ప్రశ్నలు మరియు జవాబులు #1
VGR COUNT- 268 అది ఎక్కడనో నాకు తెలియదు. వారు వారు బహుశా దానిని సరిగా వ్రాసి ఉండక పోవచ్చును. వారు “యెషయా 4:24” అని చెప్పారు. యెషయా 4లో కేవలం ఆరు వచనములు మాత్రమే ఉన్నాయి. అందువలన నేను...మరియు లేకపోతే యెషయా 5:24 అని మీ భావమేమో నాకు తెలియదు. “యెషయా 4:24 ఎప్పుడు నెరవేరబోతుంది మరియు ఆ లేఖనము యొక్క అర్థమేమిటి?” మరియు యెషయా 4:24 లో ఆరు వచనములే ఉన్నాయి. మీరు గనుక... దానిని ఎవరు రాసినప్పటికిని, మీరు ఇప్పుడు దానిని ఆలోచించి, దానిని రాసి ఇచ్చినట్లయితే నేను దానిని తీసుకుంటాను, మీరు చూశారా. మీరు దేనిని సూచిస్తున్నారో నాకు తెలియడం లేదు. యెషయా 4:24, ఆ లేఖనము యొక్క అర్థమేమిటి మరియు అదెప్పుడు నెరవేరబోవుచున్నది?''
2
ఇప్పుడు, మిమ్ములను ఎక్కువసేపు ఉంచాలనుకోవట్లేదు. నేను ఒకదానిని తీసుకున్నాను ...సరే, సోదరుడా, కృతజ్ఞతలు. మరియు నేను-నేను కొన్ని స్థలములకు వెళ్ళవలసియున్నది, మరియు ఇది...మీకు తెలుసా, నేను ఆలోచిస్తున్నాను, ఇక్కడ ఒక లేఖనమును నేను కలిగియున్నాను... నన్ను క్షమించండి, అది మిస్టర్. బాక్స్టర్ నుండి ఒక ఉత్తరము. మరియు ఈ ఉదయకాలము ఆరాధనను ప్రారంభించడానికి ముందు, దీని నిమిత్తమే నేను-నేను మిమ్ములను నాతో కొద్ది నిమిషములు ప్రార్ధించాలనికోరుచున్నాను.
తరువాత కొన్ని రోజులలో నా విదేశీ పరిచర్యకు వెళ్ళినపుడు ఆ పరిచర్య నుండి వెలుపలకు వచ్చేసరికి చాలా మంచి ఉద్దేశాలతో నేను-నేను రావాలనుకొంటున్నాను. ఇప్పుడు సహోదరుడు బాక్స్ టర్ (Baxter) నుండి ఒక ఉత్తరాన్ని నేను పొందుకున్నాను. గత రాత్రి సహోదరుడు కాక్స్ (Cox) దానిని ఫోన్లో చదివి వినిపించి, ఈ ఉదయమున వారు దానిని నాకు ఇచ్చియున్నారు. వారు మరల తిరిగి ఏర్పరుచుటకు ప్రయత్నించుచున్నారు, ఇప్పుడు, మరలా మరియు నాకు-నాకు తెలియదు సాతాను నన్ను వెనక్కి పట్టు ఉంచుచున్నాడా లేదా దేవుడే నన్ను సరియైన సమయం కొరకు వేచి చూడమంటున్నాడా అనేది నాకు-నాకు తెలియదు. వారు తిరిగి వాటిలో కొన్నింటినైనా ఏర్పర్చాలని కోరుకుంటున్నారు, మరియు వారు వాటిని అక్టోబర్ నుంచి ఏర్పర్చుటకు ప్రయత్నించుచున్నారు. అక్టోబర్, నవంబర్, డిశంబర్, జనవరి, మొత్తం నాలుగు నెలలు ఇప్పుడు వారు తిరిగివాటిని ఏర్పాటు చేశారు.
3
మరియు దర్శనము వచ్చియున్నది, ఖచ్చితముగా ఏమి జరుగబోతుందో అనేది, ఇక్కడ నా పరిశుద్ధ గ్రంథములో రాయబడియున్నది. కానీ ఎప్పుడో నాకు తెలియదు. ఇప్పుడు, నేను ప్రజలతో (మంచి విశ్వాసముతో) చెప్పియున్నాను. వారు నాకు ఏమి చెప్పారో, అది ఈ సమయములో జరుగుటకు సిద్ధముగా ఉన్నది.
ఇప్పుడు దాని గురించి నేను నిజాయితిగా లేనేమో అని, “ఓహ్...ఏమిటి... ఆయన ఎప్పుడు పొందుకోవడానికి వెళ్తాడు...ఆయన ఎప్పుడు వెళ్తున్నాడు?” అని ప్రజలు ఆ రీతిగా ఆలోచిస్తారని నేను నమ్ముచున్నాను.
కానీ నేను ఆ ఉత్తరాలు పొందుకున్నప్పుడు మరియు వారు నాకు ఇలా చెప్పారు, “మంచిది, నీవు దానిని ఇప్పుడు ఏమైనప్పటికీ చేయలేవు, అక్కడ ఇది జరగవలసియున్నది, ఇది జరగవలసియున్నది.” అప్పుడు నేను చేయలేదు... (వారికి) ఆ ప్రజలకు ఎదురుపడడానికి నేను-నేను చాలా చింతించాను. ఏమి చేయాలో నాకు తెలియదు. కానీ ఒక్క విషయం, నేను దీనిని చేస్తాను, మరియు మీరంతా నాతో ఉన్నారు. మరియు నేను దానిని దేవునికి అప్పగించి మరియు “ఇప్పుడు, నీవు సిద్ధముగా ఉన్నప్పుడు ప్రభువా, నేనును సిద్ధమే” అని చెప్తాను. చూశారా? మరియు ఇప్పుడు నేను కొద్దిగా...
4
కొన్నిసార్లు సంఘము దాని పరిధి దాటినపుడు, ఇప్పుడు ఏదో విషయము అయినా, లేక మరొక విషయమేదైనను అది అంతే. మీకు తెలుసా, అక్కడ ఆ విషయములు ఆవిధముగా జరుగుతూ ఉంటాయి. అది ఒకవేళ సాతాను దానిని
చేయుటకు ప్రయత్నించుచుండవచ్చును. అందుచేత ఈ ఉదయము మనము ప్రార్థించుచున్నప్పుడు... మరియు ఈ వారమంతా మీరు ప్రార్థిస్తున్న ప్రతీసారి దేవునిని అడగండి... ఒక వేళ అది సాతాను అయితే, మార్గములో నుండి అది బయటకు పోయేటట్లుగా అడగండి. చూశారా? మరియు అది - మరియు అది ఆయన చిత్తమైయున్నట్లయితే, నన్ను ఇక్కడే ఉంచమనండి చూశారా? ఖచ్చితముగా ఏమి చేయవలెనో ఆయనకు తెలియును. అక్కడ వేరేది ఉన్నట్లయితే, ఆయన మరొక రీతిగా, చిత్రాన్ని సరిచేయును. ఆయనను దాటిపోయి ఎన్నడూ నేను వెళ్ళాలని అనుకోవట్లేదు. ఓహ్ నీవు అలా చేస్తే, అది ఒక భయంకరమైన విషయం. చూశారా? అందుచేత నేను-నేను ఇప్పుడే అనుభూతి చెందుతున్నాను. అది...అది-అది అయ్యి ఉండవచ్చును... ఏమి చెప్పవలెనో నాకు తెలియదు ఎందుకనగా నాకు తెలియదు.
5
మన ప్రియమైన సోదరుడు జార్జిరైట్ వలె, అతని యొక్క పరిస్థితులు మీకు తెలియును. తెలియదా? మరియు మీకు తెలుసు వైద్యులు అతనిని పంపించివేసి, ఒక వారం లేక అంతకంటే ఎక్కువలో సోదరుడు జార్జిరైట్ చనిపోతాడని ఊహించారు, చూశారా. నేను అతనిని చూడడానికి వెళ్ళినపుడు నేను ప్రార్థించాను మరియు అతని కొరకు నేను ఎరిగినంత యధార్ధముగా ప్రార్థించాను. మరియు నేను ఇంటికి వచ్చి మరియు ఏమి జరగబోతున్నదో అని ఆశ్చర్యపోయాను. మరియు కొన్ని రోజుల తరువాత, మంచిది నేను నేను గడచిన సోమవారం ఒక దర్శనమును పొందుకున్నాను. మరియు ఎదురుచూచుచున్నాను...
6
ఇప్పుడు నేను క్యాన్సర్ కోసము ప్రార్థించిన స్త్రీ అక్కడ అక్కడ యున్నది. మరియు ఆమె నిలబడుట నేను చూచుచున్నాను. మరియు ఆమె-ఆమె... వారు ఆమెను పరీక్షించడానికి కోసినప్పుడు, ఆమె క్యాన్సర్తో నింపబడియుండడంతో వారు తిరిగి కుట్లు వేసేసారు. చూశారా? కానీ ఆమె జీవించబోతున్నది. నాకు తెలియును.
కానీ, ఇప్పుడు సోదరుడు జార్జిరైట్, స్పష్టముగా దర్శనమును నేను పొందుకోలేదు. నేను వచ్చుచున్నాను...ఆ దర్శనములోనే, నేను బయటికి వచ్చి మరియు అతని-అతని స్థలాన్ని, అతని ఇంటిని నేను చూశాను. మరియు ఎక్కడయితే
చెట్లు ఉన్నాయో ఆ ఇంటి యొక్క ఎడమవైపున, చెట్లున్న చోట ఒక ఒక బుర్రచెట్టు (willowtree) సరిగ్గా దాని పైనుండి అక్కడ సరిగ్గా నా పిడికిలి అంత పెద్దగా ఉన్న బురదతో కూడిన మట్టిముద్దలు దొర్లివచ్చుట నేను చూశాను. మరియు నాప్రక్కగా నిలబడియున్న దూత, సమాధి గురించి మరియు బ్రదర్ జార్జి గురించి ఏదో చెప్పుట నేను విన్నాను.
ఇప్పుడు అది ఒకవేళ అదియే అయినట్లయితే, వారు తవ్వుతున్నది బ్రదర్ జార్జి యొక్క సమాధియే అని, లేక అది నాకు అలా కనిపించినదా...ఇప్పుడు-ఇప్పుడు గుర్తుంచుకొనండి, నేను దీనిని నిర్ధారణ చేయుటలేదు... మరియు నేను నమ్ముచున్నప్పటినుండి ఇక్కడ నుండి ప్రసారము చేయు విధానమును (P.A System) మనము కల్గియున్నాము, లేక రికార్డు చేయు విధానము (Recording System) ఎక్కువగా కల్గియున్నాము కాని ఇప్పుడు నేను పూర్తిగా దానిని వివరించాలనుకొంటున్నాను, వారికి చేసిన విధముగానే, ఇది అదేనని నేను ఆలోచిస్తున్నాను...
7
“అతడు జబ్బు పడిపోయాడు, అవును, అతడు బాగుపడలేడు, చూడండి, రక్తము గడ్డకట్టి, అతని ఊపిరితిత్తులలోనికి వెళ్ళిపోయి మరియు రక్తమును బయటికి చిమ్మేస్తుంది, అలాగే అన్నీ జరుగుతున్నాయి” అని వైద్యులు చెప్పిన తరువాత కూడా ఇంకనూ అతనిని దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముచున్న కారణం చేత అక్కడ ఉన్నకొంతమంది ప్రజలు గుంపుకూడి అతని వైపుచూసి నవ్వుతున్నారు. “అసలు చిన్న గింజ అయినా, అతని గుండెలోనికి గాని లేక అతని తలలోనికి గానివెళ్ళినా అది అతనిని పక్షవాతానికి గురిచేస్తుంది లేక అతనిని చంపేస్తుంది” అని అతడు చెప్పాడు చూసారా? మరియు అతనికి డబ్భైరెండు సంవత్సరములు, అతనికి కేటాయించిన సమయాన్ని దాటేసాడు.
కానీ అతనివైపు చూచి నవ్వేవారికి అతను సమాధిని తవ్వాలి, అది ఇదేనని నేను నమ్ముచున్నాను, మరియు ఇప్పుడు, అతను సమాధులను త్రవ్వేవాడని నాకు తెలియదు, కాని అతడు ఉన్నాడు. నేను... మరియు మీరు చూసారా? మరియు
వారి యొక్క సమాధులను అతను త్రవ్వుతాడని నేను ఆలోచిస్తున్నాను, అతడు చేయునది అదియే. మరియు సహోదరుడు జార్జెట్ ఆ సమాధి త్రవ్వుట లేక -లేక ఇవన్నీదేని గురించో అయినట్లుగా కనపడుతున్నాయి.
నేను ఇప్పుడే దేవుడిని అడిగాను, నాలుగు రాత్రుల నుండి అడుగుచున్నాను, దానిని మరలా నాకు చూపించమని, ఒక రోజు ఉదయాన్నే ఏడు లేక ఎనిమిది గంటల సమయంలో అది వచ్చియున్నది. అందువలన ఆయన దానిని తేటపరుచునని నేను నమ్ముచున్నాను. కానీనేను నా హృదయపూర్తిగా నేను నమ్ముచున్నాను... ఇప్పుడు, ఇది కేవలం సత్యము అని, నేను దానిని స్పష్టముగా పొందినపుడు, అతనివైపు చూచి నవ్వేవారి యొక్క సమాధిని అతడు తవ్వుతున్నాడని నేను చెప్పినపుడు నేను సరిగ్గా ఉ న్నాను. కాని నేను దానిని ఖచ్చితముగా చెప్పుటలేదు. అది సమాధిని త్రవ్వుట మరియు సహోదరుడు జార్జిరైట్గురించి ఏదో అయి ఉన్నది. అతని వైపు చూచి నవ్వేవారి యొక్క సమాధిని అతడు త్రవ్వుతున్నాడని నేను ఆలోచిస్తున్నాను.
8
ఇప్పుడు, దేవుడు ప్రేమయై ఉన్నాడు, మరియు, ఓహ్, కేవలము ఆయనను మన హృదయాలన్నింటితో ఆయనను ప్రేమించెదము.
ఇప్పుడు, ఈ ఉదయము, ఈ ప్రశ్నలన్నింటి మీదను మన సమయమును ఈ ఉదయము ఎక్కువుగా తీసుకోవాలని కోరుకోవట్లేదు. నాకు తెలిసిన పూర్తి జ్ఞానమంతటిని బట్టి నేను వాటికి సమాధానమిచ్చెదను. ఇప్పుడు, స్నేహితులారా, ఈ విషయాలన్నింటి మీద నేను చాలా పొరపాట్లు చేయుదును. నేను కేవలం-కేవలం మిగిలిన మనుష్యులవలె నేనూ మనిషినే. మరియు సహోదరుడు నెవిల్, లేక ఏ ఇతర పరిచారకులైనను, లేక మిగిలినవరెవరైన, నేను సమాధానాలిచ్చునట్లు వారును చేయగలరు. కానీ, నేను ఒక ఉద్దేశము కొరకు దీనిని చేయుచున్నాను, ప్రజల హృదయాలలో ఏ విధమైనవి ఉన్నవో కనుగొనుట కొరకు.
అప్పుడు, ఒక విషయము మీద నాలుగు లేక ఐదింటిని బయటకు లాగిచూచి, అప్పుడు నేను ఇలా అనుకొంటాను, “ఉహ్-ఓహో, మనము ఇక్కడ ఉన్నాము. చూశారా, మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియును, కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు సంఘములో ఉన్నవి” మరియు ఇప్పుడు ఆ-ఆ చిన్న ప్రశ్నల గురించి మరచిపోదాము. మరియు అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయము, మనయొక్క ప్రతి పాపము మరియు అతిక్రమములన్నింటిని యేసుక్రీస్తు యొక్క రక్తము శుద్ధి చేసిందని మనమంతా నమ్మినట్లయితే, దేవుని యొక్క ప్రేమ మరియు మాధుర్యతలో సంఘమును ఉంచి, మరియు కదిలించుట.
నీ ప్రక్కగా ఒక స్త్రీ కూర్చునియున్ననూ, లేక నీ ప్రక్కన పురుషుడు కూర్చునియున్ననూ, వారు, యేసు మరలా నిజముగా దృశ్యరూపములో రాడు అని నమ్ముచున్నట్లయితే, ఎలాగయిననూ, అలాగే నమ్ముచూ ముందుకు కొనసాగుచుండనీయండి. లేఖనము ప్రకారము వారితో మనము ఏకీభవించము. కానీ మాధుర్యత కొరకు సంఘాన్నిముందుకు కదులుచుండనీయుడి, ఎందుకనగా అక్కడ మనము చాలా మందిని పట్టుకొనుటకు వెళ్ళవలసియున్నది. కానీ సంఘము మాధుర్యతకు బయట ఉన్నట్లయితే, అప్పుడు నీవు నీవు సంఘమును బాధపెట్టెదవు, అపుడు ఆ కారణముతో నీవు బాధపడెదవు. నీవు... అది కేవలము... నీవు దానిని చేయకూడదు. కానీ మనము ఒక విషయము మీద ఏకీభవించినపుడు, యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపములన్నింటి నుండి మనల్ని శుద్ధి చేస్తుంది (అది సత్యము)మరియు పాపము పోతుంది, అప్పుడు మనము మనము అంతా గృహానికిచుట్టూ దగ్గరగా ఉండెదము సహోదరుడా నెవిల్. అప్పుడు రక్తము...మనము ఆశీర్వదించబడెదము.
నాకొక సోదరుడున్నాడు, మేము రక్త సంబంధులము. కానీ, నేను, మేము ఏకీభవించకుండ ఎలా ఉంటాము; ఉప్, దౌర్భాగ్యము. కానీ మేము అదే రీతిగా సహోదరులమైయున్నాము.
9
ఇప్పుడు, ఈ వారము నేను ఆలోచిస్తున్నాను, వచ్చేవారము విదేశాలకు నేను వెళ్ళినట్లయితే, ఒకవేళ...సహోదరుడు కోబ్లెస్ వచ్చి, లూయిస్వీల్లో ఒక సువార్త దండయాత్రను ప్రారంభించాలనుకొంటున్నాను, అక్కడ మరొక రాత్రి ఆయుధశాలలో మనము కలిగియున్న చిన్న స్వస్థతా పరిచర్యను కావాలని అతడు కోరుతున్నాడు. మరియు కొన్ని మహాశ్చర్యకార్యములను ప్రభువు చేసెను. మరియు అందువలన... కానీ అప్పుడు డెల్ రియో ,టెక్సాస్— జెస్సప్ సహోదరులను నేను కనుగొన్నాను, వారు లూయిస్వీల్లో పరిచర్యను కలిగియుందురు మరియు వారు రాబోవుచున్న తరువాత వారములలో ప్రాముఖ్యమైన పరిచారకులను పొందుకున్నారు మరియు అతను ఎప్పుడు విడిచి వెళతారో అది అతనికి తెలియదు. చార్లెస్, తరువాత వారము అది అక్కడ ఉండునని నేను నమ్ముచున్నాను, మరియు ఆ సువార్త దండయాత్ర కొనసాగుచుండగా నేను ఖచ్ఛితముగా ఇక్కడ ఏవిధమైన ఉజ్జీవమును ఖచ్ఛితముగా ప్రారంభించను.
మరియు వారు కూడా స్వస్థతా దండయాత్రను కలిగియుండెదరు. మరియు అందుచేత మధ్యాహ్నము స్వస్థతా పరిచర్య ఉండును. ఈ మధ్యాహ్నము మరియు అందుచేత ఈ మధ్యాహ్నము కూటమును నేను ప్రారంభించాలనుకోవట్లేదు. మరియు- మరియు వారికి అక్కడ కూటము ఉన్నది, ఎందుచేతననగా ఆ విధముగా ఎక్కడో జరుగుచుండగా ఎలా ఉండునో నేనెరుగుదును, మరియు అది కేవలము... ఓహ్, నేను ఒక కూటమును నడుపుచుండగా, మరియు ఎవరో ఒకరు ఎగిరివచ్చి ఆ విధముగా చిన్న కూటమును ప్రారంభించుట ఎలా ఉండునో మీకు తెలియునా. అది మంచిగా అనిపించదు, మీకు తెలుసా అది దాని సరైన స్థానమును తీసికోదు. అందుచేత మనము కొంత సమయము పాటు వేచి చూచెదము, ఒకవేళ ప్రభువు మనకు సహయం చేయవచ్చును. ఆయనే మనకు సహయము చేయును, ఏది ఏమైననూ, మరియు మనము కేవలము నమ్మి మరియు దానిని పట్టుకొని మరియు దేవునికి నమ్మకముగా ఉండెదము.
10
ఇప్పుడు మనము ప్రార్థించెదము:
పరలోకమందున్న తండ్రీ, ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి నేను ప్రారంభించు చుండగా నీ ఆశీర్వాదములను మాపైన ప్రకాశింపజేయుము. ఓ దేవా, కేవలము... వాటిలో కొన్నింటిని నేను ఇప్పటివరకూ చూడలేదు, కొద్ది సమయం క్రితము రెండు లేక మూడింటిని నేను-నేను చదివియున్నాను. నీవు నాకు సహాయపడుము మరియు నీవే నాకు జ్ఞానమును మరియు అర్ధముచేసుకునే కృపను, ఏది సత్యమో అది మాత్రమే నేను పలికేటట్లు చేయుము తండ్రీ, నేను ప్రార్థిస్తున్నాను.
దానిని అనుగ్రహించండి, తండ్రీ మరియు నేను నీ జ్ఞానము కలిగియుండి మరియు నీ పరిశుద్ధాత్మ ఇప్పుడే క్రిందకు దిగివచ్చి అవసరమైన జ్ఞానమును అనుగ్రహించును గాక. ఒక చిన్న గుడారగుంపుగా ఉన్న మా అందరిని ఈరోజు ఆశీర్వదించండి.
ఇక్కడున్న మా ప్రియ ప్రేమపాత్రుడైన సహోదరుడు, సహోదరుడు నెవిల్ను మీరు దీవించండి, తండ్రీ అతడు పనిచేయుచుండగా, కాపరి పొలములో ఇక్కడ గొర్రెల కాపరిగా, గొర్రెలను పచ్చికగల చోట్లకు నడిపించుటకు ప్రయత్నించుచుండగా, లోతైన మొక్కల యొద్దకు (Clovers= త్రిపత్రదశ మొక్కలు) లేక నీటి యొద్దకు మరియు తిరిగి చెట్ల నీడ యొద్దకు మరియు వ్యాధిగ్రస్తులను మరియు అవసరతలో ఉన్నవారిని పట్టించుకొనేటట్లు మరియు ఆ చిన్న గాయపరచబడినవారిని మరియు బాధలతోఉన్నవారిని బాగుపడడానికి ప్రయత్నించేవారినందరిని తీసుకుని వచ్చును గాక, అందువలన వారు నిజమైన గొర్రెలుగా ఉండెదరు. ఓ తండ్రీ, నీవు అతనిని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. తెలివిని మరియు జ్ఞానమును మరియు అర్థము చేసుకునే కృపనూ అతనికి ఇవ్వండి.
మరియు ఇప్పుడు మాకందరికీ సహాయపడండి, తండ్రీ, మీకే మా స్తుతులు సమర్పిస్తున్నాము, యేసు నామములో ఆమేన్.
11
ఇప్పుడు, ఇక్కడున్నవాటిలో కొన్నింటిని, కొద్ది సేపటిలో వాటిని నేను తీసుకొంటాను... అవి-ఎక్కడ అవి ఎక్కడ చెందియున్నవో లేఖనముల యొక్క వివిధ భాగాల నుండి మరియు ఇప్పుడు మనము కొన్నింటిని ప్రారంభించెదము, మరియు మనకు సాధ్యమైనవన్నింటిని మనకు సమాధానము దొరికే వరకూ సమాధాన మిచ్చెదము. మరియు వాటినన్నింటిని మనము పొందుకొనెదమని నేను నమ్ముచున్నాను, మరియు మనము వాటిని త్వరగా పొందుకొనెదమని నేను ఆశిస్తున్నాను.
12
మొదటిది ఒక ప్రశ్న, ఒక సూటైన ప్రశ్న:
నేను పదమూడు సంవత్సరముల వయస్సులో బాప్తిస్మము పొందాను. తిరిగి మరలా నేను బాప్తిస్మము పొందాలా?
ఇప్పుడు, అది-అది అడుగుటకు మంచిప్రశ్న. మంచిది, ఇప్పుడు, స్నేహితుడా, నేను దానిని ఎల్లప్పుడు ఆ వ్యక్తికే వదిలివేస్తున్నాను
గుర్తుంచుకొనండి, నాకు తెలియదు... దానిని ఎవరు రాసారో నాకు తెలియదు, అది ఇక్కడ ఉన్నది మరియు ఆ మనిషి తనంతటతానే నా చేతికి అందించాడు. మరియు ఎవరో ఒకసారి నన్నుఈ ప్రశ్న అడిగారు అని నేను సమాధానమిచ్చాను, మరియు వారు దానిని ఎన్నడూ పేపరు మీద రాయలేదు. మరియు నేను, “దాని మీద చాలినంత సమయం మనకుంటే నేను సమాధానమిస్తాను” అని చెప్పాను.
కానీ ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది, “నేను పొందాలా...నేను పొందితిని...” పదమూడు సంవత్సరముల వయస్సులో బాప్తిస్మము పొందితిని. తిరిగి నేను మరలా బాప్తిస్మము పొందాలా?
నీవు పదమూడు సంవత్సరముల నుండి, క్రీస్తులో ఒక విశ్వాసిగా, అప్పటి నుండి నీవు క్రైస్తవునిగా నీవు ఉన్నట్లయితే, నేను-నేను నీవలెనె ఉండియున్నాను. దేవుడు నిన్ను దీవించి మరియు అప్పటి నుండి పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించినట్లయితే, నాకు తెలియదు.
13
మరియు బాప్తిస్మము అనగా కేలవము ఒక-ఒక-ఒక కార్యము, అది కేవలము ప్రపంచానికి చూపించాడానికే (లేక ఆ సమయంలో నీతో ఉన్న సమూహానికి చూపించుటకు) నీవు, సాక్ష్యులముందు, దేవుడు ఆయన కుమారుని పంపియున్నాడని మరియు ఆయన చనిపోయి మూడవ దినమున తిరిగి లేచాడని మరియు నీవు ఆయనలోకి నీవు పాతిపెట్టబడి మరియు తిరిగి లేచి నూతన జీవములోనికి నడచి వచ్చుచున్నావని, నమ్ముచున్నానని రుజువు చేయుట కొరకు, బాప్తిస్మము అనునది మరియు నీవు బాప్తిస్మము పొందినప్పుడు నిన్ను గమనించిన ప్రజలు తీర్పు దినమున నిన్ను కలుసుకొనెదరు. చూశారా?
మరియు అప్పుడు, ఎవరో ఒకరు (ఒక కొత్త వ్యక్తి) “నీవు పొందావా?” అని అడిగినట్లయితే,
“అవును, నేను నా ప్రభువు యొక్క మరణము మరియు సమాధిలోనికి నేను బాప్తిస్మము పొందియున్నాను.”
