దయ్యపు శాస్త్రము - మత సంబంధమైన రాజ్యము
VGR COUNT -243 అద్భుతమైన ఈ చిన్న పాట ఎంత మందికి తెలుసు, ఉత్సాహమైన క్రైస్తవ సహవాసము వలన క్రీస్తు యొక్క ప్రేమతోను, నేను ఈ దినాన మీకు శుభములు తెలుపుచున్నాను, “ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును,” అను ఈ చిన్న పాట ఎంత మందికి తెలుసు? అది మీకు తెలుసా? మంచిది. మనము దానిని పొందామన్నది చూద్దాం. సహోదరి, అది నీకు తెలుసా? నీకు తెలుసా?
ఇప్పుడు, ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును,
ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును;
సూర్యకాంతులతోను లేక ఛాయలతోను,
ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును.
ఓ, అది మంచిది.
దానిని ఇప్పుడు మరల ప్రయత్నం చేద్దాం.
ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును,
ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును;
సూర్య కాంతులతోను లేక ఛాయలతోను,
ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును.
2
మా పరలోకపు తండ్రి, [టేపులో ఖాళీ ఉన్నది] మీరు మా కొరకు జాగ్రత్త వహించి, మీ యొక్క స్పష్టమైన ప్రేమను మాకు కనబరచి, అంతే కాక మీరు మీ యొక్క సొంత ప్రియమైన కుమారుని పంపితిరని నమ్ముచున్నాము, నేరస్థులైన పాపుల స్థానమును స్వీకరించుటకై నిర్దోషమైన దేవుని యొక్క కుమారుని పంపితివి. నీవు మా కొరకై జాగ్రత్త వహించి, మా కొరకు శ్రద్ద వహించునందుకు మేము నీకు ఏ విధముగా ధన్యవాదములు తెలియజేయుదము! మరియు ప్రభువా, మేమెంతో హర్షించుచున్నాము. ఆకాశము యొక్క పందిరి క్రింద ఈ మధ్యాహ్నవేళ మేము ఇక్కడ కూడుకున్నందులకై సంతోషించుచున్నాము, మరియు ఈ కూటమును మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాము. ప్రతి పురుషుడు, స్త్రీ, బాలుడు లేక బాలిక ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, ఇప్పుడు లేఖనములను లోతుగా అధ్యయనము చేయుదురు గాక. అనుగ్రహము చూపండి, ప్రభువా, సాతాను చేత నియంత్రించబడుచున్న ఈ ప్రపంచమును మేము ఎదుర్కొనబోవుచున్నాము. మరియు, తండ్రి, దయ్యము యొక్క శక్తిని గూర్చియూ, మరియు ప్రజలకు అది ఏమి చేస్తున్నదో అందును గూర్చియూ, మేము చదువుచుండగా, మాకు గొప్ప విశ్వాసాన్ని దయచేయండి, మరియు బహుశా అనేక గొప్ప సూచనలు మరియు అద్భుతములు జరిగించుమని, మేము ప్రార్థిస్తున్నాము. దేవుని యొక్క మహిమార్ధమై, మేము దీనిని క్రీస్తు నామమున అడుగుచున్నాము.
3
త్వరగా అందులోనికి వెళ్ళి, ఈ మధ్యాహ్నము మనము దీనిని చదువుకుందాం, నేను తలంచుచున్నాను, సుమారు పదిహేను నిమిషములు పాటు, అది ఇంకా దయ్యపు శాస్త్రము పైనే ఉన్నది.
మరిప్పుడే కొద్ది సేపటి క్రితం, నా సహోదరుడు బీలర్ నుండి నాకొక వర్తమానము అందినది. నేను జులై మాసము మధ్యలో ఆఫ్రికాకు బయలుదేరుచున్నాను. కాబట్టి అది నిర్ణయమైనది, ఇప్పుడు మనము దానిని తీర్మానించుకున్నాము. మరియు సహోదరుడు బాక్స్టర్ ఆ సమయములో వెళ్ళలేదు. కాబట్టి నేను వెళ్ళుచున్నాను. నేనే ఆఫ్రికాకు వెళ్ళవలసియున్నది. కాబట్టి అక్కడకు వెళ్ళుచున్నాను... బహుశా... కనుక ప్రభువు నాకు సహాయము చేయు రీతిగా మీరు నా కొరకు ప్రార్థించవలసియున్నది, కారణము ఇప్పుడు నేను నిజముగా అక్కడకు వారి మధ్యకు వెళ్ళవలసిన అవసరత ఉన్నది... రెండు వందల వేల మంది ప్రజలు ఆ కూటమునకు వచ్చెదరని నేను అంచనా వేయుచున్నాను.
4
మరియు నాకొచ్చిన ఒక దర్శనాన్ని ఇక్కడ వ్రాసికొని యున్నాను. దాని వలన జనులైన మీరు మేలు పొందాలని నేను కోరుకుంటున్నాను. అది డిసెంబర్లో జరిగినది. ఒక ఉదయమున నేను గదిలో ఉంటిని, అప్పుడు ప్రభువు యొక్క దూత లోపలికి వచ్చెను. మీరు చూడండి, నేను అక్కడ ఉన్నప్పుడు, నేను దేవునికి అవిధేయుడనయ్యాను, నాకు అమీబా సోకినది. ఏ మనిషికైన తెలుసు - అమీబా ఏ విధంగా ఉంటున్నదోయని, అది ఒక పరాన్న జీవి... దాదాపు నిన్ను చంపేస్తున్నది. ఎందుకనగా దేవుడు చేయవద్దు అని చెప్పిన దానిని నేను చేసితిని కాబట్టి. ఆ కథ ఎంత మంది వినియున్నారు? ఇక్కడున్న మిలో కొంత మంది వినియుంటారని నేను తలంచుచున్నాను. జరిగిన కథ టెబర్నికల్ చుట్టూ వున్న జనులందరికి తెలియునని నేను అనుకుంటున్నాను, దేవుడు నాకు ఒక స్థలానికి వెళ్ళమని చెప్పెను, ఈ స్థలానికి దూరముగా ఉండమని మరియు వెనుక వేరే స్థలానికి వెళ్ళమని చెప్పెను. ఇప్పుడు నేను దానిలో నుండి బోధకులతో మాట్లడనివ్వండి, ఇప్పుడు, బోధకులు అద్భుతమైన వారు, మరియు వారు నా సహోదరులు, అయితే దేవుడు నీకు ఏమి చెప్పాడో దానిని మనస్సులో ఉంచుకొనుము. అది సరే, చూశారా. నీకు ఒక పని ఉన్నది.
5
ఒకే సమయములో ఇద్దరు ప్రవక్తలు బైబిల్ లో ఉన్నారు అని ఎంతమందికి గుర్తున్నది? మరియు వారిలో ఒక్కడు, ప్రభువు అతనికి చెప్పెను. “నీవు ఒక నిశ్చితమైన స్థలానికి వెళ్ళు. మరియు నీవు రావద్దు... నీవు వేరొక మార్గమున వెళ్ళు,” అని చెప్పెను మరియు ఆ విధంగా. మరియు చెప్పెను, “నీవు అక్కడవున్నప్పుడు తినవద్దు త్రాగవద్దు,” అని చెప్పెను.
మరియొక్క నిజ ప్రవక్త అతనిని కలుసుకొనెను, మరియు “ఆయన నిన్ను కలుసుకొనిన తరువాత, ప్రభువు నన్ను కలుసుకొనెను,” అని చెప్పెను. మరియు “నా యింటికి రా,” అని చెప్పెను. మరియు ఆ ప్రవక్త వేరొక ప్రవక్త ఏమి చెప్పెనో వినుచుండెను, మరియు దాని ద్వారా అతను ప్రాణమును పోగొట్టుకొనెను. చూశారా, ఎవరు ఏమి చెప్పినా చూడొద్దు, దేవుడు నీకు ఏమి చేయమని చెప్పుతో దానినే నీవు చేయుము.
6
ఇప్పుడు మనము, ఈ దర్శనములో ఉన్నాము. అది నన్ను మేల్కొలిపెను, సెప్టెంబర్ - లేక డిసెంబర్ పదమూడున. మరియు నేను నా యొక్క పడక ప్రక్కన కూర్చొని ఉంటిని. నేను నా భవిష్యత్ ఏమైయుంటున్నదో అని ఆశ్చర్యపోవుచున్నాను. నేను తిరిగి ఇక్కడకు వచ్చినప్పుడు, వారు నన్ను క్రిమి సంహారక గదిలోనికి త్రోయుటకు సిద్ధంగా ఉన్నారు. అప్పుడే పరాన్నజీవి నన్ను తీసుకొంటున్నది. నేను ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు నాకు పరీక్ష చేశారు. మరియు, దేవుని కృప చేత, వారు నన్ను ఇంటికి వెళ్ళనిచ్చిరి, ఎందుకనగా అది చాలా చెల్లాచెదురైపోయినది. మరియు నేను ప్రార్థించాను, మరియు ఆ దైవ సేవకుల యొద్దకు వెళ్ళాను. “ఆ మార్గమున వెళ్ళొద్దని ప్రభువు నాకు చెప్పెను,” అని నేను చెప్పాను. “ఓ, దేవుడు నీకు ప్రక్కగా ఏవరితోనో మాట్లడుచున్నాడు,” అని చెప్పెను.
“కోరహుకి ఒకసారి అలాంటి తలంపే కలిగినదని,” నేను చెప్పాను. మరియు అలాగున, కాబట్టి నేను వెళ్ళిపోయి కొన్ని ఆకులు తెచ్చి వారి పాదముల యొద్ద పెట్టి, మరియు నేను ఇలాగున చెప్పాను, “గుర్తుంచుకొనండి, ప్రభువు యొక్క నామములో అక్కడకు మనము ప్రయాణించినా అది విఫలమే అగును, మనమంతా దాని కొరకై మూల్యం చెల్లించెదము.” మరియు మనము తప్పక చేద్దాం! ఓ, మై! మేమంతా చనిపోయినవారి వలే ఉన్నాము, కాబట్టి అప్పుడు మరల తిరిగి వస్తున్నాము.
7
మీరు ఇతర దేశాలలో మీరెంతో పోరాడుచున్నారు. ఉదాహరణకు, ఒక చిన్న పురుగు (flea) నిన్ను కుట్టును. అప్పుడు నీకు కొద్దిగా జ్వరం రావటానికి కారణమగును. మరియు ఆ చిన్న ప్రాణి అది నిన్ను కుట్టినప్పుడు, నీకు దురదగా ఉన్నట్లుగా భావించెదవు, దానిని నీవు గోకలేవు, నీవు చూడు, అది ఒక చిన్న నల్లటి వ్యక్తి అయినచో, దాన్ని లాగివేయవద్దు. అది ఒక చిన్న తలను కలిగి ఉన్నది, అది శరీరములోనికి రంధ్రము వేసుకొంటూ, ఈ విధంగా చుట్టూ తిరుగుచూ, మరియు దానికదే బంధించుకొంటున్నది. నీవు దాని లాగినట్లయితే, అందులో తలను ఉంచి లాగివేస్తావు. దానిలో అంటురోగపు క్రిమీ ఉంటున్నది, నిన్ను శక్తిహీనపరుస్తున్నది. కాబట్టి గోకవద్దు లేక దాన్ని లాగివేయవద్దు; కొంత క్రొవ్వును తీసుకొంటున్నది. మరియు అది తన వెనుక భాగము నుండి గాలిని పీల్చుకుంటున్నది. దానిపైన కొవ్వును వేస్తున్నది మరియు అది బయటకు వస్తున్నది.
తరువాత అక్కడ ఒక చిన్న దోమ ఉండియున్నది. అది చిన్న శబ్దం కూడా చేయదు. అది నేరుగా గాలిలోనికి వస్తున్నది. [సహోదరుడు బ్రెన్హాం తన చేతిని తట్టుచున్నారు.] అది నిన్ను అలా తాకును, అది అంతే; నీకు మలేరియా వస్తున్నది.
8
మరప్పుడు వారు అక్కడ వాటిని మాంబా పాము అని పిలిచెదరు. అది నిన్ను కుట్టినట్లయితే, అది నిన్ను కుట్టిన తరువాత నీవు రెండు నిమిషములు మాత్రమే బ్రతుక గలవు.
మరిక్కడ పసుపు రంగు త్రాచు పాము ఉన్నది. అది నిన్ను కరిచిన తరువాత నీవు పదిహేను నిమిషములు మాత్రమే జీవిస్తావు. మరియు వాటిలో ఒకటి నా కుమారునికి దగ్గరగా వచ్చినది, దాని తలపైన అతడు చేయిపెట్టెను. మేము దానిని తుపాకీతో కాల్చివేయుటకు ముందు, అది కరుచుటకు, తలనుపైకి ఎత్తినది.
మరియు అక్కడ నల్లత్రాచు పాము ఉన్నది. ఓ, అలాంటివి అనేకమైనవి అక్కడున్నవి! మరప్పుడు అపాయకరమైన అడవి జంతువులు ఉన్నవి, బహుశా, అడవిలో సింహాములు, పులులు, లేక చిరుత పులులు, మరియు ప్రతీదియూ కూడా ఒకదానికొక్కటి పోట్లాడుకొనును. మరప్పుడు వ్యాధులు, అన్ని రకములైన వ్యాధులు అచ్చట ఉన్నవి.
నీవు వెళ్ళునపుడు నీవు దానంతటిని ఎదుర్కోనవలసి వున్నది. ఆ వెనుక ఒక మూఢభక్తి మరియు అలాంటి అన్ని కోణములోను నీపై సవాలు విసరుటకు ఒక మాంత్రిక వైద్యుడున్నాడు. అయితే, మన ప్రభువు వాటిని తరంగముల వలె, ఈ ప్రక్కకు ఆ ప్రక్కకు ఊపివేయుచుండుట, ఎంతటి ఆశ్చర్యకరమైన కార్యముగా కనపడుచున్నది. ఆ దినాన నేను ఇక్కడ నిలబడి ఉండగా, ఏమి సంభవించినదో, నాకు జ్ఞాపకమున్నది. నేను మీకు మరొక కూటములో చెప్పెదను, ఎందుకనగా నేను ఈ మధ్యాహ్నవేళ నా అంశమైన దయ్యపు శాస్త్రమును గూర్చి చెప్పాలని అనుకుంటున్నాను.
9
కాని ఇప్పుడు, మరిక్కడ కూర్చొని, అంతము ఏమైయుంటుందని దాన్ని గూర్చి నేను ఆలోచించుచున్నాను? మరియు సముద్ర మార్గము దాటి వస్తున్నప్పుడు అక్కడ వందల వేలమంది మార్పు చెందినవారు ఉన్నారని నాకు తెలుసు, ఆ సమయమందు మనము అక్కడ ఉన్నాము. మరియు పెద్దవాడైన సహోదరుడు బోస్వర్త్ నా దగ్గరకు వచ్చి, చెప్పెను, “మంచిది, సహోదరుడా బోస్వర్త్” అని నేను చెప్పాను.
“నేను నిన్ను బట్టి చాలా గర్విస్తున్నాను, సహోదరుడా బ్రెన్హాం!” అని అతడన్నాడు. “నీవు జీవము యొక్క ఆరంభములోనే ఉన్నావు,” అని అతడన్నాడు.
మరియు అతడు చెప్పెను, “మంచిది, అది అంతా అయిపోయినదని నేను తలంచానని నేను చెప్పాను. ”నాకు నలభై సంవత్సరాలు దాటినవి. నేను మంచి పోరాటం పోరాడి నా పరుగు తుదముట్టించితినని తలంచుచున్నాను,“ అని నేను చెప్పాను.
అతడన్నాడు, “నలభై సంవత్సరాలు గతించినవా?” “నేను రక్షింపబడినప్పుడు అదే వయస్సువాడిని,” అని చెప్పాడు. “నేను ఇంకా మంచివాడిగానే ఉన్నాను,” అని చెప్పాడు. అతడు తన ఎనభైలోనికి వెళ్ళుచున్నాడు.
మరియు “మంచిది, బహుశా అది సరికావచ్చును,” అని నేననుకుంటున్నాను.
కనుక, “కాదు, నీవు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన క్రొత్త బ్రెన్హాం. నీకు, నీ కూటములను మరియు అలాంటి ప్రతి దానిని ఏ విధంగా బాగా వశమందు ఉంచుకొనవలెనో నీకు తెలుసు,” అని అతడన్నాడు. “కేవలము, నీవు ఎప్పుడైనా అమెరికాను సరైన విధముగా సంధించినట్లయితే, సరైన విధముగా కూడికలను ఏర్పాటు చేసినట్లయితే, ఒక స్థలములో నీవు ఆరు లేక ఏడు వారములు ఉండి, దాని చుట్టూ ప్రకటనలు చేసినట్లయితే,” చెప్పెను “నీవు మన ప్రభువు కొరకు ఏదో కార్యము చేసియుండేవాడవు,” అన్నాడు. కాబట్టి మేము ఆ విధంగా ముందుకు వెళ్ళాము, కనుక అది చాలా - చాలా బాగున్నది.
10
కొంచెము కాలము తర్వాత, నేను అమెరికాలో ఉన్నపుడు, నేనొక దర్శనం చూశాను, అది నా యొద్దకు వచ్చెను, ఆఫ్రికాకు నేను తిరిగి వచ్చాను, నేను డర్బన్ పట్టణము ముందుగా కూర్చొని ఉండగా, అదే కూటము నాకు చూపించబడినది. మొదటి కూటము పశ్చమ దిశగా వెళ్ళుచు, చరిత్రలో నుండి దూరముగా కాంతి విహీనమైపోయినది. రెండవ కూటము లేపబడెను, అది లేపబడినపుడు, అది మొదటి కూటము కంటే అది ఇంకా పెద్దదిగా ఉండెను. నేను ఒక కేకను విన్నాను, ఆయన ఒక గొప్ప వెలుగును కలిగి, పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చుచుండెను.
మన ముందు నిలబడిన ఆ ప్రభువు యొక్క దూత, నిలబడుచూ వున్నది, ఎల్లప్పుడు నాకు కుడిప్రక్కగా పైన వుంటున్నది. అది అక్కడే నిలబడి వున్నది, అది ఉండెను - అది చుట్టూ తిరుగుచుండెను. ఈ మనుష్యుడు ఆయన క్రిందగా ఉండుటను నేను చూశాను. ఇప్పుడు, నీవు అతన్ని చూచినప్పుడు, అది దర్శనం కాదు. నీవు నా వైపు చూస్తున్నట్లుగా ఎంత వాస్తవమో, అది కూడ అంతే వాస్తవము. ఎందుకని, ఆయన నీతో నడుచుటను మాట్లాడుటను నీవు వినగలవు, ఏదైనా. ఆయన వాస్తవమైనవాడు. నీవు ఎలాగైయితే నిలబడి వుంటున్నావో; ఆ మనిషి కూడా అలాగే నిలబడి ఉన్నాడు, అది దర్శనం కాదు. ఆయన స్వరం, నీ స్వరం లేక నా స్వరం వలె వాస్తవముగా వుంటున్నది. దర్శనమైతే, నీ ముందు ఏదో తెరువబడినట్లుగా, నీవు చూస్తావు. కాని ఈ మనిషి అయితే, నడిచి వెళ్ళి అక్కడ నిలబడెను.
11
కాబట్టి ఆయన ఏమి సంభవింపబోవుచున్నదో నాకు చెప్పెను. మరాయన అది చెప్పాడు... ఈ దేవదూత దిగివచ్చి, తిరిగి ఈ మార్గమువైపు చూడమని ఆయన నాతో చెప్పెను. మరియు అది ఇండియా వైపుగా చూపించుచున్నది, ఇప్పుడు అది ఇండియా దేశమని నేను చెప్పుట లేదు, అయితే దానికి సమీపముగా ఉన్నది.
కాని వారు ఇండియా ప్రజలు. ఎందుకనగా, ఆఫ్రికనులు పెద్ద, లావుగా, అధిక బలము కలిగిన ప్రజలు. వారిలో కొందరు సరాసరి ఏడు అడుగుల పొడవు, మరియు బరువు, ఓ, రెండువందల-ఎనభై, లేక మూడు వందల పౌనుల బరువు, లావు గలవారుగా ఉంటారు. ఇప్పుడు జూల్స్, సంగయి, మరియు బాజుడ, మరియు, ఓ అనేక రకమైన జాతులవారు ఉన్నారు. నేను మాట్లడుచూ ఉండగా, ఆ దినాన అక్కడ పదిహేను రకములైన తెగల వారు కూర్చోనియున్నారు.
12
“యేసుక్రీస్తు, దేవుని యొక్క కుమారుడు,” అని నేను ఇలా, ఒక్క మాట చెబితే, అది అంత అనువదించడానికి ముందే నేను మంచి నీళ్ళు త్రాగవచ్చును. ఒకరు ఇలా చెప్పెదరు... మరియు అందరూ శబ్దం చేస్తారు! నేను పెంతెకోస్తు జనులు భాషల్లో మాట్లాడుటను వినుచున్నప్పుడు, బహుశా ఒకరు ఒక రకమైన శబ్దంతో మాట్లాడుదురు మరి ఇంకొక్కరు వేరే విధంగా మాట్లాడుదురు, అది లోకమునకు ఎలాగుంటున్నది? అని నేను తలంచుకొంటూ ఉంటాను. అయితే బైబిల్ సత్యమని నేను నమ్మెదను, మరియు ఇది తెలుసుకో, అది చేప్పబడినప్పుడు అక్కడ విశేషము లేకుండా ఏ శబ్దము ఉండదు. “వారిలో కొందరు ఇలా చెప్పెదరు, వారిలో ఒకరు వెళ్ళి ”బిర్ల్ బిర్ల్ బిర్ల్ బిర్ల్“ అని అంటారు, దాని అర్థం ”యేసుక్రీస్తు, దేవుని కుమారుడు.“ మరియొక్కరు వెళ్ళి ”క్లక్ క్లక్ క్లక్,“ అని అంటారు, అది తన యొక్క భాషలో ”యేసుక్రీస్తు, దేవుని యొక్క కుమారుడు,“ అని అర్థం. కాబట్టి అది ఏ రకమైన శబ్దం అయినప్పటికి, దాని అర్థం ఎక్కడో ఒక చోట ఉంటున్నది, అది సత్యము. అది ఏ విధమైన శబ్దం అయినప్పటికి ఎవరికో ఒకరికి ఏదో చోట అది ఏదో విధంగా అర్థమౌచున్నది. మరియు అది వారు వ్యక్తపరుస్తారు.
13
ఆ దేవదూత క్రిందికి దిగి వచ్చినప్పుడు, నా ఎడమ వైపుగా దానిని నేను గమనించాను. మరియు నేను తేనెటీగల గుంపు వలే అక్కడ చూశాను, మరియు వారు మనుష్యుల వలె... ఆ విధంగా కనిపించారు. వారి చుట్టూ ఒకటి ఈ విధంగా దుప్పటి చుట్టబడినట్టుగా, ఒక చిన్న బిడ్డ పొత్తిగుడ్డలతో ఎలాగు చుట్టబడెదడో, వారు అలాగున దుప్పటితో చుట్టబడియున్నారు. మరియు అది.... మరియు నేను ఎంత దూరం చూడగలనో అంత దూరం నేను చూడగలుగుచున్నాను, అది ప్రజలు కాక మరొకరు కాదండి. అటు తరువాత ఈ దేవదూత ముందుకూ వెనుకకూ బలంగా ఊగుచున్న గొప్ప వెలుగు కాంతి వలె కనిపించాడు. మరియు నా జీవితంలో అంత మంది జనులను నేనెన్నడునూ చూడలేదు!
అంతట ఈ మరొక దేవదూత నిజముగా నాకు దగ్గరగా వచ్చి, మరియు అతడు చెప్పాడు, “ఆ కూటములో అక్కడ మూడు వందల వేల మంది ఉన్నారు,” అని చెప్పాడు. మరియు నేను దానిని ఈ క్రింద వ్రాసుకొనియున్నాను. మరియు నేను ఫిన్ ల్యాండ్ లోని ఒక చిన్న బాలుడను స్వస్థపరచునని చెప్పినట్లుగా, మీరు కాగితపు ముక్క మీదనో లేక అలాంటి రకమైన దాని మీదనో వ్రాసుకొనండి. మీరు మీ బైబిల్ పుస్తకము యొక్క మొదటి పేజీ లేక కడపటి పేజీలోనో లేక మరేదో చోటనో ఈ కూటములో వ్రాసుకొనండి. అక్కడొక కూటము జరగబోవుచున్నది, (మరియు మీరు ఏదో వెలువడు ద్వారము గుండా వింటారు.) ఆ కూటమునకు మూడు వందల వేల మంది హజరగుచున్నారు. చూడండి, ఇప్పుడది వాస్తవము కాకపోతే, అది మిగతా దానికంటే మూడింతలు ఎక్కువై యుంటున్నది, చూశారా. మూడు వందల వేల మంది జనులు ఈ కూటమునకు హజరగుచున్నారు. నేను అక్కడకి వెళ్ళుటకు చాలా ఆనందముగా ఉన్నది. నేను ఏమి చేయాలో నాకు తెలియదు, మన ప్రభువు కోసం ఆత్మలను సంపాదించుటకు నేను ఇష్టపడుదును.
మరక్కడ, ఒక్క సమయములో, చూస్తూ - చూస్తూ ముప్పై వేల మంది అన్యులు, ఒక్క వేదిక పిలుపుతోనే క్రీస్తు నొద్దకు వచ్చెను - ముప్పై వేల మంది అన్యులు.
14
ఇప్పుడు, మనము మన పాఠములోనికి త్వరగా వెళ్దాం. నిన్నటి రోజున మనము దయ్యముల యొక్క ఎత్తులను గూర్చి అధ్యయనము చేశాము, దేవుడు నన్ను నడిపించులాగున, నేటి దినాన నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. అది వ్యక్తపరచుటలో ఎటువంటి స్వాతంత్ర్యము ఉన్నదో నాకు తెలియదు.
ఇప్పుడు, నేను ఉపాధ్యాయుడను కాను. నేను ఎల్లవేళలా బైబిల్ ని గూర్చి విశదపరచేవానిగా ఉంటాను. నా యొక్క విద్యాభ్యాసము ఏడవ తరగతికి దాటి మీరలేదు, కాబట్టి... మరి నేను పాఠశాల నుండి ఇరవై-ఐదు సంవత్సరాల క్రితమే బయటకు వచ్చేశాను, కాబట్టి అది నాకు ఎంతో దూరమైపోయినది. మరియు నాకు సరిపడినంత విద్యాభ్యాసము లేదు, అయితే నేను ఏదైతే ఆత్మ ప్రేరణ ద్వారా పొందుకుంటానో, అది అంతా నాకు తెలుసు.
మరియు ఆ ప్రేరేపణ బైబిల్ తో సరిపోకపోతే, అది తప్పు అవుచున్నది, చూశారా. అది బైబిల్ తో ఉండవలసియున్నది. అది ఎటువంటి ప్రేరణ అయినప్పటికి, అది రావలసి ఉన్నది... ఇక్కడ దేవుని యొక్క పునాది ఉన్నది. ఇది కాక వేరొక పునాది వేయబడలేదు. మరియు ఇది ఏమిటి, నేను దీనికి వ్యతిరేకముగా ఏదైన చెప్పినట్లయిన, మీరు నా యొక్క మాట అబద్దం అని తలంచుడీ, ఎందుకనగా ఇది సత్యమైయున్నది, చూశారా, చూశారా. మరియు “దీనికి వ్యతిరేఖముగా ఒక దేవదూత మీకు ఏదైన చెప్పినయెడల, అతడు శాపగ్రస్థుడవును గాక,” అని పౌలు చెప్పాడు. అతడు వెలుగు దూత అయినప్పటికి! ఇప్పుడు, అనేక గొప్ప కార్యములు ఉన్నవి. నేను మాత్రం... అది మాత్రం... ఎందుకనగా జనులకు ఈ పాఠమును చెప్పుటకై నేను రెండు దినాలు ఎన్నుకొన్నాను, నిన్న మరియు ఈ రోజు మధ్యాహ్నవేళ కూటములు.
