విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది
VGR COUNT- 22O మనము తలలను వంచుదాము.
మా పరలోకపు తండ్రి, ఇచ్చటకు వచ్చి నీ ప్రియ కుమారుడగు ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుటకు ఇచ్చిన అద్భుతమైన ఈ భాగ్యము కొరకు మేము నీకు కృతజ్ఞతలను తెలుపుచున్నాము. నశించిపోయిన దరిద్రులము, పాపులమగు మా స్థానమును మీరు తీసుకొని, మా పాపముల కొరకు శిక్షను అనుభవించి, మా వ్యాధులను మీరు భరించి మరియు వాటిని మా నుండి పారద్రోలుటకు మీ కుమారుని ఈ భూమికి పంపించవలెనని మమ్మల్ని గూర్చి ఎల్లప్పుడు తలంచినందుకు మేము మీకు కృతజ్ఞతలను తెలుపుచున్నాము. మాకు చాలినంత సంపూర్ణమైన బలియర్పణ ఫలములను ఈ రాత్రి మేము ఆనందముతో అనుభవించుచున్నందుకు మీకు మేమెంతో కృతజ్ఞతలు తెలుపుచున్నాము.
2
ఇప్పుడు, ప్రభువా, ఈ రాత్రి ప్రజల హృదయములలో విశిష్టమైన రీతిలో సంచరించుము. మిమ్మల్ని విశ్వాసించువారి కొరకు కాదు గాని అవిశ్వాసులు మిమ్మల్ని విశ్వసించునట్లుగా వారికొరకు ఏదోక కార్యమును చేయుమని మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఎమ్మాయి నుండి మీరు ఆ శిష్యులతో మాట్లాడినప్పుడు వారేవిధముగా చెప్పితిరో అదే విధముగా, “మన హృదయములు మనలో మండుచుండలేదని?” మేము కూడా చెప్పుదుము గాక! ఈ రాత్రి కూటమున మీరు మా కొరకు ఏదోక విశిష్టమైన కార్యములు చేయుము. యేసు నామమున మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.
ఇచ్చట మరలా ఈ ప్రసంగ వేదిక నుండి ఇచ్చట కూడియున్న ప్రియమైన జనులయొద్ద మాట్లాడుట వాస్తవముగా ఎంతో భాగ్యమైయున్నది. మనమిట్లు ఏకముగా కూడి వచ్చుటవలన నిశ్చయముగా మనము ఆశీర్వదించబడెదము.
నేను వచ్చుచుండగా నన్ను లోపలికి తీసుకొని వచ్చుటకు కొద్ది నిమిషముల ముందు నేను సేవకులు ధ్యానించే గదిలోకి ప్రవేశించితిని. “ఆయన యొక్క మహిమనుండి” అనే పాటను నా ప్రియమైన సహోదరుడు ఎక్బర్గ్ పాడుటను నేను విన్నాను. నాకు అదెంతో ఇష్టమైన పాట. కావున ఆ సహోదరుడిచ్చట వున్నాడని నేనెరిగితిని. మేమెన్నోసార్లు మంచి సమయములను గడిపితిమి, ఎక్బర్గ్ సహోదరుడు చూచుటకు ఎంతో ఆరోగ్యముగా ఉంటూ, చక్కగా ఉన్నందుకు నేనెంతో సంతోషించుచున్నాను. అతనిని దేవుడు దీవించునుగాక.
3
ఇపుడు మనము ఎక్కువ సమయమును తీసుకోకుండా, ప్రతీ రాత్రి ఎంత త్వరగా వాక్యము యొద్దకు వెళ్ళగలనో అంత త్వరగా వెళ్ళునట్లు నేను ప్రయత్నిస్తాను; ఎందుకనగా ఇచ్చటున్న జనులగు మీతో ఈ చికాగోలో ఎన్ని దినములు మేము ఉంటామో తెలియదు. అవి కొన్ని దినములేనని మేము నమ్ముచున్నాము. నిన్నటి రాత్రి కూటమున ప్రకటించిన ప్రకారముగా మేము త్వరగా వెళ్ళాలని కోరుకొనుట లేదు. ఉద్రేకపడవద్దు, నిరీక్షణ కలిగి అలాగే ఉండండి. దేవునికి ఒక అవకాశమును ఇవ్వండి. మీ సమయమును ఆయనకొరకు సమర్పించుకోండి.
అటు పిమ్మట, మేమెంతవరకు ఉండవలెనో అంతవరకు ఉండుటకు కోరుకొను ... లేదా, ఏదైన ఒక కార్యముకొరకు మీకు ప్రార్ధించి ఆ తర్వాత ఆ కార్యము మీకు సంభవించినయెడల, జరిగిన ఆ కార్యములన్ని ఏమిటని ఇచ్చట మనము ఉండి వాటిని చూడగోరుచున్నాము. కొన్నిసార్లు జనులలో విశ్వాసము కొదువైన, లేదా నమ్మలేకుండునట్లు ఏదోక కార్యము ఉన్నను, లేదా అవిశ్వాసుల మధ్య చిక్కుబడియున్నను, లేదా తప్పుడు సహవాసమును కలిగియున్నను, లేదా అటువంటి వేరేదైనా కార్యములు, లేదా వేరేదైనా సంభవింప వచ్చును, లేదా సాతాను దానిని ఆటంకపరచు కార్యముగా ఉండును. ఆ సమయమున ఆయన మనకు నమ్మదగిన వానిగా ఉండును. కాబట్టి అది విశ్వాసము యొక్క క్రియయైయున్నది. కావున ఈ సమయమునకు తగిన వాక్యమును మాట్లాడుటకు దేవుడు మనకు సహాయమును చేయునట్లుగా ఆయనయొద్ద మనము ప్రార్థించెదము.
4
మరిప్పుడు, ఇచ్చటున్న మన ప్రియమైన సంఘ కాపరి, సహోదరుడు జోసఫ్, వచ్చే ఆదివారము మరియు దాని తరువాత ఆదివారము కూడా ఆ పాఠశాలయందు జరుగు కూటమునకు మనము వెళ్ళుచున్నామని చెప్పెను. అందుకొరకు మేము సంతోషించుచున్నాము. అచ్చట ఆయన మహిమ కొరకు తన రాజ్యము యొక్క శ్రేష్టమైన కార్యములను ప్రభువు మనకు ఆశీర్వదించి అనుగ్రహించును గాక.
ఇప్పుడు, పరి. యోహాను 15వ అధ్యాయము 7వ వచనము. ఈ లేఖనములను చదువవలెనని నేను కోరుచున్నాను.
నాయందు మీరును, మీయందు నా మాటలను నిలిచియుండినయెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
మరియు పరి. యోహాను 14:12, దీనిని కూడా మనము చదువుదాము.
నేను నా తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
5
ఈ రాత్రియందు ఒక చిన్న అంశమును నేను తీసుకోవాలనుకుంటున్నాను. “విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది.” ఇటువంటి కూటములకు రావాలంటే ఎక్కువ ప్రార్థన అవసరమైయున్నది. అంతేకాకుండా దీనికొరకు సమయమును సమర్పించుకొనవలెను. మరియు ప్రభువగు యేసుయొద్ద మనల్ని మనము సమర్పించుకోవలెను.
మార్గము అంతమున జీవితకాలము సమాప్తమైనపుడు, నా జీవితమున ఇచ్చటున్న ఈ జనులను సంధించి వారి ముందు నేను నిలబడియున్నపుడు, మీరు దీనియొక్క భావమేమిటో, ఆ విధమైన విషయములందు అది దేనిని కొరుకొనుచున్నదో మరియు పరిశుద్ధాత్మ ఏ విధముగా క్రియ చేయుచూ మనతో అదే విధముగా వ్యవహరించుచున్నదో అప్పుడు మాత్రమే మీరు దానిని గ్రహించగలరు.
దానిని ఇప్పుడు వివరించి చెప్పలేము. మీరు కేవలము విశ్వాసము ద్వారానే క్రియ చేయవలసియున్నది. ఆ విధముగానే నేను దానిని పొందుకున్నాను. దానిని నేను వివరించి చెప్పలేను. దానిని నేను కూడా విశ్వసించవలసియున్నది. ఆయన దానిని అనుగ్రహించుచున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దానిని నేను అట్లే పొందుకొని, దానిని అలాగే ఇంకా ఎదుగునట్లుగా చేయుదును. దానిని ఆ విధముగా చెయ్యుటయే ఆయన యొక్క విధానమైయున్నది.
6
ఇప్పుడు అనేకమంది జనులు ఈ విధముగా చెప్పుటను మనము వినెదము, “నాకు విశ్వాసము ఉన్నయెడల,” విశ్వాసము అనగా సుదీర్ఘమైన ప్రార్థనా కూటములను జరిపించుటవలన విశ్వాసము వచ్చునని దాని అర్థము కాదు. చాలా దినములు ఉపవాసము ఉండుట వలన వచ్చునని భావము కాదు. విశ్వాసమనగా అచేతనమైనది, నీలోవున్న నిజమైన విశ్వాసము, అది నీలో అచేతన స్థితిలో వున్నది. ఆ విశ్వాసము నీలోనే చలనము లేకుండా అచేతనముగా ఉన్నదని నీకు తెలియుట లేదు. ఆ విశ్వాసము నీకు తెలియకుండానే నీలోనే చలనము లేని స్థితిలో యున్నది.
పెను గాలులను లేదా ఉప్పొంగే కెరటాలను అణచుటకు తనకు విశ్వాసము ఉన్నదా లేదాని యేసు తనను ప్రశ్నించుకున్నాడని మీరు ఊహించగలరా? లేదా లాజరును మృత్యువు నుండి సజీవునిగా లేపుటకు తనకు తగినంత విశ్వాసము గలదా లేదాని యేసు తన విశ్వాసమును సందేహించెనా? లేదా తనకున్న విశ్వాసమును సందేహించుచూ ఆయన ఎన్నడూ ప్రశ్నించుకోలేదు.
ఇప్పుడు, విశ్వాసమును కలిగివుండుటకు ముందు, ఆ విశ్వాసము కలిగియుండునట్లుగా మనకొక పునాది అవసరమైనది. ఆ విశ్వాసమునకు వెనుక ఏదోకటి కలిగియుండవలయును.
7
ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎన్నుకొనునపుడు, వాస్తవముగా ఆమె ఏ విధముగా జీవించుచున్నది, ఏ కుటుంబ వంశావళినుండి ఆమె వచ్చినది, ఆమె యొక్క పుట్టు పుర్వోత్రాలు ఏమిటియని మరియు ఆమెకు సంబంధించి అనేక విషయములను గూర్చి అతడు పరిశీలించి కనుగొనును. దానికి సంబంధించిన ఏదోక ఆధారమును మనమును కలిగియుండవలయును. కావున ఆమెకు సంబంధించిన విషయమును అతడు ఆమె యొద్ద అడిగి తెలుసుకోవలయును.
ఇప్పుడు, ఆమె చెప్పే మాటలను మాత్రమే అతడు ఆధారముగా చేసుకోగలడు. ఆమె మాటలనే ఆధారముగా అతడు తీసుకోగలడు. అలాగే ఆమె కూడా అతను చెప్పే మాటలనే ఆధారముగా తీసుకోగలదు. అది తప్ప వేరే ఏ మార్గము లేదు.
దానిని ఆ విధముగా దేవుడు పెట్టినందుకు నేనెంతగానో సంతోషించు చున్నాను... మనము చేసిన విధముగా ఒక వ్యక్తి తనకు కాబోయే భార్యను ఎన్నుకొనును. అలాగే క్రీస్తు కూడా తన వధువును ఆ విధముగానే ఎన్నుకొనును లేదా ఒక వధువుగా ఆయన మనల్ని ఆ విధముగానే అంగీకరించును. మనము తీసుకునే కార్యమేదైనా గాని అది వాక్యముపై ఆధారపడి ఉండవలయును.
ఇపుడు, ఏదైనాగాని మనమేమై ఉన్నాము? మనమిచ్చటకు ఎట్లు వచ్చితిమి? మనమెందుకొరకు ఇచ్చట ఉన్నాము? నీవు చేయుచున్న తుచ్ఛమైన క్రియల ద్వారా ఆ విషయములను గూర్చి నీవు ఎన్నడైనా తలంచి చూచితివా? మనము మానవులము, మరి మనలను మానవులుగా చేసినది ఏది? భూమి మీదున్న వాటన్నిటికంటే ఒక భిన్నమైన మానవులుగా ఏది మనల్ని చేసినది? (క్షమించండి).
8
ఒక మానవుని యొక్క స్థితి ఎట్లున్నాగాని, అతడు ఎంత పాపియైనాగాని, అతడు దేవునికి ఎంత దూరముగా ఉన్నాగాని, అయినప్పటికీ అతడొక దేవుని కుమారుడు. అతడు పడిపోయిన స్థితిలోవున్నాగాని అతడు దేవుని కుమారుడేయగును. అతనిని సృష్టించినవాడు దేవుడే. అతడిని నిర్మాణించినవాడు దేవుడే. క్రయ ధనమును చెల్లించి దేవుడు అతనిని తీసుకొని వచ్చెను. ఒకవేళ అతడు తన దానితో సమ్మతించకపోవచ్చును, దానిని అతడు అంగీకరించకపోవచ్చును. దానివలన అతనికి ఏ ప్రయోజనము లేకపోవచ్చును. అయినప్పటికి అతడు ఒక దేవుని కుమారుడే మరియు ఆమె ఒక దేవుని కుమార్తెయగును.
ఎందుకొరకు దేవుడు మానవుడిని ఇచ్చట ఉంచెను? ఇపుడు, మనము ఈ తలంపులపై ఎక్కువగా మన సమయమును వెచ్చించవచ్చును, కాని మనము ఆ విధముగా చేయుట లేదు. ఈ రాత్రి కూటమునకు కేవలము ప్రాధమిక తలంపును మాత్రమే ఇచ్చట మనము చూడబోవుచున్నాము. పిదప మనము రోగుల కొరకు ప్రార్ధించబోవుచున్నాము, ఎందుకనగా ఇంతక్రితమే సేవకులు బహుశా వారితో మాట్లాడి ఉండవచ్చును మరియు ఇంకా అనేక కార్యములు చేసి ఉండవచ్చును.
ఇప్పుడు, దేవుడు, మానవుడిని ఆదియందు చేసినపుడు, భూమి పై ఉన్న ప్రతీదాని మీద అధిపత్యమును చెలాయించే ఉన్నత స్థాయిలో చేసెను. సమస్తమును తన ఆధీనములో అతడు ఉంచుకొనునట్లుగా, భూమిపైయున్న సమస్తము పై అధికారమును ఆయన అతనికి అనుగ్రహించెను. అతడు జంతు జీవులను నియంత్రించెను. పక్షి జాతిని, సముద్ర గర్భములోని జలచరములన్నింటిని అతడు నియంత్రించెను. అతడు గాలులను నియంత్రించెను. వృక్ష జాతిని తన ఆధీనములో ఉంచుకొనెను. సమస్తమును అతడు నియంత్రించెను.
9
ఈ భూమిమీద మానవుడిని రెండవ స్థానమున ఒక చిన్న దేవునిగా చేసెను. అంతేకాకుండా భూమి పై ఉండు సమస్త మూలకాలు (పంచ భూతములు)పై మరియు సమస్తమును తన ఆధీనములోకి తీసుకొని నియంత్రింగల శక్తిని లేదా అధికారమును ఆయన అతనికి ఇచ్చెను. అతడే ఆదాము. ఆదాముకు ఆయన ఈ గొప్ప అధికారములన్నింటిని ఇచ్చెను. సమస్తమును నియంత్రించే అధికారము అతనికి ఇచ్చెను. కాని సమస్తమును పరిపాలించే అధికారము అతడి వశమున ఉన్న సమయమునందే, అప్పుడే అతడు పతనమాయెను.
కాబట్టి ఆదాము గాలులతో మాట్లాడి, దానిని ఆపగలడు. వృక్షములతో మాట్లాడిన, అవి అతడికి లోబడును. వన్య ప్రాణులతో అతడు మాట్లాడగలడు, అవి అతనికి లోబడును. జలములతో అతడు మాట్లాడగలడు, అదేమైనాగాని వాటితో అతడు మాట్లాడగలడు, అతడు దేనితో మాట్లాడునో అవన్ని ఆదాముకు లోబడును.
అదే మానవుని యొక్క ఆరంభ స్థితి. భూమి పై ఉన్న సమస్తము పై ఆయన అతనికి అధికారమును ఇచ్చెను. ఇప్పుడు ఆదాము పతనమవుట ద్వారా తాను కలిగివున్న అధికారమునంతా కోల్పోయేను. పిదప ఆదాము తానున్న నిజస్థితి నుండి అచేతన లేదా చలనములేని స్థితికి మారిపోయెను. పిదప ఆదాము తన తండ్రితో గల సంబంధమును, స్నేహ బంధమును, సహవాసమును కోల్పోయెను. పిదప అతడు తన అధికారమును కోల్పోయెను. దేవునితో అతనికి గల అధికారములన్నీ సమస్త ద్వారములు మూయబడినట్లాయెను. అతడింక దానిగుండా ముందుకు సాగిపోలేనట్లుగా ఆ అధికారము ఉపయోగించకుండునట్లుగా బంధింపబడెను.
ఇప్పుడు, ఆదాము దేవునిలో ఏమైయుండెనో, అదే స్థానమునకు లేదా అదే నిజస్థితికి మనలను మరలా తీసుకొని వెళ్ళుటకు క్రీస్తు మనలను విమోచించెను. ఇపుడు ఒక విమోచకునిగా ఆయన దేనినైనా విమోచించి మరలా దానిని దాని నిజ స్థితికి లేదా మూల స్థితికి తీసుకొని వెళ్ళుటకే విమోచించెను.
10
అలాగే ఆదాముకు ఏ రోగమనేది లేదు. ఆదాముకు మరణమనేది లేదు. అతనికి ఏ బాధంటూ లేదు. ఆదాముకు అసలు గుండె నొప్పి ఎన్నడూ రాలేదు. అతనికి ఏ భయములేదు. ఒక చిన్న బిడ్డవలె ఆదాము తన తండ్రియైన దేవుని చేతులపై ఎక్కి కూర్చొని ఉండును. అతనికి సమస్తము గలదు. అతడు ఆశించేది అడిగినను తక్షణమే దానిని అతడు పొందుకొనును. సమస్తము ఆదాముకు లోబడును, ఎందుకనగా అతడు దేవుని కుమారుడు, కావున కుమారుడు సమస్తమునకు వారసుడగును.
ఇప్పుడు, మానవుడు తన నిజ స్థితినుండి పతనమైనప్పుడు, అతడు తనకున్న సమస్తమును కోల్పోయెను. కాబట్టి అతడు పతనమైపోయి దేనినైతే పోగొట్టుకొనెనో, వాటన్నింటిని క్రీస్తు ఒక విమోచకునిగా వచ్చి విమోచించెను. క్రీస్తు దేనికొరకు మనల్ని విమోచించెనని ఎప్పుడైనా కొంచెము ఆలోచించి చూచితిరా? ఆయన మనకు నిత్యజీవము అనుగ్రహించెను. దేవునితో మనకున్న సంబంధమును మరియు నిత్య సహవాసమును మరలా ఆయన మనకు తీసుకొని వచ్చి, తద్వారా దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగా ఉండుటకు దేనినైతే ఆదాము కోల్పోయెనో వాటన్నింటిని తిరిగి ఆయన పునరుద్దరించెను.
11
ఇప్పుడు అసలైన విషయమేమనగా, దేవుడు మానవుడిని మరలా మూల స్థానమునకు తీసుకొనివచ్చి నిలిపి పునరుద్ధరించువరుకు, మానవుడు పతనమైపోయి తన తండ్రి తనను ఈ భూమిమీద ఏమి చేయుటకు ఉంచెనో దానిని అతడు “తన సృహలో కోల్పోయెను. ఇంకొక మాటలో, మనము చేయవలసిన మన తండ్రి యొక్క కార్యములను మతిమరుపువలె మరచిపోయి, వాటికి బదులుగా మన మెదడులో మెదిలే కార్యములతో, బాహ్యప్రపంచ కార్యములతో, వ్యాపారపు కార్యములతో, దాంపత్య జీవిత కార్యములతో, గృహ సంబంధ కార్యములవంటి వాటిల్లో మునిగిపోయి విశ్వాసమును క్రియ చేయనివ్వకుండా బంధించెను. కాబట్టి ఏ ద్వారముల ద్వారా మానవునితో క్రియ చేయునట్లు ఆయన చేసెనో ఆ ద్వారముల ద్వారా దేవుడు క్రియ చేయలేనంతగా అవన్నీ మూయబడెను.
ఇప్పుడు, దేవుడు మానవుని శరీరమును చేసినప్పుడు, ఆ శరీరములోని ప్రతీ చిన్న భాగములగు పళ్ళు, నాలుక, కన్నులు, ముక్కు అన్నీ వాటి - వాటి పనులు చేయునట్లుగా ఆయన చేసెను. కావున మానవుడు చక్కగా జీవించునట్లు శరీరములోని సమస్త అవయవములు ఖచ్చితముగా వాటి - వాటి పని చేయునట్లుగా వాటిని ఆ స్థానములలో ఉండునట్లు దేవుడు చేసెను. కాబట్టి ఒక మానవుని శరీరమును చేయుటకే దేవుడింత ఖచ్చితమైన నిర్మాణ క్రమముతో దానిని చేయగా, మరి క్రీస్తు యొక్క శరీరమనే సంఘమును నిర్మించుటకు మరెంత ఖచ్చితమైన క్రమముతో దానిని ఆయన నిర్మించును?
