తిరిగి వెళ్ళే మార్గము

తిరిగి వెళ్ళే మార్గము

1. మీరు కూర్చొనవచ్చు. (ఒక ప్రవచనము ప్రవచింపబడినది, టేపులో స్పష్టముగా లేదు. -సంపా.,) ఆమేన్. దానిని విని మరియు విశ్వసించి పాటించేంత వినయముగల జనులలో ఆత్మ సామాన్యతలో క్రియచేయుటను చూచుటకు చాలా అద్భుతముగా ఉన్నది. దానిని అట్లే వెంబడిస్తూ ఉండండి. ఆయన మన మధ్య ఒక క్రియ చేయును, దానికొరకు మనము కనిపెట్టుకుని ఉండాలని దేవునినుండి వచ్చిన ఆ ఉపదేశమునకు మనము ఎట్లు కృతజ్ఞతలు తెలుపగలము. మనము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుదాం.

2. నిన్న రాత్రి నేను కొంచెము ఎక్కువ సమయము మిమ్మల్ని ఉంచాను. నేను కొద్ది నిమిషముల క్రితము వచ్చాను, మిమ్ములను అలాగు నిలబెట్టి ఉంచినందుకు చింతిస్తు న్నాను. వీలైనంతమట్టుకు నేను ఈ రాత్రికి త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను.రేపు ఉదయము వాషింగ్టన్ ప్రాంతములో వ్యాపారవేత్తల అల్పాహార కూటము గలదు. ఆ కూటమునకు తగినంత స్థలము ఉన్నందున వాటి టిక్కెట్లను ఇచ్చే సహోదరుడు ఈ రాత్రికి ఆ టిక్కెట్లను కొనుగోలు చేయవలసివుండునని నాకు చెప్పెను. ఎన్ని గదులు ఉన్నవో అన్ని టిక్కెట్లను విక్రయించిన పిదపే ఉదయమున దానికి తగిన ఏర్పాట్లును వారు సిద్ధపరచవలసివున్నది. కనుక మీ టిక్కెట్లు ఖచ్చితముగా పొందుకోండని అతను చెప్పెను. ఈ రాత్రి వారు ఆ గది ముందు భాగములో ఉంటారని నేననుకుంటాను.

3. రేపు రాత్రి ప్రభువు చిత్తమైతే, నేను ఒక ప్రత్యేకమైన విషయము గూర్చి మాట్లాడాలని కోరుచున్నాను, నాకు తెలియదు, కాని దానిగూర్చి నేను ఆలోచిస్తున్నాను. అదేమనగా, "క్రీస్తులో మనకు సమస్తము ఉన్నవి" అనే అంశము. అది మనకు పరిచయమైన ఒక అంశమే. కానీ దానియొక్క కార్యము ఈ దినమున నావద్దకు వచ్చినది, కనుక ప్రభువు చిత్తమైతే నేను రేపు రాత్రి దానిగురించి మాట్లాడాలనుకుంటున్నాను.ఆపై మనకు ఆదివారము ఉదయము మరియు రాత్రి ఉన్నదని నేననుకుంటు న్నాను. ప్రభువు చిత్తమైతే, “అవరోహణ క్రమములో లెక్కించుట” అనే అంశముగూర్చి నేను బోధించాలనుకుంటున్నాను. సంఘము కదులుచూ సాగిపోవుటకు సిద్ధముగా ఉన్నది. అర్థమైనదా? "అవరోహణ లెక్కింపు”, అర్థమైనదా? “అవరోహణ లెక్కింపు”అనగా ఏమిటో మీకు తెలుసు. చూచారా? మనము ప్రస్తుతము“అవరోహణ లెక్కింపు”లోనే ఉన్నామని లేఖనములద్వారా నిరూపించగలమని నేను నమ్ముచున్నాను. కాబట్టి, ఇప్పుడు మనకొరకు ప్రార్ధించుదాం. మీరు ఆదివారము ఉదయము,రాత్రి వెళ్ళుటకు మీకు ఎలాంటి మందిరము లేకుంటే, మీరిక్కడ ఉన్నట్లయితే మేము సంతోషిస్తాము.అయితే, మీకు మీ స్వంత(మీరు వెళ్లే) మందిరము ఉంటే, అక్కడకు వెళ్ళుట మీయొక్క మొదటి బాధ్యత, మీరు అక్కడకు వెళ్తారని ఆశిస్తున్నాము, కానీ ఏ కారణముచేతనైన మీరు వెళ్లలేకపోతే, మేము మిమ్ములను ఇక్కడ కలిగి ఉన్నందుకు సంతోషిస్తాము.

4. మనము ఈ రాత్రికి త్వరగా ముగించగలిగితే, మనము ఒక చిన్న ప్రార్ధన వరుస కలిగి ఉంటామని నేను అర్ధము చేసుకున్నాను. బిల్లీ, ఇక్కడ కొన్ని ప్రార్ధన కార్డులు ఇస్తున్నట్లు చెప్పాడు. అది సరైనదని నేను భావిస్తున్నాను, అవును, అనారోగ్యముతో ఉన్నవారి కొరకు ప్రార్ధించుటకు మనకు ప్రార్ధన వరుస ఉండును. కొన్నిసార్లు, "మీరు అనారోగ్యముతో ఉన్నవారికొరకు ప్రార్థిస్తూ ఉండాలి. మీరు మరొకటి చేయుటకు ప్రయత్నించకూడదు" అని చాలామంది చాలాసార్లు నాతో చెప్పారు.కానీ ఈ మధ్య ఎవరో నాకు ఫోనుచేసి "మీరు ఎల్లప్పుడూ మహిళలను గద్దించుటనే ఎందుకు ఎన్నుకొనుచున్నారని?” అడిగెను. "లేదు, నేను మహిళలను గద్దించుటను ఎన్నుకొనుట లేదని” చెప్పాను. “మీరెందుకు స్త్రీలను వారి మార్గమున వారిని వదిలి వేయరని” అడిగెను. “అలాగే పురుషులందరిని, వారి సంస్థలను మరియు ప్రతిదానిని గూర్చి ఖండిస్తునే ఉన్నావు...” అని చెప్పెను. ఆ సహోదరుడు చాలా ప్రాముఖ్యమైన…"వారి గురించి అలాగు మాట్లాడుట లేఖనాధారమని మీరు నమ్ముట లేదా? నీవు నమ్ముచున్నావా?" అని నేను అడిగాను.అతను, “లేదు” అన్నాడు. “కాని, నిన్ను రోగులకొరకు ప్రార్ధించుటకే ప్రభువు నిన్ను పిలవలేదా?" అని అడిగెను.నేను “అవును” చెప్పాను.అతను, “అలాగైతే, నీవు దానితోనే ఎందుకు ఉండకూడదు?" అని అడిగెను.“నేను దానితోనే ఉన్నాను" అని నేను చెప్పాను."రోగులకొరకు ప్రార్ధించుటకు ఆయన నిన్ను పిలిచినట్లయితే, ఇతర విషయము లనుగూర్చి బోధకులు చూసుకోనివ్వండని" అతను అన్నాడు."కాని వారు వాటిని చేయుట లేదు" అని నేను అన్నాను."ఎందుకు చేయుట లేదు...” అని అతను అడిగెను."గనుకనే దానిని నేను చేయవలసివచ్చుచున్నది" అని నేను చెప్పాను."కాని, నాకు తెలిసిన చాలా మంది ప్రజలు... ఒక పది లక్షల మంది ప్రజలు మిమ్మల్ని ప్రవక్తగా భావిస్తారు" అని అతను అన్నాడు.“నేను ప్రవక్తను కాను” అని నేను అన్నాను.“అయితే ప్రజలు నీగురించి అలాగే భావిస్తున్నారని, వాస్తవంగా నేనుకూడా అలాగే భావిస్తున్నాను” అని అతను చెప్పెను."ధన్యవాదములు”, “ఆయన కొన్నిసార్లు రాబోయే విషయములను నాకు చూపిస్తాడు, మరి ఆయన ఇంతవరకు నాకు ఎప్పుడూ అబద్ధము చెప్పలేదు, ఆయన అలా చేయడు, ఎందుకంటే ఆయన దేవుడు గనుక ఆయన చేయడు." అని నేను చెప్పాను.“సరే, నీవు అలాంటి దేవుని సేవకుడవైతే, స్త్రీలు జుట్టు కత్తిరించుకొనుట, పొట్టి దుస్తులు ధరించుట, అలంకరించుకొనుట మరియు మొదలైనవాటిని గూర్చి ఎడతెగక కించపరుస్తూ గద్దించుటకు బదులు, ఉన్నతమైన ఆధ్యాత్మిక వరములను ఎలా పొందుకోవాలో నీవు వారికి ఎందుకు బోధించకూడదు? నీవు వారికి మేలైన గొప్ప విషయములు బోధించబద్ధులైయున్నారు, లేకుంటే వారు ఎలా గొప్ప వరములు పొందుకుని ఏదో ఒకటి చేయగలరు?" అని అతను అడిగెను.అప్పుడు నేను, “అ, ఆ, లు కూడా విని నేర్చుకొనని వారికి బీజ గణితమును గూర్చి ఎలా బోధించగలవు? మొదట వాటిని నేర్చుకున్నాక, పిదప మనము వేరొక విషయమును నేర్పుటకు ప్రారంభించుదాం" అని నేను చెప్పాను.

5. అది వినుటకు దేవ దూషణముగా... ఒక వృద్ధ దైవ సేవకుడు... (ధన్యవాదములు), ఒక వృద్ధ దైవ సేవకుడు ఒకసారి ఒక ప్రాంతములో కూటములను నిర్వహించుటకు వెళ్ళెను, మొదటి రాత్రి పశ్చాత్తాపమునుగూర్చి ప్రసంగించెను, 2వ రాత్రికూడా పశ్చాత్తా పముగూర్చి ప్రసంగించెను, అలాగు 3వ రాత్రి, 4వ రాత్రి, 5వ రాత్రి ప్రసంగించెను. పిదప ఆ సంఘ పరిచారకులు (deacons)వెనుక వైపు అతనిని కలుసుకుని, “సహోద రుడా,పశ్చాత్తాపమునుగూర్చి ఆ సందేశమును మేము ఆనందించాము. కానీ మీరు ప్రసంగించడానికి మరేదైనా అంశము లభించలేదా?" అని అడిగిరి.అప్పుడు అతను“ఓహ్, ఉన్నాయి. కాని వారందరూ ముందుగా పశ్చాత్తాపపడే వరకు వేచి ఉండండి. తర్వాత మనము వేరే అంశమును ప్రారంభిద్దామని” చెప్పెను.కాబట్టి నేను దేవుని గృహములోనికి ప్రవేశించినప్పుడు, ప్రతిదీ చక్కగా క్రమములో ఉన్నట్లు చూసినప్పుడు, ఆ తర్వాత మనము వేరే అంశమును ప్రారంభిద్దాము,మీకు అర్థమైనదా? కాబట్టి మేము... మీరు... నేను మీ ప్రార్థనను కోరుచున్నాను. ఆ విషయము లనుగూర్చి నేను చెడుగా చెప్పనని మీకు తెలుసు.నేను భక్తిపరవశముతో వున్నాను. మీరు దేవుని కుమార్తెలు మరియు దేవుని కుమారులు. కనుక మనము అలాగునే ప్రవర్తించవల సియున్నది. మనము అలాగే ప్రవర్తిస్తూ, దానితోనే ముందుకు సాగిపోవుటకు ప్రయత్నిం చాలి. నేను కొరతలను గలవాడిని, కనుక నాకొరకు మీరు ప్రార్థించాలని కోరుచున్నాను. అలాగే నేను మీకొరకు ప్రార్థించెదను. కాబట్టి మనము ఒకరికొరకు కలిసి ప్రార్థించుదాం. బహుశా,ఒకానొక దినము దేవుడు మనందరినీ ఏకముగా సమకూర్చి ఈ గందరగో ళమునుండి ఎలాగైనా బయటకు తీసుకువెళ్ళి, ఒకానొక శ్రేష్ఠమైన కార్యమగు పైకి తీసుకొని వెళ్ళుటకు మనలందరినీ సమకూర్చును. నేను ఈ పాడు రోగ గృహముతో మిక్కిలిగా అలసిపోతున్నాను. మీకు అలాగు లేదా? ఆయన వచ్చునప్పుడు ఏదోక ఉదయమున నేను ఆయనతో ఒంటరిగా ఎగురుతూ ప్రయాణించాలని కోరుచున్నాను.

6. నేను గత రాత్రి చెప్పాను జూబ్లీనిగురించి మాట్లాడిన తరువాత, అసలైన పెంతెకోస్తు వర్తమానమునకు తిరిగి రావాలనే పిలుపునుగూర్చి, మరియు ఈరాత్రి ఎలాగు తిరిగి వెళ్ళుటనే అంశమునుగూర్చి నేను కొద్దిగా మాట్లాడుటకు ప్రయత్నిస్తానని చెప్పాను. మీకు తెలుసా, ఒకరికి ఒక కార్యమును ఎట్లు చేయవలెనో నీవు చెప్పేంత వరకు, వారేమి చేయవలెననే దానిగూర్చి ఎవరికీ చెప్పనవసరము లేదు. అదే కార్యమైయున్నది.ఇప్పుడు,నేను చదవాలనుకుంటున్న వాక్యము, నేను ఇంతకు ముందు ఉపయోగిం చాను,కానీ బహుశా సరిగ్గా ఈ కోణంలో కాదు. దాన్ని సరియైన విధానంలో అమర్చి, దానిని ఈవిధముగా తీసుకొని రావాలని నేను తలంచాను. కాబట్టి, ఎలాగు తిరిగి వెళ్ళాలనే అంశముపై దీనిని చెప్పాలని నేననుకుంటున్నాను, వెలుపలికి వెళ్ళుటకు అనేక మార్గములు ఉన్నవి, కానీ తిరిగి వెళ్ళుటకు ఒకే ఒక్క మార్గము ఉన్నది.

7. ఒక సహచరుడు పర్వతములలో ఉన్నప్పుడు ఒకసారి ఇలా అన్నాడు. కొలరాడోలో లైసెన్స్ పొందిన గైడ్గా ఉన్న మరొక వ్యక్తి మరియు నేను అక్కడ ఉన్నాము. మాకు అవతలి వైపు ఒక ప్రజలగుంపు గలదు, ఒక చిన్న వ్యక్తి యాత్ర సామగ్రితో ఉన్నారు. వారు అక్కడికి కొంతమంది సభ్యులను తీసుకునివచ్చారు, అక్కడ స్వయంగా గైడ్ తప్పిపోయి, అతను అక్కడ ఎక్కడో తిరుగుతున్నాడు. అతను మేము గుఱ్ఱముపై ఎక్కడైతే ఉన్నామో ఆ చోటువరకు వచ్చి, “ఓయ్" అని పిలిచెను. నాతో ఉన్న ఈ సహచరుడు, శ్రీ. జెఫ్రీస్ గారు, ఒక రకమైన దుడుకుగా మాట్లాడే వ్యక్తి.అతను, “ఓయ్, మీరు ఇక్కడ నుండి ఎలా బయటపడతారు?” అని అడిగాడు.అప్పుడు అతను, “మీరు ఇక్కడకు ఎలా వచ్చారు? అని అడిగాడు.అందుకు అతను, “ఆ మార్గమున” అని చెప్పాడు.“అలాగైతే, అదే బయటకు వెళ్లే మార్గము”అని చెప్పాడు. కాబట్టి మరలా తిరిగి వెళ్ళుటకు మార్గము. కనుక అది అలానే ఉండును, కేవలము అలానే ఉంటాది.

8. మనము ఇప్పుడు II రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2 లేదా 3 వచనములు చదువుకుందాము. ఇప్పుడు మనము "తిరిగి వెళ్లే మార్గము” అనే ఒక వాక్యమును ఉపయోగించి ఒక అంశముగా తీసుకోవాలనుకుంటున్నాము.అహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలవారిమీద తిరుగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడ గది కిటికీలోనుండి క్రిందపడి రోగియై మీరు ఎక్రోను దేవతయగు బయల్డెబూబు నొద్దకు పోయి, ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిప్పీయు డైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను- నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము- ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్లైబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా?

9. కొద్ది క్షణముల క్రితము సహోదరుడైన మూర్ అక్కడ ఇంటర్ కామ్లో మాట్లాడుటను విన్నాను. గిలాదులో గుగ్గిలముగలదనే వాక్యముకొరకు దీనిని నేను చదవబోవుచున్నా నని అతనికి తెలియదు. నేను దానిని యిర్మీయా 8:22లో చదవాలనుకుంటున్నాను. గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? అలాగైతే నా జనులగు కుమార్తెలకు ఎందుకు స్వస్థత కలుగక పోవుచున్నది? “ఎందుకు నా జనులకు స్వస్థత కలుగకపోవుచున్నది?" అక్కడ “ఎందుకు?” అనే ఒక ప్రశ్న ఉన్నది.ఇప్పుడు, మనము ఈ గొప్ప సహవాస సమయమును కలిగి ఆనందిస్తూ, అత్యంత సంతోషముగా ఉన్నామని చెప్పుటకు నేను ఇష్టపడుచున్నాను. ఇచ్చటకు వచ్చిన ఏ వ్యక్తికూడా రక్షణ పొందని స్థితిలోనే ప్రభువు వదిలివేయడని, మరియు ఏ ఒక్కరిని పరిశుద్ధాత్మను పొందుకొనని స్థితిలోనే వదిలివేయడని, అయితే ప్రతీ ఒక్కరిని పరిశు ద్ధాత్మతో నింపి, రోగియైన ప్రతి వ్యక్తిని స్వస్థపరుచునని నేను నమ్ముచున్నాను. నేను దానికొరకు ఎదురు చూస్తున్నాను మరియు మనము దానిని నమ్ముచున్నాము.

10. ఇప్పుడు, మన పాఠ్యాంశము గత రాత్రివలె మనము ధ్యానించునట్లుగా,దేవుని నుండి దూరమైన ప్రజలతో మన కథ ఈ రాత్రినుండి మొదలవుతుంది. మరి నేను ఆలోచించగలిగిన అత్యంత దయనీయమైన విషయమేదనగా, ఎవరైనా, విశ్వాసి, దేవునికి దూరముగా ఉండుటయే. ఇక్కడ షోమ్రోను రాజైన అహజ్యా దేవునికి దూరముగా ఉండుటకు కారణమేమనగా, అతను తప్పుడు బోధలనుగలవాడై, తప్పుడు పెంపకముతో పెంచబడెనని మనము కనుగొన్నాము. అతని తల్లి ఒక అన్యురాలు, అలాగే అతని తండ్రి వెనుకకు జారిపోయిన ఇశ్రాయేలీయుడైన అహాబు. కావున అహజ్యా, ప్రభువు మార్గమున సరియైన రీతిలో పెంచబడలేదు. అక్కడ ఆ ప్రజలుకూడా...

11. దేవునికి తనకంటూ ఒక సాక్షిని ఎన్నడూ లేకుండా ఉండలేదు. ఆ దినమునకూడా దేవునికి ఒక సాక్షి ఉన్నాడు, కానీ అతని తండ్రి (అహాబు) ఈ సాక్షిని ద్వేషించాడు. ఆ సాక్షి పేరు ప్రవక్తయైన ఏలీయా. అతని తల్లికూడా ఈ సాక్షిని ద్వేషించినది. అయితే.. అది దేవునియొక్క సాక్షిగా ఉండెను, కనుక అది అలాగే స్ధిరముగా నిలిచియుండెను…దేవుడెల్లప్పుడూ ఎదోకచోట వారిని చూపిస్తూ, "వారు అలాగే ఉండెదరని”చెప్ప మనమందరం ఖచ్చితముగా వారిలో ఒకరుగా ఉండాలని కోరుచున్నాను. ఇది ప్రతి గలిగే తన ప్రజలను కలిగివుండును. ఓహ్, నేను ఆ సంఖ్యలో ఉండాలని కోరుచున్నాను.హృదయముయొక్క కోరిక. "వారు నా ప్రజలు, వారివైపు చూడండి, నేనేమి చెప్పుచున్నానో దానికి వారొక ఉదాహరణ. వారు నా జీవితమును తమ జీవితములలో ప్రతిబింభిస్తు న్నారు. వారు తమ జీవితమును అప్పగించిరి. అలాగే నా జీవితమును వారి జీవితము లలో నేను ప్రతిబింభిస్తున్నానని” దేవుడు చెప్పగలిగే ఆ జనుల సంఖ్యలో వుండుటకు కోరుచున్నాము. అదెంత రమ్యమైన విషయము! ఏమిటంటే... తనపై నమ్మకమును పెట్టగలిగే ఒక వ్యక్తి తనకు గలడని ఎరుగుట దేవునికి ఎంత మంచి అనుభూతిని కలిగిస్తుంది. తనకొరకు ఆయన ఒక వ్యక్తిని కలిగి ఉన్నాడు, అతని పేరు ఏలీయా.

12. ఇప్పుడు, ఈ మనిషిని దేవుడు ఆశీర్వదించెను. ఎల్లప్పుడూ భౌతికమైన దీవెనలను మీరు కలిగి ఉన్నంత మాత్రాన దేవునితో సరైన రీతిలోనే మీరున్నారనేది దాని భావం కాదు, ఎందుకనగా, ఆయన దుష్టులనుకూడా వర్థిళ్ళునట్లు చేసెను. కానీ ఈ వ్యక్తి తన తండ్రి మరణము తరువాత రాజు అయ్యెను, మరియు అహజ్యా తనకు ముందుండిన తన తండ్రి మరియు తల్లి దేవుని ఎదుట తప్పు చేసినట్లే అదే బాటలోనే ఇతడు పయనించెను. అతను తన ఇంటి మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై యుండెను. బహుశా, అది అతనిని లోపల గాయపరచి లోపల రక్తస్రావమైయుండ వచ్చు. లేదా అతను క్రింద పడినందువలన ఏదైనా వ్యాధి సంక్రమించి ఉండవచ్చు.అతని పక్కటెముకలు విరిగి ఉండవచ్చు, లేదా అతని ఊపిరితిత్తులు ఛిద్రమై ఉండవచ్చు. లేదా అతను ఏదో మిక్కిలిగా రోగియై ఉండవచ్చు. కనుక తాను బ్రతుకు తానా లేదాని విస్మయపడుచున్నాడు. అందుచేత తాను వెళ్ళి ఏమి చెయ్యవలెనో చేయుటకు బదులుగా, బహుశా తనకు నమ్మకమైన అంతఃపుర భటులగు కొంతమంది దూతలను అక్కడనున్న ఎక్రోనులోగల, దెయ్యము, మరియు సోదెను చెప్పే దేవతయగు బయల్టెబూబునొద్దకు తాను బ్రతుకుతానా లేదాని విచారించుటకు పంపెను.

13. దేవునిని విశ్వసించే ప్రజలకు మరియు ఆత్మ సంబంధమైన ప్రజలకు రాజుగా ఉండవలసిన వ్యక్తికి,ఇదెటువంటి మూర్ఖపు విషయమై యున్నది, అసలు వారి స్వంత నాయకుడు ఉండగా, తాను సంప్రదించవలసిన తన నాయకుడిని కాకుండా, మరొక చోట సంప్రదిస్తున్నాడు, చూడండి. అతను తప్పక ఎరుగవలసిన... అతనికి ధర్మశాస్త్రము తెలుసు, దేశములో యాజకులు, సమాజ మందిరములు, మొదలైనవి ఉన్నవి. ప్రభువు యొక్క వాక్యమును కలిగివున్న ఒక ప్రవక్తకూడా ఉన్నాడు, అతను వారిని సంప్రదించ దానికి బదులుగా అత్యంత ప్రజాదరణ పొందిన మార్గమునే ఎన్నుకొనెను.నేడుకూడా అదే కార్యము జరుగుచున్నదని నేననుకుంటున్నాను. మనము అత్యంత ప్రసిద్ధమైన మార్గమునే కోరుకుంటున్నాము. దేవుడు ఒక మార్గమును ఏర్పరచినప్పుడు ... ప్రజలు ఆయన మార్గమునుండి తొలగిపోవుచున్నారు. నేను గత రాత్రి చెప్పినరీతిగా, ప్రజలు తనవద్దకు తిరిగి వచ్చుటకు దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేసినా, ప్రజలు దానిని చేయుటకు నిరాకరిస్తున్నారు. కనుక దేవుడు "ఎందుకు?"అని అడుగుచుండును. “నీవెందుకు దానిని చేయుట లేదు?"అని ఆయనెల్లప్పుడూ దానినే అడుగుచుండును.కాబట్టి, ఆయన ఒక మార్గమును ఏర్పాటు చేసి, మనము దానిని చేయడానికి నిరాకరిస్తే, అప్పుడు ఆయన మనమెందుకు దానిని చేయలేదు? అని అడుగుతాడు. దానిని నేనెందుకు చేయలేదని తీర్పులో నన్ను అడిగేంతవరకు వేచి ఉండుటకన్నా నేను దానిని ఇక్కడే పరిష్కరించాలనుకుంటున్నాను. కొంతమంది మనుష్యుల పాపములు వారి ముందు వెళ్తాయి, మరికొందరి పాపములు వారిని వెంబడించును. కాని నేను నా పాపములను ఒప్పుకుని నాకంటే ముందు వెళ్ళుటకు కోరుకుంటున్నాను, ఆ తర్వాత, ఆ సమయము వచ్చినప్పుడు నేను సరియైన రీతిలో ఉండుటకుకోరుదును.

14. ఒక వృద్ధ నల్ల జాతి సహోదరుడు, "మీకు తెలుసా, చాలా కాలము క్రితం, నేను ప్రభువుతో మాట్లాడాను, నా మార్గము స్పష్టముగా ఉండాలని, నేను నదికి అవతలి గట్టుకు వచ్చునప్పుడు నేనెలాంటి ఇబ్బందిని ఎదుర్కొనుటకు కోరుటలేదని ఆయనకు చెప్పానని" చెప్పెను. కాబట్టి, మనమందరముకూడా ఆవిధముగానే భావించెదమని నేననుకుంటున్నాను. ఆ నదికి అవతలి గట్టువద్ద మనమెలాంటి ఇబ్బందులను ఎదుర్కొ నుటకు ఆశించమనే భావమును అది వ్యక్తపరుచును. ఎందుకనగా, ఆ సమయమున బలవంతముగా త్రోయబడునట్లు మరియు నెట్టబడునట్లుగా అనుభూతిచెందే ఒక భయంకరమైన సమయము ఆసన్నమగును. కాబట్టి మనము సరియైన మార్గమున ఉన్నామో లేదోనని నిర్ధారించుకోవాలసి యున్నది.

15. ఈ రాజు, విషయములను ఎరుగుటకు ఒక మార్గమును ప్రభువువద్ద నుండి అతనికి ఇవ్వబడినది. కానీ అతను దానిని చేయుటకు నిరాకరించెను. కనుకనే దేవుడు సిద్ధపరచిన తన మార్గమగు, అనగా, ఆయన తన ప్రవక్తను రంగంలోకి తీసుకొని వచ్చెను. బుగ్గ మీసాలు, బట్ట తలగల, ప్రజలలో అంతగా గౌరవములేని ఈ వ్యక్తిని,ఈ రాజుకూడా అసలు పట్టించుకోలేదు. అతని వర్తమానము ఎల్లప్పుడూ తన చుట్టూవున్న ప్రజలను ఖండిస్తూ, గాయపరుస్తూ, వారిని తరిమికొట్టునట్లుగా ఉన్నది. ఎందుకనగా, అతనొక ప్రవక్తగా ఉండుటవలన అంతకంటే అతను వేరేమీ చేయలేడు. ప్రభువుయొక్క వాక్యము ప్రవక్తవద్దకు వచ్చును, ప్రవక్త ఆ వాక్యమందే నిలబడాలి, అతను దానిని మాత్రమే చేయవలెను. వాక్యమునకు లోబడనప్పుడు, గద్దించుట తప్ప వేరే దారి లేదు.కాబట్టి, తాను కఠినంగా ఉండాలనేది తన భావము కాదు. అతనలాగు చేయుటతప్ప వేరేమి చేయలేడు. ఎందుకనగా అతను తన స్వంత ఆలోచనలచేత పరిపాలించబడుట లేదు, కాని అతను దేవునియొక్క ఆత్మచేత పరిపాలించబడు చున్నాడు. అలాగే మనమం దరముకూడా దేవునియొక్క ఆత్మచేత పరిపాలించబడవలెను. మనము అలాగున్నట్లైతే, మనము పాపమును చూచినప్పుడు, అది మనకు రోగమును కలిగించుచున్నది. దానిని గూర్చిన విషయము ఏదోకటి ఉన్నది. నరుల చెడుతనము గొప్పదనియు, తాను భూమిమీద నరులను చేసినందుకు దేవుడు సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకనగా పాపము భూమిమీద మిక్కిలి భయంకరముగా ఉన్నది.

16. కాబట్టి అతను అడిగెను... దానిని తెలిసికొనుటకు దేవుడు అతనికొక మార్గమును పెట్టాడు, కానీ అతను ఆ మార్గమును తీసికొనలేదు. అక్కడ ప్రజలలో ఉన్న అత్యంత ప్రసిద్ధిచెందిన మార్గమును అతను వెంబడించెను. నేను దీనిని చెప్పడానికి అసహ్యించు కుంటున్నాను, కానీ ఎప్పుడూ "అమెరికా దేవునివైపుకు తిరుగుచున్నది,” “దేవుని గడియకు తిరిగి వచ్చినది” అనే నినాదాలు మరి అలాంటి వాటిని మనము చూస్తూనే ఉంటాము. కానీ దానిలోవున్న విషయము ఏమిటంటే, దేవునివద్దకు వారు తిరిగి వచ్చుటకు మానవ కల్పిత మార్గములోనే వారు తిరిగి రావాలని కోరుచున్నారు. వారు తమ స్వంత ఆలోచనా విధానములోను, వారు కోరుకునే స్వంత మార్గములోనే తిరిగి రావాలని కోరుచున్నారు. అయితే సాధారణముగా ఇది దేవుని యొక్క తిరిగి వచ్చే మార్గమునకు విరుద్ధముగా ఉంటుంది. ఆపై, వారు దేవునివద్దకు తిరిగి రావడానికి దేవుడు ఇచ్చిన మార్గమును తిరస్కరించినప్పుడు, అప్పుడు దేవుడు వారిని, "ఎందుకు? ఎందుకు నీవు ఆవిధముగా దానిని ఆ మార్గమున చేసావు?" అని అడుగును.

17. ఇప్పుడు, మనము... ఒక సమయమునకు పిలుపు ఇవ్వబడునట్లు... ఒకప్పుడు అధ్యక్షులుగా ఉండేవారు, “పదిహేను నిమిషాల ప్రార్థనకొరకు మనము పిలుద్దాం”అని చెప్పేవారు. ఆ సమయమున యంత్రములన్నీ ఆగిపోయేవి. అది ఎప్పటికీ క్రియచేయదు. ఆ ప్రార్ధన ఒక కదిలింపును తీసుకొని రావాలి, అది ఒక మరణమునుండి వెలుపలికి తీసుకొని రావలెను, అది ఒక పునరుజ్జీవమును తీసుకొని రావలెను. అది ఒక గంట ప్రార్థనలో తీసుకొని రాలేదు, ఆ ప్రార్థన మీరు తిరిగి వచ్చేంతనట్లుగా ఉండవలెను. అలాంటి ప్రార్థనే మిమ్మల్ని తిరిగి తీసుకునివచ్చును, అదే విశ్వాసముయొక్క వాస్తవాలకు తిరిగివచ్చునట్లు చేయును. అదేదో మీరు ఊహించిన విషయమో లేక మత సంబంద మైన సంప్రదాయముల వైపుకు లేదా మానవ కల్పనా విధానముల వైపుకు తిరిగునట్లు కాదుగానీ, అది క్రీస్తుని స్వయముగా తెలిసికొనుట ద్వారా తిరిగి వచ్చునట్లు చేయును.ఆయనను ఎరుగునట్లు చేయును. వాక్యమును మాత్రమే కాదు, మీరు ఆయనను ఎరిగితే, మీరు ఆయన వాక్యమును ఎరుగుదురు. ఎందుకనగా ఆయనే వాక్యమై యున్నాడు. అప్పుడు, మీరు ఆ వాస్తవమునకు తిరిగి రావాలసినవారైయున్నారు.

18. దేవుడు తన ప్రజలద్వారా తననుతాను వ్యక్తపరచుకోవాలని కోరుచున్నాడు, అయితే సంఘము, పెద్ద సంఖ్యలో సభ్యులను చేర్చుటకు, పెద్ద గుంపులను సమకూర్చుటకు, ధనవంతులను, మంచి వస్త్రములను ధరించినవారిని చేర్చుకొనుటలో, మొదలైనవాటి ద్వారా ప్రజలకు తనను ప్రత్యక్షపరచుకోవాలని కోరుచున్నది. అదే మనము ఇప్పుడున్న గందరగోళములోనికి మనలను తీసుకుని వచ్చినది. మనము గోనె పట్టను ధరించుకొని ఉండినయెడల బాగుండునేమో, మనకు ఉద్యోగం లేకుండా, ఒకరి గృహమును ఒకరు దర్శించుచు... భుజించుటకు ఏదైనా ఆహారము దొరుకునానే స్థితిలో మనముంటే బాగుండునేమో, చక్కని నాజూకుగా ఉంటు, విలువైన వస్త్రములను ధరించికొని, గొప్ప కార్చములను కలిగియుండి, ఆపై ఆత్మలో చచ్చినవారివలె ఉండుటను చూచుటకంటే, సంఘము ఆత్మతో నింపబడిన స్థితిలో ఉండుటనే నేను చూడాలనుకుంటున్నాను.