15
ఇప్పుడు, ఈ కారణము చేతనే, ప్రభువు నాకు సహాయము చేసినట్లయితే కొద్దిగా నాకు నేనుగా చూచుటకు ప్రయత్నం చేస్తాను. నా హృదయములో ఏదో కార్యమున్నది. మరది, అది ఈ గొప్ప కూటము అనంతరము, తర్వాత దేవుడే తనకు తానుగా ఆయన వాక్యములో ఏదైతే నేను సత్యమని చెప్పానో, దాన్ని ఆయన మొదటిగా ఆయన వాక్యము చేతనూ, తర్వాత సూచనలు, అద్భుతముల ద్వారాను నిర్ధారణ చేయుచుండెను. ఇప్పుడు, నేను అనుకొనుచున్నాను, సంఘానికి సత్య సువార్త చేత, నేను దేవునికి బద్ధుడనైవుంటూ, సంఘానికి దీనిని తెచ్చితిని. అది వాస్తవము. వారు అనేక రకములైన నిర్మాణాత్మక సంఘాలుగా బ్రద్దలగుచూ, అవి అనేక భాగములుగా విడిపోవుచున్నవి, ఇంకను అది తప్పే. మనము తిరిగి జన్మించినప్పుడు, మనమంతా దేవుని యొక్క పిల్లలము, అంతే, చూశారా. మనము ఆయన యొక్క బిడ్డలమనే సత్యమును తెలుసుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు.
16
ఇప్పుడు, జ్ఞాపకముంచుకొనుము, సొలోమోను యొక్క దేవాలయము ప్రపంచమంతటా నరకబడినది. మరియు ఇక్కడ ఒక రాయి ఈ విధంగా వంగి వచ్చినది, మరియు ఒక రాయి ఆ విధంగా వంగి వచ్చినది, మరియు ఒకటి ఈ విధంగా నరికి వేయబడినది, మరియు ఒకటి ఆ విధంగా నరకబడెను. అయితే, అవి అంతా దగ్గరగా వచ్చినప్పుడు, అక్కడ రంపము యొక్క జుంకార ధ్వని కాని, సుత్తి యొక్క శబ్దం కాని లేవు. ప్రతిది వాటి వాటి స్థానములోనికి వెళ్ళిపోయినవి. దేవుడు వాటికి ఉపాధ్యాయుడై యున్నాడు.
అసెంబ్లీస్ అని, చర్చ్-ఆఫ్-గాడ్ అని, మరియు ఒకటి ఇది అని మరియు ఒకటి అది అని పిలువబడు సంఘము దేవునికి ఉన్నవి; ఓ, అయితే, అవి అన్ని ఒక్కచోటకు వచ్చినప్పుడు, వారు అంతా సహోదర ప్రేమ కలిగిన ఒక పెద్ద గుంపుగా ఉంటారు, మరియు దేవుడు ఆ సంఘాన్ని సమ్మేళనము చేసి మరియు ఆమెను ఆయన ఆకాశానికి కొనిపోవును.
17
ప్రతి ప్రఖ్యాతి గాంచిన చిత్రము, అది కళా భవనములో వ్రేలాడబడుటకు ముందు, అది విమర్శకుల యొక్క బహిరంగ భవనము గుండా వెళ్ళి, ముందుగా అది ఎన్నడూ వేలాడనటువంటి ఆ భవనములో వ్రేలాడవలసి ఉన్నది. ప్రధమంగా ఒక అనుభవం లేని చిత్రకారుడు, నన్ను క్షమించండి. నేను అతని పేరును పిలువ లేను, ఆఖరి రాత్రి భోజనపు పటమును గీసెను, ఏ విధంగానైన, అది అతని జీవితకాల మూల్యమే అవుచున్నది. అతడు ఆ చిత్ర పటమును చిత్రీకరించాడు. క్రీస్తుకు మరియు యూదాకు మధ్య చిత్రీకరించుటకు, అది ఇరవై లేక పది సంవత్సరాలు పట్టి ఉంటుందని, నేను నమ్ముచున్నాను. మరియు ఆ ప్రఖ్యాతిగాంచిన పటమును మీరు గమనించితిరా, అదే మనిషి క్రీస్తు చిత్రము కొరకు నిలబడ్డాడు, పది సంవత్సరాల తరువాత అదే వ్యక్తి యూదా కొరకు చిత్రము కొరకు నిలబడ్డాడు. అది నిజము. ఆయన చేశాడు. ఒక గొప్ప సంగీతశాలా, విధ్వాంసుడు క్రీస్తు యొక్క స్థానమును తీసుకొని, యూదా యొక్క స్థానమునకు వచ్చుటకు, పది సంవత్సరాలు పట్టనవసరము లేదు. నీవు ఆ కార్యము చేయుటకు పది నిమషములు పట్టును. అది పాపములో, నీ యొక్క గుణమును మార్పు చేయును. అయితే, ఏ విధంగానైనను, ఆ చిత్రము విమర్శకులందరి ద్వారా వెళ్ళెను.
18
గుంపు అని పిలువబడుచున్న, దేవుని యొక్క సంఘాన్ని గూర్చి నేనివిధంగా ఆలోచించుచున్నాను. మంచిదే, ఇందును గూర్చి ఏ గాయము చేయాలని నా భావము కాదు. నేను ఏడు సముద్రాల గుండా ఓడ ప్రయాణము చేసితిని. మూడవ సారి ప్రపంచ యాత్రలో వున్నాను. “పరిశుద్ద గుండ్రాళ్ళు - పరిశుద్ద గుండ్రాళ్ళు,” అని జనులు చెప్పుచుందురు. నేను ప్రపంచమంతటా పరిశోధించాను. అయినప్పటికి ఒక్క పరిశుద్ద గుండ్రాయిని నేనెన్నడు కనుగొనలేదు. ఆ పేరును దయ్యము జనులకు తగిలించినది. అంతే, పరిశుద్ద గుండ్రాయి అనునటువంటి ఏ ఒక్క కార్యము లేదు. ప్రపంచములో వ్యవస్థాపకమైన ప్రతి ఆరువందల-ఆరవై-ఎనిమిది సంఘాలైన వారిలో ఏ ఒకరైన పరిశుద్ధ గుండ్రాయి అని పిలువబడలేదు. అది ప్రభుత్వం నుండి వచ్చినది. నేనెరిగినంత వరకు పరిశుద్ద గుండ్రాయి అని పిలువబడు ఏ ఒక్క సంఘము కూడా లేదు. కనుక, దానిని దయ్యం పిలిచినది. అయితే, ఇప్పుడు, వీటన్నిటిలో, ఈ కార్యాలన్నిటిలోను, దేవుడు ఒక చిత్రాన్ని చిత్రీకరించాడు. ఒకప్పుడు ఈ చిన్నదైన పాత సంఘములు ఇక్కడ ఉండేవి, మీలో కొందరు...
19
ఈ నెరసిన తల గల మనిషిని నేను గమనిస్తున్నాను. నేను గదిలో, చదువుచూ వున్నాను, మరి ఒక దైవజనుడు నిన్నటి దినాన నా బాలుడు దగ్గరకొచ్చి, ఇలా అన్నాడు, “మీ నాన్న గారితో కరచాలనం చేయాలని ఇష్టపడుచున్నాను.” బహుశా నా కుమారుడు బ్రదర్ బాక్స్టర్ తో పెరిగాడు మరియు వారితోను, త్వరగా: “లేదు”; అదంతే,“ అని అన్నాడు. నాకు అది ఇష్టముండదు, చూశారా. ఏమైయిన పర్వాలేదు అకవేళ నేను.. బహుశా, దేవునికి మనిషికిని నేను సేవకునిగా ఉండలేను. అయితే నా సహోదరులతో కరచాలనం చేయుటకు నేను ఇష్టపడుచున్నాను. నేను అది చేయుటకు ఇష్టపడుదును. అక్కడ దాన్ని గూర్చి ఏదో ఒకటి వుంటున్నది, నేను దైవజనులతో కరచాలనం చేయుటకు ఇష్టపడుచున్నాను, ఒక్క దైవజనుడుతోనే కాదు, దేవుని యొక్క బిడ్డలెవరైయినను, నేను అది చేయుటకు ఇష్టపడెదను. నా భార్య కొద్దిసేపటి క్రితం దాన్ని గూర్చి నాకు చెప్పినంత వరకు అది నాకు తెలియదు. మంచిది, ”ఒక్క నిమిషం, ప్రార్థన అనంతరం తిరిగి వస్తాడు మరియు తండ్రి ఏమి చెప్తాడో నేను కనుక్కొని చెప్తాను,“ అని అతడు ఆ దైవజనుడితో చెప్పగలిగివుండినట్లయితే, అది చాలా బావుండేది. కాబట్టి నేను అలా చేయకూడదు అని చిన్నగా సరిద్దిదాను, చూశారా.
20
కనుక కొద్ది సేపటి క్రితం, సహోదరుడు చెప్పిన విధంగా, అది సత్యమే, నీవు సరిగ్గా చేయలేకపోయావు. నీవు అది చేసినట్లయితే, రాత్రివేళ నేను అలసిపోయాను, నీవు చూచావా. జనులు బహుశా ప్రతి ఒక్కరు వ్యాధిగ్రస్తులుగా వుండి మాట్లాడుకొంటారు, వారు దాన్ని గూర్చి మాట్లాడుకోబోవుచున్నపుడు, వెంటనే, అక్కడ ప్రభువు యొక్క దూత దాన్ని గూర్చి చెప్పుటకు అక్కడ వున్నాడు.
కొద్ది నిమిషాల క్రితం నుంచి, లేక గంటన్నర క్రితం నుంచి, అది నిజమని ఎరిగి, అక్కడ ఎవరో ఒక్కరు కూర్చొని, నావైపే చూస్తూ వున్నారు. ఇక్కడ ఒక స్త్రీ కూర్చొని వున్నది. ఆమెకు అదేమిటో తెలియదు, గత రాత్రి ప్రభువు యొక్క దూత ఆమెతో మాట్లాడెను. ఆమెతో ఏదో మాట్లాడుచుండెను, గాని ఆమె దాన్ని అర్థం చేసుకోలేకపోవుచున్నది. కాని అది ఈ రోజే జరిగినది, ఆయన ఆమెతో మాట్లాడుచూవున్న దానిని అదేమిటనే దాన్ని ఇప్పుడే ఆమె ఎరిగియుండెను. ఎలాగున అక్కడ నిలబడి ఆమెతో మాట్లాడుతూ వుండగా, ప్రభువు యొక్క దూత నేరుగా తిరిగి వెళ్ళి, ఆమెకున్న బాధ ఏమిటో, దానంతటి గూర్చి ఏమిటో, మరియు ఆమె దేన్ని గూర్చి ఆలోచన చేస్తున్నదో ఆమెకు ప్రియమైన వారిలో ఒకరి గూర్చి, ఏ విధంగా దేవుడు దానిని పలికి ఆయన దానిని నిర్ధారణ చేసెను, మరియు ఏమి జరగబోవుచున్నదో వాటన్నిటిని గూర్చి ఆమెకు చెప్పుచుండెను. కాబట్టి కచ్చితంగా ఆ విధంగా వుంటున్నది. చూశారా, దేవుడలాగున చెప్పెను.
21
సరే, ఇప్పుడు, కొన్ని సమయాల్లో దాని గూర్చి ఏమిటి, అది ఎన్నడూ... అప్పుడు, ప్రతి దర్శనం నిన్ను చాలా ఎక్కువగా బలహీనపరుస్తున్నది, చూశారా. మొదటి కార్యమేమిటో మీకు తెలుసా, ఆ రాత్రి నీవు సంఘానికి వెళ్ళునపుడు, నీవు పూర్తిగా అలసిపోయి, ఏమి చేయాలో నీవు తెలియక యుందువు. ఇప్పుడు మీరు నా కొరకు ప్రార్థించండి, చూడండి, ఎందుకనగా అది ఒక కూటము నుండి మరొక కూటమునకు, ఒక కూటము నుండి మరొక కూటమునకు అవుచున్నది. ఈ ఒక్క కూటము మాత్రమే, అది వ్యత్యాసముగా వున్నది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళవలసినట్లయితే, రెండు నెలల వరకు ఏమి చేయలేకుంటే, వెళ్ళిపోయి, నా చేపలు పట్టు గేలమును పట్టుకొని చేపల వేటకు వెళ్తాను. అయితే, ఒక కూటము నుండి మరో కూటమునకు, మరో కూటము నుండి మరొ కూటమునకు వెళ్ళవలసి వుంటున్నది, మీరు చూశారా. అదే దానిని చేయును.
22
ఇక్కడ సభలో వున్న ఆ వెనుక కూర్చొన్న జనులందరు, నా కొరకు ప్రార్థించండి. గత రాత్రి వారు నాకు అది చెప్పారు... [టేపు పై ఖాళీవున్నది]... పిలుపుకు ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు మీరు చూడండి, అది ఎంతో అపాయకరము. వారది చెప్పినపుడు, మంచిదే, కొన్నిసార్లు ఈ దీపాలు కాంతి నివ్వవు, వాటి మధ్యలో నల్లటి మచ్చ ఉన్నది.
నేను ప్రభువు యొక్క దూతని గమనిస్తూ, ఆయన ఇక్కడ నిలబడి ఉండుటను, నేను అనుభూతి చెందగలను. అప్పుడు అది నా నుండి కదులుచున్నట్లుగా నేను భావిస్తాను. అది నన్ను విడచి, అది ఎక్కడికో ఒక చోటికి వెళ్ళి, అక్కడ నిలబడి వుండుటను, నేను గమనిస్తాను, మరియు నేను దాని చూడగలను. మరియు అది తళతళమగు వెలుగుగా అక్కడ దర్శనమిచ్చును. అంతట నేను దర్శనం చూస్తాను. అక్కడ ఆ వ్యక్తి చుట్టూ ఎటువంటి విధంగా వున్నదో చూస్తూ గమనిస్తాను. ఆ వ్యక్తిని కనుగొని, అప్పుడు నేను మాట్లడేదను. ఏమి సంభవించునో ఏమి జరుగునో, నీవు దాన్ని గూర్చి ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం లేదు, అయితే అది ఏమి సంభవించునో మీరు చూస్తారు. అది అంత ఆత్మ సంబంధమైన రాజ్యంలో (పరిధిలో) వుంటున్నది.
23
అంతట ఆ వ్యక్తి దానికి స్పందించకపోతే, ఇక్కడ బైబిల్ చదువుచూ “దానిలో ఏమియు లేదు,” అని చెప్పి దాని నుండి నడిచి వెళ్ళిపోవును, చూశారా. కాబట్టి అది పనికిమాలినదిగా చేస్తున్నది. కాబట్టి, సిద్దంగా వుండు, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా గమనించు. ఆయన మాట్లాడినప్పుడు, జవాబివ్వు. చూడండి, ఏ సమయంలోనైన జవాబు ఇచ్చుటకు సిద్దంగా వుండండి.
కాబట్టి నా భార్య, బ్రదర్ బీలర్ మరియు వారిలో అనేకులు, ఈ ఉదయమున, దానిని గూర్చి చెప్పుచున్నారు. అతని సహోదరుని గూర్చి, ఎక్కడో, మరి ఆ విధంగా ఏదో అతనికి సంభవించినదని ఆ మనిషిని అది పిలుచుచున్నది. ఆ పిలుపుకు ఆ మనిషి స్పందించలేదు, కాబట్టి అది సహాయము చేయలేదు. అది దేవునికి మనిషికి మధ్యన వుంటున్నది. ఆ దర్శనం నన్ను విడిచెను. అంతట నేనేమియూ కనుగొనలేకపోయాను, ఎందుకనగా అతడు జవాబివ్వలేదు. కాబట్టి, గమనిస్తూ వుండుము, సిద్దపడి వుండుము.
24
ఇప్పుడు, దయ్యపు శాస్త్రమును తీసుకొని మరియు దయ్యములను గూర్చి మాట్లాడుకొందాం. ఇప్పుడు, ప్రజలు “దయ్యము,” అని చెప్పగానే, వెంటనే వారికి తలంపు వస్తున్నది, “ఓ, అదొక మూఢభక్తి లేక అలాంటిది ఏదో!” అయితే దేవదూతలు ఎలాగు వాస్తవమో అలాగే దయ్యములూ ఉండును. అవి నిజమైనవి.
యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడన్నది ఎంత వాస్తవమో, అలాగే దయ్యము కూడా అంతే వాస్తవము. వాడు దయ్యమైయున్నాడు. అలాగే పరలోకం కూడా అంతే వాక్యము వాస్తవముగా వున్నది. నరకమనేది అక్కడ లేకుండినట్లయితే, అక్కడ పరలోకం అనేది కూడా వుండదు. అక్కడ నిత్యమైన ఆశీర్వాదము లేకపోయినట్లయితే... నిత్యమైన దండన లేకపోతే, అక్కడ నిత్యమైన ఆశీర్వాదముండదు. పగలు లేకపోతే, రాత్రియుండదు, చూశారా. అయితే, పగలు ఎంత వాస్తవముగా వున్నదో, రాత్రి కూడా అంతే వాస్తవముగా వుంటున్నది.
అక్కడ ఒక క్రైస్తవుడు కచ్చితంగా వుంటే, అక్కడ ఒక వంచకుడు (వేషదారి) కూడా వుండును. దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక అసలైనవాడు ఉండుట ఎంత వాస్తవమో, అలాగే ఒక నకిలివాడు (అనుకరించువాడు) ఉండుట అంతే వాస్తవము, చూశారా. అది కచ్చితంగా బొమ్మా బొరుసు, నలుపు మరియు తెలుపు, జీవితకాలమంతటిలో వాస్తవాలు, అవాస్తవాలు, ప్రతి చోటా సత్యము, అసత్యము వున్నవి. ఒక అబద్ధపు సువార్త వున్నది, ఒక నిజ సువార్త కూడా వున్నది. ఒక నిజ బాప్తిస్మమున్నది, ఒక అబద్దపు బాప్తిస్మము కూడా వున్నది. ఒక నటించు-విశ్వసి వున్నాడు, ఒక నిజ విశ్వాసి వున్నాడు. ఒక నిజ అమెరికన్ డాలర్ వున్నది, ఒక అబద్దపు అమెరికన్ డాలర్ కూడా వున్నది. అసలైన క్రైస్తవుడు వున్నాడు, ఒక అసలైన వంచకుడు (వేషదారి) కూడా వున్నాడు, (చూశారా) అది అనుకరణ. కాబట్టి నీవు దాన్ని కనుగొనుము, కనుక, అవి అంతా కలిసి వెళ్ళుచున్నవి. ఇప్పుడు మనం దాన్ని వేరుచేయలేము. దేవుడు వాటిపై వర్షమును కురిపించనిమ్ము.
25
కొద్దిగా మాట్లాడుటకై ఆయన నాకు అనుమతిని దయచేయును గాక. ఇక్కడ ఎంత మంది బోధకులున్నారు, మీ చేతులు పైకెత్తండి. ఈ చుట్టూ ప్రక్కల, బోధకులారా, మీ చేతులను చూడనివ్వండి. మంచిది, సహోదరుడా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు మీరు దీన్ని సిద్దాంతముగా తీసుకోవద్దు, అయితే మన జీవితమునకు ముఖ్యమైన అంశమునకు చేరువయ్యే ముందుగా, ఏమిటనేది నేను మీకు చెప్పెదను. ఇక్కడ ఎంత మంది పెంతెకొస్తు జనులు వున్నారు? సరే. చుట్టు ప్రక్కల, ప్రతి చోట వున్న మీరందరూ చేతులను పైకెత్తండి. మంచిది, మీరంతా పెంతెకోస్తువారేనా. సరే. మొదటిగా నేను మీ రాజ్యంలోకి వచ్చినప్పుడు, నాకు ఏమి జరిగినదో మీకు చెప్పబోవుచున్నాను. సరిగ్గా ఇక్కడనే ఇండియానాలోని, ఫలాన మిషవాక్ అని పిలువబడే స్థలమందు నేనుంటిని. నేను ఎప్పుడు చూచినటువంటి పెంతెకోస్తు జనుల యొక్క మొదటి గుంపును, వారు — యేసుక్రీస్తు యొక్క పెంతెకోస్తు అసెంబ్లీస్ అని పిలుచుకున్నారు. నేను నమ్ముచున్నాను, లేక అది ఆ విధంగా పిలువబడుచున్నది, అద్భుతమైన జనుల గుంపు. ఇప్పుడు వారు ఒక్కటిగా ఏర్పాటై యునైటెడ్ పెంతెకోస్తుగా పిలుచుకుంటున్నారు. మిగిలిన వారితో వారు వేరైపోయారు, ఎందుకనగా నీటి బాప్తిస్మము కారణంగా, అది వారికి ఎటువంటి వంచకులుగా చేయలేదు. వారి హోదాలో, అక్కడ అనేకులు అసలైన వారు, నిజముగా అసలైన పరిశుద్ధాత్మను, తిరిగి-జన్మించిన క్రైస్తవులు వున్నారు. “యేసు నామములో” బాప్తిస్మము పొందుట చేత దేవుడు వారికి పరిశుద్ధాత్మను ఇచ్చెను, మరియు “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ”లో బాప్తిస్మము పొందిన ఇతరులకు పరిశుద్ధాత్మను ఇచ్చెను. కాబట్టి, “ఎవరు ఆయనకు విధేయులగుదురో, వారికి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చును.” కాబట్టి ఎవరు పొందుకొనెదరు, ఎవరు ఆయనకు విధేయులగుదురు? అక్కడే నీవున్నావు.
26
నీవు మర్చిపోతే, వారు ఒకే విధంగా ఉండాలనుకుంటే, వారిని అలాగే ఉండనీ, నీవు ముందుకు వెళ్ళు సహోదరుడుగానే వుండు. అది అంతే. అదేమిటి చేసినది, వారిని పగులగొట్టెను, పగులగొట్టెను, చూశారా, ఏమిటి? పగులగొట్టబడెను, చినిగిపోయెను, సహోదరత్వము పగులగొట్టబడెను, మీకు మీరే వేరైపోయిరి. కాదయ్యా, మనం వేరైయినవారము కాదు; మనమంతా ఒకటి. అది వాస్తవము.
27
అయితే, నేనక్కడే నిలబడి ఉన్నప్పుడు, నేను ఆ జనులను గమనిస్తూ వున్నాను. ఇప్పుడు, నేను క్రమమైన చిన్న పురాతన దక్షిణమునకు చెందిన బాప్టిస్ట్ సంఘానికి వచ్చాను, ఎందుకు, నేను ఆ జనులను చూశాను, అందులోనికి వెళ్ళాను. వారి చేతులతో చప్పట్లు కొట్టుచూ, వారు అరచుచున్నారు, “వారిలో ఒకడిని, వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడినని నేను చెప్పుటకు ఆనందించాను!”
నేననుకున్నాను, “మై! వ్యూ!” మొదటి కార్యమేమిటో మీకు తెలుసా, అక్కడకు ఎవరో ఒకరు వచ్చి, ఎంత ఎక్కువగా నాట్యమాడాలో అంత ఎక్కువగా నాట్యమాడారు. “ఏమిటి సంఘము తీరు! నేనెన్నడూ అలాంటి కార్యములు వినలేదే,” అని నేననుకున్నాను. నేను వారి చుట్టూ గమనిస్తున్నాను, మంచిదే, ప్రపంచములో వున్న ఆ జనుల సంగతేంటి? అని ఆశ్చర్యపోవుచున్నాను.
28
ఇప్పుడు ఎక్కడైతే, నా కూటములు తాకినవో అక్కడ, నా యొక్క జీవిత గాధను చెప్పుటను మీరు విన్నారు. అయితే, ఈ ఒక్క కార్యము నేను మీకు ఎన్నడూ చెప్పలేదు, జనుల ముందు దాన్ని ఎన్నడూ చెప్పలేదు. ఇప్పుడు, మీరు వ్రాసి పెట్టుకొన్నవి తుడిచిపెట్టుకోవలెనని అనుకున్నట్లయితే, ఎందుకు, మీరు అలాగున చేయగలరు. మంచిది. ఇప్పుడు, నేను దీనిని గమనిస్తున్నాను, ఇప్పుడు నేను, “మంచిది, నా జీవితంలో వారి జనులున్నంత సంతోషంగా ఉండు జనులను మరెక్కడను నేను చూడలేదు. వారి మతమును బట్టి వారు సిగ్గుపడలేదు. మీకు తెలుసా, బాప్టిస్టు వారమైన మనం కొన్ని సార్లు సిగ్గుపడుదుము, చూశారా. మీకు తెలుసా, ప్రార్థనకెళ్ళినప్పుడు, ఫ్యాన్ వెనుకకు వెళ్ళెదరు, మీకు తెలుసా. అయితే వారు అలా చేయరు. సహోదరుడా, వారు లోపట, బయట వారి అంతటి చుట్టూ భక్తినే కలిగి వుంటారు.
29
మంచిది, నేను వేదికపైకి వెళ్ళినపుడు. ఆ రాత్రి నాకు జ్ఞాపకమున్నది. “బోధకులందరు వేదికపై వున్నారు,” అని చెప్పెను. అది ఒక కూటము. వారు ఇక్కడ ఉత్తరాన జరిపించవలసి ఉండెను, కాని కోలరాడాలో, జిమ్-క్రోవ్ చట్టం వలన దక్షిణమున రంగు జాతి సమస్య వచ్చినది, కాబట్టి, అన్ని చోట్ల నుండి వారందరు కలుసుకొనెను. కాబట్టి, నేను అక్కడే కూర్చోండిని. అతడన్నాడు... మంచిది, ఇప్పుడు అక్కడ... ఆ పగలు ఆ రాత్రి బోధకులందరి బోధను నేను విన్నాను. వారు, కొంత మంది వృద్ధ బోధకులొచ్చి చెప్పారు, అతడొక వృద్ద నల్లజాతి మనిషి, అతని మెడచుట్టూ ఉంగరాల జుట్టు కలిగి వున్నాడు, పొడవైన బోధకుని కోటును ధరించియుండెను, మెడకు మృదువైన కండువా వేసుకున్నాడు, మీకది తెలియును, అది వేడి వాతవరణము, కావున ధరించి, ఆ దీనుడైన పెద్ద మనిషి ఈ విధంగా అక్కడకు వచ్చుచున్నాడు. “నా ప్రియ పిల్లలు,” అని అతడన్నాడు. “నేను మికొక్కటి చెప్పాలనుకుంటున్నాను,” అని అతడన్నాడు. సాక్ష్యమిచ్చాడు. వేదిక పైన కూర్చొన్న వారందరిలో నేనే చిన్నవాడిని. అంతట అతడిలా, “నేను మీకు చెప్పెదను!” అన్నాడు. అతడు తన లేఖనమును యోబు గ్రంథము నుండి తీసుకున్నాడు, “నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడుంటివి? వారు ఎక్కడ నిర్మించబడ్డారో, నీకు వివేకముంటే చెప్పుమనెను.”
30
ఈ మిగతా ఇతర బోధకులందరు వారి వారి క్రమము బట్టి, క్రీస్తును గూర్చి మాటలాడుచున్నారు. నేను వారు చెప్పింది విని, సంతోషించాను. అయితే ఆ వృద్ద బాలుడు కాదు! భూమి ఆరంభము కాకమునుపే, పదివేల సంవత్సరాల వెనుకకు అతడు వెళ్ళిపోయాడు. అతడు పరలోకమునకు వెళ్ళిపోయి, ఆకాశముల గుండా క్రిందికొచ్చెను, ఏమి సంభవించినది. పగటి పూట జరిగిన దానిని గూర్చి వారు ఏమి బోధించుచున్నారు; పరలోకములో ఏమి సంభవించినదా, అని దానిని గూర్చి అతడు బోధించుచున్నాడు. అదుగో ఎక్కడో వెనుక నిత్యత్వంలో వున్న వర్ష ధనుస్సు పైకి క్రీస్తుని అతడు తీసుకొచ్చెను. ఎందుకు, అతడు ఐదు నిమిషాలు కూడా ప్రసంగించలేకపోయాడు. అతనిని ఆ వృద్ద వ్యక్తిని ఏదో పట్టుకొన్నది. అతడు గాలిలోకి ఎగిరి గంతులు వేసెను, తన మడిమలు జోడించి, కేకలు పెట్టెను, “కేకలు పెట్టెను!” అతడు ఇక్కడికి వచ్చినప్పుడు సరిపడినంత అవకాశమును కలిగియుండెను. “నేను బోధించుట కొరకై నాకు సరిపడినంత అవకాశమును మీరు ఇవ్వలేదు,” అని అతడు చెప్పి, వెళ్ళిపోయాడు.
