ఈ దినము కొరకు దేవుడేర్పాటు చేసిన మార్గము

ఈ దినము కొరకు దేవుడేర్పాటు చేసిన మార్గము

1.
లేఖనములు.
వాటిని ఈ రాత్రి నేను కలిగియున్నందుకు నిశ్చయముగా నేను సంతోషించుచున్నాను.
(టేపులో ఖాళీ వున్నది - సంపా).
ప్రభువు చిత్తమైతే కొద్దిగ సేపు ఒక చిన్న అంశం కొరకు లేఖనములను త్రిప్పుదుము.
2.
మరొకసారి రోగుల కొరకు రేపు రాత్రి ప్రార్థించుటకలదని గుర్తుంచుకోండి.
నేను భోధించునప్పుడు.
వినండి, చేయుటకు ప్రతి ఒక్కరు ప్రయత్నించండి, ఏదో జరగాలని ఎదురుచూడొద్దు.
మీరు చేయవల్సిందల్లా, ఉన్నపాటునే దేవున్ని విశ్వసించండి.
ఇప్పుడే ఆయనను విశ్వసింపుము.
చూశారా?
3.
ఇప్పుడు అన్ని రకములైన ప రిచర్యలున్నవి.
ఈ అంత్యదినములయందు దేవుడు మనకు ఇచ్చెదనని తన వాక్యమునందు చెప్పినవాటన్నిటిని అనుగ్రహించుచున్నాడని నేను నమ్ముచున్నాను.
ఆయన వాగ్దానము చేసిన ప్రతిదానిని, మనము చూచితిమి, అయితే ప్రజలు దానిని ఇంకనూ గ్రహించినట్లుగా కనబడుటలేదు.
దానిని గ్రహించుట (పట్టుకొనుట) కు ఎవరైతే ముందుగా నిర్ణయించబడిరో, కేవలం వారు మాత్రమే వాటిని గ్రహించుదురు.
కొందరిని అవి గ్రుడ్డి వారినిగా చేయును, మరికొందరికి కనువిప్పు కలుగజేయును.
4.
గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు నిన్న నేడు, నిరంతరం ఒకటేరీతిగా ఉన్నాడని మనము నమ్ముదుము.
ఆయన మరణమొందుటయే కాదు, మరణములోనుండి తిరిగిలేచి నిరంతరము సజీవుడుగా ఉన్నాడు.
మరి ఆయన ఇప్పుడు ఇక్కడ వున్నాడు.
ఈరాత్రి మనము ఆయన సన్నిధిలో వున్నాము.
ఈ దినమునకు ఆయన చేసిన ప్రతివాగ్దానమును నెరవేర్చుట కొరకు ఆయన ఇక్కడ ఉన్నాడు.
ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటేరీతిగా ఉన్నాడు.
ఒకప్పుడు ఆయన ఎలా వున్నాడో మరిప్పుడును ఈ రాత్రి ఆలాగే ఉన్నాడు.
గనుక రాబోయే పదిహేను లేక ఇరువది నిముషముల పాటు ఆయన వాక్యమును చదివి, ఆయన గూర్చి చెప్పుకొనుట ద్వారా మనము ఆయన యందు విశ్వాసముంచెదము.
5.
ఆదికాండము 22వ అధ్యాయము 7 మరియు 8 వచనములలోనుండి ఒక అంశమును తీసికొనెదము.
ఆది 22:7,8 ఇస్సాకు తన తండ్రియైన అబ్రహాముతో - నా తండ్రి అని పిలిచెను; అందుకతడు - ఏమి నా కుమారుడా అనెను.
అప్పుడతడు - నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము - నా కుమారుడా, దేవుడే దహనబలికి.
గొఱ్ఱపిల్లను చూచుకొనునని చెప్పెను.
6.
ప్రభువైన యేసూ, నీ వాక్యమును దీవించుము, నిష్పలముగా అది వెనుకకు మరలకుండును గాక.
విత్తనములు భూమిలోపడి, ఆత్మీయ, భౌతిక అవసరతలలో వున్నవారికి అవి రక్షణను తెచ్చును గాక.
మమ్మును నీకు సమర్పించుకొనుచున్నాము.
సమాజమును, శ్రోతలను, వాక్యమును, పాఠ్యాంశమును, అంశమును నీకు అప్పగించుచున్నాము.
యేసుక్రీస్తును మేము చూచునట్లుగా పరిశుద్ధాత్మకు మమ్మును మేము అప్పగించుకొనుచున్నాము.
ఆమెన్.
7.
ఇప్పుడు నేను రాబోయే కొద్దినిముషములు "ఈ దినముకొరకు దేవుడేర్పాటు చేసిన మార్గము” అనే అంశమును బోధించగోరుచున్నాను.
8.
దేవుడెల్లప్పుడు ఒక మార్గమును కలిగివున్నాడు.
మన మార్గములు, ఆయన మార్గములు అనే రెండు మార్గములున్నవి.
ఈ దినము కొరకు దేవుడు ఒక మార్గమును కలిగిఉన్నాడు, ఆయన ఎల్లప్పుడు ప్రతిదాని కొరకు మార్గమును కలిగియుండెను.
దేవుడు ఆదిలోనే అంతమును ఎరిగియుండెను గనుక ఆయన ప్రతికాలానికి లేఖనములను ఏర్పాటుచేసెను.
మరి ఆ కాలము వచ్చినప్పుడు, దానికొరకు నిర్ణయించబడిన లేఖనము నెరవేర్పులోనికి వచ్చును.
ఇప్పుడు దానిని చూచుటలో తప్పిపోవద్దు.
ఆ యొక్క కాలము వచ్చినప్పుడు, సాధారణంగా పరిచర్య అనేది ఉద్యమముల (Isms) తోను, ఆచారములతోను, మరి అలాంటి వాటితోను మిళితమైపోయి ఆ కాలమునకు చెందిన వాక్యమునకు అది బహుదూరముగా వుండిపోవును.
9.
మరప్పుడు, దేవుడు రంగము మీదికి ఒకవ్యక్తిని, ఒక ప్రవక్తను ఎల్లప్పుడు పంపును.
మరి ఆ ప్రవక్త.
దేవుడెన్నడు తన పద్దతిని మార్చుకోడు.
ఆయన తన మార్గమునెన్నడు మార్చకోడు.
ఆయన ఎల్లప్పుడు దానిని ఒకేరీతిగా చేయును.
ఎల్లప్పుడు ఆయన చేసినట్లే, దానిని ఇప్పుడు కూడా ఆయన నిశ్చయముగా అలానే చేస్తాడు.
మరి దీని ద్వారానే దేవుడు పనిచేయును మరియు ఆ వాక్యమును బుజువు చేయును (స్థిరపరచును).
దేవుడే స్వయముగా తన వాక్యమునకు అనువాదము చేయునని గత రాత్రి నేను బోధించినట్లుగా ఆయనకు వాక్యమును అనువాదము చేయుటకు దేవునికి ఏ ఒక్కరి సహాయం అవసరంలేదు.
వాక్యమును బుజువుచేయుట ద్వారా, వాస్తవములోనికి తెచ్చుట ద్వారా దేవుడు తనకు తానే స్వయంగా అనువాదం చేయును.
పలాని కార్యం చేస్తానని దేవుడు పలికినట్లయితే, నిశ్చయముగా ఆయన దానిని చేస్తాడు, ఇక దాని విషయంలో ఏ ప్రశ్నలుండవు.
10.
కావున మనకొరకు దేవుడు ఒక మార్గమును ఏర్పాటుచేసెను.
దేవుడు తన బిడ్డలను ప్రేమించుచున్నాడు.
తన ప్రజలను ఆయన ప్రేమించుచున్నాడు.
వారికి ఆయన సహాయం చేయగోరుచున్నాడు.
నీకు అవసరమైన సహాయం కంటే మరి అధికముగా ఆయన నీకు సహాయం చేయగోరుచున్నాడు.
నీకు నీవు నహాయవడు దానికంటే, మరి ఎక్కువగా ఆయన నీకు సహాయపడగోరుచున్నాడన్న సంగతిని నీ హృదయములోనికి తీసికొనుము.
ఆయనకు ఒక మార్గమున్నది.
ఆయన పని చేయగలిగిన ఏకైక మార్గమే ఆయన మార్గము.
నీ షరతులు కాదు ఆయన షరతులకు నీవు లోబడాలి.
ఆయన షరతులు (Terms) నీకవసరమైనది నీకిష్టమైనట్టు రావాలని కోరుకుంటావు, కానీ ఆయన - ఆయన దానిని తన మార్గములో నీకిచ్చును.
11.
యోర్దాను నది జలములలో నయమాను మునిగినట్లుగా అది వుండును.
ఎందుకని అక్కడ తన దేశములో వున్న నదులు యోర్దాను కంటే ఎంతో తేటగా, శుద్ధిగా వున్నవని అతడన్నాడు.
అయితే ప్రవక్త సెలవిచ్చినది అదికాదు.
ఇక్కడమునుగు (Dip here) అని ప్రవక్త చెప్పెను.
అతడు ఒకసారి మునిగెను.
అయితే కుష్టు ఇంకను పోలేదు.
అలా ఆరుసారు మునిగినా అది ఇంకను అలాగేవుండెను.
అతడు దేవునిమార్గములోకి వచ్చి దానికి లోబడవలెను.
ఎప్పుడైతే అతడు పరిపూర్ణముగా దేవునిమార్గమునకు లోబడెనో అప్పుడు కుష్టు అనేది విడిచిపోయెను.
12.
ఈ రాత్రి నేను చెప్పుచున్నాను, మనము దేవుడేర్పాటు చేసిన మార్గమునకు లోబడితే కుష్టు విడిచిపోవును, రోగము విడిచిపోవును, సమస్తమును తొలగి పోవును.
మనము నిశ్చయముగా ఈ దినమున దేవునిమార్గములోనికి రావల్సివుంది.
ఇప్పుడు,మనం యోర్దానులో మునుగుట వలన మనకేమి ప్రయోజనం వుండదు.
అది ప్రవక్తద్వారా వచ్చిన మాటే, కానీ అది నయమానుకొరకు మాత్రమే.
ధర్మశాస్త్రము అనేది యూదులకుమాత్రమే ఇవ్వబడెను.
అయితే కృప క్రీస్తు ద్వారా ఇవ్వబడెను.
13.
ప్రతికాలమునకు చెందిన, సువార్తవాక్యము దాని యొక్క భాగము అది ముందుగానే ప్రవచింపబడింది (నిర్ణయించబడింది).
ఈ బైబిల్ గ్రంధము యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షమయైయున్నది.
ఏదియు దీనికి కలుపకూడదు.
దీనిలోనుండి దేనినీ తీసివేయకూడదు.
ఏవడైనను అలా చేస్తే అతడు శపించబడును.
దానికి మనమేమియు చేర్చకూడదు, దానిలో నుండి దేనినైననూ తీసివేయకూడదు.
ఈ కాలమునకు చేయబడిన వాగ్దానమును, దాని నెరవేర్పును తెలియాలంటే మనం తప్పక ఆ కాలమునకు చెందిన వాక్యభాగమునే చూడాలి.
అది ఆయన సొంతవాక్యము.
“కన్యక గర్భము ధరించి కుమారుని కనును.
” అని చెప్పబడినదే ఆమెలో రూపుదాల్చెను.
మరి అదియే దేవునియొక్క సొంత అనువాదము.
ఆయన దేనిని వాగ్దానము చేయునో దానిని ఆయన తప్పక నెరవేర్చును.
14.
కార్యములను జరిగించుటలో దేవుడు ఎన్నడూ తన పద్ధతిని మార్చుకొనడు.
కార్యములను జరిగించు విధానంలో మనమైతే ఎప్పటికప్పుడు మారుతూవుంటాం.
ఎందుకంటే మనం మితము గలవారము.
కార్యములను చేయుటలో మనం పొరపాట్లను చేస్తూ, వాటిని చక్కదిద్దుకొనుచూ ఎప్పటికప్పుడు మెరుగవుతూ వుంటాము.
కానీ దేవుడైతే అలాకాదు.
ఆయన ఒక్కసారి నిర్ణయం తీసికొంటే ఇక అదియే అన్నికాలములలోనూ పరిపూర్ణముగా వుంటుంది.
ఎందుకంటే ఆయన మితిలేనివాడు.
ఆయన.
సమస్త జ్ఞానముకు మూలాధారం.
ఆయనే సమస్త జ్ఞానము.
ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వజ్ఞడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, మితిలేనివాడు (అపరిమితుడు).
గనుక ఆయన నీకు దేన్నైనా చెబితే, దానిని గట్టిగా పట్టుకొనుము, ఎందుకనగా అది వాస్తవము.
15.
ఇప్పుడు కొన్ని సంఘములు, “దీనిని మేము నమ్మము, దానిని మేము నమ్ముదుము” అంటుంటారు.
సంఘము ద్వారా దేవుడు లోకమునకు ఎన్నడూ తీర్పుతీర్చడు.
అయితే యేసుక్రీస్తు ద్వారా ఆయన దానికి తీర్పు తీర్చును.
యేసు వాక్యమైయున్నాడు.
వాక్యము ద్వారా ఆయన సంఘమునకు తీర్పుతీర్చును.
16.
అన్ని కాలములకు మరియు ఈ కాలమునకు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఇదియే, ఈ కాలములో తాను దేనినైతే చేయుదునని వాగ్దానము చేసెనో దానినే ఆయన చేయుటను మనము చూచెదము.
తాను వాగ్దానము చేసిన దానిని మరియు ఆయన దాన్ని నెరవేర్చుటను మనం నిశ్చయముగా చూస్తాము.
కన్యక కుమారునికనును అనే వాగ్దానం ఈకాలానికి చెందినది కాదండీ.
ఆవాగ్దానం రెండువేల సంవత్సరాల నాటిది.
నేటి దినానికి దేనినైతే చేస్తానని ఆయన వాగ్దానము చేసాడో మరి, దాన్నే ఆయన నేడు చేస్తాడు, నేడు అదే ఆయనైయుంటాడు.
17.
చాలాసార్లు జనులు ఇలా చెప్పుదురు “దానిని నేను నమ్మను”.
వారు హవ్వకు అనువాదం చేసినవాణ్ణి తిరిగి పొందుకొన్నారు గనుకనే అలా చెప్పుచున్నారు.
వారు పూర్తివాక్యమును స్వీకరించరు, గానీ దానిలో కొద్దిగ మాత్రమే తీసికొందురు.
18.
దేవుడు నిత్యము ఒక్కటేరీతిగా వున్నాడని మీకు గుర్తుచేయగోరు చున్నాను.
తన వాక్యమందు తాను దేనిని చెప్పుతో దానిని ఆయన చేయును.
19.
ఆయన ఎన్నడును మారడు అనే దాన్ని ఇప్పుడు చూద్దాం.
ఆదికాండము మొదటి అధ్యాయములో ఆయన సెలవిచ్చెను.
" ప్రతి జాతి విత్తనము తన జాతినే మొలిపించునుగాక” ప్రతి విత్తనము తన జాతినే మొలిపించును గాక.
మరి అక్కడే మనము పరిణామ సిద్దాంత వాదులను  పట్టుకొందుము.
మీరు వంశవృద్ధిని గావించజాలరు.
మీరు గుఱ్ఱము వంటి దానిని తీసికొని.
గాడిదతో కలిపిన యెడల ఒక కంచరగాడిదను పొందెదరు.
అయితే ఒక కంచరగాడిద మరొక కంచరగాడిదను కనలేదు.
తిరిగి మరొక కంచరగాడిదను పొందలేదు.
అది అక్కడే ఆగిపోవును.
“ప్రతి జాతి తన జాతినే ఉత్పత్తిచేయును” వారు వంశవృద్ధిని (లేక) పెంపకమును చేయగలరు, కానీ అక్కడే అది తిరిగి మారిపోవును, తద్వారా పరిణామ కార్యము జరగదని అది చూపును.
