మృగము యొక్క ముద్ర
VGR COUNT-279 ఇప్పుడు, రేపు రాత్రి.... మనము ఎల్లప్పుడూ కూడా ఒక వైఖరిని చూస్తూయుంటున్నాము. అది ప్రభువైన యేసుక్రీస్తు అంతవరకే, ఆయన చిత్తము మనయెడల ఏమైయున్నదో అది చేయుట కొరకే. అయితే, రేపు రాత్రికి అది దైవ చిత్తమయినట్లయితే దేవుని యొక్క ముద్ర, దానిని గూర్చి మాట్లాడబోవుచున్నాను.
ఈ రాత్రికీ అది చేయుటకు మన యెడల ఉన్న ఆధిక్యతను బట్టి... లేక, ఈ రాత్రికి దానిని బయటికి తెచ్చుటకు ఆయన కొరకు దానిని చేయుట కొరకు అది మన భాగ్యమై ఉంటున్నది. ఈ కాలానికి సంబంధించిన ఎంతో ప్రాముఖ్యమైన అంశాన్ని గూర్చి మనము మాట్లాడబోవుచున్నాము: అది మృగము యొక్క ముద్ర.
గతరాత్రి మనము సంఘకాలములలో ఉన్నాము. ఏడు సంఘకాలాలు ఎఫెసు సంఘ కాలముతో ప్రారంభించాము. లవోదికయ సంఘకాలముతో ముగించాము. అది చివరి సంఘకాలము. ఇప్పుడు మనము మాట్లాడుచున్నప్పుడు ప్రభువు తన యొక్క వాక్యానికి తన దీవెనలు చేర్చును గాక.
2
మనము ఇప్పుడు దేవుని వాక్యము తెరువక ముందు మనము ఒక క్షణము ప్రార్థన కొరకై మనం తలలు వంచుదాం.
దయకలిగిన పరలోకపు తండ్రీ, ఈ రాత్రి సజీవులుగా ఉండుటకు మాకిచ్చిన ఆధిఖ్యతను బట్టి మేము కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ఈ రాత్రి ఈ భూమి మీద బాహ్యంగా బలంగా ఉండటానికి దేవుని వాక్యము చదవబడే ఈ బిల్డింగ్లో ఈ భవనములో కూర్చొని ఉండగలుగుచున్నాము.
ఓ శుభప్రధముడైనా విమోచకుడా, మేము నీకు ప్రార్ధన చేస్తున్నాము. మా రక్త సంబందుడవైన విమోచకుడిగా నీ యొక్క రక్తంలో మా పాపాల నుండి మమ్మును కడిగియున్నావు. నీవు ఇంకా ఇప్పుడు యేసుక్రీస్తులో మమ్మును నిందారహితులుగా తండ్రికి సమర్పిస్తున్నావు. ఈ రాత్రికి మీరే వచ్చి వాక్యాన్ని తీసుకొని, మా హృదయాలను తెరువజేయుదురు గాక. అది బోధించబడుచుండగా పరిశుద్ధాత్మ వాక్యాన్ని పట్టుకొని, దానిని ప్రతీ హృదయంలోనికి, నా హృదయంలోనికి జన సమూహముల యొక్క హృదయంలోనికి నేరుగా గురియొద్దకు వెళ్ళును గాక! తండ్రీ, అది మాకు అవసరమైనట్లుగా అది మాకు సరఫరా చేయబడును గాక. ఇంకా ఎవరును వాక్యాన్ని గూర్చి విభేదించకుండు గాక. తండ్రి నడిపింపునకు వ్యతిరేఖముగా ఏ సమయములోనైన సరే నేను ఏదైన చెప్పవలసి వస్తే పరిశుద్దాత్మ నా నోటిని మూయును గాక, ఇది సత్యము అని నేను ఎరగాలని, ఆ తర్వాత దానితో నడవాలని నేను ఆశపడుచున్నాను.
ఈ ఆరాధన గృహములోనికి మేము కూడి యుండగా, మా పాపాలు క్షమించండి. మమ్ములందర్ని దీవించండి. మా పాపములు రక్తం క్రింద ఉంచబడి మా ఆత్మలు సరైన ఆరాధన ధృక్పధంతో ఈ యొక్క సమయములో ఉంచబడును గాక. యేసు నామములో అడుగుచున్నాము ఆమెన్.
3
ఇప్పుడు, ఇక్కడున్న చిన్న కాగితము గూర్చి తలస్తున్నాను. దానికి సంబంధించిన అనేకమైన లేఖనాలు చదవటానికి, ప్రారంభించటానికి నేను వాటిని వ్రాసుకొనియుంచాను. నేను ఇక్కడ లేచి నిలబడినప్పుడు వాటిలో దేనిని చదవాలని నాకనిపించినట్లుగా కనబడుట లేదు. అది సాధారణముగా ఆలాగే వెళ్ళును; నాలుగు లేక ఐదు చిన్న పాఠ్యా౦శముల నుండి ప్రారంభించుకుందాం.
కానీ ఇది ముందుగా చెప్పాలని, లేక చదవాలని నేననుకొనను, మాట్లాడుటకు నేనెన్నడూ ఆలోచన చేయను. ఇది తెలుసా, మీరు చేస్తున్నట్టుగానే ఏమి చెప్పాలో నేనెన్నడూ ఒక్కటి కూడా ఆలోచన చేయను. నేను కేవలము ఆయన కొరకు కనిపెడతాను. నేను దానిని అలా చూచినట్లగానే నేను దానిని సమీపించి అందుకుంటాను. ఇంకా బయటకు అందిస్తాను. కొన్ని కొన్ని సార్లు అది కొంచెము కరుకుగా వినబడవచ్చును. కొన్నిసార్లు అయితే నేను ఆ రీతిగా మాత్రమే పొందుకొంటాను. కనుక ఆ రీతిగానే నేను దానిని బయటకు ఇవ్వగలిగే మార్గము అది ఒక్కటే.
4
ఇప్పుడు, ఈ రాత్రిలో ఈ విషయాలను మరి నన్ను చెప్పనివ్వండి. ఇది ఏ వ్యక్తి యొక్క మతమునకు గానీ, ఏ వ్యక్తికి గానీ, ఎవ్వరిని ఉద్దేశించి చెప్పబడుటలేదు, గమనించండి; కానే కాదు. అలాంటి దానిని మనము నమ్మము, మనము నిజముగా అసలైన అమెరికా వారమని నేను నమ్ముచున్నాను. ప్రతి మనిషి తన సొంత మనస్సాక్షి ప్రేరేపించు రీతితానే దేవునినిని ఆరాధించు ఆధిక్యతను కలిగియుంటున్నాడు. అది ఎల్లప్పుడు ఆ విధముగా ఉండాలనే మనము కోరుచున్నాము. అయితే, ప్రతీ సంఘములో మనకు సిద్ధాంతము ఒకటి యున్నది.
అనేకసార్లు సంస్థల్లో, సంఘ శాఖల్లో వారు ఒక ఆచారాన్ని కలిగియుంటారు. వారు ఆ విధమైన ఆచారము మీద నిలిచియుంటారు. “ఇది మా ఆచారమని” చెబుతారు. ఆ దైవ సేవకుడు ఏమి యోచించినప్పటికి లెక్క కాదు. అతడు ఆచరమునే బోధించవలసినది, కారణము అతడు సంఘ శాఖలో ఉన్నాడు కాబట్టి.
మనకయితే క్రీస్తు తప్ప మనకు ఎలాంటి మూఢ విశ్వాసము లేదు — అదే మన విశ్వాసము; ఇంకా ఏ ధర్మశాస్త్రము లేదు, ప్రేమ తప్ప; ఏ గ్రంథము లేదు, బైబిల్ తప్ప; మరియు క్రీస్తే శిరస్సైయున్నాడు; బైబిల్ మన పాఠ్యపుస్తకము; ప్రపంచం నా་ సువార్త ప్రదేశము [స్పష్టతలేని మాటలు]. కనుక నేను దానిని చూచిన రీతిగానే వినిన రీతిగా భావించి బోధించుటకు నడిపించబడుతున్నానో ఆ విధముగానే బోధించుటకు ఇష్టపడతాను.
5
ఇంకా తరువాత ఈ సమయములో ప్రత్యేకించి, ఈ నిజమైన కరుకైనా, కఠినమైన సువార్తతో కత్తిరించిన భాగమును మాట్లాడుటలో అలా యుంటాను, కాని, మీకు తెలుసా, ఇది తీర్పు గృహము. “దేవుని యొక్క తీర్పు స్థలము (ఎక్కడ?) దేవుని యొక్క గృహములో.” అవును. ఇక్కడే తీర్పు ప్రారంభమవుతుంది. నీవు కోర్టుకు వెల్తే, నీవు పరీక్షలో నీవు నిలవాలంటే వారికక్కడ న్యాయశాస్త్రపు గ్రంథము ఉంటున్నది; మీకు ఎందు నిమిత్తము తీర్పు తీర్చబడుతుందో వారు ఆ న్యాయశాస్త్రపు గ్రంథాన్ని చదివి, అందులో దానిని గూర్చి తెలుసుకోవలసియుంటుంది. దేవుని యొక్క గృహములో కూడా అలాగే యుండును; మనము దేవుని వాక్యము నుండి దానిని తీసుకోవలసివున్నది.
మరియు ఇప్పుడు, అనేకసార్లు, ఈ విషయాలలో — కాబట్టి మీరు తప్పక దీనిని ఇప్పుడు గ్రహించవలసివున్నది — ఏమనగా, నేను పొరపాటు కావచ్చును. నా యొక్క అనువాధము తప్పు కావచ్చు. అయితే నేను దానిని అతి దగ్గరగా చదవటానికి, మరియు అది ఎలాగు చెబితే ఆలాగునే చెప్పుటకు ప్రయత్నం చేస్తాను. అది ఏమని చెప్పుచున్నదో, సరిగ్గా ఆ లేఖనముతోనే నిలిచియుండుము.
6
ఇప్పుడది చాలా హీన స్థితిలో యున్నది. బహుశా, అది దేవుని చిత్తము కాకపోవచ్చును. బహుశా అది దేవుని చిత్తము కావచ్చును. నాకది తెలియదు. ఈ గ్రంథాన్ని వారము తర్వాత వారము నేను తీసికొని ఇక్కడ నిలువగోరుతాను. దానిని గమనించి, నేరుగా తిరిగి దానియేలులోనికి దానిని పట్టుకొని, దానియేలు గ్రంథము మరియు ప్రకటన, మరియు ప్రవక్తలలోనికి దానిని ముడివేయాలి.
దేవుని యొక్క వాక్యము మొత్తము ప్రతీ ఒక ముక్క కలిసి నేరుగా ముడి వేయబడియున్నది. అరవై-ఆరు పుస్తకాలు వందల-వందల సంవత్సరాలు వ్యత్యాసములో అనేక మంది మనుష్యుల చేత వ్రాయబడి యున్నది. దానిలో ఒకటి మరొక దానితో విభేదించదు, ఏ ఒక్కటి వేరు కాదు. వాటిలో ప్రతి ఒక్కటి పరిపూర్ణముగా యున్నది. లోకమందు ఎక్కడా కూడా అలాంటా చిన్న గ్రంథసముదాయములు వ్రాయబడిలేదు.
రెండువేల సంవత్సరముల నుండి వారు పరలోక ప్రార్థన మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాటను దానికి చేర్చాలని, లేక ఒక్క మాటను దాని నుండి తీసివేయాలని దానిని బాగుగా చేయాలని అనుకుంటున్నారు. నీవది చేయలేవు సుమా! అది పరిపూర్ణమైనది. అది దేవుని యొక్క వాక్యమై యుంటున్నది.
బైబిల్ ఆత్మ ప్రేరేపితము చేత వ్రాయబడిన దేవుని వాక్యమని నేను నమ్ముచున్నాను. దానిలో ప్రతీ మాట కూడా ప్రేరేపణ చేత, వ్రాయబడి యున్నది. ఇది ప్రేరేపణలేదు, ఇది ప్రేరేపించబడియున్నది, అది ప్రేరేపించబడినది అనే మాటలు నేను నమ్మను. అదంతా ప్రేరేపించబడినది అని, నేను నమ్ముతాను. అదంతా సరే అయి యుండాలి లేదా తప్పుయైనా అయ్యి ఉండాలి; అదంతా కలగలపు అయినట్లయితే అప్పుడు మనము ఏమేమి చేయాలో మనకు తెలియదు. అయితే దానిలో ప్రతి భాగము సత్యమే. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” కానీ ఇక్కడ వున్న దాని కొరకు ఏ క్షణములోనైనా నేను నా జీవితాన్ని త్యాగము చేయగలుగుతాను.
7
ఇప్పుడు, ఈ కొద్ది రాత్రులు వారు కలిగి యున్నారు. ఆ విధముగా మనము శనివారము రాత్రి ఆరాధన జరుపుకొనబోచున్నాము. అదే రీతిగా ముందుకు సాగుచున్నాము.
సంఘములోని కొందరు ప్రజలు ఆదివారము ఉదయమున మందిరానికి వచ్చుటకు అది మురికిగా ఉందంటారు, మరియు వారిలో కొందరన్నారు, శనివారము రాత్రికి కూటాలు అయిన తరువాత మందిరములో యుండి మందిరాన్ని పరిశుభ్రము చేయటానికి సహాయపడితే, ఆదివారము ఉదయమున ప్రజలు రానవసరము లేదని అన్నారు. వారు ఆదివారము పనిచేయడం అవసరము లేదు మందిరములో ఇది అది బిగించనవసరము లేదు. నేను సబ్బాతు అనుసరించువాడను కాను, అయితే నేను సమీపించగలినంతగా ఆరాధనను గౌరవిస్తాను.
8
శనివారము రాత్రికి మనము ఏమి మాట్లాడకొనబోవుచున్నామో ప్రభువు చిత్తమైతే బహుశా, రేపు రాత్రికి దానిని ప్రకటన చేస్తాననుకొనుచున్నాను.
ఈ రాత్రికి మన అంశము: మృగము యొక్క ముద్ర. రేపు రాత్రి యొక్క అంశము: దేవుని యొక్క ముద్ర. ఈ దినాన రెండూ అతి ప్రాముఖ్యమైన అంశాలను మాట్లాడవలసి యుంటుందని నేను తలస్తున్నాను, ఎందుకనగా మనము దేవుని యొక్క పరిశోధనా తీర్పు సమయములో జీవిస్తున్నాము. మనము అదే దినాలలో జీవిస్తున్నామని నేను నమ్ముచున్నాను. మనము విరోధించే వారిగా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. మూఢ భక్తి గలవారివలె మనము ఉండకూడదు. బైబిల్ ఇక్కడ మాట్లాడుచున్నట్లుగానే, స్థిరబుద్ధితోనే కేవలము స్థిరబుద్ధితోనే మనము దానిని సమీపింపగోరుచున్నాము, అవును, అది పరిపూర్ణమైనది.
9
ఇప్పుడు ఇది చేయుటలో నేటి రోజులలో అనేకమంది ప్రజలు మృగము యొక్క ముద్రను గూర్చి మాట్లాడుతుంటారు. చాలా కాలమున మీరు దానిని వినియున్నారు: “ఏంటది? దానిని ఎవ్వరు చేశారు? ఎవ్వరు దానిని పొందబోవుచున్నారు? వారు దానిని కలిగియున్నట్లయితే, అది వారికి ఏమి చేయబోవుచున్నది. ఏంటది? అది నీకు హాని చేస్తుందా? దానికేదైనా హాని ఉన్నదా?”
కనుక ఇప్పుడు మనము దేవుని వాక్యము నుండి కనగొనబోచున్నాము. మొట్టమొదటి విషయము: బైబిల్లో మృగం యొక్క ముద్ర గురించి మాట్లాడియున్నట్లయితే. ఆ తరువాత విషయం: అది ఏ యుగానికి సంబంధిస్తుంది. ఇంకా దానిని పొందబోయే ప్రజలు ఎవరు? నీవు ఏమి చేయాలి? నీవు దానిని పొందగలవా? ఇంకా దానిని ఎరుగకపోవచ్చును. అలాంటిది, అలాంటి ప్రశ్నలున్నవి, కనుక నాకు తెలిసినంత వరకు ఈ రెండు అంశాలు బైబిల్లో అతి ప్రాముఖ్యమైన అంశాలని నేను ఊహిస్తున్నాను. ఒకటి మృగము యొక్క ముద్ర, రెండవది దేవుని యొక్క ముద్ర.
10
ఇప్పుడు, మొదటిగా, మీకు చూపించుట కొరకే నా దగ్గర ఒక లేఖనము ఉన్నది. నేను దానిని వ్రాసియుంచాను. కాబట్టి దానివైపు నేను తిరుగగలను. ప్రారంభించడానికి మృగము యొక్క ముద్ర అనగా ఏమిటో మనము చూద్దాము. “ఈ ముద్రను కలిగియుండుట అనేది ప్రమాదకరము? కాదంటారా?” ఇప్పుడు, ప్రకటన గ్రంథము 14వ అధ్యాము 9వ వచనము, అది మూడవ దూత యొక్క వర్తమానము. ఇప్పుడు, ఏ బైబిల్ పండితుడైనా సరే....
సహోదరుడు స్టాన్లీని నేను ఇక్కడ చూస్తున్నాను. ఇంకా ఇద్దరు లేక ముగ్గురు దైవసేవకులు ప్రస్తుతం ఇక్కడ కూర్చొనియున్నారు. నిన్న సాయంకాలం లూయిస్-విల్లోని బాప్టిస్టు మిషనరీ నుండి వచ్చిన కొందరు సహోదరులు ఇక్కడ ఉన్నారు. బహుశా ఈ రాత్రికి మరికొందరు ఇక్కడ ఉండవచ్చునని నాకు తెలియునది. బహుశా మెథలిస్టు, బాప్టిస్టు, క్యాథలిక్కు మరియు శాస్త్రసమ్మతమైన యూదులు అక్కడ ఉండవచ్చును. నాకు తెలియదు. కాని అది కాదు...
ఇది ఎవరి భావాలను గాయపరచుటకు కాదు; ఏ మాత్రము కాదు. అది కేవలము బైబిల్లో వ్రాయబడిన విధముగా దానిని చదవటం మరియు మీకై-మీరే దానిపైపు చూడటము మన మాటలను బట్టి ఆయన మనకు తీర్పు వచ్చునని ఎరిగిన వారమై దేవుని యందలి భయముతో దానిని చేయాలో మనము ఎరిగినట్లుగా దానిని మనము బుద్ధిపూర్వకముగా మనము సమీపిద్దాము. ఆ తీర్పు దినాన మన మాటలు మనలను దీవిస్తున్నవి, లేక దోషిగా నిరూపిస్తాయి.
11
ఇంకా నేనేదైన యెరిగియుండి దానిని దాచుకొన్నట్లయితే అప్పుడు తీర్పు దినాన నేను దానిని చెల్లించునట్లు దేవుడు చేయబోచున్నాడు; అప్పుడు ఆ ఆత్మలు తమ చేతులెత్తి సహోదరడా బ్రెన్హాం కేవలము మీకు చెప్పియున్నట్లయితే, ఇది ఈ దినాన ఈ స్థితిలో ఉండేవారము కాదు కదా,“ అని అంటారు.
ఆ కాలపు పౌలు వలె నేను నిలబడగోరుచున్నాను, “ఎవ్వరి రక్తము విషయమై నేను దోషిని కాదు అని అనడానికి. ఎందుకనగా దేవుని చిత్తానంతా మీకు వివరించకుండా నేను తప్పించుకోలేదు.” అది నిజం. దానిని నేను చూచియున్నట్లుగానే; మరియు అది తప్పైయున్నట్లయితే, అప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. ఇవి ఏనాడు కూడా ఏ సెమినెరీకి వెళ్ళుట ద్వారా, ఏ పాఠశాలకు వెళ్ళుట ద్వారా నాకు తెలియబడుట లేదు. దాని గూర్చి ఎన్నడూ ఎవరు ఏ మాటైనా వారి మాటను నేను తీసికొనలేదు. ప్రార్ధన ద్వారా నేరుగా నేను బైబిల్లోనికి నేను వెళ్ళాను. అది పరిశుద్దాత్మ ద్వారా దైవ సమ్మతముగా బయలు పరచబడినది. అదే దేవుని యొక్క దూత దర్శనములో చూపిస్తూ, రోగులకు స్వస్థత అలాంటి వాటిని గూర్చి నన్ను నడిపించారు. కనుక అది సత్యమో, కాదో దాని ద్వారా నీవు తీర్పు చేయవచ్చును.
12
సరే, ఇప్పుడది ప్రపంచానికి మూడవ దూత వర్తమానము అదేమిటో తెలుసా? మూడవ దూత వర్తమానము అది ఇప్పుడు ఈ దినానికి బయలువెళ్ళుచున్నది. మీరు బైబిల్ చదువరులైతే ఇది ఎరుగుచున్న మూడవ దూత వర్తమానము.
దానిని మూడు శ్రమలు వెంబడించినవి. మొదటిగా మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినవి. రెండవది రెండవ ప్రపంచ యుద్ధములో జరిగినవి. చూడండి, ఇప్పుడు మనము దేనిలోనికి వెళ్తున్నాము? మంచిది. మనము మార్గము యొక్క చివరిలో యున్నాము.
మనము లేఖనాన్ని చదువక ముందు ఇప్పుడు మనము దానిని మనస్సులోనికి తీసుకొందాము. మనము అంత్య యుగానికి బద్దులమైయున్నాము. ఎంత కాలము? ఎంత కాలమని నాకు తెలియదు; ఎవ్వరికిని తెలియదు.
13
అయితే చూడండి, చరిత్రాత్మకముగా మాట్లాడు దానిని మనము తీసుకొందాము. మొట్టమొదటి రెండువేల సంవత్సరాలకు ప్రపంచ క్రమము ఆ దశకు వచ్చినప్పుడు దేవుడు లోకాన్ని నీళ్ళతో నాశనము చేశాడు. అది మీకు తెలుసా? అటు తరువాత అది నూతన ప్రపంచముగా ముందుకు వచ్చినది. ఆ తర్వాత రెండువేల సంవత్సరాలకు మరలా దానిని అంతమునకు చేరుకున్నది. దేవుడు యేసును పంపించాడు. అవునా? తర్వాత “రెండువేల సంవత్సరాలకిది ముంగింపు అయియున్నది.” 1954 మరియు సువార్త పని తక్కువగా చేయబడుచున్నది (దేని కొరకు?). యేసు చెప్పెను, “ఎన్నుకొనబడిన వారి కొరకు, అయినట్లయితే ఏ శరీరము రక్షింపబడడు.” అది ఎంతో దుష్టత్వములతో ఉంటున్నది. కనుక మనము కడవరి కాలములో ఉన్నాము. తరువాత ఏడవది వెయ్యేండ్ల పాలనకు మాదిరిగా ఉన్నది.
14
దేవుడు ఆరువేల సంత్సరాలు పని చేసినట్లుగా అది మనకు తెలుసు. “వెయ్యి సంవత్సరాలు పరలోకములో ఒక దినము.” భూమి మీద వెయ్యి సంవత్సరములు, (II పేతురు, చూశారా.) ఇప్పుడు, దేవుడు లోకమును ఆరువేల సంవత్సరాలలో నిర్మించాడు. ఇప్పుడు, సంఘము ఆరువేల సంవత్సరములు పాపమునకు వ్యతిరేకముగా శ్రమపడినది. ఏడువేల సంవత్సరములలో దేవుడు విశ్రాంతికి వెళతాడు. ఏడవ దినమున విశ్రమించాడు, అది ఇప్పుడు వెయ్యేండ్ల పాలనకు మాదిరికరముగా యున్నది. సంఘము, భూమి మీద నివసి౦చుటకు, ఇక్కడే, శరీర రూపములో, వెయ్యి సంవత్సరములు; ఏటువంటి రోగము, దుఃఖము, అలసట, లేక మరణము లేకుండా. అతి గొప్ప బంగారు యుగము రాబోచున్నది, అన్నియు అందుకొరకై.
ఓ, పాటను నేను ఇష్టపడతాను. “మధరమైన ఆ విడుదల దినము కొరకు భూమి మూలుగుతూ కేక పెడుచూయున్నది. భూమి పైకి యేసు మరలా వచ్చినప్పుడు.” నేనది ప్రేమిస్తున్నాను. “ఈ చీకటి లోకము యొక్క పాపము, దుఃఖము, బాధ, మరణము ఆగిపోతున్నది, వెయ్యేండ్లు మహిమ గల యేసుతో సమాధానముతో ఉంటాము.” బైబిల్ చెప్పుచున్నది, వారు వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసిరి, ఒక మిలీనియం.
