మేము ఆయనను కనుగొంటిమి, వచ్చి చూడుము
రీడ్ సోదరుడా నీకు వందనములు. ఈ రాత్రి ఇంకనూ కొంచెము గొంతు బొంగురుగా ఉండుటను బట్టి క్షమించండి, అయితే నేను చాలా గట్టిగా బోధింస్తానని తలస్తున్నాను. కాని మొట్టమొదటిసారి, అనేక సంవత్సరముల తరువాత అట్టి రీతిగా మాట్లాడుటకు నేను ప్రయత్నించితిని, అని నేను ఊహిస్తున్నాను. అయితే మన ప్రభువుకు సమస్త విషయములు తెలియును, కావున ఆయన సమస్తమును మంచి కొరకే చేయును, ఆయన చేయడా?
ఈ రాత్రి నా యొక్క స్థలములో రీడ్ సోదరుడు మాట్లాడగలిగితే నేను సంతోషించెదెను. మరియు ఇప్పుడు, మీరందరు కూడా ప్రార్ధనలో ఎక్కువగా ఉ౦డవలెనని మేము కోరుచున్నాము. మీరందరూ వచ్చినందుకు సంతోషము. మన ప్రభువును ప్రేమించుచున్నారు అని అది చూపించుచున్నది, లేక ఇట్టి రకమైన వర్షాకాలపు రాత్రి ఇచ్చట మీరు ఇలా ఉండలేరు. మరియు కొంతమంది ప్రజలు బయట నిలువబడియున్నారు. కావున వారు ప్రభువును ప్రేమించుచున్నారని అది చూపించుచున్నది. మరియు అట్టి రీతిగా ప్రభువును సేవించవలెనని ప్రజల యొక్క హృదయములకు కోరిక వచ్చినపుడు, నిశ్చయముగా దేవుడు వారిని మరచిపోడు. దేవుడు నిశ్చయముగా వారిని దీవిస్తాడు. కనుక ఈ రాత్రి నేను నమ్ముచున్నదేమనగా, ఈ రాత్రి ఒక గొప్ప రాత్రిగా ఉండబోవుచున్నది, అని నేను నమ్ముచున్నాను, మీలో ఎవరైతే రోగులుగాను మరియు బాధపడుతూ ఉన్నారో వారందరు కూడా ప్రభువైన యేసుక్రీస్తులో విడుదలను కనుగొందురు.
2
రీడ్ సోదరుడా, మీకు వందనములు. నా గొంతును బొంగురు పోయేటట్లుగా చేసిన ఒక ముఖ్య విషయమును నేను కనుగొంటిని. మరియు నేను ఇదివరకే దానిని చెప్పగలను. నేను దీనిని కూడా చెప్పియుండవచ్చు: అదేమనగా అచ్చట ఆ వెనుకనున్నటువంటి ఫ్యాన్ మూలముగా. నాకు అది అలవాటు లేదు. సాధారణముగా నేను కలిగియున్న బట్టతలను ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు... బట్టతల కలిగి ఉన్న ఒక మనిషి సాధారణముగా వాస్తవమైన గట్టి పుర్రెను కలిగి ఉ౦టాడు, చర్మము యొక్క రంధ్రములు మూయబడును.
ఒక మంగళివాడు ఒక రకమైన పదార్ధమును నా తల మీదకి పోశాడు, దానివలన నా యొక్క జుట్టు ఊడిపోయినది, కనుక నా యొక్క... చూచారా,నా యొక్క మృదువైన చర్మము అది ఎంత మృదువుగా ఉండునో అంత మృదువైనది, మరియు ఆ రంధ్రములు అన్నియూ అక్కడ ఉన్నవి. చెమట పట్టే ఒక తక్కువ స్థాయి కూడా, ఓ, మై. అది నాకు వేగముగా వచ్చినది. నా తలలో ఉన్నటువంటి చుండ్రును దానినంతటిని బయటకు తీసివేయడానికి ఆ మంగళివాడు ఒక రకమైన పదార్ధమును నా తలపైన పోశాడు. అతడు అలా చేశాడు. అయితే దానితో నా జుట్టు కూడా ఊడిపోయింది. కావున ఆ యొక్క రంధ్రములు మూసుకుపోయినచో, సహజముగా అనగా ప్రకృతి చేసిన రీతిగా, అది నన్ను కలవరపరచదు. అయితే నాకు అలా జరగలేదు. ఆ యొక్క రంధ్రములు అలాగే అచ్చట ఉండిపోయినవి.
కావున ఎవరో చెప్పిరి, “మంచిది, మీరు ఒక రకమైన థామస్ వ్యవస్థకు వెళ్ళినచో, లేక అటువంటిది చేసినచో, వారు నీకు ఒక చికిత్సను ఇస్తారు.”
నేను చెప్పాను, “అవును, ఇప్పుడు నేను చాలా రకములైన చికిత్సలను పొందియున్నాను”
3
కావున ఇది అంతయూ సరియే. కావున గతరాత్రి నేను కనుగొంటిని... కొంతమట్టుకు అలాగే నిలువబడి ఉంటుండగా మరియు ఆ యొక్క అభిషేకము మీదకు దిగివచ్చినపుడు తన పై ఉన్న ఆ యొక్క భారమును ఏ వ్యక్తి కూడా ఎరుగలేడు. ప్రతీ ఒక్క కండరము, నేను ఇక్కడ నిలువబడి, నా యొక్క బూట్లులోనున్న సాక్సులు కూడా చెమట పట్టి తడిచినవి, నేను అలాగే నిలువబడియున్నాను. అట్టిరకమైన భారంతో మీరుంటారు; ప్రతీ రాత్రి, నేను ఇంటికి వెళ్ళినప్పుడు, అలవాటుగా నేను స్నానపు గదిలో షవర్ క్రింద చాలాసేపు నిలబడి వుంటాను. భావనను వెనుక మరలా పొందుటకు అలా వుంటాను. కొంచెము ఒక భయంకరమైన అలసట గుండా వెళ్లాను. దానిని అర్థము చేసుకొనుట ఒక రకముగా కష్టమే. మనము దానిని అర్థము చేసుకొనలేము. మనము దానిని కేవలం నమ్మవలసియున్నాము.
అంతే దేవుడు అర్థము చేసుకొనుటకు కాదు, ఆయనను నమ్మవలసియున్నాము. మనము దానిని అర్థము చేసుకొనలేము. మనము కేవలము దానిని నమ్మెదము.
4
ప్రియ ప్రజలైన మీతో వుండుటకు, మా కార్యాచరణ జాబితా ప్రకారముగా మాకు ఇంకా రెండు రాత్రులు మాత్రమే వున్నవి. సోమవారం రాత్రికి చాలా కష్టముగా వుంటుందని నాకు తెలియును. మరియు బహుశా రేపటి రాత్రికి, ప్రభువు చిత్తమైనచో, మీ కొరకు మాట్లాడగలనని నేను నిరీక్షిస్తున్నాను. ఈ రాత్రి నేను మీకు ఒక లేఖనాన్ని చదువాలని ఆశిస్తున్నాను. మరియు ఆ యొక్క లేఖనములో, మీరు చాలా జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. దానిని మనము పరిశుద్ధ యోహాను సువార్త 1వ అధ్యాయము. 44వ వచనము నుండి ప్రారంభము.
“ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడుడు.
పిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరినిగూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.
అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా అని అతనినడుగగా వచ్చిచూడుమని ఫిలిప్పు అతనితో అనెను.
యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి - ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను.
నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు - ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.
నతానియేలు - బోధకుడా, నీవు దేవుని కుమారుడవు; ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.
5
ప్రార్థన కొరకు ఒక్క క్షణం మన, తలలు వంచెదమా.
మా తండ్రీ, విశ్వాసులమైన పిల్లలుగా, దేవునిని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడు వారికి సమస్తమునూ మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని నీ వాక్యములో మేమెరిగి యున్నాము. ఇప్పుడు ఇచ్చట ఈ రాత్రి మేము నిన్ను మహిమపర్చడానికి తప్ప మరి ఏ ఇతర ఉద్దేశ్యము నిమిత్తమునూ మేము కూడుకోలేదు, మరియు పాపులు నిన్ను వెదికే లాగున, మరియు వారు మిమ్ములను పిలిచే లాగున, అది బహుశా, పాపం నుండి వారిని రక్షించుటకు వారి మీద మీరు కనికరము చూపించగలరు. అదియే మా యొక్క మొట్టమొదటి ఉద్దేశ్యము.
ఇక రెండవదిగా, మీకు చెందిన అనేక మంది పిల్లలు రోగులుగాను మరియు బలహీనులుగాను వున్నారు. చాలామంది ఎంతో నిరుత్సాహంగా అవసరతతోనున్నారు. ఈ రాత్రి ఇచ్చట కొంతమంది, నిస్సందేహంగా, హృద్రోగ వ్యాధిగ్రస్తులు, కేన్సర్, క్షయ మొదలగు వారు వారిని విడిపించుటకు మీరు రానిచో, వారు శీఘ్రంగా మరణిస్తారు. మీ సేవకులైన, వైద్యులు, వారు చేయగలిగినదంతా చేశారు. అయితే దానిని వారు నిలుపు చేయలేక పోయారు. ఆ యొక్క అరణ్యములో ఇత్తడి సర్పము పైకి ఎత్తబడినట్లుగా ఎత్తబడవలెను, మోషే ఐగుప్తీయుల యొక్క జ్ఞానమంతటినీ నేర్చుకున్నప్పటికీ...అద్భుతమైన వైద్యులు.
6
అయితే సర్పము అనేది బహు కారణముల నిమిత్తము ఎత్తబడినది, వారు క్షమింపబడటానికి మరియు స్వస్థత పొందుకొనడానికి కూడా. కావున ప్రభువా, ఈ రాత్రి మాకు సహాయం చేయండి. మీరిచ్చట భూమి మీద చెప్పినరీతిగా, “మోషే ఆ ఇత్తడి సర్పమును ఎత్తిన రీతిగా,” అదేరీతిగా: మనుష్యకుమారుడు కూడా ఎత్తబడవలసియున్నది; అదే కారణము: పాపక్షమాపణ కొరకు, శరీరము యొక్క స్వస్థత కొరకు. పిమ్మట సర్పము ఒక ఛాయగా ఉండి దానిలో అది స్వస్థతను కలిగి వున్నప్పుడు, దానికి వ్యతిరేక మాదిరి (ప్రభువైన యేసు సిలువ మరణం - సంపా) ఇంకెంత గొప్ప కార్యమును చేస్తుంది: రక్షణ మరియు స్వస్థత అనే రెండు కూడానూ.
