ఆయన రాకడ యొక్క సూచనలు
1. సహోదరుడా లిటిలిఫీల్డ్ నీకు కృతజ్ఞతలు. మీరు కూర్చోవచ్చును. ఎలాగైతేనేమి ఈ రాత్రి ఈ రమ్యమైన సంఘమునకు మరలా తిరిగి వచ్చుటనేది గృహమునకు తిరిగి వచ్చునట్లున్నది. (కొంతకాలం క్రితం ఈ సంఘమును ప్రభువుయొక్క పని కొరకు ఉపయోగపడునట్లుగా ప్రతిష్ట చేయుటను గొప్ప భాగ్యముగా నేను తలంచు చున్నాను). మిక్కిలి దయగల సహో॥ లిటిల్ ఫీల్డ్లోను మరియు అతని మందతో నేనిచ్చట ఉండుటయు మరియు ఈ మంచి పాత క్లీవ్లాండ్, టెన్నిస్సీ వచ్చు ప్రతీసారి కరచాలము చేయుచు ఒక చక్కని, మంచి ఆహ్లాదకరమైన స్వాగతంను పలుకుటనేది నిశ్చయముగానే ఈ రాత్రి ఒక మంచి అనుభూతినిచ్చుచున్నది.
కొంతకాలం క్రితం నేను లిటిల్ఫీల్డ్ సహోదరుడను పిలిచాను లేదా సంభాషించి తిని. అప్పుడతడు, “బ్రాన్హాం సహోదరుడా, మీరెప్పుడు వస్తారో మరియు మరలా ఎప్పుడు మమ్మల్ని వచ్చి చూస్తారనే విషయముగూర్చి ఏమిటి?" అని అడిగెను.
లిటిల్ఫీల్డ్ సహోదరుడా, "మంచిది. దీనిని చేయుటకు నేను సంతోషించెదను. ఇప్పుడు నేను ఒక స్థలమునకు వెళ్ళవలసి యున్నది. కాని నేను ఏప్రిల్ నెలలో తిరిగి వచ్చునప్పుడు నేను నీతో దానిని గురించి మాట్లాడతానని" నేను చెప్పాను.
2. మేము అరిజోనానుండి వచ్చిన పిదప ఫ్లోరిడాకు వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాము. ఆ రాత్రి నేను అతనితో మాట్లాడాను. అతడు మరియు అతని యొక్క ప్రశస్తమైన భార్య నిద్రించే సమయమది. కాని సేవకులవలె అన్ని సమయములలో నేను సిద్దంగానే ఉండెదను. “సరే, ఒక బోధకునికి ఫోన్చేసి మాట్లాడుటకు ఆలస్యమనేది సమస్య కాదని మీకు తెలుసు. వాస్తవముగా సేవకుడు ఏ సమయములో పిలిచినా అతడు సిద్ధంగానే ఉంటాడు" అని నేను తలంచాను. కావున నేను ఫోన్లో పిలవగానే అతని భార్య ఫోన్ తీసుకొని జవాబు పలికెను. అతడు ఇంచుమించు మోర్ఫియస్ యొక్క చేతులలో చక్కని నిద్రలో ఉండెను. (మోర్ఫియస్ - అనగా కల్పనా కలల గ్రీకు దేవత - సంపా.,). మరియు ఒక మహానీయుని యొక్క నిద్ర ఎట్లుండునో మీరెరుగుదురు. కాబట్టి అతనితో, "ప్రభువుకు చిత్తమైతే ఈ శనివారము రాత్రి, ఆదివారం ఉదయము అచ్చట ఆరాధనలను జరుపుటకు నేను వచ్చుచున్నాను" అని చెప్పాను. నేను మరలా ఇచ్చటకు వచ్చుట ఒక గొప్ప భాగ్యముగా ఉన్నది.
3. ఇచ్చట పట్టణములోగల సిటీ వ్యూ హోటల్ వారు మరియు లెహి హోటల్వారు మాపట్ల చూపించిన ఎంతో దయగల ఉపచారమునుబట్టి వారికి నేను నా కృతజ్ఞత లను వ్యక్తపరచుచున్నాను. అంతేకాకుండా, మాతోకూడా బసచేసిన వారికికూడాచేయుటవలన ఆ గదులను వారు విరాళముగా ఇచ్చిరి. అనగా ఆ గదులకొరకు వారు చెల్లించవలసిన దానికంటే ఎంతో తగ్గించి యిచ్చిరి. క్రైస్తవులకొరకు వారీవిధముగా ఉపచారము స్థలములో ఉండుట ఎంతో యుక్తమైనదని మీరెరుగుదురు. అది నిజము. ఒక మంచి పాత పద్ధతిలో భక్తిని చేయుటకు, దేవుడు పంపించిన పెంతెకోస్తు ఉజ్జీవమును ఆరంభించుటకు ఇదొక మంచి స్థలముగా ఉన్నది. అది అట్లే ఉన్నది కదా? నిశ్చయముగా అట్లే ఉన్నది. ఇచ్చటకు వచ్చుచుండగా, చూచు టకు ఇది చర్చ్ ఆఫ్ గాడ్ సంఘముగా ఉన్నది, దాని ప్రధాన కార్యాలయములను, మార్గము గుండా చిన్న, చిన్న రహదారులతో మరియు కుడి ప్రక్కున పెద్ద శిబిరములు ఉండుటను నేను గమనించాను. మరిచ్చట ఇది గొప్ప స్థలముగా ఉన్నది. కాబట్టి ఒక ఉజ్జీవమును ఆరంభించుటకు ఇదొక మంచి స్థలముగా ఉన్నది.
4. ఆదివారమునకు ముందుగా.. మూడు ఆదివారముల క్రితం, నేను నా గృహంలో చదివిన దానినుండి కొన్ని విషయములను తీసుకొనుచున్నాను. అది ఇప్పుడు ఇచ్చట ఉన్నదని నేను విశ్వాసించుచున్నాను. ఆదివారపు ఉదయకాల ఆరాధనలలో యథాప్రకారంగా నేను ప్రసంగించే ఒక ఆదివారపు ఆరాధనలో(అది కేవలం ఆరుగంటలు అని మీరెరుగుదురా) నేను ప్రసంగించుచున్నాను. అది ఇలాగే ఉన్నది. అది ఆరుగంటలు. దీనిని విశ్వాసించండి. కాబట్టి మూడు గంటలలోనే దానిని నేను ప్రారంభించలేక పోతినని మీకు తెలుసు, పిదప మీరు సిద్ధపరచబడిన తర్వాత, అనగా పరిగెత్తుటకు సిద్ధపడునప్పుడు, ఆరంభించిన ఆ పరుగును ఎచ్చట నిలుపవలెనో ఆ స్థలము మీకు తెలియదని తెలుసా? అట్లే ఈ సువార్తను ప్రసంగించేటప్పుడు దానిని నిలుపుటకు ఏ బ్రేకులు లేవు. అది మీకు తెలుసు. నిలువ వలసిన స్థలము ఎచ్చట లేదని మీరెరుగుదురు. కాబట్టి అలాంటి ఒక గొప్ప మహిమకరమైన సమయమును కలిగియుంటిమి.
పిదప ఆదివారం, అది గత ఆదివారమని నేను నమ్ముచున్నాను. మనము ఏ దినములలో జీవించుచున్నామో మరియు మనమే కాలములో జీవించుచున్నామో అనే అంశముమీద మరలా వాక్యమును ఇంకో మూడు గంటలు ఉపదేశించుచూ మంచి సమయమును గడిపితిమి. మనమెచ్చట ఉన్నామనే దానినిగూర్చి అన్వేషిస్తూ దానిగూర్చి లేఖనములను మాట్లాడుచున్న వాటిని చూచుకుంటూ మేము అలాగే కొనసాగుచూ, అది మాకొక మహిమకరమైన సమయముగా ఉండెను. అనగా మనమెచ్చటున్నామో దానిగూర్చి చూస్తూ లేఖనములో వెనుకకు వెళ్ళి దానిలోనున్న ప్రవచనములను తీసి చూచుచూ, వారేమి చేసిరో దానిగూర్చి చూపించుచూ, సరిగ్గా ఇప్పుడిచ్చట మనమేమి కలిగియున్నామో చూపిస్తూ, మరియు భవిష్యత్తులో
"ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ఏమైయున్నది మరియు రాకడను గూర్చి పరిశీలించి చూస్తూ సాగిపోయాము, అర్థమైనదా? ఇది సత్యమని మనమెరు గుదుము. ఇది వాక్యములో ఉండుట వలన ఇది ఎన్నటికీ విఫలమవ్వడు. మరియు వాక్యము ఎల్లప్పుడూ సరిగ్గానే ఉండును.
5. మనకు ఎనిమిది లేక పది రాత్రులు, చక్కని దేశమున, చుట్టు ప్రక్కలనున్న అన్ని సంఘముల వారు సమకూడి వచ్చునట్లు ఈ కూటములను గూర్చి ప్రకటించు టకు మనకు కొన్ని రాత్రుల సమయమును కలిగివుండాలని కోరు చున్నాము. కాని మనము అలాగు చేయుటకు సాధ్యపడదు. నేను కెనడా దేశమునకు ఇండియన్లుల (రెడ్ ఇండియన్స్)తో కలిసి సరిగ్గా ఇప్పుడే వెళ్ళబోవుచున్నాను. ఆ దేశములోనున్న దూర ప్రాంతములకు నేను వెళ్ళబోవుచున్నాను. గత ఆకులు రాలు కాలమున ఒక చిన్న మిషనరీతో అచ్చటున్నప్పుడు దానిని నేను చూచాను... అతడొక మంచి కుటుంబం నుండి వచ్చినవాడు. కాని అతని చేతుల క్రింద చుట్టూ ఎఱ్ఱగా ఉండెను. అదేమిటని నేను అతని దగ్గర అడిగాను. ఇచ్చటున్న పురుగులు మరియు నల్లులు అతనిని కొరికినందు వలన అచ్చట అలాగైనది. ఎందుకనగా అచ్చటున్న ఆ రెడ్ ఇండియన్లుల ప్రజలతో కలిసి ఉండాలంటే అది అలాగే జరుగుతాది. కాని మీకు తెలుసా, మీరు అలాగే వారితో కలిసి నివసించవలసి యున్నది.
6. ఆఫ్రికాలో ఉన్నప్పుడు నేను భుజించుటకు... ఈ లోకంలో దానిని ఏవిధముగా చెయ్యాలో నేను అర్థం చేసుకోలేకపోయాను. వీటన్నింటిని చేయుటకు దేవుడు మాత్రమే నాకు చెయ్యవలెను. కాని ఎలాగైతేనేమి దానిని మీరు చేసి తీరవలయును. మీకు అర్థమైనదా? కాబట్టి మిషనరీ పరిచర్య చేయు ఈ సేవకులు బాధాకరమైన ఈలాంటి అనేక కార్యములగుండా పరిచర్యను చేయవలసియున్నది.కావున క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటకు మనము ఈలాంటి బాధాకరమైన కార్యములను మరియు ప్రజలందరితోను కలిసి సమస్తమును భరించుచు కొనసాగిపోవలను.
ఎడ్డీ సహోదరుడు మరియు ఆ మార్గమున వెళ్ళే అతని పిల్లల కొరకు నేను మిక్కిలిగా జాలిపడుచున్నాను. ఈ చిన్న ఎడ్డీ బిస్కల్ (Eddie Byskal) మరియు చక్కని స్త్రీయగు అతని భార్య ఒక మంచి, చక్కని కుటుంబం నుండి వచ్చినవారు. అతని తండ్రికి ఒక పెద్ద కర్మాగారము గలదు, దానికి అతడే అధిపతి. మరియు వారికి సమస్తము గలదు. అయినప్పుటికీ వారు తమ జీవితములను ఆవిధముగా సమర్పించుకొనిరి. లిటిల్ఫీల్డ్ సహోదరుడా, నిశ్చయముగా దేవుడే దానిని తీసుకొని చెయ్యగలడు. అది నిజంగానే ఒక త్యాగమైయున్నది.
7. అచ్చట ఉన్నవారందరూ దాదాపు కాతలిక్కులై ఉండిరి. కాబట్టి వారు అధిపతిని మరియు నలుగురు లేదా ఐదుగురు రెడ్ ఇండియన్లను తమతోపాటు తీసుకొని వచ్చిరి. వారు కూటము జరుగుచున్న స్థలమునకు వచ్చుచుండగా,సరిగ్గా అచ్చటే పరిశుద్ధాత్మ సంచరిస్తూ, వచ్చిన వారి సమస్యలనుగూర్చి చెప్పుచు మరియు సరిగ్గా అచ్చటే వారిని స్వస్థపరచెను. ఇప్పుడు వారు సముద్ర తీర ప్రాంతములలో ఎగువ మరియు దిగువ స్థలములన్నింటికి వెళ్ళుచూ అగ్నిని మండించుచున్నారు. వారు వాణిజ్యపరంగా జాలర్లు. వారివద్ద పడవులు ఉండుటవలన వాటిద్వారా అనేక ప్రాంతములకు వెళ్ళుచూ (ఆ ప్రాంతములకు పడవలద్వారానే వెళ్ళగలరు). అనగా దీర్ఘ ప్రయాణమైన వాస్క్యువెన్ను దాటుకొని విక్టోరియా రాణి దీవికి, అవతలనున్న స్థలమునకు వెళ్ళవలెను. మీరు అలస్కాకు వెళ్ళవలెననిన ఆ సముద్ర తీరప్రాంతము గుండానే వెళ్ళవలెను. అచ్చటకే మేము వెళ్ళుచున్నాము. పిదప అలస్కా రహదారికి అవతలనున్న పరి.జాన్ కోటకు వచ్చి, ఆ తర్వాతే మరలా తిరిగి వచ్చెదము.
8. పిదప, ఇచ్చటున్న పై ప్రాంతముననున్న సదరన్ ఫైన్స్కు వచ్చి మిమ్మల్ని కలుసుకొనెదము. అది 6,7,8,9,10 జూన్ నెలలో మీతోనూ మరియు 11,12 తేదిలలో బిగ్ బై సహోదరునితో ఉండెదను. కొలంబియాలోనున్న అతనిని మీలో అనేకులకు తెలుసని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. అది దక్షిణ కారోలినా అని నేను నమ్ముచున్నాను. మరియు తర్వాత అచ్చటనుండి దక్షిణ గేట్లో నున్న కౌ పేలస్ (Cow Palace)కి, లాస్ ఏంజల్స్కి వెళ్ళి, అచ్చట గొప్ప కూటమును జరిపించవలెనని మేము ఎదురుచూస్తున్నాము. కాబట్టి మేము దాని తర్వాత అచ్చట నుండి కాలిఫోర్నియా గుండా ఒరెగన్, వాషింగ్టన్, పిదప అంకొరాగ్, అలస్కాకు మేము వెళ్ళెదము. దానితర్వాత తిరుగు ప్రయాణంలో ప్రభువుకు చిత్తమైతే ఈ ఆకులు రాలు కాలమున, ప్రభువు మమ్మల్ని ఎచ్చటకు నడిపించునో మేము ఎదురు చూస్తున్నాము. ఎలాంటి ఒక ప్రత్యేకమైన నడిపింపు లేనియెడల, ఏదైన ఒక ఆత్మ నడిపింపును పొందుకునేంత వరకు మేము విత్తనములను విత్తుచూ ఉండెదము. అంతే. మీరు మా గురించి ప్రార్థించుచున్నారని నిశ్చయముగా నమ్ముచున్నాము.
9. ఇప్పుడు మిక్కిలి దయగల మరియు ఉదార హృదయముగల మీ సంఘకాపరి ఈ ఉదయమున ఆదివార పాఠశాలను నేను నడిపించు భాగ్యమును నాకిచ్చెను. కాబట్టి ఈ రాత్రి సమయమున రోగుల కొరకు ప్రార్థించుటకై ప్రార్ధనా పునాదిని వేయాలని నేను తలంచాను. మరి రోగులకొరకు ప్రార్థించాలని కూడా తలంచాను. ఉదయ కాలపు కూటమున ఆదివారపు పాఠశాల యొక్క పాఠ్యాంశము గలదు.
ఇప్పుడిది చక్కగా ఉండును. ఎందుకనగా, ఒక మనిషి తన బలిపీఠమును వరుస క్రమములో వారాంతపు సేవలో రెండుసార్లు సేవకొరకు ఉపయోగించుటనేది ఒక మంచి విషయము. లిటిల్ఫీల్ద్ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక! అతడొక అద్భుతమైన, మంచి క్రైస్తవ సహోదరుడు. కాబట్టి మేము మీకొరకు ఎదురు చూస్తూ ఉంటాము. ఉదయమున మీ సంఘమున మీకు బాధ్యతతో నిర్వహించే ఏ కార్యము లేనియెడల మీరెందుకని మాతో ఆరాధనలో కలుసుకో కూడదు.కాని ఈ రాత్రి రోగులకొరకు ప్రార్థించుట యుక్తమైనదని నేను తలంచుచున్నాను. ఎందు కనగా వారు బహుశా... అందరు చెదరిపోకుండా ఏకంగా సమకూర్చి ఉండుటకు మన సంఘము చిన్నది. కావున అతడు ఒక సభా భవనమును తీసుకోవలెనని కోరుకొనెను. ప్రజలందరిని ఏకంగా సమకూర్చు విషయములో లిటిల్ఫీల్డ్ చాలా చక్కగా చేయగలడు. "లిటిల్ఫీల్డ్ సహోదరుడా, నేను ఎక్కువ రోజులు ఉండలేను. కాబట్టి నీ చిన్న సంఘములోనే కూటములను ఏర్పరచుము” అని నేను చెప్పాను.
10. ఒక సంఘములోయైతే అది పరిశుద్ధ స్థలమగును. సంఘములో ప్రసంగించు టకే నేను ఇష్టపడుదును. మీరు ఇష్టపడరా? ఈ సభా భవనములకు మీరు వెళ్ళిన యెడల... వాటిని మేము అభినందించుచున్నాము. వాటిని గల ప్రజలు, ధర్మకర్తలు, మెదలగువారు మంచివారే. కాని అచ్చటేమేమి జరుగుతాయో మీరు గమనించండి. అచ్చట అన్ని రకముల అసభ్యమైనవి, లోక సంబంధమైన అన్ని రకముల వినోద కార్యములు జరుగుచూ, దాని చుట్టూ దయ్యపు ఆత్మలు ఉండును. అర్థమైనదా? అవన్నీ దయ్యములద్వారా తీసుకొని రాబడుచున్నవి. కాని మీరు సంఘములో కూటమును జరిపిన అచ్చట పరిశుద్ధాత్మ ఉండును. మీకు అర్థమైనదా? కాబట్టి సంఘమునకు వచ్చుటనేది ఒక భిన్నమైన విషయముగా ఉండును.
11. దానిని గూర్చి ఇచ్చట తలంచుచుండగా... నేను అరిజోనాకు వెళ్ళే మార్గమున వెళ్ళుచుండగా జరుగబోవు ఒక విషయమును గూర్చి ప్రభువు నాకు చూపించెను.
పిదప దానిని నా పుస్తకములో వ్రాసుకొని ఉంచాను. ఒక దినమున లేదా నేడు దానినిగూర్చి నేను ఆలోచించుచుంటిని. వాటినిగూర్చి ప్రజలవద్ద నేను చెప్పని యెడల... వాస్తవముగా వాటిని నేను వ్రాసి ఉంచుతాను. ఆయన నాకు చూపించే ఆ విషయములన్నింటిని గూర్చి నేను చెప్పను. కాని ఇప్పుడు, పరిశుద్ధాత్మ... ఇదిగో ఇచ్చట పరిశుద్ధ గ్రంథము ఉన్నది. ఇది ఆయన నివసించుచున్న ఆయన యొక్క గృహమై యున్నది. మరియు ఇచ్చటున్న జనులగు మీలో ఆయన నివసించు, చున్నాడు; మరియు ఇది సత్యమని ఆయన ఎరుగును
12. ఆరు వారముల క్రితం ఒక ఉదయమున, దానిని గూర్చి నేను ఊహించు చుండగా... జెఫర్సన్ విల్లిలోగల మన సమాజ మందిరముయొక్క ట్రస్టీలు ఇద్దరు సహోదరులగు సహోదరుడు సాత్మన్. సహోదరుడు ఉడ్తో కలిసి నేను అరిజోనాకు వెళ్ళుచుండగా, దర్శనములో నేను ఒక వింతైన కార్యమును చూచాను. అచ్చట ఇద్దరు పురుషులు గలరు, వారిద్దరు చక్కగా ముష్టి యుద్ద వస్త్రములను ధరించుకొని ఉండిరి. మరియు వారివురు చూచుటకు ముష్టి యుద్ధ యోధులుగా ఉండిరి. వారెప్పుడు వేసుకునే యోధులయొక్క వస్త్రములను ధరించుకొని ఉండిరి. కాని వారు ఒక నిజమైన యోధులుగా ఉండిరి. వారు పోరాడుటకు కోరుచున్నారు. వారివురు ఒకరిపట్ల ఒకరు పగను కలిగియుండిరి. మరియు వారిలో ఒకరు...
అది చూచుటకు న్యూయార్క్ పట్టణములో ఉన్నట్లున్నది. అచ్చటున్న రంగ స్థలము వైపుగా నేను వచ్చుటను చూడగలుగు చున్నాను. ఆ స్థలమున నేనెంతో ప్రసంగించాను. అచ్చట చూచుటకు ఒక చిన్న రంధ్రము వంటిది గలదు, ఆ స్థలము ఈవిధముగా గుండ్రముగా ఉన్నది. వారివురు దానిలోనికి ప్రవేశించిరి. అచ్చట వారివురు ఒకరితో ఒకరు పోట్లాడుకొనుచున్నారు. ఒకడు తన పగవానిని చంపివేసెను. మరియు అచ్చట తేమవంటిది లేదా నీళ్ళవలె ఉండుటను నేను చూచాను. వారిలో ఒకరి పాదము చుట్టూ సెల్లోఫేన్(cellophane)అనే టేపు చుట్ట బడి ఉన్నట్లుగా కనబడుచున్నది. వాస్తవముగా సమస్తము నిమ్మళముగా ఉండెను. మరచ్చట వేదనకరమైన పరిస్థితి ఉండెను. అతడు చంపబడెను... ఆ ముష్టి యుద్ధంన ఒకరు మరొకరిని చంపివేసెను. “సరే, ఈ దర్శనముయొక్క భావమేమిటో ప్రభువా, ఖచ్చితముగా నాకు తెలియుట లేదని" నేను తలంచాను. వెంటనే నేను దానిని వ్రాసి ఉంచుకున్నాను. ఆ రోజు ఏమి జరిగినదో మీకందరికి తెలుసు. న్యూయార్క్ మంచి బలమైన బరువుగల ముష్టి యుద్ద (welterweight) యోధుల మధ్య పోటీ జరుగగా అందులో ఒకరు ఇంకొకరిని చంపివేసెను. మీకు అర్థమైనదా?.
13. నిజంగానే ఆయన చాలా మంచివాడు. ఈ కార్యములన్నింటిని మనము తెలుసుకొనుటకు ఆయన మంచివానిగా ఉన్నాడు కదా? ఎట్లనగా, అది చూచుటకు సంఘమునకు సంబంధించినట్లుగా కనబడుటలేదు. ఆ కారణముచేతనే నేను దానిని అలాగే వదిలివేసితిని. కొంతసేపటి క్రితం వరకు అసలు దానిగూర్చి నాకేమి తెలియనట్లుగానే ఉండెను. “అవునయ్యా, నా చిన్న పుస్తకంలో దానినిగూర్చి వ్రాసి ఉంచానని” నేను తలంచుచుంటిని. అర్థమైనదా? అది, అది ఏదోక కార్యమై యున్నది.
అదేమిటో నాకు తెలియదు. అది క్రిందికి దిగి వచ్చునట్లుగా నేను చూచాను. ఎందుకనగా అదొక రంథ్రంగా ఉండెను. వారు దానిద్వారా ప్రవేశించి, పోటీకి
తల పడుటకు రంగ స్థలం పైకి వెళ్ళి, ఆ ఇద్దరు యోధులు పోరాడు చుండిరి. వారిలో ఒకరు చంపబడిరి. అనగా తన ప్రత్యర్థిని అతడు చంపివేసెను. ఇరువురు ఒకేలాంటి యోధులై... వ్యాయామా క్రీడాకారుల మరియు క్రీడాకారుల దృష్టి వాటిపైనే వుంటే వారిని అట్లే వదిలివేయుట మంచిది. నిజము. అది కయూను, హేబేలు మధ్య జరిగిన వ్యవహారంవలె ఉన్నది. మీకర్థమైనదా? అచ్చట చూచిన అతడు తన సహోదరుడై ఉండికూడా తన సహోదరుడిని చంపివేసెను. కాని పరిశుద్ధులకు ఒకసారి. అనుగ్రహించబడిన విశ్వాసమునకు తిరిగి వచ్చునట్లు సహోదరులను మరలా పుణరుద్దరించి తీసుకొనువచ్చు ప్రయత్నంలో మనమెంతో సంతోషిస్తున్నాము.
14. ఇప్పుడిచ్చట ప్రజలు నిలబడి ఉన్నారు. వారిని చాలాసేపు అలాగే ఉంచు టకు మేము ఇష్టపడుట లేదు. ఇచ్చట కొన్ని లేఖనములను చదువుటకు నేను వ్రాసి ఉంచాను. వాటిని నేను చదవాలనుకుంటున్నాను. ఇచ్చట కొన్ని వ్యాఖ్యాన ములలో, లేఖనములలో వ్రాసివుంచుకున్న వాటినుండి కొద్దిసేపు నేను మాట్లాడాలని ఇష్టపడుచున్నాను. మరి మనకు సాధ్యమైతే ప్రార్థనకొరకు మొదటగా మన తలలను మనము వంచి ప్రార్ధించుకుందాము. ఇప్పుడిచ్చటున్న వారిలో ప్రార్థనలో తమను జ్ఞాపకమును చేసుకొనుటకు ఇష్టపడు వారు, మీరు దేవుని వైపుగా మీ చేతులను పైకి ఎత్తి, “ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకొనుము" అని ఇప్పుడు చెప్పండి. ఇచ్చటున్న ఈ యవ్వన ప్రజలను, యవ్వన బాలికలను, యవ్వన బాలురను, యవ్వనస్థుల మరియు వృద్ధుల ప్రతీ ఒక్కొక్కరి చేతులను ఆయన చూచుచున్నాడు. మనము నిత్యత్వమును ఎదురుచూచు చున్నామని మనమందరము ఎరుగుదుము.
15. మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి మరలా మేము నీ కరుణా పీఠము వద్దకు సమీపిస్తున్నాము.మేము ప్రభువుద్వారా పిలువబడినవారమై నీవద్దకు వస్తున్నాము.
“నా నామమున తండ్రిని మీరేమి అడిగినను దానిని నేను చేసెదనని” చెప్పితివి. ఆ మాటలు సత్యమని మేమెరుగుదుము. కాబట్టి, "తండ్రీ, వారిని క్షమించమని” ప్రోక్షింపబడిన యేసు ప్రభువుయొక్క రక్తము కేకలు వేయుచుండగా మేము కరుణా పీఠమువద్దకు వచ్చుచున్నాము. తండ్రీ, గాడాంధకారపు లోయలో మేము నడుస్తున్నందువలన నిజముగానే కొన్నిసార్లు తడబడుచూ నడుస్తున్నాము. సువార్త వెలుగులోకి పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించుచున్నది. లేనియెడల తడబడుచూ, నిరీక్షణ లేనివారమై, దేవుడు లేనివారమై నిత్య అంధకారములో పడి ఉందుము.
కాని ఆ వివాహ విందుకు వచ్చునట్లుగా ఆహ్వానమునిచ్చి నీవు మాకొక మార్గమును సిద్ధపరచి ఇచ్చినందుకు మేము మిక్కిలిగా సంతోషించుచున్నాము. ఈ రాత్రి వేళలో ఇప్పుడిచ్చట కూర్చొనియున్న సమూహముతో సమకూడి వచ్చుట
ఎంతో ఒక భాగ్యమై యున్నది. అదెట్లున్నదనగా, వివాహ విందుకు ఆహ్వానించబడిన వారై, వస్త్రములను అలంకరించుకొని, వివాహామునకు వచ్చుటకు సిద్ధపడుచున్న వారివలె ఇప్పుడది ఉన్నది. ఇందుకు మేము మిక్కిలిగా కృతజ్ఞతులమై యున్నాము. ఒక అవసరత గలదు. ఈ ప్రశస్తమైన చేతులను, ఆ చేతుల వెనుకున్న అవసరత, ఈ రాత్రివేళ ఈ దేశమునకు ఎన్నో అవసరతలు గలవు, ప్రభువా, సంఘమునకు ఆ హృదయములోనున్న వాటిని మీరు చూచి వాటిని ఎరిగినవాడవు. దేవా! ప్రతీ ఒక్కొక్క హృదయములోని కార్యములను ఎరిగి వారి అవసరతలకు తగిన జవాబును నీవు వారికి అనుగ్రహించుము. తండ్రీ, నీ వద్ద నా ప్రార్థన అదియేయై యున్నది.
16. ఈ సంఘముకొరకు, దీనియొక్క మహిమకరమైన మనుగడకొరకు, అంధకార సమయములో కూడా ఇది ఒక దీప స్తంభంవలె నిలిచియున్నందుకు, కొండమీద పెట్టబడిన దీప స్తంభమై, దాని కాంతి కిరణములద్వారా దేశమంతటానున్న, విసిగిపోయిన వారు, పాప రోగ జనులు లోపలికి వచ్చి మరియు ఒక శ్రేష్ఠమైన దేశమున మాతో జీవించుదురుగాక! దేవా, ఈ సంఘ కాపరిని, మా ప్రశస్తమైన సహోదరుడను దీవించుము. మరియు ఈ సంఘ ట్రస్టీ బోర్డును, డీకను బోర్డును మరియు ప్రతీ సభ్యుడను, ఈ ప్రజలతో నిర్గమములోనున్న ప్రతీ ఒక్కొక్క వ్యక్తికొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఇచ్చట ఈ దేశమంతానున్న ఈ గొప్ప సంఘములకొరకు, దేవునియొక్క సంఘమును మరియు అంతర్జాతీయంగా గొప్ప మనుగడను సాగించు చున్న ఇరు పక్షముల వారికొరకు మేము ప్రార్థిస్తున్నాము. దేవా, ఏదోక దినమున పరిశుద్ధాత్మ శక్తిద్వారా మేమందరము ఏకమై సమకూడి ఉండెదమని, ఒకే సహవాస ములో మేము ఐక్యమగు కాలం వచ్చునని మేము విశ్వాసించుచున్నాము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఇప్పుడు ఈ తొలకరి వర్షమున విత్తనములను విత్తుము. కడవరి వర్షము కురియునప్పుడు అప్పుడది పరిపక్వము చెందిన సువార్త విత్తనము లను తీసుకొని వచ్చును. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. ఇప్పుడీ రాత్రి మమ్మల్ని దీవించుము. అల్పమైన, అప్రయోజకుడనైన నీ సేవకుడనైన నేను, మా ముందు పెట్టబడిన ఈ మాటలను కొన్ని నిమిషములు మాట్లాడుటకు ప్రయత్నిస్తుండగా మమ్మల్ని దీవించుము. ఈ సందర్భమునకు తగిన మంచి అంశమును అనుగ్రహిం చమని మేము నిన్ను వేడుకొనుచు, యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
17. ఇప్పుడు, నేడు రాత్రియందు మేము మీకొరకు మాట్లాడుటకు కోరుకొనుచున్న దేమనగా, ఈ దినముకొరకు అనుగ్రహించబడిన దైవీక స్వస్థత యొక్క వెలుగును మరియు మనము జీవించుచున్న ఈ దినముయొక్క సువార్తను మీ చుట్టూ
నిర్మించుటకు నేను ప్రయత్నిస్తున్నాను. ఆ సువార్తను మరియు దైవీక స్వస్థతకొరకు ఎవరైతే వెదుకుచున్నారో వారు విడుదలను పొందుకొనుటకు ఇదే ఆ ఘడియయై యుండుటవలన, దేవుడు తన ఆత్మను క్రుమ్మరించునని నేను విశ్వాసించు చున్నాను. యిర్మియా గ్రంథము 10వ అధ్యాయము, 2వ వచనములో.....
యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్య జనముల ఆచారములనభ్యసించ కుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి.
అన్య జనముల ఆచారములనభ్యసింపకుడి (ఇప్పుడు) ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడుచున్నారేయని మీరు వాటికి భయపడకుడి.
ఇప్పుడు, “ఆయన రాకడయొక్క సూచనలు" అనే అంశము మీద మాట్లాడాలని నేను కోరుచున్నాను.
18. ఇచ్చట క్లీవ్ లాండ్ చుట్టు ప్రక్కలనున్న చర్చ్ ఆఫ్ గాడ్ జనులగు మిమ్మల్ని నేను ప్రత్యేకంగా గమనించితిని. (నేను వచ్చిన మార్గమంతటా నాకు కనిపించిన వన్నీ వారి సంఘములేనని నేను భావించుచున్నాను). నేను ఈ అంశము మీద మాట్లాడాలని తలంచినప్పుడు, "సిద్దపడి ఉండుము, యేసుక్రీస్తు త్వరలో రాబోవు చున్నాడు" అనే ఒక రకమైన నినాదం వారి మధ్య ఉన్నదని నేను తలంచితిని.
సరే, ఇప్పుడు, అన్ని యుగములగుండా దేవుడు ఎల్లప్పుడూ... ఆయన ఏదైనా ఒక కార్యమును చేయుటకు ముందు, మొదటగా ఆయన ప్రజలను హెచ్చరించి, రాబోవుచున్న ఆ కార్యమును ఎదుర్కొనుటకు ఆయన వారికి ఒక సూచనను అనుగ్రహించునని మనమెరుగుదుము. ప్రకృతికూడా దానంతటది అట్లే చేయు చున్నది. వసంత కాలము వచ్చుటకు ముందు వాతావరణంలో ఉష్ణమును ఏర్పరచు చున్నది. చలి కాలం వచ్చుటకు ముందు వాతావరణంను చల్లగా చేయుచున్నది. మరి ఓ, మనము ఆవిధముగా అనేకమైన వాటిని ఉదాహరణగా చెప్పుకుంటూ వెళ్ళవచ్చును. అదంతా ప్రకృతి సంబంధమైనవి... కాబట్టి అలాగే, ప్రకృతియొక్క సృష్టికర్తకూడా ఒక అద్భుతమును లేదా ఏదోక కార్యము సంభవింప జేయుటకు ముందు తగిన ఒక సూచనను అనుగ్రహించును. అందుచేతనే ఆయన యొక్క తీర్పులు న్యాయమైనవి. ఎందుకనగా, నీవు అందుకొరకు హెచ్చరింపబడితివి.
19. ఇప్పుడు, ఒక మనిషి నిలబడవలసిన సంకేతంను తెలిపే వెలుగు గుండా వెళ్ళుచున్నప్పుడు, అతడు ఆవిధముగా ముందుకు కొనసాగుచు వెళ్ళుచుండగా అతని ఎదుట ఎఱ్ఱని కాంతి దీపం వెలుగునప్పుడు అది తనకు ఒక హెచ్చరికను
తెలిపే సంకేతమని అతడు బాగుగా ఎరిగియున్నాడు. ఇప్పుడిచ్చట నిలువవలసిన సంకేతంను తెలిపే ఎఱ్ఱని దీపం లేనియెడల ఇకప్పుడది. ఆ పట్టణము యొక్క పొరపాటు. లేదా నిలుపవలసిన సంకేతం తెలిపే సూచన అచ్చట ఎన్నడూ “లేకపోతే దానిని అచ్చట ఖచ్చితముగా పెట్టవలెను.)
కాని దేవుడెల్లప్పుడూ, ఏదైన ఒక కార్యము జరుగుటకు ముందుగా హెచ్చరిక యొక్క సూచనను అనుగ్రహించును. అర్థమైనదా? దానిని నా హృదయమంతటితో విశ్వాసిస్తున్నాను. నేను గత సంవత్సరముకంటే క్రీస్తును సమీపించు విషయమందు మరియు ప్రభువు రాకడనుగూర్చి ఇప్పుడు ఎక్కువ లోతుగా త్రవ్వుచూ అణ్వేషించు చున్నాను. ఇప్పుడిది ఒకటి సత్యమైయుండవలెను లేదా ఇది సత్యమై ఉండదు. ఈ పరిశుద్ధగ్రంథము ఒకటి సరియైనదిగా ఉండాలి లేదా సరికానిదిగా ఉండ వలెను. ఈ పరిశుద్ధ గ్రంథమును ఉన్నది ఉన్నట్లుగానే నేను విశ్వాసించుచున్నాను.
1
20. ఏదోక కార్యముద్వారా ఈలోకమును దేవుడు ఏదోక దినమున తీర్పుతీర్చును. ఒక సంఘముద్వారా ఆయన దీనిని తీర్పుతీర్చిన యెడల ఏ సంఘముద్వారా ఆయన దీనిని తీర్పుతీర్చును? కాతలిక్ సంఘము ఈలాగు చెప్పుచున్నది. “మేమే అది", లూథరన్లు, "మేమే అది" అని చెప్పుచున్నారు. మెథడిస్టులు “మేమే అది” అని చెప్పుచున్నారు. బాప్తిస్టులు, “మేమే అది” అని చెప్పుచున్నారు. పెంతెకోస్తు, “మేమే అది" అని చెప్పుచున్నారు. అట్లే చెప్పుకుంటున్న ముప్పది లేదా నలుబది లేదా ఏబది భిన్నమైన మరియు అనేక శాఖ సంఘస్థులు "మేమే అది" అని చెప్పుచున్నారు. అర్ధమైనదా? కాబట్టి అలాగు చెప్పుకుంటున్నా వారిలో “అది” ఎవరైయున్నారు? ఇప్పుడిచ్చట ఎంతో గందరగోళంగా ఉన్నది, అలాంటి గందరగోళమైన దానిని ఆధారముగా చేసుకొని ఏ మానవుడు తన విశ్వాసమునుంచడు మీరు వివాహము! చేసుకోబోయే అమ్మాయి భవిష్యత్తులో మంచి గుణవతియైన స్త్రీగా ఉండునో లేదానే విషయములో నీకు గందరగోళంగా ఉంటే ఆమెను అలాగే వదిలి వేయుట నీకు యుక్తమైన కార్యమగును. ఒక పురుషుని ఎన్నుకొను విషయములో కూడా అలాగే వర్తించును. విశ్వాసించుటకు ఏదోక ఆధారము మీకు కావాలి. )
21. కొంత కాలం క్రితం నేనొక యాజకునితో మాట్లాడుచుండగా, అతడు, “సరే” అని చెప్పుచూ... ఆ విషయమునుగూర్చి నేను అతనితో చెప్పుచుంటిని... ఒక స్త్రీ నా సంఘమునకు వచ్చుచుండెను. నేను ఆమె కుమార్తెకు బాప్తిస్మమును ఇచ్చాను. ఆమె ఒక కాతలిక్ కుటుంబంనకు చెందిన వ్యక్తిని వివాహము చేసుకొని ఒక కాతలిక్గానే మారిపోయెను. ఆమె ఇదివరకే బాప్తిస్మమును తీసుకొని యుండుట వలన, "నీవు ఆ అమ్మాయికి బాప్తిస్మమును యిచ్చితివి కదా” అని ఆ విషయమును
గూర్చి అతడు నన్ను అడిగెను. "అవును" అని నేను చెప్పాను "నీవు ఆమెకు చిలకరింపు బాప్తిస్మమును యిచ్చితివా?" అని అతడు అడిగెను.
"ముంచుటద్వారా క్రైస్తవ బాప్తిస్మమును నేను ఆమెకు యిచ్చాను (అర్ధమై నదా?)" అని నేను చెప్పాను.
