సంయుక్త రాష్ట్రాల యొక్క దురాక్రమణ
VGR COUNT -267 కొన్ని సంగతులకై ప్రభువు చిత్తము జరుగును. ఈ మధ్యనే మేము డెన్వర్ వెళ్ళి వచ్చాము. అక్కడ జరిగిన కూటములను గూర్చి నివేదిక ఇవ్వాలని నేను అనుకొనుచున్నాను. ఇన్నేళ్ళలో జరిగిన కూటాలలో నాకు ఇదొక అత్యుత్తమ కూటము. మేము ఒక అద్భుతమైన సమయాన్నికలిగియున్నాము. రెండు వేల మంది తమ హృదయాలను క్రీస్తుకి సమర్పించుకొన్నారు. అంతేకాదు, మరోపక్క అనేకులు పరిశుద్దాత్మ బాప్తిస్మము నొందారు, అలాగే అక్కడ డెన్వర్ జనుల మధ్య
మన ప్రియ ప్రభుయేసు గొప్ప అద్భుతాలు సూచకక్రియలను జరిగించెను. మాపై గొప్ప కుమ్మరింపు పోయబడింది, గొప్ప జనసమూహము సమకూర్చబడినది. సుమారు ఐదువేల మందితో ఆరంభించాము. మమ్మత్ గార్డెన్‌లో జరిపించాము. మరి మూడవ రాత్రి వచ్చేసరికి కనీసం జనులు నిలబడడానికి కూడా అచ్చట చోటు లేదు. ఐదు అద్భుతమైన రాత్రులు కలిగి వుంటిమి!
2
ఇక అక్కడ నుండి నేను, బాలుడు కెనడా వెళ్ళుటకు బయలుదేరి వెళ్ళాము. పర్వతముల మీదకి చేరుకొన్నాము, మరి అక్కడ మంచు తుఫాను రేగినది. మీ రేడియోలో దానిని మీరు బహుశా వినే వుండవచ్చునని నేను అనుకొనుచున్నాను. దానిలో చిక్కుకొని సుమారు నూట ఎనభై-ఎనిమిది (188) మంది నశించిపోయారు. అనేక రోజులపాటు ఆ పర్వతముల మీద మేము కూడా ఆ హిమపాతములో చిక్కుకొన్నాము. మా కూటము అయిపోయింది, మరలా మేము బయలుదేరటానికి ముందు మేము ఇంటికి తిరిగి వచ్చాము. ఇది ఒక ఉత్తమమైన కూటము అగుటకు, అలాంటిదేమైనా అగుటకు అదంతయు దేవుని చిత్తమై వుంటుందని మా నమ్మకం. మనకి తెలియని ఒక దానిని ఆయన వరుస ప్రకారం జరిగిస్తాడు.
ఒక రకమైన చీకటి లోకంలాంటి దానిలో మనం నడవ వచ్చును కానీ చీకటిలో మాత్రం కాదండీ. వెలుగు వెళ్ళుచున్న కొద్ధీ మనం దానిని వెంబడిస్తే మనం వెలుగులో నడిచి వెళ్ళెదము.
మనకి తెలియని ఒక దానిని బహుశా మన పరలోకపు తండ్రి కలిగి వుండొచ్చునేమో. అచ్చట ఏదో అపాయము వుండి వుండొచ్చునేమో. లేదా, తిరిగి, ఎవరినో తెచ్చుటకు ఆయన అక్కడ పనిచేస్తు వుండెనేమో. మీరు చూశారా, ఆ విధంగా దేవుడు ఒక వ్యక్తి పట్ల క్రియ జరిగించుచున్నాడేమో; వారిని లోనికి తెచ్చుటకు ఆయన ఒక దేశాన్నే పూర్తిగా ఆ వ్యక్తి కోసం మార్చును. అదంతయు దేవుని మహిమ నిమిత్తమేనని మనమెరిగి యున్నాము. మనల్ని కాపాడుచున్నందుకు మరియు వాటన్నిటిని బట్టి మనమాయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఇంకా ఎన్నో వున్నవి, మేము...
3
మేము రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు, రోడ్డు ప్రమాదానికి గురైన అనేక మందికి, మరి అటువంటి పరిస్థితుల్లో వున్న అనేకులకి నేను మరియు బిల్లీ సహాయపడెదము. మేమైతే ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా వచ్చెదము. ఒకసారి మేము దారితప్పి దిగాము, అయితే అది కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే. మరి అక్కడ వున్న కొందరు మనుష్యులు, పశుక్షేత్రంలో నుండి వచ్చి ఒక ట్రాక్టర్‌తో మమ్మును (వాహనాన్ని) బయటికి నెట్టారు. కొద్దిగ జారిపోయింది, ఎందుకంటే అక్కడ అది బాగా నున్నగా (చదును)గా వుంది.
4
మరి అటువంటి ఒక కార్యాన్ని వారు ఎన్నడూ కలిగిలేరు.... మొంటానా చుట్టుప్రక్కల, ఏడాదిలో ఆ కాలమందు ఆ ప్రాంతంలో అటువంటి ఒక తుఫాను గతంలో ఎన్నడు వచ్చినట్టు ఆ పాతకాలపు వారికి గుర్తులేదు. మరి మేము... అటువంటి ఒక అసాధారణమైనవి సంభవించినప్పుడు, మన ప్రభువు హస్తము ఏదో రీతిగా సహాయం చేయునని మనం ఎరిగియున్నాం. అదొక ఉద్దేశ్యం కొరకు, మన మంచి కొరకే జరుగును. మన మేలు కోసమే అది అందుకోసమే సంభవించును.
5
నేను తిరిగి వచ్చిన తర్వాత నేను సహోదరుడు నెవిల్‌కి కబురు చేసి ఇలా అడిగాను, “ఆదివారం నేను ఇంటి వద్దే (స్థానికంగానే) అందుబాటులో వుంటాను. మరి-మరి నేను వచ్చి సండేస్కూల్ చెప్పుటకు మీరు ఇష్టపడినట్లైతే అది చాలా బావుంటుంది” మరియు అన్నాను,“ అప్పుడు నేను అది చేయుటకు ఎంతో ఆనందింతును”.
అతడన్నాడు, “ఖచ్చితంగా, సరే సహోదరుడు బిల్” అన్నాడు “మీరు వచ్చుట మాకు ఎల్లప్పుడు ఎంతో ఆనందం” గొప్ప విశాల హృదయంతో ఆ విధంగా నన్ను ఆహ్వానించాడు. మరి దానిని అతడు నిన్న తన రేడియో కార్యక్రమంలో పెట్టాడు. కనుక వీటన్నిటి కోసం మేమెంతో కృతజ్ఞులం.
6
మరి ఈ ఉదయవేళ, ఇప్పుడిది మాతృ దినోత్సవం (తల్లుల దినము). ఎక్కువ మంది ప్రజలు, అంతటా మాతృ దినోత్సవ ప్రసంగాలనే మీరు విందురు, మరి తల్లులను గూర్చి జనులు చెప్పుకొంటారు, అది చాలా అద్భుతమని నేను భావించుచున్నాను. కూటములోని మిగతా భాగమంతా దానికోసమే విడిచిపెట్టుదుము.
7
సంయుక్త రాష్ట్రాల యొక్క దురాక్రమణ అనే ఒక - ఒక అంశాన్ని నేను బోధించగోరుచున్నాను అని ఈ ఉదయాన ప్రకటించాను. బహుశా మీరు దానిని మీ రేడియో ప్రచార కార్యక్రమాలలో విని వుండొచ్చును, అటువంటి వాటిననేకం నేడు మీరు విందురు. మరియు ఈ రాత్రి జరిగే కూటములలో మాతృ దినోత్సవం సందర్బంగా అనేక ప్రసంగాలు దాని మీదనే ఉండబోవచ్చునేమో.
మరి కావున నేను అనుకొనుచున్నాను, ఈ ఉదయాన, “దురాక్రమణ (దాడి, దండయాత్ర)” అనే అంశాన్ని ప్రకటించాను.
డెన్వర్ లో దాని మీద నేను ప్రసంగించాను, ఇచ్చట, దేవుని చిత్తమైతే ఈ ఉదయకాలమున అచ్చం దాని మాదిరిగానే అది చెప్పాలనుకోవట్లేదు. మరి, దానితో, ఒక అద్భుతమైన సమయం దానితో ఉండెను. అద్భుత రీతిలో ప్రభువు దీవించెను. ఒక రకంగా కొన్నిసార్లు అది ఇస్తుంది...
అదంతా ఏమైయున్నదో తెలిసికొను నిమిత్తం కొన్నిసార్లు నీవు కదిలింపబడవల్సి వుంది, కొన్నిసార్లు మనము అలా కాలేమా? దేవుడు దానిని జరిగించునట్లు మనం ప్రార్ధించుదుము.
8
మరి, అన్నట్టు పైన అక్కడ, మేము దాని గుండా వెళ్ళినప్పుడు... కూటమునకు ఆర్థిక సహాయం అందించినది డెన్వర్ వ్యాపారస్థులే. నాకు ఇది వరకు ఎన్నడు లేని విధంగా ఈ ఆర్థికసహాయ సహాకారం వున్నది.
మరి సాధారణంగా సేవకులు, వారు ఒక కూటమునకు ఆర్ధిక సహాయం చేసినప్పుడు, మీరు అందురు... “ దానిని మీరు బహిరంగంగా ప్రకటించారా?” “అవును, సంఘమునకు” దాని గూర్చిన సంగతి అంతే. వారు కాపరులుగా వున్నారు. వారు చేసిన దానిని వారి యొక్క మంద తెలిసికొనగోరును. అది ఒక చక్కని మాట, అది వారి వృత్తి (వ్యవహారం).
కానీ వ్యాపారస్థులైతే కొద్దిగ వ్యత్యాసమున్నది. వారు చేస్తున్నది లోకం తెలిసికోవాలని వారు భావిస్తారు, అందుచేతనే వారు మూడు నాలుగువేల డాలర్లు ఖర్చుపెట్టి వీధికార్ల మీద, అద్దెకార్లమీద, కారు ముందు బంపర్లమీద ప్రతీచోట ప్రకటనలు అంటించి ప్రచారం చేస్తారు. మేము ఒక అద్భుతమైన సమయాన్ని కలిగివున్నాం.
9
కూటము అనంతరం వారు నన్ను ప్రక్కకు పిలిచి ఇలా అంటారు, “సహోదరుడా బ్రాన్హాం నీ కొరకు ఏమి చేయమంటావు ? నీకు ఏ మాట ఇవ్వమంటావు ?”
నేనంటాను “ఎందుకు పర్వాలేదండీ, ఏమి వద్దండీ” అన్నాను “మీరు నాకు మాట ఇవ్వవద్దు” అన్నాను. “కావాలంటే ఇక్కడ నేను బస చేసిన హోటల్ బిల్లు కట్టండి”. “ఓ, నీ కోసం మేము ఏదో చేయగోరుతున్నాం”. వారేం చెయ్యరు.... వారి యొద్ద నుండి నేనేమి పుచ్చుకొనను.
గనుక మేనేజరు వారిని దగ్గరకు పిలిచి అతడిలా చెప్పాడు, “ఆయనికి చేపలు వేటకి వెళ్ళడం ఇష్టమని నేను భావిస్తున్నాను, అతనికి అది కాదా?” అతడన్నాడు “అవును”
వ్యాపారస్తులలో ఒకరికి పశుక్షేత్రం వుంది, మరియు అతడన్నాడు, “అతడిని అక్కడికి నేను తీసికొని పోగోరుచున్నాను.”
సరే, శ్రీ మూర్ దానిని చూడటానికి వెళ్ళాడు. గుఱ్ఱం మీద అతడు తిరిగి ముఫ్ఫై అయిదు మైళ్ళు వెనక్కి వెళ్ళవల్సి వుంది. నేను అన్నాను... శ్రీ మూర్ అన్నాడు, “శ్రీమతి బ్రాన్హాం గుఱ్ఱం మీద కూర్చొండటంను నేను చూడగోరుచున్నాను, తిరిగి దాని యొద్దకి వెళ్ళుటకు” కనుక అతడు, వారు, మరి...
10
కానీ, దాని తర్వాత, వారు కొలరాడో రాష్ట్రంలోని సిల్వర్ ప్లూమ్‌బె ప్రాంతంలో నొక నివాసము ఏర్పాటు చేసికొన్నారు. అది ఈ ప్రక్కన ఉండవల్సి వుంది. మరియు వారు అచ్చట ఒక చిన్న పశుక్షేత్రాన్ని కొన్నారు, అక్కడే వారు ఒక అయిదు గదుల ఇల్లు నిర్మించారు...కొలరాడోలోని సిల్వర్ ప్లూమ్‌బె వద్ద, ఆ చోట పర్వతముల మద్య బాగానే వుంటుంది. గనుక జాలర్లు అగు మీరు, దేవుడు అనుమతిస్తే, ఈ కూటములు మిగతావన్ని ముగించిన అనంతరం వెళ్ళి విశ్రాంతి (సేదదీరటానికి) తీసికోవటానికి అదొక చక్కని చోటని చక్కని సమయముగా వుండునని నేను అనుకొనుచున్నాను. అది ఆయన ఇష్టం, మీరు చూచారా.
11
ఇప్పుడు మన గమనమును వాక్యము వైపునకు త్రిప్పాలని కోరుచున్నాను. వాక్యాన్ని, సజీవమగు దేవుని వాక్యాన్ని నేనెంతో ప్రేమిస్తాను. అందులోనే, వాక్యములోనే జీవమున్నది. ఇప్పుడు, “వాక్యము, అక్షరము చంపును, కానీ ఆత్మ జీవింపజేయును.” మరి వాక్యములోనే జీవమున్నది, ఎందుకంటే అది దేవుని వాక్యమై వున్నది. వాక్యమందే జీవమున్నది.
నేను చెప్పినట్టు, “నేను నీకిచ్చెదను... ”
నీవు అంటావు,“నేను ఆకలి గొన్నాను, ఈ ఉదయమున సహోదరుడా బ్రాన్హాం, దయచేసి నాకు అయిదు డాలర్లు ఇవ్వగలరా?
నీవంటావు, “నేను ఇచ్చెదను” నేనిచ్చిన వాగ్దానంలో ఎంత వాస్తవం (జీవం) వుందో దానిలోను అంతే వుండును.
దేవుని విషయం కూడా సరిగ్గా అదే. దేన్నైన దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు అనగా ఏమిటో, ఆయన... ఆయన తన మాట యందు వుండి యుండాలి. చూశారా? ఈ వాక్యము ఎంతో విలువైనది... ఈ వాక్యము దేవునివలె వున్నది. అది దేవుడై ఉండెను.
నీ మాటే నీవై వున్నావు. దానికి నీవు బద్దుడవు. మనం దానిని అలా పిలుస్తాం. నీవు దేనికి బద్దుడై వుంటావో అదే నీమాట అయి వుండును. నీ మాటను పరిగణనలోకి తీసికోకపోతే, అప్పుడు మేము నీయందు నమ్మికయుంచలేము. దేనికోసమైన సరే నీమాట తీసికొంటున్నామంటే, దానర్థం నీవొక గౌరవనీయుడైన వాడవని అన్నమాట.
మరియు బైబిల్ చెప్పినది, “ఆదియందు వాక్యముండెను, మరియు వాక్యము దేవుని యొద్ద వుండెను, మరియు వాక్యము దేవుడై వుండెను” చూశారా? “వాక్యము శరీరధారిమై మన మధ్య నివశించెను”.
12
మనం యోచించినట్లైతే, ఇప్పుడు ఈ ఉదయకాలం మనముంటున్న ఆ భూమి కూడా దేవుని వాక్యముగానే వున్నది. ఆ చెట్టు దేవుని వాక్యము. మరియు నువ్వు, నీ శరీరము దేవుని వాక్యముగా వుండెను. ఆ విధంగా ఉనికిలోకి వచ్చునట్లు దానిని దేవుడు పలికెను, ఏ పదార్థము లేకుండానే చేసాడు, అదేమి కాదు.
మానవ జీవం ఎక్కడి నుండి వచ్చిందనే దానిని నీవెన్నడైనా గమనించావా? ఒక చిన్న కణము, మానవ కన్ను చూడలేనంత సూక్ష్మముగా వున్నది అది, అది కేవలం ఒక గొప్ప శక్తివంతమైన అద్దము ద్వారానే కనబడును. దానిలో నుండి నూటయాభై, రెండువందల పౌండ్ల బరువుగల మనిషి వచ్చాడు. అది ఎక్కడి నుండి వచ్చినది? చూశారా? కేవలం దేవుడు దానిని పలికాడు, మరి అది అలా ప్రకృతిచేత ఆరంభమై, ఎదుగుచూ ఉండెను, మరియు అది అక్కడ చక్కగా ఉత్పత్తి అగుచుండెను. ప్రతిచెట్టును ఆయన పలికాడు, ప్రతీదానిని ఉనికిలోకి తెచ్చాడు అదెంతో చక్కగా, చక్కని సంగతిగా ఈ ఉదయకాలమున వున్నది, అదంతా దేవుని వాక్యమునే అగపర్చుచున్నది.
13
ఇప్పుడు ఈ ఉదయకాలమున, పాతనిబంధనలో దినవృత్తాంతముల వైపుకి త్రిప్పుదాం. నాకు కొంచెం నీరసంగా వుంది... 18వ అధ్యాయం దినవృత్తాంతముల వైపుకి మనం త్రిప్పుచుండగ, కొంచెం నీరసంగా వుంది. కానీ ప్రభువు చిత్తమైతే...
నాకు ఖచ్చితంగా తెలీదు; బుధవారం రాత్రికి ఎక్కువగా తెలిసికొందుము. ప్రభువు చిత్తమైతే, సంఘము ఆ విధమైన నడిపింపును కలిగివుంటే, బుధ, గురు,శుక్ర, శని, మరియు ఆదివారాలను నేను తీసికొనగోరుచున్నాను, ఇక్కడ ఒక ఉజ్జీవమువలె, వాక్యములో నుండి ఒక బోధించు ఉజ్జీవము వుండునట్లు (ఆమేన్ అని సమాజము అనుచున్నది -సంపా) బుధ, గురు, శుక్ర, శనివారం మరియు ఆదివారములలో కేవలం వాక్యము మీదనే బోధ (ఉపదేశము), స్వస్థత కూటము కాదండి కేవలం ఉపదేశము. బహుశా ప్రభువు ఆ విధంగా నడిపించునేమో. అంతట మనము... మీతో వుండి, వాక్యము చుట్టూ మీతో కలిసి సహవాసమును కలిగి వుండటాన్ని నేను ఇష్టపడతాను. ఒక చక్కని అద్భుతమైన ఆమెన్ చెప్పినందుకు మీకెంతో ధన్యవాదములు.
14
ఇప్పుడు, దినవృత్తాంతములు పద్దెనిమిదో అధ్యాయంలో, పండ్రెండవ వచనం నుండి ఆరంబింతుము, కొద్దిసేపు దినము యొక్క కీలకమైన -ఈ అంశం మీద మన దృష్టి నిలుపుదాం. మొదటి దినవృత్తాంతములు...కాదు, క్షమించండి రెండవ దినవృత్తాంతములు. 2 దినవృత్తాంతములు 18:12, ఇచ్చట దీనిలోని ఒక భాగమును చూద్దాం, దేనిని మనం చూడాలని ప్రభువు కోరుచున్నాడో దానిని చూద్దాం.
మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏక ముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుమనగా,
మీకాయా - యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.
అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి - మీకాయా, యుద్దమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా, మానుదుమా అని యడుగగా అతడు పోయి జయించుడి (వర్ధిల్లండి), వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను.
15
ఇప్పుడు కొద్దినిమిషాల పాటు మన ఆలోచనలు దీని మీద పెడదాం, దీనిపై కేవలం ఒకమాట ఆయనతో.
మా ప్రియ పరలోకపు తండ్రీ, సంఘ పక్షాన అవసరతలో వున్న వారి పక్షాన, నశించిపోవుచున్నఆత్మల పక్షాన ఇప్పుడు మేము కృతజ్ఞుతా హృదయం గలవారమై నిన్ను సమీపించుచున్నాము. ఇప్పుడు పరిశుద్దాత్మ త్వరగా వాక్యములోనికి వచ్చునట్లు మేము ప్రార్థించుచున్నాము. ఇక్కడ అవసరతలో వున్న ప్రతి హృదయములోనికి దానిని తిన్నగా తీసికొని పోనిమ్మని అడుగుచున్నాము. మరియు ఆయన తన వాక్యము యొక్క శక్తిగల వర్తమానమును హృదయములోనికి పంపినప్పుడు, దాన్ని బట్టి ఈ ఉదయకాలంన మేము ఫలించుదుము గాక, వెళ్ళుచూ మందిరము నుండి తిరిగి వెళ్ళిపోవుచూ, ఆనందిస్తూ, దేవున్ని స్తుతిస్తూ ఇలా చెప్పుచూ పలుకుదుము “ మన హృదయములు ఆయన సన్నిధిని బట్టి మండుచున్నవి, ఆయన పేరిట ప్రార్ధి౦చుచున్నాము ఆమేన్.
16
ఈ ఉదయం మన దృశ్యము ఒక విచారకరమైన దాని మీద వుంది. నా మట్టుకు పాతనిబంధన అనేది ఎల్లప్పుడు ఒక ఛాయ- లేదా నూతన నిబంధనకి ఒక పూర్వ నిరూపణ (సూచన) గా వున్నది. చాలాసార్లు నన్ను ఇలా అడుగుతారు, “సహోదరుడా బ్రాన్హాం, ఎందుకని నీవు ఎప్పుడూ పాతనిబంధననే అంశంగా తీసికొంటావు? దాదాపు ఎప్పుడూ అంతే, నువ్వు పాత నిబంధనలోనికి వెళ్తుంటావు” నేను దీనిని చేయుటకు కారణం నాకు పోల్చి చెప్పటం ఇష్టం, నేను ఇష్టపడతాను.
మీ అందరికి తెలుసు నా చదువు అంతంత మాత్రమేనని. ఒక విషయం సత్యానికి దగ్గరగా ఉందని తెలిసికొనుటకు నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ఏదనగా దాని నమూన(మాదిరి)ను చూచుటయే, దాని నకలును చూచుటను బట్టి అది ఏమిటో తెలిసికొందును. ఇక్కడున్న దానికి అది సమాంతరముగా ఉండెనని నేను తెలిసికొంటాను, ఎందుకంటే అది ఇక్కడున్న దానికి ఛాయగా వున్నది. ఇశ్రాయేలీయులు ఏమి చేశారో, ఆ పాపానికి వచ్చిన శిక్ష ఏమిటో, ప్రవక్తల తీర్పు ఏమైయున్నదో, వాటన్నిటి విషయమేమిటో అనే మొదలగునవన్ని పాతనిబంధనలో నేనెల్లప్పుడు వెనక్కి చూస్తాను, తద్వారా ఇక్కడ వున్నది ఏమిటో అనే దానివిషయమై ఒక అవగాహనను నేను కలిగి వుంటాను, అంతమందు సంభవించేదానికి అది ముందస్తు సూచన.