14
చూశారా, ఆ బాప్తిస్మము గురించి నేను ఆలోచిస్తున్నాను...ఓహ్, అది (బాప్తిస్మము)ఖచ్చితముగా అవసరమని నేను చెప్పుచున్నాను, అది అవసరములేదని నేను చెప్పాలనుకొవట్లేదు. కాని అది ఖచ్చితముగా అవసరము ఎందుకనగా అది... దేవుని యొక్క ప్రతీ ఆజ్ఞ ఖచ్చితముగా అవసరమైనదే. నీవు అలా అనుకోవట్లేదా? మనము బాప్తిస్మము పొందుట ఖచ్చితముగా అవసరమైయున్నది. యేసు ఈ ఆజ్ఞను పరిశుద్ధ మత్తయి లేకపరిశుద్ధ మార్కు 16లో ఇచ్చెను. “సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును.” అని ఆయన చెప్పెను. మరియు ఆయన నికోదేముతో మాట్లాడుతున్నపుడు “ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగానూ జన్మించితేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు” అని ఆయన చెప్పెను. తప్పనిసరిగా బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మమునందు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముంచుటను నేను నమ్ముచున్నాను మరియు నూతన జీవములోకి తిరిగి లేపబడుట, తరువాత దేవుని ఆజ్ఞలలో నడుచుట.
కానీ నీవు “సహోదరుడా బిల్, నీవు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా వారు చిన్న వ్యక్తులుగా ఉన్నప్పుడే బాప్తిస్మము పొందియుండగా, నీవు మరలా వారికి తిరిగి బాప్తిస్మమిచ్చావా?” అని నీవు నన్ను అడగవచ్చు. చాలాసార్లు ఇచ్చాను.
అందుకే అక్కడ-అక్కడ ప్రకటన గ్రంధము 2వ అధ్యాయములో సంఘముతో మాట్లాడుతూ ఒక లేఖనము ఉన్నది, “మారుమనస్సు పొంది తిరిగి ఆ మొదటి క్రియలను చేయుము.” మరియు వారిలో చాలామంది ఆ లేఖనము యొక్క అర్థము ఏమనగా నీవు వెనక్కి తిరిగివెళ్ళి మరలా అదే కార్యమును చేయమని అనువదించెదరు. మంచిది, ప్రియమైన క్రైస్తవ స్నేహితుడా నీవు గమించినట్లయితే...
15
ఇప్పుడు, ఇప్పుడు నేను మీతో దీని నిమిత్తము విభేదించుటలేదు, చూశారా, ఎందుకనగా మనము బాప్తిస్మపు కార్యక్రమాన్ని నెరవేర్చాము. ఎవరికైనా ఏ సమయంలో బాప్తిస్మము కావాలన్నా మేము బాప్తిస్మము ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాము. కానీ మేము విభేదించుటలేదు. అందులన నీకు బాప్తిస్మము కావల్సినట్లయితే, నీ మార్గములో ఏదో అడ్డుగా నిలబడి మరియు నీవు పొందాలి అని అనుభూతి చెందితే, వెళ్ళి దానిని చేయుము. నీ మార్గములో దేనిని నిలబడనీయవద్దు, నీయంతటనీవే నిన్ను నీవు పరిపూర్ణముగా సరిచేసుకొనుము. (తేటపరుచుకొనుము)
కొన్ని సంవత్సరముల క్రితము నీవు కేవలము ఏదో విధముగా తీసుకొన్నట్లయితే, మరియు అది సత్యమని నీవు వెళ్ళి దానిని చేయాలని నీవు అనుభూతి చెందినట్లయితే, నీవు వెళ్ళి దానిని సరిచేసుకొనుము. అది ఏమైనప్పటికి నీ సంబంధము లేదు. నీవు ప్రతీదానిని సరిచేసికొనుము. ఎందుకగా ఆ విషయానికి నీవు వచ్చేసరికి, మరియు ఆ మార్గముగుండా నీవు ముందుకు కదలలేకయుందువు, నీవు చూశావా. ప్రతీ భారమును ప్రక్కకు విడిచిపెట్టి దానిని పొందుకొనుము, అది నిన్ను చాలా తేలికగా చేయును.
16
మరియు నీవు బాప్తిస్మము పొందాలనుకున్నట్లయితే, ముందుకు కదలివెళ్ళి, ఆ కార్యమును చేయుము. చాలామందికి నేను బాప్తిస్మమిచ్చాను.
కానీ ఇప్పుడు నీవు సూచించినటువంటి ఆ లేఖనము, అది వ్యక్తిగతముగా మాట్లాడుటలేదు, అది సంఘానికి చెందినది. చాశారా, ఆ సంఘము, వారు చేసినది ఏమిటి, వారు మొదటి ప్రేమను కోల్పోయారు, చూశారా, ప్రారంభములో వారు కలిగియున్న ముఖ్యమైన సారాంశము. మరియు వారు చెప్పుచున్నారు, “మారుమనస్సు పొంది తిరిగి ఆ మొదటి క్రియలను చేయుము.” తిన్నగా వెనక్కి వెళ్ళి మరియు ఆ కార్యమును చేయుము. ఆయన సంఘముతో మాట్లాడుచున్నాడు. “మారుమనస్సు పొంది మరియు తిరిగి వెనక్కి వెళ్ళనట్లయితే, అప్పుడు, దీపస్తంభమును కదిలించుటకు (తీసివేయుటకు) ఆయన వెళ్ళుచున్నాడు.
17
మరియు నీవు బాప్తిస్మము పొందాలనుకున్నట్లయితే, మరియు నీవు పదమూడు సంవత్సరముల వయస్సున్నప్పుడు పొందినట్లయితే, లేక ఏ వయస్సులో పొందినా, ఏది ఏమైనా, అది నీ మార్గములో ఉన్నట్లయితే నీవు - నీవు బాప్తిస్మము పొందుము.
కానీ ఇప్పుడు లేఖనము ప్రకారము చెప్పడానికి నీవు తిరిగి బాప్తిస్మము పొందాలి అని నేను చెప్పగలను, నేను ప్రజలకు తిరిగి బాప్తిస్మము పొందమని చెప్పగల-చెప్పగల ఒకే ఒక్క లేఖనానుసారమైన మార్గము ఒక్కటే ఉన్నది. ప్రజలు తిరిగి బాప్తిస్మము పొందారని చెప్పగల లేఖనము పూర్తి బైబిల్లో ఒక్కటి మాత్రమే అక్కడ ఉన్నది, మరియు అది, పరిశుద్ధాత్మ రాకమునుపు బాప్తీస్మమిచ్చు యెహను ద్వారా బాప్తీస్మము పొందినవారు. పౌలు అపోస్తులుల కార్యములు 19:5 లో, పరిశుద్దాత్మ పొందు క్రమములో ప్రభువైన యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తీస్మము పొందమని వారితో చెప్పెను. చూశారా?
18
ఇప్పుడు- ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొనుటకు నీవు బాప్తీస్మము పొందకూడదు, ఎందుకనగా నీ హృదయము సరిగా ఉన్నప్పుడే నీవు పరిశుద్ధాత్మను పొందుకోగలవు. చూశారా ఎందుకనగా అపోస్తులుల కార్యములు 2లో, పేతురు ఒక సూత్రము-ఒక సూత్రమును ఇచ్చెను. “మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి మరియు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.” కానీ అప్పుడు, అపోస్తలుల కార్యములు 10:49లో, దేవుడు వారి వైపు తిరిగి, అన్యజనులకు వారంతా బాప్తిస్మము పొందకమునుపే వారికి పరిశుద్ధాత్మ బాప్తీస్మము నిచ్చెను. మీరు చూశారా? అందువలన, చూశారా, అది నీ హృదయము యొక్క స్థితిపై ఆధారపడియున్నది.
అప్పుడు పేతురు చెప్పెను, “ప్రారంభములో మనము పొందిన రీతిగా వీరును పరిశుద్ధాత్మను పొందుట చూచియూ, నీళ్ళను మనము ఆటంకము చేయగలమా?” చూశారా? అందువలన అప్పుడు అతడు వారిని తప్పక యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలని ఆజ్ఞాపించెను.
అప్పుడు పౌలు, అపోస్తలుల కార్యములు 19 లో చెప్పెను... పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసుకువచ్చి కొందరు శిష్యులను చూచి “మీరు విశ్వసించినపుడు పరిశుద్ధాత్మను పొందితిరా?” అని వారిని అడిగెను.
వారు, “మాకు తెలియనే తెలియదు...పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి మాకు తెలియదు” అనిరి.
“అలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందారు?” అని అతడు అడిగాడు,
వారు పొందారు. వారు యోహాను ద్వారా బాప్తిస్మము పొందామని అన్నారు.
“యోహాను తన వెనుక వచ్చువాడైన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని మారుమనస్సు నిమిత్తమై బాప్తిస్మమిచ్చెను.” అని అతడు చెప్పాడు. వారు ఆ మాటలు విని యేసుక్రీస్తు నామములో మరలా బాప్తిస్మము పొందిరి. చూశారా? అందుచేత అప్పుడు అది...
19
ఇప్పుడు, దీనిమీద, అది...కానీ కేవలం చెప్పుచున్నాను పదమూడేండ్ల వయస్సులో క్రైస్తవ బాప్తిస్మములో బాప్తిస్మము పొంది, మరియు నీ జీవిత మార్గమంతటగుండా ఒక క్రైస్తవునివలె జీవించి లేక కొన్నిసార్లు నీవు వెనక్కి జారిపొయినట్లయితే...
వారు పొందియున్నారో లేదో నాకు తెలియదు... వెనక్కి జారిపోవుటగురించి, దానిని గురించి నన్ను అడగాలి అడగాలి అనుకుంటే నాకు తెలియదు. కానీ వెనక్కి జారిపోవుట అనేది, గుర్తుంచుకొనండి, నీవు ప్రతిరోజు వెనక్కి జారుతునే యుంటావు. దానినుండి నిన్ను తప్పించగల వేరే మార్గాలంటూ ఏమీలేవు. సరే నీవు వెనక్కి జారిపోతున్నప్పుడు, సంఘములోని ప్రజలముందు మాత్రమే జారిపోతున్నావు. కానీ దేవుని ముందు కానే కాదు. చూశారా? నీవు క్రీస్తులో వెనక్కి జారిపోతున్నావు, కానీ దేవునిలో కాదు. ఎందుకనగా నీవు గనుక నిజముగా పాపము చేసినట్లయితే, నీవు నశించినట్టే కానీ నీవు నిరంతరం పడిపోతున్నావు. పౌలు కూడా ప్రతిదినము చనిపోవుచున్నాడు. అది సత్యమేనా? అతను కూడా ప్రతీదినము చనిపోవుచున్నాడు. మరియు ప్రతీదినము మారుమనస్సు పొందుచున్నాడు, మరియు నిరంతరము ప్రతీసారి మారుమనస్సు పొందుచున్నాడు. చూశారా? మరియు పౌలు గనుక అలా చేసినట్లయితే నేనును అలానే చేయుదును. మీరు చేయరా? అది సత్యము. అందువలన మనము...
కానీ ఇప్పుడు నీవు గనుక- నీవు గనుక విమోచింపబడినట్లయితే, మరియు ఆ యేసుక్రీస్తు యొక్క రక్తము నీ పాపముల నుండి నిన్ను శుద్ధిచేసిందని నీవు అనుభూతి చెందినట్లయితే, అప్పుడు నేను-నేను... మరియు నీవు క్రైస్తవ జీవితము జీవించుచున్నట్లయితే, అది అవసరమని నేను-నేను అనుకోవట్లేదు. కానీ నీకు కావాలంటే, అది మంచిది, అది మంచిగానే ఉండును, దానిని చేయుటకు మేము సంతోషించెదము.
20
ఇప్పుడు ఇక్కడచిన్న గమనిక అని ఎవరో నాకు వెనుక అక్కడ ఇచ్చియున్నారు. సువార్త యూదులకు తిరిగి వెళ్ళినప్పుడు సంఘము ఏ స్థానములో ఉండబోవుచున్నది?
ఇప్పుడు, ఆ వ్యక్తి దీనిని, ఇక్కడ లూకా సువార్తను సూచించెను ఆ... అతడు-అతడు నాతో చెప్పెను, మన సహోదరుడు, అది ఎక్కడ చెప్పబడిందో దానిని అతడు సూచిస్తున్నాడు. “ఆ-ఆ అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును.” అది లూకా 21:24 లో ఉన్నది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి మరియు దీనిని మనము పొందుకొనవచ్చు. అద్భుతమైన ప్రశ్న! అద్భుతము!
యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి.
ఇప్పుడు, జాగ్రత్తగా దీనిని పట్టుకొందాము. “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి.” ఇప్పుడు, అక్కడ చాలా గందరగోళము ఉన్నది, ఆ ప్రజలతో... కానీ దానిని చారిత్రాత్మకమైన దృష్టికోణము నుండి బైబిల్ తో దానిని సమీపించెదము.
21
ఇప్పుడు, అడ్వెంట్ సోదరులారా, సెవెంత్డే అడ్వెంట్ సోదరులారా, ఆ-ఆ యెరూషలేము మరలా దండ్లచేత చుట్టబడునని వారు నమ్ముచున్నారు. మంచిది, ఇప్పుడు, అది సత్యము కాగలదు, ఎందుకనగా లేఖనము చాలాసార్లు సమ్మిళిత అర్థాన్ని కలిగి ఉంటుంది.
మరియు ప్రతీ ప్రవచనానికి లేఖనము సమ్మిళిత అర్థాన్ని కలిగియుంటుందని ఎంతమందికి తెలుసు? ఖచ్చితముగా సత్యము. అవునయ్యా. అది దానిని చెప్పుచున్నది మరియు ఈ సమయానికి ఖచ్చితంగా దాని అర్థాన్ని అది చెప్పుచున్నది, మరియు మరలా చుట్టూ తిరిగివచ్చి మరలా ఇక్కడే ఎక్కడో ఒక చోట దానిని మరలా చెప్పుచున్నది. చూశారా? అలా... మరియు నేను త్వరగా ఆలోచించి సరిగ్గా తీయగలిగినట్లయితే, వాటిలో ఒక దానిని నేను మీకు చూపిస్తాను. ఓహ్, అవును, లూకాలో ఇక్కడ ఒకటి ఉన్నది...మత్తయి 2లో చెప్పెను, “ఐగుప్తులో నుండి యేసును పిలచితిని అని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరునట్లు, చెప్పెను నా... ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని:
ఇప్పుడు, ఆ ప్రవచనము, అక్కడ వెనుక ప్రవక్త ద్వారా చెప్పబడినది చూపిస్తుంది అది ఖచ్చితము ఇశ్రాయేలును చూపిస్తుంది (ఎందుకనగా అతడు దేవుని కుమారుడు) ఐగుప్తు నుండి ఆయన పిలిచాడు. అది సత్యము, ఆదికాండములో మరియు నిర్గమకాండము. కానీ అది అది అక్కడ సూచిస్తుంది, కానీ మరలా తిరిగి పునరావృతమౌతున్నది. “నీ నుండి...” ఇశ్రాయేలు దేవుని కుమారుడు. మీకు అది తెలుసు. ఆయన ఫరోతో అన్నాడు, “నీవు...” చెప్పెను “నీవు-నీవు...” అతని యొక్క కుమారునికి ఆయన ఏమి చేసాడు, ప్రాణాన్నిఆయన తీసివేసెను... అతడు ఆయన కుమారుని (ఇశ్రాయేలును) పంపనందుకుగాను, అందువలన ఫరో... దేవుడు ఫరో కుమారుని తీసుకున్నాడు ... మరియు...లేక ఆ రాత్రి మరణ దూత తీసుకున్నాడు. అందుచేత అది ఒక సమ్మిళిత అర్థము.
22
మరియు అందువలన, ఇప్పుడు, యెరూషలేముదండ్ల చేత చుట్టబడెను, కానీ అక్షరార్థముగా చారిత్రాత్మకముగా క్రీస్తుశకం 96 (AD-96) లోనే టైటస్ యెరూషలేమును ముట్టడి చేసేను. కానీ ఇపుడు దీనిని జాగ్రత్తగా (వినండి) గమనించండి, మీరు ఆ వత్యాసాన్ని చూడగలరు, అంత్యకాలములో మరలా యెరూషలేము దండ్లచేత చుట్టబడునని నేను నమ్ముచున్నాను. కానీ నేను దీనిని ఇక్కడ పోలుస్తూ నమ్ముచున్నాను... వారిని టైటస్ ముట్టడి చేసినపుడు, అపుడు నాశనము సమీపించును.
ఇప్పుడు, “నాశనము” మాట్లాడుచున్నది... దానియేలు సమయములో, ప్రవక్త... “పరిశుద్ధ స్థలమందు నిలబడగానే” గమనించండి, అతడు చెప్పుచున్నాడు, “నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే.” చూశారా, “హేయవస్తువు” హేయవస్తువు అనగా “అపవిత్రమైనది/అపరిశుద్ధమైనది”(Unclean) “నాశనము చేయును”, నాశనము చేయుటకు “ఊడ్చివేయ బడును”, “నాశనము” చేయుటకు నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే టైటస్ యెరూషలేమును ముట్టడి చేసినపుడు లేఖనాను సారంగా అది నేరవేరియున్నది, తీసుకొని...
23
ఈ అధ్యాయము ప్రారంభములో ఆయనను వారు అక్కడ అడిగారు, “యుగసమాప్తి ఎప్పుడు? మరియు క్రీస్తుయొక్క... రాకడకు సూచనలు ఏమిటి?” వారు ఆయనకు దేవాలయము గురించి చెప్పుచున్నారు, అది ఎలా ఉన్నదో, గొప్పరాళ్ళు మరియు వివిధ వస్తువులతో ఎంత అందముగా అలంకరింపబడిందో చెప్పుచున్నారు.
ఆయన అన్నాడు, “ఒక సమయం రాబోవుచున్నది, అప్పుడు రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండదు, ఇది పడద్రోయబడుతుంది.” ఆయన వారికి సూచనలు మరియు అద్భుతాలు ఇవ్వడం ప్రారంభించాడు. అప్పుడు, ఇప్పుడు యేసు మాట్లాడుచున్నాడు, దానియేలునకు త్రిప్పుదాము, ఎందుకనగా అన్ని ప్రవచనములు నెరవేరుటకు, తప్పక ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండాలి. పూర్తి లేఖనము ఎక్కడా విభజింపబడదు.
యేసు చెప్పెను, లేఖనములు నిరర్థకము కానేరవు(The Scriptures cannot be broken) ఆమేన్. మరియు అక్కడ... నేను పరలోకానికి వెళ్ళెదనా? ఖచ్చితముగా నేను వెళ్తాను, లేఖనములు నిరర్థకము కానేరవు. అద్భుతాలు మరియు ఆశ్చర్యకార్యములు మరియు సూచకక్రియలు నమ్మనటువంటి మీరు,లేఖనముల నుండి మీరెలా దూరంగా పోయారో? లేఖనములు నిరర్ధకము కానేరవు, క్రీస్తుకంటే వేరే ఎవ్వరూ లేరు (ఇక్కడ నుండి) దూరముగా ఉన్ననూ జరుగగలవు. ఎలా అనగా ఆయన గొప్ప శరీరము పైన (పరలోకంలో ఉన్నను, ఆయన శరీరము యొక్క ప్రతీ కదలికను ఈ భూమిమీద ఉన్న శరీరము (సంఘము) ఇక్కడ ప్రతిబింబింపజేస్తుంది, అది దానికి హద్దులులేనిదిగా ఉన్నది. అప్పుడు క్రీస్తయితే,... నీయొక్క..దైవిక స్వస్థతను, దైవిక శక్తిని ఈభూమిమీదనున్న అక్షరార్థమైన సంఘము లేదా ఆత్మీయ సంఘమమునుండి తీసివేస్తే, అప్పుడు అది క్రీస్తునుండి తీసివేయబడును. ఆయన ఇక కలిగిలేనట్లుగా...
24
కాని, ఓహ్, అక్కడున్న నిజమైన ద్రాక్షావల్లియొక్క ఏమి చిత్రమది, మరియు మనము ఆ ద్రాక్షావల్లిలోని తీగలమైయున్నాము. చూశారా? ద్రాక్షావల్లి కదిలినట్లుగా, తీగలు కూడా కదులును. అది నిజమేనా? ఆయన శరీరమును గురించిన ఎటువంటి అద్భుతమది, ఓహ్ ఆయన రక్తముకారుచున్న చేతులు మరియు పడుచున్న కన్నీళ్ళు మరియు రక్తము కారుచున్న ఆయన ప్రక్కటెముకలు, మరియు దెబ్బలు తిన్న ఆయన వీపు ఈ భూమి యొక్క మర్త్యులకు మరియు దేవునికి మధ్య ఈ విధముగా పైన వ్రేలాడుచూ ఆయన శరీరానికి శక్తి మరియు కదలిక రావడానికి వారిని క్షమించుచూ మరియు ప్రేమించెను, దానిని సంఘములోనికి ఇచ్చెను.
ఆయన చెప్పినట్లుగా, “నేను ఇలా నా చేతులను కదిపితే”-మరియు ఆయన అక్షరార్థమైన శరీరము కూడా కదులుతుంది. “ఇక్కడకు వెళ్ళి సువార్తను బోధించుము” - సంఘము తిన్నగా నడచి వెళ్ళుట మీరు చూచెదరు. ఎందుకనగా నా నీడ నా చేతితో పాటుగా కదులుతుంది. ఆమేన్. అది నిజమేనా? ఆమేన్. ఓహ్, మై, నేను దానిగూర్చి ఆలోచించినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, “సర్వలోకమునకు వెళ్ళి శక్తిని ప్రత్యక్షపరుచుము.” ఆయన శరీరము కదులుతుంది, మన వేదాంతాలు, బోధలు మరియు మిగిలినవన్ని తీసుకుంటే, సమస్యే లేదు మనము ఖచ్చితముగా ఓడిపోతాము. కానీ ఇప్పుడు దేవుని యొక్క హస్తము కదిలినప్పుడు, అద్భుతాలు మరియు సూచకక్రియలు కనిపించును. ఎందుకు, మై!
25
ఆయన దయ్యములు వెళ్ళగొట్టుచున్నప్పుడు, యేసు అన్నాడు...ఇప్పుడు, ఈ ప్రశ్నను తీసుకోవట్లేదు. కొద్ది సమయం దీనిని చూద్దాము. కానీ, యేసు చెప్పెను,
ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నప్పుడు, ఆయన అడిగాడు “మీ కుమారులు ఎవని వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు?” “నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవనివలన వెళ్ళగొట్టుచున్నారు?” మీకు గనుక దీనికి మించిన శ్రేష్టమైనది (better policy) తెలుసుంటే, మాకు చూపించండి.చూశారా? “నేను దేవుని వ్రేలితో...” ఆమేన్. దేవుని “వ్రేలు” (Finger) గురించి ఆలోచించుము. అక్కడ క్రీస్తుకుపైగా దేవుడున్నాడు, సంఘమునకు పైగా క్రీస్తు ఉన్నాడు. అక్కడ దేవుడు తండ్రి పలానా పలానా కార్యము చెప్పినట్లయితే, అప్పుడు దేవుడు, కుమారుడు, ఆయన చేతిని కదిలించును మరియు నీడ దానిని వెంబడించును. “నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టినయెడల, మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు?”
చూడండి, నేను మిమ్మల్ని గమనించాలని కోరుచున్నాను. ఓహ్, ఆ రోగము ఎంత పెద్దదైనప్పటికీ, లేక దయ్యము నీ మీద ఎంత పెద్ద బాధనుంచినప్పటికి నేను లెక్కచేయను, వాటిని వెళ్ళగొట్టడానికి ఆయన తన వ్రేలిని కదిపితే చాలును. ఓహ్, మై, మై, పెద్ద బలమైన భుజములు మరియు చేతులు మరియు కండలున్న వాటివైపు చూడండి. కేవలం ఆయన వ్రేలిని కదిపి ప్రతీ రోగాన్ని మరియు దయ్యములను పారద్రోలెను. మరియు దయ్యమనేది ఎంత చిన్న కార్యము! ఆయన కేవలము ఆయన వ్రేలితో వాడిని పారద్రోలాడు. “నేను దేవుని వ్రేలితో చేసినట్లయితే...”
26
ఇప్పుడు నన్ను మీకు కొంత దేవుని ప్రేమను చూపనివ్వండి. కానీ ఒక గొర్రె గనుక తప్పిపోయినట్లయితే ఆయన తన వ్రేలిని ఉపయోగించుట లేదు కానీ, ఆయన అతడిని (గొర్రెను) తన భుజాలపై వేసుకొంటున్నాడు. మరియు ఆయన అతడిని (గొర్రెను) పూర్తిగా తీసుకొని, చేతులను ఆయన, భుజముల చుట్టూ గొర్రెను వేసుకొంటున్నాడు. ఒక మనిషి యొక్క అత్యంతశక్తివంతమైన, బలహీనమైన భాగములు, అవి అతని భుజములు మరియు వీపు. మీకు అది తెలియును. ఆయన యొక్క సమస్త చేతి కండరాలు మరియు కండలు కదిలించి, మరియు ఆయన పూర్తి గొర్రెను తీసుకొని; ఆయన అతనిని (గొరెన్రు) తన భుజాలపై ఉంచుకొని మరియు ఇక్కడ ఆయన వస్తున్నాడు, ఆ చిన్న, ముసలి దయ్యాన్ని తన చేతి వ్రేలితో వెళ్ళగొట్టినట్టుగా కాదు, కానీ ఇక్కడ ఆయన అతనితో (గొర్రెతో) వస్తున్నాడు... ఆయన యొక్క సమస్త కాలి కండరములతో, ఆయన చేతి కండరాలను, అరణ్యములగుండా కదిలించుచూ, తప్పిపోయిన ఆ గొర్రెను ఆయన భుజాలపై మూటకట్టుకుని వస్తున్నాడు. ఓహ్,మై! “నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల, మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు”? ఓహ్, హల్లెలూయా! మై!
27
అది మంచిది, అంశము యొద్దకు తిరిగి వెళ్ళెదము.
కానీ మీరు... యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచినప్పుడు...
అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండు వారు వెలుపలికి పోకూడదు. మరియు... పళ్ళెటూళ్ళలోని వారు దానిలోనికి... ప్రవేశింపకూడదు.
లేఖనములో వ్రాయబడినవన్నియు నెరవేరుటకై అవి ప్రతిదండనము యొక్క-యొక్క దినములు.
ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి ఇబ్బందియు ఆ ప్రజలమీద కోపమును వచ్చును.
వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడినవారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు...
28
గమనించండి, ఎంత అద్భుతముగా లేఖనము దానిని ప్రత్యేకముగా చేసియున్నదో. మొదటి విషయము “ఖడ్గములయొక్క అంచులతో (కత్తివాత).” (By the edge of Swords) ఈ చివరిది అణుబాంబుగా ఉండబోతుంది. చూశారా? కానీ ఇది కత్తివాత ద్వారా, యూదులు చెరపట్టబడినవారై సమస్తమైన అన్యజనముల మధ్యకు వెళ్ళారు. అదెన్నటికి మరలా అదే రీతిగా జరగదు, గడచిన కొంతకాలము నుండి వారంతా పాలస్తీనాలోనికి చేరుకుంటున్నారు. చూశారా? గడచిన దినములను ఇది చూపిస్తుంది. మరియు అది ఖచ్చితముగా చరిత్ర ప్రకారము అదే విధముగా జరిగినది.
సమస్త దేశాలలోనికి వారు వెళ్ళియున్నారు. నేడు ఆకాశముక్రిందనున్న ప్రతీదేశములోను నీవు యూదులను కనుగొందువు. ఓహ్ ప్రతీదేశము మీరు చైనాకు వెళ్తే, మీరు యూదులను కనుగొంటారు. మీరు రష్యాకు వెళ్తే, మీరు యూదులను కనుగొంటారు. చిన్న ద్వీపాలకు వెళ్ళండి, మీరు యూదులను కనుగొంటారు. ప్రతీదేశము మధ్యలోనికి చెదిరిపోయారు. అది ఏమిటి? దేవుని ప్రవచనము. దేవుడు దానిని ఉద్దేశించాడు. మరియు సహోదరుడా, యూదులైనవారు మైలురాళ్ళు.(Milepost) మీరు వారిని చూచినప్పుడు...