మీరు చెప్పారు, “మోషే చేసినట్లుగా, నేను కూడా అలానే,” ఆ విషయమును ప్రజలకు చెప్పుటకు మేము ప్రయత్నించుచున్నాము.
మరియు ఇప్పుడు, మీరు సంఘములోనికి కొంతమందిని పంపించియున్నారు, మొదటగా అపొస్తలులను, రెండవదిగా ప్రవక్తలను, స్వస్థతా వరాలను, అద్భుత కార్యాలను, ఉపదేశకులను, చాలా ఇతర అద్భుతమైన వరాలను, అది మీరు... మీరు పైకి ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి, మనుష్యులకు ఈవులను అనుగ్రహించారు. మరియు ప్రభువా, మేము వందనస్తులము, సంఘంలోనికి ఈ యొక్క వరములను, ఈ రోజులలో మరలా పునరుద్ధరించడానికి మీరు చాలిన వారుగానున్నారు. నోవహు దినాల వలే, మేము ఈ యొక్క అవిశ్వాసపు విద్యా ప్రపంచానికి, దాని నాశనానికి ముందు కారణంగా వున్నామేమో. ఎంత తెలివైన వారు. ఆ యొక్క పిరమిడ్లు ఎలా నిర్మించగలిగినప్పటికీ, స్పింక్స్, నేటికీ భద్రంగా సహజంగా శవాలను వుంచునట్లుగా చేయుట, గొప్ప విషయాలను వారు చేయగలరు, తెలివిగా. అయితే నమ్మువారిని అమాయకపు బోధ ద్వారా నీవు రక్షించావు.
దేవా, ఈ రాత్రి కనికరము చూపించండి, విశ్వాసపు గృహములను రక్షించుటకు ప్రతీ పరికరంతో పనిచేయుటకు సహాయం చేయండి. ఎందుకనగా మేము నీ ప్రియ బిడ్డ అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్.
(వ్యాధి గ్రస్తుల కొరకు ఇక్కడ ఉన్న చేతిరుమాళ్ళు...)
7
ఈ రాత్రి నేను మాట్లాడలేనప్పటికిని కొద్దిగా మీరు మీ యొక్క మనసును నేను చెప్పే దానిపై ఉంచవలెనని నేను మిమ్ములను పిలుచుటకు ఇష్టపడుచున్నాను, అయితే నజరేయుడైన యేసును చూచుటకు వచ్చిన భక్తి కలిగిన వ్యక్తిని గూర్చి కొన్ని విషయముల మీద మీరు మనసు ఉంచవలెనని నేను చెప్పుచున్నాను. ఫిలిప్పు నతానియేలును కనుగొనినప్పుడు, ఫిలిప్పు మార్పుచెందిన వెంటనే మరియు యేసు చేసిన దానిని చూచియున్నప్పుడు, అది యేసు యొక్క పరిచర్య ప్రారంభ దినాలు. మరియు ఆయన చేయువాటిని అతడు చూచినప్పుడు, తన యొక్క స్నేహితుని కనుగొనాలని అతడు ఆతురతపడ్డాడు. ఇప్పుడు, అది నేటి దినము ఏమైయున్నదో వాటియొక్క సామాన్య సత్యముగా లేదా మనము యేసుక్రీస్తును కనుగొనినప్పుడు, మనము మన యొక్క స్నేహితులకు దానిని చెప్పవలెనని ఇష్టపడెదము.
ఈ యొక్క భవనము వెనుకాల ఉన్న మీరందరూ సరిగ్గా నా మాటలు మీరు వినుచున్నారా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఈ మైకు ద్వారా మీరు, నా మాటలు వినగలుగుచున్నారా? మీకు వందనములు. అచ్చట ఉన్న మీరు నా మాటలు సరిగ్గా వినగలుగుచున్నారా? మీకు వందనములు. మీకు వందనములు.
మరియు అతడు తన యొక్క స్నేహితుడి వద్దకు వెళ్లినప్పుడు, తన యొక్క స్నేహితుడు దేవునిలో విశ్వాసి. అతడు భక్తిగలవాడు, చాలా అద్భుతమైన సంస్కారవంతుడు నతానియేలు. యేసు అతనిని కనుగొనినప్పుడు దానిని నిశ్చయము ప్రకటించాడు. కాని, అతడు చెప్పెను, “యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసును నేను కనుగొనియున్నాను గనుక నీవును వచ్చి చూడుము.”
8
ఎందుకు, నతానియేలు ఆ యొక్క నజరేతు ఎంత కలుషిత నగరము, దొంగలతో నిండియున్నది, దోపిడీ గాళ్ళతో, అని ఎరిగి, అతడు చెప్పెను, “నజరేతు నుండి మంచిదేదైననూ రాగలదా?”
అతడు చెప్పెను, “వచ్చి, చూడుము.” ఇంకో మాటలో చెప్పాలంటే, “వచ్చి నీకు నీవే చూడుము.” అదియే ఉన్నతమైన మార్గము. మరియు నేను తలస్తున్నాను, ఏ మనిషియైనా సరే, దేవునిని సమీపించుచున్నచో, అనగా మోషే తన యొక్క చెప్పులు విడిచిపెట్టి వెళ్ళినట్లుగా, అది ఏమైనప్పటికీ, గౌరవముగా...
9
స్నేహితులారా, ఈ రాత్రి, లేక ఈ దినము ఏ వ్యక్తియైననూ వచ్చినచో, దేవుని ముందు గౌరవముతో, మరియు చెప్పును, దేవా, “నేను ఇప్పుడు నా యొక్క ఏ విధమైన తలంపులను తీసుకొనుట లేదు; నేను నా యొక్క హృదయమును నీకు తెరచుచున్నాను. మరియు నిన్నునీవు నాకు బయలుపరుచుకొనుము. నేను చూడవలెనని ఆశిస్తున్నాను,” అని నేను నమ్ముచున్నాను. ఆయనను వెదకుచున్న ప్రజలకు దేవుడు తనను తాను బయలుపరుచుకొంటాడని నేను నమ్ముచున్నాను. ఆయన ఎవరిని ఎన్నడూ నిరాశపరచడు. మరియు పిమ్మట, మీరు ఈ యొక్క ఇద్దరు స్నేహితులు కలసి వెళ్ళటం గమనించగలరా?
నేను వినగలను, బహుశా, అనగా ఫిలిప్పు నతానియేలుతో ఇలా చెప్పుటను గూర్చి, “ఇప్పుడు, నతానియేలు చూడుము, ఈ యొక్క మనిషి అచ్చట ఇప్పుడు పడియున్న రోగుల గూర్చి ప్రార్థించుచున్నాడు.” యేసు, ఆయన యొక్క కీర్తి అప్పటికీ ఇంకనూ దేశమంతటికి గొప్పగా ప్రచారము కాలేదు. ఆయన అప్పుడు బయటకు వెళ్ళుట ప్రారంభించాడు. మరియు ఆయన ఒక గొప్ప వ్యక్తిగా తనను గూర్చి తాను చెప్పుకొనలేదు. ఆయన మహిమనంతటినీ దేవునికిచ్చాడు.
10
ఆయన చెప్పిను, “ఈ క్రియలు నాయంతట నేనే చేయుట లేదు; నాలో నివసించు నా తండ్రియే వాటిని చేయుచున్నాడు, ఆయనే వీటిని చేయుచున్నాడు.” మరియు ఆయన చెప్పెను, “ఇప్పుడు...” మీరు ఆయనను గమనించినచో, ఆయన చాలా దీనమైనవాడు, మరియు బాధను అనుభవించువానిగా దయగలవానిగా నున్నాడు. అతడు ఏ విధమైన యోగ్యతను కలిగియున్నవానిగా చెప్పుకొనలేదు. అయితే ఆయన యొక్క సామాన్యమైన బోధ ఆ దినపు పరిసయ్యులను మరియు పండితులను కలవరపరిచాయి, ఎందుకనగా వారు కేవలము వేదాంత శాస్త్రము నుండి మాత్రమే బోధించేవారు; అయితే యేసు దేవునితో కృప పొందుకొనిన యోగ్యుడిగా అనగా ఆయన చెప్పిన వాటిని నిశ్చయము చేసినట్లుగా ఉండేవి. ఇప్పుడు, అచ్చటే సత్యమున్నది ఒక మనిషి ఫలానా దానిని చెప్పినప్పుడు, దేవుడు దానికి మద్దతునిచ్చుచున్నాడు.
మరియు చివరిగా యేసు ఆ యొక్క ప్రార్థనా వరుసలో నిలవబడినప్పుడు అతడు అచ్చటకు వచ్చాడు... ఇచ్చట మనము ఒక చిన్న నాటకము వలే చెప్పుకొందాము, చెప్పాడు, యేసు రోగుల కొరకు ప్రార్థించుచున్నాడు. చాలా మంది అచ్చటకు వచ్చుచున్నారు, మరియు ఆయన ప్రార్థించుచున్నాడు. నతానియేలు ఆ యొక్క ప్రార్థనా వరుస గుండా వస్తూ ఉండటము ఆయన చూసాడు. మరియు ఆయన చెప్పెను, “ఇదిగో, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు మరియు ఇతనిలో ఏ కపటమును లేదు.”
నేను దానిని వ్యక్తీకరించినచో... నేను దానిని త్రిప్పి చెప్పెదను, ఇచ్చట నిలువబడియున్న ఈ మనుష్యుడు,“ నేను అతనిని ఎన్నడూ చూడనిచో, నేను ఇలా చెప్తాను, ”ఇతడు ఒక నిజాయితీపరుడు, ఒక నమ్మకమైన క్రైస్తవ విశ్వాసి.“
11
మంచిది, ఇశ్రాయేలీయుడైన నతానియేలు, అటువంటిది ఆయనను ఆశ్చర్యపరచినది. అతడు వెనుతిరిగి అతడి వైపు చూచాడు. అతడు అడిగెను “రబ్బీ, లేక బోధకుడా, నీవు నన్ను ఎప్పుడు ఎరిగియున్నావు? ”రబ్బీ“ అనగా ”బోధకుడు,“ లేక ”ఉపదేశకుడు,“ అని అర్థము. నేడు మనము చెప్పుచున్న రీతిగా, అనగా రెవరెండ్ లేక సంఘ పెద్ద లేక అలాంటిది. ”రబ్బీ, నీవు నన్నెప్పుడు ఎరిగియుంటివి?“ లేక, ”నేను ఇచ్చట నీకు ఒక కొత్త వ్యక్తిని కదా. నేను ఒక విశ్వాసినని నీవెలా ఎరిగియున్నావు? నేను అట్టి వ్యక్తినని నీకెలా తెలియును... (మనము నేడు చెప్పిన రీతిగా) ఒక క్రైస్తవుడనని.“
ఎందుకు, యేసు చెప్పెను, “నతానియేలు నిన్ను పిలువక మునుపే, లేక నీవు ప్రార్థనా సభకు రాకమునుపే, నేను నిన్ను ఆ యొక్క అంజూరపు చెట్టు క్రింద చూచితిని.”