17
ఈ కాలమందు, ఇశ్రాయేలీయులకి గొప్పకార్యము జరిగెను. అది అర్ధరాత్రి చీకటిలో వున్నది.
18
పాతనిబంధనలో, ప్రభువు చిత్తమైతే, రాబోవు కూటాలయందు పాతనిబంధనలో ఏడు సంఘకాలములు ఛాయగా వున్నవని నేను మీకు చూపించగోరుచున్నాను. అన్యుల సంఘము యొక్క సంఘకాలములు ఏవిధంగానైతే ఆరంభమైనవో సరిగ్గా అలాగునే అవి ఆరంభమై, అలానే చీకటియుగము గుండా వెళ్ళి, మహిమగల పెంతెకోస్తు కాలమందు బయిటకి వచ్చినవి, ఆదిమ సంఘంలో పరిశుద్దాత్మ కుమ్మరింప బడినప్పుడు యూదుల సంఘకాలంలో తదుపరి మరో సంఘకాలం గుండా వెళ్ళుచూ, చీకటి కాలంగుండా వెళ్ళుచూ తిరిగి వెయ్యేండ్ల పాలనలోనికి
అంత్యకాలమందు వచ్చును.
19
ఇప్పుడు, అక్కడ మధ్య శకములందు, ఈ గొప్పరాజగు ఆహాబు అధికారములోనికి వచ్చాడు. మిగతా ఇశ్రాయేలు రాజులు నడిచిన దారిలోనే ఇతడును నడిచాడు, అతడు... స్వయముగా ఆహాబు ఒక సరిహద్దు విశ్వాసి. తరుచుగా నేను అతన్ని ఆ విధంగా పరిగణిస్తాను, ఎందుకంటే అతడు కొన్నిసార్లు కంచెకు ఇవతల వుంటాడు మరికొన్నిసార్లు అవతల వుంటాడు. ఆ విధంగా స్థిరత్వం లేనివానిగా వుంటే ఎక్కడ నిలబడాలో నీకెన్నడు బోధపడదు. లేదా కైస్తవునిగా తన్నుతాను చెప్పుకొనే ఒక వ్యక్తి నిలకడగా లేకుండా వున్నట్లైతే, అతని విషయం ఏమి చేయాలో నీకెన్నడూ అంతుపట్టదు. నేడేమో వారు క్రైస్తవులుగా వుంటారు, మరి రేపు ఎలా(ఎక్కడ)
వుంటారో నీకు తెలియదు. నేడు సంఘములో వారు ఆనందిస్తారు, పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు; మరి రేపు బయిటికి వెళ్ళి మద్యం సేవిస్తారు, విందు వినోదాలలో తైతక్కలాడతారు, అన్నింటిని జరిగిస్తారు. అటువంటి ఒక వ్యక్తి ఏదీ సాధించలేడు.
20
నేను బాలునిగా వున్నప్పుడు, నాకొక గుర్రము వుంది, అది పొద్దస్తమానం కంచె దూకిపోయే సంగతి నాకు భలే బాగా గుర్తుంది. నా బాల్యంలో గుఱ్ఱంల రోజులు, గుఱ్ఱంపుబండి రోజులులాంటి వాటిని పురుషులగు మీలో చాలామందికి జ్ఞాపకం వుండే వుంటాయను కొంటున్నాను. స్వయంగా నేనే నా చిన్నతనంలో గుఱ్ఱం మీద గుఱ్ఱం బండి మీద ఈ వీధిలో చాలాసార్లు చక్కర్లు కొట్టాను. ఇప్పుడు నా వయస్సు నలబైఐదు అందువల్ల, వారు... నాకు చాలా గుర్తున్నది, ఈ పెద్ద గుఱ్ఱం కంచె దూకి తప్పించుకోకుండా వుండటానికి మీరు గేదె (ఆవు)కి ఎలాగైతే కడతారో అలాగే దాని మెడకి మనం కాడిమ్రాను (గుదిబండ) కడతాము. ఎంత కట్టినా సరే అదిమాత్రం దూకడం మానదు. మరది దూకినప్పుడు ఆ కాడిమ్రాను దానితో వుంటుంది, మరి అది దానితోనే అంతటా తిరుగుతుంది. అది కంచెదాటి వెళ్ళిపోతుంది.
మరియు ఒకరోజు, అది...ఆ ముసల జీవిని ఆకర్షించిన దాని గూర్చి నేను విస్మయం చెందుతున్నాను. అక్కడ దిగువున ఒక పెద్ద గుంట (ఊబి)వుంది. ఇప్పుడు అది ఒక ఆల్పాల్పా అనే గడ్డిలో నిల్చున్నది, ఓ ఎత్తువుంది, అది కావాలనుకొన్నది... ఆ గుంటలో పెరిగిన పచ్చని కంకులు పరకులు వున్నవి. కావున అది ఆ కంచెదూకి అక్కడికి పోయినది, ఆ గుంట నిండా పచ్చని గడ్డిలో వైర్లు అద్దపు పెంకులు కనబడకుండా వున్నాయి. మన చెత్త దిబ్బల్లో అలానే వుంటాయి కదా, కొన్ని గడ్డి పరకలు నోటినిండా పట్టుకోవడానికి అది దానిలోకి దూకినది. కానీ ఆ తరువాత అది ఆ గుంటలో నుండి రాలేకపోయినది, కావున మరికొన్ని గుఱ్ఱములను తెప్పించి దానిని బయిటికి తేవాల్సి వచ్చెను. అది దానిలోకి పోయినప్పుడు అది అక్కడే చిక్కుకొన్నది, మరది అక్కడ నిలబడినప్పుడు, అది గడగడ వణుకుచుండెను, మరియు రక్తం కారుచుండెను, మరియు - మరియు అది కేవలం నోటినిండా గడ్డి మేయడానికి, లేదా రెండు గడ్డిపరకలు మేయటానికి అది ఆల్పాల్పా గడ్డిలో నిలబడినది, దాదాపు అది తన మోకాళ్ళ మీద వున్నది.
21
నేను తరచుగా ఆ దృశ్యాన్ని తలస్తాను. “అతిక్రమించేవాని త్రోవ బహు కష్టంగా వుండును” ఉన్న చోట వుండి హాయిగా తింటూ, చక్కగా కాలాన్ని గడపటం వాడికి వల్లకాదు (కుదురుగా వుండలేడు), గానీ నోటి నిండా గడ్డి మేయటానికి, లేక వేరే రకమైనదాన్ని తింటానికి అది కంచెదూకి నానా రకాలుగా దెబ్బలు తిని గాయాలు నొందుతుంది. ఇప్పుడు జనులు కూడా ఆవిధంగా చేస్తుంటారు, దేవుని పచ్చికలోనుండి దూకిపోతుంటారు. అది వాస్తవం కాదా? (సమాజం ఆమెన్ చెప్పుచున్నది - సంపా) బయటికి వెళ్ళుట, నేడు బయటికి పోవుట, లోకములోనికి వచ్చుట. సంఘములో ఒక అద్బుత సమయాన్ని గడిపి, రేపు (లోక కార్యాల కొరకు) అమ్మివేయబడుట లాంటివి. దానిని అది బహు క్లిష్టమైనదిగా చేస్తుంది.
22
కొంచెం ఎక్కువో, తక్కువో ఆహాబు కూడా ఆ రకమే. ఎటు గాలి వీస్తే ఆహాబు అటు కొట్టుకుపోతాడు, ఎటు వాలు వుంటే అటు ఒరిగిపోతాడు. యెజెబెలు అనే రాకుమారితో అతని వివాహం అతన్ని తారుమారు (విచ్చిన్నం, దుస్థితి) చేసింది. ఆమె చూడ చక్కని చిన్నది. చూపుకి అందెగత్తై, కానీ హృదయంలో మాత్రం ఆమెంతో దష్టురాలు. ఆమె ఒక విగ్రహారాధికురాలు, ఇశ్రాయేలీయులు పతనానికి ఆమెయే కారణం...
23
ఇప్పుడు, కొద్దినిమిషముల పాటు మాతృత్వము అనే మూలాంశములోనికి వెళ్ళుటకు ముందు దాని ఉపోద్గాతమును అది వున్నట్టుగా తెలుపగోరుచున్నాను, చూశారా, అక్కడ ఒక వ్యక్తి వివాహాం చేసికోవటానికి మొదలు పెట్టినప్పుడు, ఎటువంటి అమ్మాయిని, స్త్రీని అతడు... అది ఆమె చక్కదనాన్ని (అందాన్ని) చూచుట కంటే ఎక్కువగా వుండాలి. ప్రాణ దేహము కలగలిసిన ఒక వ్యక్తిని నీవు ఎన్నుకోవాలి, మందమైన మరియు పలుచనైన (కష్టనష్టాల్లో, ఒడిదుడుకుల్లో) చేదోడువాదోడుగా నీతో నిలిచి నీ నేస్తంగా నీ జతగా ఆమె వుండాలి.
24
ఇప్పుడు, అయితే ఆహాబు, నేనూహించుచున్నాను, అతడామెకి పడిపోయాడు (ఫిదా అయ్యాడు) ఆమెను వివాహామాడాడు, ఎందుకంటే ఆమె అందెగత్తె, ఆమె కోసం చెప్పుకోవాల్సింది ఏమీలేదు, ఆమె ఒక దుర్మార్గురాలు (దుష్టురాలు) మరి ఆమె అచ్చటికి చేరుకొన్నది. మరి అంతట, గాఢంగా ఆమె (ప్రేమకు బానిసై, ఆమెతో ఆ విధంగా చుట్టబడినవాడై (ఆమె చెప్పుచేతల్లోకి పోయి) వుండుట వలన ఇశ్రాయేలీయులంతా పాపము చేయుటకు హేతువయ్యాడు, దేవునికి విరోధముగా వారు మారుటకు కారకుడయ్యాడు, దేవుని బలిపీఠములు పడద్రోసి బయలుకి (ఆకాశభైరవునికి) బలిపీఠములు కట్టుటకు హేతువయ్యాడు, ఆ కాలములో ఇశ్రాయేలు అంతటా బయలు పూజలే పెచ్చు మీరి పోయాయి.
25
ఇప్పుడు, అతని భార్య కారణమైయింది నీతిమంతుడగు నాబోతు... మీలో చాలామంది అతని గూర్చి చదివే వున్నారు. మోసము చేసి ఏలాగున వాడు అతని భూమిని (తోటను) లాక్కొన్నాడో, అబద్దం చెప్పి, దొంగ ప్రమాణం చేసి అతనికి విరోధంగా అబద్ద సాక్ష్యం పలికించాడో మీరెరుగుదురు. ఎందుకంటే ఆమె తన భర్తకోసం ఏదైనా చెయ్యాలని తలంచింది, ఆ విధంగా రాజభవనానికి ఆనుకొని వున్న నీతిమంతుని పొలమును కలుపుకోవటానికి (ఆక్రమించుకోవటానికి)
నీతిమంతుని చంపించింది.
26
ఇదంతా దేవుడు గమనిస్తూనే వున్నాడు. గనుక గొప్ప మరియు బలమైన ప్రవక్తయగు ఏలీయా వెళ్ళి ప్రవచించి ఆమెకి సంభవింపపోవు వాటిని ఆమెకి చెప్పాడు. అతని రక్తాన్ని కుక్కలు నాకునని ఆహాబుకి చెప్పాడు. ఇప్పుడు, దేవుడు చెప్పిన ఏదైన సరే... ఆ దినాలలో యెహోవా వాక్కు తిన్నగా ఆ ప్రవక్త ద్వారా వచ్చుచుండెను.
“పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినాల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను”.
కావున, ఇది వాక్యము. దీనికి భిన్నంగా (వ్యతిరేకంగా) ఏది వున్నదానిని అలానే వదిలేసెయ్. చూశారా? ఇప్పుడు రెండవదిగా నేడు ఆయన ప్రవక్త ద్వారా, దీర్ఘదర్శి, మొదలగు వారిద్వారా మాట్లాడుచున్నాడు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యం వాక్యం. ఇప్పుడు...
27
ఆహాబు ఈ ద్రోహానికి (దుర్మార్గానికి, మోసానికి) ఒడిగట్టాడు. మరతడు అలానే ముందుకి చేసికొంటుపోయాడు. ఏళ్ళతరబడి దేవుడు జనులను దీవిస్తూనే వున్నాడు. మరి చివరికి ఆహాబు ఇశ్రాయేలీయుల మీద రాజుగా కొనసాగుతుండగా యెహాషాపాతు యూదావారికి రాజయ్యెను.
మరప్పుడు, యెహాషాపాతు ఒక నీతిమంతుడు, అతడు ఆసా కుమారుడు. ఆసా ఒక నీతిమంతుడు, మరతడు విగ్రహముల బలిపీఠములన్నిటిని పగులగొట్టాడు (తుత్తునీయులుగా చేసాడు, ద్వంసం చేసాడు) అలాగే యెహోవా యొక్క బలిపీఠములను నిర్మించాడు. గతంలో వున్నట్టుగానే వారొక ఉజ్జీవమును యూదాలో కలిగియుండిరి.
28
మరియు కొంతకాలమైన తర్వాత, యెహోషాపాతు, లేక ఆహాబు సిరియాలో కొంత భూభాగాన్ని కనుగొని దాని కోసం అతనికి కబురు పంపెను, ఆ భూభాగం తనకి చెందినది అని అతడు భావించాడు, దానిని స్వాధీనం చేసికొనగోరెను. కనుక వచ్చి తనతో పొత్తు కలవమని ఈ యెహాషాపాతును అతడు అడిగాడు.
29
మరియు బహుశా, చూడండి అక్కడ ఒక గొప్ప అపాయం వున్నది, అక్కడ దిగువున వారు ఈ గొప్పరాజగు ఆహాబు చూచినప్పుడు, మరి ఈ గొప్పవాడైన యెహాషాపాతు పైకి వచ్చినప్పుడు, వారిలో ఒకరు నులివెచ్చని వాడు, మరొకరు ఆత్మనింపుదల గలవాడు. నీవు ఎలాంటి వారితో పొత్తుపెట్టు కొంటున్నావో (కలుస్తున్నావో, కూటమిగా జతకడుతున్నావో) గమనించు. నువ్వు చేస్తున్న దానిని గమనించు, ఏ విధంగా నీవు అవిశ్వాసులతో జతగడుతున్నావో కనిపెట్టుము. నిన్ను నీవు పవిత్రంగా కాపాడుకో, ప్రత్యేకించి మనం జీవిస్తున్న ఈ దినమందు.
ఏ సందేహం లేకుండా నేను నమ్ముచున్నాను. సంఘము, ఇది నా హృదయంలో మండుచున్నది. ఆ కారణమును బట్టియే ఈ ఐదురాత్రులు నేను ఎదురు చూస్తున్నాను, శీఘ్రముగా మరోసారి, ఇది జరుగుటకు ముందు, కూలంకుషంగా బైబిల్ ద్వారా దువ్వుట (సాఫీగా చెప్పుట)ను ఈ సంఘానికి నేనిచ్చుచున్నాను.
30
కాలము యొక్క నీడ (ఛాయ)ల్లో మనం జీవిస్తున్నాము. ఇది ఎప్పుడైన సంభవింపవచ్చును. శత్రువు దుర్మార్గం, దుష్టశక్తుల ప్రభావం లాంటివి జరిగే సమయం ఆసన్నమగుటను మనం చూస్తున్నాం. ఈ మంచుతుఫాన్లు, ఇవన్నీ జరగటం, తెగుళ్ళు (ఘోరమైన అంటు రోగాలు) అన్నిరకాల వాటిని మనం చూస్తున్నాం. సృష్టి అంతరాయానికి, బాంబులు మొదలగునవి కారణమాయెను. వారు అన్నిటిని కలగలపుతున్నారు. ఆయన వాక్యాన్నినెరవేర్చుటకై వారు దేవుని యొక్క గొప్ప ప్రయోగశాలలో (పరిశోధన కేంద్రంలో) గందరగోళం చెందుతున్నారు. అది జరుగబోవుచున్నది.
కనుక, ఎంతో మోసముతో (కుయ్యుక్తితో) పాప పురుషుడు అధికారంలోకి వస్తున్నాడు. మై, ఈ ఉదయ కాలమున దేవుని ఆత్మనింపుదల గల ఒక సేవకుడు మృగము యొక్క ముద్ర అనే అంశాన్ని తీసికొని రష్యానే క్రీస్తు విరోధి అయి వుండెనని బోధించాడు. అదెంతో పొరపాటు. హు- హూ. దానితో రష్యాకి ఏ సంబంధం లేదండీ. లేదు. అది లేఖనానుసారం. ఇప్పుడు, మనం జీవిస్తున్న ఈ గొప్ప కాలపు హెచ్చరికను గమనించండి.
31
ఇప్పుడు యెహోషాపాతు, “వచ్చి నన్ను దర్శింపుము” అని ఇశ్రాయేలీయుల గొప్పరాజు పిలవడం ఎంతోమంచి అనుభూతిగా అతనికి అనిపించింది. మరియు అతడు అచ్చటికి దిగి వెళ్ళాడు. మరియు వారు ఎద్దు లేక గొర్రె మొదలగు వాటిని బలిగా అర్పి౦చారు. అన్ని వేళలా, అక్కడున్న ఆహాబు హృదయంలో అతడొక మోసగాడిగా వున్నాడు. ఎందుకనగా అతడు ఆరాధించట్లేదు...లేదా ఆ గొర్రెలను వాటిని అతడు నిజమైన హృదయముతో అర్పించుట్లేదు, కారణం అన్నిటికి మించి అతడు తన భార్య యొక్క మతము నుండి నేర్చుకొన్నాడు.
32
మరి గమనించండి, ఇశ్రాయేలు యొక్క కటిక చీకటి కాలమందు ఆహాబు యెజెబెలును వివాహామాడినట్టే, అతడు ఎలాగైతే ఇశ్రాయేలులోకి విగ్రహారాధన తెచ్చాడో, సరిగ్గా నేడును అలానే వున్నది. చీకటి కాలమందు వున్నట్టే, మనము ఆదిమ అపోస్తుల కాలమునుండి, రెండవ రౌండు, మూడవ రౌండు దాటు కొంటూ చీకటి యుగములోనికి వెళ్ళి పదిహేను వందల ఏళ్ళు వుంటిమి. ఆహాబు యెజెబెలును వివాహామాడి ఇశ్రాయేలులోనికి విగ్రహారాధన తెచ్చినట్టే, పరిశుద్దాత్మ సంఘము వాదములను వివాహమాడి, విగ్రహారాధనను తిరిగి తెచ్చెను, మరి నేడు అది క్రైస్తవ రూపములో కనబడుతున్నది. చూశారా? కేవలం కటిక చీకటి. మరి ఇప్పుడు అది కదులుతూ వుంది, ప్రతి దినము, ప్రతి సంఘకాలము అదే సంగతికి కదిలిపోవుచున్నది, గొప్ప ముగింపుకి, నులివెచ్చని పరిస్థితులు వచ్చుటకు, నులివెచ్చని లవొదికయ సంఘకాలమునకు ఓ, మనం జీవించుచున్న గడియ ఎంతో భయంకరముగా వున్నది.
33
వినండి, నేను ముందుకి పోవడానికి ముందు ఇక్కడ నేనొకదానిని ఒప్పుకొనగోరుచున్నాను. పాత కాలపు దినములు తిరిగి చూడాలని ఆశించే పాతకాలపు ప్రసంగీకుడిని నేను. నేను ఈ వంచన (నకిలీ)ను ఎంతో చూశాను. హాలివుడ్ అనేది సువార్తను సుందరీకరించుచున్నది, దాన్నిబట్టి నేనెంతో అనారోగ్యం (జబ్బున పడ్డాను) చెందాను, ఎంతో అలసిపోయాను. అవునండీ పాతకాలపు విధానంను నేను చూడగోరుచున్నాను. క్రైస్తవ్యాన్ని మనం ఎంతో అందంగా చూపిస్తున్నందున నేనెంతో భయపడుచున్నాను; అదొక అపాయకరమైన గీత (రేఖ).
34
ఇప్పుడు, యెహాషాపాతు దిగువునకు వచ్చి ఇలా ఆలోచిస్తున్నాడు, “ఓ, మంచిది, ఇశ్రాయేలు యొక్క ఈ గొప్పరాజు, నేను కేవలం... ఓ, మనం పర్వాలేదు అది.” ఈ గొప్ప ఆకర్షణ (మనోహరమైన, సౌందర్యమైన) మధ్యలో అతడేమి చేసాడు? అతడొక పొత్తును ఏర్పరిచాడు, శత్రువు మీదికి వెళ్ళి పోరాటం చేయడానికి ఒకే యుద్ద రంగం మీద, ఎందుకనగా వారు అన్నారు, “మనము ఇరువురం ఒకే జనముగా వున్నాము” కానీ వారు కాదండీ, ఒకరేమో ఆత్మనింపుదల గల గుంపు, మరొకరేమో నులివెచ్చని గుంపు, వారొకే జనము కాదు. కాదు. నువ్వు కలిగి యుండలేవు.
వెలుగుతో చీకటికి పొత్తు (సంబంధం, సహవాసం)లేదు. సూర్యుని వెలుగులో చీకటి నిలబడలేదు. కాలాల మధ్యలో అదొక వంచన కాలము. ప్రొద్దుపొడిచే, ప్రొద్దుగ్రుంకే కాలము ఎంతో ప్రమాదకరమైంది. మసక మసకగా వుంటుంది స్పష్టంగా ఏది కనబడదు, అలాంటప్పుడు నీ వాహనం యొక్క లైట్లు కూడా తేటగా దారిని చూపించవు, స్పష్టంగా ఏది కనబడదు. ఉంటే పూర్తిగా వెలుగైనా ఉండాలి లేకుంటే పూర్తిగా చీకటియైనా కమ్మాలి. యేసు అన్నాడు, “వెచ్చగానైనా చల్లగానైనా వుండుము, నులివెచ్చని స్థితిమాత్రం వద్దు,” అదొక గొప్ప ప్రమాదరేఖ.
35
మరి అంతట యెహాషాపాతు. అతడు అచ్చటికి వచ్చినప్పుడు, మరంతట ఈ గొప్ప కూటమి ఏర్పడిన అనంతరం, అది దేవునికి ఇష్టంగా లేదు. మరి గమనించండి అతని కాలమందు, ఇప్పుడు ఎంతో ఉత్సాహం, “రాజు అనుగ్రహం నాకు దొరికినది. మరియు ఓ, ఈ గొప్ప పొరుగువానితో నాకు - నాకు -నాకు సహవాసం ఏర్పడింది, నేను కలిగియున్నాను...”చూశారా, జాగ్రత్త అది, సంఘమా, చూశారా? ఈ టబర్నికల్లోను, అన్ని చోట్ల అసలు సమస్యకి కారణం అదేనండి. చూశారా? నువ్వు దేనితో కలుస్తున్నావో జాగ్రత్త సుమా. చూశారా? దాని నుండి తక్షణమే బయటపడు, ఉంటే క్రీస్తులో వుండు లేకుంటే ఆయనకి వ్యతిరేకంగానైనా వుండు.
