పరీక్ష తరువాత శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకొనుట
1మీకు తెలుసా, మనము వాక్యమును చదువుచుండగా, ప్రజలు నిలబడుటను చూడవలెనని, నాకు ఒక చిన్న ఆలోచన ఉన్నది. మీరు దానిని ఇష్టపడతారా? మన భక్తిని, నమ్మకమును చాటినప్పుడు మనము నిలబడతాము, మనము దేశము కొరకు నిలబడతాము, ఇప్పుడు వాక్యము కొరకు ఎందుకు నిలబడకూడదు?
2 మనము ఒక్క నిముషము నిలబడియుండగా, ఈ మధ్యన, నేను ఒక వ్యాసమును చదువుచుంటిని, మరియు గత రాత్రి క్రీస్తు కొరకు నిలబడిన ఆ ప్రజల కొరకు నేను ఆలోచించుచుంటిని. నీవు దానిని చేయకపోయినట్లయితే, ఈ రోజు నీవెందుకు చేయకూడదు?
3 దరిదాపుగా డెబ్బై ఐదు సంవత్సరముల క్రితము ఒక సువార్తికుడున్నాడు, అతని యొక్క పేరును నేను సరిగ్గా ఆలోచించలేను. అది ఆర్డర్ మెక్కాయ్ అని అనుకుంటాను, మరియు అతడు ఈ దేశమంతా సంచరించాడు. అతడు ఒక రాత్రి మహిమలోకి వెళ్లినట్లుగా కలకన్నాడు. అతడు పైకి ద్వారమునొద్దకు వెళ్లాడు మరియు వారు అతనిని లోపలకు రానియ్యలేదని అతడు చెప్పాడు. అతడన్నాడు, "నేను యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన, ఆర్డర్ మెక్కాయ్ అని. నేను ఒక సువార్తికుడను."
4 కాబట్టి ద్వారపాలకుడు లోపలకు వెళ్ళి, (ఇప్పుడు అది ఒక కలయైయున్నది), అతడు లోపలకు వెళ్లి, "నీ పేరు నాకు ఎంతమాత్రము కనబడుటలేదు. అన్నాడు.
అతడన్నాడు, "బాగుంది, నేను ఒక సువార్తికుడను."
అతడన్నాడు, "అయ్యా, నేను..."
5 అతడన్నాడు, "మంచిది. నాకు ఏమైనా అవకాశమున్నదా... అక్కడ ఏదో తప్పుగా ఉన్నది."
6 అతడన్నాడు, "లేదయ్యా, ఇక్కడ నా దగ్గర గ్రంథమున్నది. నేను నీ యొక్క పేరును ఏ మాత్రము కనుగొనలేదు."
అతడన్నాడు, "మంచిది. దానిని గూర్చి నేనేమైనా చేయవచ్చా?"
7 అతడన్నాడు, "నీవు నీ యొక్క వ్యాజ్యెమును ధవళ సింహాసనము వద్ద చెప్పుకొనవచ్చును." దేవా, సహాయము చేయుము, అక్కడుండుట నాకు ఇష్టము .
8 అతడన్నాడు, "మంచిది, అది ఒకటి మాత్రమే నా యొక్క నిరీక్షణ అయితే, నేను నా వ్యాజ్యెమును సరిగా చెప్పుకుంటాను."
* అప్పుడతడు దూరముగా వెళ్ళునట్లు తలంచాడు. సరిగ్గా... అతడు ప్రారంభించగా, అది చీకటిగా ఉండి, మరి ఇంక ఆ చీకటి, ప్రకాశము ప్రకాశముగా మారింది, ఒక నిర్ణీతమైన స్థలములో అది ఎక్కడనో అగినట్లుగా ఆ వెలుగు కనబడలేదు. అయితే అతడు తిన్నగా ఆవెలుగు మధ్యలో ఉన్నాడు. ఆయనన్నాడు. నా యొక్క తీర్పు సింహాసనము సమీపించుచున్నదెవరు?"
30 అతడన్నాడు. "నేను ఆర్డర్ మెక్కాయ్ను. నేను ఒక సువార్తీకుడను, అనేక ఆత్మలను దేవుని రాజ్యమునకు పంపాను."
ఆయనన్నాడు. "నీ పేరు గ్రంథమందు కనబడలేదా?"
ఆయనన్నాడు. "అలాగైతే, నా న్యాయస్థానములో నీవు చెప్పుకుంటావా?"
11. "నీవు న్యాయాన్ని పొందుతావు. నా చట్టముల ద్వారా నేను నీకు తీర్పు చేస్తాను. ఆర్డర్ మెక్కాయ్ నీవు ఎన్నడైనా అబద్దం చెప్పావా?"'
12 అతడన్నాడు. "నేను ఆ వెలుగులో నిలబడువరకు నేను ఒక చాలా చక్కని వ్యక్తిననుకొన్నాను." అతడన్నాడు. "ఆ వెలుగు సన్నిధిలో, నేను ఒక పాపివైయున్నాను." మనమందరము అలాగే ఉంటాము. ఇప్పుడు నేను భద్రంగా ఉన్నానని నీవు అనుకుంటావు, అయితే నీవు అక్కడకు వచ్చువరకు వేచియుండుము. ఆయన ఇక్కడ అభిషేకించుచుండగా అది ఎలాంటి భావనగా ఉంటుందని నీవు అనుకుంటావు? నీవు ఎంత చిన్నవాడవని భావిస్తావో! మరి ధవళ సింహాసనము తీర్పునొద్ద అది ఎలా ఉంటుంది?
ఆయనన్నాడు, "నీవెన్నడైనా అబద్ధం చెప్పావా?"
13 అతడన్నాడు. "నేను సత్యవాదినై యుండియున్నానని తలంచాను, కానీ కొన్ని చిన్న చిన్న పచ్చి అబద్ధాలను నేను తలంచాను, అవి అక్కడ నల్లగాను మరియు పెద్దవిగాను మారాయి.*
అతడన్నాడు, "అవునయ్యా, నేను అబద్ధమాడాను."
ఆయనన్నాడు, "నీవెన్నడైనా దొంగిలించావా?"
14. అతడన్నాడు. "దాన్ని గూర్చి యథార్థంగా ఉన్నానని నేను తలంచాను. మరియు నేను ఎన్నడూ దొంగిలించలేదు, కానీ "ఆ వెలుగు తెలుగు యొక్క సన్నిధిలో, నేను కొన్ని వ్యవహారాలలో నేను కొన్ని లాక్కొన్నవి సరిగ్గా లేవు."
అతడన్నాడు, "అవునయ్యా, నేను దొంగిలించాను."
ఆయనన్నాడు. "నా తీర్పు..."
15 అతడు సరిగ్గా అతని శిక్షను వినుటకు సిద్ధంగా ఉన్నాడు, "సాతానుకు మరియు అతని దూతలకు సిద్దపరచిన నిత్య అగ్నిలోనికి పొమ్ము. "నా ప్రతీ ఎముక విడిపోయినట్లుగా వచ్చుచున్నది.
16 "అప్పుడు నా జీవితములో నేను ఎన్నడూ వినని అతి మాధుర్యమైన స్వరమును చిన్నాను." "నేను తిరిగి చూడగా, నేను ఎన్నడూ చూడని అతి మాధుర్యమైన ముఖమును చూశాను: ఒక తల్లి ముఖము కంటే, నా తల్లి ఎన్నడైనా నన్ను పిలిచిన
అతి మాధుర్యమైన స్వరముకంటే మధురమైనది." అతడన్నాడు. "నేను చుట్టూ చూశాను. ఒక స్వరం ఇలా చెప్పింది. 'తండ్రీ. అది సత్యము, అతడు అబద్దాలు చెప్పాడు. అతడు సరిగ్గా యథార్ధంగా లేడు. కానీ భూమి మీద అతడు నా కొరకు నిలబడ్డాడు, "ఇప్పుడు నేను అతని స్థానములో నిలబడతాను," అన్నాడు.
17 అక్కడ అదే సంభవించాలని నేను కోరతాను, ఇప్పుడు నేను ఆయన కొరకు నిలబడగోరతాను, అదే, ఆ సమయము వచ్చినపుడు, ఆయన నా స్థానములో నిలబడతాడు.
18 ఆదికాండము 22 వ అధ్యాయము 15, 16, 17, 18 వచనములు మనము చదువుదాము.
యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను
నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక యీ కార్యము చేసినందున
నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్ర తీరమందలి యిసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.
మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
ప్రార్థన చేసుకుందాము.
19 పరలోకపు తండ్రీ, ఈ అంశమును తీసుకొని, మాకు పరిచర్య చేయండి, ప్రభువా. పరిశుద్దాత్మ ప్రతీ హృదయమునకు తిన్నగా వాక్యమును మోసుకొని వెళ్ళునుగాక. ఈ మధ్యాహ్నము అది మా ఆశలను కలుసుకొనును గాక, ఏలయనగా అవి గొప్పవైయున్నవి, ప్రభువా. మా సంతోషము పరిపూర్ణమగునట్లుగా, సమృద్ధిగా అడుగుమని నీవు మాకు చెప్పియున్నావు. యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్.
మీరు కూర్చొనవచ్చును.
20 కొన్ని క్షణముల పాటు, నేను తప్పక దీనిని ఒక అంశముగా పిలువగోరినట్లతే. నా స్వరం బలహీనముగా ఉన్నది, కాబట్టి ఆ కారణమును బట్టియే నేను మైక్రోఫోన్ దగ్గర నిలబడవలసి యున్నది. అక్కడ అది ప్రతి ధ్వనించుచున్నదని నాకు తెలుసు, అయినా మనము దానిని కొంచెము భరించాలి. పరీక్ష తరువాత శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనుట అని నేను దానిని పిలుస్తాను.
21 మన దృశ్యము అబ్రాహాము యొక్క అమోఘమైన దృశ్యములలో ఒక దాని యొద్దకు తెరవబడుతుంది. మీకు తెలుసా అబ్రాహాము నమ్మకత్వమునకు తండ్రిగా ఉన్నాడు. మరియు వాగ్దానము అబ్రాహమునకు చేయబడింది. మరియు అతనితో వారసులుగా ఉన్నవారికి మాత్రమే, క్రీస్తు ద్వారా, మనము వాగ్దానము పొందే ఒకే మార్గము, అబ్రాహాము ద్వారానే. ఇప్పుడు, అబ్రాహాము ఒక సామాన్యమైన
మనిషైయున్నాడు. అయితే అతడు దేవుని చేత పిలువబడ్డాడు మరియు ఆ పిలుపునకు అతడు నమ్మకముగా ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, అబ్రాహాము ఒక్కసారి కూడా ఎన్నడూ ఆ స్వరమును సందేహించలేదు. అతడు తిన్నగా దానితో నిలిచియున్నాడు. ఇబ్బంది ఏమైననూ లెక్కకాదు, అతడు తిన్నగా దానితో నిలిచియున్నాడు.
22 అప్పుడు అతనికి కుమారుడు వాగ్దానము చేయబడ్డాడు. ఆ కుమారుని పొందుటకు అతడు ఇరువది అయిదు సంవత్సరములు కనిపెట్టాడు, దానికి వ్యతిరేకముగా ఉన్న దేనినైననూ అది లేనట్లుగానే అతడు పిలిచియున్నాడు. మరియు అప్పుడు, ఈ కుమారునిలో, భూమి మీద కుటుంభములన్నియు దీవించబడవలసి యుండెను. తన పిలుపునకు మరియు వాగ్దాన వాక్యమునకు • పితరుడు నమ్మకముగా ఉన్నాడు.
23 మనము తప్పక ఎలా ఉండాలో అతడు మనకు ఒక మాదిరియై యున్నాడు. ఇప్పుడు మనము, క్రీస్తులో మృతి చెందిన వారమై, మనము అబ్రాహాము యొక్క సంతానమై యున్నాము.
24 ఇప్పుడు, అక్కడ అబ్రాహాము యొక్క రెండు సంతానములున్నవి. వాటిలో ఒకటి సహజ సంబంధమైనది; మరొకటి ఆత్మ సంబంధమైనది. వాటిలో ఒకటి అతని శరీరము ద్వారాయై యున్నది; మరొకటి అతని యొక్క విశ్వాస సంతానమై యున్నది, విశ్వాసము, వాగ్దాన వాక్యము ద్వారా మనము అబ్రాహాము యొక్క సంతానము కాగలము.
25 ఇప్పుడు ఇరువది అయిదు సంవత్సరములు పరీక్షించబడిన తరువాత, అతడు బలహీనుడగుటకు బదులుగా అతడు ఇంకా బలమైనవాడుగా ఎదిగాడు. చూడండి. అది మొదటి సంవత్సరములో సంభవించకపోయినట్లేతే, తరువాత సంవత్సరములో అది అతి పెద్ద అద్భుతముగా ఉంటుంది, ఏలయనగా అది రెండు సంవత్సరముల వయస్సు గలదై యున్నది. అతడు ఆ సంవత్సరములను పైకి ప్రోగుచేసి యున్నాడు, అతడు బాగా వృద్ధుడగుచుండగా, అతని దేహము మృతతుల్యమైనది. శారా యొక్క గర్భము, మృతత్తుల్యమైనది లేక అది ఫలించనిదిగా మారినది. అందుచేత అతని బలము క్షీణించిపోయింది, అది సంపూర్ణముగా అసాధ్యం.
26 అక్కడ దేవుడు ఏమి చేశాడో మీరు యోచించారా? చూడండి, ఆయన కేవలం ఎన్నడూ ఆమె యొక్క గర్భమును ఫలించునట్లుగా చేయలేదు. కారణము గుర్తుంచుకొనండి, ఆయన అది చేసినట్లయితే, అప్పుడు గుర్తుంచుకొనండి ఆయన దానిని చేసినట్లయితే... చిన్న బిడ్డలకు ఆవు పాలనిచ్చుటకు, ఆ దినములలో, ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పాల సీసాలు వారికి అప్పుడు లేవు. చూడండి? పాలగ్రంథులు ఎండిపోయినవి. ఆయన దానిని కలిగియుండలేదు... అక్కడ ఏదో సంభవించవలసి యుండెను,
27 అప్పుడు, స్త్రీ వైపు చూడండి, ఒక వంద సంవత్సరములు కలిగిన వ్యక్తి, ప్రసవ నొప్పులు పడగలదా. ఆమె గుండె దానిని తట్టుకొని యుండేది కాదు. అది ఇప్పుడు నలుబది సంవత్సరములు కలిగిన స్త్రీకే, దానిని చేయుట కష్టము. ఆమె గుండె
దానిని తట్టుకొని యుండేది కాదు. కాబట్టి ఆయన ఏమి చేశాడో మీకు తెలుసా? మీరు గమనించినట్లయితే...
28 అనేకులు సమ్మతించరని నాకు తెలుసు. ఈ ప్రకటన చేయుట సరియై యున్నట్లయితే? చూడండి. అది నా యొక్క స్వంత ఆలోచనగా ఉంటుంది.