12
ఇప్పుడు, మనము నేటి మాటలతో చూద్దాము. ఇప్పుడు, నేటి పండితుడు ఏమి చెప్పును? “మంచిది, ఆ మనిషి మనసులను చదివే వ్యక్తి? అది యొక మానసిక శాస్త్రము,” లేక అట్టి రకమైన వేరే పేరు కలది. మరియు వారు ఆ దినమున ఏ విధమైన యోగ్యమైనదియూ చేయలేకపోయారు. వారు ఆయన మీద అదే విషయమును మోపారు. వారు చెప్పారు, “ఇతడు భవిష్యత్తును గూర్చి చెప్పే ముఖ్యులలో ఒకడైన బయెల్జేబూబు లేక దయ్యముల,” మీకు తెలుసు.
అయితే నతానియేలు అట్టివాడు కాదు నతానియేలు ఒక నీతిమంతుడు. అతడు ఎన్నడూ కలుసుకొనని ఒక దానిని కలుసుకొని అచ్చట ఏదో ఒక విషయమున్నదని ఎరిగినప్పుడు, అతడు చెప్పెను, “నీవు జీవముగల దేవుని కుమారుడవైన క్రీస్తువు.” అతడు ఆయన యెదుట సాగిలపడెను.
“ఎందుకు” ఆయన చెప్పెను, “నతానియేలూ, నీవు ఆ యొక్క వృక్షము క్రింద వున్నావని నేను చెప్పినందుకు నీవు నన్ను నమ్ముచున్నావా? ఎందుకు,” ఆయన చెప్పెను, “వీటికంటే మరి గొప్ప కార్యములు నీవు చూచెదవు.”
మరియు యేసు ఆయన యొక్క పరిచర్య అంతటిలో, ఆయన తానెన్నడూ తనకు తాను హెచ్చించుకొనలేదు, ఆయన ఏదో ఒక గొప్పవాడనని తనకు తానుగా చెప్పుకొనలేదు. ఆయన ఎల్లప్పుడూ ఆయనను సృష్టించిన సృష్టికర్తనే మహిమపరిచాడు.
13
ఇప్పుడు, శరీరధారియైన యేసు దైవమైయున్నాడు. దేవుడు ఒక కన్యకను ఆవరించి మరియు ఒక రక్త కణాన్ని సృష్టించాడు. మనందరికి తెలియును, బిడ్డ లేక... పురుషుని యొక్క కణాల నుండి వచ్చును, జీవకణమేదైనా సరే, మగవాని నుండియే వచ్చును. అనగా ఒక కోడి ఒక గ్రుడ్డును పెట్టగలదు గాని అది మగ పుంజుతో లేనిచో, దానిని అది పొదగలేదు. ఒక ప్రాచీన తల్లి పక్షి తన గూడు నిండా గుడ్లను పెట్టగలదు, ఇది పొదిగే కాలము; అయితే అది మగ పక్షితో లేనిచో, అవి ఫలవంతము కాలేవు. అవి ఎన్నడూ పొదగలేవు, ఆమె వాటి మీద ఎంత వెచ్చదనము చేసినా సరే, వాటి మీద ఆడినా సరే. ఆమె ఆ యొక్క గూడు మీద అలావుంటూ అతి దీనమైన స్థితిలోనికి వచ్చేంత వరకు ఉండి పిమ్మట దూరముగా ఎగిరిపోవును. అయితే అవి పొదగబడవు; అవి కుళ్ళిపోతాయి.
స్నేహితులారా, ఈ యొక్క అనేకమైన సంఘములన్నియూ కూడా నేడు అలాగేవున్నవని నేను తలంచుచున్నాను. మనము గూడును సంపూర్ణముగా గుడ్లతో కలిగియున్నాము, అయితే అవి ఎన్నడూ జీవమునకు రాలేకపోయినవి. వాటిని కేవలము మనము వేడి చేస్తున్నాము మరియు సంఘ సభ్యులను మరియు విషయములను పిలుస్తున్నాము. మనము ఆ యొక్క గూడును శుభ్రపరిచి మరియు మరలా ప్రారంభించాలి, మీరు అలా తలంచుటలేదా?
14
మీరు యేసుక్రీస్తు అనే జతపురుషునితో కలవనిచో మరియు సహజాతీతముగా మీరు జన్మించనిచో, నీవు సహజాతీతమైన దానిని నమ్మలేవు. మరియు ఒక మనిషి దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మించినచో, దేవుడు ఒక సృష్టికర్తయైయున్నాడు. మరియు దేవుని యొక్క కొంత భాగము... నేను మా నాన్నగారైన చార్లెస్ బ్రెన్హాంలో ఒక భాగాన్ని. అతడు నా యొక్క తండ్రి. అతడు నాలాగే కనిపిస్తాడు లేక నేను అతడి లాగా కనిపిస్తాను. మేమిద్దరము కూడా ఒకే రకమైన ఆకారము కలిగియుంటాము. మరియు అనేకమైన లక్షణాలలో పోలికలుంటాయి, ఎందుకనగా నేను అతని యొక్క సంతానమును. మరియు అదే రీతిగా నా యొక్క ఆత్మలో దేవుని యొక్క సంతానముగా నేను మారినచో అప్పుడు నా యొక్క ఆత్మ కూడా దేవుని యొక్క క్రమములో ఉంటుంది. అది సహజాతీతమైన దానిని నమ్ముతుంది. అది దేనినైనా నమ్ముతుంది. నా భావాన్ని మీరు చూచారా?
“సమస్త విషయములను నమ్ముతుంది, సమస్త విషయములను నిరీక్షిస్తుంది,” చూచారా. మంచిది. పిమ్మట ఒక మనిషి అతడెన్నడైననూ దేవునిని కలిస్తే మరియు నిజముగా తిరిగి-జన్మించినచో, అతనితో నీవు దైవిక స్వస్థత గూర్చి మాట్లాడుము, నిశ్చయముగా, అతడు దానిని నమ్ముతాడు. నిశ్చయముగా. “నీవు అద్భుతములయందు నమ్మిక కలిగియున్నావా?”
“నిశ్చయముగా.” చూచారా, అతడు దేవుని యొక్క భాగమైయున్నాడు, దేవునితో ఏదైననూ జరుగగలదని అతడు నమ్ముతాడు, చూచారా. మరియు అతడు ఒక మూఢభక్తి పరుడిగా ఉండలేడు.
15
అయితే వేదాంతమును కలిగియున్న ఒక వ్యక్తి, మంచిది, అతడు చెప్తాడు, “ఓ, అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవని నేను నమ్ముతున్నాను.” అతడు దానిని ఒక రకమైన పెద్ద కాలువ గొట్టము ద్వారా దానిని తన యొక్క పొలములోనికి పరుగెత్తేటట్లుగా బయటకు తోసివేస్తాడు. అతడు దానిని కోరుకొనుట లేదు. ఎంత దయనీయమైన పరిస్థితి.
మంచిది, దేవుడు చెప్పెను, మనము వాటిని కలిగియుండెదము, మరియు వాటిని పొందుతున్నాము. దానిని ఆపజాలము; వాటిని మనము కలిగియుండెదమని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. కావున వారు ఇచ్చటనున్నారు, చాలా మంది మనలను లెక్కించలేదు. మీరు గమనించినచో, యేసు ఇచ్చట ఉన్నప్పుడు, వారు ఆయనను ఒక మూఢభక్తిపరుడని పిలిచిరి, మరియు ఆయనని పిచ్చివాడని పిలిచిరి, మరియు ఆయనను ఒక దయ్యమని పిలిచిరి. ఎందుకని, ఆయన చెప్పెను, “వారు ఇంటి యజమానుడనే బయెల్జేబూబు అని పిలిచినప్పుడు, ఆయన యొక్క శిష్యులను మరి ఎంత ఎక్కువగా పిలిచెదరు?” అయితే ఆయన అలా కొనసాగుచున్నప్పుడు ఆయన యొక్క జీవితాన్ని గమనించండి.
ఆయన ఒక నాడు బావి యొద్ద ఉన్న ఒక స్త్రీతో మాట్లాడెను. ఆమె యొక్క సమస్య ఏమిటో ఆయన ఆమెకు చెప్పెను. ఆమె వెళ్ళి మరియు వేరొకరికి చెప్పియున్నది, ఆమె దేనినైతే చూచినదో దానిని, అప్పుడు ఆ పట్టణమంతా కూడా దేవుని యొద్దకు రావటానికి ఆమె కారణమైనది. ఫిలిప్పు అదే నగరమునకు వెళ్ళియున్నాడు, వారికి బాప్తిస్మమిచ్చాడు, మరియు వారు ఒక అద్భుతమైన సమయాన్ని కలిగియున్నారు.
ఆయనను గమనించండి!
16
బేతెస్థ యొక్క కోనేరు గుండా ఆయన వెళ్ళటము నేను చూడగలను; అంగహీనులు, కుంటివారు, వంకరలు తిరిగినవారు, గ్రుడ్డివారు, అట్టి ప్రజలు అచ్చట పడియున్నారు. ఆయన నేరుగా ఆ యొక్క జనసమూహము గుండా నడిచి వెళ్ళాడు, అచ్చట ఒక మనిషి ఒక మధుమేహ వ్యాధితో లేక అట్టి రకమైన ఏదో ఒక వ్యాధితో పడియుండుట చూచేంత వరకు వెళ్ళాడు, అది అతడిని గాయపర్చలేదు. అతడు దానిని ముప్పై-ఎనిమిది సంవత్సరములుగా కలిగియున్నాడు. ఆయన ఆ మనిషిని బాగుచేసి ముందుకు వెళ్ళాడు.