12
దేవుడు ఒక మానవుని యొక్క శరీరమును అంత చక్కగా రూపొందించినయెడల, సంఘమనే ఆయన కుమారుని యొక్క శరీరమును రూపొందించుటకు ఆయన నిశ్చయముగా ఎంతో శ్రద్ధవహించును. మనమందరము ఏకముగా కూడి క్రీస్తుయున్న ఉన్నత స్థలమగు పరలోకమునకు వచ్చి చేరుటకు మరియు మనము ఈ వ్యక్తపరచు క్రియలగు ఆత్మ వరములను కలిగి దాని ద్వారా ప్రవచించుచూ, దేవుని జ్ఞానమును, దేవుని తెలివిని, స్వస్థతా వరములు వంటివి కలిగియుండునట్లు ఈ దివ్య శక్తితో దేవుని క్రియలు చేయుటకు దేవుడు మనకు రూపొందించెను. దేవుడు తన శక్తిని, తన ప్రత్యక్షతను తన జనులకు అనుగ్రహించుటకు ఈ వివిధ రకములగు వరములన్ని వ్యక్తపరచు క్రియలుగా ఉన్నవి.
కాబట్టి మనమందరము వేరువేరుగా ఉండుటకు కాదు గాని మనమందరము ఒక్కటిగా ఏకమై ఒక గొప్ప విశ్వాసుల యొక్క శరీరమనే సమూహముగా ఉన్నాము. కావున మనమెట్లు ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మర్మమగు శరీరమున ఏకమవ్వగలము? మనమందరము ఈ శరీరములో ఏకమగుటకు ఒక్క ఆత్మ ద్వారా బాప్తిస్మమును పొందితిమి.
ఇపుడు పాపము మరియు మరణమనే నియమముల ద్వారా సాతాను పాపము మరియు మరణమనే వాటిని సమస్త వ్యాధుల రూపమున మలచుకొని క్యాన్సర్ వ్యాధిని పంపించి మనపై ప్రయోగించును. మానవుడు దానిని అంగీకరించి, దానిని స్వీకరించును. అలాగే సాతాను అనేక మనోవేదనలను పంపించును, దానిని మనము అంగీకరించి మరియు దానిని స్వీకరించెదము.
13
మరియు సాతాను తన శక్తితో తన నియమముల ద్వారా మనిషిలో క్రియ చేయునట్లు ప్రయోగించినయెడల, అటైతే దేవుడు తన శక్తితో తన నియమముల ద్వారా ఇంకెంత మరెక్కువగా మానవునిలో క్రియ చేయునట్లు చేయును? సాతాను తన నియమములయందు నిశ్చయమునుగలవాడై, మనము దానిని అంగీకరించునట్లు చేసినయెడల, అటైతే ప్రజల మధ్య జరుగు దైవీక స్వస్థతలు, వాక్యప్రత్యక్షత, దేవుని శక్తి, ఆత్మవరములు మరియు పరిశుద్ధాత్మ యొక్క క్రియలు ప్రత్యక్షముగా బయలుపడుటను తన నియమముల ద్వారా తన పిల్లలు వాటిని అంగీకరించి, నమ్మునట్లుగా దేవుడు మరెంతో ఎక్కువగా క్రియలు చేయగలడు.
కావున పాపము మరియు మరణముల యొక్క నియమము ప్రజలలో క్రియ చేయుచున్నది, అలాగే క్రీస్తు యొక్క స్వేచ్ఛయనే నియమము మనయొద్దకు వచ్చి అటువంటి కార్యముల నుండి అది మనలను విడుదల చేయుచున్నది.
అందుచేతనే దీనిని నా హృదయమంతటితో విశ్వసించుచున్నాను. ఇటువంటి కార్యములను జనులు గ్రహించే స్థితికి వచ్చినప్పుడు మనము ఆ యుగమునకు సమీపించుచున్నామని నేను నమ్ముచున్నాను. మనకు పనికిరాని అత్యధికమైన తత్వ శాస్త్రము మరియు అనేక విధములగు కార్యములు గలవు, అంతేకాకుండా విరుద్ధమైన బోధలు, విప్లవాత్మకమైన ఈ తలంపులు, ఆ తలంపులతో అనేక వ్యర్ధమైన విషయాలతో మానవుని మనస్సుంతా నిండిపోయి అవి దేవుని వాక్యము నుండి దూరముగా తీసుకొనుపోవునంతగా మానవునికి ప్రయోజనము లేనివిగా ఉన్నవి.
కాబట్టి, నేను చెప్పిన విధముగా విశ్వాసమనేది ఉపవాసము ఉండుటవలన రాదు, ఏదోక పుస్తకములను చదువుటవలన, ప్రార్థించుటవలన విశ్వాసమనేది నీకు రాదు. కాని అవన్నీ మంచిదే. ఉపవాసము ఉండుట, ప్రార్థించుట, మరియు వర్తమానమును చదువుట అన్నీ మనము చేయవలసిన కార్యములే. కాని విశ్వాసమ నేది ఏ విధముగా వచ్చుననగా, అది మానవుని హృదయములో సందేహించలేని స్థిరమైన కార్యముగా స్థిరపడిపోవునట్లుగా ఉండును. అది ఏలాగనగా, ఈ సంఘమునకు వచ్చుటకు ముందే ఈ రోజు రాత్రి సంఘమునకు నిశ్చయముగా వస్తావని ఏ విధముగా సందేహములేకుండా నీవు చెప్పితివో, అలాగే ఇది కూడా వున్నది, అలాగే సంఘములో ఆరాధన ముగిసిన వెంటనే ఇంటికి వస్తావని నీ భార్యతో నీకు తెలియకుండానే నమ్మకముతో చెప్పి ఆరాధన నుండి వెలుపలికి వచ్చి, నీ కారు ఎక్కి, నీవు ఇంటికి వెళ్ళి చేరెదవు.
ఇప్పుడు, నీకు విశ్వాసము లేకుండా నీవు దానిని చేయలేవు, నీవు చేయలేవు. నీవు కూర్చున్న స్థలము నుండి నీవు పైకిలేచి నిలబడుట నీకు విశ్వాసము లేనియెడల నీవు అచ్చట నుండి కదలలేవు. కాని ఇవన్నీ మీ అనుదిన జీవితములో సర్వసాధారణమైన కార్యములై, ఆ నియమములు మీకు చాలావరుకు అలవాటు చొప్పున చేసే విషయములుగా మారిపోయి మీ జీవితములలో అవి చాలా సామాన్యమైన కార్యములుగా యున్నవి.
14
ఇపుడు, మన తలంపులన్నింటిని పారద్రోలి దేవుని చిత్తమును మాత్రమే చేయుటకొరకై మనల్ని మనము దేవునియొద్ద సాష్టాంగముగా సమర్పించుకొని, క్రీస్తు మనస్సును మాత్రమే మనలో కలిగి, ప్రకృతిలో ఏ విధముగా కార్యములు సంభవించుచున్నవో, అలాగే ఆత్మ సంబంధమగు క్రియలు కూడా అదే విధముగా మనద్వారా జరుగును. దానిలో ఏ మార్పు లేదు, వాటిని అలాగే నీవు చేయుదువు, ఎందుకనగా భూమిపైయున్న సమస్తమును మన ఆధీనములో ఉంచుకొని, సమస్తమును పరిపాలించుచు, దేవుడిని మహిమపరుచుచు మరియు దేవుని కొరకు జీవించు ఉద్దేశ్యము కొరకే మొదటగా మనము సృష్టించబడితిమి.
ఇపుడు, యేసు చెప్పెను, “నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండినయెడల.”
ఇపుడు, తండ్రిని మరియు ఆయన వాక్యమును వేరుపరచలేరు, ఎందుకనగా వాక్యము ఆయన కుమారుడై యున్నాడు. “ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను.” దేవుడిని మరియు వాక్యమును మీరు విడదీయలేరు. ఆయన వాక్యమును పొందుకోకుండా మీరు దేవుని కలిగియుండలేరు, మీరు ఆయన వాక్యమును కలిగియున్నపుడు, మీరు దేవుని కలిగియుందురు.
15
మనము ఇంకా కొంచెము వెనుకకు వెళ్ళి చూచిన, అనగా చరిత్ర ఆరంభమైననాటి నుండి చూచిన, మీరు వాక్యమును చూడగలరు. ఆదియందు వాక్యము ఉండెను. కాని వాక్యమనగా ఏమైయున్నది? వాక్యము అనగా తలంపులోనున్న కార్యము బయలుపడుటయగును. తలంపు అనేది ఇదివరకే పలుకబడిన మాటగా యున్నది. దేవుడు, మొదటగా ఒక తలంపును తలంచి, తాను తలంచిన ఆ తలంపును పలికెను. పలకబడిన ఆ తలంపు ఒక వాక్యముగా మారెను, ఆ వాక్యమే దృశ్యరూపమున కనబడు ఒక పదార్దముగా మారెను.
కావున దేవుడు తన వాక్యములలో నుండి సమస్తము పలికెను. ఆ పలకబడిన మాట ద్వారా కలిగిన పదార్ధమును సరియైన విధానమున స్వీకరించినపుడు ఆ వాక్యము వెనుకయున్న ఏ వాగ్దానమైనను అది నెరవేరును. దేవుడు దానిని చేయును. దానిని చేయుటకు ఆయన బద్దుడైయున్నాడు.
అటైతే, “నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియున్నయెడల.” అట్లైతే మీరు దేవుని కలిగివున్నట్లగును. అంతే కాదు, ఆయన వాక్యము మీలో ఉన్నట్లగును. మీరు దేవుడిని ఏ విధముగా విశ్వసించుచున్నారో అలాగే ఆయన వాక్యమును విశ్వసించెదరు, ఎందుకనగా దేవుడే వాక్యము, వాక్యమును దేవుడును మీరు విడదీయలేరు. కాబట్టి మీరు దేవుని వాక్యమును మీలో కలిగియున్నయెడల, మీలో దేవుని యొక్క జీవము ఉన్నట్లగును. అనగా మీలో దేవుడిని మీరు కలిగి యున్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్యముగా మీరేది పలికినను మీలో నుండి బయలువెడలిన ఆ మాట దేవుడే పలికిన మాటవలెయుండి - అది నెరవేరును.
16
యేసు, “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను దానిని నేను చేసెదనని” చెప్పెను. ఎప్పుడైనా దాని భావమేమిటని మీరు గ్రహించితిరా? మీరు దేవుని ఎదుట యేసు నామమున ప్రార్థించినప్పుడు, స్వయముగా యేసే దాని ప్రార్థించుచున్నట్లుగా అది ఉన్నదని మీరు గ్రహించితిరా? కాబట్టి ఇక ప్రార్థించునది నేను కాదు. నేను ఆయన నామమున వచ్చినయెడల, ఆయన తన నామమును గుర్తించును. అలాగే యేసు, “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను దానిని నేను చేసెదనని,” చెప్పెను. అటైతే నేను యేసు నామమున తండ్రియొద్దకు వెళ్ళి ప్రార్థించినప్పుడు, ఇక ప్రార్థించునది నేను కాదు గాని, అది యేసే. ఆయన ఆత్మ నా ద్వారా ప్రార్థించుచున్నది.
అందువలన నేనేది అడిగినను దానిని నేను పొందుకొనెదను, ఎందుకనగా ఆయనే దానిని ఆలాగు చెప్పెను. మరియు అది దేవుని యొక్క స్వంత మాటయైయున్నది. అదేమని పలికినదో దానిని మాత్రమే అది ఉత్పత్తి చేయునుగాని మరి వేరే దేనిని అది ఉత్పత్తి చేయదు.
17
కాబట్టి అడిగినదేదో దానిని పొందుకొనెదమని మనము విశ్వసించుచున్నాము... దేవునియొద్ద అడిగేదేమైనను దానిని పొందుకొనెదమనే దృఢమైన విశ్వాసము మనము దేవునిలో కలిగివున్నాము, ఎందుకనగా ఆయన దేవుడు, తన మాటను వెనుకకు తీసుకోలేడు, ఆయన తాను పలికిన మాట మీద నిలబడి ఉండును.
కావున, “నాయందు మీరును, మరియు మీయందు నా మాటలను నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.” ఇదేదో సామాన్యముగా ఉన్నట్లు ఉన్నది కదా! విశ్వాసమనేది సృష్టించును. మనము ఆ ఉద్దేశ్యము కొరకే రూపించబడితిమి. కాని ఆ తర్వాత పతనమువలన దానినుండి మనము దూరముగా తొలగించబడితిమి; కాని పిదప విమోచన ద్వారా మనము కోల్పోయిన దానిని మరలా తిరిగి మనము ఆ స్థితికి తీసుకొనిరాబడితిమి.
ఆదియందు దివ్య శక్తిని మరియు సమస్తమును తన ఆధీనములో కలిగివున్న స్థితినిగలవానిగా మానవుని దేవుడు రూపించినను... మానవుడు ఆ శక్తి ద్వారా చేయవలసిన కార్యములు చేయలేకుండునట్లు ఆ మార్గములన్ని మూతబడి పోవుటయే నేడు మానవ జాతికి అడ్డంకిగా యున్నది.
18
కొన్నిసార్లు (దీనిని నేను భయభక్తులతో చెప్పుచున్నాను) కొన్నిసార్లు వేదశాస్త్రము మరియు సంఘము యొక్క ఉపదేశములు మీ విశ్వాసమనే ప్రవాహ మార్గములను క్రియ చేయనివ్వకుండా మూసివేయుచున్నవి. అవన్నీ జరుగుటకు ఆవకాశమేలేదని మీరు మీ సంఘము ద్వారా బోధింపబడియుండుటవలన మరియు మీరు కూడా అదే తలంపును కలిగియుండుటవలన మీ విశ్వాసము క్రియ చేయుటకు ప్రవహించే ఆ ప్రవాహ మార్గములను అది అడ్డుకొనుచున్నది.
ఈ రాత్రి ఈ భవనమున విద్యుత్ శక్తి ద్వారా వెలుగును కలిగియున్నట్లుగా ఒక శక్తిని కలిగియున్నదని మీరు ఊహించి చూడగలుగుచున్నారా? విద్యుత్ శక్తి అనేది కనబడని ఒక శక్తిగా ఉన్నది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొట్టమొదట ఈ విద్యుత్ శక్తిని కనుగొని, ఉపయోగించుచు, తీసుకొని వచ్చినప్పుడు, “నేను దానిని పొందుకున్నాను,” అని గట్టిగా అరిచెను. అతడేమి చేసెనో అతనికే తెలియదు. ఏదోక దానిని అతడు కనుగొని పొందుకొనెను.
కాని బెంజమిన్ ఫ్రాంక్లిన్ తరువాత వచ్చిన ఎడిసన్ అది క్రియ చేయునట్లుగా చేసెను. నేడు సరిగ్గా ఇచ్చట నుండి ప్రపంచములో గల ఏ స్థలములోకైనా, ఎచ్చటకైనా వైర్-లెస్ టెలిగ్రామును మనము పంపించగలము, అంతరిక్షము ద్వారా అదృశ్యమైన శక్తియగు చలనముతో ఏ మానవుడు దానిని చూడలేని విధముగా ఆ వార్త కొనిపోబడుచున్నది. యంత్ర పరికరములు మాత్రమే దానియొక్క చలనమును పసిగట్టగలవు, ఎందుకనగా మన కంటి దృష్టి కన్నా ఆ యంత్ర పరికరములు అతి వేగముగా పని చేయును, అలాగే ఆ తంతి వార్తలను ఎంతో దూరము నుండి ఇప్పుడు ఇచ్చటకు తీసుకొని రాగల ఒక శక్తి ఇచ్చటగలదు.
19
కాబట్టి, విద్యుత్ శక్తిని మరియు తదితర కార్యములను సరియైన విధానమున వినియోగించే సామర్థ్యమును కలిగియున్న దేవుని యొక్క సహజమైన నియమములే దానిని చేయుచున్నట్లైతే, మానవుని హృదయములోకి ఒక్కసారి పరిశుద్ధాత్మ శక్తి ప్రవాహించి, ప్రవేశించినపుడు విశ్వాసము ద్వారా మరెన్ని గొప్ప కార్యములను చేయును, అదింకా ఏమేమి కార్యములను చేయగలదు.
ఇపుడు, వారు విడుదలను కలిగియుండునట్లుగా విద్యుత్ శక్తిని వాగ్దానముగా దేవుడు మనకు ఇవ్వలేదు. కాని నేడు విశ్వాసులగు మనకు పరిశుద్ధాత్మ ఏమి వాగ్దానము చేసినదో గమనించండి. ఈ విద్యుత్ శక్తిని ఒక ప్రత్యేకమైన కార్యము కొరకు దేవుడిచ్చట ఉంచెనని మనము చూచుచున్నాము. విజ్ఞాన శాస్త్రము అన్వేషణ రూపములో వాటిని అన్వేషించుచూ ఆ విజ్ఞానశాస్త్ర రంగము ఇంకా అనేక కార్యములు తీసుకొని వచ్చుచున్నవి.
కాని క్రైస్తవులమగు మనము, అనేక విషయములతో బహుగా బంధింపబడి యున్నాము. దానియొక్క కార్యములను మనము గ్రహించలేనంతటి స్థితిలోకి వెళ్ళిపోయాము. సరే, “నేను బాగవ్వనని వైద్యుడు చెప్పాడని,” ఆ వైద్యుడు చెప్పిన మాట గురించే తలంచెదము. మీరు అటువంటి తలంపులను కలిగియున్నంత వరకు, ఇక దేవుని తలంపును గూర్చి మీరు ఆలోచించలేరు. మీరు దేవుని క్రియలను గూర్చి తలంచి చూడలేరు. “నేను మరణించబోవుచున్నాను, ఎందుకనగా వైద్యుడు నేను చనిపోతానని చెప్పాడని” మీరు చెప్పవచ్చు. వైద్యులకు గౌరవ మర్యాదలను చెల్లించుచున్నాము, వారియొక్క శ్రేష్టమైన జ్ఞానము అంతవరకే.
20
నీవు మరణిస్తావని అతడు చెప్పినయెడల, మానవ రీతిలో దానిని చూచినపుడు, నేను కూడా దానిని అలాగే నమ్మెదను. కాని వాక్యప్రకారముగాయైతే నేను దానిని నమ్మను. అది నిజము. ఎందుకనగా, ఆయన నామమున నేను తండ్రిని ఏది అడిగినను దానిని నాకు అనుగ్రహిస్తానని ఆయన నాకు వాగ్దానము చేసెను. అది సత్యమని నేను విశ్వాసించుచున్నాను.
ఇపుడు, దేవుడు ఆ ప్రవాహ మార్గమునగల అడ్డంకులను శుభ్రము చేసి ఆ మార్గముల నుండి శక్తి బయలు వెళ్ళునట్లు చేసిప్పుడు, ఏదోక కార్యము జరుగును. శరీరములో భాగములన్నీ ఏకముగా కూర్చి అది పనిచేయునట్లు చేసిన ఆయన జీవము క్రియ చేయుటకు ఆరంభించును... నా శరీరములోని ప్రతీ అవయవము ఏకముగా కూడి పనిచేయుచూ నాకు ఏ విధముగా జీవమును ఇచ్చుచున్నదో, నిశ్చయముగా అదే విధముగా క్రీస్తు శరీరములోని ప్రతీ అవయవము, అనగా ప్రతీ సభ్యుడు ఏకముగా కూడా చక్కగా పని చేసినప్పుడు, సరిగ్గా పొందుకోవలసిన దానిని అది పొందుకొనును. నేను చెప్పు భావమేమిటో మీకు అర్ధమగుచున్నదా?
21
ఈ సంఘమునందు కొందరిని ఉపదేశకులుగా, అపోస్తులులుగా, ప్రవక్తలుగా, స్వస్థతా వరమునుగలవారుగా, అద్భుతములను చేయువారుగా, అన్యభాషలలో మాట్లాడువారుగా, వాటికి అనువాదమును చెప్పువారుగా మరియు ఇంకా అనేక విధముల పరిచర్యను చేయువారుగా ఉంచెను. ఈ కార్యములన్ని గొప్ప మర్మమైన యేసుక్రీస్తు యొక్క శరీరమున క్రియ చేయుచూ ఏదోక దినమున ఈ భూమిమీద నుండి బయలు వెళ్ళునని నేను విశ్వసించుచున్నాను. అదెంతో సమీపమున మన అర చేతిలోనే ఉన్నంత దూరమున ఉన్నట్లుగా ఇప్పుడు నేను విశ్వసించుచున్నాను.
అదెట్లనగా, ఈ రాత్రి ఇచ్చట వెలుగుచున్న ఈ లైటుకు మరియు అదిగో అచ్చట వీధీలో వెలుగుచున్న ఆ లైటుకు ఒక చిన్న విద్యుత్ తీగను దానికి దీనికి కలిపినందువలన అవి వెలుగునట్లుగానే అది ఉన్నది. అది పదార్ధముగా అనగా వస్తువు రూపములో ఉన్నది. సరే, ఇప్పుడు, ఈ తీగ ద్వారా విద్యుత్ శక్తిని ప్రవాహింప జేయుట ద్వారా, శక్తిని ఉత్పత్తి చేసి ఇచ్చటవున్న ఈ లైటు ఎట్లు వెలుగుచున్నదో అలాగే ఖచ్చితముగా అదియు అట్లే ఆ శక్తితో అచ్చట వెలుగునట్లు చేసెను.
అనేక సమయములలో నేను నమ్ముచున్నదేమనగా, ఈ భూమిమీదున్న దేవుని యొక్క ఆత్మ సంబంధమగు శరీరము ఆ శక్తిని కలిగివున్న విద్యుత్ తీగతో కలపబడివున్నపుడు, మనకు నీటి కుళాయిలు పనిచేయువారు గలరు, దీనిని నేను మర్యాద పూర్వకముగా చెప్పుచున్నాను, విద్యుత్ కార్మికుడు బదులుగా కుళాయిలు పనిచేయువారని చెప్పాను. నీరు ప్రవాహించే మార్గములన్ని భాగుగానే ఉన్నాయి, కాని నీటిద్వారా మాత్రమే మనము వారిని రక్షించలేము. అది సరియని మీరెరుగుదురు. ఆ విధముగా చెప్పుట బాప్తిస్టులకు అదొక మంచి విషయముగా ఉండును. కాని అది సత్యము. అది సత్యము.
