వాక్యము శరీరమాయెను (ఇండియా ప్రయాణము యొక్క నివేదిక)
VGR COUNT -275 స్నేహితులారా శుభోదయం. ఈ ఉదయం ఈ మందిరములో మరల వుండటం నిజముగా ఒక భాగ్యము. మనము ప్రపంచములోని వివిధ భాగములలో వరుసగా ప్రయాణము చేస్తున్నప్పుడు, నీవు ఎప్పుడైనా తిరిగి గృహము చేరుకొంటావా అని ఆశ్చర్యపోతావు, ఎందుకనగా ముందు పొంచియున్న అపాయములు మరియు భయహేతుకమైనవి ముందున్నప్పుడు. కాని మన సోదరుడు బ్రదర్ నెవిల్ ఇప్పుడే చెప్పినట్లు ప్రభువు మన గూర్చి జాగ్రత్త వహించును. దానిని నమ్మటం మనము నేర్చుకోవాలి.... [టేపు పై ఖాలీ.] ఈ ఉదయమున, అది...
ప్రపంచములోని వివిధ మతములను, వారి వేదాంతమును, వారు నమ్మునదేమిటో, వాటి నిర్వహణను చూచిన తరువాత, మనము క్రైస్తవులముగా నిజమైన దేవునిని కలిగియున్నామని గ్రహింపునకు వచ్చినపుడు, నా జీవితమంతటిలో ఎప్పుడూ లేనంత లోతైన ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తు పట్ల కలిగియున్నానని నమ్ముచున్నాను. క్రైస్తవ్యమును దాని స్థానమునకు తెచ్చినపుడు, మిగతా మతములన్నియూ ఏమీ లేక వాడిపోయినవగును.
ఇప్పుడు, నేను బిగ్గరగా మాట్లాడలేను. ఎవరైనా ఇంకా దగ్గరగా రావలయుననుకొంటే, మనము వేచి యుండగా మీరు ముందుకు రావటానికి స్వాగతము.
2
విదేశములలో జరిగిన కూటముల మీద నా నివేదికను క్లుప్తముగా ఇవ్వగోరుచున్నాను, అట్లు మీరు ప్రభువు విదేశములలో ఉన్నప్పుడు, మీరు నా కొరకు ప్రార్థించారు. మరియు నన్ను అక్కడకు పంపినవారిలో భాగమైనందున, ప్రభువు అక్కడ ఏమీ చేశాడో తెలుసుకొనే హక్కు మీకున్నది. అవి మాకు గొప్ప ఆశ్చర్యకరమైన కూటములు కలిగియున్నాము.
ఈ దీర్ఘ కాలములో పోర్చుగీస్‌లోని లిస్‌బన్‌లో ఎంత చక్కని కూటములు, ఈ మధ్యలో మేము జరిగించినట్లు జరిగాయి. స్పెయిన్ నుండి కాథలిక్ పోర్చుగీస్ దేశము వచ్చింది, అది నూరు శాతము ఖచ్చితమైన కాథలిక్ దేశము. మరియు స్పానిష్ వారు కాథలిక్‌లు, వారు లోనికి వచ్చారు. పోర్చుగీస్ వారు కాథలిక్‌లు, వారందరి మధ్యలోలే ప్రభువు జన సమూహములపై తన ఆత్మను క్రుమ్మరించారు, అప్పుడు అలాంటి కూటములు, అద్భుతములు జరిగెను.
ఎన్నో వేలమంది.... ఇప్పుడు, ఇక్కడ ఎవరైనా కాథలిక్ వారు ఉన్నట్లయితే, ఆ ప్రజలు కాథలిజం నుండి క్రైస్తవ్యమునకు మార్పు చెందారని నేను చెప్పుటకు ప్రయత్నించుట లేదు; ఏలయనగా అది క్రైస్తవ్యమునకు ఒక ప్రాతినిధ్యం. అనగా వీరు సాధరణముగా కాథలిక్ సంఘమునకు వెళ్ళరు, వారు నిజమైన భక్తిగల క్రైస్తవులు కారు — అలాంటి వారు ప్రొటెస్టెంటులలో కూడా వున్నారు — వారంటారు, “మంచిది, నేను కాథలిక్‌ను, ఎందుచేతనంటే, మా అమ్మమ్మ మొదట కాథలిక్ కాబట్టి.” అది అంతవరకే; వారు దానిని లెక్కచేయరు. అయితే ఈ ప్రజల పోర్చుగీస్‌లోని మీటింగులలో వేలాదిగా ప్రభువైన యేసుక్రీస్తు నొద్దకు నడిపించబడ్డారు.
3
అక్కడ నుండి మేము రోముకు వెళ్ళాము. అక్కడ నేను క్రైస్తవులు ఆరాధించే (ఆదిలో, మొదటి యుగములలో) గొప్ప శవముల గుహలను దర్శించాను. అక్కడ విశిష్టమై సంగతి, సెయింట్ ఏంజిలో శవముగల గుహలోనికి వెళ్ళి దానిని దర్శించటం మాకు అద్భుతమైన అనుభవము కలిగింది. మా గైడులు (మార్గదర్శకులు) నిశ్చయముగా కాథలిక్‌లు, వారు మాకు వారందరు కాథలిక్‌లని చెప్పుటకు ప్రయత్నించారు. కాని దాని మీద చెక్కబడిన శాసనములు మాత్రము అది భిన్నమైనదని చూపుచున్నది; మీరు చూడండి, అది కాదు.
అక్కడ నుండి మేము వాటికన్ పట్టణమునకు వెళ్ళాము. మరియు వాటికన్ పట్టణములో నాకు అద్భుతమైన సమయం దొరికినది. మరియు సెయింట్ పీటర్స్ క్యాతిడ్రల్ సమీపములోనే స్వస్థతా కూటం జరిగించాము; అది గొప్ప కూటము. నిజానికి అంతా మా చుట్టు గుమికూడ వచ్చు, అయితే మేము ఎక్కడున్నామో ప్రజలకు తెలియజేయటానికి అక్కడ మేము దానిని రహస్యముగా చేయవలసి వచ్చింది. వేలమంది వచ్చి ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. మరియు అద్భుతములు, మహత్కర్యములు, సూచక క్రియలను ఆయన వారి మధ్య జరిగించెను. వాటికన్ పట్టణములోనే! మీరు దానిని ఊహించగలరా?
4
ఆ సమయములో అది అనేక మంది గొప్ప ప్రముఖులతో కలిసాను, ఎందువలననగా బారన్ వాన్ బ్లోమ్ బర్గ్ మాతో వున్నాడు. ఆ కూటములకు ఆయన కార్య నిర్వహణాధికారి, ప్రపంచములో చక్రవర్తులు, అధిపతులు ఇంకా అనేక మందికి ఆయన బాగుగా తెలిసినవాడు. లిస్‌బన్‌లో మేమ పార్లమెంటు గవర్నరును కలుసుకొన్నాము, మరియు ఆయనతో కలిసివిందు చేశాము. మరియు రోములో గొప్ప హోదాలో ఉన్న వారందరూ ఉన్నారు.
మరియు ఐగుప్తు రాజైన ఫరూకు, ఈ మధ్యనే ఒక యవ్వనస్థురాలను వివాహము చేసికొన్నాడు, మరలా వారు విడాకులు తీసుకొన్నారు, మీకు తెలుసా, ఆయనకు నలుగురు భార్యలను ఉంచుకొనే హక్కు వున్నది. ఇప్పటికి ఒకరో ఇద్దరో వున్నారు. కాని ఈ యవ్వనస్తురాలైన స్కూలు పిల్లను వివాహము చేసికొన్నాడు. దానిని వార్త పత్రికలలో చాటించడం మీరు విన్నారు. మాట్లాడటానికి మంచివాడు, పెద్దవాడు, చాలా చక్కనివాడు.
తరువాత మేము కొంత మంది తూర్పు దేశాల రాణులను కలుసుకొన్నాము, వారు ఆ సమయములో రోములో వున్నారు. మేము అక్కడ వున్నామని తెలిసి మమ్ములను కలుసుకొంటానికి వచ్చారు.
5
పోపు మాట్లాడుట వినుట జరిగెను, నేను వెళ్ళి మాట్లాడి యుండేవాడినే. కాని నీవు వెళ్ళినపుడు ఆయన ఉంగరమును మరియు పాదమును ముద్దు పెట్టుకోవాలన్నపుడు, నేను అన్నాను, “ఓ అది వద్దు, వద్దు!” చూశారా? “నేను ఏ మనిషికైనా అతనికివ్వవలసిన ఘనతలు, రెవరెండ్ అనో, లేక డాక్టర్ అనో, లేక మరి ఆయన ఏదైనప్పటికి అతనిని ఒక పెద్ద మనిషిగా, నా టోపి తీసి ఇంకా ఆ విధముగా అతనికి గౌరవాన్ని ఇస్తాను. కాని ఆరాధన విషయమునకు వస్తే , ఒకే ఒక వ్యక్తి వున్నాడు; ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఆ పనిని చెయ్యను.”
బారన్‌గారు మంగళవారము మధ్యాహ్నము ఆ ప్రాంతములో నేను పోపు దగ్గరకు వెళ్ళటానికి వారిని అడిగాడు. బారన్ గారు అన్నాడు, “మీరు లోనికి వెళ్ళినపుడు ముందు మీరు ఆయన ముందు గౌరవముగా వంగి తరువాత ఆయన ఉంగరాన్ని చూపుతాడు, మీరు ఆ వుంగరాన్ని ముద్దు పెట్టుకోవాలి. అప్పుడు తరువాత ఆయన తన కాలు చూపుతూ తన పాదమును చాపుతాడు.”
నేనన్నాను, “వద్దు, వద్దు, వద్దు. చూడండి. దాన్ని మర్చిపొండి. దాన్నిమేము చేయము.”
6
అక్కడ నుండి కైరో (ఈజిప్టు) ఏతెన్సు (గ్రీస్), మరియు దేశములోని వివిధ భాగములకు వెళ్ళి తిరిగి బొంబాయి చేరుకొన్నాము. నేను మీకు చెపుతున్నాను, ఇంకా పది సంవత్సరములలో అది ఎలా వుంటుందో, నేను బొంబాయిలో ఏమీ చూశానో దాని నుండి తేరుకొంటున్నానని నేను నమ్ముట లేదు. నా జీవితములో ప్రపంచమంతటా చూచినదానంతటిలో అవి బహు హృదయ విదారకమైన దృశ్యములు.
ఈ దేశము పూర్తిగా తూర్పుకొనయై యున్నది. నేను నిజానికి ఐరోపా దేశము ఆసియా దేశములను దర్శించాను. ఆ దేశములోని భాగముల గుండా రష్యా బోర్డర్ల వరకు కూడా, ఇంకా జపాను వెళ్ళియుండ లేదు. అది ఈ సారి కార్యక్రమములో వున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్. ఈసారి నేను ఎచ్చట వున్నాను, నా యొక్క తరువాత గమ్యము చైనాలోని, హాంకాంగ్. ఈ మార్గమునకు వస్తూ, మేము అమెరికాకు దగ్గరగా అవతలి ప్రక్కన వున్నాము. మేము కొద్దిగా హాంకాంగ్‌లో టోక్యో, ఫార్మసా, గయామ్, వేక్, ఫిలిప్పైన్స్‌లో ఆగవలసియున్నది, తరువాత ఇచ్చటకు. దానికి బదులుగా, మేము తిన్నగా ఈ మరొక మార్గముగా ఇక్కడకు రావలసివచ్చెను.
7
అమెరికాలో పేద ప్రజలు లేరు. ఒకడు ఎక్కడున్నప్పటికి, అతను ఎంత కష్టముగా జీవించవలసి వచ్చినప్పటికి ఇక్కడ పేదవారు లేరు. ఒక్కడు కూడా అమెరికాలో పేదవాడు లేడు. ఒకడు బట్టలు లేకుండా ఒక సందులో చెత్త కుండీలోనిది తినటం మీరు చూచినట్లయితే, అతడు లక్షాధికారియై యుండును. అతడు పేదవాడని మీరు తలంచవద్దు, అతను పేదవాడు కాదు; ఎందుచేత, మీరు ఒకసారి ఇండియాను దర్శించి, అక్కడ పేద ప్రజలను చూచిన తరువాత. ఎందుకు, నేను మీకు చెప్పెదను, అది కష్టము.....
నా గుండె కఠినమైనది. నేనెంతో చూశాను మరియు ఇంకా చాలా వాటి గుండా వెళ్ళవలసియున్నది. అలాంటి అనేక సంగతులు చూచినపుడు మానవునిపై అది ఎలాంటి ప్రభావమును కలిగి యుంటుందో, మీలో అనేక మంది అది ఏమిటో గ్రహించలేరు. సమయమంతా నిన్ను-నీవు వేరైనవానిగా భావించుకొంటూ పైకి ఎక్కవలసియున్నావు. మరలా కొద్దిసేపటికి, మరలా నీవు అదే వాతావరణానికి దిగుతావు, ఎలాగనగా వాటన్నిటిని చూచి గమనించేసరికి, ఎలాగనగా నీవు ఆ స్థలములో వున్నావు కాబట్టి.
8
ఒక డాక్టరు వలె, ఒక మనిషిని కోసి లోనికి జొచ్చి అతని అంత్రములను వెలికి తీసినట్లే. మొదటిసారిగా అతడు చేశాడు, ఆయన సృహ తప్పిపోయి మరేదో అయివుండవచ్చు. కాని కొద్దిసేపటికి, అది తప్పక చేయవలసియున్నదని ఎరిగినవాడై, ఆ స్థలమునకు జొచ్చి దానిని చేయును. ఆ రోగి చనిపోయినప్పటికి, బ్రతికినప్పటికి, వైద్యుడు తాను చేయగలిగినదంతా చేస్తాడు.
ఒక సేవకుడు అలాంటి మార్గములోనికే వెళతాడు, నీవు ఎప్పుడైతే.... అతి విశేషముగా అపోస్తలుడు. లేదా, ఏమిటి.... మంచిది, అపోస్తలుడు అనువాడు ఒక మిషనరీ. అపొస్తలుడు అను మాటకు అర్థము “పంపబడిన వాడు.” మరియు అపోస్తలుడుగా పిలువబడుటకు బదులు, ఎందుకు ఒక మిషనరీ ఒక మిషనరీగా పిలువబడుటకు ఇష్టపడతాడు, నాకు తెలియదు. బైబిలు క్రమము ప్రకారము అతను అపొస్తలుడు, పంపబడిన వాడు. అతను ఖచ్చితముగా సేవకుడుగా వుండవలసిన వాడని కాదు, అపొస్తలుడు సేవకుడుగా ఉండవలసిన పనిలేదు; అతడు పంపబడిన వాడిలో ఒకడై యుండవలసియున్నాడు. కొన్ని కార్యములను చేయటానికే దేవుడు అతనిని పంపియున్నాడు.
9
మేము ఇండియా వెళ్ళినపుడు, అక్కడ రోడ్ల పై పేదవారు పడియున్నారని నేను మీకు చెప్పుచున్నాను, మరియు ఆకలి బాధతో చనిపోవుచున్నారు. మరియు తల్లులు తమ చిన్న పిల్లలను ఎత్తుకుని ఆహారము కొరకు అడుక్కొనుచున్నారు. వారు ఆకలి బాధతో అలమటించుచున్నారు, కాని వారి చిన్న బిడ్డలను చనిపోనిచ్చుట లేదు. ఏదో ఒక పావలా కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ప్రతి మూడు దినములకు వారికి అంత మట్టుకు ఆహారము దొరికితే చాలు, వారికి పరవా లేదు. వారు నిద్రించటానికి ఇల్లు లేదు, వారికి నిద్ర వచ్చినపుడు రోడ్డు మీదే పడుకొంటారు. పాత రేజరు వలె వీపు కలిగిన పంది, ఆకలితో దాని ప్రక్కలు పీక్కుపోయి ఏమీ దొరకక ప్రజలను దాట లేక వారి మీదుగా తిరుగుతున్నాయి. అలాగే ముసలి మేక కూడా, ప్రజల మీదుగా తిరుగుతున్నది. వారు చెడు వాసన కొట్టుచున్నారు. ఓ, ఇండియా దేశము ఇంత ముద్దగా ఉండటం నేనెన్నడూ చూడలేదు! నిజానికి అది ఎల్లప్పుడు ఆలాగే యుండి వుంటుంది. అదేమి క్రొత్త కాదు.
మనకు తెలిసినట్లుగా వారికి స్వాతంత్య్రము వచ్చి ఆరు సంవత్సరములు అయినది. ఇంగ్లండు చేత దివాలా అయిపోయారు. వారు చాలా ఒక వింతైన ప్రజలు.
10
ఇండియా దేశములోని లక్షలమంది ప్రజలలో సరియైన అంగములు కలిగి, తొడల మీద బలమైన కండరములు కలిగిన ఒక మనిషిని కూడా నేను చూడలేదు; అందరూ వట్టి తోలు, ఎముక కలిగిన మనుషులే. నా కిటికీ దగ్గర నా కుమారుడు కూర్చొనియుండగా, వింటూ వుంటే అది ఒక మనిషి హృదయమును బ్రద్ధలు చేస్తుంది. నా కుమారుడు కిటికీ దగ్గర కూర్చొని ప్రజలు రోడ్లపై కూర్చొని వుండటం గమనిస్తున్నాడు. నేను ఎక్కడ వున్నానో వారు గమనించినపుడు, చేతులు లేని కుష్ఠు వ్యాధి గలవారు, వారి మొండి చేతులను గాలిలోనికి ఎత్తి తినుటకు బిక్షము అడుగుచున్నారు; కాళ్ళు లేవు, మరియు దేహమంతా తెల్లని కుష్ఠు పొడలతో వున్నారు. ఓ! ఒకరు మరొకరికి సహాయము చేయుట కష్టముగా వున్నది. ఓ! అది నీవెన్నడూ చూడని గొప్ప హృదయ విదారకమైన దృశ్యము!
నేను మిషనరీలతో చెప్పాను, “నేను ఈ దృశ్యమును తట్టుకోలేనన్నాను.” నేను నాకున్న ప్రతి పైసా, మరియు సమస్తమును, వీధులలో ఇచ్చేసాను. వారు నా కుమారైలైన శారా, రిబ్కాల వలె తినేంత హక్కు వున్నది, అని నేననుకొన్నాను.
11
మీరు అమెరికాలో ఎంత ఆశీర్వదించబడిన వారో మీరు గుర్తించలేరు. ఇప్పుడు, అది నిజము. మీరు దానిని గుర్తించుట లేదు. మీకు తెలుసా, అది ఎక్కడ నుండి వచ్చుచున్నదో, మీరు తల ఎత్తి పైకి చూడవలసినవారై యున్నారు. మై! అమెరికా ప్రజలు యాపిల్ చెట్టు క్రింద వున్న పంది వలె వున్నారు. మీకు తెలుసా, దినమంతా యాపిల్ పండ్లు దాని తల మీద పడుతూ వుంటాయి, అది వాటిని తింటూ వుంటుంది, కాని అవి ఎక్కడ నుండి వచ్చుచున్నవో అది ఎన్నడూ తన తల ఎత్తి చూడదు, మనము ఆ రీతిగానే యున్నాము. ఇప్పుడు ఇక్కడవున్న మీరని నా అర్థము కాదు, మొత్తముగా చూస్తే మనము దానిని తలంచము. మీరు క్రైస్తవులు, అయితే ప్రజలందరూ వారు ఎంత దీవించబడినారో, ఎంత సమద్ధి కలిగియున్నారో వారది గుర్తించరు.
12
ఈ రోజు జెఫర్‌సన్‌విల్ లోని చెత్త (తినగా మిగిలిన ఆహారము) భారతదేశములోని నాలుగవ వంతు ప్రజలను పోషిస్తుంది. అది నిజము. అది నిజము. అలాంటి దానిని పొందుటకు, ఏదైనా, వారు సంతోషించుదురు.
మీరు ఇక్కడ చెత్తకుండీలో మనిషిని చూస్తారు; చెప్తారు, “మంచిది, సహోదరుడా బ్రన్హం గారు! ఇక్కడి ఇతని సంగతి ఏమంటారు? అతనికి సరిగా బట్టలు లేవు? అన్నీ చింపిరి బట్టలే.” కానీ చూడండి! అతను చేయవలసిన పని ఒక్కటే, అది సహాయమును అడగటం, ఇక్కడ వారతనికి సహాయం చేస్తారు. అక్కడ అతనికి ఏ సహాయం లేదు. మరి ముఖ్యముగా, ఇక్కడ అతడు ఎక్కడో ఒక కుటిరములో నివసి౦చవచ్చు, వాన వచ్చినపుడు అతడు పెట్టెకారులోనికి వెళ్ళవచ్చును.
అక్కడ, అతడు తల దాచుకొంటానికి ఏమీ వుండదు, అతడు ఎక్కడైనా పడిపోతే, అక్కడ పడి వుంటాడు. వారు చనిపోయినపుడు. వారిని బయటకు తీసి వారిని దహనం చేస్తారు, పెద్ద గుంటలో పడవేస్తారు, ఆ విధంగా వీధులలో నుండి వారిని (కుష్ఠు రోగులను) తొలగిస్తారు. వారు ఎవరికి అవసరము లేదు. ఏ స్థలము వారికి లేదు, ఏమీ లేదు. వారు ఆకలితో వున్నారు. మనవలె వారు కుడా మానవ మాత్రులే.
13
సోదరుడా, నేను నీకు చెపుతున్నాను, దానిని నేను తట్టుకోలేకపోయాను. నాకు దరిదాపు నరముల ఉద్రిక్తత వచ్చింది. గత ఆదివారం నుండి, ఈ దినములన్నీ నేను ఇంటి దగ్గరే వున్నాను. నా గది నుండి లేవ లేక పోవుచున్నాను - ఇది ఐదు రోజుల నుండి - నా భార్యకు ఆ సత్యము తెలుసు. ఆ దృశ్యము నన్ను చంపివేసినట్లయింది. మా డాక్టరు చెప్పెను, “నీవు కొంత విశ్రాంతి తీసుకొనుట మంచిది.” చెప్పెను, “నీ రక్త ప్రసరణ పడిపోయేటంతగా నీ నరములు బలహీనమై పోయాయి, రక్తమును గ్రహించలేకపోవుచున్నవి, తిరిగి రక్తమును తేలేకపోవుచున్నవి.” అలాంటి సంగతులు చూడటం ద్వారా, అది నన్ను రెండుగా చీల్చివేసింది.
కొందరు మిషనరీలు అన్నారు, “బ్రదర్ బ్రన్హం, ఇది మిమ్మును గాయపర్చినట్లయితే, మీరు ఇంకా లోతట్టు ప్రదేశములకు వెళ్ళవద్దు, 'ఏలయనగా అది దీనికంటె అనేక రెట్లు హృదయ విదారకముగా వుంటుంది.'” వారికున్న మంచి పట్టణాలలో బొంబాయి వారికి అతి పెద్ద పట్టణము. మీరు దానిని తప్పక చూడవలసియున్నది!
14
ఇక వాళ్ళు మతముల సంగతికి వస్తే, అలాంటి మూఢ నమ్మకములను నేను ఎన్నడూ చూడలేదు! ప్రజలు పూర్తిగా గ్రుడ్డివారు, సూర్యుని తేరి చూస్తూ ఆరాధిస్తారు; అలాగే సూర్యుని చూచి చూచి గ్రుడ్డివారై పోతారు.