లేదండి.
అది అక్కడే ఆగిపోవును.
నీవు బచ్చలకూర అనునొకదానితో మరేదైనా కలిపి పెంచిన యెడల ఆకులు విడివిడిగా వుండే ఒక క్యాబేజి రకం వంటి దానిని తేగలవు.
కానీ దానినే తిరిగి దాని స్థానమునకు తిరిగి తేలేవు.
లేదండి నీవు సంకరపు మొక్కజొన్న ను పెంచగలవు.
కానీ అదే సంకరపు మొక్కజొన్నను నాటిన యెడల నీకేమి రాదు.
నాటు ప్రతిసారి అది తిరిగి వంశవృద్ది గావించబడవలెను.
ఎందుకనగా, దేవుడన్నాడు “ప్రతి జాతి విత్తనము తన జాతినే మొలిపించును.
20.
మరిప్పుడు, వాటిని సంకరము చేయుటద్వారా లోకమునకు ఏమి జరిగియున్నదో చూడండి.
ఇక్కడ 'రీడర్స్ డైజస్ట్ అనే పత్రికలో నేను ఒక వ్యాసమును చదివాను.
అందులో ఇలా వుంది.
ఇది ఇలానే కొనసాగినట్లయితే “ఇప్పటి నుండి ఇరవైయేండ్లు గడచిన తర్వాత స్త్రీలు పిల్లల్ని కనజాలరు.
ఎందుకనగా వారు సంకరము చేయబడిన ఆహారమునే తినుచున్నారు .
దాన్ని బట్టి వారు సంకరమవుచున్నారు, ఆ విధముగా సంకరము చేయబడిన ఆహారమును తినునట్లుగా మానవజాతి సృజింపబడలేదు.
సంకరము చేయబడిన దానిని తినునట్లుగా ఆదిలో లేదు.
సృజించబడినది ఎలావుందో దానిని అలానే తినునట్లుగా చేయబడెను.
ఈ దినమున సృజించబడిన మాంసమును, మరియు మిగతావాటిని వారు సంకరము చేయుచున్నందున, కృత్రిమరీతిలో తయారుచేయుచున్నందున అసలైనదానిని ఆ రీతిగా వారు వుంచలేకపోవుచున్నారు”.
ప్రతీదానిని కూడా సంకరము చేయుచున్నారు.
(అన్నిటిని కలిపివేస్తున్నారు.
) వారు తమ సొంత లక్షసాధనల కొరకు, మంచిదిగా దేవుడు సృజించిన దానిని తీసికొని వారు తమ కిష్టమొచ్చినట్లు వాటిని వారి సొంత పద్దతిలోకి మార్చుచూ సమస్త మానవాళికి నాశనం చేయుచున్నారు.
దేవుడు దానిని ఏలాగున సృజించెనో దానిని ఆలాగుననే వుండనిమ్ము.
21.
నేడు 'సంకరము' అనే దానిని వారు చివరికి సంఘములలోకి కూడా ప్రవేశింప ప్రయత్నించుచుండిరి.
ఒక నిజ పరిశుద్దాత్మ బాప్తిస్మము అను దానిని ఒక కరచాలనముగాను, నీటి బాప్తిస్మమును ఒక చిలకరింపుగాను మార్చుచున్నారు.
ఓ మై!
సమస్తము సంకరము చేయబడెను.
గనుక మనము అసలైన దానివైపుకు మరలవలెను.
22.
ఒక సంకరజాతి మొక్కగూర్చి ఆరంభంనుండే నీవు ఎన్నో మెళకువలు తీసికోవల్సివుంది.
తెగులు సోకకుండా పిచికారి చేయవలెను.
అన్నిరకములైన జాగ్రత్తలు తీసికొనవలెను.
కానీ సహజసిద్ధమైన మొక్కకు అలాంటివేమి అవసరంలేదు.
అది చాలా ఆరోగ్యంగాను, దృడ నిర్మాణంలో వుండును.
తెగులు సోకినా కూడా దానికి ఏమీ అవ్వదు.
తెగులును సహితం పారద్రోల గలిగినంత సామర్థ్యమును అది తనలో కలిగివుండును.
23.
ఒక నిజమైన క్రైస్తవుడు కూడా మరి అంతే!
నీవు అతనిని సాగతీయవల్సిన పనిలేదు.
దీనినీ లేక దానిని, మరో దానిని అతనికి చెప్పి అతన్ని నీవు బ్రతిమలాడల్సిన పని లేదు.
అతడు తనయందు పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మమును కలిగియుండును.
ఇక అదియే సమస్తమును బయటకు త్రోసి వేయును.
అతని వెంటపడుచూ, అతనిని నీవు బ్రతిమలాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతడు నిజమగు దేవుని మొక్క.
గనుకనే సహజ సిద్ధముగానే పోరాట పటిమను అతడు కలిగియుండును.
ఒక క్రైస్తవుడు తాను నిల్చోనియున్నా ప్రతి అంగుళము భూమి కొరకు పోరాడును.
నిలిచి వుండాలంటే అతడు తప్పక దానిని చేయవల్సివుండెను.
మరియు దాన్ని జరిగించుటనుబట్టి అతనిలో ఏదో ఒకటి వుండి అతని పక్షమున శ్రద్ద వహించును.
24.
ఆదిలోనే హవ్వ ‘వాక్యమును' సంకరము చేయుటకు ప్రయత్నించినది.
“దానిని తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు” అని దేవుడు ఆమెతో చెప్పెను.
సాతాను తనకిచ్చిన తెలివితో వాక్యమును కలుప ప్రయత్నించెను.
దానిని ఆమె చేసినప్పుడు, తెలివిని స్వచ్ఛమైన దేవుని వాక్యముతో (Unadultrated Word) కలుపుటకు ప్రయత్నించినప్పుడు సమస్త మానవాళి అక్కడే సాతానుయొద్ద పడిపోయెను.
(వాక్యమును సాతాను తెలివితో కలుపుట వలన సమస్త మానవాళి పడిపోవుటకు హవ్వ కారణ మాయెను.
) వాక్యము ఈ లోక సంబంధమైన తెలివి (జ్ఞానము) ద్వారా వచ్చినదికాదు.
25.
అయితే అది పరిశుద్ధాత్మశక్తి వలన వచ్చును!
శక్తి చేత కాదు, బలము చేతకాదుగాని నా ఆత్మచేతనే అని ప్రభువు సెలవిచ్చెను.
దేవుడు చేయు విధానము అదైయున్నది.
దేవుని వాక్యమే నిత్యజీవమునిచ్చు విత్తనమైయున్నది.
26.
దానిని నీవు సంకరము చేయబూనితే ఏమగును?
దానితోనే నీవు నశించెదవు.
అదిఎన్నటికి క్రియ చేయదు.
నూనె మరియు నీరు ఏలాగున ఒకటిగా కలవదో, మరలాగే ఇదికూడా ఎన్నడు కలువదు.
అవును, అది కలువదు.
27.
దేవుడు చేయు విధానము కంటే మరెంతో మెరుగ్గా చేయాలని వారు సకల ప్రయత్నాలు చేసారు.
ఒక కోడిపిల్ల తన ముక్కుతో పెంకు (గుల్ల)ను పొడుచుకొని (లేక) పగులగొట్టుకొని బయటకు వచ్చు విధానము కంటే మరే ఇతర మెరుగైన విధానములను వారు ఇప్పటికిని కనిపెట్టలేకపోయిరి.
దానిని మీరు ఎరిగియున్నారా?
మెరుగైన మార్గమును వారు ఎన్నటికి కనిపెట్టలేకపోయిరి.
ఆ పసిప్రాణి తన ముక్కు చివరన గట్టిదనమును కలిగి యుండెను.
తన ముక్కు చివరను గట్టిదనము కలిగి పుట్టియుండెను.
గట్టిదనము గల తన ముక్కుతో గోకుచూ, శోకుచూ పెంకును పగులగొట్టుకొనుచూ తన మార్గమును సరాళము చేసికొనును.
దానికి దేవుడేర్పాటు చేసిన మార్గము అదైయుండెను.
ఒకవేళ నీవు బలవంతముగా దానిని పెంకులోనుండి బయటకు తేవాలని ప్రయత్నిస్తే అది అక్కడే చచ్చును.
అలా నీవు చేసినట్లయితే అది బ్రతుకుటకు అవకాశమే ఉండదు.
అది కేవలం దేవుడేర్పాటు చేసిన మార్గముగుండానే అది బయటకు రావల్సియుండెను.
నీ ప్రయత్నాలు ఫలించవు.
28.
నేడు క్రైస్తవుల సంగతి కూడా మరి అంతే.
మనము వారిని ఎంతగానో పొగుడుచుందుము.
(లయలపడుదుము) వారితో కరచాలనము చేసి, రహస్యముగా వారినిలోనికి తెచ్చి సంఘములోకి చేర్చుదుము.
అయితే వారికి అవసరమైనది అదికాదుగానీ, ఆ పాతకాలపు ప్రార్థన బలిపీఠము వారికి అవసరం, అక్కడికి వారు వచ్చి తమ్మును తాము అప్పగించుకొనుచూ, లోకమునుండి తమ్మును తాము వేరుచేసికొనుచూ, దేవుడుఏర్పాటు చేసిన మార్గములోనికి రావలియును.
అయితే నేడు వచ్చినచిక్కు ఏమిటంటే, వారు తమ పేర్లును సంఘపుస్తకములలో నమోదు చేసికొనుట ద్వారా సంఘములో సభ్యత్వమును తీసికొనుచున్నారు (సంఘసభ్యులుగా మారుచున్నారు) అక్కడ అంతయూ అలాగే జరుగుచున్నది.
కానీ దేవుడేర్పాటు చేసిన మార్గము ఏదనగా నీవు (బలిపీఠంవద్దకు వచ్చి అక్కడే) వేచియుండి, దేవుడు నీకు నూతన జన్మ యిచ్చువరకు ప్రార్థించుచుండవలెను (కని పెట్టుకోవలయును) నిశ్చయముగా అది వాస్తవమైయున్నది.
ఒకవేళ అలాకాక సభ్యత్వము ద్వారా చేర్చుకొన ప్రయత్నిస్తే అక్కడే మరణము సంభవించును (బలవంతముగా లాగితే అతడు చచ్చును.
29.
అయితే ఈ దినమున జనులు పరిస్థితి అలాగున లేదు.
ఒక క్రొత్త జన్మ అను దానిని చూచి వారు ప్రక్కకు జరిగిపోవుచున్నారు.
దాన్ని వారు ఇష్టపడుటలేదు.
ఓ క్రొత్తజన్మకు బదులు దాని స్థానములో మరిదేనినో చేర్చుచున్నారు.
వారు ఇలా అందురు.
“రండి నమ్మండి.
ఇక అది చాలు (మీరు చేయవల్సిందంతా ఇక అంతే) ”దయ్యము సహితం నమ్మును అయితే అతడు తిరిగి జన్మించలేడని నీకు తెలుసా?
క్రొత్త జన్మ అనేది వున్నది.
నీవు పొందినట్లయితే ఇక ఎంతమాత్రం నీవు ఈ లోకాన్ని రుచిచూడలేవు.
ఈ లోకానికి తగినట్లుగా నీవు ఇక ఉండలేవు.
30.
ఏరకమైన పుట్టుకైనా సరే అది కష్టతరము (చిక్కు) గా వుండును.
అదెక్కడైనా సరే అంతే వుండును.
అది ఒక పందులకొట్టములో కావచ్చు, లేక ఒక ఆసుపత్రిలో కావచ్చును.
ఒక 'పుట్టుక' అనేది కష్టతరమైనది (చిక్కైనది).
31.
క్రొత్త జన్మ అనేది కూడా మరి అలాగే వుండును.
నీవు చేయదలంచని కార్యములను నిన్ను చేయనివ్వకుండా అది నిన్ను జేయును, అది నిన్ను బలిపీఠముయొద్ద ప్రాకరింప జేసి, ఆక్రందన చేయునట్లు గాను, కేకలువేయునట్లుగాను, నీ ముఖమునకున్న రంగును తుడిపివేయునట్లుగాను,నీ చేతులను పైకెత్తి దేవునిని స్తుతించునట్లుగాను, బాషలు మాట్లాడునట్లుగాను, సమస్త విధములుగా జేయునట్లుగాను అది నిన్ను జేయును.
క్రొత్త జన్మ ఆ రీతిగా జరిగించును, ఎందుకనగా తిరిగి జన్మించుటకు అది దేవుడేర్పాటు చేసిన మార్గమైయున్నది.
32.
నీవు మరణించవల్సివుంది.
తిరిగి జన్మించాలంటే నీవు తప్పక మరణించాలి.
ఏ విత్తనమైనా సరే, తిరిగి ఉత్పత్తి కావాలంటే అది తప్పక చనిపోవల్సివుంది.
చనిపోకపోతే అది నిలిచియుండలేదు.
ఒకడు తన సొంత ఆలోచనల విషయమై చనిపోవాలి.
దేవుని వాక్యము కానీ వాటన్నిటి విషయమై అతడు చనిపోవాలి.
ఆయన మార్గములోకి రావాలి.
ఎందుకనగా అది దేవుని నేలయైయున్నది.
మన ఆలోచనల ద్వారా మనమాయనను కలుసుకోలేము గానీ ఆయన దేనినైతే సెలవిచ్చియుండెనో దాని ద్వారా మాత్రమే మనమాయనను కలుసుకోగలం.
అదే దానికొరకు దేవుడేర్పాటు చేసిన మార్గము.
అయితే ప్రజలు దానిని తప్పించుకొనుటకు ప్రక్కకు జరిగిపోవుచున్నారు.
అది వారికి అవసరం లేదు.
కానీ అదే వాస్తవమైనది, అది ఎల్లప్పుడు అలాగే వుండును.
నీ తలంపులు నశించాలి.
లేకపోతే అవే నిన్ను నాశనం చేస్తాయి.
33.
“మంచిది, బైబిల్ అలా చెప్పుచున్నదని నాకు తెలుసు, కానీ అది నాకు అర్థం కావటం లేదు.
” అయితే దానిని దేవుడు నీకు బయలు పరుచు వరకు వేచియుండుము.
అదంతే దానిని.
అది క్రొత్త జన్మ.
34.
బాతులు మరియు పెద్దబాతులు దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయాలంటే మొదటిగా అవన్నియు ఒక పెద్ద గుంపుగా గుమిగూడుకొంటాయి, అంతకంటే శ్రేష్టమైన మార్గము వాటికి లేవు.
అదేసరి.
అవి తమకున్న సహజ బుద్ధినిబట్టి ఒక చోటుకి కూడివస్తాయి.
అలా వచ్చుటను నీవు చూచెదవు.
దక్షిణ దిక్కుకు వెళ్ళేముందు అవన్నియు ఒక గుంపుగా కూడుకుంటాయి.
ఇదేమిటి?
అవన్ని కూడివచ్చుట అనేది ఒక ఉజ్జీవకాలమది.
అవన్నియు గుంపుగా గుమ్మిగూడుట ఒక ఉజ్జీవమైయున్నది.
అటువంటి ఒక విభజన అనే దాని గూర్చి నీ జీవితములో ఎన్నడైనా విన్నావా?
అవి ఒకదానికొకటి, ఒకటిగా కూడివచ్చుట.
అటువంటి దానినెన్నడు నేను వినియుండలేదు!
అవి 'ఒకటిగా కూడుకొనుట' అనే మార్గము తప్ప మరొక మార్గము వాటికి లేనే లేదు.
35.
అనేక పర్యాయములు కెనడాలోని నార్త్ వుడ్ ప్రాంతమందు శీతా (చలి) కాలపు ఆరంభమున నేను గమనించాను.
అక్కడొక సరస్సు వుండెను.