19. దేవుడు ఒక మార్గమును ఏర్పరచగా, మనము దానిని తిరస్కరించెదము. మనము తిరిగి వచ్చుటకు ఆయన మనకు సిద్దపరచిన మార్గములో మనము తిరిగి వచ్చుటలేదు. అహజ్యా దానినే చేసెను. నేడు మనలో అనేకులు ఉన్నట్లే అతనుకూడా వుండెను. అతను చాలా మొండివాడు. అక్కడ అరణ్యములో ఏలీయా ఉన్నాడని తెలిసినప్పటికీ, అతను అచ్చటకు వెళ్ళాలని కోరుకొనలేదు. పరలోకములో దేవుడున్నాడని అతనికి తెలుసు,కాని అక్కడున్న ప్రజలందరు వెళ్ళుటకు ఆశించే మార్గమున, మరియు అత్యంత ప్రసిద్ధిచెందిన మార్గమునే వెళ్ళాలని అతను కోరుకొనెను. (అక్కడ వారికున్న ప్రవక్తినిద్వారా, అహాబు యొక్క భార్య యెజెబెలుద్వారా, ఆమె అన్యురాలు. ) వారు ఎక్రోనులోనున్న దేవతలలో ఒకదానివద్దకు వెళ్లి రాజు మరలా బాగవ్వునాని అడుగుటకు కోరుకొనిరి. ఎందుకనగా, అతనొక రాజైయుండి, తనను తగ్గించుకొని జనులలో ప్రసిద్ధిలేని ఒక కార్యముతో తనను జతపరచుకొనుటకు ఇష్టపడలేదు. అదే అక్కడున్న అసలైన సమస్యకు కారణము.

20. నేటి మన స్త్రీలు చేస్తున్న తీరుతో అదే ఇబ్బంది. దానికిగల కారణమేమనగా... పురుషులు క్రైస్తవ్యమునుగూర్చి మాట్లాడేటప్పుడు, "నేను ఫలానా-ఫలానా దానికి చెందినవాడినని” చెప్పెదరు. దానికి, క్రైస్తవ్యమునకు ఏ సంబంధము లేదు. నేనొక నిర్దిష్ట సంస్థకు చెందినవాడిని కావచ్చు. అయినప్పటికీ మీరు క్రైస్తవులని అర్ధముకాదు. క్రైస్తవ్యమనగా ఏదోక దానిలో చేరుటని అర్ధం కాదు. క్రైస్తవ్యమనగా ఒక కుటుంబమై, ఆ కుటుంబములో జన్మించుటయగును. మీరు జన్మించుటద్వారానే క్రైస్తవులగుదురు.అయితే "నేను మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు లేదా మరేదైనా, నేను ఇది లేక అది" అని చెప్పుటయే అత్యంత ప్రసిద్ధి పొందినది. కాని "నేను దేవునియొక్క ఆత్మతో తిరిగి జన్మించాను. పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చెను, కనుక నేను క్రీస్తులో ఒక నూతన సృష్టియైతినని" చెప్పుట లేదు, అయితే ఇదే అసలైన మార్గమైయున్నది. కాని రాజేమో ప్రజాదరణ కావాలని కోరుకొనెను, మరి ఈ దినమున ప్రజలుకూడా అదే మార్గమునే ఎన్నుకొనుచున్నారు. వారు దేశవ్యాప్తముగా ఉజ్జీవ కూడికలు జరిపించవచ్చు. అనేక సంవత్సరములుగా కొన్ని లక్షలకంటే ఎక్కువ నినాదములు చేస్తూ, లేదా వారి సభ్యత్వములను, పాండిత్యమును, మరి ఇంకా ఏదైనా పెంచుకోవచ్చు. అది ఎప్పటికీ, ఎప్పటికీ... మీరు ఎల్లప్పుడూ ఇంకా చాలా దూరముగానే తొలగిపోవుచున్నారు. తిరిగి వెళ్ళే మార్గము... దేవుడు తిరిగి వెళ్ళే మార్గమును కలిగి ఉన్నాడు. నేను ఆ తిరిగి వెళ్లే మార్గము గురించి మీతో మాట్లాడనుకుంటున్నాను. మీరు తిరిగి రావడానికి దేవుడు మీకొరకు సిద్దపరచిన మార్గములోనే మీరు తిరిగి రావలెను.

21. ఇప్పుడు, ఒక్కక్షణం ఈ రాజు గురించి మాట్లాడుకుందాము. అతను ఆ తిరిగి వచ్చే మార్గమును కోరుకొనలేదు. ఎందుకనగా, అతను మొండిగా ఉండుటవలన అలా చేయలేదు... అతను ఇతర ప్రజలవలె ఉండాలని కోరుకున్నాడు. అతను తన స్వంత మార్గములను గలవాడై, తన మార్గములోనే వెళ్ళాలని కోరుకొనెను. మరియు అతను ప్రజాదరణ పొందిన మార్గములోనే తిరిగి రావాలని కోరుకొనెను.దేవుడు తనకొరకు సిద్ధపరచిన మార్గమును వెంబడించుటకు అహజ్యా ఇష్టపడ లేదు, కనకనే అతను ఆ ప్రవక్తను అలక్ష్యం చేసెను. మరి ప్రవక్త ఏమని చెప్పుననగా, "పశ్చాత్తాపపడి, దేవునితో సమాధానపడుము. నీవు రాజుగా ఉండుటకు తగినవాడివి కావు" అని నిస్సందేహంగా ప్రవక్త అతనికి ఘాటుగానే చెప్పియుండును ఓహ్, ఒక రాజుగా అది ప్రజల ముందు అతని ఈకలన్నింటిని పీకివేసినట్లయ్యెను, అర్థమైనదా?. అయ్యో! ఆ మాటలను అహజ్యా జీర్ణించుకోలేక పోయెను.

22. కాబట్టి, బహుశా అక్కడ ఉండే దెయ్యము మరియు దేవతా విగ్రహము "ఓహ్, నీవు గొప్ప రాజువి, డాక్టర్. మరియు ఫలానా ఫలానా, అసలు నీవు..."అని డంభపు మాటలు చెప్పియుండును. అర్థమైనదా? అహజ్యా, ప్రజలలో ప్రసిద్ధిచెంది ఉండి,గొప్ప ప్రసిద్ధమైన పేరును కలిగి ఉండవచ్చు. ఓ, ప్రజలు ప్రశంసలవంటి విషయములను ఎంతో ఇష్టపడతారు! అతను దేనిని పొందాలో దానిని పొందితే, ప్రజల ముందు హెచ్చించబడగలనని, ప్రజల ముందు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఉందునని అతను తలంచెను. మరి మీరు నా ఉద్దేశమును పంక్తుల మధ్య చదువగలరని నేను ఆశిస్తున్నాను.కాబట్టి, అప్పుడు అతను తానొక గొప్ప వ్యక్తినని తలంచి, తనకు సత్యమును చెప్పే వ్యక్తివద్దకు తనను తగ్గించుకొని వచ్చుటకు మనస్సులేదు. ఆ ప్రవక్త ఎల్లప్పుడూ తనపై ఏదోక తప్పునే మోపుచున్నాడని వాస్తవముగా అహజ్యా తలంచెను. కాబట్టే అతను తన పనివారిని పిలిచి "మీరు ఎక్రోను దేవతయగు బయల్డెబూబునొద్దకు వెళ్ళి నేను ఈ వ్యాధి పోగొట్టుకొని స్వస్థపడుదునో లేదో విచారించుడని" చెప్పెను.ప్రభువైన దేవుడు ప్రతి మనిషియొక్క హృదయమును ఎరిగియున్నాడు. ఆయన ఉద్దేశములనుకూడా ఎరిగినవాడు. మీరు దేవునియొద్ద దేనిని మరుగుచేయలేరు. లేదండీ. “నీవు వెళ్ళి మార్గములో వారిని ఎదుర్కొని, ఇలాంటి ఒక కార్యమును చేయుటకు ఎందుకు అతను తలంచెనని వారిని అడుగుము. ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొనెనా? ఇచ్చట ఆయనకు ఒక ప్రవక్తనేవాడు లేడనుకొనెనా? ఇవేమి ఇచ్చట లేవని అతను తలంచెనా? అసలు అతను ఇశ్రాయేలీయుడైయుండి కూడా అక్కడికి వెళ్లి విచారించాలనే తలంపు అతనికి ఎలాగు కలిగెను?" అని ఆయన అడగమనెను.

23. ఆ స్త్రీలను, పురుషులను, ప్రజలను మూల పునాదికి తిరిగి తీసుకొని వచ్చుటకు బదులుగా, వారిని సంఘశాఖల సహవాసము క్రింద సంఘ సంస్థల సభ్యులుగా పరిగణించుటకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో నేను ఆశ్చర్యపోతున్నాను. దేవునికి దానిని గూర్చి తెలుసు, కానీ అది మిక్కిలి ప్రఖ్యాతిగాంచిన మార్గము. "నేను ఫలానా- ఫలానాకి చెందినవాడిని. నేను ఫలానా ఒక ప్రత్యేక సంస్థకు చెందిన డాక్టర్ ఫలానా ఫలానా. నేను పర్డ్యూ విశ్వవిద్యాలయము నుండి వచ్చాను. నాకు ఫలానా ఫలానా పట్టములను గలవాడిని, మరియు నేను Ph.D., LL.D.,ని కూడా పొందాను. "అవేవి కూడా దేవునికి అసలు పనికిరావు, వాటివలన ఏ ప్రయోజనము లేదు. ఏలీయాకు LL.D., లేదా Ph.D.,వంటి పట్టములు ఉండకపోవచ్చు. నిజము చెప్పాలంటే, అతనిగూర్చి మనకు ఏమీ తెలియదు. అతను సన్నివేశములోకి ఎట్లు వచ్చెనో అలాగే సన్నివేశమునుండి వెళ్ళిపోయెను. అతని తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు, అతనిగురించి ఏమీ తెలియదు. అయితే అతని గురించి దేవునికి తెలుసు. ఆయనకొరకు ఉపయోగించకోగల ఒక వ్యక్తిని మరియు దేనికి భయపడని ఒక వ్యక్తిని ఆయన కనుగొనెను. రాజ్యము మొత్తము అతనికి వ్యతిరేకముగా ఉన్ననూ, దానిని అసలు అతను లెక్కచేయకుండా, అతను ఇప్పటికీ నలుపును, "నలుపు", తెలుపును, "తెలుపు" అనే ధైర్యముగా చెప్పును. దేవా, మాకొరకు మరొకరిని పంపండి! అది నిజము. దేనికి భయపడని ఒకరిని మాకు పంపండి. మనుష్యుల గౌరవము మరియు ప్రశంసలు పొందవలసిన అవసరము లేని వ్యక్తిని, దేవుని వైపు మాత్రమే చూసే మరియు దేవునిని విశ్వసించే మరియు సత్యమును మాత్రమే మాట్లాడే ఎవరైనా ఒకరిని మాకు పంపుము. ఆ వ్యక్తే దానిని చేయగలడు, దేవుడు ఆ సత్యమును సత్యమని ఋజువుపరుచును.చెప్పండి?ఎక్రోనుయొక్క దేవత చేయగలడా? ఏలీయా చేసిన కార్యములను ఎక్రోను 24. ఏ మనిషి తన ప్రార్ధనా దినములలో ఆకాశమును మూసివేయగలడో నాకు దేవత చేయగలడా? నిశ్చయముగా చేయలేడు. జీవము గలిగిన దేవుడు ఏలీయాతో నిజమైన ఇలాంటి కార్యమునకు తననుతాను తగ్గించుకోకూడదనుకునేంత మొండి ఉన్నాడని అక్కడ చూపించెను. కానీ ఈ అహజ్యా బిగుసుకుపోయి, డంభముగలవాడై, వానిగా ఉండెను. కాని ఏలీయా నడుము కట్టుకుని, అక్కడికి వెళ్లి దారిలో నిలబడెను. ఈ పాత గొంగళితో కనిపించే వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు, ఇతను మత గురువులు ధరించే కోటు మొదలైనవి ధరించలేదు. కానీ అతను రోమముల ముఖము కలిగినవాడై, మరియు బహుశా అతని బట్టతల సూర్యరశ్మికి కమిలిపోయి ఉండవచ్చు, అతని వెంట్రుకలు వేలాడుతూ అంటుకుని ఉండవచ్చు. ఒకవేళ అలాంటి రూపముగల అతను మీ ఇంటి ద్వారము ఎదుట అడుక్కుంటూ ఉంటే మీరు అతనిని తరిమివేసెదరు. అతను అక్కడికి వచ్చి అలానే దారిలో నిలబడి యున్నాడు.అతను ఒళ్లంతా రోమములతో, నడుముచుట్టూ తోలు దట్టీ కట్టుకుని ఉన్నాడని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. అది మత గురువులు ధరించే కోటు కాదు, అతను ఏ సహవాసమునుండి వచ్చెనో చూపించుటకు ఏలీయావద్ద ఏ యోగ్యతా పత్రములు లేవు. కాని,సహోదరుడా, అది అతని హృదయాంతరంగములో ఉన్నది,అతను దేవునితో సహవాసములో ఉండెను,ఎట్లనగా, అతను “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" కలిగియున్నాడు. అదియే తిరిగి వెళ్లే మార్గము. అతను “ప్రభువు ఈలాగు సెలవిచ్చు చున్నాడు" కలిగియున్నాడు. చూడటానికి అతని దగ్గర పెద్దగా ఏమి లేకపోయినా, ఆ చిన్న వృద్ధ సన్న శరీరమున దేవుడు నివసించే హృదయము కొట్టుకొంటూ ఉన్నది.

25. అతను చేతులు కట్టుకుని దారిలో నిలబడి, వారి రాకకొరకు ఎదురుచూస్తూ సరిగ్గా అక్కడే నిలబడి ఉండెను. వారు అక్కడకు రాగానే, బహుశా వారి మార్గమున అడ్డుగా ఏలీయా నిలచి, “తిరిగి వెళ్ళండి, వెనక్కి వెళ్లి అతనిని ఇలాగు అడగండి,నీవు ఇటువంటి కార్యమును ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఇశ్రాయేలులో దేవుడన్న వాడు లేడనుకున్నావా? ఈ విషయములను సంప్రదించుటకు అతనికి ప్రవక్త లేడా? అతను ఈవిధముగా చేసినందువలన, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు అతను ఎక్కిన మంచము మీదనుండి దిగిరాడని అతనికి చెప్పండి" అని వారికి చెప్పెను.

26. ఓ,దేవా! దానిగూర్చి ఎవరైనా ఏదైనా చేయగలిగినప్పటికీ, దేవుడు తన మార్గము లోనే క్రియ చేయును, దేవుడు దానిని చేయబోవుచున్నాడు. ఆయన దానిని తనదైన మార్గములోనే చేయబోవుచున్నాడు. మనము దానిని ఎట్టి పరిస్థితులలోను అడ్డుకోలేము. అసలు మనము దానిని ఆటంకపరచలేముకూడా, అవును. ఆయనెలాగైనా చేయబోవుచున్నాడు. ఆయన తనకంటూ ఒక సంఘమును కలిగి ఉండును. ఆయన చేయలేడని ఎవరు చెప్పినా దానిని నేను పట్టించుకోను. ఎంతమంది అవిశ్వాసులు లేచినా, దేవుడు ముడత, కళంకము లేని ఒక సంఘమును కలిగి ఉండబోతున్నాడు. అలాంటి సంఘము అచ్చట ఉండును. ఆయన చేసితినని చెప్పెను, కనుక అది అక్కడ ఉండబోవుచున్నది. దానిలో పాలిభాగస్థులమగుటకు మనము ప్రయాసపడుదాము, అదే కావలసియున్నది.ఆయన దేశమంతటా సువార్తను ప్రకటించుటకు బోధకులను పంపవచ్చు. ప్రతి ఒక్కరూ వారిని తిరస్కరించవచ్చు, చెరసాలలో పడవేయవచ్చు, పట్టణమునుండి తరిమివేయవచ్చు. అయినా ఆయన తనకంటూ ఒక సంఘమును కలిగే ఉంటాడు. “దేవుడు ఈ రాళ్లతో అబ్రాహామునకు పిల్లలను పుట్టించగలడు" అని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పెను. దేవుడు ఇప్పటికీ దేవునిగానే ఉన్నాడు. ఆయన చేయగలడు…సంఘము మత్తీయను ఎన్నుకొనిన విషయములో పొరపాటు చేసినప్పుడు, దేవుడు, కొంచెం పొడవాటి ముక్కుగల, ముక్కోపియైన యూదుడగు పౌలును తీసుకుని “నేను అతనితో ఏమి చేయబోతున్నానో మీకు చూపించెదననిని" చెప్పెను. ఆయన అతనిని వారందరిలో ఒక గొప్ప అపొస్తులుడుగా ఏర్పరచుకొనెను. ఎందుకనగా, అది దేవుని యొక్క క్రియయైయున్నది, కావున అది ఏదోక కార్యమును చేసెను.

27. ఈ ప్రవక్త ప్రభువు నామమున పలికి, వారిని వెనక్కి పంపించుటను మనము చూచాము. కనుక రాజు, "మిమ్మును నిలిపినవాడు ఏలాటివాడని?" అడిగెను. అందుకు వారు, "అతనొక వింత వ్యక్తివలె కనిపిస్తూ, గొంగళి ధరించుకుని, నడుముకు తోలుదట్టి కట్టుకొని ఉన్నాడని” చెప్పిరి. "ఆ వ్యక్తి తిప్పీయుడైన ఏలీయాని" అతను చెప్పెను. అతని దినములు దగ్గర పడ్డాయని, ఏదో తప్పు జరిగెనని అహజ్యా ఎరిగెను. ఆ ఏలీయా తిరిగివచ్చి, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు ఎక్కిన మంచము మీదనుండి. దిగిరాడని అతనికి చెప్పుడని" చెప్పెను. ఓ, దేవా, ఆ మాటతో అది స్థిరపరచబడినది.

28. నేడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదెలా ఉంటుందంటే, ఒక రోగి వైద్యుడి దగ్గరకువచ్చి, ఆ వైద్యుడివద్ద రోగికి కావలసిన నివారణ మందు ఉండికూడా, ఆ మందును తీసుకొను టకు ఆ రోగి నిరాకరించినట్లున్నది, వైద్యుడు యిచ్చిన మందును ఆ రోగి నిరాకరించు నంత వరకు, దానినుండి బాగవుటకు అవకాశము ఉండికూడా ఆ వైద్యుడి వద్దనే అతను మరణించవచ్చును. అతను ఆ నివారణను తిరస్కరించడమే దీనికి కారణము.కాబట్టి సంఘములో అదే కార్యము జరుగుచున్నది. ఇప్పుడు వారు బలిపీఠము వద్దకు వచ్చికూడా పాపులుగా చనిపోవుచున్నారు, అవిశ్వాసులుగా చనిపోవుచున్నారు. ఇది దానికి నివారణ లేనందువలన కాదు. గిలాదులో గుగ్గిలము గలదు. కానీ అది ప్రజల స్వంత మొండి పట్టుదలవంటి చిత్తమైయున్నది. అచ్చట పరిశుద్ధాత్మ సమృద్ధిగా యున్నది, కాని ప్రజలే దానిని కోరుకొనుటలేదు.
29. రోగికి వైద్యుడు అవసరమైయున్నదని యేసు చెప్పెను. కాని వైద్యుడు వచ్చినప్పుడు రోగి వైద్యుడిని అంగీకరించనియెడల, అప్పుడు వైద్యుడు అతనికి ఏ మంచి చేయగలడు?మనకు వైద్యుడు అవసరమైయున్నాడు, అలాగే రోగి అతని ఔషధమును స్వీకరించవల సిన అవసరమున్నది. ఎందుకనగా, ఇది అనారోగ్య ప్రపంచము, అనారోగ్య కాలములో అనారోగ్యముతోవున్న సంఘము. అది నిజము. కాబట్టి, వైద్యుని గుమ్మములో కూర్చుని రోగి మరణించినట్లయితే, నివారణకొరకు అక్కడ ఔషధము ఉన్నదని అతను నిరూపిస్తే ఇప్పుడు మీరు వైద్యుడిని నిందించలేరు. అతను బాగవుటకు ఔషధము అక్కడున్నది, లోపల అతనికి కావలసిన నివారణ ఉన్నా, రోగి అచ్చటే కూర్చొని ఉండి, "నేను, అక్కడికి వెళ్ళదలచుకో లేదు.” ఎందుకని? అచ్చట రోగ నిరోధన ఔషధము గలదుకదా!

30. సరే, మీకు ఒక నిర్దిష్టమైన వ్యాధి గలదు. అతను ఆ వ్యాధిని నిరోధించే ఔషధమును అరలుగల బీరువా నిండా అమర్చి ఉంచెను. అది ఆ వ్యాధిని తరిమికొట్టే విషపూరితమైన ఔషధము. స్వస్థతను పొందిన ఇతరులు ఇక్కడ ఉన్నారు, వారిని చూడండి, వారికి ఆ వ్యాధి ఉండెను, కాని వారికి ఇక ఆ వ్యాధి లేదు. వైద్యునిదగ్గర చాలా ఔషదములు సమృద్ధిగా ఉన్నవి. మీరు అచ్చటకు వెళ్ళి, అచ్చటే కూర్చొని, “సరే, నేను ఇంత దూరము వచ్చాను. నేను స్వస్థత పొందాలని అతను కోరుకుంటే, అతనే ఇక్కడకు వచ్చి ఆ పని చేయనివ్వండి" అని చెప్పిన, ఓహ్, లేదు. లేదు, అది కాదు. మీరు అక్కడిక్కడే చనిపోయెదరు. కాబట్టి అది వైద్యుని తప్పు కాదు. అది ఔషధము కొరత కూడా కాదు. ప్రజల స్వంత మొండి పట్టుదలవలనే ఔషధమును తిరస్కరిచుచున్నారు.కనుక సంఘముకూడా అలాగే ఉన్నది. మనకు అనేక లేఖనములు ఉన్నవి,సంఘ మును చక్కదిద్దే కార్యము మనకు ఉన్నది. యాభై సంవత్సరముల క్రితమువున్న అదే స్థితికి మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్ళేదికూడా మనవద్ద గలదు, కాని మీరే దానిని తీసుకోవాలని కోరుకోవలసియున్నది. మీరే స్వస్థత పొందుకోవాలని ఆశించాలి, ఈ వ్యాధులను బాగుచేయునది మనవద్ద ఉన్నది, ఈ ఆధ్యాత్మిక వ్యాధులను నిరోధించే ఔషధము - దానిని మీరు తప్పక కలిగి ఉండాలి.

31. ఇప్పుడు ఇదొక ప్రమాదకరమైన విషయము. మన దేశములో ఇప్పుడే పోలియో వాక్సిన్ను కలిగివున్నాము. ఈ భయంకరమైన పోలియోనుండి తప్పించుకోనుటకు యువకులు, పెద్దలు అందరూ పోలియో చుక్కలను వేసుకోవాలని వారు చెప్పుచున్నారు. కనుక ప్రతి ఒక్కరూ, వేలాదిమంది వాటిని వేసుకొనుటకు వెళ్ళిరి.వారు దానినెలాగు వేసెదరు? మీరు చూడండి, వైద్యులు ఆ మందులను ఎట్లు ఉపయోగించెదరనగా... మీకు తెలుసా, అది కొంతమందికి పని చేస్తుంది, కాని అది కొందరికి పని చేయదు. ఎందుకనగా, మీకు తెలుసు అది అందరికి ఒకేలాగా క్రియచేయదని మీకు తెలుసు.ఇప్పుడు మన దగ్గర ఈ పెన్సిలిన్ అనే మందు ఉన్నది. నేను నా జేబులో ఒక కార్డును పెట్టుకొని వెళ్తాను. తద్వారా నాకు ఎప్పుడైనా ప్రమాదము జరిగితే, వైద్యుడు నాకు పెన్సిలిన్ మందు వేయకూడదు. అది నన్ను చంపివేయును. కాబట్టి, ఇది కొంత మందిని చంపుతుంది మరియు కొంతమందికి సహాయము చేయును. ఎందుకనగా, ఈ మందు ప్రజలందరిపై ఒకేలాగ పని చేయదు.

32. వారు ఈ మందు(serum)ను ఎట్లు కనుగొనెదరో మీరెప్పుడైనా ఆలోచించారా? వారు దానినెలాగు చేసెదరనగా, వారు పుస్తకాలను చదువుచు, రసాయన శాస్త్రవేత్తలు వెళ్లి కొన్ని సూక్ష్మక్రిములను తీసుకొని, ఒక ఫార్ములాను కనుగొనువరకు వివిధ విషము లను కలుపుతారు. అది రోగిని చంపదు, కాని సూక్ష్మక్రిమిని చంపును.వారు పనిచేసే విధానమదే. అప్పుడు ఆ మిశ్రమమంతటిని వారు కలిపి తీసుకొని, అదెట్లు క్రియచేయు చున్నదో కనుగొనుటకై వారు వెళ్లి ఒక సీమ పందిని తీసుకొనెదరు. ఒక పొడవాటి సూదిని తీసుకొని, ఆ మందును సీమ పందిలోనికి ఎక్కించి, ఆ మిశ్రమమును పూర్తిగా దానిలోనికి నింపుతారు. పిదప ఆ సీమ పంది బ్రతికినట్లయితే, వారు దానిని మీకు ఉపయోగించి,ఆ వ్యాధినుండి మీరు బాగవుతారో లేదో కనుగొనెదరు. సరే, ఇప్పుడు, అదంతా మంచిదే. వారు గొప్ప కార్యములు చేశారు, అర్థమైనదా? వారు దానిని ప్రజలపై ఉపయోగించి అది ఎలాగు పని చేయాలో వారు కనుగొనే విధానమదే.ప్రతి ఒక్కరూ సీమ(guinea)పందివలె తయారుచేయబడలేదని మీరు కనుగొ న్నారు,కాబట్టి అది అందరిపై పనిచేయదు. కానీ నేను మీకు ఒక విషయము చెప్పాలను కుంటున్నాను, దేవునియొక్క టీకాలు అందరిపై పనిచేస్తాయి. ఇది ప్రతి ఒక్కరిపై పని చేస్తుంది. ఇది తీసుకున్న ప్రతి ఒక్కరికి సహాయము చేయును.

33. "గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? అక్కడుంటే, మరి నా ప్రజలగు కుమార్తెకు ఎందుకు స్వస్థత కలుగలేదు? నా కుమార్తెయొక్క అనారోగ్యము, బలహీనత ఇంకా అట్లే ఉన్నదికదా?" అని దేవుడు ప్రశ్నించుచున్నాడు. ప్రజలగు నా కుమార్తెనగా, అది ప్రాచీన సంఘము. ఆయన సూటిగా మనతో మాట్లాడు చున్నాడు. “నా ప్రజలగు కుమార్తె తన అనారోగ్యము నుండి స్వస్థతను పోందుకోలేక పోవుటకు, మన మధ్య వైద్యుడు లేడా? లేక మన దగ్గర లేదా లేదా... అతనివద్ద రోగమును నిరోధించే ఔషధము లేదా? గుగ్గిలము లేదా? వైద్యుడు లేడా?"

34. నేడు మన వైద్య శాస్త్రముద్వారా చెప్పబడిన విషయములకొరకు, అందుకొరకై మనము ఎంతగానో అభినంధిస్తున్నాము. మనకు ఇలాంటి పలురకాల బలహీనతలు ఉండి,ఈ టీకాలను తీసుకొనుటలో మనము విఫలమైతే, అది ప్రమాదకరమైనదగును. మీరు దానిని తీసుకొనకపోతే మీరు మీ ప్రాణమును కోల్పోవచ్చు.మనము పాపము మరియు అనారోగ్యముయొక్క దినములలో జీవిస్తున్నాము. ఇప్పుడు మనకు అదివరకు లేనన్ని చాలా వ్యాధులు ఉన్నవి. ఎందుకనగా, ఇదివరకు లేనంత మిక్కిలి పాపము మరియు కార్యములను మనము కలిగి ఉన్నాము. అక్కడనుండే అనారోగ్యము వచ్చినది. పాపముయొక్క ఫలితమే అనారోగ్యము. మనమేదైనా అనారోగ్యమును పొందుకొనుటకు ముందు ఏ పాపము లేదు. పాపము అనారోగ్యమును వెంబడిస్తూ వచ్చును. అర్థమైనదా? క్షమించండి, నా ఉద్దేశ్యమేమనగా, అనారోగ్యమే పాపమును వెంబడిస్తూ వచ్చును. వారు మొదట పాపమును చేసిరి. ఇకప్పుడు ఆ పాపముయొక్క ఫలితము వ్యాధిని తీసుకొనివ చ్చెను. కనుకనే ఇప్పుడు, పాపము పెరుగుతున్నకొలది, వ్యాధులుకూడా పెరుగుచున్నవి.మనకు ఇంతకముందెప్పుడూ లేని అత్యుత్తమ వైద్యులు ఉన్నారు. మన దగ్గర ఇదివరకంటే మెరుగైన మందులు ఉన్నవి. మనకు ఇంతకముందుకంటే ఎక్కువ వైద్యశాలలు గలవు. మనకు ఇదివరకంటే ఎక్కువ శిక్షణ పొందిన మనుష్యులున్నారు. మనము ఇంతకముందుకంటే ఎక్కువ వ్యాధులను కలిగివున్నాము. ఎందుకు? ఎందు కంటే ఇదివరకంటే మనము ఎక్కువ పాపమును కలిగివున్నాము. మనకు జనాభా ఎక్కువయ్యారు, ప్రజలు విస్తరిస్తున్నప్పుడు, పాపము మరియు హింస ప్రవేశించును.ఈ పెద్ద నగరములను చూచినట్లయితే, అసలు దేశములో నివసిస్తున్నట్లు లేదు, గొప్ప ప్రాకారములుగల పట్టణములనుగూర్చి గత రాత్రి మనము మాట్లాడుకున్నాం... మీరు ఈ ప్రాకారములుగల పట్టణములను చూచినయెడల, అచ్చట మీరు ఎల్లప్పుడూ పాపమునే కలిగి ఉందురు. అలాగే మనము మరొక రకమైన ఆత్మ సంబంధమైన ప్రాకారములతో కూడిన ఈ నగరములను కలిగియున్నప్పుడు, మీరు ఎల్లప్పుడూ దానితో ప్రతిదానిని కలుపుతూ పాపమును కూడా కలిపివేయుదురు.

35. ఇప్పుడు, మనుష్యులను చంపే మొట్టమొదటి(No.1- killer)వ్యాధి గుండె సమస్య యని వైద్యులు మనకు చెప్పెదరని మనకు తెలుసు. సరే, నేను వైద్యులతో విభేదించను, ఎందుకనగా, నేను వైద్యుడిని కాదు. కానీ నేనొక విషయము చెప్పెదను, మనుష్యులను చంపే మొట్టమొదట జబ్బు గుండె సమస్య కాదు, కాని మొట్టమొదటిగా చంపే జబ్బు పాపపు సమస్యయగును. పాపమే మొట్టమొదటి చంపే వ్యాధి, గుండె సమస్య కాదు.ఈ దినమున అనేకులు, సహోదరుడా బ్రాన్హాం, నీవు ఈ విషయములను చాలా కఠినముగా చెప్పెదవు. మేము ప్రతి దినము కొద్దిగానైనా పాపము చెయ్యాలి. మేము అలాగ చేయవలసియున్నదని నీకు తెలుసుకదాని?” చెప్పెదరు. "సహోదరుడా, బ్రాన్హాం, నీవు ధూమపానమును ఖండిస్తున్నట్లు నేను విన్నానని" ఎవరోకరు చెప్పిరి. మనుష్యులు ధూమపానము చేయకూడదని నేనుకూడా నమ్ముచున్నాను. నేను అంతరాత్మ, శరీరము, మరియు ఆత్మ అంతటా పరిశుద్ధతముగాను, పవిత్రతముగాను ఉండాలని నమ్ముతాను.
మరియు అతను ఇలా అన్నాడు, "నేను ధూమపానము చేసెదను. నేను కొంచెము పొగ త్రాగాలి. నేను దీనిని చేయవలసి వచ్చుచున్నది.”“నా ఉద్యోగమును నిలబెట్టుకొనుటకు నేను కొంచెము సాంఘిక మద్యపానమును తీసుకొనవలసి యున్నదని" అనేకమంది చెప్పుటను మనము వింటుంటాము.స్త్రీలు, “నా సంఘములో నా సామాజిక స్థితిని కాపాడుకొనుటకు నా జుట్టును కత్తిరిస్తూ, ఆధునిక దుస్తులను నేను ధరించుకోవలసియున్నది, నేను అలా చేయకపోతే నేను చాలా పెద్దదానిగా కనిపిస్తున్నానని స్త్రీలు చెప్పెదరని చెప్పుటను మనం వినెదము.నన్ను క్షమించండి, కానీ నేనొకటి చెప్పబోవుచున్నాను, అది పెంతెకోస్తుల వ్యభిచార మైయున్నది. అవును. వారు దీనిని చేయుటకు కారణమేమనగా, వారు వేసుకోవలసిన టీకాలను వేసుకొనుటకు ప్రయత్నించకపోవుటయే. పాపము మరియు ఈ కార్యముల కొరకు దేవుడిచ్చే నిరోధక మందును తీసుకొనుటకు వారు ప్రయత్నించుటలేదు. అవును.