మంచిది, నేను తలంచాను, “ఆ ఎనభై సంవత్సరాలు గల ఆ మనిషికే అలాగు చేసినట్లయిన, అది నాకు ఏమి చేయును?” అదే నాకు కావలసినది. అదే నాకు కావలసినది.
31
అయితే నన్ను ఆకర్షించినది ఇది. ఇప్పుడు, మనం దయ్యముల గూర్చి మాట్లాడుకోబోవుచున్నాము. నన్ను ఆకర్షించినది, ఇద్దరు మనుష్యులను నేను గమనిస్తున్నాను. ఒకరు ఒక ప్రక్కన కూర్చొన్నారు, ఒకరు మరో ప్రక్కన కూర్చొన్నారు. వారి మీద ఆత్మ వ్రాలినప్పుడు, ఆ మనుష్యులు లేచి భాషలతో మాట్లాడెను, కేకలు పెట్టెను, వారి నోటి నుండి నురగవచ్చుచున్నది. “ఓ, మై! అది నేను కలిగి ఉండగలిగితే!” అని నేననుకున్నాను. చూశారా, “ఎంత అద్భుతం! ఓ, నేను దాన్ని ప్రేమిస్తాను.” మంచిది, మొక్కజొన్న పొలములోకి నేను వెళ్ళిపోయాను. నేను మీకు నా జీవిత గాధను చెప్పాను. దానిని మీరు పుస్తకంలో చదవండి, రాత్రంతా నేను నిద్రపోయాను. మరుసటి ఉదయమున నేను తిరిగి వచ్చాను, కాబట్టి దాన్ని నేను పరీక్షించాలని అనుకున్నాను. ఆ కార్యములను తెలుసుకొనుటకు నాకొక్క మార్గమున్నది, అది నాకు దేవునికి తప్ప మరెవ్వరికి తెలియదు. కాబట్టి, నేనొక ఉపమానమును తీసుకొని మనుష్యుని ఆత్మను కలుసుకొనుటకై వెళ్ళాను. సరిగ్గా ఈ వేదిక మీద దాన్ని మీరు చూస్తారు, చూశారా. అంతట ఆ మనుష్యుల్లో ఒకరితో మాట్లాడుచుంటిని. వారెంతో సమీపముగా వుండి, వారిచేతులను కలిపి, నాట్యమాడుచూ, కేకలు పెట్టెను, నేను వారిని చూశాను. “ఓ, మై! ఆ ధ్వని నాకెంతో నిజంగా అనిపించినది!” అని నేననుకున్నాను.
మరియు నేను అందులో ఒకరి చేతిని పట్టుకొన్నాను “అయ్యా, మీరు ఏలాగున్నారు?” అని నేను అడిగాను.
“మీరు ఏలాగున్నారు?” అని ఆయన అడిగాడు. చాలా మంచి వ్యక్తి, పెద్ద తరహకి చెందినతను. అతడు చెప్పాడు...
“మీరు దైవ సేవకులా?” అని నేను అడిగాను.
“లేదు, అయ్యా, నేను ఒక సాధారణ సభ్యుడను,” అని అతడు చెప్పాడు.
అతనితో నేను చిన్నగా సంభాషణను కొనసాగించాను. అప్పుడు అతని ఆత్మను పట్టుకొనగలిగాను, చూశారా. అదేమిటో అతనికి తెలియదు. ఎవరూ ఎరుగరు. దాన్ని గూర్చి నేనెమియు ఎన్నడునూ చెప్పలేదు; సంవత్సరాలు దాటిన తరువాత నేను దానిని ప్రస్తావించక ముందు. అయితే, నేను కనుగొన్నప్పుడు, అది సత్యమని తెలిసినది, పరిపూర్ణమైన క్రైస్తవ మనిషి! ఆ మనిషి సంపూర్ణముగా దేవుని యొక్క భక్తి కలిగిన మనిషి. “సహోదరుడా, అది బాగున్నది,” అని నేననుకున్నాను.
32
అయితే వింత కార్యము ఏమనగా: మరో మనిషిని కలిసికొన్నప్పుడు, అది వ్యతిరేఖముగా వున్నది. అతను ఒక స్త్రీతో జీవించుచున్నాడు, అసలు ఆమె అతని భార్య కాదు. అది వాస్తవము. ఒక దర్శనంలో అతను పైకి లాగబడటం నేను చూశాను. “ఓ, మై! అది అలాగున ఉండకూడదే,” అని అనుకున్నాను. అంతట ఆ మనిషి... “ఇప్పుడు, ఇప్పుడు, జనుల మధ్య నున్న ఈ ఆత్మ తప్పు. అదంతా అంతే,” అని నేననుకున్నాను.
కాబట్టి ఆ రాత్రి అప్పుడు... కూటమునకు వెళ్ళాను, దీవెనలు కుమ్మరించబడెను, నేను దేవునికి ప్రార్థన చేసితిని, ఆ పరిశుద్ధాత్మ, ఆ ప్రభువు యొక్క దూత అది పరిశుద్ధాత్మ అని సాక్ష్యమిచ్చెను. అదే పరిశుద్ధాత్మ ఈ మనిషి మీద కుమ్మరించబడెను. అలాగే ఈ మనిషి మీదను కుమ్మరించబడెను. వారిద్దరి మీదను పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు, వారిద్దరు లేచి, కేకలు పెట్టి, అరచి, ప్రభువుని స్తుతించి, భాషల్లో మాట్లాడి, నాట్యమాడెను. “నేను దాన్ని పొందుకోలేకపోవుచున్నాను. ప్రభువా. అది... అది ఎక్కడ సత్యముగా యున్నదో అని నేను దాన్ని బైబిల్లో చూడలేకపోవుచున్నాను,” అని నేనన్నాను. ఇప్పుడు నేను, “బహుశా, నేను మోసపోవుచున్నానని” నేనన్నాను. చూశారా? నేను చెప్పాను... ఇప్పుడిక్కడ, నేను కాను... నేను బైబిల్ ఖండితమైన ముఖ్యాంశములో వున్నాను. అది దీన్ని పొందుకోవలసి వున్నది, చూశారా. ప్రభువా, నీకు నా స్థితి తెలుసు, మరియు మీ వాక్యములో నేను దాన్ని చూశాను. మరి నేను అర్ధము చేసుకోలేకపోవుచున్నాను. పరిశుద్ధాత్మ ఈ మనిషి మీద కుమ్మరించబడెను, అదే పరిశుద్ధాత్మ ఆ మనిషి మీద కుమ్మరించబడెను, మరి ఒకరేమో పరిశుద్దుడు, ఇంకొక్కరు వంచకుడుగా (వేషదారి) వున్నాడు. అది అదేనని నాకు తెలుసు,“ అని నేనన్నాను. ”అది నాకు తెలియును. నేను ఆ మనిషిని తీసుకొని అతన్ని రుజువు చేయగలిగేవాడిని, లేక అతని బయటకు పిలిచి దానిని గూర్చి చెప్పియుండేవాడిని.
33
నా వలె ఆ మనిషి గత రాత్రి ఇక్కడ కూర్చొనియున్నాడు, అతడు వంచకుడు (వేషదారి) కాక మరొకడు కాదు, అక్కడ ఎవరో ఒకరు కూర్చొనియున్నారు. నేను అతన్ని బయటకు పిలువవలసి ఉండెను, అయితే, అతడు లేచి గడబిడ చేయటం మొదలు పెట్టియుండేవాడు. ఆ కూటము కారణము చేతనే నేను దాన్ని పోనిచ్చాను, కాని అతన్ని నేనెరుగుదును. అవునండి. గత రాత్రి, సరిగ్గా ఆ వెనుకాల కూర్చొన్న వారిద్దరిలో ఒకరు, సరిగ్గా ఇక్కడున్న నగరములో ఫలాన సంఘానికి చెందినవాడు. నిజంగా విమర్శకులు! నేను వారిని చూశాను. అయితే, నేనది చేస్తే, ఇబ్బందులు మొదలవుతాయి. నేనది అనేక సార్లు చేసాను. నేను వారిని ఒంటరిగా విడిచిపెట్టాను. అది సరియే. దేవునికి తెలుసు, ఆయనే న్యాయాధిపతి. ఒకసారి వారు నన్ను పిలవనివ్వండి, అంతట ఏదో సంభవించునని మీరు చూస్తారు. అయితే, అతన్ని చేయనివ్వండి. దయ్యము వలే, నేనెన్నడూ దయ్యమును బయటకు పిలువలేదు. అతడు నా యొద్దకొచ్చి నాతో సవాలు చేసెను. అంతట దేవుడు పనిచేయటం ఆరంభించగానే, చూశారా, అది వాస్తవము, ఏమి సంభవించినదో మీరు చూశారు. అది నిజము. కాని నేను దాన్ని పోనిచ్చాను. కూటమును కష్టతరంగా చేసినది, ఎందుకనగా ఆ ఆత్మ అన్నివేళల్లోను సరిగ్గా నాపై కదలాడుచున్నది, చూశారా. కాబట్టి నేనలాగే కొనసాగాను.
34
అయితే ఇప్పుడు, ఈ మనుష్యులను, నేను దాని అర్థము చేసుకోలేకపోవుచున్నాను. అది రెండు సంవత్సరాల తర్వాతో, లేక మూడు సంవత్సరాల తర్వాతో, గ్రీన్ మిల్స్ వద్ద, నేనున్నప్పుడు, ఇక్కడ ఇండియానా, స్కౌట్ రిజర్వేషన్ వద్ద, నేను ఎక్కడికైతే వెళ్ళి ప్రార్థిస్తానో - ఆ పాత గృహం యొద్దకు వెళ్ళితిని. వెనుకకు వెళ్ళి, “ప్రభువా, ఆ గుంపు జనులు ఏమౌదురో నేను అర్థం చేసుకోలేకపోయాను. అటువంటి అద్భుతమైన జనులను నా జీవితంలో నేనెన్నడూ కలువలేదు, మరియు నేను - ఆ తప్పుడు ఆత్మను వారే విధంగా కలిగియున్నారో నేను అర్థము చేసుకోలేకపోయాను. అంతట అది... అప్పుడు... నా హృదయ యధార్థతను మీరెరుగుదురు. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో మరియు నేనెంతగా సేవ చేశానో, మీకు తెలుసు, ఇక్కడున్న అదే ఆత్మ నాతో వున్నది, ఆ జనులు మీద కూడా వున్నది. ఇక్కడున్న ఆ యౌవన వ్యక్తి పైన వున్నది, అక్కడ, అదే ఆత్మ,” అని నేనన్నాను. కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోవుచున్నాను.
35
ఆయన కనికరముతో, ప్రభువు దిగివచ్చి మరియు నాకు చూపించెను. అది ఏమిటో ఇక్కడున్నది. మొదటిగా, అది లేఖనము కావలసివున్నది. “నీ బైబిల్ ని తీసుకోమని,” ఆయన అన్నాడు. అంతట నేను నా బైబిల్ ని తీసుకొంటిని. నేను బైబిల్ తీసుకున్న పది నిమిషముల వరకు ఎటువంటిది రాలేదని, నేను తలంచాను... ఏ వాక్యము రాలేదు. నేను కొద్ది క్షణాలు వేచియున్నాను. “హెబ్రీ 6వ అధ్యాయము తీసి చదవటం ప్రారంభించమని మరల ఆయన చెప్పుటను నేను విన్నాను. నేనది చేశాను. అది ఎక్కడైతే చెప్పబడినదో, అది అక్కడికే వచ్చినది, ”ఎట్లనగా, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించును... అయితే, ముండ్ల తుప్పలును, గచ్చతీగెలును దాని మిద పెరిగినయెడల, అది పనికి రానిదని విసర్జింపబడి, శాపము పొందతగినదగును. తుదకది కాల్చి వేయబడును.“ సరిగ్గా అక్కడే దాన్ని నేను పట్టుకున్నాను.
“అది అక్కడే వున్నది. దేవునికి ధన్యవాదములు! అది అక్కడే వున్నది,” అని నేననుకున్నాను, చూశారా.
36
ఇప్పుడు, “విత్తువాడు విత్తనములను విత్తుకుంటూ వెళ్ళెను,” అని యేసు చెప్పెను. ఆయన చెప్పలేదా? ఇప్పుడు, ఇక్కడున్న మీరంతా క్రైస్తవులు. పెంతుకోస్తు, వారు, తిరిగి-జన్మించిన క్రైస్తవులు, ఏ విధంగానైనను ప్రతి యొక్కరూ వారి చేతుల నెత్తండి. సరే. “విత్తువాడు విత్తనములను, విత్తుకుంటూ వెళ్ళెను, మరియు అతడు నిద్రించిన సమయమున...” అని ఆయన చెప్పాడు. (ఆయన విశ్రాంతికి, మరణానికి మధ్యన, చూశారా), “ఆయన నిద్రించు సమయాన, శత్రువు వచ్చి పొలములో గురుగులను చల్లిపోయెను.” గురుగులు అనగా ఏమిటి? కలుప మొక్కలు, గచ్చతీగెలు మొదలగునవి. ఇప్పుడు, “వ్యవసాయకుడు (ఆ బోధకుడు) ఈ గురుగులు ఎదుగుటను చూచినప్పుడు. 'నేను వెళ్ళి వాటిని పెరికివేయ నియ్యుడి' అని చెప్పెను. 'వద్దు, వద్దు, నీవు గోధుమను కూడా పెరికి వేయుదువని, అతడన్నాడు. ఆ రెంటిని కలిసి ఎదుగనీయుడని,'” ఆయన చెప్పెను.
37
అక్కడ గోధుమ పొలమున్నది. అక్కడ గచ్చతీగెలు, దుమలగుండు కాయలు, చెడు వాసనకొట్టు విత్తనాలు, మొదలగు ప్రతీది అందులో వున్నవి. అది వాస్తవమేనా? అయితే, ఇప్పుడు, అందులో గోధుమ వున్నది. ఇప్పుడు, భూమిని తడుపుటకు తరచుగా వర్షము కురియుచుండెను. ఇప్పుడు, వర్షము ఎందుకొరకు? దుమలగుండు కాయలను తడుపుట కొరకు కాదు. ఇప్పుడు గమనించి శ్రద్దగా వినండి. నీరు గచ్చ తీగల కొరకు కాదు. వర్షము గోధుమల కొరకు పంపబడెను, అయితే గోధుమలు ఎలాగైతే, దాహంగొన్నవో, అలాగే దుమలగుండు కాయలు, కలుపు మొక్కలు కూడా దాహమును కలిగియున్నవి. అదే వర్షము గోధుమల మీదను, కలుపు మొక్కల మీదను కురియుచున్నది. ఏ విధంగా చిన్న గోధుమ సరిగ్గా నిలబడి తనకి తానుగా ఆనందం, సంతోషమని చెప్పుచున్నదో, అదే విధంగా చిన్నదైన పాత కలుపు మొక్క కూడా సరిగ్గా నిలబడి ఈ విధంగా ఆనందం, సంతోషమని చెప్పెను.
“అయితే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకొందురు.” నీవు అక్కడేవున్నావు, చూశారా. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ వంచకుడిని (వేషదారిని) కూడా దీవించగలదు. అర్మేయన్లు అయిన మీలో కొందరిని అది తట్టెను. అయితే అది సత్యమే. అది సత్యమే. పరిశుద్దత అని వారు పిలచుదురు, పరిశుద్ధతను నేను నమ్ముదును. అయితే అదే ఆత్మ నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను కుమ్మరించబడెను, అయితే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకొందురు.
38
నేను గోధుమను పొందుకొనుటకై వెళ్ళి ఇటు చూసినట్లయితే, నేను గోధుమను పొందుకుంటాను, కాని దాని చుట్టూ చుట్టుకొని కలుపు మొక్కలు వుంటాయి, గోధుమల కొరకు కురియుచున్న అదే వర్షము చేత అవి కూడా జీవించుచున్నవి. వర్షము కలుపు మొక్కల కొరకు పంపబడలేదు, అది గోధుమల కొరకు పంపబడినది. అయితే, పొలములో వర్షము కురియుచున్నది, ఆ గోధుమల కొరకై... గోధుమ పొలములో కలుపు మొక్కలు ఉండి, మిగతా వాటి వలె అవి ఎంత లాభం పొందుకొనవలెనో, అంత లాభం పొందుకునుచున్నవి. అదే వర్షము గోధుమల్ని జీవింపచేస్తున్నది, కలుపు మొక్కల్ని జీవింపచేస్తున్నది.
మనం బోధించుచున్న విధంగా ప్రకృతి సంబంధమైన అన్ని కార్యములు, ఆత్మ సంబంధమైన వాటికి పోలికైయున్నవి. అక్కడే ఆ దయ్యపు శాస్త్రమున్నది... దయ్యములు క్రైస్తవ్యమును అనుకరణ చేయుచున్నవి, అయినను ఆశీర్వాదములు పొందుకొనుచున్నవి. అది పాలపై మీగడ తీయుట కాదు, సహోదరులారా, నీవు దాన్ని తీసుకున్నట్లయితే, చూడండి, చూడండి. మంచిది. అది సత్యం.
39
కాబట్టి, నేను కేక వేయగలను. కనుక ఈ రోజు నేను రక్షింపబడలేదు. నేను రక్షింపబడ్డాను, అని భావించుట చేత నేను రక్షింపబడలేదు. ఈ బైబిల్ యొక్క షరతును బట్టి నేను దేవున్ని కలిసికొన్నాను కనుకనే నేను రక్షింపబడ్డాను. “నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, అతడు తీర్పు లోనికి రాక మరణములో నుండి నిత్యజీవములోనికి దాటియున్నాడు,” అని యేసు చెప్పెను. నేను దాన్ని నమ్ముచున్నాను. అది వాస్తవము. ఆ షరతుల మీద నేను రక్షించబడ్డాను, ఎందుకనగా దేవుడాలగున చెప్పెను.
“ఒక బలమైన గాలి నా ముఖమును కొట్టెను.” కనుక నీవు రక్షింపబడ్డావు, అని ఎవరో ఒకరు నాకు చెప్పినట్లయితే, అది అద్భుతము, కాని అది నా ముఖమును తాకక ముందు ఆ బలమైన గాలి ఎక్కడి నుండి వచ్చినదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చూశారా. ఇప్పుడు, ఆ బలమైన గాలి నిన్ను కొట్టిన తర్వాత నీవు ఏ రకమైన జీవితమును జీవించబోవుచున్నావు? చూశారా, మి ఫలముల చేత మీరు తెలియపరచబడుదురు. కాబట్టి, దయ్యములు సరిగ్గా క్రైస్తవుల మధ్య పనిచేయగలవు. నీవు దాన్ని నమ్ముదువా?
పౌలు వైపు చూడండి. పౌలు చెప్పెను...
40
ఇప్పుడిక్కడ కడవరి కాలపు వర్షము ఎక్కడున్నది... ఇక్కడున్న మీలో ఎవరైన, నేను మాకు వ్యతిరేఖముగా చెప్పినట్లయితే, నన్ను క్షమించండి. అంతట అసెంబ్లీస్ వారితోను, లేక బాప్టిస్టు వారితోను, లేక ఇంకెవరితోనైన, నేను మీకు వ్యతిరేఖముగా ఏమియూ మాట్లాడుట లేదు. సత్యమేమైయున్నదో అదే సత్యము. దీన్ని మీరు ఎక్కడ పొందుకున్నారు: ప్రవక్తలు కాని వారిని మీరు ప్రవక్తలుగా చేయుచున్నారు. “చేతులు వేసి” పంపించబడినవారు, ప్రవక్తలు కారు. ప్రవక్తలు జన్మించెదరు, చూశారా. బైబిల్లో ప్రవచన వరమున్నది. ప్రవక్తకి మరియు ప్రవచన వరమునకు మధ్యన, మీరు అక్కడే తప్పు చేయుచున్నారు. వరము...
పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, ఈ దినముల అంతమందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాటలాడెను.“ క్రీస్తు శరీరములో తొమ్మిది ఆత్మ వరములు కార్యనిర్వహకమగుచున్నవి. బహుశా అది ఈ రాత్రి ఈ స్త్రీపై వుండవచ్చును, ఆమె యొక్క జీవితకాలములో ప్రవచనం ఎన్నడు చెప్పకపోవచ్చును. అది తర్వాత రాత్రి ఈ స్త్రీపై వుండవచ్చును. తర్వాత రోజు ఈ పురుషుని పై యుండవచ్చును. బహుశా ఆ తర్వాత రోజు ఆ వెనుక వున్న వారిపై యుండవచ్చును. అది ఆమెను ఒక ప్రవక్తగా చేయుట లేదు, అది ఏ ఒక్కరిని ప్రవక్తగా చేయుట లేదు. ఇది నీలో ఉండు ప్రవచన వరమైయున్నది.
41
ఆ మనిషి లేక ఆ ప్రవచనం సంఘానికి ఇవ్వబడక ముందే అది ఇద్దరు లేక ముగ్గురు ఆత్మ సంబంధుల చేత పరీక్షించబడవలసి వున్నది. అది వాస్తవమేనా? ఇప్పుడు, పౌలు చెప్పిన ప్రకారముగా, “మీరు ఒకరి వెంబడి ఒకరు ప్రవచనం చెప్పవచ్చును.” ఈ ఒక్కడికి ఏదైన బయలుపరచబడినట్లయితే, అతడు నెమ్మదిగా వుండవలెను. మంచిది, ఈ దినమున బోధించిన ప్రకారముగా, వారినందరిని ప్రవక్తలుగా చేసినట్లవుచున్నది. పెంతెకోస్తు సంఘాన్ని కాదు, మనకున్న విషయములన్ని సందేహముతో వున్నవి. ఆ కారణము చేతనే మనము బైబిల్ చేత సరికాబడనంత వరకు దేవుడు లోపలికి రాడు. అది వాస్తవము. నీవు సరైన త్రోవలో రావలసివున్నది. నమునా లేకుండా నీవు ఎలాగున భవనము నిర్మించగలవు, చూశారా? నీవు సరిగ్గా ఆరంభించవలసి వున్నది.
42
ఇప్పుడక్కడ, ప్రవక్త యెషయా, మోషేల ముందు ఏ ఒక్కరు నిలబడటం మిరెన్నడూ చూడలేదు. ఒకనొక దినాన, కోరహు, ఒకరు లేచి, అతనితో వాదించగోరెను, మరియు, “నీకు నీవుగా వేరైపో, నేను భూమిని తెరవబోవుచున్నాను,” అని దేవుడు చెప్పెను. ప్రవక్త జన్మతోనే ప్రవక్త. “వరములు, పిలుపులు మారుమనస్సు లేకుండగానే వచ్చును.” అది బాల్యము నుండే, అది దేవుని చేత ముందు ఏర్పాటు, కచ్చితంగా, అతడు చెప్పిన సత్యము రుజువు చేయబడి నిరూపణవుచున్నది, సరిగ్గా ప్రతీది పరిపూర్ణమగుచున్నది. ఆ దేవుని యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను. కాని ప్రవచన వరము సంఘములో వున్నది.
43
ఇప్పుడు మీరు, “మంచిది, పాత నిబంధనలోనే ప్రవక్తలున్నారు,” అని చెప్పెదరు. ఓ, లేదు! క్రొత్త నిబంధనలో కూడ ప్రవక్తలున్నారు.
అగబు ఒక క్రొత్త నిబంధన ప్రవక్తగా ఉండెను. అక్కడ వ్రాలిన ప్రవచనాత్మను గూర్చి పౌలు చెప్పుచున్నాడు. తరువాత అగబు యెరుషలేము నుండి ఇక్కడకి వచ్చెను. మరియు పౌలు స్థాపించిన మరియు అతడి నడికట్టు తన చుట్టూ చుట్టుకొని, మరియు మీదుగా తిరిగి ఈలాగున చెప్పెను. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు యెరుషలేముకు వెళ్ళినప్పుడు, ఈ మనుష్యుడు ఈలాగున గొలుసులతో బంధించబడును,” అని చెప్పెను. అగబు, అతడు ముందుగా ఏమి సంభవింపనైయున్న దానిని నిలబడి మరీ చెప్పెను. ప్రవచన వరము కలిగిన మనిషిగా కాదు, అతడు ప్రవక్తగా ఉండెను.
మరియు నా పెంతుకోస్తు సహోదరులారా, స్వస్థత వరమును మరియు అలాంటి అన్ని వరములను, మీరు కలగలుపు చేయుచున్నారు. శరీరములోనికి బాప్తిస్మము పొందిన ఎవరికైనా, సంఘములో యున్న ఏ వ్వక్తికైనా వరములు సంఘములో యున్నవి. “ఒక్క ఆత్మ ద్వారా మనమందరము బాప్తిస్మము పొందితిమి.” మరియు బైబిల్ చెప్పెను...
“నేను స్వస్థత వరమును కలిగి ఉన్నాను, మంచిదే.”
మంచిది, బైబిల్ చెప్పుచున్నది, “మీ తప్పిదములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మరియు ఒకరికొకరు ప్రార్థించండి.” ప్రతీ వ్యక్తి ఒకరి కొరకు మరొకరు ప్రార్ధన చేయండి. మనము విభాగింపబడిన గుంపు కాదు; మనము ప్రోగుచేయబడి, సేకరింపబడిన గుంపైయున్నాము, గమనించారా. ఇప్పుడు, మరక్కడ కొన్ని సమయాల్లో దయ్యములు ఏ విధంగా పని చేయుచున్నవి.
44
ఇప్పుడు పౌలు ఏమి చెప్పాడో గమనించండి, “ఒకరు భాషలతో మాట్లాడితే మరి ఇంకొక్కరు అర్థము చెప్పవలెను, మరియు అతడు ఏమి చెప్పినప్పటికి, సంఘము దానిని పొందుకొనక ముందు అది తీర్పు తీర్చబడవలెను.”
ఇప్పుడు, అది లేఖనాన్ని అనుకరణము చేయుట, లేక అలాంటిది. ఏదో చేయుట కాదు. దేవుడు మరల తనకు తానుగా దాని చేయడు. అయితే అది సంఘానికి ఒక హెచ్చరిక అవుచున్నది. తరువాత మంచి న్యాయాధిపతులు చెప్పినట్లయితే, “దాని స్వీకరించుదాం. అది అంతా సరే, అది ప్రభువుదైయున్నది.” “దీనిని స్వీకరించుదాం,” అని రెండవ వ్యక్తి చెప్పెను. ఇద్దరు లేక ముగ్గురు యొక్క నోటి మాట చేత స్థిరపరచబడవలెను. సంఘము దాని స్వీకరించి, దానికొరకే తయారు కావలెను. ఏదైయితే చెప్పబడినదో, అది జరగనట్లయితే, అప్పుడు మీరు మీ మధ్యన ఒక దయ్యపు ఆత్మను కలిగి ఉన్నారు. అది వాస్తవము. అది జరిగితే, అప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుడి. దేవుని యొక్క ఆత్మ మీ మధ్యనే ఉన్నది, గమనించారా. ఇప్పుడు ఎక్కడ మీరు గమనిస్తున్నారో అక్కడ జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. కాబట్టి, అణుచుటకు ప్రయత్నించవద్దు. నాకు నీలిరంగు కళ్ళునప్పుడు నాకు నేనుగా గోధుమ రంగు కళ్ళు తయారు చేసుకొనకూడదు, చూశారా. నేను నీలిరంగు కళ్ళతో సంతృప్తి చెందవలసియున్నది. ఇప్పుడు, అక్కడ ఆత్మ సంబధమైన ప్రజల రాజ్యములో దయ్యములు పని చేస్తున్నవి.
