దయ్యపు శాస్త్రము, భౌతిక రాజ్యము
VGR COUNT-109 ఇప్పుడు నేను.... [టేపు పై ఖాలి.] నేను పొలములో ఉన్నప్పటి నుండి కూటమిలో నేను ఇది చేయుట ఇదే మొదటిసారి. ఇది ఒక క్రొత్త సమయము. సహోదరుడు బాక్స్టర్ వెళ్ళిపోయెను మరియు — సహోదరుడు బోస్వోర్త్ ఇండియాలో లేదా ఆఫ్రికాలో ఉండవచ్చు; మరియు సహోదరుడు బాక్స్టర్, అతడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అతడు ఎక్కడికో వెళ్ళాడు, మరియు తక్కిన వారు మరియు వెళ్ళిపోయారు. మరియు బిల్లీ మరియు నేను మాత్రమే ఇక్కడ ఒంటరిగా ఉన్నాము. కావున లేచి, ఆడి, మరియు తినుచు మేము మంచి సమయమును కలిగియున్నాము. కావున, మేము అనుకొనుచున్నాము బహుశ మేము.... ప్రభువు యొక్క సహాయము చేత, మనకు మనమే కూటములను నేరుగా కొనసాగించుకొన గలుగుచున్నాము. ఆ కారణము చేతనే, ఆ ఒక్క కారణము చేత అవి కొద్దిగా ముందుకు జరుగుటను చూచి నేను ఆనందించుచున్నాను. అది చేయుటకు ప్రభువు మనకు సహాయము చేయుదురని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు, మీకు తెలుసు అక్కడ... నేను నా నిర్వాహకత్వమును ప్రేమించుదును. నాకు కొందరు ప్రియమైన సహోదరులు ఉన్నారు, బోస్వోర్త్, బాక్స్టర్, లిండ్సే, మూర్, మరియు వారిలో ఐదవ వాడైన బోరన్ వోన్ బ్లూమ్ బెరగ్ వారందరు ఉన్నారు. వారు చాలా మంచి మనుష్యులు. అయితే ఒక గుంపు జనులను నీవు కలిగి ఉన్నప్పుడు, దాని గూర్చి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒకరు ఒకటి కలిగి ఉండెదరు, మరి యొక్కరు ఇంకొక్కటి కలిగి ఉండెదరు. కొన్ని సార్లు నేను తలంచిన దానికది భిన్నముగా ఉండును. కాబట్టి, ఇప్పుడు నేను స్వేచ్ఛను కలిగి ఉన్నానని నేను నమ్ముచున్నాను. మనకు కొంచెము ఎక్కువ సమయం ఉంటున్నది, చొక్కా చేతులు ముడుచుకొని మరియు అలా మునుగుచు తినవచ్చును. మీ చొక్క చేతులు ముడుచుటను బట్టి, మరియు మంచి సమయం కలిగి ఉండుటను గూర్చి నేను ఆలోచన చేస్తున్నాను.
నా మొదటి బైబిల్ ప్రకృతి. ప్రకృతిలో నుండి దేవుని గూర్చి నేను నేర్చుకున్నాను. మరియు నాకు చేపలు పట్టడమంటే ఇష్టం. నేను చేపలు పట్టడాన్ని ఎంతగానో ప్రేమిస్తాను! సన్ని బాలుడా నీకు చేపలు పట్టడమంటే ఇష్టమా? నీకు చేపలు పట్టడం ఇష్టమయితే, మరియు నీ తల్లిని ప్రేమించినచో, నీవు మంచి బాలుడుగా తయారవుతావు. మరియు చివరికి నా మర్పుచెందుట నాలో నుండి అన్ని తీసివేయలేదు. కాబట్టి, ఒక రోజున నేను పర్వతముపై యున్నాను, దూరముగా చేపలు పట్టుచున్నాను. ఇప్పుడు, నేను దీనిని ఈ చిన్న బాలుని ఉపయోగార్ధమై చెప్పుచున్నాను. చేపలను పట్టుటకై నేను పర్వతముపై అక్కడ వున్నాను... మరియు మిగతా పిల్లలంతా, బహుశా, చుట్టూ కూర్చొని వుండవచ్చును. నా దగ్గర చేపలు పట్టు వల ఉన్నది. మరియు, ఓ, వసంత కాలము, అది ఎంతో అద్భుతము. నేను అలా దారి గుండా వెళ్ళాను, మరియు అక్కడ తరువాత రంధ్రములో తెల్ల చేప పిల్ల ఉన్నది. అది మీకు తెలుసు. ప్రభువుని స్తుతిస్తూ, మంచి సమయమును గడిపాను, కేకలు పెట్టాను. కొన్ని సార్లు, నా గాలపు త్రాడును వేశాను. కేకలు పెట్టుటను నేను నమ్మెదను. ఆమేన్, ఖచ్చితముగా నేను నమ్ముదును. ఎందుకనగా నన్ను ఎదో తాకును, మరియు అది నన్ను ఎదో చేయును.
2
కావున నేను ఈ ఉదయము కొద్దిగా ఎక్కువ సేపు వెళ్ళాను, మరియు నేను వెనక్కు వచ్చినప్పుడు, వింత సంగతి... న్యూ హంప్ షైర్ ప్రాంతములో చాలా ఎలుగుబంట్లు ఉన్నాయి. నేను ఎక్కడ చేపలు పట్టుచున్నానో, అక్కడ నేను ఒక శిభిరమును కలిగియున్నాను. నేను కూర్చొనుట కొరకు ఒక పాత చిన్న గుడారము కలిగియున్నాను, ఆ చిన్న పాత గుడారములో నేను జీవించితిని. అక్కడ ఒక నల్లటి ఎలుగు బంటి అది చాలా తుంటరి జంతువు. అక్కడ, కాబట్టి, ఒక ముసలి తల్లి ఎలుగు బంటి మరియు రెండు పిల్ల ఎలుగు బంటులు అక్కడకు వచ్చినవి. మరియు అవి నా యొక్క గుడారాన్ని ధ్వంసం చేసినవి!
ఇప్పుడు, నేను ఆ ఎలుగు బంటిని ఏమి చేయనై యున్నానని నీవు తలంచుచున్నావు, ఎర్రటి తల వెంట్రుకలు కలిగిన చిన్న బాలిక వెనుక యున్నది, అక్కడ వెనుక? నేను నిజముగా దాని వెనుక వెళ్ళవలసి ఉన్నది, నేను కాదా?
3
కాని అదిక్కడ ఏమి చేసినది. అది లోపలకి వచ్చి, నా గుడారమునంతటిని చింపివేసి మరియు సమస్తమునూ చెల్లాచెదరు చేసి, మరియు నేను అక్కడ కలిగియున్న ఆహారమునంతటిని తీసివేసినది, మరియు అది అంతా బాగానే చేసినది. అలాగున, నేను అక్కడకి చేరుకున్నప్పటికీ, అది వెళ్ళిపోయినది. అది తన పిల్లకు కీచుమని కేకవేసినది, మరియు ఒక చిన్న పిల్ల దానితో పరుగెత్తుకొని పోయినది. మరి యొక్కటి పరుగెత్త లేదు; అది అక్కడే కూర్చొని, తన వెనుక భాగాన్ని నావైపు త్రిప్పి, ఈ విధంగా ఏదో చేస్తూ ఉండిపోయినది. నా చేతులో ఒక చిన్న గొడ్డలి తప్ప మరేమియు లేదు. అక్కడ కొంత మంది పెద్దలతో నేను నరుకుచున్నాను. మంచిది, అది ఎంత త్వరగా పరుగెత్తగలదో అంత త్వరగా పరుగెత్తుకొనిపోయి, ఓ, అది అక్కడున్న టెలిఫోన్ స్తంభము దగ్గరకు వెళ్ళి అది కూర్చొన్నది. అది ఈ చిన్న ఎలుగు బంటి పిల్ల కోసం కూత కూయుచున్నది, మరియు అది దానికి ఎటువంటి ప్రతిస్పంధన ఇవ్వలేదు. అది అలాగున అక్కడనే కూర్చొన్నది.
4
“ఆ చిన్న పిల్ల ఏమి చేయుచున్నది?” అని నేననుకున్నాను, నేను మరింత దగ్గరగా వెళ్ళితిని. అది నన్ను గాయపరచునని భయపడితిని, నేను దానికి దగ్గరగా వెళ్ళుటకు భయపడితిని. నేను ఒక చెట్టు చూడలేకపోయాను, అది కూడా చెట్లు ఎక్కగలదని నాకు తెలుసు, కాబట్టి నేను దానికి అతి దగ్గరగా వెళ్ళాలని అనుకోలేదు, ఎందుకనగా నాకు ఎలుగు బంటి యొక్క స్వభావము తెలియును. కాబట్టి, నేను కొంచెము దగ్గరగా వెళ్ళితిని. మరియు ఏమి జరిగినదో మీకు తెలుసా?
5
ఇప్పుడు, నాకు పాన్-కేక్ అంటే ఇష్టం. పిల్లలు, మీలో ఎంత మందికి పాన్-కేక్స్ అంటే ఇష్టం? ఓ, బాలుడా! ఓ, బాలురందరికి ఇష్టం, వారు, మాకు కూడా ఇష్టం అని చేతులెత్తుటను నేను చూచుచున్నాను. మనమందరము పాన్-కేక్స్ ఇష్టపడెదము, నేను వాటిని ప్రేమించెదను, వాటి పైన తేనెను పోయటమంటే నాకు ఇష్టం. ఒక బాప్టిస్టుగా, మీకు తెలియును, అది మనలను తిన్నగా చేయుచున్నది, మీకు తెలియునా, అది తేనె, మీకు తెలియునా కాబట్టి, వినండి, వాటికి నేను తేనెను చిలకరించను; నిజముగా వారికి నేను బాప్తిస్మము ఇచ్చెదను. ఎక్కడయితే బలముగా మరియు మంచిగా ఉంటున్నదో, అక్కడ నిజముగా నేను దానిని కుమ్మరించెదను. నేను అక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా చిలకరించను. నేను నిజముగా వాటిమీద (పాన్-కేక్స్ పై) కుమ్మరించెదను, అవి తేనెలో మునిగిపోయేంతగా కుమ్మరించెదను.
6
అప్పుడు, మీకు తెలుసా, నేను అక్కడ ఒక బకెట్టుడు తేనె, బకెట్టుకు సగం తేనెను అక్కడ ఉంచాను. మరియు ఎలుగు బంటులకు తేనె బహు ప్రియం. కాబట్టి, ఆ చిన్నది అక్కడికి చేరుకొని తేనెతో వున్న బకెట్టు మూత తీసివేసి, ఈ విధంగా తేనెతో ఉన్న బకెట్టు చేతి క్రింద పెట్టుకొని అది అక్కడ కూర్చొని ఉన్నది. మీరు ఏ విధంగా తినెదరో, ఆ విధంగా తినటం దానికి తెలియదు, కాబట్టి తన యొక్క పాదమును ముంచి ఈ విధంగా నాకుచున్నది, మరియు నాకుచున్నది. అది నన్ను చూచుటకు నావైపు తిరిగినది, దాని కళ్లు జల్లు కోట్టున్నట్లయినది. దాని చిన్న పొట్ట తేనెతో ఎంత నిండుగా ఉన్నదో అంత నిండుగా ఉన్నది. అది అక్కడ కూర్చొని, దాని చేయి ముంచుతూ ఎంత కష్టంగా నాకాలో అంత కష్టంగా తేనెను నాకుచున్నది.
ఓ, మై! శ్రేష్టమైన పాతకాలపు పరిశుద్ధాత్మ కూటములను గూర్చి నేను ఆలోచన చేసితిని, మనము బకెట్టు తెరచినప్పుడు, మన చేతులు జాడీలో ముంచి నాకుతూ ఉంటాము. మీకు తెలిసిన విధముగా, నాకుకుంటూ వెళ్ళిపోయెదరు.
7
ఇక్కడ మీకు వింతయిన విషయము ఏమిటో తెలియునా? తరువాత చిన్నది ఎంత తినగలిగినదో అ౦త తిని, బకెట్టు క్రింద పడవేసి, అక్కడ నుండీ పరుగెత్తుకొని వెళ్ళిపోయినది. ఏమి జరిగినదో మీకు తెలుసా? తల్లి ఎలుగు బంటీ మరియు పిల్ల ఎలుగు బంటి దానిని నాకుచున్నవి, కాబట్టి తేనె ఆరిపోయినది.
కాబట్టి, మంచిది, మన కూడికలు కూడా ఆ విధంగానే ఉండి ఉండవచ్చును, కాబట్టి మన పైన పడుచున్న దేవుని యొక్క మహిమ, ఇతరులకు చెప్పులాగున, నేను ఆశపడుచున్నాను. అది సరే.
8
మీకు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. ఇక్కడ చుట్టూ కూర్చొని ఉన్న ఆ చిన్నారులను బట్టి మీకు కృతజ్ఞతలు, రేపు అనునది ఉన్నట్లయితే, యేసు ఆలస్యము చేసినట్లయితే, రేపటి స్త్రీ, పురుషులు వీరే.
మనము దయ్యపు శాస్త్రము గూర్చి మాట్లాడుకోబోవుచున్నాము. కీర్తనలలో - నుండి 103:1-3, మనము ఈ వచనములు చదివెదము. ప్రతి క్రైస్తవ పెద్ద, మరియు క్రైస్తవ మతాచార్యులకు లేక బైబిల్ చదువు వారికి ఇది కంఠత వాక్యము.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము; నా అంతరంగమున నున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు; నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
అక్కడ మీరు ఒక దానిని గమనించాలని ఆశపడుచున్నాను, అన్నింటిని అను దానిని: “ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. (ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము — ”ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు; నీ రోగములన్నిటిని స్వస్థపరచువాడు,“ అని ఉన్నది. — తెలుగు తర్జుమాదరుడు.) ఇప్పుడు ఒక్క క్షణము మనము తలలు వంచుదుము.
9
ఇప్పుడు, పరలోకపు తండ్రీ, ఈ మధ్యాహ్నము ఇక్కడ ఉన్నందుకు నీకు వందనములు. ఇక్కడ కూర్చొనియున్న చిన్న పిల్లలను బట్టి నీకు వందనములు. యేసు రాకడ ఆలస్యమైనచొ, రేపు అనునది ఉన్నట్లయితే, వారు రేపటి పురుషులు, మరియు స్త్రీలు.