"కాతలిక్ సంఘముకూడా అలాగే చేసేదని నీకు తెలుసా?" అని చెప్పెను.
"ఎప్పుడు" అని నేను అడిగాను.
"యేసుక్రీస్తు మరియు అపొస్తులుల వరకు" అని అతడు చెప్పెను.
"అది కాతలిక్ సంఘమని మీరు చెప్పుచున్నారా?" అని నేను అడిగాను.
"అవునయ్యా” అని అతడు చెప్పెను.
"ఆరుకుందల ఆరు సంవత్సరములకు ముందుగా చివరి అపొస్తులుడు మరణించినంతవరకు కాతలిక్ సంఘము ఎన్నడైనా ఉన్నట్లుగా చరిత్రలో ఎచ్చటైనా ఉంటే నాకు చూపించుము. మరియు నైసియా పితరులు, నైసియా సభ ముందు, నైసియా సభకు పిదప, రచయిత పెంబర్ రచియించిన “రెండు బబులోన్లు", రచయిత ఫాక్స్ రచియించిన "హత సాక్షులయొక్క పుస్తకము", ఓ, మరియు రచయిత బ్రాడ్బెంట్స్ రచియించిన "ప్రారంభ సంఘము", ఈ పవిత్ర చరిత్ర పుస్తకములన్నీ నీకు తెలిసినంత వరకు ఇచ్చట ఉన్నవి. ఈ పుస్తకములలో ఈ ప్రారంభ కాలములలో ఎన్నడైనా కాతలిక్ సంఘము ఉన్నట్లుగా ఒక్క పేజీలోనైనా మీరు నాకు చూపించగలరా? అని నేను అడిగాను. అర్ధమైనదా?
22. "నీవు లేఖనాత్మక దృక్పథంలో నుండి వాదించడానికి ప్రయత్నించుచున్నావు. వాటిల్లో ఏమేమి విషయములు చెప్పబడినవో వాటినిగూర్చి మేము పట్టించుకోము.) దేవుడు తన సంఘములో ఉన్నాడు. ఆ సంఘము మేమే” అని అతడు చెప్పెను,
"మీరే ఆ పరిశుద్ధ సంఘమైతే, అట్లయితే పరిశుద్ధ గ్రంథమేమి చెప్పుచున్నదో దానియందు మీరెందుకు నిలబడుట లేదు? వారే సంఘమును క్రమమున అమర్చి రని మీరు చెప్పుచున్నట్లైతే మరి మీరు దానిని మార్చివేసిరి” అని నేను చెప్పాను.
“సంఘముయొక్క క్రమమును మార్చుటకు మాకు హక్క గలదు. దేవుడు మాకు ఆ హక్కును ఇచ్చెను" అని అతడు చెప్పెను.
"మరి, అపొస్తలులు కాతలిక్కులైతే... వారావిధముగానే ఉన్నారని మీరు చెప్పు చున్నారు. సరే, అలాగైతే, వారు ఆ క్రమమును పొందుకొని, ఆ క్రమమునే వారు ఆచరించుచు చేసిరి. కాబట్టి మీరు మరలా అదే క్రమమునకు తిరిగి వచ్చిన బాగుండును" అని నేను చెప్పాను. అదే నిజము.
"అయ్యా, దేవుడు తన సంఘములో ఉన్నాడు" అని అతడు చెప్పెను.
“దేవుడు వాక్యమందు ఉన్నాడు. ఆయన వాక్యములో ఉండుట మాత్రమే కాదుగాని ఆయనే వాక్యమై యున్నాడు. నిజము. ఆయనే వాక్యమైయున్నాడు. దేవుడే వాక్యమై యున్నాడు” అని నేను చెప్పాను.
AP)
33
23. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము ప్రత్యక్షమై మనమధ్య నివసించెను.” సరిగ్గా ఇప్పుడు ఇచ్చట మన మధ్య ఉన్నాడు. అది అదే దేవుని వాక్యముగా, పలకబడిన విత్తనముగా ఉన్నది. సరిగ్గా ఏదేను తోటయందే, “ప్రతీ విత్తనము తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములను మొలకెత్తించును" అని అప్పుడే చెప్పబడి నది. అది నిజము.హవ్వ తారుమారైనప్పుడు, అనగా దెయ్యముయొక్క అబద్ధమును నమ్మెను, ఒక్క వాక్యమును మార్చి చెప్పినదానిని ఆమె తన ఆత్మలో నమ్ముట వలన తన గర్భమందు ఆమె తప్పుడు భీజమును పొందుకొనెను...
మ 0
దేవునియొక్క ఏ వాక్యమును కూడా మీరు వక్రీకరించుటకు కోరుకోకూడదు. ప్రవచనమునకు ఎలాంటి స్వంత అనువాదము ఉండకూడదని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. ఎందుచేత? ప్రవచనమనేది ప్రవక్తల ద్వారా ఇవ్వబడుచున్నది. ప్రభువు యొక్క వాక్యము ప్రవక్తల వద్దకే వచ్చును. ప్రవక్తలే ఆ వాక్యము ఏమి చెప్పుచున్నదో దానిని అట్లే చెప్పుదురు. కాబట్టి ఇక దానితో ఎలాంటి వాదము చేయకూడదు)
అ
24. పిదప ప్రకటన 21వ అధ్యాయములో దేవుడు చెప్పిన ఆ విషయమును మనము కనుగొన్నాము... లేదా 22వ అధ్యాయములో అది ఉన్నదని నేను విశ్వాసం చుచున్నాను. “ఎవడైనను ఈ ప్రవచన గ్రంధమందున్న వాక్యములో ఏదైనను తీసివేసిన యెడల లేదా మరి ఏదైనను కలిపిన యెడల...” అని ఉన్నది. కాబట్టి ఇది సంపూర్ణముగా దేవుని వాక్యమైయున్నది. ఈ వాక్యము ద్వారానే ఈ లోకము తీర్పు తీర్చబడును. కాబట్టి ఈ వాక్యమును వక్రీకరించుటకు కోరుకోకూడదు. అలాగే దానిని మరింతగా హెచ్చించి చెప్పుటయో లేదా తక్కువ చేసి చెప్పుటయో, మనము చేయకూడదు. ఆ వాక్యము ఎట్లున్నదో దానిని అట్లే ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. మరియు దానిని ఉన్న ప్రకారముగానే విశ్వాసించండి. అదెట్లున్నదో అట్లే అది ఉత్పత్తియగుటను నేను కనుగొంటిని; ఎందుకనగా, ప్రతీ విత్తనము తమ తమ జాతి ప్రకారము విత్తనములను మొలకెత్తింపజేయును.
ఇప్పుడు,హవ్వ... ఆమె దానిని నమ్మకపోవుటే కాదుగాని, జ్ఞానమును కనుగొను టకు వెతుకుచున్నది. దేవుని వాక్యమునకు దయ్యము ఎల్లప్పుడూ తన స్వంత అనువాదమునిచ్చుటకు ప్రయత్నించును. ఆ వాక్యమునకు కొంత తన జ్ఞానమును
చేర్చి, దాని అర్థము ఇది, లేదా దాని అర్థము అది"అని చెప్పును. దేవుడేమి చెప్పెనో S" దానిని ఖచ్చితముగా అట్లే చేయుటయే దాని పరమార్ధమగును. మరి అదెట్లున్నదో -చె దానిని అట్లే చెప్పండి. మరియు ఇకది స్థిరపడుతుంది. దానిని నేను అట్లే విశ్వాసిస్తు - న్నాను. అది సత్యమని నేనెరుగుదును. ఎందుకనగా దానిని ఆయన ప్రత్యక్షపరచి స మరియు ఇది సత్యమని దానిని ఆయన ఋజువుపరచును. అర్థమైనదా?.
FOL
80
C
3
అ
20 25. ఇప్పుడు, దేవుని వాక్యములోనుండి ఒక్క చిన్న మాటను వక్రీకరించుటవలన - ప్రతీ మరణము, ప్రతీ బాధ, ప్రతీ గుండెపోటు, సమస్తము, అనేక సమస్యలను - ఎదుర్కొనుచు మనము వెళ్ళుచున్న కార్యములు,కేవలము దేవునియొక్క వాక్యములో ఒక్క చిన్న మాటను మార్చివేయుట వలన అవన్నీ జరుగుచున్నవి. కాని వారు " దానిని అంగీకరించకుండా... కాబట్టి దానియొక్క ఫలితముగా ఆరువేల సంవత్సర 3 ములుగా గుండెపోటులను మనము కలిగియున్నాము. అంతేకాకుండా దేవుని గా > యొక్క కుమారుడు ఈ భూమిమీదకు వచ్చి, మానవ జాతిని విమోచించుటకు మరణించెను. ప్రతీ యుద్ధము, ప్రతీ గుండెపోటు, వివాహము కాని ప్రతీ తల్లి,దేవుని వాక్యమును అవిశ్వాసించుట వలన ఈ ప్రపంచములోని సమస్తము తప్పిదముగా మా పోయెను. ఆ వాక్యములో తొంబది తొమ్మిది శాతం దేవునియొక్క వాక్యమును విశ్వాసించి, ఒక్క చిన్న కొనలో కేవలము రవ్వంత మాత్రమే మార్చివేయుటవలనే ఇవన్నీ జరిగినవి. పిదప ఎచ్చటైనా ఒక్క విషయమును మార్చివేసిన... సంపూర్ణమైన దేవుని వాక్యములో నుండి దేనినైనా తక్కువగా చేసి, మరలా తిరిగి రాగలనని - మీరెప్పుడు తలంచవద్దు. దానిని అట్లే విశ్వాసించండి. దానియందే నిలిచి వుండండి. ఆ వాక్యము ఏమి చెప్పుచున్నదో దానిని అట్లే మనము చెప్పవలసి యున్నది.
గ్రా
26. కాబట్టి దేవుడు తన ప్రజలను, సూచనలు మరియు అద్భుతముల ద్వారా సమీపించును. ఇప్పుడు, "అన్యజనుల ఆచారముల నభ్యసింపకుడి". ఇప్పుడు, అన్యజాతివాడు అనే మాటకు అనువాదమేమనగా “అవిశ్వాసి" అని అర్ధము. అర్థమైనదా? అన్యజనుల, అవిశ్వాసియొక్క ఆచారముల(విధానము) నభ్యసింప కుడి. అవిశ్వాసికి దూరముగా ఉండండి. అర్థమైనదా? వారితో ఎలాంటి సహవాస మును కలిగి ఉండకుడి. అతడొక అవిశ్వాసి, అతడు ఒక అవిశ్వాసిగా గుర్తువేయబడి యున్నాడు. వెలుగు, చీకటి ఒకే సమయమున ఏర్పడునా? సూర్యుడు ప్రకాశించు దన్నప్పుడు చీకటి ఉండునా? ఎన్నటికీ ఉండదు. ఏది శక్తివంతమైనది? చీకటి, సూర్యుని వెలుగును మరుగు చేయగలదా? లేదయ్యా! సూర్యుని వెలుగు, చీకటిని పారద్రోలును. అర్థమైనదా? అది సరియైన దానికి మరియు తప్పిదమైన దానికి తప్పిదమైన
మాదిరిగా ఉన్నది. కాబట్టి తప్పుడు విషయము సత్యముయొక్క ఉనికి ఎదుట స్త్రీ ఒకేలాగ ఉండును. కార్యమును ఎంత వక్రీకరించినను అదింకా అట్లే అబద్దముగానే నిలువలేదు. అలాగే ఒక అబద్ధమనేది సత్యము ఎదుట నిలువలేదు. సత్యమెల్లప్పుడూ ఉండును. అర్థమైనదా? కాబట్టి సత్యము ఎప్పుడూ సత్యముగానే ఉండును.
27.) అవిశ్వాసియొక్క మార్గమును (ఆచారము) అభ్యసింపకుడి. అతడొక అవిశ్వాసి యైన యెడల అతడెలాగు ఉండాలని కోరుకొనుచున్నాడో అలాగే అతడిని ఉండ నివ్వండి. కాని నీవు ఒక విశ్వాసిగానే ఉండుము. “అన్యుడు” అనగా “అవిశ్వాసి” అర్థం. దేనినైతే విశ్వాసించాలో దానిని ఎవరైతే విశ్వాసించరో వారే అవిశ్వాసి యగును. "నేను దేవుని నమ్ముచున్నాను" అని చెప్పవచ్చును. అయినా నీవు దేవుని వాక్యమును విశ్వాసించని యెడల, అట్లయితే నీవు దేవునిని నమ్ముట లేదు. నిజము.
""నన్ను ప్రేమించుచున్నాడని చెప్పువాడు. నా ఆజ్ఞనలను గైకొనని యెడల అతడొక అబద్ధికుడు, అతనిలో సత్యమే లేదు". కాబట్టి, మనము దేవుని వాక్యమును విశ్వాసించవలసి యున్నది. మనము ఆయన వాక్యమును విశ్వాసించినప్పుడు, అదే మనము దేవునిని ప్రేమించుటకు ఋజువగుచున్నది. నేను నిన్ను ప్రేమించు చున్నానని మీరు చెప్పి, మరి నీవేమి చెయ్యాలో మీకు చెప్పిన దాన్ని మీరు చెయ్యకపోతే లేదా నేను చెప్పిన మాటలను వెంబడించుడని చెప్పినప్పుడు దానిని వెంబడించక పోయిన యెడల లేదా అట్లే నేను కూడా మిమ్మల్ని ప్రేమించుచున్నానని చెప్పి దానిని చెయ్యని యెడల అదెట్లుండును? (అర్థమైనదా?). కాబట్టి మనము చెప్పిన దానిని మనము చెయ్యలేదని అది నిరూపించుచున్నది. అనగా మనకు -ఒకరిపట్ల ఒకరికి నమ్మకము లేదని అర్థమగును. సృష్టించబడిన సృష్టి, సృష్టికర్తపై విశ్వాసము కలిగి ఉండాలి, తద్వారా అది ఒక ఐక్యతను ఏర్పరచును.)
ラ
28. అదెట్లున్నదనగా, విద్యుత్తును ప్రసారింపజేయు ఒక తీగ(కమ్మి)ను తీసుకొని దానిని ఒక డైనమో(dynamo) అనే యంత్రముతో కలిపి, ఎచ్చట విద్యుత్పత్తి 1 ఉండునో, విద్యుత్తును ప్రసారింపజేయు ఒక తీగ తీసుకొని ఒక సాకెట్లో దానిని పెట్టండి. దానిలో విద్యుత్పక్తి ప్రవాహించని యెడల అందులో ఏదో పొరపాటు - గలదు. అర్థమైనదా? అది పనిచేయని, విద్యుత్శక్తి ప్రవాహములేని తీగగా ఉండును. ఆ తీగను సాకెట్లోలో పెట్టి ఉంచినను దానివలన ప్రయోజనము ఉండదు. దానిలో - విద్యుత్ ప్రవాహించనియెడల అది చచ్చిన(పనిచేయని) తీగ. ఏ జీవములేని లేదా ఏ సత్యములేని అలాంటి ఒకదానిని తీసుకొని మనమెంత ప్రయత్నించినాగాని దానిలో ఏ మెరుపులేని ఒక నిర్జీవమైన ఉరుముగా ఉండును. అది నిజము. కాని మనము వాక్యముతో కలపబడి ఉండవలెను. అదే దేవుని యొక్క సత్యమైయున్నది.
29. “వారి మార్గము(ఆచారము)లను అభ్యసింపకుడి" అని ఆయన చెప్పెను. వారి మార్గములను వెంబడించవద్దు. వారినుండి తొలగిపోయి దూరంగా ఉండండి. వారి నుండి వైదొలగిపోండి. వారు నిరుత్సాహం చెందునట్లుగా మీరు నిరుత్సాహపడ వద్దు. భయపడుటనే పదం నుండే నిరుత్సాహపడుటనే పదం వచ్చినది. అనగా అదేమిటి? అవిశ్వాసులు భయపడెదరు. దేనికొరకు భయపడుదురు? ఆకాశములోని సూచనలను చూచి, సూచక క్రియలను మరియు అద్భుత కార్యములను గూర్చి మరియు మొదలగు వాటినిగూర్చి మీరు మాట్లాడునప్పుడు అది అవిశ్వాసులకు కోపమును రేకెత్తించును. వాటియందు వారికి నమ్మకము లేదు. అలాగే మీరు దైవీక స్వస్థతను గూర్చి మాట్లాడినను, “ఓ, మా సంఘము దానిని గూర్చి బోధించదు. "అలాంటి వాటికి మేము దూరంగా ఉంటామని” వారు చెప్పెదరు. పరిశుద్ధాత్మను గూర్చి చెప్పిన, “ఓ, అది కేవలం అపొస్తులులకు మాత్రమే"అని చెప్పెదరు. అర్థమై నదా? అందుకే వారి మార్గములను అభ్యసించవద్దు. వారికి దూరంగా ఉండండి. వాక్యమును అభ్యసించుడి, వాక్యములోనే నిలిచి ఉండండి. వాక్యమే సత్యమైనది.
2
>
ఆ
3
ఇప్పుడు, వారి మార్గములను అభ్యసింపకుడి, ఎందుకనగా ఆకాశము యొక్క సూచనలను చూచి వారు కలవరపడుదురు. దానినే ఈ పరిశుద్ధ గ్రంథములో, "- ఇచ్చట యిర్మియా 10వ అధ్యాయమున 2వ వచనమున, ఆఖరి వచనమున చెప్పబడినది. “వాటివలన వారు భయపడుదురు” అని ఉన్నది. వాటివలన వారు భయపడుదురు. అవి వారిని అధైర్యపరచుచున్నవి..)
30. ఇప్పుడిది వారిని అధైర్యపరచిన యెడల, ఆ సూచనలు వారిని అధైర్యపరచును మరియు నిరుత్సాహపరచును. కాని ఆ సూచనలు విశ్వాసిని ఉత్సాహపరచును. అదే నిజము. అది ఒకరిని నిరుత్సాహపరచుచున్నది. కారణమేమిటి? అతడు వాక్యమును విశ్వాసించుచున్నాడు. అదే విశ్వాసిని లేఖనముల సత్యమునందు ఉత్సాహపరచుచున్నది. సూచనలు... ఈ తరములోనున్న వారికి ఆయన యొక్క ప్రత్యక్షమగు సూచనలను గూర్చి నేను మాట్లాడుచున్నాను. ఇప్పుడు... అట్టైతే, ఈ తరములోనున్న వారు ప్రభువుయొక్క రాకడను చూచుననే లేఖనములను ఇచ్చట మనము చూపించిన యెడల పిదప... లేదా సరే... అయితే ఏమిటి?
"ఓ, నీవేమి చెప్పుచున్నావో దాని గురించి ఖచ్చితంగా నీకు తెలుసా?” అని మీరు అడుగవచ్చు.
మంచిది, నేను... ఆ సూచనలు దేనిని సూచించుచున్నవనే దానిని మనము కేవలం గమనించి మరియు మనము దానికెంత దగ్గరలో ఉన్నామనే విషయమును మనము చూద్దాం(అర్థమైనదా?). ఇంకా కొంత దూరంలో మీరు చేరవలసిన
గమ్యమునకు దగ్గరలో ఉన్నారని సూచన పలక తెలిపిన యెడల మీరు అందుకొరకు సిద్దపడి యుండుట యుక్తమైనది. ఎందుకనగా, ఆ గమ్య స్థలంను వెళ్ళి చేరుటకు కొన్ని గంటలు దూరంలోనే ఉండవచ్చును. అర్థమైనదా? కాని ఈ కాలమునకు ముందుగా ఏమి జరుగబోవుచున్నదో ఆయన మనకు చెప్పియుండెను. గనుక దాని గురించే ఇప్పుడు మనము చూడగోరుచున్నాము.
అవి అతడిని నిరుత్సాహపరచుచున్నవి. వాటినిగూర్చి ఆలోచించుటకుకూడా అతడు 31. అవిశ్వాసి ఆకాశములోని దేవునియొక్క సూచనలకు భయపడుచున్నాడు. 1 ఇష్టపడడు. వాటినిగూర్చి అతడు తన సంఘములో బోధించడు. వాటిని విశ్వాసించు 3 టకు అతడు తన ప్రజలను అనుమతించడు. అర్థమైనదా? తన చుట్టూ అలాంటి. 7 కార్యములు ఉండుటకు అతడు ఇష్టపడడు. అలాంటి విషయములను విశ్వాసించే > ఒక బోధకుడిని తన బలిపీఠము నందు అతడు అనుమతించడు. అదే నిజము. గత వారమున ఒక పెంతెకోస్తు గుంపుద్వారా నేను నిరాకరింపబడితిని. ఎందుకనగా, ఈ కార్యములనుగూర్చి వారు భయపడుట వలన, వాటి గురించి - వేలకొలది ఉత్తరములు మరియు అలాంటివన్నీ వారికి వచ్చి చేరుచున్నవి. అర్థమై - నదా? నిజము. పెంతెకోస్తు,ఇప్పుడు ప్రెస్బిటేరియన్ వారు కాదుగాని పెంతెకోస్తు వారే భయపడుచున్నారు. అవి వారిని కలవరపరచుచున్నవి. ఆకాశములో కనబడు _ సూచనలను గూర్చి, అద్భుతములను గూర్చి వారు భయపడుచున్నారు.
32. కాని ఒక విశ్వాసికి, అది దేవుని వాక్యమందు చెప్పబడిన ఆయన రాకడయొక్క - సూచన సత్యమని తెలిపే ఒక నిరూపణగా ఉన్నది. ఆమేన్. దేవునియొక్క వాక్యము సత్యమని అది నిరూపించుచున్నది. ఒక విశ్వాసికి అదట్లే ఉన్నది. ఆమేన్. కాని ఒక అవిశ్వాసి: కలవరపడును, భయపడును, నిరుత్సాహపడును. “ఓ, అదొక భరించ లేని కార్యమని" అతడు చెప్పును. "నీవు దానికి సంబంధించినవాడివి కాదనేదే దాని భావము”. అర్థమైనదా? దానివలన అతడు మిక్కిలిగా నిరుత్సాహముచెందును. కాని విశ్వాసికి: ఓ,అది బండలోని తేనెవలె ఉండును. అదొక ఋజువుగా వున్నది.
' 33. కొంత కాలం క్రితం ఒక చిన్న వ్యాసంను నేను చదువుచుండగా, దానిలో ఒక వ్యక్తికి నలుపు రంగులోని పక్షులంటే ఇష్టం. అతనికి స్ట్రా బెర్రీస్ ఫలములుగల ఒక పొలం ఉండెను. ఎందుకనగా నల్లని పక్షులకు స్ట్రా బెర్రీస్ పండ్లంటే ఇష్టం. ప్రతీ వసంత ఋతువులో ఆ పక్షులు ఉత్తరము నుండి వచ్చుటను చూచుటకు అతడు ఇష్టపడును. మన దేశమున ఉత్తర భాగమున కొన్ని శ్రేష్టమైన స్ట్రా బెర్రీ ఫలములు మనకు గలవు. కాని అతడు ఆ ప్రాంతమును వదిలి దూరంగా వెళ్ళవలసి
వచ్చెను. అతని ప్రక్కన నివసించువారు అతడచ్చట లేనందున ఆ పొలములోకి వచ్చి ఆ స్ట్రా బెర్రీ ఫలములను తీసుకొనుటకై, ఆ పక్షులను పొలంలోకి రాకుండా - చెయ్యాలని తలంచి ఆ పొలంలో ఒక పెద్ద దిష్టి బొమ్మను పెట్టిరి. రహదారిలో నడుస్తూ వెళ్ళేవారు దాన్ని చూచి దిగ్భ్రాంతి చెందునట్లుగా పెద్ద దిష్టి బొమ్మను పెట్టిరి. ఎందుకనగా వృద్ధుడు మరలా తిరిగి అచ్చటకు రాడని వారు తలంచిరి.
- 34. యధాప్రకారంగా ఆ నల్లని పక్షులు ఋతువు కాలమున మంచి ఆ స్ట్రా బెర్రీస్ ఫలములను తినుటనుగూర్చి తలంచుకుంటూ తిరిగి వచ్చినప్పుడు, వాటిల్లో కొన్ని పక్షులు అచ్చటున్న వృక్షములపై కూర్చొని కీచ్కీచ్ మంటూ అరుస్తూ, అటు, - ఇటు పరిగెత్తుచూ ఉన్నవి. కొన్ని పక్షులు కంచె వేసిన స్థంభముల మీద కూర్చొని కీచ్కీచ్ మంటూ అరుచున్నవి. కారణమేమిటి? ఎందుకని అవి అలాగు కిచకిచ మని అరుస్తున్నవనగా, ఆ అలజడికి కారణమేమనగా... కాని ఆ పొలములో చాలా స్ట్రా బెర్రీ ఫలములు ఉన్నవి. ఆ పొలంలో చక్కగా పండిన స్ట్రా బెర్రీ పండ్లు చాలా ఉన్నవి. అవి అందుకొరకు అలాగు అలజడి చెయ్యుటలేదు, కాని ఆ పొలములో దిష్టిబొమ్మ ఉన్నందువలన దానికి అవి భయపడుచున్నవి. అదే కారణమైయున్నది.
అదేవిధముగానే జనుల మధ్యకూడా కార్యములు అట్లే ఉన్నవని నేను తలంచి తిని. దెయ్యము అలాంటి పాత దిష్టి బొమ్మను అచ్చట పెట్టి ప్రతీ పావురమును భయపడునట్లు చేసి వాటిని దేశమునుండి దూరముగా తరిమి వేయుటకు - ప్రయత్నించుచున్నది. లేదా సాతాను ప్రతీ పక్షిరాజును కూడా అలాగే, సాధ్యమైతే - దేశమునుండి దూరంగా తరిమివేయుటకు చూచుచున్నది సాధ్యమైతే అనే మాటను నేను బహుశా చెప్పవచ్చును. అవునయ్యా. ఆ విధముగా సాతాను కొన్ని పాత దిష్టి బొమ్మలను పెట్టి ప్రతీ ఒక్కొక్కరిని భయపడునట్లు చేయును. మీకు అర్థమైనదా?)
35. కాని నన్ను ఆశ్చర్యపరిచిన విషయమేమనగా, సరిగ్గా ఆ దిష్టి బొమ్మయొక్క చెయ్యిమీద రెండు పెద్ద బలమైన పక్షులు కూర్చొని బ్లాక్ బెర్రీ లేదా స్ట్రా బెర్రీ పండ్లను తినుచున్నవి. అంతవరకు ఏ పక్షికూడా ఆ పండ్లను తినలేకపోయెను. చూచారా? అది నిజము. "అచ్చటున్న ఇతరులమీద ఏ శిక్షా విధియు లేదు" అని నేను తలంచితిని. అచ్చట ఖచ్చితముగా ఒక విషయము గలదు. అవునండీ. ఎందుచేత, ఆ రెండు పెద్ద పక్షులు అసలు దిష్టి బొమ్మమీద ఏ మాత్రము దృష్టిని పెట్టకుండా దానిని అసలు లెక్కచేయకుండా, సరిగ్గా అవి దానిమీదనే కూర్చొని ఎప్పటిలాగే ఆ స్ట్రా బెర్రీ పండ్లను తినుచుండెను, ఎందుకనగా, ఆ స్ట్రా బెర్రీ పండ్లు వాటికొరకే పండించబడి యున్నవి.
అది సరికాదని లేదా ఇది సరికాదని ఏదోక దానిని సూచించుచు దేవునినుండి
దూరంచేయుటకు ప్రయత్నించే ప్రతీ అవిశ్వాసపు దిష్టి బొమ్మ చుట్టూ తిరుగుచూ.. దానిపై దృష్టిని పెట్టని పురుషుడిని లేదా స్త్రీని దేవుడు దీవించునుగాక! ఎందుకనగా,
సరిగ్గా ఆ ఋతువులో పండిన సస్యమైన పంట ఫలము అచ్చట గలదు. ఆమేన్. అలాంటి దేవునినుండి నిన్ను దూరంగా చేయుటకు ప్రయత్నించు కార్యము లెన్నివున్నా సరిగ్గా వాటిగుండానే ముందుకు సాగిపోవుచూ ఉండుము. అలాంటి భయపెట్టే దిష్టి బొమ్మలకు భయపడకుండా, దేవుని నుండి దూరం చేయుటకు ప్రయత్నించు కార్యముల మధ్య సరిగ్గా అచ్చటే ఉంటూ, వాటికి కావలసిన ఆహారమును భుజించుచున్న ఆ పెద్ద పక్షులకు ఎలాంటి శిక్షా విధి ఉండదు.
36. దేవుని వాక్యం సత్యమని ఋజువుచేయబడెను. తన సూచనలద్వారా తన వాక్యమునకు దేవుడు సాక్ష్యమును కలిగి ఉండును. దేవుని వాక్యము ఒక భీజమై యున్నది. ప్రతీ విత్తనము దాని, దాని జాతి ప్రకారము విత్తనములను మొలిపించును (ఆదికాండము 1:11). ప్రతీ విత్తనము తమ తమ జాతి ప్రకారము. “దేవుని వాక్యము విత్తువానియొక్క విత్తనమువలె ఉన్నదని" యేసు చెప్పెను. అట్టైతే పరిశుద్ధ గ్రంథమున చెప్పబడియున్న ప్రతీ వాగ్ధానము దాని రకాన్ని(జాతిని) ఉత్పత్తి చేయును. ఆమేన్.
ఇప్పుడు, దీనినుండి మీరెట్లు దూరంగా తొలగి ఉండగలరు? పెంతెకోస్తు దినమున వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారని పేతురు చెప్పియుండగా, ఈ దినములలో పరిశుద్ధాత్మను పొందుకొనుటనే కార్యము లేనే లేదు, అది అపొస్తులు లకు మాత్రమే ఇవ్వబడినదని వారు చెప్పెదరు. ఇప్పుడు వారేమి చేయుచున్నారో గమనించండి. యెషయా చెప్పిన ప్రకారము మరియు ప్రవక్తలందరూ ప్రవచించిన ప్రకారముగా పరిశుద్ధాత్మ క్రుమ్మరింపబడెను... ఇప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క ప్రేరేపణ క్రిందనున్న ఒక వ్యక్తి ఈలాగు చెప్పెను, “ఈ వాగ్ధానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారందరికిని చెందునని", గనుక, ఈ దిష్టి బొమ్మలకు నీవు భయపడిన యెడల ఈ పరిశుద్ధాత్మను నీవెన్నటికీ పొందుకోలేవు. అర్థమైనదా? కాని నీవు భయపడనియెడల సరిగ్గా ఆ దిష్టి బొమ్మ వెనుకకు రమ్ము మరియు అది, ఇది, ఏది జరిగినను దానిని లెక్కచేయవద్దు, అవన్నీ నిన్ను లేదా దేవునియొక్క వాక్యమును ఏమీ చెయ్యలేవు. సరిగ్గా ఆ వాక్యములోనే నీవు నిలిచి యుండుము.
37. ఆ సూచనలు సత్య వాక్యముయొక్క నిరూపణగా ఉన్నవి. అన్ని యుగములలో వున్న దేవుడు దానినిగూర్చి చెప్పుచున్నాడు. మీలో కొంతమంది ఈ లేఖనములలో
కొన్నింటిని తీయాలని ఆశించిన హెబ్రీయుల పత్రిక 2:4లో అది గలదు. దేవుడు ఋజువుపరచిన దానిని అచ్చట మీరు చూడవచ్చును. అలాగే తన వర్తమానికులను కూడా ఆయన నిరూపించుచున్నాడు. పూర్వకాలమందు నా,నా సమయములలోను 9 నా,నా విధములుగాను దేవుడు, హెబ్రీయుల పత్రిక ఈ వచనముతో ప్రారంభమగు చున్నది. “పూర్వకాలమందు నా, నా సమయములలోను, నా, నా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, ఈ దినముల అంతమందు కుమారునిద్వారా యేసుక్రీస్తుద్వారా మనతో మాటలాడెను.” అర్థమైనదా? గనుక దీనిని చూడగా, వారు చాలా కాలం క్రితమే వారికి సువార్తను బోధించిరి. సూచక క్రియలు మరియు అద్భుత కార్యములు వారి మధ్య జరుగుచూ అది నిరూపించ బడెను. అట్లైతే సూచనలతోను, అద్భుత కార్యములతోను మరియు పరిశుద్ధాత్మ యొక్క వరములతోను తనను నిరూపించుకొనుచున్న దేవుడిని మనమెంత గట్టిగా పట్టుకొని ఉండవలెను? ఓ, పలు రకముల సూచనలతో యేసుక్రీస్తు తానెవరో, తానేమైయున్నాడో, ఇచ్చట ఏ ఉద్దేశ్యముకొరకు ఆయన ఉన్నాడో, ఈ భూమిమీద ఆయన ఉన్నప్పుడు ఆ సూచనలతో తనను వ్యక్తపరచుకొనెను.
ఎ
38. "మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. నన్ను మీరు ఎరిగిన యెడల నా దినమును మీరెరిగి యుందురని”
ఆయన చెప్పుటలో ఏ ఆశ్చర్యములేదు. చూచారా? నేడుకూడా సమస్య అదే. మనమే దినములలో జీవించుచున్నామో దానిని గ్రహించి, గుర్తించుటలో ప్రజలు విఫలమైరి. ఈ కార్యములు ఇట్లు ఈ మార్గముననే ఉండితీరవలయును. ఏదీకూడా క్రమమును తప్పి జరుగుటలేదుగాని సమస్తము పరిపూర్ణముగానే జరుగుచున్నవి..
39. కొంతకాలం క్రితం చిన్న అంశముమీద నేను ప్రసంగించాను. హెబ్రీయుల పత్రిక... నన్ను క్షమించండి. అది మత్తయి 11:6 అని నేను నమ్ముచున్నాను. దానికి “మరుగుచేయబడిన ధన్యత” అని పేరు పెట్టాను. బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చినప్పుడు, అవి యేసు పలికిన మాటలని మీరెరుగుదురు.
క్రీస్తు వచ్చుచున్నాడని బాప్తిస్మమిచ్చు యోహాను బోధించుట వలన, ఆ విషయములో యోహాను కొంత కలతను కలిగియుండెను. (ఇప్పుడు ఈ మాటలు పెంతెకోస్తు సహోదరులకు బాగుండును). అచ్చట క్రీస్తుయొక్క రాకడగలదనే విషయము గలదు. చెట్లయొక్క వేర్లుపై గొడ్డలిని పెట్టి అచ్చట యోహాను నిలబడి యుండెను. అచ్చట విష పాములవంటి తప్పుడు కార్యములు కొనసాగు చున్నవి. గనుక వాటినిగూర్చే అతడు బోధించుచుండెను. అతడు అరణ్యములలో నివసించు
చుండెను. ఎలాంటి వేద కళాశాల అనుభవము అతనికి లేదు. గనుక అతనికి తెలిసినదంతా అరణ్యములో గొడ్డలితో నరుకుట మరియు కొన్ని రకముల పాము లను గురించి మాత్రమే. తనకున్న అనుభవమంతా అలాంటి విషయములనుగూర్చే అతనికి తెలుసు. అనగా అరణ్యములో తానేమి చూచెనో వాటిని గురించే అతనికి "తెలుసు. అర్థమైనదా? కాబట్టి పాము పరిగెత్తుకొని దగ్గరకు వచ్చినప్పుడు దానినుండి వేగముగా తప్పించుకొని పారిపోవలెను. అదే తాను ఎరిగిన విషయము.
-
-
1 40. కాబట్టి, పరిసయ్యులనుగూర్చి యోహాను చెప్పినప్పుడు, "సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు”. అర్థమైనదా? - కాబట్టి అచ్చట అతడు నిలబడి ఈలాగు చెప్పెను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుములను కొట్టులో "పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును మరియు ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది. ఓ, దేవా! మెస్సీయ్యా రాకడ ఎంత అద్భుతమైనది?కాని ఆయన అచ్చటకు వెళ్ళినప్పుడు, దీన ఆకారముతో, సాత్వికుడై, మృధువైనవాడై, భుజములు వంగినవాడై ఉండెను. పరిశుద్ధ గ్రంథము, "ఆయనకు సురూపమైనను, సొగసైనను లేదు. వ్యసనా క్రాంతుడుగాను, దుఃఖా క్రాంతుడుగాను ఉండెను” అని చెప్పబడెను.
)
యోహాను చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు వీటన్నింటిని గూర్చి తలంచు చుండెను. కానీ అతడేమి చెప్పెననగా, “ఒక సరియైన సూచనను నేను చూచితినని ఖచ్ఛితంగా అనుకుంటున్నాను. ఇప్పుడు, అరణ్యములో ఆయన నీతో ఏమి చెప్పెన * ? నగా, ఎవరి పైనైతే ఆత్మ దిగి నిలిచియుండునో, ఆయనే పరిశుద్ధాత్మ ద్వారాను, . అగ్నినిద్వారాను పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఆ సూచనను నేను చూచాను. అది సత్యమని నేను సాక్ష్యమును కలిగివున్నాను. ఆయనే దేవునియొక్క కుమారుడు అయినాగాని ఆయన... ఆయన ఈవిధముగా ప్రవర్తించు తీరును చూస్తే ఇదేదో _ పొరపాటుగా ఉన్నట్లనిపించుచున్నది. కనుక ఈ విషయమును వెళ్ళి కనుగొనుట 'మంచిదనిపించు చున్నది”. అందుకే అతడు తన కొంతమంది శిష్యులను పంపెను.
41. యేసు, “ఇప్పుడు ఒక్క నిమిషము ఆగుము. నీతి నిమిత్తము చెఱశాలలో ఎట్లు ప్రవర్తించవలెననే విషయమును అతడు తెలుసుకొనుటకు వేద కళాశాలకు పంపించి అచ్చటనుండి ఒక పుస్తకమును తీసుకొని వచ్చి నేను యోహానుకు యిచ్చి పంపించెదనని” చెప్పలేదు. లేదు. ఆయన ఎన్నడూ అట్లు చెప్పలేదు. “అతని తండ్రి చేసినట్లుగా, ఇంకో రెండు సంవత్సరములు కళాశాలకు వెళ్ళి అభ్యసింపవలె నని” ఆయన చెప్పలేదు. యోహాను ఎన్నడూ కళాశాలకు వెళ్ళలేదు. పాఠశాలకు కూడా ఎన్నడూ వెళ్ళలేదు. అతడు బాలునిగా ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు
మరణించిరి. తొమ్మిది సంవత్సరముల వయస్సులోను అతడు అరణ్యలోకి వెళ్ళెను. 1 ఎందుకనగా దేవునియొద్ద నుండి అతనికి ఒక వర్తమానము వచ్చెను. అదేదో మానవ కల్పిత సిద్దాంతం నుండి రాలేదు. అది దేవునియొద్ద నుండే రావలెను అతని తండ్రివలె బుద్దిలేనివానివలె ఆ కొద్దిపాటి వేదశాస్త్ర కళాశాల అనుభవము చుట్టూ 'తిరుగుచున్నటువంటి అనుభవముతో కాకుండా (నిజంగా అతడొక యాజకునిగా ఉండెను)... ఎందుకనగా యోహానుయొక్క దినములు అతి ప్రాముఖ్యమైన దినములుగా ఉండెను. అతడు తన తండ్రి అభ్యసించిన పాఠశాలకు వెళ్ళలేదు. అతడు AVO) అరణ్యమునకు వెళ్ళెను. కాబట్టే అతడు దేవునియొక్క పాఠశాలందు అభ్యసించెను.