ఇప్పుడు, ఈ మూడవ దూత వర్తమానము ప్రభువు రాకడకు ముందు, ఈ ముద్ర మరియు గురుతు వేయబడునప్పుడు, ఇప్పుడు అది ఒక గొప్ప సమకూర్చుట అయి యుంటున్నది.
15
సమకూర్చుట: పశ్చిమాన పశువులను తోలుకొని, మేపడానికి బయటకు వెళ్ళేటప్పుడు, నేను చిన్నవానిగా యున్నప్పటి నుంచి నేను చిన్నవానిగా యున్నప్పుడు, పశువులను తోలుకొని వెళ్ళేవాడను. వసంత కాలమున పశువులను సమకూర్చటానికి ఆకు రాలే కాలమున పశువులను సమకూర్చటానికి నేను బయటకు వెళ్ళేవాడిని కొండలలోనికి వెళ్ళి ఆ పశువులను క్రిందకు త్రోలే వారము. మేము ఆ పశువులన్నిటిని ఒక చోటకు చేర్చిన తరువాత, ప్రతీ స్థలములో వాటిని తీసుకొని, అప్పుడు మాకు చెందని వాటినన్నింటని బయటకు వేరు చేసేవారము. అవి మావే అయితే వాత కలిగి వుండేవి. అవి వాత వేయబడియున్నవి. వాత గురుతుగా వేయబడియున్నది.
ఎప్పుడైనా మీరు ఈ పశువులను వాత వేయుట మీరు ఎప్పుడైనా చూశారా? పశువులకు, మీరు వాత వేయడ౦ గమణించతగిన విషయమే. అవును. చూస్తే నేను జాలిపడేవాడను మీరు పశువులను వాత వేయడం ప్రారంభించినప్పుడు, అది భయంకరముగా, అసహ్యపడు గందరగోళముగా వుండును. ఆ వాత వేయడానికి ఇనుప ముక్కను పట్టుకొని, దానిని వేడిచేయడం నా పని. ఆ పై దవడను దాని కళ్ళను కట్టివేసి, అక్కడ దానిని పండుకొనబెట్టి, దాని మీద ఆ వాతను పెట్టాలి. దాని వెంట్రుకలు, మాంసము మాడిపోవును. దాని మీద కొద్దిగా తారు వేసి ఆ పశువులకు వేస్తాము. ఇప్పుడది ఎలా వెళుతుందో చూడాలి, అది నిజముగా పరుగు తీయును. అయితే గమనించండి, అది వాత వేయబడినది.
అలాగే దేవుడు కూడా మనకు చేస్తాడు. అప్పుడప్పుడు నీవు కూడా కళ్ళు చేతులు కట్టివేయబడినట్లుగా బలిపీఠము నొద్దకు దిగాలి. అయితే సోదరుడా, పరిశుద్ధాత్మ నీ మీద ఎన్నడైన వాత వేసినట్లయితే నీవు కొంత పరుగెట్టడం, కేకలు వేయడం చేయవచ్చు, కాని నీవు ముద్ర వేయబడ్డావు. అది యదార్థము. నీవు అక్కడే ఉన్నావు. యజమానుడు దగ్గరకు వచ్చినప్పుడు, నీవు ఎవరికి చెందినవాడవో ఆయన ఎరుగును. అయితే దొడ్డిలో నుండి తప్పిపోయి తిరుగుతున్న సంవత్సరపు పిల్ల నిందించబడిన ఆ పశువు తిరిగి పల్లెటూరులో నివాసము చేయు వాటి మధ్యకు వస్తుంది.
ఇప్పుడు, వాత వేయబడు సమయము. అక్కడ ఇద్దరు స్వారీ చేయబోవువారు ఉండబోచున్నారు, అది దేవుడు మరియు సాతాను. సాతాను తనవారిని తీసుకోవడానికి, మరియు దేవుడు తనవారిని తీసికోవడానికై. ఈ రాత్రికి మనము ఎవ్వరు సాతాను ముద్ర ధరించబోతున్నారో మనము చూద్దాము, మరియు రేపు రాత్రికి దేవుని యొక్క వాక్యము ప్రకారము ఎవ్వరు దేవుని ముద్ర ధరించబోవుచున్నారో చూద్దాము.
16
ఇప్పుడు, దేవదూత వర్తమానములోకి: 14వ అధ్యాయము 9వ వచనము. మరికొన్ని లేఖనములు ఇక్కడ చదువండి, నేను దానిని వ్రాసియుంచాను.
మరియు వేరొక దూత... అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి, గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను. ఈ క్రూరమృగమునకు గానీ, దాని ప్రతిమకు గానీ, ఎవ్వడైనను నమస్కారము చేసి, తన నొసటియందేమి, చేతిమీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన యెడల,
ఏమియు కలపకు౦డా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొర్రెపిల్ల యెదుటను అగ్నిబందకముల చేత వాడు బంధింపబడను,
నిజముగా మనము దానితో చేయునది ఏమి లేదు! చూడండి.
వారి భాదసంబంధమైన పొగ యుగయుగములు లేచెను. ఆ క్రూరమృగమునకు గాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారు దాని పేరుగల ముద్రను ఎవ్వడైనను వేయించుకొనిన యెడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారైయుందురు.
దానితో నేనే ఏమియు చేయగోరను. నాకు నిశ్చయత ఉన్నది. అవును. తరువాత వచనమునకు రండి. నేను దానివైపు చూస్తూ ఉండగా
దేవుని ఆజ్ఞలను యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసమును గైనుకొనుచున్న పరిశుద్దుల ఓర్పు ఇందులో కనబడును.
ఇప్పుడు 15వ అధ్యాయము 2వ వచనము వినండి.
ఇప్పుడు మనము, ప్రక, 14వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుచుంటిమి. ఇప్పుడు 16వ అధ్యాయము 2వ వచనము.
అంతట మొదట దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా, ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను.
16వ అధ్యాయము 2వ వచనము.
భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తిల్లిరి.
ఒక్క క్షణము నన్ను మన్నించండి. ఒక్కసారిగా రెండు లేఖనాల వైపు నేను తప్పక తిరగాలి. సరే. ఇప్పుడు, ప్రక, 20వ అధ్యాయము 4వ వచనము. అవును, ఇక్కడే మనమున్నాము.
అంతట సింహాసనములను చూచితిని వాటిమీద అసినులైయున్న వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైననూ నమస్కారము చేయక, తమ నొసళ్ళయందుగాని, చేతులయందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్చేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి.
17
నీవు మృగము ముద్రను పొందలేవు, అప్పుడు క్రీస్తును ఆరాధించిన ఆయనతో ఉండనులేవు. “అయితే ఎవ్వరైతే మృగమును గానీ దాని ప్రతిమను గానీ ఆరాధిస్తారో, వారు దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధ దూతలు యెదుట వారు బాధింపబడతారు.” దానిని గూర్చి ప్రభువు చెప్పినది అదే.
18
ఇప్పుడు, మనము ప్రారంభించబోచున్నాము. ఇప్పుడు ప్రకటన 13వ అధ్యాయము వైపు తిరగండి. కొన్నిక్షణాలలో ప్రారంభిద్దాము. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. బహు జాగ్రత్తగా వినండి.
మొట్టమొదటిగా నిన్న రాత్రి నుండి మనము మన అంశమును తీసుకోవాలి. గతరాత్రి మనము సంఘ కాలాల మీద తీసుకొన్నాము. ఎట్ల యేసు తన సంఘములో నిలబడియుండుట, “ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహములు వలె యుండటము” మనము చూశాము. ఆయన తన వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవైవుండెను. ఆయన కన్నులు అగ్ని జ్వాలలవలె ఉండెను.
గుర్తుంచుకొనండి, ప్రకటన అంతా కూడా ఒక దర్శనమునైయున్నది. మరియు ఒక సూచనయై యుంటున్నది. దానంతటికి అర్థం ఒకటి ఉన్నది కాబట్టి - నీవు దానిని జాగ్రత్తగా గమనించాలి. ప్రవక్తను చదవండి - చిహ్నములు లేక సూచనల భావమేమిటో చూడండి. ఆ తర్వాత దానిని ఇక్కడ పోల్చి చూడండి అట్లు చిహ్నము యొక్క బావము నిజముగా ఏమిటో తెలుసుకుంటావు.
“అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగియుండెను,” భూమియందట ఇటు అటు తిరుగుచున్నవి. మరియు ఆ అగ్ని జ్వాలలు “ఖడ్గము వలె ఉండుట మనము చూస్తున్నాము. ఆయన నోట నుండి ఒక ఖడ్గము బయలు వెళ్ళెను. అది రెండంచుల గల వాడియైన ఖడ్గము.” అది దేవుని యొక్క వాక్యమని, అది సంఘము నోట నుండి బయలు వెళ్ళునని మనము కనుగొంటున్నాము. “అది చిట్టచివరకు ఎముక యొక్క మూలుగు మట్టుకు కోయుచూ, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నది.” హెబ్రీయులు 4వ అధ్యాయము.
19
సంఘము తన సౌందర్యముతో అక్కడ నిలబడుచున్నది. దానిని మనమలా చూస్తున్నాము. సరిగ్గా దానిలోకి క్రీస్తు ఆమెను పూతపూశాడు. ఇంకా సంఘము తనపై తెల్లని వస్త్రములు ధరించుకొనియున్నది. మీరు గమనిస్తున్నారా, అది స్త్రీయైయున్నది. “రొమ్ము చుట్టూ” ధరించియున్నది. ఆమె సిగ్గుపైన వస్త్రము ధరించియున్నది. (కప్పబడి యున్నది). ఆమె “బంగారు దట్టీని” కలిగియున్నది. అది చుట్టూ లాగబడి, రొమ్ము చుట్టూరా పట్టుకొనియున్నది. “తెల్లనివిగా” ఉన్నది. అది క్రీస్తు యొక్క నీతిని గూర్చి మాట్లాడుచున్నది; మరియు “బంగారు దట్టీ” సువార్తను సూచిస్తున్నది. సువార్త ప్రకటన సంఘము మీదకు పరిశుద్ధాత్మను దేవుని యొక్క నీతిని తెస్తున్నది; దానిని అక్కడ పట్టుకొనియున్నది, త్రాళ్ళతో కట్టబడి ఉన్నది, అది నడుమును బిగించియుంచే త్రాడు అది.
అటు తరువాత ఆయన దీని మీద నిలబడియున్నాడు “అపరంజి వంటి పాదముల మీద అవి కొలిమిలో కాల్చబడి ఉన్నవి.” “అపరంజి” దైవీక తీర్పును గూర్చి మాట్లాడుచున్నది. దేవుడు తాను తీసుకున్న గొప్ప ప్రమాణమును శాంతింప చేయడానికి క్రీస్తును పంపియున్నాడు, మరియు క్రీస్తు దైవీక తీర్పును చెల్లించియున్నాడు. అప్పుడు, సంఘము దేవుని తీర్చు మీద ఆధారపడియున్నాది. క్రీస్తు దాని స్థానములో నిలబడి ఉన్నాడు. ఎంతటి అందమైన సాధృశ్యము అది: ఆయన ఏడు దీపస్తంభముల మధ్య నిలబడియున్నాడు!“
20
ఆ తరువాత మొదటి సంఘకాలము వారు దేనిని కలిగియున్నారో మనము చూశాము. గతరాత్రి మీరు ఎంతమంది యున్నారు? మీ చేతులు చూపించండి. మంచిది, అది సరి. మొదటి సంఘకాలము, ఎఫెసి సంఘకాలమని మనము చూస్తున్నాము. వారు పరిశుద్దాత్మ బాప్తిస్మము కలిగియున్నారని మనము చూస్తున్నాము. నీళ్ళలో ప్రజలకు వారు బాప్తిస్మము ఇచ్చారు, వారు అన్నింటిని కలిగి యున్నారు... అన్ని విధములైన సూచక క్రియలను, అద్భుతాలను విశ్వాసిని వెంబడించవలసియున్నది.
మరలా అది సంఘకాలాలు కాంతి విహీనం కావడము ప్రారంభమైనది. రెండవ కదలిక, మూడవ కదలిక, ఆ తరువాత చీకటి యుగము గుండా లేక కాలము గుండా తప్పుడు నామముతో తప్పుడు బాప్తిస్మముతో బయటకు వచ్చారు. వారు నీటియు మరియు పరిశుద్ధాత్మ రెండింటిని కూడా తరువాత వారు క్రిందకు వచ్చేశారు. ఆ తరువాత కాలములోనికి అక్కడ వారు కొంచం వెలిగించబడ్డారు. ఆ తరువాత ఫిలడెల్ఫియా సంఘకాలానికి, లవొదికయ సంఘకాలానికి మధ్యలో తెరవబడుటకు అక్కడ ద్వారము ఉంచబడియున్నది. తరువాత లవొదికయు నులివెచ్చనదిగా మారి, చిట్టచివరకు దేవుడు తన నోటి నుండి ఉమ్మివేసే వరకు వాటన్నిటిలో నుండి నేరుగా బయటకు వెళ్ళిపోయినది. అది యధార్ధము. అది లేఖనమైయున్నది.
21
ప్రతి యొక్క చరిత్రకారుడు మరియు ప్రతి ప్రమాణికమైన ప్రతి విశ్వాసి ఆ యేడు సంఘకాలాలు.... లేదా, ఆ యేడు సువర్ణ దీప స్తంభములను ఎరుగుదురు, బైబిల్ చెప్పినట్లు గానే ఎరుగుదురు. అవి ఏడు సంఘకాలాలై అయియున్నవి. పాత నిబంధన ఎలాగో ఇక్కడ క్రొత్త నిబంధన పోల్చినట్లుగా ఉన్నది, అలాగే అది బయటకు వెళ్ళిపోయినది.
యూదులు తిరిగి వారు ప్రత్యేకించకముందు లేక మరొక చోటకు రాకముందు అన్యులకాల ముగింపునకు ముందుగా అక్కడ ఒక గొప్ప కదలిక జరుగుటము అనేది ఒక ఉజ్జీవమనేది ఉండవలసియున్నది.
గుర్తుంచుకొనండి, అన్యులు మాత్రమే కృపాకాలానికి పరిమితమైనవారు. బైబిల్ చెప్పుచున్నది, వారు యెరూషలేము గోడలను ముక్కలుగా తెగ్గొడతారని, యేసు చెప్పెను, అన్యుల కాలము సంపూర్ణమగు వరకు. అది నిజము. అది ముగించబడటానికి నిర్ణీతమైన సమయము ఉంచబడియున్నది.
22
వారు ఆ విధముగా చేసిన కార్యాలు మనము చూశాము. అద్భుతాలు, సూచకక్రియలు, వారిని వెంబడించునట్లుగా మనము చూస్తున్నాము. క్రీస్తు వారికి ఎలాగు చెప్పాడో, అది ఎంత అద్భుతముగా యున్నదో, ఎలా ఉన్నదో మనము చూస్తున్నాము. ఆ తరువాత వెలుగు కాంతి వీహీనమైపోయి, విహీనమైపోయి అలా ప్రారంభించడమై పోయినది, చిట్టచివరకు వెళ్ళిపోయినది. ఆ తరువాత ముగింపు నొద్ద మరియొక ద్వారము తెరువబడుటకు సంఘమునకు వున్నది. ఇప్పుడు, అందులోకి వెళ్ళక ముందు మనము అక్కడే ఆగుదాము. గమనించండి, నా మనస్సులోకి వచ్చిన మరొక ప్రవచనాన్ని మనము తీసుకొందాము. ప్రవక్త చెప్పెను, “ఆ దినము ప్రత్యేక దినముగా ఉండునది, అది, పగలు కాదు - రాత్రి కాదు.”
(నేనెక్కువ బిగ్గరగా మాట్లాడుచున్నానా? అలా బిగ్గరగా యున్నట్లయితే, మీరు దానిని కొంచెము క్రిందకు త్రిప్పండి. నాకది తెలుసు. శబ్దము తిరిగి పైకి ఎగురుతున్నది. ఆ కారణం చేత నేను కొంచెము బిగ్గరగా మాట్లాడుచున్నాను. ఆ రీతిగా వెనుక వున్న ప్రజలు నిశ్చయముగా వినగలుగుతారు, ఎందుకనగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం.)
ప్రవక్త చెప్పెను, “ఒక దినము ఒక సమయములు ఉంటుందని, అది పగలు కాదు - రాత్రి కాదు.” ఇంకొక మాటలో అది వెలుగుగా యుంటుంది, కాని మబ్బుగా ఉంటుంది, గమనిస్తున్నారా, ఒక మబ్బుగా వున్నరోజు అది. “అయితే సాయంకాలమున వెలుగు కలుగును.” ఎంతటి అందమైన దృశ్యమది.
23
ఇప్పుడు, మబ్బుగా వున్న దినము, తెల్లవారుచున్నప్పుడు దాని యొక్క భావము అక్కడ యుద్దాలు వున్నవి, బాధలు ఉన్నవి, మరియు ఎత్తు - పల్లాలు ఉన్నవి, కాలాలు ఉన్నవి, సంఘములు ఉన్నవి, వాదములు ఉన్నవి, మరియు సమస్తము ఉన్నవి. అది వెలుగు కాదు లేదా చీకటి కాదు. అది దేవుడున్న సమయము అని మనకు తెలుసు అక్కడ సువార్త ఉన్నది. అయితే కేవలము వారు దాని గుండా చూడలేదు. నా భావమేమిటో మీకు అర్థమవుచున్నదా. బైబిలు చెప్పెను, “ఆ వెనుక పెంతెకోస్తునాడు వారు దాన్ని చేశారు, అది సంఘకాలాలలో వారు వాటిని చేశారు, వారు అద్భుతాలు, సూచక క్రియలు కలిగియున్నారు, కాని మా సంఘము దాన్ని బోధించదు అని చెబుతారు.” చూచారా, అది మబ్బుగా ఉన్నది, పగలు కాదు - రాత్రి కాదు. “అయినప్పటికి, ఇంకా మనము యేసుక్రీస్తునందు విశ్వాసముంచుచున్నాము. మనము ఆయన రెండవ రాకడను నమ్ముచున్నాము, మరియు ఆయన వచ్చుచున్నాడని మనకు తెలుసు.”
“పగలు కాదు - రాత్రి కాదు,” అని బైబిల్ చెప్పెను. నీవు దానిని పగలుగా పిలువలేవు, నీవు రాత్రిగా పిలువలేవు. అయితే గమనించండి, “సాయంకాలమున వెలుగు కలుగును.” సాయంకాలమున!
24
ఈ గ్రంథము ఒక తూర్పువారి గ్రంధమై అయియున్నది - బైబిల్. ఆది సంఘము మీద మొదట వెలుగు ఉదయించినప్పుడు, అనగా, ఎఫెసు నొద్ద ఏమి జరిగిందో మనము చూశాము, యేసుక్రీస్తు ద్వారా దేవుని వెలుగు, పరిశుద్దాత్మ మొదటి కుమ్మరింపు; అది ప్రపంచమంతటికీ వెలుగునిచ్చినది, మరియు బైబిల్లో వ్రాసినది. అది నిజమేనా?
ఇప్పుడు, ఇక్కడ పశ్చిమ ప్రపంచము మీద, ఆయన వాగ్దానం చేశాడు — సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది కృపాయుగం యొక్క ప్రారంభము — పశ్చిమాన, ఆ ప్రజల మీద సూర్యుడు ఇప్పుడు అస్తమిస్తున్నాడు. మనము పశ్చిమ ప్రాంత వాసులమై ఉంటున్నాము. సాయంకాలము అక్కడ ఒక ఉజ్జీవము ఉండునని, అక్కడ వెలుగు ఉండునని ఆయన వాగ్దానము చేశాడు. మనము ఇక్కడే ఉన్నాము. వెలుగు ప్రకాశిస్తుంది, “చీకటి దానిని గ్రహింపకుండును.” అది అంతే. “అయితే మనుష్యులు మంచి కార్యముల కంటె బాగా చెడ్డ కార్యములనే ప్రేమిస్తుంటారు.”
ఇదిగో ఉపరితలం మీద దూరముగా పడుటకు అది స్థిరపరచబడివున్నది. ఎంతటి చిన్న వెలుగును మనము కలిగియున్నామో, దానినే మనము పట్టుకొందాము. చూడండి, అది ఇదే సూర్యుడు యూదుల మీద ఉదయించాడు, ఇప్పుడు అన్యుల మీద అస్తమిస్తున్నాడు. అన్ని యూగాల గుండా, ఈ రెండువేల సంవత్సరాల గుండా, వారు దీనిని కలిగియున్నారు, మరియు సంస్థలు మరియు కాలాలు, మరియు దీనిని గజిబిజి చేయుచున్నారు. కలిగియున్నారు. ప్రజలు ఎక్కడ నిలబడి యున్నారో వారికే తెలియదు.
25
అయితే బైబిల్ వాగ్దానం చేస్తున్నది (దేవుడు, ప్రవక్త ద్వారా దానిని తెలియజేశాడు) సాయంకాలమున వెలుగు కలుగును. “అది సాయంకాలమున వెలుగు కలుగును.” మనము ఇక్కడే యున్నామని నేను నమ్ముచున్నాను. సూర్యుడు అస్తమిస్తునప్పుడు. సృష్టి యావత్తు ఆ దినము కొరకు ములుగుచున్నది, మొర్రపెట్టుచున్నది. గమనించండి.
26
మొదటి సంఘకాలములో వారు ఏమి కలిగియున్నారంటే, భిన్నమైన సిద్దాంతాన్ని కలిగియున్నారని మనము కనుగొనియున్నాము. మొదటి సంగతి అది కొన్ని క్రియలుగా మారినవి. “నికొలాయితుల క్రియలను నేను ద్వేషిస్తున్నానని,” ఆయన చెప్పుచున్నాడు.
నికొయిలాతుల క్రియలనగా ఏమిటి అని నేను ఆశ్చర్యపడ్డాను. చరిత్ర ద్వారా చూశాను. అది ఎవ్వరూ ఎరుగరు. అది ఒక సిద్ధాంతమైవుంటున్నది. నికోలాయిస్ అనే మానవుని ద్వారా అది ప్రారంభించబడినది. అతడు అపోస్తులలో ఒకటిగా ఉండవలసినవాడు కానీ, ఒక రీతిగా అతడు తప్పిపోయాడు. ఒక సిద్ధాంతాన్ని లేక అలాంటి దానిని అతడు ఏర్పరచాడు. మరియు అక్కడ నుండి నికోలాయితులు ప్రారంభమైనవి. ప్రథముగా, అవి క్రియలు. ఎఫెసులో యున్న ఆ క్రియలే ఆ తర్వాత సంఘ కాలములో ఒక “సిద్ధాంతముగా” మారినవి. ఆ తరువాత హి౦స యొక్క చీకటి కాలములోనికి వెళ్ళిపోయినవి.
ఇప్పుడు, మొదటి సంఘకాలములో ప్రారంభమైన ఆ నికోలయితుల బోధనలే మొదటి మూడు లేక నాలుగు సార్లు అపోస్తులుల తరువాత అది ఒక క్రియగా మారిపోయినది. “మంచిది, ఇది ఈలాగు ఉంటుంది” అని వారు ఆలోచించుట ప్రారంభించారు. ఇప్పుడు, బైబిల్ చదివే మీరు అది ఎలాగు బయటకు వచ్చినదో మీరు ఎరుగుతారు.
27
ఇప్పుడు, అది క్రీ.శ. 600 సంవత్సరాలలో ప్రాంభించబడినది, లేక 306 సంవత్సరాలు, దానిని వారు కాన్స్టాంటన్ యొక్క మార్పు అని పిలుస్తారు. అతడు ఎన్నడూ మార్పు చెందినవాడు కాడు. ఒక మనిషి చేసే ఎన్నో మురికి పనులు అతడు చేశాడు, అతడు మార్పు చెందలేదు. అది నిజం. ఏ మతానికైనా వారు చేసినట్లుగానే అతడు ఎన్నడైనా చేసిన పని ఏదనగా అతడు సెయింట్ సోఫియా గుడి మీద సిలువను వేయడం మాత్రమే. పరలోకానికి వెళ్ళటానికి అది ఏదైనా చేయునా? మంచిది. తాను క్రైస్తవులతో, తాను యుద్దములో జయం పొందితే, క్రైస్తవుడును అవుతాను, అని చెప్పెను. వారు ప్రార్ధన చేశారు, అతడు వెళ్ళి యుద్ధములో జయము పొందాడు; అతడు తిరిగి వచ్చి మరియు అన్నాడు. “సరే, ఇప్పుడు నేను సంఘములో చేరతాను.” ఆ రోజు వున్నటువంటి అందమైన నులివెచ్చని సంఘ సభ్యుడు. ఏదో గుడి మీద సిలువను పెట్టడము.
