కావలివాడా, రాత్రి యెంత వేళైనది
1.[సహోదరుడు విలియమ్ బ్రన్ హమ్ యెషయా 21:1నుండి12 వరకు రాసినదానిని సహోదరుడు జీన్ గోడ్ చదివెను – సంపాదకుడు] సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి -దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను గ్రహింపబడియున్నది.మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా,ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టియున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు.అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి; ప్రభువు నాతో ఇట్లనెను నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను. జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును సింహము గర్జించునట్టు కేకలు వేసి -నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెనుదాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అని చెప్పుచు వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చ బడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి యున్నాను.దూమానుగూర్చిన దేవోక్తి -కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు -ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు.
2.నెవిల్ సహెూదరుడా, నీకు కృతజ్ఞతలు.మిమ్ములను తిరిగిచూచుట బాగుగా యున్నది.
3.ప్రభువైన యేసు నామములో మిమ్ములను మేము ప్రేమించుచున్నట్లుగా ఈ ఉదయకాలపు బైబిలు తరగతికి శుభోదయం.కొద్దిసేపటిక్రితం నా కుటుంబముతో నేను దిగువన వీధిలో వాహనము నడుపుచుండగా, జారిపోవు (మంచువలన) దినములలో ఈ విధముగా సంఘములోకి వచ్చు ప్రజల గురించి నే ఆలోచిస్తున్నాను, దేశమంతయూ మంచుతో కప్పబడియున్నది, వీధులు అపాయకరముగా ఉన్నవి. వారు కనిపించినంత సులభంగా వచ్చుటలేదు. వారు వచ్చుటలో ఏదో ఒక ఉద్దేశ్యము ఉన్నది.మన పితరుల యొక్క విశ్వాసము, ఈ ఉదయకాలము ఇంకనూ వీరిలోని ప్రతి స్త్రీ మరియు పురుషునిలో మండుచున్న ఈ గుంపు లేక సమూహము ఇక్కడ ఉండుట చూచుటనేది నాకు చాలా సంతోషముగావున్నది.
4. మన సూదరుడు జినే గోడ్ ఇప్పుడే యెషయా గ్రంథము, 21వ అధ్యాయములోని వాక్యమును చదివియున్నాడు, మనము అక్కడనుండే కొద్దిగా చదివిన తరువాత బలహీనుల కొరకు ప్రార్దన కలిగియుందాము. ఈ ఉదయకాలము అంశము కొరకు వాక్యభాగము, 11 నుండి 12వ వచనము వరకు తీసుకుంటున్నాను, “కావలివాడా, రాత్రి యెంత వేళైనది?
5.మనము దాన్ని అంశముగా తీసుకొనుటకు ముందు, ప్రార్ధనలో మన తలలు కొద్దిసేపు వంచుదాం.
6.ప్రభువైన దేవా! మా పితరుల దేవుడవు నీవే. ఈ భూమి మీద జీవించిన మొదటిజీవిలో జీవమును ఊదినది నీవే. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి జీవిమీద నీవు నియంత్రణ కలిగియున్నావు, ఇకముందు కూడా కలిగియుంటావు. శ్వాసించేవాటి అన్నింటికి, అన్ని విధములైన మానవజాతులకు నీవే సృష్టికర్తవు. నీవే సృష్టికర్తవు.
7.ఈ ఉదయకాలమున మేము మా హృదయాలలో నీ వాగ్దానములు సత్యమైనవని నమ్ముచున్నందుకు సంతోషముగా ఉన్నాము, వాటిలో ప్రతియొక్క దాన్ని మేము నమ్ముచున్నాము.ఈ వాగ్దానములలో నీవు చెప్పియున్నావు అది ఏమిటంటే ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నీ నామమున కూడియుంటారో, వారి మధ్యలో నీవుంటావని చెప్పియున్నావు, వారి పిలుపుకు నీవు జవాబిస్తావని చెప్పియున్నావు.
8.ఈ దినము ఇక్కడ బరువైన హృదయాలున్నాయి.సంఘము లోపలికి వచ్చిన దగ్గరనుండి, మనుషులను మోసుకొని వచ్చెడివి లేక మంచములను నేను చూస్తున్నాను, కొంతమంది చేతులకు వ్యాధి సోకుట వలన వారు తమ భుజములను పైకెత్తియున్నారు.మిగిలినవారు, వారి ప్రియమైనవారిని పోగొట్టుకొనియున్నారని నేను వినియున్నాను.ఓహ్!, ఇది పాపమైయున్న భయంకరమైన లోకము, కానీ ఇంకనూ ఈ క్రియలన్నీ ప్రభువైన యేసులో నేర్చుకోవలసి యున్నది, “దేవుని ప్రేమించువారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఆయనే మాకు చెప్పెను.
9.వాటిలో చాలా సంగతులు లేక క్రియలు మా మోకాళ్ళ దగ్గరకు తీసుకుని రాబడుచున్నవని ఈ ఉదయమున మేము ఆదరించబడు చున్నాము.మేము లేఖనముల గురించి ఆలోచించుటకు ఇష్టపడతాము, అవి ప్రభువు పైన ఆధారపడియుంటాయి, అవి వారి బలమును నూతనపరుస్తాయి.వారు ఒక పక్షిరాజువలె పర్వతము మీదకు ఎక్కుతారు. వారు అలసట లేకయే పరుగెత్తుదురు, వారు నడుస్తారు కానీ మూర్చిల్లరు.ఒక కవి చెప్పినట్లుగా, “ప్రభువా, నాకు బోధించుము, ఎలా ఎదురుచూడాలో నాకు బోధించుము.
10.మహిమ నుండి మన రక్షకునియొక్క నోటి నుండి పరిశుద్ధాత్మ ద్వారా వినుటకు మనము ఈ దినము ఎదురుచూద్దాం, ఆయన వాక్యము ద్వారా, ఆయన స్వరముతో ప్రియమైన సంగతులు మాట్లాడుటను వినుటకై మనము సహనముతో ఎదురుచూద్దాం, మన పాపములను క్షమించుటకును మన బలహీనతలను స్వస్థపరచుట కొరకును మాట్లాడును.
11.బహుశా మనము ఈ ఉదయము ఈ గుడారమును విడిచివెళ్ళునప్పుడు, సంతోషముతో ఆ ఎమ్మాయి గ్రామమునుండి వచ్చినవారు చెప్పినట్లుగా, “ఆయన దారిలో మనతో మాట్లాడినప్పుడు మన హృదయము మండలేదా? .”ఆయనే లేపబడిన ప్రభువని వారు ఆ దినమున ఆయనను కనుగొన్నారని మేము నిశ్చయముగా నమ్ముచున్నాము. ప్రజల మధ్యలోనే ఆయన ఉండెను.మనము అలసిపోవలసిన అవసరంలేదు, లేక మన హృదయములు మూర్ఛిల్లవలసిన అవసరములేదు. తండ్రీ, మాకిది దయచేయుము, ప్రతి ఘడియా నీలో మా విశ్వాసమును నూతన పరచుము.
12.వ్రాయబడిన వాక్యమును దీవించమని మేము మిమ్ములను అడుగుచున్నాము వినుచున్న చెవులను దీవించుము, మాట్లడుచున్న పెదవులను దీవించుము, నీకే మహిమ కలుగునుగాక, యేసు నామములో అడుగుచున్నాము.ఆమేన్.
13.మనలో ఏ ఒక్కరూ సమస్యలు లేకుండా ఉండలేరు.ప్రతి రోగము రాకుండా చేస్తానని దేవుడు మనకు వాగ్దానము చేయలేదు కాని, ఆయన బలము (కృప) చాలును అని రాయబడియున్నది.ఆయన ఎన్నడు మనము మోయలేనంత బరువును మనమీద ఉంచడు, కానీ ఆయన మనకు ఇచ్చేదేమిటంటే దానిని భరించుటకు కృపను ఇస్తాడు.కావున, మనము ఆ ఆదరణను తెలుసుకొనియుండాలి.
14.నా హృదయములో కొద్ది గంటల నుండి ఏదో చెప్పవలెనని ఉన్నట్లుగా నాకు అనిపిస్తున్న అంశము మీద ఇప్పుడు కొద్దిసేపు మాట్లాడుదాం, "కావలివాడా, రాత్రి యెంత వేళైనది?
15.బహుశా అది అస్తమయమునకు మరియు చీకటికి మధ్యన అయ్యుండవచ్చును, ఆ దినము పట్టణములో ఒక భయంకరమైన దినమైయున్నది, ఎందుచేతంటే అక్కడ అపాయమును తెలియచేయుటకు అలారం ఏర్పాటు చేయబడింది.అక్కడ వారు.గోపురం పైనున్న కావలివాడు వెనుకకు వెళ్ళి దూరముగా రథముయొక్క చక్రముల క్రింద నుండి పైకి లేస్తున్న దుమ్మును చూశాడు.అతడు దూరమునుండే గుర్రపు డెక్కల చప్పుడును విన్నాడు.
16.కానీ ఇద్దరు యవ్వనస్తులైన స్త్రీలు బావి దగ్గర నిలబడియున్నారు, వారి యొక్క యవ్వనములో, యవ్వన వయస్సులో, వారికి ఆలోచించుటకు చాలాయున్నది, ఈ కావలివాని మాటలు ఏమైయుండవచ్చని వారు అనుకుంటున్నారు.బహుశా అది వారికి తగినంతగా అర్ధము అయ్యుండకపోవచ్చును, ఎందుచేతనంటే వారు అప్పుడే సిగ్గు చేత యెరుపెక్కిన స్త్రీ యొక్క యవ్వనదశలో ఉన్నారు.ఆ రాత్రి వారికి అక్కడ ఒక విందును (పార్టీని) కలిగియున్నారు బహుశా అందువలనైయుండవచ్చును, ఈ యవ్వనస్త్రీలు ఆ విందునకు హాజరు కావలసియున్నది.అందుచేత ఆ కావలివాని యొక్క హెచ్చరిక వారిమీద ఎక్కువగా ప్రభావము చూపించలేదు, లోకము యొక్క చిత్రవిచిత్రమైన సంతోషమును ఆ రాత్రియందు వారు కలిగియున్నారు.వారి సంభాషణ ఈ విధముగా కొనసాగుతున్నది, ఒక యవ్వన స్త్రీ మరొకరితో ఈలాగు అంటున్నది, “మన దినములలో ఉన్న ఆ మృత్యుక్రీడల చేత ఆనందించుటవంటివి ఉండుటనేది మరీ అంత చెడు ఏమికాదు, మనము కలిగియున్న ఆ గొప్ప అవకాశమును తీసుకొనుటకు ఎవరో ప్రయత్నము చేస్తున్నారు, మనము ఆనందించే ఈ సంతోషమును మన నుండి ఎవరో తీసుకొనుటకు ప్రయత్నము చేస్తున్నారు.
17.అది కేవలం నేటి మన ఆధునిక దినమునకు సరిగ్గా సరిపోతుందని నేను నమ్ముతున్నాను.ఆ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వారిని మీరు హెచ్చరించేటప్పుడు వారికి అపాయము జరుగబోవుచున్నదని వారిని హెచ్చరించునప్పుడు, వారు మిమ్ములను కేవలం ఏదో పాత పొగ అని అనుకుంటునట్లుగా అగుపిస్తుంది, వారి జీవితంనుండి వారియొక్క సంతోషమునంతా ఎవరో తీసుకొనుటకు ప్రయత్నము చేస్తున్నట్లుగా వారికి అనిపిస్తుంది.
18.కార్చానా నుండి వచ్చిన యవ్వనస్తులైన వారి గురించి మనము మరొక్కసారి ఆలోచించుదాము.వారు దినమెల్లా పనిచేయుటవలన వారి ముఖమంతా ధూళితో నిండియుంటుంది.ఒక యవ్వనస్తుడు మరొక యవ్వనస్తునితో ఇలాగ అంటున్నాడు, “మనము ఎప్పుడైతే మనలను కడుగుకొని శుభ్రముగా చేసుకొని, మరలా మనము యధాప్రకారముగా ఆ గోపురము దగ్గర కలుసుకుందాం.జాన్, నేను ఖచ్చితముగా చెప్పగలను నీవు కూడా, ఈ దినమున మనము వింటున్న ఆ వర్తమానము అందరిని కలచివేయలేదా, గోపురము మీద ఉన్న ఆ కావలివాడు జీవితములోని సంతోషమంతటిని తీసివేయుటకు ప్రయత్నము చేయుచున్నాడు, అపాయము మన దగ్గరకు రాబోవుచున్నదని చెప్పుటకు అతడు ప్రయత్నము చేయుచున్నాడు.కానీ మీకు తెలుసా, అక్కడున్న ఉత్తమమైన సైన్యం మనదే, మన సైనికులలో చాలామంది ప్రతి రాత్రి మనము కలుసుకునే అదే ప్రదేశములో అక్కడనే కలుసుకుంటారు, మనము ఆ సహవాసమునుబట్టి సంతోషిస్తాము, అది ఎటువంటిదంటే కొద్దిగా జూదము, ఏదో కొద్దిగా త్రాగెడి పానీయములు.“నేను, నా మటుకైతే,” అతడిలా అన్నాడు, "ఈ కావలివాడు మాట్లాడబోవుచున్న వాటిలో దేని గురించియైనా హెచ్చరించినట్లయితే నేను దాన్ని వ్యతిరేకిస్తాను.” అది ఏదైననూ అపాయము వచ్చుటకు ముందుగా ఏర్పరచబడినది మనము నమ్ముచున్నాము, దానిని గురించి మన రబ్బీలకు తెలుసు, మన కాపరులకు తెలుసు, అందుచేతనే వారు అటువంటి కార్యములను గురించి చెప్పుచున్నారు.
మనము మాత్రము గోపురము మీద ఉన్న ఈ కావలివాడు చెప్పు ఈ భయంకరమైన సంగతులను వినుటకు శ్రద్ద వహించుటలేదు.
19.అది మన దేశముయొక్క నేటి చిత్రమువలె ఉన్నది, మన దేశములో ఉన్న యువత, కేవలం యువత మాత్రమే కాదు, మన దేశములో వయస్సు మళ్ళినవారు కూడా దుష్టులైనారు.హెచ్చరికను వినుటను వారు వ్యతిరేకిస్తున్నారు.ఎప్పుడైతే నిజమైన కావలివాడు హెచ్చరిస్తున్నాడో, అతడు ఒక మతవిరోధిగానో లేక మూఢభక్తి గలవానిగానో పరిగణించబడుచున్నాడు.
20.పగటి సమయము రాత్రిగా మారబోవుచున్నప్పుడు, బహుశా గవిని దగ్గరున్న సైనికుడు, ఎవరైతే ద్వారమునకు కాపలా కాస్తున్నాడో, అతడు విశ్రాంతి లేకుండా ఉన్నాడు.అతడు తన తోటి సైనికుని దగ్గరకు వెళ్ళి ఇలా అంటున్నాడు, “ఆ కావలివాడు చెప్పుచున్నది సరియైనదే అని నమ్ముటకు అవకాశమున్నదని నీవు నమ్ముచున్నావా?
21.అక్కడ ఏదో అపాయమున్నదని మీకు తెలుసు.అక్కడ మరణముకు సంబంధించినదానికై ముందుగా హెచ్చరిక చేయబడింది.చాలాసార్లు ప్రియమైనవారు, అవతలి ఒడ్డునకు ముందుగానే దాగియున్నారు, వారియొద్దకు హెచ్చరిక వచ్చినట్లుగానే అది కనిపిస్తుంది.నేను మా తండ్రిగారి గురించి ఆలోచిస్తున్నాను, ఆయన నన్ను విడిచివెళ్ళుటకు ముందుగా, ఆయన చాలా సంవత్సరములు కెంటకీ వెలుపట ఉన్నారు.
22.కానీ అకస్మాత్తుగా, తిరిగి తన పాత ఇంటికి వెళ్ళాలని, ఆయనకు ప్రియమైన వారితో మాట్లడాలని, తన స్నేహితులతో మాట్లాడాలని నాన్నగారి మీద ఏదో కదిలినట్లుగా అనిపించిన తరువాత ఆయన తన పాత గృహమును చేరుకుని, తనకు ప్రియమైనవారితోను మరియు తన స్నేహితులో మాట్లాడియున్నారు.
23.నాన్నగారు మా గృహమునకు తిరిగివచ్చిన తరువాత ఆయన తన సోదరుడు తనను చూచుటకు రాని కారణముచేత గట్టిగా మందలించి తనను తప్పనిసరిగా చూచుటకు జఫర్సన్ విల్కు రావాలని చెప్పియున్నారు.
కొంతసేపటి తరువాత వారుకూర్చుని మాట్లాడుకుంటుండగానే నాన్నగారు వేరే లోకమునకు దాటి వెళ్ళిపోయారు.
24.నేను మా మామగారి గురించి ఆలోచిస్తున్నాను. ఆయన వెళ్ళిపోవుటకు కేవలం కొద్దిరోజుల ముందు ఆయన ఇలా అన్నారు, “బిల్లీ, యుటికాలోని ఎగువ ప్రాంతములో నీవు మరియు నేను వెళ్ళి ఉడుతల వేటాదాం.నేను ఆ పాత ప్రదేశమునకు వెళ్ళాలని ఆశిస్తున్నాను.” దేవుని యొక్క ఏదో ముందు జాగ్రత్తచేతనే నేను ఆ దినమున అతడితో వెళ్ళలేకపోయాను.ఆ దినమున అతడు పైకి వెళ్ళి వేటాడాడు, అతడు తిరిగి బస్సులో వస్తుండగా, అతడు నాతో ఇలా చెప్పెను, “నేను ఆ కొండ పై భాగమున కూర్చునియున్నాను, ఇప్పుడు అదంతయూ పూర్తిగా మారిపోయున్నది.కానీ క్రింద దిగువన కొన్ని నిర్దిష్టమైన మలుపులలోని చెట్లమానుల పగుళ్ళ నుండి కీచుమని శబ్దం మాకు పైగా వస్తున్నది,” అతడు ఇలా అనెను, “అది మా అమ్మగారు నన్ను “ఓ, ఫ్రాంకీ' అని పిలుచుటను నేను వింటున్నట్లుగా ఉన్నది.” ఆ రాత్రి అతడు ఈ సంఘములో నాకు ఎడమ వైపు నుండి రెండవ వరుసలో ఉండి సాక్ష్యము ఇచ్చియున్నాడు, ప్రజల నుండి తన కొరకు ప్రార్ధనను ఆశించియున్నాడు.కొద్ది దినముల తరువాత అతడిని మనము సమాధి చేసియున్నాము.
25.దేవుడు ఎల్లప్పుడూ ముందుగా వర్తమానీకుడను పంపుతున్నట్లుగా అది కనిపిస్తున్నది.అది ఆయన యొక్క మంచితనమైయున్నది.హృదయమందు సత్యము కలిగిన వారికి రాబోవువాటి గురించి ముందుగా హెచ్చరించుటకు ఆయన తన కృపను ఇస్తున్నాడు.