à
42. దేవుడు చాలా ఖచ్చితంగా అతనివద్ద ఈలాగు చెప్పెను. “ఇప్పుడు యోహాను, దీనిలో ఎలాంటి పొరపాటు లేదు. నీకొరకు అనుగ్రహించబడిన సూచన కొరకు 9 నీవు వేచి ఉండుము. ఈ సూచన అచ్చట ప్రత్యక్షమగుటను నీవు చూచినప్పుడు, ఎట్లనగా, పరిశుద్దాత్మ ఒక అగ్ని మేఘమువలె దిగుచున్నట్లు మరియు ఒక పావురము ఎగురుచూ క్రిందికి దిగి వచ్చుటవలె చూచినప్పుడు, రాబోవుచున్నవాడు ఆయనే” అని గుర్తెరుగుము. “నేను ఆయనను చూచాను. కాని ఆయన అట్లు ప్రవర్తించుట - లేదు. కాబట్టే అచ్చటకు వెళ్ళి దానినిగూర్చి కనుగొంటాను" అని యోహాను చెప్పెను. గనుక యేసు, “నేను నీకు చెప్పుచున్నాను. ఇంకా వెనక్కి వెళ్ళవద్దు. మరియు ' ఎలాంటి పుస్తకమును లేదా దేనిని తీసుకొనవద్దు. ఆరాధన ముగించేవరకు అట్లే నిలిచి ఉండుము. సాయంకాల ఆరాధన ముగించేవరకు వేచియుండుము” అని C చెప్పెను. పిదప వారు అచ్చట నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు, “వెళ్ళి, యోహానుకు చెప్పండి(ఆమేన్). నేను సరియైన సమయమునకే వచ్చానని, రావలసిన సమయము "కంటే ఆలస్యంగా రాలేదని మరియు సమస్తము క్రమము ప్రకారముగానే జరుగు చున్నవని చెప్పండి" అని యేసు చెప్పెను. ఆమేన్. అర్థమైనదా? ఆ విధముగానే మనముకూడా నేడు దానిని పొందుకొనవలెను. ఏదోకటి జరిగినదని మనము తలంచుచున్నాము. అదలాగు కాదు. ఆయన సరియైన సమయములోనే కార్యములు చేయును. ఎప్పుడు ఆ కార్యములో సమయము గతించిన తర్వాత ఆయన చెయ్యడు. ఆమేన్. సమస్తము ఇప్పుడు సరియైన సమయములోనే ఖచ్చితముగా సాగుచున్నవి. “మీరు వెళ్ళి, విన్నవాటిని, కన్నవాటిని యోహానుకు తెలుపుడి. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు”. పిదప అతడు వెళ్ళినప్పుడు...
43. ఆ అభిప్రాయమును నేను ఇష్టపడుచున్నాను. చూడండి. యేసునుగూర్చి, - యోహాను చాలా అల్పమైన వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానించాడు. "రాబోవువాడవు నీవేనా...."అర్థమైనదా? ఆ చెఱసాలలో ఉంటు అతడేవిధముగా బాధపడుచున్నాడో,
కాని యోహానుపరిస్థితి యేసుకు తెలుసు. పెంబర్ చెప్పినట్లుగా, "ఆయనయొక్క పక్షిరాజు కన్నులు ఆ పరిస్థితిని చిత్రీకరించెను”. కాబట్టి అచ్చట అతడు బంధింప బడి, సరిగ్గా ఆ సమయమున అతనిలో గల ప్రవచనా వరము క్రియచేయకుండా చెఱసాలలో అతడు బంధింపబడి ఉండెనని నేను ఊహించు చున్నాను. ఎట్లనగా ఇంకా కొన్ని రోజులలో తన శిరస్సు చేధించబోవుచున్నారని యోహానుకు తెలుసు.
ב కాని యేసు చుట్టూ తిరిగి చూచి, ఎవరూ అభినందించలేని విధముగా ఎంతో ' గొప్పగా యోహానును అభినందించెను. ఆయన,“మీరేమి చూచుటకు అరణ్యము లోనికి వెళ్ళితిరి? అవును, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి?గాలికి - కదులుచున్న రెల్లునా? యోహానును కాదు, కాదు. కాదు. గుండ్రని కాలరుతో టెక్స్ట్ కోటును ధరించుకొనియున్న వేద కళాశాల నుండి అభ్యసించి వచ్చిన మనిషిని - చూచుటకు మీరు వెళ్ళితిరా? కాని మీకు తెలుసా? వారు అలాంటి వస్త్రములను _ ధరించుకొని చిన్న పిల్లలను ముద్దుపెట్టుకొనుచు, యవ్వనస్థులకు వివాహములు చేయుచూ మరియు మృతులను భూ స్థాపన చేయుచుందురు. వారు రాజుయొక్క భవనముల చుట్టూ తిరుగుచుందురు. మరియు డి.డి, పి హెచ్, ఎల్ ఎల్, క్యుయు, అలాంటి పట్టములన్నింటిని కలిగియుందురని మీకు తెలుసా? మరియు చూడండి. వారావిధముగానే ఉండెదరు. కాని మీరేమి చూచుటకు వెళ్ళిరి. ఒక ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. అవునండీ. మీరు అంగీకరించుటకు మనస్సున్నయెడల ఇదిగో అతనిగూర్చి ఇచ్చటీలాగు చెప్పబడెను. (మలాకీ 3) ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్దపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇతడే దీనిలో చెప్పబడినవాడు. ఇప్పుడు అచ్చట ఒక సూచన ఉండుటను గమనించండి. (అతడు ఆ సూచన వైపు గమనిస్తూ చూచుచున్నాడు.గె
44. ఇప్పుడు, ప్రతీ యుగములగుండా దేవుడు ప్రజలకు సూచనలను అనుగ్రహిం చుచు, దానికి తగిన సాక్ష్యములనుకూడా కలిగియుండెను. మీరు లేఖనములను గుర్తుంచుకోవాలని తలంచిన యెడల ద్వితియోపదేశ కాండము 18:22 మరియు 13:1ని గుర్తుంచుకోండి. ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక సంపూర్ణమైన నిశ్చయముతో కూడిన సూచనను అనుగ్రహించెను. ఆయన... తన ప్రవక్తలను తన వాక్యముద్వారా దేవుడు పంపుచున్నాడు. నిజమేకదా? దానినే పరిశుద్ధ గ్రంథము ఖచ్చితముగా చెప్పుచున్నది. ప్రభువు వాక్యము ప్రవక్తలయొద్దకు వచ్చుచున్నది. ఒక నిజమైన ప్రవక్త ఉన్న యెడల అతడెట్లు ఉండునో పరీక్షించి చూచుటకు ఇచ్చట *ఆయన ఒక విషయమును సూచించెను. ఒక ప్రవక్త ప్రవచించిన యెడల, అతడేమి చెప్పెనో అది నెరవేరవలెను. అప్పుడు అతని మాటలకు చెవియొగ్గుము. కాని ఆ
ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరనియెడల, అట్లయితే దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడ లేదు. అదే పరీక్షయై యున్నది. కాబట్టి అతనికి భయపడవద్దు. అది నిజము. మీ మధ్య ఆత్మ సంబంధమైన వాడు లేదా ఒక ప్రవక్త యుండిన యెడల ప్రభువైన దేవుడునగు నేనే దర్శనమిచ్చి, అతడు నన్ను తెలుసుకొనునట్లు దర్శనములలో, స్వప్నములలోను అతనితో మాటలాడుదును. అతను చెప్పినవి నెరవేరినయెడల అప్పుడది నేను అతనితో మాటలాడుచున్నాను. ఖచ్చితముగా, దేవుడు అబద్దమా డడు. ఆయన అబద్దమును మాటలాడలేడని మీకు తెలుసు. ఆయన అబద్దమాడు టకు ఏమి లేదు. సమస్త పరిశుద్ధతకు, సమస్త సత్యమునకు ఆయనే దేవుడగును.
కాబట్టే దేవునియొద్ద నుండి ఎలాంటి ఒక అబద్దమనేది రాలేదు. ఆయన పరిపూర్ణుడు మరియు పరిశుద్దుడైయున్నాడు.
45. అది ప్రభువు వాక్యమైయున్న యెడల, అట్టైతే అది ముందుగానే సంకల్పించబ డిన ఆయనయొక్క ఆలోచనయైయున్నది. ఆమేన్. కాబట్టే మనము నిత్య జీవమును కలిగియున్నాము. ఎందుకనగా మనము దేవునిద్వారా పలకబడిన మాటద్వారా ఉనికి(జీవము)లోకి వచ్చాము, ఒక సంఘమున చేరుటద్వారా కాదుగాని, ఆ మూల భీజమునుండి వాక్యముద్వారా జన్మించితిమి. “కలుగునుగాక” అని దేవుడు పలుకుట వలన అది అచ్చట కలిగిన విధముగా మనము వచ్చితిమి. ఆమేన్. ఆ విధముగానే నేడు దేవుడు తన బిడ్డలను, వారియొక్క హృదయము గర్భంలో తన వాక్యముతో జన్మింపజేయుచున్నాడు. మరియు ఆయన వాక్యమనే వేర్లు లోతుగా పాతుకొని అది వారిలో ఎదుగుచున్నది. మానవుని హృదయములోనున్న ఆత్మ “అది దేవుడని” గ్రహించిన పిదప అదెలాగు ఆయన వాక్యమును నిరాకరించును? నిజంగా ఆ దేవుని వాక్యము దానంతటదే మానవుని హృదయమున ఉండి తీరవలెను. ఆమేన్. అట్లు దేవుని వాక్యము ఆ హృదయమున లేనియెడల దానిలో వేరే ఏదోకటి ఉండును. మరియు అచ్చట పరిశుద్ధాత్మనేది ఉండదు. సరే మంచిది.
46. ప్రభువుయొక్క ప్రవక్తలు ప్రతీ తరమువారికి సూచనలను మరియు అద్భుత - కార్యములను యిచ్చిరి. ప్రవక్తలు, నిజమైన ప్రవక్తలు నిజమైన వాక్యమును, నిజమైన లేఖనానుసారమైన సూచనలతో యిచ్చిరి. ఇప్పుడు గుర్తుంచుకోండి. ఇప్పుడిచ్చట సత్యమునకు మరియు అసత్యమునకు మధ్యనున్న బేధమును మనము చూద్దాము. - ఎందుకనగా గుర్తుంచుకోండి. పరిశుద్ధ గ్రంథమున మత్తయి 24వ అధ్యాయమున చెప్పిన నేడు ఆ రెండు ఆత్మలు, సాధ్యమైతే ఎన్నుకొనబడిన వారిని సహితము మోసపుచ్చునంతగా చూచుటకు అవి ఒకేవిధముగా ఉండుననే విషయమును
ఇంకా కొద్దిసేపటిలో మనము చూడబోవుచున్నాము. దానిని ఈలాగు చెప్పుచున్నం దుకు నేను సంతోషిస్తున్నాను. అనగా “సాధ్యమైతే" ఎన్నుకొనబడిన వారిని.. ఎవరైతే 3) ఎన్నుకొనబడినవారో వారు దేవునిద్వారా ముందుగా ఎరుగబడినవారు, "దేవుడెవరిని ముందుగా ఎరిగెనో, వారిని ఆయన పిలిచెను. ఎవరినైతే ఆయన పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆయన ఎవరినైతే నీతిమంతులుగా తీర్చెనో వారిని ఆయన ముందుగానే మహిమపరచెను. ఇక ఆ కార్యము అంతటితో ముగించి 1 పోయెను. అవునండీ. మీకు అర్థమైనదా? అట్లయితే, సాధ్యమైతే ఎన్నుకొనబడిన a వారిని సహితము అది మోసపుచ్చును. మరియు అది ఖచ్చితముగా చూచుటకు 35 సరియైన విషయముగానే కనబడుచున్నది. సరే మంచిది.
కాని నిజమైన ప్రవక్తలు, నిజ వాక్యముద్వారా నిజమైన సూచనలను యిచ్చిరి. 23 (అది నిజమేకదా?) నిజమైన వాక్యము. కొంతమందిని మాత్రమే తీసుకొని నేను 1 వివరించి చెప్తాను. ఇంకా కొంచెం ముందుకు మనము కొనసాగే ముందుగా 3 సరిగ్గా ఇచ్చట వారిలో ఒకరినిగూర్చి చూద్దాం. నిజమైన ఒక కార్యమునకు అబద్ధ > మనేది చాలా దగ్గరగా ఉన్నట్లు కనబడును. (నేను గట్టిగా మాట్లాడుచున్నానా? నా - మాటలు చాలా శబ్ధంతో మీకు వినిపించుచున్నావా? చూడండి. ఆ వెనుక ప్రక్కన - కూర్చున్నవారికి నా మాటలు వినిపించుచున్నవా?) సరే. ఇప్పుడు సత్యమునకు, - అసత్యము చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించుచున్నది. సాతాను హవ్వకు చెప్పిన - విషయము కూడా ఇంచుమించు పరిపూర్ణంగా సత్యమేనన్నట్లుగా ఉండెను.
47. గమనించండి. యెహోషాపాతు మరియు అహాబు కాలములలో... అహాబు తనకొరకు నాలుగువందల ఇశ్రాయేలీయుల ప్రవక్తలను భధ్రపరచి ఉంచెను. వారి ప్రవక్తలు, ఇశ్రాయేలీయుల ప్రవక్తలు యూదులను సత్య మార్గములో నడిపించిరి. ఆ నాలుగు వందల ప్రవక్తలను ఆహాబు వేదాంత కళాశాలలో తర్ఫీదుచేసి వారిని - తనకొరకు అతడు భద్రపరచి ఉంచెను. కాబట్టి యెహోషాపాతు, అహాబుతో మైత్రిని కలిగియుండుటకై వచ్చెను. ఆహాబు తన ప్రవక్తలను పిలిచి, “యుద్దము చేయుటకు రామోల్గిలాదు మీదికి పోదునా, పోకుందునా?” అని తన ప్రవక్తలవద్ద అడిగెను. గుర్తుంచుకోండి. అది చూచుటకు ఎంత నిజముగా ఉన్నదో చూడండి. ఆ ప్రవక్తలు, "ప్రభువు నీతో ఉన్నాడు, గనుక పొమ్ము” అని చెప్పిరి. ఎందుచేత? వారు దేనిని ఆధారముగా చేసుకొని అట్లు చెప్పిరి? ఎట్లనగా, ఆ స్థలము వారికి చెందినది,కాబట్టి దానినే ఆధారము చేసుకొని చెప్పిరి. నిజము. యెహోషువా ఆ దేశమును విభాగించి యిచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు రామోల్గిలాదును యిచ్చెను. కాని శత్రువులు వారిని ఆ స్థలమునుండి తరిమికొట్టి, దానిని వారు ఆక్రమించుకొనిరి.
సహోదరులారా, ఇప్పుడు చూడండి. చూస్తున్నారా? అదే నిజము. ఆ భూమి-మీకు చెందినదే, కాని కార్యములన్నీ సరిచేయబడేంత వరకు శత్రువులద్వారా ఆ భూమి స్వాధీనము చేసుకొనబడి వారి వశము ఉండును. వాక్యము వద్దకు మరలా తిరిగి రండి. అర్థమైనదా? దానిపై మనకు ఎంత హక్కు ఉన్నాగాని దానితో సంబంధం లేదు. మరలా మనము వాక్యము వద్దకు తిరిగి, ఆ వాక్య క్రమములోకి వచ్చి తీర వలెను. ఆవిధముగానే దేవుడు దాని మార్గమును సిద్దపరచి యుంచెను. మనము మరలా వాక్య క్రమశిక్షణలోకి తిరిగి రావలసియున్నది. మనము వాక్య క్రమములోకి, అనగా దేవుని వాక్య క్రమములోకి తిరిగి వచ్చినప్పుడే అది క్రియ చేయును.
48. "ప్రభువు నీతో ఉన్నాడు, గనుక దానిమీదికి యుద్దమునకు నీవు వెళ్ళుము” అని ఆ ప్రవక్తలు చెప్పిరి. మరియు వారిలో ఒకరైన సిద్కియా అచ్చట ఉన్నాడని నేను నమ్ముచున్నాను. అతడు రెండు ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, “వీటితో నీవు శత్రువులను పొడిచి నాశనముచేసి ఆ దేశమునుండి వారిని పారద్రోలెదవు” అని చెప్పెను. కాని ఒక నిజమైన ఆత్మ సంబంధమైన మనిషి...మీకు తెలుసా... (ఈ-రాత్రి ఈ భవనమంతా పూర్తిగా అలాంటి వారితో నిండివున్నారని నేను నమ్ము చున్నాను). అర్థమైనదా? ఆ ప్రవక్తల మాటలు యెహోషాపాతుకు సరియైన మాటలుగా ధ్వనించుట లేదు. ఎందుకనగా, అతడు మంచి వ్యక్తి. ఈ రాత్రి యిచ్చట ఉన్నవారందరి కంటె బహుశా, రెండు రెట్లు ఇంకా ఎక్కువగానేయున్న నాలుగు వందల మంది ప్రవక్తలందరూ ముక్త కంఠంతో ఒకేవిధముగా ప్రవచించిరి. అహాబు, “ఇదిగో ఇప్పుడు అచ్చట వారు ఉన్నారు. ఇక్కడే వారు ఉన్నారు. గనుక ఇదే మన సూచన"అని చెప్పెను. సిద్కియా, “నేను నీకొక సూచనను చేసి చూపించెదనని, రెండు ఇనుప కొమ్ములను చేసి తీసుకొని వచ్చి, ఈ రెండు కొమ్ములతో శత్రువులను పొడిచి నాశనముచేసి వారిని నీవు అచ్చట నుండి పారద్రోలెదవు. ఇది ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు”అని ఆ ప్రవక్త చెప్పెను.
49. కాని యెహోషాపాతు, “వాళ్ళు చెప్పే విషయములో ఏదో పొరపాటుగలదు. ఈ విషయంలో నేను నా వ్రేలు పెట్టను. అయినా ఇందులో ఏదో పొరపాటుగలదు. వీళ్ళు తప్ప వేరే ఇంకెవరూ లేరాని?” అడిగెను. అహాబు, "ఆ, ఉన్నాడు. మనము ఇంకొకరిని పిలువవచ్చు. అదిగో అచ్చట పరిశుద్ధ దొర్లు బండవంటి ఒకడున్నాడు. అతడి పేరు మీకాయా, కాని నాకు అతడంటే ఇష్టము ఉండదు. ఎందుకనగా, అతడు ఎప్పుడూ నాకు విరుద్ధముగా కీడునే ప్రవచించునని” చెప్పెను. “ఓ, రాజైన నీవు అలాగనవద్దు, అతడేమి చెప్పునో ఆలకించుదాము" అని యెహోషాపాతు చెప్పెను.
కాబట్టి వారు మీకాయావద్దకు ధర్మకర్తలను, పెద్దల(deacon)సమూహమును పంపించగా వారు మీకాయాతో, "ఇదిగో ఆలకించుము, వారేమి చెప్పితిరో వారి మాటలతో నీవు ఏకీభవించి, వారు చెప్పినట్లుగా నీవుకూడా చెప్పినయెడల, అప్పుడు నిన్నెట్లు సన్మానించెదరో తెలుసా? నిన్ను ఆ రాష్ట్రానికి మత పెద్దగా లేదా మంచి హోదాగలవానిగా చేసెదరని" చెప్పిరి. ఓ, దేవునియొక్క మనిషితో వారెట్లు మాట్లాడు చున్నారో మీరు ఊహించగలుగుచున్నారా? "ప్రభువైన దేవుడు నాకు సెలవిచ్చున దేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదునని" మీకాయా చెప్పెను.
-50) మన స్థితికూడా అట్లే ఉండాలి. మనముకూడా అట్లే ధృడముగా నిలబడవలెను. అవునండీ. అతడేమైయున్నాడు. అతడే ఒక సూచనగా ఉన్నాడు. అప్పటికి సరియైన సూచన అతడే. ఏదోక కార్యము జరుగబోవుచున్నది. దేవుడు తన వాక్యమును నెరవేర్చబోవుచున్నాడు. ఎందుకనగా, అహాబు మరియు యెజెబెలులయొక్క దుష్ట కార్యముల వలన వారికేమి జరుగబోవుచున్నదో ఇదివరకే దేవునియొక్క నిజ ప్రవక్తయగు ఏలీయా వద్ద ఆయన చెప్పెను. పశ్చాత్తాపమే లేని అలాంటి దుష్ట కార్యమును ఆయన ఎలాగు దీవించగలడు?.
భిన్నమైన బేధములతో, స్వార్థంతోను, పైకి భక్తిగల వారివలె వేషం ధరించుకొని, దేవుని వాక్యమును త్రోసివేయుచు, మరియు దేవునియొక్క శక్తిని నిరాకరించుచు, సంఘమున దుర్నీతో నిండిపోయిన నేడున్న స్థితిలో దేవుడు అచ్చట తన కార్యములు ఎట్లు చేయగలడు?. దానిపై తన దీవెనలను ఎట్లు ఉంచగలడు?. ఆయన దానిని చేయలేడు. నిశ్చయముగా ఆయన చేయడు. మరలా మనము ఆ 'నిజమైన కార్యము వద్దకు తిరిగి రావలసియున్నాము.
మీకాయా, “ఈ రాత్రి వేచి ఉండండి” అని వారి దగ్గర చెప్పెను. ఆ రాత్రి ప్రభువు అతనికి ప్రత్యక్షమాయెను, గనుక ఆ ప్రవచనము ఏమిటని మీకు తెలుసు. కాబట్టి అదే ఖచ్చితముగా నిజమైన ప్రవచనము. అదే ఒక సూచన.
51. ఇప్పుడు, అవి నిజమైన ప్రవచనములైనయెడల...పిదప మనము నేర్చుకో వలసినదేమనగా, అచ్చట మత్తయి 24లోని లేఖనములో అచ్చట సత్యము మరియు అసత్యమైనవి రెండు గలవని మనమెరుగుదుము. అది మనకు తెలుసు. సత్యమైన కార్యమును మీరు చూచు ప్రతీసారి దానితోపాటు అచ్చట అసత్యముకూడా ఉండుటను మీరు చూడగలరని గుర్తుంచుకోండి. ఏమిటి... అబద్దమంటే ఏమిటి? సత్యమును తారుమారు చేయుటని అర్థము. వాస్తవముగా అది సత్యమైన విషయమే గాని దానిని ఎవరో ఒకరు వక్రీకరించి ఉదాహరణగా చెప్పిరి. దానిని అబద్దముగా మార్చివేసిరి. ఒక తప్పుడు (అసత్యం) కార్యమనగా ఏమిటి? ఒక సరియైన
కార్యమును వక్రీకరించుట. అర్థమైనదా? సమస్తము... సాతాను దేనిని సృష్టించలేడు. మరి సమస్తమును వక్రీకరించును. సరియైన కార్యమును తప్పుడు కార్యముగా మార్చివేయును. దయ్యము తారుమారు చేయును. ఒక నిజమైన దేవుని వాక్యము ఉంటే, అలాగే నామకార్థమైన దేవుని వాక్యముకూడా ఉండును. అదే అసత్యమై నది. నిజము. ఒక నిజమైన ప్రవక్త ఉంటే... మత్తయి 24 యేసు,"అబద్దపు ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి” అని చెప్పెను. కాబట్టి అచ్చట అబద్దపు ప్రవక్తలు ఉన్నట్లుగానే, అదే విధముగా నిజమైన ప్రవక్తలుకూడా ఉన్నారు.
52. కాని ఒక నిజ ప్రవక్తను మీరెట్లు గుర్తించగలరు, నిజ ప్రవక్త ఎల్లప్పుడూ వాక్యముతో నిలిచియుండును. దానినే ఇచ్చట మీకాయా ఖచ్చితముగా చేసెను. మీకాయా ప్రభువు వాక్యమందు ఖచ్చితముగా నిలబడివుండెను. ఎందుకనగా, ప్రభువు వాక్యము... ఇది వాక్యమని, ఆ వాక్యము ప్రవక్తయొద్దకు వచ్చునని అతనికి తెలుసు. ఇప్పుడు మనము పరవశము చెందునట్లనిపించుచున్నది. అర్థమైనదా? ఏమి సంభవించినను దానితో ఏ సంబంధం లేకుండా ప్రభువు వాక్యము అట్లే నిలిచి ఉండును. సంఘములు ఎన్ని నిర్మించినా, పతనమైపోయినా, జనులెందరు లేచినా, పడినా, సమస్తము, ఏది వర్థిళ్ళినా, పతనమైపోయినా దేవుని వాక్యము ఎన్నడూ విఫలమవ్వదు. ఎందుకనగా, ఆ వాక్యమే దేవుడై యున్నాడు. ఈ వాక్యము ముద్రించబడిన రూపముననున్న దేవునిగా ఉన్నది. నిజము.)
ఆ కారణముచేతనే మీరు నిత్య జీవమును కలిగియున్నారు. ఆరంభము గల ప్రతీదానికి అంతం ఉన్నది. మీకు ఆరంభంవున్నయెడల మీకు అంతం కూడా ఉండును. కాబట్టే ఈ శరీరము మరణించవలసియున్నది. దీనికొక ఆరంభం గలదు. కాని మీలోనున్న అంతరాత్మ... అది మీలో దేవునిగావున్న పరిశుద్ధాత్ముడై యున్నాడు. ) అదేమిటది?ఇది దేవుని పూర్వ సంకల్పంయొక్క ఆలోచనయైయున్నది. వాక్యము అనగా ఏమిటి?ఆలోచన వ్యక్తపరచుటగును. అర్థమైనదా? ఈ ప్రపంచం సృష్టించు వ టకు ముందే నీవు ఆయన మనస్సులో ఉన్నావు. నిశ్చయముగా. అర్థమైనదా? 7
53. అలాగైతే నీవు తిరిగి నూతనముగా జన్మించినప్పుడు, యేసు, “అతనికి నిత్య జీవముననుగ్రహించెదను"అని చెప్పెను. “జోయి (Zoe)” అనే గ్రీకు భాష మాటకు -అర్థమేమనగా, "దేవునియొక్క స్వంత జీవము” అని అర్థం. దేవునిలో నీవొక భాగమై ఉన్నందువలన నీవెన్నటికీ నశించిపోవు. "అంత్య దినమున నేను వానిని లేపుదును." -అది నశించిపోదు, ఎందుకనగా, అది నిత్యత్వమును కలిగియున్నది. అదెన్నటికీ
ప్రారంభం కాలేదు. దానికి ఎన్నటికీ ప్రారంభం లేదు. కాబట్టే అది అంతం అవ్వదు,
ఆయన తన వాక్యములో నిన్ను వ్యక్తపరచుటకు ముందుగానే నీవు దేవుని ఆలోచ నలో ఉంటివి. అది వాక్యముగా మారిన పిదప మాంసము (శరీరము)గా మారెను. యేసు ప్రార్దించడానికి అదే కారణమగును. నేను ప్రార్దించవలసియున్నది.
మీరుకూడా ప్రారించవలసియున్నది. ఎందుకనగా మనము లైంగిక కార్యములు వలన తారుమారైతిమి. తండ్రి మరియు తల్లి తారుమారుచేయబడిన మార్గముగుండా మనల్ని తీసుకొని వచ్చిరి. ఆదిలో సృష్టింపబడినట్లు మనము సృష్టించబడలేదు. ఆదిలో దేవుడు, "స్త్రీ, నీవు మానవులను (ప్రసూతి ద్వారా.. తె.త) తీసుకొని వచ్చెదవు గాక!” అని అసలు చెప్పలేదు. అయన తన వాక్యము(మాట) ద్వారా మనిషిని సృషించెను. అందుకే యేసు వాక్యమైయున్నాడు. గనుక పురుషుడు చెయ్యుటకు అచ్చట ఏమీ లేదు. అలాగే స్త్రీ కూడా ఏమియు చేయుటకు లేదు. అవునండీ, 54. ఆయన అలాగే... ఆయన, మరియయొక్క పుప్పొడి(పరాగ) రేణువు కాదు.
ఈ మాట కాతలిక్కుల ఆలోచనల నుండి పది లక్షల మైళ్ళ దూరంనకు కొట్టుకొని పోవునట్లు చేయును. ఈ విషయములో మరియకు ఏ సంబంధం లేదు. మరియ కేవలం ఒక పొదిగే సాధనం మాత్రమే. అంతవరకే. మరియను ఎన్నడు ఆయన “తల్లి” అని పిలిచినట్లు పరిశుద్ధగ్రంథమున ఎచ్చటైనా ఒక్క చోటైనా నాకు చూపిం చండి. ఆయన, “స్త్రీ” అని ఆమెను పిలిచెను. ఆమేన్. అమె స్థానం అంతవరకే. ఒక స్త్రీగా, ఆమెను ఒక పొదిగే సాధనంగా మాత్రమే దేవుడు ఉపయోగించెను. అదే నిజము. ఆమెను ఒక దేవతగాను, “దేవునియొక్క తల్లిగాను” చెప్పకూడదు, చెయ్య కూడదు. అదెంతటి వెట్టితనంగా ఉన్నది. దేవునికి తల్లి? ఆమెను దేవునికి తల్లిగా చెయ్యుటకు ఎవరు అనుమతించిరి? అట్లయితే దేవునియొక్క తల్లికి తల్లి ఎవరు? ఓ, దేవా! నిత్య కుమారత్వముగురించి మాట్లాడుచున్నాను. కుమారునికి ఒక ఆరంభం గలదు. నిత్యత్వమునకు ప్రారంభంగాని, ఆరంభంగాని లేదు. అది నిరంతరం ఉండును. ఒక నిత్య కుమారుడుగా అదెట్లుండును? ఓ, దేవా, నేనొక పనికిరాని వాడిని. కాని అంతకన్నా శ్రేష్టమైన దానిని నేనెరుగుదును. నిశ్చయముగా,
ఆయనే దేవునియొక్క పోలికగా వ్యక్తపరచబడెను. ఎందుకనగా, ఆయన తన వాక్యముద్వారా వ్యక్తపరచబడిన దేవునియొక్క ఆలోచనగా ఉండెను. దేవుడు, “అచ్చట కలుగును గాక!" అని పలుకగా అది కలిగెను. ఆయన మరియ పై కమ్ముకొని ఉండెను. ఆమె అయనకు పాలిచ్చెను. నిజమే. ఖచ్చితముగా, ఈ రాత్రి మీరుకూడా అదే కార్యమునే చేయుచున్నారు. ఎట్లనగా, మీరు ఆయనను స్తుతించుటద్వారాను మరియు మహిమపరచుట ద్వారా దేవునితో సహవాసమును చేయుచు, ఆయనకు మీరు ఆహారమును తినిపించుచున్నారు.
55. ఇప్పుడు గమనించండి. ఆయనే వాక్యమైయున్నాడు. ఇప్పుడు చూడండి. యేసు, ఆయన వాక్యమైయున్నందువలన దీనిని ఆయనే చెప్పెను. కాని మనము, వాక్యము ద్వారా దేవుని వద్దకు సమీపించవలెను. అర్థమైనదా? వాక్యము ప్రవక్తలవద్దకు వచ్చెను. కాని వారు వాక్యము కాదు. పాత నిబంధనలోవున్న ఏలీయా, మోషే మరియు ఆ గొప్ప ప్రవక్తలందరు, వారు వాక్యము కాదు. తుచ్చమైన శరీరముననున్న వారివద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యము ప్రవక్తలవద్దకు వచ్చునని పరిశుద్ధ గ్రంథమున చెప్పబడెను. వారు వాక్యము కాదు. కాని యేసే వాక్యమై యున్నాడు. ఆమేన్. ఆమేన్.ఓ, దానిని నేను అలాగే ప్రేమించుచున్నాను. మంచిది.
56. ఎందుచేత ఆయన ఆ వాక్యముతోనే ఖచ్చితముగా నిలచి వుండు విషయములో విఫలమవ్వ లేదు? సాతాను, హవ్వకు చేసిన విధముగా వాక్యమును 'తారుమారు చేయుటకు ప్రయత్నించును. "ఆయన నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు” అని సాతాను చెప్పెను. అందుకు ఆయన "ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని” వారితో చెప్పెను. "ఈలాగు వ్రాయబడియున్నది” అని ఆయన చెప్పెను. అర్థమైనదా? ఓ, సాతానుడిని వెనుక ప్రక్క పొడిచి త్రోసివేయునట్లు ఆయన అట్లు దానిని చెప్పెను. “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును" అని ఆయన చెప్పెను. ఇచ్చట ఒక చిన్న మాటవలన కాదు,కొంచెం ఎక్కువ మాటల వలన కాదు, లోక సంబంధమైన తత్వముతో మరియు ప్రజలద్వారా ఏర్పడిన మానవ కల్పితముల వంటి వాటితో కలగలిపిన మాటలతో కాదు గాని, “దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను మనుష్యుడు జీవించును." ప్రతీ మాటవలన, ప్రతీ వాక్యమువలన, దేవుని యొక్క ప్రతీ వాక్యము ద్వారా మనుష్యుడు జీవించును. దాని ద్వారా మాత్రమే అతడు జీవించవలెను. యేసు ఆ విధముగానే దానిని చెప్పెను. మరియు ఆయనే వాక్యమైయున్నాడు.
57. ఒక నిజమైన ప్రవక్త, వాక్యముతో నిలిచివున్నయెడల, అనగా మీకాయా చేసినట్లు,మోషేవలె మరియు ప్రవక్తలందరూ చేసినట్లుగా ఆ వాక్యముతోనే నిలిచి వున్నప్పుడు, ఆ వాక్యము ప్రత్యక్షమగుటను మీరు చూచెదరు. కాని ఒక అబద్దపు ప్రవక్త దేవుని వాక్యముయొక్క సూచనలను వక్రీకరించుచు మీరు భయపడునట్లు చేయుటకు ప్రయత్నించును. ఎందుకనగా, అతడొక అబద్దపు ప్రవక్త. వానినిగూర్చి జాగ్రత్తగా ఉండుడని యేసు చెప్పెను. ఎందుకనగా, సాధ్యమైతే ఏర్పరచుకొనిన వారిని సహితము మోసపుచ్చెదరు లేదా వంచించెదరు. ఖచ్చితముగా అలాంటి
వారు వచ్చెదరు. సమస్తమును హక్కు కోరెదరు. కాని వారివలన సాధ్యమవ్వదు. వారు వాక్యమునుండి దూరముగా తొలగిపోవునప్పుడు మీరుకూడా దూరంగా తొలగిపోయెదరు. వారినుండి తొలగిపోయి వాక్యముతోనే నిలిచి ఉండండి.
58. మనము ఆ కాలమునకు వచ్చుచున్నామని నేనిప్పుడు తలంచుచున్నాను. దానిని వారు లెంతు(40 దినముల ఉపవాసము) దినములని పిలిచెదరు. లెంతు (Lent) దినములు...? అలాగే దానిని మీరు పిలిచెదరని నేను తలంచుచున్నాను. లేదా అలాంటిదేదో ఒకటి... సరే అవన్నీ మంచిదే. వారు అనుసరించిన యెడల... వారితోపాటు నేను అంత దూరం వరకు వెళ్ళెదను. కాని త్రాగకూడదు, సిగరెట్ పొగ పీల్చకూడదు. దీనిని చెయ్యవద్దు, ఫలానా మరియు ఫలానా చేయకూడదని చెప్పెదరని మీకు తెలుసు, ప్రొటెస్టంట్స్, కాతలిక్కులు మరియు వారందరూ అలాగే చేయుదురు. అవన్నీ మంచిదే. అలాంటి వాటిని చేయుటయందు నాకు నమ్మకము లేదు. నిశ్చయముగా దానిని నేను నిరాకరించెదను. కాని నలుబది దినములకు తర్వాత మీరు మరలా నన్ను వదిలివేసి దూరంగా వెళ్ళిపోయెదరు. నేను అంతదూరం మీతోకూడా వచ్చినా, మరలా నన్ను మీరు ఆ బురదలోకి లాగెదరు. నేను వెనుకకు తిరిగి వెళ్ళుటకు కోరుకొనను. ముందుకు సాగిపోతూనే ఉండెదను. 40 దినములు అలాగే ఉండుట బాగుంటే, దానిని మరలా, మరలా అలాగే చేయుచూ ఉండవచ్చు. అర్థమైనదా? వాక్యముతోనే నిలిచి ఉండండి. నిత్యత్వముతోనే నిలిచి ఉండండి. క్రీస్తులోనే నిలిచి యుండండి. ఆ నలుబది దినములు మీకు ప్రయోజనకరముగా ఉన్నయెడల మీ శేష జీవిత కాలమునకుకూడా అది ప్రయోజనకరముగా ఉండును. ఖచ్చితముగా, ఎందుకనగా, వాక్యము నిత్యమైయున్నది. మంచిది.
59. అబద్దపు ప్రవక్తలు లేదా అవిశ్వాసులు, అన్యులు (ఈ రెండింటిలో ఏదోక దానితో వారిని మీరు పిలువవలసియున్నది. ఎందుకనగా,వాక్యమును విశ్వాసించని ఎవరినైనాగాని అతడొక అన్యుడగును, ఖచ్చితముగా అదే నిజము), వారు భయపడిరి (కలవరపడిరి). మరియు వారు వాక్యమునకు తప్పుడు అనువాదమును ఇచ్చిరి. ఆ వాక్యముయొక్క భావము ఇదికాదని వారు చెప్పెదరు. ఆ వాక్యముయొక్క భావము సరిగ్గా ఇలాగే చెప్పుచున్నదనెదరు, “సరే, అది అపొస్తులులకొరకే. అది వారికే... "అని చెప్పెదరు. మంచిది. అట్లయితే యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని వారెట్లు బోధించగలరు? అర్థమైనదా? ఆయన నిన్నవున్న రీతిగానే మారనివానిగా ఉన్నాడని వాక్యము చెప్పుచున్నది. "సరే, ఆయన ఒకేవిధముగా మారనివానిగానే ఉన్నాడు", ఆయన అన్ని విధానములుగాను మారనివానిగానే ఉన్నాడు. అవునండీ. ఆయన నిశ్చయముగా అలాగే ఉన్నాడు. అవునండీ.
60. అబద్దపు ప్రవక్తలు లేదా అవిశ్వాసులగు అన్యులు అబద్దపు సూచనలను గలవారై యున్నారు. అలాగైతే వారెలాంటి ఒక సూచనను పొందుకొనెదరు? ఇప్పుడు గుర్తుంచుకోండి. వారందరూ అలాంటి... వారు కమ్యూనిస్టులు కాదు. వారు దైవభక్తి గల మత సంబంధులు. ఒక కమ్యూనిస్టు ఎవరినీ ఎన్నడూ మోసము చేయడు. నిశ్చయముగా. కాని ఇలాంటి వారు సాధ్యమైతే ఏర్పరచుకొనిన వారిని సహితము మోసగించెదరు. అర్థమైనదా? అతడేమి చెప్పుననగా, “వచ్చి, సంఘమున చేరుము” అని చెప్పునుగాని వచ్చి, మరలా జన్మించుము" అని చెప్పడు. అర్ధమైనదా? అలాంటి వారే అబద్దపు ప్రవక్తలు. అర్థమైనదా? “వచ్చి, మరలా సంఘమున చేరుము”. కాని మీరు మరలా వెళ్ళి సంఘమున చేరుటకాదు, గాని మరలా నూతనముగా జన్మించ వలెను. అబద్దపు సూచనలు... వారు ప్రజల వద్ద ఇప్పుడు ఈలాగు చెప్పుచున్నారు, "అలాంటి సూచనలను మీరు విశ్వసించవద్దు. ఎందుకనగా, వారు వాటి నిమిత్తము భయపడిరి. వారు అట్లే ఉందురని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. అర్థమైనదా? వారు దేవుని యొక్క సూచనలకు, ఆకాశమందు కనబడు సూచనలకు భయపడుదురు.