29
వారు గ్రుడ్డివారిగా చేయబడి మరియు చెదరగొట్టబడ్డారని నేనెరుగుదును. మరియు మోసగించబడ్డారు మరియు అన్ని విధములుగా చేయబడిరి ఎందుకనగా నీవు నేను చూపు పొందాలని వారు దేవుని చేత మోసగించబడ్డారు. అది సత్యము. కానీ ప్రవచనము యొక్క ఆత్మద్వారా, బైబిల్ ద్వారా, నేను దానిని చెప్పుచున్నాను, యూదులు తిరిగి గృహానికి తిరిగి వచ్చే ఘడియ సమీపముగా ఉన్నది. అవునయ్యా ఆయన హిట్లర్ యొక్క హృదయాన్ని కఠినపరిచాడు, జర్మనీ నుంచి వారిని విసిరివేసాడు. ముస్సోలిని యొక్క హృదయాన్ని కఠినపరిచాడు, రష్యానుండి వారిని విసిరివేసాడు. ఆయన వారిని తీసుకునివచ్చుచున్న దినములవలెనె, ప్రతిచోటనుండి ఆయన విసిరివేసాడు. మరియు వారు బయటికి వచ్చి అరణ్యములోనికి వెళ్ళుటకు అక్కడ దానిని దాటడానికి సిద్ధపడుచుండగా ఏమి జరిగినది? దేవుడు ఈ భూమిని గొప్ప తెగుళ్ళు మరియు ఆ కార్యములతో మొత్తాడు. యెహెజ్కేలు మరియు ప్రకటన గ్రంథము 11లోని ఆరెండు ఓలివచెట్లైన తన ఇద్దరు సేవకులతో ఆయన తిరిగి అదే చేయును. ఆయన మరలా తిరిగి అవే సూచకక్రియలు మరియు అద్భుతాలు చేయును.
30
ప్రకటన గ్రంధము 11లో ఉన్న ఆ ఇద్దరి సాక్ష్యుల వైపు చూడండి, “నేను నా సాక్ష్యులకు అధికారమిచ్చెదను. వారు ప్రవచించు దినములలో వారు ఆకాశమును మూయుదురు. వారు కోరినట్లుగా వారు భూమిమీదకు తెగుళ్ళను పంపిస్తారు.” మీరు అక్కడే ఉన్నారు, చివరి దినములలో ఆ ఇద్దరు సాక్ష్యులు ఉందురు.
“అది పాత మరియు కొత్త నిబంధన” అనేది నవీన బోధగా(Modern Teaching) ఉన్నదని నేనేరుగుదును. అది తప్పు! అది తప్పు!.
అది ఇద్దరు సాక్ష్యులు కాదు గాని, అది ఖచ్చితముగా మోషే మరియు ఏలియాలు తిరిగి వచ్చుట మరియు మీరు అక్కడ వెనుక (Old Testment) గమనిస్తే, వారిలో ఒక్కరు కూడా... మోషే, అతను చనిపోయాడు, కానీ అతడు ఎక్కడకు వెళ్ళాడు? అతడు మరలా తిరిగి లేచాడు. మరియు ఏలియా అయితే చనిపోకుండానే మార్పు చెందాడు. అతడు కూడా చనిపోవలసియున్నది, ఎందుకనగా ప్రతీ మర్త్యుడు చనిపోవలసియున్నది, అందుకే తిరిగి మరలా అతడు వస్తున్నాడు. మరియు అక్కడ యిద్దరు సాక్ష్యులున్నారు.
31
ఇప్పుడు గమనించండి;
మరలా వారు తొక్కబడెదరు... మరియు వారు కత్తివాత కూలుదురు... (24వ వచనము)...కత్తివాత, మరియు సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; మరియు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును...(ఆమేన్!)... అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకూ.
అది వణుకు పుట్టించుటలేదా, మనమెంత తక్కువ సమయం కలిగియున్నామో తెలుసుకుంటే, ఆ విధంగా లేదా? దేవుడు అలాగే చెప్పాడు. అన్యజనుల కాలము రాజైన నెబుకద్నెజరుతో ప్రారంభమైంది. ఓహ్, ఎంత చెప్పుకోదగినదో! నేను దీనిపై ఎంత సమయం మాట్లాడగలనో కొన్నినిమిషాల పాటు దానిని చూద్దాం! కానీ గమనించండి, ప్రతీ ఒక్కరు వారి ప్రశ్నను చూడాలనుకొంటారు. కానీ మనము దీని పైన ఉండగా, దాని గురించే ఆలోచిద్దాము, ఎందుకనగా అది ఇప్పుడు చాలా అత్యవసరమైయున్నది, సరిగ్గా ఇప్పుడే.
చూడండి! దేవుడే యూదా ప్రజలను నడిపించుచున్నాడు. వారు ఎన్నడూ దేశముగా లేరు, వారు ప్రజలుగానే ఉన్నారు. మరియు వారు ఎన్నడూ ఒక సంస్థాపకమైన సంఘముగా లేరు, వారు కేవలము బయటకు పిలవబడిన సంఘముగానే ఉన్నారు. అక్కడ యూదుల మధ్య ఎన్నడూ ఒక సంస్థ అనేదే లేదు, వారు ఎల్లప్పుడూ దేవునితో నడిపించబడుచున్నారు.
అప్పుడు రాజకీయపరంగా, జాతిపరంగా, వారు కోరుచున్నారు... ఒక రాజు కావాలని. మరియు దేవుడు వారికి రాజునిచ్చాడు మరియు అది ఎన్నడూ సరిగా పనిచేయలేదు. వారి రాజు దేవుడే. దేవుడే మన మహారాజు, అది సత్యము, మరియు దేవుడే సంఘానికి మహారాజు.
32
ఇప్పుడు, గమనించండి! వారు పట్టబడి బబులోనుకు చెరపట్టబడి వెళ్ళిపోయారు ఎందుకనగా వారు ప్రపంచదేశాలను అనుకరించడానికి ప్రయత్నించారు. ఎంతటి అద్భుతమైన చిత్రము, ఈ దినమున సంఘము కూడా బయటి ప్రపంచాన్ని అనుకరించడానికి ప్రయత్నించుచూ మరియు దూరముగా చెరపట్టబడుతుంది. వారియొక్క-వారియొక్క జీవములతో పాటుగా చెరపట్టబడిపోతున్నది. సంఘము కూడా ప్రపంచము ఏవిధముగా చేయుచున్నదో ఖచ్చితముగా అదే విధముగా చేస్తుంది, మోసుకుపోబడుతుంది, అది దానివలెనె ప్రవర్తిస్తున్నది, మరియు సమస్తము అలానే చేయుచూ మరియు సంఘమని చెప్పుకొంటుంది. నీవు దానిని చేయలేవు. లేదయ్యా నీవు ఏమిటో నీ జీవితమే ఋజువు చేస్తున్నది.
నీవు ఎవరనేది... నేను ప్రారంభములో చెప్పినట్లుగా, ఎక్కడో ఒకచోట నువ్వు ఏమైయున్నావనేది ఇక్కడ నీవు ప్రతిబింబింప చేయవలసియున్నది. నీవు ఏమైయున్నావనేది, పైనున్ననీ యొక్క మట్టి లేక భూసంబంధమైన శరీరం ఏమిటో, ఎక్కడో ఉన్న నీ పరలోకసంబంధ శరీరము ఏమైయున్నదో అదే ఇక్కడ నీవు ప్రతిబింబిస్తావు. ఆత్మదేశములో నీవు ఏమైయున్నావో, అదే ఇక్కడ నీవైయున్నావు. నీవు ఇంకనూ ఆత్మ(భూమి) దేశములో అసభ్యకరమైన మనస్తత్వము మరియు మొదలగు విధంగా ఉన్నట్లయితే. నీవు ఇక్కడనూ అసభ్యకరమైన మనస్తత్వముతో ఉందువు. నీవు ఇంకనూ అసూయ, ద్వేషము మరియు కలహములతో ఉన్నట్లయితే, నీవు ఆత్మ(భూమి) దేశములో వాటితో ఉంటే, అది ఇక్కడ ప్రతిబింబిస్తుంది.
కానీ నీయొక్క పూర్తి అంతరంగ జీవి శుభ్రపరచబడి మరియు పవిత్రపరచబడి ఉన్నట్లయితే, అది అక్కడ ఆవలి గట్టున శుద్ధిచేయబడి మరియు పవిత్రపరచబడిన ఒక శరీరము (ఎదురు చూచుచున్నది) నీవు పొందుకున్నావని చూపించుచున్నది, మరియు అదే శరీరములో ఇక్కడ ప్రతిబింబిస్తుంది. మీరు చూడలేదా? చూడండి. అది అక్కడే ఉ న్నది. “భూమిమీద మన ఈ గుడారము శిధిలమైపోయినను, మన నిమిత్తము ఒకటి ఇప్పటికే ఎదురుచూచుచున్నది.” చూశారా.
33
ఇప్పుడు, ఈ సమయంలో, అంత్యకాలములో ఏవిధముగా శరీరానుసారమైన పోలికలు, క్రైస్తత్వము యొక్క అనుకరణలు ఇవన్ని అక్కడ వెనుకనున్న ఆ పెద్ద బబులోనులో జరిగిన మాదిరిలలోనికి ఏరీతిగా కలిసిపోవుచున్నవో. మరియు వారు బబులోనికి చెరపట్ట బడబోవుచున్నారు. అది నిజమేనా? మరియు “నా ప్రజలారా బబులోనులోనుండి బయటకు రండి.” అని 'ప్రభువుదూత పిలిచి చెప్పుటను పరిశుద్ధ గ్రంథము మాట్లాడుచున్నది.
గందరగోళం! ఇది “నేను బాప్టిస్టును. నేను మెతడిస్టును. నేను ప్రెస్బిటేరియను.” అదంతా గందరగోళమే. అసలు ఎన్నటికి దానిలో రక్షణ లేదు.
ఇప్పుడు, మెతడెడిస్టు ప్రజలారా, బాప్టిస్టు ప్రజలు రక్షింపబడరని నేను చెప్పుచున్నానని చెప్పవద్దు. నేను దాని గురించి మాట్లాడుటలేదు. నేను సంఘము గురించి, మరియు దాని రాజకీయశక్తి గురించి, దాని రాజకీయాల గురించే మాట్లాడుచున్నాను. మరియు రాజకీయంగా మాట్లాడుతున్నారు, ఎలాగనగా నీవు మెతడిస్టువు లేక బాప్టిస్టువు లేక ప్రెస్బిటేరియను లేకక్యాథోలికు, దానితో చేయగల్గింది ఏమీ లేదు. దేవుడు దానిని అసలు పట్టించుకోడు, మరియు అది నేటి దినమున బబులోనైయున్నది. మరియు వాటన్నింటిలోనుండి ఒక సంఘమును దేవుడు బయటకు పిలుచుచూ, హృదయములో పరిశుద్ధత స్వచ్ఛతగల వారిని బయటకు లాగుచూ, ఆయన తన సంఘమును తయారు చేయుచున్నాడు. ఎంత అద్భుతము!
34
మరియు గమనించండి, ఇక్కడ మిమ్మల్ని వణికింపచేయు ఒక కార్యాన్ని నేను చెప్పబోవుచున్నాను కానీ అయితే-అయితే అది... ఇప్పుడు వినండి బబులోను ఏవిధంగా ఉన్నదో గమనించండి... అక్కడ ఏమి జరిగింది... బబులోనులో-లో, నిజమైన ఆరాధికుల మీదకు ఒత్తిడి తీసుకురాబడినప్పుడు. గుర్తుంచుకొనండి, కొద్ది సమయం చూద్దాం, ఆ నిజ ఆరాధికులైన షడ్రకు, మేషాకు మరియు అబెద్నెగో మరియు దానియేలును నిర్భంధములోనికి వెళ్ళేటట్లుగా, వారేమైయున్నారో, నిజముగా వారియొక్క రంగులు ఏమైయున్నాయో చూపించడానికే దేవుడు వారిని పిలిచాడు. ఒక విగ్రహాన్ని ఆరాధించడానికి వారు ఒత్తిడి చేయబడ్డారు. అది నిజమేనా? విగ్రహారాధన! ఒక విగ్రహాన్ని ఆరాధించుటకు మరియు ఆ విగ్రహంముందు మోకరించుటకు వారు ఒత్తిడి చేయబడ్డారు. మరియు వారు దానిని చేయకపోతే, వారు శిక్షింపబడుదురు.
ఓహ్, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము నుండి మీరు ఎటువంటి చిత్రాన్ని బయటికి లాగవచ్చునో, వాటిని కలుపుతూ ఆమె (సంఘము) బయటికి పిలవబడటానికి ముందుగా సంఘము కూడా అదే విధమైన ఒత్తిడి లోనికి వెళ్ళుచున్నదని లేఖనము ద్వారా చూపించవచ్చును. ఆ మార్గములోనే అన్యుల సంఘము (బయటకు) తీసుకుని రాబడి, ఆ మార్గములోనే అన్యుల సంఘము (రాకడలోనికి) తీసుకొనిపోబడుతుంది. ఆమె వచ్చిన విధముగానే ఆమె కొనిపోబడుతుంది.
35
మరియు అతడు ఆ ప్రతిమను ఎలా చూశాడో చూడండి. మరియు ఇప్పుడు, గుర్తుంచుకొనండి, ఆ ప్రతిమ... ఇప్పుడు, ఇది ఇప్పుడు స్వస్థలమై(Home Place) ఉన్నది. చూడండి రాజైన నెబుకద్నెజరు చేయించిన ఆ ప్రతిమ పరిశుద్ధుడైన దానియేలు యొక్క ప్రతిమ అని నేను నమ్ముచున్నాను. మీరు గమనించినట్లయితే, రాజైన నెబుకద్నెజరు దానియేలుకు పేరు పెట్టాడు, 'బెల్తెషాజరు' అని అతనిని పిలిచాడు (అది అతని దేవత పేరు). మరియు అతను ఒక ప్రతిమను చేసెను - చేసెను, మరియు దానియేలు తర్వాత ఏ ఒక్కరూ సింహాల గుహలోనికి త్రోయబడలేదు, మరియు మిగతాదంతా, మరియు అతడు అన్నాడు, “దానియేలు దేవుడిని కాక ఏ ఒక్కరూ ఏ ఇతర దేవతలను మరియు మిగతా వాటన్నింటిని పూజింపనేకూడదు.” అది ఖచ్చితముగా పరిశుద్ధ వ్యక్తి యొక్క ప్రతిమ, గొప్ప విగ్రహం, మరియు ప్రతీ ఒక్కరూ దాని యెదుట మోకరించాలి.
కానీ సంఘమైన, షడ్రకు, మరియు మేషకు, మరియు అబెద్నెగో... క్రీస్తు సంఘానికి నాయకత్వం వహించినట్లుగా, దానియేలు (ఆ సంఘానికి) నాయకత్వం వహిస్తున్నాడు.
మరియు వారు ఆ ప్రతిమ ముందు మోకరించవలసియున్నారు మరియు ఆ ప్రతిమకి ఆరాధించవలసియున్నారు. గమనించండి! మరియు మీరు గమనించండి, ఆ సమయములో దానియేలు నిశబ్దంగా ఉన్నాడు. ఆమేన్! ఓహ్, మరియు మీరు దీనిని పొందుకున్నారని ఆశిస్తున్నాను. దానియేలు నిశబ్దంగా ఉన్నాడు. వారిని చేయనిచ్చాడు...వారి సొంత ఎన్నికను వారు చేయవలసియున్నారు.
36
ఆ దినములో... అన్యజనుల కాలము యొక్క అంతములో, అక్కడ ఒక ప్రతిమ ఉండబోవుచున్నది, మరియు ప్రతీ ఒక్కరూ ఆ ప్రతిమ ముందు మోకరించి మరియు దానిని ఆరాధించవల్సియున్నారు. అదెంత పరిశుద్ధముగా ఉన్నప్పటికీ, నీవు ఎన్నడూ ఒక విగ్రహాన్నిఆరాధించకూడదు. (విగ్రహారాధన)
ఇప్పుడు, గమనించండి. ఓహ్, మై! సరిగ్గా అంత్యకాలములో, దానియేలు మరలా రావడం కనిపిస్తుంది ఎంత ఆశ్చర్యము! ఆ రాత్రి ఆ ఉపపత్నుల (concubines) మరియు మొదలైనవారున్న ఆ గొప్ప విందులోవారి ఎదురుగా అక్కడ ఒక హస్తము వచ్చి గోడమీద వ్రాయుచున్నది, గోడమీద “మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్” అని వ్రాసెను. మరియు దాని అనువాదాన్ని ఏ ఒక్కరూ ఇవ్వలేకపోయారు, అది అన్యభాషలో వ్రాయబడియున్నది. ఏ ఒక్కరూ దానికి అర్థము చెప్పలేకపోయారు. వారు వెళ్ళి వారియొక్క పెద్ద విద్వాంసులను తీసుకువచ్చారు. (దాని అర్థము) “మాకు తెలియనే తెలియదు.” అని వారు అన్నారు.
వారు వెళ్ళి మరియు వారికి ఉన్న గారడీ విద్య గలవారిని మరియు జ్యోతిష్యులందరినీ తీసుకువచ్చారు. “మాకు తెలియనే తెలియదు. దాని గురించి మాకు ఏమీ తెలియదు. మేమెన్నడూ అటువంటి భాషనుచూడలేదు, మా జీవితంలో అటువంటి దానిని ఎన్నడూ వినలేదు.”
కానీ అక్కడ ఒక మనిషి ఉన్నాడు! దేవుడు తన మనిషిని కలిగియున్నాడు, దానియేలు అక్కడ ఉన్నాడు.“వెళ్ళి అతనిని తీసుకురండి,” అని చెప్పాడు “అతనిలో దేవుని ఆత్మ జీవించుచున్నది.” అని అన్నాడు.
కాబట్టి దానియేలు అక్కడకు వెళ్ళి, చదవడం ప్రారంభించి మరియు గోడమీదనున్న ఆ భాషకు అర్థము చెప్పుచున్నాడు, మరియు అతడు ఇచ్చాడు... అనువాదము ఏమిటి? “ఓహ్, రాజా, నీవు ఆశీర్వదించబడుదువు గాక, చిరకాలము జీవించుదువు గాక. అలా (అనువదించలేదు) కాదు”. కానీ మొండిగా, కఠినముగా, అతనిని పూర్తిగా తిరస్కరిస్తూ చెప్పాడు. “నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువుగా కనబడితివి.”
37
చూడండి, సరిగ్గా ఆ మార్గంలోనే. అన్యుల రాజ్యములోనికి సహజాతీతమైనది తీసుకునివచ్చినట్లుగానే, అలాగుననే అన్యులనుండి సహజాతీతమైనది తీసివేయబడుతుంది. సహజాతీతమైన దాని ద్వారా రాజ్యము కావలికాయబడినట్లుగానే, సహజాతీతమైన దానిద్వారానే అది వెళ్ళిపోతుంది. యెరూషలేముయొక్క గోడలు త్రొక్కబడును, త్రొక్కబడును...అది... అన్యజనులకాలము సంపూర్తియగువరకూ అన్యులు దానిని స్వాధీనపర్చుకుంటారు. అప్పుడు దేవుడు యూదులవైపుకు తిరుగును. ఆమేన్! ఓహ్, మై!
ఓహ్, స్నేహితులారా, మనము దానిని సరియైన మార్గములో సరిగ్గా పొందుకున్నామని నేను ఆశిస్తున్నాను. మీరు పొందుకోలేదా? ఆ ఒక్క అంశము మీద ఒక్క వారము పాటు మనము ఉండగలము, చూశారా, అందుకనే మనము లేఖనములగుండా పరిశోధిస్తూ వెళ్ళుచున్నాము.
38
అది, గమనించండి, ఇప్పుడు ఆయన ఏమి చెప్పుచున్నాడో జాగ్రత్తగా వినండి-వినండి, “అన్యజనులకాలము సంపూర్తియగువరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. ”టైటస్ యొక్క - యొక్క ముట్టడిలో, లోపలికి వచ్చి, యెరూషలేమును తీసుకునిపోయెను.
“ఇప్పుడు- ఇప్పుడు, హేయవస్తువు నాశనము చేయుట మీరు వినగానే?” అని ఆయన చెప్పుచున్నాడు.
“అవును”
“మంచిది, అప్పుడు అన్యులు లోపలికి వచ్చినప్పుడు.”
“అవును, మేము అర్థము చేసుకున్నాము.” అని శిష్యులు అన్నారు.
“ఇప్పుడు, అన్యులు ఇప్పుడు వారియొక్క ప్రభుత్వాన్ని కలిగియున్నారు.”
“ఖచ్చితముగా.”
యెరూషలేము అన్యుల ప్రభుత్వం క్రింద ఉన్నదా? అవునయ్యా! రోమావారి క్రింద ఉన్నది. యెరూషలేములో లో ఇప్పటికీ వారు ప్రభుత్వాన్ని కలిగియున్నారు. మరియు పూర్వము నాశనకరమైన హేయవస్తువు గురించి దానియేలు పలికినప్పుడే అది ప్రారంభమైనది.
39
ఇప్పుడు ఆయన చెప్పుచున్నాడు, “ఆ సమయము సమీపముగా ఉన్నది, వారు ఈ దేవాలయమును పడగొట్టి, అన్యులైన, మహ్మదీయులు, అదే స్థలములో ఓమర్ మసీదును ఉంచబోవుచున్నారు. మరియు అది అక్కడ నిలబడబోవుచున్నది.”
అన్యులు అనగా “అవిశ్వాసులు.” ఇప్పుడు, అది సంఘము (అన్యులు అనగా అన్యులసంఘము కాదు)కాదు. అది అన్యులు చూశారా, అవిశ్వాసి. అన్యులకాలము సంపూర్తియగు వరకూ అది నిలబడుతుంది. అప్పుడు అన్యులకాలము సంపూర్తియైనపుడు, ఆ గొప్పరాజు(క్రీస్తు) అంత్యకాలములో ప్రజలకొరకు నిలబడును.
దానియేలు గ్రంథములో, “ఆయన అతని దగ్గరకు వచ్చినప్పుడు”, ప్రకటన గ్రంథము 1లో ఆయనను మీరు చూచినట్లుగా, పురాతన కాలములో ఉన్నట్లుగా “ఆయన తల వెండ్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చువలె తెల్లగా ఉండెను.” తీర్పు తీర్చుటకై గ్రంథములు (బహువచనం) తెరువబడెను“, ”మరియు ప్రతీమనిషి ఆ గ్రంథములతో వ్రాయబడినవాటి ప్రకారముగా తీర్పుపొందెను.“ చూడండి, గ్రంథములు తెరవబడ్డాయి. ”ఆయన వచ్చుట అతడు చూచాడు, మరియు కోట్ల కొలది మనుష్యులు వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి.“ పరిశుద్ధులు ఆయనతో వచ్చుచున్నారు. దానియేలులో ఉన్న ఆ కార్యము నిజమేనా? ”మరియు గ్రంథములు తెరువబడెను.“ అది నీ జీవితము యొక్క గ్రంథము, ”మరియు ప్రతీ మనిషి-మరియు ప్రతీ మనిషి ఈలాగునే తీర్పు తీర్చబడును, ఒక పాపి, ఈలాగుననే తీర్పు తీర్చబడును. మరియు మరియొక గ్రంథము తెరువబడెను“, అది జీవగ్రంథము, ”మరియు ప్రతీమనిషి తీర్పు తీర్చబడెను.“
40
ఇప్పుడు గమనించండి, ఎల్లప్పుడూ గుర్తుంచుకొనండి, అది మూడులో (Three) కొనసాగుతూ ఉంటుంది. మీరు అలా చేయకపోతే, మీరు ఖచ్చితముగా కలగలుపు చేస్తారు. అక్కడ భూమి మీద మూడు జాతుల ప్రజలు పుట్టియున్నారు; ప్రారంభములో అక్కడ మూడు జాతుల వారున్నారు; చివరిలో కూడా మూడు జాతుల
వారుందురు. ఏమిటి... ఆయనకు పరిచారము చేయు కోట్లకొలది మనుష్యులతో యేసు తిరిగివచ్చెను. “ఇది మీకేమి చిన్న విషయం కాదు... లేక ధర్మశాస్త్ర ప్రకారము మీ పనులు చేసుకొనుట సాధారణ విషయమేమి కాదు, పరిశుద్ధులు భూమికి తీర్పుతీర్చుదురని మీరెరుగరా?” అని అతడు చెప్పుట మీకు జ్ఞాపకమున్నదా. పరిశుద్దులు భూమికి తీర్పు తీర్చుదురు! హల్లెలూయా! నేను దానిని ఆలోచించుచుండగా, మై! ఆయన వచ్చుట చూచుచుండగా ఆయన వెనుక రక్తముతో కడుగబడినవారు వచ్చుచుందురు, వెయ్యేండ్లపాలన తరువాత, విమోచన మరియు అన్ని యుగములలో విమోచింపబడినవారు ఆయన సన్నిధిలో నిలిచియుందురు. రక్తముతో కడుగబడిన వధువు!
41
కేవలం వారు మంచి జనులు మాత్రమే కాదు గాని, వారు ఖచ్చితముగా మొదటి పునరుత్థానాన్ని తప్పిపోయెదరు. “ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు” అని బైబిల్ చెప్పుచున్నది. అది నిజమేనా? వారు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వారి పేర్లను కల్గియున్నారు కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును తృణీకరించారు.
కేవలం ఎన్నుకోబడినవారే ఆ సమయంలో వెళ్ళుదురు. కేవలం ఎన్నుకోబడినవారే ఆ-ఆ-ఆ వెయేండ్ల పాలనలో ఉందురు. ఓహ్, అప్పుడు, సహోదరుడా, మనము ఎటువంటి జనులుగా ఉండబోవుదుము? నేను వెయేండ్ల పాలన గుండా జీవించాలనుకొంటున్నాను.! సులువుగా చిక్కులు పెట్టే ప్రతీభారాన్ని మరియు పాపాన్ని ప్రక్కకు పడవేయండి. ఏ వ్యక్తి అయినా ఏదైనా తప్పుగా చెప్పినట్లయితే లేక ఏదైనా వేరేమార్గములో చేసినట్లయితే, అతని గురించి ప్రార్థించండి మరియు ముందుకు కదలివెళ్ళండి. నీయొక్క ఒక ప్రత్యామ్నాయాన్ని (Alternative) దేవునివైపు ఏర్పర్చుకో? ఒకవేళ ఎవ్వరూ దానిని చేయనట్లయితే, నీవే దానిని చేయుము! వెళ్ళుటకు ఎన్నుకోబడినవారే, వెయ్యేండ్ల పాలన యుగములో జీవిస్తారు మరియు వారే వెయ్యేండ్లు క్రీస్తుతోపాటు వెళ్ళి వచ్చెదరు మరియు వారే ఆయనతో మహిమలోనికి వెళ్ళి మరియు తిరిగి వచ్చెదరు. దుష్టుల యొక్క పునరుత్థానము జరిగినపుడు, అప్పుడు వెయ్యేండ్లపాలన ప్రారంభించి... వెయ్యేండ్ల పాలన ముగిసిన తర్వాత, అప్పుడు క్రీస్తు సంఘముతో పైకి వెళ్ళిపోవును, మరియు వెయ్యి సంవత్సరముల చివరిలో ఆయన సంఘముతో తిరిగి వచ్చును.