మరియు ఇప్పుడు, తండ్రి, మేము ప్రార్ధిస్తుండగా, ఇప్పుడు మేము మీ వాక్యమును గూర్చియూ, మా గొప్ప శత్రువైన సాతానును గూర్చియూ మాట్లాడుకోబోవుచుండగా మమ్మును ఆశీర్వదించుదురు గాక. మేము ప్రార్థిస్తున్నాము, దేవా, దేవుని శక్తియగు సంపూర్ణ యాంత్రిక శక్తి మా ముందు ఉంచండి, ఈ రాత్రి అది వాని యొక్క ప్రతి అంగుళపు భూభాగాన్ని ఎదిరించుచున్నది, ప్రభువా, మరియు వాడికి ఎటువంటి చట్టబద్ధమైన హక్కులులేవని చూపించండి, మనకు బదులుగా కల్వరిలో క్రీస్తు వాడిని జయించెనని, ఆయన మరణించినపుడు, సాతాను కలిగిన ప్రతి శక్తిని, మరియు సిద్దాంతములను, ఆయన విచ్చిన్నము చేసెను.
మరియు, దేవా, ప్రజలు ఏ విధంగా స్వస్థత పొందుకోగలరో, సాతానుని ఏ విధంగా ఓడించగలరో అది మేము ఎరిగి, ప్రజలకు విశదపరచులాగున మాకు బుద్ధి కుశలత అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
10
ఇప్పుడు మనము కొద్ది నిమిషములు దయ్యపు శాస్త్రమును గూర్చి మాట్లాడుకోబోవుచున్నాము. మీరు దయ్యములను గుర్చి చాలా ఎక్కువగా విని ఉంటారు. ఇప్పుడు, మనం రేపటి మధ్యాహ్నమునకు తప్పక ముగించుకొందుము. ఏ విధంగానైన, ఈ అంశము బోధించుటకు, నాకు ఈ వారములో రెండు దినములు కావలెను. ఇప్పుడు... లేక, దీనిపై మాట్లాడుటకు, మధ్యాహ్న కూటముల కొరకై నాకు రెండు రోజులు కావలెను.
11
ఇప్పుడు, దయ్యము ఏమైయున్నదన్నది మొదటి విషయం. చాలా మంది ప్రజలు దయ్యములను గురించి మాట్లాడుకోవటం మీరు వినేవుంటారు. మంచిది, ఇప్పుడు, “పీశాచము, దయ్యము,” అన్నీ ఒక్క పదము నుండి వచ్చినవే, మరియు ఆంగ్లములో “బాధపెట్టువాడు” యని పిలుచుదురు. బాధపరచువాడు ఎవరనగా, ఒక దయ్యము, ఒక చెడ్డ వ్యక్తి. ఇప్పుడు, బైబిల్ ఈ దినములలో ఎక్కువగా, చాలా మందికి, చాలా మంది ప్రజలకు ఇది తాత, అమ్మమల చదివే పురాతన కాలపు గ్రంథము వలె ఉంటున్నది లేక ఆ విధంగా ఏదో ఒకటి. “దానిలో ఏమియూ లేదు; అది పురాతన జనులకు, మరియు అలాంటివారికి మాత్రమే,” మరియు ఫలానా అని అందురు. కాని అది పొరపాటు. అది అందరి కొరకు. మరియు దయ్యములు బాధించేవి, అవి మనలను బాధించును.
12
ఇప్పుడు, మానవుని ప్రాణములోనికి (Soul) ప్రవేశించే దయ్యములున్నవి, మరియు అది పదశాస్త్రములో ఉన్నది, అది అందులో ఉన్నది... నేను దీనిని చెప్పెదను, అయినప్పటికీ, ప్రాణములోనికి ప్రవేశించిన ఆ దెయ్యమే, ఆ ప్రాణమును బాధించేది అయివున్నది.
చాలా సార్లు పిచ్చి పట్టిన వ్యక్తిలో మీరు ఇది చూడగలరు. ఇప్పుడు, వారు మారుమనస్సు పొంది, పరిశుద్ధాత్మతో నింపబడిన వారైయినప్పటికి, అయినప్పటికి వారు వెర్రివారే, చూశారా. అది వాస్తవము. దానికి ప్రాణముతో ఏ సంబంధము లేదు. అది బాధపరచునది, చూడండి, వారిని బాధపరచునది ఏదో అది.
13
ఇప్పుడు, అన్ని విధములైన వ్యాధులు, మొదటిగా మనము అన్ని విధములైన వ్యాధులు దయ్యము నుండి వచ్చినవని కనుగొనవలసియున్నది. దేవుడు వ్యాధులకు కర్త కాడు. ఏ వ్యాధి దేవుని యొద్ద నుండి రాదు. దేవుడు కొన్ని సమయములలో నీలో వ్యాధులు పెట్టుటకు సాతానుకు అనుమతిని ఇచ్చును, నీవు ఆయనకు అవిధేయుడవైనప్పుడు, దేవుని ఇంటికి నిన్ను తిరిగి తెచ్చుటకు అది కొరడా దెబ్బ లాంటిది. అయితే ఆరంభములో వ్యాధి దయ్యము యొద్ద నుండి వచ్చినది. మన పరలోకపు తండ్రి, అటువంటి వ్యాధి మరియు మరణమునకు కర్తయని దేవుని యందు విశ్వాసముంచు ఒక వ్యక్తి చెప్పగలడని నీవు ఊహించగలవా? కాదు, ఎన్నడూ ఆయన చేయడు. ఎన్నడూ అది చేయలేదు, మరియు ఎన్నడూ చేయడు. అవిధేయతను బట్టి దేవుడు మరణాన్ని అనుమతించును. దేవుడు మరణమును అనుమతించాడు. ఒక గ్రంథకర్త, “మరణము చేయగలిగినదంతా, గుర్రపు బండికి దేవుడు జీవమును కట్టెను. మరియు అది ఒక విశ్వాసిని దేవుని సన్నిధానములోనికి లాగును,” అని చెప్పాడు. అయితే మరణమను మాటకు అర్థము, “ఎడబాటు.”
14
యేసు చెప్పెను, “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు.” మరియు ఆయన చెప్పెను, “పునరుత్థానమును, జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరి ఎన్నడూ చనిపోడు.” మరియు మనము ఒకరి శరీరములు ఒకరు కట్టకట్టి మన యొక్క పాపము సమాధి యొద్దకు తెచ్చుదము. “కాని అతడు ఎన్నడూ మరణించడు.”
15
ఇప్పుడు, మీరు గమనించినట్లయితే, ఆయన లాజరుని గూర్చి మాట్లాడినప్పుడు, ఆయన “లాజరు నిద్రించుచున్నాడని,” చెప్పెను.
శిష్యులు, (వారు మనలాంటి మనుష్యులే), వారు చెప్పెను, “ఓ, అతడు నిద్రించిన బాగుండునే.” ఆయన విశ్రాంతిని గూర్చి మాట్లాడుతున్నాడని వారు తలంచుచున్నారు.
కాని ఆయన వచ్చి వారి భాషలో వారితో మాట్లాడెను. “ఆయన చనిపోయాడు, అని మీరు నమ్ముచున్నారు. కాని చెప్పెను, ”నేను వెళ్ళి అతనిని మేలుకొలిపెదను, అతనిని మేలుకొలిపెదను,“ అని చెప్పెను, చూశారా? అప్పుడు మీరు...
మరణము అనగా “ఎడబాటు.” ఇప్పుడు, మీలో ఒకరు మీ కుటుంబములో ఒకరు చనిపోయినట్లయితే, లేక ఏదో జరిగితే, అతడు మార్పు చెందినవాడయితే, వారు చనిపోలేదు. వారు నరమాత్రుల లెక్కల్లో చనిపోయినవారు, కాని వారు కేవలం మనలను ఎడబాసి ఉన్నారు, అయితే వారు దేవుని సన్నిధిలో వున్నారు. వారు చనిపోలేదు, మరియు వారు చనిపోలేరు. వారికి చనిపోవుట అసాధ్యము. యేసు చెప్పెను, “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు, అయితే అతడు తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.” కాబట్టి అతడు చనిపోడు. అమర్తత్యమైనది ఏదైనా — నిత్యమైనది — అది నశించలేదు. అది నాశనము కాని జీవము. అది అతడు కలిగి ఉన్నాడు, కారణము దేవుడు అతనికి అది ఇచ్చియున్నాడు. మరియు యోగ్యతను బట్టి కాదు; అది షరతులు లేనిది. దేవుడు అతనికి దానిని అనుగ్రహించెను.
16
దేవుడు పిలచుచున్నాడు. దేవుడు అతనిని పిలువకపోతే, దేవుని యొద్దకు ఏ మానవుడు రాలేడు. యేసు చెప్పెను, “నా తండ్రి వానిని ఆకర్షించితేనేగాని ఎవడును నా యొద్దకు రాడు.” అది సరియేనా? కాబట్టి దేవుడు అన్నింటిలోను ఉన్నాడు. బహుశా రేపు మధ్యాహ్నము దాన్ని గూర్చి కొద్దిగా ఎక్కువ పొందుకొనెదము, కారణము ఏమనగా మీరు వ్యాధిని గూర్చి ఎరుగులాగున ఈ విషయం, మీ యొద్దకు, తీసుకురావాలని నేను అనుకొనుచున్నాను.
ఒకానొక సమయములో అక్కడ మన ముత్తాతలో ఒక చిన్న కణముగా మనము ఉన్నాము. అది మీకు తెలుసు, వైద్యులకది తెలుసు. మంచిది. బైబిల్ చదివే మీకు కూడా అది బాగా తెలుసు. మా ముత్తాతలో జీవము యొక్క కణము ప్రారంభమైనదని మీకు తెలుసు. జీవకణము మీ ముత్తాత గుండా రావాలి, తరువాత మా నాన్నలో, తరువాత మా అమ్మలో, మరియు ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు. అది వాస్తవము. లేఖనము కూడా దానినే బోధచేయుచున్నది. నీకు కావలెననుకుంటే ఇక్కడ లేఖనము నీ కొరకే ఉన్నది. ఆ లేవి తన ముత్తాతయగు అబ్రహాము యొక్క నడుములో ఉన్నప్పుడే దశమ భాగమును చెల్లించెను, దానిని నేను నమ్ముచున్నాను. అది నిజమేనా? కనుక, చూశారా, భీజకణము అక్కడే ఏర్పడినది.
17
అయితే దేవుడు నరుని తన యొక్క సొంత స్వరూపములో సృజించినప్పుడు, నరుని యొక్క ఆత్మ... ఒక మనిషి తన యొక్క సొంత స్వరూపములో కాదు, అయితే ఆయన యొక్క సొంత స్వరూపమందు చేయబడెను. మీ యొక్క ప్రాణములు జగత్తు పునాది వేయబడకమునుపే తయారు చేయబడెను, చూశారా. నేల మట్టి నుండి ఆయన నరుని చేయకముందు, ఆయన వారిని స్త్రీని గాను, పురుషుని గాను చేసెను. ఈ మధ్యాహ్నము అందులోనికి వెళ్ళుటకు మనము తరుణమును ఇద్దాము. దేవుడేమైయున్నాడో చూడండి... ఇప్పుడు, అది గీతకు మధ్యలో, కాని నీవు దాన్ని చూసినప్పుడు, అది ఆ గీతతోనే వచ్చును, చూశారా. ఆరంభములో దేవుడు ఏ విధముగా చేసెను, ఆయన అక్కడ ఏమి చేసెను, ఆయన ఏ విధంగా భూమి మీదకు దిగివచ్చెను ఆయన ఏ విధంగా నరుని తన స్వరూపమందు చేసెను. మరియు అప్పుడు మానవుని విమోచించుట కొరకే, దేవుడు చుట్టూ తిరిగి, మానవుని స్వరూపములో తయారు చేయబడెను.
18
ఇప్పుడు, దేవుడు నరుని తన స్వరూపములో చేసినప్పుడు, అతడు ఒక ఆత్మ-నరుడిగా వుండెను. మరప్పుడు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు, అప్పుడాయన నేలమట్టి నుండి నరుని తయారు చేసెను. ఇప్పుడు, కాలవృత్తాంత గ్రంథములో వ్రాసిన వారు లేక మిగతా వారు మరియు ఆ ప్రజలు పరిశోధన చేసి పాత ఎముకలు మొదలైన వాటిని సంపాదించారు, మరియు పరిణామమును నమ్మిన వారై... నేను నిజమైన పరిణామమును నమ్ముదును. మనిషి తన నుండి తానే పరిణామము చెందెను, కాని ఒక్క కణము నుండి అన్ని వచ్చుట కాదు. కాదండి. ఎందుకనగా దేవుడు ఒక పక్షిగా తయారు చేసినప్పుడు, ఒక పక్షి, పక్షిగానే యుండును; మరియు ఒక కోతి, కోతిగానే యుండును; ఒక మనిషి, మనిషిగానే యుండును. అది వాస్తవము.
19
ఇప్పుడు, లూయిస్-విల్ లో కొద్ది సేపటి క్రితం నేను ఒక వైద్యునితో మాటలాడుచు౦టిని. అతడు “ఎందుకు, రెవరెండ్ బ్రెన్హాం...” అని అడిగెను. నేను ఆఫ్రికా నివాసులు గూర్చి మాటలాడుచుంటిని, వారు ఏ విధంగా తింటారో... ఓ, నీవు ఎన్నడూ చూడనటువంటి భయంకరమైన దృష్యాలవి, వారు ఏ విధంగా తి౦టారో! దానిపై పురుగులు ఉండి, కుళ్ళిపోయిన వస్తువులను (వాటిని) దానిపై యున్న ఆ పురుగులను అన్నిటిని దులిపివేసి, వాటిని తీసుకొనెదరు. అతనికి వ్యత్యాసమేమి ఉండదు, చూశారా. ఏది త్రాగినను, అది ఏమైనను వారికి వ్యత్యాసము ఏమియు ఉండదు. అతడు, “కాని, రెవరెండ్, బ్రెన్హాం వారు మానవులు కాదు,” అని చెప్పెను. నేను చెప్పాను, “ఓ, అవును, వారు, నిశ్చయముగా వారు తప్పక మానవులే.”
“మానవునికి అతి సమీపముగా ఉండేది, జంతు క్రమ ప్రకారము చింపాంజీ. చింపాంజీలో నుండి ఒక చిన్న గొణుగుట అనే దాని కోసం మీరు నాలుగు వేల సంవత్సరాల నుండి ప్రయత్నం చేశారు, మరియు అతడు దానిని చేయలేకపోయాడు,” అని చెప్పాను. “ఎందుకనగా అతడు ఆలోచించలేడు. అతడు ఆలోచించుటకు మరేమియులేదు,” యని చెప్పాను. ఓ, నీవు గుర్రానికి, అడవి పందికి, చిన్న విషయాలు నేర్పించగలవు, లేక అద్దాలు ధరింపచేయగలవు, లేక సిగరెట్టును తాగించగలవు, లేక సైకిల్ పైన తనకు తానే నిలుచుట, గుర్రపు స్వారీ చేయుట, లేక అలాంటిది ఏదో చేయించగలవు. అయితే గుర్రానికి లేక కుక్కకు, లేక అలాంటి దానికి అర్ధము కాదు. నేను చెప్పాను, “అది ఒక జంతువు.”