45
ఇప్పుడు, మనము లోతైన ఏదో కార్యమును ఇక్కడ పొందుకోబోవుచున్నాము, మరియు అది అంత లోతైనది కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ సరిగ్గా ఈ సమయమందే మొదటి సమూయేలు 28లో, కొంత లేఖనభాగమును నేను చదవాలని అనుకున్నాను. మీరు జాగ్రత్తగా వినాలని నేను ఆశిస్తున్నాను. మరియు నేను “దయ్యములను” గురించి మాట్లాడగోరుచున్నాను. అవి మీకు సంఘములో ఏ విధంగా పనిచేస్తున్నాయి, మరియు సాతాను ఏ విధంగా ప్రతి నిజమైన దానికి పోలికగా ఉంటున్నదో అన్నది చూపించాలని అనుకుంటున్నాను. బైబిల్ ప్రకారముగా, ఇప్పుడు మీరు చూడగలరు, ఆ దయ్యములు క్రైస్తవుల మధ్యలోకి వచ్చి అవి క్రైస్తవులవలె (అనుకరించుచున్నవి) నటించుచున్నవి.
మరియు అనేక సార్లు వారు చెప్పినప్పుడు మనము ప్రజలు క్రైస్తవులవుచున్నారని ప్రచురిస్తాము, “నేను యేసుక్రీస్తును నమ్ముచున్నాను.” ఎందుకు, దయ్యములు కూడా అదే కార్యమును నమ్ముచున్నవి, మరియు వణకుచున్నవి. నీవు రక్షించబడ్డావు అనుటకు అది సూచన కాదు. ఈ రాబోవుచున్న ఒక రాత్రి నేను ఎన్నిక అను దాని తీసుకోవాలని అనుకుంటున్నాను, మరియు తరువాత రక్షణ ఏమైయుంటున్నదని మీరు చూస్తారు, చూశారా. దానితో మీరు ఏమియు చేయలేరు, మొదటి స్థానములోనో, లేక చివరి స్థానములోనో, లేక మీరు దానిని గూర్చి ఏమియు చేయలేరు. దేవుడు మనిషిని, నిబంధన లేని షరతులతో రక్షించెను. బాలుడా, అది ఎంతో లోతుగా కూరుకుపోయినది, అది కాదా? ఇప్పుడు, ఇక్కడ ఉండగనే, నీ పద్దతి నుండి పరిస్థితి నుండి బయటకు రావలసి ఉన్నది. అది సరే.
46
అబ్రాహాము మన యొక్క విశ్వాసమునకు ఆరంభముగా ఉన్నాడు. అది సరేనా? ఓ, అబ్రాహాము వాగ్దానాన్ని కలిగి ఉన్నాడు. మరియు దేవుడు అబ్రాహాముని పిలిచెను, ఎందుకనగా అతడు ఒక గొప్ప మనిషిగా ఉన్నాడు, నేను ఊహించుచున్నాను? కాదు, అయ్యా, బాబేలు ప్రాంతమైన కల్దీయుల దేశమందు ఊరు అను పట్టణము నుండి అతడు వచ్చెను, మరియు దేవుడు అతనిని పిలచి మరియు ఆయన అతనితో షరతులు లేని నిబంధన చేసెను. “నేను నిన్ను రక్షించబోవుచున్నాను. మరియు అబ్రాహామూ, నిన్ను మాత్రమే కాదు, అయితే నీ సంతతిని కూడా.” షరతులు లేని నిబంధన.
దేవుడు మానవునితో ఒక నిబంధన చేసెను, మరియు మనిషి ప్రతి సారి కూడా తన నిబంధనను బ్రద్దలు చేయుచున్నాడు. మానవుడు దేవునితో తన నిబంధనను ఎన్నడూ కాపాడుకోలేదు. ధర్మశాస్త్రాన్ని ఎన్నడూ గైకొనలేదు. వారు ధర్మశాస్త్రమును గైకొనలేకపోయారు. క్రీస్తు తనకు తానే, వచ్చి ధర్మశాస్త్రమును పగులగొట్టెను, ఎందుకనగా కృప ముందుగానే ఒక రక్షకుని ఏర్పాటు చేసెను. మోషే తప్పించుకొనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసెను. తప్పించుకున్న తరువాత, ముఖ్యముగా, మరియు తరువాత ప్రజలు, వారు ఇంకా ఏదో చేయాలని అనుకుంటున్నారు. నీవు దాని చేయలేనప్పుడు, మనిషి ఎల్లవేళల తనకు తాను రక్షించుకొనుటకు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాడు. అది అతని స్వభావము. ఏదేను తోటలో, అతడు వస్త్రహీనుడుగా ఉండెనని గ్రహించిన వెంటనే, అతడు కొన్ని అంజూరపు ఆకులను కచ్చడముగా చేసుకొనెను. అది వాస్తవము కాదా? అయితే అతడు అవి పని చేయవని గ్రహించుకున్నాడు. ఒక మనిషి తనకు తానుగా రక్షింపబడజాలడు. అన్ని కాలముల ద్వారా, షరతులు లేని నిబంధనతో దేవుడు నిన్ను రక్షించెను. మరియు అప్పుడు నీవు రక్షింపబడినప్పుడు, నీవు రక్షింపబడ్డావు.
47
అబ్రాహాము వైపు చూడండి. అతడు అక్కడికి వెళ్ళెను, మరియు దేవుడు అతనికి పాలస్తీనా దేశమును ఇచ్చెను, మరియు అక్కడ నుండి వెళ్ళవద్దు అని చెప్పెను. ఎవరైన యూదుడు పాలస్తీనాను విడిచినచో, వాడు వెనుకకు జారినవాడు అగును. దేవుడు అక్కడ ఉండమని అతనికి చెప్పెను. ఏదో ఒక కార్యము దేవుడు నీకు చేయమని చెప్పితే, మరియు దానిని నీవు చేయలేనప్పుడు, నీవు వెనుకకు జారినవాడవుగా అగుచున్నాను. అది వాస్తవమేనా? అది సరే, అబ్రాహాము విశ్వాసమును పరీక్షించుటకై ఒక కరువు వచ్చెను. మరియు అబ్రాహాము అక్కడ ఉండుటకు బదులుగా, లేదు అతడు అక్కడ ఉండలేకపోయాడు. అతడు పరుగెత్తుకు వెళ్ళి మరియు తన శారాను వెంటబెట్టుకొని మూడు వందల మైళ్ళు (దానిని గూర్చి నేను కొంత సమయము తీసుకోవాలని ఆశిస్తున్నాను) దూరము వేరొక దేశమునకు వెళ్ళెను.
మరియు అతడు అక్కడకు చేరుకొన్నప్పుడు, తరువాత అతడు ఈ గొప్ప రాజైన అబీమెలెకు అక్కడ ఉన్నాడు. అతడు ఒక యవ్వనస్తుడు మరియు అతడు ఒక ప్రియురాలు కొరకు ఎదురు చూస్తున్నాడు, కాబట్టి అతడు అబ్రాహాము భార్య అయిన శారాను కనుగొన్నాడు, మరియు ఆమెతో ప్రేమలో పడెను. మరియు “ఇప్పుడు, నీవు అతనితో నీవు నా చెల్లివని మరియు నేను నీ అన్న అని అతనితో చెప్పుమని,” అబ్రాహాము చెప్పెను.
కాబట్టి అది అబీమెలెకును ఆనందపరచెను, కాబట్టి “సరే, మేము ఆమెను కోటలోనికి తీసుకు వెళ్ళెదము,” అని అతడు చెప్పెను. మరియు నేను ఆ స్త్రీని, ఆమెను సిద్దపరచారని అనుకుంటున్నాను, మరియు అతడు మరుసటి దినాన్న ఆమెను పెండ్లి చేసుకోబోవుచున్నాడు.
48
మరియు అబీమెలెకు ఒక మంచి మనిషి, ఒక నీతిమంతుడైన మనిషి. మరియు ఆ రాత్రి, అతను నిద్రపోవుచుండగా, ప్రభువు ప్రత్యక్షమై - అతనితో ఈలాగున చేప్పెను, “నీవు ఎలాగైతే మంచి వ్యక్తిగా ఉన్నావో, అలాగే ఒక చచ్చిన వ్యక్తివై యున్నావు,” అని చెప్పెను, “ఆ పురుషుని... నీవు పెండ్లి చేసుకోనుటకై తెచ్చిన ఆ స్త్రీ, వేరొక పురుషుని భార్య,” అని ఆయన చెప్పెను. ఇప్పుడు గమనించండి, “వేరొక పురుషుని భార్య.”
ఎందుకు, “ప్రభువా, నా నీతి, పరిశుద్ధత, నా యొక్క యధార్థ హృదయము మీకు తెలియును. నా యొక్క యధార్థ హృదయము మీకు తెలియును. ఆమె నా చెల్లెలని, ఆ మనిషి నాతో చెప్పెను, మరియు అతడు నా అన్న, అని ఆమె తనకు తానుగా చెప్పలేదా?” అని అతడన్నాడు.
అతడు చెప్పెను... దేవుడు, “నీవు యధార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును, మరియు ఆ కారణము చేతనే నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా, నేను నిన్ను అడ్డగించితిని. కాని అతడు నా ప్రవక్త!” అని చెప్పెను. హల్లెలూయా!
అతడు ఏమైయున్నాడు? వెనుకకు జారినవాడు, మరియు కొద్దిగా, పిరికివాడు, అబద్ధమాడువాడునై యున్నాడు. అది సరేనా? ఓ, కాదు, అక్కడ తెల్లటి అబద్దాలు లేవు. అవి నల్లటి అబద్ధాలు లేక అసలు అబద్ధాలే లేవు. అక్కడ ఒక మనిషి కూర్చొని సంపూర్తిగా అబద్దములాడుచూ, ఆమె అతని భార్య అయి యుండి, ఆమె నా “చెల్లెలని” చెప్పుచున్నాడు, అది డొంక తిరుగుడుగా చెప్పుచున్నట్టు మరియు వెనుక జారినవాడుగా ఉన్నాడు.
మరియు ఇక్కడొక నీతిమంతుడైన మనుష్యుడు దేవుని ముందు నిలబడి ఉండి, మరియు “ప్రభువా, నా హృదయము నీకు తెలియును,” అని చెప్పాడు.
“అయితే, అబీమెలెకు, నేను నీ ప్రార్థనను వినను, కాని అతనిని తీసుకో... ఆమెను వెనుకకు తీసుకువెళ్ళు మరియు అతడు నీ కొరకు ప్రార్థించనిమ్ము, అతడు నా ప్రవక్త, నేను అతని ప్రార్థనను వినెదను.” అవును, ఒక వెనుకజారినవాడు, అబద్దికుడు, కాని “అతడు నా ప్రవక్త.” అది సత్యము? అదే బైబిల్.
49
ఇప్పుడు, ఇక్కడున్న కాల్వినిష్టుల మట్టపు గుండుకు దూరముగా వెళ్ళవద్దు, “ఒకసారి అది కృప అయితే, ఎల్లవేళలా అది కృపయే అవుచున్నది,” ఎందుకనగా నీవు అవమానపరచబడెదవు, చూశారా. ఇప్పుడు, ఒక క్షణము, దాని తీసుకువచ్చి, మరియు అది ఎంత సమమట్టముగా ఉన్నదో మీకు చూపించుటకు మనకు ఈ వారం సమయము ఉన్నది. అయితే నీవు ఏదో తప్పు చేశావు కనుక నీవు దూరమైతివని ఆలోచించవద్దు, నీవు దేవుని బిడ్డవు, మీరు దేవుని యొక్క ఆత్మ చేత జన్మించిన వారు, మీరు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలై యున్నారు, మరియు ఫలము దానికదే సాక్ష్యమిచ్చును. మీరు అక్కడే ఉన్నారు.
50
ఇప్పుడు, ఇక్కడ మనము ఈ దేశములో కూర్చొని ఉన్నాము. ఇప్పుడు, 6వ వచనము నుండి నేను చదవాలని ఆశించుచున్నాను.
యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారా నైనను ఏమియు సెలవియ్యకుండెను.
అప్పుడు సౌలు - నా కొరకు మీరు కర్ణపిశాచము గల యొక స్త్రీని కనుగొనుడి; నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా. (ఇక్కడ, కొద్దిగా నేను బెత్తమును సిద్ధపరచుదును: “నా కొరకు కర్ణపిశాచముగల యొక్క స్త్రీని కనుగొనుడి.”) వారు - చిత్తము, ఏనోరులో కర్ణపిశాచముగల యొకతె యున్నదని అతనితో చెప్పిరి.
కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని యిద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని పోయి, రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి - కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా.
ఆ స్త్రీ - ఇదిగో, సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలము చేసెను గదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి, నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను.
అందుకు సౌలు - యెహోవా జీవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష యెంతమాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణముచేయగా...
ఆ స్త్రీ - నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు - సమూయేలును రప్పింపవలెననెను.
ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి - నీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా.
రాజు - నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని అమె నడుగగా? ఆమే - దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను.
అందుకతడు - ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు, అది - దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచుచున్నాడనగా సౌలు - అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.
సమూయేలు - నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా, సౌలు - నేను బహు శ్రమలోనున్నాను; ఫిలిష్తియులు నా మీదికి యుద్దమునకు రాగా, దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమియు సెలవియ్యక యున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాలో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను.
అందుకు సమూయేలు - యెహోవా నిన్ను ఎడబాసి, నీకు పగవాడు కాగా, నన్ను అడుగుటవలన ప్రయోజనమేమి?
యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి, నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చియున్నాడు.
51
ఇప్పుడు, మీలో అనేకులు, దీనిని బాగా ఎరిగియుందురు. ఇప్పుడు మనము అందులోకి వెళ్ళాలని ఆశిస్తున్నాము, మరియు కొన్ని నిమిషములు, దీనిలోనికి వెళ్ళుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక. ఇప్పుడు గమనించండి. సౌలు, అను ఒక మనుష్యుడు అక్కడ ఉండెను. అతడు ఒకసారి ప్రవక్తగా పరిగణించబడెను, అతడు ప్రవక్తలతో కలిసి ప్రవచించెను. ఉపదేశకులారా, అది వాస్తవమేనా? ఇప్పుడు, ఇక్కడ ఆ మనిషి వెనుకకు జారినవాడుగా ఉన్నాడు. అది సరేనా? అయితే గుర్తుంచుకొనండి. సమూయేలు ఎక్కడ చెప్పెనో ఆ తరువాత రోజు, అతనితో కలిసి అతడు అక్కడుండెను. సంపూర్తి కాక ముందే వెళ్ళిపోయెను, చూశారా. సరే, నీవు. దేవుని లెక్కచేయకపోతే, దేవుడు నిన్ను భూమి మీద నుండి తీసివేయును.
52
అక్కడ కొరింథి పత్రికలో చూడండి, పౌలు ఏ విధంగా ఆ ప్రజలను క్రమములో ఉంచెనో, అతడు చెప్పాడు, “మొదటిగా, ఆత్మ సంబంధమైన కృపావరముల విషయమై మీరు ఏ లోటు లేనివారైయుండుట చూచి, మీ నిమిత్తమై నేను దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించుచున్నాను.” క్రీస్తులో మీ స్థానము ఏమైయుంటుందని వారికి చెప్పుచున్నాడు. తరువాత అతడు, వారి స్త్రీ బోధకులు గూర్చి, మరియు వారు ఏ విధంగా ప్రభువు యొక్క బల్ల దగ్గర భుజిస్తున్నారో వారికి చెప్పుచూ, వారిపై సమ్మెట దెబ్బ కోట్టడం ప్రారంభించాడు. అయినా ఒక మనిషి తన సవతి తల్లితో జీవించుచున్నాడు. మరియు అతడు క్రీస్తులో ఈ మనిషితో ఈలాగునా చెప్పెను, “అతని ఆత్మ రక్షింపబడుటకై, అతని శరీరము నశించబడుటకై, అతనిని దయ్యమునకు అప్పగించుడి.” చూశారా, అది అంతే. అతనిని అప్పగించుడి. “ఈ కారణము చేతనే మీలో అనేకులు వ్యాధిగ్రస్తులును మరియు బలహీనులునై యున్నారు, మరియు అనేకులు నిద్రించుచున్నారు,” అని బైబిల్ చెప్పుచున్నది. ఎందుకనగా పాపము చేత దినములు నిండక ముందే వెళ్ళిపోవుచున్నారు, ఆ మార్గము నుండి దేవుడు నిన్ను తీసివేయుచున్నాడు; నీవు తీసుకోబడితే, నీవు క్రైస్తవునివి అయి ఉండుట ఒక మంచి సూచనై యున్నది.
53
కాబట్టి, ఇప్పుడు గమనించండి, సౌలు ప్రవక్తలలో ఒక్కడుగా గుర్తించబడెను, లేక ప్రవక్త మధ్యలో ఒకనిగా ఉండెను, ఎందుకనగా అతడు ప్రవచించెను. మరిప్పుడు అతడు వెనుకకు దిగజారినవాడుగా ఉన్నాడు, ఎందుకనగా అతడు దేవునికి అవిధేయుడయ్యెను, మరియు అతని రాజ్యము అతని చేతిలో నుండి తీసివేయబడి, దావీదు చేతిలో పెట్టబడినది, అతడు సమూయేలు చేత నూనెతో, దేవుని అభిషేకము పొందెను.
54
గమనించండి. అంతట దేవుని యొద్ద నుండి విషయములను తెలుసుకొనుటకు వారికి మూడు మార్గములున్నవి: మొదటిది - ప్రవక్త. రెండవది - స్వప్నము. మూడవది - ఊరీము తుమ్మిము. వారికి వేరే మార్గములో జవాబు దొరకదు. ఇప్పుడు, ప్రవక్త అంటే ఏమిటో మీకు తెలుసు, ఆత్మ సంబంధమైన కల అంటే ఏమిటో మీకు తెలుసు, ఊరీము తుమ్మిము అంటే ఏమిటో మీకు తెలుసు. ఆ మరుసటి రోజు నేను ఒక మనిషిని ఊరీము గూర్చి ఏమిటో, తెలుసా, అని అడిగాను. ఊరీము తుమ్మిము ఏమైయున్నది, అన్నాను. ఆ మనిషి నాకు చెప్పలేకపోయెను. దేవుడు వాటి ద్వారా జవాబు ఇచ్చుచున్నాడు.
చూశారా, మాంత్రికుడు, అబద్ధపు ప్రవక్త, తళతళ మెఱయు స్ఫటికపు రాయిగా, ఈ దయ్యము ఈ ప్రతీ ఒక్కరి ద్వారా అనుకరణ చేయుచున్నది. చూశారా, మరియిప్పుడు, ఈ ఊరీము తుమ్మిము అహారోను రొమ్ముభాగాన వ్రేలాడుచున్నది. ఈ ఊరీము తుమ్మిము రాళ్ళచేత కట్టబడివున్నది. మరియు వారు దాన్ని మందిరములో వ్రేలాడదీసెను. వారికి నిశ్చయత లేనప్పుడు, జవాబు కొరకై దేవుని ముందుకెళ్ళి, ఈ ఊరీము తుమ్మిము పైన వెలుగు ప్రకాశించుచున్నదా లేదా, అది దేవుని చిత్తమా - కాదా, అని తెలుసుకొందురు. ఇప్పుడు ఆ ఊరీము తుమ్మిము జవాబు ఇవ్వకపోయినపుడు... ఇప్పుడు, అది దేవుని యొద్ద నుండి నేరుగా వచ్చిన జవాబే అవుచున్నది.
ఇప్పుడు, ఈ దినాన ఊరీము తుమ్మిమును, ఒక సోదే చెప్పువాడుగానో, స్ఫటికము వంటి బంతిగానో అటువంటి మాదిరిగానో తీసుకుంటున్నారు — అది అబద్దపు కార్యము. దేవుడు త్రిత్వములో వున్నాడు, దేవుని శక్తులు కూడా త్రిత్వంలో వున్నవి; దయ్యము కూడా త్రిత్వంలో వున్నది, అతని శక్తులు కూడా త్రిత్వంలో వున్నవి. నేను దానిని బైబిల్ ద్వారా రుజువు చేయగలను. ఆ ఊరీము తుమ్మిమును ఈ రోజు దయ్యము వాడుచున్న ఒక స్ఫటికము వంటి బంతి మాత్రమే. ఇక్కడ ఈ రోజు అబద్ధపు ప్రవక్త తిరిగి వచ్చెను, ఇప్పుడు, మనము ఆ ఒకటి మాత్రమే కలిగియున్నాము... లేక, మంత్రగత్తె, లేక, సోదె చెప్పువాడుగా అదుగో దూరాన, దయ్యం పక్షాన ప్రవక్త యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. నా భావమేమిటో గ్రహించారా?
55
ఇప్పుడు, తరువాత, ఈ రోజులలో ఊరీము తుమ్మిము ఈ బైబిల్ గ్రంథమే. ఎవరో ఒకరు ఒక ప్రవచనము గాని లేక ఒక కలగాని కన్నా, మరియు అది దేవుని యొక్క బైబిల్ గ్రంథముతో సరిపోకపోయిన లేక ప్రతిధ్వని ఇవ్వకపోయినా, అది అసత్యము. దాన్ని నమ్మవద్దు.
నేను ఎక్కడికైతే వెళ్ళాలని అనుకున్నానో, అక్కడి నుండి, ఇండియా నుండి, ఒక చిన్న బోధకుడు, కొంత కాలం క్రితం నా యొద్దకు వచ్చెను. “సహోదరుడా బ్రెన్హాం, నేనిక్కడికే వచ్చాను,” అని అతడన్నాడు, ఒక స్త్రీ పరిశుద్ధాత్మను పొందుకున్నది, మరి, ఆమె ఎంతో మంచిది, మధురమైన స్త్రీ,“ అని చెప్పాడు. (ఆమె నాలుగు సార్లు పెండ్లిచేసుకొన్నది, ఆమె నాల్గవ భర్తతో జీవించుచున్నది.)
మరియు నేను చెప్పాను, “మంచిది, ప్రభువా అది ఎలాగు సాధ్యం.”
“నేను అతనితో వెళ్ళి చెప్పాను, ”ఓ, దేవునికే మహిమ!“ చెప్పాను, ”హల్లెలూయా! ప్రభువుకు స్తోత్రం!“ (ఆ విధంగా చెప్పే ఒకరివలె, మీకు తెలుసా.) ”హల్లెలూయా! ప్రభువుకి స్తోత్రం,“ అని చెప్పాడు. ప్రభువు నాకు చెప్పాడు, ”ఇక్కడ నీకు ఒక కలను నేను చెప్పబోవుచున్నాను,“ అని అన్నాడు. ”నా కలలో నా భార్య వ్యభిచారంలో జీవించుచున్నట్లు నేను చూశాను, ఆమె తిరిగి వచ్చి నాతో ఇలా చెప్పినది, 'ఓ, నీవు నన్ను క్షమించెదవా, విక్టర్? నీవు నన్ను క్షమించెదవా?“ నేను క్షమించాను... ఎందుకు, ”తప్పకుండా, నేను నిన్ను క్షమించి మరియు తిరిగి చేర్చుకొందును, అని నేను చెప్పాను.“ ”ఇప్పుడు, అదే నేను చేశాను,“ అని అతడన్నాడు. ”చూశారా, నేను క్షమించెదను,“ అని చెప్పాడు.
“విక్టర్, నీ కల చాలా అందముగా ఉన్నది, కాని దయ్యము దాని నీకు ఇచ్చెను,” అని నేను చెప్పాను.
“ఎందుకని?” అని అతడు అన్నాడు.
“దేవుని వాక్యముతో సరిపోల్చదు. సంపూర్తిగా ఆమె వ్యభిచారములో జీవించుచున్నది. ఆమె నలుగురు మనుష్యులతో జీవించకూడదు. వాస్తవము. ఆమె దానిని వదిలి పెట్టి మరియు ఆమె మొదటి దాని యొద్దకు మరల వెళ్ళినది, ఆమె ప్రారంభము కంటే బహు నీచముగా ఆమె ఉన్నది. ఆమె జీవితమంతా, ఆమె ఒంటరిగానే జీవించవలసి ఉన్నది,” అని నేను చెప్పాను. “దానిని దేవుని వాక్యముతో పోల్చకూడదని నీకు తెలియును, కాబట్టి ఆమె... నీ కల తప్పు,” అని నేను చెప్పాను. “దీనితో అది సరిపోల్చదు,” అని నేను చెప్పాను.
56
ఒక ప్రవక్త ప్రవచనం చెప్పినప్పుడు, వారు పలికినప్పుడు, ఆ ప్రవచనం సత్యమేనా అని చూడాలనుకున్నట్లయితే, వారు దాన్ని ఊరీము తుమ్మిము ముందు ఉంచేవారు. ఆ ఊరీము తుమ్మిము మీద దేవుని స్వరము యొక్క వెలుగు పడినట్లయితే, అంతట అది సంపూర్ణముగా సత్యమే. ఒక మనిషి కలకు గాని, బైబిల్లో ఏదో ఒక దానికి గాని, లేక మరేదో దానికి గాని దాని యొక్క అర్థానికి అనువాదము చేసినట్లయితే, అది గనుక దేవుని యొక్క బైబిల్ తో సరిపోకపోతే, అది తప్పు అగును. ఈ దినాన్ని కూడా ఊరీము తుమ్మిము వున్నది. బైబిల్ వ్రాయబడక ముందు ఊరీము తుమ్మిము ఎలాగున్నదో - అలాగే దేవుని యొక్క మాటలు పలుకబడుచున్నవి. అది నేరుగా దేవుని యొక్క వాక్యమై యుంటున్నది. ఆమేన్! హల్లెలూయా! ఇప్పుడే నేను భక్తిపూరితమైన అనుభూతిని చెందుచున్నాను. నన్ను ఒక పిచ్చివానిగా తీసుకోవద్దు, మీరు అలా అనుకుంటారు. నాకు తెలుసు. నేనెక్కడున్నానో నాకు తెలుసు. నేను ఉద్రేకింపబడుట లేదు. అది వాస్తవము.
57
ఇక్కడ సత్యమున్నది. దేవుని వాక్యము! ఎటువంటి రకమైన కలను నీవు కన్నా, లేక ఎటువంటి రకమైన ప్రవచనము చెప్పినా, అది దేవుని యొక్క వాక్యము కాకుంటే, నేను లెక్క చేయను. అది దేవుని వాక్యముతో సరిపోకపోతే, అది తప్పే. అదే ఈ రోజు కలిగినటువంటి ఇబ్బంది. ఒకరు కలను కలిగియున్నారు, ఒకరు దర్శనం కలిగియున్నారు, ఒకరు భాషలు కలిగియున్నారు, ఒకరు ప్రత్యక్షతను కలిగియున్నారు; అది ప్రతీ కార్యమును గందరగోళము చేస్తున్నది. మరియు మీరు సంఘ శాఖల్లో వుండి, ప్రతీ దాన్ని బ్రద్దలు చేయచున్నారు. ఆఖరి పునాది అయిన దేవుని యొక్క వాక్యము యొద్దకు మారు తిరిగి రావలసివున్నది. అది సత్యము.
సంఘములన్ని ఒక దాని మీద ఒకటి కట్టబడుచున్నవి, “ఓ, యేసు తెల్లని గుర్రం మీద వచ్చుచున్నాడు. నాకు తెలుసు. నేనొక దర్శనంలో ఆయనను చూశాను,” అని చెప్పుదురు. వారు ఆ రకమైన సంఘాన్ని తయారు చేస్తున్నారు, “ఓ, హల్లెలూయా, ఆయన మేఘము మీద వస్తున్నాడు.” వారు దానిని ఆ రకమైనదిగా తయారు చేయుచున్నారు. వారు విడగొట్టబడి, వేరైపోయి, ఒకరి నొకరు “కోళ్ళ ఝంకారము,” అని ఇంకా “పేన్ల గుంపు,” అని ప్రతీది ఆ విధంగా పిలుచుకొనుచున్నారు. ఎందుకు, సహోదరుడా, అది మొదటి స్థానములోనికే, మెల్లగా వెళ్ళిపోవుచున్నది, నీవు అది చేసినప్పుడు, నీ హృదయం దేవునితో సరిగ్గా లేదు. అది వాస్తవము. మనము సహోదరులము. మనము తప్పక ఒకరినొకరము కలిసి ఉండవలసియున్నది. మనము ఒకరికొకరము అవసరమైయున్నాము.