15
శ్రీ నెహ్రు, రాష్ట్రపతి, పార్లమెంటు మరియు ప్రఖ్యాతి చెందిన వారందరి నుండి నేను సత్కరించబడ్డాను. వారి కార్డులు వారికి సంబంధించినవన్నీ, నా జేబులో వున్నాయి. వారు చాలా మంచివారు. మంచి వారంటే మంచి వారు. మిమ్ములను ఎంతగానో పరామర్శిస్తారు.
నేను బొంబాయి మేయరు గారి ఆఫీసుకు వెళ్ళాను. మీ కోళ్ళ యిల్లే దాని కంటే ఎంతో చక్కగా వుంటుంది. వారికున్న దానిలో అది మంచిది. మరియు అక్కడ తింటానికి ఏమీయూ లేదు. ఇక వీధులలో అయితే అది నీవెన్నడూ చూడని హృదయ విదారకమైన దృశ్యములు. మీరు మీ “కేర్” పాకెట్లను పంపేటప్పుడు వాటిని ఇండియాకు పంపండి. అవునండి.
16
ఇప్పుడు, నేను ఇక్కడ తప్పులను పట్టే వాడిగా లేను. ఇక్కడకు వస్తుండగా, నేను నా భార్యతో చెప్పాను, “నేను దేనినుండైనా వైదొలగాలంటే, ఈ సంఘమును నా కొరకు ప్రార్థన చేయమని చెప్పు,” అని అన్నాను. “అది ఎంతో విమర్శనాత్మకమైనది,” నా హృదయములో నేనెంతో కలవరముగా నున్నాను, ఆ రీతిగానే నేనుండాలని కాదు.
నేను అమెరికా భూభాగాన్ని చేరుకొన్న కొద్ది క్షణాలలో, నేను ఇక్కడకు రాక ముందు, విమానము వెనుక ఒక ముసలి తల్లిని చూచినపుడు అక్కడే నేను అమెరికా ప్రజలను చూచి వారిని విమర్శించుట మొదలుపెట్టాను; మేము రెండవ తరగతిలో వస్తున్నామ, నిజంగా, బోధకులు ఆ రీతిగా ప్రయాణము చేయాలి. విమానములో చివర ఒక ముసలి తల్లి, ఇంకా కొందరు చిన్న పిల్లలతో వున్నది, అక్కడ ఒకాయన కూర్చొని ఆ చిన్న పిల్లల గురించి పేచి పెడుతున్నాడు, ఎందుకనగా వారు... నేను గాలిలో 58 గంటలు వున్నాను, మరియు వారు 35 గంటలు వున్నారు; పాపం చిన్న పిల్లలు, విశ్రాంతి లేదు, వారిని చంకను పెట్టుకొని యున్నది.
17
ఈ అమెరికా స్త్రీలు లేచి, ఎంతో అసభ్యంగా దుస్తులు ధరిస్తారు. ఈ అసభ్యకరమైన స్త్రీలను ఆ ఆకలితో బాధపడే స్త్రీలు వచ్చి అమెరికా స్త్రీలకు ఎలా చక్కగా జీవించాలో నేర్పవచ్చు. అది నిజము! వీధిలో సహితము, అది నీ భార్యయైనప్పటికి, నీవు ఆరు అంగుళాలకు మించి ఆమె ప్రక్కన నిలబడకూడదు. వారు నిన్ను అదుపులోకి తీసుకొంటారు. అది నిజము. అక్కడ వీధులలో ప్రేమించుకోవటం, సరసాలాడటం, అలాంటివి చేయటానికి వీలులేదు. వారి స్త్రీలు ఎన్నడూ పురుషుని ముఖము వంక చూడరు, వారితో మాట్లాడుతూ యున్నప్పుడు సహితం, వారు తమ తలలను ఆ రీతిగా వంచుకొని నడిచిపోతారు. మరియు అక్కడ స్త్రీలను ఆ రీతిగా వీధులలో తిరుగనియ్యరు. అవే నైతిక విలువలు. అలాంటి ఆకలి బాధలో వున్న ప్రజలను, హిందువులను, వారు ఆ రీతిగా, మన దేశములో ప్రజలు ఇంత నీచముగా పరువు తక్కువగా, ఈ రీతిగా వుండటం చూచినపుడు; అది నన్ను బాధపెడుతున్నది.
18
నేను తాజ్‌మహల్ హోటల్ దగ్గర నిలబడ్డాను. ఏమి, బిల్లీ.... బిల్లీ, దానిని ఎలా ఉచ్చరిస్తారు? తాజ్‌మహల్ హోటల్ అను దాన్ని ఎలా ఉచ్చరిస్తారు బిల్లీ పౌల్? తాజ్ మహల్? [బిల్లి పౌల్ చెప్పెను, “తాజ్ మహల్”] అవును. తాజ్ మహల్, ఆ హోటలు దగ్గర. మరియు బిల్లీ దానికి సాక్షము.
ఇద్దరు అమెరికన్లు లోనికి వచ్చారు. వారు మరలా వీధిలోనికి వెళ్ళినపుడు... వారు బయటకు వెళ్ళినపుడు, మేము వారిని కనిపెట్టాము. అక్కడ పేద వారి మధ్యలో నడుస్తున్నారు, అప్పుడు ఒక చిన్న బాలుడు వారి దగ్గరకు పరుగెత్తాడు, వారికి ఒక విధమైన వ్యాధి వస్తుంది అక్కడ. అతనికి ఎనిమిది సంవత్సరములుంటాయి. అతని రెండు పాదములు పెద్దగ ఉన్నాయి, రెండు పాదాలు కూడా. అంత వరకు, అతను తన రెండు పాదములను ఆ రీతిగా ఈడ్చుచుండెను. వారి దగ్గరకు నడుచుకొంటూ వచ్చి, వారిని పైసా అడిగాడు. ఏదో తింటానికి ధర్మము అడిగాడు. ఆ అమెరికన్లు చెప్పారు.... [బ్రదర్ బ్రన్హం గారు వారి సంజ్ఞను ఉమ్మివేసినట్టుగా అనుకరించుచున్నారు] ఆ రీతిగా తిరిగి, నడుచుకొంటూ వెళ్ళిపోయారు.
నేనన్నాను, “దేవా, కనికరము చూపుము.”
19
తల బిరుసుతనము! మరియు నెహ్రు గారు ఇంకొందరు మాతో మాట్లాడుచుండిరి, చెప్పెను, “మీ ప్రజాస్వామ్యము, మీరు మాకు ఇష్టమే, కాని మీ యొక్క ఆత్మ మాత్రము మాకు వద్దు.” అది సత్యము. “మీకు అమెరికాలో వున్నట్లుగా తల బిరుసుతనము, ఆ బడాయి మాకు అక్కర లేదు. అది మాకు అవసరము లేదు.” సూటిగా మాతో చెప్పుటకు వారు ఇబ్బంది పడలేదు. “అది మాకు అవసరము లేదు,” అన్నారు.
నేనన్నాను “అది క్రైస్తవ్యమునకు నిజమైన ప్రాతినిధ్యము కాదు.” “అది ఒక రకమైన వేషధారణ,” అని చెప్పాను. కచ్చితముగా. నేనన్నాను, “క్రైస్తవులు ఆ రీతిగా ప్రవర్తించరండి, లేదండి.” నేనన్నాను, “అమెరికాలో వున్న వారందరూ ఆ రీతిగా ప్రవర్తించరు.” “ప్రపంచములోని మిగతా వారి వలె దీనముగాను, చక్కని ప్రజలు మాకున్నారు,” అన్నాను. “మాకు కొందరున్నారు, అయితే దీనిని విచారముతో చెప్పుతున్నాను; వారిలో అధిక సంఖ్యాకులు బడాయిగా, తల బిరుసుగా, లెక్క లేని వారుగా వుంటారు.”
20
మరియు ఇక్కడకు రావటం, నన్ను కఠినముగా చేస్తుంది, ఆ రీతిగా వుండటం నా భావము కాదు, చూశారా. నేను ఎంతో చూచిన తరువాత, ఎంతో కనుగొన్న తరువాత, ఈ గుడారములోని సహోదరీ, సహోదరులారా, దేవుడు మీ హృదయములను దీవించును గాక. నేను దేనిగుండా వెళ్ళానో మీకు తెలియదు. నేను చేయగలిగినంత మంచిని మీకు చేయుచూ, మిమ్ములను వాక్యములో పోషించుచున్నాను. ఒక దినమున నేను దేవునికి లెక్క చెప్పవలసియున్నది. నేను ఏదైనా తప్పు చేయటం మీరు చూస్తే, నన్ను ఖండింప వద్దు; కేవలము నా గురించి బాధపడ౦డి, నన్ను దిద్దుటకు ప్రయత్నించండి, ఎందుకనగా ఆ రీతిగా నేను ఉండాలని కాదు.
కాని నీవు అనేక వాటి గుండా వెళ్ళాలి, నీవు దానిని గ్రహించవు. మరియు నీవు ఎంతో స్వారి చేయవలసి వుండును. ఈ ఉదయమున నేను కొన్ని సంగతులు మీకు చెపుతాను, అవి ఈ ఉదయమున మీకు వాటిని చెప్పటం న్యాయము కాదు, నేను ఐదు దినములు ఎందుకు ఇంటి యొద్ద పడి వున్నానో మీరు గ్రహిస్తారు, నేను కదలలేకపోయాను. అది నిజము. దానిని మీరు గ్రహించలేరు.
ఎలా.... ఆ పాత నిష్కపటమైన బోధకుడు బలిపీఠము మీద నిలబడినపుడు, ఆ హృదయము గుండా ఏది దాటిపోయినదో, ఏది కోసినదో, ఏది కొట్టినదో, ఏది లాగినదో. కేవలము దేవునికే తెలుసు. దానిని నేను ప్రజలకు కానీ, కనీసం నా భార్యకు కూడా చెప్పను; దేవునికి నాకు మధ్యనే ఉంచుకొంటాను, అలా వీలైన౦త మంచిగా ముందుకు సాగిపోతాను. కాని మీకు తెలుసు, మానవ హృదయాలు కొంత మట్టుకే తట్టుకోగలదు, తరువాత అతడు బయటకు పోవును. మీరు చూశారా. ఏది నన్ను పట్టుకొని వున్నది, నాకు తెలియదు; అది చేసిన దేవుని మాత్రమె అది తెలియును.
21
ఇప్పుడు, ఇండియాలో అన్ని రకముల మతములు ఉన్నవి. ప్రతిదానికి మతమున్నది. ప్రతిదానికి దాని సొంత మార్గమున్నది. చరిత్రాత్మకముగా నేను వారిచేత సత్కరింబడ్డాను.... ఇంతకు మునుపు ఎన్నడూ భారతదేశములోని మతములన్నియూ కలసి ఒక క్రైస్తవుని సత్కరించలేదు. కాని రెండు వారముల క్రితము, పోయిన గురువారము, నేను భారతదేశములోని మతముల వారిచేత సత్కరించబడ్డాను.
వారిలో అనేక మంది ఈగలను ఆరాధిస్తారు. మరియు పశువులను ఆరాధిస్తారు. ఓ, ప్రతి దానిని వారు ఆరాధిస్తారు. అక్కడ జైనులు తమ గుడిలో కూర్చొనియున్నారు. అక్కడ వారి పూజారులు ఉన్నారు. ఆ మతము క్రైస్తవ్యము పుట్టక ముందు మూడు లేక నాలుగు వేల సంవత్సరములకు పూర్వము ఏర్పడినది.
వారికి మఠము (సన్యాసుల ఆశ్రమము) వున్నది; అంతా కాథలిక్కుల వలె సన్యాసులు వున్నారు. వారు తమ చేతులతో తమ గడ్డములను లాగుకొంటారు. తల జుట్టును ముందుకు విసురుకొని మరలా తమ చేతులలో దువ్వటం ప్రారంభిస్తారు. దానిని మీరు కత్తిరించలేరు.
22
వారు ఆలాగున ప్రతిచోట వుంటారు, ఒక చీపురు కట్టను గాని, అలుకు గుడ్డను గాని తీసికొంటారు, వారు అక్కడ కూర్చొంటారు; ఈ సన్యాసులు ఈ చిన్న అలుకు చుట్టలను చేస్తారు, ముందు తుడుచుకొంటూ వెళుతూ ఏ చీమ మీద గాని, మరి దేని మీదనైనా గాని అడుగు వేసి చంపకుండా జాగ్రత్తగా వెళాతారు. ఒక వేళ దేని మీదనైనా అడుగు వేసినట్లయితే, అది వారికి మరణకరమైన పాపము, మరియు వారికెన్నడూ అది క్షమించబడదు. వారు తమ మూతి చుట్టూ, చెవుల చుట్టూ తెల్లని గుడ్డ వంటిది కట్టుకొంటారు; ఎందుకనగా ఒక వేళ వారు ఊపిరి పీల్చేటప్పుడు ఒక చిన్న దోమను పీల్చారనుకోండి, దానిని బట్టి వారికి ఎన్నడూ క్షమాపణ లేదు. చూశారా? అది దేనినో చంపినది! ఓ, దేవా!
వారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్త బలిని ఎలా అంగీకరించగలరు? వారు ఆయనను గురించి విన్నారు, కాని దానిని వారు నమ్మరు. వారికి యేసును గూర్చి తెలుసు. మిషనరీలు దానిని తీసుకొంటారు. “ఓ, మీరంతా కలగలుపై పోయారు,” అని అతడన్నాడు. “మీరు ఆ యేసు అనే మనిషిని గూర్చి అంటారా.... ఆయన పరిశుద్ధుడై యుంటే, దుర్మార్గులైన మనుషులు ఆయనను సిలువవేయుట? బుద్ధిహీనత!” “ఆయన గుర్రము నెక్కి పరలోకమునకు స్వారి చేసెను. అక్కడికే ఆయన వెళ్ళెను అన్నాడు.”
23
ఇక సిక్కులు, వారు తలపాగా ధరిస్తారు; దానిలో కత్తి వుంటుంది. ప్రతిసారి క్రైస్తవులు వారి వీపును త్రిప్పటం కనుగొన్నప్పుడు, వారిని వారు చంపెదరు. ఎందుకనగా అతను పరలోకము వెళ్ళినపుడు... క్రైస్తవుడు కూడా పరలోకము వెళతాడు. కాని అతను పరలోకము వెళ్ళినపుడు, క్రైస్తవుడు జైనుకు పరిచారకుడు కాబోతున్నాడు. మీరు చూశారా, అతడు ఈ భూమి మీద ఎంత ఎక్కువ మందిని చంపివేస్తాడో, అతనికి అంత ఎక్కువ మంది సేవకులుంటారు. కాబట్టి అతడు నిన్ను చంపినచో, నీవు చంపబడతావు. అంతే, వారి తలపాగాలో ఒక దువ్వెన అంటుకొనివుంటుంది, ఆలాగే ఒక కత్తి నడుము ప్రక్కన వుంటుంది. వారికి కావలసినది, నీవు వారికి నీ వీపును త్రిప్పటమే. మరియు అప్పుడు, కేవలము ప్రతియొక్కటి, ఈ లోకములోని మతములు!
24
ఆ మొదటి రాత్రి కూటములో మాట్లాడుతున్నప్పుడు, అక్కడ వున్న ప్రజలెంత మందో లెక్కించుట వీలుపడలేదు. వారందరినీ ఉంచుటకు స్థలము లేకపోయింది. అది వర్షాకాలము, వర్షములు పడుతున్నాయి; ప్రజలు ఆలాగే నిస్సహాయులుగా బయట నిలబడియున్నారు. ఎంతో దయనీయమైన సందర్భములు. అప్పుడు, మొట్ట మొదటిగా నిలబడి వచ్చినది ఒక స్త్రీ, ఒక చిన్న బాలుని తెచ్చింది. అతడు హిందువుడనుకొంటాను, పౌల్, కదా? ఆ కుర్రవాడు మూగవాడు చెవిటి వాడు. అతను పుట్టుకతోనే మూగవాడు చెవిటివాడు.
నేనన్నాను, “ఇప్పుడు ఇది మొదటి కేసు, ఇక్కడ ఒక చిన్న బాలుడున్నాడు.” నేను అన్నాను, “మీలో ప్రతి ఒక్కరూ, జైనులు వారు జైనులవ్వాలనుకొంటారు, మహమ్మదీయులు వారు మహమ్మదీయులవ్వాలనుకొంటారు, ఇంకా ఇతరులు, వేరే విషయాలు తేవాలనుకుంటారు.
25
వారంతా తమ ఖూరాన్ బైబిలు చదువుతారు, మీకది తెలుసు. వారికది వున్నది.... అది మహమ్మదీయులకు సంబంధించినది. వారికి రకరకాల స్థాపకులున్నారు.
ఇప్పుడు, కొంతమంది ఒక మనిషి తనకు తాను దేవుడై యున్నాడు; ప్రతి మనిషి, దేవుడని నమ్ముతారు. నీవు ఎంత బాగా వుంటే, నీవు అంత మంచి దేవుడవన్న మాట. ఓ, వారు చేసేదంతా చూడటానికి భయంకరమైనది.
26
అక్కడ నేనన్నాను, “చూడండి, పెద్దమనిషి,'' ఏలాగనగా నేను వారిని సోదరులని పిలువలేను. కాబట్టి నేను వారిని ప్రపంచములోని మతముల ''పెద్ద మనుషులారా'' అని వారిని సంబోధించాను. చూడండి? నేను మిమ్మును ఒక విషయము అడుగ గోరుతున్నాను. ఈ రోజు, ఈ రాత్రి మనమంతా ఇక్కడ వున్నాము; ఇక్కడ అనేకమైనవి వున్నవి, మీరు పశువులను ఆరాధిస్తారు, సమస్తమును ఆరాధిస్తారు. మీరు నన్ను క్షమించితే, ఇదంతా మూఢ విశ్వాసము అన్నాను. వారంతా ఇంగ్లీషును అర్థము చేసికొనగలరు; అయితే వారు తిరిగి మాట్లాడలేరు. ఇంగ్లండు దేశము ఎంతో కాలము వారిని నియంత్రించింది.
నేనన్నాను, “మనమంతా ఒక్కొక్కరము రక రకాల మతములకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ యున్నాము.” నేనన్నాను, “మీరు వెళ్ళి అన్య మతమును అవలంభింప చేస్తారు. ఒక సిక్కును తీసుకొని అతనిని జైనుగా చేస్తారు; ఒక మహమ్మదీయుని తీసికొని ఒక బౌద్ధుడిగా అతనిని చేస్తారు, ఆ రీతిగా ఇంకేదో చేస్తారు. అది తలంపులో మార్పు మాత్రమే. అంత వరకే, అని అన్నాను.”
నేను చెప్పాను, “అమెరికాలో కూడా మాకు అలాంటిదే వున్నది. ఈ సంగతుల నుండి మేము తప్పించుకోలేము.” నేను చెప్పాను, “కాని మేమంతా ఒకే దేవుని యందు నమ్మకము కలిగియున్నాము.” “మా దగ్గర ఇప్పుడు, మెతడిస్టు, బాప్టిస్టు మరియు ప్రెస్బిటేరియన్ మరియు వారు ఒకరికి మధ్య ఒకరు శాఖలుగా భిన్న విశ్వాసమును ప్రవేశపెట్టారు.”
“కాని మీరు ఒక దేవుని నుండి మరియొక దేవునికి అన్యమతమును అవలంభింప చేశారు. అది ఏమిటి? అది, ప్రతిది మూఢ నమ్మకమే,” అన్నాను.
27
''మీరు ఆరాధించే ఈగ, మీరు ఆరాధించే ఆవు, గుర్రము, అది ఏదైనప్పటికి, ఆ జీవినే సర్వశక్తిగల దేవుడు సృజించాడు.'' చూశారా? ''మీరు సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించుచున్నారు, చూచారా.“ ”నా మట్టుకైతే,“ నేను చెప్పాను, ”వాటన్నిటిలో ఏదీ కూడా...“ వాటిలో కొన్ని విగ్రహములు, మొదలగునవి. నేను చెప్పాను, ”వాటిలో ఏదియు మీకు సహాయము చేయలేదు. వాటిలో ఏదియూ తిరిగి జవాబు చెప్పలేదు. అవన్నియు మూగవి, వాటిలో ఏదియూ తిరిగి పలుకలేదు. ఏదియూ రంగముపై వచ్చి కార్యము చేయలేవు.“
''కాని ఒకే ఒక నిజమైన జీవించుచున్న దేవుడున్నాడు, మరియు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కుమారుడు.“ మరియు నేను చెప్పాను, ”ఇప్పుడు, ఇక్కడ నేను ఆయనకు ప్రాతినిధ్యం వహించుచున్నాను.''
28
''ప్రవక్తయైన ఏలీయా బయలు ప్రవక్తలందరినీ కర్మెలు పర్వతము మీదకు తెచ్చి, దేవుడెవరో రుజువు చేయుదము రండి, అని చెప్పినట్లుగా నేనన్నాను.“ నేను చెప్పాను, ”ఇప్పుడు చేయవలసినది ఒకటే యున్నది. మీదేవుళ్ళు యదార్థమైనట్లయితే, నేను నా దేవుని విడిచిపెట్టి మీ దేవుళ్ళను సేవిస్తాను.''
ఇప్పుడు, ఇక్కడ మూగవాడైన చెవిటి బాలుడు నిలువబడియున్నాడు. ఇప్పుడు మీ దేవుళ్ళలో ఎవరు అతనిని స్వస్థపరచగలరు? అతనికి మాటను, వినుటను ఎవరిస్తారు? అదే ఇప్పుడు నేను తెలుసుకొనవలసియున్నది. చూడండి? ఎవరు ఇప్పుడు ఈ బాలునికి మాటనున తిరిగి ఇవ్వగలరు?“ ప్రతి ఒక్కరూ నిశ్శబ్దముగా వున్నారు.
“బైబిలు ద్వారా సిద్ధాంతము ద్వారా, కర పత్రముల ద్వారా క్రైస్తవ్యము ఏమీటో మీకు చూపబడినది.” దాని కొరకే నూటికి నూరు శాతము నేను ఉన్నాను. అవునండి. దేవుడు అక్కడికి వెళ్ళి నివసించే మిషనెరీలకు సహాయము చేయును గాక! చూశారా? నేను చెప్పాను, “అది మీకు వాక్యము ద్వారానే చూపబడినది. దానిని మీరు మీ హృదయములలో వుంచుకొని యున్నారు; కాని ఆ వాక్యమును వ్రాసిన దేవుడు, ఇప్పుడు ఆయన ఎంతవరకు వచ్చాడంటే, ఆ వాక్యమును ఇప్పుడు ఆయన జీవింపచేయనై యున్నాడు. వాక్యములో తన్ను తాను సజీవముగా కనపరచుకోనై యున్నాడు.”
29
ఇప్పుడు, “ఈ కుర్రవాడు ఇక్కడ నిలబడి యున్నాడు. అతడు మూగవాడు చెవిటివాడు. అతను మాట్లాడలేడు, వినలేడు. అతడు ఆ రీతిగా పుట్టి యున్నాడు.” పరిశుద్ధాత్మ వారి పాపములను, వారి సంగతులను, ఆ ప్రజలను అక్కడ బయలు పరచెను. దానిని వారు చూచినపుడు, దరిదాపు స్పహ కోల్పోయారు, మీకు తెలుసా?