అందు కొన్ని బాతులు పుట్టును, అవి అక్కడే వుండును.
అయితే మీరు గమనించినట్లయితే, ఉత్తర దిక్కు తీవ్ర చలిగాలులు వీచడం ఆరంభమైనప్పుడు పెద్దదైన మగబాతు ఆ సరస్సు మధ్యకు చేరి తన పొడవైనముక్కును పైకెత్తి నాలుగైదు సార్లు అరుచును, అది పుట్టుకతోనే నాయకునిగా పుట్టియుండెను గనుక మిగతా వాటిని తన యొద్దకు రప్పించుకొనును, దాని స్వరమును విని మిగతావన్నియు గుమిగూడుకొనును.
అప్పుడు అవన్నియు కలిసికట్టుగా పైకెగురుచూ తిన్నగా లూసియానా వైపు వెళ్ళును.
36.
ఎందుచేత?
అవి అక్కడికి చేరుకొనుటకు అంతకంటే మరీ ఏ శ్రేష్టమైన మార్గమును వారు ఎన్నడును కనుగొనలేరు.
నీవు వాటిని గుంపుచేయలేవు.
నీవు వాటిని ఒక వంటగదిలో వుంచి.
కోళ్ళ గంపలో పెట్టి, వాటన్నిటిని ట్రక్కులో చేర్చగలవు.
అయితే దానికంటే మరెంతో శ్రేష్టమైన దృష్టిని ఆ బాతులు కలిగియుండెను.
ఆ కోళ్ళ గంపలో నీవు దానినుంచి, అక్కడికి వాటిని తీసికొనిపొయినా, వధశాలకు నీవు తమని తీసికెళ్తున్నావని అవి ఎరుగును.
నిశ్చయముగా అవి ఎరుగును వాటిని నీవు తీసికెళ్ళటం కాదుగానీ అవి ఎలా వెళ్ళాలో వాటికి తెలుసును.
గనుక దేవుడేర్పాటు చేసిన మార్గములోనే అవి వెళ్ళును.
37.
నేడు మనిషి కూడా అదేవిధముగా వుండి తీరవలెను.
ఏదో ఒక శాఖాసంబంధమైన గూటి క్రిందికి గుంపులుగా చేర్చబడుట కాదు.
గానీ దేవుడు చెప్పిన రీతిలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము చేతను, క్రొత్త జన్మ చేతను సమకూర్చబడవలెను.
అదే గుమిగూడి వచ్చు ఉజ్జీవము (Swarming Revival) లేదా ఒకటిగా కూడివచ్చు ఉజ్జీవము.
ఒక సంఘములోకి సభ్యులుగా చేరుట కాదు, ఇంటింటిని సంప్రదించుట కాదు, పత్రికలను పంచి పెట్టడము కాదు గానీ జన్మించుట అనేది ఒక్కటి కావాలి.
తిరిగి జన్మించుట, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడుట, లోక కార్యములలోనుండి ప్రత్యేక పర్చుకొనుట, ఇదే దేవుని మార్గము, అవును!
దేవుని వాక్యమును విశ్వసించుట!
ఇది ఈ గడియ.
మనము నమ్మవల్సింది అదే మరి.
38.
నరుడా, నీవెన్నటి.
ఎంతమంది మనుష్యులైన సరే ఆ బాతులున్న సరస్సు నొద్దకు వెళ్ళి “ఒక్క నిముషం ఆగు, చిన్న బాతులారా, మీతో మాట్లాడాలనుకొంటున్నాను.
అదేమిటనగా విద్య నేర్చుకొనిన ఒక బాతు ఇక్కడున్నది.
దానికి పి.
హెచ్డి (PhD) మరియు యల్.
యల్.
డి (LLD) డిగ్రీలున్నవి.
అదే మిమ్మును నడిపించగలదని నేను చెప్పుచున్నాను.
” అని అన్నప్పటికి దానిని నేను లెక్కచేయను.
39.
ఆ బాతులు ఆ మాటల కంటే పైగా మరింతగా దృష్టిని (లేక) జ్ఞానమును కలిగియున్నవి.
అవునండి.
ఎంత మెరుగైన విద్యనైన మరేదైనను అవి లెక్కచేయవు.
ఒక నిర్థిష్ట పిలుపును లేక ఖచ్చితమైన కేకను అది వేయును.
సహజ జ్ఞానమును అది కలిగియున్నది.
ఓ మై!
దేవుని వాక్యమును గూర్చి సంఘము కూడా అదే సహజ జ్ఞానము కలిగియుండవలెను.
40.
నిశ్చయముగా అది అస్పష్టమైన ధ్వనియైయున్నది.
బైబిల్ అంటోంది.
పౌలు అన్నాడు "బూర ధ్వని అస్పష్టముగా నున్నప్పుడు, యుద్ధమునకెవడు సిద్దపడగలడు?
” అవునండి చేరుట (Joining) అనే అస్పష్టమైన ధ్వనిని సంఘము ఇచ్చిన యెడల, సంఘము వినిపించిన యెడల ఇక ఎవరు జన్మించెదరు?
41.
దేవుడన్నాడు “జన్మించుము”.
జన్మించుట ద్వారా అక్కడ ఏమి జరుగును, గతములో అది ఏమి జరిగించియుండెనో, నేడు కూడా దానినే అది జరిగించును, ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగావున్నాడు.
గతములో ఆయన ఎలా ఉన్నాడో మరి నేడును ఆలాగే ఉ న్నాడు.
అప్పుడు వారు ఏమి చేసియున్నారో, దానినే మనమిప్పుడు చేయుచున్నాము.
అక్కడ దానిని వారు ఎలా పొందుకొన్నారో, అదే రీతిగా నేడును పొందుకొనుచున్నాము.
గతములో వారు దేనినైతే కలిగియుండిరో, మరి దానినే నేడును కలిగియుండిరి.
అదే మార్గమైయున్నది.
దేవుడేర్పాటు చేసిన మార్గమైయున్నది అదెన్నటికి మారదు.
42.
బాతులు ఎన్నడు మారవు.
ప్రతి సంవత్సరం అవి పూర్తిగా ఏకమై (అన్నియు ఒక చోటికి గుమిగూడికొని) ఉత్తరమునకో, దక్షిణమునకో ఏ దిక్కునకు అవి వెళ్ళాలని అని అనుకొంటాయో మరి ఆ దిక్కునకు అవి వెళ్ళుటకు తప్పక గుమ్మిగూడుకొంటాయి.
వెళ్ళాలంటే మొదటిగా అవి గూమిగూడుకొనును.
ఒకటిగా చేరి వచ్చును.
43.
దేవుడు చేయు విధానమదే.
ప్రతి కాలమునకు ప్రతి ఋతువునకు ఆయన తన వాక్యమును పంపును, మరి ఆ కాలమున అది బయలుపడును.
దానితోపాటు మిగతా విషయాలు ఏవిధంగా జరుగుచున్నవో వాటిని నేను మనస్కరించను.
ఆ దినము కొరకు దేవుడు చేసిన వాగ్దానమును వారు చూచినప్పుడు, నిరూపించ (ఋజువు చేయ)బడినప్పుడు, ఆ వాగ్దానమును ఆపు చేయునది ఇక ఏదియు వుండదు.
“కన్యక గర్భము ధరించి కుమారుని కనును.
” మరి వారు అన్నప్పుడు.
44.
“నా వంటి ఒక ప్రవక్తను ప్రభువగు దేవుడు మీలో నుండి లేపును.
” అని మోషే చెప్పెను.
45.
ఒక మనిషి వచ్చి, చేయవల్సిన వాటిని చేసినప్పుడు, అది మెస్సియానే అనివారు తెలిసికొనెను.
అది జరగటం ఫిలిప్పు చూచినప్పుడు, అతడన్నాడు 'నీవు క్రీస్తువు నీవు ఇశ్రాయేలునకు రాజువు' దానిని అతడు ఎరిగియుండెను కారణం వాక్యము వాగ్దానము చేయబడెను, ఆ దినమును అది జీవించుచుండెను.
తన చుట్టూ ఎంతమంది పరిసయ్యులు, సద్దూకయ్యులు మరియు వేదాంత పండితులు నిలబడియున్నప్పటికినీ అది అతనిని కొద్దిగ కూడా కదల్చలేకపోయెను, ఎందుకనగా అతడు ఆ సూచన కొరకే ఎదురుచూచుచున్నాడు.
అది జరుగుట కనబడినప్పుడు, అది ఆ ఘడియ సూచన అని అతడు గ్రహించాడు.
దాని కొరకే వారు ఎదురుచూచుచుండెను, దేవుడేర్పాటు చేసిన మార్గము, అవునండి.
46.
ఒక బాతుకు నీవు ఏ విద్యను నేర్పలేవు.
దానిని అది నేర్వజాలదు.
దానికి అది అవసరం లేదు.
ఎన్నో డిగ్రీలు తనకున్నవని చెప్ప గలిగినా సరే, మిగతా బాతులు డిగ్రీలను బట్టి పెద్ద బాతును వెంబడించవు.
“ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను బాతుల పాఠశాలకు వెళ్ళాను.
దాని గూర్చి నాకంతయు తెలుసును.
పట్టా కూడా పొందుకొన్నాను.
ఈ విషయాలన్ని నేనెరిగియున్నాను అనే మాటలు ఎన్ని చెప్పినా ఏ ప్రయోజనం లేదు.
” అవి నిజంగా బాతులే అయివుంటే డిగ్రీలను బట్టి అవి వెంబడించవు.
ఆమేన్ ఎందుచేతననగా అవి నిర్దిష్టమైన ఒక సూచనను చూచును.
ఆ సూచనను అవి చూచినప్పుడు, దానిని అవి నమ్మును.
47.
సాధారణమైన ఒక బాతుకే దాన్ని ఎరిగే విధానము వుంటే, మరి తిరిగి జన్మించిన క్రైస్తవుని గూర్చి ఏమందుము?
తన యొక్క పునరుత్థాన బలమునందు మనము యేసుక్రీస్తును ఎరిగి యుండవల్సివుంది.
అవును.
దేవుడేర్పాటు చేసిన మార్గములోనే దానిని దేవుడు చేసెను.
48.
గుర్తుంచుకోండి, దేవుడేర్పాటు చేసిన స్థలమునకు మనలను నడిపించే సాధనము విద్య కాదు.
వాటికున్న ఏకైక సాధనము దేవుడిచ్చిన స్వభావమే.
దేవుడు తమలో వుంచిన స్వభావమే దేవుడేర్పాటుచేసిన చోటికి తమను నడుపునని బాతులు ఎరిగియున్నవి.
49.
మరదేవిధముగా పరిశుద్ధాత్మ కూడా సంఘమును దేవుడేర్పాటు చేసిన స్థలమునకు నడుపును.
సంఘములో సభ్యత్వము తీసికొనుట ద్వారా కాదు.
ఆయన వాక్యము బయలుపర్చబడి, ఋజువు చేయబడుటను చూచుటకు నీవు ఆయన సన్నిధిలో నింపబడవలెను.
తనకొరకు దేవుడేర్పాటుచేసిన చోటికి తెచ్చుటకు ప్రజలకు, సంఘమునకు అది దేవుడు ఏర్పాటుచేసిన మార్గమైయున్నది.
నేడు సంఘము నిశ్చయముగా ఆ విధముగానే వుండవలెను.
ఇప్పుడు అది సరియైనదని మనమెరిగియున్నాము.
50.
ఒక చంటి బిడ్డ తనకవసరమైన దాని కొరకు ఏడ్చును మరి అది.
తప్ప మరే మెరుగైన మార్గమును వారు కనుగొనలేకపోయారు.
నీవు ఒక గంటను ఆ బిడ్డ కిచ్చి “బాబూ, నీది కేవలం మూడు రోజుల ప్రాయం, నీకు అవసరమైన పాలబుడ్డి కొరకు నీవు ఈ గంటను మ్రోగించుము” అని చెబితే.
దానిని ఆ చంటిబిడ్డ చేయగలడా?
ఆ పద్దతి ఆ చంటి బిడ్డకు పనిచేయదు.
తనకేం కావాలన్న ఆ బిడ్డ ఏడ్చును.
అదే దేవుడేర్పాటుచేసిన మార్గము.
అదీకాక మరేది నీవు చేసినా, ఎంత గోల చేసినా ఏం ప్రయోజనం?
బిడ్డను ఎంత కొట్టినా, ఏడ్చుట తప్ప మరే మార్గం తనకు తెలియదు.
తనకు ఏది కావాలన్నా ఏడ్చుట ద్వారానే తెలియజేయును.
అదే దేవుడేర్పాటు చేసిన మార్గము.
అది అంతే, తన తల్లిని పిలుచుట కొరకు ఏడ్చుట, కేకలు పెట్టుటయే మార్గము.
ఆ బిడ్డకు తెలిసిందంతా అదే మరి.
51.
తన పిల్లలు కూడా అలానే వుండాలని దేవుడు కోరుచున్నాడు.
విశ్వసించు ఆయన పిల్లలు ఆ విధముగా వుండాలని దేవుడు కోరుచున్నాడు.
ఆయన దానిని చేసియున్నాడు.
తెలివి తేటలతో కూడిన బోధలు కాదు, లేదా కొద్దిగ గొప్పవేదాంతమును బోదించుట కాదు, కానీ నీవు నీ అక్కరల కొరకు మొడ్డ పెట్టాలని ఆయన కోరుచున్నాడు.
అది అంతే మరి.
నీకవసరమైన దానికోసం నీవు మొఱ్ఱపెట్టాలి.
అయితే నీవు వంగనివానిగా, బిరుసుగా, కరుకుగా వున్నందున, నీవెన్నటికి పొందలేకపోతున్నావు.
గనుక ఇప్పుడు నీవు మృదువుగా, కొంచెం తగ్గించుకొని మొఱ్ఱపడితే దేవుడు నీకవసరమైన దానిని నీకిచ్చును.
తన ప్రజల మొడ్డను ఆయన వినగోరుచున్నాడు.
నీ అవసరతల కొరకు దేవునికి మొఱ్ఱపెట్టుము, దేవుడు దానిని కోరుకొంటున్నాడు.
అదే ఆయన ఏర్పర్చిన మార్గము, దానికొరకు మొఱ్ఱపెట్టుము చంటి బిడ్డలు ఏడ్చిన ట్టుగానే నీవు కూడా మొడ్డ పెట్టవలెనని ఆయన కోరుచున్నాడు.
“ఎంత కాలం మొఱ్ఱపెట్టాలి?
52.
బిడ్డ ఎంతసేపు ఏడ్చును?
తన ఆకలి తీరేవరకు.
ఒక దేవుని బిడ్డ, విశ్వసించుకైస్తవుడు కూడా మరి అదేవిధముగా వుండాలి.
దేవుడు నీకొక వాగ్దానమును చేసినట్లైతే, మద్యలోనే విడిచి పెట్టక, దానికి జవాబు వచ్చేవరకు, అది నెరవేరే వరకు మొడ్డ పెట్టవలెను.
ఆయన తన వాక్యమును ఋజువు చేసేవరకు మొడ్డ పెట్టుచూనే వుండును.
దేవుడు తన వాక్యమును వెల్లడిపరిచిన తర్వాత స్థిరపరిచిన తర్వాత ఇక నీవు మొఱ్ఱ పెట్టవలసిన పని వుండదు.
ఎందుకంటే దానిని నీవు పొందుకొన్నావు.
గనుక నీవు నడుచుకుంటూ వెళ్ళి దానికొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుము.
పొందుకొనే వరకు మొఱ్ఱ పెట్టుచూనే వుండుము.
నిలకడగా కని పెట్టుము.
అలా వుండటం నా కిష్టం.
పట్టువిడువక దానిని కనిపెట్టుట, నిలకడగా దానికోసం వేచివుండుట.
53.