61. దేవుడు తన వాక్య సూచనలను పరలోకమునుండి క్రిందికి పంపును. గనుక ప్రజలు, అన్యులు, “వారు అభ్యసించే అభ్యాసమును మీరు అభ్యసించవద్దు.వారి అభ్యాసానికి దూరంగా ఉండండి” అని చెప్పెదరు. ఇప్పుడు, వారు అభ్యసించిరి. కాని మీరు వారి మార్గములను అభ్యసింపకుడి. వారికి వేదాంత కళాశాల పద్దతులు గలవు మరియు అలాంటి అన్ని రకముల పద్దతులు వారికి గలవు. కాని మీరు మాత్రం వాటినుండి దూరంగా తొలగిపోండి. మీరు సరిగ్గా వాక్యముతోనే నిలిచి ఉండండి. అర్థమైనదా? సరిగ్గా మీరు వారివద్ద నుండి తొలగిపోండి. ఎందుకనగా, వారు అబద్దపు సూచనలను గలవారై ఉందురు. మార్కు 16వ అధ్యాయమున యేసు ఇట్లు చెప్పెను. “విశ్వసించిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును.” అవునండీ, అదే నిజము. కాబట్టి ఈ సూచక క్రియలు వారిని వెంబడించుటలేదు, గనుక, “ఓ, ఈ దినమునకు అవి అవసరము లేదు" అని అతడు చెప్పును. అదెట్లున్న దనగా, ఓ దేవా! కాలిన గాయముగల ఒక బిడ్డ మండుచున్న పొయ్యికి దూరంగా ఉన్నట్లది ఉన్నది. వాటినుండి తొలగిపోయి వాటిని విసర్జించండి. అర్థమైనదా? వాటినుండి బహు దూరంగా వైదొలగిపోండి. వారు జీవించుచున్న ఈ దినము కొరకు తగిన వాక్యపు సూచనగా దేవుడు ఒక నిజమైన సూచనను పంపించగా, "ఈ సూచనలను మీరు నమ్మవద్దు” అని ప్రజలతో వారెట్లు చెప్పగలుగుచున్నారు?.
62. ఇప్పుడు, కొద్దిసేపటి క్రితం నేను మీకాయాను గురించి చెప్పాను. ఇప్పుడు మరలా కొంచెం వెనక్కి వెళ్లాం. ప్రభువు చిత్తగించిన కొన్ని నిమిషములలో ఆ
ప్రవక్తలలో చాలా మందిగూర్చి నేను వివరించి చెప్పగలను. కాని ఇప్పుడు మీకాయా దగ్గరకు నేను వెళ్ళుచున్నాను. ఇప్పుడు గమనించండి. ప్రభువుయొక్క వాక్యముతో అహాబు శపించబడి, యెజెబెలు శపించబడి మరియు ఆ దేశము శపించబడి యుండుటను అచ్చటున్న ఆ ప్రవక్తలు ఎట్లు చూడలేకపోయిరి. దానిమీద శాపము ఉండగా ఆయన దానిని ఎట్లు దీవించగలడు? అర్థమైనదా? దానిని ఆయన చెయ్యలేడు. దేవుడు ఆవిధముగా కార్యములను చెయ్యడు. అర్థమైనదా?.
ఇచ్చట మీకాయా.... అతడు ఆత్మ ప్రేరణ క్రింద ఉండుటచేత ఖచ్చితముగా వాక్యముతోనే నిలిచియుండెను. అనగా ఖచ్చితముగా వారి గురించి దేవునియొక్క వాక్యము ఏమి చెప్పెనో దానితోనే అతడు నిలచి వుండెను. అహాబుయొక్క రక్తమును కుక్కలు నాకును. మరియు యెజెబెలును కుక్కలు తినివేయునని దేవుని వాక్యము వారినిగూర్చి ప్రవచించి చెప్పబడెను. ప్రభువుయొక్క వాక్యము ప్రవక్త ద్వారా పలుకబడి చెప్పబడినవి. అది ప్రవక్త వద్దనుండి పలుకబడిన వాక్యము, గనుక అది ప్రభువుయొక్క వాక్యమైయున్నది. అలాగనే ఇచ్చట మరొక ప్రవక్త సరిగ్గా వాక్యమునకు అనుగుణంగా నిలచివుండెను. అహాబు దానిని చూచినట్లుగా కనిపిం చుచున్నది. వారుకూడా దానిని చూచునట్లుగానే కనిపించుచున్నది. అర్థమైనదా? కాని అతడు మీకాయా వైపు తిరిగి, మీకాయాను శపించెను. మరియు ఆ బిషప్ సిద్కియా మీకాయా వద్దకు వెళ్ళి చెంపమీద కొట్టెను. ఆ మాటలు కపటంతో చెప్పలేదు, గనుక తాను చెప్పినది నిజమని మీతాయా విశ్వసించెను.
63. బ్రాన్హాం సహోదరుడా, ఏది నిజమో, ఏది అబద్దమో మీరెట్లు చెప్పగలరు? వారికి వాక్యానుసారమైన పరీక్షను పెట్టండి. ఆ పరీక్షద్వారా వారు సరియా లేదా తప్పా లేదా కాదాని చెప్పవచ్చును. ఆ వాక్యముతో నిలిచివుండండి. ఏమి జరుగు చున్నదో చూడండి. అర్థమైనదా? వారివైపు వాక్యమును మాత్రము త్రోసి చూడండి, అప్పుడు వారెచ్చట ఉన్నారో మీరు చూడగలరు. “ఓ, మంచిది, మీరు దానిని గమనించెదరు...”. ఓ, అట్లయితే సరిగ్గా దానినుండి తొలిగిపోండి. అర్థమైనదా? అవును. కాని మీరు మాత్రం ఆ వాక్యముతోనే నిలిచి ఉండండి. మరియు, వారు గనుక మీకాయాకు వాక్య పరీక్ష పెట్టినయెడల, తాను ఆ వాక్యముతోనే వందశాతం నిలిచివున్నానని అతడు ఋజువుచేసి చూపించును. వారు, "ఒక్క నిమిషము ఆగుము. దేవుడు దానిని మాకు ఇచ్చెనని” వారు చెప్పెదరు. అర్థమైనదా? నిజము.
పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మపు వాగ్ధానమును దేవుడు మాకు యిచ్చెను. మీకు తెలుసా, పెంతెకోస్తు దినమున పేతురు ఈలాగు చెప్పెను. “మీరు మారుమనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్ధానము
ప్రతీ తరము వారికి...” చూచారా? ఇది మనకొరకు ఇవ్వబడెను. ఇది మనకని అర్ధము. కాని దానికి షరతులు గలవు. మీరు వేరే ఏ మార్గముద్వారా దాన్ని పొందు కోలేరు. మీరు ఈ నియమాలను అనుసరించవలసి వున్నది. అవును ఖచ్చితముగా,
64. ఆ దేశము వారికి చెందినది, వారికిగల నియమాలను వారు అనుసరించవలసి యున్నది. ప్రభువుయొక్క నియమాలు అహాబుకు ఇవ్వబడలేదు. ఆయన అతడిని శపించెను. దేవుడు దేనినైతే శపించునో, కాబట్టి ఆయన దానిలో లేడని ఋజువుపర చుచున్నాడు. కాబట్టి శపించబడిన దానినుండి దూరంగా తొలిగిపోండి. ఆమేన్. (అది రెండు గొట్టములుగల మంచి తుపాకీ వంటిది. అవును కదా?) అవునండీ.ఆ కార్యములో దేవుడులేడని నిరూపణమైతే దానినుండి దూరంగా ఉండుము.నిజము. అది ఆరంభంనుండే బాగోలేదు. దేవుడు దానిని ఖండించెను. దానివద్ద వుండుటకు నిశ్చయముగా నేను కోరుకొనను. అవునండీ. ఏదైనా లాభము పొందుకోవటానికి ఆ మార్గమును అవలంభించుటవలన మిక్కిలి ఇబ్బందులకు గురగుదురు.
65. అతడు చెప్పెను... ఇప్పుడు ఈ విషయముమీద కొంతసేపు చూద్దాం. వీళ్ళు ఆ చిన్న బోధకుడిని పట్టుకొని, మనము తిరిగి వచ్చే వరకు బందీ గృహములో పెట్టండి. మేము క్షేమముగా తిరిగి వచ్చేంతవరకు ఒక పెద్ద చెక్క కాడితో అతడి మెడకు బంధించి ఉంచి, మరియు అలాంటి పెద్ద చెక్క కాడిని మెడకు తగిలించి, తినుటకు శక్యము కాని అన్నము, త్రాగటానికి శక్యము కాని నీళ్ళను ఇవ్వండి" అని చెప్పెను. పిదప నేను వచ్చి ఇమ్లా కుమారుడగు ఈ మీకాయాపై చర్య తీసుకొనెదనని అతడు చెప్పెను. అప్పుడు మీకాయా, "రాజువైన నీవు ఏ మాత్రమైన క్షేమముగా తిరిగి వచ్చిన యెడల ప్రభువు నాతో పలుకలేదని భావమగును” అని చెప్పెను. తాను చెప్పిన ప్రవచనమును వెనక్కి తీసుకోలేదు. ఎందుకనగా, తానేమి ప్రవచించెనో దానిగూర్చి అతనికి తెలుసు. ఆ ఆత్మ, అతనికి వచ్చిన దర్శనము ఖచ్చితముగా ఆ వాక్యమునకు అనుగుణంగా మీకాయావద్దకు వచ్చెను. మీరు దానిని అట్లే పొందు కోవలెను. ఇప్పుడు నేనేమి పొందుకొనియున్నానో మీరు చూడగలుగుచున్నారా? మీ దర్శనము ఖచ్చితముగా వాక్యానుసారముగా లేనట్లయితే, దానిని వదిలివేయుట మీకు శ్రేష్టమైనదగును. మీరెలాంటి ఒక వాగ్ధానమును హక్కు కోరుటకు ప్రయత్నిం చినను దానితో సంబంధం లేదుగాని మీరు సరిగ్గా వాక్య క్రమములో తిరిగి వచ్చుటయే మీకు శ్రేయస్కరము. అదే నిజము. అదే ఖచ్చితముగా సత్యమగును.
66. సరిగ్గా ఈ కార్యము ఆ కాలముననే జరుగునని దేవుడు చెప్పిన, అది పలుక బడిన వాక్యమైయుండి, ఈ దినముకొరకు దేవునియొక్క నిజమైన సూచనగా అది ఉన్నప్పటికీ దీనిని వారు త్రోసివేయుచూ, “దానివలన మనకు ఏ ప్రయోజనము
లేదు(అది నిజము). దానిని నమ్మవద్దు" అని చెప్పెదరు. ఓ, దేవా! ఆయన తన తీర్పును పంపించుటకు ముందుగా, ఆయన తన వాక్యముద్వారాను మరియు నిజమైన తన ప్రవచనా వాక్యముద్వారా ఆయన ఎల్లప్పుడూ లేఖనానుసారమైన సూచనలనిచ్చును. అర్థమైనదా? ఆయన పలికిన విధముగానే అది అట్లే వాక్యము వద్దకు వచ్చి, అదే విధముగా చెప్పబడినదో అదే విధముగా దానిని ప్రకటించుటకు దానితోపాటు ఆయన సేవకులలో ఒక్కరు వచ్చి పలుకబడిన మాటను ప్రకటిం చెదరు. అర్థమైనదా? ఆయన వాగ్ధానము చేసిన ప్రకారముగా తన తీర్పును పంపించుటకు ముందుగా, ఎల్లప్పుడూ... ఆ లేఖనానుసారమైన సత్యముతో ఎవరో ఒకరు వచ్చి దానికి సాక్షిగా నిలిచెదరు. హెబ్రీయుల పత్రిక 2:4లో అలాగే చెప్ప బడివున్నది. సూచక క్రియలతోను మరియు అద్భుత కార్యములతో తన సాక్ష్యమును అతడు కలిగియుండును. దేవుడు తన వాక్యమును సూచక క్రియలతోను మరియు అద్భుత కార్యములతో (మార్కు 16) ఋజువుపరచుచుండును. మరియు ఏదైతే ప్రసంగించ బడినదో దానిని దేవుడు ఋజువుపరచుచుండును. అర్థమైనదా? నిశ్చయముగా, మీరొక చిన్న స్వస్థతా ఆరాధనను జరిపించవచ్చు. ఆ ఆరాధన లోకూడా చక్కగా క్రియ జరిగివుండవచ్చు. కాని ఇతర కార్యములనుగూర్చి ఏమిటి? మీరు వాక్యమును తీసుకొని దానిని సరిగ్గా ఇచ్చటే క్రియచేయునట్లు చేయవచ్చు. అలాగే ఇతర కార్యములనుకూడా తీసుకోండి. దాని స్థానమందు అది క్రియ చేయును. అనగా ఖచ్చితముగా ప్రతీ స్థలములో అదట్లే క్రియచేయును.ఆ వాక్య మును మీరే స్థలములో ప్రయోగించినను ప్రతీ స్థలములోను దానికి తగిన సరియైన మార్గమువున్నయెడల ఆ వాక్యము క్రియచేయును. దాని వెనుక విశ్వాసము
వుంటు దానిని విశ్వసించునట్లు అది చేయును. పిదప అది ఎదుగవలసియున్నది.
67. ఐగుప్తులో ధాన్యపు కొట్టులో యోసేపు కాలమున రెండు వేల ఎనిమిది వందల సంవత్సరముల క్రితం నిల్వ చేయబడి ఉంచిన ప్రొద్దు తిరుగుడు పువ్వు యొక్క విత్తనములు కొన్ని తీసుకొని లేదా కొన్ని గోధుమ గింజలని నేను నమ్ము చున్నాను. వాటిని తీసుకొని విత్తినప్పుడు ఆ గోధుములు పండినవి. అవెంత పాతవన్నది కాదు లెక్క, కాని దానిలో ఇప్పటికీ జీవము గలదు. ఎందుకనగా అది భీజమును మొలకెత్తించ గల విత్తనమై యున్నది. ఆ వాగ్దానములు వాగ్దానముచేసి ఎంత కాలమైనా గాని దానితో ఏ సంబంధం లేదు. అవి మీకును, మీ పిల్లలకును మరియు దూరస్థులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారికందరికిని చెందును. ఆ విత్తనానికి మీరు నీరు పోస్తూ మొలకెత్తింపజేయాలి. ఆమేన్. ఆ విత్తనములో ఏ ముందో ఆ పంటనే అది ఉత్పత్తిచేసి తీసుకొచ్చును.
68. మనము ఒక గొప్ప ఉజ్జీవమును పొందుకున్నాము. దాంట్లో ఏ సందేహంలేదు. కాని అదొక సంఘశాఖ ఉజ్జీవమై యున్నది. ఎందుకని? ఎందుకనగా, మనము సంఘశాఖ యొక్క విత్తనములును విత్తితిమి. నిజము, పరిశుద్దాత్మ క్రుమ్మరింప బడినప్పుడు, అది నీతిమంతుల పైన(మంచివారు) మరియు అనీతిమంతుల (చెడ్డ వారి)పైన వర్షం కురియునట్లు... వర్షం కురియునప్పుడు, మరుల మాతాంగి అనే మొక్కను (cocklebur)ఎదుగునట్లు చేయును మరియు గోధుమ చెట్టును ఎడుగు నట్లు చేయును. ఆ వర్షము వాటిపై కురియుటవలన ఇతర చెట్లువలె ఈ రెండు కూడా ఆనందించును. కాని వాటి ఫలములను మీరెరుగుదురు, మనమేమి చెయ్యు టకు ప్రయత్నించితిమి? ఒక పది లక్షల మందిని ఈ సంఘ సంస్థలలో చేరునట్లు గాను, ఈ సంఘశాఖ ఆ ఒక్క కార్యమునే చేయుచున్నది. మనకు బిల్లిగ్రహమనే దైవజనుడు గలడు. బాప్తిస్టులు మరియు వారు ఒక ఉజ్జీవమును పొందుకున్నారు. మీలో ఒకరైన ఇతడు చాలా మంచి గొప్ప దైవజనుడు. అవును. పెంతెకోస్తువారు కూడా ఒక ఉజ్జీవమును పొందుకున్నారు. ఓరల్ రాబర్ట్స్, ఓ, దేవా! ఇంకా వారిలో అనేకులు గొప్ప ఉజ్జీవమును పొందుకొనిరి. అధికమైన సంఖ్యలో ఎవరి వద్దలేరో వారిని వారు లెక్కించిరి. అదిప్పుడు దేనికి దారి తెరచినది? ఇప్పుడది సమాప్తమైనది.
69. తొలకరి వర్షమునుగూర్చి, కడవరి వర్షమునుగూర్చి యోవేలు చెప్పిన విషయము మీకు తెలుసు కదా? తొలకరి(f-o-r-m-e-r) వర్షమనే ఆంగ్ల పదము నకు అర్థమేమనగా, “మోరే(mourch)"అని అర్థము. ఈ మోరే అనే హెబ్రీ భాషయొక్క పదమునకు అర్థమేమనగా విత్తనముల వర్షము... పంటకొరకు విత్తడమని అర్ధం. ఆ కారణము చేతనే... మీరు దేనిని కోసెదరు? ఓ, సంఘసంస్థ యొక్క నిర్మించిన నిర్మాణము. కాని దేవుడెచ్చట ఉన్నాడు? మీరు సంఘశాఖల విత్తనములను విత్తిరి. పరిశుద్ధాత్మ వర్షము కురిసినప్పుడు అది సంఘశాఖ ఉజ్జీవమును ఏర్పరచినది.
వాక్యము వద్దకు తిరిగి వెళ్ళుటయే మన అవసరతయైయున్నది. నిజమైన వాక్యమువద్దకు తిరిగి వెళ్ళండి. వధువును క్రీస్తువద్దకు మరియు వాక్యము వద్దకు తీసుకొని రండి. నిజము, వాక్యమువద్దకు తిరిగి రండి. సరే, సంఘసంస్థను విడిచి పెడదాము...సరే మంచిది. దానికి విరుద్ధంగా ఏమీ చెప్పుట లేదు. కాని ప్రతీ ఒక్కొక్కరికి... “ఇప్పుడు కొన్ని పిడిగుద్దులు గుద్దుదాము..." తన శత్రువు తనపై దాడి చేయుటకు ముందుగా వారు పిడి గుద్దులతో తమ శత్రువుపై దాడి చేయకపోతే ఇక తన శత్రువు వద్ద నుండి ఆ పిడి గుద్దులను వారు పొందుకుంటారు. అలాంటి పిడి గుద్దుల నుండి తప్పించుటకు దేవుడు కనికరమును కలిగియుండును గాక! నీవు చెప్పగలిగితే సత్యమునే చెప్పుము లేదా నోరు మూసుకొని ఉండుము.
అవునండీ. ఈ వాక్యము ఏలాగు వ్రాయబడియున్నదో దానిని అలాగే చెపుండి. అప్పుడు దానిని దేవుడు ధృవీకరించుచున్నాడో లేదో చూడండి. దీనిని విశ్వాసించ మని నేను మీకు సవాలు చేయుచున్నాను, నాకు తెలుసు అది సత్యమని, అర్థమై నదా? కాని నీవు ఇటు వైపు, అటు వైపుగా జారిపోకుండా, సరిగ్గా వాక్యముతోనే నిలిచియుండి మరియు దానిని విశ్వసించవలెను. అర్థమైనదా? కాని "మెల్లగా పొడుస్తూ దానిని నేను ప్రయత్నించెదనని" చెప్పకూడదు. మీరు దానిని అలాగు చెయ్యకూడదు. వద్దు, వద్దు. నీవు నీ పూర్ణహృదయముతో రావలసియున్నది. "ప్రభువా ఇది నీ వాక్యము, నేను దీనిని విశ్వసించెదనని" చెప్పినప్పుడు, దేవుడు దానిని అనుగ్రహించును. పిదప అది సరిగ్గా క్రియచేయుటకు ప్రారంభించును. అవునండీ.
70, అవునండీ, ఆయన ఎల్లప్పుడూ తన తీర్పులను పంపించుటకు ముందుగా లేఖనముల వాక్యముతో ఎవరో ఒకరిని పంపించును. మరియు తన తీర్పులను పంపించుటకు ముందుగా లేఖనానుపారమైన సూచనలను చూపించును. మరి అవిశ్వాసి దానిని చూచుటకు ఒక పది లక్షల దూరంలో విఫలమగును. ఎందుచేత? ఆ సూచనల వలన అతడు కలవరపడును, నిరుత్సాహము చెందును. ఎందుచేత? ఎందుకనగా అతడు దానిని విశ్వాసించలేదు. ఆమేన్, కాని అదెల్లప్పుడూ అదే రకమైన ఫలము(పంట)ను తీసుకొని వచ్చును. గమనించండి. ఈ అవిశ్వాసి ..."ఓ, అది బుద్ధిలేని కార్యము, అది అర్ధంలేని కార్యము, ఓ, దానివలన ఏ ప్రయోజనము లేదు. ఎందుకంటే, అద్భుత కార్యములు జరుగు దినములు గతించిపోయెనని మీకు తెలుసు. అసలు అలాంటి కార్యమనేది లేనేలేదు. ఓ,అది ఒక భయంకరమైన ఒక చెత్తగుంపు. అచ్చటున్నదంతా అదే తప్ప వేరేమి లేదు" అని చెప్పును. గనుక వారు అదేవిధముగా అలాగే కొనసాగిపోయెదరు.
71. సరే, మోయోబు అచ్చట నిలబడి తన సహోదరులగు ఇశ్రాయేలీయుల వైపు చూస్తూ ఉండుటను, మీరు ఊహించగలుగుచున్నారా? అవన్నీ జరిగిన పిదప, ఆ శిబిరమునకు వెలుపల మోషే ఎట్లు బలి పీఠమును కట్టి బలిని అర్పించెనో, ఈ అబద్దపు ప్రవక్తయగు బిలాముకూడా తత్వశాస్త్రపు నియమాలకు తగినట్లుగా అదేవిధమైన బలిని అర్పించెనని మీకు తెలుసా? అవును. ఇదిగో ఇచ్చట బిలాము (బిషప్ బిలాము) అచ్చటున్న గొప్ప, పెద్ద స్థాపించబడిన సంస్థయగు మోయోబు దేశము నుండి వచ్చెను. ఈ మోయోబు అనేవాడు లోతుయొక్క కూమార్తె ద్వారా జన్మించినవాడు. గనుక వారుకూడా అదే దేవునినే ఆరాధించుచున్నారే గాని వేరే దేవుడిని కాదు. బిలాము వచ్చి అచ్చట ఏడు బలి పీఠములను కట్టించెను. యెహోవా
ఏమి కోరును? పరిపూర్ణమైన సంఖ్య, యెహోవా, ఏడు బలి అర్పణలు, పవిత్రమైన బలియర్పణలు, సరిగ్గా యెహోవా ఖచ్చితముగా ఏమి కోరునో...
సరిగ్గా ఖచ్చితముగా అలాంటి బలి అర్పణములనే ఇచ్చట మోషేకూడా అర్పించెను. ఏడు పోట్టేళ్ళను, అనగా దేవుని కుమారునియొక్క రాకడను గూర్చి చెప్పుచున్న ఏడు పోట్టేళ్ళు, అవునండీ. కాని ఓ, సహోదరుడా, బిలాము కొట్టబడిన బండను మరియు ఇత్తడి సర్పమును చూచుటకు విఫలమయ్యెను. మరి నేడుకూడా అది అట్లే ఉన్నది. వాక్యమందు పరిశుద్ధాత్మ కదులాడుటను, దేవునియొక్క వాగ్ధానమును మరియు ఆయన వాగ్ధానము చేసిన సూచక క్రియలను మరియు అద్భుత కార్యములను తీసుకొని వచ్చుచు క్రియ చేయుటను చూచుటకు వారు విఫలమైరి. అందుకు కారణమేమనగా దానిని వారు విశ్వసించలేదు.
72. ఇప్పుడు, మనమింకా కొన్ని నిమిషములు. మనమింకా కొన్ని నిమిషములు. నోవా మరియు దేవుడు అతనికి యిచ్చిన సూచనలు... దేవునిద్వారా ఇవ్వబడిన ఒక సూచనను అతడు కలిగియుండెనని మీరు నమ్ముచున్నారా? నిశ్చయముగా, అతనివద్ద గలదు. అతడు దేవునిచేత పంపబడినవాడు. దేవునియొక్క ప్రవక్తగా ప్రవచింపబడినవాడు. గొప్ప సూచక క్రియలు, అద్భుత కార్యములు ప్రదర్శించ బడెను. అనగా ఒక గొప్ప సూచన ఆకాశమున కనబరుస్తూ మేఘములు ఆకాశ మున ఏర్పడునట్లుచేసి వర్షమును కురిపించెను. దేవుడు అతనికిచ్చిన సూచన ఏదనగా, ఆ దినమువరకు అచ్చట ఎన్నడూ వర్షము కురియలేదు. సరిగ్గా ఓడయొక్క తలుపువద్ద అతడు నిలబడి నూట ఇరువది సంవత్సరములు ప్రసంగించెను. కాని వారు ఆ ప్రసంగంను ఆలకించి, పరిహసించుచూ, అతని చూచి ఎగతాళి చేసిరి.
73. యేసు దానినిగూర్చి ప్రస్తావించెనని, మత్తయి 24వ అధ్యాయములో నోవాహు దినముల గురించి మరలా ప్రస్తావించెనని మీకు తెలుసా? నోవాహు దినములలో .“నోవాహు దినములలో ఏలాగుండెనో..." ఆయన చెప్పెను. వారు ఆ కాలమున తినుచూ, త్రాగుచూ, పెండ్లి చేసికొనుచూ, పెండ్లికిచ్చుచుండిరి. ఆ విషయమునే మత్తయి 24వ అధ్యాయములో ఆయన చెప్పెను. అదే ఖచ్చితముగా నిజము. వారుకూడా ఆ కార్యమునే చేసిరి. అలాగే సరిగ్గా దానిక్రింద వచనమును మీరు గమనించినయెడల, అచ్చట ఆకాశమందు భయంకరమైన సూచనలు కనబడెను మరియు భూమిపైనను, ఆకాశమందును కలవరపరచు సూచనలు కనబడును. అది నిజమే కదా? ఇప్పుడు యిర్మియా ఏమి చెప్పెను? "ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి.”
ఇచ్చట గమనించండి, "ఆకాశములో సూచన?" అని మీరు అడుగుచున్నారు. ఎందుకని, వారు ఆశ్చర్యపడుచున్నారు? పెంటగన్ కూడా ఆశ్చర్యపడుచున్నది. ఎగిరే పళ్ళెములు (flying saucer) వంటి అనేక కార్యములు ఇచ్చట కనబడుటను
కొన్ని దినముల క్రితం మీరు చూచిరి. కనబడుచున్న ఈ కార్యములన్నీ ఏమిటని వారు ఆశ్చర్యమైపోయిరి, అసలు అవన్నీ ఏమిటనే విషయము ఇంతవరకు వారు కనుగొనలేకపోయిరి. ఇది దాదాపు అచ్చటకు దిగి వచ్చిన అదృశ్యమైన శక్తిగా ఉన్నది. ఇంతవరకు మేథాశక్తికి కూడా అందనిదిగా అది యున్నది. ఇప్పుడు, నేను ఎగిరే పళ్ళెం వంటి ఒక మనిషిని కాదు. వాటన్నింటిని గూర్చి ఇచ్చట బుద్దిలేని మాటలు చెప్పుకొనుచున్నారు. ఆ మాటలకు, వాటికి ఏ సంబంధం లేదు, దానిని మీరు నమ్మవద్దు. కాని అవి అగపడు సూచనలుగా ఉన్నవి. ఖచ్చితముగా కాని అవి సరిగ్గా పెంటగన్(అమెరికా రక్షణ కేంద్రం) పై ఎందుకు ప్రత్యక్షమవ్వవలెను? సరిగ్గా వాషింగ్టన్ పట్టణములోనే అవి ఎందుకు కనిపించాలి. ఇప్పటికీ వారు అలాంటి వాటిని ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నారు. సరే. వాటి విషయమై మనము మరలా కొద్దిసేపు తర్వాత వద్దాం. “నోవాహు దినములలో ఏలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండునని” ఆయన చెప్పియుండలేదా? నిజము.
74. మోషే మరియు అతడికివ్వబడిన సూచన, దేవుడు - ఇచ్చిన సూచన, అది లేఖనానుసారమైన సూచన... మోషేకు దేవుడిచ్చిన సూచన లేఖనానుసారమైనదని మీరు నమ్ముచున్నారా? దానిని మోషే ఎట్లు కనుగొనెను? అది దేవునిద్వారా ఇవ్వబడి నదని మోషే ఎట్లు ఎరిగెను? ఒక ప్రవక్తగా అతడు జన్మించినందువలన, తాను కలిగివున్న ప్రభువుయొక్క వాక్యము ఏమైయున్నదో అచ్చటకు వెళ్ళి చూచి దానిని గ్రహించి అతడు కనుగొనెను. కాబట్టి అతడు ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి వారిని విడిపించుటకు ఇది సరియైన తరుణం కాదనికూడా కనుగొనెను. ప్రజలు ఆ సమయమున అతడిని అంగీకరించలేదు. ప్రవక్తయొక్క వర్తమానమును ప్రజలు ఆలకించుటకు ఇష్టపడితేనే తప్ప, ఆ ప్రవక్త తన వర్తమానమును ఎన్నటికీ వెల్లడించ లేడు. కాబట్టి అరణ్యమునకు దేవుడు తన ప్రవక్తను పిలిచెను. నిశ్చయముగా, ఐగుప్తులోనున్న ప్రజలు అచ్చటనుండి బయలుదేరి వచ్చుటకు సిద్దపడేంత వరకు ఇంకా కొంత కాలం వారు శ్రమలను అనుభవించునట్లుగా ఆయన ఆ ప్రవక్తను అచ్చట నుండి తీసుకొని వెళ్ళెను. మోషే సిద్ధంగానే ఉన్నాడు. దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కాని ప్రజలే సిద్ధంగా లేరు. వారు అచ్చట నుండి బయలుదేరి వచ్చుటకు సిద్ధంగా లేకపోవుటవలన నలుబది సంవత్సరములు కంటే ఇంకా ఎక్కువ కాలం అచ్చటే ఉండవలసి వచ్చెను. అదే ఖచ్చితముగా నిజము,
75. కావున ఈ మండుచున్న పొదను మోషే చూచినప్పుడు... దానిలో ఎంతో భయంకరమైన మండుచున్న అగ్నిని మోషే చూచెనని నేను ఊహించు చున్నాను.
కాని ఈ పొదనుండి స్వరము వచ్చినప్పుడు.. బహుశా అతడు చాలా స్వరములు విని ఉండవచ్చును; కాని మండుచున్న పొదనుండి ఈ స్వరము వినినప్పుడు, ఆ స్వరము ఏమి చెప్పినదో మీకు తెలుసా? అది అతనికి లేఖనములను ఉదాహరించి చూపించెను. అది లేఖనానుసారమైన సూచనగా ఉన్నది. ఎట్లనగా, దేవుడు, అబ్రాహా ముతో, నీ జనులు అన్య దేశములో నాలుగు వందల సంవత్సరములు అన్యులుగా జీవించెదరని చెప్పెను. పిదప ఒక బలమైన బాహువుతోను మరియు గొప్ప శక్తితో ఆ అన్య దేశమునుండి వారిని విమోచించెదనని ఆయన చెప్పెను. ఓ,ఆయన, “మోషే, ఆ వాగ్ధానమును నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాను, నేను నిన్ను అచ్చటకు పంపించుచున్నాను. ఆమేన్. దీనిని లేఖనములద్వారా చెయ్యబోవుచున్నాను... నేను లేఖనములను నీకిచ్చెదను. నీవద్దవున్న ఈ పాత కఱ్ఱను నీ చేతిలోకి తీసుకొని వెళ్ళుము మరి అదెంత కష్టమైనాగాని ఆ ఐగుప్తును నీవు జయించెదవు". అయన తాను చెప్పిన వాగ్దానమును నెరవేర్చుటకు దీనిని ఆయన చేయబోవుచున్నాడు.
76. అచ్చట వారేమి చేసిరో మీకు తెలుసా? ఐగుప్తీయులు మోషేను చూచి, “ఓ, మోషే, ప్రభువుయొక్క గొప్ప ప్రవక్త" అని చెప్పుచూ, పరిహసించిరి. మరియు మోషే వారియెదుట చేసిన సూచకక్రియలను చూచి వారు భయపడిరి. అతెందుకు, ఇశ్రాయేలీయులుకూడా మోషే చేసిన సూచక క్రియలను చూచి భయపడిరి. “మేము ఇంకా కఠినముగా కష్టపడి చాకిరి చేయునట్లుగా ఎందుకు చేసితిరి? ఇదిగో మా చేతులు ఎలాగున్నవో చూడండి. ఇటుకలును కాల్చుటకు కావలసిన గడ్డిని మేమే వెళ్ళి కోసుకొనునట్లు చేసి మాకు కష్టమును తీసుకొని వచ్చి పెట్టిరని" చెప్పిరి. దేవుడు మోషేకు ఏ సూచనలను ఇచ్చెనో వాటినే అతడు చేసి చూపించెను. అయినప్పటికీ వారు వాటిని గ్రహించలేకపోయిరి. అదే ఖచ్చితమైన నిజము. అర్థమైనదా? మోషే ఐగుప్తులకు ఇచ్చిన సూచనద్వారా వారు నిరుత్సాహము చెందిరి. దేవుని సూచక క్రియలతో వారు కలవరపడిరి, ప్రవచింపబడిన సూచనలతో వారు కలత చెందిరి.
వాగ్ధానపు తండ్రియగు అబ్రాహాముతో దేవుడు చెప్పినదేమనగా, నీ భీజము (సంతానము), ఇశ్రాయేలీయులు ఒక అన్య దేశమున సంచరించెదరు. తన బలమైన బాహువుతో వారిని విమోచించుటద్వారా తన శక్తిని వారికి చూపించెను. లేఖనానుసారమైన ఒక వ్యక్తి ఇచ్చటున్నాగాని, మరియు వాగ్ధానము చేయబడిన ఆ సూచనలతో ఒక వ్యక్తి ఇచ్చటున్నాగాని వారు దాన్ని నమ్మలేదు. ఖచ్చితముగా వారు నాశనమైపోయిరి.
77. మరొక ప్రవక్త, యెహెజ్యేలనుగూర్చి మీరు తలంచి చూడగలుగుచున్నారా? యెహెజ్కేలు, అతనితో దేవుడు ఈలాగు చెప్పెను, "నేను చెయ్యబోవు" సరిగ్గా తీర్పుతీర్చుటకు ముందు... తీర్పుకు ముందుగా దేవుడు మోషేను పంపించెను. అలాగే తీర్పుకు ముందుగా నోవాహును దేవుడు పంపించెను. ఆయన నోవాహును పంపించి, అచ్చటున్న జనులందరిని... అనగా మోషే, ఆ దేశమునున్న ప్రజలు, అతనికి చెందినవారిని... అచ్చట అనేక తెగుళ్ళు వారి మధ్య ఉన్నను ఆ ప్రజలను అవేమి బాధించలేదు. అట్లే ఆయన నోవాహును పంపించెను. అచ్చటున్న విశ్వాసు లందరిని ఆ ఒడలోకి తీసుకొని వెళ్ళెను. నోవాహుయొక్క సూచనద్వారా అచ్చటున్న అవిశ్వాసులందరు నాశనమైపోయిరి. (ఓడను కట్టుచుండెను, సిద్ధపరచు చుండెను, ఏమి జరుగబోవుచున్నదో దాన్నే ప్రవచించుచుండెను). ఆ ఓడలోకి ప్రవేశించిన వారందరూ రక్షింపబడిరి. గోషేను దేశములోనున్న వారందరు రక్షింపబడిరి.
78. ఇచ్చట యెహెజ్కేలు వచ్చుటకు ముందు దేవుడు వారిని బబులోకి తీసుకొని వెళ్ళెను. “మూడు వందల తొంబది దినములు నీవు ఎడమ ప్రక్కన పండుకొని ఉండుము. నీ మీద భారమును మోపెదను" అని ఆయన యెహెజ్కేలుతో చెప్పెను. ఇశ్రాయేలు దేశములోనున్న యెరూషలేములో ఈ నెరసిన వెంట్రుకల ప్రవక్త ఒకే ప్రక్కగా పండుకొని ఉండుటను మీరు ఊహించగలుగుచున్నారా? గనుక అచ్చటున్న ప్రజలందరూ వచ్చి, దానిని చూచి, "ఈ వెట్టివాడిని చూడండి, అతడెట్లు ఒకే ప్రక్కగా పండుకొనియున్నాడో” అని చెప్పుచుండిరి. ఒక పాత కుండలో బీన్స్ మరియు గింజలు వంటివాటిని కొన్ని వారాల పాటు ఉంచుటవలన అవి పుల్లగా పులిసిపోయినవి. యెహెజ్కేలు అచ్చట అట్లు తన ఎడమ ప్రక్కన మూడు వందల తొంబది దినములు పండుకొని ఉండెను. పిదప దేవుడు, ఆ దినములు గడిచిన పిదప నీ కుడి ప్రక్కన తిరిగి మరొక నలుబది దినములు పండుకొని ఉండవలెనని" చెప్పెను. ఎందుచేత, అదొక అవమానకరమైన కార్యముగా ఉన్నది.
79. ఓ, ఇశ్రాయేలీయులు వాస్తవముగానే ఎంతో వైభవంగా ఉండిరని మీకు తెలుసా? బాలుడా, వారు ఇతర దేశములతో స్నేహ సంబంధములను కలిగి యుండిరి. వారు ప్రవక్తలను మరియు అలాంటి కార్యములను త్రోసివేయుటకే ఇష్టపడిరి. కాని దేవుని వాక్యము ప్రవక్తవద్దకు వచ్చుననే విషయమును వారు మరచిపోయిరి. వారు తమకు నచ్చిన దేవతలను ఆరాధించాలని కోరుకొనిరి. వారు తమ ఇష్ట ప్రకారముగా వారి విధానములో... వారు దేనిని నమ్మితిరో దాని ప్రకారముగానే వెంబడించాలనుకున్నారు. కాని దేవుడు వారికి సూచనగా ఒక ప్రవక్తను పంపించెను. గనుక పంపబడిన ఆ ప్రవక్త సూచనను చేసెను. కాని
వారు ఆ సూచనను నిర్లక్ష్యంను చేయుటవలన తీర్పులోకి వెళ్ళిరి. ఎంతకాలం? ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు. ఒక్క దినమనగా, ఒక సంవత్సరము
నకు సమానముగా లెక్క చొప్పున ఆయన ఆ శిక్షణను వారికి అనుమతించెను. వారు ఆ ప్రవక్తను చూచి పరిహరించిరనగా, వారు అతనిని చూచి పరిహసించే ఒక్కొక్క దినము ఒక్కొక్క సంవత్సరముగా పెరుగుతూ, వారు బందీ గృహములో బందీలుగా ఉండునట్లు గురైరి. ఆయన వారికి ఒక సూచనను ఇచ్చెను. వారు దానిని నమ్మలేదు. లేదు. కనుక ఆయన వారిని తీర్పుద్వారా శిక్షించుటకు సుదూరముగా బబులోను దేశమునకు చెఱపట్టబడి తీసుకొని పోయెను.ఓ, దేవా!
