దేవునితో ఒక వ్యక్తిగత అనుభవము
మీకు చాలాకృతజ్ఞతలు. ప్రార్థన కొరకు మన తలలను మనము వంచుదాము.
మా దయగల పరలోకపు తండ్రీ, ఇచ్చట చికాగోలో మీ ప్రేమగల పిల్లలతో కూడి సహవాసము చేయుటకు మీరిచ్చిన ఈ సమయము కొరకు మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఇచ్చట ప్రపంచములోనున్న అనేక ప్రాంతముల నుండి ప్రజలు వచ్చిరి. అవకాశము ఉన్నప్పుడల్లా సహవాసము కొరకు ఈలాగు కూడి ఉండుటను బట్టి మీకు మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఏదోక దినమున అవతలి గట్టున మీ రాజ్యములో మేము కూడి సహవాసము చేయుదమని మేమెరుగుదుము. అచ్చట నుండి ఇక మేమెన్నటికి వదిలిరాము. ఆ దినమని పిలువబడుచున్న ఈ భూమిలో ఆయన రాజ్యమును కట్టి నిర్మించుటకు మేమందరము ఏకముగా కూడి, ప్రభువగు యేసుక్రీస్తులో విశ్వాసమును కలిగి క్రియ చేయుదుము గాక!
మా పాపములను, మీకు విరోధముగా చేసిన మా అతిక్రమములను మన్నించి, ఇప్పుడు ఈ ఆరాధనను పరిశుద్ధాత్మ ఆధీనములోకి తీసుకొనుము. మీ ఆధీనములోకి మీకు మహిమార్ధముగా దీనిని తీసుకొనుము. మా ప్రభువు ద్వారా, “నా నామమున తండ్రిని ఏది అడుగుదురో దానిని నేను చేయుదును,” అని వ్రాయబడియున్నది. ఈ రాత్రి ఆయన ప్రసన్నతను, ఆయన మహిమను, మా అందరిపై ఆవరించియుండుటను మేము చూడవలెనని నేను ప్రార్థించుచున్నాను. దీనిని యేసుక్రీస్తు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.
2
దేవుని రాజ్యము యొక్క పౌరులకు, నా క్రైస్తవ స్నేహితులకు సాయంకాలపు శుభములు. పునరుత్థానుడైన యేసు ప్రభువు నామమున మీకు పరిచర్యను చేయుటకు ఈ రాత్రి ఇచ్చట మేమున్నందుకు నిజముగా గొప్పగా భావిస్తున్నాము. కొన్ని క్షణముల ముందు నా హృదయము కొంచెము వేగముగా కొట్టుకుంటూ ఉండెను. నేనిచ్చటకు లోనికి ప్రవేశించిన వెంటనే సముద్రమును దాటి స్విట్టర్లాండ్ నుండి వచ్చిన కొంతమంది ప్రజలను నేను కలిసాను. మరియు ఒకానొక రాత్రి సమయమున పరిశుద్ధాత్మ వారియొక్క పరిస్థితులన్నింటి గూర్చి, వారి జీవితాలను గూర్చి వారితో చెప్పి మరియు వారేవిధముగా స్వస్థతను పొందుకున్నారో నాతో వారు చెప్పుచుండిరి. పిదప తిన్నగా నేను లోపలికి ప్రవేశించినపుడు, “తన మహిమ నుండి ఆయన దిగి వచ్చెను,” అను అద్భుతమైన పాటను పాడుటను నేను ఆలకించితిని. నా ఆత్మను ఉద్వేగపరచు ఒక పాట ఉన్నయెడల అది, “తన మహిమ నుండి ఆయన దిగి వచ్చెనను,” పాటయేయగును. ఏ విధముగా దేవుడు తన్నుతాను తగ్గించుకొని క్రిందికి దిగి వచ్చి, మాంసపు శరీరమున తనను ప్రత్యక్షపరచుకొని, కల్వరిలో ఒక పాపియగు నా స్థానమును ఆయన తీసుకొని, నాకు బదులుగా మరణించి, ఆ జీవ వృక్షము యొద్దకు నేను వెళ్ళే హక్కును నాకు అనుగ్రహించి, దానిని నేను భుజించి నిరంతరము నేను జీవించునట్లుగా చేసెను. దీనిని నేనెట్లు నిరాకరించగలను? ఇంతటి అద్భుతమైన ఆహ్వానమును మీరెట్లు నిరాకరించగలరు?
3
కావున దూర దేశమగు స్వీడన్ నుండి వచ్చిన మన సహోదరుడు వచ్చుచుండగా నేను కలిసాను. ఆ సహోదరుడిని కలుసుకొనుటయే అద్భుతముగా ఉన్నయెడల, ఈ ఒక్కొక్క ఆరాధనలో మనము కలిసే చక్కని జనులను మనమందరము మహిమలోకి వెళ్ళి అచ్చట వారిని చూచినప్పుడు అదెంత బాగుండునని నేను తలంచితిని?
సహోదరుడు జోసఫ్ ఇచ్చట ఉన్నాడు. అతడే నన్ను పరిచయము చేసాడు, నాపై అతనికి అపారమైన ప్రేమ గలదు. అందువలననే నన్ను అంతగా అభినందించి నన్ను గూర్చి చెప్పెను. [బోజ్ సహోదరుడు బ్రెన్హాం సహోదరునితో మాట్లాడుచున్నాడు.]
కృతజ్ఞతలు సహోదరుడా. కృతజ్ఞతలు సహోదరుడా. నా సహోదరుడా, మీకు ధన్యవాదములు. అటువంటి అనుభూతిని నా సహోదరుడు లేదా ఎవరైనా కలిగియుండినయెడల దానికి నేను ఎన్నడు హాని కలిగించనని నేను నమ్ముచున్నాను. మన ప్రభువగు యేసు, నా సహోదరునియందు ప్రేమను, సహవాసమును కలిగియుండు స్థానమందు నన్నెల్లపుడు ఉంచును గాక, ఎందుకనగా నిశ్చయముగా నేను వారిని ప్రేమించుచున్నాను. అదొక అన్యోన్యమైన అనుభూతియైయున్నది. మరియు మేము ఏకముగా కలిసి దేవుని యొక్క రాజ్యము కొరకు మరియు ప్రభువగు యేసు క్రీస్తుకు సేవ చేయు జతపనివారమైయున్నాము.
4
ఇపుడు, రేపు మధ్యాహాన ఆరాధన 2 గంటలకు లేదా దాదాపు ఆ సమయమున ఆరంభమగునని నేను తలంచుచున్నాను. స్వీడన్ నుండి వచ్చిన మన సహోదరుడు మనకు ప్రసంగించునని నేననుకుంటున్నాను. పిదప రేపు రాత్రితో వరుసగా జరుగుచున్న ఈ కూటములు సమాప్తమగును; ఎందుకనగా రేపు రాత్రి బయలుదేరి నేను నా గృహమునకు వెళ్ళుటకు త్వరపడవలెను. బహుశా, సోమవారము 2 గంటలకు, నేను కెంటకీలోనున్న ఫోర్ట్ ణాక్స్ లో దిగి దూర దేశములకు వెళ్ళుటకు ముందుగా కొన్ని వ్యాధి-నిరోధక ఇంజక్షన్లను వేసుకోవలెను. అవన్నీ నాకు అవసరములేదని నేను వారికి చెప్పినను వారు నా మాటలను ఆలకించరు. అవి నా చేతలకు చాలా నొప్పి కలిగించును. అవి నాకు అవసరములేదు, కాని చట్టము అటువంటి వ్యాధి-నిరోధక ఔషధములు వేసుకోకుండా వెళ్ళకూడదని చెప్పుచున్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా, “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని.” కావున నేను ఆ ఇంజక్షనులను వేసుకొని వెళ్ళి, వారికి సువార్తను ప్రసంగించకుండా ఉండగలనా? కావున దేవునికి ఏవి చెల్లించవలెనో అవి దేవునికి, కైసరునకు ఏవి చెల్లించవలెనో అవి కైసరునకు చెల్లించునట్లగును.
5
ప్రభువు మిమ్మల్ని ఒక్కొక్కరిని దీవించునని నేను నమ్ముచున్నాను. మీ యొద్ద చెప్పవలసిన ఇంకా కొన్ని మాటలు నా యొద్ద గలవు. ఇపుడు, ప్రభుని చిత్తమైనయెడల, నేను అచ్చట నుండి తిరిగి వచ్చిన, ఈ రాత్రి ఇచ్చటున్న చికాగో ప్రజల యొక్క చెవులలో దీనిని రూఢిగా ఎరుగునట్లుగా నేను ప్రయత్నించుచున్నాను. అదేమనగా, “నా పరిచర్యలోప్రజలు కనుగొనుగల ఒక లోపము ఏమిటంటే, ఒకేసారి అనేకమంది జనులకు పరిచర్యను నేను చెయ్యలేను.” మంచిది. నిశ్చియముగా, అలాగు చేయుటకు నేను కూడా ఆశించుచున్నాను. నేను చేయగలిగినట్లైతే, దానిని చెయ్యుటకు నేనెంతగానో సంతోషించెదను. కాని నా పరిచర్య విధానములో నేను అలాగు చెయ్యలేను. ఆ ఉద్దేశ్యము కొరకు ఈ పరిచర్య నాకు యివ్వబడలేదు.
మన సహోదరుడు శ్రీ రాబర్ట్స్, ఐదు వందలమందికి ప్రార్థించు సమయమున నేను కేవలము ఇద్దరుకు మాత్రమే ప్రార్థించగలను. అవును, అది నిజము. కావున దేవుడు రాబర్ట్స్ సహోదరుని ఏమి చేయమని చెప్పెనో దానినే చేయుచున్నాడు, ప్రభువు, నాకేమి చేయమని చెప్పెనో దానినే నేను చేయుచున్నాను. కావున మా యిద్దరి మధ్యవున్న బేధము అదియే. సంఘము కొరకు పరిశుద్ధాత్మ యొక్క క్రియలు భిన్నముగా ఉండును. రాబర్ట్స్ సహోదరుడు ఖచ్చితముగా విశ్వాసముగల ఒక చక్కని వ్యక్తి. ఒక అద్భుతమైన స్వభావముగలవాడు, ప్రేమగల సహోదరుడు. ఇంకా ఇలాంటివారు నేడు పరిచర్యలో అనేకులు గలరు. స్పష్టముగా చెప్పాలంటే ప్రతీ ఒక్కొక్కరు ఎతైన స్థానమున ఉండాలనే తలంపును కలుగివుండాలని నేను కోరుచున్నాను. మీరు గమనిస్తున్నారా? అది అద్భుతమైనది, వారికొరకు నేనెల్లప్పుడూ ప్రార్థించెదను.
6
నేడు పరిచర్యలోవున్న ఈ గొప్ప సువార్తికుడు, ప్రేమగల మన సహోదరుడు బిల్లీ గ్రహం. బహుశా, దైవిక స్వస్థత గూర్చి నాతో ఏకీభవించకపోవచ్చు. కాని, దేశమంతటా ప్రసారమైన ఒక రేడియో కార్యక్రమమున నేను ఆలకించుచున్నపుడు, మూత్ర పిండములో ఒక అవరోధము అతనికి కలిగి అస్వస్థతతో జర్మనీలోనున్న ఒక వైద్యశాలలోనో లేదా ఎచ్చటో ఒకచోట గలడని నేను విన్నాను. సహోదరునిపై గల సానుభూతితో, నేనెచ్చట ఉన్నానో అచ్చటనే అతని కొరకు ప్రార్థించితిని. ఆ అస్వస్థత నుండి అతనికి విడుదల కలగాలని నేను దేవుని యొద్ద ప్రార్థించాను. దానిని తప్ప వేరే ఏ సహాయమును నేను అతనికి చేయలేకపోయాను. ఎన్నో దినములు చికిత్స చేసిన తరువాత ఇప్పుడు అతడు స్వస్థతను పొందుకొని మరలా పరిచర్యను కొనసాగించుచున్నాడని నేను విన్నాను. ప్రజలను రక్షణలోకి నడిపించుటకు దేవుడు మన సహోదారుని గొప్పగా, బలముగా ఉపయోగించుకొనుచున్నాడు. మనము ఖచ్చితముగా మన సహోదరుడిని అభినందించవలెను. నశించిపోయే ఆత్మలను రక్షించుటకు దేవుని హస్తము అతనిపైయున్నదని మనము చూచుచున్న నిమిత్తము మన సహోదరుని కొరకు ప్రార్థించమని క్రైస్తవులందరిని నేను కోరుచున్నాను.
మరిప్పుడు, అతడికి సంపూర్ణముగా దేవుడు విడుదలను అనుగ్రహించునని నేను ప్రార్థించుచున్నాను. అతడింకా చాలా బలహీనముగా ఉన్నట్లు నేను విన్నాను. సువార్తను ప్రసంగించునట్లుగా దేవుడు అతడిని పూర్తిగా స్వస్థపరచవలెనని నేను ప్రార్థించుచున్నాను. అతడు కలుకొనుచున్న ఒక విధమైన జనులు, బహుశా నా యొక్క ప్రసంగమును కూడా ఆలకించుటకు రారు. దేశము యొక్క రాయబారులు మరియు ఇంకా అటువంటి గొప్పవారు వచ్చెదరు. వారు వచ్చి, నా ప్రసంగమును ఆలకించుటకు గల ఒకే ఒక్క మార్గమేదనగా, మిక్కిలిగా అస్వస్థతను పొందుకున్నపుడు మాత్రమే వారు వచ్చెదరు. వారు నా యొద్దకు వచ్చుటకు ఆ ఒక్క మార్గమే మాత్రమే గలదు.
7
రాజులకు, శ్రేష్టులకు, అధిపతులకు ప్రార్థించే భాగ్యము నాకు లభించినది. ప్రభువు, వారిని స్వస్థతపరచకుండా ఏనాడు వెనుదీయలేదు. కావున వారందరిని ఆయన స్వస్థపరచెను. అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వపు ప్రముఖ వ్యక్తులలో ఒకరగు కాంగ్రెస్ సభ్యుడు అప్షా గారు అరువది-ఆరు సంవత్సరములుగా చక్రాల కుర్చీలోనే చతికిలబడి ఉండెను, కాని అప్పటికప్పుడే స్వస్థతను పొందుకొనెను. ఇతని గూర్చి నా జీవితములో నేనెన్నడూ ఆలకించలేదు. అతడు జనుల మధ్య వెనుక చక్రాల కుర్చీలో కూర్చొనివున్న సమయమున యేసు ప్రభువు ఏమి సంభవించునో మరియు ఏమి సంభవించబోవుచున్నదో ఒక దర్శనమును చూపించెను. అప్పుడు అతడు పూర్తిగా స్వస్థతనొందెను. అందుకొరకు మనము కృతజ్ఞతులమైయున్నాము.
అతడు స్వస్థతను పొందుకున్న విషయమును, అనగా అతడేవిధముగా స్వస్థతను పొందుకునెనో, ఆ కార్యమును మీలో ఎంతమంది ఆలకించిరి? ఎంతో మంది లేరు. నేనిచ్చట ఒక చిన్న లేఖనమును చదివి మరియు దీనిని ఒక సాక్ష్యముగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనగా, నాకు కేవలము పది నిమిషములు మాత్రమే సమయము గలదు. రేపు రాత్రి మీరు త్వరగా వచ్చి నేను ప్రసంగించెదను. అపోస్తులుల కార్యములు 2వ లేదా 3వ అధ్యాయము, మొదటి వచనము.
పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును, యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా.
పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసుకొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాడిని శృంగారమను దేవాలయపు ద్వారము నొద్ద ఉంచుచువచ్చిరి.
పేతురును, యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునపుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును, యోహానును వానిని తేరి చూచి — మా తట్టు చూడుమనిరి.
వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.
అంతట పేతురు - వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను.
వెంటనే వాని పాదములును, చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను.
నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడ దేవాలయములోనికి వెళ్లెను.
8
చదివిన లేఖన భాగమునకు ప్రభువు తన ఆశీర్వాదములను చేర్చును గాక.
ఆ దినమున ఆ ఆలయమున ఒక గొప్ప సమయమును కలిగియుండిరి, ఎందుకనగా ఆ అపోస్తులుల, వారి హృదయములలో సంతోషము మరియు ఆనందము నిండియుండెను. కారణమేమనగా, అప్పుడే వారు ప్రభువగు యేసుక్రీస్తు యొక్క నూతన అనుభవమును పొందుకొనిరి. వారి హృదయములు సంతోషముతో నిండియుండెను. “ఆహా, ఏదోక నూతన కార్యము జరిగెను,” అని వారు తలంచిరి.
అనేక దినములుగా వారు ఎదురుచూచిన తండ్రి అనుగ్రహించిన వాగ్దానమగు పరిశుద్ధాత్మ వచ్చెనని వారెరిగి ఉల్లాసభరితులైరి. లూకా 24:49లో, “ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేము పట్టణములో నిలిచియుండుడని యేసు తన శిష్యులతో చెప్పెను. అపోస్తులుల కార్యములు 1:8లో, ”అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్ష్యలైయుందురని ఆయన చెప్పెను. వారిపైవున్న ఆ ఆశీర్వాదము భూదిగంతముల వరకు వెళ్ళవలెనని మనకు తెలుసు. కావున, నేడు కూడా అదే ఆశీర్వాదములను అది కలిగియున్నది. కాని ఈ కాలము వరకు, అనగా భూమి యొక్క మూడులో ఒక భాగము కూడా ఇంతవరకు వెళ్ళి చేరలేదు. రెండువేల సంవత్సరములు గతించిపోయెను. మనము ఈ సువార్తను వ్యాపింపజేయుటకు భూమి యొక్క మూడులో రెండు భాగములు ఇంకా మిగిలియున్నది. ఈ శక్తిని రుజువుపరచుటకు భూదిగంతములవరకు ఇవ్వబడెను.
9
యేసు మహిమలోకి కొనిపోబడిన కొన్ని దినములకు తర్వాత తన శిష్యులతో ఆయన చెప్పిన చివరి మాటలేమనగా, “మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. (ఇప్పుడిది సర్వ లోకమునకు ఇవ్వబడినది.) నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళ గొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనదేది త్రాగినను అది వారికి హానిచేయదు, రోగుల మీద చేతులుంచినపుడు వారు స్వస్థతనొందుదురని,” చెప్పెను. పరిశుద్ధ గ్రంథమున, హెబ్రీయులకు 13:8వ వచనము, “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడు.”
అది దేవుని యొక్క వాక్యము కాబట్టి దానిని మనము త్రోసివేయలేము. దానిని త్రోసివేయాలంటే, ఆ వాక్యముపై అవిశ్వాసమును పెట్టి, నా అవిశ్వాసమును నేను సమర్ధించుకుంటూ ఆ వాక్యమును దాటుకొని నేను వెళ్ళిపోవుటయగును. కాని ఆ వాక్యమును నేను చూచి, “అది వాక్యమా కాదాయని చెప్పవలసి వచ్చినపుడు, అది వాక్యమే,” అని చెప్పుదును. ఆయన ఇచ్చట ఈ భూమిమీద ఉన్నపుడు, ఆయన తనను ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకోలేదు, తనను ఒక సేవకునిగానే చెప్పుకున్నాడు. ఆయన దేవుని కుమారుడైవుండియు, తనకంటూ ఏ పేరుప్రతిష్టలను కోరుకోలేదు.
10
ఒకానొక దినమున నేను ఈ విధముగా ఆలోచించుచుంటిని, కృత్రిమ చెయ్యిని తయారు చేసిన మానవుడు అందుకొరకు తనకు పేరుప్రతిష్టలను ఆశించును. కాని సహజమైన చెయ్యిని చేసిన ఈ మానవుడనే దేవుడు తనకంటూ ఏ పేరుప్రతిష్టలను కోరుకోలేదు. అలాగే ఒక కృత్రిమ కంటిని తయారు చేసిన మానవుడు తనకొరకు పేరుప్రతిష్టలను ఆశించెను. కాని మానవుని రూపములో వచ్చిన ఈయన నిజమైన కంటిని సృష్టించినను ఏ పేరుప్రతిష్టలను తనకంటూ కోరుకోలేదు. దేవుడగు యెహోవా తనను బహుగా తగ్గించుకొని, మాంసములో తనను మరుగుపరచుకొని, మన పాపముల కొరకు మరియు వ్యాధుల కొరకు తనను బలిగా సమర్పించుకొనుటకు దిగి వచ్చెను. దేవుని యొక్క ప్రేమనేది తలంచలేనంతటి ఏంతో లోతైనది, ఎంతో స్వచ్చమైనది, ఎంతో ఐశ్వర్యమైనది. మరియు దేవుడు తనకు శత్రువులైన వారికి కూడా వీటన్నింటిని చేసినయెడల, ఆయన ఎంత మహోన్నతుడై ఉండవలెను?అలాగే తనను ప్రేమించు ప్రియమైనవారికి వాటిని ఆయన చేయలేదు గాని తన శత్రువుల కొరకే ఆయన వాటిని చేసెను.