20
“అయితే, మీరు నన్ను ఆఫ్రికాలోని, అడవి జాతి ప్రజలు మరియు చిన్న పొదజాతి ప్రజల యొద్దకు తీసుకెళ్ళనివ్వండి.” మరియు నేను చెప్పాను, “సర్వసాధారణముగా అతని ముత్తాత-ముత్తాత-ముత్తాత-ముత్తాత ఎన్నడూ కూడా తెల్ల మనిషిని చూసి ఉండకపోవచ్చును. కేవలము అతనికి తెలిసిన ఒకే ఒక విషయము ఏది కుడో, ఏది ఎడమో కూడా అతను ఎరుగడు. అతనికి తినటం ఒక్కటి మాత్రమే తెలుయును మరియు అతని చేతిలో ఏది ఉందో అది తినగలడు, అది మానవ మాంసమయిన, మరేదైనా, అతనికి ఏ వ్యత్యాసము ఉండదు, అతడు అలాగునే తి౦టాడు. అయితే అతనిని నా యొద్ద ఐదు లేక పదిహేను సంవత్సరాలు ఉండనీయండి, అతడు మంచి ఆంగ్లము మాట్లాడును మరియు మంచి విద్యను కలిగి ఉంటాడు. ఎందుకు? అతనికి ప్రాణము ఉన్నది; దేవుడు అతనిని మానవునిగా చేసెను, అతను సువార్తను వినుటకు హక్కు ఉన్నది, చివరిగా మనమిక్కడ అమెరికాలో ప్రజలకు, చెప్పి, చెప్పి, చెప్పి, బ్రతిమలాడి, ఒప్పించి, మరియు సమస్తము చేయుదుము. అయితే అతడు దానిని ఒక్కసారి విననివ్వండి, మరియు అతనిని గమనించండి. ఏడుస్తు వేదిక యొద్దకు పరిగెత్తుకొంటూ వస్తాడు,” చూశారా. అవునండీ!
21
సహోదరుడా, నేటి దినాన, నేను ఆఫ్రికాను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, నా హృదయము ఏమైయుంటున్నది, వారి పేద చిన్న నల్లని చేతులు పైకి ఎత్తబడుచూ, “సహోదరుడా బ్రెన్హాం, యేసుని గూర్చి మరి యొక్కసారి చెప్పమని!” అడుగుచున్నారు. ఓ, కనికరము! నాలో ఏదో త్రవ్వుచూ, మండుచున్నది. నాకు సరిపడినంత డబ్బును నేను ఎంత త్వరగా పొందుకొంటానో, అంత త్వరగా నేను అక్కడకు వెళ్ళెదను. నేను. పొందుకున్న ప్రతీ పైసాతోను, ప్రతీ దానితోను, నేను ఏమి చేస్తానో, దేవునికి తెలుసు, నేను ఏమి తినగలనో, మరియు చాలా మంది ప్రజలు నాకు వస్త్రములను ఇచ్చెదరు. నాకు నేనుగా, చాలీ చాలనట్టుగా జీవిస్తాను. ఎంత ఒదిగి జీవించాలో, అంతగా జీవించగలను. ప్రభుత్వము ఏదైయితే ఏర్పాటు చేసినదో అది నేను మిషనరికి అనగా సువార్తకు ఇచ్చివేయుదును. దానికి ఆదాయపు పన్నును కూడా కట్టను. నేను మూడు లేక నాలుగు, ఐదు వేల డాలర్లు సంపాదించి విదేశాలకు వెళ్ళి ప్రజలకు సువార్తను ప్రకటన చేస్తాను. ఆ దినమందు నేను దానికి జవాబు చెప్పవలసి ఉన్నదని నాకు తెలుసు. మరియు నేను దేనికి జవాబు ఇవ్వాలో నాకు తెలుసు.
22
నేను ఎప్పుడూ పట్టణానికి వెళ్ళుచూ ఉంటాను, నేను పెద్ద కూటములు ఏర్పాటు చేస్తాను. వారు బాగా డబ్బును కలిగి ఉంటారు, మరియు పెద్ద కూటములను మరియు వేల కొలది డబ్బును వారు కలిగి ఉంటారు, నేను వాటిని రెడ్-క్రాస్ మొదలగు వాటికి ఇచ్చేస్తుంటాను. ఇప్పుడు, వారి ద్వారములు మూసివేయుట కాదు, అయితే నాలుగు వేల డాలర్ల కారులో వీధులలోనికి వస్తుంటారు, పెద్ద డైమండ్ (వజ్రపు) ఉంగరాలుతో, సిగరెట్లు కాల్చుకొంటూ, వ్యాధిగ్రస్తుల కొరకై ఒక్క వారమునకు ఐదు వందల డాలర్లు వెచ్చిస్తువుంటారు... లేదయ్యా! లేదు, రూఢిగా! మరియు వాటిపైన, మీరు పట్టణమును విడిచి బయటకు వెళ్ళిన వెంటనే, వారు “పరిశుద్ద గుండ్రాళ్ళు,” అని పిలిచెదరు. మరియు మనము నిలబడు మతము పైన, అపహస్యమో, మరేదో అలాంటిది వారు చేస్తారు. లేదయ్యా!
23
నాకు నేనే తీసుకొని, నా యొక్క న్యాయాధిపతి అయిన దేవుని ముందు నా సువార్త పనిని పెట్టెదను. కాబట్టి నాకు తెలియును, ఆ దినమున నా గృహనిర్వాహకత్వపు పనికి నేను లెక్క అప్పజెప్పవలసి ఉన్నప్పుడు, అది ఖచ్చితముగా ఇవ్వబడినది. అది ఖచ్చితముగా సరియే, ఎందుకనగా నేను ఏ విధంగా దేవుని గౌరవించానో, ఆ విధంగా నేను ప్రజలను గౌరవించానని గ్రహించాను. మీ యెడల నా పద్దతి ఎలాగుంటున్నదో, అలాగే క్రీస్తు యెడల కూడాను ఉంటున్నది. మరియు నా యెడల మీ వైఖరి ఎలాగు ఉంటుందో అలాగే (అది సరే), క్రీస్తు వైపు ఉండును.
24
ఇప్పుడు, అటువంటి ప్రజలను చూడవలెనన్న, మరియు ఆ మానవులు ఏ విధంగా ఉన్నారో, అప్పుడు, ఇప్పుడు ఒక అమర్త్య ఆత్మతో, అది చనిపోలేదు, అది నాశనము కాలేదు, అది ఏమియు చేయలేదు, కాని నిత్యజీవము కలిగియున్నది. దేవుడు ఆయన సొంత చిత్తము చేత శ్రేష్ఠమైన దానిని నీకిచ్చెను. మరిప్పుడు, తరువాత, ఇప్పుడు నేను....
నన్ను దీనిని కొంచెము సరిచేయనివ్వండి, లేక ఏదో చెప్పనివ్వండి. ఎవ్వరో ఒకరు అలా వెళ్ళుచూ, “సహోదరుడు బ్రెన్హాం ఒక కాల్వినిష్టు,” అని చెప్పుదురు. కాదు, నేను కాదు. కాల్వీనిష్టు బైబిల్ లో ఉన్నంత కాలము నేను కాల్వినిష్టుగా ఉంటాను. అయితే కాల్వినిష్టులు బైబిల్ నుండి బయటకు వెళ్ళిపోయినప్పుడు, తరువాత నేను ఆర్మీనిష్టుగా ఉంటాను, చూశారా. నేను పరిశుద్ధతను నమ్మెదను, మరియు నేను కాల్వినిస్టులను కూడా నమ్మెదను. అయితే రెండునూ, ఒకటి ఒక అవయవమును పట్టుకొని ఈ విధంగా వెళ్ళిపోయినది, మరియు మరొకటి ఒక అవయవమును పట్టుకొని ఆ విధంగా వెళ్ళిపోయినది. అది ఎఫెసి పుస్తకానికి సంబంధము కాకపోతే, దేవుడు ఎక్కడ ఉంచాడో ఆ స్థానానికి తిరిగి తీసుకొని వచ్చి సరైయిన స్థానములో ఉంచినట్లయితే, మనము అంతటిని కలగలుపు చేసాము. కాని ఆ రెండింటికిని సిద్దాంతాలు ఉన్నవి, అయితే అది ప్రతీ ఒకటిని విత్తుటకు, కాల్వినిష్టులు, పరిశుద్ధత కలిగిన వారు, ఆర్మినిష్టులు కూడా వెళ్ళుచున్నారు. ఇప్పుడు, కాల్వినిష్టులు సత్యమును కలిగియున్నారు. దాని నేను నమ్ముచున్నాను, అదే కాల్వినిష్టుల సిద్ధాంతము...
25
భద్రతను నేను నమ్ముచున్నాను: సంఘము నిత్య భద్రతను కలిగి ఉన్నదని నేను నమ్ముచున్నాను. బైబిల్ చదివే వారికెవరికైన అది తెలుసు, ఎందుకనగా దేవుడు ఎప్పుడో చెప్పియున్నాడు, అది మచ్చ కళంకము లేనిదిగా అగుపించుచున్నది. అది వాస్తవము కాదా? తరువాత, అది అక్కడ ఉండబోవుచున్నది. అది నిజమేనా? సంఘము నిత్య భద్రత కలిగి ఉన్నది. ఇప్పుడు, నీవు సంఘములో ఉన్నావా, అది తరువాత విషయము. నీవు సంఘములో ఉండినట్లయితే, అది సరే, నీవు సంఘములో భద్రత కలిగియున్నావు, కాని నీవు సంఘముతో ఉండిపోవుట మంచిది. నీవు సంఘములో ఏ విధంగా చేరెదవు? కరచాలనము చేయుట వలనా? కాదు. పుస్తకములో నీ పేరు నమోదు చేయుట ద్వారానా? కాదయ్యా. “ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి.” మరియు ఆ శరీరమును, దేవుడు కల్వరి యొద్ద తీర్పు తీర్చెను, అది యేసుక్రీస్తు యొక్క శరీరమై యున్నది. మరియు ఒక్క ఆత్మ చేత మనము ఆ శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి. క్రీస్తు యొక్క శరీరములో ఉన్నంత కాలము మనము నిత్య భద్రతను కలిగియుంటాము, మనలను వేరు చేయునది, తాకునది ఏదియు లేదు. నీవు బయటకు వెళ్ళినట్లయితే, నీ సొంత చిత్తము ద్వారా నీవు బయటకు వెళ్ళుము. అది ఎంత నిశ్చయమో, ఒక వేళ క్రీస్తు యొక్క శరీరములో నీవుంటే, యేసు మరణము నుండి లేచుట ఎంత నిశ్చయమో, నీవు తిరిగి లేచుట అంతే నిశ్చయము. దేవుడు దాని ఎప్పుడో చేసెను.
26
నీవు పాపము చేయలేవు. ఓ, నీ దృష్టిలో నేను ఒక పాపిని కావచ్చును, కాని నేను క్రీస్తులో ఉన్నట్లయితే, దేవుడు దానిని చూచుట లేదు, ఎందుకనగా ఆయన పాపమును పరిహరించెను, ఆయన రక్తము నా పాపముల కొరకై పరిహరించెను, చూశారా. నేను పాపము చేయలేను. “ఆయన మూలముగా జన్మించినవాడు పాపము చేయడు, ఎందుకనగా అతను పాపము చేయలేడు. దేవుని భీజము అతనిలో నిలచియున్నది,” చూశారా. అతను తప్పిదము చేసినట్లయితే, ఖచ్చితముగా, వెంటనే అతను తప్పిదాన్ని ఒప్పుకొనును. అతడు నిజమైన క్రైస్తవుడయితే, అతడు దాన్ని చేస్తాడు. అతడు దానిని ఒప్పుకొనకపోయినట్లైతే, అతడు మొదటి స్థానములో అతడు దేనిని పొందుకోలేదని చూపించుచున్నాడు. అది సత్యము. అతను ఆరంభములో ఏమి పొందుకోలేదు. కాని అతడు నిజమైన క్రైస్తవుడయితే...
27
ఇక్కడనే, మీరు భూమిలో గోధుమ గింజను నాటండి, అది ఎల్లప్పుడును గోధుమ గింజనే కాయును. దాని చుట్టూ గురుగులు ఉండవచ్చును, మరియు ప్రతీది, కాని అది ఎంతకాలమైన అది గోధుమ గింజే అగును. అది నిజమేనా? మరి నిజముగా ఒక మనిషి దేవుని యొక్క ఆత్మచే జన్మించినట్లయితే, అతను లోపట, బయట, ముందు, వెనుక, బయట లోకములో, ఇక్కడ ఎక్కడ ఉండలేడండి. లేదయ్యా. లేదు, లేదు. నీవు ఒక రోజు గురుగువై యుండి, మరునాడు గోధుమ విత్తనానివి కాలేవు. పొలములో దేవునికి అటువంటివి ఉండవు. అవునయ్యా. నీవు దేవుని యొక్క ఆత్మ చేత జన్మించినట్లయితే, ఆ సమయము నుండి నీవు క్రైస్తవుడివి.... వెడలిపోవు వరకు, మరియు అలాంటప్పుడు నీవు దేవునితో అమర్త్యుడవు. అది వాస్తవము, నీవు సంఘములో ఉండినట్లయితే.
28
ఇప్పుడు, ఇప్పుడు మనము మరణము పక్షాన మాట్లాడుకొనెదము. ఇప్పుడు, ఏ విధంగా ఒక వ్యక్తి ఆ రకమైనటువంటి స్థితిలో వుండి, ఆ పరిస్థితిలో ఉండి వ్యాధిగ్రస్తుడవ్వగలుగుచున్నాడు? ఎందుకనగా నీ శరీరము ఇంక విమోచింపబడలేదు; నీ శరీరము విమోచింపబడలేదు. నీవెంత మంచిగా ఉన్నప్పటికీ, నీవెంత భక్తిగా ఉన్నప్పటికీ, నీవెంత పరిశుద్ధంగా ఉన్నప్పటికీ, నీవెంత పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పటికి, అది నీ ప్రాణమునకు మాత్రమే చెందును. మరియు నీ ప్రాణము ఇంకా పూర్తికాలేదు. అది ఆశీర్వాదమును మాత్రమే పొందుకొన్నది, దేవుని యొక్క వాగ్దానము, అనగా మన రక్షణకు సంచరువుగా ఉన్నది. కాని ఇప్పుడు మన యొక్క పునరుత్థానమునకు సంచకరువు లేకపోతే, దైవిక స్వస్థత లేదు, అలాంటప్పుడు నాకు ఎటువంటి నిశ్చయత లేదు, లేక అక్కడ పునరుత్థానమున్నదని రుజువు చేయుటకు నా యొద్ద ఏమియు లేదు.