వారంతా గొప్ప కేకలు వేయసాగారు, ఏమీ వినపడటం లేదు. మీకు తెలుసా, ఎందుకంటే మిలటరీ వారు వారిని కనిపెట్టుచున్నారు. వారు పైకి, క్రిందికి ఎగురుతున్నారు. ఓ, నా దేవా! ఇండియా దేశములోని ప్రజలంతా అక్కడ ఉన్నారని వారు చెప్పారు. చూడండి, అక్కడ ఎంత మంది ఉన్నారో మీరు గ్రహించలేదు. అప్పుడు, నేను ఆ చిన్న కుర్రవానిని పైకి తీసుకొన్నాను.
30
నేను ఇలా అన్నాను, ''ఇప్పుడు, పరలోకపు తండ్రి, ఇక్కడ వున్న ఇతర మనషుల వలె నేనున్నానని నీకు తెలుసు. నీ కృపను నేను పొందకయుంటే వారి వలెనే బహు అధ్వానముగా వుండెడి వాడిని. నీవు నన్ను రక్షించావు. ఇదంతా నీ వలన నిశ్చయించబడినది, నా వలన కాదు. ఇప్పుడు, ఒక్క కార్యమైనా నేను చేయగలను అని నేనెన్నడూ పలుకలేదు. ఇది నీవే, ప్రభువా. ఇప్పుడు ఇక్కడే, ప్రపంచములోని మూఢ విశ్వాసములు గలవారు, మతములవారు వున్నారు.... అది ప్రవక్తయైన ఏలీయా దినములలో వలె, నీ కుమారుడైన యేసు దినములలో వలె, ఇపుడును మరలా వున్నది.“
''ప్రభువగు దేవా, నీవే నిజమైన జీవించుచున్న దేవుడవని మానవాళిని చేసింది నీవేనని, మూగవానిని మాట్లాడునట్లు చేస్తావని, చెవిటి వానిని వినునట్లు చేస్తావని మరొకసారి తెలియజేయుము. నీ మాట ప్రకారము, నీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను; క్రైస్తవ విశ్వాసిగా మీరేది తండ్రిని ఆయన నామమున అడిగినను, అది అనుగ్రహింబడునని చెప్పావు. ఇప్పుడు, నేను ఆయన వాక్యమును నమ్ముదును, ఆ రీతిగానే ఈ మూగ-చెవిటి ఆత్మను ఈ కుర్రవానిని విడిచి వెళ్ళునట్లుగా ఆజ్ఞాపించుచున్నాను,'' అని అన్నాను.
31
మరియు నేను నా చేతులతో అలా చప్పట్లు కొట్టాను. అతడు తిరిగి అంతా కలయ జూచాడు. తన చెవులను పైకెత్తి పట్టుకొన్నాడు. అప్పుడు, అక్కడే ఆ జన సమూహములో, ఆ కుర్రవాడు అందరి వలె వినుచూ మాట్లాడుచుండెను.
ఇక ఆ రీతిగా అది ప్రారంభమైనది! తరువాత... వారు నన్ను బయటకు తీసికొని వెళ్ళవలసియున్నది. వెళ్ళుటకు మార్గము లేదు. వారు నా బూట్లలను, వస్త్రములను దరిదాపుగా నా నుండి లాగివేశాను. సైన్యము వారిని అదుపు చేయలేక పోయినది. మిలటరీ వాళ్ళు, గార్డులు వారిని అదుపులో వుంచలేక పోయారు. మీరు చూడండి. వీలైతే వారు నిన్ను ఆరాధిస్తారు, వారికది అర్థము కాదు. నీవు వారికి ఎంత చెప్పాలని చూచినా లాభము లేదు, వారు అర్థము చేసుకోలేరు.
32
మరలా రెండవ దినము సాయంకాలము; ఒక సూర్య ఆరాధన చేసే వ్యక్తి. అతడు సూర్యుని తేరి చూచుచూ ఆరాధించడం ద్వారా 20 లేక 30 సంవత్సరముల క్రితము గ్రుడ్డివాడై పోయాడు. అతడు పూర్తిగా గ్రుడ్డివాడగు వరకు ఆలాగే సూర్యుని తేరిచూచేవాడు. 20, 30 సంవత్సరముల నుండి అతనికి దృష్టి లేదు, అతడు తరువాత వాడు; అతనిని పట్టుకొని తరువాత రాత్రి మా యొద్దకు తెచ్చారు.
నేనన్నాను, ''ఇపుడు, ఏది ఆఖరు రాత్రి?“ నేను వచ్చిన తరువాత, మీరు వినుట కష్టముగా వున్నది, మీరు చూడండి. ప్రతి మతము వారు, ప్రతి ఒక్కరూ అంతా అక్కడ వున్నారు. నేనన్నాను ''మీలో ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించనై యున్నారు?'' చూచినంత వరకు అంతటా, ప్రభువైన యేసుక్రీస్తును వారు వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించారు. ఆ సమూహాన్ని మీరు చూడలేరు.... నేను చూడగలిగినంత వరకు వారిని అంతా చూడలేకపోయాను.
మేము బహిరంగముగా కూటములు పెట్టలేకపోయాము, ఎందుకనగా వర్షములు కుండపోతగా కురుస్తున్నాయి. ఆ జన సమూహములో వారందరి దగ్గరకు మేము చేరలేకపోయాము. వాళ్ళందరూ ఇంకా రోడ్ల వెంబడి కూటములకు వస్తూనే యున్నారు; మేకలను వెంటబెట్టుకొని, వాళ్ళ సామానులతో లోనికి రావాలని ప్రయత్నించుచున్నారు.
33
ఆ గ్రుడ్డి వ్యక్తితో ఆ రాత్రి కూటములలో నేనన్నాను, “ఇప్పుడు మీ దేవుళ్ళలో ఏ దేవుడు ఇతనికి దృష్టిని ఇస్తాడు?” “ఇక్కడ మీ సొంత ఆరాధికులలో, ఒకడు ఇక్కడున్నాడు; అది మూఢభక్తి అది అతని కన్నులను పోగొట్టింది, సూర్యుని వైపు తేరి చూడటం ద్వారా,” అన్నాను. “అతడు సూర్యుని ఆరాధిస్తున్నాడు, ఎందుకంటే అది సృజించబడిన వస్తువని, అది సృజించబడిన ఒక సృష్టి.”
''ఆ సూర్యుని సృజించిన సృష్టి కర్తే ఈ మనిషి కన్నులను కూడా చేశాడు,'' అన్నాను. ''ఇప్పుడు ఆయనకు ఇష్టమైతే, దేవుడు ఇతనికి దృష్టి ఇస్తాడు; ఇంకా ఏదైనా నేను మిమ్మును అడుగక మునుపు, మీలో ఎంత మంది ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా, సిలువవేయబడినవానిగా నమ్ముదురు?''
34
వారు గ్రహించలేకపోయారు, ఆ పరిశుద్ధుడు ఎలా, చనిపోతాడని ఈ క్రైస్తవుడు చెపుతాడు. నేనన్నాను, ''ఆయన చనిపోవుటకు కారణమేమనగా మన పాపములను తీసివేయుట కొరకే.“ ”ఆయన మూడవ వ్యక్తి కాదు, లేక రెండవ వ్యక్తి కాదు. ఆయన అదే వ్యక్తి, మన పాపములను తీసివేయుటకు శరీరధారియైనాడు.“ నేను అన్నాను, ”ఆయన వచ్చి అది చేసెను.''
అంతకు ముందు రాత్రి నేను వారికి చిన్న కథను తేనెటీగను గురించి చెప్పాను. మీకు తెలుసు, అది ఏ రీతిగా తన ముల్లుతో కుడుతోందో, దాని ముల్లును విడిచిపెడుతుందో; అది ఇక ఎంత మాత్రము కుట్టలేదు, మీకు తెలుసా? ఏలయనగా మరణమనే తేనెటీగ కుడుతుంది, ఏలయనగా మరణము ఆత్మలో లేదు కాని శరీరములో వున్నది. కాబట్టి దేవుడు మరణము అనే ముల్లును తీసివేయటానికి ఆయన శరీరధారి కావలసివచ్చెను, ఎందుకనగా వారది చూడవలసియున్నది, మీకు తెలుసా, ఎందుకనగా అనేకమైన పురుగులు ఇండియా దేశములో వున్నవి. అవి వున్నవి...
35
నేను చెప్పాను, “ఇప్పుడు చూడండి, ఈ మనిషి మూఢ భక్తితో, తన ఆత్మలో కనికరము పొందుట కొరకు సూర్యుని తేరి చూసేవాడు, ఏలయనగా ఇక్కడ నుండి చనిపోయిన తరువాత అతను ఎక్కడికో వెళ్ళవలసియున్నానని అతను ఎరుగును.” “అయినను అతని కళ్ళు పోయినవి; మరియు అజ్ఞానముతో అతడు ఆ పనిచేసెను. కాని అతడు చూడటానికి సూర్యుని చేసిన సృష్టికర్తే అతని కన్నులలోనికి దృష్టిని తిరిగి ఇవ్వగలడు.”
నేనన్నాను, ''ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తును మీ స్వరక్షకునిగా అంగీకరించి, మీ యొక్క విగ్రహములన్నిటిని విసర్జించి, మీరు జీవించినంత కాలము మీరు ఆయనను సేవించుటకు సిద్ధముగా వున్నారా?'' అప్పుడు ఈ పేద ముసలివాడు వణకుచున్న తన చేతిని ఎత్తి చూపాడు. వారందరు అక్కడ నడుముకు జ౦ఘనమును వేసికొనియున్నారు. అతను తన ఇష్టతను చూపుచూ, తన చేతిని ఎత్తాడు.
36
వారు గుడికి వెళ్ళినపుడు ఎన్నడూ కూర్చొనరు. ఎన్నడూ వారికి గుడిలో కూర్చొండుటకు కుర్చీలు గానీ ఏమీ వుండవు. వారు క్రింద కూర్చొంటారు, లేక సాష్టాంగపడతారు, లేక ఒకరి మీద ఒకరు ఆనుకొంటారు, అలాంటిదేదో చేస్తారు. ఇక అది ఎలా వుంటుందో మీరు దానిని గ్రహించవచ్చు. మీరు చూడగలిగినంత వరకు, ప్రజలంతా వారు అలాగే వుంటారు.
37
అప్పుడు నేను, అతనికి దృష్టి ఇవ్వవలసినదిగా కృపగల ప్రభువునకు ప్రార్థన చేశాను. అప్పుడు, దేవుని కృప వలన, పూర్తిగా గ్రుడ్డివాడైన ఆ మనిషి, ముడతలు పడిన తన ముఖము నుండి, అతని తెల్లని గడ్డము మీదుగా కన్నీరు క్రిందికి కారుచున్నది. అప్పుడతడు, తన సొంత భాషలో కేకలు వేయటం ప్రారంభించాడు, మరియు ప్రతి ఒక్కరూ కేకలు వేయటం ప్రారంభించారు. అప్పుడతడు అక్కడ నడుచుకొంటూ వారందరిని తన చేతితో తట్టుచూ వెళ్ళాడు. గ్రుడ్డివాడుగా వున్నటువంటి వ్యక్తి, అతడు చూడగలుచున్నాడు.
38
ఇప్పుడు, సహోదరుడు కాక్స్ వాళ్ళంతా వెనుక కూర్చొనియున్నారు, ఆయన ఈ సంగతులు నిజమని అవి రుజువు చేయు ఉత్తరములను చూపగలడు, ఇండియా నుండి వచ్చినవి, ఓ అది చాలా సమయం పడుతుంది.
కానీ మేము అవి జరిగించిన రీతిలో చూస్తే, నేను నిలబడలేక పోయాను. అక్కడ ఐదు రాత్రులు ఎలా గడిపామో, నేను గ్రహించలేకపోతున్నాను. దేవుని సహాయముతోనే, నా కుమారుడైన బిల్లీ నాతో ఉండుటను బట్టి మాత్రమే, నేనెన్నడూ అది చేయగలిగి ఉండేవాడిని కాదు. నాకు తెలియదు, బిల్లీ నాతో అతుక్కుపోయాడు. బిల్లీ నన్ను తీసికొనివెళ్ళేవాడు. ఆలాగే నన్ను చేరుకొనుటకు ప్రయత్నించేవాడు. మీకు తెలుసా? ఆ ప్రజలు చాలా పిరికి వారు, వారు ఎవరికీ హాని చేయరు. ఆలాగే వారి మీదుగా నీవు వెళ్ళిపోవాలి, లేని యెడల జన సమూహము క్రింద నలిగి పోవలసియుండును. ఏమీ జరుగుతుందో మాకు తెలియదు. చూశారా. లేనిచో త్రొక్కులాటలోనే చనిపోవటం జరుగుతుంది. వారి గుండా నీవు దూసుకొని పోవలసినదే.
దేవుని కృపను బట్టి నేను తిరిగి గృహము చేరుకొన్నారు. నేనెంతో చెప్పగలను, కాని ఇది ఆదివారపుబడి సమయము. నేను ఇపుడు మిషనరీగా మాట్లాడుచుండగా దేవుని వాక్యము బోధించటం చేయను.
39
ఏమైనా కేర్ ప్యాక్‌లు మీకున్నట్లయితే, మీకు నా సలహా ఏమిటంటే, వాటిని ఇండియాకు పంపండి. నాకు జర్మనీ మీద ఏమీ వ్యతిరేకము లేదు - ఇతరులందరి కంటే వారు మంచివారు. కానీ సోదరుడా, సోదరీ, ఈ వస్తువులన్నిటిని వారికి పంపించి వారిని బాగా నిలబెట్టి, తరువాత వారితో మరొక యుద్ధాన్ని తెచ్చుకొంటాము. చూశారా. అది నిజము. వాటి అవసరత నిజముగా ఎక్కడ వున్నదో అక్కడికి వాటిని పంపుదాము, చూశారా. మీకేమైనా పంపాలని వుంటే దానిని ఇండియా దేశము పంపండి. వారే అవసరతలోవున్నవారు, పేదవారు, చదువులేని వారు; వారికి సహజ సంపదలున్నవి, కాని వాటిని అభివృద్ధి పరచుకొనే జ్ఞాన సంపద వారికి లేదు. వారికి తెలిసినదంతా భిక్షము అడుక్కొనుటమే, వారు చేసేది అది మాత్రమే.
40
నాకు వేటాడటం బాగా ఇష్టమని మీకు తెలుసు. వారు తమ ఖర్చులతో నన్ను తీసికొని అక్కడ బాంగెల్ పులిని వేటాడుమని చెప్పారు. నేనన్నాను, ''నాకు ఒక సహాయము చెయ్యండి, నా కొరకు మీరు ఖర్చు పెట్టే అదే డబ్బును తీసుకొని, బయట వున్న పేద ప్రజలకు భోజనం పెట్టండి. నేను వేటాడకుండానే ఇంటికి వెళాతాను.'' చూడండి. అది నిజము. ఏలయనగా నేను ఇంకెక్కడికైనా వేటకు వెళతాను.
మీకు ఏమైనా పాత బట్టలు ఉన్నట్లయితే, ఇంకా ఏదైనా మీరు పైకి పంపవలసినట్లయితే దానిని ఇండియాకు పంపండి. చూడండి? ఇప్పుడు నేను దరిదాపు ప్రపంచమంతా ప్రయాణము చేసినాను కాబట్టి నేనేమి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. ఓ క్రైస్తవ సోదరుడా, ఇండియా దేశము అవసరతలో యున్నది.
41
ఇప్పుడు, నేను ఇంటికి వచ్చాను; నాకు తెలిసినంతవరకు, నా శాయశక్తులంతటితో, ప్రభువు నాకు చెప్పిన వాటన్నిటిని నెరవేర్చియున్నాను. ఈ పోయిన వారము జరిగిన ఒక సంఘటన గూర్చి నేను మీకు చెప్పబోవుచున్నాను.
నేను గవర్నరుతో రాత్రి విందు చేయుచుంటిని. వారు నాకు గొర్రె కాళ్ళతో వండిన పాత అన్నము ఇవ్వవలసియున్నారు. అది ఒలీవ నూనెతో తాలింపు చేయబడినది. మీరు ఊహించండి, అది ఎంతో చప్పగా వున్నది. ఆ ఆహారాన్ని నేను తట్టుకోలేక పోయాను, అది నన్ను బలహీనపరచినది. నేను దరిదాపు వాంతి చేయుటకు సిద్ధమయ్యాను. గవర్నరు గారు అంతా చూచి అన్నాడు, “ఏమండి, మీకు బాగా లేదని అనుకొనుచున్నాను.”
నేనన్నాను, ''ఓ ఆహారము కొంచెము తేడాగా వున్నది.''
42
మేము హోటల్‌కి వెళ్ళినపుడు అక్కడ గవర్నరు యొక్క డాక్టరు నా కొరకు కనిపెట్టుకొని యున్నాడు. ''నేను మిమ్ములను పరీక్షించాలి నేను గవర్నరు గార్కి పరసనల్ డాక్టరును,'' అన్నాడు.
నేనన్నాను, ''నేను బాగానే యున్నాను.''
ఆయన చక్కగా పెద్ద మనిషి వలె నన్నంతా తిరిగి చూస్తూ మాట్లాడటం ప్రారంభించాడు. ''మీరు బాగానే యున్నారు అనుకుంటా,'' అన్నాడు. నా రక్త ప్రసరణ చూసేవరకు అంతా బాగానే యుంది. నా వైపు తిరిగి చూచి అన్నాడు, “మీరు బాగా అలసిపోయి లేరా?''
''అవునండి,'' అన్నాను. నేను ఆయనకు ఆ కూటముల ప్రభావమును, ఆ దర్శనములను చెప్పాను.
“మీరు ఎలా జీవించుచున్నారో నేను గ్రహించలేకపోతున్నాను,” అన్నాడు. ''మీ యొక్క రక్త ప్రసరణ ఎంతో తక్కువగా పడిపోయింది, మీ నరములు ఎంత బలహీనముగా వున్నాయంటే, చివరకు అవి రక్తమును పైకి పంపు చేయలేక పోతున్నాయి,'' అన్నాడు. చూశారా? ''మీ యొక్క రక్తపోటు అపాయకరంగా ఎంతో తక్కువలో వుంది. మీరు ఇక్కడ ఇంకా ఎంత కాలము ఉండగోరుచున్నారు?''
నేనన్నాను, ''ఇంకా రెండు కూటముల వరకు.''
మంచిది, ''మీరు సాధ్యమైనంత త్వరగా అమెరికా వెళ్ళిపోయి మంచి వైద్యునితో పరీక్ష చేయించుకోండి, ఇంకా కొద్ది కాలము వరకు మీరు ఏ కూటములు పెట్టవద్దని సలహా ఇస్తున్నాను,'' అన్నాడు. ''అది ఎలా కుదురుతుంది,'' అని నేనాయనతో అన్నాను. ఆయన వాటిని ''హద్దులు'' (dimensions) అన్నాడు, చూశారా ఒక హద్దు నుండి మరొక హద్దునకు ప్రవేశించటం.
43
మంచిదండి, ''నేను ఇంటికి వెళ్ళినపుడు, అమెరికా ప్రజలకు కొన్ని కూటములను వాగ్ధానము చేశాను, వారికి కొన్ని కూటములు ఇచ్చాను,'' అన్నాను. ''ఇప్పటి నుండి అది కుదరదు. నేను వారి కొరకు ప్రార్థిస్తాను,'' అన్నాను, చూశారా.
మరియు దానికి కారణం నేను చూస్తాను, అది మనము ఆశించినంత ప్రభావమును చూపలేదు. ఓరల్ రాబర్ట్స్ ఇంకా అలాంటి వారు కూటములు పెట్టినపుడు, నా కంటె ఎక్కువ మంది వారి కూటములలో రక్షణ పొందుతారు. ఈ గొప్ప దైవిక వరమును లేక ప్రవచనాత్మకమైన వరమును, దైవిక స్వస్థతా విధానము నేను దానిని తప్పుగా ఏదో వాడానని నేను నమ్ముచున్నాను; అది దేవునిని సంతోషపరిచిందని, నేను అనుకొనను లేక నేను అలా చేయటం ద్వారా దేవుడు దానిని ఎక్కువ తలంచునని నేను అనుకొనను, కారణము అది అలాంటి ప్రభావమును కలిగించలేదు.
ఆ ప్రజల గురించి ఎన్నడూ ఆయన నాకు చెప్పలేదు, మీకు తెలుసా. అది ఒక సారి జరిగిందని ఆయన చెప్పాడు. మోషేను కూడా ఆయన ఆ రీతిగానే చూపాడు. మోషే ఐగుప్తులోనికి వెళ్ళి ఒకేసారి తన అద్భుతములను చేశాడు. దానిని స్థిరపరచెను. అతడు తన చేతిని తీసినపుడు, కుష్ఠము స్వస్థతనొందెను; తన కర్ర పడవేసినపుడు అది పామాయెను, మరలా దానిని తీసికొన్నప్పుడు మరలా అది కర్రాయెను, మరియు అది దానిని స్థిరపరచెను.
మరియు నేను అనుకుంట, పది సంవత్సరముల పాటు అమెరికాలోని ప్రతి పట్టణముగుండా దువ్వుకొంటూ ముందుకు, వెనుకకు సంచరించిన తరువాత ప్రజలు అది సత్యమని గ్రహించారు, చూశారా. ఈ సారి ఇక ప్రజల కొరకు ప్రార్థించాలి, అదే నేను చేయ తలపెట్టినది.
44
నేను మీకు చాలా మంచిగా యుంటిని. మీకు తెలుసా మిమ్ములను నేను ప్రేమించుచున్నాను, దేవునికి అది తెలుసు. నేను ఏకాంతముగా ఉండవలసియున్నాను. అమెరికా అంతటా కూటములలో నేను ప్రజలతో కరచాలనము చేయాలని ఎంతో ఆశించాను. దానిని చేయలేక పోయాను, చూశారా. ఆ దర్శనము ఎలాంటి ప్రభావమును మీకు చూపుతుందో నాకు తెలియదు. మీరు ఆ వ్యక్తి ముందు నిలబడగానే అక్కడే వుంటుంది మరియు కొన్నిసార్లు నేను దానిని ప్రజలకు చెప్పను, కాని ఆ వ్యక్తి ముందు అది వుంటుంది. ప్రజల సంగతులు నేను కనుగొంటాను, అది నాకు తెలియపోతే బాగుండు అని కోరుకు౦టాను. వాళ్ళు నా స్నేహితులైన వారు, అయినను, అది తప్పు అని నీవు ఎరుగుదువు. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి నాకు అనుమతిస్తే, అవి మీకు చెపుతాను; అవి మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి.
అది ఆయన చిత్తమో కాదో, నేను పరిశుద్ధాత్మను అడిగాను. నేను గుడారమును విడిచి పెట్టినపుడు ఎట్లు వున్నానో, ఆ స్థాయికి ముందు నన్ను తేరుకోనివ్వండి; ఆయన ఏదైనా చెప్పటానికి ముందు, అక్కడ వుండనివ్వండి, నేను ప్రజల ముందు నిలబడటానికి ముందు అంతా ప్రశాంతమవనివ్వండి, అది దర్శనము కాదు. అది ఎలా వుంటుందంటే: అతని స్థితిని చూడకుండా, ఒక సహోదరునితో మాట్లాడగలను. ఆ తరువాత అతని కొరకు ప్రార్థన చేస్తాను, చూశారా, ఆ రీతిగా.... అది చేయమని నేను దేవునిని అడిగాను.
