వైద్యుడైన మోషే
VGR COUNT-145 మంచిది, మీకేమి తెలుసు, కేవలం పన్నెండు జతలు, ఇంతకు ముందు కూటములలో ఎప్పుడూ ఒక్కసారి కూడా జరుగలేదు. మేము మిమ్ములను తప్పకుండా ఆహ్వానిస్తాము, మా ప్రియమైన సోదరుడా, మరియు యేసుక్రీస్తు యొక్క ప్రేమతో, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఈ రాత్రి నిన్ను దర్శించును మరియు నీ యొక్క భావోద్వేగాలు ఆయనని చాలా చాలా గొప్పగా ప్రేమించును.
ఇప్పుడు, ఇది దాదాపుగా అన్నిసార్లు, మొదటిగా, దేవుని యొక్క నిజమైన వాక్యము, ఆ పరిశుద్ధ గ్రంథము, దానిలోని ప్రతీ ఒక్క చిన్న భాగము మార్గదర్శకం చేస్తుంది. మరియు అదంతా దేవుని వాక్యమైయున్నది, మరియు దేవుడు ఆయన వాక్యములో ఉన్నారు, దేవుడు ఆయన వాక్యములో ఉన్నట్లయితే, నీవు దేవుని వాక్యము తీసుకున్నట్లయితే, నీవు దేవుడిని తీసుకున్నట్లే.
ఇప్పుడది దేవుని ప్రణాళికైయున్నది, దేవుని కోరికైయున్నది. దేవుని లక్షణం, దేవుని ప్రేమైయున్నది, దేవుని రక్షనైయున్నది. ప్రతి ఒక్కటి ముద్రించబడిన ఆయన వాక్యములో ఉన్నది. మరియు ఆ వాక్యములు గింజలు, లేక విత్తనములైతే మీరు వాటిని తీసుకొని తిని మింగివేయండి, అది ఏ విధంగా చేయును అని చెప్పుచున్నదో, అదే విధంగా వాటిలో ప్రతి ఒక్కటి అలాగే ఉత్పత్తి చేయును. అయితే విశ్వాసము వలన వాటిని పొందుకోగలము.
2
ఇప్పుడు, కొద్ది సమయం క్రింద నన్ను ఎవరో అడిగారు, “బ్రదర్ బ్రెన్హాం, ఎప్పుడు ఆ దర్శనాలు వచ్చాయి, అది దేవునిలో భాగమా?”
నేను చెప్పాను, “అది రెండవదైన దేవుని మాట. అది ఏదైనా పరిశుద్ధ గ్రంథములోని వాక్య ప్రకారము కానట్లయితే, అది ఖచ్ఛితంగా తప్పే. ఇదే మొదటిది.”
మరియు ఇప్పుడు, ఇది దేవుడైయున్నాడు. ఆయన చెప్పెను, “నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.” సమస్త స్వస్థత దేవుని యొద్ద నుండి వచ్చును. స్వస్థపరచువాడు ఆయనే. దైవ వాగ్దానాలన్నీ దేవుని దగ్గర నుండే వస్తాయి, ఎందుకనగా అది నీ కొరకు మరియు నా కొరకైన ఆయన వాక్యము.
3
కాని ఇప్పుడు, ఒక ఉదాహరణ ఉన్నది, బహుశా నమ్ముట చేత కొండపైన విశ్వాసమనే స్థలమునకు ఎక్కలేకపోవుట. మీకు తెలుసా, అది చేయుటకు కష్టతరమైనదని? మన భావోద్వేగములలో కొన్నిసార్లు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించుటకు ప్రయత్నము చేస్తాము. అయితే అది మనము రక్షింపబడినట్లు కాదు.
నీవనవచ్చు, “మంచిది, నేను నమ్ముచున్నాను.” సాతాను కూడా నమ్ముచున్నాడు. దాని అర్ధము నీవు రక్షింపబడ్డావని కాదు. నీవు ఎప్పుడైతే రక్షింపబడ్డావో, అప్పుడు నీవు రక్షణ యొక్క ముద్రను పొందుకుంటావు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము.
అబ్రాహాము విశ్వాసము చేత దేవుడిని నమ్మెను, మరియు అది అతనికి నీతిగా ఎంచబడెను. అయితే దేవుడు అతనికి సున్నతిని ముద్రగా ఇచ్చెను, లేక అతని విశ్వాసము యొక్క నిర్ధారణగా ఇచ్చెను. విశ్వాసమే నిజము, చూశారా.