సంకరము చేయబడిన మొక్కవలే కాదు, జాగ్రత్తగా సాకుచూ, మచ్చికగా చూచుకొనుచూ, చుట్టూ భద్రము చేయురీతిగా కాదు.
క్రైస్తవులు అటువంటి వారు కాదు, వారు జాతి విత్తనములవలెను, వాస్తవమైనవారు, జన్మించినవారు, దేవునికి నిజమగు సాధనములుగా వున్నారు!
వారు తమ స్థానము కొరకు పోరాడుదురు.
భూమి మీద తమ జీవితములను ముగించేవరకు పోరాడుచూనే వుందురు.
దాని ప్రతి కదలిక వారికి పోరాటమే.
54.
భూమిని ఇచ్చితినని దేవుడు మోషేకు చెప్పెను.
ఆయన యే హెూషువాతో “మీరు నిలుచు ప్రతి స్థలమును, మీరు అడుగు పెట్టు ప్రతిస్థలమును, నడుచు ప్రతి భాగమును నేను మీకు ఇచ్చెదను” అని సెలవిచ్చెను.
గనుక దానిలోని ప్రతి అంగుళము కొరకు వారు పోరాడవల్సిందే.
మరి అలాగే మనము కూడా ప్రతి అంగుళం కొరకు పోరాడాలి.
సంకరము చేయబడిన మొక్కను సాకినట్లు, మచ్చిక చేసినట్లు, భద్రం చేసినట్లుగా అది కాదండి, “మంచిది, అక్కడికి నేను మిమ్మును తీసికొనివెళ్ళెదను, అక్కడ నీవు ఏం అంటావో చూచెదను.
అప్పుడు నీ అభిప్రాయమును నీవు వెల్లడిపరచవచ్చును” అనేది కానేకాదండి.
అలావుంటే అదెన్నటికి నెరవేరదు.
55.
ఒక నిశ్చయతతో రమ్ము, అక్కడికి నీవు చేరి, అక్కడే నివశించు నట్లుగా రమ్ము.
దేవుడు జవాబునిచ్చువరకు, ఋజువు పరచేవరకు అక్కడే నిలచియుండుము.
దేవుని యందు విశ్వాసముంచు ఒక వ్యక్తి దేవుని సన్నిధిని చూడగలడు, దేవుని సన్నిధిని అనుభవించగలడు, దేవుని సన్నిధిని గుర్తించగలడు, ఆయన ఇక్కడ వున్నాడని ఎరిగియుండగలడు.
ఈ దినముకొరకు ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చుట కొరకు ఆయన ఇక్కడ ఉన్నాడు.
గనుక పొందుకొనేవరకు నీవు మొడ్డ పెట్టుచూనే వుండుము!
పట్టు విడువక ఆయనను వేడుకొనుము.
మద్యలోనే నిష్క్రమించవదు.
దివారాత్రులు నిలిచి, కని పెట్టుకొనుము.
తెలివి తేటలతో కూడిన బోధలను తన పిల్లలు వినవలెనని దేవుడు కోరుకోవట్లేదు.
వాగ్దానము చేయబడిన దానికొరకు, దాని నెరవేర్పుకొరకు మొఱ్ఱ పెట్టవలెనని ఆయన కోరుకొను చున్నాడు.
56.
అబ్రహాము దేవునికి బలి అర్పించుటకు ఒక దానిని అవసరత కలిగియున్నాడు.
అప్పుడేమి జరిగెను.
దేవుడే అతనికి ఒక గొట్టెను సమకూర్చెను.
అది దేవుడేర్పాటు చేసిన మార్గమైయున్నది.
అతనికి బలిపశువు అవసరమై వుండెను, గనుక దేవుడే దానిని అతనికి సమకూర్చెను.
తదుపరి అతడు ఆ చోటికి యెహెూవా యీరే అని పేరు పెట్టెను, దాని అర్ధం “స్వయంగా దేవుడే తన కోసం ఒక బలిపశువును సిద్ధపరచుకొనెను.
57.
ఇప్పుడు, యోబు అనే ఒక పురాతన ప్రవక్త ఒకప్పుడుండెను.
యోబు, అతనొక ప్రవక్త.
అతడు కష్టాలపాలయ్యెను.
సాతాను అతనిని శోధింపగోరెను, కురుపులతో అతనిని మొత్తాను.
సాతాను అతని పిల్లల్ని తీసివేసెను, సంపదను తీసివేసెను.
తనకు కలిగినయావత్తును తీసివేసెను.
అంతమాత్రమేకాక అతని శరీరమును కురుపులతో మొత్తెను.
58.
అతని యొద్దకు ఆదరణకర్తలు వచ్చిరి.
మరివారేమి చేసారు?
అతన్ని హీనంగా చూచారు (వెక్కిరించారు) ఆటపట్టించారు.
అతనితో “నీవెందుకు రహస్యముగా పాపము చేసితివి?
” అని పలికారు.
59.
అయితే యోబు తన యదార్థతను విడిచి పెట్టలేదు.
అతడు దేవునికి మొడ్డ పెట్టెను.
తాను దేవుని ఆజ్ఞలను వెంబడించుచున్నానని తాను ఎరిగియుండెను.
దేవుడు ఏదైతే చేయుదునని వాగ్దానము చేసాడో సరిగ్గా దానినే యోబు చేసాడు.
దహనబలిని బట్టి తాను దేవునితో నిలుచుదునని అతనికి దేవుని వలన వాగ్దానము చేయబడెను.
గనుక సరిగ్గా దానియందే అతడు నిలిచియుండెను.
60.
గనుక దేవుడతనికి ఒక దర్శనమును అనుగ్రహించెను.
అతడొక ప్రవక్త అతడేమి చూచెను.
వాక్యమైయున్న యేసుక్రీస్తును అతడు చూచెను.
అతడన్నాడు.
“నా విమోచకుడు సజీవుడనియు అంత్యదినములయందు ఆయన ఈ భూమి మీద నిలుచుననియు, నా శరీరము పురుగులు పట్టి, చీకిపోయిననూ, నా శరీరముతోనే నేను దేవునిని చూచెదను.
” చూశారా!
ఆయన అతనికి పునరుత్థానము యొక్క దర్శనమును అనుగ్రహించెను.
అతడొక ప్రవక్త గనుక వాక్యమును చూచెను.
అతడు వాక్యమును చూచేను.
తన ఎముకలు, తన దేహము అంత్యదినమున లేచునని అతడు ఎరిగియుండెను.
దేవుని ఉనికిని గూర్చి అతడు ప్రశ్నింపబడెను.
కేవలం అతడు చూడగలిగినటైతే.
61.
అతడిలా పలికెను.
“ఒక పుష్పము రాలిపోవును, మరలా అది తిరిగి వచ్చును, ఒక వృక్షము నరకబడినను అది తిరిగి చిగురించును.
నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు?
నీవు పాతాళములో నన్ను దాచిన యెడల ఎంతోమేలు, నీకోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన యెడల ఎంతో మేలు.
62.
అప్పుడు ఉరుములు ఉరుముట ఆరంభమాయెను, మెరుపులు వచ్చెను, ప్రభువు ఆత్మ ప్రవక్త మీదికి వచ్చెను.
అతడు నిలిచి ప్రభువు రాకడను చూచెను.
మరిలాగున కేకవేసెను.
“నా విమోచకుడు, సజీవుడనియు, అంత్యదినములయందు ఆయన ఈ భూమి మీద నిలుచుననియు, నా శరీరము పురుగులుపట్టి, చీకిపోయినను నా శరీరముతోనే నేను దేవుని చూచెదను.
” దేవుడు వాక్యమైయున్న యేసుక్రీస్తును అనుగ్రహించెను.
అతడు ఆయనను చూచెను.
మరలాగే ఆయనను విమోచకుడని పిలిచెను.
63.
ఐగుపు నుండి బయటకు వచ్చుటకు ఇశ్రాయేలుకు ఒక మార్గము కావాలి.
అందుకు దేవుడు వారి కొరకు ఒక ప్రవక్తను అనుగ్రహించెను.
అబ్రహామునకు చేయబడిన వాగ్దానమును ఋజువు పరిచే ప్రవక్తగా అతడుండెను.
నిశ్చయముగా అది దేవుడేర్పాటు చేసిన మార్గమునైవుండెను.
తమ విడుదలకొరకు వారొక సైనికున్ని తర్పీదునకు పంపడము కాదు, అదీ ఇదీ చేయడమూ కాదు, వారు చేయవల్సిందల్లా, చేసినదంతా కేవలం దేవుడేర్పాటు చేసిన వాగ్దానము కొరకు కనిపెట్టుటయే.
ఆయన ఇలా సెలవిచ్చెను.
అతని జనులు బానిసలుగా వుందురు.
నాలుగు వందల సంవత్సరముల తర్వాత అతడు వారిని బయటకు తెచ్చును.
ఆయన బాహుబలమే వారిని బయటకు రప్పించును.
సూచనలు, అద్భుతములు జరిగించుట ద్వారా ఆ దేశములో తనకి మహిమ వచ్చును.
64.
ఇక్కడొకడు వచ్చుచుండెను!
వారు మొట్టి పెట్టినప్పుడు, ఇప్పుడు గుర్తుంచుకోండి!
వారి విడుదల కొరకు వారెంత మొడ్డ పెట్టినా, నిర్ణయించబడిన కాలము వచ్చువరకు వారు ఆవిధముగా మొఱ్ఱపెట్టుచూనే వుండవలెను.
65.
నేడు మనం చూచే ఈ సంగతులు, ఇరువై ఏళ్ళ క్రితం లేక నలభై ఏళ్ళ క్రితం జరిగియుండేవికావు.
ఇవి ఈ దినముకై వున్నవి.
గనుక ఈ దినమునే జరుగును.
ఇవి జరిగే ఘడియ ఇదే!
ఆ సమయమిదే!
నెరవేరే సమయమిదే.
ఎందుకని?
దేవుడు వాగ్దానము చేసెను.
గనుక ఇది ఇక్కడ ఇప్పుడు జరుగుచుండెను.
66.
“పరిశుద్ధాత్మ బాప్తీస్మం అనేది మరలా ఉండబోదు” అని వారు వందేళ్ళ క్రితం అన్నారు.
“పరిశుద్ధాత్మబాప్తీస్మం మరోసారి ఉండదు” అని యాభై ఏళ్ళ క్రితం వారన్నారు.
కానీ పెంతెకొస్తు లైన మీరు దేవుడు తనపరిశుద్ధాత్మను
కుమ్మరించే ఘడియ ఇదేనని నిరూపించారు.
మెధడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూధరన్ అనే వారు ఎంతన్నప్పటికి మీరు వాక్యముతోనే అక్కడ నిలిచియున్నారు.
ధైర్యంగలమనుష్యులు నిలబడి, పరిశుద్ధాత్మ బాప్తీస్మం దిగేవరకు వేచివుండి, బాషలతో మాట్లాడి, దేవుని మహిమపరిచిరి.
తేడా అనే దానిని ఏ ఒక్కడు చెప్పజాలడు.
తన వాక్యమునకు తానే అనువాదకునిగా దేవుడున్నాడు.
దానిని నీవు పొందుకొన్నాను.
అయితే నీవు పొందుకొన్న దానిని వివరించలేకపోవచ్చును.
కానీ దానిని నీవు పొందుకొన్నావని మాత్రం నీవు ఎరిగియున్నావు.
దేవున్ని ఎవరు వివరించగలరు?
ఏ ఒక్కరూ దానిని చేయలేరు.
67.
ఒక దర్శనమును దేవుడు ఎలా చూపించగలడో అనే దానిని నేను చెప్పలేను.
కాని ఆయన చూపించగలడని మాత్రం తెలుసును.
ఈ కార్యములను దేవుడు ఎలా చేయగలడో అనే దానిని నేను చెప్పలేను.
అలా చెప్పటం నా పనికాదు.
అది ఆయన ఇష్టం.
ఎందుకంటే వాటిని చేయటం ఆయనకే సాధ్యం.
ఆయన ఎలోహిం అయివున్నాడు, ఆయనే స్వయంభవుడు.
నేను కేవలం ఆయన సేవకుణ్ణి మాత్రమే.
ఆయన దీనిని వాగ్దానము చేసాడు గనుకనే ఇక్కడి వున్నదని నేనెరుగుదును.
ఆయనమాట ఇచ్చాడు గనుకనే దానిని నెరవేరుస్తాడు అన్నది మాత్రమే నాకు తెలుసును.
ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా వున్నాడని నేనెరుగుదును.
ఆయన దీనిని వాగ్దానం చేసాడు.
దానిని నిజం చేయుటకు ఆయన ఇక్కడ వున్నాడని నాకు తెలుసును.
అవును అది దేవుడేర్పాటుచేసిన మార్గము!
68.
ఇశ్రాయేలునకు ప్రవక్త ఇవ్వబడెను, ఆ ప్రవక్త ద్వారా వారు బయటకు రప్పించబడుటనుబట్టి ఆ వాగ్దాన వాక్యము ఋజువుచేయబడెను.
ఈ ప్రవక్త మోషే అనేక సంవత్సరములు అరణ్యములో నివశించెను, నలుభై సంవత్సరములు ఈ జనులతో అనేక రీతులుగా ఇబ్బందులుపడెను, అయినను వాగ్దాన భూమిలోకి వారిని చేర్చుటకు ఎంతగానో ప్రయత్నించెను.
అయితే ఒక చోటికి వచ్చినప్పుడు అతడు మరణించవలసివచ్చెను, అప్పటికి అతని వయస్సు నూట ఇరువై సంవత్సరములు.
చనిపోవుటకు అక్కడ అతనికి స్థలము లేకుండెను.
అతడు చనిపోవుటకు సిద్ధపడునప్పుడు, దేవుడు అతనికి ఒక బండను అనుగ్రహించెను.
అరణ్యములో అతడు కొట్టిన బండ అది, వారిని వెంబడించిన బండ అది, వారికి దాహము తీర్చిన బండ అది.
చనిపోవుటకు దేవుడు సమకూర్చిన బండ.
మరి అక్కడ ఆ బండ మీద అతడు ప్రశాంతముగా చనిపోయెను.
69.
ఆ బండ మీదనే, ఓ దేవా, అదే బండ మీద నన్ను కూడా చనిపోనిమ్ము!
నేను కూడా అక్కడే చనిపోవుటకు ఇష్టపడుచున్నాను.
ఆ బండ క్రీస్తుయేసే.
అవునండి.
70.
ఆ బండ మీద మోషే చనిపోయిన్పుడు, అతని శవమును మోసికొని పోయేవారు అక్కడ అవసరమైయున్నారు.
గనుక దేవుడే ఒక దూతల గుంపును అక్కడికి పంపెను.
అతని సమాజము యొక్క పెద్దలు ఎందుకు కాదు?
దూతలు తప్ప మరెవ్వరు అతనిని అక్కడికి తీసుకొనిపోలేరు.
వారు అతనిని దేవుని సన్నిధిలో పాతి పెట్టిరి (తీసికొనిపోయిరి).
తన శవమును మోసేవారు (Pallbearers)అతనికి అవసరమైయున్నారు, దేవుడుఅందుకు తగిన ఏర్పాటు చేశాను.
దేవుడేర్పాటు చేసిన మార్గములో అతడు వెళ్ళిపోయెను.
హల్లెలూయ.
71.
హనోకు దేవునితో ఐదువందల సంవత్సరములు నడిచెను.
ఆయనను సంతోషపెట్టెను.
గృహమునకు వెళ్ళుటకు అతనికి విశాల మార్గము (High way) కావల్సివుండెను.
దేవుడు దానిని అతనికి అనుగ్రహించెను.
72.
రంగులు పులుముకొన్న తన యొక్క ముఖమునుబట్టి, తన దుష్టమార్గములోనికి జనులందరిని రప్పించుటను బట్టి యెజెబెలును ఏలియా శపించెను.
