నిత్యజీవము అది ఎలా పొందవలెను?

నిత్యజీవము అది ఎలా పొందవలెను?

VGR COUNT -218......... ఇక్కడ ఈ రాత్రి, గతించిన సంవత్సరమంతా వారికి ఆయన ఏమైయుండెనో దాని కొరకు, వివిధమైన వ్యక్తీకరణలు యొక్క కృతజ్ఞతలు దేవునికి వెల్లడించుకొనుటకు మరియు ఈ సాక్ష్యములు వినుటకును ఉన్నాము. మరియు వారితో నా సాక్ష్యమును చేర్చగోరుచున్నాను. “నీళ్ళ మీద ఆహారము”

అను అంశమునకు అక్కడ వెనుక ఉన్న ఆ సహోదరీలు సాక్ష్యమిచ్చుచూ, ఆలోచించుచున్నారు, మరియు స్లాటర్ సహోదరుడు. “ఆ మర్త్యమైన జీవితచక్రాలు, ఇంకా నిలచి ఉండగా” అను సంగతిని గూర్చి సహోదరుడు

గ్రహమ్‌, మాట్లాడుచుండెను. ఇక్కడ తప్పుడుగా అర్ధము చేసికొని ఉండవచ్చును, అయితే అక్కడ, సింహాసనము ఎదుట, దేవుడు సమస్త సంగతులను గూర్చి అంతా ఎరుగును.

కనుక మనం ఇక్కడ ఈవిధముగా చేయుటకు ఉన్నాము ...... క్రొత్తపేజి త్రిప్పుటలో నేను నమ్మిక ఉంచను, లేక ఆ విధముగ ఏదైనను, నేను—కేవలం అలా నీవు ఆ తరువాత రోజు దానిని వెనుకకు విడచిపెట్టుదువు. అయితే మనం వచ్చి మరియు ఆరాధించుట కొరకు మనలను దేవునికి ఇచ్చుకొని మరియు మనం ఏమైయున్నామో దాని కొరకు ఆయనకు వందనము చెల్లించవలెను..... ఆయన మనతో ఉండునట్లు, మరియు శ్రేష్టమైన దాని గూర్చి, మనతో ఉండి కొనసాగుటకు ఆయనను అడిగెదము.

2

ఈ రాత్రి కొంచెం అలసిపోయాను. నేను గతరాత్రి కొందరు జనులతో ఉన్నాను, మరియు నేను కొంచెం సమయం ఇక్కడ ఉన్నాను. మనం ఈరోజు దాదాపు రోజంతయు, బయటే ఉన్నాము, కనుక అలా౦టి భావన కలిగియుండి, కొంచెం అలసిపోయాము. మరియు నేను ఇక్కడే ఎక్కువ సేపు నిలచి ఉండలేను.

అయితే అప్పుడు వేదికను సహోదరుడు ఫంక్‌నకు ఇవ్వగోరుచున్నాను, మరియు అతడు మనకు వక్త (మాట్లాడువాడు) మరియు అప్పుడు సహోదరుడు ఉడ్స్, అతని వెంబడి వెళ్ళునని, నేను అనుకొనుచున్నాను. మరియు అప్పుడు, కనుక అప్పుడు వారందరు నిలచి ఉందురు. అతడు అన్నాడు, ఈరోజు ఇక్కడ అది నేను చెప్పలేను. అయితే, మీరు చూడండి, నేనే చెప్పాను. కనుక తన తలను ఆడించుచు, అక్కడ వెనుక కూర్చుని ఉన్న సహోదరుడు ఫంక్‌ను నేను చూశాను. సహోదరులారా, అతనిపై అది ఒక చిన్నహాస్యము. మరియు, అయితే, అది-అది సరియైనది, వారు నిశ్చయముగా కొన్ని నిమిషాలలో ఇప్పుడు సరిగ వెంబడించు అవకాశమును పొందారు.

కనుక ఈ రాత్రి ఇక్కడ చాలమంది వక్తలు మనకు ఉన్నారని, మీకు తెలియును, కనుక మనకు మూడుగంటలు ఉన్నాయి, మరియు కనుక మనం ఎంత తొందరగ చేయగలిగితే అంత తొందరగ ముందుకు వెళ్ళెదము. కొన్ని వేళల్లో.......

3

ఈ సమయంలో ఈ చిన్న సంగతి నేను చెప్పగోరుచున్నాను, అక్కడ సహోదరి ఇచ్చిన సాక్ష్యమునకు చె౦దినదై ఉన్నది. ఆమె పేరు, సహోదరి లియోఫోర్డ్, అని నేను నమ్ముచున్నాను.

కొన్ని వారాలు క్రితము, లేక ప్రజలు కార్యాలయమునకు ఇచ్చు పిలుపును గూర్చి అలా చేశాను, మరియు అప్పుడు- ఆ తరువాత సహోదరుడు కాక్స్‌ మరి అది ఏమైయున్నదీ వారు ఆ సమస్యను నాకు బాగుగ అభ్యసింప చేశారు. మరియు నేను వెళ్ళుటకు నడిపించబడునట్లు భావించిన విధముగానే నన్ను వెళ్ళనివ్వండి. మరియు, ఓహ్‌, మై, అది చేయుటకు అదే మార్గము.

మరో ఉదయాన, నేను.... పరిశీలించి చూడగ మరియు వివిధ పిలుపులు గలవు. అక్కడ సిస్టరు లేక్‌ ఉండెను, మరియు ఆమె కుమారుడు యాక్సిడెంటులో ఉండెను. సహోదరుడు కాక్స్‌ చెప్పినది అదే అయి ఉండెనని నేను నమ్ముచున్నాను ....సహోదరుడు కాక్స్‌. మరియు వారు (ప్లీహము) రక్తంలో మార్పులను తీసుకొనువచ్చు ఒక ఇంద్రియం బయటకు తీసేశారు మరియు మరణించు స్థితిలో పడి ఉండెను. మరియు మరో సహోదరుడు అలా బయట పర్వతాల మీద ఈ సంవత్సరం ప్రయాణములో నాతో ఉ౦డెను, మరియు అతడు మూత్ర పిండాలులో రక్తస్రావం గలిగి, బహుశా కేన్సరుతో, అక్కడ పడి ఉండెను. మరియు కాలిఫోర్నియాలో ఓ, కేవలం ప్రతిచోట, అలా రోగులయి ఉన్న వివిధ రకాల ప్రజలు, మరియు నేను బయట ప్రార్ధన కొరకు ఉన్నాను.

నేను లోనికి వచ్చాను మరియు నేను...... నా భార్య సహోదరుడు స్లాటర్ పిలిచెనని నాతో చెప్పెను, ఏదో ఒక చిన్న దాని కొరకు...... లేక సహోదరి స్లాటర్, ఇక్కడ ఆ మరో ఆదివారం ఉన్నటువంటి ఒకతె అయిన ఆ చిన్న బాలిక, నేను లోనికి వెళ్ళాను మరియు కూర్చున్నాను. నేను తలంచాను “ప్రియదేవా, నేను ఇవన్నియు కలిగి ఉన్నాను,” మరియు నేను వాటి అన్నిటి కొరకు ప్రార్ధించుచున్నాను. “మరియు - మరియు మీరు నన్ను ఏమి చేయమని కోరుచున్నారు?”

మంచిది, ఒక చిన్న బిడ్డను గూర్చి మనకు ఏముందో చూచుటకు, నేను చూచుటకు వెనుకకు వెళ్ళాను. మరియు నేను-నేను ఒక చిన్న బిడ్డను గూర్చి ఏదైనా ఉందా కనుగొనుటకు సహోదరి కాక్స్‌ పిలిచాను. ఒక బిడ్డను గూర్చి ఏ విషయమైనను ఎరుగుటకు ఏ ఒకడూ లేనట్టుగ కనబడెను, అది ఒక దర్శనము కాదు. అయితే జబ్బుగా ఉన్న, “ఒక చిన్న బిడ్డ” దగ్గరకు వెళ్ళుటకు, ఆత్మలో ఒప్పించబడుట అయి ఉన్నది. సరే, నేను కనుగొనగల ఒకే సంగతి, వారు మాట్లాడుతున్న ఆ బిడ్డ, కెంటకీ దగ్గరలో దిగువన ఉండెను. సరే, వారు అది చెప్పినప్పుడు, అది ఆ విధముగా కనిపించలేదు.... ఏ విధముగా అయినను, కేవలం అది సరిగా గుర్తించబడలేదు. మరియు నేను అలా ఉండి .... అనుకున్నాను, బహుశా, కేవలం కొంచెం సేపటిలో ఒక దర్శనము వచ్చి ఉండవచ్చును. అయితే అలా జరగలేదు, ఒక దర్శనముగ మారలేదు, మరియు నేను ఆశ్చర్యపడుచూ ఉన్నాను. నేను ప్రార్ధించుటకు, ఒంటరిగ, వెనుక నా గదిలోనికి వెళ్ళాను మరియు నేను అనుకున్నాను, “ఇప్పుడు, ఆ బిడ్డను గూర్చి ఎక్కడ? నేను ఒక బిడ్డను గూర్చి ఆలోచించగలిగేది అక్కడ ఎక్కడైనా ఉందా?”

4

మరియు గత ఆదివారము, లేక ఒక వారం ఆదివారం, లేక అలా ఏదో ఒకటి, నేను అక్కడ వెనుక కూర్చున్నాను. మరియు ఒక చిన్న బాలిక వచ్చింది, నా చెవిలో నా వెనుక, నెమ్మదిగ చెప్పింది, అనెను, “బిడ్డగానున్న సహోదరి, నా చిన్న సహోదరి కొరకు ప్రార్ధించుము”. మరియు ఆ చిన్న లియోఫోర్డ్ బాలికయే అది ఆమె ఈ రాత్రి ఇక్కడే ఉండవచ్చును. నేను ఎరుగను ఆమె చాల అందమైన చిన్నబాలిక, ఒక చిన్నదైన వ్వక్తి. మరియు నేను వెనుకకు తిరుగుట జరిగినది. నేను అన్నాను, “ప్రియమైనదానా, మంచిదే” ఆ విధముగ మరియు కనుక ఒక విధముగా నా తలవంచి మరియు ఆ బిడ్డకొరకు ప్రారంభించి ప్రార్ధిస్తూ ఉంటిని మరియు కేవలం వెళ్ళిపోయాను, దాని గూర్చి మరచిపోయాను. మరియు అది నా మనసు లోనికివచ్చిన వెంటనే, ఏదో జరిగినది. మరియు అప్పుడు అది దేవుడయి ఉండెనని నేను తెలిసికొంటిని.

కనుక అప్పుడు నేను వెళ్ళి మరియు మిడాను ఎక్కడని అడిగాను-ఎక్కడ వారు నివసించెను. మరియు ఆమెకు ఖచ్చితముగా తెలియదు కనుక మేము ఫోన్‌ బుక్కులో చూశాము మరియు వారి నంబరు పొందాము. మరియు- మరియు నేను అన్నాను, “ఏదో ఒకటి .... మరియు వారు ఒక రోగంతో ఉన్న బిడ్డతో ఉన్నారు, అని నేను నమ్ముచున్నాను. లేక, ఒక వారం ముందు, లేక ఏదో ఒకటి, ఒక వారము లేక పది రోజులు ముందు వారు ఒక జబ్బుగ ఉన్న బిడ్డను కలిగి ఉన్నారు.” కాబట్టి నేను అన్నాను, “అక్కడ దాని గూర్చి ఏదో ఉన్నది. ఇప్పుడు నీవు గమనించుము.”

మరియు నేను అక్కడ దిగువకు పిలిచాను మరియు ఏ ఒక్కరూ జవాబు ఇయ్యలేదు. సరే, అప్పుడు నేను మిష్టర్ కాక్స్ను వెనుకకు పిలిచాను, మరియు ఇక్కడ ఉన్న ఆమె తల్లి దగ్గరకు వెళ్ళాను. మరియు-మరియు నేను ఆమె తల్లిని పిలిచాను, మరియు ఆమె అనెను, “ఎందుచేత....” నేను అది ఏమై ఉ౦డెనో ఆమెకు చెప్పాను. మరియు ఆమె ఇక్కడ ఈరాత్రి ఉండవచ్చును; నేను విచారపడుచున్నాను, నేను ఆ స్త్రీని గుర్తించలేకపోయాను. నేను-నేను ఆమె ముఖము చూచి ఉండిన యెడల ఆమెను ఎరిగి ఉండేవాడిని.

అయితే ఆ బిడ్డ ఆసుపత్రిలో చాలా జబ్బుగ ఉన్నదని ఆమె నాకు చెప్పినది. మరియు అదే సమయంలో రక్తమార్పిడి జరుగుచున్నదనియు చెప్పెను. సరే, నేను అన్నాను, “సహోదరీ, నేను ఎరుగను. నేను ఇప్పుడు అది ఒక దర్శనము అని చెప్పలేను, ఎందుకనగా అది కాదు, అయితే కేవలం ఏదో అలా నేను కదలలేకుండ ఉన్నాను. అది కేవలం నన్ను ఒత్తిడి చేయుచున్నది- ఆ బిడ్డ దగ్గరకు. కేవలం నేను కేవలం ఆ బిడ్డ నా ఎదుట ఉన్నట్టుగ కనిపించుచున్నది.” కనుక నేను వెళ్ళాను.

మరియు నేను అన్నాను. “ఇప్పుడు నేను వెళ్ళను,” కారణం ఆ మార్పిడికి అది కొంత సమయం తీసుకొనునని నేను ఎరుగుదును.“ మరియు వారు ఇక్కడ తలద్వారా ఇచ్చెదరు, నేను ఆలోచించాను, కనుక వారు..... అది చాల బాధతో మరియు చెడుగ ఉండునని నాకు తెలియును. కనుక కేవలం నేను కనిపెట్టాను, లోపలకు వెళ్ళాను మరియు ఆ బిడ్డ కొరకు ప్రార్ధించాను. మరియు నేను సిద్ధముగ ఉన్నాను. నేను అనుకున్నాను, ”ప్రభువు నన్ను నడిపించినది ఈ స్ధలమే అయిఉన్నది.“

5

మరియు నేను ఆసుపత్రికి వేగముగా వెళ్ళాను మరియు-మరియు ఆ బిడ్డను చూడాలని అడిగాను. మరియు ఆ బిడ్డ ఉన్నచోటకు వారు నన్ను పంపారు, మరియు గదిలో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తల్లిని కలిసాను. దానికి ఒక గంట ముందుగా, లేదా ఆ విధమైనది ఏదో ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళుటకు, ప్రభువు నాపై ఎలాంటి ఒత్తిడి కలిగించెనో ఆమెకు చెప్పెను. మరియు ఆమె పడక దగ్గరకు తిరిగి వెళ్ళెను; ఆ బిడ్డ అక్కడ కాళ్ళతో తన్నుకొనుచు, జారుచూ నవ్వుచూ పడి ఉండెను.

కనుక నేను లోనికి వెళ్ళాను, మరియు ఆ చిన్న బాలుడు కేవలం తన్నుకొనుచు, నవ్వుచుండెను. ఆ చిన్న సీసాతో పాలు త్రాగెను మరియు ప్రతిదియు, నీ జీవితంలో ఎన్నడైనా చూచిన కేవలం మామూలుగ ఏ బిడ్డవలెనైనా ఉండెను. మరియు కేవలం నేను నా చేతులను ఆ చిన్న వ్యక్తి మీద ఉంచాను, ఇప్పుడు, చూడండి, మరియు అది ఆశీర్వదించబడి, మరియు అనుభవములో నుండి బయటకు నడచివెళ్ళెను.

మరియు నేను కొన్నిక్షణాల క్రితం ఆ తల్లి చెప్పినది విన్నాను, వారు ఆ బిడ్డను ఇంటికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి అది-అది జరిగినప్పుడు నిన్న అయి ఉండెను, మరియు ఈరోజున ఆ బిడ్డ ఇంటి వద్ద బాగానే ఉన్నది.

నాయంతట నేను ఒక వంద పిలుపులు ఇచ్చిన దానికంటె అది శ్రేష్టమైనది. ప్రభువు ఎదుట ప్రశాంతముగ ఉండుడి, కనుక కేవలం నీవు ఎక్కడికి వెళ్ళవలెనో ఆయన మీకు చెప్పును. మరియు ప్రతి సమయంలో అది పరిపూర్ణము అయి ఉన్నది. చూశారా? అది - అది ప్రభువు నడిపించుచున్నాడు.

ఇప్పుడు ఎవరో అంటారు, “సరే సహోదరుడా, బ్రాన్హాం నీవు ఇక్కడకు రమ్ము నీవు ఇక్కడ దిగువకు రమ్ము”నీవు-నీవు దీనికి లేక దానికి ఒక క్రమములేని వాడుగా ఆ విధమైన గందరగోళములోనికి వెళ్ళెదవు, నీవు.... దేవుడు నీతో మాట్లాడలేడు. నీవు కేవలం కింద కూర్చుని చెప్పుము, “నీకు వందనములు” అని ప్రభువు ఎదుట అది ఉంచుము. చెప్పుము, “ఇప్పుడు, ప్రభువా, దీని గూర్చి నేను ఏమి చేయవలెనని కోరుచున్నావు? ఇప్పుడు, నేను నీ సేవకుడనని మీరు ఎరుగుదురు, మరియు నీవు ఏమి కోరుచున్నావు.....”

అయితే, చూడండి ప్రభువు నా హృదయంతో మాట్లాడిన వెంటనే నేను అక్కడకు వెళ్ళి ఉందునని అలా ప్రభువుకు తెలిసినందున, నేను అక్కడకు కూడ వెళ్ళకముందే ఆయన ఆ బిడ్డను స్వస్థపరచెను. అది యథార్థం. చూశారా? కాబట్టి, చూడండి, అవునండి. చూడండి, అక్కడకు వెళ్ళినది నేను కాదు.

ఇప్పుడు నీవు అందువు, “సహోదరుడా, బ్రాన్హాం, అది ఏమయి ఉండెను?” చూడండి, యేసుక్రీస్తు శరీరములో మనం వరములు కలిగి ఉన్నాము. మరియు ఆ పరిశుద్ధాత్మ తనకు తానే, అది ఏమై ఉండెనో ఎరిగి ఉండి, అక్కడ విజ్ఞాపనము చేయుచు ఆ పరిశుద్ధాత్మ ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళునట్టు నా మీద ఒత్తిడి కలిగి ఉండెను. నేను ఆ బిడ్డకు ఇంటి దగ్గర కూడ ప్రార్ధించిన వెంటనే, మరియు ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళాను, ఎందుకనగా అది ఆయన ఏమి చెప్పెనో అది నెరవేర్చుట అయిఉండెను. మనం అర్ధం చేసికొనలేని సంగతులు గూర్చి కూడ, అక్కడ పరిశుద్ధాత్ముడు విజ్ఞాపనలు చేసెను. ఆయన అద్భుతకరుడు కాడా?

6

స్నేహితులారా, నేను మీకు చెప్పుచున్నాను, ఈరాత్రి ఎంతో ఎక్కువగ వందనములు చెల్లించవలసి ఉన్నాను! నేను-నేను కేవలం ఎలా ప్రారంభించాలో తెలియదు, మరియు నేను కూడ ప్రయత్నించలేదు. నేను ప్రయత్నం కూడ చెయ్యలేను! నాకు తెలియదు.

