ఆదికాండము మీద ప్రశ్నలు మరియు జవాబులు
VGR COUNT-285 ఇప్పుడు, ఎవరైననూ తమ చేతులలో కలిగి యున్నటువంటి ప్రశ్నలు పొందాలనుకుంటే, వాటిని ఎవరికైనా చిన్న పిల్లలకు ఇచ్చి, వాటిని సరిగ్గా పైకి పంపండి లేదా మీ ఇష్టం చొప్పున చేయండి. లేక ఒకవేళ, వీటి గుండా మీరు పొందాలనుకున్నట్లయితే... నేను ఒక పేజీ మీద ఆరింటిని (పశ్నలను) కలిగి ఉన్నాను. మరియు అప్పుడు ఇక్కడ మనము ఇంకొక రెండింటిని కలిగియుండవచ్చును.
ఇప్పుడు, మనము కనుగొనాలనుకొంటున్నాము. అసలు ప్రజల మనస్సులలో ఏమున్నది, వారు వీటిని గురించి ఏమని తలంచుచున్నారు అన్న కారణము చేతనే, మనము వీటిని కనుగొనాలనుకొంటున్నాము, చూశారా. మరియు అది ఒక మంచి బలమైన సంఘముగా చేయును. మీరు సమయములు కలిగి ఉన్నప్పుడు మీరు గురుగులను బయటకు తీసివేయుటను కలిగి యుందురు. మీకు తెలియును మరియు సమస్త కార్యములు మార్గము నుండి బయటకు పోవుట వలన మీరు స్థిరముగా నడవగలరు. అందుచేతనే ఇప్పుడు ఆ కారణము చేతనే మనము కనుగొనుటకు ఏదో ఒక సమయమున ప్రశ్న రాత్రి కలిగియున్నాము.
2
ఇప్పుడు దాని మీద ఏదైననూ ప్రశ్న ఉన్నట్లయితే... ఇప్పుడు, ఈ సమయములో దానిని విశాల మార్గంలో తెరచి చెప్పెదను. ఇప్పుడు, నేను ఈ విధంగా చెప్పాలనుకొంటున్నాను ఇప్పుడు ఎవరైననూ... ఆ లేఖనానికి సంబందించినదేదైననూ అడుగిడి; సమాధానము ఇవ్వబడును.“ (కృతజ్ఞతలు సహోదరుడా.) మరియు నేను చెప్పాను, ”లేఖనమునకు సంబంధించిన దేనినైననూ అడుగిడి. సమాదానముమివ్వబడును.“ చూశారా, మేము దానికి సమాధానమిచ్చెదము.” కాని ఈ రాత్రి నేను చెప్పాను...
మీకు తెలియనా, అప్పుడు వారందరూ చుట్టూ చేరి, వారు అడిగెదరు, “సహోదరుడా బిల్,” నేను ఒక ప్రశ్న అడిగెదను, “క్రైస్తత్వము అనగా ఫలనా-ఫలనా వారు ఫలనా-ఫలనా కార్యములు చేయుట అనీ నీవు తలంచుచున్నావా?”
మంచిది, అది ఎవరొకరి మీద అదోరకమైన ఒత్తిడిని కలిగించుటై ఉన్నది. అయితే నేను చెప్పాను, “ఈ రాత్రి వాటిని తీసుకునిరండి.” చూశారా, అది నిజము. అందుచేత, ఏదైనా ఒత్తిడి కలిగి ఉన్నట్లయితే మనము దానిని కనుగొనెదము.
3
ఓ, నేను నిజముగా ఈ రాత్రి మంచి అనుభూతిని పొందుచున్నాను. బయట సూర్యుని యొక్క వేడిమిలో, కోయబడిన పచ్చిక గుండా మధ్యాహ్నం నేను నిజముగా మంచి అనుభూతిని పొందియున్నాను.
మనము ఇప్పుడు చాలా త్వరలోనే ఒక కూడికను కలిగియుంటాము. దీనిని మర్చిపోవద్దు. ఆగష్టు 23 నుండి, చికాగో స్టేడియం వద్ద, సెప్టెంబరు 5 వరుకు ఉండును. అక్కడ ప్రభువులో మంచి సమయమును కలిగియుందుమని ఆశించండి. మరియు, ఇప్పుడు అది ప్రతి చోట ప్రకటింపబడియున్నది. మరియు అన్ని రకముల పత్రికలు దానిని ప్రచురించునవి. మరియు మనము ఒక గొప్ప సమయమును ఆశిద్దాం.
ఇప్పుడు, నేను తలంచుచున్నాను, నేను ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరింటిని ఒక్క పేజీ మీద కలిగియున్నానని, నేను తలంచుచున్నాను. మరియు ఇవి అన్ని వెనుక ఉన్న ఆదికాండములో నున్న విషయాలకు సంబంధించినది.
4
ఇప్పుడు, మొదటిది ఆదికాండము 1:26 లేక 1:26 నుండి 28, అది ఎక్కడ, ఆ వ్యక్తితో.... అది ఏమై ఉంటుందని వారు అడిగారు, ఈ ప్రశ్న ఏమిటి. నా అర్ధం, ప్రశ్నను అడిగారు, నన్ను మన్నించండి. మరియు మనము మొదట చదివెదము. ఇప్పుడు ఇక్కడ వ్రాసి ఉంచిన దాని నుండి వారు పొందెదరు. మీరు గనుక దాని వెనకనే అనుసరిస్తున్నట్లయితే, అది మంచిది. అయితే, “దేవుడు నరుని సృజించెను, స్త్రీ గాను, పురుషుడు గాను, వాని సృజించెను,” చూశారా. మరియు ఆ తరువాత ఆదికాండములో..... లేక, అతడు లేక ఆమె, ఆదికాండము 2:7 లో ఒకరిని చేసెను. “ఆయన నేలమంటితో నరుని నిర్మించెను.” అది మరియొక స్థలమై ఉన్నది. నేను వాటినన్నింటిని చదివెదను, అప్పుడు మనము వాటినన్నింటినీ కలిపి ఇక్కడ మీరు చూడగలరు. ఇప్పుడు మొదటిగా, దీనిలో మొదటి భాగం ఇలా చెప్పబడెను:
5
ప్రశ్న: “దేవుడు నరుని సృజించెను, స్త్రీ గాను, పురుషుని గాను, వారిని సృజించెను.” ఇప్పుడు, అది మొదటి భాగం అని నేను తలంచుచున్నాను. అప్పుడు ఆదికాండము 27 లో ఇలా చెప్పుబడెను, “ఆయన నిర్మించెను,” (క్రింద గీత గీయబడెను) “కాని మొదట అతడు సృజింపబడెను” తరువాత అతడు చేయబడింది. గీత గీయబడెను “మరియు అతడు నిర్మించబడెను” (క్రింద గీత గీయబడెను) నేల మంటితో నరుని నిర్మించి, మరియు వాని నాసికారంధ్రములలో జీవ వాయువును ఊదెను“ మరియు మిగిలినదంతా కూడా, ఇప్పుడు, ఆ వ్యత్యాసం ఏమిటి, లేక ఆ పైన ఉన్నటువంటి లేఖనానికి కలయిక ఎక్కడ?
ఇప్పుడు, మీరు వ్రాసుకోగోరినట్లయితే: ఆదికాండము 1:26 నుండి 28 మరియు ఆదికాండము 2:7. ఇప్పుడు, ఇది చాలా కఠినమైన విషయం. మరియు నేను చేయలేకపోవచ్చును..... నేను దానిని గురించి నా యొక్క స్వంత తలంపును కలిగియున్నాను, అందుచేత నేను దానిని ఏ విధంగా అనుకొంటున్నానో, ఆ మార్గంలోనే నేను దానిని మీకు ఇచ్చెదను. మరియు మీకు ఇది విభిన్నమైన కార్యమైనట్లయితే, అది మంచిది.
అక్కడ, ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలను ఇవ్వడాన్ని బట్టి, నేను సహోదరుడు నెవిల్ ను అభినందిస్తున్నాను. ఇప్పుడు అవి చాలా బాగున్నాయి.
6
ఇప్పుడు, ఆదికాండము 1:26లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మరియు మీరు గమనించినట్లయితే, మనము దానిని పొందెదము. మీరు కూడ దానిని చదవగలరు. మరియు 26.... మీరు మాతో కూడ కలసి చదవాలనుకున్నట్లయితే, మేము మీ కొరకు దానిని చేయడానికి చాలా సంతోషిస్తున్నాము, నన్ను గమనించండి.
దేవుడు మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులను చేయుదము: వారు సముద్రపు చేపలను.... ఆకాశపక్షులను.... భూమి మీద ఉన్న ప్రతీ పశువును..... భూమి మీద ప్రాకు ప్రతీ జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీ గాను, పురుషునిగాను, వారిని సృజించెను.
7
దాని మీద చాలా సార్లు చర్చించుట నేను విన్నాను, మరియు ప్రపంచమంతా దాని మీద చర్చలు వచ్చినవి; ఇప్పుడు ఆదికాండము 2:7లో ఆయన ఇక్కడ ఏమి చేసెనో గమనించండి, మంచిది, అది ఇక్కడ ఉన్నది:
మరియు.... దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా, నరుడు జీవాత్మ ఆయెను.
ఇప్పుడు ఎటువంటి సృష్టి .... ఆ ప్రశ్నంచినవారు ఇలా అడగాలనుకుంటున్నారు:
ప్రశ్న: ఆదికాండము 1:26 మరియు ఆదికాండము 27 కి సంబంధం ఏమిటి? దేవుడు ఇద్దరు మనుష్యులను చేసెను. మరియు నరుడు ఎవరు, మరియు అది ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంది? లేఖనములో అది ఎలా సరిపడుతుంది?
మంచిది, ఇప్పుడు, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆదికాండము 1:26 లో మొదటిగా మొదటి భాగాన్ని పొందెదము. దేవుడు చెప్పెను, “మనము చేయుదము.” ఇప్పుడు, “మనము చేయుదము.” మనము అనగా... “మన స్వరూపమందు నరుని చేయుదము.” మనము అనగా, ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడని మనము గ్రహించాలి. మరోక జీవితో ఆయన మాట్లాడుచున్నాడు, “మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులను చేయుదము, మరియు వారు భూమి మీద ప్రతీ జంతువును ఏలెదరు.”
మీరు గమనించినట్లయితే, సృష్టిలో మొట్టమొదటిగా సృజింపబడినది, వెలుగు. ఆ సృష్టిగుండా మీరు క్రిందికి చూచుచు వచ్చుచున్నట్లయితే, చిట్టచివరిగా చేయబడిన సృష్టి ఏమిటి? ఒక మసుష్యుడు. మరియు పురుషుని తర్వాత స్త్రీ తయారు చేయబడినది. మంచిది, దేవుని సృష్టిలో చివరిగా సృజింపబడినది, మానవజీవి (మనుష్యుడు).
కాని దేవుడు తన యొక్క మొదటి మనుషిని చేసినప్పుడు, మీరు గమనించినట్లయితే, ఆయన తన యొక్క పోలిక చొప్పున నరుని చేసెను, తన స్వరూపమందు సృజించెను, మరియు దేవుడు అనగా ఏమిటి? ఇప్పుడు దేవుడు అనగా ఏమిటో మనం కనుగొనగలిగినట్లయితే, ఆయన ఏ రకమైన మనుష్యుని చేసెనో మనము కనుగొనగలము.
8
ఇప్పుడు, పరిశుద్ద యోహానులో, 4వ అధ్యాయము, మనము దీనిని చదివెదము: స్త్రీతో యేసు మాట్లాడుచున్నాడు... మరి దానిని త్రిప్పగోరనట్లయితే. నాకు ఎక్కువ సమయము లేదు, నేను వాటిని ఇక్కడ వ్రాసుకోలేదు, కేవలం వాటిని గుర్తించుకున్నాను అంతే. మరియు మీరు వాటిని చూచినట్లయితే, నేను దానిని త్వరగా కనుగొన్నట్లయితే, ఇప్పుడు 4వ అధ్యాయము 14వ వచనము నుండి ప్రారంభించెదము:
మరియు నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెవడును దప్పిగొనడు... నేను వానికిచ్చు నీళ్ళు నిత్యజీవనముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును.
ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లు... ఆ నీళ్ళు నాకు దయచేయమని అడిగెను.
యేసు ఆమెతో... వెళ్ళి, నీ పెనిమిటిని పిలుచుకుని రమ్ము...
ఆ స్త్రీ ఆయనతో...
9
మనము, దాని కంటే కొద్దిగా పైగా చూచాము అని నమ్ముచున్నాము అది ఎక్కడ ఉందో కనుగొనుటకు నేను ఇక్కడ చూడాలనుకొంటున్నాను. ఇది కాక పోవచ్చును, నేను ఏది చూడాలనుకొంటున్నానో అది ఈ క్రింద చూడవచ్చును. ఎక్కడ చెప్పబడింది? 23 మరియు 24 వచనము. మంచిది.
మీరు ఆరాధించువారు (అంతే.) ... మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు: మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము: రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. (మరియు అది నిజము, చూశారా.)
కాని కాలము వచ్చుచున్నది... అది ఇప్పుడును వచ్చేయున్నది. అయితే యదార్ధముగా ఆరాధించువారు (యూదుడు లేక అన్యుడు) ఆత్మతోను, సత్యముతోను, ఆరాధించు కాలము వచ్చుచున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.
ఇప్పుడు, నేను కోరుకుంటున్నది తరువాత వచనమైయున్నది:
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యము తోను ఆరాధింపవలెననెను.
10
ఇప్పుడు, దేవుడు నరుని తన స్వరూపమందు, తన పోలిక చొప్పున సృజించినట్లయితే, ఆయన ఎటువంటి మనిషిని సృజించెను? ఒక ఆత్మీయ మనిషిని (మనిషిని ఆత్మగా). ఇప్పుడు, మీరు గమనించినట్లయితే, ఆయన సృష్టి అంతా చేసిన తరువాత, మరియు ఒక ఆత్మీయ మనిషిని సృజించెను. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చదివినట్లయితే (ప్రశ్నను అడిగినటువంటి వారు) దీనిని కనుగొనగలరు. దేవుడు పశువుల మీదను, చేపల మీదను, మరియు సమస్తము మీదను, నరునికి అధికారము ఇచ్చెను కాని, ఆయన అక్కడ తయారు చేయునప్పుడు, నేడు పరిశుద్ధాత్మ ఏ విధముగా విశ్వాసిని ఏలుతున్నదో, అలాగే పొలములోని (భూమి మీద) పశువులను ఏలుటకు, జంతువులను ఏలుటకును, దేవుడు తన స్వరూపమందు నరుని నరుని సృజించెను, చూశారా?
అతడు మరియొక మాటలో చెప్పాలంటే, ఆదామైయున్నాడు. దేవుని యొక్క స్వల్ప సృష్టిలో మొదటి వ్యక్తి.... మొదటి సృష్టి ఏమనగా తనంతట తానుగా ఉన్న దేవుడే; అప్పుడు దేవునిలో నుండి లోగోస్ బయటకు వచ్చెను, అది (లోగోస్) దేవుని యొక్క కుమారుడు; అప్పుడు లోగోస్ నుండి వాక్యమైనటువంటి (“ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు ఆ వాక్యము దేవుడై యుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను.”) లోగోస్ నుండి ఆ నరుడు బయటకు వచ్చెను.
11
ఓ, ఇప్పుడు నా యొక్క మనస్సులో ఒక అద్భుతమైన దృశ్యాన్ని పొందియున్నాను, మీరు నాతో కలసి కొద్ది దూరము ప్రయాణించగలరా, నేను ఇంతకు ముందే దీనిని గురించి మాట్లాడానని నమ్ముచున్నాను. కాని ఆ స్థలాన్ని పొందటానికి, దానిని చూడటానికి నీవు నమ్మికను కలిగియుండవలసియున్నది. ఇప్పుడు, చిన్నగా ప్రయాణాన్ని ప్రారంభించి, మరియు కొద్దిసేపు వెనుకకు (ఆదికి) వెళ్ళెదము. ఇప్పుడు, ఎంత వేడిగా ఉన్నదని తలంచవద్దు, మనము దేని గురించి అయితే మాట్లాడుకొంటున్నామో, సరిగ్గా దాని మీద మీ మనస్సులను ఉంచి మరియు దాని గురించి ఇప్పుడు ఆలోచించండి.
ప్రపంచంలో ఏదియు లేనప్పుడు, ఆ నక్షత్రము, చంద్రుడు లేనటువంటి, వంద మిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్ళెదము. ఇప్పుడు, ఇక్కడ (భూమి మీద) ఏదీ లేనప్పుడు అక్కడ సమయము ఉన్నది. అది సమస్తము అంతయును నీత్యత్వమై ఉన్నది. మరియు ఎల్లప్పుడును, నిత్యత్వము దేవుడే, ఆయన ఆదిలో అక్కడ ఉన్నాడు.
ఇప్పుడు, ఇక్కడ ఈ లోకము యొక్క అంచు నుండి బయటకు వచ్చి, మరియు పైకి చూచి, ఈ సంగతులు జరుగుట మనము చూద్దాము.
12
ఇప్పుడు, “ఎవడును, ఎప్పుడైననూ, దేవుని చూడలేదు.” ఏ మనుష్యుడును శరీరరూపంలో ఉన్న దేవుని చూడలేదు, ఎందుకనగా దేవుడు శరీరరూపీగా లేడు, దేవుడు ఆత్మగా ఉన్నాడు, చూశారా. మంచిది. “ఎవడును, ఎపుడైననూ, దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వీతీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను” — మొదటి యోహను, చూశారా.
ఇప్పుడు, కాని ఇప్పుడు గమనించండి. అక్కడ ఏదీ లేదు, అక్కడ శూన్యము మాత్రమే ఉన్నది. అక్కడ వెలుతురు లేదు, అక్కడ చీకటి లేదు, అక్కడ ఏదీలేదు. అక్కడ ఏమీ లేనట్లుగా అగుపించుచున్నది. కాని, అన్ని సమయములలోనూ, శూన్యము యొక్క ప్రతి స్థలములోనూ, ఆవరించబడినటువంటి, యెహోవా దేవుడు, ఒక గొప్ప అతీతమైన రూపంలో అక్కడ ఉన్నాడు. ఆయన శ్వాశతకాలము నుండి, శ్వాశతకాలము వరుకూ ఉన్నాడు, ఆయనే సృష్టికి ఆధ్యుడు. ఆది దేవుడే, ఏదీ కనిపించుటలేదు, ఏమియును వినిపించుటలేదు, గాలిలో ఒక అణువు కూడా కదులుటలేదు, ఏదీ లేదు, గాలి లేదు, కాని అయినప్పటికీ దేవుడు అక్కడ ఉన్నాడు. అది దేవుడే, కొన్ని నిముషములు మనము గమనించెదము, మరియు తర్వాత ఒక క్షణము... ఏ మనుష్యుడును దానిని చూడలేదు, ఇప్పుడు, అది తండ్రి. అది తండ్రియైన దేవుడు.
13
ఇప్పుడు గమనించండి. అప్పుడు తరువాత, దైవికమైన, వెలుగు ప్రసరింపబడి, ఒక చిన్న హేలో (Halo) లేక మరేదో రూపొందుట నేను చూడగలుచున్నాను, మీరు మీ అత్మీయమైన నేత్రములు ద్వారా మాత్రమే మీరు దానిని చూడగలరు.
కాని, ఇప్పుడు చూడండి, మనము చూచుచుండగా, ఇప్పుడు సంఘమంతయూ చూచుచున్నది. ఒక అతి గొప్ప భూప్రపంచము మీద నిలబడి, దేవుని యొక్క కార్యములను (చేతి పనులను) మనము చూచుచున్నాము. మరియు మనము ఈ ప్రశ్నను సమీపించడానికి ముందు, మరియు ఆయన ఏ విధంగా ఉనికిలోనికి తీసుకొని వచ్చాడో మీరు చూడాలి.
ఇప్పుడు, ఎవరునూ దేవుని చూచియుండలేదు, మరియు ఇప్పుడు, మనము చూసే తరువాత కార్యము, ఒక చిన్న తెల్లని వెలుగు అక్కడ బయట రూపొందుట, మనము మన అతీతమైన నేత్రముల ద్వారా చూచుచున్నాము. అది ఏమిటి? బైబిల్ చదువరుల చేత అది “లోగోస్” లేక “అభిషేకించబడినది” లేక “అభిషేకము,”అని పిలువబడుచున్నది. లేక ఆ... నేను ఈ విధముగా చెప్పాలనుకొంటున్నాను, మరియొక దానిగా అభివృద్ధి చెందుటకు ఆ దేవుని యొక్క భాగము ప్రారంభించినది, అందుచేత మానవులు దాని గురించి ఒక ఆలోచనను పొందెదరు. చిన్నగా ఉండెను, తక్కువ... లేక చిన్నవెలుగు కదులుచున్నది. ఆయన... అది దేవుని యొక్క వాక్కము.
ఇప్పుడు, దేవుడే తనకు తానుగా, ఏ పరమాణువు కూడ లేని పూర్వమే తన కుమారునికి జన్మ నిచ్చాను, లేక పరమాణువును చేయుటకు. అది చూశారా, యేసు చెప్పెను, “తండ్రి నన్ను మహిమపరుచుము, జగత్తుకు పునాది వేయబడకముందే మనకు ఎట్టి మహిమ ఉండెనో అట్టి మహిమతో మహిమపరచుము.” చూశారా, కాలపు తెర ఆవల.
14
ఇప్పుడు, పరిశుద్ద యోహాను 1లో ఆయన చెప్పెను, ఆదియందు వాక్యము ఉండెను, మరియు మొదట... మరియు ఆ వాక్యము దేవుడై యుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను. ఒక మానవునిగా క్రిందికి దిగివచ్చుటకు, దేవుడు తనుకు తాను విశధపరుచుకొనుచున్నాడు. ఇప్పుడు ఆయన ఏ విధముగా చేసెనో గమనించండి.
ఇప్పుడు, వెనుక అక్కడ, అప్పుడు, ఈ చిన్న హేలో బయటకు వచ్చియున్నది. ఇప్పుడు, మనము ఏమి చూడగలగలేకపోయినప్పటికీ, కాని ఆత్మీయమైన నేత్రముల ద్వారా అక్కడ ఒక హేలో నిలబడి ఉండుట మనము చూచుచున్నాము. ఇప్పుడు, అది దేవుని కుమారుడైన, లోగోస్. ఇప్పుడు, సమస్త నిత్యత్వముతో, దేవుని తండ్రి ద్వారము ఎదుట, ఆయన చిన్న పిల్లవానివలె చుట్టూ తిరుగుతూ ఆడుకొనుట నేను చూడగల్గుచున్నాను, చూశారా. మరియు ఇప్పుడు, ఆయన లోని ఊహ, ఏయే కార్యములు జరగబోతున్నాయో, వాటిని తలంచుటకు ప్రారంభించినది, మరియు “వెలుగు కలుగును గాక!' అని ఆయన చెప్పుట నేను వినగలుచున్నాను.
మరియు ఆయన అలా చెప్పినప్పుడు, ఒక పరమాణువు విస్ఫోటనము చెంది, సూర్యుడు ఉనికి లోనికి వచ్చెను, ఆమె (సూర్యుడు) పది లక్షల వందల సంవత్సరముల పాటు భ్రమిస్తూ, నిప్పురవ్వలను పుట్టిస్తూ, మరియు మండుతూ మరియు ఈ దినమున ఉన్నట్టుగా రూపొందినది; ఇంకనూ మండుచూ, ఇంకనూ పరమాణువులను బద్దలుగొట్టుచున్నది. ఆ పరమాణుబాంబు ఎప్పుడైననూ, విస్పోటనం చెందినట్లయితే, ఆ పరమాణుపు గొలుసు తీసుకొని... ఈ భూమి కూడా, దూరము నుండి, పగులగొట్టబడి, విస్ఫోటనం చెందుతున్న సూర్యుని వలె ఉండును. మీరు గనుక మరో గ్రహం మీద నిలబడి దానిని చూచినట్లయితే, పరమాణువులు దీనిని మండించుట వలన ఇది (భూమి) ఇంకొక సూర్యుని వలే కనబడును, మరియు గొలుసు ఊడదీయబడినట్లయితే, అది భ్రమిస్తూ ఆ విధముగా తిరుగుట ప్రారంభించును. సూర్యుని యొక్క బిలియన్ (లక్షల కోట్ల) ఫారన్హీట్ గల పెద్ద అగ్ని జ్వాలలు, పదిలక్షల మరియు పదిలక్షల మైళ్ళు చేరగలవు.
15
ఇప్పుడు, దీనిని గమనించండి. అద్భుతము! ఆయన సూర్యుని చేసెను. మరియు అప్పుడు, మొదటి విషయము మీకు తెలుసా, దాని (సూర్యుని) నుండి ఒక పెద్ద అగ్ని రవ్వ బయటకు వచ్చి, బరువు కలదిగా మారేను.... అది ఏమనగా, ఈ భూమి వలె ఉండెను, బయటకు వెళ్ళగ్రక్కబడెను. అప్పుడు, ఇక్కడ ఉన్నటు వంటి ఈ లోగోస్, దేవుని యొక్క కుమారుడు, దీనిని చూచుచున్నాడు. ఆయన దీనిని పదిలక్షల వందల సంవత్సరములు అలా పడి ఉండునట్లు చేసెను మరియు ఆయన దానిని ఆపేను. అప్పుడు ఇంకొకటి ఎగిరి వచ్చినది, మరియు దానిని (ఎగిరి వచ్చిన దానిని) ఆయన పదిలక్షల సంవత్సరములు పడి ఉండునట్లు చేసెను. అప్పుడు ఆయన దానిని ఆపెను. ఇప్పుడు, మనము నిలబడి, అది ఉనికి లోనికి వచ్చుట మనము గమనించుచున్నాము.
ఇప్పుడు, ఆయన యొక్క మనస్సులో ఏదో మొదలైనది, మరియు ఆయన ఏమి చేయుచున్నాడు, అయన తన మొదటి బైబిల్ ను వ్రాయుచున్నాడు. మనుష్యులు ఎప్పుడూ చూచేటటువంటి నక్షత్రములున్న రాశి చక్రములో ఆయన మొదటి బైబిల్ ను వ్రాయుచున్నాడు, మరియు అది పరిపూర్ణముగా ఉన్నది... కేవలం... ఇక్కడ ఉన్న ఈ బైబిల్ తో అది అంటకట్టబడి (జత చేయబడి) దాని ప్రారంభము, రాశి చక్రములోని కన్యారాశితో అది ప్రారంభమగును. అది నిజమేనా? రాశి చక్రములోని చివరిది ఏమిటి? లియో, సింహము. అది ఆయన యొక్క మొదటి రాకడై యున్నది, ఆయన ఒక కన్యక ద్వారా వచ్చెను; రెండవసారి ఆయన యూదా గోత్రపు సింహముగా ఆయన రాబోవుచున్నాడు, చూశారా. అదంతా గీయబడి, కాన్సర్ యుగము, మరియు సమస్తమూ దానిలో ఉన్నది. ఇప్పుడు, దీనంతటినీ ఆకాశములో ఉంచెను. ఈ సమస్త ఉల్కలను, భూమి యొక్క ముక్కలను, లేక సూర్యుని, ఇక్కడ వ్రేలాడదీసి ఉంచెను.
ఇప్పుడు, అణ్వాయుధాలు పడిపోతున్నాయని విజ్ఞానము ఏదైతే చూపించగోరుతుందో, అది దేవుడు కాదని రుజువు చేయుటలేదు; అది నాకు మాత్రమే రుజువు చేస్తుంది. చూశారా, అది దానిని మరింత వాస్తవముగా చేయుచున్నది. ఇప్పుడు, ఇప్పుడు, గమనించండి. ఈ అణ్వాయుధాలు అన్ని గాలి గుండా వెళ్ళుతూ, ఆ వేడియైన సూర్యునికి దూరంగా వ్రేలాడ దీయబడి ఉన్నాయి. ఒకవేళ అవి ఒక చోటనే కూర్చబడి ఉండవచ్చును. మరియు మొదటిగా అది ఒక్క మంచు గడ్డగా ప్రారంభమైనదని మీకు తెలియునా.