80. మరొక విషయమును గూర్చి ఆలోచించుదాము. మిక్కిలి ఎండ వేడితోనున్న ఒక రోజు ఉదయమున, సమరయ మార్గమున వచ్చుచుండగా, అతడి ముఖమంతా ముడతలతో, అతడి చిన్న కన్నులతో ఆకాశము వైపు తేరి చూచుచు, తన చేతిలో కఱ్ఱ(దండము)తో, చెప్పులు లేని కాళ్ళతో, పాత గొట్టె చర్మమును తన చుట్టూ చుట్టుకొని, (చూచుటకు దట్టమైన రోమములతో బయటకు వచ్చుచున్న పురుగువలె ఉండెను) మరియు అతడి బట్టతల ఎండకు మెరియుచున్నది, అతడి చేతిలో కఱ్ఱ గలదు... సహోదరుడా, ఒక యవ్వనస్థుడు రహదారిపై నడిచి వస్తే ఎట్లుండునో అట్లు అతడి అడుగులు ఆ సమరయ దారిలో ఉండెను. తన ఎదుట అహాబు ఎదురైనప్పుడు అతడు తడబడలేదు. వారేవిధముగా శాపగ్రస్థులైతిరో దానినిగూర్చి అతడు అనేక దినములుగా ప్రసంగిస్తూ ఉండెను. తల వెంట్రుకలు ఎప్పుడూ తడిగా ఉండునట్లు కేశ అలంకరణ పద్ధతిని బహుశా, ఆ దినములలోనే వారు అచ్చట కలిగియుండవచ్చు. ఈ విధమైన కేశ అలంకరణను చేసుకున్న వారిలో వారే మొదట స్త్రీలై ఉండవచ్చునని మీకు తెలుసా? యెజెబెలు మరియు ఆమెయొక్క నీచమైన కార్యములు అచ్చట అత్యధికముగా ఉండుటచేత వాటన్నింటిని అతడు గమనిస్తూ వాటి నిమిత్తము వారిపై శిక్షను మోపుచుండెను. అతడు దేవుని యొక్క ప్రవక్తయని చూపించుటకు దేవుడే అతని మాటలను ఋజువుపరచుచుండెను. అవునండీ. కాని ఆ దేశపు పట్టణపు రాణిగా యెజెబెలు ఉండుటచేత ఆమె ఎట్లుండునో వారుకూడా అట్లే ఉండుటకు ఆశించిరని మీకు తెలుసా?. అదే కార్యము తరచుగా మరలా, మరలా జరుగుచూనే ఉన్నదని మీకు తెలుసా?
81. ఈ దేశము మొత్తం ఇశ్రాయేలువలె ఉన్నది. దేవుడు వారికొక దేశమును అనుగ్రహించెను. వారు ఆ దేశమును ఆక్రమించుకొని అచ్చటున్నవారిని బయటకు త్రోసివేసిరి. మరియు సొలొమోనును రాజుగా కలిగియుండిరి. వారు దావీదును మరియు చక్కని రాజులను కలిగియుండిరి. పిదప ఆ దేశమును పాలించుటకు
బలహీనమైన, నిలకడలేని అహాబు రాజు వచ్చెను. (నాకు తెలియదు). మరియు అహాబు యెజెబెలు చేతిలో ఒక కీలు బొమ్మగా ఉండెను (అది నిజము). మరియు యెజెబెలే ఆ రాజ్యమునకు ప్రధానముగా ఉండి అహాబును నడిపించుచుండెను.
మనముకూడా దానినే చేసితిమి. ఇచ్చటకు వచ్చి ఇశ్రాయేలీయులను పారద్రోలితిమి లేదా రెడ్ ఇండియన్లు బయటకు తరిమివేసితిమి. వారిని వెలుపలికి పారద్రోలి మరియు వారి దేశమును ఆక్రమించుకొని వారు మరణించు వరకు ఆకలితో అలమటించునట్లు మనము చేసితిమి (నిజము). మనకుకూడా ఒక వాషింగ్టన్ మరియు ఒక లింకన్ ఉండెను. కానిప్పుడు నేను ఆశ్చర్యము చెందు చున్నాను. మరిప్పుడు అదే పాత యెజెబెలు వ్యవస్థవంటి ఏదోకదానిని దాని వెనుక మనమిచ్చట కలిగివున్నాము. ఖచ్చితముగా ఆనాడు వారు ఉన్నట్లుగానే మనము నేడు ఉన్నాము. దేవుడే మనల్ని పంపించెను... మలాకీ 4 ప్రకారముగా, ఈ అంత్య దినములలో ఆయన వాగ్ధానముచేసిన రీతిగానే, ఏ ఒక్కరు తప్పించుకొని పోకుండునట్లు ఆయన ఒకరిని దృశ్యములోకి తీసుకొని వచ్చును.
గనుక అతడు సూచక క్రియలను, అద్భుత కార్యములన్నింటిని చేసినప్పుడు... సహోదరుడా, నేను చెప్పుచ్నుదేమనగా, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనే దానిని అతడు కలిగివుండెను. ఏలీయా ఆ పట్టణపు రాజధానిలో ప్రవేశించి, "నేను చెప్పువరకు మంచైనను ఆకాశమునుండి పడదని చెప్పెను". అట్లు చెప్పుచూ తన కాలును నేలపై గట్టిగా తన్ని అచ్చట నుండి తన మార్గము గుండా వెళ్ళిపోయెను. ఎందుకని? "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అనే దానిని అతడు కలిగి యున్నాడు. అదొక సూచనయై (గుర్తు) ఉన్నది. అచ్చట కరువు ఏర్పడుట వలన ఆ దేశమున మరణములు ఏర్పడినవి.
82. ఈసారి యెజెబెలు సంతానమగు కొంతమందికి ఇది ఆత్మ సంబంధమగు మరణముగా ఉండునని నేను తలంచుచున్నాను. అవునండీ. ఆత్మ సంబంధమైన మరణము, ఎండిపోయెను... ఇచ్చట నేనొక విషయమును చెప్పగలను, కాని దీనిని ఇంతవరకు వదిలివేయుట మంచిది. ఎందుకనగా, ఇది టేపులో రికార్డు అగుచున్న దని నమ్ముచున్నాను. ఓ,మనము ఆ దినములలోనే జీవించుచున్నాము. అవునండీ.
దేవునిద్వారా అతడికి ఇవ్వబడిన పరిచర్య తర్వాత, దేవుని నిజ వాక్యముతో ఇవ్వబడిన నిజమైన సూచక క్రియలు మరియు అద్భుత కార్యములు నిరాకరించబడి నవి. గనుక ఆ మనిషి ఏమి చెయ్యగలడు. కావున అతడు వారిని ఖండించుచు, గద్దించెను, యెజెబెలు అతడిని ద్వేషించెను. అచ్చటున్న ఆమెయొక్క ఆధునిక ప్రథమ మహిళలందరూ ఏలీయాను ద్వేషించిరి. అతనిని వారు ఇష్టపడలేదు.
ఖచ్చితంగా వారు ఇష్టపడలేదు. అతడొక భయంకరమైన మనిషని వారు తలంచిరి. కాని అదే సమయమున వారికి అతడే సంఘ కాపరి, అతడే వారికి కాపరి. ఓ, అవును. పాస్టర్ ఏలీయా. ఓ, ఆమె అతనిని పాస్టరుగా అంగీకరించలేదు. కాని ఏలీయానే దేవుడు పంపించిన పాస్టర్. ఆమెకు అతడు దేవుడు పంపించిన సంఘకాపరి. అతడు ఆమెను విడిచిపెట్టలేదు. ఆతడు వాక్యమును క్రుమ్మరించాడు.
మరియు వారు ఏలీయాను నిరాకరించుచు అతడొక మూర్ఖుడని తలంచిరి. వారినుండి అతనిని దూరంగా తరిమివేసిరి. ఏ ఒక్క సంఘ సంస్థలు ఏలీయాను అంగీకరించలేదు. అతనిని వెలుపలికి త్రోసివేసిరి. అయినాగాని అది వాక్యమును ఆపలేకపోయెను. అది ఇదివరకు ఎట్లు కొనసాగుచూ వెళ్ళినదో సరిగ్గా అదేవిధము గానే అది వెళ్ళుచుండెను. గనుక అహాబుకొరకు అతడు, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అనే దానిని పొందుకునేంత వరకు అచ్చట వేచి యుండి, పిదప అతడు వచ్చి అహాబును హెచ్చరించెను. ఎప్పుడైతే ఏలీయా అట్లు చేసెనో ఆ దేశమున కరువు ఏర్పడినది. అది నిజము. అచ్చట ఏమి జరిగినదో మీకు తెలుసు, నిశ్చయముగా, కరువుకు ముందు ఏలీయా అట్లే ఉండెను.
83. అతనిని సాదృశ్యంగా చూచుటకు నేను ఇష్టపడుచున్నాను. గనుక అతనివలె మరొకరు అదే మాదిరిగా ఉండాలని లేదా అతనికి ప్రతిరూపంగా మరొకరిని చూడాలని నేను ఆశిస్తున్నాను. మలాకీ 3లో చెప్పబడిన ప్రకారముగా యోహాను వచ్చి ఆఖరి ప్రవక్తయొక్క వర్తమానమును నెరవేర్చినప్పుడు... యోహాను వింతగా జన్మించిన ఒక బాలుడని మీకు తెలుసు. అది మీకు తెలుసు. గాబ్రీయేలు దూత అతని తల్లికి ప్రత్యక్షమై ఈ బాలుడు ఏమి చెయబోతాడో ఆమెకు తెలిపెను. ఎట్లనగా, అతనొక గొప్పవానిగా అవుతాడని, పిల్లల హృదయమును పితరుల విశ్వాసము వైపుకు త్రిప్పునని, ఇంకా అనేక కార్యములు అతడు చెయ్యబోతాడని ఆమెకు తెలుసు. మలాకీ :3, “ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను". ఈ యోహాను తన తండ్రియొక్క వేదాంత పాఠశాలకు వెళ్ళుటకు బదులు, అరణ్యమునకు కొనిపోబడెను. అచ్చటే ఇతడు సిద్ధపడెను.
సరిగ్గా ఏలీయావలెవున్న ఇతనివైపు చూడండి, ఏలీయావలె ఇతడు కూడా అరణ్యములోనే నివసించెను. ఏలీయావలె నీచమైన ప్రవర్తనగల మహిళలను ద్వేషించెను. వృద్ధుడగు హెరోదుతో, "ఆమెను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని” చెప్పెను. ఆమె హేరోదుయొక్క తమ్ముడు ఫిలిప్పు భార్య. ఆ మాట అతడు చెప్పినందువలన దానికి క్రయముగా అతని తల చేధించబడెను, అయినా అతడు అట్లే ముందుకు సాగిపోయెను. నిశ్చయముగా, అతడొక గురుతుగా ఉండెను.
అతడేమి చెప్పుచుండెను? "నేను మారుమనస్సు నిమిత్తము మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను, గాని నా వెనుక వచ్చుచున్నవాడు, ఇదివరకే మీమధ్య ఉన్నాడు. నేనాయ నను ఎరుగను. నేనింకా ఆ సూచనను చూడలేదు. కాని ఆయన మీమధ్య వున్నాడు". ఇప్పుడది ఆసన్నమగు సమయము బహు సమీపముగా ఉన్నదని, సరిగ్గా ఇప్పుడు ఆయన భూమిమీద ఉన్నాడని అతడెరిగివుండెను. ఆమేన్. "సరిగ్గా ఇప్పుడు ఆయన మన మధ్యనే నిలబడియున్నాడు. మీరాయననెరుగరు. కాని అది ఆయనే. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను మరియు అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో వున్నదని”చెప్పెను. “ఈ దినములలో ఏదోక దినమున ఆయన వచ్చును”. అవును.
84. ఒక రోజు యేసు అచ్చటకు నడుస్తూ వచ్చుచుండగా యోహాను ఆయనవైపు చూచి, "ఇదిగో లోక పాపమును మోసుకొనుపోవు దేవుని గొఱ్ఱపిల్ల" అని చెప్పెను. యేసు భూమిపైకి వచ్చినప్పుడు ఆయనేమి చేయునని వాక్యము చెప్పెనో దానిని అట్లే ఖచ్చితముగా ఆయన చేసెను. ఎందుకనగా, రెండు వేల సంవత్సరములుగా ఆ దేశమును వదిలి వెళ్ళిన ఇశ్రాయేలీయులు మరలా అచ్చటకు తిరిగి వచ్చుటకు, వారు అచ్చటనుండి తిరిగి వచ్చునప్పుడు వారికొక సూచనగా ఆయన ఉండెను. బహుశా, ఆ ఇశ్రాయేలీయులందరూ ఒకేసారి మారుమనస్సు పొందవచ్చు.వారు ఒక ప్రజలుగా, వారొక దేశముగా ఉండుటకై తిరిగి వచ్చెను. ఇశ్రాయేలీయులతో దేవుడు ఒక దేశముగా వ్యవహరించును. కాని అన్యజనుల ప్రజలగు తన వధువుతో ఆయన వ్యక్తిగతంగా వ్యవహరించును. ఇశ్రాయేలీయులు ఇప్పుడు తమ స్వంత దేశమునకు తిరిగివచ్చి ఒక దేశముగా ఏర్పడెను. అదొక గొప్ప సూచనగా వున్నది.
దానికొరకు మనము కొన్ని నిమిషములు చూడవచ్చని నేను నమ్ముచున్నాను. నాకింకా ఐదు లేదా పది నిమిషములు మాత్రమే ఉన్నాదనుకుంటున్నాను. మనము ప్రార్థనా వరుసను సిద్దపరచవలెను. మనమిచ్చట దానిని చెయ్యుటకు ముందు, ఈ రాత్రి నేను చెప్పదలచిన విషయమును చెప్పాలని కోరుచున్నాను. అర్థమైనదా! ఇదొక మహా గొప్ప పునాదగును. ఇది స్థిరముగా నిలిచియుండును.
85. యేసు ఈ వాక్యమునకు సాక్షియైయుండెను. ఆయనే మెస్సియ్యా, అభిషిక్తుడై యుండెను. “క్రీస్తు” అనగా “అభిషేకింపబడినవాడు, మెస్సియ్యా, పంపబడినవాడు, అభిషేకింపబడినవాడు" అని అర్థము. ఆయనే వాక్యమైయున్నాడు. ఆయనే అభిషేకిం పబడిన వాక్యమైయున్నాడు. ఆమేన్. ద్వితియోపదేశ కాండములో ఆయన ఏమి చేయునని మోషేతో పలికెనో దానిని ఖచ్చితముగా చేయుచూ, దాని నిమిత్తము
ఆయన సాక్ష్యమును కలిగివుండెను. "నీ దేవుడైన దేవుడు నీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను పుట్టించునని" ఆయన చెప్పెను. ఆయన ఒక ప్రవక్తయై యుండును.
సీమోను పేతురుకు ఇది తెలుసు. తన సహోదరుడగు అంద్రెయ యేసుతో, రాత్రంతా ఉండెనని పేతురు ఆలకించినప్పుడు... ఆవిధంగా రాత్రంతా ఆయనతో గడుపుటనేది చాలా మంచి విషయమని మీకు తెలుసా?. ఉహ్..హ్.. కొంతమంది ఒక్క ఐదు నిమిషములు కూడా ఆయనతో ఉండలేరు. కాని అంద్రెయ రాత్రంతా ఆయనతోనే ఉండెను. పిదప వాస్తవముగా దానిని తన సహోదరుడితో చెప్పి వుండవచ్చు. “ఇప్పుడు మనము అచ్చటకు వెళ్ళి మరలా ఆ విషయమును పరీక్షించు దాము". వద్దు. "సరే, మనము ఈ రాత్రి వెళ్ళి పరీక్షించి చూద్దాం". వద్దు. అతడు, "నేనెవరిని కనుగొంటినో నాతో వచ్చి చూడుము" అని చెప్పెను. అతడు ఎవరిని కనుగొనెనో అతనికి తెలుసు. ఎట్లనగా రాత్రంతా అతడు ఆయనతోనే ఉండెను.
యాకోబు రాత్రంతా పెనుగులాడుచూ ప్రార్థిస్తూ ఆయనతోనే నిలిచి ఉండి, పిదప తన సహోదరుడిని వెళ్ళి కలుసుకోగలిగెను. ఈ దినమున మీకున్న సమస్య ఏమిటంటే తగినంత సమయము మీరు ఆయనతో గడుపుట లేదు. గత కాలమున మీ తల్లులు మరియు తండ్రులు పెంతెకోస్తు దినములలో పగలు మరియు రాత్రంతా ప్రార్థిస్తూ గడిపిరి. కాని నేడు మనము దిగజారిపోయాము. “మా అమ్మను, నాన్నను, నా సహోదరిని మరియు నా సహోదరుడును దీవించుము. ఆమేన్. నాకు చాలా తీవ్రంగా నిద్ర వచ్చుచున్నది. నేనేమి చెయ్యాలో నాకు తెలియుటలేదు. నేను ఇంటికి వెళ్ళి, టెలివిజన్లో ప్రదర్శించే క్రొత్త కార్యక్రమమును చూడవలెను. (అర్ధమైనదా?) "వి లవ్ సూసీ" అనే ధారావాహికను కొద్దిసేపటిలో ప్రసారమవుతాది. అది ఏదోక దానిని వక్రీకరించబడిన ఆ పాత దయ్యమైయున్నది. బుధవారంలో లేదా ఏదోక దినమున ప్రార్థనా కూటమునకు వెళ్ళి నీ ఆత్మను పోషించుకుంటున్నావు. ఇన్ని చేసి మరలా దేవుడు మీపై ఆత్మను క్రుమ్మరింపవలెనని దేవుని వద్ద అడిగెదరు.
అతడు దేనిని పొందగలడు? ఒక సంఘశాఖల గుంపును పొందుకొనును. అదే చేయగలడు. అలాంటి విత్తములనే అతడు విత్తగలడు. "సరే. ఓ, నేను దీనికి చెందిన వాడిని. నేను..." నేను దేవునికి చెందినవాడినని చెప్పుటకు బదులుగా దేనినో చెప్పుదురు. (అవునండీ). ఇతర కార్యములన్నీ వాటితోనే వదిలివేయండి. నిజము.
86. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు, యేసు తనకంటూ ఒక సాక్ష్యమును కలిగియుండెనని మనము కనుగొన్నాము. సీయోను... అతడినెరిగెను... "నా తండ్రీ నాతో ఏమి చెప్పెనో నాకు తెలుసు. ఆయన వచ్చు దినమున అచ్చటంతా మిక్కిలి గందరగోళంగా ఉండునని నాతో చెప్పెను" అని సీమోను చెప్పెను.
ఈ వృద్ధుడగు సీమోను తండ్రి చెప్పుచున్న మాటలను అట్లే నేను వినగలుగు చున్నాను... తన కుమారుడగు పేతురుతో ఇట్లనెను. “కుమారుడా, ఆలకించుము.
మెస్సీయ్యాను నేను చూసెదనని నమ్మితిని, కానిప్పుడు నేను చాలా వృద్ధుడనైపోతినని నేను ఊహిస్తున్నాను. గనుక నేను ఆయనను చూడలేను. కాని నేను చెప్పేది ఆలకిం చుము. దీనిని నీవు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. ఆయన వచ్చుటకు ముందు, అనేక రకముల అనుకరణలు పైకి లేచును. కాని నీవు ఆ మెస్సీయాను కనుగొనెదవు. ఆయన వచ్చునప్పుడు, కుమారుడా... చేపలను ఎట్లు వేటాడాలో నేను నీకు నేర్పించితిని. ఉప్... అచ్చట ఆ అవతలి గట్టున నీ త్రాసు యదార్థముగా ఎట్లుండవలెనో నేను నీకు నేర్పించితిని. ఇచ్చిన మాటను ఎట్లు కాపాడుకోవాలో నీకు నేర్పించితిని. అదే నిన్ను చిత్తశుద్ధిగల వ్యక్తిగా తీర్చిదిద్దినది. అదే నిన్ను ఒక యదార్థవంతునిగా చేసినది. కుమారుడా, నిజాయితితో జీవించుటకు అలాంటి ఉపదేశమును నీవు పాటించిన, మరి అట్లే నీ తండ్రి మాటలను యదార్థముగా నీవు గైకొనిన, అప్పుడు యదార్ధమైన హృదయముతో దేవుని మాటను నీవు పాటించెదవు. ఆమేన్. ఈ మెస్సీయ ఒక ప్రవక్తగా ఉండునని దేవుడు చెప్పెను. ఒక తత్వవేత్త కాదు. "మీ మధ్య ఒక ప్రవక్తను మీ దేవుడగు ప్రభువు లేపును".
87. తన తండ్రి మాటలను సీమోను తన మనస్సులో భద్రపరచుకొని ఉండెను. ఆయనపట్ల ధృఢమైన నమ్మకమును కలిగినవాడై ఒక రాత్రంతా ఆయనతో ఎట్లు గడిపెనో అంద్రెయ ఒక రోజు అతనితో చెప్పెను. ఎవరిని గూర్చి అంద్రెయ చెప్పెనో ఆయనను చూచుటకు సీమోను అచ్చటకు వెళ్ళెను. ఆనాడు ఆ సముద్ర తీరమున ఒక చెక్క ముక్క మీద కూర్చొని ఆయన మాటలను అతడు ఆలకించెను. కాని ఆయన వృద్ద సీమోనువైపు చూచిన ఆ క్షణమందే, “నీ పేరు సీమోను మరియు నీవు యోనాయొక్క కుమారుడవు" అని ఆయన చెప్పెను. ఆ మాటలు సత్యమైనవి. అవి సరియైన మాటలు. ఎందుచేత? అదొక లేఖనానుసారమైన సూచనగా ఉన్నదని అతడెరిగెను. అది మెస్సీయయొక్క సూచనగా ఉండెను.
అలాగే ఫిలిప్పు, నతానియేలువద్దకు వెళ్ళినప్పుడు, నతానియేలు తిరిగి వచ్చి, “ఇప్పుడు ఒక్క నిమిషము ఆగుము. నేను దానినిగూర్చి ఆలకించి ఉండవచ్చు. కాని అది నిజమా లేదా అబద్దమా అనే విషయములో నేను ఆశ్చర్యపడుచున్నాను" అని చెప్పెను. “నాకు తెలియదు, కాని నీవు అచ్చటకు వచ్చి కనుగొనువరకు వేచి వుండుము. అచ్చట నీవు కనుగొనెదవు. కొద్దిసేపు ఉండి ఆ కూటమును గమనించి చూడుము. అచ్చట ఏమి జరుగుచున్నదో నీవు చూచెదవు” అని ఫిలిప్పు చెప్పెను. ఇదిగో ఇచ్చట ఫిలిప్పు, అంద్రెయ ఇద్దరూ కలిసి వచ్చుచున్నారు. యేసు అచ్చట
నిలబడియుండి వారి వైపు చూచి, "ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటము లేదు" అని చెప్పెను. అప్పుడు నతానియేలు, “రబ్బీ, నన్ను నీవెలాగు ఎరుగుదువని?" అడిగెను. ఆ మాటలు నతానియేలుని మతిపోయి నట్లు చేసెను. అందుకు ఆయన, "ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచితినని" చెప్పెను. అదేమిటది? మెస్సీయ యొక్క లేఖనానుసారమైన సూచనయగును. అది నిజము.
88. బావివద్దకు సమరయ స్త్రీ వచ్చినప్పుడు, "స్త్రీ, దాహమునకు నీళ్ళు ఇవ్వుము” అని ఆయన అడిగెను. “ఇది వాడుకకు విరుద్ధమైన కార్యము. మన మధ్య ఇచ్చట విభజన గలదుకదా? నీవొక యూదుడవు మరి నేనేమో సమరయురాలిని, మన మధ్య ఎలాంటి సంబంధాలు లేవు కదా? మరియు నేనొక స్త్రీని, నీవొక పురుషుడవు. గనుక నీవెలాగు ఇలాంటొక కార్యమును నావద్ద అడుగుచున్నావని?”ఆమె అడిగెను.
అందుకు ఆయన, “కాని నీతో మాట్లాడుచున్నవారెవరో నీవెరిగిన యెడల నీవు దాహమునకు నీళ్ళు అడుగుదువు" అని ఆయన చెప్పెను.
మేము ఈ పర్వతమందు ఆరాధించెదము గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పెదరు, నీవొక యూదుడవు..." అని ఆమె చెప్పెను. అలాగు ఆ సంభాషణ జరుగుచుండగా యేసు ఆమె ఆత్మను పట్టుకొనెను. "నీవు వెళ్ళి నీ భర్తను పిలుచుకొని ఇచ్చటకు రమ్మని" ఆయన చెప్పెను. ఓ, దేవా!
“నాకు భర్త లేడని” ఆమె చెప్పెను.
“నీవు చెప్పిన మాట సరియే, నీకు ఐదుగురు భర్తలుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు" అని ఆయన చెప్పెను.
అప్పుడామె ఏమని చెప్పెను? "అయ్యా, ఒక్క నిమిషము ఆగుము. అలాగే ఒక్క నిమిషము ఆగుము. నీవు ఒక ప్రవక్తవై ఉండవలెను. ఇదే ప్రభువుయొక్క వాక్యమై యున్నది. మెస్సీయ వచ్చునని ఎదురుచూచుచున్న దినములలో ఇప్పుడు మేము జీవించుచున్నామని మరియు ఆయనే ఇలాంటి కార్యములను తెలియజేయు నని మేమెరుగుదుము. “నేనే ఆయనని” యేసు చెప్పెను. ఇక యాకోబు బావిలోని నీళ్ళు అంతగా రుచి అనిపించవు. ఆ క్షణమందే ఆమె ఆ ఊరిలోకి పరిగెత్తుకొని వెళ్ళి, “మీరు వచ్చి,నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఈయనే మెస్సీయ కాడా?" అని ఆమె చెప్పెను. ఆయనే మెస్సీయ అనేదానికి అదే ఒక లేఖనానుసారమైన సూచనగును. ఖచ్చితముగా నిజము. అవునయ్యా. అవును.
89. వారు దీనిని త్రోసివేసిరి. ప్రజలు, బయెల్జెబూలు, సోదె చెప్పువాడు, దయ్యమని ఆయనను చూచి వారెందుకు చెప్పిరి? కాబట్టి ఏమి జరిగెను? తమ సొంత
రక్తమునే క్రయముగా చెల్లించిరి. ఎట్లనగా, రోమీయులు గొప్ప సైన్యాధిపతియగు తీతు యెరూషలేమును చుట్టుముట్టి ముట్టడివేసి మూడు సంవత్సరములుగా బంధించుటవలన, చెట్ల బెరడులను వారు తీసికొని తినిరి, ఒకరి పిల్లలను ఒకరు చంపుకొని వారి మాంసమును తినిరని చరిత్రకారుడగు జోసెఫస్ తన రచనలలో చెప్పెను. అది ఎందుచేత? వారియొక్క సూచనను చూచుటకు వారు విఫలమైరి.
యేసు ఏమి చెప్పెను? "వేషదారులారా?”(యాజకుల అంగీలతో డాక్టర్ పట్టములను కలిగియుండి,ఈ గొప్ప పోప్ జాన్లువంటి వారందరూ, ప్రతీ ఒక్కొక్కరు ఈ పట్టములను మరియు మొదలగు హంగామలన్నింటిని కలిగివున్నారు) వీధులలో నడుచుకుంటూ వెళ్తూ వందనములను, సమాజ మందిరములో అగ్ర పీఠములను (శ్రేష్టమైన స్థలములకు వెళ్ళుటకు), విధరాండ్ర యిండ్లు దిగమ్రింగుచు, మాయ వేషముతో దీర్ఘ ప్రార్థనలు చేయుదురు మరియు దానినెట్లు ప్రార్ధించవలెనో నేర్చుకొనెదరు. “మిక్కిలిగా మీరు శిక్షకు పాత్రులగుదురు మరియు మీరు ఆకాశము వైపు తేరి చూచెదరు. కాని దేవుని వాక్యము ఏమి చేయుచున్నదో తెలుసుకొనుటకు బదులుగా దానికంటే విజ్ఞానశాస్త్రము గూర్చి అధికముగా మీరెరిగి ఉందురు". అని ఆయన చెప్పెను. ఆ మాటలు వారిని బ్రద్దలు చేసెను.
90. మీరు ఆకాశముల వైపు చూచెదరు, మీరు నా మాటలను ఆలకించుటకంటే, వాతావరణమునుగూర్చి చెప్పె ప్రవక్తల మాటలనే ఎక్కువగా ఆలకించెదరు. అంతేకాదు, ఆకాశము మబ్బుగాను మరియు ఎఱ్ఱగాను ఉన్నదని మొదలగువాటిని గూర్చి చెప్పుచూ, గనుక రేపటి దినమున గాలివాన వచ్చునని, సూర్యుడు స్పష్టముగా కనబడుట వలన, అది చాలా ఆహ్లాదకరముగా ఉండునని మీరు చెప్పెదరు. “మీరు ఆకాశ వైఖరి వివేచింపనురుగుదురు గాని ఈ కాలముల సూచనలను మీరు వివేచింప లేరు. మీరు నన్ను ఎరిగిన యెడల నా దినమును మీరు ఎరిగియుందురు. అచ్చట సూచనలు గలవు" అని ఆయన చెప్పెను. మెస్సీయ.ఓ, దానిని చూచుటకు వారెంత ఘోరముగా విఫలమైరి. (ఈ అంశమందే చాలాసేపుగా మనము ధ్యానించవచ్చును గాని ఇప్పుడు మనకు సాధ్యమవ్వదు. మనము త్వరపడవలెను).
91. ఆలకించండి. పిదప, ఆయన రాకడకు ముందుగా ఏమి సంభవించవలెనో, ఆ వాగ్ధానము యేసుద్వారా వచ్చెను,సరే ఇప్పుడు, దానిని ఒక్క నిమిషము పరిశీ లించి చూద్దాం. ఇప్పుడు ఆ విషయమునుగూర్చి కొన్ని నిమిషములు చూద్దాం. కొంతసేపు. మీరు అలసిపోయారా? అట్లయితే మీరు... చూడండి. సరే. దీనిని కొద్ది నిమిషములు మాత్రమే చూద్దాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దానిని
_
వెనుకకు పెట్టి, ఇప్పుడు మనము సూచనలన్నింటిని చూద్దాం. మనము దానిమీద ఎన్నో గంటలు, వారాలు మరియు నెలలుగా ధ్యానించవచ్చు. కాని ఆ ఒక్క అంశంను వదిలి మనము బయటకు రాలేము. కనుక దానిమీద నిలిచి ఉందాము. ఇప్పుడు కొన్ని నిమిషములు, వెనుకకు వచ్చి...
- 92. “రాతి మీద రాయి ఉండకుండ పడద్రోయబడు ఆ దినములు ఎప్పుడు 7 వచ్చును? మరియు ఈ యుగసమాప్తికి సూచనలేమిటి? అదెప్పుడు జరుగును?" - అని వారు యేసు వద్ద అడిగిరి.
పిదప ఆయన ఆ విషయమునుగూర్చి చెప్పుటకు ప్రారంభించెను. "ప్రతీ దేశమందు మరియు రాజ్యమందు నాకొరకు సాక్ష్యముగా ఈ సువార్త ప్రసంగించ బడును.” అదేమిటో మీకు తెలుసా? ఇప్పుడు ఈలాగు ఆయన చెప్పలేదు గాని, “ఈ సువార్త” యని ఆయన చెప్పెను. "వాక్యమును వెళ్ళి బోధించమని చెప్పలేదు గాని సువార్తను బోధించుడి” అని ఆయన చెప్పెను. ఖచ్చితముగా ఈ మాటలలో చాలా బేధము గలదు. సువార్తయనేది దేవునియొక్క శక్తిని మరియు వాక్యముయొక్క క్రియనుచేసి చూపించును. అర్థమైనదా? వాక్యము యొక్క క్రియలను చేసి చూపించుచు మరియు దాని శక్తిని ప్రదర్శించును.
నది పైన ఆ దూత వచ్చిన విషయము మీకు జ్ఞాపకమున్నది. (దానియొక్క చిత్రపటము మీవద్ద గలదు. దానినిగూర్చి మీరెరుగుదురు). దానిని గూర్చి ఇచ్చట చెప్పబడినది. 1933లో నేను నా మొదటి గుంపుకు బాప్తిస్మమును ఇచ్చుచున్న ప్పుడు, ఆ వర్తమానము ప్రపంచమంతటా వ్యాపించెను. మరియు ప్రతీ దేశమున ఒక ఉజ్జీవమును వారు పొందుకొనుచుండిరి. ఆ ఉజ్జీవమును ప్రతీచోటా వారు పొందుకొనిరి. అర్థమైనదా? ఖచ్చితముగా. ఎన్నుకొనబడిన వారిని ఆ ఉజ్జీవము బయటకు తీసుకొని వచ్చినది. అది నిజము. ఈ సువార్త ప్రకటించబడినది.
93. పిదప ప్రకటన గ్రంధం 3: 1-3లో, అంత్య దినములలో మూడు సంఘ కాలములు ఉండునని మనము కనుగొంటిమి. ఆ విషయము మీరెరుగుదురా? అది నిజము. అవి మనకు గలవు. వారు ఆ మూడు అంశాలద్వారానే వచ్చారని మీరు గుర్తుంచుకోండి. అవి నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము (లూథర్, వెస్లీ, పెంతెకోస్తు). అంత్య కాలమందు ఈ ముగ్గురు వర్తమానికులు ఉండెదరని కనుగొన్నాము... అంత్య దినములలో ఆయనయొక్క స్వకీయ రాకడ గలదని మనము చూచుచున్నాము. దానిని మరలా మనము కనుగొందాం. ఈ అంత్య దినములలో ఆయనయొక్క... వర్షమును... అనగా పరిశుద్ధాత్మ క్రుమ్మరింప
బడునని... ఆయనయొక్క రాకడను మనము కనుగొనుచున్నాము. ఆ పరిశుద్ధాత్మ - క్రుమ్మరింపబడినదని మీరు విశ్వసించుచున్నారా? ఎవరిపై క్రుమ్మరించబడినది? > ఎవరో విత్తిన విత్తనములు ఆయన యొక్క కడవరి దినములలో పంటను తీసుకొని వచ్చుట కొరకై క్రుమ్మరింపబడినది. “కడవరి దినములలో” అని యోవేలు చెప్పెను.
- 94. ఇప్పుడు, చూడండి. ఇచ్చట మరొక విషయమునుగూర్చి చెప్పాలని నేను _ ఇష్టపడుచున్నాను. “మీరు ఇప్పుడే వెస్లీతో ప్రారంభించిరి” అని మీరు చెప్పెదరు. మీరెప్పుడైనా దాని గురించి ఆలోచింతిరా? ఏడు సంఘకాలముల ద్వారానే నేను తెలుసుకున్నాను. నేనెందుకొరకు వెస్లీతోనే ప్రారంభించానని మీరెప్పుడైనా గమనిం చారా? ఎందుకనగా సంస్కరణకు పిదప, అది వెస్లీతోనే ప్రారంభమైనది. మరియు పరి. మార్టిన్ గురించి, పరి. ఐరేనియస్ గురించి, ఆ తర్వాత వచ్చిన వారందరు ఆ రోమన్ కాతలిక్ సంఘమునకు వ్యతిరేకముగా ఎదిరించి నిలబడినవారు. వారు సిద్ధాంతములను ప్రారంభించకుండా, దానిని త్రోసివేసి, వాక్యముతోనే నిలిచి ఉండిరి. అది ఏమి ప్రారంభించినది? వారికి ఏమి జరిగినది?.
95. దానినిగూర్చి యావేలు మీకు చెప్పియుండలేదా? గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి. అర్థమైనదా? అదీ కీటకమే(పురుగు), గొంగళి పురుగు నుండి మిడతగా, మిడత నుండి పసర పురుగుగా, మొదలగు పురుగులుగా మారుచూ వచ్చెను. అనగా అదే పురుగే - వివిధ దశలలో మారుచూ వచ్చెను. అదే కాతలిజంగా ఉన్నది. అదేమి చేసినది? వాక్యమును తినివేసెను. కాని, "నేను మరలా పునరుద్దరించెదనని (ఇచ్చెదను) ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేను మరలా పునరుద్దరించెదను" అని చెప్పెను. అదెట్లు ఉన్నది? వృక్షముయొక్క కాండమునంతా, అడుగు భాగము మొద్దు వరకు అవి తినివేసినవి. అది నిజము. అనగా పరిశుద్ధగ్రంథము బోధించిన సమస్త బోధలను ఈ రోమన్ కాతలిక్ సంఘము తినివేసెను. నిజము. వారు దానినుండి తమ స్వంత రోమ సిద్దాంతములను రూపొందించారు. మరియు వాటితోపాటు వారియొక్క తప్పుడు ప్రభువు రాత్రి సహవాస ఆరాధనను, తప్పుడు పరిశుద్ధా త్మను, తప్పుడు బాప్తిస్మమును, తప్పుడు నీటి బాప్తిస్మమును, సమస్తమైన తప్పుడు - సిద్దాంతములను వారు రూపొందించిరి. ఆ వృక్షముయొక్క అడుగు భాగపు మొద్దు - నిర్జీవమునుండి మరలా దానిలోకి జీవము వచ్చువరకు ఇకెన్నడూ, ఎన్నడూ, ఎన్నడూ - మీరు రాలేరు. ఆ జీవమే దేవునియొక్క వాక్యము. మనుష్యులు స్వతంత్రులుగా
ఉండుటకై... అది వారిని సంఘసంస్థతో బంధించి ఉంచెను. ఎవరైనా వారితో చేరనట్టైతే వారిని కాల్చి చంపిరి, వారిని చంపివేసిరి, సింహములకు ఆహారముగా వేసిరి. అలాగు అనేకమైన చిత్ర హింసలన్నింటిని చేసిరి. అది ఖచ్చితముగా నిజము.
96. కాని ఆ మొద్దు మరలా ఎదుగునని ఆయన చెప్పెను. అది మరలా చిగురించి ఎదుగును. ఆ వృక్షములో మొట్టమొదటగా ఏమి చిగురించి వచ్చును. ఆకులు 7 చిగురించి వచ్చిన పిదప ఏమి వచ్చును? పువ్వులు పుష్పించును. దాని తర్వాత - ఏమి వచ్చును? ఫలము ఫలించును. లూధరు, వెస్లీ దాని ఆకులై యుండిరి. పెంతెకోస్తు దాని పుష్పమై యుండెను. ఇప్పుడు మనము ఫలముల వైపుగా, కొనసాగుచున్నాము. సంఘము క్షీణించుచు దిగజారిపోవుచున్నది. ఆమేన్.
"నేను మరలా పునరుద్దరించెదను" అని ప్రభువు సెలవిచ్చెను. "నేనేమి చేసెదను? నేను ఆమెను మరలా పూర్వ స్థితికి తీసుకొని వచ్చెదను. నేను మరలా ఆమెను మూల ఉపదేశమునకు తీసుకొని వచ్చెదను. నేను మరలా ఆమెను మూల వాక్యమువద్దకు తీసుకొని వచ్చెదను. ప్రతీ సంఘశాఖను నేను ముక్కలు ముక్కలుగా పగులగొట్టెదను. ఆమెను మరలా నేను నా వాక్యమువద్దకు తీసుకొని వచ్చెదను". ఎట్లు? నేను నా నోరు మూసుకోవటం మంచిది, ఆగుము, అబ్బాయి. "నేను ఆమెను మరలా పునరుద్దరించి తీసుకొని వచ్చెదను”.
97. మొట్టమొదటి సంఘసంస్థ ఏది? దానిని అడిగి చూడండి. కాతలిక్ సంఘము, ఖచ్చితముగా నిజము. అదే ఖచ్చితమైన నిజము. లేదా ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో ఆమెనుగూర్చి చెప్పబడిన విధముగా, “ఒక మహావేశ్య”. అదొక... అదేమనగా...ఓ, ఆమె అలాంటి స్త్రీగా ఉండెను. అర్ధమైనదా? అనగా వాక్యమునకు యదార్థం(నమ్మకం)గా లేని ఒక సంఘముగా అది ఉన్నది. ఆమె వేశ్యలకు ఒక తల్లిగా ఉండెను. “వేశ్య” అనగా ఏమిటి? దాని అర్థం ఒక్కటే. సరిగ్గా ఇప్పుడే మనము దానిని చూడబోవుచున్నాము. ఇంకా రెండు లేదా మూడు నిమిషములలో దానిని తెలుసుకుందాం. అర్థమైనదా? మంచిది. మీరు ఆ విషయములను తెలుసుకొనెదరు.