36
ఇప్పుడు, ఇతడు పొత్తును ఏర్పరిచాడు, ఏదో గొప్పకార్యం తాను చేసినట్టుగా అతడు భావించాడు. ఇంకా అతడన్నాడు,“ఇప్పుడు అక్కడ లేరా, మనం వెళ్ళుటకు ముందు, దీని విషయమై మనం ప్రభువును సంప్రదించవలెను? ”ఇప్పుడు యెహాషాపాతులో ఇంకా విశ్వాసము మిగిలివున్నది, అతని తప్పిదములో, ఈ రాజుతో చేతులు కలిపినప్పటికి, అతనిలో ఇంకా విశ్వాసం వుండనే వుంది అని అతని భావన,“ సరే, మనం కనీసం ప్రభువును తప్పనిసరిగా సంప్రదించాలి”.
37
ఇప్పుడు, ఆహాబు వెంటనే ఒక్క మాట కూడా చెప్పకుండా బయటికి వెళ్ళుచుండెను, అతడు ఎప్పటిలాగే కార్యాలను యాంత్రికంగా, బౌతికంగా మానవ ధోరణిలోనే జరిగించుచున్నాడు.
సంఘమా ఇక్కడ అదికాకపోతే అనేకసార్లు మనము కూడా అదే తప్పు చేస్తాము. దాని విషయమై నేను ఆశ్చర్యపోతున్నాను. దానిని గుర్తించండి, చెప్పండి, “మంచిది, ఇది ఈ విధంగా వుండాలి. మరి మనం దానిని అలా వుంచము.”
నేడు అమెరికా చేసే సువార్త అంతా అలానే వుందని నేననుకొనుచున్నాను, మనము దానిని ఒక రూపములో వుంచము, నేనంటాను, అది హాలివుడ్ సువార్త అని. అది పూర్తిగా ఆకర్షణీయముగా (అందంగా) వుండేటట్టు చేశాం. నేడు సువార్తికులు వేదిక మీదికి వచ్చి, మై, అతడు ఊకదంపుడు ప్రసంగాలు అదరగొడతాడు, ప్రసంగించటానికి ముందు అనేక సరసోక్తులు (హాస్యపు కథలు) చెప్పి (నవ్వించి), ఆ విధంగా చేసి బలిపీఠము మీద ఒక హాస్యగానిగా నటిస్తూ అలా ముందుకు వెళ్తాడు, దాన్ని మనం గమనించ వచ్చును. ఇక చివరికి అతడు వేదిక పిలుపు ఇచ్చినప్పుడు జనులు దానిని కనీసం పట్టించుకోరు (హృదయాన్ని సమర్చించుకోరు). అది నిజం. అందుచేతనే నేడు లోకమంతా నులివెచ్చని స్టితిలోకి వెళ్ళింది, అది అందున్నది.
38
నేడు నేనెంతో ఆశ్చర్యపోతున్నాను. అది కేవలం, నేడు నేను... సంఘము, మన పిల్లల్ని మనం పాఠశాలకి పంపుతాం, మనస్తత్వశాస్త్రం నేర్చుకోవటానికి, ఒక కార్యక్రమాన్ని ఎలా తయారు చేయాలి, వేదికమీద ఎలా వుండాలి మరియు సిద్దపాటును మనం... ప్రసంగం చాలా సరసమైనదిగా (వంచన, ప్రలోభ పెట్టేదిగా) భలే బాగుంటుంది. అది జనాలకి బాగా నచ్చుతుంది, వారి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి అటువంటి బోధకులవలే అనేకమంది గొప్ప గొప్ప మనస్తత్వ మేధావులు
(వైద్యులు) బయటికి వెళ్తారు, నాటకీయంగా మాట్లాడతారు మరియు ఏదేదో సొగసులు అద్దుతారు తమ మాటలకి. మరి నాకు ఆశ్చర్యమేస్తుంది, మరి వారు... మనమెల్లప్పుడు సంఘ సొగసును గూర్చి, దాని ఆకర్షణ గూర్చియే మాట్లాడుతుంటాం. ఈ విధంగా చెప్పుటలో విఫలమౌతుంటాం, “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను” జనాకర్షణ కోసం మన సంఘాలకు మెరుగులు దిద్దటం చూసి నాకెంతో ఆశ్చర్యం.
39
ఉదాహరణకి, నేడు బాప్టిస్టు సంఘం ఒక నినాదాన్నిఎత్తుకొంది, అదేమంటే “44లో పదిలక్షల మంది” మార్పులేని వేలమందిని, వేవేలమంది సభ్యులను లోపలికితెచ్చి తమ సంఘసభ్యత్వం తీసుకొనేటట్టు చేస్తున్నారు. అటువంటి వారిని సంఘసభ్యులుగా చేర్చుకోవటం యేసుక్రీస్తు సంఘానికి కళంకమే. ఎందుకంటే వారు ఇంకా త్రాగుతారు, పొగపీలుస్తారు, జూదమాడతారు, అబద్దాలాడతారు.
వారు సంఘానికి వస్తారు, హాలివుడ్ సువార్తికుల గుంపు పైకి వచ్చి తమ్మును వినోదపర్చాలని (ఆహ్లాదపర్బాలని) గొప్ప గొప్ప అలంకరణ వుండాలని, వేదికమీద వాయిద్యాలు పైన క్రింద అమర్చబడివుండాలని కోరుకొంటారు.
ఎప్పుడు పాతకాలపు విధానాన్ని వారు ఖచ్చితంగా కలిగియుండవలెను, దేవునికే మొదటిస్థానం ఇవ్వాలి. మొర్ర పెట్టేవారిగా వుండాలి, బలిపీఠపు పిలుపుకి స్పందించేదిగా వుండాలి, అందం కొరకు స్త్రీ, పురుషులు అక్కడికి రాకూడదు, లేదా పరుగులు తీయటానికో హాస్యము కొరకో కాదండీ, కానీ బలిపీఠం యొద్దకి చేరి యేసుక్రీస్తు మరణాన్ని గుర్తించే వారుగా వుండాలి, యదార్థతతో దేవున్ని తిరిగి చేరేవారుగా వుండాలి.
40
నాకాశ్చర్యం, అటువంటి ఒక కాలంలో మనం జీవించకపోతే, మనం గొప్ప సువార్తికులను తీసికొన్నట్లైతే, వారు దేశ విదేశాల్లోకి వెళ్తున్నారు ఈ దినమున, వారు ప్రఖ్యాత సువార్తికులు, వారు మనస్తత్వ శాస్త్రాన్ని అభ్యసించారు మరియు సంఘానికి వారు జనులను ఆకర్షిస్తారు. అయితే ఒకసారి నీవు వారిని సంఘంలోకి చేర్చిన తర్వాత, నువ్వు వారితో ఏం చెయ్యబోతున్నావు, సంఘంలోకి చేరిన తర్వాత వారికేం జరుగును? కేవలం సంఘంలో చేర్చబడుటకు మాత్రమే, తరువాత వారు ఏ ఆశలుతోనైతే, ఏ పాపంతోనైతే లోనికి వచ్చారో మళ్ళి అదే పాపంతో, అదే ఆశలతో బయటికి పోతారు. వేటితో వచ్చారో వాటితోనే తిరిగిపోతారు. అందునుబట్టే నేడు లోకం చూచినప్పుడు ఇలా అంటుంది, “మంచిది, అతడు మతం మారినా, ఇతడు మతం మారినా...”
మనం దానిని చాలా సులభం చేసినందుకు నేను భయపడుతున్నాను. అదే , నేను ప్రేమిస్తున్నా..... నేననుకొనుచున్నాను, సంతోషము నిశ్చయంగ, సకల సంతోషం యేసుక్రీస్తులో వుందని నేను నమ్ముచున్నాను. అది నిజం. అది ఆనందదాయకమని, సంతోషదాయకమని నేను నమ్ముచున్నాను. సోదరుడా, అది వేదన మరియు బాధ మరియు సిలువ యొక్క మార్గమని గుర్తంచుకో. అదంతే మనం దానిని సులువుగా వుండునట్లు రంగు దిద్దకపోవుటను బట్టి నేను ఆశ్చర్యపోవుచున్నాను.
41
నేను చూస్తూవుండగా, మరి నా భార్య పెట్టినది... నేను బయలుదేరాను, మరియు ఆమె నా కోటు మీద రోజాపువ్వును నేడు పెట్టి అన్నది “నీవు దీన్ని తప్పక ధరించాలి. నీ తల్లి ఇంకా ”బ్రతికేవుంది“
మరి నేను అన్నాను, “ఓ, ప్రియా, నాకది తెలీదు”
మాతృదినోత్సవము అద్భుతమైంది, లోకానికి అది ఇష్టం, దానిని వారు వ్యాపారంగా చేసారు, పూలు అటువంటి వాటిని అమ్ముతారు. ఎందుకు, తల్లికి ఇచ్చే గౌరవం అది కాదు. ఎందుకు, కేవలం ఒక్క దినానికి మాత్రమే నా తల్లి నాకు తల్లికాదు, సంవత్సరంలో ప్రతి దినము ఆమె నాకు తల్లియే అవును.
నేను అడుగుతాను, “నీవు నీ తల్లిని ప్రేమిస్తావా ?”
గత మాతృదినోత్సవం నాడు నేను ఆమెకి గంప నిండా పూలు పంపాను“ మంచిది సహోదరుడా, అనుదినము ఆమె తల్లిగానే యుండవల్సివుంది. కానీ అది వ్యాపారమై పోయింది.
42
ఆ పువ్వు చాలా మంచిది (అందమైనది). చక్కని పూలంటే నాకును ఇష్టమే. నేను చేస్తున్నట్టే దానిని నేను భావిస్తాను... పూలు ఎంతో చక్కగా వుంటాయి. అవి వికసిస్తాయి. సువాసనలు వెదజల్లుతాయి. బాటసారులు వాటి సువాసనను ఆస్వాదిస్తారు. జంతువులు వాటి దగ్గరికి వచ్చి వాటి సువాసనను ఆఘ్రాణిస్తాయి. కానీ ఇప్పుడు చూడండి, అవి చక్కనివే. ప్రభువైన యేసుక్రీస్తు సంఘంవలె అవెంతో మనోహరమైనవి, దైవీకస్వస్థతలు, అధికారములు, సూచక క్రియలు, మహాత్కార్యాలు, పాపమునుండి విడుదల. అదొక చక్కనిచోటు. కానీ చూడండి, ఒకవేళ ఆ పుష్పములనేవి... మిగతా సృష్టి అంతటివలె మనం కూడా సంఘానికి రావల్సి వుంది.
ఆ గులాబి, అందంగా ఉండుట చేత దేశంలో వున్న ప్రతీ ఆవు శక్యమైతే దానిని నాకగోరును. అయితే ప్రకృతి వాటికి బాకులను (గుచ్చుకొనేవి) ప్రసాదించెను, చిన్నపాటి బళ్ళెం (ఈటె)ల వలే అవి వాటికే అంటుకొనే వుంటాయి, వాటిని ముళ్ళు అని పిలుస్తాం, అవి వాటికి సంరక్షణ. అవే వాటిని కాపాడతాయి. అది నిజం.
43
దేవుని పరిశుద్దత యొక్క శక్తి ఔనత్యం చుట్టూ రెండంచుల వాడిగల ఖడ్గమనే దేవుని వాక్యాన్ని నేడు మనం కలిగియుండకపోతే, దేశంలో వుండే ప్రతీ ఆవు దాని దగ్గరకు వచ్చి దానిని నాకి, దానిని త్రుంచునట్లు వాటిని స్వయంగా మనమే అనుమతించినట్లగునని అనుకొనుచున్నాను. సంఘానికి అది రుణగ్రస్తమైవుండును. అది వాస్తవం.
నేడు మనకి అవసరమైనది పాతకాలపు, దైవపిలుపున్న సేవకులు, ఉన్నది వున్నట్టు బోధించే బోధకులని నేననుకొనుచున్నాను, వారికి ఎక్కువ చదువులేకపోయిన పర్వాలేదు, కానీ జనులను బలిపీఠం నొద్దకు నడిపించే వారై వుంటే చాలు, అక్కడ వారిని పశ్చాత్తాపపడేవారిగా చేసేవాళ్ళు. సరసోక్తులు, సరదామాటలు, నవ్వించి కవ్వించేవారు కాదు కావాల్సింది, సహాదరుడా, (స్త్రీ పురుషులు నిజంగా తమ పాపాలకోసం పశ్చాత్తాపం నొంది దేవునికి సమీపంగా తీసికొచ్చే ఆ పాతకాల మనుష్యులు, ఆక్రందన చేస్తూ ప్రాణాలను ఆయాసపర్చుకొనే వారు కావాలి. ఆమెన్.
44
“క్రీస్తుని అంగీకరించువారు చేతులు పైకెత్తండి” అని అడిగేవారిని మనం కలిగియున్నాం అని మీకు చెబుతున్నాను, అందరు అలానే వున్నారు. అది నిజం, సహోదరుడా, అందువల్ల - అందువల్ల పాపం పోదు.
మొదటిగా నువ్వు పశ్చాత్తాపపడాలి, సరిచేయబడాలి, అక్కడికి చేరి నిజంగా మొర్రపెట్టాలి. పాతకాలపు ప్రజలు వసారాలో నడుచుచూ మరియు రోడ్లపై పైకి క్రిందికి తిరుగుచూ, ఏడ్చుచూ, తమ పొరుగువారితో సంభాషిస్తూ వుండుటను నేను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. అది ఆనాటి క్రైస్తవ్యము, జనాలకి వారు ప్రభువును గూర్చిన సంగతులు చెబుతుండేవారు.
మరి నేడు, మనం మన పేర్లను సంఘ పుస్తకంలో పెట్టి, బయటికి వెళ్ళి మరియు ఇళ్ళలోనే వుంటాం కానీ దాని గూర్చి ఒక్క మాటకూడా మాట్లాడము. ఏ ఏ పట్టింపు(శ్రద్ద) వుండదు. “మనం సంఘమునకు చెందినంత కాలం మనకేం పర్వాలేదు అంటాం.” జనులారా! మనం ఆ విషయంలో పొరపాటులో వున్నామని నిశ్చయంగా చెప్పగలను. దానిని పరీక్షించుకోండి, ఎందుకంటే అటువంటి ఒక స్థితి తీర్పులో నిలబడదు. లేదు. అది నిలబడలేదు.
అంతకంటే తక్కువ కాదు, “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని, అనుదినము చనిపోవాలి” సిలువ మీద చస్తూనే వుండుము. అది నిజం. వేదన పడుట (శ్రమనొందుట) “మార్గము, ”నేను వెళ్ళే మార్గము“ ”అని నీవు పాడతావు “ప్రభువు యొక్క తృణీకరించబడిన కొద్ది మందితో”.
45
నేడు నేననుకొనుచున్నాను, ఎటువంటి సమయములో మనం జీవిస్తున్నాము! ఆ, సువార్త, వారు దానిని పెద్ద పెద్ద వెలుగు కాంతులలో పెట్టియున్నారు, మరియు వారు ప్రయత్నిస్తున్నారు... ఒక సువార్తికుడు పట్టణములోనికి వచ్చుట నువ్వు చూసినప్పుడు ఆశ్చర్యపోతావు నేను, నా కూటాలు కూడా అట్టి విధముగానే వున్నాయనే అపరాద భావన నాకు కూడా వున్నదండి. అవును పట్టణానికి సువార్తికుడు వచ్చుచున్నాడా లేక యేసుక్రీస్తు వచ్చుచున్నాడా? అనేది నాకు భలే ఆశ్చర్యంగా వుంటుంది. ఎందుకని, వారు కలిగియున్న...
కొద్దికాలం క్రితం నేను ఒక చోటుకి వెళ్ళాను, అక్కడికి ఒక సువార్తికుడు రావల్సి ఉంది. మరి యేసు నామము... ఎందుకు వారు ఆ సువార్తికుని బొమ్మను ప్రచురించారు, “ఈ గడియకు పంపబడ్డ మనిషి” అని, అవి ఉన్నవాడు, ఇవి ఉన్నవాడు అని ప్రకటనలు చేసారు.
46
నా సేవను గూర్చి జనులు వచ్చుటను గూర్చి కొన్నిసార్లు నేను తలస్తుంటాను. నేను హోటల్ గదికి వెళ్ళిన తర్వాత ఇలా చెబుతాను, “దేవా ప్రజలు చూడటానికి వచ్చేది నిన్నా లేక నన్నా? చూశారా?” వారొకవేళ నన్నుచూడటానికి వచ్చినట్లైతే వారు నశి౦చినట్టే, ఓ దేవా, నన్ను చీల్చీవేయుము, నన్ను ప్రక్కకి నెట్టివేయుము (నాలో అహంను తీసివేయి). నిన్నే నేను కనబర్చాలి, ఒక దినాన మేము గడగడలాడుచు, వణుకు చేతులతో, బలహీన దేహంతో నీ యెదుట నిలబడాలి, నిన్ను చూడాలి. నీ తీర్మానం చేత నా ఆత్మ వ్రేలాడుతున్నది“ మనం క్రీస్తుని హెచ్చిద్దాం.
47
నేడు నీవు ఇలా అందువు “మంచిది, నేను బాప్టిస్టుకి చెందియున్నాను. నేనొక మెతడిస్టుని. నేను టబర్నికల్‌కి చెందియున్నాను. నేను ఇది చేస్తాను.” ఓ, దానికి దీనితో ఏ సంబంధం లేదండీ. ఒక్కటికి కూడా సంబంధం లేదు. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోవుదును.
కొద్దికాలం క్రితం, పలాని కూటాలు పట్టణం లో జరగబోవుచున్నవి అని తెలిపే ఒక ప్రకటనను నేను చూశాను. ఆ ప్రకటనలో మనిషి పేరు, అతని పేరైతేనేమో పెద్ద అక్షరాలతో వేశారు, ఎక్కడో దిగువున ఒక మూలన చిన్న చిన్న అక్షరాలలో “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా వున్నాడు” అనే దానిని వ్రాసారు; ఎక్కడో మూలన వుంచారు. చూశారా?
క్రీస్తు నుండి గొప్పతనాన్ని వారు తీసికొని, దాన్ని ఒక మనిషికో, లేక ఒక సంఘానికో లేక ఒక సంస్థకో ఆపాదించుచున్నారు. సహోదరుడా, హాలివుడ్ సరసోక్తులు (హాస్యం), సౌందర్యం అటువంటి, వాటిని నీవు సంఘములో పొంద వచ్చునేమో గానీ యేసుక్రీస్తు సన్నిధిలో అలాంటివి కుదరవు, మహిమార్హుడు ఆయన ఒక్కడు మాత్రమే. అది నిజం. ఇప్పుడది వాస్తవం సహోదరుడా, సహాదరీ.
48
నామీద కోపం పెట్టుకోవద్దు. నేను నీకు బోధించుచున్న సంగతి జ్ఞాపకం చేసికో. ఒకవేళ నా జీవితంలో ఇదే ఆఖరి ప్రసంగమైతే తప్పక నేను బోధించి తీరాలి. నేను ప్రసంగించే ప్రతీ ప్రసంగం చనిపోతున్న వ్యక్తికి బోధించే చనిపోతున్న వ్యక్తిగా వుండాలని కోరుచున్నాను. మరి, దినదినము నా కాంతి తగ్గుతూవుంది, అలాగే నీది కూడా సుమా. మనం నశించుచున్న మర్త్యులం. మరి మనము దేవుని యెదుట నిలబడవల్సి ఉంది, ఈ దినాలలో ఒకదినాన, కావున దీని విషయములో మనము ఎంతో యదార్ధంగా ఉండవల్సి వుంది.
49
కేవలం ఒక ఆకర్షణ, కొనసాగుట, సంఘంలో చేరుట, అక్కడికి ఇక్కడికి వెళ్ళుట, ఈ విధంగా ఆ విధంగా చేయుట.
పాతకాలపు ప్రార్ధనా కూటాలు మన ఇళ్ళలో కలిగి యుండి రాత్రింబవళ్ళు దేవునికి మొర్రపెట్టుట మనకి మంచిది. కాలము సంపూర్ణమైనది, బాధ కాలములు, అపాయకరమగు కాలములు “ఒక చీకటి దినమని” బైబిల్ చెప్పుచున్నది మనం దాని యందు జీవించుచున్నాము.
50
ఈ గొప్పవాడు ఉద్రేకపడి అక్కడికి ఎలా వెళ్ళాడు. నులివెచ్చని వారితో, సరిహద్దు విశ్వాసులతో , జతకట్టి తానేదో గొప్పకార్యం చేస్తున్నట్టు, దేవుడు తనని ఆశీర్వదిస్తున్నట్టు భావించుకొన్నాడు. తనతోపాటే ఈ గుంపంతటిని తీసికొని వచ్చుచున్నాడన్న సంగతిని అతడు గుర్తించలేకపోయెను. “ఇక్కడ యూదాలోవున్న మన చిన్న గుంపు దిగి వచ్చి ఇశ్రాయేలు సైన్యంతో కలిసి పోవాలి. అప్పుడు వారు మనం కలిసి ఒక గొప్ప జనమౌతాము”.
51
నువ్వున్నది అక్కడే. ఇక్కడ నేను నిలబడి యుండుట ఎంత వాస్తవమో అంతే వాస్తవమగు సంగతి ఏదనగా క్రీస్తు విరోధిలోకి చేర్చుటకు ఇప్పుడు అపవాది పన్నుచున్న కుయుక్తి (పన్నాగము) సరిగ్గా అట్లానే వున్నది మరి. “మనమంతా కలిసికట్టుగా మన తలాంతులను ఒకటి చేద్దాం.” దానిని మనం చేయలేం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడువగలరా?
సంయుక్త రాష్ట్రాలు సహితం మరి .... అదే అనుభవం నొంది, మరి అదే పొరపాటును చేసింది గతంలో అది రష్యాతో జత కట్టినప్పుడు ఆ సమయంలో వారు యుద్దానికి సన్నద్దులైయ్యారు, రష్యాతో మనం కట్టుబడివుంటిమి. మనమేమి పొందుకొని యున్నామో మరిప్పుడు మీరు చూడవచ్చు, నొందలేదంటారా? వారు మన విమానాల్ని తీసికొన్నారు, మరియు మన రహస్యములన్నిటిని తెలిసికొన్నారు, మన అణుబాంబుల సంగతిని మరి అలాగే అక్కడున్న అంతటిని వశపర్చుకొన్నారు మన మీదనే వాటిని ప్రయోగించటానికి. సరిగ్గా ఆత్మీయ కోణంలో కూడా అదే జరుగుతుంది.
52
అంతట మనం కనుగొనవచ్చును, యెహోషాపాతు కూటమిని ఏర్పరచుకొన్నాక, వారు సంప్రదించారు. ఇప్పుడు గమనించండి, గమనించండి బయట ప్రపంచాన్ని, అతడన్నాడు “నిశ్చయంగా మనకి ఎంతో ఎక్కువ మంది ప్రవక్తలున్నారు, అటువంటివారితో నిండుకొనియున్న ఒక ”సెమినరి (వేదాంత పాఠశాల) మనకి వున్నది“.