36. ఇప్పుడు నేను మీకు తిరిగి వచ్చే మార్గమునుగూర్చి చెప్పబోవుచున్నాను. మీరు తిరిగి రావాలని కోరుకుంటే, మీరు తప్పనిసరిగా టీకాలు వేయుంచుకోవాలి. మీరు దేవుని ఔషధ తైలము(గుగ్గిలము)ను, దేవుని టీకానే మందును తీసుకోవాలి. ఆయన దానికొరకైన నివారణను కలిగియున్నాడు. అది పాపమునకు రెట్టింపు నివారణగా యున్నది,అదే యేసు క్రీస్తుయొక్క రక్తమగును. దేవునియొక్క స్వకీయ కుమారుడే మిమ్ములను పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో పాపమునుండి విముక్తి కలుగజేసి (కడిగి)సేవ కొరకు నింపును. అక్కడున్న అంశముల ద్వారానే మనము తిరిగి రావలసిన మార్గముగా యున్నది. మీరు ఆ అంశములు చేయనవసరము లేదు. మీరు దానిని చేయవలసిన అవసరము లేదు. మరి మీరు దానిని చేయుటకు కారణమేమనగా...

37. కొంత కాలము క్రితము ఒక పరిచారకుడు నాతో ఇలా అన్నాడు, "సహోదరుడా, బ్రాన్హాం, మీరు చెప్పే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము సత్యమని నేను నిజముగా నమ్ముచు న్నాను. నేను దానిని నిజముగా నమ్ముచున్నాను. నా సంఘము పరిశుద్ధాత్మయొక్క బాప్టిస్మముగూర్చి ఏమని బోధించుననగా, మనము విశ్వసించు ఆ క్షణములో,మనము విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతామని. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను” అని అతను చెప్పెను."అవును నిజమే. అందుకే దేవుడు అతనికి సున్నతియొక్క ముద్రను అతను విశ్వసించినదానికి ధ్రువీకరణగా ఇచ్చెను. మీరు ఇంతవరకు పరిశుద్ధాత్మను పొంద నట్లయితే, దేవుడు మీ విశ్వాసమును ఎన్నడూ గుర్తించలేదు" అని నేను చెప్పాను, అడే సత్యము. మనము అబ్రాహాముయొక్క సంతానమైయున్నాము.అందుకు అతను. "అయితే సహోదరుడా, బ్రాన్హాం, ఒకవేళ నేను అలా చేసే, నేను నా సంఘము నుండి వెలివేయబడతానని" చెప్పెను."దాని గురించి ఏముంది? నేనుకూడా వెలివేయబడితిని" అని నేను చెప్పాను."మంచిదే, కాని నేను దానిని చేయలేనని” అతను చెప్పెను."నీవు దానిని ఎందుకు చేయలేవు? నీవు దానిని ఎందుకు చేయలేవో నాకు చెప్పుము? అని నేను అడిగాను."కాని, నేను అలాగు చేసినయెడల వేరే ఎక్కడా ప్రసంగించుటకు కూటములను ఇక పొందకపోవచ్చని" అతను చెప్పెను."అది బుద్ధిలేని మాట. దేవుడు నిన్ను సువార్తకు పిలిచినయెడల, నీవు బోధించుటకు ఆయన నీకొరకు ఒక స్థలమును కలిగివుండును. నీ మాటలను వినుటకు కొంతమం దిని ఆయన కలిగియున్నాడు. ఖచ్చితముగా, వీధి మూలన నిలబడి ప్రసంగించినా, వినేవారు ఎవరో కొంతమంది ఉంటారని” నేను చెప్పాను."వారు నన్ను చెఱశాలలో వేస్తారు” అని అతను చెప్పాడు.“మంచిదేకదా,చెఱశాల నాయకునికి, దానిలోవున్న కొంతమందికి బోధించవచ్చు, నిశ్చయముగా.” పౌలుకూడా అలాగే చేసెను. వారంతా రక్షించబడిరి. అవునయ్యా.

38. మీరు దానిని చేయవలసిందేనని నీవు అంటావు. వద్దు, మీరు చేయరు. వారు చేయుటకు కారణమేమనగా, వారు ఈ టీకా మందును పరీక్షించకపోవడమే. దానికొరకు వారింకా శరీర జన్య విషము (టాక్సిన్)ను తీసుకొనలేదు. దానిని బాగుచేసే మందు ఏదోకటి ఉన్నది, అది నీకు కలిగిన భయమును తీసివేయును. మిమ్ములను స్త్రీలాగా వస్త్రములను ధరించునట్లు మరియు ప్రవర్తించేలా చేసేది ఏదోకటి ఉన్నది. అలాగే మిమ్ములను క్రైస్తవులవలె జీవింపచేసేది ఏదో ఉన్నది. మీరు గనుక టీకా మందును తీసుకుంటే, నీవు నిలబడి సాక్ష్యమును చెప్పునప్పుడు, ఇంటి పై కప్పును కంపింపజేసి కదిలించునంతగా నిన్ను దేవునితో పూర్తిగా నింపబడేలా చేయునది ఏదోకటి ఉన్నది. కానీ మీరు శరీర జన్య విషము (టాక్సిన్)ను తీసుకోవలసియున్నది.మీకు వ్యాధి గలదు, కాబట్టి చేయవలసినది ఒకే ఒక విషయము ఉన్నది, దాని నుండి విడుదలపొందుటకు శరీర జన్య విషము (టాక్సిన్)ను తీసుకోవాలి. సాధారణ మైన క్రైస్తవ ఆరోగ్యమును తిరిగి పొందుకొనుటకు వచ్చు మార్గము ఇదే. సంఘము అనారోగ్యముతో ఉన్నది. అది దుర్బలమైనదిగాను, రక్తహీనతతో, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుచున్నది, మరి దీనికి భూసంబంధమైన చికిత్స ఏదియులేదు. విద్య దానిని చేయలేదు. మేము దానిని ప్రయత్నిస్తున్నాము. సంఘశాఖ దానిని చేయదు. మేము దానిని ప్రయత్నిస్తున్నాము. మీరు దానిని మరింత దిగజార్చుతారు.మరలా తిరిగి వచ్చుటకు ఒకే ఒక్క మార్గము ఉన్నది, అది యేసుక్రీస్తు యొక్క రక్తమనే టీకా మందు ద్వారా మాత్రమే. క్రీస్తువద్దకు తిరిగి రండి. పరిశుద్ధాత్మవద్దకు తిరిగి రండి. మరలా నిత్య జీవము వద్దకు తిరిగి రండి. మనము తిరిగి వచ్చే మార్గము అదేయగును.

39. ప్రజలు చెప్పెదరు, "ప్రజలలో నా అంతస్థును కాపాడుకొనుటకు నేనుదీనిని చేసితీరాలి." మీరు దానిని చేయనవసరము లేదు. అది మీ అవివేకమును చూపుచున్నది. అది పిరికితనమును చూపుచున్నది. ఒక బోధకుడు ప్రసంగ పీఠముమీద నిలబడి, క్రీస్తు నియమములందు రాజీపడును, ఎందుకనగా, కొంతమంది బిషప్లు అతనిపై ఆధిపత్యము చెలాయిస్తారు, వారతనితో, “నీవు దీనిని చేయాలి, లేదా మేము నిన్ను ఈ సహవాసమునుండి వెలివేసెదమని” గద్దించెదరు. నీవొక పిరికివాడివి. నీవు అక్కడే నిలబడుచు, దానికెంత మూల్యము చెల్లించవలసినా సరే, సత్యమునే ప్రకటించుము.ఆ ఉదయమున పరిశుద్ధాత్మతో నింపబడివున్న మన దీన సహోదరుడు స్తెఫనును చూడండి,మహా సభ(సన్హెడ్రిన్ కౌన్సిల్) ముందు నిలబడివున్నాడు. అపోస్తుల కార్యములు 7 వ అధ్యాయము ఇలా చెబుతున్నది, "ఇశ్రాయేలు ప్రజల్లారా, యూదయ మొదలగు ప్రాంతములలో నివసించువారైన మీరు, మన పితరులు మెసొపొతమియా నుండి ఎలా బయటకు వచ్చారో,” మొదలైనవాటిని వారికి చెప్పడము ప్రారంభించెను. అప్పుడు అతనిని గాయపరచుటకు, ప్రారంభించిరి. పరిశుద్ధాత్మ అతని మీదికి వచ్చెను. అతడు కాంతివంతమయ్యెను... అతని ముఖము దేవ దూతవలె మెరియుచు ఇలా చెప్పెను. “ముష్కరులారా, హృదయమందును, చెవులయందు సున్నతి పొందనివార లారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు."తాను ఎక్కడ నిలబడి ఉన్నాడో అతనికి తెలుసు. తన స్థానమును అతను ఎరిగియుండెను.అతని ముఖము ఒకవేళ ఇక్కడున్న లైటువలె కాంతిగా ప్రకాశించకపోవచ్చు,కాని అతనేమి చేయుచున్నాడో దేవదూతకు తెలుసు. దేవదూత అనగా దేవునినుండి ఆజ్ఞను పొందుకొనిన ఒక వర్తమానికుడు. అతను తలను వంచవలసిన అవసరము లేదు. అతనికి ఖచ్చితముగా విషయములను ఎరిగినవాడు, ఐదు లక్షలమంది మత గురువులనే తోడేళ్ళవలె అరుస్తూ, స్తెఫను ప్రవరిస్తున్న తీరును మరియు అతను బోధిస్తున్న ప్రసంగ ములను ఖండిస్తుండగా, స్తెఫను అక్కడ నిలబడి ఇలాగు చెప్పెను: “ముష్కరులారా, హృదయమందును, చెవులయందు సున్నతి పొందనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. కాబట్టే మీరును అదే కార్యము చేయుచున్నారా? అతను ఎర్ర సముద్రమును తెరచిన దేవుని యొద్దకు తిరిగి వచ్చే మార్గమునుగూర్చి వారికి చెప్పుచున్నాడు, ఐగుప్తులో తెగుళ్లను క్రుమ్మరించిన దేవుని యొద్దకు మరలా తిరిగివచ్చే మార్గమును స్తెఫను వారికి చెప్పుచున్నాడు.కాని తిరిగి వెళ్లే మార్గమును స్వీకరించుటకు వారు ఇష్టపడలేదు, కాబట్టే వారు ఆ మార్గమును తప్పించుకోలేరు. అది ఇప్పటికీ వెంటాడుతునే ఉన్నది. సాక్ష్యమిచ్చిన వ్యక్తిలో ఒకరైన పౌలు త్వరలో వారిలో ఒకనిగా మారుచున్నాడు. నిజము, అవును. వారు ఆ టీకా మందును ప్రయత్నించలేదు. వర్తమానికుడిని రాళ్లతో కొట్టారు. మీరావిధముగా ఆ

40. వారు అలాగు చేయుటకు కారణము మీకు తెలుసా? ఆ నూతన జన్మనుగూర్చి ఉద్దేశ్యము నిజమైన నూతన జన్మ విషయము. ఓహ్, "నిశ్చయముగా, మీరు తిరిగి జన్మించాలని నేను నమ్ముచున్నానని అందరూ చెప్పెదరు. అవునయ్యా!". అవును. కాని అసలైన నూతన జన్మ విషయానికి వస్తే... కరచాలనము చేయుటద్వారా, మత సంబంధమైన సిద్దాంతములను చెప్పుటద్వారా లేదా వేరేదైనా చెప్పుటద్వారా నూతన జన్మ కలుగుతుందని వారు నమ్మెదరు. వారు దానినే, “నూతన జన్మని”చెప్పెదరు. అది నూతన జన్మకాదు. నూతన జన్మగూర్చి వారు భయపడుచున్నారు. వారు భయపడుచున్నారు. నా ,వినండి. ఎలాంటి జన్మయైనా గందరగోళమే. అది పందికొక్కైనా, లేక ఏదైన, ఎలాంటి జన్మయైనా నేను పట్టించుకోను, అది గందరగోళముగానే ఉన్నది. నూతన జన్మకూడా అట్లే ఉన్నది. నీవెన్నడూ చెయ్యుటకు తలంచని కార్యములను అది నిన్ను చేయునట్లు చెయ్యును. కాని అది జీవమును తీసుకొనివచ్చును. మీరు జీవమును పొందు. టకు మునుపు మరణించవలసియున్నది. ఒక విత్తనము తనంతటతానుగా పునరుత్పత్తి చేసే ముందు, అది క్రమముగా చనిపోవాలి... చనిపోవడమే కాదు, అది కుళ్ళిపోవును. దానినుండి నూతన జీవమును పొందుటకు, అది చనిపోయి దానంతటదే కుళ్ళిపోవాలి.ఆవిధముగానే ప్రతి పాపిచేయును. ప్రతి మనిషి, అతనెంత గొప్ప విద్యావేత్తయైనా, అతనెంత మేధావియైనా, అతను సంఘములో ఎన్ని పట్టములను, మొదలైనవి కలిగి ఉన్ననూ, ఇంకా ఎన్నో విషయాలు కలిగివున్నను, ఎన్ని కళాశాలలలో చదివిననూ, అతను తన స్వంత సిద్ధాంతమునకు చనిపోవాలి. అతను తన స్వకీయమునకు చనిపోవాలి. అతను పరిశుద్ధాత్మద్వారా తిరిగి జన్మించినవానిగా ఉండాలంటే,అతని యొక్క ప్రతీ కార్యమునకు చనిపోవలసియున్నది. అది అతనిని ఏడ్చేలా చేయును, “అహా హూ”, అన్య భాషలలో మాట్లాడేలా చేయును, పైకి, క్రిందికి దూకేలా చేయును, పిచ్చి భ్రమపట్టినవానివలె ప్రవర్తించునట్లు చేయును. కాని అతనికి నూతన జీవము కలిగెను. అది ఆవిధముగానే ప్రవర్తించునట్లు చేయును, అతను నూతన జీవమును పొందుకోవ లెను. వారు నూతన జన్మగూర్చి భయపడుచున్నారు. నూతన జన్మ ఒక గందరగోళము.

41. ఇప్పుడు వారు నూతన జన్మ మరిము సమస్తవాటినిగూర్చి ఇట్లు చెప్పెదరు, "ఓహ్, నిశ్చయముగా, నేను తిరిగి జన్మించుటను నమ్ముతాను." వారు తిరిగి జన్మించామని చెప్పుకుంటూ, మరి వాక్యమును తిరస్కరించెదరు, పరిశుద్ధాత్మను కలిగియున్నామని చెప్పుచూ, పరిశుద్ధగ్రంధము స్పష్టంగా బోధించే లేఖనములను తీసి, "ఈ వాగ్ధానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచినవారందరికిని చెందునని" ఆయన చెప్పెను. ఈ లేఖనములో ఏమని చెప్పెనో చూడమంటే, ఆపై వారు, “ఓహ్, అది మరొక కాలము నకు చెందినవని" చెప్పెదరు.మీలోనున్న పరిశుద్ధాత్మ అది మరొక యుగానికని సాక్ష్యమిస్తుందని దాని అర్థమా?ఆయన అబద్ధము చెప్పడు. మీలోనున్న ఆత్మ అది సత్యమని అంగీకరించుటకు నిరాకరిస్తే, అది పరిశుద్ధాత్మ కాదు, ఎందుకనగా వాక్యమును వ్రాసినవాడు పరిశు ద్ధాత్ముడే ఆమేన్. దానినెట్లు అమర్చవలెనో నాకు తెలిసినంతవరకు అదంత దృఢమైనది.అది జీవమును ఉత్పత్తి చేయుటకు మరణమును తీసుకొనును. మీరు మీ స్వకీయ ఆలోచనలకు చనిపోవాలి. మీరు మీ స్వకీయ వేదాంతమునకు చనిపోవాలి. మీ స్వకీయము చనిపోవాలి, మీ స్వకీయ మానవ మార్గములకు చనిపోవాలి. మీరు పునర్జీవమును పొందుకోవలెను, నూతన జీవిగా, నూతన సృష్టిగా మారాలి, మీరు అలాగు మారుటకు ముందు.... మీరు ఒకేసారి రెండు స్వభావమును కలిగి ఉండ లేరు. మీరు ఒకదానియందు మరణించి మరొక దానిలో జన్మించవలసినవారుగా ఉన్నారు. ఇది గందరగోళమును కలిగించును, మరి నూతన జన్మకూడా గందరగోళము (మురికి లేదా అసహ్యము)నకు గురియగును. కాని మీరు నూతన జన్మను పొందు కున్నారు. అది ఏ బేధమును కలుగజేయును? మీరు దానిని చేయవలసియున్నది.

42. ఒకప్పుడు టైఫాయిడ్ జ్వరమునకు టీకాలు వేయలేని పరిస్థితి ఉండేదని మీకు తెలుసు. నేను దీనినిగూర్చి మాట్లాడుచున్నప్పుడు, ఇక్కడ కూర్చుని, నన్ను చూస్తున్న నా స్నేహితురాలైన ఒక నర్సువైపు నేను చూస్తున్నాను. అది నిజము. ఆమె సహోదరి డౌచ్, టైఫాయిడ్ జ్వరమునకు టీకాలు లేని కాలము ఉండెను. అది తాకినవారు వేలాదిమంది చనిపోయారు. అలాగే పోలియోకు టీకాలు లేని కాలము గలదు, వేవేల కొలది చిన్న పిల్లలు చనిపోయారు. కాని ఇప్పుడు అది లేదని సాకులు చెప్పలేరు. మనకు ఇప్పుడు దానికి తగిన టీకాలు ఉన్నవి, అది నిజము, సరే మంచిది. సరియైనది.

43. మనము దేవుని శరీర జన్య విషము (టాక్సిన్) అని పిలిచే ఈ టాక్సిన్ లేదా ఔషధ తైలము (గుగ్గిలము)ను కలిగియున్న ఒక కాలముండెను. కాని అది పరిపూర్ణమై నిది కాదు. ఎందుకనగా, అదేమని పిలువబడెననగా... ఇది మేకలు, గొట్టెలు మరియు పశువులు, మొదలైనవాటి రక్తముగా ఉండెను. ఇది పాపమును సరిగ్గా తీసివేయలేదు. ఇది పాపమును కప్పుతుంది అంతే. మనిషి తన పాపపు ఒప్పుకోలును చేయుటకు సంవత్సరము వెంబడి సంవత్సరము వెళ్ళవలసి వచ్చెను. ఇది సరైనదిగా పరిగణించ బడిన ఒక కాలము ఉండెను.కాని బలిని అర్పించిన ఆరాధకుడు ఒకసారి శుద్దీకరించబడిన పిదప, ఇంకా పాపముగలదనే మనస్సాక్షి అతనికి ఉండదు. అలాగైతే పాపమనగా ఏమిటి? అవిశ్వా సము.దేనిలో అవిశ్వాసము? వాక్యమందు. నిశ్చయముగా, మీరు దేవునిని విశ్వాసిస్తున్నా నని చెప్పుచూ, ఆయన వాక్యమును తిరస్కరిస్తున్నారు, అసలు మీరు ఆయననునమ్మలేదు."నేను సహోదరుడు బ్రాన్హాంని నమ్ముతానని" మీరు చెప్పితే, “కానీ అతను తప్పుగా ఉన్నాడని"వారు చెప్పెదరు. సరే, మీరు దానినెలాగు చెప్పగలరు? మీరు దానినలాగు చెప్పకూడదు. మీరు తప్పుచేశారని నాకు తెలుసు, ఎందుకనగా మీరు నన్ను నమ్మలేదు.మీరు దేవునిని నమ్ముచున్నామని చెప్పి, ఆయన వాక్యమును తిరస్కరించినట్లయితే, అలాగైతే మీరు దేవునిని నమ్ముటలేదు, ఎందుకనగా దేవుడే ఆయన వాక్యమైయున్నాడు, మీరు వాక్యమును తిరస్కరించకూడదు, మీరు వాక్యమును అంగీకరించాలి. అదే తిరిగి వచ్చే మార్గమైయున్నది-వాక్య మార్గముద్వారా తిరిగి వచ్చేది. వాక్యమే దేవుడైయున్నాడు.

44. ఇప్పుడు మనము దానిని కనుగొన్నాము. మరి ఆనాడు ఉపయోగించిన టీకాలు ఒక కాలమందు అంత మంచిగా పనిచేయలేదని మనము చూశాము. ఇంకా పాపము గలదనే మనస్సాక్షి ఎప్పుడూ ఉండేది, కనుకనే అతను సంవత్సరము వెంబడి సంవత్స రము వచ్చి తనకొరకు బలి అర్పణను అర్పించవలసి యుండెను. కాని సేవించువారొక్క సారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు లేదా మరొక విధముగా చెప్పాలంటే, పాపము చెయ్యాలనే వాంఛ ఇక అతనికి ఉండదని, అతని నుండి అది పూర్తిగా పోయినదని హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో చెప్పబడినది.ఇకమీదట ఉండదు... నీవు ప్రతి దినము పాపము చేయనవసరము లేదు. మీరు ఈ కార్యములన్నీ చేయవలసిన అవసరములేదు. మీరు ఉద్దేశపూర్వకముగా కోరుకొనుట చేత మీరు దానిని చేసెదరు. మీరు ఉద్దేశపూర్వకముగా కోరుకొనుటకు కారణమేదనగా, ఓ, సహోదరుడా, అసలు మీరు మీ స్వకీయమునకు చావనేలేదు. అది మీకు మంట కలిగిస్తున్నదని నాకు తెలుసు, కాని అది మంచిదే. ఎప్పుడైతే మీరు మీ స్వకీయమునకు చనిపోతారో, అప్పుడే మీరు నూతన జీవమగుదురు. అప్పుడే ఈ ఇవన్నీ గతించును.మీరు వాటిని పొందుటకు ముందే, మీరు వాటిని పొందినట్లు నటించుటకు ప్రయత్నిస్తే, అదెలాగు ఉండునంటే, ఒక నల్లటి పక్షి తన రెక్కలలో నెమలి ఈకలను పెట్టుకొనుటకు ప్రయత్నిస్తున్నట్లుండునని నేనొక దినమున చెప్పాను. “మీరు చూడండి, నేను నెమలిని- నేను నెమలిని." అది నెమలి కాదు, అవి తనకుతానుగా పెట్టుకున్నవి. కాని అవి లోపలనుండి బయటకు పెరుగుచూ వాటంతటవే రావాలి. పరిశుద్దాత్మ కూడా ఆవిధముగానే ఉన్నది. అదేదో నీవు పూసుకునే పై పూత లేక అలాంటిదేదో కాదు. అది ఒక నూతన జన్మ. నీవు మరలా తిరిగి జన్మించాలి. పరిశుద్ధాత్మయొక్క ఈ సద్గుణములనేవి నీ లోపలినుండి బయటకు రావాలి. ఎప్పుడైతే లోకము మరియు పాపము, వెంట్రుకలు కత్తిరించుకొనుట, ముఖముకు రంగులు వేసుకొనుటలాంటి దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన కార్యములు నీనుండి బయటకు వచ్చినయెడల, నీలో పరిశుద్ధాత్మడు లేడని చూపించుటకు అదే సూటిగా కనబడే ఆధారమైయున్నది.కాబట్టి మీరు దీనిని ఏమని పిలిచెదరు? పెంతెకోస్తుల వ్యభిచారము. అదే నిశ్చయముగా సరియైనది. పరలోకపు దేవునితో ఆత్మీయ వ్యభిచారము చేయుట. ఇది ఎంత అవమానము, ఇది సిగ్గుచేటు! ఓహ్, అవునయ్యా! అది భయంకరమైనది.

45. మనిషి(వైద్యుడు) తన రోగిని వ్యాధినుండి విడిపించుటకు అతనికి టీకాలు వేయడానికి మందు(సీరమ్)ను కనుగొనడానికి ప్రయత్నించునప్పుడు, అతను మొదట దానిని సీమ (గినియా)పందిపై ప్రయోగించి, అది పని చేస్తుందో, లేదో పరీక్షించును. కాని దేవుడు అట్లు చేయలేదు. ఆయన ఎన్నడూ గినియా పందిపై ప్రయోగించలేదు. ఆయన ఆ మందును తనపైతానే ఉపయోగించుకొనెను. ఒక వ్యాధికి మందుని పరిశోధించు టకు కోరుకొను ఒక మంచి వైద్యుడు, ఆ మందు ప్రాణమునకు హాని చేయునా, లేదా ప్రాణమును కాపాడునో అతనికి తెలియకపోతే, దానిని పరిశోధించుటకు వేరొకరిపై ప్రయోగించే ముందు మొదట దానిని తనపై తాను స్వయముగా ప్రయోగించుకోవాలి.కనుకనే ఆ రీతిగానే దేవుడు ఈ వ్యాధి నిరోధక మందు లేదా రక్తము (సీరమ్) ను తీసుకొనుటకు మాంస శరీరధారియై ఒక సమీప బంధువైన విమోచకుడనిగా మన మధ్య నివసించవలసి వచ్చెను. ఆమేన్. దేవుడు మనిషిగా మారవలసి వచ్చినది, తద్వారా ఆయన ఆ వ్యాధి నిరోధక మందును తీసుకోగలిగెను. అలాగే ఆయన యొర్దానువద్ద తన టీకాను తీసుకొనెను (ఆమేన్), ఆయన యోహానుద్వారా బాప్తిస్మ మును తీసుకొని యొర్దాను నదిలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు, అప్పుడే ఆ వ్యాధి నిరోధక మందు పై నుండి క్రిందికి దిగినది. శరీర జన్య విషము (టాక్సిన్) పావురమువలె పరలోకమునుండి దిగి, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నివసించు టకు నేను ఆనందిస్తున్నానని" పలికెను. ఆయనకు టీకా వేయబడినది.మరి టీకా మందు వేయబడినవెంటనే పరీక్ష సమయము వచ్చును. ప్రతీ మనిషి పరిశుద్ధాత్మను పొందుకొని, టీకా మందును వేయబడిన వెంటనే, పాతాళములోనున్న ప్రతి దెయ్యము నీకు వ్యతిరేకముగా లేచును. నీ స్వంత కుటుంబముకూడా, కొన్నిసార్లు మిమ్మల్ని త్రోసివేయుదురు. నీ భర్త, నీ భార్య, నీ సంఘ కాపరికూడా, నిన్ను చూచి నవ్వుచు, ఎగతాళి చేయుచూ సంఘమునుండి వెలివేసెదరు. ఇది నీకొక పరీక్ష, ఆమేన్.

46. దేవుడు శరీరధారియై, ఆ టీకా మందును తీసుకొనుటకు ఆయన మనలో ఒకనివలె మారి, పాప నియమమునకు బద్దుడయ్యెను, ఎందుకనగా, ఆయన ఒక స్త్రీ ద్వారా జన్మించెను. ఆయన మనవలె అన్నీ విషయములలో శోధించబడెను, కాని ఆయన ఆత్మ స్వరూపిగా ఉన్నంతవరకు శోధించుటకు సాధ్యమవ్వదు. ఆయన శోధించ బడుటకై, టీకా మందును వేయించుకొనుటకు, శరీర జన్యు విషము(టాక్సిన్)ను తీసు కొనుట కొరకే, ఆయన శరీరధారిగా మారవలసి వచ్చెను. తాను వేసుకున్న శరీర జన్యు విష(టాక్సిన్)మందు సరియైనదేనని ఆయన నిరూపించకోరెను. ఆమేన్. కాబట్టి, యోహాను ఆయనకు బాప్తిస్మమిచ్చిన ఆ దినమున ఆ శరీర జన్యు విషము (టాక్సిన్) పరలోకము నుండి దిగివచ్చి ఆయనను నింపినప్పుడు, ఆయన దానిని తీసుకొనెను.ఆ తర్వాత శోధింపడెను. ప్రతీ అపహాస్య శోధనలో ఈ టీకా మందు తట్టుకొని నిలబడెను. ఆయనకు ప్రపంచ రాజ్యములను ఇవ్వజూపినప్పుడు, లోకమును, దానిలోని ప్రతీ రాజ్యమును ఇచ్చెదనని సాతాను చెప్పినప్పుడు, ఈ టీకా మందు తట్టుకొని నిలబడెను. ఆ మందు లోపలికి ప్రవేశించిన రీతిగానే దానిని ఎదుర్కొనెను. ప్రపంచము ఆయనవైపు చూచెను. సంఘము ఆయనవైపు చూచెను, విమర్శకులు ఆయనవైపు చూచిరి, దెయ్యము, తనకు సాధ్యమైనంతవరకు ఆయనపై ప్రతీ శోధనను ప్రయోగిం చెను, అయిప్పటికీ ఈ టీకా మందు దానిని ఎదుర్కొని నిలబడెను. ఆమేన్!ఆయన వేదాంత పండితులైన యాజకుల గుంపు ఎదుట నిలిచినప్పుడు, "మీలో ఎవరు నాలో పాపమున్నదని నన్ను ఖండించగలరని? ”అడిగెను. ఆమేన్! ఈ టీకా మందు అలాగే తట్టుకొని నిలబడెను. "నేను నా తండ్రి క్రియలుచేయనియెడల నన్ను నమ్మకుడి,కాని నేను నాతండ్రి క్రియలు చేసినయెడల ఆ క్రియలను నమ్ముడని"చెప్పెను. వారు, “నీవు మనుష్యుడవైయుండి నిన్ను నీవు దేవుడనని చెప్పుకొనుచున్నావు" చెప్పిరి. ఆయన, “నేను నా తండ్రి క్రియలుచేయనియెడల నన్ను నమ్మకుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నా మాటలకన్నా నా క్రియలే బిగ్గరగా మాట్లాడునని”చెప్పెను.

47. అది నిశ్చయముగా నిజము. నీవు ఏవిధానముగా జీవించెదవో నీవు ఆవిధముగానే ఉండెదవు. నీవు మాట్లాడే విధానముద్వారా, లేదా నీవు ధరించే వస్త్రముల విధానము, లేదా నిన్ను నీవు కనబరచుకునే విధానముద్వారా నీవు ఉండవుగాని, నీవేమైయున్నావో ఆవిధముగా నిన్ను చేయునదేదనగా నీవు జీవించే విధానమేయగును. అదే నీవేమైయు న్నావో తెలియజేయును. నీ లోపల ఏమున్నదో అదే బయటకు వ్యక్తమగును. పనికిరాని, అల్పులవలె ఉండు మీరు, మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా చెప్పుకునే, జూదమాడువారు లారా,పొగ త్రాగువారలారా, చెవులవరకు జుట్టును కత్తిరించుకున్న స్త్రీలారా, నాట్య మాడువారలారా, టెలివిజన్ పిచ్చిపట్టినవారలారా, అసహ్యమైన పరిహాసములాడే - మీకే టీకా అవసరమైయున్నది! మరలా తిరిగి పెంతెకోస్తుకు రండి. అదే సత్యము. మనము చాలా అవసరతలో ఉన్నాము.
48. ప్రతీ శోధనలద్వారా ఒక మానవుడిని శోధించునట్లుగా, యేసును శోధించినపుడు ఆ మందు తట్టుకొని నిలబడెను. ఒక మానవునిపై పడు సమస్త శోధనలవలె ఆయన పైనా శోధనలు పడెను. కానీ ఆయనకు వేయబడిన ఆ టీకా మందు వాటిని ఎదుర్కొని నిలబడెను. ఆ టీకా మందు ఎదుర్కొని నిలబడగలదా లేదాయని, అది సరైనదో, కాదో నీవు తెలుసుకోవాలంటే, ఆయన వైపు చూడండి. ఆయనే మీకు మాదిరియైయున్నాడు. అది ఆయనతోనే ఉండెను. అది ప్రతీ శోధనలోను ఎదుర్కొని నిలబడెను. ఆయన అక్కడ నిలబడి ప్రజలయొక్క ఆలోచనలను వివేచించినప్పుడు అది ఆయనలోనే ఉండెను, కాని వారు ఆయనను బయెల్టెబూబని పిలిచిరి, ఆ మాటలు ఆయనను ఆటంకపరచలేదు, ఆయన ఎప్పటివలె అలాగే ముందుకుసాగిపోతూ ఉండెను.ఆయన వారి హృదయములలోని ఆలోచనలను ఎరిగినప్పుడు, ఆయన బావివద్ద ఉన్న స్త్రీని తేరి చూచి నీకు ఐదుగురు భర్తలుగలరని చెప్పినప్పుడు, పేతురుకు అతని పేరును, మొదలగువాటిని చెప్పినప్పుడు, వారు, "ఈ వ్యక్తి సోదె చెప్పేవాడని" చెప్పిరి.అందుకని ఆయన, “సరే, నేను తప్పుగా ఉండవచ్చు. బహుశా..." అని చెప్పలేదు. వారి మాటలకు ఆ(టీకా)మందు ఎదుర్కొని నిలబడెను. ఎందుకు? ఆయన ఎక్కడ నుండి వచ్చాడో ఆయన ఎరిగియుండెను.

49. నేను మొన్న రాత్రి నా కూటములో, యోహాను సువార్త 3వ అధ్యాయములో, యేసు అచ్చట నిలబడి, “పరలోకము నుండి దిగివచ్చేవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు" అని చెప్పిన దానిగూర్చి నేను ప్రసంగించినప్పుడు, “ఇచ్చట నేను దీనిని నిలిపి తదుపరి కూటము వరకు నేను మిమ్మల్ని ఈ అంశంమీద మీద అలాగే ఉంచుతానని” చెప్పాను. ఇచ్చటే ఆ టీకా మందు వేయబడినది. “పరలోకమునుండి దిగివచ్చేవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకము నకు ఎక్కిపోయిన వాడెవడును లేడు". ఇక్కడ ఆయన నిలబడి నికోదేముతో మాటలాడు చున్నాడు. సంఘము, అయోమయంతో నిట్టూర్పులను విడుచుచు ఆ మాటలను లెక్కచేయకుండా అలాగే కొన్ని గంటలపాటు ఉండి, నేరుగా వారు అచ్చటనుండి వెళ్ళిపోయిరి. "ఆయనే దేవుడని, ఆయనే సర్వాంత ర్యామియని అది నిరూపించెనని” చెప్పాను. అదే ఖచ్చితముగా నిజము. నిశ్చయముగా, ఆయనకు టీకా మందు వేయబడెను. “ఈ క్రియలను చేస్తున్నది నేను కాదుగానీ, అది నాలోనున్న టీకా మందు. నాలో నివసించే నా తండ్రే ఈ క్రియలను చేయు చున్నాడు. నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును (యోహాను 14:12). ”సంఘములకున్న సమస్య ఏమిటి? ఇది దెయ్యమునకు సంబంధించినదని దీనిని ఖండించి చెప్పుచున్న వారిలో ఈ దినమున ఉన్న సమస్య ఏమిటి? వారు ఇంకా టీకా మందును వేసుకోలేదు. టీకా మందు అంటే ఏమిటో వారికి తెలియదు. అదే కారణము. అది అవిశ్వాసము, కనుక అవిశ్వాసమే పాపమైయున్నది. విశ్వాసించనివాడు ఇదివరకే తీర్పు తీర్చబడెను. అవిశ్వాసమే వారు అలాగు చేయునట్లు చేయుచున్నది.