22
ఈ శరీరము ఆ శక్తితో చక్కగా సంబంధము కలపబడియున్నటైతే పరలోకమునందున్న తండ్రి ముఖ్యమైన ఆ గొప్ప స్విచ్ ను వేయును, అప్పుడు నిశ్చయముగా ఏదోక కార్యము సంభవించును. అది నిజము. ఒకవేళ శరీరము... భవనములో విద్యుత్ శక్తి తీగలన్ని సరైన విధానమున కలపబడివున్న యెడల... మరియు అది సరియైన విధానమున బోధింపబడివున్నయెడల, మన శరీరములోయున్న ప్రతీ నాడీ నరము క్రీస్తుతో కలపబడి, మన సమస్తమును క్రీస్తులో కోల్పోయి మనలో ఆయన వాక్యము మాత్రమే ఉండిన.
ఇపుడు మీరు వేద శాస్త్రమును గలవారైనయెడల, ఏదోక సిద్ధాంతము మీరు గలవారైనయెడల, మీరు ఏదోక మూఢ విశ్వాసమును కలిగివున్నయెడల, ఏదోక అపనమ్మకమును మీరు కలిగివున్నయెడల, ఏదోక స్థలమున మిమ్మల్ని అడ్డుకొని నిలుపువేయుగల ఏదోక దానిని మీరు గలవారైనయెడల, ఇక అప్పుడు ఆ దివ్యమైన శక్తి మీలోనుండి ప్రవాహించుచు బయలు వెళ్ళదు. కాని మీరెప్పుడైతే ఆ దివ్యశక్తిని ప్రవాహింపజేయు తీగతో సంబంధమును కలిగి కలపబడియుండు ఆ స్థలమందు ఉండెదరో, అప్పుడు ఆ విద్యుత్ శక్తి యజమానుడు అది చక్కగా ఉన్నదని చూచి పరిశుద్ధాత్మనే ముద్రతో తన అంగీకారపు ముద్రను ముద్రించును. ఎప్పుడైతే ఆ ముద్రతో ముద్రించబడునో అప్పుడు మాత్రమే ఆ విద్యుత్ దీపమును వెలుగించుటకు స్విచ్ వేయబడును. అప్పుడు ఆది వెలుగును విరజిమ్మును. అది సత్యము.
23
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీదనుండు పట్టణము మరుగై ఉండనేరదు. ఈ రాత్రియందు మనగూర్చి మనము సిగ్గుపడవలసిన వారమైయున్నాము. యదార్ధముతో మరియు తగ్గింపుతో మన అవిశ్వాసమును బట్టి దేవుని ముందు పశ్చాత్తాపమునొంది, మన జీవితములో ఆయన కొరకు మనమేవిధముగా ప్రాతినిధ్యం వహించుచున్నామో దాని నిమిత్తము క్షమాపణను ఆయనయొద్ద మనము అడుగవలెను. ఆయన మన మీద ఆధారపడి యున్నాడు.
పాత నిబంధనలోని జనులు ఈ విధమైన ప్రసన్నతను కలిగియుండలేదు. దానిని మీరు కూడా ఎరుగనివారైయున్నారు. కొన్నిసార్లు మీరు ఎలీయాను, మోషేను వంటి వారికి సూచించెదరు మరియు ఎలీయా, మోషే మరియు ఇంకా అటువంటి వారందరు గొప్పవారు, దేవుని చేత నియమించబడినవారు, అయినప్పటికీ మీకున్న ఈ భాగ్యము వారికి లేదు. క్రీస్తులోవున్న సమస్తమును మీరు కలిగినవారై ఆ శక్తి ద్వారా మీరు గొప్ప కార్యములను చేయునట్లుగా వారికి ఆ శక్తి ఇవ్వబడలేదు.
24
వారు ఈ దినము కొరకు ముందుగానే చూచి, దానిని కౌగిలించుకొని, వారు దానిని విశ్వసించిరి. మరియు అది వచ్చుటకు ముందుగానే వారున్న కాలములోనే అది రావలెనని దానికొరకు వారు ఎదురుచూచిరి. మరిప్పుడు మనము వారు ఎదురుచూచిన కాలమగు అదే కాలమందే మనము జీవించుచున్నప్పటికినీ దానిని చూచి మనము భయపడుచున్నాము, చూచారా. ఇదెంతటి విచారము.
ఇప్పుడు, అవిశ్వాసము, సందేహము మరియు భయము ద్వారా శరీరమందు సాతాను పని చేయుచుండినయెడల, లేఖనము ఏమి చెప్పుచున్నదో దానిని ఉత్పత్తి చేయును. అది వ్యాధులను ఉత్పత్తి చేయును. ప్రమాదకరమైన వినాశనమును ఉత్పత్తి చేయును. అటువంటి నాశనము చేయు సమస్త కార్యములను శరీరమందు అది ఉత్పత్తి చేయును.
కావున, అవిశ్వాసము ద్వారా అటువంటి వినాశకరమైన కార్యములను శరీరమున ఉత్పత్తి చేయుటకంటే, జనులు దేవుని యొక్క శక్తిని ఉపయోగించి ఆ కార్యములను నియంత్రించుచు మరియు వాటిని సరిదిద్దుకొనే స్థలము యొద్దకు వారిని మరలా తీసుకొని వచ్చుటకు వారెందుకు విశ్వసించుట లేదు?
25
ఎందుకొరకు క్రీస్తు మనలను విమోచించెను? ఆయన మనలను ఎందుకొరకు విమోచించెనని ఎన్నడైనా మీరు ఆలోచించితిరా? ఆయన మీ కొరకు ప్రాయశ్చిత్తం చేయకుండా, “ఇంత గొప్ప శక్తులను వీరికి ఇవ్వవలసిన అవసరము లేదు, ఈ మానవుడిని ఒక దేవుని కుమారునిగా చేయవలసిన అవసరమేమియు లేదు. ఆ విధముగా చేయవలసిన అవసరము లేదు. దానిని అతడు కేవలము విశ్వసించునట్లు నేను చేసి మరియు అతని పేరును పరలోకపు గ్రంథములో వ్రాసిన చాలు, అది చాలు, అంతటితో సమాప్తమగును,” అని ఆయన చెప్పవచ్చు కదా! కాని మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క క్రియలను చేయుటకే ఆయన మనకు ఈ విమోచనా ఆశీర్వాదములను అనుగ్రహించెను.
పరి. యోహాను 15వ అధ్యాయమున, ఆయన, “ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు” అని చెప్పెను. ద్రాక్షా చెట్టున దాని ఫలములు కలిగియున్నను, తనంతట తాను ఆ ద్రాక్షా చెట్టు ఫలములను ఇవ్వలేదని మీరెరుగుదురు. కావున ద్రాక్షా చెట్టునుండి తానంతట తానుగా అది ఫలములను తీసుకొని రాలేదు. ఆ ఫలమును తీసుకొని వచ్చుటకు దానికొక కొమ్మ కావలెను. కాబట్టి మీరే ఆ కొమ్మలు లేదా తీగెలైయున్నారు. అందుచేత ద్రాక్షా చెట్టు తన శక్తినంతటితో దేనిని ఫలింపచేయలేదు గాని, దాని తీగ ఆ శక్తిని అంగీకరించితినే తద్వారా ఫలమును ఫలింపగలదు.
26
ఇప్పుడు, మీరు ఆయన శరీరము యొక్క సభ్యునిగా లేదా అవయవమై ఆయన ఆత్మ యొక్క ఫలమును ఫలింపజేయువారై యుండుటచేత, దేవుడు మీపై ఆధారపడుచున్నాడు. మరిప్పుడు, ఆయన మీపై ఆధారపడినయెడల ఈ రాత్రి పరిశుద్దాత్మ మనలోకి వచ్చి, మనలను శక్తితో నింపి, సమస్త భయములు మరియు సందేహముల నుండి మనలను విడుదల చేసి విశ్వాసపు క్రియలను చేయుటకు ప్రవాహపు ద్వారములన్నింటిని ఆయన తెరచును గాక. అప్పుడు ఉజ్జీవమువచ్చును.
ఎవరో ఒకరు, “అటువంటి అద్భుత కార్యములను చేయుటకు అపోస్తులులకు మాత్రమే ఆ శక్తి అనుగ్రహించబడినదని,” చెప్పిరి. నేనొక చరిత్రకారుడను కాదు, కాని సంఘము యొక్క చరిత్రను అధికముగా నేను చదివితిని.
పరిశుద్ధాత్మ యొక్క అలలు సంఘమును తాకునప్పుడల్లా ఉజ్జీవము లేకపోయినా అద్భుత కార్యములు మరియు ఆశ్చర్య కార్యములు మరియు సూచక క్రియలు దానిని వెంబడించుచుండెను. కాని ప్రపంచపు చరిత్రంతటిలోను ఈ అద్భుత కార్యములు, సూచక క్రియలు జరుగలేనట్లు ఒక్కసారియైనా నేన్నెడూ చూడలేదు. ప్రతీ కాలములో రోగులను ఆయన స్వస్థపరచుచున్నాడు. ఆ స్వస్థతను ఆయన ప్రతీ యుగమున అలాగే కొనసాగించుచున్నాడు. ఎచ్చటైతే ప్రజలు మరియు సంఘములు తమ స్వచిత్తమును వదులు కొనుటకు ఇష్టపడుదురో అప్పుడు వారిని పరిశుద్ధాత్మ తన ఆధీనములోకి తీసుకొనును.
27
మార్టిన్ లూథర్ తన సమీప సహకారుడు అస్వస్థతతో ఉండగా అతనికి ప్రార్థించినప్పుడు అతను స్వస్థతనొందెను. రెండువందల నలుబది మందికి జాన్ వెస్లీ ప్రార్థించగా, వారు స్వస్థతను పొందినట్లు నమోదు చేయబడెనని నేను నమ్ముచున్నాను.
అతను గుర్రము మీద స్వారీ చేయుచుండగా, తన గుర్రము అస్వస్థతకు గురై కుంటుచూ వెళ్ళుచున్నపుడు, అలాగే తాను కూడా తలనొప్పితో బాధపడుచుండగా, అతను ప్రార్థించినప్పుడు, దేవుడు ఇరువురిని అనగా జాన్ వెస్లీని మరియు గుర్రమును కూడా స్వస్థపరచెను. ఆ తర్వాత గుర్రము ఎప్పటిలా చక్కగా వెళ్ళినది.
ఆలాగే మూడీ, సాంకీ, ఫీన్నీ వంటి గొప్ప వ్యక్తుల కాలమున పరిశుద్ధాత్మ యొక్క అలలు సంఘమును తాకినప్పుడు అచ్చట సూచక క్రియలు మరియు అద్భుత కార్యములు సంభవించినవి.
ఎందుచేత, ఒకసారి ఒకరు ఇలా చెప్పిరి... బహుశా అది మూడీ అని నేను నమ్ముచున్నాను. దైవీక స్వస్థతనే ఉపదేశమును మూడీ తన కూటమున ఉపదేశించకుండానే పరిశుద్ధాత్మ ఆ కూటమున కుమ్మరింపబడుటచేత ఆ కూటమునయున్న అనేకమంది ప్రజలు స్వస్థతను పొందుకొనిరి. కావున మూడీ ఈ విధముగా చెప్పెను, తన కూటమునందు అనేకమంది జనులు స్వస్థతను పొందుకొనుటవలన ఫ్రాన్స్ లో యున్న తన ప్రధాన మందిరమునకు కేవలము స్వస్థత కొరకే వచ్చుదురేమోనని తలంచెను, అనేకమంది జనులు స్వస్థతను పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తామేవిధముగా స్వస్థత పొందుకొనిరో సాక్ష్యములను చెప్పిరి, దైవీక స్వస్థతను గూర్చి మూడీ తన కూటమున ఉపదేశించనప్పటికీ పరిశుద్ధాత్మ దానిని తనంతటతానే దానిని చేసెను, ఎందుకంటే ఆయన దానిని చేయుటకు సరియైన వాతావరణమును, అచ్చట కలిగియుండెను. కావున అది అచ్చట ఉత్పత్తి చేయబడినది.
28
స్వస్థత వారికి అవసరమైనను దానికొరకు కూడా రాకుండా కేవలము వారు ఉన్న చోటనే కూర్చొని ఉండు ప్రజలను నేను చూచితిని, తమ జీవితములను పరిశుద్ధాత్మకు సంపూర్ణముగా సమర్పించుకొనిన పిదప తమ గృహములకు వెళ్ళుదరు, వారు తమ గృహములకు వెళ్ళిన తరువాత పరిపూర్ణముగా వారు స్వస్థతను పొందుకొని యున్నను దానిని కూడా గ్రహించలేని స్థితిలో వారుందురు.
పరిశుద్ధాత్మయే స్వస్థపరచువానిగా యున్నాడు. ప్రతీ ఒక్కొక్కరి జీవితమును శక్తితో నింపి మరియు సమస్త కార్యములను చేయుటకు ఈ రాత్రి ఇచ్చట పరిశుద్ధాత్మ గలదు. ఇపుడు, దేనిని ఆధారముగా చేసుకొని దైవీక స్వస్థత వున్నదో మీరు చూచితిరా? దీనిని మనము త్వరగా ముగించవలెను, ఎందుకనగా ఎక్కువ సేపు దీనినిగూర్చి మాట్లాడుటకు మనకు సమయము లేదు. మనము దీనిని త్వరగా ముగించవలెను.
ఇప్పుడు ఎక్కడో పొరపాటు గలదు. సమస్త వాతావరణము మీ ఆధీనములో కలిగిన ఒక యజమానుడుగా ఆదిలో దేవుడు మిమ్మల్ని సృష్టించెను. అదే మీ మూలము లేదా ఆరంభము. అదే వాస్తవము, అది దేవుని వాక్యము. అచ్చట ఏదీ మిమ్మల్ని దాటుకొని ఏమి చెయ్యదు, ఎందుకనగా మీరే దానికి యజమానులు. దానిని మీ ఆధీనములో ఉంచుకొనుటకొరకే మీరు సృష్టించబడితిరి.
29
పతనము వెనుకనే పాపము వచ్చినది, అది వారి కనులకు గ్రుడ్డితనము కలుగజేసెను. పిదప యేసు వచ్చి కోల్పోయిన దానిని మరలా విమోచించి ఇచ్చెను. ఇప్పుడు తండ్రి మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి, మీకు మార్గదర్శియై, మిమ్మల్ని నడిపించుచూ, సమస్త దైవీక వాగ్దానములను మీకు అనుగ్రహించుచుండెను.
బోధకులారా, ప్రభువగు యేసుక్రీస్తు నామమును విశ్వసించే ప్రతి పురుషుడిని లేదా స్త్రీని నేను ప్రేమిస్తున్నానని మీకు వినయముతో చెప్పుచున్నాను. అర్దమైనదా? నేను వ్యాజ్యమాడువాడను కాను. నేను గొడవ మనిషిని కాను. దానిని నేను నమ్మను, కేవలము వాక్యమును ప్రసంగించుటను నేను విశ్వసించెదను. అంతవరుకే.
అది దేవుని యొక్క వాక్యమని నేను విశ్వసించెదను. నేను విశ్వసించునట్లుగా ఇది దేవుని వాక్యమైయున్నది. గనుక, ఆయన యొక్క నిబంధనల ప్రకారముగా సమస్తమును నేను అనుసరించిన, పరిశుద్ధ గ్రంథమున ఉన్న వాగ్దానములన్నిటిని నాకు అనుగ్రహించుటకు ఆయన జవాబుదారియై యున్నాడని నేను విశ్వసించుచున్నాను, మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రాజ్యము కొరకు ఆయన నన్ను ముద్రించును. నేనేదైతే విశ్వసించుచున్నానో అది మూఢభక్తి కాదు. ఇదొక మూఢభక్తి కానప్పటికీ, అనేక మంది మూఢభక్తులు మనయొద్ద గలరు; కాని ఇది సత్యము. అట్లైతే ఆయన తన వాక్యమును గూర్చి శ్రద్దవహించును, తన వాక్యమును కాపాడుకొనుటకు దేవుడు బద్దుడైయున్నాడు. దానిని నెరవేర్చుటకు ఆయన దానిమీద తన దృష్టిని కేంద్రీకరించును.
30
ఇప్పుడు ఆకలిగల జనులు... నేడు లోకమునవున్న ఈ మత పిచ్చిలన్ని ఎచ్చట నుండి వచ్చినవని మీకు తెలుసా? నేడు లోకమున ప్రతీ మత పిచ్చి లేచుటకు కారణమేమనగా ఆకలి కలిగివున్న పిల్లలు యుండుటచేత. వారిలో దేవుని పట్ల ఉన్న ఆకలియే అన్యుల దేశములోకి వెళ్ళి అన్యులవలె విగ్రహములను ఆరాధించువారుగా వారిని మార్చి వేసినది. వారు ఆకలిని కలిగివున్న పిల్లలు. ఆలాగు చేయునట్లు వారిని అది మార్చివేసినది. దేవునికొరకు ఆకలిని కలిగియున్న పిల్లలు వాక్యములో ఇది సరియా లేక అది సరియాయని అన్వేషించుచూ వాక్యమును చూచుటకు ప్రయత్నిస్తున్నారు. అందువలనే ఒక్కొక్క మత పిచ్చివాడు విచ్చలవిడిగా దానినుండే పుట్టుకొని వచ్చారు.
నేడు దీనిగుండా అనేక కార్యములు వచ్చెను, యదార్ధమైన హృదయముగల జనులు దేవుని కొరకు ఆకలిని, దప్పికను కలిగివున్నారు. ఈ కాలములన్నిటిగుండా నిత్య జీవమనేది ఎచ్చటో ఒకచోట గలదని పురుషునిలోయున్న లేదా స్త్రీలోయున్న ఏదోకటి ఆరంభము నుండి వారికి చెప్పుచునే ఉన్నది. దానిని విగ్రహములో గలదని కొందరు వెతికిరి. దేవాలయములో గలదేమోనని కొందరు వెతికిరి.
31
కొన్ని వారముల క్రితము రోములో ఉన్న ఒక గొప్ప ప్రార్ధనా మందిరమునకు నేను వెళ్ళితిని, తమ మత గురువులు మరణించిన తరువాత వారిని ఎచ్చట సమాధి చేసెదరో ఆ స్థలమునకు వారు నన్ను తీసుకొని వెళ్ళిరి; ఒక పూల తోటలో పూల మొక్కను నాటునట్లు వారిని అచ్చట పూడ్చి పెట్టిరి. బ్రతికి ఉన్నప్పుడు మనస్సుల్లో ఎన్నో రకపు తలంపులను కలిగిన అనేక వేలమంది అచ్చట పూడ్చి పెట్టబడిరి. కాని పూడ్చి పెట్టబడిన ఆ శరీరము క్రుళ్ళిపోతూ ఆ శరీరమునవున్న పురుగులు దానిని తినివేయును. పిదప పూడ్చి పెట్టిన ఆ సమాధిని త్రవ్వి మరణించిన వారి ఎముకలను సేకరించి, ఒక గదిలో మరణించిన వారి ఫోటోలను, వారి ఎముకలను, వారి చేతి వ్రేళ్ళ చిన్న ఎముకలను ఇంకా మొదలగువాటిని పెట్టి ఉంచిరి. కావున ఆ గోడలనిండా చనిపోయిన మానవుల ఎముకలను తగిలించి పెట్టి వాటితోపాటు వారియొక్క పుర్రెలను ఇంకా అనేక ఎముకలను ఏకముగా కూర్చి కట్టి పెట్టి వుంచిరి. ఆ భవనమంతా ఎక్కడ చూచినా ఆ విధముగానే మానవ ఎముకలతో నిండిపోయి ఉన్నది. చనిపోయి సమాధిలోవున్న ఆ మత గురువులు మరలా వచ్చి అచ్చట పెట్టియున్న వారియొక్క ఎముకలను తీసుకొని వెళ్ళేదరట.
32
నన్ను అచ్చటకు తీసుకెళ్ళిన మార్గదర్శితో పాటు నేను వాటిని గమనించుచుండగా, అచ్చటున్న కొన్ని పుర్రెలు అరిగిపోయి తెల్లగా నున్నగా ఉండెను. అలాగు అవి ఎందుకు ఉన్నాయని గమనించి చూడగా, ఆ పుర్రెలను చూచుటకు వచ్చే జనులు వాటిపై చేతులను పెట్టుటవలన తాము ఆశీర్వాదములు పొందుకుంటామనే తలంపుతో వచ్చే ప్రతీవారు ఆ పుర్రెలపై తమ చేతులను పెట్టి రుద్దెదరు. ఎందుకనగా, తమ మత గురువులు అవతలిగట్టున ఉన్నారని, గనుక అచ్చటెచ్చట నుండో ఆశీర్వాదములను తాము పొందుకొనెదమనే తలంపుతో వారలా చేయుచున్నారు.
అచ్చట ఆ భవనము వెనుక లేదా మందిరము ఉన్న ఆ స్థలమందున్న ఒక ఆసక్తికరమైన విషయము ఉండెను. అదేమనగా, ఒక యుక్తమైన సూక్తి సూచనగా అచ్చట వ్రాయబడి ఉన్నదని నేను తలంచితిని. ఆ సూచన, “ఇప్పుడు నీవు ఉన్న ప్రకారముగానే ఒకప్పుడు నేను కూడా ఉంటిని, అలాగే ఇప్పుడు నేను ఏ విధముగా ఉన్నానో ఒక దినమున నీవు కూడా ఇలాగే ఉందువు” అని వ్రాయబడియుండెను. అది నిజము. మిమ్మల్ని ఆలోచింపజేయునట్లు అందులో ఏదోక విషయము గలదు.