వారు దిగివచ్చి, మనస్తత్వశాస్త్రాన్ని ఎరిగి, దాని గూర్చి బాగా తెలిసిన తర్భీదు నొ౦దిన వారిని వారు రప్పించుకొన్నారు, వారిని ఇలా అడిగారు, “ఇప్పుడు ఇక్కడికి రండి, ప్రభువు యొద్ద విచారించి అడుగుదుము”.
వారందురు, వారు ప్రకృతి సంబంధమైన మనస్సు గలవారై ఇలా చెప్పారు, “ఇప్పుడు చూడండి, మనం... మీరు ముందుకు సాగిపొండి. ప్రభువు మీతో కూడా వున్నాడు. అదిగో అక్కడున్న ఆ భూబాగాన్ని ప్రభువు మీకు ఇవ్వబోవుచున్నాడు. అది, అది మీకు సొంతం కాబోవుచున్నది. సిరియా వారిని మీరు వెనక్కి తరిమెదరు. దానిని మీరు చేయుదురు” వారిలో ఒకడైతే ఏకంగా రెండు ఇనుప కడ్డీల కొమ్ములను చేసి, ఇట్టి విధంగా గుండ్రంగా చక్కర్లు కొడుతు ఇలా పలికాడు. “ఇదిగో ఇలా మీరు సిరియా వారిని తరుముతారు ....”
53
కానీ యెహాషాపాతు కొంచెం ఎక్కువ ఆత్మీయత వున్నవాడు గనుక వారు చెప్పిన హాస్యపు పిచ్చికూతలను ప్రక్కన పడేసాడు. అది అంతే.
దేవా, ఇక్కడ ఈ హాలివుడ్ హాస్యమును బట్టి మేమెంతో జబ్బునపడి అలసిపోయాము, కావున మరి కొంతమంది యెహోషాపాతులను మాకు దయచేయుము. అది నిజం, వేషం ధరించి, తమకి లేకపోయిన ఏదో స్థితి వున్నట్టు నటిస్తు స్థాపింప బూనుకొని, నాటకీయంగా చెప్తూ పటమును గీస్తారు. మరంతట వారు లోనికి వచ్చినప్పుడు, నీలోనికి వచ్చినప్పుడు నీవేమి పొందుకొందువు? “ఎడారిలో ఈత కొట్టుటకు రమ్ము”అని ఒకన్ని అడిగినట్టు వుంటుంది. ఎడారిలో ఇసుక దిబ్బలు తప్ప ఈతకొట్టే పరిస్థితి ఎక్కడుంటుంది, ఒకవేళ నువ్వు నీ తలను ఇసుకలో దూరిస్తే తరువాత బాధలు తప్ప ఇంకేం వుంటుంది.
54
ఇప్పుడు గమనించండి, వారిని ఎందుకోసం లోనికి తెస్తున్నాము? ఒకసారి ఒక స్తీ నాతో ఇలా అన్నది, “నేను సంఘానికి వెళ్తాను, కానీ - నేను సంఘంలోనికి వెళ్ళినప్పుడు నేనేం పొందుకొందును? ” ఇంకా అన్నది “ వారు చేసేదంతా ఒక రాత్రి భోజనం నిర్వహిస్తారు, మరియు వారు... దానిగూర్చి దీనిగూర్చి మరో దానిగూర్చి.”
మరి ఆ స్త్రీ అన్నది, “నాకు మాటలు రాలేదు అతన్ని ఎచ్చటికి పంపాలో నాకర్థం కాలేదు.” నువ్వు ఉన్నది అచ్చటే. చెప్పింది “పాతకాలపు గీతములు ఆలపించి, భక్తిగా బ్రతికే ఒక పాతకాలపు సంఘాన్ని నేను కనుక్కొవాలని ఆశపడుచున్నాను”.
పిల్లలు ఆకలిగొన్నారు, చెత్తకుండీలో దానిని వారు తిందురు. జీవంగల దేవుని సంఘం వారిని సజీవ వాక్యము చేత పోషించే పని కలిగియున్నది.
55
అచ్చట, సౌందర్యం మరియు ఏదో వున్నా యెహోషాపాతు అడిగాడు, “ఇంకొకరు లేరా?”
“ఇంకొకరా?” అని ఆహాబు చెప్పాడు. “మంచిది, ఆ ఇంకొకరితో నీకేం పని? నాల్గువందల మంది శ్రేష్టమైన వారు, ఎన్నికగాంచిన వారు, బాగా మేసిన వారు, దేశమంతటిలో మంచి హుందాగా వస్త్రాలను ధరించిన వారు, ఇక్కడ నిలబడి మనకి వున్నారు కదా. వారంతా ఒకే మాట, ఒకే గుండె, ఒకే స్వరంతో పలుకుచు అన్నారు, ”వెళ్ళుము, దేవుడు మీతో వస్తాడు“.
56
ఒకవేళ సంయుక్త రాష్ట్రాలు అదే కార్యాన్ని కలుసుకొనపోవుట నాకు ఆశ్చర్యం. జీవంగల దేవుని సంఘం అదే కార్యాన్ని కలుసుకొనపోవుట నాకు ఆశ్చర్యం. “సరే, చూడు, వారు సఫలీకృతమగుచున్నారు. వారు గొప్ప మహాసభలు జరుపుచున్నారు. వాళ్ళ దగ్గరికి వేలకి వేలు మంది జనులు పోగవుతున్నారు” కానీ ఇంకొకటి అనేది లేకపోయినట్లైతే ఏం లాభం, వ్యత్యాసమైనది లేకపోతే ఏం ప్రయోజనం అని నేను ఆశ్చ ర్యపోవుచున్నాను.
57
మనము కనుగొందాము, ఆరు వారాలలో ముప్పయివేల మంది మారు మనస్సు గలవారిని కలిగియున్నాము. మరియు ఆరు వారములు తరువాత ఒక్కరు లేరు. ఎక్కడో ఏదో తప్పిదము ఉంది. మరి అంతా సౌందర్యమును ధరించుకొనుచున్నది. ఈ ప్రపంచము టెలివిజన్ ద్వారా, రేడియో ద్వారా, సినిమాల ద్వారా, ఆ యొక్క హాలీవుడ్ సరదా జోకులు (టామీరాటు) ద్వారా ఈ దేశము చెడగొట్టబడినది. సరి, ప్రతిది గొప్ప సౌందర్యముగా ఉండాలని కోరుచున్నది. అది సత్యము కాదా? మీకు అది సత్యమని తెలుసు. మనము పూర్వకాల సంవత్సరములలో కలిగియున్నట్లుగా ఆ పాతకాలపు భక్తి ఇక ఎంతమాత్రము కలిగిలేము. అది ఎందుకంటే దానిని మనము వదిలివేసాము. మనము దానిని పొందుకుందాము, ఒక్క క్షణములో, మీరు చూడండి.
58
ఎందుకు, ఎంత చక్కటి దృశ్యమది... లేదా, ఒక రేపే దృశ్యం, అని ఖచ్చితంగా చెప్పి తీరాలి. మరి ఇచ్చట ఈ యెహోషాపాతు వచ్చి అంటున్నాడు, “అవును, వారందరిని నేను చూసాను. వారంతా ప్రతి ఒక్కరు పట్టాలు పుచ్చుకొన్నవారే” అదేదో ఒకటి కావొచ్చును. “వారంతా ప్రవక్తలుగా వుండొచ్చును, లేదా గొప్ప సేవకులే కావొచ్చును. గొప్ప కళాశాలనుండి వచ్చినవారే మరి వారందరు ఇది అయి వున్నారు. వారంతా ఏకమనస్కులై యున్నారు. అది నిజం. కానీ ఇంకొకరు లేరా?”
“మంచిది, ఒకేసారి నాలుగు వందల మంది ఆమోదించి చెబుతుంటే ఇంకా ఆ ఒక్కరితో ఏం అవసరం?”
అయితే అలా అడిగిన ఆ వ్యక్తి హృదయంలో ఎక్కడో దేవుడు వుండి యుండెను. వారంతా చెప్పినదాంట్లో ఏదో తేడా వుందని అతడు ఎరిగియుండెను. అవునండి ఏదో కుళ్ళినట్టు అతడెరిగెను. ఎందుకని? నేను దానిని వివరిస్తాను... వారు చెప్పినది లేఖనానికి సరిపోలేదు, అయితే ఇక్కడ నేను పొందుకొన్నది ఇదే. అక్కడున్న ఆహాబు ఒక వేషధారి అని, అతడు దేవునితో సరిగాలేడనే విషయాన్ని యెహోషాపాతు ఎరిగియున్నాడు. అతని గూర్చి దేవోక్తిని ఏలియా ప్రవచించాడు. మరి అలా వుంటే శపించిన వానిని దేవుడు ఎలా దీవించగలడు? ఆమేన్.
59
నేడు నేను చెప్పేది కూడా సరిగ్గా అదే మిత్రమా. నిజంగా దేవుని కోసం నిలబడిన జీవంగల దేవుని సంఘం కూడా సరిగ్గా అదే చెబుతుంది. నీళ్ళు నూనెను నీవు కలుపలేవు. మరిదానిని రక్షణ అని పిలువలేవు నువ్వు అది చెయ్యలేవు. సహోదరుడా, నిన్ను నీవు ప్రత్యేకపర్చుకోవాలి. ఏదో ఒక కార్యం జరగాలి. ఏదైనా ఆశ మిగిలి వున్నట్లైతే, మనము ఏదో ఒకటి చెయ్యాలి, అది కూడా తొందరగా చెయ్యాలి, ఎందుకంటే ఎత్తబాటు గడియ ఆసన్నమైనది.
60
సంగతులు పోగు అవుతున్నాయి, ప్రతీది మరియు సంఘం చాలా వెనుకబడి వుంది. వారు అన్నిరకాల వార్తా పత్రికలు, పుస్తకాలు, కథలు, ప్రతీది చదువుతారు. నేను ఈ రోజు వెళ్ళినప్పుడు...నేను ఒక సంఘమునకు వెళ్ళి ఇలా చెప్పగలను. “ఓ ఎందరికి తెలుసు...”వారికి ప్రతి పాట తెలుసు, ఈ గొప్పఉజ్జీవాల అనంతరం “ఇప్పుడు పలాని -పలాని పాట ఏ-ఏ పేజీలో వుంది?” వారికి బాగా తెలుసు. అది ఎవరో వారికి తెలియును, ప్రెసిడెంట్‌గా ఇప్పుడు ఎవరు వున్నారో, దీనిని ఎవరు నడుపుతున్నారో, ఎంతమంది సినిమా యాక్టర్లు వివాహాం చేసికొన్నారో, అది ఇది, వివిధ సంగతులను వారు బాగా ఎరిగివుంటారు. కానీ వాక్య విషయానికి వస్తే దానిగూర్చి వారికి ఏం తెలీదు. అది పరిస్థితి. మనం ఇచ్చుచున్నవారిగా.. ఐనా వారు తమ్మును తాము ఇంకా కైస్తవులుగానే చెప్పుకొంటారు.
61
జనులను మనం తప్పుపట్టలేం. బలిపీఠం నుండి వచ్చే దాని మీదనే వారి స్థితిగతులు ఆధారపడివుంటాయి. నిశ్చయంగా అంతే. బలిపీఠం నుండి వెలువడే వాటిపైనే. అన్ని రకాల దరువులను, దాన్ని దీన్ని, మరియు శాఖల్ని, మీరు ఎలా బోధించాలో, అలాంటి ప్రతీదానిని వారు వారికి నేర్పిస్తారు. నేను ఆశ్చర్యపడుతున్నాను దానికి వెల చెల్లిస్తారని. దానికి విరోధం ఏదిలేదు, నేను ఆశ్చర్యపడుతున్నాను దేవుడు దానిని కోరతాడని .
యేసు అన్నాడు “ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకపోతే, వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడు. నన్ను వెంబడించువాడు తన్నుతాను ఉపేక్షించుకోవాలి, తన సొంత లోకభోగాలు వదులుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలి”. సిలువ వేదనకి (భాధ, శిక్ష), “చావుకి సంకేతం ”. “కైస్తవుడైన వాడు తన సొంత ఆలోచనలను ఒలిచివెయ్యాలి తన క్రియలను ఒలిచివేసికోవాలి, ప్రతీదానిని ఒలచివేసికోవాలి, తన్నుతాను ఉపేక్షించుకోవాలి, ఆ సమర్పణ సిలువను ఎత్తుకొని అనుదినం నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించువాడు అట్టి విధంగా చేయాలి” యేసు చెప్పింది అదేనండి.
62
కానీ నేడు మనం అంటాం “ప్రతీ ఒక్కరికి చక్కని సమయం వుంది. ప్రతి ఒక్కరు తమ చేతులను తట్టి చప్పట్లు కొడతారు. ”హల్లెలూయ“ అని ప్రతీ ఒక్కరు దొర్లుతారు, ప్రతి ఒక్కరు దీన్ని చేస్తారు” ఓ, ఇంతటి గడబిడ ఎలా వచ్చింది! ఆమేన్. దేవుడు... మనకి నూతనగీతాలు వచ్చాయి, అయితే వాటిని మనం ఎంతో వేగంగా పాడతాం, గోడల్ని సహితం దూసుకుపోయేటంత వేగంగా, ఆవిధంగా పాడతాము. (పాటలు గజిబిజిగ గందరగోళంగా వుంటాయి).
“నా దేవా నీకు సమీపముగా వుంచుము” అని పాడే ఆ పాతకాలపు పాటలే సంఘంలో పాడితే చాలా బాగుంటుందని నేను భావించుచున్నాను.
లోక సంబంధమైన నాట్యాలు చేస్తూ వాయించే వాయిద్య బృందాలను పురమాయించుకొంటాం, గతరాత్రి అక్కడ వాయించి మరి ఈ రాత్రి జీవంగల దేవుని సంఘంలోకి వచ్చి వాయించటమా? అయ్యో ఇది దేవుని దృష్టిలో ఎంతో హేయమైన కార్యం. ఒకవేళ ఆ బాలుడు దేవుని సంఘంలో వాయించాలంటే మొదటిగా వాడు మారుమనస్సు పొందాలి, దాని ఫలము ఫలించాలి, దేవునితో వాడు సరిగ్గా వున్నాడని చూపబడుటకై మొదటిగా వాడు నిరూపించబడాలి.
లోక సంబంధమైన జాజ్ తరహా నృత్య సంగీతాన్ని వేదిక మీదికి వారు తెచ్చుచున్నారు. అలాగే హాలివుడ్, మరియు ఆకర్షించే ప్రసంగాల్ని తిన్నగా వేదిక మీదికి తెచ్చుచున్నారు.
63
అందమైన మీ పట్టణం లూయిస్‌విల్, కెంటకీ నందు నేను కొన్నివారాలు క్రితం కూర్చోలేదా? అప్పుడు నాహృదయం బ్రద్దలైంది, వారంతా అక్కడ కూర్చొని, దేవుని అద్భుతాలు చూడగోరారు, నీవు సువార్తను ప్రకటించిన వెంటనే, ఒక్క సెకనులో వారు నింపుతారు, వారి వీపులను త్రిప్పి, బిల్డి౦గులో నుండి వెళ్ళిపోతారు, ఖచ్చితంగా అలానే చేస్తారు. వారికి అది అక్కర్లేదు. వారి హృదయాలు కఠినమైపోయాయి. బయటికి నడిచిపోతారు, చాలా మంది అంతే, చివరికి పెంతెకోస్తులు సహితం అలానే చేస్తారు, ప్రొటెంస్టంట్ సంఘాలకి వెళ్ళేవారు సహితం, కానీ వారు మెరుగుల (సుతిమెత్తని) ప్రసంగాలు కోరుకొంటారు. వాళ్ళు టామీరాట్టు (సరదా జోకులు), తమ సంఘాలను గూర్చిన గొప్పల(ఢాంబికాల)తో నింపబడ్డారు, జీవం గల దేవుని ఆత్మను గూర్చిన గొప్ప విషయాలు వారికి తెలియదు. “పైకిభక్తి గల వారై వుండి దాని శక్తిని ఆశ్రయించరు” మనం జీవించే దినము ఎంత భయంకరమైందో చూడండి. ఇవన్ని ఎక్కడ కుప్ప అవుతున్నాయో
గమనించండి.
64
యెహోషాపాతు అన్నాడిలా “నాకు తెలుసు ఆహాబూ. నీ నాలుగువందల మంది ప్రసంగీకులు వున్నారు, సరే వారంతా చక్కని వారు, చక్కటి వస్త్రధారణను వారిలో ప్రతి ఒక్కరు వేసికొన్నారు, వారు చక్కగా దువ్వుకొన్నారు, వారంతా బాగున్నారు, వారి గురించి చెప్పాలంటే ఇంకా ఎక్కువే వుండొచ్చు. వారికి డి డి పట్టాలుండొచ్చు, వారికి అన్ని రకాల పట్టాలు వుండొచ్చును. లేఖనాలను ఆ చివరి నుండి ఈ చివరి వరకు బాగా ఎరిగి వుండొచ్చును, కానీ ఇంకెవరైనా? ఒక్కరు లేరా నీ దగ్గర? కనీసం ఇంకెవరైనా ఒక్కరు లేరా?”
అందుకు అతడన్నాడు,“అవును, మీరు అడిగినట్టే ఒకడు వున్నాడు, కానీ అతడంటే నాకు గిట్టదు (పడదు)” మీరున్నది అక్కడే. మీరున్నది అక్కడే. “నేను అతన్ని ద్వేషిస్తాను” గుర్తుచేసికో౦డి, ఆహాబు భక్తిగలవాడే (మతసంబంధి), వారంత మత సంబంధమైన బోధకులే, కానీ సత్యం కలిగిన ఈ వ్యక్తిని వారంతా ద్వేషిస్తారు. అన్నాడు, “నాకు అతనికి పడదు.” అన్నాడు, “అతడు ఎల్లప్పుడు నాకు విరోధంగానే రంకె వేస్తాడు (గర్జిస్తాడు)” దేవుని వాక్యము అతడిని ఆజ్ఞాపించినప్పుడు, దానిని చేయకుండా అతడు ఎలా వుండగలడు?
65
పాపము మరియు మొదలగు కార్యాలు కుప్పలు తెప్పలుగా పెరుగుతూ వుంటే నువ్వొక దేవుని సేవకునిగా ఒక దేవుని సేవకురాలిగా వుండి వాటిని ఖండించక మౌనంగా నీవెలా వుండగలవు, చూడండి, రోజుకి లక్షలాది మంది మానవ ఆత్మలు పాతాళానికి పోతుంటే నువ్వు మౌనంగా ఎలా వుండగల్గు తున్నావు? నువ్వు అలా ఉండకూడదు. మొన్న ఒకరోజు ఒకరు నాతో అన్నారు, “వెళ్ళే వాళ్ళని నువ్వు ఆపగలవని అనుకొంటున్నావా?”
నేను అన్నాను,“లేదండీ, నేను ఆపలేను, ఎందుకనగా దేవుడు చెప్పాడు. అయితే ఒకరోజున తీర్పుపట్టి యొద్ద వారొక పెద్ద తెరను లాగుతారు, అక్కడ కెమెరా తళ్ళుక్కుమంటుంది, ఆ టేపు రికార్డరు వినిపించబడుతుంది. నేను నిలబడి దానిని వినబోవుచున్నాను. దానికి వ్యతిరేకంగా నా స్వరాన్ని వినగోరుచున్నాను. దానికి వ్యతిరేకంగా నా వంతు వచ్చినప్పుడు దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు” అవునండి. మనము ఈ జీవితంను, ఈ తరంను, తిరిగి శాసనంగా తీర్పునొద్ద వుండుట చూచెదము. నిశ్చయంగా. భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం. అదిచ్చటే వుంది.
మనం చూసాం; అతడన్నాడు, “అక్కడ కనీసం ఒక్కరైనా లేరా?”.
అతడు జవాబిచ్చాడు, “ఉన్నాడు, కానీ అతడంటే నాకిష్టంలేదు, ఎందుకంటే అతడెల్లప్పుడు నాకు విరోధంగా కీడు ప్రవచిస్తాడు”.
66
కళ్ళముందు అవి జరుగుతుంటే వాటిని ఖండించకుండా అతడు ఎలా మౌనంగా వుండగలడు? చూడండి, గతంలో వలె ఆహాబు జీవిస్తున్నాడు, అలాగునే కార్యాలు చేయుచున్నాడు, ప్రజలను వారున్నట్టుగానే తీసుకొచ్చుచున్నాడు.
అన్నివైపుల నుండి పాపాన్ని ఖండించకుండా, దానికి విరోధంగా కేకలు పెట్టకుండా ఒక దైవజనుడు, దైవజనురాలు భక్తిగల స్త్రీ ఎలా వుండగలరు? ఈ నులివెచ్చని ప్రసంగీకులు, ఆకర్షించేవారు, చదవరులు, ఆ విధంగా వున్న వారు లక్షలాది మంది ప్రజలను తమ మోసము ద్వారా నరకమునకు పంపుచున్నారు. అనేకమంది...చివరికి హోలీనెస్ ప్రజలలో కూడా అటువంటి వారున్నారు. మెథడిస్టులు, బాప్టిస్టులు, అలాంటి వారికోసం అధికంగా నేను మాట్లాడుట లేదు, వారు కూడా దాన్నే కలిగివున్నారు. కానీ అది నీ సొంత శ్రేణిలోనే వుండి వున్నది.
67
మై!
క్రైస్తవులు కూడా అందరిలాగే వేదిక (బలిపీఠం)నొద్దకు వచ్చుచున్నారు, దేశమంతా వారు మిగతా వారివలె జీవిస్తున్నారు, దానిని వారు “మతము” అని పిలుచుచున్నారు. అది ఒక మతముగా వుంటుందే తప్ప దానికిని ప్రభువు యొక్క రక్షణకు ఏమాత్రం సంబంధం లేదండి. అది నిజం. వారు గుంపులను సమకూర్చుకుంటారు, వారిని ఉద్రేకపరులను చేస్తారు. వారు పతాకస్థాయికి వెళ్ళిన తర్వాత మీకు తెలుసా వారిలో ఒక్కడు కూడా మిగలడు (అందరు జారుకొంటారు). సంఘం ఖాళీ అగును. సహోదరుడా, ఒక వ్యక్తి దేవున్ని ప్రేమిస్తే అతడు సంఘములో తన సీటును నింపుతాడు, ప్రతిసారి. అతడు హాజరు కాకుండా ఉండలేడు. అది నిజం.
68
ఇప్పుడు గమనించండి, కొద్ది నిమిషాలపాటు, ముగించటానికి త్వరపడి ప్రయత్నిస్తాను. విషయాన్ని నేరుగా చెబుతాను, ఎందుకంటే నాకివ్వబడిన సమయం అయిపోయింది.
గమనించండి, అంతట అతడు అడిగాడు “అక్కడ కనీసం ఒక్కరైనా లేరా?”