నేను లేఖనంలో ఇక్కడ కొన్ని వాక్యములు చదువబోవుచున్నాను, మరియు వాటిపై దేవుని చిత్తమయితే, కొన్ని నిమిషాలు మాట్లాడుదును.

అయితే, మొదట, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు నా కృతజ్ఞతలు తెలియజేయగోరుచున్నాను, అలా నన్ను రక్షించి మరియు ఆయన సొంత రక్తములోనన్ను కడిగెను మరియు అలా ముఖాముఖిగ, ఏదో రోజున ఆయనను చూచునట్లు, ఈ చక్కని మరియు మహిమకర నిరీక్షణ నాకిచ్చెను. మరి శిక్షావిధిలో నేను అక్కడ నిలబడను, ఎందుకనగా ఆయన రక్తము ఇదివరకే నన్ను విమోచించెను.మరియు ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను విమోచించబడి ఉన్నాను.

ఆయన నాకు ఏమి ఇచ్చెననగా, మీరందరూ ఎక్కడకు వెళ్ళుచున్నారో అదే రాజ్యములో సహపౌరునిగా ఉండుటకు, మరియు మనమందరము మహిమలో ఆయనతో కలసి ఏలుదుము! అది ఎంతటి మరపురాని సంగతి అయి ఉన్నది!

7

గత సాయంకాలము. నేను కూర్చుని ఉండగా, ఆ సమయములో ఇక్కడ హాజరయిన కొందరు ప్రజలతో నేను మాట్లాడియున్నాను. ఈ రోజున, మార్గము దిగువన, ఎలిజబెత్‌లో, మేము కూర్చుండి, ఒక సహోదరుని మేజాబల్ల యొద్ద, ఈనాడు మధ్యాహ్న భోజనం కలిగియున్నాము. మరియు మేము మూలాధారమైన సత్యాలను గూర్చియు, లేక ఆ విధముగ మనం కలిగియున్న ప్రారంభ సువార్తను గూర్చియు మాట్లాడుకొనుచున్నాము, సందేహము యొక్క ఏ ఛాయకైనను ఆవలకు అది ఎలా౦టి వాస్తవికతను కలిగియున్నది. ఏలా౦టి సందేహము కొరకైనను, ఎంత మాత్రము మనం కలిగి ఉండుటకు ఏచోటూ లేదు. ఈ గుడారము మరియు ప్రజలు, దాని సభ్యులు, మరియు జెఫర్‌సన్‌ విల్లాలో ప్రజలు మరియు దానిచుట్టు ఉన్నవారు, న్యాయతీర్చు నొద్ద నిలబడుదురు. మనం రక్షించబడక పోయినయెడల, సంపూర్ణముగా ఏ క్షమాపణలు లేకుండ నిలబడుదుము.

8

కొంతకాలం క్రితం ఒక యవ్వన సేవకునిగా నా మొదటి ఉజ్జీవం వచ్చినప్పుడు ఒకటెంటులో, (ఒక గుడారంలో) ఎక్కడ ఈ హౌసింగ్‌ ప్రాజెక్టు ఉన్నచోట, నేను ఇక్కడ ఈ మూలన కలిగి ఉన్నాను. నేను మాట్లాడనై ఉన్న వర్తమానము ఒక ఋజువుగా నేను నది దిగువన ఒక గుంపునకు బాప్తిస్మమిచ్చుచుండగా, ఆ ఆదివారం మధ్యాహ్నము, ప్రభువు దూత బహిరంగముగా ఆయన మొదటిసారి కనిపించెను. మరియు ఆకాశము నుండి కిందకు దిగివచ్చిన వెలుగై ఉండెను మరియు అక్కడ నిలిచెను. బహుశా ఈరాత్రి ఎవరైతే నిలచి ఉన్నారో గుడారంలో ప్రజలు మరియు ఆ వెలుగును చూచెను. మరియు నేను అది, మొదలైనవి చెప్పుట ప్రారంభించితిని. మరియు ఆ కథ ఎట్లు వెళ్ళునో, మరియు అలా ముందుకు మరియు ముందుకు వెళ్ళినది మీరందరు ఎరుగుదురు. మరియు ప్రజలు కొన్ని సమయాలలో నడచిపోయి, మరియు అంటారు, “అది కేవలం ఊహించుట.” ప్రజలు ఎక్కడ దానిని చూశారో ఆ సమావేశం విడచి మరియు దూరంగపోయి, అందురు “నేను అది చూశాను” మిగతావారు అందురు, “సరే, నేను అది చూడలేదు.” ఇప్పుడు, పరంపరముగ, దేవుడు ఎవరు చూడగోరుచున్నారో వారిని చూడనిచ్చును.

ఆ జ్ఞానులు ఆ నక్షత్రములను వెంబడించునప్పుడు, అక్కడ చరిత్రలో ఏ చిన్న సంగతియు లేదు, లేక ఏదైన నక్షత్ర గణితశాల, లేదా ఏదైనను లేదు.... మరియు వారు కూడా నక్షత్రములద్వారా, సమయాన్ని అయితే ఆ నక్షత్రమును ఏ ఒకరూ చూడలేదు. అయితే ఆ జ్ఞానులైన మనుష్యులు, చూశారు, చూడండి, అది యధార్ధము, కారణము వారు దాని కొరకు చూచుచున్నారు. మరియు వారు అది చూచుటకు ఉద్దేశ్యం కలిగి ఉన్నారు మరియు అది వారిని క్రీస్తు దగ్గరకు మార్గదర్శిగ ఉండి నడిపించెను. మరియు, ఆ సమయములు, మరియు మొదలైనవి చెప్పుటకు ఆ ప్రజలు ఆకాశముల వైపు చూచిరి మరియు, అయినను అది ప్రతి నక్షత్ర గణితశాల మీదుగా దాటిపోయెను. అయితే అది వెళ్ళుచుండగా ఏ వ్యక్తి చూడలేదు, అయితే ఆ జ్ఞానులు చూశారు, ఏలయనగా అది చూడవలెనని అది వారి కొరకు నిర్దేశించబడియుండెను. దేవుడు నీకు ఏదో సంగతిని చూపించుటకు ఉద్దేశించిన యెడల, నీవు దానిని చూడగలవు.

ఆ సమయములో, ఎలిషా దోతానులో నిలబడి ఉండగా, మరియు ఆయన చుట్టూ చూచెను. మరియు సేవకుడు బయటకు చూచెను, మరియు అనెను, “ఓహ్‌, అలా చూడండి.... ” అష్సురీయులు చుట్టూర ముట్టడించియున్నారు. ఎలిషా చెప్పెను, “వారితో ఉన్నవారికంటే మనతో ఉన్నవారు అనేకులు” అతడు చుట్టూ చూచెను, అతడు ఏమియు చూడలేదు గాని ఎలిషా అక్కడ నిలబడి ఉండెను ..... ఆయన అనెను అతడు ..... “దేవా” అనెను, “ఈ యవ్వన మనిషి కండ్లు తెరువుము ప్రభువా” మరియు అప్పుడు, అదే కళ్ళతో, కనబడే ఆ కళ్ళతోనే, అలా ఆయన అతని కండ్లను తెరచినప్పుడు, ఆ ప్రవక్త చుట్టూ అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు నిలబడెను. మరియు, చూడండి, అతడు ..... అదే అయి ఉండెను. అది ఎక్కడో అయి ఉన్నది. మరియు ఆయనను నమ్ముచున్న పిల్లలతో ఆయన సన్నిధి ఉన్నదని మనము ఎరుగుదుము.

నేను మాట్లాడుచున్నాను, నేను అన్నాను, “గదిలో నా భార్య కూర్చున్నది మరియు మేము అదే వెలుగును గూర్చి మాట్లాడుకుంటున్నాము, అది ఎక్కడకు వచ్చెనో మరియు దాని చిత్రము తీయబడి ఉండెను. ఈ రాత్రి, కళ్ళారా చూచిన దానిని గూర్చి, మరల చెప్పుచున్నాను, కనీసం ఒకరు లేదా ఇద్దరు ప్రజలు, ముగ్గురు ప్రజలు ఇప్పుడు భవనములో, అక్కడ ఉండెనని నేను ఊహించుచున్నాను; అక్కడ వెనుక ఉన్న డేవిడ్‌, సహోదరుడు ఉడ్స్‌, మరియు సహెదరి ఉడ్స్‌; దేవుడు ఆ చిత్రమును తీసికొనుటకు అనుమతిని ఇచ్చినప్పుడు, టెక్సాస్‌లోని హోస్టన్‌ వద్దనుండెను.

ఇప్పుడు, ఈ రాత్రి నీవు నిలబడి ఉండినయెడల, మరియు చుట్టూ తిరుగుచున్న ఆ దూతను చూచి యున్నారు! ఇక్కడున్న వారిలో అక్కడ మీలో అనేకులు, బహుశా, అది ఎన్నడూ చూడకపోవచ్చును. అయితే చూడండి, ఆ వెలుగు, ఇశ్రాయేలు పిల్లలను నడిపించిన ఒక అగ్నిస్థంభము! అది చెరసాల చిన్న గదులలో పేతురు దగ్గరకు వచ్చెను, మరియు - మరియు -మరియు చెరసాల నుండి వానిని విడుదల చేసెను. ప్రభువు యొక్క అదే దూత ఇది. మరియు ఇక్కడ అన్ని వందల సంవత్సరాలు, అవును, వేల సంవత్సరాలు తరువాత- ఇక్కడ ఉన్నది, ఇప్పుడు ఇంకా మనతో ఉన్నది. చూడండి? మరియు నేను ఎక్కడ నిలబడి ఉన్నానో అది ఆయన చిత్రమును తీసికొనియుండెను. ఇప్పుడు, కాదు, నా కొరకు కాదు; అయితే విశ్వాసుల శరీరము కొరకు, సంఘము కొరకు అయి ఉన్నది. చూడండి, అది ప్రతీ ఒక్కరికిని.

ఇప్పుడు, గమనించండి.

9

నేను - అది నిజముగా ఇశ్రాయేలు పిల్లలను నడిపించిన ఒక అగ్నిస్తంభమని నేను నమ్ముచున్నాను. మీరు అలా నమ్ముటలేదా? (సమాజము “ఆమెన్‌” అని చెప్పుచున్నారు- సంపా) కేవలం ఒక అగ్నిస్థంభము. మరియు చెరసాలలోనికి అలా ఆ వెలుగు వచ్చినదని నేను నిజముగా నమ్ముచున్నాను, మరియు - మరియు పేతురు ఎక్కడ ఉన్నాడో అక్కడకు మీరు ఆ సాక్ష్యమును నమ్ముచున్నారా? (సమాజము “ఆమెన్‌” అని చెప్పుచున్నారు - సంపా) నా పేరు విలియం బ్రాన్హాం

అని నేను నమ్మిన దాని కంటె ఎక్కువగా నా హృదయం అంతటితో అది నేను నమ్ముచున్నాను. నేను -నేను అలా నమ్ముచున్నాను, చూడండి, నేను ఆ కథ నమ్ముచున్నాను. అయితే, దాని కంటె, మేము ఇంకా చాలా బలమైన, వాస్తవమైన ప్రాధమిక ఆధారమును మనం కలిగి ఉన్నాము. మనం కలిగి ఉన్నాము. మనం చాలా బలమైన, నిజమైన ప్రాధమిక ఋజూవు కలిగియున్నాము. ఇప్పుడు, నేను దానిని విశ్వాసము చేత నమ్ముచున్నాను.

మరియు ఇక్కడ ఇప్పుడు ప్రభువు దూత, చుట్టూ తిరుగుచు, నిలబడి ఉన్నయెడల ఏమీ జరుగును, మరియు మీలో ప్రతి ఒకరి కన్నులు దానిని చూచే కళ్ళగా ఉండియుండును. అది చాలా రమ్యముగా ఉండును. అయితే దాని యొక్క చిత్రము వైపు చూచుట అను సంగతి, నీ కళ్లతో దానివైపు చూచిన యెడల ఏమై యున్నదో దానికంటె చాలా ఎక్కువ ఋజూవు అయిఉన్నది. చూశారా? అది సరియైనది కాదా? ఎందుచేతననగా, నీవు మోసముతో కూడిన కను దృష్టిని కలిగియుండగలవు. కాని ఆ యంత్రము....కెమెరా మోసముతో కూడిన ఆ కను దృష్టిని స్వీకరించదు. అది అలాచేసియుండదు, ఎందుకనగా అది - అది ఒక కెమేరా. మరియు అది నిజమైయున్న చిత్రమునే తీయగలదు. ఆ కటకమును తాకుటకు, అది అక్కడ ఉండవలసియున్నది. చూశారా? నీవు మోసముతో కూడిన కంటిదృష్టిని కలిగి ఉండగలవు మరియు అది అలా లేకపోయినను దానివలె కనిపించు వస్తువులు కలిగి ఉండగలవు. చూడండి? అయితే ఆ చిత్రము ఆ విధముగా ఉన్నప్పుడు .... మరియు అది మనస్తత్వశాస్రమయి ఉండవచ్చును. నీవు అనగలవు, “నీవు అక్కడ అది చూస్తున్నావా?” మరియు కేవలం నీవు చెప్పుచు ఉందువు. “అవును, నేను అది నమ్ముచున్నాను” మరియు నీవు అలా చేయనప్పుడు, నీవు అది చూశావని నిజముగా నీవు తలంచినంత వరకు అంత ఎక్కువగా అది నమ్మగలవు. చూశారా? అది యథార్థం. అయితే అది మనస్తత్వ శాస్త్రము. అయితే, నిన్ను మానసికముగా దానివైపు మరలునట్లు ఒత్తిడి కలిగించి అది నిన్ను పొందియున్నది, నిన్ను ఇంత వరకు- కేవలం నీవు దానిని ఉహించావు, నీకు అది నిజమేనని ఒత్తిడి చేయునంత ఎక్కువగా అది అలా ఊహించావు.

ఒకప్పుడు, మీరు కేవలం ఎవరో వ్యక్తి మిమ్మును ద్వేషించారని ఊహించారు. మరియు వారు మిమ్మును ద్వేషించలేదు, అయితే వారు అలా ద్వేషించారని మీరు ఊహించారు. “వారికి నేనంటే ఇష్టం ఉండదు” అని మీరు ఆ విధముగా ఆలోచించుచున్నారు. మరియు మొదటి సంగతి, వారు మీకు ఏమియు చేయకపోయినను, మీరు ఆ వ్యక్తిని ఇష్టపడకుండా పక్కకు తప్పుకొనుచున్నారు. మరియు కొంచెం సమయం తరువాత, ఆ వ్యక్తి మిమ్మును ఇష్టపడుటలేదని మీరు దానిని ఖచ్చితముగా నమ్మునంతవరకు, ఆ విధముగా అది మీకు నిజమైనదిగామారును. మరియు మీరు వారిని తన్ని ఉండవచ్చును, లేక మీకు ఏదో చెప్పవచ్చును. ఉదాహరణకు, మీ భార్య లేదా మీ భర్త, లేక ఎవరో పొరుగువాడు, లేదా ఆ విధమైన ఏదో సంగతి, ఏ చెడు సంగతి విషయములోనైనను ఆ వ్యక్తి సంవూర్ణముగా ఏమియు ఎరుగని అమాయకుడుగా, ఉన్నప్పుడూ, అలా చేయుదువు. అది ఎందుచేతననగా అది మీరు నిజమని తలంచువరకు, కేవలం మీరు అది అలాగు అని ఊహించారు. ఇప్పుడు నాఉద్దేశ్యం ఏమిటో గ్రహించారా? అయితే, ఖచ్చితముగా ఒకఫోటో తీయబడినప్పుడు, అది అక్కడ ఉ౦డవలసియున్నది.

10

కనుక, ఈ రాత్రి సహో. గ్రహం కొంచెం సేపటి క్రితం చెప్పినట్లుగ సంఘమును తలక్రిందులుగా చేసిన అనేకమైనవి మరియు మొదలైనవిగలవు. మనం చాలా అపాయముల గుండా, శ్రమల ద్వారా, ఉరులు గుండా మనం వెళ్ళుచున్నాము; అది చాలా భేదము కలిగించుచున్నదిగా ఎంచబడెను, మనం “విముఖులమై” మరియు “పరిశుద్ధ గుండ్రాయిలుగాను” మరియు మొదలైన అన్ని రకాల పేర్లతో, ఆ విధముగా పిలిచిరి. అయితే, ఇంకా వీటన్నింటి మధ్య, ఈ గుడారం కాలినప్ఫటికి, ఈ రాత్రి మరియు నేను చనిపోయి ఉన్నయెడల, మరియు మీలో ఉన్న మిగిలినవారు పోయినను, ఈ రాత్రి, మన సాక్ష్యం సంపూర్ణంగా సత్యమై ఉన్నది. అక్కడ అది ఎరిగి ఉన్న మిలియనుల ప్రజలున్నారు.

మరియు శాస్త్రీయ ఋజువు సాక్ష్యమిచ్చును; మన మాట మాత్రమే కాదు వెలుగు రావడానికి ముందే మనం అదే చెప్పాము. దూత ఆయన చిత్రం తీయుటకు ముందే అదిచెప్పబడెను , ఒక బిడ్డగ ఉన్నప్పటి నుండి, అలా ఆ వెలుగు వెంట వచ్చుచు సాక్ష్యమిచ్చుచుండెను. సంవత్సరాలు తరబడి ఇక్కడ కూర్చున్న మీలో అనేకులు, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు, ఆ చిత్రము తీయబడకముందే, దానిని గూర్చినదంతయు అందరూ ఎరిగియున్నారు. మరియు శాస్త్రీయ ప్రపంచం దాని చిత్రం పొందిన తరువాత, మనం సాక్ష్యం ఇచ్చిన విధంగా ఖచ్చితముగా అలా ఉండెను. కనుక నీవు సత్యం చెప్పుచున్నావని అది చూపించుచున్నది. అది సంపూర్ణంగా సత్యమైయున్నది.

11

కనుక, ఈ రాత్రి, అలా ఒకప్పుడు సీనాయిపర్వతం మీద గర్జించిన ఆ గొప్ప యెహోవా, ఆ విధంగా ఒకప్పుడు ఆ పర్వతం మీద నిలబడి మరియు ధన్యతలు బోధించి మరియు మృతులనుపైకి లేపి, మరియు అదే విధముగా ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడని తెలిసికొనుటకు నేను వందనీయుడనై ఉన్నాను. అప్పుడు ఆయన ఉన్నట్లే, ఈనాడు అలాగే ఉన్నాడు. మరియు నిరంతరం అలాగే ఉండును.

మరియు అలా ఆయన గూర్చి ఆలోచించిన పరలోకపు దేవుడు ఈ లోక వస్తువులు ఎక్కువగా లేని నాతోను, మరియు ఇక్కడ పేదప్రజలైన మనతోను భాగస్వామిగా ఉండుటకు, కిందకు దిగి వచ్చుటకు తనకు తానే తగ్గించుకొనెను. కేవలం నేను చదువులేనివాడను మరియు అలా ఆయనకిందకు వచ్చి మరియు తన కృపచేతనే నన్నురక్షించి, అలా ఆయన నన్నుప్రేమించెను. నాకు ఏ అర్హతలేదు, లేక, ఏమి చేయలేదు, అయితే ఆయన నన్ను ప్రేమించెను. ఏలయనగా, జగత్తు పునాది వేయబడక ముందే, లోకం ప్రారంభం కాకముందే తన సొంత ముందు జ్ఞానముద్వారా, నన్ను రక్షించుటకు ఆయన ముందుగా నిర్ణయించెను. మరియు రక్షించబడిన ప్రతి ఇతర మనిషి, వారి కొరకు ఆయన అదే చేసెను. ఓ! ఎలా౦టి ఒక మరపురాని సంగతి! అది ఎంత ఆశ్చర్యకరమైన భాగ్యము అయి ఉన్నది! మరియు ఈ సంవత్సరము కొరకు, దేవుడు నా ప్రార్ధన వినిన యెడల నా హృదయం అంతట అభిలాష అదే అయి వున్నది.