50. ఆ మందు ఎదుర్కొని నిలబడెను. వారు వెళ్లి, ఇప్పుడు ఈ క్రియలను చేయుటకు శక్తి ఆయనవద్దకు వారు వెళ్ళి, ఆయన ముఖమునకు ఒక గుడ్డ పేలికను కట్టిరి.మన పెంతెకోస్తుల కదలికలోగల సమస్య అదే.నా మాట వినండి. నేను చెప్పబోవు చున్న కార్యము గాయపరచుటకు కాదుగాని బాగుచేయుటకే చెప్పుచున్నాను.మీ ప్రతి ప్రశ్నకు సమాధానమివ్వగల మాయోపాయంగల ఒక వ్యక్తి మీవద్దకు వచ్చిన ప్పుడు,ఆ కార్యములను మరచిపోండి. ప్రతి ఒక్కరూ, మీ కలలకు అనువాదమును మీకు చెప్ప గలరు, ప్రతి అనారోగ్యమును బాగుచేయగలరు, ఈ కార్యములన్నీ చేయ గలరు, ఓ, అతడు అన్నీ కార్యములను చేయగల ఒక వ్యక్తిగా ఉన్నాడు, కాని అది వాక్యమునకు విరుద్ధముగా ఉన్నది. అతను అన్నింటికీ జవాబును కలిగివున్నాడు. అయితే వాక్యము నకు విరుద్ధముగా ఉన్నది. మీరు దానిని గమనించి చూడండి.

51. ఈ దినము ఉన్నట్లుగానే ఈ దినమునకూడా ఉన్నది. మనుష్యులు అన్ని రకాల వెట్టి ఉత్సాహములను పొందుకొని, శారీరక సంబంధమైన ఉద్రేకములను వెంబడిస్తూ, అసలైన అనువాదమును ఇచ్చుటకు బదులుగా అర్ధంలేని అనువాదమును ఇచ్చెదరు. నేను పలు దేశములకు వెళ్ళుటవలన ఇలాంటి విషయములను వింటూ మిక్కిలిగా విసిగిపోతిని. నేను ఎవరి మనోభావాలను గాయపరచకూడదనుకుంటున్నాను, కాని ఈ రాత్రి నేను తిరిగి వెళ్ళే మార్గమును గురించి మరియు స్వస్థతను పొందుకొనుటకు ఎలా, తిరిగి వెళ్ళాలనే కార్యమునుగూర్చి నేను చెప్పుచున్నాను. అదే నిశ్చయముగా సరైనది. ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు, అతను చెప్పినది నెరవేరకపోయినయెడల అప్పుడు అతనిని నమ్మవద్దు. అది నిజము. "అయితే అది నెరవేరితే అతనిని నమ్మండి, ఎందుకనగా, మాట్లాడుచున్నది నేనే.” దానిని చెప్పినది ప్రభువే.

52. ఇక్కడ యేసు నిలబడి ఉన్నాడు. ఆయనెంత అద్భుతమైన మాదిరిగా ఉన్నాడు. పౌలు ఎంత మంచి సాదృశ్యము. అక్కడ ఒకనిని గుడ్డితనముతో మొత్తుటకును,రోగులను స్వస్థపరచుటకు, అంగవైకల్యమును తిరిగి స్వస్థపరచుటకు మరియు ఇవన్నీ చేయుటకు పాలుకు శక్తి గలదు .కాని పౌలు ప్రసంగిస్తున్న కూటమునకు ఆటంకపరచి దానిని నిలిపివేసి, పౌలును దేశమునుండి వెళ్లగొట్టిన కంసాలినిగూర్చి ఏమి చెయ్యకుండానే విడిచిపెట్టిన ఆ పరిచర్యయొక్క చివరి భాగమును మీరు ఊహించగలరా? ఆ కంసాలిని గుడ్డితనముతో మొత్తే శక్తిని పౌలు కోల్పోయెనని విమర్శకులలో కొందరు చెప్పియుందు రని నేను ఊహిస్తున్నాను. లేదు. అది కాదు. అతని దగ్గర ఏ తంత్రము లేదు. అతను పరిశుద్ధాత్మను కలిగియున్నాడు. పౌలు తన దృష్టిని దేవుని పైన మాత్రమే పెట్టెను.
అనారోగ్యంతోవున్న తన స్నేహితుడైన త్రోఫిమును జబ్బుపడిన చోటనే విడిచిపెట్టి వచ్చెనని నేను ఊహిస్తున్నాను. స్వస్థపరిచే శక్తిని అతను కోల్పోయెనని నేను ఊహిస్తు న్నాను. పౌలు తనతో ఒక వైద్యుడిని తీసుకొని వచ్చెను. దైవిక స్వస్థతనుగలవాడగు, వైద్యుడైన లూకాను తనతో తీసుకొని వచ్చెను. దేవుడు పౌలుకు కిరీటమును ధరింప జేయుటకు నిశ్చయించుకొనెను, ఎందుకనగా, స్తెఫనుకు చేసిన దానికి తను ఎల్లప్పుడూ వేదనను అనుభవించుటకు పౌలు కోరుకొనెను. అదే పౌలు యొక్క వాంఛయై యుండెను.యెరూషలేముకు వెళ్లవద్దని పరిశుద్ధాత్మ అతనితో ఎలా మాట్లాడిందో మీకు తెలియదా? యేసుకొరకు తాను చనిపోవుటకు వెళ్ళుచున్నానని పౌలు ఎరిగియుండెను. ఆయనకొరకు చనిపోవాలనేదే పౌలుయొక్క హృదయ వాంఛయైయుండెను.

53. యేసు వైపు చూడండి, ఆయన రోగులను స్వస్థపరచెను, చనిపోయినవారిని లేపెను, ఈ కార్యములన్నీ చేయగలడు, జరగబోయేవాటిని ముందుగానే చెప్పగలడు, ప్రజల హృదయ ఆలోచనలను వివేచిస్తూ వారికి చెప్పగలడు. ఆయన అక్కడ పిలాతు యొక్క ఆవరణములో కూర్చోపెట్టబడి, ఒక రోమా సైనికునిచేత కళ్ళకు గంతలు కట్టబడి, కొంతమంది సైనికులు తాగిన మైకంలో ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. ఆయన గడ్డమును లాగిరి, తలమీద రెల్లుతో కొట్టి, రెల్లును ఒకరి చేతిలోనుండి ఇంకొకరు మార్చుకుని, కళ్ళకు గంతలు తీసి, “నీవు ఒక ప్రవక్తవైతే, ఇప్పుడు నిన్ను ఎవరో కొట్టారో చెప్పుము, అప్పుడు మేము నిన్ను నమ్ముతామని” చెప్పిరి. ఆయన నోరు విప్పలేదు,నిజము. ఆయన దగ్గర ఏ తంత్రము లేదు. ఆయనే దేవుడైయున్నాడు."మేకులతో కొట్టబడిన నీ చేతులను సిలువనుండి లాగి, కిందికి దిగి రమ్ము, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము. మేము యాజకులము, మేము దేవుని సేవకులము. కనుక నీవు సిలువనుండి దిగి వచ్చి, దానిని ఋజువుపరిచిన, నీవు దేవుని కుమారుడ వని మేము తెలుసుకుంటాము. నీవే మా రాజువు, సిలువనుండి దిగి రా! అప్పుడు మేము నిన్ను నమ్ముతాము.” ఆయన నోరు తెరచి ఒక్క మాటకూడా పలుకలేదు.ఎందుచేత? దావీదులోవున్న అదే ఆత్మ, "నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి? వారు నా చేతులు మరియు పాదములలో పొడిచారు (22వ కీర్తన) బిగ్గరగా పాడిన అదే కీర్తనను, ఆ వేషధారుల సమూహముకూడా క్రింద పాడుచున్నారు. "వారు నా అంగీకొరకు జూదమాడి చీట్లు వేసిరి,”అని దావీదు అదే కీర్తనను (పరిశుద్ధాత్మ ద్వారా) దాదాపు 800 సంవత్సరముల క్రితమే బిగ్గరగా పాడిన కీర్తననే వారుకూడా పాడిరి. ఆయనకూడా అదే మాటలతో మూలుగుచూ పలుకుచున్నను దానిని వారెరుగకుండిరి.

54. నేడు వేద పండితులని పిలవబడే వీరు మరియు సంఘశాఖలు, అనాడు పెంతెకోస్తు దినమున జరిగిన ఈ కార్యములను చదివికూడా, అదే కార్యము కార్య రూపము ఎంత అవమానకరము! కాని మనలను గొప్ప క్రైస్తవ సంఘమని, పెంతెకోసు ప్రజలుగా దాల్చుటను చూచిన పిదపకూడా వారిని, "పరిశుద్ద దొర్లు బండలని" పిలుచుచున్నారు. మనము చెప్పుకుంటున్నాము. దానిని సందేహిస్తున్నాను. గమనించండి, ఒక సంస్థగా మనము పెంతెకోస్తుగా ఉండలేము. వ్యక్తిగత రీతిలోనే మనము పెంతెకోస్తుగా వుండ వచ్చు. అదొక అనుభవము కాబట్టి మనము ఉండగలిగిన ఏకైక మార్గము అదేయగును.

55. ఏదైనా ఒక కార్యమును ఆయన నోటిద్వారా చెప్పించుటకు వారు ప్రయత్నించిన ప్పుడు, "నీవు దేవుని కుమారుడవైతే... నీవు ఆహారము లేకుండా నలభై దినములు ఉపవాసముతో ఉన్నావు గనుక, ఈ రాళ్ళను రొట్టెగా మార్చి నీకునీవే సహాయము చేసుకోగల శక్తి నీకున్నదని నీవెరుగుదువు, కావున నీవు అలాగు చేసిన నిన్ను నమ్మి నాకు నేనే మారుమనస్సు పొందెదనని, ”చెప్పుటకు సాతాను ప్రయత్నించినప్పుడు, ఆయన సాతానుయొక్క ఉపాయమును ఎరిగినవాడు. ఆయనలోనున్న ఆ టీకా మందు. క్రియచేసెను. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో ఆయనకు తెలుసు. నేడువున్న సమస్య ఇదే. కొన్నిసార్లు మనము ఎక్కువగా మాట్లాడుతాము. కాని ఎప్పుడు మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో తెలుసుకోండి. దేవుడు ఏదైనా చెప్పేవరకు ఏమి మాట్లాడవద్దు. మీరు దానిని ఎలాగు చేయగలరు? మీరు అలాగు చేయనియెడల,అనగా దేవుడు వ్యక్తిగతముగా మీతో చెప్పని దానిని చెప్పిన, అప్పుడు మీరు ఏదోక తప్పును చేసినవారగుదురు. మీరు అలాగు చేసినప్పుడు, దైవదూషణ చేయువారగుదురు.అది దేవుడని నిశ్చయతను కలిగి ఉండండి. దేవుడే మీతో నేరుగా మాట్లాడనివ్వండి,ఆ తర్వాతే, అది "ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడని" చెప్పండి. నేను వెళ్లి, "జాక్ మూర్ నాతో ఫలానా - ఫలానా కార్యము చెప్పెనని" చెప్పిన,కాని అతను దానిని అసలు చెప్పకుండానే చెప్పినట్లుగా చెప్పిన, నేను అబద్ధము చెప్పినట్ల గును.ఓ,దేవా. మనకు కావలసిందల్లా మనము ఆ టీకా మందును వేసుకొనుటకు తిరిగి వెళ్ళుట, పెంతెకోస్తు శక్తిని పొందుకొనుటకు తిరిగి వెళ్ళవలెను, పరిశుద్ధాత్మను పొందుకొనుటకు తిరిగి వెళ్ళవలెను. అవునండీ! కాని ప్రతీసారి మనము దానినుండి చాలా దూరముగా తొలగిపోవుచున్నాము. మన సిద్దాంతములు, సంఘములు, సంఘ శాఖలు ప్రజలను విభజించి వారిని ఎప్పటికప్పుడు దూరముగా తరిమివేయుచున్నాము.

56. టీకా మందు యేసుపై నిలిచియుండెను. ఆయన సిలువనుండి దిగి రాగలడనే స్థితిలోకూడా దేవ దూతలతో నిండి ఉండి, మీరు సిలువ నుండి దిగి రావలసిన అవసరములేదు. ఆ టీకా మందు దానిని ఎదుర్కొని నిలబడగలిగెను. "ప్రతీ వృక్షముపైన కేవలము మీ వేలుతో సైగ చేయండి, చాలు, మొత్తం పరిస్థితిని మేము మార్చివేస్తామని" దూతలు చెప్పినటుగ్గా బిల్లీ సండే (Billy Sunday) అనే అతను చెప్పెను.కాని ఆయన, “నేనెల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యమునే(చిత్తమునే) చేయుడు నని"చెప్పెను. అనగా ఏమిటి? టీకా మందు ఎదుర్కొని నిలబడెను. వాక్యము మరియు దేవుని చిత్తము ఆయనలో నిలిచియుండుటవలన, ఆయనను వెన్ను తట్టి ఆదరించక పోయినా, గలలీయుడవైన యవ్వన రబ్బీయని పిలిచినా, పిలువలేక పోయినా, లేదా ఆయనను బయెల్జెబూలని పిలిచినా, దెయ్యము మరియు సోది చెప్పేవాడని పిలిచినా, అది ఏమైనాగానీ, ఆయననుగురించి దూషణకరమగు ఎన్ని మాటలు చెప్పినా, ఏమి ఫర్వాలేదు. ఎందుకనగా ఆ టీకా మందు ఎదుర్కొని నిలబడగలిగెను.ఆవిధముగా ఆయన వారు దూషిస్తూ మాట్లాడుచు ఆయన ఎలాగు ఉన్నాడో ఆయన వైపు గమనించి చూచిరి, ఆయన గొప్ప శబ్దముతో కేకవేసి, ఆ సిలువపై వాటన్నింటిని భరించెను. కానీ ఆ టీకా మందు దానిని ఎదుర్కొనెను. ఆమేన్! సమస్తము ఆయన చేయిని విడిచెను, ఆయన సంఘము, ఆయన ప్రజలు, చివరకు దేవుడుకూడా ఆయన చేయిని విడిచెను. కాని టీకా మందు ఎదుర్కొని నిలబడెను.ఆకాశము చిమ్మ చీకటికాగా, బండలు బద్దలయ్యే మధ్యన,నా రక్షకుడు తల వాల్చి మరణించెను.పరలోకముయొక్క ఆనందము మరియు అనంతమైన దినమునకు తెరవబడిన తెర, మార్గమును బయలుపరచినది,

57. అదే తిరిగి వచ్చే మార్గము, ఆ మందు తట్టుకొని నిలబడును. ఏది వచ్చినా, ఏది పోయినా దానితో సంబంధము లేదు, అది అట్లే ఎదుర్కొని నిలబడును. టీకా మందు ఎదుర్కొని నిలబడెను. ఆయన పిరికివానివలె కాకుండా రాజ కుమారునివలె ఆయన మరణించుటకు వారు చూచిరి. ఆయన ఎన్నడూ వెనుదీయని ఒక రాజ కుమారునివలె దానిని ఎదుర్కొనెను. దానిని ఏవిధముగా ఎదుర్కోవలెనో ఆయనకు తెలుసు, ఎందుక నగా ఆయనకు పరిశుద్ధాత్మద్వారా టీకా వేయబడెను.ఈస్టర్ ఉదయమున అదేమైయున్నదో నిరూపించబడినది. ఆ టీకా మందు అన్నింటిని ఎదుర్కొని నిలబడుటవలన ఆయన మృతులలోనుండి లేపబడెను, దాని కొరకు ఆయనకు టీకా వేయబడినది. “మీరు ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను మూడు దినములలో దానిని లేపుదునని" ఆయన వారితో చెప్పెను. హల్లెలూయా! ఆయన ఏమి చేయుచున్నాడు? ఈ భూమిమీద తన తండ్రియైన దావీదుద్వారా దేవుడు మాట్లాడిన దేవుని వాక్యమును మరలా ఉదాహరించుచు, “నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధున్ని కుళ్లుపట్టనీయవు" అని చెప్పెను. డెబ్బై రెండు గంటలు కుళ్ళుపట్టడానికి కేటాయించబడినదని ఆయనకు తెలుసు, కాబట్టే ఆయన, “మీరు ఈ దేవాలయమును పడగొట్టండి, నేను దానిని మరలా లేపుదునని" చెప్పెను. ఎందుకు? దానిని ఆయన చేయునని, దేవుని వాక్యములో పలుకబడినది.అదే పరిశుద్ధాత్మ, “సమ్మినవారిని ఈ సూచనలు వెంబడించును" అని చెప్పలేదా? ఈ లోకములో మనము దానిని ఎలాగు విడిచి బయటపడతాము? మీకు టీకా మందు వేయబడినట్లయితే, అప్పుడు దానిని మీరు కలిగియుండెదరు.

58. ఆయన ఆ స్త్రీతో, “నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను వేసుకున్న టీకా మందును మీరు వేసుకొనగలరా? నీ కుమారులను నా కుడి వైపున మరియు ఎడమ వైపున ఉండనిచ్చుట నా వశమున లేదు, కాని మీరు ఈ గిన్నెలోనిది త్రాగి, దీనిని చేసినయెడల, అంతా బాగుంటుందని” చెప్పెను. నిశ్చయముగా, “అది నా వశమున లేదు. కాని నేను త్రాగే ఈ గిన్నెలోనిది త్రాగగలరు, నేను బాప్తిస్మము తీసుకున్న అదే ఆత్మతో మీరుకూడా టీకా మందును వేసుకొనబడినవారైతే మరి సమస్త కార్యములన్నీ బాగానే ఉండును.”

59. ఈస్టర్ రోజున ఆ శిష్యులు అక్కడ నిలబడియున్నప్పుడు, అక్కడ సమాధి వద్దున్న దీన స్త్రీల సమూహము, వారు చూచిన కార్యము... మరియ ఏడుస్తూ, బాధతో అచ్చటి నుండి బయలుదేరుచుండగా, ఎవరో తనను పేరుపెట్టి పిలుచుటను ఆమె విని,తన చుట్టూ తిరిగి చూడగా, అది ఆయనేనని ఆమె చూచెను. ఆయన చనిపోలేదు.ఆయన మరలా లేచెను. "నేను వారిని గలలియలో కలుస్తానని, వెళ్లి నా శిష్యులకు చెప్పుము. నేను చెప్పిన రీతిగానే నేను తిరిగి వచ్చెదను. ఆ టీకా మందు ఎదుర్కొని నిలబడెను. నేనేవిధ ముగా మరణించెదనని పరిశుద్ధగ్రంధము చెప్పెనో అట్లే మరణించితిని.నా ఆత్మ పరిశుద్ధగ్రంధము చెప్పినట్లుగా చేయుచు, పాతాళమునకు దిగిపోయెను. కనుక మరణము మరియు పాతాళముయొక్క తాళపు చెవులు నావద్ద ఉన్నవి. నేను తిరిగి లేచాను,నేను నిరంతరము సజీవముగా ఉన్నానని, "ఆయన చెప్పెను. టీకా మందు దానిని ఎదుర్కొని నిలబడగలిగిననే దానికి సాక్ష్యముగా, ఋజువుగా అది ఉన్నది, ఆమేన్. ఓ, దేవా.

60. ఆ శిష్యులు దానిని చూసి, "మాకుకూడా ఆ టీకా మందు కావాలి. మాకు అది కావాలి”అని అడిగిరి. “యెరూషలేము పట్టణమునకు వెళ్లి, శరీర జన్య విషమ(టాక్సిన్)నే మందును నేను పంపేంతవరకు అక్కడ వేచి ఉండండి. మీకు నిత్య జీవము కావలను కుంటే, నేను కలిగియున్న దీనిని మీరుకూడా చేయాలనుకుంటే, పునరుత్థానముకొరకు నేను కలిగివున్న దీన్ని మీరు పొందుకోవాలని ఆశించితే,నన్ను ఉంచిన అదే మార్గమున మిమ్మల్నికూడా ఉంచగలిగే కార్యము మీరు కోరినయెడల, నేను మరణించినట్లు మీరు కూడా మరణించునట్లు చేయగల కార్యము మీకు కావాలని కోరిన, నిన్ను సమాధినుండి పునరుత్థానుడుగా లేపగల కార్యము మీరు కావాలని కోరినయెడల,నేను దానిని మీ పైకి తిరిగి పంపబోవుచున్నాను. వెంటనే అక్కడికి వెళ్లి వేచివుండుడని"ఆయన చెప్పెను.
ఇప్పుడు, "మీరు వెళ్ళి LL.D డిగ్రీని మీరు పొందుకొని రండని" ఆయన ఎప్పుడూ చెప్పలేదు. "మీరు అ, ఆ, ఇ లను నేర్చుకొని రండని" కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదు."మీకు టీకాలు వేయబడేవరకు వేచి ఉండండి, పైనుండి శక్తిని పొందువరకు వేచి ఉండండి. దాని తరువాత, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చును, ఇకప్పుడు మీరు నా పట్టభధ్రు లవుతారని(పండితులు)"ఆయన చెప్పెను. ఆమేన్. ఆమేన్. "వేచి ఉండండి, వేదాంత కళాశాల(సెమినరీ)కు నాలుగు సంవత్సరములు వెళ్ళవద్దు, పనికిరాని ఈ చెత్తనంత టిని మరియు ఈ పట్టములన్నింటిని పొందుకొనుటకు వెళ్ళవద్దు, మీలోనికి శవములను భద్రపరచే ద్రవమును ఎక్కించుకోవద్దు ద్వారా ఇవన్నీ పొందకుండా, అక్కడే ఉండి, వేచి ఉండండి. నీవు సీమ పందివి కాదు. నీవొక కుమారుడవు. మీరు శక్తిని పొందే వరకు, మరియు నిత్య జీవముయొక్క టీకా మందు మీ పైకి వచ్చేవరకు వేచి ఉండండి, మరియు అంత్య దినమున మిమ్ములను తిరిగి జీవముతో లేపెదను.

61. బాలుడా, ఆయనకు అక్కడే కొంతమంది వ్యక్తులు గలరు. వారిలో నేనుకూడా ఒకడినని నేను మొదట విన్నప్పుడు, వారేమి చెప్పినను నేను దానిని పట్టించుకోలేదు, నాకు కావాలసినది అదే. నేను ఎప్పుడూ చెప్పెదను, “ఇది ఒకవేళ అది కాకపోతే, అది వచ్చేవరకు నేను దీనిని పదిలపరచుకోవాలనికోరెదను." అవును. నాకు కావాలసినది అదే-ఆ టీకా మందు. వారు అక్కడకు వెళ్లి పది రోజులు వేచియున్నారు. ఓహ్,నా దేవా! అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివలె అకస్మాత్తుగా పరమునుండి ఆ టీకా మందు దిగి వచ్చెను, అది ప్రతీ ఒక్కరిని నింపింది, అప్పుడు నూట ఇరవైమందికి టీకా మందు వేయబడెను. ఓ, అది ఎలాంటి సమయము! అదే తిరిగి వచ్చే మార్గమై యున్నది. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి. అన్య భాషలలో మాట్లాడుట ప్రారం భించిరి,అగ్ని జ్వాలలవంటి నాలుకలు విభాగించబడి వారిమీద వ్రాలెను, అది దేవుడు, ఇశ్రాయేలు పిల్లలను అనుసరించిన గొప్ప అగ్ని స్తంభము - అదే దేవుడైయున్నాడు.ముగ్గురు దేవుళ్లు కాదు, ఒక్క దేవుడు. ఒకే ఒక్క దేవుడు, ముగ్గురు దేవుళ్లు కాదు. కాని మూడు కార్యాలయములలోవున్న ఒక్క దేవుడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మని పిలిచెదరు. అగ్ని స్తంభములోవున్న తండ్రియైన దేవుడు, తన స్వంత కుమారుడిలోని దేవుడు -కుమారుడగు దేవుడు, నీలోనున్న పరిశుద్ధాత్ముడగు దేవుడు నీలో, అదే దేవుడు అన్ని విధములుగా తనను తగ్గించుకుని, దిగివచ్చి, మానవ హృదయ ములలోనికి ప్రవేశించునట్లుగా తన మార్గమును ఏర్పరచుకొనెను. అవును అయ్యా!

62. అక్కడ వారు యేసుయొక్క వాగ్దానమునకు సంబంధించిన ఋజువును చూచారు. ఈ అగ్ని స్తంభము తననుతాను అగ్ని జ్వాలలుగా విభాగింపబడి, వారిమీద వ్రాలుటను చూచిరి, అరణ్యములో ఇశ్రాయేలీయులతో వచ్చిన అదే అగ్ని స్తంభము, అగ్ని నాలుకలు
-విభాగించబడిన అగ్ని జ్వాలలవంటి నాలుకలు- అచ్చటున్న వారిలో ప్రతీ ఒక్కొక్కరి పై వ్రాలెను. అక్కడ దేవుడు తన సంఘము మధ్య తనకుతానే విభాగించుకొనెను.ఒక పురుషుడు మరియు అతని భార్య ఏకమైయున్నట్లుగా, దేవుడు మరియు ఆయన సంఘము ఏకమయ్యెను. అచ్చట ఒక్కడే ఉన్నాడు! "నేను తండ్రియందును, తండ్రి నాయందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు." అదే టీకా మందు. ఆయన ఆ టీకా మందునే వేసుకొనెను. ఆయన పొందుకున్న టీకాకూడా అదే. “నాయంతట నేను క్రియలు చేయుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఈ దర్శనములను చూస్తున్నది నేను కాదు, అది నా తండ్రి. నాయంతట నేనేమి చేయను... తండ్రియేది చేయుట కుమారుడు చూచునో, అదేకాని తనంతట తాను ఏదియు చేయనేరడు, ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును.”అవిశ్వాసము నుండి కాపాడే టీకా మందు అదే. అది క్రీస్తుయొక్క స్థిరపరచబడిన విశ్వాసములో నిన్ను లంగరు వేయును. అది మిమ్మల్ని లంగరు వేయునట్లు చేయును.అక్కడే మీరు మరణమునుండి జీవములోనికి దాటియున్నారని మీరెరుగుదురు. దానికి విరుద్దముగా ఏ ఒక్కరూ మీతో మాట్లాడలేరు. మీకు అవతల ఎవరు దానిని వివరించలేరు. మీరు దేవునితో ఒంటరిగా పవిత్రమైన ఇసుకపైనున్న ఆయనయొక్క అడుగుజాడలలో ఉన్నారు. మీరు తిరిగి జన్మించారని మీరెరుగుదురు. మీ జీవితము పూర్తిగా మారిపోయి, మరి మీరు క్రీస్తులో నూతన సృష్టియగుదురు. నీనుండి దానిని తీసివేయుటకు తగినన్ని దెయ్యములు పాతాళములో లేవు. నీవొక నూతన జీవివి,ఒక నూతన సృష్టివి. నీవు దేవుని శక్తితో టీకా మందు వేయబడితివి, దేవుని పరిశుద్ధాత్మ యొక్క శరీర జన్యు విషము మిమ్ములను ఆకర్షించెను. ఆమేన్!

63. మీకు తెలుసా, ఆయన లోయయొక్క కలువయైయున్నాడు. నల్లమందు (Opium), లిల్లీ(కలువ) పుష్పమునుండి వచ్చును. అది మనకు తెలుసు. ఓహ్, అది ఏమై ఉన్నది! ఆ చుట్టతో పొగ పీల్చువారు నల్ల మందును ఉపయోగించి పొగ పీల్చుచు కలలనుకనే వారు అదేదో గొప్పగా తలంచుచున్నారు. ఓ, వారు నిశ్చయముగా ఈ టీకా మందును ఒక్కసారి వేసుకోవాలి. అన్ని కాలములకొరకు ఒకేఒక్క టీకా మందు. ఇది పొగ గొట్టమును పట్టుకొని పొగ పీల్చుచు కలలనుకనుట కాదుగానీ, పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మముద్వారా మీ అంతరాత్మలో మరలా లంగరు వేయబడిన పరలోకముయొక్క వాస్తవమైన కార్యముగా ఇదున్నది. ఇది మిమ్ములను నిద్రించునట్లుచేయును-నిద్రించుట అనగా లోక కార్యములకు చనిపోయి, క్రీస్తులో జీవింపజేస్తుంది. అస్పష్టమైన..?... నిరంతరము క్రీస్తు నీలో జీవించును. మీకు తప్ప మరెవరికిని తెలియని ఏదోక కార్యమును ఇది చేయును. ఆ శరీర జన్యు విషమును (సీరం) పొందుకున్నది మీరే. ఆ టీకా మందును పొందుకున్నది మీరే. అదేమిటో దాని గురించి అంతా మీరెగుదురు. ఎందుచేత? మీరు దానిని అనుభూతిచెందితిరి. అది మీకు తెలుసు. అది మీకేమి చేసినదో మీరు చూచిరి. అది మీకు ఏదో చేసినది. మీరు ముద్రించబడితిరి. ఆమేన్. మీరు ఎక్కడకు చెందినవారో మీరు ఎరుగుదురు.

64. మేము దూడలకు ముద్ర వేయుట ఆనవాయితి. ఒకసారి, ఒక స్త్రీ గుఱ్ఱముపై అక్కడకు వచ్చి, "మీరలా చేయుటకు సిగ్గు లేదా? ఆ చిన్న దూడమీద అలాగు ముద్రను వేయవచ్చునాని?"అడిగెను. "ఆ ముద్రను వేసేటప్పుడు దానికి కొంచెం నొప్పి కలిగి స్తుంది, కానీ దానివలన అది ఎక్కడికి చెందినదో, దానికి తెలుస్తుందని" నేను చెప్పాను. ఆమేన్. అదెక్కడికి చెందినదో తెలుసుకొనుటకు అదే మార్గమైయున్నది.దేవుడుకూడా మీకు కొంత నొప్పి కలుగునట్లుచేయును, కాని ఆ తర్వాత మీరెక్క డికి చెందినవారో మీరెగుదురు. ఆయన తన టీకా మందనే ఇనుప ముద్రను ఒక పురుషుడు లేదా స్త్రీమీద క్రుమ్మరించినప్పుడు, ఇదివరకు అతడేమైయుండెనో దానినుండి అతడిని ఆయన మార్చివేయును. అతనే స్థలముయొక్క పచ్చిక బయళ్ళకు చెందినవాడో ఆయనకు తెలుసు. అతని చుట్టూ ఉన్నవి ఏదీకూడా నియమమునకు విరుద్ధముగా చెయ్యకుండునట్లు ఆయన నడిపించును. అతనికొక గృహము గలదు. అతడు మేయుటకు ఒక పచ్చిక బయలు ఉన్నది. అతనికి చెందిన ఒక స్థలముగలదు. పరిశుద్ధాత్మే, అతనిని శాంతికరమైన జలములయొద్దకు నడిపించి, అతనికి నిత్య జీవము ఇచ్చే నాయకుడు.

65. ఈ మనుష్యులు తమ గర్వమును కోల్పోవుటను చూచినప్పుడు... వారు ఆత్మలో నృత్యము చేయవలసివచ్చినది, వారు భాషలలో మాట్లాడవలసివచ్చినది. విభాగింపబ డిన అగ్ని జ్వాలలవంటి నాలుకలు వారినుండి బయటకు జ్వలించినవి. ఇక్కడ ఒక గలలీయుల గుంపు ఆకాశము క్రింద ఉండే ప్రతి భాషలో మాట్లాడుచూ బయటకు వచ్చిరి. వాటన్నింటికి అర్ధము ఏమిటో వారికి తెలియదు. వేద పండితులు నిజముగా ఆశ్చర్యపోయిరి. ఏమి జరిగెనో వారెరుగరు, కాని వారికి టీకా మందు వేయబడెను.మీకు తెలుసా, ప్రశ్నలు తలెత్తినప్పుడు, "వీటన్నింటికీ అర్ధము ఏమిటని?”వారు అడగవలసి వచ్చెను. "గిలాదులో గుగ్గిలము ఏదైనా ఏమియు లేదా? అక్కడ వైద్యుడును లేదా?". వారికి ఒక వైద్యుడు ఉండేవాడు. వారికి ఒక గొప్ప వైద్యుడు ఉన్నాడు. వారికి భూ సంబంధమైన వైద్యుడు ఉన్నాడు. అతని పేరు ఏమిటో తెలుసా? డాక్టర్, సీమోను పేతురు, అతనికొరకు ఒక చిన్న సబ్బు పెట్టెలాంటి పెట్టెను తీసుకుని,దాని పై నిలబడి, వారికొరకు ప్రసంగించెను. వారు, "మేము దానికి అర్హులమగు వ్యక్తులము. రక్షింప బడుటకు మేము ఏమి చేయాలి?" అని అడిగిరి."సహోదరులారా, మీకు ఇది కావాలా?”"అవును.""ఎందుకని ఇది... ఇదెక్కడనుండి వచ్చినదో లేఖనములలోకి వెళ్ళి నేను మీకు చెప్పెదను. (ఏ మంచి వైద్యుడైనా తన సూత్రంవద్దకు తిరిగి వెళ్ళును) అహ్, ఓ,వెనుకకు తిరిగి వెళ్ళుము. అంత్య దినములలో అది వచ్చునని ప్రవక్తయైన యోవేలు ద్వారా ఇది పలుకబడెను. 'సర్వ జనులమీద నా ఆత్మను కుమ్మరింతును' దేవుడు చెప్పెను.వారు, "డా॥సీమోను పేతురు, రక్షింపబడుటకు మేమేమి చేయాలి?" అడిగారు. "నేను మీకొక మందు చీటీని వ్రాసి యిచ్చెదను, ఇది మార్చబడలేని ఒక మందు చీటిగా ఉండబోవుచున్నది. అది నిత్యమైన మందు చీటి.” అదేమనగా, "మీరు పశ్చాత్తాపపడి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్దాత్మను వరమును పొందుదురు. ఈ మందు చీటి మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారందరికిని చెందునని" వారితో చెప్పెను. ఓ, సహోదరుడా! అదే ఆ మందు చీటి. దానిని అట్లే అమలు చేయండి. గిలాదులో గుగ్గిలము పుష్కలముగా ఉన్నది, మరి ఇక్కడ మనకు చాలా మంది వైద్యులు ఉన్నారు. అదే నిజము.