29
ఏలాగనగా, క్రీస్తు నా హృదయములో జీవించకపోతే, ఒకవేళ అక్కడున్న ఏదో రకమైన మనస్తత్వ విషయము నేను తీసుకోవలసి ఉన్నది, ఎక్కడో ఒక చోట నేను దానిని నమ్మవలసి ఉంటున్నది, మంచిది, అప్పుడు నేను దాని గూర్చి సందేహించువాడనయ్యెదను. ఆ కారణము చేతనే, ఆఫ్రికాలో, వారు వచ్చినప్పుడు, ఇక్కడికి మిషనరీలు వచ్చి, వేలకొలది ఆ స్వదేశీయులను తీసుకు వస్తారు. మరియు వారు చిన్న పాత మట్టి బొమ్మలను మూట కట్టుకొని మరియు అలాంటివి ఏదో కట్టుకుంటారు, దానికి కారణము వారు కేవలము బైబిల్ లోని వేరొకవైపున విన్నారు. అది సత్యము. నా సొంత సంఘమైన బాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్పిటేరియన్లు అందరూ అందులోనికే వెళ్ళియున్నారు. అయితే దేవుని యొక్క శక్తి నిరూపించగానే, అది సరిచేయబడి, అప్పుడు వారు దేవుని దేవునిగా తెలుసుకున్నారు.
30
అయితే, ఇప్పుడు ఈ వ్యాధికి ఏది ఆరంభము? ఇప్పుడు, మొదటి కార్యము, నీవు మానవునిగా రూపుదిద్దుకొనక మునుపు ఎలాగు ఒక ఆత్మగా నీవు ఉన్నావో అలాగే వ్యాధిగా అది ఉండక మునుపు అది ఒక ఆత్మగా ఉండెను. ఇప్పుడు నేను సహోదరుడు విలెట్స్ ను ఉదాహరణగా తీసుకొంటున్నాను. సహోదరుడా విలెట్స్, ఒక సమయాన - నీవు మరియు నేను ఏమీ కాదు. మరప్పుడు దేవుడు మొదటిగా మనకు జీవమును ఇచ్చెను. దాని గూర్చి మాటలాడుకోబోవుచున్నాము, ఈ మధ్యాహ్నము నేను మీ శరీరాన్ని తీసుకున్నట్లయితే, నీవు కణముల గుంపుతో తయారు చేయబడ్డావు, పరమాణువులతో కలిసిపోతావు. మరి ఇప్పుడు, యేసు ఆలస్యము చేసినట్లయితే; ఏదో రోజు ఆ పరమాణువులు నశించిపోవును. నీవు వెనుకకు జారిపోయెదవు. వారు ఆదిలో ఏలాగున ఉన్నారో అలాగున గాలిలోకి వెళ్ళిపోయెదరు. అయితే నీ ఆత్మ తిరిగి వచ్చినప్పుడు, ఆ పరమాణువులు మరల ఒకదానితో ఒక్కటి కూడి ఈ ఆత్మతో కలుసుకొని మరియొక సహోదరుడు విలెట్స్ ను అలాంటివాడిని, అతను యవ్వనములో ఏలాగున్నాడో, అలాంటి శ్రేష్ఠమైన వానిని తీసుకువస్తాయి.
31
ఒక మనష్యుడు ఇరవై-ఐదు సంవత్సరాలు దాటిన తరువాత, అతని కన్నుల క్రింద కొన్ని ముడతలు పడటము, తెల్లని వెంట్రుకలు రావటం గమనిస్తాడు. అది అలాగే వెళ్ళుచున్నది, ఎందుకనగా నీ వెనుక మరణము వస్తున్నది. ఒకానొక ఈ దినాలలో దానితో నీవు తీసుకోబడెదవు. నీవు ఎవరైనప్పటికి అనవసరం, అది నిన్ను తీసుకొంటున్నది, కాని అది క్రమ క్రమంగా... నీవు ఈ మూలన ఉంటావు, మరియు దేవుడు నిన్ను ఆ మూలన పట్టుకొంటాడు, మరియు నీవు ఈ మూలన ఉంటావు, మరణము నిన్ను దాదాపుగా కలిగి ఉంటున్నది. మరి యిక్కడ, అయితే కొంత సమయం తరువాత అది నిన్ను పట్టుకొంటున్నది. అయితే అప్పుడు, అంతటా మరణము ఏమి చేయగలదు. అది సంపూర్ణముగా తీసుకొంటున్నది... అది చేయగలిగినంత చేసినప్పుడు... ఇరవై-మూడు సంవత్సరాల వద్ద; నీవు ఎంత బాగా ఉన్నావో, దేవుడు నీకు ఈ జీవమును ఇచ్చినప్పుడు అలా ఉందువు. నీవు పునరుత్థానమునకు వచ్చినప్పుడు, మరణము నిన్ను సంథించక మునుపు, నీవు ఇరవై-ఐదు, ఇరవై-మూడు సంవత్సరముల వయస్సులో ఉండినట్లుగా, అదే విధముగా నీవు తిరిగి వచ్చెదవు. మరణము అది చేయగలిగినదంత చేయును. అది అక్కడే ఉండిపోవును, అయితే నీవు వెనుక ఏలాగున్నావో ఆ స్థితిలోనికి వచ్చెదవు.
32
ఇప్పుడు, మీలో ప్రతి ఒక్కరు మీ శరీరములోని మీ కణములను... ఇప్పుడు క్రిందకు తీసుకుందాం. నీవు కణము తరువాత కణము, కణము తరువాత కణముగా నీవు వచ్చెదవు, దానిని ఈ వేదిక పైన వేరుగా పెట్టండి. మీ శరీరములో ఉన్న ప్రతి కణము, నీవు యెక్కడయితే ప్రారంభమయ్యావో, ఆ చిన్న కణము యొద్దకు వస్తావు, సహజమైన కన్నులతో దాని నీవు చూడలేవు. నీవు దాని భూతఅద్దాలతో చూడాలి. జీవ కణమును నేను మైక్రోస్కోపుతో చూశాను. అది ఒక చిన్న ధారము వలే కనిపించినది. మొదట కార్యము ఎక్కడ ఆరంభమవుచున్నది అనగా వెన్నెముక యొద్ద, అది చిన్న మడతవలె ఉంటున్నది. అదే మొట్ట మొదటి చిన్న కణము, కణముపైన అది చేరుచున్నది.
33
ఇప్పుడు, మీ ప్రతీ ఒక్కరు వచ్చినటువంటి, ఒక అతి చిన్న కణము, బీజమును నేను తీసుకున్నట్లయితే... బీజమనగా ఏమిటి? ఒక బీజము చిన్న కణమైయున్నది, కణములో అతి చిన్నది. మంచిది, దాని తరువాత ఏమిటి? ఇప్పుడు, నేను నీ యొక్క ప్రతీ ముక్కను తీసుకొన్నాను, ఒక చిన్న కణమును తీశాను, అయిన నేను నిన్ను కనుగొనలేదు. మీ కణములను నేను క్రింద పెట్టాను. మంచిది, తరువాత కార్యము, రక్త కణములు, మరియు మాంస కణములు, మరియు అవి ఏమైనప్పటికీ, (అవి అంత క్రింద పెట్టబడినవి), అయినను నేను నిన్ను కనుగొనలేదు. నేనిప్పుడు ఒక బీజమునైపోయాను. మంచిది, నేను ఆ చిన్న కణభాగమును తీసుకొనుచున్నాను. ఇప్పుడు, నీవు ఎక్కడ ఉన్నావు? నీ జీవము. జీవము మొదటి కణమును తయారు చేయుచున్నది, అది దాని బీజమౌచున్నది. తరువాత ప్రతీది దాని స్వభావమును కలిగియున్నది. కుక్క, కుక్క స్వభావమును; పక్షి, పక్షి స్వభావమును; మనిషి, మనిషి స్వభావం కలిగియున్నవి. కణము మీది కణము, కణము మీది కణము, కణములు. వృద్ధి చెందుచూ, నీవు మానవునిగా ఎక్కడైతే యున్నావో అక్కడకు వచ్చియున్నవి. కణములు ఒక దానిపై ఒకటి చేరి, (చివరకు మానవునిగా తయారైనవి), కణములు వృద్ధి చెందుచున్నవి. ఇప్పుడు, అలాగుండుటయే దేవుని యొక్క నిర్ణయము మరియు ఏర్పాటు.
34
అయితే, ఇప్పుడు, క్యాన్సర్ సంగతేంటి? దాని గూర్చి కొద్దిగా మాట్లాడుకొందాం. ఇప్పుడు, దేవుడు మీకు మీ ప్రాణాన్ని ఇచ్చాడు. మరియు చెప్పెను, ఈ రోజు నీవు ఇక్కడ వున్నావు, నేను ఇక్కడ వున్నాను. అక్కడ నా చేతిలో ఏమియు లేదు, అయితే అక్కడ నా చేతిలో కొన్ని సమయాల్లో క్యాన్సర్ ఉండవచ్చును. మంచిది, అక్కడికి ఆ క్యాన్సర్ ఏలాగున వచ్చినది? ఆ క్యాన్సర్ ఏమైయున్నదో చూద్దాం, ఇప్పుడు దానిని కొంత భాగముగా తీసుకొందాం, దానిలోకి వెళ్ళి తీసుకొందాం. ఇప్పుడు, అది కూడా కణముల గుంపుగా ఉంటున్నది, అది నీకు తెలుసా? కణితి, నేత్ర వ్యాధి, ఇలాంటివి ఏదైన ఒక కణమే. వాటికి ఆకారము లేదు. వాటిలో కొన్ని బయటకు పోవుచున్నవి. మరియు కొన్ని సాలెగూడు వలె కనిపిస్తాయి. కొన్ని చారలు వలె కనిపిస్తాయి, ఒక ఎరుపు క్యాన్సర్, అది ఎర్రటి ధారము వలే ప్రాకుచున్నది, తరువాత, గులాబి క్యాన్సర్ అది స్త్రీల రొమ్ము భాగాన సహజముగా వస్తున్నది, అది ఒక దాని పై ఒకటి పెట్టబడి ఉన్న పాన్-కాకేస్ వలె ఉంటున్నది. అంతట అవి ప్రాకుకుంటూ పోవును. అది ఎక్కడైన పెరుగును.
35
కొన్ని సార్లు, కణుతులు వ్రేలాడుచుండును, ఈ విధంగాను, పొడవుగాను, దీర్ఘచతురస్త్రముగాను మరియు అన్నియూ ఉండును. వాటికి రూపము లేదు, ఎందుకనగా అవి ఆత్మ గనుక వాటికి రూపముండదు. కాని అవి కణములను ఉత్పత్తి చేయును. అవి కణముల గుంపుగా ఇలా చెప్పెదము, నీలో కణితిగా, క్యాన్సర్ గా, అది కణములను ఉత్పత్తి చేస్తూ, పెరుగుచూ, పెరుగుచూ, పెరుగుచూ ఉంటున్నది. అది నీ నుండి నీ ప్రాణాన్ని పీల్చి వేస్తూ, తినేస్తూ ఉంటున్నది. అది రక్తనాళములలో జీవిస్తున్నది. కంటి శుక్లము కంటిలోని తేమడను తీసుకొని, అది అక్కడే పెరుగుచున్నది, దానికదే ముసుకు వేసుకొంటున్నది, మీ కన్నులను కప్పివేస్తున్నది, వాటిలో కొన్ని వచ్చి ఏమి పొందుకోవు... క్షయరోగము వలే, అది ఒక చాలా చిన్న కణము వలె వస్తున్నది. దాని పరిమాణము దేనికి ఉండదు. అదే పరిమాణమున్న బీజము ఒక ఏనుగును తయారు చేస్తున్నది, ఒక పురుగును తయారు చేస్తున్నది. ఆ బీజమునకు ఏ పరిమాణము లేదు.
వాటిలో కొన్ని శరీరాకారమును దాల్చుచున్నవి. కొన్ని దాల్చుటలేదు. మరియు కొన్ని కణములలోనికి వెళ్ళుట లేదు. కొన్ని ఆత్మలై, ప్రాణమును బాధిస్తున్నాయి. మనము ఆ భాగమును తీసుకొనుటకు ప్రయత్నించుదము, ప్రాణము - ఆత్మ ఎక్కడ నుండి, ఏ విధంగా ఇక్కడికి వచ్చుచున్నవి నేను చెప్పగలుగునట్లుగా, రేపటి మధ్యాహ్నమునకు ఆ భాగమును నేను విడిచిపెట్టుచున్నాను.
36
మరియు ఇప్పుడు, స్నేహితులారా, ఏదో ఒక రకమైనటువంటి మనస్తత్వ శాస్త్రము ద్వారా నేను దీనిని చెప్పుట లేదు; సంవత్సరాల తరబడి దయ్యములతో నేను సంధించాను, అది మీకు తెలుసు. రాత్రి కూటము ముగించిన తరువాత, కొన్ని సార్లు ఏమి జరుగుచున్నది, అనే విషయము నీవు గ్రహించగలిగినట్లయితే, మీకు తెలియదు. గుర్తుంచుకొనండి, నీవు ఒక ఆత్మకు వ్యతిరేకముగా వచ్చినప్పుడు, మీరు ఏమి మాట్లాడుచున్నారో ఎరిగి ఉంటే మంచిది. కేవలము అక్కడనే నిలువబడవద్దు, ముందుకు సాగిపోవుడి, ఎందుకనగా అది మీకు ఏ మేలు చేయదు. అయితే, నిజముగా ఒక దయ్యము నీకు లోబడవలసివచ్చినప్పుడు, నీవు దానిని గుర్తించెదవు. నీవు ఎంత గట్టిగా కేక వేశావు అన్నది కాదు; దానిపైన ఎంత ఎక్కువ నూనెను పోశావు అన్నది కాదు. ఈ వెనుక ఏమిటి ఉన్నదో అని దానిని అతడు గుర్తించును: అది సత్యము. “బయటికి రా,” అని యేసు అతనికి చెప్పెను.
37
గుర్తుంచుకొనండి, శిష్యులు దాన్ని తన్ని వేయుటకు మరియు తోలివేయుటకు, మరియు బయటకు వెళ్ళగొట్టుటకు అన్ని విధములుగా ప్రయత్నించారు. “మేము ఎందుకు బయటకు వెళ్ళగొట్టలేకపోతిమి?” అని వారు చెప్పెను.
“ఎందుకనగా, మీ అవిశ్వాసము చేతనే” అని చెప్పెను. “అతని విడిచి బయటకు రా,” అని చెప్పెను. బాలుడు పడిపోయి ఎన్నడులేనంతగా కొట్టుకొన్నాడు. చూశారా, అవి అధికారమును గుర్తించినవి.