26.మనము ఈ దినములలో జీవిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, చీకటి (మబ్బుగా ఉండు), అంధకారము ఎప్పుడైతే ప్రతిచేతిలో ఉంటుందో,అప్పుడు దేవుని ప్రజల యొక్క హృదయమును దీవించబడిన ఆశను పట్టుకున్నట్లుగా అనిపిస్తుంది, ఆ గొప్ప ఘడియలో యేసు వచ్చును.
27.పట్టణములోని ఈ సమస్యాత్మకమైన సమయములో, ఆ యవ్వనస్తులైనవారు దానిని తృణీకరించారు, నిస్సందేహంగా.ఆ కావలివాడు చెపుతున్నదానిని చాలామంచి ప్రజలు తృణీకరిస్తున్నారు, వారు సత్రములలో (గోపురములో) త్రాగుచున్నారు, అక్కడ విందు జరుగుచున్నది, సైనికులందరూ త్రాగుచున్నారు, అక్కడ వారు గొప్ప సమయమును కలిగియున్నారు.తాము చాలా సురక్షితముగా ఉన్నామని వారు తలంచుచున్నారు.వారికి ఏ హానియూ జరగదనుకుంటున్నారు ఎందుచేతనంటే వారు వెలింగించబడ్డామని అనుకుంటున్నారు, మనము దానిని ఈ విధముగా పిలుస్తాము, మద్యపానము యొక్క ద్రవములు, కలగలుపు పానీయములు.
28.అకస్మాత్తుగా, అప్పుడే పట్టణములోకి రథములు వచ్చాయి.గోపురము యొక్కద్వారములు పగులగొట్టబడ్డాయి, వారి గృహములు కూడా పగులగొట్టబడ్డాయి, వధించే ఆయుధములు తమ పనిని ప్రారంభించాయి.ఎందుచేతనంటే కేవలం ఆ కావలివాని యొక్క హెచ్చరికను వినుటను వారు తృణీకరించుటవలన వారికి అది సంభవించినది.
29.పాతనిబంధనలో కావలివానియొక్క విధులు ఏవనగా, దానికొరకు ఒక మనుష్యుడు ఎంచబడతాడు.అతడు తప్పనిసరిగా ఆకాశములోని గ్రహాలు నక్షత్రాలను గూర్చి అప్రమత్తముగా ఉండు వాడైయుండాలి.అతడికి తప్పనిసరిగా ఆకాశ నక్షత్రములు ఎక్కడ వ్రేలాడుతున్నాయో ఖచ్ఛితముగా తెలసియుండాలి, దాన్ని బట్టి ప్రజలకు ఖచ్ఛితమైన సమయమును చెప్పువాడై యుండాలి.చాలామంది భయపడి బయటకు వెళ్ళకపోవచ్చు, బహుశా, వారికి నిద్రపట్టకపోవచ్చును, విశ్రాంతి లేకుండా ఉండవచ్చును, ఆ కావలివాడున్న గోపురము దగ్గర వారు పెద్దగా అరుస్తుండవచ్చును, వారు ఈ విధముగా అరుస్తుండవచ్చును, “కావలివాడా, రాత్రి యెంత వేళైంది?
30.అతడు నక్షత్రములను చూచి, ఆ తరువాత అతడు “సమయము ఇంత - ఇంత అయ్యింది అని చెప్పును.
31.తరువాత వారు తిరిగి తమ పడకకు వెళ్తారు లేక వారు ఎక్కడైతే నివసించుటకు ఎంచుకున్నారో అక్కడకు వెళ్తారు, వారు అలసిపోయినప్పుడు పగటి వెలుగుకై ఎదురుచూస్తారు, భయము, విశ్రాంతిలేని ఆ రాత్రి గడచిపోవుటకై ఎదురుచూస్తారు.
32.దేవుడు! కరుణను చూపుము.అది ఈ సమయము కాదా అని నేను ఆశ్చర్యపోతుంటాను, మనకున్న ఆ గొప్ప కావలివానిని “రాత్రి యెంత వేలైంది.” అని మనము పిలుచుటలేదా, మనలను ఒక అపాయము సమీపించబోవుచున్నది, దాని ప్రభావముచేత ప్రపంచమంతా వణికిపోతున్నట్లుగా అనిపిస్తున్నది.
33.కావలివాడు అన్ని వేళలయందు తన విధులను నిర్వర్తించవలసియుంటుంది.ప్రజలకు అపాయము సంభవించునప్పుడు అతడు తప్పక హెచ్చరించవలసి ఉంటుంది.అపాయము సంభవించినప్పుడు దానిని గమనించుట అతడి విధియైయున్నది.అన్ని గోడలకన్నా ఎత్తులో నిర్మించబడిన గోపురము పైన అతడుంటాడు.ఆ గోపురములో అతడు ఇవన్నీయూ కలిగియుండును, నక్షత్రములకు సంబంధించిన పుస్తకములను మొదలైనవి కలిగియుండును, కావున అతడు నక్షత్రములను గమనించి సమయమును చెప్పును.దినములో ఏదైనా క్రియ సంభవించబోవుచున్నట్లయితే అది ఏ సమయములోనైనా సరే అతడు దాన్ని చెప్పును.
34.అటు తరువాత అతడు, నేలమీద లేక మైదానమునుండి చూసే ప్రతియొక్కరికన్నా ఎంతో ఎక్కువ దూరము చూచును.గోడల మీద నిలబడు చూసేవానికన్నా అతడు ఎంతో ఎక్కువ దూరమును చూస్తాడు, ఎందుచేతనంటే అతడు ఆ గోడలకన్నా ఎక్కువ ఎత్తులో నిర్మించిన దానిమీద నిలబడియున్నాడు.నీవు ఎత్తుకు వెళుతున్న కొలది, నీవు మరింత ఎక్కువ దూరమును చూడగలవు.నేలమీద నిలబడు చూసేవారికన్నా నీవు ఎక్కువ దూరములోవున్న అపాయమును చూసి చెప్పగలవు.
35.ఆ దినములలో యెషయా ఉన్నట్లుగా, తనను దేవుడు కావలివానిగా చేశాడని అతడు చెప్పుచున్నాడు.దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులుగా చేశాడు.
36.నేను తరచుగా పక్షిరాజులను గురించి చెప్పుచున్నట్లుగా, పక్షిరాజు మిగిలి అన్ని పక్షులకన్నా ఎక్కువ ఎత్తుకు ఎగురగలదు.ఆ పక్షిరాజు అటువంటి ఎత్తైనవాటిలోకి వెళ్ళునట్లుగా ప్రత్యేకంగా రూపొందించిబడ్డాడు.డేగ దానిని అనుసరించలేదు.ఏ ఇతర పక్షి దాన్ని వెంబడించలేదు.అది దేవుడు ప్రత్యేకంగా తయారుచేసిన పక్షియైయున్నది.ఆ పక్షి అందుకొరకే రూపొందించబడింది.ఒకవేళ ఏదైనా పక్షి ఆ స్థానమును తీసుకోవాలని ప్రయత్నించినట్లయితే ఆ పక్షి మరణిస్తుంది.దానికి బలమైన ఈకలు, బలమైన రెక్కలు కలిగియుండాలి.ఒకవేళ అది పైకి వెళ్ళినా అది చూడలేకపోయినట్లైతే (ఎక్కువ దూరం చూడలేకపోతే - తర్జుమాదారుడు) ఉపయోగమేమున్నది, దానిని చూచుటకు తప్పనిసరిగా మంచి కన్నులను కలిగియుండాలి.ఒక డేగ అంత పైకి వెళ్ళినట్లయితే అది గ్రుడ్డిది అవుతుంది.అది చూడలేదు.కానీ పక్షిరాజులు పైకి వెళ్ళుతున్న కొలదీ, ఇంకా ఎక్కువ దూరం అవి చూడగలవు.
37.అందుచేతనే దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులతో పోలుస్తాడు.ఆ కావలివాడు ఎక్కువ ఎత్తుకు ఎక్కి అక్కడనుండి ఎక్కువ దూరమును చూడగలడు.
వారి కన్నులు ఆత్మీయంగా చేయుటవలన వారు రాబోవు అపాయములను చూడగలరు.
38.రాబోవు అపాయములను గురించి ప్రజలను హెచ్చరించుటకు దేవుడు యెషయాను అక్కడ పైన నియమించెను, వారు అతడు చెప్పినది వినుటలేదు.
39.ఈ దినము కూడా దేవుడు పక్షిరాజులను కలిగియున్నాడు, మన వర్తమానీకులు, మన మనుషులు గోపురము మీద ఉన్నారు, వారు ఆత్మలో పైకి ఎక్కుతూ ఈ యంత్రపరిజ్ఞానమంతటికీ దూరముగా, అణుబాంబులకు దూరముగా, శాస్త్రీయ పరిశోధనలకు దూరముగా ఉన్నారు.అటువంటి ఉద్దేశ్యము కొరకే ఆయన దగ్గర ప్రత్యేకముగా రూపొందించబడినవారు ఉన్నారు, ప్రభువైన యేసు నామములో వారు కల్వరి యొక్క గోపురమును ఎక్కియున్నారు, వారు శిలువ శిఖరమున నిలబడియున్నారు, అక్కడ నుండి “యెహెూవా ఇలాగు సెలవిచ్చెను.” అను వర్తమానమును వెనుకకు పంపుచున్నారు.దేవాలయములోని యాజకుని దృష్టికన్నా వారి యొక్క ఆత్మీయ దృష్టి చాలా గొప్పది, సాధారణ మనుష్యుడు జీవితంలో నడిచినదానికి వారు చాలా దూరముగాయున్నారు.వారు విధులు నెరవేర్చుటకొరకు ప్రత్యేకముగా రూపొందించిబడి దేవునిచేత వాటి కొరకే పిలువబడియున్నారు.కాబట్టి, అపాయములు సంభవించుట అతడు వినినప్పటినుండి అతడు మనకొరకు ఎంతో శ్రద్ధను కలిగియుండును.
40.కొద్దిసేపటికొరకు నేను దాన్ని మరలుస్తున్నాను, మీరు మీ యొక్క దృష్టిని పక్షిరాజులయొక్క రాజువైపు, లేదా ప్రవక్తలు, లేక గోపురము మీదనుండి చూసేవారి వైపు త్రిప్పుము.ప్రభువైన యేసు తనంతట తానేమైయున్నాడు.ఆయన భూమిమీద ఉన్న ఆ దినములకన్నా ఇప్పుడు మనమున్న ఈ దినములు ఎంతో గొప్పవి, ఆయన శిలువయొక్క నీడలోకి వచ్చువరకు, ఆయన వెళ్ళిపోవుటకన్ననూ ఆయన యొక్క రెండవరాకడ గురించియే ఎక్కువగా ఆయన మాట్లాడియున్నాడు.
మీరు జాగ్రత్తగా లేఖనములను వెదికినట్లయితే, ఆయన వెళ్ళిపోవుటకు ముందుగా ఈ దినము జరుగబోవు సంగతులగూర్చి ఆయన ప్రవచించుటను మీరు కనుగొనగలరు.
41.ఆయన తప్పక సిలువ మరణం పొందాలని ఆయనకు తెలుసు.ఆయన తప్పక బాధను భరించవలెనని, పాపమునకై నిర్దోషమైనది భరించవలెనని ఆయనకు తెలుసు.మూడవదినమున ఆయన సమాధి నుండి తిరిగిలేస్తాడని ఆయనకు తెలుసు.ఆయనను సమాధిలోనే ఉంచుటకు ఏ శక్తులు లేవని ఆయనకు తెలుసు.
ఎందుకనగా దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది, “ నా పరిశుద్దుని కుళ్ళు పట్టనీయను మరియు నేను ఆయన ప్రాణమును పాతాళములో విడువను.” ఆ ప్రవచనమును బ్రద్దలుకొట్టు ఏ శక్తులు అక్కడలేవు.ఆయన వాక్యము సత్యమైయున్నది.అవి వాటియొక్క రుతువులలో నెరవేరతాయి.తండ్రి ఏమి చెప్పియున్నాడో వాటియందు ఆయనకు నమ్మకమున్నది, తండ్రి తన వాక్యమును నెరవేరుస్తాడని ఆయనకు నమ్మకమున్నది.
42.కాబట్టి, ఆ గొప్ప హృదయము ఆయనతో ఉన్నది, అదియే దేవుని యొక్క సింహాసనము.ఆయన హృదయములో, ఈ గొప్ప ప్రయత్నములుచేయు సమయములు వచ్చి అవి అన్ని దేశములకు మరియు ప్రజలందరికి రుజువు చేస్తాయని ఆయనకు తెలుసు.అక్కడ ఒక గొప్ప ప్రశ్నయున్నదని ఆయనకు తెలుసు, ఒకవేళ ఆయన లేవకపోయినట్లయితే, లేక ఆయన లేఖనముల ప్రకారం సిలువ వేయబడక పోయినట్లయితే, లేక ఆయన ఆరోహణమై వెళ్లకయుంటే, పరిశుద్దాత్మ వచ్చునా? అనేది ప్రశ్న కాదు. కాని ప్రశ్న ఏమిటంటే, ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమిమీద విశ్వాసమును కనుగొనునా? విశ్వాసము ఎక్కడ నుండి వచ్చును, దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారా వచ్చును. ఆయన యొక్క ప్రశ్న అదియే.“నేను తిరిగి వచ్చునప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా?
” ఆయన వాక్యమును విశ్వసించువారిని ఆయన కొనుగొనునా?
43.మనము జీవిస్తున్న ఈ దినములలో, ఆయన యొక్క దీవించబడిన వాక్యము యొక్క పేజీలను త్రిప్పితే ఆయన చెప్పిన ఆ కార్యములు ఈ దినమునభూమిమీద ఆక్రమించుకోబోవు చున్నవి.ఆ సూచనలు మరియు అద్భుతములు జరుగుతున్నాయి.మానవుల హృదయములు భయముతో పడిపోవుచున్నాయి.సంధిగ్ధతా సమయములు, దేశముల మధ్యన బాధలు, ఆకాశములో భీతిగొలుపు దృశ్యములు ఎగురుచున్న పళ్ళెములవలె, పెంటగాన్ పైనంతయూ కదులుచున్నది. సముద్రము గర్జిస్తున్నది, సముద్రములోని లోతైన భాగములో భూకంపములు, మానవుల హృదయములు భయముతో జారిపోవుచున్నవి, గొప్ప అణు ఆయుధములు అక్కడున్నాయి, ఎదురుచూస్తున్నాయి, లోకము ఎన్నడు చూడని దుఖము అక్కడ వ్రేలాడుచున్నది.
44.గతవారము నా ప్రియ స్నేహితుడు, సహెూదరులైన కేప్టెన్ జూలియస్ స్టార్స్క్లేవ్తో మాట్లాడు ఆధిక్యత నాకు కలిగియున్నది, అతడే “ప్రవక్త ఆఫ్రికాను దర్శించుట” అను పుస్తకమును వ్రాసియున్నాడు.బ్రదర్ చదువుచున్నాడు. జూలియస్, కాలిఫోర్నియాలో ఉన్నాడు, ఇప్పుడు అతడు ఆర్మీలో మేజరు కోర్సును (check is there any continuation for this paragraph) ఆ ఆర్మీవారు అతనికి గొప్ప శ్రమను కలిగించారు. అతడి యొక్క అమ్మమ్మ యొక్క అమ్మను నిరూపించువరకు వారు అతడి యొక్క వంశావళిని పరిశోధించారు.వారి యొక్క చరిత్రను మరియు అంతకుముందు వారు ఎటువంటివారు అనేదానిని పరిశోధించారు. అతడు ఇక్కడ ఈ కూటమిలో కూర్చునియున్నాడు.
45.అతడు కూటమినుండి వచ్చుచున్నప్పుడు మేము ఎక్కడైతే స్నేహితులుగా ఉన్నామో ఆ కొండయొక్క శిఖర భాగమునకు వచ్చియున్నాడు, ఒక జునిపల్ చెట్టుక్రింద అతడు నన్ను కలుసుకున్నాడు, ఇలా అన్నాడు, “బ్రదర్, బ్రాన్హా, ఇప్పుడు నేను చెప్పబోయేది నీవు ఎన్నడు విననటువంటి భయంకరమైన సంగతి.” అతడన్నాడు, “నేను దీన్ని చెప్పకుండుటకు ఈ సమాచారమును బయటకు వెళ్లకుండుటకు నేను చాలా ప్రమాణముల క్రిందయున్నాను,” ఇలా చెప్పెను, “ఎందుచేతనంటే, వారు మాతో వ్యక్తిగతముగా ప్రమాణమును చేయించి ధృఢపరచి యున్నారు.” కానీ ఇలా చెప్పెను, “నేను ఈ సంగతిని చెప్పగలను, అదేమంటే సైన్యము దీన్ని ముగించబోతున్నది.” వారు ఇంకేతమాత్రము సైన్యమును కలిగియుండరు, చుట్టు కొద్దిమంది మాత్రమే కాపలావారున్నారు. వారు ఇంకెంత మాత్రము వైమానికదళమును కలిగియుండరు.వారు వేగవంతమైన విమానములను తయారుచేయుటయందు మొదలైనవాటియందు ఏకాగ్రతను ఇక ఎంతమాత్రము కలిగిలేరు, వాటిని వారు కేవలం వ్యాపారసంబంధిచిన వారికే ఉపయోగించాలని అనుకుంటున్నారు. ఆ మీటను ఒక్కసారే నొక్కాలి అనే దాని మీదనే వారు తమ ఆసక్తిని కలిగియున్నారు.అటుతరువాత నాశనము తటస్థించును”.
46.ఇలా అన్నాడు, “బ్రదర్ బ్రెన్ హామ్, సైన్యము యొక్క ఈ రహస్యములు ప్రజలకు తెలియవు”.ఇంకా ఇలా అన్నాడు, “ఈ గొప్ప అధికారులు గదిలో మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక భయంకరమైన నైరాశ్యము ఆ గదిని ఆవరించినది, అప్పుడు వారిలో ఒక శాస్త్రజ్ఞుడు నిలబడి ఇలా చెప్పెను, 'నేను ఒక ఆవుని మరియు ఒక బండిని నడుపుకుంటూ ఆ పర్వతముల వెనుకకు వెళ్ళి అక్కడ పచ్చని స్థలములో క్యాబేజి మరియు చిక్కుళ్ళు నాటుకొని దీనంతటిని మరచిపోతాను.”” ఓహ్, అతడు ఇలా అనెను, “అది ఎలాగుంటుందటే.ఒకవేళ ఈ సంగతి ప్రజలలోకి వెళ్లినట్లయితే, ప్రపంచమంతా బాధలో కూరుకుపోతుంది.” అపాయము సమీపిస్తుంది.