ఎందుకని, యూదులు ఆయనను ప్రశ్నించారు, (యోహాను సువార్త 5:19.) ఆయన చెప్పెను, “నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. ఆయన ఈ మనిషి యొక్క స్వస్థత కన్నా గొప్పదానిని ఆయన మీకు చూపించును అప్పుడు మీరు ఆశ్చర్యపోవుదురు.” నా భావమును మీరు గ్రహించారా? ఇప్పుడు, ఆయన చెప్పెను, “నేను చేయు కార్యములు, మరి కొంత కాలము పిమ్మట.” చాలా జాగ్రత్తగా వినండి, “మరి కొంతకాలమైన పిమ్మట లోకము నన్నెంత మాత్రము చూడనేరదు. అయినప్పటికీ మీరు నన్ను చూస్తారు.” ఎవరు? విశ్వాసులు! “మీరు నన్ను చూచెదరు...” అది మాత్రమేనా? లేదు. “మీరు నన్ను చూచెదరు, ఎందుకనగా నేను మీతోనుందును, ఈ యుగసమాప్తి వరకు మీలో కూడా ఉందును.” అదే యేసు.
17
మరియు నేను, ఆయన యొక్క సేవకునిగా, మరియు మీరు ఆయన యొక్క సేవకులుగా, మరియు మనము సహోదరీ మరియు సహోదరులముగా దేవుని యొక్క సంతానముగా, మరియు నేను మీకు ప్రకటిస్తున్నదేమనగా, యేసుక్రీస్తు ఈ రాత్రి ఈ యొక్క భవంతిలోయున్నాడు. ఎమ్మాయికు వెళ్ళిన, ఆ యొక్క శిష్యుల హృదయాలలో ఉన్న ఆనందాన్ని మీరు ఊహించుకోగలరా, ఆయనతో ఆ రోజంతా మాట్లాడిన తరువాత మరియు ఇంకా వారాయనను గుర్తుపట్టలేకపోయారు? పిమ్మట అకస్మాత్తుగా, ఆయన ఏదో ఒకటి చేయుట ద్వారా వారికి తనను తాను తెలియపర్చుకొన్నాడు, ఆ మార్గము గుండానే ఆయన దానిని చేసెను. మరియు వారు సంతోషించి ఆనందించిరి. వారు కలిగియున్న ఆనందమును మీరు ఊహించగలరా, ఆ యొక్క అద్భుతమైన ఈస్టర్ ఉత్సవ సమయాన పునరుత్థానుడైన క్రీస్తుతో నివసించుట?
మీరు ఈ రాత్రి అట్టి స్థితిలో లేనిచో, మీరు దేవుడు మీకు అనుగ్రహించిన సదవకాశము క్రిందనే జీవిస్తున్నారు. ఆ యొక్క అపొస్తలులందరూ కలిగియున్నటువంటి సంపూర్ణ ఆశీర్వాదమును ఆనందించుటకు మీరు ఈ రాత్రి హక్కును కలిగియున్నారు. ఆ యొక్క ఆది సంఘములో ఉన్నదంతయూ సంఘములో మరలా ఉండవలసియున్నది, ఎందుకనగా సంఘములో ఉన్నదంతయూ యేసుక్రీస్తే. మరియు ఆయన తన యొక్క వాక్యమును వాగ్దానము చేసెను. మరియు మీరు ఇచ్చట చూస్తున్న విషయములు, అనగా రాత్రి వెంబడి రాత్రి జరగుచున్నటువంటివి, ఇవన్నియూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పలుకబడినవి నెరవేరుచున్నవి. “నేను మీతో ఉందును, యుగ సమాప్తి వరకు మీలో కూడా ఉందును. మరియు నేను చేయు క్రియలు మీరునూ చేయుదురు. మీరు దీనిని నమ్ముచున్నారా?”
మీరు ఇది సత్యమని నమ్ముచున్నారా? మనము చిన్న ప్రార్ధన కొరకు మన తలలు వంచెదము.
18
జీవమునకు గొప్ప అధికారి, మీ యొక్క కుమారుడైన యేసు యొక్క నామములో మేము సమీపిస్తున్నాము, మీ వాక్యము కొరకు వందనములు చెల్లించుటకు వచ్చియున్నాము. వారు అపొస్తలులుగా మారక మునుపు ఆ యొక్క అపొస్తలులను గూర్చి మేము ఆలోచించగలము: జెబెదయ కుమారులైన పేతురు మరియు అంద్రెయులు ఒక రాత్రి యందు చేపలు పడుతూవున్నారు, మరియు వారు ఆ రాత్రంతయూ శ్రమించి మరియు ఏమియూ పట్టలేకపోయారు, సముద్రపు ఒడ్డున కూర్చొని వారి యొక్క వలలను శుభ్రపరుచుకొనుచున్నారు, ఎంతో నిరాశ పడిపోయారు. పిమ్మట వారు చూచారు, ఆ యొక్క సముద్రపు ఒడ్డునకు ఎవరో వచ్చుచున్నారు మరియు అచ్చటకి ఒక ప్రేమ గల వ్యక్తి వచ్చుచున్నాడు, ఆయనను కొంతమంది వెంబడించుచున్నారు.
స్త్రీలు వారి యొక్క ఇంటి పనులు మానుకొని రావటాన్ని నేను చూడగలను, పురుషులు వారి యొక్క పశువులను పొలములో విడిచి పెట్టి రావటం, అనగా ఆయన చెప్పిన దానిని వినటానికి గలిలయ సముద్రపు ఒడ్డునకు వచ్చిరి. ఆయనను గూర్చి ఏదో ఒక వ్యత్యాసమైనది ఉన్నది. అది ఏమనగా ఆయన దేవుని నుండి అధికారమును కలిగియున్నాడు.
మరియు ఆయన మాట్లాడిన తరువాత, ఆయన వారి యొక్క దోనెలలో ఒక దానిని అద్దెకు తీసుకొనియున్నాడు, ఎందుకనగా దానిని ఆయన తన యొక్క ప్రసంగ వేదికగా ఉపయోగించుకొనియున్నాడు, ఒక చిన్న ప్రాచీనమైన చేపల దోనెను ఆయన ఒక గొప్ప ప్రసంగ వేదికగా వాడుకొనియున్నాడు. అచ్చట ఆయన అనేకమైన జన సమూహములతో మాట్లాడియున్నాడు. పిమ్మట ఆ యొక్క దోనెను అద్దెకు తీసుకున్న తరువాత, ఆయన చెప్పెను, “సీమోను నీ యొక్క వలను ఇంకా లోనికి వేయుము. వలను లాగుము.”
19
“ఆ వలను గట్టిగా లాగుము? మేము ఇచ్చట రాత్రంతయూ లాగియున్నాము. అయినా సరే ఇచ్చట ఏమియూ దొరకలేదు. అయితే ప్రభువా, నీ మాట చొప్పున నేను మరలా వల వేయుదును.”
ఓ దేవా, అది అచ్చట వేసియున్నాను. “నీ మాట ప్రకారముగా, ప్రభువా. ఒకవేళ అచ్చట ఏమియూ లేకపోయినచో, దేవుని యొక్క వాక్యము అచ్చట ఏదో ఒక దానిని ఉంచుతుంది. అది సత్యమని మాకు తెలుసు, ప్రభువా. అచ్చట ఏమియూ లేనిచో నీవు చెప్పావు, నీవు మాట్లాడినది చేయకుండ ఉండవు. చాలామంది పురుషులు మరియు స్త్రీలు ఇచ్చట. ఈ రాత్రినున్నారు, ప్రభువా నిస్సందేహముగా వారు ప్రతీ ఆసుపత్రి గుండా వెళ్ళి వచ్చియున్నారు మరియు నగరములో గల ప్రతీ వైద్యుని యొద్దకు చుట్టూ తిరిగి వచ్చియున్నారు. సహాయము కొరకు ప్రయత్నిస్తూ వారు ప్రతీ చోటకూ వెళ్లారు. వారు రోగగ్రస్తులుగా వున్నారు, ప్రభువా, వారు చనిపోవుచున్నారు. వ్యాధి యొక్క దయ్యాలు వారి యొక్క జీవాన్ని తినివేయుచున్నవి. గుండె బాధలు వారిని చంపివేయుచున్నవి. వారు బొగ్గు శాలలోనికి వెళ్ళుచున్నారు. వారు బయట పొదలలోనున్నారు; వారు బలిపీఠమునొద్ద ఉన్నారు, ప్రార్థించుచున్నారు. వారి కొరకు ప్రార్థించుటకు వారు వారి యొక్క ప్రియమైన కాపరిని కలిగియున్నారు, వివిధ రకాలైన సేవకులను కలిగియున్నారు. అయితే ఇంకనూ, వారు స్వస్థత పొందుకొనినట్లుగా కనిపించుటలేదు.
20
అయితే వారు పేతురు వలే చెప్పునట్లుగా, ఈ సమయం వుండును గాక, “నీ మాట చొప్పున, ప్రభువా, నేను నా యొక్క వలను వేయుచున్నాను, నేను ఈ రాత్రి నిన్ను నమ్ముచున్నాను ఈ రాత్రే. ఈ సమయంలోనే, ఈ రాత్రి నుండి నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నా యొక్క అనురాగములను పైనున్న విషయాల పైనే వుంచుకుంటాను.” మా ఒప్పుకోలు మీద మీరు మా ప్రధానయాజకునిగా ఆయన యొక్క ఔన్నత్యపు కుడిపార్శ్వమున నిలువబడియున్నారని మీ వాక్యము చెప్పుదానిని మేమెరిగియున్నాము. నీవు చేసియున్నావని దేనినైతే మేము చెప్పుచున్నామో, అదియే నీవు చేయుదువు. అయితే మేము దానిని ఒప్పుకొనిచొ, మేము భయపడినట్లయితే, నీవు మాకు సహాయం చేయలేవు.“
కావున మేము ప్రార్థిస్తున్నాము, దేవా, నీవు ఇచ్చటనున్న ప్రతీ స్త్రీ మరియు పురుషుడు, అబ్బాయి లేక అమ్మాయి ఇచ్చట ఈ రాత్రికి వారికి మీరు ధైర్యమును, నిజమైన ఒప్పుకోలును, విశ్వాసమును అనుగ్రహించండి. అలా వారు అచ్చటకు చూచేలాగున మరియు దేవుని యొక్క కుమారుడు ఆయన యొక్క ఆధిపత్యములో, అచ్చట వుండుట వారు చూచేలాగున, ఆయన ఆత్మ యొక్క శక్తి, ఆయన సంఘంలో కదిలేటట్లుగా వున్నచో అప్పుడు వారు భయపడక చెప్తారు, “ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను, మరియు దానిని నమ్ముచున్నాను.” పిమ్మట నీవు ఆ యొక్క ప్రధానయాజకుడుగా వుంటావు, మేము దానిని ఇచ్చట ఒప్పుకొనినచో మీరు పరలోకములో దానిని ఒప్పుకోవడం ఆరంభిస్తారు. అయితే నీవు దీనిని చేశావని మేము చెప్పేంత వరకు, నీవు దానిని చేయజాలవు, ఎందుకనగా ఇది ఒక ఒప్పుకోలు, మరియు దాని అర్థమేమనగా, “అదే విషయమును చెప్పుట.” దానిని గూర్చి మీరేమి చెప్పియున్నారో, దానినే మేము చెప్పవలసియున్నాము. మేము ఇదివరకే స్వస్థత పొందియున్నాము, కావున దానిని మేము అంగీకరిస్తున్నాము. ఆ యొక్క గొప్ప దేవదూతను, గొప్ప నాయకుడను, ఈ రాత్రి మీ యొక్క సంఘమును సర్వ సత్యములోనికి నడిపించుటకు పరిశుద్ధాత్మను పంపుము,.
