన నిన్ను చూసాడు, నీకు వున్న ప్రతీ లక్షణము ఆయన ఎరిగియున్నాడు. మరియు యేసు నిన్ను తిరిగి తీసికొని వచ్చుటకు వచ్చాడు. అందుకే యేసు ఇక్కడకు వచ్చాడు. విమోచకుడు. ఆ మానవ శరీరము, నిన్ను తిరిగి తీసుకొని వచ్చుటకు, విమోచకుడిగా వుండుటకు మానవుడుగా వుండవలసి వుండెను. నీవెక్కడినుండి వచ్చావో తిరిగి అక్కడకు తీసికొని వెళ్ళుటకు నిన్ను విమోచించుటకు, ఆయన గుణలక్షణములను రక్షకుడుగా ప్రదర్శించవల్సెను.
79. నీవు నిత్యజీవాన్ని పొందినప్పుడు, ఒకే ఒక్క నిత్యజీవమున్నది. "జో" అనేది గ్రీకు పదము. అది సరేనా సహోదరుడా? (సహోదరుడు "అవున”ని చెప్పుచున్నాడు సంపా॥) జో. "దేవుని సొంత జీవం". కాబట్టి నీవు కుమారుడవై యుండి, ఆ జీవములో భాగమైతివి కనుక, నీలో వున్న జీవము ఎన్నటికీ ఆరంభం కాలేదు మరెప్పటికి అంతమవ్వదు. దానిగూర్చి ఆలోచించండి. అది అంతమవ్వదు. కారణం, నిత్యమైనదేది ఆరంభం కాదు, నీలో ఉన్న నీ జీవం, అది నిత్యజీవమైతే, ఎన్నడూ ఆరంభం కాలేదు. అది దేవుడే ఎందుకనగా నిత్యత్వములోనే నీవాయన తలంపుల్లో వున్నావు. మరిప్పుడు, ఆయను మహిమ కోసం అది మానవునిగా వ్యక్తపరచబడింది. యేసు, కుమారుడై వుండి దేవుని సర్వపరిపూత అయివుండి, రావలసి వచ్చెను. అలా, విమోచించవలసి వచ్చెను. దేవుని యొక్క పాపరహిత గుణము దానిని చేసెను. ఆయన వద్దకు రాబోవుచున్న ఈ ఇతర తలంపులను విమోచించుటకు. ఒక భార్యను చేసుకొనుటకు ఆయన చేసెను. నా భావము మీకు అర్థమైనదా? ఓ, అది ఒక మహిమాన్విత కథ! ఇప్పుడు దాని మీద ధ్యానింపవలసిన వారం... కాదు, అయినా, ముందుకు సాగుదాం. సరే.

80. గమనించండి, “సృష్టించెను" ఒక భవనములో గాలి వీచినరీతిగా లేదా సెలయేరులో నీరు పారినరీతిగా దేవుడు ఆయనలో ప్రవహించెను... ఆయన మరియు వాక్యము ఏకముగా వుండిరి. మరి ఏ పాత్ర కూడా దానిని చేయలేదు, ఎందుకంటే, శరీర సంబంధమైన కార్యము లేకుండా జన్మించినది ఆయన ఒక్కడే. మిగిలిన వారందరూ లైంగిక వాంఛతో శరీర సంబంధమైన కార్యముతో జన్మించారు. ఆయన లైంగిక వాంఛ లేకుండా పుట్టాడు. ఆయన కన్యక ద్వారా జన్మించాడు.

81. మనము గుర్తించబడినట్టే, దేవుడు కూడా తన్ను తాను గుర్తించు కొన్నాడు. ఆయన తన జాతిని తీసికొని ఆయన ఏమై వున్నాడో, దేవుడుగా తన జాతి (లక్షణాన్ని) తీసికొని, ఆయన గుడారాన్ని ఇక్కడకు చాచి మానవుడయ్యాడు. ఆయన తన కొరకు ఒక గుడారాన్ని నిర్మించుకున్నాడు. నివసించడానికి ఒక శరీరాన్ని, ఆ శరీరమే యేసు క్రీస్తుగా పిలువబడుతున్నది. దేవుడు క్రీస్తులో జీవించెను, చూడండి, మనలను రక్షించుటకు ఆయన మానవుడయ్యెను. మరియు మనలో ఆయన గుణమును మలచగలుగునట్లు, ఆయన మన రూపమును ధరించుకొనెను.

82. దేవునికి ప్రీతికరమైనదంతయూ ఆయన చేసాడు. మరియు ఆయన వాక్యముతో నిలిచియున్నాడు. అది ఆయన స్వభావముగా వున్నది. మననుండి ఆయన ఆశించేది కూడా అదే, మనం దేవుని వాక్యముతో నిలవాలని, మన స్థానాన్ని మనం గుర్తెరగాలని, మనమెక్కడ వున్నామో తెలుసుకోవాలని కోరుచున్నాడు. ఆయన వాక్యంతో నిలవండి, మరియు దానిగూర్చి ఆలోచన చేయండి. మన స్వభావమును ఆయన స్వభావంగా మలచబడుటకు మనం ఆహ్వానించబడ్డాము. మనమేమి చేసామో ఇప్పుడు దానిని మనం చూడబోతున్నాము. ఆయన ఆత్మచేత మన స్వభావాన్ని ఆయన స్వభావంగా మలుచుట. ఆయనను బట్టి మనమిప్పుడు దేవుని కుమారులై వున్నాము, ఆయన మనస్సు మనలో యుండుట ద్వారా, మన స్వభావాన్ని ఆయన స్వభావంగా ఆయన మనసుగా మలుచునట్లు,
"క్రీస్తు నందున్న ఈ మనస్సు మీరును కలిగియుండుడి" ఆ మనస్సు నీలో వుంటే, అప్పుడు, చూడండి.

83. దేవునికి ఇష్టమైనది మాత్రమే ఆయన చేసాడు. తానెవరో ఆయన ఎరిగి యున్నాడు. దేవుని కుమారునిగా వచ్చాడు. ఆ స్థానాన్ని తీసికోవాలని ఆయనకు తెలుసు. ఆయన స్వభావము (పాత్ర) ఆ రీతిగా వుండవలెను. పిమ్మట ఆయన ఆ స్థానాన్ని తీసికొని, మెస్సయ్యగా ఏమి చేయాలో ఎరిగినవాడై, ఆ కార్యముల కొరకు ఎప్పుడూ దేవుని యొద్ద కనిపెట్టుకొనెను. తండ్రి చూపించనిదే ఏది చేయలేదు.

84. ఇప్పుడు, సహోదరీ లేక సహోదరుడా, మీరు మీ స్థానాన్ని కనుగొనండి, మిమ్మల్ని బాధపెట్టడం నాకిష్టం లేదు, ఒక క్రైస్తవుడుగా నీవు నీ స్థానాన్ని కనుగొనుము. సిద్ధాంతం ఏమి చెప్పిందో కాదు సుమా. నశించే ఈ మందుపాతర మేతకు అది వున్నది. చూడండి. క్రైస్తవునిగా నీవు నీ స్థానాన్ని కనుగొనుము, ఎందుకంటే క్రీస్తు స్వభావంగా నీ స్వభావం మలచబడినది. ఆయన “జో (సొంత జీవం)" కలిగివున్నట్టే నీవు కూడా "జో (సొంత జీవం)” కలిగియున్నావు. మరి, స్త్రీ తన వెంట్రుకలను కత్తరించుకొనకూడదని బైబిలు చెప్తుంటే నీవెలా దాన్ని చేయగలవు? "పురుషుడే ఇంటిని పరిపాలించువాడ"ని బైబిలు చెబుతుంటే స్త్రీలు, ఏలా వుండగలరు? దేవుని కుమారులైన పురుషులగు మీతో వున్న సమస్య ఏంటి? చూసారా? చూడండి. మీరు మీ స్థానాన్ని కనుగొనలేదు. చూసారా? గమనించండి. మీరు వచ్చి ఆయన స్వభావాన్ని తీసుకొనుటకు ఆహ్వానించబడ్డారు. నీవు నీయందు ఆయన స్వభావాన్ని కలిగియుంటే, ఆయన మనస్సులాగే అది నిన్ను మలుస్తుంది. ఆయన ఏమేమి చేయాలని తండ్రి నిర్ణయించెనో, వాటిని ఎల్లప్పుడూ చేసేది ఆయన మనస్సు.

85. "లేఖనములను పరిశోధించండి. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” ఆయన అన్నాడు. మరొక మాటలో, "నేనేదైతే చేయాలని లేఖనము చెప్పియున్నదో, దానిని నేను చేయని యెడల, అది ఎక్కడ నేను చేయలేదో నాకు చూపించండి"

86. నేడు, దేవుడు ఈ వేదిక మీద నిలబడి "క్రైస్తవునిగా వుండుటకు అవసరమైనది ఏమిటి?" అని అడిగితే, అప్పుడు మనమంతా ఎక్కడ ఉంటాము? చూడండి, ఆ స్వభావము వ్యక్తపరచబడటం లేదు.

87. తండ్రి యొక్క వాక్యంతో నిలబడి వుండటమే ఆయన మనస్సు. వారి వారి మనస్సు... వారిలోవున్న మనస్సే మనలో వుండాలి. ఆయన మనస్సు మనలో వుంటే, ఆయన చేసినట్టుగానే మనం కూడా చేస్తాము. ఆయన స్వభావం మనలో వుంటే, ఆయన వున్నట్టే మనం కూడా వుంటాము. అది సరేనా? (సంఘము “ఆమేన్” చెప్పుచున్నది – సంపా॥). ప్రవక్తలందరూ దానిని కలిగివున్నారని మనకు తెలుసు. నోవహును చూడండి, అతడు తన దినాల్లో ఏమి చేసాడు, దానియేలు తన దినాల్లో, హెబ్రీ పిల్లలు అలాగే మిగతావారు తమ తమ దినాల్లో ఏమి చేసారు.

88. వాక్యమే మనలో దేవుని స్వభావాన్ని మలుస్తుంది. మరి ఆ స్వభావంతో దేన్ని
కలిపినా, మలచబడిన ఆ రూపం విరిగిపోతుంది. వాక్యంతో సిద్ధాంతాన్ని నీవు కలపలేవు. లోకాన్ని వాక్యంతో కలపలేవు. “నీవు దేవునికిని సిరికిని దాసునిగా వుండలేవ"ని యేసు చెప్పెను. మమ్మన్ అనే పదానికి "లోకం” అని అర్ధం. రెంటితో నీవుండలేవు, ఏదో ఒకదానితో మాత్రమే నీవు వుండగలవు. "నీవు లోకంను లోకంలో వున్నవాటిని ప్రేమించిన యెడల దేవుని ప్రేమ నీలో వుండదు" అది నిజమేనా? (సంఘము “ఆమేన్" చెప్పుచున్నది- సంపా) అప్పుడు చూడండి, నీవు దానిని కలపలేవు.

89. నీటిని నూనెను నీవు కలపలేవు, అవి కలవవు కూడా. పైకి క్రిందకు చిలికినా మరి ఇంకేం చేసినా అవి కలువవు (పొసగవు).

90. క్రీస్తులో వున్న మనస్సు నీలో వుండుటకు నీవు అనుమతిస్తే, తద్వారా నీవు దేవుని రూపంలోనికి మలచబడితే, నీ స్వభావము లోకముతో కలవదు. అదే (స్వభావమే) నియంత్రించు గోపురమును, దిశయై వున్నది,

91. ఇప్పుడు, దేవుని వాక్యమనే అద్దములో చూచి, బైబిలు పాత్రలలో ఏదో ఒక దానితో మన ప్రస్తుత పాత్రను గుర్తుంచుకుందాము. మరికొద్ది నిమిషాల్లో ముగించుకుందాము. మనలను మనము గుర్తించుకుందాము. ఆ చిన్న పిల్లవాడు చేసినట్లు, మీరు ఈ అద్దములో చూసుకొనవలెను. దీనిలోకి చూసుకొని, ఏదైనా ఒక బైబిలు పాత్రతో మనము ప్రతిబింబిస్తామో లేదో చూద్దాం. కొన్నిసార్లు వారు ఏమి చేసారో చూద్దాం మరియు మనం ఏమి చేస్తున్నామో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా చూడండి. క్రైస్తవునిగా మీ ప్రస్తుత స్వభావము చూడండి.

92. ఇప్పుడు నిన్ను నీవు తీర్పు తీర్చుకో. అందువలన, ఇంకెవరూ నిన్ను తీర్పు తీర్చరు, నీకు నీవే తీర్పు తీర్చుకో, చూడండి. ఎవూ నీకు తీర్పు తీర్చడం లేదు. నేను తీర్పు తీర్చట్లేదు. కాని, మనల్ని మనమే పరీక్షించుకుందాము. మనం బైబిలు పాత్రలను గూర్చి మాట్లాడబోవుచుండగా, వారిని ఎలా మనము ప్రతిబింబిస్తామో చూద్దాము, మరియు ఈ ప్రస్తుత కాలంలో నీ పాత్ర ఏమై ఉన్నదో చూద్దాము. ఇప్పుడు గమనించండి, వాక్యము ఒక పాత్రను సృష్టిస్తుంది. అది మనకు తెలుసు ఇప్పుడు మనం ఆయన అద్దంలోకి చూసి, బైబిలులో ఏదో ఒక వ్యక్తితో మనలను మనము గుర్తించుకుందాము.

93. నీవు నోవాహు దినములలో నివశించి, ఇప్పుడు నీవున్న పాత్రలో... మీకు అర్థమైతే "ఆమేన్" చెప్పండి. (సంఘం "ఆమేన్” చెప్పుచున్నది-సంపా) నీవు నోవాహు దినములలో నివశిస్తున్నటైతే, మరియు నీ ప్రస్తుత పాత్రలో, నీవెవరివైపు వుంటావు? జాగ్రత్తగా చూడు. నీ ప్రస్తుతపాత్రలో, ఇప్పుడు నీవేమై వున్నావో ఆలోచించు, ఆ గుంపులలో, ఏ గుంపుతో నిన్ను నీవు గుర్తించుకుంటావు, నీ ప్రస్తుత పాత్ర నోవాహు దినములలో వున్నట్లయితే, ప్రవక్త మరియు రుజువుపరచబడిన దేవుని వాక్యముతో వుండి, అల్పసంఖ్యతో, చిన్న గుంపుతో నిలబడి వుండేవాడివా లేకపోతే. ఆ దినమున పేరు ప్రఖ్యాతి పొందిన జనముతో వుండేవాడివా? ఏ పాత్ర?