58
ఇప్పుడు గమనించండి. సౌలు వెనుకకు జారినవాడాయెను, మరియు అతడు వెళ్ళుచున్నాడు. ఆయన, దేవుడు, తన ముఖమును అతని నుండి త్రిప్పుకొనెను. మరియు అతడు వెళ్ళిపోయి మరియు అతడు ప్రవక్తతో విచారణ చేసెను, ప్రవక్త వెళ్ళి ప్రవచించుటకు ప్రయత్నము చేసెను, మరియు దేవుడు నిలుపు చేసెను, ఒక్క దర్శనము కూడా ఇవ్వలేదు. ప్రవక్త బయటకు వచ్చి, “నేను చేయలేను.... ఆయన నీ గురించి నా కేమియు చెప్పలేదని,” చెప్పాడు.
మంచిది, తరువాత “ప్రభువా, నాకు ఒక కల ఇవ్వు,” అని అతడు అడిగెను, రాత్రులు దాటిపోయినవి, ఏ కల రాలేదు. అప్పుడు, అతడు ఊరీము తుమ్మిము దగ్గరకు వెళ్ళుచున్నాడు, మరియు “ఓ, దేవా! నేను ప్రవక్తల ద్వారా ప్రయత్నము చేశాను, నేను కల ద్వారా ప్రయత్నము చేశాను, ఇప్పుడు నీవు నాకు సహాయము చేయుము, నీవు దానిని చేయుదువా?” అని అతడు అడిగెను. అది నరకబడినది, ఏ కాంతి ప్రకాశించుట లేదు.
అప్పుడు, అతడు నీచమైన, హీనమైన, ఒక మంత్రగత్తెను ఆశ్రయించెను. మరియు అతడు ఆమె దగ్గరకు పోయి, మరియు అతడు తనకు తానుగా మారువేషము వేసుకొని, అక్కడకు పోయెను. మరియు ఈ మంత్రగత్తె బయటకు వెళ్ళి సమూయేలు యొక్క ఆత్మను పిలిచెను.
ఇప్పుడు, మీరు ఏమి ఆలోచన చేస్తున్నారో నాకు తెలుసు. “అది సమూయేలు కాదు,” అని అనేకులు చెప్పెదరు. కాని సమూయేలు అని బైబిల్ చెప్పుచున్నది, మరియు అది సమూయేలు. నీవు దాని ఏ విధంగా పట్టుకొన్నావో, అది వింతగా ఉన్నది కదా? అయితే అది సమూయేలు. అదేనని బైబిల్ చెప్పుచున్నది.
మరియు ఆ మంత్రగత్తె అతన్ని పిలువగలిగినది, మరియు ఆమె సమూయేలును పిలిచినది. మరియు సమూయేలు ఎక్కడో ఒక చోట ఉన్నాడు, అయితే ఏమి జరిగినదో అన్న ఆత్మ వివేచన ఇంకా కలిగి ఉన్నాడు. మరియు అతను తన ప్రవక్తల దుప్పటి కప్పుకొని ఇంకా నిలబడి ఉన్నాడు. కాబట్టి, సహోదరుడా, నీవు చచ్చినప్పుడు, మీరు చనిపోవుటలేదు; మీరు ఎక్కడో ఒక చోట జీవిస్తున్నారు. ఎక్కడో ఒక చోట.
59
ఇంకొంచెము లోతుగా ఈ దయ్యపు శ్రాస్తమును పొందుకొనుటకు నన్ను ఒక నిమిషము నిలుపు చేయనివ్వండి. ఆమె ఒక దయ్యము, కాని ఈ ఆత్మ ప్రపంచమునకు ఆమె అతి సమీపముగా ఉన్నది. ఇప్పుడు, ఈ రోజు, ప్రజలు తమకు తామే క్రైస్తవులమని బహిరంగముగా చెప్పుకొనువారికంటే, ఆత్మ సంబంధికి ఆత్మ ప్రపంచమును గూర్చి మరి ఎక్కువగా తెలియును, అయినప్పటికీ ఆమె ఒక దయ్యము. బైబిల్ కాలములో కూడా అది అదే కార్యముగా ఉన్నది.
యేసు ఇక్కడ భూమిపైన ఉన్నప్పుడు, అక్కడ వారి యొక్క వేదాంత పండితులు మరియు విద్యావంతులు, మరియు బోధకులు ఉన్నారు, మంచి సెమినరీల కంటే, ఇక్కడ కొందరు గొప్పవారిని మనము ఈ రోజున ఉత్పత్తి చేయగలుగుచున్నాము. మరియు పరిశుద్ధ, కీర్తి కలిగిన మనిషి, వారికి ఉన్నారు, ఒక లేవిని కనుగొన్నట్లయితే, అతడు ప్రతి దానియందు నిర్దోషియు, నీతిమంతుడుగా కనుగొనబడవలసి ఉండెను. అయినప్పటికీ ఒక కుందేలుకి, మంచుకుందేలు గురించి ఎలాగు తెలియదో - ఆ మనిషికి దేవుని గూర్చి యేమియు తెలియదు. యేసు వచ్చినప్పుడు, ఆయనను గుర్తించుటలో అతను విఫలుడయ్యెను, మరియు అతను యేసును ఇలా పిలిచెను, “దయ్యము” “బయల్జెబూబు, దయ్యములకు అధిపతి,” అని అతడు పిలిచెను. అది వాస్తవమేనా?
60
మరియు ఇక్కడకు ఒక నీచ తరహాకు చెందిన ఒక దయ్యము వచ్చి, అదుగో దూరాన సమాధుల్లో మరియు ప్రతి కార్యము చేత ఆ మనిషిని బంధించెను, మరియు వాటిని బయటకు రమ్మని పిలిచెను. దయ్యము తనకు తానుగా ఈలాగు చెప్పేను, “నీవు ఎవరో మాకు తెలుసు. నీవు దేవుని యొక్క కుమారుడవు, పరిశుద్ధుడవు,” అని చెప్పెను. అది వాస్తవమేనా? మంత్రగత్తెలు మరియు మాంత్రికులు, దయ్యములు ఆయనను దేవుని కుమారునిగా గుర్తించెను; ఆ సమయమందు విద్యావంతులు, వేదాంత పాఠశాల బోధకులు ఆయనను బయల్జెబూబులుగా గుర్తించిరి. ఏది వాస్తవము, దయ్యమా లేక బోధకులా? దయ్యము. మరియు సహోదరుడా, అది ఈ రోజు ఎక్కువగా మార్పుచెందలేదు. వారు దేవుని యొక్క శక్తిని గుర్తించుట లేదు.
61
నీవేంతటి బోధను కలిగి ఉన్నప్పటికి. అది నీలో మద్దెలు మ్రోగించగలదు. దేవుడు పెద్ద మాటలలో లేడు. దేవుడు యధార్థ హృదయములో ఉన్నాడు. నీవు ఇక్కడ నిలబడి, అదేమిటో నాకు తెలియని విధంగా, పెద్ద మాటలు పలుకవచ్చును, అది నిన్ను దేవునికి దగ్గరగా తీసుకు రాదు. నీవు నిలబడి నీతి వాక్యములు మరలా అభ్యాసము చేసి మరియు అలాంటి కార్యములు చెప్పగలవు, అది నిన్ను దేవునికి సమీపస్తునిగా చేయలేదు. నీవు ఒక క్షణము కూడా నిద్రించకుండా నిఘంటువును నేర్చుకొనగలవు, అయినప్పటికి అది నిన్ను దేవునికి సమీపస్తునిగా చేయలేదు.
ఒక దీనత్వము, సమర్పణ హృదయము, సామాన్యత, నిన్ను దేవుని యొద్దకు తీసుకు వచ్చును. మరియు అది సత్యము. ఆమేన్! ఒక దీన హృదయమును దేవుడు ప్రేమించును. ఇప్పుడు నీ యొక్క ఎ.బి.సి.లు నీకు తెలియనవసరము లేదు, అది ఏ వ్యత్యాసమును చేయదు. కేవలం ఒక దీన హృదయము! దేవుడు ఒక దీన హృదయములో నివసించును; విద్యలో కాదు, పాఠశాలలో కాదు, వేదాంత పాఠశాలలో కాదు, సెమినరీలలో ఇంకా వేరే స్థలములన్నిటిలో కాదు; పెద్ద మాటలలో కాదు, లేదా అత్యుత్తమమైన స్థలములో కాదు. దేవుడు మానవ హృదయములో నివాసము చేయును. నీవు ఎంతగా తగ్గించుకుంటే దేవుని దృష్టిలో నీవు అంత గొప్పగా అయ్యెదవు.
62
నన్ను ఏదో కార్యమును మీకు చెప్పనివ్వండి, ఇక్కడున్న మీ పొలములన్ని గోధుమ కంకితో నిండియున్నవి. గోధుమ పూర్తిగా పండినప్పుడు అది ఎల్లప్పుడు తల దించుకొనును. ఒక చిన్న పాతవైన పుల్లల చెట్టు దానికంత తెలుసుననుకున్నట్లుగా విరజిమ్ముకుంటాయి, అవి ఇంకా గింజను కలిగిలేవు. ఆ విధంగానే ఈ అనేకమైన కుర్రాళ్ళ ఆలోచన కూడా, వారి తలలో అంతా పొందుకున్నాము అని అనుకుంటారు. వారి హృదయంలో ఏమియు లేదు. లేక పరిశుద్ద శిరస్సు శక్తికి తలవంచును, యేసుక్రీస్తుని దేవుని కుమారుడునిగా గుర్తిస్తారు, మరియు ఆయన క్రియలను నమ్మెదరు.
“ఆయన నిన్నా, నేడూ, ఒకేరీతిగా వున్నాడు.” ఓ, వారాయనను, తప్పక, చరిత్ర సంబంధమైన మైలు రాయి వద్ద గుర్తించెదరు. అయితే, చారిత్రక కార్యము కాదది. “ఓ, గొప్ప కుమ్మరింపును మరలాంటి కార్యమును కలిగియున్నప్పుడు, నేను పెంతెకోస్తును నమ్ముచున్నాను,” అని జనులు నిలబడి చెప్పెదరు. పూయబడిన అగ్ని రంగు. గడ్డకట్టుకుపోవుచున్న మనిషి పూయబడిన అగ్ని చేత వేడికాలేడు; పూయబడిన అగ్ని వేడినివ్వలేదు. వారదే అయి ఉన్నారు. ఈ దినాన అదేమిటి, ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా వున్నవాడు కాదా? అది పూయబడిన అగ్ని, గడ్డకట్టుకొని చనిపోతున్న ఒకరు ఇలా చెప్పెను, “వారు కలిగి వున్న ఆ గొప్ప అగ్ని వైపు చూడండి.” ఎందుకు, అది మీకు వేడినివ్వలేదు.
63
పెంతెకోస్తు వద్ద వారు ఏమి చేశారు, క్రొత్త నిబంధన ఆరంభ దినాల్లో వారేమి కలిగియున్నారు. ఈ దినాన మనము పొందుకున్నదేమిటి! దేవుడు (విషయమును) వస్తువుని తీసుకొని ఇస్తిరి చేసిన వెంటనే, సంఘము ఏకమైపోవుచున్నది, ఎత్తబడుట వస్తుంది. అయితే, దైవిక స్వస్థత పొందుకునే విశ్వాసము కూడా మనకు లేదు, ఎత్తబడుటలో ఎలాగుంటాము, ఎందుకనగా ఒకరు ఈ విధంగాను, ఒకరు ఆ విధంగాను, మనమంతా తలక్రిందులైపోయాము. “ఇది ఫలాన - ఫలాన అని డాక్టర్ చెప్పును. మంచిది, ఆయన ఇది అని నా బోధకుడు చెప్పును.”
కొంత సేపటి క్రితం, ఒక స్త్రీ ఇలా చెప్పెను. “అతడు ఒక అనుకరణ చేయువాడు.” “నా యాజకుడు నాకు అలాగున చెప్పెను,” అని అన్నది. ఆమె యాజకుడను ఒక్కసారి ఇక్కడకు రమ్మని నేను కోరుచున్నాను. ఎవరు అనుకరణ చేయువారో మనము చూచెదము, అవును. ఎవరు అనుకరణ చేయువారో మనము చూద్దాం. వచ్చి ప్రయత్నించ వచ్చును.
64
ఇక్కడే కొంచెం కాలం క్రితం, టెక్సాస్, హెరిలిన్ లోని మేము అక్కడ కూటము కలిగియుంటిమి. ఆ రాత్రి నేను అక్కడికి వెళ్లినప్పుడు ఆ కార్లంతటి మీద గొప్ప గుర్తులు వారు కలిగియుండిరి, నన్ను ఒక నకిలివాడుగా బట్టబయలు చేయుటకు యఫ్.బి.ఐ వారు అక్కడున్నారని చెప్పెను. కనుక అక్కడ టెక్సాస్లోని ఎక్కడో చోట ఒక చిన్న బాలిక స్వస్థపరచబడెను. పెనహెండల్ చుట్టుపట్లలలో వేయి మైళ్ల దూరం నుండి ఆమె వచ్చినదని నేననుకుంటున్నాను. ఇది హెరిలిన్లో సరిహాద్దు ప్రాంతములో వున్నది. సహోదరుడు బాక్స్టర్ వచ్చి, “ బ్రెన్హాం సహోదరుడా,” అని చెప్పెను. “నీవెన్నడు అలాంటి గందరగోళమును చూడలేదు, అక్కడ సుమారుగా నాలుగు లేక ఐదు వేల మంది జనులున్నారు,” అని చెప్పెను. “అంతటా, ఈ రాత్రి వేదికపై నిన్ను పట్టుకొని, నిన్ను బట్టబయలు చేయుటకు, యఫ్.బి.ఐ. వారంతా చుట్టూ వున్నారు,” అని చెప్పాడు.
“మంచిదే, నేను తప్పక దాన్ని గూర్చి సంతోషించుచున్నాను,” అని నేనన్నాను.
గత రాత్రి ఆ చిన్న బాలిక స్వస్థపరచబడెనని నీకు తెలియునా?“ అని అన్నాడు.
65
నేను ఇంటికి పయనించి, నా గదిలోనికి వెళ్ళుచుంటిని, మరియు ఏదో అరవడం నేను వినుచున్నాను. మరియు చుట్టూ చూశాను. బహుశా, ఎవరో ఒకరు దాడికి గురైరి అని నేను అనుకొనుచున్నాను. అది ఒక బాలిక. మరియు నేను వెనుదిరిగి చూశాను. నేను చెప్పాను... మరియు నేను వెనుకకు వెళ్ళి, ఇలా చెప్పాను. “అమ్మగారు, ఏమిటి సంగతి?” మరియు పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల ఆ ఇద్దరు చిన్న బాలికలు అక్కడే నిలబడి ఉన్నారు, వారి చేతులు ఒకరి మీద ఒకరు వేసుకొని ఏడ్చుచున్నారు.
“సహోదరుడా బ్రెన్హాం!” అని అన్నారు. (అప్పుడు వారు నన్నెరిగియున్నారు అని నేను ఎరిగితిని.) “మేము, ఇక్కడకు అన్ని మార్గముల గుండా ఆమెను తెచ్చాము,” అన్నారు “ఆమె పిచ్చాసుపత్రికి వెళ్ళవలసి ఉన్నది,” అని అన్నారు. మరియు ఆ చిన్న బాలిక టెక్సాస్, లూబక్లోని నా కూటములో ఉన్నది. “నేను ఎప్పుడయిన ఆమెను ఇక్కడకు తెస్తే మరియు నీవు ఆమె కొరకు ప్రార్థిస్తావు అని నేను ఎరుగుదును, ఆమె స్వస్థపరచబడునని, నేను నమ్ముచున్నాను,” అని అన్నదామె.
“ఎంతటి విశ్వాసమో!” మంచిదని, నేను అనుకున్నాను. మరియు “మంచిది, ఇప్పుడు, సహోదరీ, నీవు ఆమెను తీసుకురాగలవా....” అని నేను అడిగాను. మరియు అప్పుడు వెంటనే, “నీవు ఇక్కడకు ఒక పసుపు రంగు రోడ్స్టర్ కారులో వచ్చావు, నీవు కాదా?” అని నేను అన్నాను.
“అవును,” అన్నది
మరియు “మి తల్లిగారు ఒక చచ్చుబడిపోయినదిగా ఉన్నది కదా,” అని నేను అన్నాను
“అది సత్యము,” అన్నదామె.
“నీవు మెథడిస్టు సంఘానికి చెందినదానవు,” అని నేను అన్నాను.
“అది కచ్చితముగా నిజము,” అని అన్నదామె.
మరియు “ఇంచుమించుగా మీరు రోడ్డు మీద తిరగబడి పోయారు. సగం కాంక్రీటు, సగం తారు రోడ్డు ఉన్న రహదారి మీదకి వచ్చినప్పుడు నీవు మరియు ఈ బాలిక నవ్వుకొనుచూ వున్నారు, మరియు మలుపు తిరుగుచున్నావు,” అని నేను చెప్పాను.
“సహోదరుడా బ్రెన్హాం, అది సత్యం,” అని అన్నది.
“మరియు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ బాలిక స్వస్థపరచబడెనని,” నేను చెప్పాను.
66
ఆ తర్వాత రోజు చుట్టూ వెళ్ళుచూ, ప్రతి ఒక్కరికి చెప్పుచూ ఆమె పట్టణానికి నిప్పు అంటించినట్లు చేసినది. అక్కడి వారికి ఆమె ఎవరో తెలియదు, ఆమె ఆ స్థితిలో ఎప్పుడు వుంటున్నదో లేదో తెలియదు. అంతట ఆ దినాన నేను, సహోదరుడు బాక్స్టర్ చెప్పెను, “బ్రదర్ బ్రెన్హాం, ఆ ఇద్దరు బాలికలు వారి పెట్టెను సర్దుకొంటున్నారు,” అని చెప్పెను. నేనెరిగిన ఈ ఒక్క కార్యమును అతడెరుగలేదు. మన యొద్ద వున్న ధనము అయిపోవుచున్నది. దాన్ని గూర్చి నేనెన్నడూ అతనిని మాట్లాడనియ్య లేదు. కాని ఆ ఇద్దరు బాలికలో ఒకరు తొమ్మిది వందల డాలర్లు అందులో - దానికి ముందు రాత్రి కానుకల పెట్టెలో వేసెను, ఆ ధనము (ద్రవ్యము) తీసుకురాబడినది. ఇప్పుడు, అతనికి తెలియదు, ఈ రోజు వరకు అది అతనికి తెలియదు, కాని నేనది ఎరుగుదును, చూశారా. అది అంతా సరైపోవునని దేవుడు నాకు చెప్పెను.
67
మరియు సహోదరుడు బాక్స్టర్, “సహోదరుడా బ్రెన్హాం, నీవు నన్ను కొంచెము లాగినట్లయిన బాగుండెడిది,” అని అన్నాడు. “ఇక్కడ ఈ ప్రజలను లాగినటువంటి, కొందరు దైవిక స్వస్థత జరిగించువారు, వారికి కొందరు ఇక్కడ ఉన్నారు,” అని అన్నాడు.
“లేదు, లేదయ్యా, నీవు అది చేయకూడదు. సహోదరుడా బాక్స్టర్, నీవు ఆ విధంగా డబ్బు కొరకు ఎప్పుడైన లాగినప్పుడు, ఆ సమయమున నీవు, నేను, ఒకరి చేతులు ఒకరము కలుపుకొని, నేను ఒంటరిగా వెళ్ళిపోవుదును, చూశారా,” అని నేనన్నాను. “నీవు అది చేయకూడదు,” అని నేనన్నాను. “వేయికొండలపైన వున్న పశువులన్నీ దేవుని సొంతం, ప్రతిదీ ఆయనకు చెందినదే. నేను ఆయనకు చెందినవాడినే, ఆయన సన్ను గూర్చి శ్రద్ద వహించును,” అని నేనన్నాను.
“సరే,” అని అతడన్నాడు.
మరియు ఆ రాత్రే అతడు చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హాం, ఇటు చూడు. ఎవరో ఒకరు... ఇటు చూడు! ఇక్కడ ఒక కవరు ఉంది, దీనిపై ఏ పేరు లేదు, దానిలో తొమ్మిది వందల డాలర్లు గల చీటి ఉన్నది. మాకు ఎంత అవసరమో కచ్చితముగా అంతే ఉన్నది.”
“సహోదరుడా బాక్స్టర్,” అని నేను అన్నాను.
“నన్ను క్షమించు,” అని అతడు చెప్పాడు.
68
కాబట్టి అప్పుడు, అది ఆ బాలికే అని నేను తెలుసుకొన్నాను. కాబట్టి అప్పుడు తరువాత రోజు, సహోదరుడు బాక్స్టర్ చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హాం, వారు అక్కడ వారి బట్టలు సర్దుకొంటూ, ఏడుస్తున్నారు,” అని చెప్పాడు.
“ఏమి జరిగినది?” అని నేను అడిగాను.
“నీవు క్రిందికి వెళ్ళి వారిని చూచుట మంచిదని,” అన్నాడు.
వారు ఎక్కడైతే ఉన్నారో ఆ గది దగ్గరకు నేను వెళ్ళాను. “వారు ఏ గదిలో ఉన్నారు?” అని నేను అడిగాను. నేను అక్కడకు వెళ్ళి తలుపు తట్టాను. వారు ఏడ్చుటను నేను విన్నాను. నేను తలుపు తట్టాను, మరియు ఆ బాలిక తలుపు నొద్దకు వచ్చి, “ఓ, సహోదరుడా బ్రెన్హాం,” అని అన్నదామె. “నీకు ఈ సమస్యంతా వచ్చుటకు కారణము నేనే,” అని అన్నదామె.
“ఇబ్బందా? సహోదరి, ఏమీటి విషయం?” అని నేను అన్నాను.
“ఓ, నా వలన యఫ్.బి.ఐ. వారు నిన్ను వెంటాడుతున్నారని,” ఆమె చెప్పినది.
“ఓ, అది నిజమా?” అని నేను అన్నాను.
“అవును,” అని అన్నది. “నేను పట్టణమంతా జరిగిన దానంతటి కొరకు చాలా సాక్ష్యమిచ్చాను అని నేను అనుకొంటున్నాను,” అని చెప్పినది.
“లేదు,” అని నేను చెప్పాను.
మరియు ఆమె, “సహోదరుడా బ్రెన్హాం, యఫ్.బి.ఐ. వారు అక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు, నిన్ను ఈ రాత్రి బట్టబయలు చేయబోవుచున్నారని,” చెప్పెను.
“మంచిది, నేను ఏదైన తప్పు చేసినట్లయిన, నేను బట్టబయలు కావలసిన అవసరత ఉన్నది,” అని నేను చెప్పాను. చూశారా? “తప్పక, సువార్తను ప్రకటించుటను బట్టి బట్టబయలు కావలసి ఉండినట్లయితే, మంచిదే, దానిని చేయనియ్యండి, చూశారా,” అని నేను చెప్పాను. “నేను ఈ బైబిల్ ద్వారా జీవిస్తాను, మరియు ఈ బైబిల్ చెప్పనిదానిని... సరిగ్గా ఇక్కడ ఇదే నా రాక్షనైయున్నది, చూశారా?” అని నేను చెప్పాను. మరియు నేను చెప్పాను, మరియు...
69
“మంచిదని,” అన్నదామె. “నేను ఏదైయితే చేశానో, ఆ చేసిన దానికి నన్ను క్షమించు,” అని అన్నది.
“సహోదరి, నీవు ఎన్నడు ఏమియు చేయలేదు,” అని నేను అన్నాను.
“మంచిది, నీవు అక్కడకు వెళ్ళుటకు బయపడుట లేదా?” అని ఆమె అడిగినది.
మరియు నేనన్నాను, “లేదు.”
“మంచిది, ఆ యఫ్.బి.ఐ. వారు అక్కడున్నారు,” అని అన్నదామె.
“వారు రక్షించబడుటకు ముందు వారు నా కూటమునకు రావటం మంచిదే,” అని నేను చెప్పాను. “మిస్టర్. ఆల్ ఫెరర్...” అని నేను పిలిచాను.
అధికారి అయిన ఆల్ ఫెరర్, మీలో అనేకులకు వాషింగ్టన్, టకోమాలో, సరిగ్గా షూటింగ్ గేలరీ వద్ద అతను మార్పు చెంది, రక్షింపబడెనని మీకు తెలియును. అతను కూటమునకు వచ్చి, ఇలాగున, “రెండు సంవత్సరాల నుండి నేను ఈ మనుష్యుని వెంబడించుచున్నాను. ధనమును గూర్చి నేను విన్నాను, దాన్ని నేను గమనించాను, మరియు ప్రతి చోటకి వెళ్ళాను,” అని చెప్పెను. “ఇది సత్యము, ఈ రాత్రి మీరు ఎవరో మూఢభక్తి గూర్చి వినుటలేదు; మీరు సత్యమును వినుచున్నారు,” అని చెప్పెను.
“రక్షణ బలగంలో పని చేస్తున్న, అందులో ఒకరిని నేనెరుగుదును, అతని బిడ్డను ఒక వైద్యుడు చూసి, అతనిని ప్రార్థనా వరుసలోనికి పంపెనని,” చెప్పెను. ఇంకా చెప్పాడు, “ఏ బలహీనతతో, ఏమి జరిగినదో ఆ బిడ్డకు కచ్చితంగా చెప్పాడు,” ఇంకా చెప్పాడు, “ఎనిమిది రోజుల్లోనే అతడు పాఠశాలకు తిరిగి వెళ్ళెను, అది ఒక పోలియో కేసు,” అని చెప్పాడు, “ఎనిమిదవ దినాన్న బిడ్డ తిరిగి పాఠశాలకు వెళ్ళును,” అని చెప్పెను. వదివేల జనుల ముందు, రెండు సంవత్సరాలుగా నేను అతన్ని వెంబడించుచున్నాను,“ అని చెప్పాడు. అక్కడంతా... సియాటెల్ కూటములో - మీ పుస్తకములో, ఆ చిత్రం అక్కడున్నది. ”మీరెంతో కొంత మత సంబంధమైన కంపనములను, వినుటకు రాలేదని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు సత్యమును వినుచున్నారు,“ అని అతడన్నాడు. కెప్టన్ ఆల్ ఫెరర్.
ఆ తర్వాత రోజు నేను అతన్ని దేవుని యొద్దకు నడిపించాను, షూటింగ్ గేలరీ వద్ద అక్కడ పెద్ద స్థలములో అతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకున్నాడు.
70
“బహుశా ఈ వ్యక్తి అదే పనిచేయును,” అని నేనన్నాను.
కాబట్టి, “నీవు అక్కడకు వెళ్ళుటకు భయపడుతున్నావా?” అని అన్నదామె.
“భయమా? ఎందుకని, నిశ్చయముగా లేదు, నిశ్చయముగా లేదు. దేవుడు అది చేయమని నన్ను పంపినప్పుడు నేను ఎందుకని భయపడాలి? యుద్దములో పోరాడువాడు ఆయనే, నేను కాదు,” అని నేను చెప్పాను. కాబట్టి, “ఇప్పుడు, మీరందరు దూరంగా ఉండాలని నేను కోరుచున్నాను,” అని నేను చెప్పాను.
మేము ఆ రాత్రి కూటమునకు వెళ్ళాము, ఆ స్థలమంతా నిండిపోయినది. అక్కడున్న కాపలదారుడు బయటకు వచ్చి, “రెవరెండ్ బ్రెన్హాం గారు, నేను పదిమంది మెక్సికో పిల్లలను అద్దెకు తీసుకొచ్చాను,” అని చెప్పాడు. “రెవరెండ్ బ్రెన్హాం గారు ఇటువైపు చూడండి, మూఢ భక్తుడవుగాను, మత భక్తుడవుగాను, యఫ్.బి.ఐ. చేత ఈ రాత్రి బట్టబయలు కాబడుచున్నావు,” అని చెప్పాడు. లేక అలాంటి మరొక్కటి ఏదో కార్యము గూర్చి చెప్పెను. అది వారి ప్రతియొక్కరి కార్ల మీద నున్నది, బయటకు లాగును...“ అని చెప్పాడు. ”నేను, పదిమంది మెక్సికో పిల్లలు వాటినంతటిని బయటకు లాగి, ఇక్కడ పెట్టబోవుచున్నాము,“ అని చెప్పాడు. ”ఓ, నేను ఆ వ్యక్తిని పట్టుకొనగలిగినట్లయితే, చాలా బాగుండునే అని నేను భావించుచున్నాను,“ అని చెప్పాడు.