45
నేను ఇంటికి వచ్చాను. ఇంటి దగ్గర ఎవరూ లేరని నాకు తెలుసు. అది మంచి సంగతి. నేను అక్కడ ఐదు దినములున్నాను, నేను కనీసము కదలలేకున్నాను. నేను ఎలాంటి స్థలానికి వెళ్ళానంటే, నా ఎముకలలో పోటు వచ్చుచున్నది. కారణము అది మార్పు, ఖచ్చితంగా బొంబాయికి మనకు మధ్య పదకొండున్నర గంటల తేడా వున్నది. ఇప్పుడు అదే సమయము కావస్తుంది. ఇప్పటికి ఒకటి లేదా రెండు గంటలు నిద్రపోయి వుంటాను. చూశారా. అది రాత్రి సమయము, ఇప్పుడు అంతా మారింది. మరియు రక్త ప్రసరణ బహు బలహీనమైనది, చివరకు నేను పైకి క్రిందికి లేవటమే కష్టమైంది. అది అంతే. ఎక్కువ చేయుటకు ప్రయత్నము చేస్తూ, దానిని నాకు నేనే నా మీదికి తెచ్చుకొన్నాను. ఇప్పుడు, దేవుని కృప వలన నేను ఇంటికి తిరిగి వచ్చాను.
మరియు వచ్చే వారము, నేను వెళ్ళిపోవుచున్నాను, రెండు లేక మూడు వారముల ముందు; ఒంటరిగా వుండి, మొదటిగా ప్రార్థిస్తూ, నాకు నేను గడపాలనుకొనుచున్నాను. ప్రభుని చిత్తమైతే, నేను వేటకు వెళ్ళబోవుచున్నాను. నేను దానిని చేయుటకు ముందు, నేను ఆ రుతువులకు కొన్ని దినముల ముందు పోవుచున్నాను. నేను కొలరెడో కొండల మీదికి పోవుచున్నాను. నేను అక్కడ రెండు లేక మూడు వారములు, లేక ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకొనుచున్నాను, ఎంతో ఒంటరిగా ప్రశాంతముగా ''దేవా, ఇదిగో నేనిక్కడున్నాను,'' అని చెపుతాను.
46
నేను తిరిగి వచ్చి శ్రీ. మిషలర్ గార్ని మరలా.. ఒక ఉద్యోగము అడుగుతాను, తిరిగి పబ్లిక్ సర్వీస్ కంపెనీలోనికి.
ఆయన నాకు ఏమి చేయమని చెప్పాడో దానిని నేను నెరవేర్చాను. మరియు ఈ ఉదయమున నేను గుడారము నొద్ద నిలబడియున్నాను, ఇది వరకు పది సంవత్సరాల క్రితము విడిచినట్లు వలె. నాకు మేనేజరు లేడు. నా మేనేజర్ ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చాడు. నాకు మేనేజరు లేడు. నా పిల్లవాడు వెళ్ళిపోవుచున్నాడు. ఆ వెనుక కూర్చొనియున్న నా పిల్లవాడు సైన్యములోనికి వెళ్ళుచున్నాడు. అతడు నాకు స్నేహితుడై యున్నాడు. నాతో అతక్కుపోయాడు.
వారిలో కొందరు నాతో ఎప్పుడూ వాదన చేసేవారు, ''నీతో బిల్లీ ఎందుకు?''
తల్లి లేని స్థితిలో అతడు పాలు త్రాగుతూ వున్నప్పటి నుండి, ఆ కుర్రవాడిని నేను ఎలా నా చేతులలో చుట్టుకొనియుండే వాడనో, మీకది తెలిసివుంటే తెలుస్తుంది. అతని పాల సీసాను వేడిచేయటానికి, ఇంట్లో ఏమీ నిప్పులు లేని స్థితిలో, రాత్రి వేళలలో నేను అతని పాల సీసాను నా తలక్రింద పెట్టి ఉంచుకొనేవాడిని, ఆ రీతిగా పాలిచ్చేవాడిని. నా మార్గమంతటి గుండా అతడు నాకు తొడుయైయున్నాడు. ప్రభుని చిత్తమైతే, మేము ఆ రీతిగానే చనిపోవాలను కొరుచున్నాము.
బహుశా తిన్నగా సైన్యములోనికి వెళ్ళిపోవచ్చు; నిన్న అతడు తీర్మానము చేసే పత్రములొచ్చినవి, అది స్వేచ్ఛాపూర్వకము గానా, తప్పనిసరిగానా అని. మంచిది, నేను అతనిని కలిగియుండను.
47
నేనిక్కడున్నాను, కాని నాయంతట నేను ఇక్కడికి రాలేదు. చూడండి నా తల్లి గర్భము నుండి నన్ను ఇక్కడికి తెచ్చిన వారున్నారు, ఎవరు నాకు భోజనము పెట్టారు, ఎవరు నన్ను ఈ కఠినమైన శ్రమల గుండా తీసుకొని వచ్చారు. ఇంత వరకు క్షేమముగా ఆయన కృపయే నన్ను తోడుకొని వచ్చింది. ఆయన ఇక ముందునూ నన్ను తోడుకొని పోవునని నమ్ముచున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ వుండాలో ఆ స్థానమునకు వచ్చియున్నాను.
ఇప్పుడు లేఖనములలో ఒక భాగమును మనము చదువక ముందు, నేను సంఘమును మరొక విషయం అడుగగోరుచున్నాను, మీరు నా కొరకు ప్రార్థించండి. ఒక చిక్కైన ఆత్మ నాలో పెరిగింది, మరియు అది నన్ను వెంటాడుచున్నది. మొదటి సారిగా నా భార్యకు నిన్న, నేను ఆ సంగతి చెప్పాను. నేను పెరట్లో కూర్చొన్నప్పుడు ఏదో సంభవించింది, నేను దానిని ఆమెకు చెప్పాను. నేనన్నాను, ''హనీ, నేనిప్పుడు ఎలాంటి స్థితికి వచ్చానంటే, ప్రజల పట్ల కరుకుగా మారను.“ అలా వుండుట నాకిష్టము లేదు.... అది ఎవరి పనియై యున్నది? అది నాపని కాదు. మరియు దేవుడే విమర్శించే వాడు, నేను కాదు.
48
శ్రీమతి. డవుడ్ అనే స్త్రీ అక్కడకు వెళ్ళి యుండెను. మీరు ఆమెను గూర్చి ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. ఓ, ఎంత అవమానము, అది ఇండియా దేశములో ఆ పని చేయటం. ఆ కారణమును బట్టియే మన కూటములను బహిరంగ స్థలములలో పెట్టలేక పోయాము. ఆమె అక్కడికి వెళ్ళి ప్రజల దగ్గర నుండి కానుకలు తీసికొనటం ప్రారంభించింది. ఏలయనగా వారు ఆ చిన్న రూపాయిని ఇవ్వలేరు...
ఒక పేద స్త్రీకి ఉద్యోగము ఉందంటే, ఆమె సున్నపు గచ్చును తన తల మీద మోసుకొంటూ, ఎతైన మెట్లు ఇంకా అలాంటి వాటి మీద ఐదు గంటల నుండి పది గంటల వరకు పనిచేస్తే, ఆమెకు ఒక రూపాయి వస్తుంది. అనగా 21 సెంట్లు. చూచారా. ఆ ఉద్యోగమును కాపాడుకొనుటకు ఆమె కష్టపడి పనిచేయవలసియున్నది. ఒక స్త్రీ, తన చిన్న పిల్లలను పోషించుకొనుట కొరకు, ఆ రూపాయి అనగా 21సెంట్ల కొరకు తన మోకాళ్ళు లోతు బురద నీళ్ళలో కష్టపడవలసియున్నది.
అలాంటి చోట, ప్రజలలో సందడి చేస్తూ, ఆ రూపాయలను తీసుకొని వాటిని అమెరికా డబ్బులోనికి మార్చుకోవటమా! వారన్నారు, ''మీరు మాకు సహాయము చేయకుండా, మాకున్న దానిని తీసికొని వెళ్ళుటకు వస్తారా!''
49
అక్కడకు వెళ్ళుటకు లేదా వచ్చుటకు, వారు ఒక చిన్న పైసా కూడా నాకు ఇవ్వనవసరము లేదు. మేము ఇటు అటు తిరగటానికి, ఆడిటోరియం అద్దెలు కట్టటానికి, హోటల్ బిల్లులు ఇంకా తదితర ఖర్చులు అన్నీ మేమే చెల్లించి వేశాము. ఇంకా మిగిలిన డబ్బులు నేను తీసికొని, ఏదో సొసైటీకి ఇవ్వలేదు గాని ఆకలి బాధతో అలమటించిపోతున్న పేద ప్రజలకు ఇచ్చి వేశాము. మీ డబ్బు అక్కడికే వెళ్ళినది. అక్కడికే మీ డబ్బు వెళ్ళినది. అది కచ్చితముగా, నాకు తెలిసినంత వరకు అది సరియైనది, నా మట్టుకు నేను చేశాను. ఇంకా ఎక్కువ డబ్బు ఉండి వుంటే దానితో ఇంకా అదే చేసే వాడిని, అదే నేను కోరుకొన్నాను.
50
ఇప్పుడు, కాని, సోదరుడా, సోదరీ మనము మాట్లాడుకొన్న ఆ స్త్రీ (శ్రీమతి. డవుడ్) వారి దగ్గర సందడి చేసి కానుకలు తీసింది. వారన్నారు, ''నీవు మాకున్నది తీసికొని వెళ్ళటానికి వచ్చావు. మాకు సహాయం చేయటానికి కాదు. నీవు మాకు సహాయము చేయటానికి వచ్చావను కొన్నాము.'' మరలా ఆమె దైవిక స్వస్థత వరముగలదంట.
నేను పశ్చిమ తీరమున ఉన్నపుడు, నా మీద ఆమె కోపముతో వున్నది. ఆమె అన్నది, ''హౌవ్వార్డ్,'' ''మీ నాన్నను నేను చూడగోరుచున్నాను.'' ఆమె ఒక ఐగుప్తు వ్యక్తిని వివాహము చేసికొన్నది. ''నేను ఇండియా కూడా వెళ్ళుచున్నాను అన్నది.''
నేనన్నాను, ''మంచిదమ్మా, ఆ అభిషేకము వారిపై నున్నపుడు, ప్రజలు అలా ముందుకు రారు.''
ఆమె అన్నది, ''నేను శ్రీమతి. డవుడ్‌నని ఆయనకు చెపుతారా!“ అన్నది. ”నేను ఆయన కంటె ముందు ఇండియా వెళ్ళినపుడు, ఆయన వచ్చే సమయం వరకు పరిస్థితులన్నీ అదుపులో వున్నాయి.“ ''ఏమైనప్పటికి, ఆయన పెట్టిన కూటముల కంటే, నా కూటములు గొప్పవి.'' మంచిది కావచ్చు, నాకు తెలియదు.
51
అది ఆమె నియంత్రణలో వుండటం అనే దాన్ని తలిస్తే, అది ఎంత వరకు వచ్చిందంటే బహిరంగముగా కూటములు పెట్టకూడదన్నంత వరకు వచ్చింది. అదే ఆ సంగతి వారు అల్లరి చేయటం ప్రారంభించారు, ఆమె అక్కడ నిలబడి, ''మీరు నల్ల దయ్యాలు!“ అన్నది. ఇంకా ఆ రీతిగా చెప్పింది. వారు ఆమెను పంపివేయుటకు ప్రయత్ని౦చారు, ఆమె అది చేయుటకు ఇష్టపడలేదు. ఎవరో ఆమెను తల మీద రాయితో కొట్టారు, అప్పుడు వారామెను బయటకు మోసుకుపోయారు. మరలా ఆమె మరొక పట్టణానికి వెళ్ళినపుడు బారన్ వాన్ బ్లాంబుర్గ్ గారు ఆమెను విడిపించటానికి, గొప్ప హత్యకాండ నుండి అనేకులను విడిపించటానికి ఆయన రాజును చూడవలసి వచ్చింది. అదే ఆమె పని, అందుచేత నేను దానిని చూచి విమర్శించాను.
52
నేను తిరిగి వచ్చాను, ఇప్పుడు మొదటిగా నా చేతులలో ఉంచబడినది, ది వాయిస్ ఆఫ్ హీలింగ్ మరియు నేను ఏ.ఏ. ఎలెన్ యొక్క మీటింగు చూశాను, అది ఎంతో లేఖనములకు వ్యతిరేకము. అప్పుడు నేను దానిని విమర్శించాను, మీరు గమనించారా, ఓ, నా దేవా, అనుకొన్నాను. కాని ఆ పేద ప్రజలను చూడండి, చక్కని ప్రజలు, యధార్థ హృదయము గల ప్రజలు, దానిని వెంబడించుచున్నారు.
నా చుట్టూ జరుగుచున్న ఈ సంగతులను చూచినపుడు, నా హృదయంలో విమర్శ చేయటం ప్రారంభిస్తాను. చూశారా. నాకు ఆ రీతిగా వెళ్ళుట ఇష్టము లేదు. నేను ఆ పని చేసినట్లయితే, దేవుని మెప్పును పోగొట్టుకొందును. చూశారా? అదే ముఖ్యమైనది...
ఆమెరికా వాసుల పోకడను చూడండి; స్త్రీలను చూడండి, వారెలా బట్టలు వేసికొంటారో; పురుషుని చూడండి, వారెలా ప్రవర్తిస్తారో, వారి త్రాగుడు, వారి సిగిరెట్లు, వారు చప్పరించటం, వారి శాపనార్థాలు, అవన్నీ నాకు వాంతికి వచ్చుచున్నవి. నేను దాని మరొక వైపును చూచినపుడు మరియు ఆ రెండింటి మధ్య చూస్తూ ఆలోచిస్తూ, ఓ, దేవా! కాని దీనిని వినండి: ఎవరి యుద్ధమిది? దేవుడున్నాడు, ''గోధుమలను గురుగులను కలిసి పెరుగనియ్యండి. ఆయన దూతలు వచ్చి అంత్య కాలములో వాటిని వేరుచేస్తారు.'' అది నేను కాదు.
53
కాబట్టి నా చేతులెత్తి బలిపీఠము దగ్గర నిలబడియుండగా; ఎవరినీ నేను విమర్శించకుండ మీరు నా సహాయము చేయండి. దేవుడు నాకు వారిని విమర్శించుటకు బదులుగా ఎలాగైనా వారిని ప్రేమించే ఆత్మను దేవుడు నా హృదయములో ఉంచి, అలా ముందుకు సాగిపోవునట్లు మీరు నాకు సహాయపడండి.
నేను మామూలు మనిషిని అయ్యే వరకు అది నన్ను పదేపదే అరుగ దీయుచు, మరలా అరుగదీయుచు సానపట్టుచున్నది. మీరు చూశారా, నా మానసిక శక్తులు ఆ రీతిగా బ్రద్దలగుచున్నవి. కొంత విశ్రాంతి కొరకు ఇక్కడ నుండి నేను వెళ్ళిపోవలసియున్నది.
దాని కొరకే నేను వెళ్ళిపోవుచున్నాను, ఒంటరిగా వుండి దేవుడు నా నుండి ఆ క్లిష్టమైన అనుభూతిని తీసివేసి, నన్ను తిరిగి క్రిందికి కరగించునట్లు దేవునికి ప్రార్థిస్తాను. ఇప్పుడు, నేను వెళ్ళి ఆ రీతిగా ప్రవర్తించవచ్చును, కాని అది నా హృదయములో నుండి రాదు. అప్పుడు నిశ్చయంగా నేను వేషధారినౌతాను, చూశారా. ప్రేమగా లేని వారిపట్ల నాకు నిజముగా ప్రేమ వున్నట్లు అది నా హృదయములో నుండి రావాలని కోరుచున్నాను. అది యేసు చేశాడు. నేను క్లిష్టదశలో వున్నప్పుడు, నేను విమర్శింపబడవలసి వచ్చినపుడు, ఇంకా ఎలాగైనా ఆయన నన్ను ప్రేమించాడు. కాబట్టి ఆ రీతిగా నేను ఉండగోరుచున్నాను, మీరు నా కొరకు ప్రార్థించండి.
నవంబరు, ఆ ప్రాంతములో మరలా మిమ్మును చూడగోరుచున్నాను, అప్పుడు తిరిగి వచ్చి మన ఆలయములో ఉజ్జీవ కూటములను పెడదాము.
54
ఇప్పుడు, ఇంకొక విషయము నేను చేశాను, మరొక సంగతి. చేతి గుడ్డలను అభిషేకించటం తప్ప, ఇప్పుడు వ్యాధిగ్రస్థుల కొరకు నేను ప్రార్థించుట లేదు. నేను ఆ దర్శనము నుండి దూరముగా ఉండగోరుచున్నాను, మీరు చూశారా. మరి ముఖ్యముగా, నేను ఇప్పుడు ఇంత బలహీనతతో ప్రజల ముందు నిలబడినట్లయితే, మీరు దానిని ప్రారంభిస్తారు. మరలా ఆ దర్శనము తిరిగి వస్తుంది. నేను దూరముగా వెళ్ళి, నన్ను నేను ప్రశాంతపరచుకొని, మరలా ఆ రీతిగా తిరిగి వచ్చి మరొక కూటమును జరిగిస్తాను. మీరు నా కొరకు ప్రార్థించండి, చేయరా? తరువాత ప్రార్థనా వస్త్రములను వ్యాధిగ్రస్తులకు బాధపడుచున్న వారికి మెయిల్‌లో పంపాలని నేను ప్రార్థన చేయుచున్నాను.
అయితే, ప్రజలు నన్ను ప్రార్థన కొరకు పిలచినపుడు, వారిని బ్రదర్ నెవిల్‌ను చూడమని చెప్పుచున్నాను, లేక ఇంకా వారిలో కొందరిని వెళ్ళి ప్రార్థించమని చెప్పుచున్నాను.
కారణము, నేను మనిషి ముందు నిలబడినపుడు, అది నన్ను మరలా దానిలోనికి కదిలిస్తుంది, చూశారా మీరు. మరియు నేను దానినుండి దూరముగా పోవాలనుకొనుచున్నాను. కాబట్టి నన్ను నేను ఆయన సన్నిధిలో వుంచుకొని “ప్రభువా, ఇప్పుడు నీ చిత్తము, ఎప్పుడైనా ఏదైనా నేను తెలిసికోవాలని మీరు కోరితే దయచేసి నాకు తెలియజేయండి. దానిని మీరు మరలా చెప్పమని నన్ను చెప్పేంత వరకు, ఆ రహస్యాన్ని నాలోనే దాచుకొంటాను.” నా ఉధ్ధేశ్యము మీరు చూశారా? అప్పుడు బయటకు వెళ్ళి వ్యాధిగ్రస్థుల కొరకు ప్రార్థిస్తాను, మరియు నా సేవను పూర్తిగా మార్చివేస్తాను. నేను ఇది వరకు జరిగించిన కూటముల కంటే మంచి కూటములు ఎక్కువ కూటములు పెడతాను.
మనము తలలు వంచుచుండగా, ప్రభువు మిమ్మును దీవించును గాక!
55
పరలోకపు తండ్రి, పంపిన పనులను గూర్చి మాట్లాడే సమయము మీరు మాకు ఏ రీతిగా సహాయము చేశారో, మమ్ములను ఎలా దీవించారో దానిని బట్టి ఈ ఉదయమున మీకు వందనములు. అలలు పైకి దొర్లుతూ వుండగా గొప్ప శోధనల మధ్య తిరిగి నేను గృహము చేరగలనా అని, నేను ఎన్నిసార్లు తలంచినానో కాని, మరలా ఇక్కడ వున్నాను. ప్రభువా, మీరు నన్ను ఎల్లప్పుడు తిరిగి తెచ్చెదరు. ఈ సంఘమును బట్టి, కాపరిని బట్టి, ఈ ప్రజలను బట్టి నీకు వందనములు. మమ్ములను దీవించుము.
తండ్రీ, ఈ ఉదయము, నా హృదయము ఇండియా దేశము అంతటా వీధులలో పడియున్న వారిని చూస్తు తలంచుచున్నది. ఆ తీరము వెంబడి పల్లపు ప్రాంతముల నుండి, జన సంచారము లేని చిన్న పాత గుడిసెలలో వున్న ఆ పేదవారు, ఆకలితో అలమటిస్తున్నారు, విద్యలేని పామరులు యేసుక్రీస్తును ఎరుగక మూఢ భక్తితో విగ్రహములను పూజించే వారిని జ్ఞాపకము చేసికొనుచున్నాము. తండ్రీ, ఇప్పుడు నేను మిమ్ములను ఎరిగే భాగ్యము దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను; నిన్ను ఎరుగుటయే నిత్యజీవము.
56
ఇప్పుడు నాకు సహాయము చేయమని ప్రార్థించుచున్నాను. ప్రభువా, నీ సేవకుని నుండి క్లిష్టమైన ఆత్మను తీసివేయుము. దేవా, అది చెయ్యటం నాకు ఇష్టము లేదు... మనుషులలో తప్పుంటే, నీవే వారికి తీర్పరివి. ఎలాగైనా వారిని ప్రేమి౦చునట్లు చేయండి. మీరు చేయుదురా తండ్రి? స్త్రీలు అసభ్యముగా బట్టలు వేసికోవటం, తమ్ము అపవిత్రముగా చేసికొని వేశ్యలుగా మారటం, మా దేశం కుళ్ళిపోవటం, దేవా నీవు చెప్పినప్పుడు నేను చరిత్రను ఎట్లు మార్చగలను? నేను ప్రేమగా, దయగా వుండుటకు నీ సేవకునిగా నీ చిత్తము చేసేవానిగా వుండుటకు నాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రీ, నీ మహిమ కొరకు ఈ సంగతులను అడుగుచున్నాను.
ఇప్పుడు మమ్మును ఆశీర్వదించండి. కొంచెము వాక్యము బోధించమని నన్ను అడిగారు. తండ్రీ, ఇప్పుడు ఒక చిన్న వర్తమానమును దయచేయుము. ఇది ఒక గొప్ప దినముగా వుండునట్లు, వాక్యము బయలు వెళ్ళును గాక. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
57
మంచిది. ఇప్పుడు పావు తక్కువ పదకొండు అయినది. అంతేనా? మంచిది, ఇంకా ముప్పది ఐదు నిమిషములు మనము తీసికోవచ్చా? అది సరియేనా, పదకొండున్నరకు మనము బయటకు వెళ్ళిపోతాము? ఆమేన్. ఇప్పుడు మనము ఎక్కడున్నాము?
నేను అక్కడ కూర్చొని, పాత నిబంధనను ఉపదేశించుటను గూర్చి ఆలోచించుచున్నాను. సామాన్యముగా మీరు ఎల్లప్పుడు పాత నిబంధనలోనికి వెళ్ళతారు. ఎవరో అన్నారు, ''బ్రదర్ బ్రన్హం పాత నిబంధన కంటే ఇంకేమీ మీకు తెలియదా?'' అది మంచిది. నేను దానిని నేర్చుకొన్నప్పుడు, అప్పుడు నేను క్రొత్త నిబంధనను నేర్చుకొంటాను. నీవు ఒక దానిని తెలుసుకొన్నప్పుడు రెండింటిని నేర్చుకొంటావు. చూడండి, అవి రెండూ కలిసి యున్నవి.
ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలో ఒక భాగమును చూద్దాం, మీరంతా ఎక్కడ చదువుచున్నారో లేదో నాకు తెలియదు. యోహాను సువార్తను విందాము. యోహాను సువార్త మొదటి అధ్యాయమునకు వెళ్ళుదాము, యోహాను సువార్త ప్రారంభిద్దాం. నేను దాని వైపు తిరుగుచున్నాను. మనమంతా యోహాను సువార్తను చదవటం ప్రారంభిద్దాం. అందరూ చక్కగా తీసారా? మంచిది, యోహాను సువార్త మొదటి అధ్యాయము.
58
ఈ వచ్చే బుధవారము రాత్రి కావచ్చు, నేను విన్నాను.... ఈ రాత్రికి నేనే మీతో వుంటాను. బుధవారంలోపు మనము విడువము, కాబట్టి నేను బుధవారం రాత్రి వుంటాను. నిశ్చయముగా, వచ్చే గురువారము లేక శుక్రవారము, మేము వెళ్ళకముందు ఒక రోజు. కాబట్టి బుధవారం రాత్రికి ప్రభువు చిత్తమైతే నేను కూటమునకు ఉంటాను. బుధవారం రాత్రికి, ప్రభువు చిత్తమైతే కొంత నేను ఉపదేశిస్తాను.
సహోదరుడు ప్లీమేన్ మంచి సలహా ఇచ్చారు, మీరు కోటు తీసివేసి, మీ ఇంటి యొద్ద వలె వుండండి అని.
59
ఇక్కడ ఎవరైనా, ఎవరి మీదైనా వ్యతిరేకముగా వున్నారా? అలా వుంటే మీ చేతులెత్తి వారి యొద్దకు వెళ్ళండి. ఇప్పుడు, ఈ ఉదయం దీనిని ఒక గొప్ప ప్రేమ విందుగా చేద్దాం. మీరేమంటారు? ప్రతి ఒక్కరు మీకేది వున్నప్పటికి, ఆ వ్యక్తి ఇక్కడ లేకపోయినప్పటికి, మనం ప్రభువైన యేసు అని ఇప్పుడే దానిని రక్తము క్రింద పెడదాం; ఈ దినము నుండి, దానిని నేనిక ఎంత మాత్రమును తలంచను. ఇప్పుడే వెళదాం, ఇప్పుడే అంతా క్రొత్తదిగా ప్రారంభిద్దాం.
ఓ, నీవు ఎంత సంతోషముగా వుండవలయునో నీకు తెలిస్తే చాలు. ఈ లోకములోని మతములన్నిటిని చూస్తున్నప్పుడు, ప్రతి ఒక్కటి అది వుండవలసినంత అడుగులేని అగాధంగా వున్నది. ఒకటే నిజమైనది ఉన్నది: అది ప్రభువైన యేసు సువార్త, అది మెతడిస్టు నుండి కాని, బాప్టిస్టు నుండి కాని, ప్రెస్బిటేరియన్ సంఘము నుండి కాని సంబంధం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు సత్యము. ఆమేన్. చూడండి, అది ఎక్కడ నుండి వచ్చునో అది ముఖ్యము కాదు, క్రైస్తవ్యము తేటగా ప్రకాశించును. అది ఒక్కటి మాత్రమే అన్నిటిలో పునాది కలిగినది. మిగతావన్నీ.... లోకమునకు ఒకే నిరీక్షణ అది ప్రభువైన యేసు రక్తబలి మాత్రమే.
నేను వారి మతములను చూశాను. వారి విగ్రహాములను చూశాను. వారి మూఢ విశ్వాసములను చూశాను. వారి దేవుళ్ళనందరినీ చూశాను, వాటిని చదివాను, మరియు, ఖురాను చదివాను, ప్రతి దానిని చదవటం నాకు తెలుసు. అన్నీ, వాటిలో ప్రతిది మూఢ ఆచారములే. కాని యేసుక్రీస్తు, దేవుని కుమారుడే ఈ లోకమునకు ఏకైక నిరీక్షణ, అది నిజము. నీవు ఉన్న పాటున దానిని మెచ్చుకొనేటట్లు అది చేస్తుంది. ఎన్నడైనా మరణము నుండి లేచిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన మరణము నుండి తిరిగి లేచాడని దానిని మనము నిరూపించగలము, ఆయన నేడు జీవించుచున్నాడు. ఆమేన్. ఓ, బ్రదర్ నెవిల్ సోదరుడా! నేను క్రైస్తవుడుగా ఉన్నందులకు నేను ఎంత సంతోషించుచున్నానో నీకు తెలియదు. ఓ, నీవును తప్పక సంతోషించాలి.
60
ఇప్పుడు పరిశుద్ధుడైన, ఈ గొప్ప యోహాను సువార్త ప్రకారము, యోహాను ప్రభువుకు ప్రియమైనవాడు. ఈ పరిశుద్ధుడైన యోహానే ప్రభువు రొమ్మున ఆనుకొనిన ప్రియుడు అని మనము నమ్ముచున్నాము. ఆయన అపొస్తలందరిలో ఎక్కువకాలము, లేదా వారందరి కంటె ఎక్కువ కాలము జీవించినవాడు.
పేతురు తలక్రిందులుగా, కాళ్ళుపైకి తల క్రిందికి పెట్టబడిన సిలువ వేయబడినాడు. ఆంద్రెయ రెండు ప్రక్కల చేతులలో మేకులు కొట్టబడి సిలువవేయబడినాడు. పరిశుద్ధుడైన పౌలును రోమాలో శిరచ్ఛేదము చేసిన స్థలమును నేను చూశాను.
61
నేను చెప్పవలసినవి ఇంకా కొన్ని వున్నవి. (ఓ, ఈ సారి వచ్చినపుడు తెస్తాను.) హతసాక్షులైన వారందరి పటములు, సింహములకు ఎరగా వేయబడిన వారు అలాంటివన్నీ, నా పెద్ద పోల్డరులో అవన్నీ వున్నాయి, వాటిని ఇక్కడికి తెస్తాను, తెచ్చి ఒక దానిని ఒక పోల్ మీద మరొక దానిని మరొక పోల్ మీదపెడతాను. అప్పుడు, వాటన్నిటిని మీరు చూడవచ్చు, అన్నీ ఇంగ్లీషులోనే వున్నాయి.
62
గమనించండి. ఓ, ఎలాంటి హృదయం బ్రద్దలైపోయే దృశ్యము, వారు పౌలు తలను తెగనరికి అతనిని మురికి నీళ్ళ కాలవలోనికి ఎత్తిపడవేశారు. ఓ, నా దేవా, అతడు మహిమలో వుండే వరకు ఇక ఎంత మాత్రము ఆ గొడ్డలి అతనిని అంటుకోలేదు. ఆమేన్. అతడు చెరసాలలో కూర్చొని, “ఓ మరణమా నీ ముల్లెక్కడ? సమాధి నీ విజయమెక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు అని వ్రాయడంలో ఆశ్చర్యంలేదు. అతడింకా వ్రాశాడు, నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగును తుదముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు జీవకిరీటము దాచబడి యున్నది; ఆ దినమున నీతిమంతుడైన న్యాయాధిపతి, ఆ ప్రభువు దానిని నాకిస్తాడు.” ఓ, అది మిమ్ములను ఆలోచించేటట్లు చేస్తుంది:
గొప్పవారి జీవితములన్నీ మనకు జ్ఞాపకము చేయుచున్నవి,
మన జీవితములను కూడా మనము ఉన్నతమైనవిగా చేద్దాం,
కాని ఎడబాయుటలు వెనుక విడిచిపెడదాం
కాలము యొక్క ఇసుకలపై కాలిముద్రలు.
63
ఇప్పుడు, యోహాను, ప్రియమైనవాడు, బయలుపరచువాడు. బైబిలులో అనేక మంది యోహానులున్నారు. కాని ఈ యోహాను, పరిశుద్దుడైన యోహాను, ఈ ఉదయమున మనము ఆయన గురించి మాట్లాడుచున్నాము. యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడు, దేవుని చేత పంపబడిన వాడు.
మిషనరీ అనగా ''పంపబడిన వాడు.'' ఈ దినమున ప్రజలు “అపొస్తలులు కేవలము పన్నెండు మంది మాత్రమే,” అని చెప్పటం తరచు నన్ను ఆశ్చర్యపరుస్తుంది, చూశారా. మీరు దానిని వినియున్నారు. ఆ మాటకు అసలు అర్థము “పంపబడిన వాడు.”
పన్నెండు మంది లెక్క ప్రకారము పౌలు అపొస్తలుడు కాడు. మీరెప్పుడైనా గమనించారా, వారు మత్తీయను ఎన్నుకొన్నారు, యూదా స్థానములో మత్తీయను ఎన్నుకొన్నారు. అదే మనిషి చేసినది. తరువాత అతనిని గురించి ఎప్పుడూ మనము వినము. మీరు చూడండి. అతని స్థానమును తీసికొనుటకు దేవుడు పౌలును ఎన్నుకొన్నాడు. మరియు పౌలు ఏమీ చేశాడో చూడండి! చూడండి. అది మానవుని ఎన్నికకు మరియు దేవుని ఎన్నికకు వ్యత్యాసము చూపిస్తున్నది. అది కొన్ని పొరపాట్లు పట్ల కొన్ని విషయముల పట్ల నా హృదయములో గొప్ప కృపను ఇస్తుంది.
64
కొన్ని క్షణముల క్రితం రేడియోలో విన్నాను, డాక్టర్ డీహాన్ గొప్ప ప్రసిద్ధి గాంచిన అద్భుతమైన ఉపదేశకుడు, ఒక చక్కని వాడు, నా సోదరుడు. నేను నా హృదయమంతటితో ఆయనను ప్రేమించుచున్నాను; దేవునికి అది తెలుసు. ఎంతో గొప్ప వాళ్ళు కూడా పొరపాట్లు చేయటం చూస్తాము. అప్పుడు వెంటనే సహోదరుడు పొరపాటు చేయటం చూడగానే నేననుకొన్నాను, ''దేవా ఒక వేళ అలాంటివే నేను చేయవచ్చు కాబట్టి మీరు నన్ను దాటవేయండి.''
డాక్టర్. డీహాన్ అన్నాడు, నేను ఉదయము ఆలయమునకు వస్తూ వుండగా ఇది విన్నాను, “బాప్తిస్మము బైబిలులో ఒకేసారి అని మాత్రమే వున్నది.” చెప్పెను, “పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఆ మేడ గదిలోప్రతి ఒక్క అపొస్తలుని ముంచివేసి బాప్తిస్మము ఇచ్చింది. దానిని సూచించుటకు మనము నీళ్ళ ద్వారా బాప్తిస్మము పొందాము. ఆ సమయంలో మాత్రమే వారు పరిశుద్ధాత్మలో ఒకేసారి బాప్తిస్మము పొందారు. ఒకసారి మాత్రమే, బైబిలులో.''
''ఓ, డాక్టర్. డీహాన!'' అనుకొన్నాను
65
మరలా పది దినముల తరువాత ఫిలిప్పు వెళ్ళి సమరయులకు సువార్తను బోధించెను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అతడు వారికి బాప్తిస్మము ఇచ్చెను. అయినను పరిశుద్ధాత్మ వారి మీదికి ఇంకా వచ్చియుండ లేదు, పేతురు వెళ్ళి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.
రెండు మూడు నెలలు తరువాత.... పేతురు ఇంటి కప్పు మీద నుండగా అతనికి దర్శనము కలిగింది, అప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్ళెను. అప్పుడు వారంతా అక్కడ నిలబడి ఏకమనస్సుతో ప్రార్థన చేయుచుండిరి. “పేతురు ఇంకనూ మాటలాడుచుండగా, ఆయన ఆదిలో చేసినట్లు వలె పరిశుద్ధాత్మ వారందరి మీదికి దిగెను.” వారు ఇంకనూ నీళ్ళతో బాప్తిస్మము పొందలేదు, వారు నీటి బాప్తిస్మము ఇంకా పొంది యుండక పోవుట చూచి, పేతురు “మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు, బాప్తిస్మము పొందకుండా నీళ్ళకు ఆటంకము చేయగలడా?” ఆ చిన్న శరీరము ఎలా ప్రాతినిధ్యం చూపుచున్నదో చూశారా... ఓ, లేదు, లేదు.
66
కొన్ని సంవత్సరముల తరువాత, దాదాపు ఇరవై సంవత్సరముల తరువాత, పౌలు ఎఫెసునకు యొక్క పై తీర ప్రదేశములు సంచరించి వచ్చి అక్కడ కొందరు శిష్యులను కనుగొనెను. ఆయన వారితో అన్నాడు, మీరు విశ్వసించినపుడు పరిశుద్ధాత్మను పొందితిరా?
వారన్నారు, ''పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.''
అతడన్నాడు, ''అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరి?''
వారు, ''యోహాను బాప్తిస్మమును బట్టియే అన్నారు.''
యోహాను ''తన వెనుక వచ్చు వానియందు, అనగా యేసునందు మీరు విశ్వాసముంచవలెనని మారుమనస్సు విషయమై బాప్తిస్మము ఇచ్చెను.''
వారు ఆ మాటలు విన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. చూశారా, ఆదిలో జరినట్లుగానే అదే పద్ధతి. ఓ, అవును! పరిశుద్ధాత్మ బాప్తిస్మము, నీటి బాప్తిస్మము, ఇంకనూ నిలచియున్నవి, మరియు అది యేసుక్రీస్తు తిరిగి వచ్చు వరకును ఉండును.
67
కానీ అది ఎలాంటి పొరపాటు, ఎలాంటి గొప్ప పొరపాటు, ఆయన మళ్ళీ ఎంతో గొప్ప చురుకైన పండితుడు. నీవు ఎంత చురుకైనవాడవైనప్పటికి, నీకు ఎంత తెలిసియున్నప్పటికి, నీవు మనిషివని మరియు లోకములోని వారి వలె తప్పు చేస్తావని అది చూపెడుతుంది.“యుద్దము యెహోవాది.” అది నిజము.
68
నేను దర్శనముల ద్వారా దేవుడు చూపించిన సంగతులను చూస్తాను, మరలా వెను తిరిగి దానికి వ్యతిరేకముగా చేస్తాను. మీరు ఊహించగలరా? దేవుడు నాకు చూపెడుతున్నాడు! అది లిస్బన్‌లో చూశాను. నేనన్నాను, “ప్రభువా, నీ చేయిని నా మీద నుండి తీసివేయి; నేను నీ సేవకునిగా వుండుటకు యోగ్యుడను కాను.” ఆయన చెప్పిన ఒక సంగతిని చూడటం, మరలా నేను దాని గురించి అంతా మర్చిపోయి, మరలా చక్కగా అక్కడికే వెళ్ళాను. అది ఆలాగే జరిగింది. ఓ, దేవా, అక్కడ నేను ఎందుకు దానిని గుర్తుచేసికోలేకపోయాను, అని అనుకొన్నాను. చూశారా? ఇక్కడ, దానిని చిన్న కాగితము మీద వ్రాసి దానిని నా జేబులో పెట్టుకొని, మరలా తిరిగి అచ్చటికి ఆలాగే వెళ్ళి దానికి వ్యతిరేకముగా ఏదో చేశాను. మీరు చూశారా? నేను ఎంత మంచివాడనో దీనిని బట్టి కనబడుతున్నది. ఓ, వారి అందరిలో చెడ్డవాడను నేనే అది కావచ్చు. దేవుడు నిన్ను ఒక పని చేయమని చెప్పిన తరువాత, నీవు తిరిగి దానికి వ్యతిరేకముగా ఏదో చేసినట్లయితే, అది భయంకరము. చూశారా?
మీరు చూడండి, ఆ మనిషి ఎవరైనప్పటికి అతడు మానవ మాత్రుడు తప్ప మరేమీ కాదు. అతడు పొరపాట్లు చేయగలడు. కాబట్టి మనము ఒకరితో ఒకరము సహించుచు, సాధ్యమైనంత మంచిని చేద్దాము. అదొక్కటి మాత్రమే మనము చేయగలిగినది. మంచిది.
69
యోహాను, మొదటి వచనము. మీలోప్రతి ఒక్కరూ మీ బైబిళ్ళను తెరిచారా?
ఆది యందు.... (ఓ, దీనితో ప్రారంభించటం మంచిది, కాదంటారా?)
ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను. (విన్నారా!)
వాక్యమే ఆదియందు దేవుని యొద్ద వుండెను.
70
ఆలాగే క్రింద వరకూ తీసుకొందాము, 14వ వచనము. దీని మీద చాలాసార్లు నేను మాట్లాడాను, మరియు ఆలోచించాను. చూడండి.
ఆ వాక్యము శరీరధారియై కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.(చూశారా!)
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను.
ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను.
71
''ఆదియందు....'' ఇప్పుడు నిజమైన దానిని చూద్దాం.... ఇక్కడ నేను కొంత చూచుచున్నాను. మరియు పరిశుద్ధాత్మ దీనిని ఆ రీతిగా నిర్ణయించినది, చూడండి. ఇక్కడ ఒక గొప్ప విషయమును నేను చూసాను. ''ఆది యందు వాక్యముండెను.''
ఇప్పుడు, మానసికముగా మాట్లాడితే, ఆదియందు కంటే, దానికంటే నీవు వెనుకకు వెళ్ళలేవు.
''ఆది యందు'' లోకము లేనప్పుడు, నక్షత్రములు లేనప్పుడు, సూర్యుడు, చంద్రుడు మరి ఇంకేది లేకముందు, అంటే సృష్టి అనేది ఏదియు లేకముందు, ''ఆదియందు'' అనగా అది. అది నిజమేనా? తిరిగి ప్రారంభమునకే మనము వెళ్ళగలిగినంత వరకు వెళ్ళగలము.
“ఆది యందు దేవుడుండెను, దేవుడు..... ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై యుండెను, వాక్యము దేవునియొద్ద వుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను.” ఆ వాక్యము యేసు ప్రభువై యుండెను. అంతేనా? ఓ, మై! అప్పుడెవరుండెను....? ఆది యందు యేసుక్రీస్తు ఉండెను.
72
అప్పుడు కాథలిక్ వారి ఉద్ధేశ్యములలో “నిత్యుడైన కుమారత్వము,” అలా వుండటానికి వీలులేదు. ఏలయనగా ఆయన దేవుని కుమారుడై యున్నప్పుడు ఆయనకు ఆరంభ కాలము వుండి ఉండవలసినది. ఆయన దేవుని కుమారుడై యుండవలసియున్నచో, ఆయన కుమారుడుగా పుట్టవలసియున్నది. (అంతేనా?)
73
ఓ, ఇక్కడ మనము ఒక మంచి పాత లేఖనముతో ముగించుదము. నేను దానిని ఎంత ప్రేమించుదునో! మీరు ఇంట్లో వున్నట్లు అనుభూతి చెందుతారు. మీరు దానిలోనికి వెళ్ళినపుడు, మీకు తెలుసా. దానిని మీరు ప్రేమించరా?
74
''ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద వుండెను, వాక్యము దేవుడై యుండెను.'' వాక్యమే దేవుడైయుండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను; తండ్రి మహిమతో ఆయనను మనము చూశాము, మీరు చూశారా. భూమి మీద శరీరధారియైన, ఆది యందున్న వాక్యమును మనము చూశాము. మన పాపమును తీసివేయుటకు దేవుడు శరీరధారియైనాడని ఆలోచించడం ఎంత అద్భుతమైన సంగతి.
75
ఇప్పుడు, మనము లోకములోని మూఢ విశ్వాసములను చూస్తే, మంచిగా అవ్వాలని వారు ఎలా ఆరాధిస్తారో, వారిలో కొన్ని తెగల విశ్వాసము గలవారు, ఒక వ్యక్తి నిజముగా మంచి వ్యక్తి అయితే, అతను దేవుడవుతాడు అని నమ్ముతారు. అతడు దేవుడైనప్పుడు, అతనిని దేవునిగా ఆరాధిస్తారు.
వారు ఆరాధించుటకు మరొక కారణమున్నది.... దానిని ఇప్పుడు ఈలాంటి మిశ్రితమైన జన సమూహముల మధ్యలో దానిని బోధించుట కష్టము. ఏలయనగా జీవబీజము పురుషుని నుండి వస్తుంది, మీరు గమనించారా, మరియు వారు ''జీవము దానిలో వున్నదని నిత్యజీవము, శాశ్వతజీవము పురుషుని ద్వారా ఒకరి నుండి ఒకరికి వస్తుందని వారు నమ్ముదురు. మనము ఎల్లప్పుడు ఇక్కడే వున్నాము. ఇక్కడే వున్నాము.“ అదే ఆత్మ ప్రజల మీద మరీ మరీ కదులుచున్నది. అందుచేత జీవబీజము పురుషుని నుండి వస్తుందని అందుచేత వారు పురుషుని ఆరాధిస్తారు.
76
ఇప్పుడు, కాని, ఇక్కడ మనకు అది చెపుతుంది, మనిషి లేక మునుపు! “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద వుండెను, వాక్యము దేవుడై యుండెను.” మరియు “ఆ వాక్యము శరీరమాయెను!” ఇపుడు, మానవ మనస్సు వెళ్ళగలిగినంత వరకు, మనము వెనుకకు వెళ్ళినంత వరకు అది ప్రారంభానికి. అంతేనా? “ఆది యందు వాక్యముండెను.” మనము వేదాంతముతో వెళ్ళగలిగినది అదే. మన జ్ఞానముతో వెళ్ళగలిగిన దూరము అంతే. కాని ప్రత్యక్షత మనలను వెళ్ళగలిగిన౦త దూరము తీసికొని వెళుతుంది. అంతేనా?
ఇప్పుడు, నీవు వేదాంతమును బోధిస్తున్నట్లయితే, నీవు తలంచుదువు, “ఆదియందు వాక్యముండెను.” అది దేవుడే. “వాక్యము దేవుడైయుండెను.” అది నిజము. “ఆ వాక్యమే శరీరమై మనమధ్య నివసించెను.” చూశారా. “తరువాత దేవుడు శరీరధారి అయ్యెను. దానికి ఆక్షేపణ లేదు.” అది సత్యము, “దేవుడు శరీరధారి ఆయెను.” దానిని మనము నమ్ముదుము. కాని, ఇప్పుడు ఈ వాక్యము....
వాక్యమనగా నేమి? వాక్యమనగా ఒక తలంపు స్పష్టపరచుట, ఒక తలంపును వ్యక్తపరచుటయై యున్నది. అంతేనా? నీవేదైనా చెప్పక ముందు, దానిని నీవు నీ అంతరాత్మలో ఆలోచిస్తావు. అంతేనా?
77
కాబట్టి, ''ఆదియందు వాక్యముండెను.'' వేదాంతము ద్వారా మనము ఇంత వరకే వెనక్కు వెళ్ళగలము. కాని వాక్యమునకు ముందు, అది ఒక తలంపు మాత్రమే, తరువాత తలంపు బయలుపరచబడెను. నా భావమును మీరు గ్రహించారా?
ఇప్పుడు, ఆయన దానిని ఆ రీతిగా చెప్పాడు.... మొదటిగా, ఆయన తలంపు, తరువాత ఆయన మాట పలికెను, మరియు అప్పుడు వాక్యము బయలుపరచబడెను. ఓ, ఆయన ఎంత పొరపాటు లేని (Infallible God) దేవుడు! గమనించండి! ప్రతి తలంపు ఆయన మాట్లాడినప్పుడు.....