29 చూడండి, బైబిల్ ఒక సహజాతీతమైన గ్రంథమైయున్నది. అది పాఠశాలల నుండి, వేదాంత పండితుల నుండి మరుగుచేయబడినట్లుగా వ్రాయబడింది. మీలో ఎంతమందికి అది తెలుసు? యేసు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయనన్నాడు, "తండ్రీ, జ్ఞానులకు, వివేకం గలవారికి వీటిని మరుగుపరిచి. నేర్చుకొనే పసి బాలురకు వాటిని బయలుపరిచినందుకు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను." అది ఒక ప్రేమ గ్రంథమై యున్నది. దేవుని యొక్క ప్రేమ ఒక హృదయములోనికి వచ్చినపుడు, నీవు దేవునితో ప్రేమలో పడతావు, అప్పుడు ఆయన తనకుతాను బైబిలు భావనను బయలుపరచుతాడు. బైబిలు యొక్క అనువాదమేమనగా దేవుడే స్వయముగా ఆయన యొక్క వాగ్దానములను అనువదించుటయై యున్నది. అది వరుసల మధ్యలో వ్రాయబడింది.
30 ఇప్పుడు, నా భార్య వలే, ఓ, ఆమె ప్రపంచమంతటిలో అత్యంత అద్భుతమైన స్త్రీయై యున్నది. నేను ఆమెను నిజంగా ప్రేమిస్తాను. ఆమె నన్ను ప్రేమిస్తుంది. కాబట్టి నేను ఇంటి నుండి దూరముగా ఉన్నప్పుడు, ఆమె నాకు ఉత్తరము రాస్తుంది, "ప్రియమైన బిల్, ఈ రాత్రి నేను పిల్లలను నిద్రపుచ్చియున్నాను. ఈరోజు నేను స్నానము చేసియున్నాను," అంటుంది. ఆమె ఏమేమి చేసిందో, అంతా వ్రాస్తుంది. ఇప్పుడు ఉత్తరము మీద ఆమె దానిని చెప్పుచున్నది. కానీ, మీరు చూడండి, నేను ఆమెను ఎంతగానో ప్రేమిస్తాను. మేము ఎంతో ఒక్కటిగా ఉన్నాము, చివరకు నేను ఆ వరుసల మధ్య చదువగలను. ఆమె ఏమి చెప్పగోరుచున్నదో నాకు తెలుసు, చూడండి, ఆమె దానిని నాకు చెప్పినా లేక చెప్పకపోయినా, చూడండి. ఆమె భావము నేనెరుగుదును, ఏలయనగా అది ఆమె కొరకైన నా ప్రేమయైయున్నది, మరియు నా అవగాహన.
31 మంచిది, ఆ విధానములోనే బైబిలు వ్రాయబడియున్నది. చూడండి? విద్యాభ్యాసము తిన్నగా, దాని తలమీదుగా పైనుండి వెళ్ళిపోతుంది, వారు ఎన్నడూ దానిని పొందలేరు. చూడు, నీవు తప్పక వాక్యముతో ప్రేమతో ఉండవలసియున్నది, ఆయనతో, "ఆయనను ఎరుగుటయే. చూడండి?
32 ఇప్పుడు, ఇప్పుడు దీనిలో, ఆయన ఏమిచేశాడో గమనించండి. ఇప్పుడు అబ్రాహాము మరియు శారా ఇద్దరూ వృద్ధులై యున్నారు. "బహు కాలము గడిచిన వృద్ధులైరి," అని బైబిలు చెప్పియున్నది. ఇప్పుడు వారు దీర్ఘకాలము జీవించి ఉండటమే కాక, "వారు బహుకాలము గడిచిన వృద్ధులైరి"అని బైబిలు చెప్పింది.
33 ఇప్పుడు గమనించండి. ఈ దూత ప్రత్యక్షమైన వెంటనే, మనము దానిని గూర్చి మాట్లాడుచున్నాము; ఆయన ఎలోహిం అయి ఉన్నాడు, దేవుడు. అబ్రాహాముతో చెప్పాడు, "నేను నిన్ను జీవపు కాలము ప్రకారము దర్శించబోవుచున్నాను." ఇప్పుడు క్రిందవరకు అంతా గమనించండి, వారు సంఘమునకు ఒక మాదిరియై యున్నారు, మార్గమంతటి గుండా.
34 ఇప్పుడు చూడండి. ఇక్కడ సంభవించినదేమనగా, ఆయన శారాను మరియు అబ్రాహామును పైకి అతుకు వేసినటుగా చేయలేదు. ఆయన వారిని తిరిగి ఒక యౌవ్వనస్తుడుగా, ఒక యౌవ్వన స్త్రీగా మార్చెను, ఇప్పుడు అది వింతగా కనపడవచ్చు. అయితే ఇప్పుడు మిగిలిన వాక్యమును గమనించండి, దానిని ఏకముగా చేయండి. వాక్యము ప్రేరేపించబడియున్నది, మరియు నీవునూ వాక్యముతో ప్రేరేపించబడవలసి యున్నది. ఇప్పుడు, గుర్తుంచుకోండి, అది జరిగిన వెంటనే, దూత ప్రత్యక్షమైన తరువాత వెంటనే...
35 నేను దానిని చూడగలను, శారా యొక్క తెల్లని వెంట్రుకలు, ఒక అమ్మమ్మ భుజము మీద శాలువా వేసుకొని, చిన్న టోపీ పెట్టుకొని, కర్ర పట్టుకొని, నడిచి వెళ్ళుచున్నది. "నేను, నా యజమానితో సంతోషం పొందగలనా, అతడును వృద్ధుడు?" చూడండి? ఇక్కడ అబ్రాహాము, బహు కాలము గడిచిన వృద్ధుడుగా, ఇంత పొడవైన గడ్డముతో, కర్రపట్టుకొని ఉన్నాడు.
36 మరుసటి ఉదయము, నేను చూడగలను, అతని భుజములు తిన్నగా మారిపోయి, పైకి వచ్చుట ఆరంభమైనవి, గూని పోయి వీపు పైకి వచ్చింది. ఆమె వెంట్రుకలు మారుట ఆరంభమైనది. వారు తిరిగి ఒక యౌవ్వనస్థుడుగా, ఒక యౌవ్వన స్త్రీగా మారియున్నారు. అబ్రాహాము యొక్క రాజ సంతానమునకు ఆయన ఏమి చేయబోవుచున్నాడో, అది సరిగ్గా చూపుతుంది, చూడండి, అప్పుడు మనము "మార్పు చెంది. రెప్పపాటులో ఏకముగా పైకి కొనిపోబడుదుము."
37. ఏమి సంభవించియున్నదో గమనించండి. ఇప్పుడు దీనిని మీకు నన్ను రుజువు చేయనీయండి. ఇప్పుడు వారు గొమొఱ్ఱాలో ఉన్నారు; ఇప్పుడు అక్కడ నుండి ఫిలిష్తీ దేశములోకి గెరారుకు ప్రయాణము చేశారు. మీరు గమనించారా? అది ఎంత దూరమున్నదో, మీ పటములో మీరు గుర్తుపెట్టండి. ఆ వయస్సులో ఉన్న వృద్ధ దంపతులకు ఒక పెద్ద ప్రయాణం.
38 అప్పుడు, అదియు గాక, ఫిలిష్తీ దేశములో, అబీమెలెకు అను పేరుగల ఒక యౌవ్వన రాజు ఉన్నాడు, అతడు ఒక భార్య కొరకు ఎదురుచూస్తున్నాడు. అతడు ఆ అందమైన ఫిలిష్తీ బాలికలందరినీ కలిగియుండెను, అయితే అతడు ఈ అమ్మమ్మను చూచినప్పుడు, "ఆమె చూచుటకు సౌందర్యవతిగా ఉన్నది." అని అతడన్నాడు. అతడు ఆమెతో ప్రేమలో పడ్డాడు, ఆమెను వివాహము చేసుకోగోరాడు. అది నిజము, ఆహా. చూడండి, ఆమె అందముగా ఉన్నది. చూడండి?
39 ఆమె తిరిగి యౌవ్వన స్త్రీగా మారింది. గమనించండి, ఆమె కుమారుని కనవలసి యుండెను. దేవుడు ఆమెను నూతన సృష్టిగా మార్చెను, మరియు ఆమె ఈ బిడ్డను పెంచవలసి యుండెను. గుర్తుంచుకోండి, అబ్రాహాము, "అతని శరీరము ఎంతో మృతమై యున్నది." ఇస్సాకుకు నలుబది అయిదు సంవత్సరముల వయస్సులో శారా చనిపోయియున్నది. శారా చనిపోయినప్పుడు అని నేను నమ్ముతాను, దాని తరువాత అబ్రాహాము మరొక స్త్రీని వివాహము చేసుకున్నాడు, కుమార్తెలు కాక, ఏడుగురు కుమారులను కన్నాడు. ఆమేన్.
50 చూడండి. వరుసల మధ్య చదవండి. అది ఒక మాదిరియై యున్నది. అబ్రాహాము యొక్క పిల్లలందరికీ ఆయన ఏమి చేయబోవుచున్నాడో అది అక్కడ
చూపుతుంది. ఇప్పుడు తిన్నగా మనము దానిని సమీపించబోవుచున్నాము. కాబట్టి మన వంగిపోయిన భుజము, మరియు సమస్తము, ఏ బేదమును చేయదు, స్నేహితులారా. మన తెల్లని వెంట్రుకలు, అది ఏమైయున్నప్పటికీ, అది ఇప్పుడు లెక్క కాదు. మనము వెనుకకు చూడము. మనము దేనియొద్దకు వచ్చుచున్నామో, దానియొద్దకు ముందుకు చూద్దాము.
41 గుర్తుంచుకోండి, మనము చూచుచున్న ఈ సూచన, వాగ్దాన కుమారుడు ఉనికిలోనికి రాకముందు, అది అబ్రాహాము మరియు శారా చూసిన చివరి గురుతై యున్నది. ఆఘడియనొద్ద మనము ఉన్నామని మనము నమ్ముతాము.
42 ఈ పితరుడు, ఈ పిల్లవాడు పుట్టిన తరువాత... పన్నెండు సంవత్సరముల వయస్సు గల ఇస్సాకును మీరు ఊహించగలరా; చక్కని చిన్న ఉంగరాల జుట్టు కలిగిన బాలుడు, చిన్న గోధుమ రంగు కళ్ళు? ఆ తల్లి ఎలాటి అనుభూతిని కలిగియుందో నేను ఊహిస్తాను, అందమైన యౌవ్వన స్త్రీ, అలాగే అతని తండ్రి. ఒక దినమున, దేవుడు ఇప్పుడు అన్నాడు, ఒక ఉదాహరణకు; మనము మార్గమునకు ఎంతో దూరముగా ఉన్నాము, ఆ ఘడియ రావలసియున్నది. "నేను నిన్ను జనములకు తండ్రిగా చేసియున్నాను. ఆ కుర్రవాడి ద్వారా, అయితే నీవు ఆ కుర్రవాడిని నేను నీకు చూపించబోవు కొండ శిఖరమునకు తీసుకొని వెళ్ళి, నీవు అతనిని ఒక బలిగా చంపాలి." మీరు దానిని ఊహించగలరా?
43 ఇప్పుడు అలాటి పరీక్షకు నీవు వెళ్ళవలెనని నీవు ఎన్నడూ అడగబడలేదు. ఆయన దానిని ఇప్పుడు చేయడు. అవి మాదిరిలు, ఛాయలై యున్నవి.
44 అబ్రాహాము భయపడ్డాడా? లేదండి. అబ్రాహాము ఇలా చెప్పాడు, "దేవుడు అతనిని మృతులలో నుండి లేపుతాడని నేను పూర్తిగా సమ్మతించియున్నాను, ఏలయనగా మృతులలో నుండి ఒకనిని నేను పొందినట్లుగా పొందుతాను. దేవుని యొక్క ఆజ్ఞలు దీనిని చేయవలెనని చెప్పినట్లయితే, నేను దానికి నమ్మకముగా నిలిచియున్నాను, అది నేను కుమారుని పొందుటకు అది చెల్లించబడియున్నది; ఒక రూపముగా, నేను దానినుండి అతనిని పొందియున్నాను. దేవుడు అతనిని మృతులలో నుండి లేపుటకు సమర్థుడైయున్నాడు."
45 ఓ, నా, స్నేహితుడా! పెంతెకొస్తువారైన మీరు, దేవుడు పరిశుద్ధాత్మను, భాషలతో మాట్లాడుటను ఇచ్చినట్లయితే, మరిఎంత ఎక్కువగా ఆయన యొక్క స్వస్థత శక్తిని, ఆయన మంచితనమును మరియు కృపను ఎంత ఎక్కువగా నమ్మవలసియున్నారు! దేశములోని వేదాంత పండితులందరికీ వ్యతిరేకముగా, ఆయన చేసినట్లయితే! అది జరుగదని వారు చెప్పారు, కానీ దేవుడు దానిని చేశాడు, కారణం ఆయన దానిని వాగ్దానం చేశాడు. అలాగైతే నీ యొక్క తుపాకీతో, నీ వాక్యముతో, నీ ఖడ్గముతో నిలబడుము, దేవుని వాక్యమును నమ్ముము. దేవుడు ఆ ప్రకారము చెప్పియున్నాడు, మరియు అది దానిని పరిష్కరించును।
46 గమనించండి, ఇప్పుడు, అతనిని తీసుకొని అక్కడ నుండి కంచర గాడిదతో మూడు దినములు ప్రయాణము చేశాడు. ఇప్పుడు నేను నడవగలను, నేను పర్యవేక్షకుడిగా ఉన్నప్పుడు, నేను ప్రతిరోజూ, అరణ్యము గుండా ముప్పయి మైళ్ళు నడిచాను; ఇప్పుడు మాట్లాడాలంటే మనము, ప్రయాణ వాహనాలు ఉన్నాయి మనకి. అయితే ఆ మనుషుల యొక్క రవాణా, ఒక గాడిద ద్వారా గానీ లేక
నడచుట ద్వారా మాత్రమే యెయున్నది. మరియు అతడు ఉన్న స్థలము నుండి మూడు రోజులు ప్రయాణము చేశాడు, మరియు అప్పుడు అరణ్యములో కన్నులెత్తి. దూరము నుండి ఆ పర్వతమును చూశాడు.
47 అతడు ఇస్సాకును పట్టుకుని అతని చేతులను బంధించాడు. ఆదికాండము 22లో ఇక్కడ, క్రీస్తుకు మాదిరిగా మాదిరిగా ఉంది. బంధింపబడి, పర్వతము మీదకు నడిపించబడ్డాడు, యేసు వలే పర్వతము మీదకి నడిపించబడ్డాడు, కల్వరి పర్వతము; నిజానికి దేవుడు తన యొక్క స్వంత కుమారుని చంపుటకు ఒక మాదిరిగా ఉన్నది.
48 కానీ అతడు పైకి వెళ్ళినప్పుడు, అతడు విధేయుడుగా ఉన్నాడు, ఇస్సాకుకు ఒక విధమైన అనుమానము వచ్చింది. అతడన్నాడు, "తండ్రీ, ఇక్కడ ఇక్కడ బలిపీఠమున్నది, ఇక్కడ నిప్పు ఉన్నది, కానీ బలిపశువు ఏది?" క్కడ కట్టెలున్నాయి,
49. అబ్రాహాము, తన మనస్సులో దానిని ఎరిగినవాడై, ఇంకనూ దేవుని వాక్యము అక్కడ నిలబడియున్నది. అతడన్నాడు, "నా కుమారుడా, దేవుడే తన కొరకు బలిపశువును సిద్ధము చేసుకొంటాడు." అతడు ఆ స్థలమును “యెహోవాయీరే” అని పిలిచాడు.