94. అక్కడ ఆ సంఘాలకు చెందియుండి మరటువంటి వాటికి చెందియుండి (ప్రవక్తను
ఎగతాళి చేసేవాడివా? అటువంటి ఒక గుంపుతో కలిసి నడుచుకొంటు వెళ్ళి ఇలా చెప్పేవాడివా? "మంచిది, ఆ వృద్ధునికి వ్యతిరేఖంగా నాకేం లేదు; ఒకవేళ అతడు చెప్పేది సరే కావొచ్చు" లేదంటే అతడితో కలసి కీలు పూస్తూ వుండేవాడివా? ఇప్పుడు నీ పాత్ర (స్వభావం) గూర్చి ఆలోచించు. అంతా వ్యతిరేఖంగా వుంటే నీవు ఏమి చేసేవాడివి?

95. గుర్తుంచుకోండి, లోకమంతా ప్రవక్తను, అతని వర్తమానాన్ని విమర్శిస్తూ వుండెను. సంఘాలన్ని అతడిని విమర్శిస్తూ వుండెను. విజ్ఞాన శాస్త్రమంతా "అతడు పిచ్చివాడ"ని అనుచుండెను. తన శరీరాన్ని తిని, తన రక్తాన్ని త్రాగమని యేసు చెప్పగా, వారన్నారు "ఇతడు నరమాంస భక్షకుడు, రక్తపిపాసి” చూసారా? లోక జ్ఞానంగలవారి (మేధావులు)గా పిలవబడుచున్న శాస్త్రవేత్తలు ఎక్కడున్నారు?

96. మీకు తెలుసా? ఎక్కువ విద్య, ఎక్కువ సంస్కృతి నీకు వస్తే, అది నిన్ను ఎటువైపు పెట్టునో నీకు తెలుసా? అది నిన్ను దెయ్యం వైపునకు వుంచును. "చీకటి పిల్లలు వెలుగు సంబంధులు కంటే తెలివిగలవార”ని బైబిలు చెప్పుచున్నది.

97. కయీను కుమారులను చూడండి, వారంతా శాస్త్రవేత్తలగా, నిర్మాణ వ్యవహారికులుగా, గొప్ప అభివృద్ధి కాంక్షకులుగా వున్నారు. అయితే షేతు కుమారులు దీనులుగా, రైతులుగా, గొర్రెల్ని కాయువారిగా వున్నారు. అది సరేనా? (సంఘము "ఆమేన్" చెప్పుచున్నది. సంపా॥) నోవహు దినములలో వున్నట్లు, ఆ పాతకాలపు ప్రఖ్యాతి (మేధావులు) గాంచినవారు, పిరమిడ్లు మొదలైన వాటిని, వారు ఎలా అన్నీ కట్టించారు? జాగ్రత్తగా గమనించండి, చూడండి, దేవుని యొక్క రుజువు అతనియొద్ద వున్నప్పటికి ఈ ప్రజలు అతని వర్తమానాన్ని విమర్శించారు.

98. లేదా, ఏలియా కాలంలో నీవు జీవించినట్టైతే, ఏలియా ఆ కాలపు కాపరిగా వున్నప్పుడు, నీవేమి చేసేవాడివి? మరియు యెజెబేలు, రెండువేల ఐదువందల ఏళ్ల క్రితం, హాలీవుడ్, ఆమె రంగులు వేయడంతో ఫ్యాషన్లతో మొదలయ్యెను. ఇశ్రాయేలు కుమార్తెలందరి చేత కూడా దానిని చేయించింది. ఒకే ఒక వృద్ధుడు దానికి వ్యతిరేకంగా నిలబడి చావు దెబ్బలు కొడుతున్నాడు. మిగిలిన పూజారులంతా “ఓ, సరే, అతడు వృద్ధుడు, అతన్ని ఒంటరిగా విడిచిపెట్టండి, త్వరలో అతని పనైపోతుంది. అందులో ఏమీ లేదు. మన చక్కటి రాజు, మనవలె బట్టలు వేసుకొని అత్యంత విలువగల బట్టలు కలిగివున్నాడు. ఇది అత్యంత శ్రేష్టమైన ఆహారంగల దేశం, "ఇది" చేసినప్పటికీ, “అది” చేసినప్పటికీ ఏమి వ్యత్యాసం వున్నది? అది ఏ తేడా కలుగజేస్తుంది?" అని అంటున్నారు. ఆ కాపరులు అలాగున చెబుతున్నారు.

99, కాని అక్కడ ఒకేఒక మనిషి, “యెహోవా ఈవిధంగా సెలవిచ్చుచున్నాడు" అను దానితో ఒంటరిగా నిలబడి వున్నాడు.

100. ఇప్పుడు నీవున్న పాత్రలో. నీవు ఎక్కడ వుండి వుంటావు? ఇప్పుడు "ఈ అద్దములో” చూడు, నీవు ఇంటికి వెళ్లి నీవెక్కడ వున్నావో చూసుకో. చూడు? చూడు? నీ ప్రస్తుత పరిస్థితి నేడు నిన్ను ఏ స్థానంలో వుంచి వుండవచ్చు? నవీన ఆలోచనతో, సంఘశాఖతో,
సూచనతో, “ఓ మంచిది. మనమంతా పెళ్లి చేసికొందుము" అని చెప్పు వానితో అంగీకరించి వెళ్లి వుంటావా? ఓ. ఖచ్చితంగా, వారంతా ప్రతి అమావాస్య రోజున యెహోవాను ఆరాధించేవారు, వారు కేకలు పెట్టి, ఊటనుండి వచ్చిన "ను త్రాగి, వారిని బయటకు తీసుకొచ్చిన పరలోక దేవుని స్తుతించి, అలా అన్నీచేసేవారు, కాని అసలైన మార్గంనుండి మిలియన్ల మైళ్ల దూరంలో తొలిగిపోయారు. నీ ప్రస్తుత క్రైస్తవ అనుభవం, ఏలియా కాలములో నిన్ను ఎక్కడ వుంచుతుంది? నీవు ఎవరివైపు వుండేవాడివి?

101. లేదా, మోషే ఇశ్రాయేలును తీసికొచ్చినప్పుడు, దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసిన వాక్యముతో గుర్తించబడిన ప్రవక్తగా, మోషే అక్కడకు వెళ్లి దేవుడు చేయమని చెప్పిన సూచనలన్ని చేసెను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక నిమిషంలో ముగించెదము. (మోషే) వారిని బయటకు తీసికొని వచ్చి అరణ్యములోకి తెచ్చెను, యాభై ఏళ్ల క్రితం పెంతెకోస్తులైన మీరు సంఘశాఖను విడిచిపెట్టి, ఆ గీతను దాటినట్లుగానే, వారు కూడా దాటారు. పిమ్మట ఒకడు లేచి, “ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి, మనమొక సంస్థను తయారు చేద్దామ"ని చెప్పి, దాతాను అనే వ్యక్తి “మోషే, నీవు ఒక్కడవే ప్రత్యేకమైన వాడవని నీవనుకొంటున్నావు. నీవొక్కడవే మన మధ్యలో పరిశుద్దుడవని అనుకొంటున్నావు. మాకింకా ఇతర పరిశుద్ధులున్నారు. దీని గురించి ఏదో ఒకటి చెప్పు. మేమొక చిన్న గుంపును తయారు చేస్తాము, మరి ఇలా నమ్ముతాము, ఇలా నమ్ముతాము.

102. ఇప్పుడు ఏ గుంపులో నీ ప్రస్తుతపాత్ర గుర్తించబడుతుంది? ఏలియా కాలంలో, జుట్టు కత్తిరించుకొని, ముఖానికి రంగు వేసుకొని, నవీన స్త్రీగా వుండిన యెజెబెలు వున్న స్థలానికి నీవు వెళ్ళితివా? ఇప్పుడు నీవు ఎక్కడ గుర్తింపబడుచున్నావో ఆలోచించు, నీవు, "నేను పెంతెకోస్తుకు చెందినవాడను" అని చెప్పవచ్చు. నీవు ఏమై వున్నావో దాన్ని నేను చెప్పడం లేదు. నీ పాత్రను (నీ స్వభావాన్ని) గూర్చి నేను అడుగుచున్నాను. మీరు చూస్తున్న ఈ అల్పమైన వాటికి దిగువుగా మనం వెళ్తున్నాము. మీ లోపల వున్న వాటికోసం వెళ్తున్నాము.

103. గతరాత్రి, ఆఖరున, పరిశుద్ధాత్మ ఎలా అరచెనో మీరు విన్నారా? నేడు, నేను చెప్పుదానికి కారణమదే, చూసారా? ప్రజలరా, మీ ఆత్మయ గ్రహింపుని తెరవండి, మీరనుకొన్న దానికంటే సమయం గడిచిపోయింది చూసారా? చూసారా? నీవు సరియేనని ఒకడు అనుకొనుటకు అదొక మార్గము. దీనిగూర్చి మాట్లాడుటకు ప్రభువు నన్ను అనుమతించిన యెడల, సంస్థవారు మరియు సహోదరులు నన్ను మన్నిస్తారని నేననుకున్నాను; వారు మన్నిస్తారని నాకు తెలుసు, వారు దీని విషయమై నాతో ఏకీభవించారు.

104. గమనించు, వెలుగులో నిన్ను నీవు నేడు చూసుకొన గలిగినట్లయితే, నీలోవున్న నీ ఆత్మ, నాటి దినాల్లో అక్కడ జీవించినట్లయితే, ఇప్పుడు నేడు నీవెక్కడున్నావో చూడుము. నాడు నీవెక్కడ వుండేవాడివో చూస్తావు. ఆ కాలంలో నీవు ఎక్కడుండేవాడివి? దాతాను స్థాపించడానికి ఇష్టపడిన సంస్థ వైపుకు నీవు వెళ్లేవాడివా? లేకపోతే, నీ ప్రస్తుత స్వభావంతో అంతా దానికి వ్యతిరేఖంగా వున్నా, వాటినుండి వేరై వాక్యముతో నిలబడేవాడివా?
105. ప్రభువు యొక్క వర్తమానాన్ని తాను కలిగివుండెనని మోషే పూర్తిగా రుజువు పరచబడెను. అన్నిరకాలుగా దేవుడు దానిని రజువుపరిచెను, ఆయన చెప్పినది అక్షరాలా జరిగెను, ఇశ్రాయేలుకు ఇలా చెప్పెను, ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళండి, "ఈ సూచనలేదైనను, మీరు దానిని వెంబడించాలి. దానికి మీరు చెవియొగ్గాలి. వాక్యము వాగ్దానం చేసిన దానిని మీరు వినాలి" ఆయన ప్రత్యక్షపరచబడెను.

106. అయినప్పటికీ, ఐగుప్తులో వున్న ఒక చురుకైన నాయకుడైన దాతాను, లేచి, "నీకొక్కడికే ఏదో ప్రత్యేకత వున్నట్టు నిన్ను నీవు చేసికొన ప్రయత్నిస్తున్నావని అన్నాడు.

107. నిజానికి అది మోషే ఆలోచన కాదండి, చేయుటకు దేవుడతనికి నియమించిన దాన్ని మాత్రమే అతడు చేస్తుండెను. వారంతా మోషే కానవసరం లేదు. అతడు చెప్పినదానిని మాత్రమే ప్రజలు చేయవలసినవారై వున్నారు. ప్రతి ఒక్కరు సృష్టించనవసరం లేదు, అద్భుతాలు, మొదలైన వాటిని చేయవలసిన అవసరం లేదు. నేడు ప్రజలతో వున్న సమస్య అదేనండి.

108. మొన్న ఒక స్త్రీ ఇక్కడ నుండి వస్తువుండగా మార్గంలో నన్ను అడిగింది. ఆమె అన్నది... అది ఫ్లోరెన్స్ షెకారియన్ మరియు బ్రదర్ డిమోస్ యొక్క సహోదరి యగు సిస్టర్ విలియమ్స్, మొదలైనవారు కారులో కూర్చొన్నారు. ఆమె అడిగింది "సహోదరుడా బ్రెన్హామ్, నేనెంతగానో ఉపవాసం వుంటాను అయినా గాని నేనింక దయ్యములను వెళ్లగొట్టలేకపోతున్నాను.”

109. నేనన్నాను. "అలాంటివి చేయడానికి నీవు పుట్టలేదు. ఉపవాసం వుండ టమే నీ పని. దానికోసం పరిశుద్ధాత్మ వేరొకరిపై పనిచేయును. నీకు స్థానం తెలీదు"

110. మనకు సమయం వుంటే, సుదీర్ఘ కూడికల్లో దాని గూర్చి మనం బోధించుకోవచ్చును. ఒక వ్యక్తి ఇక్కడ వాటికోసం భారము కలిగి వుండును. నీకు తెలీదు, నీకు తెలీదు మరది నీవు తెలిసికోవల్సిన పన్లేదు. దానిని చేసేది ఆయనే. నీవు కేవలం నీ పిలుపుకు లోబడి వుండడమే. మరెల్లప్పుడూ లేఖనముతో అది తప్పో ఒప్పో సరిపోల్చుకొని చూడటమే.

111. మనమిప్పుడు కనుగొన్నాము... ఈ మోషే విమర్శింపబడెను. ఈ గుంపు చేత విమర్శింపబడెను. కానీ దేవుడు మోషేతో చెప్పాడు "అతని నుండి నిన్ను నీవు వేరుపరచుకో, ఎందుకంటే భూమిద్వారా అతనిని మ్రింగవేయబోవుచున్నాను" మరట్లానే ఆయన చేసెను, ఇప్పుడు, చూడండి, నీవు జీవిస్తున్న గడియను నీవు తెలుసుకోవాలి. మరి మీకున్న స్వభావమును వారితో సరిపోల్చుకోండి (తీర్పు తీర్చుకోండి).