47.అతడు ఇలా అనెను, “వారు దానిని కలిగియన్నారు. వారు తమ స్వంతమైయున్నవాటిని ద్వీపములలో నుండి ఇప్పుడు లాగుచున్నారు.వారు వారి యొక్క సమూహములను ఇంగ్లాండు నుండి బయటకు లాగుచున్నారు, వారు గొప్పవి పెద్దవైయున్న చొరబాటు చేయుటకు వీలున్న ఆయుధములను కలిగియున్నారు, వారు తమ యొక్క మొదటి మిస్సైలును వదులుటకు ఎదురుచూస్తున్నారు, ప్రతియొక్కదేశము కూడా ఒకే సమయములో మిస్సైళ్ళను వదులుటకు సిద్దముగా ఉన్నాయి.” “భూమి మీద ఒక్క గడ్డిపరక కూడా మిగలదు లేక ఒక పర్వతము కూడా కదిలింపబడి నేలమట్టుకు దిగిపోతుంది.” అది ఏ సమయములోనైనా జరుగవచ్చును. ఓహ్, అది ఎంతో విషాదమైన ఘడియ.
48.మీరు వినుచున్న ఎగిరే పళ్ళెములు (ఫ్లయింగ్ సాసర్స్) అటువంటివన్నియు.అతడితో జరిగిన సంభషణను మీరు వినియున్నారు, బహశా గతదినమున రేడియోలో అతడు ప్రజలతో మాట్లాడాను అని అన్నాడని నేను అనుకుంటున్నాను.ఆ మనుష్యుడను నేను తృణీకరించుటలేదు కాని, అతనియొక్క ప్రవర్తన అంతయూ వాక్యమునకు విరోధముగా ఉన్నది. అంగారక గ్రహము మీద మరణములేదని, మరణమనేది లేకుండా ఎట్లుండవచ్చు అని వారు ఇక్కడకు వచ్చి బోధించాలనుకుంటున్నారు. కాని, రుజువుల నిర్ధారించే విషయమునకు వచ్చేసరికి, దానిని నిరూపించుటకు అతడి దగ్గర ఒక చిన్న ఆధారమును కూడా కలిగిలేడు, అతడు ఏదో ఒక మిథ్య కలిగిన ఆలోచనను గీసుకుని వచ్చెను. నా యొక్క ఉద్దేశ్యములో అది అబద్దము, ఎందుకంటే అతడు చెప్పేదానికి పరిశుద్ధగ్రంథము వ్యతిరేకముగా చెప్పుచున్నది గనుక.
49.ఆ ఎగురుచున్న పళ్లెముల గూర్చి నేను ఎమనుకుంటున్నానో తెలియచేయాలని అనుకుంటున్నాను. అవి ఛాయలని నేను నమ్ముటలేదు. అవి అన్నియు మిథ్య అని నేను నమ్ముట లేదు. నేను నమ్ముచున్నాను, ఇది నిజము కాకపోయుండవచ్చును, ఇది కేవలం నా యొక్క ఆలోచనయే. అవి ఏమిటనేది ప్రభువు నాకు చెప్పియుండలేదు. కాని, ఇవన్నియు జరుగుటను బట్టి లేఖనములు చూచినప్పుడు.
50.యేసు చెప్పెను, “సొదొమ దినములలో ఎట్లుండునో, మనుష్యకుమారుని దినములలో అట్లుండును.” సొదొమను నాశనము చేయుటకుముందు, మరియు అగ్ని పట్టణమును, పచ్చికబయళ్ళను కాల్చివేయుటకు ముందు, ఈ సంగతులు నిజమైనవో కావో అని కనుగొనుటకు పరలోకమునుండి దూతలు పంపబడియున్నారు.
అది ఆ గొప్ప నాశనము తటస్థించుటకు ముందు దేవుడు తన దూతలను కేవలం పరిశోధించి కనుగొనుటకు మాత్రమే పంపలేదు.మీరు గమనించారా, వారిలో ఒక దూత వచ్చి, దేవునికొరకు ఒక తీర్మానమును కలిగియున్న ఒక వృద్దుడను దర్శించెను, అతను లోకమునకు వ్యతిరేకముగా ఎడారిలో గుడారము వెనుక జీవించుచున్నాడు, కారణమేమంటే కొందరు అతడియొక్క సంపదను తీసుకొనిపోయున్నారు.కాని అతను ఇలా అనెను, “అదంతయూ మంచిదే.
దేవుని చిత్తములో నేను ఇక్కడనే ఉంటాను.
51.లోకములో ఉన్న ధనసంబంధమైన వాటికన్ననూ దేవుని చిత్తములో నేను ఉంటాను.
52.అతడు చివరి నిర్ణయము తీసుకొనగానే, దేవుని యొక్క దూత అబ్రహాము యొద్దకు వచ్చి ఇలా అనెను, “అబ్రహామా, తూర్పువైపు, పడమరవైపు, ఉత్తరమువైపు, మరియు దక్షిణమువైపు చూడుము, ఇదంతయూ నీదే.
53.లేఖనములు ఆవిధముగా చెప్పుచున్నాయి, “సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకొందురు.” అది ఏ విధమైన వ్యత్యసమును తీసుకొనివస్తుంది?
భూసంబంధమైనవన్నియు భూమిచేతనే మృతిచెందుతాయి.కాని, దేవుడు ఎన్నడు మృతమైనవాడు కాడు.
54.నేను దానిని నమ్ముచున్నాను -- నేను దానిని నమ్ముటకై నడిపించబడుచున్నాను, అది ఏమిటంటే, ఒకవేళ దేవుని యొక్క దూత వచ్చినప్పుడు మరియు మీరు వివేచనను కలిగియున్నట్లయితే.
55.అబ్రహాము దగ్గరకు వచ్చియున్న ఆ దూతను మీరు గమనించారా?.ఆ దూత అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు తన వీపును గుడారమువైపునకు ఉంచి ఇలా అనెను, “నేను నీకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చబోవుచున్నాను.
56.ఓహ్, తన వాగ్దానమును నిలబెట్టుకొనే అటువంటి దేవుని యొక్క దూత వర్తమానము ఈ దినమునకు ఎంతో ఘనమైయున్నది.లోకము యొక్క అవిశ్వాసము, సంశయవాదులు, అజ్ఞానులు, నాస్తికులు మరియు అవిశ్వాసులు అన్నియు కలసిననూ దేవుని యొక్క శక్తిని ప్రభావము లేకుండా చెయ్యలేవు.
57.“నేను నా వాగ్దానమును జ్ఞాపకముంచుకుంటాను, నేను నా వాగ్దానమును మేలైనదిగా చేస్తాను.” ఆ దూత తన వెనుకవున్న గుడారములోని శారా దాన్ని బట్టి నవ్వెను.
58.ఆ దూత తన వీపును గుడారము తట్టునేవుంచి ఇలా అనెను, “శారా ఎందుకని నవ్వింది?
59.శారా పరుగెత్తుకొనివచ్చి, “నేను నవ్వలేదు” అనెను, ఎందుకంటే ఆమె భయపడియున్నది.
60.ఆయన ఎటువంటి మనుష్యుడు? దానిని బట్టి ఆ గోపురము మీదనున్న కావలివాడు ఎటువంటివాడో? అతడి వీపును నా వైపు త్రిప్పియుంచి గుడారములోని శారా నవ్వెను అని ఎలా చెప్పెను? దానిని బట్టి మనతో ఉన్నవాడు ఎటువంటి వ్యక్తిత్వము కలిగినవాడో గమనించుము.జ్ఞాపకముంచుకో, అతడు కావలివాడైయున్నాడు.
61.అతడు, ఆమె వైపునకు తిరిగి, “అవును, నీవు నవ్వియున్నావు.” ఆమె భయపడింది.
62.ఈ దినములలో ప్రభువు రాకడకు ముందుగా మరలా అలాగే జరుగబోవుచున్నదని గమనించండి.ప్రకృతిలో జరుగుచున్నవి చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తుంది, వారు ఏమి చేస్తున్నారో గమనించండి, ఇటువంటి మర్మయుక్తమైనవి జరుగునని యేసు ముందుగానే చెప్పియుండకపోతే నేను ఆశ్చర్యపోతాను.“ఆకాశములో సూచనలు జరుగును, భూమి మీద రాజ్యములలో అనిశ్చితి ఉండును, సమాధానములేని సమయములు, భూకంపములు, స్త్రీలు కాదు పురుషులు గుండెపోటుతో మనుష్యులు మరణించుట, స్త్రీలు తరచుగా గుండెపోటుతో మరణించరు కాని పురుషులు ఆవిధముగా మరణిస్తారు.
ఇవన్ని యేసు చెప్పినదానిని నెరవేరుస్తున్నాయి.ఆయన చెప్పినది ఖచ్చితముగా ఇదే అయ్యుంటుంది.
63.ఈ దినము గూర్చి ప్రవక్తలు ఏదైతే ప్రవచించియున్నారో మనము దానిలోని ఒకొక్క ఘడియను దాటుకుంటూ వెళ్తున్నాము.” అది నిన్ను “కావలివాడా, రాత్రి యెంతవేళైంది” అని కేక వేయునట్లుగా చేయడంలేదా?
64.పెంటగాన్ దగ్గర సమాధానములేదు.ఆమెరికా దగ్గర సమాధానములేదు.జర్మనీ, రష్యా ఏ దేశము దగ్గరా సమాధానములేదు.సైన్సు దగ్గర సమాధానములేదు.
65.మరి సమాధానము ఎవరిదగ్గర ఉంది? గోడమీద ఉన్న ఆ కావలివాని దగ్గర సమాధానమున్నది.“కావలివాడా, రాత్రి యెంతవేళైంది?” పరిశుద్దాత్ముడే ఆ కావలివాడైయున్నాడు.దేవుని దగ్గర నుండి హెచ్చరికలు పొందుకొని ప్రజలను సిద్దపరుస్తున్నది ఆయనే.ఆయనే కావలినిగా మారియున్నాడు.రోగులు స్వస్థపడుట మనము చూస్తున్నాము, గ్రుడ్డివారి కన్నులు తెరవబడుట మనము చూస్తున్నాము, చెవిటితనము తీసివేయబడింది, కుంటివారు నడుస్తున్నారు, మందకోడిగా ఉన్నవారు హృదయము నిండినవారివలె గంతులు వేస్తున్నారు.ఏమిటిదంతా? ఈ కార్యములన్నీ మరియు ఈ హెచ్చరికలన్ని ప్రభువు రాకడను సూచిస్తున్నాయి.
66.ప్రజలు నిరంతరం మద్యపానవిందులో ఉంటున్నారు.వారు ఉల్లాసముగా నృత్యములుచేస్తూ, తినుచూ త్రాగుచూ, పెండ్లి చేసుకొనుచూ, పెండ్లికిస్తూ, దేవుడు చెప్పినట్లుగా వారి మూర్ఖత్వమైన సమయము ముగిసేంతవరకు.దానికి అంతమేలేదు.
67.ప్రకటన 3 ప్రకారం ఈ ఘనమైన సంఘకాలములో, తను రాకడకు ముందుగానే వేకువ నక్షత్రమును ఎవరు పంపియున్నారో మీరు గమనిస్తే, యెషయా దీనిని చెప్పియున్నప్పుడు అతడు ఎంత ఆత్మీయముగా ఉన్నాడో, “కావలివాడా, రాత్రి యెంత వేళయింది? ” అతడు ఇలా అనెను, “రాత్రియగుచున్నది మరియు పగలు అగుచున్నది.” ఏమిటి? ఉదయమగుచున్నది, రాత్రికి ముందుగా ఉదయము వచ్చుచున్నది.అది ఏమైయున్నది?
68.ఉదయమునకు ముందుగా, కొద్దిగంటలలో ఉదయమవుటకు ముందు, అంతకు ముందుకన్నా అధికమైన చీకటి కమ్ముకుంటుందని ప్రతియుక్కరికి తెలుసు.
69.ఓహ్, నా స్నేహితులారా! ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడని వినండి. నేను, ఆయన యొక్క సేవకుడని మీరు గుర్తించినట్లయితే ఇది తెల్లవారుటకు ముందు సమయమైయున్నది ఆ కారణముచేతనే ఆ భయంకరమైన నిరాశ ఈ భూమియంతా కమ్ముకొనియున్నది. ఇది ప్రభువైన యేసు రాకడకు ముందు సమయమైయున్నది. ఆయన రాకడతప్ప మరి ఇంకే ఆశ మిగిలిలేదు.
70.దేశముల మీదకి దేశములు లేచుచున్నాయి, వారు ఒకరిమీద ఒకరు ప్రేల్చుకునేశక్తిని కలిగి దేవుడు చేసియున్న కార్యమంతటిని అణుబూడిదగా మార్చి వేయాలనుకుంటున్నారు.వారు చెడిపోయున్నారు, వారు మత వ్యతిరేకులు, వారు క్రీస్తులేని వారిగా ఉన్నారు.వారు కలిగియున్న ఏకైక ఉద్దేశ్యమేమనగా నాశనముచేయుటయే.వారు ఇటువంటి ఆసక్తిని కలిగియుండుటకు పరలోకమునుండి నాశనముచేయు దూత నుండి వారు ప్రభావితులైనారు.
71.ప్రభువైన యేసు నామములో దీనిని చెప్పనివ్వండి, పరిశుద్దాత్ముడే ఆ గోపురము మీదకి కావలివానిగా పంపబడెను. "రాత్రి యెంతవేళైంది?” అని ప్రజలు అరుచుచుండగా, మీకు జీవితమును గూర్చి భయము వేయడంలేదా? పాపమునుబట్టి మీరు భయపడుటలేదా? సమాధి కార్యక్రమములనుబట్టి మీరు భయపడుటలేదా? బలహీనతనుబట్టి, ప్రతిచోటా దైవత్వము లేకపోవుటనుబట్టి మీరు భయపడుటలేదా?అందునుబట్టి ఆ రాత్రి ఎంతో దీర్ఘముగానూ భయముగానూ లేదా? “కావలివాడా, రాత్రి ఎంత వేళైంది?” అతడు చెప్పుచున్నాడు, “ఉదయమగుచున్నది.” ఆదరణను గమనించండి.
72.రాత్రియును అగుచున్నది.” మరి రాత్రి సంగతి ఏమైయున్నది? యెషయా యొక్క లేఖనము ఎంత చక్కగా సరిపోవుచున్నదో గమనించండి.ప్రకృతి సహజసిద్ధముగా, సూర్యుడు దగ్గరగా వస్తున్నప్పుడు ఎల్లప్పుడు చీకటిని దట్టముగా చేయుట ద్వారా ఆ చీకటి మరింత దట్టమైన చీకటిగా మారుతుంది.అప్పుడు ఆ చీకటి ఆ రాత్రియంతటిలోకి అత్యంత గాఢాంధకారంగా మారుతుంది.ఎందుకు?వెలుగు దగ్గర అగుటచేత అది మరింత చీకటిగా మారియున్నది.
73.ఇప్పుడు ప్రభువైన యేసు యొక్క రాకడ దగ్గర అగుటచేత ఈ భూమిని చీకటి ఆవరించియున్నది.ఆయన ఇలాగు చెప్పియుండలేదా? “ఈ సంగతులు జరుగుతున్నప్పుడు, మీ తలలు పైకెత్తుకొనండి, మీ విమోచన దగ్గరకు వచ్చియున్నది.
74.పాలస్తీనా ఒక దేశమైయున్నది. ఆయన దేవుడుగా వచ్చుటను చూచుటకు భూమిపైన ఉన్న యూదులంతా తిరుగు ప్రయాణమైయున్నారు.అలాగున దేవుడు చెప్పియుండలేదా, “అంజూరపు చెట్టు లేతపై చిగుర్చునప్పుడు దానిని చూచి ఒక ఉపమానమును నేర్చుకొనుడి” “ఇవన్నియూ జరుగుట చూచువరకు ఈ తరమువారు నిశ్చయముగా గతించదని నేను మీతో చెప్పుచున్నాను.” “ఏ తరమువారు?” ఏ తరమువారైతే అంజురపు చెట్టు లేతదై చిగురించుట చూస్తారో ఆ తరమువారు.అంజూరపు చెట్టు ఎల్లప్పుడు ఇశ్రాయేలియులకు సాదృశ్యముగా ఉన్నది.
75.యోవేలు 1వ అధ్యాయములో 4వ వచనములో ఇలా చెప్పుచున్నాడు, "గొంగళి పురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసియున్నవి, మిడుతలు విడిచినదానిని పసరు పురుగులు తినివేసియున్నవి.పసరు పురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసియున్నవి.” మీరు గమనించినట్లయితే, అదే చీడపురుగు, వివిధ కాలములలో ఆ చెట్టుని తినివేసియున్నది.యూదులను కూడా అదే పాపము, అవిశ్వాసము ఆ విధముగా తినుట ప్రారంభించియున్నవి, అవి ఏమిటంటే యేసు, క్రీస్తు కాడనే సంగతి ఫలించని ఆ చెట్టు మోడుని తినివేసియున్నాయి.మరియు ప్రవక్త దానిని చూసి ఏడ్చియున్నాడు.కాని ప్రభువు ఇలాగు చెప్పెను, “సంవత్సరముల తరబడిగా మిడుతలు, పసరపురుగులు మరియు చీడపురుగులు తినివేసిన దానిని నేను పునరుత్తరించెదనని ప్రభువు సెలవిచ్చెను.
76.2500 సంవత్సరముల తరువాత యూదులు మొదటిసారిగా వారి స్వస్థలమునకు తిరిగి వస్తున్నారు.“ఇవన్నియు జరుగువరకు ఆ తరము గతించదు. చివరిదినములలో నా కుమారుల మీద, కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరించెదనని దేవుడు చెప్పెను.వారు ప్రవచించెదరు మరియు నేను అద్భుతములు చూపించెదను.
77.రోగులు స్వస్థతను పొందుకొనెదరు.తన వెనుక ఉన్న గదిలో శారా నవ్వినది అని అబ్రహాముతో చెప్పిన అదే ఆత్మ ఇప్పుడు ఘనమైన కార్యములుచేయును.
అప్పుడు మనము “కావలివాడా, రాత్రి యెంత వేళైంది?” అని కేక వేస్తాము.
78.అప్పుడతడు, “రాత్రి వచ్చియున్నది.” అంటాడు. గమనించారా! మొదటగా రాత్రి.మొదట ఉదయము వచ్చును అటుతరువాత రాత్రి కూడా వచ్చును.
79.తెల్లవారుటకు ముందు ఎల్లప్పుడు ఒక గొప్ప వెలుగు ఆకాశములో కనిపిస్తుంది అదే వేకువచుక్క ఆ ఉదయనక్షత్రము యొక్క వెలుగు కొద్ది కొద్దిగా పెరుగుట మీరు చూచినప్పుడు, భూమి మరింత దట్టమైన చీకటిలోకి వెళ్ళిపోతుంది.భూమి చీకటిగా మారుటచేతనే ఆ నక్షత్రము మరింత కాంతివంతముగా కనిపిస్తుంది.
80.ఈ చివరిదినములలో బయటకుపిలువబడి క్రీస్తుచేత శరీరముగా ఎన్నుకోబడిన సంఘము ఉదయనక్షత్రమును కలిగియుంటుందని పరిశుద్ధగ్రంథము వాగ్దానము చేసియున్నది."కావలివాడా, రాత్రి యెంత వేళైంది? ఏమి జరుగనైయున్నది?