42
క్రీస్తు మూడుసార్లు వచ్చును. మొదటిసారి ఆయన తన సంఘమును విమోచించుటకు వచ్చెను. అది నిజమేనా? రెండవసారి, ఆయన తన సంఘమును తీసుకొనిపోవుటకు వచ్చును. మూడవసారి ఆయన సంఘముతో వచ్చును. చూశారా? ఆయన ఆమెను విమోచించడానికి వచ్చాడు; ఆయన ఆమెను ఎత్తబాటుకు గురిచేసి మరియు తెగుళ్ళు మరియు మొదలగువాటి సమయంలో ఆమెను దూరంగా తీసుకుని పోవడానికి వచ్చును; వెయ్యేండ్లపాలనలో తిరిగివచ్చును; వెయ్యేండ్లపాలన కాలమంతటిలో జీవించును.
మరియు అప్పుడు గొప్పరాజు మరియు రాణి తీర్పు నిమిత్తమై క్రిందకు దిగివచ్చును. ధవళ సింహాసనపు తీర్పు ఏర్పాటు చేయబడి మరియు గ్రంథములు తెరువబడెను. మరియు అక్కడ విమోచించబడి, పరిశుద్ధాత్మతో జన్మించిన జీవముగల దేవుని సంఘము, ఆమె యొక్క సౌందర్యముతో అక్కడ తీర్పుతీర్చుటకు నిలబడియున్నది. “గ్రంథములు తెరువబడెను, తీర్పు ఏర్పాటు చేయబడెను మరియు ప్రతీ మనిషి ఈలాగు తీర్పు తీర్చబడును” అది ఒక పాపి నిమిత్తము. “మరియు మరియొక గ్రంథము తెరువబడెను”, అది పరిశుద్ధాత్మతో నింపబడిన వధువు కొరకు కాదు, ఆమె ఎన్నడూ తీర్పులోనికి వెళ్ళదు ఎందుకనగా ఆమె ఎత్తబాటులో ఉన్నది.
నీవు గనుక ఈ ఉదయం పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే, మరియు దేవుని శక్తి నీ శరీరముయొక్క ప్రతీ నరములోనూ కదులుచున్నది, తీర్పులోనీవు నిలబడుట వలన నీకు ఏమంచి జరుగుతుంది? నీవు ఇప్పటికే తీర్పుతీర్చబడ్డావు, మరియు పొందుకున్నావు, మరియు నింపబడ్డావు, మరియు ఇప్పటికే-ఇప్పటికే క్రీస్తుయేసుతో పరలోకస్థలములోనికి మార్పుచెందావు. నీవు ఉండబోతున్నావు కాదు కానీ, నీవు ఇప్పుడే అక్కడ ఉన్నావు, సరిగ్గా ఇప్పుడే మార్పుచెందియున్నావు!
43
“ఆయన ఎవరిని పిలిచెనో, వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో, వారిని మహిమపరిచెను. ”మరియు ఈ ఉదయము ప్రపంచములో విమోచించబడి, యేసుక్రీస్తు రక్తముక్రింద ఉండి, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతీవ్యక్తి, నిత్యజీవమును కలిగియుండి మరియు ఎన్నటికీ నశించడు, మరియు ఇప్పటికే క్రీస్తుయేసుతో పరలోక స్థలములలో ఉండి, మరియు ఎన్నటికినీ శిక్షావిధిలోనికి రాడు. ఇప్పటికే విమోచించబడ్డాడు! అది అద్భుతముగా లేదా? చూశారా? ఇప్పటికే విమోచించబడి, ఇప్పుడే క్రీస్తుయేసుతో పరలోకస్థలములలో కూర్చుండపెట్టబడ్డాడు, మరియు మహిమ... ఇప్పటికే మహిమపర్చబడ్డాడు, ఇప్పటికే మహిమపర్చబడ్డాడు.!
“సహోదరుడా బిల్, లేఖనము ఆ విధముగా చెప్పుచున్నదా?” అని నీవు నన్ను అడుగవచ్చును.
యేసు దానిని చెప్పెను, లేక లేఖనమే ఆ విధంగా చెప్పుచున్నది, లేక ఆ లేఖకులు ఆ విధముగా రాసారు. పౌలు,అతడన్నాడు “ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో, ఆయన వారిని ఇప్పటికే మహిమపరిచెను. ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించెనో, ఆయన ముందుగా నిర్ణయించాడు; ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించెనో, ఆయన నీతిమంతులుగా తీర్చెను; ఆయన ఎవరిని నీతిమంతులుగా
తీర్చెనో, ఆయన వారిని ఇప్పటికే మహిమపరిచెను. “అది ఏమిటి? ఓహ్ మై! (నన్ను మన్నించండి) ముందుగానే మహిమపరిచెను! అప్పుడు మనము పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే, మన నరములు మరియు జీవకణములు ఇప్పటికే దేవునిలో భద్రముచేయబడ్డాయి, అక్కడ మహిమశరీరము ఇప్పటికే ఎదురుచూచుచున్నది, మరియు ఇది ముగించబడిన వెనువెంటనే నీవు దానిలోకి వెళ్ళెదవు. ఎవరిని ఆయన నీతిమంతులుగా తీర్చెనో, ఆయన ఇప్పటికే మహిమపరిచెను.
ఇక్కడ మునుపు నేను చెప్పియున్నట్లుగా, (నెగటివ్) (Negative)ఛాయ మరియు నిజమైనది(Positive). నేను కలిగియున్నచాలినంత విద్యద్వారా దానిని తీసుకునివచ్చి మరియు దానిని మీకు పూర్తిగా విశదపరచాలనుకుంటున్నాను, కానీ నేను దానిని కనుగొనలేకపోయాను. నేనేమి మాట్లాడుచున్నానో నేనెరుగుదును, కానీ నేను అనుకున్న మార్గములో నేను దానిని వివరించలేను.
44
(టేపు మీద ఖాళీ స్థలమున్నది-ఎడిటర్) ... ఎర్ర సముద్రము మరియు ఈ కార్యములు అన్నింటిని అక్కడ వారు బయట పెట్టియున్నారు. సామాగ్రి అంతయు అక్కడే ఉన్నది యూదులు, నిజముగా ధనవంతులు, అప్పుడు అదే కార్యము మరలా వారి శిబిరాలను కలుషితము చేయుచున్నది. మీరు! ప్రపంచపు నగరముల నుండి వారు వచ్చుచున్నారు. “మేము ఆ చెత్తను కలిగియున్నాము. అది యురేనియము మరియు ప్రతీది అక్కడ ఉన్నది, మేము దానిని పొందడానికి వెళ్ళుచున్నాము” అని రష్యా చెప్పుచున్నది, మరియు వారు వెళ్ళిన వెనువెంటనే అక్కడ హరమెగిద్దోను ప్రారంభమవుతుంది. అదంతా ఇశ్రాయేలీయులా పిల్లలపక్షముగా ఆ లోయలో నిలవబడి ఆయన పోరాడినట్లుగా, దేవుడు నిలబడి మరలాపోరాడును. కానీ అది అన్యులకాలము సంపూర్తియైన తర్వాత జరుగును. మరియు ఆ సమయము ముగించబడినపుడు, ఆమె నరికివేయబడుతుంది.
45
(టేపు మీద ఖాళీ స్థలమున్నది-ఎడిటర్) ఈ ప్రశ్నను అడిగిన ప్రియమైన వ్యక్తికి ఇదే నా అభిప్రాయము, దీనిని గురించి నా అభిప్రాయము ఇదే అయ్యున్నది.
ప్రశ్న: ఆ దినములలో ఉన్న శూరులు(Giants) ఎవరు?
ఇప్పుడు, జోసెఫస్ అక్కడ.... ఒకవేళ, నేనెరుగుదును, మన సంఘము, మీరునూ నావంటివారే. నేను-నేను ఏడవ తరగతి చదివిన నకిలీని (Dummy) మరియు నేను-నేను విద్య మరియు అలాంటి కార్యముల గురించి పట్టించుకోను. సువార్తకు అదే పెద్ద అభ్యంతరకరముగా ఉన్నదని నేను అనుకొంటున్నాను. కానీ, అయినప్పటికీ, కొన్నిసార్లు, ఒకటి లేదా రెండు పుస్తకాలు తీసుకొంటాను. ఇప్పుడు, ప్రజలతో నా సంభాషణలు నావలెనే ఉండును, మేమంతా అదే గీత మీద ఉంటాము, మనమంతా సామాన్య జనులమే. మరియు నేను చాలా కృతజ్ఞుడను. “సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి” అని బైబిల్ చెప్పుచున్నది. సామంతలు, అక్కడ మరొక వర్గపు ప్రజలు అక్కడ ఉన్నారు, కానీ సామాన్య జనులు...కేవలం మనవంటి సామాన్య పరుగు కలిగిన ప్రజలమై, కుటుంబాలను మరియు పిల్లలను కలిగియుండి, ఈ లోకములో ఎక్కువగా ఏమీ కలిగిలేకుండా, దేవుని ప్రేమించే జనులు, మనము దేవునిని ప్రేమించుచు మరియు సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడెదము, మన శరీరముల యొక్క ఆ-ఆ దుస్తులు దేవుని రాజ్యముకొరకు ఇచ్చివేస్తాము, ఏదైనా అలాగుననే చేస్తాము. మనము ఆయనను ప్రేమించుచున్నాం, మనము ఏదైనా చేయగలం, అందుకే సామాన్య జనులు ఆయనను వింటున్నారు. మరియు అది ఈ దినమున కూడా అదే రీతిగా ఉన్నది, సామాన్య జనులు ఆయనను సంతోషముతో వినుచున్నారు.
ఇప్పుడు, ధనవంతుడైన వ్యక్తి, ఈ భూమిమీద చాలా ఎక్కువగా సంపాదించుకొని దాని గురించే ఆలోచించును, చూశారా. మరియు మరియు అక్కడ క్రిందనున్న నిజమైన వ్యక్తి, జారిపోయేదారిలో నీవు అతనితో ఏమీ చేయలేవు, అతడు అసలు దానిమీద తన ధ్యాసనే నిలుపడు. కానీ సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వింటున్నారు.
46
మరియు ఇప్పుడు జోసెఫస్ తన రాతలలో, అతడున్నాడు... ఇప్పుడు, ఇక్కడ దీనిగురించిన అతని అనువాదమున్నది “దేవుని కుమారులు” నరుల కుమార్తెలను తీసుకొనిపోయిరి. “భూమిమీద పడిపోయిన ఆత్మలు అవే” అని అతడు చెప్పాడు.
ఇప్పుడు, మీకు తెలుసు... ప్రకటన గ్రంధములో, 11వ అధ్యాయము... లేక 7; కాదు మిమ్ములను అడుగుతున్నాను... ప్రకటన గ్రంధము 12వ అధ్యాయము, సూర్యునిలో ఒక స్త్రీ నిలుచునియున్నది. “ఎర్రని ఘటసర్పము దాని తోకతో ఆకాశ నక్షత్రాలలో మూడింట రెండు భాగములు నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను.” ఆ సాతానే ఆదిలో, మిఖాయేలు కంటే మరింత అందంగా) అద్భుతముగా ఉండటానికి ఉత్తరదిక్కున ఒక రాజ్యాన్ని ఏర్పరచాడు అని మనము గ్రహించాము, మరియు అక్కడ అతడే పరలోకములో యుద్ధమును ప్రకటించాడు. మరియు అది వాడితోపాటూ మూడింట రెండు వంతుల (2/3) దేవదూతలను లాక్కొని వచ్చేసాడు. అది నిజమేనా?
ఆ కారణము చేతనే మనము చాలా తక్కువగా (Minority) ఉన్నాము. నా అర్థము ఆ-ఆ-ఆ పక్షమున...క్రైస్తవ రాజ్యములో, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన జనులు, ఈ ఉదయమున చాలా తక్కువ మంది ఈ పక్షమున ఉన్నారు, ఎందుకంటే వారు ఆ-ఆ-ఆ కొద్దిమందిగా ఉందురు. అది నిజము.
47
మరియు మీరు గనుక ఆదికాండము నుండి బయటకు వచ్చిన ఆత్మలను గమనించినట్లయితే మరియు అవి లేవడానికి ప్రారంభించాయి, నిజమైన సాంప్రదాయకమైన, పెద్ద పెద్ద సాంప్రదాయకమైన సంఘ ఆరాధనలను గమనించండి (High classical Worship). ఒకసారి వెన్నక్కి వెళ్ళి కయీనును చూడండి, నేటి దినమున దానిని చేసెదరు. అది అలా తిన్నగా ప్రయాణిస్తూ, అది పరిసయ్యులలోకి కదిలివెళ్ళింది. మరియు కదలివెళ్ళుతూ, నేటి దినమున ఉన్న, క్యాథోలిజమ్, మరియు అటువంటి గొప్ప కదలికలలో, గొప్ప అందమైన స్థలములలో దానిని చూచెదరు.
మంచిది, ఆ చిన్న గొర్రెపిల్లతోనున్న హేబేలును చూడండి, చూశారా, కేవలం సామాన్యంగా ఉన్నది. యేసు దినములలో దానిని చూడండి. లేఖనము ప్రకారము మీరు కదలివెళ్ళుతూ, మార్గమంతటిగుండా దానిని చూడండి, అది ఎలా ఉన్నదో చూచెదరు. ఆ మార్గమంతటిలో నుండి సరిగ్గా దేవుడు తన సంఘాన్ని పిలిచే అదే దినమున మనము జీవించుచున్నాము. ఆ చిన్న చార(Streak), మార్గమంతటి గుండా ఆ చిన్న ఎర్రని చారగా ఉన్న రక్తముతో కడుగబడిన జనులు సరిగ్గా పరిశుద్ధ గ్రంథము ద్వారా వచ్చుచున్నారు. గమనించండి!
48
ఇప్పుడు, ఈ “దేవుని కుమారులు”, నా అభిప్రాయం ప్రకారం, మీరు ఖచ్చితముగా...అతనితో ఏకీభవించకపోవుటకాదు, లేక తెలివిగా నటించుటకు ప్రయత్నించుట కాదు, లేక జోసెఫస్ ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు అని చెప్పుటకానేకాదు, కానీ అతడును నావంటి మనుష్యుడే. అతడు ఎంత పెద్ద వేదాంతి (Scholar) అయినప్పటికీ ఏమీకాదు, అతడు కేవలం ఒక మనిషే. మరియు అతడు కలిగి ఉన్న ఒకే ఒక్కటి, పురాతన లేఖనాలను మరియు మొదలైనవాటిని, మరియు పురాతన అవశేషాలను, మరియు మొదలగువాటిని అతడు పరిశోధన చేసాడు, కానీ నేటి దినమున మనము కలిగియున్న దానికంటే ఎక్కువగా ఏమీ కలిగిలేడు, అదే పరిశుద్ధాత్మ. (మనము కలిగియున్నాము అతడు కలిగిలేడు). ఇప్పుడు, అతడు కేవలం శరీరానుసారమైన మనస్సుతో వెళ్ళుచున్నాడు. కానీ మనము ఆత్మానుసారమైన మనస్సు (Spiritual Mind) ద్వారా తీసుకొంటున్నాము. ఈ “దేవుని కుమారులు”, అవి దేవదూతలు అని చెప్పుచున్నారు. అవి అవేనని నేను నమ్ముచున్నాను. మరియు నేను-నేను నమ్ముచున్నాను...
49
ఇప్పుడు, జోసెఫన్ కూడా అదే విషయాన్ని చెప్పాడు, కానీ “తమంతట తాముగా వారు మరియు బలవంతంగా మానవ శరీరాలలోనికి చొప్పించుకొని, మరియు కుమారులని తీసుకొని... మరియు-మరియు నరుల కుమార్తెలను తీసుకొనిపోయారని ”అతడు చెప్పాడు. ఇప్పుడు మనము మిశ్రిత జనాంగము; మనము వేరువేరుగా పురుషులుగా, స్త్రీలుగా, మరియు చిన్నబాలికలు మరియు బాలురుగా ఈ ఉదయం ఇక్కడ ఉన్నాము, మరియు దీనిని నేను మాట్లాడుచుండగా పెద్దవారు ఖచ్చితముగా దీనిని అర్ధము చేసికొనెదరు. కానీ ఎప్పుడు... “ఆ దేవదూతలు స్త్రీల యొక్క వాంఛను చూసినపుడు, పురుషులు ఏ విధముగా స్త్రీలతో జీవిస్తారో ఆ రీతిగా బలవంతముగా మానవ శరీరములలోనికి చొప్పించుకున్నారు. అందువలన... మరియు వారికి వారు నరుల కుమార్తెలను తీసుకొనిపోయారు” అని అతడు చెప్పాడు.
మంచిది, నేను-నేను దానిని నమ్మను. నేను దీనిని నమ్ముచున్నాను, వారు కానానులో జన్మించారు, మరియు నోదు దేశానికి పంపివేయబడిన ఆ-ఆ కయీను యొక్కగుంపు నుండి వారు జన్మించారు. మరియు అతనిని ఎవరూ చంపకుండా అతను గురుతును తన మీద కలిగియున్నాడు., ఎందుకనగా అతని హత్య నిమిత్తం...దూరముగా, అతను తన సహోదరుని చంపాడు. కానీ మీరు గమనించినట్లయితే, ఆ జనులలో కొంతమందిని ఇశ్రాయేలీయులు కూడా అక్కడకు వెళ్ళినప్పుడు కనుగొనియున్నారు. వారు చాలా పెద్దగా ఉన్నారు, మరియు వారి ప్రక్కన వీరు మిడుతలవలె కనిపించారని అతడు చెప్పాడు. అది నిజమేనా? వందల మరియు వందలసంవత్సరాల తర్వాత, అక్కడ గొప్ప, భారీకాయులు,పెద్ద వ్యక్తులు. మరియు కొన్నిసార్లు వారు వారియొక్కఆ-ఆ శవాలను త్రవ్వినప్పుడు, మరియు వారుపెద్ద వ్యక్తులని వారు కనుగొన్నారు.
50
ఇప్పుడు అది ఎక్కడనుండి వచ్చినదో అని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు, ఇక్కడ కొద్దిగా, నా స్వంత సిద్ధాంతమున్నది. ఇది కేవలం సంఘపుజనులు, చూశారా. కయీను సాతాను యొక్క కొడుకు అని నేను అనుకొంటున్నాను. మీరు దానితో ఏకీభవించరని నేనెరుగుదును, నా సొంత సంఘము ఏకీభవిస్తుంది. కానీ అది ఇంకనూ... దానికి వేరుగా దేవుడు చూపించేవరకూ, నేను-నేను అదే కార్యాన్ని నమ్ముతాను, చూశారా, అతడు సాతాను కుమారుడు. ఎందుకనగా ఆ దైవత్వంకాని, హత్యచేసే ఆత్మ దేవుని నుండి వచ్చినది అనే దానిని నేను (అంగీకరించను) స్థానములో దీనిని ఉంచను. లేదయ్యా అతని తండ్రి తర్వాత అతడు ఉండవలసి యున్నాడు, మరియు అతని తండ్రి ... ఇక్కడ, సర్పము మీదకి సాతాను వచ్చియున్నాడు.
మరియు సర్పము ప్రాకే జంతువు కాదు, ఆ శాపము దానిని ప్రాకే జంతువుగా మార్చింది. అతడు (సర్పము)కూడా మనిషి వలెనే ఉన్నాడు, అతడు నిలబడి నడిచేవాడు. మరియు అతడు(సర్పము) అక్కడ బయట ఆ స్త్రీతో, మరియు ఆమె ఈ వ్యభిచారానికి ఒప్పింప చేయబడి మరియు ఆమె మొదటి కుమారుడైన కయీనును బయటకు తీసుకువచ్చింది, అతనిది అతని తండ్రియొక్క స్వభావమే. మరియు ఆ పెద్ద జంతువు(సర్పము) ఒక మనిషివలె ఉండెనని నేను నమ్ముచున్నాను, మరియు అతడు సరిగ్గా నిలబడి నడుచుచున్నాడు, మరియు అక్కడ నుండియే ఈ గొప్ప శూరులు వచ్చియున్నారు. మీరు, అది ఖచ్చితం. ఇప్పుడు, అది నా స్వంత ఆలోచన మరియు నేను-నేను తప్పు అవ్వవచ్చును. అది నా ఆలోచన, చూశారా. కానీ వారు గొప్ప మనుష్యులు.
51
మరియు మీరు గమనించినట్లయితే, అక్కడ ఆదాము మరియు అవ్వ ముందు దేవుడు నిలబడియున్నాడు. ఆయన అన్నాడు, “మన్ను నుండి నిన్ను నేను తీసియున్నాను, నీవు తిరిగి మన్నైపోదువు” నేను...
“మరియు ఎందుకనగా నీవు తీసుకొని నీ యొక్క.. నీ భర్తకు బదులు ఆ మృగము (సర్పము)మాట విని నందున, నీవు లోకములో నుండి జీవాన్ని తీసివేసియున్నావు, నీవే దానిని తిరిగి తీసుకుని వచ్చెదవు. ”నీ భర్తమాట బదులు ఆ మృగము (సర్పము) మాట వినినందున, నీవు లోకములో నుండి జీవాన్ని తీసివేసియున్నావు, నీవే దానిని తిరిగి తీసుకుని వచ్చెదవు.“
మరియు “సర్పమా, నీ కాళ్ళ ద్వారా రాకుండా, చూశారా, నీవు ఇక ఎన్నటికి నడవవు. మరియు నీవు ఇక జంతువుగా ఉండవు, నీవు ఇప్పటి నుండి ప్రాకే జంతువుగా ఉందువు. మరియు నీవు పొట్టతో ప్రాకుదువు, మరియు మన్నును నీవు ఆహారముగా తిందువు.” అని ఆయన అన్నాడు.
52
నేను ఆలోచించేటటువంటిది అక్కడే ఉన్నది... కయీను, ఆ మృగము యొక్క స్వభావంతో జీవించాడు... ఒక జంతువువలె, ఈ స్త్రీతో జీవించి, ఈ శిశువును తీసుకువచ్చారు, అది సగము మృగము మరియు మనిషివలె ఉన్నది, ఒక పెద్దవయస్సున్న వ్యక్తి. మరియు అతడు బయటకు వెళ్ళి మరియు అతని పిల్లలు అతని నుండి బయటకు వచ్చుట ప్రారంభించారు మరియు అప్పుడు మృగములు, ఆరంభంలో వలెనే వారి తండ్రి వలెనే లైంగిక వాంఛలు, మరియు ఆ పాతవాంఛలు కలిగిన ఆ మృగము ఈ కుమార్తెలను మరియు ఆ కార్యాలను కనుగొని, మరియు నరుల కుమార్తెలను తీసుకొనిపోయారు. అది నిజము.
మరియు ఈ వ్యక్తులను ఎవరు తీసుకువచ్చారు, ఖచ్చితముగా, ఆ పడిపోయిన ఆత్మలే ప్రజలమీదకు వచ్చియున్న అదే వంశావళి గుండా వారు వచ్చియున్నారు. గుర్తుంచుకొనండి, ఒకప్పుడు జీవించిన అవే ఆత్మలు, నేటి దినమున...నేటి దినమున జీవిస్తున్నాయి.
53
నేటి దినమున దానిని చూడండి! మంచిది, ఈ దేశంలో మనకు ప్రజలున్నారు అది...ఇప్పుడు, నేను కాదు... ఇది నేను అమెరికను, నేను అమెరికను అని మీరెరుగుదురు. కానీ దీనిని నేను మీకు చెప్పనివ్వండి, ప్రపంచంలో నేనేరిగిన అక్కడున్న పారిస్, ఫ్రాన్స్ కంటే కూడా ఇది హీనమైన దేశము. ఇది చాలా దిగజారిపోయినది!
ఎందుకని, విదేశాలలోనున్న ప్రజలు కూడా, ఆఫ్రికాలో, స్వీడన్లో మరియు...అక్కడున్నవారు, “ప్రపంచంలోని మీ అమెరికా ప్రజల పరిస్థితి ఏమిటి, మీ స్త్రీల గురించి మీరు గౌరవమే కలిగిలేరా? రేడియోలోని అన్ని పాటలు, కొన్ని రకాల పాత మురికివి, నీచమైన పాటలు స్త్రీల గురించి పాడుతున్నారు. అక్కడున్నమీ స్త్రీలను మీరు గౌరవించరా?” అని వారు అడుగుతున్నారు.
మన పాటలన్నీ స్త్రీల గురించే, లేక లైంగిక కార్యక్రమాలు మరియు కోర్కెలు మరియు వాటి గురించే అయ్యున్నవి. అది ఎందువలన జరుగుతుందనగా దెయ్యం దానిని పట్టుకున్నది. అది ఖచ్చితంగా నిజం. పాత హాలివుడ్ మరియు టెలివిజన్లు, మరియు ప్రతీదీ ఆ నీచత్వాన్ని మరియు దేవుడులేని మురికిని త్రోయుచున్నది, పాత వార్తాపత్రికలు భద్రపరిచే స్థలాలు మరియు ఎక్కడికి వెళ్ళినా, ప్రతీదీ వస్త్రహీనురాలైన స్త్రీ ఏదొక రకంగా అక్కడ ఉంటుంది. అది ఖచ్చితముగా ఆదిలో ఏది ప్రారంభించిందో, చివరిలో కూడా అదే విధానం. అది సిగ్గుచేటు!
54
నీతి అనే విషయానికి వచ్చేసరికి, మరియు ప్రతీ దేశము యొక్క వెన్నెముక ఒక స్త్రీయై యున్నది. మరియు నీవు మాతృత్వాన్ని ముక్కలు చేస్తున్నావు. మనము మన స్త్రీలను ఏ స్థితి వరకూ తీసుకువచ్చామనగా...సిగరెట్లు త్రాగుతున్నారు మరియు అటువంటి కార్యాలన్నీ చేస్తున్నారు, మరియు విస్కీని సేవించుచున్నారు, మరియు ఆ విధముగా కొనసాగుతున్నారు, మరియు అది-అది అవమానము!
ఒక కన్యకైన నీతి గల భార్యకై వెదకు యువకుడు... అతడు అలాంటి ఒకరిని (కన్యకను) కనుగొనడానికి, సరిగ్గా ఒక ఉన్నతమైన, కొద్దిమంది ఉన్న, పురాతన పరిశుద్ధాత్మ సంఘము చుట్టూ తిరగవలసి ఉంటుంది; ఆమె విషయమై మర్యాద కలిగి, ఆమెను లోపల ఉంచు పురుషునికి సంబంధించినంత వరకూ అది ఖచ్చితంగా నిజం.
అది వింతగా నున్నదని నీవు అనుకొనవచ్చును, కానీ, సహోదరుడా, నీవు దానిని పూర్తిగా చూసి మరియు కనుగొనవచ్చును, మరియు అది సత్యము కానట్లయితే చూడుము. అది అవమానం! మంచిది.
అక్కడ వారు దేవుని కుమారులుగా ఉన్నారు ఎక్కడైతే... ఇప్పుడు దానిని, నేను వివరించగలను, నా...చూడండి, అప్పుడు-అప్పుడు నేనెరిగినట్లయితే...
55
నేను ఈరోజు మరొక ప్రశ్నను కలిగియున్నాను, “సహోదరుడా బిల్, అవ్వ పరిశుద్ధ గ్రంథములో ”నేను యెహోవా వలన కుమారుని పొందానని ఎందుకు చెప్పుకున్నది“ అని వారు అడిగారు.”ఖచ్చితంగా సత్యం. అది యెహోవా నుండే వచ్చియున్నది. యెహోవా మాత్రమే అక్కడ సృష్టికర్త. ఆయన... దయ్యమును దేవుడు సృజించాడు. అది ఎలా? దయ్యమును దేవుడు సృజించాడు. అక్కడ పడిపోయిన ప్రతీ దేవదూతను దేవుడు సృజించాడు. అది నిజమేనా? ఎందుకు, ఖచ్చితంగా. అది వారి యొక్క ఎన్నిక, ఆయన (ఎన్నిక)ది కాదు. ఆయన నిన్నును సృజించాడు, దాని గురించి నువ్వు ఏమి చేయుచున్నావు? వారు తీర్పు తీర్చబడిన రీతిగానే నీవును తీర్పు తీర్చబడెదవు. అక్కడే నీవున్నావు. ఖచ్చితముగా.