50. అతడు తన కుమారుని బంధించినప్పుడు, అతడు మరణమునకు విధేయుడుగా ఉన్నాడు; అతడిని బలిపీఠము మీద ఉంచాడు, ఒరలో నుండి కత్తిని బయటకు లాగాడు, మరియు తన స్వంత కుమారుని యొక్క ప్రాణము తీయుటకు ప్రారంభించాడు. అతడు అలా చేసినప్పుడు, ఏదో అతని చేతిని పట్టుకొన్నది, "అబ్రాహామా, నీ చేతిని నిలుపు" అన్నది.
51 మరియు ఆ సమయములో, ఒక పొట్టేలు బా అని వెలుపల అరిచింది, పొదలో దాని కొమ్ములు తగులుకొని ఉండెను.
52 నీవెన్నడైనా ఆలోచించావా, ఆ పొట్టేలు ఎక్కడ నుండి వచ్చింది? గుర్తుంచుకోండి, ఆ దేశమంతయూ సింహములు, తోడేళ్ళు, నక్కలతో ఉన్నది, అవి గొట్టెలను మింగివేసే జంతువులు. అతడు నాగరికతకు ఎంతో దూరములో వెనుక ఉన్నాడు? అప్పుడు, ఆ పర్వతము పైన, అక్కడ నీరు లేదు. బలిపీఠము కట్టుటకు, ఆ చుట్టూ, రాళ్ళను యేరియున్నాడు. ఆ పొట్టేలు ఎక్కడ నుండి వచ్చింది? చూడండి?
53 అయితే అది ఒక దర్శనం కాదు. అతడు పొట్టేలును చంపాడు; అది రక్తమును కలిగియున్నది. అతడు ఏమని చెప్పాడు? "దేవుడు తన కొరకు బలిపశువును సిద్ధము చేసుకొంటాడు."
54 నీవు ఎలా ఆ కుర్చీలోనుండి బయటకు రాబోవుచున్నావు? ఆ ఈడ్పులు రోగము గల బిడ్డ ఎలా స్వస్థపడబోవుచున్నాడు, లేక ఆ కుర్చీలో ఉన్న నీవు, అక్కడ ఉన్న నీవు గుండె జబ్బుతో ఉన్న నీవు ఎలా బాగుపడబోవుచున్నావు? అది ఏ విషయమైనప్పటికీ, “దేవుడు తనకొరకు సిద్ధపరచుకొనగల సమర్థుడు."
55 అబ్రాహాము దానిని నమ్మియున్నాడు. పితరుడు వాగ్దానమునకు నమ్మకముగా నిలిచియున్నాడు. ఆయన వాగ్దానమిచ్చాడు. "అదే, "నీ సంతానము! కారణము, పరిస్థితులతో ప్రమేయము లేకుండా, నీవు నా మాటను నమ్మియున్నావు, నీ సంతానము శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకొంటుంది."
56 ఎందుచేత? అబ్రాహామునకు వ్యతిరేకంగా పైకి వచ్చిన ప్రతీ శత్రువు, ఒక ఛాయగా...శత్రువు, "నేనెంతో వృద్ధురాలను నేనెంతో వృద్ధుడను. మరియు ఈ సమస్తమూ, అతడు ఇంకనూ ఆ వాగ్దానమునకు నమ్మకముగా నిలిచాడు."
57 ఇప్పుడు, ఆ విశ్వాసము కలిగిన మనిషి, పరిస్థితులతో ప్రమేయము లేకుండా ఇంకనూ అతడు వాక్యమును తీసుకొంటాడు. ఇప్పుడు, నీవు దానిని చేయలేకపోయినట్లయితే, అప్పుడు నీవు అబ్రాహాము యొక్క సంతానము కాదు. అదే విశ్వాసాన్ని అబ్రాహాము కలిగియున్నాడు, అతని సంతానము.
58 అబ్రాహామునకు ఇవ్వబడిన వాగ్దానము అతని యొక్క "సంతానమై" యున్నది, ఇప్పుడు అతను రాజ సంతానము కూడా, కొద్ది క్షణముల క్రితము నేను చెప్పియున్నట్లుగా. అబ్రాహామునకు ఇచ్చిన ఈ ముద్ర, వాగ్దానపు ముద్రయై యున్నది. మరియు రాజ సంతానము, ఎఫెసీ 4:30 ప్రకారము, "పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడుట." వారు పరీక్షకు నిలబడిన తరువాత. దానిని ఆలోచించుటకు ప్రయత్నము చేయండి.
59 అనేకమంది తాము పరిశుద్ధాత్మను కలిగియున్నామని తలస్తారు. మాకు పరిశుద్ధాత్మ ఉన్నదని అనేకులు చెప్పుకొంటారు. అనేకమంది దాని యొక్క సూచనలను, గురుతులను చూపగలరు. కానీ, ఇంకనూ, వారు వాక్యముతో నిలబడలేరు, అది పరిశుద్ధాత్మ కాదు. చూశారా?
60 నీవు ప్రతీమాటను నమ్ముతావు, అప్పుడు పరీక్ష తరువాత నీవు ముద్రించబడతావు. అబ్రాహాములో ప్రతీ వాగ్దానము మనము నమ్మినపుడు, వాగ్దానము నిర్ధారించబడుటకు, అప్పుడు మనము ఆత్మ ద్వారా ముద్రించబడతాము. అదే, అతడు చేసిన విధానము, అదే అబ్రాహామై యున్నాడు. తరువాత, అప్పుడు మాత్రమే, మనము శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనుటకు మనము హక్కును కలిగియున్నాము. నీవు మొదట ఆ సంతానముగా మారనంతవరకూ, నీవు దానిని చేయలేవు. గుర్తుంచుకోండి,
61 నేను దాని మీద, హోస్టన్లోనో లేక మరెక్కడో, నేను దానిని గూర్చి డల్లాస్లో ఆనవాలు (గురుతు) గూర్చి మాట్లాడాను.
62 చూడు, ఒక యూదుడు ఇశ్రాయేలు దేశములో, యూదుడై యున్నాడని సున్నతి ద్వారా చూపగలడు. అయితే దేవుడు చెప్పాడు. "నేను రక్తమును చూసినప్పుడు! రక్తము మీకు ఒక గురుతుగా ఉంటుంది."
63 రక్తములోని జీవము ఆరాధికుని మీదకు రాజాలదు, ఏలయనగా, బాగుంది, అది ఒక జంతు జీవమై యున్నది. అది రాబోవుచున్న నిజమైన జీవమునకు ఒక ఛాయ మాత్రమే. అప్పుడు, రసాయనము, రక్తమే స్వయముగా, ద్వారము మీద మరియు ద్వార బంధముల మీద ఎర్రగా ఉండవలసి యున్నది.
64 హిస్సోపు ద్వారా అన్వయించబడాలి, అది కేవలము ఒక తుంగముక్కయై యున్నది, నీవు ఏదో అతీతమైన విశ్వాసము కలిగియుండవలసిన అవసరము లేదని అది చూపుతుంది. నీవు సంఘమునకు వచ్చినపుడు, నీవు నీ కారును నడుపునట్లుగా, నీవు కేవలము అదే విశ్వాసమును కలిగియుండవలెను. చూశారా? అనేకమంది ప్రజలు వారు తప్పక ఏదోగా ఉండవలెనని వారు
తలస్తారు... కానీ, కాదు, కాదు, అది తప్పు, నీవు అన్వయించవలసినది అంతా కేవలము సామాన్య విశ్వాసము, వాక్యమును వినుట ద్వారా నీవు రక్తమును అన్వయించాలి. వాక్యమును నమ్మాలి, దానిని అన్వయించాలి. అంతవరకే. కేవలము తుంగ ముక్కలను ఏరుకొని, ఆ హిస్సోపు, పాలస్తీనాలో ఎక్కడైనా ఉంటాయి, గోడల సంధులలో పెరుగుచున్న తుంగముక్కలను తీసుకొని, రక్తములో ముంచి, ద్వారబంధముపై మరియు ద్వారబంధము కమ్మీలపై రాయాలి.
65 మరియు, గుర్తుంచుకోండి, వారు ఎంతగా నిబంధనలో ఉన్నప్పటికీ నేను లెక్కచెయ్యను, ఆ యూదుడు నేను సున్నతి చేయబడిన వాడనని ఎంతగా చూపిననూ లెక్కకాదు, అతడు ఎంత మంచివాడైననూ లెక్క కాదు, ఆనవాలు అక్కడ లేనిదే నిబంధన రద్దు చేయబడుతుంది. "నేను రక్తమును చూసినప్పుడు," మాత్రమే.
66 ఇప్పుడు, రక్తము ఆనవాలై యున్నది, రసాయనము కాదు. క్రీస్తు రక్తము యొక్క రసాయనము, 'ఏలయనగా అది ఎన్నో వేల సంవత్సరముల క్రితము చిందించబడియున్నది.
67 కానీ, మీరు చూడండి, అక్కడ రసాయనము ఉండవలసియున్నది, జంతువులోని జీవము మానవునిలోనికి రాలేకపోయింది. కారణమేమనగా జంతు జీవమునకు ఆత్మ లేదు. మంచి ఏమిటో, తప్పు ఏమిటో జంతువునకు తెలియదు. ఆత్మను కలిగియున్న జీవి మానవుడే.
68 ఇప్పుడు, కన్యకకు జన్మించిన, దేవుని కుమారుడైన యేసు, ఆయన రక్తమును కార్చినప్పుడు, ఆ రక్తములోని జీవము స్వయముగా దేవుడై యున్నాడు. బైబిలు చెప్పియున్నది, "మనము జీవము ద్వారా, దేవుని రక్తము ద్వారా రక్షించబడియున్నాము." ఒక యూదుని రక్తము కాదు, ఒక అన్యుని రక్తము కాదు; కానీ దేవుని యొక్క జీవమే. దేవుడు ఈ రక్త కణమును సృజించియున్నాడు, కన్యకకు జన్మించినవాడు. ఆమె ఎన్నడూ ఏ పురుషునినీ ఎరుగలేదు, అలాగే ఆమె నుండి అండము రాలేదు.
69 మీలో అనేకమంది ప్రజలు అండము దానిని చేసియున్నదని నమ్మగోరుతారు. స్పర్శ లేకుండా అక్కడ అండము ఉండలేదు, అప్పుడు దేవుడు ఏమి చేశాడు? చూడండి?
" 70 ఆయన అండమును మరియు రక్త కణమును రెండింటినీ సృజించియున్నాడు. అది దేవుని యొక్క గుడారమై యుండెను, పరిశుద్ధమైనది. "నా పరిశుద్ధుని కుళ్లు పట్టనియ్యవు. "చూడండి అండము ఎక్కడ నుండి వస్తుంది? "అతని ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు." ఆయన శరీరము పరిశుద్ధమైనది! ఓ, మై! నీవు చేయలేవు. నీవు దానిని నమ్మలేవు, ఎలా నిన్ను నీవు క్రైస్తవునిగా పిలుచుకొనగలవు?
71 "మనము దేవుని యొక్క రక్తము ద్వారా రక్షణ పొందియున్నాము." అక్కడే నా విశ్వాసము ఉంచబడియున్నది. అక్కడ ఒక ప్రవక్త రక్తములోనికి నడిచివెళ్ళుట కాదు, ఒక సామాన్య మానవుని రక్తములోనికి నడిచివెళ్ళుట కాదు, లేక ఒక ఉపదేశకుడు, లేక ఒక వేదాంత పండితుడు కాదు. మనము అక్కడ దేవుని రక్తములోనికి నడిచివెళతాము, దేవుడు ఆ రీతిగా చెప్పియున్నాడు.
ఆయన మానవుడైనాడు. ఆయన తన తీరమును మార్చియున్నాడు. ఆయన తన గుడారమును, మనతో ఇక్కడకు చాపి, పరిచియున్నాడు, మరియు మనలో ఒకడుగా మారియున్నాడు. ఆయన మన యొక్క రక్త సంబంధియగు విమోచకుడు. ఆయన మనకు సమీప బంధువు కావలసియుండెను. 'ఏలయనగా అది చట్టము. దేవుడు మానవుడై మనమధ్య నివసించాడు.
72. అది ఎలాగో గమనించండి, ఇలా చేయుట ద్వారా, ఆయన నుండి ఆయన వచ్చుచున్నాడు, ఆయనే దేవుడైయున్నాడు, ఆత్మ మరియు ఆ ఆత్మ విశ్వాసి మీదకు వచ్చుచున్నది. అందుచేత, మన బలి అర్పణలో ఉన్న జీవము, మనము అదే జీవముతో గుర్తించబడినాము.
73 అలాగైతే దేవుని యొక్క జీవము ప్రజల మధ్య కదలాడుట చూసి, అది మన బలి అర్పణకు గుర్తింపుగా ఉన్నప్పుడు, ఎలా వారు దానిని ఒక అపవిత్రాత్మ అని పిలవగలరు? "నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు అతడును చేస్తాడు." బలి అర్పణకు ఆయన యొక్క జీవము తిరిగి వస్తుంది, మనలోని మనము మన స్వంత తలంపులకు మృతులుగా ఎంచుకొని, బలి అర్పణ మీద మన చేతులుంచి గుర్తింపు చేసుకున్నప్పుడు, బలి అర్పణ నుండి. అప్పుడు ఎలా సిద్దాంతములు మరియు తదితరమైనవి, వాటిలోనికి సంఘశాఖలను మనము త్రోయనిస్తాము మరియు దానిని నమ్ముతాము అని ఎలా చెబుతాము? ఆ కార్యమునకు మనము చనిపోయాము.
74 పౌలు అన్నాడు, “వీటిలో ఏదీ నన్ను బాధించదు," కారణము అతడు ఒక పరిపూర్ణతకు కట్టబడియున్నాడు, క్రీస్తు. ప్రతీ నిజమైన సాధించిన కార్యము, ఒక పరిపూర్ణతకు కట్టబడియున్నది. మరియు నా పరిపూర్ణత వాక్యమై యున్నది. మరియు అది ప్రతీ ఒక్కరిది కూడా, అది నిజముగా ఆత్మ ద్వారా జన్మించియున్నది, వారి యొక్క పరిపూర్ణత దేవుని వాక్యమై యున్నది. నేను దానికి కట్టివేయబడినాను. నేను దానిపై నా చేతులనుంచాను. అది నా యొక్క స్థానమును తీసుకొన్నది. మరియు నేను ఆయనతో నన్ను నేను గుర్తింపుచేసుకున్నాను. ఆయన మనతో తన్నుతాను గుర్తింపు చేసుకొంటానని వాగ్దానము చేశాడని మనకు తెలుసు. అది నిజమైన విశ్వాసమును తెస్తుంది; నీ స్వంత విశ్వాసము కాదు, కానీ ఆయన విశ్వాసము; అది నీవు నియంత్రణ చేయలేనిదై యున్నది. ఆయన దానిని చేస్తాడు. ఇప్పుడు గమనించండి. అప్పుడు, అప్పుడు మాత్రమే, నీకు వాగ్దానము చేయబడింది.
75 నీవు ఎన్ని సంఘములలో చేరినప్పటికీ, నీవు ఎన్నిసార్లు బాప్తిస్మము పొందినప్పటికీ లెక్క కాదు; నీవు ముందుకు ముంచబడినా, వెనుకకు ముంచబడినా, నీవు కోరిన ఏ విధముగా బాప్తిస్మము పొందినా లెక్కకాదు. నీవు ముద్రించబడనంత వరకూ, నీవు అర్పణతో సంయుక్తమైనట్లు నిన్ను నీవు పిలుచుకొనే హక్కు నీకు లేదు.