అందుకతడు “ఉన్నాడు, కానీ నాకు అతడు నచ్చడు, అతడు ఎల్లప్పుడు నాకు విరోధంగా ప్రవచిస్తాడు. నా గురించి విరోధంగా చెబుతుంటాడు”
“సరే, వెళ్ళి అతన్ని తీసికొనిరా” అన్నాడు.
అతడు చెప్పాడు, “అతని పేరు మీకా”.
వీరెవ్వరు సరికాదనే సంగతిని పసిగట్టగలిగిన విశ్వాసం ఇతని (యెహోషాపాతు) కి వున్నది.
69
దేవుని ఆత్మచేత తాకబడిన ఏ వ్యక్తికైనా సరే, ఎంత అత్యల్పుడైనా సరే క్రైస్తవ్యమని నేడు పిలువబడేది సరైంది కాదని, వీటన్నిటిని గూర్చి ఎరిగి వుండును. “లోకమును, అందులో వున్నవాటిని నీవు ప్రేమింపలేవు. ఒకవేళ ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో వుండదు” అని బైబిల్ చెప్పుచున్నది. ఇప్పుడు చూడు, అతడన్నాడు,
“వెళ్ళి అతన్ని తీసికొని రమ్ము” వారు అక్కడికి వెళ్ళారు.
మరి అంతట అతడు ఒక చిన్న వర్తమానికున్ని అక్కడికి పంపాడు, సంఘములోని పెద్దను, బహుశా ఎవరో ఒకరిని కావొచ్చును, మరియు అన్నాడు, “ఇటు చూడు మీకా, ఆహాబు మరియు యెహోషాపాతు యెదుటికి నిన్ను రప్పింపబోవుచున్నాము. ఇప్పుడు వారిద్దరు కలిసి అక్కడ ఆసీనులు కాబోవుచున్నారు, వారిప్పుడు గొప్పవారు. వారి బోధకులు, వారి విధ్వాంసులు (పండితులు)వుండెదరు. వారు పట్టాలు పుచ్చుకొన్నవారు, తదితర వాటిని కలిగివున్నారు. మా సెమినరీలోని ప్రతి ఒక్కరూ, ఇక్కడ మా సంఘంలో వున్నప్రతి ఒక్కరూ ఇది ఖచ్చితంగా ప్రభువు చిత్తమై వుండెనని సమ్మతించారు. కావున నీవిప్పుడు వచ్చి సరిగ్గా అలాగునే చెప్పాలి. అలా చెబితే నీకు మంచి బట్టలు ధరింప చేస్తారు, ఖరీదైన క్యాడలిక్ కార్లలో తిరగొచ్చును. చెప్పినట్టు చేస్తే మీ మధ్యలో నిన్నుగొప్పవాని (ప్రసిద్దుని)గా చేస్తామని నీకు చెబుతున్నాను. అవునయ్యా. నువ్వు బాగా వృద్దిపొందుతావు, బాగుపడతావు.
అందుకు మీకా అన్నాడు, “యెహోవా నాకు ఏది సెలవిచ్చునో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుతాను” ఆమేన్. అవును, ఓ, అక్కడ నా హృదయమెరిగిన ఒక వ్యక్తి వున్నాడు. దీన్ని చేసినందుకు అతడు కేవలం రొట్టె, నీరునే భుజించి రావల్సి వుండొచ్చును. అతని చెంపమీద కొట్టించుకోవల్సి రావొచ్చును, ఇంకేదో జరుగవచ్చును, ఏం జరిగిన సరే, అతడు సత్యమునే పలికాడు, దానికోసమే నిలబడ్డాడు. అతడు చెప్పింది సత్యమని దేవుడు బుజువు చేసాడు. అతడు ప్రఖ్యాతి గాంచిన సేవకుడేం కాదు కానీ దేవున్ని ఎరిగినవాడు.
70
చిన్న మీకా అక్కడికి రప్పించబడెను, వాడు అడిగాడు, “మంచిది, దీని గూర్చి నీవు ఏమి అంటావు మీకా?”
అతడన్నాడు, “ముందుకు పదండి, ముందుకు పదండి.” అన్నాడు,“సమాధానముగా ముందుకి సాగిపొండి. ముందుకి వెళ్ళండి, వర్ధిల్లండి, మీరు దానినే చేయాలని నేను కోరుచున్నాను. అయితే కాపరిలేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారు కొండల మీద చెదిరిపోయి వుండుటను నేను చూచాను, అది నిజం” అని అతడు అన్నాడు.
అతడు దానిని అలా అన్నప్పుడు... ఆహాబు కలియ తిరిగి యెహోషాపాతుతో ఇలా అన్నాడు, “నీకేం చెప్పాను నేను? ఆ పరిశుద్ద బండరాయి...” లేదా ఏమిటి, మన్నించండి, అదేమైనప్పటికి, ఆ బాలుడు అన్నాడు, “ఆ... నీతో ఏమి చెప్పాను? అతడు నా గురించి కీడు పలుకుతాడని చెప్పలేదా? అతడేం అన్నాడు? ”మా సంఘాన్ని పనికట్టుకొని దూషించుటమే అతని పని, మా సేవకులను ఖండించటమే, మా విశ్వాస విధానాలను తప్పుపట్టటమే అతని పని“ నీకేమి చెప్పాను నేను? అతడు అలానే అంటాడని నీతో అన్లేదా నేను. అతని గూర్చి నాకు తెలుసండి. అతని కంటే ముందు అతని తండ్రిని నేనెరుగుదును” ఆమేన్ (రెండు చేతులు కలిపి సహోదరుడు బ్రాన్హాం చప్పట్టు కొట్టుచున్నాడు-సంపా) “అతనికంటే ముందు అతని తండ్రి నాకు తెలుసు” అవును అయ్యా, నిజమైన ఒక దైవజనుడు, అన్నాడు, “దానినే అతడు చెబుతాడని నాకు తెలుసు”.
71
మరి అంతట అతడు ఇలా అన్నాడు “అవును, కాపరిలేని గొర్రెలవలె ఇశ్రాయేలీయులు కొండల మీద చెదిరిపోయారు” మరి అంతట అతడు అన్నాడు,“నేను...”
మరి అంతట వారిలో ఒకడు పెద్దకొమ్ములు పట్టుకొని సులభంగా నెట్టబోవుచున్నాడు. ఒక ప్రసంగీకుడు అక్కడకి నడుచుకొంటూ వచ్చి ఆ చిన్న మీకాను చుట్టూరా తిప్పి దఢాలున గట్టిగా దెబ్బ వేసాడు, అన్నాడు “నాలో నుండి దేవుని ఆత్మ ఎటువైపుకి పోయిందో నీకు తెలిస్తే చెప్పు”.
అన్నాడు, అతడన్నాడు, “నీవిక్కడ చెరసాలలో కూర్చొని వేచివుండుము, అది ఎటుబోయిందో నీకు తెలుస్తుంది” అది నిజం.
72
ఈ దేశము వెనక్కి జారిపోయినందున రష్యా దీని మీదికి వచ్చి, దేశములన్నిటిని లోపర్చుకొని, అలాంటి వాటిని చేసి, దీనిని స్వాధీనపర్చుకొనుటకు వేచియుండుము. ఏది తప్పో ఒప్పో నీవే చూస్తావు, తొందరపడకు. అది నిజం నీ నులివెచ్చని భక్తికి తగిన వెలను నీవు చెల్లిస్తావో లేదో నువ్వే చూస్తావుగా.
73
నవ్వటానికి, నాటకాలు (వేషాలు) వెయ్యటానికి కాక కన్నీరు విడవడానికి ఈదేశం వచ్చును గాక. ఈ దేశము తన మోకాళ్ళమీద పడి పశ్చాత్తాపపడును గాక. మనకి అవసరమైనది అదేనండి. పెక్కుమంది ప్రజలు సంఘంలోకి వచ్చే ఉజ్జీవం కాదండి కావల్సింది. ప్రతి అక్రమానికి (నిషిద్దమైన దానికి, చీకటి వ్యాపారానికి) ముగింపు పలకాలి, సిగరెట్టు త్రాగటాన్ని పూర్తిగా ఆపివేయాలి, ఆ కర్మాగారాలన్నిటిని ధ్వంసం చేయాలి. స్త్రీ, పురుషులు మోకాళ్ళపై పడి రాత్రింబవళ్ళు మొర్రపెట్టే ఒక నిజమైన, పాతకాలపు, పరిశుద్దాత్మ, కూటాల్ని ఆరంభించాలి. అటువంటి ఒక కార్యక్రమమే ఈ దేశానికి ఇదివరకు ఎన్నడూ లేనంత సురక్షితం (ఆశ్రయం, శరణం). అది నిజం.
74
బ్రాన్హాం టబర్నికల్ తన మూర్ఖత్వాన్ని (అవివేకాన్ని, అజ్ఞానాన్ని) విడిచిపెట్టును గాక. అది ఇక్కడ ఈ బలిపీఠము నొద్దకి తిరిగి వచ్చి దేవునితో సరిచేసికొనును గాక. పొరుగువారితో కలిసి వుండటం, మరి ఆ విధంగాను, మరియు దేవునితో సరిచేయబడిన వారుగా వుందురు గాక. అప్పుడు మీమధ్య ఏ కలహాలు (గొడవలు, మనస్పర్థలు) వుండనే వుండవు. లోకాన్ని ఆకర్షించే చోటు ఇదే అవుతుంది. అది నిజం. ఇప్పుడు, అది వాస్తవం.
75
అంతట అతడన్నాడు, “నాలో నుండి దేవుని ఆత్మ ఎటుబోయింది?”
మరియు మీకా అన్నాడు, “నేను దేవున్ని, ఆయన సైన్యాన్ని చూసాను, మహిమలో వుండిన ఆయన సభను, చూసాను.”
మీకు తెలుసా, అప్పుడప్పుడు కూడుకోటానికి ఆయన ఒక ఆలోచన సభను కలిగివున్నాడు.
మరి అతడన్నాడు, “యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్స్వమున ఎడమ పార్స్వమున నిలిచియుండుట నేను చూచితిని.” మరియు అన్నాడు, “వారు చర్చించుకొంటున్నారు, ”క్రిందికి వెళ్ళి ఏలియా ప్రవచనాన్ని నెరవేర్చుటకు ఆ ఆహాబును మోసం చేసి ఇచ్చటికి అతన్ని తెచ్చుటకు ఎవరు పోవుదురు? దేవుడు అలా సెలవిచ్చి యున్నాడు, ఏమి జరుగబోవుచున్నది, గనుక మనం చూద్దాం ఎవరు పోవుదురో.“
76
“మరి ఒక అబద్దపుటాత్మ క్రింది నుండి పైకి వచ్చెను,” సహజంగా, నరకంలో నుండి వచ్చెను, దేవుని ముందుకి వచ్చి ఇలా చెప్పెను, “నేను దిగి వెళ్తాను, ఆ బోధకులను పట్టుకొంటాను (చేజిక్కించుకొంటాను) మరియు అబద్దమును ప్రవచించునట్టు చేస్తాను.” ఓ, అది వారిని, అది వారిని పేల్చివేసిందా, అది వారిని హాస్యానికి గురి చేసిందా, “వారన్నారు నేను క్రిందికి దిగి వెళ్ళి ఆ బోధకులందరిచేత, వారిలో ప్రతి ఒక్కరి చేత అబద్దం ప్రవచించునట్లు చేస్తాను” మరి అతడు దిగివచ్చి, ఆ బోధకులను చేజిక్కించుకొన్నాడు, వారు అబద్దాన్ని ప్రవచించుటకు మొదలుపెట్టిరి.
77
మరి సహోదరుడా, అదే దేవుడే అదే సింహాసనం మీద ఉండి నేడు పాలిస్తున్నాడు. అలాగే అబద్దమాడే అదే ఆత్మ నేడును అదే కార్యాన్ని చేయుచుండెను.
మొదటి ప్రపంచయుద్దం అనంతరం వారిలా అంటున్నారు, “శాంతి, శాంతి, శాంతి”.
అది ఎక్కడి నుండి వచ్చిందో నేను మీకు చూపిస్తాను. మొదటి ప్రపంచ యుద్దకాలమున ఫ్రాన్స్ దేశం తమ గే నైన్టీస్(రాక్ సంగీత బృందం) మోజులో పడి దేవునినుండి వైదొలిగి పోయి, ఆరంభించింది...
నేనిప్పుడు కొంత నైతికవిలువ గూర్చి ప్రస్తావిస్తాను, మీరంతా కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొండి.
చూడండి, పూర్వం, ఆరంభమందు, ఫ్రాన్స్లో చెడు స్వభావం మరియు రోత మొదలయ్యెను. (ప్రపంచములో కల్మషం వున్నది అంటే అది ప్రాన్స్ దేశంలోని పారిస్‌నందే. నేను నా విశ్వవ్యాప్త పర్యటనల్లో చూసిన ప్రదేశాల్లో అతి చెడ్డ స్థలం అదేనండి. మరియు ఇంగ్లాండ్‌లోని లండన్ నగరం దీనికి మినహాయింపేమి కాదు. ఇప్పుడు ఆ వరుసలోనికి సంయుక్త రాష్ట్రాలు వస్తున్నది. అది నిజం. మీరున్నది అచ్చటే.
78
స్త్రీ తత్వము యొక్క నైతిక విలువల్ని నీవు చెడగొట్టిన ప్రతీసారి, నీవు దేశము యొక్క వెన్నెముకను విరుగ గొట్టుచున్నావన్న మాట.
నీవు వారి స్వదేశాలకి వెళ్ళి అక్కడ నిన్ను నీవు ఒక మిషనెరీగా చెప్పుకొని చూడు, వారు నిన్ను ఇష్టపడరు... “మాకు నువ్వు ఏం చెప్పటానికి వచ్చావు, మా భార్యలను గూర్చి మా ఆడపిల్లలను గూర్చి ద్వందార్ధ (పోకిరి, నీచమైన, మలినమైన) పాటలు ఏ విధంగా పాడాలో చెప్పటానికి వచ్చావా? మా భార్యలకి విడాకులు ఎలా ఇవ్వాలో నేర్పడానికి వచ్చావా? విస్కీలు త్రాగి మార్పులేని బ్రతుకులు బ్రతక నేర్పడానికి వచ్చావా?” అని అందురు. అది మీ స్థానం.
మనది విశ్వాస సంబంధమైన దేశమని, క్రైస్తవ దేశమని మనం పిలుచుకొంటుంన్నాం. మంచిది, అయితే జీవించుటకు నైతిక విలువలను గూర్చి ఆఫ్రికాలోని అన్యులు మనకు బోధించెదరు. చెడిపోయిన చోటు ఏదైన, అమెరికాలో లేదా లోకమంతటిలో, ఏదైనా వుందంటే అది ఈ దేశమేనండి, అది ఎలా సంభవించింది. నేను నిశ్చయంగా అమెరికా వాడినే. కానీ సహోదరుడా, నేనేం చెయ్యలేను, ఆహాబు లేదా యెహోషాపాతు యెదుట నుండి... సత్యమని దేవుడు దేన్ని అయితే చెప్పాడో దానినే నేను చెప్పి తీరాలి. నేడు సంఘం కూడా అదే చేయాలి మరి. దేశం కావాలా దేవుడు కావాలా అనే ప్రస్తావన వస్తే, దేవుడే కావాలి అని చెబుతాను. అవునండి.
79
గమనించండి, తమ కుళ్ళంతా (చెడంతా) ఫ్రాన్స్ లోనే వారు ఆరంభించిరి, వారి బ్రతుకుల్లో మార్పు అనేదే లేకుండెను అప్పుడు దేవుడు వారిని కొద్దిగా కొట్టుటకు జర్మనీ వారిని పంపెను. అప్పుడు వారిని రక్షించటానికి మనం అక్కడికి వెళ్ళాము. మనం దాన్ని చేసిన వెంటనే, యుద్దంలో గెలిచాము, జర్మనీ వారిని వెనక్కి పంపాము, ఫ్రాన్స్ తో శాంతి ఒప్పందం చేసికొన్నాము. వారు దేవుని తట్టు తిరిగారా? లేదు. స్రీ, మద్యం, వ్యభిచారం (విశృంఖలత), పాపము (కనుబొమ్మలకి) అపరిశుభ్రత, అపవిత్రత.
అప్పుడు వారు ఏమి చేసారు? ఏం జరిగింది? వారు ఆరంభించింది ఇక్కడి నుంచే అపవాది తన కేంద్ర ప్రధాన కార్యలయాన్ని ఏర్పాటు చేసాడు. అతడు అక్కడే ప్రారంభించాడు. ప్రాన్స్ దేశపు ప్యారిస్ నుండే నైతిక పతనాన్ని అతడు ప్రపంచ మంతటికి విస్తరింపచేసాడు
80
అప్పుడు, మీరు గమనిస్తే అతడు ఇక్కడైతే పరిచర్య గుండా రాలేడు, కావున అతడు హలీవుడ్‌లోకి తెచ్చాడు. అతడు తన... అతడు తన కేంద్ర కార్యాలయాన్ని హాలివుడ్‌లో నిర్మించాడు కొన్నేళ్ళ క్రిందటే పదిహేను ఇరవై ఏళ్ళ క్రితమే అపవాది గొప్పసైన్యముతో ఇక్కడికి అడుగుబెట్టాడు, వెళ్ళి కాలిఫోర్నియా హాలివుడ్ని తాకాడు. తన దయ్యపు శక్తులచేత సంయుక్త రాష్ట్రాల్ని ఆక్రమించాడు దానిని స్వాధీనపర్చుకొన్నాడు నిజం. మన ఫ్యాషన్లశైలి (అధునాతన పోకడలు, హంగు ఆర్బాటాలు) అన్నియు ప్యారిస్ నుండే దిగుమతి అయినవి. వారు దాన్ని హాలివుడ్‌లోకి తెర మీదకి తెచ్చారు ఈ చిన్నబాలికలు, చిన్నబాలురు, కొందరు ఇక్కడికి వచ్చి, తెరమీద ప్రసారమయ్యే వాటిని వారు తిలకిస్తారు.
చక్కని బిడ్డలు, మంచి చంటివారు, వారికి వ్యతిరేకంగా ఏమి చెప్పుట లేదు. దేవుడు వారి చిన్న హృదయాల్ని దీవించును గాక. నా హృదయం వారికోసం స్రవించుచున్నది (పరితపించుచున్నది).
81
మరి ఈ పట్టణములోనే మొన్న ఒకరోజు నేను మాట్లాడుచున్నాను నా... ఒక...బాలునితో, అతడు నాతో అన్నాడు “డాడీ, పరిశుద్దాత్మ నొందిన కొందరు బాలురు ఈ పట్టణంలో ఉన్నట్లయితే మరి ఆవిధంగా కొలరాడో రాష్టం డెన్వర్‌కి, అటువంటి చోట్లకి నేనెందుకు వెళ్ళుచున్నానో మీరు ఆశ్చర్యపోవుదురు? దేవునికి ఎవరైతే మొర్రపెడతారో అట్టి ప్రజల సమూహంలో నా పిల్లల్ని వుంచాలని కోరుదును, మనకి అవసరమైంది అదే సహోదరుడా!
82
ఈ దేశము, ఈ జాతి, ఈ పట్టణము, ఈ ప్రాంతము నైతికంగా ఎంతో (చెడిపోయింది), అదెంతో విచారకరం (శోచనీయం). ఏదైతే సత్యమని నేను సంపూర్ణంగా ఎరిగియున్నానో దానిని నేను వ్యక్తపర్చినట్లైతే, కనీసం మిశ్రమ ప్రేక్షకుల మద్యలో కూడా అది అగుపర్చబడదు. లేదా ఇక్కడ ఈ సొంత పట్టణములో కూడా కేవలం ఇక్కడే కాదు, కూడా, ప్రతిచోట, అది సామాన్యముగా వచ్చుట ఆరంభమైనది అందుకే జనులు ......స్నేహితులారా చూడండి. దానిలో ఎంతో కుయ్యుక్తి వుంది. ఎంతో సుళువుగా అది లోనికి వచ్చును, సున్నితంగా (మృదువుగా, మెత్తగా) నిన్ను రుద్దును. అపవాది ఫ్యాషన్లలో వుంటాడు. వాటిలో నుండి వాడు బయటికి వెళ్ళి యుండక పోవచ్చును, ఆ వ్యాపకం వాడు బయటికి వెళ్ళలేడు. వాడింకను ఆ వ్యాపకంలోనే నిమగ్నమై వున్నాడు.
83
చూడండి, నేడు ఇంతక మునుపు నేను ఒక చిన్నదాని గురించి, గులాభి పుష్పం ధరించిన ఒక చిన్నదాని గురించి చెప్పినట్టుగా. ఉదాహరణకు, గులాబి చక్కనిదే చూపుకి ఆకర్షణీయంగానే వుండును, అది నిజం, అదొక సంఘమువలే వున్నది, అది ఆకర్షణీయముగ కనబడుతుంది. ఆ చక్కని చిన్నదాని వలే. సంఘము కూడా చక్కగా వుంటుంది. అది నిజం, కానీ ఆమె... ఆమె చక్కనిదే (దివ్యమైనదే, లక్షణమైనదే), అందమైనదే, అయితే ఆ చక్కదనం కేవలం ఆమె భర్తకి మాత్రమే సొంతం, అప్పుడే ఆమె సరైనది అగును. నైతికత అనే ఖడ్గం (పువ్వుకి ముళ్లు వున్నట్టు) ఆమె చుట్టు ఆమెకి కాపుదలగ వుండకపోతే, ఆమె సమాజానికి మానవాళికి కళంకితురాలగును (అపకీర్తి తెచ్చినదగును) అంతేకాక హీనమైదిగా, చెడ్డదిగా, కుళ్ళిపోయిందిగా అగును, చివరికి కుక్కలు కూడా ఆమె వంక చూడవు. అది నిజమండి.
జీవం గల దేవుని సంఘము యొక్క విషయంలో కూడా మరి అంతే. వారిక్కడ లేచి, దానిని అలంకరించ (ప్రయత్నిస్తూ, తమ్మును తాము స్థాపించకొనజూతురు, మరియు అలా చేయ... వారు ఇచ్చట తమ స్త్రీలను వస్త్రహీనులుగా (దిగంబరులుగా) మలుచుదురు... ఈ దయ్యములు మీ ఇళ్ళను లోబర్చుకొన్నాయని (ఆక్రమించాయని) జనులు గుర్తెరుగుట లేదు.
84
మొన్న ఒకరోజు మా ఇంటి ప్రక్కన ఒక యవ్వన స్తీ వున్నది, ఆమె మంచిదని అనుకొనుచున్నాను... ఆమెకు పెళ్ళైంది, ఒక బిడ్డకూడా వున్నాడు. ఆ చిన్న యవ్వన స్త్రీ అక్కడ బయటికి వచ్చింది. ఒక...పురుషుడు కొంత పని నిమిత్తం రోడ్డు మీద వస్తున్నాడు, మరి ఈ స్త్రీ కురచ వస్త్రాలు వేసికొని బయటికి వచ్చింది. అది భయంకరము.