అతడు మరణం తర్వాత.... అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు; కాన్స్టాంటెన్, కాన్స్టటియస్, కాన్స్టెంట్నోఫెల్. దానిని తూర్పు, పశ్చిమ రోమ్లు చేయుటకు ప్రారంభమై వారు విడిపోయారు. దానిలోని, ఆ తరువాత ఆ కాలములో అది తూర్పు సామ్రాజ్యముగా మారిపోయినది.
ఆ తరువాత అపొస్తులులు రెండవ చుట్టూ, మూడవ చుట్టూ, నాల్గవ చుట్టుకు వచ్చేసరికి, అప్పుడు మొదట జరిగిన విషయము ఏమిటో తెలుసా... వారిలో ఒకరి మధ్య ఒకరికి గడబిడలు ఏర్పరచబడినవి. ఒక వాగ్వాధముగా వారు విడిపోయారు.
28
ప్రతి యొక్కరూ... మీరు ఒక సంఘమును తీసుకొండి: వెస్లియన్ మెథడిస్తు సంఘము శక్తులలో వున్నప్పుడు, జాన్ వెస్లీ అక్కడ ఉన్నప్పుడు ఆమె శక్తిలో ఉన్నది. వారి దినమున లూథరన్లు; మరియు ప్రతి యొక్కరూ అలాగే ఉన్నారు. అయితే ఒక్కసారి ఆ సంస్థాపకుడు చనిపోన్విండి, అప్పుడు వారు త్రోవ తప్పారు.
ఇదిగో ఆ వెనుక మొదటగా ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు — వారు ఒక దాని మీద నన్ను ప్రారంభించమని నన్ను ఆ రీతిగా కోరియున్నప్పుడు — నేను అక్కడకు వెళ్ళి, ఒక గొప్ప సంస్థాపకుడైన ద్వైట్ మూడి స్థాపించిన మూడీ పాఠశాలను చూశాను. నేను ఈలాగు అనుకున్నాను, ఇప్పుడు ద్వైట్ మూడి ఆ బైబిల్ పాఠశాల చూసినట్లయితే; ఆ మనిషి దేని కొరకు నిలబడ్డాడు, మరియు ఇప్పుడు వారేమి చేస్తున్నారు!
సరే, నేను అన్నాను, “ఇక్కడ చూడండి, వెస్లీ, కాల్విన్, నాక్స్ ఫీన్ని, వారిలో ఏ ఒక్కరైనా ఈ దినాన తిరిగి లేచి సంఘము ఎక్కడ వుందో చూసినట్లయితే?” ఓ, మై! చూశారా, మొదటి చుట్టులో మనిషి నిలబడినప్పుడు, అతడు సత్యమును పట్టుకొనియున్నాడు.
సీయోను నగరంలో వున్న “డాక్టర్ డోవి” వైపు చూడండి. ఎందుకని? ఆ నగరం దైవీక స్వస్థత మీదనే ఆధారపడినప్పుడు, వారు దైవీక స్వస్థత చూసి ముఖము మీదనే నవ్వుకున్నారు. అయితే “డోవి” చనిపోయిన తరువాత, పైకి వచ్చినవారు... బ్లాక్, జాన్ లేక్, మొదలయిన వారందరూ. ఆ తరువాత మొదటి సంగతి చివరికి అసెంబ్లీస్-గాడ్ వరకు దానిలోనికి వెళ్ళినవారు, నులివెచ్చని గుంపువారు అందులోకి వెళ్ళారు. సంఘము పని అయిపోయినట్లయినది, అది వెనుకకు జారిపోయినది, మరియు నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినది.
29
కనుక నేను దీనిని కనుగొన్నాను: “తన తరములో దావీదు ప్రభువుని బహుగానే సేవించెను,” అని బైబిల్ చెప్పెను.
కనుక నేను అన్నాను, “ప్రభువా, నాకు ఏ సంస్థాపకము వద్దు. నేను అక్కడ జీవించుచుండగానే నా హృదయమంతటితో నిన్ను సేవింపనీయుము.” అది నిజం. “తరువాత, నేను వెళ్ళిపోయిన తరువాత నీవు మరొక మనిషిని కలిగియుంటావు. ఈ స్థానమును తీసుకొనుటకు నీవు మరొక మనిషిని తీసుకొనియుంటావు.” అంతవరకే.
మరొక దానిమీద కట్టడానికి ప్రయత్నం చేయవద్దు. అదే నేల మీద నీవు అగ్నిని నిర్మాణం చేయలేవు. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూనే వుండాలి. అగిపోయినప్పుడు వారు వెనుకకు జారిపోయారు. ప్రతి రాత్రి కూడ వారు కదులుచునేయుండాలి, ప్రతిరాత్రి క్రొత్త అగ్నిని నిర్మించారు; ముందుకు వెళ్ళుచునే వున్నారు. అదే మనము చేయవలసివుంటున్నది. లూథర్ దేనిని కలిగియున్నాడో అది మంచిదే; అది లూథర్ దినానికై అయ్యియున్నది. వెస్లీ తన దినములలో ఏమి కలిగియున్నాడో అది మంచిదే; అది వెస్లీ దినానికి అయ్యివుంటున్నది. హోలినెస్స్ వారు ఏమి కలిగియున్నారో అది మంచిదే; అది వారి దినానికై వుంటున్నది. ఇప్పుడు, మనము మరొక దినాన జీవిస్తున్నాము. ఇప్పుడు, మనం ముందుకు సాగుచున్నాము. మన తరువాత మరొక దినము యున్నది; అది కూడా అదే రీతిగా వస్తున్నది. అయితే వెలుగు ఇక్కడ యుండగానే వెలుగునందే మనము నడచెదము.
30
ఇప్పుడు నేను దానిని గమనించాను, మొదటి విషయము మీకు తెలుసా, అక్కడ ఈ సిద్దాంతము చివరికి కొన్ని గుంపులుగా విరిగిపోయినది. అప్పుడు రోమీయులు మార్పు చెందారు. రోమా కాలము నుండి అదే రోమా సామ్రాజ్యము, అప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో ప్రధానమైయుండిన గ్రీసు నుండి ఆ గొప్పవారైన అలెగ్జాండర్ పడిపోయిన తరువాత రోము ఈ అన్య ప్రపంచమును జయించి వారి నుండి ప్రభుత్వము చేజిక్కించుకున్నది: రోమా ప్రజలు మరియు అన్యజనుల కాలము. దర్శనములో దానియేలు ఆ రీతిగా చెప్పాడు. కొన్ని నిమిషాలలో దాని యొద్దకు మనము వెళ్ళుదము. అయితే అది ఎల్లపుడూ కూడ ప్రపంచముపై ఆధిపత్యము శక్తి కలిగియున్నది: రోము.
తరువాత మనము ఈలాగు కనుగొంటున్నాము, అప్పుడు వారు సంఘమును సంస్థాపకము చేశారు. తరువాత 606 సంవత్సరములో కొంతమంది ప్రజలు కలిసి వారు, “ఆది తండ్రులమని,” తమ్మును తాము సంఘ పితరులని పిలచుకొన్నారు. అనేక గుంపుల ప్రజలు కలిసి వచ్చి వారు తప్పక ఏమి చేయవలెనో, ఒక సభను ఏర్పాటు చేసి, మరియు వారు ఒక సంస్థను ప్రారంభించారు.
31
నా క్రైస్తవ స్నేహితులారా, ప్రొటెస్టెంట్ మరియు క్యాథలిక్ వారులారా నన్ను ఇక్కడ మాట్లాడనివ్వండి. ఇక్కడ కొందరు క్యాథలిక్ స్నేహితులు కూర్చొనియున్నారని నేను తలస్తున్నాను. ఈ మీ భావములను గాయపరచుటకు నేనది చెప్పడం లేదు. కారణం కొన్ని విషయాలు కొంచెము ఆగండి, దానిలో బ్రెన్హాం టెబర్నికల్ ను కూడా, చూచారా, ఒక్క నిమిషములో చూద్దాం. అది ఇక్కడ ఉంచబడినట్లుగా మాత్రమే మనము సువార్తను ప్రకటించాలి. అది ఏదయినప్పటికీ కూడా.... యోహాను అన్నాడు, “చెట్టు వేరున గొడ్డలి యుంచబడివున్నది”; ఆ చెదళ్ళు ఎక్కడ పడునో అక్కడికి పాడనిమ్ము. అది నిజము. ఆయన తప్పక చెట్లను మరియు ఆయా విషయాలను నరకవలసియున్నది.
32
అయితే చూడండి, వారక్కడ మొదటి సంఘమును సంస్థాపకము చేశారు. వారందరూ ఏకమైపోయి మొదటిగా ఆ సంఘమును సంస్థాపకముగా చేశారు. అదే ప్రపంచ వ్యాప్త సంఘము, లేక రోమ్లోని క్యాథలిక్కు సంఘము. అది క్యాథలిక్ వారు దాని “తల్లి సంఘమని” చెప్పుకొనుకొనుచున్నారు. అది నిజముగా సత్యమే. అది వాస్తవముగా సంస్థాపకమైన తల్లి సంఘము. ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా ఏనాడైనా సంఘము సంస్థగా మారినది అదే. సూర్యుడు ఉదయించినప్పటి నుండి అది ఎన్నడూ అలాగు లేకుండా యుండినది.
ఇశ్రాయేలు దినములన్నింటిలో కూడా వారక్కడ ఒక సంస్థగా సంస్థాపకముగా లేరు. వాళ్ళు ఒక ప్రజలైయున్నారు, ఒక సంస్థ కాదండీ. యేసుక్రీస్తు ఎన్నడూ కూడా సంఘమునకు సంస్థాపకముగా చేయలేదు. అపొస్టులలో ఎవ్వరూ కూడా సంఘమును సంస్థాపకము చేయలేదు. క్రితము వరకు ఏ కాలములోను లేదు, వారు తరువాత రెండు లేక మూడు తరముల తరువాత వారు ఎన్నడైనా సంస్థగా మారారా? నేను చరిత్రను ము౦దుకు తీసుకొని వస్తాను. మీ వేలును దాని మీద యుంచగోరుతున్నాను.... అది ఎక్కడున్నాదో మీరు నాకు చూపించండి. నేను ఎరిగినంత వరకు ప్రపంచములో బహు ప్రసిద్ధిగాంచిన అందరి చరిత్రకారుల గ్రంధమును. జోసఫ్స్ వ్రాసిన గ్రంథములను వాటిని నేను చదివాను, కారణం అది తప్పక సత్యమైయుంటున్నది. వేలమంది ప్రజలముందు నేను ప్రకటన చేస్తున్నాను. నీవు ఏమి మాట్లాడుతున్నావో దానిని నీవు ఋజువు చేయవలసియుంటున్నది. సమర్ధించుకొనవలసియున్నది అది నిజము. ఈనాడు ఒక సంస్థ కూడా అక్కడ లేదు.
33
పరిశుద్ధుడైన పేతురు ఏనాడు కూడా క్యాథలిక్ సంఘాన్ని స్థాపన చేయలేదు. దానిని గూర్చి నాకు ఒక చరిత్ర కావాలి లేక ఒక చిన్న లేఖనము కావాలి. పరిశుద్దుడైన పేతురు వివాహం అయిన వ్యక్తి, మీరు అతనిని పోపు అని అంటున్నారు. అతడు పోపుగా వుండలేదు. పేతురు ఒక వివాహం అయిన వ్యక్తి. బైబిల్ చెప్పుచున్నది, “అతని భార్య తల్లి జ్వరముతో పడియుండగా, యేసు ఆమెను స్వస్థపరిచెను.” నాకు తెలిసినంత వరకు ఏనాడు కూడా అతను రోమ్లో లేడు. అతడు ఏనాడు కూడా రోమ్లో వున్నట్లు ఏ చరిత్ర కూడా దూషి౦చడము లేదు. అది తప్పు అలా చెప్పడం.
అయితే వారు దానిని సంస్థగా తయారు చేసేసి, దానినంతా కలగలుపుజేసి, ఒక సంఘముగా చేసి దానిని ప్రపంచవ్యాప్తగత సంఘముగా పిలిచారు. అక్కడ వారు సార్వత్రిక ప్రార్థన చేస్తున్నారు. పరిపూర్ణమైన సభ్యత వారికున్నది. ప్రతి ఒక్కరు కలిసి ఉండవలసియుంటున్నది. ప్రతి యొక్కరూ అదే సంగతిని చెబుతారు. ఒక్కటే ప్రార్ధనా వారందరూ చేస్తారు.
వారు కొన్ని లేఖనములను తీసుకొని అనేకమంది తీసికొనినట్లు చేయుచున్నారు. బైబిల్లోని పవిత్ర గ్రంథాలలో ఏ ఒక్క చోట కూడా పాపములు పోగొట్టువంటి అనునది లేదు; ఎక్కడ కూడ “మేరీని స్తోత్రించు,” అలాంటిది లేదు. లేఖనాలలో ప్రతిచోటా అది ఎల్లప్పుడూ దానికి వ్యతిరేఖముగా ఉన్నది. ఏ స్థలములోనైనా నీవు దానిని కనుగొనినట్లయితే, రేపు రాత్రికి నీవు వచ్చి నన్ను సరిదిద్దు. అది ఎక్కడా లేదు, ఎక్కడా లేదు; మీ యాజకుని గానీ, లేక నీ పాస్టర్ గారిని గానీ తీసుకొని రండి. అది ఎక్కడైనా ఉదహరింపబడినట్లు లేఖనములో ఏ స్థలములో కూడా లేదు.
ఒక చిన్న గ్రంధాన్ని మేకాబీస్ అను దానిని వారు ఇందులో కలిపారు, అది ప్రేరేపించిన గ్రంథము కాదు.... వాటిని వారు దీనిలో నుండి పెట్టారు.... లేక దీనిలో నుండి తీశారు. ఈ బైబిల్ మాత్రమే అసలైన గ్రంథము. ఈ రోజు మనము కలిగియున్న అది స్థాపకులు చేత గుర్తించబడినది, ప్రామాణికమైన యూదులు కాని మరి ఎటువంటి సంఘ చరిత్రకారుడు గానీ ఈ బైబిలును తప్ప మరియొక దానిని గుర్తించలేదు.
34
అటు తరువాత దానిలో... జాగ్రత్తగా వినండి. ఇప్పుడు, క్యాథలిక్లు నూర్పు పిండి పొందుచుచున్నారని మీరంటున్నారు. ఒక్క క్షణము చూడండి.
అప్పుడు వారు క్యాథలిక్ సంఘమును స్థాపన చేసి హింసను ప్రారంభించారు. ప్రతి యొక్కరూ ప్రతిచోటా సంఘమును ప్రభుత్వమును ఏకము చేసి విగ్రహారాధన నుండి రోమన్ క్యాథలిక్ మతాధికారాత్వాన్ని అందులోనికి తీసికొని వచ్చారు. ఇంకొక మాటలో విగ్రహారాధన మూఢభక్తి నుండి తమ సొంత రూపములు గల అట్టి దానిని క్రైస్తత్వమును దత్తత చేసుకున్నారు, గమనించండి. ఆ మనిషి నిలబడి ఎందుకు దీనికి ప్రార్ధన చేయటం లేదని వారు గ్రహించలేరు. వారు విగ్రహరాధికులు కాబట్టి వారు వీనస్ ను అలా ప్రక్కకు తీసి వేసి మరియను పైన పెట్టారు. జూపిటర్ ను తీసివేసి పేతురును పైన పెట్టారు. ఆరాధన చేయడానికి ఏదో రకమైన ప్రతిమను వారు చేసుకున్నారు. దానికి ముందే వారు దానిని ఆరాధించారు. లాటిన్ భాషలో చెప్పబడే సార్వత్రిక ప్రార్థనను వారు తయారుజేశారు, కాబట్టి ఆ రీతిగా, అది ఎన్నడూ తప్పిపోదు. ఎల్లప్పుడు దానినే వారు చెబుతూ యుంటూరు.
35
బైబిల్ ఆధారం మీద నీవు ఒక క్యాథలిక్ యాజకులు గానీ లేక క్యాథలిక్తో గాని నీవు వాదించలేవు.
ఈ మధ్యనే ఒక యావ్వన యాజకుడు మా ఇంట్లో కూర్చోవడం జరిగింది. అతడు చెప్పెను, “ప్రొటెస్టెంటు వారగు మీరు బైబిల్ చదువుతూ ఇంటి వద్దనే నిలిచిపోతారు. క్యాథలిక్ వారగు మేము ఆలయానికి వెళ్ళి ఆరాధన చేస్తాం.”
“అయితే ఏమిటి?” అని నేను అన్నాను. అంతే. “ఇప్పుడు, దానికి జవాబు చెప్పండి.”
“దేవుడు తన యొక్క సంఘములో ఉన్నాడు,” అని అతడు అనెను.
నేను చెప్పాను, “ఒక అణువు అంత లేఖనము కూడా ఆ రీతిగా చెప్పట్లేదే?” “దేవుడు తన యొక్క వాక్యంలో ఉన్నాడు,” అని నేను చెప్పాను. అతడు చెప్పెను, “ప్రతి మానవుని మాట అసత్యము, మరియు నాది సత్యము.”
అతడన్నాడు, “కేవలము ఒక మనిషి కంటే మొత్తం గుంపు ప్రజలు కలిసి ఆలోచన చేసుకొనేటప్పుడు, అది ఎక్కువ అధికారముగా ఉంటుందని నీవు తలంచట్లేదా?”
నేను చెప్పాను, “లేదు ఒక మనిషి దేవుని చిత్తములో ఉన్నట్లయితే, అతడు సత్యమును కలిగియుంటున్నాడు.” ఎల్లప్పుడూ అది రుజువు చేయబడింది.
మొన్నటి దినాన లేక గత ఆదివారము యొహోషువాపాతు మరియు మీకాయి వలె ఆ పాఠంలోన విన్నట్లుగా మీకా అక్కడకు వెళ్ళినప్పుడు, అక్కడ నాలుగువందల మంది బోధకులు చేరి, “వెళ్ళు! ప్రభువు నీతో ఉన్నాడు. వెళ్ళండి! ప్రభువు మీతో యున్నాడు,” అని చెప్పుచున్నారు.
“మరొక వ్యక్తి ఇక్కడ లేడా?” అని యెహోషువాపాతు అడిగాడు.
అతడన్నాడు, అక్కడ మీకాయి ఉన్నాడు, కానీ నేనతనిని అసహ్యించుకుంటాను.“
“అతడేమి చెబుతాడో విందాము” అని అన్నాడు.
అతడు చెప్పెను, “వెళ్ళు, అయితే ఇశ్రాయేలు గొర్రెల వలె చెదరిపోవుట నేను చూస్తున్నాను.”
“నేను నీకు చెప్పలేదా?” చూశారా? అని అంటున్నాడు.
కాబట్టి అక్కడ ఎవరు నిజం? నాలుగువందల మంది తర్ఫీదు పొందిన ప్రవక్తలు ఆ వ్యక్తి నిలబడినప్పుడు, అయినను ఇంకా పాతబట్టలు వేసుకున్న ఒక పరిశుద్ధ గుండ్రాయి ఆ వెనుక నిలబడి సత్యమును కలిగివున్నాడు. అది యధార్థము. అది సత్యము. అతడు కలిగియున్నాడు. అతడు సత్యమును కలిగియున్నాడు. అతను నోటి మీద కొట్టబడ్డాడు, కాని అతడు సత్యాన్ని కలిగియున్నాడు.
36
కనుక ఎంతమంది కలిసి ఇది చెప్పినా, లేక అది చెప్పినా, అది లెక్కకు రాదు; అది “యెహోవా ఈలాగు సెలవిచుచ్చున్నాడు.” అదే ముఖ్యమైయున్నది. అది సత్యము. అనేకసార్లు నీకునీవు నిలబడవలసియుంటున్నది. నీవు దేవుని వాక్యం మీద నిలబడినప్పుడు, ప్రభువు ఏమి చెప్పెనో దాని మీద నిలబడుటకు నీవు నిశ్చయత కలిగియుండాలి.
ఇప్పుడు, ఈ సంఘాన్ని ఈ గొప్ప సమూహమును వారు సంస్థాపకముగా చేశారు, క్యాథలిక్ సంఘము. ఈ దినాన క్రైస్తవ పరిధిలో మతములన్నింటి ఔన్నత్వము వహించినది క్యాథలిక్ క్యాథలిక్ వారు. అయితే వారుంటారు, “నీవు అవసరం లేదు. మాకు వద్దు....”
నీవంటావు, “మాంసము తినకూడదని ఎక్కడ ఉన్నది? యాజకుడు వివాహం చేసుకొనకూడదని ఎక్కడ ఉన్నది? నీవు దీనిని ఎక్కడ పొందికొని యున్నావు...?”
చెప్పెను, “మేము బైబిల్ ను ఉపదేశించము.” “సంఘము స్వరమై ఉన్నది. బైబిల్ ఏమి చెబుతుందో అది కాదు; సంఘము ఏమి చెబుతుందో అదే మాకు లెక్క” అని అన్నారు.
అయితే “ప్రతి మనుష్యుడు అబద్ధికుడు, కానీ దేవుడు సత్యవంతుడు” అని దేవుడు చెప్పెను. ఇప్పుడు, నీ ఎంపికను నీవు చేయవలసియున్నది.
37
ఇప్పుడు, ఆ నికొలాయితుల సిద్దాంతముగ మారినది తరువాత అది హింసగా మారిపోయినది. ఇప్పుడైతే ఈ చివరి దినాలలో అది బట్టబయలై బయటకు వచ్చినది. అటు తరువాత ఒక ఒయాసిస్ వచ్చినది, చీకటి యుగములో గుండా హింస వచ్చినది; అక్కడ మొదట పుణరుద్ధరణ మీద అక్కడ ఒక మేల్కొలుపు వచ్చియున్నది. అది మార్టిన్న్ లూధర్. మార్టిన్ లూధర్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేఖముగా తన అభిప్రాయాన్ని చెప్పాడు, అందును బట్టి అతడు నడుచుకుంటూ బయటకు వెళ్లి సంస్కారము తీసుకొని...
వారన్నారు, “ఇది క్రీస్తు శరీరము” అని.
అతడు చెప్పాడు, “అది క్రీస్తు శరీరము కాదు. అది పలుచని రొట్టె మాత్రమే; అది అంతవరకే” అని అన్నాడు.
దానిని వారు అది పరిశుద్ధ యుకారిస్ట్, “పరిశుద్ధ యుకారిస్ట్” అనగా దాని అర్థము “పరిశుద్దాత్మ” అని. నీవు దానిని తీసుకొన్నప్పుడు, పరిశుద్దాత్మను నీవు నీ శరీరంలోనికి తీసుకొనియున్నావు అని వారి నమ్మకం. అది తప్పు.
పరిశుద్ధాత్మ అనగా ఆత్మ యొక్క బాప్తిస్మమైయున్నది.
“పెంతెకొస్తు అను పనిదినము వచ్చినప్పుడు ఒక యాజకుడు వచ్చి, ఒక పరిశుద్ధ యుకారిస్ట్ ను వారి నోట్లోకి ఒక పలుచని రొట్టె ముక్కను ఇచ్చి.” లేక కాదు, “ఎవ్వరో బోధకుడు నడుచుకొంటూ వచ్చి కొంత నీటిని వారి మీద చిలకరించి, వారితో కరచాలనం చేశాడు” ఏదీ కాదు. కాదండి.
అయితే, “వేగముగా వీచు బలమైన గాలివంటి ఒక ధ్వని ఆకాశము నుండి ఆకస్మాతుగా వారు కూర్చొన్న ఇల్లంతయు నిండెను.” అది లేఖనం. అదే నిజమైయున్నది. ఆ సంఘములో జరిగింది అదే, ఆ దినమున వెలుగు ప్రకాశించుచుండగా జరిగినది అదే. దానిని గుండానే అక్కడ వెలుగు ప్రకాశించెను; మరియు ఇక్కడ దీని ద్వారా వెలుగు ప్రకాశించును.
38
ఇప్పుడు, లేఖనములో ఏదైనా గానీ చెప్పనట్లయితే, అది ప్రశ్నించబడితే దాని మీద అలా వుంచండి... అది ఎక్కడయున్నదో లేఖనములో నేను మీకు చూపిస్తాను, చూశారా. మంచిది. కారణము ఇలాంటి కొద్ది సమయాలలో సహజముగా మనము దాని ద్వారా పరిశీలించి చూచినప్పుడు మనకు వారములు, నెలలు కావాలి. జనులు బైబిల్ కలిగియుండగా పైనుండి క్రిందకు ప్రతీ లేఖనాన్ని మనము చూడవచ్చు. అయితే అది ప్రశ్నించబడితే, కేవలము నాకు తెలుపండి. మంచిది.
తరువాత మార్టిన్ లూథర్, మార్టిన్ లూథర్ తరువాత జాన్ వెస్లీ వచ్చాడు.