4
ఒక రొట్టె వలె... దాని విలువ పది సెంట్లు, అనుకుందాము. మంచిది, ఇక్కడ ఒక నాణెము ఉన్నది. మంచిది, అది ఆ రొట్టె మాత్రము కాదు, కాని అది నేను పది సెంట్లు పెట్టి ఆ రొట్టెని కొనుటలో వున్నది. కావున నేను విశ్వాసముచేత రక్షణను కొనుగోలు చేసియున్నాను. విశ్వాసము అనునది రక్షణ కాదు. విశ్వాసము రక్షణను కొనును. విశ్వాసము... ఆ రొట్టె కొరకు ఆ నాణెము చెల్లించబడినది, కాని ఆ నాణెము ఆ రొట్టి కాదు, చూచారా.
అయితే మీరు దేవునిని నమ్ముచున్నారు, మరియు మీ విశ్వాసము ఏదైతే ఉత్పత్తి చేసినదో దానిని తిరిగి ఇచ్చుట ద్వారా దేవుడు మీ విశ్వాసమును ధృఢపరుస్తున్నాడు. నీవనవచ్చు, “స్వస్థతనొందుటకు నాకు విశ్వాసమున్నది.” అది నీకున్నట్లయితే, నీవు స్వస్థపడియున్నావు. దేవుడు ఆయన చెప్పిన మాటకు కట్టుబడియున్నాడు. నీవు దానిని చూచావా?
5
“నేను రక్షించబడ్డాను అని నేను నమ్ముచున్నాను,” అని నీవు చెప్పినట్లయితే. అప్పుడు దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇచ్చుట ద్వారా దానిని ధృఢపరుస్తాడు, ఆ పరిశుద్ధాత్మ యొక్క రుజువును నీకిస్తాడు. అది నిజము. నీ హృదయములో నుండి ప్రతి పాపము గతించిపోవును, చీకటి వెలుగుగా మారుతుంది, మరియు ఆ పాత మనిషి వెళ్ళిపోయాడు, మరియు నీవు నిజముగా నమ్మినప్పుడు - ఒక కొత్త మనిషి తిరిగి జన్మిస్తాడు.
అయితే “నేను నమ్మాను,” మరి అప్పుడు ఏమియు జరుగలేదు, అని నీవు అనవచ్చు. నీవు అదేవిధమైన జీవితాన్ని గడుపుతావు, అది కేవలం, “నేను సంఘములో చేరాను.” అతను ఎప్పటికీ దానిని అంగీకరించలేదు, చూచారా. కాని ఎప్పుడైతే అతను దానిని అంగీకరిస్తాడో, నీకు ఏదో జరుగుతుంది మరియు అప్పుడు నీవు ఒక నూతన సృష్టిగా మారుతావు.
దైవిక స్వస్థత కూడా అటువంటిదే. నీవనవచ్చు, “దైవిక స్వస్థతను నేను నమ్ముచున్నాను.” మంచిది, అయితే నీవు దానిని ఒప్పుకొనుము, ఏదో జరుగును. నీవు నిజముగా నమ్మినట్లయితే, ఏదో జరిగివుంటుంది. నీవు నమ్మనట్లయితే...
6
ఇప్పుడు, దేవుని కొరకు నేను చేయు కార్యమేమంటే, ఆ వ్యక్తిని ఈ దశ వరకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేయుటయే, ఎక్కడైతే వారి విశ్వాసము, వ్యతిరేకంగా కాదు కాని, అనుకూలముగా మారునంతమట్టుకు. నా భావమేమిటో చూశారా?
ఇప్పుడు, శిష్యులు యేసుని నమ్మలేకపోయారు. ఆయన వారికి చాలా ఉపమానాలు వివరించాడు. ఆయన ఒక విధముగా మాట్లాడాడు, మరియు తరువాత మరొక విధముగా, మరియు అది ఎలాగున్నదంటే ఆయనతో ఆయనే అన్నిటిని విభేధించుకున్నట్లుగా వున్నది. కాని వారు ఆయన చెప్పిన ఉపమానములను అర్థం చేసుకోలేదు మరియు ఆయనను ఏ ఒక్కరూ అర్థం చేసుకున్నట్లుగా కనిపించుటలేదు.