16
ఇప్పుడు, ఆవల నుండి ఒక పెద్ద పాత నిప్పురవ్వ ఎగురుకొంటూ వచ్చి, అది ఈ భూమిగా ఉనికి లోనికి వచ్చియున్నది, దీని (భూమి) క్రింద అడుగుభాగాన ఏమీ కాదు గానీ, అది భ్రమిస్తూ, అగ్నిపర్వతము మండుచూ, పూర్తిగా అది బ్రద్దలగుచున్నది. మరియు వాటిలో కొన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి, మరియు మనము ఎక్కడ జీవిస్తున్నాము అనగా, ఒక ఆపిల్ యొక్క పైతొక్క మీద జీవించిన్నట్లుగా జీవిస్తున్నాము. ఈ ప్రపంచము దాని యొక్క తొక్కవలె పైభాగాన ఉన్నదని విజ్ఞానము కూడా వాదిస్తున్నది. మరియు ఇది అన్నీ ... ఇప్పుడు, అక్కడ ఇరువై-అయిదు వేల మైళ్ళు చుట్టూ, అది సరిగ్గా ఎనిమిది వేల మైళ్ళు (అది సరాసరిగా ఎనిమిది వేల మైళ్ళు ఉండవచ్చును.) మందంగా ఉంది. మరియు దాని గురించి ఒకసారి, ఆలోచించుము, అక్కడ అది మండుచున్న ఒక అగ్నిపర్వతము.
మరియు భూమి యొక్క రెండు వంతులు, దానిలో మూడింట రెండు వంతులు నీటిలో ఉన్నది. మరియు మూడింట ఒక వంతు భూమి, ఒక వంతు మాత్రమే, మరియు ఒకసారి చూడండి, ఇది (భూమి) ప్రమాదకరమైన ప్రేలుడు పదార్థాలు, గ్యాస్, గాసోలిన్, నూనె, సమస్తముతో నింపబడినది. మనము దాని యొక్క పై పొర మీద నివసిస్తున్నాము. అది సరియేనా? మరియు దానీలో రెండు వంతులు, దానిలో రెండు వంతులు కంటే ఎక్కువ నీరు ఉన్నది. నీటి యొక్క సూత్రం (Formula) ఏమిటి? రెండు వంతుల హైడ్రోజన్ మరియు ఒక వంతు ఆక్సిజన్. మండే పదార్దములు.
శీతలం నుండి వేడిని వేరుపరచడానికి, ప్రతీ గదికి కావల్సినంత విద్యుచ్ఛక్తి అక్కడ ఉన్నది. మరియు అది ఒక గదిని బ్రద్దలు చేయగలిగే అంత విద్యుచ్ఛక్తి ని తయారు చేస్తుంది. మీరు ఒక గోల్ఫ్ బంతిలో సరిపడినంత పరమాణువులు నింపి, భూమి యొక్క ముఖభాగము నుండి నూయార్క్ ను ఎగరగొట్టివేయగలరు. మరియు అప్పుడు మనుష్యులు, పాతాళము యొక్క కుండలో కూర్చొని, వారంతటవారు రొమ్ము కొట్టుకొనుచూ, మరియు దేవుని వాక్యాన్ని ఒప్పుకొనుచూ మరియు “ఈ నరకము వంటి స్థలము మరెక్కడ లేదు,” అని చెప్పెదరు. (నేను దాని గురించి కొంత భాగాన్ని పొందియున్నాను. మనము వెళ్ళి దానిని పొందెదము, చూశారా) మీరు ప్రతీ రోజూ దాని యొక్క పెద్ద కుండ మీద కూర్చునియున్నారు. మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు సరిగ్గా దాని మీదనే కూర్చోనియున్నారు; మరియు నరకము సరిగ్గా మీక్రిందనే అడుగుభాగాన్నే ఉన్నది.
17
మరియు ఇప్పుడు, గమనించండి, కాని ఇప్పుడు అది మొదటిగా కనుగొనబడినప్పుడు అప్పుడు యేసు... ఇప్పుడు ఆవల ఉన్న ఆ చిన్న హేలో ను గమనించండి. ఇప్పుడు అది ఈ భూమి మీదకు కదలివచ్చి మరియు దానియొక్క పై భాగామున ఉండి, మరియు సూర్యుని దగ్గరగా ఇక్కడ అది కదులుట ప్రారంభించినది. అది ఏదో కాదు గాని, అది ఒక పెద్ద మంచు బంతి, మరియు అది కరుగుట. ప్రారంభించినప్పుడు, అప్పుడు ఆ అతి గొప్పమంచు దిబ్బలు కోయబడుట ప్రారంభించి ఉత్తరపు భూబాగములుగా ఏర్పడి మరియు క్రిందికి దిగి వచ్చెను. మరియు అలా కాన్సాస్ మరియు టెక్సాస్ గా అవి కోయబడ్డాయి. మరియు మిగిలిన ప్రదేశాలు ఏర్పడ్డాయి, మరియు మెక్సికో యొక్క గల్ఫ్ లోనికి కదలి వెళ్ళాయి. మరియు మొదట సమస్తము పూర్తిగా నీటితో నింపబడియండెను, అని మీకు తెలియునా.
అప్పుడు, ఇప్పుడు మనము దానిని ఆదికాండము 1లో కలిగియున్నాము. మనము ఇప్పుడు, బైబిల్ లో కలిగియున్నాము. మరియు బైబిల్ వద్ద మన దృశ్యాన్ని పెడదాము. ఆదికాండము 1, భూమి నిరాకారముగాను, శూన్యముగాను ఉండెను; మరియు నీరు అగాధజలముల పై కమ్మియుండెను.“ అది సరియేనా? ” దేవుని ఆత్మజలముల పైన అల్లాడుచుండెను.“ ఇప్పుడు, ఆయన నీటిని వేరుపరచి, పర్వతములను, మరియు భూములను, బయటకు తీసుకువచ్చి, దానిని ఎండిపోజేసెను. విత్తనములు నిచ్చు చెట్లలను మరియు సమస్తమును ఆయన చేసెను. మరియు ఆయన చంద్రుని చేసెను. మరియు సముద్రానికి ఆయన సరిహద్దులు నియమించెను, అది వాటిని దాటిరాదు.
18
ఆయన వాటినన్నింటిని కలసికట్టుగా చేసెను, అన్నీ సమస్త కార్యములను చేసెను. అన్ని జంతు జీవరాశులను, పక్షులను, తేనెటీగలను, కోతులను, మరియు అది ఏమైనప్పటికిని, వాటినన్నింటిని ఆయన ఈ భూమి మీద ఉంచెను, మరియు అప్పుడు ఆయన ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. “మనము చేయుదము” (ఎవరు? తండ్రి మరియు కుమారుడు) “మన స్వరూపమందు నరులను చేయుదము.”
ఇప్పుడు, ఒకవేళ నరుడు గనక ఆ చిన్న ఆవల ఉన్న వెలుగు వలె చేయబడినట్లయితే, లేక ఆ విధంగా చేయబడితే, అది ఎవరికిని కనిపించదు (అది ఆత్మీయ జీవి), ఆయన తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ ద్వారా తనంతట తాను త్రిత్వంలోనికి మారుతూ, ఇంకా కొంచెం ఎక్కువగా ఆయన తనంతట తాను బయలు పరచుకొంటున్నాడు లేక తెలియపరచుకొనుచున్నాడు. మరియు దేవుడు ఇక్కడ ఉండెను, ఇప్పుడు తనను తాను తెలియపరచుచున్నాడు, క్రిందికి దిగివచ్చి, “మనము నరుని చేయదము,” అది ఆయన యొక్క కుమారుడు. ఆయన నుండి వచ్చిన ఒక చీగురు “మన స్వరూపమందు నరుని చేయుదము.” ఆయన ఒక అతీతమైన జీవి “ మరియు పొలములోని పశువులన్నింటి మీద, సమస్తము మిగిలిన అన్నింటి మీద, అతనికి అధికారమిద్దాము.”
ఇప్పుడు, ఆ నరుడ్ని ఆ నరుడు ఏలుచున్నాడు ... నేటి దినమున ఒక నిజమైన, నిజవిశ్వాసిని పరిశుద్ధాత్మ ఏలుచున్నట్లుగా ఆ పశువులను మరియు సమస్తమును ఏలుచున్నాడు. అక్కడ దేవుని యొక్క స్వరము ఉన్నది... మానవుని యొక్క స్వరము కొంచెం ఎక్కువగా పలుకుచున్నది. మరియు చెప్పుచున్నది... ఈ మార్గములోనికి పశువులను పిలచుచున్నది, ఈ పచ్చికలోనికి గొర్రెలను పిలచుచున్నది. ఈ నీటిలోనికి చేపలను పిలచుచున్నది. చూశారా, అతనికి అధికారము ఉన్నది, ప్రతీది (సమస్తము) అతనికి లోబడుచున్నవి.
19
ఇప్పుడు, కాని అప్పుడు అక్కడ మంటితో చేయబడిన ఏ మానవుడు లేడు, ఆదికాండము 2, మంటితో చేయబడిన ఏ మనుష్యుడును లేడు. “మరియు అప్పుడు దేవుడు నరుని నిర్మించెను.” (ఆదికాండము 2:7) “నేల మంటి నుండి చేసెను.” ఇప్పుడు దానిని మనము అనుసరించెదము, ఆయన నేలమంటితో నరుని నిర్మించెను. మరియు ఈ అతీతమగు ఆత్మను (దానిలో) ఉంచెను.
ఇప్పుడు, అతడు అక్కడ పడియున్నాడు. నేను దాని గురించి చాలా దృశ్యములను కలిగియున్నాను. ఆదాము నిలబడి యుండుట నేను చూడగల్గుచున్నాను... ఈ మార్గములో మనము చూద్దాము, ఒక చెట్టు వలె నిలబడియుండుట చూడండి. దేవుడే అతనిని చేసెను. అతడు ఉండగలినంతగా చనిపోయినవాని వలె యున్నాడు; అతని యొక్క బొటన వేళ్ళు, వేర్ల వలె భూమిలో నాటబడియున్నవి. మరియు, దేవుడు చెప్పెను “అక్కడ ఉండును గాక,” లేక ఊదేను జీవవాయువు అతని లోనికి వచ్చెను, మరియు అతడు ఎగిరెను (దుమికెను) అతడు తనలోనికి వచ్చెను. అతడు ఒక ... జీవవాయువును అతనిలోనికి ఊదగా - నరుడు జీవాత్మ ఆయెను. ఇప్పుడు అతడు కదులుటకు ప్రారంభించెను, కదులుచున్నాడు.
20
మరియు, దేవుడు అతని ప్రక్కనుండి ఒక భాగాన్ని తీసి, ఒక ప్రక్కటెముకను మరియు ఒక స్త్రీని చేసెను. ఇప్పుడు, ఆ స్త్రీకి ఆత్మను, ఆయన ఎక్కడ నుండి తీసెను? చూశారా? అప్పుడు ఆయన... ఆదికాండము 1:26 ఆయన చెప్పెను. “మన స్వరూపమందు, మన సొంత పోలిక చొప్పున ఆయన వారిని (నరుని) స్త్రీ గాను, పురుషునిగాను , సృజించెను.” ఆయన పురుషుని కొరకు మోటైన, కరుకైన, ఆత్మను తయారు చేసెను; ఆయన స్త్రీ కొరకు మృదువైన, చిన్నదైన, సున్నితమైన, స్త్రీ తత్వపు ఆత్మను తయారు చేసెను.
మరియు ఒక స్త్రీ పురుషుని వలె నటించుట మీరు చూసినప్పుడు. ఆమె తన స్థానము నుండి బయటకు వచ్చియున్నది. మీరు చూశారా, ఆరంభంలోనే, చూశారా. మంచిది. ఆమె బదులుగా ... స్త్రీలు వారి యొక్క సున్నితమైన, స్త్రీ తత్వపు స్థానమును కోల్పోవుట అది ఒక సిగ్గుగా ఉన్నదని నేను ఆలోచిస్తున్నాను. అది ఒక అపకీర్తి. నేను చెప్పుచున్నాను, అది, మీకు తెలుసా, నేను ఇది చెప్పాలనుకొంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఇక్కడ ఉన్న స్త్రీ లైన మీ గురించి కాదు. కాని, ఒకవేళ అది మిమ్ములను బాదించవచ్చు. అది చేస్తుంది కాని, చూడండి, నేను కొంత మీకు చెప్పనివ్వండి, ఒక పరుషుడు వెళ్ళి వారితో మాట్లాడుచున్నప్పుడు స్త్రీ తత్వము కలిగిన స్త్రీలు సిగ్గుపడెదరు. ఉహు! ఎలాగైననూ, ఎటువంటి సిగ్గు? నేను అది చూసి చాలాకాలమైంది. కొంతమంది స్త్రీలు సిగ్గు పడినట్లయితే, అది ఏమిటో నాకు కొంచెము కూడా తెలియదు. ఎటువంటి మర్యాద వారు కలిగి లేరు, అక్కడ అంతా మంచి సీతత్వపు ఆత్మ ఉన్నది వారు కేవలం... వారు చేయగలరు... ఒక పురుషుని వలే వారు దుస్తులు ధరిస్తారు, ఒక పురుషుని వలె వారి యొక్క జుట్టును కత్తిరిస్తారు, ఒక పురుషునివలె పొగత్రాగుతారు, ఒక పురుషుని వలె మద్యం సేవిస్తారు, పురుషుని వలె అసహ్యమైన కార్యములు చేస్తారు, పురుషుని వలె ఓటు వేస్తారు ఒక పురుషుని వలె పని చేస్తారు వారు కరుకుగా కఠినముగా, తయారగుచున్నారు. ఓ, మై! నువ్వేది పొందుకున్నావో అది చూపిస్తుంది. ఖచ్చితంగా.
21
ఆ చిన్న స్త్రీ వలే, నీవు ఆమెను ఎక్కువగా చూడవు; ఆమెను కనుగొనుట చాలా కఠినమైన సంగతి. అది నిజము కాదా? అవును, అది సత్యము. అందుచేత, ఒక స్త్రీ పెద్దగా మరియు మోటుగా, పైకి నిలబడుటకు మరియు ఒక పురుషుని వలే నటించుటకు నిర్ణయించబడలేదు, ఎందుకనగా ఆమె మృదువైనది. ఆ దేవుడు ఆ విధముగా ఆమెను చేసాడు. లేఖనముల ద్వారా మీకు నేను నిరూపించగలను. అవునయ్యా, అది నిజము.
కాని, ఒకవేళ, ఈ ప్రశ్నను పొందుకున్నాము, కాని ఈ ప్రశ్న గురించి నేనింకా ఎక్కువ చెప్పగోరుట లేదు. కాని, చూడండి, అక్కడ, ఆయన తన మొదటి మనిషిని, తన స్వరూపమందు, సృజించెను.
22
మరియు, అప్పుడే, ఒక నక్షత్రము కూడా లేక ముందే, ఈ ప్రపంచము ఎలా ఉండబోతుందో, దేవునికి తెలుసు. మరియు విల్లియం బ్రెన్హాం అయిన నేను ఈ ప్రసంగ వేదిక నుండి సువార్త బోధిస్తానని, మరియు మీరును ఉండెదరని, జాన్ డోయీ అక్కడ కూర్చొని దీనిని వింటూ ఈ ప్రపంచము అనేది ప్రారంభము కాక ముందే ఆయనకు తెలుసు. హల్లేలూయ!
ఇప్పుడు, కొన్నిసార్లు అక్కడే — ఆ లీగలిస్ట్ లో, కాల్వినిస్ట్ లైన మీరు, అన్నింటిని కలగలుపు చేయుచున్నారు, చూశారా. “ముందే నిర్ణయించనబడినవారు ఎందుకు తప్పిపోవుచున్నారు?” అని వారు చెప్పెదరు. ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు. ఏ ఒక్కరూ నశించాలని ఆయన అనుకోవట్లేదు, కాని అయినప్పటికినీ, దేవుడు చేయుచున్నాడు, దానిని కొంతమంది అక్కడ అంగీకరించరని ఆయన ఎరుగును, చూశారా. చూడండి, దేవునిగా ఉండుటకు ఆది నుండి ముగింపు వరకూ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదా?
23
అలాగుననే కొంతమంది స్త్రీలను కలిగియుంటామని, అలాగుననే అక్కడ ఆయన వారి ఆత్మలను తయారుచేస్తాడని, ఆయన ఎరుగును. ఆయన చేసాడని బైబిల్ చెప్తుంది. ఆదికాండము 1:26, “ఆయన అతనిని నరుని సృజించెను,” (నరుడు, ముందుగానే), “స్త్రీగాను మరియు పురుషునిగాను చేసెను.” ఆమేన్. చూశారా, ముందుగానే, నేలమంటి నుండి వారిని బయటకు తీయకముందే, ఆయన వారిని స్త్రీగానూ మరియు పురుషునిగానూ చేసెను.
మరియు అప్పుడు దేవుడు నరుని చేసెను, ఆయన స్వరూపమందు కాదు. ఈ శరీరము దేవుని యొక్క స్వరూపములో లేవు; ఈ శరీరములు జంతువులు (మృగముల) యొక్క స్వరూపమై యున్నది.
24
(నేను నా కోటును తీసివేయవచ్చా? ఇక్కడ చాలా వేడి పెరిగిపోతున్నది. నేను దాని మీద ఒక నలిగిన చొక్కాను వేసుకున్నాను, కాని మీరు దానిని గమనించలేరు, ఎందుకనగా అది కేవలం... జెస్సీ ఇస్త్రీ చేయడానికి వచ్చియుండలేదు, అందుచేత... కాని, చూడండి, ప్రసంగవేదిక మీద ఒక నలిగిన చొక్కా కంటే ఎక్కువ అర్ధాన్ని కలిగి ఉన్న ఒక అంశం మీద మనము ఉన్నాము. అది కాదా? దాని అర్ధం నిత్యజీవం.)
25
ఇప్పుడు, నరుని గమనించండి. దేవునికి ఆదిలోనే ఆయన పురుషుని మరియు స్త్రీని కలియుంటాడని తెలుసు, మరియు ఇక్కడ ఒక రక్షకుడు ఉంటాడనీ, మరియు ఆయన యేసును తీసుకువచ్చునని మరియు ఆయన సిలువ వేయబడతాడని, ఆయన ఎరుగును, మరియు యేసు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే వారిని ఎరుగుదును, అని చెప్పెను, ఈ ప్రపంచము అనేది ఉనికిలోనికి రాకమునుపే.
మరియు దేవుడు చెప్పెను, లేక పౌలు కూడా ఆయన మనలను జగత్తుకు పునాది వేయబడక మునుపే ఏర్పరచుకొనెను, అని గలతీయులకు వ్రాసిన పత్రికలో చెప్పుచున్నాడు. దాని గూర్చి ఆలోచించండి! ఆ దేవుడు... మీరెవరైననూ, ఆ లేఖనము ఎక్కడ చెప్పబడిందో వినుటకు ఇష్టపడుతున్నారా, మీ చేతులను పైకి ఎత్తుడి. అది ప్రశ్నతో పాటుగా కొనసాగుతున్నది. నాతో పాటు గలతీయులకు వ్రాసిన పత్రికను తీయండి, మొదటి అధ్యాయము, ఇక్కడ వినండి. నా అర్ధం గలతీయులకు కాదు, నా అర్ధం ఎఫెసీయులకు, దేవుడు ఏమి చెప్పెనో జాగ్రత్త గా వినండి, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1:
దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో నున్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది.
మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు, మీకు కృపయు సమాధానమును కలుగును గాక.
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయములో ఆత్మసంబంధమైన ప్రతీ ఆశ్వీర్వాదములను మనకనుగ్రహించెను:
ఇప్పుడు, అది ఇక్కడ ఉన్నది, గమనించండి:
జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయనలో మనలను ఎన్నుకొనెను... (హు!)
అది చాలా మంచిగా ఉన్నది కాదా? అది చాలా మంచిగా కాదు, అది నిజముగా ఎంతో మంచిగా ఉన్నది. జగత్తుకు పునాది వేయబడక మునుపే, దేవుడు ఆర్మన్ నెవిల్ ను ఎరుగును మరియు ఆతడు సువార్త భోదిస్తాడు అని ఆయన ఎరుగును. అది అద్బుతముగా లేదా? ఎన్నుకొనెను. అతడు ఎందుకు ఆ సంఘములో సభ్యుడైయున్నాడు, మరియు అతడు ఆ సంఘమునకు వెళ్ళునని దేవుడు ఎరుగును. మరియు అతడు చెప్పెను, ఎఫెస్సీ సంఘముతో పౌలు మాట్లాడుతున్నాడు. “ఆయనలో మనలను ఎన్నుకొనెను.” ఇప్పుడు మనమందరము క్రీస్తు శరీరములో సభ్యులైయున్నాము. అది సరియేనా? మరియు దేవుడు, జగత్తుకు పునాది వేయబడకమునుపే, నిన్ను, నన్ను ఆయనలో ఎన్నుకొనెను, జగత్తుకు పునాది వేయబడక ముందే హు! మై! అది అద్భుతముగా లేదా?
26
ఇప్పుడు, ఆ మొదటి మనిషి... ఇప్పుడు, ఆయన మొదటి మనిషిని ఆయన స్వరూపమందు చేసెను, మరియు మనము తిరిగి ఆ స్వరూపమునకు వెళ్ళచున్నాము. (అది నిజము), మనయొక్క సృజింపబడిన మొదటి స్వరూపమునకు.
దేవుడు నన్ను విలియం బ్రెన్హాంగా సృజించినప్పుడు, నేను జగత్తుకు పునాది వేయబడకముందే ఉన్నాను, ఆయన నా జీవమును, నా ఆత్మను సృజించెను. దాని గురించి ఏదియునూ నాకు తెలిసినంతలో జ్ఞాపకము లేదు, కాని నేను అక్కడ ఉన్నాను. ఓ, మీరు దానిని పొందుకొనుచున్నారు అని నేను అనుకోవట్లేదు. కాని ఇప్పుడు, ఒక్క నిమిషము, యేసు శిష్యులతో ఆయన, “వారిని జగత్తుకు పునాది వేయబడకముందే ఎరుగుదును,” అని చెప్పెను. మరియు పౌలు ఇక్కడ ఈ ప్రపంచము ప్రారంభము కాకముందే ఆయనలో మనలను ఎన్నుకొనెను,“ అని చెప్పెను. ఇప్పుడు, అక్కడ నాలో కొంతభాగము, ఆర్మన్ నెవిల్, మరియు ఇక్కడ ఉన్న మీరందరూ, ప్రపంచము ప్రారంభము కాక మునుపే క్రీస్తు యేసులో ఉన్నారు. మరియు దాని గురించి ఇక్కడ నా యొక్క వివరణ ఉన్నది. ఈ దినమున ఉన్న ప్రజలు ఈ ఆత్మతో లేక ఆత్మగా స్వాధీనపరచబడి యున్నారని నేను తలచుచున్నాను. దేవుని వైపుకు తిరుగునటువంటి ఆత్మలు, ఈ దేవదూతలు యొక్క శేషం, అది ప్రారంభములో ఎన్నడూ పడిపోలేదు మరియు పరలోకములో దెయ్యము యొక్క అబద్ధాన్ని వ్యతిరేకించాయి.
27
మూడింట రెండు వంతుల దేవదూతలు బయటకు తన్నివేయబడినట్లుగానే, మరియు భూమి యొక్క మూడింట రెండు వంతులు పాపములో ఉన్నది. మరియు దానికంటే ఎక్కువ ఉన్నది. మరియు ఈ దెయ్యపు ఆత్మలు ప్రజలలోనికి వచ్చి మరియు వారి శరీరములను నివాసముగా మార్చుకొన్నాయి. నా యొక్క అర్ధము ఏమిటో చూశారా? అవి ఒకప్పుటి దెయ్యాలు... అవి ఒకప్పుడు నెట్టివేయబడి మరియు అవి ప్రజలలోనికి వచ్చి మరియు వారికి అవి ఒక స్వభావాన్ని ఇచ్చుచున్నవి. యేసు మగ్దలేనే మరియలో నుండి వాటిలోని ఏడింటిని బయటకు వెళ్ళగొట్టాడు: గర్వము, డంబములు చెప్పుకొనుట, (పెద్దవారైన పజలు, మీరు చూశారా) అపవిత్రత, అసహ్యత, నీచతత్వము, ఒకనితో సమానము కావాలని లేదా ఒకనిని మించి హెచ్చాలని చేసే పోటీతత్వము, కలహము. ఈ అన్ని కార్యములు చూశారా?
దేవుడు ప్రారంభములో మానవుడిని తన స్వరూపమందు తయారు చేస్తున్నప్పుడు వెనుక అక్కడ ఉన్నటువంటి ఆత్మలు అవి. అటువంటి అతీతమైన జీవులను, ఆ ఆత్మలను సృజించెను.
28
మరియు, అప్పుడు ఆయన నేలమంటితో నరుని ఉంచాడు, అది మొదటి వ్యక్తి అయిన ఆదాము, మరియు ఆ నరుడు మరొక స్వరూపమందు తయారు చేయబడ్డాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మానవుడైన నరుడు ఒక జంతువు యొక్క స్వరూపమందు తయారు చేయబడ్డాడు. ఈ మానవ శరీరములు జంతువు యొక్క స్వరూపమందు తయారు చేయబడ్డాడు.
మనము ఒక కోతి వలె చేతులు కలియున్నాము, మరియు, ఒక ఎలుగుబంటి వలె పాదములు కలిగియున్నాము. ఒక చిన్న ఎలుగుబంటి పిల్లను తీసుకొని, దాని పైతోలును క్రిందకు తీయండి, దాని యొక్క చర్మమును లాగివేయండి మరియు చిన్న బాలికను పైకి పెట్టండి మరియు వ్యత్యాసమును గమనించండి, హు! సహోదరుడా, నీవు రెండింటినీ ఖచ్చితంగా ఒకేలా చూస్తావు. ఆ పూర్తి స్నాయువు, విభాజకము, ఆ నిర్మాణమంతా దరిదాపుగా ఒకేలా చేయబడ్డాయి. ఆ మార్గములోనే దాని రూపము మరియు సమస్తము ఖచ్చితంగా అలానే చేయబడింది. అది జంతు జీవము యొక్క స్వరూపములో ఉన్నది, ఎందుకనగా అతడు ఆ జంతు క్రమములోనే తయూరు చేయబడ్డాడు, ఎందుకనగా ఆ జంతువును ఏలుటయే అతని విధి.
29
మరియు మీరు ఒక మనిషిలో నుండి పరిశుద్ధాత్మను తీసివేసినట్లయితే, అతడు ఒక జంతువు కంటే తక్కువవానిగా ఉంటాడు, అతడు జంతువు కంటే చెడ్డవానిగా ఉంటాడు. అది చెప్పటానికి చాలా కఠినమైన విషయం. కాని అతని యొక్క ఆలోచనలను మార్చే పరిశుద్ధాత్మ లేనటువంటి, అతని మనస్సులో జన్మించనటువంటి ఒక మనిషిని మీరు తీసుకొన్నట్లయితే, మరియు మరియు అతని కార్యములు, ఏ విధముగా ఉంటాయంటే, అతడు తల్లియొక్క చేతులలో నుండి బిడ్డను విసిరివేసి మరియు అతని క్రూరత్వపు శరీరేచ్ఛల కొరకు, ఆమెను లాగుకొని పోతాడు. అది ఖచ్చితంగా.
ఒక స్త్రీ అంత మంచిగా లేదు, మీరు ముసలిదైన తల్లి పందిని లేక ముసలిదైన కుక్కను తీసుకొనండి, (మనము దానికి అన్ని రకములైన పేర్లను పెట్టెదము), కాని దాని ధర్మము దాని యొక్క కుక్క పిల్లలకు మాత్రమే, మరియు పంది దానియొక్క పంది పిల్లలకు మాత్రమే, కాని అలంకరించబడిన, మంచితనము లేని స్త్రీ మాత్రము... ఎప్పుడూ అన్యహముగా ఉంటుంది. అది నిజము. అందుచేత, గుర్తించుకొనండి, క్రీస్తు లేనియెడల మీ నైతిక విలువ ఒక కుక్కలకంటే, కూడా నీచముగా ఉండగలవు. అది నిజము.
ఏ ఇతర జంతువులు, కుక్క తనను తాను కప్పుకొనడానికి వస్త్రములు ధరించవు. పతనమయ్యింది మనిషి, జంతుజీవము కాదు. కాని, ఒక (మానవుని జీవితము) క్రింద, జంతుజీవితము ఉన్నది, మానవుడే వాటికి ప్రధాన నాయకుడుగా, మార్గదర్శకునిగా, ఉండులాగున చేయబడ్డాయి. మరియు పొలములోని ప్రతీ జంతువు మనిషికి భయపడును.
కొన్నిసార్లు, కొంతమంది వేట గురించి నన్నిలా అడిగారు, నీవు దానిగురించి భయపడవా? ఎందుకు, ప్రతీ జంతువు మనిషికి భయపడేలా సృజింపబడినది. ఎందుకనగా, ఆ వెనుక ఆది నుండి అలాగునే యున్నది, చూశారా. ఖచ్చితంగా, మీరు పరిగెత్తండి మరియు అది కూడా నీ వెనుక పరిగెడుతుంది, (అది నిజము), లేక ఆ కుక్క, లేక మీరు కోరునది ఏదైననూ. అది నిజము.