దేవుడు తన శత్రువులను పాతాళము నుండి రక్షించుటకు, తాను మరణించుటకు ఇష్టపూర్వకముగా చిత్తముగలవాడైనయెడల, నిశ్చయముగా తన పిల్లల యొక్క వ్యాధులను స్వస్థపరచుటకు ఆయనెంతగానో ఇష్టపడుచూ, అందుకొరకు చిత్తము గలవాడైయుండునని నేను అనేకసార్లు తలంచితిని. మీరు అలాగు ఎన్నడు ఆలోచించలేదా? తన శత్రువుల కొరకు ఆయన అంతగా శ్రద్దను కలిగియున్న యెడల....
11
ఇపుడు, గొప్ప హడావిడిని కలిగియున్న ఈ ఆది అపోస్తులుల కాలమున వారెంతో మహిమకరమగు సంతోషముతో ఉండిరి, ఎందుకనగా వారొక అనుభవమును కలిగియుండిరి. ఏదోకటి వారు కలిగియుండిరి. ఆ అనుభవమే నేడు మనకు కావలసియున్నది.
మనము కాలిఫోర్నియాకి ప్రయాణమై వెళ్ళాలనుకుంటే, మీ కారును ఎవరో ఒకరు నడపాలి, కాని దీనికి మునుపెన్నడూ కారును నడపని ఒక డ్రైవరును కారు నడుపమని నిశ్చయముగా మీరు కోరుకొనరు గాని అందులో అనుభవమును కలిగియున్న ఒకరిని మీరు వెదుకుదురు. అలాగే ఏదైన శస్త్ర చికిత్స చేయించుటకో లేదా పళ్ళను సరిచేసుకోవాలనుకున్నా దానిగూర్చి అసలు ఏమియు తెలియని ఒక వ్యక్తి యొద్దకు నిశ్చయముగా మీరు వెళ్ళరు. ఆ శస్త్ర చికిత్స చేయుటయందు అనుభవముగల వారియొద్దకే మీరు వెళ్ళుదురు.
ఆలాగే మనము దేవుని గూర్చి మాట్లాడబోయే విషయము కూడా ఉండును. వారు దేనిని గూర్చి మాట్లాడుతున్నారో దానిని ఎరిగినవారై, ఇటువంటి అనుభవముగల వారిని మనము కలిగియుండవలెను. ఈ అపోస్తులలు పెంతెకోస్తు అనుభవమును కలిగియుండిరి. వారు ఆశీర్వదించబడినవారై, దైవిక సంతోషమును కలిగివుండిరి. వారి హృదయములు ఉప్పొంగుచూ ఉండెను, సమస్త లోకము వారికి చెందినదిగా ఉండెను. ఆనాడు వారు కలిగియున్న ఆ సంతోషము, దైవిక ఆనందము ఈ రాత్రి మనము కోల్పోయియుండుట చాలా విచారకమైన విషయముగా లేదా? అలాగే, వారు ఆ దినములలో కలిగియున్న ఆ అనుభవము ఈ లోకమునకు ఎంతగానో అవసరమైయున్నదని నేను తలంచుచుంటిని.
12
ఇపుడు, మండుచున్న అగ్ని పొద యొద్దనున్న మోషే గూర్చి మనము చూద్దాము. ఈ గొర్రెల కాపరి, అనేకసార్లు తాను నడచి వెళ్ళిన అదే మార్గమున ఒక ఉదయ కాలమున నడుస్తూ వెళ్ళుచుండగా, అచ్చటున్న మండుచున్న అగ్ని పొద ఒకటి అతడిని ఆకర్షించెను. కావున అతడు దాని దగ్గరకు వెళ్ళి, అదేలాగు మండుచున్నదో కనుగొనాలని వెళ్లెను, కాని మండుచున్న ఆ అగ్ని పొదలో ప్రభువు దూత వుండెను. ఇపుడు ఆయన మోషేతో మాట్లాడసాగెను. మోషే భయంకరమైన ఓటమిని చవిచూచినవాడు. అయినప్పటికీ, తన ద్వారా ఇశ్రాయేలీయులుల సంతానమును దేవుడు విడిపించబోవుచున్నాడని అతడు ఎరిగియుండి, నలుబది సంవత్సరములకు ముందే తన స్వకీయ బలముతో దానిని చేయాలని ప్రయత్నించి విఫలమైనాడు. ప్రజలను బానిసత్వములో నుండి విడిపించగలననే విజయము యొక్క సమస్త దర్శనములను అతడు కోల్పోయి, ఒక ఓటమిని చవిచూచినవానిగా మిగిలెను.
కొన్నిసార్లు నేను చాలా ఆశ్చర్యపోయెదను, సంఘమగు మనము, దేవుడు సంఘమును పాపము నుండి, దానియొక్క వ్యాధులనుండి విడుదల చేసి, ఈ భూమిపై యున్న జనులు మనల్ని చూచినపుడు వారు ఆకలిదప్పికలు కలుగునట్లు ఉప్పువలె సారవంతమైన జనులుగా మనల్ని ఉంచెదనని వాగ్దానమును చేసెనని మనము ఎరిగియుండి, మనమెందుకు మానవ ప్రయాసములు, మన వేద తత్వములు, మన గొప్ప భవనములు, ఇంకా అనేక కార్యములను చేయుటకు ప్రయత్నించుటను చూచి నేను ఆశ్చర్యపోయెదను. అనేక సంవత్సరముల ముందు వీటిని జనులకు సమర్పించాలని మనము ప్రయత్నించితిమి, కాని అది విఫలమైనదని మనము కనుగొన్నాము, ఎందుకనగా వాటిని మనమే చేయునట్లుగా వాటిని మన చేతుల్లోకి తీసుకొని చేసితిమి. మనము వాటిని తీసుకొని చేయ్యాలని చేస్తూ నూతన పాఠశాలలను నిర్మించాము, మన సేవకులను విద్యావంతులుగా చేసాము, మరియు ఇంకా అనేక కార్యములు చేసాము. మనము అవలంభించవలసిన మూల నియమములను వదిలి వేసాము. మనము పొందుకోవలసిన వాస్తవమైన కార్యమును దేవుడు మనకు చెప్పెను. అదేమనగా, పరిశుద్ధాత్మ సంఘమును నడిపించునట్లు అనుమతించమని చెప్పెను, కాని మనము దానిని వదిలి వేసాము. మన దైవిక సంతోషమును మనము కోల్పోయాము, మనకు ఇవ్వబడిన దర్శనము ఇపుడు మసకబారిపోయెను.
ప్రజలు ప్రభువు రాకడకొరకు ఎదురు చూచుట లేదు. అయినప్పటికీ, ఈ ప్రపంచమును ఒకేసారి నాశనము చేయుటకు ప్రతీచోటా అణుబాంబులు వ్రేలాడుచూ ఉన్నవి. కాని ప్రజలు ప్రభువు యొక్క దర్శనమును కోల్పోయిరి, ఎందుకనగా ఈ నిర్ణీతమైన కాలములోనే ప్రభువు వచ్చునని వారే ఆ సమయమును నిర్ణయించి పెట్టుకున్నారు. ఈ కార్యములన్ని వారే చేసిరి, వీటన్నింటిని స్వయముగా వారే చేయుటకు ప్రయత్నించుచున్నారు. మనము అటువంటి కార్యముల నుండి తొలగిపోయి, దేవుడు కార్యములను చేయునట్లు మనము అనుమతించవలెను. పరిశుద్ధాత్మ లేకుండా ఈ విషయములను మనమేలాగు చేయగలము?
సరే, ఇప్పుడు, మోషే ఘోరముగా విఫలమైనవాడు. అయినా ఇపుడు అచ్చటమండుచున్న ఆ పొదయొద్ద అతడి దృష్టి ఆకర్షింపబడుటను మనము చూచితిమి. అసలు అదేలాగు మండుచున్నదో కనుగొనుటకు ఆ మండుచున్న పొదనే అతడు చూచుచుండెను. దానికి సమీపముగా నడచి వెళ్లెను... మామూలుగా అగ్ని దృష్టిని ఆకర్షించును. సాధారణముగా, పరిశుద్ధాత్మ అగ్ని రూపమున ప్రత్యక్షమైనపుడు అది ప్రజల దృష్టిని ఆకర్షించును. అచ్చట అగ్ని మండుచున్నను ఆ పొద అగ్ని వలన ఎలాగు మండుటలేదో కనుగొనుటకు మోషే దాని ప్రక్క తిరిగినపుడు, దేవుడు దూత ద్వారా ఒక నూతన దర్శనమును యిచ్చి అతడితో మాట్లాడెను.
13
విశ్వాసము దానిని సరిగ్గా పట్టుకొనియుండుటను ఇపుడు మీరు గమనించండి, త్వరగా చూద్దాము. పాతవి గతించిపోయెను, కాని ఇపుడు మోషే ఒక నూతన దర్శనమును కలిగియుండెను... అతడు ప్రత్యక్షతను కలిగివుండెను, అనుభవమును కలిగియుండెను, అతడు దేవుడిని, దేవునితో మాట్లాడెను. దీనికి ముందు అతడు దేవుడిని కలుసుకో లేదు; తన తల్లి ఏమి చెప్పినదో లేదా తన సంఘ కాపరి ఏమి చెప్పెనో వినిన మరియు చదివిన వాటి ద్వారా మాత్రమే అతడు వాటిని ఎరిగి వుండెను. కాని ఇప్పుడు, మోషే వ్యక్తిగత అనుభవమును కలిగియుండెను.
ఈ రాత్రి సంఘమునకు కావలసినది అదే, మితిమీరిన వేదపాండిత్యమును చదువుటను నిలిపివేసి, బలిపీఠము యొద్ద మోకరిళ్ళి, మానవ హృదయములో ఒక వ్యక్తిగత అనుభవమనేది రగులుకొని మండుచూ, మసక బారిన సమస్త కార్యములు కాల్చివేసి మరియు ఒక నూతన దర్శనమును ఆయన అనుగ్రహించువరకు మీరు అచ్చటనేయుండి ప్రార్థించవలెను.
14
ఇపుడు, మోషే, ఆ అనుభవమును పొందుకొనెను. అతడు ప్రభువగు దేవుని యొక్క శక్తిని కన్నులార చూచిన సాక్షిగా ఉన్నాడు. అతడు దైవిక స్వస్థతలోను రెండు విధాల సాక్ష్యమును కలిగియున్నాడు. ఎట్లనగా, తన చెయ్యి కుష్ఠముగలదిగా మారిపోగా, తన చెయ్యిని మరల రొమ్మున ఉంచి బయటకు తీయగా అది బాగయ్యెను. దేవుడు స్వస్థపరచువాడని, దేవుడు తనతో ఉన్నాడని మరియు స్వయముగా ఆయన తనకు వ్యక్తిగతముగా బయలుపడెనని అతడెరిగియుండెను.
ఆ విధముగానే, “నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను,” అని చెప్పిన ఈ అపోస్తులులు పైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. ఈ రాత్రి అటువంటి దేవునితో ఒక వ్యక్తిగత అనుభవమే మనకు కావలసియున్నది.
మోషే ఆ వ్యక్తిగత అనుభవమును కలిగియుండెను; ఇపుడు విశ్వాసము గంతులు వేయుచూ వచ్చుచుండుటను గమనించండి. మోషేలో ఉన్న బేధమును ఇపుడు గమనించండి. దానిని స్వాధీనపరచుకొనుటకు, దానిపై దాడి చేయుటకు అతడు ఏకాకిగా ఐగుప్తునకు వెళ్ళెను. ఎండిపోయిన కర్ర తప్ప వేరేమియు అతడి చేతిలో లేదు, కాని అతడు వెళ్ళి, దేవుడు అతడికేమి చెయ్యమని చెప్పెనో, దానిని అతడు చేసి ముగించుటకు ఆ ఎండిపోయిన కర్రతోనే వెళ్ళెను. ఎందుకనగా, అతడు దేవుని నుండి ఒక నూతన దర్శనమును పొందుకొనెను.
అలాగే ఈ రాత్రి సంఘమునకు ఏదైన అవసరమైనయెడల, స్నేహితులారా, దానిని చెయ్యుటకే మేము ప్రయత్నించుచున్నాము. దేవుడు ఇప్పటికీ జీవముతో జీవించుచున్నాడని, ఆయన ఏలుచూ, తన సంఘముతో ముందుకు సాగిపోవుచున్నాడని ప్రజలు చూచునట్లు దేవుని యొక్క సన్నిధి నుండి ఒక నూతన దర్శనమును తీసుకొని రావలెను. మరియు యేసు వచ్చి దానిని స్వీకరించు వరకు అతడు అచ్చటనే నిలచియుండును; ఒక దర్శనము, ఒక అనుభవము.
15
ఒకసారి దావీదను పేరుగల ఒక చిన్న వ్యక్తి, తన సహోదరులకు రొట్టెలను మరియు ఎండు ద్రాక్షలను తీసుకొని వారువుండే సైన్యము యొద్దకు వెళ్ళెను. పర్వతము మీద ఈ వైపు గొల్యాతు అను పేరుగల ఒక భయంకరమైన రాక్షసుని వంటివాడు నిలబడి బెదిరించుటను మనము కనుగొన్నాము. అతడు ఇశ్రాయేలీయులకు ఎదురుగా డంభములను పలుకుచూ, ఎగతాళి చేయుచూవారిని తిరస్కరించుచుండెను. కాని ఇశ్రాయేలీయులు తమ విశ్వాసమును కోల్పోవుటను మరియు దేవునితో గల వ్యక్తిగత అనుభవమును కూడా వారు కోల్పోవుటను మరియు వారందరూ మౌనులై బహు భీతితో నుండుటను కనుగొన్నాము. ఎవ్వరూ ఒక్క మాట కూడ పలుకలేకపోయిరి. రాక్షసుని వంటి అతడిని చూచి వారు భయపడిరి.
కాని అతడు వెలుపలికి వచ్చి తాను పలికే డంభపు మాటలు దేవుని యందు విశ్వాసముగల ఒకరి చెవిలో పడునట్లుగా వినబడెను. అతడే ఆ చిన్న దావీదు; గొర్రెపు చర్మముతో చేయబడిన చొక్మాయిని ధరించుకొనినవాడు. బహుశా, ఒక ఎర్రని చిన్నవానివలె ఉండును. దావీదు అచ్చటకు పరుగున వెళ్ళి, “నేను వెళ్ళి ఆ శత్రువుతో పోరాడనివ్వండి, జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? నీవా దూషించెదవు,” అని చెప్పెను. అది దావీదు తన సహోదరులను అనమానించునట్లు ఉండెను. మనకు నేడు కావలసిన దేమనగా, దావీదువలె అనుభవముగల ఒకరు లేచి నిలబడి, “అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవని, పందొమ్మిది వందల సంవత్సరములకు ముందే యేసు రక్తము ఎండిపోయినదని మరియు నేడు మనకందరికి కావలసినదంతా ఒక సంఘములోకి వెళ్ళి చేరితే చాలునని చెప్పే పురుషులను మరియు ప్రజలను అనుమతించవలెననే భావముతో మీరు నాతో చెప్పుచున్నారా?” అని పౌరుషముతో గట్టిగా అడుగగల ఒకరు మనకు కావలసియున్నది.
16
ఒక చక్కని పూర్వకాల భక్తితో నిండిన పరిశుద్ధ పౌలు యొక్క కాలమునాటి ఉజ్జీవము, పెంతెకోస్తు దినమున దిగిన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మరియు దేవునిలో జీవించే విశ్వాసము వైపుకు మరలా జనులను తీసుకొని వచ్చుటయే నేడు మనకు కావలసియున్నది. ఖచ్చితముగా, మనకు అదియే కావలయును. యేసుక్రీస్తును అంగీకరించి మరియు అందరి ఎదుట లేచి నిలబడి దానిని ఒప్పుకొనుటను నేను విశ్వసించెదను. అదే యుక్తమైనది. వాటన్నింటిని నేను నమ్ముచున్నాను, కాని స్నేహితులారా, మనకు దానికంటే అత్యధికమైనది కావలసియున్నది.
అబ్రాహాము విశ్వాసము ద్వారా దేవుడిని నమ్మెను, అతడి విశ్వాసము అంగీకరించబడినదనే దానికి ఆధారముగా సున్నతియనే ముద్రను ఆయన అబ్రాహాముకి యిచ్చెను. “నాకు దేవునిపట్ల విశ్వాసము గలదని,” నీవు చెప్పవచ్చు, నీవు చెప్పిన నీ విశ్వాసము సరియైనదైతే, దేవుడు నీ విశ్వాసమును అంగీకరించి దానికి రుజువుగా సరిగ్గా అచ్చటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును అనుగ్రహించును. దానిని అనుగ్రహించుటకు దేవుడు బద్దుడైయున్నాడు. ఆమేన్. అది నిజము.
17
ఇపుడు ఈ చిన్న దావీదును గమనించండి. ఆ రాక్షసునితో యుద్ధము చేయుటకు దావీదు సిద్ధపడుటను రాజు చూచి, అతడి ధైర్యమునకు ఆశ్చర్యపడెనని నేను ఊహించుచున్నాను. రాజు, దావీదుతో, “కుమారుడా, నీ ధైర్యమును చూచి నేను నిశ్చయముగా ఆశ్చర్యపోవుచున్నాను. కాని మనము మోషే దినములలో జీవించుటలేదని, ఈ కార్యములన్ని గతించిపోయిన కాలములో మనము జీవించుచున్నామని నీవు గుర్తించుకో. అయినా ఫర్వాలేదు - నీవిచ్చటకు రమ్ము, నేను నిన్ను యుద్దాయుధములతో సిద్దము చేస్తాను,” అని చెప్పెను. కాబట్టి రాజు తాను ధరించే యుద్ధ కవచమును తీసుకొని, ఆ చిన్న బాలుడైన దావీదుకి ధరింపజేసెను. అతడి డాలును దావీదు చేతికి యిచ్చెను. ఆ గొప్ప బరువైన కవచము చిన్న దావీదు మోయలేక క్రిందికి క్రుంగిపోయేటట్లు చేసినది.
“ఇదెందుకు, దీనిని తీసివేయండి; ఈ కవచమును నేనెన్నడూ ధరించలేదు. దానిని నేనెప్పుడూ ఉపయోగించలేదు. అసలు ఇదేమిటో నాకు తెలియదు,” అని దావీదు చెప్పెను. కాని దావీదు ఒక దానిని కలిగియుండెను; వడిశలతో రువ్వుటనే వ్యక్తిగత అనుభవమును అతడు కలిగియుండెను. ఆ వడిశలను రువ్వుటలో దేవుడు తనతో ఉన్నాడనే దానిని దావీదుకు తెలుసు. మనకు కూడా అదే అవసరమైయున్నది.
18
సౌలు యొక్క మతాచార సంబంధమైన వస్త్రము దేవుని యొక్క మనిషికి ఇమడలేదని సౌలు కనుగొనెను. అది చాలా బరువుగాయుండి, దావీదు దానిని మోయలేక వంగిపోవునట్లుగా చేసినది. దేశాంతరమును దాటి నేను పెద్ద సంఘములలో నిలబడే గొప్ప పేరుప్రతిష్టలను కలిగిన మనుష్యులను కలిసినపుడు, ఈ సమస్యే నేడు అనేకులయందు గలదు. ఈ విమోచనా వర్తమానమును వారు విశ్వసించెదరు; యేసు ప్రభువు యొక్క వర్తమానమును మరియు ఆయన శక్తిని వారు విశ్వసించెదరు, కాని వారి సంఘ సిద్దాంతములకంటే మించి ఎక్కువగా చూడలేని అజ్ఞానులవలె సంఘ శాఖల యొక్క సంకెళ్ళతో బంధింపబడియుందురు. అంతేకాకుండా, తమ సంఘమును అధిగమించి దాటుకొని వెళ్ళుటకు సంఘము వారిని అనుమతించదు. దావీదువలె వడిశలను రువ్వే అనుభవమును కలిగి వెలుపలికి వచ్చే ఎవరో ఒకరు నేడు మనకు కావలసియున్నది.