76 దేవుని యొక్క ముద్ర ఏమిటి? ఎఫెసీ 4:30 చెబుతుంది, "దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచనా దినము వరకూ ఆయన యందు మీరు ముద్రించబడియున్నారు.” ఒక ఉజ్జీవము నుండి మరొక ఉజ్జీవము వరకు కాదు, కానీ నీవు తిరిగి విమోచించబడిు దినము వరకు నీవు శాశ్వతముగా ముద్రించబడియున్నావు.
77 మరియు, గుర్తుంచుకోండి, నీవు ఎన్నడూ దేవుని యొక్క తలంపులో ఉండనట్లయితే, నీవు దేవునితో ఎన్నడూ ఉండలేదు. ఆయన ఒక విమోచకుడై యున్నాడని మీలో ఎంతమందికి తెలుసు? (సమాజము, "ఆమేన్'"" చెప్పింది. — సంపా.. బాగున్నది. అలాగైతే, విమోచించబడిన దేదైననూ అది ఎక్కడనుండి పడిపోయిందో అక్కడికి తిరిగి రావలసియున్నది. కాబట్టి ఆయన మనలను విమోచించుటకు వచ్చియున్నట్లయితే, ఎలా మనము, ఒకప్పుడు మనమందరము "పాపములో జన్మించి, అతిక్రమములో రూపుదిద్దబడి, అబద్దములాడుచూ లోకమునకు వచ్చాము? అది చూపునదేమనగా, ప్రపంచము లేనప్పుడే, ఒక నక్షత్రము, గాలి, లేక మరేదైననూ లేనప్పుడే, ఒక నిజ క్రైస్తవుడు దేవుని యొక్క ఆలోచనలో ఒక గుణలక్షణమై యున్నాడు. అది నిత్యమైయున్నది, మరియు మనలను తిరిగి విమోచించుటకు ఆయన వచ్చాడు. అది దేవుని యొక్క తలంపు, ఒక మాటగా పలుకబడింది. ప్రత్యక్షపరచబడింది, ఆయన తలంపునకు తిరిగి తెచ్చాడు. విమోచన లేనివారముగా
78 రక్త సంబంధియగు విమోచకుడు। ఆ కారణమును బట్టియే దేవుడే స్వయముగా మనలను విమోచించుటకు, మనలో ఒకనివంటి వాడాయెను. ఏదియూ దానిని చేయలేకపోయెను. ఒక దూత దానిని చేయలేకపోయెను, ఇంకా ఏదియూ చేయలేదు. ఆయన క్రిందికి దిగివచ్చి, మనలను విమోచించుటకు, మనవలే శోధింపబడ్డాడు.
79 ఇప్పుడు గమనించండి అబ్రాహాము యొక్క సహజ సంతానము. ఆ సహజ సంతానములో కొందరిని మనము పరీక్షిద్దాము, ఆ సహజ సంతానమైన ఇస్సాకుతో ఆయన వాక్యమును పాటించుచున్నాడేమో మనము చూద్దాము. ఏ ప్రశ్న లేకుండా, దేవుని యొక్క సంపూర్ణ వాగ్దానమును నమ్మియున్న సహజ సంతానములో కొందరిని మనము పరీక్షిద్దాం. ఇప్పుడు గుర్తుంచుకోండి, అక్కడ వేల కొలదిగా, వేలకొలది సార్లు, వేలమంది విస్తరించబడి, సున్నతి మరియు సమస్తం పొందిన వారు, ఇంకనూ అబ్రాహాము సంతానము కాదు. నిశ్చయముగా, "బాహ్యముగా యూదుడైనవాడు యూదుడు కాదు; కానీ అంతరంగములో యూదుడైనవాడే." వారు, వారిలో అనేకమంది, తప్పిపోయారు, ఘోరముగా విఫలమయ్యారు.
80 చూడండి, అరణ్యములో, వారన్నారు, "మేము..." పస్కా పండుగ దినమున, జీవజలపు ఊటనొద్ద, పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయము. వారందరూ ఆనందించిరి.
81 యేసు అన్నాడు. "అరణ్యములో ఉన్న బండను నేనే. పరలోకములోని దేవుని నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఒకడు దానిని భుజించిన యెడల వాడు చనిపోడు."
82 వారన్నారు. "నలుబది సంవత్సరములు, మా పితరులు అరణ్యములో మన్నా తిన్నారు."
ఆయనన్నాడు, “వారిలో ప్రతీఒక్కరూ చనిపోయారు."
83 చనిపోయారు, ఆ మాటను తీసుకొని, దాని భావమేమిటో చూడండి, "శాశ్వతముగా వేరుచేయబడ్డారు." ఇంకనూ, వారు అబ్రాహాము సంతానమై
యున్నారు. మరణమనగా భావము "వేరుచేయబడుట, నాశనమగుట, సంపూర్ణముగా నాశనమగుట, సంపూర్ణముగా ధ్వంసము చేయబడుట." వారిలో ప్రతీఒక్కరూ చనిపోయారని యేసు" అనా అన్నాడు, అయిననూ వారు సున్నతి చేయబడిన యూదులు.
84. చూడండి, దయనీయమైన జనులారా, మీరు కేవలం మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్ అయినందువల్ల, ఒక చిన్న ఒప్పుకోలును, అలాటి దానిని కలిగియున్నందున, మనము నమ్మినట్లుగానే సరిగ్గా దయ్యము నమ్ముతుంది.
85 అయితే నీవు తప్పక దానితో గుర్తింపబడాలి. పరిశుద్ధాత్మతో ముద్రించుట ద్వారా, దేవుడు తప్పక దానికి సాక్ష్యమియ్యాలి. వాక్యమునకు ప్రశ్న వేయుట లేదు!
86 "మంచిది, ఇప్పుడు, అది మరొక దినమై యున్నది," అని నీవు అంటే, అక్కడ ఏదో తప్పున్నది.
87 ఒక మనిషి పరుగెత్తుకుంటూ వచ్చినప్పుడు, మరియు వెలుగు ప్రకాశించుచున్నదని నీవు అతనికి చెప్పినప్పుడు, అతడు ఇంటి క్రింది భాగమునకు పరుగెత్తి వెళ్ళి. "నేను వెలుగును త్రోసివేయుచున్నాను అని అంటే. నాకు అది వద్దు అంటే, వెలుగు అనేది అక్కడ లేదని, నేను దానిని నమ్మనంటే?" ఆ మనిషితో ఏదో పొరపాటున్నది. అతడు మానసికంగా తలక్రిందులైనాడు. ఏ. వెచ్చటి కిరణాలను మరియు జీవమిచ్చు వనరులను అతడు తృణీకరించినట్లయితే, అతనిలో మానసిక లోపం ఉన్నది.
88 ఒక మనిషి దేవుని యొక్క వాక్యము అతని ముందు తేటపరచబడుట, అది గుర్తించబడుట చూసియు, అతడు తన యొక్క సంఘశాఖా తెరలను అతడు క్రిందికి దించినట్లయితే, ఆత్మ సంబంధముగా ఆ మనిషితో ఏదో లోపమున్నది. అతనిలో ఏదో పొరపాటున్నది. ఏదో ఆత్మ సంబంధమైన పొరపాటు అక్కడ ఉన్నది. అతడు దానిని స్వీకరించలేడు. "గ్రుడ్డివాడు మరియు దానిని ఎరుగడు." తీర్పుకు ముందు వెళ్ళుచున్నాడు, దేవుడే న్యాయాధిపతిగా ఉంటాడు.
89 గమనించండి, వారు దానిని చేసినప్పుడు, దానిని నమ్మిన ఈ సంతానములు, ఏమి సంభవించిదో కనిపెట్టండి. ఇప్పుడు అబ్రాహాము యొక్క సంతానములో, కొందరిని మనము పరీక్షిద్దాం.
90 మనము హెబ్రీ పిల్లలను తీసుకొందాము, 'ఏలయనగా వారు నమ్మకముగా నిలబడి, ప్రతిమ యొక్క ఆరాధనను సహించలేదు. ఆ దేశము యొక్క రాజు తయారుచేసిన ప్రతిమకు సాగిలపడుటను వారు నిరాకరించారు. అది ఒక పరిశుద్ధుని రూపములో అది తయారుచేయబడింది కూడా, దానియేలు యొక్క రూపము.
91 అది చూపునదేమనగా, అన్యజనాంగము ఒక పరిశుద్ధుని రూపమును ఆరాధించ అబద్దము క్రిందకు తేబడ్డారు. అది అదే విధముగా బయటకు వెళ్తుంది. అప్పుడు ప్రజలు ప్రజల యొక్క ప్రతిమలను ఆరాధించుటకు ఒత్తిడి చేయబడ్డారు. అది ప్రత్యక్షత ద్వారా లోనికి వచ్చింది, దానియేలు వాక్యమును అనువదించగలిగాడు, అది గోడ మీద చేవ్రాతలో వ్రాయబడింది. ఆ మార్గములోనే అది లోనికి వచ్చింది, మరియు అది ఆ మార్గములోనే బయటకు వెళుతుంది. అదే మార్గము అన్యుల యొక్క ప్రతిమ.
92 గమనించండి. వారు దానిని చేయుటకు నిరాకరించారు. మరియు వారేం చేశారు? వారు అబ్రాహాము యొక్క సంతానమై యుండి వాక్యమునకు నమ్మకముగా నిలబడ్డారు, మరియు వారు శత్రువు యొక్క గనినిని, అగ్నిని స్వాధీనపరచుకొన్నారు. వారు దానిని చేశారు. మంచిది, దేవుని వాక్యము సత్యము.
93 ఒకే నిజ దేవుని ఆరాధనను బట్టి, దానియేలు పరీక్షించబడ్డాడు. దాని నిమిత్తము అతడు పరీక్షించబడ్డాడు. మరియు పరీక్షా సమయములో, అతడు పరీక్షకు నిలబడ్డాడు. మనము చెప్పునట్లుగా, అతని నుండి పేడ్లు రాలునట్లు కనబడిన తరువాత, దేవుడు ఏం చేశాడు? వారికి ఏం చేయాలో అర్థము కాలేదు.. వారు అతనిని సింహములకు ఆహారముగా వేయాలనుకున్నారు. కానీ దానియేలు పరీక్షకు నమ్మకముగా నిలబడ్డాడు, అదేమనగా అక్కడ నిజ దేవుడు ఒక్కడే ఉన్నాడు, అతను శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొన్నాడు. సింహముల నోటిని దేవుడు మూసివేశాడు.
94 యన్నే, యంబ్రేలు అను అబద్దపు అనుకరణలు చేయువారిముందు పరీక్షలో, మోషే దేవుని వాక్యమునకు నమ్మకముగా నిలబడ్డాడు. చూడండి, దేవుడు సహజాతీతమైన దానితో అతనిని కలుసుకొని, ఆ కార్యములు చేయమని చెప్పాడు, ఈ సూచనలను చూపించాడు, మరియు ప్రతీ సూచన ఒక స్వరమును కలిగియున్నది. అతడు ఎరిగియున్నట్లుగా, మోషే తిన్నగా ముందుకు వెళ్ళాడు. అతడు తన కర్రను పడవేయగా, అది ఒక సర్పముగా మారింది. ఏమి సంభవించిందో మీకు తెలుసా? అనుకరణలు చేయువారు వచ్చి, అవే కార్యములు చేశారు.
95 ఇప్పుడు, మోషే తన చేతులను పైకెత్తి, "బాగుంది. అది అంతా తప్పు అని నేను ఊహిస్తాను," అని అనలేదు. అతడు అక్కడ నిలబడి, దేవుని కొరకు కనిపెట్టాడు. అతడు నమ్మకముగా నిలబడ్డాడు. అక్కడ ఎంతమంది అనుకరణ చేయువారున్నప్పటికీ లెక్కకాదు, అతడు నమ్మకముగా నిలబడ్డాడు. ఆ స్థలము నుండి ప్రజలను బయటకు తెచ్చుటకు, తన పని కొరకు అతడు నమ్మకముగా నిలబడినప్పుడు, నీటి గవినిని అతని మార్గములోనికి వచ్చినప్పుడు, దేవుడు అతనిని దానిని స్వాధీనపరచుకోనిచ్చాడు, మరియు అతనిని నడిపించుచున్న అగ్నిస్తంభము ద్వారా ఆ గవినిని తెరిచాడు. అతడు ప్రజలను వాగ్దాన భూమిలోనికి తీసుకొని వెళ్ళాడు.
96 యెహోషువా, మరొక గొప్ప నాయకుడు. ఇద్దరు మాత్రమే...వాగ్దాన భూమిలోనికి వెళ్ళారు, యెహోషువా మరియు కాలేబు. వారు కాదేషు అని పిలువబడు స్థలమునొద్దకు వచ్చారు, ఆ సమయములో అది ప్రపంచమునకు కేంద్రమై యున్నది, ఎంతమట్టుకనగా, అది తీర్పు పీఠమై యున్నది. మరియు. ఓ, వారు పన్నెండు మంది వేగులవారిని ఆ దేశమును చూచుటకు పంపారు, మరియు పన్నెండుమంది తిరిగి వచ్చారు.
97. పదిమంది అన్నారు. "ఓ, అది ఎంతో కష్టమైన పని, మనము దానిని సరిగ్గా చేయలేము. మంచిది, ఆ ప్రజల ప్రక్కన మనము మిడతల వలే కనబడ్డాము."
98 కానీ యెహోషువా ఏం చేశాడు? అతడు ప్రజలను నిమ్మళపరిచాడు. అతడన్నాడు, "ఒక్క నిముషము ఆగండి, మనము ఎంత చిన్నవారమైనప్పటికీ, లేక మనము ఎంత అల్ప సంఖ్యాకులమైనప్పటికీ, దానిని తీసుకొనుటకు మనము సమర్థులము," ." అతడు ఏమి చేయ నమ్మకముగా నిలబడ్డాడు, "నేను ఈ దేశమును మీకిస్తాను," అయితే దానిలో ప్రతీ చేయుచున్నాడు? అతడు వాగ్దానమునకు అంగుళము కొరకు మీరు పోరాడాలి.
99 తల్లీ, నీవు దానిని నమ్ముతావా? దేవుడు నీ స్వస్థతను నీకు ఇచ్చియున్నాడు, కానీ దానిలోని ప్రతీ అంగుళము కొరకు నీవు పోరాడాలి. "మీ పాదములు అడుగుపెట్టు ప్రతి స్థలమును, నేను మీకు ఇచ్చియున్నాను," పాదముద్రలు అనగా భావము "స్వాధీనపరచుకొనుట," అదంతయూ మీదే, ప్రతీ వాగ్దానము నీకే చెందియున్నది, కానీ మార్గములోని ప్రతీ అంగుళము కొరకు ఇప్పుడు నీవు పోరాడాలి.