66. విషయము ఏమిటో మీకు తెలుసా? ఒక వైద్యుడు ఒక సూత్రమును వ్రాస్తే,కొంత మంది నకిలీ వైద్యులు దానిని పట్టుకుని, ఎక్కువ మోతాదును ఇచ్చినా లేదా తగినంత మోతాదును ఇవ్వకపోయినా అతను ఆ రోగిని చంపివేయును. నేడు జరుగుచున్న విషయము అదే. మందుచీటి వ్రాయబడినది-పెంతెకోస్తు దినమున ఆ నిత్య మందు చీటి వ్రాయబడినది. చాలా మంది నకిలీ వైద్యులు, తమను వైద్యులుగా పిలుచుకునే వారు ఆ మందు చీటిలోనున్న దానిలో ఇతర విషయములను చొప్పించిరి. మరి మెడవరకు వెంట్రుకలను కురచగా కత్తిరించుకొనిన స్త్రీలను మరియు పొట్టి వస్త్రములను ధరించుకొని వచ్చే స్త్రీలుగల సంఘముగా అది సంఘమును చంపివేసినది. జరిగిన విషయము అదే. ఆ కారణముచేతనే మన స్త్రీలు కురచగా వెంట్రుకలను కత్తిరించుకొను కొనచున్నారు, మన పురుషులు సంఘమును శాఖలుగా విభజిస్తూ మరియు మొదలైనవి చేయుచు,అసలు నిలబడుటకు తగినంత ధైర్యము కూడా లేనివారుగా మారిపోవుటకు అదే కారణమగును. వారు ఆ మందు చీటీని లేఖనానుసారముగా అమలుచేయుటలేదు.

67. మీరు తిరిగి వెళ్ళే మార్గమును తెలుసుకోవాలనికోరుచున్నారా? అది ఇదే. పేతురు దాన్నిగురించే చెప్పెను,టీకా మందును ఇచ్చేవాడు డా॥ పేతురే. క్రీస్తు దానిని తనపైనే ప్రయోగించుకోగా, అది పని చేసెను. పేతురు దానిని వేసుకొనెను, అది పని చేసెను. నేను కూడా దానిని వేసుకున్నాను, అది చాలా బాగా పనిచేస్తున్నది. ఆ మందు చీటి అదే.దానిని కలుషితం చేయుటకు ప్రయత్నించవద్దు. దానికి ఏదోకటి కలిపి కల్తీ చేయుటకు ప్రయత్నించవద్దు. మీరు ఎక్కువగా విషము (క్రిమి సంహారిణి) వేస్తే, మీరు మీ రోగిని చంపెదరు, నిశ్చయముగా ఈ లోక రీతిగా చేయవద్దు.ఆ చీటిలోని మందును ఎలా సమతుల్యము చేయవలెనో వైద్యునికి తెలుసు. అది నిజమే.కాబట్టి, మందు చీటి ఎలాగు ఇవ్వబడినదో నీవు తెలుసుకొనగోరితే, ఆయన సరిగ్గా దానిని ఇచ్చట అపోస్తులుల కార్యములలో వ్రాసియుంచెను. ఖచ్చితముగా దానిని ఆవిధముగానే చేయవలెను. అదేదో బోధకుడితో కరచాలనము చేయుట, కొన్ని చుక్కల నీటిని మీపై చిలకరించుకొనుట, ఏదైనా లేక మరేదైనా కాదు. ఆయన మందు చీటి సరిగ్గా ఇక్కడే యిచ్చెను. మీరు దానిని లేఖనములో చెప్పినట్లుగానే అనుసరించండి, మరి అదే ఫలితములను పొందుకొనెదరు (అది ఖచ్చితముగా నిజము) ఎందుకనగా, ఆయన దానిని సీమ పందిపై ఎప్పుడు ప్రయోగించలేదు, ఆయన దానిని స్వయముగా తన పైనే ప్రయోగించుకొనెను. దేవుడు శరీరధారియై మన మధ్య నివాసము చేసెను, కనుక దేవుని ఆత్మ మూలముగా జన్మించిన ప్రతీ దేవుని కుమారుడా... "అది మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచినవారందరికిని", ఈ మందు చీటీ పని చేయును. ఆమేన్! నేను వెట్టివాడిని కాదు, కాని నేను ఆ టీకా మందును వేసుకున్నాను. ఆమేన్. ఇక్కడ ఏదో కదులుతున్నది. అదే సరైనదని నేనెరుగుదును. నేను దానిని ప్రయత్నిం చాను. అది సత్యమని నాకు తెలుసు. ఆనాడు వారు పొందుకొనిన అదే ఫలితములే...

68. “నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును. నేను చేయు ఈ క్రియలు మీరు కూడా చేయుదురు... మీలోనున్న క్రీస్తే మహిమయొక్క నిరీక్షణయైయున్నాడు. క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి." అచ్చటున్న అదే మనస్సు అచ్చటున్న అదే శక్తితో ఉన్నయెడల, ఆయన చేసిన అదే క్రియలను మీరును చేయుదురు. మీరు దానిలోని విషమంతటిని, బాధంతా తీసివేసిన.. ఇదిగో "నేను దీనిని మీకు చెప్పుటకు భయముగా ఉన్నది...”అని ఎవరైనా చెప్పిన యెడల, అతను ఆడంగివాడు! దేవునికి ధైర్యమైన పురుషులు కావాలి."దానిని చెప్పుటకు నాకు ఇష్టము లేదు...”ఓ,కొందరు... దానిని పొందుకోవలసిన... అదేమిటో నాకు తెలియదు. వారికి టీకా మందు వేయవలసినవసరమున్నది. అవునయ్యా. మనకు కావలసినది టీకా మందు వేయబడుట. అవునయ్యా. అది మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికి.


69. ఇప్పుడు, చూడండి, నీవు అందులో ఎక్కువ మోతాదు (మందులో కలుపు)విషమును కలిపిన, నీ రోగిని నీవే చంపెదవు. అది నిజమే. చూడండి, కనుగొన్న సత్యముతో మీరు మొరటుగా, మూర్ఖంగా, దురుసుగా ధ్వంసం చేయునట్లు, మరియు అతిగా పెత్తనం చెలాయించే వారుగా ఉండకూడదు. అర్థమైనదా? ఇక్కడే ఏకత్వము (One-ness) సహోదరులారా మీరు తప్పు చేసిరి, ఇప్పుడు మనము మరలా రహదారికివైపుకు తిరిగి వెళ్ళుచున్నాము. స్వస్థను పొందుకొనుటకు మనము తిరిగి వెళ్ళుచున్నాము. అసెంబ్లీ(Assembly) సహోదరులారా, మిమ్మల్ని మీరు వేరుపరచుకొని, మీలో ప్రతి ఒక్కరు, అక్కడే మీరు తప్పు చేసిరి. ఎప్పుడైతే సత్యము హెచ్చించబడునో, దానితో అట్లే కొనసాగండి. దానిని అలాగే ఉండనివ్వండి. దేవుడే దానిని చూచుకొనును. ఆయన ఒకరిని పిలిచితే తప్ప ఏ మనుష్యుడు ఆయనయొద్దకు రాలేడు. అదే నిజము.తిరిగి వెళ్లే మార్గము, సహోదరుడా, అది సహోదరులందరితో సహవాసము చేయుట గును. అది నిజమే. ద్వేషమునుండి నిరోధించబడి, దుష్టత్వమునుండి నిరోధించబడి, లౌకిక వాదమునుండి నిరోధించబడి, పెంతెకోస్తు దినమున అగ్ని జ్వాలల అభిషేకమును పొందుకొనిన సంఘముగా మార్చి, యేసు క్రీస్తును సమాధినుండి సజీవునిగా లేపిన శక్తిని పొందుకొనుటకై పరిశుద్ధాత్మనే టీకా మందు వేసుకొనుటకు మనము మరలా ఆ మార్గమునకు తిరిగి వెళ్ళుటయే ఉత్తమమైనది. టీకా మందుకొరకు తిరిగి వెళ్ళండి.

70. ఇదిగో మందు చీటి, “ఇచ్చట నీళ్ళు ఉన్నవి. మిమ్మల్ని ఏది ఆటంకపరచుచున్నది?”ఇదిగో ఇచ్చట సంఘము అంతటా ఆత్మ ఉన్నది. సమస్య ఏమిటి? ఒక దినము దేవుడు తప్పకుండా, “ఎందుకు చేయలేదని?” అడుగును. మీరు మందు చీటిలన్నింటిని తీసికొని, మీ సంఘమునకు దానిలో ఏదైనా చెప్పుటకు భయపడితే, మీ సంఘశాఖ మిమ్ములను సంఘమునుండి వెలివేస్తుందని భయపడితే, మరి నిన్ను గూర్చి నీవేమి చేస్తావు? అసలు మందే లేని ఒట్టి నీళ్ళను వారికి త్రాగుటకు నీవు ఇచ్చుచున్నావు. వారేవిధముగా చెసెదరో అట్లే వారు చేయుటకు అదే కారణమగును. అది నిజమే.మీకు వ్రాయబడిన మందు చీటి అవసరమైయున్నది. అదే తిరిగి వెళ్లే మార్గము. ఆ మార్గములోనే అది ప్రారంభమైనది. ఆ మార్గములోనే దేవుడు తన సంఘమును ప్రారంభించెను. మీరు ఆ మార్గమునుండి తొలగిపోవునప్పుడు, మీరు దారి తప్పిపోయె దరు.మనము సంఘమును ఒక సంస్థగా మార్చినప్పుడు, కరచాలనమనే సిద్దాంత మును అనుసరించినప్పుడు, బాప్తిస్మమునకు బదులుగా చిలకరించుటను అవలంభిం చినపుడు, పరిశుద్ధాత్మను పొందుకొనుటకు బదులుగా కరచాలనము చేస్తే చాలని చెప్పునప్పుడు, లేదా పరిశుద్ధాత్మ కొరకు పలచటి రొట్టె ముక్కను తీసుకుంటే చాలని చెప్పెదరో, ఇకప్పుడు మీరు ఆ మార్గమునుండి తొలిగిపోయి తప్పిపోయెదరు.


71. ఒక వ్యక్తి మెషిన్ గన్ ద్వారా కాల్చబడినప్పుడు, సైన్యములోనున్న మత గురువు వచ్చి, "దళపతి, నీకు దేవుని గురించి తెలుసా?" అని అడిగెను.“నాకు ఆయన ఒకప్పుడు తెలుసు" అని దళపతి చెప్పెను."ఆయనను నీవు ఎప్పుడు ఎరుగుదువు?" అని గురువు అడిగెను.“నాకు జ్ఞాపకము లేదు" అని దళపతి చెప్పెను."ఆయనను ఎక్కడ విడిచిపెట్టావు? ఆయనను కనుగొనడానికి నీవు ఆయనను ఎక్కడ విడిచిపెట్టితివో మరలా అచ్చటికే నీవు తిరిగి వెళ్ళవలెనని" గురువు చెప్పెను.“నాకు తెలియదు” అని దళపతి చెప్పెను.“మీ ఊపిరితిత్తులు రక్తముతో నిండిపోవుచున్నవి, అయ్యా, ప్రశాంతముగా మరియు త్వరగా ఆలోచించుట నీవు యుక్తమైనది” అని గురువు చెప్పెను.కనుక కొద్దిసేపు అతను అలాగే పడుకొని ఉండెను, అతని ముఖములో ఒక గొప్ప శాంతి వచ్చెను. "నాకు జ్ఞాపకము వచ్చినది, నేను ఆయనను ఎక్కడ విడిచి పెట్టితినో నాకు జ్ఞాపకము వచ్చెను" అని దళపతి చెప్పెను."ఆయనను ఎక్కడ విడిచిపెట్టితివో, మరలా అచ్చటినుండే ప్రారంభించమని” గురువు చెప్పెను. “ఇప్పుడు నేను నిద్రించుటకు తలవాల్చాను. కనుక నా ఆత్మను కాపాడమని నేను ప్రభువును వేడుకొనెదను. నేను మేల్కొనేలోపు చనిపోతే,నా ఆత్మను చేర్చుకోమని నేను ప్రభువువద్ద ప్రార్థిస్తున్నానని" అతను చెప్పెను. ఊపిరితిత్తులలో రక్తపు ధారలతో నిండిపోవుటచేత అతను తుది శ్వాస విడిచి మరణించెను. అతనేమి చేశాడు? అతను యేసును ఎచ్చట విడిచిపెట్టెనో సరిగ్గా అచ్చటే ఆయనను కనుగొనెను.అక్కడే సంఘము ఆయనను కనుగొనగలదు. మీరు ఆయనను ఒక సంఘశాఖలో ఎన్నటికీ కనుగొనలేరు. ఆయన అక్కడ లేడు. మీరు ఆయనను ఒక రకమైన విద్యకు సంబంధించిన కార్యక్రమములో ఎన్నటికీ కనుగొనలేరు. ఆయన అక్కడ ఉండడు. మీరు ఆయనను పరిశుద్ధాత్మ బాప్తిస్మమందు కనుగొనగలరు, ఆయనను కనుగొనే ఏకైక ప్రదేశము అదేయగును. ఆమేన్.

72. సహోదరుడా, ఇదే సత్యమగును! ఇదే తిరిగి వెళ్లే మార్గము. మందుచీటిలో ఏదీ చేర్యవద్దు, ఏదీ తీసివేయవద్దు.దానిలో ఉన్నట్లుగానే తీసుకోండి. దానిని విశ్వాసిం చండి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి. ఇది ప్రతీ తరమునకు చెందినది.గమనించండి, ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారందరికిని చెందును. ఈ మందు చీటివున్న ప్రతి వ్యక్తికి చెందును. ఇదేదో కరచాలనము చేయుటయో లేదా మరేదో కాదుగానీ, సరిగ్గా పేతురు ఇక్కడ మాట్లాడిన మరియు వ్రాసిన విధముగానున్నమందు చీటి, అపొస్తలుల కార్యములు 2:38లో దేవుడు పరిశుద్దాత్మద్వారా వ్రాసినట్లు గానే, మీలో ప్రతి ఒక్కరు పశ్చాత్తాపపడవలెను. “సరే, పశ్చాత్తాపపడవలెనా? అలాగైతే, నేను వెళ్లి సంఘములో చేరెదనని” కేవలము చెప్పుట కాదు. దాని అర్థం అది కాదు."సరే, నేను వెళ్లి బాప్తిస్మము తీసుకుంటాను, అది దానిని చేయును." లేదయ్యా, నీళ్ళు నిన్ను రక్షించవు. పశ్చాత్తాపమును పొందుము లేదా నశించిపొమ్ము. బాప్తిస్మము పునరుజ్జీవనం కొరకు కాదు. మీలో కొందరు దానిని నమ్ముచున్నారని నాకు తెలుసు. కాని, మీరు ఎట్లు ఆవిధముగా తీసుకొనగలరు? లేదయ్యా. పశ్చాత్తాపము పొందండి!"మొదట పశ్చాత్తాపము చెందాలి, పశ్చాత్తాపపడిన తర్వాత మీ పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడని మందు చీటి సూచిస్తున్నది. మీరు పశ్చాత్తాపపడినతర్వాతే పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మము పొందుకొనుటకు అర్హుడగు ఒక వ్యక్తియగుదువు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, 73. ఓ మెథడిస్టులారా, బాప్టిస్టులారా, ప్రెస్పిటేరియనులారా, నజరేనులారా, పిలిగ్రిమ్ హోలీనెస్, కాథలిక్కులారా, పెంతెకోస్తులారా, సమస్య ఏమిటి? మీ సమస్య ఏమిటి?దేవుడు తన శక్తితో మరియు మహిమతో మాట్లాడటానికి దిగి వచ్చినప్పుడు, మీరు వాటన్నింటినిగూర్చి ఆశ్చర్యపడుదురు. ఆ కారణముచేతనే మీరు ఈ మత సంప్రదాయ ములను మరియు కార్యములను గలవారైయున్నారు. ఈ సిద్ధాంతములను మరియు కార్యములను నిజ మార్గమునుండి తొలగిపోయేంతవరకు లోపలకు అనుమతించి), పిల్లలారా, తిరిగి రండి. మందు చీటిని పాటించండి, అదే మీరు తిరిగి వచ్చే మార్గమైయు న్నది. ఈ పాప వ్యాధిని, ఈ అవిశ్వాసమును వదిలించుకొనండి. దేవునివద్దకు తిరిగి రండి. మీ పూర్ణ హృదయముతో దీనిని విశ్వాసించండి. మనము ప్రార్థించుదాము.

74. నేను నిన్ను నమ్ముచున్నాను, ప్రభువా. నేను ఈ రాత్రి ఈ సంఘముతో వచ్చు చున్నాను. నేను విశ్వసిస్తున్నాను, ప్రభువా, నేను సంధించిన సంతతిలోనే నిజాయితీ హృదయముగల ప్రజలతో వచ్చుచున్నాను. మనలోనే మనము ఈ విషయములనుగూర్చి మాట్లాడుకొను చున్నామని వారు తలంచకూడదని ప్రభువా, నేను ప్రార్థించుచున్నాను. ఈ విషయములు చెప్పుటకు భారముగాను, హృదయ వేదనగాను వారు కనుగొనవచ్చు. అయినప్పటికీ, ఒక నిజమైన వైద్యుడు తన మందు చీటికి అనుగుణముగా యదార్థంగా ఉండును. ప్రభూ, ఈ రాత్రి ఇది ప్రతీ హృదయములో నిండియుండునుగాక! ఇక్కడున్న ప్రజలు యోహాను యొక్క బాప్తిస్మము మాత్రమే పొందుకొనియుంటే,పౌలు వారిని కనుగొనినట్లుగా, మరొక బాప్తిస్మము ఉన్నదని, అది పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మ మని వారు గ్రహించునుగాక. ఒక పరిచారకునికి కరచాలనము చేయుట లేదా ఏదోక మత సిద్దాంతములో చేరుట మాత్రమే వారెరిగినవారైతే, మీ పరిశుద్ధాత్మతో వారు నింపబడుదురుగాక. ప్రభువా, దానిని వారికి అనుగ్రహించుము. వారు వినయముగా వచ్చి, ఈ విశేషాధికారమును పొంది, మరలా అజుసా వీధికి అనుభవమునకు తిరిగి వచ్చెదరుగాక! దేవుని రాజ్యమునకు, మహిమకు, మరలా పెంతెకోస్తుయొక్క మార్గమంతటి గుండా తిరిగి రండి. మా బలియగు యేసు క్రీస్తును ఉంచిన మీ సువర్ణ బలి పీఠము ఎదుట నేను వారిని నీకు సమర్పిస్తున్నాను. తండ్రీ, మమ్ములను స్వీకరించుము.

75. నీవు దేవుడవు. నీవెల్లప్పుడూ దేవుడివే. నీవెప్పటికీ దేవుడుగానే ఉంటావు. నీ మాటలు విఫలమవ్వవు. నీవు నివసించుటకు నిర్మించిన గుడారమగు నీ స్వంత కుమారునిలో భూమిపై శరీరధారియై ఇక్కడ నిలిచివున్నప్పుడు, అది ప్రజలను ఎంత గానో గ్రుడ్డివారిని చేసెను. వడ్రంగి తాను నివసించుటకు ఒక గృహమును నిర్మించుకో లేడా? గొప్ప నిర్మాణికుడగు దేవుడు నివసించుటకు తనకొరకు ఒక గృహమును నిర్మించుకోలేడా?ఓ,దేవా, నివాస స్థలమును కాదుగాని దానిలో నివాసముచేయుచున్న ఆ గృహ నిర్మాణకుడినే వారు చూచుదురుగాక! కృపద్వారా, పాపులమగు మా హృదయ ములలో దేవుడే నివసించునట్లు, మరియు దేవుడు నివసించిన ఆ నివాస స్థలములో మరణించి, పాతిపెట్టబడి, పునరుత్థానము ద్వారా, తన స్వంత సృష్టియగు కల్మషములేని రక్తముద్వారా,మార్గమును శుద్ధీకరించినది ఈ పరిశుద్ధాత్మేనని వారు గ్రహించునుగాక! నీవు నీ క్రియలను నీ సంఘముద్వారా, మనిషనే సాధనముద్వారా కొనసాగించె దవు. అదియే నీవెల్లప్పుడును క్రియచేసే నీ మార్గమైయున్నది. దేవా, ఈ రాత్రి ఇక్కడున్న పురుషులు, స్త్రీలు తమ హృదయాంతరంగములలో ఆకలిని, దప్పికను కలిగియుందురు గాక. మేము సునాద సమయములో ఉన్నాము. ప్రభువా, యాభై సంవత్సరముల క్రితము మీ సంఘముపై మీరు కురిపించిన మీ గొప్ప కృప మరియు పవిత్రతయొక్క ఈ సునాదము వారమును, ఇచ్చట ఈ రాష్ట్రములో మేము జరుపుకుంటున్నాము. తండ్రియైన దేవా, ఇది సునాద సమయము, ఎలా తిరిగి రావాలో ప్రజలకు తెలుసు. ఇదే మొట్టమొదటగా, మొదటి సంఘము వారు ప్రారంభించిన మార్గము. పరిశుద్ధాత్మయొద్దకు తిరిగి రండి. దీనిలోనికి సంఘశాఖలు చొప్పించిన ఈ సిద్ధాంతము లను తిరస్కరించుటకు తిరిగి రండి. తిరిగి వచ్చి దేవునియొక్క శక్తితో స్వస్థతను పొందండి. తండ్రీ, దానిని అనుగ్రహించుము.

76. మేము గత రాత్రి ధ్యానించినట్లుగా, ఈ కార్యములనీ మీ వాగ్దానము ప్రకారము, మా మేలుకొరకు క్రియచేసెనని ఇప్పుడు మేమెరుగుదుము. ఎందుకనగా, ఇశ్రాయేలులో మీరు దానిని ఒక మాదిరిగా ఇచ్చితిరి. ఇప్పుడు, దేవుడు - యేసుక్రీస్తు, ఇమ్మానుయే లుయైన ఆయన, ఇక్కడ భూమిపై నిలబడి, "నేను చేయు క్రియలు నాయందు విశ్వాస ముంచువాడును చేయును" అని చెప్పెను, ప్రభువా! అది అట్లే జరుగునుగాక!.మేము ఈ ఆరాధనను, వాక్యమును సమర్పించుచున్నాము. వారి చితికిన విధాన మును క్షమించండి ప్రభువా!, కానీ మీరు దానిని ప్రతి హృదయములోనికి నింపాలని నేను ప్రార్థిస్తున్నాను, అది ఆత్మతో నింపబడిన పవిత్రమైన సంఘమును తీసుకొనివచ్చి, మరలా తిరిగి పెంతెకోసు దినమునకు అది తీసుకొని వెళ్ళును. యేసుక్రీసు నామములో దానిని మీకు సమర్పిస్తున్నాను. ఆమేన్.

77. మీరు నమ్ముచున్నారా? నేను కొన్ని క్షణములు దీనిపై మీ చెదరని దృష్టిని పెట్టా లని కోరుచున్నాను. మీ పూర్ణ హృదయముతో దీనిని విశ్వసించాలని నేను కోరుచున్నాను.నమ్మినవారందరు రక్షింపబడతారని ప్రభువైన దేవుడు మనకు వాగ్దానముచేసెనని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. ఇప్పుడు ఇదేదో సామాన్యమైనదిగా కనిపించును. కాని, మీరు గమనించండి, మీరు నిజముగా విశ్వసించినప్పుడు, మీరు చేయగలిగినది అదే. మీరు నిజముగా విశ్వసించినప్పుడు దేవుడు తప్పక మీ పై పరిశుద్ధాత్మను క్రుమ్మరించును. ఇకప్పుడు దేవుడు తన వాక్యమును ఋజువుపరుచును.ఇప్పుడు పరిశుద్ధ గ్రంధము చెబుతున్నది... ఒక్క నిమిషము ఆగండి. నేను దీనిని చేయడానికి ముందు ప్రార్థనా వరుస ఉండబోతోందని నేను నమ్ముచున్నాను. అది నిజమే కదా? అవును. సరే. ఎంతమంది పెంతెకొస్తుకు తిరిగి వెళ్లాలనుకుంటున్నారు? మీ చేతులు పైకెత్తండి. మందు చీటి ఇంకా మంచిదేనని ఎంతమంది నమ్ముచున్నారు? ఆమేన్. ఇది నిశ్చయముగానే మంచిదిగానే ఉన్నది- పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అది విద్య కాదు, మొదట పీహెచ్.డి(Ph.D.) పట్టాని పొందుకుని ఆపై... అని చెప్పుటకాదు.

78. నికోదేము యేసు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు, "నిత్య జీవమును పొందాలంటే నేనేమి చేయాలి?"అని అడిగెను. ఎనభై ఏళ్ల వ్యక్తి, అతని జీవిత కాలమంతా యాజకు నిగా ఉన్నవాడు...“నిత్యజీవమును పొందాలంటే నేనేమి చేయాలని?" అడిగెను."నీ పాండిత్యమును మెరుగుపరచుకోమని” యేసు చెప్పలేదు. లేదండి. “నీవు వెళ్లి నీ సంఘ సంస్థలో ఉన్నత పదవిని వెతుక్కోమని" ఆయన చెప్పలేదు. లేదండి. ఆయన అతనితో స్పష్టముగా ఇట్లు చెప్పెను. అతడు మంచి నైపుణ్యమును గలవాడైయుండి, మరలా తిరిగి జన్మించాలనే విషయమునుగూర్చి ఎలాగు తెలియకుండా ఉన్నావని ఆయన అతనిని గట్టిగా గద్దించెను. అవునయ్యా! చూడండి, ఈ రాత్రికూడా కార్యములు అట్లే ఉన్నవి. మనము దానిని చాలా తేలికగా తీసుకుంటున్నాము. మనము దానిని కేవలము ఏదో ఒకరకమై ఉద్రేకంతో "నేను తిరిగి జన్మించానని" చెప్పుకుంటూ ముందుకు సాగిపోవుచున్నాము. దానిని నీవు పొందుకోలేదని నీ జీవితమే ఋజువుపరు చుచున్నది. ఆ విషయంలో నీవు ఏదో పొరపాటుపడుచున్నావు. అవునండీ.ఓ, మీరు, "కాని ఆ వ్యక్తి మంచి మనిషి వ్యక్తియని నాకు తెలుసని” చెప్పవచ్చు. అతను ఎంత మంచివాడైనా సరే, దానికి దీనితో ఏ సంబంధము లేదు.మధురమైన మరియు సమస్త మంచి కార్యములుగల చక్కనివారగు మహమ్మదీయు లకన్నా మంచి మనుష్యులను మీరు సంధించి ఉండకపోవచ్చు. నిశ్చయముగా లేదు. ఓహ్, లేదు. కొన్నిసార్లు అన్య జనులు, విగ్రహారాధకులు... వారు సాధ్యమైనంతవరకు మధురమైన మరియు వినయముగా ఉంటారు. కాని దానిలో అర్ధము లేదు. లేదయ్యా,

79. "నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును. ” వైద్యుడు చెప్పినది అదే. ఇవి టీకా మందు వలన వచ్చిన ఫలితాలు. మీకు కావాలసినది అదే. అవునండీ. చేయవలసినది అదే. "నేను చేయు క్రియలను నాయందు విశ్వాసముంచువాడును చేయునని” వైద్యుడు చెప్పెను. ఆయన చెప్పెనుకదా? అదే ఒక విశ్వాసియొక్క సూచన.ఒక మంచి వ్యక్తిగా సంఘమునకు వెళ్ళుట, దశమ భాగమును చెల్లించుటనే, గురుతును కలిగివుండును. అది మంచిదే. అది బాగానే ఉండును. కాని యేసు చెప్పినది అది కాదు. "నమ్మినవారిని ఈ సూచకక్రియలు వెంబడించును, నేను చేయు క్రియలను నాయందు విశ్వాసముంచువాడును చేయును. ” పీచ్ చెట్టులోవున్న జీవమును బయటకు తీసి ఆపిల్ చెట్టులోనికి చొప్పింపజేస్తే, అది ఇకమీదట ఆపిల్ పండ్లు కాయదుగానీ, పీచ్ పండ్లును కాస్తుంది. ఎందుకనగా, పీచ్ జీవముయొక్క జీవ క్రిమి ఇప్పుడు ఆపిల్ చెట్టులో ఉన్నది, గనుక దానిలో పీచ్ పండ్లే పండును. అది నిశ్చయముగా సరైనది.

80. సహోదరుడు విలియమ్స్ ఇక్కడ నా ముందు కూర్చునివున్నాడు, నాకు చాలా వ్యక్తిగతమైన, మధురమైన స్నేహితుడు. అతను ఈ ఉదయము సహోదరుడు షర్రిటికి ఫోన్ చేసెను. నేను అతనికొరకు ఫోన్లో ప్రార్థన చేసాను. ఒక నిమ్మ జాతి (citrus) తోటలో నేను, సోదరుడు పర్రిత్తో కలిసి నిలబడివుండగా, అక్కడ ఒక చెట్టు వున్నది, అదొక నారింజ చెట్టని నేను నమ్ముతున్నాను. ఆ ఒక్క చెట్టులోనే నాలుగు లేదా ఐదు రకాల పండ్లను కలిగివున్నది. నేను సహోదరుడా జాన్, “అదే రకము చెట్టని” అడిగాను.అతను, “అది నారింజ చెట్టు' అని చెప్పెను."సరే, కాని, నేను ద్రాక్ష పండ్లను, ఒక దబ్బ కాయను, ఒక కమలా పండ్లను, ఒక నిమ్మ కాయను, ఇన్ని రకాల పండ్లను ఒకే చెట్టులో చూస్తున్నానని” నేను అడిగాను.అతను, “ఓ, అవును”, అన్నాడు. నేను “అదెలా...?” అని నేను అడిగాను.“అవి అంటు కట్టబడ్డాయి” అని అతను చెప్పెను.“సరే,” “ఇప్పుడు అది అద్భుతముగా ఉన్నది కదా?" అని నేను చెప్పాను."అవును,నిమ్మ జాతి జీవమున్న ఏదైనా దానితో అంటుకట్టిన అది ఫలించునని” చెప్పెను. చాలా బాగుంది. నేను నిలబడ్డాను. ఏదో నన్ను నిలిపెను. నేను మళ్ళీ చూచాను.


81. ఫిన్లాండ్లో, ఆ చిన్నవాడు మరణించి పడియున్న ఆ దినమువలె, "సహోదరుడా, ఆ చిన్నవానినిగూర్చి నేను మీకు అక్కడ చెప్పాను, ఆ చిన్న మూర్, ష్రెవ్ పోర్ట పిల్లవాడు ఒక నిర్దిష్ట ప్రదేశములో మరణమునుండి జీవముతో లేపబడునని. అతను ఇతడే, అతను తిరిగి రావాలి. ఇక మృత్యువు అతనిని బంధించి ఉంచలేదు. దేవుడు చెప్పెనని" నేను చెప్పాను. “మరణమా, నీ పిడికిలి సడలించుము" అని చెప్పాను. ఇక్కడే అతను ఉన్నాడు. ఆమేన్. దేవుడు అబద్ధము చెప్పలేడు. లేదు. లేదు.