81.ఇదిగో అది ఇదే.ప్రపంచమంతటికి నాశనము తటస్థించబోవు చున్నది.కాని, ఆ నాశనము తటస్థించుటకు ముందుగా, తన ప్రభువును కలుసుకొనుటకు యేసుక్రీస్తు యొక్క సంఘము ఎత్తబడుతుంది.
82.ఉదయనక్షత్రము ఏమి చేయబోవుచున్నాడు?ఏ కారణము చేత ఆ నక్షత్రములు అంత కాంతివంతముగా ప్రకాశిస్తున్నాయి.అవి సూర్యుడు దగ్గరవుచున్నాడని తెలియచేస్తున్నాయి.సూర్యుని యొక్క వెలుగును ఉదయకాల నక్షత్రము ప్రతిబింబిస్తున్నది.మిగిలిన నక్షత్రములు ఆ సమయములో కాంతిహీనముగా మారతాయి.
83.మానవులచేత తయారుచేయబడిన థియాలజీలు, చల్లబడిపోవుట, జీవితములలో వ్యత్యాసములన్నీ అంతరించిపోతాయి.గోపురము మీద ఆ ఉదయకాల నక్షత్రముతో కూర్చునియున్న ఆ కావలివాడు, ప్రభువు యొక్క రాకడను సూచించు వర్తమానమును ప్రతిబింబించుచున్నాడు, ఎందుకంటే సూర్యుడు పైకివచ్చుచుండగా అతడు మరింత కాంతివంతముగా తయారగుచున్నాడు.
84.ఓహ్, నేను ఇలాగు చెప్పగలను, “ఉదయ నక్షత్రములారా, దేవుని యొక్క మహిమను మరియు వెలుగును ప్రకాశింపుము.మధ్యరాత్రి సమీపించుచున్నది, అంధకారము భూమి మీదను మరియు గాఢాంధకారము జనలందరి మీదను కమ్ముకొనుచున్నది.” కాని, ఉదయము వచ్చుచున్నది మరియు ఆ నక్షత్రములు వాటి యొక్క వెలుగును ఇచ్చుచున్నవి.
85.లోకము ఎదుర్కొనబోవుచున్న ఆ భయంకరమైన ఘడియను గురించి ఆలోచించుము.ఈ దినమున రక్షించబడని ప్రతియొక్కరు ఎదుర్కొనవలసియున్న ఆ భయంకరమైన చీకటిని గూర్చి ఆలోచించుము.ఘనతవహించిన అన్ని దేశములు, అన్ని పర్వతములు, అన్ని పొలములు మరియు గృహములన్నియు రెప్పపాటు కాలములో అగ్నిపర్వతము బ్రద్దలైన తరువాత ఉండే బూడిదవలె మారిపోతాయి.
86.కాని, ప్రభువును ప్రేమించినవారు మాత్రము, ఉదయకాల నక్షత్రపు వెలుగును కలిగియున్నవారు, లోక క్రియలనుండి దూరముగా ఉండి ఆయన మీద తమ దృష్టిని ఉంచినవారు.అపోస్థలుడైన పౌలు భూమిని విడిచిపోవుటకు ముందు తన చివరి పత్రికలో ఇలాగు వ్రాసియున్నాడు, అతడు ఉద్రిక్తతతో ఎంతో అలసిపోయున్నాడు.ఓహ్, ఆ చిన్న యూదుడు ఈ విధముగా చెప్పుటను నేను ఏవిధంగా భావించగలను, “నన్ను ఎవరును శ్రమ పెట్టవద్దు, నేను మంచి పోరాటం పోరాడి నా పరుగును తుద ముట్టించియున్నాను.నేను విశ్వసమును కాపాడికొనియున్నాను.కావున, నీతియనే కిరీటము నాకొరకు ఉన్నది.ఆ దినమున ప్రభువును, న్యాయ తీర్పరియైన ఆయనే అది నాకిచ్చును.” అప్పుడు అతడు ఉదయకాల నక్షత్రములు వస్తున్నాయని ఆలోచించియుంటాడు.అతడు ఇలాగు అనెను, “అది నాకు మాత్రమే కాదు, ఆయన రాకడను ప్రేమించువారి అందరిది.” ఓహ్, మీ తలలను పైకెత్తుకొనుడి, మీ విమోచన సమీపించియున్నది.
87."కావలివాడా, దేనివలన ఈ దినపత్రికలు ఈ విధముగా చెప్పుచున్నాయి?సైన్సును కదులుటకు భయపడునట్లుగా చేయుచున్నది.
ఏమిటి? పెంటగాన్ తనదగ్గర ఉన్న వార్తలను బయటపెట్టటానికి భయపడే కారణమేమిటి? ” కారణమేమంటే ప్రజలు తమకున్న ధనమును మరియు మిగిలినవాటిని వీధులలో పడవేసి ఆత్మహత్యలు చేసుకుంటారని.కారణమేమైయున్నది? అది ఏమిటి?ఎందుకు ఆ వెలుగు?
88.ఉదయము వచ్చుచున్నది.అది నిజము.అదంతయూ దేని గురించి?అది ఉదయము వచ్చుచున్నది అని తెలియచేయుచున్నది.ఆ వెలుగు ముందుకు జరుగుచున్నది, అది మరింత కాంతివంతము అగుటకు ముందుగా దట్టమైన చీకటి కమ్ముకొనుచున్నది.
89.నేను క్రైస్తవుడనైన దాన్ని బట్టి సంతోషించుచున్నాను.వారిలోని ఒక కావలివాడు నా కొరకు గోడమీద నిలబడి “దేవుని ఎదుర్కొనుటకు సిద్దపడుము, ఆయన రాకడ యొక్క ఘడియ దగ్గరపడియున్నది.” అని కేక వేయుచున్నందుకు నాకు సంతోషముగావున్నది.
90.ఈ ఉదయకాలము సంఘములో మీరు దాన్ని వినియున్నారా, ఇక్కడ ఉన్నవారిలో ఏ ఒక్కరైనా మీ హృదయములో ఆ ఉదయనక్షత్రమును ఆ గొప్పదైన పరిశుద్దాత్మ వెలుగును సానుకూలముగా ప్రతిబింబించకపోయిన యెడల, ఇప్పుడే మీరు దానికొరకు సిద్దపడుము.ఎన్నడు జరుగని ఒక గొప్పసంఘటన జరుగుటకు సమయము సమీపించియున్నది.నాటకములు ప్రదర్శించునప్పుడు మనము అంచున నిలబడి దాన్ని చూస్తుంటాము.
91.చాలాసార్లు నేను సినిమాలను గమనించియున్నాను.హాలీవుడ్లో వారు ఎలాగు అటువంటి నాటకములను తయారుచేస్తారని నేను గమనించియున్నాను.
వారు ఎలాగు వారి దగ్గర ఉన్న తారల చుట్టు వారు ఏ విధముగా సిద్దపరుస్తారా అని, మరియు ఆ గొప్ప నాటకము ప్రారంభమునకు ముందే వారికి తర్ఫీదును ఇచ్చి సమస్తమును ఎలాగు సిద్దపరుస్తారా అని నేను గమనించి యున్నాను.అక్కడ సిద్దపరచబడినవి అన్నియు నిజమైనవి కావని అవి నకీలివి అని తెలిసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను.
92.సలైన దానిని బట్టే నకీలివి అన్నియు తయరువుతాయి.నిజమైన రూపాయి లేనప్పుడు అబద్దమైన రుపాయి తయారవ్వదు.నిజమైన క్రైస్తవుడు లేనప్పుడు వేషధారి ఉండలేడు.నిజమైన వర్తమానము లేకుండా అబద్ద వర్తమానము ఉండలేదు.పగలు అనేది లేకుండా రాత్రి అనేది ఉండదు.నిశ్చయముగా.
93.వారి యొక్క ఆ కట్టడములను నేను చూచినప్పుడు, ఇలాగు అనుకునేవాడిని, “ఓహ్, ఈ లోకములో ఉన్న అన్నింటికన్నా పైనున్న గోపురము మీద మనము దూరముగా నిలబడియున్నాము.మనము రెండు ఘనమైన కార్యములను గమనించుచున్నాము, కాలము ముగిసిపోవుట మరియు ప్రభువు యొక్క రాకడ.
” త్వరలో సమయము ముగిసిపోతుంది.ప్రభువు యొక్క రాకడ తరవాత ఇక సమయముండదు.
94.క్రీస్తువిరోధి సమస్తమును సిద్దపరచుకునియున్నాడు.వానికి కమ్యూనిజమున్నది, మరియు వానికి వివిధమైన “తత్వములు” ఉన్నాయి.వానికి సంఘతత్వమున్నది, క్యాథలిక్ తత్వమున్నది, వానికి ప్రోటెస్టెంట్తత్వమున్నది.వాడు గొప్ప ప్రదర్శన చేయుటకు సమస్తమును సిద్దపరచుకున్నాడు.
95.కాని, పరలోకములోని తండ్రి ఈ నాటకము నిమిత్తము తన పాత్రధారులను కలిగియుండుటను బట్టి నేను సంతోషముగా ఉన్నాను.
ఈ విధములైన వ్యాధులచేత క్రీస్తు విరోధి వారిని కాలముల గుండా తీసుకొనిపోవుచుండగా, ఈ నాటకములో దేవుడు తన సంఘమును నిత్యము తనతోపాటు ఉండే నిత్యత్వమనే రాజ్యములోనికి తీసుకొని వెళ్ళుటకు సిద్దముగావున్నాడు, ఈ మృతతుల్యమైన శరీరములు మార్పుచెంది ఆయన వంటి మహిమకరమైన శరీరమును పొందుకుంటాయి, పాడయిపోయే ఈ శరీరములు మరణములేనివిగా మార్పుచెందుతాయి.ఆయన సారూప్యములోకి మనము మారి నిరంతరము నిత్యత్వములో ఆయనతోపాటుగా మనము ఉంటాము.
96.చూడండి, మీరు టెలివిజన్ చూస్తున్నారో, ఎవరైతే రేడియోలు వింటున్నారో, మీలో ఎవరైతై దినపత్రికలు చదువుతున్నారో, మీలో ఎవరైతే వార్తలు వింటున్నారో వారందరూ ఈ వార్తనుబట్టి ఆశ్చర్యపోతారు.నా స్వరము వినుము.ఉదయమగుచున్నది మరియు రాత్రియగుచున్నది.ఉదయకాలము కొరకు సిద్ధపడినవారి కొరకు ఉదయకాలము వచ్చుచున్నది, ఉదయకాలము కొరకు సిద్దపడనివారికొరకు రాత్రి వచ్చుచున్నది.దేవుడే మన హృదయములను సిద్దపరుచును గాక!
97.నిత్యము వెలుగుమయమైన ఉదయకాలము కొరకు సిద్దపరచునుగాక.ఒక కవి చెప్పియున్నట్లుగా, “పైకి పిలువబడిన క్రమము వచ్చినప్పుడు, ఆయన ఎన్నుకున్నవారిని ఆకాశమునకు అవతలవున్న వారియొక్క గృహములకు తీసుకొనిపోవును, నేను అందులో ఉంటాను.” మనము ప్రార్ధన చేసుకుందాం.
98.ప్రభువైన దేవా!ప్రతిచోటా నాశనము కొరకై చీకటి భూమిని కమ్ముకొనుచుండగా, మా కొరకు యేసుక్రీస్తు మహిమ నుండి క్రిందకు దిగివచ్చి మా వలే ఒక మానవుని శరీరము ధరించుకొని మా మధ్యలోనే నివసించాడన్న సంగతిని బట్టి మా హృదయములలో ఉన్న కృతజ్ఞతాభావమును మరియు ఘనతను మేము వ్యక్తపరచలేని స్థితిలో ఉన్నాము.మా పాపముల నిమిత్తము ఆయన మరణించినప్పుడు, పరదేశు గుండా వెళ్ళి, అపవాది యొక్క భూసంబంధమైన ప్రతివిధమైన ఆత్మ శక్తులను బద్దలుకొట్టి బంధింపబడి తనకొరకు ఎదురుచూచుచున్న ఆత్మలను తీసుకొనివచ్చాడు, దేవా! ఎవరైతే దేవునియొక్క పగటి వెలుగు అనే శాశ్వతకృపను పొందుకొనుటకై ఎదురుచూస్తున్నారో వారిమీద ప్రకాశింపచేయునట్లుగా ఆయన ఒక మార్గమును ఏర్పరిచియున్నాడు.
99.దేవా!ఈ దినము ఈ వర్తమానము ఎల్లప్పుడు త్వరితమైనదే అందువలన ప్రతిచోటా మానవుడు త్వర త్వరగా దేవునిరాజ్యములోనికి వచ్చునట్లుగా దయచూపుము. సొదమలోవున్న దూత, “త్వరగా, త్వరగా, బయటకు రమ్ము”, “నీవు పైకి వస్తే తప్ప నేనేమియు చేయలేను.” అనెను.ప్రభువా! ఈ వర్తమానము ద్వారా పరిపూర్ణమైన కృప, శక్తి మరియు ప్రేమ, దయచేయుము ఎందుకంటే ఇది అత్యంత అవసరమైయున్నది. ప్రభువా! ఈ ప్రజలు త్వరగావచ్చి, క్రీస్తును పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడునట్లుగా దయచూపుము. యేసు ఇలాగు చెప్పియుండగా, “దేవుని సంబంధులు దేవుని యొక్క వాక్యమును విందురు.
” వారు వచ్చి, వారి పాపముల నిమిత్తము ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము చేత తమ పాపములనుండి ప్రాయశ్చిత్తము చేసుకొని పరిశుద్దాత్మ యొక్క నింపుదలను కలిగియుండి, వారియొక్క ఆత్మలు ఆ ఆది సంఘములోని స్థితిలో ఎలాగున్నవో ఆలాగు ఉండునుగాక. మీరు వచ్చినప్పుడు అది మీకు జరుగునుగాక.
100.ప్రభువా! మీరు ఈ వర్తమానము ద్వారా మమ్ములను దీవించారని కృతజ్ఞతతో మేము ప్రార్ధిస్తున్నాము.ప్రభువా మా హృదయమంతటిలో మేలైనదానితో మేము, నీ కొరకు ఎదురుచూస్తున్నాము, యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము.ఆమేన్.
101.నీ కొరకు నా కొరకు అక్కడ వారు ఆ సువర్ణ గంటలు మ్రోగించునప్పుడు ఒకరి తరువాత ఒకరము ఆ గుమ్మములో ప్రవేశిస్తాము, అక్కడ మరణములేకుండా జీవిస్తాము.
102.మీరు ఆయనను ప్రేమించుటలేదా?ఈ వర్తమానము పూర్తయినది, మనమిప్పుడు ఆత్మలో ఆరాధన చేద్దాం, ఆయన ఇక్కడే ఉన్నాడు.ఈ మాటలు కఠినములే కాని అవి సత్యమైయున్నాయి.అవి నేను క్రీస్తు నామములో పలుకుచున్నాను.ఆ దినము దగ్గర అగుచున్నది.మీరు నన్ను గౌరవించినట్లయితే దీనిని చేయుము.
నీ కొరకు నా కొరకు మన చేయిని పైకెత్తుదాము నీవు విన్నావా.ఇదే మహిమా, హల్లెలూయా, సునాదమని దూతలు పాడుట నీవు వినుటలేదా దూరముగా ఉన్న ఆ మధురమైనది శాశ్వతముగా ఉండును మెరుస్తున్న ఆ నదికి ఆవల, నీకు కొరకు మరియు నా కొరకు, వారు ఆ సువర్ణ గంటలు మ్రోగించినప్పుడు.
103.ఆమె దానిని ఆలాగు పాడుచుండగా, మరొకరితో మనము కరచాలనము చేద్దాం.మధురమైనది శాశ్వతముగా ఆవల.కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే ఆవలగట్టును చేరుకోగలము.
104.ఒకరితో ఒకరు ఇలాగు చెబుదాం, “యాత్రికుడా, నేను నీతో ఉండుటను బట్టి సంతోషముగా ఉన్నాను.” నీ కొరకు నా కొరకు అక్కడ వారు ఆ సువర్ణ గంటలు మ్రోగించిప్పుడు ఒకరి తరువాత ఒకరము ఆ గుమ్మములో ప్రవేశిస్తాము, అక్కడ మరణములేకుండా జీవిస్తాము.ఆ గంటలు మ్రోగుట నీవు వినుటలేదా, దూతలు పాడుట నీవు వినుటలేదా (అది ఏమైయున్నది?) ఇదే మహిమా, హల్లెలూయా, సునాదమని, దూరముగా ఉన్న ఆ శాశ్వతమును మధురమైనది, మెరుస్తున్న ఆ నదికి ఆవలున్నది, వారు ఆ గంటలు మ్రోగించినప్పుడు.
105.ఇది నా మనస్సులోకి ఏదో తీసుకొనివచ్చియున్నది.ఆ వెనుక ఉన్న నా భార్యకు ఇది బాగుగా తెలుసు.కాలిఫోర్నియాలో , బైబిలు ఇనిస్టిట్యూట్ వారి పాతదైన పిస్గా సంఘమును దర్శించు భాగ్యము నాకు కలిగియున్నది.ఆ సంఘములో నేను ఒక రాత్రి ఆరాధనను కలిగియున్నాను.అది ఒక పాతకాలపు శక్తివంతమైన గృహమైయున్నది.ఎంత అద్భుతమైన స్థలమది!అక్కడ కాపరియైన బ్రదర్ స్మిత్ ను నేను కలుసుకున్నాను అది దినపత్రికలలో కూడా వచ్చినదని మీకు తెలుసు.వారు సహాయము చేసియున్నారు.వారు కానుకలను పట్టలేదు.ప్రతియొక్కటి అక్కడ ఉచితమే.వారు సుమారుగా 50 సంవత్సరములున్నారు. కాలిఫోర్నియాకు సహాయము కొరకు వచ్చిన ఒక కుంటివాడైన వైద్యుడు దీనిని ప్రారంభించియున్నాడు.ఆ వైద్యుడు ఇలా అనెను, “నేను మీ కొరకు ఏమియు చేయలేను.” ఆ వైద్యుడు ప్రెస్ అని నేను నమ్ముచున్నాను, లేక ఒక గదిలో ఒక ఉదయమున మేము ప్రార్ధించిన మరొకరు కావచ్చును.అతడు వెంటనే ఎటువంటి స్వస్థతను పొందుకోలేదు. అదేమంత పెద్ద విషయము కాదు.కాని, అతడు “ఏదో విధముగా నేను దానిని నమ్ముచున్నాను” అని చెప్పుట అతడు ప్రారంభించియున్నాడు.అతడు బంధించబడిన దానిలోనుండి తన కాలును తీసి అడుగు బయటపెట్టుట ప్రారంభించగానే కుంటిదైన అతడి కాలు చక్కగా మార్పుచెందినది.అతడే ఆ పిగ్గా గృహమును నిర్మించియున్నాడు.