100 ఇప్పుడు, దేవుడు ఏం చెప్పాడో యెహోషువా యెరిగియున్నాడు. అతడు అబ్రాహాము యొక్క సంతానమైయున్నాడు. చూడండి? అతడన్నాడు, "దేవుడు ఆ దేశమును మనకు ఇస్తానన్నాడు, నేను దానిని నమ్ముతాను, మనము దానిని తీసుకొనుటకు సమర్థులము." ఇశ్రాయేలు గుంపు ప్రజలందరికీ వ్యతిరేకంగా, అతడు పరీక్షకు నిలబడియున్నందున, ప్రజలందరూ ముల్గుచూ, మొర్రపెట్టారు, యెహోషువా అన్నాడు, "ఊరకుండుడి। దేవుడు దానిని వాగ్దానము చేశాడు."
101 నీవెంత పెద్దవాడైనప్పటికీ లెక్క కాదు, వ్యతిరేకత ఏమైనప్పటికీ లెక్క కాదు, వైద్యుడు ఏమి చెప్పినప్పటికీ లెక్క కాదు, దేవుడు వాగ్దానము చేశాడు. దానిని చేయుట దేవుని వంతు అయి యున్నది.
102 అతడు ఏం చేశాడు? అతడు యోర్దాను నది యొద్దకు వచ్చినపుడు, అతడు గవినిని స్వాధీనపరచుకున్నాడు. అదే అతడు చేసియున్నది.
103 యెరికో, తాబేలు చిప్పలో మూయబడినట్లుగా ఉన్నది. అతడేం చేశాడు? అతడు గవినిని స్వాధీనపరచుకొన్నాడు.
104 ఒకరోజైతే శత్రువు అతనిని లాక్కొనుటకు ప్రయత్నము చేశాడు, అతడు శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకున్నాడు, ఎంతవరకంటే, అతడు సూర్యుడినే ఆగిపొమ్మని ఆజ్ఞాపించాడు. సూర్యుడు అతనికి లోబడి, ఇరువది నాలుగు గంటలు కదలలేదు.
105 దేవుడు తన వాగ్దానమునకు నమ్మకముగా ఉంటాడు, ఆయన వాక్యము ఓడింపనిచ్చుటకు ముందు, పరలోకములను దివాలా చేస్తాడు. ఆయన నెరవేర్చలేని వాగ్దానమును ఆయన ఎన్నడూ చేయలేదు. "నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు స్వస్థతనొందుదురు."ఆమేన్. "నీవు నమ్మగలిగినట్లయితే, సమస్తమూ సాధ్యమే."
106 యెహోషువా దానిని నమ్మాడు, దేవుడు భూమిని తిరగకుండా ఆపినప్పటికీ. మరొక శక్తితో దానిని అక్కడ పట్టుకొన్నాడు, ఆయన తన స్వంత శక్తి: యెహోషువా తన శత్రువుల మీద తనకుతాను కోపము తీర్చుకొనువరకు, ఇరువది నాలుగు గంటలు ప్రపంచము ఎన్నడూ కదలలేదు. అతడు గవినులను
స్వాధీనపరచుకొన్నాడు. నిశ్చయముగా, అతడు చేశాడు. దేవుడు ఎల్లప్పుడూ నమ్మకముగా ఉంటాడు.
107 ఇప్పుడు ఎక్కువమంది వీరులను తీసుకొనుటకు మనకు ఎక్కువ సమయము ఉండాలని నేను కోరతాను, కానీ నాకు ఇప్పుడు పది నిముషాలు ఉన్నాయి. చూడండి, ఈ ప్రశస్తమైన వీరులందరూ, వారున్నట్లుగా, వారు గొప్ప విశ్వాస వీరులైయున్నారు, వారందరూ మరణపు గవిని దగ్గర చనిపోయారు. వారందరూ మరణపు గదిని దగ్గర నశించారు.
108 తరువాత దానివెంబడి అబ్రాహాము యొక్క రాజ సంతానము వచ్చింది. వారందరూ ఇస్సాకు నుంచి సహజ సంతానమై యున్నారు. కానీ ఇక్కడ అబ్రాహాము యొక్క రాజ సంతానమైన క్రీస్తు వచ్చాడు, అబ్రాహాము యొక్క విశ్వాస సంతానము: మనము తప్పక ఎలా ఉండాలంటే, ఎలా మనము అలాగు ఉన్నామో లేదో కొంచెం చూద్దాం. సహజ సంతానము ఒక మాదిరి మాత్రమే. మిగిలినవారందరూ సహజమైన జన్మ ద్వారా పుట్టారు. కానీ ఆయన ఒక కన్యక గర్భమున వచ్చాడు. చూడండి, అలాగైతే ఒక యూదుడు, అది అబ్రాహాము యొక్క సంతానము కాదు. ఆయన వాగ్దానము యొక్క విశ్వాస సంతానము ద్వారా వచ్చాడు. మరియు, అప్పుడు, ఈ మనిషి ద్వారా, మనము ఆయన పిల్లలుగా ఉండవలసియున్నాము.
109 ఆయన ఏమి చేశాడో గమనించండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, శత్రువు కలిగియున్న ప్రతీ గవినిని జయించాడు, స్వాధీనపరచుకొన్నాడు. మరియు వాక్యము ద్వారా స్వాధీనపరచుకొన్నాడు. ఆయన జయించాడు. ఆయన రోగము అను గవినిని మనకొరకు జయించాడు. ఆయన దానిని చేయుటకే వచ్చియున్నాడు. ఆయన, రోగులను జ్ఞాపకము చేసుకొని, ఆయన ఆ గవిని జయించాడు. నీవు దానిని జయించవలసిన పనిలేదు; ఆయన దానిని జయించాడు. ఇతరులు వారి స్వంత గవినులను జయించవలసియున్నారు. కానీ నీవు జయించవలసిన పనిలేదు; అది ఇదివరకే జయించబడింది. ఆయన రోగము యొక్క గనులను జయించాడు. రోగము, పాపము యొక్క గనులను ఆయన జయించి, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేస్తానని చెప్పాడు? భూమి మీద మీరు దేనిని అడుగుతారో, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో, ఆయన దానిని పరలోకములో బంధిస్తాడు, గవినికి తాళపు చెవులను మనకు ఇచ్చాడు.
110 వాక్యము ద్వారా, ఆయన శోధన అను గవినిని జయించాడు. మరియు తాళపు చెవులు ఏమనగా. "అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు." అదంతయూ ఆయన జయించాడు; ప్రతీ రోగమును జయించాడు.
111 ఆయన మరణమును జయించాడు. ఆయన పాతాళమును జయించాడు. ఆయన మరణమును మరియు పాతాళమును జయించాడు. ఇతరులు జయించలేని దానిని ఆయన జయించాడు. కారణము వారు సహజ సంతానమైయున్నారు. ఇది ఆత్మసంబంధమైన సంతానము. ఆయన సమాధి అను గదినిని జయించాడు, మరియు మన నీతీకరణము కొరకు, మూడవ దినమున తిరిగి లేచాడు.
112 "మరియు ఇప్పుడు మనము అత్యధికమైన జయశాలురము." మనము ఒక స్వాస్థ్యముగా, మనము తిన్నగా దానిలోనికి నడిచివెళతాము, "అత్యధికమైన జయశాలురము. "ఇప్పుడు మనము ఓడించబడిన శత్రువుతో వ్యవహరిస్తున్నాము. వ్యాధి ఓడించబడింది. మరణము ఓడించబడింది, నరకము ఓడించబడింది. సమస్తమూ ఓడించబడింది. ఓ, మై! నేను నాకంటే రెండంతల పరిమాణములో ఉన్నాను, ఇప్పుడు బహుశా రెండంతల మంచి అనుభూతిని పొందాను. మనము జయించబడిన శత్రువుతో వాదిస్తున్నాము.
113 అతని యొక్క తలను నరకివేయుటకు, వారు ఒక రాతి బండకు కట్టినప్పుడు, ఆశ్చర్యము కాదు, పౌలు ఇలా చెప్పగలిగాడు. "ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? ఎక్కడనీవు అరవగలవో, బుసకొట్టగలవో చూపు? సమాధి నీ విజయమెక్కడ? నీవక్కడ నన్ను మలచాలనుకొంటావా? అక్కడ ఉన్న ఒక ఖాళీ సమాధివైపు నేను వ్రేలు పెట్టి చూపుతాను, మరియు నేను ఆయనలో ఉన్నాను, అంత్యదినమున ఆయన నన్ను లేపుతాడు. " ఓడించబడిన ఒక శత్రువు!
114 అబ్రాహాము యొక్క రాజసంతానము। ఇప్పుడు, సహజమైన సంతానము దానివైపు వ్రేలుపెట్టి చూపలేదు. కానీ రాజసంతానము జయించగలదు, ఇదివరకే జయించింది, ఏలయనగా ఆయన మనముందుగా వెళ్ళి, మనకొరకు ప్రతి గవినిని జయించాడు. ఇప్పుడాయన, రెండువేల సంవత్సరముల తరువాత, బలిష్ఠుడైన జయశాలిగా, మన మధ్య ఆయన నిలబడియున్నాడు. ఆయన జయించినది వ్యాధిని మాత్రమే కాదుగానీ ఆయన రోగమును జయించాడు. ఆయన శోధనను జయించాడు. ఆయన ప్రతీ శత్రువును జయించాడు. ఆయన మరణమును జయించాడు. ఆయన పాతాళమును జయించాడు. ఆయన సమాధిని జయించి, తిరిగి లేచాడు. మరియు రెండువేల సంవత్సరముల తరువాత, బలిష్ఠుడైన జయశాలిగా, ఈ మధ్యాహ్నము మన మధ్య నిలబడి తననుతాను గుర్తింపుచేసుకొనుచున్నాడు। ఆమేన్. అబ్రాహాము యొక్క రాజసంతానమునకు ఆయన సజీవుడని, ఆయన వాగ్దానము సత్యమని రుజువు చేస్తూ, ఆయన ఇంకనూ ఇక్కడ సజీవుడుగా ఉన్నాడు! ఓ, మై। శత్రువు...
115 "ఆయన శత్రువు యొక్క గవినిని జయించాడు." ఆ సంతానానికి, తననుతాను ఎవరైయున్నారో సత్యమును రుజువు చేయుటకు ఇప్పుడాయన సజీవుడుగా ఉన్నాడు? ఆ ఎన్నుకొనబడిన విత్తనములు దానిని చూడగలవు. ఆయన దానిని జయించాడు. ఆయన పరీక్ష తరువాత, వాక్యపు వాగ్దానము పొందినవారు, వారే క్రీస్తు యొక్క శరీరము లోనికి పరిశుద్దాత్మ ద్వారా ముద్రించబడియున్నారు, వారికే (ఎవరు?) హెబ్రీ 13:8 ఆలాగుండునని. నిర్ధారించాడు. వారు పరిశుద్దాత్మ ద్వారా లోనికి ముద్రించబడియున్నారు. ఆ పరిశుద్దాత్మ...దానిని అబ్రాహాము ముందుగా చూశాడు; విశ్వాసము ద్వారా అతడు దానిని నమ్మాడు, మరియు ఆయన ఏమి చెప్పాడో ఆ వాగ్దానము వైపునకు తిరిగి చూస్తూ, మనము దానిని స్వీకరిస్తాము. మరియు యోహాను 14:12 తిరిగిలేచిన జయశాలి ద్వారా, తానే, ఈ చివరి దినములలో దానిని నిర్ధారించియున్నాడు.
116 ఏదో ప్రణాళిక కాదు; కానీ ఒక వ్యక్తి, క్రీస్తు, జయశాలి నా సంఘము కాదు, నా బాప్టిస్టు సంఘము కాదు, మీ ప్రెస్బిటేరియన్, మెథడిస్ట్ లేక పెంతెకొస్తుల
ద్వారా కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా. ఈరోజున ఆయన జీవిస్తున్నాడు. మన నీతీకరణము కొరకు, ఆయన దానిపై తిరిగిలేచాడు.
117 మరియు ఆయన జీవిస్తున్నందున, మనమును జీవిస్తామని ఆయన చెప్పాడు. "మనిషి రొట్టెవలన మాత్రము కాక, దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాట వలన జీవిస్తాడు," వాక్యములో ఒక భాగం కాదు, "దేవుని నోట నుండి వచ్చు ప్రతీ మాట వలన." "పునరుత్థానమును మరియు జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. దీనిని నమ్ముతావా?" ప్రతి శత్రువు గవిని తీసుకొనుము।
118 బాస్వర్త్, ఎలా జయించగలిగాడు. దేవుడు. బాస్వర్త్ జయశాలిలో ఉన్నాడు. మరియు ఆ కారణమును బట్టియే అతడన్నాడు. "నా జీవితములో అత్యంత సంతోషకరమైన ఘడియ ఇప్పుడే." ఆ-హా ఆ బలిష్ఠుడైన జయశాలిని అతడు ఎరిగినవాడు. ఆయన నిశ్చయత ఆయనతో విశ్రమించింది. ఓ, మై! ఇప్పుడు మనము పాడగలము:
జీవించి, ఆయన నన్ను ప్రేమించాడు; మరణించి, ఆయన నన్ను రక్షించాడు: సమాధి చేయబడి, ఆయన నా పాపములను దూరంగా మోసుకెళ్ళాడు; తిరిగిలేచి, ఉచితంగా నన్ను సదాకాలము నీతిమంతునిగా చేశాడు; ఒకరోజు ఆయన వస్తున్నాడు. ఓ మహిమకరమైన దినము!
119 ఓడిపోయినట్లుగా కనబడినవారికి, ఎడ్డీ పెర్నెట్, అది అతడేనని నేను నమ్ముతాను, అతడు క్రైస్తవ పాటలను అమ్మలేకపోయాడు. ఎవరూ వాటిని కొనలేదు. దానితో వారు చేయునది ఏమియు లేకున్నది. ఓ, ఓడిపోయిన ఒక విశ్వాసి! ఒకరోజు, పరిశుద్దాత్ముడు అతని మీదకు వచ్చాడు. అతని సాహిత్యమును స్వీకరింపని, శత్రువు యొక్కి గవినిని। ఆత్మ అతనిని తాకింది. అతడు కలమును లాక్కొన్నాడు, ప్రారంభపు పాటను దేవుడు అతనికి వ్రాయనిచ్చాడు.
యేసు' నామము శక్తిని అందరూ నమస్కరిస్తారు! దేవదూతలు సాగిలపడి నమస్కరింపనిమ్ము, రాజ కిరీటమును తీసుకురండి, అందరికీ ప్రభువుగా ఆయనకు కిరీటము పెట్టండి.
120 గ్రుడ్డిదైన ఫాన్నీ క్రాస్్బ, ఒకసారి. అన్నది, "దాని భావము నీకేమిటి?" పెంతెకొస్తు ఎల్విస్ ప్రెస్లీ వలే లేక క్రీస్తు సంఘము లోని బూన్ చేసినట్లుగా లేక రెడ్ ఫోలే చేసినట్లుగా, వారు లోకమునకు వారి తలాంతును అమ్మివేసినట్లుగా, ఆమె తన యొక్క జన్మహక్కును అమ్ముకొనలేదు. వారు కాడిల్లాక్ కార్లను, పదిలక్షల డాలర్ల బంగారపు పథకములను కలిగియున్నారు. కానీ ఫాన్నీ క్రాస్బై ఆమె స్థానమునకు నమ్మకముగా నిలిచింది. ఆమె కేకలు వేసింది:
ఓ మృధువైన రక్షకుడా, నన్ను దాటిపోవద్దు, నా దీన మొరను విను: ఇతరులను నీవు పిలచుచుండగా, నన్ను దాటిపోవద్దు. నీవే నా ఆదరణ జలపాతము, నాకు జీవము కంటే అధికము, భూమి మీద నీవు గాక నాకు ఎవరున్నారు?