82. "సహోదరుడా జాన్, నేను ఏదో చూచుచున్నాను. మీరు చూడండి. సహోదరుడా జాన్, ఇప్పుడు నేను నిన్ను ఏదోకటి నిన్ను అడగాలనుకుంటున్నాను, ఎందుకనగా, నేను దీనినుండి ఒక వర్తమానమును పొందాలని కోరుచున్నాను. ఇప్పుడు పడుచున్న ఈ నిమ్మకాయ, దబ్బకాయ మరియు ద్రాక్షపండు వంటి నిమ్మ జాతి పండ్లన్నీ పడిపోతాయి మరి వచ్చే సంవత్సరము వాటి స్థానంలో నారింజ పండునా?” అని నేను అడిగాను.అతను, “ఓ, లేదు, లేదు, లేదు, లేదు. అది దానిదాని జాతినే తీసుకువచ్చును. నిమ్మకాయ కొమ్మ నిమ్మ కాయలనే తీసుకువచ్చును, దబ్బ పండు కొమ్మ దబ్బ పండునే తీసుకువచ్చును” అని అతను చెప్పెను."ఎందుకు?ఇది నారింజ చెట్టని నీవు చెప్పావనుకొనుచున్నానని” నేను అడిగాను.అతను “అవును” అని చెప్పెను."ఇది నారింజ పండ్లను ఫలింపజేయుట నిలిపివేయునా?" అని నేను అడిగాను."లేదు, ఎప్పుడైతే మూల(అసలైన) చెట్టు, దానియొక్క అసలైన కొమ్మను తీసుకు వచ్చునో, అప్పుడు అది నారింజ పండ్లను ఫలింపజేయునని” అతను చెప్పెను.విషయము అదే. అదలాగే ఉన్నది, ఈ సంఘశాఖలు అంటుకట్టబడ్డాయి. అవి ఇప్పటికీ సంఘ సభ్యత్వము, మొదలైనవాటినే సంఘశాఖల ఫలము తీసుకువచ్చు చున్నవి.కాని ఆ వృక్షమునకు మరలా అసలైన కొమ్మ పెరిగినప్పుడు, అప్పుడది మరలా వ్రాయబడిన అపోస్తులులు కార్యముల పుస్తకముగానే ఉండును."నేను ద్రాక్షావల్లిని, మీరు ద్రాక్ష తీగలు." ఎందుకు? అసలైన ద్రాక్షావల్లి నుండిప్రవాహించు జీవము ఒక కొమ్మను తీసుకొని వచ్చును, అది పెంతెకోస్తు ఫలములతో నిండియుండు పెంతెకోస్తు తీగ(కొమ్మ)గా ఉన్నది. ఎందుకనగా క్రీస్తు యొక్క జీవము ఆ తీగలో ఉంటూ, అది ఆయనయొక్క క్రియలనే చేయును. భాషలలో మాట్లాడే వరమును నేనింకా పొందుకోలేదు, కాని నేను నిశ్చయముగా, దానిని కలిగియుండు టకు ఇష్టపడుచున్నానని భావిస్తున్నాను. ఓ! ఆత్మ నా అంతరాత్మలో ఎలా సాక్ష్యమునిచ్చు చున్నది! అది ఈ విషయములు సత్యమని వాక్యముతో సాక్ష్యమునిచ్చుచున్నది.
83. మీరు విశ్వసిస్తున్నారా? ఇక్కడ మీలో ఎంతమందికి ప్రార్థన అట్టలు ఉన్నవి? మీ చేతులను పైకెత్తండి. ఇప్పుడు మీ చేతులను క్రిందికి దించండి. ఇక్కడ ఇంకా మీరు అనారోగ్యముతో ఉంటు దేవునినుండి ఏదోకటి కోరుకుంటూ, ప్రార్థన అట్టలు లేని వారు ఎంతమంది ఉన్నారు? మీ చేతులను పైకెత్తండి. సరే. మీరు విశ్వసిస్తున్నారు.మా పరలోకపు తండ్రీ, నేను ప్రేక్షకుల ముందు నిలబడియున్నాను, వారిలో కొంత మంది క్రొత్తవారని నాకు తెలుసు, మీ ఆత్మ ఇప్పుడు స్థిరపడుచున్నట్లుగా భావిస్తున్నాను. నేను మీ వాక్యము మాట్లాడాను మరియు మీ మందు చీటిని చదివాను. అదే తిరిగి వెళ్లే మార్గమనకు ఆధారమని ప్రజలకు చెప్పాను.నీకొదేము మరియు మహా సభ వారు నీవు శరీరధారియైనది చూచినప్పుడు, వారు నిన్ను గుర్తించిరి. వారు, “రబ్బీ, నీవు దేవునియొద్దనుండి పంపబడిన ఒక మనుష్యుడవని మాకు తెలుసు, నీవు చేసే ఈ క్రియలు దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవ్వరునూ చేయలేరని" చెప్పిరి. కాని అదే సమూహము, ఆయన చెప్పిన, చేసిన క్రియలను, ఆయన యందు విశ్వాసముంచువారు కూడా అదే క్రియలు చేసెదరని వాగ్దానము చేసెనని ఎరిగికూడా, వారు, ఆయనను బయెల్జెబూలని చెప్పుచూ, ఆయన ఉపదేశము ప్రజలను మోసపరచుచున్నదని చెప్పిరి. కాలము మారలేదు తండ్రీ, మేము వేరొక పంట కాల ములో ఉన్నాము, కాని నీవు అట్లే నిలకడగా ఉన్నావు. అవిశ్వాసము నిన్ను ఆటంక పరచదు. తండ్రి నీకు ఏమి చెప్పెనో దానినే చేయుచు అట్లే నిలకడగా ముందుకు సాగిపోతివి, “నేనేమి చేయుట లేదు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని, తనంతటతాను ఏదీ చేయనేరడని” నీవు నీ స్పష్టమైన ప్రకటనచేసి చెప్పితివి.

84. ఫిలిప్పు, నతానియేలును కనుగొన్నప్పుడు, అతను ఏ చెట్టు క్రింద ఉండెనో, నతానియేలుతో నీవు చెప్పగలవు. నీవు యోనాయొక్క కుమారుడవని, సీమోనుతో చెప్పగలవు. అతని పేరు మరియు అతని తండ్రి పేరును కూడా చెప్పగలవు. బావియొద్ద నున్న స్త్రీకి నీవు చెప్పగలిగితివి. ఒక గ్రుడ్డివానియొక్క విశ్వాసము నిన్ను నిలిపెను. రక్త స్రావముగల స్త్రీ, నీ వస్త్రపు చెంగును తాకెనని, భౌతికముగా అనుభూతిచెందుట పూర్తిగా అసాధ్యమైనప్పటికీ, నీవు నిలిచి, ఆమెయొక్క సమస్యలను ఆమెకు చెప్పి, ఇక ఆ సమస్యలు తీరిపోయినవని చెప్పితివి.క్రీస్తులోవున్న ఆ జీవము కొద్ది క్షణములు ఈ గుంపులోనికి ప్రవేశించునుగాక, ప్రభువా, తద్వారా నీవింకా దేవుడవని వారు ఎరుగుదురుగాక!. ప్రభువా, నీ వాక్యము ద్వారా నేను వారికి చెప్పాను. మనుష్యులు చుట్టూ తిరుగుచూ, ఇది, అదీయని చెప్పుచూ మరియు జనులను ఆకర్షించుటకు ప్రతీ చిన్న తంత్రమును చేయుచున్నారు, కాని ప్రభువా,అది దేనిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నది? ఎక్కడో ఒక చోట నిజమైనది ఉన్నది.ప్రభునైన దేవా, అది ఈ రాత్రికి వెలుపలకు వచ్చునుగాక!. దీనిని మానవుడు కాదుకాని, పరిశుద్దాత్మే మాట్లాడునుగాక!. ఈ సంఘమునకు విశ్వాసమును దయచేయుము.ప్రభువా! నీవు మాలో ఒక్కరిని మాత్రమే అభిషేకించలేరని, మాలో అనేకులను అభిషేకిం చగలరని నేను గ్రహించితిని. ప్రభువా, నీ సంఘముగా మమ్ములందరిని ఏకముగా అభిషేకించుము. నేను సత్యమునే చెప్పితినని, నీవే దేవుడవని తెలియజేయుదువుగాక!. వ్యతిరేకత ఉన్నాకూడా, నేను నీ వాక్యముపై నిలబడియున్నాను. కాని యదార్ధముగా ఉండుటకు ప్రయత్నించితిని. నాకొరకు అలా చెప్పుట లేదు ప్రభువా, నా మాటలు వినెదరని ఈ ప్రజలుకొరకు చెప్పుట లేదు. కాని బల పరీక్షను నిరూపించే కాలము అతి సమీపములో ఉన్నందున నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యమును నీవు ఋజువుపరచాలని, అది సత్యమని, క్రీస్తులోనున్న ఆ జీవము, ఇప్పుడు ఆయన సంఘములోను, విశ్వాసులలో జీవిస్తున్నదని ఋజువుపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తుయొక్క నామమున దీనిని అనుగ్రహించుము తండ్రీ, ఆమేన్.

85. ప్రతి ఒక్కరూ వీలైనంత భయభక్తులతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు తెలియని వారు ఎంతమంది ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. మీరు ఇంతకు ముందు కూడికలకు ఎప్పుడూ రాలేదని నేను గ్రహించగలుగుచున్నాను."నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయునని" యేసుక్రీస్తు తన వాక్యమందు యోహాను14:12లో చెప్పెను. మీరు దానిని విశ్వాసిస్తారా? "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు" హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13:8లో పరిశుద్ధగ్రంధము చెప్పుచున్నది, మీరు దానిని విశ్వసిస్తారా? మంచిది.ఇప్పుడు అది ఆయన క్రీస్తు, కాదాని ఎరుగుటకుగల ఏకైక మార్గము... ధరించిన వస్త్రములు కాదు, ఎట్లనగా ఆయన సాధారణ పురుషులవలె వస్త్రములను ధరించెను. ఆయన ఈ రాత్రి ఇక్కడ ఉంటే, మనము ధరించినట్లే సూట్ను ధరించి ఉండును. అవి ఆయన వస్త్రములు కాదు. ఆయన గడ్డము గలవాడో లేక గడ్డము లేనివాడో కాదు, ఆయన ఏమైయున్నాడో దానినిగూర్చి నిరూపించునది ఆయనలోనున్న జీవమేయగును.ఆ దినములలో అనేకులు ఆయనవలె అనేకులు వస్త్రములను ధరించిరి. అంత మాత్రాన వారు ఆయన కాదు. అది నిజమే. నేడుకూడా అనేకులు అదే కార్యములను చేయుచున్నారు. కాని అదే మాత్రముకూడా మారదు. ఎందుకనగా అది జీవమైయున్నది. క్రీస్తు ఏమైయుండునో లేఖనములు చెప్పిన రీతిగా వారు ఆయనను వెంబడించవలెను, ఆ మార్గముననే వారు ఆయనే క్రీస్తని వారు కనుగొనగలరు. అది నిజమేనా?కనుక క్రీస్తు ఏమైయుండునని మోషే వారితో ఏమి చెప్పెను? ఆయన తనవంటి ఒక ప్రవక్తవలె ఉండునని చెప్పెను. అది నిజమే కదా? కావున వారందరూ దానికొరకు ఎదురు చూచిరి, ఎందుకనగా, దేవుడు వారికి ఇట్లు చెప్పెను, "మీలో ఎవరైనా ఆత్మ సంబంధి లేక ప్రవక్త ఉంటే ప్రభువునైన నేను అతనితో మాట్లాడెదను. నేను అతనితో మాట్లాడియుండిన, అది నెరవేరును. అట్లు అది జరుగక పోయినయెడల అతని మాట వినకండి." అది మాత్రమే భావయుక్తమైనది.

86. యేసు పెరిగి పెద్దవాడై, ఆయన తన పరిచర్యను ప్రారంభించినప్పుడు, సీమోను పేతురు వచ్చెను, అతని పేరు సీమోనని మరియు అతని తండ్రి పేరు యోనానియు ఆయన పేతురుతో చెప్పెను, అది సరియైనదేనా? అది అతనిని ఒక విశ్వాసిగా చేసినది.ఫిలిప్పు వెళ్లి ఒక చెట్టు క్రింద నతనయేలును కనుగొని... నతనయేలు వెళ్ళి చెట్టు క్రిందవున్న ఫిలిప్పును కనుగొని, “మేము ఎవరిని కనుగొన్నామో వచ్చి చూడుము" అని చెప్పెను. మరి అతను ఏమి జరుగుతున్నదో అతనికి(నతనయేలుకి) చెప్పినప్పుడు, అతను దాని గురించి కలవరపడలేదు. అతను, అక్కడకు చేరుకున్నప్పుడు, యేసు అతనివైపు సూటిగా చూచి, "ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటము లేదని"అతనిగూర్చి చెప్పెను. నతనయేలు ఒక బోధకుడైయుండి, వాటన్నింటిని ఎరిగిన వాడై, "రబ్బీ, ఎప్పుడు నీవు నన్ను ఎరుగుదువు" అని అడిగెను.అందుకు యేసు, "ఫిలిప్పు నిన్ను పిలవకమునుపే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచితినని” అతనితో చెప్పెను.అందుకు నతనయేలు, "రబ్బీ, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు" అని ఆయనకు ఉత్తరమిచ్చెను.

87. బావి దగ్గరున్న స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు, అనేకులు వచ్చినప్పుడు, ఆయన దేవునిగాను, ప్రవక్తగాను ఉండునని వారు లేఖనములద్వారా ఎరుగుదురు. అదే ఆయన యొక్క సూచనగా యున్నది. అదెల్లప్పుడూ అట్లే ఉండును. అది ఇప్పుడుకూడా అట్లే ఉండును. కాబట్టి మీరు గమనించండి, ఆ స్త్రీ అచ్చటకు వచ్చినప్పుడు, యేసు ఆమెతో సంభాషణ కొనసాగింపగోరెనని మనము కనుగొనినప్పుడు, “ఓ స్త్రీ, దాహమునకు నాకు నీళ్లిమ్మని" ఆమెను అడిగెను.ఆ సమరయ స్త్రీ “యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను అలా అడుగుట ఆచారము కాదు. ఒకరితో ఒకరికి మనకు సాంగత్యము లేదుకదా?" అని చెప్పెను.అందుకు యేసు, "నీవు ఎవరితో మాట్లాడుచున్నది ఎరిగియుంటే, నీవు నన్ను నీళ్లు అడుగుదువు" అని ఆమెతో చెప్పెను.అందుకు ఆ స్త్రీ, "అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే?" అని మొదలైనవి అడిగినప్పుడు,ఆయన, "నీవు వెళ్లి నీ పెనిమిటిని తీసుకుని ఇక్కడకు రమ్మని" ఆమెతో చెప్పెను.అందుకు, “ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడని" చెప్పెను.”అప్పుడు యేసు. "నీకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియైనదే, నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను.”అప్పుడు ఆమె “అయ్యా...” అనెను.

88. పరిసయ్యులు ఆయన ఇవన్నీ చేయుట చూచినప్పుడు, వారు, "ఆయన సోదె చెప్పువాడని, బయెల్జెబూలని” చెప్పిరి. అర్థమైనదా?. అయితే ఆ వేశ్య, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సీయ వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులన్నీ తెలియజేయునని మేమెరుగుదుము, అదే మెస్సీయయొక్క సూచన, ఆయన వచ్చినప్పుడు, మాకు ఈ సంగతులన్నీ తెలియజేయునని మేమెరుగుదుమని” చెప్పెను.”అప్పుడు యేసు, “నీతో మాటలాడుచున్న నేనే, ఆయననని ఆమెతో” చెప్పెను. ఆ స్త్రీ, వెంటనే పట్టణములోనికి పరుగెత్తుకుని వెళ్లి, "మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. “ఈయన మెస్సీయ (క్రీస్తు) కాడా?”అని వారితో చెప్పగా, ఆ పట్టణపు ప్రజలు,ఆ స్త్రీ మాటను నమ్మి, క్రీస్తును నమ్మిరి. అది నిజమేకదా? "నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి" అని ఆయన చెప్పుటలో ఏమాత్రము ఆశ్చర్యము లేదు.

89. ఇప్పుడు మనము మేధావులుగా ఉండనవసరము లేదు. మనము విద్యావేత్తలమై ఉండనవసరము లేదు. మనము కేవలము విశ్వాశించవలెను. దేవుడు మన ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకొనుటకు, మనలను మనము తగ్గించుకోవాలి, మనలను మనము ఖాళీ చేసుకోవాలి. మిమ్ములను మీరు ఖాళీ చేసుకోండి. మిమ్ములను మీరు మార్గమునుండి తొలగించుకోండి. మీకున్న అతి పెద్ద శత్రువు మీరే. ఇప్పుడు మీరు దేవుడిని విశ్వాసించండి. మీరు దానిని చేసెదరా?మన తండ్రియైన దేవుడు పరిశుద్ధాత్మయైతే... మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మయై యున్నాడు. అది మనకు తెలుసు. "ఆమెలో గర్భము దాల్చినదేదనగా, పరిశుద్ధాత్మద్వారా అది కలిగినది.” కనుక ఆ పరిశుద్దాత్మ మీలోనికి మరియు నాలోనికి వచ్చి, క్రీస్తు జీవించిన అదే జీవితమును జీవింపజేస్తే, ఇక మీ సందేహమునకు స్థానము ఎక్కడ ఉన్నది? నేను మీకు తిరిగి వచ్చుట, తిరిగి వెళ్ళుటనుగూర్చి సత్యమును చెప్పాను. మీరు దానిని నమ్ముతారా? ఆయన దానిని చేసినయెడల... ఆయన చేయునని చెప్పలేదు. ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆ దినములు గతించిపోచినవని ప్రజలు నమ్ముచున్నారు, కాని ఆయన వాటిని చివరి దినములలోనే వాగ్దానము చేసెను.

90. మనలో ప్రతి ఒక్కరికి కార్యాలయములు ఉన్నవి. ఈ కార్యాలయమునకు మనము నమ్మకస్థులముగా ఉండాలి. దేవుడు... ఆయన వాక్యమైయున్నాడు. వాక్యము శరీరధారియై మన మధ్య నివాసము చేసెను. ఆ దేవుడు మనలో ఉన్నాడని నిరూపించుటకై, ఆ వాక్యము తననుతాను ప్రత్యక్షపరచుకొనుటకు, ఈ రాత్రి ఆ వాక్యము మన శరీరములో ఉన్నది. అది నిశ్చయముగా ఆయనయొక్క ఫలములనే ఫలింపజేయును.డిల్లింగర్ (డిల్లింగర్ అనే వ్యక్తి అమెరికాలో నివసించిన ఒక గూండా తర్జుమాదారుడు) యొక్క ఆత్మ నాలో ఉన్నదని నేను మీకు చెప్పినయెడల, నావద్ద తుపాకీలు ఉంటా యని మీరు ఎదురుచూస్తారు. ఒక చిత్రకారుడి ఆత్మ నాలో ఉన్నదని నేను మీకు చెప్పినయెడల, నేను ఒక చిత్రమును గీసి రంగులు వెయ్యాలని మీరు ఎదురుచూస్తారు. క్రీస్తుయొక్క ఆత్మ నాలో ఉన్నదని నేను మీకు చెప్పినయెడల, అప్పుడు నేను క్రీస్తుయొక్క క్రియల చేయవలెను. ఆయన చెప్పినది అదే.

91. నేను మీకొక చిన్న కార్యము చెప్పనివ్వండి, తద్వార అది మీరు నమ్ముటకు సహాయపడును. ఒకానొక దినము కివానీస్ లో జరిగిన సమావేశములో కొంతమంది వైద్యుల సమక్షములో మాట్లాడుతూ.... నేను ఒక ప్రముఖ వైద్యునివద్ద భౌతిక పరీక్ష చేయించుకున్నాను. నేను విదేశాలకు వెళ్ళుచున్నాను. నాకు భౌతిక పరీక్ష జరిగినది. నేను దానిని ఉద్దేశపూర్వకముగానే చేసుకున్నాను. మరి అతను నన్ను పరీక్షించుచు... అతను నాకు కడుపులోని జీర్ణకోశముయొక్క పైన మరియు క్రింది భాగమును, పిదప గుండె, రక్తము, అన్నింటిని పరీక్షించెను... దేవునికి కృతజ్ఞతలు. వాటిని త్వరగా ముగించెను.కాబట్టి, నేను ఈ బేరియం(కడుపును శుద్దిచేయు) ఔధమును తాగినప్పుడు,నాకు నేనే నిజముగా చాలా ఒత్తిడికి లోనయ్యాను, అతను నా కడుపుపై నొక్కాడు. అతను ఎక్స్-రే ద్వారా చూస్తూ, “సహోదరుడా బ్రాన్హాం” అని పిలిచెను.నేను “చెప్పండయ్యా” అన్నాను."మీ కడుపు బాగానే ఉన్నట్లనిపించున్నది,కాని ఏదీ బయటకు రాలేదని” చెప్పెను.నేను, "అది బయటకు రాలేదా? అది బయటకు రావలసి ఉన్నదికదా?" అడిగాను.అతను, “అవునయ్యా, అదే నాకు అర్ధమగుట లేదు" అని చెప్పెను.“మరి నేను ఏమి చేయాలి?" అని అడిగాను."ఏదైనా తినడానికి ఇష్టమైనదాని గురించి ఆలోచించండని” అతను చెప్పెను."ఎలాంటి దానిని నేను ఇష్టపడి తినాలని నీవు కోరుచున్నావని?” అడిగాను. అతను ఏమి చెప్పబోవుచున్నాడో నాకు తెలుసు."ఒక మంచి, పెద్ద మాంసపు ముక్క” అని అతను చెప్పెను.నేను, “ఒక పళ్ళెం నిండా వేపిన ఉడుత మాంసముతో చిక్కుడు గింజలతో చేసినదైతే ఇష్టమని” చెప్పాను. అతను, “సరే,దానినే ఆలోచించుటకు ప్రారంభించమని” చెప్పెను. నేను ఆలోచించుటకు ప్రారంభించగా ఇప్పుడు ఏదో మార్పు కలిగెను."అదిగో అది బయటకు వచ్చుచున్నది" అని అతడు చెప్పెను.నేను, "డాక్టర్, అలాగు జరుగుటకు కారణమేమిటి?" అని నేను అడిగాను. "ఒక చిన్న విద్యుత్ తీగ నీ మెదడునుండి నీ కడుపులోనికి ఒక సంకేతమును పంపించెనని" అతను చెప్పెను. నేను, “అది నిజమేనా?” అని నేను అడిగాను.

92. పిదప నేను మాట్లాడుతూ, "మీకు ఆ చిన్న తీగ జ్ఞాపకమున్నదా? అడిగి, “డాక్టర్, మీరు కలలు కనేలా ఏది చేయును? మీరు కలలు కంటారాని?” అని నేను అడిగాను,అతను, “అవును, కలలు కంటాను” అని చెప్పెను."మీలో ఏ భాగము కలలు కంటున్నది, అదేమిటది?" అని నేను అడిగాను.“మీ ఉపచేతనావస్థ (subconscious)" అని అతను చెప్పెను."ఒక సాధారణ మానవునికి, ఇక్కడ చేతనావస్థ (conscious)ను, మరియు అక్కడ ఉపచేతనావస్థను (subconscious) కలిగియున్నాడు. ఆ స్పృహలోనికి రావాలంటే మీరు నిద్రపోవాలని” నేను చెప్పాను. “సహోదరుడా బ్రాన్హాం నేను ఏదో కనుగొన్నాను,మరలా, దానిని నేను వివరించలేనని” అతను నాతో చెప్పెను."అది మీ నరములు కాదుగాని, అది మీ నరముల లోపలవున్న ఏదోకటియగును" అని అతను చెప్పెను. “అది నా అంతరాత్మ" అని నేను చెప్పాను.అతను, “అవును, అది నీవు ఏమైయున్నావో అలాగే నిన్ను తీర్చిదిద్దునని" చెప్పెను.

93. నేను అతనిని దర్శనములనుగూర్చి అడిగాను. వాటిగూర్చి అతనికేమీ తెలియదు. కాబట్టి నేను అతనితో చెప్పాను... “ఒక చేతనావస్థ ఇక్కడ ఉన్నది, ఉపచేతనావస్థ ఇక్కడ ఉన్నది, ఈ చేతనావస్థనే భాగము నిద్రించు స్థితిలోనికి వెళ్ళునంతగా మీరు ఆ భాగమునుండి బయటకు రావలెను, అప్పుడే మీరు ఈ ఉపచేతనావస్థలోనికి ప్రవేశించగలరు. కాని మీలో కొంత భాగము (కలలో) ఎక్కడికో వెళ్లిపోయింది, ఎందు కనగా, అనేక సంవత్సరములు గడచిపోయినను మీరు ఆ కలలను, కలలలో మీరున్న ప్రదేశములను గుర్తుంచుకోగలరు. “అవును, అది నిజమే” అని అతను చెప్పెను."మీరు చూడండి, ఇది సాధారణమైనది. కాని దేవుడు మాలో కొందరికి ఈ విధముగా అమర్చును, అదేమనగా, మా మొదటి చేతనావస్థ మరియు ఉపచేతనావస్థ సరిగ్గా కలిసి ఉండునట్లు చేయును. మేము నిద్రలోనికి వెళ్ళనవసరము లేకుండానే దేవుడు ఇదివరకు ఉండినవి, ఇప్పుడు ఉన్నవి, మరియు రాబోయే కార్యములను చూచుటకు మాత్రమే వాటిని ఉపయోగించును. అది ప్రవచనాత్మకమని” నేను చెప్పాను."శ్రీ బ్రాన్హాం,నేను స్వస్థతనుగూర్చి మీ పుస్తకాలను చదివాను, నేను నిశ్చయముగా మీతో ఏకీభవిస్తున్నానని" అతను చెప్పెను. నేను నీకు కొన్ని విషయాలు చెప్పబోవు చున్నాను, "నేను దానిని విజ్ఞాన శాస్త్రముద్వారా నిరూపించగల మాకు ఇక్కడ రోగులయొక్క కార్యములు గలవు, (మీకు దగ్గరలో ఉంటే దానిని వైద్యుడు మీకు చెప్పగలడు), ఒక వ్యక్తికి ప్రాణాంతమైన కేన్సర్ లేదా క్షయ, లేదా పేగు పుండు, లేదా ఘోరమైనదేదైన అది అతనిని చంపబోవుచున్నదని మాకు తెలుసు, కాబట్టి మేము దానినిగూర్చి అతనికి చెప్పెదము, కనుక ఆ రోగి ఆందోళనతో, చిరాకుతో, కోపముతో, విరక్తి చెందుచూ ఉన్నయెడల, ఆ రోగి వెంటనే చనిపోవునని" ఆ వైద్యుడు చెప్పెను. “కాని ఆ రోగి సాధారణముగా క్రైస్తవుడైతే, అతను మరణమునుగూర్చి లెక్కచేయడు. మరణించుట అనేది జీవింతములో ఒక భాగమని మనము చేయవలసిన కార్యములలో అది ఒకటిగా తలంచుచు, కాబట్టి, 'నా సమయము ముగిసే వరకు నేను జీవిస్తానని' ముందుకు సాగిపోవుచు దానిని ఎదుర్కొనును. దాదాపు ఆవిధమైన వైఖరి ఆ సమస్యను నిష్క్రమించునని. ఆ రోగిని మరణమునుండి అతను జాప్యము చేసి, జాప్యముచేసి, దానిని త్రోసివేసుకుంటూ ముందుకు సాగిపోవుచుండునని" అతను చెప్పెను.

94, “సరే, డాక్టర్, నేను నా కధను పూర్తి చేయనివ్వండి. మీ చేతికి అబద్ధమును కనిపెట్టే ఒక యంత్రమును అమర్చి, నిలబడి, మీకు సాధ్యమైనంతవరకు అబద్ధమును నిజమువలె వినిపించునట్లు మీవంతు ప్రయత్నము చేయండి. అప్పుడు ఆ యంత్రము లోని ముళ్ళు ప్రతికూలముగా మారుటను గమనించండి. ఎందుచేత? అది మీ నరము లలో ప్రకంపనలు కలుగుటవలన. మీరు అబద్ధమును చెప్పుటకు రూపింపబడలేదు. మీరు సత్యమును చెప్పుటకు మాత్రమే రూపింపబడితిరని” నేను చెప్పాను. మీ నరము లకు అంతరాయము కలిగించేంతటి భయంకరమైనది ఈ అబద్ధము. అలాగే మీరు కోపించుటకు రూపింపబడలేదు. మీరు దేవునితో పిల్లలవలె ప్రశాంతంగా ఉండవలసిన వారైయున్నారు, అర్థమైనదా? మీరు కంగారుపడకూడదు, మీరు దేవునితో నడుస్తూ విశ్వాసమును కలిగియుండాలి." అర్థమైనదా? "అలాగు ఉంటే చాలని" నేను చెప్పాను."డాక్టర్,ఇప్పుడు, ఈ మొదటి చేతన స్థితిలో జీవిస్తున్న ఈ వ్యక్తి, ఒకవేళ అతను మరణించినా రక్షణనను కలిగియుంటాననే వైఖరి గలవాడైతే, అది (మరణము) ఏ తేడాను కలిగించును? చాలా కాలమునకు ఆ సమస్యకు పరిష్కారము లభించును, అది మొదటి భాగమగు చేతన స్థితినుండి తొలగి, రెండవ భాగమునకు తిరిగి వచ్చినప్పుడు అదేమి చేయును? పరిశుద్ధాత్మ బాప్తిస్మముద్వారా ఆ సమస్యను అది పూర్తిగా తొలగి పోవునట్లు చేయును" అని నేను చెప్పాను.

95. ఆ వైద్యుడు లేచి నిలబడి, "అద్భుతము” అని చెప్పెను, అతని చెంపల మీద నుండి కన్నీళ్ళు కారుచున్నవి.నేను, “డాక్టర్, సమస్య ఏమిటో మీకు తెలుసా? మన సంఘములు దానిని బోధించుట లేదు” అని చెప్పాను. "బ్రాన్హాంగారు, అది నిజము”అని డాక్టర్ చెప్పెను."మనము తిరిగి పెంతెకోస్తుకు వెళ్ళవలసినవసరము గలదు" అని నేను అన్నాను."నేను ప్రెస్బిటేరియన్, నా భార్య ప్రెస్బిటేరియన్” అని డాక్టర్ చెప్పెను."మీరు ప్రెస్బిటేరియన్ విడిది గృహములో చేరిరి" అని నేను చెప్పాను."దానిగూర్చి విషయము అదే" అని డాక్టర్ చెప్పెను."డాక్టర్, ఒక క్రైస్తవుడనగా తిరిగి జన్మించినవాడగును. మీరు వెళ్ళి దేనిలోనో చేరుట కాదుగాని, మీరు మరలా తిరిగి జన్మించవలసియున్నదని” నేను చెప్పాను."బ్రాన్హాంగారు అది నిజమని” డాక్టర్ చెప్పెను. అతని చెంపలమీద కన్నీళ్ళు కారుట ప్రారంభించెను. నేను అతనికి త్వరలో బాప్తిస్మము ఇవ్వబోవుచున్నాను.

96. అదేమిటి? మీ కలవరములను అక్కడే అట్లే బిగపట్టి ఉంచి, మీ స్పృహ (చేతనావస్థ) యొక్క ఒక భాగమును అణచి వేస్తూ, మీయొక్క శరీరమును అది చక్కగా పనిచేసేలా చేసినట్టైతే, పరిశుద్ధాత్మను మీ లోపలికి మీరు అనుమతించినప్పుడు అదెలాంటి కార్యమును చేయగలదు? అది క్రీస్తు వాగ్దానముచేసిన ప్రతిదానిని నెరవేర్చును. మీరు పరిశుద్ధాత్మయొక్క సాధనముగా మారిపోయెదరు.నేను జన్మించినప్పుడు, అక్కడ ఒక వెలుగు వేలాడుచు ఉండెను. ఆ చిత్రాన్ని మీరు ఇక్కడ ఎక్కడో చూడవచ్చు. అది నిజము. నేను ఈ వేదిక పైనే చనిపోయిననూ, విజ్ఞాణ శాస్త్రము అది నిజమని నిరూపించెను. కనుక నామట్టుకైతే నేను ఒక మనిషిని, నేను ఒట్టి వాడను. నేను కేవలము మీ సహోదరుడిని మాత్రమే. నాలో ఏమీ లేదు. కాని ముందు ఏర్పాటులో, పరిశుద్ధాత్మలోని వరములను ముందుగా నిర్ణయించెను. ఆ వరములను దేవుడు సంఘములో అమర్చెను. అదెవరో ఒక సంఘ పెద్ద తన చేతులను ఒకరిపై ఉంచుటవలన వచ్చేవి కాదు. దేవుడు సంఘములో మొదట అపొస్తులులను, తరువాత ప్రవక్తలను మరియు మొదలైనవారిని ఏర్పాటు చేసెను. దేవుడు అక్కడ వాటిని అమర్చెను. అవి దేవుడు ముందుగా నిర్ణయించిన దైవిక వరములగును.యిర్మీయానే ప్రవక్త జన్మించక మునుపే, "నీ తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితినని” దేవుడు చెప్పెను. అది నిజమేకదా? అతనికి దానితో ఎలాంటి సంబంధము లేదు. దేవుడే దానిని చేసెను.

97. ఆయన ఇప్పటికీ దేవుడై యున్నాడు. మీరు మీ పూర్ణ హృదయముతో నమ్మండి. మీలో అనారోగ్యముతో ఉన్నవారు లేదా దేవునివద్ద అవసరతగలవారు ఇలా చెప్పండి, "ప్రభువైన దేవా, నేను ఈ వర్తమాన మును విన్నాను. నన్ను ఆశ్చర్యపరచినది. నీవే దేవుడవని, నీవు ఇక్కడే ప్రజల మధ్యలో ఉన్నావని, ఈ వ్యక్తి చెప్పుటను విన్నాను." ఆయన అట్లులేనియెడల ఈ వ్యక్తి ఏదో తప్పు చెప్పినట్లగును. “ఇద్దరు, ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.” ఎందుచేత? ఎలాగైనా ఆయన మీలో ఉన్నాడు. ఆయన మీ మధ్య తననుతాను విభాగిం చుకున్నప్పుడు, అది మరలా ఒక మూల ప్రమాణమునకు తిరిగి వచ్చును. ఈ మూల ప్రమాణముయొక్క భాగము క్రియచేయగల దని నీవు విశ్వాసించుటకు, ఈ మూల ప్రమాణములో నీవొక భాగంగా ఉండవలెను. ఆయన నాకు ఒక పరిచర్యను ఇచ్చిన, దానిని విశ్వసించుటకు ఎవరో కొంతమంది ఆయనకు ఉండెదరు. అట్లు లేకపోతే నాకు పరిచర్య ఇవ్వవలసినవసరము లేదు. అది నిజము. మీరు మీ పూర్ణ హృదయముతో విశ్వసించి, దేవుడు చెప్పిన ఆ కార్యము చేసెనో, లేదో చూడండి.