30
కాని ఇప్పుడు గమనించండి, ఆయన ఇక్కడ క్రిందికి దిగివచ్చినప్పుడు ఆ మనిషి... ఇప్పుడు చూడండి, ఇక్కడ. “ఇప్పుడు, సహోదరుడా బ్రెన్హాం, దాని గురించి ఏమిటి?” అని మీరడగవచ్చును.
ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడే దేవుని పొందగలరు, ఏకత్వము మరియు త్రిత్వము మధ్యనే ఖచ్చితంగా సరిగ్గా అక్కడే మీరు పొందుకొనెదరు, ఇప్పుడు చూడండి! దేవుడు క్రిందికి దిగివచ్చినప్పుడు, ఆయన తనంతట తాను మార్చుకొన్నాడు, ఈ మానవుని వద్దకు రాగలిగేంత దీనుడిగా ఆయన తనను తాను మార్చుకొన్నాడు. ఇప్పుడు, నరుడు అతని యొక్క ఆత్మతో పాపము చేయలేదు, కాని శరీరేచ్చలు, కామోద్రేకాలు, కలిగిన అతని శరీరంతోనే, అప్పుడు అతడు పాపం చేసినప్పుడు, అతని యొక్క సృష్టికర్త నుండి తనంతటతాను వేరుచేయబడ్డాడు. మరియు అప్పుడు దేవుడు, ఆ లోగోస్, ఆ గొప్ప సృష్టికర్త , క్రిందికి దిగి వచ్చెను. మరియు మానవ స్వరూపంలో చేయబడెను. మానవుడు దేవుని యొక్క స్వరూపమందు చేయబడ్డాడు మరియు అప్పుడు అతడు జంతు స్వరూపమందు చేయబడి, అతడు పతనమయ్యాడు, మరియు క్రీస్తు యేసు అను నరునిలో శిక్షను అనుభవించడానికి, మానవ స్వరూపంలో దేవుడు క్రిందికి దిగివచ్చాడు. దేవుడు ఆత్మలో బాధను అనుభవించలేదు. భౌతీకసంబంధమైన బాధను ఆయన ఆత్మలో ఎలా అనుభవించగలడు? ఆయన దానిని చేయలేడు. అందును బట్టి, దేవుడు తనంతట తాను మార్చుకొని మరియు మానవ స్వరూపంలో చేయబడి, పతనమయినటువంటి మానవుని విమోచించెను, చూశారా.
మరియు అప్పుడు దేవుడు శరీరమందు శ్రమపడ్డాడు. I తిమోతీ 3:16 “నిరాక్షేపముగా,” అది వాదించుటైయున్నది. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. దేవదూతలకు కనబడెను, ప్రకటింపబడెను, సిలువ వేయబడెను, మరియు నమ్మబడెను, మరియు దేవుని యొక్క కుడి పార్శ్వమునకు చేర్చబడెను.“ అది సరియేనా? దేవుడు తనంతట తాను క్రిందికి దిగి వచ్చి, మరియు ఒక మానవ శరీరంలో నివసించి, మరియు శ్రమననుభవించెను. ”దేవుడు క్రీస్తులో నివసించుచూ, తనంతటతాను, లోకముతో సమాధానపరచుకొనుచుండెను.“ అది ఎటువంటి ప్రేమో చూశారా? దేవుని ప్రేమ!
31
ఇప్పుడు, ఇప్పుడు, పురుషుడు మరియు స్త్రీ గూర్చి పొందుకొన్నారు నేను తలంచుచున్నాను. ఇప్పుడు ఒక స్త్రీ ... ఇప్పుడు నేను దీనిని సరిగ్గా మంచిగా పొందుకొననిమ్ము, అప్పుడు మీరు చూడగలరు, చూశారా స్త్రీ తన యొక్క భర్తకు లోబడవలసియున్నది, మరియు “పురుషుడు తనయొక్క భార్యను ఏలవలెను” అని బైబిల్ చెప్పుచున్నది. కాని వారు దీనిని ఎలా మార్చివేసారు! పురుషుని మీద స్త్రీ అధికారం చెలాయిస్తుంది. “ఇప్పుడు, జాన్! నీవు ఇంటి వద్దే ఉండు, నీవు వెళ్ళకూడదు!” మరియు అది సరిపోతుంది. “అలాగే నా ప్రియమైన దానా” చూశారా?
కాని మిష్టర్ (అయ్యా నేను నీకు కొంత చెప్పనివ్వుము. నీభార్య గురించి నీవే సమాధానము చెప్పుకోవాలి, అంతే కాని, నీ గురించి నీ భార్య సమాధానము చెప్పదు. నీవు స్త్రీకి శిరస్సైయున్నావు, మరియు దేవుడు పురుషునికి శిరసై యున్నాడు అందుచేతనే ఆయన చెప్పెను, “పురుషుడు క్రీస్తును బట్టి తన తలవెండ్రుకలు కత్తిరించుకోవాలి, మరియు స్త్రీ తన తలవెండ్రుకలు ఉంచుకోవాలి, ఆమె తన తలవెండ్రుకలు కత్తిరించినట్లయితే, ఆమె తన భర్తను అవమానపరుచుచున్నది.” చూశారా లేఖనములు చెప్పుచున్నదాని బట్టి నా భావమేమిటో మీరు చూశారా?
32
ఆ క్రింద నున్న శ్రివ్-పోర్ట్ లో ఒక రోజు దాని గురించి ఒక కఠినమైన దానిని కలిగియున్నాను, వారు స్త్రీ గురించి , మరియుస్త్రీ పొడవైన జుట్టును ధరించాలి, అని మాట్లాడుకొనుచున్నారు. “మరియు ఒక స్త్రీ తన యొక్క తలవెంట్రుకలను కత్తిరించినట్లయితే, ఆమెకు విడాకులు ఇచ్చే హక్కు మరియు, ఒక బైబిల్ అధికారం ఆమె భర్తకు ఉన్నది,” అని నేను చెప్పాను. అది నిజము. బైబిల్ అలాగునే చెప్పుచున్నది. అది ఖచ్చితంగా సరైనది. ఓ, మై! ఆ మార్గములోనే భోదించబడినటువంటి, పరిశుద్ధాత్మ పొందిన స్త్రీలు అక్కడ కూర్చోనియున్నారు. వారికి నేర్పించిన విధముగానే, అది అంతే, చూశారా. అవును, అది వదులుగా విడిచిపెట్టబడినది.
ఆయన చెప్పెను, “వారు దానిని కత్తిరించినట్లయితే, అక్కడేదో కొంత పొరపాటు ఉన్నట్లయితే, వారు తమ వెంట్రుకలను కత్తిరిస్తారు,” చెప్పెను, “వారు ఒక క్షౌరపు కత్తి తీసుకొని, ఉన్నదంతా క్షౌరము చేయించుకొని, మరియు నిజముగా, వారి వెంట్రుకలు సౌమ్యముగా చేసుకొననిమ్ము.” నీవు అలాగున చేయుట మంచిది. అది నిజము. లేఖనము అలాగునే చెప్పుచున్నది. మరియు అది చెప్పుచున్నది. “ఆమె తన తలవెంట్రుకలు కత్తిరించినట్లయితే, ఆమె తన భర్తను అవమానపరుచుచున్నది.” మరియు ఒక స్త్రీ ఆ విధంగా అవమానపరిచినట్లయితే, విడాకులు పొంది దూరం కాబడడానికి ఒక న్యాయపరమైన హక్కు కలదు.“ ”కాని, ఇప్పుడు అతడు తిరిగి (ఆమెను) వివాహము చేసికొనకూడదు. కాని అతడు ఆమెను విడాకుల ద్వారా దూరపరచవచ్చును. అది నిజము. అది లేఖనము. ఓ సహోదరుడా, మనకు కొన్ని ప్రశ్నల గురించిన రాత్రులు అవసరమైయున్నది. అది నిజము. మీరు గనక చదవాలన్నట్లయతే ఆది, I కోరింథీయులకు వ్రాసిన ప్రతిక, 14వ అధ్యాయము. ఇప్పుడు ఈ స్త్రీ...
33
దేవుడు నరుని సృజించెను, స్త్రీ గాను మరియు పురుషుని గాను సృజించెను; ఆయన ఏమి చేసెనో మీరు చూశారా? “ఆయన నరుని చేసెను. ఇప్పుడు, అదే మొదటి ప్రశ్న, చూశారా: ”ఆయన వారిని సృజించెను,“ మరియు మొదలగునవి: ఆదికాండము 1:26. ఆదికాండము: 2:7: ”ఆయన నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదెను.“
ప్రశ్న: వ్యత్యాసము ఏమిటి, లేక పై లేఖనానికి సంబంధం ఎక్కడ ఉన్నది? మొదటి మనిషికి రెండవ మనిషితో ఉన్న సంబంధము ఏమిటి?
అయిదు జ్ఞానేంద్రియములు ద్వారా ప్రత్యక్షపరచబడిన రెండవ మనిషే ఆ మొదటి మనిషై యున్నాడు, చూశారా. మీరు ఆ విధముగా మీ హస్తములతో దేవునిని తాకలేరు; మీ నేత్రములతో దేవునిని చూడలేరు. మీరు ఆ విధంగా చేయుటకు దేపుడు దానిని మీకు అనుగ్రహించలేదు.
34
ఒకానొక వృద్ధ పరిశుద్దుడు చనిపోయినప్పుడు, “వారి తల్లిని కొన్ని సంవత్సరములుగా నేను చూడలేదా?” అని వారు చెప్పినప్పుడు, మీరెప్పడైనా విన్నారా, ప్రజలు అలా చెప్పినప్పుడు మీరు విన్నారా...? చూశారా, అది ఏమిటి, ఈ నేత్రములు క్షయమైపోయి మరియు సహజతీతమైన నేత్రములు అమర్చబడుచున్నాయి, చూశారా. మరియు అప్పుడు కొన్నిసార్లు మనవలె... దేవుడు అలా చేసినట్లయితే సహజమైన నేత్రములు, క్షయమై పోయినప్పుడు మనము దర్శనములు చూస్తాము సరిగ్గా తిన్నగా చూచుచుండగా, మరియు దర్శనము మనముందు దేవుని యొక్క సహజతీతమైన కార్యములను చూపిస్తుంది. నా భావమేమిటో చూశారా?
కావున అప్పుడు, చూడండి, “అప్పుడు భూమి మీద నున్న ఈ గుడారము ఇక్కడ...” ఇప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి మీలో కొందరైనా పురుషులు మరియు స్త్రీలు వృద్ధులగుచున్నారు. చూడండి. “ఈ భూసంబంధమైన ...” అక్కడున్న తొంబది-రెండు సంవత్సరాలు కలిగిన తండ్రి గురించి నేను ఆలోచించుచున్నాను. “భూమి మీద నున్న ఈ గుడారము శిధిలమైపోయిననూ, నశించని ఒక ఆత్మీయ మనుష్యుడు, ఒక ఆత్మీయ శరీరము మన కొరకు అక్కడ ఎదురు చూచుచున్నది.” నేను నిన్ను అక్కడ చూచెదను. నేను అక్కడకు నడిచెదను...
35
అక్కడ నేను సహోదరుడు నెవిల్ ను తాకలేను, ఎందుకనగా యోహాను వారిని చూచెను, మరియు వారు బలిపీఠము క్రిందనున్న ఆత్మలు, మొర్రపెట్టుచున్నారు, “ఈ ఎంతకాలము ప్రభువా, ఇంకెంత కాలము?” ఎందుకో మీకు తెలుయునా, మనము ప్రత్యక్షత గుండా వెళ్ళుచున్నాము. క్షయమైన శరీరములతో వస్త్రములు ధరింపబడినవారై మరియు, వారు అక్కడ నుండి తిరిగి వచ్చుటకు ఆశపడుచున్నారు. “ఎంతకాలము ప్రభువా?” అని వారు మొర్రపెట్టుచున్నారు
ఇప్పుడు, వారు ఒకరినొకరిని ఎరుగుదురు , కాని వారు మట్లాడుకోలేరు మరియు కరచాలనము చేసుకోలేరు, లేక నేను అడుగుచున్నాను... వారు మాట్లాడుకోగలరు, కాని వారు కరచాలనము చేసుకోలేరు మరియు అలాగునే అన్నీ.
దానిని రుజువు చేయడానికి ఇక్కడ ఒక సాదృశ్యం ఉన్నది, ఎన్దోరు మంత్రగత్తె సమూయేలు యొక్క ఆత్మను పైకి పిలిచినప్పుడు, మరియు సౌలు అతనిని చూచాడు, మరియు అతడు సమూయేలు అని గుర్తుపట్టాడు. మరియు సమూయేలు సౌలును గుర్తించి, “నా విశ్రాంతిలో నుండి నన్నెందుకు పిలిచితివి, నీవు దేవునికి శత్రువైతివి, మరియు దేవుడు నిన్ను ఎడబాసెను అని చూచుచున్నాను?” అది సరియేనా? మరియు ముసలివాడైన సమూయేలు అతని ప్రవక్త యొక్క దుప్పటితో అక్కడ నిలబడి యున్నాడు, మరియు అతని వైపు చూసాడు.
ఆ మంత్రగత్తె అతనిని చూచి మరియు నేలమీద పడి, “దేవతలు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచున్నాను,” అని అరచెను.
అతడు “నీవు నన్నెందుకు తొందర పెట్టితివి?” అని అడిగెను.
అతడు, “మంచిది, యుద్దము ఎలా జరుగుతున్నదో నేను తెలుసుకోవాల అనుకొంటున్నాను,” అని అడిగెను.
“రేపు నీవు యుద్ధములో చనిపోవుదువు, మరియు నీ కుమారులును చనిపోవుదురు మరియు ఇదే సమయానికి రేపు రాత్రి నీవు నాతో కూడ ఉందువు,” చూశారా. ఇప్పుడు, అతడు ఆలోచన బుద్ధితోనే ఉన్నాడు. మరియు అతడు (సమూయేలు) భూమి మీద ఉన్నప్పుడు, ఎలా ఉండెనో అలానే అతడు (సౌలు) అతనిని చూశాడు, ఆ మంత్రగత్తె మరియు సౌలు, నిలబడి అతనిని చూచియున్నారు.
36
ఇప్పుడు గమనించండి. చాలా సార్లు... తండ్రి మరియు తల్లి గురించి ఏమిటి వారు చనిపోయినప్పుడు, అక్కడ నిలబడి, వారి ప్రియమైనవారిని చూస్తారు? వారు వారిని గుర్తించారు. కాని అది సహజతీతమైన శరీరము.
కాని ఇప్పుడు ఆ మహిమకరమైన భాగము ఇక్కడ ఉన్నది. యేసు పునరుత్థానమందు తిరిగి లేచినప్పుడు, అది శరీరము కాదు. ఆ శరీరము అప్పుడు, అది ఆదిలో దేవుడు సృజించినటువంటి సహజతీతమమైన జీవము అది, మరొక శరీరాన్ని పొందటానికి, అది భూమి మీదకు వచ్చును. అది స్త్రీ ద్వారా జన్మింపబడినది కాదు, కాని అది దేవుని చేత సృజింపబడినది. (హల్లేలూయ!) ఎన్నడూ పాతగిల్లనది, లేక ముడతలు లేనటువంటిది, నీ శిరస్సు మీద ముసలి వెంట్రుకలు లేనిది. ఎన్నటికిని, పరిపూర్ణమైనది! హల్లేలూయ! ఓ, సహోదరుడా, అది నిన్ను ఈ వేడి రాత్రియందు అరచులాగున చేయుచున్నది. అది నిజము! ఓ, ఈ మాంసపు వస్త్రమును నేను విడిచిపెడ్తాను, మరియు తిరిగి లేచి మరియు అశాశ్వతమైన బహుమానాన్ని చేజిక్కించుకొంటాను! మనము ఈ లోకములో దేనిగురించి దిగులుచెందాలి?
37
ఆదిలో దేవుడు నన్నెలా సృజించాడో, ఆ పూర్తి ప్రణాలిక అక్కడ పడియున్నది. నేను ఈ భూమి మీదకు దిగివచ్చి, ఒక సువార్త బోధకునిగా నేను నా స్థానాన్ని తీసుకొన్నాను. పురుషుని లేక స్త్రీగా మీరు రక్షణ పొంది, అప్పుడు దేవుని కృప ద్వారా మీరు జీవితాన్ని జీవించుచున్నారు. హల్లేలూయ! మరియు అదే ఆత్మ, అక్కడ వెనుక ఆదిలో ఉన్నటువంటి అదే ఆత్మ ఇక్కడ విడిచిపెడుతుంది. నేను ఇక్కడ ఉంటుండగా నేను వెనుకకు తెలుసుకొనే జ్ఞాపకమునకు వెళ్ళెదను, (హల్లెలూయ!) మరియు అప్పుడు అక్కడ బలిపీఠము క్రింద ఎదురు చూచెదను, విశ్రాంతిలో నిత్యము ఆశీర్వాదించబడెదను. మరియు అప్పుడు తిరిగి వచ్చినప్పుడు మరణము ఎన్నడూ తాకనటువంటి నేను అత్యున్నతమైన శరీరమును పొందెదను.
ఇరువది-రెండు లేక ఇరువది-మూడు సంవత్సరములకే, నిన్ను మరణము తాకుచున్నది. నీవు పడిపోవుట ప్రారంభిస్తావు. ఇంకెంత మాత్రము నీవు ఉపయోగపడే పురుషునివి కావు, ఉపయోగపడే స్త్రీవి కావు, తరువాత నీకు ఇరువది-ఐదు సంవత్సరములు వచ్చే సరికి, ఒకానొక స్థితిలో ఉంటావు, ముడతలు నీ కళ్ళ క్రింద రావడం ప్రారంభిస్తాయి. నీకు ఉపయోగపడేంతగా నీవు శుభ్రము చేయలేపు, ముప్పది సంవత్సరాలు, అది ఒక పూర్తి మొత్తము అని నీవు గమనించగలగాలి. నీకు నలుబది-నాలుగు సంవత్సరములు వచ్చే వరుకూ, ఆగుము, నావలనే ఉండెదవు, మరియు అప్పుడు నీవు నిజముగా దానిని గమనించెదవు. కాని, ఓ సహోదరుడా! నాకు ఎనబై, తొంబై వచ్చేవరుకు ఎదురు చూడండి. మరియు చేతి కర్రతో, నేను అక్కడ నిలబడి యుంటాను. అది ఏమిటి? ఒక పందెపు రంగంలో పరిగెత్తుటకు దేవుడు అతనిని పెడుతున్నాడు. కాని ఒకానొక మహిమకరమైన దినమున... ఆ మరణము దాని స్థానాన్ని తీసుకొనును.
38
ఒకానొకప్పుడు నిటారైన భుజములు కలిగి, నల్లని వెండ్రుకలు కలిగి (మరియు పూర్తిగా తల అంతా), మరియు నా కళ్ళ క్రింద ఎటువంటి ముడతలు ఉండేవి కావు; మరియు ఇప్పుడు నన్ను చూడండి, క్రిందికి వంగిపోయాను, భజములు వంగిపోయాయి, లావుగా తయారయ్యాను, మరియు కళ్ళ క్రింద ముడతలు, బట్టతల ఉంది. ఎందుకు గత ఇరువది సంవత్సరముల నుండి మరణము ఏమి చేయుచున్నది. చూడండి, మరణమే దానిని చేయుచున్నది. నాకు ఎనభై వచ్చే వరుకు ఆగండి, దేవుడు నన్ను జీవింపచేసినట్లయితే, మరియు చూడండి నేను ఏ విధంగా ఉంటానో. ఒక పాత చేతి కర్ర మీద ఆ విధముగా నిలబడి, ఎక్కడొకచోట వణుకుచూ కనిపిస్తాను. కాని, (హల్లెలూయా!) ఒకానొక మహిమకరమైన దినమున మరణము దాని పూర్తి సుంకాన్ని తీసుకొంటున్నది. అప్పుడు నేను పునరుత్థానములో లేచినప్పుడు, నేను ఏ విధంగా ఉండెదను, ఇక్కడ ఈ భూమి మీద నా కొరకు ఏదైతే చేసానో, దాని యొక్క నా అతి శ్రేష్ఠమైనదానిలో, మిసెస్. బ్రెన్హాం మరియు మిష్టర్. బ్రెన్హాంలతో తయారు కాని, తనంతట తాను దేవుడే సృజించినటువంటి శరీరంలో ఉండెదను; బాధల నుండి విడుదల, పాపము నుండి విడుదల, అది ఏమైనప్పటికిని దాని నుండి విడుదల, ఎన్నడూ ఎటువంటి వ్యాధి, గుండెపోటు ఉండదు. ఓ, మై!
అప్పుడు నా చిన్న భార్య యొక్క చేతులు పట్టుకొని, మరియు కొత్తగా దేవుని యొక్క పరదైసులో ఆ విధంగా నడచి వెళ్ళెదను, మీరు కూడా అలానే చేస్తారు. ఈ రాత్రి నీవు ఏలుచున్న, నీ భార్యగా నీవు పిలుచుచున్న, ఆ ముసలి వెండ్రుకలు కలిగిన స్త్రీ కాదు, కాని ఈ బలిపీఠము వద్ద నీవు వివాహము చేసుకొన్నప్పుటి వలెనే ఆ అందమైన స్త్రీ వలెనే ఆమె ఉండును. హల్లెలూయ! వ్యూ! అది వ్యక్తిని అరచేటట్లు చేయుచున్నది. కాదా?
39
మంచిది. అదే ఆ సంబంధము. దేవుడు దానిని నిర్ణయించాడు. దేవుడు ఏదైనా చేయుటకు, తన మనస్సులో ఆయన రూపొందించినప్పుడు, అది జరగవల్సిందే. సాతాను లైంగిక వాంఛ ద్వారా ఒక స్త్రీ ద్వారా ముందుగా పిల్లలను తీసుకొని వచ్చుటను బట్టి, ఈ చిత్రాన్ని చెరిపివేసాడు. అతడు దానిని చెడగొట్టాడు. కాని దానితో ముందుగా వెళ్ళుము. అది మంచిది. ఈ నివాసము తీసివేయబడవలసియున్నది, ఎందుకనగా నీవు ఎలా ఉన్నావో, నీ నిర్మాణము మరియు స్వరూపము ద్వారానే నీవు ఈ జీవితములో ఉన్నావు. ఇప్పుడు నీవు ఎరుపైన వెంట్రుకలు కలిగి యున్నట్లయితే, అప్పుడు నీవు ఎరుపైన వెంట్రుకలనే కలిగి ఉందువు. ఇప్పుడు నీవు నల్లని వెంట్రుకలు కలిగియున్నట్లయితే, అప్పుడు నల్లని వెంట్రుకలనే కలిగియుందువు. చూశారా, నీ యొక్క అతి శ్రేష్ఠమైనవాడిగా నీవుందువు. ఆ చిత్రాన్ని సాతాను అనువదించెను. నీ కొరకు దేవుని ఉద్దేశ్యము ఎలా ఉన్నదో అలానే ఉందువు. ఓ, ఎంత మహిమకరము! మీ మనుష్యుడు అక్కడ ఉన్నాడు.
40
ఇప్పుడు ఆదికాండము 2 చెప్పుచున్నది. (నేను త్వరపడవలసియున్నది. నేను వాటిని తీసుకొనెదను.... మీరు ఎంతో కొంత కార్యము మీరు పొందితిరా? మీరు ఇచ్చారా... వాటిని సమాధానాన్ని పొందితీరా? మంచిది.) ఆదికాండము 2:18-21:
ప్రశ్న: దేవుడు ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి హవ్వను చేసెను (ఆదికాండము 2:18-21.) దేవుడు పురుషుని, స్త్రీని సృజించి.... ఆదామును మరియు హవ్వను చేసెనా?
ప్రశ్న: మరియు కయీను తన భార్యను పొందుటకు సృష్టింపబడిన పురుషుడు మరియు స్త్రీ నొద్దకు వెళ్ళెనా?
ఇప్పుడు, దీనిని వ్రాసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా నమోదు చేసారు. ఇప్పుడు, దేవుడు అప్పుడు... ఇక్కడున్న మొదటి ప్రశ్నలో:
ప్రశ్న: అదికాండము 2:18-21లో దేపుడు పురుషుని మరియు స్త్రీని చేసెనా?
లేదు, మీరు ఇక్కడ చూచుచున్నట్లు - అట్లు 2:18-21: లో ఇప్పుడు గమనించండి:
మరియు దేవుడైన యెహోవా - నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు; వానికి సాటియైన సహయమును వాని కొరకు చేయుదుననుకొనెను.
మరియు యెహోవా నేలమంటి నుండి... ప్రతీ భూజంతువును సృజించెను... మరియు మిగిలిన అన్నీ.
ఇప్పుడు, దేవుడు ఆదాము యొక్క ప్రక్కనుండి హవ్వను చేసెను మరియు శరీరశాస్త్ర ప్రకారము ఈ దినమున స్త్రీ - పురుషుని కంటే ఒకటి ఎక్కువైన ప్రక్కటెముకతో నిర్మించబడియున్నది, ఎందుకనగా ఆదాము శరీరము నుండి ఒక ప్రక్కటెముక తీసివేయబడింది. ఆదాము అప్పుటికే తయారుచేయబడి మరియు జీవించుచున్నాడు. మరియు ఒంటరిగా ఉన్నాడు. మరియు అప్పుడు దేవుడు చెప్పెను, “నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు.”
41
అందుచేత ఈ యాజకులు మరియు మిగినలిన వారు భార్యను కలిగియుండే హక్కును వారు కలిగియున్నారు, ఇప్పుడు అది రోమన్ సంఘము చేసేటటువంటిది అది... అది వారే, దాని కొరకు వారే సమాధానము చెప్పుకుందురు,నేను కాదు.
మంచిది. ఈ మధ్యనే ఒక వ్యక్తి నన్నిలా అడిగాడు, “యాజకులు గురించి నీవేమనుకొంటున్నావు?” అడిగాడు, “ఆ యువకుడైన యాజకుడుని గురించి నీవేమనుకొంటున్నావు, అతడు ఆ పట్టణములో నుండి స్త్రీని తీసుకువెళ్ళి పోయి, ఆ బాలిక, ఇక్కడున్న జెఫర్సన్ విల్-బాలికై యున్నది. మరియు వెళ్ళి ఆమెను వివాహము చేసుకొనెను?” ఐరిస్ చర్చిలో, మీకు గుర్తిండి యుండవచ్చును. అతని పేరేమిటో నేను మరచిపోయాను.
నేను చెప్పాను, “నేను కలిగి యున్నట్లుగానే అతను కూడ వివాహము చేసుకొనే అధికారం అతనికి యున్నది, నేను దాని గురించి ఖచ్చితంగా అలాగే అనుకొంటున్నాను.” నేను చెప్పాను, “నేను పట్టుకొన్న ఒక కార్యం... అలా పరిగెత్తుకొంటూ వెళ్ళిపోయే బదులు, అతడు ఆసంఘాన్ని నుండి బయటకు వచ్చి మరియు అతని కార్యాలయానికి, రాజీనామా చేసి, అప్పుడు వెళ్ళి మరియు ఆ బాలికను వివాహము చేసుకోవల్సింది. అక్కడే అతడు తప్పు చేసాడని నేను తలంచుచున్నాను.”
ఇప్పుడు, కొన్ని వారముల క్రితం జెఫర్సన్-విల్ ఇక్కడ జరిగిన కార్యము మీకు గుర్తుండి యుండవచ్చును. ఆ క్రింద నున్న ఐరిస్ కాథోలిక్ యాజకుడు అలా చేసాడు. అతడు ఒక యౌవనస్థుడైన వ్యక్తి, అతడు వెళ్ళిపోయాడు... క్రింద నున్నటువంటి మధురమైన హృదయము గల బాలికతో, మరియు వారు అతనికి ఒక పెద్దప్రేమ కానుకను ఇచ్చిరి, అతని యొక్క ఫాదిరి ప్రదేశమును మార్చివేసి, ఇండియానా పోలిస్ కో లేక మరెక్కడి కో అతనిని పంపివేసిరి. మరియు అతడు ఆ ప్రేమ కానుకను మాత్రమే తీసుకోని, బాలిక మరియు అందరూ వెళ్లి, వివాహము చేసుకొన్నారు, మరియు ఇంకెన్నడూ వారు అతని గూర్చి ఎక్కువుగా వినలేదు. మంచిది, అతనికి వివాహము చేసుకొనే హక్కు ఉన్నది. కాని, అతనికి ఆ విధముగా చేసే హక్కులేదు, ఆ విధముగా చేయకూడదు. అతడు ఆ సంఘానికి వెళ్ళి మరియు చెప్పాలి. “ఇక్కడ, యాజకుని యొక్క కార్యాలయము నుండి నేను రాజీనామా చేస్తున్నాను. నేను వివాహము చేసుకోవాలనుకొంటున్నాను మరియు అది సరిపోతుంది.”