7
అదే విధముగా, ఆయన పరిచర్యలోని చివరి భాగమైన పరిశుద్ధ యోహాను 15వ అధ్యాయంలోనికి వెళదాం, నేను దానిని నమ్ముతాను, ఆయన ఈ విధంగా చెప్పెను, “ఇప్పుడు నీవు మాతో ఉపమానములతో కాకుండా తేటగా మాట్లాడుము. ఇప్పుడు మాకు తెలిసింది నీవు దేవుని వద్ద నుండి వచ్చావని, మరియు ఏ మనుష్యుడు కూడా నీకు ఏమియు చెప్పలేడని మాకు తెలిసింది,” చూశారా. “దీని వలన మాకు నీవు దేవుని దగ్గర నుండి వచ్చావని అర్థమయినది.” యేసు ఇలా చెప్పెను, “ఇప్పుడు మీరు నన్ను నమ్ముతారా?” చూచారా, చూడండి.
ఆయన ఏమి కార్యములు జరిగించాడో వారి యొక్క విశ్వాసము వాటిని చూసింది మరియు గొప్ప ప్రత్యక్షతని ఆత్మ ద్వారా కొంత గుర్తించబడింది, తరువాత వారి విశ్వాసము దానిని అందుకొనుటకు ఈ స్థలము వరకు పైకెత్తబడింది. మరియు ఇప్పుడు ఆయన దేవుని వద్ద నుండి వచ్చాడని మనకు ఖచ్చితముగా తెలుసు,“ చూచారా? ” ఇప్పుడు మేము నమ్ముచున్నాము.“
8
ఎంత మనస్తత్వ శాస్త్రము, దానికి అసలు అర్థములేదు. దానికి అసలు అర్ధమే లేదని నేననలేదు, నన్ను క్షమించండి. అది సహయాపడును — మనస్తత్వ శాస్త్రము (సైకాలజీ). కాని అది ఎప్పటికి వాస్తవమైనది కాలేదు. అది నిజమే. మనస్తత్వ శాస్త్రము అనేది ఏమిటంటే నీవు ఆలోచించి లేక మానసికంగా శ్రమించి ఆ విధంగా తయారు చేసుకొన్నది. కాని వాస్తవం ఏమిటంటే దేవుడే నీ మానసిక శాస్త్రమును అమలు పరుస్తున్నాడు. అది తీసుకొనివస్తుంది...
“విశ్వాసమనునది నిరీక్షింబడువాటి యొక్క నిజస్వరుపమైయున్నది, లేనివి ఉన్నవి అనుటకు రుజువునైయున్నది. నిజానికి అది ఒక రుజువైయున్నది, అది నీకు నిశ్చయమైనప్పుడు ఎదో సానుకూలము.
9
పరిశుద్ధ యోహాను సువార్త 3వ అధ్యాయములో, కొన్ని వాక్యములను చదువుకుందాం. దీనిని వినండి.
యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యుడొకడుండెను.
అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి - బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము: [అది నీవు ఎలాగు తెలుసుకున్నావు?] నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. [ఆయన ఇంకనూ అన్ని రకాల వేదాంతమునకు వ్యతిరేకంగానే ఉన్నాడు, వాళ్ల అన్ని రకాల భోధలకు. ఆయన వాటన్నిటిని ప్రక్కకు తోసి, దేవుని నుండి వచ్చిన నిజమైన సత్యమును బోధించెను.] నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము: దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న అద్భుతములు ఎవడును చేయలేడు.
10
వారు ఆ రకంగా తెలుసుకున్నారు. యేసు తన కార్యముల ద్వారా వారి యొక్క విశ్వాసము ఆయనను దేవుని కుమారుడని గుర్తించగలిగే ఒక స్థాయికి తీసుకొని వచ్చాడు.
ఇప్పుడు, సంఘము కేవలం వేదాంతమునే బోధిస్తున్నట్లయితే, నీకు అది నిజమైనదో లేక కాదో ఎలా తెలుస్తుంది? మరియు ఎప్పుడైతే దేవుడు ఆ సంఘములో పనిచేస్తాడో, వారి విశ్వాసమును ఒక ఉన్నత స్థాయికి, తరువాత మీకు తెలుసు. దైవిక స్వస్థత అనేది ఆ విధంగా వుంటుంది.
ఇప్పుడు, 14వ వచనము ఇక్కడ వున్నది, నేను ఈ వాక్యము మీద కొద్దిసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను.
అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక, ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.
11
యేసు, ఈ శక్తివంతమైన రాజును గురించి మాట్లాడుట అనేది వారికి అర్థం కాలేదు, మరియు ఆయన ఆ పాత నిబంధనని ఆధ్యాత్మిక రుజువుగా చేసి దాని గురించి మాట్లాడుట ద్వారా వారికి అందిస్తున్నాడు. యేసు యొక్క బోధనలో అదే పునాది. కాని అది వారి యొక్క వేదాంతమునకు ఆ బోధ వ్యతిరేకమైనది. వారి వేదాంతము అంతా చాలా సంప్రదాయబద్దమైనది. వారు నమ్మినదేమిటంటే ఇంకా చాలా మంది విశ్వాసులు నమ్మినదే వారు నమ్మియున్నారు. కాని వారు దానిని కలిగియుండలేదు, సత్యమును.
అక్కడొక మార్గమున్నదని అది మనుష్యునికి సబంధి౦చినదిగా పరిశుద్ధ గ్రంథము చెపుతుంది. అది ఎలా ఉండవచ్చంటే దానిలోని ప్రతీది నిజమైనదిగా వుంటుంది. కాని ముగింపు అనేది అనేకమైన చావు మార్గాలు. అందుకని మనము తప్పనిసరిగా సరైన దానిలోనే ఉండాలి. అన్ని రకాల సంఘ కాలాలని ఏ విధంగా దేవుడు నిజమైనది లేదా అబద్ధమైనదని చెప్పగలడు. దాని నుండి నిందలేని దానిని ఆయన వేరు చేస్తాడు. ఆయన దానిని ఋజువు చేస్తాడు.
12
ఎక్కువ కాలం అయ్యుండకపోవచ్చును, సమారుగా ఒక రెండు వారాల క్రితం, నేను ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు. అతను ఈ విధంగా అన్నాడు, “మంచిది, ఒకవేళ పాత నిబంధనలో దేవుడు ఆ విధంగా బలహీనులను స్వస్థ పరిచినట్లయితే.” కాని చెప్పాడు, “క్రొత్త నిబంధనలో, ఆయన బలహీనులను స్వస్థపరిచాడు.” కాని చెప్పాడు, “ ఇప్పుడు ఇది ఒక... ఇది ఆలాగు కాదు.”
ఇంకా నేను ఇలా అన్నాను, “ఆయన వారికి బలహీనులను స్వస్థపరచు శక్తినిచ్చాడని నీవు అంగీకరిస్తావా?”
“అవును.”
“ఆయన వాక్యము ద్వారానా?”
“అవును.”
నేనన్నాను, “ఆయన వారి యొద్దనుండి దానిని తీసివేసికొన్నాడని పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ చెప్పబడింది?” చూడండి, “మీకు అది ఎచ్చటి నుండి వచ్చినదో నేను చూపించగలను. మీకు తెలుసా, అది ఎచ్చటి నుండి ఇవ్వబడినదో. ఇప్పుడు, మీరు నాకు చూపించండి అది ఎచ్చటి నుండి తీసివేయబడిందో, అప్పుడు నేను దానిని నమ్ముతాను.”
13
కాని ఆయన చెప్పాడు, “నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను, యుగ సమాప్తి వరకూ ఉన్నాను. మరియు ఏ కార్యాలు నేను చేస్తానో, మీరు కూడా చేస్తారు. మీ కొరకే నేనుంటాను, ఈ యుగ సమాప్తి అయ్యేంతవరకు మీతోనే ఉన్నాను.”
ఇప్పుడు, యేసు వారితో మాట్లాడి ఈ విధంగా ఇస్తున్నాడు ఒకానొక ఉపమానం, లేక నేనంటాను అది ఒక ప్రవచనం ఒకలాగ మరియు మరొకలాగ, అది ఒక ఉదాహరణ.
ఆయన అన్నారు, “ మోషే ఆ అరణ్యములో ఇత్తడి సర్పము పైకెత్తాడో.”