తరువాత అతడు నీరసపడి, చింతాక్రాంతుడయ్యెను.
గృహమునకు వెళ్ళుటకు సిద్దపడెను.
అతడు బాగా ముసలివాడయ్యెను గనుక కనీసం యొర్దాను నదిని కూడా దాటలేకపోయేను.
అయితే యొర్దాను దాటిపోవుటకు దేవుడతనికి ఒక మార్గమును సమకూర్చెను.
దేవున్ని కలుసుకొనుటకు అతడు పరలోకమునకు ఎక్కి వెళ్ళగోరెను గనుక అతనికి తీసికొనిపోవుటకు దేవుడు అగ్ని రధములను, అశ్వములను క్రిందికి పంపెను.
ఆయన ఎల్లప్పుడు సరిగ్గా ఆలానే చేయును.
మంచిది అవునండి.
దేవుడెల్లప్పుడు మార్గము చూపును.
(సమకూర్చును).
అవును.
73.
జ్ఞానులు బబులోనులో నుండి బయలుదేరగోరిరి, వెళ్ళుటకు వారు ఒక మార్గము కొరకు వెదుకుచుండిరి.
ఎందుకంటే రాజు పుట్టియున్నాడన్న సంగతినివారు ఎరిగియున్నారు.
దిక్కులను చూపే ఒక అయస్కాంత పరికరము (Compass) వారికి అవసరము.
అందుకని దేవుడు వారికి ఒక నక్షత్రమును పంపేను.
గనుక వారు దానిని వెంబడించిరి.
అది దేవుడే ర్పాటుచేసిన మార్గమైయున్నది.
దేవుడు ఒక మార్గమును అనుగ్రహించెను.
పరిపూర్ణమగు వెలుగును వారు కనుగొని చేరేటంతవరకు ఆ నక్షత్రమును వెంబడించిరి.
ఓ!
74.
ఒక దినమున ఈ లోకమునకు రక్షకుడు అవసరమయ్యెను.
వారు నశించిరి.
ఆ సంగతి వారికి తెలియకుండెను.
తాము రక్షింపబడితిమని వారనుకొన్నారు.
కానీ వారికి ఒక రక్షకుడు అవసరము.
రక్షకునిగా దేవుడు తన కుమారుని సమకూర్చెను.
ఎందుకని?
ఆయన తప్ప మరెవ్వరు లేరు రక్షించుటకు.
దానిని చేయగలిగినవారు ఈ భూమి మీదగానీ, పరలోకములో గానీ మరెక్కడైనా గానీ ఎవ్వరు లేకుండిరి.
దేవుడు ఒక కన్యకను కమ్ముకొనెను, ఆమె గర్భము ధరించి ఒక మగబిడ్డను కనెను.
ఆ మగబిడ్డ ఒక యూదుడు కాదు, అన్యుడు కాదు ఆయన దేవుడే.
శరీరమందు ప్రత్యక్షమయ్యెను, మరి ఆయన మాత్రమే విమోచింపగలడు.
ఆయన రక్తము మనలను రక్షించుచున్నది.
ఆయన రక్తము మనలను స్వస్థపరచుచున్నది.
ఆయన చేసిన ఏ వాగ్దానముకైనా సరే మనము నిలువగలిగినది ఆ రక్తము మీద మాత్రమే.
దానిని చేయుదునని దేవుడు వాగ్దానము చేసియుండెను.
75.
రక్తము క్రింద, రక్తము ద్వారా మాత్రమే దేవుడు ఆరాధికున్ని కలుసుకొనును.
ఇశ్రాయేలు దేవున్ని కలుసుకొనే ఒక చోటు కలిగియున్నది.
అదొక.
నేడు కూడా దేవుడు కలుసుకొనుటకు ఒక చోటు వున్నది.
ఒక మెధడిస్టు నొద్దనో, బాప్టిస్టు పెంతుకోస్తు నొద్దనో ఆయన ఆరాధికున్ని కలుసుకోడు గానీ రక్తము క్రింద మాత్రమే ఆయన కలుసుకొనును.
దేవుడు కలిగియున్న ఏకైక స్థలము అదియే.
ఒక సంస్థలోనో, ఒక యూనియన్ లోనో ఆయన కలుసుకోలేడు.
రక్తములోనే ఆరాధికున్ని యేసుక్రీస్తు కలుసుకొనును.
“నేను రక్తమును చూచినప్పుడు” అదే దేవుడేర్పాటు చేసిన మార్గము.
76.
ఆయనే మెషీయా అని వారు ఆయనను చూచినప్పుడు, సంఘము పూర్తిగా ఒప్పించబడెను.
77.
బావి యొద్ద నున్న ఒక చిన్న స్త్రీ, ఆమెకు ఒక రక్షకుడు అవసరమైనప్పుడు, దానిని చూపేందుకు ఆమెకు ఒకటి అవసరమైయున్నది.
ఆమె సంఘమునకు వెళ్ళుచుండేది, అంతయు చేయుచుండేది, వారు ఈ మతసిద్ధాంతం, ఆ మత సిద్ధాంతంను కలిగియుండిరి అయితే అవి ఆమె నైతిక జీవితమును ఏ మాత్రం మార్చలేకపోయెను.
ఆమె ఒక వేశ్యగా అయ్యెను.
బజారు కీడ్చబడెను.
ఒకనాడు ఆమె ఇంచుమించు పగలు పదకొండు గంటల ప్రాంతములో నీటికొరకు వెళ్ళుచుండెను.
అక్కడ ఒకతను కూర్చొనియుండెను, ఒక యూదుడు ఆ సమగ్రదృశ్యమందు అక్కడుండెను.
మరి ఆమె అన్నది.
78.
ఆమె ఆ బావి దగ్గర నీళ్ళు చేదుకొనుటకు సమీపించినప్పుడు ఒక మనిషి స్వరము ఆమె చెవినపడింది.
“అమ్మా (Woman), నాకు దాహమునకిమ్ము.
” మరి ఆమె అన్నది.
79.
వెంటనే ఆమె ఆయనవైపు తిరిగి, ఆయనొక సాధారనణమైన యూదుడనుకొన్నది, అవును శరీరరీత్యా ఆయన ఒక మానవుడే అయివున్నాడు.
ఆయనొక మనిషి, గనుకనే మనవలె ఆయన కూడా తినెను, త్రాగెను, నిద్రించెను.
ఆయన మరణించేటంత వరకు మానవునిగానే వుండెను.
అయినను ఆయన దేవుడు.
దానిని మనం తెలిసికోగలం.
80.
అందుకు ఆమె అన్నది “యూదులు ఆ విధముగా సమరయులను అడుగుట వాడుక కాదు గదా.
81.
ఆయన అన్నాడు “నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో దానిని నీవు ఎరిగియుంటే నీవే ఆయనను అడుగుదువు.

“నీవు వెళ్ళి నీ భర్తను తీసికొని ఇక్కడికి రమ్ము”.
“నాకు భర్తలేడు” అని ఆమె బదులిచ్చెను.
82.
అందుకాయన “నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే, నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి.
” ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు.
” అని చెప్పెను.
ఏమైంది?
ఆమెకు దేవుడు ఏదో ఒకదానిని సమకూర్చెను.
83.
"అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.
క్రీస్తనబడిన మెస్సీయ వచ్చినప్పుడు, ఆయన సమస్తమైన సంగతులను మాకు తెలియజేయునని మాకు తెలియును.
ఇటువంటి కార్యాలను ఆయన మాత్రమే చేయును.
వాక్యము ఆ విధముగా సెలవిచ్చుచున్నది.
ఆయన కొరకు మేము ఎదురుచూచుచున్నాము.
నేను పరిసయ్యులు, సద్దుకయ్యులు, హెరోదీయుల యొక్క బోధలను బట్టి, మతాచారములను బట్టి ఎంతో అలసిపోయి బలహీనపడియుంటిని.
కానీ మెస్సీయ వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, వీటిని మాకు తెలియజేయునని మేనెరిగియున్నాము.
అందుకు మీరేమంటారు?
”.
84.
అప్పుడు “నేనే ఆయనను” అని ఆయన చెప్పెను.
ఆమేన్.
ఏర్పాటుచేసిన మార్గమును దేవుడు కలిగియున్నాడు.
ఇక ఆమె అక్కడే కుండను విడిచి పెట్టి, మార్పునొందిన స్త్రీగా ఊరులోనికి పరుగెత్తికొనిపోయి “రండి, నేను చేసినవన్ని నాతో చెప్పిన వానిని చూడుడి.
ఈయన మెస్సీయా కాడా?
” అని అన్నది.
85.
పేతురు, అంద్రియ చెప్పేదానిని వినుచుండెను, అనేకసార్లు వినెను.
యోహాను మెస్సీయను పరిచయము చేసిన సంగతిని ఇంకా అక్కడ జరుగుచున్న వాటిని అంద్రియ చెప్పుట వినియుండెను.
అయితే అవన్నియు పేతురుకు మరుగుగావుండెను.
కానీ ఒక దినాన అతడు అందేయతో కలసి యేసుని చూచుటకు వచ్చెను.
అతడు యేసు సన్నిధిలోనికి వచ్చినప్పుడు, యేసు అతనిని తేరి చూచి ఇలా అన్నాడు.
“నీ పేరు సీమోను, నీవు యోనా కుమారునివి.
ఆయన ఎవరో అనే దానిని చూచుటకు దేవుడు పేతురునకు ఒక ఏర్పర్చబడిన మార్గమును దయచేసెను.
ఆ మెస్సీయా ఆయనే.
86.
యేసు మృతినొంది, తిరిగిలేచి, పరలోకమునకు ఆరోహణమయిన తర్వాత, దానిని సాక్ష్యమిచ్చుటకు సంవుమునకు తగిన శక్తి అవసరమైయున్నట్టుగా మనము కనుగొన్నాము.
అందుకని దేవుడు వారికి పెంతెకొస్తును ఇచ్చెను.
ఆయన ఒక పెంతెకొస్తును దయచేసెను.
87.
స్నేహితులారా, రెండువేల సంవత్సరములు గడిచిపోయాయి.
రెండువేల సంవత్సరములు గడిచిపోయాయి.
అంత్య దినాలలో అనేకులు క్రైస్తవ్యము లోకి వచ్చియున్నారు, వారు వచ్చుట మాత్రమే కాదుగానీ వచ్చి, తమ సిద్ధాంతములతోను, కల్పనాకధలతోనూ, తెలివితేటలతో కూడిన ప్రసంగములతోను క్రైస్తవ్యాన్ని చెటిపివేసి, దానిని సంకరము చేసారు.
తద్వారా దేవుని శక్తి, క్రీస్తు సువార్త యొక్క అసలు సంగతులు వాస్తవంగా నశించిపోయినవి.
ఇక్కడ ఈ చివరి దినములకొరకు వాగ్దానము చేయబడిన వాక్యమును మనము కలిగియున్నాము.
ఏమి జరుగునో, ఏమి సంభవించునో వాటిని మనిషి నమ్ముటలేదు.
దానిలోనుండి వారు తొలిగిపోయారు.
మీరు క్రైస్తవులేనా?
అని నీవు వారిని అడుగుము, వెంటనే వారంటారు “నేను పలాని, పలాని దానికి చెందియున్నాను” అని బదులిచ్చెదరు.
మరి ఇదొక్కటేకాదు.
క్రైస్తవుడవ్వాలంట చేరుట కాదు జన్మించాలి.
ఆది క్రైస్తవులు అలాగే జన్మించారు.
కానీ రెండువేల సంవత్సరముల తర్వాత అంతయు మరలా బబులోను లోనికి తిరిగిపోయేను.
88.
గనుక సంవుమునకు నేడు మరలా శక్తి, సత్యము అవసరమయ్యివుండెను.
ఓ!
అలా పొందుకొనుట కొరకే దేవుడు తన కుమారుని తిరిగి లేపెను.
ఆయన అన్నారు.
“మరికొద్ది కాలము తరువాత ఈ లోకము నన్ను చూడదు.
అయితే మీరు నన్ను చూచెదరు.
నేను మీతో కూడా వుందును.
మీలో వుందును.
హెబ్రీ 13:8 లో మనం చూడవచ్చు” ఆయన నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా వున్నాడు.
” 89.
ఆయన మనకు అంత్యదినములయందు ఒక వర్తమానమును ఇచ్చెదనని మలాకి నాలుగులో కనుగోగలము.
“ తండ్రుల తట్టు పిల్లల హృదయముల (విశ్వాసము) ను త్రిప్పును.
” ఇదే ఆ వాగ్దానము.
ఈ కడవరి దినములకు దానిని ఆయన వాగ్దానము చేసియున్నాడు.
90.
మరలాగే యెహాను 14:12 లో కూడా వాగ్దానము చేసెను.
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరిగొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
91.
ఒకనాడు ఆయన వారితో మాట్లాడుతున్నాడు, “బోధకుడా, మాకొక సూచన కనబరుచుము” అని వారడిగారు.
92.
అందుకు ఆయన వారితో “వ్యభిచారులగు చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు” అనెను.
నేడు మనము నివసించు ఈ తరము నిశ్చయముగా అట్టిదే.
ఆయనన్నాడు.
వారికి నేనొక సూచన ఇచ్చెదను.
యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఏలాగుండెనో, మరి ఆలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును.
93.
వ్యభిచారులైన చెడ్డతరము వారు ఏ విధమైన సూచక క్రియను పొందుకొన్నారు?
అది పునరుత్థానపు సూచన.
నేటికిని అదే వాగ్దానము మనకివ్వబడెను.
అయన సజీవుడని, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా వున్నాడనే పునరుత్థానపు సూచన.
94.
ఆయన అన్నాడు "లోతు దినములలో జరిగినట్టుగానే దాని గూర్చి గత రాత్రి మనము విన్నాము.
“లోతు దినములు, లోతు దినములలో ఏదైతే జరిగెనో, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో కూడా అదే జరుగును.
” ఇవి మనకి వాగ్దానము చేయబడెను, ఇంకా ఎన్నో లేఖనములున్నవి.
ఎక్కువ సమయం తీసికొనకుండునట్టు.
“కొంత కాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడు చూడదు”.
కాస్మోస్ (Kosmos)అనగా లోకము.
ఈలోకము, ఈ క్రమము, సంఘకాలము నన్ను ఇక ఎన్నడు చూడదు.
కానీ మీరు నన్ను చూచెదరు.
ఎందుకనగా నేను మీతో వుందును.
మీలో వుండును.
ఎప్పటి వరకు?
యుగసమాప్తి వరకు (To the end of the age).
యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగావున్నాడు.
ఏమిటిది?
అది దేవుడనుగ్రహించిన సూచన.
దేవుడేర్పాటుచేసిన మార్గము.
95.
అబ్రహాము కుమారుని కొరకు ఎదురుచూచేను.
అన్యుల వినాశనమునకు ముందు అతడు చూచిన చివరి సూచన ఏదనగా దేవుడు శరీరమందు ప్రత్యక్షమై, గుడారము యొక్క వెనుక బాగమందున్న శారా యొక్క హృదయ రహస్యములను వెల్లడిపరిచెను.
యేసు ఇలా అన్నాడు.
“మరి అదే కార్యము తిరిగి మనుష్యకుమారుని యొక్క ప్రత్యక్షత యందు వచ్చును.
” సహోదరుడా, సహోదరీ, మనము ఆ దినముయందు జీవించుచున్నామని నేను నమ్ముచున్నాను.
వాగ్దానము యొక్క నెరవేర్పు దినము ఇదియేనని నేను నమ్ముచున్నాను.
96.
నీవు చేయుచున్న దానియందు నీవు నమ్మిక యుంచవలసియున్నది.
ఒక వేళ దానియందు నీకు నమ్మకం లేనట్లైతే, కేవలం ఊహించి దానిని చేయుచున్నట్లే.