78
ఆశ్చర్యము లేదు, యేసు ప్రభువు కొండ దిగి వస్తూవుండగా ఆ రాత్రి ఆహారము కొరకు ఆ చెట్టంతా చూశాడు, దాని మీద ఏ ఆహారము లేదు. అప్పుడాయన అన్నాడు, ''నిన్ను ఎవరూ భుజింపకుందురు గాక.'' తరువాత ఆయన వెళ్ళిపోయాడు, మరుసటి దినమున వస్తూ యుండగా, ఆ చెట్టు ఎండిపోయెను. దేవుని మనస్సు.... మనస్సు, ఆదియందున్నది, అది వాక్యము కాక మునుపు అది ఒక తలంపుగా వుండెను, అది క్రీస్తును వ్యక్తపరచినది. ఆయనే మరలా తిరిగి ఆ వాక్యమును వ్యక్తపరచుచుండెను. చూశారా.
మరియు బైబిలులోని ప్రతి మాట దేవుని యొక్క తలంపై విత్తన రూపములో వున్నది, అయితే దానిని మానవ హృదయములోనికి తీసుకొన్నట్లయితే, మరియు బైబిలును సాధన వస్తువుగా చేసి అదే తలంపుతో మాట్లాడినచో, అది జరిగి తీరుతుంది. నా భావము గ్రహించారా? సంఘము ఎంత శక్తివంతముగా వుండునో కదా! బైబిలు చెప్పుచున్నది, “క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, మీరును కలిగి యుండుడి. ఒక మనిషి తన హృదయములో తలంచిన రీతిగా, వారు అలాగే ఉ౦దురు.” ఇప్పుడు నీ తలంపులు, వ్యక్తపరచబడినపుడు!
దేవుడు చెప్పినట్లుగా, “ప్రపంచము కలుగును గాక.” అది వాక్యము కాక మునుపు, అది తన తలంపై యుండవలసి వుండును. కాబట్టి దేవుడు తన సృష్టిలో ప్రపంచమును తన తలంపు ద్వారా ముందుగా సృష్టించెను, తరువాత మాట్లాడాడు. ఆ తలంపు బయలుపర్చబడినపుడు అది పదార్థమాయెను. నా భావము గ్రహించారా?
79
ఇప్పుడు, అదే ఆత్మ దానిని చెప్పెను, ''వెలుగు కలుగునుగాక,“ వెలుగు కలిగెను; ”మరలా చెట్లు కలుగును గాక,“ అని చెప్పెను, చెట్లు కలిగెను; కాబట్టి ఇప్పుడు క్రీస్తులోని అదే ఆత్మ మనలో వున్నట్లయితే, అది ఎంత ఎక్కువ ఇంకా చెప్పును. కాన్సర్ లేకపోవును గాక, అది వెళ్ళిపోతుంది; గ్రుడ్డివాని కన్నులు తెరవబడును గాక, అది ఆలాగే జరుగును! చూశారా? అది నీ తలంపు. యేసు చెప్పెను, నిశ్చయముగా . ...
“అది యేసు,” అని మీరంటారు.
ఒక నిమిషము ఆగండి. ఆయన అన్నాడు, “దేవుని యందు విశ్వాసముంచుడి. ఏలయనగా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు ఈ కొండతో ఇక్కడ నుండి పెల్లగించబడి లేచి సముద్రములో పడవేయబడును గాక, మీ హృదయములో ఏమీ సందేహించక, మరియు మీరు చెప్పినది నెరవేరునని నమ్మిన యెడల, మీరు ఏమి చెప్పుదురో వాటిని మీరు పొందుదురు.” అంతేనా? “మీరు దానిని పొందుతారు.” నేను కాదు; “మీరు దానిని పొందుదురు.” ఎలాంటి శక్తి సంఘమునకు ఇయ్యబడినది!
80
ఇప్పుడు మీరు దానిని మనసులో ఊహించుట ద్వారా వ్యక్తపరచవచ్చును. అయితే నీకు అది నిజమైన దైవ ప్రత్యక్షతయైనపుడు, అది జరుగుటకు ముందు నీవు దానిని చూచిన, మరియు దానిని వాక్యరూపములో వ్యక్తపర్చినపుడు, ఆ వాక్యము దానిని పట్టుకొని పదార్థమవుతుంది. ఒక తలంపు వ్యక్తపరచబడింది! ఓ, దేవుడు ఏలా చేశాడో.... దానిని చూశారా? నీ మనస్సు నీ హృదయము ఆలాగే వుండాలి, నీ తలంపులు ఆయన తలంపులయ్యే వరకు దేవుని ఆత్మతో నింపబడాలి. ఆమేన్. నీవు అక్కడే వున్నావు. నీ మనస్సు, నీ నడిపింపు, నీ నాయకత్వం, తిన్నని స్థలము లేక పరిశుద్ధాత్మ యొక్క తిన్నని ప్రేరేపణగా, నీ మర్త్యమైన దేహామును నడిపించేదిగా వుండాలి. ఓ, మై!
మనము ఎలాంటి ప్రజలముగా ఉన్నాము? పరిశుద్ధాత్మయే నీకు రూపమిచ్చినపుడు లేక నీకు అధికారమిచ్చినపుడు, అపుడు నీవు నీ సొంత తలంపులను వాడవు, నీ సొంత మనస్సును వాడవు; కాని పరిశుద్ధాత్మ నిన్ను ఎలా నిర్మించినదంటే నీ తలంపులు, నీ ద్వారా దేవుని ఆత్మే తనకు తాను వ్యక్తపర్చునంత వరకు! అప్పుడు ఎలాంటి సంఘముగా అది వుంటుంది?
ఈ బ్రన్హం గుడారములో ప్రజలు, దేవుని సన్నిధితో ఎంతగానో నింపబడితే, మీ సొంత మనస్సును వాడకుండా, మీ సొంత తలంపులను వాడకుండా, మీ సొంత తీర్పులు వాడకుండా కేవలము ఆత్మ ద్వారానే నడిపించబడినపుడు, వారు ఎలాంటి ప్రజలుగా ఈ ఉదయమున ఉంటారు.
81
''వారు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వారు దేవుని కుమారులు.'' మానవ సంబంధమైన మూల పదార్థము పోయి, ఆ ఖాళీని పరిశుద్ధాత్మ నింపటం, అక్కడ నిన్ను నీవు ఖాళీ చేసికోవటం (ఆమేన్), అప్పుడు యేసు ప్రభువు యొక్క పునరుత్థాన శక్తితో, ఆయన సంఘము ఆయన అడుగులలో నడచుచూ ఆయన శక్తితో, ఆయన తలంపులతో, ఆయన యొక్క కదలికలో ఆయననే కలిగియుంటుంది. నా భావము గ్రహించారా? అప్పుడు మీ తలంపులు మాటలగును, ఆ మాటలు పదార్థమగును. అది సంఘము దాని శక్తిలో ఉండటం.....
అది దాని దారిలో ఉంది అని నేననుకొంటాను, సంఘము ఎంతో క్రీస్తులో చుట్టబడిన (పరిశుద్ధాత్మలో) మనుషులు వారికి ఎంతో దూరముగా నుండిరి. వారు వారిని చూచుకొనుట లేదు, వారికి ఏమి [టేపు పై ఖాలీ.] కేవలము దేవుని సేవించుటయే. వారి తలంపులుముందుకు కదిలినవి. వారు లోకములో వాటిని తిరస్కరించిరి. వారు ఆత్మలో కదులుచు, ఆత్మలో జీవించుచు, ఆత్మలో నడచుచు, ఆలాగు క్రీస్తు నియమమును నెరవేర్చిరి. అప్పుడు మానవ హృదయములోని దేవుని ప్రేమ; పరిశుద్ధాత్మలో నడచుచు, ఆ గొప్ప అద్భుతమైన సంఘము దేవత్వముతో శక్తితో ముందుకు వెళ్ళెను; ఏలయనగా దేవత్వము పరిశుద్ధాత్మ ద్వారా మనుషులలో బయలుపరచబడుతుంది, వారి మనస్సులోని తలంపును నెరవేర్చుతుంది.
82
మన తలంపులు వేరుగా పరుగెత్తును. ఎన్నోసార్లు అది మీ హృదయములో ఏమీ అర్థము లేకుండానే మనము నడుస్తూ చెపుతాము, మీరు ఎలా వున్నారు బ్రదరు? ఎన్నోసార్లు మనము అంటాము, ''నేను ఇది, నేను అది, నేను దానిని చేస్తాను....'' మీ హృదయములో ఏమీ అనుకొవద్దు. చూశారా? నా హృదయములో నేను ఏమీ అనుకొనను.
కాని నీవు లోక సంబంధమైన వాటికి బాగా చచ్చిపోయినపుడు, క్రీస్తు మొదట వుంటాడు, క్రీస్తు అన్నింటిలో వుంటాడు, అప్పుడు నీ పూర్తి ఆకారము ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మయై యుండును. ఆయన పూర్తి నియంత్రణ కలిగియుండును. అప్పుడే నీ తలంపులు తేటగా నుండును. నీ తలంపులు పరిశుద్ధముగా నుండును. నీ హృదయము! నీ హృదయము!
అనేకమంది చెపుతారు, ''మంచిది, మతము నీ హృదయము నుండి వచ్చును.''
“హృదయము” అనే చిన్న జీవిలో నోటి లెక్కలు వేసే సౌకర్యము లేదు. నీ హృదయములో నీవు తలంచలేవు. బైబిలు చెప్పింది, “మనిషి, తన హృదయములో తలంచిన రీతిగా ఉండును.” నీ హృదయముతో నీవు తలంచలేవు. నీవు చేయలేవు, ఏలయనగా అక్కడ ఆలోచించటానికి మానసికమైనది ఏదీ లేదు. యేసు, భౌతికమైన మనిషిని గూర్చి మాట్లాడలేదు; ఆయన సహజాతీతమగు వ్యక్తిని గూర్చి మాట్లాడుచున్నాడు.
83
మనము మూడు అమరికలు గల మానవులము; అంతరాత్మ, శరీరము, మరియు ఆత్మ. శరీరము ఏమైయున్నదో మనకు తెలుసు; మనము దానిని గ్రహించాము; అది ఇక్కడ వున్నది. ఆలాగే ఆత్మ ఏమైయున్నదో మనకు తెలుసు; అది శరీరమును నియంత్రించును. కాని అంతరాత్మ ఏమై యున్నది? అంతరాత్మ, ఆత్మ యొక్క స్వభావమై యున్నది.
ఒక మనిషి మార్పు చెందినపుడు, దాని భావము అది కాదు.... ఇక్కడ చక్కని లోతైన ఉపదేశమున్నది. మీరు దానిని గ్రహించారనుకొంటాను. కొంత కాలము క్రితము.... నిన్నటి దినమున, నేను కొందరు పిల్లలతో మాట్లాడుచున్నాను.
84
ఒకాయన మా వరండాలో కూర్చొని, మరియు ఆయన అన్నాడు, “బ్రదర్ బ్రన్హం, నేను ఒకప్పుడు వ్యాపారస్థుడను. మరియు నేను రక్షించబడాలని ఎన్నోసంవత్సరములు ఖర్చుపెట్టాను.” అతని బాధలన్నీ చెపుతాడు. నా భార్య అక్కడకు వెళ్ళి ఆత్మను పొందినది. అతను ఆత్మను పొందలేకపోయాడు.
నేనన్నాను, ''సోదరుడా, ఏమిటి నీ భావము?'' తరువాత అతడు ఎక్కడివాడో, తన్ను తాను తెలియజెప్పుకొన్నాడు. నేనన్నాను, ''నీవు రక్షించబడాలని ప్రయత్నించుచున్నావా?''
అతడన్నాడు, ''అవును, నేను రక్షించబడాలని కోరుచున్నాను.''
నేను చెప్పాను, ''ప్రభువు కోరుచున్నాడు....“
అన్నాడు, “నేను గీతను దాటానని నమ్ముతున్నాను. బ్రదర్ బ్రన్హం, ఇక రక్షణ నేను పొందలేను.''
నేనన్నాను, “ఓ! నాకు తెలియదు.”
85
అతడన్నాడు, ''చూడండి, నేను గొప్ప ప్రసిద్ధిగాంచిన బిల్లీ గ్రహం గారి కూటములకు వెళ్ళాను.'' ఆయన అద్భుతమైన దైవజనుడు, దేవునికి గొప్ప పనిచేయుచున్నాడు. అతడు అన్నాడు, “నేను ఆయన కూటములకు వెళ్ళినపుడు, ఆయనన్నాడు, రక్షణ పొందే వారందరు తమ చేతులెత్తండి.” “నేను నా చేయి ఎత్తాను మరియు విచారణ గదిలోనికి వెళ్ళాను.” అప్పుడు వారన్నారు, “నీవు యేసును అంగీకరించాలి,” అని చెప్పారు.“
“నేను మోకరించి ప్రార్థించాను. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుచున్నారా?” నేను, 'అవును' అని “ఆయనను నేను నా స్వంత రక్షకునిగా అంగీకరించుచున్నాను.” అప్పుడాయన అన్నాడు, “ఇప్పుడు నీవు రక్షించబడినావు.” “కానీ నాకు ఏమీ జరుగలేదు.”
అతడు చెప్పెను, “నేను కొన్ని సంవత్సరములు అక్కడికి వెళ్ళాను, తరువాత నేను స్వేచ్ఛా మెతడిస్టు ప్రజలను కనుగొన్నాను. వారు నేను సంతోషము చాలినంత వచ్చే వరకు కేకలు వెయ్యమన్నారు.” ఇంకా అన్నారు, “నేను సంతోషముతో కేకలు వేసేంత వరకు, నా కొరకు ప్రార్థన చేశారు.” తరువాత అన్నారు, “నీవు దానిని పొందావు. నీకు శుద్ధీకరణ వచ్చింది.” నేను వెళ్ళిపోయాను, నేను వెతకవలసినంతగా వెతుకుతున్నాను. “ఇంకా అది నాకు దొరకలేదు,” అన్నాడు.
86
ఆయన చెప్పెను, “నేను, బ్రదర్ ఓరల్ రాబర్ట్ మీటింగులకు వెళ్ళాను.” ఆయనన్నాడు, “నేను గదిలోనికి వెళ్ళిన తరువాత వారు నేను పరిశుద్ధాత్మను పొందాలి అన్నారు. నేను భాషలతో మాట్లాడవలసియున్నదని లేనిచో దానిని పొందలేదని చెప్పారు.” నేను లోనికి వెళ్ళాను. “వారు నా మీద చేతులుంచి ప్రార్థించారు. ప్రభువుతో మాట్లాడమన్నారు.” తరువాత “నేను భాషలతో మాట్లాడాను.”
ఆయనన్నాడు, “బ్రదర్ బ్రన్హం, నేనింకా దానిని పొందలేదు.” అన్నాడు, “నేను ఏమీ చేయాలో అర్థము కావటము లేదు.”
నేనన్నాను, “ఇప్పుడు నా సోదరుడా.....”
ఆయనన్నాడు, “నేను ది వాయిస్ ఆఫ్ హీలింగ్, ష్రీవ్ పోర్టుకు వెళ్ళినపుడు, వారు అక్కడ నాతో మీరు దేవుని ప్రవక్త అని చెప్పారు; దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినపుడు, నా బాధ ఏమిటో మీరు బయలుపరచుతారని నేనిక్కడకు వచ్చాను.”
నేనన్నాను, “సోదరుడా, ఆ పని చేయటానికి నీవు ప్రవక్తవు కావలసిన పని లేదు. దేవుని వాక్యమే దానిని నిశ్చయించును.” నేనన్నాను, “దానికి ప్రవచనము అవసరము లేదు.”
87
నేనన్నాను, “నా సోదరుడా, నీవు కేవలము తికమకపడ్డావు.” అన్నాను, “నేను నిన్ను ఒక సంగతి అడగాలనుకొనుచున్నాను. మీరు ఎల్లప్పుడు ప్రభువైన యేసును ప్రేమిస్తారా?”
ఆయనన్నాడు, “మంచిది, నేను ప్రెస్బిటేరియర్ సంఘమునకు చెందిన వాడను, నేను అక్కడకు వెళ్ళాను అంతే,” అన్నాడు.
నేనన్నాను, “మంచిది, నేను నిన్ను అడుగుచున్నాను. ఏమి జరిగింది, ఏమీ సంభవించింది, నీవు ఒక్కసారే నీ మనసునంతా మార్చుకొన్నావు?”
ఆయనన్నాడు, “నా భార్య పెంతెకోస్తులోనికి వెళ్ళి, ఆత్మను పొందినది అన్నాడు. తరువాత ఆమె తిరిగి వచ్చి సంతోషముగా వున్నది.”
నేనన్నాను, “దాని గురించి మీ ఆలోచన ఏమిటి? దానిని మీరు విమర్శించుదురా?”
ఆయనన్నాడు, “లేదు, అది ఎంతవరకు కొనసాగుతుందో అనుకొన్నాను.” అన్నాడు, “అది ముందుకు కొనసాగింది.” “ఆమె దానిని పొందినట్లే యున్నది,” అన్నాడు.
88
అతడు అన్నాడు, “ఒక దినమున నేను బయట అంగడిలో విక్రయము చేసి వస్తూ యుండగా, నా జేబులో చూచినప్పుడు, నాకు ఒకరు ఒక పాత కరపత్రము ఇచ్చారు.” నేను ఆఫీసులో కూర్చొని దానిని చదవటం ప్రారంభించాను. అప్పుడు, నాలో భయంకరమైన భావన కలిగింది, అది నేను దేవునితో సరికావాలని, అప్పటి నుండి నేను వెదకటం ప్రారంభించాను అన్నాడు.“
నేనన్నాను, “నేను నిన్ను ఒకటి అడుగగోరుచున్నాను? మీకు ఈ భావన కలిగినపుడు, దాని నుండి మీరింత వరకు ఎన్నడూ బయటపడలేదా?”
ఆయనన్నాడు, “లేదండి, బయటపడలేదు.”
నేనన్నాను, “మంచిది, అది నీవు క్రీస్తును అంగీకరించినప్పుడు.” అనగా “నీవు చేతులెత్తుట కాదు. అది మంచిదే. భాషలలో మాట్లాడటం, అది మంచిదే. కేకలు వేయటం అది మంచిదే.” కాని “ఆయనలోనికి వచ్చిన తరవాత, అవి క్రీస్తు యొక్క గుణలక్షణములు.” నేనన్నాను, “క్రీస్తును చేర్చుకోవటం, క్రీస్తుయేసు అనే వ్యక్తిని చేర్చుకొనుటయే. ఆయనను చేర్చుకొనుటయే జీవము.” “కేకలు వేయటం, భాషలలో మాట్లాడటం అవన్నియు విశదపర్చునట్టివి.” నేనన్నాను, “అవన్నీ ఆయనను వెంబడించే వారి గుణలక్షణములు. కానీ, ముందుక్రీస్తును చేర్చుకొనవలసి యున్నది.”
89
ఆయనన్నాడు, “బ్రదర్ బ్రన్హం, నేను ఇంతవరకూ రక్షించబడియే యున్నానా?”
నేనన్నాను, “నిశ్చయము.” చూడండి, “మీరాయనను ప్రేమించుచున్నారా?”
ఆయనన్నాడు, “నా హృదయమంతటితో.”
నేనన్నాను, “ఒకసారి నీవు ఆయనను ప్రేమించలేదు.”
ఆయనన్నాడు, “అది నిజము.”
“ఇప్పుడు మీరాయనను ప్రేమిస్తున్నారా?”
ఆయనన్నాడు, “మంచిది, అది సత్యము.”
“మంచిది, మీరెల్లప్పుడు ఆయనను కలిగియున్నారు.”
అప్పుడు అతను వరండాలో ఎగిరి గంతులు వేశాడు, నన్ను ఆయన చేతులలోనికిని తీసుకొని ఏడ్వటం ప్రారంభించాడు. “ఓ దేవా, నేను ఈ సంవత్సరములన్నీ క్రైస్తవుడనైయున్నాను,” అని అన్నాడు.
మీరు చూశారా. ఆ సంగతి ఏమంటే ప్రారంభములో అతను సరిచేయబడలేదు. హల్లెలూయా!
90
ఏమిటి? మీరు పందిలో నుండి గొర్రెపిల్లను తయారు చేయలేరు, నీవు అది చెయ్యాలనుకొన్నప్పటికి ప్రారంభము నుండే అది పంది; అది తన పనిని గూర్చి జాగ్రత్త కలిగి యుంటుంది, గొర్రె పిల్లను తన పని చేసికోమని చెపుతుంది. పందిని అది పందుల దొడ్డిలో ఉండుట తప్పని అది నమ్మునట్లు చేయుటకు నీకు ఒకే మార్గమున్నది, దానిలోనికి గొర్రెపిల్ల ఆత్మను పెట్టుటయే. దానికి ఎప్పుడైన గొర్రెపిల్ల అంతరాత్మను దానిలో పెట్టబడినట్లయితే... లేదా, గొర్రెపిల్లకు అంతరాత్మ లేదు. అయితే ఎప్పుడైన గొర్రెపిల్ల ఆత్మ దానిలో పెట్టినట్లయితే, అదే స్వభావము.... ఆ కారణమును బట్టియే నీవు పందిని మార్చలేవు, ఆలాగే గొర్రెపిల్లను మార్చలేవు, ఏలయనగా దానికి అంతరాత్మ లేదు. దాని జీవములో ఏమీ వున్నదో అదే స్వభావమును అది ఎల్లప్పుడు కలిగియుండును. చూశారా.
కాని, ఒక మనిషి మాత్రము పంది నుండి గొర్రెపిల్లగా మార్పు చెందగలడు, ఏలయనగా దేవుని పోలికలో చేయబడిన అంతరాత్మ అతనికున్నది. ఆమేన్.
91
మంచిది, అతని తలంపులు మార్చును. అతని కొరకు ఏదో జరుగును. హల్లెలూయా! “ఒక మనిషి తన హృదయములో ఆలోచించిన రీతిగా.” చూశారా? సృష్టికర్తయైన క్రీస్తు అతని దగ్గరకు వచ్చి, ఆ రూపములోనే, అతని సజించును. ఆయన యొక్క సొంత ఆత్మయే మానవుని స్వభావమును తెసివేసెను, డాన్సులను ప్రేమించటం నుండి, లోకము దాని పోకడ నుండి, ఆ సమయము నుండి ప్రక్కకు పెట్టి వేసి, దేవుని కొరకు ఆకలిగొనునట్లు చేయును. మరియు దేవుడు ఎల్లప్పుడు అతనిలో వుండును. ఆదిలో వున్నది దేవుడే. చూశారా. అక్కడే నీవున్నావు. ఆమేన్.
“మనిషి ఆలోచించినట్లుగా.” అది వాక్యము అగుటకు ముందు తలంపై వుండాలి. వాక్యము వ్యక్తపరచినపుడు, పదార్థమును చేస్తుంది. నేను క్రైస్తవుడనని నా హృదయములో నమ్ముటకు కారణము, నేను యేసు ప్రభువును అంగీకరించి యున్నాను; నేను కేకలు వేయలేకపోయినా, నేను కదలకపోయినా నాకు బదులుగా క్రీస్తు చనిపోయాడని నమ్ముదును. ఆమేన్. క్రైస్తవుడిగా, నేను దానిని అంగీకరించాను. క్రైస్తవుడిగా, నమ్ముదును; తరువాత అది నా హృదయములో వున్నది, అప్పుడు నేను దానిని మాటలో నేను క్రైస్తవుడనని వ్యక్తపర్చుదును. హల్లెలూయా! అప్పుడు, నేను క్రైస్తవుడిగా నడచుదును, క్రైస్తవుడిగా మాట్లాడుదును, క్రైస్తవుడిగా జీవించుదును, క్రైస్తవుడిగానే వుందును. నా ఫలముల ద్వారా లోకముచే నేను క్రైస్తవుడనని గుర్తించబడుదును. హల్లెలూయా!