కతేసియిజం బోధించేవారిగానే మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడు. తప్పు, బాప్తిస్మముతో అతను బయటకు వచ్చాడు. అతడు త్రిత్వ బాప్తిస్మం ఇచ్చుకుంటానే వచ్చాడు. అది ఎన్నడూ బైబిల్లో బోధింపబడలేదు. ఎన్నడూ బైబిల్లో చెప్పబడలేదు. బైబిల్ గ్రంథములో ఎక్కడైనా, ఎప్పుడైనా త్రిత్వ బాప్తిస్మము ఏ ఒక్కరూ పొందియుండలేదు. అది అలాగయినట్లయితే, మీరు వచ్చి అది ఎక్కడయందో చూపించండి. అది అక్కడ లేదు.
39
వారు బాప్తిస్మము ఇవ్వవలసిన ఆత్మను పొందియున్నప్పుడు, ఆ రీతిగా మాత్రమే “మీరు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” అని వెనుక ఆయన చెప్పియున్నాడు. “ఆ నామములోనికి బాప్తిస్మము ఇవ్వవలయునని,” చెప్పాడు. “తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములలోనికి కాదు; నామములోనికి,” అని ఆయన చెప్పాడు. శిష్యులు నేరుగా ప్రతీ ఒక్కరికి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చారు. ఎవ్వరైనా వేరొక రీతిలో బాప్తిస్మం పొందియున్నట్లయితే, అట్టివారు వచ్చి, “పరిశుద్ధాత్మను పొందకముందు తిరిగి బాప్తిస్మము పొందమని ఆజ్ఞాపించారు.” ఇక్కడైతే క్యాథలిక్ సంఘము బయటకు వచ్చినది....
తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్క నామములో ఎవ్వరైనా - ఎన్నడైనా బాప్తిస్మము పొందియున్నట్లు బైబిలు ఒక్క స్థలాన్ని చూపండి. అది కేవలం ఖాళీగా వున్నది, అది కాదా? శనివారం రాత్రి ప్రశ్నల రాత్రియై వుంటున్నది. నేను దానిని తీసుకుంటాను; మనము దానిని సరిచేయుదము. మంచిది. మంచిది. ఏ వ్యక్తియైనా ఎన్నడైనా తండ్రి కుమారుడు, పరిశుద్దాత్మ అనే నామములో బాప్తిస్మము పొందినట్లు ఏ ఒక్క స్థలమైనను నాకు చూపించండి. నేను వేషధారినని చెప్పి, వేదిక మీద నుండి దిగిపోయి అలాగే వెళ్లిపోతాను. ఎవ్వరైనా మరేరీతిగానైనా బాప్తిస్మం పొందియున్నచో, పరిశుద్దాత్మను పొందుకొనుట కొరకే వారు వచ్చి తిరగి యేసుక్రీసు నామములో బాప్తిస్మము పొందవలసియున్నది. అది ఖచ్చితముగా నిజం. బైబిల్ అదే చెప్పుచున్నది.
40
ఇప్పుడు, మీరు చూడండి, మనము సత్యానికి బదులుగా సిద్దాంతాన్ని తీసుకొందాము. ఇప్పుడు, మీరు లేఖనమును చూడండి. “సరే, సహోదరుడు బ్రెన్హాం చెప్పాడు.....” అని మీరు అనవద్దు. మీరు లేఖనం వైపు చూడండి. మీ యొక్క కాన్కర్డేన్స్ ను తీసుకొని అందులో చూడండి. అప్పుడు వెంటనే...
41
మీరు గమనించండి, ఈ చీకటి సంఘకాలము వచ్చువరకు ప్రతి సంఘకాలము ఆయన యొక్క నామాన్ని కలిగియున్నది.
చూడండి, ఆ వెనుకాల ప్రామాణికమైన సంఘమునకు అది మాదిరిగా వుంటున్నది. యూదుల మధ్య అతి చీకటి యుగము కొనసాగక మునుపు ఆహాబు కాలమందున్న గొప్ప రాజులలో గొప్ప పేరులో ఉన్నాడు. దానికి ముందు ఇశ్రాయేలీయులంతా మంచి స్థితిలోనే ఉన్నారు. ఆహాబు నులివెచ్చని స్థితిలో సరిహద్దు విశ్వాసిగా లోనికి వచ్చాడు, అతడు వెళ్ళిపోయి, ఆ చిన్న రాజకుమార్తెను, యెజెబెలను, ఒక విగ్రహరాధికురాలిని వివాహము చేసుకొని ఆమెను లోనికి తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయులలోనికి విగ్రహారాధికురాలను తీసికొని వచ్చాడు. అది మీకు గుర్తు లేదా? ఎంతో చక్కని మాదిరి అది.
ప్రాసస్టెంట్ వారు రోమన్-ఇజమ్ లోనికి వివాహం చేయబడినప్పుడు, చీకటి యుగంలో వారు విగ్రహారాధనను మరలా క్రైస్తవ్యములోనికి తీసికొని వచ్చారు; కచ్చితముగా, భౌగోళికంగా.
ఇప్పుడు, ఈ వైపుగుండానే బయటకు వచ్చుట వచ్చుచుండగా గమనించండి. ఇక్కడ నీకు ఏమున్నది? పరిశుద్ధాత్మకు ఒక ప్రత్యామ్నాయముగా పలుచని రొట్టె ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము బదులుగా: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ప్రతీదానికి వారు ప్రత్యామ్నాయము చేసిరి. నేను లేఖనాన్ని తీసుకొని, దానిని రుజువు చేస్తాను: ప్రత్యామ్నాయం వెంబడి ప్రత్యామ్నాయం.
మార్టిన్ లూథర్ దానితో సమ్మతించాడు. జాన్ వెస్లీ దానితోనే నేరుగా వచ్చి దానితో సమ్మతించాడు. బైబిలులో ఎవ్వరూ ఎక్కడా, ఎన్నడూ చిలకరింపబడ లేదు. అలాంటిది ఇప్పుడూ కూడా లేదు. బైబిలులో అలాంటి విషయం గానీ అలాంటి ఆజ్ఞ గానీ, అలాంటి క్రమము గానీ, ఏ మాత్రము లేదు, కానీ మీరు దానిని అనుమతిస్తున్నారు. అది యధార్థము. మీరు దానిని అనుమతిస్తున్నారు. వారు బయటకు వచ్చి ఈ చిన్న ఉప్పు చల్లు దానిని తీసికొని మరియు నీ మీద (నీటిని) దానిని చిలకరిస్తారు. ఎందుకని? క్యాథలిక్కు సంఘము దానిని ప్రారంభించింది, మీరు దానికి సమ్మతిస్తున్నారు. అవును.
42
ఒకరు మొన్నటి దినమున ఈలాగు అన్నారు, “నీవు కాదు.... నీవు క్యాథలిక్వు కాదు.
నేను అన్నాను, “లేదు, సహోదరుడా. నేను ప్రొటస్టెంట్ ను, నేను దానిని వ్యతిరేకిస్తాను.” అది నిజం. పరలోకము కొరకు దేవుని పిల్లలు నా సభ్యులుగా ఒక సువార్త సేవకుడిగా నేనున్నాను. అద్భుతములు, సూచక క్రియలతో వారి ముందు నేనొక ఉపాధ్యాయనిగా కూర్చొని నేను వారికి బోధించవలసివున్నది; ఏది సత్యమో దాని కొరకు నేను నిలబడకపోయినట్లయితే, నేను ఒక వేషధారినవుతాను. “అవునండీ. అది నన్ను చంపినను నేను నిలబడతాను అని నేనన్నాను. బైబిల్ ఏమి చెబుతున్నదో కేవలము దానినే నేను బోధిస్తాను.”
ఎవ్వరితోనైనా చర్చించడానికి ఏ సమయంలోనైనా నేను సంసిద్ధముగా వున్నాను, గమనించారా; అతడు రోమ్లోని పోపు కానివ్వండి, ఆర్చ్ బిషప్ కానివ్వండి, అతడు ఎవ్వరైనప్పటికి కూడా, చూశారా. అవునండీ. అది నిజం. నేను తప్పు అయినట్లయితే, వచ్చి నాకు చూపించండి. ఇప్పుడు నేను తప్పు కాదు, కారణం నేను లేఖనములను చూపుచున్నాను. మీ యొక్క పాఠ్యపుస్తకమును నేను తీసుకొను. ఇదే పాఠ్యపుస్తకము, ఇక్కడే వున్నది.
ఇప్పుడు, మీరు గమనించండి, ఆ నమకార్ధమైనవాటన్నిటిలో నుండి వారు బయటకు వస్తారు.
ఇప్పుడు, చివరి దినాలలో, ఒక హింస రాబోవుచున్నది.
43
ఇప్పుడు, మనము ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము ప్రారంభిందాం. ఇప్పుడు, మీరు గమనించినట్లయితే, ఆ అధ్యాయం క్రిందకు వెళితే
అక్కడ:
.... మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలబడియుండెను...
కాదు, నన్ను క్షమించండి, నేను తప్పు వచనములో వున్నాను, అది తప్పు, 14వ అధ్యాయము కాదు - 13వ అధ్యాయము:
... మరియు పది కొమ్ములను, ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద పది కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమగు పేళ్లును యుండెను.
44
దేవదూషణం అనగా ఏమిటి? అది “ఎగతాళి చేయటం, పరిహాసముగా మాట్లాడటం.”
ఇప్పుడు, గమనించండి, అది “సముద్రములో నుండి పైకి వచ్చినప్పుడు” ప్రకటన 17వ అధ్యాయము (మీరు దానిని రాసుకొనుచున్నారా.) ప్రకటన 17:15వ వచనం చెప్పినది, నీరు సూచించుచున్నది ఏమనగా, “ప్రజలను, జనసమూహములను, జనములను సూచిస్తున్నది.” కాబట్టి, ఈ మృగము “శక్తిని, దైవికము-కాని-శక్తిని,” చూపిస్తున్నది. ఎరను వెతుకు జంతువు ప్రజలలో నుండి లేచినది, అది సముద్రపు ఇసుక మీద నిలబడియున్నది. “నేను ఆ మృగాన్ని చూశాను.”
నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలియున్నది, ...దాని పాదములు ఎలుగబంటి పాదములు వంటివి, ... దాని నోరు సింహపు నోరు వంటిది: దానికి ఆ ఘటస్పరము దాని బలమును దాని సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.
ఘట సర్పము!
45
రెండు విషయములను మనము పరిగణములోనికి తీసికొనవలసి ఉన్నది. ఈ మృగాన్ని గమనించండి. దానిలో నాలుగు విధములైన గుణవిశేషములు యున్నవి.
మీరు దానియేలు 7వ అధ్యాయము తీసుకొనినట్లయితే, (దానిని వ్రాసుకొను మీరు), దానియేలు 7వ అధ్యాయము దానియేలు అదే దర్శనాన్ని ఎనిమిదివందల సంవత్సరాల మునుపుగా — అతడు దర్శనాన్ని చూశాడు. అన్యుల పరిపాలన యొక్క ప్రారంభములో ఒకదాని నుండి మరొకటి వేరుగా వున్నట్లే, అతడు ఆ జంతువులను చూడగలిగాడు.
అవి ఇక్కడ వున్నవి యోహాను దాన్ని చూస్తూవున్నాడు. ఆ నాలుగు జీవులు ఒక్కదానిలో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా అన్యజనుల ప్రభుత్వ యొక్క ముగింపు చూస్తున్నాడు. అతడు అవే ఆ పాత దయ్యాలనే ఆ పిచాచాలనే గ్రీకుల రాజ్యం వరకు ప్రతీ రోమా సామ్రాజ్యము వున్నది, అన్యులకాలం వరకు క్రిందకు దిగి వచ్చి, అవన్నియు ఒక మృగంలో ఏకమైపోయినవి. నేరుగా అతడు ఎవరో, అతడు ఏమైయున్నాడు అను దానిని మనము చూడగలుగుచున్నాము. నిజము. వాటన్నిటిని కూడా చిరుతపులి, సింహము, అవన్నియు, ఆ ఘటసర్పము. ఘటసర్పం అనగా ఎంతమందికి తెలుసు? ఘటసర్పము “రోమ్ ను” సూచిస్తున్నది.
దానిని మనము చాదివెదము. ఆ విధమైన ప్రశ్న మీ హృదయములో ఉన్నదా. ఇక్కడ ప్రకటన 12వ అధ్యాయము నాకు ఒక క్షణమును నివ్వండి, మనము ఇక్కడ చూద్దాం. ప్రకటన 12వ అధ్యాయము చూడండి.
అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను.
ఒక స్త్రీ దేనికి సూచనగా వున్నది? “సంఘానికి.” ఇక్కడ యున్నది వధువైయున్నది. ఇది సంఘము, నిజమైన సంఘము.
.... అదేమనగా సూర్యని ధరించుకొనిన స్త్రీ, ఆమె పాదములు క్రింద చంద్రుడు...
46
గమనించండి, “క్రింద చంద్రుడు, సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడు.” సూర్యుడు కృపాకాలమైయుంటున్నది. మరియు చంద్రుడు ధర్మశాస్త్రము యొక్క కాలము. స్త్రీ యూదుల ప్రామాణికమైన సంఘమై వుంటున్నది, మరియు ఆమె ధర్మశాస్త్రము మీద ఆధారపడియున్నది. ధర్మశాస్త్రం గతించిపోతున్నది, కారణం ధర్మశాస్త్రం రాబోవు మంచివాటికీ ఛాయయైవుంటున్నది. అది నిజమేనా? చంద్రుడు కేవలం ఛాయయైయున్నాడు, సూర్యుడు చంద్రుని మీద ప్రతిబింభిస్తున్నాడు (అది వాస్తవమేనా?) — చంద్రుడు ప్రకాశించు రీతిగా సూర్యుడు చేస్తున్నాడు. మరియు ధర్మశాస్త్రం ఆమె పాదముల క్రింద వున్నది; ఆ దినము గుండా ఆమె జీవించుచున్నది. ఆమె ఇక్కడ ఎలా అలంకరింపబడియున్నదో గమనించండి.
... ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను: (సంఘము పన్నెండుగురు అపోస్తులులు సిదాంతముతో ఆమె కిరీటము పెట్టబడియున్నది, చూచారా.)
ఆమె గర్భిణియై ప్రసవ-వేదన పడుతూ, ఆ అరుపులకు కేక వేయుచున్నది. (గమనించండి. అది యూధుల ప్రామాణికమైన సంఘము.)
అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను; ఇదిగో, ఎర్రని మహా ఘటసర్పము, దానికి ఏడు తలలును... (గమనిస్తున్నారా, ఇప్పుడు ఆ యేడు అనే సంఖ్యను గుర్తు౦చుకొనండి: యేడు తలలును, ఎల్లప్పుడు.) .... ఏడు తలలును, మరియు పదికొమ్ములును వుండెను, మరియు దాని తలల మీద ఏడు కిరీటములున్నవి.
మరి ఇప్పుడు దాని తోక ఆకాశనక్షత్రములలో మూడవ భాగమున ఈడ్చి, వాటిని భూమి మీద పడవేసెను: కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మ్రి౦గి వేయవలెనని, ఆ ఘట సర్పము స్త్రీ యొదుట నిలుచుండెను. (చూడండి!)
సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగ శిశువును ఆమె కనగా: ఆమె శిశువు దేవుని యొద్దకును, ఆయన సింహాసము నొద్దకును కొనిపోబడును.
47
యూదుల ప్రామాణిక సంఘము అక్కడ నిలువబడియున్నది; సూర్యుడు క్రిందకు ప్రకాశిస్తున్నాడు; అది పన్నెండుగురు అపోస్తులులు సిద్దాంతముతో. సరే. చంద్రుడు ఆయన పాదముల క్రింద, ధర్మశాస్త్రము, రాబోవుతున్న వాటి ఛాయ; ఇప్పుడు సువార్త వెలుగు ప్రకాశిస్తూవున్నది, సూర్యుడు బయటకు వచ్చినప్పుడు ధర్మశాస్త్రము వాడిపోయి వున్నది.
“ఆమె ప్రసవించడానికి నొప్పులు పడుతున్నది, ఆమె మగ బిడ్డను కన్నది.” ఆయన యేసుక్రీస్తు, “ఆ బిడ్డ దేవుని యొద్దకు కొనిపోబడ్డాడు. అయితే వెంటనే....” అది ఇక్కడ వున్నది. “కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె యొక్క శిశువును మ్రింగి వేయాలని ఆ ఘటసర్పము, ఆ సాతానుడు, ఆ స్త్రీ యొదుట నిలబడియున్నాడు.”
ఇంకా యేసు పట్టినప్పుడు, యేసును చంపడానికి రెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందర్ని చంపివేయమని ఒక ప్రకటన వారు వెలువడి చేశాడు. దేవుడు అతడి కన్నులను మూసి, మోషేను దాచినట్లుగానే ఆయనను ఐగుప్తునకు కొనిపోయి, అక్కడ దాచి పెట్టాడు.
48
ఆ ఎర్రని ఘటసర్పము, దయ్యమ అక్కడ వున్నది. దాని సింహసనం ఎక్కడయున్నది? రష్యాలో కాదు సుమా; రోమ్ లో! సాతాను అతడికి తన సింహాసమును అధికారమునిచ్చాడు,“ అని చెప్పబడియున్నది, ఎర్రని ఘటసర్పము,” రష్యా కాదు.
ఒక గొప్ప దైవసేవకుడు, “రష్యా అంత్యక్రీస్తు” అని చెప్పడం నేను విన్నాను.
రష్యా క్రీస్తువిరోధితో చేయునది ఏమిలేదు, ఎందుకని? అది కమ్యూనిజమై యుంటున్నది. తప్పుడుగా వున్నటువంటి ప్రొటస్టెంటిజము, కథోలిజము ఇవి అక్కడ కమ్యూనిజాన్ని ఉత్పత్తి చేసినవి. రష్యా ఎందుకు వారిని అక్కడ నుంచి తరిమి వేసినదంటే, దానికి కారణం, ఆ డబ్బంతా అక్కడ కలిగియున్నారు కనుక. పరిశుద్ధుల పేరిట - వారి చేత ప్రార్ధన చేయించి, ప్రజల డబ్బునంతా లాగుకొని, ఆ విధంగా పెద్ద కట్టడాలు కట్టారు. ఆ రీతిగానే డబ్బును కట్టలు కట్టుకున్నారు. వారు ఇలాంటి వారిలో ఏ విధమైన బేధాన్ని కనుగొనలేరు. లోకంలో మిగిలిన వారందరికంటే వారు ప్రత్యేకముగా లేరు, కాబట్టి వీరి మీద ఉమ్మివేసి మరియు బయటకు తరిమి వేసి కమ్యూనిజాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
మీరు మరొక్క రాత్రి నాకిచ్చినట్లయితే... దేవుడు అనుగ్రహించినట్లయితే, రోమ్ ను నాశనము చేయడానికి, కమ్యూనిజము దేవుని యొక్క చేతిలో నేరుగా పనిచేయనున్నదని నేను రుజువు చేస్తాను... గుర్తు౦చుకొండి, దేవుని యొక్క ప్రవక్తగా నేను దీనిని చెబుతున్నాను: రష్యా ప్రభుత్వము వాటికన్ సిటీ మీద ఒక విధమైన ఆటమ్-బాంబును వేసి, ఒక గంటలో దానిని నాశనం చేయుటకు అది చేయునని, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” ఇంకా బైబిల్ చెప్పినది కఠోరమైన హృదయం గల మనుష్యులను తీసుకొని మరియు వారిని అతని చేతుల్లో ఉంచుతారు, ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఆమె వద్దకు ఏమి వచ్చుచున్నదో, ఆమె వద్దకు ఖచ్చితముగా దానిని తిరిగి తెచ్చుటకు వారు ఆయన చేతిలో సాధనాలై ఉంటారు. అది కచ్చితము. అది వాక్యమైయున్నది.
49
సహోదరుడా, ఈ విషయములు ఎంత మోసకరమైయున్నదో నీవు గ్రహించావా? జ్ఞాపకముంచుకో, యేసుక్రీస్తు చెప్పియున్నాడు, ఈ క్రీస్తువిరోధి సాధ్యమైతే ఎర్పరచబడిన వారిని సహితము మోసపరచినంత దగ్గరగా యుంటాడు. “ఇప్పుడు, ఎవ్వరూ నిన్ను మోసపరచనివ్వకుము,” అని ఆయన చెప్పెను. “మీరు అన్యజనుల వలె ఉండవద్దు, విస్తరించి ప్రార్థనలు చేయవద్దు, మరియు మరియా నీకు వందనము, నీవు దీవించబడివున్నవని - నిండైన కృపతో వున్నావని,” ఆలాగు చెప్పవద్దు అని చెప్పెను. “అన్యులవలె విస్తరించి వ్యర్థంగా మాట్లాడవద్దు అని ఆయన చెప్పియున్నాడు.” “ఇంకా భూమి మీద తండ్రి అని ఎవ్వరిని పిలువవద్దు, మీకు ఒక్కడే తండ్రియున్నాడు, మరియు ఆయన పరలోకమందు ఉన్నాడు,” అని ఆయన చెప్పియున్నాడు.
అయితే మీరు చుట్టూ తిరిగి అవివేకముగానే చేస్తున్నారు, దానిని ఎలాగైనా మీరు చేస్తున్నారు, కారణం అది ప్రసిద్ధిగాంచినది కాబట్టి. అయితే సాతానుడు ఎల్లప్పుడూ కూడా ప్రసిద్ధిగాంచింది, ప్రఖ్యాతి గాంచినదే దానిని కలిగివుంటాడు. ఆరంభము నుండి అది అలాగే ఉంటున్నది, “ఒక విధమైన భక్తి.” కయ్యూను దానిని కలిగియున్నాడు. క్రీస్తువిరోధి ద్వారా అతని ఆత్మ ఇక్కడే కదులుచూయున్నది; ఇంకా ఇక్కడ హేబేలు వస్తున్నాడు, అతను కూడా వధించబడినవాడే. అవును. గమనించు, మరియు ఇప్పుడు చూడు.
ఆ వెనుకనున్న మృగాలన్నియు కలసి ఒకే మృగముగా ఇక్కడ చుట్టబడివున్నది, అదే “ఎర్రని ఘటసర్పము” అని పిలువబడుచున్నది, దయ్యము.
ఇప్పుడు, ప్రకటన 13వ అధ్యాయము 15వ వచనము.
ఇప్పుడు దానిని మీరు చూడండి, రోమా దాని యొక్క సింహాసనమై యున్నది. ఆయన పుట్టిన వెంటనే బాలుడగు క్రీస్తును మ్రింగి వేయడానికి ఆ ఏడు తలలును మరియు పది కొమ్ములును కలిగిన క్రూరమృగము ఆ బాలుని ప్రక్క నిలువబడియున్నది. ఎవరది చేశారు? హేరోదు, రోమ్; ఎల్లప్పుడు అదే. నేరుగా మనము దానియేలు గ్రంథములోనికి వెళ్ళిపోదాము, ప్రభువు మనకు సహాయం చేసినట్లయితే, మనకు తగినంత సమయము వున్నట్లయితే, మనము దానిని కూడా చూద్దాం.
50
లేఖనములో ప్రతీ చోట వున్నట్లుగా, అన్యజనుల ప్రారంభం నుండి అక్కడ వెనుకాల ఆదికాండము నుండి నేరుగా బబులోను ఆదికాండములో ప్రారంభమై ప్రకటనలో ముగియుచున్నదని నేను రుజువు చేస్తాను. విగ్రహారాధన ద్వారా, విగ్రహాలను లోపలికి తెచ్చుట ద్వారా, విగ్రహాలను ఆరాధన చేయుట ద్వారా, హాము కుమారుడైన నిమ్రోదు ద్వారా అది వెనుక ఆరంభములో ప్రారంభమైనది. అది నేరుగా క్రిందకు వచ్చియున్నది. చిట్టచివరకు క్రైస్తవ్యము అను పేరు తీసికొనువరకు ఈ చివరి దినములో ఎంతో మోసకరముగా వచ్చియున్నది, ఇంకనూ అది విగ్రహారాధనే!
II థెస్సలోనీకయులలో పరిశుద్ధుడగు పౌలు దానిని చెప్పట్లేదా? మనము వెళ్ళబోయేముందు దానిని మనము చదువుకుందాము. II థెస్సలోనీకయులు 2వ అధ్యాయము, పౌలు ఇక్కడ ఏమి చెప్పియున్నాడో చూద్దాం. మనము జీవిస్తున్న ఈ దినములలోనికి మనము రాకముందు, అతడు ముందే దానిని ఆత్మలో చూశాడు.
మనము జీవిస్తున్న దినము ఎలాగున్నది? చీకటిలో మనము జీవిస్తున్నాము. స్త్రీలు, పురుషులు విగ్రహారాధన అను చీకట్లో తడములాడుచున్నారు. కేవలం అది వారికి తెలియనే తెలియదు. ఎంతటి జాలిగల విషయమది....