12

మధ్యరాత్రి వరకు పూర్తిగా నేను ఉండలేకపోవచ్చును. అక్కడ వెనుక నిద్రపోవుచున్న ఇద్దరు చిన్న బాలికలు గలరు, మరియు వారు నిద్రపోతూ, కూనిరాగం తీస్తూ, మరియు ఏడుస్తూ ఉన్నారు. నేను మొదట, వారిని అక్కడ నుండి పారద్రోలవలెను. నేను మరల తిరిగి వచ్చి మరియు సాక్ష్యమిచ్చుటకు నాకు ఒక అవకాశం లేనియెడల, నేను ఇది చెప్పగోరుచున్నాను, ఆ విధంగా నేను -నేను.... ఈ సంవత్సరము నా కొరకు ప్రార్థించిన మీ ప్రార్ధన కొరకు మీలో ప్రతి ఒక్కరికి వందనము చేయగోరుచున్నాను. మీరు ఎన్నడైనా నన్ను విడిచినయెడల, నేను ఇకలేను. అది కేవలం మీరు నా కొరకు, ప్రార్ధనలో, పట్టుకొనినందున, అలా ఆ విధముగా నేను యుద్ధమునకు వెళ్ళుచున్నాను.

మరియు నేను - కొంచెంసేపటి క్రితము ఒక సోదరుడు చెప్పినట్టు నా హృదయమంతటితోను - నేను మిమ్మును ప్రేమించుచున్నాను. ఇక్కడకు నేనిష్టపడిన విధముగా నేను రాలేదు. ఆ విధముగా నేను -నేను కోరిన విధముగా, నా హృదయం కోరిన విధముగ ప్రజలను మరియు ఇంటి దగ్గర ఈ సేవకుడను చూచుటకు రాలేకపోయాను. అయితే నేను కేవలం మానవుడను, మరియు నేను - కొన్ని నిర్ణీత సమయాలకు మరియు పరిమితమైన బలములు, మొదలైన వాటికి చాల ఎక్కువగా నేను పరిమితయిపోయాను.

మరియు ఇప్పుడు.... అయితే దేవుని సహాయం వలన, ఆయన నాకు సహాయం చేసిన యెడల, నాజీవితములో నేను ఎన్నడైనా కలిగి ఉన్న ఘనమైన సంవత్సరముగా ఈ సంవత్సరము ఉండవలెనని కోరుచున్నాను. నేను ఇప్పుడు దేవుని కృపవలన, అర్ధ మిలియను ఆత్మలు క్రీస్తు కొరకు కలిగి ఉన్నాను. మరియు దేవుని చిత్తమైతే, ఈ సంవత్సరము, అది మిలియును పూర్తి అగుటకు నేను నిరీక్షించుచున్నాను. కారణం, దేవుని చిత్తమైన యెడల, నేను ప్రారంభించగోరుచున్నాను -కేవలం మనం ఆర్థికముగ మరియు మొదలైనవి కలిగిన వెంటనే, అది చేయగల శక్తిగలిగినప్పుడు - మరల విదేశాలకు వెళ్ళుదును. ఒక సమయంలో అనేక వేల మందిని మనం సంపాదించిన అక్కడ మిగిలిన దేశాలలోనికి ప్రవేశించవచ్చును. నేను పగలు సమీపముగా ఉందని నేను ఎరుగుదును. కొన్ని గంటలు గడిచిపోయినవి. స్నేహితులారా, సంధ్యావేళలు పోవుచున్నవి. అలా నేను చేయగోరినదంతయు నేను కోరుదును, ఎందుకనగా నీవు మరియు నేను ఎన్నడైనా మర్త్యునిగ ఉండే సమయం ఇదే. నిత్యత్వమంతా క్రీస్తుకొరకు ఎవరినైనా గెలుచుటకు మనం ఎన్నడైనా కలిగి ఉండు భాగ్యం ఈ సమయమందే. ఆ విధముగా చేయుదము. మనం చేయగల ప్రతీదియు చేయుదము. మనకు సాధ్యమగునంతగా, ఆయన మహిమ కొరకు ప్రతి ఘడియ ఇవ్వవలెను. ఈ రానున్న సంవత్సరము కొరకు అది నా హృదయ ఉద్దేశ్యము అయి ఉన్నది. మీ ప్రార్ధనలు, దేవుని సహాయం ద్వారా, నేను అది చేయగలను. కాబట్టి

ఇప్పుడు నా కొరకు ప్రార్థించండి.

13

ఇప్పుడు, వాక్యము తెరుచుటకు, కేవలం ఒక క్షణం మన తలలు

వంచుదుము.

తండ్రీ, ఇక్కడ నా యెదుట నీ నిత్యత్వ వాక్యము ఉంచబడియున్నది. భూమి మీద లేక పరలోకములో ఆ గ్రంధమును తీసికొని, ముద్రలను విప్పి లేక అక్కడ ఉన్నదాని చూచుటకు యోగ్యుడైన ఏ మనిషి లేడు. అయితే జగత్తు పునాది నుండియు, వధింపబడిన గొర్రెపిల్ల మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఆయనను మనం పిలిచెదము. మనం ఆయన దృష్టిలో కృప కనుగొనిన యెడల, ఓ దేవుని గొర్రెపిల్లా, మేము నీ వాక్యము యొక్క పేజీలు తిప్పుచుండగా, మరియు మా హృదయములకు అది తెరచి, ఇప్పుడు ఈ కొన్ని క్షణములు మీరు తీసికొనవలెనని మేము ప్రార్ధించుచున్నాము. ఎందుకనగా మేము అది యేసు నామములో అడుగుచున్నాను. ఆమెన్‌.

14

ఇప్పుడు, ఈ మధ్యాహ్నం కొంచెంసేపు, ఈ రాత్రికి కొన్ని సంగతులపై మాట్లాడనైయుండి, నేను అభ్యాసములో ఉన్నాను. అయితే అలా చేయుటకు సరియైన సమయానికి రాలేకపోయాను. కనుక నా భార్య బిల్లీ తో ఇక్కడకు వచ్చింది, మరియు నేను - నేను కేవలం లోపలకు వచ్చి మరియు బైబిలు గుండా వేలిని త్రిప్పుచున్నాను. నేను తలంచాను, “సరే. నేను అలా మెల్కీసెదెకును గూర్చి” మరియు నేను తలంచాను, ఓ, మై! నేను అది తీసుకొంటె, మిగిలిన, సహోదరులకు మాట్లాడుటకు సమయం ఉండదు మరియు కనుక దానిని, దేవుని చిత్తమైతే అలా మనకు ఎక్కువ సమయం ఉన్నప్పుడు కలిగి ఉండునట్టు కొన్ని దినముల వరకు నేను దానిని అలా ఉంచెదను.

అప్పుడు నేను అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయము కనుగొని, ఆది సంఘము గూర్చి మాట్లాడుచున్నాను. ఎవరైనా ఒకరు మరియు బైబిలు గలవారు, అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయము వైపునకు కొన్ని క్షణములు కేవలం ఒక చిన్నహెచ్చరిక కొరకు తిప్పెదము.

మీరు త్రిప్పుచుండగా నేను దాని వెనుక ఉన్న ఒక చిన్న ఉద్దేశ్యమును ఇచ్చుచున్నాను, ఒక వారము క్రితము, గత ఆదివారం, నేను ఇప్పుడు అని నమ్ముచున్నాము. లేక ఆది సంఘమును గూర్చి, ఒక వారం ముందు గత ఆదివారము మనం అపొస్తలుల కార్యములు గ్రంథము అలా మనం అభ్యసించుట అయి ఉండెను. అపోస్తులుల కార్యములు 2లో మనం ఉన్నామని నేను నమ్ముచున్నాము. ఎక్కడ వాటిని మనం వదిలాము, మరియు వాటి దగ్గరకు వెళ్ళాము..... అది ఎలా ..... ఎలా వారు “మారుమనస్సు పొంది మరియు పాపక్షమావణపొంది, మరియు పరిశుద్దాత్మను పొందుటకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందవలెను” అని పేతురు వారితో చెప్పెను.

15

ఇప్పుడు నేను ఒక చిన్న వ్యక్తికరణ చేయ ఇష్టపడుచున్నాను. ఈ రాత్రి ఆ వేదిక మీద నుండి ఏదైనా సరియైనదిగలదా? (సహో. నెవెల్లీ గారు చెప్పుచున్నారు, “ఆమెన్‌” సంపా). చూడండి, ప్రతి ఒక్కరు ఎల్లప్పుడు అన్నారు, “బిల్లీ సోదరుడా ఏవ్యక్తి నిన్ను అర్ధము చేసికొనలేరు.” సరే, కేవలం నేను ఒక కొంచెం వింతగా ఉ౦డవచ్చును. అయితే, మీరు ఎరుగుదురు, అయితే నేను -నేను ఆ ఉద్దేశ్యంతో లేను. అయితే నాకు సంగతుల ఉద్దేశములు, మరియు నా ధృడమైన నమ్మిక నేను కలిగి ఉన్నాను. ఇప్పుడు, నేను తరచుగా నేను అవి కలిగి ఉన్నాను. నేను అలా చాలా సంగతులు తరచుగా ఒప్పించబడి ఉన్నాను, అది ఈ రోజు, మనం నెరవేర్చని, అపొస్తులునికి చెందిన, అది లేఖనములో ఉన్నది మరియు ఉదాహరణకు, ఒక సంగతి, చాలామంది ప్రజలు అన్నారు,“ఎలా, ఆ సువార్త కూడికలలో నీవు బయట ఉన్నప్పుడు , రక్షించబడుటకు వేదిక దగ్గరకు 30,000 మంది ప్రజలు నీవు ఎలా సమకూర్చితివి?” రక్షించబడుటకు వేదిక దగ్గరకు వారు రానక్కరలేదు. వారు చెయ్యవలసినది ఒకే ఒక కార్యము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటయే. అది సరియేనా?

16

నేను కేవలం మిమ్మును ఏదో అడుగగోరుచున్నాను, మరియు

దానిగూర్చి మీరు ఆలోచించి, అప్పుడు నేను ఈ తరువాత వారము నేను మీ ఉత్తరాలు పొందుదును. చూశారా?.... నేను కేతలిక్కుగా ఉండలేను. అయితే కేతలిక్కులు ఈ వాక్యము ప్రేరేపించబడినదని నమ్మును, అయితే, “ఆ సంఘం వాక్యం మీద ఉన్నదందురు” నేను ఒక ప్రొటెస్టంటుగా ఉండలేను. ఎందుకనగ ప్రొటెస్టంటులు కేవలం ఎంత తీసుకొనగలరో అంత అది సరియైనది అని తీసుకొందురు, మరియు ఆ మిగిలినదంతయు ప్రేరేపించబడలేదు.“ అని అందురు. కాబట్టి, ఏది సత్యమై ఉన్నదని బైబిలు చెప్పునో దానినే నేను నమ్ముదును. అది దేవుని వాక్యము అని అలా నేను నమ్ముదును. అది అలా నమ్ము క్రమములో, అది సత్యము అని నమ్ముటకు, అలా అక్కడ మరే ఇతరమైనది లేదు అయితే అదే సత్యము, అక్కడ దానికి ఏదియు కలుపగూడదు, లేక దానినుండి ఏదియు తీయకూడదు. కేవలం అది ఉండవలసిన విధముగా ఉన్నది.” మరియు ఏ వ్యక్తి అయినా ఆ గ్రంథములో నుండి ఏదైనా తీసినయెడల, లేక దానికి కలిపిన యెడల, అతని పేరు ఆ జీవగ్రంథములో నుండి తీసివేయబడునని,“ ప్రకటనలో దేవుడు చెప్పెను. ”ఎవరైనను తీసివేసినయెడల లేక దీనిని కలిపినయెడల“ ..... ప్రజలకు, దేవుని పూర్తి చిత్తమును, మరియు యేసుక్రీస్తు ప్రత్యక్షతయైయున్నది. అది సరియైనది. ఇప్పుడు, అది అలా చేయు క్రమములో, నేను తప్పక దేవుని వాక్యము సంపూర్ణముగా సత్యమై ఉన్నదని నమ్ముచున్నాను.

17

మరియు అపోస్తులుల కార్యములు 2:38లో పేతురు చెప్పెను,“మీలో ప్రతి ఒక్కరు మారుమనస్సు పొందుడి!” వారు అన్నారు, “సహోదరులైన ప్రజలారా, మేము ఏమి చేయవలెను?” మొదట వారు రక్షించబడవలెనని కోరెను. ఇప్పుడు గమనించండి. అతడు అక్కడ అవిశ్వానులతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు అతడు ఏమి చెప్పెనో గమనించండి. “మీలో ప్రతి ఒక్కరు, మారుమనస్సు నొందుడి!” ఇప్పుడు మారుమనస్సు అనగా అర్ధము ఏమిటి? మారుమనస్సు అనగా నీవు ఏమి చేశావో దాని కొరకు దు:ఖము కలిగి ఉండుట.“ ఇప్పుడు ఉదాహరణకు, ఒక కారణం లేకుండా, ఇక్కడ నేను సరిగా చుట్టు తిరిగి మరి నా సహోదరుని కొట్టినయెడల, ఏమి? నేను దానికొరకు మారుమనస్సు పొందకోరెదను, నేను ఇలా అందును, ” సహోదరుడా నెవిల్లీ, నేను అది చేసినందుకు దుఖపడుచున్నాను,“చూశారా? సరే, అప్పుడు, నేను ఇలా చెప్పినయెడల, ”నేను అది చేశాను అని దుఖించుచున్నాను.“మరియు అది నా హృదయం నుండి ఆ ఉద్దేశ్యంతో, చెప్పినప్పుడు నేను మారుమనస్సు పొందాను.

నేను నా పాపముల కొరకు దుఃఖించినయెడల, నన్ను క్షమించమని దేవుని అడిగినప్పుడు, నేను మారుమనస్సు పొందాను. అది సరియైనదా? అంతా యదార్థం. పేతురు అనెను, మారుమనస్సు పొందండి, లేక మీపాపాల కొరకు దు:ఖించి మరియు మీరు పావక్షమావణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్దాత్మ అనువరము పొందుదురు“ అది సత్యమేనా? (సమాజం ”ఆమెన్‌“ అని చెప్పారు -సంపా) అంతా బాగుంది.

ఇంటియొద్ద, ...పౌలు - సీలలు సమావేశము కలిగి మరియు జైలులో పెట్టబడి మరియు కొట్టబడి, ఎందుకనగా ఒక సోదె చెప్పుదానినుండి వారు ఒక దురాత్మను వెడలుగొట్టెను. మరియు వారు ఫిలిప్పీ జైలులో ఉన్నప్పుడు, మరియు ఆ రాత్రి, వారు పాటలు పాడగ, మరియు వారు.... ప్రభువు ఒక భూకంపమును పంపగా, వారి చేతుల నుండి సంకెళ్ళు విడిపోయినంత గట్టిగా ఆ చెరసాల కంపించెను. ఆ చెరసాల అధికారి తన కత్తి తీసికొని తనకు తాను చంపుకొనబోయెను. మరియు పౌలు అనెను, “చూడండి, మేము అందరం ఇక్కడే ఉన్నాం, మీరు ఏ హానియు చేసికొనవద్దు,”మరియు అతడు అనెను ......రక్షింపబడుటకు అతడు ఏమి చేయవలెను? అతడు అనెను, “మీ ఇంటివారందరితో, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచుము.... మీ హృదయం అంతటితో మరియు నీవు, నీ ఇంటివారు రక్షించబడుదురు. గమనించండి, ”ప్రభువైనయేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచుము.“

18

ఇప్పుడు, ఒక మనిషి తన పాపాలు కొరకు దు:ఖపడినయెడల! నేను కేవలం అది నిజ లోతుగ వెళ్ళునట్లు, తేలికగా అది ఉండుటకు కోరుచున్నాను. ఒక మనిషి తన పాపాలు కొరకు దుఃఖించి, మరియు మారుమనస్సు పొంది, తన పాపాల కొరకు దు:ఖించుచు, మరియు తన పాపాల కొరకు యేసుక్రీస్తును తన రక్షకునిగ అంగీకరించిన యెడల, మరియు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మం పొందినయెడల, అదే నిమిషంలో, ఆ మనిషికి పరిశుద్దాత్మబాప్తీస్మం ఇచ్చుటకు దేవుడు బద్దుడై ఉండును. ఆయన అలా చేయనియెడల, ఆయన చేయకపోతే..... ఆయన ఆయన వాక్యమును కాపాడుకొనలేదు. అది సరియేనా? (సమాజము “ఆమెన్‌” అని చెప్పుచున్నారు - సంపా) ఇప్పుడు, అలాగ అయితే ఈ కనిపెట్టు కూటములు ఎందుకు? ఈ ఋజువులు మరియు సంగతులన్నియు మనం ఎందుకు పొందవలెను.?

19

పరిశుద్ద యోహాను 5:24 లోయేసు చెప్పెను, “నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలిగి ఉన్నాడు.” “ఇప్పుడు, ”నిత్యజీవము అయిన, “నిత్యము అను మాటకు అర్ధము ఏమిటి? దాని అర్ధము. ”అంతము లేనిది“ అతడు అలా చేసిన-అతడు అలా.... నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, అంతములేని జీవము కలిగిఉండెను.” ఎందుచేత అందరు వెనుకకు వచ్చి మరియు - మరియు అప్పుడు రక్షించబడుటకు ప్రయత్నించుట, మరియు ఈ సంగతులన్నియును ఎందుకు కావలెను? అంతము లేని జీవము నీవు పొందినయెడల, నీవు నశించవు. నీ జీవము నశించదు ఎందుకనగా నీవు నిత్యజీవము పొందినావు.

ఇప్పుడు, మీలో కొందరు ఆ మాటను చూడకోరవచ్చును, మీరు అక్కడ, ఆ గ్రీకు పదము, “జొ” Z O E, జోయి Z-O-E , ఆ గ్రీకు పదము, దాని అర్ధము “దేవుని జీవము”. ఎందుకనగా, అది నిత్యమైనది అయిన యెడల, అక్కడ నిత్యముగ ఉండునది. ఒకే ఒక సంగతి గలదు, మరియు అది దేవుడయి ఉండెను. “ఆయన నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నీవే దేవుడవు అయి ఉన్నావు.” ఇప్పుడు, ఆయన నిత్యత్వము నుండి మరియు నిత్యత్వము వరకు ఉండినయెడల, మరియు నీకు నిత్యత్వము నుండి నిత్యజీవము నిచ్చును, అప్పుడు నీవు ఆయన నిత్యత్వపు ప్రాణిగ (జీవిగా) ఒక భాగముగా అగుదువు. అది సరియేనా? మరియు నీవు ఆయన నిత్యత్వపు ఉనికిలో ఒక భాగముగ నీవు అయిన యెడల, అది నిన్ను ఆయనకు ఒక కుమారుడు లేక కుమార్తెగ చేయును. అది ఖచ్చితముగా లేఖనం ఏమి చెప్పెనో దానిని నెరవేర్చుటయే, “మేము దేవుని కుమారులు మరియు కుమార్తెలు అయి ఉన్నాము.” అది సరియేనా?