98. ఇప్పుడు, ప్రార్ధన అట్టలు ఉన్నవారిని కాదుగాని, ప్రార్ధన అట్టలులేనివారినే నేను కోరుచున్నాను. నేను ప్రార్ధన అట్టలుగలవారిని పిలవబోవుచున్నాను. దీనిని మీ మనస్సులో ఉంచుకోవాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు నిజమైన భక్తితో ఉండండి. క్రీస్తు... ఇప్పుడు క్రీస్తు స్వస్థపరచగలడు, ఎందుకనగా, తండ్రి దర్శనము ద్వారా ఆయనకు చెప్పినప్పుడు ఆయన స్వస్థపరిచెను. అది నిజమే. ఆయన మొదట దర్శనము చూడకుండా, ఎవరినీ స్వస్థపరచలేదు లేదా ఒక అద్భుతము చేయలేదు. అది ఎంతమందికి తెలుసు? యోహాను సువార్త 5:19 లో ఆయనే స్వయముగా దానిని చెప్పెను. ఆయన దేవుడు, ఆయన అబద్ధమాడనేరడు.కాని మీరు గమనించండి, ఇదివరకే స్వస్థతకొరకు క్రయం చెల్లించబడినది. బలి అర్పించబడినది.సూచక క్రియలను కనబరచుచు, ఆయన ఇప్పటీకీ ప్రవచనముద్వారా తననుతాను వెల్లడిచేసుకోగలడు. కాని స్వస్థతను పొందుకొనుటకు మీరు ఆయనను విశ్వసించాలి. ఆయన ఈరాత్రి ఇక్కడ నిలబడియుండిన, “ప్రభువా, నన్ను స్వస్థపరచ వాని? నీవు అడిగితే, ఆయన నేను ఇదివరకే స్వస్థపరిచితిని. నీవు దానిని నమ్ముట లేదాని?”అడుగును. ఎట్లనగా, మన అతిక్రమములకొరకు ఆయన గాయపరచబడెను, ఆయన పొందిన గాయములచేత మనము స్వస్థత పొందితిమి. అది మీకు అర్థమైందా? కనుక మీరు దానిని విశ్వసిస్తూ, ఆయనింకా జీవించిచున్నాడో లేదో చూడండి.

99. ఎటువంటి సవాలు! భారతదేశములోని బొంబాయిలో నాకు వ్యతిరేకముగా నిలబడిన ఐదు లక్షలమంది ముందు నేను దానిని సవాలు చేశాను. దక్షిణాఫ్రికాలోని డర్బన్లో 2,50,000మంది ముందు నేను దానిని సవాలు చేశాను. దేవుడు రంగము మీదకి వచ్చుటను చూచాను. ముప్పై వేలమంది బ్లాంకెట్ నేటివ్స్(blanket natives) అనే తెగ ప్రజలు తమ విగ్రహములను పారవేసి మరి నిమిషములోనే క్రైస్తవులుగా మారిపోయిరి. అప్పటివరకు పూర్తి నగ్నముగావున్న మహిళలు, క్రీస్తు వారిపైకి వచ్చిన వెంటనే వారు తమ చేతులతో తమ పై భాగమును మరుగుపరచుకొని వెళ్ళిరి.కాని ఈ దినమున పెంతెకోస్తుల సంఘములో స్త్రీలు తమ వస్త్రములను కురచగా కత్తిరించుకుని, మరియు ఆ విధముగా ప్రవర్తిస్తూ... మేము పరిశుద్ధాత్మను పొందామని ఇంకా చెప్పుకొనుచున్నారు, దానిలో కొందరు గలరు... నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను, అది మీకు తెలుసు. కాని దీనిని దేవునిపట్ల నాకువున్న అత్యంతాసక్తితో చెప్పుచున్నాను.దేవుని కుమార్తెయగు నా సహోదరి వీధులలో తిరుగుచున్న పద్దతిని నేను చూచినప్పుడు, అలాగే ప్రసంగ వేదికపై నిలబడి దేవుని వాక్యమును బోధించుటకు నా సహోదరుడు మిక్కిలి పిరికితనముతో దానిలో విఫలము చెందుటను నేను చూచి నప్పుడే దేవునిపట్ల నాకువున్న అత్యంతాసక్తితో అట్లు మాట్లాడెదను, ఆ విషయములో తాను విఫలము చెందానని అది సత్యమని అతనికి తెలుసు. నా సహోదరి, దేవునియొక్క పరిశుద్దురాలివలె ప్రవర్తించుటకు బదులుగా ఏదోక వీధి స్త్రీవలె ప్రవర్తించుటను గమనించండి, అలాగే కొంతమంది పురుషులు తన సంఘశాఖ తనను తరిమివేయునని భయముతో, లేచి నిలబడి సత్యమును ప్రకటించుటకు, దానికొరకు నిలబడుటకు బదులుగా భయపడుటను చూడండి. దేవుని కుమారుడనగా... ఆ రక్తము సరిగ్గా అతనిలో ప్రవహించుట లేదు. అసలైన, నిష్కళంకమైన క్రైస్తవ్యమనగా - వాక్యమును విశ్వసించును, దానిని పట్టుకొనును, ఆ వాగ్దానమును పట్టుకొని నిలుచును.

100. ఇప్పుడు, మీరంతా నాకు పరిచయము లేనివారు. నేను చుట్టూ చూస్తుండగా, ఇక్కడ కూర్చున్న సహోదరుడు విలియమ్స్ నాకు తెలుసు. నేను సహోదరి మూర్ని చూచుచున్నాను. ఆమె పక్కన కూర్చున్న సహోదరి బౌట్లియరని నేననుకుంటున్నాను. గత రాత్రి నేను ఆమెను గుర్తించలేదు. నాకు తెలిసినవారు ఇంకెవరైనా కనిపిస్తారాని చూచుటకు నేను ప్రయత్నిస్తున్నాను. ఇక్కడున్న ఈ సహోదరుడు, అతని పేరు గుర్తుకు రావడము లేదు. ఏమిటి? సహోదరుడు హార్రిస్. అతను నాకు తెలుసు. ఒహియోలో టోలెడోలో ఉండే సహోదరుడు మరియు సహోదరి డౌచ్ ఇక్కడే కూర్చునియున్నారు. అంతవరకే తెలుసు. నేను సహోదరుడు కాలిన్స్ని చూచానని నమ్ముచున్నాను. అది నిజమేనా, సహోదరుడా కాలిన్స్? ఒక మంచి వృద్ద మెథడిస్ట్ వ్యక్తి. పరిశుద్ధాత్మను పొందుకొనెను, ఇప్పుడు సంఘములో నా డీకన్లలో ఒకరు. సహోదరుడా కాలిన్స్, సహోదరీ కాలిన్స్ దేవుడు మిమ్ములను దీవించునుగాక!.

101. పరిశుద్ధాత్మ ఇప్పుడు లోపలికి వచ్చుచున్నాడు. ఇది కంటికి కనిపించని విధముగా ఉండును. నేను దీనిని వివరించాలని కోరుచున్నాను. నీవు దేవుడిని వివరించ లేవు. నీవు దేవునిని విశ్వసించాలి. నీవు కేవలము విశ్వాసమును కలిగి ఉండవలెను. సందేహించకు. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మండి. మీరు దానిని విశ్వసించినయెడల మీరు రక్షింపబడుదురని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది."ప్రభువా, నేను బోధకుని వస్త్రమును తాకిన స్త్రీవలె ఉన్నానని" నీవు చెప్పవచ్చు. నేను ఆ బోధకుడిని తాకుటకు ప్రయత్నించుట లేదు. ఆయన ఒక మనిషి, కాని నీవు మా బలహీనతలయందు తాకగల ప్రధాన యాజకుడవై మాతో సహానుభవముగలవాడ వని పరిశుద్ధగ్రంధము చెప్పుచున్నది. "ఆయన దానిని చెప్పెనా?అది క్రొత్త నిబంధన. సరే, అయితే, మీరు ప్రధాన యాజకుడిని తాకినట్లయితే, ఆయన ఆనాడు చేసినట్లుగానే నేడుకూడా అదే క్రియను ఆయన చేయకపోతే మీరు ఆయనను తాకినట్లు మీకు ఎలాగు తెలియును? కావున ఆయన ఒక్కటే రీతిగా ఉన్నయెడల, ఆయన అదే క్రియలను చేయును. అది సరైనదేనా? అదే సరికదా? ఆయన మన బలహీనతల అనుభూతిద్వారా తాకగల ప్రధాన యాజకుడైయున్నాడు. కనుక ఆ స్త్రీ ఆయనను తాకి, వెళ్లి మీలాగే కూర్చున్నప్పుడు ఏమి జరిగెను, లేదా ఆమె ఏమి చేసెను? యేసు వెనుకకు తిరిగి, "ఎవరో నన్ను తాకిరని" చెప్పెను. "అసలు ఈ సమూహమంతా నిన్ను తాకుచుంటే, ఎందుకని ఇలాగు అడుగు చున్నావని? పేతురు ఆయనను అడిగెను."కాని నానుండి ప్రభావము బయలువెళ్లడము నేను గ్రహించాను. నేను బలహీను డైతినని" ఆయన చెప్పెను. ఆయన, ఆ స్త్రీని కనుగొనేవరకు చుట్టూ చూసెను, ఆమె రక్తస్రావ సమస్య గురించి చెప్పి, "నీ విశ్వాసము నిన్ను రక్షించెనని" చెప్పెనుఈ రాత్రి ఆయన అదే దేవునిగా ఉన్నాడు. ఆయన అదే ప్రధానయాజకుడై యున్నాడు. ఇప్పుడు మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. నాకు పరిచయములేనివారు, ప్రార్థన అట్టలు లేనివారు దేవుడిని అడగండి, దానినిగూర్చి వినయముతో ఉండండి. ఇప్పుడు ఆయనను తాకుటకు మీరు విశ్వాసమును కలిగివుండాలని గుర్తుంచుకోండి. నేను మీకొరకు ఆయనను తాకలేను. మీయంతట మీరే ఆయనను తాకవలెను .ఇది మీయొక్క స్వంత విశ్వాసముపై ఆధారపడి యున్నది. కాని మీరు విశ్వసించెదరు. ఎంతమంది విశ్వాసిస్తున్నారు? "నేను విశ్వసిస్తున్నానని" చెప్పండి. మీరు విశ్వసించ గలిగితే... వరుస క్రమములో ఇప్పుడే ప్రారంభించెదము. అది ఇప్పుడే వచ్చెను.

102. ఇప్పుడు మీరు నిజముగా విశ్వసిస్తున్నారనుకుంటున్నాను. ఇప్పుడు లేచి అటు ఇటు తిరగవద్దు. నిశ్శబ్ధంగా స్థిరముగా కూర్చోండి. ప్రభువైన దేవుడు తన సంఘమునకు ఋజువును అనుగ్రహించునుగాక!. దేవా, నేను సత్యమునే చెప్పాను. నాకు తెలిసినంత వరకు అది సరైనదే. పరలోకపు తండ్రి, నీ ప్రజలకు సహాయము చేయుటకై దానిని చేసెదవుగాక! మేము ఆయన ఎదుట నిలబడివున్నాము, నీ ప్రజలకు సహాయము చేయుము, ప్రభువా, కఠినముగా బోధించుచున్నాము, మీరు చేయవలసిన... ఇది ఒక మార్పు. ఇది మరొక అభిషేకము - అదే ఆత్మ, కాని ఇది మరొక కార్యాలయము.అక్కడ కూర్చున్న మహిళ, ఇక్కడే వరుస చివరలో, ఇదిగో నన్నే చూస్తున్నది,నీపై ఉన్న చిన్న తెల్లటి విషయము, నీవు నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? నేను ఆయన సేవకుడినని నీవు నమ్ముచున్నావా? నీకు ఆయన అవసరము ఉన్నది, నీకు లేదా? ఇది నీ గొంతు సమస్యకొరకు. ఇది నిజమా, కాదాని ఆమెను అడగండి. శ్రీమతి స్పార్బ్, నీవు మీ హృదయమంతటితో నమ్ముతున్నావా? అక్కడ కూర్చున్న ఆ బిడ్డ నీకుకూడా ప్రార్థించాలని కోరుచున్నావు. అవునయ్యా. అతనికి రక్తహీనత, నరముల బలహీనత గలదు. అది నిజము, అవునా? కాదా? ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు, నా జీవితములో ఎన్నడూ ఆమెను చూడలేదు. యేసు క్రీస్తు నామములో ఆ బిడ్డపైన నీ చేయిపెట్టుము, ప్రభువా, ఈ స్త్రీకి అలా చేయగలిగేంత విశ్వాసము ఉన్నయెడల అది తెలియజేయుము. అది యేసుక్రీస్తు నామములో విడిచిపోవునుగాక. ఆమేన్. సందేహించవద్దు.

103. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన వచ్చేవరకు మనము ఆయనను స్తుతిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు.ఇక్కడ ఒక చిన్న స్త్రీ ఉన్నది, ఆ స్త్రీ వెనుక కూర్చొని ఉన్నది. ఆమె చేతులు పైకి లేపినది. ఆమె చేతిలో చేతి రుమాలు ఉన్నది. ఆమె ప్రార్ధన చేయుచు, ఆ చివర కూర్చొని ఉన్నది. ఆమె కడుపు నొప్పితో బాధపడుచున్నది. సహోదరీ, అది పోయినది, నీ దగ్గర ప్రార్థన అట్ట ఉన్నదా?నీ దగ్గర లేదా? నీకది అవసరము లేదు. నీకిప్పుడు ఆ బాధలేదు. ఇంటికి వెళ్లి నీరాత్రి భోజనమును భుజించుము. "నీవు నమ్మగలిగితే... అది పోయెను". నీవు విశ్వసిస్తున్నావా? ఈ ప్రజలను అడగండి. పరలోకమందున్న దేవునికి తెలుసు, నేనెరిగినంతవరకు నా జీవితములో నేను వారిని చూడలేదు. ఇదంతా అదే క్రీస్తుకాదా?ఇదిగో ఇక్కడ ఒక చిన్న స్త్రీ కూర్చొని ఉన్నది. ఆమె ఎర్రటి కోటు వేసుకునివున్నది. ఓ, స్త్రీ నీ దగ్గర ప్రార్థన అట్ట ఉన్నదా?నీ దగ్గర లేదా? నీకది అవసరము లేదు. నీకు అనారోగ్యము లేదు, కాని నీవు నాతో మాట్లాడాలనుకుంటున్న ఒక ప్రశ్న నీ మనస్సులో ఉన్నది. ఆ ప్రశ్న ఆత్మ సంబంధమైనది. నీవు నీ పనిని విడిచిపెట్టి, పూర్తి సమయము ప్రభువు పనికొరకు వెళ్లాలా, వద్దానే దానిగురించి నీవు తెలుసుకోవాలనుకుంటున్నావు. నీవు ఇక్కడనుండి రాలేదు. నీవు టెక్సాస్, హ్యూస్టన్ నుండి వచ్చావు. వేచి ఉండుము, ఆయన నీకొరకు సిద్ధముగా ఉన్నప్పుడు నిన్ను పిలుచును. నా జీవితములో నేను ఆస్త్రీని ఎప్పుడూ చూడలేదు, నీవు వానిని నమ్మమని నేను నీకు సవాలు చేయుచున్నాను.

104. తిరిగి వెళ్ళు మార్గము అనగా ఏమిటి?. ఇదిగో ఇక్కడ, వెనుక కూర్చునియున్న వ్యక్తి ఒక మంచి ఆత్మ సంబంధమైన సాన్నిహిత్యంగలవానిగా ఉన్నాడు. తెల్ల చొక్కా వేసుకొని బట్టతలగలవాడు. అతను అర్కాన్సాస్నుండి వచ్చెను. నీవద్ద ప్రార్ధన అట్ట ఉన్నదా? నన్ను దేవుని ప్రవక్తని నీవు నమ్ముచున్నావా? నీకున్న కడుపు నొప్పి నీనుండి తొలగిపోయెను. నీవు ఆర్కాన్సాస్కు సంతోషిస్తూ ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. అతనిని నా జీవితములో ఎన్నడూ చూడలేదు. ఇక్కడ మరొక వ్యక్తి ఉబ్బసము, వరిబీజముతో కూర్చునియున్నాడు, అతను టెక్సాస్కు చెందినవాడు. శ్రీ. కాబ్. అది నిజమే. నేను నీకు అపరిచితుడిని. నీవు నమ్ముచున్నావా? టెక్సాస్కు తిరిగి వెళ్లి, యేసుక్రీస్తు పేరట క్షేమముగా ఉండుము. ఆయనే దేవుడు. నీవు నమ్ముచున్నావా?ఇదిగో ఇక్కడే బొద్దుగావున్న ఒక చిన్నది కూర్చుని ఉన్నది. ప్రియమైనదాన,నీ దగ్గర ప్రార్థన అట్ట ఉన్నదా? నన్ను దేవుని ప్రవక్తని నీవు నమ్ముచున్నావా? దేవుని సేవకుడిగా, ప్రసంగించిన ఆ వర్తమానములో నేను కొద్ది సేపటి క్రితము చెప్పినది సత్యమని నీవు నమ్ముచున్నావా? నీ మూత్ర పిండముల సమస్య నిన్ను విడిచిపోతుంది. ఇంటికి వెళ్ళు, యేసు క్రీస్తు నామములో బాగవుదువుగాక! నీవు దానిని విశ్వసించుము.ఆ వరుస చివరలో చెవిలో అంటు వ్యాధితో కూర్చునివున్న స్త్రీ, దేవుడు నిన్ను బాగుచేస్తాడని నమ్ముచున్నావా? ఇంటికి వెళ్ళు, విశ్వసించు, క్షేమముగా ఉండు.అక్కడ ఊదా రంగు టోపీ ధరించి, గుండె సమస్యతో శ్రీమతి. లాంబెర్ట్ పేరుగల ఒక స్త్రీ కూర్చునియున్నది. నీవు నీ పూర్ణ హృదయముతో నమ్ముచున్నావా? నీ గుండె సమస్య నిన్ను విడిచిపోతుంది, నీవు ఇంటికి వెళ్లి క్షేమముగా ఉండవచ్చు.

105. మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా? నమ్మమని నేను మీకు సవాలు చేయు చున్నాను. మీ చేతులు పైకెత్తండి. ప్రభువైన యేసూ, దేవుని కుమారుడా, ఈ కార్యములు గతించిపోనివ్వకు. నీవు ఈ కార్యములు వ్యర్ధము కానివ్వకు ప్రభువా. నీవు దేవుడవు, నిత్యమైన దేవుడవు. నీవు ఎన్నటికీ జీవించెదవు. నీవే దీనికి కర్తవని ఈ రాత్రి ఎరుగు దురుగాక!. ఈ మందు చీటి సరియైనది. నీవు మా మధ్యలో ఉన్నావు, నీవు దేవుడవై యున్నావు. ప్రజలు ఇప్పుడు నీయందు విశ్వాసము ఉంచుదురుగాక!. వారు స్వస్థత పొందెదరుగాక! - అవిశ్వాసములన్నింటినుండి రెట్టింపు నివారణ పొందెదరుగాక!మా కృపగల దేవా, మా పరలోకపు తండ్రీ, అన్ని విషయములలో మేము నిన్ను స్తుతించుచున్నాము. యేసుక్రీస్తు నామములో మేము వీరిని నీకు అప్పగిస్తున్నాము.

106. మీ పూర్ణ హృదయముతో మీరు విశ్వసిస్తున్నారా? ఇక్కడున్న వ్యక్తులలో కొందరిని అడగండి. నా జీవితములో నేనెన్నడూ వారిని చూడలేదు. వారిలోవున్న సమస్యలు ఏమిటో నాకు తెలియదు. అది పరిశుద్ధాత్మకే తెలుసు. నేను మీకు సత్యమునే చెప్పితిననే దానికి అదే ఋజువు. నేను మీకేమి చెప్పితినో అదే తిరిగి వెళ్ళవలసిన మార్గమైయున్నది.సంఘము అరణ్యములో తప్పిపోయి చుట్టూ తిరుగుచుండెను. దేవుడు, మన తండ్రి ఇక్కడ మన మధ్య మనలో ఉన్నాడు. ఆయన తన కుమారుడైన క్రీస్తు యేసులో ఉన్నట్లు మనలో ఉన్నాడు. ఆయనలో అపరిమితమైన కొలతలో ఆయన ఉంటూ, మనలో కొలత చొప్పున మాత్రమే ఉన్నాడు, కాని ఆయన అదే ఆత్మగా యున్నాడు. మీరు దానిని చూడలేదా? మీకది తెలియదా?మీ పూర్ణ హృదయముతో విశ్వసించండి.మనము ఎక్కడ ఉన్నాము? దేవునిపై విశ్వాసము కలిగియుండండి. యేసు చెప్పిన ఈ కార్యములను నమ్మండి. ఆయన దేవుని కుమారుడైయుండి అబద్ధము ఎలాగు చెప్పగలడు? ఆయన ఒక దానిని వాగ్ధానముచేసి, దానిని అబద్దముగాఎలాగు చేయును? అదెందుకనగా మనకు ఇంకా వ్యాధి నిరోధక టీకాలు వేయబడలేదు. తిరిగి గుగ్గిలము వద్దకు రండి తిరిగి రండి,ఏదోక ఆవేశము కాదు, ఉద్రేకము కాదు,కాని అది ఆవేశమైన ప్పటికీ, అలాగే అది ఉద్రేకమైనప్ప టికీ, మీలోకి అసలైన పరిశుద్ధాత్మ వచ్చునుగాక! అప్పుడు అది తననుతాను నిరూపించుకొనునుగాక!. మీ హృదయములను తెరవండి. ఆయన ఎల్లప్పుడూ చేసే కార్యములనే అది చేయును. "నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును.” దీనిని మీరిప్పుడు విశ్వాసించెదరా?

107. ఇప్పుడు ఎంతమంది దగ్గర ప్రార్ధన అట్టలు గలవు? నన్ను క్రీస్తు సేవకుడని మీరు నమ్మితే... మీ చేతులు పైకి లేపండి. యేసు సంఘమునకు ఇచ్చిన చివరి ఆదేశము ఏదనగా, "నమ్మినవారిని ఈ సూచకక్రియలు వెంబడించును. వారు రోగులమీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతనొందుదురని" చెప్పెను. నేను బయటకు వెళ్లాలని భావించి, బయటికి వెళ్లబోయాను, కాని ఏదో నాతో, "అలా చేయవద్దు. నీవు వారిపై చేతులుంచా లని ప్రజలు కోరుకుంటున్నారు" అన్నట్లుగా నేను నడిపింపబడితిని. దేవుడు మంచివాడు! ఆయన నాస్వంత ఆలోచననుండి నన్ను నిలిపెను. ఏది నన్ను ఆపింది? దానిని మీరు ఆశించిన రీతిగా చేసిరి. ఆయన మీ హృదయ వాంఛను మీకు దయచేయును. మీరు ప్రార్ధన అట్టలతో వరుసలో ఉండండి. సరిగ్గా ఇటువైపు వచ్చి, వారిని వరుసలో ఉంచండి. ఆయన మంచివాడు.మరణ అంచులలోవున్న తన కుమారునికొరకు ఒక నల్లజాతి స్త్రీ విశ్వాసమునుబట్టి ఆయన విమానమును ఆకాశమునుండి క్రిందికి దింపి, నన్ను రాత్రంతా, మరుసటి దినమంతా అక్కడే ఉండునట్లు చేసినదానిని నిశ్చయముగా నేను చూచాను. మీరు నమ్ముతారా? మీరు వర్తమానమును నమ్ముచున్నారా? మీరు వర్తమానమును నమ్మక పోతే, నిశ్చయముగా మీరు ఎన్నటికీ వర్తమానికుని నమ్మరని నేను అనుకుంటున్నాను. కాని అది దేవుని వర్తమానమైతే, దేవుడే దానిని ఋజువుపరుచును.

108. ఇప్పుడు, దర్శనములు ఏమి చేయునో మీరు చూచిన... దర్శనములు దేవుని యొద్దనుండి వచ్చు కార్యములు. దర్శనములు మిమ్ములను స్వస్థపరచవు, కాని దర్శన ములు దేవునిగూర్చి వెల్లడిపరచును. "మీలో ఎవరైనా ప్రవక్తని చెప్పుకుంటే, ప్రభువైన నేను అతనితో మాట్లాడెదను. (ఆయన ఎలాగు మాట్లాడును? ఆయన ఎల్లప్పుడూ చేసినట్లే, మాట్లాడినట్లుగానే మాట్లాడును) మరి... అతను సత్యమునే చెప్పిన, నేను దానిని సత్యమని ఋజువుపరుస్తాను” అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది.అలాగైతే మందు చీటి తీసుకుని తిరిగి వెళ్ళండి. పెంతెకోస్తుల విశ్వాసమునకు తిరిగి వెళ్ళండి. ఏకత్వమువారు త్రిత్వమువారికి, త్రిత్వమువారు ఏకత్వమువారికి సహోదరులుగా ఉండండి. చర్చ్ ఆఫ్ గాడ్వారు నజరేన్వారికి, నజరేన్వారు చర్చ్ ఆఫ్ గాడ్వారికి సహోదరులుగా ఉండండి. సంఘశాఖలు మిమ్ములను వేరుపరచనివ్వ కండి. దేవుడు తన సంఘమును ముందుగా నిర్ణయించెను. వారెక్కడో గుంటలో వున్నారు. మనము బయటకు వెళ్లి వారిని తీసుకురావాలి. పరిశుద్ధాత్మ ప్రతీ హృదయ మును ఈ రాత్రి వెదుకుచూ ఇక్కడ ఉన్నాడు. పరలోకపు తండ్రి అనుగ్రహించునుగాక.

109. ప్రజలగు మీరు వచ్చినప్పుడు, నేను మిమ్ములను స్వస్థపరచగలిగితే, నేను స్వస్థపరుస్తాను. కాని నేను మిమ్ములను స్వస్థపరచగలనని చెప్పినయెడల,నేను అబద్ధకుడి నవుతాను. మీరిదివరకే స్వస్థపరచబడిరి. యేసు కల్వరిలో చనిపోయినప్పుడే మిమ్ములను స్వస్థపరిచెను. ఎందుకనగా, "మన అతిక్రమములకొరకు ఆయన గాయపడ్డాడు, ఆయన పొందిన గాయములు చేత మనము స్వస్థత పొందాము.” ఇది సత్యమని ఎంతమంది నమ్మగలరు? "ఆమేన్" అని చెప్పండి. మీ మీద చేతులుంచి దేవా, ఈ ఆశీర్వాదము అనుగ్రహించుమని ఆశీర్వాదమును పలుకుటను మాత్రమే నేను చేయగలను. మీరు విశ్వసిస్తే అది మీకు సహాయము చేయునని నేను నిశ్చయముగా చెప్పగలను. ఓరల్ రాబర్ట్స్ గారు ఒకసారి చెప్పినట్లుగా, ఇది ఒక తాగగల కేంద్ర బిందువైయున్నది. మనము తలలు వంచి ప్రార్థిస్తున్నప్పుడు ఇక్కడున్న ప్రతీ వ్యక్తి ఇప్పుడు విశ్వసించాలని నేను కోరుచున్నాను. ఈ ప్రజలు ఇక్కడే వరుసలో ఉండాలని నేను కోరుచున్నాను.వారు వచ్చుచుండగా నేనిప్పుడు మీ మీద చేతులుంచి ప్రార్ధించబోవు చున్నాను. సమయము పది గంటలవుచున్నది, ఆలస్యమగుచున్నది, నేను మీ కొరకు ప్రార్థించబోవుచున్నాను.నేను ఇప్పుడే మీమీద చేతులుంచి ప్రార్ధించబోవుచున్నాను, దేవుని పరిచర్యచేయు సహోదరులనుకూడా ప్రార్దించమని అడుగబోవుచున్నాను, తద్వారా కేవలము నేను ఒక్కడిని మాత్రమే కాదు, రోగులకొరకు ప్రార్థించే హక్కు ఏ దేవుని సేవకునికైనా గల దని మీరు చూడగలరు. దైవ భక్తిగల, దేవుడు పంపిన, దేవునియందు విశ్వాసముగల ఏ దైవజనుడైనా, ఇతరుల ప్రార్థనను ఆలకించిన రీతిగానే దేవుడు అతని ప్రార్థనను వినును. వారు వివేచించుట మరియు అలాంటివి చేయకపోవచ్చు, అవి చాలా తరచుగా జరగవు. అది నిజమే. కాని వాటిని చేసే వ్యక్తిని ఇతరులకంటే ఎక్కువగా హెచ్చించదు.

110. నేను ఇతర ప్రసంగీకులు ప్రసంగించునట్లుగా నేను ప్రసంగించలేను. ఒక ఉపదేశకుడు బోధించునట్లు నేను బోధించలేను. అన్య భాషలు మాట్లాడే వరముగల వారివలె నేను అన్యభాషలు మాట్లాడలేను. భాషలకు అనువదించే వరము నాకు లేదు. అది ఒకటి లేదా రెండు పర్యాయాలు నా దగ్గరకు వచ్చి... నేను నా జీవితములో నాలుగు లేదా ఐదుసార్లు భాషలలో మాట్లాడాను. కాని అనేకసార్లు చెయ్య... నిశ్చయ ముగా అనేకసార్లు అలాగు మాట్లాడాలని అనుభూతి చెందాను, కాని ఎన్నడూ అది బయటకు ఉచ్చరించలేదు. అది అనేక సార్లు జరిగినది.నేను ఒకసారి ఒక గంటసేపు భాషలలో మాట్లాడాను. నేను ఒకసారి భాషలలో మాట్లాడాను, కాని నేను మాట్లాడుచున్నది నాకే తెలియలేదు. ఎవరు మాట్లాడుచున్నా రని చూట్టూ చూశాను. నేను "ఆ జర్మన్ ఎక్కడ ఉన్నాడు, అతను ఎవరో?" అనుకుని చూట్టూ చూశాను. కాని అలాగు మాట్లాడినది నేనే. వాస్తవముగా అలాగే మాట్లాడుచూ నేను ఉండిపోయాను. అదే సమయములో పది మైళ్ల దూరములో, ఒక మహిళ రక్త స్రావముతో మరణించే స్థితిలో మందిరమునకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నది. కావున ఆమె అక్కడికి చేరుకున్నప్పుడు, ఆమె తక్షణమే స్వస్థపరచబడినదని సాక్ష్యమిచ్చెను. ఇది నిశ్చయముగా మధ్యవర్తిత్వము (విజ్ఞాపనలు) చేయు పరిశుద్ధాత్మగా ఉన్నది.ఇప్పుడు ఈ విషయములు కల్పితముకాదు మిత్రుల్లారా. అవి నిజమే. పరలోక మందున్న తండ్రికి అవి నిజమని తెలుసు, అలాంటివి వేలకొలది, పదివేలకొలది కార్యములు ఉన్నవి. కాబట్టి అది దేవుడు, మిత్రులారా, అది దేవుడైయున్నాడు. ఇప్పుడు మీ పూర్ణ హృదయముతో దానిని విశ్వసించండి.

111. సహోదరుడు మూర్, సహోదరులారా మీలో కొందరు, సహోదరుడు ట్రేసీ, పరిచర్య చేసే సహోదరులారా మీరెవరైనా నేను చేతులనుపెట్టేటప్పుడు నాతోపాటు ఇక్కడ నిలబడాలని కోరుచున్నాను. సహోదరుడా డాన్, మీరు అక్కడున్నవారికి సహాయము చేయవచ్చు, సహోదరుడు బ్రౌన్, ఎవరైనా, మీలో ఎవరైనా క్రైస్తవులుగా ఉండి విశ్వసించే వారు ఇక్కడకు వచ్చి ప్రార్ధించండి. ఇప్పుడు అందరము తలలు వంచుదాము.కృపగల దేవా, మేము సహాయము చేయుటకు ఇక్కడ ఉన్నాము. మీరు సహాయము చేయాలని నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా. నీవిక్కడ ఉన్నావని వారెరుగుదురు. ఆత్మ ఫలముద్వారా వారికి తెలుసు, నీవు ఇక్కడ ఉన్నావని పరిశుద్ధాత్మయొక్క క్రియలద్వారా వారు చూస్తున్నారు.ప్రభువా! మేము కేవలము మనుష్యులము, మా బాధ్యతను చేయుటకే మేమిక్కడ నిలబడి ఉన్నాము. నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని చెప్పావు. ప్రభువా! వారిపట్ల మాకున్న సానుభూతిని మరియు దేవునిలో మాకున్న విశ్వాసముయొక్క జ్ఞాపకార్ధము వారిపై చేతులుంచి వారిని దాటి పోవునప్పుడు ప్రతీ వ్యక్తిని స్వస్థపరచబడునుగాక!.

112. ప్రారంభముగా, నేను ఈ శిశువుపై నా చేతులు ఉంచి, ఈ ఉబ్బిపోయివున్న తలను ఖండిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో, అది కుంచించుకుని పోవునుగాక. ఈ శిశువు తల ఎంత కుంచించుకుపోయిందో చూపించుటకు ఈ స్త్రీ తిరిగి వచ్చును.ఆ శిశువు దేవుని రాజ్యముకొరకు జీవించునుగాక! ఆమేన్.సహోదరునిపై నా చేయి ఉన్నది, యేసుక్రీస్తు నామములో అతను స్వస్థపడునుగాక. నా సహోదరునిపై నా చేయి ఉన్నది, యేసుక్రీస్తు నామములో తన స్వస్థతను పొందుకొనునుగాక!. యేసుక్రీస్తు నామములో నా సహోదరుడు స్వస్థపడును గాక!.యేసుక్రీస్తు నామములో బిడ్డ స్వస్థపరచబడునుగాక!.దేవా! యేసుక్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపడనివ్వండి. యేసుక్రీస్తు నామములో మా సహోదరుడు స్వస్థపడునుగాక!. యేసుక్రీస్తు నామములో మా సహోదరుడు స్వస్థపడునుగాక!. యేసుక్రీస్తు నామములో మా సహోదరుడు స్వస్థపడునుగాక!.