42
కాని, ఇప్పుడు, దేవుడు హవ్వను చేయుచున్నాడు. మరియు ఆదాము మరియు హవ్వ ఒకే సమయములో చేయబడిరి. అతడు కేవలం ఒక సహజతీతమైన వానినిగా చేయబడ్డాడు. ఆదాము ఆత్మ మరియు హవ్వ ఆత్మగా, పురుషుడు మరియు స్త్రీగా చేయబడెను, అప్పుడు ఆయన చేసెను... ఆదామును ఇక్కడ ఉంచాడు. అది మంచిది కాదు... చూశారా, ప్రతీ సమయములోని అది దేవుని యొక్క చిత్రముగా తెలియపరచబడుచున్నది. ప్రతీది అలానే ఉన్నది, అది సరిగ్గా అలాగే క్రిందికి వస్తూ, సరిగ్గా విశదపరచబడుతూ, వెయ్యేండ్ల పాలన గుండా వస్తూ, సరిగ్గా ఆవలనున్నుటువంటి నిత్యత్వములోనికి అది వస్తున్నది. దేవుని చిత్రము విశదపరచబడుచున్నది, దేవుడు తనను తాను తెలియజేసుకొంటున్నాడు.
ఇక్కడ, దేవుడు క్రీస్తు యేసులో ప్రత్యక్షమాయెను. ఆయన ఏమైయున్నాడో అది చూపించుచున్నది. యేసు అనగా ఎవరు? మనోవేదన కలిగి, దుఃఖముతో బాధపడుతూ, ప్రేమించినటువంటి మనిషి, ఆ వేశ్యను, “నీ మీద నేరము మోపువారు ఎక్కడ?” అని అడిగెను,
“ఎవరూ లేరు ప్రభువా.”
“నేను నీ మీద నేరము మోపను. వెళ్ళి, ఇంకెన్నడును పాపము చేయకుము.”
అలసిపోయి మరియు నీరసించి, ఆ ఎడారి గుండా మరియు ఆ విధముగా ఆ రోజు ముప్పది మైళ్ళు నడిచెను. అక్కడ నాయీనూ స్త్రీ బయటకు వచ్చుచున్నది. మరియు ఆమెకున్న ఒక్క కుమారుడు, చనిపోయి అక్కడ పడియున్నాడు. ఆయన ఆ సమాధి ఊరేగింపును ఆపివేసి, పడియున్న అతని మీద చేతులుంచి చెప్పెను, “లెమ్ము.” మరియు ఆ చనిపోయిన బాలుడు తిరిగి లేచెను. ఆయన మన ప్రభువైన యేసు. (కృతజ్ఞతలు, టెడ్డీ, కుమారుడా.) మరియు అక్కడ మన ప్రభువైన యేసు ఏదైననూ మంచిదిగా చేయడానికి, ఎన్నడూ ఎక్కువ శ్రమపడి, ఎక్కువ బాధపడనక్కర్లేదు. అది సరి.
43
ఇప్పుడు, మరోక విషయం ఉన్నది:
ప్రశ్న: అతని భార్య కొరకు కయీను మొదట సృజింపబడిన స్త్రీ మరియు పురుషుని నొద్దకు వెళ్ళెనా?
ఇప్పుడు, ఇది ఒక భయంకర అస్థిరమైన ప్రశ్నయై యున్నది. ఇప్పుడు నిజముగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఓ, నేను... ఆ పేపరులో ప్రజలు దానిని ఉంచుట మీరు చూచియున్నారు. “కయీను అతని భార్యను ఎక్కడ నుండి పొందెను?” ఓ నేను దానిని చెప్పుటకు ఉపయోగించుచున్నాను.
మరియు నా కూటములో నాలుగు సంవత్సరముల పాటు మండుచున్న నరకము గూర్చి నేన్నెడును బోధించలేదు. నేను దానిని లేఖనములలో చూడవలసియున్నది. నాకు తెలియనట్లయితే, దాని గురించి నేనేమి చెప్పను, చూశారా.
కాని, ఇప్పుడు, కయీను అతని భార్యను ఎక్కడ నుండి పొందెను?“ ఇప్పుడు, అది ఆ ప్రశ్న యొక్క విశ్లేషణ అదియే. ”కయీను అతని భార్య కొరకు, సృష్టియైన స్త్రీ, పురుషుని నొద్దకు వెళ్ళెనా?“ చూశారా? ఇప్పుడు, మొట్టమొదటి...
44
ఈ మిసెస్. డి-ఆర్క్ ఒక రాత్రి ఆమె స్వస్థతను గూర్చి, ఏ విధముగా, దేవుడు ఆమెను ఆశ్వీరదించెనో మరియు సమస్తమును నీవు అదంతా వినియున్నావు. ఆమె పడిపోయి, చనిపోవుచుండెను. వారు ఉదయమున రెండు గంటలకు చేరి వచ్చారు.
మరియు, అందుచేత ఇప్పుడు, నేనెల వచ్చానో... ఆమె బాలుడైన, జార్జ్, మధ్యవర్తిగా ఉండిన బాలుడైన, ఎడ్ కూడా (వారు స్టోరు లో ఉండెను.) మరియు నేను వెనుక అక్కడ ఒక చర్చను విన్నాను. అక్కడ మొదటిగా... అతని భార్యను ఎక్కడ నుండి పొందెను. మంచిది. ఒకరు దాని అంటిపెట్టుకొన్నట్లు అగుపించే ఒక మంచి వాదనను ఇచ్చారు. అతడు చెప్పెను, “అతని భార్యను ఎక్కడ నుండిపొందేనో నేను మీకు చెప్తాను.” చెప్పెను, “కయీను వెళ్ళి మరియు ఒక గొప్ప పెద్ద ఆడ కోతిని వివాహము చేసుకొన్నాడు.” మరియు చెప్పెను, “ఆ కోతి నుండి రంగు(జాతి) వంశావలి బయటకు వచ్చియున్నది.” చెప్పెను, “ఆ రంగు జాతి వ్యక్తుల తల చివరన ఆ విధంగా ఉంటుంది. తల భాగం కోతి వలెనే ఉండుట మీరు గమనించండి.”
మంచిది, నేనిక్కడ నిలబడి యున్నాను, నేను సువార్తలోనికి వచ్చి కేవలం రెండు నెలలు మాత్రమే అయింది. నేను చెప్పాను, “నేను నీతో వ్యతిరేకించాలనుకోవట్లేదు, ఎందుకనగా నేనొక విధ్యార్ధిని కాదు. నేను రక్షించబడి యున్నాను.” కాని నేను చెప్పాను, “అది అలా జరిగినట్లయితే, నీటితో ప్రపంచము నాశనమైనప్పుడు, జల ప్రళయం జరిగినప్పుడు, ఆ రంగుజాతి ప్రజలు ఉనికి లోనికి రాకుండా ఆగిపోవాలి, ఎందుకనగా ఆ ఓడలో నోవహు అతని కుటుంబం మాత్రమే ఉన్నారు. ఆ రంగు జాతి ఉనికి లోనికి రాకుండా ఆగిపోవాలి.” నేను చెప్పాను, “అది అలా జరిగినట్లయితే.” నేను చెప్పాను, “లేదండి! ఆ రంగుజాతి వంశావళి అక్కడ నుండి రాలేదు. లేదు, అయ్యా. మనము ఎక్కడనుండైతే వచ్చామో, ఆ వృక్షం నుండే ఆ రంగు జాతివారు కూడ వచ్చియున్నారు, మరియు ప్రతీ మానవుడు దానినుండే వచ్చియున్నాడు.” ఏ బేధమును లేదు. ఖచ్ఛితంగా మనమంతా ... ఒక పసుపుగా ఉండవచ్చు, మరియు మరొకరు గోదుమ వర్ణములో ఉండవచ్చు, మరియు మరొకరు పాలిపోయిన రంగులో ఉండవచ్చు, మరొకరు ఎరుపు రంగులో ఉండవచ్చు. అలా ఉండినా, కాని మీరందరూ అదే వృక్షము నుండి వచ్చి యున్నారు. అది ఇక్కడున్న భౌతికమైన భాగము మాత్రమే. అది నిజము. వారంతా ఇక్కడ దేవునిచేత సృజింపబడిన మానవులే.
45
మరియు ఇప్పుడు గమనించండి, ఇక్కడే కొంతకాలం క్రితం, ఇక్కడే నిలబడి, మరియు లూయిస్-విల్ లోని కొంతమంది వైద్యులతో నేను మాట్లాడాను, ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ నరమాంసభక్షకులైన పేద ప్రజల గురించి మాట్లాడితిని. ప్రాముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉన్నారో, ఒక చిన్న బిడ్డను తీసుకొని... వారు చిన్న బిడ్డను చూసినప్పుడు, ఆ స్త్రీ దానిని ఆ విధముగా కొట్టివేసి మరియు ఒక పొదకుపైన దానిని వ్రేలాడుకట్టి మరియు కొన్ని దినాలు దానిని కుళ్ళబెట్టుదురు, మీకు తెలియునా, వారు దానిని తినడానికి ముందుగా అది చాలా శుభ్రంగా తయారయ్యేవరుకు అలా చేస్తారని మీకు తెలుసా, దేనినైననూ అంతే, వారు దానిని అలా మృదువుగా తయారయ్యేవరుకూ, కొంతకాలం కుళ్ళపెట్టుదరు.
ఆ నరమాంస భక్షకులను గూర్చి ఏమి వింతగా తలంచవద్దు. ఇంగ్లాండులో కూడ వారదే కార్యములను చేస్తారు. వారు నెమలి వంటి పక్షులను చంపి, వాటిని చెట్ల మీద వ్రేలాడదీస్తారు, అలా ఒకసారి వాటి ఈకలు రాలిపోయిన తరువాత అలాగున కొన్ని రోజులకు వాటిని దింపి అప్పుడు వారు వాటిని తింటారు. ఆ తెగవాళ్ళ, ఇంగ్లాడు లోని, ఆంగ్లో-సాక్షన్ ప్రజలైన మాతృవంశావళికి చెందినవారు. అది నిజము. తలంచవద్దు... మీరు ఇంగ్లాండు వెళ్ళలేనట్లయితే, అక్కడే ఆ క్రింద ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళండి, వారు కూడా అలానే చేస్తారు. ఖచ్చితంగా. ప్రతీ మనిషి ఒక నత్తను లేక రాటిల్ పాములను తినెదరు, ఏదైనా సరే వారు తినేస్తారు.
46
ఇప్పుడు గమనించండి. నన్ను మీకు చెప్పనివ్వండి. కాని, ఇక్కడ ఏమి జరిగింది. ఆ రంగుజాతి... దీనితో ఏమీ చేయలేదు. కయీను...
ఇప్పుడు, నేను మిమ్ములను గమనించాలని కోరుచున్నాను. “అతడు నోదు దేశమునకు వెళ్ళెను” అని వారు చెప్పిరి. ఇప్పుడు కయీను ఏదేనులో యున్నాడు. మరియు ఏదేను, ఏదేను తోట, తూర్పు ఏదేను వద్ద ఉన్నది. అది సరియేనా? ఏదేను తోట, ఏదేనులో తూర్పున ఉండెను. ఏదేను యొక్క తూర్పు భాగాన ఉండెను. మరియు కెరూబులు అక్కడే ఉన్నాయి. మరియు, ఏదేను తోట తూర్పు ద్వారము వద్దనే జీవవృక్షము ఉన్నది. మరియు అక్కడే కయీను మరియు హేబేలు తమ ఆర్పణను అర్పించారని నేను తలంచుచున్నాను. మరియు అక్కడే, లోపలికి రానివ్వకుండా ఖడ్గజ్వాలలతో కెరూబులు అక్కడే ఉన్నాయి, తూర్పు ద్వారము నొద్ద.
మీరు గమనించారా, యేసు తూర్పు దిక్కు నుండే వచ్చెను. వెలుగు తూర్పు దిక్కునుండే ఉదయిస్తుంది. ప్రతీది వచ్చును .... నాగకరికత తూర్పున ప్రారంభమై, పశ్చిమానికి ప్రయాణించింది. అది చుట్టూ తిరిగి మరియు దానినే అది మరలా పట్టుకొన్నది. మనము పశ్చిమార్ధ గోళములో ఉన్నాము. అది తూర్పు భాగాము, తూర్పు నున్న నాగరికత పాతది. నేడు ప్రపంచములో, చరిత్రకారుల ద్వారా తెలిసినటువంటి పాతదైన నాగరికత చైనాది. తూర్పు!
47
ఓ, కొన్ని గంటలపాటు ఈ ప్రశ్న మీద ఉండగలము, ఈ ఒక్క దాని మీదనే కాని నేను మిగిలిన వాటిని కూడ తీయాలి కాని, గమనించండి, ఇక్కడ... తన భార్యను కయీను ఎక్కనుండి పొందాడో మరియు కయీను గురించి మనము ఏది నమ్ముతున్నామో దానిని ఎంతమంది తెలుసుకోవడానికి ఇష్టపడుచున్నారు? ఇప్పుడు చూద్దాము. మంచిది. కయీను ఏమి చేసాడో నేను మీకు చెబుతాను. మరియు మీరు ఊహించగలిగే ఒక తెలివైన జవాబుగా అది ఉంటుంది: కయీను తన సొంత సహోదరినే వివాహము చేసుకొన్నాడు. అతడు అలానే చేసాడు, ఎందుకనగా అప్పుడు భూమి మీద ఒకే ఒక స్త్రీ యున్నది. బైబిల్ కేవలం ముగ్గురు పుట్టుక గురించే వ్రాసియున్నది, హము, షేము... లేక కాదు... (నన్ను క్షమించండి), వారు కయీను, హేబేలు మరియు షేతు, కాని అక్కడ ఎవ్వరూ లేకపోయినట్లయితే... బైబిల్ బాలికలు యొక్క జన్మ గురించి చాలా తక్కువగా నమోదు చేసింది. అది మీకు తెలియను.
48
ఇప్పుడు, నేను ఖచ్చితంగా ఈ రాత్రి స్త్రీ గురించి ఎత్తి చెప్పెదను. కాని చూడండి, ప్రపంచము స్త్రీని ఆరాధిస్తుంది. కాని ఆదిలో స్త్రీ దెయ్యము యొక్క ఆయుధమై యున్నది. మరియు ఒక అన్యాయమైన ఒక మంచి ఆయుధమును ఈ రోజు అతడు పొందుకున్నాడు. ప్రపంచములో ఉన్నటువంటి అన్ని చట్ట-విరుద్దమైన మద్యపు దుకాణములు కంటే ఎక్కువ అనేకమంది బోధకులను ఆమె నరకానికి పంపుచున్నది. ఆమె నోటి యొక్క మూలలో సిగరెట్టు యొక్క చిన్నభాగము వ్రేలాడదీయబడి ఉంటుంది. ఆమె జుట్టును ఆ విధముగా పైకి లేపుతూ మరియు గొప్ప పెద్ద పొడవైన కనుబొమ్మలు పైకి, క్రిందకు మిటకరిస్తూ సహోదరుడా, ఒక చిన్న... ఆమె భౌతికంగా అందముగా మంచిగా కనిపిస్తుంది, అయితే ఆమె ఏమి చేస్తుందో గమనించుము.
బోధకుడా, యేసుక్రీస్తు యొక్క రక్తముతో, నిన్నునీవు కప్పుకొనుట మంచిది. అది నిజము. ఇప్పుడు మీరు మనుష్యులని, నాకు చెప్పువద్దు నేను దాని గురించి చాలా ఎక్కువగా చూసాను. ఇప్పుడు ఇక్కడ గమనించండి. మీరు చెయ్యవలసినటు వంటి అతి గొప్ప కార్యం యేసుక్రీస్తు మీద మీ మనస్సులను కేంద్రీకరించి మరియు మీ ఆలోచనలు ప్రవిత్రంగా ఉండనివ్వండి.
49
పౌలు అక్కడ చెప్పినట్లుగా చెప్పెను, “ఒక సహోదరిని ఏలుటకు మనకు అధికారము కలదని మీకు తెలియునా, అలా చేయుటకు నాకును అధికారము కలదు,” కాని చెప్పెను, “నేను అది చేయను.” చూశారా, అది అతడు చేయలేదు. అతడు చెప్పెను, “వారి ద్వారా పరిచర్య జీవించునని నేనెరుగుదును... నూర్చుచున్న ఎద్దుకు చిక్కము పెట్టవద్దు.”
మీకు తెలియునా, మనము బోధకులైనందు వల్ల, కొన్నిసార్లు ఆలోచిస్తాము, (మీరు మరియు నేను అని నేను చెప్పుటలేదు, సహోదరుడా), కాని బోధకులు ఆలోచించెదరు, ఎందుకనగా బోధకులైనవారు ఆ సంఘములోని లౌకికులైన సభ్యులు కంటే వారు ఎక్కువైనవారు, ఒక గంట ముందు మార్చబడిన త్రాగుబోతుకంటే, దేవుని దృష్టిలో నీవు ఏమి కానివాడవే మరియు నీవు ఎక్కువైనవాడివి ఏమీ కాదు.
ఈ కార్యములన్నింటిని ఆ ఒక్క పునరుద్దరణ ఎన్నడూ, పరిశుద్దపరచుటలేదు. నా పేరును నేను “రెవరెండ్” అని సంతకం చేస్తానని నేనెరుగుదును. అవును, ఖచ్చితంగా అది నేడు ఒక అలవాటైన కార్యమైయున్నది. కాని అది అలా చేయకూడదు. “రెవరెండ్” మరియు “బిషప్” మరియు “డాక్టర్” ఈ అన్ని విషయాలు మానవ-కల్పిత బిరుదులు, మరియు అది బుద్దిహీనమైనవి! బైబిల్లో వారు కేవలం “పేతురు,” “యకోబు,” “పౌలు,” “యోహాను,” మరియు మిగిలినవారంతా అలాగుననే పిలువబడ్డారు.
50
పౌలు చెప్పెను, “ఇప్పుడు, ఇక్కడ, నేను సువార్తను బోధించుట, అది అది నా విధి అని నాకు తెలియును.” నేను ఒక బోధకుడిని మరియు అతడు ఒక బోధకుడు, మరియు సహోదరుడు నెవిల్ ఒక బోధకుడు, కాని... ఒక బోధకునిగా ఉండుట, అది మా విధి (duty), మంచిది. మేము చేయుచున్నదానిని ఆ విధంగా అనుకుంటున్నాము. “కాని నన్ను ఎంతో కొంత చేయనివ్వండి.” పౌలు చెప్పెను, “దానివెనుక అది యున్నది.” ఇప్పుడు ధనము తీసుకొనే హక్కు నాకు కలదు.“ పౌలు చెప్పెను, కాని నా అర్పణ మీకు చూపించుటకు నేను వెళ్ళి గుడారాలు తయారు చేసుకొంటున్నాను.” అతడు చెప్పెను, “అది ఘనమైనది, వివాహము అన్నీ విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వివాహము చేసుకొనుట పురుషులకి మంచిది.” అతడు చెప్పెను, “వివాహము చేసుకొనుటకు నాకును అధికారము కలదు. ఇప్పుడు నేను వివాహము చేసుకోగలను, వివాహము చేసుకొనుటకు నాకు చట్టపరమైన హక్కు కలదు, కాని నేను వివాహము చేసుకోను, నేను ప్రభువుకు మరోక అర్పణ చేయగోరుచున్నాను,” చూశారా. అప్పుడు అతడు చెప్పెను, “ప్రతీ మనిషి తన పిలుపును ఎరుగును. అతనిని చేయనివ్వుము... దేవుని వాక్యము నిమిత్తము నపుంసకులైన కొందరు కలరు,” మరియు మొదలగునవి.
మనము మన విధి నిర్వహణ వెనుక ఎంతో కొంత చేయాలనుకొంటున్నాము. మరియు నీవు దేవుని ఆత్మ ద్వారా నిజముగా తిరిగి జన్మించిన విశ్వాసివైతే మరియు ఇలా చెప్పెదవు, “సంఘానికి వెళ్ళుట అది నా విధి; నేను ఎక్కడికి వెళ్ళతున్నానో నేనెరుగుదును.” ఓ, మై! ఎందుకు, నేను దాని కంటే ఇంకా ఎక్కువ చేయగోరుచున్నాను; క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలను నేను జయించాలను కొంటున్నాను. నేను ఎంతో కొంత చేయాలనుకొంటున్నాను. నేను రోగులను దర్శించాలనుకొంటున్నాను లేక ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలనుకొంటున్నాను. సమాధి కార్యక్రమములో భోదించుట, అది నా విధి. సువార్త బోధించుట, అది నా విధి. రోగులకు ప్రార్ధించుట, అది నా విధి. నన్ను ఎంతో కొంత ఏదో ఒకటి చేయనిమ్ము, నన్ను దేని ద్వారా దేవుడు ఘనపరుస్తాడో దానిని నేను లేచి వెళ్ళి, మరియు చేయనిమ్ము.
51
ఇప్పుడు, వెనక్కి కయీను వద్దకు వద్దాం, [టేపులో ఖాళీ ఉన్నది.] హవ్వ మాత్రమే దేవుని చేత సృజింపబడిన స్త్రీ యై యున్నది. మరియు ఆమెకు ఎలాంటి కుమార్తెలు లేనట్లయితే, ఆ చివరి స్త్రీ (ఆ ఒక్క స్త్రీ) చనిపోతుంది, మానవ జాతి ఉనికిలోనికి రాకుండా ఆగిపోతుంది, అది సరియేనా? అక్కడ ఇక ఎటువంటి స్త్రీలు లేరు. అందుచేత ఆమెయే కుమార్తెలను కలిగి ఉంది. మరియు కయీను తన సొంత సహోదరినే వివాహము చేసుకొన్నాడు. అతనికి స్త్రీ రావడానికి వేరోక మార్గం లేదు.
మరియు అది ఆ దినములలో, అబ్రాహాము వరుకూ మరియు క్రిందనున్న ఇస్సాకు వరుకూ అదీ చట్టపరమైనది మరియు న్యాయబద్ధమైనది. ఇస్సాకు తన సొంత రక్తబంధువునే వివాహము చేసుకొన్నాడు. మరియు అబ్రాహాము తన సొంత సహోదరిని, రక్తబంధువువగు సోదరిని వివాహము చేసుకొనెను. (అతని తండ్రి... అది వేర్వేరు తల్లులు మరియు ఒకే తండ్రి; మరియు పురుషుని నుండియే బీజము బయటకు వచ్చును) శారా, ఆ అందమైన ఇస్సాకును కనెను. అది సరియేనా? అప్పుడు భూమి మీద ఇంకెవ్వరునూ లేరు.
అదంతా ఒక సాదృశ్యముగా ఉన్నది... అది చూపించుచున్నది... అది ఇక్కడ ఉన్నది, సహోదరుడా ఇస్సాకు.. రిబ్కా సంఘానికి మాదిరిగా ఉన్నది, మరియు ఇస్సాకు వధువుకు మాదిరిగా ఉన్నాడు... క్రీస్తు. అది సరియేనా? వారు రక్తసంబంధం కలిగి యుండాలి, హలెలూయా! ఆమెన్! రక్తసంబంధము.
52
అందుచేత కయీను తన సోదరిని వివాహము చేసుకొనెను, మరియు అప్పుడు వారు నోదు దేశములోనికి వెళ్ళారు. ఇప్పుడు మనము ఇంకా కొంచెము ముందుకు వెళ్ళినట్లయితే, అది ఒక లోతైన అంశం, దానికంటే ఎక్కువ మీరు నన్ను అడగరని నేను ఆశీంచుచున్నాను. (“ఆ దినమున భూమి పైకి బలాడ్యూలు ఎక్కడ నుండి వచ్చారు?” అలాంటివి జోసెఫ్స్ మరియు మిగిలిన వారు దాని మీద చాలా వాధనలు ఇచ్చిరి.) ఆమెన్! నేను దానిని సరిగ్గా చెప్పనట్లు అయితే సోదరుడా, ఆదివారం ఉదయము దానిని మరలా పట్టుకురండి. మంచిది.
53
ప్రశ్న: వారములో మొదటి రోజు ఆదివారము అని మరియు ఏడవ రోజు శనివారము అని మీరు వివరించగలరా? క్రైస్తవులు వారములో మొదటి రోజైన అదివారము నాడు సంఘానికి వెళ్ళుచున్నారు. వారములో ఏడో రోజైన శనివారము వెళ్ళకూడదా?
మంచిది, ఇప్పుడు, ప్రియమైన స్నేహితుడా, దీనిని ఎవరు అడిగిననూ, అది ఒక ప్రశ్న, చాలా మంచి ప్రశ్న ఈ దినమున అనేక వేలమంది విద్యార్థుల మధ్య ఈ పాత ప్రశ్న వాదింపబడుతుంది, కాని ఈ రాత్రి నా యొక్క భాగాన్ని చెప్పనివ్వండి, మీరు చూశారా, అదంతా నేను చేసాను, ఒకవేళ నాది సరికానట్లయితే, మంచిది. మీరు నన్ను భరించండి; మరియు దేవుడు నన్ను క్షమించుము, మీరు చూశారా, నేను దానిని ఒకవేళ తప్పుగా చెప్పినట్లయితే.
54
ఇప్పుడు, దర్మశాస్త్ర ప్రకారం... ఇప్పుడు అది ఖచ్చితంగా ఏడవ-దినము అడ్వెంటిస్ట్ వ్యక్తి ఇక్కడ కూర్చునియున్నారు. సెవెంత్-డే అడ్వెంటిస్ట్ మీదనే నా మొదట అధ్యయనమై ఉన్నది. అది నిజము. నేను మొదటిగా అధ్యయనం చేస్తునటువంటిది సెవెంత్-డే అడ్వెంటిస్ట్, మరియు వారు వచ్చి నాతో ఇలా చెప్పారు, ఏడవ రోజు శనివారము, సహోదరుడా, అది యూదుల యొక్క కేలండరు ప్రకారము ఉన్నది. రోమా కేలండరు అక్కడ దానిని ఉంచలేదు. మరియు శనివారమే ఆదివారముగా ఉండును. మంచిది, వారు నాకు కొన్నింటిని అమ్మారు అప్పుడు నా ఆలోచన సరియైనది మరియు కొంతకాలము క్రితం వారి సాహిత్యాన్ని, నేను చదివినప్పుడు, దాని కొరకు సరిచేయబడితిని, వందశాతం, కాని ఒక రోజు ఆ బైబిల్ ను పట్టుకొన్నప్పుడు మరియు అప్పుడు నేను అది వ్యత్యాసమైనదని చూచితిని.
ఇప్పుడు, వారం యొక్క చక్రం ప్రకారం సబ్బాతు దినము శనివారమే. ఇప్పుడు, మనకు తెలియదు. అది మార్చబడింది మరియు మనకు అనేక మార్పులు చేయబడ్డాయి. అదేంటో కూడా ఇప్పుడు నీకు తెలియదు, చూశారా. ఎందుకనగా మనము ... ఇప్పుడు, యూదులు వాదిస్తున్నారు మనము కేవలం... అది సరిగ్గా 1970 నాటిది, వారి కేలండరు, వారి చక్రం ప్రకారం రోమా కేలండరు 1955 సంవత్సరములుగా తీసుకొంటుంది. వారు వేరొకచోట మరోక కేలండరును తీసుకొంటారు. కాని క్రైస్తవ్యానికి ఉన్నటువంటి రుజువు ఏమిటి, ఇవి అన్నియు క్రీస్తు యొక్క పుట్టుకను ఆధారం చేసుకున్నాయి, మీరు చూచారా. అక్కడ నుండే మనము దానిని తీసుకొందుము.
55
ఇప్పుడు, కాని ఇప్పుడు ఏడవ దినముగా, ఇప్పుడు అక్కడ చాలామంది పెంతుకోస్తు ప్రజలు ఆ సబ్బాతీయులు - శనివారమును సబ్బాతు దినముగా ఆచరిస్తున్నారు. ఇప్పుడు, వారు చెప్పెదరు, ఆదివారాన్ని ఆచరించుటకు అక్కడ బైబిల్ లో ఒక్క మాట కూడ లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న ఆ సబ్బాతు దినము గురించి నేను అదే కార్యాన్ని చెప్పగోరుచున్నాను, చూశారా. ఇప్పుడు, శనివారమే యూదులకు ఇవ్వబడునటువంటి ఆ సబ్బాతు దినము. ఇప్పుడు, అది ఒక కాలములో మాత్రమే ఇవ్వబడింది.