33
కాని ఇప్పుడు, ఆ పుర్రెలను తాకుటవలన ఆశీర్వాదములను పొందుకుంటామని వారు తలంచుచున్నారు. అది దేనిని సూచించుచున్నది? ఒకానొక దినమున ఈ శరీరములో జీవించిన ఎవరో ఒకరు ఎదోక స్థలమునకు దాటి వెళ్ళిపోయిరి, గనుక అటువంటి వారియొక్క పుర్రెలను తాకుటవలన తాము ఆశీర్వాదములు పొందుకుంటామనే తలంపుతో ఆత్మ దాహమును కలిగియున్న ఆ జనులు దానిని చేయుచున్నారు. అది కేవలము మానవ తలంపు. హృదయమందు దాగియున్న ఏదోకటి వెలుపల పిలుచుచున్నది, వాంఛించుచున్నది, దానిని పొందుకోవాలని, ఆకలిని మరియు దప్పికను కలిగి ఏదోక దానిని అన్వేషించుచున్నది.
ఇప్పుడు, ఏదోక సత్యమైన కార్యము ఎచ్చటో ఒకచోట ఉండితీరవలయును, మానవ హృదయములో ఆత్మ దాహమును కలిగి అందుకొరకు అంతగా అన్వేషించుచుండినయెడల, మరియు దానియొక్క మౌలిక ఆరంభమేమనగా, దాహము కలిగియున్న ఆ ఆత్మ దానికొరకు అన్వేషించునప్పుడు, అది ఒకటి సత్యము యొద్దకైనను లేదా ఏదోక అసత్యమైన దానియొద్దకైనను వారిని నడిపించుకొంటూ అదే విధముగా వెళ్ళుచున్నదో మనము చూచుచున్నాము. స్నేహితుడా, అది నిశ్చయముగా అలాగే ఉండితీరవలెను. దానిని నా హృదయమంతటితో భయభక్తులతో నేను చెప్పుచున్నాను. మరియు నేను దీనిని మీ సహోదరుడుగా మీకు చెప్పుచున్నాను.
34
ఎవరి నమ్మకమును నేను కించపరచుట లేదు లేదా మీ మతమును నేను అవమానించుట లేదు. ఇచ్చట ఈ రాత్రి బహుశా, అనేక మతముల ప్రతినిధులు, పలు రకముల సంఘ శాఖలకు చెందిన భక్తిగల జనులు మరియు అనేక మంది గలరు, వారందరిని నేను గౌరవించుచున్నాను.
కాని ఇప్పుడు, రోగుల కొరకు ప్రార్థించుటకు ముందుగా, ఈ చిన్న ప్రాధమిక ఆలోచనను గూర్చి మన దృష్టిని కేంద్రీకరించి చూద్దాము. దానిని గమనించుచూ మరియు దానిని కనుగొని చూద్దాము.
ఇప్పుడు మన అంశమునకు తగిన విధముగా మొదటగా మనము ప్రభువు యేసు చెప్పిన మాటలను చూడబోవుచున్నాము, “మీరు నాలోను మరియు నా మాటలు మీలోను నిలిచియుండినయెడల.” అంతేకాకుండా, “నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు,” అని కూడా యేసు చెప్పెను. మనము నిత్యజీవమును కలిగియున్నాము. దానిని మనము విశ్వాసము ద్వారా అంగీకరించితిమి. మనము దానిని విశ్వసించుచున్నాము.
35
ఇపుడు, యేసు, “నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును; వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” సరియైన తర్జుమా “అధికమైన(more)” అని వచ్చును. కింగ్ జేమ్స్ బైబిల్ తర్జుమాలో “గొప్ప (greater) అని చెప్పబడినది. ”గొప్ప“ అనే పదమునకు భావమేమనగా... ఆ కార్యములు నాణ్యత యందు కాదు గాని, అవి సంఖ్యలో అధికమైనవిగా ఉండును. ఎందుకనగా, ఆయన సర్వలోకమున ఈ కార్యములు చేయుచున్నాడు. ఆయన తన క్రియలను ఇచ్చట చేయగలడు, ఇటలీ దేశమందు చేయగలడు, ప్యారిస్ దేశమున, మరియు ప్రతీచోటా తన క్రియలను చేయగలడు.
“నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక వాటికంటే మరి గొప్పవియు మీరు చేయుదురు. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు అయితే మీరు నన్ను చూతురు, ఎందుకనగా నేను మీతో కూడా ఉండెదను, యుగ సమాప్తివరుకు నేను మీలో ఉందును.”
36
ఇప్పుడు, క్రైస్తవులుగా మనము విశ్వసించునదేమనగా యేసుక్రీస్తు మరణించి... యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమిపై సంచరించుచూ ఇచ్చటున్నప్పుడు ఆయన రోగులను స్వస్థపరచెనని మీరు విశ్వసించుచున్నారా? మీ హృదయమంతటితో ఎంతమంది దానిని విశ్వసించుచున్నారు? ఆయన మృతులను జీవముతో లేపెను. అపవిత్రాత్మలను ఆయన పారద్రోలెను.
“తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతటతాను ఏదియు చేయనేరడు,” అని ఆయన చెప్పెను. పరి. యోహాను 5:19, “మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను...” అని ఆయన చెప్పెను.
“అతడిని నాయొద్దకు తీసుకొని రండి, నేను అతడిని స్వస్థపరచి చూపించెదనని,” తనంతట తానుగా క్రియచేస్తూ, అటు ఇటు తిరిగే మనిషి కాదు ఆయన. కాదు, కాదు, కాదు. కాని ఆయన దేనియొద్దకు వెళ్ళిననగా, తానేమి చేయవలెనో, తన తండ్రి దేనినైతే చూపించునో దానియొద్దకే వెళ్ళి, దానినే ఆయన చేసెను.
37
ఆయన ఈ భూమిమీద ఉన్నప్పుడు... బహుశా, నేను దీనిని మరలా చెప్పుచున్నానేమో, నేను దీనిని మరలా చెప్పాలనే భావముతో చెప్పుటలేదు, కాని దీనిని ఇంతకు ముందే చెప్పాను. ఆయన ఎలాంటి వ్యక్తిత్వముగల మనిషని కొద్ది సేపు ఆయన జీవించిన జీవితమును గూర్చి మనము చూద్దము. అప్పుడే నేడు ఆయన ఏ విధముగా ఉండుననే విషయమును గూర్చి మనకు ఒక అవగాహన కలుగును.
ఆయన భూమిమీద ఇచ్చట ఉన్నప్పుడు, సమస్త దైవత్వమునకు ఆయన పరిపూర్ణమైన సాదృశ్యముగా ఉన్నాడు. శరీరరీతిగా ఆయన దైవత్వము యొక్క పరిపూర్ణుడై ఉండెను. క్రీస్తులో దేవుడు ఉండెను. యేసుక్రీస్తు శరీరము దేవుని యొక్క గుడారముగా మాత్రమే ఉండెను. సర్వశక్తిమంతుడగు దేవుడే ఆ మానవ శరీరమున జీవిస్తూ మరియు అందులో నివాసమై ఉండెను. మీరు దానిని విశ్వసించుచున్నారు, మీరు నమ్ముచున్నారు కదా? మీ రక్షణ కొరకు మీరు దానిని విశ్వసించవలెను.
38
జనులకు తన ప్రేమను వ్యక్తపరచుటకు, ఈ భూమి యొక్క పాపమును తీసివేయుటకు దైవత్వమునవున్న ఆయనే శరీరధారియై ఈ భూమిమీదకు వచ్చెను. ఆ నియమము ప్రకారము ఆయన ఇచ్చటకు వచ్చి, మరణమును తన శరీరమున వహించగలిగెను. వ్యాధులను తన శరీరమందు భరించెను. వాస్తవముగా నీ పై మోపవలసిన నీ శాపమును ఆయనే భరించి, తనపై వేసుకొని, అంతేకాకుండా, మరలా నీవు తండ్రితో సంపూర్ణమైన సహవాసమును కలిగియుండుటకై నియమము ప్రకారము నిన్ను విమోచించుటకై ఆయన ఒక మానవునిగా మరణించెను. అది ఎంతటి అద్భుతమైన విషయము!
అదెంత గొప్ప కార్యమో మరియు ఆయన చేసిన కార్యమేమిటో మన హృదయాలు గ్రహించలేవు. ఎందుకనగా మనము చాలా మంద బుద్దిగలవారము, మన మనస్సులు చాలా మందమైనవి. భయముతో, సందేహముతో మరియు అవిశ్వాసము ద్వారా పక్షవాతము వచ్చినదానివలె అది స్తంభించిపోయి ఉన్నది. కావున మన జీవితములలో పరిశుద్ధాత్మ బహుగా అధిపత్యము వహించుటకు మరియు విశ్వాసపు నాళములలో మరలా జీవమును ప్రవాహింపజేసి, అది క్రియచేయుటకు మనల్ని మనము సమర్పించుకొనేంతవరకు అది ధారాళముగా ప్రవాహింపదు, చూచారా. అప్పుడు, అది నిశ్చయముగా, తండ్రియే చేయు క్రియ అనే విషయమును మనము గ్రహించగలము.
39
కాబట్టి అచేతన స్థితిలో నీ విశ్వాసము నీలోనే ఉన్నది. దీనిని చేయుటకు నాకు తాగినంత విశ్వాసము ఉన్నదో లేదోయని లేదా దానిని చేయుటకు నాకు తగినంత విశ్వాసము ఉన్నదో లేదోయనే దానినిగూర్చి బాధపడనక్కరలేదు. అది అక్కడే నీలోనే అలాగే ఉన్నది. దానిని నీవు చేయగలవు, ఎందుకనగా తండ్రి అలాగు చెప్పెను గనుక నీవు దానిని చేసెదవు. అంతేకాకుండా, అది నీలో జీవించుచున్న వాక్యమై ఉన్నది. మరియు దేవుడు నీలో ఉన్నాడు, క్రీస్తులో ఆయన ఏ విధముగా తనను ప్రత్యక్షపరచుకొనెనో అలాగే ఆయన తనను నీలో ప్రత్యక్షపరచుకొనును. “అది క్రీస్తులో ఉన్నట్లుగా” అని నీవు చెప్పుదవా, అవునండీ.
యోహాను 14:12లో, నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను, గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని,“ ఆయన చెప్పెను. ఆయన ఆ వాగ్దానమును ఇచ్చెను. ప్రతీవారు అది ప్రేరేపించబడుచున్నదని విశ్వసించెదరు.
కొంత కాలమైన తరువాత లోకము నన్ను మరెన్నడు చూడదు, కాని మీరు నన్ను చూతురు, అపొస్తులు కాలము సమాప్తమగువరుకు నేను మీతో ఉండెదను? కాదు గాని, “నేను మీతో కూడ మరియు మీలో యుగ సమాప్తి వరుకు ఉంటానని” ఆయన చెప్పెను. “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు.” హెబ్రీ. 13:8.
40
ఆయన ఈ భూమిమీద ఉన్నప్పుడు ఏ విధముగా ఉండెను? తగ్గింపుతో ఒక దీనునిగా పశువుల తొట్టిలో ఒక మానవునిగా ఆయన జన్మించెను. మనమెరిగిన గొప్ప విద్యర్హత గల... ఆయన ఏ పాఠశాలలో గొప్ప విద్యను అభ్యసించని గొప్పవాడు కాదు. ఆయన తన స్వదేశమునకు వచ్చినప్పుడు, ఆయనకు గల జ్ఞానమును చూచి, ఈయన ఈ జ్ఞానమును ఎచ్చట నుండి సంపాదించుకొనెనో తెలుసుకోవాలని వారు ఆశించిరి. కావున అచ్చటున్న జనులు, ఏ పాఠశాలకు వెళ్ళి దీనిని ఈయన అభ్యసించెను? ఏ కళాశాలకు వెళ్ళి దీనిని పొందుకొనెనని?“ వారు చెప్పుకొనిరి. కాని వారికి దానినిగూర్చి ఏమియు తెలియదు. ”ఆయన ఇచ్చటున్న ఒక వడ్రంగి యొక్క కుమారుడు కదా?“ అని చెప్పిరి.
ఆయన ఏ మానవుని యొద్ద విద్యను అభ్యసించలేదు. ఆయనకు పండ్రెండు సంవత్సరములప్పుడు, కాని ఆయన యొక్క జ్ఞానము... వేద పండితులు ఎరిగిన దానికంటే ఆయన ప్రజ్ఞ విశిష్టమైనది. లోక జ్ఞానమును మరియు ఈ భూలోకపు విద్యా జ్ఞానమును కలుగుయుండుటకు మరియు దేవుని శక్తితో నిండిన బలమైన జ్ఞానమును నీలో నీవు కలిగియుండు దానికి ఎంతో బేధము గలదు.
కావున అటువంటి దైవ జ్ఞానమును జ్ఞానులకు మరుగుపరచి పసి బాలురగు పామరులకు ఆయన బయలుపరచెను. కాబట్టి వేద పాఠశాలల ద్వారా మరియు కళాశాల సెమినరీల ద్వారా దీనిని కనుగొనుటకు మీరు ప్రయత్నించనవసరము లేదు. మీరెన్నడూ దానిని అలాగు కనుగొనలేరు. అది మరుగుపరచబడిన మర్మమై ఉన్నది. కావున దానిని ఎవరికి తెలపాలని దేవుడు సంకల్పించునో వారు మాత్రమే దానిని తెలుసుకుందురు. ఇప్పుడు మనము దానిని గ్రహించినయెడల, అది సత్యమని మనము ఎరుగుదుము.
41
ఇపుడు కొద్దిసేపు ఆయనను గూర్చి గమనిద్దాము. ఈ భూమిమీద ఆయన ఇచ్చట ఉన్నప్పుడు మనము ఆయనను గమనించిన... ఫిలిప్పు అనే వ్యక్తి ఆయన యొద్దకు వచ్చి రక్షణను పొందుకొనెను. ఫిలిప్పు తన స్నేహితుడగు నతానియేలు యొద్దకు వెళ్ళి, దానినిగూర్చి చెప్పెను. ఫిలిప్పు అతనిని ప్రార్థనా కూటమునకు తీసుకొని వచ్చెను, లేదా ఆ సమయమున అచ్చటేమి జరుగుచున్నదో కాని దాని యొద్దకు అతనిని తీసుకొని వచ్చెను. బహుశా, అచ్చటున్న జనులతో కలిసి నిలబడి ఉండెను లేదా ఏదోక సందర్భమున నతానియేలు అచ్చట ఉండెను.
యేసు తన చుట్టూవున్న జనులను చూస్తూ అచ్చట ఉన్న నతానియేలును చూచుటకు ఆయన కన్నులు త్వరపడినవి... అతడు ఎక్కడ ఉన్నాడోగాని, ఒకవేళ ప్రార్ధనా వరుసలోనో లేదా మరెచ్చటైనా అది ఉండవచ్చును, “ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని” యేసు చెప్పెను.
“మంచిది, నన్ను నీవు ఏలాగు ఎరుగుదువు, రబ్బీ,” అని నతానియేలు అడిగేను.
“ఫిలిప్పు, నిన్ను పిలువక మునపే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని” ఆయన చెప్పెను. ఆ మాట విని అతడు ఆశ్చర్యపోయెను.
“రబ్బీ, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువని” నతానియేలు చెప్పెను.
“అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా?” “ఇంతకంటే గొప్ప క్రియలను నీవు చూచెదవని,” యేసు చెప్పెను.
42
ఏదైతే సరియైన మార్గముగా అనుసరించి నడుచుటకు మీకు ఇవ్వబడినదో దాని విశ్వసించి కొనసాగువారికి మాత్రమే గొప్ప వాగ్దానము ఇవ్వబడును. కాబట్టి ఆ వెలుగును మీరు నిరాకరించినయెడల, ఇక మీకు గాఢాంధకారమే మిగులును, చూచారా. కాని వెలుగు ఉన్నప్పుడే...
మనము ఆయనను గమనించుదాము. బేతెస్ధ గుండా ఆయన వెళ్ళి దానిని దాటిపోవుచుండగా అచ్చట అనేకమంది వికలాంగులు మరియు కుంటివారు అచ్చట పడియున్నను వారియొద్దకు వెళ్ళి, “నేను మిమ్మల్ని స్వస్థపరచగలనని,” తనను గూర్చి ఆయన చాటుకోలేదు. వారిలో ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరచలేదు. కాని అచ్చట మంచముమీద, లేదా పరుపు మీద, లేదా ఏదోక దానిమీద పరుండియున్న ఒక వ్యక్తియొద్దకు వెళ్ళి, “స్వస్థతను పొందుకోవాలని నీవు ఆశించుచున్నావా?” అని ఆయన అడిగెను.
43
అతడు గత ముప్పది-ఎనిమిది సంవత్సరములుగా అచ్చట ఆ విధముగానే పడియున్నాడని అతడిని గూర్చి యేసుకు తెలుసని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఇప్పుడది ఆయన నిన్నటి యేసుగావున్న విషయము. అవును కదా? బలహీనుడుగా ఆలాగు అతడు గత ముప్పది-ఏనిమిది సంవత్సరములుగా అచ్చటనే పడియున్నాడని ఆయనకు తెలుసు. “నీవు స్వస్థతను కోరుకొనుచున్నావా?” అని ఆయన అడిగెను.
ఆ బేతెస్థ కోనేరుగుండా ఆయన దాటి వెళ్ళుచున్నప్పుడు రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాళ్ళు, చేతులుగలవారు గుంపులుగా అక్కడ పడివున్నను వారిని ఆయన ఎందుకని స్వస్థపరచలేదు. దానిని ఆయన 19వ వచనమున వివరించెను.
“తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తానేదియు చేయనేరడు, తండ్రి వేటిని చేయునో, వాటినే కుమారుడు అలాగే చేయునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని,” చెప్పెను. నా భావమేమిటో చూచారా?
రక్త స్రావముగల స్త్రీ ఆయన వస్త్రమును తాకినప్పుడు, “నేను నిన్ను స్వస్థపరచానని” ఆయన చెప్పలేదు కాని, “నీ విశ్వాసమే నిన్ను రక్షించెనని,” ఆయన చెప్పెను. ఆమెకు ఆయనయందుగల విశ్వాసమే ఆమె పట్ల సరియైన కార్యము జరిగించినది.
44
అపొస్తులుడగు పేతురు నడచి వెళ్ళుచుండగా రోగుల మీద అతని నీడ పడినపుడు వారు స్వస్థతను పొందుకొనిరి. పేతురు నీడ వారిని స్వస్థపరచలేదు కాని అపోస్తులులయందు వారికిగల విశ్వాసమే వారిని స్వస్థపరచినది. అంతే కాకుండా, దేవునిని తాకగల గురిని వారు కలిగియుండిరి.
ఇప్పుడు, ఆయన ఈ భూమిమీద ఉన్నప్పుడు, ఈ విషయములను వాగ్దానము చేసెను... ఇపుడు గమనించండి. ఆయన అనేక క్రియలు చేసెను, కాని ఎవరిని తాను స్వస్థపరచితినని ఆయన ఎన్నడూ తనను గూర్చి పేర్కొనలేదు. దర్శనము ద్వారా తండ్రి తనకు ఏది చూపించునో దానినే తాను చేయుదునని చెప్పెను. అచ్చట జనుల మధ్య నిలబడివున్న ఒక వ్యక్తిని ఆయన చూచి ఒక ప్రత్యేకమైన మాటను చెప్పగలిగే బలమైన శక్తి ఆయనకు గలదని మనందరికి తెలుసు.
ఉదాహరణకు, ఆయన వస్త్రమును ఆ స్త్రీ తాకినపుడు, ఆయనలో నుండి ఏదోక ప్రభావము బయటకు వెళ్ళినది. తనలో ఏదోక కార్యము సంభవించెనని ఆయన ఎరిగెను. ఇప్పుడు దానిని మనము చూడగలమని నేను నమ్ముచున్నాను.
45
దీనిని ఈ విధముగా మనము చెప్పుకుందాము, యేసు అటువంటి శక్తిని కలిగియుండెను. ఆదాము అతిక్రమించుటకు ముందు మనము ఏ స్థితిలో ఉన్నమో ఆ స్థితికి మనలను మరలా తీసుకొని వెళ్ళుటకు విమోచించే విమోచకునిగా యేసు వచ్చెను. ఆయన ఈ భూమిలో ఉన్నప్పుడు, మొట్టమొదట పరిశుద్ధాత్మ ఆయనలో నివాసమై ఉండి, ఆయన దేవుని కుమారునికి ఒక ఉదాహరణగా వుండెను. పిదప ఆయన అనేకమంది పిల్లలను దేవుని యొద్దకు తీసుకొని రావలసి ఉండెను. ఆయన ఈ భూమిమీద ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ప్రత్యేకమైన విశ్వాసమును కలిగి యుండినప్పుడు, జనుల మధ్య ఆ విశ్వాసమును ఎవరైతే కలిగియున్నారో వారి వైపుకు ఆయన తిరిగి వారినిగూర్చి చెప్పగల శక్తిని ఆయన కలిగియుండెను.
ఒక స్త్రీ ఆయన వస్త్రమును తాకెను. తద్వారా ఆమె స్వస్థతను పొందుకొనెను. గనుక జనుల మధ్యకు మరలా తిరిగి పరిగెత్తుకొని వెళ్ళిపోయెను. మరియు ఆమెకు గల రక్తస్రావమనే వ్యాధినుండి ఆమె విముక్తి పొందుకొని తాను బాగైతిననే అనుభూతి ఆమెకు కలిగెను. కావున ఆమె ఆ జనుల మధ్యనుండి వెనుకకు వెళ్ళి, దూరముగా నిలవబడి యుండెను.
46
యేసు చుట్టూ తిరిగి జనులవైపు చూస్తూ, “ఎవరు నన్ను తాకిరని?” అడిగెను. “నన్నెవరు తాకిరని?” అడిగే అవసరము ఆయనకు లేదు. ఎందుకనగా ఎలాగైనా ఆయన ఆమెను కనుగొనగలడు. కాబట్టి జనసమూహము చుట్టూ ఆయన చూచి, “ఎవరు నన్ను తాకిరని?” అడిగెను. ఆమె అమాయకముగా చూస్తూ అచ్చట నిలబడి ఉండెను. “నీ విశ్వాసమే నిన్ను రక్షించినదని” ఆయన ఆమెతో చెప్పెను. నిన్నటి దినమున యేసు ఏ విధముగా ఉండెనో దానిని అది సూచించుచున్నది.