20

నీవు అది ఎప్పుడు పొందావు? నీవు ఆర్భాటము చేయునప్పుడా? నీవు బలిపీఠం దగ్గరకు వెళ్లినప్పుడా? నీవు భాషలలో మాట్లాడినప్పుడా? నీవు నమ్మినప్పుడు! అలా నమ్మని అనేకమందికి మేము బాప్తిస్మం ఇచ్చాము. అలా నమ్మని, భాషలలో మాట్లాడిన అనేక మంది భాషలు మాట్లాడుట మేము విన్నాము. వారు ఋజువులు పొంది మరియు కార్యములు జరిగించునట్లుగా మనం వారి విషయమై పనిచేసి, మరియు వారిని వెలుపల నుంచి, అంటాము, “నీవు దీనిని చేసినప్పుడు, నీవు అది పొందావు.”

“అతడు దీనిని చేసినందువలన, ఆ విధముగ అతడు ఒక క్రైస్తవుడైయున్నాడు” అని అలా ఒక మనిషిని నీవు క్రింద పడద్రోయునట్లుగా నొక్కి చెప్పగలిగినది అక్కడ బైబిలులో ఏదియు లేదు, బైబిలులో ఏ స్థలములోను లేదు. అతడు ఒక క్రైస్తవుడు ఎందుకనగా అతడు నమ్మును. మరియు అతని సొంత జీవితము ఆత్మ ఫలము కలిగి ఉండును. అతడు ఏమి చేసినను ఏమియు కాదు. చూశారా? అది అదే. ఇప్పుడు, మరియు నీవు విశ్వసించినప్పుడే, నీవు నిత్యజీవము పొందావు. మరియు నిత్యజీవము దేవుడు అయి ఉండెను; మరియు దేవుడు పరిశుద్దాత్మ అయి ఉన్నాడు. అది యథార్దమేనా? దేవుడు మరియు పరిశుద్ధాత్ముడు ఒకే వ్యక్తి కానియెడల, యేసుకు ఇద్దరు తండ్రులు కలరు. అది యేసు చెప్పెను “దేవుడు” ఆయన తండ్రి అయి ఉన్నాడు, మరియు ఆ పరిశుద్దాత్ముడు ఆయన తండ్రి అయి ఉండెనని బైబిలు చెప్పెను, కనుక వారు ఇద్దరు ఒకే వ్యక్తి అయి ఉండెను.

మరియు నీవు దేవుని పొందినయెడల, నీలో నిత్యజీవము కలిగి ఉన్నావు, అప్పుడు నీవు ఏమి పొంది ఉన్నావు? నేను తెలిసికొనగోరినది అదే. మీరు ఆ ఉద్దేశ్యం గ్రహించారా?

21

కనుక మనం సిద్దాంతముతో నింపబడి, ఆ సంఘం అది కలిగి ఉ౦డెను. ఎందుకనగా అది సంఘశాఖగా మారినది. ఈ సంఘశాఖ ఇది కనుగొనెను, వారు దీనియందు విశ్వసించుదురు, వారు దానినుండి ఒక శాఖను తయారు చేయుదురు. వారు దానికంటె ఇక ముందుకు కొనసాగక కదలక ఉందురు.

అయితే దేవుని సంఘం నిరంతరం కదలుచు, ఇంకా ముందుకు కదలుచుండును. అది కేవలం సరిగ కదలుచు మరియు శాఖలు వెనుక కూర్చుండునట్టు విడచును. అది లూధరు నుండి దూరముగ కదలి వెళ్ళెను. అది మెథడిస్టు నుండి దూరముగా కదలివెళ్ళెను. అది బాప్టిస్టునుండి దూరంగా కదలి వెళ్ళును. అది ప్రేస్పిటేరియన్‌ నుండి అది దూరముగా కదలి వెళ్ళును. మరియు అది పెంతెకొస్తు నుండి దూరముగా కదలి వెళ్ళును. నిశ్చయముగా కారణం ఏమనగా, నిత్యజీవము ముందుకే కదలుచుండును, చూడండి, మరియు మీరు అది పొందారు ఎందుకనగా (ఎందుచేత?) నీవు ప్రభువైన యేసు క్రీస్తునందువిశ్వాసం ఉంచావు.

22

ఇప్పుడు, అక్కడ రెండు సంగతులు కలవు. చూడు. నీవు అవిశ్వాసివి అయిన లేక ఒక విశ్వాసిగ అయినా అయి ఉండగలవు. అది పగటి సమయం అయి ఉండవలెను లేక అది రాత్రి సమయం అయి ఉండవలెను. అది సరియేనా? ఇప్పుడు, “కేవలం ఈ ఎక్కువగా ఉన్న ఇది అయి ఉన్నది - అయి ఉన్నది - రాత్రి సమయం అయి ఉన్నది. కేవలం ఆ కిటికి ద్వారా నేను చూచినదే, అదే రాత్రి సమయం” అని నేను చెప్పలేను. కాదు, కాదు. మొత్తం అంతా రాత్రి సమయం అయి ఉన్నది. అది సరియైనది.

ఇప్పుడు, కాల్చుట ..... నేను తరచు చెప్పినట్టు, సిగిరెట్లు కాల్చుట, చ్యూయింగ్‌ గమ్‌ నమలుట, మరియు విస్కీ త్రాగుట, అది పాపము కాదు. అది పాపము యొక్క గుణలక్షణములు. నీవు అది చేయుదువు ఎందుకనగా నీవు అవిశ్వాసివి అయి ఉన్నావు.

మరియు నీతిగా జీవించుచు మరియు పరిశుద్ధముగా మరియు సమాధానముగా, మరియు ప్రశాంతముగా, మరియు స్థిమితముగా, మరియు ప్రేమగలిగి, మరియు - మరియు స్నేహ భావం గలిగి మొదలైనవి గలిగినను, అది నీవు కైస్తవుడవు అయిన కారణం కాదు. కేవలం అది కైస్త్వవ్యము యొక్క గుణలక్షణములు. ఎందుకనగా అది నీలో ఉండి, అలా చేయుచున్నది. మరియు నీవు అది అనుకరించుచు, లేక అది చేయుచున్నావు, ఎందుకనగా నీవు ఒక కైస్తవునిగ ఉండవలెను, అది సరియే, నీ జీవితములో మాధుర్యముగా నడవనియెడల, నీవు ఒక వేషదారివై ఉన్నావు. ఎందుకనగా, నీలో నుండి ఏదో బయటకు వచ్చును. అది దానిని చేయును, ఆ విధముగా నీవు భావించునట్లు చేయును. నీవు శోధనలు, మరియు కష్టాలు మరియు ఒకప్పుడు బాగుండుట మరియు క్రింద పడిపోవుట ద్వార వెళ్ళగలవు మరియు అపార్థము చేసికొనబడుదువు. అది ఇలా జరిగినందున దానికి (లోవలనున్న నిత్యజీవమునకు) ఏ నష్టములేదు.

ఇశ్రాయేలు వెనుకకు జారి ఐగుప్తులోనికి వెళ్ళెను, వారు వెనుకకు జారెను. వారు నిబంధనను ఎన్నడు పొగొట్టుకొనలేదు. వారు వారి రక్షణానందమును పోగొట్టుకొన్నారు.

నా రక్షణను ఇమ్ము“ అని దావీదు అనలేదు. అతడు అనెను, ”నా రక్షణానందము ఇమ్ము“ అతని రక్షణ అలాగే ఉన్నది, అయితే అతడు పొరపాటుతో అంతమునకు వెళ్ళెను మరియు అతని రక్షణానందము పొగొట్టుకొనెను. నాఉద్దేశ్యం ఏమిటో చూశారా?

23

మీరు ఎప్పుడు రక్షింపబడినారు? మీరు ఎప్పుడు శుద్దీకరించబడినారు? మీరు ఎప్పుడు పరిశుద్దాత్మతో నింపబడినారు? ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచినప్పుడు! ఏలయనగా అక్కడే నీవు నిత్య జీవమును పొందినావు. అయితే అప్పుడు, అప్పటినుండి, నీవు ఎదుగుటకు ప్రారంభించావు. నీవు ప్రారంభించి ఎదుగుచున్నావు. నీవు శుద్దీకరణము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, మరియు భాషలు మాట్లాడుట ద్వారా, మరియు ఇక్కడ ఈ సంగతులన్నిటి ద్వారా ఎదిగితివి. అయితే నీవు విశ్వసించినప్పుడు నీవు జీవమును పొందావు. నా ఉద్దేశ్యం ఏమిటో చూచారా? మరియు ఇప్పుడు అలా కాదు. ...కొంతమంది ప్రజలు ఇది వరకే జీవమును పొందారు, మరియు వారు ఇంకను ఆ స్థానమునకు చేరనప్పుడు, ఇక్కడ వారేదో చేయుటకు మీరు ప్రయత్నించుచున్నారు. మరియు పెంతెకొస్తు ప్రజలు ఎన్నడూ ... ఇప్పుడు సంఘం దత్తతకు, లేక కుమారులను సరియైన స్థానములో ఉంచుట అనే స్ధానమునకు రాలేదు.

24

ఇప్పుడు, పాత నిబంధనలో, ఒక కుమారుడు ఒక గృహములోనికి జన్మించినప్పుడు, అతడు ఒక కుమారుడే ఎందుకనగా అతడు ఒక గృహములో జన్మించియుండెను. అతడు నాకు జన్మించినప్పుడు నా కుమారుడు నా

కుమారుడే.

పెంతెకొస్తు సంఘం జన్మనిచ్చినప్పుడు, లేక కనుగొనినప్పుడు “జన్మ, నూతనజన్మ, లేక పరిశుద్దాత్మ సంఘము” అని వారు పిలిచెను. అలా వారు దేవుని రాజ్యములోనికి జన్మించెను.

సరే, ఇప్పుడు, పాతనిబంధనలో ....ఇప్పుడు, ఎఫెస్సీయులు, మొదటి అధ్యాయములో, అది చెప్పెను, “మన దత్తత చేయబడిన కుమారులుగ, ముందుగ నిర్ణయించబడితిమి. ”కుమారులుగ దత్తత చేయబడుటకా“? ”దత్త కుమారులు!“ అలా దానివైపు పాతనిబంధనలో, ఒక మనిషి అతని ఇంటిలోనికి ఒక కుమారుడు పుట్టినప్పుడు, అతడు పుట్టినప్పుడు అతడు కుమారుడై ఉండెను. అయితే అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఆ బిడ్డను ఒక నిర్ణీత వయసు వచ్చువరకు పెంచును. అప్పుడు ఈ ఉపాధ్యాయుడు ఉండెను ..... ఆ బిడ్డ యోగ్యుమైనదని మరియు అంతా సరిగ ఉన్నదని మరియు ఇప్పుడు ప్రతి సంగతి తండ్రి దగ్గరకు మాటను తీసుకువచ్చెను అది ఉండెను .... అతడు ఉండెను - అప్పుడు అతడు కుటుంబములోనికి దత్తత చేయబడెను.

పాతనిబంధన చదివే మీలో అనేకులు దానిగూర్చిన ఆ లేఖనము ఎరుగుదురు. అతడు ఆగృహములోనికి దత్తత చేయబడెను. అయితే అతడు దత్తత చేయబడక ఉండినను అతడు ఇంకను ఒక కుమారుడుగానే ఉండును, కాని అతడు దత్తత చేయబడలేదు. మరియు అతడు దత్తత చేయబడి ఉండినయెడల, అతడు వీధిలోనికి బయటకు తేబడి, ఒక పై వస్త్రం ధరించి, మరియు అప్పుడు ఒక ఉత్సవము జరుగును. మరియు అప్పుడు ఈ బాలుని ఒక చెక్కుపై సంతకం అతని తండ్రి సంతకం వలె ఉండును. కేవలం అదే విధముగా చెల్లును, ఏలయనగా ఆ కుటుంబం యొక్క పూర్తి సహవాసంలోనికి అతడు దత్తత చేయబడెను.

25

దేవుడు తన సొంత కుమారుని దత్తత చేసికొనెను, ఆయన ఆయనను పైకి తీసుకువెళ్ళి, పేతురు, యాకోబు, యోహానులను ఒక సాక్ష్యముగా ఉంచెను. “ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యుల నోట, ప్రతి నంగతియు స్థిరపరచబడును.”మరియు అక్కడకు పైకి వెళ్ళెను మరియు దేవుడు క్రీస్తు మీద కమ్ముకొనెను. పరిశుద్దాత్మ క్రీస్తును కమ్ముకొనెను మరియు ఆయన వస్త్రము సూర్యుని వలె ప్రకాశించెను. అది సరియేనా? మరియు దేవుడు తనకు తానే ఇలా చెప్పెను, “ఈయన నా ప్రియకుమారుడు. ఆయన స్వరము వినుడి.”చూడండి. అవునండి. మరొక విధమైన మాటలలో, “అది అక్కడే ఉన్నది. ఆయన ఏమి చెప్పునో దాని యొక్క సమస్తము అలాగే జరుగును.” మరియు ఆయనకు సమాన అధికారము ఇవ్వబడెను... మరియు, పరంపరముగ, అది దేవుడే అయిఉ౦డెను, అయితే దేవుడు యేసుక్రీస్తు శరీరములో నుండి, ఆ ప్రజలకు తనకు తానే ప్రత్యక్షపరచుకొనుచుండెను. మరియు, అక్కడే, దేవుడు ఆయన సొంత కుమారుని దత్తత చేసికొనెను.

26

మరియు ఈ పెంతెకోస్తు సంఘము మరియు అంత్యదినాలలో ప్రజలు ఇక్కడ నూతన జన్మను కనుగొన ప్రారంభించిరి, తిరిగి జన్మించి ఉండగా అది సరిపోయినదని వారు అనుకొనెను. లేదండి నీకున్న ఆ ఒడుదుడుకులు మరియు బలహీనతలతో మరి ఆవిధమైన సంగతులతో దేవుడు, ఒక కుమారునిగ స్థానములో ఉంచరు. అయితే, నీవు దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు , సువార్తలో ఉన్నప్పుడు, సరిగ నిలబడినప్పుడు, ఈ రోజుల్లో ఏదో దినాన దేవుడు నిన్ను బయటకు పిలిచి మరియు నిన్ను ఒక ప్రక్క కూర్చుండబెట్టి, ప్రజల యెదుట నిన్ను తన కుమారునిగ దత్తత చేసికొని, మరియు దానితో దేశాలను వణకింప చేయునట్లు నీకు ఏదో ఒకటి ఇచ్చును. నా ఉద్దేశ్యం ఏమిటో చూశారా? కుటుంబంలోనికి అది దత్తత చేసికొనుట అయిఉన్నది.

27

ఇప్పుడు, ఆయనను వెంబడించినవారు. పేతురు, యాకోబు, యోహాను. ఈరాత్రి పేతురుకు వచ్చిన ఒక గొప్ప దర్శనములో ఆరోజుల్లో ఆ ప్రజలు ఏలాగు జీవించిరో దాని గూర్చి మాట్లాడుకొనుచున్నాము. మరియు ఇప్పుడు, మొదట, ఇక్కడ ఇరవై.... లేక, ముందు అధ్యాయంలో 32వ వచనము, తొమ్మిదవ అధ్యాయము.

ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను.

అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి

పేతురు - ఐనెయా, యేసు క్రీస్తు నిన్నుస్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను.

దానిని గమనించండి. ఇప్పుడు ఏమి జరిగినదో చూడండి

లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరు అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. (ఇక్కడ గమనించండి).... వారందరు ప్రభువు తట్టు తిరిగిరి.

ఎందుకనగ పక్షవాయువుతో ఉన్న ఒక మనిషి స్వస్థపడెను, పక్షవాయువుతో ఒక మనిషి స్వస్థపడెను. కాబట్టి మొత్తం దేశం ప్రభువు తట్టుతిరిగెను. మరియు, ఈనాడు, చనిపోయినవాడు లేపబడెను. మరి ప్రజలు అంటారు, “అది దయ్యం అయి ఉన్నది. అది మనస్తత్వ శాస్తమై ఉన్నది. అది మనస్సులో ఉన్న సంగతులను ఊహించి చెప్పుట అయి ఉన్నది. ప్రారంభంలోనే, ఆ వ్వక్తి చనిపోలేదు.” ఆ భేదము నీవు చూశావా? ఈనాడు మనం ఏమి పొందుచున్నామో ఆ చేసిన తీర్మానము, దేవుని యెడల అది మన యొక్క విముఖత అయిఉన్నది మనం దైవిక తీర్పును పొందుటకు వెళ్ళుచున్నాము. ఇప్పుడు ప్రపంచం మొత్తం, రాబోవుచున్న తీర్పుల ప్రభావము క్రింద సరిగ వణకుచున్నది.

రానున్న తీర్పులు, కొన్ని నిముషాలలో, సేవకులలో ఎవరో ఒక సేవకుడు బహుశా అది తీసుకోవచ్చును మరి వారు అలా చేస్తారని నేను ఆశపడుచు, ఏ విధముగ అయినను, దాని మీద, ఆ రానున్న తీర్పు మీద తీసి కొందురని నిరీక్షించుచున్నాను. ఎందుచేతననగా, ప్రపంచం మొత్తం అంతా సిద్ధంగా ఉంది, వణకుచున్నది. ప్రతి దేశము వణకుచున్నది. రష్యా కూడ వణకుట లేదని నీవు అనుకొనుటలేదా? అమెరికా సంయుక్త రాష్ట్రములు, మరియు ఆ ద్వీపములు వణకుచున్నవి. “ఆ మొదటి అణుబాంబు ఎవరు విసరనైయున్నారు.?” అది జరిగినప్పుడు, ఉన్న మొత్తం సంపదనంతా అది బయటకు త్రోసివేయవచ్చును, మరియు ఏ ఒక్కటీ ఉండదు.... ఎవరు..... వాటిలో కొన్ని విడచిపెట్టబడిన యెడల ఏమగును, ఒక-కోబాల్టు బాంబు. అక్కడ భూమియొక్క ఉపరితలముపై ఒక ఈగ కాని లేదా కీటకముగాని ఉ౦డదు.

28

ఇప్పుడు అది సరిగ క్రూరమైన పాపయుక్తమైన, నరక బద్దులయిన మనుషుల చేతులో ఉన్నది. మరియు ఈభూలోక యాత్ర యొక్క నీ గమ్యము క్రూరమైన మరియు పాపయుక్తమైన మనుష్యుల చేతులలోనికి విడచిపెట్టబడి ఉన్నది. నీ ఆత్మయొక్క గమ్య స్ధానము ఎక్కడ తీర్మానం చేయబడినదో గమనించుట ఉత్తమమైనది. అది పరలోకంవైపు మరియు దేవునివైపు అది తీర్మానం చేయబడని యెడల, నీ పూర్ణ హృదయంతో, ఈరాత్రి తిరుగుము మరియు దేవుని వైపునకు తిరుగకుండ ఈ పాత సంవత్సరమును పోనియ్యకుము. ఎందుకనగ, నీ భూసంబంధ గమ్యము, తీవ్రమైన బాధ కలిగించెడి, మరియు క్రూరులైన చల్లబడిన హృదయం గలిగి, దేవునియందు విశ్వాసంలేని మనుష్యుల చేతిలో ఉన్నవి. అదే ఎక్కడ నీవు-నీ దేహమును గూర్చి తీర్మానించితివో అదే ఇప్పుడు దాని గూర్చి వారు ఏమి చేయకోరినప్పటికి అది నిన్ను పూర్తి చేయును. దేవుడు నిన్ను కరుణించును గాక!