పౌలు చెప్పియున్నాడు, “మొదట భ్రష్టత్వము సంభవించి, నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపరచబడితేనే గానీ,” ఆ దినము రాదు. ఇప్పుడు, గమనించండి, అతడు ఒక మనిషి అని పౌలు ప్రకటించుచున్నాడు. నిజమేనా? పౌలు చెప్పెను, “అతడు పాపపురుషుడు, ఏది దేవుడనబడెనో దానంతటికీ పైగా వాడు తనకుతాను హెచ్చించుకుంటాడు. అటు అతడు దేవునిగా ఆరాధించుకుంటాడు....” ఒక్కమనిషి దేవునిగా ఆరాధించబడ్డాడు; ఒక మనుష్యుడు ఆరాధనకు పాత్రుడుగా పెట్టబడును. అతడు చెప్పెను, “మొదట భ్రష్టత్వము సంభివిస్తేనే గానీ, ఆ దినము రాదు.” ఏంటది? సంఘము యొక్క నులివెచ్చని స్థితి. సరే.
వినండి. మీరు ఇష్టపడితే, మీ కొరకు దానిని చదువనివ్వండి. II థెస్సలోనీకయులు. మంచిది. ప్రారంభించడానికి కావలసిన స్థలాన్ని పొందగలను కాబట్టి మనము అంతా చదువవలసిన పనిలేదు.
ఎవ్వడును, మిమ్ములను మోసపరచనీయవద్దు... (II థెస్సలోనీకయులు 2వ అధ్యాయము 3వ వచనము.) ఎవ్వడును ఏ రీతిగా మిమ్ములను మోసపరచనీయకుడి, ఏలయనగా మొదట బ్రష్టత్వము సంభవిస్తేనే గానీ, ఆ దినము రాదు. (ఇప్పుడు లొవొదికయ సంఘకాలము.) ఆ మనిషి (ఏక వచనము)... నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని, నాశన పాత్రుడగు పాపపురుషుడు; (దేవుని కుమారునికి బదులుగా), నాశన పాత్రుడగు పాపపురుషుడు.
ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడెనో దాని కంతటికిని ఎదిరించుచూ, ఆ రీతిగా అతడు దేవుడిగా ఆరాధించబడతాడు; .... తాను దేవుడినని అని తన్నుతాను కనుపరచకుంటూ దేవుని యొక్క ఆలయములో కూర్చొనును. (ఒప్పుకోలును అంగీకరిస్తూ!)
51
నా క్యాథలిక్కు సహోదరుడా, నాకు చెప్పవద్దు! అది నేను నమ్ముట లేదని చెబుతూ ఒక పెళ్ళి చేసుకొనవచ్చు అని మీరేలాగు చెప్తారు; ఒక పెళ్ళి చేసుకొనవచ్చు అని క్యాథలిక్కు సంఘము చెబుతుంది. మీకు డబ్బు లేకపోయినట్లయితే, అది సరే. అయితే నేను మీకు చెప్పనివ్వండి, ఇక్కడే నా సొంత ప్రజలలో జరిగియున్న విషయం: ఇక్కడ ఒక యవ్వనుడు మరియు యావ్వనస్తురాలు కూర్చొనియున్నారు, ఒక తల్లి ఇక్కడ కూర్చొనియున్నది, ఒక తండ్రి కూడా ఉన్నాడు; ఇంకా మరొక స్త్రీ ఒక చిన్న బాలునితో ఇక్కడే వున్నది. ఆ అమ్మాయి ప్రొటస్టెంట్కు కుర్రవానిని వివాహము చేసుకొన్నది; తరువాత వారు ఒకరి నుండి ఒకరు వేరైపోయారు. కనుక మొదటి విషయం మీకు తెలుసా, తిరిగి ఆ బాలిక ఒక క్యాథలిక్ కుర్రవానిని వివాహము చేసుకున్నది; ఆమె, వారు తిరిగి వచ్చుటకు వెళ్ళి ఎంతో డబ్బు చెల్లించవలసియున్నది, “మొదటిగా చెప్పాలంటే ఆమెకు ప్రొటస్టెంట్ కుర్రవాని వివాహం చేసుకోలేదు.” ఇక్కడే హోవర్డు వారు వున్నారు. వారు నా స్వంత ప్రజలు, సరే ఇక్కడవారు యున్నారు.... నేను వాళ్ళ పేర్లు చెప్పను. ఆమెకు ఒక కుమార్తెయున్నది, ఆ కుమార్తె సుమారు ఇరవై-ఆరు సంవత్సరాల వయస్కురాలు. ఆమె తన భర్తను ఇక్కడే మిల్టౌన్ లో విడిచిపెట్టినది మరియు వెళ్ళిపోయి ఒక కాథలిక్ పురుషుడిని వివాహము చేసుకున్నది. ఇప్పుడు వారన్నారు, సంఘములో నుండి బయటకు వేల్లిపోవలెను; ఆమె మరలా తిరిగి చేరుటకు వారు చాలా డబ్బును చెల్లించవలెను మరియు ఆమెను తిరిగి కన్యకగా మర్చి మరియు ఆమెను ఈ వ్యక్తితో వివాహము చేయుటకు. మూర్ఖత్వము! ఆమెను మరలా తిరిగి కన్యకగా మార్చుట? దేవుని దృష్టిలో ఆమెకు వివాహమయినది మరియు వ్యభిచారములో జీవిస్తున్నది. అది కచ్చితముగా నిజము. అది కూడా “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” సత్యము.
ఎంతటి అపకీర్తి అది. “ఎంతో డబ్బులు వీరు చెల్లించారు.” ఆ కారణం చేతనే ఈ పెద్ద పెద్ద పాఠశాలలు, గుడులు అన్నీ నిర్మించబడ్డాయి. ఆ కారణం చేతనే ప్రపంచమంతా అవి వున్నవి. ఇక్కడ అమెరికా దేశములో అది మీకు తెలియదు. నాతో కలిసి మీరు విదేశాలకు వచ్చినట్లయితే, మీరు దానిన చూడగలుగుతారు. అవునండీ. మీరు ఆ అక్కడకు వెళ్ళండి, సహోదరుడా, వారు అక్కడ పైచేయి కలిగియుంటున్నారు.
52
నిజమైన ఒక ఫొటోను నేను మీకు చూపిస్తాను. సహోదరుడు కొప్ ఈ మధ్య దానిని తీసికొని పంపించాడు — అది ఒక ప్రొటస్టెంట్ బోధకునిది, పరిశుద్దాత్మను బోధకుడు, అతడు వీధిలో పడియున్నాడు, వీధిలో పడి అంత ఎత్తున ఉబ్బిపోయి వున్నాడు; అతడు అతని భార్య, తన చిన్న కుమార్తె, ఉబ్బిపోయివున్నారు; కారణం వారు యేసుక్రీస్తును ఆయన పునరుద్దాణ శక్తిని ప్రజల రక్షించబడతారని పరిశుద్దాత్మను పొందుతారని బోధించాడు. వీధిలోనే వారిని హత్య చేశారు. వారి మీద ఉమ్మివేసి ఎన్నో దినాల వరకు వారిని పాతిబెట్టబడనీయలేదు. అది నిజము.
ఆ స్థలం నుండి వారిని బయటకు తీసుకు రావడానికి సహోదరుడు ఆస్బన్ ను నిలుపు చేయుటకు వారు తుఫాకులను తనపై పెట్టవలసి వచ్చెను.... ఒక యాజకుల గుంపు అందరు కలిసి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఆ యవ్వనస్తుని హత్య చేశారు. అతని భార్యకు ఒక చిన్న బిడ్డ వున్నది. వారు ఆ వీధిగుండా అలా నడచి వెళ్తున్నారు, అతని తీసికొని ఒక పరివారాన్ని తీసికొని అతన్ని సమాధి చేయుటకు సమాధుల వారు తీసికొని వెళ్తున్నారు. ఈ తల్లి తన చిన్న బిడ్డతో వెళ్తూ తన చనిపోయిన భర్త వెనుక ఏడుస్తున్నది. ప్రజలు కిటికీలు తెరచి బయటకు చూశారు, యధార్ధ-హృదయము గల ప్రజలు అన్నారు. “ఈ విధముగా క్యాథలిక్ సంఘ౦ ఆ రీతిగా భావించినట్లయితే, మేము దానిని వ్యతిరేకిస్తాము” అని చెప్పారు. ఆ విధముగా వేలకొలదిగా ప్రజలు వీధి వెంబడి వెంబడించారు. సహోదరుడు ఆస్బాన్ అక్కడే ఒక ఉజ్జీవాన్ని కలిగియున్నాడు. చివరికి వారు అతనిని ఆ దేశము నుండి వెళ్ళగొట్టలేకపోయారు. అక్కడ ఎందరో ప్రజలు వున్నారు. అది కచ్చితముగా నిజము.
ఓ, అది వేషధారణ! అది చెడ్డ దృశ్యమని నాకు తెలియును. క్యాథలిక్ సహోదరులారా, ఇంకా కొంచెం కూర్చొండి, కొన్ని నిముషాలలో మరియొక వైపు మనము త్రవ్వుదాము. సరే. గమనించండి.
53
ఇంకా కొంచెం ముందుకు మన క్రిందకు రాబోవుతున్నాము. దీన్ని మీరు ఇవ్వనివ్వండి. బహుశా నాకు ముప్పై నిమిషాలు సమయం నాకు వున్నది. జాగ్రత్తగా వినండి. చదివే ప్రతీ ఒక్కరూ మనము వెనుకకు వెళ్ళెదము. ఒక్క నిమిషము మీ మనస్సులో దృశ్యము కొరకు వెళ్ళెదము.
ఇక్కడ వున్నటువంటి ప్రతీ ప్రామాణిక విశ్వాసికి అన్యుల కాలమనేది రాజైన నెబుకద్నెజరుతో ప్రారంభమైనదని తెలుసు. అది నిజమేనా? ప్రవక్త యొక్క ప్రామాణికమైన విశ్వాసికి అది తెలుసు. నెబుకద్నెజరు రాజుకు కల వచ్చినది, దానియేలు దానికి భావాన్ని చెప్పియున్నాడు. అది వాస్తవమేనా? దాని శిరస్సు బంగారం, అది బబులోనై యుంటున్నది; రెండవది మాదీయులు, పారాశీయుల రాజ్యము; ఆ తరువాతది గ్రీకుల రాజ్యము, ఆ తదుపరిది రోమా సామ్రాజ్యము. రోమా సామ్రాజ్యము యొక్క అంతములో చేతి సహాయం లేకుండా పర్వతము నుండి తీయబడిన రాయి యేసుక్రీస్తే, అది దొర్లకుంటూ క్రిందకు వచ్చి ఆ ప్రతిమను విరుగగొట్టింది. (అది నిజమేనా?) అది భూమిని కప్పెను. ప్రతి విశ్వాసికి అది తెలుసు.
ఈ చివరి దినాలలో రకరకాల రాజ్యములుగా ఎలా విడిపోతారో చిట్టచివరికి అది బొటన వ్రేలు వద్దకు వచ్చుట అక్కడ అన్నాడు. “అటువలె మనుష్యజాతుల మిళితములై ఇనుము, మట్టితో అతికినట్లు ఒకరినొకరు పొసగకయుందురు.” అయితే వారు తమ విత్తనాలను మిశ్రమం చేస్తారు. దాని అర్థం ఇంకొక రీతిగా వారు వానిలోనికి వివాహ గ్రాహించబడతారు. వారు పిల్లలను పెంచడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఆ రీతిగా ఫలము కొరకు విడిపోతారు. అది యధార్ధముగా మీకు తెలుసు. అయితే అది ఒక పట్టును కలిగియుంటున్నది, “అది అద్భుతముగా” వున్నదని మీరు దానికి లొంగిపోతారు.
54
ఇక్కడ ఈ స్టీవ్సన్ వైపు చూడండి, అతను పేరు ఏనాడైన నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఆయన వున్నాడు. అతని పేరేమిటి? నేను మరచిపోయాను. ఆ మనిషి ఈ చుట్టు అనవసరముగా గడబిడలు రేపుతుంటాడు. [సమాజము ఆయన పేరు చెప్పుచున్నారు.] అవును. ఓ, మై!
ఈ అమెరికా దేశము మధ్య భాగం వరకు కూలిపోయివున్నది. అవునండీ. ఆ కాలములోని నేను మీకది రుజువు చేయగలను. ఇక్కడ ప్రకటన 12వ అధ్యాయములో వున్న ఈ స్త్రీ ఆమె మగ శిశువు దేవుని సింహాసనము మీద కూర్చొండుట, అందుల కొరకై కొనిపోబడ్డాడు. అది జరుగగా, ఆ స్త్రీ అరణ్యములోనికి పారిపోయినది. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరచియున్నాడు, ప్లయ్-మౌత్-రాక్ రోజుకు ఖచ్చితముగా ఇక్కడే సంఘము మత స్వాతంత్ర్యము కొరకు వచ్చినది. మరియు ఆమె ఇక్కడ స్థాపించబడియున్నది.
మనము క్రిందకు, ప్రకటన 13వ అధ్యాయము15వ వచనమును ఇక్కడ చూద్దాం. ఒక నిమిషం దాన్ని వెనుకకు నేను వెళ్ళాలనుకొంటున్నాను. ఇక్కడది సముద్రపు తీరమున నిలబడియుండుట మనము చూస్తున్నాము. ఇప్పుడు నేను ఆ స్థలాన్ని కనుగొనునట్లయితే, అది 11వ అధ్యాయమవుతు౦ది.
మరియు భూమిలో నుండి మరి యొక క్రూరమృగము పైకి వచ్చుట చూచితిని...
నీళ్ళలో నుండి కాదు; భూమిలో నుండి. అప్పుడు ప్రజలు జన సమూహములును, జనములు నీరయైయుంటున్నారు, తరువాత ఇక్కడ ఏ ప్రజలు లేరు, అది అమెరికా.
గొర్రెపిల్ల కొమ్ముల వంటి రెండు కొమ్ములు దానికుండెను...
“గొర్రెపిల్ల వంటి కొమ్ములు,” గొర్రెపిల్ల కాదు సుమా. మరి ఏమిటది? అది మన అమెరికా దున్నపోతు. నిజం. అది అక్కడే వున్నది: “గొర్రెపిల్ల వంటి రెండు కొమ్ములు.” అటు తరువాత అది ఏమి చేసినది. మొదటిది మత స్వేచ్ఛను కలిగియున్నది; గొర్రెపిల్లవలె నటించును, గొర్రెపిల్ల వలె మాట్లాడును. అయితే గుర్తించుకొనండి, అది ఎన్నడూ ఒక పాత పొట్టేలుగా మారలేదు. అది గొర్రెపిల్లగా వున్నది. మీకు తెలుసా. ఈ దేశము 150 సంవత్సరాల వయస్సు కలిగివున్నది, ఒక గొర్రెపిల్ల.
.... అది ఘటసర్పము వలె మాట్లాడుచుండెను.
అది ఆ మొదటి క్రూరమృగమునకు వున్న అధికార చేష్టలన్నియూ దాని యెదుట చేస్తూ వున్నది. ఎర్రని ఘటసర్పము మరియు చావు దెబ్బ తగిలి బాగుపడయున్న ఆ మొదటి క్రూరమృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. (చూడు!)
అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల యొదుల అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. (ఆటమ్-బాంబును, హైడ్రోజన్ బాంబును కలిగియున్నది; చురుకైనది. తెలివైన దేశం అది, వీటి ద్వారా దేశములను మోసం చేయుచున్నది.)
55
సంఘము మరియు ప్రభుత్వము కలిసి ఐక్యమయ్యే సమయానికి అమెరికా దేశము వస్తున్నది. అప్పుడు ప్రొటస్టెంట్లు వారు, క్యాథలిక్ వారు కలిసి కమ్యూనిస్ట్ తో పోరాడుటకు తమ వస్తువులను విసరివేయుదురు. దేవుడిక్కడ ఏమని చెప్పాడో ఖచ్చితముగా అట్లే దేవుని చేతిలో జరుగుచున్నది.
ఇదిగో దూరానవున్న ప్రొటస్టెంట్ వారలారా, మీరు బాగా నిద్రపోవుచూ బైబుల్ కు బదులుగా మీ ప్రేమ కథలున్న పుస్తకాలను చదువుతున్నారు! మీరు ఎక్కడో ఒక చోట ప్రార్ధన కూటాలలో ఉండవలసినది బదులుగా బయట ఎక్కడో ఒక విధమైన లోక సంబంధమైన పార్టీల్లో చుట్టూ దిమ్మరిగా తిరుగుతూయున్నారు; ఎక్కువ లెక్కలేని అతి చిన్న స్వల్ప విషయాలను బట్టి ఒకరిపట్ల ఒకరు అనవసరముగా ఆందోళన చేయడం. నిత్యత్వము అంటు ఏమిటో నీవు ఎరిగియుంటే, నీవు తప్పక ఎక్కడో నీ మోకాళ్ళ మీద ఉండేవాడవు.
56
గమనించ౦డి, వెనుక, ప్రారంభములో రాజైన నెబుకద్నెజరు అన్యుల కాలంలోనికి జారి వేయబడినప్పుడు అది లోనికి ఎలా వచ్చిందో మనము గమనిద్దాము. అది ఏ విధముగాలోనికి వచ్చినదో, అది లోనికి వచ్చిన రీతిగానే బయటకు వెళ్తున్నది. అన్యులకు కృపాకాలము యొక్క ప్రారంభం, మరియు అంతము వున్నదని మనకు తెలుసు. అది సరియేనా?
ఇప్పుడు గమనించండి. రాజైన నెబుకద్నెజరు చురుకైన మరియొక వ్యక్తియగు దానియేలును అక్కడికి పంపించబడినప్పుడు, మిగిలిన యూదులందరు ఒక విధముగా తగ్గించుకొని వారు ఆ రోమీయులకు లేక బబులోనుకు నమస్కరించుచున్నారు. అయితే అక్కడ ముగ్గురు లేక నలుగురు మనుష్యులు ఉన్నారు; ముగ్గురు (షద్రక్, మెషకు, అబెద్నగో), మరియు దానియేలు దేవుని సేవించవలయునని వారి మనస్సులలో నిశ్చయించుకున్నారు. అప్పుడు వారు షద్రక్ను వారినందరిని లోనికి పిలిచినప్పుడు దానియేలు రాజైన నెబుకద్నెజరు మరియు బెల్షాజరు ముందు గొప్పవాడయ్యాడు. అతడు గొప్పవాడయిన తరువాత (ఇప్పుడు గమనించండి) రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి, దానిని ఒక మైదానములో నిలువబెట్టించి, ప్రతీ యొక్కరూ ఆ ప్రతిమకు సాగిలపడాలని ఆజ్ఞాపించాడు.
మీరు ఏనాడైనా దాని అమాయకత్వాన్ని గమనించారా? ఎవరి నుండి ఆ ప్రతిమ తయారు చేయబడినది. అది దానియేలు ప్రతిమయే — ఒక మనిషి యొక్క ప్రతిమ. అతడు చెప్పలేదా, “దేవతల ఆత్మ అతనియందు యున్నదని,” అది అన్యత్వం. ఈనాడు వారికి ఎలాగున్నవో అలాగే మూడు, నాలుగున్నవి. “దేవతల ఆత్మ అతనిలో నివసిస్తున్నది,” కాబట్టి వారు దానియేలుకు ఒక ప్రతిమ తయారు చేశారు. అతడు చెప్పాడు, “ఆ ప్రతిమకు నమస్కరించని వారందరూ మండుచున్న అగ్ని గుండములో పడవేయబడతారని.” మీరు గమనించండి, ఆ సమయములో దానియేలు రంగముపై లేడు. నా భావాన్ని గ్రహిస్తున్నారా? ఎవ్వరైతే ఆ ప్రతిమకు సాగిలపడరో, అలాంటివారు ముక్కలు చెక్కలుగా చేయబడతారు, సింహపు బోనులో వేయబడతారు, లేక ఏదో ఒక శిక్ష వారికి విధించబడుతున్నది.“
విగ్రహసంబంధమైన మత ఆరాధనతో దానికి వారు నమస్కారము చేయవలెనని హింసతో ఆ రీతిగా అన్యుల కాలం ప్రారంభమైనది. ఆ విధముగానే అది అంతమవుతుందని బైబిల్ ముందే చెప్పియున్నది; ఒక “పరిశుద్ధ మనిషి,” యేసుక్రీస్తు; ఆయనకు ఒక ప్రతిమను చేయటము దానిని ఆరాధించుట కొరకు.
మీకు ఇది జ్ఞప్తి ఉందా, హతసాక్షుల పుస్తకములో వారు వారి ముందు ఒక సిలువను పెట్టి, అనగా మరణము పెట్టి మేకులతో కొట్టబడిన క్రీస్తు యొక్క ప్రతిమను (బొమ్మను) పట్టుకొని అతని రెండు చేతులను రెండు వైపులా రెండు ఎద్దులకు కట్టి, అతనిని చెప్పమంటారు. నీవు ప్రొటస్టెంటిజమును వ్యతిరేకించి ఈ సిలువను ముద్దు పెట్టుకొని ఒక క్యాథలిక్ గా మారని పక్షమున వారు ఒక ఎద్దును ఒక వైపునకు మరియొక ఎద్దును మరొక వైపునకు లాగి, వారిని వేరువేరు ముక్కలుగా చీల్చుతారు. వారిని కొయ్య స్థంభాలకు కట్టి కాల్చివేస్తారు. వారు అంతా చేశారు. శవాలను పెట్టే ఆ పాత్ర గుహలోనికి (కాటాకొ౦బ్స్) నేను వెళ్ళాను; నేను ఏమి మాట్లాడుతున్నానో నాకు తెలియును. చూడండి. అది వాస్తవము. వారక్కడ ఉంచబడ్డారు. మార్టిన్ లూథర్ కు ముందు వారు ఎలా హత సాక్షులుగా చనిపోయారో గమనించండి. బైబిల్ ప్రకారము కూడా.
57
మరలా ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు గొప్ప విషయాన్ని గ్రహించాలని నేను కోరుచున్నాను. ఆ బబులోను సామ్రాజ్యం ఏ విధముగా విచ్చినమైపోయినది? ఒక రోజు రాత్రి వారు వెళ్ళిపోయి, దేవుని పవిత్రమైన పాత్రలను తీసుకొని వచ్చి వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగటం ఆరంభించారు. గొప్ప సమయాన్ని వారు కలిగియుండటానికి ప్రారంభించారు. కొంత మంది స్త్రీలను, ఉంపుడుగత్తెలను బయట నుండి తెప్పించారు. వారు నాట్యాలు చూస్తూ త్రాగి తూలుతూ, గొప్పు సమయాన్ని వారు కలిగియున్నారు. అది నిజమా? ఆ సమయంలోనే గోడ మీద చేవ్రాత వచ్చినది, మెనె, మెనె, టేకెల్, ఒఫారిస్.“ అవునా? వారు వెళ్ళిపోయి, వారు కల్దీయులను వారి జ్ఞానుల మనుష్యులను, నులివెచ్చని సంఘ సభ్యులనందరిని తీసుకొని వచ్చారు. ఇంకా వారిలో ఎవ్వరూ దానిని చదువలేకపోయారు. అది వాస్తవము.
అయితే వారు ఒక మనుష్యుని కలిగియున్నారు, అతడు అన్యభాషలను చదువగలడు. (హల్లెలూయా!) దాన్ని తర్జుమా చేయగలడు. నా భావమేమిటో చూస్తున్నారా? అన్యభాషలను అతడు తర్జుమా చేయగలడు. ఆ విధముగానే అది బయటకు వెళ్ళుచున్నది.
58
ఆ రీతిగానే ఆమె యిప్పుడు బయటకు వెళ్ళుచున్నది: ప్రజల మీద పరిశుద్దాత్మ శక్తితో మరియు పరిశుద్దాత్మ పొందిన వారితో అద్భుతములను, సుచక క్రియలను చేయగల శక్తి గలవారితో బయటకు వెళ్లినది. అక్కడ అన్య సంఘము ఉన్నది. అక్కడే శేషము ఉన్నది.
అక్కడ ఆ రీతిలోనికి వచ్చినది, ఆ రీతిగానే బయటకు వెళ్ళుచున్నది, ఖచ్చితముగా, సగం అన్యమతానికి సాగిలపడి బలవంతము చేయటం అక్కడ ఉన్నది. మరియు దేవుడు ఆ క్లిష్టమైన సమయములలోనికి అడుగు పెట్టడం మరియు అన్యభాషలతో వ్రాయటం మరియు మనిషి దానికి తర్జుమా ఇవ్వటం. అతడు దానిని అనువదించగలడు. ఆ భాష అతడికి తెలియదు; మరి ఇంకొకరికి తెలియదు. అయితే అతడు అదే పరిశుద్దాత్మను కలిగియున్నాడు, అదే అతనిని తర్జుమా చేయించకలిగినది, అదే పరిశుద్దాత్మ సంఘములో ఈ దినమున ఉన్నది.