మాతృదినోత్సవము గూర్చి నేడు ఎంతో గొప్పగా చెబుతాం. కానీ నా సహోదరుడా నన్ను కొద్దిగా చెప్పనిమ్ము. తల్లీ, నీకివ్వబడిన తల్లి స్థానంలోకి తిరిగి రా!
మా ప్రక్కింటి వారి చిన్నబిడ్డ బాలుడు సహితం సందర్షిస్తున్నాడు, లోపలికి వచ్చి దానిని గూర్చి మాకు చెప్పాడు, “అక్కడ చూడండి!”
నేనన్నాను, “సరే తప్పేముంది”
స్త్రీ మంచిదేనండి. ఆమె చెడిపోయిందని నేను అనట్లేదు. కానీ అసలు విషయమేమిటంటే, ఆమెలో చెడ్డ స్వభావం వున్నది, అపవిత్రాత్మ ఆమెలో వుండి, అటువంటి వాటిని ఆమెతో చేయిస్తున్నవి, ఆ విషయం ఆమెకి తెలియట్లేదు.
85
అటువంటి కురచ వస్త్రాలు ధరించి, పురుషుల ముందు అలా అంగ ప్రదర్శన చేసే ఖర్మ లోకంలో ఏ తల్లికి అవసరం వుంటుంది చెప్పండి. ఏ స్త్రీకైనా సరే అది అవసరం లేదు. సహోదరి నువ్వు చాలా మంచిదానవు. అమ్మా, నువ్వు చాలా మంచిదానవు. నిన్ను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కానీ నువ్వు మంచిదానివే, అక్కడ ఆ నైతిక విలువలను కాపాడటానికి నువ్వు పరిశుద్దాత్మను పొందితే, నువ్వు చాలా వికారంగా వుంటావు, తద్వారా ఎవరు నీవైపు కన్నెత్తి చూడరు, పరలోకానికి వెళ్తావు. అది నిజం, అది వాస్తవం. ఆనైతిక విలువల్ని నువ్వు చేస్తున్నదానిని గమనించు.
86
ఇప్పుడు, అది ఏమిటి, అపవాది లోనికి ప్రవేశించాడు వీటిని ప్రజలకు బోధించాడు. అతడు బోధకులలోనికి కూడా ప్రవేశించాడు, అతడు హాలివుడ్‌ను మాదిరిగా చూపిస్తున్నాడు. బాలికలు, యవ్వన స్రీలు, వారు హాలివుడ్‌ని మాదిరిగా తీసికొంటున్నారు. ఈ రోజు దేశంలోవారు కలిగియున్న ముఖ్యమైన సంగతి ఏదనగా నైతికత లేని సంభాషణ, నువ్వు వినేది చెడ్డ ప్రవర్తన గూర్చియే, రేడియోలో వచ్చేదంతా అటువంటిదే.
వృద్ధాప్యానికి వచ్చిన శ్రీమతి కే స్టార్ లాంటివారు, ఆమె గూర్చి వ్యతిరేకంగా నేనేం అనట్లేదు, కానీ ఆమెను చూడండి, వయస్సు యాభై ఏళ్ళు, ఆమె వస్త్రధారణ చూడండి, భోజన సంచిలో కుక్కినట్టువుంది. దీన్ని నేను ఒక హాస్యం కోసం చెప్పుట లేదు, కారణం నేను ఇటువంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుచున్నాను. ఒక స్త్రీగా ఆమె అలా నటిస్తు, నిలబడి, మిగతా యవ్వన ఆమెరికా స్త్రీలకి మాదిరిగా వుండల్సింది, కానీ ఆమె అలా లేదు, అదెంతో సిగ్గుచేటు (అపకీర్తి అవమానం) ఈ దేశానికి. (సహోదరుడు బ్రాన్హాం ఐదుసార్లు బలిపీఠమును తట్టుచున్నాడు -సంపా) అది అవమానం.
దేశములో పేరుగాంచిన పురుషుల్లో ఆర్థర్ గాడ్‌ఫ్రే లాంటివారు, ఇక్కడ చక్కర్లు కొడుతూ, అటువంటి కార్యాలను చేస్తూ వుండటం ఎంతో సిగ్గుచేటు అది.
87
హల్లెలూయ! దాన్ని చెప్పండి, ఎందుకంటే పరిశుద్దాత్మ ఇచ్చట వున్నాడని నాకు అనుభూతి కలుగుచున్నది. దాడి కొనసాగుతూనే వుంది, ప్రతి ఇంటిని, ప్రతి చోటును, ప్రతీ సంఘాన్ని, ప్రతీ మనిషిని అది ఊడ్చివేయుచున్నది.
88
పిల్లలారా, యేసుక్రీస్తు నామంలో ఉజ్జీవము యొక్క నైతికవిలువలతో మరియు యేసుక్రీస్తుతో కలిసి లేచి ఇలా చెప్పండి, “ప్రభువా, శిక్షణలో వున్న కొందరి మార్గాన్ని నేను ఎంచుకొనుచున్నాను” అవును అయ్యా, “నేనొక నిజమైన తల్లిగా వుంటాను” నేనొక నిజమైన తండ్రిగా వుంటాను.“
లోకమంతటిని, చుట్టూ వున్నదంతటిని నా ఆత్మ త్యజించినది,
అంతట ఆయనే నా పూర్తి నిరీక్షణ మరియు క్షేమము (కాపుదల).
బలమైన బండయగు క్రీస్తు మీద నేను నిలబడితిని;
మిగతా నేలంతా మునిగిపోయే ఇసుక లాంటిదే,
మిగతానేలంతా.................
89
వీటన్నిటికి మూలకారణం ఏమిటి? జనులకి అబద్ధాలను ప్రవచించి చెప్పుటకు బోధకులకి ఏమైంది?
దీనినెందుకు జరిగించారు, ఏళ్ళక్రితం, మేతడిస్ట్ వారగు మీరు... సువార్తను బోధించడానికి ఆ వృద్ద జాన్‌స్మెత్ బలిపీఠం మీద నిలబడినప్పుడు, నాల్గు గంటలపాటు చిన్న వర్తమానమును బోధించాడు మరి అతడు చెప్పాడు, “దీనిలోని సమస్య ఏమిటంటే, నా హృదయం బద్దలగుచున్నది,” ఇంకా అన్నాడు, “మెథడిస్టు కుమార్తెలు సహితం తమ వేళ్ళకి ఉంగరములు ధరించుచున్నారు.”
మరి నేడు వారు కురచదుస్తులు అలాగే నీచమైన అపరిశుభ్రమైన వస్త్రములు ధరించారు. ఏదైన ఒకటి జరగకపోతే ఇంకో ఐదేళ్ళలో వారు ఖచ్చితంగా (పూర్తిగా) దిగంబరులు (నగ్నము)గా తయారవుతారు. (మూడుసార్లు సహోదరుడు బ్రాన్హాం బలిపీఠమును తట్టుచున్నాడు - సంపా) మెథడిస్టు బోధకులారా, క్యాంప్‌బెల్ వారలారా, బాప్టిస్తు వారలారా ఏమైంది మీకు? అవును అయ్యా. అది దయ్యమే, తన శక్తి యుక్తులన్నిటిని విసిరాడు, వాడు తన బలమంతటిని ఇక్కడ అధికపరిచాడు.
సిగరెట్లు పీల్చే స్త్రీ లారా, దానిని మీరు గ్రహించారా, అక్కడ బయట ఏమాత్రం మార్పులేకుండా జీవిస్తున్నారు, మరియు మద్యం సేవిస్తు అలానే కొనసాగుతున్నారు. మీ పద్దతుల్ని మీరు విషతుల్యం చేస్తున్నారని మీరు గుర్తించారా, ఇలాగే కొనసాగితే మీ రాబోయే తరాలు నాశనం అవ్వటం ఖాయం, సిగరెట్టు పీల్చటం వల్ల ఎనభై అయిదు శాతం కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయి, అయినా మీరు కావాలనే వాటిలో కొనసాగుతున్నారు. వీటిని సంఘాలు కూడా ఆమోదిస్తున్నాయి. సేవకులు అలా ప్రవర్తించుటకు కారణం ఏమిటి?
90
ఈ మధ్యనే ఇక్కడున్న గొప్ప బాప్టిస్టు సంఘంలో... నేను బాప్టిస్టు వారిని తప్పుబడుతున్నాను. దాన్ని చేసే హక్కు నాకుంది. నేను
దేనిలోనుండైతే బయటికి వచ్చానో దానినే వారు వ్రేలాడబడుతున్నారు. ప్రసంగ కూటానికి సండేస్కూల్ కూటానికి మధ్య విశ్రాంతి సమయంలో పాస్టర్‌తో పాటు మిగతా వారంతా బయటకెళ్ళి సిగరెట్లు పీల్చిరి. మరియు సిగరెట్టు పీల్చే స్త్రీ పురుషులతో ఆ వీధి నిండిపోయింది. దయ్యం దానిని చేయించింది, అది నిజం.
తర్వాత ఇక్కడే న్యూ ఆల్బానీ అగు మన సొంత నగరంలో, ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో ఒకరు, ఇక్కడున్న క్రీడామైదానంలో, నగరంలో ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో ఒకరు స్త్రీ పురుషులను వేదిక మీదికి రప్పించాలని వారితో చదరపు నృత్యం ఆడించాడు.
91
లోకం ఏం అనినా నా కవసరం లేదు, దాన్ని నీవ్వెంత పొగిడినా నేను పట్టించుకోను. సహోదరుడా, నీతి నియమాలుగల దృడమగు ఏ పురుషుడైన సరే వేరే పురుషుల భార్యల వెంట పడడు. అది వాస్తవమని మీరెరుగుదురు.
వారు మన స్త్రీలను తీసికొని, ఒలిచివేసారు (దిగంబరులను చేసారు) ఆఫీసుల్లో పెట్టుకొన్నారు. అద్దెకార్లు తోలేటట్టు చేసారు, బజారుకీడ్చారు (వీధుల్లో తిప్పారు) వాస్తవానికి వాళ్ళు ఇంట్లో ఉండవలసింది, పొయ్యి ముందు వుండి, వంట చేస్తూ భోజనాలు చేస్తూ ఉండవలసింది.
92
ఏమిటి ఇదంతా? అది దయ్యము. అపవాది వీటన్నిటిని ఆక్రమించేసాడు. ఈ వ్యక్తి గూర్చో, ఆ వ్యక్తి గతాన్ని గూర్చో నేను మాట్లాడుట లేదు. అపవిత్రాత్మలు జనులను పట్టి అటువంటి కార్యాల్లోకి వారిని నడిపిస్తున్నాయి (తోలుతున్నాయి). సంయుక్త రాష్ట్రాలపై దాడి అదేనండి.
సంఘాన్ని జయించుట. అపవాది సంఘాన్ని ఆక్రమించాడు, పూర్వం... .
93
ఒక బాలుడు సెమినెరికి వచ్చినప్పుడు వారు అతన్ని ఇప్పుడు తీసికొంటారు, అతనికి ఏం నేర్పుతారంటే తన డిగ్రీ పట్టాను ఎలా పుచ్చుకోవాలో అనేది నేర్పిస్తారు. మానసిక శాస్త్రాన్ని అతడు అభ్యాసించాలి. వేదాంత విద్యను అతడు నేర్చుకోవాలి. తాను నేర్చుకొన్న దానినే అతడు నేర్పించాలి (బోధించాలి). ఒకవేళ అతడు చక్కగా విద్యను అభ్యసించకపోతే ఉండగల్గినంత చక్కగా మెరుగ్గా అతడు వుండకపోయినట్లైతే, వారు అతన్ని తోలివేస్తారు (వెనక్కి పంపివేస్తారు), అతన్ని అనర్హునిగా పరిగణిస్తారు. అతడు ఏం చేయవలెను? ఇక్కడ అతడు బయటికి వెళ్ళి, ఒక రాజకీయ ఉపన్యాసం చేసినట్టుగా అతడు నశించిపోతున్న స్తీ పురుషులకి ఒక గుంపు జనులకి రాజకీయ ఉపన్యాసంచేసే మాదిరిగా చెయ్యాలి.
94
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్దాన బలమును ఎరిగి మారుమనస్సు (పశ్చాత్తాపము)ను బోది౦చగలిగే ఆ పాతకాలపు పురుషులని, తా అంటే తూ తెలియని పామరులని పంపుము ఓ దేవా, బలిపీఠము నొద్దకి చేరుకుని ప్రభువైన యేసుని ప్రేమించే స్త్రీ పురుషులను (టేపుపై ఖాళీవున్నది - సంపా) పంపుమయ్యా. ..
95
అతడు సెమినరీలను ఆక్రమించాడు (కైవశం చేసికొన్నాడు). వాడు సంఘాలని ఆక్రమించాడు. వాడు మన స్త్రీలను వస్త్రహీనులుగా చేసాడు. వారికి నువ్వు ఏమి చెప్పిన వినని ఒక చోటుకి మన పురుషులను వాడు తీసికొనిపోయాడు (మొండి వారిగా చేసాడు). మరి స్త్రీ పురుషులు, నేను అనుకొనుచున్నాను...
నువ్వు ఇలా అనొచ్చు “సరే స్త్రీ సంగతేంటి” అవును, అటువంటి వాటిని చేయిటకు అనుమతించే పురుషులారా, మీరు నిర్మించబడిన రీతిని అది చూపెడుతుంది. అది ఖచ్చితం. నిశ్చయం. అదెంతో విచారకరం, అది శోచనీయం.
ఇంక ప్రసంగీకుని విషయానికి వస్తే నేడు ప్రసంగీకుడు అధునాతన బలిపీఠమున్న వేదికమీద నిలబడుతున్నాడు. జనుల ఎదుట తాను అక్కడ నిలబడి, కరుకైన క్రీస్తు సిలువను గూర్చి, పాపము మరియు మారుమనస్సు (పశ్చాత్తాపమును) గూర్చి బోధించడానికి బదులు అతడు లోకమందున్న అల్ప విషయాలను గూర్చి బోధిస్తున్నాడు. అవును.
96
వాస్తవాన్ని నీవు వారి ముందు వుంచుము, సువార్త సభలలో జనులు నీ మాటలు వినటానికి వస్తుంటారు. అంశాన్ని తీసికొని సువార్తను బోధించుము, ప్రజలను పశ్చాత్తాపంలోనికి నడిపించుము. వారిని సరిచేయుము. వారు పైకి వెళ్ళి బయటికి వెళ్ళి, వారు, “దాన్ని వారు వినాల్సిన అవసరం లేదు”.
లేదు, వారు వినరు. కానీ సహోదరుడా, వారు పశ్చాత్తాప పడాలి లేదంటే నశించాలి.
97
దయ్యాలు! నువ్వు పాఠశాలకి వెళ్ళి చూడు, అవి పాఠశాలను అక్రమించేసాయి (కైవసం చేసికొన్నాయి), దేశాన్ని కలియ చూడు, ప్రొటస్టంట్ వారలారా, ప్రజలారా చూడండి, గొప్ప పెద్ద క్యాథలిక్ నాలుగు పాఠశాలలు అక్కడ నేడు నిర్మితమైనవి. ఎందుకది? బార్లని మీరెందుకు అనుమతిస్తున్నారు.
క్యాథలిక్ వాదాన్ని నేను నమ్మనప్పటికి దానికి, వ్యతిరేకంగా నేను చెప్పేది ఏదీ లేదండి. నేను ఖచ్చితంగా (రూఢిగా, తిరుగులేని) ఒక ప్రొటస్టంట్‌ని. అది వాస్తవం. వారు కాదని నిరూపి.... వారితో నీవు వాదించలేవు. వారంటారు, “ బైబిల్ చెప్పే దానితో మాకు పన్లేదు. చర్చి ఏమి చెబుతుందో దాన్నే మేమెరిగియున్నాం”.
దేవుడు తన వాక్యమందున్నాడు, (ఐదుసార్లు సహోదరుడు బ్రాన్హాం బలిపీఠమును తట్టెను సంపా) దేవుడు వున్నది అక్కడే.
క్యాథలిక్కులో వారు తమ చర్చితో అతుక్కుపోయి వుంటారు, ఒక ప్రొటస్టంట్‌గా అది అవమానంగా వుండును. వారు ఎలాగైతే తమ చర్చితో అతుక్కుపోయి వున్నారో ప్రొటస్టంట్‌లగు మీరు ఆవిధంగా బైబిల్‌కి అతుక్కుపోయి వుండాలి. నిజం. వారు తప్పు. సర్వశక్తి గల దేవుని అధికారమును బట్టి వారు తప్పు అని నేను చెప్పగలను, నిశ్చయంగా తప్పేనండి.
మరి అలాగే ప్రొటస్టంట్‌లగు మీరును తప్పే, మీరు చేస్తున్నది, మెరుగైన దానిని ఎరిగి యుండి కూడా మీరు దాన్ని చెయ్యలేకపోతున్నారు. అది మిమ్మును వేషదారులుగా చేస్తున్నది. వాస్తవం. అది ఒక దురాక్రమణ. చర్చీలు అనుమతిస్తున్నాయి.
98
మరి దానికి బదులు .....
చర్చి, మందిరాల్ని అందంగా తీర్చి దిద్దికడుతున్నారు, పెద్ద పెద్ద చర్చీలు కడుతున్నారు. వాటి మీద గోపురాల్ని నిర్మిస్తున్నారు, క్యాథలిక్కు సంఘంవలె అన్నీ చెయ్య చూస్తున్నారు, పెద్ద పైపు ఆర్గన్ (సంగీత వాయిధ్యాల్ని)ను ఏర్పాటు చేసికొంటున్నారు. (అనేక సార్లు బ్రాన్హాం బలిపీఠమును తట్టుచున్నాడు-సంపా) క్యాథలిక్కుల మాదిరి మీకు అవసరం లేదు, అది నాశనానికి నిర్ణయించబడింది. ఆమె వినాశనమగుటకు విధి౦చబడింది. అని 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' ఆమె కూలిపోవుటకు నిర్ణయించబడింది మరి మీరేమో ఆమె మాదిరులు వెంట పడుతున్నారు, ఆమెతో వెళ్తున్నారు.
పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద గోపురాలు కాదు. ఈ దినాన మనకి కావల్సింది, పాపములు కాల్చివేయబడే ఆ పాతకాలపు బలిపీఠములే, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించే స్త్రీ పురుషులు యొక్క సమర్పించబడిన ప్రార్ధనలు చేసే బలిపీఠాలే అవసరం. అవే మనకి కావల్సింది. మిత్రులారా నామాట వినండి, నా మాట చెవినబెట్టండి. ప్రేమతో చెబుతున్నాను.
99
నా సమయం అయిపోయింది. కేవలం దాని మీదనే నేను జాగుచేయగోరుచున్నాను, అక్కడ, దానిని తీసికొంటాను, కొద్దిసేపటి తర్వాత, ఆ దాడి, అది ఎక్కడికి వెళ్ళిందో అనే సంగతిని. అది దురాక్రమణకి గురైంది. అది మన దేశాల్ని వశపర్చుకొన్నది (లోబర్చుకొన్నది) సంయుక్త రాష్ట్రాలపై
అది దాడి చేసింది.
100
ఇప్పుడు గుర్తుంచుకోండి, నేనెన్నడూ నాజీవితంలో ఓటు వేయలేదు, చూశారా, ఇప్పుడు దాన్ని పట్టుకొని వ్రేలాడవల్సిన పన్లేదు, అమెరికా పౌరునిగా అది నా జన్మహక్కు, అది నా ఇష్టం చెయ్యాల వద్దా అనేది. కానీ నా స్నేహితులలో అనేకులు అక్కడికి పంపబడియున్నారు అని నేను అనుకొనుచున్నాను. చూడండి, వారక్కడికి చాలా మంచి వారిగా వెళ్ళెదరు, కాని వచ్చేటప్పుడు నిజాయితీ లేనివారిగా వచ్చెదరు, మరి అది నా కిష్టంలేదు.
నేనొక సంగతిని కలిగి వున్నాను, అభ్యర్థిగావున్న ఒక వ్యక్తి కోసం నేను వేదికను నిర్మిస్తున్నా, అది యేసుక్రీస్తు, కేవలం ఆయన మాత్రమే. ఆయనకే నా సమయాన్ని కేటాయిస్తాను. అది నిజం. సంఘాన్ని సరిచేస్తే చాలు, మిగతా లోకమంతా తనంతట తానే సరి అగును. అది నిజం.
101
కానీ మీతో చెప్పనీయండి, శ్రీ రూజ్‌వెల్డ్, అప్పుడు... అతడు చనిపోయాడు. అతన్ని విశ్రాంతి తీసికోనివ్వండి, నేను అతన్ని నమ్ముదును. లోనికి వచ్చి, మరి మూడు నాల్గు దఫాలుగా అధికారం చేపట్టుట, అది ప్రాధమిక నియంత్రత్వపు పోకడ. దానిని నేను లేఖనాలలో నిరూపించగలను. అది జరుగునని చెప్పబడెను. అది నిజం. రాజ్యంగమనేది ఇక నేమాత్రం అమలుకాకుండుట. అది ముక్కలైపోయింది. అంతయు చెల్లా చెదురైపోయింది. ఈ విషయంలో రిపబ్లికన్సు కూడా ఏమి తీసిపోలేదు. ప్రతీ ఆరుగురిలో ఒకరు, అరడజను మందిలో మరొకరు అన్నట్టుగా.
ప్రతీరాజ్యము ముక్క చెక్కలౌతుంది, కానీ యేసుక్రీస్తు రాజ్యము శాశ్వతముగా నిలిచివుండి సదాకాలం పరిపాలన చేయును. అది వాస్తవం. దానికై... పర్వతమునుండి తీయబడిన రాయిని గొట్టి పొడిచేసినట్టు వాటన్నిటిని అది పొడిచేయుటను దానియేలు చూశాడు. అలాగే ఆ రాయి క్రమంగా పెరుగుతూ ఒక గొప్ప పర్వతంగా తయారై... సర్వభూమి మరియు ఆకాశములనంతటిని నింపుకోవటంను చూశాడు. అది అంతే.
102
రాజకీయ ప్రపంచం పని అయిపోయింది. మన దేశం ముక్కలైంది. యెహోవా ఈలాగు సెలవిచ్చాడనే దాన్ని సహోదరుడు బ్రాన్హాం చెప్పాడని మీరు గుర్తు చేసికొంటారు. మన దేశం యొక్క సభ్యత సత్ప్రవర్తన కనుమరుగైపోయింది. ఇక ఎన్నటికి అది కోలుకోలేదు మిగతా దేశాలవలే దాని పనైపోయింది. నేడు అదొక గొప్ప దేశంగా ప్రపంచంలో నిలిచింది, అయితే అపవాది బీజాలు దాని ప్రజలలోకి ఎలాగు చొచ్చుకొనిపోయి ఇట్టి నీచ క్రియలు ఆరంభమైనవో సుస్పష్టం. ఇక వారికి నువ్వు ఏం చెప్పలేవు.