మరియు దేవుడు, తన కరుణగల ప్రేమలో, సూచనలు మరియు ఆశ్చర్యకార్యములు మరియు అద్భుతాలు, మరియు ప్రతిదియు, సువార్తను బోధించి, మరియు ప్రజలైన మీరు నిరంతరం నీ ముఖమును త్రిప్పుచున్నావు అప్పుడు తీర్పు తప్ప మరే ఇతర సంగతియు ఎలా నీవు ఉద్దేసించుచున్నావు? నీవు అది తప్పక పొందవలెను.

మరియు పక్షవాయువుతో ఒకమనిషి స్వస్థపరచబడెను. మరియు దేశము అంతా క్రీస్తువైపునకు తిరిగెను. మరియు ఇక్కడ మనం రాజులు మరియు సర్వాధికారులు, చక్రవర్తులు, మరియు కాంగ్రెసు మనుష్యులు. మరియు ప్రతి ఇతరమైనది. బాధపరచబడినవారు మరియు వ్యాధులతో బాఢపడువారు, మృతులై మరియు గతించిపోయారు. మరియు వారు తిరిగి ప్రాణంతో లేపబడ్డారు మరియు దేశం వారు అంతా దానివైపు చూచి అపహాస్యం చేసి నవ్వెను. అప్పుడు తీర్పు తప్ప మనకు మిగిలినది ఏమిటి? ఓ, సహోదరులార, దేవుడు తన ప్రజలను లేపు అక్కడ ఒక సమయం ఎన్నడైన ఉండినయెడల, ఈనాడే అయి ఉండవలెను. ఈ రానున్న సంవత్సరము, దేవుడు తన సేవకులను అభిషేకించిన మరియు ఈముగింపు సమయాలలో అంత్యకాలంలో నీవు ఉన్నావు. కాబట్టి అగ్నిజ్వాలవలె ఉందురు.

29

ఇక్కడ చూడండి. ఈ మనిషే క్రిందకు వచ్చి... అక్కడ తబిత అను పేరుగల ఒక అమ్మాయి ఉండెను. తబిత, దాని అర్ధము “దొర్కా” అక్కడ ఆమె చనిపోయి పడి ఉండెను. పేతురు యొప్పేలో ఉండెను. వారు అక్కడకు మరియు ఆయనను, అక్కడకు దిగువకు తీసుకొని వచ్చెను. ఆమె ఎక్కడ శవముగ పడిఉండెనో లోనికి అతడు నడిచి వచ్చెను. ప్రజలందరిని బయటకు పంపి మరియు మోకాళ్ళు ఊని మరియు ప్రార్ధించెను. మరియు ఆయన అలా ప్రార్ధించినప్పుడు, ఆయన పైకిలేచి మరియు ఆమె చేయిపట్టుకుని, మరియు ఆమెను పైకి నిలబట్టెను మరియు ఆమె పూర్తిగ, మరల సజీవముగ ఉండెను.

మరియు ఏమి జరిగినదో గమనించండి.

“మరియు, అది జరిగినప్పుడు, అతడు అక్కడ అనేక దినములు ఉండెను” .......

కేవలం దానికి ముందు.

ఇది యొప్పే యందంతట తెలిసినప్పుడు. మరియు అనేకులు ప్రభువునందు విశ్వసించెను. (అనేకులు నమ్మెను.)

మరియు, ఈనాడు, వారు అంటారు, “ఆమె ఎంతమాత్రం చనిపోయినదా లేక లేదా నాకు అనుమానమే. ఆమె కేవలం-ఒక కోమాలో లేక ఏదో ఒకటి ఆ విధముగ నేను అలాంటి సంగతిని నమ్మను.” అది వాస్తవికతకు దూరముగ వివరించబడెను. బైబిలు నుండి, అతీతమైన దానిని నీవు విశదీకరించిన యెడల, నీవు ఆరాధించు అదే దేవుని నీవు విశదీకరించుచున్నావు. నిశ్చయముగ, నీవు అలా ఉన్నావు. ఆయన ఒక

అతీతమైన దేవుడు. అంతా యథార్థం.

30

ఇప్పుడు, అయితే, ఈ అపొస్తలులను ఆపినదా? సహోదరుడా, వారు యేసుతో ఉన్నారు. ఏ వ్యక్తి ఏమి చెప్పినను వారు లక్ష్యము చేయలేదు. ఒకసారి వారు వారిని అక్కడకు పిలిచారు మరియు అద్భుతాలు జరుగు రోజులు గతించిపోయాయని వారితో అన్నారు. వారిని కొట్టారు మరియు వారిని జైలులో పెట్టారు, మరియు వారిని రాత్రంతా ఉంచారు, మరుసటి ఉదయం వారిని న్యాయతీర్చులో ఉంచారు. మరియు వారు విధ్యలేని పామరులని, వారు తెలుసుకున్నారు. అయితే వారు యేసుతో ఉన్నవారని వారిని గుర్తించారు.

వెళ్ళుచుండగా, వారు ఎన్నడు బయటకు వెళ్ళి, మరి ఏమాత్రం సెమినరీని (వేదాంత పాఠశాల) సంప్రతించలేదు. వారు వారి సొంత ప్రజలు దగ్గరకు వెళ్ళారు. వారు అంతా సమావేశమయినప్పుడు, ప్రభువు ఏమి జరిగించెనో విశదీకరించుచు, వారంతా కలసి సమావేశమయి మరియు ఇలా ప్రార్ధించారు, “ప్రభువా, ఎందుచేత—-” ప్రవక్త ద్వార పలుకబడినది నెరవేరునట్లు అన్యజనులు ఏల గల్లత్తు చేసిరి. ఆ ప్రజలెందుకు వ్యర్ధమైన ఆలోచనలు పెట్టుకొనిరి. నీ పరిశుద్ధ బిడ్డ అయిన యేసు చేయిని చాపుట ద్వార, వ్యాధిగ్రస్తులను బాగుచేయుటకు మరియు సూచనలు మరియు ఆశ్చర్యకార్యములు జరుగునట్లు నిజముగ మాకు శక్తిని ఇమ్ము“ మరియు ఆ ప్రజలు ఆ స్థలములో ఏకమనస్సుతో ప్రార్ధించినప్పుడు, వారు సమావేశం అయిన చోట ఆ భవనము కంపించెను.

ఈ రాత్రి మనకు అవసరమైనది దేవుడు ఒకడేనన్న విశ్వాసం గలిగి, ఒక ప్రార్ధనా కూడికలో ఏకాత్మ మరియు ఏక హృదయంతో కలసి మనంతట మనం బందించబడినయెడల, మరియు ఆ విధమయిన ఒక ప్రార్ధన చేసినయెడల, అప్పుడు మనం మరొక వణకించు సమయం కలిగి ఉందుము. ఆమెన్‌.

31

గమనించండి. పేతురు, ఒకసారి ప్రభువును కాదు అనినవాడు, ఒకప్పుడు ఆయన యందు విశ్వసించనివాడు, లేక ఆయనను కాదు అనినవాడు; మరియు బయటకు వెళ్ళి మరియు సంతాపపడి ఏడ్చెను, మరియు లోనికి వచ్చెను. ఇప్పుడు ఆయన పరిశుద్దాత్మను పొందెను. ఆయన బోధించినది వినుడి.

అపోన్తులుల కార్యములు10:1 ఇటలీ వటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.

అతడు తన ఇంటి వారందరితో కూడ దేవునియందు భయభక్తులు గలవాడయి ఉండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్ధన చేయువాడు.

ఎలా౦టి మనిషి! ఇప్పుడు, కాదు, జ్ఞాపకముంచుకొనుడి, కాదు—-ఒక అన్యుడు. ఒక యూదుడు కూడ కాదు. అతడు ఒక అన్యుడై ఉండెను, ఒక శతాధిపతి; ఒక వంద మనుష్యుల పై, వంద మీద అయి ఉండెను. అయితే అతడు దేవునికి భయపడు ఒకమనిషి అయిఉండెను. దేవుడు ఎల్లప్పుడు అన్యజనులయిన ప్రజల మధ్య, దేవునికి భయపడు మనుష్యులను కనుగొనెను.

32

ఈరోజు ఒక యవ్వన మనిషితో నడచుచు, మాట్లాడుచుండగ, నేను అన్నాను, “నేను పరలోకం వెళ్ళినప్పుడు, నేను చేయగోరు సంగతులలో ఒకటి ధైర్యముగ ఒక కార్యము చేసిన ఒక ప్రత్యేక వ్యక్తి దగ్గరకు నడచి వెళ్ళి మరియు కరచాలనము చేయుట” మరియు అతడు చూడగోరిన ఆ ఒకని గూర్చి అతడు మాట్లాడెను. దేవుడు ఎలా ఆ ప్రజలను ఆశీర్వదించెనో, వివిధ సంగతులగూర్చి, అతడు అతనికి కరచాలనము చేయగోరెను.

ఊరియా యొక్క భార్య అయిన బెత్షేబాను దావీదు తీసుకున్నప్పుడు, మరియు వారు అతనిని బయటకు పంపి మరియు వానిని అక్కడే ఉంచెను. మరియు ఆమె తల్లి అయినది మరింత లోపలకు తేబడినది అయితే అతడు దానిని ఊరియా యొద్దకు తెచ్చాడు. అతడు ఒక అన్యుడు కాడు.... అతడు ఒక యూదుడు కాదు. అతడు ఒక అన్యుడై ఉండెను. మరియు అతడు ఒక హిత్తీయుడు, యూదా మతమునకు కొత్తగా వచ్చినవాడు. మరియు అతడు దిగువకు వెళ్ళి మరియు కొంచెం సమయం ఇంటి దగ్గర తన ప్రేమతో, ఉన్న అందమైన భార్యతో నిలచి ఉండమని చెప్పెను. అతడు అనెను “నా దేవుని మందసము యుద్ధభూమిలో ఉండగ, అలాటి సంగతిని చేయుట దేవుడు నిషేధించునుగాక.” అతడు అది చేయుటకు తిరస్కరించెను. మరియు సహోదరుడా, నేను మహిమలోనికి వెళ్ళినప్పుడు, నేను ఊరియ దగ్గరకు వెళ్ళి మరియు అతని చేతులతో కరచాలనం చేసి, మరి అంటాను, “నా భూసంబంధ యాత్రలో నీ సాక్ష్యము నాకేదో అవగాహన కల్గించిన దాని కొరకు దేవునికి స్తోత్రములు” అవునండి.

నేను దానియేలు దగ్గరకు వెళ్ళి, అందును, “దానియేలు, నీకు తెలుసా, భయం లేకుండ ఆ సింహాలు ఎదుటకు అక్కడకు నీవు వెళ్ళినప్పుడు, ఆ సాక్ష్యము నాకు ఏదో ఉద్దేశ్యమును కలిగించినది” అవునండి.

నేను అపొస్తులుడు అయిన పేతురును చూడగోరి, మరి అందును, “పేతురు, ఆ రాత్రి నీవు చెరసాలలో ఉన్నప్పుడు , మరియు ప్రభువు ఒక పెద్ద వెలుగుతో లోనికి వచ్చి, మరియు నీపై ప్రకాశించినప్పుడు ఓహ్‌, నేను ఎల్లప్పుడు దానికి ఉత్సాహముగా ఆమోదము తెలిపెదను. మరియు నీవు ఆ వెలుగును వెంబడించుచు మరియు నీ ఎదుట ద్వారము తెరువబడినప్పుడు, మరియు నిన్ను సరిగ వీధులలోనికి తీసుకొని వెళ్ళినది. నీవు కల కనుచున్నట్టు నీవు తలంచావు.” ఎలా౦టిది ఆ సమయం!

విమోచించబడిన వారందరు అక్కడ చుట్టూ చేరి ఉన్నప్పుడు పరలోకంలో ప్రశాంతమైన స్థలమే లేకుండెను, అది అలాగే కదా? విమోచించబడిన వారందరు

కదం తొక్కుచూ లోపలికి వచ్చునప్పుడు, అక్కడ మరపురాని ఒక సంగతి జరుగనైయున్నది.

33

మరియు ఇక్కడ కొర్నేలి ఇంటిలో ఇతడు శతాధిపతి అయి ఉండెను. చూడండి దేవుడు ఎలా అది ఏర్పాటు చేసెను! ఇప్పుడు, కొర్నీలి దేవునికి భయపడు మనిషి అయి ఉండెను. అతడు ప్రార్ధన చేయువాడు, మరియు ప్రజలకు ధర్మము చేయువాడు. నీవెన్నడూ యోగ్యమైనది చేయలేదు. అయితే దేవుడు నీ వివరములు నమోదు చేయు పత్రములో అది ఉంచును. అది యాధార్ధం అతడు ప్రార్ధించెను, మరియు అతడు ప్రజలకు ధర్మకార్యములు చేయువాడు అతడు ఒక గొప్ప మనిషి.

ఒకరోజున, అతడు ఇంటిలో ప్రార్ధించుచుండగ అతడు ఉన్నచోటకు గదిలోనికి అక్కడకు దూత వచ్చెను. నీవు దూతలను నమ్ముచున్నావా? (సమాజం చెప్పిరి, ఆమెన్‌“-సంపా) ఆయన ఉన్న గదిలోనికి దూత వచ్చెను, మరియు అనెను, ”కొర్నేలి పైకి లేచి యొప్పేకు వెళ్ళుము. సీమోను వాని ఇంటిలో నివసించు, పేతురు అను పేరుగల ఒకని కొరకు అడుగుము. మరియు ఏమి చేయవలెనో అతడు నీకు చెప్పును.“ ఆమెన్‌.

ఇప్పుడు, పేతురు, ఈ సమయంలో ప్రయాణంలో ఉన్నాడు, కనుక అతడు ఆకలిగొనెను అది 12 గంటల సమయమై ఉండెను. కనుక, అతడు ఇంటిపైకి ఎక్కి వెళ్ళి మరియు చిన్న కునుకు తీసికొనెను. అతడు అక్కడ ఉండగ, మధ్యాహ్న భోజనం సిద్ధపరచు వారికొరకు కనిపెట్టుచుండగ, ఆయన ఒక చిన్న కునుకు తీసికొనుచుండెను.

కాబట్టి కొర్నేలి ఒక సైనికుని మరియు ఇద్దరు భక్తిగల మనుష్యులను అక్కడకు పంపెను, మరియు పేతురును కనుగొనుటకు వారిని తీసికొనవచ్చెను.

మరియు, దేవుడు, ఆయన నిన్నుచూచుటకు ఎవరైనా ఒకరిని పంపించుచున్నప్పుడు, ఆయన ఆ సంగతి జరుగుటకు ఆ సమయానికి ముందుగానే ఏర్పాట్లు చేయును.

అలా అక్కడ చనిపోయేస్థితిలో పడియున్న, నిన్న ఈ చిన్నబిడ్డకొరకు, ఆయన ఆసుపత్రినొద్ద ఏర్పాట్లు చేసెను. ఆ సంగతి ఏమై ఉండెనో వారికి తెలియదు. మరియు పరిశుద్ధాత్ముడు గదిలో మాట్లాడెను, నేను అక్కడకు కూడా వెళ్ళక ముందే, ఆ బిడ్డ స్వస్ధత కొరకు, ఆసుపత్రి నొద్ద ఏర్పాట్లు చేసెను. హల్లేలూయ!

ఫిన్‌లాండ్‌లో చనిపోయి, అక్కడ రోడ్డుపై అక్కడ ఆ చిన్న బాలుడు పడి ఉండెను. అతని తండ్రి మరియు తల్లి పొలం నుండి పరుగెత్తుచు, మరి అరచుచు, వారి చేతులతో శబ్దము చేయుచుండిరి. రెండు సంవత్సరములకు ముందుగానే, దేవుడు అతని పునరుత్థానం కొరకు ముందుగానే ఏర్పాటు చేసెను. దేవునికి స్తోత్రం!

మరియు, ఈ రాత్రి మనం ఈ సంఘంలో ఇక్కడ ఉండగ మనం చేయు ఈ సంగతుల యందు శ్రమపడుచుండగ, మన పునరుత్థానమును దేవుడు ముందుగ ఏర్పాటు చేసెను. ఏదో మహిమకర రోజున, ఆయన వచ్చును. అది అంతా ముందుగనే ఏర్పాటు చేయబడెను. దానిగూర్చి ఆలోచించు పురుషులు మరియు స్త్రీలు, కొన్నివేళల్లో కవులు ఈ పాటలు పాడుదురు “ఓ అక్కడ మధ్యాకాశంలో ఒక సమావేశం జరుగనైఉన్నది.”

34

ఈరాత్రి, పదిహేను సంవత్సరములకు పూర్వము, ఒక పెద్ద పటముతో, బోధించుచు, అక్కడ ఇదే వేదికపై నేను నిలబడి ఉన్నాను. అక్కడ ఒక చిన్న పెంతెకోస్తు గుంపు లూయిస్‌ విల్లా నుండి వచ్చెను వారు నాట్యం చేయు పద్ధతిలో ఆ ప్రజలను నేను ఎన్నడు నమ్మలేదు. అక్కడ ఒక చిన్న స్త్రీ ఇక్కడ పియానా వాయించుటకు పైకి వచ్చెను. మరి వారు ఒక ప్రత్యేకమైనది వాయించుచు మరియు ఒక చిన్నదాని మీదకొట్టుచు.... బట్టలుతుకు బల్లపై వ్రేళ్ళతో కొట్టుట. వారిలో కొందరు ఒక తగరపు డబ్బా పై కొట్టుచుండిరి. నేను దాని గూర్చి చాల విమర్శకుడునై ఉన్నాను కాబట్టి నేను అనుకున్నాను, “ఏమి జరగనై ఉన్నది?” మరియు ఆ స్రీ ఆ ప్రత్యేకమైనది వాయించుటకు పైకివచ్చెను ఆమె వాయించుచుండెను. ఆ స్తీ ఆ బట్టలుతుకు బల్లపై కొట్టుచు వాయించుచున్నది. మరియు ఈ చిన్నఅందమైన జుట్టుగల బాలిక, నేల మీదకు, ఇక్కడ బయటకు గెంతెను మరియు ఆత్మలో నాట్యం చేయుటకు ప్రారంభించెను.

మరియు నేను, అపహాసకులు కూర్చుండు స్థలంలో కూర్చుని, నేను అంటిని, “ఇప్పుడు, దానివైపు మీరు చూడాలని నేను కోరుచున్నాను!” నా సంఘానికి నేను ఆ విధంగా చెప్పాను, నేను దానిగూర్చి ఏమి చేయబోవుచున్నానని వారందరు ఆశ్చర్యపడునంతవరకు. నేను ఆమెవైపు చూస్తూ ఉన్నాను, మరియు నేను తలంచాను “అలా దానివైపు చూడండి! ఇప్పుడు, అది ఏమి కానియెడల, సంఘముగ కాక ఒకపూట కూళ్ళ ఇల్లుగ చేయుటయే!”. మరియు నేను అక్కడ నిలబడి, ఏ శ్రేష్టమైనది ఎరుగక ఉన్నాను. నేను ఏమియు చెప్పక, అయితే నా హృదయంలో దానిగూర్చి ఆలోచించుచుంటిని.