ఇప్పుడు, ఇది దాని వెనుక మరోక ప్రశ్నను లేవదీస్తుంది. కాని ఇప్పుడు గమనించండి. దేవుడు ఏడవ దినమున విశ్రాంతి పొందినప్పుడు, పదిహేను వందల సంవత్సరాల వరకూ, ఆ లేఖనముల ప్రకారం, అప్పుడు ఆ ఏడవ దినాన్ని కనుగొనలేదు, మరియు అరణ్యములో, దేవుడు ఇశ్రాయేలుకు, ఒక సూచనగా ఏడవ దినాన్ని ఇచ్చెను ... దేవుడు.
56
మరియు దేవుడు ఏడవదినాన్ని విశ్రమించెను, అది ఆయన జ్ఞాపకార్ధ దినమైన విశ్రాంతి దినము. నేను చెప్పేటటువంటిది ఒక సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సోదరుడు లేక సోదరికి ఉపయోగకరంగా ఉండవచ్చు, చూశారా. మరియు వారు ఒక ప్రియమైన సంఘమును, కలిగియున్నారు మరియు ఇప్పుడు గమనించండి, ఈ ప్రశ్న యెక్క చిన్న అంశం మీద నేను ఇప్పుడు వారితో వ్యతిరేకిస్తున్నాను.
ఇప్పుడు, దేవుడు ఏడవ దినాన్ని పరిశుద్దముగా చేసాడు. ఆరు దినములు మనిషివి. ఏడవ దినము దేవుని విశ్రాంతి దినము, ఇది ఒక మాదిరి, వెయ్యేండ్ల పాలనకు ఒక మాదిరిగా ఉన్నది. ఇప్పుడు, దీనిని గమనించండి, ఎలా అది కలియుచున్నదో, ఇప్పుడు యేసు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన సుబ్బాతు దినాన్ని ఆచరించ లేదు అన్న కారణము చేతనే యేసును సిలువ వేసారు. యేసుకు వ్యతిరేకంగా మోపినటువంటి రెండు నిందలు ఏవనగా, ఆయన సబ్బాతు దినాన్ని ఆచరించలేదు, మరియు తన్నుతాను దేవుడిగా చేసుకొన్నాడు. మరియు ఆయన సబ్బాతు దినానికి ప్రభువునని ఆయన చెప్పెను. ఆయన కూడా దేవుని సబ్బాతు మరియు ఆయన దేవుడై యుండెను. అందుచేత వారు ఆయనను నిందించడానికి ఏ మార్గము లేదు.
57
ఇప్పుడు, దీనిని మీ కొరకు నన్ను స్థిరపరచన్విండి మరియు మీరు ఏ దినమును ఆచరించాలో చూపించెదను. ఇప్పుడు అక్కడ లేఖనము ఉన్నదా? మీ ప్రయోజనం కొరకు నేను దీనిని అడిగెదను:
ప్రశ్న: సహోదరుడా బ్రెన్హాం, యూదులు శనివారాన్ని ఆచరించుచున్నట్లుగా, మేము అధికారపూర్వకంగా ఆదివారాన్ని ఆచరించుటకు ఏదైనా లేఖనము కలదా?
లేదండీ, అక్కడ ఏదీ లేదు. శనివారాన్ని లేదా ఆదివారాన్ని మనము ఆచరించుటకు కొత్త నిబంధనలో గాని, బైబిల్ లో కాని ఏ లేఖనము లేదు. కాని వునరుత్థానము యొక్క జ్ఞాపకార్ధ కారణముచే మనము ఆదివారాన్ని ఆచరిస్తున్నాము.
ఇప్పుడు, ఈ విధముగా చెప్పెదరు, “రోమన్ కాథోలిక్ దానిని చేసింది.” వారు దానిని చేసారని, వారు వాదిస్తారు, కాని వారు చేసినట్లయితే, పరిశుద్ద పౌలు ఒక రోమన్ కాథోలిక్, మరియు అలాగే పేతురు, యోహాను, మరియు యాకోబు మరియు మిగిలిన వారు అందరూ కూడ అంతే, ఎందుకనగా వారు ఆరాధించడానికి వారములో మొదటి దినాన్ని వారు కలిసిరి. మరియు చరిత్రకారుల ప్రకారం, క్రైస్తవ యూదుడు మరియు ఒక శాస్త్రసంబంధమైన యూదుడు (వారిద్దరూ సమాజానికి వెళ్ళెదరు), కాని ఒకరు శనివారము వెళ్ళెదరు (యేసు యొక్క పునరుత్థానాన్ని వ్యతిరేకించేవారు), మరియు మరొకరు ఆదివారము వెళ్ళెదరు (యేసు మృతులలో నుండి లేచాడని నమ్మేవారు). అది ఒక ముద్ర. మరియు అది ఉండును.... అది ఒక ముద్ర అయినప్పటికీ, మరియు అది ఒక మృగము యొక్క ముద్రలో బయటకు రావచ్చును.
58
ఇప్పుడు, నేను అది ఎరుగుదును, అది దేవుని యొక్క ముద్రగా సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సహోదరులు తలంచెదరని నేను విన్నాను. వారు “సబ్బాతు దినాన్ని ఆచరించుట ద్వారా నీవు ముద్రించబడియున్నావు,” అని చెప్పెదరు. బైబిల్ లో ఆ విధంగా చెప్పేటటువంటి ఏ లేఖనము లేదు.
మరియు ఇక్కడ ఒక లేఖనము బైబిల్ లో మీరు ముద్రింపబడి యున్నారు అని చెప్పుచున్నది: ఎఫిసి 4:30, “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మీరు విమోచనదినము వరుకు ముద్రింపబడియున్నారు.” - పరిశుద్ధాత్మ బాప్తిస్మము.
పరిశుద్ధాత్మ బాప్తిస్మమే దేవుని ముద్ర అని ఇప్పుడు నేను మీకు రుజువు చేసెదను, చూశారా. ఆత్మ బాప్తిస్మమే దేవుని ముద్రయైయున్నది. ఇప్పుడు, యెషయా 28, అతడు చెప్పెను, “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట, కొంత అచ్చట.”
59
ఇప్పుడు గమనించండి. ఇప్పుడు, ప్రియమైన స్నేహితులారా. ఇప్పుడు పని మానివేసినవారు... చూశారా, మనుష్యులు తమను తాము రక్షించుకొనుటకు ఏదొ ఒకటి కనుగొనుటకు ప్రయత్నించుచున్నారు. దాని గురించి మీరు చేయగలిగే ఏ కార్యము అక్కడ లేదు, మీరు కృప ద్వారా రక్షింపబడిరి. దేవుడే పిలచుచున్నాడు, దేవుడే రక్షించుచున్నాడు. మీరు కేవలం ఆ దేవుని అడుగుజాడలను వెంబడించాలి, అంతే. మానవుని స్వభావము అదే. వారు మాంసాన్ని తినడాన్ని మానివేయుటకు ప్రయత్నము చేస్తారు, సబ్బాతు దినములు ఆచరించుటకు వారు ప్రయత్నించెదరు, వారు దీనిని చేయుట మానివేయుటకు ప్రయత్నిస్తారు. మీరు మాంసమును తినుట మానివేయుట ద్వారా రక్షింపబడలేదు. ఇది, అది లేక మరేదో దానిని ద్వారా నీవు రక్షింపబడలేదు. మీరు కృప ద్వారా రక్షింపబడ్డారు! మరియు దేవుడు, కృప ద్వారా, మీకు మాంసాన్ని, నిత్యజీవనాన్ని ఇచ్చుచున్నాడు. నా భావమేమిటో మీరు చూశారా? మరియు నిత్యజీవము అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మమే.
60
ఇప్పుడు నన్ను చూపించనివ్వండి. సబ్బాతు (Sabbath) అనే పదానికి అర్ధం ఏమిటి? ఎవరికైనా తెలుస్తున్నట్లయితే, మీ చేతిని పైకెత్తైదరా? సబ్బాతు (Sabbath) [ఒక సహోదరి చెప్పుచున్నది, “విశ్రాంతి (Rest)”] విశ్రాంతి. ఖచ్ఛితంగా, సబ్బాతు, (S-a-b-b-a-t-h) సబ్బాతు దినము అనగా “విశ్రాంతి (R-e-s-t) విశ్రాంతి దినము.” మీ బైబిల్లో అడుగుభాగమున వ్రాయబడిన దానిని చూడండి,“ విశ్రాంతి (Rest)” దినము. ఇప్పుడు, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక వద్దకు వెళ్ళుదము, 4వ అధ్యాయము, ఇప్పుడు త్వరగా తీయుదము మరియు మనము...
ఇదీ ఇక్కడ ఉన్నటువంటిది నా చివర ప్రశ్నయైయున్నది. మరియు, ఒకవేళ వాటిని సహోదరుడు నెవిల్ అక్కడ పొందినట్లయితే చూడండి. వాటిలో ఇంకొక రెండు ప్రశ్నలు చిన్నవి ఉన్నాయని నాకు తెలుసు. అందుచేత నేను మిమ్ములను ఎక్కువ సేపు ఉంచను. ఇప్పుడు, నేను వాటిని తీయుచుండగా నన్ను మన్నించండి.
ఇప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి విశ్రాంతి (Rest) అనే పదానికి అర్ధం చూసినట్లయితే, దాని అర్ధము ఏమీటో మీకు తెలియునా “సబ్బాతు” (Sabbath).
ఇప్పుడు, క్రొత్త నిబంధన ఇక్కడ ఉన్నది. యేసు, పరిశుద్ధ మత్తయిలో, పరిశుద్ధ మత్తయి 5వ అధ్యాయము వద్ద ఆయన ప్రారంభించాడు. ఆయన ఈ విధముగా ప్రారంభించాడు: “వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా.” అది అది ఏమిటి? ధర్మశాస్త్రము, ఆజ్ఞలు. “కాని నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు...” దానిని మార్చివేసెను, ఆయన చేయలేదా? “నరహత్య చేయవద్దు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా, కాని నేను మీతో చెప్పునదేమనగా!” దానిని మార్చివేసెను. ఆయన చేయలేదా? ఆయన ధర్మశాస్త్రమును మార్చలేదని తలంచుచున్నారా. మంచిది. ఆయన చెప్పెను, “కాని నేను మీతో చెప్పునది ఏమనగా ఏ కారణము లేకుండా తన సహోదరుని మీద కోపపడు ప్రతీవాడును అప్పటికే తన సహోదరుని చంపివేసియున్నాడు.” అది ఇక ఎన్నడును పాతనిబంధన క్రింద లేదు; అది క్రొత్త నిబందన. ఆయన వాటిని దాని క్రిందకు ఊడ్చివేసెను, చూశారా. ఆయన ఇంకొంచెము ముందుకు వెళ్ళి, ఆ ఆజ్ఞలు ఇచ్చెను, కాని ఆయన తప్పించెను... ఆయన నాల్గవ దానిని దాటివేసెను, అది ఏడవ దినము గురించి. ఇప్పుడు, ఇక్కడు 7వ అధ్యాయములో...
61
ధన్యతలతో, ఇక్కడ ఆయన చెప్పెను, ఆయన చెప్పెను, “పూర్వమందు చెప్పబడినవి, మీరు విన్నారు. మీరు చేయవద్దు మరియు 'మీరు చెయ్యవద్దు' అని, మరియు నేను మీకు మరొక విధముగా చెప్పుచున్నాను. 'కంటికి కన్ను మరియు పంటికి పన్ను' అని వారు చెప్పుట మీరు విన్నారు, కాని నేను మీతో చెప్పనదేమనగా! ”వారు మీకు మరొక విధంగా చెప్పుట మీరు వినియుందురు, అయితే నేను మీతో చెప్పునది ఏమనగా....“
ఇప్పుడు, దానినంతటి ముగింపులో, 4వ ఆజ్ఞను ఆయన విడిచిపెట్టాడు, అది,“సబ్బాతు దినాన్ని పరిశుద్దముగా ఆచరించుటకు గుర్తించుకొనండి.” ఇప్పుడు ఆయన చెప్పెను, “ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగజేతును.”
62
ఇప్పుడు గమనించండి. వ్యభిచారము చేసినవాడు రాళ్ళతో చంపబడాలి. వారు వ్యభిచారము అనే క్రియ చేయుటకు వారికి హక్కు ఉన్నది. అది సరియేనా? మరియు అది భౌతికంగా జరిగి ఉండాలి. “ఎవరినైనను చంపినట్లయితే,” అతడు ఒక నరహంతకుడు.
కాని యేసు చెప్పెను, “ఎవరైతే ఆ స్త్రీ వైపు చూస్తారో...” ఇప్పుడు అతని శరీరముతో కాదు, అతని ప్రాణము విమోచింపబడింది, అది అప్పుడు కాదు; దర్మశాస్త్రం అనేది ఒక పాఠశాల బోధకుడైయున్నది. ఇప్పుడు ఆయన చెప్పెను, “ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతీవాడు తన హృదయమందు వ్యభిచారము చేసినవాడగును.” ఇప్పుడు, ఆయన చెప్పెను, “నరహత్య చేయవద్దు” అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా, కాని నేను మీతో చెప్పునదేమనగా, ఏ కారణము లేకుండా తన సహోదరుని మీద కోపపడు ప్రతీవాడును, అప్పటికే తన సహోదరుని చంపివేసియున్నాడు.“
63
ఇప్పుడు ఆయన చెప్పెను, మరొక మాటలో, సబ్బాతు గురించి ఆయన చెప్పెను:
ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి... మరియు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేతును — మీ ప్రాణములకు సబ్బాతు విశ్రాంతి. (భౌతిక శరీరానికి కాదు; మీ ప్రాణములకు.)
ఇప్పుడు, పౌలు చెప్పుచున్నదానిని ఇప్పుడు వినండి, మీరు గనక ఉన్నట్లయితే... ఇప్పుడు చూడండి అంతా వేడిగా యున్నది. ఇక్కడ పైన కూడ వేడిగాయున్నది. కాని ఇప్పుడు, దీనిని జాగ్రత్తగా వినండి. అందుచేత ఖచ్చితంగా అది మనకు సరిపోతుంది. ఇప్పుడు, పౌలు, హెబ్రీయులకు వ్రాయుచున్నాడు. హెబ్రీయులు ఎవరు? చెప్పండి. యూదులు. అది సరియేనా? ఇప్పుడు, వారు ధర్మశాస్త్రాన్ని ఆచరించువారు, సబ్బాతు ఆచరించువారు. అది సరియేనా? బోధకుడా, సోదరుడా అది సరియేనా? వారు సబ్బాతును ఆచరించువారు, వారు దర్మశాస్త్రాన్ని ఆచరించువారు. మంచిది.
ఇప్పుడు, పౌలు యూదులకు ఛాయల ద్వారా మాదిరుల ద్వారా, తీసుకువచ్చుచున్నాడు, ధర్మశాస్త్రం ఎలాంటి మాదిరులుగా ఉన్నదో చూపించుచున్నాడు. “ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగా ఉన్నది.” మరియు అతడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి, అతడు ఒక స్థలంలో చంద్రుడు, సూర్యునిగా, చెప్పుచున్నాడు, ఆ చంద్రుడు మరోక ప్రపంచములో లేక మరొక దేశములో ప్రకాశిస్తున్న సూర్యుని యొక్క ఛాయగా ఉన్నాడు, మరియు అది ఇక్కడ ప్రతిబింబించుచున్నది, ఇప్పుడు, కాని ఇప్పుడు, మరియు అది అలా కాదు... కాని హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9.
64
ఇప్పుడు, హెబ్రీ4లో ఇప్పుడు గమనించడి, అతడు సబ్బాతు ప్రతిపాదన వద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి:
మన కొరకు ఆ వాగ్దానము ఇంకనూ నిలచియుండగా, తప్పిపోవునేమో అని భయము కలిగి ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించుదము...
ఇప్పుడు, సబ్బాతు ఆచరించు ప్రజలతో పౌలు మాట్లాడుచున్నాడు, ప్రజలు సబ్బాతు దినాన్ని ఆచరించుచున్నారు. మరొమాటలో “సబ్బాతు దినము గురించిన వాగ్దానము నిలచియుండగా తప్పిపోవునేమో అని భయము కలిగియుందుము.” లేక మీరు గనక ఆ క్రింద లైను వద్ద చదివినట్లయితే, అది సబ్బాతును ఆచరించెదము.“ అది ”j“ అని నా స్కోఫీల్డ్ బైబిల్ లో ఉన్నది. లేక ”సబ్బాతు ఆచరించుట,“ చూశారా. మంచిది.
మనము ... ఆ వాగ్దానము ఇంకనూ నిలచియుండగా... తప్పిపొవునేమో అని భయము కలిగి... దానిలోనికి ప్రవేశించెదము. వారికి ప్రకటింపబడినట్లు (దర్మశాస్త్రము క్రింద) మనకును సువార్త ప్రకటింపబడెను: గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను.
ఇప్పుడు, ధర్మశాస్త్రము క్రింద యున్నది. వారికి విశ్వాసము లేదు, ఎందుకనగా వారికి ఆధారము ఏదియు లేదు, చూశారా. మంచిది.
విశ్వాసులమైన మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము, ఆయన చెప్పినట్లుగా...
ఇప్పుడు, “ఆయన” విశ్రాంతి. ఇప్పుడు, “ఆయన,” అది క్రీస్తు విశ్రాంతి. అది నిజము, ఆయన యొక్క విశ్రాంతి, ఆయన “సబ్బాతు.” మరియు ప్రతీసారి అక్కడ వ్రాయబడినట్లుగా “ఆయన విశ్రాంతి” (His Rest) అని ఉపయోగిస్తున్నాను. నేను దానిని “ఆయన సబ్బాతు (His Sabbath)” అని ఉపయోగించెదను, అందుచేత మీరు ఒక దినమును ఆచరించుట గురించి మీరు అర్దము చేసుకొనెదరు, చూశారా.
విశ్వాసులమైన మనము ఆయన (సబ్బాతు) విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము, ఆయన చెప్పినట్లుగా... నేను కోపముతో ప్రమాణము చేసినట్లు, (విశ్వాసులు) వారు నా విశ్రాంతిలో ప్రవేశింతురు: అయినప్పటికిని (ఇప్పుడు, పరిశుద్ధ దినమును గూర్చి పౌలు వర్తమానాన్ని గమనించండి)... అయినప్పటికిని, జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్ణిమైయున్నవి.
యేడవ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పియున్నాడు, విశ్రాంతి కొరకు, (లేక సబ్బాతు...) (అది సరీయేనా? అక్కడున్న దాని యొద్దకు నేను వెళ్ళుచున్నాను, చూశారా.) యేడవ దినమును గూర్చి ఆయన ఒకచోట (దర్మశాస్త్రములో) చెప్పియున్నాడు, దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నింటిని ముగించి విశ్రమించెను.
65
అది ఆయన యొక్క ఏడవ దినము. ఇప్పుడు, పౌలు దేవుడు వారికి ఇచ్చిన దానిని ప్రవేశపెట్టుచున్నాడు. అది ఏడవ దినము, దేవుడు ఏడవ దినాన్న విశ్రమించెను, ఆయన సబ్బాతు దినాన్ని ఆశ్వీరదించెను, ఆయన దానిని పవిత్రపరచాడు, మరియు ఆయన దానిని పరిశుద్ధపరిచాడు, మరియు విశ్రాంతి దినముగా చేసాడు. ఆయన కార్యములన్నింటిని ముగించి, దేవుడే దానిని చేసాడు.
ఇదియును గాక, ఈ చోటననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు (యేసు మాట్లాడుచున్నాడు.)
ఇప్పుడు, అక్కడ మరొక సబ్బాతు ఉన్నది. అది ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఇక్కడ, ఏడవ దినము “దేవుడు యొక్క విశ్రాంతి” అని గుర్తించుకొనండి. పౌలు చెప్పెను, “వారు ఫలానా స్థలములో దానిని కలిగియుందురు.” కాని ఇప్పుడు మరలా అతడు, “వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు,” అని చెప్పెను. సరిగ్గా మత్తయిలో యేసు ఇలానే మాట్లాడుచున్నాడు. మంచిది.
కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త విననివారు ప్రవేశింపలేదు ఎందుకనగా అవిధేయుత చేత:
ఇప్పుడు జాగ్రత్తగా వినండి! ప్రతీ ఒక్కరు వింటున్నారా, “ఆమెన్!” చెప్పండి: వినండి:
మరలా, ఆయన ఒక దినమును నిర్ణయించుచున్నాడు...
ఆయన ఇక్కడ, ఒక దినమును నిర్ణయించాడు. అది ఏమిటి? ప్రతి ఒక్కరు ఒకసారి చెప్పండి. సబ్బాతు! అది సరియేనా? ఆ స్థలంలో ఒక సబ్బాతుగా వారములోని ఏడవ రోజును ఆయన నిర్ణయించెను.
మరియు మరలా, ఆయన ఒక దినమును నిర్ణయించుచున్నాడు, దావీదు గ్రంథములో (కీర్తనలు), నేడు, ఇంతకాలమైన తరువాత; (యేసు వచ్చేవరుకు, మీరు చూశారా, మొదటిసారి) ... చెప్పబడిన ప్రకారము, నేడు మీరు... ఆయన మాట వినినయెడల, నేడు మీరు... ఆయన మాట వినినయెడల, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. (అక్కడ మరొక విశ్రాంతి వచ్చుచున్నది; బౌతికంగా కాదు - ఆత్మీయమైనది.)
66
ఇప్పుడు, గమనించండి. “అందుచేత అప్పుడు మనము ఏడవ దినమును కూడ కలిగియున్నాము,” అని మీరు చెప్పవచ్చు. ఇప్పుడు, ఒక నిమిషము దానిని పట్టుకొనండి. తరువాత వచనము చదువుదాము, చూశారా; చాలా వేగంగా దానిని తీసుకోకూడదు. మంచిది:
యేసు వారికి కలుగజేసినయెడల... ఒకవేళ యేసు వారికి విశ్రాంతి కలుగజేసినయెడల, విశ్రాంతి దినము, ఆ తరువాత మరియెక దినమును గూర్చి ఆయన చెప్పకపోవచ్చును.
దర్మశాస్త్రము నుండి కృపకు ఆయన దర్మశాస్త్రాన్ని మార్చినప్పుడు, విశ్రాంతికి ఒక దినమును ఆయన వారికి ఇవ్వలేదు, ఒక విశ్రాంతి దినము, ఫలానా దినమా? కాని సబ్బాతు గురించి ఆయన ఎన్నడూ ఏదీ చెప్పలేదు, ఆదివారము గురించి ఆయన ఎన్నడూ ఏదీ చెప్పలేదు, శనివారము గురించి ఆయన ఎన్నడూ ఏదీ చెప్పలేదు. కాని ఇక్కడ ఆయన ఏమని చెప్పెను, పౌలు చెప్పెను. ఇప్పుడు గమనించండి, “అక్కడ...” - 9వ వచనము:
కాబట్టి దేవుని ప్రజలకు సబ్బాతు నిలచియున్నది. (అది ఈ దినమే!)... అక్కడ నిలచియున్నది... దేవుని ప్రజలకు ఒక సబ్బాతు.
ఆయన యొక్క విశ్రాంతిలో (యేసు యొక్క విశ్రాంతి “ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి నిత్తును.”) ప్రవేశించినవాడు (నీవు లేక నేను), తన (నీవు లేక నేను) కార్యములను ముగించి విశ్రమించును, ఆదిలో దేవుడు చేసినట్లుగా. (ఆమెన్! అక్కడే మీకు సబ్బాతు ఉన్నది. అది సరియేనా?)
జాగ్రత్త పడుదము... (పౌలు చెప్పెను)... ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు, అవిధేయుత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా (ఆ దినముల యొక్క మరియు మిగిలినవాటి గురించి, చూశారా).
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, బలము కలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, దూరుచు... ఆత్మను విభుజించునంత మట్టుకు... మరియు శోధించుచున్నది ఆ యొక్క.. మరియు... (చూద్దాము) ఆత్మ యొక్క మరియు ఆ యొక్క ... (ఒక నిముషము) ప్రాణాత్మలను విభజించుచూ మరియు... కీళ్ళను మరియు మూలుగును, మరియు... హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. స్పష్టము ఏదియు లేదు... ఆయన దృష్టికి కనబడినది: మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో, ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా యున్నది.
67
ఇప్పుడు చూడండి, దేవుడు ఏడవ దినాన్ని విశ్రమించెను, ఏడవ దినాన్నిసృజియించి, యూదులకు ఒక జ్ఞాపకార్థంగా దీనిని ఇచ్చియున్నాడు. పరిశుద్ధ పౌలు గురించి మాట్లాడెదను, చూశారా. వినండి. ఇప్పుడు, అతడు దానిని తీసుకువచ్చాడని, మీరు తలంచుచున్నారా? అతనికి హక్కు ఉన్నదని మీరు అనుకొంటున్నారా? ఇప్పుడు గలతీ 1:8 లో అతడు ఏమి చెప్పుచున్నాడు? “నేను మీకు ప్రకటించిన సువార్తను గాక మరియొక సువార్తను పరలోకము నుండి వచ్చిన యొక దూతనైన మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడగును గాక.” చూశారా, సువార్తలు స్పష్టమైనవి. ఇప్పుడు, గమనించండి.
“మంచిది, సహోదరుడా బ్రెన్హాం, ఇప్పుడు నేనేమి చేయాలి, కేవలం యేసుక్రీస్తును నమ్మడమేనా?” కాదు. అది ఆ విశ్రాంతి కాదు.
68
ఇప్పుడు, మీరు దానిని తెలుసుకోవాలన్నట్లయితే... క్రైస్తవుని యొక్క విశ్రాంతి ఏదో ఎంత మంది తెలుసుకోవాలనుకొంటున్నారు, “ఆమెన్” చెప్పండి. ఇప్పుడు, అది మీకు కావాలన్నట్లయితే, ఒక గుర్తును పెట్టుకొనండి, అది యెషయా 28. అతడు చెప్పెను, “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట మరియు కొంత అచ్చట, మరియు ఏది మంచిదో దానిని పట్టుకొనుడి.” ప్రవక్త కాలము వచ్చుచున్నది అని చెప్పుచున్నాడు, విశ్రాంతి గురించి, సబ్బాతు. పూర్తి అధ్యాయం అంతా చదవండి, అతడు చెప్పుచున్నాడు, “కాలము వచ్చినప్పుడు, ఆ సబ్బాతు పాడుచేయబడును.” వారు సోమవారమున బూట్లు అమ్మినట్లుగానే శనివారమున కూడా అమ్ముచున్నారు, లేక ఏ దినమునైననూ, మీరు చూశారా. చెప్పెను, “ఇది సూచనగా ఉండినప్పుడు,” చెప్పెను:
... ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ... సూత్రము వెంబడి సూత్రము; కొంత ఇచ్చట, మరియు కొంత అచ్చట: ఏది మంచిదో దానిని పట్టుకొనండి.
నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను నేను ఈ జనులతో మాటలాడెదను.
మరియు ఇదే సబ్బాతు - విశ్రాంతి అని వారు ప్రవేశించెదరు అని నేను చెప్పుచున్నాను. అయిననూ వారి హృదయములు కఠినపరుచుకొని వారి తలలు ఊపుతూ మరియు దానిని త్రోసివేసిరి. పరిశుద్ధాత్మ ప్రజల మీద కుమ్మరించబడినప్పుడు, పెంతుకోస్తు దినాన వారు అదే చేసిరి మరియు అక్కడ పెంతోకొస్తు దినాన మొట్టమొదటిగా ప్రజలకు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. అదే విశ్రాంతి, దేవుని ప్రజలకు సబ్బాతు.
69
ఆ కారణము చేతనే ఆదివారమును అచరించుచున్నాము, మన పూర్వీకులైన బైబిల్ తండ్రుల చేతను అది ప్రారంభించబడెను, పరిశుద్ధ పౌలు, యోహను, మత్తయి, మార్కు, లూకా, మరియు వారంతా, వారు ఇంటి ఇంటికి వెళ్ళుచూ, శిష్యులందరూ కూడి వచ్చి, వారములో మొదటి దినాన వారు సంస్కారాన్ని తీసుకొనేవారు, మరియు అది సబ్బాతుగా పిలువబడలేదు, కాని అది ప్రభువు దినము.
పత్మాసు ద్వీపములో, అక్కడ సంఘములో అప్పటికే సబ్బాతు పండగ జరుపబడుతుంది అని యోహను చెప్పెను. “ప్రభువు దినమందు నేను ఆత్మవశుడైనుండగా.” అది నిజము, చూశారా.