విస్కీని ఆపి, ఇప్పుడు దాని మీద నిషేదం విధించ గలిగే ఒక ప్రెసిడెంట్‌ని నువ్వు తెచ్చుటకు ప్రయత్నించి చూడు, అప్పుడేం జరుగునో నీకే తెలుస్తుంది. అలా చేస్తే నీవలా చేసిన రెండు గంటల్లోపే అతడు కాల్బబడతాడు. నిశ్చయం, అతన్ని నిలువనివ్వరు. లోకమంతా అతనికి విరోధమగును. అవును. నువ్వు దాన్నిచెయ్యలేవు.
ఆమె పనైపోయింది. ఆమె దురాక్రమణకు గురైంది. కమ్యూనిజపు ఆత్మ పెచ్చుమీరి ఆధిపత్యం చెలాయిస్తుంది
103
నేటి మన పాఠశాలలకి వెళ్ళండి, మన పిల్లలవైపు చూడండి. బడికి పోతున్న మన చిన్న పిల్లలు జరుగుతున్న దానిని గూర్చి నువ్వు నిశితంగా తెలిసికొనుము. పాఠశాలల్లోని బాలికలు, అటువంటి వారు, పద్నాల్గు లేక పదిహేనేళ్ళ పిల్లలు, వారి తల్లులేమో వారిని పాఠశాలలకి కానీ పిల్లలేమో నైతికముగా చెడిపోయి, మానసికంగా పైశాచికంగా తయారై, మత్తుకి బానిసలైపోతున్నారు. సిగరెట్లు పీలుస్తున్నారు, ప్రతీది ఆలాగు అగుచుండెను. పసిప్రాయంలోనే ఆలాగు తయారగుచున్నారు, చిన్నపిల్లలు అలా అగుచున్నారు, గడ్డివాములో సూదిని వెతకటం అగుచుండెను, ఎంత కష్టమో వారిలో కన్యత్వంను కనుగోవటం కూడా అంతే కష్టము, ఎందుకంటే వారు బాలురుతో కలిసి దుప్పట్ల క్రి౦ద జొరబడటం నదీ తీరాలలో (చెట్టపట్టాలేసుకొని తిరగడం) అలాంటి వాటిని చేస్తున్నారు.
నా స్నేహితుడా, మరి నేను దానిని మీకు నిరూపించగలను (సహోదరుడు బ్రాన్హాం ప్రసంగపీఠంను మూడు సార్లు తట్టుచున్నాడు-సంపా.) తెలియకుండా నేను దేనిని ప్రస౦గపీఠము మీద చెప్పను. మన దేశంలోని పాఠశాలల దుస్ధితి ఇది, ఈ దేశాల పరిస్థితి ఇది, ఆ చిన్న బాలికలు అసభ్యకరంగా వస్త్రధారణ చేస్తూ తమ తల్లులకైతే పాఠశాలకి వెళ్తున్నామని చెప్పి నానా చోట్లకూ పోవుచూ బాలురను కలుస్తున్నారు. వారి తల్లులకు తెలియవు, ఇంకా ఘోరమేమిటంటే లూయిస్‌విల్ వీధుల్లో వారు వ్యభిచార కార్యాలలో పాల్గొంటూ మరో ప్రక్క సంఘ సంగీత బృందాల్లో కార్యాల్స్ పాటలు పొడుట (ఏమిటిది?)
వీటన్నిటికి కారణం, పశ్చాతాపం కలిగించే బోధలు చేసి స్త్రీ పురుషులను బలిపీఠం వద్దకు నడిపించడానికి బదులు అక్కడ నిలబడి, కాకమ్మ కబుర్లు చెబుతూ బైబిల్ లో నుండి లేక అటువంటి వాటిని చెప్పడమే.
ఆ బాలిక తండ్రి రాత్రికి ఇళ్ళు చేరి, సిగరేటు వెలిగించి, గ్గాసులో బీరు పోసుకొని కూర్చొని దాన్ని సేవించటం. ఇక తల్లి విషయానికొస్తే ఆమె బయటికి వెళ్ళి పేకాట ఆడి బయటే కాలం గడిపి, పిచ్చాపాటిగా తిరిగి తిరిగి ఇళ్లు చేరుతుంది. గృహంలో పిల్లలు మెరగ్గా వుంటారని మీరెలా ఆశంచగలరు చెప్పండి?
చూడు! నీవు ఏ ఏ వాతావరణంలోనైతే వుంటావో మరి అలానే నువ్వు తయారవుతావు.
104
నువ్వు ఒక చిన్న బాలికను తీసికో, లేదా చిన్న బాలున్ని తీసికో వారిని బయట ఉంచు ఎవరితోనైనా వుండేటట్టు చేయి, నువ్వు ఒక పురుషుణ్ణి తీసికో, నేను నా బాలున్ని తీసుకొని ఎవరితోనైనా ఒక దినమంతా ఉండేటట్టు చేసి తిరిగి ఇంటికి తెచ్చి వాడు చేసే పనులను బట్టి యిట్టె చెప్పగలుగుతాను వాడు ఎవరితో వుండి వచ్చాడోనని. ఖచ్చితం. గమనించండి ఆ వాతావరణాన్ని, ఏ ఆత్మ అతన్ని పట్టిందో ఆ వాతావరణాన్ని బట్టి ఇట్టే చెప్పొచ్చు.
ఒక సంఘంలోకి వెళ్ళి చూడుము, అచ్చట ప్రజలు... పరిశుద్ధాత్మ నొందామని చెప్పుకొనే సంఘాల్లోకి లేదా - లేదా పెంతెకోస్తు అని తాము పిలుచు సంఘాలలోకి వెళ్లి చూడుము. ప్రతి ఒక్కరూ ... ఓ, అక్కడ పాస్టరు పరుగెత్తి తలను బహుశా అటు ఇటు ఊపాడనుకో, అచ్చటున్న మిగతా వారంతా అలాగే చేయుట నీవు గమనించగలవు . మిగతా వారంతా అలాగే చేయుట నీవు గమనించగలవు, సంఘమంతా సరిగ్గా అలాగే చేస్తారండి. ఆ వ్యక్తులు, ప్రజలు, నిలబడి మరి అలా భయంకరంగా ప్రవర్తిస్తే ఎవరైన అలా వుంటే, మిగతా వారంతా దానినే చేయటాన్ని గమనించి చూడుము. చల్లారిపోయి మొద్దుబారిపోయిన ఒక సంఘకాపరి వున్న చోటుకి వెళ్ళి చూడు, అచ్చటవున్న ఆ గుంపంతా అలానే వుండుట నీవు గమనించెదవు. నీవు అటువంటి వాతావరణానికే వచ్చెదవు.
ఒక నైతిక విలువులున్న ఒక మంచి వ్యక్తిని తీసికో, ఒకవేళ విలువ తక్కువ (చవుకబారు) ఒక స్త్రీని అతడు వివాహాం చేసికున్నట్లైతే, అతడు కూడా చవుకబారు వ్యక్తిగా మారటం ఎంతోకాలం పట్టదు. ఆహాబుకి జరిగింది కూడా సరిగ్గా అదే. మరి అలాగే ఒక చక్కని (మంచి) చిన్న స్త్రీ చవుకబారు (విలువ తక్కువ) వ్యక్తిని వివాహామాడినట్లైతే ఆమె కూడా అతనిలాగే తయారగును, మీకు తెలుసా, అతడేం చేస్తాడో ఆమె కూడా అదే చేస్తుంది.
చిన్నాభిన్నమైన ఆ దీన గృహాలు మరి అటువంటి వాటివైపు, ఈ ఉదయం నేనేలాగున వెళ్ళి నా చేతులు ఎత్తి చూపగలను, అలాంటి గృహాల్లో ప్రియ దీనమగు తల్లులు త్రాగుబోతు తండ్రులను ఎలాగైన మార్చాలని అనుకొంటారు. అయితే అది కష్ట సాధ్యంగా వుండును, మరి ఆ తల్లులు మరియు మిగతా వారు కూడా ఆ త్రాగుడుకు బానిసలౌతారు. వాతావరణం అలాంటిది మరి.
105
అది ఏమిటి? అది దయ్యం. అది దయ్యం దాడి చేయుట (స్వాధీనపర్చుకొనుట) గర్జించు సింహాంవలె వాడు అ దేశాన్ని ఊడ్చివేసాడు. వారి అతిశ్రేష్టమైన స్థలమగు హాలివుడ్‌లో వాడు తిష్టవేసి కూర్చొన్నాడు. వాడన్నాడు, “టెలివిజన్లు వచ్చేవరకు నేను సినిమాల్లో తిష్టవేసి కూర్చొంటాను. అవి వచ్చిన తర్వాత వాటిలోకూడా జొరబడతాను.” మరి వాడు ఇచ్చట తిష్టవేసి కూర్చొనివున్నాడు.
మరి సంఘానికి చెందిన జనులు సినిమాలు చూచుట ఆపు చేయటానికి బదులు, తమ పిల్లల్ని వాటికి పోనియ్యకుండా వుంచుటకు బదులు వారే డబ్బులిచ్చి మరి తమ పిల్లల్ని ఆదివారం మధ్యాహాం వాటికి సాగనంపుతున్నారు కొంచం సాంఘిక కార్యక్రములకు, మరి వారు వెళ్లి తమ కిష్టమొచ్చినట్టు తిరుగుతూ జూదమాడుచు తాగితందనాలు ఆడతారు, హో ఎంతటి సిగ్గుచేటు అది. ఇప్పుడు వారు టీవీలు త్రిప్పి లోకంలో వున్నకుళ్ళిపోయిన చెత్త కార్యక్రమాలన్ని నిసిగ్గుగా వీక్షించుచున్నారు. అది నిజం.
సినిమాలు, టీవీలు ఎంత చెడిపోయాయే నేను విడమర్చి చెప్పాల్సిన పనిలేదు. అవన్నీ ఎంతో భయంకరంగా చెడిపోయాయి. అవన్నీ అంతే. వాటిని నీవు చెరపకపోతే అవి బాగానే వుండివుండేవి.
106
పాతకాలపు సభ్యతగల చెప్పులను నేడు నీవు పట్టణములో అమ్మలేవు, అవెంత మాత్రం అమ్ముడుపోవు. స్రీలకు నేడు అటువంటివి అవసరం లేదు. వ్రేళ్ళు బయటకి కనబడే అసభ్యమగు బూట్లు వేసుకొనగోరుచున్నారు. మిగత స్త్రీలు కూడా అదేబాట పట్టారు. అది వాస్తవం. నీవు చర్చికి వెళ్ళినప్పుడు, వారికి నీవు ఆ పాతకాలపు విశ్వాసాన్ని అమ్మలేవు (ఇవ్వలేవు), ఎందుకంటే వేరేస్త్రీలు, ఆమె దాన్ని ఇష్టపడదు, లేదు, దానితో వారికెట్టి సంబంధంలేదు. లేదు. అక్కడికి నే వెళ్లాల్సిన పన్లేదు. నేను కేవలం నమ్ముతాను. దానితో వున్నదంతా అదే. ఓ, సోదరా, దయ్యము కూడా నమ్ముతుంది, నిజం. నీవు పశ్చాత్తాపపడు లేదంటే నశించిపోతావు.
107
ఇప్పుడు, క్షమించండి, లేదు నేను కాదు, లేదు నేను కాదు. లేదు దాన్ని నేను వెనక్కి తీసికొంటున్నాను. నేను జనుల్ని ప్రేమిస్తున్నాను. కానీ నేను-నేను-నేను మిమ్మునెంతో ప్రేమిస్తున్నా, లోతుగా దీన్ని గూర్చి చెప్పినదాన్ని మీరు చూడాలని నేను కోరుచున్నాను. దేవుని చిత్తమైతే వారంలో దీనిని ఇంకా ఎక్కువ చెప్పాలని ఆశపడుచున్నాను.
108
ఇప్పుడు, తల్లులైన మీకు వెళ్ళుటకు ముందుగా ఒక మాట. గాడ్ బ్లేస్‌యు. మీ పిల్లల్ని మీరు సక్రమంగా పెంచండి.
109
ఈ స్వాధీనపరుచుకొనుట మనం తీనుకొందాం, మనమింకా గృహంలోకి వెళ్ళివలసియుంది, ఇంకా అనేక చోట్లకి, స్కూల్లకి, ఇంకా మిగతా స్థలాలకి వెళ్ళి పట్టుకొందాం.
కానీ, సంయుక్త రాష్ట్రాల దురాక్రమణ, దయ్యం దానిమీద పట్టు సాధించాడు. రష్యా గూర్చి భయపడకండి. రష్యా ఏమి చేయలేదు. కానీ మన పతనాన్ని మనమే కొని తెచ్చుకొంటున్నాం. మన కంపే (కుళ్ళు) మనమధ్య వున్నది అది నిజం.
మిగతా ప్రపంచములోనున్న విడాకుల కేసుల కంటే మన సంయుక్త రాష్ట్రాల్లోనే ఎక్కువుగా ఉన్నాయని మీకు తెలుసా? విరివిగా విడాకులు, దాని గూర్చి ఆలోచించండి. అదెంతో భయంకర౦? మాతృత్వం అనేది మంట గలిసింది(విచ్చిన్నమైనది) ఒకప్పటి తల్లులువలె ఇప్పటి తల్లులు పిల్లల్ని కనిపెట్టుకొని వుండటం లేదు. ఉద్యోగాలు కోసం వె౦పర్లాడుతున్నారు.
110
ఇక్కడ మొన్న ఒకసారి, కిరాణా కొట్టుకి చెందిన దీని విషయమై నాతో మాట్లాడుచున్నాడు. స్రీలు బహిరంగ కర్మాగారాలలో పనిచేయుచున్నారు, పెళ్ళైన ఈ యవ్వన స్త్రీలు తమ పిల్లల్ని వదిలేసి పనులకి వెళ్ళుచున్నారు. వారి పిల్లల యొక్క ఆలనా పాలనా చూచుకోవటానికి ఆయా(దాసీల)ను పురమాయించు కొనుచున్నారు. వారు ఈ బహిరంగ చోట్ల పని చేయుచున్నారు. ఇంకా అతడన్నాడు. “వారి పనులు అయిపోయిన తర్వాత వారిలో ఇద్దరు అక్కడ నిలబడ్డారు. అన్నాడు, 'విచారించవద్దు ఏదో రకంగా మేము దానిని చేసెదము”
111
ఓ ఎంతటి ఘోరమైన వ్యభిచారం జరిగే కాలమిది. నిజంగా. ఇంటికి పెత్తందార్లు వారేనని అపవాది వారికి (స్రీలకి) చెప్పెను. వారి సంపాదన వారిదే. వారికిష్టమైనట్టు వారు చేస్తారు. మీకు వీలైతే అటువంటివాటిలో నుండి బయటికి రండి.
వాటన్నిలోనుండి బయటికి రప్పించగల్గి౦ది ఒకే ఒక్కటి ఉన్నది అది యేసుక్రీస్తు ఎదుట బలిపీఠం. పాతకాలపు, కన్నీటి ప్రవాహమనే మతం(విశ్వాసం) వున్న బలిపీఠం, వారి హృదయాలను పగలకొట్టి వారిని ముక్కలు చేయును, మరి వారేం కావాలనుకొన్నా అలా వారిని చేస్తుంది అది నిజం.
112
నేనొక పాతకాలపు మనిషినని వారు అనుకోవచ్చును. అయితే నా సహోదరుడా, నా సహోదరి నేను చెప్పేది సత్యమని నీవు చనిపోయేటప్పుడు ఎరుగుతావు. అది నిజం. స్త్రీ దురాక్రమణ పాలైంది, అది ఈ గడియనందే. అవును, ఇప్పుడు, నిర్ణయం తీసుకొనే గడియ ఒక నిర్ణయం తీసుకొనే గడియ. చర్చికి వచ్చిపోవటం కాదు, సంఘంలో నులివెచ్చని వ్యక్తిగా వుంటావా లేక క్రీస్తుని సేవిస్తావా అని ఒక నిర్ణయం తీసుకొనే గడియ నీకు వచ్చింది వాస్తవం.
113
సంఘ సభ్యులుగా చాలామంది వుంటారు. ఒకవేళ సభ్యులంతా... లేదా క్రైస్తవులమని తమ్మను తాము చెప్పుకొనే అమెరికా జనులు, నిజమైన క్రైస్తవులుగా వున్నట్లైతే, తిరిగి జన్మించిన వారిగా వున్నట్లైతే, సహోదరుడా, పరలోకంలో ఎంత సురక్షితముగా నీవుంటావో అంతే రీతిగా మనం ప్రతీ యుద్ధము, ప్రతీ సమస్యనుండి సురక్షితంగా వుంటాము, అవును, దేశంలోనుండి వ్యాధులు మరియు సమస్త కీడు తొలిగిపోవును.
“సహోదరీ, ఎలా వున్నావు? శుభోదయం సహోదరుడా” అని వీధిలో కలిసికొన్నప్పుడు ఒకరునొకరు సంభాషించుకోవటం ఎంతమంచిగా వుంటుందో కదా. నడుస్తూ... ఒక చింతకూడా నీకు లోకంలో వుండదు సుమా. ప్రతీది ఎంతో చక్కగా సొగసుగా వుండును. మరి అతడు వీధి మూలకు వచ్చును, నీవెంట పడటానికి బదులుగా, అతడు నిన్ను ఆపి ఇలా అనును “మంచిది, సహోదరుడా. మంచిది, నీవు... ఓ, నీవు నాకంటే ముందున్నావు”చూశారా ఎదుట వారికి ప్రాధాన్యత... అది అద్భుతంగా లేదా? (సమాజం “ఆమేన్” చెప్పుచున్నది-సంపా) మనం దానిని కలిగివుండబోవుచున్నాం, అయితే అది వెయ్యేండ్ల పాలనలోనే సహోదరుడా. ఆ దినం వచ్చుచున్నది. అది నిజం. కనుక మనం ఇప్పుడు కాదు......
114
మొన్న ఒక రోజున నేను నా ప్రక్కింటి నొద్ద నిలబడి వున్నాను, వారికి నాకు మధ్య ఏ విరోధం లేదు, అయితే నా చిన్నపిల్లల్ని నేను గమనించాను. భార్య ఏడ్చుచున్నది. ఈ పట్టణంలో వున్న ఒకానొక వైధ్యుడు, అతని చిన్న బాలిక నా చిన్న కుమార్తెతో పరుగెత్తుచుండిరి, వారు ఒకరినొకరు ఎంతో ఇష్టపడుదురు. అయితే వారొక విషయం తెలిసికొన్నారు, అదేమనగా ఆమె బ్రాన్హాం అని రెవరెండు బ్రాన్హాం యొక్క కుమార్తె అని తెలుసుకొన్నారు, ఇంక అంతేనండి, వెంటనే ఆ బాలిక నా కుమార్తెతో ఆడుకోవడం మానేసింది. మై, “సరే కానివ్వండి” అని నేను అనుకొన్నాను.
పొరుగున వున్న కొందరు అచ్చటికి పరుగెత్తుకొనిపోయి, ఇలా అన్నారు “సరే అది మంచిదే” తరువాత వారు తమ పాస్టరు దగ్గరకు వెళ్ళారు. నాకు చెప్పొద్దు. మీకు తెలుసా, ఇలా చెప్పారు, “నీకు తెలుసా, మా పొరుగు ఇంట్లో ఒకరు నివసిస్తున్నారు, అతడెంతో మంచివాడు” ఇంకా చెప్పారు, “అతడు రెవ.బ్రాన్హాం. మా పిల్లల్ని తన పాత ట్రక్కులో ఎక్కించుకొని, బయటికి తీసికుపోతాడు”.
అన్నాడు, “మంచిది,” [సహోదరుడు బ్రాన్హాం తనగొంతును సవరించుకొనుచుండెను - సంపా] “రెవ.బ్రాన్హాంకి మేమెంత మాత్రం వ్యతిరేకం కాదు. అతడు మంచివాడే, మీరు చూడండి అతడు మనలాంటోడు కాదు (అతడు తేడా మనిషి) ”అవును,“ మనం, నేను - నేను అనట్లేదు... మీకు తెలుసా, మీరు వాళ్ళతో మాట్లాడవచ్చును, స్నేహంగా వుండొచ్చును, అంతవరకు చాలు ఎక్కువ పోకండి”.
ఓ, సహోదరుడా! నా భార్య అక్కడ నిలబడి ఏడ్చుచుండెను, నేనన్నాను ,“ప్రియా, ఇది వేరు చేసే గీత. నామట్టుకైతే నేను నా ఇంటివారు ప్రభువునే సేవించెదము”.
లోకమంతా విడిచిపెట్టినా, నేను మాత్రం యేసుక్రీస్తునే కోరుకుంటాను, నన్ను మతపిచ్చోడని పిలిచినా సరే, అంతా వెలివేసినా సరే... నాతోటి వారు, అంతా వ్యతిరేకమైన సరే, నేనింకా యేసుక్రీస్తునే కోరుకుంటాము. ఎన్నడూ మారని ఆయన హస్తాన్ని పట్టుకుంటాను, లోకస్నేహితులు నిన్ను చేయి విడిచిన, మరింత దగ్గరగా ఆయన్ని చేరి ఆయన్ని అంటి పెట్టుకొని వుండు. ఆయన్ని పట్టుకొనుము.
115
ఇది వరకూ ఎన్నడూ ప్రకటించని రీతిగా దేవా నన్ను ప్రకటించనిమ్ము. మరణించుచున్న వారికి ప్రాణం దారపోసి ప్రకటించేటట్టు నన్ను చేయుము. ఇదే నా ఆఖరి ప్రసంగం అనేటట్టుగా నన్ను ప్రకటించనిమ్ము. తమ ముఖము మీద కన్నీటి ప్రవాహ జాలువారుచూ బలిపీఠం నొద్దకు చేరునట్టు వారిని ఒప్పింపనిమ్ము, అంతే కాక వారు తిరిగి తమ తమ గృహాల్లో ఇరుగుపొరుగు వారి మధ్య క్రైస్తవులుగా జీవించున్నట్లు చేయనిమ్ము. అటుఇటు సరదాగా ఆడుకొంటూ, చుట్టూ తిరుగుచూ, గెంతుచూ వుండటాన్ని నేను ఆపు చేయించాలి, ఇలా నటిస్తూ, ఇలా ఉబ్బిపోతూ, అలా వెళ్ళుచూ వారు వుండకూడదు. (ఆటపాటలతో కూడిన సరదా భక్తి వారు చేయకూడదు ). ఓ, అలా చేయకండి. అది దయ్యము. అటువంటి దయ్యాలు కైస్తవులు మీదకి వచ్చాయి.
116
గుర్తుంచుకో, అక్కడ ఆ సేవకులు, వారు వారికి ప్రవక్తలు. వారు ప్రవక్తలు. వారు మతభక్తులుగా వుండి అర్పణలు అర్పించుదురు. నేటి దినపు భోదకులున్నట్టే నుండిరి, అయితే సహోదరుడా, వారు సత్యానికి ఎంతో దూరంగా వుండిపోయారు.