59
“మూఢవిశ్వాసం” అని మీరు, దానిని పిలుస్తారు. అది నేనంగికరిస్తాను, దానిని వారు ఎంతో కలిగి ఉన్నారు. అయితే సహోదరుడా, అక్కడ ఒక నిజమైన వ్యక్తి కూడా ఉన్నాడు. [స్పష్టతలేని మాటలు] తప్పు, అక్కడ ఒక నిజమైన వ్యక్తి కూడా ఉన్నాడు. దయ్యము విసిరివేయగలిగే ప్రతీ విరుద్ధమైన దానిని నీపై విసిరి నిన్ను అయోమయములో పెడుతుంది. నీవు ఏ మాత్రము దేవుని గూర్చి ఆలోచన చేయకుండా, క్రిందకి దిగి బైబిల్ చదువకుండా, ప్రార్థన చేసి దేవుని అడుగనట్లయితే, అప్పుడు నీ ఆత్మ విషయములో నీవు ఎక్కువ శ్రద్ధ లేనివాడవని అది చూపుతున్నది.
నేరుగా ముందుకు కదిలి చెప్పుము, “దేవా, ఆ పాతా కాకి ఎరలు ఎన్ని బయట ఉన్నప్పటికిని నేను లెక్కచేయను. ఇప్పుడు నీ యొక్క బైబిల్ ఇలా చెప్పుచున్నది, నేను నిర్ణయించుకున్నాను!” అది నిజము. “నీవు నాకు వాగ్దానము చేశావు, అబ్రహాము సంతానము.”
దేవుడు నిన్ను పిలిచాడు, నీవు దాని యొద్దకు వస్తావు; అయితే నీవు పిలువబడకపోయినట్లయితే, నీవు ఎంత భక్తిగా ఉన్నప్పటికి నాకనవసరము, నీవు నశించిపోయినట్లే; అంతే, నీవు రాలేవు. ఆయన నిన్ను పిలిచినట్లయితేనే తప్ప, ఏ మనుష్యుడు రాలేడు. ఎవ్వరునూ నశించవలెనని ఆయన ఆశించటము లేదు, కానీ మీలో అనేకులు నశిస్తారు, కారణం దాన్ని గూర్చి మీరు శ్రద్ధలేని వారుగా ఉన్నారు.
నీవు చుట్టూ తిరిగి ఏదో కొంత వెర్రి భక్తిలాగ ఉన్నదానిని చూస్తావు, ఒక చిన్న నీడ వంటిది, “సరే, డాక్టర్ ఫలానా-ఫలానా, ఫలానా, అని చెప్పాడు, అని అంటావు. తరువాత నీవు నడుచుకొంటూ వెళ్ళి పరిశుద్ధాత్మను దూషిస్తావు. తెలుసా, అది నిజం. అది ఎన్నటికీ క్షమించబడదు.
దయ్యపు ముద్ర అనగా ఏమిటో కొన్ని నిమిషాల్లో మనము చూడబోతున్నాము, దయ్యపు ముద్ర అనగా, మృగము యొక్క ముద్ర. “ఎవ్వరైతే పరిశుద్దాత్మకు వ్యతిరేకముగా మాట్లాడతారో, వారికి ఈ లోకంలో గానీ, రాబోవు లోకంలోగానీ, క్షమాపణ ఎన్నడునూ లేదు.” వారు ఏమి చేశారో ఆ మొదటి సంఘాన్ని గమనించండి. ఈ రెండవ సంఘాన్ని గమనించండి! దేవుని రాజ్యానికి బయట దయ్యములోనికి నిన్నునీవు ముద్రించుకుంటావు; బయట అక్కడ క్షమాపణ లేదు, ఈ లోకంలో గానీ, రాబోవు లోకంలో గానీ. వాస్తవం. కాబట్టి జాగ్రత్తగా ఉండు, భయభక్తులు కలిగియుండు. నీవు ఏమి చేస్తావో జాగ్రత్త వహించు, ఎందుకంటే ఏమి జరుగుతుందో నీకు తెలియదు.
60
ఇప్పుడైతే ఇదంతా క్రిందికి కప్పివేయబడుట మనము చూస్తాము. నాకింకా ఇరవై నిమిషాలు ఉన్నవి. కొన్ని నిమిషాల్లో ముగించడానికి మీరు నాతో పాటు ప్రకటన 17వ అధ్యాయము చూడండి. ఇప్పుడు, మనము దానిని తాకబోతున్నాము. జాగ్రత్తగా విన౦డి. నాతో చదవండి. మీ బైబిల్ తెరచి చదువుటకు సంసిద్దముగా ఉండుడి. ఇది దానిని తప్పక ముద్ర వేయవలెను.
గుర్తించుకో, ఇక్కడ రెండు ముద్రలున్నవి; ఒకటి భక్తిహీనత, మరొకటి పరిశుద్దాత్మ. ఒకటి దయ్యము యొక్క ముద్ర.
గుర్తుంచుకో, ప్రారంభ క్యాథలిక్ సంఘమును గూర్చి నేను దీనిని చెప్పాను.... ఇప్పుడు, క్యాథలిక్ వారలారా కొన్ని నిమిషాలు భయభక్తులతో కూర్చొనండి. ప్రారంభ క్యాథలిక్ సంఘము ఒక విషయాన్ని గూర్చి తమ అభిప్రాయమును రూపొందించారు. పరిశుద్ధ రొట్టెను గూర్చి ఆత్మ బాప్తిస్మానికి బదులుగా రొట్టెను తీసుకొనుట గూర్చి వారు తప్పు సిద్దాంతాలను కలిగియున్నారు.
ప్రొటస్టెంట్ వారు కరచాలనం చేయడం ఆరంభించారు, లేక ప్రతిజ్ఞ చేయడం లాంటిది; దేవుని యొక్క వాక్య ప్రకారముగా రెండు తప్పే. ఇది నమూనా అయ్యియుంటున్నది. వారు వచ్చి “తండ్రి, కుమార, పరిశుద్దాత్మలో” బాప్తిస్మము ఇస్తారు. ఏ భక్తుడూ ఆ రీతిగా బాప్తిస్మము పొందినట్లు ఏ ఒక్క కాలంలో కూడా లేదు; అది పూర్తిగా విగ్రహారాధనకు సంబంధించినది, అది క్యాథలిక్ వారి యొక్క బాప్తిస్మము. వారు దానిని ఒప్పుకుంటారు, “మీ ప్రొటస్టెంట్ వారు మా బాప్తిస్మానికి సాగిలపడతారు,” అని చెప్తారు.
నేను అన్నాను, “మీరు దానిని ఎందుకు చేశారు?”
“వారు కోరిన ఏ లేఖనాన్ని అయినా మార్చడానికి క్యాథలిక్ సంఘానికి అధికారము ఉన్నదని” అతడు అన్నాడు.
“అది ఒక అబద్ధము,” అని నేను చెప్పాను.
అతడన్నాడు, “అలాగైతే మీరు దానికి ఎందుకు సాగిలపడతారు?”
ఆహా, అలాగైతే మీరు నోరు మూయండి. నేను కాదు! నేను దానియందు నమ్మకము౦చను. ఇది దేవుని వాక్యమైయున్నది. అది నిజము. ప్రజలు వెంబడింపగోరితే, వారు ఒంటరిగా వెళ్ళవలసియున్నది. నేను సత్యాన్ని చెప్పవలసియున్నది. అది నిజము.
61
గమనించు, ఆ తరువాత వారు వాటన్నింటితో వచ్చి సంఘము దాని పాత పరిశుద్ధ క్రమముగా బోధించుటలోనికి వాటన్నిటితో అక్కడ ఏకమైనది. ఎలాంటి మూర్ఖత్వము మరియు బుద్ధిహీనత అది! లక్షల కొలది నాస్తికులను, మరియు నామాకార్ధపు వారిని పొదిగినది...
ఆదిలో అది దయ్యమైయున్నది. బైబిల్ ఎక్కడ చెప్పియున్నది, నేను మీకు దానిని రుజువు చేయగలుగుతాను. “ప్రపంచమంతయూ ఈ మృగమును (శక్తిని) చూచి, ఆశ్చర్యపోతున్నది, ఉండునది, ఇప్పుడు లేనిది, అయినప్పటికి ఉన్నది.” అదెలా వుంటుంది, “ఉన్నది, మరియు లేనిది?” ప్రపంచమంతా దాని గురించి ఆశ్చర్యపోతున్నదని,“ చెప్పబడి యున్నది.
విగ్రహారాధనా చేయు రోము - రోమన్ క్యాథలిక్లు, మతాధికారము రోముగా మారినప్పుడు, అది ఎన్నడూ అంతము లేదు. రోమనిజం యొక్క క్రమము అంతమైనది; ఒక రాజు క్రొత్తగా లోనికి వచ్చినప్పుడు, అతడు నూతన క్రమాన్ని ఏర్పాటు చేసేవాడు. అయితే అది విగ్రహారాధనలోనికి వచ్చినప్పుడు క్యాథలిక్ సంఘము ద్వారా రోమన్ క్యాథలిక్ మతాధికారుల ద్వారా అది ఎన్నడూ అంతము కాలేదు సుమా. ఒక పోపు చనిపోయినట్లయితే, వారు మరొక పోపును నియమించేవారు; ఒక పోపు చనిపోయినప్పుడు, వారు మరొకరిని నియమించేవారు. “లేనిదై ఉండి, అయినప్పటికీ ఉన్నది, లేనిదినై అది ఇంకనూ ఉన్న మృగము; అది నాశనంలోనికి వెళ్ళును. లేఖనము ద్వారా పరిశుద్ధాత్మ ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
62
ఇప్పుడు, వినండి.
మరియు అక్కడ.... (మీరందరూ కూడా గమనించండి: ప్రకటన 17వ అధ్యాయము.) ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఆ చివరి పాత్రలో అవి కుమ్మరించబడతాయి. నాతో మాట్లాడుచూ, ఈలాగు చెప్పెను... నీవు ఇక్కడకు రమ్ము; విస్తార జలములపై కూర్చున్న మహా వేశ్యకు చేయు తీర్పు నీకు కనపరిచెదను.
63
ప్రకటన 12 నీవు గమనించు. ఆమె కన్యకయైన స్త్రీ. ఆమె నిజమైన స్త్రీ. ఆమె ఎంత అందముగా నిలబడియున్నదో!
అయితే ఇక్కడ ఈమె వేశ్యగా పిలువబడుతున్నది. “మహావేశ్య” ఏమిటిది? మనము దీనిని విశదీకరించుదాము.
నన్ను క్షమించండి, పదిహేను నిమిషాలు తలస్తూ నేను అతివేగముగా వెళ్తున్నాను. నేను ఒక గంట సేపు తీసుకొనబోవుచున్నాను, కాబట్టి కొంచెం నిలకడగా ఉండండి.
మంచిది, దానిని మనము విశదపరచుదాము. ఆమె ఒక చెడ్డ స్త్రీ. వేశ్య అంటే ఏమిటి? ఈ మాట చెప్పటానికి నేను అసహ్యపడతాను, అయితే అది బైబిల్లో వ్రాయబడియున్నది. ఒక స్త్రీ, మంచి స్త్రీ అని చెప్పుకొనుచు, ఇంకా మరియొక పురుషునితో వ్యభిచారము చేయునది. ఇప్పుడు, ఒక స్త్రీ సంఘమునకు సాదృశ్యముగా యున్నట్లయితే, అప్పుడది క్రైస్తవునిగా ఉన్నానని చెప్పుకునే సంఘము ఇతర విషయాలలో వ్యభిచారము చేయుచున్నది. అది వాస్తమేనా?
“ఆమె విస్తార జలములపై కూర్చునియున్నది; ఆ జలములు ప్రజలు, జనసమూహముల మీద.” 15వ వచనాన్ని మీరు చదవండి మరియు మీరు దానిని చూస్తారు. లేక 17వ వచనము దాని వెంబడే, ఒక నిమిషం మనము దానిలోనికి వెల్దాము. విస్తార జలముల మీద కూర్చునియున్న ఆ స్త్రీ మహావేశ్య, ఎలాంటి సంగతి అది. ఇప్పుడు మనకు దినముల వెంబడి దినములు ఉన్నట్లయితే నేను ఆ స్త్రీని తీసుకొని కయీను నుండి ప్రభువైన యేసు వచ్చువరకు దాని జాడను తీసి సంఘమునకు మొదటిగా ఒక సంఘశాఖను మార్చినది ఆమెయేనని నేను మీకు రుజువు చేస్తాను. సంస్థాపక సంఘానికి ఆమెయే తల్లియైయున్నది. గమనించు, “ఆ స్త్రీ విస్తార జలముల మీద కూర్చునియున్నది... విస్తార జలముల మీద కూర్చున్నది.”
ఇప్పుడు, రెండవ వచనము.
... భూ రాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులైరి.
64
ఇంకొక మాటలో, ఆమె క్రైస్తవ సంఘమని చెప్పుకొనుచున్నది; ఆమె ఉన్నత స్థితిలో సౌందర్యముగా ఉన్నది. ఆమె ఎలా అలంకరించబడినదో గమనించు, కొద్ది నిమిషాలలో, ఆమె బంగారముతోనూ, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరించబడినది. “ఆమె వంటివారు ఎవరు?” అని వారంటారు.
మరియు ఆమె వ్యభిచార సంబంధమైన మధ్యముతో కూడిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉన్నది. ఆమె అపవిత్రమైన ఆమె సిద్దాంతము దానితో “ఆమె రాజుల గూర్చిన ప్రార్ధన చేసి పాపపరిహార స్థలము నుండి వారు బయటకు రావాలని,” వీటన్నిటికి ఆమె ఒక కారణమైనది. అది అంతే. అక్కడే నీవున్నావు. నేను చదువుతున్నది దేవుని యొక్క వాక్యమైయున్నది. చూడు, “అతడు నన్ను కొనిపోగా...” ఇప్పుడు, మనము చూద్దాం..... అది 3వ వచనము. సరే.
అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా: ధూమ్ర రక్తవర్ణముగల మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని... (“ఎర్రనిది, ధనవంతమైనది. ప్రపంచములోనే ధనికమైన సంఘము.)
“ఆమెతో ఎవరు యుద్ధము చేయగలరు?” అని వారు కేకలు వేస్తున్నారు. ఈ ప్రపంచములో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. దర్శనం ప్రకారముగా రాజైన నెబుకద్నెజరు వలె శక్తివంతమైన వ్యక్తి, ప్రపంచమంతటిలో ఒకే ఒక మనిషి ఉన్నాడు. కాలు యొక్క ఆ పది వ్రేళ్ళు ప్రతీ దేశములోనికి వెళ్ళునని ఆ రోమా ఇనుప రేఖ, ప్రపంచములోని ప్రతీ దేశములోనికి పరిగెత్తినది. ఈ ప్రపంచములో ఆ రీతిగా చెప్పాడు అను దానిని కలిగియున్నది. పోపు కంటె మరియొక మనిషి ఎవరున్నారు? ప్రెసిడెంట్ ఐసెన్-హావర్ అమెరికాలోనే మాట్లాడగలడు, మరియు అమెరికా యొక్క చట్టము గూర్చి మాత్రమే అతడు చెప్పగలడు; అయితే మరొక దేశములో ఇతర దేశములో మాట్లాడలేడు. అయితే గతంలో వలె పెద్ద గురువు రోములో మాట్లాడితే ప్రతీ దేశములో దానికి కేకలు వేయాలి. అది వాస్తవము. అక్కడే అతడు ఉన్నాడు. ఇప్పుడు, అతడు ఎక్కడ ఉన్నాడో మనం చూడబోతున్నాం. మరియు అతడు అవునో, కాదో చూద్దాం. అతడు ఇక్కడే చిత్రీకరించబడియున్నాడు. సరే.
... దేవదూషణ నామములతో నిండుకొని, ధూమ్ర రక్తవర్ణముగల మృగము మీద కూర్చు౦డిన ధనికురాలు, ఒక స్త్రీని చూచితిని.
తప్పుడు బాప్తిస్మము; తప్పుడు ఆర్థిక విధానము; ప్రజలను గ్రుడ్డిగా నడిపించుచున్నది, కేవలం సంఘమునకు వస్తే చాలు అని వారికి చెప్పుడం, వారికి ఒప్పుకోలు చెప్పుడం, మొదలైనవి. “మరియా - నీకు వందనాలు” అని చెల్లించడం మొదలగునవి. అజ్ఞానము! బుద్ధిహీనత! మంచి నాగరికత, మనుష్యలు ఎలాగ అలాంటి సంగతులను నమ్ముతున్నారో నేను చూడలేకపోవుచున్నాను.
... ఏడు తలలు కలిగినది....
అక్కడే నీవున్నావు, చుట్టూ అంతటా ఇదే దయ్యము, ఎర్రని ఘటసర్పము. క్రూరమృగము, మరియు అన్నియు, వాటికీ “ఏడు తలలు; పది కొమ్ములు.”
65
మరియు స్త్రీ..... (సంఘమంటే స్త్రీయైయున్నది; మృగము ఆమె కలిగియున్న శక్తి, రోమన్ క్యాథలిక్ సంఘము. అయితే రోమన్ క్యాథలిక్ యొక్క శక్తి; అయితే ఇప్పుడు ఇక్కడ సంఘము మాట్లాడుచున్నది.) ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరించబడి యున్నది. ఏహ్యమైన కార్యములతోనూ, తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రకార్యములతోనూ నిండినదై ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొనియున్నది.
ఆమె అక్కడే యున్నది. అది ఏదో ఒక సంఘము, అది కాదంటారా? అక్కడ ఉండవలసియున్నది; ఆమె దృశ్యము బయటికి తీయబడింది. కొంచెం క్రిందికి చదివి మరియు ఆమె ఎవరో మనం చూద్దాం.
దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను. మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను.
సరే, ప్రొటస్టెంట్ వారు ఇక్కడే మీరు పిండబడతారు. ఆమె ఒక వేశ్యయని మీవు అంగీకరించాలి. అయితే ఆమె “తల్లి” అయి యున్నది. (దేనికి? ఏ కుమార్తెలకు?) “వేశ్యలకు.” ఆమె స్త్రీ అయి యున్నది. అది నిజమేనా? అప్పుడది సంఘములైయ్నువి. అది నిజమేనా? అప్పుడు ఆమె తల్లిసంఘమైయుంటున్నది. ఆమె కాదా? మార్టిన్ లూథర్ ఎక్కడ నుండి వచ్చాడు? కేథోలిజం నుండి. ఇవన్నీ ఎక్కడ నుండి పొదగబడినవి? క్యాథలిక్లో నుండి అదే సిద్దాంతము తెచ్చుచ్నువి, మీరు దానికి సాగిలపడతారు.
66
ఇప్పుడు, జెఫర్సన్విల్లోని ఒక అతి సామాన్యమైన స్త్రీ ఒక మంచి నిజమైన కన్యకయైన బాలికను కనగలదు. (అది నిజం), ఇంకా ఆమె కోరుకున్నట్లయితే నేరుగా వెళ్లిపోవచ్చును. ఆ విధముగానే లూధరన్ సంఘము, మెథడిస్టు సంఘము, బాప్తిస్మము సంఘము ఇంకా ప్రేస్బిటేరియన్ సంఘము, మరియు మోడులగునవి చేసినది; వారి యొక్క సంస్థాపకులు వారికి సువార్త భోదిస్తున్నప్పుడు వారు కొంత కాలం నేరుగా ముందుకు వెళ్ళారు. అయితే ఇప్పుడు వారు సినిమాలకు వెళ్తున్నారు, నాట్యాలు, టెలివిజన్లు, పొగత్రాగడం, అన్నీ చేస్తున్నారు (అది సత్యమని నీకు తెలియదా!) ఆదివారం ఇంటి దగ్గరే ఉండటము. ఏంటి ఇదంతా? కారణం మీ యొక్క వేశ్య ఆమె యొక్క తల్లివలె ప్రవర్తించుచున్నది. అది ఖచ్చితము. అది ఖచ్చితము.
ఇప్పుడు, ఆ రంగు ఎక్కడ ఉన్నదో మనము చూద్దాం. బైబిల్ ఈలాగు తెలియజేస్తున్నది, “ఆమె వేశ్యలకు తల్లి.” ప్రతీ ఒక్కరికి అది తెలుసు అది విగ్రహారాధన సంబంధమైన రోము అని, లేక శ్రీమతి. పాపల్ రోము, అది రోమన్ క్యాథలిక్ సంఘం. ఒక నిమిషములో భూమి మీద ఆమె స్థానములో మీకు ఆమెను చూపిస్తాను. ఖచ్చితముగా ఆమె ఎక్కడ కూర్చోని ఉన్నదో. నిజం. ఆమె ఎక్కడ ఉన్నది మరియు ఆమె ఎవ్వరైయున్నది, బైబిల్ ఆ విధముగా చెప్పినది. నేను కాదు; బైబిల్ చెప్పినది! మరియు ఆమె వెంబడి అనేకమైన కుమార్తెల సంఘములను ఆమె కలిగియున్నదని చెప్పుబడియున్నది. సరే ఇప్పుడవన్నీ మెతడిస్టు, బాప్టిస్టు, లూథరన్ అలాంటివి, మీరు ఎక్కడికి వచ్చారో చూశారా? “వేశ్యలకు తల్లి.”
67
వారు బాగానే జీవించారు, అయితే వెలుగు ప్రకాశించుట ప్రారంభము కాగానే...
అది వేసవి కాలములోని ఒక విధమైన బొద్దింకవలెయున్నది. రోడ్డు మీద పాతజొన్నకంకి లేక మరి అలాంటిది తింటున్న బొద్దింక వైపు వెలుతురు గమనించు అవి గట్టిగా కమ్ముకొనియుంటివి.
దానికి ఆ పాత నామాకార్ధ భక్తియైన సంఘాలకి మీరు సువార్త ప్రకటించగా, అనగా, పరిశుద్దాత్మ బాప్తిస్మము గురించి భోదించు; వారిని గమనించు: “మేము అలాంటి దాన్ని నమ్మము అంటారు. మేము దీనిని నమ్మము...” ఎందుకు? ఆరంభము నుండి ఎవరో నీకు తెలుయును. అది నిజం. అది కచ్చితముగా.
మీ సంఘానికి వ్యతిరేకంగా నేను చెప్పుట లేదు; సహోదరుడా, అక్కడ వారిలో ముచ్చటలాడే ప్రజలు నీకు ఉన్నారు. క్యాథలిక్ వారికి వ్యతిరేకముగా నేనేమి చెప్పుడం లేదు. బ్రెన్హాం టెబర్నికల్ లో యున్న ప్రజలను నేనే విధముగా ప్రేమిస్తున్నానో, క్యాథలిక్ ప్రజల్ని కూడా నేనాలాగు ప్రేమిస్తున్నాను. నీపై కాదు స్నేహితుడా నేను అరిచేది. మెథడిస్టు, బాప్టిస్ట్ మరియు బ్రెన్హాం టెబర్నికల్ వారాలారా, అది మీపై కాదు. నేను అరిచేది వేసేది మీ మీద కాదు. అది సాతాను, నీ మీద వేసున్న పాపము మీదనే నేను కేకలు వేస్తున్నాను. ఏదో మందిరానికి వెళ్తున్నంత మాత్రాన నీవు రక్షించబడ్డావని తలస్తున్నావు.
“ఒకడు నీటి మూలముగా, ఆత్మమూలముగాను జన్మించితినేగానీ, అతడే మాత్రమును పరలోక రాజ్యములో ప్రవేశింపలేడని” యేసు చెప్పియున్నాడు. “నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే: ”నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును.“ సహోదరుడా, అది నేరుగా భుజము దగ్గర నుండి రావాలి. అయితే అది అంతగా భుజము నుండి కాదు; నేరుగా బైబిల్ దగ్గర నుండి రావాలి. ”బహుశా కొందరిని ఈ సూచనలు వె౦బడి౦చును,“ అని యేసు చెప్పలేదు. ఆయన చెప్పెను, ”అవి వారిని వె౦బడి౦చును.“
“ఓ,” మీరు చెప్తారు, “అది అపోస్తులులకే అని నేను నమ్ముతాను. ఆరంభములో కేవలము ఒకే ఒక అపొస్టులులు యున్నారు.”