మరియు, ఇప్పుడు, ప్రభువు దినము అనగా అది ప్రభువు తిరిగి లేచిన దినము. ఇప్పుడు మీరు చరిత్రకారుల యొద్దకు వెళ్ళినట్లయితే, జోసెఫెస్, ఆక్టిబస్ వారిలోని చాలామంది ఇతరులు, లేక ఆక్టిబస్ కాదు, ఓ, నేను... ప్రాచీన రచయితలు ఎవరినైననూ, మీరు అక్కడ కనుగొనెదరు. సంఘము యొక్క చరిత్రకారులను, ఫాక్సస్ యొక్క హతసాక్షుల గ్రంథము, చాలా మందిని మరియు మీరు అక్కడ కనుగొనెదరు. ఆ ఒక్క వత్యాసము... వారు యూదుల గుంపు. వారిలో ఒకరు, “నరమాంసభక్షకులు” (cannibals) గా పిలువబడుదురు; అది క్రైస్తవులు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, అతడిని పొంతు పిలాతు చంపెను మరియు శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని దొంగిలించారు, అని వారు చెప్పెదురు. మరియు వారు దానిని దాచివేసారు, మరియు ప్రతీ ఆదివారం దానిలోని భాగాన్ని వారు తినెదరు. వారు సంస్కారాన్ని తీసుకొంటారు, మీరు చూశారా. ఆయన శరీరాన్ని వారు తీసుకొన్నారు, మీరు చూశారా. వారు సంస్కారముగా ప్రభువు యొక్క శరీరాన్ని తీసుకొంటున్నారని వారు చెప్పెదరు, మరియు అదేంటో వారికి తెలియదు, మరియు అతడు చెప్పెను, వారు నరమాంస భక్షకులు. చెప్పెను, వారు వారములో మొదటి దినాన్న వారు తింటారు; వారంతా కలసి మరియు ఈ మనిషి శరీరాన్ని తినెదరు.
70
వారు ధర్మశాస్త్రాన్ని ఆచరించువారైనా మరియు పునరుత్థానాన్ని కఠినముగా వ్యతిరేకించేవారైనా, లేక వారు క్రైస్తవులైననూ మరియు పునరుత్థానాన్ని నమ్ముచున్న నీవు ఒకే మార్గములో చెప్పగలగాలి, ఒకరు శనివారమున సంఘమునకు వెళ్ళి, మరియు ఒకరు ఆదివారమున సంఘానికి వెళ్ళెదరు, వాటి మధ్య ఒక ముద్ర ఏమైయున్నది?
అది చాలా బలముగా ఉన్నది, అది లేదా? మంచిది. అది దానిని వివరించును అని అనుకోనుచున్నాను. పరిశుద్ధాత్మ...
ఇప్పుడు, సోదరుడా, నీవు ఎంతో కొంత పొందకున్నావా? మీరు కోరితే వెళ్ళి, నీవు వారికి సమాధానము చెప్పాలనుకుంటున్నావా? [సహోదరుడు నెవిల్, సహోదరుడు బ్రెన్హాంతో మాట్లడుచున్నాడు.] మనము చూద్దాము, ఇక్కడే. ఓ, అవును.
71
ప్రశ్న: అన్యులకాలము ముగిసిన పిదప యూదులు ఇంకనూ రక్షింపబడే అవకాశమున్నదా?
ఓ, మై, అది అంత చాలా మంచిగా లేనట్లు లేదా! మనము సమయము లేనట్లయితే దానిలోనికి మంచిగా పోయేదము, కాని నన్ను దీనిని చెప్పనివ్వండి, మరియు మీరు నా మాటను తీసుకొంటే, నేను మీకు చూపించెదను. నేను వివరించునప్పుడు, మీరు నా మాటను తీసికొన్నట్లయితే, అప్పుడు మీరు వెళ్ళి దానిని చూచెదరు, చూశారా, మరియు అప్పుడు మీరు దానిని కనుగొంటారు, ఎందుకనగా నేను ఊహిస్తున్నాను... నేను గడియారమును చూడలేకపోవుచున్నాను, కాని అది సమయము అయిపోయిందని నేను అనుకొంటున్నాను... (సమయము ఎంతైనది? ఎంత? తొమ్మిదిన్నర. నేను హస్పిటల్ కి వెళ్ళినప్పటికి, మరియు న్యూ-ఆల్బనికి వెళ్ళినప్పటికి, ఉదయమున మూడుగంటల తరువాత ఇరువై-ఐదు నిమిషములకు జెఫర్సన్-విల్ బయట ఉండెదను. మరియు ఈ వారములో ఏ రాత్రి రెండు లేదా మూడు గంటల కంటే ఎక్కువ పండుకొనలేదు.)
72
దీనిని త్వరగా పొందటానికి, ఇప్పుడు త్వరగా, ఇప్పుడు ఇక్కడ గమనించండి. అవును, నా క్రైస్తవ సోదరుడా, అన్యుల దినము ముగిసినది, సరిగ్గా ఇప్పుడు ముగియుచున్నది. మరియు దేవుడు యూదుల వైపుకు తిరుగుచున్నాడు మరియు నేను స్థిరముగా ప్రార్ధిస్తున్నాను అని ఈ చిన్న సంఘానికి నన్ను చెప్పనివ్వండి. మరియు దేశము యొక్క వివిధ ప్రాంతాల నుండి ప్రవచనములు వచ్చుచున్నవి, దాని నిమిత్తమై వారు ఇక్కడ కుమ్మరించుచున్నారు. అది యూదుడు అని నేను నమ్ముచున్నాను... ఇప్పుడు, ఒక్క నిమిషము మీ కోటులను పట్టుకొనుడి, ఇప్పుడు.
క్రైస్తవ సంఘము ఈ ఒక్క కార్యములోనే యూదుడ్ని ఎన్నడూ మోసగించలేరు, ఆ యూదుడు నాకు చెప్పాడు, చాలా సార్లు, “సహోదరుడా, మీరు దేవుడ్ని మూడు భాగాలుగా కోసి, నాకు ఇవ్వలేరు.” యూదునికి ఒకే దేవుడున్నాడు, మరియు ఆయనే యెహోవా.
మరియు అన్యులు దానిని తప్పుగా అర్ధము చేసుకున్నారు. అయినప్పటికిని చాలా ఎక్కువగా అతడు దానిని జ్ఞానముతో ఒకే మార్గములో పట్టుకొన్నాడు, ముగ్గురు దేవుళ్ళు లేరని, ఒక బలమైన నమ్మకముతో, అతడు ఉన్నాడని నేను నమ్ముచున్నాను. అక్కడ ఒకే దేవుడున్నాడు, మూడు ప్రత్యక్షతలు - ఒకే వ్యక్తిలోని మూడు వ్యక్తిత్వాలు మరియు మీరు ఆ వర్తమానాన్ని పొందినప్పుడు... హైమన్ ఆపిల్మాన్ తో నేను చెప్పాను... (మీలో చాలా మందికి అతడు తెలుసు)... అతడు చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హాం, నీవు ఆ వర్తమానాన్ని అద్భుతములు మరియు సూచక క్రియలతో పాలస్తీనాకు తీసుకు వెళ్ళినట్లయితే,” చెప్పాడు, “అక్కడ పదిలక్షల మంది యూదులు యేసుక్రీస్తును తమ వ్యక్తిగత రక్షకునిగా స్వీకరిస్తారు.” చూశారా, అది నిజం.
73
ఇప్పుడు, ఆ వర్తమానాన్ని మనము ఇక్కడ కలిగియున్నాము. ముసుగు ధరించిన యెహోవాయే యేసు, క్రిందికి దిగివచ్చి ముసుగు ధరించెను. ఇప్పుడు, దేవుడు (తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ) మీ వ్రేళ్ళవలె కాదు - ఒకటి - కొంత మంది దానిని అలా తలంచెదరు. ఆ సమస్త కార్యము... లేదు, దేవుడు... నేను ఇప్పుడు ఒక నిమిషం ముందే దానిని మీకు వివరించాను, చూశారా, అది ఒక్కటిలో ఉన్నటువంటి త్రిత్వం.
నేను ఒక్కటిలో ఉన్న త్రిత్వమై యున్నాను. నేను ఒకే వ్యక్తిలో ఉన్న ప్రాణము, శరీరము, మరియు ఆత్మను. అది సరియేనా? ఖచ్చితంగా. నేను కణములతో, రక్తము, మరియు నరములతో నిర్మించబడ్డాను, మరియు అయినప్పటికిని ఒకే జీవిని, చూశారా. సమస్తమును మీరు త్రిత్వములోనే చూచెదరు, మరియు ఒక్కదానిలో ఉన్న త్రిత్వం.
అక్కడ ఓడలో కూడ త్రిత్వము ఉన్నది. అడుగు అంతస్తు నేలను ప్రాకే వాటికి, రెండవ అంతస్తు పక్షులకు, ఎగిరే వాటికి, మరియు మూడవ అంతస్తు నోవహకు మరియు అతని కుటుంబానికి. సమస్తము!
గుడారములో, అక్కడ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతిపరిశుద్ధ స్థలము ఉన్నది, చూశారా.
మరియు అక్కడ మూడు కాలములు ఉన్నవి: పితృత్వము, కుమారత్వము, మరియు పరిశుద్ధాత్మ కాలము. నా భావము ఏమిటో మీరు చూశారా? కాని ఆ మూడు... “మన దేవుళ్ళు,” అని మనము చెప్పుకూడదు. విగ్రహారాధికులు అలా చెప్తారు. యూదుడు దానిని ఎరుగును. కాని మీరు అతనికి ఇది యేసు దేవుడు, యోహోవా దేవుడు, రెండవ వ్యక్తి లేక మూడవ వ్యక్తిగా చేసి చూపించలేరు, అది ఒకే వ్యక్తి అన్ని సమయములలో తన్నుతాను ప్రత్యక్షపరుచుకొనుచున్నాడు, చూశారా. మరియు అప్పుడే యేసు మృతులలో నుండి తిరిగి లేచాడని అద్భుతములు మరియు సూచక క్రియలతో రుజువు చేయబడును.
74
మరియు ఈ డాక్టర్ రీడ్ హెడ్...
అక్కడున్నటువంటి సోదరుడు, సంఘంలో ఉపదేశకుడు... బోధిస్తాడు... ఇక్కడున్న సంఘములో పాఠశాల ఉపాధ్యాయుడు, మరియు నేను అతనిని అడిగాను... మరియు నేను అక్కడ అతని భార్యతో మరియు అతని బిడ్డతో నేను కరచాలనము చేసాను. ఒక రాత్రి అతడు నా బోధను వినడానికి అతడు అక్కడికి వచ్చాడు. వారు అక్కడ ఉన్నారని నేను అనుకొంటున్నాను, వారు వెళ్ళలేనట్లయితే, అతడు లూయిస్-విల్ లో ఒక పాఠశాల ఉపాధ్యాయుడని నేను నమ్ముచున్నాను, ఏదేమైనను, వారు అక్కడ అతని నుండి వినడానికి బయటున్నారు.
అది గుర్తించుకోదగినది, కొన్ని నెలల క్రితం అతడు, మరొకరు మరియు ఒక యూదుడు మా ఇంటికి వచ్చారు. మరియు అతడు చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హాం, బాబ్-జోన్స్ లో నాకు చాలా డిగ్రీలున్నాయి, ఆ బయట నున్న వీటన్ లో, సమస్త విద్య అతనిలో కుప్పగా పోయబడింది! చెప్పెను, ”నేను బాలునిగా ఉన్నప్పటి నుండి నేను దేవుని నమ్ముచున్నాను.“ మరియు చెప్పెను, ”ఇంకనూ నా జీవితం ఖాళీగానే ఉన్నది!“ అతడు చెప్పాడు, ”బోధకులు తప్పు చేస్తున్నారా?“
75
మరియు ఇక్కడ ఒక భావన ఉన్నది. ఒకవేళ మీలో కొందరు మరుసటి రాత్రి ఆ తెరచిన ద్వారము దగ్గర - వారు అక్కడ కలసి బోధించుచుటను మీరు విన్నత్లైతే. అతడు చెప్పాడు, “నా అవకాశము వచ్చినప్పుడు....” ఇప్పుడు వినండి, చిన్న గుడారమా, దీనిని వినండి, మీ ప్రార్ధనలు మరియు కార్యములు బయట సహాయపడతాయి. అతడు దానిని ఇంతకు ముందు, ఇక్కడ మా ఇంటి వద్ద చెప్పాడు.
అతడు మా ఇంటికి వచ్చాడు, అతడు చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హాం,” చెప్పెను, “నేను మాట్లాడలేకుండా అయిపోయాను.” అతడు చెప్పాడు, “క్రీస్తును నా వ్యక్తిగత రక్షకునిగా నమ్మి, మరియు అంగీకరించుట కంటే ఇంకా ఎక్కువైన కార్యము ఇంకేదైనా కలదా? మరియు ఆత్మతో నేను తిరిగి జన్మించానని నేను నమ్ముచున్నాను, కాని నాకు ఏ ఒక్క సాక్ష్యము లేదు.”
నేను చెప్పాను, “సోదరుడా, చాలా చెడుగా దీనిని చెప్పుటకు నేను అసహించుకొంటున్నాను, మీ పాఠశాలలు ఆ బోధకులు నిన్ను మోసగించారు.”
చూడండి, నేను చెప్పుచున్నట్లుగా, వేలిముద్రలు వేయుట నీ పరలోకానికి మార్గం అని నేను నమ్మను. “మీ సంఘాలలో దీనిని నమ్ముచున్నారా?” (ఇక్కడ ఏదియును దాని గురించి నాకెన్నడూ తెలియదు...) “బైబిల్ ఇలాగున చెప్పుచున్నది, మీరు దానిని నమ్మెదరా?” దెయ్యము కూడ నమ్మి వణుకుచున్నది! నీవు ఏది నమ్ముచున్నావో అది కాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంది మరియు తిరిగి జన్మించుట ద్వారా మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలైయున్నారు అని ఆయన ఆత్మ - మీ ఆత్మతో సాక్ష్యము చెప్పవలెను.
76
అతడు అడిగాడు “సహోదరుడా బ్రెన్హాం, పెంతోకోస్తు వారి గురించి నీవేమి తలంచుచున్నావు?”
మరియు నేను చెప్పాను, “ఆ కారణము చేతనే నేను వారితో వ్యవహరిస్తున్నాను. ఆ కారణము చేతనే నేను వారితో మూఢునిగా ఉంటున్నాను: నీవు పొందని దాన్ని దేన్నో వారు పొందారు.” నేను చెప్పాను, “వారి మూఢభక్తితో మరియు సమస్తముతో నీకు తెలియనటువంటి సత్యాన్ని వారు పొందుకున్నారు.” మరియు సరిగ్గా అప్పుడే, అమెరికాలోని ఒకానొక గొప్పవానితో మాట్లాడుచున్నాను. అవును అయ్యా. అతడు సూడాన్ మీషన్ యొక్క అధ్యక్షుడు, హృదయానికి ఆధారమైన, ప్రపంచములోనే అతడు గొప్పవాడు. అతనికి లేఖనములు తెలుసు, మరియు మరణము, సమాధి, మరియు పునరుత్థానమును, ఒక ఇంటిలోని అగ్నివలే అతడు బోధిస్తాడు. కాని అది అది కాదు. దెయ్యము కూడా అలానే చేస్తుంది. అతడు చేయుచున్నదానికి దెయ్యమే ఆధారము.
కాని, సోదరుడా, యేసుక్రీస్తు చెప్పెను, “ఒక మనిషి దేవుని ఆత్మతో తిరిగి జన్మించకుండా అతడు దేవుని రాజ్యమును చూడలేడు.”
మీరు అలాగున, “అవును, నేను దానిని నమ్ముచున్నాను. అవును, అదే మార్గమని నేను నమ్ముచున్నాను. నేను దానిని నమ్ముచున్నాను. అవును,” అని చెప్పుచున్నారని కాదు. అది దానిని చెయ్యదు. కొత్తజన్మ యొక్క నిజమైన అనుభవముగా అది ఉండాలి. అది నీకు దేవునికి మధ్య ఏదో కలిగియుండి, నీవు మరణములో నుండి జీవములోనికి దాటియునన్నావని నీకు తెలియాలి.
77
అడిగాడు, “బ్రదర్ బ్రెన్హాం, నేను పరిశుద్ధాత్మను పొందుకోగలనా?”
నేను చెప్పాను, “అక్కడ క్రింద హైమాన్ ఆపిల్ మాన్ మీద కేవలం చేతులుంచాను మరియు అతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పోందుకున్నాడు.”
ఆ మరొక యూదుడు ఏడ్చుట ప్రారంభించాడు, మరియు అక్కడ చిన్న కాఫీ టేబుల్ పైన ఉన్న అద్దమును పగలగొట్టిరి, మరియు అక్కడ వారి ఏడ్పు ఒక పెద్ద గుంటగా ఏర్పడెను. వారిరువురు “బ్రదర్ బ్రెన్హాం, మేము పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి?” అని అడిగారు. చదువుకున్నవారు! చురుకైనవారు, తెలివైనవారు! అక్కడ పొలములో గొప్పవారు!
మరియు నేను చెప్పాను, “పరిశుద్ధాత్మను పొందిన అపోస్తలుల మార్గములోనే వారి మీద చేతులుంచాను.” అది నిజము.
“చేతులుంచుట.” అననీయ వచ్చి పౌలు మీద చేతులుంచగా, అతడు దృష్టి పొంది మరియు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు.
ఫిలిప్పు క్రిందికి వెళ్ళి మరియు అక్కడ బోధించి, మరియు ఆ పూర్తి గుంపుకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చాడు. పరిశుద్ధాత్మ ఎవరి మీదకు రాలేదు, ఎందుకనగా పేతురు వద్ద తాళపుచెవి కలదు. మరియు అతడు దిగివచ్చి, మరియు వారి మీద చేతులుంచాడు, మరియు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అది సరియేనా?
78
పౌలు, అపోస్తలుల కార్యములు 19లో, తరువాత అతడు దాటిపోయాడు అపోల్లో, అక్కడ ఉన్న బిల్లీ గ్రాహంకు, మాదిరిగా యున్నాడు, గొప్ప పెద్ద ఉజ్జీవాన్ని కలిగి మరియు మంచి సమయాన్ని కలిగియున్నాడు. అతడు, “మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా,” అని ఆ బాప్టిస్టు గుంపును అడిగాడు.
వారు చెప్పారు, “మేము యోహాను శిష్యులము, మాకు తెలుసు! అపోల్లో మా బోదకుడు, అతడు ఒక మార్చబడిన లాయరు, దేశములోనే తెలివైన మనిషి.”
అతడు అడిగాడు, “మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా?”
అతడు చెప్పెను, “మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా?”
అతడు చెప్పెను, “పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు.”
అడెగెను, “అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మమును పొందితిరి?”
చెప్పెను, “మేము యోహాను బాప్తిస్మమును బట్టియే పొందితిమి.”
చెప్పెను, “అతడు తన వెనుక వచ్చువానియందు, అనగా యేసు నందు విశ్వాసముంచవలెనని చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెను.” మరియు వారు దీనిని విన్నప్పుడు వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందారు. మరియు పౌలు వారి మీద చేతులుంచగా, మరియు వారందరూ పరిశుద్ధాత్మను పొంది, బాషలతో మాట్లాడుటకు ప్రారంభించి మరియు దేవుని మహిమపరచిరి. అది నేనెరిగిన లేఖనమునకు సమముగా ఉన్నది.
79
ఇప్పుడు చూడండి, స్నేహితులారా! అది మీ తలంపులకు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చును, ఎందుకనగా మీరు అన్నింటిని కలగలపు చేసారు, కాని దానిని అలానే ఉంచండి, మీ అనువాదాన్ని ఇవ్వడానికి ప్రయత్నించవద్దు, బైబిల్ చెప్పుదానినే చెప్పండి, దానిని ఈ మార్గములో వదిలి వేయండి.
మరియు నేను చెప్పాను, “పరిశుద్ధాత్మను వెదకుటకు నాకు తెలసిన ఒకే కార్యము, వారి మీద చేతులుంచుటై యున్నది.”
అతడు అడిగాడు, “నీవు చేతులుంచి మరియు మాకు పరిశుద్ధాత్మను ఇచ్చి మరియు మమ్ములను దీవించుటకు దేవుని అడిగేదవా?”
“నేను చేస్తాను” అని నేను అన్నాను. మరియు మేము నేలమీద మోకరించాము మరియు నేను ప్రార్ధించి వారి మీద చేతులుంచాను, మరియు అది జరిగిన కొన్ని వారముల తరువాత వారిద్దరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకొన్నారు. మరియు ఈ డాక్టరు రీడ్ హెడ్ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినప్పుడు, అన్యభాషలలో మాట్లాడాడు. అవునయ్యా.
80
మరియు మీ సూడాన్ మిషను చెప్తుంది, “బాషలలో మాట్లాడే మనిషికి మా యొద్ద చోటు లేదు.”
మరియు అతడు నా దగ్గరకు వచ్చి మరియు అడిగాడు, “ఏవరైననూ భాషలలో మాట్లాడారా?”
“ఎందుకు, ఎందుకు” నేను చెప్పాను, “తెలియని బాషలో యేసు మాట్లాడినప్పుడు, వారి దగ్గర యేసుక్రీస్తుకు చోటు లేదు; మరియు చనిపోయినప్పుడు, తెలియని బాషలో మాట్లాడెను.”
వారు పౌలు బోధను అంగీకరించలేదు, ఎందుకనగా పౌలు వారందరి కంటే ఎక్కువగా భాషలతో మాట్లాడాడు.
నిన్నటి దినమున ఒకరు నాతో చెప్పిరి, చెప్పెను, “అర్ధముతో కూడిన అయిదు మాటలు పలుకుట నాకు మేలు.”
కాని పౌలు యొక్క బోధ చెప్పుచున్నది, “ప్రవచనములను ఆపేక్షించుడి, మరియు బాషలతో మాట్లాడుటకు ఆటంకపరచద్దు.” మరియు వారు భాషలతో మాట్లాడుటను ఆపివేసారు!
81
బాషలలో మాట్లాడుట అనేది దేవుని దైవికపరమైయున్నది, ఆదిలో ఉన్నట్లుగానే అవి నేటి దినమున సంఘానికి చెందినవే, అవును, అది ఖచ్చితంగా సత్యం. అవును, వాస్తవము! అది బైబిల్ బోధగాయున్నది. అది దైవిక వరము, మరియు నీవు క్రొత్తజన్మను కాదన్నట్లుగానే నీవు దానిని కూడ కాదంటున్నావు, నీవు దానిని బయటకు కత్తిరించినప్పుడు, యేసు బోధించిన ప్రతీ దానిని నీవు కాదనుచున్నావు.
ఇప్పుడు, నీవు దాని మీద విశాలంగా పోయినట్లయితే; వారిలో చాలా మంది కలిగియున్నారు. కాని నేను చెప్పుచున్నాను, “అది దాని స్థానములో ఉన్నది.” అది ఒక జత బూట్లవలె ఉన్నది. నీవు ఒక జత బూట్ల కొన్నప్పుడు, వాటిలో ఆ త్రాళ్ళు ఉంటాయి, మరియు అది నిజము. మరియు నీవు క్రీస్తు శరీరములోనికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నింటినీ కలిగిన బల్లయై యున్నాడు. ఇక్కడ, ఆయన ప్రేమను కలిగియున్నాడు, ఆయన సంతోషమును కలిగియున్నాడు.
నేను మీ బల్లయొద్దకు వెళ్ళి మరియు అక్కడ కూర్చున్నట్లయితే, మరియు మీరు చెప్పెదరు, బోదకుడా, “నాతో వచ్చి తినండి.” మీరు నన్ను ప్రేమిస్తున్నారని నేను నమ్ముచున్నాను, మరియు మీరు చిక్కుళ్ళు, మరియు బంగాళాదుంపలు, మరియు క్యారెట్లు, మరియు కోడిమాంసము వేపుడు, మరియు గుమ్మడికాయ పిండివంటలు, మరియు ఐస్క్రీమ్, ప్రతీది అక్కడ పెట్టియున్నారు. ఎందుకు, నేను బంగాళాదుంపలు తినడానికి పిలవబడినట్లుగానే - చిక్కుళ్ళు తినడానికి పిలవబడ్డాను అని నేను నమ్ముచున్నాను. నేను కోడిమాంసం తినడానికి పిలవబడినట్లు గానే - పిండివంటలు తినడానికి కూడ పిలువబడ్డాను. అవి అన్నీ బల్లపై ఉన్నాయి, మరియు నేను చేయవలసినటువంటి కార్యమేమిటంటే, “దయచేసి మీరు నాకు పిండివంటలు వేయగలరా?” అని అడగడమే. మరియు నేను నమ్ముచున్నాను, ఒక మంచి స్వచ్చమైన హృదయముతో, మీరు నన్ను ప్రేమిస్తు, “తప్పకుండా, నా సోదరుడా, దానిలోని పెద్ద ముక్కను వేసుకోండి,” అని మీరు చెప్పెదరు. అది సరియేనా? నేను, “మీరు నాకు బంగళా దుంపలు వేయగలరా,” అని అడిగినట్లయితే, “తప్పకుండా నా సోదరుడా, ఎందుకు లేదు అదిక్కడ ఉన్నది,” అని మీరు చెప్పెదరు.
మరియు ప్రతీ విమోచనా ఆశీర్వదమును యేసుక్రీస్తు చనిపోయి ఆ కల్వరి వద్ద ఆయన ప్రాయశ్చితార్ధంలో ఆయన కొన్నాడు, అది బల్ల మీద కూర్చునుటైయున్నది. మరియు ప్రతీ విశ్వాసి దాని యెదుటనే కూర్చునియున్నాడు. హల్లేలూయ! నాకు స్వస్థత కావల్సివస్తే, “తండ్రి నాకు కొంత స్వస్థత ఇవ్వగలరా,” అని నేను అడిగెదెను, మరియు దానిలోని ఒక పెద్ద ముక్కను నా పళ్ళెములో వేసుకొని మరియు తినేదను. ఇప్పుడు, నీవు మరణముతో కృశించిపోవుచున్నట్లయితే, ముందుకు వెళ్ళు. అవునయ్యా, మరియు ప్రవచనము, భాషలతో మాట్లాడుట...
82
మరియు అప్పుడు ఆ మనిషి అక్కడ వ్రాసాడు... నేను మాట్లాడునటువంటిది అతనికి తెలియదు... నా అంతట నేనే బాషలతో మాట్లాడాను. మరియు అతడు వ్రాసినటువంటి ఈ పుస్తకము అది దేశములను ఊడ్చివేసిందని మీరు కనుగొనెదరు. మరియు దాని ప్రక్కగా, ఈ మనిషి బాషలలో మాట్లాడే వరం కోసము వెదుకుచున్న మూడీ బైబిల్ ఇనిస్టిట్యూట్ యొక్క ఇరువది-ఐదుగురు పరిచారకులను అతను పొందుకున్నాడు. ఆ ప్రాదమికమైన ప్రజలు పైనుండి క్రిందకి దిగారు. ద-క్రిష్టియన్-లైఫ్ ఈ నెల... ఈ నెలలో విడుదలైన క్రిష్టియన్-లైఫ్ మ్యాగజైన్ లోని, 19వ పేజీలో చూడండి, మరియు ఆ గొప్ప డాక్టర్ డివినిటీ చెప్పుచున్నారు చూడండి, చెప్పెను, “మనము దీనిని అంగీకరించేదమా? మనము దేనినైసూ కోల్పోయమా?” హల్లేలూయ!
విస్తారమైన వర్షము వచ్చుచున్నది అని నేను విన్నాను! ప్రజలైన మీరు దానిని ఆ మూలలో మెలి తిప్పారు, కాని అది ఒక స్థలమునకు వచ్చును దానిని దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనే కదలింపుతో అన్యుల ప్రపంచానికి ఇచ్చుచున్నాడు, అది దాని యొక్క పూర్తి సంపూర్ణతతో మరియు అద్భుతములు మరియు సూచక క్రియలు మరియు బలముతో కుమ్మరించబడును. ఆ కారణము చేతనే నేను పట్టుకొని యున్నాను... పెంతోకోస్తు దానిని మూలను త్రోసివేసి మరియు ఆ విధంగా వేరోక కార్యాలయానికి వెళ్ళిపోయింది. అయినప్పటికినీ సమయము ఇంకా పరిపూర్ణము కాలేదు. ఆ కారణముచేతనే వారంతా ఈ మూఢభక్తిని కలిగియున్నారు. కాని ఆ దేవుని దైవిక వాగ్దానము మరియు ఆ దేవుని దైవిక వాక్యము, మరియు దేవుడు దానిని చేయుదునని చెప్పినప్పుడు అది గతీంచిపోదు. మరియు అన్యుల కాలము ముగిసే ముందుగా దేవుడు దానిని ఆ మూలాధారమైన వారి మీద కుమ్మరించునని నేను నమ్ముచున్నాను.