113. క్రైస్తవులందరూ ఇప్పుడు ప్రార్థిస్తున్నారు, అందరూ ప్రార్థిస్తున్నారు. యేసు నామములో, మా సహోదరిని బాగుచేయుము. యేసుక్రీస్తు నామములో ఆమెపై చేతులుంచండి... జూన్, ముందుకు రండి, నీవేమి ఆలోచిస్తున్నావో నీవు విశ్వాసించవా? జూన్,నీవు బాగానే ఉంటావు. తల్లీ... ఇది నీకు జరిగినది. కానీ నిన్న రాత్రి నాకు చెప్పినప్పుడు, అది ప్రార్థనలో ఉంచబడినది. నీవు ఇంకా ఏదో ఎక్కువగా... ఏదో క్లిష్టమైన మార్గములో వెళ్ళుచున్నావు. కానీ నీవు బాగానే ఉంటావు. పరలోకమందున్న దేవుడు తన దీవెనలను ఈ యవ్వన స్త్రీ మీద ఉంచునుగాక...?…ఈ బంగారు స్వరము, ఈమెలోవున్న ప్రతిభ దేవుని రాజ్యముకొరకు అర్పించబడిన స్థితికి వచ్చి, మరలా ఆ స్వరము బాగై, మరలా ఆ స్వరము దేశమంతటా ప్రతిధ్వనించు నట్లుగా మనము వినెదముగాక! కనుక యేసుక్రీస్తు నామమున ఆ గొంతులోని ప్రతీ నరము సడలించబడునుగాక! ఈ కార్యములపట్ల ఆమె మనస్సును విషపూరితము చేయడానికి ప్రయత్నిస్తూ, ఆమె కళ్లను గుడ్డిగా ఉంచుటకు ప్రయత్నిస్తున్న దెయ్యమును నేను గద్దిస్తున్నాను. అయితే పరలోకపు దేవుడు, క్రీస్తు వెలుగుయొక్క పగటి వెలుగుతో దానిని విచ్చిన్నము చేయును గాక!నేను ఈ అమ్మాయిని నీకొరకు హక్కుగా కోరుచున్నాను. "మీరు మీ హృదయములో సందేహించక ఈ పర్వతమును చూసి కదిలిపొమ్మని చెబితే, మీరు చెప్పిన దానిని నమ్మండి, మీరు చెప్పినది నెరవేరుతుంది. మీరు చెప్పినది మీరు పొందెదరు" అని చెప్పావు. ఈ అమ్మాయి యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందాలని నేను ఉచ్చరించు చున్నాను. ఇది చెప్పబడినది, ఇప్పుడు అది జరగనివ్వండి.

114. యేసుక్రీస్తు నామములో ఇది మన సహోదరునికి జరగునుగాక!.శ్రీమతి ప్రాడర్, నాకు మీ చీటీ అందినది. (సహోదరి షాడర్ నాకు తెలుసు), మీరు నన్ను టేపులోని విషయమును గురించి అడిగారు. అది వినడానికి నేనింకాఇంటికి వెళ్ళలేదు. నేను ఇంటికి వెళ్ళగానే వింటాను. సహోదరి షాడర్ నీవొక మంచి స్త్రీవి. నా సహోదరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రారంభములో నేనొక చిన్న బాప్టిస్టు బోధకునిగావున్నప్పుడు,ఆ వెలుగు క్రిందికి దిగి నాపైకి వచ్చినప్పుడు ఆ వెలుగు ఏమి చేసెనో సరిగ్గా నేను లోపలికి నడిచి వచ్చేటప్పుడు దానినిగూర్చి ఎవరోకరు అన్య భాషలో చెప్పుచుండగా, నీవు దానికి అనువాదము చేయుచున్నావు, ఆ సమయ మున నిన్నుగూర్చి నాకు తెలియదు. "క్రీస్తుయొక్క మొదటి రాకడను ముందుగా ప్రకటించుటకు బాప్తిస్మమిచ్చు యోహాను ముందుగా పంపబడినట్లుగా, నీ వర్తమానము రెండవ రాకడను గూర్చి ప్రకటించుటకై నీవు ముందుగా పంపబడితివి” అని చెప్పెను.నేను ఎక్కడైతే సేవకునిగా నియమించబడితినో, అచ్చటున్న బాప్టిస్టు సేవకుడు అది విన్నప్పుడు, “ఏడవ తరగతి చదివిన వ్యక్తి, అధిపతులకు బోధించునాని?” అడిగెను. నేను, “ఆయన చెప్పినది అదేనని” చెప్పాను."మర్మమైన వెలుగు దైవ సేవకునిమీద వ్రేలాడుచున్నది" అనే వ్యాసం అనుబంధ ముద్రణములో వ్రాయబడియున్నదని పత్రికలో చెప్పబడెను. పదకొండు సంవత్సరాల క్రితము దాని గురించి ఏమి తెలియని స్థితిలో, ఎవరో అన్య భాషలో దానిగురించి మాట్లాడగా, నీవు దానిని అనువదించుండగా, నేను అక్కడ నిలబడి ఉన్నాను. సహోదరి ప్రాడర్ దేవుడు నీతో ఉన్నాడు. దెయ్యములు నీకు విరోధముగా ఉన్నాయి. నేను నీ సహోదరుడను. భూమిని, ఆకాశమును సృజించిన ఓ, ప్రభువా, ఈ బలహీనమైన దీన మహిళయొక్క ప్రశస్తమైన, ప్రియమైన భర్త వెళ్ళిపోయెను, ఓ ప్రభువా! “మా రక్షకుడిని సమాధి నుండి లేపిన అదే శక్తి, నీ మహిమార్థమై నీ నామమున ప్రవచించిన ఈ బలహీనమైన దీన మహిళ పైకి ఆయన వచ్చునుగాక!. అది మరలా కొనసాగును గాక! చిధ్రమైపోయిన ఆ వరము మరలా చక్కగా ఆమెలో క్రియచేయునుగాక!, ప్రభువా,ఆమె బాగవునుగాక. నేను దీనిని యేసుక్రీస్తు నామములో ఆమెపై ఉచ్చరిం చాను. ఇప్పుడు అది చెప్పబడినది, ప్రభువా, అది నీ మహిమకొరకు జరగునుగాక!. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక!. నీ ఆత్మ... ?...

115. మా పరలోకపు తండ్రీ, యేసు క్రీస్తు నామములో ఈ యవ్వన సహోదరిని ఆశీర్వదించండి,ఆమె ఏమి కోరునో దానిని యేసు నామములో ఆమెకు అనుగ్రహిం చుము. దేవుడు సహోదరుడిని దీవించి, యేసుక్రీస్తు నామమున అతనికి స్వస్థతనివ్వుము. దేవుడు మన సహోదరిని ఆశీర్వదించును. యేసుక్రీస్తు నామములో ఆమెకు స్వస్థత అనుగ్రహించుము. దేవుడు మన సహోదరుడిని ఆశీర్వదించునుగాక, ప్రభువా, అతనికి స్వస్థతను అతనికి అనుగ్రహించుము. ప్రభువా! ఇక్కడకు వచ్చిన ప్రజలను వచ్చినట్లు గానే తిరిగి వెళ్ళకుండా, విశ్వాసము ద్వారానే దానిని పొందగలమనే విశ్వాసముతో,నమ్మకముతో వచ్చి గ్రహించునట్లు చేయుము, దానిని పొందుకొనుటకు అదియే మార్గమని...?... ప్రభువా, దానిని అనుగ్రహించుము. వారు కేవలం వ్యర్థంగా నడుచు కుంటూ రాకుండా... కాని తాము దేవునియొక్క ఆశీర్వాదములు క్రింద వచ్చుచున్నా మని, ఈ రాత్రి అది సంఘమున నిరూపించబడిన మరియు ఋజువుపరచబడిన తన వాక్యముతో ఆయన ఇచ్చటే ఉన్నాడనే గ్రహింపుతో వచ్చెదరుగాక!. ప్రభువా,నీ స్వస్థతా శక్తిలో...?...నీవు దానిని చేయగలవు... (టేపులో ఖాళీ గలదు-సంపా.,) మేము వెళ్లి ప్రజలకు బాప్తిస్మమిచ్చుటకు నీవిచ్చిన ఆజ్ఞను షరతులమీద వెంబడించి నప్పుడు, పరిశుద్ధాత్మను ఇస్తానని ఆయన వాగ్దానము చేసెను. మేము చేయగలిగిన దంతా బాప్తిస్మమివ్వడమే, బాప్తిస్మమునిచ్చువాడు ఆయనే. అప్పుడు నేను వాక్యమును బోధించగలను, ఆయన దానిని ఋజువుపరుచును, కనుక నా చేతులను ఈ ప్రజలపై ఉంచుతాను, అప్పుడు వారిని యేసు నామములో... దేవుడు వారిని బాగుజేయును...

116. దేవుడు ఈ సహోదరునికికూడా అదే రీతిగా యేసు నామమున దీవించునుగాక.పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములో ఈ సహోదరిని స్వస్థపరచండి. ఈ రాత్రినుండి అది పోవును గాక, ప్రభువా, ఇక్కడ నీయొక్క గొప్ప సంఘము ప్రార్ధించుచున్నది, తండ్రీ, అది అలాగునే జరగనివ్వండి... స్వస్థపరచండి.యేసుక్రీస్తు నామములో, స్వస్థత పొందుకొనునుగాక!.యేసుక్రీస్తు నామములో, మా సహోదరుడిని స్వస్థపరచండి.యేసుక్రీస్తు నామములో, మా సహోదరికి అది జరుగును గాక!.యేసుక్రీస్తు నామములో, అది జరుగును గాక!యేసుక్రీస్తు నామములో, మా సహోదరికి అది జరుగును గాక!యేసుక్రీస్తు నామములో జరుగునుగాక! ఇప్పుడే అతని అవిశ్వాసమును తీసివే యుము, అతను ఇప్పుడిక్కడ ఉన్నటువంటి సర్వాంతర్యామియైన దేవుని కుమారుని సన్నిధిలో ఉన్నాడు. ఈ గడియలోనే నీ విడుదలను ఆయన అనుగ్రహించునుగాక.అట్లే మా సహోదరుడు దాటివెళ్ళచుండగా, ప్రభువా, అతనికి అనుగ్రహించుము.నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగులమీద చేతులుంచి నప్పుడు, స్వస్థతనొందుదురని నీవు చెప్పావు, దాని కొరకు నేను నిన్ను నమ్ముచున్నాను. కనుక యేసుక్రీస్తు నామమున నేను రోగులైన ఈ ప్రజలపై నా చేతులుంచుచున్నాను.యేసుక్రీస్తు నామములో నా సహోదరుని మీద చేతులుంచుచున్నాను. మీ తండ్రి ఆమె పొందిన ఆశీర్వాదమునకు అదనముగా చేర్చగలడా.. ? యేసుక్రీస్తు నామములో మా సహోదరికి స్వస్థతను అనుగ్రహించుము దేవా,యేసుక్రీస్తు నామములో, ఈ సహోదరునికి స్వస్థత అనుగ్రహించుము. దేవా,మా సహోదరుని కోరికను తీర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్దిస్తున్నాము.

117. పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు నామములో... కోరికను అనుగ్రహించుము. పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు నామములో మా సహోదరికి అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో దీనిని అనుగ్రహించండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను స్వస్థతను అడుగుచున్నాను, తండ్రీ.యేసుక్రీస్తు నామములో మా సహోదరుడిని స్వస్థపరచుము.యేసుక్రీస్తు నామములో మేము విజయమును అడుగుచున్నాము.యేసుక్రీస్తు నామములో మా సహోదరునికి స్వస్థతను అనుగ్రహించుము.యేసుక్రీస్తు నామములో మా సహోదరుని స్వస్థతను అనుగ్రహించుము.మా సహోదరిని స్వస్థపరచుము తండ్రీ...?…యేసుక్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపరచుము తండ్రీ.యేసుక్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపరచుము.యేసు నామములో మా సహోదరుడిని స్వస్థపరచుము. యేసుక్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపరచుము.దేవా, యేసుక్రీస్తులో అనుగ్రహించుము, మా సహోదరుడిని స్వస్థపరచుము.ఇప్పుడు, ప్రభువా, యేసుక్రీస్తు నామములో దీనిని స్వస్థపరచు... ఈ బిడ్డలోమీ మహిమ కొరకు చేయుము.యేసుక్రీస్తు నామములో దీనిని స్వస్థపరచుము...?…యేసుక్రీస్తు నామమున, ప్రభువా, మా సహోదరిని స్వస్థపరచుమని నేను ప్రార్థించుచున్నాను.యేసుక్రీస్తు నామములో, దేవుని ఆశీర్వాదములను కుమ్మరించుము.యేసుక్రీస్తు నామములో, మా సహోదరిని స్వస్థపరచుము.యేసుక్రీస్తు నామములో మా సహోదరుడిని స్వస్థపరచుము.

118. ఇప్పుడు మీరు ఇచ్చటినుండి దాటి వెళ్ళుచున్నప్పుడు నమ్మండి, విశ్వసించండి.ఆయన ఇక్కడ లేనియెడల ఎలాగు ఆయన ఈ కార్యములను చేయగలడు? ఆయనెంతో గొప్పవాడు... ఎల్లప్పుడూ ఉండే రీతిగానే అదే అభిషేకము ఇక్కడ అట్లే ఉన్నది.యేసుక్రీస్తు నామములో ఈ, మా సహోదరిని స్వస్థపరచుము. యేసుక్రీస్తు నామములో మా సహోదరి మీద చేతులుంచుచున్నాను, ప్రభువా! యేసుక్రీస్తు నామములో దానిని నమ్మండి. ఆమేన్. ఇప్పుడు దానిని విశ్వసించండి... సహోదరీ. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక!.యేసుక్రీస్తు నామములో నా చేతులతో...?... యేసు నామములో యేసుక్రీస్తు నామములో మా సహోదరి కొరకు నేను విశ్వసిస్తున్నాను.యేసుక్రీస్తు నామములో...?…యేసుక్రీస్తు నామములో మా సహోదరి...?.యేసుక్రీస్తు నామములో మా సహోదరి...?…యేసుక్రీస్తు నామములో...?…యేసుక్రీస్తు నామములో మా సహోదరుడు స్వస్థపరచబడును గాక!.యేసుక్రీస్తు నామములో మా స్వంత సహోదరి స్వస్థపరచబడును గాక!ప్రభువా యేసుక్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపంచుము.యేసుక్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపరచుము.తండ్రీ, యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను మా సహోదరిని స్వస్థపరచుము.యేసుక్రీస్తు నామములో మా సహోదరుడిని స్వస్థపరచుము.

119. అక్కడ స్విచ్ని ఆపుచేస్తారా? ఇక్కడ ఇది చాలా వింతగా కనిపించవచ్చు,కాని ఇది దేవుని నిబంధనకు విధేయత చూపుట మాత్రమేయగును. మీరు పశ్చాత్తాపపడి, బాప్తిస్మమును తీసుకొన్నవారని మీరు విశ్వసించినయెడల, మీరు పరిశుద్ధాత్మను పొందు కొనుటకు అర్హతగల వ్యక్తియగుదురు. అర్థమైనదా? దేని ద్వారా? దేవుని సేవకునిద్వారా, మీకు సత్యమును తీసుకువచ్చిన క్రీస్తుయొక్క సేవకునిద్వారా, మీకు దేవుని వాక్యమును బోధించే సేవకులద్వారా, కనుక దేవుడు తన వాక్యముగా వచ్చినప్పుడు, వారు ఆ వాక్యమును బోధించగా, అప్పుడు పరిశుద్దాత్మ దిగివచ్చి అది సత్యమని నిరూపించును.చూడండి మిత్రులారా, కొద్దిసేపటి క్రితము ఏమి జరిగినదో నాకు తెలియదు. పరలోకములోవున్న దేవునికే తెలుసు, నాకు తెలియదు, అర్థమైనదా?. కానీ అదేమైన టికీ, అది మహిమకరముగా ఉండాలి, ఎందుకనగా నా హృదయము ఆనందముతో వేగముగా కొట్టుకొనుచున్నది. అది ఏదోక కార్యము. ఇప్పుడు ఇది చూచుటకు,క్రీస్తు రాకడ సమయము సమీపముగా ఉన్నందున, తిరిగి జన్మించిన సంఘము నూతన జన్మ హక్కును కోరుచున్నదానివలె నాకు కనబడుచున్నది. అసలు అది ఆధారముతో, ఒక సానుకూల ఆధారముతో…ఇచ్చట పొడగు అంగీతో, చేతులలో గాయపు గుర్తులతో, ముఖమునుండి రక్తము కారుచున్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాకూడా, అయినప్పటికీ అది క్రీస్తు కాదు. ఏ మోసగాడైనా దానిని చేయగలడు. కానీ... క్రీస్తులో ఉన్న జీవము పునరుత్పత్తి చేయబడినప్పుడు, అప్పుడు అది క్రీస్తు అని మీరు ఎరుగుదురు.


120. నేను రాబోయే రాత్రులలో ఏదోక రాత్రి, "నమ్మలేని నిజము” అనే అంశంమీద ప్రసంగించెదను. కనుక మీరిప్పుడు చూచిన కార్యము కేవలము నమ్మలేని నిజముగా ఉన్నది. ఇది వివరించలేని ఒక కార్యముగా ఉన్నది, అర్థమైనదా?.పరలోకమున దేవుడు అలాంటి కార్యములను ఎలాగు కలుగజేయుచున్నాడో అదొక అద్భుతమైన కార్యము. “సహోదరుడా బ్రాన్హాం, నన్ను స్వస్థపరచగలవాని" ఇప్పుడు మీరు అడగవచ్చు. అది అసాధ్యము. ఎందుకనగా, మీరు ఇదివరకే స్వస్థపరచబడిరి.ఆయన నాకిచ్చిన ఈ కోటును ఆయన ధరించి ఇక్కడ నిలబడి ఉంటే, ఆయన ఇంతకు మించి ఏమీ చేయడు. ఆయనే క్రీస్తని ఋజువుపరచుట, ఆయనే ఇక్కడున్నాడని నిరూపించుట తప్ప వేరేమి ఆయన చేయలేడు. మీరు ఆయనను నమ్మవలెను. "నీవు విశ్వసించిన,నేను చేయగలను. "సరిగ్గా ఇప్పుడిచ్చటున్నది అదే కార్యము. మీరు దీనిని విశ్వాసించియెడల, ఆయన చేయగలిగినది అది మాత్రమే. ఇది ఉద్వేగపరచవలసియు న్నట్లుగా నాకనిపిస్తున్నది. ఇది ప్రజలను పశ్చాత్తాపము చెందు స్థితికి తీసుకువెళ్ళవలెను. ఇది ప్రజలను పరిశుద్ధాత్మకొరకు వెదకునట్లు తీసుకువెళ్ళవలెను. ఇది చేస్తున్నదానికంటే ఇంకాకొంచెం అధికమైనవాటిని చేయగల స్థానమునకు తీసుకొనివెళ్ళుట యుక్తమగును.ఆహారము... రహదారిపై... వాక్య విత్తనము రాతి నేలపై పడుచున్నదా? స్త్రీలారా, దీనికి సమాధానమేమిటి? సహోదరులారా, సంఘమా, దీని సమాధానమేమిటి? దీనికన్నా దేవుడింకా ఏమి చేయగలడు? ఆయన ఎప్పుడుకూడా మరొక కార్యమును వాగ్దానము చేయలేదు. యేసుక్రీస్తు సన్నిధి తన సంఘములో క్రియచేస్తూ, ఆయన చేస్తాన వాగ్దానము చేసిన కార్యములు చేయుటకంటే మించి వేరేదీ మీరెన్నడు చూడలేరు.

121. అయితే, మీకు తెలుసా, ఇక్కడ సంఘమునకు ఏదో జరిగినది. యాభై సంవత్స రముల క్రితము అది ఛేదించి ఉంటే ఏమి జరిగి ఉంటుందని మీరు అనుకుంటు న్నారు? చూడండి,సంఘమును మరింత గట్టిగా కదిలించడానికి ఇది మరింత శక్తివంత ముగా ఉండవలెను. “శత్రువు వరదలా వచ్చినప్పుడు, దేవుని ఆత్మ దానికి వ్యతిరేఖ ముగా ఒక ధ్వజమును లేపును." ఈ దినములలో ఒకానొక దినమున అది ఆయన సంఘమును, తిరిగి జన్మించిన పరిశుద్ధులనే స్థానమునకు తిన్నగా పైకి లేపును."మంచంలో ఇద్దరు ఉంటారు, నేను ఒకరిని తీసుకుని ఒకరిని విడిచిపెడతాను, పొలములో ఇద్దరు ఉంటారు, నేను ఒకరిని తీసుకుని ఒకరిని విడిచిపెడతాను.”ఇది సంఘమును నిరంతరము జీవించుటకై క్రీస్తు సన్నిధిలోనికి పైకి లేపును. నేను దీనిని కఠినముగా ఉండుటకు చెప్పుటలేదు. నేను దీనిని దైవభక్తితో, సహోదరత్వముతో, యధార్ధతో, ప్రేమతో, దేవుని సంఘమనేది ప్రజలతోకూడిన శరీరముగా, దేవుని సంఘ ములా ఉండుటను నేను చూడాలని నా హృదయములోనున్న ఆకలితో చెప్పుచున్నాను.


122. మీపై చేతులు పెట్టబడి, ఈ ప్రార్థనా వరుసను మీరు దాటి వెళ్ళుచున్నను, మానవులుగా మీకొరకు ఎవరేమి చేయలేరు, మీరు చాలా తంత్రములను, ఇంకా అనేక కార్యములను విన్నారు, “నేను వాసన చూస్తున్నాను..." ఈవిధమైన కార్యములన్నీ లేఖనాధారముగా కూడా ఉండవు. ఇవి మీ మనస్సులను దాదాపు స్తంభింపజేయును. నిన్ను సత్యమునుండి కదిలించి, తొలగిపోవుటకు దెయ్యము అలాగు చేయును. అర్థమై నదా? వాక్యమే సత్యము, మరియు వాక్యము శరీరధారియాయెను. మీకు అర్థమైందా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. ఇదిగో చేతి రుమాళ్ళు ఇచ్చట ఉన్నవి... (ప్రేక్షకుల మధ్యనున్న ఒక స్త్రీ సాక్ష్యము చెప్పుచున్నది - సంపా.,). ఆమేన్. దేవునికే స్తుతులు కలుగునుగాక!.

123. ప్రభువైన యేసు, షారోన్ రోజా, లోయయొక్క లిల్లీ, ఉదయ నక్షత్రమా, దావీదు యొక్క వేరు మరియు చిగురు, అల్ఫా, ఒమేగా, ఆదియు మరియు అంతము, ఉండిన వాడు, ఉన్నవాడు, రాబోవువాడా, ఈ ప్రజలమీదకు నీ దీవెనలు పంపుము ప్రభువా. పాత కాలపు ఉజ్జీవముతో వారిని ఆశీర్వదించుము, ప్రభువా. అనేక సంవత్సరముల క్రితము వారి తండ్రులకు మరియు తల్లులకు గల అనుభవమునకు, మేము ఈ ఆరాధనలో కొనియాడుచున్న ఆ అనుభవమునకు వారిని తిరిగి పంపుము, ప్రభువా.ఇవిగో చేతి రుమాళ్ళు. యాభై సంవత్సరముల క్రితము ఆ ఆశీర్వదించబడిన పాత పరిశుద్ధుల శరీరముల నుండి వాటిని తీసుకున్నారు, రోగులు స్వస్థపరచబడిరి. రెండు వేల సంవత్సరముల క్రితము వారు అదే కార్యము చేసిరి, మరియు వారు స్వస్థతపరచబడిరి. ఈ రాత్రి మీరు అదే దేవుడైయుండి, సంఘమును దాని నిద్ర మత్తునుండి తట్టి లేపుటకు, సంఘమున శక్తిని పునరుద్దరించబడుటకు గొప్ప పరిమాణ ములో వచ్చచున్న అదే పరిశుద్ధాత్మునిగా నీవు యున్నావు. ప్రభువా! ఈ చేతి రుమాలు ధరించిన వారెవరైనాసరే స్వస్థతపరచండి. దేవునియొక్క శక్తి ప్రతీ ఒక్కరినీ బాగు చేయును గాక! స్వస్థతకొరకు యేసుక్రీస్తు నామమున నేను వారిని పంపుచున్నాను.

124. ప్రజలను ఆశీర్వదించండి, ఇప్పుడు వారిని నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. వాక్యము ప్రకటించబడెను. నీయంతట నీవే ప్రత్యక్షమైతివి. నీవిక్కడ ఉన్నావని నిరూపిం చావు. నీవు మరణించలేదు, కాని మృతులలోనుండి లేచితివని, నీవు నిరంతరము సజీవుడవని నిరూపించితివి. నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగాయున్న నీ ఆజ్ఞలను, వాక్యమును, వాగ్ధానములను గైకొని నీ నామమందు విశ్వసించే వారిని తరతరములకు కాపాడు దేవుడవై యున్నావు. ఎక్కడైనా ఒక్క వ్యక్తి తనకొరకు ఉన్నాడాని కనుగొనుటకు వెతుకుచున్నాడు.ఓ దేవా! ఆయన ఒక దినమున ఐరేనియస్ ను కనుగొనెను, ఒక దినమున పాలికాపు కనుగొనెను, ఒక దినమున పౌలును కనుగొనెను, ఒక దినమున మార్టిన్ని కనుగొనెను,ఒక దినము లూథర్ను కనుగొనెను, వెస్లీని కనుగొనెను, జార్జ్ వైట్ ఫీల్డ్ని కనుగొనెను. ఓ దేవా! ఆయన బిల్లీ సండేని కనుగొనెను, ఈ రాత్రి ఆయన మనలను కనుగొనునుగాక!. ఓ దేవా! ఒక చార్లెస్ ఫిన్నీవంటి, లేదా సంఘమును దాని స్థానము నకు తీసుకొని రాగల ఎవరినైనా ఒకరిని, సంఘమును కదిలించగల విధముగా సువార్తను ప్రసంగించే ఈ ఘడియకు తగిన ఎవరైనా ఒకరిని ఆయన కనుగొనును గాక! ఒక మనిషిని కాదు,మహోన్నతుడగు పరిశుద్ధాత్ముడే స్వయముగా,ప్రజల మధ్య కదలాడుచు, తన స్వకీయ క్రియను చేయుచు, ఈ రాత్రి తాను ఇచ్చటున్నానని తనను తాను బయలుపరచుకున్నందుకు, ప్రభువా, మేము మీకు కృతజ్ఞుతులమై యున్నాము.మా కృతజ్ఞుతులను స్వీకరించుము, నీ ఆశీర్వాదములను మాకు అనుగ్రహిం చుము. యేసుక్రీస్తు నామములో, మేము దీనిని అడుగుచున్నాము.

125. నేను ఆయనను ప్రేమిస్తున్నాను, నేను ఆయనను ప్రేమిస్తున్నాను, ఎందుకనగా, ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.ఇప్పుడు మనము కళ్ళు మూసుకుందాము. మన చేతులను పైకెత్తి ఆయనను స్తుతించుదాము. ఆయన ఇక్కడున్నాడని మీకు తెలుసు. ఎంతమంది దానిని మీ పూర్ణ హృదయముతో నమ్ముచున్నారు. క్రీస్తు ఇక్కడున్నాడని నమ్మే ప్రతివారు ఆమేన్ చెప్పండి.ఇప్పుడు మనలోవున్న మన పూర్ణ హృదయముతో ఆయనకు కీర్తించెదము. ఎలాగు స్తుతించాలో మనకు తెలిసిన రీతిగా అన్నీ స్తుతులను ఆయనకే చెల్లించెదము. సరే.నేను ఆయనను ప్రేమిస్తున్నాను (ఇప్పుడు మీ కన్నులను మూసుకోండి, ఆత్మలో పాడండి), నేను ఆయనను ప్రేమిస్తున్నాను,ఎందుకనగా, ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.ఆ కల్వరి వృక్షము మీద ఆయన నా రక్షణను కొనెను.

126. ఓ! అద్భుతము,(ఒక వ్యక్తి ప్రవచిస్తున్నాడు-సంపా.), ఆమేన్. అది ఏమిటో మీకు తెలుసా? అది ఏమిటి? భాషలలో మాట్లాడుట మరియు అనువదించుటనగా ఏమిటి? మీరేమి మాట్లాడుచున్నారో మీకే తెలియని స్థితిలో ఏదోక కార్యమును మాట్లాడుచుండుటనేది పరిశుద్ధాత్మయొక్క ప్రేరేపణయగును, అర్థమైనదా?.నేను మీకు తిరిగి వెళ్లే మార్గమునుగూర్చి చెప్పాను. నేను మిమ్మల్ని ఆహ్వానించు చున్నాను. ఇక్కడ ఎంతమంది ఆ మార్గమును తీసుకొని మందు చీటీని అనుసరించుటకు ఇష్టపడుచున్నారు? ఇక్కడ మీలో ఇంకా ఎన్నడూ బాప్తిస్మము పొందనివారు, బాప్తిస్మము పొందాలనుకునేవారు మీ చేతులను పైకెత్తి "నేను సిద్ధముగా ఉన్నాను, నేను నమ్ముచు న్నాను. నేను నా మొదటి కార్యమును పూర్తి చేసెదను. నేను మరలా తిరిగి వస్తాను,నేను క్రీస్తుయొద్దకు వస్తానని" చెప్పండి. మీ చేతిని పైకెత్తండి. రేపు రాత్రి బాప్తిస్మము ఆరాధన ఉండబోవుచున్నది. ఒక బాప్టిస్ట సేవకుడు, "నేను సిద్ధముగా ఉన్నానని” ఇప్పుడే కబురు పంపెను. సరే సహోదరుడా, నేనుకూడా ఆ సంఘమునుండే వచ్చాను.వారు మందు చీటీని తప్పుగా చదివి నాకు చెప్పిరి. కానీ నా అంతట నేనే చదివాను. నేను మార్చి దానిని చదివి, ఆయన చేయమని చెప్పిన రీతిగా దానిని చేసినప్పుడు నాకు ఏదో జరిగినదని నేను కనుగొన్నాను. ఓ, దేవా! వెలుగును పంపుము. పిలుస్తున్న ఆయనవైపు చూడండి. మనము ఎందుకు చేస్తున్నామని ఆశ్చర్యపోతున్నారా?

127. ఒకరికొరకు మరొకరు కనిపెట్టుకుని వేచియుండే మీ సహనమును నేను అభినందిస్తున్నాను? ఎందుకనగా అది మీలోకి ఏదో తీసుకువచ్చుటకు ప్రయత్నిస్తున్న పరిశుద్ధాత్మగా ఉన్నది. మీరు చూచారా, ఆయన మీలో ఏదో చొప్పించుటకు ప్రయత్నిం చుచున్నాడు. మీ సహనము అద్భుతమైనది మరియు అది మంచి కార్యమును చేయును."నాకు అర్ధము కాలేదు, కానీ నేను కూర్చుని దానిని చూడబోతున్నాను. నేను దానిని గమనించెదనని” మీరు చెప్పినయెడల, నిజముగా పొందుకోగల ఆకలిని కలిగియున్న ప్రతీ హృదయమును దేవుడు నింపునుగాక!. మీరు దానిని చూచినప్పుడు, ఒక్క నిమిషముకూడా వేచి ఉండకుండా, అక్కడకు వెళ్ళి, అక్కడే దానిని పొందుకోండి. అది దాటిపోవుచున్నది. ఆయన మరలా ఆ మార్గములో దాటి వెళ్ళకపోవచ్చు. అది నిజమే. ఆమేన్, ఆమేన్....

128. ష్...వినండి,(ఒక స్త్రీ భాషలలోమాట్లాడుతున్నది, మరియు ఒక పురుషుడు అనువాదము చెప్పుచున్నాడు-సంపా.,). ఆమేన్. ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీరు గమనించారా? మీ స్తుతులను స్వీకరించుటకు ఆయన ఇచ్చట ఉన్నానని చెప్పెను. సహోదరుడా, “ఆమేన్” అనే పల్లవి మీకు తెలుసా? ...నీవు నా కొరకు పాడితివి. “ఆమేన్” నీవు పాడెదవా? నీకు తెలుసు కదా? సహోదరుడా సరే మంచిది, సహోదరుడా డాన్...హ్…రండి, ఎర్నీ. మనము “ఆమేన్” పాటతో ఆయనను స్తుతించబోవుచున్నాము.. ఇది ఎంతమందికి తెలుసు? ఓ, మనకందరికి ఆ పాట తెలుసని నేను నమ్ముచున్నాను. నా సంఘమంతటికి అది తెలుసని నేను నమ్ముచున్నాను. బహుశా, అది నువ్వేమోనని అనుకున్నాను.. ఓ సహోదరుడా ఎమంటావు? నేను దానిని నడిపించలేను, నేను పాడలేను అంటావా?. ఓ! అయితే ఆయన చెప్పిన ప్రతీదానికి సరిగ్గా ఇప్పుడు"ఆమేన్"అని చెప్పుట అద్భుతముగా ఉండునని నేను భావిస్తున్నాను. ఓ! నా దేవాఅందరూ "ఆమేన్" కోరస్ పాడతారుఆమేన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్,ఆమేన్, ఆమేన్, ఆమేన్.ప్రతీ ఒక్కొక్కరు దీనిని పాడండి.ఆమేన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్,ఆమేన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్,ఆమేన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్,ఆమేన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్, ఆమేన్,మన చేతులను పైకి ఎత్తి ఆయనకు మనము...? నీకే స్తుతులు చెల్లించుచున్నాము, ప్రభువా?... ఆశీర్వాదములను, ప్రభువా, పరిశుద్ధాత్మను పంపించుము. మేము నిన్ను స్తుతించుచుండగా ఈ రాత్రి వచ్చి, ప్రతీ హృదయమును పగులగొట్టుము...

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...