106.మరోక రాత్రి అక్కడ నేను ప్రసంగము చేయుచుండగా, ఆ పెద్ద ఆడిటోరియం అంతా కొన్ని వందలమందితో నిండియుండుట చేత మేము వెనుక నుండి లోపలికి వెళ్ళవలసివచ్చెను.వర్తమానము పూర్తయిన తరువాత ఏదో జరిగింది.అక్కడ నేను చూసిన ఆ రెండు కార్యములు నా జీవితములో ఎన్నడు చూసియుండలేదు.వారు కేవలం ఒక గుంపుగా చేరి శబ్దమును చేయు వంటివారుకాదు.వారు ఎండిపోయిన వారివలె ఉండే గుంపు కూడా కాదు.వారు ఆత్మతో నింపబడినవారు.ఆ అద్భుతమైన సహవాసమును నేను ఆనందిచియున్నాను.
107.నేను రోగుల కొరకు ప్రార్థించుటకై వెళ్ళకముందు, వారు మధురముగా ఏదో పాడుట ప్రారంభించియున్నారు.నేనే ఆశ్చర్యముతో లేచి నిలబడియున్నాను.
నేను ఇలా అన్నాను, “ఇక్కడ ఏదో జరుగుతుంది అదేమిటో నాకు అర్ధం కావటంలేదు?” నేను మళ్ళీ వినినప్పుడు రెండు బృందములు పాడుట విన్నాను.
నేను ఇలా అన్నాను, “ఎక్కడో ఏదో తేడా ఉన్నది.” నేను నా తలను విదల్చి నా చెవులతో జాగ్రత్తగా మరలా విన్నాను.నేను ఇలాగ అన్నాను “ఓహ్, ప్రభువా!బహుశా ఇక్కడ పాడుచున్న ఈ బృందము యొక్క ప్రతిధ్వని అక్కడ నుండి మరలా వినిపించుచున్నది.” మరొకరు అక్కడ పైన చాలా ఎత్తులో నిలబడియుండుట నేను చూసియున్నాను.నేను ఇలా అన్నాను, “బహుశా ఆ పై నుండి శబ్దం వచ్చుచున్నది.” కావున నేను లేచి నడుచుకుంటూ సేవకులు ఉండు స్థలమునకు పైన బృందగానము చేయుచున్న వారియొద్దకు వెళ్ళాను.అది పైన ఉన్నది.నేను నా భార్యతో ఇలాగు చెప్పియున్నాను, “హనీ నీవు దానిని విన్నావా?” ఆమె, “అది ఏమిటి” అన్నది.నేను “ఆర్గన్ప్రైట్ సహైదరీ, మీరు దానిని వినియున్నారా? .” ఆమె ఇలాగన్నది, “నేను గతములో ఒకసారి దానిని వినియున్నాను.” ఆ తరువాత నేను సహెూదరుడైన ఆర్గన్ప్రైట్ దగ్గరకు వెళ్ళి, “నీవు దానిని వినియున్నావా?”.
108.వారిలో ప్రతియొక్కరు పాడుటకై తమ తలలను వంచియున్నారు.ఓహ్, నేను ఇలాగ అన్నాను, “బహుశా.నేను ఖచ్ఛితముగా చెప్పగలను.
నేనొక అవిశ్వాసిగా ఉండగోరుటలేదు.ప్రభువా!ఒకవేళ నేను నీకు సాక్షిగా ఉన్నట్లయితే, ఒకవేళ నేనే నీ కావాలివాడినైతే, నేను మాట్లాడుచున్నదేదో నేను ఎరిగియుందును.దానిని గురించి నేను ఖచ్చితముగా ఎరిగియుందును.
109.దైవీక స్వస్థత మాదిరిగా, ఒకవేళ నేను ఎరుగనట్లయితే, నేను దానిని గురించి ఏదియు మాట్లాడను.ఒకవేళ ఇది ప్రభువు రాకడ కానట్లయితే నేను దాని గురించి ఏమియూ మాట్లాడను.నాకు అది ఖచ్చితముగా తెలిసివుండాలి.
110.ప్రతియొక్కరు తలలు వంచియుండగా మరియు వేదిక పిలుపును ఇచ్చియుండగా నేను ఆ దిగువన ఉన్న అడుగుభాగమునకు మరలా వెళ్ళవలసియున్నది.
111.చాలామంది ప్రజలు క్రీస్తు రాకడకై కిటికీలలో తమ చేతులను వుంచియున్నారు.వారు పాడుచున్నారు.నేను దిగువకు వచ్చినప్పుడు, నేను ఇలా అన్నాను, “ప్రభువా! అది సాధ్యముకాదు.” ఈ దిగువున పాడేవారు సాధారణమైన ప్రజలైయున్నారు.కాని, పైన పాడుచున్నది చాలామంది యొక్క ధ్వనిలాగా ఉన్నది, బహుశా అక్కడ 2 లేక 3 వేలమంది పాడుచుండవచ్చు.కాని, చూచుటకు అక్కడ ఒక లక్షమంది ఉన్నట్లుగా ఉన్నది.అది ఒక మధురమైన నిజమైన పై తాళములో పాడుచున్న స్త్రీల స్వరముల వలె ఉన్నది.నేను వింటున్నప్పుడు, నా శరీరమంతా కంపించిపోయున్నది.
112.ఒక నిముషము తరువాత నేను ఒక అడుగు వెనుకకు వేసి వినియున్నాను.నేను ఆ వరండాలో నడచి మరలా వెనుకకు వచ్చియున్నాను, ఎందుచేతనంటే వారు ఆత్మలో పాడుచున్నారు.నేను మరలా విన్నాను.ఇది ఆ స్వరము కాదు.నేను దిగువన వినినప్పుడు అది ఒకవిధమైన స్వరముగా ఉన్నది, పైన వినినప్పుడు మరొక విధమైన స్వరముగా ఉన్నది.
113.అక్కడ ఆరాధన ముగిసిన తరువాత ఆ కాపరితో నేను ఇలా అన్నాను, “కాపరీ, ఇక్కడ నాకు తెలియనిది ఏదో నేను వినియున్నాను.” అతను, “సహెూదరుడైన బ్రెన్ హామ్ ఏమిటది?
114.నేను ఇలా అన్నాను, “బాగుగా తర్ఫీదును పొంది పై తాళములో స్త్రీల యొక్క స్వరముతో పాడుటను నేను వినియున్నాను, నా జీవితమంతటిలోకి ఎన్నడు విననటువంటి చక్కగా పాడుట ఆ పైన నేను వినియున్నాను.
115.అతడు ఇలా, “సహోదరుడా బ్రెన్ హామ్ , అలాగు చాలాసార్లు వినబడియున్నది.
116.ఒక ముసలి తల్లి గురించి నేను చదివియున్నాను, (ఓహ్, నేను ఆమె యొక్క పేరును మరచిపోయున్నాను.) ఆమె రోగుల కొరకు ప్రార్ధన చేసేది.
ఒక రాత్రి కాపరి ప్రసంగము ముగించిన తరువాత, ఆ చిన్న తల్లిగారు రోగుల కొరకు ప్రార్ధించుటకు క్రిందకు వెళ్ళియున్నది.ఆమె చుట్టూ ఐదుగురు లేక ఆరుగురు పిల్లలు ఉంటారు.ఆమె పాడుట ఆపివేసి, పైన నుండి వచ్చుదానిని వినుట ప్రారంభించియున్నది.అది శ్రీమతి వుడ్వర్త్ ఎడ్డర్, మీరు ఆమె యొక్క పుస్తకమును ఎవరైనా చదివియున్నారా? ఆమె వినియున్నది, ఆమె ఇలా అన్నది, “సంఘములో ఒక బృందము పైన పాడుచున్నది. ” దిగువున ఆ స్వరములు తగ్గిపోయిన తరువాత కూడా పైన ఆ పాట వినపడుతూ ఉండేది.గమనించారా? నేను అక్కడ నిలబడి.
117.ఆ భవనము యొక్క వెనుక అంతయూ తిరిగివచ్చాను, అది క్రమముగాను, ఖచ్ఛితముగాను.గమనించారా.నేను బాషలు మాట్లాడుటను నమ్ముచున్నాను.
అది సంఘములో దేవుడు ఇచ్చియున్న వరమని నేను నమ్ముచున్నాను.మిగిలిన లేఖనములను ఏలాగు తప్పుగా ఉపయోగించుచున్నారో అదే విధముగా దీనిని కూడా తప్పుగా ఉపయోగించుచున్నారు.కాని నిజమైనది ఉన్నది.అవును.ఈ మనుష్యుడు ఈ భవనములో వెనుక భాగమున లేపబడి నాలుగు లేక ఐదు మాటలు వేరే బాషలో మాట్లాడియున్నాడు, అది ఏదో కాదు కాని ఒక బాషయై యున్నది.ప్రతియొక్కరు మౌనముగా ఉన్నారు.మీరును వినియున్నారు.
118.నా మీద ఏదో కదిలియున్నది.నా జీవితములో ఎన్నడు నేను తర్జుమా చేసియుండలేదు, నేను వాటిని ఎన్నడు ఉపయోగించి ఉండలేదు, కారణమేమంటే అవి అంటే నాకు భయము.అవి దేవునియొక్క వరములైయున్నవి.వాటిని నీవు వ్యర్థముగా ఉపయోగించవద్దు.
119.నాతో ఎవరో ఇలాగు చెప్పెను, “ఆ కాపరిని విశ్వాసముతో ప్రార్ధన చేయనిమ్ము.” నేను నా నోటిని మూసుకొనవలసివచ్చెను.నేను ఎదురుచూచుచుండగా ఒక తరంగము మాదిరిగా అది మరలావచ్చి ఇలాగ అనెను, “ఆ కాపరిని విశ్వాసముతో ప్రార్ధన చేయనిమ్ము.
120.నేను ఇలా అనుకున్నాను, “ప్రభువా! నేను అర్ధమును వివరించే వరములను కలిగిలేను. నేను కేవలం రోగులకు ప్రార్ధించేవాడిని మాత్రమే.కావున నాకు తర్జుమాచేయగలిగే వరములు లేవు.” నా నోటిని మూసుకొని నేను అలాగునే నిలబడి యున్నాను.
121.అప్పుడు ఆ కాపరి లేచి నిలబడి రోగుల కొరకు ప్రార్ధించుట ప్రారంభించెను.ఓహ్, ఆయన దేవుడైయున్నాడు.ఆ భవనములో ప్రతిచోట నుండి బలహీనత స్వస్థపరచబడినది.అది ఏమైయున్నది?అది ఉదయకాలమైయున్నది.కలత చెందవద్దు, ఇంకనూ అటువంటి చిన్న తీగ మిగిలేవున్నది.దేవుడు ఎన్నడు ఒక సాక్ష్యము కలిగిలేకుండా ఉండడు.
122.ఏదో గొప్ప మర్మయుక్తమైనది ఎక్కడో వున్నదని నమ్ముదాము, బహుశా అది దూత యొక్క స్వరము కాకపోయుండవచ్చును, కాని, ఈ భూమిమీద రాత్రి మరింత చీకటిగా మారునట్లుగా ఆ గాఢాంధకారము కమ్ముకొనుచున్నదని ఈ భవనములోవున్న ప్రతి పాపికి ఏదో తెలియచేయుచున్నది.ప్రభువు యొక్క రాకడ సమీపించుట ద్వారా ఏమి తెలియచేయబడుచున్నది.మీ కావలివానిగా నేను ఇలాగ చెప్పుచున్నాను, “ఉదయము వచ్చుచున్నది.ఉదయకాల నక్షత్రములారా ప్రకాశించుటకు సిద్దపడండి.
123.మనము ముగింపు ప్రార్ధనకు వెళ్ళుటకు ముందుగా ఎంతమంది దానిని జ్ఞాపకముంచుకుంటారు? కేవలం నీచేతిని పైకెత్తుము..
124.ప్రియమైన దేవా! ప్రజలు తమ చేతులను పైకెత్తియుండగా వాటిని చూడుము. ఈ విషయములో వారు యదార్ధముగాయున్నారు.వారిలో చాలామంది దినపత్రికలలో వెదకియున్నారు, వారు పండితుల యొక్క పుస్తకములలో, వివిధ రకములైన వార్తలలో వెదికియున్నారు కాని, వారు దానికి సమాధానమును కనుగొనలేకపోయున్నారు.కాని, ఈ ఉదయమున ఈ పరిశుద్ధగ్రంథములో సమాధానము వచ్చియున్నది, “ఉదయమగు చున్నది మరియు రాత్రియగుచున్నది.” మనము ప్రార్ధించుదాము, దేవా! తమ చేతులను పైకెత్తిన ప్రతివారిని మీరు దీవించండి.ఎందుకంటే పైకెత్తబడిన ప్రతిచేతి వెనకాల ఏమున్నదో మీరు ఎరిగియున్నారు.ప్రభువా! ఇక్కడ వీరు ఎక్కడైతే కూర్చునియున్నారో, వారి ఆత్మయొక్క వారసత్వపు లక్షణములు విభాగింపబడి వారు దానిని పొందుకొనునట్లుగా సర్వంతర్యామియైన దేవుడు సమర్ధుడైయున్నాడని తెలుసుకొందురుగాక.ప్రభువా, దానిని ప్రతియొక్కరికి నీ వాక్యమునుబట్టి మరియు వారి చిత్తమును బట్టి దయచేయుము, నీ దైవీక వాగ్దానము ఎన్నటికిని విఫలము చెందదు. తమ చేతులను పైకెత్తినవారి తరుపున నేను ప్రార్ధన చేయుచుండగా వారు దానిని పొందుకొందురుగాక.ప్రభువైన యేసు నామములో వారు దానిని పొందుకొందురుగాక.ఆమేన్.దేవుడు మీతో ఉండునుగాక.
125.మనము కొద్ది సమయమును కలిగియున్నాము.ఇప్పుడు మనము రోగుల కొరకు ప్రార్ధన చేద్దాం.రోగుల కొరకు ఒక ఆశ కలిగియుండుటను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను.“నీ అతిక్రమములను క్షమించువాడను నీ వ్యాధిని స్వస్థపరచే ప్రభువు నేనే అయ్యున్నాను.
126.ఇది ఎంతో వింతగా ఉన్నది, అక్కడ పడక మీద ఒక యవ్వన తల్లి పడుకొనబెట్టియుండగా నేను ఆమె దగ్గరకు వెళ్ళియున్నాను.ఆమె గొంతు కాన్సరు (హెూడ్కిన్స్)తో బాధపడుచున్నది.నేను ఖచ్చితముగా చెప్పగలను ఆమెతో పాటుగా ఆమె యొక్క తల్లిగారు నిలబడియున్నారు.అవును, అది నిజము.ఆ తల్లి తన యొక్క కుమార్తె గురించి చెప్పుచున్నది.నేను ఆమెను చెప్పుటకు ప్రోత్సహించాను.
127.ఆ వర్తమానము ముగించిన తరువాత మొదటిది రక్షణ రెండవది స్వస్థత అని నేను అనుకుంటున్నాను. బహుశా స్వస్థత అనేది నీ జీవితములో చాలా సంవత్సరముల తరువాత ముగిసిపోవచ్చును.నీవు భూమిమీద ఉన్నప్పుడు ఆ స్వస్థత నీకు సంతోషమును ఆనందమును ఇవ్వవచ్చును, కాని, అది నీ మరణముతో ముగించబడుతుంది.కాని రక్షించబడిన ఆత్మకు నిత్యజీవముంటుంది.అది మరణించదు లేక దానిని నీ నుండి ఎవరు తీసుకోలేరు. చివరిదినములలో లేపబడుటకు అది దేవుని యొక్క గ్రంథములోకి వెళ్ళిపోతుంది.ఆ గొప్ప కార్యమే మొదటిదైయున్నది.మొదటిదిగా దేవుని యొక్క రాజ్యము మరియు ఆయన యొక్క నీతి, అటు తరువాత అన్నియు దానికి జతకలుస్తాయి.
128.ఈ యవ్వన స్త్రీ బాధపడుచున్న ఆ భయంకరమైన వ్యాధి నుండి స్వస్థతను పొందుకున్న సాక్ష్యమును నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను.
కొంతకాలము క్రితం.(బహుశా ఈ ఉదయము వారు వచ్చియుండవచ్చును, ఇక్కడ ఎవరు ఎవరో అని తెలుసుకునే అన్నిసార్లు నేను వచ్చియుండలేదు.
మీలో అనేకమంది నాకు తెలియదు.) మా ఉన్నత పాఠశాలలో ఒక యవ్వన బాలిక ఉండేది, ఆమె గొంతు కాన్సరుతో బాధపడుతూ ఉండేది, ఆమెలోనుండి ఆ పెద్ద గడ్డలు బయటకు వచ్చేంత బాధతో ఉన్నప్పుడు ఆమెను వైద్యుని దగ్గరకు తీసుకొనివెళ్ళారు.వారు ఆ గడ్డలోని ఒక భాగమును తీసుకొని, అది ఏమైయున్నదో కనుగొనుటకు దూరప్రాంతమునకు పంపించియున్నారు.తరువాత వారు అది “ఈ గొంతు కాన్సరు (హాప్కిన్స్) తగ్గించలేనిది” అని తిరిగి పంపివేశారు.
129.ఆ తల్లి తన కుమార్తెకు ఆ వ్యాధి ఏమిటో తెలియచేయుటకు ఇష్టపడలేదు.ఆమెను యధాప్రకారముగా పాఠశాలకు పంపించమని ఆమె తల్లికి వైద్యులు చెప్పియున్నారు, ఆమె ఇప్పటికే చాలా దినములు జీవించియున్నది.చివరకి అది హృదయాలను బద్దలు చేసేదిగా ఉన్నది.ఆ గొంతువ్యాధి అంటే అది మరో రూపములో ఉన్న ఒక విధమైన కాన్సరు అని మనకు తెలుసు.ఆ బాలిక మరణించేంత వరకు పాఠశాలకు పంపించాలని అనుకున్నారు.
130.ఆ తల్లి ఎంతో ఆందోళనతో ఉండేది.ఒకదినమున ఆమె నాకు ఫోన్ చేసి ఇలాగు చెప్పియున్నది, “నేను ఆ బాలికను తీసుకొని రావాలని అనుకుంటున్నాను.
కాని సహెూదరుడా బ్రెన్ హామ్ , ప్రార్ధనా వరుసలో నీవు చాలాసార్లు ఆత్మ ప్రేరపణచేత వ్యాధులను పేర్లతో పిలిచెడి వాడివని నాకు తెలుసు.” “ఒకవేళ పరిశుద్ధాత్మడు నీకు నా కుమార్తె గురించి ఏమైనా తెలియచేస్తే దానిని ఆమెకు నీవు తెలియచేయకపోయినట్లయితే నేను చాలా దయపొందిన దానిని అవుతాను.
131.నేను “మంచిది” “ఆయన కాదని అనుకున్నట్లయితే ఆయన నాకు దానిని నాకు తెలియచేయుడు.” అన్నాను, “నేను కష్టముగా దాని గురించి ఆలోచిస్తున్నాను.