56
వీరు దేవుని యొక్క కుమారులే, కానీ వారు కృప నుండి పడిపోయి మరియు ఈ మృగపు మానవులలోనికి వచ్చి మరియు పరుగెత్తి మరియు ఆశించారు. వారు స్త్రీని చూచినపుడు, వారు వారిని (స్త్రీలను) పట్టుకున్నారు. ఎందుకని, వారు ఇంకనూ ఇక్కడే ఉన్నారు. అమెరికా యొక్క దుర్నీతి పూర్తిగా దేవుని యొక్క ఆత్మ లేకుండా ఆ యొక్క-యొక్క మనుష్యులు, ఒక తల్లి యొక్క చేతిలోనుండి ఆ శివువును విసిరివేసి మరియు ఆమెను చెరుపుతున్నారు. దేవుడు లేకుండా, ఒక మృగము కంటే అతడు-అతడు ఎక్కువేమి కాదు. అతడు ఇంకనూ ఆ మృగాన్ని పొందుకుని, దైవత్వాన్ని కాని స్వభావాన్ని కల్గియున్నాడు. మరియు ఒక మనిషితో... “మతము బాగానే రుచించును, అందుకే మనిషి మత పిచ్చిలోనికి పోవుచున్నాడు అని వారు అన్నారు.” మతము చేయునది ఏమిటంటే, మనిషికి తన సరైన మానసిక స్థితిని ఇస్తుంది, అది కేవలం, యేసుక్రీస్తు యొక్క మతం మాత్రమే.
నీవు క్రీస్తును కనుగొనేవరకూ, నీవు నీ సరైన మానసిక స్థితిలోనికి రాలేవని నేను పరిశుద్ధ గ్రంథము ద్వారా నిరూపించగలను, అది నిజం. అది బలముగానే కనిపిస్తుంది, కానీ నేను దానిని లేఖనముద్వారా నిరూపించగలను. అది సత్యం. నీవు క్రీస్తుయేసును కనుగొనేంత వరకునూ, నీవు మృగముగా, వ్యామోహముతో, మరియు ప్రతీవిధముగా ఉండెదవు. ఆయన ఒక్కడే ప్రేమామయుడు.
57
ఇప్పుడు, చాలా ఎక్కువగా చదివే ప్రజలను గూర్చి, మరియు చాలా ముందుకు వెళ్ళిపోయే ప్రజలను గురించి చెప్పుచున్నాను, మరియు కొన్నిసార్లు ప్రభువును గూర్చిన విషయాలు చదివేటప్పుడు కొన్ని మానసికమైన ఒడిదుడుకులు వచ్చుచుండును. నీవు దాని నుండి బయటికి రా! నువ్వు దానిని చేయకూడదు. నీవు చేయవల్సిన ఒకే ఒక్క విషయం ఏదనగా ఆయనతో ప్రేమలో పడిపో, మరియు కేవలము ఆయనను ప్రేమించుచు ఉండు. అది నిజం అది ఏదో దానిలోనికి చొప్చించుటకు ప్రయత్నించుట కాదు లేక నువ్వేమి కాదని నీకు నీవుగా తయారు చేసుకొనుట కాదు గానీ, కేవలము ముందుకు సాగి, ఆయన కోరుకొనిన మార్గములో దేవుడు నిన్ను వాడుకోనివ్వు. కేవలము నిన్ను నువ్వే(ఆయనకు) ఇచ్చేసుకో, నిన్ను నువ్వే(ఆయనకు) అప్పగించేసుకో మరియు కొనసాగిపో, సంతోషించు, పాటలుపాడు, ఆనందించు. అదే మార్గమైయున్నది.
58
“ఆయనను ప్రేమించువారికి మేలు కొరకై సమస్తము సమకూడి జరుగుచున్నవని” బైబిలు చెప్పుచున్నది. అందుకే కేవలం ఆయనను ప్రేమించుటలో నిశ్చయతగా ఉండు, నీవు తెలుసుకోవల్సిన ఒక్క విషయం అదే. ఆమేన్! కేవలం ఆయనను ప్రేమించు మరియు కొనసాగిపో!“ ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు” అని చెప్పు.
“నీవు దీనిని ప్రేమిస్తున్నావా?”
“లేదయ్యా. నేను నిన్నే ప్రేమిస్తున్నాను.” చూశారా?
“మంచిది, నీవు అలా అవ్వాలనుకోవట్లేదా... నీవు గొప్ప బోధకుడిగా ఉండాలనుకోవట్లేదా? నీవు ఈ విధంగా కావాలనుకోవట్లేదా?” (అని ఆయన) అడుగును.
“లేదు. ఇప్పుడు, ప్రభువా... నీవు ఒకవేళ నన్ను ఆవిధంగా ఉండమని కోరితే నేను ఉంటాను. నీవు కోరనట్లయితే, నేను అలా ఉండను. ఆమేన్. నేను సరిగ్గా ఇక్కడే, ఈ సంఘములో ఒక కాళ్ళు తుడుచుకునే గుడ్డగా ఉంటాను.”
“మంచిది, ఇప్పుడు, నీవు ఏదో ఒకటి ఈ విధంగా చేస్తే, ఆ ప్రజలు నీ సంఘము గురించి ఎక్కువగా ఆలోచిస్తారని నేను విశ్వసిస్తున్నాను.”
“ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో అది నాకు అనవసరం, ప్రభువా, నువ్వేమి ఆలోచిస్తున్నావో అదే నాకు కావాలి. నేను-నేను సరిగ్గా నీతోనే నిలబడతాను, నువ్వేమి చేయమని చెప్పావో దానితోనే ఉంటాను, నేను ఖచ్చితంగా వారందరిని ప్రేమిస్తున్నాను.”
“మంచిది, ఇప్పుడు, నీవు ఎరిగిన ఫలానా ఫలానా సహోదరి, నీవు ఆమెను ప్రేమించుటలేదు.”
“అవును, ప్రభువా, నేను చేస్తాను. అవును, నేను ఖచ్చితంగా చేస్తాను. నేను ఆమెను ప్రేమిస్తాను.”
“ఎందుకు?”
“ఎందుకంటే నీవే ఆమెను ప్రేమించావు, మరియు నీవు నాలో ఉన్నావు. మరియు నేను కూడా ఆమెను ప్రేమించాలి, ఎందుకంటే నాలో ఉన్న నీవు బయట ఉన్న నన్ను ఆమెను ప్రేమించేటట్లు చేయుచున్నది.” వ్యూ! అదే దానిని పొందుకొనును.
కానీ అక్కడ ఆ మృగములు అది అది పతనమయ్యామని నేను ఆలోచిస్తున్నాను, ఆ...?... ఆ పడిపోయిన మృగము, చూశారా.
59
దేవుని కుమారులు అనగా దేవదూతలా లేక పరలోకమునుండి పడిపోయిన ఆత్మలా?
అది ఆ వ్యక్తి యొక్క ప్రశ్న. అది మంచిది. వారు దేవదూతలు కాదని నేను నమ్ముచున్నాను. చూశారా, లేఖనము చెప్పుచున్నట్లుగా వారు జీవించుచున్న దేవుని కుమారులు. దేవదూతలు కాదు, వారు “దేవుని కుమారులు”. మరియు వారు పరలోకమునుండి భూమి మీదకు వచ్చిరి, మరియు వారు శరీరంలో పెట్టబడ్డారు; “శరీరంలో వారంతటవారు చొచ్చుకురాలేదు”, యేసుక్రీస్తు తప్ప ప్రతీ శరీరియు లైంగికంగానే జన్మించాడని నేను నమ్ముచున్నాను. కన్యక ద్వారా జన్మించిన వారు ఎవరైనా ఉన్నారంటే, ఆ ఒక్కడు యేసుక్రీస్తే అని నేను నమ్ముచున్నాను.
మరియు నేను-నేను దాని మీద గొప్ప చరిత్ర కారుడైన జోసఫ్తో ఏకీభవించను. కానీ వారు సహజాతీత జీవులుగా దిగివచ్చి మరియు మనుష్యుల ఆత్మలను(నివసించుటకు) తీసుకున్నారని నేను నమ్ముతాను. మరియు వారింకా నేటికీ ఇక్కడే ఉన్నారని నేను నమ్ముతున్నాను, నేటికీ జెఫర్సన్విల్ చుట్టూ ఇంకనూ నడుస్తున్నారు, వారిలో అవే మృగములుగా వాంఛలతో, దైవత్వం కానీ ఆత్మలతో, మనుష్యలలో జీవిస్తున్నారు. ఇప్పుడు, ఈ మనుష్యులు చనిపోతారు, మరియు ఇంకొక తరమనేది ఉన్నట్లయితే, వారి మీదకి కూడా దిగివస్తారు.
గుర్తుంచుకొనండి, దేవుడు ఆయన మనుష్యుని తీసుకుంటాడు కానీ అతని ఆత్మను ఎన్నటికీ తీసుకోడు, ఇది పెంతుకోస్తు దినమున వారుపొందుకున్న అదే పరిశుద్ధాత్మ.
క్రీస్తును అప్పుడు హింసించిన అదే దయ్యం (మత సంబంధమైన రూపంలో), అదే దయ్యం నేటి దినమున సంఘములో పెద్ద పొడవాటి అంగీలు ధరించియున్నది. మరియు వారు దానిని ధరించరాదు... వారి శరీరం మీద ఉన్న అంగీ కోసం నేను మాట్లాడుటలేదు, నా భావం నీ ఆత్మమీద ఉన్న అంగీ కోసం. చూశారా, “ఎందుకు, అద్భుతాలు జరిగే దినాలు గతించిపోయాయి, అలాంటి కార్యమనేదే లేదు”. నవీన పరిసయ్యుల కోసం నీవు మాట్లాడు! ఖచ్చితంగా సత్యం.
60
ఏమైనప్పటికి, బైబిల్ చెప్పుచున్నది, “పైకి భక్తిగల వారివలె ఉండి, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. అట్టి వారికి విముఖుడవై ఉండు. కేవలం దూరంగా ఉండు, నిన్ను నీవు దూరంగా ఉంచుకో”. అది ఇంకనూ వారిని దేవుని కుమారులుగా చేస్తుంది, కానీ వారు పతనమయ్యే స్థితిలో ఉన్నారు. నా భావమేమిటో గ్రహించారా? వారిలో కొంతమంది సేవకులు, వారిలో కొంతమంది సంఘ పెద్దలు, వారిలో కొంతమంది పెద్దలు, వారిలో కొంతమంది బిషప్లు, వారుండవలసినంత పవిత్రంగా వారుంటారు! కానీ బైబిల్...
61
ఇప్పుడు, సోదరుడా, ఇంతకు ముందు నీవు నన్ను అడిగిన ప్రశ్నకు నేను జవాబివ్వబోతున్నాను. ఎవరో అడిగారు:
ఈ కార్యము చేయుట వలన అతడు పరిశుద్ధాత్మను పొందాడు లేక ఈ కార్యము చేయుట వలన ఆమె పరిశుద్ధాత్మను పొందినది అని నేను ఆ కార్యాన్ని ముడిపెట్టి చెప్పే స్థలం(పరిశుద్ధ గ్రంథములో) ఎక్కడున్నదో, సహోదరుడా బ్రాన్హాం నేను తెలుసుకోవాలనుకొంటున్నాను.
దానిని తెలుసుకొనే మార్గం ప్రపంచంలో ఎక్కడా లేదు. అది నిజం. దానిని నీవు తెలుసుకొనే మార్గమే లేదు. దేవుడే తీర్పుతీర్చువాడు, మనము తీర్పు తీర్చరాదు.చూశారా? కేవలం సువార్తను ప్రకటించు, జీవించు...
62
గతరాత్రి నేను చెప్పిన దానిని గురించి నేను బోధిస్తున్నాను, కొంతకాలం క్రితం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతడునా ఇంటికి వచ్చి మరియు అతడు “బ్రాన్హాం సోదరుడా, నేను కావాలనుకొంటున్నాను-నేను కావాలనుకొంటున్నాను-నేను ఉండాలనుకొంటున్నాను... నేను నా పాపాలను విడిచిపెట్టాలను కొంటున్నాను. నేను క్రైస్తవుడిని కావాలనుకొంటున్నాను”, అని అన్నాడు. అతడు నా వరండాలో కూర్చొన్నాడు.
“గొప్ప వ్యక్తేన, అంతర్జాతీయంగా (ప్రపంచవ్యాప్తంగా) పేరు కలిగిన బిల్లీగ్రహం గురించి నేనువిన్నాను” అని అతడు చెప్పాడు. “నేను ఆయన కూటములకు వెళ్ళాను మరియు-మరియు-మరియు ఆయన(బిల్లీగ్రహం) చెప్పినదల్లా, క్రైస్తవునిగా మీరంతా మారాలనుకుంటే, మీహస్తములు పైకెత్తి మరియు మీ స్వంత రక్షకునిగా క్రీస్తును మీరు అంగీకరించండి. అందువలన నేను నా హస్తములు పైకెత్తాను. ఇప్పుడు, అందరూ నిలబడి, మనమంతా ప్రార్థిద్దాం అని ఆయన(బిల్లీగ్రహం) అన్నాడు. అందువల్ల నేను నిలబడి మరియు ప్రార్ధించాను కేవలం...”(నన్ను మన్నించండి) “నేనెంత యధార్ధంగా ఉండాలో అంత యధార్ధంగా ఉంటిని. మరియు కానీ అది కూడా నాకు ఏ మంచి చేయలేదు” అని అతడు చెప్పాడు.
“అప్పుడు నేను ఓరల్ రాబర్ట్స్ కూటములకు వెళ్ళాను” అని చెప్పాడు. “నేను ఆయన (ఓరల్ రాబర్ట్స్)గురించి విన్నాను, మరియు వారంతా గొప్ప సంతోషం కల్గియున్నారని విన్నాను” అని అతడు చెప్పాడు. “నేను ఓరల్రాబర్ట్స్ దగ్గరకు వెళ్ళి, నేను క్రైస్తవునిగా మారడానికి నేను తప్పక చేయవల్సిందేమిటి? అని ఆయనను అడిగాను” అని చెప్పాడు. “నీవు అక్కడకు వెళ్ళమని” ఆయన(రాబర్ట్స్)చెప్పాడు. నీవు చాలా సంతోషముగా భాషలతో మాట్లాడేవరకూ ఆ విచారణ గదిలో వేచియుండమని ఆయన(ఓరల్ రాబర్ట్స్) చెప్పాడు. “నేను అక్కడకు వెళ్ళి మరియు నేను భాషలతో మాట్లాడేవరకూ నేను ప్రార్థించాను” అని అతడు చెప్పాడు. “నేను బయటకు వచ్చాను కానీ అది కూడా నాకు ఏ మంచి చేయలేదు”.
63
“మరియు అప్పుడు నేను మరొక కూటమునకు వెళ్ళాను మరియు వారు నాతో నేను ఇంకా శుద్ధీకరించబడలేదని చెప్పారు” అని అతడు చెప్పాడు. “నేను శుద్ధీకరించబడి మరియు సంతోషముతో అరవాలని, చాలినంత ఆనందాన్నిపొందుకోవాలని” చెప్పారు. అందునుబట్టి నేను ప్రార్థించాను మరియు నేను-నేను అరిచేంత వరకూ ప్రార్థించాను, కానీ ఇంకనూ...
“సోదరుడా, వాటిలోని ప్రతీకార్యము సత్యమే (నిజమే” అని నేను అన్నాను. వారిలో ప్రతీఒక్కరూ మంచివారే. నీ చేతులు పైకెత్తుట, భాషలతో మాట్లాడుట, వాటిలో ప్రతీ చిన్నకార్యాన్ని నేను నమ్ముతున్నాను, కానీ అయినప్పటికీ అసలైన కార్యము అది కానే కాదు. చూశారా. అది వ్యక్తియైన క్రీస్తుయేసును అంగీకరించుటైయున్నది“ చూశారా? చూశారా, అది కాదు...
ఈ కార్యములన్నీ గుణ లక్షణములైయున్నాయి. అరచుట, భాషలతో మాట్లాడుట, పరుగెత్తుట, అరచుట, ఏడ్చుట, ప్రార్థించుట, వేగముగా మాట్లాడుట, ఇవన్నీ కేవలం వెంబడించే గుణలక్షణాలై యున్నాయి. వ్యక్తియైన క్రీస్తుయేసును మొదటిగా అంగీకరించవల్సియున్నది. చూశారా? అందువలన మనము చెప్పగలిగే ఋజువు ఏమీలేదు. ఎందుకంటే ఒక మనిషి ఏడవగలడా? మనిషి ఏడుస్తూ ఏడుస్తూ మరియు మొసలివలె కన్నీరు కార్చిననూ, మరియు అతడింకనూ ఒక పెద్ద పాపివలెనే ఉండుట నేను చూశాను.
64
వినండి. యేసు మనలను గొర్రెలుగా పోల్చారు. అది నిజమేనా? గొర్రెలకాపరి తన గొర్రెలను ఎరుగును. ఇక్కడున్న వారిలో ఎవరైనా మేక అరచుట ఎప్పుడైన విన్నారా? మంచిది, సోదరుడా, నీవు ఆ వ్యత్యాసం ఎరగాలంటే నువ్వు గొర్రెల కాపరిగా ఉండుట మంచిది. మేక కూడా ఖచ్చితముగా గొర్రెవలెనె అరచును. ఉహ్-హు. అక్కడ ఎక్కడో ఒకచోట ఒక పాత ముసలి మేకను వ్రేలాడదీస్తే, మరో ప్రక్క గొర్రెను వ్రేలాడదీస్తే “బా(Baa)” అని అరుచును. మరియు అదికూడా దీనివలెనే“బా (Baa)” అని అరుచును.
మరియు బలిపీఠం వద్దనే “ఓదేవా!” అని ఏడ్చుట మరియు ఏడుస్తుండుట నేను వాటిని (గొర్రె మేకల అరుపులను)విన్నాను, కేవలం “ఓ దేవా!”అని వెక్కిక్కి ఏడుస్తూ ఇంకనూ ఒక మేక వలెనే ఉండుట. అది నిజం. అరచుట? మంచిది, మై, వారు అరచుటను నేను చూశాను వారు కేవలం... మరియు వారు నేలమీద పరుగెత్తుతూ మరియు పైకి క్రిందకి ఎగురుతూ(దుముకుతూ) అరచుట నేను చూశాను.
65
ఇప్పుడు, “బ్రదర్ బ్రాన్హాం మీరు ఏడ్చుటను నమ్మరా!” అని మీరు అడుగవచ్చును.
నన్ను తప్పుగా తీసుకోవద్దు. ఖచ్చితంగా నేను ఏడ్చుటను నమ్ముతాను. కానీ అదే ఋజువు కాదు అని నేను చెప్పుచున్నాను, చూశారా, ఎందుకనగా అవి రెండూ(మేక, గొర్రె) అరుస్తున్నాయి. వారు తాము అరవగలిగినంత గట్టిగా అరచుటను నేను చూశాను. అవునయ్యా, ఆ విధంగానే కొనసాగిపోతున్నారు, మరియు అక్కడ చాలా దూరం ప్రయాణించాల్సిన దారులున్నాయి, నేను దేని గురించి మాట్లాడుచున్నానో మీరు ఎరిగియున్నారు. వారు భాషలతో మాట్లాడుట నేను విన్నాను, బయటకు వెళ్ళిపోయి నానారకములుగా జీవించుచు, అన్ని కార్యాలను చేసేస్తారు. అయిననూ, అది సూచనకాదు.
కానీ “నీవు దానికి వ్యతిరేకివి”, అని మీరు అనవచ్చు.
ఓహ్, నేను వ్యతిరేకిని కాదు. భాషలతో మాట్లాడుట నేను నమ్ముతాను, అది సంఘములో దేవుని వరం. నేను దానిని (భాషలతో మాట్లాడుటను) తీసివేస్తే, నేను దేవునిలో నుండి ఒక భాగాన్ని తీసివేసినట్లవును. నేను ఇక్కడ నా శరీరం నుండినా నాలుక-నా నాలుకను తీసివేస్తే, నేను పరిపూర్ణమైన శరీరాన్ని కలిగియున్నట్లు కాదు. యేసుక్రీస్తు శరీరంలో భాషలు ఉన్నాయి, మరియు మీరు వాటిని తీసివేస్తే, మీరు క్రీస్తులో నుండి ఒక భాగాన్ని తీసివేస్తున్నారు. కానీ అయినప్పటికీ, అదే అదే (భాషలతో మాట్లాడుటే) పూర్తి శరీరం (క్రీస్తు) అని చెప్పలేరు. చూశారా. చూశారా? చూశారా?
66
కానీ వ్యక్తి అయిన క్రీస్తు యేసును మీరు అంగీకరించినపుడు మిగిలిన కార్యాలన్నీ ఒక్కటిగా వచ్చి దానిలో సరిగ్గా సమకూరుతాయి. ఈ ఉదయం ఈ శరీరంలో ఉన్న ప్రతీవ్యక్తి, ఈ చిన్నగుంపుగా ఉన్న ప్రజలు, మనం అన్నివైపులానున్న తెరలను క్రిందికి లాగగలిగినట్లయితే, మరియు ఇక్కడున్న ప్రతీవ్యక్తి వ్యక్తియైన క్రీస్తుయేసును పొందుకోండి. అక్కడ ఎన్నడు ఎటువంటి గడబిడ (fuss) ఉండదు లేక అక్కడ ఎన్నడూ వాగ్వాదం అనేది ఉండదు. అక్కడ కేవలం పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఉండును. నీవు ఇంకనూ దీనిని నమ్మినా మరియు దానిని నమ్మినాసరే, కాని అది కేవలం పూర్తిగా ప్రేమమయమై ఉండును, నీవుకేవలం... చూశారా? అది అదే. ఇప్పుడు “వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు” అని యేసు చెప్పెను. మరియు ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వీకము, దయాళుత్వము.
ఇప్పుడు, నేను వెళ్ళుచున్నాను (ప్రశ్నలోనికి)... ఒక మనిషి క్రైస్తవుడన్న ఋజువుకు దగ్గరగా నున్ననా ఆలోచనను నా అంచనాను నేనెరిగిన మరేదానికంటే కూడా మీకు ఇవ్వబోతున్నాను. అదేమిటో మీరెరుగుదురా? అది ఆత్మయొక్క ప్రసవ వేదన. ఒక వ్యక్తి దేవుని కొరకు ఎల్లప్పుడూ ఆకలిదప్పులు కలిగి ఉంటాడు, వారు కేవలం సామాన్యంగా...రాత్రింబవళ్ళు, వారు వారు దానిని నిలిపి ఉంచలేరు. వారు వారు వారు దేవుని కొరకు ఏదోఒకటి చేస్తారు. వారు వారు పరిపూర్ణ ప్రేమతో మరియు వారు కేవలం... ఆత్మ ప్రసవవేదనతో, ఎల్లప్పుడు ప్రసవవేదన పడెదరు. “ఏడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచుపనలు మోసుకొని వచ్చును” అని బైబిల్ చెప్పుచున్నది. అది నిజమేనా? ఈ కార్యములన్నీ.
67
ఇప్పుడు, చూడండి, అక్కడ...ఈ సంఘము గనుక... ఈ గుంపు ప్రజలకు ఈ ఉదయం నేను చెప్పినట్లయితే మరియు నేను... మరియు దేవుడు “ఇప్పుడు, చూడు, విల్లియం బ్రాన్హాం, ఆ గుంపు ప్రజలకోసం, వారికి నువ్వేమి చెప్పావో నీవు సమాధానం చెప్పవల్సియున్నది. ఇప్పుడు, నీవు వారినిగట్టిగా అరవాలని కోరుకుంటున్నావా?” అని అడిగితే,
“ఖచ్చితంగా, వారు అరవాలని నేను కోరుకుంటాను”
“వారంతా భాషలతో మాట్లాడాలని కోరుకుంటున్నావా?”
“వారిలో ప్రతీ ఒక్కరూ అలా చేయాలని కోరుకుంటాను.”
“వారంతా ఆత్మలో నాట్యమాడాలని కోరుకుంటున్నావా?”
“వారిలో ప్రతీ ఒక్కరూ అలా చేయాలని కోరుకుంటాను.”
“అది సరి, మంచిది, అది చాలా మంచిగా ఉన్నది, కానీ వారు దీనికంటే ఎక్కువగా ఇంకా ఏమిచేయాలని కోరుకుంటావు? ”ఉహ్-హు.
“మరియు అన్నిటికంటే రాత్రింబవళ్ళు ఇక్కడే ఈ బలిపీఠం వద్దే ఉండి ప్రార్థన కొరకు వారి హృదయములలో భారం కలిగిన సంఘాన్ని కలిగియుండాలని కోరుకుంటాను. మరియు వారియొక్క గృహములో నిరంతరం ప్రార్థనలో ఉంటూ మరియు దీనులుగా ఉంటూ మరియు దేవుని యొద్దకు ప్రజలను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ, మరియు ఆసుపత్రిలో ఉన్నవారికి పిలుపునిస్తూ మరియు రోగులను సందర్శిస్తూ, మరియు మరియు సంఘానికి ప్రజలు వచ్చేలా ప్రయత్నిస్తూ మరియు సరైనది చేయాలని కోరుకుంటాను. అన్నియూ కలసి ఉంచుటకంటే ముఖ్యముగా దానిని కలిగియుంటాను; అయినప్పటికి మిగిలినవి కూడా సత్యమే, అవి సంఘానికి లోపల సంబంధించినవి.”
68
కానీ దానిని నేను కలిగియున్నట్లయితే, దానినే మొదట పెట్టెదను. ఎందుకనగా నీవు దానిని పొందుకుంటే, మిగిలినవి వాటి స్థానాన్ని తీసుకుంటాయి. ఉహ్-హు.చూశారా? నీవు దానిని పొందుకున్నట్లయితే, నీవు దేవుని కొరకు ఆకలిగొన్నట్లయితే, అరచుట అనేది సంభవించును. నీవు దేవుని కొరకు చాలా ఆకలిగొన్నట్లయితే, నీవు కేవలం ఆకలితో ఉంటే, నిన్ను నీవు అలానే ఉంచుకో. ఇప్పుడు, నిన్ను నువ్వే పట్టించుకోకపోవుట నీవు చూస్తావు. కేవలం గుర్తుపెట్టుకో, చూడు, అక్కడ మరొక ఆత్మ దానంతట అదే పనిచేయుటకు ప్రయత్నిస్తుంది. దేవుని ఎదుట దీనత్వంతో, ఆత్మయొక్క ప్రసవవేదనతో పడియుండుము. కేవలం సమస్తమంచి పాత నాగరికత ఉన్న దానిని కలిగియుండుము...
69
“మొదటిసారి భూమిమీద నుండి వెళ్ళుతూ దేవుని దూత పరిశుద్ధాత్మతో ముద్రించినది, పట్టణములో జరుగు హేయకృత్యముల నిమిత్తము ఏడ్చుచు మరియు మూల్గులిడుచున్న వారినే అతడు ముద్రించాడని” నేను పరిశుద్ధ గ్రంథము ద్వారా నిరూపించగలను. యెహెజ్కేలు 9వ అధ్యాయము. అది నిజమేనా? పట్టణములో జరుగు హేయకృత్యముల నిమిత్తము మూల్గులిడుచూ ప్రలాపించుచున్నవారి నొసట మీద ముద్ర వేయుము.