112. లేదా, క్రీస్తు దినాలలో. నేనిప్పుడు మిమ్మల్ని అడగాలనుకొంటున్నాను. చక్కటిసెమినరీలు, చక్కటి సేవకులు, గొప్పవిధ్యాదికులు, గొప్ప మతాచారాలు, మనమిప్పుడు కలిగియున్న వాటిని వారు ఆనాడే కలిగియున్నారు. యేసు రంగము మీదికి వచ్చినప్పుడు, ఆయన వారికి తిరుగుబాటు దారునిగా వుండెను. అయితే, మీరు చూడండి, ఆయనే దేవుడని ప్రత్యక్షపరచడం ద్వారా దేవుడు తన యొక్క స్వభావమును ఆయనలో గుర్తుంచుకొనెను. మరియు ఆయనన్నాడు "నేనెవరినో మీరు ఎరుగకుంటే, లేఖనములను
పరిశోధించండి".

113. "మీకు మోషే తెలిసివుంటే, నేను మీకు తెలిసి వుంటాను. అతడు నన్ను గూర్చి వ్రాసాడు" అని ఆయన అనెను.

114. ఇప్పుడు, నీవు ఆనాడు జీవించివుంటే, సన్హెద్రిన్ సభలో ఏదో ఒక చక్కని సంఘమునకు సభ్యుడిగా, చక్కటి కాపరిగా వుండి వుంటే, నీవు ఎవరివైపుకు వెళ్లేవాడివి? ఇప్పుడున్న నీ ప్రస్తుత స్వభావము ఎవరివైపునకు నిన్ను వుంచి వుంటుంది? ఆలోచించు, అది నీ ఇష్టం (నిర్ణయం), యేసు వున్న కాలంలో నీవున్నట్లైతే “ఓ, అవన్నీ బుద్ధిహీనత అయివున్నద"ని, నీ కాపరి అన్నట్టైతే, నీవు ఎవరివైపుకు వెళ్లేవాడివి, ఎక్కడ నిన్ను నీవు గుర్తుంచుకొనేవాడివి?

115. ఈనాడును యేసు వచ్చి, "నేను దీన్ని చేయవలెనని లేఖనం చెప్పుచున్నది” అని చెప్పి, దానిని ఆయన చేసెను. "నేను దీన్ని చేయవలెనని లేఖనం చెప్పెను మరియు "కన్యక ద్వారా పుట్టవలెను", దాన్ని ఆయన చేసెను. “దీన్ని చేయవలెనని లేఖనం చెప్పెను" ఆయన దానిని చేసెను. "లేఖనమును పరిశోధించండి మరియు నేను ఎక్కడ విఫలమయ్యానో చూడండి" అని ఆయన అనెను.

116. అయితే వారు, "అతన్ని మీరు లక్ష్యపెట్టవద్దు, అతనికి మతి పోయింది” అని అన్నారు. చూసారా?

117. ఎలాంటి స్వభావాన్ని నీవిప్పుడు కలిగియున్నావు? ఆ పెద్ద సంఘశాఖలు, వేదాంతులు, అందరు ఆయనకు విరోధముగా వున్నప్పుడు, బోధకులు మరియు ఆనాటి పండితులంతా ఆయనకు విరోధముగా వున్నప్పుడు, బైబిలు బోధకులంతా ఆయనకు విరోధముగా వున్నప్పుడు, యేసు భూమిపైన వున్న ఆ రోజులలో నీవు ఎక్కడ వుంచబడతావు? దేనికి విరోధముగా వారున్నారు? ఆ కాలానికి తేటగా ప్రత్యక్షపరచబడి గుర్తించబడి స్వయంగా దేవుడే రుజువు చేసిన దేవుని వాక్యానికి వారంతా విరోధులయ్యారు.

118. “ఆలోచనకర్త, సమాధానపు అధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేరు పెట్టబడును. కన్యక గర్భవతియై ఈ కుమారుని కనును. ఆయన భుజము మీద రాజ్యభారముండును, చూడండి. ఆయన రాజ్యమునకు అంతం లేదు” ఎవరీ వ్యకి? ఒక శిశువు, దేవుడు, ఆ తరువాత దేవుడు మనిషి అయ్యెను. ఒక పశువుల పాకలో యెహోవా పుట్టడం నీవు ఊహించుకొనగలవా? ఒక బాలుడిగా యెహోవా ఆడుకోవడం నీవు ఊహించుకొనగలవా? ఆయన్నే ఆరాధించుచున్నామని చెప్పుకొను సంఘము ఆయన్ని సిలువ వేయడం నీవు ఊహించుకోగలవా?

119. నీవు ఎటువైపుకు గుర్తించబడతావు? నీ సిద్ధాంతాన్ని తీసుకొంటావా లేక అతిస్పష్టమైన, సత్యమైన వాక్యం చెప్పినదాన్ని తీసికొంటావా? నీ ప్రస్తుత స్వభావంతో. నీవెక్కడుంటావు? నీవు అక్కడే వుండి వుంటావు. ఇప్పుడు నీవేమై యున్నావో సరిగ్గా అదే ఆనాడు నీవు వుండెదవు. స్పష్టంగా ఖచ్చితముగా, ఓ, మై,

120. ఆయన యొక్క మెస్సయ్య సూచన, ఇప్పుడు గమనించండి, ఆయన మెస్సయ్య
సూచన ఆయన స్వభావాన్ని గుర్తించెను, ఎందుకనగా వాక్యమైన దేవుడు ఒక మనిషిలో వుండెను. నా భావం గ్రహించారా? అది ఆలోచనల్ని వివేచించి, వాటన్నింటిని వారికి చెప్పెను.

చక్కని డివి? చు, దీనత

నీవు

అని ركت

121. (టేపులో ఖాళీ వుంది - సంపా॥)... వాక్యము ఆమెను కనుగొనింది. అయితే వాక్యము మొదటిగా మెరసినప్పుడు ఆమె దానిని పట్టుకుంది. ప్రత్యక్షపరచబడిన దేవుని తలంపులలో ఆమె ఒకటి. చూసారా?

122. ఎవరైతే ప్రసంగీకుని వస్త్రధారణతో హుందాగా మరియు వాక్యాన్ని చెరిపి భిన్నమైనవాటిగా చేస్తు ఏ మాత్రం యదార్ధత లేకుండా, కేవలం సంఘానికి చెందినవారిగాను, తమలో వెలుగుందని చెప్పుకొంటూ అక్కడ నిలబడ్డారు. అయితే వారు తమలో వెలుగుందని చెప్పుకొనే వెలుగుని అసలైనవెలుగు మసకబార్చెను.

123. సూర్యుని వెలుగును ఆప ప్రయత్నించుటకు టార్చిలైట్ వెలుగును వేసినట్టుంది. వారి తంతు. చూసారా, టార్చిలైట్ వెలుగుగాని లేక మరే వెలుగైన సరే సూర్యుని వెలుగును ఆపలేదు, ఎందుకని? ఎందుకనగా అది ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమై వున్నది. "వెలుగు కలుగును గాక!" అని దేవుడు పలికాడు. అప్పుడు దేవుని వెలుగు కలిగెను. అది ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యం, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు.

124. ఏ సిద్ధాంతం, ఏ సంఘశాఖ, ఏ పోపు, ఏ యాజకుడు లేక అది ఏదైన సరే, లేక డాక్టరేట్ పట్టా అయినా, ఏ సంస్థ అయినా, ఏ దేశమైన, ఏదైన దేవుని వెలుగు యొక్క ప్రత్యక్షతను ఆర్పివేయలేదు. వాక్యము పలుకబడినప్పుడు, ఆది వెలుగులోనికి వస్తుంది, అది ఏమి చేస్తుందని చెప్పబడిందో దాన్నే అది చేస్తుంది. దానితో ఇక ఏ సిద్ధాంతం నిలబడలేదు. అయితే వెలుగు తనంతట తానే మరియు దానిలో నడుచువారు మాత్రమే నిలబడగలరు. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు, ఇక్కడ మనమధ్య తన్నుతాను కనపరచుకొనుచుండెను. మరియు ఆయనలో మనము నడుచుచుంటిమి. ఏది దానిని ఆపలేదు. "ఆకాశము భూమి గతించినా, వాక్యము గతించద"ని యేసు అనెను. గమనించండి, బైబిలు బోధకులారా...

125. అయితే, ఆ వాక్యము రుజువగుట చూస్తుండగా, తన మెస్సయ సూచన, ఆ వేశ్యకు తానెవరో చూపించుచుండగా, ఇతరులు, పేతురు, నతానియేలు వంటివారు దేవుని మనస్సులో తలంపులుగా వున్న వారంతా, ఆ వెలుగు ప్రసరించగానే వారు దానిని గుర్తుపట్టారు. వారిని వేదిక వద్దకు లాగుకొని వచ్చి, వారిని బ్రతిమాలి, వారికి ఏదో ఒకటి చేస్తామని చెప్పి, వారికి ఇంకొంచెం మంచి జీవనాన్ని ఇస్తామని చెప్పి, ఒక అధికారితో ఉద్యోగం కొరకు మాట్లాడుటకు ప్రయత్నించి, మంచి స్థానములో పెట్టుటలాంటివేమి వారికి చేయలేదు. వారు దేనినీ లక్ష్యపెట్టలేదు. తమ స్థానాన్ని పట్టుకొనుటకు వారు పోరాడవలసి వచ్చింది. “అయితే మనల్ని వేరు చేసేది ఏదీ లేద"ని బైబిలు చెప్పుచున్నది. క్రీస్తులోనున్న దేవునిప్రేమ నుండి... శ్రమయైనా, క్షామమైనా, మరణమైనా, మనల్ని వేరు చేయలేదు, ఎందుకంటే మనమంతా ఎప్పుడో ఆయన తలంపులలో వున్నాము. సరే, ముందుకు సాగుదాము.
126. అనాటి పరిసయ్యులతోని ప్రస్తుత స్థితి గుర్తించబడెనా? నీ ప్రస్తుత స్థితి? ఇప్పుడు నీవు, "లేదండి, అప్పటి పరిసయ్యులతో అది నన్ను గుర్తించద"ని చెబితే, మరిప్పటి సంగతి ఏమిటి? "ఆయన నిన్న, నేడు నిరంతరం ఒకటే రీతిగా వున్నాడ"ని హెబ్రీ13:8 చెప్పుచున్నది. మరిప్పుడు నీ ప్రస్తుత స్వభావం ఏ స్థితిని గుర్తించుచున్నది? "ఆ పరిసయ్యులతో నాకే పని లేదు. లేదండి" ఇప్పుడది కేవలం పేరు మాత్రమే. అయితే నీవున్న స్థితి గూర్చి ఏమిటి; ఆరోజు వుండినట్లుగానే, ఈ రోజు నీవు ఆయనను ఆయన సంఘములో చూచినప్పుడు, నీవెక్కడుంటావు? చరిత్ర దానికదే పునరావృతమగుచున్నది.

127. వివక్షత (దురంహకారం)ను బట్టియే నాటి పరిసయ్యులు ఆయనకి విరోధంగా నిలబడ్డారు. నేడును అంతేనండి, శాఖ ప్రపంచం వాక్య సత్యానికి విరోధంగా నిలబడుటకు కారణం వివక్షత (దురంహకారం లేదా విచారింపకపోవుట).

128. ఒక కథోలిక పూజారి నన్ను ఇంటర్వ్యూ చేసాడు, ఆయన నాతో "నీవు బైబిలుని బోధించడానికి ప్రయత్నిస్తున్నావు" అని అన్నాడు. అందుకు నేను "దానినే నేను నమ్ముతాన” న్నాను. అతడన్నాడు "దేవుడు తన సంఘములో వున్నాడు". మరి నేనన్నాను “దేవుడు తన వాక్యములో వున్నాడు”.

129. అప్పుడు అతడన్నాడు, "ముందున్న వారంతా కథోలిక్కులే”. “పేతురు, యాకోబు, యోహాను, వారంతా కథోలిక్కులే".

130. నేనన్నాను, “వారైతే... మరియు నేను “నేటి సంఘము గూర్చి మీరేమను కొనుచున్నారు?" అని అడిగాను. "అప్పుడున్న దానికంటే ఎంతో మెరుగుగా వుంది" అని అతడు అన్నాడు.

131. నేను, “మరప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు చేయండి” చూడండి, అది ఏమై వున్నదో స్వభావము చూపుతుంది.

132. ఆనాటి పరిసయ్యులు, వివక్షత కోసం! గుర్తుపెట్టుకోండి, అది దురంహకారం. నిజానికి వారు దానిని (వాక్యము/వెలుగు) చూసారు! యాజకులలో ఒకడైన నికోదేము దానిని వ్యక్తపరచెను, “రబ్బీ, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదము. దేవుడాయనకు తోడుగా లేనిదే ఎవరును నీవు చేయు క్రియలు చేయలేరు", అన్నాడు - చూడండి. అయితే దురంహకారం వలన, ఎందుకంటే ఆయన వారి గుంపులో చేరలేదు.

133. ఒకవేళ ఆయన వచ్చి, “పరిసయ్యులైన మీరు తప్పు, నేను సర్దూకయ్యు డను" లేదా, “సద్దూకయ్యులైన మీరు తప్పు, నేను పరిసయ్యుడను” అని చెప్పినట్లయితే, పరిసయ్యులు, “చూసారా, మేమే సరియని నీకు చెప్పాము" అందురు. అయితే, ఆయన వారిలో ఎవరి వద్దకు పోలేదు, వారికి మధ్యలో ఆయన నిలబడ్డాడు.

134. ఆయన అద్భుతాలను చూడడానికి ఆయనను వెంబడించి వుంటే... నీవు, “ఓ
ఆయన అద్భుతాలను చూడటం నాకెంతో ఇష్టమైనది" అని చెప్పి, ఆయన అద్భుతాలను చూడటానికి నీవు ఆయనను వెంబడించెదవు.