ప్రభువా, నేను ప్రజలకు ప్రాతినిధ్యము వహించుటకు ఇచ్చట వుంటుండగా, మీ యొక్క దీన, యోగ్యతలేని, అయోగ్యుడైన సేవకుడనైన నేను ఇక్కడ నిలువబడి యుండగా, నాకు సహాయం చెయ్యండి. క్రీస్తు నామములో నేను దీనినడుగుచున్నాను. ఆమేన్.
[టేపు పై విరామమున్నది.]
21
అప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు. అది నిజమే గదా? ఆయన చెప్పెను, “ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడుదురో,” ఎంత చిన్న గుంపు అయినను లెక్కలేదు, ఇద్దరు లేక ముగ్గురు, “వారి మధ్యలో నేను ఉందును.” వారు ఏది అడిగినను, అది అనుగ్రహించబడును. ఇప్పుడు, అది సరిగా ఉండవలెను లేక పొరపాటుగా అయినా ఉండవలెను.
యేసు చెప్పెను, “నాయందు మీరును, మీయందు నా మాటలను నిలచి ఉండినయెడల, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు ప్రార్థించినపుడు మీకేది కావలెనని కోరెదరో, అవి కలిగినవని నమ్ముడి.” అయితే ఇప్పుడు వాక్యము యొక్క క్రమమును గమనించండి. ఇప్పుడే మీరు నమ్మండి, మీరు అది పొందుకొనెదరు, ఈ రాత్రీయే అది మీకు అనుగ్రహించబడును, చూశారా. మొదటగా మీరు అది నమ్మి, ఆయన అది చేసెను అని చెప్పునంత వరకు, ఆయన మీ కొరకు ఏమియు చేయలేడు. అది నిజముగా లోతునకు వెళ్ళునట్లుగా నన్ను చేయనివ్వండి.
22
ఎంతమంది నిజముగా అది అవగాహన చేసికొన్నారు? హెబ్రీయులు 3:1. నీవు ఎంతగా రోగివి అయినను లెక్క లేదు, అది ఏమైనను. అయన చేయును అని నీవు మొదట నమ్మవలెను మరియు ఆయన దానిపై పని చేయుటకు వెళ్ళే అదే సమయంలో ముందుగానే చేసెను అని నీవు ఒప్పుకోవలెను. అది ఎంతమంది ఎరుగుదురు? నీ పాపములు క్షమించబడునట్లుగా ప్రార్థించుటకు వేదిక దగ్గరకు నీవు వచ్చినపుడు, అది నీవు మొర్రపెట్టిన కారణం చేత కాదు, అది నీవు ఒప్పుకొనిన కారణం చేత కాదు, అది నీవు విశ్వసించిన కారణము చేతనే. నీవు నమ్మినప్పుడు అంతలో పైకి లేచి నిలబడి, మరియు సాక్ష్యము చెప్పుము... ఇప్పుడు, గమనించండి!
నీవు క్రీస్తును అంగీకరించిన తరువాత నీవు బయటకు వెళ్ళెదవు, ఆ ప్రాచీనపు గుంపు వారు ఇలా చెప్పెదరు, “నీలో ఏ వ్యత్యాసము లేదు. అక్కడ ఏ విధమైన తేడా కనబడలేదు.” అయితే నీవు వ్యత్యాసముగ మారావని నీవు నమ్మెదవు.
మంచిది, నీవు వెళ్ళి ఇలా అందువు, “లేదు, నేను దానిని పొందలేదని నేను ఊహించుచున్నాను,” సరే, నీవు మరొకసారి వేదిక యొద్దకు వచ్చియున్నావు.
23
అయితే నీవు పొందియున్నావని నీవు నమ్మినపుడు, నీవు అంటావు “అవును, నేను పొందుకున్నాను.” అప్పుడు నీవు ఒక క్రైస్తవుడవని నీవు నమ్ముదువు. అలా నీవు కాని దానిని నీవు ఏదియు ప్రదర్శన చేయలేవు. అయితే నీవు అలా ఉన్నావని నమ్మెదవు. నీవు అలా ఉన్నావని నమ్మెదవు. అప్పుడు అలా అయి ఉన్నావని నీవు ఒప్పుకొనినపుడు, మరియు నీవు ఆయనను ఒప్పుకొనినపుడు, ఆయన నిన్ను ఒప్పుకొనును, ఆయన ఒక ప్రధానయాజకునిగా దేనిమీద పనిచేయుచున్నాడు? నీవు ఏడ్చిన దానిపై కాదు, నీవు మారుమనస్సు పొందిన దానిపై కాదు, నీ విశ్వాసము మీద కాదు, అయితే నీవు ఒప్పుకొనిన దాని మీదనే. నీవు ఎంత ఎక్కువ విశ్వాసము కలిగియున్నావు, అది లెక్క లేదు, దానితో నీవు క్రియలు చేయునంత వరకు, అది ఎన్నడూ నీకు ఏ మంచీ చేయదు. ఎందుకనగా క్రియలు లేని విశ్వాసము మృతము. అది నిజమేనా?
ఆత్మ లేని శరీరము వలె — అది మృతము. “నేను క్రీస్తును నమ్ముచున్నాను,” అని నీవు చెప్పినప్పుడు, అప్పుడు అది అంగీకరించుము, అలాగు ఉన్నది అని చెప్పుచు ముందుకు కొనసాగుము. అప్పుడు నీవు ఒక క్రైస్తవుడవు అని నమ్ముము, నీవు ఒక క్రైస్తవుని వలె ప్రవర్తించుము, అలా క్రైస్తవులై ఉన్న వారితో కలసి ఉండుము మరియు అది నీతిగా పనిచేయును. కొంచెం సమయం తరువాత నీవు ఒక క్రైస్తవునివని ప్రతి వ్యక్తి ఎరుగును, ఎందుకనగా నీవు నీ ఒప్పుకోలును పట్టుకొని ఉన్నావు. దానివలె నీవు ప్రవర్తించుము. నీవు వీధిలోనికి వెళ్ళి, ఇలా చెప్పకూడదు, “సరేగాని నేను కేవలం సగమే కలిగి ఉన్నాను. బహుశా నేను ఒక క్రైస్తవుడను అయి ఉండవచ్చును.” కాదు, నీవు వెళ్ళి ఇలా చెప్పుము, “నేను ఒక క్రైస్తవుడను.” నీవు దానితో ధైర్యముగా ఉ౦డుము. అప్పుడు ఆయన దానితో ధైర్యముగా ఉండును, చూశారా.
24
ఆయన నీవు చెప్పిన దానిని బట్టి మాత్రమే ఆయన చేయగలడు, ఎందుకనగా నీవు ఒప్పుకొనిన దానికే ఆయన ప్రధానయాజకుడు. అలా ఆయన విమోచనా దీవెనలు ఆయన బలి కొరకు పిలుచుచుండగా, ఏదైనా మంచి కార్యము చేయుటకు ఉన్నతమైన ఆయన సన్నిధికి ముందుగానే ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఏమి చెల్లించెనో అదే మరియు అలా ఆయన ఏమి చేసెనని నీవు అంగీకరించితివో, అలా నీవు చెప్పిన ఏ కార్యము అయినను నీకు మంచిగా చేయుటకు అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన ఏమి చేసెను?
మీ అపరాధముల నిమిత్తము ఆయన గాయపరచబడెను. అది నిజమేనా? అది కలసి చెప్పెదము. “మన యతిక్రమ క్రియలనుబట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను; మరియు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది.” అది సరియేనా?
25
ఇప్పుడు, ఆ విషయాలలో దేనినైనా, మీరు అలసిపోయినచో, నిరాశపడినచో, ఆందోళనతో, భయము, రోగము, పాపము అది ఏమైనప్పటికీ, దానిని నీవు నీ హృదయంతో అంగీకరించినచో ఒప్పుకొనుటకు వెళ్ళినచో, మరియు పిమ్మట అది సరియేనని చెప్పినచో, నీవు దానిని ఒప్పుకున్నప్పుడు దానిని సరిగ్గా చేయుటకు దేవుడు అచ్చటనున్నాడు. కాని ఆ విధముగా చెప్పుటకు భయపడినచో, మరియు నీవు ఒప్పుకొనిన దాని ప్రకారం ప్రవర్తించుటకు భయపడిన యెడల, ఎన్నిసార్లు నీవు ప్రార్థన చేయించికొనినను ఏమియు కాదు, నీవు ఎన్నడూ బాగుపడవు. మొదటగా దానిని నీవు నమ్మవలసి ఉన్నది, చూశారా. అలా ఆయన నీ కొరకు చేసిన దానిని నీవు ఏమి ఒప్పుకొంటివో దానికి ఆయన ప్రధానయాజకుడుగా నున్నాడు.
దానిని ఇప్పుడు ఎందరు అర్ధము చేసుకున్నారు? మీ చేతులు ఎత్తండి, చూశారా. అది నిజము. నీవు అలా చెప్పునపుడు మాత్రమే. ఇప్పుడు, నీవు దానికొరకు ప్రార్థించబడిన యెడల, మరియు నీవు ఇలా చెప్పుము, “ఇప్పుడు, నేను నమ్ముచున్నాను. అవునండి.” ఇప్పుడు, నీవు నిజముగా నమ్మినంతవరకు, నమ్ముచున్నాను అని నీవు చెప్పలేవు. నీవు అలా చెప్పినయెడల, నీవు ఎదో తప్పు చేయుచున్నావు. నిజముగా నీ హృదయంలో నీవు నమ్మినంత వరకు, నీవు నమ్మితివని చెప్పలేవు. అయితే తుది రూపము వచ్చునట్లుగా నీవు స్థిరముగా ప్రార్థించి మరియు నిజముగా విశ్వసించినపుడు, అప్పుడు నీవు చెప్పగలవు, “నేను నమ్ముచున్నాను.” అప్పుడు నీవు దానిని అంగీకరించగలవు. ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుము, ఆయన అక్కడే ఉన్నాడు, అలా ఆయన చేసెనని మరియు దానిని ఒప్పుకొని, అలా నీ హృదయంలో నీవు నమ్మినపుడు ఏ మంచి కార్యమును అయినా చేయును. అప్పుడు నీవు వెళ్ళిన ప్రతీ చోట, నీ స్వస్థతను గూర్చి సాక్ష్యము ఇచ్చెదవు. అలాగని చెప్పెదవు. అలా నమ్మితినని చెప్పెదవు. అలాగని ఇతరులకు చెప్పెదవు.