“మీ తత్వశాస్త్రమును గూర్చి నాకేమియు తెలియదు, ఈ ఖడ్గములు మొదలగువాటిగూర్చి నాకేమి తెలియదు, కాని నీ సేవకుడనగు నేను వడిశలను రువ్వటలో అనుభవము గలదు. ఎట్లనగా ఈ వడిశలతో సింహమును మరియు ఎలుగు బంటును చంపునట్లు దేవుడు చేసెను. ఈ వడిశలతో సింహమును నేను చంపుటకు దేవుడు సహాయము చేసినయెడల, నిశ్చయముగా సున్నతిలేని ఈ ఫిలిష్తీయుడిని ఈ మధ్యాహానమున నా చేతికి ఆయన అప్పగించునని,” దావీదు చెప్పెను. గణగణ ఎర్రని మంటతో మండే అనుభవముగలవారిని, దేవుడిని ఆయన వాక్యమందు స్వీకరించే, అలాగే ఆయన చెప్పిన సమస్తమును సత్యమని ఆయనను విశ్వసించే ఎర్రగా మిసమిసలాడే అనేక యవ్వనస్తులను దేవుడు మనకు దయచేయును గాక! నా ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, ఈ రాత్రి మనకు కావలసినది అదియే.
మరిప్పుడు మీరు శ్రద్ధగా గమనించవలెనని నేను కోరుకుంటున్నాను. దావీదు అతడిని ఎదుర్కొనుటకు వెళ్ళి, ఖచ్చితముగా దేవుడు తనతో ఉన్నాడని నిరూపించెను, ఎందుకనగా తన వడిశల దెబ్బ ద్వారా తన శత్రువును తన చేతికి అప్పగించి, దేవుడు తనకు విడుదలను యివ్వగలడనే అనుభవమును అతడు కలిగియుండెను.
19
సమ్సోనను పేరుగల ఒక వ్యక్తి ఒక కాలమున ఉండెను. సమ్సోను గిరజాల వెంట్రుకలు గలవాడు. కొన్నిసార్లు సమ్సోనును చిత్రించేటపుడు అతడు బరువైన తలుపులను తన భుజములుపై పెట్టుకొని మోసుకొని వెళ్ళే చిత్రమును కళాకారుడు గీసినపుడు, ఈ సభా మందిరం ఉన్నంత పెద్దదానిగా అతడిని చిత్రించి గీసెదరు. అటువంటి బలశాళియైన ఒక వ్యక్తి పట్టణము యొక్క తలుపులను ద్వారబంధములతో ఎత్తి పట్టుకొని నడుస్తూ వెళ్ళున్నాడంటే, అందులో ఏ ఆశ్చర్యము ఉండదు. కాని వారి అవగాహన పొరపాటు. సమ్సోను చాలా చిన్న ఆకారముతో గిరజాల వెంట్రుకలను కలిగి ఒక స్త్రీవలె వ్రేలాడుచూ ఉండే ఏడు అల్లిన చిన్న జడలు గలవాడు. అతడు చూచుటకు ఒక సాధారణమైన పురుషునివలె ఉండెను గాని, అతడు వేరేవిధమైన గొప్ప దృఢమైన ఆకారమునుగలవాడు కాదు. అయితే దేవుని ఆత్మ అతడి మీదకు వచ్చినపుడు, ఒక సింహమునైనా లేదా వేరేదేనినైనను సునాయసముగా చంపగలడు. అది దేవుని యొక్క ఆత్మ ద్వారా చేయుచుండెను.
ఒక దినమున ఒక కొండ మీద వెయ్యిమంది ఫిలీప్తీయులు అతడిని చుట్టుముట్టినపుడు తానేమి చేయలేని పరిస్థితియని ఎరిగెను. కాని అచ్చట ఎండిపోయివున్న పాత గాడిద దవడను తన చేతిలో తీసుకొని, తన ఏడు జడలు వెనుక వున్నాయా లేదాని ఒక్కసారి చూచుకొని, వారిని ఎదుర్కొనుటకు విరజిమ్ముకొని వారిపై పడి, వారందరిని, అనగా వెయ్యి మంది ఫిలిష్తీయులను ఆ దవడతోనే కొట్టి చంపెను. వారిని చంపుటకు అతడి చేతిలో ఆ గాడిద దవడ ఎముక తప్ప వేరేమి లేదు. కాని అతడు, “మీకు యిచ్చుటకు (మిమ్మల్ని చంపుటకు) నాయొద్ద ఈ దవడ ఎముక తప్ప వేరేమి లేదు. కాబట్టి ఈ ఎముకతోనే మిమ్మల్ని చంపుతానని,” చెప్పెను. దానితోనే వెయ్యి మంది ఫిలిష్తీయులను చంపెను. దేవునికి సంబంధించిన కార్యములలో యధార్ధమైన ప్రమేయమును కలిగిన కొంతమంది ప్రజలు నేడు మనకు కావలెను.
20
ఒకసారి నేను ఒక కూటము కొరకు ఫుట్ బాల్ ఆట జరుగు మైదానమునకు వెళ్ళుచున్నాను. దాని తలుపు మీద వ్రాసివున్న సూచనను నేన్నెటికి మరచిపోలేను. అది, “పొట్లాటలో కుక్క ఎంత పెద్దదన్నది కాదు గాని, కుక్కలో గల పోరాట పటిమ ఎంత దృఢమైనదో అదియే,” అని వ్రాసియున్నది. తగినంత దృఢమైన వైఖిరి మరియు వెన్నెముక గల కొందరు ఈ రాత్రి మనకు కావలసియున్నది. అతడు ఏ సంఘ శాఖకు చెందనివాడు కాకపోయినను, డి.డి. పట్టభద్రుడు కాకపోయినను లేదా నీకేమి ఉన్నను లేకపోయినను ఏమి ఫర్వాలేదు. కాని యేసుక్రీస్తును నీ పక్షమున నీవు కలిగియున్నంతవరకు, జీవించుచున్న దేవుని యొక్క వాక్యమును రాజీపడకుండా ప్రసంగించుచూ మరియు ఎల్లప్పుడూ స్థిరముగా నిలచియుండుము. దేవుడు నీ పక్షమున ఉండెదనని ఆయన వాగ్దానము చేసెను, అది ఖచ్చితముగా సత్యము.
న్యాయాధిపతుల కాలములోవున్న షమ్గరు అను పేరు గల ఒక చిన్న వ్యక్తి నాకు గుర్తుకు వచ్చుచున్నాడు. అతనిలో ఏ గొప్పతనము లేదు; అతడు ఒక యోధుడు కూడా కాదు. యుద్దము గూర్చి అతనికేమి తెలియదు. అప్పుడ్పుడు ఫిలిష్తీయులు వచ్చి వారి కష్టార్జితమును, సమస్తమును దోచుకొని వెళ్ళేదరు. ఇశ్రాయేలీయులు ఏదైన ఒక చిన్న దానిని కట్టుకొని, కావలసిన కొన్ని వస్తువులను సమకూర్చుకొనివున్న సరిగ్గా ఆ సమయమున ఫిలిష్తీయులు వచ్చి వాటన్నింటిని కొలగొట్టుకొని వెళ్ళేదరు.
ఆ విధముగానే నేడు మనము ఉజ్జీవ కూటములను జరిపించుచున్నాము. మేము వెళ్ళి ఉజ్జీవమును ఆరంభించెదము, సువార్తికులు వెళ్ళిపోయిన వెంటనే లేదా ప్రజలు ఆ ఉజ్జీవ కూటము నుండి తిరిగి వెళ్ళినపుడు, సరిగ్గా అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి, “ఇపుడు, అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి, అసలు అటువంటి ఒక కార్యమే లేదు. అవన్నీ కేవలము మనస్తత్వ శాస్త్రమే. అది మానవ మనస్సులను చదివి చెప్పుట మాత్రమే, లేదా ఏదో అటువంటి క్రమములో జరుగు కార్యములు మాత్రమే,” అని చెప్పెదరు.
21
ఓ, అచ్చట ఫిలిష్తీయులు సమూహముగా వచ్చుచుండుటను ఆ చిన్న వృద్ద షమ్గరు వీధిలో నిలబడి చూచుచుండెను. అతడు ఒక యోధుడు కాదు; ఏ విధముగా పోరాడాలో అతడికి ఏమి తెలియదు. కాని తానొక యూదుడని, తన స్వాస్థ్యముపై తనకు హక్కుగలదని, తాను సున్నతి చేయబడినవాడని మరియు తనతో దేవుడు ఉన్నాడని అతను ఎరిగెను. కావున షమ్గరు అచ్చటున్న ఎద్దులను తోలు ముళ్ళ కర్రయనే ములుకోలను తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ చిన్న కర్ర మాత్రమే అతనియొద్ద గలదు. దానితోనే అతడు ఆరువందల మంది ఫిలిష్తీయులను నిశ్చయముగానే ఎదుర్కొనెను. తన చేతిలోవున్న ఈ చిన్న కర్రయగు ములుకోలతో కవచములను ధరించివారిలోవున్న ప్రతి ఒక్కరిని చంపివేసెను, ఎందుకనగా ఏదైతే సరియైనదో దానిపై అతడు తనకాలును పెట్టి నిలిచి దేవుడిని విశ్వసించెను.
అటువంటి కొంతమంది షమ్గరులు ఈ రాత్రి మనకు అవసరమైయున్నారు. అది నిజమే కదా? దేవుని యొక్క వాక్యమందు కాలు మోపి అది సత్యమని ఏ భయము లేకుండా, ధైర్యముగా చెప్పే ఎవరో ఒకరు మనకు కావలయును. అట్లు నిలబడగలవారి పక్షమున దేవుడు నిలిచి తన వాక్యమును ఆయన నిలబెట్టుకొనును. అది చెయ్యుటకు ఆయన బద్దుడైయున్నాడు.
22
ఓ, పరిశుద్ధ గ్రంథములోని విశ్వాస వీరులను గూర్చి నేను ఆలోచించుచుండగా, కొంత కాలము క్రితము ఇచ్చట జరిగిన ఒక కార్యము నాకు జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అదేమనగా, ఇచ్చటున్న కొండల మీద నేను ఉన్నప్పుడు, బాతులు నీళ్ళలో చుట్టూ గుమిగూడి ఈదుటను నేను గమనించుచుంటిని. మొట్ట మొదటగా చల్లని గాలి వీచిన వెంటనే వాటిల్లోని పెద్ద బాతులు హాంక్, హంక్ అని రెండు లేదా మూడు సార్లు అరుస్తు, వాటికి సాధ్యమైనంత వరకు త్వరపడుచూ అచ్చట నుండి ఎగిరి లూసియానాలో నున్న వరి పొలాల్లోకి వెళ్ళుటకు ఏ తత్వ శాస్త్రమును అవి అభ్యసించలేదు. అది పూర్తిగా ఒక బాతుగానే జన్మించినది. అది బాతైతే సహజము గానే దానిలో ఆ స్వభావము గలదు. అదొక బాతైతే, చల్లని వాతావరణము రాబోవుచున్నది గనుక వెచ్చని వాతావరణము మరియు మంచి స్థలము ఎచ్చట ఉన్నదో ఇచ్చట నుండి బయలుదేరి, ఆ స్థలమునకు వెళ్ళవలెనని దానికి చక్కగా తెలుసు.
మంచిది, అదొక బాతే ఆలాగు చేసినయెడల, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకొని దేవుని ఆత్మతో మరలా నింపబడివున్న ఒక వ్యక్తి ఎటువంటి యుక్తమైన కార్యమును చేయును? సమస్య వచ్చుటకు ముందే అతడు దానిని గ్రహించి, దేవుని చెంతకు వెళ్ళుటకు ఒక అడుగు ముందుకు వేసి, తన విశ్వాసపు రెక్కలను ఆడించి, ఆ సమస్య నుండి తప్పించుకొనును. మీ వ్యాధుల నుండి తప్పించుకొనెదరు, క్రుంగదీసే పరిస్థితుల నుండి మీ సంకెళ్ళను తెంపుకొని తప్పించుకొనెదరు. మరియు ఇటువంటి సమస్యలన్నింటిని దాటుకొని ముందుకు సాగిపోయెదరు. వాటిని చేయుటకు దేవుడు కదలాడే సమయము ఇదే. అంతే కాకుండా, యేసు ప్రభువు తన ప్రసన్నతను అనుగ్రహించి, మనలను ఆశీర్వదించి, ఆయన తన శక్తిని అనుగ్రహించి మరియు ఏ దినములోనైన సంఘము కొరకు గొప్ప కార్యములను ఆయన అనుగ్రహించును గాక! దానిని చేసెదనని దేవుడు వాగ్దానము చేసెను.
23
“అంత్యదినములలో, పరలోకము నుండి ఆయన ఆత్మ కుమ్మరింపబడును. భూమియందు దర్శనములను, సూచక క్రియలను మరియు అద్భుత కార్యములను ఆయన చూపించునని,” దేవుడు చెప్పెను. ఈ వివిధ కార్యములన్నింటిని చేసెదనని దేవుడు వాగ్దానము చేసెను. దేవుడు వాగ్దానము చేసినయెడల అందుకు భాధ్యత వహించి దానిని చేయుటకు ఆయన బద్దుడైయున్నాడు. మీరు దానిని విశ్వాసించుచున్నారా? అవునండీ, ఆయన నిశ్చయముగా దానిని చేయును. సరే, ఎప్పుడైతే…
నేను బాప్టిస్టు సంఘము యొక్క కాపరిగా ఉన్నప్పుడు ఒకసారి ఒక చిన్న నైటేంగీల్ అనే పక్షిని గనిమనిస్తూ ఉంటిని. సాధారణముగా నేను రాత్రి సమయములలోనే వచ్చేవాడిని. అపుడు ఆ పక్షి అచ్చట ఒక చోట కూర్చొని రాత్రి సమయమున చుట్టూ చూస్తూ ఉండును. అలా చూస్తూ ఉండగా మేఘములు కదులుతూ చెదిరి పోవునపుడు, ఏదైనా ఒక నక్షత్రమును అది చూచిన తన హృదయములో నుండి ఎంత బిగ్గరగా కూస్తూ పాడగలదో పాడును. ఎందుచేత? సూర్యుడు ఎచ్చటో ఒక చోట ప్రకాశించుచున్నదని దానికి తెలుసు. సూర్యుడు ప్రకాశించుట ద్వారా ఆ రుజువును అది చూచెను. నక్షత్రము ప్రకాశించుటవలన అచ్చటెచ్చటో ఒక సూర్యుడు ఉన్నదని రుజువుపరుచుచూ సూర్యుడు ఎచ్చటో ప్రకాశించుచున్నాడు.
24
ఈ రాత్రి నా సహోదరుడా, నేను తలంచుచున్నదేమనగా, పరిశుద్ధాత్మ బలమైన గాలివలె వీస్తూ దిగివచ్చినపుడు, అది గాఢాంధకారమైన మేఘములను పారద్రోలును, అప్పుడు మనము పూర్వకాలపు ఉజ్జీవమును పొందుకొనెదము. పరిశుద్ధాత్మ అచ్చట కుమ్మరింపబడి, ఏ క్రైస్తవుడనైనను ఉజ్జీవింపజేసి ప్రకాశింపజేయుటకు హేతువుగా అది ఉండును. ఎట్లనగా, మనము జీవించుచున్న ఈ దినములలో ఆయన తన ఆత్మను జనులపై కుమ్మరింపజేసి, తన ప్రజలను పరిపాలించుచూ, దేవుడు ఇంకా జీవించున్నాడని నేనెరుగుదును. (అవును, అదే వాస్తవము).
ఒకవేళ ఉదయమున నేను నడిచి వెళ్ళుచూ, పెద్ద వేకువ చుక్కను చూచి, “ఓ, వేకువ చుక్కా ఏది నిన్ను ప్రకాశింపచేయుచున్నది?” అని అడిగితే, ఒకవేళ అది నాకు ప్రత్యుత్తరము యిచ్చిన, “బ్రెన్హాం సహోదరుడా, నేను ప్రకాశించుట లేదు సూర్యుని వెలుగు నా మీద పడి, సూర్యుడే నన్ను ప్రకాశించునట్లు చేయుచున్నాడు,” అని చెప్పును.
25
కొంతకాలము క్రితము నేనొక వైద్యునితో మాట్లాడుచుండగా, అతడు నాతో, “బ్రెన్హాం సహోదరుడా, ఆ ప్రజలకు ఏమైనది, వారు ఏదోకదానికి గురియగుచున్నారు, అదే వాళ్ళను ఆలాగు ప్రవర్తించునట్లు చేయుచున్నది. అనగా బలిపీఠము యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళి మరియు అచ్చట ఏడ్చుచున్నారు. అది ఉద్రేకము తప్ప వేరేమి కాదు,” అని అన్నాడు.
“వైద్యుడా, ఒక వ్యక్తి ఉద్రేకము చెందుటకు ముందుగా అతని నరములు ఏదోక దానిద్వారా ఉద్వేగము చెందుటవలననే అది జరుగుచున్నదని నీకు బాగుగా తెలుసు,” అని నేను అన్నాను.
అది నిశ్చయముగా నిజమే. ఏదోకటి అతడలా చేయునట్లు చేయుచున్నది. అది నిజము. పరిశుద్ధాత్మ క్రిందికి దిగి వచ్చినపుడు, అది జనులను కదిలించుచు ఉద్రేకము చెందునట్లు చేయుచున్నది. వారు దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడి, అచ్చట కూర్చొనియున్నపుడు, పరిశుద్ధాత్మ వారిని పూర్తిగా నింపబడినపుడు, అది వారికి ఉద్రేకమును కలిగించును. అది ఆ విధముగానే చేయును.
“వారు మౌనముగా ఉంటే వెంటనే ఈ రాళ్ళు బిగ్గరగా అరచి కేకలు వేయునని,” యేసు చెప్పెను. కావున మనమేమి చేయవలెను? ఆహా, నేను దానిని ఆలోచించినప్పుడు.
“దానిని ప్రజలు చేయుట లేదని,” అతడు అన్నాడు. ప్రజలు ప్రకాశించుటలేదు; పరిశుద్ధాత్మయే వారిపై ప్రకాశించి వీటన్నింటిని చేయుచున్నది. పరిశుద్ధాత్మయే దానిని చేయుచున్నది. చేయుచున్నది ప్రజలు కాదు; దేవుని యొక్క ఆత్మ వారిపై యుండుటవలన దానిని వారు విశ్వసించునట్లు చేయుచున్నది. దేవుని ఆత్మయే వారి పైయుండి వారికి విడుదలను అనుగ్రహించుచున్నది. దేవుని యొక్క ఆత్మయే తాము స్వతంత్రులమని భావించునట్లు చేయుచున్నది.
26
సమీపకాలమందు నేను ఒక చోటికి వెళ్ళుచుంటిని. వేటాడుటకు కొండలకు వెళ్ళుటకు నేను ఇష్టపడెదను. అచ్చటున్న ఒక పాత నీటి ఊటలోని నీళ్ళను త్రాగుట నాకు యిష్టము. ఆ నీళ్ళు ఎప్పుడు గలగలయని పారుచూ, ఉప్పొంగుచూ ఉండును. అటువంటిది నా జీవితములో నేనెప్పుడూ చూడలేదు. ఉప్పొంగుచూ, ఉప్పొంగుచూ, అదెప్పుడు ఉప్పొంగుచుండును. ఒక దినమున నేను దాని దగ్గరకు వెళ్ళి, “ఏది నిన్ను ఇంత సంతోషముగా ఉండునట్లు చేసినది? జింకలు నీ నుండి నీళ్ళను త్రాగుటవలన నిన్ను ఉప్పొంగునట్లు చేయుచున్నదా?” అని నేను అడిగాను.
ఆ నీటి ఊట మాట్లాడగలిగినయెడల, అది, “లేదు” అని జవాబు యిచ్చును.