135. అటు పిమ్మట, ఆయన ఈ చోటుకి వచ్చి, అద్భుతాలను ప్రదర్శించడం ఆపివేసి, వారికి బోధించడం మొదలుపెట్టాడు. అప్పుడు, క్రీస్తుచేత అభిషేకించబడిన డెబ్బై మంది సేవకులు లేచి ఆయన యొద్దనుండి వెళ్లిపోయారు, ఎందుకంటే సైన్స్ అంగీకరించని దానిని, మిగితా గుంపు అంగీకరించని దానిని ఆయన అన్నాడు. ఆయన మనిషై వుండి, తన్నుతాను పరలోకము నుండి వచ్చిన దేవునిగా చేసికోటం వారికి అర్ధం కాలేదు. మనుష్య కుమారుడు ఎక్కడ నుండి వచ్చాడో మరి అక్కడికే ఎక్కిపోవును. ఆయన దేవుడే, నిశ్చయంగా, ఆయన దేవుడు, ఓ, అదెంతో కఠినంగా వుంది, మేము దాన్ని అంగీకరించలేమ"ని వారన్నారు.

136, ఇప్పుడు, నీలో మలచబడిన స్వభావముతో, అప్పుడు నీవెక్కడ గుర్తించ బడేవాడివి? నీ స్వభావాన్ని ఏదో మలిచింది. ఇక్కడే ఎక్కడో నిన్ను నీవు గుర్తించుకొన బోవుచున్నావు. ఏదో ఒకరకమైన పాత్రగా నీవున్నావు. నీవేమి చేసితివి? చూసారా? ఇప్పుడు నీవున్న పాత్రలో, ప్రస్తుత స్థితిలో, నాడు నీవెక్కడ వుండి వుంటావు? చూసారా?

137. బోధకులంతా మరి అన్నియు ఆయనకు విరోధమయ్యెను. అయితే ఆయన చేసిన అద్భుతాలు ఆయన్ని గుర్తించెను. మరి ఆ డెబ్బైమంది మరియు కాపరులు, సేవకులు లేచి, "అది మాకు అర్థం కాలేద"ని చెప్పినప్పుడు, ఆ సమాజం వలె నీవును నడిచిపోయేవాడవా? లేదా ఆ శిష్యుల వలె “వారేమన్నారో నాకవసరం లేద"ని చెప్పెవాడివా? చూచారా, అదక్కడే వుంది.

138. అప్పుడు యేసు వారివైపు తిరిగి వారిని పరీక్షించ నిమిత్తం, "మీరు కూడా వెళ్లిపోవాలనుకుంటున్నారా?" అని వారినడిగెను.

139. చూడండి, వారాయన్ని ఇరకాటంలో పెట్టి "ఇతడొక రక్తపిపాసి, అతని మాంసాన్ని, రక్తాన్ని మనం భుజించాలా” అని చెప్పి, ఆ సమాజం వెళ్లిపోయింది.

140, కొంతమంది సేవకులు, "సరే, ఇంకొంత కాలం మనముండి ఇందంతా దేనిని గూర్చినదో చూద్దామ"ని అన్నారు.

141. మరి "మనుష్యకుమారుడు తన్నుతాను దేవునిగా గుర్తించుకొనడం చూచినప్పుడు, చూడండి, మనుష్యుకుమారుడు ఎక్కడి నుండి వచ్చెనో, ఆ పరలోకమునకు ఎత్తబడుటను చూచినప్పుడు" అని ఆయనన్నాడు.

వారు “ఓ, దీనిని మేము భరింపలేమ”ని చెప్పి వెళ్లిపోయిన తరువాత ఆయన శిష్యులవైపు తిరిగి, “మీరు కూడా వెళ్లిపోవాలనుకుంటున్నారా?" అని అడిగాడు.

142. మరి, "ప్రభువా, మేము ఎవని యొద్దకు వెళ్ళెదము, ఎక్కడకు వెళ్లగలము? కేవలం నీవొక్కడివే నిత్యజీవపు మాటలు గలవాడవని మేమేరుగుదుమ"ని పేతురన్నాడు. (సహో॥ బ్రెన్హామ్ ఐదుసార్లు బలిపీఠమును కొట్టుచున్నాడు - సంపా)
143. మరి నేడును అదే. నీసంస్థ కాదు, నీగుంపు కాదు, "ఆయనేనండి". కేవలం క్రీస్తే నిత్యజీవపు మాటలు గలవాడు. నిన్ను నీవు ఎక్కడ గుర్తించు కొంటావు, మానవ కల్పిత కథలనా లేక దేవుడు సాధించిన దానినా? గత ఆదివారం, "అవరోహణ లెక్కింపు" గూర్చి మాట్లాడినట్లు, ఇప్పుడు వ్యామోగాము యుగమునకు సంఘమును తీసికొని రావడానికి దేవుడు ఏమి సాధించెనో చూసారా? లేదా నీవెక్కడ చూడగలవు? లేక నీవిప్పుడు నీ సొంత గుర్తింపును చూడగలవా?

144. గమనించు, ప్రఖ్యాతిని ప్రేమించేఅధ్యాపకులతో. కొద్దిసేపు యవ్వనస్థులైన మీతో ముచ్చటించగోరుచున్నాను. పాఠశాలలో నిన్ను నీవు ఎక్కడ గుర్తించుకుంటావు ఓ యవ్వన స్త్రీ? ఓ, నీవు గింజలను చీల్చగలవు, నీవు "దీన్ని” చూపగలవు, నీవొక సైన్స్ టీచరువు, అయితే నీకు తెలుసా? అది నీకు జీవమును ఇవ్వలేదు.

145. క్రీస్తు ద్వారా మాత్రమే జీవము వస్తుంది, "ఆయనను ఎరుగటయే" ఆయనమాటను కాదు, ఆయనసంఘాన్ని ఎరుగుట కాదు. తన దీనిని ఎరుగుట కాదు. "ఆయనను ఎరుగుటయే" అదొక్కటే నీకు జీవమును ఇవ్వగలదు.

146. ఇప్పుడు ఇది (వాక్యము) ఒక నవీన యవ్వనస్థుని వద్దకు వచ్చినట్లయితే, ఎల్విస్ ప్రిస్లే, వంటి నవీన పెంతుకొస్తు కుర్రాడు, వేగవంతమైన కాడిలాక్ కార్లకోసం, బంగారు రికార్డులు, మరటువంటి వాటికోసం, అతడు తన జన్మహక్కులను అమ్ముకొనెను లోకానికి కావలసినది అదే.

147. జుట్టు కత్తిరించుకోనిచ్చే చిన్నప్యాంటులు ధరించుకోనిచ్చే, లేదా ఇష్టమొచ్చిన దానిని చేసుకోనిచ్చే ఒక పెంతుకోస్తు కావాలని నేడు స్త్రీలు కోరుకొంటున్నారు. వారు కేవలం పెంతెకోస్తుకు చెందితే చాలని అనిపించుకోగోరుచున్నారు. వారు అటువంటి దానినే కోరుచున్నారు చూసారా? "లేదు, నేను ఆ గుంపు వద్దకు వెళ్ళను. వారు పాతకాల పద్ధతులను గలవారు" చూసారా? చూడండి. వారు దానిని కోరుకుంటున్నారు. అది వారి స్వభావం. స్త్రీల చేత నడిపింపు కోరుకుంటున్నారు. అది వారి స్వభావం. స్త్రీలచేత నడిపింపబడే కొంతమంది పురుషులు, వారు దానిని వారికి ఇస్తున్నారు.

148. అయితే, “దేవుడు ఈ రాళ్ళనుండి." ఆ వెలుగును ఎవరో పంచవలెను. మరి నేడు ఆ వెలుగునుపంచుటకు భయపడని వారిని కలిగివున్నాం. ఏది జరిగినా.

149. నీవెక్కడ గుర్తించబడ్డావు? ఏ గుంపుతో నీవున్నావు? చూసారా? నీవు ఎక్కడ నిలబడ్డావు? గమనించు.

150. ఈ యవ్వనస్థుడు తన సొంత చర్చిలో గుర్తించబడ్డాడు; వెల చాలా గొప్పది. అతని ఆఖరి గుర్తింపు మీకు జ్ఞాపకం వుందా, యేసును వెంబడించడానికి అవకాశం పొందుకొనిన ఈ యవ్వన అధికారి, తన సంఘమును తీసుకొని ముందుకు సాగిపోయెను. అతడు మంచివాడు, అన్ని ఆజ్ఞలను పాటించి, అన్నింటిని చేసాడు. మిగిలిన వారందరివలె అతడు కూడా ఎరిగి వున్నాడు. అందుకే ఆ ఆలోచనను తీసుకొన్నాడు. యేసును వెంబడించుటకు నిరాకరించాడు. మరియు అతని ఆఖరు గుర్తింపు, పాతాళములో లాజరు
వచ్చి కొంచెం నీరును ఇవ్వవలెనని ఏడుస్తూ వుండటాన్ని మనం చూస్తున్నాము.

151. నీ గుర్తింపు, ఒకవేళ యూదావున్న గుంపుతో నీవు గుర్తించబడ్డావా? అతడు యేసుతో నడవ మొదలు పెట్టాడు. ఏళ్ళ క్రితం పెంతెకొస్తు వారివలె, అతని ఆరంభం బాగానే వుంది. మీ తల్లులు, తండ్రులు, ఈ యవ్వనగుంపు దేనినుండైతే బయటకు వచ్చి, తిరిగి మరలా అందులోకే, ఆ సంస్థలోకే, పోయినట్టే వుండెను. చూసారా? నీవు ఏ రకమైన గుంపుతో వున్నావు?

152, ఇప్పుడు, బైబిలు చెప్పుచున్నది. ఈ లవొదికయ సంఘకాలము... యూదా, తనకున్న దానితో ఏదో ఒకటి గొప్పది పొందుటకు అవకాశాలను చూసాడు. యేసుతో గుర్తించబడ్డాడు. కనుక, ఆ చిన్న సంచిని మోసుకొని తిరిగాడు, ఆయన్ని ముప్పైవెండి నాణెలకి అమ్ముటద్వారా ఇంకొంచెం డబ్బును కూడపెట్టొచ్చనుకొన్నాడు.

153, లవొదికయ సంఘకాలం చేసింది కూడా సరిగ్గా అదే. బైబిలు ఇలా చెప్పుచున్నది, "నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. మరియు నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగకయున్నావు”. అది ఆఖరిదైన పెంతెకొస్తు సంఘకాలం. లూథర్ కాదు, వెస్లీకాదు. కాని పెంతెకోస్తు, అది సంఘకాలం.

154. నీవెక్కడ గుర్తింపబడ్డావు? "నేను పెంతెకోస్తు వాడిన"ని నీవు చెప్పవచ్చు. అదెక్కడ గుర్తింపబడుతున్నదో చూస్తున్నావా? ఆయన్ని బయటకు నెట్టివేయడంలో, ఖచ్చితంగా, ఎందుకంటే వారు ధనవంతులు, వారికి ఏ అవసరమూ లేదు...

155. “ఓ, 'ధనవంతురాలు' అని నీవనొచ్చును?" ఎందుకని, ఆ మూలన నిలబడి, చిన్న పాతగుడిసెకు వారానికి మూడు డాలర్లు ఇచ్చేవాడివి. నేను గుర్తించ డానికి ప్రయత్నిస్తున్నట్టు కాదు, కాని పూర్తి సారాంశం తీసికోగలిగినట్టైతే తీసికో. నిశ్చయంగా. ఇప్పుడు “యేసు త్వరగా వచ్చుచున్నాడ"ని ప్రకటించుటకు మార్గం సుగమనం చేయునిమిత్తం సెమినరీలకి, గుంపులకి, అలాంటి గొప్ప పెద్ద కార్యాలకు యాభైమిలియన్ల డాలర్లు హెచ్చిస్తు, మరోప్రక్క బిలియన్ల మిలియన్ల ఖరీదైన కట్టడములు కట్టుచున్నాము. పొలములో వున్న మిషనరీలు నాకు తెలియును, అయితే వారి కాళ్ళకు జోళ్ళుకూడా లేవండి. ఆమేన్. ఇంకొంతమంది మిషనరీల కోసం కానుకలు పట్టండి, ఒక సహోదరుడు, తన కాళ్ళకు చెప్పులు తప్ప ఏమీ అతని యొద్ద లేదు, అయితే వాటిని తీసికొని వేరొక మిషనరీ కోసం వాటిని కానుకగా సమర్పించాడు. ఓ, మై! నీవు ఎక్కడ గుర్తించబడ్డావు?

156. పెంతెకోస్తులారా! నేనక్కడ ఎక్కువసేపు వుండను, అయితే మీకు తెలుసు నా భావమేమిటో, ఓ,మై! అమ్ముకొన్నారు! వేటిని అమ్ముకొన్నారు? పేరు ప్రఖ్యాతల కోసం జన్మహక్కులను అమ్ముకొన్నారు. మెథడిస్టులవలె వుండాలనుకున్నాం. బాప్టిస్టులు, ప్రెస్బటేరియన్లువలె మీరుండాలనుకొన్నారు... అందుకే అలాంటి భవనాలనే నీవు నిర్మించుకొన్నావు. పొదిగే పెట్టెలాంటి ఒక సెమినరీని నీవు పెట్టి, అక్కడ కొంతమంది బోధకులను పొదిగి, నువ్వు చెప్పినట్టుచేసేవారిగా వారిని తయారు చేస్తావు. ఇవన్ని
చేసికూడా నిన్ను నీవు "పెంతెకోస్తు"గా పిలుచుకొంటున్నావు. అదొక అబద్ధం. అవును, గుర్తుంచుకో, యూదాని మిగతా సేవకులకంటే పేరు పొందిన వానిగా చేసింది సరిగ్గా అదే, అతడు ఆయనను ముప్పై వెండి నాణెములకు అమ్మివేసాడు.