ఇప్పుడు, నేను మిమ్ములను ఒక ప్రశ్న అడగాలనుకొంటున్నాను, నేను మిమ్ములను ఈ ప్రశ్న అడుగుతాను (ఇప్పుడు వీలైనంతత్వరగా మనము ముగిద్దాం). ఒకవేళ పరిశుద్ధాత్మ ఈ దినమున లూయిస్విల్లే మరియు న్యూఆల్బనీ, జెఫర్సన్వెల్ మీదుగా వెళ్ళినట్లయితే ఏమి జరుగుతుంది, ఈ మధ్యాహ్నవేళ ముద్రించుటకు, ఎవరు ఇంటివద్దే ఉండి, “దేవా, ఒక కూటము కొరకు ఆకలిగొంటూ, ఒక ఉజ్జీవాన్ని పంపు. ఓ దేవా, ఈ పట్టణము యొక్క పాపమును చూడుము. ఓ దేవా అది భయంకరముగా లేదా? ఓహ్, దేవా దయచేసి ఒక ఉజ్జీవాన్ని నీవు పంపవా? ఒక మంచి బోధకుడని పంపు, ఎవరినో ఒకరిని పంపుము. ఓ దేవా, పరిశుద్ధాత్మ కేవలం...?” అని ప్రార్థిస్తున్నారు. ఎక్కడ, ఆయన ఎక్కడ ముద్రిస్తాడు? దానిని గురించి ఆలోచించు.
70
ఇప్పుడు, “మంచిది, బ్రదర్ బ్రాన్హాం, నీ భావమేమిటి?”
నా భావము ఇదే, మరియు చీకిపోయిన తాడు మీద నడుస్తున్నామని గౌరవముగా నేను చెప్పుచున్నాను. వారు దానిలో ఉండగా, ఆ దినము ముగిసిపోతుందని నేను నమ్ముచున్నాను. చూశారా? చూశారా? నీవింకా ఆ భారమును కలిగిలేనట్లయితే, తలుపులు కలసికట్టుగా మూసుకుపోవుచున్నవి.
బిల్లీగ్రహం, ఓరల్రాబర్ట్స్, మిగిలినమేమంతా, దేశమంతటా కూటములను కలిగియున్నాము. మేము కేకలువేస్తూ ప్రార్థిస్తూ మరియు ప్రార్థిస్తున్నాము, మరియు అంతా చేస్తున్నాము. కానీ, మీరు చూశారా, తలుపులు మూసుకుపోతున్నవి. “అపవిత్రునిగానే ఉండనిమ్ము”. నేను లేఖనములు ఎత్తి చూపుచున్నాను. “అపవిత్రునిగానే ఉండనిమ్ము”. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతునిగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధముగా ఉండనిమ్ము. అన్యజనులు యొక్క తలుపులు మూసుకుపోవుచున్నవని నేను నమ్ముతున్నాను. చూశారా? ఋతువుకు సంబంధించిన ఆ యొక్క దినము ముగిసిపోవుచున్నది, లోపలికి రావలిసినవి కొన్నే ఉన్నవి. ఎందుకంటే అటువంటి కూటములు నీకు ఎంతమాత్రము లేవు, ఆత్మయొక్క ప్రసవవేదన లేనేలేదు. నీకు-నీకు ఆ భారము లేనేలేదు.
71
కొన్ని సంవత్సరముల క్రితం నాకు గుర్తున్నది. ఆలయంలోని ఆ రంపం పొట్టు అడుగు జాడలు మరియు మొదలగు కార్యముల గురించి మాట్లాడుట ఎప్పుడూ మీరు వినేయుందురు. అది ఇక ఎంతమాత్రము చేయట్లేదు, కొద్దిగా కూడా చేయట్లేదు. కానీ అది తాజాగా ఉన్నప్పుడే, దేవుడు తన సంఘాన్నిపిలుచును. రాత్రంతా బలిపీఠం మీద పడి వెక్కివెక్కి ఏడ్వడం నేను చూశాను. వారి ఇంటికి నేను వెళ్ళినపుడు, మీరు వచ్చినపుడు... పురుషులు మరియు స్త్రీలు వారి పడకగదిలో “ఓ దేవా” అంటూ (ఏడ్వడం) మీరు వినగలరు.
వారు సంఘముగుండా నడచి వెళ్ళినపుడు మీరు చూడవచ్చు, మరియు “యేసు సిలువకు దగ్గరగా నన్ను ఉంచు” అనే పాట పియానో మీద వాయించడం ప్రారంభించగానే మరియు అక్కడ కన్నీళ్ళు పొర్లుకుంటూ రావడం నేను చూశాను, మీకు తెలుసా [బ్రదర్ బ్రాన్హాం శ్వాసను గట్టిగా తీసుకొనుచున్నారు-ఎడిటర్]. ఈ సంఘంలోనికి వస్తూ, మరలా మరో సంఘానికి వెళ్ళి అక్కడ వారి యొక్క “అక్కడ ఒక ప్రశస్తమైన ఊట ఉన్నది” (అనేపాట) వింటూ, “ఓ దేవా, నా కుమారుడిని రక్షించునా కుమార్తెను రక్షించు, ఆమె నశించిపోయినది, ప్రభువా దయచేసి రక్షించు!” అని వారు ఏడ్చేవారు.
72
అలాంటి దానిని నీవిక ఎన్నడూ కనుగొనలేవు. సమస్య ఏమిటి?దేవుని ఆత్మ విడిచిపోయినది. యేసు దీనిని ముందుగానే చెప్పెను, ఆ ప్రేమ... ఎందుకనగా అనేకుల ప్రేమ...వారి ప్రేమ చల్లారును (విఫలమగును). ఎందుకనగా అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును“. చూశారా? చూశారా, చల్లదనం పెరిగిపోయి, దూరంగా పోయింది. ప్రేమ చచ్చిపోయింది. మరియు వారు లోపలికి దేనిని తీసుకువస్తున్నారు, ఒక నామకార్థ స్థితి, పియానోను పైకి క్రిందకూ వాయిస్తూ ”ఓ, హల్లేలూయ! దేవునికి మహిమ! హల్లేలూయ! మరియు ప్రభువుకు స్తోత్రం!“ చూశారా, ఆ విధమైనది, అది ఒక నామకార్థస్థితి. నిన్ను నువ్వు వెర్రివానిగా చేసికోకు, చూశారా, అది నిన్ను నువ్వు వెర్రివానిగా చేసికొనుట.చూశారా, అది అసలు విషయమేకాదు మనము చేసే వరకూ...నేను ఈ విధంగా వెళ్ళెదను, నేను మాట్లా...
నేను మన టాబర్నికల్ (గుడారం) కోసం మాట్లాడుటలేదు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నేను చూసిన దానిని గురించి మాట్లాడుచున్నాను. అది ఒక అలవాటుగా మారిపోయింది, అది మనము ఉపయోగించే అదొక రకమైన నటన. మరియు ఆత్మల యొక్క ప్రసవవేదన, అది ముగిసిపోయింది. ఓ, సోదరుడా, సోదరీ(దేవా, మా మీద కృప చూపుము) దేవుడు కృప చూపును గాక!
73
ఈ ఉజ్జీవములు మరియు కార్యముల వైపు చూడండి కేవలం వెదజల్లబడుచూ మరియు వెదజల్లబడుచూ మరియు వెదజల్లబడుతుంది, మరియు సువార్త మరింత స్పష్టముగా ప్రకటించబడుతున్నది, అది...అది నేటి దినమున చూడండి, త్వరత్వరగా ఉజ్జీవము ముగిసిపోయిన వెనువెంటనే, వారు దూరముగా వెళ్ళిపోవుచున్నారు, ఏమిటో మీకు తెలుసా?#182 నన్ను దీనిని చెప్పనివ్వండి. నేను దీనినుండి దూరముగా ఎందుకు వెళ్తున్నానో నాకు తెలియదు. కాని, చూడండి, “పరలోకరాజ్యము సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది” అని యేసు చెప్పెను. మరియు అతడు ఆ వలను తీసినపుడు, ఒకవేళ ఆ సముద్రములోని నానారకములైనవాటిని అతడు తీసియుండవచ్చు. అతడు, తాబేళ్ళు తీయవచ్చు, మరియు పాములు తీయవచ్చు, మరియు గాజురొయ్య, చేపలను తీయవచ్చు, నీటికుక్కలను, చేపలను చూశారా? మరియు నేను నమ్ముచున్నాను ఆవల...
74
ఇప్పుడు, చూడండి ఇక్కడ ఒక తాబేలు ఉన్నది, మరియు ఇక్కడ ఒక చేప ఉన్నది. ఆ తాబేలు దానంతట అదే సహాయం చేసుకోలేదు, ఎందుకంటే అది ఒక తాబేలు, అది ప్రారంభంతోనే తాబేలు అయియున్నది. దాని స్వభావం తాబేలు, మరియు దానికి అక్కడ ఉన్నదంతా అదే. (ఇప్పుడు గుర్తుంచుకోండి, నేను-నేను ప్రార్థిసానని చెప్పాను) చూశారా అది ప్రారంభం నుండి తాబేలు, అది ఇప్పుడునూ తాబేలే. దాని ప్రారంభము పాము అయితే, అది ఇప్పుడునూ పామే. దాని ప్రారంభము నీటికుక్క అయితే...
మరియు ఆ కొలనులో ఉన్న చేపలన్నింటిని బయటకు లాగేవరకూ ఆ వల వేయబడుచూ మరియు వేయబడుచూ మరియు వేయబడుచున్నదని నేను నమ్ముచున్నాను.
ఆ కారణమును బట్టే “మంచిది, నేను నా చేతులు పైకెత్తాను. దేవునికి మహిమ నేను రక్షించబడాలనుకొంటున్నాను. ప్రభువుకు స్తోత్రం!” అని చెప్తున్నారు. మరియు కొన్నిరోజుల తర్వాత “ఓ, లిడియా, నీకు తెలుసా అదంతా పనికిరానిది... బుద్ధిహీనత. నేను అది నిజమని అనుకున్నాను.” అని అంటున్నారు. ఎందుకని? దాని స్వభావం ఇక్కడ ఉన్నది. అది ప్రారంభంనుండే నీటి పురుగు; ప్రారంభం నుండి ఒక సర్పం.
ఆ చేప ఆ కొలనునుండి బయటకు లాగబడేది ఇప్పుడే. ఆ వల ఎండిపోవును. మరియు యేసు వచ్చినప్పుడు తన చేపలను ఆయన తీసుకొని పోవును. నా భావమేమిటో మీరు చూశారా? ఓహ్, అక్కడ క్రైస్తవ్యం యొక్క చిన్న గురుతు నీలో ఉన్నా, ఈ ఉదయం దానిని ఎంత గట్టిగా పట్టుకోగలిగితే అంతగట్టిగా పట్టుకుని నీ హృదయం అంతటితో దానిని పోషించి కాపాడుకో.
75
“దేవుని కుమారులు నరుల కుమార్తెలను తీసుకొనిపోయిరి”. ఖచ్చితంగా వారు దేవుని కుమారులే. నేటికిని వారు ఇంకా దేవుని కుమారులే, కాని వారు పడిపోయిన దేవుని కుమారులు. వారిలో కొందరు, లేఖనాపూర్వకంగా, వ్యూ! వారు ఎంతలా లేఖనములు మాట్లాడగలరో! వారు దేవుని కుమారులు. మీకు తెలుసా, సాతాను దేవుని కుడివైపున ఉండే వ్యక్తి (Right handman) మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఉన్నఏ-ఏ వేదాంతి - వేదాంతి కంటే ఎక్కువగా లేఖనముల గురించి వాడికి తెలుసు. మాట్లాడుట గురించి... అతడు వేదాంత పాఠశాలలను పైకి క్రిందకి త్రిప్పి వేసాడు, ప్రత్యేకంగా ఇక్కడున్న ఒక బాప్టిస్టు వ్యక్తి “యేసుక్రీస్తు రోమా లేక ఒక జర్మన్ సైనికుడికి పుట్టాడు” అని-అని ఇక్కడ చెప్పుచున్నాడు. నేను దానిని గురించిన పుస్తకమును పొందాను, రాబోవుతున్న రోజులలో దానిని మీకు చూపిస్తాను. అది మంచిది.
76
త్వరగా, నిర్గమకాండము... ఓహ్, మనము వెనకే ఉంటే మనము దానిని ఎన్నడూ పొందుకోలేము. వాటిని ఇప్పుడే త్వరగా నేను తీసుకుంటాను, నేను చాలా సమయం మాట్లాడానని నాకు తెలుసు, ఇంకొన్ని నిమిషములు నన్ను భరించగలరా? [సమాజం ఆమేన్! అని చెప్పుచున్నది]
ప్రశ్న: ప్రకటన గ్రంథములో ప్రస్తావించబడిన లక్షా నలభైనాలుగు వేలమంది, ఆ యూదా శేషము అని మనము... సంఘము యొక్క ఎత్తుబాటులో వారు భాగముగా యుందురా? (అయిపోయినది) అది ప్రారంభములోని ఇశ్రాయేలు కాదా...వారు ప్రారంభించారు... (నన్ను మన్నించండి)... ఆ కాలము - కాలములో వెళ్ళుదురా...
నన్ను మన్నించండి. దీనిని నేను తయారు చేసేవరకూ ఒక్క నిమిషం వేచియుండుడి. అది-అ వెళ్ళుతూ, పేపర్ మీద నొక్కబడియున్నది.
ప్రశ్న: నవీన మతపరమైన వ్యక్తులు మనకు చెప్పుచున్నట్లుగా, క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పాలనలో, మనిషి జీవించే దానికంటే ఉన్నతముగా జీవిస్తాడా? అవునయ్యా.
ఇప్పుడు, ఒక్క నిమిషం, దీనిని సరిగ్గా పొందుకుంటాను.
ప్రశ్న: ఆ లక్షా నలభైనాలుగు వేలమంది, శేషముగా ఉన్న మనము...
ఆ మొదటిదాని మీద మనము సరిచేయబడాలనుకుంటున్నాము, ఖచ్చితముగా మీకు చూపుటకు ... చూశారా, ఆ లక్షా నలభై నాలుగువేల మంది...
ప్రశ్న: ప్రకటన గ్రంథములో ప్రస్తావించబడిన లక్షా నలభై నాలుగువేల మంది, యూదా శేషముసంఘము యొక్క ఎత్తబాటులో భాగముగా ఉందురా? ఆ లక్షా నలభై నాలుగువేల మంది ఉందురా...
ఇప్పుడు, కొద్దిగా... నేను-నేను... నేను దానిని ప్రారంభించే ముందుగా నా మనస్సులో దీనిని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకొంటున్నాను
ప్రశ్న: ప్రకటన గ్రంథములో ప్రస్తావించబడిన లక్షా నలభై నాలుగువేలమంది, యూదా శేషము సంఘము యొక్క ఎత్తబాటులో భాగమవుదురా?
నేను మొదటి (ప్రశ్న) దానిని తీసుకుంటాను. ఆ లక్షనలభై నాలుగు వేలమంది యూదా శేషముగా ఉన్నారు, కానీ ఎత్తబడే సంఘము కాదు. చూశారా? ఇప్పుడు ప్రకటన గ్రంథమంతటా చూస్తే, 6వ అధ్యాయములో, మీరు దానిని చూస్తారు.
అప్పుడు మనము దానిలోని మరోభాగాన్ని మరో-మరో ప్రక్కగా పొందుకొనెదము. మరియు అక్కడ దానిలో వారు మరొక ప్రశ్నను కల్గియున్నారు. ఈ కార్యములు గమనించండి.
77
మంచిది, ఇప్పుడు ప్రకటన గ్రంథము 6లో చూడండి, ఇప్పుడు, మీరు అక్కడనే కనుగొనెదరు. చూశారా? మనము ప్రారంభించబోతున్నాము, అతడు(యోహాను) ముందుకు వెళ్ళి మరియు గుర్రముల మీద స్వారీ చేయువారి కోసము మరియు మొదలగునవి మరియు మొదలైనవి మాట్లాడుచున్నాడు. వారు తెరచినపుడు... ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము చూద్దాము:
ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు...
నేను-నేను-నేను తప్పుగా తీసాను, నేను మరో అధ్యాయములో ఉన్నాను, అది 7వ అధ్యాయము
...అటు తరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు
దేవదూతలు నిలిచియుండుట చూచితిని...
ఓహ్, ఎంతటి అద్భుతమైన ప్రశ్న, మరియు దానిలోనికి వెళ్ళుటకు సరిపడినంత కొద్ది సమయాన్ని తీసుకుని మరియు రోగుల కొరకు ప్రార్థించెదము.
...అటు తరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమి మీదనైనను, సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగుదిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని.
మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొకదూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని...
ఓహ్, ఖచ్చితంగా, ఇది అద్భుతమైన ప్రశ్న. చూశారా? ఇప్పుడు, అది ఒక నాటకరూప చిత్రముగా, యోహాను దానిని ఇప్పుడు చెప్పుచున్నాడు, ఇక్కడ... ఇప్పుడు భూమికి దూరంగా, ఆత్మలో ఉండి, తిరిగి భూమివైపు చూస్తున్నాడు. మరియు భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకునియుండుట అతడు చూశాడు.
ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథములో “వాయువులు” అనగా... మీ కొరకు లేఖనములను పరిగెత్తించేంత సమయం నాకు లేదు. కానీ మనము దీనిని పొందుకుంటాము. ఒకవేళ జవాబు సరిగ్గా ఇవ్వనట్లయితే, తిరిగి మరొకసారి దీనిని చెప్తాను. ఆ నాలుగు... పరిశుద్ధ గ్రంథములో వాయువులు అనగా అర్థం “యుద్ధములు మరియు వివాదములు”. యోబు దినములలో వలె, మీకు గుర్తున్నదా, సుడిగాలులు క్రిందకి దిగివచ్చి మరియు మరియు కుమారులను తీసుకొనెను. మరియు నా భావమేమిటో మీరు గ్రహించారా, అది అది అది ఒక సమస్య. చూశారా?
... మరియు నలుగురు దేవదూతలు (నలుగురు దేవదూతలు లేదా నలుగురు వర్తమానికులు) భూమియొక్క నాలుగు దిక్కులలో... వారు నిలబడి యుండుట చూచితిని, నాలుగు వాయువులను పట్టుకొని...
...మరియు భూమికి సముద్రమునకు హాని కలుగచేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత బిగ్గరగా చెప్పెను (ఇప్పుడు, అది ప్రభువు రాకడను గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు. చూశారా?)
మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని చెప్పెను.(దాసులు)
78
ఇప్పుడు, గుర్తుంచుకొనండి, సంఘము ఆయన దాసులుకాదు. మనము ఆయన కుమారులము, ఆయన దాసులము కాము. సంఘము ఎన్నటికీ ఆయనకు దాసులు కానేరదు, అది ఆయన పిల్లలే. చూశారా? దాసులు:
మరియు ముద్రింపబడినవారి... లెక్క చెప్పగావింటిని
మరియు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్షా నలువది నాలుగు వేలమంది (ఇప్పుడు, చూడండి, అందరూ యూదులే)
ఇప్పుడు గమనించండి! “యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండు వేలమంది. రూబేను గోత్రములో పన్నెండు గాదు గోత్రములో పన్నెండు. ఆషేరు పన్నెండు. మరియు నఫ్తాలీ పన్నెండు, మరియు-మరియు ఆ విధంగా షిమ్యోను పన్నెండు మరియు ఆషేరు పన్నెండు మరియు జెబూలూను పన్నెండు మరియు బెన్యామీను, పన్నెండు.” మరియు ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రములు అలా పన్నెండును, పన్నెండుసార్లు (గుణించగా) ఎంత? లక్షా నలభై నాలుగువేలు ఇప్పుడు, గమనించండి ఇశ్రాయేలీయుల సమస్త గోత్రీకుల పిల్లలు. ఇప్పుడు, గమనించండి, వారు దేవునికి “దాసులు”.
ఇప్పుడు వీలైతే నేను దీనిని మీకు తేటపరచగలను. ఇప్పుడు గమనించండి:
అటు తరువాత... ఇదిగో, ఎవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహమును నేను చూడగా (ఇప్పుడు ఇది మరొక గుంపు చూశారా) ప్రతి జనములో నుండియు... ప్రతీ వంశములో నుండియు ...ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండియు, మరియు ప్రజలలో నుండియు, సింహాసనము ఎదుటను, మరియు గొర్రెపిల్ల ఎదుటను, తెల్లనివి... ధరించినవారై...గొర్రెపిల్ల ఎదుట తెల్లని వస్త్రములు ధరించిన వారై, ఖర్జూర మట్టలు చేతపట్టుకుని నిలువబడిరి;
మరియు వారు మహాశబ్దములతో ఎలుగెత్తి... (పరిశుద్ధాత్మ కూటములో వినండి)...సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని చెప్పిరి. దేవదూతలందరూ... మరియు సింహాసనము చుట్టూ-చుట్టూను మరియు పెద్దల చుట్టును మరియు ఆ నాలుగు జీవులచుట్టును...వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి దేవుడిని ఆరాధించారు:
ఆమేన్ చెప్పుచూ మా దేవునికి స్తోత్రమును... మహిమయు... జ్ఞానమును... కృతజ్ఞతాస్తుతియు... ఘనతయు... శక్తియు... బలమును, యుగయుగముల వరకూ కలుగుగాకని చెప్పుచూ దేవునికి నమస్కారము చేసిరి, ఆమేన్.
పెద్దలలో ఒకడు...(ఇప్పుడు, ఇప్పుడు గమనించండి...యోహాను దర్శనములో ఉన్నాడు) ...పెద్దలలో ఒకడు అడిగెను... నన్ను అడిగెను, వీరెవరు అని నన్ను అడిగెను...(ఇప్పుడు, యోహాను ఒక యూదుడు మరియు అతడు ఇశ్రాయేలు పండ్రెండ్రు గోత్రములు చూశాడు, అతనికి వారు తెలుసు)...కాని తెల్లని వస్త్రములు ధరించుకునియున్న వీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చిరి? వారు ఎక్కడనుండి వచ్చారు? ఇప్పుడు, నీవు యూదులందరిని చూశావు, వారిలో ప్రతీ ఒక్కరూ నీకు తెలుసు, నీవు వారిని గోత్రములలో లెక్కపెట్టి, మరియు ఎన్నివేలమంది
ముద్రింపబడతారో చెప్పావు. కానీ ఇక్కడున్నప్రతీ వంశములోని వారు, ఆయా భాషలు మాట్లాడేవారు, మరియు ప్రతీ జనములో వారు ఎవరు? వారు ఎక్కడనుండి వచ్చారు?
అందుకు నేను, నీకే తెలియునని అతనితో చెప్పితిని. (మరో మాటల్లో “వారు ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు. నేను ఒక యూదుడిని మరియు నేను ఇక్కడ నిలబడియున్నాను, మరియు నా-నా ప్రజలు(జనులు) మరియు ఇక్కడుండుట నేను చూశాను” అని యోహాను చెప్పుచున్నాడు... మరియు అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు,...(చూశారా?)... మహాశ్రమలలో, రక్తములో (సంఘ సభ్యత్వములో కాదు) తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి.. కానీ గొర్రెపిల్ల యొక్క రక్తములోనే. (చూశారా?)
అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు...
79
ఇప్పుడు, మిసెస్ బ్రాన్హాం (మీడా)నాకు ఎక్కడ సేవ చేస్తుంది? నా ఇంట్లో, అదే వధువు. మిసెస్ నెవిల్ (నెవిల్గారి భార్య) ఆమె ఎక్కడ ఉంటుంది, ఇంట్లో నీకు సేవ చేస్తుంది. వధువు ఉండేది అక్కడే (వారు దాసులు కాదు)... వధువు సేవ చేస్తున్నది.
...ఆలయములో; మరియు వారు... సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును.
మరియు వారికి ఇక మీదట ఆకలి ఉండదు... వారిక్కడ ఉన్నప్పుడు కొన్నిసార్లు వారు భోజనాన్ని పోగొట్టుకున్నట్టుగా కనపడియుండవచ్చు (వారు పోగొట్టుకోలేదా?)... ఆకలియైనను దాహమైనను ఉండదు... సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగలదు.
ఏలయనగా వారి మధ్యనుండు గొర్రెపిల్ల వారికి కాపరియై వారిని లోనికి-కి జీవ...(ఒక్క నిమిషం) జీవజలముల బుగ్గ యొద్దకు నడిపించును; మరియు దేవుడే తుడిచివేయును... ప్రతి భాష్పబిందువును (అక్కడ ఒక పెద్దగా ఏడ్చే గుంపు ఉండును) వారి కన్నుల నుండి తుడిచివేయును. (చూశారా?)
80
ఇప్పుడు, గమనించండి, వారు ఆకలిగొన్నారు మరియు దాహముగొన్నారు మరియు ఏడ్చారు, మరియు మూలిగారు మరియు యాచించారు, వారు శ్రమలలోనుండి వచ్చియున్నారు (“పరిశుద్ధ గుండ్రాళ్ళ వైపు చూడండి, వారు పిచ్చివారు!” అన్నారు) ఓహ్! మై, మీరు చూశారా? కానీ వారు ఏడ్చారు మరియు యాచించారు తప్ప, వారు తొందరపడి మరియు నిరాశ చెందలేదు. మరియు వారు కేవలం ఏడ్చి మరియు యాచించారు. మరియు, చూడండి, మరియు వారంతా అన్ని వంశముల వారు, ఆయా భాషలు మాట్లాడువారు. అన్ని జనములలోని వారు.
ఇప్పుడు, ఆ లక్షా నలభై నాలుగువేల మంది, వారు యూదులు. అబ్రహాము దేవుని సేవకుడు(దాసుడు) యూదులు ఎల్లప్పుడూ దేవుని దాసులే. అన్యులెన్నడూ ఆయన దాసులుకాదు.
81
ఇప్పుడు, దీనిని కొద్దిగా త్వరగా చూద్దాం, ఎందుకంటే మనకు ఇంకా రెండు లేక మూడు (ప్రశ్నలు)ఉన్నవి. మరియు నేను ఎంత త్వరపడాలో అంత త్వరితముగా చూస్తాను, మరియు బహువేగముగా పరిగెత్తుటకు ప్రయత్నించుటలేదు. కానీ నేను సరిగ్గా తిరిగి వెనక్కి వచ్చి వచ్చే ఆదివారం (దేవుని చిత్తమైతే) మరలా నేను వాటిని తీసుకుంటాను మరియు వాటి మీద ఎక్కువ సమయం గడుపుదాము.
కానీ, ఇప్పుడు చూడండి, అతడు భూమియొక్క నాలుగు దిక్కులు చూశాడు, మరియు దూతలు భూమికి నాలుగు దిక్కులలో నిలువబడియున్నారు. ఇప్పుడు, మీరు అనవచ్చు అది (భూమి) గుండ్రంగా ఉందని నేను అనుకుంటున్నానే, అది (గుండ్రముగా ఉండే భూమికి) నాలుగు దిక్కులున్నట్లు చూపించట్లేదు, మీరు చూశారా.
82
ఇప్పుడు, “భూమి యొక్క నాలుగుదిక్కులలో నాలుగు వాయువులను పట్టుకున్నారు”. మరొక మాటల్లో, ఇక్కడ వాయువుబయలు వెళ్ళగానే, యుద్ధము ప్రకటించబడుతుంది మరియు ప్రపంచమంతటా కలహము రేగును. అది ఎప్పుడైనా జరిగిందా? మొదటి ప్రపంచ యుద్ధము వరకూ అలా ఎన్నడూ జరుగలేదు. “వాయువులను పట్టుకొనుట”, మరియు వారు పోట్లాడుకుంటూ స్వాధీన పరుచుకోవడానికి వెళ్ళుతుంటారు.