117
దయ్యము ఎంతో భక్తిగా వుండుట మీరు చూడలేరా? గొప్పదగు, కమ్యూనిజంలాంటిది క్రైస్తవ్యానికి వ్యతిరేకం అయినట్టు దయ్యము కైస్తవ్యానికి వ్యతిరేకంగా వున్నట్టు కనబడదు. అది (కమ్యూనిజం) కూడా దయ్యమే అయినప్పటికి, అది క్రీస్తువిరోధి కాదు. క్రీస్తువిరోధి ఎంతో భక్తిగా కనబడతాడు. యేసుని సిలువవేసింది మతసంబంధమైన ఆత్మయే. సిలువ వేసింది ఎల్లప్పుడు మతలోకమే, భక్తులే. నిజమైన క్రీస్తుకి వ్యతిరేకులు మతభక్తులే. మతప్రవక్తలే మీకు వ్యతిరేకులు. ఆ దినపు మతప్రజలే ఆ దినపు దేవుని వర్తమానానికి వ్యతిరేకులు.
118
గుర్తుంచుకోండి, నేను మిమ్మును హెచ్చరించాను. నేను మీతో చెప్పాను. క్యాథలిక్ వాదమును గూర్చి బాప్టిస్టును గూర్చి, మెతడిస్టుని గూర్చి నేను ఎక్కువుగా మాట్లాడను. అయితే హోలీనెస్ ప్రజలు గురించి ఈ గీతల మధ్యవున్న దాని గురించి నేను మాట్లాడుదును. అది వచ్చి ఎలాగు నాటకంలో నిలబడిందో నేడు దాన్ని చూడండి. ఓ, మై ఏదో ఒకసారి నేను దానిలోనికి వెళ్తాను. మరి నా హృదయం నాలో బ్రద్దలగుచున్నది.
ఆ పాత బాంజో పట్టుకొని ఆపాత బాంజో వాయిస్తు అ పాత ఫిడేల్ని అలా కత్తిరిస్తూ “ఇతడు టెక్సాసు కౌబాయి, పలానా పలానా” అన్నట్టు వుందురు. నేను మనుషులకి ఏ మాత్రం వ్యతిరేకిని కాను, కానీ వారు ఆ లోకకార్యాలలో వుండటాన్ని నేను వ్యతిరేకిస్తాను. అది నిజం. నేను నిలవబడి, సహోదరుడా కనీసం ఒక్క దానితో కూడా నేను సమ్మతింపను, నా చేతులు పైకెత్తి ఇలా అందును, “యేసు, సిలువకు సమీపముగా నన్ను వుంచుము” అవును.
ప్రతిష్టింపబడి (త్యాగపూరిత)న సిలువను నేను మోయుదును,
మరణము వరకు నన్ను అది వేరుగా (స్వేచ్చగా) వుంచును,
తదుపరి కిరీటం ధరించుకొనుటకు గృహమునకు వెళ్ళెదను,
ఎందుకంటే నా కొరకు కిరీటంవుంచబడి వున్నది.
119
ఈ ఉదయకాలం ఇక్కడ వున్న చిన్న తల్లులగు మీకు, నిజమైన తల్లులగు మీకొక విషయం చెబుతాను, మీలో అనేకులు తల్లులుగా వున్నారని నాకు తెలుసును, మీరంత తల్లులని నేను అనుకొనుచున్నాను. గాడ్ బ్లెస్యు, మీరే ఆయిదవ సువార్తని నేను భావించుచున్నాను. మీ పిల్లల కోసం ఇప్పుడొక చిన్న విషయం నన్ను చెప్పనివ్వండి. ఎందుకంటే, సహోదరుడు నెవిల్ బహుసా మీకు భోధించ వచ్చును... తల్లుల గూర్చి ఈ రాత్రి, అతడు కావచ్చు లేక మరొకరు కావచ్చు తల్లులు గూర్చి బోధించెదరు. కానీ వినండి ఒక సంగతి మిమ్మల్నిఅడగగోరచున్నాను.
గుర్తుంచుకోండి, మోషే బాలునిగా వున్నప్పుడు, అతనికి ఉపదేశించింది (నేర్పింది) అతని తల్లే . భక్తిగల ఆ తల్లి చంటిబిడ్డ మోషేని తన మోకాళ్ళుపై వుంచుకొని, ఇలా అనేది, “మోషే” అన్నిటిని అతనికి నేర్పించేది. అతడు ఆమెకి ఉపాధ్యాయుడు లేక ఆమె అతనికి ఉపాధ్యాయురాలు. ఫరోను గురించి ఆమె ఇలా చెప్పేది, “మోషే ఒకానొక రోజు నీవు ఇశ్రాయేలియులను విమోచించెదవు. దాన్ని చేయుటకు పిలవబడిన బాలుడవు నీవే. కావున నీవు పవిత్రంగా, మచ్చలేనివాడిగా ఇహలోక కార్యాలకి దూరంగా వుండు, నువ్వే ఆ బాలుడవి, నువ్వే ఆ బాలుడవి.”
అతడొక సెమినరీకి వెళ్ళినట్టు ఏ బోధనైనా పొందుకొన్నట్లు ఎక్కడా చెప్పబడలేదు. అతడు ఫరో రాజభవనంలోనే నిలిచియున్నాడు. (సహోదరుడు బ్రాన్హాం ప్రసంగ పీఠంను తట్టుచుండెను) ఆమె ఒక నిజమైన తల్లి, ప్రభువు నియమాలను ఆమె అతనికి బోధించేది. అతడేలాగు పరిశుద్ధంగా వుండాలో చెప్పేది. అతడు ఎలా జీవించాలో ఏవిధంగా జీవించాలో, దేవుడు ఏమి చేస్తాడో అనే విషయాలు ఆమె అతనికి ఉపదేశించేది. ఆ ఉపదేశం మోషే జీవిత కాలమంతా అతనిని అంటుకొనే యుండెను.
ఏ మంచి నిజమైన, నమ్మకమైన తల్లియైనా సరే తన పిల్లల్ని సినిమాలకి, డాన్సులకి అటువంటి దుర్నీతి కార్యాలకి అసలు పంపదు, గానీ తన ఒడిలో వేసికొని ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించును.
120
మొన్న ఒకరోజు నేను ఇక్కడ ఒక తల్లితో టెలిఫోన్లో మాట్లాడాను, మరి ఆమె అన్నది, “ఓ సహోదరుడా బిల్లీ” ఆమె అన్నది, “నా దీన బాలుడు సమస్యలో చిక్కుకొన్నాడు” ఆమె అన్నది “చాలా కష్టంలో వున్నాడు”.
నేనన్నాను, “అవును, సహోదరీ. ప్రియా, నాకు తెలుసును దాని గూర్చి.
“మరియు ఆమె అన్నది ”బహుశా వాడు తప్పుడస్తుడైతే కావచ్చు, నాకు తెలీదు“ నేనైతే వాడిని నేను ప్రేమిస్తాను. నువ్వు వున్నది అక్కడే,” వాడిని నేను ప్రేమిస్తాను.
అతడు తన తల్లితో ఇలా చెప్పాడు, “దీని ద్వారా, దాని ద్వారా నేనెంతో మోసపోయాను” నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దానవు నువ్వే, నిజంగా నాతో ఉండి నన్ను అంటిపెట్టుకొనే స్త్రీవి నీవే“. అది తల్లి ప్రేమంటే. తన బిడ్డను తన కౌగిలిలో తీసుకొనేదే నిజమైన తల్లిప్రేమ. వాడి తప్పోప్పుని మనస్కరించదు, కానీ వాడిని వెనకేసుకొని వస్తుంది. మరి ఒకవేళ దేవుడు... ఒక తల్లి తన బిడ్డను గూర్చి అంతలా ఆలోచిస్తే మరి తన వారినిగూర్చి దేవుడు ఇంకెంతలా గొప్పగా ఆలోచిస్తాడో గదా. మీరు గమనించారా? నీవు నిలిచియుండుము. ఆయనతో కొనసాగుము.
121
మనం ముగించుకొనబోయే ముందు బైబిల్‌లో వున్న మరొక తల్లిని గూర్చి నేను త్వరగా చెప్పగోరుచున్నాను. హేరోదియా అనే తల్లి వున్నది. ఆమె తన కూతురికి నాట్యం నేర్పించింది. తన కూతురు పేరు ప్రతిష్టలు తేవాలని ఆ తల్లి కోరుకొన్నది. మరి ఆమె రాజు యొదుట నాట్యమాడింది, బాప్తీస్మమిచ్చు యోహాను తలను కోరుకొన్నది. ఆ తరువాత ఆమె సంతతికి చెందిన డెబ్బైమంది చిట్టాను మనం కలిగియున్నాము, ఈ అవివాహిత సుందరీమణి హేరోదు ముందు నాట్యమాడేది. ఆమె సంతతిలో డెబ్బైమంది వేశ్యతనంలోవుండిరి, లేక ఉరితీయబడి చనిపోయిరి.
ఒక తల్లేమో తన బిడ్డకి లోకవిషయాలు నేర్పించింది. మరొక తల్లేమో తన బిడ్డకి దేవుని సంగతులు నేర్పించింది. ఒకరేమో గొప్ప నాయకుడయ్యాడు జయవీరుడయ్యాడు, నేటికి మనుషులు మధ్య అక్షయుడిగా వున్నాడు. మరి ఇంకొకరేమో జారత్వం చేసి (నైతికంగా పతనమై) మరియు పాతాళంలోకి నెట్టివేయబడెను, అంతేకాదు ఆమె తనతో పాటు వేవేల మందిని పాతాళంలోనికి తీసుకొనిపోయెను. నా భావాన్ని గ్రహించారా? “బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పాలి.”
122
తెల్లని గులాబీలు ధరించి ఇక్కడ కూర్చొని వున్న బీద తల్లులారా, మీ మీద నిశ్చయంగా జాలిపడగోరుచున్నాను. నేడు, పరలోకమునకు వెళ్ళిన ఒక తల్లి వున్నది, ఆమె దేవుని కొసం మంచి నిష్టకలిగి బ్రతికినది, బహుశా ఆమె తెరకి ఆవతల వైపునకు వెళ్లివుండవచ్చును. ఆమె నీరాక కోసం ఎదురుచూస్తూ వున్నది. అది నిజం.
ఎర్రని గులాబీలు ధరించిన మిమ్మును నేను మెచ్చుకుంటాను, గౌరవిస్తాను. తల్లులారా, ఆమె కోసం మీరు ఏదైన చెయ్యాలనుకుంటే, దానిని ఒక్కరోజు మాత్రమే కాదు, ఏడాది పొడుగున మూడువందల అరవై ఐదురోజులు చేస్తూనే వుండండి. ఇంటికి వెళ్ళండి, ప్రార్ధన చెయ్యండి, దేవుని కోసం జీవించండి (అదే నిజమైన నివాళి). చెయ్యాల్సింది అదే మరి. మీ పిల్లల్ని మంచిగా పెంచండి. మీ పిల్లలు పెద్దవాళ్ళయినప్పుడు వారు తెరకి ఆవతల వైపుకి వెళ్ళిన తర్వాత వారు మిమ్మును “ధన్యురాల”ని పిలుస్తారు. మాతృత్వపు నిజమైన ఆత్మ అదే, మాతృదినోత్సవపు ఆత్మ అదే. మాతృదినోత్సవం అనేది ఒకరోజుది కాదండి, మూడువందల అరవై ఐదు రోజులది.
123
నేడు వాళ్ళు పుష్పములు అమ్ముతారు, బహుమానాలు పంచుకుంటారు, లోకం చేసే తంతు అదే, ఇది ఇలా కొనసాగితే, ఈ లోకం మరో ఐరవై ఏళ్ళు వున్నట్లైతే వారు కొడుకుల దినము, కూతుర్ల దినము, దాయాదుల దినము, మామల (పినతండ్రుల) దినము అంటూ అన్ని రకాల దినాలు కావించి లోకానికి వాణిజ్య సొగసులు అద్దుతారు. మరి అదంతా ఎక్కడికి పోతుంది, అది తిన్నగా పాతాళానికే, అది వెళ్ళగలిగినంత నాశనానికే వెళ్ళేది.
అయితే మీరు... గాడ్ బ్లెస్ యు, అనేది నా ప్రార్ధనా.
124
ప్రార్ధి౦చుకుందామా.
మా దయగల పరలోకపు తండ్రీ, మేము గతాన్ని ఈ ఉదయాన చూసాము, మా మనసుతో, పూర్వమున, కొన్ని వందల ఏళ్ళక్రితం ఆహాబు రాజు ప్రక్కన యెహోషాపాతు నిలబడినప్పుడు, అతని హృదయంలో ఒక దీన ఆత్మ, ఇంకా దేవున్ని విడిచి, అతడు పొరపాటులు చేసినప్పటికి, అతనితో చెప్పాడు, “ఇది తప్పు, ఇది తప్పు, అది శుద్దిగా లేదు ఇది పరిశుద్ధంగా లేదు. ఇది ఇలా జరుగునని ప్రవక్త చెప్పాడు. దేవుని యొక్క చిన్న అగ్ని అతనిని ”మెలుకొల్పింది“.
అంతట ఆ చిన్న అగ్నికి జవాబుగా అక్కడ ఒక వ్యక్తి వున్నాడు, అతని “పేరు మీకా, దేవునియొక్క నిజ ప్రవక్త, ముతక దుస్తులు ధరించి అక్కడ నిలబడి వుండవచ్చును, అతడు అక్కడ నిలబడినప్పుడు అందరు కలిసి అతన్ని నిరాకరించి (తృణీకరించి) వుండొచ్చును, అలాగే అక్కడ వున్న తోడేళ్ళు మధ్య ఒక గొర్రె పిల్లలాగా అతన్ని చూసివుండవచ్చును, ఏది ఏమైన అతడు మాత్రం సత్యమే చెప్పాడు, అతని ముఖం మీద గ్రుద్దారు, చెరసాలలో వేసి క్లౌషాన్నపానములు (————- ) అందించారు కానీ నీవు అతనిలో వున్నావని చెప్పుటకు అతడు పలికిన మాటలు నెరవేర్పులోకి వచ్చాయి.
దేవా నేడు దయచేయుము, మేము ఈ బైబిల్‌నే చూస్తున్నాము. ఇప్పటివరకు మేము సంఘం యొక్క పుస్తకాల వైపు, ఆచార కట్టుబాట్ల వైపు, అనేకమైన వాటివైపు, సంఘాల వైపు సంప్రదాయాల వైపు చూశాం. దీనిని వారు ఎలా చేసారు, దానిని ఏలా చేసారు, ఇంకో దానిని ఎలా చేసారనే మొదలైన వాటివైపే చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ నిజవాక్యం వైపు చూసి అది ఏం చెబుతుందో చూడగోరుచున్నాం, లోకములో వున్నవాటిని ప్రేమించు వానిలో దేవుని ప్రేమ నిలువదు.“ ”పరిశుద్దత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరు. సమాధానమును పరిశుద్ధతను వెంబడించుము. ఎవ్వడును ప్రభువును చూడలేరు. లోకమును లోకములో ఉన్నవాటిని ప్రేమించు వానిలో దేవుని ప్రేమ నిలువదు.“
అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు స్వార్ధ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు“అహంకారులు” ఓ, జరుగుచున్న ఆ గొప్ప కార్యాలు ప్రభువా ద్రోహులు, మూర్ఖులు, గర్వాందులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువుగా ప్రేమించువారు,“దేవుని ఆజ్ఞలను పాటించండి అని ప్రజలకు చెప్పుటకు బదులు మానవుల పద్దతులను పాటించండి అని చెప్పుదురు, అంతేకాక పైకిభక్తిగల వారైయుండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా వున్నారు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని నిరాకరిస్తున్నారు. ఆత్మనింపుదల ఒక మనుష్యున్ని తయారు చేయటం అతన్ని ఆనంది౦పచేయటం, అతని కళ్ళవెంట కన్నీళ్ళు తెప్పించడం, అతన్ని బయటికి పంపి, రోగుల నిమిత్తం ప్రార్ధన చేయించడం, బాషలలో మాట్లాడటం దానికి అర్ధం చెప్పించడ౦
ప్రవచింప చేయటం, దేవుని ఆత్మ, జీవంగల దేవుడు, వారు కేవలం దానిని తీసేసీ దాన్నీలాడ్జిగా అటువంటి ఒకదానిగా చేసారు, దైవభక్తి కలిగిన వారిగా వుండి, దాని శక్తిని ఆశ్రయింపకయున్నారు“.
ఓ దేవా, ఈ చిన్న ప్రేక్షక గుంపు, నేడు త్వరగా మేల్కోనును గాక. ఇప్పుడే, కాలం అంతం కాకముందే ఈ స్ధితి మమ్మును పట్టుకొనకముందే “లెమ్ము, నిన్ను నీవు విదిలించుకొనుము పురాతన మార్గములను విచారించుము, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుము. ప్రభువా దానిని అనుగ్రహించుము, ఆ పాత పురాతన కరుకైన మార్గాన్ని మేము కనుగొనునట్లు చేయుము, తద్వారా మేమంతా ఒక్కసారి వందలాదిమందిగా మా చేతులను కలుపుదుము, ఇలా పాడుదము.
ప్రభువు యొక్క కొద్దిమంది తీసుకొన్న మార్గమును నేను ఎంచుకొందును,
నేను యేసుతో కలిసి ఆరంభించాను. నేను ముందుకు సాగిపోతున్నాను.
దేవా, దానిలో జీవించుటకు దానిగా జీవించుటకు సహాయం చేయుము!
ప్రభువా ఇక్కడ కూర్చొన్న ఈ ప్రియ తల్లులందరిని దీవించుము. వారు కూడా తల్లులుగ వున్నారని వారెరిగి, రంగం మీద నుండి వెళ్ళిపోయిన వారి ప్రియ తల్లుల కోసం వారు ధరించిన కోటుకి ఈ ఉదయకాలం వారి తల్లుల జ్ఞాపక చిహ్నంగా తెల్లని గులాబీలు ధరించారు. ఓ జీవాధిపతి వారిని దీవించు ప్రభువా, వారు కూడా దీవించబడుదురు గాక, మరియు వారు తెరకి ఆవలవున్న ఆ మహిమగల పరలోకం చేరినప్పుడు వారి పిల్లలు జ్ఞాపకాలు వారి తల్లులతోపాటు వుండును గాక. ప్రభువా దానిని దయచేయుము.
మరి ఒక ఉదయాన మా నరాల్లో నుండి ప్రాణంపోయినప్పుడు, మా ఊపిరి ఆగిపోయినప్పుడు తెర తిరిగి తెరుచుకొనును, ఆమె క్రిందికి దిగి వచ్చును, బహుశా, మాకు సహాయం చేయుటకు యోర్దాను ముగింపు నొద్దకి దిగివచ్చును. ఓ, సుదూరానా మేము అడుగుమోపే ఆ మహిమగల దినమందు, అక్కడ వుండని... గాలి అనేది సిగిరెట్టు పొగతో కలుషితం కాదు. అచ్చట తాగుబోతులు వీధుల్లో పడివుండుట వుండదు. అక్కడ ఇక ఏ వేశ్యవుండదు. పాపమనేదే ఇక ఉండదు. అటువంటివి అసలు వుండనే వుండవు. మహిమలో మేము సమాధానం గలవారమై మా ప్రభువైన యేసుక్రీస్తుతో కలసి మరియు మా పిల్లలతో కలసి సదాకాలం జీవించెదము. ఓ
అదెంతో అద్భుతమైన దినము.
ఓ, తండ్రి అంధకార చీకటి అలుముకొన్నది, పోరాటం, అపవాది దేశాలన్నిటిని తన గుప్పిట్లో తీసుకొనుచున్నాడు, ప్రసంగపీఠాల్ని ఆక్రమిస్తున్నాడు, సంఘాల్ని ఆక్రమిస్తున్నాడు, జనుల్ని ఆక్రమిస్తున్నాడు, వ్యాపారాల్ని ఆక్రమిస్తున్నాడు, పట్టణాల్ని స్వాధీనపర్చుకొనుచున్నాడు, ఇళ్ళని, బళ్ళుని స్వాధీనపర్చుకొనుచున్నాడు, ఓ దేవా, సమాజంలోకి పాపం ప్రవేశించినప్పుడు అక్కడ మోషే మరియు లేవీయులు త్వరపడి ఖడ్గములను తీసి దేవునికోసం పోరాడినట్టు మాకు నిలబడే శక్తిని ప్రసాదించండి. మాకు సహాయం చెయ్యి ప్రభువా.
ఇప్పుడు మమ్ము క్షమించండి, దీవించండి. ప్రభువా మమ్ము పగులగొట్టండి, దీనులుగా చెయ్యండి, ఓ దేవా, నీవన్నావు “కన్నీళ్ళతో విత్తువాడు సంతోషగానములతో పంటకోయును, రెండెంతలతో తిరిగివచ్చును” ఓ దేవా ముక్కలుగా మమ్ము పగులగొట్టుము. మమ్ము మలుచుము, నూతనపరుచుము ప్రభువా. మేమెంతగానో దారితప్పిపోయాము.
ప్రభువా నామట్టుకైతే నాకూటాలకి ఎంతమంది వచ్చారో అనేది నాకొద్దు. ఓ దేవా నువ్వొస్తే చాలయ్య. ప్రభువా నువ్వు రమ్ము. ఓ క్రీస్తూ నువ్వు రా ప్రభువా. నన్ను పగులగొట్టుము, నన్ను రూపించుము. ఓ ప్రభువా, మేము ఖచ్చితంగా నిత్యత్వమనే దాన్ని ఎదుర్కోవల్సి వుందని తెలిసికొని చనిపోతున్న ఒక వ్యక్తికి చనిపోతున్న ఒక వ్యక్తిగా సువార్తను బోధించవలెనని కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టు ప్రకటించుటకు నాకు సహాయం చెయ్యి ప్రభువా. నువ్వు సంతోష భరితముగా లేనప్పుడు, కనికరం లేకుండా నువ్వు నిలబడినప్పుడు, దయలేకుండా నిలబడినప్పుడు, నువ్వు కోపంగా వుండి దేశాల మీదికి, నీ కుమారుల ప్రేమను తిరస్కరించి, తృణీకరించిన జనుల మీదికి తీర్పు తెచ్చుటకు నిలబడినప్పుడు మేము కూడా నీ ముందు నిలువబడవల్సి వుంది. (లెక్క అప్పజెప్పుటకు).
దేవా ఆయనతో వుండే కృప నేడు నాకిమ్ము, అప్పుడు ఆ దినాన నేను బహు నిశ్చయత కలిగి నిలబడెదను. ఇప్పుడు మేము దుఃఖించాలి, నువ్వు మా దుఃఖాన్ని సంతోషముగా మార్చి, మా కన్నుల ప్రతీ బాష్పబిందువును తుడిచి, “లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్దపర్బబడిన ప్రభువు యొక్క ఆనందములోనికి ప్రవేశించండి” అని చెప్పుదువు. దేవా ఇప్పుడు మాతో వుండి, మాకు సహాయం చేయుము, యేసు నామమున ప్రార్దించుచున్నాము. ఆమేన్.