“సరే, ఎలుగు బంటులు నీ నుండి నీళ్ళను త్రాగుటవలన నీవు సంతోషముగా ఉన్నావా?” అని నేను అడిగాను.
అది, “లేదు” అని చెప్పినది.
“సరైతే, బహుశా, నేను నీ నుండి నీళ్ళు త్రాగుచున్నాననా? నిన్ను ఉప్పొంగునట్లు చేయుచున్నదేది?”
అది మాట్లాడగలిగిన యెడల, “సహోదరుడా బ్రెన్హాం, ఉప్పొంగుచున్నది నేను కాదు; నా వెనుక వున్న ఏదోకటి నేను ఉప్పొంగునట్లుగా నన్ను త్రోయుచున్నదని” చెప్పును.
ఆ విధముగానే దేవుని ఆత్మ ద్వారా జన్మించిన ప్రతీ వ్యక్తిలో జీవపు ఊట యొక్క నీళ్ళు ఉప్పొంగుచుండును. ఉప్పొంగుచున్నది అతడు కాదు; అతడి వెనుక ఉన్న పరిశుద్ధాత్మయే అతడిని ఉప్పొంగునట్లుచేసి, దానిని విశ్వసించునట్లు చేయుచూ, ఎంతో ఎత్తైన ఉన్నత స్థానమునకు అతడిని నడిపించుచూ, బహు లోతునకు నడిపించుచూ మరియు ప్రభువగు యేసుక్రీస్తుతో అనుభవములను పొందుకొనునట్లు చేయును. నేడు మనకు కావలసినది అదే, ఎట్లనగా, మూసి ఉంచిన మూతను బద్దలు చేసుకొంటు నీళ్ళు ఉప్పొంగి చిమ్ముకుంటూ ప్రవాహించి వచ్చునట్లుగా అది ఉండవలెను. నేడు మనకు అటువంటి అనుభవమే అవసరమైయున్నది.
27
ఉదయ కాలమున మంచు బిందువులను మీరు గమనించి ఉందురు. రాత్రి సమయమున మంచు పడుటను నేను అనేకసార్లు గమనించితిని. అచ్చట బయట పడే మంచును చూడండి. సూర్యుడు ఉదయించే ప్రతీసారి ఆ చిన్న హిమబిందువులు ఎంత సంతోషముగా ఉంటాయో మీరెప్పుడైనా గమనించితిరా? అది మిళమిళ మెరుస్తూ, ప్రకాశించును, మరియు అది మిళమిళ మెరుపులతో ప్రకాశించుచుండును. ఈ ప్రకృతిని చూచి ఒక ఉదయమున నేను ఒకటి అడిగాను, ఈ ప్రకృతియే నా మొదటి పరిశుద్ధ గ్రంథమగును. “చిన్న హిమబిందువా, నీవు మెరుయునట్లు చేసినదేది?” అని అడిగాను.
అవును, ఏదోకటి నన్ను మరలా తిరిగి జవాబు యిచ్చినట్లుగా నాకు తోచినది. “నీకు తెలుసా, నిన్నటి రాత్రి నేను అచ్చట ఉంటిని, మరలా నేను అచ్చటకు తిరిగి వెళ్లెదనని నాకు తెలుసు, ఎందుకనగా ఈ పాత వేడి భూమికి అవతల తేమవున్న స్థలమునకు నేను చెందినదానను. ఒకానొక సమయమున నేనచ్చట వున్నందున మరియు సూర్యుడు నాపై ప్రకాశించుట వలన నేను సంతోషముగా ఉన్నాను. సూర్యుడు నాపై ప్రకాశించునపుడు నేనెచ్చట ఉంటినో, మరలా అచ్చటకే నన్ను పీల్చుకొని తీసుకొని వెళ్ళుట వలననే నేను ఆనందించుచున్నాను,” అని చెప్పెను.
అది నిజమేనని నేను తలంచితిని. నీవలాగు మెరయుటకు గల కారణమేమనగా, నీవు ఒక అనుభవమును పొందుకొనియున్నావు, ఎందుకనగా నీవు ఒకప్పుడు అచ్చట ఉన్నావు.
నేను దీనిగూర్చి ఆలోచించుచుండేవాడిని. మరలా నూతనముగా జన్మించిన ఒక మనిషి, తాను జీవించుచున్న ఈ జీవితమును విడిచిపెట్టి, ఆశీర్వాదము మరియు మహిమకరమగు వేరొక పరిమాణములోకి ప్రవేశించును. మరియు ఈ దినములలో ఏదోక దినమున ఈ భూమిమీద నీతి కుమారుడు ప్రకాశించును. మరియు నూతన జన్మ అనుభవముగలవారు మధ్యాకాశములోకి కొనిపోబడి ఆయనను కాలుసుకొందురు. అనగా మహిమకరమగు ఆ పరిమాణము ఎచ్చట గలదో అచ్చటకు వారు వెళ్ళి కనుమరుగైపోవుదురు. అప్పుడు వారి చుట్టూ ఎవరు ఉన్నను దానిని గూర్చి వారు లెక్క చెయ్యరు, ఎందుకనగా ఒకప్పుడు వారచ్చట ఉండినవారు. అటువంటి పరిస్థితులలో వారు ఉంటూ, ఆత్మ యొక్క అభిషేకమును వారు పొందుకున్నప్పుడు, ఆ మహోన్నతుని ఆత్మయగు యేసుక్రీస్తు ఏదోక దినమున వచ్చి తన సంఘమును హక్కుతో కోరును.
28
సమీప కాలమున నేనొకటి చదివితిని... లేదా సహోదరుడు మూర్ దీనిని నాతో చెప్పెను. పూర్వ కాలములలో వున్న గొప్ప రచయిత ఈ విధముగా చెప్పెనని నేను నమ్ముచున్నాను. అతడు, “నేనింత వరుకు చూచిన దృశ్యములలో ఘోరమైన దృశ్యమేమనగా, ఆకాశములో ఎగిరే పక్షియగు పక్షిరాజును ఒక గూడులో పెట్టి బంధించడమే. పక్షిరాజు ఆ గూడు యొక్క ఇనుప కమ్ములకు తన తలను గుద్దుకుంటూ, తన పొడవు రెక్కలతో ఎగురుటకు ప్రయత్నిస్తూ ఆ ఇనుప కమ్ములకు కొట్టుకొని తన ఈకలన్ని చిన్నభిన్నమై, తన రెక్కల నుండి రాలిపోయేంత వరుకు అదలాగు ఇనుప కమ్ములకు కొట్టుకొంటూ ఎగురుటకు ప్రయత్నిస్తూనేవుండెను. అందువలన దాని తలపై మరియు మెడ పైయున్న ఈకలన్ని ఊడిపోయినవి. అది ఎలాగైనా ఆ గూడులో నుండి బయట పడాలని దాని నుండి విముక్తి చెందాలని ప్రయత్నించుచూ తన రెక్కలను కొట్టుకొనుచూ, తన శక్తినంతటిని ఉపయోగిస్తూ, శక్తినంతా కోల్పోవువరకు ప్రయత్నిస్తూ క్రిందకు పడిపోయేది. మరియు అలసిపోయిన తన కళ్ళతో చూట్టూ చూస్తూ, వాస్తవముగా తానెచ్చటకు చెందినదో, ఆ ఆకాశము వైపు తన తలను పైకి ఎత్తి చూస్తూ ఉండెను, కాని ఆ గూడు తనను బంధించి, తాను వెలుపలకు వెళ్ళలేకుండా దాని ఇనుప కమ్ములు అడ్డుకొనుటకు విసిగిపోయిన తన కళ్ళతో చూస్తూ ఉన్నది,” అని చెప్పెను.
29
అవును, అది నిజము. ఆ దృశ్యము ఎంతో విచారకరమైనది. కాని అంతకన్నా ఇంకా మించిన ఒక దుర్బరమైన దృశ్యము ఒకటి గలదు: అదేమనగా, సర్వశక్తిమంతుడగు దేవుని యొక్క పోలికలతో జన్మించిన ప్రతీ పురుషుడు మరియు స్త్రీ, దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగాను ఉండవలసినవారు సంఘ శాఖల ద్వారా సంకెళ్ళతో బంధింపబడియుండుట, సర్వశక్తిమంతుడగు దేవుడు వారిని తన ఆశీర్వాదములలోకి ప్రవేశింపవలెనని, తన సన్నిధి యొక్క శక్తితో వారిని విడుదల చేయాలని ఆయన కోరుకొనుచుండగా మరియు “నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను,” అని లోకమునకు చెప్పునట్లు వారికొరకు క్రుమ్మరింపబడిన పెంతెకోస్తు ఆశీర్వాదము, తన సన్నిధి యొక్క శక్తితో కూడిన పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదములు వారికి ఆయన అనుగ్రహించగా, ఆ ఆశీర్వాదములను వారు పొందకుండనట్లు ఆ సంఘ శాఖ వారిని బంధించుచున్నది.
ప్రభువగు యేసు క్రీస్తే మనకు మాదిరి, మరియు అటువంటి ఆశీర్వాదమే ఈ రాత్రి మనకు అవసరము. ఈ రాత్రి ఆయన మృత్యువు నుండి జీవముతో లేచెను. ఈ రాత్రి ఆయన మన మధ్య ఉన్నాడు. మనము తండ్రి యొద్ద ఆయన చిత్త ప్రకారముగా సరియైనది ఏది అడిగినను దానిని చెయ్యుటకు ఆయన ఇచ్చట వున్నాడు. ఆయన దానిని చేస్తానని వాగ్దానము చేసెను. “నా నామమున మీరేది అడిగినను దానిని నేను చేసెదను.”
30
రెండవది... శ్రీ. అప్షా గారు, స్వస్థతను పొందుకున్న సాక్ష్యమును గూర్చి రెండు లేదా కొన్ని నిమిషములలో మీకు నేను చెప్పెదనని చెప్పాను. కాలిఫోర్నియాలో లాస్-ఏంజెల్స్ అనే స్థలమున నేను ఉంటిని. నా జీవితములలో నేనెన్నడూ అతనిని గూర్చి ఆలకించలేదు. డీకన్లు లేదా ద్వారపాలకులు నన్ను వేదిక పైకి తీసుకొని వెళ్ళారు. నేను వేదికపై నడిచి వెళ్ళి, ప్రార్థనా వరుసను పిలుచుటకు ప్రారంభించితిని, ఎందుకనగా శ్రీ. బాక్స్టర్ అప్పుడే ఒక బలమైన వర్తమానమును ప్రసంగించెను, కావున ఇక నేను మాట్లాడుటకు ఏ అవసరము లేకుండెను. అందుచేత నేను వేదిక పైకి వెళ్ళిన వెంటనే ప్రార్థనా వరుసను పిలుచుటకు ప్రారంభించితిని. అలాగు నేను ప్రార్థనా వరుసను ప్రారంభించగా, ఒక చిన్న బాలుడు గడ్డివాములో ఆటలాడుచుండుటను నేను చూచాను. ఆ విధముగా ఆడుకొనుచూ అతడు క్రిందపడి తన వెన్నెముక ఎముకను విరుగగొట్టుకొనెను. తెల్లని మీసములతో, కళ్ళ అద్దాలుగల ఒక వైద్యుడు అతడి వెన్నెముకకు చికిత్స చేయుటను నేను చూచాను. అతడు అనేక పుస్తకములను మరియు మొదలగువాటిని రచియించిన ఒక ప్రసిద్ధిగాంచిన వాడని నేను చూచాను; మరియు నేనేమి చూచానో దానిని గూర్చి చెప్పుచుంటిని.
31
నేను ముందుకు వెళ్ళి ప్రార్థనా వరుసలోవున్న వారిని పిలుచుటకు ప్రారంభించితిని. అప్పుడు ఎవరో ఒకరు పైకి లేచి ఏదో చెప్పుటను నేను ఆలకించాను. కొన్ని నిమిషములలో శ్రీ. బాక్స్టర్ నా యొద్దకు వచ్చి, “నీవిప్పుడు వివరించి చెప్పిన ఆ మనిషి అచ్చట ఉన్నాడు, చక్రాల కుర్చీలో కూర్చొని అచ్చట ఉన్నాడు, అతడు కాంగ్రెస్ కు చెందిన అప్షా గారు” అని చెప్పెను.
“మంచిదే, అతని గూర్చి అసలు నాకేమి తెలియదు,” అని చెప్పాను. పిదప అతడు వేరొక మైకులో నుండి “నా కుమారుడా, నీవు చెప్పినదంతా నిజమే. ఈ విషయములన్ని నీకేలాగు తెలుసు,” అని అతడు నన్ను అడిగెను.
“దానిని దర్శనము ద్వారా నేను చూచాను,” అని నేను చెప్పాను.
“బాప్తిస్టు సంఘములో నిన్ను సేవకునిగా నియమించిన డాక్టర్ డేవిస్ గారు నన్ను ఇచ్చటకు వచ్చునట్లు చేసెను. అందువలనే, నేనిచ్చటకు వచ్చాను. నేను చిన్నప్పుడు నుండే స్వస్థతను పొందుకోవాలని అనేక స్వస్థతా కూటములకు వెళ్ళేవాడిని. కాని అరవై-రెండు సంవత్సరములుగా వికలాంగుడిగానే ఉన్నాను,” అని అతడు చెప్పెను. అతనికి ఎనబై-ఆరు సంవత్సరములు.
“సరే, అయ్యా, ఇపుడు నేను మీ కొరకు ఏదైన ఒకటి చేయ్యాలని ఆశిస్తున్నాను, కాని నేనేదైతే చూస్తానో దానినే నేను మీకు చెప్పగలను,” అని నేను చెప్పాను.
32
పిదప కూటము ఆరంభమైవేదిక పైకి ఒకరిని తీసుకొని వచ్చుచుండగా, తాబేలు పెంకు వంటి కళ్ళాద్దాలను కలిగిన, గుండ్రని కాలర్ తో వైద్యుని కోటు వేసుకొనివున్న ఒక వైద్యుడుతన చేతులను ఈలాగు ముడుచుకొని, తన తలను ఊపుచూ, ఆకాశమున నిలచియున్నట్లుగా నేను చూచాను. అతడు నల్ల జాతికి చెందిన ఒక చిన్న బాలికకు శాస్త్రచికిత్స చేయుచూ, ఆమెకు గొంతులోవున్న తోన్సిల్స్ ను తీసివేసెను. అందువలన ఆమె పక్షవాతానికి గురైనది. నేను వేదికనుండి దానిని చెప్పుచున్నప్పుడు, అచ్చట అప్షా గారి వెనుకవున్న ఒక నల్లజాతికి చెందిన వృద్దురాలగు తల్లి తన చేతిలోని బండిని పట్టుకొని త్రోసుకుంటూ గట్టిగా అరుస్తూ వచ్చుచూ, “ప్రభువా, కనికరించుము, అదెవరో కాదు, నా కుమార్తె మరియు ఖచ్చితముగా అటువంటి వైద్యుడే నా కుమార్తెకు శాస్త్ర చికిత్స చేసెనని,” చెప్పెను.
ద్వారపాలకులు ఆమెను వేదిక పైకి రాకుండా ఆపవలసి వచ్చెను, ఎందుకనగా మనకు ప్రార్థనా కార్డుల వరుస క్రమము గలదు. మాకు తెలిసినంత వరుకు ఆ విధానమే న్యాయమైన మరియు శ్రేష్ఠమైన మార్గముగా ఉన్నది.
33
తన కుమార్తెకు నోట్లో మందును పోసి, ఆ దీన తల్లి, చక్రాల బండిని తోసు కుంటూ ద్వారపాలకులను త్రోయుచూ ఎలాగైనా వేదిక పైకి రావాలని ఆశించెను.
నేను ఆ చిన్న బాలికను చూచి, “అవును, అమ్మా, ఆ బాలిక ఈమే. ఆమె ఒక యవ్వనస్తురాలిగా, నల్లని నున్నని వెంట్రుకలు గలది” అని చెప్పెను.
“అవును, అది నిజము” అని ఆమె చెప్పినది.
“మంచిది, ఇప్పుడు...” అని చెప్పాను.
“నా కుమార్తె బాగవునా?” అని ఆమె అడిగినది.
“అమ్మా, ఆ విషయము నాకు తెలియదు. ఏదో ఊహతో దానిని నేను చెప్పలేను. మీ విషయములో నేనేమి చూచెదనో దానిని మాత్రమే నేను చెయ్యగలను. అదే నేను చెయ్యగలను. ఆ విధముగానే చెయ్యాలని యేసు ప్రభువు చెప్పెను, ”తండ్రి నాకు చూపించువరకు నాయంతట నేనేమియు చేయలేనని,“ ఆయన చెప్పెను. ”నిశ్చయముగా, నీ కుమార్తె బాగవునను విశ్వాసము నీకు గలదు, దేవుడు మన మధ్య సంచరించుచూ ఆ వ్యక్తి గూర్చి ప్రేక్షకుల ముందు చెప్పినయెడల, ఈ మర్యాదస్తుడగు ఈయన కూడా స్వస్థతను పొందుకొనును,“ అని నేను చెప్పాను.
34
“మంచిది, ప్రార్థనా వరుసలోకి తీసుకొని రండి” అని నేను నా ద్వారపాలకుని యొద్ద చెప్పాను. అప్పుడు వారు ఒక స్త్రీని నా యొద్దకు తీసుకొని రాసాగిరి. అది మరలా నన్ను ఈ వైపుకు పిలిచినది, నేను గమనించాను, దానిని గమనించగా, చూచుటకు అది ఏదోక నల్లని గీతలాంటిది ప్రేక్షకులు పై నుండి కదులుచున్నది. సరే, అదేదో అపవిత్రాత్మని నేను తలంచాను. కాని అది పెద్దదై దృశ్యరూపములోకి వచ్చినప్పుడు, దానిని నేను చూచుచుండగా, ఈ నల్లజాతి బాలిక తన చేతిలో ఒక బొమ్మను పట్టుకొని చేతులు ఊపుకుంటూ వీధిలో లేదా రహదారి పై నడుచుకుంటూ వెళ్ళుచున్నది. సహోదరుడా, అదే.
నేను దర్శనములో చూచిన ఆ దృశ్యమును అడ్డుకొనుటకు సాతాను వద్ద తగినన్ని దెయ్యాలు పాతాళములో లేవు. దర్శన రూపములో దేవుడు దానిని ఇదివరకే చెప్పుట వలన ఖచ్చితముగా అదియే నిజము.
అప్పుడు, “అమ్మా, నీ ప్రార్థనలు ఆలకించబడినవి. యేసుక్రీస్తు నీ కుమార్తెను స్వస్థపరచెను. నీ కుమార్తె తన కాళ్ళతో లేచి నిలబడును గాక!” అని నేను చెప్పాను.
“నా కుమార్తె బాగవునా?” అని ఆమె అడిగినది.
“ఇపుడు, ఇప్పుడు ఆమె బాగైనది,” అని నేను చెప్పాను.
ఆమె నాతో మాట్లాడుతూ ఉండగా, ఆమె కుమార్తె పైకి లేచి నిలబడి “అమ్మా,” అని పిలిచి, తన చేతులని విదిలించుకొనెను. రెండు సంవత్సరములుగా భుజముల నుండి క్రిందివరకు ఆమె పక్షపాతముతో బాధపడుచుండెను. ఆ తల్లి, బిడ్డ ఒకరి నొకరు కౌగిలించుకొని అరుచుచూ, ఏడ్చు చుండిరి. వారిచుట్టూ నిలబడియున్న జనులు స్పృహ-తప్పి పడిపోవుచూ మరియు ఇంకా అనేకము జరుగుచుండెను.
35
అది ప్రేక్షకుల పైనుండి వెళ్ళుటను నేను చూచాను. సరిగ్గా ప్రేక్షకుల తలమీద వెళ్ళుచున్నది. ఇచ్చటున్న వృద్దుడు, గోధుమ రంగులో గీతల కోటును ధరించియున్న ఈ అమెరికా సంయుక్త రాష్ట్రముల పార్లమెంటు సభ్యుని యొద్దకు వెళ్ళెను. అందరి ముందు తన తలను వంచి ఉండుటను మరియు అది సరిగ్గా ప్రేక్షకుల మధ్య వెళ్ళుచుండుటను నేను చూచాను. పిదప, “కాంగ్రెస్ సభ్యుడా, గోధుమరంగులో గీతలుగల కోటు నీకు ఉన్నాదా?” అని నేను అడిగాను. ఆ సమయమున అతను నల్ల రంగు లేదా ఒక నీలి రంగు కోటును, ఎర్రని టై ధరించి ఉండెను.