(Presume) ప్రిజమ్ అనే పదమునకు వెబ్స్టర్ డిక్షనరీలో ఇలా అర్ధం వుంది.
“అధికారపూర్వకముగా కాకుండా సాహసించటం.
” ఊహకాదు, మాట మనకు వాగ్దానముగా ఇవ్వబడినప్పుడు దానిని నెరవేర్చుటకు దేవుడు దానివెనుకనే వుండును.
అధికారంలేనట్టు (లేక) భాద్యత లేనట్టుగా (లేక) ఊహతో నీవు చేయవల్సిన పనిలేదు.
ఖచ్చితముగా దేవుడు చేయమన్నట్టు నీవు చేస్తే, దానిని నెరవేర్చుటమనే దానికి ఆయన కట్టుబడి వుండును.
97.
చాలా ఏళ్ళ క్రితం, నేను బాలునిగా వున్నప్పుడు, ఒక గొప్ప ప్రఖ్యాతిగల ఉజ్జీవకర్తను నేను చూచాను.
అతని పేరు పాల్ రెయిడర్ (Paul Raider).
ఒకనాడు అతడొక కధ చెప్పెను.
అదెల్లప్పుడు నాకు గ్రుచ్చుకొనును.
అతడన్నాడు “ఒకరోజున మేమొక చెట్టును నరుకుచున్నాము”.
ఓరిగాన్ (Oregon) లో అతడు ఒక దుంగలను కోయువాడుగా వుండెను.
అతని యజమానుడు కొండ పైకి వెళ్ళమని అతనితో చెప్పెను.
అతడు కల కనుచున్నాడు.
నిజానికి అతడక్కడే వున్నాడు.
ఆసమయమందు ఆ ద్వీపమునకు దిగువన అతడుండెను.
ఎంతో జ్వరపీడితుడై చావనైయుండెను.
98.
వైద్యుడు అక్కడికి చేరుకొనే లోపే, పాల్ ఆరోగ్య స్థితి క్షీణించి, మరణమునకు అతి సమీపమగుచుండెను.
అతడు నమ్మకమైన తన భార్యను పిలిచి, “ప్రియా, గదిని చీకటి అలుముకొనుచున్నది.
కటిక చీకటి ఆవరించుచున్నది.
” అని చెప్పి కోమాలోకి పోయేను.
99.
దానిని అతడు చేసిననంతరం, తానొక కల కన్నాడని చెప్పెను.
అతడు ఆ కోమా (అపస్మారకస్థితి) లో వుండగా అతని యాజమానుడు పలానీ చెట్టును నరకమని చెప్పి పంపాడట.
అతడు వెళ్ళి, దాన్ని కనుగొని, పడగొట్టి, తాను మోసుకొని పోగలిగిన సైజులోకి నరుకుటకు గొడ్డలితో ఎంతో కష్టపడెను.
కానీ దానిని చేయలేకపోయాడు.
తనకున్న బలము క్షీణించిపోయెనని పలికెను.
దానిని చేయలేకపోయాడు.
“ఆ మొద్దు (దుంగ) ఏ పరిమాణములో వున్న, ఖచ్చితముగా నేను లేపగలను, మరొకసారి ప్రయత్నించేదను.
” అని అనుకొనెను.
అక్కడ వంగి, దానిని లేప ప్రయత్నించాడు, ఎంత ప్రయత్నంచినను (ప్రయాసపడినను) తన వల్ల కాకపోయెను.
గనుక దాని ప్రక్కన కూర్చొని, “నేనేం చేయాలో నాకు పాలుపోట్లేదు (అర్థం కావట్లేదు), నాయజమానుడైతే దీన్నే ఆ క్యాంపులోకి కావాలని అడిగాడు!
కానీ దీన్నేమో నేను లేపలేనంత బలహీనుడనయ్యాను”.
100.
ఇదివరకు తాను ఎన్నడూ విననంత మధురమైన స్వరమును తాను విన్నానని అన్నాడు.
అది తన యజమానుని స్వరము అనుకొని, తన యజమానుని చూచుటకు ఆ ప్రక్కకు చూచెను.
అయితే మాట్లాడినది తన యజమానుడు కాదు గానీ ప్రభువైన యేసు.
ఆయన అన్నాడు “పాల్ నీవు తెగపోరాడుచున్న పోరాటం దేనికొరకు?
దేని కొరకు దిగులుపడుచున్నావు?
చూడు అక్కడ ఆ నీటి ప్రవాహము పారుచున్నది.
ఆ నీటి ప్రవాహములో ప్రయాణించి ఆ క్యాంపుకి చేరుకోవచ్చును.
101.
వెంటనే అతడు ఆ దుంగను ప్రవాహములోకి తోసి వేసి, దాని మీద ఎక్కి కూర్చొని, వేయగలిగినంత గట్టిగా తన స్వరమును ఎత్తి “దాని మీద నేనుస్వారీచేయుచున్నాను,దానిమీదనేనుప్రయాణం చేయగలుగుచున్నాను.
”అని బిగ్గరగా అరిచేను.
102.
సహోదరుడా, సహోదరీ, ఈ సంగతులు అంత్యదినములలో జరుగునని యేసుక్రీస్తు వాగ్దానము చేసెను.
దాని నెరవేర్పు జరుగు దినములలో జీవించుచున్నామని నేను నమ్ముచున్నాను.
ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా వున్నాడని నేను నమ్ముచున్నాను.
అదెలా జరిగియున్నదో నేనెరుగను, కానీ దానిమీద నేను స్వారీ చేయగలుగుచున్నాను.
అది సత్యమని నేను నమ్ముచున్నాను.
ఎందుకనగా అది సువార్త, దేవుడేర్పాటు చేసిన మార్గము.
అది ఈ గడియ వర్తమానమని నా నమ్మకం.
మనం జీవించు కాలమునకు అది చెందియున్నది.
అది దేవుడేర్పాటుచేసిన మార్గము.
దాని మీదనే నేను స్వారీ చేయుచున్నాను.
మరి నీవు కూడా నాతో పాటు స్వారీ చేయుదువా?
మనము తలలు వంచుదుము.
103.
పరలోకపు తండ్రీ, నీ వాక్యము మీద నిలిచి మహిమలోనికి మేము స్వారీ చేయుచున్నాము (ప్రయాణించుచున్నాము).
నీ వాక్యము సత్యమని మేము నమ్ముచున్నాము.
ఓ దేవా ఈ రాత్రి ప్రతీ పురుషుడు, స్త్రీ యు వాక్యము పైకి ఎక్కును గాక.
గుర్తుంచుకోండి.
వారు ఆ విధముగా ప్రయాణం చేయుచూ “నేను దేవుని వాగ్దానము పై స్వారీచేయుచున్నాను.
అది నన్ను తిన్నగా మహిమలోనికి నన్ను తీసి కొనిపోవును, నేటికి అది నాకు దేవుడేర్పాటుచేసిన మార్గము.
యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు” అని వారు ఒప్పుకొందురు.
104.
“మరికొద్ది కాలము తరువాత లోకము ఇకెన్నడు నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు, ఎందుకనగా నేను మీతోను, మీలోనూ వుందును” అని నీవు పలికావు.
ప్రభువా నీవు వాగ్దానము చేసితివి గనుక మేము నిన్ను చూచెదము.
105.
ఒకసారి గ్రీకులు వచ్చి “అయ్యలారా మేము యేసుని చూడవలయును” అని అన్నారు.
వారడిగినది వారికి ఇయ్యబడెను.
మరి ఈ రాత్రి ప్రభువా వేమును నిన్ను చూడగోరుచున్నాము.
అది మా హృదయకోరికయై యున్నది.
నిన్ను గూర్చి వినకుండా ఏ ఒక్కరు నిన్ను చూడాలనుకోరు.
నిన్ను చూసే భాగ్యము ఈ గ్రీకులకు ఏ విధముగా అనుమతించబడియున్నదో, మరలాగే మేము కూడా చూడాలని మాకొరకు ఒక మార్గమును సిద్ధపరచియున్నావు.
నిన్న నేడు నిరంతరము నీవు ఏకరీతిగా వున్నందున, నీ వెల్లప్పుడు ఒక మార్గమును సిద్ధపరుచుదువు.
ఈ గ్రీకులను నీ సన్నిధిలోనికి ఒక దాసుడు తోడుకొని వచ్చెను.
నిన్ను చూచుటకు వారొచ్చెను.
తండ్రీ, అదే భాగ్యము ఈ రాత్రి మాకును అనుగ్రహించండి.
నీ దాసులుగా మేము ఈ ప్రజలను నీ సన్నిధిలోనికి తీసికొనివచ్చుచున్నాము.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా వున్న యేసుని మేము ఈ రాత్రి చూచుదుము గాక.
ప్రభువా దానిని అనుగ్రహించుము.
106.
నశించిపోయిన స్త్రీ, పురుషులను, బాలబాలికలను ప్రభువా రక్షింపుము.
హంతకులతోను, గొంతులు కోసేవారితోనూ, మొదలగువారితో దేశము కలుషితమైపోయినది, నేడు దేశము చెడిపోయినది, సంఘములు దుర్నీతితో నిండిపోయినవి.
సంఘసమాఖ్య వధశాల (Ecumenical - slaughter)కు వారు దానిని నడుపుచున్నారు.
ఎందుకనగా వారు దేవుడేర్పాటు చేసిన మార్గములోకి వెళ్ళుటలేదు.
దేవుని వాక్యమును బట్టికాక, ఏదో ఒక మత సంబంధమైన దాన్ని బట్టివారు వెళ్ళుచున్నారు.
107.
దేవా నేను ఉదాహరించి చెప్పిన ఆ నిజమైన బాతులవలె తిరిగి జన్మించిన క్రైస్తవులు, వాస్తవమైనట్టుగా, నిజమైనట్టుగా వున్నారు, వారు.
“నా గొఱ్ఱలు నాస్వరమును వినును.
అన్యుని అవి ఎంతమాత్రము వెంబడించవు.
” ప్రభువా, నీ స్వరమే నీ వాక్యమైయున్నది.
సంఘమునకు, ప్రజలకు మరి అదే నీవు ఏర్పాటుచేసిన మార్గమైయున్నది.
నీ వాక్యమే సత్యము.
నీవు వాక్యమైయున్నావు.
దేవుని వాక్యమ సజీవమై బలముగలదై రెండంచులు గల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా వుండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించునంతమట్టుకు దూరుచూ, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోదించుచున్నది అని బైబిల్ చెప్పుచున్నది.
108.
ఆయన వాక్యమైవున్నాడని, వారి హృదయాలలో వున్న ఆలోచనలను వివేచించగలిగియుండెనని వారు చూచినప్పుడు ఎందుకని ఇశ్రాయేలీయులు తమ మెస్సీయాను గుర్తించలేకపోయిరి.
ఎందుచేత వారు గుర్తించలేకపోయారు?
ప్రవక్తల ద్వారా అది వారికి అర్ధమైంది, ప్రవక్తలే అది చేయగలుగుదురని, అయితే దేవుని యొక్క సర్వసంపూర్ణత తన కుమారునిలో చేయబడినప్పుడు మన మధ్య ఆయన నివసించినప్పుడు, దానిని చూచుటలో వారు తప్పిపోయారు, ఎందుకంటే వారు గ్రుడ్డివారు గనుక.
109.
ప్రభువా, ఈ రాత్రి ఎందరి కళ్ళు తెరువబడియున్నవో, అందరును మా మధ్యలో యేసు ఉండటాన్ని చూచుదురు గాక.
ప్రతి రోగి స్వస్థపడునుగాక.
ప్రభువా ఇది స్థిరమవునుగాక, తద్వారా వారు ఇక ఎన్నటికి, ఈ గడియనుండి ఇక ఎన్నటికీ.
నీవే మెస్సీయావని నమ్మునట్లు ఏమి చేయుచున్నది.
వారు దేవుని మార్గములో వచ్చుచున్నారు.
వారిలో అనే కులు ఈ రాత్రి మరణించుచున్నారు.
ఈ రాత్రి ఇక్కడున్న అట్టివారిలో అనేకులు, బహుశా ఇప్పటినుండి ఇంకో వారం రోజుల వరకు ఉండకపోవచ్చునేమో, నీవు ఆదుకోకపోతే, (నీవు సహాయం చేయకపోతే).
110.
ఇప్పుడు, తండ్రి నీవు చేసిన వాగ్దానమునకు నీవే బాధ్యుడవు.
నీవు వాగ్దానము చేసితివి గనుక మేము నిన్ను చూచెదము.
దేనినైతే నీవు చేసితివో, వాటిని మేము కూడా చేయుదుమని నీవు మాకు మాటయిచ్చావు.
మరి ఆ గడియ ఇదే.
దానిని నేను ఒప్పుకొనుచున్నాను.
దానిని నేను నమ్ముచున్నాను.
నీవు చెప్పినట్లు, నీ వాక్యము సెలవిచ్చినట్లు నేను వినుచున్నాను.
దానిని నీవు స్థిరపరుచుము.
అది వాస్తవమని నేనెరుగుదును.
ప్రభువా అది ఇప్పుడు తెలియబడును గాక.
అది వ్రాయబడియున్నది.
ఇప్పుడు అది దేవుని రాజ్య మహిమ కొరకు జరుగును గాక.
ఆమేన్.
111.
ప్రార్థన వరసను మేము పిలుచుదుమని నేను అనుకోవట్లేదు.
ఇక్కడ నుండే నేను అది చేయుదునని అనుకొనుచుచున్నాను.
112.
మీలో ఎంతమంది రోగగ్రస్తులుగా వున్నారు?
ఇప్పుడు మీరు.
మీకు అనారోగ్యమని మీచేతిని పైకెత్తుట ద్వారా తెలియపరుచుము.
113.
మరలాగే “బ్రదర్ బ్రౌన్ హామ్, నేనింకా రక్షించబడలేదని మీలో ఎంతమంది మీ చేతిని ఎత్తుట ద్వారా తెలుపగలరు?
” “నా కొరకు ప్రార్థించండి" అని మీలో ఎంతమంది అడుగ గలరు?
గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, అది మంచిది.
అది.
గాడ్ బ్లెస్ యూ.
నేనింకా రక్షించబడలేదని ఎవరు ఒప్పుకోగలరు?
114.
ఇప్పుడు, చేతులు పైకెత్తిన మీరు, “బ్రదర్ బ్రెన్హామ్, నేను నిజంగా రక్షింపబడగోరుచున్నాను.
అది నా హృదయములోనుండి వచ్చుచున్న మాట.
” లోకములో నేను సాధించాల్సింది ఇక ఏమిలేదు అని అనుచున్నాను.
మంచిది నీ రక్షణ కన్నా ఈ లోకములో నీవు సాధించ గలిగేది ఏముంది?
“నా కొరకు ప్రార్థించుము.
నేను రక్షింపబడగోరుచున్నాను.
” అని ఈ భవనమంతటిలో దానిని చెప్పేవారు మీ చేతులను పైకెత్తండి.
మీరెక్కడున్నా సరే.
“నేను.
115.
మీలో ఎందరు పరిశుద్ధాత్మను పొందలేదు?
“కచ్చితంగా నేను పరిశు ద్ధాత్మను పొందగోరుచున్నాను” అని చెప్పుదురా?
అలాగైతే మీ చేతులు పైకెత్తండి.
మంచిది, కొద్దిమంది మాత్రమే వున్నట్టున్నారు.
116.
ఇప్పుడు, క్రీస్తు తన వాక్యమును నెరవేర్చును.
ఆయన యందు నీవు నీ విశ్వాసమునుంచుము.
ఆయనే వాక్యము.
ఇప్పుడు హెబ్రీ నాలుగవ అధ్యాయం అంటోంది.
“దేవుని వాక్యమనగా క్రీస్తు.
క్రీస్తు వాక్యమైయున్నాడు.