ఆమె వేశ్యలకు తల్లి. ఆమె దానిని సంఘసంస్థగా స్తాపించి, పరిశుద్ధ గ్రంథము లోని ఉపదేశములను తొలగించి, ఆమె తన స్వకీయ కార్యములను బోధించుచూ, దేవుని యొక్క ఆజ్ఞలను బోధించుటకు బదులుగా... తమ సంప్రదాయాల ద్వారా దేవునియొక్క ఆజ్ఞలను ఎటువంటి ప్రభావం లేకుండా చేయుచుండిరి. యేసుకూడా అదే విషయమును కనుగొనెను. మసి కుండ, పాత్రను చూచి నీవు నల్లగా వున్నావని చెప్పుటకు వీలుపడదు. అది నిజము. అవన్నీ కూడా అలాగే ఉన్నవి. అవునండీ.
98. వారు వాక్యమును విడిచి దూరంగా తొలగిపోయినప్పుడు, మీరుకూడా దేవునిని విడిచి దూరంగా తొలగిపోయెదరు. పరిశుద్ధాత్మను విడిచి దూరంగా తొలగిపోయెదరు. మీరు అట్లు అన్నిటినుండి దూరంగా తొలిగిపోయెదరు. సాతాను ఏదోక అసత్య కార్యములను మీకిచ్చును. కాని అదెన్నడూ సాక్ష్యమును కలిగి ఉండదు. అది సత్యముగా ఉన్నంతవరకు... గనుక మరలా అదే మెస్సీయవద్దకు మీరు తిరిగి రండి. అదే దేవునియొక్క ఆత్మగా ఉన్నది. "ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు”. ద్రాక్షావల్లిలోవున్న అదే జీవము తీగలలోను ఉండును. మరియు తీగలు ద్రాక్షావల్లియొక్క ఫలములను కలిగియుండును. పరి. యోహాను 15. సరే మంచిది.
99. వారేమి చేసిరి? ఇప్పుడు వారందరూ, మీకు తెలుసా?.... అంత్యదినములలో ఆయన మొదటగా అన్నింటినిచేర్చి దేనిని కట్టెదనని ఆయన చెప్పెను. ముందుగా గురుగులను కూర్చి కట్టలు కట్టెదనని చెప్పెను. అదే నిజమేకదా? అబ్బాయి, ఇప్పుడు ఖచ్చితముగా వారట్లే కట్టబడుచున్నారు. ప్రపంచ సంఘముల యొక్క ఆలోచనా సమితి ప్రతీ ఒక్కొక్కరిని బంధించి ఉంచెను. పెంతెకోస్తులు మరియు వారందరూ కట్టబడియున్నారు. వారందరూ కాల్చివేయుటకు సమకూర్చి కట్టబడుచున్నారు. అదే ఖచ్చితముగా నిజము. ఉహ్..హ్. గోధుమ గింజలనుండి వారు వేరు చేయబడు చున్నారు. అందుకొరకు దేవునికి స్తోత్రము. అవును. అవిశ్వాసులు, వారందరినీ దానినుండి వేరుపరచి వెలుపలికి తీయబడుచున్నారు. వారి మార్గమును అనుసరిం చుచు వెళ్ళవద్దు. వారు అభ్యసించిన విధముగా మీరు అభ్యసింపకుడి. మీరు _వాక్యముద్వారా రండి. అదే సరియైనది. ఆకాశముయొక్క నిజ సూచనలకు, దేవుని సూచనలకు మీరు కలవరపడకుడి. అది... సూచనలు కాదు... ఆకాశము యొక్క సూచనలేగాని, సంఘముయొక్క సూచనలు కాదు. అవి దేవుని ద్వారా పంపబడిన సూచనలు, ఆకాశముయొక్క సూచనలు. వాటినిబట్టి మీరు కలవర పడకుడి. దానితోనే నిలిచి ఉండండి. అర్థమైనదా? సరే మంచిది.
100. ప్రపంచ సంఘములయొక్క ఆలోచనా సమితి వారందరినీ ఏకముగా సమకూర్చు చున్నది. వారేమి చేయుచున్నారు? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయ మును నెరవేర్చుచున్నారు. “వారి మృగమునకు ఒక ప్రతిమను తయారుచేసిరి". ప్రతిమ అనగా ఏమిటి? ఆ ప్రతిమ ఏమిటో మనమెరుగుదుము. కన్యకయైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మ్రింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీయెదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనైయున్న ఒక మగ శిశువును ఆమె కనగా... అనగా క్రీస్తు. ఆయన (ఆ శిశువు) ఆకాశము పైకి
కొనిపోబడి దేవునియొక్క సింహాసము ముందు కూర్చుండెను. ఆ ఘట సర్పము స్త్రీయెదుట నిలుచుండెను. అది ఆదిలోయున్న అదే పాత మృగమైయున్నది, రోము. ఆమె ఏమి చేసెను? ప్రజలందరినీ ఏకముగా సమకూర్చి సంస్థను స్థాపించెను, వారు దానికి ఒక ప్రతిమను తయారుచేసిరి. సంఘములన్నీ సమకూడి వచ్చి కమ్యూనిజంకు వ్యతిరేకముగా పోరాడాలని పోప్ జాన్ కోరుకొనుచున్నాడు. మరి దేవుడు... ఆ కమ్యూనిజంతోనే ఆమెను చంపాలని దేవుడు కమ్యూనిజంను స్థాపించె నని పరిశుద్ధ గ్రంథమును చదివే ఎవరైనా ఎరుగుదురు. ఆ మహావేశ్యను ద్వేషించెను-కాల్చివేయును. మరియు ఆమెను కాల్చివేసి, అగ్ని గుండములో ఆమెయొక్క పిల్లలను పడవేయును. నిశ్చయముగా. ఖచ్చితముగా, నెబుకద్రెజరు రాజును ఆయన ఉపయోగించిన విధముగానే దీనిని ఆయన ఉపయోగించును.
101. ప్రొటెస్టంటు సంఘములు వారంతటవారే సమకూడి ఏకమై మరియు సంఘములయొక్క ఆలోచనా సమాఖ్యను ఏర్పరచుకొనెదరు, పెంతెకోస్తు వారు కూడా సరిగ్గా వారితో చేరెదరు. ఎందుచేత? వారు వాక్యమును ఎరుగనందున.అదే ఖచ్చితముగా జరుగును. ఎట్లనగా, వాక్యము దానినే వాగ్ధానము చేసెను. గనుక దేవుడు ఎవరినైనా ఒకరిని పంపించి ఈ విషయములను గూర్చి బ్రద్దలు చేయును; ప్రజలను హెచ్చరించును. మనమిప్పుడు సరిగ్గా ఆ ఘడియలోనే ఉన్నాము. సరిగ్గా ఇప్పుడే అది జరుగుచున్నది. ఆ దినము సిద్ధముగా ఉన్నది. ఇచ్చట గమనించండి.
ఆ సూచనల వైపు చూడండి. ఓ, అవన్నీ ప్రతీచోట, మన చుట్టూ ఉన్నవి. అసలు ఏమి జరుగచున్నదో ఎరుగక మీరు ఆశ్చర్యపోయెదరు; మరి సంఘము ఇంకా ఎత్తబడుటలోకి ఎందుకు కొనిపోబడలేదని ఆశ్చర్యపడుదురు? మంచిది, ఇలాంటి పరిస్థితులు ఉన్నంతవరకు సంఘము ఎన్నటికీ కొనిపోబడదు. అది వెళ్ళదు. నిజము. ఈలాంటి దిగజారిపోయిన సంఘమును గురించి ఆయన మాట్లాడలేదు.
ఆదాముయొక్క పెండ్లి కుమార్తె తప్పుడు విత్తనమును కలిగియుండుట కనుగొనబడినది. అది ఖచ్చితముగా నిజము. యెహోవాయొక్క పెండ్లికుమార్తె కూడా అదేవిధముగానే కనుగొనబడెను. నిజము. ఆయన ఆమెకు విడాకులను యిచ్చివేసి ఆమెను త్రోసివేసెను. నిజమేకదా? అది దేవుడైయున్నాడు.
క్రీస్తుయొక్క వధువుకూడా అలాగే ఉండెను. ఆమె లోక సంబంధమైన సంఘ సంస్థయొక్క భీజమును కలిగివున్నట్లుగా కనుగొనబడెను. అది సువార్తయొక్క భీజము కాదు, పైకి దైవ భక్తి వంటి వేషమును ధరించుకొనెనుగాని, పరిశుద్ధాత్మను మరియు వాక్యపు శక్తిని నిరాకరించెను. అదే అంత్య దినము యొక్క సూచనగా ఉన్నది. దేవుడు ఆమెకు విడాకులు ఇచ్చివేసి మరియు ఏ విషయములోనైనను
రూఢీగా నిలబడగల ఒక వధువును ఆయన తీసుకొనెను. “నోవాహు దినములలో జరిగినట్లు మనుష్యకుమారుని దినములలో జరుగును" అని ఆయన చెప్పెను.
102. చూడండి. మృగమునకు ఒక ప్రతిమను రూపొందించుట... వీటన్నింటిని మనము చూచాము. కాతలిక్ అధిపతి... అది కెన్నడి కాదు; నేనెరిగినంత వరకు అతనుకూడా నాలాంటి ఒక మనిషే లేదా అందరివలె అతడుకూడా ఒకడు. అది అతనిని ఉద్దేశించి కాదు. అలా ఇది అహాబుకూడా కాదు. అహాబుకూడా చాలా మంచి వ్యక్తే. కాని ఆహాబు వెనుకవున్న ఆ యెజెబెలు. అతని వెనుక ఉన్నది ఆమే. సమస్యలు అందువలననే ఏర్పడినవి. అది కెన్నడి కాదుగాని అతని వెనుకనున్న యెజెబెలు సంఘమగును. అదే అతని వెనుక కార్యములను జరిపించుచున్నది. నిశ్చయముగా అదే సరియైన కారణమగును.
ఎందుకొరకు ఈ విషయము సరిగ్గా మీ ఎదుట ఉన్నది. దీన్ని మీరు చూడలేక పోవుచున్నారా?. అంజూరపు చెట్టు చిగురించుటను మీరు చూచుచున్నారా? యేసు చెప్పెను...“ఒక ఉపమానరీతిగా నేర్చుకొనుడి, అంజూరపు చెట్టు మరియు ఇతర వృక్షములన్నింటిని మీరు చూచినప్పుడు..." ఇప్పుడు చూడండి. యూదులు ఒక ఉజ్జీవమును పొందుకొనిరి. ఇదివరకే వారొక దేశముగా ఏర్పడిరి. నిజమే కదా? అనగా, ఇరువది ఎనిమిది వందల సంవత్సరములలో మొట్ట మొదటగా సొంత ద్రవ్యం, సొంత జెండా మరియు సమస్తము వారికి గలదు. చూచారా? వారు ఒక దేశముగా ఉన్నారు. అంజూరపు చెట్టు తన మొగ్గలను చిగురింపజేయుచున్నది.
103. ఇతర వృక్షములు: "ఇంకో పది లక్షల మందిని” అని 44వ సంవత్సరములో బాప్తిస్టులు నినాదించిరి. మరి బిల్లీగ్రహం ఈ ప్రక్కనుండి ఆ ప్రక్కవరకు నరుకు కుంటూ వెళ్ళుచుండెను. “అందరు వచ్చి చేరండి, రండి, చేరండి, రండి, చేరండి”. అలాగే పెంతెకోస్తులు, మరొక విషయములో... ఏకత్వమువారు, ద్విత్వం వారు, త్రిత్వం వారు, అసెంబ్లీస్ వారు, ప్రతీవారు, “వచ్చి చేరండి, రండి, చేరండి, రండి, చేరండి”అంటూ నినాదించుచు కొనసాగిరి. ఓ, దేవా, దేవుడు వాగ్దానము చేసిన ఆ విషయములు ఎక్కడ? అవెచ్చట ఉన్నవి? అంత్య దినములలో ఏమి జరుగునని దేవుడు చెప్పెనో ఆ లేఖన కార్యములు, అవన్నీ ఎచ్చట ఉన్నవి? అవి ఎచ్చట ఉన్నవి? చల్లని మరియు సాంప్రదాయాలతో నిండిపోయిన సంఘ సంస్థలయొక్క పెద్ద గుంపు తప్ప మరేమి మనకు లేదు. ప్రతీ ఒక్కొక్కరినుండి వేల కొలది మందిలో ఆ ఉజ్జీవపు మంటలు వ్యాపించినా, కాని పరిశుద్ధతలో నిలిచి ఉండునట్లు క్రీస్తుయొక్క వధువు ఎచ్చటున్నది? మన స్త్రీలందరూ తమ వెంట్రుకలను కురచగా చెవుల వరకు కత్తిరించుచున్నారు. అన్ని రకాల అసభ్యమైన వస్త్రములను ధరించు
చున్నారు. కాని మన బోధకులు ఆ విషయములను గూర్చి అసలు గొంతెత్తి ఒక్క మాటైన మాట్లాడుట లేదు. ఆవిధముగా నామకార్థంగా మరియు నిర్లక్ష్యంతో వారు దిగజారిపోతున్నారు. పొట్టకూటికోసం ఈ సువార్తను ఉపయోగించుకొనుచున్నారు. అదెట్లున్నదనగా, సామాజిక సువార్త బోధకులు ఉన్నట్లుగా వారు మారిపోయిరి.
104. మనకు కావలసినదేమనగా, దేవుని వాక్యము కొరకు రూఢిగా నిలబడగల, మరియు దేనినిగూర్చి లెక్కచేయకుండా ఆ వాక్యమును ప్రసంగించుచు మరియు దేవునియొక్క పరిశుద్ధ గ్రంథములోని సూచక క్రియలు, అద్భుత కార్యములకొరకు నిలబడగల దేవునియొక్క మనిషి కావలెను. అదే ఖచ్చితముగా కావలసియున్నది. ఆమేన్. ఖచ్చితముగా నిజము. నలుపును నలుపని, తెలుపును తెలుపని చెప్పడానికి భయపడువాడు కాదు. అతడు వెన్నెముకకు బదులుగా పక్షి ఎముకను గలవాడు. అదొక సిగ్గుచేటుగా ఉన్నది. ఆధునికముగా, స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారు.ఓ, దేవా... పిదప...ఓ, నా నోరు మూసుకోవటం మంచిది. ఆలకించండి. సహోదరుడా, నేను మీకు చెప్పుచున్నదేమనగా, ఈ సూచనలు మీ చుట్టూ ఉన్నవి. చిన్న వధువా! మీరు చింతించనవసరము లేదు. దేవుడు వచ్చుచున్నాడు. మీరేమి బాధపడవద్దు. సమస్తము జరుగుటకు సరియైన కాలములలోనే ఉన్నవి. ఇది ఈవిధముగా జరిగే తీరవలసియున్నది. వాక్యము అట్లే చెప్పుచున్నది. ఆలకించండి. గమనించండి.
105. ఈ దుష్ట మరియు వ్యభిచారులైన తరమువారికి యేసు వాగ్ధానము చేసి యున్నాడు. మత్తయి 12:24... అనగా ఈ దుష్ట మరియు వ్యభిచారులైన తరమువారు ఒక సూచక క్రియను పొందుకొనెదరని యేసు వాగ్ధానము చేసెను. వారు ఆయన యొద్దకు వచ్చి, “బోధకుడా, నీవలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని” అడిగిరి. సరిగ్గా ఆ సమయమున ఆయన రోగులను స్వస్థపరచి మరియు ఆయన చేయవలసిన కార్యములను చేసిన పిదప, "నీవలన ఒక సూచక క్రియ మేము చూడగోరుచున్నాము” అని అడిగిరి. అప్పుడు ఆయన, "వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచకక్రియ అడుగుచున్నారు గాని అలాంటి వ్యభిచారులైన చెడ్డతరమునకు ఏ సూచక క్రియ అనుగ్రహించబడదు...” అని చెప్పెను.
గతంలోకంటే ఆ అనైతిక కార్యమనే కదిలిక అత్యధికంగా ఇప్పుడు ఉన్నదని మీరెందరు ఎరుగుదురు? ఆ దుష్టత్వమే అవిశ్వాసమని మీకెంతమందికి తెలుసు? ఎన్నడూ లేనంతగా ఇప్పుడే మనకు అవిశ్వాసము మరియు వ్యభిచారపు కార్యములు అధికంగా గలదు. స్వసలింగ సంపర్కులు, సమస్తము ఉన్నవి. అది నిజమేకదా? వక్రబుద్ది... నేను దీనిని చెప్పితీరవలయును. మన పెంతెకోస్తు స్త్రీలు, చిన్న పిల్లలవలె తమ ఒంటి మీదున్న వస్త్రములను ఒలిచి వేసుకొని తమ శరీరమును చూపించు
కుంటూ చూచుటకు చాలా నీచంగా కనిపించుచున్నారు, అలాగే ఇచ్చట వీధులలో చాలా అసహ్యంగా నడుచుకుంటూ వెళ్ళుచున్నారు. పురుషుల దృష్టిని మీ వైపుగా ఆకర్షిస్తూ, వారి చూపులద్వారా వారు నీతో వ్యభిచరించునట్లు చేయుచున్నందుకు, మీ పిల్లలకుకూడా మీరు అలాంటి వస్త్రములను ధరింపజేయుచున్నందుకు, మీరు దానికొరకు జవాబు చెప్పవలసియున్నదని మీరెరుగుదురా? అసలు ఏమిటి సమస్య?
106. ఎందుచేత, కొంతకాలం క్రితం ఎవరో, “బ్రాన్హాం సహోదరుడా ప్రజలు నిన్నొక ప్రవక్తని పిలుచుచున్నారని” చెప్పిరి. "నేను ప్రవక్తను కాదని” నేను చెప్పాను.
"కాని ప్రజలు నిన్ను అలాగే పిలుచుచున్నారు. వారి కురచ వెంట్రుకలను గురించి, పొట్టి వస్త్రములను ధరించుకొనుట గురించి, వారు ధరించు వస్త్రాధరణ గురించి,ముఖములకు రంగులువేసుకొనుటగూర్చి మరియు వారు చేసే కార్యము లను గురించి మరియు అలాంటి వారి కార్యములను గూర్చి నీవు మాట్లాడుటకు బదులుగా, వారికి నీవు గొప్ప విషయములనుగూర్చి, మరియు ఏవిధముగా దేవునియొక్క వరములను పొందుకోవలెనో బోధించ వచ్చుకదా?” అని చెప్పిరి.
"వారికి అసలు, అ, ఆ, ఇ (ABC)లే తెలియకపోతే బీజగణితం (algebra) గురించి నేనేవిధంగా బోధించగలనని?" నేను అడిగాను. శిశు పాఠశాల (kin-dergarten) లో నుండే వారింకా బయటకు రాలేదు. దేవుని యొక్క వాక్యములో ఏకీభవిస్తూ వెళ్ళుటనేది ఒక సాధారణమైన సభ్యతయైయున్నది. అదే సరియైన నిజము. మీరు దానిని ఎట్లు చేయగలరు? దానిని మీరు చెయ్యలేరు.
107. ఎందుచేత? ఎవరినైతే దేవుడు పిలిచెనో వారు మాత్రమే దానిని వినెదరు. “నా గొట్టెలు నా స్వరమును వినును" అవును. దేవునియొక్క స్వరమును వారెరుగు దురు. అది వాక్యమునుండి మాట్లాడును. ఆ వాక్యమే దానిని చేయుచున్నది. ఇప్పుడు, ఆ తరమువారు ఒక సూచక క్రియను(అదే ఇది) పొందుకొనెదరని ఆయన చెప్పెను. ఎలాంటి సూచక క్రియను? “యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఏలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును". అది నిజమేకదా? వారేవిధమైన సూచనను పొందుకొనే దరు? ఒక పునరుత్థాణపు సూచనను. యేసు మరణించలేదు. ఆయన సజీవుడు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అది నిజమే కదా? దుష్టులైన మరియు వ్యభిచారులైన తరమువారు పునరుత్థాణం యొక్క సూచనను పొందుకొనెదరు. ఆమేన్. దీనిని వారు నిరుత్సాహపరచుటకు ప్రయత్నించెదరు. దానిని వారు చేసిరి. ఆయనకొరకు వారు చేసిరి. మత్తయి... మీరు దీనిని వ్రాసుకో దలచిన మత్తయి 13:24. వారు దీనిని గూర్చి ఎంతగానో భయపడిరి,
108. వారు, “ఈ వ్యక్తి... మన సంఘశాఖలకు మనము జవాబు చెప్పే తీరాలి. పరిసయ్యులకు, సదూకయ్యూలకు, హేరోదీయులకు, సుంకరులకు మరియు మొదలగు వారికి జవాబు చెప్పితీరాలి. మనం అందరికీ జవాబు చెప్పాలి. అదేమై యున్నది? ఎందుకని? అతడు సోదెను చెప్పువాడు. అందుచేతనే అతడు వారి హృదయములలో ఏమున్నదో చెప్పుచున్నాడు. వారి ఆలోచనలను అతడు గ్రహించు చున్నాడు. ఆయన సోదెను చెప్పువాడు. అంత్య దినములలో అట్లు విమర్శించువారికి ఇకెన్నటికీ క్షమాపణ ఉండదని ఆయన చెప్పెను. నిజము. ఆయనను బయల్టెబూబని దయ్యములకు అధిపతియని పిలిచిరి. అవును. ఎందుకనగా, ఆయన నిమిత్తము వారు భయపడిరి. నిజమే కదా? కాని ఆయన తన సంఘమును, ఇచ్చటున్న నిజమైన సంఘమును చూచి ఇట్లనెను. "వారివలె ఆకాశమందు కనబడు సూచన లకు భయపడకుడి. దుష్టులు, అన్యులు, అవిశ్వాసులు వాటిద్వారా భయపడుదురు” అర్థమైనదా? మనము అంత్య దినములలో ఉన్నాము.
109. ఇప్పుడు ఒక్క నిమిషము, ముగించుటకు ముందుగా దీనిని చెప్పుచున్నాను. అది ఈలాగు ఉండదని వారు చెప్పెదరు... దేవుడు దీనిని ఆవిధముగా ఏర్పరచలేదని చెప్పెదరు... “ఒక మహా గొప్ప దీనిని మరియు ఒక మహా గొప్ప దానిని దేవుడు కోరుచున్నాడు, గనుక మేము అరువది లక్షల డాలర్లు ఖర్చుచేసి దీనిని నిర్మించ బోవుచున్నాము. మరియు మేము దీనిలో దీనిని మరియు దానిలో దీనిని పెట్టబోవు చున్నామని” చెప్పుచున్నారు. అలాగు చెప్పుతూ, దేవునియొక్క కుమారుని రాకడ అతి సమీపమున ఉన్నదనికూడా చెప్పుచున్నారు. అదేమిటది? అవన్నీ సంఘశాఖల యొక్క గడ్డిపరకలవలె మారిపోయెను. అవన్నీ ఒక పెద్ద కట్టగా కట్టబడియున్న సంఘముల సమ్మేళనము(కూటమి)గా ఉండును; కట్టబడివున్న అవన్నీ అంత్య కాలమున కాల్చబడును. దానినే యేసు చెప్పెను. ముండ్ల పొదలు మరియు ఎందుకు పనికిరాని అన్ని రకముల కార్యములతో వారు కట్టబడినవారు (అవును); గొడవలతో, మొండి పట్టుదలతో దేశమునుండి ఉజ్జీవమును దూరంగా త్రోసివేయుచున్నారు.
ఆ వాక్యమునుగూర్చి నాతో సవాల్చేసిన ఆ వ్యక్తికి నేను సవాల్ చేయు చున్నాను. ఎవరైనాగాని... దీనిని గూర్చి వివాదం చేసి చూడండి. ఏమి జరుగునో మీరే చూచెదరు. ఏమి జరుగునో కనుగొనెదరు. దీనిని ఎదుర్కొనుటకు మీకు సాధ్యమవ్వని యెడల, అట్లయితే మీరు నోరు మూసుకొని ఉండండి. అవును. వచ్చి దానిని సరిదిద్దుకోండి లేదా చెప్పండి... ఏదోకటి చెయ్యండి. అవునండీ.
110. నోవాహు,మత్తయి 24: వారి దినములలో నెరవేరుటను మనము చూచాము. పరి. లూకా 17:28 నుండి 30వ వచనములలో యేసు చెప్పిన విషయమునుకూడా
మీరు జ్ఞాపకముంచుకోండి. సొదొమ దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోను జరుగును. అది నిజమే కదా? ఇప్పుడు, అగ్నితో కాల్చబడుటకు ముందు సొదొమ ఉండెనని గుర్తుంచుకోండి. మరి వారేమి పొందుకున్నారు? వారు ఒక సూచనను పొందుకొన్నారా? తప్పకుండా.
ఇప్పుడు, ఎల్లప్పుడూ మూడు తరగతుల ప్రజలు ఉంటారు. అది విశ్వాసులు, వేషధారులు, అవిశ్వాసులు. అచ్చట మూడు సూచనలు, మూడు తరగతులు, ఎల్లప్పుడూ ఉండెను. సరిగ్గా అవి అచ్చటే ఉన్నవి. ఇప్పుడు, "సొదొమ దినములలో జరిగినట్లు...” అని యేసు చెప్పిన విషయమును గమనించండి. అదే రకముగా మరియు అదే కార్యముగా ఉన్నది. అర్థమైనదా? నోవాహు దినములలో వారేమి చేయుచుండిరో ఆయన చెప్పెను. వారు తినుచు, త్రాగుచు, పెండ్లిచేసుకొనుచు, మరియు పెండ్లికిచ్చుచుండిరి. ఆయన చెప్పినట్లుగా, ఇది సొదొమను అగ్ని గంధకములతో కాల్చక ముందు దినములలో... తీర్పుకు ముందుగా ఏమి జరిగినదో ఇప్పుడు గమనించండి. ఇప్పుడు, అగ్నితో కాల్చబడుటకు ముందుగా ఈ తరము వారికొరకు ఆయన ఒక సూచనను పంపించబోవుచున్నాడు. అచ్చట అసలు నీళ్ళేలేవు. అయితే ఏమిటి? మరియు ఈ దినములలో? అగ్ని. దేవునియొక్క తీర్పులు అగ్నిగా ఉండబోవుచున్నవి. సొదొమ దానినేకదా పొందుకొనెను?
111. ఇప్పుడు సరిగ్గా సొదొమను అగ్నితో కాల్చుటకు ముందుగా, ఎన్నుకొనబడిన సంఘమునకు అబ్రాహాము సాదృశ్యముగా ఉన్నాడు. ఎందుకనగా, అతడు ఎన్నుకొన బడెను. మరియు అబ్రాహాముయొక్క సంతానము (భీజము) అబ్రాహాముతో కూడ ఎన్నుకోబడెను. వాగ్ధానము అబ్రాహాముకు మరియు అతని సంతానముకు ఇవ్వబడి నది. అనగా అబ్రాహాము యొక్క ఆత్మ సంబంధమైన సంతానము. అబ్రాహాములో నున్న ఆ భీజము దేవుని వాక్యమును పొందుకొనెను. ఎలాంటి కార్యములు దానికి విరుద్దముగా లేచినను దానినేమి లెక్కచేయకుండా, అది ఇప్పటికీ దేవుని వాక్యంగానే ఉన్నది. అతడు సరిగ్గా దానితోనే నిలిచియుండెను. అబ్రాహాముయొక్క సంతానముకూడా అలాగే ఉండును. అలాంటివారే ఆ వాక్యముతోనే నిలిచివుండె దరుగాని, లోతువలె దానినుండి పారిపోరు. అర్థమైనదా? అచ్చట సొదొమీయులు ఉండిరి. వారు అవిశ్వాసులు, అలాగే అచ్చట లోతుకు చెందినవారు కూడా ఉన్నారు. వారు వేషధారులు. (నమ్ముచున్నట్లు నటించువాడు), మరియు అబ్రాహాము అచ్చట ఉన్నాడు. అతడు వాగనము చేయబడిన, ఎన్నుకొనబడిన, విశ్వాసియగును.
112. ఒక రోజు అబ్రాహాము నివసించుచున్న గుడారమువద్దకు ముగ్గురు దూతలు వచ్చిరి. ఇద్దరు దూతలు సొదొమకు వెళ్ళి ఒక మంచి వర్తమానమును
సాదోమీయులకు ప్రసంగించి, ఒక గుంపు జనమును వెలుపలికి పిలిచిరి. కాని వారు అబ్రాహామును వెలుపలికి రమ్మని పిలువలేదు. ఎందుకనగా, అతడు ఇదివరకే దానికి వెలుపలే ఉన్నాడు. ఆ మొదటి స్థలములోకి అతడు వెళ్ళలేదు. ఇరువది ఐదు సంవత్సరములకు క్రితమే అబ్రాహాము దానిని విడిచి వచ్చెను. అవునండీ. అతడు దానినుండి వెలుపలికి రమ్మని పిలువబడెను. ఎన్నుకొనబడెను. వెలుపలికి పిలువబడెను. ఎడారులో కూర్చొని ఉండెను. పిదప వారిలో ఇద్దరు దూతలు అచ్చటకి వెళ్ళి సువార్తను వారికి బోధించి చివరగా ఇద్దరిని లేదా ముగ్గురినే అచ్చట నుండి వెలుపలికి తీసుకొనివచ్చిరి. ఒక వర్తమానము సొదొమకు వెళ్ళెను. ఆ సంఘ సంస్థలోని కొన్ని సంఘములు అచ్చట ఉండెను, వారిలో అనేకులు రక్షింపబడిరి. మరియు అచ్చట ఎన్నుకొనబడిన వారికి కూడా ఒక వర్తమానము అనుగ్రహించబడెను. అదే వాక్యముగాను, సూచనగాను ఉన్నది. అర్థమైనదా?.
అబ్రాహాముతో సంభాషించుచున్న ఆయన ఈలాగు చెప్పెను... ఆయన వచ్చి మాట్లాడుటకు నాలుగు లేదా ఐదు దినముల క్రితం అతడి పేరు అబ్రాము, శారా పేరు శారయి (S-a-r-r-a)గా ఉండెను. శారాగా లేదు. అలాగే అబ్రాము (A-b-r-a-m) అబ్రాహాము కాదు (అర్థమైనదా?) అని గుర్తుంచుకోండి. నాలుగు లేదా ఐదు దినముల క్రితం వారి పేర్లు పాత పేర్లుగానే ఉండెనని మీరు గుర్తుంచుకోండి. మరియు ఈయన "అబ్రాహామా నీ భార్యయగు శారా ఎచ్చట ఉన్నది? ఇచ్చట “శారాయి” అనుటకు బదులుగా “శారా” అని పిలిచెను. నీ భార్యయగు శారా ఎక్కడ?.“ఆమె గుడారములో ఉన్నది. నీ వెనుక ఉన్నదయ్యా” అని అబ్రాహాము చెప్పెను. “ఆయనకు వెనుక” అని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినది.
113. "అబ్రాహామా, నేను నీకు వాగ్దానముచేసిన దానికొరకు నీవింకా వేచివుండు నట్లుగా నేను నిన్ను ఉంచనని” ఆయన చెప్పెను. ఆయన ఎవరని గమనించారా? ఆయనే అబ్రాహాముతో ఎల్లప్పుడూ మాట్లాడువాడు. చూచారా? ఆయనే అతనితో ఎల్లప్పుడూ ఉండువాడు. అర్థమైనదా? "నేను నీకొక వాగ్ధానము చేసితిని. నేను దానిని నెరవేర్చబోవుచున్నాను. జీవము కాలము ప్రకారముగా నేను నిన్ను దర్శించె దను. శారా మరలా ఒక యవ్వన స్త్రీవలె మారబోవుచున్నది. మరియు నీవు ఈ కుమారుడిని కలిగివుందువు మరియు మొదలగు కార్యములను నేను చేసెదను" అని ఆయన చెప్పెను. అర్థమైనదా? ఇప్పుడు వాగ్ధానము చేయబడిన కుమారుడు వచ్చుటకు అదొక సూచనగా ఉండెను. గమనించారా? అబ్రాహాము వాగ్ధానము చేయబడిన కుమారునికొరకు ఎదురుచూచుచున్నాడు. నిజమేకదా? అలాగే సంఘము ఒక వాగ్ధాన పుత్రునికొరకు ఎదురుచూచుచున్నదా? అవునా?
చిట్టచివరగా ఏ సూచనను అబ్రాహాము పొందుకొనెను? "నేను జీవ కాలము ప్రకారముగా నిన్ను దర్శించెదను...” అని ఆయన చెప్పెను. గుడారములోనున్న శారా తనలో తాను నవ్వుకొనెను. "నాకా, వృద్ధురాలినైన నేను, నా యజమానునితో సుఖము కలుగునా? అబ్రాహాముకూడా వృద్ధుడైయున్నాడు. వారివురు బహు కాలము గడిచిన వృద్ధులైయుండిరి. శారాకు 90సంవత్సరములు, అబ్రాహాముకు నూరు సంవత్సరములు. అనేక సంవత్సరములుగా వారివురు మధ్య దాంపత్య కలయిక లేదు. అర్థమైనదా? "నా యజమానుడు వృద్ధుడు, నేను కూడా వృద్ధురాలినై వుండగా నా యజమానునితో నేను సుఖమును అనుభవించగలనా?" తలంచెను.
114. అబ్రాహాముయొక్క శరీరము మృతతుల్యమై యుండెనని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. అవును. శారా గర్భము మృతతుల్యమయ్యెను. "అవిశ్వాసమువలన దేవుని వాగ్ధానముగూర్చి సందేహింపక, దేవుని మహిమపరచి, ఆయన వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను". మనముకూడా అదే విధముగానే దానిని పొందుకో... అతని సంతానముకూడా అదే విధముగానే కార్యము చేయును; అది ఆయనయొక్క వాగ్ధానము చేయబడిన భీజము, రాజవంశ సంతానము, అట్లే విశ్వాసించును.
ఇప్పుడు గమనించండి. పిదప ఆయన చెప్పెను... కాని ఆమె నవ్వెను. "శారా ఎందుకు నవ్వెను" ఆయన అడిగెను? అదే ఆయన సూచనగా ఉండెను. బయటకు పిలుబడిన సంఘమునకు, సంఘమునకుకూడా అదే సూచనగా ఉండెను. ఒక మానవునిగా, ఒక మానవునిగా శరీరధారియై, లేత దూడ మాంసమును, జొన్న రొట్టెను తినుచు, పాలును త్రాగెను. దానిని ఆయన చేసెనా? అది దేవుడేనా? అట్లు ఆయన లేనియెడల చూడండి. మీ పరిశుద్ధగ్రంథములో దానిని అట్లు చూపించు చున్నదో, లేదో గమనించి చూడండి. దానిలో "ఎలోహిం” గా అది చూపించును. “ఎలోహిం” అనగా స్వయం ఉనికిలో ఉన్నవాడని (స్వయంభవుడు) అర్థం. ఆ ఎలోహిం శరీరధారియై వచ్చెను. ఇదెలాంటి సూచనగా ఉన్నది? ఎలోహిం మరలా తన వధువులోకి వచ్చును. ఈ అంత్య దినములలో మరలా ఈ మానవ శరీరంలోకి ఆయన వచ్చి అదే కార్యమును చేయును. అదెక్కడ ఉన్నది? ఈ అంత్య దినములలో అదే మీయొక్క సూచనగా ఉన్నది.
115. జెకర్యా 14:7లో, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది పగలుకాదు, రాత్రి కాదు. అదొక అంధకారముగా ఉండును. ఈ దినమున మనకున్న విధముగా వర్షము కురియు దినమువలె ఉండును. అంధకారముగా, వర్షము కురియు దినము వలె మబ్బుగా ఉండును. "కాని సాయంకాలమున వెలుతురు కలుగును".
నేను అప్పుడప్పుడు చెప్పు విధముగా నాగరికత తూర్పునుండి పడమరకు పయనించును. సూర్యుడు కూడా అదేవిధముగా తూర్పున ఉదయించి పడమరన అస్తమించును. "ఇది సంఘ సంస్థయొక్క దినముగా ఉన్నది. మనము సంఘము లను, పాఠశాలలను, వైద్యశాలలను, వేదాంత కళాశాలను మరియు మొదలగు వాటిని నిర్మించుటకు చాలునంత వెలుగు గలదు. క్రీస్తును స్వీకరించుటకు, సంఘ సభ్యుల పుస్తకములో మన పేర్లును నమోదు చేయించుకొనుటకు మరియు అలాంటి కార్యములు చేయుటకు కొంత వెలుగును మనము కలిగియున్నాము.
కాని, "సాయంకాల సమయమున వెలుగు కలుగును" అని ఆయన చెప్పెను. అదేమిటి? సువార్త వెలుగు. అదేమి చేస్తుంది? పరిశుద్ధాత్మ. ఇదేమి చేయును? పంటను పరిపక్వములోకి తెచ్చును. ఈ చివరి దినములలో పరిశుద్ధాత్మ సరియైన సమయమున క్రుమ్మరింపబడును. ఈ చివరి దినములలో, కడవరి వర్షమును తీసుకొని వచ్చును, అదే నిజమైన వర్షమగును. కాని, ఎప్పుడూ సంఘ శాఖల విత్తనములనే నాటుచూ, మనమింకా ఎక్కువగా అవిశ్వాసమను పంటనే తీసుకొని వచ్చుచుంటే మీరెట్లు వర్షమును పొందుకొనెదరు? పునరుత్థాణంలోనున్న దేవుని యొక్క శక్తిని తీసుకొనివచ్చే సువార్త విత్తనమును మీరెందుకు నాటకూడదు?అదే అంత్య కాల సూచనలుగా ఉండును. స్నేహితుల్లారా, ఇదే ఆయన వాగ్ధానమై వున్నది.
- 116. ఇచ్చట చూడండి. ఇప్పుడిచ్చట మూడు సూచనలను మనము తీసుకొని ఒక్కొక్కటిగా చూద్దాం. మూడింటిని నిర్ధారణకొరకు తీసుకుందాం. అలాంటివి మీకు నేను ఒక డజను ఉదాహరణలను ఇవ్వగలను. గ్రహ మండలం మరియు పిరమిడ్ సిద్దాంతము వంటి కార్యములను గూర్చి మీరు చెప్పుచున్నట్లుగా, అలాంటి వాటిని నేను నమ్మను. నేను వాటినిగూర్చి మాట్లాడుట లేదు. ఎందుకనగా, అందులో ఏదోక కార్యము గలదు... మీరు మొదటగా తెలుసుకోవలసినదేమనగా... బ్రిటిష్ ఇశ్రాయేలీయులవద్ద మీయంతట మీరే గాయపడిరి. మరి అలాంటి విషయములన్నీ అవి అసలు వ్యర్థమైన కార్యములు. కాని నేను మీకు చెప్పుచున్నాను. అచ్చట....
మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథము ఆకాశములోనే వ్రాయబడినది. ఆ గ్రహ మండలం(zodiac) వైపు చూడండి. దానిలోని రాశులు మొదటగా దేనితో ప్రారంభమగుచున్నవి? కన్యక. అనగా యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, అచ్చటనుండి అది అట్లే క్రిందకు వెళ్ళుచూ అడ్డంగావున్న చేపలవద్దకు వెళ్ళుచున్నది. దాని తర్వాతది ఏమిటది? అది కేన్సర్ యుగం. మనము దానిగుండా వెళ్ళితిమి. మరి తదుపరిగా ఉన్నదేమిటి? సింహము, అనగా యూదా గోత్రపు సింహంగా ఆయన యొక్క రెండవ రాకడయై యున్నది.