అక్కడ ఉన్న బాలుర వైపు చూడండి, వారు దేశ దిమ్మరులై, పౌలు దయ్యములను వెళ్ళగొట్టుటను వారు చూసెను. వారు చెప్పెను, “మేము అదే కార్యములు చేయగలము,” వారు యాజక కుమారులు. కాబట్టి వారు వెళ్ళి చెప్పెను, “మేము దయ్యములను వెళ్ళగొట్టగలము.” అపొస్తలుల కార్యములు 19. వారు ఒక మూర్ఛ వ్యాధి ఉన్న మనుష్యుని యొద్దకు వెళ్ళెను. మరియు చెప్పెను, “యేసు ద్వారా నీకు మేము ఆజ్ఞాపించుచున్నాము, అతని నుండి బయటకు రా!” దయ్యము చెప్పెను... “ఇప్పుడు, యేసు నామములో పౌలు బోధించుచున్నాడు!”
దయ్యము చెప్పెను, “ఇప్పుడు, యేసును నేను ఎరుగుదును మరియు పౌలును నేను ఎరుగుదును, కాని మీరు ఎవరు?” ఏమి జరిగినదో మీకు తెలుసా. ఆ మనుష్యులుపై పడి, వారి బట్టలు చింపివేసెను, మరియు వారికి వారే మూర్ఛగలవారై వీధులలో పరుగెత్తెను.
38
అదే దయ్యములు ఈ రోజు జీవిస్తున్నవి, కాబట్టి ఎంతో మూఢభక్తి ఉన్నది. ఈ సాయంకాలము ఇది సంఘముగా ఉన్నది. దైవిక స్వస్థత అని పిలువబడే అధిక మూఢభక్తి ఈ దేశములో ఉన్నది, అది మూసివేయబడవలెను. నిజమైన కారణమునకు అదే నిందను తెచ్చుచున్నది. అందుకొరకే నీవు అంత కఠినమైన పోరాటం కలిగియున్నావు. ఈ రోజులలో మతమని పిలవబడే ఎంతో చెత్త ఉన్నది, అది మూసి వేయబడవలసి యున్నది. మతాచార పద్దతి తప్ప మరేమియు రాదు! దాని వలననే దేవుని యొక్క నిజమైన సంఘమునకు పోరాటం ఉంటున్నది. కాని మనము అమెరికనులము, చూడండి, ఆ విధముగానే యున్నది. కఠినమైన గోధుమలు మరియు గచ్ఛతీగలు మరియు నాచు కలిసి ఎదుగును అని దేవుడు చెప్పెను. వాటిని పెరికివేయవద్దు; వాటిని కలిసి ఎదుగనీయుడి. అయితే వాని ఫలమును బట్టి మీరు తెలుసుకొందురు. అక్కడ ఫలాలు లేవు, ఎందుకనగా, అక్కడ జీవము లేదు, అక్కడ ఏమియు లేదు.
39
ఇప్పుడు, ఈ కణమును గమనించు. ఉదాహరణను చెప్పనివ్వండి, అనేక పర్యాయములు, ఎర్ర క్యాన్సర్ స్త్రీ గర్భాశయాన్ని, స్త్రీని నలుగకొట్టుచున్నది. ఇప్పుడు దానిని క్రిందనున్న ఆ వ్యక్తిని తీసుకోనివ్వండి, ఇప్పుడు అతని కణము మీద. ఇది - ఈ క్యాన్సర్, ఇప్పుడు ఒక క్యాన్సర్...
ప్రకృతి సంబంధమైన ప్రతీది ఆత్మ సంబంధమైన దానికి పోలికగా ఉంటున్నది. నీవు దానిని ఎరిగి ఉన్నావా? అది ఏమైనప్పటికీ, ప్రకృతి సంబంధమైన ప్రతీది ఆత్మ సంబంధమైన దానికి పోలికైయుంటున్నది.
ఉదాహరణకు, ఈ విధంగా: మనము క్రీస్తు శరీరములో జన్మించినప్పుడు, అక్కడ మూడు మూలకములు మన పుట్టుకకు కారణమగుచున్నవి. మరియు ఆయన చనిపోయినప్పుడు ఆ మూడు మూలకములు క్రీస్తు యొక్క జీవములో నుండి బయటకు వచ్చినవి. ఆయన శరీరములో నుండి నీరు, రక్తము, ఆత్మ వచ్చినవి. అది సరియేనా? మూడు మూలకములు, మనము తిరిగి జన్మించినప్పుడు ఆ మూడు మూలకముల ద్వారా బయటకు వస్తున్నాము: నీతికరణము, శుద్ధికరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము.
ఇప్పుడు, అవి అన్నీ ఒక్క కార్యములో ఉండగలవు, కాని అది తీసుకొనును... అయితే నీవు శుద్దీకరించబడకుండనే నీతికరణము నొందగలవు. నీవు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి కూడా నీ మురికితో నీవు కొనసాగగలవు. అయితే నీవు సంపూర్ణముగా పరిశుద్ధాత్మ లేకుండగనే, నీతీకరణము మరియు శుద్ధీకరణము ఈ రెండునూ కలిగిన శుద్ధమైన జీవితమును జీవించగలవు.
చూడండి, బైబిల్, I యోహాను 5:7 చెప్పెను, “పరలోకములో సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ... మరియు తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ,” (అదే కుమారుడు), “మరియు ఈ ముగ్గురూ ఒక్కటే. భూమీ మీద సాక్ష్యమిచ్చువారు ముగ్గురు - నీరు, రక్తము, ఆత్మ, మరియు ఒక్కరిలో ఏకీభవించియున్నారు.” ఒకటి కాదు, కాని ఒక్కరిలో ఏకీభవించియున్నారు. నీవు కుమారుని కలిగిలేకుండా తండ్రిని కలిగియుండలేవు; నీవు పరిశుద్ధాత్మను కలిగి లేకుండా కుమారుని కలిగి యుండలేవు, వారు విడదీయబడని వారు: ఒకటే. త్రిత్వము ఒకటిలో ఉన్నది.
40
నేను ఇక్కడి ప్రాంతములో వినుట లేదు, అయితే దేశములో పలు చోట్ల అది నీవు ఎంతో ఎక్కువగా వింటావు. పెంతుకోస్తు గుంపులో ఒక గొప్ప విషయము ఏమనగా, ఒక చిన్న విషయాన్ని కూడా కలగలపు చేస్తారు. మరియు వారు పెద్దలను ఏకము చేసి వారిరువురును ఒక్కటే నమ్ముచున్నారని నేను రుజువు చేయుదును. వారి మధ్యన ఉన్నది దయ్యమే, అది అంతే. ఆ గొప్ప పెంతెకొస్తు సంఘము, ఆ చిన్న పాత ఆచారమును తోసివేసి మరియు దేవుని యొక్క దీవించబడిన సంఘములో ఒక్కటిగా కలిసిపోయినట్లయితే, రాకడ వచ్చును. అయితే సాతాను వారిని విడగొట్టునంత కాలము, అది అంతే. వాడు చేయు విధానము అదియే. మరియు వారు నిశ్చయముగా ఆ కార్యములనే నమ్మెదరు. ఒకరు చెప్పుదురు, “మంచిది, ఇదే అది.”
నేను చెప్పాను, “మంచిది, ఇది అదే అయితే, అప్పుడు అది ఇదే.” కాబట్టి అక్కడే నీవున్నావు. కాబట్టి అదంతా ఒక్కటే కార్యము. అయితే ఆ త్రియుక్తమైన దేవుని త్రిత్వములో అక్కడే నీవు ఉన్నావు. ఇప్పుడు, దేవుడు తన ఏకత్వములో ఉన్నాడు: దేవుడే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు, మనము అన్యులు చెప్పిన విధంగా, “మన దేవుళ్ళు,” అని చెప్పము. ఆయన “మన దేవుడు,” చూశారా. అది దేవుని యొక్క మూడు కార్యములై యున్నవి.
ఇప్పుడు గమనించండి. ఇప్పుడు, సాతాను కూడా త్రిత్వములో ఉన్నాడు. మరియు వాని అన్ని శక్తులు త్రిత్వములో ఉన్నవి.
41
ఇప్పుడు, గమనించినప్పుడు, నీరు, రక్తము మరియు ఆత్మ క్రొత్త జన్మను ఉత్పత్తి చేయుచున్నవి. అది వాస్తవమేనా? ఇప్పుడు గమనించండి. అదే క్రొత్త జన్మను సూచించుచున్నది. క్రొత్త జన్మ వచ్చు ముందుగా ప్రకృతి సంబంధమైన జన్మను ఏది సూచించుచున్నది? తల్లులైన మీరు, బిడ్డ పుట్టినప్పుడు, మొదటి కార్యమేమిటి? నీరు, తరువాత, రక్తము. తరువాత, చూడండి, అది జీవాన్ని తెచ్చుచున్నది, చూచారా, వ్యక్తిని చేయును. నీరు, రక్తము, ఆత్మ.
42
ఇప్పుడు, ఒక క్యాన్సర్, మన తరువాత భాగము దానిపై చర్చించుకొందుము. మనకు ఇంక ఐదు నిమిషాలు ఉన్నదని, నేను తలంచుచున్నాను. తరువాత ఐదు నిమిషాలు, క్యాన్సర్ పై చర్చించుకొందుము. ఆ వ్యక్తి ఏమైయున్నాడు? అతడు దేనికి పోలిక? అతడు ఒక పాకీవాడు. అతడు రాబందుకు పోలిక, చచ్చిపోయిన వాటిని తినును. మరియు నలుగగొట్టబడిన దానిలో నుండి క్యాన్సర్ వచ్చును, ముఖ్యముగా, ఒక కణము కొట్టబడి మరియు అది పగులగొట్టుకు వస్తున్నది. మరియు అక్కడ ఒక చిన్న కణము వెనుకకు జారిపోవుచున్నది. ఓ, అది బాప్టిస్టుకు పెద్ద మాట కాదా? అది సరే, అయిన అది వెనుకబడిన కణము. నేను వెనుకబడిపోవుటను నమ్ముచున్న ఒక బాప్టిస్టును.
43
ఎవరో ఒకరు చెప్పెను, ఇక్కడ గతించు దినమున ఆర్కన్సాస్ కూటములో చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం,” చెప్పెను... అతడు (నజరీనువాడు) స్వస్థత పొందుకొన్నాడు. అతను తన ఊత కర్రలను తన భుజములపై వేసుకొని వీధుల గుండా నడుచుచున్నాడు. అతను చెప్పెను, “మీకు తెలుసా ఏమిటో?” చెప్పెను, “నేను మొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు, మీరు బోధించుట విన్నాను, మీరు ఒక నజరీను వారని నేను తలంచుకొంటిని,” అని అతను చెప్పెను. “ఎక్కువ మంది పెంతుకోస్తు ప్రజలను నేను చూసినప్పుడు, మరియు ఎవరో నాకు చెప్పిరి నీవు పెంతెకొస్తువాడవని. మరి ఇప్పుడు నీవు బాప్టిస్టు వాడవని చెప్పుచున్నావు, దానిని నేను అర్థము చేసుకోలేకపోవుచున్నాను,” అని చెప్పెను.
“ఓ, అది సులభము,” అని నేను చెప్పాను. “నేను పెంతెకొస్తు, నాజరీను, బాప్టిస్టును,” అని నేను చెప్పాను. అది నిజము. మంచిది. లేదు, క్రీస్తు యేసులో మనమ౦దరము ఒక్కటే, పరిశుద్ధాత్మ మనలను ఒక్కటిగా చేయుచున్నది. అది నిజము.
44
ఇప్పుడు, గమనించండి, ఈ చిన్న కణము కొట్టబడినప్పుడు అది వెనుకబడిపోవుచున్నది. అది చిన్నదిగా ఆరంభమగుచునపుడు.... మరి యొక్క చిన్న జీవి ముందుగా పరుగెత్తుకు వెళ్ళి అందులో జీవిస్తున్నది. అందుకే పుండులో నుండి చీము వస్తున్నది. ఆ చిన్న సైనికుల గుంపు నీ జీవము కొరకు పోరాడును. దయ్యపు శక్తులు అందులో చేరుటకు ప్రయత్నిస్తున్నప్పుడు - అవి పరిగెత్తి మరక్కడ విషాన్ని పోస్తాయి, మరియు వాటి ప్రాణము పెట్టును. అది ఏమిటి తయారు చేస్తున్నది... అది మరణించినటువంటి చిన్న సైనికుల గుంపు — ఆ పుండు దగ్గరనున్న రక్తములో పెట్టును, అవి నిన్ను రక్షించుటకై వాటి జీవాన్ని ఇస్తున్నది.
45
ఇప్పుడు, ఒకసారి ఒక చిన్న కణము అక్కడ నుండి తోసివేయబడి మరియు దయ్యము పొందుకోవటం ప్రారంభమవుచున్నది. అతడు పెరుగుట ఆరంభించును. అతడు కణములను రెట్టింపు చేయటం ప్రారంభించెను. మీ గర్భంలో మీ బిడ్డల వలె సరిగ్గా వాడు ఒక శరీరమును నిర్మించుకొనుచున్నాడు. మరియు నీ తల్లియందు నీవు చేసిన విధంగానే. కణము పైన కణము, కణము పైన కణము. కణము ఏ విధంగానైన, ఎక్కడైయిన... దాని స్వభావము, మానవుని వలె దానికి ఒక రూపము లేదు. అది ఆత్మ నుండి వచ్చినది. అది ఏ విధంగానైనను పెరుగును, మరియు కణము పైన కణము, కణము పైన కణము ప్రారంభమగును.
మరియు ఇప్పుడు, మొదటి కార్యము ఏమి జరుగుచున్నదో తెలుసా, నీవు బలహీనుడవు మరియు వ్యాధిగ్రస్తుడవైనట్టు భావిస్తావు. నీవు వైద్యుడు దగ్గరకు వెళ్ళెదవు, మరియు అతడు నిన్ను పరీక్షించును. బహుశా అతడు దాని కనుగొనకపోవచ్చును. అతడు గుర్తించినట్లయితే, బహుశా అతడు దాని కోసివేయును. అతడు దానిని శుభ్రముగా కోయగలిగినట్లయితే, సరే, అది నీవు పొందుకోంటివి. కాని అతడు దానిని శుభ్రముగా కోయలేనట్లయితే, అప్పుడు (అది గొంతులోనో లేక వేరే ఎక్కడో, అది ఎక్కడ శుభ్రముగా కోయబడలేదో అక్కడ), ఒక చిన్న ముక్క దానిలో జీవించును. చూశారా, ఎందుకనగా నీవు నీ చేయిని కోసివేసి మరియు దానిని ముగించుట కాదు లేక వేరే విధంగా ఉండునంతగా, లేదా నీవు కత్తిరించిన... నా భావము ఏమనగా, నీవు ముఖ్యమైన శరీరభాగాన్ని కోసివేసి, మరియు నీ చేయిని అక్కడ వదిలేసినట్లయితే, ఎందుకు, అది జీవించదు. కాని, చూడండి, అది నీవు కలిగియున్నటువంటి జీవ రూపము కాదు; అది కదులుతున్న దయ్యపు శక్తి.