157. అతడిని, ఏది అతడిని త్రిప్పివేసింది? నిజానికి అతడు క్రీస్తు వాక్యమై వున్నాడనే దాన్ని సందేహించాడు. అతడు ఆయన్ని చూడగలిగాడు, ఆయనతో తిన్నాడు, అక్కడ ఆయనతో చేపలు పట్టాడు, ఇంకా అన్నీ చేసాడు; అయితే ఆయనే వాక్యమై వుండటను అతడు నమ్మలేకపోయాడు, ఆయన దేవుడని అతడు నమ్మలేకపోయాడు, అయితే ఆయన దేవుడే. యూదా స్వభావము దానిని చేయడానికి కారణమైంది. నీ స్వభావము కూడా అదే చేసిందా? గుర్తుంచుకో. యూదా చాలా భక్తిపరుడు.

158. నేను ఆఫ్రికాకు వెళ్ళాను, "ఇక్కడంతటా, ఎల్విస్ ప్రెస్లీ పాటలన్ని మా వద్ద వున్నాయి. అతడు పాడుతాడ”ని వారన్నారు.

159. పాట్ బూన్, మరియు వారంతా, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి అనుమతించబడలేదు. మురికి మరియు పెంట! అది వేషధారణ. "క్రీస్తు నామాన్ని ఉ చ్చరించువాడు పాపము నుండి తన్నుతానే వేరు పరచుకోవాలి" చూసారా? అయితే మీరక్కడే వున్నారు. మనమెక్కడకు చేరామో చూసారా? పాపమెంతో మోసకరమైనది. అది కుయుక్తిగా లోనికి వస్తుంది. నిన్ను పూర్తిగా చుట్టివేసే (వశపరచుకొనే) వరకు అది వుందనే విషయం కూడా నీకు తెలియదు, చూసారా, తరువాత అది నిన్ను పంజరంలో పట్టుకుంటుంది. యూదా ఆఖరి గుర్తింపు ఏమిటో చూసారా?

160, మరియు, నా సహోదరుడా, మూలనున్న సంఘముకంటే నీవు వెళ్ళేది పెద్ద సంఘమే కావచ్చు, మూలనున్న వారు సత్యమును బోధించుదురు, కాని మీరు సత్యాన్ని బోధించరు, కావున అది నిన్ను ఎక్కడికి తీసికొని వెళ్తుందో చూడు? అది ఆ యూదా ఆత్మ, అతని ఆఖరి గుర్తింపు నీకు తెలుసు. రావి చెట్టుపై ఉరి వేసికొనెను.

161. లేదా క్రీస్తుయొక్క నిజ అపొస్తులులతో నిన్ను నీవు గుర్తించుకొంటివా? ఇప్పుడు మనం ముగించబోతున్నాం. ఇక చాలు. విమర్శల మధ్య ఆయనకి ఆయన వాక్యానికి నమ్మకంగా వుండు. పెంతెకోస్తు నాటి పేతురుతో నిన్ను నీవు గుర్తించు కొనగలవా?

162. వారంతా దాన్ని చూచి, "ఈ పిచ్చి గుంపును చూడండి. వారంతా త్రాగిరి" అని అనెను.

163. పేతురు లేచి నిలబడి, “యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియును గాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే" అని అనెను. అది ఏమిటి? దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడుట. అతడు, “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును,
దూరస్థులందరికని చెప్పెను. ఎంతమందికి? "ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి. మీకు తెలుసా ఆయన అందరిని పిలువలేదు. అయితే పిలవబడినవారికి తెలుసు వారు ఏమి చేయాలో, సరే. సరే.

164. లేదా, పౌలుతో, పౌలు యొక్క సహాయకుడగు దేమా అనే ఖ్యాతి కాంక్షకుడు అతనిని విడనాడి లోకకార్యాల కోసం వెళ్ళిపోయెను, "నా చలికోటును తీసికొనిరా" అని పౌలు అనడాన్ని విన్నవారంతా పౌలును చూసి ఎగతాళిగా నవ్వుటను నీవు చూసినట్లయితే. కేవలం ఒకేఒక కోటుతో సరిపెట్టుకొనే వ్యక్తి యొక్క పరిచర్య.

165. దేమా అనుకొన్నాడు "అతనికి ఒక గొప్ప పెద్ద బైబిలు పాఠశాల వుండవలసి వున్నది, ప్రతీచోట స్థాపించబడి వుండవలెను. గొప్ప కూటమి వుండ వలెను. అతడు రోగులను స్వస్థపరచగలడు. అతడు ప్రవక్త. ఎంతో డబ్బును కలిగి వుండాలి, మిలియన్లకు వారసుడుగా వుండాలి, కాని ఒకే ఒక కోటు వుంది"

166. “ఇక్కడ చలి ఎక్కువైంది. వచ్చేటప్పుడు నా కోటును తీసుకొని రమ్మని అతనికి చెప్పు" అని పౌలు అనెను.

167. ఇది చూచిన దేమా, తన చిన్న సహోదరుని ఒంటిరిగా పోరాడుటకు విడిచిపెట్టి, లోకములోకి వెళ్లిపోయెను. యేసు చలితో వుండి, అవసరతను కలిగి వుండి అక్కడ నిలబడటం చూచి, అక్కడనుండి నడచి వెళ్లిపోయే ధైర్యం నీకుందా?

168. పరిశుద్ధమార్టిన్ జ్ఞాపకం వున్నాడా? పరిశుద్ధమార్టిన్ గూర్చి పుస్తకాలు, సహోదరులైన మీకు చాలామందికి గుర్తుండే ఉంటుంది. అతను ఫ్రాన్స్లో టోరాస్ వాసి, మరి అతడు క్రైస్తవుడు కాడు. అతని తల్లి క్రైస్తవురాలు. ఐరేనియస్కి బంధువు. అపొస్తులులు మరణమైన వందల ఏళ్ల తరువాత ఇది జరిగింది, వారింకను వాక్యం కోసం నిలబడ్డారు. అయితే క్యాథలిక్ సంఘం సిద్ధాంతాలతో మిళితం చేయుచుండెను మరియు వారు దానికొరకు నిలబడలేదు.

169. ఒక చల్లని మధ్యాహ్నవేళ, పరివుద్ధ మార్టిన్ ఒక గేటు ద్వారా వెళ్ళుచుండగా, ఒక పేద భిక్షగాడు అక్కడ పడుకొని, చలికి చనిపోయే స్థితిలో వుండగా, ఎవరునూ ఒక కోటు అతనికి ఇవ్వలేదు. పరిశుద్ధ మార్టిన్ తన కోటును తీసి, రెంటిగా కోసి, భిక్షగాడిని దానిలో చుట్టి వెళ్లిపోయాడు. వారతనిని చూచి నవ్వారు. “ఎంత బుద్ధిహీనుడైన సైనికుడు, అతడు మన సైన్య నియమాలను ఉల్లంఘిస్తున్నాడు. ఇదంతా చేస్తున్నాడు. ఆ పనికిమాలిన వాడికోసం, సగం కోటు ధరించిన ఒకవ్యక్తి", అని వారన్నారు.

170. ఆ రాత్రి తన పడక మీద పడుకొని వుండగా, ఒక శబ్దముతో మెలకువ వచ్చింది. పైకి చూడగా, ఆ కోటు ముక్క ధరించుకొని యేసు నిలబడటాన్ని చూసాడు. ఆ భిక్షగాడికి చేసినది క్రీస్తుకు చేసెనని తెలుసుకున్నాడు. అదే అతని మార్పు.

171. ఈరోజు, సువార్త శ్రమ పడుటను చూస్తు నిలుచుందువా? లేకపోతే, దేమా చేసినట్టే, పేరు ప్రఖ్యాతలను ప్రేమించే గుంపుతో నీవు వెళ్ళెదవా? చావైన బ్రతుకైనా నీవు ఆయనతోనే నిలబడెదవా? పేతురువలె, “చెరసాలకైనా, లేదా ఎక్కడికైనా, నీతో
కలసిపోవడానికి నేను సిద్ధంగా వున్నాన"ని అందువా? అవునా?

172. స్త్రీలు వెంట్రుకలను కత్తిరించుకోవచ్చా లేదా, వారేమి చేయాలి. అలాంటి కార్యము సంఘములో తలెత్తినప్పుడు కొరింథీయుల వలె, నీవు ఎవరివైపుకు స్థానం తీసుకుంటావు? నీ ప్రస్తుత పరిస్థితి అప్పుడు ఏమి చేస్తుంది? సహోదరీ, దాని గూర్చి గూర్చి ఆలోచించు, "బోధించుటకైననూ, పురుషునిపైన అధికారం చేయుటకైననూ నేను అనుమతించను కాని విధేయులుగా వుండవలెన"ని పౌలు చెప్పెను.

173. వారు అతనికి (ఉత్తరము) వ్రాసి, “మంచిది, ఇక్కడ వున్న సంఘము, పరిశుద్ధాత్మ మాకు ఇలా చెప్పాడు" అని అన్నారు.

174. అతడు అన్నాడు, "ఏంటి? మీ నుండి దేవుని వాక్యము వచ్చినదా? నాకు మాత్రమే అది వచ్చిందా? ఎవరైనా ప్రవక్తనని తలంచిన యెడల నేను చెప్పునవి దేవుని ఆజ్ఞలై వున్నవని గ్రహించుకోవాలి." గలతీ 1:8లో, "పరలోకము నుండి ఒక దూత వచ్చి వేరొక దానిని చెప్పినా, అతడు శాపగ్రస్తుడగును" అని అతడన్నాడు.

175. అది నీ సంఘంలో వస్తే నీవు ఎవరివైపు స్థానము తీసుకుంటావు? ఇప్పుడు నీ ప్రస్తుత స్థితిని చూసుకో. నీవు ఎక్కడ వున్నావో నేను కేవలం అడుగుచున్నాను. ఓ సహోదరుడా, త్వరపడుదాము. నీకు గుర్తుందా? పౌలు గొప్ప స్థితి నుండి క్రిందికి దిగివచ్చాడు. నీవు, “కాని సహోదరుడా, నేను జిల్లాధికారిని, నేను....” అని అనవచ్చు. నీవెవరివో నాకు అక్కరలేదు. నీ ప్రస్తుత స్థితి, నీ ప్రస్తుత స్వభావము ఏమిటని నేను అడుగుచున్నాను. నీకు అది ఏమి చేస్తూ వున్నది? నీవెక్కడ గుర్తింపబడు చున్నావు?

176. గుర్తుంచుకోండి, గమలియేలు దగ్గర గొప్పవిద్య నుండి పౌలు క్రిందికి దిగాడు. గమలియేలు అతనికి బోధకుడు, అతను గొప్పవాడు. అయితే అతడు క్రిందికి దిగాడు, వాక్యము నిరంతరమూ ఎదుగుతుందని చూచుటకు, మరియు దాని కొరకు అతడు తన జీవితాన్ని ఇచ్చాడు.

177. అరణ్యంలో దేవునివాక్యాన్ని మోసుకొని వెళ్లడానికి, సింహాసనం నుండి, కాబోయే ఫరో స్థానం నుండి మోషే దిగివచ్చాడు.

178. నీకు జీవమివ్వడానికి, యేసు పరలోకము నుండి క్రిందికి దిగి వచ్చాడు. నీవు ఏ గుంపుతో గుర్తించబడుచున్నావు? ఒక ప్రకాశించే వెలుగు వలె తన్నుతాను ప్రతిబింబించుటకు ఒక మార్గాన్ని చేయుటకు ఓ! దేని కొరకు దానిని చేసాడు?

179, ఇప్పుడు, సరే, మీరు ప్రార్ధన చేయుంచుకోవాలంటే, ఇంక కొద్ది సమయం కూర్చోండి. మిమ్మల్ని ఎక్కువ సమయం వుంచుతున్నానని నాకు తెలుసు. ఇప్పుడు సరిగ్గా ఇరవై నిమిషాలు తక్కువ ఐదు అయ్యింది. ఐదు గంటలకల్లా మనం వెళ్లిపోదాము. దేవుని చిత్తమైతే వినండి, ఏ గుంపుతో నీవు గుర్తింపబడతావు? నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను.

180, వెలుగును ప్రకాశించడానికి యేసు వచ్చాడు. ప్రకాశించే వెలుగు (కెమెరా) చిత్రాన్ని తీస్తుంది. చూడండి. అలా ఆయన నీలో ప్రతిబింబించునట్లుగా నీ చిత్రాన్ని తీసినప్పుడు,
ఆయన వలె వుంటుందని, ప్రజలు నిన్ను చూసినప్పుడు దేవుని వాక్యము తిరిగి జీవిస్తుండటం చూస్తారు. అందుకే ఆయన వచ్చాడు, ఆ కెమరాని తీసికొని వచ్చేందుకు, ఆయన పరిశుద్ధ పరిచే రక్తం ద్వారా, వాక్యాన్ని నీకు దగ్గరగా తీసుకొని వచ్చుటకు, దీని కోసమే ఆయన యోహాను 14:12లో "నేను చేయుక్రియలు మీరునూ చేయుదుర"న్నాడు. "ఎవరైనా నన్ను వెంబడింప కోరిన యెడల, తన సిద్ధాంతాన్ని తృణీకరించి, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను.

181. లేదా, కొంతమంది నిలబడని లేఖనాలతో నీవు గుర్తించబడుచున్నావా? ఎలాగైన నీవెక్కడ గుర్తింపబడుచున్నావు? కెమెరా ఇదివరకే ఫోటో తీసింది. నీవు, ఎక్కడో గుర్తించబడ్డావు. ఈ మధ్యాహ్నం ఇక్కడ నీవు కూర్చొన్నావు, మనలో ప్రతీ ఒక్కరు, ఇప్పుడు వినండి, నీవు ఎక్కడో గుర్తింపబడ్డావు. కెమెరా ఫోటో తీసింది. నీవు ఏమై యున్నావో నీకు తెలుసు. ఎక్కడో నీ ఫోటో అది తీసింది, నీవెక్కడ నిలబడ్డావు? నీకు నీవే తీర్పరి.