అతను, “అవునయ్యా, నాకు గలదు. దానిని నేను కొన్ని దినముల క్రితము ధరించియుంటినని,” చెప్పెను.
“యేసుక్రీస్తు ప్రభువు నిన్ను స్వస్థపరచెను. నీ స్వస్థత కొరకు నీవు లేచి నిలువుము. 'ఇది ప్రభువగు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' ఆయన నీ పట్ల గౌరవమును కలిగియుండుట వలన నీవు బాగైనావు,” అని చెప్పాను.
ఆరువది-ఆరు సంవత్సరములు మంచము పైనే ఉంటూ, చక్రాల కుర్చీలో కూర్చొని వుండే ఆ వృద్ద కాంగ్రెస్ సభ్యుడు, చక్రాల కుర్చీలో నుండి ఎగిరి దూకి, చేతిలో ఏ చేతికర్రలు లేకుండానే, ఏమి లేకుండా వేదిక యొద్దకు పరిగెత్తుకొనివచ్చుచుండెను. అతను తన కాలి బొటన వ్రేళ్ళను ఈ విధముగా తాకి చూచుకొని, తన చేతులను యించుమించు అన్ని వైపులా త్రిప్పి చూచుకొనెను. పరిపూర్ణముగా స్వస్థతను పొందుకొని సాధారణమైన స్థితిలోకి వచ్చి బాగయ్యెను.
36
ఇది మరణము నుండి పునరుత్థానుడైన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క శక్తియైయున్నది. ఆయన ఆనాడు లోకమంతటికి చేసిన అదే క్రియలు నేటి రాత్రియందు అదేవిధముగా చేయుటకు ఈ భవనమున ఆయన ఇచ్చట ఉన్నాడు. అనేక దేశములలో వారి భాష కూడా తెలియకుండా ఏ విధముగా నేను ఈ పరిచర్యను చెయ్యుటకు సాధ్యమగుచున్నదని మీరు ఒకవేళ ఊహించుచూ లేదా తలంచవచ్చును... ఇచ్చటున్న జనుల కొరకు ఒక ఉదాహరణకు చెప్పుచున్నాను. స్వీడన్ నుండి ఇచ్చటకు ఒక సహోదరుడు వచ్చెను. అలాగే ఇచ్చటకు అనేక దేశముల నుండి అనేకులు వచ్చుచున్నారు. ఫిన్లాండ్ నుండి, ఆఫ్రికా నుండి వచ్చుచున్నారు. కనీసము వారి భాషలో ఒక్క మాటైనా, ఏదియు నాకు తెలియదు. కాని పరిశుద్ధాత్మ సరియైన ఒక వ్యక్తిని అచ్చట ఉంచి, జనులతో మాట్లాడి, వారి చేసే కార్యములను గూర్చి మరియు వారి జీవితములోని పాపకార్యములను గూర్చి, నేను మాట్లాడే మాటలను వారికి అర్థమయ్యేలా అనువదించి అతడు చెప్పునట్లు చేయును. అది ఎన్నడు విఫలమవ్వలేదు, ఎందుకనగా అది చేయుచున్నది ఎవరనగా, నిన్న, నేడు, నిరంతరము ఏకముగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను నేను ప్రేమించుచున్నాను.
37
మిమ్మల్ని ఇంతసేపు ఉంచినందుకు నన్ను క్షమించండి. ఇంకా కొన్ని నిమిషములలో ప్రార్థనా వరుసను పిలిచి మరియు రోగుల కొరకు ప్రార్థించెదము.
నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీతో ఉండును గాక! మీలోయున్న అనేకులు రేపుమీ సంఘములకు వెళ్ళి, మీకు యిచ్చిన బాధ్యతను మీరు చేయుచూ మరియు నా కొరకు మీ సంఘ కాపర్లకు అభివాదము చేయండి. నేను సంపూర్ణముగా సంఘ శాఖల బేధములేనివాడను. క్రైస్తవులందరూ నా సహోదర, సహోదరీలని నేను నమ్మెదను. మనమందరము ఏకముగా కూడి ఆరాధించవలెను. ఇలాంటి అడ్డంకులు మనల్ని ముక్కలుగా చేయుట చాలా దుఃఖకరము.
నా జీవితములో నేనెన్నడూ ఒక్కసారి కూడా నాకు తెలిసినంతవరకు ఎవ్వరిని నీవు మా సంఘమునకు చెందినవాడవైతే బాగుండునని నేను చెప్పి అతని మనస్సును మార్చుకొనునట్లు చేయుటలో నేను నిర్దోషిని. ఒక వ్యక్తి తానే సంఘమునకు వెళ్ళుటకు ఇష్టపడునో అచ్చటకు వేళ్ళుటకు ఆలోచించే స్వతంత్రము అతడికి గలదని నేను నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించవలెనని నేను ప్రార్థించెదను. మీకు కావలసినదేదనగా ఒక నూతన సంఘము కాదు గాని, ఒక మంచి పాత-కాలపు భక్తిని, ఉజ్జీవమును మీ సంఘములో మీరు కలిగియుండుటయే మీకు అవసరమైయున్నది. మీకు కావలసినది అదియే. మనకందరికీ కావలసినది అదియేనని నేను తలంచుచున్నాను.
ఇచ్చటున్న సంఘ కాపర్లగు మిమ్మల్ని దేవుడు దీవించును గాక! యేసుక్రీస్తు మరణము నుండి పునరుత్థానుడై, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని నేను నిరూపించిన దానిని ఒకవేళ మీరు నాతో ఏకీభవించకపోవచ్చు. మీరు అలాగు ఉన్నప్పటికీ ఫర్వాలేదు. అయినప్పటికి మీరు నా సహోదరులే. అందుకొరకు దేవుడు మిమ్మల్ని క్షమించును గాక! ఆయన మిమ్మల్ని దీవించునట్లు నేను ప్రార్థించెదను. ఆ గొప్ప దినము వచ్చునప్పుడు మనము ఆయన రాజ్యములో యేసు పాదముల యొద్ద కూర్చొని, మన ప్రసంగము ద్వారా రక్షణను పొందుకొని అవతల గట్టున భద్రముగా వున్న అనేక వేలమంది జనులను మనము చూచెదము. మనము ప్రార్థించుచుండగా, ఇపుడు ప్రభువు మీతో ఉండును గాక.
38
తండ్రీ, మీ వాక్యము కొరకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మీ వాక్యమే జీవము. “వినుట ద్వారా విశ్వాసము కలుగును, దేవుని వాక్యమును వినుట ద్వారా కలుగునని,” మీరు చెప్పితిరి. ఈ రాత్రి ఇచ్చటున్న జనులను మీరు ఆశీర్వదించమని నేను ప్రార్థించుచున్నాను. ప్రభువా, వారిని ఎల్లప్పుడూ మీ ఎదుట ఉంచుదురు గాక! మీ అరచేతిలో వారి పేర్లును వ్రాయుము. వారు అవతలి గట్టుకు వచ్చేంతవరుకు వారిలో ప్రతిఒక్కొక్కరిని క్రైస్తవులుగా జీవించునట్లు ప్రభువగు యేసుక్రీస్తు యొక్క హృదయములోవారిని పదిలపరచుకొనుము.
విశ్వాసములో వెనుక అడుగువేసిన వారు సిగ్గుపడుచూ పరమ తండ్రి ఇంటికి ఈ రాత్రి తిరిగి వచ్చుదురు గాక! పాపి పశ్చాత్తాపపడి గృహమునకు తిరిగి వచ్చును గాక! వ్యాధులతో, బాధలతో ఉన్నవారినందరిని మీరు స్వస్థపరచవలెనని మేము ప్రార్థించుచున్నాము. ఈ ఆరాధన ద్వారా మీరు మహిమను పొందుకోమని, రోగులను స్వస్థపరచుటకు మమ్మల్ని మేము మీకు సమర్పించుకొందుము గాక! మీ కుమారుడగు యేసుక్రీస్తు నామమున దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
39
ఇపుడు, ఆరాధన కొరకు... ఈ దినమున అతడు ఏ ప్రార్థనా కార్డులను ఇచ్చెనో కనుగొనండి. మనము... సరే మంచిది.
మేమిచ్చట నిలబడి గంటల తరబడి ప్రసంగించవచ్చు. నేను విదేశములకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రార్థనా వరుస క్రమమును, మొదలగువాటిని నేను మార్చబోవుచున్నాను. కాని, ఈ సమయమున, అనగా చికాగోలో ఇప్పుడు జరుగుచున్న ఈ కూటములు రేపు రాత్రి జరగబోవు కూటముతో ముగియును. పిదప మేము పడమర సముద్ర తీరప్రాంతములకు వెళ్ళెదము. పిదప అచ్చట నుండి న్యూయార్క్ పట్టణమునకు వెళ్ళి తర్వాత అచ్చట నుండి విదేశములకు వెళ్ళెదము.
నేను మిమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నాను. మరియు మీరు కూడా నన్ను ప్రేమించుచున్నారని నాకు తెలుసు, ఎందుకనగా మీరు ప్రవర్తించు విధానము, మరియు మీరు చేయుచున్న కార్యములు దానికి నిదర్శనముగా కనబడుచున్నది. దానిని ఇరువైపుల గ్రహించుచున్నాము.
40
ఇపుడు మనము రోగుల కొరకు ప్రార్థించుటకు గల ఏకైక మార్గమేదనగా, అనగా నాకు తెలిసిన ఒకే మార్గమేదనగా... ఇప్పుడిచ్చట మీరు దీనిని నిశ్చయముగా అర్థము చేసుకోవాలని నేను మీకు చెప్పెదను; యేసుక్రీస్తు దేవుని కుమారుడని, వారు ఆయనను సిలువలో వేసిరని, ఆయనను సమాధి చేసిరి. మూడవ దినమున ఆయన మరణము నుండి లేచెనని నేను హక్కు కోరుచున్నాను. పిదప నలుబది దినములు పగలు మరియు రాత్రి భూమి పై తన శిష్యులతో ఆయన ఉండెను. నలుబదవ దినమున పరమునకు కొనిపోబడుచూ, “నేను వెళ్ళుచున్నాను, ఈ లోకము ఇక ఎన్నడును నన్ను చూడదు,” అని తన శిష్యులతో చెప్పెను. అయినప్పటికీ వారు ఆయనను చూడగలిగిరి. మరియు ఆయన వారితో ఉండెను. యుగ సమాప్తి వరుకు తన శిష్యులతోను, ప్రతీ తరముతోను ఆయన ఉండును. “ఇదిగో, యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.” మీరు దానిని విశ్వసించుచున్నారా?
41
పెంతెకోస్తు దినమున ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ వారికి యివ్వబడెను. అనగా యేసుక్రీస్తు ఆత్మ సంఘమునకు అనుగ్రహింపబడినదని నేను విశ్వసించుచున్నాను. శిష్యులతో ఏ విధముగా ఆయన తన శరీరమున జీవించెనో, అలాగే తన సంపుములోను, తన జనులలోను ఆయన జీవించుచున్నాడు. మనము పొందుకోవలసిన మరణ శిక్షను ఆయన భరించి, మనల్ని విమోచించి దేవుని యొద్దకు మరలా తీసుకొని వెళ్ళుటకు మాంసము బలియర్పణముగా మరణించవలసివున్నది.
మరిప్పుడు ఆరోహణుడై పరమునకు వెళ్ళిన అదే యేసు, ఏదోక దినమున భౌతిక శరీరమున మరలా తిరిగి వచ్చునని నేను విశ్వసించుచున్నాను. సంఘములో యున్న ఆత్మ తీయబడి మరలా క్రీస్తు శరీరములోకి తిరిగి వెళ్ళిపోవును. ఆయన తన శిష్యులతో ఏ విధముగా భుజిస్తూ, నీళ్ళు త్రాగుచూ, మాట్లాడెనో ఆలాగే, ఆయన ఆరోహణుడై వెళ్ళినట్లుగానే మరలా తన భౌతిక శరీర రూపమున అదే యేసుగా తిరిగి వచ్చును. ఆయన మరలా తిరిగి వచ్చునని నేను విశ్వసించుచున్నాను. నేడున్న లోక సమస్యలకు అదొక్కటే జవాబని నేను విశ్వసించుచున్నాను. అది నిజము.
42
ఆ తర్వాత, దీనిని యేసు చెప్పెనని నేను నమ్ముచున్నాను: “నేను చేయు క్రియలను మీరును యుగసమాప్తి వరకు చెయ్యుదురు” అని ఆయన చెప్పెను.
ఈ కార్యములు యేసుక్రీస్తు పునరుత్థానమును వెంబడించుచు వెళ్ళు కార్యములని నేను విశ్వసించుచున్నాను. అలాగైతే ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని లేఖనము బోధించుచున్నందువలన, నా దీన అభిప్రాయము ప్రకారముగా, ఆయన ఆనాడు ఏమి చేసెనో, దానిని తన జనుల ఎదుట తన వాక్యమును కాపాడుకొనుట ఆయన బాధ్యతయైవున్నదని మనము కనుగొన్నాము. నేనిచ్చట ఉంటానని మీకు వాగ్దానము చేసి, దానిని నేను ఉద్దేశపూర్వకముగా... తాను నెరవేర్చుటకు సాధ్యమవ్వని ఏ వాగ్దానమును ఆయన చేయడు. ఒకవేళ నేను ఒక వాగ్దానము చేసి, దానిని చెయ్యలేకుండా వెనుకంజ వేయవచ్చును, కాని దేవుడు అలాగు చెయ్యుటకు అవసరము లేదు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నానని వాగ్దానము చేసినయెడల, ఆయన చేసిన అదే కార్యములను ఈ యుగ సమాప్తి వరకు తన సంఘము కూడా ఎల్లప్పుడూ వాటినే చెయ్యును. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు తన వాక్యమునకు ఆయన బద్దుడైయున్నాడు. ఇపుడు అవి జరుగకుండా అలాగే ఉండునట్లుగా చేయునదేదనగా మన అవిశ్వాసమే. మన అవిశ్వాసము మాత్రమే. ఆ కార్యము ఒక్కటే.
43
ఆయనను ప్రేమించుచు... ఓ, మనము,“మాకు విశ్వాసము గలదు. మాకు ప్రేమ గలదని” చెప్పవచ్చును. కాని మనకు ప్రేమ ఉన్నయెడల, మనకు విశ్వాసము ఉండును. అది... “పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును.” భయము ఎప్పుడైతే పోవునో, అప్పుడు విశ్వాసము పరిపూర్ణమగును. ఆయన తన వాక్యమును నెరవేర్చలేడని మీరు భయపడుతున్నారు, కాని ఆయన దానిని నెరవేర్చునని నేను విశ్వాసించుచున్నాను. మరిప్పుడు ఆయన ఏమి చేసెనో మనము కనుగొందాము.
ఆయన భూమి మీద ఉన్నప్పుడు, “ఆ వ్యక్తిని నా యొద్దకు తీసుకు రండి, నేను అతడిని స్వస్థపరచెదనని,” ఆయన చెప్పలేదు. ఇది విరుద్ధముగా ఉండకూడదు. మృతులను ఆయన జీవముతో లేపగలడని నేను విశ్వసించెదను. మీరు దానిని నమ్ముచున్నారా? కాని ఆయన మృతులైన అందరిని జీవముతో లేపలేదు. తన పూర్తి సేవంతటలో ముగ్గురిని మాత్రమే జీవముతో లేపెనని లేఖనము చెప్పుచున్నది. మూడనేది రుజువుపరచుచున్నది.
44
బహుశా, ప్రజలు వచ్చి, “ఇపుడు, ఈ వైపు చూడండి, ఆ మనిషిని చూడండి, ఆయన లాజరుని లేపినట్లైతే, ఇచ్చటకు వచ్చి చనిపోయిన మా మావయ్యను కూడా ఆయన లేపలేడా? ఆయన దానిని చేస్తాడో లేదో మనము చూద్దాము” అని చెప్పవచ్చును. నిశ్చయముగా, అటువంటి విమర్శకు గురియగు విషయములు జరుగుచునే ఉండును, వారు చేసినట్లే యూదులు ఆయనను ద్వేషించిరి. వారు ఆ విధముగానే ఆయన విమర్శించిరి.
గమనించండి, ఆయన బెతెస్థ కోనేరు గుండా వెళ్ళుచున్నప్పుడు, అచ్చట అనేకులు వికలాంగులు, కుంటివారు, గ్రుడ్డివారు గలరు. మరియు వేలకొలదిమంది అచ్చట వికలాంగులు, కుంటివారు, కదలలేనివారు, గ్రుడ్డివారు, తలలు వాచిపోయివున్న పసి బిడ్డలు మరియు అనేకులు గలరు. వారందరని ఆయన దాటుకొని వెళ్ళుచూ, దిక్కుమాలిన పడక మీద అనేక సంవత్సరములుగా పడివున్న వ్యక్తి యొద్దకు ఆయన వెళ్ళేంతవరకు అచ్చట తిరుగుచుండెను. పిదప ఆ వ్యక్తిని మాత్రమే స్వస్థపరచి, అచ్చట దీన స్థితిలో పడివున్న వారందరిని విడిచి దాటుకుంటూ వెళ్ళిపోయెను.
మరియు అదే అధ్యాయములో యూదులు ఆయనను ప్రశ్నించగా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు, ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడు అలాగే చేయును, నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను,“ అని ఆయన చెప్పెను.
45
ఇపుడు, ఆయన మరణము నుండి పునరుత్థానుడైన యెడల, ఆయన నేడు కూడా అదే యేసుగా ఉన్నాడు. ఆయన అలాగే ఉన్నాడు కదా?
బావి దగ్గర ఆయన ఆ స్త్రీని కలిసినప్పుడు, ఆమెలో వున్న సమస్య ఏమిటో కనుగొనేంతవరకు ఆయన ఆమెతో మాట్లాడెను. ఆయన జనులతో మాట్లాడేటపుడు వారి ఆలోచనలను ఆయన వివేచించెను. వారి విశ్వాసము ఆయనను తాకెను.
ఈ రాత్రి ఈ కూటములోవున్న జనులగు మీరు, “మీ పాపములు క్షమించబడినవని, లేదా మీ కేన్సర్ వ్యాధి బాగయైనది,” అని ఆయన చెప్పునట్లు ఈ వేదిక మీద ఆయన ఉండి, ఆయన మీ వైపుకు తిరుగునట్లు చేసినయెడల, మీ విశ్వాసముతో మీరు ఆయనను తాకగలరు. లేదా మీ సమస్య ఏమైనగాని దానిని గూర్చి ఆయన చెప్పునట్లు చేసినయెడల, మీ విశ్వాసముతో మీరు ఆయనను తాకగలరు. మీరు దానిని విశ్వసించుచున్నారా? సరే అటైతే, ఇపుడు ఆయన ఆత్మరూపమున వున్నాడు, మన కళ్ళు తప్ప ఆయనకు వేరే కనులు ఆయనకు లేవు, మన చెవులు తప్ప ఆయనకు వేరే చెవులు లేవు, మన నాలుక తప్ప ఆయనకు వేరే నాలుక లేదు. కాబట్టి ఆయన సమస్తమును కలిగియుండునట్లు మనము అనుమతించుదాము. దీనియొక్క రహస్యమేమనగా, దైవిక ప్రేమతో ప్రియమైన తండ్రి యొక్క హస్తములలో మనల్ని మనము ఆయనకు సమర్పించుకొనెదము. మరియు ఆయన మిమ్మల్ని పాలించునట్లుగా అనుమతించండి. అది మాత్రము చాలు.