లేక పరలోకములో నీవు గాక నాకెవరున్నారు?
121 వారన్నారు, "నీవు పరలోకమునకు వెళ్ళునప్పుడు గ్రుడ్డిదానవైతే ఎలా?"
ఆమె అన్నది, "నేనెలాగైనా, ఆయనను ఎరుగుతాను."
"ఎలా నీవు ఆయనను ఎరుగుతావు?" అన్నారు.
"నేను ఆయనను ఎరుగుతాను" అన్నది.
19
వారన్నారు, "శ్రీమతి. క్రాస్బ, నీవు ఒక పదిలక్షల డాలర్ల సొమ్ము చేసుకోవచ్చు."
ఆమె అన్నది. "నాకు పదిలక్షల డాలర్లు అవసరం లేదు."
122 "నీవు ఎలా ఆయనను గుర్తిస్తావు?" ఆమె అన్నది:
నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగుదును, ఆయన ప్రక్క ద్వారా విమోచించబడి నేను నిలబడతాను; నేను ఆయనను ఎరుగుదును, నేను ఆయనను ఎరుగుదును.
123 "నేను ఆయనను చూడలేకపోయినట్లయితే, నేను ఆయన చేతులలోని గాయములను స్పృశిస్తాను." ఆమె తన శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకుంది. అవును.
124 నీవు క్రీస్తులో ఉన్నట్లయితే! ఆయనన్నాడు, "మీరు నాయందును, నా మాటలు మీయందును నిలిచియున్న యెడల మీకు ఏ తాళపుచెవి అవసరమో అడుగు, నీవు ఏ గవినిని తీసుకొనగోరుచున్నావో అడుగు; నీకు ఏది ఇష్టమో అడుగు, అది నీకు అనుగ్రహించబడును. మీరు నాయందును, నా మాటలు మీయందును నిలిచియున్న యెడల, మీ ముందుకు వచ్చే ఏ శ్రతువు యొక్క గవినినైనా మీరు తీసుకోవచ్చు."మీరు అబ్రాహాము యొక్క రాజసంతానమైయున్నారు.
125 ఎలాంటి గవిని నీ ముందు నిలబడియున్నది? అది రోగమైనా, దానిని జయించుటకు నీవు అధికమైనవాడవు. అలాగైతే మనము చెప్పగలము, ఈ దయగల పాత పాటను పాడుదాము:
గ్రంథములోని ప్రతీ వాగ్దానము నాదైయున్నది, ప్రతీ అధ్యాయము, ప్రతీ వచనము ఎంతో దైవికమైనది, నేను ఆయన దైవిక ప్రేమయందు నమ్మకముంచుచున్నాను, ఏలయనగా గ్రంథములోని ప్రతీ వాగ్దానము నాదైయున్నది.
126 మనము అధికమైన జయశాలురము, అబ్రాహాము యొక్క సంతానము శత్రువు యొక్క గదినిని స్వాధీనపరచుకుంటుంది! ఈ కార్యములు జరుగవు అని వారు చెప్పినప్పుడు, దానిని ఒక దయ్యమని, లేక బయల్లైబూబు అని, లేక మరొకటిగా దానిని వారు పిలువగోరినప్పుడు, నిశ్చయముగా దేవుడు ప్రతీ గదినిని స్వాధీనపరచుకొని, శత్రువును జయిస్తాడు.
మనము ప్రార్థించుకుందాం.
127 ప్రభువా, అబ్రాహాము యొక్క సంతానము... ప్రభువా, వారు దానిని బహుశా చూస్తారని నాకు తెలుసు. నిజమైన నేలను తాకకుండా, ఎలా ఆ వాక్యము పడుతుంది? వారు ఇప్పుడు గ్రహిస్తారని నేను ప్రార్థిస్తాను. ప్రార్ధనా వరుసలోనికి వచ్చు ప్రతీ వ్యక్తి స్వస్థపడునుగాక.
128 ప్రభువా, ఇక్కడ ఇంకనూ తమ ఒప్పుకోలును చేయనివారు, క్రీస్తు కొరకు బహిరంగముగా నిలబడనివారు ఉన్నట్లయితే, నీ నుండి వారిని దూరముగా తీసుకొనివెళ్ళు, మృతమైన కార్యమునకు, చల్లని, నులివెచ్చని సిద్ధాంతములన్నిటిని, వారు నిరాకరించుటకు సిద్ధపడుదురు గాక. మరియు వారు ఇప్పుడు నిలబడి, "నా రక్షకుడుగా నేను ఆయనను స్వీకరిస్తాను." అని చెప్పుదురుగాక. అప్పుడు ఆ దినమున నీవు వారి కొరకు నిలబడతావు.
129 మన తలలను మనము వంచియుండగా, ఒక క్షణము అక్కడ ప్రార్థన కొరకు నిలబడగోరుచున్నట్లయితే, చెప్పండి, "ఆయన దైవ సన్నిధిలో, నేను ఇప్పుడు ఆయన కొరకు నిలబడగోరుచున్నాను, అట్లు నా కొరకు ఆయన ఆ దినమున నిలబడతాడు." మీరు నిలబడగలిగినట్లయితే, మీ పేరు జీవగ్రంథములో ఉంచబడునట్లుగా, మీరు ఒక అవకాశము ఇవ్వాలని నేను మిమ్మును అడుగుతాను. ఏదో ఒక సంఘములో చేరాలని నేను మిమ్మును అడుగుటలేదు. మీరు ఆయనను ఎరుగనివారుగా ఇక్కడ ఉన్నట్లయితే, క్రీస్తునొద్దకు రమ్మని నేను మిమ్మును అడుగుచున్నాను.
130 కుమారుడా, ప్రభువు నిన్ను దీవించునుగాక. అక్కడ మరొకరున్నారా, "నేను ఇప్పుడు నిలబడతానని" చెప్పండి. ఓ స్త్రీ, ప్రభువు నిన్ను దీవించునుగాక. నా సహోదరీ, ప్రభువు నిన్ను దీవించునుగాక. "నాకు కావాలి..." దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. "ఈ మధ్యాహ్నమున నా నిర్ణయమును నేను తీసుకొంటాను." మీ చక్కని ప్రజలు, స్త్రీలు మరియు పురుషులు, "ఈ మధ్యాహ్నమున నేను నా నిర్ణయమును తీసుకుంటాను" అని పైకి నిలబడుచున్నారు.
131 ఆ దినమున వైద్యుడు ఇలా చెప్పినప్పుడు, "మంచిది, అతని రక్తము కారిపోవుచున్నది, బ్రద్దలైపోయాడు, రక్తము కారుచున్నది, మరణము అతనిమీద ఉన్నది లేక ఆమె మీద ఉన్నది." లేక, ఒక ఉదయమున, నీవు నీ తీర్మానమును గుర్తుచేసుకుంటావు. ఇప్పుడు నీవు ఆయన కొరకు నిలబడుము.
132 "మీరు మనుషుల యెదుట నన్ను గూర్చి సిగ్గుపడినట్లయితే, నా తండ్రి యెదుట మరియు ఆయన పరిశుద్ధ దూతల యెదుట నేనును సిగ్గుపడతాను. కానీ మనుషుల ముందు మీరు నన్ను ఒప్పుకొన్నట్లయితే, అప్పుడు నేను నా తండ్రి యెదుట మరియు దూతల యెదుట ఒప్పుకొంటాను."
133 నా సహోదరీ, ప్రభువు నిన్ను దీవించునుగాక, ఇంకెవరైనా మిద్దె మీద అక్కడ ఉన్నారా? ఇప్పుడే మనము వేచియుండగా, వారిలో కొందరు, ఎక్కువమంది ముఖ్యమైన నేలపై ఉన్నారా? మంచిది. స్నేహితుడా, నీ మాట ప్రకారము నేను తీసుకొంటాను.
134 వాక్యము ఫలించి నేలపై పడినట్లయితే, ఆ బావి దగ్గరున్న స్త్రీవలే, ఆమె గ్రహించింది. జగత్తు పునాదికి ముందే, ఆమె పరలోకము నుండి ప్రాతినిథ్యము వహించింది. ఆ వెలుగు దానిని తాకినపుడు, ఆమె దానిని గుర్తించింది.
135 నా సోదరుడా, ప్రభువు నిన్ను దీవించునుగాక. అది ఒక సాహసము.... సోదరుడా, ప్రభువు నిన్ను దీవించునుగాక. నీ జీవితములో నీవు గొప్ప కార్యములు చేయవచ్చునుగానీ; ఇది నీవు ఎన్నడైనా చేయబోవు అతిగొప్ప కార్యము, ఇప్పుడు, క్రీస్తు కొరకు నిలబడుము,
136 మా పరలోకము తండ్రీ, ఈ మధ్యాహ్నము, కొంత మంచి నేలపై విత్తనము చల్లబడింది. జీవము పైకి పొర్లువచ్చుచున్నదేమో చూస్తాము. స్త్రీలు, పురుషులు వారి పాదములపై నిలబడ్డారు, మరియు సమస్తమూ, చూచుచున్న దేవుని నేత్రము, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞానియై యున్నాడు. వారిని చూస్తున్నాడు. తండ్రి, వారు నీవారైయున్నారు." ఇప్పుడు వారిని, బహుమానములుగా నేను వారిని హాజరుపరుస్తాను.
137 అప్పుడక్కడ నిలబడియున్నవారి యొక్క అనుభవము, వారు ఏమి చేసియున్నారో వారు ఎరిగియున్నారు. దీని భావమేమిటో వారు ఎరిగియున్నారు. ప్రభువు యొక్క తృణీకరింపబడిన కొద్దిమందితో వారు నిలబడి, వారు నిర్ణయము తీసుకొందురుగాక. వారు నీ సన్నిధిలో నిలబడువరకు, వారు నమ్మకముగా నిలిచియుందురు గాక, అప్పుడు ఆ మాధుర్యమైన స్వరము ఇలా చెబుతుంది, "అవును, ఒక దినమున బాటన్ రోడ్లో, లేక డెన్హాం స్పింగ్స్ అని పిలువబడుచున్న ఒక చిన్న స్థలములో, అతడు నా కొరకు నిలబడ్డాడు. తండ్రీ, నేను ఇప్పుడు అతని కొరకు, లేక ఆమె కొరకు నిలబడతాను." ప్రభువా, దయచేయుము. వారు నీవారైయున్నారు, యేసు' నామములో. ఆమేన్.
మీ నిర్ణయమును బట్టి, ప్రభువు మిమ్మును దీవించునుగాక.
138 ఇప్పుడు నాకు ఈ ఒక్క పని చేయండి. ఈ సంఘకాపరులు చుట్టుప్రక్కల మీరున్నట్లయితే, కనుగొనండి, కొందరిని చూడండి, వారితో మాట్లాడండి. ఇంకనూ మీరు క్రైస్తవ బాప్తిస్మమును పొందకపోయినట్లయితే, ఆలాగు చేయండి. ఇప్పుడు విశ్వాసుల మధ్యలోనికి మీరు వెళ్ళండి, నిజమైన విశ్వాసులు, వేషధారులు కాదు; నిజ విశ్వాసులు.
మనము ప్రార్థిస్తూ ఉండగా, ఈ చేతిరుమాళ్ళ కొరకు ప్రార్థిద్దాం.
139 పరలోక తండ్రీ, ఈ చేతిరుమాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్లబోవుచున్నవి; ఎక్కడకో, నాకు తెలియదు. ఎక్కడో ఒక వృద్ధ తండ్రి, ఒక బురదలో కూర్చొని బహుశా ఈ చేతిరుమాళ్ళు వచ్చుట కొరకు కనిపెడుతూ ఉండవచ్చు. ఒక చిన్న బిడ్డ రోగముతో హాస్పిటల్లో మంచము మీద పరుండి ఉండవచ్చు: ఒక తల్లి నిర్ఘాంతపోతూ నిలబడి, ఈ చేతిరుమాళ్ళు తిరిగి వచ్చుటకొరకు ఎదురుచూస్తూ ఉండవచ్చు. పరలోకపు తండ్రీ, నీవు వాటితో వెళ్ళమని ప్రార్థిస్తాను.
ఈ దినమున నీ సన్నిధి యొక్క ఆనవాలుగా, మేము బోధించినట్లుగా మాకు నీయందు విశ్వాసమున్నది, అబ్రాహాములో ఉన్న విశ్వాసము, మరియు యేసుక్రీస్తు, ద్వారా ఉత్పత్తి చేయబడి, మాకీయబడిన విశ్వాసము, ఈ చేతిరుమాళ్ళతో వెళ్ళి ప్రతిఒక్కరూ వారి మీద ఉంచబడినప్పుడు, ప్రతీ ఒక్కరినీ స్వస్థపరుచునుగాక. యేసు నామములో, మేము వాటిని పంపుచున్నాము. ఆమేన్.
140 ఇప్పుడు ప్రార్థనా వరుసను పిలవక మునుపు, ఒక్క క్షణం. సర్వశక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడు దయతో, స్నేహితులారా, నేను రోగుల కొరకు ప్రార్ధన చేయబోవుచున్నాను, మరియు నేను...బహుశా, మీరు ఇక్కడకు వచ్చునప్పుడు, మీకు ఏమియూ చెప్పకపోవచ్చు. మీలో కొందరు ఆ సమయమునకు ముందే వెళ్ళిపోతారు. మీరు ఏమైయున్నప్పటికీ, ఒక్క క్షణం క్రితం మీరు కనీసం నిలబడలేకపోయిననూ, అది మీకు నిశ్చయత లేదు...
141 నీవు ఒక సంఘములో సభ్యుడవై ఉన్నట్లయితే, అది మంచిదే, కానీ అది తగినంతగా మంచిది కాదు. చూడు, ఆ ధనికుడైన యౌవ్వన న్యాయాధిపతి, ఒక మంచి సంఘ సభ్యుడై ఉన్నాడు. చూడండి? అతడు నిత్యజీవమును పొందుటకు ఏమిచేయాలని యేసును అడిగాడు. అతడు దానిని ఎన్నడూ అంగీకరించలేదు. అతడు నడిచి వెళ్ళిపోయాడు. అది ఒక యౌవ్వనస్థుడు చేయు ఏలాటి వెర్రి పని. అతని స్థానము తీసుకోవద్దు. చివరిసారిగా అతడు ఎక్కడ గుర్తించబడ్డాడో మీకు గుర్తున్నదా? కొద్ది కాలము తరువాత, అతడు వృద్ధి చెందాడు. అతడు బాగా ధనవంతుడయ్యాడు. అతడు ఏ స్థానమునకు వచ్చాడనగా, చివరకు అతని కొట్లు నిండిపోయాయి. కానీ తరువాత అతని చివరి గుర్తింపును మనము కనుగొన్నప్పుడు, అతడు పాతాళములోని, అగ్నిజ్వాలలలో బాధింపబడ్డాడు. అది నీకు సంభవించనీయవద్దు. క్రీస్తును అంగీకరించుము.
142 యౌవ్వనస్థులైన మీరు, యౌవ్వన బాలికలైన మీరు, యౌవ్వన బాలులారా, జీవితం యొక్క మలుపునొద్ద, సరిగ్గా దానిని చేయండి. నా మాట వినండి. మీ సోదరుడుగా, మిమ్మును ప్రేమించువాడుగా. నేను మిమ్ములను ప్రేమించుచున్నందులనే నేను ఇక్కడ ఉన్నాను. నేను దేవునిని ప్రేమిస్తాను. మరియు మిమ్ములను ప్రేమిస్తాను, నేను మిమ్ములను ప్రేమించకుండా, నేను దేవునిని ప్రేమించలేను.