92
బిగ్గరగా అరవాలని నా భావము కాదు, కాని అది అక్కడే వున్నది, దేవుని వాక్యము! యేసు అన్నాడు.... ఇక్కడే అది వున్నది! ఓ, ఎక్కువ సమయము అయినపుడు నాకు చెప్పండి. యేసు దీనిని చెప్పాడు, చూడండి, “ఆది యందు.” గమనించారా. “తన హృదయాలోచనను బట్టి ఒక మనిషి వుంటాడు.” ఇప్పుడు యేసు ఏమీ చెప్పాడో వినండి. మీరు దానిని కనుగొనలేరు.....
93
ఓ, మీరు చుట్టూ తిరిగి మతములను చూడగలిగితే; ఒకరు ఇది చేస్తున్నారు, ఒకరు అది చేస్తున్నారు, మరొకరు మరొకటి చేస్తున్నారు. కాని సోదరుడా, ఈ పాత గుడారమును ఎప్పటికిని ఒకేసారి సరి చేయుదము.
విశ్వాసము ద్వారా మనము క్రైస్తవులము. దేవుని కృపద్వారా, మనము క్రైస్తవులము. చూశారా? దేవుడు తన అనంతమైన కృపలో, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మనము సమాధానపడుటకు పిలిచాడు. అది అంతే! మనము చేసినది కాదు, అది ఆయన చేసినది. ఆయన నా అంతరాత్మను లోకమును వాటి నుండి దేవునిలోని వాటికి మార్చెను; గుఱ్ఱముల పందెములు, పేకాట, వ్యభిచారము, అబద్ధములు మరియు దొంగతనముల నుండి నా అంతరాత్మను మార్చెను. నా తలంపులను మార్చెను; తరువాత నా తలంపులు ఎంత యదార్థముగా మారాయంటే అవి నా పెదవుల మీద మాటలగు వరకు; అవి ముఖ్యాంశమును చేయును. ఇప్పుడు నేను క్రైస్తవుడను, అది నన్ను భిన్నమైన వ్యక్తిగా చేసింది. అదే నిన్ను చేసినది. చూశారా?
94
ఇప్పుడు, నీకు బలహీనమైన మనసున్న యెడల, నీవు దానిని నమ్మనట్లే, అవును. నీవంటావు, మంచిది, నాకు ఆశ్చర్యముగా వుంది, నీవు మెళుకువగా వుండటం మంచిది!
నీవంటావు, “మంచిది సోదరుడా, నేను మంచి సమయమును గడిపాను.” నీవు ఎంత మంచి సమయము గడిపావో నాకనవసరము. “నేను భాషలతో మాట్లాడాను” అంటావు; మంచిది, ఇంకా దాని వలన ఏమీ అర్థము లేదు. “నేను కేకలు వేశాను,” అంటావు. మంచిది, ఇంకా దానివలన ఏమీ అర్థము లేదు. నీవంటావు, “నేను వ్యాధిగ్రస్థులను స్వస్థపరిచాను.” ఇంకా దానివలన ఏమీ లేదు.
యేసు అన్నాడు, “అనేకులు ఆ దినమున నా యొద్దకు వచ్చి, మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, ఇంకా గొప్ప కార్యములను చేయలేదా?” ఆయనంటాడు, “అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. నేను మిమ్ములను ఎన్నడునూ ఎరుగను,” అవునండి.
పౌలు అన్నాడు, “నేను మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను మాటలాడినను, కొండలను పెకలించగల విశ్వాసము కలిగియున్ననూ, పేదలకు నా ఆస్తి అంతయూ పంచి పెట్టినను, ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను.”
95
అది మార్పు చెందవలసియున్నది - ఇక్కడే యున్నది - అది హృదయమార్పు; ఈ భౌతికమైన సంగతి కాదు, నీ హృదయములోని అంతరాత్మ మార్పు. అది దేనినో పట్టుకొంటుంది, చివరకు నీ తలంపులన్నీ బలహీనమగు వరకు, ఇక మీరెంత మాత్రము వాటిని చూడరు. మీరు ప్రభువైన యేసునే చూస్తారు. మీరు నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను, ప్రేమను మరియు కృపను చూస్తారు. అది నీవు మార్పు చెందియున్నప్పుడు. మార్పు చెందుట అనగా ఏమి? మార్పు చెందుట అనగా, ఒక దాని నుండి పూర్తిగా పరివర్తన చెందుట. నీ తలంపులు, నీ అలవాట్లు, నీ పూర్తి వ్యక్తిత్వం పాపి నుండి క్రైస్తవునిగా మార్పు చెందటం. మొదటిగా నీవు దానిని నీ హృదయములో ఎరుగుదువు; తరువాత దానిని పెదవుల ద్వారా వ్యక్తపర్చుదువు; తరువాత అది భౌతికమైనదిగా చేస్తుంది. అదే నీవై యున్నావు.
ఇప్పుడు, నీవు (ఒక మాటను!) దానిని ఆలోచించినట్లయితే, దానిని నీవు ఊహించి ఆలోచిస్తావు. తరువాత దానిని వ్యక్తపరుచుతావు. అప్పుడు భౌతికము కానట్లయితే, నీవు తప్పు దారిలో ఉన్నావు. మీరు దానిని గ్రహించారా? నేను నెమ్మదిగా మాట్లాడతాను. చూడండి, నీవు క్రైస్తవుడను అని ఊహించినట్లయితే, మరియు నీ పెదవులతో బయటకు మాట్లాడుదువు, కానీ నీవు క్రైస్తవుడవు కాదని తెలుసుకొన్నావు, దయచేసి నీ తలంపులను మార్చుకొనుట మంచిది, నీ హృదయమును మార్చుకొనుము. చూశారా? ఎందువలననగా దానికి అక్కడ సాక్షము లేదు. దాని ఫలమును అది ఫలించుట లేదు. “ఆత్మ ఫలమేదనగా సాత్వికము, సమాధానము, ఆశానిగ్రహము, మంచితనము, కృప, విశ్వాసము.” ప్రతి చిన్న విషయమునకు, నీవు ఒకవేళ దానిపైకి ఎగురుతున్నట్లయితే, నీవు జాగ్రత్తగా వుండటం మంచిది. అక్కడ ఏదో జరిగలేదు. నీవు అక్కడ లేని దానిని ఏదో ఇక్కడ వ్యక్తపర్చుచున్నావు.
96
యేసు పరిసయ్యులతో అన్నాడు, “వేషధారులారా! మీరు ఎలాంటి మంచి విషయములు పలుకగలరు?” అదే వారిని వేషధారులుగా చేసింది; వారు హృదయములో ఒక దానిని యోచించి పెదవులలో మరొకదానిన వ్యక్తపరచుదురు. వేషధారి అనగా అతనే. అదే వేషధారిని చేస్తుంది. ఆయనన్నాడు, “మీరు వేషధారులైయుండి ఎలా దానిని మీరు చేస్తారు. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును.” నీవు నిజముగా యోచించే దానిని మాట్లాడవు. నా భావమును గ్రహించారా? “నీవు ఆలోచించే దానినే నీవు తప్పక చెప్పాలి. నీవు దానిని యోచించకపోతే, దానిని నీవు చెప్పవద్దు.” చూశారా? నీ హృదయాంతరంగములో నుండి వచ్చునట్లు నీ మాటలను మాట్లాడుము.
యేసు ఆ చెట్టును గురించి చెప్పినట్లుగానే, “ఏ మనిషి, నీ ఫలములు భుజింపకుండును గాక.” దాని గురించి ఆయన హృదయములో ఏ విధమైన అవిశ్వాసపు ఛాయలేదు. ఆ చెట్టు ఎండిపోయినదేమిటి, ఎందుకు? అది ఆయన శుద్ధ హృదయము నుండి వచ్చుచున్నది... అది ఆయనలోని దేవుని ఆత్మ, ఆ రీతిగా ఆయనను చేయించుచున్నది, ఆ శిష్యులకు ఒక పాటమును నేర్పుచుండెను. నా భావము గ్రహించారా? మంచిది.
97
అది శుద్దముగా ఇప్పుడు ఉండనివ్వండి. మీ తలంపులు శుద్దముగా ఉండనియ్యండి, మరియు మీ ఉచ్చరణలు శుద్దముగా ఉండనియ్యండి. శుద్దముగా ఉండండి, శుద్దముగా జీవించండి. ఇప్పుడు, హృదయములో నుండియే వ్యభిచారములు, దురాలోచనలు బయలు వెడలును, మరియు ఇలాంటివన్నీ; అవి నీ హృదయములో నుండి వచ్చినట్లయితే, నీ హృదయములో నున్నవి అవియే. కాని నీ హృదయములో నుండి, నీతి, సమాధానము, ప్రేమ, సంతోషము, వస్తున్నట్లయితే, (ఓ, మై!) అది వాటితో తయారైన నిధుల నుండి అది వచ్చుచున్నది. నా భావమును గ్రహించారా? అది దేవుని ఆత్మతో తయారు కాబడి, అది ఆ పని ద్వారా దానంతట అది వ్యక్తపరచబడినది, మరియు నీవు ఏమీ చెప్పినా అది నెరవేరుతుంది.
98
దేవుని వాక్యము ఎంత ఖచ్చితమైనదో, నేను మీకు కొంత అంతర్దుష్టిని ఇస్తాను. నీవు ఏమి చెపుతున్నావో గమనించుము. దేవుడు ఏది మాట్లాడినా, అది ఎంత భిన్నముగా కనపడినప్పటికి నాకు పరవాలేదు, అది ఆలాగే వుంటుంది. ఇప్పుడే ఈ దేశ సంచారములోనే, నేను దేవుడు కార్యములు చేయుట చూశాను.స్నేహితులారా, దేవుడు ఏదో చేయటం నేను చూశాను. అలాంటిది ఎప్పుడైనా జరుగుట అసాధ్యమని నేను తలంచాను, కాని అది జరిగినది. నేను ఏదో ఒక పొరపాటును జరిగించి చూచిన తరువాత అది పొరపాటై యుండెను. నేను నిజానికి ఇంకేదో చేయవలసియుండెను. దేవుడు చెప్పాడు, వెళ్ళి దానిని చేయుము; దానిని వ్రాసి నా జేబులో పెట్టుకొన్నాను. నేను దాని చేయుటకు బదులు, దాని గూర్చి మర్చిపోయి పూర్తిగా తారుమరై మరేదో చేశాను. దేవుని కృప దానిని తిరిగి వెనుకకు సుడిగాలి వలె గిరగిర త్రిప్పి దానిని ఎలాగైనా తిన్నగా తీసికొనెను. ఆమేన్. అది జరుగవలసియున్నది.
99
మంచిది, నేను నమ్ముచున్నాను, పరిశుద్ధుడైన యోహాను సువార్తలో ఒక దినమున దానినే ఇక్కడే ఎక్కడో చదువుచున్నాను. మనము చూద్దాం; అది 12వ వచనము. అవును. అది ఇక్కడే వున్నది. చూడండి. పరిశుద్దుడైన యోహాను సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనములు.
మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి, వెళ్ళి, వారికి కనపడకుండా దాగి యుండెను.
ఇప్పుడు వినండి. అది ఇక్కడ వున్నది. చాలా దగ్గరగా దానిని గమనించండి. దానిని నేను ఇక్కడే గుర్తు పెట్టాను. నేను బొంబాయిలో అక్కడ దానిని చదివాను.
ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను, వారాయన యందు విశ్వాసముంచరైరి.
100
ఏమి జరిగినా! ఆయన సూచక క్రియలు చేశాడు. ఈ దేశాన్ని చూడండి, ఈ ప్రజలను చూడండి, ఈ గుడారములోనే ఎలాంటి అద్భుతములు మరియు సూచక క్రియలు జరిగినవో చూడండి. చూడండి, ఎలాంటి సంగతులు చెప్పబడినవో, అది దేవుని సంబంధమైనవని ఎలా రూపించబడినవో, చూడండి! చూశారా, దేవుని చేత రుజువు చేయబడినవి, అయినను పట్టణములోని ప్రజలు దానిని చూచి నవ్వుదురు. దానిని గూర్చి తమాషా చేస్తారు, “అది మనసు చదవటం, ఇంకా అలాంటిది ఏదో,” అని వారు అంటారు. ఇక్కడ గ్రహించారా, వారు దానిని అర్థం చేసికోలేరు.
ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.
యెషయా ప్రవక్త చెప్పినది నెరవేరవలసియున్నది. అది, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? అని పలికెను.
అందుచేత వారు దానిని నమ్మలేదు, ఏలయనగా... యెషయా దానిని చెప్పెను.
101
దేవుడు ఏది మాట్లాడినా, అది జరిగి తీరవలెను; ఏలయనగా అది మొదటగా ఆయన తలంపు, తరువాత ఆయన మాట బయలుపరచబడుతుంది. ఏది వచ్చినా వెళ్ళినా పరవాలేదు, అదేమీ కాదు, అది తప్పక జరిగి తీరును. ఓ, దేవుని వాక్యము ఎంత ఖచ్చితమైనదో మీరు చూశారా?
ఓ! వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను.
చూడండి! తన ప్రవక్తయైన యెషయా ద్వారా, మనము చేయునట్లు, హెచ్చు-తగ్గులు కలిగిన మనవంటి మనిషి, మనము చేయునట్లు పొరపాట్లు కలిగియున్నాడు; ఆ మనిషి దేవునికి ఎంతగా లోపరచబడ్డాడంటే, ఒక ప్రవక్త అగు వరకు, ఆయన తలంపులు... దేవుని తలంపులు! హల్లెలూయా! దేవుని తలంపులు, ఈ మర్త్యుడైన యెషయా పెదవుల ద్వారా వ్యక్తపరచబడ్డాయి; నా వలె పాపముతో పొరపాట్లు కలిగిన మనిషి, నా వలెనే జీవితములో హెచ్చుతగ్గులు కలిగిన వాడు, నీ వలెనే; కాని దేవునికి ఒక లోపరచబడిన పాత్ర, దేవుని తలంపును వాక్యము ద్వారా వ్యక్తపర్చాడు. వారు ఏమి చేసినప్పటికి పరవాలేదు, యెషయా మాటలు నెరవేర్చబడవలసియున్నవి; ఏలయనగా అది యెషయా ద్వారా బయలు పర్చబడే దేవుని తలంపు.
102
అక్కడే వున్నావు. హల్లెలూయా! ఓ దేవా! “ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.” ఓ, అప్పుడు, ఇక లోకము లేదు..... “భూమ్యాకాశములు గతించును, కానీ నా మాటలెన్నడూ గతించవు.” ఎందుకు? సర్వశక్తుడైన దేవుని తలంపును ఆయన మాట ద్వారా బయలుపరచుచుండెను. మరియు మనము విశ్వాసము ద్వారా ఆ వాక్యమును అంగీకరించినపుడు, అది తప్పక భౌతికము కావలసియున్నది. అది ఆలోచించటం, నా హృదయమును పులకరింప చేయుచున్నది. ఓ, “నీ వాక్యము పరలోక మందు ఎన్నటికిని స్థిరపర్చబడియున్నది.” దేవుని తలంపులేమిటో, ఆయన వాటిని మాటలుగా బయలుపరచాడు, ఇక్కడ మనకు సజీవమైన వాక్యమున్నది.
యేసు అన్నాడు, “నా మాటలు విని, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, నిత్యజీవముగలవాడు, మరియు అతడు తీర్పులోనికి రాక; మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడు.” హల్లెలూయా!
103
“సంఘమునకు వెళ్ళెవాడు కాడు,” “పుస్తకముపైన తన పేరును ఎక్కించుకున్న వ్యక్తి కాదు, బహిరంగముగా చాటుకొనేవాడు కాదు. కేకలు వేసే వాడు కాదు. వ్యాధి గ్రస్తులను స్వస్థపరిచే వాడు కాదు. గ్రుడ్డివాని కన్నులు తెరచేవాడు కాదు. భాషలతో మాట్లాడేవాడు కాదు.” “ప్రవచించే వాడు కాదు.” కాని “నా మాటలు విని, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు, నిత్యజీవము గలవాడు మరియు అతను తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడు.”
ఓ, సోదరుడా, నీ మాటలు దేవుని ముందు సత్యమగునట్లు, ఆ విశ్వాసము నీ హృదయమును ఒకసారి పట్టుకోనిమ్ము. అప్పుడు, భూమ్యాకాశములు కదిలిపోయి వెళ్ళిపోవును, కాని ఆ నిత్యమైన వాక్కు , దేవుని చేత వ్యక్తపర్చబడిన నీ హృదయములోని ఆ తలంపు, యెషయా మాటలు గతించనట్లు, అవియు గతించవు.
వేలకొలది మంది అద్భుతములు జరుగుట చూస్తూయున్నారు, అయినను నమ్మలేకపోవుచున్నారు. ఏలయనగా యషయా దానిని సూచిస్తూ చెప్పాడు, “వారు దానిని నమ్మరు.”
104
దేవుని వాక్యము నిత్యమైనది. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద వుండెను, ఆ వాక్యము దేవుడై యుండెను.” దేవుడు ఆదిలో మునుపు లోకమును చూచినపుడు, ఈ ఉదయమున, ఆయన నిన్ను నన్ను చూచి యున్నాడు. నేను అక్కడ బాలుడుగా కూర్చొని యుండటం ఆయన చూశాడు. ఇండియా దేశములోని ప్రతి ఆకలిగొన్న వ్యక్తిని ఆయన చూశాడు. ప్రసంగ వేదిక మీద ప్రతి బోధకుని చూశాడు. ప్రతి వేషధారి నడవటం ఆయన చూశాడు. ఆయన మొత్తమును చూశాడు. దేవుని అనంతమైన మనస్సు దానిని ముందే చూచినది.
ఆయనన్నాడు, ఇప్పుడు ఆ పడిపోయిన ఆ మానవాళిని విమోచించుటకు, నేను నా కుమారుని ముందుకు పంపుతాను, క్రీస్తు యేసును. అక్కడ వాక్యమున్నది. ఆది యందు, ఆది వాక్యము కాక మునుపు, అది తలంపై యుండెను. అది తలంపునకు ముందు; అది వాక్యములో వ్యక్తపరచబడినది; ఆ వాక్యము పదార్థమై మన మధ్య నివసి౦చెను. హల్లెలూయా! ఒక వేళ ఒక కోటి సంవత్సరములకు ముందు, లోకము ఇంకా సృష్టించబడక మునుపు దేవుని తలంపు ఆయన శరీరమును, మరణపు ముల్లును తీసివేయుటకు, శరీరములో ఆయన నివాసమును చూసెను. అయ్యో!
105
దేవుని వాక్యము ఎంత నిత్యమైనదో! ఓ, కాలములు మారును, సంవత్సరములు వచ్చును మరియు పోవును, కాల యుగములు గతించిపోవును; కాని దేవుని వాక్యము నిత్యము నిలిచి వుంటుంది. అదీ విషయం!
ఓ దేవా, నేను నీకు విరోధముగా పాపము చేయకుండునట్లు, నా హృదయములో నీ వాక్యమును నా హృదయములో దాచుకొననిమ్ము. దీవారాత్రులు దానిని ధ్యానించనిమ్ము. నీ ఆజ్ఞలను నా మంచపు కోళ్ళపై వ్రాయనివ్వండి. అవన్నీ ఎల్లప్పుడు నా ముందుండును గాక. మరియు దేవా, నేను నీకు వ్యతిరేకముగా పాపము చేయకుందును గాక. దానిలో నన్ను నడవనివ్వండి. “ఇప్పుడు అట్టి వారికి శిక్షలేదు.” (రోమా 8:1.) హల్లెలూయా! “శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొనుచున్న వారికి, యిప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఏ శిక్షా విధియు లేదు.” ఆమెన్.
106
మానవ హృదయములోనికి దేవుడు తన తలంపులను బయలుపరచి, అమర్త్యుడైన దేవుడుగా, తనకు లోబడిన ప్రజలను ఒక స్థలము నుండి మరొక స్థలమునకు ముందుకు నడిపించును. మరియు బైబిలు చెప్పుచున్నది, “నీతిమంతుని అడుగులు, యెహోవా చేత స్థిరపరచబడును.” ఓ, లోకము ఎంత క్రొత్తదిగా వున్నది? నిత్యత్వము ఎంతకాలము! మర్త్యుడైన మానవుని పెదవుల ద్వారా దేవుని వాక్యము బయలుపరచబడుటను మనము ఆలోచించినపుడు, దేవుని వాక్యమునకు ఇంకా ఎంత విధేయత కలిగియుండాలి.
ఆయనన్నాడు, ''యెషయా దానిని గూర్చి చెప్పెను. మరియు వారు దానిని చేయలేక పోయారు, ఎందువలనంటే యెషయా ఆత్మప్రేరేపణతో దానిని చెప్పాడు.''
107
యేసు క్రీస్తు, అన్నిచోట్లనుండి లేఖనములన్నింటితో భూమి మీద ఇమ్మానుయేలుగా వున్నాడు. ఆయన భూమి మీద నడుస్తుండగా, ఆయన మూడవ దినమున తిరిగి లేచునని ఆయనకు తెలియును, ఎందుకు? ఏలయనగా దావీదు ఆత్మ ప్రేరేపణలో చెప్పాడు, ''నీ పరిశుద్ధుని కుళ్లు పట్టనీయవు, అతని ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు.'' ఆయన అన్నాడు, ''అందుచేత నా హృదయము సంతోషించుచున్నది, నా శరీరము ఆనందముతో వున్నది.'' యేసు ఆత్మాభిషేకము క్రింద మాట్లాడినట్లుగా, తన జీవితములో హెచ్చు తగ్గులు కలిగిన దావీదు వంటి ఒక మనిషి ద్వారా దేవుడు మాట్లాడెను. దావీదు అన్నాడు, ''నీ పరిశుద్ధుని కుళ్లు పట్టనీయవు, అతని ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు.''
యేసు అన్నాడు, ''ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దానిని లేపుదును.'' హల్లెలూయా! ఆయన అ మర్త్యమైన దేవుని వాక్యమును నమ్మియుండెను. అవునండి. ఎంతైనప్పటికి....
“ఆయన అది చెప్పలేదని మీరంటారు,” మీర౦టారు, “మంచిది. మీకు తెలుసా. ఆయన శుక్రవారము చనిపోయి, మరలా ఆయన లేచాడు. మూడు రోజుల సంగతి ఏమిటి?”
డెబ్బది రెండు గంటలలో శరీరమునకు కుళ్లు వస్తుందని యేసుకు తెలుసు. ఆయనకు తెలుసు, మూడు రోజులకు మధ్యలో ఏదో సమయము, ఆ మధ్యలో ఏదో సమయము, దేవుడు దానిని లేపనైయున్నాడు. ఏలయనగా దావీదు, ఆత్మావేశముతో, దానిని ఆయన లేపుతాడని చెప్పాడు. హల్లెలూయ! ఒక లేఖనము బైబిలు మీద వ్రాసియున్నది! దేవుడు తన వాక్యమును నెరవేర్చునని ఎరిగి, మరణమునకు ఒక హీరో వలె ఆయన ముందుకు నడిచాడు; మొదట దేవుడు దేనిని తలంచాడో తరువాత దానిని వ్యక్తపరిచాడు. హల్లెలూయా!