46
ఈ చేతిరుమాళ్ళ కొరకు మనము ప్రార్థించుదాము. ప్రభువా, ఎవరి నామమున మేము నమ్మకము కలిగివున్నామో, ఆ దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామమున, రోగుల యొక్క ప్రతినిధులుగా మా చేతులను పెట్టబడిన ఈ చేతిరుమాళ్ళకు చెందిన వారిపై మీ ఆత్మ దిగివచ్చును గాక! మరియు ప్రనరుత్థానుడైన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా వారిలో ప్రతీ ఒక్కొక్కరు స్వస్థతనొందుకొని బాగవుదురు గాక! ఆ ఉద్దేశము కొరకే ఈ చేతిరుమాళ్ళను వారియొద్దకు మేము పంపించుచున్నాము. ప్రభువగు దేవా, వారిని గమనించి, ఆ దీనులయెడల, రోగులయెడల, బాధలలో వున్న జనులయెడల మీ కనికరమును చూపి మీ మహిమ కొరకు దీనిని చేయుదురు గాక! బహుశా, వారిలో కొందరిని వైద్యులు ఏమి చేయలేక వదిలివేసి ఉండవచ్చు. ప్రార్ధించే ఒక క్రైస్తవ సంఘము గలదనుటకు ఆనవాలుగా ఈ చేతిరుమాళ్ళు వారియొద్దకు వెళ్ళి చేరుటయే వారు నమ్మే ఏకైక మార్గము. తండ్రీ, ఇది ఈ విధముగానే జరుగును గాక! అని నేను అడుగుచున్నాను. ఆమేన్.
47
ధన్యవాదములు సహోదరుడా. ఏ సంఖ్య? “u”? ఎన్ని? వందా? సరే, ఈ రాత్రి ఎంతమందికి మనము ప్రార్థించగలమో చూద్దాము. సంఖ్య 1 నుండి ఆరంభించే దము. “u” సంఖ్య -1,2,3,4,5,6,7,8,9,10, నుండి 15,20 వరుకు. మీరెంత మంది వరుసలోకి వచ్చి నిలబడినా నాకేమి ఫర్వాలేదు. కాని ఒకేసారి అనేకమంది ఇచ్చటకు వచ్చి నిలబడవద్దు. 1,2,3,4,5 నుండి 15 వరుకు ప్రారంభించెదము. ఆ తరువాత ఇంకా ఎంతమంది మిగిలినవారు నిలబడియున్నారో అప్పుడు చూద్దాము.
ఇపుడు, వారు వచ్చుచుండగా, నేను సంఘమును ఒకటి అడగాలనుకొనుచున్నాను, ఇంకా కొన్నినిమిషములే వున్నవి. జనుల వైపు గమనించండి. ప్రార్ధనా వరుసలోకి వచ్చినిలబడినవారికంటే ఈ కూటములోవున్న అనేకమంది జనులు స్వస్థత నొందుదురు. అది నిజమే కదా? మీరు దీనిని గుర్తుంచుకోండి, నేను ఇచ్చట నుండి వెళ్ళిపోయిన అనేక దినములకు తరువాత ఈ కూటములోవున్న అనేకులు సహజమైన స్థితికి వచ్చి బాగవుటను మీరు కనుగొనెదరు. గత సాయంకాలమున నేనింతవరుకు చూడని ఒకదానిని చూచాను. అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి వదిలిపోవుటను, అది ఒక ఆకారముగా వదిలి వెళ్ళుటను నేను స్పష్టముగా చూచాను. అది అతడి నుండి స్పష్టముగా వదిలి వెళ్ళుచున్నది. దానిని నేను నిన్న రాత్రి చూచాను.
క్రైస్తవ మిత్రులారా, నేను ఒక మూఢ భక్తిగలవాడను కాదు. మూఢ భక్తిని నేను నమ్మను. మీకంటే నేను దానికి వ్యతిరేకిని, ఎందుకనగా దానికి వ్యతిరేకముగా ఉండుట నా బాధ్యతయై ఉన్నది. ఆ అపవిత్రాత్మను బలహీనపరచి నాకు సాధ్యమైనంతవరకు సంఘమును చక్కని విధానమున ఉంచుటయే నా బాధ్యతయై వున్నది. మూఢభక్తియందు నాకు నమ్మకము లేదు. కాని యేసు క్రీస్తు పునరుత్థాన శక్తి యొక్క ప్రభావమును నేనెరుగుదును, మరియు దెయ్యములు గలవని కూడా నాకు తెలుసు.
48
ఇపుడు, ఇచ్చట ఈ శక్తి... వాళ్ళు జనులను వరుసలో నిలబెట్టుచుండగా నేను దీనిని అడగనివ్వండి. దేవుని రాజ్యములో మిక్కిలి ప్రధానమైనది “ప్రేమ” యని ఇచ్చటున్నవారిలో ఎంతమంది విశ్వసించుచున్నారు? అది నిజము. ఇపుడు, ఒక చిన్న రహస్యమును చెప్పబోవుచున్నాను. మీరు జనులను ప్రేమించినపుడు దానిని వారు కనుగొనెదరు. మానవుడు తన లోపల తానే ఒక సృష్టికర్తయని మీకు తెలుసా? ఎంతమంది దానిని నమ్ముచున్నారు? తాను ఒక దేవుని కుమారుడనే స్థితి నుండి అతడు పడిపోయెను.
నేడు చికాగోలోవున్న ఆకాశమును అంటుకునేంత ఎత్తైన భవనములను మనము చూచునపుడు, జంతువుకంటే మానవుడు ఉన్నతమైనవాడని మీరు చూడగలరు. నగరములలో భవనములు, అందమైన నౌకాశ్రయములు వంటివాటిని జంతువులు కట్టుటను మీరెన్నడు చూడలేరు. మానవుడు ఒక సృష్టికర్త.
మీరు ఇష్టపడే ఒకరు ఎప్పుడూ మీతోనే ఉండాలని కోరుకొని, అటువంటి వారిని కూడ మీరు కలిగి ఉన్నారా? అటువంటి ప్రజలను మీరు కలిగియుందురు. అదేమిటది? వారి చూట్టూ అటువంటి ఒక వాతావరణమును వారు సృష్టించి వుంచుటయే అందుకు కారణము. మంచి చక్కని జనులతో మీరు ఉన్నప్పటికీని, వారి చుట్టూ ఉండే పరిస్థితిని బట్టి మీరు వారితో కలిసి నిలబడలేరు. ఎందుకనగా, వారి చుట్టూవున్న వాతావరణమే అందుకు కారణము. ప్రేమయే అందుకు కారణమైయున్నది. ప్రేమ లోతుగా వెళ్ళును; అది గొప్ప కార్యములను చేయును. అంతే కాకుండా, యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రేమయై ఉన్నాడు.
49
దేవుడు నా పట్ల కోపముగా ఉన్నాడని నేను తలంచెడివాడిని, కాని క్రీస్తు నన్ను ప్రేమించెను. పిదప క్రీస్తే దేవుని యొక్క హృదయమని నేను కనుగొంటిని. ఆయనే దేవుని యొక్క హృదయము. యేసు క్రీస్తే దేవుని యొక్క హృదయము. ఇపుడు, ప్రేమ జయించును. ప్రేమ పాపమును మరుగుపరచును లేదా పాపమును వీడి తొలగిపోవును. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు ప్రతివాడును నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”
ప్రేమ పాపమును మరుగుపరచును లేదా ప్రేమ రోగులను స్వస్థపరచును. మీరు జనులను ప్రేమించుచున్నట్లు నటించవచ్చు. “సరే, నేను శ్రీమతి. జ్సోని, నేను ఆమెతో ఏకీభవిస్తూ ఆమెతో కూడా ఉండలేను, కాని నేను ఆమెను ప్రేమిస్తున్నానని,” మీరు చెప్పవచ్చు. దీనిని గూర్చి తన మనస్సులో ఏమున్నదో శ్రీమతి. జోన్స్ కి చాలా బాగా తెలుసు. నిశ్చయముగా, అవును, దానిగూర్చి ఆమెకు తెలుసు. అసలు నీవు ఆ విధముగా చెయ్యవద్దు. నీవు ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించుటకు ఎంత ప్రయత్నించినను ఆమెను నీవు ప్రేమించుటలేదనేదే వాస్తవము. ఆ విధముగానే దైవిక స్వస్థతయందును లేదా మరేవిషయములోనైనను గలదు. నీవు నటించుచూ అనుకరించలేవు; నీవు దానిని కలిగియుండవలెను. నీవు దానిని కలిగి...
50
మీలో ఎంతమంది మీ హృదయపూర్వకముగా నన్ను ప్రేమించుచున్నారు. నేను మీకొక చిన్న కధను చెప్పాలనుకుంటున్నాను. మీ నమ్మకము నిజముగానే లోతైనదని నేను నమ్ముచున్నాను. ఇది ఒకవేళ మీకు వినుటకు వినోదముగా ఉండవచ్చు. మీలో అనేకులు నా ఇంటికి వచ్చారు. సహోదరుడు ఉడ్ ఇచ్చట కూర్చొని నన్ను చూచి నవ్వుచున్నాడు, ఎందుకనగా ఆ అనుభవము అతనికి గలదని నాకు తెలుసు. ఓ, జనులారా, మీరు కూడా వచ్చి వెళ్ళండి, అప్పుడు అదేమిటని మీరెరుగుదురు.
గత వేసవి కాలములో, మా ఇంటి ముందున్న గడ్డిని యంత్రము ద్వారా పూర్తిగా కోయుటకు నాకు సాధ్యమవ్వలేదు. ఎందుకనగా, వెనుక ప్రక్కవున్న గడ్డిని కోసి ముగించేలోపు ముందు ప్రక్కనవున్న గడ్డి మరలా పెరిగిపోవును. నేను గడ్డిని కొంచెము కోయుటకు ప్రారంభించగా, అంతలో జనులు లోపలికి ప్రవేశించెదరు. కావున వారికి ప్రార్థించుట కొరకు దానిని విడిచి వెళ్ళేదను. నేను మరలా వచ్చి గడ్డిని రెండు లేదా మూడు సార్లు చుట్టు తిరిగి కోసెదను. ముందు భాగమున నాకు కొంచెము పెద్ద స్థలము గలదు. కావున నేను... నా భార్య నాతో, “మీరు ధరించిన ఆ వస్త్రములతో వెలుపలికి వెళ్ళి రోగుల కొరకు ప్రార్థించవద్దు. లోపలికి వచ్చి మీ వస్త్రములను మార్చుకొని వెళ్ళండి,” అని చెప్పెను.
51
కావున నేను ప్రభువుని స్తుతించుచు, ఆ ఆవరణము నుండి వెళ్ళి మరలా తిరిగి వచ్చెదను. మరలా గడ్డిని కోయు యంత్రముతో కోయుటకు ప్రారంభించేదను. గడ్డి కోయు ఆ పాత యంత్రము ఎంత శబ్దము చేయునో మీకు తెలుసు. అంతలో ఒక కారు వచ్చి నిలబడును. మరలా వారి కొరకు నేను కొన్ని గంటలు వెచ్చించవలెను. కొంతసేపటికి మరలా ఇంకొకరు లోపలికి వచ్చెదరు. ఇకంతే ఆ రోజంతా అలాగు వారితోనే సరిపోవును. మరుసటి దినమున ఆ గడ్డి మరలా మంచి ఎత్తుగా పెరిగిపోయి ఉండును.
కావున నేను మరలా వెనుక ప్రక్కవున్న గడ్డిని కోయుటకు వెళ్ళుదను. నేను అచ్చటకు వెళ్ళినపుడు నా చొక్కాయిని విప్పెదను, ఎందుకనగా నేను వెనుక ప్రక్కన ఉన్నందున నన్నెవరు చూడలేరు. నేను గడ్డిని కోయుచూ ఉందును. ఆనాడు ఎండ చాలా తీవ్రముగా ఉండెను. అలాగు వెలుపలవరకు గడ్డిని కోసుకుంటూ వెళ్ళాను. కాని జరిగినదేమిటంటే, అచ్చట చాలా కందిరీగలు గూడును కట్టి ఉండెను. నేను కందిరీగల తుట్టెను తెలియకుండా గడ్డిని కోయు యంత్రముతో గుద్దినపుడు, అవన్నీ ఒక్కటిగా ఆ తుట్టెలో నుండి బయటికి వచ్చెను. ఆ పెద్ద కందిరీగలన్ని నా చుట్టూ తిరుగుచూ, ఎగురుచు నన్ను పూర్తిగా చుట్టు ముట్టాయి.
52
ఇపుడు, ఇది చూచుటకు వింతగా ఉండవచ్చు, ఒరెగన్ రాష్ట్రములోవున్న పోర్టు లాండు అనే నగరమున ఒక ఉన్మాది వెర్రిపట్టినవాడై నన్ను చంపాలని పరిగెత్తుకొని వచ్చిన విషయమును నా పుస్తకమున వున్న ఆ కధను మీరు చదివితిరా? ఆ పుస్తకము గూర్చి మీకు గుర్తున్నదా? ఆ వ్యక్తి పై నాకే ద్వేషము లేదు. కాని అతడిపై దయ మరియు ప్రేమ మాత్రమే గలదు, ఎందుకనగా అతడి పరిస్థితి ఆ విధముగా ఉండెను. అతని కొరకు నేను బాధపడ్డాను. బహుశా, ఆ ఆత్మ అతనిలో లేనియెడల, అతడు నన్ను ప్రేమించును. మీరు మీ శత్రువును ప్రేమించవలెను. ఇపుడు వారు దానిని సిద్దపరచుచున్న సమయములో నేను ఈ చిన్న కార్యమును మీకు చెప్పెదను.
53
ఈ కందిరీగలు నన్ను పూర్తిగా చుట్టుముట్టాయి. నేను వాటిని చూచి భయపడుటకు బదులుగా, ఆ కందిరీగల పుట్ట పట్ల నాకు ప్రేమ కలిగెను. ఇది, నా మాటలు ఆలకించుటకు బుద్దిహీనతగా ఉన్నట్లు అనిపించును, కాని ఇది సత్యము. ఏదోకటి అచ్చట సంభవించినది, “ఈ చిన్న కందిరీగలు, బహుశా విశ్రాంతి తీసుకుంటుండగా వాటి యొద్దకు వెళ్ళి నేనే కదా వాటిని ఇబ్బందిపరచాను,” అని నేను తలంచాను. అవి తమ పనిలో నిమగ్నమైయుండగా, నేనే వాటిని తాకినందువలన అవి నన్ను ఈ విధముగా చుట్టుముట్టాయి. ఇక నేను గడ్డిని కోయు యంత్రమును నిలిపివేసి, నా చిన్ని స్నేహితులారా, నన్ను క్షమించండి, నేనే మిమ్మల్ని ఇబ్బందిపరచితిని, మన్నించండి. నేను దేవుని యొక్క సేవకుడిని. మీరు నాపై కోపముతో ఉండుటలో ఏ ఆశ్చర్యము లేదు, ఎందుకనగా మిమ్మల్ని నేను ఇబ్బందిపరచాను, కాని నేను దేవుని యొక్క సేవకుడిని. నేను ఆయన జనులకు ప్రార్థించుచూ సేవ చేయుచున్నాను. కాబట్టి మీతో ఆటలాడుటకు ఇపుడు నాకు సమయము లేదు. కావున ప్రభువగు యేసు నామమున ఇప్పుడే మీరున్న స్థలమునకు మీరు త్వరగా తిరిగి వెళ్ళిపోండి.
ఇదిగో ఇచ్చట నా పరిశుద్ధ గ్రంథము గలదు మరియు నేనొక క్రైస్తవ సేవకుడిని, నా హృదయమును దేవుడు ఎరుగును, ఆ కందిరీగలు గుంపుగా గూడి రెండు, మూడుసార్లు నా చుట్టూ గుండ్రముగా తిరిగి ఒకదాని వెనుక ఒకటి వరుసగా సరిగ్గా అవి వాటి తుట్టెలోకి తిరిగి వెళ్ళిపోయాయి. అవునయ్యా. అది సత్యము. అలాగే ఒక దినమున ఒక పెద్ద పొలమున...
54
మీలో ఎంత మంది దగ్గర ప్రార్థనా కార్డులు గలవు? ఇచ్చట వరుసలో ఎంత సంఖ్య వరకు గలదు? ఇంకా కొన్ని కావలెనా? మీకు ఇంకా కొన్ని కార్డులు కావలెనా? సరే, మంచిది. ఆఖరన ఉన్న నలుగురిని మాత్రము నా యొద్దకు పంపించండి. చివరగా, ఏ సంఖ్య దగ్గర వదిలితిమి? పదిహేనా? సరే, మంచిది, అలాగైతే 20 వరుకు వరుసలోకి రావచ్చును. వారు సరిగ్గా వరుస క్రమములో సరి చేసుకోనివ్వండి, మీకు ఇష్టమైతే ఇరువది వరుకు తీసుకొని రండి. సరే.
55
గమనించండి, ఒక పెద్ద ఎదు, నన్ను పొడిచి చంపాలని ఆ పొలము నుండి నా వైపుకు రంకె వేసుకుంటూ వచ్చుచున్నది. దాని నుండి తప్పించుకొనుటకు ఏ ప్రక్క దారిలేదు. దానిని చూచి భయపడుటకు బదులుగా ఆ జంతువు పట్ల నాకు జాలి కలిగినది. అది పరిగెత్తుకుంటూ నా ముందు కొన్ని అడుగుల దూరములో ఉండెను. కొన్ని దినములకు ముందే ఒక నల్లజాతి వ్యక్తిని అది చంపినది. రెండు నెలల ముందు బుర్క్ పొలమున అది జరిగినది. “నిన్ను సృష్టించిన సృష్టికర్త నా ప్రియమైన రక్షకుడు, నేను నిన్ను విసిగించుట లేదు; నేను సువార్త పరిచర్య నిమిత్తము ఈ పొలమును దాటుకొని వెళ్ళవలసియున్నది. ఇప్పుడు మన సృష్టికర్త నామమగు ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీవు తిరిగి వెళ్ళి ఆ చెట్టు క్రింద కూర్చొనుము,” అని నేను చెప్పాను. ఆ ఎద్దు రంకె వేసుకుంటూ, నాకు, దానికి మధ్య ఇంచుమించు ఇంకా అయిదు అడుగుల దూరము మాత్రమే ఉండెను. కాని ఆ మాట చెప్పగనే చాలా బలహీనమైపోయిన దానివలె చూస్తూ ఠక్కున నిలబడిపోయి, దాని కుడివైపు, ఎడమవైపు చూస్తూ, కుడివైపుకు తిరిగి, మెల్లగా నడుచుకొని ఏ చెట్టుక్రింద నేను చెప్పానో, ఆ చెట్టు క్రిందకు వెళ్ళి కూర్చొనెను. అది నిజము. దానిని చూచి నేను జాలిపడ్డాను; దానిని నేను ప్రేమించాను. అదే ఖచ్చితముగా నిజము.
56
ఇపుడిది కూడా ఆలకించుటకు వింతగా ఉండును, కాని స్నేహితుడా, దీనిని కూడా నేను మీకు చెప్పనివ్వండి, అపొస్తులుడగు పరిశుద్ధ పౌలు చెయ్యిని పాము చుట్టుకున్నపుడు, “ఓ, అబ్బా, ఐయోడిన్ తైలమును లేదా ఏదోక విషము విరుగుడు రసమును త్వరగా నా యొద్దకు తీసుకురండని,” అతడు చెప్పినయెడల, అది అతడిని హాని కలిగించి ఉండును. కాని పరిశుద్ధాత్మతో మిక్కిలిగా నింపబడి ఉండుటచేత, దానిని చూచినపుడు కొంచెం కూడా భయపడకుండా, మామూలుగా తన చెయ్యిని విదిలించగా అది అగ్నిలో పడిపోయెను, అతడు లేచి వెళ్ళిపోయెను. అది నిజము.
కేన్సర్ వ్యాధి తాకినపుడు జనులు భయపడిపోవుదురు. మీరు, “నేను చనిపోయెదనని వైద్యుడు చెప్పెనని,” చెప్పెదరు. మిమ్మల్ని చంపేది మీ మాటలే. “కేన్సర్ వ్యాధి నాలో నుండి బయలు వెళ్ళి పొమ్ము. నేను యేసు ప్రభువు యొక్క సేవకుడిని, నీవు నన్ను బంధించివుంచుటకు నీకే హక్కు లేదని” చెప్పండి. మీ హృదయాంతరంగము నుండి ఆ మాటలు రావలెను. అప్పుడు ఏమి జరుగుతాదో గమనించండి. మీరు దానిని అనుకరించుచూ నటించలేవు. మీరు దానిని పొందుకొని తీరవలయును.