గత వారములో మనకున్నటువంటి వర్తమానములో: ఆయన చేతిలో ఏడు నక్షత్రాలుయున్నవి, ప్రతీ యొక్క నక్షత్రము కూడా ఆ కాలానికి ఒక వెలుగుగా ఇవ్వబడియున్నది. అవును. అక్కడ ఒక అపొస్తులుడు ఏ విధంగా ఉన్నాడో, అక్కడొక, అక్కడొక, అక్కడొక అపోస్టులుడు ఉన్నారు; “అవి యేడు ఆత్మలు (అక్కడ మన పాఠము యొక్క ఆరంభములో) యేడు సంఘకాలాలకు పంపించబడుటకై దేవుని యెదుట అవి నిలబడి ఉన్నవి.”
68
ఓ సహోదరుడా, నీవు ఆ చిన్న బాప్టిస్ట్ లేక మెథడిస్టు సిద్ధాంతాలతో నడుస్తూ యుండవచ్చు; అయితే ఒక్కసారి నీవు దానిని బైబిల్ దృష్టిలో చూచినప్పుడు. అవును. ఆమెన్. ఇప్పుడు నేను భక్తి పూర్వకమైన అనుభవమును పొందుచున్నాను. ఆమెన్. అవునండి. చూడు. సహోదరుడా, అక్కడే నీవున్నావు. అది తిరుగలి పట్టుచున్నది; కానీ నీకు దెబ్బలు తగలనట్లయితే, అది నీకు ఏ మంచిని కలిగించుదు...
మా తల్లి ముందు కాలములో మాకు ఆముదాన్ని ఇచ్చేది. మేము అప్పుడు చిన్న పిల్లలము. వారమంతా కూడా, ఆదివారం కూడా మేము మొక్కజోన్న రొట్టెలను, ఈ విధముగా చిక్కుడు కాయలు తినేవారము. ఎల్లవేళలా ఎక్కువ మందులు వాడవలసివచ్చేది. శనివారం రాత్రి ఎప్పుడూ కూడా మా తల్లి నన్ను ఆముదాన్ని త్రాగమనేది. మరియు శనివారం రాత్రి నేను నా ముక్కును ఈ విధముగా మూసుకొనేవాడను. నేను తమాషాగా ఇది చెప్పుట లేదు సుమా! నేను నా యొక్క ముక్కును ఈలాగు మూసుకుని, “అమ్మా నేను దానిని త్రాగలేను, అది నన్ను ఎంతో జబ్బుగా చేస్తుంది,” అని చెప్పేవాడను.
ఆమె అనేది, అది నీకు జబ్బుగా చేయకపోతే, అది నీకు ఏ మంచి చేయదు.“
అలాగే ఇది కూడా. [సాహో బ్రెన్హా౦ తన బైబిల్ ను తట్టుచున్నారు.] అది నిన్ను కదిలిస్తుంది! అది నీ జీర్ణకోశాన్ని సరిగ్గా పనిచేయునట్లుగా చేస్తుంది, కావున ఆ విధముగా నీవు సంపూర్ణ సువార్తను జీర్ణము చేసుకోగలుగుతావు.
69
లూథర్ నీతికరణతో వచ్చియున్నాడు. ఎందుకు, వారు అదంతయూ కూడా సంస్థగా తయారు చేశారు: “అవునండి, మేమే సంఘము,” అని అన్నారు.
జాన్ వెస్లీ శుద్దీకరణమును చూశాడు. అతడన్నాడు, “అది భిన్నముగా యున్నట్లు నేను చూస్తున్నాను,” అని అన్నాడు. అతడు చెప్పాడు, “లూథర్ అది మంచిదే కానీ, అది ఇదే.” అతడేమైయున్నాడు? లూథర్ తన యొక్క కాలానికి నక్షత్రమై యుంటున్నాడు, అయితే ఇక్కడ వెస్లీ ఉన్నాడు. మంచిది.
అప్పుడు లూథరన్ లు అందరూ గూట్లోనికి వెళ్ళిపోయారు, కారణం వారు దానిని మర్చిపోయారు... ఇప్పుడు, అందరూ కాదు.... లూథరన్ సంఘమని నా భావం. లూథరన్లు ఇంకా మంచివారే, పరిశుద్దాత్మతో నింపబడినవారు. అది నిజం. అయితే ఇప్పుడు, వారందరూ ఆ కాలములోనికి సంఘములోనికి వెళ్ళిపోయారు. దాని వెంబడి వెస్లీ వచ్చాడు. వారిని అతని కాలము గుండా తీసికోని వచ్చాడు.
ఆ తరువాత మొదటి విషయం ఏమిటో తెలుసా, వెస్లీ కాలము వెంబడి పెంతెకోస్టు కాలము వచ్చినది. వారు పరిశుద్దాత్మను పొందారు, భాషలతో మాట్లాడారు.
మై, మెథడిస్తులు, బాప్టిస్ట్ లు, నజరీనులు, హోలినెస్ వారు, “ఓ, అది దయ్యము” అని అన్నారు. వారు ఏమి చేసిరో మీరు చూడండి? వీరు పరిశుద్దాత్మను ధూషించారు. ఈ దినాన మీరు ఎక్కడ ఉన్నారు? సరే. కచ్చితముగా మీరు చేసిందే అదే. నిశ్చయముగా, మీరే చేశారు. వెలుగులో నడుచుటకు మీరు తప్పిపోయారు.
మరియు ఇప్పుడు పెంతకోస్తు వారైన మీరు ఈ లవోదికయ సంఘకాలములో ఎంతో నులివెచ్చగా మారారు, చివరకు దేవుడు తన నోటి నుండి ఉమ్మివేయుచున్నాడు. వాస్తవము. అది కచ్చితముగా సత్యము.
70
మీరు అడుగవచ్చు, “భాషలలో మాట్లాడటం మీరు నమ్ముతారా?” అని. అవునండీ. “మీరెన్నడైనా భాషలతో మాట్లాడారా?” అవునండీ. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. అవునండీ. ఎన్నోసార్లు నేను భాషలతో మాట్లాడాను. ఇంకా అది దేవుని శక్తి అని నేను నమ్ముతాను. అవును. అయితే భాషలతో మాట్లాడటమే పరిశుద్ధాత్మకు సూచనగా నేను నమ్మను. అయితే, దేవుని శక్తి ఉన్నదని నేను నమ్ముతాను, అది నీవు భాషలతో మాట్లాడునట్లు అద్భుతములు మరియు సూచక క్రియలు నిన్ను వెంబడించునట్లు చేస్తుంది. అవునండీ.
తరువాత సాతాను అక్కడ దానిని దిష్టిబొమ్మపై ఉంచుతాడు. ఎవరో పరిశుద్ధాత్మను కలిగియున్నట్లుగా నటించేవారు దానిని వెక్కిరించేవారు. పిలిగ్రిం హోలినేస్, మరియు హోలినేస్, మరియు నజరీనులు మీరందరు వెనుకకు తిరిగి, “ఓ, అలాంటిది ఏది నాకు వద్దు” అని చెబుతారు.
ఓ, ఎంతటి దీన విషయము! మీరు పరిశుద్దాత్మను కలిగియున్నట్లయితే, లేక నీ హృదయముతో దేవునిలో భాగమయినట్లయితే, నీవు తప్పక ఉండవలసినట్లుగా శుద్దీకరింపబడితే, అది దేవుని శక్తి అని నీవు గుర్తించినట్లయితే, “మీరు మోషేను ఎరిగియున్నట్లయితే నన్నును ఎరిగియున్నారని యేసు చెప్పలేదా?” నిశ్చయముగా. శుద్దీకరణ పరిశుద్దాత్మలో భాగమైనట్లయితే, అది నిన్ను కడిగి శుద్ధిచేసినట్లయితే నీవు దానిని కలిగియున్నట్లయితే, అది వచ్చినప్పుడు నీవు మిగిలిన దంతయూ గుర్తిస్తావు.
నీ చేయి, నీ చేతిని గుర్తిస్తుంది. ఈ తల, ఈ కాళ్ళను గుర్తిస్తున్నది. అది నీ శరీరములో భాగమైయుంటున్నది.
మరియు తొమ్మిది ఆత్మ వరములు ఉన్నవని బైబిల్ తెలియజేస్తున్నది; ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు, మరియు [స్పష్టతలేని మాటలు], ఆ విధముగా; మరియు భాషలు మాట్లాడటము, భాషకు అర్ధము చెప్పుడం, దైవీక స్వస్థత. దానిలో ప్రతీ ముక్కను అది గుర్తిస్తున్నది.
71
ఓ, నీవు స్తంభి౦చిపోయావు: “దానితో చేసేది ఏమి లేదంటావు.” వ్యూ! ఈ ప్రదేశము వేడిగా అవుతుంది, కాదా? అది సత్యము. ఎందుకని? ఎందుకు? మీరు సంస్థగా మారారు. మీ సంఘము ఆ రీతిగా తెలియజేసినది, ఆ హేతువు చేతనే మీరు దానిని చేయలేకపోతున్నారు.
అయితే, అనేకమంది మెథడిస్తులు బయటికి వచ్చి, పరిశుద్దాత్మను పొందారు. అవునండీ. అనేకమంది మీ హోలినెస్ వారు బయటికి వచ్చి పరిశుద్దాత్మని పొందారు. అవును. ఎందుకు? సంఘము చెప్పినది మీరు లెక్క చేయరు. మీరు వెలుగులో నడిచారు. ఆమెన్. ఏమి జరిగిందో మీరు లెక్క చేయలేదు. అది ప్రభువును మీరు ఎరిగి, మీరు దానిలోనికి నేరుగా నడిచారు.
ఆ పాత స్త్రీని ఆ వృద్ధురాలిని, ఆ అమ్మమ్మను అక్కడే వుండనివ్వండి. ఆ వెనుక వున్న ఆమె తల్లివలె ఆమె ప్రవర్తిస్తున్నది, ఒక వేశ్య. ఆమె సంస్థాగతముగా మారిపోయినది. క్యాథలిక్ సంఘాశాఖగా మారినప్పుడు, ఇబ్బంది ప్రారంభానికి అదే మూల కారణమవుతున్నది. ఆమె వెంబడి తరువాత లూథరన్ సంఘము సంస్థగా మారిపోయినది. అప్పుడు మెథడిస్తు సంఘము ఆమె వెంబడి సంస్థగా మారిపోయినది. ఆ తరువాత బాప్టిస్ట్ సంఘము సంస్థగా మారినది. ఇప్పుడైతే ఆరువందల-తొంభై-ఆరు పలు విధములైన సంస్థలున్నవి. పెంతెకోస్తు కూడా అదే పని చేసినది.
మహిమ! ఏమిటి సంగతి? ఆయన ఒక సంస్థలో లేడని ఆ దేవుడే రుజువు చేస్తున్నాడు. ఆయన ఆత్మలో ఉన్నాడు, పరిశుద్దాత్మ. హల్లెలూయా! హల్లెలూయా! ఆమేన్.
నీ సంఘ శాఖ ఏమైనదో ఆయన లెక్కచేయడు. అది బుద్ధిహీనత. అది క్యాథలిక్ తో ముడివేయబడియున్నది మరియు తిరిగి దానిలోకి వెళ్ళిపోయినది. మరియు దానిలో నిలిచియున్నది, ఆమె కలిగియున్న అదే ముద్రను నీవు పొందుతావు. “నా ప్రజలారా...మీరు దాని పాపముతో పాలివారు కాకుండునట్లు దాన్ని విడిచి బయటకు రండి, మరియు నేను మిమ్ములను చేర్చుకుంటాను,” అని దేవుని దూత చెప్పుట లేదా. “ఆమె యొక్క అపవిత్రమైన దానిని ముట్టుకొనవద్దు, నేను మిమ్ములను చేర్చుకుంటాను,” పరిశుద్దాత్మ మాట్లాడుచున్నాడు.
72
“ఎవ్వరైతే మృగపు ముద్రను తీసుకుంటారో లేక అతని పేరులోని అక్షరాన్ని తీసుకుంటారో.” అందులోనికి వెళ్ళడానికి సమయముంటే బాగుంటున్నది; నా సమయం అయిపోయినది. అతని పేరులోని అక్షరమేమిటి? ప్రొటస్టెంటిజము. “దానిని పోలిన ఒక రూపాన్ని మనము చేద్దాము. మనము ఒక సంస్థను తయారు చేద్దాము.” మా సంఘము క్యాథలిక్ సంఘమంత పెద్దది. ఇలాంటివన్నీ తీసుకున్నారు.... వారికి పెద్ద పెద్ద సంఘాలున్నవి, మాకూ అలాంటివి ఉండాలి. వారికి నగరములో ఏలాగో ఉన్నదో మాకూ నగరములో ప్రఖ్యాంతిగాంచిన సంఘమున్నది. “ఆ మృగానికి ఒక ప్రతిమను చేద్దాము.” బైబిల్ ఏమి చెప్తుంది? ఆమె “వేశ్య” అని, సంఘ సంస్థల ద్వారా ఆమె “వేశ్యయైయున్నది.”
అయితే, దేవుని యొక్క సజీవ సంఘము స్వతంత్రముగా యున్నది. “కుమారుడు ఎవని స్వతంత్రునిగా చేస్తాడో వాడు నిజముగా స్వతంత్రులై ఉంటారు.” దానిలో నుండి బయటికి రండి! పరిశుద్దాత్మతో నింపబడండి.
రాజ్యములు బ్రద్ధలగుచున్నవి. ఇశ్రాయేలు మేల్కోనుచున్నది,
బైబిల్ ముందుగా చెప్పిన సూచనలు;
అన్యుల దినాలు లెక్కించబడియున్నవి, ఇబ్బందులు అడ్డగించుచున్నవి;
“చెదరిన వారలారా, స్వంత భూమికి తిరిగి రండి.”
విమోచనా దినము సమీపముగా ఉన్నది;
భయముతో మన హృదయాలు తప్పిపోతున్నవి.
దేవుని ఆత్మతో నింపబడి, మీ దీపములు తేటగా సిద్ధపరచు,
పైకి చూడండి, మీ విడుదల సమీపమైయున్నది! ఆమెన్.
73
సంగతులు ఎలా జరుగుచున్నవి! కడవరి దినాలలో ఆయన ఈలాగు చెప్పెను, “చిన్న మందా భయపడకుడి. మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రి చిత్తమైయున్నది”; పరలోక స్థలములో ఆయనతో కూడా కూర్చుండపెట్టబడియున్నారు.
పెంతెకోస్తును చూచి నవ్వుచున్న మెథడిస్తు, బాప్టిస్ట్, ప్రెస్బెరిటియన్ వారలారా...
నేను చెప్పునదేమనగా, పెంతెకోస్తుకు మంచి పాతకాలపు సువార్త కదిలింపు కావాలి, ఎందుకనగా వారు సంస్థగా మారిపోయియున్నారు. కాబట్టి అసెంబ్లిస్-ఆఫ్-గాడ్ వారు కూడా అది పెద్ద పెంతెకోస్తులోనికి వెళ్ళిపోయినది, సంఘముల సమైఖ్యలో చేరియున్నది, నామాకార్ధముగా లెక్కలేనిదిగా ఉన్నది. నేను చూచిన సంగతులన్నిటిలో కూడా చెడ్డ సంగతి, పెంతెకోస్తు బోధకుడు పరిశుద్దాత్మను తేలికగా భావించడమే. కనుక నీవు పెంతెకోస్తు సంఘానికి చెందినంత మాత్రన నీవు రక్షించబడతావని తలంచవద్దు.
పరిశుద్దాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నీవు నిజముగా బాప్తిస్మము పొందినట్లయితే, ఆయన పుణరుద్దాణ శక్తితో ఐక్యమైయున్నప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళుతున్నదో అక్కడికి వెంబడించినప్పుడు అద్భుతములతో, సూచక క్రియలతో ముందుకు వెళ్ళిపోయినప్పుడు, నీవు రక్షించబడినవని గురుతు. ప్రవక్తలను సూచక క్రియలు వెంబడించియున్నవి. యేసుక్రీస్తును సూచక క్రియలు వెంబడించియున్నవి. ఆయన చెప్పెను, “ఆయన మరలా తిరిగి వచ్చువరకు కూడా ఈ సూచక క్రియలు వారిని వెంబడించును.”
“సహోదరుడా బ్రెన్హాం, ఆ విధముగా చెప్పబడియున్నాదా?”
“మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి ఈ శక్తిని బోధించుడి మరియు ప్రతీ దేశానికి నిరూపించండి.” మూడింట-రెండవంతులవారికి అది క్రొత్తగా ఉన్నది, ఇంకను ఎన్నడూ వారు దానిని వినియుండలేదు. “ఈ సూచక క్రియలు వారిని వెంబడించును — వారి ప్రతీ దేశము!”
మహిమ! వ్యూ! ఓ, మై! నేను వెర్రివాడినని మీరు అనుకోవచ్చును. సహోదరుడా, నేను నీకు చెప్తాను, నేను ఈ మంచి పాత-కాలపు భక్తిని ప్రేమిస్తాను. అవునండి. అది నిన్ను క్రీస్తుతో లంగరువేయును!
74
మృగము యొక్క ముద్ర ఏమిటో ఇప్పుడు మీరు చూచారా? అది భక్తిహీనపు ముద్ర. అది ఒక వ్యక్తి అనుకుంటాడు, “సరే, నేను ఈ సంఘానికి చెందినవాడను, నేను నా ప్రక్కనున్న వ్యక్తి ఎంత మంచివాడో నేను అంత మంచివాడను. నేను ఈ సంఘానికి చెందిన వాడను కాదా అని అనుకుంటాడు.” మరియి నీవు ఆధారపడిన నీ సంఘసంస్థ ఎక్కడి నుండి వచ్చినదో మీరు గ్రహించారా...?
బైబిల్ చెబుతున్నది, “ఆ మృగమును ఆరాధించువాడు దాని ముద్రను పొండుకుంటాడు, అనగా ఆ మృగము పేరైనను, దాని పేరిట సంఖ్యయైనను కలిగినవాడు (ఇప్పుడు గమనించండి) తమ నొసటయందైననూ, తమ కుడిచేతి మీదనైననూ అది జ్ఞానమైయున్నది. లేక క్రియ, దాని భావము. నీ ముఖము మీద పెద్ద పచ్చబొట్టును వేస్తారు అని దాని భావము కాదు. అది ఆ రీతిగా ఉండవలసిన పనిలేదు. అది బాహ్యాసంబంధమైన దాని గూర్చి మాట్లాడటం లేదు. అది ఆత్మసంబంధమైన దానిని గూర్చి మాట్లాడుతున్నది.
అతడిని గమనించి చూడు. లేఖనము గూర్చి అతనికి ఏమి తెలుయునో అతను చెప్పునది విను మరియు అతను ఎక్కడికి వెళ్ళుచున్నాడో చూడు. “ఏ వ్యక్తి యైతే సిద్ధాంతాన్ని కలిగియుంటాడో, అతనిలో వెలుగు లేదు,” బైబిల్ చెప్పినది, చూశారా, చూశారా. అతడు ఎటు వెళ్ళుచున్నాడో గమనించు. అతను ఏమి చేయుచున్నాడో గమనించు.
“సరే, నేను ప్రెస్బేరిటియన్ వాడను,” అని అంటారు. అవునండీ. నేను ఫలానా సంఘానికి చెందిన వాడను. అవునండీ. ఆదివారము వర్షములో నుండి లోనికి రావటానికి, దాని కొరకు తగినంత గౌరవమున్నది. అతడు క్రిందికి వెళ్ళిపోయి.... ప్రార్ధనా కూటానికి వెళ్ళుటకు బదులు మీరు మందిరము మూసివేసి కూర్చొని టెలివిజన్ చూస్తుంటారు. అతడు బయటకు వెళ్ళిపోయిన తరువాత, ఇంటికి వెళ్లిపోయి త్రాగుతూ అలా కొనసాగుతూ ప్రపంచములోని మిగిలిన వారివలె అతడు ప్రవర్తిస్తాడు, అయినను అతడు సంఘానికి చెందినవాడే. జ్ఞప్తించుకొనండి, అది పాపపు ముద్రయైయున్నది.
75
ఇప్పుడు, మనం కొంచెం ముందుకు చదువుదాము, త్వరగా, నేను ముగిస్తాను. మనకు సమయం మించిపోయినది; ఇప్పుడు మనము 6వ వచనము చదువుకుందాము.
ఆ స్త్రీ (ఇప్పుడు, సంఘము) పరిశుద్దుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని...
“పరిశుద్దుల యొక్క రక్తాన్ని త్రాగినది.” బైబిల్ ఎలాగు చెప్పుచున్నదో తెలుసా, ఆమె నాశనము చేయబడినప్పుడు ప్రతీ శరీరియూ భూమి మీద చనిపోయియున్నాడు, ఆ దోషారోపణ క్యాథలిక్ సంఘమునందు కనుగొనబడినది. ఆరంభములో — అది కచ్చితము.
... యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను: మరియు ...(ఇప్పుడు యోహాను మాట్లాడుతున్నాడు) ... నేను దానిని చూచి, బహుగా ఆశ్చర్యపడగా.
యోహాను చెప్పియున్నాడు .... ఇప్పుడు, ఇక్కడ మనము చూద్దాం. యోహాను చెప్పియున్నాడు, “నేను ఆమె వైపు చూడగా, ఆమె ఎంతో చక్కగా ప్రియమైన పెద్ద సంఘముగా ఉన్నది. గొప్ప, గొప్ప సంఘాల సమూహాలు ఆమె నుండి పుట్టుకొని వచ్చినవి ఆమె వేశ్యలకు తల్లి, ఇదిగో నేను వెనుకకు చూడగా, ఆ స్త్రీ ఇలా ఉన్నది.... ఆమె తప్పు సిద్దాంతమును బయటకు తెచ్చియున్నది. భూరాజులందరూ గొప్ప, గొప్ప మనుష్యులు దాన్ని త్రాగి మత్తులగునట్లుగా చేసినది. మరియు ఆమె యొక్క కుమార్తెలు దానినే చేయబోతున్నారు. నేను ఆమె వైపు చూడగా; ఆమె ఎంతో అందముగాయున్నది!”
లేఖనములో ఒక చోట ఇలా చెప్పబడియున్నది, “నేను రాణినిలా కూర్చుంటిని మరియు నాకు ఏమి కొదువ?” అని అనుచున్నది. చూశారా.
యోహాను తర్వాత ఇలా చెప్పాడు, “నేను ఆమెను చూచి ఆశ్చర్యపోయాను. నేను ఆమెను చూచినప్పుడు బహుగా ఆశ్చర్యపడ్డాను. ఆమెను బట్టి ఆశ్చర్యపడ్డాను.”
ఆ దూత నాతో ఇట్లననెను, నీవేల ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, ఏడు తలలును, పది కొమ్ములును కలిగి దాన్ని మోయుచున్న క్రూరమృగము యొక్క మర్మమును నేను నీకు తెలిపెదను.
76
ఇప్పుడు, అది సరియో కాదో చూద్దాం. క్యాథలిక్స్ మరియు సరిగా తీసుకుంటే, ఇప్పుడు ప్రొటస్టెంటిజము దాన్ని వెంబడిస్తున్నది. కనుక మీరు దాన్ని పొందియున్నారు. మీరు దానిని తెలుసుకొంటానికి తగినంత జ్ఞానము కావాలి, చూచారా. గమని౦చండి.
నీవు చూచిన ఆ మృగము ఉండినది, కాని ఇప్పుడు లేదు.
“మృగము.” ఇప్పుడు, గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? ఇక్కడ ఎంతమంది రాజులు ఉన్నారని చెప్పుబడియున్నది? ఎంతమంది కూలిపోయారు? ఒకరు రావలసియున్నది.
... అయితే అది అడుగులేని అగాధము నుండి పైకి వచ్చును...
అది బైబిల్లో లేదు! ఎన్నో మూఢనమ్మకాల గుంపుతో అది తయారు కాబడియున్నది. దానికి వెనుక ఎటువంటి ఆధారము లేదు. మీకు “పాపపరిహార” ఎక్కడ ఉన్నది? ఎక్కడ “ఫలానా రోజు మాంసము తినకూడదని,” మరియు “యాజకులు పెళ్లి చేసుకోకూడదు” అని ఎక్కడ ఉన్నది, మరియు వారు చేసే అన్ని కార్యములు: “పాపము ఒప్పుకోవాలనీ?” ఇవన్నీ ఎక్కడ నుండి వారు పొందుకున్నారు? ఎక్కడ ఏ స్థలములో నీవు దానిని కనుగొనగలవు? అది నరకము నుండి వచ్చునవి. బైబుల్ అలాగు చెప్పి౦ది. ఆ మృగము, ఆ శక్తి, ఆ సిద్దాంతము, “అడుగులేని అగాధము నుండి పైకి వచ్చినది.”
..... నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది...
“నాశనము” ఎక్కడ ఉన్నది? నరకము. అది ఎక్కడ నుండి వచ్చినదో నేరుగా తిరిగి ఆ స్థలమునకే వెళ్ళుతున్నది.