108
ఆ ప్రభువైన యేసు తరువాత పరమునకు ఆరోహణమాయెను, ఆయనను ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగివచ్చుచున్నాడు. కాబట్టి ఈ దినమున నేను దినిని నమ్ముదును. తిరిగి జన్మించిన రక్తముతో కడుగబడి, విమోచించబడినవారి కొరకు ఆయన వచ్చుచున్నాడు. “ఆయన వెళ్ళిన రీతిగానే తిరిగి వచ్చును.” అది బైబిలులో చెప్పబడియున్నది. రాజులు లేవొచ్చు, భేదములు రావచ్చు, ఉరుము భూమిని ఆపవచ్చు. కరువు , అణుబాంబులు మరియు ఏమైనప్పటికి, “దేవుని కుమారుడైన యేసు, మీరు ఏ రీతిగా ఆయన వెళ్ళుట చూశారో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును.” ఏలయనగా దేవుని ఆత్మ ప్రేరేపించబడిన వాక్యము దానిని ఆ విధముగా చెప్పినది.
దేవుడు ఈ శరీరమును, వ్యాధిగ్రస్థమైనదానిని తప్పక బాగు చేయునని నేను నిజముగా నమ్ముదును; ఏలయనగా ఆయన చెప్పెను, మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది. బోధకులు, వేదాంతము, సెమినరీలు లేవొచ్చు మరియు పోవచ్చు, ఇంకేది లేచినప్పటికి, దేవుని వాక్యము మాత్రము ఆ రీతిగానే నడుస్తుంది. అవునండి. దేవుడు ఆ రీతిగా చెప్పాడు. దేవుడు దానిని చెప్పకముందు, అది ఒక తలంపుగా వుండెను. దేవుడు సమస్తమును ఆలోచించి తన మాటలలో దాని వ్యక్తపరిచెను, అది భౌతికమైన దానిని చేయవలసియున్నది.
109
ఈ మధ్యనే నేను చదువుతూ ఒక చోట చూశాను, అక్కడ ఒక పాప గడియారము మీద అంకెలుండు బిళ్ళలను రేడియంలో ముంచుచున్నది. ఆమె ఆ బ్రష్‌ను తన నాలుకతో నాకటం జరిగింది. అది ఆమెను చంపి వేసింది. అనేక సంవత్సరముల తరువాత ఆమె యొక్క పుర్రెను త్రవ్వి పైకి తీసారు. వారు తమ స్కోపులను చెవులలో పెట్టుకొని, ఆ పుర్రె లోపల పెట్టి చూచినపుడు, “బర్ర్-బర్ర్-బర్ర్,” అని రేడియ౦ శబ్దము వారికి వినబడినది. దానికి అంతము లేదు. అది ముందుకు, ఇంకా ముందుకు, ఇంకా ముందుకు సాగిపోతూనే యుంటుంది. రేడియంకు అంతము లేదు. అది ముందుకు సాగిపోతూ వుండును. అనేక సంవత్సరముల తరువాత ఆ పుర్రె తెల్లటి ఎముక తప్ప మరేమీ కాదు, కానీ రేడియం ఇంకా ఆ పుర్రెలో కదులుతూనే యున్నది, ఎందుకంటే ఆమె దానిని తన నోటిలోనికి తీసుకొన్నది. కొంత ఆ రీతిగా వుండుటను బట్టి, ఆ రేడియం కదులుతూనే యున్నది.
దేవత్వ సంపూర్ణతను కలిగి, పలుకబడిన మాటల శక్తులతో నిత్యుడైన దేవుడు తన మాటను మాట్లాడినపుడు ఇంకెంత ఎక్కువగా వుంటుంది. కాలములు మారవచ్చు, ప్రజలు మారవచ్చు, రాజ్యములు మారవచ్చు, లోకములు మారవచ్చు, కానీ ఆ వాక్యము ముందుకు, ముందుకు ఎల్లకాలము కదులుతూనే యుంటుంది. కారణము అది వ్యక్తపర్చబడుటకు పూర్వము అది దేవుని తలంపు. హల్లెలూయా!
110
నా హృదయమంతటితో నేనాయనను ప్రేమించుదును. ఈ లోకములోని వందల మతములను చూచిన తరువాత, ఈ ఉదయము నేను చెపుతాను, క్రీస్తు అనే నిశ్చలమైన బండపై నేను నిలబడతాను. ఇంకా మిగిలిన నేలంతా మునిగిపోయే ఇసుకే, మిగిలిన నేలంతా మునిగిపోయే ఇసుకే.
మనము ప్రార్థన చేద్దామా!
పరలోకపు తండ్రి, నీ విమోచనా కృపను ఎరుగుటకు ఈ ఉదయమున నేను ఎంత సంతోషముగా వున్నానో, పాప-జీవితము నుండి నీ కుమారుడు మమ్మును విమోచించెను. ఓ, నా పాత శరీరము వాడిపోవుట నేను చూచినపుడు, పాతదైపోయి, ముడతలు పడి ముసలిదైపోయి, ముడతలు పడి ముసలిదై పోయినను, ఈ నీడకు ఆవల దూరముగా చేతులతో చేయబడని శరీరము నిలిచియున్నదని ఎరుగుదును. అమర్త్యమైనది అక్కడ వున్నది, కాచుకొని చూస్తూయున్నది; అది ఒక దినమున ఈ శరీరము నుండి ఈ జీవము లాగివేయబడినపుడు, అది క్రొత్తదిగా ఆయన సన్నిధిలో యుగయుగములు ఆయనతో వుండుటకు అక్కడ మేల్కొంటుంది.
దేవా, ప్రతి స్త్రీ పురుషుడు, ఈ ఉదయమున వారిలో ఈ నిరీక్షణ కలిగిన వారై లోకములోని వాటన్నిటి నుండి తమ్మును తాము శుద్ధి చేసికొందురు గాక. మరియు ఈ చిన్న విషయములు వారిని క్రిందికి లాగివేసి, వారిని ధౌర్భాగ్యమైన వారిగా చేయును. వారు సంతోషమైన క్రైస్తవులుగా నిన్ను సేవించే వారిగా ఉండనిమ్ము. తండ్రీ, ఈ మనవులన్నీ నీ కుమారుడైన యేసు నామములో దయచేయుము. ఆమేన్.
111
నేను కొంచెము ఎక్కువ సమయము వెళ్ళినట్లున్నానని తలంచుచున్నాను, కాని నా హృదయము ఆయన మీద, ఆయన వాక్యము మీద కొనిపోబడినది. ఏమి మాట్లాడాలో తెలియని వాడనై నేను సిద్ధపడకుండా వచ్చాను; ఈ మాటలు ఇప్పుడు చెప్పుట జరిగినది. మరియు నాకు లేఖనము అంతటిలో నాకు ఒక వచనము దొరకలేదు, కాని కొద్ది వారములలో వాక్యము ఏమైయున్నదో, కొన్ని ఆదివారములలో దానిని మనము అక్కడ నుండి తీసుకోని ముందుకు సాగుదాము.
112
మీరు ఆయనను ప్రేమిస్తారా? నా క్రైస్తవ సోదరుడా వినుము. నీ హృదయములో ఎవరి మీదైనా ఏదైనా వ్యతిరేకలు వున్నచో, వారి యొద్దకు వెళ్ళి సమాధానపడుము. గతాన్ని అంతా మర్చిపొమ్ము. మరియు నీ జీవితము ఎత్తు-పల్లములుగా ఉన్నట్లయితే గుర్తుంచుకో, నీ హృదయములోనికి ఏదో వచ్చినది, ఏదో ఒకటి తలంపుల లోనికి కదిలి వెళ్ళినది. నీ శత్రువు ఎవరైనప్పటికి, అతనిని ప్రేమించుము. అతనిని ప్రేమించుము. ఏమీ జరిగినదో పరవాలేదు. దానిని ఆలాగే పోనిమ్ము. మనము కేవలము గురుగులతో వున్న పొలములో వున్నాము — మనము దానిని గ్రహించాము — కాని మనము తప్పక కలసి పెరగవలసియున్నది.
ఏలయనగా, ఒక మంచి బావి, చెడు నీళ్ళను పైకి తేదు; ఆలాగే ఒక చెడ్డ బావి, మంచి నీళ్ళను పైకి తేదు. ఒక చెట్టు మంచి ఫలమును, చెడ్డ ఫలమును ఒకేసారి ఫలించదు. కాబట్టి బావినంతా మురికి చేయటమో లేక బావినంతా శుద్ధి చేయటమో చెయ్యాలి. అది కానీ, ఇది కానీ, చూశారా? ఏలయనగా మురికితోనే ఆరంభమైనది, కాబట్టి ఈ ఉదయమున బావులను శుద్ధి చేయుదము. “ప్రభువా, నీ ఆత్మను క్రుమ్మరించుము, నన్ను నడుపుము, ఓ దేవా నన్ను నడుపుము,” అని చెపుదాము.
113
రోమాలోని కాథలిక్ సంఘములో, మేము అక్కడున్నప్పుడు, వారు నన్ను ఎముక సంఘము అని పిలువబడే స్థలమునకు తీసికొని వెళ్ళగోరారు. వారి సన్యాసులను వందల సంవత్సరముల కొలది, నేలలో పెట్టి ఆలయము క్రింద వారిని సమాధి చేశారు. ప్రతి సంఘమునకు దాదాపుగా సమాధుల దొడ్డి వున్నది. అక్కడ వారున్నారు. వారు చాలా కాలము అలా వున్నాక వారిని త్రవ్వి బయటకు తీస్తారు. శరీరము అంతా కుళ్ళిపోయి మట్టి అయిపోయాక, వారిని త్రవ్వి పైకి తీస్తారు.
మరియు వారు ఒక పెద్ద గదిని చేశారు. అది అనేక రెట్లు దీనికంటె పెద్దది. దానిని మానవ ఎముకలతో చేశారు, ఎలా వారందరిని కుప్పగా కలిపి చేశారో, మరియు మూలలో నీవు నడుస్తున్నప్పుడు, పుర్రెలు అలాంటివన్నీ వుంటాయి. దీపముల స్టాండులు చిన్న చేతి వ్రేళ్ళతో, ఎముకలతో చేశారు. దీపములన్నీ, అక్కడ సమస్తము ఎముకలతో చేయబడినాయి. అక్కడ ఇతరుల సమాధులు క్రుళ్ళిపోవుచున్నవి. అంతములో ఇది ఒక సూచన, చాలా మనస్సుకు తట్టునట్టిది, ''ఒకప్పుడు మేము మీ వలె వున్నాము, కొద్ది కాలము తరువాత మీరు మా వలె అవుతారు, అని చెపుతుంది.“ అది నిజము.
దేవుని ప్రేమించువారు మాత్రమే అమర్త్యమైన జీవమును కలిగి యుంటారు. అది నిజము.
114
అక్కడకు వచ్చుచున్న ప్రజలను నేను గమనించాను. కాథలిక్ మతము మొత్తము అంతా మూఢ నమ్మకములే. సన్యాసులు ఆ పుర్రెలను తెల్లవగునంత వరకు రుద్దుతున్నారు. వారిలో కొందరు కొంత లోతు వరకు వాటిని త్రవ్వివేయుచున్నారు. ఈ సన్యాసుల పుర్రెలను ప్రజలు ఆశీర్వాదాలు పొందాలని వాటిని రుద్దుతున్నారు, అది మానవ మాత్రుడేనని అది మనకు చూపుచున్నది. వారు దేనికొరకో ఆకలి గొంటున్నారు. అది ఒక వ్యసనము.
సోదరుడా, యేసుక్రీస్తు యొక్క భక్తిలో చచ్చిన వాని ఎముకలను రుద్దుట లేదు. అది యేసుక్రీస్తు నందు విశ్వసించట మరియు అమర్త్యమైన జీవమును అంగీకరించుటయే. ఓ, మై!
115
కాని ఆలోచిస్తే అది సత్యము: ఒకానొకప్పుడు ఆ మనుషులు ఈ ఉదయమున మనము ఉన్నట్లుగానే యున్నవారు. వారి అవకాశమును వారు పొందారు, మనము మన దానిని పొందాము. నీవు దీనితో ఏమీ చేయబోతున్నావు?
ఓ, దానిలోని ప్రతి ఔన్సును యేసు ప్రభువు కొరకు లెక్కించుము. లోకములోని వాటికి సమయమియ్య వద్దు. “సుళువుగా చిక్కుల బెట్టు ప్రతి భారమును విడిచిపెట్టుము. మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తుదము.” ప్రభువైన యేసును ప్రేమింతము.
ఒకరితో ఒకరు దయగా వుండండి. మీ శత్రుల పట్ల దయగా వుండండి. ప్రతి ఒక్కరిని ప్రేమించండి. వారు ఏమీ చేసినప్పటికి పరవాలేదు, ఎలాగైనా వారిని ప్రేమించండి. సోదరుడా, సోదరీ నీవు దానిని చెయ్యలేకపోతే, అలాంటిది ఎప్పుడైనా చెయ్యవలసియుంటే, అది ఇపుడే, ఈ బలిపీఠము నొద్ద. ఎప్పుడు నీవు తిరిగివస్తావు, చేయము...
116
నిన్నటి దినమున నేను గుర్తించాను, ఒక స్వార్థపూరితమైన ఆత్మ, నాలోనికి వచ్చి, ఇలా అంటున్నది, ఈ మనిషిది తప్పు, నేను దాని గురించి అతనికి చెప్పవలసియున్నది. అది తప్పు. దాని గురించి అతనికి చెప్పేది దేవుడే. అది నా పని కాదు. నా పనియేమనగా సువార్తను ప్రకటించటం, ప్రతి ఒక్కరిని ప్రేమించటం, నేను ఆయనకు శత్రువుగా వుండగా, ఆయన నన్ను ప్రేమించినట్లు; నా శత్రువులను కూడా ప్రేమించి అలా సాగిపోవుటయే. అది మంచిది. నేను ప్రేమ హీనముగానున్నప్పుడు, ఆయన తన రొమ్ముపై ప్రేమించాడు. మరియు ఎవరైనా ప్రేమ హీనముగా నున్నచో, ఆలాగే నన్నును వారిని ప్రేమించనివ్వండి. క్రీస్తులోని ఆత్మను మనలోనూ ఉండనివ్వండి. ఆమేన్. నేనాయనను ప్రేమింతును, నేనాయనను ప్రేమింతును. ఓ, మై!
లోకము యొక్క వ్యర్థమైన సంపదలను ఆశించవద్దు,
అవి అతి త్వరగా కుళ్ళిపోవును,
ఆ పరలోకపు సంపదలను పొందుటకు వెదకుము,
అవి ఎన్నడూ గతించవు!
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
నీ ఆశలన్నీ నిత్యమైన వాటి మీద నిర్మించుకొనుము,
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
నా యాత్ర పూర్తియైనపుడు,
నేనాయనకు నమ్మకముగా వున్నచో,
మహిమలో నా గృహము చక్కగా
ప్రకాశముగా నుండును,
గొప్ప ఆనందము పొందిన నా ఆత్మ చూచును!
కాబట్టి మార్పు చెందని ఆయన హస్తమును పట్టుకొనుము!
నీ ఆశలన్నీ నిత్యమైన వాటి మీద నిర్మించుము,
మార్పు చెందని ఆయన హస్తములను పట్టుకొనుము!
117
ప్రతి స్త్రీ మరియు పురుషుడు, బాలుడు మరియు బాలిక యొక్క ప్రార్థన ఈ దినమున అది కాదా? దేవుడు మిమ్ము దీవించును. ఆ రీతిగా దేవుడు నిన్ను కాపాడును; నీ మనస్సులో దీనుడవుగా; నీ ఆత్మలో మృదువుగా; దేవుని బట్టి క్రీస్తు మిమ్మును ప్రేమించినట్టుగా, ఇతరులను క్షమించుము. దయగా, ఔదార్యముగా, స్వాగతము ఇచ్చునట్లుగా ఉండుడి.
118
బ్రదర్ నెవిల్, సంఘములో ఇంకేదైనా కార్యక్రమము. ఇంకా అలాంటిది ఏదైనా వున్నాదా?
119
ఈ ఉదయమున ఇక్కడ నుండి ప్రయాణిస్తూ వుండగా నా క్రైస్తవ స్నేహితుడా వినుము. మీకు వస్తు రూపముగా ఇచ్చుటకు మా యొద్ద ఏదీ లేదు. మీరు మా గుమ్మములలో క్రొత్తవారుగా వున్నారు. మాకు చిన్న పాత గుడారమున్నది. మేము పేద ప్రజలము, పేదవారమంటే పేదవారము. క్షమించండి. మీకు స్వాగతము పలుకుటకు, ప్రాతినిధ్యంవహించే మంచిది ఏదీ ఇక్కడ లేదు. కాని సోదరుడా, సోదరీ దీనిని నిర్మాణము చూచుటకు అంత పెద్దగా వుండదు, కాని ఇక్కడ వున్న చిన్న గోడల లోపల ప్రభువైన యేసు క్రీస్తు కొరకు మీకు స్వాగతమున్నది. మీకు వెళ్ళుటకు ఆరాధనా స్థలము లేకపోయినచో, వచ్చి మాతో ఆరాధించండి. మీకు ఇక్కడ మంచి దైవ సేవకుడు వున్నాడు. కొందరు చక్కని వారు పెద్దల బోర్డులో వున్నారు. కొందరు మంచి క్రైస్తవులున్నారు, వచ్చి కూర్చొండి. మీకు ఎల్లప్పుడు ఈ బ్రన్హం గుడారములో సుస్వాగతము.
120
మేము చేయగలిగినది ఒక్కటే మా దగ్గర వున్నది. మేము ప్రభువైన యేసు క్రీస్తును మా హృదయమంతటిలో ప్రేమించుటయే. మేము ఈ బైబిలు దేవుని వాక్యమని నమ్ముదుము. మాకు బైబిలు తప్ప ఇతర మూల పుస్తకములు లేవు. మాకు ఇది అని గాని, అది అని గాని, ఏ నియమము లేదు. మా నియమము ప్రేమయే. మా సిద్ధాంతము క్రీస్తు. మేము మిమ్ములను మా హృదయమంతటితో ప్రేమించుదుము. తిరిగి రండి, మాతో ఉండండి. మీకిష్టమైతే మరియు ఒక దినమున మంచి స్థలములో చూడాలని ఆశిస్తున్నాము. ఎక్కడ మనము...
కానీ ఈ సమయమున మీ కాళ్ళ మీద నిలబడియుండగా, మీకిష్టమైతే మనము సీయోనుకు వెళ్ళుదము. టెడ్డీ, మీరిక్కడకు వస్తారా ఒక్క నిమిషము, కుమారుడా ఒక్క నిమిషము. మనము....
ఈ రాత్రికి ప్రభురాత్రి ఆరాధన వున్నది. ఓ, దాని కొరకు నేనిక్కడ ఉండుట సంతోషము. వినండి. యేసు అన్నాడు, “నా శరీరము తిని, నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్య దినమున నేను అతనిని లేపుదును.” ఆ వాక్యము అమర్త్యమైనది. అది నిజమేనా? మంచిది.
121
ఇప్పుడు మనమంతా కలిసి, సీయోనుకు వెళ్ళుదము అను పాటను పాడుదము. మంచిది.
రండి ప్రభువును ప్రేమించు మనము,
మన సంతోషములు తెలియనివ్వండి,
తియ్యటి మనస్సుతో పాటలో ఏకమవ్వండి,
ఆ రీతిగా సింహాసనము చుట్టు చేరుదము.
ఇప్పుడు, అందరూ తిరిగి కరచాలనం చెయ్యండి.
మనము సీయోనుకు వెళ్ళుతున్నాము,
చక్కని, అందమైన సీయోను;
మనము ముందుకు సాగుచూ
సీయోనుకు వెళ్ళుచున్నాము
దేవుని రమ్యమైన పట్టణము.
ఓ!మనము సీయోనుకు వెళ్ళుచున్నాము,
చక్కని, అందమైన సీయోను;
మనము ముందుకు సాగుచూ
సీయోనుకు వెళ్ళుచున్నాము
దేవుని రమ్యమైన పట్టణము.
122
ఇప్పుడు, మనము ఆ పల్లవిని మరొకసారి పాడుతూ వుండగా, తరువాత శెలవు పుచ్చుకొనే పాట పాడుదము. మనము సీయోనుకు వెళ్ళుచున్నాము అనే పాటను మరొకసారి పాడుదము, తెలియని వారికి మిమ్మును మీరు పరిచయం చేసికొనండి. మీరు ఇక్కడున్నందుకు చాలా సంతోషం, అని చెప్పండి. కారణము ఆలయము చాలా వేడిగా వున్నది. ఇంకా ఎక్కువ సేపు మనము ఆలయములో ఉండలేము. ప్రార్థన అయిపోయింది. వెళ్ళిపోదాం. కొన్ని నిమిషములలో మనము శెలవు పుచ్చుకొందాము. ఇప్పుడు, అందరూ తిరిగి చెప్పండి “నేను మిష్టర్ జోన్సును, నేను మిమ్మును కలుసుకొనటం సంతోషం, తిరిగి ఆలయమునకు రండి.” అందరూ స్నేహ పూర్వకముగా నవ్వండి. ఇప్పుడు మంచిది.
మనము వెళ్ళుచున్నాము...
మిమ్ములను మీరు క్రొత్తవారితో
పరిచయం చేసికొనండి,
మరలా రమ్మని తిరిగి చెప్పండి.
అందమైన సీయోను;
మనము సీయోను వైపు వెళ్ళుచున్నాము,
దేవుని రమ్యమైన పట్టణము.
123
ఇప్పుడు బ్రన్హం గుడారము యొక్క అమర్త్యమైన శెలవుపాట. పాతకాలపు శెలవు పుచ్చుకొనే పాట, ఎంత మందికి గుర్తున్నది?
యేసయ్య నామమును నీతో తీసికో,
దుఃఖములో బాధలో వున్న కుమారుడా;
అది నీకు సంతోషమును ఆదరణ ఇచ్చును,
నీవు వెళ్ళినన చోటికల్లా దానిని తీసికొని వెళ్ళుము.
ఓ,అందరూ కలిసి,
యేసయ్య నామమును తీసికో,
దుఃఖములో బాధలో వున్న కుమారుడా;
అది నీకు సంతోషమును ఆదరణను ఇచ్చును,
నీవు వెళ్ళిన చోటికెల్లా దానిని తీసికొని వెళ్ళుము.
ఓ ప్రశస్తమైన నామము,
ఓ ఎంత మధురము!
భూమికి నిరీక్షణ మరియు పరలోకమునకు సంతోషము;
యేసయ్య నామమును తీసికో,
ప్రతి వల నుండి డాలుగా,
శోధలు నీ చుట్టూ పోగైనపుడు,
ఓ, ఆ పరిశుద్ధ నామమును ప్రార్థనలో ఊదుము.
ఓ ప్రశస్తమైన నామము,
ఓ ఎంత మధురము!
భూమికి నిరీక్షణ మరియు
పరలోకమునకు సంతోషము;
ప్రశస్తమైన నామము (ప్రశస్తమైన నామము).
ఓ ఎంత మధురము!
భూమికి నిరీక్షణ మరియు పరలోకమునకు సంతోషము.
ఇప్పుడు, ప్రార్థనకు తలలు వంచుదము. పాస్టరు గారు, వచ్చి సెలవియ్యండి, ఇస్తారా, నా సోదరుడా.