కనుక ఆమె అక్కడ నాట్యం చేయుచుండగ నేను ఆమెను గమనించాను. నీవు తెలుసుకొను మొదటి సంగతి, నేను అన్నాను, “ఇప్పుడు ఒక నిముషం కనిపెట్టండి. దాని కొరకు ఆ స్త్రీకి ఏమైనా లేఖనం కలదా అని ఆశ్చర్యపడుచున్నాను?” మరియు నేను లేఖనములు గూర్చి ఆలోచించ ప్రారంభించాను. నేను అన్నాను, “ఎక్కడ నాట్యం అనునది నియమించబడెను? బైబిలులో, మొదటి స్ధలము.” అది యధార్దం. మరియు నేను తలంచాను, “ఇది వారిని నాట్యం చేయునట్లు చేసెను?”

వారు ఎర్ర సముద్రమును దాటునప్పుడు, నేను ఇశ్రాయేలు పిల్లలను చూశాను, మిరియాము వెనుకకు చూచెను మరియు ఆ పని యాజమానులు అందరు మునుగుట చూచెను, ఆమె ఒక తంబూర పట్టుకొని మరి నాట్యం చేయ ప్రారంభించినది; మరియు ఈ తంబూర కొట్టుచు, మరియు నాట్యం చేయుచు ఆ ఒడ్డుల గుండా పరుగెత్తినది. మరియు ఇశ్రాయేలు పిల్లలు, నాట్యం చేయుచు ఆమెను వెంబడించెను. నేను తలంచాను, “అది విజయమై ఉన్నది.”

నేను దావీదును చూశాను, అక్కడ గాలిపంక వీచుచుండగా దానివెనుక తన ప్రియురాలు కూర్చుండగా, అక్కడ దావీదు బయట నిలబడియుండగా, ఆమె తన అందమైన బాల్య స్నేహితుని చూచుచుండెను. మరియు ఆ కొండ అడ్డముగ వస్తున్న సహోదరుడు గ్రహం కొంచెం సేపటిక్రితం మాట్లాడిన ఆ మందసం ఇక్కడకు వస్తున్నది, అది వచ్చుట దావీదు చూచినప్పుడు, అతడు ఆ చుట్టూ మరియు చుట్టూ మరి చుట్టూ నాట్యం చేసెను. “ఎందుకు?” ఆమె అన్నది, “నీవు నన్ను సిగ్గుపరిచావు!”

అతడు అన్నాడు, “నీవు అది ఇష్టపడనియెడల ఇది గమనించు!” మరియు చుట్టూ మరియు చుట్టూ మరియు చుట్టూ అతడు మరల వెళ్ళెను. ఏమిటో నీకు తెలియునా? దేవుడు పరలోకం నుండి క్రిందకు చూచెను, మరియు చెప్పెను, “దావీదూ, నీవు నా హృదయానుసారుడవైన మనుష్యుడవు”అది యథార్ధము.

మరియు నేను తలంచాను, “నీకు తెలుసా, అక్కడ నాతో ఒక సంగతి ఉన్నది. బహుశా, నాకు చాలినంత విజయం కలిగి ఉండలేదు.” మరియు నేను అక్కడ కూర్చున్నాను మరియు నేను నా మెథడిస్టు పాదమును నేలపై కొట్టుచున్నాను మరియు నీవు మొదట తెలిసికొను సంగతి.... దేవుడే, నా తీర్పరి! నేను, నేను ఏమి చేయబోవుచున్నానో తెలిసికొనక ముందు, నేను ఇక్కడ ఆ బాలిక చుట్టూ తిరిగి నాట్యం చేయుచుండగా ఇక్కడ నేలపై ఉన్నాను. అది సరియైనది. అప్పుడు నేను అన్నాను, “దేవా, అపహాసకులు కూర్చుండు చోటునుండి నన్ను బయటకు తీయండి. నేను ఎన్నడైనా ఏదైనా తీర్పు తీర్చేముందు ఏ సంగతిని జ్ఞానముతో నన్ను చూడనివ్వండి.” ఆమెన్‌. దేవుడు అసాధారణమైన కార్యములు చేయును.

35

నేను బుద్ధిహీనతలో నమ్మిక ఉంచను. నేను మూర్ఖమైన అనవసరపు మాటలలో నమ్మిక ఉంచను. అయితే నేను నిజమైన, అసలైన ఆత్మతో నింపబడిన, శక్తిలో మరియు ఋజూవు చేయుచు బోధించబడిన దేవుని పరిశుద్ధాత్మ వాక్యమునందు నమ్మిక ఉంచుదును. ఆమెన్‌. ఎందుకనగ, ఆ సంగతియే నన్ను రక్షించినది. అదే సంగతి నన్నుఇంత దూరం తీసుకొని వచ్చినది. అదే సంగతి డాక్టరు నేను చనిపోవుచున్నానని చెప్పినప్పుడు అదే సంగతి నాకు సహాయం చేసెను. నా మరణ ఘడియలో అదే సంగతి నన్ను రక్షించినది. అదే సంగతి నన్ను పునరుత్దానంతో లేపినది. మరియు అదే సంగతితో నేను పరలోకమునకు వెళ్ళగలను. నేను ఎన్నడైనా అక్కడకు వెళ్ళినయెడల, నేను దాని ద్వార వెళ్ళగలను. కారణం నేను ఇతరమైన ఏది ఎరుగను అయితే అదే, మరియు అది తప్పఇతరమైన ఏదియు తెలిసికొనగోరను. అయితే అదే. అది యథార్ధము. సిలువ వేయబడిన యేసును ఎరుగుము, మరియు అంతా అదే. ఆయన సిలువవేయబడి ఉన్నయెడల, అప్పుడు అది నా శరీరము ఆయనతో సిలువ వేయబడెను, మరియు నేను ఈలోకసంగతులకు చనిపోయాను. ఎందుచేత! ఆమెన్‌!

నేను భక్తిని అనుభవించుచున్నానని, మీకు తెలియును. ఆమెన్‌. నేను ఆ విధముగ ప్రారంభించి భావన కలిగి ఉన్నాను.

36

గమనించండి, వారు ఇక్కడే ఉన్నారు. ఆహా, ఎలాంటి సమయం! అద్భుతమైన సమావేశం వారు కలిగిఉన్నారు! కొర్నేలి చెప్పెను, “ఇప్పుడు నీవు అక్కడకు వెళ్ళు మరియు పేతురు అను పేరుగల ఒకని కొరకు అడుగుము.” మరియు అనెను.... ఎన్నడూ అతని గూర్చి ముందు వినలేదు.

మరియు పేతురు అక్కడ పైనఉండి అనుకున్నాడు, “ప్రభువా నేను భోజనము చేయకముందు నేను ఒక చిన్న కునుకు తీసుకుంటాను. నేను అలసి మరియు అలా ఆకలిగ ఉన్నాను.” మరియు అతడు అక్కడ ఉన్నప్పుడు అతడు పరవశుడయ్యెను. లేఖనం అలా చెప్పెను. అప్పుడు, అతడు అలా పరవశుడయ్యెను అని నేను నమ్ముచున్నాను. నీవు నమ్మవా? మరియు అతడు అలా చేసినప్పుడు, ప్రాకుచున్న జీవులతో నింపబడిన, ఒక పాత్ర క్రిందికి దిగివచ్చుట అతడు చూచెను. మరియు ఒక స్వరము అనెను, “పేతురూ, లెమ్ము. చంపుకుని మరియు తినుము”.

అతడు అనెను, “లేదు, ప్రభువా. నేను ఒక యూదుడను. అపవిత్రమైనదియు లేక నిషిద్దమైనదేదియు నా నోటిలోనికి ఎన్నడూ రాలేదు.”

అతడు అనెను, “నేను పవిత్రం చేసిన దానిని అపవిత్రము అని పిలువవద్దు.” అనెను, “నీవు లెమ్ము” అనెను, “అక్కడ ఒకరు నీకొరకు, క్రింద ద్వారము నొద్ద ఎదురుచూచుచున్నారు. మరియు ముందుకు వెళ్ళి, ఏదియు అనుమానించవద్దు. అతని వెంబడి వెళ్ళుము.” ఆమెన్‌.

37

ఇప్పుడు, పేతురు మరియు అతని యొక్క స్వనీతి మార్గములనుగూర్చి మీకు తెలియును. అతడు ఒక రకమైన పేరు ప్రఖ్యాతులను ఆ ప్రజల చుట్టూ కలిగియున్నాడు, కనుక అతడు ఏమి తినుచున్నాడో అతడు గమనించవలసి ఉండెను. అతడు ఒక యూదుడు అయి ఉండెను. అతడు ఒక-ఒక నిక్కచ్చియైన ప్రెస్పిటేరియనుగా తీర్చబడ్డాడు, అలాంటి మరి ఏదో విధముగ అని మీకు తెలియును. మరియు అతని యొక్క సంఘ వ్యవహారమయినందు చేత అతడు ఏమి చేయుచుండెనో అతడు గమనించవలసి ఉండెను.

కనుక ప్రభువు చెప్పెను “ఏమి జరిగినా, ఏమైనప్పటికి ఏశ్రద్ధ చూపక ఆ అన్యజనులను వెంబడించుము. నీవు అక్కడకు వెళ్ళుము.” మరియు అతడు తిన్నగా కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు, కొర్నేలి చుట్టుఉన్న ప్రజలనందరిని సమావేశపరిచెను, మరియు అతడు (పేతురుతో) వానితో ఎలా అతడు దూతను చూచెనో చెప్పెను. అతడు అనెను, “ఇప్పుడు, పేతురూ, నేను-నేను నీకొరకు పంపి ఉన్నాను.”

మరియు పేతురు అక్కడకు వెళ్ళినప్పుడు మరియు బోధించనారంభించి, “పేతురు ఈ మాటలు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ వారి మీదకు దిగెను,” మరియు వారందరు పరిశుద్దాత్మ చేత నింపబడెను, ప్రవచించనారంభించుచు, భాషలలో మాట్లాడుచు, మరియు ఒక మరపురాని సమయం కలిగి ఉండెను. అతడు అనెను, “నీళ్ళకు మనం ఆటంకమా?” ఇప్పుడు, వీరు బాప్తిస్మము పొందకముందే పరిశుద్ధాత్మ పొందెను. మరియు అతడు యేసుక్రీస్తునామంలో బాప్తిస్మం పొందమని ఆజ్ఞాపించెను. మరియు పేతురు కొన్ని దినములు వారితో కనిపెట్టెను.

38

అది అపొస్తలుల సంఘము, దేవుడు చెప్పిన ప్రతిచోటకు ఆత్మలో కదులుచుండెను. పేతురు అతని భోజనము చేయకుండానే చేసెను. పేతురు ప్రభువును వెంబడించుటకు దిగువకు వెళ్ళెను.

మరియు దేవుడు ఈ గుడారంలో, ఇతర ఏ చోట అయినను ఈనాడు ఒక మనిషిని మరియు స్త్రీని ఎన్నడైనా పొందిన యెడల, అలా వారిచుట్టూ ఏమి జరుగుచున్నదీ శ్రద్ధ చూపరు, అయితే వ్యక్తిగతమైన, విభాగముగా, ప్రభువుకు వారంతట వారే అప్పగించుకొందురు. దేవుడు ఈనాడును, అలా అప్పుడు నడిపించినట్టే అలా మనిషిని నడిపించును. అలా ఆయన మనతో ఉన్నానని ఆయన బుజువు చేయును. ఈనాడు మనకు అవసరమైనది ఒక తగ్గించుకొనిన, అప్పగించుకొనిన జీవితము. నీయంత నీవే అప్పగించుకొనుము. నీకు నీవే వెనుకకు లాగుకొనవద్దు. ఏమియు చేయక అయితే పరిశుద్ధాత్మతో తిన్నగ నడిపించబడుము. ఆత్మ ఏమి చెప్పుచున్నారో, త్వరగా చేయుము. ఇలా అనవద్దు, “సరే. ఇది ఏమిటో మరియు అది ఏమిటో అని కనిపెట్టి మరియు కనుగొను వరకు ఉందును.” పరిశుద్ధాత్మ ఏమి చెప్పుచున్నారో చేయి, వెళ్ళి అది చేయుము!

పరిశుద్ధాత్మ అక్కడకు నన్ను పిలిచినప్పుడు, ఫిన్లాండుకు నేను వెళ్ళకుండిన యెడల, ఏమిటి? ఎక్కడ ఆ చిన్న శిశువు అక్కడ పడి ఉండి చనిపోవుచుండెనో; వెళ్ళకుండిన యెడల? నిన్ననేను ఆసుపత్రికి వెళ్ళకుండిన యెడల ఏమిటి? అది, “బలులర్చించుట కంటె మాటకు విధేయుడగుట శ్రేష్టమైనది. పరిశుద్ధాత్మ ఏమి చేయమని చెప్పెనో చేయుము. ఈ రాత్రి మనకు అవసరమైనది ఏమనగా మన అందరికి ఉన్న వెనుకకు లాగే చిన్న స్వల్పమైన ఉద్దేశ్యములు విడిచి పెట్టుము. మరియు పరిశుద్దాత్మను రానిచ్చుట.... ఇక్కడే నీవు బోధించబడినావు, ఏది సరియైనదో మరియు పొరపాటు ఏదో నీవు ఎరుగుదువు.

అయితే ఈ రాత్రి నీకు అవసరమైనది ఏమనగా నీ హృదయంలో దేవుడు ఒక గొప్పది పెద్దవైన ప్రేమతో కూడిన పూర్తి మూట కుమ్మరించెను; అన్ని భేదములు కడుగబడినవి. అది గతించుపోవుచుండగా, పాత సంవత్సరంతో దానిని కాల్చివేయుము. దానిని పోనిమ్ము ఒక కొత్తది ప్రారంభించుము, ఒక క్రొత్త జీవితమును ప్రారంభించుదుము. నీవు ప్రారంభించలేవు—- నీవు ఇది వరకే దేవుని రాజ్యములోనికి జన్మించి ఉన్నయెడల, నీవు ఇది వరకే నీలో పరిశుద్ధాత్మను పొంది ఉన్నావు, నీవు చేయవలసిన ఒకే కార్యము నిన్ను కింద ఉంచి పట్టుకొని ఉన్న ఈ లోకసంగతుల నుండి తెగవేయబడి విడుదల పొందవలెను. చెప్పబడెను, “సులువుగ చిక్కులు బెట్టు ప్రతి భారము విడచిపెట్టి మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము” హెబ్రీయులు, 12వ అధ్యాయము. భారములు పక్కనబెట్టి!

39

జ్ఞానులు యేసును చూచుటకు వచ్చుచుండుట నీవు ఊహించితివా? ఒక నిమిషం కేవలం నేను ఒక చిన్న నాటకము వలె తీసికొందును. నేను చూడగలను.... వారు ముగ్గురు జ్ఞానులని వారు చెప్పుదురు. మనం ముగ్గురు ఉన్నారని మాత్రమే అందాము. జిమ్‌, జాన్‌ మరియు జార్జి, వారి పేర్లు అయి ఉండెనని మనం చెప్పెదము. మరియు వారు యేసును చూచుటకు వచ్చుచున్నారు. మరియు వారందరు వెళ్ళుటకు సిద్ధపడుట నేను వారిని చూడగలుగుచున్నాను. జ్ఞానులు మనం జిమ్‌ అనే వ్యక్తిని తీసుకుందాము. అతడు నెమ్మదస్తుడైన ఒక మనిషి. అతడు పరుగెత్తి మరియు అతని భార్యతో చెప్పును. అనెను, “భార్యా, ఏమయిందో నీకు తెలియునా? నేను ఆ నక్షత్రం చూశాను, కనుక నేను వెళ్ళవలెను.” మరియు అతడు ఆవలకు వెళ్ళి మరియు అతడు వెళ్ళుటకు, మూటలు కట్టును.

ఈనాడు ప్రజలతో వచ్చిన సంగతి అదే. ఒక క్రైస్తవునిగా ఉండుటకు, వారు మూటలుకట్టుటకు ప్రయత్నించుచున్నారు. అక్కడ నీకు ఏదైనా అవసరమైన యెడల, ఒక క్రైస్తవునిగ ఉండుటకు, నీవు కట్టబడియున్న మూటలు విప్పవలసియున్నది. ఇప్పుడు కూడా ఎన్నో వస్తువులు వ్రేలాడదీసియున్నాము. “అమ్మా!” చెప్పును, “ఇప్పుడు, అమ్మా, నేను పేకాట ఆడుటకు ఉపయోగించు మేజాబల్లను నా వెంట తీసికొని వెళ్ళే వరకు నేను వెళ్ళి ఉండలేను,” అని నీకు తెలియును గదా. కనుక అతడు అది ఒంటె మీదనుండి వేలాడదీయును, “ఎందుకనగా, నేను నాతో ఆ కార్డు టేబిలు నాతో నేను కలిగి ఉండని యెడల నాతో వెళ్ళుచున్న ఆ మిగతా బాలురు నన్ను కొనియాడరనియు, అది నీకు తెలియును గదా.”

ఇతరమైన ఈ సమస్త పురాతన స్వలమైన సంగతులు నిన్ను పట్టుకొన్నవి. మరియు నీకు స్వార్దము అనే చిన్న పెట్టి ఉన్నది, అది కూడ నీవు వేలాడదీయవలసి ఉన్నది. నీవు చిన్నచిన్న ముచ్చట్లు చిన్న చిన్న చాడీలు, కొంచెం ఇది, అది, వేలాడదీయవలసి ఉన్నది, ఒంటె మీద అది వ్రేలాడదీయవలెను. నీవు తెలిసికొనవలసిన మొదటి సంగతి ఏమనగా, అతడు అక్కడ ఒంటెమీదకు దుమికి, కాళ్ళు అటు ఇటు పెట్టుకొని కూర్చొని ఇలా అనెను, ఇప్పుడు ఇటు రమ్ము! మనము వెళ్ళెదము! ఆ వృద్ధ ఒంటె కదలలేకపోయినది. అది దాదాపుగా, భూమి మీదకు కాళ్ళు వంచునంతగా లొంగిపోయినది.

నీవు ఎల్లప్పుడు నీవు వెళ్ళుచున్న నీ సంఘమును గూర్చి విమర్శించుచూ మరియు పిర్యాదు చేయుచు, మరియు అది (సంఘము) నడిపించ జాలనంతవరకు నీవు అధికమైన భారము పెట్టుకొని ఉండవచ్చును. అసలు సంగతి అదే. నీవు ఆ భారమును దించి, కడిగి, శుభ్రం చేసి సరిగ సిద్ధము చేయు అవసరంగలదు. ఆమెన్‌, నాతో వచ్చిన సంగతి ఏమైయున్నది?