83
ఈ ఆగష్టులో జరిగిన విషయాన్ని, ఈనెలలోని రీడర్స్ డైజెస్ట్ లో మీరు చదవగలరు, వెళ్ళి, అక్కడ ఆ క్రింద నున్న ప్రసంగ వేదికపై ఉన్న ఆ మెతడిస్టు బోదకుడు ఎలా హస్పటల్ మంచం మీద చనిపోవుచు, పడి ఉన్న ఆ మనిషికి ఏ విధంగా ప్రార్ధించాడో చదవండి మరియు ఆ పరిశుద్ధాత్మ సాక్షి వచ్చెను మరియు ఆ మనిషి వెనువెంటనే స్వస్థత పొందెను. హల్లేలూయా! ఖచ్చితంగా, దేవుడు కలిగియున్నటువంటి, దైవిక స్వస్థత ఇక్కడ ఆ బల్లపై కూర్చోనియున్నది! ఆయన కలిగియున్న ప్రవచనము ఇక్కడ బల్లపై కూర్చోని యున్నది! ఆయన కలిగియున్న భాషలలో మాట్లాడుట ఇక్కడ బల్లపై కూర్చోనియున్నది! ఆయన శరీరములో తొమ్మిది ఆత్మీయ వరములు కలిగియున్నాడు, మరియు మీలోని ప్రతీ ఒక్కరూ ఆహ్వనింపబడుచున్నారు! హల్లేలూయ! అవునయ్య. అక్కడే మనమున్నాము.
ప్రశ్న: అన్యులది ముగియగానే, యూదులు తిరుగుదురా?
అవునయ్యా. సోదరుడా, సోదరి, అది ఎవరైనప్పుటికినీ, చాలా లేఖనములు ఉన్నాయి. “పసర పురుగు విడిచినదానిని, గొంగళిపురుగు తినివేయును,” వాటిలో ఒకటి యోవేలు చెప్పుచున్నాడు, మరియు మిగిలినవి, ఆ వృక్షాన్ని తినివేయును, మరియు యేసే స్వయంగా వారు ఏ విధంగా త్రిప్పబడతారో మరియు సమస్తమును చెప్పెను. ఓ, ఆ లేఖనాలన్ని, దానియేలు మరియు ప్రతీచోట, దాని గురించి పలికారు. అవును, యేసు చెప్పెను, “అంజారపు చెట్టు చిగిరించి మొగ్గలు వేయునప్పుడు, సమయము సమీపముగా ఉన్నదని తెలుసుకొనుడి.” ఇది మరొక దానితో వ్యవహరిస్తుందని నేను నమ్ముచున్నాను.
84
ప్రశ్న: యూదులు పాలస్తీనాకు తిరిగి వచ్చుట బైబిల్ నెరవేర్పు అని నీవు నమ్ముచున్నావా? నీవు పాలస్తీనాకు వెళ్ళుచున్నావని మేము విన్నాము, అది నిజమేనా?
అవును. అవునయ్యా. నన్ను మీకు ఒక విషయము చెప్పనివ్వండి: ఒకానొక గొప్ప... ఇది ఏ సంవత్సర కాలమో నీవు చూడాలనుకొన్నట్లయితే, కేలండరు వైపు చూడుము. ఇది ఏ ఘడియో నీవు చూడాలనుకొన్నట్లయితే, గడియారం వైపు చూడుము. ఏ దినమున జీవించుచున్నావో నీవు చూడాలనుకొన్నట్లయితే, యూదులు ఎక్కడున్నారో చూడుము. అదే దేవుని గడియారం
మరియు చూడండి! అదే రాత్రి, అదే రోజు ఆ ప్రభువు యొక్క దూత, 1946, మే ఏడవ దినమున, గ్రీన్-మిల్, ఇండియానా వద్ద నన్ను కలుసుకొన్నాడు, అదే రోజున శాంతి ఒడంబడిక యూదుల కొరకు సంతకం చేయబడినది మరియు వారు రెండువేల-అయిదువందల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా - ఒక దేశాన్ని స్థాపించుకొన్నారు. హల్లేలూయ!
మరియు, ఈ రాత్రి, ప్రపంచమంతటిలో పాతదైనటువంటి, దావీదు యొక్క ఆరు కోనల నక్షత్రపు జండా, బబులోనుకు తీసుకు వెళ్ళబడినప్పటి నుండి, రెండువేల-అయిదువందల సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా, యెరుషలేము మీద ఎగురుచున్నది. యేసు చెప్పెను, “అంజురపు చెట్టు చిగిరించి మొగ్గలు వేయునప్పుడు...” ఆమె అక్కడ ఉన్నది! అక్కడ ఆయన చెప్పెను, “ఒక ఉపమానము నేర్చుకోనుడి 'వసంతకాలము సమీపముగా ఉన్నదని' మీరు చెప్పెదరు. మీరు దీనిని చూచినప్పుడు, సమయము ద్వారము వద్దనే ఉన్నదని తెలుసుకోనుడి.” మనము సరిగ్గా కాలము యొక్క ముగింపులో ఉన్నాము.
85
ఆ దానియేలు చెప్పిన “హేయమైన వస్తువు” ఎలా ఉన్నదో చూడండి, మరియు మిగిలినిది. మీరు ఎరుగుదురు యేసు చెప్పెను “ఆ గొప్ప రాజు వచ్చినప్పుడు, ఆయన ఒక వెయ్యి-రెండువందల-అరువది దినములు ప్రవచించును.” అది మూడున్నర సంవత్సరములై యున్నది. మరియు ఖచ్చితంగా యేసు అలానే బోధించాడు. ఆయన యూదుల యొద్దకే వచ్చెను, అప్పుడు ప్రజల కొరకు ఒక అర్పణగా కొట్టివేయబడెను. “మరియు ఆ హేయమైన వస్తువు నాశనము చేసెను”; ఆ మహమ్మదీయులు అక్కడ ఓమర్ మసీదును పెట్టారు. “మరియు వారు యెరుషలేము గోడలను అణగదొక్కుదురు.” (వ్యూ! ఎప్పటివరుకూ?) “అన్యుల కాలము సంపూర్తి చేయబడేవరుకూ.” మరియు ఆయన మరల యూదుల వైపుకు తిరుగును, మరియు అక్కడ హరమెగిద్దోను యుద్ధము జరుగునప్పుడు... అక్కడ ఆయన అన్యులను, ఆయన నామము నిమిత్తమైన ప్రజలను, ఆయన వధువును పిలచును. గమనించండి. అవునండీ. ఆ ఒక-లక్షా-నలభై-నాలుగు-వేలమంది యూదులందరూ, విమోచింపబడి అక్కడ నిలబడునంతమట్టుకు.
86
అప్పుడు సంఘము పైకి తీసుకుపోబడినప్పుడు, ప్రకటన గ్రంథము 11లో మోషే మరియు ఏలీయాలు ప్రత్యక్షమై మరియు వారికి యేసుక్రీస్తును గురించి బోధిస్తారు. మరియు పరిశుద్ధాత్మ అన్యులలో నుండి తీసివేయబడును, మరియు సంఘమును పైకి తీసుకొనిపోవుటకు ఎత్తబాటు వచ్చును. మరియు యూదులు ఇక్కడ విడిచిపెట్టబడి, మూడున్నర సంవత్సరములు బోధింపబడెదరు, ఎందుకనగా ఆయన చెప్పెను, “అక్కడ నీ జనమునకు డెబ్బది వారములు విధించబడెను, మరియు అభిషక్తుడు వారి మధ్య నుండి కొట్టివేయబడెను.” ఆయన కొట్టివేయబడినప్పుడు, అన్యులు ఒక స్థలాన్ని ఇచ్చారు, మరియు అప్పుడు ఇంకనూ యేసుక్రీస్తును గూర్చి బోధించడానికి వారికి మూడున్నర సంవత్సరములు ఉన్నవి.
తప్పకుండా, యూదులు వచ్చుచున్నారు మరియు నేను నమ్ముచున్నాను. సోదరుడా, మనము ఈ సమయములో పాలస్తీనాకు వెళ్ళినట్లయితే... ఓ, ప్రార్ధించండి! వారు ఆ బైబిల్ ను చదువుచున్నారు.
కేవలం ఇంకొక వివరణ మాత్రమే, తరువాత ఆ చిన్న, చిన్నదైన ప్రశ్న ఇక్కడ ఉన్నది, మరియు వాటిలో ఇకలేవు. ఇక్కడున్న ఈ ఒక్కటీ ఒక ప్రార్ధన అని నేను తలంచుచున్నాను.
87
దీనిని చూడండి! డాక్టర్ రీడ్ హెడ్ చెప్పెను, అక్కడ నిలబడి, ఆ తెలివైన మహమ్మదీయునితో మాట్లాడుచుండెను...
ఇప్పుడు, మీ చెవులను జాగ్రత్తగా దగ్గరకు పెట్టి వినండి. ఒక మహ్మదీయుడు, ఆఫ్రికాలో అద్భుతములు మరియు సూచక క్రియలు, చూసినప్పుడు వారిలో ఇరవైవేలమంది ప్రభువైన యేసు నొద్దకు వచ్చుట నేను పరిచర్యలో కలిగియన్నాను, వారు ఇరవైవేలమంది; వారంతా ముప్పైవేల మంది; వచ్చినవారు పదివేలమంది అని నేను అనుకొంటున్నాను, ఎందుకనగా ఆ పెద్ద గొప్ప జనాభా మహ్మదీయులుగా ఉన్నారు మరియు వారు అక్కడ నిలబడియున్నప్పుడు, మరియు నేను అడిగాను, దేవాలయాల్లో ఉన్నటువంటి మీ ప్రవక్తలలో ఏ ఒక్కరైనా, ఈ మనిషిని బాగుచేయగలరా?“ నేను అడిగాను, ”మీ విగ్రహల్లోని ఒక్కటైనా, మీకు జన్మనిచ్చినవారైనా, ఈ మనిషిని బాగుచేయగలరా?“ నేను చెప్పాను, వారిలో ఏ ఒక్కరూ లేరు! దేవాలయములోని ఏ ప్రవక్త లేడు... మరియు ఏ యాజకుడు, మరెవరును లేరు.” మరియు నేను చెప్పాను, “ఏ విగ్రహము దానిని చేయలేదు మరియు నేను కూడ చేయలేను. కాని తన కుమారుడైన యేసుక్రీస్తును లేపినటువంటి పరలోకమందున్న దేవుడు నేటి దినమున మానవుల మధ్య సజీవముగా ఉన్నాడు, ఆయనే ఇక్కడ నిలబడియున్న, మీరు చూస్తున్నవానిని పూర్తిగా బాగుపరచగలరు.” ఆ మనిషి మెడచుట్టూ గొలుసు కట్టబడి, ఒక కుక్కవలె నడిపింపబడుచున్నాడు - ఒక్క నిముషములోనే అతడు మంచిగా, బాగుపడి, సాధారణ స్థితిలోకి వచ్చి, తన కాళ్ళ మీదనే నిలబడ్డాడు.
88
మేము కారులో మరుసటి రాత్రి కూర్చునియుండగా, మరియు డాక్టరు రీడ్ హెడ్ నాతో చెప్పెను, “ఓ, మై!” దాని గురించి ఆలోచించుచున్నాను. ఈ మహమ్మదీయుడు అతని దగ్గరకు వచ్చినప్పుడు, మరియు చెప్పెను. ఆతడు మాట్లాడుతున్న ఈ మహమ్మదీయుడు, ఒక చాలా పాండిత్యము గల వ్యక్తి, అతడు “మంచిది, ఆ పాత చనిపోయిన, మీ మహ్మద్ ప్రవక్తను నీవు ఎందుకు విడిచిపెట్టకూడదయ్యా?” అని అడిగాడు.
ఇప్పుడు గుర్తించుకోండి, మహ్మదీయులు దేవునిని నమ్మెదరు అక్కడ బయట, ఆప్రికాలో ఒక పెద్ద గంట, గంటను ఆ విధంగా వ్రేలాడదీస్తారు, మరియు వారు ఒక గొప్ప పెద్ద రబ్బరు సుత్తిని తీసుకొని మరియు దానిని ఆ విధంగా కొడతారు, మరియు అది దేశమంతా వినబడుతుంది, మరియు ప్రతీ మహ్మదీయుడు ఆగిపోతాడు, మరియు ఆ యాజకుడు బయటకు నడుచుకుంటూ వచ్చి ప్రజలతో మాట్లాడతాడు, మరియు “అక్కడ, ఒకే నిజమైన మరియు సజీవమైన దేవుడున్నాడు, మరియు ఆయన ప్రవక్త మహ్మదు,” అని చెప్పుతాడు.
వారు ఇష్మాయేలు పిల్లలు, చూడండి. హాగరు. అబ్రాహాము ద్వారా హాగరు నుండి వచ్చిన సంతానము వారు, చూశారా. వారు నిజమైన యెహోవా దేవున్ని నమ్మెదరు, కాని వారు యేసును తలంచెదరు...(అది... ఆయనే మా విమోచకుడు, స్వతంత్రమైన స్త్రీ నుండి అన్యులకు పంపబడ్డాడు, ఇస్సాకు, చూశారా, మరియు... శారా ద్వారా). మరియు ఇప్పుడు, వారు హాగరు ద్వారా వచ్చారు, ఇష్మాయేలు మరియు మహ్మదీయులు వచ్చారు.
మరియు మహ్మద్ సమాధి వద్ద మీరు వెళ్ళి చూడండి, అది ఆశ్చర్యపరుచును, ఆ గొప్ప సమాధి అక్కడ ఉన్నది. మరియు రెండువేల సంవత్సరాలుగా ఒక తెల్లని గుర్రము, అక్కడ నిలబడియున్నది. అతడు ఏదో ఒక రోజున తిరిగి లేచి మరియు ప్రపంచాన్ని జయిస్తానని మహ్మద్ వాగ్దానము చేశాడు. మరియు ప్రతీసారి వారు ఒక్కొక్క గుర్రాన్ని మారుస్తారు. అక్కడ ఒక నమ్మకమైన కాపలా కాయువాడు ఎదురు చూస్తుంటాడు, నిలబడి మహ్మద్ మృతుల నుండి తిరిగి లేస్తాడని ఎదురు చూస్తుంటాడు, అప్పటి నుండి రెండువేల సంవత్సరములు గడిచిపోయాయి.
89
వారు యేసును నమ్ముతారు, వారు ఆయన ఒక ప్రవక్త అని చెప్పెదరు. ఆ మహ్మద్ రావడానికి ఆ పాత యెరుషలేము గోడల మీద, అక్కడ ఒక గొప్ప పెద్ద దేవాలయము ఉన్నది, మరియు ఒక చిన్న తక్కువైన దేవాలయము క్రింద ఇక్కడ ఉన్నది. అది యేసు కొరకు, చూశారా. “యేసు సిలువ వేయబడలేదు; వారు దానిని అంతా కలగలుపు చేశారు,” అని చెప్పెదరు. “అతడు ఒక గుర్రాన్ని తీసుకొని మరియు స్వారీ చేస్తూ వెళ్ళిపోయెను,” అని చెప్పెదరు, చూశారా. ఇప్పుడు, వారు దానిని నమ్ముతారు.
వారు వారి కండ్ల మీద ఎరుపు మచ్చను కలిగియున్నారు. వారి గుంపులు ఇండియాకు వెళ్ళియున్నవి, మీరు దానిని గమనించండి. మై, వారు అక్కడ వేలకొలదిగా నిలబడియున్నారు.
90
మరియు అప్పుడు డాక్టర్ రీడ్ హెడ్ చెప్పాడు, అతడు అక్కడ నిలబడియుండగా అతడు అడిగాడు, “ఇప్పుడు, మీరు ఆ పాత చనిపోయిన ప్రవక్తను వదిలివేసి, ఎందుకు మృతులలో నుండి లేచినటువంటి, జీవించుచున్న క్రీస్తును అంగీకరించకూడదు?” ఇప్పుడు, అతడు ఒక పండితుడు మరియు అతని మాటలు ఎలా ఉపయోగించాలో అతనికి తెలుసు.
ఆ మహ్మదీయుడు అతని వైపు చూచి చెప్పాడు, (తెలివైనవాడు, చదువుకలిగిన వ్యక్తి, ఇక్కడే అమెరికాలోనివాడు, ఇక్కడే చదివినటువంటి వాడు) అతడు చెప్పాడు, “అయ్యా, దయగల అయ్యా, నా చనిపోయిన ప్రవక్త కంటే మీ యొక్క తిరిగి లేచిన యేసు నా కొరకు ఎక్కువ ఏమి చేసాడు?” చెప్పెను, “నా చనిపోయిన ప్రవక్త నాకు చనిపోయిన తర్వాత జీవితము ఉంటుదని వాగ్దానము చేసాడు, అలాగునే మీ యేసు కూడ చేసాడు.” మంచిది, అతడేదో కలిగియున్నాడు. “ఇప్పుడు, వారిద్దరూ పుస్తకములు వ్రాసారు. నేను మహ్మద్ వ్రాసిన దానిని నమ్ముచున్నాను. వారిద్దరూ జీవాన్ని వాగ్దానం చేసారు.” “నా మహ్మద్ ప్రవక్త కంటే నా కొరకు యేసు ఇంకేమైనా ఎక్కువ చేయగలడు?”
మంచిది, ఆ మనిషి, సాధారణ సత్యాలలో, అది సత్యమే, అతడు అన్నాడు, “కాని దయగల అయ్యా, ఒక నిమిషం.” అతడు అన్నాడు, “నా మహ్మద్ ప్రవక్త ఎన్నడూ మీ యేసు వలె వాగ్దానము చేయలేదు. మీ యేసు వాగ్దానం చేసాడు... వారు చెప్పారు, 'ఆయన తిరిగి లేచాడు' మరియు యుగ సమాప్తివరుకూ, సదాకాలము మీతో కూడ ఉండెదను, మరియు ఆయన అవే చేసిన అద్భుతములు మరియు సూచక క్రియలు మీరు కూడా చేయుదురు; యుగ సమాప్తి వరుకూ ఉండెదను, మీరు రోగులను బాగుపరచెదరు, మరియు చనిపోయనవారిని తిరిగి లేపుదురు, మరియు కుష్ఠురోగులను శుద్ధి చేయుదురు, మరియు దేయ్యములను వెళ్ళగొట్టెదరు.” చెప్పాడు, “నేను పూర్తి క్రైస్తవాన్ని చదివియున్నాను.” చెప్పాడు, ఇప్పుడు బోధకులైన మీరు యేసుక్రీస్తును ఉత్పత్తి చేయుట నన్ను చూడనివ్వుము, మరియు నేను యేసును మృతులలో నుండి తిరిగి లేచాడని నమ్ముతాను. కాని, దానిబయట... మహ్మద్ ప్రవక్త మాకు అలాంటి కార్యలు వాగ్దానం చేయలేదు, అతడు కేవలం మరణము తర్వాత జీవాన్ని వాగ్దానం చేసాడు, మరియు ఆ అసలైన అదే కార్యాన్ని నీవు భోదించి, మరియు మరొక దానిలోనికి దాటిపోతావు.“ ఆ మనుష్యుడు సత్యము; ఆ మహ్మదీయుడు ఖచ్చితంగా సత్యమైయున్నాడు.
91
డాక్టర్ రీడ్ హెడ్ అక్కడ నిలబడి మరియు చెప్పి ఏడ్చాడు, చెప్పాడు, “బ్రదర్ బ్రెన్హాం, నేను, నా గురించి ఆలోచించాను, మరియు అతడు త్వరితముగా ఇక్కడకు వచ్చి, మరియు అక్కడకు వెళ్ళాడు, మరియు నేను నా చేతులను అతనిపై ఉంచాను, మరియు అతని మీదకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము వచ్చియున్నది. మరియు ఇప్పుడు అతడు దర్శనములు మరియు సమస్తమును చూడగలుగుచున్నాడు. ఇప్పుడు, ఆ మహ్మదీయునిని అతనిని (రీడ్ హెడని) కలవనివ్వండి! అతడు ఒక విభిన్నమైన వ్యక్తి.
మన యేసు మరణిములో నుండి తిరిగి లేచాడు, ఆయన ఈ దినమున జీవించుచున్నాడు అని నేను చెప్పుదును. మరియు అప్పుడు ఆయన చేసిన ఆ అన్ని అద్భుతములు మరియు సూచక క్రియలు నేడును చేయును, మరియు ప్రాధమిక ప్రజలైన మీరు చుట్టూ కూర్చొని దానికి దూరంగా వివరించడానికి ప్రయత్నించి, మరియు బైబిలోని అతి ప్రధానమైన భాగమును మీరు తప్పిపోవుచున్నారు. అది ఖచ్చితంగా వాస్తవము. యేసుక్రీస్తు, ఆ తిరిగి లేచిన దేవుని కుమారుడు, నీ ద్వారా భాషలతో మాట్లాడగలడు, ఆయన నీ ద్వారా ప్రవచించగలడు, ఆయన నీ ద్వారా దర్శనములు చూడగలడు, ఆయన నీ ద్వారా అన్యభాషలను అనువదించగలడు, మరియు అదంతా ఆయనలో బాగమైయున్నది.
మరియు ఆయనలో నుండి ఈ భాగాన్ని తీసుకొని మరియు ఆయనలోని ఆ భాగాన్ని వదిలి వేయుచున్నారు. నన్ను రెండుగా కత్తిరించి(కోసి) మరియు నా క్రింద భాగాన్ని మరియు నా కాళ్ళను తీసుకొని మరియు నన్ను వీరు (పూర్తిగా) పొందకున్నారు, అని చెప్పుచున్నారు, ఇక్కడున్న ఈ భాగాన్ని నీవు పొందుకోలేదు.
మీరెవరైనా నన్ను మీరు పూర్తిగా పొందుకొంటేనే... మరియు ఆ కారణము చేతనే దేవుడు చెప్పిన సమస్తమును సత్యము అని సంపూర్ణ సువార్త బోధకుడనైన నేను నమ్ముచున్నాను. ఆమెన్! మహిమ! నేను ఇప్పుడే సరిగ్గా ఒక పరిశుద్ద-గుండ్రాయిగా అనుభూతి చెందుతున్నాను. అవునయ్యా. నేను దానిని నమ్ముచున్నాను.
92
ప్రశ్న: ముత్తయి 24:29 చెప్పుచున్నది, “చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, మరియు ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఇది ఎత్తబడుటకు ముందు జరుగునా! లేక ఎత్తుబాటు తరువాత జరుగునా! లేక యేసు వచ్చి భూమి మీద పరిపాలన చేయు ముందు జరుగునా?
నా దీన నమ్మకములో, ఇప్పుడు, నేను కాదు... నాకు తెలియదు, అతడు అక్కడ ముత్తయి 24 గురించి మాట్లాడుతున్నాడని నేను తలంచుచున్నాను. ఇప్పుడు, యేసు చెప్పిన, ఆ నక్షత్రములు మరియు అవి పడిపోవుట అనేవి, భూమి మీద శ్రమల కాలానికి, ముందుగా జరుగునని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు, ఒక నిజమైన హస్యమైన ఆలోచన నాకు వచ్చింది, ఇక్కడ చాలామంది దానిగురించి నాతో అంగీకరించరు, మనము వీటిగుండా వెళ్ళెదమని కొంతమంది పూర్వికులు భోధించుట విన్నానని నేను అనుకొంటున్నాను. చూడండి, సంఘము శ్రమల కాలము గుండా వెళ్ళునని నేను నమ్మను. నేను నమ్ముచున్నాను సంఘము... చూడండి. ఆ పాత నిబంధన యొక్క ఛాయ ద్వారా మాత్రమే నేను క్రొత్త నిబంధనను భోధించెదను, సబ్బాతుకు సాదృశ్యంగా పరుశుద్దాత్మ ఎలాగున ఉన్నదో మరియు అవి అన్నీ ప్రతీదానికి వెనుక అక్కడ ఛాయ ఉన్నది.
93
ఇప్పుడు, వెనుక నున్న పాత నిబంధనలో చూడండి. తెగుళ్ళు కుమ్మరించబడుట నేను చూచినప్పుడు, వారు ఐగుప్తులో ఉండిరి. వారు లేరా? మరియు దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశమునకు తీసుకు వచ్చుచున్నాడు. అది నిజమేనా? మరియు ఇశ్రాయేలునకు ఎన్నడూ ఒక తెగులు కూడ లేదు. ఆ తెగుళ్ళు మాత్రమే... అది జరగాడనికి ముందుగా వారు గోషేనుకు వెళ్ళారు. అది నిజమేనా? మరియు సూర్యుడు కాంతి తగ్గిపోలేదు, ఏ దోమలు రాలేదు, ఏ కప్పలు అక్కడ లేవు, ఏ పేలు అక్కడ లేవు, ఏ తుఫానులు అక్కడ లేవు, ఏ మెరుపులు అక్కడ లేవు, అక్కడ ఏ పశువులు చంపబడలేదు, మరియు సమస్తము వారు గోషేనులో భద్రపరచబడియున్నారు. అది నిజమేనా? అది శ్రమల కాలానికి ముందుగా సంఘము వెళ్ళిపోవుటకు మాదిరిగా ఉన్నది. యేసు చెప్పెను, “ఈ సంగతులు జరుగుట నారంబించినప్పుడు, మీ తలలు పైకెత్తుకొనుడి, మీకు విడుదల సమీపించియున్నది,” చూశారా.
నేను నమ్ముచున్నాను ఆ చంద్రుడు, మరియు సూర్యుడు మరియు నక్షత్రాలు... అప్పుడు వారు దానిని చెప్పినట్లు... నేను ముందుకు వెళ్ళి దానిని చదివెదను, చెప్పెను, “మరియు మనుషులు పరుగెత్తి తమ్మును దాచుకొనెదరు మరియు ఆ... మరియు వారి మీద పడమని... వారంతట వారే చంపుకొనచూతురు, మరియు అది జరగదు,” మరియు సమాస్తమును. అది శ్రమలకు ముందుగా జరుగునని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు, గమనించండి. శ్రమల కాలము వచ్చును... శ్రమలు తాకగానే, సంఘము పైకి వెళ్ళిపోవును. ఇప్పుడు గుర్తించుకొనండి, కేవలం ఆ పరిశుద్ధాత్మ లేనటువంటి సాధారణమైన సంఘము శ్రమల కాలము గుండా వెళ్ళును. కేవలము ఎన్నిక చేయబడిన వారు మాత్రమే దానిని దాటి వెళ్ళుదురు.
ఓ, నిమిషము పాటు ఇక్కడ నేను ఏదో గట్టిగా రుద్దగలను. మీరు ఇంకొక మూడు నిమిషములు నాకు ఇవ్వగలరా? ఆ ఎత్తబడేవారిని ఏమని పిలుస్తారు? శేషము. అది నిజమేనా? మంచిది.... నా భావము, అది వధువు. ఇప్పుడు, శేషము విడువబడును.
94
ఇప్పుడు, ఒక స్త్రీ ఒక గౌను మాదిరిని కత్తిరించాలనుకొన్నప్పుడు, మీరు దానిని గురించి మాట్లాడెదరు. ఆమె ఆ మంచిదానిని (అసలైన దానిని) దానిమీద పెట్టును (అది నిజమేనా?), ఆ అసలైనదాని ముక్క మరియు దాని క్రింద ఆ మాదిరిని పెట్టును, ఆ కత్తిరించవలసిన మాదిరిని ఆమె సరిపెట్టును. నిజమేనా?
ఓ సోదరుడా, ఇది నిజముగా నీకు మంచిగా ఉండును. ఎవరు ఎన్నిక చేసారు? దేవుడే ఎన్నుకొన్నాడు! అది నిజమేనా? అది నేను చెప్పటలేదు; అది ఆయనే చెప్పాడు. మరియు ఆయన ఎన్నుకొన్న వారి మీద ఆయన మాదిరిని పెట్టుచున్నాడు. అది నిజమేనా?
ఇప్పుడు, అక్కడ పెండ్లి కుమారుని కలుసుకోవడానికి పదిమంది కన్యకలు బయలుదేరి వెళ్ళారు. అది నిజమేనా?
“కన్యక” అనగా ఏమిటి? కన్య అనగా “స్వచ్ఛమైన పరిశుద్దమైనది.” అది నిజమేనా? బాలికైన కన్యక అంటే ఎవరు? ఎన్నడూ, ఎవరూ తాకనటువంటిది; ఆమెయే ఒక కన్యక. స్వచ్ఛమైన ఓలీవ్ నూనె వలనే స్వచ్ఛమైనది అనగా ఏమిటి? దాని అర్ధం, అది శుద్దమయ్యే వరుకూ అది కాచబడాలి, అదే స్వచ్ఛమైనది. స్వచ్ఛమైన బంగారము అనగా ఏమిటి? ఆ చెత్త అంతయు... అది వేడి చేయబడి మరియు సమస్తము, మలినాలు అంతయును పోయేవరుకు కాల్చబడుతుంది. అది నిజమేనా? ఆ ఇనుము మరియు పైరైట్ అంతా మరియు సమస్తము ఏదైననూ, అది కాల్చబడవలసియున్నది; అదే దాని యొక్క కన్యత్వం.(స్వచ్ఛదనం.)