ఇప్పుడు, నేను మిమ్ములను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆయన ఈ భూమిమీద ఉన్నపుడు, ఆ విధమైన జీవితమునే ఆయన జీవించెను. తండ్రియొక్క క్రియలనే, అనగా ఆ విధమైన క్రియలనే ఆయన చేసెను. ఆయన ఈలాగు చెప్పెను, “దేవుని యొక్క చిత్తమును చేయుటకు నేను వచ్చినయెడల, మరి నేను తండ్రియొక్క చిత్తమునే చేయుదును... ఆయన ఆ చిత్తమునే నెరవేర్చుటకు వచ్చెను... లేదా దేవుని వాక్యమునకు విధేయతను చూపుటకు వచ్చెను. మరియు ఆయనలో దేవుడు నివాసమైయుండి ఆయన యొక్క ఆశలను జనులయందు నెరవేర్చుచుండెను.
47
ఇప్పుడు, ఆయన చెప్పెను, “నేను వెళ్ళిపోయిన పిదప, తండ్రి పరిశుద్ధాత్మ రూపమున వచ్చి మీతో ఉండును మరియు యుగ సమాప్తివరుకు మీలో ఉండును. నేను చేసిన కార్యములను మీరు కూడా చేయుదురు.” అది వాక్యము, వాక్యమే కదా?
నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ రాత్రి నేను చెప్పిన విధముగా రావలసిన రూపమున ఆయన వచ్చినయెడల... నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మరణించిన యేసు... ఈ రాత్రి నిద్రపోవుటకు ముందు దీనిని గూర్చి మీరు ఆలోచించాలని కోరుచున్నాను. దీనిని గూర్చి ఆలోచించండి.
ఆయన శరీరధారిగా ఈ భూమిమీద ఉన్నప్పుడు, రోగులను స్వస్థపరచు శక్తి ఆయనకు గలదు. తండ్రి అనుగ్రహించిన దానిని చేయుటకు, దర్శనములను చూచుటకు శక్తిని ఆయన కలిగియుండెను. సరే, మన నిమిత్తము ఆయన శ్రమను భరించుచూ, మరణమందు పాతిపెట్టబడి, పునరుత్థానమున ఆయనకు గల తన శక్తిని ఆయన కోల్పోయేనా? దేవునికి విధేయతను ఆయన కలిగివుండుట ద్వారా తన శ్రమలవలన, మరణమై పాతిపెట్టబడుటవలన మరియు పునరుత్థారణ వలన దేవుడు ఆయనకు అనుగ్రహించిన శక్తిని ఆయన కోల్పోయేనా? లేదా అంతకంటే ఎక్కువ శక్తిని ఆయన పొందుకొనెనా? అవును.
48
పరి. మత్తయి 19:18, ఇలాగు చెప్పబడెను... లేదా నేను చెప్పుచున్నదేమనగా, పరి. మత్తయి 28:18 అది గలదు. ఆయన, (పునరుత్థానుడైన పిదప), “పరలోక మందును, భూమిమీదను నాకు (నా హస్తమందు) సర్వాధికారము ఇవ్వబడినదని,” చెప్పెను. అటైతే ఆయన తన శక్తిని కోల్పోలేదుగాని, ఇంకా ఎక్కువ శక్తిని పొందుకొనెను. అది నిజమే కదా? అటైతే ఆయన అధికమైన శక్తిని పొందుకొనినయెడల అప్పుడు ఇంకా అత్యధికమైన క్రియలను ఆయన చేయగలడు. అది నిజమే కదా?
ఇప్పుడు, నేడు ఆయన సంఘములో జీవించుచున్నాడు. మీరు దానిని విశ్వసించుచున్నారా? ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా వున్నాడు, ఆయన ఏ క్రియలనైతే చేసెనో, అదే క్రియలను మీరును చేయుదురనియు మరియు ఇంకా అధికమైన క్రియలు చేయుదురని ఆయన వాగ్దానము చేసెను. అది సత్యమని మీరు దానిని విశ్వాసించుచున్నారా? అటైతే ఈ రోజు రాత్రి యందు ఆ విశ్వాసము కొరకు ఎటువంటి ఆధారమును మనము కలిగియున్నాము.
మొదట, స్నేహితులారా ఇచ్చటున్న మీలో కొందరు దైవీక స్వస్థతను నమ్మకపోవచ్చు, దేవుని శక్తిని మీరు నమ్మకపోవచ్చును. మొదటగా, సమస్త పరిస్థితులను మీ స్వాధీనములో ఉంచుకొనుటకే మీరు ఇచ్చట జన్మించితిరి.
49
పాపము... సేవకులను నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. రోగమునే ఎదుర్కొనలేకపోతే పాపమును ఏ విధముగా మీరు ఎదుర్కొనగలరు? కావున వ్యాధిని ఎదుర్కొనకుండా అంతకన్నా గొప్పదైన పాపమును మీరు ఎదుర్కొనలేరు. పాపము యొక్క లక్షణమే వ్యాధి. వ్యాధిని మరియు దాని సమస్త లక్షణములను ఎదుర్కొనకుండా మీరు పాపమును ఎదుర్కొనలేరు. ఎందుకనగా పాపమే ప్రాముఖ్యమైనది... ఆ పాపమే సర్పము యొక్క తలయైయున్నది. కాబట్టి మొదటగా దాని తలను చంపండి, దాని తలను చంపినప్పుడే వాస్తవముగా మీరు దాని శరీరమును చంపినట్లగును. మీరు తలను చిదకగొట్టి చంపకుండా దాని శరీరమును చంపలేరు.
కాబట్టి ఆయన మనలను స్వస్థపరచుటకు మాత్రమే వచ్చి మనలను రక్షించనియెడల అప్పుడు రక్షణను గూర్చి వేరేవిధముగా చెప్పవలసి ఉండును. కాని మన శిరస్సగు ఆయన మన ఆత్మ రక్షణ కొరకు మనతో వ్యవహరించుటకు వచ్చెను. అదే మన శిరస్సు. కాబట్టి మీరు తలను చంపివేసినప్పుడు, శరీరము యొక్క మిగిలిన భాగములన్నిటిని మీరు చంపగలరు. కావున మీరు శరీరముతో వ్యవహరించలేరు...
50
యేసు కేవలము పాపము నుండి మాత్రమే మనలను విమోచించుటకు రాలేదు, కాని వ్యాధుల నుండి లేదా దానికి సంబంధించిన వాటన్నిటి నుండి, అంతే కాకుండా మరణము నుండి కూడా మనలను విడిపించుటకు ఆయన వచ్చెను. మరియు మనము మరణించము. ఒక క్రైస్తవునికి మరణముగలదని చెప్పుచున్నట్లు ఏ లేఖనము పరిశుద్ధ గ్రంథమున లేదు. మనకు నిత్యజీవము ఉన్నది మరియు మనము మరణించలేము. అంత్యదినములలో శరీరమును పునరుద్ధరించెదనని దేవుడు వాగ్దానము చేసెను. ఆ నిశ్చయత మీదనే మనము విశ్రాంతి పొందుచున్నాము.
ఇప్పుడు రక్షణ, సంతోషము మరియు ఆనందము మనకు గలదు. అదేమనగా ఏదోక దినమున మనము పొందుకోబోయే సంపూర్ణమైన విమోచన మరియు రక్షణ యొక్క సంచకరువు మనకు గలదు. అంతేకాకుండా, మనము పొందుకోబోయే అక్షయమైన మన శరీరముల యొక్క సంచకరువు వంటి దైవీక ప్రేమను మనము కలిగియున్నాము.
మనము ఆయన మరణము యొక్క గుణాలక్షణములను ఈ పాత భౌతిక, పాపపు మరియు శపించబడిన శరీరమున పొందుకొన్నప్పుడు, అది మరలా వెంటనే మనల్ని జీవమునకు తీసుకొని వెళ్ళును. మరలా తీసుకొని వచ్చిన ఆ జీవమే నదికి అవతల తీరమున ఒక దేశముగలదని మనకు రుజువుపరచుచున్నది, ఏ వ్యాధులు లేని, ఏ దుఃఖములు లేని, మరణము లేని పరిపూర్ణమైన స్థలమగు ఆ ఏదేనుకు మరలా మనము ఏదోక దినమున వెళ్ళెదమని అది రుజువుపరచుచున్నది. నా స్నేహితులారా, ప్రభువు మిమ్ములను ఆశీర్వదించును గాక.
51
చికాగోలోని ప్రజలకు మరియు దాని చుట్టూవున్న జనులకు ఇపుడు నేను చెప్పే నా వాదనేమనగా, యేసుక్రీస్తు మరణము నుండి పునరుద్ధాణుడైనని, ఆనాడు ఆయన చేసిన అదే క్రియలు నేడు కూడా అట్లే చేయుచున్నాడని చెప్పుచున్నాను.
అలాగని ఇప్పుడు నేను దేనినైతే నమ్మి వెంబడించుచున్నానో దానిలో మీరు కూడా వచ్చి చేరమని నేను మీకు చెప్పుటలేదు. నేను ఏ సంఘమునకు చెందినవాడిని కాను. అలాగే స్థాపించబడిన ఏ సంఘ శాఖకు చెందినవాడను కాను. ఏ సంఘ శాఖకు వ్యతిరేకముగా నాకు ఏమియూ లేదు.
కాని మీ యొద్ద దీనిని మాత్రమే నేను అడుగుచున్నాను. సంఘ శాఖకు చెందిన ఒక క్రైస్తవునివలె మాత్రమే ఉంటు దానిని విశ్వసించుచున్నానని బహిరంగముగా నీవు చెప్పుటవలన, నీవెన్నటికి మర్మమైన కార్యమును గ్రహించలేవు. మీ సంఘము లోనే మీరు ఉండండి, కాని దేవుని ఆత్మతో మరలా తిరిగి-జన్మించిన అనుభవమును కలిగినవారుగా ఉండండి, అప్పుడు మీ అంతరాత్మలో, మీ మనస్సులో, మీ ఆత్మలో ఆ ప్రవాహము ఏ అడ్డు లేకుండా ప్రవహించునట్లు మీ గొట్టములను తెరచి మీరు ఆ సంఘ శాఖలో ఒక క్రైస్తవునిగా ఏమై ఉండవలెనని దేవుడు ఆశించునో అదే విధమైన ఒక పరిపూర్ణమైన స్థితికి ఎదుగునట్లు చేయును. మరియు మీరు మంచి కార్యములను చేయుదురు. మీ సంఘ కాపరి ఆత్మసంబంధమైన వ్యక్తియైనయెడల, అతడు నిన్ను అభినందించును.
52
ఇప్పుడు ప్రభువగు యేసు రంగముపై వచ్చును గాక. నేను ఎక్కువగా అనేక కార్యములను గూర్చి మాట్లాడితిని. కాని పరిశుద్ధ గ్రంథమున మనకు ఒక ఆధారము లేదా మూలముగలదని మీరెరుగవలెనని నేను కోరుకొనుచున్నాను. ఇప్పుడు నేను చెప్పబోవు విషయము మీరెల్లప్పుడూ వినే కార్యములకంటే భిన్నముగా ఉండును. కొన్ని దినములకు ముందు జరిగిన రాత్రి కూటములలో ఇచ్చటున్న జనులు ఈ విధముగా తలంచి ఉండవచ్చు... దీనిని ముగించబోవు సమయమున ఇది నా మనస్సులోకి వచ్చుచున్నది. కాబట్టి నేను దీనిని చెప్పి తీరవలయును.
ఒక ప్రత్యేకమైన సంఘ శాఖ సంఘమునకు చెందిన కొంతమంది మనుష్యులు దైవీక స్వస్థతను నమ్మరు. ఒకప్పుడు నేనొక చిన్న ప్రార్థన కూటమున ప్రార్ధించుచుంటిని. అచ్చటున్న ఒక వ్యక్తి నన్ను పట్టుకొని, “నీవు ఒక దేవుని సేవకుడివైతే, ప్రభువు కొరకు దేవుని మహిమ నిమిత్తము, దేవుని మహిమార్ధము కొరకు నా కళ్ళ యెదుట నేను చూచుచుండగా ఇచ్చటున్న ఈ వికలాంగురాలగు బాలికను స్వస్థపరచి, నా ముందు ఈ బాలికను పైకి లేచి నిలబడునట్లు చేయుము, అప్పుడు నేను దానిని నమ్మెదను” అని చెప్పెను.
53
కావున, మీరు చూడండి, అతడొక సేవకుడైయుండి కూడా, అతడు నశించి పోయెను. “సిలువ నుండి క్రిందికి దిగిరా, అప్పుడు మేము నిన్ను నమ్మెదము...” అని పరిహసించి మాట్లాడిన అదే ఆత్మయని అతడు దానిని గ్రహించలేదు.
అచ్చట ప్రక్కన గదిలో ఒక పాపి కూర్చొని ఉండెను. అతడిని అచ్చటకు తీసుకొని వెళ్ళాము. అప్పుడు, “అయ్యా, ఇదిగో ఇచ్చటున్న ఈ దీన పాపిని, పాపములోవున్న ఈ పాపిని, దేవుని యొక్క మహిమ కొరకు తీసుకొని ఇతని ఆత్మను ఈ రాత్రి రక్షించుము, అప్పుడు నేను ఈ బాలికను స్వస్థపరచెదనని,” అతనితో నేను చెప్పాను. అది నిజము. “నీవు ఇతడిని రక్షించుము, నేను ఈమెను స్వస్థపరచెదనని,” నేను చెప్పాను. అది సాధ్యమవ్వదు. అది నిజము. నిశ్చయముగా. అది నిజము. ఖచ్చితము.
అతడు ఆ వ్యక్తిని రక్షించలేడు, ఆ బాలికను నేను కూడా స్వస్థపరచలేను. కాని యేసుక్రీస్తు ఆ వ్యక్తిని రక్షించగలడు మరియు యేసుక్రీస్తు ఆ బాలికను స్వస్థపరచగలడు. అది నిజము. ఆ విధముగా చేయుటకు మానవునిలో ఏమియు లేదు. కాని మనల్ని ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనద్వారా మాట్లాడి, దేవుని యొక్క ప్రత్యక్షత మన పెదవుల ద్వారా బయలు వెళ్ళునట్లు ఆయన యొక్క సాధనములుగా మాత్రమే మనము ఉన్నాము. మరియు ఏ దైవీక వరమైనా...
54
ఇచ్చటున్న సేవకులలో అనేకులు, “లేచి నిలబడి, వేగముగా దూసుకుపోవునట్లు, దద్దరిళ్ళునట్లుగా ఒక ప్రసంగమును నేను చేస్తాను,” అని చెప్పుకొనుటకు ఇష్టపడరు. కాని నా ప్రసంగము ఆత్మ ప్రేరేపణ ద్వారా వచ్చినదని చెప్పుకొనుటకే నీవు ఆశించెదవు. దానిని నేను నమ్ముచున్నాను. ఖచ్చితముగా. మంచిది, మీరు వర్తమానమును ప్రసంగించుటకు, మిమ్మల్ని ఉత్తేజపరచుటకు పరిశుద్ధాత్మ నుండి అది రావలసియున్నది. అది ఆ విధముగా రానియెడల మీరు ఎన్నటికి ఒక జయప్రధమైన వర్తమానము ప్రసంగించలేరు.
చార్లెస్ ఫెన్నీ మరియు మెదలగు అనేకుల ప్రసంగములను వెంబడించినవారు గలరు, అయితే పరిశుద్దాత్మ ప్రేరేపణతో లేచి నిలబడి ప్రసంగించినపుడు... మొన్న రాత్రి అతడు అదే వర్తమానమును ప్రసంగించగా, వందలకొలది జనులను బలిపీఠము యొద్దకు నడిపించెను, చూచారా.
వాటి మధ్య అంత భేదము గలదు. ఆ వర్తమానము ఆత్మ ప్రేరేపణ ద్వారా రావలెను. ఆ కార్యము పరిశుద్ధాత్మ అభిషేకము నుండి రావలెను. కావున స్వస్థత కూడా ఆ విధముగానే జరుగవలెను. జనులు పరిశుద్ధాత్మతో ఉత్తేజింపబడి విశ్వసించునట్లు ఏదోక కార్యము దైవీక వరము ద్వారా జరుగవలసియున్నది.
55
ఇప్పుడు, ఈ రాత్రి సన్నివేశమున యేసు వచ్చి, ఇచ్చటయున్న ఈ పరిశుద్ధ గ్రంధములో ఆయన చేసిన అదే కార్యములను ఆయన చేయగలడనే నా వాదమును సత్యమని ఆయన రుజువుపరచును. నేను సత్యము కాదు గాని ఆయనే సత్యమని తెలుపుటకు నేను ప్రాతినిధ్యము వహించుచున్నాను.
ఏ వ్యక్తియైనా మీ యొద్దకు వచ్చి తనకు ఇష్టమైనదేదైనా మీ దగ్గర చెప్పవచ్చును. మీరు దానిని నమ్మవలసిన అవసరములేదు. కాని ఒక వ్యక్తి మీ యొద్దకు వచ్చి ఒక కార్యమును చెప్పినయెడల, ఆ మాటలు వాక్యానుసారమైనవని, దేవుడు వాటిని సమ్మతించి మరియు అది సత్యమని నిరూపించిన, అప్పుడు మీరు దానిని విశ్వసించుట యుక్తమైన కార్యము. అట్లు దానిని మీరు చేయుట మంచిదగును. ఇప్పుడు మనము ప్రార్ధించునపుడు దేవుడు మనలను ఆశీర్వదించును గాక.
తండ్రీ, ఇపుడు ఎక్కువ సేపు మాట్లాడితిని, ప్రజలు ఇచ్చట ఉండుటకు గల ఉద్దేశ్యమును వారు చూచుటకు ప్రయత్నించుచుండగా నేను ఇంచుమించు నలువది నిమిషములు మాట్లాడితిని. వారు ఏదో ఉద్యోగమును చేయుచు, మరలా రాత్రి ఇంటికి వచ్చి, భోజనము భుజించి తర్వాత నిద్రపోయి మరలా ఉదయము లేచి వార్తా పత్రికను చదివి, మరలా అనుదినము ఎప్పటిలా ఉద్యోగముకు వెళ్ళుట మాత్రమే వారియొక్క ఉద్దేశ్యము కాదు. అలాగే ఆదివారము ఉదయము సంఘమునకు వెళ్ళి, ఒక వర్తమానము విని, గృహమునకు తిరిగి వెళ్ళి, మరలా ఉద్యోగమునకు వెళ్ళుట కొరకు మాత్రమే కాదు గాని, తండ్రి, మేము మీ సాధనములుగా ఉండుటకై నీవు వారిని విమోచించితివి. సరైన మనస్సుగల మానవుడు సమస్త విషయములలో దేవునియందు విశ్వాసమును కలిగియుండును.
56
ఓ, తండ్రీ, ఈ రాత్రి మీ పరిశుద్ధ సన్నిధిలో మమ్ముల్ని ఉజ్జీవింపజేయుము, మీ కుమారుని పంపించి, లోకము ఇక ఆయనను చూడదు, అయినప్పటికీ మేము ఆయనను చూచెదము, ఎందుకనగా ఆయన మాతో ఉండుటవలన, యుగ సమాప్తి వరకు మాతో ఉండేదనని ప్రభువు యేసు మాకు వాగ్దానము చేసెను. మరియు ఈ రాత్రి మేము ఆయనను విశ్వసించునట్లుగా చేయుమని ప్రార్థించుచున్నాము.
ఇచ్చట గదిలో కూర్చొనియున్న ప్రేమగల ఈ జనుల సమూహము, ప్రభువు స్వయముగా తానే ఇచ్చట ప్రక్కనే నిలబడియున్నాడని విశ్వసించుచున్నారు. ఎందుకనగా తన అనుమతి లేకుండా ఒక్క పిచ్చుక కూడా వీధిలో నేలమీద పడదనే విషయమును మేము ఎరిగియున్నాము.
దేనినైతే ఆయన వాగ్దానము చేసెనో దానిని నేరవేర్చుటకు ఆయన ఇచ్చట ఉన్నాడని మేము ఎరిగియున్నాము.
తండ్రీ, బలహీనుడైన నన్ను, ఏ అర్హతలేని పాత్రనగు నన్ను మీయొద్ద సమర్పించుకొనుచున్నాను, ప్రభువా. ఈ రాత్రి నాలోవున్న ప్రతీ ద్వారమును తెరవమని ప్రార్థించుచున్నాను. నా ద్వారము మాత్రమే కాదు గాని ఈ రాత్రి ఈ భవనములోవున్న ప్రతీ వ్యక్తియొక్క కవాటములను(ద్వారములను) తెరువుము. వారి హృదయముల ఊట తెరువబడును గాక. ఆయన యొక్క మహిమనే అలలు ఒకదాని తరువాత ఒకటి ప్రవాహించి వచ్చునట్లు పరిశుద్ధాత్మ ప్రవాహము పొంగి పొర్లి వచ్చును గాక. మరియు జనులు, యేసు మరణము నుండి పునరుద్దానుడై ఈ రాత్రి మన మధ్యలో నిలబడియున్నాడనే వాగ్దానమును మేల్కొని తెలుసుకొందుము గాక.