..భూ నివాసులతో జగధుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవ్వరి పేర్లు వ్రాయబడలేదో వారు ఆశ్చర్యపడుదురు... జగధుత్పత్తి మొదలుకొని, వారు ఆ మృగమును చూచినప్పుడు... ముందు యుండెను కానీ, ఇప్పుడు లేదు.
77
ఇప్పుడు, ప్రొటస్టెంట్ సంఘము ఇలా చెప్పి౦ది. “సరే అది ఎలా జరుగుతుంది. యేసుక్రీస్తును నేను నమ్ముతున్నాను. ఆయన నా వ్యక్తిగత రక్షకుడు అని వారు చెప్పినట్లయితే,” దయ్యము కూడా నమ్ముతుంది,
సహోదరుడా
అది పునర్జన్మను పొందవలసియుంటున్నది, ఒక క్రొత్త జన్మ, ఒక తిరిగి జన్మించుట. మీరు తిరిగి జన్మించినప్పుడు, మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉంచబడుతుంది.
నీవ౦టావు నీవు తరచు ఆశ్చర్యపడతాను, “సరే, ఫలానా వ్యక్తివలె నేను మంచివాడిని కానా? ఈ చమత్కారపు పరిశుద్ధబండలైన మీ గుంపు వంటి మంచివాడను కాదా. నేను జ్ఞానము కలిగిన వాడను, నాకు ఎన్నో డిగ్రీలు వున్నవో నేను కాలేజ్ నుండి వచ్చినవాడను. నేను మంచి కుటుంబానికి చెందినవాడను. నీకు ముందే నా ప్రజలు సంఘ సభ్యులైయున్నారు. నేను మీ వంటి మంచివాడను కానా?”
“లోకమంతా (ప్రొటస్టెంట్లు అందరూ) కూడా జీవగ్రంథములో పేర్లు వ్రాయబడినవారు తప్ప ఆశ్చర్యపోతారని చెప్పబడినది.”
ఎందుకు వారి పేర్లు వ్రాయబడి వున్నది? వారు అబ్రహాము సంతానమై యున్నారు. మరియు వాగ్దానం ప్రకార౦ వారసులై, జగదుత్పతికి మునుపే ఎన్నుకొనబడినవారు. ఆ కారణం చేతనే వారు ఆశ్చర్యపోరు. గమనించు, అతనిక్కడ ఏమి చెప్పియున్నాడు? గొర్రెప్లిల జీవగ్రంథములో పేర్లు వ్రాయబడిన వారిని గమనించు.
ఇందు జ్ఞానముగల మనస్సు కనబడును...
78
ఇప్పుడు, కొంత నేను మిమ్ములను అడగాలని ఆశిస్తున్నా. జ్ఞానము పరిశుద్ద వరములలో ఒకటి కదా? అది సరియా? అది బైబిల్ అని ఎంతమంది నమ్ముతారు. I కొరింథీయులు 12వ అధ్యాయము, సంఘములో ఉన్న వరములన్నిటిని గూర్చి ఉపదేశం చేస్తున్నది (మనము చూద్దాం) ...ఆ వరములలో అది ఒకటి కదా? అప్పుడు భాషలతో మాట్లాడలేదని నీవేలాగు చెప్పగలుగుతావు? అలాగయితే భాషలు అర్థం చెప్పుట లేదని నీవేలాగు చెప్పగలుగుతావు? అలాగయితే దైవిక స్వస్టత లేదని నేవేలాగు చెప్పగలుగుతావు? ఎందుకంటే అదే శరీరములో.... నేను శరీరమైనట్లయితే, ఈ వైపు నాకు ఒక చేయి వున్నది, అక్కడ కాలు ఉన్నది; నేను చెయ్యి కాదు గనుక శరీరంలోనిదానను కదా అని పాదం చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోతుందా? పౌలు చెప్పినది అదే కదా?
79
ఇప్పుడు, గమనించు, అంత్య దినముల గూర్చి మాట్లాడుచున్నాడు, అతడు నేరుగా శరీరముతో, చెప్పెను, “జ్ఞానం గలవారికి అది ఇక్కడ ఉన్నది.” ఓ, అది నేను ఇష్టపడతాను. ఓ, మై! నీకు ఇక్కడ దిగ్భ్రాంతి కలుగజేస్తుంది. దీనిని వినండి. మంచిది. “ఇందులో జ్ఞానం గల మనస్సు కనబడును.” పరిశుద్దాత్మ వరములు అన్ని యుగాలలో క్రిందికి వెళితే అప్పుడు ఎందుకు పౌలు దీనిని చివరి దినముల కొరకు మాట్లాడుచున్నాడు. సంఘములో వరములు లేనట్లయితే చివరి దినములలో అప్పుడు ఎందుకు అతడు చివరి దినాల కొరకు సూచించాడు? “జ్ఞానం గలవారికి అది ఇక్కడ ఉన్నది.”
... ఆ ఏడు తలలు ఆ “స్త్రీ” కూర్చొన్న ఏడు కొండలు.
ఎన్ని కొండలు...? అది సంఘము కూర్చున్న ఏడు కొండలు ప్రపంచములో ఎన్ని పట్టణములన్నవి. ఒక్కటి మాత్రమే. అది ఇక్కడ వున్నది? అది రోమ్ లోని వాటికన్ సిటి. అవునా? ఆ నాశనకరమైన వేశ్య లోకమంతా జారత్వము చేసినట్లు చేసి, అనేక మంది కుమారైలును కని, వారును ఆమె చేసినదానినే భోదించునట్లుగా చేయుచున్నది అని బైబుల్ చెబుతుంది; వారు ఆమె అంత చెడ్డవారు కాదు గానీ, వారు వేశ్యలైయున్నారు. వారికి అదే విషయాన్ని బోధిచినది. “దాని యొక్క ఆరంభము ఒక స్త్రీగా వుండునని, రోములోని ఏడుకొండల మీద కూర్చున్న సంఘమని చెప్పబడియున్నది.” నేను ప్రపంచమంతా చూశాను; “ఒక సంఘము ఏడుకొండల మీద కూర్చుండుట,” ఎక్కడ వున్నది నాకు చెప్పండి.
ఇప్పుడు, నేను దానిని బైబిల్ నుండి చదువుచున్నాను.
మరియు ఏడుగురు రాజులు కలరు: ఐదుగురు కూలిపోయిరి....
80
మనము చరిత్ర తీసుకొనినట్లయితే, నేరుగా వెనక్కి వెళ్ళి దానిని చూడవచ్చు. బబులోను సామ్రాజ్యం మొదలుకొని రోములో ఎక్కడ రాజులు కూలిపోయారు?
.. ఒకడున్నాడు (నీరో), కడమవాడు .... ఇంకను రాలేదు; వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను (దాదాపు ఆరు నెలలు)
మరియు మృగము...
ఓ! దానివైపు చూడండి. ఇప్పుడు, ఆ శక్తి విగ్రహారాధన స్థానమును తీసికొనబోవుచున్నది.
ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూరమృగము, ఆ ఏడుగురు రాజులతో ఒక్కడైయుండి, (ఇప్పుడు గమనించండి)..... తానే ఎనిమిదవ రాజగుచు...
అతడు ఎటువంటి భయంకరమగు రాజో మీరందరూ ఎరుగుదురు. అతడు తన యొక్క తల్లిని గుర్రపు కాడికి కట్టి ఆమెను వీధుల్లో గుండా ఈడ్పించాడు, అతడు ఆ పట్టణమును తగుల బెట్టాడు. అతను వెళ్లి కొండమీద కూర్చొని ఫిడేల్ వాయించాడు. అలాంటి ఆ “స్త్రీ” విగ్రహారాధన స్థానములో వుండి సంఘము జయించుచున్నది. “ఎనిమిదవవాడు, అది ఏడవవాడే. మరియు ఉండునదియు ఇప్పుడు లేనిదియు; ఉండినదియు, ఇప్పుడు లేనిదియు; ఉండునది, ఇప్పుడు లేనిదియు.”
...అలా నాశనమయి పోవును.
నేరుగా, ప్రభువు యొక్క రాకడ వరకు అతడు అగ్నిగుండములో వేయబడతాడు.
నీవు చూసిన ఆ పది కొమ్ములు - పదిమంది రాజులు, వారిదివరకు రాజ్యములు పొందలేదు; కానీ ఒక ఘడియ క్రూరమృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుతారు.
“వారింక అధికారాన్ని పొందలేదు.” వారు రాజులు కాదు. వారు అధికారాన్ని పొందలేదు. వారు కాలేదు. ఆ కొమ్ములకు కిరీటము లేదు. “రాజుల యొక్క అధికారాన్ని పొందారు.” ఏమిటిది? నియంతలు; కరీట ధారులైన రాజులు కాదు. వారు నియంతలు! ఓ, మై!
81
ఇప్పుడు, ఓ, కొన్నిసార్లు నేను దానిని చదువుచున్నప్పుడు, ఆనందముతో నా హృదయం గంతులు వేస్తుంది (మంచిది) ఎలా మనము చివరి దినములలో జీవిస్తున్నామో నేను తలస్తున్నప్పుడు.
నీవు చూచిన పది కొమ్ములు పది మంది రాజులు వారిదివరకూ రాజ్యము పొందలేదు; కానీ ఒక ఘడియ క్రూరమృగముతో కూడా రాజుల వలె అధికారాన్ని పొందుదురు.
వీరు ఏకాభిప్రాయం గలవారై, తమ బలమును, అధికారము ఆ మృగమునకు అప్పగింతురు.
వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు, కాని గొర్రెపిల్ల వారిని జయించును...
హర్మేగేద్దోను యుద్ధము అక్కడ వచ్చును; మిల్లినియం కొరకు సిద్ధంగా.
..గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజైయున్నందుననూ: (వణికిపోవద్దు.) తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు...
నీవు కాదు; ఆయన కలిగియున్నాడు. నీవు పరిశుద్ధాత్మను కలిగియున్నావు, నీవు తప్పక విజయపు కేకలు వేయవలసియున్నది. జగత్తుపునాధి వేయబడక ముందే దేవుడు నిన్ను ఎన్నుకొన్నాడు. నీవు సువార్త వెలుగును చూడగలిగినట్లయితే, అది కేవలము గ్రుడ్డివాడవు గనుకనే.
...ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారైయున్నందున.
మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూసిన జలములు, ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయాభాషలు మాట్లాడువారిని సూచించును.
ఇంకో మాటలో, ఈ స్త్రీ అనగా సంఘము, అక్కడ కూర్బోనియున్నది. ఆమె తన సిద్దాంతాన్ని ప్రతీ ప్రజకు, జనసమూహములకు, ఆయా భాషలు మాట్లాడువారికి ఇవ్వబడుచున్నది. అక్కడే ఆమె వున్నది. ఆమె వారిని ఏలుచున్నది. ఆమె వారి మీద కూర్చొనియున్నది. ఆ శక్తి వారిని ఏలుచున్నది. ఆమె వారి మీద కూర్చొనియున్నది. ఆ శక్తి వారిని ఏలుచున్నది. ఆమె ఏడుకొండల మీద కూర్చొని యున్నది, ప్రప౦చములోనే అతి విలువైన ధూమ్ర రక్తవర్ణముగల వస్త్రములు ధరించుకొని. అక్కడే ఆమె ఉన్నది.
మరియు నీవు చూచిన పది కొమ్ములును కలిగిన క్రూరమృగము, అవి...
ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మీరు కమ్యూనిజం శక్తులలోనికి వస్తున్నారు.
... వారు ఆ వేశ్యను ధ్వేషించి, దానిని దిక్కులేనిదిగానూ, దిగంబరిగానూ చేసి, దాని మాంసము భక్షించి, మరియు అగ్నిచేత దానిని పూర్తిగా కాల్చివేయుదురు.
దేవుని యొక్క మాటలు నెరవేరు వరకు, వారు ఏకాభిప్రాయం కలిగినవారై, రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలననూ తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించును.
హల్లెలూయ! “భూమ్యాకాశములు గతించును, కాని నా మాటలు ఎన్నడునూ గతింపవు.” చూడు!
... మరియు నీవు చూసిన ఆ స్త్రీ... మరియు నీవు చూచిన ఆ స్త్రీ, భూరాజులనేలు ఆ మహాపట్టణమే.
82
రోములోని ఏడు కొండల మీద కూర్చున్న క్యాథలిక్ ల ఆరాధన పద్దతి కాకుండా, ప్రపంచములోనే భూరాజులను ఏలుతున్న ఒక పట్టణాన్ని నాకు చూపించండి. నీవు ఎలాగు అనుకొనినప్పటికీ. ఒక్క పట్టణము కూడా లేదు; ఏనాడు లేదు, ఎన్నడూ ఉండదు, పరలోకము నుండి వచ్చు ఆ నూతన పట్టణము తప్ప. అది నిజం.
83
ఇప్పుడు, ఒక్క నిమిషం. దీనిని మరలా నేను మీకు చూపించగోరుతాను, కాబట్టి మనము కలిసి దీనిని చదువుతుండగా ప్రభువు శ్రద్ధ వహించి మనలను దీవించును. మంచిది. ఇక్కడ గమని౦చు; నేను ప్రటకన 13వ అధ్యాయమును చదువుచున్నాను. 15వ చనము నేను ప్రారంభిస్తున్నాను.
ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారమియ్యబడును...
అది అమెరికా దేశము, అది పైకి రావటం మనము చూస్తాము. మీరు చూశారా. ఒక ప్రతిమ.
... మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్టును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయనివాడిని హతము చేయనట్లు. (అది వెలివేయడము.)
కొద్ది వారు గానీ, గొప్ప వారు గానీ, ధనికులు గానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరును తమ కుడిచేతి మీదైననూ, తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొన్నట్లు,
ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైననూ, దాని పేరిట సంఖ్యైననూ కలవాడు తప్ప క్రయవిక్రయము చేయుటకు మరి ఎవ్వనికిని అధికారము లేకుండునట్లును.
ఇప్పుడు, గమనించు, ఇప్పుడు జాగ్రత్తగా - ఇంకా జాగ్రత్తగా విను, మనము ముగించు ముందు. 18వ వచనము. వినండి.
ఇందులో జ్ఞానము కలదు....
పరిశుద్ధాత్మ కడవరి దినములలో విశ్వాసులను తిరిగి పిలుచుచున్నది చూచారా? అక్కడ వున్న చిన్న గుంపుతో మాట్లాడుతున్నది. ఈ దినమున వున్న చిన్న గుంపును పిలచుచున్నారు, “సంఘములో జ్ఞానముగలవానికి. దీనిని అతడు గ్రహించును గాక.”
...బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము: అది ఒక మనిషి సంఖ్యయే, (ఒక దేశము కాదు; మనిషి); మరియు అతడి సంఖ్య “666”
84
నేరుగా అక్కడ వాటికన్ సిటిలోనే... ఇప్పుడు మీరు నాకు చెప్పవద్దు; మా విశ్వాసము యొక్క వస్తవాలు, మరియు అన్నిటిని కలిగియున్ననూ, చూశారా. వాటికన్ సిటీలో, పోపు “దేవుని కుమారునికి బదులుగా అక్కడ నిలబడియున్నాడు.” ఇక్కడ నా క్యాథలిక్ స్నేహితులు కూర్చొనియున్నారు. వారు క్యాథలిక్లు, అది సత్యమనే వారు ఎరుగుదురు. బహుశా, నా స్వంత ప్రజలు నాకు ముందున్న వారు, వారు కూడా క్యాథలిక్లే, చూచారా.
సెయింట్ ప్రాటిక్ ను వారు క్యాథలిక్ గా పిలిచారు; అతడు ఎనాటికి కూడా క్యాథలిక్ కాదు. జోన్-అఫ్-ఆర్క్ ఒక పరిశుద్దురాలు; మతాధికారులు ఆమెను ఒక మంత్రగత్తె అని, కాల్చి చంపారు. “మీరు ప్రవక్తల సమాధులకు సున్నము వేస్తారు, మీరు వారిని దానిలొ వుంచుతారు, మీరు సున్నము కొట్టిన సమాధులు,” అని యేసు చెప్పుటలో ఆశ్చర్యము లేదు. అది వాస్తవము.
గమనించు, అది ఒక మనిషిని సంఖ్య. రోములోని పోపు యొద్ద ఈలాగు వ్రాయబడియున్నది. “వికారియస్ - పిల్లీ - డీ.” అది రోమన్ అక్షరాలతో వ్రాయబడియున్నది. మీకుమీరే రేపు దానిని వ్రాయండి, వి-ఐ-సి-ఐ-ఆర్ ... రోమన్ అక్షరాలతో వాటిని బయటకు వ్రాయండి. ఒక గీత గీచి, మొత్తాన్ని కూడండి. మీకు ఎంత వస్తుందో చూడండి: '666'. అతడు ఎక్కడ కూర్చొనియున్నాడు? “ఏడు కొండలమీద.”
సంస్థాగతమైన మతము అక్కడ నుండి వచ్చియున్నది, అది బైబిల్ కు విరోధముగా ఏదో సిద్దాంతమును బోధిస్తున్నది. మరియు ప్రొటస్టెంట్లు దానినుండే బదులైపోయి, వారు చేసిన దానినే వీరును చేస్తున్నారు. కారణము, ఆమె వేశ్య అని, చెప్పబడినది - మరియు వీరును వేశ్యలు.
తప్పుడు బాప్తిస్మాన్ని బయటకు తీసుకొని వచ్చారు, తప్పుడు మతముతో, తప్పుడు భక్తితో పరిశుద్దాత్మను గూర్చిన తప్పుడు భావముతో నరకము గూర్చి తప్పుడు అర్ధముతో వచ్చారు, ఇంకా ఇవన్నియూ ఈ రీతిగా వున్నవి, ఇంకా ప్రొటస్టెంట్లు వారు అడుగుజాడలలోనే నేరుగా నడిచిపోవుచున్నారు.
అయితే, సాయంకాలమున వెలుగు కలుగును,
మహిమ బాటను నీవు నిజముగా కనుగొంటావు.
(అది, నిజము.)
ఈ దినమున వెలుగైయున్నది.
ప్రశస్తమైన యేసు నామములో సమాధి చేయబడి,
యవ్వనస్తులు, వృద్దులు మీ పాపముల నిమిత్తము ప్రశ్చాత్తాపపడండి,
పరిశుద్దాత్మ నిజంగా లోనికి వచ్చును;
సాయంకాలమును వెలుగు వచ్చియున్నది.
నిజానికి క్రీస్తు మరియు దేవుడు ఒక్కడైయున్నాడు.
(ఆమేన్!)
85
సహోదరుడా, నేను మీకు చెబుతున్నాను. సాయంకాలపు వెలుగులు ప్రకాశించుచున్నవి. అదే అపోస్తులుల సిద్ధాంతాలు, అదే అపోస్తులుల బాప్తిస్మము, అదే అపోస్తులుల పరిశుద్దాత్మ నింపుదల, అదే అపోస్తులుల అద్భుతములు మరియు సూచక క్రియలు, అన్యులు ద్వారా వెలుగుచూస్తున్నవి; అక్కడ వెనుక ఉదయాన పెందలకడనే వారు, యూదులు చేసినట్లుగా; అది ఇక్కడ సూర్యాస్త సమయములో వున్నది.
ప్రజలు దాదాపు ప్రతిచోట ఉన్నారు,
వారి హృదయాలు మండుచున్నవి,
పెంతకోస్తున పై క్రుమ్మరింపబడిన అగ్నిచేత,
అది వారిని కడిగి మరియు వారిని శుద్ధి చేసెను;
ఓ, అది నా హృదయా౦తరంగమున మండుచున్నది,
ఓ, ఆయన నామమునకు మహిమ!
వారిలో ఒకడిని అని చెప్పుటకు, నేను ధన్యుడను.
వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని.
వారిలో ఒకడిని అని చెప్పుటకు, నేను ధన్యుడను.
వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని.
వారిలో ఒకడిని అని చెప్పుటకు, నేను ధన్యుడను.
వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని.
వారు ఆ పైన మేడగదిలో కూడుకొని,
అందరూ ఆయన నామమున ప్రార్ధన చేస్తూ,
వారు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము పొందిరి,
మరియు క్రియ చేయుటకు శక్తి వచ్చెను;
ఇప్పుడు, ఆ రోజున వారికొరకు ఆయనేమి చేసెను
నీకొరకును ఆయనదే చేయును,
వారిలో ఒకడిని అని చెప్పుటకు, నేను ధన్యుడను.
(మీరు కాదా?)
రమ్ము, నా సహోదరుడా, ఈ ఆశిర్వాదమును పొందుకొనుము
అది నీ హృదయమును పాపమును౦డి కడుగును,
ఆనంద గ్రంటలు మ్రోగునట్లు చేయును
మరియు నీ ఆత్మను రగిలించును;
ఓ, అది నా హృదయా౦తరంగమున మండుచున్నది,
ఓ, ఆయన నామమునకు మహిమ,
వారిలో ఒకడిని అని చెప్పుటకు, నేను ధన్యుడను.
86
ఓ, ఈ మహిమగల సువార్త కొరకు!
ఇది రక్తములో కారుచున్నది, అవును, ఇది రక్తములో కారుచున్నది,
(వెలను లెక్కించండి! “అతనిని వెంబడించగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువ నెత్తుకొని — మరణము — తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి.”)
ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో కారుచున్నది,
సత్యము కొరకు మరణించిన శిష్యుల యొక్క రక్తము,
ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో కారుచున్నది.
పరిశుద్ధాత్మ ప్రణాళికలో మరణించిన మొదటివాడు
బాప్తిస్మమిచ్చు యోహాను, అయితే అతడు ఒక మనిషిగా మరణించెను,
యేసుక్రీస్తు వచ్చెను, ఆయనను వారు సిలువవేసిరి,
ఆత్మ వారిని పాపములో నుండి రక్షించును అని బోధి౦చెను.
అక్కడ పేతురు మరియు పౌలు, మరియు దైవికమైన యోహాను,
ఈ సువార్త ప్రకాశించుటకు వారియొక్క ప్రాణములను అర్పించిరి;
పాతకాల ప్రవక్తలతో వారియొక్క రక్తమును కలిపిరి,
కావున దేవుని యొక్క సత్యమైన వాక్యము యదార్ధముగా చెప్పబడులాగున.
పాపమునకు వ్యతిరేకముగా బోధించెనని స్తెఫెనుని రాళ్ళతో కొట్టిరి,
అతడు వారిని ఎంతో కోపోద్రేకులనుగా చేసెను, అతడి మెదడును పగులగొట్టిరి;
కాని అతడు ఆత్మలో మరణించెను, తన ఆత్మను అర్పించెను,
మరియు జీవిమునిచ్చు స్థలానికి, అతడు ఇతరులతో చేరడానికి వెళ్ళెను,
అది రక్తముతో కారుచున్నది, అవును, అది రక్తముతో కారుచున్నది,
ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో కారుచున్నది.
సత్యము కొరకు మరణించిన శిష్యుల యొక్క రక్తము,
ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో కారుచున్నది.
“ఎంత కాలము?” అని బలిఠము క్రిందనున్న ఆత్మలు మొర్రపెట్టుచున్నవి,
తప్పు చేసిన వారిని ప్రభువు శిక్షి౦చుట;
(సరదాగా, చూచారా. ఓ, మై!)
అయితే జీవితము యొక్క రక్తమునిచ్చువారు ఇంకా ఎక్కువ ఉన్నారు
ఎందుకనగా పరిశుద్ధాత్మ సువార్త మరియు దానియొక్క రక్తపు ప్రవాహము
అది రక్తముతో కారుచున్నది, అవును, అది రక్తముతో కారుచున్నది,
ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో కారుచునేయుండును,
సత్యము కొరకు మరణించిన శిష్యుల యొక్క రక్తము,
ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో కారుచున్నది.
మనము తిరిగి, ఒకరితో ఒకరము కరచాలణము చేయుదము.
అది రక్తముతో కారుచున్నది, అవును, అది రక్తముతో కారుచున్నది,
ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో కారుచున్నది.
సత్యము కొరకు మరణించిన శిష్యుల యొక్క రక్తము,
ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో కారుచున్నది.
87
మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారా? ప్రభువు మిమ్ములను దీవించును.
తండ్రీ, జనసమూహాన్ని మీరు దీవించుమని మేము ప్రార్థిస్తున్నాము. సంతోషముతో వారు ఇంటికి వెళ్ళుదురు గాక. ఇమ్మానుయేలు రక్తము నుండి తీయబడిన రక్తముతో నింపబడిన ఈ ఊట యొద్దకు వారు వచ్చుదురు గాక. వారు పాత గొర్రెలను లేక సంఘాలను విడిచిపెట్టి వచ్చి, పరిశుద్ధాత్మను పొందుకొందురు గాక. యేసు నామములో అడుగుచున్నాము. ఆమెన్.