నా స్వంత గుడారములో ఇటువంటి కూడికలను మేము చాలా తక్కువగా కలిగియుంటాము, నేను కేవలం రోగుల కొరకు ప్రార్ధన మాత్రమే చేయగలను.
132.ఆ యవ్వన స్త్రీ ప్రార్ధనా వరుసలోకి వచ్చినప్పుడు నేను ఆమె తల్లిని ఇలాగు అడిగాను, “నీవు క్రైస్తవురాలివా?”, ఆమె “కాదు.” అన్నది.నేను ఆమెను ఇలా అడిగాను, “ఆ బాలిక క్రైస్తవురాలా?”, ఆమె “కాదు.”అన్నది.
133.నేను “ఈ లోకములో అలాగు వెళ్ళుట ఎంతో భయంకరమైయున్నది.” మరియు నేను ఇలా అన్నాను, “ఆమె ఇదే స్థితిలో ఉన్నట్లయితే నీవు మరెన్నడు ఆమెను చూడలేవు.
134.ఆ ఉదయము ఆ యవ్వనబాలిక ప్రార్ధనకై గదిలోకి వచ్చినప్పుడు ఆమె అదే స్థలమును దాటి వెళ్ళియున్నది, (కొద్ది నిముషముల తరువాత ఆ బాలికే వెళ్ళినది.) నేను ఆమెను ఇలా అడిగియున్నాను, ఇక్కడ ఉన్నత పాఠశాలలో ఉండే ఆ యవ్వన స్త్రీవి నీవేనా? ఆమె “అవును.” నేను ఇలా అన్నాను, “నీకున్న వ్యాధిని గూర్చి నీవు ఎరిగియున్నావా?
135.ఆమె ఇలా బదులిచ్చినది, “నాకు బాగవుతుందని అనుకుంటున్నట్లుగా వైద్యులు నాకు చెప్పియున్నారు.
136.“మంచిది.” నేను ఇలా అన్నాను, “నీవు క్రైస్తవురాలివా? ఒకవేళ నీకున్న వ్యాధి తగ్గకపోతే అప్పుడేమి చేస్తావు? ” ఆమె ఇలా బదులిచ్చినది, “లేదయ్యా, అలాగు జరుగదు.” నేను ఇలా అన్నాను, “నీవు క్రైస్తవురాలిగా ఉండగోరుచున్నావా?” ఆమె ఇలాగు బదులిచ్చినది, “అవును నేను ఉండాలనుకుంటున్నాను.
137.నేను ఇలా అన్నాను, “నీవు, నీ హృదయమును క్రీస్తుకు ఇవ్వగలవా?” ఆమె ఇస్తానని బదులిచ్చినది.ఆమె యొక్క తల్లి పరుగున వచ్చి నేను కూడా క్రైస్తవురాలిగా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పినది.అక్కడనే వారి ఇద్దరికి ఒక కొలనులో బాప్తిస్మము ఇచ్చి ఆ యవ్వన బాలికకు ప్రార్ధన చేశాను.
138.కాలక్రమములో కొద్ది దినములు గడిచిన తరువాత ఆ బాలిక స్వస్థపడినది, ఆమెకు ఏది తప్పో తెలిసియున్నది.కొద్దికాలము తరువాత ఆ బాలికను తిరిగి పరీక్షల నిమిత్తము వైద్యుల దగ్గరకు పంపియున్నారు, వారు ఆ పరీక్షలలో ఆ వ్యాధి తాలుకు గుర్తులను ఏవియు కనుగొనలేకపోయారు.
139.ప్రజలలో ఇటువంటి వాటి గురించి మాట్లాడుట నాకు అంతగా ఇష్టము ఉండదు, కాని, ప్రజలతో యదార్ధముగా ఉండుట నాకెంతో ఇష్టము.అక్కడ ప్రముఖుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఒక మంచి క్రైస్తవ సహెూదరుడైయున్నాడు లేక అతడు ఈ సంఘమునకు పెద్ద కాదనుకుంటాను, నా ఉద్దేశ్యములో అతడు ఒక ధర్మకర్తయైయున్నాడు.అతడు ఇప్పుడు కూడా ఉన్నాడు.అతడే ఈ బాలిక యొక్క ఖాతాను చూసుకుంటూ ఉండేవాడు.రెండు లేక మూడు సంవత్సరముల తరువాత ఆ బాలిక తన పాఠశాల చదువును ముగించి ఒక బాలునితో ఉంటున్నది.
140.ఒక దినమున ఆమెను నేను వీధిలో కలుసుకున్నాను, ఆమె చాలా సంతోషముగా ఉన్నది, ఆమెకున్న సమస్యనును వారు ఆమెకు తెలియచేసిన తరువాత యేసుక్రీస్తు మహిమ యొక్క శక్తి అక్కడ నిరూపించబడింది.ఆ బాలిక ఇప్పుడు వివాహము చేసుకొనియున్నది.ఆమె ఇప్పుడు పిల్లలను కలిగి సంతోషముగా జీవిస్తున్నది.
141.తన జుత్తును కత్తిరించుకొనుటకు ఈ వ్యక్తికి ఉన్న మంగలివాని స్థలముకు అతడు వస్తాడు.శ్రీ.ఈగన్ ఇక్కడ ఉన్నారు, అతడే ఈ విషయమంతటిని మొదటినుండి పర్యవేక్షించుచున్నారు.ఆ బాలిక ఇప్పుడు చాలా సంతోషముగా ఉన్నది, చాలా సంవత్సరములనుండి (బ్రదర్ ఈగన్, ఎంత కాలమునుండి) అలాగునే ఉండుటలేదా? గొంతు కాన్సరు నుండి ఆ బాలికను దేవుడు స్వస్థపరచి ఈ దినమున ఒక సాక్షిగా వుంచియున్నాడు.
142.ఓహ్, ఈ నిరాశా ఘడియలలో అటువంటి ఆశ్రయదుర్గమును గురించి తెలుసుకొనుట మనకు ఎంతో మంచిదైయున్నది. క్రీస్తే ఆ దుర్గమైయున్నాడు.
143.కూటములలో జరిగిన మరొక చిన్న కార్యమును గూర్చి నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను.ప్రభువును మీరందరు ప్రార్ధించగా మీ అందరి ప్రార్ధనలకు సమాధానముగా నేను రెండు వారముల క్రితం పశ్చిమవైపున కూడికలకు వెళ్లియున్నాను.టుల్సాలో మేము కూడికల నిమిత్తమై ఉన్నప్పుడు, నేను మాట్లాడుటకు వెళ్ళియుండలేదు ఎందుకంటే నేను అక్కడ ఒక కూడికను కలిగియున్నాను, కాని, అక్కడ సేవకులు వేరొక ఉజ్జీవమును కలిగియున్నారు, ఆ కారణము చేత మేము అక్కడ కూడికలను కలిగిలేము.సహోదరుడైన ఆర్గన్బ్రటీని తీసుకొని నేను, నా భార్య మరియు నా చిన్న జోసఫ్ కలసి కాలిఫోర్నియాకు వెళ్ళాలనుకున్నాము.
144.ఆ రాత్రి మేము ఆలస్యముగా వచ్చియున్నాము, ఆ రాత్రి ఓరల్ రాబర్ట్స్ మరియు టామీ ఆసబర్న్ ప్రసంగించబోవుచున్నారని నేను అర్ధము చేసుకున్నాను.
కావున సహెూదరుడైన ఆర్గన్బట్ మేము ఎక్కడ ఉన్నమో అని తెలుసుకునేంత వరకు హెూటల్ కి ఫోన్ చేసియున్నాడు, తరువాత ఇలా అనెను, “కూడిక నిమిత్తమై దిగువకు రండి.” అతడు మరియు మిన్నేపోలిస్లోని హెడ్ ఆఫ్ ది చాప్టర్గా ఉన్న క్రైస్తవ వ్యాపారస్తుడు సహోదరుడైన సన్మోర్ వచ్చెను.వారు నా కొరకు వచ్చియుండగా.
145.నేను లోపలికి వెళ్ళాను, అది గొప్ప ధనవంతులు కూర్చుని భోజనముచేయు స్థలమైన మయో బాత్రూమ్ నందు వారు మాకు రాత్రి భోజనమును సిద్దపరచియున్నారు.అటువంటి స్థలములకు వెళ్ళటకు నేను ఎలాంటి అనుభూతిని చెందుతానో మీకు తెలుసు. భోజనబల్ల మీద ఉన్న ఆ కత్తులు మరియు ముళ్ల చెంచాను (ఫోర్క్ ఎలాగు ఉపయోగించాలో నాకు తెలియదు.
146.నేను లోపలికి వెళ్ళినప్పుడు ఓరల్ రాబర్ట్స్ ప్రసంగించుచున్నాడు.క్రైస్తవ వ్యాపారస్తులకు విస్తారమైన జీవితమును గూర్చి భోదించుచున్నాడు, యేసు చేపలు పట్టుకొని, వాటిని వలలో ఉంచెను, వారికి కావలసినవాటికన్నా అవి విస్తారముగా ఉన్నాయని అతడు చెప్పుచున్నాడు.సహెూదరడైన రాబర్ట్స్ బలముగా ప్రసంగిస్తాడని మీకు తెలుసు.అతడు ఇలాగ అనెను, “వారు చాలినంత కలిగియున్నారు.ఇప్పుడు, ఇక్కడ నేను ఒక దేవాలయమును నిర్మించాను.” (బహుశా కొన్ని లక్షల రూపాయలు అవ్వవచ్చును.) “అది తెల్లని పాలరాతితో నిర్మించబడింది.అది సగము నిర్మించిన తరువాత నా దగ్గర ఉన్న డబ్బు అయిపోయినది, నేను వీధులలో తిరుగుచున్నప్పుడు ఒకదినమున దాన్ని నేను చూడగా, అపవాది, 'నీకు తెలుసా, ప్రజలు దానిని దాటిపోతూ ఓరల్ రాబర్ట్స్ ఏమిచేశాడో తెలుసా' అని అంటారు అన్నాడు.
147.అప్పుడు నేను ఆ అపవాదితో ఇలా అన్నాను, “కాని, వారందరు ఓరల్ రాబర్ట్స్ ఒక ప్రయత్నము చేసియున్నాడు అంటారు.” అది మంచిదైయున్నది.
అతడు, “ఆ తరువాత అది నగరములో ఉన్న బ్యాంకువారి హృదయముల మీద ఉన్నది, ఆ భవనమును పూర్తిచేయుటకు వారు నాకు లోనుగా సుమారుగా 20 లక్షల డాలర్లను ఇచ్చియున్నారు.బ్యాంకువారు సాధారణముగా అలాగు చేయరని మీకు తెలుసు.
148.అలాగు ఇచ్చియున్న ఆ వాపారస్తుడు ప్రస్తుతము ఇక్కడే కూర్చునియున్నాడు.అతని యొక్క పేరును నేను ఇప్పుడు చెప్పలేను ఎందుచేతనంటే అతడు ఖచ్ఛితముగా ఫుల్ గాస్పెల్ కు చెందినవాడు కాడు.కాని అతడు ఇక్కడే ఉన్నాడు.అతడు తనను ఒక క్రైస్తవుడని అనుకుంటున్నాడని నేను అనుకోవటంలేదు.
కాని, అతని - హృదయములో కదిలిన ఏదో ఒక కదలిక వలన అతడు నాకు ఆ ధనమును ఇచ్చియున్నాడు.ఒకవేళ అతడు నిలబడాలని ఆశించినట్లయితే, అతడు నిలబడవచ్చును, కాని నేను ఆ వ్యక్తిని ఇబ్బందిపరచాలని అనుకోవటంలేదు.
149.ఆ వ్యక్తి నిలబడి ఇలా “శ్రీ.రాబర్ట్స్, నేనేమి ఇబ్బంది పడుటలేదు.” అని కూర్చొనెను. ఆ తరువాత నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాను.
150.ఆ తరువాత సూదరడైన రాబర్ట్ మా దగ్గరకు వచ్చి నాతో కరచాలనము చేసి తన చేతులతో ఆలింగనము చేసుకున్నాడు.కొద్దినిముషముల తరువాత, చాలామంది చుట్టూచేరి మాట్లాడతారని మీకు తెలుసు, మేము ఇంకనూ తినుచుండగా సేవకులు తమకు కూడికలు కావాలని వచ్చియున్నారు.
151.అప్పుడు దేమాస్ షకర్యాన్ నిలబడెను.అతడు ఆ ఫుల్ గాస్పెల్ వ్యాపారస్తుల భాగమునకు అధ్యక్షుడైయున్నాడు.అతడు నిలబడి ఇలా అనెను, “మీకు తెలుసు, ఈ రాత్రి చివరి వర్తమానమును సహెూదరుడైన బ్రెన్ హామ్ భోధించవలసినదిగా నేను భావిస్తున్నాను.
152.మంచిది, ఏమి చెప్పవలెనో నాకు తెలియటం లేదు.” ఆ తరువాత అతడు అక్కడ కూర్చునియున్న ఒక వ్యక్తి గురించి చెప్పుట ప్రారంభించియున్నాడు.
“ఇతడు ఫలనా ఫలనా వ్యక్తి, ఇతడిని నేను ఈ దినమే కలుసుకున్నాను.వారు మిరాకిల్ మైల్స్ లోని పట్టణములో మూడు లేక నాలుగు బహుళ అంతస్తుల జనావాస సముదాయములను స్వంతముగా కలిగియున్నారని నాకు చెప్పుచున్నారు.మరియు పశువులు మొదలైనవి కలిగిన ధనవంతులు. ఇటువంటి కూడికలలో అవి నేను ఎలాగు చెప్పగలను.
153.కాని మీకు తెలుసా, ఎల్లప్పుడు తగ్గింపు కలిగియుండుట మంచిదైయున్నది.నాకు సాధ్యమైనంత ఉత్తమంగా మాట్లాడుటకు నేను లేచి నిలబడియున్నాను, ఆ ఆరాధన చివరలో.అటువంటి స్థలములలో వేదిక పిలుపును ఇవ్వటం అంటే అది క్రమమును దాటిపోవుటయే.కాని, మీకు తెలుసా, ఆదరణ కూడికలలో నేను వేదిక పిలుపును ఇస్తాను.కావున, ఇక్కడ ఇది మంచి తరుణమని తలచి నేను వేదిక పిలుపును ఇచ్చాను.అక్కడ ఉన్న ఒక ధనవంతులైన స్త్రీ మరియు పురుషుడు ప్రభువైన యేసు దగ్గరకు వచ్చి వారు తమ హృదయమును ప్రభువుకు ఇచ్చియున్నారు.
154.అక్కడ ఒక లక్షాధికారిని, మరియు చుట్టూ పక్షి ఈకలున్న ఆ టోపి సుమారుగా అది ఒక 100 డాలర్లు ఉండవచ్చు, ఆ టోపిని ధరించుకున్న అతడి యొక్క భార్యను చూసి నేను ఆశ్చర్యపోయాను.కన్నీరు ఆమె చెంపల మీద నుండి క్రిందకు కారుతుండగా ఆమె నా చేతిని పట్టుకొని ఇలా అన్నది, “బ్రదర్, బ్రెన్ హామ్ , నా హృదయము కదిలింది.ఇప్పటివరకు నేను క్రైస్తవురాలినని నేను అనుకున్నాను.నేను ప్రభువు సేవ చేయాలనుకుంటున్నాను.” “కృతజ్ఞురాలిని.
155.కొద్ది నిముషముల తరువాత ఎవరో నాతో “రోగుల కొరకు ప్రార్ధన చేయుము.” అన్నారు.
156.నేను ఇలా అనుకున్నాను, “ఓహ్, లేదు.నేను దానిని చేయలేను.నేను ఇప్పటికే ఈ పెద్ద బాల్రూమ్ని అడ్డగించియున్నాను.ఇప్పుడు నేను ప్రార్ధన చేసినట్లయితే వారు నన్ను ఒక మూడుడు అనుకుంటారు.” నేను ఇలా అనుకున్నాను, “ఖచ్చితముగా, ప్రభువు నాకు అ సంగతిని చెప్పియుండలేదు.నేను ఈ కూటములలో అధికముగా పనిచేయుట వలన బహుశా అలాగు అనిపించియుండవచ్చును.
157.కావున నేను జారిపోయి అక్కడే కూర్చునియున్నాను.” దిగువన ఉన్న ప్రసంగికుని యొక్క బల్లయొద్దకు వచ్చియున్నాను, బాగా దిగువకు వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడుతున్న సహెూదరుడైన జాకీమూర్ దగ్గర కూర్చునియున్నాను.ఆ ఆరాధనను నేను తిరిగి అధ్యక్షుడైన శ్రీ. షకర్యానాకు ఇచ్చియున్నాను.
158.అతడు లేచినిలబడి ఇలా అన్నాడు, “అది ఏమిటో మీకు తెలుసా?” ఓహ్, దేవుడు అతడి భుజమును ముట్టియుంటాడు.అతడు ఇలా అన్నాడు, “సహెూదరుడైన బ్రెన్ హామ్ వెనుకకు వచ్చి రోగుల కొరకు ప్రార్ధన చేసి నడిపించవలసినదిగా నేను భావిస్తున్నాను.నేను “ఓహ్, అది ఖచ్చితముగా నిజము” అని అనుకున్నాను.
159.నేను లేచినిలబడి వారితో ఇలా చెప్పాను, “దేవా!నన్ను క్షమింపుమని నేను ప్రార్ధిస్తాను, నేను కూడా అలాగునే భావించియున్నాను, కాని ఎవరైనా ముట్టబడినట్లయితే అది ఇంకా మంచిదైయున్నది, అది ఆత్మ యొక్క కార్యమైయున్నదని మీకు మరియు మనకందరికి తెలుసు.
160.నేను ఇలా అన్నాను, “జంతువుల మరియు పక్షుల చిహ్నములను దైవిక స్వస్థత తాకదు.దైవీక స్వస్థత అనేది ఊహాజనితమైనది కాదు.కొద్దికాలము క్రితం ఇక్కడున్న ఈ ప్రజలను కాపాడిన ఆ దేవుడే, ఇక్కడున్న ప్రజలందరు ఆయనని నమ్మినట్లయితే వారికున్న కొద్దిపాటి విశ్వాసముచేత వారిని స్వస్థపరచేవానిగా దేవునిగా ఉన్నాడు.మీరు దాన్ని నమ్మగలరా?
161.నా సంఘమునకు ఒక రహస్యము.నా పరిచర్య మారుతున్నదని మీకు తెలుసు.ఓహ్, అది ఎంతో మహిమకరమైన మార్పుగా ఉన్నది.వాక్యము ఎల్లప్పుడు మ్రోగుతూనే ఉన్నది మరియు ప్రతిసారి ఏదో జరుగుతునే ఉన్నది.దానిని గూర్చి నేను మాట్లాడబోవుచుండగా, నా దగ్గరకు రమ్ము, “ఈ పర్వతముతో చెప్పుము.” అది ఎందుకు అలాగు జరుగుతుంది?అది విశ్వాసము వలన జరుగును.ప్రతియొక్కటి విశ్వాసము మూలముగా జరుగును.విశ్వాసమును నీవు కష్టపడి సంపాదించలేవు.విశ్వాసమును నీవు కలిగియుండాలి.