57
ప్రభువా, దీనిని అనుగ్రహించుము, నన్ను మీకు సమర్పించుకొనుచుండగా, దేవుని ప్రత్యక్షతను మరియు ఈ భూమిపై నీవు ఉన్నప్పుడు రోగులను స్వస్థపరచుచూ ఏ విధమైన కార్యములను చేసితివో అదే కార్యములను మేము కూడా చేయునట్లుగా మీరు మాకు దానిని అనుగ్రహించుమని అడుగుచున్నాము. తమ గృహమునకు ప్రజలు ఆనందముతో వెళ్ళునట్లుగా ఈ రాత్రి దీనిని అనుగ్రహించుదురు గాక! గ్రుడ్డివారు చూపును పొందుకొనెదరు గాక! చెవిటి వారి చెవులు తెరువబడును గాక! మూగవారు మాట్లాడుదురు గాక! వికలాంగులు స్వస్థతనొంది బాగై వెళ్ళుదురు గాక!... [టేపులో ఖాళీ గలదు.]
ఇప్పుడు ఎవరి దగ్గర జె-సంఖ్య-1 గలదు. చూద్దాము. కొంతమంది జనులను మేము క్రమ వరుసలోకి వచ్చునట్లుగా చేసెదము. జే - సంఖ్య-1. ఈ చిన్న కార్డు వెనుకవున్న దానిని చూడండి. దాని వెనుక భాగమున ఒక సంఖ్య ఉండును. ఎవరి దగ్గర జే - సంఖ్య-1 గలదు. మీరు మీ చేతిని పైకెత్తి చూపించగలిగినట్లైతే, మీ చేతిలో దానిని చూపించగలరా! 2వ సంఖ్య ఎవరి దగ్గర గలదు? మీ చేతిని పైకెత్తి చూపించగలరా! 2వ సంఖ్య, 3వ సంఖ్య, రెండవ సంఖ్య.
సరే ఇచ్చట వరుస క్రమములోకి రండి 1,2,3 సంఖ్యలు. ఎవరి దగ్గర 4 గలదు? దానిని పైకి చూపించండి. 4? ఆ స్త్రీ యొద్ద గలదా! అచ్చటున్న ఆ స్త్రీ. 5వ సంఖ్య. ఎవరి దగ్గర 5 గలదు?అయ్యా, ఇచ్చట గలదు. 6వ సంఖ్య. 6వ సంఖ్య ఎవరి దగ్గరగలదు? అచ్చటున్న ఆ స్త్రీయొద్ద గలదు. సరే మంచిది. 7వ సంఖ్య, 7వ సంఖ్య? సరే మంచిది. ఆ స్త్రీ. 8వ సంఖ్య, ఎవరి దగ్గర 8వ సంఖ్య గలదు? ప్రార్థనా కార్డు సంఖ్య 8? నీ దగ్గర గలదా? 8. సరే మంచిది. సంఖ్య 9. ఎవరిదగ్గర 9వ సంఖ్య గలదు? ప్రార్థనా కార్డు సంఖ్య 9. నీ కార్డును పైకెత్తి చూపించగలరా?ప్రార్థనా కార్డు సంఖ్య 9 అయ్యా?
ఒక్క నిమిషము ద్వారపాలకులు క్రిందకి వెళ్ళి వారికి సహాయము చేయండి. 10వ సంఖ్య. ఎవరి దగ్గర సంఖ్య గలదు? స్నేహితుడా, ఆ కార్డును పట్టుకొని చూపించండి. ఆ స్త్రీ సరే మంచిది. సంఖ్య 11, ఎవరి దగ్గర 11వ సంఖ్య కార్డు గలదు? అచ్చట ఉన్నది. సరే. సంఖ్య 12, 12వ కార్డు సంఖ్య నీ కార్డును పైకెత్తి చూపించగలరా? అచ్చటున్న స్త్రీయొద్ద గలదు. సరే మంచిది. సంఖ్య 13, ఎవరి దగ్గర 13వ సంఖ్య కార్డు గలదు? మీ దగ్గరవున్నయెడల, మీ చేతిని పైకి ఎత్తండి. ప్రార్థనా కార్డు సంఖ్య 13, మీ చేతిని పైకి ఎత్తగలరా! అది ఎవరి దగ్గరవున్నా సరే? వారిని నేను చూడలేకపోవుచున్నానా?
58
అచ్చటున్న వారెవరో తమ ప్రక్కన వున్న వారివైపు చూచుచున్నారు. ఒకవేళ అతడు చెవిటివాడై యుండచ్చును. ఎవరివలనైన తమ ప్రార్థనా కార్డును చూపించలేక పోయినయెడల... మీ ప్రక్కనయున్న వారిని గమనించండి, వారివైపు చూడండి. ఒక వేళ ఎవరైనా పక్షవాతముగలవారు పైకి లేచి నిలబడకపోవచ్చును. ప్రార్థనా కార్డు సంఖ్య -13, అది ఇచ్చట గలదా?
మీ ప్రార్థనా కార్డుల సంఖ్యను గమనించండి. మీ ప్రక్కనవున్న వారి కార్డు సంఖ్యను చూడండి. ఎవరి దగ్గరైనా... ఆ మంచము మీద ఒక స్త్రీ అచ్చటగలదు. అమ్మా, మీ ప్రార్థనా కార్డు పైగల సంఖ్యను మీరు చూడగలుగుచున్నారా? అది 13వ సంఖ్యేనా? సరే, 13, ఎవరి దగ్గరా 13వ సంఖ్య కార్డు లేదా? ప్రార్థనా కార్డు సంఖ్య -14. ఎవరి దగ్గర 13వ సంఖ్య కార్డు గలదు? ఎవరి దగ్గరైనా 13వ సంఖ్య కార్డు గలదా? మీ చేతితో దానిని పట్టుకొని చూపించగలరా? 14? 15? ప్రార్థనా కార్డు 15, మీ చేతిని పైకెత్తి చూపించగలరా? 16? ప్రార్థనా కార్డు 16, మీ చేతిని పైకెత్తి చూపించగలరా?17? సరే, మంచిది. 17, 18 మీ చేతిని పైకెత్తి చూపించగలరా? ప్రార్థనా కార్డు 18, ఎవరి దగ్గర ప్రార్థనా కార్డు గలదు? మీ చేతిని పైకెత్తి చూపించగలరా?
అది ప్రార్థనా కార్డు సంఖ్య-18... నేను సంఖ్యలను పిలుచునపుడు మీ ప్రార్థనా కార్డుల సంఖ్యను గమనించండి. ఒకవేళ కొంతమంది లేచి నిలబడలేకపోవచ్చును. కొంతమంది చెవిటివారైయుండుటవలన వారు వినలేరు. కావున వారి ప్రార్థనా కార్డు సంఖ్యను పిలిచినపుడు వారికి తెలియదు. 18, 19, ఎవరి దగ్గరైనా ప్రార్థనా కార్డు సంఖ్య 19 గలదా? మీ చేయిని పైకెత్తండి. ప్రార్థనా కార్డులు 18 మరియు 19? 20? ఒకవేళ నేను ఇంకా ముందుకు వెళ్ళవచ్చునేమో మరియు చాలా... సరే, మనము ప్రయత్నిద్దాము....సరే మంచిది. అయ్యా, మంచిది.
59
ఇప్పుడు మనము... ఒకవేళ ఇంకా ఎవరైనా ఉన్నారేమో మనము కొద్ది నిమిషములు వేచి చూద్దాము... కొద్ది సేపు ఇంకా కొంత మందిని పిలువవచ్చును. అలాగు పిలుచుచుండగా మీ చూట్టూవున్న వారి ప్రార్థనా కార్డుల సంఖ్యను గమనించండి. ఆ విధముగా ముందుకు కొనసాగిపోదాము. ఒకవేళ వారు వచ్చినయెడల 13, 18 మరియు 19వ సంఖ్యలుగలవారు రావాలని నేను నమ్ముచున్నాను. 20వ సంఖ్య? 20? సరే. ఒకవేళ వారు వచ్చినయెడల వారు వెలుపల నుండి లోపలికి వచ్చినయెడల వారిని ఈ వరుసలో నిలబెట్టండి.
ఇపుడు, ఎంతమంది దగ్గర ప్రార్ధానా కార్డులు లేకుండా, ఈ రాత్రి ఎంతమంది వ్యాధితో బాధపడుచూ ఇచ్చట ఉన్నారు. వారు ప్రార్థనా కార్డును పొందుకోవడానికి అవకాశము లేకపోయెను. మీ దగ్గర ప్రార్థనా కార్డు లేకపోయినను మిమ్మల్ని దేవుడు స్వస్థపరచునని మీరు నమ్ముచున్నారా? అట్లు ఆశించువారు మీరు నమ్ముచున్నారా? అట్లు ఆశించువారు మీరు మీ చేతులను పైకెత్తవలెనని నేను కోరుకొనుచున్నాను. ఇప్పుడు మీరు మీ చేయిని పైకి ఎత్తండి, అలాగే, మంచిది.
60
ఇపుడు, నేను ఒకదానిని మీకు చెప్పెదను. నా ప్రియమైన ప్రేమగల స్నేహితుడా, నీవు దీనిని చేసినయెడల, ఇచ్చటున్న సహోదరుడు బ్రెన్హాం అగు నన్ను మాత్రము మరచిపోయి, చూచారా? ప్రభువు యేసుక్రీస్తే ఇచ్చట ఉన్నాడని మాత్రము నీవు విశ్వసించినయెడల, నేను కేవలము నీ సహోదరుడిని మాత్రమే... ఇచ్చట యేసు ప్రభువు మాత్రమే ఉన్నాడని నీవు విశ్వసించుచూ, నీవు అలాగే కూర్చొని దానిని మాత్రము విశ్వసించుము, దీనిని నీవు నా కొరకు చేసినయెడల...
నీవు అలాగే కూర్చొని, “ప్రభువు యేసు, అది సత్యమని నేను యదార్ధముగా విశ్వసించుచున్నాను. ఈయన చెప్పినది సత్యమని నేను విశ్వసించుచున్నాను, ఎందుకనగా దానిని మీ పరిశుద్ధ గ్రంధములో నుండి చదివి ఆయన చెప్పెను. అది సత్యమని నేను విశ్వసించుచున్నాను. ప్రభువా, ఇప్పుడు ఆయనకు నేనెవరో తెలియదు, కాని రక్తస్రావముతో బాధపడుచున్న ఆ స్త్రీకి లేదా గ్రుడ్డివాడగు... యెరికో ద్వారము యొద్ద వున్న బర్తమయి వైపు నీవు తిరిగి చూచి, ”నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినది,“ అని చెప్పినట్లుగా.
“ఈయనను నా వైపుకు త్రిప్పి, దీన యోగ్యతలేని ఆ వ్యక్తిలో నుండి ప్రభువగు యేసు మీరు నాతో మాట్లాడినయెడల. కావున బ్రెన్హాం గారు మీ యొక్క ప్రతినిధిగా ప్రాతినిధ్యము వహించినయెడల, అట్లయితే మిమ్మల్ని అడుగుచూ మరియు నేను ప్రార్ధించుచున్నాను. దానిని నేను నమ్ముచున్నాను. నేను స్వస్థతను పొందుకోవాలని ఆశించుచున్నాను. బ్రాన్హాంగారు నావైపు తిరిగి నేనెరుగునట్లుగా ఏదోక దానిని చెప్పినయెడల, దానిని విశ్వసించుటకు తగినంత విశ్వాసమును నీవు నాకు అనుగ్రహించుము,” చూచారా. లేదా ఆ విధముగా దేనినైనా చేయుము“ అని అడుగుము. కాబట్టి అటువంటిదేదైనా సూచనను లేదా ఏదైనా ఒకదానిని పొందుకొనునట్లు నీవు ప్రార్థన చేయుచూ అడుగుము.
61
ఇప్పుడు మనకు సూచక క్రియలు అవసరము లేదు. బలహీనులు మరియు వ్యభిచారపు సంతతి వారే సూచక క్రియలను వెదెకెదరని జ్ఞాపకముంచుకోండి. కాని స్నేహితుడా, మనము సహజాతీతమైన కార్యముల నుండి తొలిగిపోవునంతగా మనమెంతగానో విద్యాజ్ఞానమును కలిగియున్నాము. అది నిజము.
“నమ్మినవారివలన ఈ సూచక క్రియలు వెంబడించునని,” యేసు చెప్పెను. మనము సూచక క్రియలను ఎన్నడూ వెదుకుట లేదు. కాని దేవుడు ఎల్లపుడూ సూచక క్రియలతో క్రియ చేసెను. ఆది నుండి ప్రకటన వరకు, అనగా ఆదికాండము నుండి ప్రకటన గ్రంధము వరకు పరిశుద్ధ గ్రంధమందు సంఘము కాలముగుండా ఎడతెగకుండా సూచక క్రియలను గూర్చి చెప్పబడియున్నవి, అంతే కాకుండా, ఎచ్చట సూచక క్రియలు ఉండవో అచ్చట దేవుడు లేడు.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను. తండ్రి తనకు కనపరచని ఏ అద్భుత కార్యములను ఆయన చేయలేదని మరియు ఏ విధముగా ఫిలిప్పుతో ఆయన చెప్పెనో, పరిశుద్ధ గ్రంధమున యేసుక్రీస్తు యొక్క జీవితమును గూర్చి ఏ విధముగా వ్రాయబడివున్నదో మీరెరుగుదురు. ఆ బావియొద్ద ఆ స్త్రీతో ఆమెకు ఎంతమంది భర్తలు గలరని ఆయన చెప్పెను. ఆ మాటలు ఆ స్త్రీని ఉలిక్కిపడునట్లు చేసెను.
62
అట్లయితే యేసు ప్రభువు ఈ రాత్రి సమయమున మనవైపు తిరిగి అవన్నీయు సత్యమని రుజువుపరచినయెడల, ఆయనను మీ ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించెదరా! మీరు అట్లు అంగీకరించిన, “అప్పుడు నేను విశ్వసించెదను” అని మీ చేతులను పైకెతి చెప్పండి. ఆ క్రియలు మరలా సంభవించుటను నేను చూచినప్పుడు నా సందేహములన్నింటిని నేను పారద్రోలి విశ్వసించెదను. ఇప్పుడు ఆ కారణముచేత యేసు ప్రభువు...
ఇప్పుడు, మీరు గమనించండి, ఇండియాను గూర్చి నేను నిన్నటి రాత్రి మీకు చెప్పాను. సరిగ్గా ఈ గడియకు అదెటువంటి ఒక సవాలుగా ఉన్నదో చూడండి. ఆ కూటమున ఆయనేమి చేయబోవుచున్నాడో దానిని నేను చూచునట్లుగా ప్రభువు ఏదోక దానిని అనుగ్రహించువరకు నేను వేచియుందును. పిదప ఆ సవాలును గమనించండి, చూచారా. అదేదో ఆయన సవాలని కాదు గాని... కాని తాను ఏదైనా ఒకటి చేసెదనని దేవుడు మనతో చెప్పినపుడు, మనము దానిని విశ్వసించెదము.
63
ఈ పరిశుద్ధ గ్రంధము సత్యమని మనము నమ్ముచున్నాము. కాని దీనికి వేరొక ప్రక్కగా మనము హద్దు దాటకూడదు. మనము చేయవలసినదేమనగా... దానిని చెయ్యుటకు నా శక్తి క్రింద అదెన్నడూ లేదు. ఏ మానవుని శక్తి క్రింద అదెన్నడూ లేదు. కాని దేవుని శక్తి క్రింద అది ఉన్నది. దేవుడు తనను ఒక వ్యక్తికి ప్రత్యక్షపరచుకొనుచూ, ఏదోక మార్గమున అతడికి విశ్వాసమును అనుగ్రహించును.
ఆయన నిన్ను స్వస్థపరచునని ఇచ్చట ఆయన వాక్యము చెప్పుచున్నది. ఆయన నిన్ను స్వస్థపరచుననే ప్రత్యక్షతను నీకిచ్చినయెడల, నీవు ఈ ప్రార్థనా వరుసలోకి రావు. ఇది నీకు అవసరము ఉండదు. ఎందుకనగా, అది ఇదివరకే ముగించబడిన కార్యము. ఆయన దానిని చేయునని నీకు ప్రత్యక్షపరచినప్పుడు, దానిని ఆయన చేయును. దేవుని వాక్యము యొక్క ప్రత్యక్షత కంటే వేరేదియు ఇక నీకు అనవసరము.
ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక... పియానో వాయించేవారు అచ్చట వున్నయెడల, నా ప్రియమైన సహోదరుడా, ఒక చిన్న పాటను మెల్లగా వాయించుము, “కేవలము నమ్ముము,” నీకు ధన్యవాదములు. ఇప్పుడు, మనము కొన్ని నిమిషములు నిశ్శబ్దముగా ఉండెదము.
64
సాధారణముగా ప్రార్థనా వరుస — ఇది ఎంతసేపువరకు జరుగునో నాకు తెలియదు. చికాగో నగరమును శీఘ్రముగా వదిలి వెళ్ళవలసిన అవసరత నాకు లేదని నేను మీతో చెప్పియున్నాను. నేను ఇచ్చటనే ఉండగోరుచున్నాను. చికాగో నగరమున ఏదోకటి దేవుడు చేయుటకు గలదు... ఇచ్చటున్న ఈ ప్రసంగీకుడు ఇచ్చట ఇరువది సంవత్సరములు నిరీక్షిస్తూ ఉన్నాడు. నేనిచ్చటకు వచ్చు ప్రతీసారి వింతైనది ఏదోకటి కదలాడుటను నేను అనుభూతిని చెందుచున్నాను. నాకు అదేమిటో తెలియుటలేదు. దానిని నేను కనుగొనాలని కోరుచున్నాను. మరి దేవునికి చిత్తమైతే ఆయన నన్ను నడిపించునంతవరకు నేను ఇచ్చట నిలిచియుందును?
ఇప్పుడు, ప్రభువా, ఈ రాత్రి ఇచ్చట నుండి మా ఆరాధనను ప్రారంభించుచున్నాము. ఈ మొదటి రాత్రియందు ఎక్కువ సమయమును మేము తీసుకొనెదము, కాని తండ్రి, మేము త్వరపడుట లేదు. ప్రతీ ఒక్కొక్కరు తనకున్న స్థలమందే తమ కుర్చీల యొద్ద వేచియున్నారు. మేమిచ్చట ఉన్నాము, ఎందుకనగా, మేము నిన్ను ప్రేమించుచున్నాము. అందుకే మేము వేచియున్నాము. తండ్రీ, నీ సేవకుడు మాట్లాడుచున్నందువలన కాదు గాని, నీ ఆత్మ వారిపై ఉన్నందువలననే వారిచ్చట వేచివున్నారు. అదియే వారిని ఆకర్షించి మరియు వారినిచ్చట ఉండునట్లు చేసినది.
65
తండ్రీ, మాలో ప్రతీ ఒక్కొక్కరు అవతల గట్టున ఏమి ఉన్నదో చూచుటకు ప్రయత్నించుచున్నాము. మేము ఎచ్చట నుండి వచ్చామో మరియు మేమెచ్చటకి వెళ్ళుచున్నామో మేమెరుగుదుము. దానినిగూర్చి ఇంకా ఎక్కువగా మేము తెలుసుకోవాలని ఆశించుచున్నాము. తండ్రి, ఈ రాత్రి దయచూపి మీరు దానిని మాకు బయలుపరచండి? ఇచ్చట మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొనుము.
ఆనాడు నీవు రొట్టెను తీసుకొని విరిచినట్లుగానే ఏదోక దానిని తీసుకొని ఎమ్మాయి ఊరులో ఆ శిష్యులతో మీరు ఉన్నప్పుడు నీవు రొట్టెను విరిచినప్పుడు, ఈ రాత్రి అదే విధముగా చేసి నీవు మారని అదే యేసువని జనులు ఎరుగునట్లుగా చేయుము. ఆ విధముగా మీరొక్కరు మాత్రమే విరువగలరని వారికి తెలుసు. అలాగే ఈ రాత్రి ఇచ్చట ఈ భవనమున మీ విధానములోనే దానిని చేయగలరా! ఈ భూమిపై మీరు ఉన్నప్పుడు చేసినట్లుగానే ఇచ్చట కూడా ఏదోకటి చేయుము. అందునుబట్టి తండ్రి మేము మీకు కృతజ్ఞులమై ఉందుము.
66
ఇప్పుడు, ఈ దైవీక వరము మీ ద్వారా నాకు అనుగ్రహింపబడి మరియు ఒక దూత ద్వారా ఆజ్ఞాపించిరి... మీరు నాకు అనుగ్రహించిన ఈ వరము ద్వారా ప్రభువగు యేసుక్రీస్తును హెచ్చించునట్లుగా నన్ను మీ హస్తములలో సమర్పించుకొనుచున్నాను. దీనిని మేము ఆయన నామమున అడుగుచున్నాము. ఆమేన్.
ఇలాంటి అనుభూతితో ఎప్పుడూ కూటమునకు వచ్చుటకు నేను ఆశించెదను. ఆయన ఇప్పుడిచ్చట ఉన్నాడు. ఎంత చక్కటి అనుభూతి. ఓ, నేనెంతగానో దీనిని వాంఛించుచున్నాను... నేను మరలా తిరిగి వచ్చిన పిదప ఇదే మొట్టమొదటి.
ఇప్పుడు, ప్రతీ ఒక్కరు చాలా భయభక్తులతో ఉండండి. విశ్వాసముతో వుండండి. నమ్మకమును కలిగియుండుడి. జోసఫ్ సహోదరుడా, ఈ వైపు చూడండి, నీవు, బిల్లీ, మీరందరూ సమయమును గమనిస్తూ ఉండండి, ఎందుకనగా దేవుడు ఏదోక కార్యమును చేయునని నేను అనుభూతి చెందుచున్నాను. ఆయన ఆత్మ...
67
గత రాత్రి, మానవుడు, ప్రత్యక్షత, దర్శనమనే వాటిగూర్చి జ్ఞాపకమున్నదా? ఇదియే నిరీక్షణయగును. ఇదియే విశ్వాసము. మరియు ఇదే పరిపూర్ణమగును. “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” సరిగ్గా ఈ స్థితిలో దేవుడు ఏదోక కార్యము చేయబోవుచున్నాడని నేను అనుభూతి చెందుచున్నాను. ఏదోక కార్యము నిమిత్తము నేను చాలా చక్కని అనుభూతి చెందుచున్నాను. అదేమిటో నాకు తెలియుటలేదు. ఆయన ఏదోక కార్యము చేయబోవుచున్నాడని నేను అనుభూతి చెందుచున్నాను. ఆయన ఆశీర్వాదములు మనయొద్దకు వచ్చును గాక.