117. పిరమిడ్ వైపు చూడండి. అదెట్లు ప్రారంభమైనది, ఇచ్చట గొప్ప పునాది ఉన్నది. అదే సంఘముయొక్క ఆరంభముగా ఉన్నది. అదేమిటది? సంఘమును సంస్కరణలలో నిర్మించుటలో మొదటగా లూథర్ ఉండెను. రెండవ వరుసలోకి వచ్చినప్పుడు అది స్వల్ప సంఖ్యాకులుగా మారిపోయెను. శుద్దీకరణనుగూర్చి వెస్లీ బోధిస్తూ వచ్చెను. దాని పిదప దానిని ఆధారంగా చేసుకొని దానితోపాటు సంఘ కాలములు లోతుగా ఒక వృక్షమువలె పాతుకొనిపోయి... మొదటగా ఒక మొక్క జొన్న విత్తనమువలె ఉండి, నేలలో విత్తబడెను. పిదప దానిలో ఆకులు చిగురించెను. పిదప ఏమి వచ్చును? కుచ్చు వచ్చును. తర్వాత ఏమి వచ్చును? అదే గింజ, అదే జీవముతో వచ్చును. “నేను మరలా పునరుద్ధరించెదనని ప్రభువు సెలవిచ్చెను”. దాని తర్వాత వచ్చేదేమనగా, మొక్కజొన్న పై పొరలవంటి పొత్తు వచ్చును. ఒక వృక్షము కూడా అలాగే ఎదుగుచూ వచ్చును. అలాగే దేవుడు దానిని ఎదుగునట్లు చేయును.
118. కొంతమంది పెంతెకోస్తువారు, ఈ రోజు మార్టిన్ లూథర్ లాంటి వారిని అసలు తలంచికూడా చూచుట లేదు. ఎందుకంటే, లూధర్కి పరిశుద్ధాత్మ లేదని వారు చెప్పెదరు. లూథర్ పరిశుద్ధాత్మతో ఉండెను. మనము ఇప్పుడు కలిగివున్నంత లోతుగా అతడు బహుశా కలిగివుండకపోవచ్చు. కాని అతడు అంత లోతుగా పరిశుద్ధాత్మను పొందుకొనుటకు అది సమయము కాదు. పెద్దగా కేకలు వేయవద్దు. ఇబ్బందికరమైన ఒక కార్యమును సరిగ్గా కొన్ని నిమిషములలో మనము పొందుకో బోవు చున్నాము. గమనించారా? కాబట్టి మీరు గమనించండి. వెస్లీ మరియు ఆ సహోదరులు... నిశ్చయముగా. వారు పరిశుద్ధాత్మను కలిగియుండిరి.
అదేమిటది? అదొక శరీరము; పాదములనుండి పైకి ఎదుగుచూ, శరీరము యొక్క ముఖ్యమైన భాగములుకూడా ఎదుగుచూ వచ్చుచున్నవి. పాదముల నుండి ఊపిరితిత్తులకు, గుండె, శిరస్సువరకు ఎదిగెను. శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరు? క్రీస్తు. అదే తెలివితేటలు గలది. శరీరము ఎట్లు కదులును? శిరస్సుద్వారానే. ఆమేన్ రాజ్య భారము దానిపై ఉండును? ఆయన... (“భుజముల పైన”-అని సమాజము చెప్పెను-సంపా.,). ఆయన భుజములు అనగా ఏమిటి? ఆయన శరీరము. ఆమేన్.
తద్వారానే ఒక నిజమైన సంఘము ఆయన శక్తితో మాట్లాడును. అచ్చటనుండే అపొస్తలులోనున్న శక్తి సంఘమునకు మరలా తిరిగి వచ్చుచున్నది. ఆయన భుజము లపై రాజ్య భారముండెను. తీర్పు. అచ్చటనుండే ఒక నిజమైన సంఘము వచ్చుచు న్నది. నా భాగమును నేను సమర్పించుటకై ప్రయత్నిస్తున్నానని నేను విశ్వాసిస్తు న్నాను. క్రీస్తు వచ్చునప్పుడు, నా కాలములో నేను సమర్పించవలసిన భాగమును -సమర్పించుటకై నాకు తెలిసిన శ్రేష్టమైన రీతిలో దానిని సిద్ధపరచు చున్నాను.
119. చూడండి మరియు ఏ... మీ జేబులో ఒక డాలర్ నోటు ఉంటే బయటకు తియ్యండి. దానిలో కుడివైపు ఒక ప్రక్క,అమెరికా ముద్రను, ఒక పక్షిరాజు తన పాదముతో బాణములను పట్టుకొని ఉన్నట్లుగాను ఉన్నది. అది అమెరికా సంయుక్త రాష్ట్రములయొక్క ముద్రగా ఉన్నది. ఆ నోటుయొక్క రెండవ వైపులో పిరమిడ్ గలదు. ఆ పిరమిడ్పై తలరాయిలేదు మరియు “గొప్ప ముద్ర"అని దానిలో వున్నది.
మన స్వంత ముద్ర ఉండుటకు బదులుగా అమెరికా సంయుక్త రాష్ట్రలయొక్క గొప్ప ముద్రగా ఎందుకు ఉన్నది? దానినిగూర్చి మీరెప్పుడైనా అలోచించిరా? “గొప్ప ముద్ర” ని అది చెప్పుచున్నదా, లేదాని దానిపైన ఉన్నదానిని గమనించి చూడండి. ఆ పిరమిడ్ పైన తలరాయి (cap) అసలు ఎందుకు పెట్టకుండానే ఉన్నది? సొలొమోను ఆలయమున కూడా అదేవిధముగానే అది ఉన్నది. తలరాయి త్రోసివేయబడినది. ఖచ్చితముగా. కాని అది దిగి వచ్చుచున్నది.
ఐగుప్తులోని పిరమిడ్లవద్దకు నేను వెళ్ళి చూచాను. వాటిలోని బండలు ఒక దానిపై ఒకటి చాలా పరిపూర్ణంగా అమర్చబడి, మీరెంత ప్రయత్నించినా వాటి మధ్య ఒక బ్లేడునుకూడా పెట్టలేరు. ఆ బండలు అంత పరిపూర్ణంగా ఒకదాని పై ఒకటి అమర్చబడినవి. వారేవిధముగా వాటిని నిర్మించిరి. వారికి తెలియదు... కాని వారు స్పింక్స్, మొదలగు వాటిని నిర్మించిరి. దీనినిగూర్చి వారు చెప్పలేరు. కాని చూడండి. సరిగ్గా ఎచ్చటైతే తలరాయి అమర్చబడవలెనో అచ్చట సానరాయితో మెరుగుపరచబడి ఉన్నది. వారెప్పుడైన తలరాయిని కనుగొనివున్నయెడల, ఆ తల రాయి పిరమిడ్కి చాలా పరిపూర్ణంగా సరిపోయి ఉండును. క్రీస్తుయొక్క వధువుకు అది చక్కటి సాదృశ్యముగా ఉన్నది. ఆ తలరాయి వచ్చునప్పుడు, దానిని స్వీకరించు టకు ఇచ్చట భూమిపై ఒక సంఘము ఉండును. ఆయన చేసిన పరిచర్యవలె ఈ సంఘముకూడా ఖచ్చితంగా అలాంటి పరిచర్యను కలిగివుండును. ఆ పరిచర్యలో అది చక్కగా కొనసాగిపోతూ అట్టడుగుననున్న పాదము నుండి పైకి లేవనెత్తుచూ లూథర్ మరియు మిగిలిన వాటన్నింటిని పునరుత్థానం కొరకు తీసుకొని వచ్చును.
120. కొంతమంది మొదటి జామున నిద్రించిరి. మరికొంత మంది ఆ తదుపరి జామున నిద్రించిరి. అలాగే కొంతమంది ఏడవ జామున నిద్రించిరి. ఏడు కాలముల గుండా అట్లే జరుగుచున్నది. కాని పెండ్లికుమారుడు వచ్చినప్పుడు వారు మేల్కొనిరి (ఆమేన్). మృతుల మధ్యనుండి వారు వెలుపలికి వచ్చి పునరుత్థాణంలో లేచిరి. మనము అంత్య దినములలో జీవించుచున్నాము. “నీవేమి చెప్పుచున్నావు? లూథర్, వెస్లీ; నీతీకరణ, శుద్దీకరణ, పరిశుద్ధాత్మ అభిషేకమా" అని మీరు అడుగవచ్చు. అవును. పిదప తలరాయి, నిజమేకదా? తలరాయి పిరమిడ్లో ఉన్నది.
ఇప్పుడు మనము ఓడను ఉదాహరణగా తీసుకుందాం. ఇచ్చట ఒకటున్నది.
మనము ఆ భాగం నుండి దూరంగా వెళ్ళి ఇచ్చటున్న దాని వద్దకు తిరిగి వద్దాం. ఓడను ఉదాహరణంగా తీసుకుందాం. మొదటి అంతస్తు, రెండవ అంతస్తు,మూడు అంతస్తులు. అది నిజమే కదా? దానిలోకి వెలుగు ఎచ్చట నుండి వచ్చుచున్నది? దాని కిటికీ ఎచ్చట అమర్చబడి వున్నది? మూడవ అంతస్తు పై భాగమున. అచ్చట నుండే ఒక సంఘములోకి దేవునియొక్క శక్తి వచ్చును. దానిగుండా ఒక సూర్యుడు (s-u-n) ప్రకాశించును. కాని కుమారుడు (S-o-n) ఈ మార్గముగుండా సంఘము లోనికి వచ్చి, దేవుడే దానిని మెరుగు దిద్దుచు మరియు సిద్ధపరచుచు, గొంగళి పురుగులు, మిడతలు, చీడ పురుగులు తినివేసిన దానిని మరలా పునరుద్ధరించి సరిగ్గా, ఖచ్చితముగా అదే పరిచర్యను మరలా సంఘములోకి తీసుకొని వచ్చును.
121. ఈ మొద్దు వెస్లీనుండి ఎదుగుచూ... లూథరనుండి వెస్లీ వరకు, వెస్లీనుండి పెంతెకోస్తు, మరిప్పుడు ఆ పెంతెకోస్తులను మెరుగు దిద్దుచూ, మరియు వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకొనినవారైరి. మరియు ఏదోక దినమున... ఈ అంత్య దినములలో యేసుక్రీస్తను తలరాయి వచ్చును, గనుక సరిగ్గా, మనము ఆయన వంటి ఒక ఖచ్చితమైన పరిచర్యను కలిగివుంటాము. ఆయనయొక్క పూర్తి ఆత్మ, బహు దగ్గరగా, దగ్గరగా, దగ్గరగా వచ్చును. ఎట్లనగా, ప్రతికూలమైనది సానుకూలంగా మారిపోవును. దానితర్వాత ప్రతికూలం, సానుకూలం రెండు ఏకమై పోవును. అలాగే సంఘము మరియు క్రీస్తు ఒక్కటిగా ఏకమైపోవుదురు. మనము ఆయన మాంసము(శరీరము)నకు మాంసముగాను మరియు ఆయన ఎముకకు, ఎముకగాను మారిపోవుదుము. ఆమేన్. మీరు దీనిని విశ్వాసించు చున్నారా? చాలాసేపు మిమ్మల్ని ఉంచినందుకు క్షమించండి. ఇప్పుడు ప్రార్థించుదాం.
122. మా పరలోకపు తండ్రీ, మేమిప్పుడు ప్రసంగంయొక్క చివరిలో ఉన్నాం. ఈ సందేశంయొక్క చివరలో, ఈ రాత్రి వర్తమాన ముగింపులో ఉన్నాము. దీనిని నేను విరిగిన పగిలిన పదాలవంటి ధోరణిలో చెప్పుటకు ప్రయత్నించాను. ప్రభువా, నేను మాటలతో చెప్పలేని వాటిని నీవు దానియొక్క నిజమైన భావమును వారు ఎరుగునట్లు చేయుము. ఈ వర్తమానములోని సారం ఏమైయున్నదో దానిని నీవు వారు గ్రహించునట్లు చేయుము. ప్రభువా! ఇది విత్తనమై వున్నది. ప్రభువా, దీనికి నీళ్ళు పోయుము. దీనిని యేసుక్రీస్తు నామమున నేను నీకు సమర్పించుచున్నాను.
తండ్రీ అనుగ్రహించుము, ఈ వాక్యము ప్రభువుతో ఉన్నట్లువలె, సొదొమ దినములలో ఇది ఉన్నట్లువలె ఈ వాక్యము ధృవీకరించబడుటను మేము చూచు చున్నాము.ఇది మెస్సియా రాకడవలె ఉన్నయెడల, మేము తిరిగి జన్మించిన
మెస్సియ్యాలవలె, పుత్ర స్వీకారమును పొందుకొనిన దేవుని కుమారులవలె వుండె దము, గనుక తన మాంసమునకు మాంసముగాను మరియు తన ఎముకకు ఎముకవలె ఉండు తన సంఘములోకి ఆయన రావలసియున్నది.
దేవా, నేను ప్రార్థించుచున్నదేమనగా, ఈ రాత్రి నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొని, ఈ ప్రియమైన సంఘకాపరికి,ఈ ప్రియమైన సంఘమునకు,ప్రియమైన ఈ ప్రజలకు మరియు దీవెనకరమగు వీరందరికి అంత్య కాలపు సూచనలు ఇచ్చటున్నవని ఎరుగునట్లుగాను మరియు ఈ కార్యములన్నీ సత్యములని ఎరుగునట్లు నీవు చూపించుము. ఎంతో వాస్తవమైన ఆ కార్యములు... అంతెదుకు, అసలు వాగ్ధానము చేయబడిన కుమారుడు అనుగ్రహింపబడు వరకు అచ్చట సమయము లేదు. వెలుపలికి పిలువబడిన సంఘమునకు, రాజ వంశ విత్తనమునకు, వాగ్దానము చేయబడిన విత్తనమునకు ఆ సూచన నెరవేరిన పిదప, వెంటనే దృశ్యములోకి ఆ చిన్న ఇస్సాకు వచ్చెను. ఆ భీజమునకు లోతు కేవలము ఒక బంధువు మాత్రమే.
123. ప్రభువా, అనవాయితీగాను, నిర్లక్ష్యంగానున్న సంఘములు నేడు వారంతట వారే తమను సంఘసంస్థగా ఏర్పరచుకొను చున్నారు. ప్రెస్సిటేరియన్లు, మెథడిస్టులు, బాస్తిస్టులు అందరూ సమకూడిరి. వారిలో అనేకులు కన్యకలై యుండిరి. మరియు వారిలో అనేకులు వెలుపలికి వచ్చుటకు ప్రయత్నించిరి. ఇప్పుడు ఎపిస్కోపలియన్లు అలాగే మొదలగువారు అన్వేషించుటకు ప్రయత్నించు...మన ప్రశస్త సహోదరులు, మన అనేక పెంతెకోస్తు సహోదర్లు, వారితో వెళ్ళుచు మరియు దానితో వారు ఉత్సాహించుచుండిరి... ఖచ్చితముగా మేముకూడా చేసెదము,ప్రభువా?కాని ఆ పురుషులు వాస్తవముగా గ్రహించినదేమనగా... సరిగ్గా పెండ్లి కుమారుడు వచ్చు నప్పుడు ఆ సమయముననే నిద్రించుచున్న కన్యకలు నూనెను కొనుటకు వెళ్ళిరి.
ఓ, ప్రభువా! సరిగ్గా ఇప్పుడే త్వరగా సంఘమును మేల్కొలుపుము. ప్రభువా! నీవు నిశ్చయముగా చేస్తావని నాకు తెలుసు. కాని ఒక్కసారి పంట కోతను నీవు చూచినప్పుడు ఈలాగు చెప్పితివి. “పనివారు కొద్దిమందే గలరు. గనుక తన కోతకు పనివారిని పంపమని ప్రభువువద్ద వేడుకొనుడని చెప్పితివి", ఇప్పుడు తండ్రీ, మేము అడుగవలెనని నీవే కోరుచున్నావని మేమెరుగుదుము. మేము నీతో పాలిభాగస్థులమై యున్నాము. అది మనలను ఏకమగునట్లు చేయుచున్నది. ఒక్క దూతకూడా దానిని చెయ్యలేదని మేము గ్రహించితిమి. అది మానవులకు మాత్రమే సాధ్యమగును.
124. ఫిలిప్పు నపుంసకునియొద్దకు పంపబడెను. నిశ్చయముగా, ప్రభువా, దూత ద్వారా ఫిలిప్పు పంపబడెను. అచ్చట ఫిలిప్పు చేతులద్వారానే క్రియ చేయబడెను.
ఖచ్చితముగా, పౌలు దమస్కుకుపోవు మార్గముగుండా వెళ్ళుచుండగా అతనికొక దర్శనము వచ్చెనని మనము గ్రహించగలము, కాని అచ్చట సంఘము నుండి, బయటకు పిలువబడిన, ఎన్నుకొనబడినవాడైన అననీయ చేతులద్వారానే క్రియ జరిగెను. ఒక దర్శనముద్వారా పేతురు, కొర్నేలీవద్దకు పంపబడెను. దర్శనముద్వారా కాదు, దూతద్వారా కాదు, కాని అచ్చట అపొస్తులులద్వారానే క్రియ చేయబడెను.
దేవా, నీవు ఈ ప్రజలను మేల్కోలుపవలెనని ఈ రాత్రి నేను ప్రార్ధించుచున్నాను. మరియు వాగ్ధానము చేయబడిన కార్యము ఇచ్చటున్నదని వారు చూచెదరుగాక! ఇది సంఘముకొరకు ఇవ్వబడినది. "మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును". ప్రభువా, వారిలో అనేకులు దీనిని హక్కు కోరుచున్నారని మేమెరుగుదుము. కాని వారు అనధికార అపొస్తులులుగా ఉన్నారు. ఎందుకనగా వారు లేఖనమునకు విరుద్ధమైనవారుగా ఉన్నారు.
125. దేవా, నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోమని మరియు మిమ్మల్ని మీరు కనపరచు కోమని మేము ప్రార్థిస్తున్నాము. వారు మనుష్యులను సంఘములో చేరునట్లుచేయు చున్నారే కాని, అపోస్తులులు కార్యములు 2వ అధ్యాయములో పేతురు చెప్పిన ప్రకారముగా వారెన్నడూ వారిని బయటకు పిలుచుటలేదు. ఎట్లనగా, మారుమనస్సు (పశ్చాత్తాపము) పొందుకోవాలని చెప్పుటకు, వారిని బయటకు పిలుచుటకు, దేవుడు వాగ్ధానము చేసిన ఆత్మ బాస్తిస్మమునుగూర్చి మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి చెప్పుటకు భయపడుచున్నారు. దానిని చేయుటకు వారు భయపడుచున్నారు. అట్లు చేయువారిని తమ సంఘ సంస్థనుండి వారిని వెలుపలికి త్రోసివేయుచున్నారు.
దేవా, ఇప్పుడే, త్వరగా మానవులను మేల్కొలిపి ఈ ఘఢియను వారు చూచు నట్లుచేయుమని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకనగా, అది వేగంగా సమీపించు చున్నది. ఇప్పుడు, మేము సర్వమును మీకే సమర్పించుచున్నాము. నీవు మహిమను పొందుకొనుము, మాట్లాడుము, మా తండ్రీ. ఎట్లనగా, మమ్మల్ని మీ వాక్యములో సమర్పించుకొనుచున్నాము. మీ కుమారుడగు యేసు నామమున, ఆమేన్.
126. ఓ, దేవా,ఈ వాక్యమును, మీరు దీనిని విశ్వసించుచున్నారా?ఇది సత్యమని మీరు విశ్వసించుచున్నారా? కొన్నిసార్లు నేను కోపంతో గట్టిగా చెప్పుచున్నట్లు వినిపించవచ్చు. కాని నేను అలాగు కాదు. మీరు కొంతమందిని చూచిన యెడల... నేను రహదారిపై ప్రయాణించుచున్నానని మీరెరిగి, ఇచ్చట రహదారిపై పెద్ద నిటారుగావున్న ఎత్తైన స్థలమును దాటవలసి యుండినయెడల ఆ సమయములో నేను రహదారిపై 90 మైళ్ళ వేగంతో వెళ్ళుటను మీరు చూచినయెడల, అంత వేగంతో ఆ ఎత్తై స్థలమును నేను ఢీ కొట్టబోవుచుండగా, అది జరుగబోతాది...
ఇక అక్కడ నా పని అయిపోతాది. కాని అది తెలిసిన మీరు, నన్ను ప్రేమించుట వలన బిగ్గరగా అరుస్తూ నన్ను హెచ్చరించెదరుకదా? ఖచ్చితముగా మీరు అలాగే చేస్తారని నేను నమ్ముచున్నాను. దానినే మీపట్ల నేను చేయుచున్నాను.
127. ఇప్పుడు, రోగులకొరకు మనము ప్రార్థించబోవుచున్నాము. ఎంతమంది వ్యాధులతో బాధపడుచున్నారు? చూడనివ్వండి. ఇచ్చట వ్యాధితో భాదపడుచున్న జనులందరు మీ చేతులను పైకి ఎత్తండి. మీకు ప్రార్ధనా అట్టలు ఇవ్వబడినవా? అదే మంచిది. అతడు వెలుపల ప్రార్ధనా అట్టలను ఇచ్చును. సరే మంచిది. వారిని మనము పిలుద్దాం. ఏమిటి? ఏమిటి? 1 నుండి 100? సరే. వెలుపల 1 నుండి 100వరకు ప్రార్థనా అట్టలను ఇచ్చినట్లుగా అతడు చెప్పెను. మంచిది. ఇచ్చటున్న ఈ కొంత మంది ప్రజలను వరుస క్రమంలో ఉండునట్లు చేద్దాం. A-1 ప్రార్థనా అట్ట ఎవరి వద్ద ఉన్నది? మీరు లేచి నిలబడలేక పోయినయెడల మీ చేతులను పైకి ఎత్తండి. ఎవరైనా మేము మిమ్మల్ని పైకి ఎత్తుకొని వచ్చెదము. అదిగో ఆ స్త్రీ అచ్చట నీవు సరిగ్గా లేచి నిలబడుటకు సాధ్యమగునా? ఎవరివద్ద ప్రార్ధనా అట్ట - 2 గలదు. నేను పిలుచుచుండగానే అదిగో వెనుక అచ్చట ఆ స్త్రీ గలదు. సంఖ్య 2, నీవు రాగలవా? సరే మంచిది. ప్రార్ధనా అట్ట సంఖ్య 3, A సంఖ్య 3, ఆ ప్రార్థనా అట్ట ఎవరివద్ద గలదు. సంఖ్య-3, అదిగో అచ్చట వచ్చుచున్న ఆ సహోదరుడేనా? సరే. సంఖ్య-4, ఎవరి వద్ద ప్రార్థనా అట్ట 4 గలదు? అదిగో అచ్చట ఆ స్త్రీ. 5? ప్రార్థనా అట్ట 6, అట్టసంఖ్య -7? సరే 7,8,9,10? 10 సంఖ్య గలవారు లేచి నిలబడండి. నేను చూడలేకపోవుచున్నాను. సంఖ్య -10, అచ్చటున్న కొంతమంది ప్రజలను వదిలేసాము. బహుశా అది వాళ్ళలో ఉండవచ్చునేమో? 10,11,11,12 సంఖ్య 12,13,142 మీ చేయిని ఊపుచూ లేదా ఏదోవిధంగా మీరు తెలియ పరచండి. అందునుబట్టి నేను త్వరగా మిమ్మల్ని చూస్తూ ముందుకు సాగిపోయెదను. 14,15,15.໖ ໑໖ 15? ໖ 16,17. ໙໖ ລ້໖໖. 17,18,19,20? సరే. నేను ఏ సంఖ్యను పిలిచాను? సంఖ్య 20? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11,12, 13, 14,15,16 అచ్చట కేవలం 16 మందే గలరని నేను చెప్పగలను. సరే. 16 ລ້ 20. 1,2,3,4,5,6,7,8,9,10,11,12,13,14,15,16...
128. మంచిది. మనము అచ్చట నుండి ప్రారంభించుదాం. మీలో ఎంతమంది వ్యాధితోను, అవసరతలో ఉన్నవారు ఎంతమందివద్ద ప్రార్థనా అట్టలేదు? మీ చేయుని పైకి ఎత్తండి. ఈ భవనమంతటా ఉన్నారు. సరే. మేము కొన్ని నిమిషములు ఇప్పుడు ప్రార్థనలో ఉండెదమని మీలో ఎంతమంది వాగ్ధానము చేయగలరు? అట్లే నిశ్చబ్ధంగా కూర్చొనియుండి, ఇప్పుడు మీరు ప్రార్ధనలో ఉండగలరు?
నేను దేనినిగూర్చి ప్రసంగించుచున్నాను? చివరి సూచన అంత్య కాలమునకు ముందుగా సంఘమును తాకును. ఏదోక దినమున అది భిన్నముగా ఉండును. మనము మన అంత్య కాలమందు దానిని వినబోవుచున్నాము. సరే మంచిది. మీరు చాలా భయభక్తులతో... అది సత్యమని మీలో ఎంతమంది నమ్ముచున్నారు? సరే మంచిది. సరే, చాలా భయభక్తులతో ఉండండి. సందేహించవద్దు.
129. ఇప్పుడు, నిజమైన భయభక్తులతో అట్లే మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఇచ్చటున్న స్త్రీవద్ద ప్రార్థనా అట్ట కలదాని నేను చూడాలని కోరుచున్నాను. అట్లులేని యెడల...1 నుండి 20వరకు ఉన్న ప్రార్ధనా అట్టలలో ఏదైన ఒకటి నీవద్ద గలదా? బిల్లీ, ఆమె వద్ద ఏమున్నదో చూడుము. అది... సరే. బహుశా, కొన్నిసార్లు... ఎవరైనా చెవిటి వారు ఉందురని నేను మరచిపోయాను. చుట్టూ చూడండి. ఇంకా ఎవరి వద్దైనా ప్రార్థనా అట్టలు గలవా? గమనించండి, చూడండి. ఎవరైనా చెవిటివారై, పిలిచిన సంఖ్యను వినబడక ఉందురేమో? నేను కొంచెం ఆలస్యం చేసాను. మంచిది.రేపటి దినమున మీరెచ్చటకి వెళ్ళనియెడల ఎలాగైనా రేపు సంఘమునకు తిరిగి రండి. మీరు వచ్చెదరా?సరే, ఇక ఇప్పుడే అన్ని చక్కపెట్టండి. ఇదే కార్యమును పౌలు రాత్రంతా ప్రసంగించెను. ఖచ్చితముగా. అతడు అలాగే ప్రసంగించెను. అతడు అలాగే ప్రసంగిం చెను. కాబట్టి, మనము తొందరపడ నవసరము లేదు. మంచిది. సరే, ఇప్పుడు ప్రతీ ఒక్కరు చాలా భయభక్తులతో ఉండండి. ఇప్పుడు చుట్టూ తిరుగవద్దు.ఇప్పుడు చాలా నిశ్చబ్ధంగా కూర్చొని ఉండండి. మరి నిజమైన భయభక్తులతో ఉండండి. ఇప్పుడు, ఒక్క నిమిషము మనము మన తలలను వంచుదాము.
130. ప్రభువగు యేసు, ఇప్పుడు నేనేమి ఎదుర్కొంటున్నానో నేను గ్రహించాను. నేను సత్యమునే చెప్పుచున్నానా లేదా ఏదోక అసత్యమును చెప్పుచున్నాననేదానిని ఇప్పుడు నేను కనుగొని గ్రహించవలెను. ప్రభువా, నామీద నాకు నమ్మకం లేదు. దానిని చెయ్యుటకు నేను భయపడుచున్నాను. నాకు తెలుసు... ఇది నీ వాక్యమని నేనెరిగియుండి కూడా మరియు ఇది సత్యమని నాకు తెలుసు. అయినప్పుటికీ ప్రభువా, దీనిని చేయుటకు నీవే నాకు అనుమతి అనుగ్రహించాలి. లేదా దీనిని నేను చెయ్యలేను. దీనిని చెయ్యుటకు పూర్తిగా నాకు అసాధ్యమైన కార్యము. కాబట్టి నీవే నాకు సహాయము చేయవలెనని నేను ప్రార్ధించుచున్నాను.
నన్ను దీవించుము. నా జీవితములో నేను చేసిన పొరపాటులను క్షమించుము. ప్రభువా, నేనిచ్చటున్నాను. మధ్య వయస్సుగల వ్యక్తిగా ఇదిగో నేనిచ్చటున్నాను. నేను 21 వయస్సులో చిన్న బాలునిగా ఉన్నప్పటినుండి, సేవను ప్రారంభించిన కాలము నుండి ఇప్పటి వరకు నా మార్గమంతటిలో నేను నీకు సేవ చేయుటకే ఇష్టపడితిని.
నా జీవిత కాలంలో సేవ చేయకుండా వ్యర్థముచేసిన ఆ సమయమును ప్రభువా, నేను మరలా చెల్లించాలనుకుంటున్నాను. నేను ఆ కాలమునకు రావాలని ...మీరు మరలా యవ్వన వ్యక్తిగా ఈ రాత్రి నన్ను మార్చినయెడల, నేను నా స్థానమునుండి వెలుపలికి రావలెను. నేనిప్పుడు మరలా యవ్వనస్థునిగా మారలేను. నాకు తెలుసనే కార్యములు ఏదీకూడా నాకు తెలియదు. నేను దీనిని ప్రసంగించినాగాని ఈ ప్రజలతో పునరుత్థాణంలో నేనుండలేను. నేను ఈ తరమువారితో లేచి నీ వాక్యము నకు సాక్షిగా నిలబడవలెను. కాబట్టి ప్రభువా, ప్రజలకు యదార్థవంతునిగా మరియు నిజమైనవానిగా నేను ఉండునట్లు చేయుము. నేను ఇచ్చటున్నంత వరకు నీపట్ల యదార్థవంతునిగా ఉందునుగాక! పిదప ప్రభువా, నాతో నీసేవను నీవు ముగించినప్పుడు సమాధానముతో నన్ను నీ సేవకునిగా నీవద్దకు చేర్చుకొనుము.
131. ఇప్పుడు నీవు నన్ను నడిపించి, మార్గము చూపమని నేను ప్రార్థిస్తున్నాను.
ఈ ప్రజలను దీవించుము. ఈ సంఘమును దీవించుము. ఈ ప్రియమైన సంఘ కాపరిని, అతని భార్యని, ఇచ్చటున్న ప్రజలందరిని దీవించుము. ప్రభువా, ఎంతో ప్రియమైన, మధురమైన ఈ ప్రజలను దీవించుము. ఇప్పుడు నీవు వీరితో ఉండ మని ప్రార్థిస్తున్నాను. ఈ అంత్య కాల సూచనలను, నేనేమి చెప్పితినో వాటన్నింటిని వీరు చూచెదరుగాక! నోవాహు కాలమునుండి సంభవించినవాటిని మరియు ఈ సూచనలను ప్రభువా, నీవే అనుగ్రహించితివి. ఆ విషయములనుగూర్చి ఒక గంట లేదా రెండు గంటలు వివరించుటకు ప్రయత్నించాను. వాటన్నింటితోపాటు వివరాలలోకి వెళ్ళడం కష్టమగును. కాని ప్రభువా, ఇప్పుడు దీనిని స్థిరపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ఇదే ప్రాముఖ్యమైన కార్యము. అబ్రాహాము, శారా సమక్షంలో అచ్చట సూచనచేసిన అదే దేవుడు, దీనినికూడా చేయునని వారెరుగునట్లుగా దీనిని నిరూపించుము. మరియు ఆ ఎడారిలో ఎన్నుకొనబడిన సంఘము గలదు మరియు ఒక చిన్న మిశ్రమ సంఘశాఖ గుంపుకూడా అచ్చటున్నది... వారికే పట్టణము లేదు. వారు చిన్న గుంపుగా గుడారములో నివసించిరి. వారికి పెద్ద భవనములు ఏమి లేవు. మరి మహిమకరమగు ఏ గొప్ప కార్యములు వారివద్దలేవు. వారు కేవలం యాత్రికులవంటి గుంపు మాత్రమే. కాని వారికి నీవు ప్రత్యక్షమైతివి. ఎందుకనగా, ఒక కుమారుడు వచ్చునని వారికి వాగ్ధానము చేయబడియుండెను.
తండ్రీ మాకుకూడా ఆ వాగ్ధానము ఉన్నది. మేము దానిని విశ్వాసిస్తున్నాము. ఇచ్చట ఈ రాత్రి వాటన్నింటిగుండా ఈ దేశమును చూడగా సొదొమవలె వున్నది. ఎన్నో భయంకరమైన వ్యభిచార కార్యములు జరుగుచు, ఎన్నో కుటుంబములు బ్రద్దలైపోయెను? ప్రభువా, ఎన్నో పాపములు నీ కనులకు ముందు ఇప్పుడు వచ్చు
చున్నవి? ఇది ఈ పట్టణములోనే? దేవా, నీవెట్లు దీనిని భరించగలుగుచున్నావు? ప్రభువా, వారిని క్షమించమని నేను ప్రార్థిస్తున్నాను. వారేమి చేయుచున్నారో వారికి తెలియదు. నీవు మాకు సన్నిహితంగా ఉందువుగాక! యేసు నామమున ఆమేన్.
132. సరే మంచిది. ఒక్కక్షణము మీ దృష్టిని కేద్రీకరించండి. మొదట ఇచ్చటున్న ఈ వరుసను నన్ను చూడనివ్వండి. ఇచ్చటున్న ప్రజలలో నాకు తెలిసినంతవరకు ఈ వరుసలోనున్న వారు నేనెరుగనివారని నమ్ముచున్నాను. వారినిగూర్చి నాకు తెలియదు. వారినిగూర్చి అసలు నాకేమి తెలియదు. నిజంగా, ఇచ్చటున్న ప్రజల వైపు గమనించి చూడగా, మాకన్ లేదా జార్జియానుండి ఇచ్చటకు వచ్చిన అదిగో అచ్చట సహోదరుడు మరియు సహోదరి పాల్మర్ కూర్చొనివున్నారని నేను నమ్ము చున్నాను. ఆ సహోదరుడు, సహోదరినిగూర్చి నేనెరుగుదును. వారి ప్రక్కన కూర్చొని వున్న, వారి పేరును నేను చెప్పలేదు. సరిగ్గా ఇచ్చట కూర్చొనివున్న...సరిగ్గా ఇచ్చట కూర్చొనివున్న వ్యక్తి, ఒహియోనుండి వచ్చిన సహోదరుడు ఫ్రిట్టింగర్. అది నిజము.
ఇప్పుడు, ఫ్రెడ్ సాత్మన్ మరియు శ్రీమతి సాత్మన్ ఇచ్చటెచ్చటో ఉన్నారని నేనెరుగుదును. ఎచ్చటో నాకు తెలియదు. కొంతసేపటి క్రితం అతడు “ఆమేన్”అని చెప్పుట విన్నాను. అతడెచ్చటున్నాడో నాకు తెలియదు. ఇచ్చటెచ్చటో అతడున్నాడు. సహోదరుడు మరియు సహోదరి ఇవాన్స్ ఇచ్చట ఉన్నారు. ఇవాన్స్ సహోదరుడు ఇచ్చటున్నాడు. ఈరాత్రి సహోదరి ఇవాన్స్ ఈ క్యాంప్లో ఉన్నారని నేను తలంచు చున్నాను. లోపలికి ప్రవేశించుటకు వారికి స్థలంలేదని కనుగొన్నారు. కాబట్టి నా భార్య, పిల్లలు మరియు వారున్న చోటకే వారు తిరిగి వెళ్ళిపోయిరి. కాబట్టి మేము ఈ కూటమును కోరుచున్నాము... సహోదరుడు టాం సింప్సన్, సహోదరుడు డేవిడ్ ఉడ్ ఇచ్చటున్నారు. వారు... వారిలో ఒక్కరినికూడా, వారిని నేను చూడలేదు.
133. మీ బాధలు లేదా మీ సమస్యలు ఏంటో మీగురించి నాకేమి తెలియదని ఇచ్చటున్న మీలో ఎంతమందికి తెలుసు? మీ చేతులను పైకెత్తండి. ఈ భవనములో నున్న ప్రతీ వ్యక్తి...ఓ, అన్నిచోట్లా చేతులు ఎత్తబడినవి. సరే, మీరిప్పుడు విశ్వాస మును కలిగి ఉండండి. మీ హృదయమంతటితో మీరు విశ్వాసించండి.ఓ, దేవా!
ఇప్పుడు, ఒక వ్యక్తినిగూర్చి మాత్రమే ఏదైనా మాట్లాడటానికి ఇచ్చటున్నది. ఇప్పుడు దానిని మీరెరుగుదురు. ఇప్పుడిచ్చట మీరు గమనించండి. ఈ ప్రార్థనా వరుస వైపు చూడండి. ప్రతీ ఒక్కొక్కరు తమ చేతులను పైకెత్తిరి. ఇదిగో ఇచ్చట నా హస్తము ఉన్నది. ఇదిగో ఇచ్చట పరిశుద్ధ గ్రంథము ఉన్నది. వారు అపరిచితులు. వారినిగూర్చి నాకేమి తెలియదు. అట్లే ఈ వేదిక నుండి నేనెవరిని గుర్తించగలిగితినో,
నాకెవరు తెలుసో వారినిగూర్చి ఖచ్చితముగా మీతో నేను చెప్పాను. నా వెనుకవున్న సహో॥ లిటిల్ ఫీల్డ్ తప్ప వేరెవరు నాకు తెలియదు. నేను చూడగలుగునంతవరకు నాకు ఒక్కరుకూడా తెలియదు. ఖచ్చితముగా నాకు తెలియదు. ఒకనాటి రాత్రివేళలో మిమ్మల్ని లేపినందుకు నన్ను క్షమించండి. కావున ఇచ్చటున్న వారెవ్వరు. తెలియదు.
134. కాని ఇప్పుడు గమనించండి? ఈ వాక్యములో పరిశుద్ధాత్మవున్న యెడల, అనగా వాగ్ధానము చేయబడిన వాక్యములో, సొదొమ దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారునియొక్క రాకడకు ముందుగా ఈ అంత్య దినములలో లేఖనాను సారమైన సూచనను ఇచ్చెదనని ఆయన వాగ్దానము చేసెను. అది నిజమే కదా? ఇప్పుడు, అదొక చిన్న గుంపుగా, వెలుపలికి పిలువబడిన గుంపుగా మన మధ్యనున్న సహోదరులారా, మీరు దీనిని విశ్వాసించుట లేదా? పెంతెకోస్తు సంఘస్థుల్లారా మీరు దీనిని విశ్వాసించుట లేదా... అనేక శ్రమలలో మరియు కష్టాలలో ఎన్నుకొన బడిన వెలుపలికి పిలువబడిన ఒక గుంపు ప్రజలు ఉన్నారని నేను విశ్వాసించు చున్నాను. దీనిని నేను నమ్ము చున్నాను. నిశ్చయముగా... ఖచ్చితముగా.
వారందరూ పెంతెకోస్తు లోకంలో లేరు. కాని నా భావమేమనగా, ఈ గుంపులో వారెచ్చటో ఉన్నారు. వారెచ్చట ఉన్నారో నాకు తెలియదు. కాని వారెచ్చటో ఒకచోట ఉన్నారు. ఎందుకనగా, మరొక సంఘ కాలమనేది ఇక ఉండదు. ఇదే చివరి సంఘ కాలము. కాని రాబోవు ఆ బండలో మలుచుటకు పెంతెకోస్తు గుంపులోనుండి ఎన్నుకొనబడిన వారిని దేవుడు తీసుకొనును. ఆ పై కప్పును క్రిందికి తీసుకొని రావడానికి అది చక్కగా సరిపోతాది. చూడండి. ఇది ఏటవాలుగా అమర్చబడదు. ఇది ఈవిధముగా అమర్చబడును. ఇది పరిపూర్ణముగా అమర్చబడును. ఈ సంఘము అలాంటి పరిచర్యనే కలిగియుండును. యేసు అదే విషయమును సాక్ష్యమిచ్చెను.