95
ఇప్పుడు, పెండ్లి కుమారుని కలుసుకోవడానికి అక్కడ పదిమంది వెళ్ళియున్నారు, యేసు అలాగునే చెప్పెను. అది నిజమేనా? ఎంతమంది దానిని అంగీకరించుచున్నారో, “ఆమేన్” చెప్పండి ఆయనను కలుసుకోవడానికి పదిమంది వెళ్ళారు. ఇప్పుడు, గమనించండి, వారందరూ పరిశుద్దులే. మంచిది, పరిశుద్దులగా ఉండుటకు వారు శుద్దీకరించబడవలసి యున్నది, ఎందుకనగా దేవుడు కలిగియున్న శుద్ధిచేయబడే పరిశుద్ధ ప్రవాహము శుద్దీకరణ మాత్రమే. అది నిజమేనా?
ఇప్పుడు, గమనించండి. వారు పదిమందియును శుద్దీకరించబడ్డారు, కాని ఐదుగురు వారి దివిటీలో నూనె కలిగిలేరు, మరియు ఐదుగురు వారి దివిటీలో నూనె కలిగియున్నారు. అది నిజమేనా? నూనె దేనికి సాదృశ్యముగా ఉన్నది? ఇప్పుడు, స్వచ్ఛత, కన్యత్వము కాదు. నూనే “పరిశుద్ధాత్మను” సూచిస్తుంది.
96
ఇప్పుడు, నేను దీనిని చెప్పుచున్నట్లయితే... మరియు కొద్ది సమయం బాధపెట్టుదను, అలా చేయాలని నా భావము కాదు. ఇప్పుడు, నన్ను మన్నించండి, మరియు సంఘము నుండి దూరము కావద్దు, నేను ఈ ప్రసంగ వేదిక మీద మీకు సహయపడుటకే ఉన్నాను, చూశారా. ఇప్పుడు, చూడండి. నేను దానిని మీకు చూపించనివ్వండి.
ఆ నాజరీను బోధలు, పిల్గ్రిమ్-హోలీనస్ మరియు వారి కంటే పరిశుద్దముగా జీవించే సంఘము భూమి మీద మరెక్కడా లేదు. అది నిజమేనా? వారు సంపూర్తిగా శుద్ధీకరణ యొక్క (పవిత్రతను) నమ్మెదరు, వారి స్త్రీలు ఉంగరములు మరియు మరేది ధరించరు. పవిత్రత మరియు శుద్దీకరణ, ఏ మార్గములోనైనా వారు సమ్మెదరు. ఆ హోలినెస్ సంస్థలు, లిగలిస్ట్ లో, ఆ వారియొక్క బోధలు, వారు దానిని నమ్మెదరు. పరిశుద్దత! స్త్రీలు పొడవైన జుట్టును కలిగియుండి, పొడవైన దుస్తులు ధరించెదరు. పురుషులు కనీసం వారి చొక్కా చేతులును కూడ పైకి మడత పెట్టరు. వారిలో చాలామంది, వారు తాకరు కనీసం... పొగత్రాగుట, మద్యపానము ఏదైనా... ఏదీ చేయరు, చూశారా. పరిశుద్దత! నీవు వారు జీవించినంత పరుశుద్దునిగా జీవించలేవు.
కాని అదే నాజరీను సంఘము, ఒక వ్యక్తి సంఘములో భాషలలో మాట్లాడినట్లయితే, అతడు ద్వారము వెలుపల నుండును. మరియు వారు చెప్పెదరు, వారు ఒకరితో ఒకరు కూర్చొనరు. ఇప్పుడు, అది నిజము. మీరు దానిని నమ్మినట్లైతే, ఒకసారి ప్రయత్నించి, కనుగొనండి. దానిని ఒకరి కనుగొనండి. వారు దాని గురించిన తలంపునే ద్వేషిస్తారు. “అది దెయ్యము!” అని వారు చెప్పారు.
97
వారిలో అయిదుగురు... వారు పదిమంది కన్యకలు, అయిదుగురు తమ దివిటీలలో నూనెను కలిగిన బుద్దీగల కన్యకలు, మరియు మిగిలిన అయిదుగురు పవిత్ర, మరియు పరిశుద్ధముగా ఉన్నారు, కాని వారు నూనె కలిగిలేరు (పరిశుద్ధాత్మ లేకుండా వారు శుద్దీకరించబడ్డారు).
“భూమీ మీద సాక్ష్యమిచ్చువారు ముగ్గురు : అనగా నీరు, రక్తము, ఆత్మ.” పరిశుద్ద యోహాను 5:7... I యోహాను 5:7, మరోక విధముగా, చెప్పెను, “పరలోకమందు సాక్షమిచ్చువారు ముగ్గురు: తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ, ఈ మూడు ఒక్కటే.” కాని భూమి మీద సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు: నీరు, రక్తము, మరియు ఆత్మ, అవి ఒక్కటి కాదు, కాని అది ఒకదానినిగా అంగీకరించును.
ఇప్పుడు, నీవు కుమారుడు కలిగి లేకుండా, తండ్రిని కలిగియుండలేవు. తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మయు లేకుండ పరిశుద్ధాత్మను కలిగియుండలేవు. వారు ఒక్కటైయున్నారు.వారు వేరుపరచబడరు.
కాని నీవు శుద్ధీకరణ లేకుండా నీతిమంతునిగా తీర్చబడగలవు, మరియు పరిశుద్ధాత్మ లేకుండానే నీవు శుద్ధీకరింపబడగలవు, పవిత్రత, ఒక పరిశుద్దమైన జీవితాన్ని జీవించుట, మరియు దైవభక్తిని కలిగియుండుట, మరియు స్వస్థతా శక్తి లేదనుట, మరియు భాషలలో మాట్లాడుట, మరియు దేవుని గొప్ప వరములు - మరియు ప్రతీ ఒక్కరిలో అక్కడ ఉన్నాయి.
98
అక్కడే తమ దివిటీలలో నూనె కలియున్నటువంటి అయిదుగురు బుద్దిగల కన్యకలు ఉన్నారు; ఎత్తబడే విశ్వాసం, అన్నీ సూచక క్రియలు, అద్భుతాలు, ప్రవచనాలు, మరియు సమస్తమును నమ్మెదరు. మరియు ఈ అయిదుగురిగా కొట్టవేయబడిన శేషము తీసుకొనిపోబడును.
మరియు వారిలో మిగిలిపోయిన వారు ఇంకనూ కన్యకలుగానే ఉండి మరియు తప్పిపోకుండా ఉండెదరు, కాని శ్రమల కాలము గుండా వెళ్ళెదరు. యేసు చేప్పెను, “వారు ఉండెదరు...”
మరియు వారు చెప్పెను, “మాకు కొంత నూనెను ఇవ్వండి. మాకు ఇప్పుడు పరిశుద్ధాత్మ కావాలి.”
ఇప్పుడు, జెకర్యా 4, అది పరిశుద్ధాత్మ అని ఎవరైనా ఎరుగుదురు, మరియు, ఓ, యాకోబు 5:14, అది పరిశుద్ధాత్మకు సూచన అని అందరికి తెలుసు. ఇప్పుడు, వారు చెప్పెదరు... ఆ కారణముచేతనే మనము నూనెను సూచిస్తున్న పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. ఇప్పుడు, “ఆత్మ యొక్క నూనె,” అని బైబిల్ చెప్పుచున్నది.
99
ఇప్పుడు, వారు పరిశుద్ధాత్మను కలిగియున్నారు: మరియు వీరు శుద్దీకరించబడియున్నారు. వారు శుద్దీకరించబడినవారై పరిశద్దాత్మను కలిగియున్నారు, ఆ అన్నీ దృగ్విషయాలు మరియు సమస్తమైన దేవుని శక్తిని నమ్మొదరు. దేవుడు ఇక్కడ పలికిన ప్రతీ దానిని, వారు కలిగియున్నారు, దానిని నమ్ముచున్నారు. వీరే కొనిపోబడతారు.
మరియు వీరు అడుగుతారు, “మాకు ఇవ్వండి, ఇప్పుడు మాకు ఇవ్వండి.”
చెప్పెదరు, “మాకు సరిపడినంత దానిని మాత్రమే మేము పొందుకున్నాము,” మరియు దూరంగా వారు ఎత్తబాటులోనికి వెళ్ళిపోయెదరు.
మరియు అక్కడ, “వెళ్ళి దానిని అమ్మువారి దగ్గర కొనండి,” అని వారు చెప్పెను. మరియు వారు అప్పుడు పరిశుద్ధాత్మను పొందటానికి ప్రార్ధించి ప్రయత్నించెదరు, కాని ఆ అన్యుల కాలము ముగించిబడి మరియు శ్రమలు లేచును, మరియు ఆయన చెప్పెను, “వారు వెలుపటి అంధకారములోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పుయు, రోదనము, పండ్లు కొరుకుటయే ఉండును.” కాని రెండవ పునరుత్థానములో వారు మేకలలో నుండి వేరుచేయబడిన గొర్రెలవలె ఉందురు, కాని ఎన్నడూ వధువు కానేరరు, ఎన్నడూ ఎన్నుకోబడిన వారు కాలేరు. అదే ఆ శేషించబడిన స్త్రీ సంతానము.
100
శేషము అనగా ఏమిటి? కొట్టివేయబడి, విడువబడినటువంటి భాగము. అదే రకమైన ఉత్పత్తి. అది నిజమేనా? ఒక పెద్ద గుడ్డలో నుండి నీవు వేసుకునే వస్త్రమును కత్తిరించాలనుకొన్నట్లయితే, మరియు నీవు ఆ పెద్ద గుడ్డ విప్పి (పరచి) మరియు దానిలో నుండి కత్తిరిస్తావు. ఆ మాదిరిని ఉంచి నీవు చేసేది నీ వ్యాపారము. ఆ మాదిరిని ఉంచి ఆయన చేసేది అది దేవుని వ్యాపారము; ఆయన దానిని సరిగ్గా కత్తిరించి బయటకు తీస్తాడు. అది నిజమేనా? మరియు ఇప్పుడు ఇది, ఆ వస్త్రమును తీయగా - మిగిలిన పెద్ద గుడ్డ ఇక్కడ వదిలి వేయబడుతుంది, ఆ పెద్ద గుడ్డలోని మంచి భాగము ఆ వేసుకొనే వస్త్రములో ఉంటుంది. అది నిజమేనా? కాని అది దేవుని ఎన్నికైయున్నది. దేవుడు తన సంఘాన్ని ఎన్నుకొన్నాడు. దేవుడు తన సంఘాన్ని ముందు నిర్ణయంలోనే ఎన్నుకొన్నాడు. దేవుడు ఆయన సంఘాన్ని జగత్తుపునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు; ఆయన సంఘాన్ని ముందే నిర్ణయించాడు, మరియు ఆ సంఘాన్నే ఆయన బయటకు తీయును, మరియు ఆ మిగిలిన వదిలివేయబడిన శేషము శ్రమల కాలము గుండా వెళ్ళును.
101
మరియు అక్కడే చాలా మంది బైబిల్ పండితులు నేటి దినాన్ని కలగలుపు చేయుచున్నారు, ఆ వధువు ఆ శ్రమల గుండా వెళ్ళునని వారు తలంచుచున్నారు. ఒక వ్యక్తి నాతో చెప్పెను, చెప్పెను “నేను నీకు చెప్పలేను, బ్రదర్ బ్రెన్హాం.” చెప్పెను, “వధువు పరలోకములో ఉండుట నేను చూచాను, మరియు వధువుతో యుద్దము చేయడానికి ఆ ఘటసర్పము తన నోటి నుండి నీటిని వెళ్ళగ్రక్కుతున్నది, మరియు ఆ సీనాయి కొండపై నిలబడునటువంటి, ఆ లక్షా-నలబై-నాలుగువేల మందే ఆ వధువు.”
నేను అన్నాను, “ఓ, కాదు, కాదు, కాదు, కాదు. నీవు కలగలుపు చేయుచున్నావు. వధువు పరలోకములో ఉండును.” మరియు స్త్రీ సంతానము యొక్క శేషము ఆమె కాదు. ఆ మాదిరి కాదు, ఆ శేషము అక్కడ ఉన్నది మరియు ఆ హింసించుట (రోమా అధిపతి) కాథోలిజమ్ గొప్పదిగా చేయబడినప్పుడు మరియు వారు ఆ గొప్ప సంఘములో వారి అధికారములన్నీ ఏకము చేయుదురు.
102
ఎందుకు, వారు దానిని సరిగ్గా పొందారు... తరువాత రాత్రి అది టెలివిజన్ అది వచ్చెను. ఆ మెతడిస్టు సంఘము మెతడిస్టును మరియు బాప్టిస్టును మరియు అన్నీ చర్చి-అఫ్-క్రైస్ట్..... కాథోలిజంతో ఐక్యము చేయుటకు ప్రయత్నించుచున్నది. మరియు ఒకే సమమైన బలిపీఠము ముందు నిలబెట్టుచున్నది. ఒక కమ్యూనిస్టుగా ఉండుటకు ఆ తదుపరి రాత్రి అతడు ఉంచిన న్యాయవిచారణ మీద ఆ బిషప్ చెప్పినది ఏమిటి? నేను అక్కడ నిలబడి, నా అంతట నేను ఆ టెలివిజన్ లో దానిని నేను చూచాను. వారి యొక్క అన్నీ గుంపుల వారు ఉన్నారు! మరియు ఆ సమయము వచ్చినప్పుడు, అక్కడ ఒక ఒత్తిడి లేచును మరియు పరిశుద్ధాత్మ మెతడిస్టు మరియు బాప్టిస్టుల మీద కుమ్మరించబడును. మరియు వారంతా భాషలతో మాట్లాడెదరు, దేవుని స్తుతించెదరు, మరియు రోగులందరిని స్వస్థపరిచెదరు మరియు ప్రవచించెదరు, మరియు అన్ని సూచక క్రియలు మరియు అద్భుతములు రాబోవుచున్నవి. ఎన్నుకోబడిన వారు పైకి వెళ్ళుదురు, మరియు ఆ శేషము ఇక్కడ విడిచిపెట్టబడి, శ్రమల కాలము గుండా వెళ్ళుదురు. మరియు కాలపు ముగింపులో ఏమి జరుగుతుందో వారు చూచినప్పుడు, వారు హత సాక్షులగుటకు పోయెదరు.
103
అప్పుడు చూడండి. మీరు అడుగవచ్చును, “మంచిది, ఇప్పుడు, బ్రదర్ బ్రెన్హాం నీ భావమేమిటో నాకు చెప్పండి, వారు వెళ్ళెదరా... ఆ ప్రజలు ఆ ధవళ సింహసమును తూర్పు నొద్దకు పోయెదరా?” ఆ వధువు ఎన్నడూ తీర్పు తీర్చబడదు. లేదండీ. ఆమె క్రీస్తులో ఉన్నది. నీవు క్రీస్తులోనికి ఎలా చేరెదవు? “ఒక్క ఆత్మ ద్వారా మనమందరమూ ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.” అది నిజమేనా?
ఇప్పుడు, చూడండి, ఇక్కడ చూడండి. బైబిల్ చెప్పుచున్నది, “తీర్పు ఏర్పాటు చేయబడెను, మరియు గ్రంథములు తెరువబడెను.” అది నిజమేనా? పాపులు గ్రంథములు, “మరియు మరొక గ్రంథము తెరువబడెను,” అది జీవగ్రంథము, మరియు ప్రతీమనిషి ఈలాగు తీర్చబడును. అది నిజమేనా? మరియు ఈ తీర్పు తీర్చువారు ఎవరు? యేసు మరియు పరిశుద్దులు. ఆయన చెప్పెను, “ఆయన గొర్రె బొచ్చు వంటి తలవెంట్రుకలు కలిగి వచ్చి మరియు పూర్వదినములలో పరిచారము చేసెను.” మరియు చెప్పెను, “కోట్లకొలదిగాను, వేవేలకొలదిగానూ ఆయనతో వచ్చిరి మరియు తీర్పుచేయుటకు ఆయనకు పరిచారకులుండిరి.” ఇక్కడ యేసు ఒక రాజు మరియు రాణిగా తిరిగి వచ్చుచున్నాడు, ఆ వివాహ మహోత్సవము అయిపోయింది, మరియు ఆయన వివాహము చేసుకొనెను. ఇక్కడ రాజు మరియు రాణి నిలబడియున్నారు. మరియు అక్కడ ఆ శుద్దీకరించబడిన గుంపు నిలబడియున్నది. దేవుడు చెప్పెను, “ఇక్కడ నా కుడి ప్రక్కన నిలబడండి.” ఆ పాపులైనవారి గ్రంథము తెరువబడెను, “నా ఎడుమ ప్రక్కన నిలబడుడి.” ఇక్కడున్న వారిలో ఒక్కొక్కరు వారి యొక్క పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడియున్నవి.
104
మీరు చెప్పెదరు, “బ్రదర్ బ్రెన్హాం, నా పేరు అక్కడ వ్రాయుబడియున్నది. నేను వెళ్ళిపోయెదను!” ఒక్క నిముషం ఆగుము! ఇస్కరియోతు యూదా శుద్దీకరించబడ్డాడు. వ్యూ! సహోదరుడా, ఇప్పుడు మేల్కోనండి. మీ దృష్టిని నిలుపండి, కావున మీరు దానిని పొందుకొనెదరు, మీరు చూశారా.
ఇస్కరియోతు యూదా అతని ఆత్మయే నేటి దినమున అంత్యక్రీస్తుగా ఉన్నది. మీకు అది తెలియును. యేసు దేవుని కుమారుడు, దేవుని వద్ద నుండి వచ్చెను మరియు దేవుని యొద్దకు తిరిగి వెళ్ళెను. యూదా నాశన కుమారుడు, పాతాళము నుండి వచ్చెను మరియు పాతాళమునకు తిరిగి వెళ్ళెను. యేసు తనతో మారుమనస్సు పొందిన పాపిని తీసుకొనిపోయెను; యూదా తనతో మారుమనస్సు పొందని పాపిని తీసుకొనిపోయెను. “ఒకవేళ నీవు....” ఒకవేళ! ఒకవేళ! “ఒకవేళ నీవు దైవికంగా స్వస్థపరచువాడవైతే, దీని చేయుము. ఒకవేళ నీవు అయినట్లయితే, దీనిని చేయుము.” అయినను దేవుని వాక్యము మీద పశ్నార్ధకం. “అద్భుతాలు జరిగే దినములు గతించిపోయినవి. అది అలా అయితే, దీనిని నాకు చూపించు.” ఒకవేళ! ఒకవేళ! ఒకవేళ! చూశారా. “అదంతా సత్యము,” అని దేవుడు చెప్పెను.
105
ఇప్పుడు గమనించుము. ఇస్కరియోతు యూదా విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు, మరియు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి, బాప్తిస్మము పొందాడు. బైబిల్ చెప్పుచున్నది, “యేసు శిష్యులకు, తన శిష్యులకు బాప్తిస్మమిచ్చెను.” మంచిది.
పరిశుద్ద యోహాను 17:17, ఆయన వారిని బయటకు పంపే ముందుగా, ఆయన అన్నాడు, “తండ్రీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము.” మరియు ఆయన ప్రాయశ్చిత్తము చేయబడకముందే ఆయన వాక్యమైయున్నాడు, మరోక మాటలో, తండ్రి ముందుగానే చిందించబడిన నా రక్తమును బట్టి, నేను వారిని ప్రతిష్ఠించుచున్నాను.“
ఆయన వారికి అపవిత్రాత్మల మీద అధికారమిచ్చెను, మరియు వారు వెళ్ళి; మరియు దెయ్యములను వెళ్ళగొట్టిరి. అది నిజమేనా? వారు రోగులను స్వస్థపరిచారు. అది నిజమేనా? మరియు వారు తిరిగి వచ్చి, శుద్దీకరించబడి, సంతోషించుచూ, ఎగురుచూ, కేకలేయుచు, మరియు దేవుని స్తుతించిరి. అది నిజమేనా? మరియు చెప్పిరి, “దేయ్యములు కూడ మాకు లోబడుచున్నవి.”
మరియు యేసు చెప్పెను, “దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపవద్దు, కాని మీ పేర్లు పరలోకమందు గల గ్రంథములో వ్రాయబడియున్నవని సంతోషించుడి.” అది నిజమేనా? మరియు ఇస్కరియోతు యూదా వారితో ఉండెను, వారిలో ఒకనిగా బయటకు-పిలువబడి, శుద్దీకరింపబడ్డాడు, మరియు అతని పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వ్రాయబడియున్నది. ఒకవేళ అది తప్పు అయినట్లయితే, ముత్తయి 10లో దానిని చదవండి. ఆయన ప్రతీ ఒక్కరిని పిలిచెను, మరియు అక్కడ క్రింద, యూదాను మరియు ప్రతి ఒక్కరిని ఆయన పిలిచాడు, ఆపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి, వారిని ఆయన బయటకు పంపాడు.
106
ఇప్పుడు గమనించండి! మీ యొక్క భయాన్ని దూరము చేసే వస్త్రాన్ని దరించుకొనుడి. కాని యూదా ఆ సంఘము గుండా పైకి వచ్చి అక్కడ, సంఘము యొక్క ధర్మకర్తగా ఉండెను, పాస్టర్ తో కలసి పనిచేసెను, యేసు. కాని ఆ పెంతోస్తు సమయం వచ్చేసరికి, అతడు తన రంగులను చూపించెను. అతడేంటో అతడు చూపించాడు, మరియు చాలినంత అతని వినయముతో అతడు తనంతటతానే నాశనము చేసుకొన్నాడు మరియు తనంతట తానుగా ఆ అంజూరపు చెట్టు వంటి జాతికి చెందిన చెట్టుకు ఉరివేసుకొన్నాడు, ప్రవచనం నెరవేర్చబడటానికే అలా చేసాడు. మరియు అదే యూదా ఆత్మ వచ్చి మరియు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నది. యేసు చెప్పినట్లుగా, “దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి.” అతడు పైకి వచ్చి మరియు శుద్దీకరణను బోధించును, ప్రవిత్రత గల పరిశుద్దమైన జీవితం ఎలా ఉండాలో దానిని చెప్పును, కాని అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరియు ఆత్మ వరముల యొద్దకు వచ్చేసరికి, అతడు దానిని వ్యతిరేకించును! అతడు ప్రతీసారి తన రంగులను చూపించుచున్నాడు. ఆ ఆత్మ అక్కడే ఉన్నది.
మరియు యేసు చెప్పెను, “జాగ్రత్తపడుడి!” మరలా మత్తయి 24: “ఆ రెండు ఆత్మలు దరిదాపుగా ఒకేలా ఉండి, ఎన్నుకోబడిన వారిని సహితము మోసము చేయును...” అది నిజమేనా? ఆ మాదిరి అక్కడ ఉంచబడియున్నది... సోదరుడా, పాత-కాలపు విశ్వాసము, పరిశుద్ధాత్మ బోధకులు ఇక్కడ చుట్టూ ఉన్నారు మరియు వచ్చి దేవునితో సరిచేయబడుడి. అది నిజము. పైకి భక్తిగలవారి వలే ఉండి మరియు శక్తిని తిరస్కరిపవద్దు. ఆమేన్!
107
ప్రతీ ఒక్కరూ మంచిగా అనుభూతి చెందుచున్నారా?
మనమందరమూ పరలోకానికి వెళ్ళినప్పుడు,
అది ఎటువంటి ఆనందకరమైన రోజుగా ఉండును!
మనమందరము యేసును చూచినప్పుడు,
మనము జయోత్సహముతో పాడుచూ కేకలు వేయుదుము. మనమందరమూ పరలోకానికి వెళ్ళినప్పుడు,
అది ఎటువంటి ఆనందకరమైన రోజుగా ఉండును.
మనమందరమూ యేసును చూచినప్పుడు,
మనము జయోత్సాహముతో పాడుచూ మరియు కేకలు వేయుదుము.
హల్లెలూయ! ఒక్క నిమిషం లేచి నిలబడెదము. ఎంతమంది నీ పూర్ణహృదయముతో ఆయనను ప్రేమించుచున్నారు? మీ చేతులు పైకెత్తి, “ప్రభువునకు స్తోత్రము!” అని చెప్పండి. [సమాజము “ప్రభువునకు స్తోత్రము,” అని చెప్పుచున్నది.] “ప్రభువా, నేను ఆ సంపూర్ణ సువార్తను నమ్ముచున్నాను.” [సమాజము మరల దానిని చెప్పుచున్నది.] “నీ సేవకునిగా ఉండుటకు నాకు సహాయపడుము.” [సమాజము మరల దానిని చెప్పుచున్నది.] హల్లెలూయ! హల్లెలూయ! మీరు ఆయనను ప్రేమించుచున్నారా? బైబిల్ లో వారు...
108
ఒక స్త్రీ నాతో చెప్పినది ఒక... ఒక బాలుడు, అతడు ఈ రాత్రి వినుచుండవచ్చును, అతడు ఆ వీధికి ఎదురుగా జీవించుచున్నాడు, అతడు అక్కడకు వచ్చాడు, మరియు సహోదరి లూలా ఇక్కడికి సంఘానికి వచ్చుచున్నది. ఆమె ఆ వెనుక కూర్చుని కేకలు వేయుచున్నది, సహోదరుడా నెవిల్, నేను బోధిస్తున్నాను. మరియు ఆ బాలుడు నాతో చెప్పాడు... ఇప్పుడు, అతడు ఆ క్రిందనున్న మొదటి బాప్టిస్టు సంఘములో ఒక సండేస్కూల్ బోధకుడు. అతడు చెప్పాడు, “బిల్లీ, ఆ స్త్రీ ఏడ్చుచూ, దోర్లేంతవరుకూ నీ ప్రసంగాన్ని నేను చాలా ఆనందించాను, నిమిషానికి ఒకసారి, ”యేసు, వందనాలు! దేవునికి స్తోత్రము!“ అని ఆమె అంటున్నది. చెప్పాడు, ”ఎవరో వ్యక్తి చెప్పెను,“ (బ్రదర్ సీవార్డు) దొర్లుచూ, దేవునికి స్తోతం! ఆమెన్!” అని అంటున్నాడు. మరియు నేను “మీ యొక్క జన్మ హక్కులను విడిచిపెట్టుట,” గురించి బోదిస్తున్నాను, ఏశావు తన జన్మహక్కును అమ్ముకొన్నాడు. నేను దాని మీద ప్రసంగిస్తున్నాను. మరియు వారు కేకలు వేయుచు మరియు ఆ విధంగా చేస్తున్నారు, మరియు అన్నాడు, “ఊహ్” అన్నాడు, “అది నా వెనుక భాగంలో వణుకును పుట్టిస్తున్నది.” చెప్పాడు, “నేను అక్కడ నిలబడలేక పోయాను.”
నేను అన్నాను, సోదరుడా, నీవు ఎప్పుడైనా, పరలోకానికి వెళ్ళినట్లయితే, నీవు చనిపోయేంతగా గడ్డకట్టుకుపోతావు.“ నేను చెప్పాను, ”అక్కడ ఖచ్చితంగా పగలు రాత్రి పరలోకములో అరుపులు ఉంటాయు.“ మరియు సోదరుడా, అది నిజము. ఓ, అవునండి!
ఓ, నేను ఆయనను చూడాలనుకుంటున్నాను,
ఆయన ముఖమును చూచేదను,
అక్కడ ఆయన యొక్క రక్షణ కృపసు గూర్చి
నిత్యము పాడెదను;
ఆ మహిమకరమైన వీధులలో
నా స్వరాన్ని పైకెత్తెదను,
చింతలు అన్నీ గతించాయి,
చివరికి నిత్యమూ సంతోషించే గృహము;
ఓ, నేను ఆయనను చూడాలనుకొంటున్నాను,
ఆయన ముఖమును చూచెదను,
అక్కడ ఆయన యొక్క రక్షణ కృపను గూర్చి
నిత్యము పాడెదను;
ఆ మహిమకరమైన వీధులలో,
నా స్వరాన్ని పైకెత్తెదను;
చింతలు అన్నీ గతించాయి,
చివరికి నిత్యమూ సంతోషించే గృహము;
ఆమెన్! మంచిది, బ్రదర్ నెవిల్. దేవుడు నిన్ను దీవించును గాక. పైకి వచ్చి మరియు ముగించుము.