మరియు ఇప్పుడు, ఇక్కడ మరొకటి వచ్చుచున్నది. ఇప్పుడు, మీరు గనుక ఆ దూతను పరిశీలించి గమనించినట్లయితే, యెహెజ్కేలు 9లో, యూదులను హతమార్చుటకు యెరూషలేము గుండా హతమార్చే ఆయుధములతో వారు గవిని వెనుక నుండి వచ్చుచున్నఅతడే ఈ దేవదూత. మీకు గుర్తున్నదా? ఆయన చెప్పుచున్నాడు “దానిని నిలుపుము! దానిని నిలుపుము! పట్టణములో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారికి నొసట మీద లలాటముల గురుతు వేయువరకూ ఆపుము!” అది నిజమేనా?
అప్పుడు, అతడు దానిని చేసిన తరువాత(ముద్రించిన తరువాత), అప్పుడు వారిని లోపలికి వెళ్ళనిచ్చి మరియు హతమార్చెను. అదే తీతు(Titus) ద్వారా జరిగిన హింసకాండ. ఇప్పుడు, మీరు చూసారా, అదే దేవదూత మరలా వచ్చుచున్నాడు, సూర్యోదయ దిశ నుండి వచ్చుచున్నాడు (యేసు రాబోవుచున్న దిశ) మరియు సజీవుడగు దేవుని ముద్రను ఆ దేవదూత కలిగిఉన్నాడు. మహిమ!
83
ఇప్పుడు, సజీవుడగు దేవుని ముద్ర అంటే ఏమిటి? ఓహ్, ఈనాడు ప్రపంచంలో దాని మీద గొప్పవివాదము లేదా? కొంతమంది సబ్బాతును ఆచరించుట(దేవుని ముద్ర)అని చెప్పుచున్నారు మరికొందరు ఇది చేయుట మరియు అది చేయుట అని చెప్పుచున్నారు. కాని బైబిల్ ఏమి చెప్పుతున్నదనగా “పరిశుద్ధాత్మయే దేవుని ముద్ర!” ఎఫెసి 4:30లో “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; మీ విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రించబడియున్నారని (బైబిల్) చెప్పుచున్నది”. చూశారా? అది మంచిది. అది పరిశుద్ధాత్మయే.
అప్పుడు వచ్చినది ఏమిటి? ఇప్పుడు, చూడండి! ఓహ్, దీని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నా హృదయం ఉరకలు వేయుచున్నది. ఇప్పుడు ఆయన చెప్పుచున్నాడు, (ముద్రించే) వరకూ “నాలుగు వాయువులను పట్టుకొనుము” (మరో మాటల్లో) దేవుని సేవకులను వారి నొసట మీద మేము ముద్రిస్తున్నాము. “యూదులే” ఆ సేవకులు (దాసులు). (యోహాను తిరిగి “ లక్షానలభైనాలుగు వేలమంది ముద్రింపబడి ఉండుట చూచాను” అని చెప్పాడు) ఇప్పుడు, ఆ వాయువులు భూమిని కప్పుట ప్రారంభించగానే, మొదటి ప్రపంచయుద్ధములోనే హరమెగెద్దోను యుద్ధం ప్రారంభమౌతుంది, కానీ...
84
ఇప్పుడు, మీకు చూపించడానికి, నా దగ్గర మరొక లేఖనమున్నది. యేసు ప్రజల గురించి మాట్లాడుచుండెను...“కొంతమంది మొదటి ఘడియలో వచ్చారని, మరియు మరియొక ఘడియలో మరియు వారు పదకొండవ ఘడియలో వచ్చిన ప్రజలు. పదకొండవ ఘడియప్రజలు”. అని ఆయన చెప్పెను. ఇప్పుడు, మీరు ఆ లైన్ల (వరుసల) మధ్యనున్న ఆత్మీయమైనది చదువుచున్నారు, అందుచేత నేను ఇక్కడ నుండి ఉరికి మరిత్వరపడెను. ఇప్పుడు చూడండి “పదకొండవ ఘడియ ప్రజలారా, లోపలకి రండి”. మరియు ఇప్పుడే...“మొదటివారు (ఉదయం 6 గంటలకు వచ్చిన వారు) వచ్చి, ఒక దేనారము తీసుకొన్నారు, మరియు పదకొండవ ఘడియ ప్రజలు (సాయంత్రం 5 గంటలకు వచ్చినవారు) మొదటివారు తీసుకున్నట్టుగా అదే దేనారమును తీసుకున్నారు”. అది నిజమేనా? పదకొండవ ఘడియ!
ఇప్పుడు, గమనించండి, యూదులు ఇప్పుడు మనము వెంబడించే మైలురాయియై యున్నారు. ఇప్పుడు, మొదటి ప్రపంచయయుద్ధం రాగానే, అది ప్రతీ యూదుడిని, సమస్తదేశాలకు చెదరగొట్టేసింది. ఈరోజు అడగబడిన మొదటి లేఖనంవలెనె, ఆయన వారిని అన్ని దేశాలకు చెదరగొట్టినట్టుగా, అక్కడ వారంతా ఉ న్నారు. మరియు ఇక్కడ ఆ వాయువులు ఆ యోరూషలేములోనికి రాగానే, ప్రతి చోటనూ, ఒక ప్రపంచయుద్ధం.
85
మరియు ఆయన “పట్టుకో! దేవుని సేవకులను మేము ముద్రించే వరకూ దానిని ఆపుము” అని చెప్పాడు మరో మాటలో “మేము వారిని అన్ని దేశాలనుండి, ప్రతీచోటనుండి, తీసుకొచ్చాము, ఎందుకంటే ఆ నలభై నాలుగువేల మందిని ముద్రించుటకు వారిని ఇక్కడకు తీసుకువచ్చాము. దానిని పట్టుకో!”
మరియు ఆ మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆ సంవత్సరం పదకొండవ నెలలో, ఆ నెలలోని పదకొండవ దినమున, ఆ రోజులోని పదకొండవ ఘడియలో ఆపగా, పదకొండవ ఘడియ ప్రజలు లోపలికి వచ్చియున్నారు. యూదులు కొరకు చివరి పిలుపు! మరియు అతడు (యూదులు) ప్రారంభంలో పెంతుకొస్తు దినమున జరిగినట్టుగానే అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును వారు పొందబోవుచున్నారు, మరియు ప్రతీది అలానే చేయుదురు, పదకొండవ ఘడియ ప్రజలు కదులుచున్నారు.
“ఇప్పుడు, మేము ముద్రించే వరకూ, దానినిపట్టుకో” అని ఆయన చెప్పాడు.
“ఎంతకాలం నీవు పట్టుకుంటావు (వాయువులను)?”
“మా దేవుని సేవకులను మేము ముద్రించేవరకూ (పట్టుకో). ఇప్పుడు, మేము-మేము అన్యులను ముద్రిస్తున్నాము, శ్రమలు మరియు హింసల గుండా వారు వేవేలసార్లు వేవేలుగా ముద్రించబడియున్నారు, వారు ముద్రింపబడ్డారు. కానీ ఒక్క నిమిషం ఆగుము! ఒక్క నిముషం ఆగు! వదలద్దు... దాసులను మేము ముద్రించే సమయం వచ్చేవరకూ వదలవద్దు”. మరియు ఆయన ఒక లక్ష నలభై నాలుగువేలమందిని ముద్రించాడు.
వాయువులు మరలా వదలబడబోతున్నాయి.
86
వాయువులు మరలా వదలబడబోతున్నాయి. ఇప్పుడు, గమనించండి, మొదటి ప్రపంచ యుద్ధం నుండి కూడా యూదులకు వ్యతిరేకంగానే నిరంతరం హింసకాండ ప్రారంభమవుతూ వచ్చినది. రెండవ ప్రపంచయుద్ధానికి హిట్లర్ పైకి లేచాడు, మరియు అతడు అలా చేసినపుడు, అతడు ప్రారంభించాడు... ఏమిటి? అతడు చుట్టూ ఉన్న పూర్తి ప్రపంచాన్ని ఏడిపించాడు. అది నిజమేనా? అతడు పూర్తిగా చుట్టూ అంతటా ఏడిపించాడు. అవును, అతడు అలా చేసాడు.
ప్రతీదీ కమ్యూనిజం కాబోతున్నది. ఆ రాత్రి ఆ రివరల్లో నేను అదే కార్యాన్ని బోధించగా, అక్కడున్న జైలులో వారు నన్ను పెట్టాలనుకున్నది మీకు గుర్తున్నదా? అవునయ్యా. “అక్కడ మూడు ఇజమ్స్ (Isms) ఉన్నాయి. మరియు అవన్నీ ఒకే ఇజమ్ కలసిపోవును, ఆ ఇజమ్ యొక్క హింసకాండ ద్వారా యేసుక్రీస్తును మరలా భూమి మీదకి తీసుకువచ్చును”, అని చెప్పబడినది. మరియు అది ఖచ్చితంగా అలా జరిగినది. మరియు అది కమ్యూనిజమ్, మరియు-మరియు హిట్లర్ మరియు-మరియు నాసీ మరియు మొదలగువారు; మరియు అదే విధంగా ముస్సోలిని యొక్క ఫాసిజమ్, మరియు హిట్లర్ మరియు స్టాలిన్. “ఒక్కటే అక్కడ స్థానాన్ని తీసుకోబోతుంది, ఆ ఒక్కటి ఏమిటి నాకును తెలియదు, కాని అది ఉ త్తరదేశపు రాజు అని నేను నమ్ముచున్నాను” అని చెప్పాను. ఖచ్చితంగా ఆ కార్యాలు ఇక్కడ ఏ విధంగా బోధింపబడ్డాయో మరియు బ్రదర్ మహోనె, మరియు అప్పుడు ఉన్న మీ అందరికీ ఈ కార్యములు గుర్తుండియుండును.
మరియు వారు అన్నారు “నీవు గనుక దానిని బోధిస్తే...”
87
మరియు ఈ NRA (National Rifle Association-అమెరికా
తుపాకుల సమాఖ్య) కార్యము మీద, నేను చెప్పాను “అది మృగపు ముద్ర కాదు ఖచ్చితంగా కాదు. అది మత సంబంధవిషయాలపై మనుష్యులను వెలివేయుసంస్థ; అది అది (మృగపు ముద్ర) కాదు”. కేవలం ప్రారాంభాన్ని తెలుసుకోవడానికి మరియు ప్రజలను సిద్ధపరచడానికి అది కేవలం ముందుగా పంపించబడినటువంటిది మాత్రమే. సరిగ్గా ఇక్కడే విచారము యొక్క ప్రారంభమున్నది, సరిగ్గా ఇక్కడ మనము ప్రారంభించవలసినది ఉన్నది. సరిగ్గా ఇక్కడే ఆ-ఆ సమయం ముగిసిపోవుటకు ప్రారంబమవుచున్నది. ఇప్పుడు, గమనించండి, సమయము అక్కడే ఉన్నది.
ఇప్పుడు, హింసకాండ యూదుల మీద చెలరేగగానే, మరియు వారు, వారిని హింసించడం ప్రారంభించి మరియు యెరూషలేముకు ప్రతీ దేశమునుండి వారిని తోలివేసారు. అది నిజమేనా? ప్రతీ ఒక్కరూ, వారు వెళ్ళిపోవుచున్నారు తిన్నగా...మరియు ఆయనకు ఒక లక్ష నలభై నాలుగు వేలమంది కలరు. ప్రకటన గ్రంధములో కొంచెము ముందుకు వెళ్ళి చూడండి ఎక్కడైతే యోహాను...
88
ఇక్కడున్న మిస్టర్ బోహనన్ నాతో “నేను ఆ ప్రకటన గ్రంథాన్ని చదవలేను” అన్నాడు. “అక్కడ సీనాయి పర్వతము మీద వధువు నిలబడియుంది” అని చెప్పాడు. “పరలోకములోను వధువు ఉంది” అని చెప్పాడు. మరియు “అక్కడ ఒక వధువున్నది, మరియు నీరు... ఆమెతో యుద్ధము చేయుటకు ఆ ఘటసర్పము దానినోట నుండి నీటిని చిమ్ముచున్నదని” చెప్పాడు. అతడు అన్నాడు...
నేను “ మిస్టర్ బోహనన్, మొదటిగా దానిని'వధువు' అని పిలుస్తూ తప్పుగా చెప్తున్నావు” అన్నాను. “సీనాయి పర్వతము మీద నిలబడింది, ఒక లక్ష నలభై నాలుగువేల మంది యూదులు. వధువు, సరిగ్గా, యేసుతో పరలోకములో ఉంటుంది. మరియు ఆ స్త్రీ సంతానపు శేషము (Remnant) తో ఆ ఘటసర్పము తన నోటనుండి నీరు చిమ్ముతూ యుద్ధము చేస్తుంది” అని నేను చెప్పాను. అది ఇక్కడున్న గుంపు క్రింద వదిలివేయబడినది, అదికాదు. చూశారా? స్త్రీ సంతానము యొక్క శేషము, పరిశుద్ధాత్మను పొందకుండా “శుద్ధీకరించబడిన సంఘమునైయున్నది”, ఆ ఘటసర్పము వారితోనే యుద్ధము చేయును. చూశారా?
89
వారు ఇక్కడ ఉన్నారు, అక్కడ మూడు గోత్రాలు ఉన్నాయి. ఆ మూడింటిని ఎప్పుడూ మీ మనసులో ఉంచుకొనండి. మరియు ఈ లక్షా నలభై నాలుగువేల మంది చుట్టూ ఆ గొప్ప విమోచించబడిన వధువుండుట అతడు చూశాడు. ఈ విడువబడిన శేషము, వారు అక్కడ ఉన్నారు, అక్కడ యూదులున్నారు. అక్కడ ఇంకనూ ఒక లక్ష నలభైనాలుగు వేల మంది ఉన్నారు. ఇక్కడ శుద్దీకరించబడి, పరిశుద్ధాత్మను తృణీకరించినవారు ఉన్నారు. సంఘము హింసించబడుతుంది వ్యతిరేకంగా... ఆ-ఆ రోమా సంఘము మరియు వారు వారిని హింసిస్తారు. కానీ వధువు అప్పటికే ఎత్తబడి, పరలోకములో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము వారు ఎక్కడుంటారు అని పరిశుద్ధ గ్రంథము చెప్తున్నదో, ఖచ్చితంగా వారు అక్కడే ఉండెదరు, వారు అక్కడే ఉన్నారు. చూశారా?
అందువలననే లక్షా నలభైనాలుగు వేలమంది యూదులు, దేవుని దాసులైయున్నారు. మరియు పరిశుద్ధాత్మ సువార్త వారికి బోధించినపుడు, ఆదియందు వారు పొందినట్టుగానే ఖచ్చితంగా వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందెదరు, అన్యులకాలము సంపూర్ణమైనప్పుడు, సంఘము ముద్రించబడును, ఎత్తబాటు వచ్చును.
90
అన్యుల దినాలలో, సువార్త ప్రతీచోట బోధించబడినది, అన్యుల మధ్య సుత్తితో కొట్టబడినది (సువార్త),ఆ పెద్దవల లాగగానే, నీటిలో ఉన్న ప్రతీ చేప రావడానికిప్రయత్నిస్తుంది. మరియు వారిని చూడండి, ఆపెద్ద...?... ఆ లాగబడిన వల అంతా తాబేళ్ళు మరియు నీటి సాలీళ్ళు మరియు మొదలైనవాటితో నిండియున్నది. ఉజ్జీవం ముగిసిన వెనువెంటనే వారు తిన్నగా మరలా లోకములోనికి వెళ్ళిపోయెదరు. ఆ చేప దరిదాపుగా ఇప్పటికే పట్టబడియున్నది. నా భావమేమిటో చూశారా?
సువార్త ఇప్పటికే బోధించబడినది! ఇంక మీరు ఏడ్చుటను వినలేరు, మూల్గులు ఇక వినబడవు, నిట్టూర్పులు ఇక వినబడవు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు ఏడ్వడాన్ని మీరు వినరు. వారు లోపలికి వచ్చినట్టుగా, వందలమంది వారి మీద తమ చిన్న చేతులు ఉంచెదరు, మరియు మరియు వారు అలా కొనసాగి మరియు నాట్యమాడెదరు లేక ఆడవచ్చు లేక మరొ విధంగా చేయవచ్చు. అదంతా మంచిదే. కానీ కేవలం అది గుణలక్షణమైయున్నది.
91
వ్యక్తియైన క్రీస్తుయేసే నిజమైన కార్యాన్ని ఉత్పత్తి చేస్తాడు, మరియు ఆయన వచ్చువరకూ క్రీస్తుయేసులో ఆ వ్యక్తిని భద్రముగా ఉంచుతాడు. ఆయన అక్కడే ఉన్నాడు. మరియు ఇప్పుడు, ఆ కారణమును బట్టే అక్కడ ఏడ్పులు లేవు, తలుపులు మూయబడియున్నాయి. వర్తమానము చివరిసారిగా దానికదే ముందుకు వెళ్ళి, కేవలం కొద్దిమందినే దేవుని రాజ్యములోనికి లాగుచున్నది. తలుపులు మూయబడుచున్నవి.
అప్పుడు, తరువాత కార్యము ఏమిటి? యూదులు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది మరియు పరిశుద్ధాత్మను పొందుకొనెదరు. మార్గమంతట వారు హింసించబడి మరియు హేళన చేయబడ్డారు మరియు, అక్కడ, వీలైనంత త్వరగా పరిశుద్ధాత్మ వారికి ప్రాతినిధ్యం వహించగానే, వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందెదరు. అన్యుల సంఘము ఎత్తబడును. మరియు తృణీకరించినవారిని, మరియు నీతీకరణ క్రింద నడచినవారిని, ఆ ఘటసర్పము (రోమా అధికారము) నీటిని చిమ్ముతుంది, అది కమ్యూనిజంతో ఏకమై, సంఘాన్ని శ్రమలలోనికి తీసుకుపోతుంది. అక్కడ వారు ఖచ్చితంగా చిత్రీకరించబడ్డారు.
92
ఓ సోదరుడా, అది రాబోవుచున్నదని మనము చూచినప్పుడు, ఆ కారణము చేతనే నేను ప్రార్థించుచున్నాను, ఆ కారణముచేతనే “నేను ప్రభువా, ఆ యూదుల యెద్దకు నన్నువెళ్ళనిమ్ము. ఆ దక్షిణాఫ్రికాలో నున్న ఆ కొద్దిమంది అన్యులతో మరియు మహ్మదీయులతో పనిచేయుటకు నన్ను ప్రారంభిచనిమ్ము. ఇండియాకు వెళ్ళి ఆయన శక్తితో, ఆయన అద్భుతములతో, ఆయన బాప్తిస్మాన్ని, సమస్తాన్ని మరియు పరిశుద్ధాత్మను కనుపరిచేటట్లు నిజమైన ప్రభువైన యేసుక్రీస్తును నన్ను ఉత్పత్తి చేయనిమ్ము” అని దేవునికి మొర్రపెట్టుచున్నాను. అప్పుడు వారు యెరుషలేమునకు వచ్చినప్పుడు...
బ్రదర్ బీలర్, నీవు అడిగిన దాని గురించి ఇదే. వారు యెరూషలేముకు వచ్చి మరియు నిలబడినప్పుడు మరియు “ఇప్పుడు, మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైతే, ఆదిలో ఆయన చేసిన కార్యములన్నీ ఆయనకు తెలుసు, ఆదిలో జీవించిన అదే జీవితాన్ని ఆయన ఉత్పత్తి చేయగలడు. ఆయన అలా చేసినట్లయితే, ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారా?” అని అడిగెదము. మరియు ఆయన పునరుత్థాన శక్తితో ఆయన గొప్పశక్తిని మరియు కార్యములను దేవుడు చూపించినప్పుడు, ఆయన మనతో ఉన్నాడు.
అప్పుడు వారు అలా చేసినపుడు, “మై, మీరు ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించినపుడు...” అక్కడ వేలమంది ఉండెదరని నేను ఆశిస్తున్నాను. “పెంతుకొస్తు దినమున దిగిన అదే పరిశుద్ధాత్మ మీ కొరకు ఇక్కడ సిద్ధముగా ఉన్నది” అని చెప్పెదము.
93
అప్పుడు సువార్త ఆ సమయంలో యూదుల యొద్దకు తిరిగి వెళ్ళుతుంది. అప్పుడు అక్కడ సరిగ్గా యూదుల మధ్య ఉజ్జీవము మొదలై అది వేలాదిగా, మరియు పదివేలకొలదిగా మరియు... ముద్రించే దూత ద్వారా ముద్రించబడి, లక్షా నలభై నాలుగు వేలమంది దేవుని రాజ్యములోనికి వచ్చెదరు.
ఆయన తూర్పు నుండి వచ్చుచున్నాడని నేను నమ్ముచున్నాను. ఆ మార్గంలోనే (ఆ మాదిరిగానే) ఆయన చేతిలో ఆయన ముద్రతో ఆయన మన (దగ్గర) నుండివచ్చాడు. అప్పుడు, ఓహ్, నేను అక్కడ ఉండాలని కోరుచున్నాను. “నేను ఇక్కడకు శ్రమలను మరియు అక్కడకు శ్రమలను పంపి, మరియు యూదుల యొద్దకు పరుగెత్తుకునిపోయి మరియు నా శాయశక్తుల నేను వారిని తోలివేశాను మరియు వారు మరలా వెనక్కి వచ్చారు. అమెరికాలో(వారు తప్పించుకోలేదు) చాలా మంది యూదులు ఇప్పటికే పరిశుద్ధాత్మను పొందారు. కానీ అక్కడ నిలబడి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన ఒక లక్ష నలభై నాలుగువేల మందిని నేను పొందుకొనెదను”.
మరియు సరిగ్గా అక్కడే, ముద్రించే దూత ఆ ఒక లక్ష నలభైనాలుగు వేల మందిని ముద్రించగానే, అన్యుల సంఘ ద్వారము మూసివేయబడుతుంది, మరియు యూదులు పరిశుద్ధాత్మను యూదుల యొద్దకు తీసుకునిపోయెదరు. మరియు వారు ఒక ఉజ్జీవము కలిగియుందురు, అది సర్వప్రపంచాన్నిఊడ్చివేస్తుంది. హల్లేలూయ! మరియు దేవునిశక్తి యూదుల మధ్య ప్రత్యక్షపరచబడుతుంది. ఓహ్, ఎంత అద్భుతము! వ్యూ! ఓహ్, మై!
94
నన్ను చూడనివ్వండి, త్వరగా తీయండి, “అది యెషయా గ్రంథము”. “దేవుని కుమారులను” మనము చూశాము. ఇప్పుడు చూద్దాం;
ప్రశ్న: ఇశ్రాయేలు....
సోదరుడా, మీరు దానిని చదవగల్గినట్లయితే చూడండి నేను... అది ఒక కలగలుపుగా ఉన్నది, అతడు దానిని అనేక సార్లు చెరిపివేసియున్నాడు. మరియు నేను మరొక దాని కొరకు చూస్తున్నాను. మీరు చదవగల్గినట్లయితే, దయచేసి (చదవండి) [బ్రదర్ నెవిల్ ప్రశ్నను చదువుచున్నారు-ఎడిటర్]
(చాలా నవీన మతములు మనకు చెప్పుచున్నట్లుగా)
ప్రశ్న: క్రీస్తుయొక్క వేయ్యేండ్ల పాలనలో ఖడ్గానికి అంతము అంతము అని యెషయా చెప్పుచున్నట్లు అటువంటి శ్రేయస్కరమైన భాగ్యాన్ని మానవుడు తీసుకు వస్తాడా?
నా ప్రియమైన సోదరుడా మరియు సోదరి, మీరు ఎవరైననూ...పురుషుని చేతిరాతవలె కనిపిస్తున్నది. కానీ, ఏమైనప్పటికి, మీరు ఎవరైననూ, మీరు ఖచ్చితంగా సత్యం. అది నాగటి నక్కులుగా కొట్టినప్పుడు...లేక అప్పుడు ఖడ్గములు నాగటి నక్కులుగా సాగగొట్టుదురు అది వేయ్యేండ్లపాలనను తీసుకు వస్తుంది. మరియు ఈ మత సంబంధమైన ఆరాధనా విధానాలన్నీ దేవుని రాజ్యములోనికి ప్రజలను విధ్యావంతులను చేయడానికి ప్రయత్నిస్తాయి... అలా సహజాతీతమైన దానిని నమ్మే ప్రజలయొద్దకు, సహజాతీతమైనశక్తిలో, సహజాతీతమైన వానిగా దేవుడే తానే దిగివచ్చినప్పుడు (వారు) సహజాతీతమైన శక్తిని పొందుకొనెదరు, అది దేవుని కుమారులనుగా మలుచును. హల్లెలూయ! ఇక అదెన్నటికి చదువుగా, రాతగా, గణితశాస్త్రంగా ఉండదు, అది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానశక్తిగా ఉండును. అప్పుడు ఇక ప్రపంచం ఎన్నటికీ యుద్ధమును గూర్చి చదవదు.
95
ఈ దినమున ప్రతీదేశము, ప్రతీశక్తి, ప్రతీరాజ్యము దయ్యము చేత స్వాధీన పరచబడియున్నది. బైబిల్అలానే చెప్పుచున్నది. మరియు ఈ ఒకానొక దినములలో ఈ రాజ్యము, మన ప్రభువైనక్రీస్తు యొక్క రాజ్యముగా మారబోతుంది, మరియు ఆయన భూమిమీద వెయ్యేండ్లు ఏలును, మరియు సంఘము ఎత్తబడును. ఖచ్చితం, ప్రియ చదువరి, అది ఖచ్చితంగా సత్యం.
96
లక్షా నలభై నాలుగు వేలమంది దాసులు గొప్ప సమూహము యెవడును... “యెవడును లెక్కింపజాలని గొప్పసమూహము” అన్యులైయున్నారు.
ఇప్పుడు ఒక్క నిముషం, అక్కడ ఇంకొక చిన్న కార్యమున్నది నేను చెప్పలేను. ఇంకొద్ది నిముషములలో అప్పుడు సమాజ ప్రార్థన చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చాలా అత్యవసరమని నేను అనుకొనుచున్నాను. నేను రోగుల కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను, కానీ మనము త్వరపడెదము. వివేచనకు బదులుగా, మనము అలా ముందుకు సాగెదము. నేను మిమ్ములను ఒకటి అడగలనుకొంటున్నాను. అక్కడ మరొకటి (ప్రశ్న)ఉన్నదా? నేను దీనిని తీసుకుని, మరుసటి ఆదివారం దీనిని తీసుకోవాలని అనుకొంటున్నాను.
97
స్నేహితులారా, దీనిని చూడండి, ఎంత అద్భుతముగా ఉన్నది! చూడండి! ఈ ప్రశ్నను అడిగిన వ్యక్తి దానిని జాగ్రత్తగా గమనించాలనుకొంటున్నారా. ఆ ఒక లక్ష నలభైనాలుగు వేలమంది, ఇప్పుడు వారు దాసులు, వారు సేవచేసెదరు. మీరు గమనించినట్లయితే, స్థానపరంగా, ఆ పాత లేఖనములలో...