46
ఇప్పుడు గమనించండి. మీరు వాటిని ఇలా పిలుస్తారు... వైద్యుడు దానిని “క్యాన్సర్,” అని పిలుస్తాడు. దేవుడు దానిని “దయ్యము” అని పిలుచును. ఈ దినాన్ని చూడండి. వారు దాని తెచ్చిరి... క్యాన్సర్ అనే మాట ఎక్కడ నుండి పుట్టినది? అది లాటిన్ పదము నుండి వచ్చినది, దానిని వైద్య శాస్త్రీయ పదముగా ఉపయోగిస్తారు. దాని అర్థము “ఎండ్రకాయ,” ఎండ్రకాయను మీరు సముద్ర తీరమున చూడగలరు, అది చాలా కాళ్ళను కలిగి ఉంటున్నది, ఆ విధముగానే అది చేస్తున్నది — అది సమీపించి, వ్యాప్తి చెందును. క్యాన్సర్ అను మాటకు ఎండ్రకాయ అని అర్ధము. అది లోపలకి వచ్చి, సద్వినియోగపరుచుకొని, ఆక్టోపస్ లేక ఎదో ఒక దాని వలె రక్తాన్ని పీల్చివేస్తున్నది.
ఎందుకు, ఒక కణితి, కంటి శుక్లము, మరియు ఇతర వ్యాధులన్ని, వాటిలో ప్రతి ఒక్కటి సూక్ష్మజీవి నుంచి వచ్చును, మరియు ఆ సూక్ష్మజీవికి శరీరము కావలసియున్నది. అది శరీరమును పొందుకొనుటకు ముందుగా, దానికి జీవము ఉండాల్సి ఉన్నది. అది సృజించబడక మునుపు లేక అధిక కణములను ఉత్పత్తి చేయడానికి మునుపు, అది జీవాన్ని కలిగి ఉండాల్సి ఉన్నది. అది సరియేనా?
ఇప్పుడు, క్యాన్సర్ ఎక్కడ నుండి వచ్చినది? ఎవరు, అది ఎక్కడ నుండి వచ్చినది? ఇక్కడ కొంత కాలము. క్రితము అది నీలో లేదు, కాని ఇప్పుడు, బహుశా అది నీలో ఉండవచ్చు. అది ఎక్కడ నుండి వచ్చినది? నీ జీవమునకు భిన్నమైన వేరొక జీవము నీలో నివసించుచున్నది. మరియు అది బాధిస్తున్నది, నీ జీవమును కృంగజేస్తున్నది. ఆ కారణము చేతనే యేసు దానిని “దయ్యము,” అని పిలిచెను.
47
వారు ఈ రోజు మూర్ఛ అని పిలచుచున్నారు, వారు చెప్పెను, “మూర్ఛ.” ఎందుకు, బైబిల్ లో మూర్ఛని, యేసు దానిని ఒక దయ్యము,“ యని పిలిచెను. ఒక మనిషి బాలునితో వచ్చెను దయ్యము వానిని నేల మీద పడవేసి మరియు నోటిలో నుండి నురుగు కార్చునట్లుగా మరియు ప్రతీది చేసెను, అతడు చెప్పెను, ”అతడు ఒక దయ్యము పట్టినవాడై, తరచుగా దయ్యము అతడిని అగ్నిలోను, నీళ్ల లోను పడద్రోయుచుండెను.“
ఇప్పుడు వారు దానిని మెరుగుచేసి “మూర్చ” అని పిలిచారు, అయితే అతడు ఒక దయ్యము. “అపవిత్రాత్మ బాలుడను విడిచి బయటకు రా!” యని యేసు ఖచ్చితంగా చెప్పెను. కచ్చితముగా. ఇప్పుడు, మూర్ఛ వ్యాధి సహజముగా మూత్ర పిండముల సమస్య వలన కలుగుచున్నది. బహుశా మీరు దానిని కొద్ది సేపటి తరువాత పొందుకొనెదరు, చూశారా. మూర్ఛకు ఒక కారణము, మూత్రము లోటుపాటుల వలన కలుగుచున్నది.
48
ఇప్పుడు, గమనించండి. అందులో, అప్పుడు, ఆ కణము అక్కడ చేరి స్థిరపడును. అది దయ్యము; వాడు జీవాన్ని కట్టుచున్నాడు. అది పెరుగుచున్నది, అది పెద్దదై మరియు పెద్దదైపోవుచున్నది. “అది చేయవలసిన పని ఒకటున్నది — అది నీ జీవమును తీసుకోవటం. నలబై సంవత్సరాలు వయస్సు నుండి నీ దినములను తీసివేయటకై, దయ్యము పంపబడినది.
49
ఇప్పుడు, ప్రతీ వైద్యునికి నేను నమస్కారము చేస్తాను. అవునయ్య. ప్రతీ వైద్య శాస్త్రమునకు, వారు ప్రజల కొరకు చేసిన సహాయాన్ని బట్టి, దేవుడు వారిని దీవించును గాక. అది సత్యము. అది లేకుండా లోకంలో ఈ రోజు నీవు ఏమి చేయుదువు? వైద్య శాస్త్రమునకై నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను. నా ఇంధన వాహనమునకై నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను. విజ్ఞాన శాస్త్రము ద్వారా దేవుడు నా ఇంధన వాహనమును ఇవ్వకపోతే, నేను ఇక్కడకు నడిచి వచ్చుటకు ఎంతో కష్టపడిపోయేవాడిని. కరెంటు దీపాల కొరకు, నా చేతులు కడుగుకొనే సబ్బు కొరకు, పళ్ళను తోముకొనే పేస్టు కొరకు, నిశ్చయముగా, ప్రతీ దాని కొరకు నేను ఆయనకీ కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను, ఎందుకనగా సమస్త మంచి విషయములు దేవుని నుండి వచ్చినదే.
50
అయితే మీ కొక్కటి చెప్పనివ్వండి, అక్కడ ఒక ఔషదపు ముక్క కూడా ఏ వ్యాధిని బాగుచేయజాలదు. ఒక్క వైద్యుడు కూడా లేడు, (బూటకపు వైద్యుడు అయితే తప్ప)... కాని మేము స్వస్థపరచువారమని మమ్మును మేము పిలచుకొనలేము, అని ఒక నిజమైన వైద్యుడు మీకు చెప్పును. మీలో అనేకులు, మాయో సహోదరుల వద్ద నుండి... నేను రెండు లేక మూడు సార్లు ఇంటర్వ్యూ చేయబడ్డాను. వ్యాధిగ్రస్తులు అక్కడకు నయము కాని వ్యాధులతో వస్తారు...
మీరు రీడర్స్-డైజిస్ట్ నవంబర్ ప్రచురణ చదివారా? ఎంత మంది నవంబర్ ప్రచురణ చదివారు. అందులో నా యొక్క వ్యాసము రీడర్స్-డైజిస్ట్ లో వున్నదా? చూశారా? వారు నన్ను అక్కడ వుంచిరి, వారు విడిచి పెట్టిన అబ్బాయి గురించిన ఇంటర్వ్యూ అది జరుగదని చెప్పెను. అయితే పరిశద్దాత్మ నాతో పలికెను, మరియు అది ఏ విధంగా జరుగును అని నాతో చెప్పెను, మరియు అది జరిగినది. అది సరే. ఇప్పుడు, వారు నన్ను పైకి పిలిచారు. అక్కడే తలుపు నొద్ద జిమ్మి మరియు మొదలగు వారు అక్కడ ఉన్నారు, మాయో కూడా అక్కడే ఉన్నారు. అక్కడ ఒక గొప్ప పెద్ద చిహ్నము చెప్పెను, “మేము స్వస్థపరచు వృత్తిని కలిగిన వారము కాదు, మేము ప్రకృతికి సహాయము చేయు వృత్తిని కలిగిన వారము మాత్రమే. అక్కడొక స్వస్థపరచువాడు ఉన్నాడు. ఆయనే దేవుడు.” వారు ప్రపంచములో గొప్ప వారు. ఇప్పుడు, మనము కొందరు నటించు వారిని కలిగియున్నాము, అవును. అది నిజము. మనకు కొందరు బూటకపు బోధకులు కూడా ఉన్నారు. మంచిది, కావున, అది రెండువైపులా వెళ్ళుచున్నది.
51
గమనించండి, ఎవడైన గాని తాను స్వస్థపరచువాడనని చెప్పుకొన్నయెడల, అతడొక కథలు చెప్పువాడు, ఎందుకనగా అతడు దానిని చేయలేడు. “నీ పాపాలన్నిటిని క్షమించి, నీ రోగాలన్నిటిని కుదుర్చు యోహోవాను నేనే,” అని బైబిల్ చెప్పుచున్నది.
విదేశాల నుండి వస్తున్న కొందరు గొప్ప వైద్యుల గూర్చి నేను నా గదిలో, చదువుచూ వుంటిని. జీవము వెనుక ఏమున్నదో నీకు తెలియదు, స్నేహితుడా, అది ఏమైయున్నది అన్నది నేను బహిరంగముగా చెప్పకూడదు; పురుషులు రహస్యముగా వస్తారు. ఇంకా లోకములో అనేకమైన నికోదేములు లేరని నీవనుకోవద్దు. అది నిజమే; వారిలో వేలకొలది ఉన్నారు. వారు దాని మీద కనిపిస్తూ, కూటములకు వస్తారు. టీషర్టు లేక అలాంటివి వేరే ఏదో ఒకటి వేసుకొని వచ్చి, మెరుగులు పెట్టిన పేర్లతో అక్కడ కూర్చొంటారు. వారు కూటములో కూర్చొనుటను బట్టి నీవు ఆశ్చర్యపోయెదవు. కొద్ది రోజులలోనే చుట్టూ జారుకొని, రహస్యముగా పిలుస్తారు, మరియు సందర్శించుట (పరిచయము) కొరకై ఎవరినో ఒకరిని పంపిస్తారు. మరియు నేరుగా చెప్పుదురు, “సహోదరుడా బ్రెన్హాం, అది సత్యమని నేను దాన్ని నమ్ముచున్నాను,” అని చెప్పుదురు. మన వలే వారు కూడా నరులే. నిశ్చయముగా. ప్రతి మనిషి ఆ చీకటి తెర వెనుక కనిపించుటకు ఆశపడెదరు, అతడు ఏదో ఒక రోజున ఆ మార్గం గుండానే వెళ్ళును.
52
అయితే ఈ క్యాన్సర్లు ఇవన్ని సంపూర్ణముగా దయ్యములు, మాంస శరీరములో రూపాన్నిదరించి, కదులుచు, నీ జీవమును తీసుకొనుచున్నవి.
ఇప్పుడు, నేను వైద్యునివలె నేను చేసినట్లయితే, నేను దానిని కత్తిరించగలిగితే, దాన్ని నేల మీద పెట్టి... లేక, ఉదాహరణకు, ఈ విధంగా చెప్పుకొందాం, ఈ భూమి మీద నీకు నీవుగా ఒక క్యాన్సరువైయితే. ఇప్పుడు, ఇక్కడ ఒక దైవిక స్వస్థత ఉన్నది. నేను నిన్ను తరిమి కొట్టాలనుకున్నట్లయితే, (ఒక వైద్యుని యొక్క విధానములో), నేను దాని ఆ విధముగా చేస్తాను... నీ శరీరాన్ని రుద్దడమో, లేక అలాంటిది ఏదో ఈ భూమి మీద నుండి కనిపించకుండా పోయేంత వరకు చేస్తాను. అది అక్కడ ఉండనే ఉ౦డదు; ఆ ఎదుగుదలను వైద్యుడు నీలో నుండి తీసి వేయునట్లుగా. అయితే దైవిక స్వస్థత రూపంలో, నీవు క్యాన్సరువైనట్లయితే, నీలో నుండి నీ జీవమును పిలిచెదను, మరియు నీవు వెళ్ళిపోయెదవు. నీ జీవము నిన్ను విడుస్తున్నది, అయితే నీ శరీరము మునుపు ఇక్కడ ఎలాగున్నదో అలాగే ఉండిపోవును.
53
ఇప్పుడు, దైవిక స్వస్థతలో కాలము మరియు కనుచూపు దేవుని యొక్క అతి భయంకరమైన శత్రువులు. సహోదరుడు బాక్స్టర్ ఆ కూటములో ఏమి పొందుకున్నాడో నాకు తెలియదు. నేను కూర్చొన్నాను, అది అతనికి మరియు సహోదరుడు బోస్వోర్త్ కి మరలా మరలా వివరించుచున్నాను. అయితే ఇక్కడేమి జరిగినది. అనేక ప్రజలు దాన్ని పొందుకున్నారో లేదో నాకు అనుమానమే, ఎందుకనగా కొంత సమయం తరువాత, ప్రజలు తిరిగి వచ్చి “సహోదరుడా బ్రెన్హాం, నేను స్వస్థత పొందుకున్నాను, రెండు లేక మూడు రోజులు, దేవునికి స్తోత్రము, అది నన్ను విడిచెను,” అని చెప్పుటను మీరు కనుగొనగలరు. మరియు నేను దాన్ని కనుగొన్నాను. నేను ఆలోచించాను, ఎందుకనగా వారు కూటములో సరిగ్గా కూర్చొనలేదు; ప్రజలు అర్థం చేసుకోలేదు.
మనుష్యులు వేదిక యొద్దకు సంపూర్ణముగా గ్రుడ్డి వ్యాధి, క్యాన్సర్ వ్యాధి మరియు కంటి శుక్లముల వ్యాధి కలిగిన వారై వచ్చి, ప్రార్థన చేయబడిన తరువాత ఈ బైబిల్ చదివిరి, క్రిందకు నడిచి వెళ్తారు. మూడు లేక నాలుగు రోజులోనే వారు మొదటి స్థానములో ఏ విధంగా ఉన్నారో, ఆ విధంగా వారు గ్రుడ్డివారై పోవుచున్నారు. ఏమి జరిగినది? ఏదైన శరీరము నుండి జీవము విడిచినప్పుడు, అది కొంత సేపు ముడుచుకొని పోవును, అని ఎవ్వరికైనా తెలియును. అది నిజమేనా?
54
ఇక్కడున్న ఎవ్వరైనా, జింకను గాని, లేక ఆవుని గాని, లేక అలాంటి ఏదైన ఖచ్చితముగా. దాన్ని చంపరా? సరే. నా స్నేహితులైన వేటగాలైన మీరు ఈ రాత్రి దాన్ని తూకం వేయండి, మీరు జింకను చంపి దాన్ని తూకంపై పెట్టి, అది ఎంత బరువు ఉన్నదో బాలురకు చెప్పండి. దాన్ని కనిపెట్టండి! తెల్లవారిన తరువాత. అది ఉన్నదాని కంటే అనేక పౌండ్లు తేలికయిపోవును.