40

గమనించుము. అది ఏమై ఉన్నదో అదే. నేను మిగిలిన వారు వెళ్ళుచూ, కదలి ముందుకు వెళ్ళుట చూడగలను. మరియు నీవు ఎరిగి ఉన్న మొదటి సంగతి అతడు క్రిందకు దిగి, మరియు మరల ఆ నక్షత్రము వైపు చూచెను. కాబట్టి, మొదటి సంగతి ఏమనగా, అతడు మేజాబల్లలు ఒక ప్రక్కకు విసరుట మొదలు పెట్టెను, మరియు మూటలు మరో ప్రక్కకు విసరెను. భార్య అన్నది, “జాన్‌, నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు?”అనెను,

“నన్ను సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును నేను ప్రక్కన పెట్టి ఉన్నాను, అలా, ఓపికతో ఈ పందెములో నేను పరుగెత్తనైయున్నాను. ఎందుకనగా ఆ ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. అక్కడ నీ కొరకు మరియు యేసు కొరకు మాత్రమే స్థలము ఉన్నది. ఇతరులైన ఏ వ్యక్తియు దానిలోనికి వెళ్ళలేడు. ఆమెన్‌.

ఆమె అన్నది.... ఆమె ఇలా చెప్పుట నేను వినగలను, “మంచిది. చూడు, నీవు నీ దిక్సూచి మరిచిపోవుచున్నావు.

“నాకే దిక్సూచి అవసరంలేదు.”

“నీవు నీ వేదాంత విద్యయొక్క డిగ్రీ మరచిపోవుచున్నావు. నీవు నీ కళాశాల విద్యా సంబంధమైన పరిచర్యలు మరియు అలా నీవు వేలాడదీసిన ఈ మిగిలిన సంగతులన్నియు మరిచిపోవుచున్నావు.”

అతడు అనెను, “వినుము నాకు ఏ దిక్సూచి అవసరం లేదు.”

“అప్పుడు, నీవు ఎలా వెళ్ళుచున్నావు?”

అతడు పైకి నక్షత్రం వైపునకు చూపి, అనెను. నేను దేవుడు ఏర్పరచిన మార్గములో వెళ్ళుచున్నాను. దేవున్ని వెంబడించుటకు నాకు ఒక నక్షత్రమును ఏర్చరచెను, అది నన్ను క్రీస్తు దగ్గరకు తీసుకు వెళ్ళును.“

41

మరియు ఏ రాత్రి? మనకు ఏ విధమైన గొప్ప, దీర్ఘకాల శిక్షణా తరగతులు మరియు ఇది అంతా అక్కరలేదు. మనము దేవుడు ఏర్పరచిన మార్గములో వెళ్ళగోరుచున్నాము. మరియు ఈరోజున దేవుడు ఏర్చరచిన మార్గము పరిశుద్ధాత్మ బాప్తిస్మమే, మరియు పరిశుద్ధాత్మ ద్వార నడిపించబడినవారు దేవుని కుమారులై ఉన్నారు. అది నిన్ను నీ గమ్యానికి (చేరవలసిన చోటుకు) తీసికొని వెళ్ళును. భారము ప్రక్కకు పెట్టుము. ఇతరమైన ప్రతీదియు ప్రక్కకు పెట్టుము. అపొస్తులుల దినానికి వెనుకకు వెళ్ళెదము. మన యొక్క పునాది నిశ్చయత కలిగి యున్నది. దేవుడు సూచనలు మరియు అద్భుతాలు ద్వారా మరియు చిత్రములు మరియు ఇతరమైన ప్రతిదాని ద్వారా అది మనకు ఋజువు చేసెను. ఆయన మనతో ఉన్నట్టుగా అలా ఆయన ఋజువు చేసెను.

గత సంవత్సరము ప్రపంచం చుట్టూ, ఈ మహిమకరమైన బలమైన సువార్త ఒక మిలియను ఐదువందలవేల మందిని దేవుని రాజ్యములోనికి నడిపించెను. గత సంవత్సరము మార్చుటలో అక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘమును పెంతెకోస్తు సంఘం చేర్చుటలో విజయవంతమాయెను, ఒక మిలియను ఐదువందల వేలమంది అని రికార్డు చేయబడెను. హల్లెలూయ! సంగతి ఏమైయున్నది? ఈనాడు అక్కడ భూమిమీద అది అత్యంత శక్తివంతమైన సంగతి అయి ఉండెను. అయితే, ఆ దయ్యము వారి మధ్యలోనికి వెళ్ళి మరియు ఈ చిన్న గుంపులుగా వారిని విడగొట్టెను. మరియు ఆ చిన్నగుంపు, మరియు ఈ చిన్నగుంపు ఒకరితో మరొకరు గందరగోళంలో పడునట్లుగా చేసెను.

వారు ఎన్నడైనా వారి స్వార్థము మరియు వారి భేదములను మరచి, మరియు వారి చేతులు కలిపి, వారి హృదయములను కలిపి, ఒక్కరిగా, ఏకమైన యెడల, ఆ వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభమగును. స్నేహితుడా, ఈ రాత్రి మనకు అవసరమైనది ఏమనగా అదే మరియు అందరు కలిసి ఉండుట. బ్రాన్హాం గుడారమునకు అవసరమైనది అదియే. సమస్త సంఘాలకు అవసరమైనది అదియే, యేసుక్రీస్తులో, కొత్తగా జన్మించిన ఒక శిశువుగా, వ్యక్తిగతమైనవానిగ ఒకే సహవాసంలో అందరు కలసి, “విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూస్తూ, ఇరుకైన సంకుచిత మార్గములో నడచుటయే.”

42

ఇలా చూడండి. మన గుడారం కొరకు మరియు దాని సిద్ధాంతముల కొరకు మరియు మొదలైనవి పైకి హెచ్చించుటకు కాదు, అయితే నా ప్రియ స్నేహితులారా నేను ఇది చెప్పుచున్నాను. మీరు కోరిన యెడల ప్రపంచంలో ఏ చోటనైనా వెదకండి, మరియు మనం ఇది ఆడంబరముగా చెప్పుకొనుచున్నాము, దేనిలోను ఆడంబరం కాదు అయితే దేవుని కుమారుడయిన యేసుక్రీస్తులో. అయితే ఈ చిన్న సంఘము కొరకు సర్వశక్తుడయిన దేవుడు ఏమి చేశాడో చూడండి. చుట్టూ తిరిగి మరియు చూడండి, మీరు కోరినయెడల. సరిగ ఇక్కడ ఈ సంఘము నుండి సర్వ ప్రపంచమును ఊడ్చివేసిన ఈ గొప్ప ఉజ్జీవం ప్రారంభమయినది. మరియు అది సరి అయినది. దాని విశదముగా చూసి, మరియు అది అలా లేదా చూడండి.

దేవుడు మనతో ఉన్నాడు, ఆయన ప్రేమలో మరియు కరుణతో, మనం వ్యాధిగ్రస్తులమైనప్పుడు ఆయన ఎలా మనలను స్వస్థపరచెనో చూడండి. కేన్సరు కేసులవైపు చూడండి, మరియు గ్రుడ్డివారు, చెవిటివారు మరియు మూగవారు, మరియు అలా మన మధ్యలో ఉన్నఇతరమైన ప్రతిదియు ప్రతిచోటలో అలా ఆయన స్వస్థపరచెను. అప్పుడు ఆయన సంఘం మీద ఆమోదము తెలుపుటకు, శాస్త్రీయమైన ఒక ఋజువు కొరకు క్రిందికి దిగివచ్చి చాలినంతగా ప్రేమించుచుండెను, తీయబడిన ఆయన చిత్రము మన దగ్గర ఉండెను. ఆమెన్‌.

ఎక్కడ ఉన్న విమర్శకులు, వారు తమ నోళ్ళు మూసుకొనవలసి ఉండి మరియు వెనుకకు అడుగువేసి మరియు అన్నారు, “దాని గూర్చి ఏమియు చెప్పకు.” ఆమెన్.

43

ఈ రాత్రి వారిలో నేను ఒకనిగా ఉండుటకు నేను సంతోషముగా ఉన్నాను! నేను ఒక క్రైస్తవునిగ ఉండుటకు సంతోషముగా ఉన్నాను. ఇక్కడ ఈ గొప్ప కదలికలో నమ్మిక కలిగిన ప్రజల మధ్య అలా నేను నివసించుచు నేను సంతోషముగ ఉన్నాను. అక్కడ చిన్న భేదములు ఉండి ఉండవచ్చునని నేను ఉద్దేశించుచున్నాను. మనం అందరం ఒక్కటే. అది సరియైనదే. మనందరం ఒక్కటే. యేసుక్రీస్తులో, ఒకే విభాగముగ అందరం కలసి మనం నిలబడెదము. దేవుడు మనలను దీవించెను మరియు ఈ అద్భుతకరమైన సంగతులన్నియు మనకు అనుగ్రహించెను.

కేవలం ఆలోచించండి, ఏ విధముగ నేను-ఈ రాత్రి, అది ప్రభువు కొరకు అయిఉండని యెడల, ఇక్కడ నాయంత నేను ఉండి ఉండేవాడను కాను, అత్యుత్తమమైన వైద్యులు అన్నారు నేను అది అలా అయి ఉండలేనని. అయితే ప్రధాన వైద్యుడు కిందకు దిగివచ్చి మరియు అనెను, “అదంతా నా చేతులలో ఉన్నది, మరియు నీవు అది చేయగలవు” నేను ఆయనను నమ్మాను.

అక్కడ సహోదరి వీవర్‌ ఏ విధంగా కూర్చున్నది? ఆ చక్రాల కుర్చీలో, ఒక అస్తి పంజరమువలె కూర్చుని ఉన్నది, యేసుక్రీస్తు నామంలో ఇక్కడ బాప్తిస్మం పొందుటకు వారు చక్రాల కుర్చీలో ఉంచారు; వైద్యుడు ఆమె ఉదయం వరకే, జీవించునని వదలి వేసెను, ఏడు, లేదా ఎనిమిది సంవత్సరాల క్రితం నుండి ఒక కేన్సరు ఆమెను తినివేయుచుండెను. ఈ రాత్రి ఆమె ఇక్కడ మనతో ఉన్నది. ఇంకా ఎంతమందిని నేను పిలువగలను, అలా ఇక్కడ ఈ ద్వారముల గుండా లోపలికి నడచి వచ్చి, బయటకు వెళ్ళినవారు, అలా ఇక్కడకు లోపలకు వచ్చినవారు అంగవైకల్యము కలిగినవారు మరియు బాధపరచబడిన వారు మరియు రోగులయినవారు, మరియు కుంటి మరియు చొట్ట, గ్రుడ్డివారు మరియు ఇతరమైన ప్రతీదియు స్వస్థపరబడెను; ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఒక పునరుత్థాన సాక్షిగ కేవలం ఇక్కడ ఈ ఒక్కటైన చిన్న ద్వారము ఉన్నది!

44

మనము ఏమయి ఉండగలము? ఈ బ్రాన్హాం గుడారము ఏమయి ఉoడగలదు? అది ప్రపంచంయొక్క అంధకార స్థలములలో ఒకటైన, జెఫర్‌సన్‌ విల్లాలో అక్కడ స్థిరపడి ఒక దీపస్తంభం అయి ఉన్నది. అక్కడ ఎన్నడైనా సువార్త అవసరమై ఉన్న ఒక స్థలము ఉండినయెడల అది జెఫర్‌సన్‌ విల్లాయే! అది సరియైనది. “అయితే నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా?” అనెను.

“వచ్చి మరియు చూడుము” అది సరియైనది. ఆ చీకటి మరకలు! మనకు పగటి సమయంలో లైట్లు అవసరంలేదు. అది ఎప్పుడు చీకటిగ ఉన్నదో మనకు అవసరము. అలా దేవుడు వెలుగు పంపించునది అంధకార స్థలములలోనికి అయిఉన్నది. అది చాలా కష్టము... ఎక్కడ ప్రతిదియు సక్రమముగ జరుగుచున్నదో అక్కడకు వెళ్ళుట తేలిక. అయితే ఎక్కడ అంధకార స్థలములు ఉన్నవో, అక్కడ అది కష్టముగా జరుగుచుండెను. కరుకైన స్థలములు! .....“తేలికగా నుండు పుష్ఫపానుపుపై నేను తప్పక పరలోక గృహమునకు కొనిపోబడును. ఇతరులు బహుమానం పొందుటకు పోరాడుచు మరియు రక్తముతో కూడిన సముద్రము గుండా పయనించితిరి గదా?”

45

సరిగ ఇక్కడే ప్రజలు జుట్టు పీకుకొనుచు మరియు భేదములతో మరియు ఆ విధమైన సంగతులతో; ఒక వంద మరియు నలభై వేల మంది అన్యజనులు ప్రతిరోజు చనిపోయి మరియు యేసును కలసికొనుటకు వెళ్ళుచున్నారు, లేక ఒక నీతిమంతుడు మరియు నిజాయితీపరుడైన దేవుని, ఆయన గూర్చి ఏమియు ఎరుగకయే, కలసికొనుటకు వెళ్ళుచున్నారు. ఒక వంద మరియు నలభైనాలుగు వేలమంది ప్రతిరోజు చనిపోవుచున్నారు. యేసుక్రీస్తు పేరును అలా ఎన్నడూ వినని, ప్రతి దినము చనిపోవుచున్న అన్యజనుల మరణ సంఖ్య, మరియు మనము ప్రెస్పిటేరియనులమా లేక మెథడిస్తులమా లేక కాదా అని వాదించుకొనుచున్నాము. ఎలాంటి ఒక నిర్దయ! ఎలాంటి ఒక అవమానము!

మనకు అవసరమైనది ఏదనగా దర్శనము. ఇక్కడ నీ ముక్కు యొక్క అంతము నొద్ద సరిగ కిందకు చూచుట కాదు. అక్కడ మార్గము యొక్క అంతము నొద్ద సరిగా క్రిందకు చూచుట కాదు. నేను ఈరోజును గూర్చి ఆలోచించిన యెడల, ఇది, అది, లేక మరొకటి, నేను ఆ రోజు కొరకు జీవిస్తాను. అయితే నేను నిత్యత్వము కొరకు జీవించుచున్నాను, బయట దూరాన ఏదో దానికొరకు, అలా దేవుడు నియమించిన ఏదో మరియు నేను ఏదో రోజున తప్పక వెళ్ళి దానిని కలుస్తాను.

నేను చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను; ఒక పది నిమిషములు.

(టేపుపై ఖళీ ఉన్నది-సంపా) .... దేవుని కృపద్వారా మరియు దేవుని సహాయముద్వారా. అక్కడ రెండు సంవత్సరాలు అలా ఏదో ఒక సంగతి కొరకు ఆయనను పదేపదే అడిగాను, నేను ఏదోదాని కొరకు, 15 సంవత్సరాలు నేను ఆయనను అడిగాను, మరియు తుదకు ఆయన అది నాకు ఇచ్చెను. అలా నేను అడిగిన ఈ సంగతి కొరకు, చూడండి, ఆయన ఈ సంవత్సరం అది నాకు ఇవ్వనియెడల, నేను వచ్చే సంవత్సరం జీవించి ఉండిన యెడల, మరియు నేను ఆయన తలుపు దగ్గరకు వెళ్ళి తట్టుచూ ఉండగలను అది ఆయన మహిమ కొరకు, దూరాన ఆయన కొరకు ఏదో నేను చేసి ఉందును. ఆయన కేవలం ఇది నాకు అనుమతించిన యెడల, అప్పుడు నేను బయటదూరం వెళ్ళగలను మరియు, ఇంకొంచెం కష్టముగ, ఆ మార్గంలో ఇంకా కొంచెం బలముగా ఆయన కొరకు ఆత్మలను గెలుచుదును. మరియు ఆయన అది చేయునని అలా నేను ప్రార్ధించుదును. ఆయనకు అది నా ప్రార్ధన అయిఉన్నది.

46

మరియు మీకు నా సాక్ష్యము, ఆ విధముగా, కేవలం నా కొరకు మీరు ప్రార్ధించి మరియు ప్రార్ధనలో, ఆయన ఎదుట పడిపోకుండ పట్టుదలతో ప్రార్ధించిన యెడల, అప్పుడే నేను ముందుకు సాగగలను. ఏమి జరిగినప్పటికి ఏమియు కాదు, నన్ను నమ్ముటకు ఎవరో ఒకరు నాకుండని యెడల, నేను ఏలాగు ఒక పని చేయగలను? దానిని గూర్చి నేను ఎంత ఎక్కువగా నమ్మానో మీరును అంత ఎక్కువగా నమ్మారు లేదా ఇతరులైన ఏ వ్యక్తి అయిననూ అంత ఎక్కువగా నమ్మారు. దాని గూర్చి మీరు ఎంతో ఎక్కువగా నమ్మారు. మనం ఏమి చేసినను ఏమియు కాదు, మనం ఏమి చెప్పుదుమో, మనం అదే బోధించిన యెడల, అక్కడ అది నమ్ముటకు ఏ ఒక్కరూ లేనియెడల, అప్పుడు అక్కడ ఏమియు చేయబడదు. అది సరియైనది. మనం అంతా కలసి వచ్చి, మరియు మనం ఒకరినొకరు నమ్మితేనే తప్ప అక్కడ ఏమియు చేయబడదు, అది అంతా ఒక అపజయమే. నేను మీయందు నమ్మిక ఉంచాను మరియు మీరు నాయందు నమ్మిక ఉంచారు. మరియు అందరూ కలసి మనం దేవునియందు నమ్మిక ఉంచాము, మరియు మనం అలా ఆయన ఆత్మ మనలను నడిపించునని నమ్ముదుము.

47

ఇప్పుడు, సహోదరుడు ఫంక్‌, నీవు పైకి వచ్చుచున్నావా? నీవు ఇప్పుడు ఆ బిడ్డను పట్టుకొనుచున్నావు; అది నీకు మినహాయింపు. సహోదరుడు ఉడ్స్‌, అప్పుడు ఆ తరువాత నీవు అని నేను నేను అనుకొనుచున్నాను. (సహోదరుడు ఉడ్‌ అన్నాడు, సహోదరుడు జాక్స్‌న్‌ అని-సంపా) అంతా సరియైనది, మరియు అతడు సహోదరుడు జాక్సన్‌ను దత్తత చేసికొనెను. కనుక సహోదరుడు జాక్సన్‌ తరువాత అని నేను అనుకొనుచున్నాను. అలా ఆ తరువాత వచ్చు, మన సహోదరుడు జాక్సన్‌ను ప్రభువు దీవించును.

ప్రభువు మిమ్మును దీవించును. నీవు ప్రభువును ప్రేమించుచున్నావా? నేను మీ చేతులు చూడవలెనని కోరుచున్నాను. మీరు ఆ ప్రభువును ప్రేమించుచున్నారా? (సమాజం “ఆమెన్‌” అని చెప్పుచున్నారు-సంపా). అంతా సరియైనదిగా ఉన్నది.

48

సహోదరి గెర్టీ, ఒక నిమిషం ఇక్కడకు రమ్ము. నాతో కలసి ఒక పాట నీవు పాడవలెనని నేను నిన్ను కోరుచున్నాను. ఇతరులైన ప్రతి ఒక్కరు పాడుచున్నారు. నేనూ ప్రయత్నించబోవుచున్నాను, కారణం నాకు ఎంతో జలుబు చేసింది, మరియు నేను .... నా తల, ఏదోలా ఉంది, అయితే ఈ విధమైన మంచి పాతకాలపు పాటను పాడుచు నాకు సహాయం చేయవలెనని నేను మిమ్మును కోరుచున్నాను. ఏదో విధముగ .... ఆ రాగమును అందించండి. అది ఏమైయున్నదో నేనెరుగను. అయితే అది ఏమైయున్నది నేనెరుగను. ఏదో రకమైన సూచన నాకు ఇవ్వండి, కారణం ఏమనగా “రక్తములో ముంచబడిన,” అను పాటను మీ అందరితోను కలసి నేను పాడగోరుచున్నాను. ఎందుకనగా, నేను బోధించు ఈ సువార్త, అది రక్తములో ముంచబడియున్నది. మీరు అది నమ్ముట లేదా? (ఆ సమాజము “ఆమెన్‌” అని చెప్పుచున్నారు- సంపా) అంతా సరియైనదిగా ఉంది, ఇప్పుడు కలసి, ప్రతి వ్యక్తి.