నీవు అసలైన నిజ ప్రతిబింబాన్ని (Positive) చూడాలనుకున్నట్లయితే, నీవు ఎల్లప్పుడూ నీడ (Shadow)ను చూడవలసియున్నది. అది నిజం అది ఏమైయున్నదో వెనుకకు చూడండి. ఇప్పుడు వాటినన్నింటిని దాటి, నీవు నీడను చూడాలనుకొన్నప్పుడు తద్వారా నిజ ప్రతిబింబం ఏమైయున్నదో చూస్తావు. అక్కడ వెనుక, దానిని దాటి, దానివైపు వంగిన దానిని, మనము (వెనుక అక్కడ) నీడలో చూడాలి, ఆ అడ్డుగా ఉన్నదేదో చూడాలి; ఇప్పుడు దానిని దాటి, దానినుండి చూస్తూ, వెనుకకు చూస్తు మరియు నీడ ఏమైయున్నదో చూడుము. చూశారా? ఆయన భూమి మీదనున్నప్పుడు క్రీస్తు ఏమైయున్నాడో చూడు, ఆయన ఇప్పుడున్నపుడు ఆయన ఏమైయుంటాడు, ఇది ఆయన నీడ. నా భావమేమిటో చూశారా? మీకు తెలుసా, ఆదిలో నేను మీకు ఏది వివరించానో, అదే ఇది. ఇప్పుడు, నేను వెనుకనుండి చూడాలనుకున్నప్పుడు, ఆ అడ్డుగానున్నది ఏమిటో, ఆ నీడ ఏమైయుండబోతుందో, ఇదేమిటో కనుగొనుటకు నేను చూడవలసియున్నది.
98
ఇప్పుడు, ఒకానొక దినమున ఇశ్రాయేలులో, మరియు అక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు... లేవీయులు అనే పేరుగల గోత్రీకులు. వారు తమ ఖడ్గములు బయటికులాగి మరియు వారు మోషేతో పాటూ శిబిరములోనికి ప్రవేశించి, మరియు పాపమైన ప్రతిదానిని వారు నాశనం చేశారు. అది నిజమేనా? దేవుడు క్రిందకు చూసి “నీవు దానిని చేసి నా కొరకు నిలబడినందున నీ యొక్క...మిగిలిన వారంతా నిన్ను సేవిస్తారు. మరియు నీవు తిన్నగా యాజకునిగా ఆలయములోనికి వెళ్ళుము” అని అన్నాడు. అది నిజమేనా? “నీవు ఆలయంలో నిలిచియుండుము, మరియు మిగిలిన వారంతా కష్టపడి మరియు దశమ భాగము తీసుకునివచ్చి మరియు నీకొరకు జాగ్రత్త వహిస్తారు”. అది నిజమేనా?
ఓ, హల్లేలూయా! మీరు గనుక ఆ ఆలయమేమిటో చూసినట్లయితే, ఆ లేవీయులు వధువైయున్నారు. ఇప్పుడు ప్రతీ హస్తములో పాపము పైకి లేచినప్పుడు, లేవీయులు తమ ఖడ్గాలు బయటకు లాగారు. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వధువు, బయటనిలబడి “ఛాయలో ఉన్న యేసుక్రీస్తు మరియు నిజరూపంలోనున్న యేసుక్రీస్తు ఒక్కటే. పాపము ఇంకనూ పాపమైయున్నది, ఈ కార్యములు చేయుట తప్పు” అని చెప్పుచున్నది. అది నిజం, వారు అక్కడ ఒక ఖడ్గముతో నిలబడియున్నారు.
“నా తండ్రిచేత ఆశీర్వదించబడినవారలారా, లోపలికిరండి”, అని దేవుడు పిలుచుచున్నాడు. అది వధువైయున్నది.
99
అక్కడ దాసులు ఉన్నారు, మరియు వారు ఎక్కడ నిలబడియున్నారో చూడండి. ఈ ప్రక్కన పన్నెండు... నా భావము, ఈ ప్రక్కన నలుగురు, ఆ ప్రక్కన నలుగురు, నలుగురు ఆ ప్రక్కన, నలుగురు ఆ ప్రక్కన; పన్నెండు గోత్రములు. ఆ పన్నెండు గోత్రాలవారే ఒక లక్ష నలభైనాలుగు వేలమంది. ప్రకటన గ్రంథపు పుస్తకములో చూడండి, పన్నెండు పునాదులు గల పట్టణమును అతడు చూశాడు. పన్నెండు గుమ్మములు; ఒక్కొక్క గుమ్మము మీద ఒక్కొక్క అపోస్తులుని పేరు ఉన్నది. మరియు దాని చుట్టూ పన్నెండు గోత్రములు (హల్లెలూయ!), చుట్టూ కూర్చొనియున్నారు.
మరియు విమోచించబడినవారు అక్కడుందురు. హల్లెలూయ! నలుపు, తెలుపు, పసుపు, గోధుమరంగు, మరియు వారంతా రక్తంతో కడుగబడిన ఆయన దాసులుగా ఉండెదరు, వారు ఆయనతో ఉండెదరని ఆయన చెప్పాడు. వారు... ఇక ఎన్నడూ సూర్యుని ఎండ వారికి తగులదు, ఆకలియైనను, దాహమైననూ వారికి ఇక ఉండదు, మరియు ఆ గొప్ప నిత్యమైన యుగములో జీవించుచూ క్రీస్తుతో పాటూ యుగయుగములు ఏలుదురు. ఆయన రాజు, మరియు రాణిగా ఉన్న వారు, యుగయుగములు అధికారము మరియు ఏలుబడి చేయుదురు.
100
ప్రభువు మిమ్మలను దీవించును. ఆమేన్. నేను ఆపుచున్నాను; దేవుని చిత్తమైతే, వాటితో నేను మరలా వస్తాను, ఈ రాత్రి కావచ్చు మరియు ఈరాత్రి సమాధానమివ్వచ్చు లేక ఎప్పుడైనా సోదరుడా... మనము కలసుకొని మాట్లాడుకొనెదము. ప్రభువు మిమ్మును దీవించును. మీ పూర్ణహృదయముతో మీరు ఆయనను ప్రేమించుచున్నారా?
ఓహ్, నేను చూడాలనుకొంటున్నాను, ఆయన ముఖము ఎదుటనే
చూడాలనుకొంటున్నాను,
ఆయన చాలినంత కృపద్వారా యుగయుగములు అక్కడ జీవించెదను, ఆ మహిమకర వీధులలో నా స్వరాన్ని పైకెత్తనివ్వండి;
చింతలన్నీ పోవునపుడు, చివరికి ఆ గృహములో, నిత్యము ఆనందమే (ఓహ్ మై!)
ఈ దేశం గుండా వెళ్ళుచూ, నేను వెళ్ళు చోటెల్లా పాడుచున్నాను.
రక్తవర్ణమైన ప్రవాహాన్ని, కల్వరిని ఆత్మలకు చూపిస్తున్నాను
(కాదు కాదు సంఘము వైపు కాదు, కల్వరివైపు)
నేను చూపిస్తున్నది అక్కడికే (కల్వరి వైపు); ఏదో వేదాంతం వైపుకాదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తప్రవాహం వైపు “రక్తములో జీవమున్నది”, మరియు ఇప్పుడు మనలో జీవిస్తున్న, మన జీవమైన దేవుని యొక్క రక్తము ఆయనే. బంధింపబడిన ఆ బంధము దీవించబడును!
101
రోగుల కొరకు మనము ప్రార్థించుచుండగా, నేను ఇప్పుడే ఒక- ఒక ప్రత్యేకమైనది కోరెదను. సిస్టర్ గెర్టీ మరియు కుమార్తెను, వారు రావాలనుకొన్నట్లయితే ఇక్కడకు రావచ్చును.“Only Believe” మరియు ఇదే అసలైన పాత పాట, దానిని మీరు నా కొరకు పాడాలనుకొంటున్నాను. నాకు గుర్తున్నది, ఆ ద్వారము దగ్గర నడుస్తుండగా, మరియు ఈ పాట నాతోపాటూ అన్ని దేశాలను వెంబడించినది. మరియు నేను-నేను వారు పాడాలని కోరుచున్నాను, ఆమెయే మొదట దానిని వాయించవలసియున్నది, నేను మొదటిగా దానిని వినెదను. నా మంచి స్నేహితుడైన పాల్రాడర్ దానిని రాశాడు. మరియు మనము రోగుల కొరకు ప్రార్ధించేముందుగా, రోగులైన ప్రజలమీద దేవుని ఆశీర్వాదముల కొరకు, వారిని నేను పాడమని కోరుచున్నాను.
మనము చాలా సమయం తీసుకున్నాము. సోదరుడా నెవిల్, మన్నించుము. దేవుడు మిమ్ములను దీవించునుగాక. మీరు ప్రశ్నలను ప్రేమిస్తారా? నేను ప్రేమిస్తాను. ఓహ్, మరియు నిజముగా మంచి ప్రశ్నలు, అవి చాలా బాగున్నాయి. మరియు అక్కడ మరొక దొంతర ఉన్నది. మరియు, నిజముగా, వాటిలో కొన్నింటి గుండా వెళ్ళలేనప్పటికినీ, ఓహ్ వాటి గుండా వెళ్ళుటకు అక్కడ చాలా ఉన్నవి. ప్రభువు దీవించును గాక.
102
ఇప్పుడు మీరంతా క్రీస్తుపై మీ మనస్సును ఉంచండి, మరియు ప్రశ్నల నుండి దైవిక స్వస్థత వైపు మరల్చండి. ప్రార్ధన కొరకు ఇక్కడ ఎంత మంది ఉన్నారు? ప్రార్ధన కావలసినవారు మీ చేతులను చూడనివ్వండి. మంచిది, త్వరగా మన సహోదరి
ఆ అద్భుతమైన పాటను పాడుచుండగా వారిని ముందుకు తీసుకునివచ్చి కొద్దిసేపు వారి కొరకు ప్రార్ధించెదము. వారు సిద్ధపరచుచుండగా, నీ మీద వేలాడుచున్నటువంటిది. ఇప్పుడు వాగ్ధానమైయున్నది, ఇది ఆయన పరిశుద్ధ గ్రంథము.
(సిస్టర్ గెర్టీ ఆమె కుమార్తె పాటను పాడుచున్నారు-ఎడిటర్)
కేవలం నమ్ముము, కేవలం...
వ్యాధితో ఉన్నవారు, ఇప్పుడు రాగలిగినట్లయితే బలిపీఠంచుట్టూ వచ్చి చేరండి.
సమస్తము సాధ్యమే, కేవలం నమ్ముము;
కేవలం నమ్ముము, కేవలం నమ్ముము,
సమస్తము సాధ్యమే, కేవలం నమ్ముము.
103
(బ్రదర్ బ్రాన్హాం (Only Believe) “కేవలం నమ్ముము”అనే పాటను తనలో తాను పాడుకొనుట ప్రారంభించారు -ఎడిటర్) ఇప్పుడు పరలోకపు తండ్రీ, నేటి దినమున ఈ లేఖనము కొరకు మరియు (Only Believe) “కేవలం నమ్ముము” అనే ఈ పాట కొరకు వందనములు. మూర్ఛ రోగముకలిగిన బాలుని యొక్క తండ్రితో “కేవలం నమ్ముము సమస్తము సాధ్యము” అని నీవు చెప్పుట మేము విన్నాము.
ఇప్పడు, ప్రార్ధన కొరకు బలిపీఠము యొద్దకు వచ్చిన ప్రజలకొరకు మేము ప్రార్ధిస్తున్నాము దేవా, ఇక్కడ మేము నీడగా(Negative) ఉండియుండట చూస్తున్నాము, కేవలం మేము నీడ (Negative); నిజమైనది (Positive) మాచుట్టూ ఉన్నది. ఎన్నడూ చనిపోని అమర్త్యపు ఆత్మ మా మీద ఉన్నది. అది నిత్యమూ అన్ని యుగములలోనూ ఉన్నది. నీ యొక్క అభిషేకించబడిన సేవకునిగా మేము ముందుకు వెళ్ళుచుండగా, సహాయం కావలిసిన మా తోటి మనుష్యులకు మేము సహాయము చేయుచుండగా, ఒకరే ఒక్కరు ప్రత్యామ్నాయముగా, తండ్రీ, వారు నిన్ను మాత్రమే ఘనపరచెదరు గాక. మరియు ఇక్కడ ఈ ఉదయం వారు బలిపీఠం దగ్గర వారిలో ప్రతీ ఒక్కరూ నిలబడియుండగా, వ్యాధితో ఉన్న, భయపడుతూ ఉన్నా, పరిశుద్ధాత్మ వారిలో ప్రతీ ఒక్కరికి స్వస్థత అనుగ్రహించును గాక.
104
మరియు మేము నీయొక్క చిన్న - చిన్న మందగా(Flock), ఆ సోదరీలు ఇప్పుడే “చిన్న మందా, భయపడవద్దు” అని పాడారు, మాకు తెలుసు, ప్రభువా వారికి రాజ్యము అనుగ్రహించుట నీచిత్తమైయున్నది. మరియు నీవెప్పుడూ సమీపముగా ఉన్నావని మేమెరుగుదుము,“ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడియుందురో, వారి మధ్య నేనుండును. మరియు వారు ఏమడిగిననూ నేనిచ్చెదను”, అని నీవు చెప్పియున్నావు.
ఇప్పుడు, దేవుని యొక్క వాక్య ప్రకారము, ఎన్నడూ విఫలం కానిది, దేవుని వాక్యమే. ప్రభువా, ప్రతీ ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి. మరియు వారు ఇక్కడ నిలబడి ఎదురుచూస్తున్నారు. మేము నూనెతో వారిని అభిషేకిస్తూ, వారి మీద చేతులుంచుచుండగా, వారి విడుదల కొరకు అడుగుచుండగా, వారిలో ప్రతీ ఒక్కరూ వారి కుర్చీలోనికి తిరిగి వెళ్ళి, వారి గృహములకు, నిన్ను స్తుతిస్తూ (బాగుపడి, పరిపూర్ణముగా, మరియు మంచిగా) వెళ్ళి, మరియు రాత్రి కూటమునకు మరలా తిరిగివచ్చి వారి స్వస్థత కొరకు స్తుతులు మరియు ఘనతను దేవునికి చెల్లించెదరుగాక ప్రభువా. అనుగ్రహించండి, ప్రభువా.
మరియు మనం మన తలలు వంచి యుండగా:
105
బ్రదర్ నెవిల్, నీకిష్టమైతే నాతో రమ్ము. బ్రదర్ ఫీల్మన్ నాకు కావాలి, మరియు బ్రదర్... డీకన్, లేక ఇక్కడున్న ఎవరైనా, మరియు బ్రదర్ కాక్స్, మీరంతా ఇక్కడకు వచ్చి నాకు సహాయం చేయండి. ఇక్కడున్న సంఘము యొక్క డీకన్స్ అందరినీ ఈ సమయంలో నేను పిలుస్తున్నాను.
మరియు మేము వారి కొరకు ప్రార్ధించుచుండగా, మీకు ఇష్టమైతే, వారికి సహాయం చేయండి. నేను-నేను ఇక్కడున్న ప్రతీ ఒక్కరినీ నిజముగా యదార్ధముగా ఉండమని కోరుచున్నాను. మేము రోగుల కొరకు ప్రార్ధించుచుండగా, మీరునూ మాతో కలిసి ప్రార్ధించమని నేను కోరుచున్నాను.
ఇప్పుడు ఆ వెనకాల అక్కడ ఒక బాలుడు కూర్చునియుండుట నేను చూశాను, కొద్ది సమయం క్రితం హాలులో నుండి బయటకు అక్కడకు నడచి వెళ్ళాడు, రక్తస్రావాన్ని కల్గియున్నాడు. మరియు ప్రభువైన యేసు అద్భుతముగా ఇప్పుడే ఆ రక్తస్రావాన్ని ఆపివేసారు. చూశారా? ఆయన కృప స్తుతినొందును గాక, ఆయన నామము ఘనపరచబడునుగాక. గడచిన కొన్నిరోజులలో ఎంతమంది బాగుపడ్డారో చూడండి.
106
కేవలం ఆలోచించండి, అపోస్తులుల దినములలో ఉన్న అదే యేసు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మరియు అన్యుల ముగింపులో ఆయన తిరుగుచున్నాడు. సహజాతీతమైన విశ్వాసుల మధ్య ఒక గొప్ప కదలిక వెళ్ళుచున్నది, ఎందుకంటే దేవుడు ఇక్కడున్నాడని మేము నమ్ముచున్నాము.
కేవలం ఆలోచించండి, నీయొక్క- నీయొక్క మహిమశరీరం ఇక్కడే ఆలయంలో ఇప్పుడు ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్కసన్నిదే, నీ మహిమకరమైన స్థితి. ఇప్పుడే నీవు క్రీస్తులో మహిమపరచబడియున్నావు! “ఆయన ఎవరిని నీతిమంతులునుగా తీర్చెనో, వారిని మహిమపరచెను”. ఒక బ్యాటరీకి తిరిగి శక్తిని ఇచ్చినట్లుగా, నీకు బలమును ఇవ్వడానికి, నీయొక్క స్వంత మహిమ శరీరము, క్రీస్తుయేసుతో ఇప్పుడే నీకు దగ్గరగా నిలబడియున్నది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నది. నీ శరీరానికి శక్తినిచ్చి నూతన బలమును ఇవ్వడానికి నీవు పొందిన రోగము నుండినిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను బాగుచేస్తుంది.
107
ఇప్పుడు, సంఘమంతా, వారికిష్టమైతే, మన సోదరీలతో వారిని మరలా ఆ పాట పాడమని కోరుచున్నాను. ఇప్పుడు, బలిపీఠం యొద్దనున్న ప్రతీ ఒక్కరూ...
ఇప్పుడు, స్నేహితులారా, నేను ఒక మోసగాడినట్లయితే, నేను నిజమెరుగని అజ్ఞానిని. నేను క్రైస్తవునిగా ఉండుటకు ప్రయత్నిస్తున్నాను, మరియు నా పూర్ణహృదయముతో నేను జనులకు సహాయపడుటకు ప్రయత్నిస్తున్నాను. మరియు దేవుని పిల్లలారా, నేను మీకు సహాయపడుటకు ప్రయత్నిస్తున్నాను. మరియు నేను-నేను నా పరలోకపు తండ్రిని ప్రేమించినట్లయితే, ఆయన పిల్లలైన మిమ్మునూ ప్రేమిస్తాను. నేను కాదు...నేను మిమ్మును మోసం చేసినట్లయితే, నేను దేవునినే మోసం చేయుటకు ప్రయత్నిస్తున్నాను. మీరు ఆయన పిల్లలు; దేవునిని ఎవ్వరూ మోసం చేయలేరు. నేను మీకు సహాయం చేయుటకు ప్రయత్నిస్తున్నాను.
108
ఆ కారణములను బట్టే దేవుడు నా ప్రయత్నాలను దీవించుచున్నాడు. మరియు వారు చాలా పేదవారయితే, మరియు వారిలో కొంత మందికోసం నేను సిగ్గుపడితే, మరియు నేను సిగ్గుపడుచున్నానని దేవుడు ఎరిగి మరియు నా ప్రయత్నాల నిమిత్తమై మనస్సు మార్చుకొనును. కానీ దేవుని రాజ్యానికి నేను చేయగలిగిన సహాయన్నంతా నేను చేయుచున్నాను మరియు ఆయన పిల్లలైన మీకును సహాయపడు చున్నాను. ఇక్కడే ఈ బలిపీఠము యొద్దనే, ఈ ఉదయం నిన్ను స్వస్థపరచు వానిగా యేసును పొందుకోండి, మీ స్థలములకు తిరిగి వెళ్ళి, మీ గృహములకు బాగుపడి ఆరోగ్యంగా వెళ్ళండి.
ఇప్పుడు, ఆయన ఇక్కడ వందలాది మందిని మరియు ప్రపంచమంతటా వేవేలమందిని స్వస్థపరచినట్లయితే, నిన్నేందుకు ఆయన స్వస్థపరచలేడు? చేయవల్సిందల్లా కేవలం నమ్ముము. మంచిది సహోదరీలారా. బ్రదర్ నెవిల్ నీవు ఇక్కడికి వచ్చి వారిని అభిషేకించాలని నేను కోరుచున్నాను (బ్రదర్ బ్రాన్హాం మరియు సహోదరులు రోగుల కొరకు ప్రార్ధించుచున్నారు. సిస్టర్ గెర్టీ మరియు ఆమె కుమార్తె “Only Believe” పాటను పాడుచున్నారు-ఎడిటర్)
[టేపు మీద ఖాళీ స్థలమున్నది-ఎడిటర్]... లేక సంఘము కంటే, క్రీస్తు వధువు. ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య నిలబడియున్న ఆయనను చూడుము మరియు ఆయన పాదములు అపరంజి (ఇత్తడి)తో సమానమై ఉన్నాయి, అది. ఇత్తడి అనగా ప్రపంచం మీద సంఘము యొక్క దైవికతీర్పు. చూశారా? దైవికతీర్పు ; సర్పము, ఇత్తడి, దానిని గూర్చి మాట్లాడుచున్నది. ఇప్పుడు, గమనించండి, అది సిలువను సూచిస్తూ, స్థంభము మీద పైకెత్తబడియున్నది. ఇప్పుడు, మూడు కార్యములు.
ఇప్పుడు, గమనించండి. అది ఏ ఉద్దేశం కొరకు పైకెత్తబడింది? అది వారి యొక్క క్షమాభిక్ష కొరకు పాము...వారి పాపములను క్షమించడానికి, వారి పాముకాటుల నుండివారిని స్వస్థపరచడానికి. అది నిజమేనా? దానిని ఎవరు చూసినా, బ్రతికేస్తారు. దానిని చూడడానికి తృణీకరిస్తే, మరణిస్తారు. నీవు పాపముతోఏ మార్గంలోనూ ఒప్పందం కుదుర్చుకొనలేవు, నీవు దైవిక స్వస్థతతో ఒప్పందం కుదుర్చుకోకుండా, పాపముతో ఒప్పందం కుదుర్చుకొనజాలవు. నీవు దానిని చేయలేవు. దైవిక స్వస్థత అనేది లేకుండాసువార్తను బోధించే మార్గమే లేదు. నీవు దానిని చేయలేవు. అది నిజం
ఇప్పుడు, చూడండి, ఉదాహరణకు, ఒక మనిషి ఇక్కడ నిలబడి మరియు తన పిడికిలితో ఎంత గట్టిగా కొట్టాలో అంతగట్టిగా నన్ను కొట్టాడు అనుకోండి. మంచిది, ఇప్పుడు, పిడికిలితో నన్ను కొట్టిన ఆ మనిషిని చంపడానికి, అతని చేయిని నరకవలిసిన అవసరంలేదు. చూశారా? లేక అతని కాలితో నన్ను తన్నినట్లయితే, అతని కాలును తీసివేసినందున ఉపయోగం ఉండదు. ఇప్పుడు నీవు ఆ మనిషిని చంపాలనుకుంటే(అతని) తలను చంపేస్తే చాలు. అది నిజమేనా? నీవు అతని తలని చంపేస్తే, నీవు అతని చేతిని చంపేసినట్టే, అతని కాలిని చంపేసినట్టే, మరియు శరీరం యొక్క-యొక్క మిగిలిన భాగాలన్నీ చంపేసినట్టే.అది నిజమేనా? నీవు తల నుండి (వాటినన్నింటిని) చంపేస్తున్నావు.
మంచిది, వీటన్నింటికి ప్రధాన కారణం ఏమిటి, ఎందుకని, ఈ ఉదయం మనం ఇక్కడున్నాము? వీటన్నింటికి ప్రధాన కారణం ఏమిటి? ఈ అపనిందను, పాపమును, రోగములను కలుగచేసినది ఏమిటి? అదే పాపము !
చూడండి, నీవు ఏదైనా పాపము చేసేముందు... వ్యాధి అనేది ఒక పాపపు) గుణలక్షణం లేక ఏదైననూ అవి పాపమును వెంబడిస్తాయి. నీవు కలిగిలేనట్లయితే... లేక మరో మాటల్లో, అది పాపముకు సంబంధం లేకుండా వచ్చినది. చూశారా? అక్కడ పాపము అనేది లేనప్పుడు, అక్కడ వ్యాధిలేదు లేక ఏదీలేదు; ఏ బాధలు లేవు, ఏమీ లేదు, ముసలితనము లేదు, ఒడిదుడుకులు లేవు, గుండెనొప్పులు లేవు, పాడైపోయిన గృహాలు లేవు, ఏదీలేదు; చూశారా అది పరిపూర్ణముగా ఉన్నది. మంచిది, చూశారా, దానికి కారణమైనది ఏమిటి పాపము, పా-ప-ము(S-i-n). మంచిది. అప్పుడు పాపము ద్వారా వ్యాధి వచ్చినది, పాడైపోయిన గృహాలు, (గుణలక్షణములు), అసహ్య జీవితాలు, మరియు ఈ కార్యాలన్నీ పాపమును వెంబడించాయి.
ఇప్పుడు, మీరు పాపాన్ని చంపేస్తే, నీవు దాని గుణలక్షణాలన్నీ చంపేస్తావు, నీవు చంపలేవా? లేవు-లేవు... నీవు ముట్టుకొనలేవు...దీనితో నీవు అజ్ఞానివి కాకుండా పాపముతో నీవు ఒప్పందం చేసుకోలేవు,అప్పుడు, నీవు అజ్ఞానివైతే దాని ప్రతిఫలం పాపమైయున్నది చూశారా? ఇప్పుడు, నీవు పాపాన్ని చంపేస్తే, అప్పుడు నీవు సమస్తాన్ని చంపేస్తావు.
మరియు ఇప్పుడు- ఇప్పుడు మీరు అడిగెదరు, “వ్యాధి”. కొన్నిసార్లు మీరు వ్యాధి బారిన పడినప్పుడు “నేను పాపము చేశానా?” అని మీరు అడగవచ్చును.
ఓహ్, అది ఒకవేళ నీవు పాపము చేసినందువల్ల వచ్చియుండక పోవచ్చును, కానీ నీవు గుర్తుంచుకో, “వ్యాధి నీకు వచ్చినప్పుడు... తల్లిదండ్రుల యొక్క దోషాలు వారి పిల్లల మీద, మరియు పిల్లల పిల్లల మీద, మరియు వారి పిల్లల మీద, మూడు మరియు నాలుగు తరముల వరకూ వెంటాడతాయి. చూశారా? మరియు అది మానవ శరీరాలమీద దొర్లుతూ మరియు దొర్లుతూ మరియు అమర్చబడుతుంది మరియు ఆ విధంగానే; సుఖవ్యాధుల (సంక్రమించే వ్యాధి) వంటివి మరియు మొదలైనవి, వచ్చిపోతుంటాయి. (వస్తూంటాయి)
ఇక్కడ కొద్దికాలం క్రితం, ఒక ప్రసిద్ధి చెందిన డాక్టరుయొక్క ఇద్దరు కుమార్తెలు గుడ్డివారయ్యారు, వారిని పరీక్షించడానికి తీసుకునివచ్చారు. మరియు వారు కనుగొన్నదెమిటంటే అది ఒక సంక్రమించే వ్యాధి. ఇక్కడ ఈ పట్టణములో, శుద్దీకరించబడి మరియు నీతియుక్తంగా ఉండవలిసినంతగా వారు ఉన్నా, వారిద్దరూ గుడ్డివారైపోయారు. మరియు వారికి ఏమి చేయాలో వారికి తెలియదు, వారు వారికి కళ్ళద్దాలను అమర్చారు మరియు అప్పుడు వారు దాని (అంధత్వం)నుండి దూరమయ్యారు. మరియు వారు, వారి రక్తాన్ని పరీక్షించగా అది అక్కడ ఉన్నది. మరియు వారు దానిని వెనుకకు (ముందు తరాల వారిలో) పరీక్షించారు, వారి ముత్తాతలో అది (అంధత్వం) ఉన్నది, చూశారా, అక్కడ నుండే మీరు వచ్చారు (టేపు మీద ఖాళీ స్థలమున్నది-ఎడిటర్)