143 దానికంటే ఎక్కువగా, మీ విమర్శను బయట ఉన్న నా కుమారునికి అందచేయండి, లేక నా పిల్లలలో ఒకరికి. నన్ను కొంచెము... నేను అది లేకుండా వెళతాను. ఏ తల్లిదండ్రులైనా దానిని చేస్తారు; ఆలాగునే దేవుడు చేస్తాడు. చూడండి? ఆయన ప్రజలను ప్రేమించండి. ఒకరినొకరు ప్రేమించండి.
144 నీవంటావు, "ఎందుకని వారిని గద్దిస్తావు?" నిజమైన ప్రేమ దిద్దుబాటుతో కూడినది.
145 మీ బిడ్డ బయట వీధిలో కూర్చొనట్లయితే; నీవు ఇలా అంటావా, "మంచిది. అక్కడ జూనియర్ కూర్చొన్నాడు. అతను తప్పక దానిని చేయకూడదు. అయితే నేను ఆయన భావనలను గాయపరచను." అలాగైతే నీవు అతనిని ప్రేమించుట లేదు. అతను అక్కడ చంపబడతాడు. నీవు అతనిని ప్రేమించినట్లయితే, నీవు
అతనిని లోపలకి తెచ్చి, అతనికి కొన్ని దెబ్బలు వేస్తావు. అతడు లోబడునట్లు చేస్తావు
140 దేవుడు ఆ విధంగానే చేస్తాడు. ప్రేమ దిద్దుబాటుతో కూడినది, అదియే నిజమైన ప్రేమ
147 ఒక బోధకుడు నిలబడి, మిమ్మును దిద్దకపోయినట్లయితే, మీరు జుట్టు కత్తిరించుకొని, రంగులు, అలాంటి మురికిని వేసుకొననిచ్చినట్లయితే, దానిని గద్దించకపోయినట్లయితే, అక్కడ సరైన ప్రేమ లేదు. మీరు మూడు లేక నాలుగు సార్లు పెండ్లి చేసుకొని, అలాటి కార్యములతో మిమ్మును ముందుకు వెళ్ళనిచ్చినట్లయితే, అక్కడ నిజమైన ప్రేమ లేదు. మిమ్ములను ఈ సంఘములో చేరనిచ్చి, మీ వీపును నిమిరి, ఏదో ఒక సిద్ధాంతముతో మిమ్ములను తేలికగా చేసినట్లయితే, అప్పుడు, "నీవు చేయవలసిందల్లా, ఒక పరిశుద్ధ సంఘములో చేరుటయే," అప్పుడక్కడ ఏ ప్రేమయు లేదు. లేక, ఆ మనిషి పూర్తిగా మతిభ్రమించినవాడైనా అయి ఉండాలి, లేక అతడు చూడనివాడైనా అయి ఉండాలి.
148 నిజమైన ప్రేమ దిద్దుబాటుతో కూడినది, మరియు నిన్ను అది వాక్యమునొద్దకు తిరిగి తెస్తుంది.
149 ఆయన ఏమి చెప్పియున్నాడో, ఎలాగో, యేసు వైపు చూడండి, 'ఆయన రక్తము కొరకు సహితము వారు కేకలు వేస్తున్నప్పుడు, ఆయన ఎంతమట్టుకు వారిని ప్రేమించియున్నాడనగా, వారి స్థానములో ఆయన చనిపోయాడు.
150 ఇప్పుడు ఆ గొప్ప పరిశుద్దాత్ముడు బహుశా.. ఒక్క నిముషము నేను కనిపెడతాను. మనము ప్రారంభించకముందు, పరిశుద్దాత్మ అభిషేకము నా మీదకు వచ్చువరకు నేను కనిపెడతాను. నేను బోధించుచున్నాను. మీ సహకారమునకు వందనములు,
151 ఇప్పుడు, ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరూ, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఈ కట్టడలో ఎక్కడ ఉన్ననూ, ఒక్క నిముషము ప్రార్ధన చేయండి, చెప్పండి, "ప్రభువైన యేసు, నాకు సహాయము చేయుము నాకు సహాయము చేయుము। నన్ను నీ వస్త్రపు చెంగును తాకనిమ్ము." మీకు తెలుసా, యేసు అన్నాడు, ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును తాకినప్పుడు, భౌతికముగా, ఆయన దానిని స్పృశించలేదు, కానీ ఆయన చుట్టూ తేరిచూసి, ఆమె ఎవరో, ఆమె ఏమి చేసిందో ఎరిగియుండెను. ఈ మధ్యాహ్నము ఆయన అదే యేసుయై యున్నాడు, మన వ్యాధుల ద్వారా మనము ఆయనను తాకగలిగే ఒక ప్రధాన యాజకుడు.
152 దేవుడే ఈ వాగ్దానము చేశాడని మరొకసారి (ఆయన దానిని చూపునుగాక) మనము సొదొమ దినములలో జీవించుచున్నామని, అది సత్యమై యున్నదని మీలో ప్రతీ ఒక్కరూ నమ్ముతారా? ఈ కట్టడములో, మీలో ఎంతమంది నమ్ముచున్నారో, మీ చేతులెత్తండి.
153 సొదొమ దినములలో ఉన్నట్లుగా, మనము జీవిస్తున్నాము. పూర్తి క్రమము కలుషితమయ్యింది, ప్రపంచ క్రమము సమస్తమూ, సంఘ క్రమము, రాజకీయ క్రమము కలుషితమైపోయింది. అక్కడ ఏదియూ మిగులలేదు. రాజకీయములు ఎంతో కలుషితమైపోయాయి. ప్రతీచోట పద్ధతులన్నియూ,
మన నియంతలందరూ కలుషితమైనారు. సంఘము ఆ విధముగానే మారింది. కుటుంబములు ఆ రీతిగానే. కలుషితమైనాయి, సాదొమ కాలము।
154 అలాగైతే, గుర్తుంచుకోండి, దేవుడు మీ ముందు దానిని కలిగియున్నాడు, అప్పుడు గుర్తుంచుకోండి, ఆయన మానవ శరీరములో తననుతాను ప్రాతినిథ్యం వహిస్తానని చెప్పాడు, వాగ్దాన కుమారుడు రంగము మీదకు రాకమునుపు, సాదొమ ముందు చేసినట్లుగా ఆయన చేస్తాడు. ఆయన మొదటి స్థానములో చేసినట్లుగానే, దానిని పరిచయము చేయుటకు వాగ్దాన కుమారుని రాకను సూచించుటకు, ఒకనిని పంపుతానని ఆయన వాగ్దానము చేశాడు; ఆయనన్నాడు, "ఆలాగుననే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును."
155 మీరెవరో నాకు తెలియదు. మంచిది, మిస్ థామ్సన్, ఆ స్త్రీ సంబంధమైన బాధను, ఇబ్బందులను, దేవుడు నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముతావా? నీవు నమ్మగలవా? నీవు నమ్ముతావా? మిస్, మిస్ థామ్సన్, ఆయన నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముతావా? అలాగైతే, నీ చేతులనెత్తుము.
156 అక్కడ ఒక స్త్రీ తిన్నగా నీ వెనుక కూర్చొన్నది. ఆమె ప్రార్థించుచున్నది. ఆమెకు నరముల వ్యాధి ఉన్నది.
157 తిన్నగా ఆమె ప్రక్కగా కూర్చొన్న ఒకరు, కడుపు బాధతో ఉన్నది, ఆమె కూడా ప్రార్థన చేయుచున్నది. నీవు దానిని పోగొట్టుకొనబోవుచున్నావు, నీవు గమనించవద్దు. నీవు ఇక్కడ వ్యక్తివి కావు. నీవు మిసిసిప్పి వాసివి. మీరు శ్రీ మరియు శ్రీమతి స్ట్రింగర్. మీ హృదయమంతటితో మీరు నమ్మినట్లయితే, యేసుక్రీస్తు మిమ్ములను స్వస్థపరుస్తాడు. మీరు దానిని నమ్మగలిగినట్లయితే, మీరు నమ్ముతారా? అలాగైతే మీరు దానిని పొందవచ్చు. అలాగే, ప్రజలందరికీ అది మీరు అని చూచునట్లు మీరు చేతులెత్తండి.
158 ఆ ప్రజలు నాకు తెలియదు. నా జీవితములో నేను ఎన్నడూ వారిని చూసియుండలేదు. స్నేహితుడా, నీవు తప్పక దానిని నమ్మాలి. ఆయన తననుతాను గుర్తింపుచేసుకొనుచున్నాడు. మీ హృదయమంతటితో, మీరు దానిని నమ్ముతారా? (సమాజము, "ఆమేన్"చెప్పింది.—సంపా.)
159 అయ్యా, ఎందుకు మీ తలను ఊపుచున్నారు. అలా నావైపు చూడండి? అవునండి. నీవు దానిని చేసిన కారణమున, నేను ఒక్క నిముషము నీతో మాట్లాడగోరుచున్నాను. నీవు ఒక విధముగా ఇక్కడ కూర్చొన్న నావైపు చూస్తున్న ఒక వృద్ధ పెద్దమనిషివి. అలాటి యథార్థతతో, నావైపు చూశాడు. అతడు దానిని నమ్మాడు. పక్షవాతము కలిగిన ఒకిరికొరకు నీవు ప్రార్థిస్తున్నావు. కానీ, నీ ముఖ్యమైన ప్రార్థన ఏమనగా, నీకు అవసరమైనది, నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు ప్రార్ధన చేయుచున్నావు. అది నిజము. ఆ-హా. అది సత్యము, నీవు దానిని నమ్మినట్లయితే! ఓ స్త్రీ, నీవు ఉద్యోగము కొరకు వెదుకుచున్నావు. అదియుగాక, నేను ఒక దేవుని ప్రవక్తనని, లేక ఒక దేవుని సేవకుడినని నీవు తెలుసుకొనగోరావు, నీకు రెండు ఆపరేషన్లు కలిగియున్నావు. అది నిన్ను ఒక విధముగా బలహీనురాలుగా చేసింది. ఆత్మసంబంధముగాను, అన్ని రకములైన ఇబ్బందులను నీవు కలిగియున్నావు. అవన్నియూ పరిష్కరించబడి యున్నాయి అని నేను నీకు తెలుపగోరుచున్నాను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచియున్నది.
160 (టేపులో ఖాళీ ఉన్నది- సంపా.) అక్కడ తిన్నగా నీ పక్కనే కూర్చొన్న వ్యక్తి. ఆమె ప్రార్ధన చేయుచున్నది. ఇప్పుడు చూడు. ఆయన నీ పొరన విన్నాడు. నీవు ఆయనను తాకియున్నావు, నీవెవరవో నాకు తెలియదు. కానీ ఆయనకి తెలుసు. నీవు దేనికొరకు ప్రార్ధన చేయుచున్నావో నేను చెబుతాను. నీవు నీ హృదయమంతటితో నమ్ముతావా? నీవు పిత్తాశయము వ్యాధితో బాధపడుచూ, పార్థిస్తున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచి, బాగుచేయునని నమ్ముతావా? నీ పేరు శ్రీమతి. స్మిత్. అది నిజము. నీ చేతినెత్తుము.
161 చూడండి, ఆయన తననుతాను గుర్తింపు చేసుకొనుచున్నాడు. అది ఏమైయున్నది? అబ్రాహాము యొక్క సంతానము, అబ్రాహాము కలిగియున్న విశ్వాసము, ఆయన వాక్యమును రుజువు చేస్తూ, సూచనలు దానిని వెంబడిస్తూ, అది మన మధ్యనున్న యేసుక్రీస్తుయై యున్నాడు.
162 ఎవరు, ఎన్ని కార్డులు ప్రార్థించబడవలసియున్నది, మీ చేతులనెత్తండి, నీ కార్డు కలిగియున్నావా? ఓ, మనము ప్రార్థనా వరుసను ప్రారంభించుట మంచిది.
163 మీరు చూడండి, మీకు అర్థమయ్యిందా, మీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఆ ఆత్మ స్వస్థపరచుట మాత్రమే కాక. అది ఆయన ఇక్కడున్నాడని అది మాత్రమే గుర్తింపుచేయుచున్నది. రోగుల కొరకు ప్రార్ధన చేయుటకు మీ యొక్క సంఘకాపరులు అదే అధికారమును కలిగియున్నారు. అదే అధికారమును కలిగియున్నారు నిశ్చయముగా, "నమ్మిన విశ్వాసుల వలన ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి."
164 ఇప్పుడు ఇక్కడ ఉన్న కాపరులైన నా స్నేహితులను కోరుచున్నాను. (అది సరియే, శ్రోతల మధ్యలో నుండి పిలుపు?..)
165 ఇక్కడ ఉన్న సేవకులు ఎంతమంది మీ హృదయమంతటితో నమ్ముతారు. ఇక్కడున్న సేవకులు, నమ్ముతారా? ఓ, వందనములు. మీరు నిలబడినట్లయితే, నేను ఆశ్చర్యపోతాను? ఇక్కడకు రండి, ఒక్క నిముషము నాతో పాటు నిలబడండి, ఇక్కడే తిన్నగా, రోగుల కొరకు ప్రార్ధన చేద్దాము. తిన్నగా ఇక్కడకు రండి. ఇప్పుడు, స్వస్థత జరుగుటను మీరు చూస్తారు, ఏమి సంభవిస్తుందో గమనించండి.
166 ఇక్కడకు రండి, వచ్చి, రెండు వరుసలుగా నిర్మించండి. నేను ఒక్క క్షణములో అక్కడకు వచ్చుచున్నాను, రోగుల కొరకు ప్రార్ధన చేయుటకు. నమ్ముచున్న కాపరులు, విశ్వాసులుగా తమ్మునుతాము గుర్తింపుచేసుకొనువారు. అదే, నీవు నమ్ముతావా, ఇక్కడకు వస్తున్నావు. నీవు శుద్ధమైన, పవిత్రమైన జీవితమును జీవించుచున్నావా, గుర్తుంచుకో, యేసుక్రీస్తునకు ప్రాతినిథ్యము వహించుట ద్వారా, ఏమి బయటకు రాబోవుచున్నది ఇప్పుడు చూడండి!
167 బ్లెయిర్ సోదరుడా, నీవు అక్కడ ఉన్నావని నాకు తెలుసు, నీవు లేక సోదరుడు పాట్. సాధారణముగా మనము చేయునట్లుగా రెండు వరుసలు దారిని నిర్మిద్దామా, నీవు మరియు సోదరుడు పాట్.