26
మరియు స్నేహితులారా, అది ఎన్నడూ విఫలము కాదు. దాని వలన కార్సినోమాస్ కేన్సరుతో ఉన్నవారు స్వస్థపడుట నేను చూశాను. మరియు నాకు తెలుసు అది... ఒక సార్ కార్సినోమాస్ కేన్సరు అనగా ఏమిటో మీరు ఎరుగుదురా? మంచిది. మనకు డజన్లు ఉన్నవి, అవును, ఆ విధమైన కుప్పలుగా ఉన్న ఉత్తరాలు, ఆ విధమైన కేన్సరు నుండి, పూర్తి సాక్ష్యములతో కుప్పలుగా ఉన్నవి, వైద్యుల వివరణలు, కుంటి, గుడ్డి, క్యాన్సరుతో మంచం మీద ఉన్నవారు. అలా అనుకొనగల ప్రతీ సంగతియు, ఆ విధమైన రోగములు స్వస్థపరచబడెను. విశ్వాసము!
ఇప్పుడు, వాక్యమును ప్రసగించుట; అది ఒక మార్గము, పిమ్మట దేవుడు తక్కిన వరములను కలిగియున్నాడు.
ఇప్పుడు, పరిశుద్ధాత్మ ఈ రాత్రి వచ్చి, మరియు మరణము నుండి పునరుత్థానుడైన అదే యేసు ఇచ్చట వున్నాడని ప్రకటించును గాక. మరియు ఆయన, ఆయన యొక్క దీన సేవకుడు, ఆయన యొక్క దైవిక సన్నిధిని మీకు బయలుపర్చుటకు తన దూతను పంపును గాక. దేవుడు మిమ్మును దీవించును.
మంచిది, సహోదరి [టేపు పై ఖాళీ వున్నది].
.... నాలో ఉన్న సమస్తము, ఆయన యొక్క పరిశుద్ద నామమును దీవించబడును గాక.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనినీ మరువకుము:
ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు; నీ రోగములన్నియు స్వస్థపరచువాడు;
... ప్రభువు యొక్క మందిరమునకు పోవుదుమని వారు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని.
27
తల్లీ, అది ఒక నిరుత్సాహము? నీవు కూర్చుని ఉండుట చూశాను. నీ ప్రార్థన కార్డు పిలువబడి ఉండలేదు; అది అలాగే ఉన్నది గదా? నీవు ఆ సంఖ్యలో ఉండలేదు గదా? [ఆ స్త్రీ మాట్లాడుచున్నది.] ఓ, నీవు ఉండలేదు! సరే, నేను తెలిసికొనే ఏ మార్గము లేదు, నీకు తెలియును. నేను ఏమి చేయుదునో నీకు చెప్పెదను. దేవుని సేవకునిగా నీవు నన్ను నమ్మగలిగిన యెడల, మరియు నీ పూర్ణ హృదయముతో, మరియు యేసుక్రీస్తును గూర్చి నేను నీకు చెప్పినది అంగీకరించగలిగిన యెడల, ఆయన నిన్ను స్వస్థపరచును.
దీనమైన విషయము... ఆమె ముఖము పై ఒక నిజమైన నిరాశతో ఆమె వెనుకకు నడచి మరియు కూర్చుండుట నేను చూశాను. ఆమెకు ఒక ప్రార్ధనా కార్డు గలదు, అంతలో ఆమె దానితో ఏదో చేసింది. నేను తలంచాను, “దీనమైన స్త్రీ, అలా ఆమె విడచి పెట్టబడి ఉండవచ్చునని ఆమె భావించి ఉండవచ్చును.” కాదు, కాదు. లేదు! దేవుడు ఏ ఒక్కరిని విడువడు. ఆ వరుసలో నిలబడి ఉన్నవారు, ఇక్కడ ఉన్న ఈ
ప్రజలు, వారిలో ఏ ఒక్కరూ కాదు, అలా వారిలో ఎవరైననూ స్వస్థత పొందగలుగుట ఒక సూచన కాదు. ఇచ్చటనున్న ఈ యొక్క ప్రేక్షకులతో, చేయగలుగుటకు అచ్చట ఏ ఒక్క విషయము కూడా లేదు. ఇచ్చట వీరి కొరకు వుండగలదు... ఏదైతే అచ్చట బయట జరగగలదో అది, చూశారా. అది మీలో ప్రతీ ఒక్కరి కొరకు అయి ఉన్నది. దానిని మీరు నమ్ముచున్నారా?
28
దేవుని ఆత్మ ద్వారా నేను ఇక్కడ నిలచి మరియు నీలో ఉన్న పొరపాటు ఏమిటో నీకు చెప్పినయెడల? నీవు నమ్ముదువా? నేను నిన్ను ఎరుగను. అయితే దేవుని ఆత్మ ద్వారా ఏమిటో నేను చెప్పగలిగిన యెడల... ఇప్పుడే క్రీస్తు ఆత్మతో నేను అభిషేకింపబడినయెడల, ఇక్కడ నీవు చూచిన అదే దేవుని దూత, నీలో పొరపాటు ఏమిటో ఆయన ఎరుగును. నేను నీకు చెప్పినయెడల, నీ స్వస్థతను నీవు అంగీకరించెదవా? నీవు అది చేయుదువా? నీకు కడుపులో సమస్య ఉన్నది. అది నిజమేనా? అది. యధార్థమైన యెడల, కేవలం ఒక సాక్ష్యము కొరకు, నీ పాదములపై నిలబడుము, అవును, అది నిజము అని చెప్పుము. ఇప్పుడు, నీవు గృహమునకు వెళ్ళి మరియు నీవు కోరినది తినుము.
అనుమానించవద్దు. విశ్వాసము కలిగి ఉండుము.
ఇప్పుడు, పరిశుద్ధాత్ముడు నన్ను ఉంచాడు.. మరియు యేసుక్రీస్తు నామములో, ఇక్కడ ఉన్న సమస్త ఆత్మలు అన్నియు ఇప్పుడు నా స్వాధీనములోనికి వచ్చును గాక.
ఇప్పుడు, అందరూ గౌరవముగా నుండండి. (మంచిది, బిల్లీ. ఇది..?)
29
నీవు ఎలా ఉన్నావు? అమ్మా, మనం క్రొత్తవారము. నీ పూర్ణ హృదయంతో, నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? అలా నీకు సహాయం చేసి ఉండుటకు అక్కడ ఏదైనా ఉండినయెడల, ఒక సేవకునిగా నేను అది చేసియుందును. ఎవరు రోగులైయున్నారో ఆ ప్రజల కొరకు నేను విచారపడుచున్నాను. అయితే నేను చేయగలిగి ఉండిన ఒకే కార్యము ప్రభువైన యేసును వారికి చూపించుటయే. స్వస్థత జరిగించునది ఆయన ఒక్కడే. ఇప్పుడు, నీవు మరియు నేను ఈ జీవితంలో క్రొత్తవారము అయినయెడల, అయితే ఇప్పటికీ, అలా మనం సోదరులము మరియు సహోదరీలు అని నాకు తెలియును, ఎందుకనగా నీవు ఒక క్రైస్తవుడవు అయియున్నావు. అది సత్యము. అది కాదా? ఇప్పుడు, అది మన ప్రభువు నతానియేలుతో ఏమి చెప్పెనో, అది అలా లేదా? “నిజముగా ఇశ్రాయేలీయుడు..” అప్పుడు ఇది ఇంకా ఎక్కువగా నేను చెప్పవచ్చునా? ఒక క్రైస్తవునిగా, నీవు ఒక క్రైస్తవుడవు మాత్రమే కాదు, అయితే నీవు ఒక ఉపాధ్యాయుడవు, క్రైస్తవులుగా చేయు, ఒక సేవకుడవు. అది సరియేనా? బలిపీఠము యొద్ద నీవు వాక్యము మాట్లాడుచుండుట నేను చూశాను.
నరముల బలహీనత అనే చెడ్డ ఆత్మ యొక్క తెగులును నీవు కలిగియున్నావు, చాలా కష్టములు కలిగి ఉండుటకు నీకు కారణము అయి ఉన్నది, నీవు మాట్లాడుతున్నపుడు నిన్ను అడ్డగించుచున్నది. సరే, అది ఏమి చేసినదో నేను నీకు చెప్పబోవుచున్నాను. ఒకసారి ఆటోమోబైలులో నీకు ఒక ప్రమాదము జరిగినది. అది నిజమేనా? [“అది నిజము.”] నీకు కష్టాలు ప్రారంభమగుటకు అదియే కారణము. నీవు ఆయన సన్నిధిలో ఉన్నావని నీవు నమ్ముచున్నావా? [“నేను నమ్ముచున్నాను.”] అలా నతానియేలుతో మాట్లాడిన అదే విధముగా ఉన్న ఈయన ఇప్పుడే ఎక్కడో ఒక చోట ఎక్కడో నిలబడి ఉన్నాడని నీవు నమ్ముచున్నావా? [“అవును, నేను నమ్ముచున్నాను.”] మంచిది, ప్రభువైన యేసు నామములో వెళ్ళుము. నీవు బాగుపడుదువు. [స్పష్టతలేని మాటలు].
30
శుభ సాయంకాలము. నీవు మరియు నేను కూడా కొత్తవారము. మేము క్రొత్తవారము గదా? నేను నిన్ను ఎరుగను. నేను నిన్ను ఎన్నడూ చూడలేదు. అయితే ఇప్పుడే ఇక్కడ దగ్గరలో అక్కడ ఎవరో ఉన్నారు, అలా ఎవరి యొక్క సన్నిధిలో నీవు జాగ్రత్తగా ఉన్నావో అలా అక్కడ నీకు దగ్గరలో ఏదో కార్యము గలదు, అది నీవు కాదు. నిన్ను గూర్చి అంతయు ఎవరు ఎరిగి ఉన్నారో ఆయన ఒకడే. నీ జీవితకాలమంతయు నిన్ను పోషించి మరియు నిన్ను గూర్చి సమస్తము ఎరిగినది ఆయనే.