162.నేను ఇలా అనుకున్నాను, “ఒకవేళ.
163.కాని ప్రజలైన మీకు తెలుసు, ప్రభువు ఎంతో మంచిగా కార్యములను చూపించిచెను, దర్శనములను చెప్పెను, ప్రతియొక్కటి ఖచ్చితముగా జరిగియున్నాయి.
అది వ్యక్తిగతముగా కాదు.మానవునిగా కాదు.అది దేవుడు చేసిన కార్యమైయున్నది.”ఇక్కడ ఉన్న ఈ చిత్రము, ఇది ప్రపంచమంతా ఎలాగు వెళ్ళినది.జర్మనీలోని వారి యొద్దకు.
164.కొద్దివారముల క్రితం ఇక్కడ ఉన్నవారియొద్దకు (బహుశా ఇక్కడ ఎన్నడు చూడని ఎవరో అపరిచితుడున్నాడు.), వారు మరొక దానిని పట్టుకొన్నారు.నేను గృహమందు దానిని కలిగియున్నాను.అది ప్రభువైన యేసు యొక్క పూర్తి చిత్రమైయున్నది మరియు అది ఆ గదిలో నేను నిలబడు స్థానమునకు వెనుక కుడి ప్రక్కన ఉన్నది.ఆయన చేతులు బయటకు వచ్చి, ఆయన చేతుల నుండి అగ్నివంటి నాలుకలు ఎగురుచున్నాయి, నేను “ఆ కొండతో ఇక్కడ నుండి కదిలించబడుదువు అని విశ్వాసముతో నీవు చెప్పి నీ హృదయమందు సందేహించవద్దు.” అనే అంశము మీద మాట్లాడుతున్నప్పుడు.మేము దానిని కలిగియున్నాము.అది ఛాయాచిత్రములో ఒకదానితో ఒకటి కలిసిపోవు రంగుల సముదాయము.ఇప్పుడు మేము దానిని మా గృహమందు కలిగియున్నాము.ప్రస్తుతం ఆ చిత్రము సైన్సు యొక్క ప్రయోగశాలలో పరీక్షించబడినది.మరియొకటి త్వరలోనే బయటకు రాబోవుచున్నది.వివిధచోట్ల తీయబడిన 6 ఛాయా చిత్రములు ఉన్నవి.
165.ఇది వాటన్నింటిలోకి అత్యంత అద్భుతమైనది.ఎన్నడు చూడలేదు.ఆయన గడ్డమును కలిగియున్నాడు, ఆయన ముఖము, ఆయన పూర్తిగా ఉన్నాడు, ఆయన చేతులు క్రిందకు వ్రేలాడుచున్నాయి.ఆయన చేతులు ఎక్కడ ఉన్నాయో అక్కడ నేను కుడిప్రక్కన ఈ విధముగా నిలబడియున్నాను, ఆయన అలాగుండుట నీవు ఎన్నడు చూడలేవు.నా తల తరువాత నా కాళ్ళు పూర్తిగా నేలమీద పడియున్నాయి, కేవలం తల మరియు చేతులు, అవి మాత్రమే మిగిలియున్నాయి.గమనించారా?మరియు ఆయన తన చేతులు ఈలాగు పెట్టుకొని నిలుచునియుండెను, నేను నా చేతులను ప్రసంగించే నిమిత్తము ఈలాగు ఉంచి, ఇలా చెప్పుచున్నాను, “ఈ పర్వతముతో చెప్పుము.” ఆ సమయములోనే ఏదో జరిగింది, అప్పుడే వారు దానిని ఛాయాచిత్రముగా తీసియున్నారు.
అదిగో అది వెనుకాల ఉండియున్నది.పెద్దదిగాను.అన్ని రంగులలోను అది ఉన్నది.దేవుడే అక్కడ సమీపముగా ఒక పెద్ద కుండీనిండా కల్లా లిల్లీలు పెట్టియున్నాడు.
166.ఆయనే లోయలోని పద్మమైయున్నాడు.ఓపియమ్ ఎక్కడనుండి వస్తుంది?లిల్లీ పువ్వులలో నుండి వస్తుంది.అది నిజము.దేవుని దగ్గర ఉన్న ఓపియమ్ ఏమిటి? సమాధానము ఇస్తుంది.ఓపియమ్ నీకు సమస్యలన్ని మరచిపోవునట్లుగా చేస్తుంది.ఓపియమ్ను త్రాగువారు, ఆ ఓపియమ్తోనే వారు తమ జీవితములను చంపుకుంటున్నారు.దేవుని దగ్గర కూడ ఒక ఓపియమ్ ఉన్నది.ఆమేన్.ఆయన బాధను తీసివేస్తాడు, రోగమును స్వస్థపరుస్తాడు, ప్రతి విధమైన ఆయాసమును తీసివేస్తాడు.ఆయన ఓపియమ్ని మనము పీల్చినంతకాలము, మనము సమాధానములోనే ఉంటాము.
167.నేను మాట్లాడుచున్న వేదికకు ఎదురుగా ఒక పెద్ద కుండీనిండా లిల్లీలను ఉంచారు.
168.టుల్సాలో ఉన్నవారికి నేను ప్రార్ధన చేసి అక్కడనుండి బయలుదేరి వచ్చాను.10 నిముషముల తరువాత….
169.ఆ సువార్తికుని పేరు నేను చెప్పలేను, కాని, ఆ సువార్తికుని దగ్గర పనిచేయుచున్న ఒక స్త్రీ ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడుచున్నది, ఆమె హ్రస్వలిపి కర్త (మాటలను శబ్దమును సంకేతాల రూపములో వ్రాయుట, స్టెనోగ్రాఫర్) గా పనిచేయుచున్నది.ఆమె ఈ విధముగా టైపు చేసెడిది, కారణమేమంటే ఆమె యొక్క చేతులు మరియు భుజములు వంకర తిరిగియున్నాయి.టుల్సాలో ఉన్న ఆ సువార్తికుని యొద్ద అలాగునే టైపుచేయుచు ఆమె పనిచేయుచు, ఆ విధముగానే ఉద్యోగము చేస్తున్నది.
170.ఆ వరండాలో ఆమె నడవటం ప్రారంభించగానే అకస్మాత్తుగా ఆమె యొక్క చేతులు వదులయ్యాయి, వెంటనే అక్కడ ఉన్నవారందరు ఆకర్షించబడి లేచినిలబడేంతగా ఆమె అరచి గంతులు వేసినది.ఆమె తన చేతులు పైకెత్తి అక్కడనే మోకరిల్లి, ఈ విధముగా చప్పట్లు కొట్టుచూ దేవుడిని మహిమ పరచింది, ఎందుకంటే ప్రార్ధన ప్రారంభించిన కొద్ది నిముషములకే దేవుడు ఆమెకు విడుదల ఇచ్చియున్నాడు.
171.ఆమె చెప్పేదానిని నుండి నేను జారిపోయున్నాను, ఆమె ఏమి చెబుతుందో చూద్దాం.ఆమె ఇలా, “నేను ఈ వరండాలో కేవలం నడుస్తున్నాను.
మంచిది, దేవునికే కృతజ్ఞతలు.
172.నేను చుట్టూ తిరిగి మరొక మార్గము గుండా బయటకు వెళ్ళాను.అక్కడ ఉన్న పాపులందరు కలసి అక్కడ ఏమి జరిగిందో అని పరిగెత్తుటను నేను ఆ దిగువున వినియున్నాను.ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి సహెూదరుడైన గార్డ్నర్, నేను ధరించుకున్న ఈ సూటును ఈ వ్యక్తి నాకు ఇచ్చియున్నాడు.
173.న్యూయార్కులోని బింగామ్టన్ నివసించే సహెూదరుడు గార్డ్నర్ మీలో చాలామందికి తెలుసు.ఓల్డ్ మోబైల్ వ్యాపారస్తుడతడు.గత 3 సంవత్సరముల నుండి అమెరికా మొత్తములో ఓల్డ్ మోబైల్ కార్లను అధికముగా అమ్మినవాడు ఇతడే.అతడు తన స్వంత విమానములో ఎగురుతాడు.
174.తన విమానము తనే ఒంటరిగా నడుపుకుంటాడు, విమానము క్రిందపడినప్పుడు, అతడి మోచేతులు మరియు గిలకలు పాడయిపోయాయి.అతడి కాళ్ళు మరియు పాదములు బిగిసిపోయాయి, విమానము నడుపువానిగా ఉన్న అతడు ఇలాగు నడుచుచున్నాడు.
175.అక్కడ ఆ ప్రార్ధన జరుగుచున్నప్పుడు అతడు కూడా అక్కడే ఉన్నాడు.అతడు వరండా దగ్గర నుండి వారు ఏర్పాటుచేసిన విందు దగ్గరకి తనంతట తానుగానే కదిలియున్నాడు.అతడు ముందుకు మరియు వెనుకకు నడువుటకు ఇబ్బంది కలుగకుండా అతడిని వారు మూసియున్న ఒక గదిలో ఉంచి యున్నారు.ఇదే అతడి యొక్క సాక్ష్యమైయున్నది.అతడు క్రైస్తవుడిగా కాకుండానే ఆ గదిలో కూర్చొనియున్నాడు.ఇలా అన్నాడు, “ఎవరో బట్టతల కలిగిన ఒక వ్యక్తి ఈ రాత్రి అక్కడ ప్రసంగం చేశాడని నేను నమ్ముచున్నాను.
176.అక్కడ ఉన్న ప్రతియొక్కరు దేవుని మహిమ పరచుటకై లేచినిలబడియున్నారు, దేవుని మహిమ పరచుటకు అతడు తన కాళ్లను పైకి క్రిందకు అటు ప్రక్కకు ఇటు ప్రక్కకు పైకి లేపుచున్నాడు.
177.మరొకసారి మేము రోగుల కొరకు ప్రార్ధనచేశాము.సహెూదరుడైన ఆర్గన్బ్రటీతో నేను ఉన్నాను, నా మంచి స్నేహితుడైన లియోజినేకు ఏ ఫోన్ కాల్స్ వచ్చాయో తెలుసు.ఫోన్ మ్రోగుతున్నది, సాధారణముగా సహోదరుడైన ఆర్గన్ప్రైట్ సమాధానమును ఇస్తాడు, ఎందుకంటే నీవు అనిచోట్లా ఉండలేవని నీకు తెలుసు.
కాని, ఆ ఫోన్ కాలని నేను తీసియున్నాను.
178.దేవుడు ఏర్పరచిన విధముగానే అన్నీ జరుగుతాయని నేను నమ్ముతాను, మీరు దానిని నమ్మరా?ఆ కారణముచేతనే ఆ యవ్వన స్త్రీ అక్కడ ఉన్నదని నేను నమ్ముతాను.ఆ కారణము చేతనే మీరందరు ఇక్కడ ఉన్నారు.ఆ కారణము చేతనే నేను ఇక్కడ ఉన్నానని నేను నమ్ముతాను.మనమందరము కలిసి దేవుని మహిమ పరచటానికి ఒక ఉద్దేశ్యము ఉన్నది.మనమెందుకని ఆ మంచు మైదానముల నుండి ఈ ఉదయము ఇక్కడకు వచ్చియున్నాము?
179.సహోదరుడైన ఆర్గన్ప్రైట్ అక్కడలేని ఆ కారణముచేతనే నేను ఆ ఫోను తీసియున్నాను.అవతలి వ్యక్తి ఇలా అనెను, “సహెూదరుడైన బ్రెన్ హామ్ గారితో నేను మాట్లాడవచ్చునా?” నేను ఇలా అన్నాను, “ఆ సహెూదురుడైన బ్రెన్ హామ్ ను నేనే.
180.అతడు స్పెయిన్ దేశస్తుడు.అతడు ఇలా అనెను, “అయ్యా, నేను మిమ్ములను అడుగబోయే ఈ ప్రశ్న ఇప్పుడు అడుగుట సమయోచితము కాదని నాకు తెలుసు.ప్రజలు ఎలాగు ముందుకు లాగబడతారో.” “మెక్సికోలో నేను ఒక మిషనరీగా ఉన్నాను.” “నేను ఇక్కడ లా క్రెసెంటాలో ఉంటాను., మీరు నగరములోనే ఉన్నారని నాకు కొద్ది గంటల ముందే తెలిసింది.నా బిడ్డను తీసుకొని మీ దగ్గరకు కాని లేక బ్రదర్ రాబర్ట్స్ దగ్గరకు గాని లేక రోగుల కొరకు ప్రార్ధించే ఏ సహెూదరుడి దగ్గరకైనా వెళ్ళాలని అనుకున్నాను.” ఇంకా ఇలా అన్నాడు, “నా బిడ్డకు ఉన్న బలహీనత చిన్న బలహీనతయేనని నేను విశ్వాసిస్తున్నాను.” “నా బిడ్డకు పూర్తిగా 4 నెలల వయస్సు కూడా లేదు, కాని కాన్సర్ వ్యాధితో మరణించబోవుచున్నాడు.” ఆ బిడ్డ దగ్గరకు నీవు వెళ్లు అని ఎవరో నాకు చెప్పియున్నారు.
181.నేను ఇలా అన్నాను, “అయ్యా, నేను మిమ్ములను కలుస్తాను, మీరు, బ్రదర్ ఆర్గన్బ్రటీకి ఆ బిడ్డ ఎక్కడ ఉన్నాడో తెలియచేయండి, నేను ఆర్గన్బ్రటీని తీసుకొనివస్తాను.” అతడు బ్రదర్ ఆర్గన్బ్రటీకి వివరములు తెలియచేశాడు.
182.మేము కారులో అక్కడకు బయలుదేరాము.అక్కడ అతడి భార్యను కలుసుకున్నాను.అతడు మెక్సికన్ నివాసి, కాని చూచుటకు అతడు అలాగు కనిపించుటలేదు, అతడి శరీరము యొక్క రంగు తెలుపు, కాని అతడు మెక్సికనే, మెక్సికన్లు అధికముగా బంగారురంగు జుత్తును కలిగియుంటారు ఎందుచేతనంటే వారు స్పెయిన్ మరియు ఇండియాల మధ్యనుండి వచ్చియున్నారు.ఇండియనువారిలో కొద్దిమంది బంగారురంగును కలిగి, మరి కొద్దిమంది తెలుపురంగును కలిగియుంటారు.అతడి భార్య ఫిన్లాండ్ దేశస్తురాలు, ఆమె పూర్తిగా బంగారురంగును కలిగియున్నది, ఆమె చాలామంచి స్త్రీగా ఉన్నది.
183.అతడితో పాటుగా నేను ఆ బిడ్డను చూచుటకు ఆసుపత్రికి వెళ్ళాను.నేను ఆ గదిలోకి వెళ్లాను, అది నర్సులు ఉండే ప్రధాన విభాగమునకు కుడి ప్రక్కన ఉన్నది.
ఆ చిన్న బిడ్డకు పూర్తిగా 4 నెలల వయస్సు కూడా నిండలేదు, ఆ బిడ్డ పుట్టుకతోనే దవడప్రాంతములో ప్రాణాంతకమైన కణితి కలిగి జన్మించాడు, అవి వాచిపోయి సుమారుగా ఆ బిడ్డ ముఖముకన్నా పెద్దవిగా ఈ విధముగా కనిపిస్తున్నాయి.వైద్యులు శస్త్రచికిత్స చేయగా వాటి తాలుకు పెద్ద పెద్ద మచ్చలు ఆ బిడ్డ మెడమీద మరియు చుట్టు కనిపిస్తున్నాయి.కాని ఆ శస్త్రచికిత్స వాటిని ఆపలేకపోయాయి.అవి నాలుకలోకి కూడా చొచ్చుకొనిపోయాయి.పెద్ద పెద్ద మచ్చలతో ఆ చిన్న దవడ వ్రేలాడుతూ ఈ విధముగా ఉన్నది.ఆ బిడ్డ చిన్న నాలుక, చిన్న నోరు సుమారుగా ఇంత కూడా ఉండదు.ఆ బిడ్డ నాలుక ఇంత పెద్దదిగా ఉబ్బి ఉన్నది, అది బయటకు నెట్టబడి నలుపు రంగులోకి మారియున్నది, అది నోటి లోపల ఉబ్బిపోయి ఉండుటవలన ఊపిరి తీసుకునే సమయములో అది శ్వాస రంధ్రములకు అడ్డువచ్చుట చేత శ్వాస మధ్య మధ్యలో ఆగిపోవుచున్నది.ఖచ్ఛితముగా అది శ్వాసను ఆపివేస్తుంది.వైద్యులు ఆ చిన్నబాలుని గొంతు దగ్గర గుండ్రముగా కోసి అక్కడ ఒక చిన్న ఈలను ఉంచారు.ఆ బాలుని చేతులను ఒక బద్దకు ఈ విధముగా కట్టేసి ఉంచారు, ఆ కారణముచేత ఆ బాలుడు ఆ ఈలని తీసివేయలేడు.
అతికష్టము మీద అది అణిచిపెట్టబడినది.ఆ కాన్సరు ఎండిపోతున్నది.అక్కడ నిలబడివున్న ఒక నర్సు ఆ ఈల లోపలి నుండి దేనినో బయటకు లాగుతూ ఆ ఈలను ఖాళీగా ఉంచుటకు ప్రయత్నము చేస్తున్నది.ఆలాగు చేయకపోతే అది మరణమునకు దారి తీస్తున్నది.
184.ఆ బిడ్డ తండ్రి మంచము ప్రక్కకు వెళ్ళి, ఇలా అన్నాడు, “రికీ నాన్న యొక్క చిన్న బాలుడా, నీకు ప్రార్ధన చేయుట కొరకు నీ తండ్రి, బ్రదర్ బ్రెన్ హామ్ ని తీసుకొని వచ్చాడు.
185.అతడు “నాన్న యొక్క చిన్నబాలుడా” అని చెప్పగానే, అప్పుడే నా ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోయింది.నేనక్కడ ఇంకెంత మాత్రము నిలబడలేకపోయాను.
అక్కడ నిలబడుటకై నేను ఆ మంచము యొక్క ప్రక్క భాగమును పట్టుకొనవలసివచ్చినది.నాన్న యొక్క చిన్నబాలుడా.” అనగానే ఆ చిన్నవాడు ఇంకా లోకమును ఎరుగనివాడు, అది తండ్రియేనని ఆ బాలునికి తెలిసిపోయింది.ఆ బిడ్డ ఈ విధముగా గురక పెట్టుట ప్రారంభించెను, చిన్న చేతులను ఈ విధముగా కదిలిస్తున్నాడు, ఆ తండ్రి, పిల్లవాని తలమీద నిమురుటకు ప్రయత్నము చేయుచున్నాడు.ఆ చిన్నవాడు అటువంటి దీనస్థితిలో జన్మించియున్నాడు.నేను దాని గురించి ఏమియు మాట్లాడలేకపోవుచున్నాను.మీరు భారముతో నిండిపోయినప్పుడు ఏదియు మాట్లాడలేరని మీకుతెలుసు.