మీ అందరికి అదితెలుసు, అవునా?
ఆమెన్ చెప్పండి (ఆమెన్ అని సమాజము అనుచున్నది - సంపాదకుడు).
ఆయనే వాక్యము.
ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటేరీతిగా ఉన్నాడు.
మోషెలో ఆయన ఎలా ఉన్నాడో, అలాగే ఏలీషాలోను ఉన్నాడు, ఏలీయాలో ఎలా ఉన్నాడో, మరలాగే యెహోనులోను ఉ న్నాడు, యెహానులో ఆయన ఎలా ఉన్నాడో, తన్ను తాను సంపూర్ణముగా యేసులో ఉంచుకొనెను.
గతములో ఆయన ఏ రీతిగా ఉన్నాడో మరి నేడు కూడా అదే రీతిగా ఉండెను, ఈ దినము కొరకు దేవుని వాక్యము ఇప్పటికినీ ప్రవచింపబడియుండెను.
మరి అదే ఆయనను దాని మీద ప్రకాశించు వెలుగుగాను, వాగ్దాన వాక్యమును నిరూపణ చేయు(స్థిరపరుచు)నట్లు చేయుచుండెను.
117.
స్నేహితులారా, మనము అంత్యకాలములో వున్నాము.
యేసు ఇక్కడ ఉన్నాడు.
మీరు దానిని విన్నారని నేను నమ్ముచున్నాను.
118.
చూచే లేక స్పర్శించే దృష్టి నీకు లేనేలేదు, అందుకనే నీ జీవితములో నీవెన్నడును చూడలేక పోవుచున్నావు.
ఇది ఏవ్వరికైనా వర్తించును.
ప్రతి ఒక్కరు ఏదో ఒకసారి వెచ్చదనము యొక్క స్వర్శను అనుభవించియుంటారు.
కాదంటారా?
నాకు ఒక దృష్టివుంది.
గనుక నేను చూడగలుగుదును, మరియు నేను చెప్పుదును అది నిశ్చయముగా సూర్యుడు అని.
బహుశా నీవనవచ్చును “అదేలా జరుగునో నేనెరుగను, కానీ నాకు ఒక స్పర్శ (అనుభవము) వేడితగిలినట్టుగా వుంది, మరి నీవు కూడా దానిని స్పర్శించగలవు (లేక) అనుభవించగలవు.

“అది సూర్యుడు” అనే నేను అనగలను “సూర్యుడు అంటే ఏమిటి?
" అది ఒక వెలుగు.
“వెలుగు అనగా ఏమిటి?
” పూర్తిగా భిన్నమైన ఒక నూతన ప్రపంచముగా అది నీకుండును.
119.
యేసుక్రీస్తు ఇప్పుడు ఇక్కడ నిలబడియున్నాడని నేనంటే నీ స్పందన ఏలా ఉండును?
ఆయన మధ్యలోనే వున్నాడని నేను చెబితే అది నీకెలా వుండును?
ఆయన దానిని వాగ్దానము చేసెను.
“ఇద్దరు, ముగ్గురు ఎక్కడైతే నా నామమున కూడుదురో, వారి మధ్యలో నేను ఉందును.
" ఇప్పుడు అది నాకు ఒక సత్యముగా వుండొచ్చును లేక ఉండకపోవచ్చును, అయితే అది మాత్రం పూర్తిగా సర్వసత్యమై ఉండెను.
అది ఏదో ఒక రీతిగా నిజము లేక కాకపోవును.
120.
ఇప్పుడు, నీ రక్షణ విషయములో ఆయన అక్కడ ఆ కల్వరిలో చనిపోయినప్పుడే నిన్ను రక్షించెను (దాన్ని చేసెను.
) మరలాగే స్వస్థత విషయంలో కూడా అంతే.
దానిని నీవు నమ్ముదువా?
ఆయన చేసెనని వాక్యము సెలవిచ్చెను.
121.
ఆయన చేయగలిగిన ఏకైక కార్యము ఏదనగా తాను నాకిచ్చిన వస్త్రము (Suite) తో నిలిచి, తానే మెస్సీయా నని ఋజువు పర్చుకొనుటయే.
122.
ఆయన చేతులకి పుట్టుమచ్చలు (గోటి మచ్చలు) లేవండీ.
అలాంటివాటిని వేషదారులు ధరింతురు.
దెబ్బలు పొందినట్టు రంగులతో మచ్చలు వేసికొని, ముఖము మీద ఎజ్ఞని రంగు మచ్చలు వేసికొని అలాంటి గుర్తులు ధరించుకొందురు.
వారు ఆవిధముగా చేయగలరు,చేసియున్నారు కూడా.
అనేకమంది ఆయన వలే సిలువను వేసికొనుచుందురు.
నిజానికి వారు ఆవిధముగా నటించుచున్నారు.
123.
అయితే ఆయన జీవము, ఆయన యందు వున్నది!
"తనంతటికి తాను కుమారుడు ఏమీ చేయడు గానీ తండ్రి ఏమి చేయుట చూచునో దానినే కుమారుడు చేయును.
” ఆయన యందు ఉన్న జీవము అది, అది ఋజువు చేయబడెను.
ఆయన ఒక యూదుడైనందును బావి వద్ద స్త్రీ ఆయనను మెస్సీయా అనలేదు గానీ, తన హృదయ రహస్యములను వివేచించినందునే ఆమె ఆయనను మెస్సీయాగా గుర్తించెను.
గడచిన కాలమందు తనను తాను ఆ విధముగా మెస్పీయాగా పరిచయం చేసికొనెను.
తనను తాను కనబరచుకొనుటకు అదియే ఆయన ఏర్పాటుచేసిన మార్గమైయుండెను.
ఈ కాలము (This age)న కూడా అదియే ఆయన యొక్క లేఖనానుసారమైన ఏర్పాటు చేసికొనిన మార్గమైవున్నది.
దానిని నీవు నమ్ముదువా?
124.
ఇప్పుడు మీలో వున్న ప్రతి ఒక్కరికి నేను పరిచయస్థున్ని కాదు.
నేను చుట్టూ చూచాను.
అయితే నాకు తెలిసిన వారెవ్వరిని నేను కనుగోలేకపోయాను.
ఇక్కడున్న ప్రతి ఒక్కరు నన్నెరుగనివారే, అలాగే మీగురించి నా కేమి తెలియదు.
అవునా?
చేతులు పైకెత్తండి.
ఖచ్చితం, అంతటా ఈ పరుపు మీద పడుకొనిన ఈ వ్యక్తి తన చేతిని పైకెత్తాను.
నేనెవరో అతడికి తెలియదు.
మీరు నన్ను ఎరుగరు.
125.
కానీ ఒక సంగతి గుర్తుంచుకోండి, మీరు దేవునికి తెలుసును, మీరు దేవునికి తెలుసును.
ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడని తన్నుతాను ఋజువు పర్చుకొనును.
“బ్రదర్ బ్రెన్ హామ్ అదెలా?
” నీవనవచ్చును.
అదొక వరము.
126.
ఒక వరము అనగానేమి?
ఒక వరము అనగానేమి?
ఏదో రకంగా తీసికొని, ఏలాగో వాడేది కాదు సుమా.
“నేను స్వస్థత వరము పొందుకొన్నాను గనుక నేను వెళ్ళి వీరిని, వారిని స్వస్థపరుస్తాను.
నా కిష్టమైనట్టుగా దానిని వాడుకొంటాను” అని చెబితే కుదరదు.
ఒక వేళ నీవు ఆ విధంగా చేయుచున్నట్లైతే వరమును నీ చేతిలోకి తీసి కొని.
దానిని తప్పుడు అనువాదము ఇచ్చుచున్నావు.
అది నీ ఇష్టంకాదు.
అదొక వరము.
నీ కిష్టమైన దారిలో నుండి , పరిశుద్దాత్మ నిన్ను వాడుకొనునట్లు నిన్ను అప్పగించుకొనవలయును.
చూశారా?
అది ఒక వరము.
127.
ఒక సేవకుడంటే అంతేమరి.
అతడు తనకేది ఇష్టమో దానిని బోధించడు.
అతడు తన ఇష్టాలన్నింటిని విడిచి పెట్టి, పరిశుద్దాత్మ యొక్క ప్రేరణ క్రింద మాట్లాడును (భోదించును).
ఏ వరమైన సరే అంతేమరి.
ఇప్పుడు పరిచర్యలు అనే వరములు, మరియు ఇంకా అనేకమైనవి ఆ విధముగానే జరుగును.
మొదటిగా, దైవవరము లేవనగా “అపోస్థలలు, ప్రవక్తలు, భోదకులు, కాపరులు, సువార్తికులు.
” అవన్నియు వారి కార్యాలయములు.
అవి మన వరములైవున్నవి.
128.
ఇప్పుడు, చివరిదినములలో అది చేతునని యేసుక్రీస్తు వాగ్దానము చేసెను.
ఆయన చేసెదనని వాగ్దానము చేసినట్లైతే, తప్పక దానిని చేయును.
ఈ రాత్రి దానిని మీలో ఎందరు నమ్మెదరు.
మీ చేతులను పైకెత్తిచూపుచూ, “దానిని నేను ఒప్పుకొను (అంగీకరించు)చున్నాను” అని చెప్పండి.
ఇక్కడున్న మీలో ఎందరు.
వందనము.
ఇది వరకు జరిగిన కూటములలో మీలో ఎంతమంది పాల్గొనలేదు?
అలాంటి వారు మీరు మీ చేతిని చూపండి.
మై, దాదాపు గుంపులో సగం మంది ఉన్నారు.
ఆయన చేయుటకు ముందుగా, ఆయన చేయగలడని మీలో ఎందరు నమ్మెదరు?
గాడ్ బ్లెస్ యూ (దేవుడు నిన్ను దీవించునుగాక).
129.
ఇప్పుడు చూడండి.
మీకు నేను సత్యము బోధించినయెడల, జవాబునిచ్చుటకు అందుకు దేవుడు బాధ్యుడైయున్నాడు.
దానికి తప్పక ఆయన జవాబునిచ్చును.
అది ఆయన వాక్యమైయుండెను.
గనుక అది తప్పక జరుగవల్సివుంది.
“నేను నా మాట పంపితిని, అది నిరర్థకముకాక తప్పక నెరవేరును.
130.
ఇప్పుడు, నేను స్వస్థపరచగలిగితే, నేను దానిని చేయుదును.
కాని స్వస్థపరిచేది నేనుకాదు.
గౌరవనీయుడగు లేటు, బ్రదర్ ఉప్షా గురించి మనం చెప్పుకొందాం.
అతడు ధీరత్వము గల ఒక వృద్ధుడు, జనసమూహమునకు వెనక వైపు చక్రాల కుర్చీలో వుండెను.
ఒక వేళ నేనే స్వస్థపర్చేవాడినైతే, వెంటనే స్వస్థపరిచేవాడినేమో.
అయితే యధార్ధము చెబుతున్నాను, అప్పుడు నేను కూటమును ముగించుకొని వేదికను విడిచి పెట్టుచున్నాను.
అయితే అప్పుడే నాకొచ్చిన దర్శనములో నేనతనిని చూచితిని, కావున నేను నడుచుకొంటూ వెళ్ళి, అతనిలో అదేమిటో, మరియు అతడు ఎంతకాలము నుండి అలా ఉండెనో మొత్తం చెప్పాను.
వెంటనే అతడు లేచి, వేదిక మీదికి నడిచివచ్చెను, వంగి తన పాదములను అందుకోగలిగెను.
66 సంవత్సరములు కుంటివానిగా వున్న అతడు సంపూర్ణముగా ఆ క్షణమందే స్వస్థపడెను.
చూశారా?
131.
సరిగ్గా అదే రాత్రి ఒక నల్ల జాతి స్త్రీ (Colour Lady) తన బిడ్డను ఎత్తుకొని వేదిక ప్రక్కన వుండెను.
నేను అన్నాను.
“కళ్ళద్దాలు ధరించిన ఒక వైద్యుడు, నల్ల జాతి బిడ్డకు వైద్యచికిత్స చేసియుండెను, అయితే గొంతు పక్షవాతమునకు గురి అవ్వులను నేను చూచుచున్నాను.
132.
ఒక వృద్ధురాలగు నల్లజాతి స్త్రీ, అతికష్టముమీద వేదిక మీదికి రప్పించబడెను.
ఆమె అన్నది “ప్రభువా (అయ్యా) దయచూపండి, ఆమె నా బిడ్డ!
చాలామంది పరిచారకులు (Ushers)కలసి కూడా ఆమెను పట్టుకోలేకపోయారు.
” ఆమె వేదిక మీదికి వచ్చెను.
133.
నేనన్నాను “ఏనీ (Annie) నీవు ఇక్కడికి ఎక్కిరావటం వలన ఏంలాభం లేదు, అది నాచేతిలో ఏమీ లేదు.
ఏది చేయాలన్నా దేవుడు చెయ్యాలి, నీవు ఇక్కడికి ఎక్కిరావటం వలన ఏం లాభం లేదు, కేవలం నమ్ముము.
” ఆమె మోకరించి, ప్రార్థించుట మొదలు పెట్టింది.
నేను జనసమూహము వైపు చూచాను, వారి మధ్య ఒక సందు ఖాళీ ఏర్పడుటను చూచాను.
ఒక నల్లజాతి బిడ్డ తన చంకలో ఒక బొమ్మను ఎత్తుకొని ఏర్పడిన సందు లేక ఖాళీ మధ్య వెళ్ళుటను చూచాను.
వెళ్ళుచున్న ఆ బిడ్డను, ఈ నల్ల జాతి స్త్రీ వద్ద వున్న బిడ్డను చూచితిని ఆ బిడ్డ ఎవరో కాదు ఈ బిడ్డయే.
అప్పుడు నేను అన్నాను “జవాబు వచ్చినది”.
వెంటనే ఆమె మంచం మీద నుండి లేచెను.
చూశారా?
134.
అది దేవుడు, చూశారా?
అది దేవుడు, చూశారా ఆయన.
ఆయన తప్ప ఏ ఒక్కరు స్వస్థపర్చలేరు.
దేవునియందు నీకున్న విశ్వాసమే స్వస్థతను ఇచ్చును.
135.
ఇప్పుడు, బైబిల్ ఇలా సెలవిచ్చుచున్నది.
“ఆయనే మన ప్రధానయాజకుడు, ఇప్పుడే, ఆయన మన బలహీనతలయందు మనతో సహానుభవము గలవాడు.
” దానిని మీరు నమ్ముదురా?
(సమాజము “ఆమేన్' అనుచున్నది - సంపా) ఒక ప్రధానయాజకుడు!
ఆయన ఒక ప్రధాన యాజకుడైతే ఆయన ఏలా కార్యములు జరిగించును (స్పందించును)?
ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నట్లైతే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నట్లే స్పందించును.
(జరిగించును).
136.
ఇప్పుడు నీవు ప్రార్థింపుము, పరిశుద్ధాత్మను చేయనిమ్ము.
దేవునితో చెప్పుము, “దేవా, నాకు తెలియని ఈ వ్యక్తి అక్కడ నిలువబడియున్నాడు.
కానీ అతడు చెప్పేవి గ్రహించితిని.
నీవు మారవు.
నీవు క్రీస్తువు.
నేను అనారోగ్యముగా వున్నాను.
అవసరతలో ఉన్నాను.
చేయుటకు తగిన విశ్వాసము నాలో లేదు, అయితే ఎవరైతే విశ్వాసము కలిగియున్నారో.
వారిని పిలిచి - వారైన లేక నేనైనా మహిమలో వున్న నీ వస్త్రపు చెంగును ముట్టనిమ్ము.
ఆవ్యక్తి మార్గములో లేనివాడైతే, తిరిగి మాట్లాడుటకు అతని నోటిని వాడుకొనుము.
నీవు భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే చేసియున్నావో మరదే రీతిగా ఇప్పుడును చేయుము.