మరిప్పుడు, మీ సహోదరుడనగు నేను అటువంటి ఒక సాధనముగా నన్ను నేను సమర్పించుకొనుటకు సాధ్యమగునట్లుగా, అలాగే ఆయన వచ్చి ఈ శరీరమును ఉపయోగించుకొని, తన ప్రియ కుమారుని ప్రత్యక్షపరచుకొనునట్లు నా కొరకు ప్రార్థించండి. ఎలాంటి అర్హత లేనివాడికి ఎంతటి గొప్ప భాగ్యము! అయినా ఎవరు అర్హులుగా ఉండగలరు? యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని అట్లు అర్హులుగా చేయుచున్నది. అనర్హులమైన మనకు ఆయన కృపయై యున్నది.
ఇప్పుడు, ఈమెకే కదా నేను ప్రార్థించాలని నమ్ముచున్నాను. అది సరియేకదా. అమ్మా? నేను నీ కొరకు ప్రార్థించెదను. ఇచ్చటికి నీవు రావలెనని నేను కోరుచున్నాను.
68
ఇప్పుడు, ఇచ్చటున్న ప్రతీ ఒక్కొక్కరు, ప్రార్థనా కార్డును కలిగి వరుసలో నిలబడియున్న వారైనను లేక ప్రార్థనా కార్డు లేకపోయినను మీ హృదయమంతటితో భయభక్తులను కలిగి దానిని విశ్వసించండి, మీరు ప్రార్థనా వరుసలోకి రావద్దు. అది మీకు భయంకరమైన కార్యముగా మారిపోవునని గుర్తించుకోండి. కాబట్టి మీరు విశ్వసించండి. మీరు ఆ విధమైన విషయములను గూర్చి విని ఉందురు.
దాని శబ్దమును సరి చేయుటకు ఒక అమర్చే ఇంజనీరు ఇచ్చట ఉండాలని నేను కోరుచున్నాను. ఒకవేళ దర్శనము వచ్చి ఇచ్చట కదలాడుచున్నప్పుడు, ఆ సమయమున నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నానో నాకు తెలియదు. ఆ విధముగా నేను ఉన్నపుడు మీలో ఎవరైన నన్ను కొంచెము తోయండి లేదా నన్ను పొడుస్తూ ఉండండి, ఎందుకనగా ఇచ్చట ఈ స్త్రీ నిలబడి ఉన్నదని నేనెరుగుదును. వార్తా పత్రికలలో వచ్చిన ప్రభువు యొక్క పటములను మీరు చూచిరి. ఆ తర్వాత ఆ చిత్రములు కొన్ని మనకు లభించినవి. ఆయన ఇప్పుడు ఇచ్చట ఉన్నాడు.
ఇప్పుడు, మీరు నాయొద్దకు రావలెనుకుంటే ప్రార్థనా వరుసలో రావలెనని నేను కోరుచున్నాను. నేను అడుగు ప్రశ్నలను గమనించుచూ మీరు జవాబు చెప్పండి. నేనేమి అడుగుచున్నానో వాటికి మీరు కేవలము జవాబును మాత్రము చెప్పండి. ఆ తరువాత మీకు మీరే తీర్పును తీర్చుకొనువారగుదురు.
69
ఇప్పుడు, ఇచ్చట నా ముందు నిలబడివున్న ఈ స్త్రీ పూర్తిగా అపరిచితురాలు. ఆమె ఎవరో నాకు తెలియదు. ఒకవేళ నిన్ను నా జీవితములో నేన్నెడూ చూచి ఉండకపోవచ్చు. మనము ఒకరినొకరము ఎరుగనివారము. అవును కదా! మనము ఒకరికొకరము క్రొత్తవారము. ఇపుడు నా సహోదరీ, ఒక ఉద్దేశ్యము కొరకు ఆ గురిని సంధించవలెననే నేపధ్యముతో మాత్రమే నేను దీనిని చెప్పుచున్నాను. వేరే విధముగా చెప్పాలంటే, చూచారా, అచ్చట ఏదోక కార్యము సంభవించబోవుచున్నది. దానిని నేను వివరించలేను. అదేదో సహజాతీతమైన కార్యము. అది నేనెరిగిన దానికంటే మంచిది. కాని ఎలాగైనా ఏదోక కార్యము నీకు సంభవించబోవుచున్నది. ఏదోకటి నాకు జరిగినది.
ఇప్పుడు, మన రక్షకుడగు ప్రభువు సన్నిధిలో నీవు నిలబడియుండినయెడల, తండ్రి దానిని ఆయనకు ప్రత్యక్షపరచినయెడల, నీ సమస్య ఏమైయున్నది మరియు నీవెందుకొరకు ఇచ్చటకు వచ్చితివనే దానినిగూర్చి ఆయన ఖచ్చితముగా ఎరిగియున్నాడు. అది నిజము కదా! ఆయన దానిని చెప్పగలడు. కాని ఆయన...
ఇప్పుడు, నేను చెప్పుటకు కారణమేమనగా, “నేను మాట్లాడుతున్నపుడు నాకు ప్రత్యుత్తరము ఇస్తూ వుంటే చాలును,” ఎందుకనగా కొన్నిసార్లు దర్శనము చూస్తున్నప్పుడు, నేను మాట్లాడుచునే ఉందును, కాని అది నాకు తెలియదు. ఒకానొక దినమున నేను టేపును తీసుకొని ఆలకించుచుంటిని, దానిలో జనులు ఏదోక కార్యమును చెప్పుటకు ప్రయత్నించుచుండిరి. కాని నేను దానిని తెలుసుకోకుండానే ఆ దర్శనమును చూస్తూ అలాగే మాట్లాడుతూ వున్నాను, ఎందుకనగా దర్శనము నన్ను ఏదోక స్థలమునకు తీసుకొని వెళ్ళును. నేను దానిని ఏలాగు చూచుచున్నానో దానిని అలాగే నేను చెప్పవలయును. పిదప దానిలో నుండి మరలా వెలుపలికి వచ్చెదను. ఆ విషయములో మీరే దానికి తీర్పురులగుదురు.
70
కావున నీ జీవితములో యున్న ఏదోక కార్యమును గూర్చి ఆయన దానిని గూర్చి ఆయన చెప్పినప్పుడు అది సత్యమో లేదా అసత్యమో నీకు తెలుసు. నాకు తెలియదు. కాని ఇచ్చట తన సహజాతీతమైన మార్గమున క్రియచేయుచూ నీ జీవితములో ఏమున్నదో ఆయన ఎరిగినవాడై, పిదప ఆ విషయమును గూర్చి చెప్పినప్పుడు. అది సత్యమైతే, అట్లయితే ఏదైతే చెప్పబడినదో అది సత్యమైవుండవలెను. అది నిజమే కదా?
ఇప్పుడు, దానిని ఆయన చేయునా లేక చేయడానేది నాకు తెలియదు. కాని ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు గమనించితివా, కావున ఇచ్చటున్న విశ్వాసులు దానిని అర్థము చేసుకోగలరు...
ఒకసారి తనకు త్రాగుటకు నీళ్ళు ఇమ్మని యేసు ఒక స్త్రీ యొద్ద అడిగెను. ఆమెతో మాట్లాడలనే ఉద్దేశ్యము కొరకే ఆయన ఆమెను నీళ్ళు ఇమ్మని అడిగెను. చాలాసేపు ఆమెతో ఆయన మాట్లాడిన పిదప ఏ ఉద్దేశ్యముతో ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడో, ఆ గురియొద్దకు ఆయన వెళ్ళెను. “వెళ్ళి నీ భర్తను తీసుకొని రమ్మని” చెప్పెను.
“నాకు ఏ భర్త లేడని,” ఆమె చెప్పెను. అదే ఆమె సమస్య.
“నీకు ఐదుగురు భర్తలు ఉండిరని” ఆయన చెప్పెను.
“నీవు ఒక ప్రవక్త,” అని ఆమె చెప్పినది.
71
ఆమె ఆయనతో ఈలాగు చెప్పెను, “మెస్సీయా వచ్చినపుడు ఆయన ఈ విషయములను మాకు తెలియజేయునని నేనెరుగుదును. కావున ఆయన ఎవరు? ”నీవు ఒక ప్రవక్తవై ఉండవలెను,“ అని ఆమె చెప్పినది.
గమనించండి, హృదయ రహస్యములను ఎరుగటనేది మెస్సీయా యొక్క సూచన. నిజమేనా, ప్రియులారా? ఆ బావి యొద్ద వున్న స్త్రీ ఈ విధముగా చెప్పెను, “మెస్సీయా వచ్చినపుడు...” అది ఒక సూచన, ఆయన సన్నిధి మెస్సీయా యొక్క సూచనగా ఉన్నది.
మానసిక తలంపులను విశ్లేషించువాడు లేదా మాంత్రికుడని పేర్లు పెట్టి పిలిచే ఈ జనులకు ఏమి సంభవించును? నాకు తెలియదు. కాని ఆమెలో ఏ కార్యము ఉన్నదో దానిని కనుగొని దానిని గూర్చే ఆయన ఆమెతో మాట్లాడెను.
72
ఇప్పుడు, నిన్ను గూర్చి నాకు తెలియదు. నన్ను గూర్చి నీకు తెలియదు, కాని నీవు సత్యమని ఎరిగిన ఏదోక కార్యమును గూర్చి ఇచ్చటున్న పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరచును, మరియు దానిగూర్చి నాకేమియు తెలియదు. అయినాగాని ఏదోక విధముగా నిన్ను గూర్చి నేనెరుగగలనని నీవు చెప్పెదవు. అది నిజమేనా? అది ప్రభువగు యేసుక్రీస్తని నీవు విశ్వసించగలవా? నీవు విశ్వసించెదవు. ప్రియులారా, అదే విధముగా మీరు దానిని విశ్వసించగలరా? మీరు విశ్వసించగలిగినయెడల, మీ చేతులను పైకి ఎత్తండి. ఆయనే దానిని మీకు అనుగ్రహించును గాక, అది నా ప్రార్థన.
నేనిచ్చట కొద్దిగా ఆగి లేదా వేచి వుండుటను గూర్చి మీరు ఆశ్చర్యపడవచ్చును. నా చుట్టూ ఆత్మ కమ్ముకొని ఉన్నది, గమనించారా. ప్రతీచోటా. అది... వాస్తవముగా వ్యాధితో బాధపడే ఒక రోగి నన్ను ఒంటరిగా సంధించినపుడు అది భిన్నముగా ఉండును. కాని ప్రార్ధన కొరకు వరుసంతా జనులు నా ప్రక్కనే నిలబడియున్నారు, ఒక గుంపు జనులు, అంతేకాకుండా ఇచ్చటంతా అటువంటివారు కూర్చొని వున్నారు, నా చుట్టూ, నా వెనుక, ప్రతీచోట ఉన్నారు. ప్రతీ చోటా కేవలము ఆత్మలతో నిండిపోయి యున్నది.
73
ఒకరినుండి వెలుపలకు వచ్చు ఒక ఆత్మ... ఒకవేళ, ఇచ్చట కూర్చొనియున్న ఎవరైనా ఒకరిని చూచుటకు ఈవైపు నేను తిరుగవచ్చు, చూచారా. అది వ్యత్యాసముగా ఉండును. కావున తన సార్వభౌమాధికార కృపతో దేవుడు ఏదోక దానిని చేయు క్రియగా అది ఉన్నది. ఇపుడు, అది స్వయముగా దానిని తన ఆధీనములో ఉంచుకొనును. నేను దానిని నా ఆధీనములోకి తీసుకోలేను.
కాని నేను నిన్ను చూచుచుండగా... ఈ స్త్రీ వున్న స్థలమున ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు ఒక వ్యాధిగ్రస్తుడు. అతడు నీ భర్త కాడు. అతడు నీ కుటుంబ స్నేహితుడు. అతడు కేవలము ఒక స్నేహితుడు, అతడు ఒక క్రైస్తవుడు మరియు ఆ వ్యక్తి... అతడు సిద్ధపడుతున్నట్లు లేదా ఒక వైద్యుడు అతడిని పరీక్షించుచున్నాడు, తన నోటి ద్వారా త్రాగుటకు ఏదోక దానిని అతడికి ఆ వైద్యుడు ఇచ్చుచున్నట్లు నేను చూచుచున్నాను. త్రాగిన మందు అతడి కడుపులోకి వెళ్ళెను. అతడి కడుపులో పుండు గలదు. అతను శస్త్ర చికిత్సకు సిద్ధపడుచున్నాడు. వెంటనే శస్త్ర చికిత్స చేయవలయును. అతని కొరకు నీవిచ్చటకు వచ్చి నిలబడియున్నావు. నేను చెప్పిన విషయములు సత్యము. అవి కాదా? అది నిజమైతే, నీ చేయి పైకెత్తి చూపుము.
నీ కొరకు ఇచ్చటకు రాలేదని, దేనిని ఆశించుచూ నీవు ఇచ్చటకు వచ్చితివో ఎరిగిన ప్రభువగు యేసు ఇచ్చట ఉండినయెడల... నీవు వేరొకరి కోసము వచ్చావు. అట్లయితే మన కోరికను ఆయన అనుగ్రహించగలడా? మరణము నుండి ఆయన సజీవుడై లేచెనని ఇప్పుడు నీవు విశ్వసించుచున్నావా? ఆనాడున్న అదే శక్తి ఇప్పుడు కూడా ఆయనకు గలదు. ప్రియమైన వారులారా, అదే కార్యమును మీరు విశ్వసించుచున్నారా?
74
మా పరలోకపు తండ్రీ, ఒక క్రైస్తవ స్వభావమును కలిగి వేరొకరి కొరకు ప్రతినిధిగా ఇచ్చట నిలబడివున్న ఈ స్త్రీపై నేను మీ ప్రతినిధిగా నా చేతులను పెట్టుచున్నాను. నీవు మా అందరి కొరకు ప్రాతినిధ్యము వహించితివి. ఒక పాపిగా మరణించవలసిన మా నిమిత్తము నీవు ప్రాతినిధ్యము వహించితివి. మా వ్యాధుల నిమిత్తము మా కొరకు స్వస్థపరచువానిగా ప్రాతినిధ్యము వహించితివి. అంతేకాకుండా, అక్షయమైన జీవముగలదని, తండ్రి, ఒక దినమున మీ పునరుత్థానము ద్వారా మాకు ప్రాతినిధ్యము వహించితివి. దానికొరకు మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఈ స్త్రీ, ఏ వ్యక్తి కొరకు వచ్చెనో ఆ వ్యక్తి యొద్దకు ఆమె తిరిగి వెళ్ళినపుడు, ఆ వ్యక్తి మరణించకుండా దేవుని కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా స్వస్థతను పొందుకొనునట్లు ఆమెను నేను ఆశీర్వదించుచున్నాను. ఆమేన్. నీ స్నేహితుడితో చెప్పు... ఇప్పుడు నీ చేతిలో చేతిరుమాలు గలదు. ఆ చేతిరుమాలును తీసుకొని వెళ్ళి, అతని పై నీవు ఉంచుము.
సర్వశక్తిమంతుడగు దేవుని శక్తితో ఈ జనులు ఎంతగానో కదిలింపబడవలసియున్నది. అయినా ఇంకా ఈ విధమైన కార్యములలో మనమెటువంటి చలనము లేకుండా కూర్చొనియుండుట ఎంతగానో వింతగాయున్నది.
75
ముందుకు రండి, అమ్మా, మీరు విశ్వసించగలరా? మనము ఒకరినొకరము పరిచయములేనివారము. మనము పరిచయము లేనివారమే కదా? నీవెవరో నాకు తెలియదు. నా జీవితములో నేనెన్నడూ నిన్ను చూడలేదు. అయినా, ఈ రాత్రి ఇచ్చట నీవు నిలబడియున్నావు. మరియు నేను నీ ముందు నిలబడియున్నాను. కావున మనమిద్దరము మన తండ్రియగు సర్వశక్తిమంతుడగు దేవుని సన్నిధిలో ఉన్నాము.
నేను ఆయన సేవకుడనని, ఇచ్చటున్న ఈ జనులందరూ ఆయన సేవకులని నీవు విశ్వసించుచున్నావా? మనమందరము క్రైస్తవులము. గొప్ప మర్మమైన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క శరీరమగు ఈ క్రైస్తవ జనులు ఇచ్చట ఈ రాత్రి ఏకముగా కూడియున్నారని నీవు విశ్వసించుచున్నావా?
నీవు కూడా క్రైస్తవురాలివే. ఎవరో ఒకరు పండుకొనియుండుటను నేను చూచుచున్నాను. ఆమె ఒక స్త్రీ. ఆమె పడిపోయియున్నది. నీవు ఏదోక విధమగు స్పృహను కోల్పోయి లేదా స్పృహ-తప్పిపోయి అంతా చీకటి కమ్మునట్లుగా వున్నది. నేను ఏదోక దానిని చూచుచున్నాను... అది ఒక తలుపు లేదా ఏదోక దానిగుండా నీవు వెళ్ళుచున్నావు. పడిపోతూ... అది ఒక మరుగు ద్వారము వంటిది. దానిగుండా నీవు వెళ్ళుచున్నపుడు, పడిపోయి నీ కాలి చీలమండకు అనగా, నీ ఎడమ కాలి చీలమండకు దెబ్బ తగిలినది. అది నీ కాలి చీలమండ దగ్గరవున్న స్నాయువు తెగిపోయినది. వారివలన దానిని బాగు చేయలేకపోయిరి. ఈ వేదిక యొద్దకు నీవు వచ్చినట్లయితే, యేసుక్రీస్తు నిన్ను బాగుచేయగలడని నీవు తలంచుచున్నావు. అది నిజము. నేను చెప్పినది నిజమైతే, నీ చేయిని పైకి ఎత్తుము.
76
నీవు ఆయన దైవీక సన్నిధిలో ఉన్నావని విశ్వసించుచున్నావా? అటైతే నేను ఆయన ఆత్మతో ఎంతగనో అభిషేకించబడి, వేరే ఎవ్వరు నీ గురించి ఎరుగని కార్యములను నేను నీకు చెప్పినయెడల, అయితే నీకు మరియు దేవునికే తెలుసు, మరియు ఆయన చెప్పిన... అది నిన్ను ఒక విశ్వాసిగా మార్చును. అది నిజము కదా?
“నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగులు మీద చేతులుంచినపుడు వారు స్వస్థత నొందుదురు,” అని ఆయన చెప్పెను.. అది నిజమే కదా? అటైతే నీవు స్వస్థతను పొందుకొనుట కొరకు ఇచ్చటకు రమ్ము.
ఓ దేవా, మా తండ్రీ, భూమికి మరియు ఆకాశములకు సృష్టికర్త, నిత్యజీవమునకు కర్తవు మరియు ప్రతీ మంచి ఈవులను అనుగ్రహించువాడవు నీవే. నా సహోదరి యొక్క విశ్వాసము, మీ వాక్యము, నీ కుమారుని యొక్క పునరుత్థానము, మరియు మీ సన్నిధి ఇచ్చట మాతో ఉన్నదనే అర్హతల మీద ప్రభువగు క్రీస్తు నామమున ఆమె స్వస్థతను పొందుకొనును గాక, అని నేను చెప్పుచున్నాను. ఆమేన్. నా సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.
77
ఇప్పుడు విశ్వాసమును కలిగియుండుము. నీ హృదయమంతటితో విశ్వసించుము. అమ్మా, మనము ఒకరినొకరము ఎరుగనివారమని తలంచుచున్నాను. దేవుడు నిన్ను ఎరుగును. నీ సమస్తమును గూర్చి ఆయనకు తెలుసు. నాకేమి తెలియదు, కాని ఏదోకటి జరుగుననే గట్టి నమ్మకమును కలిగివున్నావు. ఒకవేళ మొదటిసారి నీవు వచ్చినప్పటిదానికంటే ఇప్పుడు ఇంకా కొంచెము భిన్నముగా ఉండవచ్చును, కాని ఈ కార్యములను చేయుచున్నదేదనగా, అది ఆయన సన్నిధియై యున్నది. ఆలాగు చేయుచున్నది నేను కాదు. నేను కేవలము ఒక మానవుడిని మాత్రమే.
అచ్చట కూర్చొనివున్న అయ్యా, నీకున్న కడుపు నొప్పి సమస్య యేసు స్వస్థపరచునని నీవు విశ్వసించుచున్నావా? యేసుప్రభువు నిన్ను బాగుచేయునని నీవు విశ్వసించెదవా? నీ హృదయమంతటితో దానిని విశ్వసించుము, సరే మంచిది, అచ్చట ఎర్ర చొక్కాయితో ఉన్న నీవు నీ గృహమునకు వెళ్ళి ఇపుడు నీకేది ఇష్టమో దానిని తినుము. దానినంతటిని చేసినదేదనగా నీవు విశ్వసించిన విశ్వాసమే. అదేలాగు జరిగినదో, అయ్యా నీవు దానిని గ్రహించలేకపోయావు. అది కడుపులోని పుండు అని నీవు అనుకున్నావు, కాని అది క్యాన్సర్ వ్యాధి, ఎందుకనగా ఇదిగో ఇచ్చట నిలబడియున్న ఈ స్త్రీ కూడా అదే క్యాన్సర్ వ్యాధితోనే బాధపడుచున్నది. కాబట్టి అదే అచ్చట నుండి దానిని లాగినది.