ఈ పరిశుద్ధాత్మ పథకము కొరకు చనిపోయిన మొదటి ఆయన,

బాప్తిస్మమిచ్చు యోహాను అయి ఉండెను, అయితే ఆయన ఒక మనిషివలె చనిపోయెను;

అప్పుడు ప్రభువైన యేసు వచ్చెను, వారు ఆయనను సిలువ వేసిరి,

అలా ఆత్మ పాపము నుండి మనుష్యులను రక్షించునని ఆయన బోధించెను.

రక్తములో ముంచబడుచున్నది, అవును అది రక్తములో ముంచబడియున్నది,

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తములో ముంచబడియున్నది,

సత్యము కొరకు చనిపోయిన శిష్యులయొక్క రక్తము,

ఈ పరిశుద్ధాత్మ సువార్త, అది రక్తములో ముంచబడియున్నది.

అయితే అప్పుడు వారు స్తెఫనును రాళ్ళతో కొట్టెను, అతడు పాపానికి వ్యతిరేకముగా బోధించెను.

అతడు వారికి అలా కోపం కలిగించిన వాడాయెను, వారు అతని తలను బలముగా మొత్తిరి.

అయితే అతడు ఆత్మలో చనిపోయెను మరియు అతని ఆత్మను అప్పగించెను.

మరియు అలా జీవమునిచ్చు ఆత్మ నొద్దకు, మిగిలిన వారితో ఐక్యమగుటకు వెళ్ళెను.

రక్తముతో ముంచబడియున్నది, అవును, అది రక్తముతో ముంచబడియున్నది,

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో ముంచబడియున్నది,

సత్యము కొరకు చనిపోయినశిష్యుల యొక్క రక్తము, ఈ పరిశుద్ధాత్మసువార్త—-.

ఓహ్‌, అక్కడ పేతురు మరియు పౌలు, మరియు దైవజనుడు యోహాను,

కనుక ఈ సువార్త ప్రకాశించునట్లు వారు తమ జీవితములు ఇచ్చిరి;

పాత నిబంధన ప్రవక్తల వలె, వారు తమ రక్తమును ఒలికించిరి.

కనుక దేవుని నిజవాక్యము నిజాయితీగ ఉండునట్లుగా చెప్పబడెను.

రక్తముతో కారుచున్నది, అవును, అది రక్తముచే ముంచబడియున్నది,

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో ముంచబడియున్నది, సత్యము కొరకు చనిపోయిన శిష్యుల రక్తము,

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తము రక్తములో ముంచబడియున్నది.

ఇప్పుడు ఇది వినండి.

అక్కడ బలిపీఠము క్రింద ఆత్మలు “ఎంతకాలం?” అని మొర్రపెట్టుచుండెను.

ప్రభువు తప్పు చేసినవారని శిక్షించుట కొరకు;

అయితే అక్కడ ఎవరు వారి జీవితము యొక్క రక్తం ఒలికించి వారు ఇంకా ఎక్కువగా ఉండును.

ఈ పరిశుద్ధాత్మ సువార్త కొరకు మరియు అది రక్తవర్ణమయిన ప్రవాహము.

ఇప్పుడు నిలబడుదము. అది రక్తముచే కారుచున్నది, అవును,

అది రక్తముచే కారుచున్నది,

ఈ పరిశుద్ధాత్మ సువార్త, అది రక్తముతో కారుచున్నది,

సత్యము కొరకుచనిపోయిన శిష్యుల రక్తము,

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో కారుచున్నది.

49

వారిలో నీవు ఒకనిగా ఉండుటకు నీవు సంతోషించుటలేదా?

(సమాజము “ఆమెన్‌” అని చెప్పును-సంపా) ఏ రకమైన సువార్త? వారికి

ఇవ్వబడిన అదే సువార్త, అవే సూచనలు, వెంబడించుచున్న అవే ఆశ్చర్య

కార్యములు, అదే అగ్నిస్థ౦భము, ఆ ప్రభువైన యేసే, రోగులయొక్క అదే

స్వస్థత, అదే విధమైన ఆత్మీయ శక్తి, ప్రతీదియు సరిగా కదలుచు ముందుకు

సాగుచున్నది. అదే విధమైన హింసయు వచ్చుచున్నది.

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తము బొట్లు బొట్లుగా పడుచున్నది.

ఇప్పుడు మనం అందరం కలిసి.

అది బొట్లు బొట్లుగా పడుచున్నది..............................

చుట్టూ తిరిగి మరియు ఎవరితోనో కరచాలనం చేసి, మరియు చెప్పుము,

“ప్రభువుకు స్తోత్రము!” హల్లెలూయ!

.................రక్తము బొట్లుబొట్లుగా పడుచున్నది,,

ఓహ్‌, సత్యము కొరకు చనిపోయిన శిష్యుల రక్తము,

ఈ పరిశుద్ధాత్మ సువార్తరక్తముతో తడిసియున్నది.

ఓహ్‌, నేను యేసును ఎంతగానో ప్రేమించెదను,

ఓహ్‌, నేను యేసును ఎంతగానో ప్రేమించెదను,

ఓహ్‌, నేను యేసును ఎంతగానో ్రేమించెదను,

ఎందుకనగా ఆయనే మొదట నన్నుప్రేమించెను,

ఇప్పుడు అది గట్టిగా పాడుదుము. మీ చేతులుపైకి ఎత్తండి.

ఓహ్‌, నేను యేసును ఎంతగానో ప్రేమించెదను,

ఓహ్‌, నేను యేసును ఎంతగానో ప్రేమించెదను,

ఓహ్‌, నేను యేసును ఎంతగానో ప్రేమించెదను,

ఎందుకనగా ఆయనే మొదట నన్నుప్రేమించెను,

50

మా పరలోకపు తండ్రీ, ఆయన శక్తి కొరకు, ఆయన ప్రేమ కొరకు,

ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తుకు మేము వందనములు చెల్లించుచున్నాము. మరియు మేము నివసించుచున్నఈ ఘనమైన, ఉదాత్తమైన దినాన తెలిసికొనుటకు, అది, పాతనిబంధన ప్రవక్తలు ఈ దినమును చూచి మరియు దానికి సంబందించిన ఆజ్ఞలు ఇచ్చినవారై, అది ఈ విధముగా ఉండునని చెప్పెను “మనుష్యులు మూర్కులు, గర్వాంధులు, దేవుని కంటెను సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు; పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై ఉందురు.” ఆయన చెప్పెను, “అంత్యదినాలలో అపహాసకులు వచ్చి, మరియు ఎగతాళి చేసి పరిహాసము చేయుదురు.” మరియు తండ్రీ, మేము దానిలోనే నివసించుచున్నాము.“ఆ రోజున, వాహనములు, రాజమార్గములలో తొందరగ

పోవుచున్నవి. అవి మెరుపువలె పరుగెత్తును. అవి దివిటీలు వలె కనబడుచున్నవి.“ ఈ సమస్తమైన వాటిలో, గొప్ప ప్రవచనము, నెరవేరుచున్నది!

యేసు చెప్పినట్లుగా, “ఉవ్వెత్తున లేచుచున్న సముద్ర తరంగాలు తీరములను తాకుచు, సముద్రం యొక్క ఒడ్డుల పైకి కొట్టి మరియు క్రిందికి పోవుచుండెను. అలా ఎగురుచున్న పళ్ళెములు మరియు అలాoటి సంగతులు, గొప్ప సూచనలు మరియు అద్భుతకార్యములు ఆకాశములో పైన కనబడును.

ఈ సూచనలు మూలముగా, ప్రపంచం భయపడి మరియు కంపించును. అక్కడక్కడ భూకంపాలకు, మరియు పలు విధాలైన సంగతులు జరుగుటకు కారణమగును; మరియు కలవర పెట్టు కాలములు మరియు దేశముల మధ్య వేదనలు కలుగును. మరియు ఆయన చెప్పెను, “ఆ రోజున, ఇశ్రాయేలు పుష్పించును.” హల్లెలూయ! ఆ పురాతన దావీదు ఆరు చారల నక్షత్రము, ఈరాత్రి, 2500 నంవత్సరాల నుండి మొదటిసారి యెరూవషలేముపై అంతటా రెపరెపలాడుచున్నది. దేశములు బ్రద్దలగుచున్నవి. అంజూరపు చెట్టు చిగురించుచున్నది! మిగిలిన చెట్లన్నియు చిగురించుచున్నవి. దుష్టులు చిగురించుచున్నారు. రోమీయులు చిగురించుచున్నారు. కమ్యూనిస్టులు చిగురించుచున్నారు. మరియు మీ సంఘమూ చిగురించుచున్నది. వసంతకాలము వచ్చుచున్నది. ఓ, గొవ్పవాడవు అయిన జీవాధిపతీ, వ్రభువా, నీ రెక్కలయందున్న స్వస్థతతో పైకి లెమ్ము. నీ పరిశుద్ధ బిడ్డ అయిన యేసు చేయిచాచి, సమస్త శక్తులు మరియు సూచనలు నీ సేవకులకు ఇవ్వండి. మరియు భూదిగంతముల వరకు సువార్త ప్రకటించుటకు మరియు అద్భుతములు చేసి మరియు సూచనలు కనబరచునట్లు చేయండి. ప్రభువా,

అది అనుగ్రహము చూపండి.

51

ఈ చిన్న సంఘమును ఆశీర్వదించండి. ప్రభువా, మేము ప్రేమించు సహోదరుడైన దానియొక్క కాపరిని దీవించండి. ఇక్కడ మాతో అలా సహకరించు అందరిని దీవించండి. ప్రపంచము చుట్టు ప్రతిచోట, మీ నామమున పిలుచు అందరిని దీవించండి. ఈ రానున్న సంవత్సరమునకు, సహాయం చెయ్యండి, ప్రభువా, నీ సేవకొరకు శ్రేష్టముగ ఉండునట్లు మాకు సహాయం చెయ్యండి. మా మధ్య వ్యాధి లేకుండా చేయండి. మరియు పరిశుద్ధాత్మతో మమ్మును అభిషేకించండి. ఓర్చలేని తనమును. జగడమును, అసూయపడుటను, ఆ విధముగా భక్తిహీనముగా ఉన్న ప్రతి సంగతియు మానుండి తొలగించుము. మరియు అలా మేము మీ పిల్లలమని, మా గూర్చి అలా చెప్పబడునట్లుగా చేయండి, “కొండమీద ఉండు ఒక పట్టణము మరుగై ఉండనేరదు” తండ్రీ, అది అనుగ్రహించండి.

మమ్మును దీవించండి మరియు మేము చేసిన గతించిన సంగతులను గూర్చి మమ్మును క్షమించండి. మరియు మేము పౌలువలె ఇలా చెప్పుదుము, “వెనుక ఉన్నవాటిని మరచి, ముందున్న వాటికొరకు వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను.”ప్రభువైన దేవా, మీకిష్టమైన చోటకు నన్ను పంపండి. నేను వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాను, ఏ సమయంలో అయినా మీరు ఆజ్ఞ ఇవ్వండి. నేను మరల అనుచున్నాను, మమ్మును క్షమించండి. మరియు నీ నామమునకే మహిమ ఘనత కలుగునట్లుగా ఈ సంఘమును మరియు అక్కడ లోపల ప్రజలను శుద్ధీకరించండి. ఎందుకనగా మేము అది యేసునామములో

అడుగుచున్నాము. ఆమెన్‌.

52

ఇప్పుడు మీరు కూర్చొనవచ్చును. ప్రభువు మిమ్మును దీవించును.

మంచిది, ఇప్పుడు, అక్కడ ఆకాశంలో ఒక నమావేశము జరగనైయున్నది,

అతి ప్రియాతి ప్రియమైన వారందరితో;

నేను మిమ్మును కలుసుకొననై ఉన్నాను, అక్కడ అవతల మిమ్మును కలుసుకొందును.

ఆకాశమునకు అవతల ఆ గృహములో;

నీవు వినుచున్న అలా౦టి సంగీతము,

మర్త్యమైన చెవిద్వార ఎన్నడూ వినలేదు,

“అది మహిమకరముగా ఉండును, నేను బాహాటంగా ప్రకటించుదును!

ఎందుకనగా దేవుని సొంతకుమారుడు, ఒక్కరే నడిపించును

ఆకాశములో ఆ సమావేశం యొద్ద.

ఓహ్‌, అక్కడ ఆకాశములో ఒక సమావేశం జరుగనైఉన్నది,

అతి ప్రియాతి ప్రియమైన వారందరితో;

నేను మిమ్మును కలుసుకొననై ఉన్నాను, అక్కడ ఆవల మిమ్మును కలుసుకొందును.

ఆకాశమునకు అవతల గృహములో,

నీవు వినుచున్న అలాటి సంగీతము,

మర్యమైన చెవిద్వార ఎన్నడూ వినలేదు,

అది మహిమకరముగ ఉండును, అని నేను బాహాటముగా ప్రకటించుదును! ఏలయనగా దేవుని సొంత కుమారుడు, నడిపించు నాయకునిగా ఉండును.

ఆకాశములో ఆ సమావేశమునొద్ద

బలురక్కసి చెట్లలో చిన్నమోషేను గూర్చి నీవు వినియున్నావు,

భయంలేని దావీదు మరియు వడిసెలగూర్చి నీవు విని ఉన్నావు;

యోసేపు కలకనుటను గూర్చిచెప్పబడిన కథ నీవు విని ఉన్నావు,

మరియు దానియేలు మరియు ఆ సింహాలు గూర్చి మీరు తరచుగా పాడుదురు.

ఓహ్‌, అక్కడ చాలా మంది, బైబిలులో మిగిలిన అనేకులు,

మరియు నేను వారందరిని కలుసుకొనుటకు

ఆరాట పడుచున్నాను, నేను బాహాటముగ ప్రకటించెదను!

అతి త్వరలో ఆ ప్రభువు వారిని మనం కలుసుకొనునట్లు చేయును

ఆకాశములో ఆ సమావేశమునొద్ద.

అక్కడ ఆకాశంలో ఒక సమావేశము జరగనైయున్నది,

ప్రియమైన, అతి ప్రియాతి ప్రియమైన వారితో;

మేము మిమ్మును కలుసుకొననైయున్నాము, ఆవల అక్కడ మిమ్మును అభినందించ గోరుచున్నాము

ఆకాశమునకు ఆవల ఆ గృహములో;

నీవు వినుచున్న అలాoటి సంగీతము,

మర్యమైన చెవిద్వార ఎన్నడూ వినలేదు,

అది మహిమ కరముగ ఉండును, అని నేను బాహాటముగా ప్రకటింతును!

దేవుని సొంత కుమారుడు నడిపించు నాయకుడుగా ఉండును

ఆకాశములో ఆ సమావేశమునొద్ద.

53

మీరు దానిని ప్రేమించుటలేదా? (సమాజము “ఆమెన్‌” అని చెప్పును-సంపా). ఆహా! అక్కడ సమస్తంకంటె ఉన్నతముగ ఉన్న ఒకని నేను కలుసుకొనగోరుచున్నాను, అది యేసు. మీరు అలా చేయరా? (“ఆమెన్‌”)

కేవలం నిన్ను అలా శుబ్రముగ చేయును, పవిత్రముగ చేయును,

ఆనందించు భావన కలిగించును. కేవలం మీరు అలా ఆ విధమైన భావన పొందలేదా? నీవు పూర్తిగా పరిశుభ్రము చేయబడి ఉండిన విధముగ. కేవలం

ఆయనను ప్రేమించుము?

............ ఆకాశములో ఒక సమావేశము,

ప్రియముగ, ప్రియాతి ప్రియముగా;

మిమ్మును కలుసుకొనుటకువెళ్ళుచు, మరియు అక్కడ అవతల

మిమ్మును అభినందించగోరుచున్నాము,

అవతల ఉన్న ఆ గృహములో

ఓహ్‌, వినగల మర్త్య చెవిద్వార ఎన్నడూ వినలేదు,

అది మహిమకరముగ ఉండును, నేను బాహాటముగా ప్రకటించెదను!

మరియు దేవుని సొంతకుమారుడే నడిపించగల నాయకుడై ఉండును

ఆకాశంలో ఆ సమావేశమునొద్ద.

అది నీవు ప్రేమించుటలేదా? (సమాజము “ఆమెన్‌” అని చెప్పుచున్నారు-సంపా).

ఓహ్‌, మై! బలురక్కసి చెట్లలో చిన్నమోషేను గూర్చి నీవు వినియున్నావు,

భయము లేని దావీదు మరియు వడిసెలగూర్చి నీవు విని ఉన్నావు;

యోసేపు కల కనుటను గూర్చిచెప్పబడిన కథ నీవు విని ఉన్నావు,

మరియు దానియేలు మరియు ఆ సింహాలను గూర్చి మీరు తరచుగా పాడుదురు.

ఓహ్‌, అక్కడ చాలమంది, బైబిలులో మిగిలిన అనేకులు,

మరియు నేను వారందరిని కలుసుకొనుటకు ఆరాట పడుచున్నాను,

నేను బాహాటముగ ప్రకటించెదను!

అతి త్వరలో ఆ ప్రభువువారిని మనం కలసికొనునట్లు చేయును

...ఆకాశములో ఆ సమావేశమునొద్ద.

మరియు, ఓహ్‌, మంచిది, అక్కడ ఆకాశంలో ఒక సమావేశం జరగనైఉన్నది.

ప్రియముగ, ప్రియాతి ప్రియముగ

మిమ్మును కలసికొనుటకు వెళ్ళుచు, అక్కడ ఆవల మిమ్మును అభినందించ గోరుచున్నాము

...ఆకాశంలో ఆవలనున్న ఆ గృహములో;

అలాటి సంగీతము ఎన్నడూ వినలేదు,

మర్యమైన చెవిద్వారా ఎన్నడూ వినలేదు,

అది మహిమకరముగ ఉండును, అని నేను బాహాటముగా

ప్రకటింతును! మరియు దేవుని సొంత కుమారుడు నడిపించు నాయకునిగా ఉ౦డును

ఆకాశములో ఆ సమావేశమునొద్ద.

54

మై! నేను అక్కడే ఉండగోరుచున్నాను. మీరు ఉండగోరుటలేదా?

(సమాజము “ఆమెన్‌” అని చెప్పుచున్నారు-సంపా) ఎంతమంది ఇలా చెప్పుదురు, “దేవుని కృపద్వార నేను అక్కడే ఉండగోరుచున్నాను. మీ యొక్క కృపద్వారనే”? (“ఆమెన్‌”) ప్రభువునకు స్తోత్రము. నెవెల్లీ సహోదరుడా, అంతా సరియైనదిగా ఉన్నది. మీ అందరికి, సంతోషకరమైన నూతన సంవత్సరము, దేవుడు

మిమ్మును దీవించును!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...