నీవు కూడ నరముల బలహీనతతో బాధపడుచున్నావు, నీవు బాధపడుట లేదా? [“అవును.”] చాలా నరముల బలహీనత. ఒక సంగతి నరాల బలహీనత కలిగి ఉండుటకు నీ కొరకు అది జీవ కాలము అయి ఉన్నది, ఋతుస్రావము ఆగిపోవుట అనేది నీ వయసు గల స్త్రీల మధ్య అది సర్వసాధారణమే. అలా అయి ఉండి ఉన్న ఇతరమైన ఏదో సంగతిని గూర్చి పరిశుద్ధాత్మ మాట్లాడి ఉండవచ్చును, అది నీవు తలంచిన విధముగా సహజమైనదిగా అనిపించి ఉండదు, నీవు మనస్తత్వ శాస్త్రం వైపు చూచినపుడు, మరియు ఇలా అందువు, “సరే గాని, ఆమె వయసును బట్టి జరిగి ఉండును.” నేను ఎన్నడూ అది మనస్తత్వ శాస్త్రము ద్వారా పట్టుకొనలేదు. నేను ఏ అవగాహన కలిగి ఉన్నానో [స్పష్టతలేని మాటలు] నీవు ఎరుగుదువు. అది సత్యమే గదా?
31
ఇప్పుడు, నీవు ఏదో సంగతిని గూర్చి భయపడుచున్నావు, ఎందుచేత అనగా నీకు కేన్సరు ఉన్నదనీ నీవు ఒక విధముగా భయపడుచున్నావు. [“అవును.”] అది సరియైనది కాదా? [“అవును.”] చెప్పుము, నీవు శస్త్ర చికిత్స కలిగి ఉన్నావు... నీవు అనేకమైన సమస్యలు కలిగి ఉన్నావు.. [“అవును.”] నీకు చాలా శస్త్ర చికిత్సలు జరిగి ఉన్నవి. అది యధార్థము కాదా? నీవు ఆసుపత్రి నుండి వెనుకకు, వెనుకకు, మరియు వెనుకకు కదలుచుండుట నేను చూస్తున్నాను. కనీసం 4 లేదా 5 పర్యాయములు, నీవు 5 పర్యాయములు ఆసుపత్రిలో ఉన్నావని నేను చెప్పనైయున్నాను.
ఇక్కడ మరొక సంగతి ఉన్నది. ఇప్పుడు నీలో నీవు వ్యాధిరూపమగు పెరుగుదలను కలిగి ఉన్నావు. [“అవును.”] ఈ మధ్యలో పరీక్షించబడెను, ఆ వ్యాధి రూపమగు పెరుగుదల మలాశయము లో ఉన్నది, అదియే గదా? [“అవును.”]
ప్రభువా, మా సహోదరి మీద కరుణ చూపండి. ప్రియ దేవా, ఆమెను ఆశీర్వదించండి. ఆమె [స్పష్టతలేని మాటలు]. ఆమె వెళ్ళి మరియు బాగుపడును గాక. నేను అది యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను [స్పష్టతలేని మాటలు]. వెళ్ళుము, మరియు దేవుడు నిన్ను దీవించును,
32
గౌరవ భావము కలిగి ఉండండి. మీరు తీసికొని వచ్చిన వ్యాధిగ్రస్తుడు ఇతడేనా? నన్ను క్షమించండి. చాలాసార్లు సభ జరుగుతూ వుండగా, ఇప్పుడు అంతవరకు... స్నేహితులారా, మీరు తెలుసుకొనలేరు. మీరు రెండు ప్రపంచాలలోనున్నారు, చూశారా. మరియు నేను నా ప్రక్కన నాకు నేనుగా లేను. నేను సరిగ్గానే యున్నాను. నేనేమి చేయుచున్నానో నాకు తెలియును. అయితే ఇది మిమ్ములను కలవరపరుస్తుంది. దీనిని వివరించుటకు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మీరు చేయలేరు, ఇప్పుడు మీరు గౌరవ భావంతో వుండండి.
ఆ మనిషి నీవే, అయ్యా, నీవే గదా? మనం క్రొత్తవారమని నేను నమ్ముచున్నాను, మనం క్రొత్తవారం కాదా? నన్ను దేవుని ప్రవక్తగా నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముదువా? నేను ఆయనవానిగా - ఆయన ప్రవక్తగా ఉండిన యెడల, మరియు ఇప్పుడు ఆయన ఆత్మ ఇక్కడే దగ్గరలో ఉన్నది... నీవు సహాయము కొరకు నా దగ్గరకు వచ్చావు. మరియు నేను -నేను నీకు సహాయము చేయుటకు ఆయన నాకు ఏమి ఇచ్చాడో అలాగు మాత్రమే నేను నీకు సహాయం చేసి ఉందును. నీ స్వస్థతకు సంబంధించి సాధ్యమైనంత వరకు, ఆయన నీ కొరకు ఎప్పుడు చనిపోయెనో, ఆయన ఇది వరకే దానిని చేసెను. అయితే నేను నీకు సహాయం చేయగలిగి ఉండునది ఒక సంగతి మాత్రమే, నమ్ముటకు విశ్వాసము కలిగి ఉండుటయే, ఏదో అలా చెప్పబడి ఉండవచ్చు లేదా చేయబడి ఉండవచ్చును, అలా నీ కొరకు ఎక్కువ విశ్వాసము కలిగియుండుటకు కారణము ఉండును. అది నిజమేనా?
నీవు కడుపు బాధతో బాధపడుచున్నావు. [“అవును.”] అది యధార్థమేనా? ఇప్పుడు నీవు నా ఎదుట నుండి వెళ్ళుచుండగా, వివిధ ఆహార పదార్థములు నీవు తిరస్కరించుట నేను చూచుచున్నాను. ఒక వైద్యుని యొద్ద... అవి నీ చేయి చుట్టూ ఏదో కలిగి ఉన్నది... ఓ, అది ఒక రక్తపోటు వ్యాధి, అది పైకి వచ్చుటకు బదులుగా, అది క్రిందకు పోవుచున్నది. నీకు ఒక లో-బి.పి. గలదు. అది సత్యము. అది అలా లేదా? [“అవునయ్యా.”] అది నా దగ్గర నుండి పోయినది. ఇక్కడ మరొక సంగతి ఉన్నది. ఇప్పుడు నీకు అవసరమై ఉన్న అతి గొప్ప సంగతులలో ఒకటి యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించుటయే. అది సరియైనది కాదా? ఎన్నడూ నీవు ఇప్పటికీ ఒక క్రైస్తవునిగా ఉండలేవు. చూశారా, ఆ బావి దగ్గర స్త్రీతో మాట్లాడిన అదే యేసు, అలా ఆమె పొరపాటు చేసెనని చెప్పెను, అదే విధముగా ఆయన ఇప్పుడు నీకునూ చెప్పుచుండెను.
33
ఇప్పుడే నీవు ఆయనను అంగీకరించగోరుచున్నావా? నీవు ఇప్పుడే నీ రక్షకునిగా అంగీకరించుము. అలా నీవు ఎరిగి ఉండవచ్చును, నీ యొక్క గృహము... ఇక్కడ నేను ఏదో సంగతి చూచుచున్నాను... అలా నీవు అవగాహన చేసికొనుము: అలా కీళ్ళ నొప్పితో ఉన్న భార్య నీకు ఉంది కదా? [“అవును.”]
ఇప్పుడు, నేను ఆమెను చూచుచున్నాను... నీవు తీసికొనుము... ఆమె పొట్టిగా ఉ౦డి, అధికమైన బరువు గల ఒక విధమైన స్త్రీ. అది సరియేనా? మరియు ఆమె బూడిదరంగు గల రెండు ముక్కలు గల సూటు ధరించినది. అది నిజమేనా? [“అవును.”] అది సత్యమే గదా? [“అవును.”] స్నేహితుడా, నా సహోదరుడా, నీకు నీ పాపములు క్షమించబడినవి. మరియు ఇప్పుడు నీవు వెళ్ళి మరియు నీవు ఏమి తినగోరుచున్నావో వాటిని తినుము, మరియు దేవుడు నీతో ఉండును. [స్పష్టతలేని మాటలు.]
(నీతో మాట్లాడుచు... [స్పష్టతలేని మాటలు] ఆ మనుష్యుడు ఎక్కడకు... ఆ మనిషి ఒక పాపియై ఉండెను. ఇక్కడ ఎవరో వ్యక్తి, అతడు కాదు, కేవలం కొన్ని నిమిషముల క్రితము, ఒక పాపి అయి ఉండెను. [ఎవరో ఒకరు సహోదరుడు బ్రెన్హాంతో మాట్లాడుచున్నాడు,] ఓ, మంచిది. సహనము గలిగి....)
34
శుభ సాయంకాలము, మనం కూడ క్రొత్తవారము, మనం కాదా? నేను నిన్ను ఎన్నడూ చూడలేదు. అయితే నీవు మహోన్నతుని సన్నిధిలో నిలబడి ఉన్నావని నమ్ముచున్నావా? నీ సహోదరుడు కాదు; ఆయన మహోన్నతుడు. ఆ బల్బు ఆ కరెంటునకు ఎలా దాసునిగా ఉన్నదో, కేవలం నేను అలాగే ఆయన సేవకుడను, నీవు చూశావా. నీకు అర్థము అయినదా? నీవు చాలా ఎక్కువగా బాధించబడ్డావు, నీవు బాధపడలేదా? నీవు ఆందోళనపడ్డావు, భయపడ్డావు, ఎందుకనగా నీవు ఒక పెరుగుదల కలిగి ఉన్నావు, కణితి యొక్క పెరుగుదల. మరియు ఆ పెరుగుదల నీ రొమ్ములో ఉన్నది. అది నిజమేనా? అది నీ ఎడమ భాగమున రొమ్ములో ఉన్నది. అది సరియేనా? ఇక్కడకు రమ్ము,
ఓ ప్రభువా, భూమ్యాకాశములను సృష్టికర్తా, నిత్యజీవానికి కర్తా, ప్రతీ మంచి బహుమతిని ఇచ్చువాడవు, ఆపరేషను కొరకు సిద్దముగా ఉండి, స్వస్థత కొరకు ఇప్పుడు ఎవరు కనిపెట్టుచున్నారో, ఈ మర్త్యుని పై నీ ఆశీర్వాదములు పంపండి, ఓ నిత్యుడగు దేవా, ఆమెను దీవించండి మరియు ఆమెకు సహాయము చేయ్యండి. యేసుక్రీస్తు నామములో ఆమెను స్వస్థపరచుమని నేను అడుగుచున్నాను. ఆమేన్.