168 నమ్ముచున్న సంఘకాపరులు, నమ్మబోవుచున్న కాపరులు! ఇప్పుడు, చూడండి, దేవుడు ఎంతగానో తన వాక్యముతో తననుతాను గుర్తింపు చేసుకొన్నట్లయితే, ఆయన వాక్యముతో, అది బైబిలు యైయున్నదని మీలో ఎంతమందికి తెలుసు, యేసు దీనిని చెప్పాడు, "నమ్మినవారి వలన ఈ
సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచినపుడు, వారు స్వస్థతనొందుదురు"? సంఘకాపరులారా, విశ్వాసులుగా మిమ్మును మీరు గుర్తింపుచేసుకొనుటకు మీరు ఇక్కడకు వచ్చియున్నారు. కాదా? మీరు విశ్వాసులు (మీరు కాదా?), కానియెడల మీరు ఇక్కడ నిలబడియుండేవారు కాదు. ఇప్పుడు యేసు ఏమి చెప్పాడు?"నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు కనబడును."మీతో నేను ఒక విశ్వాసిని
169 నేను అక్కడకు వస్తున్నాను. వీళ్ళు మన ప్రజలు, మరియు మనము ఈ మందలపై కాపరులమైయున్నాము. నా చేతులను మీ చేతులలో ఉంచి, ఇప్పుడు మీతో కలిసి నా వలను వేయుటకు వచ్చుచున్నాను. ఈ ప్రజలను దర్శించుచుండగా, మీ మనసులో ఒక చిన్న సందేహమైనా ఉన్నట్లయితే, ఇప్పుడే తిన్నగా బయటకు వేయుము; ఆ ప్రకారము ఈ ప్రజలు దర్శించుటకు వచ్చినప్పుడు, అప్పుడు ప్రతీఒక్కరూ దర్శించుటకు వచ్చుచున్నారు, మనము వారిమీద చేతులుంచుదాము, వారు స్వస్థపడతారు. మీ హృదయమంతటితో ఇప్పుడు నమ్ముతారా, ప్రతీ ఒక్కరూ? [సంఘకాపరులు, "ఆమేన్" చెప్పారు.— సంపా.]
170 దాటివెళ్ళుచుండగా, ఇతరుల కొరకు ఎంతమంది ప్రార్థించబోవుచున్నారు, మీ చేతులెత్తండి. "నేను ప్రార్థన చేస్తాను."
171 గుర్తుంచుకో, నీ తల్లి, నీ తండ్రి, నీ కుమార్తె లేక నీ కుమారుడు, నీ సహోదరి లేక సహోదరుడు కావచ్చు. మరియు వారు నీవారు కాకపోయినా, ఎవరో కావచ్చు, ఈ వరుస గుండా రాబోవుచున్నారు. అది వారు క్యాన్సర్తో చనిపోవుచున్న వారైయున్నట్లయితే, లేక ఏదో భీకరమైన వ్యాధి కావచ్చు, మనుషులు లోతైన యథార్థత కలవారుగా ఉండాలని నీవు కోరుకోవా? నిశ్చయముగా, మనము కోరుకొంటాము.
172 ఇప్పుడు, నేను నమ్ముచున్నాను, ఇప్పుడు ఈ వరుసలో ఇక్కడున్నవారు, ఆ ప్రక్కకు ఎదురుగా నిలబడండి, ప్రార్థనా కార్డుతో. కుడివైపున ఉన్నవారందరూ, ఆ వైపునకు ఎదురుగా నిలబడండి. ఇప్పుడు, మార్గములో, ఎడమవైపు వారిని ఆపండి; అంతా కిక్కిరిసిపోయారు, మీరు చూడండీ, ఎలాగో మీకు తెలియదు, మనము ఏమి చేయుచున్నాము. మంచిది, ఈ ప్రక్కన ఉన్నవారందరూ, ఇక్కడ నిలబడండి. ఇప్పుడు కుడివైపున ఉన్నవారందరూ, ఈ దారిగుండా రండి, 'కారణము, మీరు క్రిందికి రాబోవుచున్నారు, చుట్టూ వస్తారు.
173 మీరు ఎలా వెళతారు, బోర్డర్ సోదరుడా, వారు బయటకు ఎలా వెళతారు? తిన్నగా ప్రక్క ద్వారం గుండా బయటకు, చుట్టూ తిరిగి కట్టడములోనికి మరలా వస్తారు.
174 కాబట్టి, కొన్ని నిముషములలో ఈ ప్రక్కవారు పిలువబడినపుడు, వారందరూ పైకి నిలబడతారు. అదేమిటో ఇప్పుడు మనము చూద్దాం...మంచిది, ఈ వైపు వారు, ఈ మీదుగా పైకి రండి. మీ ప్రార్థనా కార్డులను పట్టుకొని ఉండండి, ఈ వైపుకి రండి. మరియు మిద్దె మీద ఉన్నవారు అక్కడ ఆ వరుస చివరలో వారిని కలుసుకొనుటకు తిన్నగా రండి. ఇప్పుడు ఎడమవైపునున్నవారు, ఎడమవైపునకు పైకి వెళ్ళండి. మరియు అప్పుడు, మీరు చూడండి, మీరు వరుసకట్టి ఆ మార్గములో
వెనుకకు వెళ్ళండి; వెనుకకు తిరగండి. ఆ వైపునకు తిరగండి, చూడండి? మీరు తిన్నగా చుట్టూ వరుసను వెంబడిస్తారు. అప్పుడు ఏ మాత్రము మనకు కలగలుపు ఉండదు.
175 తరువాత పైన మిద్దె మీద ఉన్నవారు, వారినొద్ద దారిలో తిన్నగా మీ స్థలములను చేరుకోండి, మరియు వారు ముందుకు వచ్చుచుండగా తిన్నగా వారితో కలవండి.
176 ఇప్పుడు, ప్రతీఒక్కరూ, తిన్నగా వెనుకకు నడవండి, తిన్నగా చుట్టూ ఉన్న వరుసను ఇక్కడ కలుసుకొను వరకు తిన్నగా వెనుకకు నడవండి. ఈ చుట్టూ తిన్నగా రండి, ఇక్కడ పైకి, చుట్టూ తిన్నగా నడచుట ప్రారంభించి, తిన్నగా ఇక్కడి వరుసలోనికి రండి.
177 ఓ, ఇప్పుడే ఏమి జరుగబోవుచున్నదో ఏమి సంభవించబోవుచున్నదో! ఏదో తప్పక సంభవించబోవుటకు ఇది ఒక సమయముగా ఉండబోవుచున్నది. మంచిది.
178 ఇప్పుడు, అది సత్యము, ఆ దారి చుట్టూ తిన్నగా వెనుకకు వెళ్ళండి, మరియు ఆ విధముగా, తిన్నగా వరుసలోకి రండి. ఈ దారిచుట్టూ తిన్నగా వెళ్ళండి. అదే దారి ఇప్పుడు.
179 ఇప్పుడు మీరు నిలబడియుండగా, ప్రతీ ఒక్కరూ వారి పాదముల మీద నిలబడియుండగా, మనము ప్రార్థించబోవుచున్నాము. మీరు బాగుచేయబడాలని, ఈ సంఘము నాతో ప్రార్థించబోవుచున్నది. ఇప్పుడు కేవలము విశ్వాసము కలిగియుండండి.
180 చుట్టూ ముందుకు రండి, ఆ వెనుక ఇంకా వెనుక ఉన్నవారు. చుట్టూ తిన్నగా వచ్చి, ఆ వెనుక ఉన్న వరుసతో ఇక్కడ కలవండి. తిన్నగా చుట్టూ రండి, ఒక పెద్ద వరుసను కట్టండి. ఆ దారిగుండా చుట్టూ రండి, ఒకే వరుసను కట్టండి. అదంతే.
181 ప్రతిఒక్కరూ ప్రార్థనలో ఉండండి. ఇప్పుడు నిజంగా విశ్వాసములో ఉండండి. జనసమూహమును గమనించవద్దు. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు యొక్క సన్నిధి ద్వారా మనము ఆవరించబడి ఉన్నాము, ఆయన వాక్యము నందు విశ్వాసముంచుట ద్వారా, మనమధ్య ఏమిచేసియున్నాడో, దానిని ఘనపరచుటకు మనమీద ఆధారపడుచున్నాడు.
182 అది బాగుంది. ఇప్పుడు అది చక్కగా ఉంది. ఆ వరుస అద్భుతముగా మారుచున్నదని నేను తలస్తాను.
183 ఇప్పుడు వారందరూ నిలబడియుండగా, ఇప్పుడు ఈ కట్టడములో ఉన్న ప్రతి వ్యక్తి, మీ తలను వంచవలెనని కోరతాను.
184 ప్రభువైన యేసు, అది త్వరగా సంభవిస్తుంది. ఇప్పుడే తీర్మానము చేయబడవలసియున్నది. మీరు ఇక్కడ ఉన్నారని మేము నమ్మామా? మేము నిన్ను ప్రేమిస్తామా? ప్రభువా, మేము దేనిని అడగబోవుచున్నామో, దానికొరకు మేము తగినంత విశ్వాసమును కలిగి ఉన్నామా? అని మేము అడుగబోవుచున్నాము. ఈ ప్రజలు వరుసలో నిలబడుట ద్వారా తమ్మునుతాము గుర్తింపుచేసుకొనుచున్నారు. ప్రభువా, అది వ్యర్థముగా పోకుండునుగాక. ప్రభువా, అది జరుగునుగాక, వారు
ఇటు దాటివెళ్ళుచుండగా, ప్రతిఒక్కరూ వారు క్రీస్తు కింద దాటి వెళ్ళుచున్నట్లుగా దాటి వెళ్ళుదురుగాక, ఏలయనగా ఇక్కడ ఆయన ఉన్నాడని మేమెరుగుదుము. వారు వారి యొక్క స్వస్థతను పొందుదురని మేము ప్రార్థిస్తాము, రానున్న వారములలో, రానున్న వారములలో సహితము, ఈ ప్రజలు వారి కాపరుల యొద్దకు వెళ్ళి, స్త్రీ సంబంధమైన వ్యాధిగల స్త్రీలు, కడుపు బాధగలవారు, పిత్తాశయ గ్రంథి వ్యాధి గల పురుషులు, అన్ని రకములైన ఇబ్బందుల నుండి స్వస్థత పొందుదురని నాకు నిశ్చయత ఉన్నది. "మీకు తెలుసా, ఆ వ్యాధి నన్ను విడిచిపోయింది," అని చెప్పుదురుగాక. ఏలయనగా వారు నీ సన్నిధిలో ఉన్నారు. వారు ఈ వరుసగుండా వచ్చి, నీవు ఎందుకొరకు చనిపోయావో, దానిని వారు లాక్కొందురుగాక. వారు అబ్రాహాము యొక్క సంతానమైయున్నారు, మరియు నీవు వారికొరకు జయించియున్నావు. వారు వచ్చి, నీవు వారికి ఏమి ఇచ్చావో, వారు దానిని స్వీకరించుదురుగాక.
185 మరియు, సాతానా, నీవు ఒక ఓడించబడిన వ్యక్తివని, నీవు తెలుసుకొనువరకు ఈ వారము నీవు ఎంతగానో బహిర్గతము చేయబడ్డావు. కలువరిలో యేసుక్రీస్తు నిన్ను ఓడించియున్నాడు. మన నీతీకరణము కొరకు, మూడవ దినమున ఆయన తిరిగి లేచియున్నాడు, మరియు మన మధ్య ఆయన ఇప్పుడు నిలబడియున్నాడు. నీ నుండి మరియు నీవు చేసిన సమస్తము నుండి మా విశ్వాసము ఆయన వైపు చూస్తుంది. యేసుక్రీస్తు నామములో, ఈ ప్రజలను విడిచిపెట్టుము.
186 (సోదరుడు బ్రెన్హాం మరియు సేవకులు రోగుల మీద చేతులనుంచి, ప్రార్థనా వరుసలోని ప్రతీఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నారు. టేపులో ఖాళీ ఉన్నది.—సంపా.
187 యజమానుడు చేయమన్నట్లుగా మేము ప్రయత్నము చేసియున్నాము. మీలో ఎంతమంది ఆ ప్రార్థనా వరుసగుండా వెళ్ళియున్నారు, మీరు బాగుపడబోవుచున్నారని నమ్ముచున్నారా, మీ చేతులెత్తండీ. మీ చేతులతో నా చేతులు జోడిస్తాను.
188 ఒక గుంపు సేవకులుగా, చివరగా, అక్కడ మేము ఏమి చేయుచున్నాము; వారిలో అనేకులు రోగులుగా ఉన్నారు. అది నాకు తెలుసు, కానీ వారు వారి ప్రయాసను ముందుకు ఉంచి, వారి సంఘమును లోనికి తెచ్చుటకు ప్రయత్నించుచున్నారు, వారు లోనికి రాగలిగినా లేక రాలేకపోయినా. వారే నిజమైన కాపరులు. "వారితో ఒకరితో ఒకరు చేతులు కలపమని,"పరిశుద్దాత్ముడు నాతో చెప్పాడు. మా హృదయములను మరియు మా వలలను ఏకముగా చేసి, మా ప్రార్థనలు ఏకముగా చేసి బిగించాము.
189 యేసు, వారిని కూడా బాగుచేయుము. మరియు వారిని బలమైన కాపరులుగా తయారుచేయుము, ప్రభువు యొక్క వాక్యములో బలముగా చేయుము.
190 నా సోదరులారా, దేవుడు మీ హృదయ వాంఛలన్నిటిని దయచేయునుగాక. మీ జీవితములలో, దేవుని యొక్క శక్తిని కలిగి, ఈ చక్కని గుంపు ప్రజలకు సేవ చేయుచూ, మీ దినములన్నియూ ఆయనను సేవింతురుగాక. మనతో ఉన్న యేసుక్రీస్తు, అన్నివేళలు మీతో ఉండునుగాక, ఎన్నడైనా ఇదివరకు
కంటే ఎక్కువగా ఆయన తననుతాను మీకు ఎక్కువ ప్రాధాన్యత గలవాడుగా చేసుకొనునుగాక.
191 ప్రజలారా, మీలో కొందరు కుంటివారు, కొంతసేపు మీరు ఏ విధమైన తేడాను చూడకపోవచ్చు, ఏ విధమైన తేడా మీకు కనపడకపోవచ్చు. అబ్రాహాము ఏమి చేశాడో చూడండి. అది ఏ బేధమును చేయలేదు; మీరు చూచుచున్నది దానివైపు కాదు. మీ రోగ చిహ్నముల వైపు చూడవద్దు. ఆయన ఏమి చెప్పాడో దానివైపు చూడు. "నేను ఇంకనూ నొప్పిని కలిగియున్నాను" అంటే, అది దానితో చేయునది ఏదియు లేదు. దేవుడు ఏమి చేయమని చెప్పాడో అది నీవు చేశావు. చూడు, దానివైపు చూడవద్దు. ఆయన ఏమి చెప్పాడో దానివైపు చూడు. అది అలా జరుగుతుందని దేవుడు చెప్పాడు। నేను దానిని నమ్ముతాను. నీవు నమ్మవా? (సమాజము, "ఆమేన్" చెప్పింది - సంపా.) నా హృదయమంతటితో, నేను నమ్ముతాను.
192 మరలా నేను మిమ్మును చూచువరకు, ప్రభువైన దేవుడు మిమ్మును దీవించునుగాక. మీ కొరకు నా ప్రార్థనలు ఉన్నాయి; రాత్రి ఎంతో చీకటి కాదు, వర్షము ఎంతో కఠినముగా పడదు. నేను మీ కొరకు ప్రార్ధన చేస్తాను. మీరు నాకొరకు ప్రార్థన చెయ్యండి. మనము తిరిగి కలుసుకొను వరకు, ప్రభువు మిమ్మును దీవించునుగాక, ఇప్పుడు కాపరిగా పనిచేయుచున్న సోదరుడు, చూడండి.