“అయ్యా, చింతించొద్దు. దేవుడు అతనిని పట్టుకొనును, చూశారా,” అని నేను చెప్పాను. “కొంచెము అతని ఒంటరిగా వదలండి,” అని నేను చెప్పాను.
71
కాబట్టి అతడక్కడికి వచ్చెను. మేము లోనికి వచ్చిన ఆ రాత్రి (నేనెన్నడు దాన్ని మర్చిపోలేను), నేను గదిలోనికి నడిచివెళ్ళాను. బ్రదర్ బాక్స్టర్ “కేవలం నమ్ముము,” అను పాటను పాడుచున్నాడు. “బ్రదర్ బ్రెన్హాం ఈ రాత్రి మన కొరకు భవనము విడిచి వెళ్ళుచున్నారు,” అని అతడన్నాడు. “నేను ఆ చివరికి వెళ్ళి కూర్చోనబోవుచున్నాను,” అని చెప్పాడు. “వారతన్ని ఈ రాత్రి వేదికపైన బట్టబయలు చేయ నిశ్చయించుకున్నారు,” అని అతడన్నాడు. “అనేకమైన కఠిన పోరాటాలలో నేనతన్ని చూశాను. దేవుడు అతని పక్షాన ఉండుటను నేను చూశాను,” అని అతడన్నాడు. “నేను కొంచెము వెనుకకు వెళ్ళి కూర్చొనబోవుచున్నాను,” అని అన్నాడు.
నేను నడిచి వెళ్ళాను. “నేను ఎక్కడైతే ఈ రాత్రి ఇక్కడ వేదిక యొద్ద బట్ట బయలు కాబోవుచుంటినో అక్కడ ఒక చిన్న వ్యాసమును నేను చదువుచుంటిని,” అని నేనన్నాను. “యఫ్.బి.ఐ, ప్రతినిధిలు ఇప్పుడు ముందుకు వచ్చి ఈ వేదిక మీద నన్ను బట్టబయలు చేయాలని నేను కోరుకుంటున్నాను,” అని నేనన్నాను. “సువార్త పక్షమున నేను ఇక్కడ నిలబడి యున్నాను; మీరు వచ్చి నన్ను బట్టబయలు చేయాలని కోరుకుంటున్నాను,” అని నేనన్నాను. నేను ఎదురు చూస్తున్నాను. “బహుశా వారు ఇంకా ఇక్కడ ఉండియుండకపోవచ్చును,” అని నేనన్నాను. నేనెక్కడ వున్నానో నేనెరుగుదును. నేను విడిచిపెట్టక ముందుగా, ఏమి జరగబోవుచున్నదో, అదుగో నా గదిలో ఆయన నాకు ముందుగానే చూపించెను, మీరు చూశారా. నేనన్నాను... నేనన్నాను, “బహుశా నేను కొద్దిసేపు వేచియుంటాను. మనం స్తుతి కీర్తన పాటలు పాడవచ్చునా?” ఎవరో ఒకరు వచ్చి ఒక పాటను పాడియున్నారు.
72
“యఫ్.బి.ఐ, ప్రతినిధి గారు, మీరు లోపల లేక బయట ఉన్నారా? నేను బట్టబయలు కాబడుటకు ఎదురుచూస్తున్నాను. మీరు ముందుకు వచ్చెదరా?” అని నేనన్నాను. ఎవ్వరు రాలేదు. అది ఎక్కడుందో అని నేను ఆశ్చర్యపోవుచున్నాను. అదేమిటని ప్రభువు నాకు చెప్పెను. అది ఇద్దరు వెనుకకు జారిపోయిన బోధకులు, నేను గమనించుచుంటిని. ఆ మూలన నల్లటి నీడ వ్రేలాడుచుండుటను నేను చూశాను. అది ఎక్కడున్నదో నేనెరుగుదును. నేను ఆ స్థలమును గమనించాను, అది సరిగ్గా కదులుచూ, ఈ విధంగా గేలరీలోకి వెళ్ళిపోయినది. ఒక మనిషి నీలిరంగు సూటు వేసుకొని వున్నాడు - ఒకరు బూడిద రంగు సూటు వేసుకొని వున్నాడు.
“సహోదరులారా, అక్కడ యఫ్.బి.ఐ ఎవ్వరు లేరు. బైబిల్ గూర్చి బోధించుటకు యఫ్.బి.ఐ వారికి ఏమిటి అవసరం?” అని నేనన్నాను. “తప్పకుండా కాదు. నన్ను బట్టబయలు చేయుటకు ఇద్దరు యఫ్.బి.ఐ ప్రతినిధులు లేరు. అయితే ఇక్కడే బట్టబయలు చేయువారు వున్నారు, వారు సరిగ్గా అక్కడే కూర్చొని ఉన్నారు, సరిగ్గా ఇక్కడున్న ఆ ఇద్దరు బోధకులే,” అని నేనన్నాను. మరియు వారు క్రిందికి వెళ్ళిపోవుచున్నారు. “ఆ విధంగా దిగొద్దు” అని నేనన్నాను. వారిలో ఇద్దరు పెద్ద టెక్సాస్ కు చెందినవారు, అక్కడకు వెళ్ళి వారిని పట్టుకొనబోవుచున్నారు. “వద్దు, సహోదరులారా, ఇది రక్తమాంసములకు సంబంధించినది కాదు; దేవుడే దానిని గూర్చి శ్రద్ద వహించును,” అని నేనన్నాను.
73
“ఇప్పుడు, సహోదరులారా, చూడండి, మీరిక్కడుండగా ఈ వైపుగా చూడండి,” అని నేనన్నాను. “అయితే... నేను గారడీవాడినైన సీమోనును, శకునము చేత, జనులను, నేను ఆకర్షించుకొనుచున్నానని మీరు అన్నారు,” అని నేనన్నాను. “నేను గారడీవాడినైన సీమోనునైతే, అలాంటప్పుడు మీరు దేవుని యొక్క మనుష్యులు. ఇప్పుడు మీరు ఈ వేదిక మీదకు రండి. నేను గారడీవాడినైన సీమోనునైతే, దేవుడు నన్ను మరణించునట్లు మొత్తనివ్వండి, నేను దేవుని ప్రవక్తనైతే, మీరు ఇక్కడకు రండి. దేవుడు మిమ్మల్ని మరణించునట్లు మొత్తును గాక. ఇప్పుడు మనం ఎవరు సరియో - ఎవరు తప్పో మనం చూద్దాం. ఇప్పుడు మీరిక్కడకు రండి. మనం స్తుతి కీర్తనలు పాడుకుందాం.”
వారు ఆ భవనం నుండి బయటకు వెళ్ళిపోయారు. అప్పటి నుండి మనం వారినెన్నడునూ చూడలేదు, చూశారా. “రండి, నేను గారడీవాడినైన సీమోనునైతే, దేవుడు నన్ను మరణించునట్లు మొత్తును గాక. నేను దేవుని ప్రవక్తనైతే, మీరు ఈ వేదిక మీదకి వచ్చునప్పుడు, దేవుడు మిమ్మల్ని మరణించునట్లు మొత్తును గాక. నేను దేవుని ముందు సత్యవంతుడనైతే, దేవుడు ఈ వేదిక మీద మిమ్మల్ని మరణించినట్లు చేయును గాక,” అని నేనన్నాను. వారు బాగుగా ఎరుగుదురు. అది వాస్తవము. వారు బాగుగా ఎరుగుదురు. వారు వేరొక స్థలము నుండి విన్నారు. అది వాస్తవము. కనుక అలా ఎన్నడూ ఆలోచించ వద్దు - దేవుడు ఇంకను దేవుడైయున్నాడు, ఆయన జవాబిచ్చును.
74
ఇప్పుడు, ఈ ఎనోరు మంత్రగత్తె, ఆమె సమూయేలు యొక్క ఆత్మను పిలిచినది. అంతట సౌలు సమూయేలుతో మాటలాడెను. ఇప్పుడు మీరు అది ఎలా జరిగినదా అని ఆశ్చర్యపోవచ్చును. అది ఈ రోజు జరుగలేదు, (లేదయ్యా.) ఎందుకనగా ఎద్దుల యొక్కయు, మేకల యొక్క రక్తము, కాలము యొక్క నెరవేర్పు కోరకై వుంటున్నది. వారి దినాల్లో ఒక మనిషి మరణించినప్పుడు... బోధకులారా, మీరాలోచించినది నిజమైతే, నన్ను బలపరచండి. ఒక మనిషి మరణించినప్పుడు అతను ఒక జంతువు యొక్క పాప ప్రాయశ్చితార్థము క్రింద వుంటాడు, అతని ఆత్మ పరదేశిలోనికి వెళ్ళిపోతాను. అక్కడతను విమోచన దినము వరకు వేచి యుండును. మరియు అతని ఆత్మ అందులో వుంటున్నది.
75
ఇక్కడొక చిన్న చిత్రమును నన్ను గీయనివ్వండి. ఎంత మంది నా వ్యాసమును చదివారు, లేక ఇక్కడ అక్టోబర్, నవంబర్ మాసాల్లో నన్ను గూర్చిన ప్రచురణ రీడర్స్-డైజెస్ట్ లో వ్రాసిరి. వారు వ్రాసిన వ్యాసము ఎంతమంది చదివారు? సరే. అది ఏ విధంగా వున్నదో మీరు గమనించారా? మీరు గమనించారా, రెండు లేక మూడు వారాల క్రితం దానికి ముందు, ఆమె మిస్ పెప్పర్, ఈ గొప్ప ప్రఖ్యాతిగాంచిన మధ్యవర్తి ఎంతో కాలముగా ప్రయత్నం చేసినది. రీడర్స్ డైజిస్ట్ లో మిస్ పెప్పర్ వ్యాసమును ఎవరైన, ఎన్నడైన అది చదివారా? వింతైన సంగతి కాదా, ఎలాగు ఈ రెండాత్మలు...
నాకు ఇంక ఎంత సమయమున్నది? ఎక్కువ కాదు, కొంచెము మాత్రమే. ఇరవై నిమిషములు దాటినది, నేను కొంచెము త్వరపడవలసియున్నది. మీరు పొందుకున్నారని నాకు తెలుసు... చూడండి, ఒక్క నిమిషము నన్ను క్షమించండి.
76
మీకు తెలుసా, అక్కడ ఒక అబద్దం ఉన్నది. ప్రతి కార్యములోను ఒక నిజము మరియు ఒక అబద్దం ఉంటుంది. నేను మీకు ఒక డాలర్ ఇచ్చి, మరియు “ఇది మంచి డాలరేనా?” అని నేను అడిగితే, మరియు మీరు దాని వైపు చూచెదరు, అది నిజమైన డాలరు కంటే చాలా మంచిదిగా కనిపించవచ్చును లేక దాని మీరు నమ్మకపోవచ్చును. అది నిజమేనా? కాబట్టి అది నిజమైన మంచి అనుకరణయై ఉండవలసి ఉన్నది.
అంత్యదినాలలో రెండు ఆత్మలు అతి దగ్గరగా ఉండి సాధ్యమైతే, ఏర్పాటు చేయబడిన భక్తిగల జనులను సహితం మోసపరచునని యేసు చెప్పెను. ఇప్పుడు గుర్తుంచుకొనండి. ఇప్పుడు, వారిలో ఏమి లేదు, అక్కడ బయట నులివెచ్చని నామకార్ధపు వారుగా ఉంటారు, బయట భక్తిపరులుగా వుంటారు, మీరు గమనించండి. ఈ రెండు ఆత్మలు, నిజమైన ఆత్మలు. సాధ్యమైతే, ఏర్పాటు చేయబడిన వారిని సహితం మోసపరచునంత దగ్గరగా ఉండును. ఆఖరి దినములలో ఎలా అవి ఒక దాని ప్రక్కన ఒకటి పనిచేయును. యేసు చెప్పలేదా? ఆయన చెప్పెను.
77
ఇప్పుడు గమనించండి, స్నేహితులారా, మీ కొరకు నేను ఒక చిన్న పటమును గీయుచున్నాను. ఒక నిమిషము మీరు ఇటువైపు చూడాలని నేను కోరుకుంటున్నాను. మీ శ్రద్దంతటిని నాపై ఉంచండి, ఎందుకనగా నేను ఒక ఉపమానము మీకు ఇవ్వబోవుచున్నాను, మరియు అప్పుడు మీరు దానిని చూస్తారు.
ఇప్పుడు, అక్కడ రీడర్స్-డైజెస్ట్ లో అది వ్రాయబడి ఉండెను, నేనక్కడ బయట నిలబడి ఉంటిని, ఇరవై-ఏడు వందల మంది జనులు ఆ బయట ప్రార్ధన కొరకై ఎదురు చూచుచున్నారు. మీరు ఆ వ్యాసమును చదవండి. ఒక మనుష్యుడు కెనడా నుండి వచ్చెను, అతనికి ఒక చిన్న పిల్లాడు ఉండెను, ఒక భయంకరమైన మెదడు జబ్బుతో అతని చేతులు ఈ విధంగా లాగబడినవి, అతని కాళ్ళు దాని క్రిందుగా ఉండి, మాయో మరియు జాన్ హాప్కిన్స్ వారి యొద్దకు తేబడెను. “ఏ ఒక్క శస్త్రచికిత్స గాని మరేదియు కూడా బాగుచేయ లేదు,” అని వారు చెప్పారు.
78
కాబట్టి అతడు తిరిగి కెనడాకు తీసుకుని వెళ్ళెను. “నేనింకా కొట్టబడలేదని,” అతడన్నాడు. రీడర్స్-డైజెస్ట్ యొక్క నవంబర్ ప్రచురణలో దాన్ని మీరు పొందుకొనగలరు, మరియు అది డోని మార్టిన్ యొక్క గొప్ప అద్భుతమని పిలువబడుచున్నది. మరియు అతడు ఆ ప్రక్కగా, అందులో, ఆ మనిషి చెప్పెను, “నేనింకా కొట్టబడలేదు, ఎందుకనగా విశ్వాసముతో స్వస్థపరచు విలియం బ్రెన్హాం అను పేరు గల ఒకాయన నాకు తెలుసు, నా యొక్క ఇద్దరు స్నేహితులైన చెవిటి మరియు మూగవారైన వారు మాట్లాడుచు, మరియు వినుటకు అది కారణమయ్యెను,” అనెను.
నేనింకా - అమెరికాలో ఎక్కడున్నానో అని కనుగొనుటకు వారు పిలువబడినారు. మరి నేను కాలిఫోర్నియాలోని కాస్టామీసా ప్రాంతములో ఉన్నాను. అది ఒక వ్యాసం, నీవు దానిని చదివినట్లయితే, ఏడ్చుటకు సిద్దపడవలెను. అది మీ హృదయాన్ని బ్రద్దలు చేయును. అతడా బిడ్డతో మంచు పర్వతములు మొదలగు వాటి గుండా ఎలా వెళ్ళెనో! “డోనీ, జాగ్రత్త,” అని అతడన్నాడు. “ఇప్పుడు మనము ఓడిపోలేదు,” అని చెప్పెను. మరియు ఆ చిన్న బాలుడు కనీసము నవ్వలేక పోయెను, అతడు చాలా బాధాకరముగా ఉన్నాడు. “మనము ఓడిపోలేదు, మనము దేవున్ని అడుగబోవుచున్నాము. మనము దేవుని యొక్క ప్రవక్త యొద్దకు వెళ్లి అతన్ని అడుగుదము,” అనెను.
79
కాబట్టి అంతట వారు మంచు గుండా వచ్చారు. మరియు ఆఖరికి వారు అక్కడకు వచ్చిరి, తల్లి కూడా వారితో వస్తున్నది, మరి వారు విమానంలో వెళ్ళుటకు చాలినంత డబ్బు లేదు, కాబట్టి వారు తల్లిని తిరిగి వెనుకకు పంపించివేశారు. బాలుడు, ఆ తండ్రి విన్ పెగ్, కెనడ నుండి కోస్టా, కాలిఫోర్నియా మార్గం గుండా వారు బస్సులో రావలసివచ్చినది. వారక్కడకు చేరుకున్నారు, విరిగిపోయి, ఏడెనిమిది సంవత్సరాల వయస్సు గల చిన్న బాలుడు, డయాపర్ మార్చవలసి ఉండెనని తండ్రి చెప్పెను, ఏ సహాయములేని స్థితిలో ఉన్నాడు. అతడ ఏ విధంగా వున్నాడు... మరి తినటానికి కూడా వీలులేని పరిస్థితిలో ఉండేనని, అతడు మాట్లాడటం తన చిన్న బాలుడు వినగలుగుచున్నాడు. అతడు కళ్ళతో చూచిన దానిని అతడు చెప్పగలిగాడు, అతడు నవ్వుటకు ప్రయత్నం చేసెనని, మీకు తెలుసా, అతడది చేసెను. అతడది చేసెనని మీకు తెలుసా... అమెరికాలో పలు విధములైన చూచెడు దృష్యాలను అతడు ఆయనకు చెప్పగలుగుచూ వుండేను.
80
మరియు అక్కడ కాలిఫోర్నియాకు చేరుకున్నప్పుడు, ప్రయాణికులకు సహాకరించే వ్యక్తితో వారు ఇలా అన్నారు, అతడు దేనిని చూచుటకు వచ్చెను. “దైవికమైనది ఏమిటో చూచుటకు వచ్చెనా?” మరియు ఒక పెద్ద ప్రశ్నార్థకమైనది.
బహుశా, అమెరికా దాని గూర్చి ఏమి చెప్పగలదో నీవు ఉహించగలవు, మీరు చూశారా, చూశారా, అదే మనము, చూశారా. మనము చాలా తెలివైన వారము! మనకంతా తెలియును, మీకు తెలియును, మరియు మనకు ఏమియు చెప్పనవసరము లేదు. మనము పొందుకున్నదంతా వ్రాసాము, మీరు చూశారా.
కాబట్టి అప్పుడు, కాబట్టి, “దైవికము అనగా ఏమిటి?” కెనడాలోని విన్ పెగ్ నుండి అన్ని విధములుగా వచ్చెనా?“ ఎందుకని, వారు అది భయంకరమని తలంచుచున్నారు.
81
ఎలాగైతేనేం, ఆ వార్తాపత్రిక ఒక కారుకి తీసుకొని అతని కొరకై అక్కడకు పంపించెను. అతడన్నాడు, వారు వరుసలోనికి చేరుకున్నప్పుడు, అది ఎక్కడైయితే చెప్పబడినదో ఇరవై-ఏడు వందల మంది జనులు అక్కడే ప్రార్థన కొరకై ఎదురుచూచుచున్నారు. అంగవీహీనుడైన చిన్న బాలుడు, చినిగిపోయిన కోటు, తల పైన టోపితోను అతని పేద తండ్రిని వారు చూచి, ప్రతి యొక్కరూ కొంచెము ప్రక్కకు జరిగి అతనికి స్థలమిచ్చిరి. అతను వేదికను తాకినప్పుడు...
ప్రార్థన కార్డులను మార్చు కొనుట అది చట్టవిరుద్దం. తప్పక ఎవరో యొక్కరు కూటములకొచ్చి, మీ సొంత ప్రార్థన కార్డులను పొందుకొనవలెను. నీవు ఎన్నడూ వరుసలో పొందుకొనక, ఎవరిదో ఒకరి ప్రార్ధన కార్డును మార్చుకొంటే ఆ ప్రార్థన కార్డు చెల్లదు, ఆ ప్రార్థన కార్డు అగౌరవ పరచబడుచున్నది, చూశారా. ఎందుకనగా మీరు ఉపదేశమును విని దానిని ఎలా పొందుకొనవలెనో తెలుసుకొనుటకై తప్పక రావలెను. అది నీకు సంబంధించినదే. దానిని నీవు ఎవరో యొక్కరి కొరకు తీసుకొనలేవు. నీకు నీవుగానే దాన్ని పొందుకొనుటకు రావలసియున్నది, కాబట్టి మీరు వినండి. “మంచిదే. ఈ కార్యమును అంతగా నేను నమ్మను, కాని బహుశా ఆయన నన్ను స్వస్థపరచవచ్చునేమో, నేను...” అని ఒక పెద్ద వ్యక్తి చెప్పెను. మీరు చూశారా, అంతట ఆ కారణము చేతనే అది వేదిక మీద వేడుక అవుచున్నది, కాబట్టి అది అక్కడకు చేరుకొనక ముందే వారు దానిని బయట పెట్టిరి.
82
కాబట్టి, ప్రజలను దాటుకొని వేదిక యొద్దకు వచ్చుటకు ఆ బాలుడు ప్రారంభించినప్పుడో, లేక తండ్రి ప్రారంభించినప్పుడో, బిల్లి అతనికి తన ప్రార్ధన కార్డు కొరకై అడిగాడు. అతని యొద్ద ఏమియు లేదని చెప్పాడు, “అప్పుడు, అయ్యా, దయతో నన్ను క్షమించు,” అని చెప్పాడు. “నీవు వేచి ఉండాలి,” అని చెప్పాడు.
“సరే,” అని అతడన్నాడు. “నేను వేచి ఉంటాను,” అని అన్నాడు. “అప్పుడు, అందరి మాదిరిగానే నేను ఇటు తిరిగెదను,” అని చెప్పాడు. “నేను ఇది చేయవలసి ఉందని నాకు తెలియదని,” చెప్పాడు.
మరియు కాబట్టి నేను ఎవరో ఒకరితో మాటలాడుచూ వుంటిని. అది జరుగుట నేను విన్నాను. ఆ తండ్రి వెళ్ళుట నేను చూశాను, “విషయమేమిటి?” అని నేను అడిగాను.
“అతనికి ప్రార్థన కార్డు లేదు,” అని అతడు చెప్పాడు.
“అతన్ని తిరిగి తీసుకు రండి,” అని ఏదో నాతో చెప్పినది.
కాబట్టి “అతన్ని ఇక్కడకు తీసుకు రండి,” అని నేను చెప్పాను. మరియు తండ్రి వస్తూ ఉన్నాడు, మరియు అతని ముఖము నుండి కన్నీరు కారుచున్నది, గడ్డము క్షవరము చేయించుకొనే అవసరత ఉన్నది. మరియు అతడు నడిచి వస్తున్నాడు, ఇక్కడ రీడర్స్-డైజెస్ట్ లో చెప్పబడినది: నేను ఏ ప్రశ్న అడుగలేదు, కాని బిడ్డ యొక్క ముఖములోనికి నేరుగా చూచితిని, అది ఎక్కడ నుండి వచ్చినదో బిడ్డతో చెప్పాను, అది మాయో వైద్యశాల నుండి ఉందని, ఆ విషయమంతా ఏమైనదని ఏ విధంగా వ్యాధి వచ్చినదని మొదలగు విషయాలు నేను చెప్పాను.
83
కాబట్టి ఆ తండ్రి ఏడ్వటం ఆరంభించి, విడిచి వెళ్ళెను. వేదికను విడిచి వెళ్ళిపోవుచూ, అతడు వెనుకకు తిరిగి చెప్పాడు, “అది వాస్తవమండి,” అని చెప్పాడు. “కాని నా బిడ్డ ఎన్నడు బ్రతుకడా?” అని అతడడిగాడు.
“అది నేను చెప్పలేను,” అని అన్నాను. “ఒక్క క్షణం అగుము,” అని నేను అన్నాను. ఒక దర్శనము ప్రత్యక్షమగుటను నేను చూశాను. “నీవు దానిని నమ్మలేక పోయెదవు. ఎందుకనగా, మెదడుకు శస్త్రచికిత్స మాయో మరియు హాప్కిన్స్ ఇద్దరు చేయలేకపోయాము అని చెప్పారు, కాని నీవు ఏమి చేయాలో నేను నీకు చెప్పెదను. నీవు, రేపు, ఈ బిడ్డతో కొంచెము ముందుకు వెళ్ళు, మూడు రోజుల్లోనే నీవు ఒక నల్లని స్త్రీని వీధులో కలుసుకోబోవుచున్నావు, మరియు ఆ స్త్రీ ఆ బిడ్డకు ఏమి జరిగినదని నిన్ను అడుగును. మరియు అప్పుడు ఒక చిన్న పల్లెటూరు వైద్యుడు వచ్చి ఆ శస్త్రచికిత్స చేయగలడని ఆమె నీకు చెప్పును, నీవు దానిని నమ్మలేకయుందువు, ఎందుకనగా ఆ మాయో దాని ఈ విధంగా అది చేయుట అసాధ్యమని చెప్పెను. అది దేవుని యొక్క శక్తి ద్వారా మత్రమే నీ బిడ్డను మార్చగలదు. దేవుని యొక్క కనికరము మాత్రమే శస్త్రచికిత్స చేయగలదు. ఇప్పుడు, నీవు గనుక నన్ను ఆయన ప్రవక్తనని నమ్మినట్లయితే, వెళ్ళు, నేను నీకు చెప్పిన విధంగా చేయుము,” అని నేను చెప్పాను. ఎలాగంటే హిజ్కియాపై అంజూరపు కాయలు తినునట్టుగా.
“మీకు ధన్యవాదములని,” తిరిగి ఇలా చెప్పి, నడిచి వెళ్ళెను.
84
రెండు రోజులు లేక మరికొద్ది రోజులు గడిచాయి, మరియు అతడు ఒక రోజు వీధి గుండా నడిచి వెళ్ళుచున్నాడు, మరియు ఒక స్త్రీ నడిచివచ్చి, “నీ బిడ్డకు ఏమైయినది?” అని అడిగినది.
“మెదడు వ్యాధి ఉన్నది,” అని చెప్పాడు. అతడు ఆ విధంగా మాట్లడుచూ వున్నాడు. మరియు మంచిది, వారు అది భయంకరమైనదని అనుకుంటున్నారు, మీకు తెలుసా.
కాబట్టి అతడు కొద్ది నిమిషములలో ఏదో సంభవించబోవుచున్నదని చెప్పాడు. “అయ్యా, నాకు తెలిసిన ఒకరు ఉన్నారు. అతడు ఆ శస్త్రచికిత్స చేయగలడు?” అని ఆమె చెప్పినది.
స్త్రీ, చూడు, మాయో సహోదరులు విడిచి పెట్టి, అది సాధ్యపడదని చెప్పారు,“ అతడు చెప్పాడు. ”దీని కొరకు ఇక్కడ ఒక మనిషి ప్రార్థన చేయుచున్నాడు, అతని పేరు సహోదరుడు బ్రెన్హాం,“అని చెప్పినది. ఆ బిడ్డ కొరకు అతను ప్రార్థన చేయుచున్నాడు,” అని చెప్పినది. “ఒక్క నిమిషమాగును! నల్లటి - తల, బూడిదగు కోటు ధరించియుండును,” అని అతడు అన్నాడు. “అదే ఆమె,” అని చెప్పాడు. “వైద్యుడెక్కడ ఉన్నాడు?” అని అడిగాడు, మరియు అతడు అతనితో చెప్పాడు, అని అక్కడకు తీసుకు వెళ్ళారు. మరియు ఆ వైద్యుడు శస్త్రచికిత్స చేసెను. ఆ బిడ్డ బాగుపడెను.
85
ఇప్పుడు, ఆ రీడర్స్-డైజెస్ట్ ద్వారా వచ్చినది, మీరు చూశారా. మాయో సహోదరులు ఇంటర్వ్యూ కొరకై నన్ను పిలిచారు. “రెవరెండ్, బ్రెన్హాం, ఆ బిడ్డని మిసు ఏమి చేశారు?” అని అడిగారు.