అడవులలో ఒక వేటగానిగా, ఎన్నోసార్లు నేను దుష్టమృగములను ఎదురుకెదురుగా వచ్చాను. వాటివైపు చూస్తూ కొన్ని నిమిషములు అలాగే నిలబడి యుండెడివాడిని, అవి కూడా అలాగే నన్ను చూస్తూ వెనుకకు తిరిగి, రహదారి ప్రక్కగా నడుస్తూ వెళ్ళిపోవును. అది నిజము. మీరు భయపడినయెడల, మీరు దానిని ప్రయత్నించవద్దు. కాని మీరు భయపడనియెడల, అలాగే ముందుకు నడుస్తూ వెళ్తూ ఉండండి. ఈ రాత్రి మీరు భయపడినయెడల, ప్రభువును నమ్ముటకు మీరు ప్రయత్నించవద్దు. మీరు మరలా తిరిగి వెళ్ళి, మీ వైద్యుడు మీకు ఏమి చెయ్యగలడో దానిని అడిగి తెలుసుకొనుట మీకు యుక్తమైనది. కాని మీరు భయపడనియెడల మరియు ఆయనను ప్రేమించినయెడల, ఈ రాత్రి మీరు ఉన్నపాటున ఆయనను స్వీకరించండి. పిదప ఏమి సంభవించుచున్నదో కనుగొని చూడండి. ఆయన దానిని చేయును. సరే మంచిది.
57
ఇప్పుడు ప్రతీఒక్కరు భయభక్తులతో ఉండండి. ఆర్గన్ వాయిద్యము వాయించుచుండగా, మనము మరల కొద్ది సేపు ప్రార్థించుకుందాము.
తండ్రీ, మీ కుమారుడగు యేసు నామమున వచ్చుచున్నాము. ఈ ప్రజలు వేదిక పైకి వచ్చుటకు ముందే వారిని కలిసినప్పుడు నేనెంతో ఉత్తేజింపబడుటకు గల కారణమేమిటో నేనెరుగను. కాని ప్రభువా, మీ కృప ద్వారా నాకు సహాయము చేయవలెనని, ఈ ఆరాధన కొరకు మరియు ఇచ్చట వందలకొలది ప్రజలు వేచియుండుటను బట్టి ఇపుడు నన్ను అభిషేకించమని తండ్రి మిమ్మల్ని నేను అడుగుచున్నాను. బహుశా, ఈ రాత్రి ఇది వారికి ఒక మలుపుగా ఉండి గొప్ప ఆశీర్వాదములు వారిని వెంబడించును గాక! దీనిని దేవునికి మహిమగా ఆయన కుమారుని నామమగు ప్రభువగు యేసుక్రీస్తు నామమున నేను అడుగుచున్నాను. ఆమేన్.
58
మంచిది, స్నేహితులారా, ఇచ్చటున్న ఈ స్త్రీతో నేను కొద్దిసేపు మాట్లాడవలయును. సాధారణముగా, నేను ప్రార్థించుటకు ఆరంభించినపుడు ఇదివరకే పరిశుద్ధాత్మ నాకు సమీపముగా వచ్చి ఉండును. కాని ఈ వేదికయొద్దకు వచ్చుటకు ముందు నేను స్నేహితులను కలుసుకొనుట వలన కొద్దిగా కలత చెందాను. కాబట్టి ఆయనేమి చేయునో కనుగొనుటకు ఒక్క నిమిషము మీతో నేను మాట్లాడెదను...
మనము ఒకరినొకరికి పరిచయము లేనివారము. వాస్తవముగా నీవు మరియు నేను పరిచయము లేనివారము. అయినప్పటికీ యేసు ప్రభువుకు మన ఇరువురిని గూర్చి తెలుసు, ఆయనకు తెలుసు కదా? మన ఇరువురిని ఆయన ఎరుగును. మరియు ఆయన మనకొరకు ఏదోకటి చేయునని నేను నమ్ముచున్నాను.
ప్రేక్షకులను మిమ్మల్ని అడుగుచున్నాను. మీలోవున్న ఎవరికైనా ఈ స్త్రీని గూర్చి తెలుసా? మీకు తెలుసా... ఈ కూటమునవున్న మీకెవరికైన ఈమె తెలుసా? మంచిది.
59
ఇపుడు, ఈమె నాకు తెలియదు. నా జీవితములో ఈమెను ఇదే మొదటిసారిగా చూస్తున్నానని దేవునికి తెలుసు. కాని మరణము నుండి జీవముతో యేసుక్రీస్తు లేచియున్న యెడల, ఇపుడు ఈ సువార్తను మనము తీసుకొని సరిగ్గా పరిశుద్ద గ్రంథములో ఇచ్చట అమర్చి చూద్దాము. ఇపుడు ఈ స్త్రీకి ఆయన ఏమి చేయును? ఆమె అస్వస్థతతో ఉండుటవలన, కల్వరిలో ఆయన ఆమె కొరకు మరణించినపుడు అచ్చటే ఆమెను స్వస్థపరచితినని ఆయన ఆమెతో చెప్పియుండును. కాని ఇపుడు, ఆమెకు గల సమస్య ఏమిటో ఎరుగుటకై బావి యొద్ద ఆయన ఆ స్త్రీతో మాట్లాడినట్లు బహుశా, కొన్ని నిమిషములు ఈమెతో కూడా మాట్లాడవచ్చు. అప్పుడు ఆమెకు గల సమస్య ఏమిటో కనుగొని ఆమెకు ఆయన చెప్పును లేదా ఆమెకేమి అవసరమో దానిని ఆయన చెప్పును, లేదా అలాంటిది ఏదైన ఆయన ఆమెకు చెప్పును. అప్పుడది అట్లు జరిగినయెడల ఆనాడు వున్న అదే యేసు నేడు కూడా ఆయన అదే యేసుగానే ఉన్నాడని దాని రుజువు. నిజమే కదా? పరిశుద్ధ గ్రంథము అలాగే ఆయన గూర్చి చెప్పెను. నేడు కూడా యేసు అలాగే మారనివానిగానే ఉన్నాడు.
మేము ఆయన సేవకులము, మనకు గల మన స్వకీయ తలంపులన్నింటిని తుడిచివేసుకొని, చాలా పరిపూర్ణముగా, మనల్ని మనము సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకొనినయెడల ఆయన అదే కార్యములను మనకు చేయును. అట్లు ఆయన చేసినయెడల అది మంచిదే. ఆయన ఆ విధముగా చెయ్యుటకు నేనేమి చెయ్యలేనని మీకు తెలుసు. కాని ఆయన వచ్చి నన్ను అభిషేకించినయెడల, అంతెందుకు, ఆయనే దానిని చేయును. దానిని గూర్చి నాకు నిశ్చయత గలదు.
ఇపుడిది అందమైన ఒక నగరము. అవును కదా? అద్భుతమైన, గొప్ప నగరము, కాని నిశ్చయముగా పాత-కాలపు భక్తితో కూడిన ఉజ్జీవము దీనికి అవసరము. ప్రతీ పట్టణమునకు అవసరము. అవును. ప్రతీ పట్టణమునకు ఉజ్జీవము కావలెను.
60
ఇపుడు, పరిశుద్ధాత్మ ఇచ్చట ఎదోకటి చెయ్యబోవుచున్నదని నాకు తెలుసు. నీ శరీరము యొక్క పరిస్థితిని బట్టి నన్ను చూచుటకు నీవిచ్చటకు వచ్చితివి. అదేమనగా నీకు ఒక శస్త్రచికిత్స జరుగవలసి ఉన్నది. అది నీ శరీరములోవున్న ఒక కణితికి సంబంధించినది. ఆ కణితి నీ కడుపులో గలదు. ఆ కణితి బాగా పెద్దదగుచున్నందువలన నీ కడుపులో నొప్పితో బాధపడుచున్నావు. నీ సమస్య అదే. అది నిజము.
మరిప్పుడు పరిశుద్ధ గ్రంథము సత్యమని నేను నీకు చెప్పుటవలన నీవు నన్ను నమ్ముచున్నావా? నేను నీతో కొంతసేపు మాట్లాడినయెడల, నీ కొరకు ఆయన ఏమి చెప్పుతో నేను కనుగొంటాను. అలాగే ఈ కూటములోవున్న వారికొరకు కూడా కొద్దిసేపు నేను నీతో మాట్లాడెదను. (మీరు గమనించారా?).
ఇపుడు, నీ గురించి నాకేమి తెలియదని నీకు తెలుసు. నీ సమస్య ఏమిటో ఆయనకు తెలుసు. ఇపుడు నీవు ఒక వ్యత్యాసమైన అనుభూతిని చెందుచున్నావు. అది ఆయన యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు కలిగే అనుభూతి. అది నిజమేనా? ఇపుడు నీవు.. అవును, అచ్చట ఏదో ఉన్నది. నీవు ప్రేమించే ఒకరిని లేదా ఎవరో ఒకరిని విడిచి వచ్చుటను నేను చూచుచున్నాను. అతడు నీ భర్త. అతనికి ఏదోక సమస్య గలదు. అది పక్షపాతము. నీ భర్తకి పక్షపాతము గలదు. అది నిజమేనా? అది నిజము. మీరు మీ గృహమునకు వెళ్ళి అతని మీద చేతులను పెట్టుము. నీ భర్త ఆ వ్యాధి నుండి విడుదల పొందుకొని స్వస్థతనొందాలని ఆశించుచున్నావా? ఇచ్చటకు రమ్ము.
ప్రియమైన దేవా, తండ్రి, మీ ఆత్మ ఈ స్త్రీ పై ఉంచండి! ఈమె బాగవును గాక! ఆమె హృదయ వాంఛను అనుగ్రహించండి! ఈ ఆశీర్వాదమును మీ కుమారుడగు యేసు ద్వారా నేను అడుగుచున్నాను. ఆమేన్.
61
అమ్మా నేను మరలా కొద్దిసేపు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నీతో మాట్లాడిన తర్వాత ఆ కార్యములు నాకు ఒక కలవలె మారిపోయెను, చూచారా. దీనిని నేను నీ దగ్గర అడగాలనుకుంటున్నాను. సందేహమనే నీడవంటిదేది వున్నా గాని అదంతా ఆయనకు సాధ్యమని నీవెరుగుదువు. ఇపుడిది నాకు జ్ఞాపకమునకు రావటము లేదు. కాని అదేమైనప్పటికీ, అది మాత్రము సత్యము. అది నిజమే కదా? అది సంపూర్ణముగా సత్యమే. అదే సమయమున, నీపై ఏదోక అభిషేకము ఉండెను, నేను నీ ఆత్మను స్పర్శించేటపుడు అదేదోకటి... అది నిజమేనా? సరే... ఇపుడు, అది యేసుక్రీస్తు అని నీవు విశ్వసించినయెడల, ఆయన చేత అభిషేకించబడిన సేవకుడునగు నేను, నాపై ఆ అభిషేకము ఉండగా, నా చేయి నీపై వుంచినపుడు, నీవు దానిని విశ్వసించినయెడల, నీవు దేనిని కోరుకొనెదవో దానిని పొందుకొనెదవు. అది సరియేనా? నీవు దానిని విశ్వసించుచున్నావు. నీవు దేనిని కోరుకొనెదవో దానిని పొందుకొనెదవు. దేవుడు నిన్ను దీవించునుగాక!
ప్రభువు యేసు నిన్ను దీవించును గాక. ఇపుడు, సందేహించకుండా దేవునిలో విశ్వాసమును కలిగియుండుము. నీ నిండు మనస్సుతో మరియు నీ హృదయమంతటితో కేవలము విశ్వసించుము.
కూటములో వున్న ఎవరైనా స్వస్థతను పొందుకోవాలని ఆశించేవారు, మీలో ఎంతమందికి ప్రార్థనా కార్డు లేదు, మీ చేతులను పైకి ఎత్తండి. మీరెచ్చటవున్నారో దానిని బట్టి నాకు ఒక అంచనా కలుగును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక! మీరేమి అడుగుదురో దానిని పొందుకుంటామనే విశ్వాసమును కలిగివుండండి.
సరే మంచిది, ఆయనను రమ్మనండి. అయ్యా, శుభ సాయంకాలము. ప్రభువు యేసుని నీవు ప్రేమించుచున్నావా? ఆయన అద్భుతమైనవాడు, అవును కదా? ఆయన జీవించుచున్న దేవుని కుమారుడు. ఆయన మన విమోచకుడు, మరియు మనలను స్వస్థపరచువాడు. ఇపుడు ఆయన ఈ భూమిలోఉండి, నాకు యిచ్చిన ఈ వస్త్రములను ఆయన ధరించుకొని కొద్దిసేపు నీతో మాట్లాడిన నీ సమస్య ఏమిటో ఆయన ఎరుగును.
ఇపుడు, నేను మనుష్యుల మనస్సులను చదువుచున్నట్లుగా కొంతమంది ప్రజలు తలంచుచున్నారు. అది సంపూర్ణముగా పొరపాటు అగును. అయ్యా, మీరు గమనించండి... నీవిచ్చటకు వచ్చి, నీ చేతులను నా భుజము పై వేసి ఉంచుము, అది కేవలము నీతో సంభాషించుట కొరకు మాత్రమే, అవును నీతో సంభాషించవలెను, యేసు చెప్పినట్లు, “వారు రోగుల పై చేతులను పెట్టెదరు.”
62
ఇపుడు, ప్రభువగు యేసు నాకు ఇచ్చట ఒక దర్శనమును చూపించి, నాతో నీ సమస్యను చెప్పి, తద్వారా ఆదర్శనమును గూర్చి మాట్లాడినా, అటువంటి ఒక దర్శనమును ఆయన నాకు చూపించి అది అట్లే జరిగినయెడల, అది నిజమా కాదా, అని నీవు నీ తలను ఊపుచూ జవాబును చెప్పాలి. మరిప్పుడు అచ్చట నుండి ఈ వేదికపైకి నీవు వచ్చేటపుడు నేను మనుష్యుల మానసిక ఆలోచనలను చదువుచున్నానని నీవు తలంచితివి. నేను అలాగు చెయ్యను. లేదు, అయ్యా, నేను అలాంటివాటిని చెయ్యను. అలాగైతే యేసుక్రీస్తును మానవుల మానసిక ఆలోచనలను చదువువాడని చెప్పిన ఏలాగుండును? నీవు దానిని నమ్మెదవా? వాస్తవముగా, ఆయన అలాగే ఉండెను. వారి తలంపులను ఆయన ఎరిగినవాడు. అది నిజమే కదా?
ఇపుడు,“తలంపులను గ్రహించుట” లేదా “మానసిక ఆలోచనలను చదువుట,” రెండింటికి గల బేధమును నీవు చెప్పినయెడల... ఇదిగో అచ్చట ఉండు మనస్సును విశ్లేషించేవారివలే కాదు. అది దయ్యమునకు సంబంధించినది. యేసుక్రీస్తు నుండి దయ్యము ఆ కార్యమును అనుకరించి చేయుచున్నది.
ఇపుడు అతడు తన చేతులను నా భుజముల మీద పెట్టెను, నాకు ముందుగా ఏదోకటి కదులుటను నేను చూచుచున్నాను. అది తెల్లగా మారుతున్నది, ఇచ్చట ఒక యవ్వనస్తుడు నిలబడివుండుటను చూచుచున్నాను. అతడొక దృఢమైన యవ్వనస్తుడు, అతడు ఏదోక తప్పిదమును చేసెను. అదొక దుష్కార్యము, దానికి అతడు మూల్యమును చెల్లించెను. అతడికి సుఖవ్యాధి సోకెను. అతడి జీవితమును అది నాశనము చేసెను. అతడు వృద్దుడైనప్పటికీ, ఆ వ్యాధి అతడిని వెంబడిస్తూ వచ్చెను. అతనికొక భార్య గలదు. ఇప్పుడతడు అపాయకరమైన స్థితిలో ఉన్నాడు. ఈ సమయమున అతడు మానసికమైన కలతతో ఉన్నాడు. తన పాపమునకు క్షమాపణ లేదనియు, జీవము నుండి వేరుపరచు గీతను తాను దాటి వచ్చేసినట్లుగా అతడు తలంచుచున్నాడు. అవన్నీ నిజమేనయ్యా. నేను చెప్పినది నిజమైతే, ఈ కూటములో వున్న వారికి నీ చేయిని పైకెత్తి చూపించుము, అది సత్యమని వారు చూడనిమ్ము.
63
అదేమైనాగాని, దేవునికి నీ జీవితమునుగూర్చి తెలుసునని ఇపుడు నీవెరుగుదువా? నీ జీవితమున ఏమి జరిగినదో అది ఆయనకు తెలుసు. అంతేకాకుండా, నీవు ఏమైయుందువో అది కూడా ఆయనకు తెలుసు. అయ్యా, అది సరియేనా? నీకున్న బాధను ఆయన తీసివేయునని నీవు విశ్వాసించుచున్నావా?... నీవు ఆయన సన్నిధిలో నిలబడివున్నావు. ఆయన సన్నిధికి ఎంత సమీపముగా నీవు ఉన్నావంటే, బహుశా ఇంతవరకు నీ జీవితములో లేనంత సమీపముగా ఇప్పుడు నీవు వున్నావు. ఇపుడు ఈ కూటములో ఉన్నవారితో కలిసి, నేను నీపై చేతులు వేసియుండగా నీ హృదయ వాంఛను యేసుక్రీస్తు నీకు అనుగ్రహించునని నీవు విశ్వాసించెదవా? -
దయగల పరలోకపు తండ్రీ, క్షయమగు ఈ మానవ పెదవులు కదులుచూ, “అవును” అని అతడు చెప్పినపుడు, ఆ మాటలు అతడి అంతరాత్మలో నుండి వచ్చినవని నేను విశ్వసించుచున్నాను. ఈ దుష్టవ్యాధి ఇతని శరీరము నుండి విడిచి వెళ్ళిపోవును గాక! మరియు సంపూర్ణముగా అతడు స్వస్థతను పొందుకొనును గాక! దీనిని నేను దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్.
నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక! వెళ్ళు, దేవుని సమాధానము నీతో ఉండును [ఆ వ్యక్తి సహోదరుడు బ్రెన్హాం గారితో మాట్లాడుచున్నాడు.] దేవుడు నిన్ను దీవించును గాక! అయ్యా మీకు కృతజ్ఞతలు, ఆయన అదే కార్యమును మీకు కూడా చేయునని నేను నమ్ముచున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక.
64
అయ్యా, ఒక్క నిమిషము. ఒక అపవిత్రాత్మ ఈ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయెను, కాని అది వేరొక స్థలము నుండి లేచుటను నేను చూచాను. ఓ, కనికరముగల పరలోకపు తండ్రీ, మీరు సమస్తమును ఎరిగినవాడవు. ఓ, స్త్రీ, నీ విశ్వాసమే నిన్ను రక్షించినది. అచ్చట కూర్చొని కన్నీళ్ళతో కనులను రుద్దుకొంటున్న అమ్మా నీవే అది. భయముతో నీవు క్రుంగిపోతివి. సాతాను నీకొక అబద్ధమును చెప్పెను. క్షమించలేని పాపమును నీవు చేసితివి, కావున ఇక నీకు క్షమాపణ లేనేలేదని సాతాను నీతో చెప్పెను. సహోదరీ, నీ పాపములు క్షమించబడినవి. యేసుక్రీస్తు నిన్ను సంపూర్ణముగా బాగుచేయును. నీ కాళ్ళపై లేచి నిలబడి దానిని ఇప్పుడు నీవు స్వీకరించుము. అవి దేవుని యొక్క దీవెనలు, పైకి లేచి నీ చేతులను పైకి ఎత్తి ఆయనను స్తుతించుము.
ఇతడి దగ్గర కూడా అదే పొరపాటు గలదా? అవును, అదే పొరపాటు. దేవుడు దానిని అట్లే విడిచిపెట్టునని సాతాను తలంచెను, కాని అది దానివలన సాధ్యమవ్వలేదు. మీరిద్దరు విడుదలను పొందుకొనిరి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక! సంతోషిస్తూ మీ మార్గమున వెళ్ళండి. ప్రభువు యొక్క దూత వారిద్దరి ప్రక్కన నిలబడియున్నాడు. దేవుడే స్తుతింపబడును గాక మరియు ఆశీర్వదించబడును గాక!