182, మా జీవితాలలో ఆయన జీవాన్ని ప్రతిబింబించునట్లుగా దేవా, ఆయనలో మేము గుర్తించబడునట్లుగా మాకు సహాయం చేయండి. వినండి, కంసాలి బంగారాన్ని తీసికొని కొడతాడు. కొట్టి కొట్టి, త్రిప్పి మళ్ళీ కొట్టి, దానిని కొడుతుంటాడు. దానిలో తన సొంత ప్రతిబింబం కనబడేంత వరకూ దానిని కొడుతుంటాడు. అప్పుడు అది శుద్ధమైన బంగారం, మలినమంతా కొట్టి తీసివేయబడింది. ఈ రోజు ఈ కూటంలో, రానున్న గంటల్లో, పరిశుద్ధాత్మ వచ్చి ఆయన ఈ వాక్యాన్ని తీసుకొని మన హృదయాలపై కొట్టునుగాక, మన సందేహాలు, సిద్ధాంతాలు, దేవునికి విరోధముగా వున్న ప్రతీకార్యం పోయ్యేవరకు కొట్టును గాక. ఆయన పునరుత్థానాన్ని, సంఘమగు మనం ప్రతిబింబించగలుగునట్లు ఆయన దానికి చేయును గాక.

183. ఈ చిన్న కథను విని, తరువాత మీ ప్రార్ధనా కార్డులను సిద్ధపరచుకోండి.

184. న్యూ మెక్సికోలోని కాల్స్బాడ్ నందు ఒక పెద్ద గుహను గూర్చి మీలో చాలా మంది వినే వుంటారు. చూడండి. భూమి క్రింద వున్న గుహ కూర్చొని, ఒక మైలు దూరం క్రిందకు వెళ్తావు. భూమి క్రిందకు మైలు దూరం అలా వెళ్తావు. అక్కడ ఎంతో చీకటిగా వుంటుంది, నీ చేయి 'ఇలా' పెట్టుకొనినప్పటికీ, ఏమీ కనిపించదు, చిమ్మచీకటి. ఒక చిన్న కుటుంబం ఒకసారి అక్కడికి వెళ్ళింది, ఆ మార్గదర్శకుడితో చిన్నపిల్లవాడు వెళు న్నాడు, అతను ముందుకు వెళ్లాడు, ఒక్కసారిగా లైటు ఆరిపోయింది. భయపడుటవలన చిన్నపిల్ల అరవడం మొదలుపెట్టింది.

185. ఇప్పుడు, అది చిన్న వధువు వలె వున్నది, తన స్థానమును తీసుకోవలసిన వధువు, అది చాలా చీకటిగా కనిపించుచున్నది. ఆ సంఘ సమాఖ్యలు అటువంటి దానిలో నిన్ను త్రోసివేస్తారు; లేదా నీవు నీ స్థానాన్ని తీసికొని బయటకు రావాలి. నీ స్వభావాన్ని నీవు ప్రతిబింబించాలి. అప్పుడు ఆమె ఏం చేయబోతున్నది.

186, “సంఘ సమాఖ్యను" వారు ఏర్పరచిన తరువాత, నీవు కొనలేవు, అమ్మలేవు.
"అదెప్పుడు జరుగు?"నని నీవు అడగొచ్చు. లేదు, లేదు, అప్పటికే కెమెరా నీ ఫోటో తీసింది. నీ స్వభావం ఇప్పటికే నీకు చెప్పింది. నీవందులో ఇదివరకే వుంటివి. చూసావా? దాని గూర్చి బైబిలు ఏమి చెప్పిందో మీకు తెలుసా. "వారు వచ్చి, 'ఇదిగో ప్రభువా ఇప్పుడు మేము వస్తున్నాము' అని చెప్పగా అప్పటికే అది మరీ ఆలస్యమైపోయింది, తలుపులు వేయబడ్డాయి" చూసారా? చిన్నవధువుకు ఏమి జరుగబోతోంది?

187. ఈ చిన్న కథలో నేను దానిని గూర్చి ఆలోచిస్తున్నాను. ఏమి జరిగిందో చూచినప్పుడు, ఆ చిన్నపిల్ల గట్టిగా అరచి, పైకీ క్రిందకూ ఎగురుచూ, చచ్చేంత భయపడినప్పుడు, ఆ చిమ్మ చీకటిలో, ఒక్కసారిగా తనకు వున్నదంతా తీసివేయబడింది. ఆ చిన్న పిల్లవాడు అరిచి, తనకున్న స్వరమంతటితో గట్టిగా చెప్పాడు, "భయపడవద్దు, చిన్నచెల్లీ వెలుగును ప్రసరింపచేయగలవాడు మనకున్నాడు".

188. భయపడవద్దు, చిన్న సహోదరీ, వెలుగును ప్రకాశింపచేయగలిగే వ్యక్తి ఒకరిని మనం కలిగియున్నాం. చూడండి. దేవుని వాక్యం ఏది చేయవలెనో దానిని చేయించగలిగే వ్యక్తి. ఆ వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన స్వభావముతో నీ స్వభావమును ప్రతిబింబించనివ్వు ప్రార్ధించుకుందాం.

189. భయపడవద్దు, చిన్న సహోదరీ, వెలుగును ప్రసరింపచేయగలవాడు, మనకున్నాడు. నీవెక్కడున్నా, ఈ మధ్యాహ్నం నీస్థానాన్ని నీవు చూచివో, లేదో అది నీకే వదిలేస్తున్నాను. వరుసలో ఎక్కడున్నావో నీకు నీవే చూచుకొనునట్లు నీ స్వభావమే చేయును. దానిగూర్చి గంటలు గంటలు మనం చెప్పుకోవచ్చు. నీ ప్రస్తుత స్వభావము ఏమిటి? ఇప్పుడు మనం ప్రార్ధన చేసుకుందాము, నీవు కూడా ప్రార్థన చేయి. ఇప్పుడు గుర్తుంచుకోండి. అక్కడ మనం కలిసేంత వరకూ, నేను మిమ్మల్ని ఎన్నడూ చూడకపోవచ్చు. మీరు నన్ను ఎన్నడూ చూడకపోవచ్చు. ఇప్పుడు నీ ప్రస్తుత స్థితిలో, నీవెవరివో నాకు అక్కరలేదు. ఈ ప్రస్తుత స్థితిలో, నన్ను కూడా అక్కడ వుంచుకొను చున్నాను, నా ప్రస్తుత స్వభావము ఈ మధ్యాహ్నము ఏమి ప్రతిబింబిస్తున్నది? నేను ఎక్కడ గుర్తించబడుచున్నాను?

190, పరలోక తండ్రీ, ఈ క్షణం, మా హృదయాలను పరిశోధించండి. మార్పుకోసం ఒక క్షణము మాత్రమే తీసికొనును. క్రీస్తులోవున్న మనస్సు మాలోనికి రానివ్వండి. "క్రీస్తునందున్న మనస్సు మీరును కలిగివుండండ"ని బైబిలు చెప్తుంది. అదే మా స్వభావాన్ని మార్చును. ఈ మధ్యాహ్నాం, ఈ సుదీర్ఘ ప్రసంగములో, మేము ఏమి తెలుసుకోవలెనని నీవు ఆశిస్తున్నావని నేను నమ్ముచున్నాను, దానినే సామాన్యరీతిలో ప్రజలకు చూపించాను, దేవా, క్రీస్తునందున్న మనస్సు నాలో వుండనియ్యండి. ఎక్కడైనా నీ వాక్యానికి 'ఆమేన్' చెప్పి తరువాత దానిని వెంబడించక పోయినట్లయితే, ప్రభువా, నన్ను మార్చండి, మరలా నన్ను మలచండి. నేను నీ దాసుడను, ప్రభువా, నేను అలా వుండాలనుకుంటున్నాను. నాకు మీరు సహాయం చేయండి. ఇక్కడ వున్న వారందరికీ సహాయం చేయండి ప్రభువా.

191. మరిప్పుడు వారిని నీకు సమర్పించుచున్నాను. జగత్తుపునాది వేయబడక మునుపే నీ ఆలోచనలో వున్నవారు ఇక్కడ వున్నట్లయితే, ఖచ్చితంగా వారికి ఇదొక మేలుకొలుపు.
ఇక్కడ వున్న వారందరూ అయి వున్నారని నేను నమ్ముచున్నాను. మరక్కడ, తండ్రీ నీవు వచ్చినప్పుడు మరియు పుస్తకము తెరువబడినప్పుడు మేము అర్ధం చేసుకుంటాము. మరియు ఎవరైనా దారి తొలగిపోయి వుంటే, దేవా, వారిని తిరిగి ఈరోజు తీసుకొని రమ్మని, నీతియు మరియు జీవము యొక్క మార్గములోనికి తిరిగి తీసికొని రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మేము నీ చేతిలో వున్నాము. మాకు ఏది తగినదో దానినే చేయండి. ఈ శ్రోతలను ఈ కూడిక విజయ చిహ్నాలుగా నీకిచ్చుచున్నాను. యేసు నామములో ఆమేన్.

192. ఇప్పుడు వేదిక పిలుపుకు సమయం లేదు. అయితే వేదిక పిలుపు నీ హృదయంలో వుండాలని కోరుచున్నాను. నీ ప్రస్తుతస్థితిలో నీవెక్కడ గుర్తించబడుదువు?

193. ఇప్పుడిలా ప్రసంగం చేసిన తరువాత రోగుల కొరకు ప్రార్ధన చేయడానికి అభిషేకం వచ్చేంత వరకు. పరిశుద్ధాత్మను నాకు సహాయం చేయుమని కోరుతాను. దేవా, నేను చెప్పిన ఈ సంగతులు సత్యముగా వుండనీయండి. అవి సత్యములే.

194. ఇప్పుడు, మీరంతా మీ స్థలములలో కూర్చుని, నిజముగా భయభక్తులతో, కొద్దిసేపు దయచేసి చూడండి. ఆయనను సంధించండి. 'ఇక్కడ' ఏదో ఒకటి వున్నది, మరియు ఏదో కదలాడుచున్నది. అది నిన్ను త్రోసివేస్తుంది. అది చాలా కష్టమైన కార్యము. సికార్...ఒక్కసారి అక్కడున్న ఆ స్త్రీకి అది చేయగలిగితే, అది ఒకసారి జరిగింది. మరలా మరలా యేసు దానిని చేయలేదు.

195. అయితే, అమెరికా ప్రజలు వినోదపరచబడాలి, తెలుసా. అది మన స్వభావం. మనం... చర్చిలో వుండుటకంటే ఇంటవద్ద వుండి, టీవీ చూడటమే మనం చూస్తాం, చూసారా? అది వినోదం. దాన్నే మనం కోరుకొంటాము. దేవుడు నిన్ను వినోదపరచడు. ఆయన కేవలం నిన్ను తన వాక్యం దగ్గరకి తెస్తాడు. చూసారా?

196. ఆయన దానిని ఆ స్త్రీకి చెప్పాడు మరియు వారు ఆ వేశ్య మాటను నమ్మవలసి వుండెను. అయితే, ఆ నగరం మొత్తం సిద్ధంగా వుండెను, చూడండి, జగత్తుపునాది వేయబడకమునుపే వారు దేవుని తలంపులలో వుండిరి.

197. ఇప్పుడు, ఈ మధ్యాహ్నము, దేవుడు దానినే మరలా చేయాలని నా దీన ప్రార్ధన. మిమ్మల్ని విడిచిపెట్టుచుండగా, ఆయన దీనిని మీతో విడిచిపెట్టును గాక, ప్రార్ధన.

198. బయటున్న మీలో ఎందరు... నాకు తెలిసిన ఒకరు కూడా లేరు. గుంపులో వున్నవారంతా, బహుశా, ప్రార్ధనా కార్డులు అన్ని చోటలా వుండి వుండవచ్చు. అయితే, అక్కడ కూర్చున్న వారిలో రోగముతో, అవసరతలోనున్న మీరు, మీ గూర్చి నాకేమి తెలియదు, మీ చేతులు పైకెత్తండి. అంతటా వున్నవారు. చూసారా? అందరు.

199. దేవుడు మనకు సహాయము చేయును గాక. ఎవరు కదలవద్దు. దయచేసి కదలవద్దు. ఇది ఒక గొప్ప కార్యము.

200. ఇప్పుడు, దీనిని చెప్పడం, వివరింప ప్రయత్నించాల్సిన పన్లేదు. దానిని ఏమి చేయాల్సింది లేదు. ఇప్పుడు, వాక్యమైన బైబిలు చెప్పుచున్నది, "ఆయన మన బలహీనతల
యందు మనతో సహానుభవము కలిగిన ప్రధానయాజకుడు" అదేనా.

201. ఇప్పుడు, కొన్నిసార్లు విశ్వాసము నీకు తెలియనదిగా వున్నది; నీవు దానిని కలిగియున్నావు, అయితే నీవు దానిని ఎరుగవు. నిన్ను నీవు దేనిలోనైనా నెట్టుకొన ప్రయత్నిస్తే, నీవు దానిని పోగొట్టుకుంటావు. దానికి పైగా వెళ్లిపోవాలి. అదెంతో తగ్గింపు మరియు సామాన్యమైనది, చూడండి. "ఆయన మన బలహీనతల యందు మనతో సహానుభవము కలిగిన ప్రధాన యాజకుడు” అప్పుడు, నీవు ఆయనను తాకినట్లయితే, ఇంతకు ముందు చేసినట్టే చేస్తాడు. అది అంతేనా? (సంఘము, “ఆమేన్”). ఇప్పుడు గమనించండి.

202. ఇక్కడ కూర్చొన్న స్త్రీని మీరు చూస్తున్నారా? ఈ చిన్న ప్రాణిని నేనెరుగను. ఆమె అక్కడ కూర్చొని వుంది, అయితే ఎలాగో దేవునిని సంధించినది. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్న పరిమాణంలో, నేను ఆ స్త్రీని చూస్తున్నాను మరియు ఏదో జరగటం ఆమె గమనిస్తున్నది. ఆమె యొక్క పిల్లల కోసం ఆమె ప్రార్థిస్తున్నది. వారు ఇక్కడ లేరు, అది సరియే. నాకు ఆమె పరిచయం లేదు. నేను ఆ స్త్రీని ఎన్నడూ చూడలేదు. కొందరు పిల్లలను గూర్చి ఎంతో భారముతో ఆమె వుంది.