ఇప్పుడు, అలా నీవు జీవించనై ఉన్నావని ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? దేవుడు నిన్ను దీవించును. నీవు నమ్మిన విధముగా, అది అలా ఉండును. ఆయన చెప్పెను, “వారు, రోగుల మీద చేతులుంచగా వారు బాగుపడుదురు.” అది నీ చుట్టూ వెలుగును త్రిప్పుచున్నది. నీవు పూర్తిగా బాగయి ఉండనై ఉన్నావని నేను నమ్ముచున్నాను. ఆ ప్రభుయేసు [స్పష్టతలేని మాటలు.]
మీ పూర్ణహృదయములతో మీరు నమ్ముచున్నారా? ఎవరు ఆయన యందు విశ్వసించెదరో అలా దేవుడు ఆ ప్రజలను బాగు చేయునని నమ్ముదురా?
35
నీకు కూడ పెరిగిన ఒకటి ఉన్నది, సహోదరీ నీకు లేదా? ఆ పెరిగినది నీ మెడపై గలదు, అది అలా లేదా? అలా కేవలం దానిలో నుండి బయటకు వెళ్ళిన ఆ జీవము ఇక్కడే ఉన్నది, మరియు అది కరుణ కొరకు అర్ధించుచున్నది. అంతలో నల్లగా, కనబడుచున్న మేఘముగా అక్కడ నీకు మీదుగా పైకి ఉండి వ్రేలాడుచుండెను. నీకు మీదుగా పై భాగమున మరొకటి మరొక దాని కొరకు నీకు పైగా ఉండుట అది నేను చూశాను. నీ చేయి నీ మెడ మీద ఉంచుము మరియు ఇలా చెప్పుము, “ప్రభువైన యేసు, నేను నా స్వస్థతను అంగీకరించుచున్నాను.” ప్రభువు నీకు కరుణ చూపి మరియు నీకు స్వస్థతను దయచేయును గాక.
విశ్వాసముగా ఉండుము. గౌరవ భావముతో ఉండుము.
అయ్యా, రండి. మనం క్రొత్తవారము అయి ఉన్నాము కదా? నేను చాలా బలహీనుడనగుచున్నాను. నీవు ఇలా ఉందువా... ప్రభువైన యేసు కేవలం నాతో మాట్లాడి ఉండినయెడల, మరియు నీలో ఏ పొరపాటు ఉన్నదో,
నాకు ఏదో ఒకటి చూపినయెడల, నా సహోదరుడా, నీవు స్వస్థతను అంగీకరించెదవా? [“అవును.”] నీవు అంగీకరించెదవా? నీవు మధుమేహ వ్యాధిని కలిగి ఉన్నావు. [“అది నిజము.”] నీ స్వస్థతను నీవు అంగీకరించెదను అని నీవు చెప్పావు గదా? నీవు చెప్పలేదా? సోదరుడా, ప్రభువు నీతో ఉండును గాక.
అమ్మా, అదే విధముగా నీవు చేసి ఉండవా? నీవు గుండెకు సంబంధించిన బాధ కలిగి ఉన్నావు. ఇప్పుడు, వెళ్ళుము, మరియు ప్రభువు నిన్ను దీవించును.
36
నీలో ఉన్న పొరపాటు ఏమైయున్నదో నేను నీకు చెప్పినయెడల, అమ్మా, అదే సంగతిని నీవు నమ్ముదువా? నీకు కడుపుకు సంబంధించిన బాధగలదు, అది కాదా? వెళ్ళుము, మరియు దేవుడు నిన్ను దీవించును గాక.
మనము ఇలా చెప్పెదము, “దేవునికి స్తోత్రము.”
ఇప్పుడే మన తలలు వంచెదము మరియు ప్రార్థన చేయుదము, ప్రభువైన యేసు, నీ చిత్తమైనయెడల, రమ్ము మరియు మా హృదయమునకు దయ చూపండి. మా అపరాధములను మరియు పాపములను క్షమించండి. యేసుక్రీస్తు నామము ద్వారా మాలో ప్రతీ ఒక్కరినీ దీవించుము. ఆమెను.
దేవుడు మిమ్మును బాగుచేయును అని నమ్ముచున్నారా? ఇప్పుడు నిన్ను ప్రభువు దీవించును. వెళ్ళుము, మరియు ఆయన నిన్ను సంపూర్ణునిగా చేయును. దేవుడు నిన్ను దీవించును. నీలో ఉన్న పొరపాటు ఏమిటో ఎవరు ఎరుగునో, ఆ దేవుడు ఆ భవిష్యత్తు ఏమై ఉన్నదో ఎరుగును. అంతా బాగానే ఉంది.
మనము ఇలా చెప్పెదము, “దేవునికి వందనములు.”
సహోదరీ, బిడ్డ కొరకు, నీవు వచ్చుచున్నావు గదా? నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముచున్నావా? నీవు ఉబ్బసము అనే వ్యాధిని అధిగమించనై ఉన్నావా? కేవలం వెళ్ళుచూ అంతలో చెప్పుము, “ప్రభువైన యేసూ, నీకు వందనములు.
37
సరిగా అక్కడ శ్వాసనాళంలో వాపుతో కూర్చుండి, అక్కడ వెనుక భాగంలో అక్కడ సరిగా వెనుక ఉన్న, అక్కడ వరుసలో వెనుక చివరలో ఉన్న నీవు కోరినయెడల, నీవు కూడ పైకి లేచి, మరియు నీ స్వస్థతను అంగీకరించుము. ఇక్కడ, దానితో ఉన్న ఈ వ్యక్తిని [స్పష్టతలేని మాటలు], ఆయన స్వస్థపరచినపుడే, ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరచెను. దేవుడు నిన్ను దీవించు గాక. నీవు వెళ్ళు మరియు బాగుపడుము.
అయ్యా, నీవు నమ్ముచున్నావా? నీలో ఉన్న పొరపాటు ఏమిటో దేవుడు నాకు బయలుపరచిన యెడల, నీ స్వస్థతను నీవు అంగీకరించెదవా? నీకు మూత్రపిండముల బాధ గలదు. [“దేవునికి స్తోత్రము.”] మంచిది.
సహోదరీ, నీవు నమ్ముచున్నావా? నీలో ఉన్న అనేకమైన సంగతులను గూర్చిన పొరపాటును గూర్చి నీవు ఆలోచించి ఉన్నావు. అది కడుపులోని బాధ అయి ఉన్నది, మరియు నీ గుండె చుట్టూ వేగంగా, వడిగా కొట్టుకొనుటను కలిగి ఉన్నావా? చాలాసార్లు నీకు గుండె బాధ కలిగి ఉన్నట్టుగా నీవు తలంచావు, అయితే అది... నీవు క్రింద పండుకొని ఉన్నప్పుడు అది ఇంకా చెడ్డగా ఉన్న భావన నీవు పొందావు. అది ఆ నరముల బలహీనతయే. గ్యాస్ గొట్టముల ద్వార నీ కడుపులోనికి వెళ్ళును, చేసినది అదే.. లేక ఆ విధముగ నీవు భావించునట్లు నీ గుండెకు జరిగినది అదే. అది ఒక నరముల బలహీన స్థితి. ఇప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచెను. వెళ్ళుము [స్పష్టతలేని మాటలు].
38
నా సహోదరీ, స్త్రీలకు వచ్చే ఈ యొక్క సమస్యను నీవు అధిగమించవలెనని కోరుచున్నావా? వెళ్ళి మరియు నీ స్వస్థతను అంగీకరించుము.
రమ్ము, సహోదరీ.
నీ పూర్ణ హృదయముతో నమ్ముము? నీవు నమ్మినయెడల, నీవు పొందగలవు.
నేను అన్నాను, “గుండె!” నీవు వింతైన భావనను పొందావు, నీవు పొందలేదా? ఆ వరుసలో చివర ఉన్న మరొకరు. అవును. నీవు ఒక గుండె బాధను అధిగమించవలెనని కోరుచున్నావా? నీవు అలా చేసెదవా? అప్పుడు కేవలం నీవు పైకి లేచి నిలబడి మరియు మీ ఇద్దరు, మీ యొక్క స్వస్థతను అంగీకరించుము.
39
అయ్యా, నీవు, సరిగా అక్కడ కూర్చుని ఉన్న నీకు కూడ, నీకు కూడ గుండె బాధగలదు. పైకి లేచి ఉండుము, అదే సమయములో అక్కడే నీవు స్వస్థత పొందావు. దేవుడు నిన్ను దీవించును. మంచిది. నా సోదరుడా, ప్రభువు నిన్ను దీవించును.
గౌరవముగా ఉండండి. నీవు దేవుని నమ్ముచున్నావా?
ప్రియమైన చిన్న బాలికా, ఈ వైపు చూడుము. అక్కడ ఉన్న మరొక చిన్న బాలిక, ప్రియమైనదానా, కేవలం ఒక నిమిషం ఇటువైపు చూడుము. ఆ చిన్నదానిపై వెలుగు వ్రేలాడుచుండుట నేను చూశాను. కాదు, అది కాదు, అది అక్కడున్న ఆ స్త్రీపై ఉన్నది. అది నీవే. నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముదువా? నీవు కలిగి ఉన్నావు.... ఒక విధముగా నెరసిన తల కలిగి, తెల్లని దుస్తులు ధరించిన ఆ స్త్రీ, నీవు ఒక రకమైన తీవ్రమైన బాధతో లేక ఏదో ఒకటి నీవు కలిగి ఉండలేదా? కచ్చితముగా, అది ఏమై ఉన్నదో ఆ వైద్యులకు తెలియలేదు, వారికి తెలియదు గదా? నేను అతడు అతని తలను త్రిప్పి అంతలో నడచిపోవుట చూశాను. అది నీ కాళ్ళ మీద ఉన్నది, అది అలా లేదా? ఎగ్జిమ (చర్మ వ్యాధి)వలె అది ఏదో ఒకటి అయి ఉన్నది. అదీ యధార్థమైనయెడల, నీ చేయి ఊపుము. ప్రభువు నీతో ఉండి మరియు నిన్ను స్వస్థపరచును. దేవుని యందు విశ్వాసముంచుము.
(బిల్లీ, ఈ స్త్రీయేనా?)
అమ్మా, ఈ వైపు చూడుము. నన్ను ఆయన ప్రవక్తగా, ఆయన సేవకునిగా నీవు నమ్ముచున్నావా?