135. ఇప్పుడు, మనమెచ్చట నుండి ప్రారంభించుదాం? ఇతడే మొదటి వ్యక్తా లేదా అతడా? ఇదిగో ఇచ్చటున్న అతడా? సరే మంచిది. స్త్రీ. నీవు ఎచ్చట నిలబడాలనుకుంటే అక్కడే నిలబడుము. ఇంకా ముందుకు నీవు రావలసినవసరం లేదు. ఇప్పుడు, ఇదిగో ఇచ్చట మనము ఒకరికొకరం ఎదురుగా, పురుషుడుగా మరియు స్త్రీగా నిలబడి ఉన్నాము. అదెట్లనగా, ఆ బావివద్ద యేసు ఆ స్త్రీని సంధించి నట్లుగా ఉన్నది. నేను ఈమెను ఎన్నడూ చూడలేదు, అసలు ఆమెగురించి నాకేమి తెలియదు. ఆమె ఒక స్త్రీగా ఇచ్చట నిలబడి వుండుట మాత్రమే నేనెరుగుదును. మరియు ప్రజలగు మీరిచ్చట ఉన్నారు. ఇప్పుడు, నేను... ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఈమె చూచుటకు ఒక విధంగా సన్నగా ఉన్నది. కాని వాస్తవంగా ఈమె మంచి ఆరోగ్యవంతమైన స్త్రీగానే ఉండేది. బహుశా ఈమె అట్లే ఉండవచ్చును.
ఈమె ఎవరో మరొకరికొరకు నిలబడి ఉన్నది. నాకు తెలియదు. ఈమెను నేనెన్నడూ చూడలేదు. సరే ఇప్పుడు, పరిశుద్ధాత్మ ఇచ్చటున్న యెడల... ఈమెను నేను బాగు చేసినయెడల, నేను అచ్చటకు నడిచి వెళ్ళి... ఆమె రోగియైన యెడల, ఒక ఉదాహరణ కొరకు చెప్పుచున్నాను. మంచిది. సన్నని ఆకారములో ఉండు స్త్రీ, నీకు క్షయవ్యాధి గలదని నీవు తలంచుచున్నావు. సరే. ఆమెకు క్షయ వ్యాధిగలదని చెప్పిన యెడల, నేను అచ్చటకు నడిచి వెళ్ళి, "సహోదరీ, నా చేతులను నీ మీద పెట్టుచున్నాను, దేవునికి స్తోత్రము, యేసు నామమున నేను నిన్ను స్వస్థపరచుచున్నా నని" చెప్పవచ్చు. వెళ్ళి దానిని చేయమని ప్రభువు నాతో చెప్పినయెడల, నేను వెళ్ళి దానిని చేసెదను. అర్థమైనదా? కాని దానిని నన్ను చెప్పమని ఆయన నాతో చెప్పువరకు నేను అచ్చటకు వెళ్ళను. ఎందుకనగా, అది నాకు తెలియదు.
136. సమీప కాలమున ఒక వ్యక్తి తన గృహము ఎదుట వాహనమును నడుపుకొని వచ్చి, తన భార్యతో ఇట్లు చెప్పెను. అప్పుడు నేను అతని ఇంటిలోపలే ఉన్నాను. కాని అతనికి తెలియకుండానే, అచ్చట గొప్ప జన సమూహము ఆ ఇంటి బయట నిలబడివుండగా అప్పుడతడు, “బ్రాన్హాం సహోదరుడు నడుచుకుంటూ నా ఇంటి ద్వారమువద్దకు వచ్చి నాకుమార్తె బాగవునని నాతో చెప్పితే చాలు. ఆయన నాతో అట్లు చేస్తే చాలని”చెప్పెను. “సరే, అలాగే నీవు బయటకు వెళ్ళి మరి..."అని మీడా చెప్పెను. “కాని,నేనేమి చెయ్యలేను. ఏమి తెలియకుండానే ఊరకే వెళ్ళి అతనితో చెప్పిన, అది నేను అబద్ధము చెప్పినట్లగును. అతనివద్దకు వెళ్ళి ఆ విషయమును చెప్పమని ప్రభువు నాతో చెప్పినప్పుడే దానిని నేను అతనితో చెప్ప గలను. కాని ఆయన నాతో దానిని చెప్పనంతవరకు, ఆయన ఏమి చెప్పమని నాతో చెప్పునో దానికంటె ఎక్కువగా నేనేమి చెప్పలేనని"చెప్పాను. ఆ కార్యమును అట్లే చేయవలెను. ఏదో ఊహించుకుంటూ నీవు ఏదైనా చెప్పవచ్చు. కాని అది తప్పు. దానిని అలాగు ఊహించి చెప్పకూడదు. సరిగ్గా ఇచ్చట అట్లు దానిని ఊహించి చెప్పకూడదు. “ఈ స్త్రీ అనారోగ్యంతోవున్న తన అత్తకొరకు ప్రార్థిస్తున్నదని నేను ఊహించుచున్నానని” చెప్పలేను. అలా ఊహించుకొనుట క్రియ చేయదు. ఆమెకు అది బాగా తెలుసు. సరే. బహుశా,ఆమె సమస్య అదేయై ఉండవచ్చు. అర్థమైనదా?కాని నా భావమేమనగా, దానిని కేవలం ఊహించుచున్నాను (చూచారా?). మీరు దానిని అట్లు చేయరాదు. అది నిజమైనదిగా ఉండాలి. అది నిజమైనదిగానే ఉండాలి. అంతేకాకుండా, అది నిజమైనదా, కాదానే విషయము ఇచ్చటనే అది నిరూపింపబడవలెను.
137. ఇప్పుడు, గుర్తుంచుకోండి. ప్రతీ ఒక్కొక్కరు దీనిని జ్ఞాపకముంచుకోండి. నేను మీ సహోదరుడు(అర్థమైనదా?), నేనుకూడా మనిషిని మాత్రమే కాని
ఇది దేవునియొక్క వరమై యున్నది. ఈ వర్తమానమును విశ్వాసించుచున్నాను. ఈ వర్తమానమును ప్రసంగించుటకై ఆయన నన్ను పంపెనని నేను విశ్వాసించు చున్నాను. గనుక ఆ పరిశుద్ధాత్మకు లొంగిపోవునట్లు నన్ను నేను సమర్పించు కున్నాను. మరియు ఆ వాక్యమును నా హృదయమున భద్రపరచుకున్నాను. "నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి". నిలిచియుండుట, ఏదో గంతులు వేయుట మరియు ఇటు, అటు పరిగెత్తుట కాదుగాని, "నాయందు మీరును, మీయందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి". అది నిజమే కదా?
ఇప్పుడు నేను నీతో ఒక్క నిమిషము మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. (ప్రసంగించుట ద్వారా), అమ్మా, నీవు కొద్ది నిమిషములు అట్లే నిలబడి ఉండుము. దానినిబట్టి నిన్ను మరొకరి నుండి ప్రత్యేకపరచి నేను ఉంచగలుగుతాను. ఎట్లనగా, బావివద్ద ప్రభువు ఆ స్త్రీతో మాట్లాడిన విధముగా అది ఉన్నది. అది నీకు తెలుసు. ఆమె సమస్య ఏమిటో కనుగొనుటకై ఆమెయొక్క ఆత్మను ఆయన పట్టుకొనునంత వరకు ఆయన ఆమెతో మాట్లాడెను. పిదప ఆమె సమస్యను ఆయన కనుగొనిన వెంటనే, ఆమె సమస్య ఏమిటో ఆమెకు చెప్పెను. గనుకనే ఇది మెస్సియయొక్క సూచనగా ఉన్నదని ఆమె చెప్పగలిగెను. మంచిది. యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నయెడల, నేనొక మానవుడిని మాత్రమేనని నీవెరుగుదువు. దానిని నేను చెయ్యలేనని, ఒకవేళ అది మరలా అట్లే ప్రదర్శించినయెడల మరలా అది మెస్సియ సూచనగా ఉండదా? సంఘమా, మీరు దానిని నమ్ముచున్నారా?
138. ఇప్పుడు, ఒక్క నిమిషము మాత్రమే నేను ఈమెతో మాట్లాడెదను. అర్థమై నదా? నేను మెస్సియాను కాదు గాని, ఆ మెస్సియా నాద్వారా మాట్లాడుచున్నాడు. అర్థమైనదా? అదే ఇది. ఎందుకనగా ఆమెను గూర్చి నాకు తెలియదు. నేనెన్నడూ ఆమెను చూడలేదు. ఇప్పుడు మనము పొందుకొనబోయే ముందుగా అంతవరకు అట్లే ఒక్కక్షణము ఉండండి. ఆయన దీనిని చేయునో లేదో నాకు తెలియదు. ఆయన దీనిని చెయ్యకుండా కూడా ఉండవచ్చును. అవును. కాని ఇప్పుడు ఈమెకు సరియైన సమయమున సహాయముచేసి తీరవలెను లేదా ఈమె చనిపోవును. ఈమెకు కేన్సర్ వ్యాధి గలదు. అది నిజము. అది నిజము, గనుక దీనిని ప్రజలు ఎరుగునట్లుగా ఈవిధముగా నీ చేయిని పైకి ఎత్తుము. అదెచ్చటున్నదో నేను చెప్పాలని నీవు కోరుచున్నావా? అది నీ గొంతులో ఉన్నది. నిజము. నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? అట్లే దీనిని నీవు అంగీకరించి... మంచిది. ఇప్పుడు గమనించుము. ఆయన నిన్ను స్వస్థపరచగలడని నీవు విశ్వాసించుచున్నట్లుగా నీవు చెప్పితివి.
నీవు దీనిని విశ్వాసించిన యెడల పరిశుద్ధ గ్రంథములోని వాక్యము ప్రకారముగా ఆయన దీనిని చేసెను. ఇప్పుడు ఆ వాక్యము నిజమైనదా? అట్లయితే నీవు స్వస్థపరచ బడితివి. నీవు స్వస్థతను పొందుకున్నావు కదా? అదే నిజము. ఆమేన్. "ప్రభువా, నీకు ధన్యవాదములు” అని చెప్పుకుంటూ దిగి వెళ్ళుము. మరి దానిని గూర్చి ఇంతటితో మరచిపోయి మరియు స్వస్థతను పొందుకొనుము. ఆమేన్.
139. మనము ఒకరికొకరం అపరిచితులము. నీ గురించి నాకు తెలియదు. నిన్ను నేనెన్నడూ నిజంగానే చూడలేదని నేను అనుకుంటున్నాను. మనము పరిచయము లేనివారిమి, ఇప్పుడే ఇచ్చటే ఒకరికొకరం కలుసుకుంటునాం. కాని మన యిద్దరి గురించి దేవునికి తెలుసు. నీవు దానిని నమ్ముచున్నావా? నమ్ముచున్నావు కదా? పరిశుద్ధ గ్రంథంలో ఇట్లు చెప్పబడినది. “ఆయనయందు విశ్వాసముంచువాడు..." మిక్కిలి భయభక్తులతో ఉండుము. ప్రభువగు దేవుడు నాతో చెప్పిన యెడల...నేను కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి, "అమ్మా నీవు అనారోగ్యంగా ఉన్నావని"చెప్ప వచ్చును. ఇప్పుడు నీవు అనారోగ్యంగానే ఉండవచ్చు. ఇచ్చట ఈ ప్రార్థనా వరుసలో అందుకే నిలబడివున్నావు. అదే బహుశా నిజంగా ఉండవచ్చును. మరొకరి కొరకు ఈ వరసలో నీవు నిలబడి ఉండవచ్చు. నాకేమి తెలియదు.కాని నీవు అనారోగ్యంతో వున్న యెడల, నేను అచ్చటకు వచ్చి నీమీద నా చేతులను పెట్టి, “నమ్మినవారివలన ఈ సూచకక్రియలు వెంబడించును. వారు రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతపొందుదరని యేసు చెప్పెనని” నేను చెప్పవచ్చును. అదే సత్యము.
140. కాని ఒక్క నిమిషము ఆగండి. ఆ వ్యక్తిని ఆయన పంపించెనా, లేదానే విషయమును నిరూపించబడవలెను. అర్థమైనదా? అది ఆ మార్గమున క్రియ చేయునో లేదో మొదట కనుగొనిచూద్దాం. గమనించారా? మీరు దానిని గుర్తుంచు కోండి. ఆ రెండు మాటలు, ఊహించుచూ, ఆ రెండు భిన్నమైన మాటలు... ఎల్లప్పుడూ అవి.. దేవునియొక్క పనిని సాతాను పాడుచేయడానికి ప్రయత్నించు... దేవునియొక్క వాక్యమునకు సాతాను ఏదేను తోటలో తెల్లని సున్నం పూసి మరుగు చేయుటకు ప్రయత్నించెను. మోయోబులుకూడా దానిని ఆవిధముగానే చేయుటకు ప్రయత్నించిరి. యేసు సమక్షంలోకి వెళ్ళి సాతాను అదే కార్యమును చేసినది. ఎట్లనగా, సాతాను తన మత సంబంధమైన విద్యతోను మరియు తెలివితోను ఆయన దగ్గరకు వెళ్ళి, “అది ఈలాగు వ్రాయబడియున్నదని” చెప్పెను. యేసుకూడా అదే మార్గమున సాతాను వెనుకవెళ్ళి, “అది ఈలాగుకూడా వ్రాయబడి యున్నది...” అని చెప్పెను. ఆవిధముగా జవాబునిచ్చుట యేసుకు క్రియ చేసెను? ఎందు చేత?
వాక్యములో వాక్యము ఉన్నది. అందువలననే అది అట్లు క్రియ చేసినది. ఎట్లనగా ఒక తీగ(wire )లో విద్యుత్ శక్తి(current)ఉన్నట్లుగా, అదే దానిలోవున్న వ్యత్యాసము.
141. ఇప్పుడిచ్చట కూడా అలాగే తీగలో విద్యుత్ శక్తిని కలిగియుండునట్లుగా ఉన్నది. అర్థమైనదా? నేను కేవలం ఒక తీగ(wire)ను మాత్రమే, కాని ఆ విద్యుతశక్తి ఆయనే. కాబట్టి విద్యుత్శక్తి లేకుంటే తీగలో జీవము ఉండదు. కాబట్టి పరిశు ద్ధాత్మయగు దేవునియొక్క విద్యుత్శక్తి తీగవలెనున్న (నీ సహోదరుడనగు) నాగుండా ప్రవాహించ గలిగితే, నీ సమస్యను వివరించగలుగును. (లేదా ఆ బావి వద్దనున్న స్త్రీ వద్ద ఆయన పరిశుద్ధాత్మద్వారా మాట్లాడిన విధముగా)... నీవు చేసిన ఏదోక విషయమును గూర్చి వివరించి చెప్పగలుగును. లేదా నీవు చేయవలసిన యుక్తమైన కార్యమునుగూర్చి లేదా గతంలో జరిగిన సంభవమునుగూర్చి, నీ అనారోగ్యం గురించి, అలాగు వివరించి చెప్పిన విషయము సత్యమా లేదా అసత్యమాయని నీవెరుగగలవు. లేదా నీలోనున్న ఏదోక తప్పిదమునుగూర్చి, అనగా నీలోవున్న తప్పిదమునుగూర్చి చెప్పినప్పుడు, అప్పుడది నిజమా లేదా అబద్దమానేది నీవెరుగు దువు. నీవెరుగుదువు కదా? దానిని నీవెరుగుదువు. సంఘమా అది నిజమే కదా?
ఆ సమస్య ఏమిటో దానినిగూర్చి ఆయన చెప్పినప్పుడు అది సత్యమా, అసత్య మానే విషయమును నీవు కనుగొనగలవు. గనుక ఆయన ఆ విషయమునుగూర్చి చెప్పిన అది నిజమని నీవెరుగగలవు. అర్థమైనదా? అదేమిటో దానినిగూర్చి నీకు ఇదివరకే తెలుసు. అది నానుండి రాకుండా, సరిగ్గా ఇచ్చట ఆయన వాక్యమునుండి చెప్పినయెడల, అది ఇదివరకే వచ్చేయున్నది. ఇప్పుడు అదొక ఋజువుగా మాత్రమే ఉన్నది. అది ఈ వాక్యమై, నీ విశ్వాసము, నీ స్థితి మరియు దేవునియొక్క వాక్యము రెండు ఏకమై సరిగ్గా ఇచ్చట సంధించుచున్నవి. అర్థమైనదా? నేను కేవలము ఆయనయొక్క నోటి బూరనై దీనిని బదిలీ చేయుచున్నాను. అర్థమైనదా?
142. ఇదిగో ఇచ్చట దేవునియొక్క వాగ్ధానము గలదు. ఇదే అంత్య దినమునకు ఒక సూచనగా ఉండునని దేవుడు చెప్పెను. ఇదిగో ఇచ్చట అంత్య దినములు గలవు. ఆ అంత్య దినములలోనే మనము జీవించుచున్నాము. సరే మంచిది. ఇప్పుడు ఇది నిజమే కదా? సరిగ్గా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రస్తుతం నిలబడియున్నాడు. వెలుగు రూపంలోనున్న ఆ దేవ దూతయొక్క చిత్రాన్ని మీరెప్పడైనా చూచితిరా? చూచారా? ప్రస్తుతం ఇప్పుడు ఇదిగో ఇచ్చటే ఆ వెలుగు ఉన్నది. ఇదిగో నేనెచ్చట నిలబడివున్నానో సరిగ్గా ఇచ్చటే అది ఉన్నది. అదే ఖచ్చితముగా ఇచ్చట మాట్లాడు చున్నది. ఆ వెలుగే ఈ స్త్రీకి ఏం చెయ్యాలో దానిని ఖచ్చితముగా చేయుచున్నది. ఈ స్త్రీ తన చెవులలో ఏదోక సమస్యను కలిగియున్నది. ఆమె చెవులలోనే ఆమెకు
సమస్యగలదు. అది నిజము. అంతేకాకుండా, వినికిడి సమస్య కూడా ఉండుట వలన కొంచెం కఠినంగా ఉన్నది. అది నిజమైతే నీ చేయిని పైకి ఎత్తి చూపుము.
143. నేనెల్లప్పుడూ దానిని పట్టుకుంటాను. దానిని నేనేదో ఊహించుచున్నానని కొంతమంది తలంచెదరు. ఊహించుచున్నది తప్పు. నేను దానిని ఊహగా ఊహిం చుట లేదు. ఒక్క నిమిషము మీరు అట్లే చూడండి. నీతో మాట్లాడుటకు కోరుచు న్నాను. చూడండి. ఆయనేమి చెప్పెనో, అదేమిటో నాకు తెలియదు. అదేమైనా గాని, అదే నిజము. అవును. అది నీకు చెవుల సమస్య. నీ చెవులలో ఏదోకటి వెళ్ళకూడనిది వెళ్ళుటను ఇప్పుడు నేను చూచాను. మరియు నీ తలలో ఏదోక సమస్య గలదు. అదొక తలనొప్పివలె ఉన్నది. తల నొప్పులలోని పార్శ్యం నొప్పివంటిది లేదా దానిని వేరేదో చెప్పెదరు. అది నిజం. అదే కదా సమస్య? అది మాత్రమే కాదుగాని నీవు మరొకరికొరకు ప్రార్ధిస్తున్నావు. ఈరాత్రి నీతో మరొకరు వచ్చారు. అది నిజము.ఆమె ఒక స్త్రీ. వృద్ధురాలగు స్త్రీ. ఖచ్చితముగా నిజము. ఆమెకు కూడా చెవులలో సమస్య గలదు. ఇప్పుడు సరిగ్గా నేను ఆమె వైపే చూచుచున్నాను; నీ వైపు చూచుచున్నాను.
అవునయ్యా. మరొక సమస్య ఆమెకు గలదు. ఆమెకు అధికమైన రక్తపోటు సమస్య గలదు. ఆమెకు కీళ్ళవాతం కూడా గలదు. అది సత్యము. అదే ఖచ్చితముగా నిజము. సరే, రూబీ, ఆమె బాగవునని నీవు విశ్వాసించుచున్నావా? మరి నీవుకూడా బాగవుదువని నీవు నమ్ముచున్నావా? శ్రీమతి కృష్ణా! రూబీ కృష్ణా? వెళ్ళి వారితో చెప్పుము. నీవు నమ్ముచున్నావా? "నీవు విశ్వసించిన యెడల...” ఇప్పుడు కేవలం నమ్ముము. ఇప్పుడు ఆమె పేరు చెప్పి పిలువటనేది సామాన్యమైన విషయము. మరియు యేసు, పేతురుతో,“నీ పేరు సీమోను, నీ తండ్రీ పేరు యోనా"అని పేరు చెప్పలేదా? అర్థమైనదా? చూడండి. ఇప్పటికీ ఆయనే ఆ కార్యమును చేయును.
144. అయ్యా, నీవెవరివో నాకు తెలియదు. మనము ఒకరికొకరం అపరిచితులం. కాని నీ సమస్య ఏమిటో దానిని దేవుడు బయలుపరచునని నీవు నమ్ముచున్నావా? నేను దానిని చేసినయెడల నేను ఆయన సేవకుడినని నీవు నమ్మెదవా? ఇచ్చటున్న జనులగు మీరు, ప్రతీ వ్యక్తి అదే విషయమును మీరు విశ్వాసించెదరా?
ఏదో జరిగినది. ప్రజల మధ్య కాదు... సరిగ్గా ఇప్పుడు దానిని నేను కనుగొనలేక పోవుచున్నాను. ఒక్క నిమిషము, దానిని కనుగొనుటకు మరలా దృష్టిని కేంద్రీకరించ నివ్వండి. నీవు మరొకరికొరకు వచ్చావు. ఆ వ్యక్తి ఇచ్చట లేడు. వారు ఈ పట్టణము నకు చెందినవారు కారు; అసలు ఈ రాష్ట్రానికికూడా చెందినవారు కారు. వారు కరోలినాలో నివసిస్తున్నారు. నిజము. ఆమె ఒక సేవకుని భార్య.ఆమెకు కేన్సర్ వ్యాధి. ఆమె వక్షంలో కేన్సర్ వ్యాధి ఉన్నది. ఆమెకొరకే నీవిచ్చటకు వచ్చి నిలబడి
వున్నావు. ఆమె బాగవునని నీవు విశ్వాసించుచున్నావా? యేసుక్రీస్తు దానిని నీకు అనుగ్రహించునుగాక!.
145. ఎలాగు ఉన్నారు? మనము ఒకరికొకరం పరిచయం లేనివారము. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు ఈ రాత్రి జీవముగలవాడని నీవు విశ్వాసించుచున్నావా? అదిప్పుడు జనుల మధ్యనుండి ప్రారంభమైనది. దానిని ఈ వేదికయందు నిలిపి ఉండుటకు ఒక రకంగా కష్టతరంగా ఉన్నది. అది అలాగే సాగిపోవుచున్నది. అది జనులగుండా వ్యాపించుచున్నది. అర్థమైనదా? స్నేహితుల్లారా, సరిగ్గా ఇప్పుడు మీరు విశ్వసించినయెడల దేవునియొక్క ఆత్మ సంచరించుటను మీరు చూడగలరు. ఈ వరుసలో నిలబడివున్న జనులవైపు నా దృష్టిని కేంద్రీకరించి ఉంచుటకు నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నించెదను.
నీవుకూడా నాకు పరిచయం లేనివాడవే. అది నిజం. వైద్యశాలలో ఉండిరి. వెన్నెముక సమస్య వలన ఏదోక శస్త్ర చికిత్సకూడా జరిగినది. అది నిజము. నీవు స్వస్థతను పొందుకొని మరలా జార్జియాకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నావా? శ్రీమతి కొల్లీన్ నీవు అట్లు చేసెదవా? మీ హృదయమంతటితో అట్లే నమ్ముచూ వెళ్ళండి.
146. అచ్చట నిలబడివున్న నీకు, నీ వెనుక భాగమునవున్న సమస్య నుండి నీవు స్వస్థతను పొందుకున్నావని నేను చెప్పవచ్చును కదా! నీవు నన్ను నమ్ముచున్నావా? సరే. ఆ స్వస్థతను హక్కుకోరుచూ తిరిగి వెళ్ళుము. “ప్రభువా, నీకు కృతజ్ఞతలు"అని చెప్పుము. విశ్వసిస్తూ వెళ్ళుము. నీకుకూడా అదే సమస్య, విశ్వాసిస్తూ వెళ్ళుము. నీవు చేయవలసినదంతా అది మాత్రమే. నీకు కడుపులో సమస్య గలదా? వెళ్ళి భుజించు, నీ హృదయమంతటితో నమ్మినయెడల యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచెను.
నీకు నరాల బలహీనత గలదు, మరియు కడుపులోకూడా సమస్య గలదు. కాబట్టి అలాగే సాగిపోయి వెళ్ళి ఈ రాత్రి భోజనము చేయుము. నీ హృదయ మంతటితో నీవు నమ్ముచున్నావా? విశ్వాసమును కలిగి ఉండుము.
గుండె నొప్పిని బాగుచేయుట దేవునికి సర్వసాధారణము. ఆయన నిన్ను బాగుచేయునని నీవు విశ్వసించుచున్నావా? "నన్ను నీవు స్వస్థపరచినందుకు ప్రభువా, నీకు కృతజ్ఞతలని" చెప్పుచూ, వెళ్ళి నీ కుర్చిలో కూర్చొనుము. అవునండీ,
147. అచ్చట పైకి ఎక్కలేవు, నీవు కీళ్ళ నొప్పులవలన బాధపడతావు. కాని దేవుడు దానిని స్వస్థపరచగలడు. నీవు దానిని విశ్వాసించెదవా? “ప్రభువా, నీకు కృతజ్ఞత లని" చెప్పుచూ తిరిగి వెళ్ళుచూ స్వస్థతను పొందుకొనుము. నరముల బలహీనత నేడు గొప్పవ్యాధి. కాని నీ నరాల బలహీనతను స్వస్థపరచగలడని నమ్ముచున్నావా? “ప్రభువా, నీకు కృతజ్ఞతలని” చెప్పుచూ వెళ్ళి స్వస్థతను పొందుకొనుము.
ప్రతీ ఒక్కొక్కరు మీ హృదయమంతటితో నమ్ముచున్నారా? "నమ్ముట నీవలనైతే " నీకు నేను ఏ ఒక్క విషయమును చెప్పకపోయినను, నీకున్న గుండె నొప్పి సమస్య బాగవునని నేను చెప్పినయెడల?... సరే, అలాగే ముందుకు వెళ్ళుము. ఎలాగైనాగాని నీవు స్వస్థత నొందెదవు. దానిని ఇదివరకే నేను చెప్పితిని. "
ఇప్పుడు ఈ సమస్య దీర్ఘకాలంగా నిన్ను ఇబ్బంది పెట్టుచున్నది (గమనిం చావా?) నీ కడుపులో పుల్లగా (తేపులు) మరియు ఏమి తిన్నా పుల్లగా పులుపు తేపులు వంటివి వచ్చుచున్నవి. ఇప్పుడే ఆయన నిన్ను స్వస్థపరచునని నీవు విశ్వాసించుచున్నావా? వెళ్ళి చక్కగా భుజించుము. నీవు స్వస్థతపరచబడుదువుగాక! ప్రతీ ఒక్కొక్కరు మీ హృదయమంతటితో విశ్వాసించెదరా?
148. తలవాల్చుకొని ఇదిగో ఇచ్చట ఈ దీన స్త్రీ కూర్చొని ఉన్నది. ఇదిగో సరిగ్గా ఇచ్చట కూర్చొని ఉన్నది. ఆమె ప్రార్ధించుచున్నది. ఆమె ప్రక్కనే మరొక స్త్రీ కూర్చొని ఉన్నది. నేను ఆమె పేరును పిలువను. ఆమె ఎవరో నాకు తెలియదు. తనకు ప్రియమైన వ్యక్తియొక్క రక్షణ పొందుకోవాలని ఆమె ప్రార్థిస్తున్నది. ఖచ్చితముగా అది నిజము. నీ హృదయమంతటితో ఆ విషయమును నీవు విశ్వసించినయెడల దేవుడు వారిని రక్షించును. నీవు ప్రార్థిస్తుండగా దేవుడు దానికి జవాబుగా దానిని ఖచ్చితముగా నీకు అనుగ్రహించును. ఆ స్త్రీ పేరు ఏమిటి? అదిగో అచ్చట కూర్చొని ఉన్నది? సరిగ్గా ఆమెకు ప్రక్కన కూర్చొనివున్న ఆమెను నేను చూడలేకపోవు చున్నాను? అవును. దానిని విశ్వాసించమని ఆమెతో చెప్పుము. దేవుడు ఆమెయొక్క ప్రార్థనకు జవాబునిచ్చెను. ఆమేన్. ప్రభువుకు స్తోత్రము. ఆమేన్.నీవు విశ్వాసించు చున్నావా? సందేహించ వద్దు. దేవునియందు విశ్వాసమును కలిగియుండుము.
నేను చూచుచున్నది రాన్ సాత్మన్, అచ్చట వెనుక కూర్చొనివున్నది. నీవేనా! అదిగో నీ ప్రక్కన కూర్చొనివున్న ఆమెపై నీ చేయిని పెట్టుము. నీ స్నేహితురాలు అచ్చట కూర్చొని ఉన్నది. ఆమెకు మూత్ర పిండము సమస్య గలదు అమ్మా, నీవు బాగవుదువనినీవు విశ్వాసించగలవా? అవునయ్యా. నీ భర్త కళ్ళ సమస్యతో అదిగో వీప్రక్కనే కూర్చొనివున్నాడు. ఆయన స్వస్థత పొందుకొనునని నీవు నమ్ముచున్నావా? నీ చేయిని అతనిపై పెట్టుము వారివురు పూర్తిగా నాకు తెలియనివారు. నా జీవిత ములో నేనెన్నడూ వారిని చూడలేదు. మీ హృదయమంతటితో మీరు నమ్ముచు న్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని బాగుచేయును. ఆమేన్. నీవు నమ్ముచున్నావా?
దేవుడు కడుపు నొప్పిని, నరాల బలహీనతను, స్వస్థపరచగలడు. దీనిని నీవు విశ్వాసించుచున్నావా?. నిన్ను బాగుచేయునా? దానిని పొందుకొనుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. ఆమేన్.
149. ఇచ్చటున్న వారిలో ఎంతమంది మీ హృదయమంతటితో విశ్వాసించు చున్నారు? పైన మరియు క్రింద, పైన మరియు క్రింద... ఆ దినమున అచ్చట అబ్రాహాముతో నిలిచివున్న ప్రభువైన దేవుడు మరలా మానవ శరీరములో తనకు తాను ప్రాతినిధ్యం వహించుచున్నాడని మీరు విశ్వాసించుచున్నారా? అదే మారని దేవుడు నీలో ఉండుటను, అదే మారని దేవుడు నాలో ఉండుటను, అదే సూచనను ఈ చివరి కాలమునకు ముందుగా తన ఎన్నుకొనబడిన సంఘమునకు ఆయన ఇచ్చెనని మీరు చూడగలుగుచున్నారా? మీరు దానిని విశ్వసించుట లేదా? యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని మీరు విశ్వాసించుచున్నారా? అది ఆయన రాకడయొక్క సూచనయని మీరు విశ్వాసించుచున్నారా? ఈ ప్రపంచం త్వరలో నాశనం కాబోతుందనడానికి ఇదొక సూచనయని మరియు వెయ్యేండ్ల పరిపాలన ఏర్పడబోవుచున్నదని, ఆ దేవునితోపాటు గొప్ప పరిపాలన మనము చేయుటకు వెళ్ళుచున్నామని మీరు విశ్వాసించు చున్నారా? మీరు దానిని విశ్వాసించు చున్నారా? ఇదే చివరి కాలపు సూచనగా ఉన్నది.
ఈ రాత్రి ఇచ్చటున్న అబ్రాహాముయొక్క సంతానములో ఎంతమందిలో దేవునిలో విశ్రాంతి పొందుదమనే నిర్ధారణ గలదు. అబ్రాహాముయొక్క సంతానము నకు "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును" అని దేవుని కుమారుడగు యేసుక్రీస్తు చెప్పెను. నీవొక విశ్వాసివా? మీ చేతులను పైకి ఎత్తండి. ఇప్పుడు, నీలో ఏ తప్పిదము కలదో దానిని గురించి నాకనవసరము. అసలు అదేమి ఒక కార్యమే కాదు. (అర్థమైనదా?) కేవలం వీటిని మీకు బయలు పరచి, నేను చెప్పుచున్నాను. అర్థమైనదా? ఈ మాటలు మీ విశ్వాసాన్ని పెంపొం దించి తద్వారా మీరు స్వస్థతను పొందుకొనుటకు ఒక హేతువుగా ఉన్నది. గమనించారా?కాని నీ విశ్వాసమే దానిని చేయుచున్నది. అర్థమైనదా? దేవునియొక్క వరములోగల నీ విశ్వాసముతో దానిని నేను బయలుపరచి చెప్పగలుగునట్లు చేయుచున్నది. ఎందుకనగా, దేవుడు ఒక వాగ్ధానము చేసెను. గనుక తన వాక్యము ద్వారా దేవుడు తన వాగ్ధానమును నాకు బయలుపరచెను. మరియు ఆ వాగ్ధానము తోనే నేను నిలిచియుందును. నా మాటలు మీకు అర్థమగుచున్నవా? నేను ఆ వాగ్ధానముతో అట్లే నిలకడగా నిలిచివున్నాను.
150. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుచున్న ఒక దీన స్త్రీ ఇచ్చట కూర్చొని ఉన్నది. దేవుడు నిన్ను బాగుచేయునని నీవు విశ్వాసిస్తున్నావా? సరే, మంచిదయ్యా. మీరు కోరుచున్న దానిని మీరు పొందుకోవచ్చు. దేవుడు నిన్ను దీవించునుగాక!
నీకు ప్రార్థనా అట్టలేదని బాధపడుచున్నావా? అవన్నీ నీకు అవసరం లేదు. అర్ధమైనదా? దేవుడు నిన్ను స్వస్థపరచెను.
ఇప్పుడు, నా భావాన్ని మీరు గ్రహించగలుగుచున్నారా? అది కేవలం ప్రతీచోటా ఉన్నది. మీరు దీనిని విశ్వసించుచున్నావా? మీ చేతులను ఒకరిపై ఒకరు పెట్టండి. అలాగే ఒకరికొరకు ఒకరు మీరు ప్రార్ధించండి. నేను మీ ప్రార్థనను ఆలకించబోవుచున్నాను. ఒకరికొరకు ఒకరు మీరు ప్రార్ధించండి. మీ చేతులను ఒకరిపై ఒకరు పెట్టండి. మీరేలాగు ప్రార్ధించుచున్నారో నేను చూడగోరుచున్నాను. ఏమిటి?...ఈ ప్రార్థనా వరుసలో నిలబడివున్న చిన్న గుంపువారు, ఈ ప్రక్క తిరగండి, మీ తలలను ఒకరివైపు ఒకరు త్రిప్పండి, మీ చేతులను ఒకరిపై ఒకరు పెట్టండి. ఇప్పుడు, మీరు ఒకరికొరకు ప్రార్ధించండి. మీ ప్రార్ధనను నేను వినగోరుచున్నాను. ఇప్పుడు,మీకొరకు మీరు ప్రార్ధించకోవద్దు. మీరు ఎవరిపై చేయి పెట్టారో వారికొరకు ప్రార్ధించండి. అలాగే చేయండి. ఈ భవనము బయట నిలబడినవారు, ఈ స్థలమం తటా, ప్రతీచోటా ఉన్నవారు మీరు చేతులను ఒకరిపై ఒకరు పెట్టి ప్రార్ధించండి. 151. మా పరలోకపు తండ్రీ, ఈ కూటమును మేము దివ్యమైన ముగింపు సమయములోకి తీసుకొను వచ్చుచున్నాము. దీనిని ఆటంకపరచటానికి సాతాను తనకు సాధ్యమైనంతవరకు చెయ్యవలసిన సమస్తమును చేయును. కాని దేవా, నీయంతట నీవేమి నీ ఉనికిని చూపించావు. ఎట్లనగా, వాక్యముద్వారా పరిశు ద్ధాత్మయొక్క సన్నిధిని, లేఖనానుసారమైన సూచనల ద్వారాను, నిశ్చయముగా పరిశుద్ధ గ్రంథముద్వారాను, వాగ్దానమును అనుగ్రహించి మరియు ఈ కార్యములు అంత్య దినములలో జరుగునని చెప్పితివి.
దేవుని కుమారుడగు యేసుక్రీస్తు హృదయములను, పేర్లును, వ్యాధులను, సమస్తమును, అది ఏమైయుండెనో, అదేమిటో, అది ఏమై ఉండబోవుచున్నదో వాటన్నింటిని గూర్చి నీవెరుగుదువు, ఇచ్చట కూర్చొనియున్న ఈ ప్రజలు, మరి నీ జనులైయున్నారు. వారు దేవునియొక్క పిల్లలైయున్నారు. మరియు వారు నిన్ను విశ్వాసించుచున్నారు. వారి చేతులను ఒకరిపై ఒకరు పెట్టియున్నారు. "నమ్మినవారి వలన ఈ సూచనక్రియలు వెంబడించును. వారు రోగులమీద చేతులుంచినప్పుడు, వారు స్వస్థతనొందుదురు" అని నీవు చెప్పితివి. ఇప్పుడు వారితోపాటు నేను నా ప్రార్థనను కలుపుచున్నాను. వారితోపాటు నేను కూడా విశ్వాసించుచున్నాను. వారేమి అడుగుచున్నారో దానిని నీవు వారికి అనుగ్రహించె దావని నేను విశ్వాసించుచున్నాను. ఎందుకనగా, వారు నీ పిల్లలు. "నీ ఎదుట యదార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలును నీవు చేయక మానవు".
152. ఇప్పుడు సాతానా, నీవద్ద సవాలుచేయు తరుణమునకు మేము వచ్చితిమి. నీవు ఓడిపోతివి. ఆ కల్వరి నుండి నీవు ఓడిపోయినవాడివి. బుకాయించుట తప్ప నీవు యిచ్చుటకు నీవద్ద వేరేమి లేదు. అది కేవలం మోసం మాత్రమే. ఇక మీదట నీవు మమ్మల్ని మోసం చేయుటకు నిన్ను అనుమతించము. మేము ప్రభువగు దేవునియొక్క వాక్యమును పెట్టుచున్నాము. ప్రభువు యొక్క వాక్యము, "నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు వెంబడించును” అని చెప్పియున్నది. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును మేము పొందుకున్నామని ఈ ప్రజలు ఒప్పుకొనుచున్నారు. వారి జీవితాలు మార్పు చెందుటకై దేవుని యొక్క అతీంద్రయ శక్తి ద్వారా అది ఉప్పెనవలె క్రియచేయునని వారు గ్రహించితిరి. వారు ఒకరిపట్ల ఒకరు సానుభూతిని కలిగివున్నారు. వారు ఒకరికొరకు ఒకరు ప్రార్ధించుచున్నారు.
ఓ, సాతానా, దుష్టుడా, నీవే ప్రజలను రోగులుగా చేసితివి. ఈ ప్రజలను నీవు వదిలి పారిపొమ్మని యేసుక్రీస్తు నామమున మేము నీకు ఆజ్ఞాపించు చున్నాము. యేసుక్రీస్తు నామమున వారిలోనుండి బయటకు రమ్ము, వారిని వెళ్ళనిమ్ము. వారిలో నుండి బయటకు రమ్ము. యేసుక్రీస్తు నామమున. ఆమేన్.
ఇప్పుడు మీరు లేచి నిలబడండి. పైకి లేచి నిలబడండి. దేవునికి స్తుతులను చెల్లించండి. ఆయన వైపుగా మీ చేతులను పైకి ఎత్తండి. మీరు వికలాంగులైనా దాని గురించి నాకనవసరము. ఎలాగైనా పైకి లేచి నిలబడండి. మీ చేతులను పైకి ఎత్తి మరియు దేవునికి స్తుతులను చెల్లించండి.