78
నీకు క్యాన్సర్ గలదు, నీ రొమ్ముపై అది ఎదుగుచున్నది. అది నీ శరీరమంతా వ్యాపించిన భయంకరమైన వ్యాధియని వైద్యుడు చెప్పెను. అది నీ ఎడమ వైపు రొమ్మున గలదు. అది నిజమే కదా? ఇప్పుడు నీవు స్వస్థతను పొందుకొనెదవని నీవు విశ్వసించగలవా? యేసుక్రీస్తు నామమున నీకు అట్లే జరుగును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. విశ్వాసమును కలిగియుండుము. నీ హృదయమంతటితో నీ ఆత్మనంతటితోను, నీ మనస్సంతటితోను విశ్వాసమును కలిగియుండుము.
అచ్చట ఒక ఆత్మ కదులుచుండుటను నేను చూచుచున్నాను. ఆ వ్యక్తి పై ఆ ఆత్మ కదులుతుండగా, అతడు నా వైపే చూస్తూ, అదిగో ఇచ్చట కూర్చొనియున్నాడు. అది అదొక విధమైన ఆత్మయైయుండి వేరొక వ్యక్తి పైకి వెళ్ళుచున్నది. వారిరువురి పై అది ఒకసారి కదలాడుచున్నది. పగులుటకు సిద్దముగాయుండు ఒక రణముతో నీవు బాధపడుచున్నావు. అయ్యా, అదే కదా.... అవునయ్యా, కాబట్టి అచ్చటున్న ఇంకొకరు కూడ అదే విధముగా బాధపడుచున్నాడు. అది నిజమే కదా? మీరిద్దరు బ్రద్దలైపోయే రణముతో బాధపడుతున్నారు. అది నిజమైతే మీ చేతులు పైకి ఎత్తండి. ఇచ్చటున్న పురుషులగు మీ ఇద్దరు... దానిని గమనించండి. ఇప్పుడు మీ హృదయమంతటితో విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
ఓ, ఇప్పుడు మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు విశ్వాసము కలిగియుండవలెను.
79
మనము ఒకరికొకరము పరిచయము లేనివారము. అమ్మా, అలాగే కదా? నీవెవరివో నాకు తెలియదు, కాని నిన్ను ఎరిగిన ఒకరు ఇచ్చట ఉన్నాడు. ఆయనే మన పరలోకపు తండ్రి. నిన్ను గూర్చి అంతా ఆయనకు తెలుసు.
నీవు నరముల ఉద్రేకముతో బాధపడుచున్నావు. దానికొరకు మాత్రమే నీవిచ్చటకు రాలేదు. నీకింకా వేరే సమస్యలు కూడా ఉన్నది. ప్రాముఖ్యముగా నీవెందుకొరకు ఇచ్చట ఉన్నావంటే, వేరొకరి కొరకు. అతడు యవ్వనస్తుడు, అతడు 18 లేదా 19 సంవత్సరాల వయస్సుగలవాడు. ఆ బాలుడు కూడా నరముల ఉద్రిక్తతతోనే బాధపడుచున్నాడు. మీరు ఒక వైద్యుని యొద్దకు వెళ్ళుటను నేను చూచుచున్నాను. ఆ వైద్యుడు అతడికి ఏదోక విధమగు దానిని ఇచ్చుచున్నాడు... ఓ, ఆ వైద్యుడు ఆ బాలునికి విద్యుత్ ఘాతపు చికిత్స చేయుచున్నాడు. అతడు బాధపడుచున్నాడు... నరాల ఉద్రిక్తత వ్యాధితో అతడు వ్యాకులపడుచున్నాడు. అతడు తన సృహను కలిగియున్నాడు. అతని చుట్టూ జనులు ఉండుటను అతడు ఇష్టపడుట లేదు. అతడొక క్రైస్తవుడు, కాని దెయ్యములతో అతడు బంధింపబడివున్నాడు. సంఘమునకు వచ్చుటకు అతడు భయపడుచున్నాడు. నీవు బాగయ్యావు. అంతే కాదు, వెళ్ళి అతడిని ఇప్పుడు తీసుకొని రమ్ము, అతడు కూడా బాగవును. దేవుడు నిన్ను దీవించును గాక.
విశ్వాసమును కలిగియుండుము. సందేహించవద్దు. నీ హృదయమంతటితో నమ్ముము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.
80
[ఒక వ్యక్తి ప్రేక్షకుల నుండి మాట్లాడుచున్నాడు, కాని ప్రార్థనా వరుసలోయున్న వ్యక్తితో సహాదరుడు బ్రెన్హాం గారు మాట్లాడుచున్నారు.] అయ్యా, నీ హృదయమంతటితో, నీవు నమ్ముచున్నావా! ఒక క్రైస్తవుడుగా ఎన్ని సంవత్సరాలుగా ఉన్నావు? చాలా సంవత్సరములుగా ఉన్నావా? నీ హృదయ మంతటితో నీవు నమ్ముచున్నావా? నేను ఆయన సేవకుడినని నమ్ముచున్నావా? పరిశుద్ధాత్మ ఇచ్చట ఉన్నదని నీవు విశ్వసించుచున్నావా? నీవెవరివో నాకు తెలియదు. దేవునికి నిన్ను గూర్చి తెలుసు. మనము ఒకరికొకరము సంధించుట ఇదే మొదటిసారి కావచ్చును. కాని నీ విషయములన్నింటిని గూర్చి ఆయనకు తెలుసు. అయ్యా, నీ గురించి ఎదో వింతగా ఉన్నది.
దయచేసి సభ్యులు భయభక్తులతో ఉండండి. కూటమును భంగపరచవద్దు. భయభక్తులతో ఉండండి.
నీవు నీ గృహమునకు వెళ్ళి మరియు నీకేది ఇష్టమైనదో దానిని తినుము. కడుపులోవున్న సమస్య నుండి యేసు ప్రభువు నిన్ను స్వస్థపరచెను. దేవుడు నిన్ను దీవించును గాక. విశ్వసించుము. దేవునియందు విశ్వాసమును కలిగియుండుము.
81
అయ్యా, నీ చుట్టూ ఒక వింతైన కార్యము ఉండుటను నేను చూస్తున్నాను. అదేమిటని నేను చెప్పలేకపోవుచున్నాను. ఒక్క నిమిషము. ఓ, అదొక గోడ. అదొక స్థలము. నీవు... ఓ, ఒక స్థలము యొద్ద నిన్ను నేను చూచుచున్నాను. అదొక కారాగారము లేదా ఏదోక స్థలమున నీవు ఉన్నావు. అది ఇండియానాలో వున్న మిచ్చిగాన్ నగరము. నరముల ఉద్రిక్తత బాధవలన నీవు ఇచ్చటకు వచ్చావు. ఏదోక సమస్య నిమిత్తము నీ భార్య కూడా కలవరములో ఉన్నది, అదేమనగా వృద్దురాలగు ఒక స్త్రీ నిమిత్తము. ఆమె క్యాన్సర్ వ్యాధితో వైద్యశాలలో ఉన్నది; ఆమె నీ భార్య యొక్క తల్లి, నీ అత్తగారు. నీవు కూడా ఒక ప్రసంగికుడివి. నీ పేరు రెవరెండ్ మికిన్నీ. అది నిజము. అది నిజమే కదా? సహోదరుడా, ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారమగును.
జీవమునకు కర్త, సర్వశక్తిమంతుడగు దేవుడు, యేసుక్రీస్తు నామమున ఈ వ్వక్తి పై ఆశీర్వాదములు పంపించును గాక. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. దేవా, కనికరమును కలిగియుండుము.
నీవు విశ్వసిస్తున్నావా? దేవునియందు విశ్వాసమును కలిగియుండుము.
82
అయ్యా, నిన్ను క్షుణ్ణముగా పరిశీలించగా, నీ హృదయములో ఏదోక సమస్య గలదు, అవును కదా? అది నీ స్నేహితుడు; అతనికి క్యాన్సర్ వ్యాధి గలదు. అతడికి ఆ వ్యాధి గలదు కదా? నీకొక చిన్న కుమార్తె గలదు, ఆమెకొరకు కూడా నీవు అక్కరను కలిగియున్నావు. ఆమెకు పోలియో గలదు, ఆమెకు గలదు కదా? నేను చెప్పినది నిజమైతే, లేచి నీ కాళ్ళపై నిలబడుము.
ఓ దేవా, ఇచ్చటున్న మా స్నేహితునియందు, అలాగే తన స్నేహితుని కొరకు నిలబడివున్న ఇతని పట్ల దయను కలిగియుండుము. “ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటినెల్లను పొందుకున్నానని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును,” అని నీవు వాగ్దానము చేసిన ప్రకారముగా, ప్రభువా, నీ మాట చొప్పున ఇతని యొక్క కోరికను నీవు అనుగ్రహించెదవు గాక. యేసు నామమున నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్. నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక.
83
ఆ దూత యొక్క వెలుగు ఇచ్చట వెనుక ప్రక్కనవున్న ఎవరో ఒకరి దగ్గరకు చాలా త్వరితముగా వెళ్ళియున్నది, కాని అచ్చట నా స్నేహితుడు కూర్చొనివున్నాడని తలంచుచున్నాను. సహోదరుడు ప్లనాగరిని నేను చూచుచున్నాను, అది అతడేనని నేను నమ్ముచున్నాను. బహుశా, నా దృష్టిని అదే ఆకర్షించి ఉండవచ్చును. నాలో నేను లేను, కాని చూచుటకు అచ్చటనే అది ఉన్నట్లుగా ఉన్నది.
అచ్చట కూర్చొనివున్న స్త్రీ, కీళ్ళ నొప్పితో బాధపడుచున్నది. అమ్మా, నేను చెప్పినది నిజమే కదా? అందుకొరకు ఆమె అచ్చట నిలబడివున్నది. కీళ్ళ నొప్పితో బాధపడుచున్న నీ కొరకే ఆ స్వస్థత గలదు. నీ ప్రక్కన కూర్చొనివున్న ఆ స్త్రీ కూడా ఏదోక అవసరతను కలిగియున్నది. ఆమెకు నడుముయందు ఏదోక నొప్పి గలదు. అది నిజమే కదా? పెద్ద ప్రేగులో నొప్పితో కూడా నీవు బాధపడుచున్నావు. నీకు నొప్పి వున్నది కదా? నిజమే కదా? యేసు నిన్ను బాగుచేయునని నమ్ముచున్నావా? నీ చెయ్యిని నీ స్నేహితురాలి పై పెట్టుము. మీరందరు కూడా మీ ప్రక్కనవున్న వారిపై మీ చేతులను పెట్టండి.
సర్వశక్తిమంతుడుగు దేవా, జీవమునకు కర్తా, ప్రతీ మంచి ఈవులను అనుగ్రహించు దేవా, నీ చేతులను వారిపై పెట్టి ప్రభువా, ఆశీర్వాదములు కుమ్మరించుము. వారు బాగవునట్లు వారి హృదయములో గల కోరికను అనుగ్రహించుము. దీనిని నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నేను అడుగుచున్నాను. ఆమేన్.
84
సరే మంచిది, ఆ రోగిని తీసుకొని రండి. అమ్మా, రా. సరే. ఆ బిడ్డ కొరకు నీవు ఒక నిమిషము నా వైపు చూడాలని నేను కోరుచున్నాను. నేను ఆయన సేవకుడినని నమ్ముచున్నావా? నేను నీకు కొత్తవాడిని. అది నిజమేనా? అమ్మా, అట్లయితే నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? సరే, మంచిది. నీవు ఇచ్చటకు వచ్చిన కారణము... నీవు ఈ పట్టణము నుండి రాలేదు. ఈ బిడ్డ నీది కాదు. నీవు... ఈ బిడ్డను నీవు సంరక్షించుచున్నావు. కాని ఒక కణితితో బాధపడుచున్నందువలన నీవు ఇచ్చటకు వచ్చితివి. మరి ఈ బిడ్డను నీవు సంరక్షించుచున్నావు. ఈ బిడ్డకు తరవాత ఇంకొక బిడ్డ గలదు. ఆ బిడ్డ ఈ బిడ్డకు చెల్లెలగును. ఆమెకు కళ్ళ జబ్బు గలదు. ఈ బిడ్డ యొక్క తల్లి కాథలిక్ కు చెందినది. నీవిచ్చటకు వచ్చుటకు ముందు ఈ బిడ్డలు స్వస్థతతను పొందుకొనినయెడల, ఆమె ఒక విశ్వాసురాలుగా మారుతానని ఆమె నీతో చెప్పినది.
85
ఇప్పుడు మనము తలలను వంచుదాము. సర్వశక్తిమంతుడగు దేవా, నిత్యజీవమునకు కర్తా, ప్రతీ మంచి ఈవులను అనుగ్రహించువాడా, ఈ బిడ్డ పై ఆశీర్వాదములు పంపించుము. స్వస్థతను అనుగ్రహించుము. ప్రభువా, నీ ప్రభావముతో మృతులలో నుండి యేసుక్రీస్తును జీవముతో లేపిన విధముగా ఇపుడు ఈ బిడ్డను జీవింపజేయుము. తండ్రీ, నీ కుమారుడగు యేసు ద్వారా దీనిని అనుగ్రహించమని నేను అడుగుచున్నాను.
మీ తలలు వంచియుండగా, ప్రతీ ఒక్కొక్కరు ఒక్క నిమిషము కేవలము నమ్ముడి. మీ కళ్ళను మూసుకొని ఉండండి. ప్రతీ ఒక్కొక్కరు మీ తలలను వంచి, ఈ బిడ్డకు సహాయపడవలెనని నేను మిమ్మల్ని కోరుచున్నాను. కనికరముగల దేవా, ఈ చిన్న బిడ్డ పై మీ ఆశీర్వాదములను పంపించి స్వస్థపరచుము. యేసు నామము ద్వారా నేను ప్రార్థించుచున్నాను.
ఇప్పుడు మీరు తలలను పైకి ఎత్తవచ్చును. ప్రియమైనదానా, ఈ వైపు చూడుము. ఇచ్చటున్న సహోదరుడు బ్రెన్హాం వైపు చూడుము. ఈ బిడ్డకు మెల్లకన్నులు గలవు. ఇపుడు, ప్రియమైనదానా, ఈ వైపు చూడుము, ఇచ్చట ఈ వైపు చూడుము. ఇప్పుడు ఈ విధముగా వెనుక ప్రక్కగా ఇచ్చట ఈవైపు చూడుము. నావైపు ఇచ్చట నన్ను చూడుము. ఇప్పుడు మీ కన్నులవలె ఈ బిడ్డ కళ్ళు తిన్నగా చక్కగా బాగైనవి. సరే, మంచిది. ఈ స్వస్థతతో నీవు వెళ్ళి, నీ తల్లి దగ్గర దీనిగూర్చి చెప్పి...
86
“దేవునికి స్తోత్రమని” మనము చెప్పెదము. పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక! ప్రభువా, దానితో నీ కృప తోడైయుండును గాక! నీవే దేవుని యొక్క కుమారుడగు క్రీస్తువని ప్రజలు ఎరుగునట్లుగా సూచక క్రియలను, అద్భుత కార్యములను చేయుచూ సంచరించుము. ప్రతీ ఒక్కరిని ప్రభువా, ఆశీర్వదించుము. మా ప్రభువా, ఈ ఆశీర్వాదములను యేసు ద్వారా అనుగ్రహించమని మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్.
స్త్రీ... ఆ స్త్రీకి కళ్ళు కనబడవు. ఆమె తన చూపును పొందుకొనుటకు యేసు వద్ద తప్ప వేరే ఎచ్చట ఆమెకు నమ్మిక లేదు. నీవు విశ్వాసముతో వచ్చావు. మనము ప్రార్థించెదము.
ప్రియమైన జీవాధిపతి, నా సహోదరి కొరకు దయను కలిగియుండమని నేను ప్రార్థించుచున్నాను, ఎందుకనగా ఆమె యొక్క పూర్వకాలపు తండ్రి నీవు కొండ మీద శిలువను మోసుకొని వెళ్ళునట్లు నీకు సహాయము చేసెను. ఈ రాత్రి ఆ తండ్రి యొక్క కుమార్తె అంధకార చీకటితో తడబడుచూ ఉన్నది. కనికరము గల తండ్రీ, ఆమెను స్వస్థపరచుము. ప్రభువా, ఆమెను స్వస్థపరచెదవా? దయ్యములను ఎదుర్కొనే శక్తిని నీవు మాకు అనుగ్రహించితివి. దానిని నీవు మాకు వాగ్దానము చేసితివి. నేను నిన్ను నమ్ముచున్నాను. నాలోవున్న ప్రతీ అణువు అణువున నేను దానిని నమ్ముచున్నాను. ప్రభువా, పరిశుద్ధాత్మ సరియైన మార్గమున క్రియ చేయునట్లు ఇప్పుడు మీరు మమ్మల్ని బలపరచుదురు గాక. నా సహోదరి చూడలేనట్లుగా గ్రుడ్డితనమును కలుగజేసిన ఈ గ్రుడ్డి ఆత్మ ఈమెను వదిలి వెళ్ళిపోవునట్లు, యేసుక్రీస్తు నామమున నేను దానిని గద్దించుచున్నాను. ఈ సమయమున ఇచ్చటున్న వారు మీ తలలను వంచియుండుడి.
87
ఇప్పుడు, నీవు నన్ను చూడలని నేను కోరుచున్నాను. సరిగ్గా ఇప్పుడే అది నిన్ను వదిలి వెళ్ళి పోయినది కదా? ఇప్పుడు నీవు చూడగలుగుచున్నావు? నీ వ్రేలును నాపై పెట్టగలవా, అనగా నా ముక్కు మీద నీ వ్రేలును పెట్టి తాకగలవా? అది సరి. నీ కన్నులు దృష్టిని పొందుకొనెను. సభ్యుల వైపు నీ తలను పైకెత్తి చూడుము. ఇప్పుడు నా ముక్కును తాకమని నేను ఆమెను అడిగాను. అమ్మా, నీవు తాకగలవా? సంతోషించుచూ నీ మార్గమున వెళ్ళుము. సహోదరీ, నీవు స్వస్థతను పొందుకున్నావు.
నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? నీవు దేవునిలో నమ్మకమును కలిగివుంటే నీ నుండి ఆ మధుమేహవ్యాధి తొలగిపోవును, అంతేకాకుండా నీవు బాగవుదవు. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? దేవుడు నిన్ను దీవించును గాక. “ప్రభువా, నీ కృప కొరకు ధన్యవాదములు,” అని చెప్పుచూ సంతోషముగా నీ మార్గమున వెళ్ళుము. దేవుడు నిన్ను దీవించును గాక.
అయ్యా, నీవు ఆయనను విశ్వసించుచున్నావా? నీకున్న నీ కడుపు నొప్పి దేవుడు తీసివేయునని నీవు తలంచుచున్నావు. కావున నీవు నీ గృహమునకు వెళ్ళి, నీ సాయంకాలపు భోజనమును భుజించుము. ఆయన నిన్ను స్వస్థపరచెను. దేవుడు నిన్ను దీవించును గాక.
88
నీకున్న మూత్రపిండము సమస్యను స్వస్థపరచుటకు దేవునికి చాలా స్వల్ప కార్యము. ఆయన దానిని బాగుచేయగలడు. దానిని నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? ఇచ్చటకు రమ్ము, తండ్రి, నీ కుమారుని నామమున, యేసు ప్రభువు నామములో మా సహోదరిని స్వస్థపరచుము. ఆమేన్. వెళ్ళుము, సందేహించవద్దు. కేవలము నీ హృదయమంతటితో నమ్ముము. నీవు దానిని పొందుకోనెదవు.
ఒక్క నిమిషము. నా ముందుకు ఏదోకటి వచ్చుచున్నది, ఒక పెద్ద భవనము. ఇప్పుడు ప్రతీ ఒక్కొక్కరు భయభక్తులను కలిగియుండండి. మన పరలోకపు తండ్రి ఏదోక విషయమునుగూర్చి మాట్లాడుచున్నాడు. నేనొక భవనమును చూచుచున్నాను. అది నా ముందుకు వస్తూనే ఉన్నది. అదొక పట్టణమందు గలదు. ఆ పట్టణము ఒక లోయలో గలదు. గొప్ప ఎత్తైన గోపురమువంటి శిఖరము మీద అది కలదు, ఎతైన భవనములు గలవు, ఆ విధమైన ఆకారముతో దర్శనము కదులుచున్నది. అది ఇప్పుడు కదులుతున్నది, అదిప్పుడు ఒక మూలకు వచ్చుచున్నది.
ఒక స్త్రీ గలదు, తన ప్రియుల ద్వారా ఆమె ఒక వైద్యశాలకు తీసుకొని వెళ్ళబడుచున్నది. అది మాయో సహోదరుల యొక్క వైద్యశాల. ఆ స్త్రీ మిచ్చిగన్ నుండి వచ్చుచున్నది. ఆమెను పరీక్షించుటకు వారు అచ్చటకు తీసుకొని వెళ్ళిరి, కాని ఆమెకున్న వ్యాధియొక్క హేతువును వారు కనుగొనలేకపోయిరి. అదొక మెదడు వ్యాధి. ఆ వ్యాధితో బాధపడుచూ ఇచ్చట ఇంకా ఎవరో ఒకరు గలరు, వారు ఇచ్చటెచ్చటో కూర్చొని ఉన్నారు. ఆమె బాగా లావుగావుండు ఒక స్త్రీ, మరియు ఆమె... ఓ, ఆమె ఎచ్చట ఉన్నది? అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక, అచ్చట మోసుకొని వెళ్ళు మంచముపై ఆమె పండుకొని ఉన్నది. అది నీవే. నీ కాళ్ళతో నీవు లేచి నిలబడుము. నీ పరుపుని తీసుకొని నీ గృహమునకు వెళ్ళుము. నీవు స్వస్థతను పొందుకున్నావు.
మనము లేచి మన కాళ్ళపై నిలబడదాము. సర్వశక్తిమంతుడగు దేవా, జీవమునకు కర్తా, ప్రతీ మంచి ఈవులను అనుగ్రహించువాడా, యేసు నామమున ఈ జనులను ఆశీర్వదించుము.