65
ఆమెను పట్టుకొనియున్న ఓ, తల్లీ, నీ స్నేహితుడు స్వస్థతను పొందుకొనెనని నీవెంతో ఆనందించుచున్నావు. నీవు ఆమెను ప్రేమించుచున్నావా? నీవు ప్రభువగు యేసును ప్రేమించుచున్నావా? నేను ఆయన యొక్క ప్రవక్తనని నీవు విశ్వసించుచున్నావా? నీవు నీ చేతులతో ఆమెను చుట్టుకున్నావు. నీకు కీళ్ళ నొప్పులు గలవు, నీకు ఉన్నవి కదా? ఇకమీదట నీకు ఆ కీళ్ళ నొప్పులు ఉండవు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినది. నీవు నీ మార్గమున వెళ్ళుచూ ఆనందించుము. దేవుడు నిన్ను దీవించును గాక! నీవు స్వస్థతను పొందుకున్నావు.
దేవుని యందు విశ్వాసమును ఉంచుము. సందేహించకుండా, నీ హృదయమంతటితో విశ్వసించుము. ప్రభువు యొక్క దూత ఇంకా అచ్చటే నిలబడియున్నాడు. ఆ దూత సరిగ్గా నీకు ప్రక్కనే కూర్చొనివున్న ఒక స్త్రీ పై వున్నాడు. నీకు ఎండ దెబ్బ తగులుట వలన బాధపడుచున్నావు, ఎండ వేడి ఎక్కువగా ఉండుటవలన భరించలేక నీవు క్రింద పడిపోయావు. అందుచేత జబ్బుపడి బాధపడుచున్నావు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచెను. సహోదరీ, నీ విశ్వాసము ఆయనను తాకేను. అదే ప్రభువగు యేసు ఆనాడు ఆ స్త్రీతో చెప్పగా, ఆమె యొక్క రక్త స్రావము నిలబడిపోయినది. ఆ ఎండ దెబ్బ నిన్ను విడిచిపోయెను మరియు నీవు ఇంటికి వెళ్ళుచూ బాగవుదువు గాక! దేవుడు నిన్ను దీవించును. ఆయనకు మహిమను చెల్లించుట కొరకు లేచి నిలబడి ఆయనకు స్తుతులను చెల్లించుము. దేవుడు నిన్ను దీవించును గాక! హల్లేలూయ!
66
ఓ, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని మీరెట్లు సందేహించగలరు? అట్లు సందేహించుట పాపమగును. నేను మీ యొక్క విశ్వాసమును సవాలు చేయుచున్నాను. నేను ప్రభువు యొక్క దూతను గూర్చి చెప్పిన సాక్ష్యమును ప్రభువగు యేసుక్రీస్తు నామమున నమ్మండి. నేను శిశువుగా ఉన్నప్పుడు, నేను జన్మించిన ఆ నిమిషములోనే ఆయన అగ్నిస్తంభము ఉయ్యాల పై వ్రేలాడుచుండెను. పది సంవత్సరములకు ముందు నేను చూచిన దర్శనము నా జ్ఞాపకమునకు వచ్చుట మొదటి విషయమైయుండెను. అప్పుడు ఒక మనిషి తెల్లని వస్త్రములు ధరించుకొని నా ప్రక్కన నిలబడెను, ఆయన తెల్లని అంగీని ధరించుకొని, ఆయన తల వెంట్రుకలు పొడవుగా వ్రేలాడుచుండెను. ఆయన నాతో, రోగుల కొరకు నేను ప్రార్ధించాలని చెప్పెను మరియు రోగుల కొరకు ప్రార్ధించే వరము దేవుని కొరకు యివ్వబడెనని నాతో చెప్పెను. నేను వెళ్ళి వ్యాధితో బాధపడుచున్న జనులు కొరకు ప్రార్థించవలెను. ఇపుడు మీరు దీనిని విశ్వాసించునట్లు మిమ్మల్ని ప్రభువగు యేసుక్రీస్తు నామమున నేను అడుగుచున్నాను. మీరు విశ్వాసించునప్పుడే స్వస్థత నొందుదురు. అవునండీ. అది సాహనముతో కూడిన ఒక సవాలు.
67
అయ్యా, తెల్లని చొక్కాయిని ధరించుకొని, కాలరును విప్పి తెరచివుంచు కొని ఎంతో యదార్ధముగా నావైపే చూస్తూన్న మీ సంగతేమిమిటి? అవునయ్యా, నీవే. నీవు నన్ను నమ్ముచున్నావా, లేదా? నీలోవున్న సమస్య ఏమిటో నీకు తెలుసా? నీ హృదయములో సమస్యగలదు, కాని నీవు ఇక ఆ సమస్యతో బాధపడనవసరము లేదు. నీ విశ్వాసము ఆయనను తాకినది. ఇంకొకరి పై కూడా నీవు ఆసక్తిని కలిగి ఉన్నావు, ఆమె నీ భార్య. ఆమె సరిగ్గా నీకు వెనుకనే కూర్చొని ఉన్నది. ఆమె నరములకు సంబంధించిన సమస్యతో బాధపడుచున్నది; తనకు కూడా హృదయములో సమస్య గలదని కొన్నిసార్లు ఆమె తలంచుచున్నది, కాని తన కడుపు ఆ నరమును నొక్కుచున్నందువలనే దానికి కారణము. ఆమె కూడా స్వస్థతను పొందుకున్నది. కాబట్టి ప్రభువగు యేసుక్రీస్తు నామమున మీరిద్దరు మీ ఇంటికి వెళ్ళి బాగవ్వండి. జీవించుచున్న దేవునికి స్తుతి స్తోత్రములు కలుగును గాక!
నేను ఆయన సేవకుడినని నీవు నమ్ముచున్నావా? ఆయన అభిషేకము ఇచ్చట గలదు. ఆయన అభిషేకము నీతో ఉన్నది. నీవు ఒక విశ్వాసివి, ఒకానొకప్పుడు దీనికి ముందు నా కూటములో నీవు కలుసుకొని స్వస్థతను పొందుకున్నావు. కాని నీవెవరో నాకు జ్ఞాపకము లేదు. దానిని దేవుడెరుగును, కాని ఏదోక సమస్యతో లేదా నీ వక్ష స్థలమునకు పైన ఏదో ఉండెను. ఒక కణితి లేదా తిత్తులాంటిది ఆ వక్ష స్థలమున ఉండెను. అలాగే నీ గొంతులో కూడా ఏదోక సమస్య గలదు. నీవు బాగయ్యావు. అవన్నీ పోయెను. అంతే కాకుండా, ఇంకొక తిత్తులాంటిది నీ కడుపులో లేదా దానికి క్రింద స్థలమున వచ్చుచున్నది. ఇప్పుడు దానిని కూడా దేవుడు తీసివేసెను. కాబట్టి నీ మార్గమున నీవు వెళ్ళుచూ సంతోషించుచూ బాగవుము. దేవుడు నిన్ను దీవించును గాక! దేవునికే స్తుతులు కలుగును గాక. హల్లేలూయా!
68
ఆయన కనికరము మరియు మంచి ఈవుల కొరకు జీవించుచున్న దేవునికి మనమెంతో కృతజ్ఞతులమై ఉండవలెను. భయభక్తులతో ఉండండి. మీ హృదయమంతటితో మీరేమి అడుగుచున్నారో దానిని పొందుకుంటామని విశ్వసించండి.
నీ హృదయమంతటితో నేను ఆయన సేవకుడినని నీవు నమ్ముచున్నావా? గమనించుము. కొన్నిసార్లు నీవు నీ కుర్చీలో నుండి లేచి వెళ్ళుటకు ప్రయత్నించుటను నేను చూచుచున్నాను. నీవు దానిని ఇబ్బందితో చేయుచున్నావు. నీకు కీళ్ళ నొప్పులు గలవు. అది నిజమే కదా? నీకు ఒక సహోదరుడు గలడు, అతడి కొరకు కూడా నీవు ఆసక్తిని కలిగి ఉన్నావు. నీవు ఆసక్తిని కలిగివున్నావు కదా? అతడు కేన్సర్ వ్యాధితో బాధపడుచున్నాడు, కాబట్టి వెళ్ళి అతడిపై నీ చేతులను పెట్టుము. అప్పుడతడు స్వస్థతను పొందుకొనును. ప్రభువగు యేసుక్రీస్తు నామమున నీవు ప్రభువగు యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదములను పొందుకొనెదవు గాక.
69
నేను ఆయన సేవకుడినని నీవు నమ్ముచున్నావా? నీవు ఇది కావాలని... నీవు అచ్చట కూర్చొనివున్నప్పుడే స్వస్థత పొందుకున్నావు. కాని ఇప్పుడు మనువడు కూడా స్వస్థత పొందుకోవాలని నీవు కోరుకొనుచున్నావు. అతనికి ఉన్న సమస్య ఏమిటో నేను నీకు చెప్పెదను. అతడి నోటిలో ఏదో సమస్య గలదు. వైద్యుడు అతడి నోటిని పరీక్షించినపుడు నోటి పైభాగము లేకపోవుటను నేను చూచుచున్నాను. నిజమే కదా? ప్రభువగు యేసుక్రీస్తు నామమున నీవు వెళ్ళి అతడిపై నీ చేతులను పెట్టుము.
స్త్రీ, నీకున్న కడుపు నొప్పి నుండి విడుదలను పొందుకోవాలని నీవు కోరుకుంటున్నావా? నీవు నీ రాత్రి భోజనమును భుజించాలని కోరుకుంటున్నావా? ఇపుడు యేసుక్రీస్తును నిన్ను స్వస్థపరచువానిగా నీవు అంగీకరించెదవా? అట్లయితే వెళ్ళి, ఈ రాత్రి భోజనమును ప్రభువగు యేసుక్రీస్తు నామమున చక్కగా భుజించుము.
అమ్మా, రండి, నీ హృదయమంతటితో నీవు విశ్వసించుచున్నావా? నీ మూత్రపిండములోని సమస్య నుండి నీవు విడుదలను పొందుకోవాలని నీవు కోరుకొనుచున్నావు. ఆ సమస్య అనేక సంవత్సరముల నుండి ఉన్నది. నీవు స్వస్థతను పొందుకోవాలనుకుంటున్నావా? నిన్ను ఆయన స్వస్థపరచగలడని నీవు విశ్వాసించగలవా? ఇపుడు ఆయన అభిషేకము ఇచ్చటున్నందువలన, నేను నా చేతులను నీపై పెట్టినప్పుడు నీవు నీ జీవితమును మరుగుచేయాలని తలంచినయెడల, ఆయనకు నీ గురించు తెలుసు. కావున నీవు దానిని మరుగు చెయ్యలేవు. అయినప్పటికీ నిన్ను ఆయన స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? ఆయన దానిని చెయ్యును. ప్రభువగు యేసుక్రీస్తు నామమున మన సహోదరికి అది నిరూపించబడును గాక. సరే మంచిది.
70
శరీరము బిగుసుకుపోతున్న సమస్య నుండి కీళ్ళ వాపులనుండి మరియు మీ శరీరములోవున్న వ్యాధులన్నింటి నుండి విడుదలను పొందుకోవాలని నీవు కోరుకొనుచున్నావు. ఇపుడు నిన్ను బాగుచేయాలని మేము అడుగుచున్నప్పుడు యేసు నిన్ను స్వస్థపరచునని నీవు విశ్వాసించెదవా?
ప్రభువా, యేసుక్రీస్తు నామమున, ఈ స్త్రీ స్వస్థతను పొందుకొనును గాక! దీనిని దేవుని యొక్క మహిమ కొరకు అడుగుచున్నాము. ఆమేన్.
ఇపుడు, సహోదరీ సంతోషంగా, ఆనందించుచూ వెళ్ళుము. నీ విశ్వాసము ఇంకా వర్దిళ్ళును గాక! మరియు నీ హృదయమంతటితో విశ్వాసించుము.
71
అమ్మా, నీ హృదయమంతటితో నీవు విశ్వాసించుచున్నావా? నీకున్న సమస్య ఏమిటో దేవుడు నాతో చెప్పినయెడల, యేసు నిన్ను స్వస్థపరచువాడని నీవు ఆయనను అంగీకరించెదవా? ఎప్పుడూ దగ్గుచువుండే ఒక విధమైన సమస్యను నీవు కలిగియున్నావు. అది ఉబ్బసము స్థితిలో ఉన్నది. నరములకు సంబంధించిన సమస్యతో కూడా బాధపడుచున్నావు. యేసు నిన్ను బాగుచేయునని నీవు నమ్మగలవా? యేసుక్రీస్తు నామమున స్వస్థతను పొందుకొనుము. ఆమేన్. సరే మంచిది.
అమ్మా రండీ. నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? రక్తహీనత స్థితి నుండి విడుదలను పొందుకోవాలనుకుంటున్నావుకదా? నిన్ను చూస్తే రక్తహీనత సమస్యగలవలె కనబడుటలేదు, ఎందుకనగా మన ఇద్దరికి మధ్య రక్తము కారుచున్నందువలన. అది తెల్లగా కనబడుచున్నది. వెళ్ళి, నీవు నమ్మినయెడల ఇపుడు కల్వరి యొద్దకు విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నుండి రక్తమును మార్పిడి చేయించుకొని యేసుక్రీస్తు నామమున స్వస్థతను పొందుకొనుము. అది అట్లే జరుగును గాక. హల్లేలూయా!
72
సహోదరీ, నీవు విశ్వాసించుచున్నావా? నీకు నరాల బలహీనత గలదు. మరియు ఇంకొక విషయమేమనగా, నీకు కడుపు నొప్పి సమస్య గలదు, అది నిన్ను బాధపెట్టుచున్నది. నీలోవున్న నరాల బలహీనతవలన నీ కడుపులో వ్రణము ఏర్పడి, జీర్ణశక్తి సమస్యను తెచ్చెను. నీకు తేన్పు వచ్చేటపుడు తిన్న ఆహారము కడుపులో నుండి పైకి వచ్చుచున్నది, అందువలన లోపల మండుచున్నట్లుండును. యేసుక్రీస్తు నామమున ఆ దయ్యమును నేను గద్దించుచున్నాను. నీ మార్గమున సంతోషించుచూ దేవునికి కృతజ్ఞతలను చెల్లించుచూ వెళ్ళుము. నీవు ఇకమీదట చిన్న పిల్లలు తినునట్లు ఆహారమును తిననవసరము లేదు. నీవు బాగైనావు. “దేవునికే స్తుతులు కలుగును గాక!” అని చెప్పెదము.
నీవచ్చటకు నడచి వెళ్ళినపుడు, అప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరచాడని నీవు నమ్ముచున్నావా? అది సరిగ్గా అలాగే సంభవించెను. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచెను. ఆ కణితికి ఇక ఏ శస్త్ర చికిత్స చేయ్యనవసరములేదని నీవు నమ్ముచున్నావా? అచ్చట నుండి ఆ కణితిని దేవుడు తొలగించెనని నీవు నమ్ముచున్నావా? నీవు దేవుని మహిమ కొరకు నీ మార్గమున సంతోషిస్తూ వెళ్ళుచు, స్వస్థతను పొందుకొనుము.
నేను ఆమెకు చెప్పిన అదే సమయమున ఒక వింతైన అనుభూతి నీకు కలిగినది కదా? అది ప్రభువు వలన కలిగినది. నీవు నీ మార్గమున వెళ్ళుచూ స్వస్థతను పొందుకొనుము, దేవుడు నిన్ను దీవించును గాక. హల్లేలూయా!
73
నీవు నీ కడుపు నొప్పినుండి విడుదలను పొందుకొని రాత్రి భోజనమును చేయ్యాలని నీవు కోరుకొనుచున్నావు, ఎందుకనగా నీవు అనేక దినములు ఆ విధముగా కడుపు నిండా భుజించలేకపోతివి. ఈ రాత్రి నీవు వెళ్ళి భుజించుము, నీ కడుపు నొప్పి నిన్ను వదిలి వెళ్ళిపోయినది, నీవు బాగైనావు.
సహోదరీ, యేసుక్రీస్తు నీకున్న కేన్సర్ వ్యాధిని తీసివేయకపోయనయెడల నీవు చనిపోయెదువు. కాని దానిని ఆయన తీసివేయునని ఇపుడు నీవు విశ్వసించెదవా? సంతోషిస్తూ నీ మార్గమున వెళ్ళుచూ స్వస్థతను పొందుకొనుము. హల్లేలూయా! నేనొక పిచ్చివాడినని నీవు తలంచవచ్చు, కాని నేను పిచ్చివాడిని కాదు. అదిగో ఆ స్త్రీ సంతోషిస్తూ అచ్చట వెళ్ళుచున్నది, ఆనందించుచూ…
74
అయ్యా, నీవేమి తలంచుచున్నావు. ఏ సమయములోనైనా ఆ వాపు పగిలిపోయే స్థితిలోవున్న దానినుండి స్వస్థతను పొందుకోవాలని ఆశించుచున్నావు. అదిగో అచ్చట వెనుక భాగమున కూర్చొని వున్న అయ్యా, అవును, దేవుడు నిన్ను స్వస్థపరచును. నీవు దానిని విశ్వాసించినయెడల, నీ కాళ్ళపై నీవు లేచి నిలబడి, ఇపుడే, దానిని అంగీకరించుము. దేవుడు నిన్ను దీవించును గాక!
అదిగో రెండవ వ్యక్తిగా అచ్చట వెనుకవున్న నీవు గుండె నొప్పితో బాధపడుచున్నావు, దాని నుండి విముక్తి పొందాలని ఆశించుచున్నావు, అదిగో అచ్చటకూర్చునివున్న నీవే నీవు దానిని నమ్ముచున్నావా? దేవుడు నిన్ను స్వస్థపరచును గాక.
నీకు ప్రక్కన కూర్చొని వున్న ఆ స్త్రీకి కీళ్ళ నొప్పులుగలవు. అవును, అమ్మా, నీవే. ఆమెపై నీ చేతులును పెట్టుము, ఆమె స్వస్థతను పొందుకొనును గాక! దేవుడు దానిని ఆశీర్వదించును గాక!
దానిని గూర్చి నీవేమి తలంచుచున్నావు? అదిగో అచ్చట రక్తపోటుతో బాధపడుచున్న ఓ, స్త్రీ? అదిగో అచ్చట కూర్చొనియున్నావు. నేను నీతోనే మాట్లాడుచున్నాను.రక్తపోటుతో బాధపడుచున్న నీవు అచ్చట కూర్చొని ఉన్నావు. నీవు మిశ్రమ భాషలను మాట్లాడేదానివి. జర్మను భాషను నీవు మాట్లాడెదవు. అవును నీవు జర్మను భాషను కూడా మాట్లాడెదవు. నీ హృదయమంతటితో విశ్వాసించుము, లేచి నిలబడి, యేసుక్రీస్తు నీకు అనుగ్రహించిన స్వస్థతను పొందుకొనుము.
75
నీవు కడుపు నొప్పితో బాధపడుచున్నావు, దాని నుండి విముక్తి పొందుకొని వెళ్ళి ఈ రాత్రి భుజించాలని కోరుకొనుచున్నావా? ప్రభువగు యేసుక్రీస్తు నామమున వెళ్ళి, నీ రాత్రి భోజనమును చక్కగా భుజించుము.
మీరందరూ ఈ సమయమున స్వస్థతను పొందుకోవాలని ఆశించుచున్నారా? మీరు ఆశించినయెడల, మీ కాళ్ళపై లేచి నిలబడి, నా ప్రభువగు యేసుక్రీస్తును మీ వ్యక్తిగత స్వస్థపరచువానిగా అంగీకరించండి, ఆయన మిమ్మల్ని స్వస్థపరచును.
ఓ దేవా, ఈ కూటములోవున్న ప్రజలపై కనికరమును కలిగి ఉండుము.ఈ స్థలము పరిశుద్ధాత్మతో నింపబడియుండును గాక! అపుడు సొలొమోను ఆలయమును ప్రతిష్ఠించినపుడు ఆ ఆలయమున మండుచున్న అగ్ని మరియు పరిశుద్ధాత్మ పొగ ఆలయములోకి వచ్చి నిండియున్నట్లుగా దేవుని శక్తి ఈ జనుల గుండా ప్రవహించును గాక! రోగులు యేసుక్రీస్తు ద్వారా ఈ సమయమున స్వస్థతను పొందుకొనెదరు గాక.