203. నేను ఆయన సేవకుడనని నీవు నమ్ముచున్నావా? యేసుక్రీస్తు ఇక్కడ వున్నాడని నమ్ముచున్నావా? పరిశుద్దాత్మను, చూడండి, మనము దారిలో నుండి తొలిగిపోతే, చూసారా? ఇప్పుడు, నిన్ను స్వస్థపరచడం, నేను చేయలేను, చూసారా? లేదా, నీ కోరికను నేనివ్వలేను, చూడండి. అది దేవునినుండి రావలెను, ఆయన ఏదైననూ మీకు చెప్పవలెనని చెప్పమంటే తప్ప, ఇప్పుడు ఆ బిడ్డ సమస్య ఏమిటో ఆయన నాకు బయలుపరిస్తే, లేదా అదేదైనా, నేను ఆయన సేవకుడనని నీవు నమ్ముతావా? నీవు నమ్ముతావు.

204. ఇప్పుడు, ప్రేక్షకులందరు, మీకిష్టమైతే ఇక్కడే ఈ స్త్రీ కూర్చొని వున్నది. నీవు లేచి నిలబడగలవా? ఇప్పుడు, బైబిలు నాముందు వుంది, ఈమె ఎవరో నాకు తెలియదు. ఈమెను ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు, ఇక్కడ, సికారు ఇప్పుడే రండి.

205. దయచేసి, అందరూ భయభక్తితో వుండండి. చూశారా? మీరు ఏదైనా చూచినప్పుడు... చూడండి. అదొక ఆత్మ, అది కదలాడుతున్నది. నన్ను త్రోసివేస్తుంది.

206. అవును, ఆ స్త్రీకి ముగ్గురు పిల్లలున్నారు, వారికోసం ప్రార్ధిస్తున్నది, ఆ ముగ్గురు నీడ క్రిందున్నారు. వారు క్రైస్తవులు కారు. వారు రక్షింపబడలేదు. అది సరియే, వారిలో ఒకరు అమ్మాయి మరియు ఆమెకు కాలుపైన పుండు వున్నది. అది సరియే, కాదా? ఒకరు, వారి కళ్ళలో ఏదో ఇబ్బంది, అబ్బాయిలలో ఒకరు, ఇంకొకరికి గుండె సమస్య, మరియు త్రాగుబోతుగా వున్నాడు. అది నిజం. అదేనా నీ కోరిక? దేవుని నుండి కావాలని అనుకుంటున్నది అదేనా? (సహోదరి, “ఆమేన్” చెప్పుచున్నది సంపా॥) నేను అడుగుచున్నాను. నీకు ఇంకేమైనా కావాలా?

207. ఇక్కడ ఒక స్త్రీ వున్నది, నేను దానిని చెప్పగానే, అది ఆమెను కలవర పరచింది. ఇక్కడే ఈ వెనకాలే ఆమె కూర్చొని వున్నది. కీళ్ళవాపు వ్యాధితో ఆమె బాధపడుచున్నది.
ఆమె పేరు కుమారి థామ్సన్, ఆమెకు తెలియదు... అవును. నీకు నాకు పరిచయం లేదు. జీవితంలో నేనెన్నడు నిన్ను చూడలేదు, అయితే నీవు అదే అయియున్నావు. ఓ స్త్రీ, నేను ఆయన సేవకుడనని నీవు నమ్ముచున్నావా? నేను చెప్పినది సత్యమని అది దేవునినుండి వచ్చిందని నమ్ముచున్నావా? కీళ్ళవాపు వ్యాధితో బాధపడుచున్నావు.

208. నీ ప్రక్కన కూర్చొని వున్నది నీ భర్త. అతడు కూడా బాధపడుచున్నాడు. అతనికి రక్తనాళాలలో ఏదో సమస్య వుంది. అది “రక్తనాళాలు గట్టిపడుట" అని అంటారు. అది సరియేనా. అతని పాదాలలో కూడా ఏదో సమస్య వుంది. అది నిజం. మద్యం మానేయడానికి నీవు ప్రయత్నిస్తున్నావు, నేను ఆయన సేవకుడనని నమ్ముచున్నావా? దేవునిసేవకుడిగా నన్ను అంగీకరిస్తావా? యేసుక్రీస్తు నామములో నిన్ను దానినుండి విడుదల చేస్తున్నాను. అయ్యా, నీవు నమ్ముచున్నావా? క్రీస్తుకు నీ హృదయం ఇవ్వు. బాప్తిస్మము గురించి సేవకులను సంప్రదించు. నీకు ఆ కార్యము ముగించినది. నీవు కేవలం నమ్ము.

209. నీవు నమ్ముచున్నావా? "నీవు నమ్మితే!" హనీ, నీ ప్రక్కలో ఏదో సమస్య వుంది కదూ? నీవు నీ పూర్ణహృదయంతో నమ్మితే, దేవుడు దానిని స్వస్థపరుస్తాడు.

210. అక్కడ నీ ప్రక్కన కూర్చొని వున్న నీకు మధుమేహం వుంది. దేవుడు నీ మధుమేహ వ్యాధిని స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా?

211. గుండె సమస్య, నీ గుండె సమస్యని దేవుడు స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా? సరే, అయ్యా.

212. ప్రక్కనున్న నీకును గుండెసమస్య. దేవుడు గుండె సమస్యని స్వస్థపరుస్తాడని నమ్ముచున్నావా? ప్రక్కనున్న? నిజమేనా. ఆయన దాన్ని చేస్తాడని నమ్ముదువా? ఊ!

213. ఇక్కడ కూర్చొన్న పెద్దావిడ. నిన్ను నీవు గుర్తించుకోవడం గూర్చి, కొద్దిసేపటి క్రితం నేను ప్రసంగం చేస్తున్నప్పుడు, ఆమె నావైపు నేరుగా చూసినది. నీవు అప్పుడే స్వస్థపరచబడ్డావు, నీకు కిడ్నీ సమస్య వుండెను. అది నిజమైతే, నీవు లేచి నిలబడు, చూడండి? నిన్ను నీవు గుర్తించుకోవడం గూర్చి నేను చెప్తున్నప్పుడు, నీవు వింతైన అనుభూతిని పొందలేదా? మరి నిజంగా వింతైన అనుభూతిని నీవు పొందావు. నీవు సరిగ్గా నావైపుకు నేరుగా చూసావు. అప్పుడే అది జరిగింది. నీవు బాగుపడ్డావు. ఇంటికి వెళ్లు. కేవలం దేవుని నమ్ము. అంతే. చూడండి, వాక్యము ప్రత్యక్షపరచబడింది.

214. అయ్యా, ఊపిరి పీల్చుకోండి. ఆ గుండె సమస్యను స్వస్థపరచి, దేవుడు నిన్ను బాగు చేయగలడని నీవు నమ్ముచున్నావా? వెంట్రుకలు నెరసి, చక్కని రూపమున్న వ్యక్తి అక్కడ కూర్చొన్నాడు, నీ గుండె సమస్యను దేవుడు స్వస్థపరచగలడని నమ్ముచున్నా వా? అక్కడ నీ భార్య కూర్చొని వున్నది. నీ భార్య సమస్య ఏమిటో, దేవుని సహాయముతో చెప్పినచో నీవు నమ్మెదవా? అది రక్తహీనత, రక్తములో సమస్య. అది సరేనా. మీ ఇద్దరిని దేవుడు బాగుచేస్తాడని నమ్ముదువా? నమ్ముదువా? దానిని అంగీకరిస్తున్నావా?

215. ఆమె ప్రక్కనే కూర్చొని వున్న స్త్రీ. అది (వెలుగు) అక్కడకు వెళ్ళడం చూస్తున్నారా?
ఆమె వీపులో ఆమెకు సమస్య వున్నది. దేవుడు నీ వీపులో సమస్యని స్వస్థపరచి నిన్ను బాగుచేస్తాడని, స్త్రీ నీవు నమ్ముచున్నావా?

216. నీ ప్రక్కనే వున్న వ్యక్తికి కీళ్ల వాపు వ్యాధి. అయ్యా, దేవుడు నీ కీళ్ల వాపు వ్యాధిని స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా? దానిని నీవు అంగీకరిస్తున్నావా? నీ చేతిని ఎత్తావు. మంచిది.

217. నీప్రక్కనే కూర్చొని తిన్నగా నావైపు చూస్తున్న ఆ చిన్నస్త్రీ గూర్చి ఏమిటి? అవును, ఆమె తన తల్లికోసం ప్రార్ధన చేస్తున్నది. ఆసుపత్రిలో తల్లి వుంది, అంటురోగము తో వుంది, అది సరియే.

218. ఆమె ప్రక్కనే వున్న నీవు నీ చేతిని పైకెత్తుము, సహోదరి. తల్లి కొరకు నీవు ప్రార్థించుటలేదు. ఈమె అసుపత్రిలో వున్న తన తల్లి కోసం ప్రార్థిస్తున్నది. మరి, ఐతే నీతండ్రికి, అతనికి క్యాన్సర్ వుంది, మరి అతని కొరకు ప్రార్ధిస్తున్నావు, అది సరియే. చూశారా?

219. ఆ తరువాత వున్న స్త్రీకి ఊపిరితిత్తుల సమస్య. ఊపిరితిత్తుల సమస్యను దేవుడు స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా?

220. ఇప్పుడు, చూడండి, అది ఇప్పుడే నన్ను పట్టుకుంది. కాబట్టి, నాకు కనిపించడం లేదు, ఇంచుమించు, ఇరవై లేకపోతే ముప్పైమందిని దాటి.

221. ఏమిటి, ఇప్పుడు నీవు ఎక్కడ గుర్తించబడ్డావు? "నేను విశ్వాసిని, నేను దేవునిని నమ్ముచున్నాను. లేకపోతే, ఇది ఆయనేనని నమ్ముచున్నానని నీవు గుర్తించు కుంటున్నావా? లేదా, “దేవుడు దాన్ని వాగ్దానం చేసాడు. నాడు యేసు ఏమి చేసాడో, దాన్నే నేడు మరలా చేయును. లోకము నాశనమగుటకు ముందు సొదొమ దినాలలో మనం జీవిస్తున్నామని నేను నమ్ముచున్నాను. సొదొమ నొద్ద ప్రత్యక్షమై నట్లు, మరలా తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడని యేసు వాగ్దానం చేశాడు. చెప్పే ఈ వాక్యముతో నిన్ను నీవు గుర్తించుకుంటావా? దీనిని నీవు నమ్ముచున్నావా? (సంఘము “ఆమేన్” చెప్పుచున్నది సంపా॥)

222. అయితే, ప్రార్థనా కార్డులు కలిగినవారంత, ఈ వరసలో ఇక్కడ గోడ వెంబడి ఇలా నిలబడండి. మీరున్న చోటనుండి ఈ గోడ వెంబడి ఇటు వైపు నిలబడండి.

223. ఇప్పుడు ఈ భాగంలో, మధ్యభాగంలో ప్రార్ధనా కార్డులు వున్న వారంతా, ఈ ప్రక్కన వున్న భాగంలో ఇలా నిలబడండి. కదలకండి, చూడండి. ఈ భాగంలోనే చూడండి, తిన్నగా వెళ్ళండి...

224. ఇప్పుడు ఆగండి, ఈ ప్రక్కనున్న గుంపు, ఇలా నిలబడండి. చూడండి, ఇటువైపు తిరగండి. ఈ గుంపు చుట్టూ వెళ్లి, ఇటువైపు వచ్చి, ఇక్కడ కలవండి.

225, ఇప్పుడు, మరో భాగంలో వున్నవారంతా, ప్రార్ధనా కార్డులు కలిగినవారు, ఈ భాగంలో నిలబడండి, ఇలా సరే. ఇక్కడకొచ్చి, వెనక్కి వెళ్లి, వీళ్లను ఇలా కలవండి.
226, మీరిప్పుడు పూర్తి అపజయాన్ని చూస్తారు లేకపోతే, దేవుని మహిమనైన చూస్తారు. నేడు మీరు ఎక్కడ గుర్తించబడుదురు? విశ్వాసులతోనా లేక వినోద పరచబడవలెనా లేక దేవున్ని మీరు నమ్మబోవుచున్నారా? బైబిలు కాలంలో కొంతమంది, పరిశుద్ధ పేతురు తన పేరుతో సంతకం కూడా పెట్టలేని జాలరి, అతని నీడ, ఈ రోజు ఇక్కడ మీరు చూసిన అదే సూచనను చూపించెను, ప్రజలను దాటుకొని వెళ్లినప్పుడు, వారు స్వస్థపరచబడ్డారు. అది సత్యమని ఎంతమందికి తెలుసు? (సంఘము “ఆమేన్” చెప్పుచున్నది సంపా॥)

227. ఇప్పుడు, సహోదరులారా, మీరు విడిచిపెట్టబడలేదు. వీరిక్కడ వుండగా, అలా అది వచ్చును. వచ్చి ఇక్కడ నిలబడండి (బ్రదర్ బ్రెన్హామ్ తిరిగి సేవకులతో మాట్లాడిరి. టేపులో ఖాళీ వుంది. సంపా॥)

228. రోగుల కొరకు ప్రార్ధన చేయుట యందు నమ్మకమున్న కాపరి ఎవరైనా వున్న యెడల, ప్రవచనాత్మక గడియలో వున్న, సువార్తికుడుగా వివేచనవరం కలిగి, నేను నిలబడి వుండగా, ప్రజలైన మీరు మీ కాపరిని ఎవరికంటే తక్కువగా ఎంచవద్దు. నేనైనా మరెవరైనా అదే అధికారాన్ని కలిగిన క్రీస్తు సేవకుడుగా వున్నాడు. మన అధికారం యేసుక్రీస్తే. వారందరు నాతో కలిసి ప్రార్ధించుటకు పిలువబోవుచున్నాను.