“ఏమియు చేయలేదు. నేను దానిని తాకనేలేదు. దేవుడు నాకు ఏమి చెప్పమని చెప్పాడో, ఇది మాత్రమే చెప్పాను. ఆ మనిషి దానికి విధేయుడయ్యెను,” అని నేను చెప్పాను.
ఇప్పుడు రీడర్స్-డైజెస్ట్ లో, ఒక వింతైన కార్యము గూర్చి, అది రెండు వారములకు తర్వాతో లేక రెండు వారములకు ముందో లేక మూడు వారములకో, బహుశా ఒక నెల తర్వాతో మిస్. పెప్పర్ వ్యాసము వచ్చినది. ఇప్పుడు, ఆమె ఒక నిజమైన మంత్రగత్తె, లేక మధ్యవర్తి కావచ్చును. ఇప్పుడు, అక్కడొక నిజమైనది వున్నది. అక్కడ అనుకరణ చేయువారు ఎవరో ఒకరు వున్నారు. వారు ఆ స్త్రీని 1897 నుంచి కలిగియున్నారు. ఇప్పుడామెకు వంద సంవత్సరాలు నిండినవి, న్యూయార్కులో ఒక చెవిటి స్తంభము వలె వున్నది. ఆ రీడర్స్-డైజెస్ట్.. అది నా దానికంటే రెండు నెలలో లేక ఒక నెల ముందే వచ్చిందని నేననుకుంటున్నాను; ముందుగా వచ్చిన దానిలో మీరు దానిని కనుగొనగలరు.
మిస్టర్ బాక్స్టర్ మరుసటి రోజు దాన్ని పొందుకున్నాడు. దాన్ని గూర్చి నాకు తలంపు కలిగి ఉన్నట్లయితే, నేను అతన్ని ఉండనిచ్చేవాడిని... నేను ఇది చెప్పబోవుచున్నానని తెలుసు. నేను దాన్ని కలిగి ఉండేవాడిని. మీ కొరకు నేను దాన్ని పొందుకొనగలను. అది పన్నెండు లేక పద్నాలుగు పేజీల వ్యాసమది. ఆమె ఒక సాదారణ గృహిణి. ఆమె ఒక రోజున మూర్చపోయినట్లుగా అయిపోయి, ఆ బాధతో చనిపోయిన వారితో మాటాలాడటం ప్రారంభించెను. ప్రతి చోటికి ప్రపంచమంతటికి ఆ స్త్రీని వారు తీసుకొని వెళ్ళిరి. వారామెను ఇంగ్లాండునకు తీసుకొని వెళ్ళిరి. అనేక సార్లు ఆమెకు వస్త్రాలు కూడా మార్చారు. అక్కడ ఏదైన పొరపాట్లు వున్నదేమోనని ఆమె ముఖం పైన ముసుగు వేశారు. గ్రీకులు, అతను ఒక ఆంగ్లపు మనిషివలె ఆటాడుకున్నాడు. ఆమె అంతటిని తెలియజెప్పినది. మరియు అతడు తనతో చచ్చిన వారిలో ఒకరిని పిలవాలని అనుకున్నాడు.
86
ఇప్పుడు, ఆమె ఒక కార్యము మాత్రమే... ప్రపంచమంతట, ఇక్కడ కొన్ని రాత్రుల క్రితం, లేక కొన్ని నెలల క్రితం, వాటిలో ఒక కార్యము బట్టబయలు చేయబడెనని, ఇక్కడ రీడర్స్-డైజెస్ట్ లో చెప్పబడెను. ఒక మనిషి ఆత్మ అయినటువంటి తన తల్లి యొక్క చెయ్యిని ముద్దు పెట్టుకోవాలని ఊహించుకొన్నాడు, తర్వాత రోజు అది పోలీస్ కోర్టులో అతడు కేవలం (cheese cloth) వెన్నెపూసిన యొక్క కాగితపు ముక్కను మాత్రమే ముద్దు పెట్టుకొన్నాడు అని రుజువు పరచబడెను. అనేక మంది జనులు ఈ మధ్యవర్తులను అనుకరణ చేస్తుంటారు! వారు మాత్రమే వీధికి ప్రక్కన, ఈ చిన్న పాత రీడర్స్ కూర్చొంటున్నారు. వారు ఆరంభములో మధ్యవర్తులు కాదు. వారు బూటకపు అనుకరణ చేయువారు కాక మరొకటి కాదు. అయితే ఒక నిజమైన మధ్యవర్తి ఉన్నాడు.
మరియు మన మతసంబంధమైన ప్రజలు, మనకు ఇరువైపుల అనుకరణ చేయువారు చాలా మంది వున్నారు. ఇప్పుడు కొద్ది నిమిషములు పట్టుకొనండి.
87
ఇప్పుడు గమనించండి. ఆ మిస్ పెప్పర్ నిజమైన మంత్రగత్తె, (మధ్యవర్తి) మరియు ఆ పత్రిక చెప్పినది, “ఇక్కడ ఒక కార్యము వున్నది. అది నిశ్చయింపగలదు, అది ఒక మనిషి చనిపోయినప్పుడు, అతను చనిపోవుటలేదు. అతను ఎక్కడో జీవిస్తున్నాడు, ఎందుకనగా ఆ స్త్రీ వారి ఆత్మలను వెనుకకు పిలిచి, ఆ ప్రజలతో మాట్లడుచున్నది.”
“ఇప్పుడు, సహోదరుడా బ్రెన్హాం, ఆమె ఏమి చేస్తున్నది? నీవు అది నమ్మేదవా?” అవునండి, బైబిల్ అలాగు చెప్పుచున్నది, ఆ కారణము చేత నేను దానిని నమ్ముచున్నాను. ఆమె దయ్యపు సంబంధమైనది. ఆత్మ సంబంధిగా ఉండుట దయ్యము యొక్క యుక్తి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ రెండింటిని గమనించుము.
తర్వాత నా యొద్దకు వచ్చిన ఉత్తరాలు మీరు చూడవలసివున్నది, అప్పుడు నా వ్యాసము ఆమె యొద్దకు చేరినప్పుడు, అంత్యకాలమునకు ముందు, అది వింతైన కార్యము కాదా? దేవుడు ఆ కార్యము పలకలేదా? రీడర్స్-డైజెస్ట్, ఆకాశము క్రిందుండు ప్రతి భాషల్లోను ప్రచురపరచెను, చూశారా. గమనించండి. వారు ఒకరికొకరు వెంబడించుకోవటం వింతైనా కార్యము కాదా?
88
ఇప్పుడు, ఇక్కడకు ఉత్తరాలు వచ్చినవి, “సహోదరుడా బ్రెన్హాం, నీవు మంత్రగాడివి కాక మరొకటి కాదని అది రుజువు చేస్తున్నది,” అని అన్నాడు. “అది దాన్ని రుజువు చేస్తున్నది. ఇటువైపు చూడు, ఆమె ఎక్కడికి వెళ్ళి వెతకాలో నీవు ఆ స్త్రీకి చెప్పావు... ఈ స్త్రీ వైపు చూడు,” అన్నారు.
“ఒక్క నిమిషమాగుము. నా దగ్గర అధికారపూర్వకమైన ఉత్తరాలు వున్నవని నేను చెప్పాను. నన్ను క్షమించండి, ప్రజల యొద్దకు పంపుటకు.” “బోధకులైన మీకు ఎంత కొద్దిగా తెలియునని” నేను అన్నాను. “మీ శరీరములకు బాప్తిస్మము పొందుటకు బదులుగా, మీ మెదడులు బాప్తిస్మము పొందవలసిన అవసరము మీకు ఉన్నది,” అని నేను చెప్పాను. అది వాస్తవము. “నీవు ఆ కార్యముల గూర్చి ఆలోచించుట ఆపవద్దు. నీవు దాన్ని లెక్కలోకి తీసుకొనుటకు ప్రయత్నించవద్దు.”
అదే విధంగా వారు మిగతా రోజుల్లో చేశారు. వారు యేసును చూశారు, ఆయన చేయగలడని వారు తెలుసుకున్నారు. వారి యొక్క హృదయ రహస్యములు ఆయన ఎరుగును. వారు ఆ విధంగా ఏమి చేయుచున్నారో ఆయన ఎరుగును. మరియు “ఆయన దయ్యములకు అధిపతి. ఆయన బయల్జేబూబు, ప్రపంచములో అత్యుత్తమ సొదె చెప్పువాడు,” అని వారు పిలిచారు. అది దేవుని యొక్క కుమారుడని చూచుటకై, వారు లెక్కలు పెట్టుటను అపుచేయలేదు. దానిని ఎరుగుటకై వారు ఆత్మ సంబంధులు కారు. అదే విషయము, వారు ఆ కార్యములను చదివిరి. తప్పక, యేసు యెరూషలేముకు వచ్చి, గాడిద పిల్ల మీద ఊరేగుచున్నాడనుకో లేక అటువంటిది ఏదో చేయుచున్నాడనుకో, అయినా వారు రెండవ రాకడ కోసం ఎదురుచూస్తు వుంటారు.
89
ఈ రోజు కూడా అలాంటి కార్యమే! నిజమైన దాని యొక్క పై భాగాన్ని వారు చూస్తున్నారు. హల్లెలూయా! అది వాస్తవము. ఈ మధ్యాహ్న కాలము దేవుడు ఇక్కడ ఉన్నాడని నాకు తెలియును, నేను మీ యొక్క అధిక సమయమును తీసుకొనుచున్నానని నాకు తెలియును, కాని స్నేహితుడా, నీవు ఇది చూడవలసియున్నది. మరలా నేను నిన్ను ఎన్నడూ చూడకపోవచ్చును, దయ్యాలంటే ఏమిటో నీవు తెలుసుకోవలసియున్నది. ఏది సత్యమో మరియు ఏది తప్పో, నీవు తెలుసుకోవలసివున్నది. అది ఎంత దగ్గరగా యున్నది, నీవు ఆ కార్యములను వేరు చేయవలసివున్నది.
ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, అవి ఎక్కడో బయటకు వెళ్ళుట లేదు, పరిసయ్యుల వలే ఏదో ఆ ప్రక్కగానో లేక ఏదో వెనుక ప్రక్కగానో అవి వెళ్ళుట లేదు. ఇక్కడ తలుపుకు దగ్గరగా, దానికి దగ్గరగా యున్నది, దాని గమనించండి. ఇప్పుడు నేను తీసుకుంటే....
90
వాటిని రెండు సంఘటనలుగా తీసుకుందాం. డాలరు తీసుకొని నేను మీకు ఇచ్చినట్లయితే, ఇప్పుడు, ఒక బూటకపు డాలరు నేను మీకు ఇచ్చినట్లయితే, మీరు దానిని చూచులాగున మనము ఒక ఉపమానమును ఉపయోగించెదము. నీవు జ్ఞానవంతుడవైయితే, మొదటిగా నీవు ఒక కార్యము చేయుదువు, నీవు ఒక డాలరు తీసుకొని దాని వైపు చూచెదవు, అదే మొదటి కార్యము, నీవు దాని తాకి చూస్తావు మరియు అది దేనితో తయారు చేయబడినదో చూచెదవు. అది వాస్తవమేనా? అది దేనితో తయారు చేయబడినదో నీవు చూచెదవు. దాని యోగ్యతను నీవు చూచేదవు, ఒక నిజమైన డాలరు పేపరుతో తయారు కాబడలేదని, అది కొంత పేపరుతోను కొంత పట్టుతోను తయారు కాబడినదని నీవు చూచెదవు. మొదటిగా, నీవు దాని యొక్క విలువ ఎంతో చూడవలసివున్నది. అదే మొదటి సూచన.
మరియు ఇప్పుడు, ఆమెను ఈ ప్రక్కగా తీసుకుందాం; మరియు ప్రభువును ఈ ప్రక్కగా తీసుకుందాం, అదే మనతో వ్యవహరమైయున్నది.
91
ఇప్పుడు చూడండి, మొదటిగా నీవు ఒక కార్యమును గమనించవలసివున్నది, ప్రతీ కార్యము... మీ వ్యాసమును గమనించండి. యాబై-లేక కొన్ని బేసి సంవత్సరాల్లో చెప్పుచున్న జ్యోతిష్యమంతా, చనిపోయిన వారి ఆత్మలను పిలుచుచున్నది. ఆమె ఒక్కసారి కూడ దేవుని గూర్చి గాని, క్రీస్తుని గూర్చి కాని, విమోచనను గూర్చికాని, దైవిక స్వస్థత గూర్చి కాని, తీర్పును గూర్చి గాని, లేక అలాంటి దాని గూర్చి గాని, ఏమియు చెప్పలేదు. అక్కడ పరిహాసము మరియు అల్ప బుద్ది కాక మరేమియు లేదు.
ఈ ప్రక్కనైయితే, అది సత్యమైన దేవుని గూర్చి, తీర్పు, యేసు యొక్క రాకడ, దైవిక స్వస్థత, దేవుని యొక్క శక్తి, విడుదల ఉంటుంది. దాని యొక్క ఖరీదు వైపు చూడు. జ్యోతిష్యులు మరియు మంత్రగత్తెలు బోధించే సువార్తను నీవు చూడవద్దు. ప్రజలకేమైనది? మై!
గమనించండి!
92
మరియు నిజమైన కార్యమును చేయవలసి యున్నది. అది నిజమైన డాలరా, కాదా అని నీవు కనుగొనవలెనని అనుకున్నట్లయితే, అది దాని మాదిరిగానే కనిపించినట్లయితే, దాని యొక్క సంఖ్యలను తీసుకొని దానిని మరలా అచ్చు వేయు వాని యొద్దకు పంపివేయండి, అక్కడ దానికి సంబంధించిన సంఖ్యలు ఉంటే, దాని కొరకు ఒక వెండి డాలరు ఎదురుచూస్తు ఉంటున్నది. అది వాస్తవమేనా?
మంచిది, అప్పుడు సహోదరుడా, ఆమె ఏమి చేసినదో తీసుకొని మరియు బైబిల్ యొద్దకు తిరిగి వెళ్ళుము, ఏనోరు అనే మంత్రగత్తెను నీవు కనుగొనెదవు...
ఇక్కడ నీవు ఏమి తీసికొనెదవో, దాని వెనుక ఏమి వున్నదో నీవు కనుగొనెదవు, ముద్రణ పుస్తకములో అది ఉన్నది, “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా వున్నాడు.” నిశ్చయముగా, ఆయన అదే పని చేయుచున్నాడు! ఆయన వెళ్ళి ప్రజలతో అల్పబుద్ధి మరియు తెలివిలేని పని చెప్పుట లేదు. అది వారిని దేవుని యొద్దకు నడిపించుటకు, ఎవరికో ఒకరికి సహాయము కొరకై, మంచి పని అవుచున్నది. ఆమేన్! “ఆమేన్” అని నాకు నేనుగా చెప్పుట లేదు, కాని ఆమేన్ అనగా “అలాగున జరుగును గాక,” అని అర్థము నేను. దాన్ని నేను నమ్మెదను. అది సత్యమని నాకు తెలియును.
93
ఇప్పుడు గమనించండి, మీరు ఇక్కడ వున్నారు. ఇప్పుడు, త్వరపడదాం, ఎందుకనగా నేను మిమ్ములను ఎక్కువ సమయం ఉంచవలెనని భావించుట లేదు.
ఇక్కడ, ఇక్కడొక చిన్న చిత్రమును, ఒక చిన్న మానసిక చిత్రమును ఇవ్వనివ్వండి. ఇక్కడ, సరిగ్గా ఈ మార్గం గుండానే నది ప్రవహిస్తున్నది, సరిగ్గా ఈ మార్గం గుండానే, జీవము గుండా వస్తున్నది. ఇప్పుడు గమనించండి. అది ఒక నది, ఇప్పుడు, మీ వ్యక్తిగత ధ్యాసంతటిని నా పై వుంచండి, అందువలన మిరది పోగొట్టుకొనరు. సరిగ్గా ఈ విధంగా, ఇప్పుడు, ఇక్కడున్న ఈ చిన్న కాలువలో నీవు, నేను, మర్త్యులమైన జీవులంగా నివసిస్తున్నాము. ఇప్పుడు అందులో, ఏమున్నదో చూడనివ్వండి, అది అంత ప్రతిదియు కూడా తెలివితక్కువ పనియైయుంటున్నది, అయితే, ఒకనొక సమయమున నీవు వెలుగును చూస్తావు. వీధుల్లో చీకటిని, దయ్యము జనులను పట్టుకొని, అది ఉల్లాసముగా మోసుకొనిపోవుటను నీవు చూస్తావు. ఓ, వారి వస్త్రములు అందంగా వున్నవి. మై, వారు ఎంత నాగరికత కలిగియుండగలరో అంతగా ఉండగలరు, నాజూకైన విద్యావంతులు. అయినను ఇంకా దయ్యమే. అయితే, తిరిగి-జన్మించినది అక్కడ కూర్చొనును.
94
ఇప్పుడు, ఈ మార్గములో ఉన్న జనులు రెండు వేరు వేరు మారములకు ప్రభావితం చేయబడెదరు. ఇప్పుడు, ఈ ప్రక్కగా, ఈ మార్గముగా వెళ్ళుచున్నది, అక్కడ ఒక త్రిత్వము వున్నది. మరియు ఈ ప్రక్కగా ఈ మార్గము గుండా వెళ్ళుచున్నదానికి అక్కడ ఒక త్రిత్వము వున్నది.
ఇప్పుడు, ఎప్పుడు మొదటి స్థానములో, ఈ ప్రక్కన, అనీతిమంతుల ఆత్మలు వున్నవి. ఒక మనిషి చనిపోయినప్పుడు, అతడు తీర్పు కొరకై ఎదురుచూస్తు ఒక స్థలానికి వెళ్ళును. అక్కడ చెరలోనున్న ఆత్మల యొద్దకు యేసు వెళ్ళి బోధించెను. ఆ తర్వాత దయ్యాలు మరియు నరకము యుండును. ఆ తర్వాత మొదటిగా, ఇప్పుడు, ఇక్కడ వారి యొక్క ఆత్మలున్నవి, ఎన్నడూ మారుమనస్సు పొందక చనిపోయిన, మనుష్యుల యొక్క ఆత్మలున్నవి, వారు తీర్పు కొరకు ఎదురుచూస్తున్నారు. వారు ఏదైతే, చేశారో, వారు ఎరుగునది ఆ అల్పబుద్ది కార్యము మాత్రమే.
ఇప్పుడు, ఈ పైన, ఈ క్రైస్తవులనబడు పైనుండు వారు ప్రభావితులవుతున్నారు. ఇది ఒక ఉపమానము. ఈ పై వేరొక ఆత్మ వున్నది. పరిశుద్ధాత్మ, ఒక మనిష్యుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఈ మర్త్య రాజ్యములో ఆయన సంఘముపై ప్రభావితము చేస్తున్నది.
ఆ దయ్యము, ఈ ఆత్మల చేత, మనిషిని ప్రభావితము చేయుచున్నది. ఇప్పుడు, చూడండి, ఆ తర్వాత దేవదూతలు. ఆ తరువాత దేవుడు. ఇప్పుడు, ఇక్కడున్న ప్రతి మర్యుడు, ఈ ఒకనొక ప్రపంచముల చేత ప్రభావితులవుచున్నారు. నా భావమేమిటో మీరు గ్రహించారా?
95
ఇప్పుడు, ఆ స్త్రీ ఏమి చేస్తున్నది, ఆమె ఆ రాజ్యములోనికి ప్రవేశించినది, ఎవరైతే ఆదిలో, దయ్యము చేత స్వాధీనపరచబడిన మనుష్యులతో, వెనుక ఆదిలో... మారుమనస్సు పొందనటువంటి, పడిపోయిన దూతల యొక్క ఆత్మలతో, ఆమె మాట్లడుచున్నది. మరియు వారి ఆత్మలు వారి చేత స్వాధీనపరచబడుటకు అనుమతించబడెను. మరియు వారు తీర్పు కొరకు ఎదురుచూచుచున్నారు.
మరిక్కడున్న వీరు దేవుని యొక్క ఆత్మ చేత తిరిగి జన్మించిన వారై ప్రభావితులగుచున్నారు. సాతాను తన ప్రవక్తలను కలిగి వున్నాడు, దేవుడు కూడా తన ప్రవక్తలను కలిగి వున్నాడు. నా యొక్క భావమేమిటో గ్రహించారా? దాని యొక్క పలుకబడి, మనమక్కడకు వెళ్ళదాం. దానిని వేరు చేయుటను ఆపెదము. యేసు, ఆయన ఇక్కడ భూమిపైన ఉన్నప్పుడు...
ఇప్పుడు, ఈ దినాన, అతడు ఆ రాజ్యము ప్రవేశించ జాలడు. మరియు ఆ రాజ్యములో నుండి ఒక్క నీతుమంతుడైన మనిషిని పొందుకోలేడు. అతను అది చేయలేకపోయెను, ఎందుకనగా వారు ఎక్కడైతే వున్నారో, ఆ పరదేశులో ఒక నీతిమంతుడైన మనుష్యుడు కూడా లేడు. లేదయ్యా. యేసు యొక్క రక్తము దాని తీసివేసినపుడు, పరదేశి కూడా ఇకను లేదు. ఇటువైపు చూడండి. మై!
96
యేసు ఏ విధంగా ఆయన చనిపోయినప్పుడు, చెరలోనున్న ఆత్మల యొద్దకు వెళ్ళి, ఆయన బోధించాడో నేను ఆలోచించగలుగుచున్నాను. ఏ పాపము ఎరుగని, అయినప్పటికీ మన పాపములను ఆయన మీద వేసుకొని, ఒక పాపిగా, ఆయన చనిపోయెను. మరియు దేవుడు, ఆయన పాపముల కొరకై, అతనిని నరకమునకు పంపెను. “ఆయన వెళ్ళి ఆ ఆత్మలకు బోధించేనని బైబిల్ చెప్పుచున్నది.
“సహోదరుడా బ్రెన్హాం, నేను దాన్ని అర్థము చేసుకోలేకపోవుచున్నాను,” అని కొందరు జనులు చెప్పుచున్నారు. “యేసు మూడవ దినమున లేచెను. ఆయన శుక్రవారం మధ్యాహ్నము చనిపోయి, ఆదివారం ఉదయవేళ లేచెను, ఎందుకని, ఆయన ఆ ఒక్క రోజు మాత్రమే చనిపోయాడు.”
“వారి సమయములోనే,” ఆయన చెప్పాడు. బైబిల్లోనే ఆయనకొక లేఖనభాగము వున్నది, ఆయన దానిపై నిలబడివుండగలిగెను. దావీదు, వెనుకకు జారిన మనిషి అయినా, అతడు రక్షింపబడెను, అయితే ఒక ప్రవక్తగా దేవుని యొక్క ప్రేరణచేత, “నా పరిశుద్ధుని కుళ్ళుపట్టనివ్వను, అతని ఆత్మను పాతాళములో విడిచిపెట్టను,” అని చెప్పెను. మూడు పగలు మరియు రాత్రులు, ఆ శరీరము కుళ్ళుపట్టునని, అతడు ఎరిగియుండెను. దేవుడు చేసిన పనిని ప్రవక్తకు చెప్పెను, “అతడు కుళ్ళు పట్టుటను చూడలేదు.” కావున...
[టేపుపై ఖాళీ వున్నది]
97
హల్లెలూయా! అతడు దేవుని వాక్యమును తీసికొనెను, ప్రతి సమయమున, దానితో అతడు సాతానుని ఓడించెను. ఆయన దేవుని యొక్క వాక్యము చేత మరణాన్ని ఓడించెను. హల్లెలూయా! ఆయన మరణమును ఓడించెను. వారాయనను చంపినప్పుడు, నా పాపములను మరియు మీ పాపములను ఆయన మీద వేసుకొని, ఒక పాపిగా, ఆయన చనిపోయెను. ఆయన క్రిందికి వెళ్ళెను, అక్కడాయన తలుపు తట్టుటను నేను చూడగలను.
మరియు నశించిన వారి ఆత్మలు బయటకు వచ్చి, ఇలా చెప్పెను, “మంచిది, ఎవరు నీవు?”
మీరెందుకు హనోకు మాటను వినలేదు? మీరెందుకు ఆ ఇతర ప్రవక్తలు బోధించినది వినలేదు?“ అని ఆయన అడిగాడు. వారు తీర్పు తీర్చబడిరి. ”జీవించుచున్న దేవుని యొక్క కుమారుడను నేనే. నా రక్తమును చిందించాను. ప్రవక్తలు ఏదైతే చెప్పారో, దానిని నేను నేరవేర్చిచితినని, నేను మీకు చెప్పవచ్చితిని,“ అనెను. దాని క్రిందగా, దయ్యములను దాటుకొని, తిన్నగా నరకము గుండా వెళ్ళి, మరణము యొక్కయు, పాతాళము యొక్కయు తాళపు చెవులను దయ్యము యొద్ద నుండి తీసికొని, ఆయన ప్రక్కగా వాటిని వ్రేలాడదీసి, తిరిగి వచ్చెను. హల్లెలూయా!
అరుణోదయ వేళలో లేచెను. హల్లెలూయా! ఇక్కడ ఒక చిన్న పటమును గీయుదము. అరుణోదయ వేళలో, ఇక్కడ పరదేశిలో వేరొక గుంపు వారు వున్నారు. ఇప్పుడు వారక్కడ లేరు.
98
ఇప్పుడు, పెద్ద కేథలిక్ స్నేహితులారా, పరిశుద్దుల యొక్క విజ్ఞాపనలు మీరు నమ్ముదురు. మీ సంఘములో పరిశుద్దుని గూర్చి మాట్లాడుతున్నట్లయితే, ఆ మనిషి ఒక పాపీ, ఆయన నరకములో వున్నాడు, లేక అదుగో దూరాన తన తీర్పు కొరకై ఎదురుచూస్తు వుంటాడు. అతడు ఒక పరిశుద్దుడైయితే, అతడు దేవుని యొక్క మహిమలో వుండి తిరిగి రాలేదు. అది వాస్తవము. నేను దాని నిరూపించగలను. ఎద్దుల యొక్క రక్తము పాపమును తీసివేయలేదు, కాని యేసుక్రీస్తు యొక్క రక్తము పాపములకు విడాకులు (విడుదల) ఇచ్చును.
99
యేసు ఎక్కడయితే, పరదేశు వున్నదో అక్కడకు వెళ్ళటం నేను చూడగలను, అక్కడ పాత అబ్రాహాము, ఇస్సాకు, మరియు యాకోబు, అందులో వారున్నారు, సమూయేలు మిగిలిన వారందరు అక్కడ వున్నారు. ఆయన తలుపు తట్టుటను నేను వినగలను. ఆమేన్! ఓ, నేను దీనిని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు భక్తిపర్వశమైనటువంటి అనుభూతిని పొందుకుంటున్నాను. ఆయన చెప్పుటను నేను వినగలుగుచున్నాను. “అక్కడ బయట ఎవరు వున్నారు? అక్కడ ఎవరు వున్నారు?” అతడు అన్నాడు, “నేను, అబ్రాహామును మాట్లడుచున్నాను. అది ఎవరు?”
“నేను అబ్రాహాము యొక్క సంతానము.” ఆమేన్. అబ్రాహాము తలుపు నొద్దకు వచ్చి, తలుపు తెరుచుట నేను చూడగలుగుచున్నాను. “నేను అబ్రాహాము యొక్క సంతానమని,” ఆయన చెప్పెను
“అటువైపు చూడండి! నేను చూచిన పర్వతము నుండి తీయబడిన ఆ రాయి,” అని దానియేలు చెప్పెను.
జనులు చెప్పుటను నేను వినగలను, “అక్కడాయన ఉన్నాడా! ఆయన పాదముల క్రింది ధూళిని, నేను చూశాను, మేఘములు కదులుటను, అప్పుడు గొర్రె... వారి చేతులతో చప్పట్లు కొట్టుట, ఆకులు, అవన్ని కేకలు పెట్టెను.” ఓ, అక్కడ పరదేశీలో ఆయన కొరకు ఎదురు చూచుచున్న ఇతరులను నేను చూడగలుగుచున్నాను.