ఒక మానవుడు చనిపోయినప్పుడు, కాటికాపరి, మొదటిగా, చెడు పళ్ళు లేక కళ్ళు, అక్కడ దానిలో ఉన్న ప్రతీ దానిని; బయటకు తీసివేస్తాడు, ఎందుకనగా అది కుంచించుకొనిపోవును. అది బయటకు నెట్టుచున్నది, ఎందుకనగా మానవ శరీరము కుంచించుకొపోవును. ప్రతీ శరీర మాంసము కుంచించుకొనిపోవును. కణములో నుండి జీవము పోయినప్పుడు, అది కుంచించుకొనిపోవుట ప్రారంభమవుచున్నది. అది డెబ్బయి-రెండు గంటలలో జరుగును. మరప్పుడు అది ఉబ్బడము ప్రారంభమవును.
చిన్న కుక్క పిల్లను రోడ్డుపై చనిపోయినయెడల. దానిని మూడు రోజులు ఎండలో ఉండనివ్వండి, మరియు ఏమి జరుగునో గమనించండి. అది ఎన్నడు లేనంత పెద్ద కుక్కగా అయిపోవును; అది ఉబ్బును. అది నిజమేనా?
55
మంచిది, ఒక వ్యాధిగ్రస్తునిలో నుండి ఒక దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత అలాంటి కార్యమే జరుగుచున్నది. మొదటి కొద్ది రోజులు: “ఓ, అద్భుతంగా ఉన్నదని నేను భావిస్తున్నాను.” ఆ తర్వాత, “నేను ఎప్పుడు ఉన్నదాని కంటే జబ్బు ఎక్కువగుచున్నదే, నేను నా స్వస్థతను కోల్పోయాను,” అని చెప్పటం ప్రారంభిస్తారు. నిజముగా విశ్వాసము తీసివేయబడి, అవిశ్వాసము మరలా తిరిగి వస్తున్నది. విశ్వాసము దానిని చంపును, అవిశ్వాసము దానిని పునరుద్ధరించును. యేసు చెప్పెను, “ఒక మనుష్యుని నుండి అపవిత్రాత్మ విడిచి వెళ్ళిన తరువాత, అతడు నీరు లేని దేశమందు సంచరించి మరియు అతడు తనతో కూడ ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చెను. ఇంటిలోని మంచి వ్యక్తి ఆ ద్వారాన్ని కాయుటకు అక్కడ నిలబడకపోతే, అతడు నేరుగా లోపలకి వస్తాడు. నీ ఇంటిలోని మంచి వ్యక్తి - ఎవరనగా నీ విశ్వాసమే; ”బయటకు వెళ్ళు!“ యని చెప్పును. అది అంతే.
56
అయితే, సాధారణముగా ఒక స్వస్థత పొందిన వ్యాధిగ్రస్తుడను మీరు గమనించవచ్చును, అది అద్భుతకరమైన విషయము అయినంత వరకూ. అది, దైవిక స్వస్థత మరియు అద్భుతము రెండునూ వేరు వేరు కార్యములు. దైవిక స్వస్థత ఒక కార్యము; అద్భుతము వేరొక కార్యము. అయితే ఒక సాదారణమైన దైవిక స్వస్థత జరిగినట్లయితే, అపవిత్రాత్మ, క్యాన్సర్ దయ్యము వెళ్ళగొట్టబడినప్పుడు, అది ఒక వ్యక్తిని విడిచి వెళ్ళినప్పుడు, ఓ! లేక, మీరు ఎక్కువగా చూడగలరు కాబట్టి మేము ఏదో తీసుకోబోవుచున్నాము, అని చెప్పెదరు. నేను నేత్రవ్యాధి అని అంటాను. ఆ మనిషికి ఏమి జరిగినది... నీవు ఒక గ్రుడ్డి వ్యక్తిని గమనించినట్లయితే, ఇక్కడ ఎవరైన కంటి శుక్లము జబ్బు కలిగిన వారు అలాంటి వారు ఉన్నారో లేదో నాకు తెలియదు. కొద్ది నిమిషాలు వారు నిలబడాలని కోరుచున్నాను. ఎందుకు? కావున అది కుంచించుకొనుట ప్రారంభమవుచున్నది. వారు వెనుకకు వచ్చి మనకు సాక్ష్యము చెప్పమనండి. ఓ మై, వారు అద్భుతంగా చూడగలరు! “ఓ, మై! ఇప్పుడే నేను సంగతులను చూడగలుగుచున్నాను! అవును! నేను...” ఏమి జరిగినది? జీవము వెడలిపోయినది; ఆ శుక్లము కుంచించుకొనిపోవుచున్నది.
మంచిది, అది అలా రెండు రోజుల తరువాత. “ఓ, నేను ఎంతో బాగున్నాను,” అని చెప్పుదురు.
57
మరియు కొంత సేపటి తరువాత, వారికి తలనొప్పి రావటం ప్రారంభమవుచున్నది, బాగుండునట్లు అనిపించదు. మరుసటి ఉదయానే లేచెదరు, “నేను మరల నా దృష్టిని కోల్పోవుచున్నాను,” అని చెప్పెదరు.
వారిలో కొందరు చెప్పిరి, “ఉహ్, నీవు బ్రమపడ్డావు. ఆ పరిశుద్ద గుండ్రాల గుంపు నిన్ను బ్రమపరిచారు.” అది నీవు నమ్మవద్దు! అది దయ్యము యొక్క అబద్దము. నీవు దానిని నమ్మినట్లయితే, నీవు మరల గ్రుడ్డి వాడివివైపోయెదవు. అయితే నీవు గట్టిగా పట్టుకొని, “లేదు, ప్రభువా, నేను నమ్ముచున్నాను,” అని చెప్పుము.
అప్పుడేమి జరిగినది? ఆ శరీరము చాలా కాలము ఉబ్బును. అది ఆ దృష్టిని మరలా కప్పెస్తున్నది. శరీరములోని ఆ క్యాన్సర్ ఉబ్బును. నీవు మరలా గాయపరచబడి, నొప్పితో బాధపడెదవు. అప్పుడు నీవు భయంకరమైన ఘోరమైన వ్యాధిని పొందుదువు. ఎందుకు? ఆ పెద్ద ఎదిగిన, చచ్చిన మాంసము అక్కడే నీలో ఉన్నది, చచ్చినది.
వైద్యుని యొద్దకు వెళ్ళినయెడల మరియు అతడు చెప్పును, “ఓ, అది బుద్దిహీనత. క్యాన్సర్ అక్కడే ఉన్నది. నేను దానిని చూడగలను.” నిశ్చయముగా, అది అక్కడే ఉన్నది, కాని అది చచ్చినది. హల్లెలూయా!
58
ఇప్పుడు, రక్తనాళములు శరీరమును శుద్ధి చేయవలసి ఉన్నది. ప్రతిసారి గుండె కొట్టుకొంటూ, అది రక్తాన్ని శరీరములోనికి పంపును. మరియు అది అంటు వ్యాధిని పట్టుకొనినది. ఖచ్చితముగా, అది నిన్ను వ్యాధిగ్రస్తునిగా చేస్తున్నది. నీలో ఎక్కడో ఒక చోట మాంసము ముద్ద వేలాడుచుండినయెడల, లేక పాము వలె పొడువుగా ఉంచుండినయెడల, లేక మా చేతి వేళ్ళ వలే దాని చుట్టూ పెద్దదిగా, అక్కడ వ్రేలాడుచుండినయెడల, మరియు అది చచ్చియున్నది? ఆ చచ్చిన మాంసమంతా నీలో వ్రేలాడుచు మరియు అది క్రుళ్ళిపోవుచున్నది? మంచిది, బహుశా, మీ రక్తనాళముల నుండి రక్తమును పంపుట ద్వారా దానిని శుద్ది చేయవలసి ఉన్నది. అయితే అక్కడ చచ్చిన శరీరము, అక్కడ వ్రేలాడుచున్నది, ఎందుకనగా దాని నుండి జీవము వెడలిపోయినది. దేవుని యొక్క శక్తి, విశ్వాసము ద్వారా, దానిని తరిమినది. అతడొక దయ్యము; అతను విడిచి పెట్టబడవలసి ఉన్నది.
59
కాని, కారణము... ప్రజలు ఉపదేశింపబడుట (ఆజ్ఞాపించబడుట) లేదు. వారు దూరము వెళ్ళి, విడిచిపెట్టిరి, మరియు అదే దయ్యము తిరిగి ఆక్రమించుకొనుట కొరకై అక్కడే నిలువబడి ఉన్నది. ఆయన ఆత్మ ద్వారా, ప్రేరేపణను బట్టి ఈ వేదిక నుంచి దేవుడు మీకు ఏదైన చెప్పినప్పుడు, నీవు దానిని సందేహించవద్దు, లేక మిక్కిలి చెడ్డదైన కార్యము నీ మీదికి వచ్చును అని ఆయన చెప్పెను. “అందుకు అతని మొదటి స్థితి కంటే అతని కడవరి స్థితి ఏడు రెట్లు చెడ్డదైయున్నది,” అని యేసు చెప్పెను. అది నిజమేనా? అపవిత్రాత్మ మనిషిలో నుండి బయటకు వెళ్ళినపుడు, అతడు నీరు లేని ప్రదేశమందు సంచరించి అతనితో కూడ తిరిగి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును.
కాబట్టి నీవు అపనమ్మకము చెందవద్దు. నీవు దానితో నిలచియుండుము: అనగా నీ హృదయము నుండి అని అర్థం. “లేదయ్య, నేను కదల్చబడను! నేను ఎంత వ్యాధిగ్రస్తుడనైనప్పటికీ, అది నన్ను ఏమియు చేయలేదని,” చెప్పు. తరువాత, మొదట ఏమి జరుగునో నీకు తెలుసా, నీవు సరిచేసుకొంటావు. అంతట ప్రతీది సరిగానే యున్నది. చూశారా, అది చచ్చినది. వైద్యుడు శస్త్రచికిత్స చేసి, నీలో నుండి తీసివేయును, అదే ఎదుగుదల నీలో ఉన్నది, దానిలో జీవము లేనిదైపోయినది.
60
“జీవము దానిలో ఉన్నదా, సహోదరుడా బ్రెన్హాం, అది నా జీవమును తీసుకుంటున్నదా?” అని మీరు అడుగవచ్చు. లేదయ్య. మీ జీవము వేరు, దాని జీవము వేరు. నేను ఇప్పుడే మీకు చూపించాను, నీవు ఒక ప్రాణి మరియు ఒక ఉనికి అయివున్నావు మరియు అది ఒక ప్రాణి ఒక ఉనికిగా మారుచున్నది; మరియు నీవు దేవుని సంబంధివి, అది ఒక దయ్యపు సంబంధి. నా ఉద్దేశ్యము ఏమిటో మీరు చూశారా? దయ్యపు శాస్త్రము. ఇప్పుడు, నీవు నిలబడి దానివైపు చూస్తున్నప్పుడు, ఆ వస్తువు ఏ విధంగా కనిపిస్తున్నదో, నీవు చూడవలసియున్నది.
ఓ, మై, నన్ను క్షమించండి, అప్పుడే 3:30 అయిపోయినది. నన్ను మన్నించండి. చూడండి, స్నేహితులారా. ఓ, ఈ లోకమునకు ఏమి అవసరము.
61
నేను ఏడు సంవత్సరాల నుండి, అమెరికా దేశమంతటా బోధిస్తూ, ఈ స్వస్థత కూటములను జరిపిస్తున్నాను. నాకిప్పుడే మంచి తలంపు కలిగినది, దేశమంతటా తిరిగి, “దయ్యపు శాస్త్రము పైన, బైబిల్ ను బోధించుచు, ఏ విధంగా ప్రజలు దానిని అర్థము చేసుకొనగలరో చెప్పాలని అనుకుంటున్నాను.” ఆ కారణము వలనే అనేక పర్యాయములు వారు ఈ కూటములకు మరియు.... మీరు అర్ధము చేసుకొననట్లయితే, ప్రజలు బయటకు వచ్చిరి మరియు అనేక సార్లు...
ఇప్పుడు, గుర్తుంచుకొనండి, ఒక వ్యక్తి వచ్చి, అతడు దైవిక స్వస్థత వరమును కలిగి ఉన్నానని చెప్పెను.... నీవు స్వస్థత పొందినట్లయితే, దైవిక స్వస్థత వరము నీలోనే ఉన్నది. ఆ ఒకటి, నీలోనే ఉన్నది. ఏ వరమైనను విశ్వాసము ద్వారానే కార్యము చేయును. నేను ఎంత దైవిక స్వస్థత వరమును కలిగి ఉన్నప్పటికీ, నేను నా హృదయమంతటితో నమ్మినను, కాని నీవు అక్కడే నిలబడి మరియు, నీవు అదే రకమైన విశ్వాసము కలిగి లేనట్లయితే, అది నీకు ఏ మేలు చేయజాలదు. నేను మీ కొరకై గంటలకొద్ది, వారముల తరబడి, మరియు నెలలు తరబడి, ప్రార్థన చేయగలను. దైవిక స్వస్థత కలిగియున్న బోధకులు కాదు. దైవిక స్వస్థత వరమును కలిగియున్నది నీవే, అది నమ్మినప్పుడు నీవు స్వస్థత పొందుకుంటున్నావు. కారణము అది విశ్వాసము ద్వారానే. విశ్వాసము వలనే... దేవుని యొక్క ప్రతి కార్యము విశ్వాసము వలనే జరుగును.
62
దేవుని యొక్క సర్వాంగ కవచమంతా విశ్వాసము మూలముగానే. ఈ లోకము యొక్క ఒక్క ప్రకృతి సంబంధమైన కార్యమునూ మనము పొందుకోలేదు. ప్రతీ కార్యము - క్రీస్తు సంఘము అనేది ఒక విశ్వాస కార్యము. దేవుని యొక్క సర్వాంగ కవచము వైపు చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళత్వము, సద్గుణము, సహనము. అది సరి కాదా? ప్రతీది అతీతమైనది; ఏదీ ప్రకృతి సంబంధమైనది కాదు. కాబట్టి, మనము ప్రకృతి సంబంధమైన కార్యముల వైపు చూడవద్దు, ఎందుకనగా మనము అతీతమైన వాటిని నడిపించుచున్నాము.
మనము ఆధారపడవలసిన ఒకే ఒక మార్గము, విశ్వాసమే, దేవుడు ఏదైతే సత్యమని చెప్పెనో దాని మీద మరియు మనము అదృశ్యమైన వాటి వైపు చూచుచున్నాము. అబ్రహాము చేసిన విధంగానే, మనము లేనివాటిని, ఉన్నట్టుగా పిలచుచున్నాము. ఆమేన్! అబ్రహాము లేనివి (దేవుడు చేసిన విధంగా), ఉన్నట్టుగా పిలిచెను. వంద సంవత్సరాల వయస్సుగలవాడై, అవిశ్వాసము చేత దేవుని వాగ్దాన వాక్యమును సందేహించలేదు.