186.ఆ పెద్ద బద్దలకు అడుగున కట్టియున్న ఆ బాలుని చిన్నచేతులు మరియు ఆ గురకవంటి శబ్దమును నేను చూశాను, నేను ఇలాగు అనుకున్నాను, “ఇది ఎంతో దయనీయముగా లేదా.
187.కొద్దిసేపు ఇటువంటి ఆలోచనలలో నేను ఉన్న తరువాత ఇంకోవిధముగా ఆలోచించాను, “యేసు, ఇటువంటి వాటిని నీవు చూసి సంతోషిస్తావా?
నేను దీనిని నమ్ముటలేదు.ఈ చిన్నపిల్లవాడు ఈ విధముగా ఇబ్బంది పడుచుండగా నీవు దాని ద్వారా మహిమను పొందుకుంటావని నేను విశ్వసించుటలేదు.
ఎన్నటికి అది అలాగు జరుగదు.ఒకవేళ అది నన్ను పాపిగా చేసినట్లయితే, ఆ బాలునికి నేనే అది చేసినట్లుగా భావిస్తున్నాను, కృప అంతటికి మూలాధారమైన నీకు అది ఎలాగు అనిపిస్తుంది? అది నీకేమి చేయుచున్నది?
188.ఆ బాలుడు వాటితో ఆడుకొనుటకు ప్రయత్నము చేయుచున్నాడు, దానిని చూసిన నేను ఏమియు మట్లాడలేక నిశ్శబ్దముగా ఉన్నాను.చిన్న అంగీని మాత్రమే కలిగిన ఆ చిన్న బాలుని శరీరము, ఇంత పెద్దదిగా కూడా ఉండదు, ఆ శరీరములో పెద్ద భాగమేమంటే అది ఆ బిడ్డ తల, ఉబ్బిపోయున ఆ బిడ్డ దవడ ప్రాంతము.
ఆ బిడ్డ తల పగిలిపోకుండా తల చుట్టూ ఏదో కట్టియున్నారు, ఆ బిడ్డ యొక్క దవడ ఇంత పెద్దదిగా ఉబ్బిపోయున్నది, అది పగిలిపోకుండా దాని చుట్టు కట్టియున్నారు.ఆ చిన్నవానిని చూచుకొనుటకు అక్కడ ఒక నర్సు నిలబడియున్నది.
189.ఈ చిన్నవానిని చూచుటకు నేను క్రిందకు చూచినప్పుడు ఇలా అలోచించాను, “ప్రభువా! ఇప్పుడు ఇక్కడ నీవే ఉన్నట్లయితే నీవు ఏమిచేస్తావు?
190.ఇప్పుడు, నేను బలిపీఠం మీద ఉన్నాననే గ్రహింపుకు వచ్చాను, దేవుడు ఇక్కడే ఉన్నాడనే గ్రహింపునకు నేను వచ్చియున్నాను.కాని, నా హృదయ అడుగుభాగములో ఎవరో ఇలాగు చెప్పినట్లుగా అనిపించినది, “ఈ సంగతియందు నీవు ఏమి చేస్తావా అని నేను ఎదురుచూస్తున్నాను.నేను నా సంఘమునకు అధికారమును ఇచ్చియున్నాను.నీవు తిరిగివచ్చి 'ఈ పర్వతముతో చెప్పుము.నేను నా సంఘమునకు అధికారమును ఇచ్చియున్నాను మరియు నీవు ఏమిచేయబోవుచున్నావో అని నేను ఎదురు చూస్తున్నాను.
191.ఒకవేళ ఈ సమయములో ఆయన ఉద్దేశ్యము మనందరి విషయములో అలాగు ఉన్నట్లయితే నేను ఆశ్చర్యపోతాను, మనము ఏమి చేస్తామా అని ఆయన ఎదురుచూస్తున్నట్లయితే నేను ఆశ్చర్యపోతాను.కాలములలో జరిగిన సూచనల గూర్చి మనము భోదించినవి అన్ని ఏమైనట్లు? ఆయన ఏమి చేస్తున్నాడు?
మనము ఏమి చేస్తామా అని ఆయన ఎదురుచూస్తున్నాడు.
192.మంచిది, నేను ఆ చిన్నవాని చేతిని నా చేతిలోకి తీసుకున్నాను, ఆ చిన్నవాని చెయ్యి చిన్నదిగా ఉండుటచేత అది కేవలం నా చేతివేళ్ల వద్దవరకు మాత్రమే వచ్చినది.నేను ఇలా అడిగాను, “ప్రభువా, నీ సేవకుని యొక్క ప్రార్ధనను వినుము.విశ్వాసముచేత నీవున్నావని నేను నమ్ముచున్నాను, యేసుక్రీస్తు యొక్క రక్తమును నేను, ఈ కాన్సరు అనే దయ్యమునకు మరియు ఈ చిన్నవాని జీవమునకు మధ్యన ఉంచుచున్నాను.హంతకునికి మరియు పిల్లవానికి మధ్యన ఆ రక్తమును విశ్వాసముతో ఉంచుతున్నాను.” అంతకుమించి నేనేమి మాట్లాడలేదు.
193.నేను వెనుకకు తిరిగి బయటకు నడుచుట ప్రారంభించియున్నాను.తండ్రి నన్ను అనుసరించియున్నాడు.అతడు ఇలా అన్నాడు, “బ్రదర్ బ్రెన్ హామ్ , నా దశమ భాగమును మీకు ఇవ్వమని ప్రభువు నా హృదయములో భారమును కలిగించియున్నాడు.
194.నేను “ఓహ్” అని “లేదు, సహెూదరుడా నేను అలాగు అనుకోవటంలేదు.” అన్నాను.ఇంకా ఇలా అన్నాను, “సహెూదరుడా నాకు డబ్బుతో ఎటువంటి అవసరతాలేదు.
195.అతడు ఇలా అనెను, “నేను కొద్ది దశమభాగములను దాచియుంచాను” (ఓహ్, అవి కొద్దిగానే కాని అది ఖచ్చిముగా ఎంత అనేది నేను మరచిపోయున్నాను, కాని అది సుమారుగా 50 డాలర్లు కావచ్చునని నేను నమ్ముచున్నాను.) అతడు “మీకు ఇవ్వమని ప్రభువు నా హృదయములో భారమును కలిగించియున్నాడు.” అని అన్నాడు.
196.మరియు నేను ఇలాగు అన్నాను, “నేను చెప్పేది వినుము, నేను దీనిని తీసుకొనియున్నాను తరువాత నీవు దాన్ని వెనుకకు తీసుకొని ఆ చిన్న రిక్కీ యొక్క ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము వాడుము, కారణమేమంటే నీవు కూడా ఒక ప్రసంగికుడవే కదా.డబ్బు యొక్క అర్ధమేమటో నాకును తెలుసు.మరియు నీవు ఒక మిషనరీగా ఉన్నావు, దానికి ఎంతో డబ్బు అవసరము మరియు నీకు కుటుంబము కూడా ఉన్నది, ఇంకా వైద్యుని ఖర్చులు చెల్లించవలసియున్నది.దీనిని తిరిగి తీసుకొని ఆ రిక్కీ యొక్క ఖర్చుల నిమిత్తము ఉపయోగించుము.
197.అతడు ఇలా బదులిచ్చాడు, “బ్రదర్ బ్రెన్ హామ్, నేను అలాగు చేయలేను, ఎందుకంటే ఇది వైద్యునికి చెల్లించే డబ్బు కాదు, ఇది సేవకులకు చెల్లించే డబ్బు (దశమభాగమని అర్దము - తర్జుమాదారుడు).
198.నేను ఇలాగ అన్నాను, “అవును, కాని ఇది నేను తిరిగి ఇచ్చివేస్తున్నాను.” నేను దానిని తీసుకోలేదు.
199.నేను ఇంటిలో పై భాగమునకు వెళ్లియున్నాను, కొద్ది గంటల తరువాత, ఆ బాలుని దవడ క్రిందకు వెళ్ళినది, ఆ నాలుక తిరిగి లోపలకు వెళ్లి యధాస్థానమును చేరుకున్నది.ఆ చిన్నవాడిని దేవుడు స్వస్థపరచాడు.ఉదయమున నేను చూచిన ఈలను కూడా ఆ చిన్నవాని గొంతునుండి వారు తీసివేసియున్నారు.
200.ఆ సంగతి పశ్చిమ భాగమంతా మారు మ్రోగిపోయినది.ప్రసిద్ద వైద్యుడు తన కుమారుడితో పాటుగా తన మనవడిని పంపియున్నాడు, పాసదేనాలో ఒక పిల్లవాడు మెదడులో ఆకస్మిక చైతన్యము (స్పార్మ్) అనే రోగముతో బాధపడుచున్నాడు ఆ పిల్లవానికి ప్రార్ధన చేయుటకు నేను వెళ్ళవలసియున్నది కాని అక్కడే ఆ రోడ్డు మార్గమును 40 లేక 50 మైళ్ళు పొడవున తొలగించారు.ఆ పిల్లవానికి పెన్సిలిన్ ఇచ్చుచున్నారు, అది ఆ పిల్లవానికి పిరుదల మీద ఇచ్చుట ద్వారా అది దుష్ప్రభావము చూపించి కాన్సరుకి దారితీసినది.దేవుడు దానిని స్వస్థపరచాడని నేను ఖచ్చితముగా చెప్పగలను.
201.మేము గృహమును విడిచిపెట్టుటకు ముందు ఫోన్ మ్రోగుచున్నది.బ్రదర్ ఆర్గన్బ్రట్, అతడు ఎవరితోనో వాదించుచు ఇలాగు అంటున్నాడు, “లేదు, నేను దానిని చేయలేను.
202.”నేను కారులో కూర్చొనబోవుచున్నప్పుడు ఒక భారవాహనము వచ్చి ఆగినది.దానిలోపల ఆ చిన్న మెక్సికన్ సహెూదరుడు మరియు అతడి భార్య ఇద్దరును కన్నీరు కార్చుచు దేవుని స్తుతిస్తూ, ఇలాగు చెప్పుచున్నారు, “బ్రదర్ బ్రాన్హా, ఈ దశమ భాగములను నేను నీ కొరకు తీసుకొనివచ్చియున్నాను.
203.నేను “ఓహ్, బ్రదర్, నేను దానిని తీసుకొనను.నేను వాటిని తీసుకొనలేను.” అతడు ఇలాగు బదులిచ్చాడు, “కాని, ఇది మీ కొరకు నేను తీసుకొచ్చియున్నాను.” నేను, “అవి రిక్కీ యొక్క ఖర్చుల నిమిత్తము ఉంచమని నేను నీకు చెప్పియున్నాను.” అన్నాను.
204.దానికి అతడు “ఈ ఉదయము ఈ దశమ భాగమును రిక్కీ ఖర్చుల నిమిత్తమై వైద్యునికిచ్చుటకు వెళ్లాను, అప్పుడు వైద్యుడు ఇలా అన్నాడు, “నీవు నాకేమియు అప్పు లేవు.” ఈ డబ్బుతో నాకేమి సంబంధములేదు.అది ఒక ఆసాధారణమైన కార్యమైయున్నది.నీవు నాకు ఒక్క పైసా కూడా అప్పులేవు.” అని “బ్రదర్ బ్రెన్ హామ్, దీనిని తీసుకోండి.దీనిని మీరు తీసుకోవాలని ప్రభువు నాతో చెప్పియున్నాడు.” అన్నాడు.
205.నేను ఇలా అనుకున్నాను, “ప్రభువా!, ఇది చేయుట నాకు ఇష్టముగా లేదు.
206.అప్పుడు నా దగ్గరకి ఏదో వచ్చియున్నది.ఒకదినము యేసు నిలబడి, విస్తారమైన ధనమును ఇవ్వబడిన ఒక ధనవంతుడిని గమనించుచున్నాడు.
ఓహ్, వారు అధికముగా కలిగియున్నారు, అందుచేత వారు అధికముగా ఇచ్చుచున్నారు.అక్కడకు ఒక విధవరాలు మూడు కాసులు తీసుకొనివచ్చినది, అది మాత్రమే ఆమె కలిగియున్నది.ఆమె దానిలో ఆ కాసులను వేసియున్నది, మరి మనము ఏమి చేస్తున్నాము?“ఓహ్, సహెూదరీ, దానిని చేయవద్దు.మనకది అవసరములేదని మీకు తెలుసా.దానిని లోపల వేయవద్దు.ఆదే నీ జీవనమైయున్నది.” కాని, ఆమె ఆ విధముగా చేయుటను యేసు అనుమతించియున్నాడు.
తీసుకొనుట కంటే ఇచ్చుట ఎంతో ఆశీర్వాదైమైయున్నది.
207.ఆ చిన్న దశమభాగమును నేను తీసుకొన్నాను.దానితో ఏమిచేయాలో నాకు తెలియదు.నేను చేయగలిగినంత ఉత్తమమైన మార్గములో ఎక్కడో ఒకచోట దేవుని మహిమపరచుట కొరకు వాటిని ఒక చోట ఉంచుతాను.
208.అది ఏమైయున్నది?అదే దేవునికి మహిమైయున్నది.అదే దేవుని యొక్క శక్తియైయున్నది.నీడ తొలగిపోవుచున్నది.క్రీస్తు కనిపించుచున్నాడు.ఆ కారణము చేతనే సూచనలు మరియు అద్భుతములు జరుగుచున్నాయి.ఆయన రెక్కల క్రింద ఉదయకాల నక్షత్రములు స్వస్థతలు కలిగియుండుటచేత ఆ గొప్ప అంతరిక్షము వారిమీద ప్రతిబింబించుట ఆగిపోయినది.ఆయన తన ప్రసన్నతను ప్రతిబింబించుట ద్వారా స్వస్థతను తీసుకొని వస్తున్నట్లయితే, ఆయనే తనంతటగా తాను వ్యక్తిగతముగా వచ్చినట్లయితే మరి ఇంకెటువంటి కార్యములను చేస్తాడు.క్షయమైపోవు ఈ శరీరములు మార్పుచెంది ఆయన స్వంత మహిమా శరీరమువలె మారును.ఆయన రాకడ ఎట్లుండును?ఆయన వచ్చేంతవరకు ఆయన సన్నిధి యొక్క వెలుగునకు మనము వందనస్తులమైయుందాము.ఆ ఉదయకాల నక్షత్రములు చేసినట్లుగా, ఈ చీకటి ఘడియలో నేను ఆ మహిమా ప్రాకారముల పైకెక్కి ఆయన రాకడను స్తుతించెదను.ప్రార్ధన చేద్దాం.
209.ఓ, దేవా!ఎంతకాలమనేది చెప్పలేము కాని, నిన్ను చివరివరకు మేము ప్రేమిస్తాము, ప్రభువా! నీ స్తుతుల యొక్క సాక్ష్యమును గురించి మేము ఎన్నడు అలసిపోము. కాని, ఇప్పుడు ఆ ఘడియ ఇక్కడే ఉన్నది.ఇక్కడ రోగులు ఎదురుచూస్తున్నారు.నీకు ఈ సాక్ష్యములన్ని ఎరుకైయున్నాయి.ప్రభువా! వీరు ఎక్కడి వరకు వచ్చారో నాకు తెలుసు, బయట నిలబడియున్న ఆ విమానమును నడుపువాడు తన ప్యాంటును పైకి లాగి తన కాళ్లను, మోకాళ్ళను మరియు పగిలిపోయిన కాళ్ళను చూపించుచున్నాడు మరియు ఆ ఎముకలను అతికించుటకు వైద్యులు ప్రయత్నము చేసినప్పుడు ఏర్పడిన మచ్చలను చూపించుచున్నాడు.అక్కడ ఒక స్త్రీ తన ముఖమునకు రంగు వేసుకొని నిలబడియున్నది, ఆమెకున్న ఎముకల సంబంధించిన వ్యాధి, నీ శక్తిచేత తొలగిపోయినదని ఆమె ఆనందబాష్పాలతో చెప్పుచున్నందున, ఆ కన్నీటిచేత ఆమె వేసుకున్న రంగు మొత్తము కడిగివేయబడినది.మనము చెప్పుకున్న సాక్ష్యములోని ఆ ప్రియమైన చిన్నపిల్లవాడు మరియు అతడి తండ్రి ఇక్కడకు వచ్చియున్నారు.
210.ఈ లోకమందు నీవు ఎక్కడ ఉన్నా ఎటువంటి ఘనతనైతే కలిగియున్నావో ఈ ఉదయము ఈ గుడారములో అదే ఘనతను నీవు కలిగియున్నావు.మేము ఎక్కడైతే కూడుకుంటామో అక్కడ నీవు మా మధ్యలో ఉంటావని మాకు వాగ్దానమును ఇచ్చియున్నావు.ఇప్పుడు, ఈ ఉదయము నీవు పంపియున్న రోగులను మేము పిలిచెదము, మనము వారి కొరకు ప్రార్ధించెదము, హృదమందున్న విశ్వాసమంతటితో మనము వారి నిమిత్తము ప్రార్ధన చేద్దాము.నీవు వారిని రోగము నుండి కాపాడి పైకి లేపుదువుగాక.తండ్రీ!ఒక వేళ వారు పాపము చేసినట్లయితే నీవు దానిని క్షమింపుము.మేము ఒకరితో ఒకరు ఒప్పుదల కలిగివున్నట్లుగా, మేము ఒకరి కొరకు ఒకరు ప్రార్ధించుచున్నట్లుగా.మీరు చెప్పియున్నారు, 'నీతిమంతుని యొక్క ప్రార్ధన ఎక్కువ ప్రభావము చూపుతుంది.
211.ప్రభువా!, ఈమె యొక్క ప్రయాణము ముగిసిపోయినది వైద్యులు చెప్పియున్నారు.కాని, ప్రభువా! ఆమెకును మరియు ఆ శత్రువుకు మధ్యన మీరే నిలబడమని మేము ప్రార్ధిస్తున్నాము.మేము ఆమెను అభిషేకించి ప్రార్ధించినప్పుడు, ఆమె యొక్క ప్రాణమును మీ శక్తి ముట్టును గాక, అది ఆమెలో విశ్వాసమును మరియు విడుదలను దయచేయునుగాక.ఆమె గృహమునకు వెళ్లి స్వస్థతను పొందుకొని నిన్ను స్తుతించునుగాక, మరియు ఆమె ఉదయకాల నక్షత్రము యొక్క ప్రతిబింబముగా మారి దేవునికి మహిమకరముగా ఉండునుగాక.ఆమేన్.
212.బ్రదర్, మెర్సీయర్, ఈ ప్రజలను ముందుగా మనము నిర్ణయించిన ప్రకారము పిలువుము.వారికి ఇవ్వబడిన సంఖ్యను పిలిచినప్పుడు ఆ ప్రజలు వస్తారు.
ఆ చీటీలో ప్రార్థించవలసిన వారి పేర్లున్నాయి.కొలతలేని ఆత్మతో దేవుడు మిమ్ములను దీవించునుగాక!