అప్పుడు నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా వున్నావని నేను తెలుసుకొందును.
” ఇప్పుడు ప్రార్థన కొరకు తలలు వంచుదుము.
137.
ప్రభువైన యేసూ సువార్తనుండి ప్రవచనాత్మక పని తట్టు త్రిప్పబడుట, అయినప్పటికిని, నేను నమ్ముచున్నాను ప్రభువా, దానిని ' నీవు వాగ్దానము చేసితివని.
ఈ రాత్రి దానిని నీవు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను.
దయచేయుము.
నా ప్రార్థన వినుము.
ఈ రాత్రి ఈ జనసమూహము ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు, ఎమ్మాయి మార్గములో వారు చెప్పినట్టుగా “దారిపొడవునా ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండలేదా?
అని చెప్పుదురు గాక.
''యేసు మృతులలోనుండి లేచెను.
అది వారికి తెలియును.
వారు ఆయనతో మాట్లాడుచున్నారు.
కానీ దానిని వారు గమనించట్లేదు (గుర్తించట్లేదు).
అయితే ఆయన వారితో కలసి ఇంట్లోకి వెళ్ళి, తలుపులు వేసి, సిలువ వేయుటకు ముందు ఎలాగైతే తన్ను తాను వారికి బయలుపరుచుకొనెనో మరదే విధముగా ఇప్పుడును వారికి కనబరచుకొనెను.
అప్పుడు వారి కన్నులు తెరువబడెను.
గనుక అది ఆయనేనని వారు గ్రహించారు.
ప్రభువా వారిహృదయములు మండినట్టుగానే మేముగృహములకువెళ్ళు చుండగా మా హృదయములను కూడా మండించుము.
ఇప్పటి వరకు నీవే మాతో మాట్లాడితివని మేమెరుగుదుము.
నీవు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా వున్నావు గనుక ఈ భూమి మీద నీవు ఉన్నప్పుడు ఎలాంటి కార్యములు చేసియున్నావో, మరి అలాంటి వాటినే మా మధ్య జరిగించుము.
యేసు నామమున అడుగుచున్నాము.
ఆమేన్.
138.
కేవలం నమ్ముచూ, ప్రార్థనలో వుండండి, మొదటిగా ఈ వైపు ఉ న్నవారి మీద దృష్టి నిలుపుదాం ఈ బిల్డింగ్లో నీవు ఎక్కడున్నప్పటికి పర్వాలేదు, కేవలం దేవునిని నమ్ముము.
ప్రతి ఒక్కరు బహుభక్తిగాను, నిన్ముళముగాను వుండి ప్రార్థించగలరని నేను కోరుచున్నాను.
139.
ఇది పూర్తిగా అసాధ్యము.
ఈ రోజు ఉదయకాలమున సేవకుల అల్పాహార విందులో నమ్మలేని నిజం (A paradox) అనే వర్తమానమును భోదించితిని.
నమ్మడానికి కష్టమైనదే అయినను అది వాస్తవము (ఆశ్చర్యకరమైనదే అయినను అది నిజం).
పరిశుద్దాత్మ ఇక్కడ నిలచి, శ్రోతల మధ్య నేనెరుగని జనులకు ఏదో చెప్పును, అది ఒక నమ్మలేని నిజముగా వుండును.
వివరింపజాలనిదిగా ఉండును.
దానిని ఆయన చేయుట నాకు తెలియదు.
ఆయన చేయునది మాత్రమే నేను నమ్ముదును.
ఆయన జరిగించునని నమ్ముచున్నాను.
140.
ఇప్పుడు ప్రభువైన యేసూ, నీ వస్త్రమును నేను ముట్టగోరుచున్నాను, నేను అవసరతలో వున్నాను.
నా జీవితకాలమంతయు నిన్నే సేవించుదునని నేను నీకు మాటఇచ్చుచున్నాను అని ప్రార్థించండి.
మీరు మారుమనస్సు (పశ్చాత్తాపము) పొందాలని దేవుడు కోరుచున్నాడు.
ఇప్పటివరకు మీరు మారుమనస్సు పొందకుంటే, ఇప్పుడే పశ్చాత్తాపపడి, “ప్రభువా నేను పశ్చాత్తాపపడాలనుకొంటున్నాను, నన్ను స్వస్థపర్చుము.
నన్ను దీవించుము.
నేను నీ దాసుడను” అని చెప్పుము.
141.
నేను.
నేడు మీరు ప్రార్థనా కార్డులను పంచితిరా?
నేను ఆ విషయమును గూర్చి బిల్లీ (Billy) ని అడిగితిని.
ఒకవేళ అతడు దానిని చేయకుంటే, ఒక ప్రార్థన వరుసను నేను పిలుచుదును.
అయితే వారు ఈ దినము ప్రార్థనా కార్డులను ఇవ్వలేదు.
భక్తిగా కూర్చోండి.
నమ్మండి.
142.
ఇప్పుడు, దేవుని మహిమ కొరకు ఇక్కడ ప్రతీ ఆత్మను నా స్వాదీనములోనికి యేసుక్రీస్తు నామమున తీసికొనుచున్నాను.
తద్వారా తీర్పు దినాన క్షమాపణ దొరకదని ఆయన వాక్యము ద్వారా వెల్లడాయెను.
143.
ఇప్పుడు ఈ వైపుకు చూస్తూ నమ్ముము.
పూర్ణహృదయముతో ప్రార్థించుచూ, కేవలం ప్రార్థించుచూ, తగ్గించుకొనుము.
బిగుతుగా వుండకుము.
సడలించుకొని “ప్రభువా, నీవు వాగ్దానము చేసితివి.
నిన్ను నేను నమ్ముచున్నాను” అని చెప్పుము.
మరి చేయవల్సింది అదే.
144.
మీరు నన్ను అడుగవలసిన అవసరంలేదని నాకు తెలుసు.
మీలో ఎందరు ఆ వెలుగుని చూచితిరి?
ఇప్పుడు చూద్దాం.
ఆ వెలుగును ఫోటో తీసియున్నారు.
దానిని చూచితిరా.
చూచినవారు మీరు మీ చేతిని చూపించండి.
అక్కడ దాన్ని మీరు చూడలేదా?
చూశారా, అది మరో పరిణామముగా వున్నది.
అది ఆ స్త్రీ మీద నిలిచియున్నది.
145.
ఆమె వెన్నుముక, కాళ్ళలోనొప్పిచేత ఎంతగానో బాధపడుచున్నది.
ఆమే.
దేవుడు నిన్ను స్వస్థపరచునని సహోదరీ నీవు నమ్ముచున్నావా?
నీవు దేనిని స్పర్శించితివి?
నీవు నన్నెరుగవు, అయినను నీవు దేనినో స్పర్శించితివి.
నీవు ఎవరివో అనే సంగతిని ప్రభువైన యేసు నాకు తెలిపిన యెడల అందును బటైన నీవు మెరుగుపడెదవా?
నీ పేరు శ్రీమతి పిలిప్స్.
నేను చెప్పినది సరైనదైతే, లేచి నిలువబడుము.
మంచిది.
మనమిరువురం ఒకరికొకరం అపరిచితులము.
అవునా?
అది నిజమైతే నీ చేతినెత్తి చూపుము.
నా జీవితములో నేనెన్నడును ఆమెను చూడలేదు.
ఆమె దేనిని తాకెను?
తరువాత మీరే ఆ స్త్రీ ని అడిగి తెలిసికోండి.
నీకున్న నొప్పులన్నీ ఇప్పుడు తొలిగిపోయినవి.
నీవిప్పుడు బాగయ్యావు.
సంపూర్ణ ఆరోగ్యము గలదానివై యింటికి వెళ్ళుము.
146.
ఇక్కడ ఒక స్త్రీ వున్నది.
ఆమె వెనుకే ఈమె వున్నది.
ఈమె నరముల బలహీనత చేత భాద పడుచున్నది.
ఓ దేవా, ఒకవేళ ఆమె అలాకాక.
ఈమె పేరు శ్రీమతి స్టార్స్.
యేసుక్రీస్తు నిన్ను సంపూర్ణముగా బాగు చేయునని నమ్ముము.
నీవు లేచి నీ స్వస్థతను అంగీకరించుము.
నన్నింత వరకు నీవు చూడనిదానివైతే (నేను నీకు కొత్త కదా!
) నీ చేతులను ఆడించుము (చూపించుము).
నీ నరముల బలహీనత తొలగిపోయింది.
యేసుక్రీస్తు నిన్ను బాగు చేసియున్నాడు.
147.
ఆయన దేనిని వాగ్దానము చేసెను?
దీనిని ఆయన వాగ్దానము చేసెను.
దీనిని నీవు నమ్ముచున్నావా?
(ఆమెన్ అని సమాజము అనుచున్నది - సంపా).
148.
ఆమె వెనుకనే ఒక స్త్రీ అక్కడ కూర్చొనియున్నది.
ఆమె ప్రార్థించుచున్నది.
ఆమె ఎంతగానో ఒత్తిడిలో వున్నది.
గందరగోళ పడుచుండెను.
పొగత్రాగుటను మానివేయాలని తీర్మానించుకొనుచున్నది.
ఆమె పేరు శ్రీమతి బోర్డన్ (Miss Bordon).
శ్రీమతి బోర్డన్ నీ చేతిని పైకెత్తుము.
నీ సిగరెట్ల దురలవాటు ఇప్పుడే తొలగిపోయినది.
యేసుక్రీస్తు నిన్ను బాగుచేసెను.
ఆమెను నాజీవితములో నేనెన్నడును చూడలేదు.
149.
మీరు నమ్ముతున్నారా?
నేను కాదుగానీ యేసుక్రీస్తు దానిని చేయుచుండెను.
ఏమిటది?
వాక్యము రెండంచులుగల ఖడ్గము కంటే పదునైనదియు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను వివేచించునదై యున్నది.
“అది వాక్యము యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా వున్నాడు.
” దానిని నీవు నమ్మలేవా?
150.
ఇక్కడ, ఒక వ్యక్తి గుండె జబ్బుతో, హెర్నీయా వ్యాధితో బాధపడుచూ, ఇక్కడే కూర్చొనియున్నాడు.
అది సరియే, అతనిని నేను ఎరుగను.
నేనెన్నడు అతనిని చూడలేదు.
అతడొక సేవకుడు.
రెవరెండ్ శ్రీ కెంజీ (Rev.
Mr.
Kensey) అదిసరియే.
సార్ మీరు నమ్ముచున్నారా?
లేచి నిలబడి నీ స్వస్థతను పొందుకొనుము, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపర్చును.
151.
ఒక సేవకునిగా మీరు ఈ సందర్భములో నా తరుపున ఒక కార్యము చేయగలరా?
మీ సతీమణి మీద చేతులుంచండి, ఆమె కిడ్నీ (మూత్రపిండాల) సంబంధిత, లివర్ (కాలేయం) సంబంధిత మరియు అధిక బరువు చేతను బాధపడుచున్నది.
ఆమె మీద చేతులుంచండి.
మీరు నమ్మితే, అవన్నీ ఆమెను వదిలిపోవును.
152.
మీ వెనుక ఒక వ్యక్తి కూర్చొనియున్నాడు.
మరణచ్ఛాయలు అతన్ని క్రమ్ముకొన్నవి.
అతనికి క్యాన్సర్ జబ్బువచ్చినది.
కణితి, క్యాన్సర్, నరముల ఒత్తిడి చేత బాధపడుచున్నాడు.
అతని పేరు శ్రీ.
యంగ్ (Mr.
Yaung).
ఇప్పుడు నమ్ముము.
యేసుక్రీస్తు నిన్ను స్వస్థపర్చును.
దానిని నీవు నమ్ముచున్నావా?
దానిని నీవు అంగీకరించుచున్నావా?
మంచిదయ్యా.
153.
ఇక్కడ ఒక వ్యక్తి, వడియున్నాడు, ఒక మంచం మీద పడుకొనియున్నాడు.
అయ్యా, నీవు ఎవరో నాకు తెలియదు.
స్వస్థపర్చువాడిని నేనే అయితే, దానిని చేసియుందును.
నేను నీకు క్రొత్త, నీవు చాలా దూరమునుండి వచ్చావు, ఎంతో శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చావు.
నీలో తప్పిదములను నీవు దాచియుంచలేవు.
నేను నిన్ను స్వస్థపర్చలేను.
నీవు నీ భార్యతో కలసి ఇక్కడికి వచ్చావు.
ఆమె ఎజరుంగు కోటు ధరించి నీ ప్రక్కనే కూర్చొనియున్నది.
అది నిజమే.
మంచిది, అతడిని మరణచ్ఛాయలు క్రమ్ముకొన్నవి.
అతడు ఎక్కువ కాలం బ్రతుకడు.
అతనికి క్యాన్సర్.
154.
సహోదరీ, నీవును బాధ పడుతున్నావు.
నీవు దేన్ని బట్టి బాధపడుచున్నావో అన్న సంగతి దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముదువా?
వెన్నెముక నొప్పి చేత బాధపడుచున్నావు.
అది నిజము.
అది సరిఅయితే లేచి నిలువబడుము.
మంచిది, నీ స్వస్థత నీవు పొందుకొనుము.
దానిని నమ్ముము.
నీ భర్త మీద నీ చేతులుంచుము.
155.
నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముదువా అయ్యా?
నీవు అక్కడే పడివుంటే, నిశ్చయముగా చనిపోవుదువు.
నీవు బ్రతుకవు.
అది అంతే, వైద్యులు చేతులెత్తేశారు.
క్యాన్సర్ నిన్ను తినివేసింది.
ఇంతకంటే గొప్ప కేసులను నేనెన్నో చూసాను.
నేను నిన్ను స్వస్థపర్చలేను.
కానీ ఆయన నిన్ను స్వస్థపర్చగలడని నమ్మి అంగీకరిస్తే చాలు.
దానిని నీవు నమ్ముచున్నావా?
నీకున్న ఏకైక సదావకాశం ఇప్పుడే.
నీకివి ఆఖరిక్షణాలు.
దానిని నీవు నమ్ముదువా?
నమ్మితే, ఆ మంచం మీద నుండి లేచి నిలబడుము.
యేసుక్రీస్తు నామములో దానిలోనుండి లెమ్ము!
సంపూర్ణ స్వస్థచిత్తుడవై లేచి నిలబడి దేవుని మహిమ పరచుకొంటూ ఇక్కడ నుండి వెళ్ళుము.
ఎవరైనా అతనికి చెయ్య అందించండి, సహాయం చెయ్యండి.
ఓ అతడు తనకాళ్ళ మీద నిలబడెను.
156.
ఇక్కడున్న వారిలో ఎందరు నమ్ముచున్నారు?
(సమాజము సంతోషించుచు 'ఆమేన్' అనుచున్నది.
- సంపా) మీ చేతులను పైకెత్తండి.
నిలువబడండి.
ఇంకా స్వస్థత కోరువారు యేసుక్రీస్తు నామములో నిలబడండి.
మీ చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి.
ఆయనకు స్తుతి, మహిమలను చెల్లించండి.
మీ స్వస్థత కొరకు ప్రభువకు కృతజ్ఞతలు చెల్లించండి.
యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా వున్నాడు!
157.
సహోదరులారా వైద్యులు వివలమవ్వ వచ్చునేమో.
అయితే దేవుడేర్పాటు చేసిన మార్గమైతే ఇదే.
గనుక దీనిని నమ్ముము.
158.
మీలో ఎందరు దేవుడే ర్పాటు చేసిన మార్గమును అంగీకరించ గోరుచున్నారు?
చేతులు పైకెత్తి దేవున్ని స్తుతించండి.
యేసుక్రీస్తు నామములో మీలో ప్రతి ఒక్కరు స్వస్థతనొందామని నమ్మండి.
ఆమెన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...