100
ఆయన ఈలాగు చెప్పుటను నేను వినగలను, “రండీ! యెరూషలేములో అరుణోదయపు వెలుగు దానిని బ్రద్దలు చేసెను. మనము ఇక్కడ నుండి వెళ్ళవలసివున్నది. మనం పైకి వెళ్ళబోవుచున్నాము, ఎందుకనగా మీరు కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును నమ్మి, నా యొక్క రక్త సమయము వరకూ మీరు ఎదురుచూచుచున్నారు. అయితే, నా యొక్క రక్తము అక్కడ కల్వరిలో చిందించబడినది. దేవుని యొక్క కుమారుని రూపము ధరించినది నేనే. పాపమంతటికి రుణము చెల్లించబడినది. ఇప్పుడు మనము బయటకు వెళ్ళు దారిలో వున్నాము!” హల్లెలూయా! దేవునికే మహిమ!
అబ్రాహాము తన హస్తముతో శారాను బయటకు లాగుటను నేను చూడగలను, సరిగ్గా ఇక్కడే వారు బయటకు వచ్చిరి! మత్తయి 27లో, అతడు బయటకు వచ్చినప్పుడు, అక్కడ యెరూషలేములో వారు కొంచెం సేపు ఆగుటను నేను చూడగలను. మొదటి విషయమేమిటో మీకు తెలుసా, కయప మరియు మొదలగువారు వీధుల్లో నిలబడి చెప్పుటను నేను చూడగలను, “వాళ్ళు నాకు చెప్పారు, ఆయన లేచాడని. అటుగా వెళ్ళుచున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ యౌవన వ్యక్తి, ఆ యౌవన బాలిక ఎవరు?”
వృద్దాప్యము ఇక లేదు, అది అబ్రాహాము మరియు శారా. వారు అదృశ్యులైపోయారు. వారు చూశారు, “ఎవరో మనల్ని గమనిస్తున్నారు.” ఆయన ఏ విధంగా గోడలో నుండి వెళ్ళి పోయాడో, ఆ విధంగా అలాంటి శరీరముతోనే వారు అదృశ్యులవ్వగలిగారు. హల్లెలూయా! సరే. ఇక్కడ ప్రవక్తలు మొదలగువారందరు, పట్టణాన్ని చుట్టూ చూస్తూ నడుచుచున్నారు.
యేసు వారిని నడిపించుకుంటూ నక్షత్రములు, చంద్రుడు, మేఘాలపై నుండి చెరను చెరగా కొనిపోయి, మనుష్యులకు వరములను అనుగ్రహించెను. యేసు నేడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చునియున్నాడు, అక్కడకు పైకి ఎక్కెను. ఆయన శత్రువులు ఆయన పాదపీఠమగు వరకు ఆయన కూర్చుండెను.
101
ఈ దినాన, నా ప్రియ క్రైస్తవ స్నేహితుడా, దయ్యములు ప్రతి కోణంలోను పని చేయుచున్నవి. సరిగ్గా దేవుని ఆత్మ కూడా మరో కోణంలో పనిచేస్తు, అది ప్రతి సమయములలోను దానికి ప్రతిఘటించుచున్నది. హల్లెలూయా! నీవు అక్కడే ఉన్నావు. వార్తాపత్రికల్లో మరియు డైజెస్ట్ లో, మరియు ప్రతి దానిలోను అది ప్రకటన చేయబడుచున్నది. వారు దాన్ని గమనిస్తున్నారు, అది ఏమైయున్నదో వారు చూడలేరు. అదేమిటి? అది దేవునికి సాతానుకి మధ్య జరుగు గొప్ప బలప్రదర్శన యొక్క ఒక గొప్ప ఛాయా రూపమైయుంటున్నది. అది త్వరగా రానైయున్నది. దేవుని పక్షాన ఉండి మరియు మీ హృదయమును సరిచేసుకొనుడి. ఆమేన్.
102
ఇక్కడ కొంత కాలము క్రితం నేను ఓహాయోలో గల టోలెడోలో కూటము కలిగి ఉన్నాను. (నేను ముగించబోవుచున్నాను.)
దయ్యాలు గూర్చి నా యొక్క భావమేమిటో మీరు గ్రహించారా? అవి పని చేయుచున్నవి. అవి చాలా భక్తిగా, మతసంబంధమైనవిగా ఉన్నవి! ఓ, అవి ప్రతీ ఆదివారము సంఘానికి వెళ్ళును, అపోస్తులుల సిద్ధాంతమును వల్లించును, మరియు దీవెన పాటలు పాడును. ఓ, మై, వారు చేయగలిగినంత భక్తి వారు చేస్తారు! “సహోదరుడా బ్రెన్హాం, అది సత్యమని నీ భావమా?”
ఆ రకమైన ఆత్మ యేసుక్రీస్తుని సిలువ యొద్ద వేలాడదీసినది. మరియు “మీరు మీ తండ్రి వలె, అపవాధి సంబంధులు,” అని యేసు చెప్పెను.
ఇప్పుడు వారిలో కొందరు ఇలా అంటారు, “ఓ, రష్యా, అంత్యక్రీస్తు.” ఎన్నడూ కాదు! రష్యా అంత్యక్రీస్తు కాదు. అంత్యక్రీస్తు చాలా మతభక్తి కలిగినవాడుగా ఉంటు, సాధ్యమైయితే ఏర్పాటు చేయబడినవారిని సహితము మోసపరుచును. గుర్తుంచుకొనండి, దేవుడు తన మనిషిని తీసుకొనును, అయితే అతని ఆత్మను కాదు. దయ్యము అతని యొక్క మనిషిని తీసుకొనును; కాని ఆయన ఆత్మను ఎన్నడూ తీసుకొనడు. ఇప్పుడు, వారక్కడే ఉన్నారు; నీకు నీవుగా సరిచేసుకో. నేను సత్యమునకు బాధ్యుడనైయున్నాను.
103
దయ్యాలు, పని చేయుచున్నవి! నిన్నటి దినాన, భౌతిక రాజ్యములో వాటిని తీసుకున్నాము. ఈ రోజు, అవి ఎక్కడ మతసంబంధమైన రాజ్యములో ఉన్నదో, నేను మీకు ఆత్మ సంబంధమైన రాజ్యములో చూపిస్తున్నాను. అవి ఎక్కడో దూరానా ఉండి క్యాన్సర్ అని పిలువబడుచున్నవి. మరియు వాటిని ఇది, అది, మరియు వేరొకటి అని పిలుస్తారు, అయితే అవి దయ్యాలని, బైబిల్ ద్వారా, నేను మీకు రుజువు చేసెదను. ఇప్పుడు, ఇక్కడే, ఈ రోజు, అవి ఇక్కడే మరలా మతసంబంధమైన రాజ్యములో, చాలా మత భక్తి కలిగినవిగాను, చాలా దైవభక్తి కలిగినవిగాను ఉన్నవి.
సహోదరుడా, ఆరంభము నుండి నీవు ఆలోచన చేయుము. కయీను, ఆదిలో చాలా మూఢభక్తి కలిగిన మనిషిగా ఉన్నాడు. ఏశావు కూడా చాలా భక్తి కలిగిన మనిషి. యూదా కూడా చాలా భక్తి కలిగిన మనిషిగా ఉన్నాడు. అది మతము. అది బయట ప్రపంచము కాదు. అది సరిగా ఉన్నత హోదాలో ఉండెను. దయ్యపు శాస్త్రము! దాన్ని గమనించు, బహుశా కొంతసేపటి తరువాత, కొంత సమయము, నేను కొంచెము ఎక్కువగా చెప్పెదను; మనకు అలస్యమగుచున్నది.
ఎవరినీ గద్దించవద్దు. ప్రతి ఒక్కరిని ప్రేమించు. నీ హృదయము నుండి నీవు ప్రేమించలేకపోతే, అప్పుడు క్రీస్తు నీతో లేడు.
104
ఓహాయోలోని, టోలెడో వద్ద వున్న, ఒక చిన్న ఫలహారశాలకు నేను వెళ్ళాను. నేను తినుచున్న స్థలము, ఒక చిన్న త్రాగుడు స్థలమది, చిన్న అందమైన స్థలమది. వారు చాలా మంచివారు. ఆదివారపుబడి పాఠమునకై వెళ్ళుటకు, వారు ఆ మధ్యాహ్నము మూసివేశారు. వారది చేసినప్పుడు, నేను ఆ వీధి గుండా, ఒక లోకకార్యములతో నిండిన చిన్న పాత స్థలమునకు వెళ్ళవలసివచ్చినది, నేను అక్కడకు నడిచి వెళ్ళాను. ఓహాయోలోని జూదము చట్టవిరుద్దమని నాకు తెలియును. ఇక్కడ ఒక రాష్ట్ర పోలిస్ ఒక బాలిక చుట్టూ తన చెయ్యి వేసి, స్లాట్ మిషన్ ఆట ఆడుచూ, అతని చెయ్యి ఆమె భుజముపై వ్రేలాడుచుండెను. మన రాష్ట్రము మరియు దేశము యొక్క చట్టం అంతా గతించిపోయినది. ఎంతటి దీన స్థితి!
కదల్చబడని బండయైన క్రీస్తుని నేను నమ్ముచున్నాను, మిగతా నేలలన్నీ మునిగిపోయే ఇసుక నేలయే. ఏది విడిచిపెట్టబడదు. అది వాస్తవము.
105
నేను వెనుక వైపు తిరిగి చూశాను, అక్కడొక అందమైన యౌవన స్త్రీ ఉన్నది, సాధారణముగా ఆమెకు పంతొమ్మిది, పద్దెనిమ్మిది, పంతొమ్మిది సంవత్సరాలు ఉండును. వారేమి చేయుచున్నారనగా, వారు ఆ బల్ల చుట్టూ చేరియున్నారు, అది భయంకరముగా ఉన్నది. అక్కడ నేను కూర్చొని యున్నాను. ఇప్పుడు నాకు ఆశ్చర్యము కలిగించేలా నేను కూర్చొనియున్న స్థలానికి ఒక స్త్రీ వచ్చి ఇలా చెప్పెను, “నీకు ఒక కుర్చీవున్నదా?”
“మీకు ధన్యవాదములు, నేను అల్ఫాహరము కావలెననుకుంటున్నాను,” అని నేను చెప్పాను.
కుర్చీలో కూర్చుని వున్న, ఆ వయస్సు పైబడిన స్త్రీ ఇక్కడ కూర్చొన్నది. ఆమెకు నా తల్లి వలె యాభై-ఐదు, యాభై-ఎనిమిది సంవత్సరాల వయస్సుంటున్నది. వారు ధరించినటువంటి భక్తిహీన వస్త్రాలు, ఆమె పొట్టి వస్త్రాలు ధరించినది.
అది చల్లగా వుంటున్నదని వారు ఆరోపిస్తారు. “నీవు వెర్రిదానవని,” విజ్ఞానశాస్త్రము చెప్పుచున్నది అంటారు. నిశ్చయముగా, అది అలాగున కాదు. నీవు నీ దిగంబరత్వమును చూపించాలని అనుకున్నావు. అది ఒక అవమానము, ఒక సిగ్గుమాలినతనము. ఒక సంస్కారము గల వనిత వాటిని ధరించదు. ఒక ఆడది ధరిస్తుంది, కాని వనిత (మంచి స్త్రీ) ధరించదు.
106
అంతట, కాబట్టి అప్పుడు, ఆమె అక్కడ కూర్చొని వున్నది. ఆమె బలహీనమైన మెత్తటి శరీరముతో వున్నది. ఆమె పెదవులపైన ఒక లేత ఎరుపు రంగు వంటి రంగు, లేక దానిని ఏమని పిలుస్తారు, పూసుకొని ఉన్నది. మరియు ఒక పురుషుని వలే జుట్టు కత్తిరించుకొనుట, అదంతా చిందరవందరగా వున్నది; బైబిల్ ఏమి చెప్పెను, అది అవమానము, స్త్రీ అయిన, పురుషుడైన అంతే...
ఒక స్త్రీ తన తల వెంట్రుకలు గనుక కత్తిరించుకున్నట్లయితే, పురుషుడు ఆమెకు విడాకులిచ్చు హాక్కును కలిగియున్నాడని, బైబిల్ చెప్పుచున్నది, ఎందుకనగా ఆమె అతని యెడల నమ్మకస్తురాలుగా లేదు. మనము వెళ్ళి, ఇక్కడ కొన్ని దినాలు బైబిల్ గూర్చి బోధించవలసి వుంటున్నది. “ఆమె తన తల వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే, ఆమె తన భర్తను అవమానపరచునదని” బైబిల్ చెప్పెను. ఆమె అవమానపరచినట్లయితే, ఆమెను విడిచిపెట్ట వచ్చును. నీవు మరియొకతెను పెండ్లి చేసుకొనకూడదు, కాని ఆమెను విడిచి పెట్టగలవు. హ్యు! బాలుడా, అది అది కఠినముగా ఉండవచ్చని నేను భావించగలను. కాని అది సత్యము.
107
ఓ, మనము పరిశుద్ధాత్మ రాజ్యములో దాని కలిగియుంటాము, కాని వాటికి అడ్డు గడియలు వేస్తాము. “మనం అడ్డు గడియలు వేద్దాం, మనం అడ్డు గడియలు వేద్దాం. మనం పాపముతో రాజీపడ్డాము. మనం అడ్డు గడియలు వేద్దాం, గొర్రెలు బయటకి వెళ్ళినవి, అయితే మేకలు లోపలకి ఏలా వచ్చినవి?” అని ఒక పెద్ద సహోదరుడు ఇలా చెప్పుచూవుండెను. మీరు అడ్డు గడియలేయండి. ఏమి జరిగింది. లోకము, సంఘము రెండు కలగలుపైపోయినవి, మీరు అడ్డు గడియలేయండి. మోయబు మరియు బిలాముల వలె, వారి మధ్య ఏ విధంగా పెండ్లి జరిగినదో, ఆ విధంగానే కచ్చితంగా నేడు అదే కార్యము జరుగుచున్నది. ఈనాడు సంఘమంతా కలుషితమైపోయినది, పెంతెకోస్తు కాలమే లవొదకయ కాలము, అది నులివెచ్చగా వుండి, దేవుని నోట నుండి ఉమ్మివేయబడినది. గుంపులన్నిటిలో నుండి, కచ్చితంగా, కచ్చితంగా పునరుత్థానము గుండా దేవుడు తన శేషమును ఆమె గృహమునకు పిలచుచున్నాడు.
108
ఆమె పెదవులకు, ముఖమంతటికి, మొదలగు వాటంతటికి రంగులు పూసుకొని, ఆమె అక్కడ కూర్చుని వున్నది. ఆమె కన్నులపైన నల్లటి రంగువున్నది, ఆమెకు చెమటపడుచు, క్రిందకి కారుతూ వున్నది. ఆ పెద్దామెకు బహుశా ముని మనవళ్ళు మనమరాండ్రులు ఉండివుండవచ్చును. ఆమె అక్కడ యిద్దరు మనుష్యులతో కూర్చోని వున్నది, వారిలో ఒకరు తన కంఠము చుట్టూ పాతదైన పెద్ద గుడ్డ తూనెకను కట్టుకొని, జూన్ మాసంలో అక్కడ కూర్చుండెను. మరతడు త్రాగుచుండెను, ఆమె కూడా త్రాగుచు మరియు చుట్టూ చూచుచుండెను.
“ఓ, దేవా! దేవా, ఎందుకని నీవు అలాంటి కార్యములను భూగోళ పటము నుండి తుడిచివేయకూడదు? నీవు ఎందుకని చేయకూడదు? నా చిన్న షారోను... నా చిన్న కుమార్తె, నా చిన్న శారా మరియు నా చిన్న రిబ్కా అలాంటి తరము వారిని ఎదుర్కొనవలసియున్నదా,” అని నేననుకున్నాను. “ఈ పార్కుల్లోను మరియు అలాంటి వాటిల్లోను, ఏమి జరుగుచున్నదో ఇటువైపు చూడు,” అని నేననుకున్నాను. “ఓ, దేవా! ఓ, షారోనును తీసుకున్నందుకు నేను సంతోషించాను, అది నీ చిత్తమే. నా చిన్న రిబ్కా మరియు చిన్న చిన్న శారా, అలాంటి వాటిని ఎదుర్కొనవలసి వుంటున్నది,” అని నేననుకున్నాను. పాటలు పాడు వరుసల్లోను ప్రతి దానిలోను ఉండుటకు... జనులు, వారిని పిలుస్తారు... “అది సిగ్గుగా లేదా?” అని నేననుకున్నాను. “దేవా, మీ పరిశుద్ధమైన నీతి ఏ విధంగా నిలువగలదు? మా సద్గుణముతో నిండిన కోపము అక్కడకు ఎగిరి వెళ్ళి మరియు ఈ స్థలమును కాల్చునట్లు చేయునని,” నేననుకుంటున్నాను.
109
“ఈ ప్రక్కకు రా,” అని ప్రభువు యొక్క దూత చెప్పుటను నేను విన్నాను. నేను అక్కడకు నడిచి వెళ్ళాను. ఆయన నాతో వచ్చినప్పుడు, నేను ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా వున్నట్టు భావించాను. “నీవు దేని కొరకు ఆమెను గద్దించిచున్నావు?”
“అటువైపు చూడు, ఆమె వెళ్ళే మార్గం,” అని నేనన్నాను. మరియు ఆయన ఇక్కడ ఏమిటి..
నేను ఒక దర్శనమును చూశాను. ఇలాంటి గుండ్రని ప్రపంచము లాంటి మరొక ప్రపంచమును నేను చూశాను. అయితే ఇక్కడున్న ఈ ప్రపంచము, దాని చుట్టూ వర్ష ధనుస్సు కలిగివున్నది, అది యేసుక్రీస్తు యొక్క రక్తము చేత దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడబడుచున్నది. ఆయన దానివైపు చూడలేకపోయాడు, ఆయన ఇప్పుడే ఆ కార్యమును నాశనము చేయును, ఎందుకనగా “నీవు దీన్ని తిను దినమున, ఆ దినమున నీవు మరణించెదవు,” అని ఆయన చెప్పెను. కాబట్టి ఆయన దాన్ని చేసెను.
నేను ఈ విధంగా ఆలోచించాను. నాకు నేనుగా చూసుకున్నాను. నేను అది చేయలేనప్పటికి, ఏ విధంగానైనను, నేను ఒక పాపిగానే వున్నాను. అంతటా యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు అపరిమితముగా పని చేయుచున్నది, చూశారా. అది, నేను పాపిగా ఉన్నప్పుడు, నా పాపములను ఆయన కొట్టెను. ఆయన ప్రశస్తమైన తల కఠినముగా కొట్టబడెను. కన్నీరు, రక్తము, క్రిందికి కారుచుండుటను నేను చూడగలుగుచున్నాను. “అతడేమి చేయుచున్నాడో అతడెరుగడు, తండ్రి, అతన్ని క్షమించండి.” “తండ్రీ, క్షమించండి.”
110
అది అతన్ని ఎన్నడూ దాటి పోలేనట్లయితే, నేను నాశనము చేయబోవుచున్నాను. ఆయన కృపను ఎన్నడు అంగీకరించకపోయినట్లయితే, ఆ దినాన్న అదుగో దూరాన్న సముద్రమునకు ఆవల నా ఆత్మకు, నాకు ఎప్పుడో తీర్పు తీర్చబడెను. నేను తిరస్కరించాను. తీర్పు తప్ప అక్కడ మరింకేమియు లేదు. తీర్పు తీర్చబడినది. నేను ఎప్పుడో తీర్పు తీర్చబడ్డాను. “నీవు తిను దినమున నిశ్చయంగా మరణించుదువని,” దేవుడు చెప్పెను. నీవు సరిగ్గా తీర్పు తీర్చబడ్డావు.... ఈ మధ్యాహ్న వేళ ఇదే నీకు తీర్పు సింహాసనమవుచున్నది — క్రీస్తు పట్ల నీ యొక్క వైఖరి.
అంతటా నేను ఆలోచించితిని, “అవును, అది వాస్తవమే.” ఒకానొక దినాన నేను ప్రాకుచూ ఆయన యొద్దకు వెళ్ళుటను నేను చూశాను. ఒక పాపిగా పాత పుస్తకము అక్కడ వుండుటను నేను చూశాను, అక్కడ ప్రతి వస్తువు పడి ఉన్నది. నా పాపము ఏమి చేయుచున్నదో నేను చూశాను. “ప్రభువా, నీవు నన్ను క్షమించెదవా?” అని నేనడిగాను.
ఆయన ప్రక్కలో నుండి తన చేయిని తీసి, కొంత రక్తమును బయటకి తీసి, “క్షమించాను,” అని చెప్పి, దాన్ని ఆ పైన వ్రాసెను. ఇక ఎన్నటికి జ్ఞప్తికి రాకుండా మరపు అనే సముద్రంలో పడవేసెను. అది ఎన్నటికి ఇక లేదు. “నేను నిన్ను క్షమించాను, గాని నీవు ఆమెకు తీర్పు తీర్చుచున్నావు,” అని ఆయన చెప్పాడు.
అది నా ఆలోచనను మార్చి వేసినది. “ప్రభువా, కనికరము చూపండి,” అని నేనన్నాను.
111
నేను దాని నుండి బయటకి వచ్చిన తర్వాత, నేను అక్కడకు నడుచుకొంటు వెళ్ళి కూర్చున్నాను. “అమ్మ, మీరు ఎలాగున్నారు?”అని నేనడిగాను.
“ఓ, హాలో,”అని అన్నదామె.
“నీవు నన్ను క్షమించెదవా,” అని నేనన్నాను. “నేను రెవరెండ్ బ్రెన్హాం, ఒక బోధకుడను,” అని నేనన్నాను.
“ఓ, రెవరెండ్ బ్రెన్హాం గారు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి,” అని అన్నదామె.
“స్త్రీ” అని నేనన్నాను. కథంతా ఆమెకు చెప్పాను. “నేనక్కడ నిలబడి, అది ఎటువంటి భయంకరమైన కార్యము! నేను నిన్ను తీర్పు తీర్చుచూ ఆలోచించుచున్నాను, బహుశా నీకు పిల్లలు ఉండి ఉండవచ్చును,” అని నేనన్నాను.
“నాకున్నారు,” అని అన్నదామె.
“ఏ కారణము చేత తప్పు మార్గమున వెళ్ళుచున్నారు?” అని నేనడిగాను. అది ఎవరి హృదయమునైన చీల్చునటువంటి, విప్పబడిన ఒక కథను ఆమె నాకు చెప్పెను. “నేను దేవున్ని అడుగుచున్నాను, ఎందుకని ఆయన వెంటనే భూమి మీద దుర్మార్గతను నిలిపివేయకూడదు. ఇక్కడ, నీవు ఈ తాగ్రిన ఇద్దరు మనుష్యులతో ఉన్నావు, మరియు నీకు నీవుగా త్రాగితివి,” అని నేనన్నాను. “ఒక దినాన ఆ రక్తము దేవుని ఉగ్రత్త నీ దగ్గరకు రాకుండా నిన్ను పట్టుకొంటున్నది, ఆ ఒకానొక ఈ దినాల్లో నీవు చనిపోబోవుచున్నావు. ఇప్పుడు నీవు స్వేచ్ఛా జీవివి, నీవు తృణీకరించగలవు లేక స్వీకరించగలవు,” అని నేనన్నాను. “కాని ఒకానొక దినాన నీ ఆత్మ అవల నున్న అక్కడకు, ఎక్కడైయితే కనికరముండదో ఆ చోటుకి వెళ్ళుచున్నది. నీవు నీ పాపములోనే చనిపోతే, నీవు ఏప్పుడో తీర్పు తీర్చబడ్డావు, మరి నీవు నరకమునకు వెళ్ళబోవుచున్నా,” వని నేను చెప్పాను.
ఏమిటో మీకు తెలుసా? ఆ స్త్రీ రెస్టారెంట్ నుండి బయటకు వెళ్ళిపోయినది. మీ జీవితంలో మరెన్నడు విననటు వంటి ప్రార్థన కూటములు మేము కలిగియున్నాము, మరి ఆమె క్రీస్తు నొద్దకు వచ్చెను. అదేమిటది? వారిని ఖండించవద్దు; వారికి సువార్తను చెప్పండి. వారు దెయ్యముతో స్వాధీనపరచబడ్డారు; ఈ లోకములో వారు మర్త్యులైయున్నారు. వారు ఇక్కడకు ఒక విధమైన ప్రభావితులై వస్తున్నారు. మన ప్రభావము పై నుండి వస్తున్నది. క్రీస్తు నొద్దకు ఇతరులను నడిపించుటకై మన తలంతులతో మనమేమి చేయగలమో చూద్దాం.
112
మా పరలోకపు తండ్రీ, మీ మంచితనానికి మరియు కనికరమునకై మీకు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. బహుశా, జనులను, నేను వారి ఎక్కువసేపు ఉంచినందులకు నన్ను క్షమించండి, ప్రభువా. అలాగే ఈ విధంగా ఈ మధ్యహ్న వేళ కూటములు ముగించుచూ, నేను వారికి “దయ్యాల్ని” గూర్చి చెప్పాలని అనుకున్నాను. నేను దాని ఒక చోట ఒక ప్రసంగములో ఎంతగానో దాన్ని చెక్కాను. అయితే ఒకొక్కరు వారు దీనిని అక్కడ - ఇక్కడ ఏరుకొనగలరు, నా యొక్క భావమేమిటో అర్థము చేసుకున్నారా? అది తెచ్చుటకు గల నా యొక్క హృదయవాంఛ ఎమిటో మీకు తెలుసు.
ఈ మధాహ్నవేళ ప్రజలు ఇక్కడ నుండి వెళ్ళిన ప్రతి స్త్రీ, పురుషులు వారు చేయు ప్రతి కదలికను గమనిస్తూ, ఆనందముతోను, స్వేచ్చతోను జీవించుదురు గాక. ఆ దేవుడు వారిని రక్షించెనని వారు తెలుసుకొందురు గాక. వారాయనవైపు చూచి, సమస్త మూఢ నమ్మకాలను వారు చుట్టూ వున్న కార్యములను, మర్చిపోయి, నెమ్మదిగాను శాంతిగాను, దేవుని భయముతో వారు జీవించుదురు గాక. అంతట, దేవా, ఏదైన దాని కొరకు మీరు వారిని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు, వారు ఎక్కడికెళ్ళాలని మీరు అనుకుంటున్నారో అక్కడికి, లేక వారు ఏమి చేయాలని మీరనుకుంటున్నారో అది చేయుటకు, మీరు వారితో నేరుగా మాట్లాడగలరు. ప్రజలు, తగ్గింపు గలవారై వారి హృదయాల్లో క్రీస్తుని కలిగి యుందురు గాక. ప్రభువా, మా ప్రతి ఒక్కరిని, మరియు మా యొక్క లోటుపాట్లను క్షమించండి.
113
సాతాను గర్జించు సింహము వలె, ప్రతిచోట, తనకు ఇష్టమైన వారిని మ్రింగుటకై, మత సంబంధమైన వస్త్రములను ధరించి యున్నాడని - మనకు తెలియును. ఓ దేవా, ధీనులై ప్రతి చోట వున్న చిన్న పిల్లలైన వారి వైపు చూడండి. వారు ఈ ప్రజల ముందు తెరువబడి మరియు బట్టబయలు చేయబడిరి. దేవా, వారి యెడల కనికరము చూపమని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచి, వారినందరిని రక్షింపమని, నేను మీకు ప్రార్థిస్తున్నాను. అంతట, దేవా, వ్యాధులైన ఈ ముసలి దయ్యాలు మీ పిల్లల మీదికి వస్తుండగా, వారి యెడల భద్రత వహించుటకై, మీ యొద్ద పరిహారార్థబలిని ఉంచుకొని యున్నారని, మేము ఎరుగుదుము. పాపము చేయుటకై కారణమైన దయ్యాలన్నిటి నుండి, మీరు ఒక పరిహారార్థబలిని కలిగియుండి, అది భద్రత వహించును గాక. యేసుక్రీస్తు నామములో దానిని మీరు అనుగ్రహిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
నేను ఆశ్చర్యపోవుచున్నాను....