63
నేను దానిని ఊహించగలుగుచున్నాను, మీరు ఊహించగలుగుచున్నారా? చూడండి, శారా ఒక ఉదయమున లేచెను. దేవుడు చెప్పెను, “అబ్రహామా!” అబ్రహాము, నీవు బిడ్డను కలిగియుండబోవుచున్నావు.“
శారా మేల్కొన్నది. “శారా నీకిప్పుడు ఎలాగున్నది?” అని చెప్పెను. ఇది కలగలపు గుంపు, అయితే విను, “తేడా ఏమి లేదు.”
“మంచిది, దేవునికి మహిమ, మనము దానిని పొందుకోబోవుచున్నాము!” వేళ్ళు బొమ్మలు మరియు పిన్నులు, మరియు ప్రతీది, వెళ్ళి కొనుము. సిద్ధపడుము. సరే, మరొక నెల గడిచినది. “శారా, నీకు ఏలాగున్నది?” “తేడా ఏమి లేదు.” సంవత్సరము గతించినది. “శారా, దాని గూర్చి ఏమిటి?” “తేడా ఏమి లేదు.” పది సంవత్సరాలు గతించిపోయినవి. “తేడా ఏమీ లేదు.” ఇరువది-ఐదు సంవత్సరాలు గతించిపోయినవీ, “తేడా ఏమి లేదు.”
అబ్రహాము బలహీనపడుటకు బదులుగా, అతడు బలమును శక్తిని పొందుకొనుచున్నాడు. అది ఎల్లవేళల కూడా అద్భుతమవుచున్నదని అబ్రహాముకి తెలియును, ఎందుకనగా అతడు దేవుని నమ్మెను, అతడు అవిశ్వాసము చేత దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహించలేదు. “దానిని మేము పొందుకోబోవుచున్నాము!” అని చెప్పెను మరియు ఒక ఉదయమున ఆ స్త్రీ, శారా, గర్భం దాల్చేను. మరియు చిన్న ఇస్సాకు జన్మించెను, ఎందుకనగా అబ్రహాము దేవుని నమ్మెను. మరియు అతడు ఆ కార్యములవైపు చూశాడు... అయితే వారు అక్కడ లేనివాటిని ఉన్నట్టుగా...
64
భావన ద్వారా కాదు, చూపు ద్వారా కాదు, నీవు భావన లేక చూపు ద్వారానో నడువ వద్దు. అది విశ్వాసము ద్వారానే. మరియు దేవుడు ఏదైయిన పలికినప్పుడు, “నీవు ప్రార్థించినప్పుడు ఏ విషయములను నీవు అడిగెదవో, వాటిని పొందుకొనియున్నాను అని నీవు నమ్ముము,” అని చెప్పెను. అప్పుడు దానిని పట్టుకొనుము. దేవుడు చెప్పెను; అది ఆ విధముగానే ఉండును! ఆమేన్. దయ్యములు!
తండ్రి యందు విశ్వాసము, కుమారుని యందు విశ్వాసము,
పరిశుద్ధాత్మ యందు విశ్వాసము, మూడు ఒక్కటిలో ఉన్నవి.
దయ్యములు భయపడును మరియు పాపులు మేల్కోనెదరు.
యెహోవా యందు విశ్వాసముతో ఏదైయినను వణుకును.
అది సత్యము. ఓ, మై! అది నిశ్చయముగా జరుగును. దేవుని యందు విశ్వాసముంచుము. ఆయన వైపు చూడుము. మీరు కదలవద్దు. అక్కడే నిలచియుండుడి. దేవుడు చెప్పెను!
65
మరియు, దయ్యములు! అవేమిటి? అవి ఆత్మలు. ఇప్పుడు, ఒక డాక్టర్, “నీకు క్యాన్సర్ ఉన్నది. నీకు టి.బి. ఉన్నది. నీకు కంటి శుక్లము ఉన్నది. నీకు శ్వాసనాళ రోగము ఉన్నది. నీకు ఇది ఉన్నది,” అని చెప్పును. అది ఒక దయ్యము! అది ఒక జీవము, ఆ జీవము వెనకాల ఆత్మ ఉన్నది. ఎంతమంది ఎరిగియున్నారు మరియు చూడగలరు, క్యాన్సర్, కంటి శుక్లము, అది ఒక ఆత్మ, దానిలో జీవము ఉన్నది? మంచిది, ఆత్మ లేకుండా దేనికి జీవముండదు, కావున దానికి నిర్వహణ ఉండాలంటే ఎక్కడో ఒక చోట జీవము ఉండవలసి ఉన్నది.
66
చెట్టు కూడా జీవమును కలిగి ఉన్నది. లోకంలో ఉన్న విజ్ఞాన శాస్త్రమంతా కూడా ఒక గడ్డి పరకను కూడా చేయలేకపోయెను. అది నీకు తెలుసా? దాని వలె కనిపించు ఒక దాన్ని వారు చేయగలరు, కాని జీవము యొక్క సూత్రమును వారు కనుగొనలేరు. అదే దేవుడు, చూశారా.
యేసు చెట్టుతో, “నీవు శపించబడినదానవు, నీలో ఏ ఫలములు కలిగి లేవు, మరియు నీవు ఇక ఎన్నడు ఫలించకుందువు గాక,” అని చెప్పెను.
వారు తిరిగి అటువైపుగా వెళ్ళారు. అది ఉదయము 8 గంటలైనది. రాత్రి భోజనానికి వారు 11 గంటలకు అక్కడ నుండి వెళ్ళుచున్నారు. పేతురు “ఆ చెట్టువైపు చూడండి, అది వేర్లు వరకు చచ్చినది,” అని చెప్పెను. ఎందుకు? ఆ చెట్టులో వున్న జీవాన్ని (చెట్టు వేర్లలో ఉన్న జీవాన్ని) అంతటిని యేసు గద్దించెను, మరియు ఆ చెట్టు అంతా చచ్చిపోయినది. హల్లెలూయా!
67
అదే క్రీస్తు, వేర్లు మొదలుకొని క్యాన్సర్ ను గద్ధించగలడు, మరియు అప్పుడు అది అంతయూ చనిపోవును. కొన్ని గంటల క్రితం ఉన్నట్టుగానే ఆ చెట్టు అక్కడ అలాగే నిలబడి ఉన్నది. అయితే వాటి ఆకులు రాలిపోవటం మీరు గమనిస్తారు, మరప్పుడు బెరడు ఎండిపోవటం చూస్తారు. దిన దినానికి, వారం వారానికి ఆకులు రాల్చివేస్తు కొంత కాలానికి, ఆ చెట్టు గుర్తు కూడా లేకుండా పోయినది. హల్లెలూయా! క్రీస్తు పలికినప్పుడు క్యాన్సర్, గడ్డ, కంటి శుక్లము, లేక ఏదైనప్పటికి, వెళ్ళిపోవలసినదే. ఆయన దయ్యములను వెళ్ళగొట్టెను. “నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, సర్పములను ఎత్తి పట్టుకొందురు, లేక మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. వారు వ్యాధిగ్రస్తులపైన వారి చేతులుంచినప్పుడు, వారు స్వస్థతనొందుదురు,” అని ఆయన చెప్పెను.
68
మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఈ మధ్యాహ్నము మిమ్ములను ఒక గంటసేపు ఇక్కడ ఉంచినందుకు నన్ను క్షమించండి. మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారా? మంచిది, ఇప్పుడేమి జరగబోవుచున్నది — క్రీస్తును మీ స్వరక్షకునిగా అంగీకరించినట్లయితే, మరియు నీకు ఏదో జరిగినదని నీ హృదయములో నమ్ముచున్నావా. మీరు స్వస్థత పొందుకున్నారని నమ్ముచున్నారా? మీరు స్వస్థత పొందుకున్నారని నమ్ముచున్నారా? దయ్యము నీలో దేనిని పెట్టుటకు అనుమతిని ఇవ్వవద్దు. కేవలము ముందుకు సాగండి. “వైద్యుడా,” చెప్పుము, “వైద్యుడా, అది ఎలా కనపడుచున్నది?” “ఎందుకు, అది ఇంకా అక్కడే ఉన్నది,” అని ఆయన చెప్పెను.
మీ హృదయములో మీకు తెలుయును; ఏమి జరిగినదో మీకు తెలుసు. మొదటి కార్యము మీకు తెలుసా, “దానికి ఏమి జరిగినది చెప్పుమా?” అని అతడు అనుకుంటాడు.
అప్పుడు, “చూడండి, డాక్టర్ గారు, నేను మీకు ఒక విషయాన్ని చెప్పబోవుచున్నాను. ఏమి జరిగినదనగా: యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచెను. అది వాస్తవము. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరచెను,” అని చెప్పండి.
69
అది సరే, ఒక్క క్షణము మనము తలలు వంచుకొనెదము. సహోదరుడా విల్లెట్స్, ఒక నిమిషము మీరు ఇక్కడకొస్తారా, సహోదరుడా?
మా పరలోకపు తండ్రీ, క్రీస్తు యొక్క రక్తమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. కొన్ని సమయాలలో, ప్రభువా, మీ సేవకుడు ఎక్కువగా మాట్లాడుట ద్వారా జ్ఞానాన్ని ఉపయోగించలేకపోవచ్చును. అయితే నేను పౌలు వలె భావించవచ్చును, అతడు ఒక రాత్రంతా మాటలాడెను. ఒక చిన్న బాలుడు కిటికిలో నుండి క్రిందకు పడి, చనిపోయాడు. మరియు ఆ అపొస్తలుడు, తన జీవితములో దేవుని యొక్క వాక్యమును కలిగినవాడై, క్రిందకు వెళ్ళి, తన శరీరమును బాలునిపైగా ఉంచెను. అతనికి జీవము వచ్చినది మరియు అతడు మరల బ్రతికెను.
ప్రియమైన దేవా, ఈ గొప్ప నవనాగరికత యొక్క సూర్యాస్తమయము అస్తమించనై యున్నది, త్వరగా గతించిపోవుచున్నది. దినములో మధ్యాహ్నము దాటిపోయినది, సాయంకాలపు గుర్తులు పడుచున్నవి. భూమి పైకి వచ్చుచున్న కటిక చీకటి స్థానాన్ని ఆక్రమించుట కొరకై దేవుని యొక్క రాజ్యము నుండి గొప్ప వెలుగు ఉదయిస్తున్నది. దేవా, నేను ప్రతి దినము వృద్దుడనైపోవడాన్ని గ్రహించుచున్నాను. ప్రభువా, నన్ను వెళ్ళనివ్వండి; బలమును దయచేయండి; ఈ గొప్ప సత్యమును ప్రతి చోట చెప్పుటకై నాకు సహాయము చేయండి. రేపు మధ్యాహ్నము, మేము ఇంకా ఎక్కువగా అర్థము చేసుకొనులాగున, మాకు సహాయము చేయండి.
70
మరియు, ప్రియ దేవా, ఈ మధ్యాహ్నవేళ ఈ చిన్న గుంపుని ఆశీర్వదించండి. ఈ రాత్రి స్వస్థత కూడికకు వచ్చినప్పుడు, ప్రతి పురుషుడు మరియు ప్రతి స్త్రీ ఒకరి నొద్దకు ఒకరు చేరి మాట్లాడుకొంటూ, చెప్పుకొందురు గాక, “ఇప్పుడు, ఇక్కడ, మాకు ఇక ఏ అనుమానాలు లేవు. అది ఎక్కడ నుండి వచ్చెనో మేము అర్థము చేసుకొన్నాము. అది దయ్యమని మనకు తెలుసు. అతడు విడిచినప్పుడు.... అతనికి దేవుని యొక్క ఆజ్ఞ కావాలని మనకు తెలుసు; అతనికి కావాలి. దేవుడు అలాగు చెప్పెను; అతడు విడిచి పెట్టబడాలి.” అప్పుడు వారు సంతోషముతోను, ఆనందముతోను, స్వస్థతను అంగీకరించినవారై బయటకు వెళ్ళుదురు గాక. ఇక వారి మార్గములో ఏదీ నిలువనేరదు. కేవలము నమ్ముచూ వెళ్ళండి.
మరియు, దేవా, ఇక్కడ ఉన్న చిన్న సంఘమును, మరియు సహకరిస్తున్న ఈ సంఘములు, ఈ కూటము తరువాత ఒక ఉజ్జీవమును కలిగియుండును గాక. ప్రభువా, వందలాది మంది ఆత్మలను దేవుని రాజ్యములోనికి మూటకట్టి తెచ్చుదురు గాక. తండ్రి దాన్ని అనుగ్రహించండి. దేశ దేశముల నుండి, పలు ఇతర స్థలాల నుండి, ఇక్కడకు వచ్చిన పురుషులు, స్త్రీలు ఉండి ఉండవచ్చును, బహుశా వారు ఈ వర్తమానమును వారి సంఘములకు తీసుకొని వెళ్ళవచ్చును, బహుశా వారు పాత ఉజ్జీవమును కలిగి ఉండవచ్చును. దాన్ని అనుగ్రహించండి, ప్రభువా. ఇప్పుడు మా పాపములను క్షమించండి. మీ సేవకులుగా ఉండుటకు మాకు సహయము చేయండి. యేసుక్రీస్తు నామమున. ఆమేన్.
71
నేను ఆశ్చర్యపోవుచున్నాను, ఈ దినము ఇక్కడ ఈ భవనములో కూర్చున్న మీరు ఎవరైనా పాపిగా ఉన్నారా, “సహోదరుడా, బ్రెన్హాం నన్ను ప్రార్థనలో గుర్తుచేసుకొనండి?” అని చెప్పుచున్నారా. మీరు మీ చేతులను ఎత్తగలరా? ఎవ్వరైన పాపిగా ఉన్న వ్యక్తి ఉన్నారా? నాకు తెలియదు... దేవుడు నిన్ను దీవించును గాక. స్త్రీ, అక్కడ? అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. నిన్ను, నిన్ను, మరియు నిన్ను, దేవుడు నిన్ను దీవించును గాక, నేను ఆశ్చర్యపోవుచున్నాను. నీవు అయితే... ఇప్పుడు, ఇది మీకే.
చూడండి, సభ్యులు వెనుకకు వెళ్ళుటను నేను నమ్ముట లేదు. దానిని ఎవరు చేయుచున్నారో వారిని నేను తప్పుపట్టుట లేదు. సభ్యులలోనికి వెళ్ళి ఎవరినో ఒక్కరిని లాగుటను నేను నమ్ముట లేదు. చూశారా? “తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. చూశారా? అది సత్యము. ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా నీవు లాగుతావు. చూశారా? కాని దేవుడు నీ హృదయమును తట్టితే, ఈ లోకములో ఒక గొప్ప భాగ్యవంతుడవైన వ్యక్తివి నీవే. నేనెంత మంది ప్రజలతో మాట్లాడితినో నీకు తెలియదు...