229. ఇప్పుడు, దైవీక స్వస్థతతో విశ్వాసముంచున్న ప్రతీ కాపరి, నాతో ఇక్కడ నిలబడాలనుకుంటున్నవారు, మీరు వచ్చి నాతో నిలబడి, నేను రోగల కొరకు ప్రార్ధన చేయుచుండగా, కాపరులైన మీరు ఎవరైనా రావాలనుకునేవారు, ఈ కాపరుల గుంపు, సమర్పిస్తున్న కాపరులు నేను వారిని అక్కడ అడిగాను, వారు "కాపరి ఏ సంఘానికి చెందిన వాడని ఎటువంటి బేధము లేదు” అన్నారు. మీరు ప్రెస్బెటేరియన్ అయిననూ, లూథరన్ లేక కథోలిక గురువు అయిననూ, నీవు క్రీస్తు వర్తమానాన్ని నమ్మినట్లయితే, దైవీక స్వస్థతను నమ్మినట్లయితే ఇక్కడకు వచ్చి మాతో వుండండి. క్రీస్తు సేవకుడిగా, ఖచ్చితముగా మిమ్మల్ని మీరు మనుషుల నుండి వేరు చేసుకోరు. వారు మీ సంఘానికి చెందినా చెందకపోయినా మీరు వారి నుండి మిమ్మల్ని వేరు చేసుకోరని మీరు నమ్మెదరు. రోగులపై చేతులుంచితే వారు స్వస్తపరచబడునట్లు, ఇక్కడకు వచ్చి నాకు సహాయము చేయుటకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను.

230. సరే. ప్రార్థనావరుసలు మొదలుపెట్టుటకు సిద్ధమని అనుకొంటున్నాను. సహాయకులు వచ్చి వారి స్థానాలను తీసికోవల్సిందిగా కోరుచున్నాను.

231. ఇప్పుడు, తద్వారా... ప్రతి ఒక్కరు అర్థం చేసుకొందురు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వింటున్నారా? “ఆమేన్” చెప్పండి (సంఘము “ఆమేన్ చెప్పుచున్నది- సంపా) మరలా చెప్పండి. (సంఘము "ఆమేన్ చెప్పుచున్నది. -సంపా) చూడండి, నేను మీకు... 232. ఇప్పుడు, నేను ఒక్కొక్కరిని తీసుకొని, అక్కడ నిలబడి ప్రార్థన చేసి, వివేచన చెప్పుటను చేయలేను. ఐదారు మందిని చూస్తే, వారు నన్ను ఈ భవనము నుండి తిసుకొనిపోతారు. మీకది తెలుసు.
233. యేసు. ఒక స్త్రీ ఆయన్ని తాకింది. ఆయన తిరిగి ఆమె సమస్యని అంతటినీ ఆమెతో చెప్పాడు. మరియు, ఆయన, “నా నుండి ప్రభావము వెడలిపోయెను" అని అన్నాడు. బలము. ఒకవ్యక్తి. అది శరీరమందు ప్రత్యక్షమైన దేవుడు.

234. అది ఆయన్ని ప్రత్యక్షపరచుటకు ఒక చిన్న వరము, నేటికి వాగ్దానము చేయబడిన ఒక వరము గమనించండి. స్నేహితుడా.

235. పేతురు, ఒకసారి, దోర్కా అని పిలువబడిన ఒక స్త్రీ, చనిపోయినప్పుడు, అక్కడకు పిలువబడ్డాడు, మీ అందరికి అది గుర్తుందా, “ఆమేన్” చెప్పండి (సంఘము "ఆమేన్ చెప్పుచున్నది. - సంపా॥) మరియు అతను వెళ్లి, మోకరించి ప్రార్ధన చేసిన తర్వాత దొర్కా మీద చేతులుంచాడు. మరియు ఆమె బ్రతికింది. నిజమేనా? (ఆమేన్)

236. ఇప్పుడు, సహోదరులారా, మీరును ఈ సంఘము నాతో ఏకీభవించ గోరుచున్నాను. ఇటు చూడండి, ఇక్కడ ఇంచుమించు ఐదు వందలమంది, లేక అంతకంటే ఎక్కువమంది ఈ మధ్యాహ్నం ప్రార్ధించబడుటకొరకు నిలబడియున్నారు. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరం విశ్వాసంతో కూడిన ప్రార్ధన చేద్దాం. అంతట ప్రజలు వచ్చుచుండగా, అది జరుగబోతున్నట్టు మీరు విశ్వాసముతో మీచేతులను వారిమీద ఉంచండి. నేను నా హృదయమంతటితో నమ్మబోవుచున్నాను.

237. పరలోకమందున్న మా తండ్రి, ఇక్కడ ఆ గొప్ప కవాతు మొదలగుచున్నది. ఈ సేవకుల చేతులక్రింద వందలమంది ప్రజలు దాటిపోతారు. ప్రభువా, వారు సిలువక్రింద దాటి పోవుచున్నారని వారు గ్రహించుటకు సహాయము చేయండి. ఈ కార్యాన్ని చేయుటకు రక్తము చిందించిన స్థలములో వాస్తవముగా వుండుటకు మేము చేయుచున్నాము. ఎందుకంటే, సిలువలో వ్రేలాడినవాడు చెప్పాడు, "నమ్మినవాని వలన ఈ సూచక క్రియలు జరుగును, రోగులపై చేతులుంచిన యెడల వారు స్వస్థత నొందెదరు", మరియు ప్రజలు దానిని అంగీకరించెదరు గాక,

238. 'ఇచ్చయించేవాడు' ఎవడైనను నీవు రక్షించెదవని వాగ్దానం చేసావు. 'ఇచ్చయించనివాడు' నిన్ను నమ్మడు గనుక నీవు లోకమును రక్షించలేవు. నీవొక పట్టణమునకు వెళ్ళావు. అయితే వారి అవిశ్వామునుబట్టి నీవు అక్కడ అనేకమైన అద్భుతములు వారి మధ్య చేయలేకపోతివి.

239. అదేరీతిగా, హృదయాంతరంగము నుండి పూర్తి అంగీకారముతో, దేవుని వాక్యముతోను, ఆ కార్యము జరిగిపోయిందని, విశ్వాసులతో తమనుతాము గుర్తించుకోకపోతే, ఈ వరుసలో వచ్చే ఏ ఒక్కరికి కూడా నీవు సహాయం చేయలేవు. ఈ గొప్ప గుర్తింపు ఇప్పుడు వచ్చునుగాక, ఈ ప్రజలు ఈ సేవకుల చేతుల క్రింద దాటి పోవుచుండగా, దేవుని ఆజ్ఞను చేసివున్నారని పరిశుద్ధాత్మ వారి హృదయములో పెట్టును గాక, దేవుని రాజ్యనిమిత్తం వారు స్వస్థతనొంది, సంతోషించుచు ఇక్కడనుండి వెళ్ళుదురు గాక, ఈ పనిద్వారా దేవా, మేము నీకు లోబడితిమి, యేసుక్రీస్తు నామములో ఆమేన్.

240. నాకొకరు కావాలి, రాయ్ నీకిష్టమైతే ఇక్కడికిరా, "ఓన్లీ బిలీవ్" పాడుము. మిగిలిన
వారంతా మీ తలలు వంచి, ప్రార్ధించండి.

241. ఇప్పుడు, ఈ తల్లులు, తండ్రులు, పిల్లలు, రోగులైన చిన్నబిడ్డలు, క్యాన్సర్తో చనిపోతున్నారు, అది నీవేయైతే, యదార్థంగా వుండే ఒకరిని నీవు కోరుకుంటావు. మేము యదార్థంగా ఉండగోరుతున్నాము.

242. ఇప్పుడు, మనమందరం తలలు వంచుదాము. రోగుల కొరకు ప్రార్ధించడానికి నేను ఈ సహోదరుల మద్యకు వెళ్తాను. (బ్రదర్ బ్రెన్హామ్ మరియు సేవకులు రోగులపైన చేతులుంచి ప్రార్థనవరుసలో వున్నవారికి ప్రార్ధించుచున్నారు. టేపులో ఖాళీ వుంది -సంపా॥)

243. ఈ సహవాసంలో ఇది అత్యంత అద్భుతమైన సమయంగా వుందని మీకు తెలుసా, మరియు ఈ మధ్యాహ్నం నేనొక సంగతిని గమనించాను, మీరు గమనించారో లేదో నాకు తెలియదు. స్వస్థపడిన వారిలో తొంభై శాతం ప్రజలు, నా దగ్గరకు రాకమునుపే, స్వస్థపడ్డారు. ఇక్కడకి రాక మునుపే వారు దేవుని స్తుతించుచూ, అరచుచూ వున్నారు. ఇప్పుడు ఈ చేతి గుడ్డల కోసం మనం ప్రార్ధించబోవుచున్నాము.

244. ప్రభువైన యేసూ, "పరిశుద్ధ పౌలు శరీరము నుండి వారు తీసికొనిరని” బైబిలులో వారు చెప్పుటను మేమెరిగియున్నాము. అతడు పౌలు కాబట్టి కాదు అతడు నీసేవకుడిగా వున్నాడు, ప్రభువా. అతడు నీ రాయబారిగా వున్నాడు, "రోగములు, వ్యాధులు వెడలిపోయెను" అని వారన్నట్టు మాకు తెలుసు. ఎంతోమంది కూడికకు హాజరు కాలేకపోయారు, వారికి ప్రాతినిథ్యంగా చేతి గుడ్డలను పంపించారు. దేవా, ప్రభువు దూతను పంపించండి. ఆయనే ఆ ఎర్ర సముద్రమును చూచినది, దానిని భయపెట్టినది, మరియు ఇశ్రాయేలు వారి వాగ్దానమునకు వెళ్లిపోయిరి. ఇది కూడా అలాగే వుండునట్లు, దయచేయండి. ప్రభువా, ఈ చేతిరుమాళ్లు రోగులపై వుంచినప్పుడు, రోగులను స్వస్థపరచును గాక. దేవుని రాజ్యము కొరకు, యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.

245. ఇప్పుడు, మీతో ఒకటి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఈ చక్కటి సేవకులను అభినందిస్తున్నాను, ఈ వరుసలోవున్న వారంతా వారు తమ సమయోచితమైన సహాయమందించారు. మరి సహోదరులారా, ఇక్కడ వివేచనాకార్యము జరుగు చుండగా, మీరు తీసికొని వుండవచ్చు. మీరు దేనిని గూర్చి ప్రార్ధన చేస్తున్నారో నాకు తెలియదని, అయితే ప్రభువైన యేసు దానిని జ్ఞాపకం చేసికొన్నాడు. నాకు తెలుసు...

246. నీ తల్లిని గూర్చి చింతించవద్దు. ఆమె బాగపడుతుంది.

247. మరియు అక్కడ కూర్చొన్న నీవు, స్త్రీకి సంబంధించిన సమస్య మరియు సైనస్ సమస్యతో వున్నావు, నాకు తెలుసు. దానిని నీవు జయిస్తావు. చింతించకు.

248, చూడండి, ఇక్కడ మాకు ముందు ఆయన వుండినట్లే అది మా వెనుక వుండెను. మరియు ఆయన అన్నిటిని ఎరిగియున్నాడు. చూశారా? ఇప్పుడు, నీవు ప్రార్ధనా వరుసగుండా వచ్చావు, కూటానికిముందు నన్ను అభిషేకించిన అదే దేవుడు ఇక్కడ
వుండి అదే కార్యాల్ని చేస్తున్నాడు. చూశారా? మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా వున్నాడు.

249. మీరాయనను నమ్ముచున్నారా? (సంఘము "ఆమేన్ చెప్పుచున్నది సంపా) ఓ, ఆయన అద్భుతకరుడు కాదా? (ఆమేన్) ఇది గొప్ప సంగతి కాదా? అవును.

250. “క్రైస్తవ ప్రేమలో మన హృదయాల్ని కట్టే బంధకం ధన్యమైనది" అను పాట ఎంతమందికి తెలుసు? సహోదరి, దీనికి సంగీతం అందించగలవా? నేను దీనిని పాడాలనుకుంటున్నాను. ఎందుకో నాకు తెలియదు, కాని దీనిని పాడుదాము. ఆయన ముందు భయభక్తులతో నిలబడి పాడండి, అందరూ కలిసి పాడండి. కట్టివేసే బంధకము ధన్యమైనది క్రైస్తవ ప్రేమలో మన హృదయాల్ని. పసిమనస్సుల యొక్క సహవాసము పైనున్న దానివలె వున్నది" ఇదొక పాతకాలపు పాట “మనము విడిపోయినప్పుడు, మనం చేతులు పైకెత్తుదాం అంతరంగ బాధను అది కలుగజేయును; అయితే మనమింకనూ మన హృదయంలో కలిసే వుండెదము. మరలా కలుసుకొనుటకు ఆశించెదము. మీరు దానిని ప్రేమింపలేరా?... కలిసేవరకు.

251. మరలా మనం కలిసే వరకు, ఇప్పుడు, మనమంతా కలిసి “మరలా మనము కలిసే వరకు" మనమంతా కలిసి.

“మనము కలిసే వరకు! మనము కలిసే వరకు! యేసు పాదాల వద్ద మనము కలిసే వరకు, మనము కలిసే వరకు! మనము కలిసే వరకు!

మరలా మనము కలిసే వరకు దేవుడు నీతో వుండును గాక!

252. ప్రార్ధనలో తలలు వంచుదాం. ఇక్కడ వున్న కాపరి వచ్చి సహోదరుడా, ఏదైనా చెప్పండి, లేకపోతే సభను ముగించాలని కోరుచున్నాను. మరలా మిమ్మల్ని చూచేవరకూ దేవుడు మీతో వుండును గాక. నా కోసం ప్రార్ధించండి. నేనాయనను ప్రేమిస్తున్నాను. ఆమేన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...