మనము తిరిగి వెనుకకు ఆ ఇశ్రాయేలు సంతానము దగ్గరికి కొద్దిసేపు వెళ్ళుదము, అదే మన ఆలోచనలకు పునాది. మరియు ఆ పరిశుద్ధాత్మ మన కొరకు ఏమి కలిగి ఉన్నాడోనని చూచుటకు మనము తొందరగా వున్నాం. ఈ కార్యాలు ముందుగానే ప్రణాళిక ప్రకారం చేసినవికావు. నేను కేవలం ఇక్కడకు వచ్చి మరియు పరిశుద్ధ గ్రంథము చదివాను. అది ఎక్కడకైతే వెళుతుందో, అది ఎక్కడికి వెళితే అక్కడకి.
14
మరియు నేను ఇప్పటి నుండి ఈ విధంగా అలోచిస్తున్నాను, ఇశ్రాయేలు ఆ యొక్క దాస్యములో నాలుగు వందల సంవత్సరములున్నది. వారు అక్కడ నాలుగు వందల సంవత్సరముల నుండి ఉంటూ దీనిని గుర్తించారు. ఈ నాలుగు వందల సంవత్సరముల దాస్యములో, ఈ నాలుగు వందల సంవత్సరాలలో రాయబడిన దేవుడు వారికి ఒక్కమాట కూడా సెలవియ్యలేదు ఏ కార్యము వారి కొరకు చేయలేదు. ఎందుకు?
వారికున్న చివరి ప్రవక్త యోసేపు, యోసేపు అనే మనిషి దేవుని వాక్యము వలన కొన్ని కార్యములు జరిపించుటకు మరియు దేవుని చిత్రం పూర్తి చేయుటకు జన్మించినవాడు.
వరములు మరియు పిలుపులు మారుమనస్సు లేకుండానే ఇవ్వబడును. నీవు కేవలం ఏదో ఒకదానిని ఇతరులలోకి త్రోయలేవు, త్రోయుటకు అది అక్కడ లేదు. మనిషి ఏమియూ చేయలేడు.
15
దేవుడు ఆయన ఎన్నికలో ఎన్నిక చేసాడు, ఈ జగత్తు పునాది వేయబడక ముందే, కొన్ని సంగతులు జరుగవలసియున్నది. ఆ కారణముచేతనే ఆయన ఆదిలోనే అంతములో ఏమి జరగనైయున్నదో ఎరిగియున్నాడు. ఆయన వాటి కొరకు ఒక క్రమ పద్ధతిని ఏర్పరిచియున్నాడు మరియు అవి అన్నియూ ఆ క్రమములోనే రావలసియున్నది.
ఇప్పుడు యోసేపు, అతను ఎప్పుడైతే జన్మించాడో, ఒక పరిశుద్దుడు, ఒక ప్రవక్త, భవిష్యత్ జ్ఞానం కలవాడు, ఒక కలలు కనేవాడు, కలలకు అర్ధం చెప్పువాడు, పరిశుద్ధుడు. అతను అతని సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, తన తండ్రిని ప్రేమించాడు. క్రీస్తుకి సరైన మాదిరిగా వున్నాడు. ఆయనను ఏ కారణము లేకుండా ద్వేషించారు, ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు. మరియు ఒక చాలా...
16
అన్ని లేఖనాల కఠినమైన ఒక సారాంశము, లేక అవి వృత్తములాగా తిరుగుతుంటాయి. ఒక సంఘటన, అక్కడ ఎక్కడైతే పరిశుద్ధ మత్తయ్య చెప్తాడో, అది ఇదే అని నేను నమ్ముతాను. “ఐగుప్తు బయట నుండి నా కుమారుడిని నేను పిలుస్తాను.” ఇప్పుడు, మత్తయ్య మాదిరిగా చెపుతున్న ఆ లేఖనం నిజానికి ఇశ్రాయేలుకి మాదిరిగా వున్నది. మరియు దేవుడు ఇలా చెప్పారు, “ఐగుప్తు బయటి నుండి, నేను నా కుమారుడిని పిలుస్తాను, ఇశ్రాయేలు.” ఆయన ఇశ్రాయేలు నుండి ఆయన కుమారుడిని పిలుస్తున్నాడు, కాని దానికి యేసు అని కూడా అర్ధం వున్నది. “ఐగుప్తు బయటినుండి నా కుమారుడిని నేను పిలుస్తాను.” చూడండి ఇది తిరిగి ఏ విధంగా వెనుకకు వెళుతుందో?
తరచుగా ఆ వృత్తము కాలమానం ప్రకారం తిరిగి వెనుకకు వెళుతుంది. చరిత్ర దానంతట అదే తిరిగి మొదలవుతుంది. మరియు లేఖనాలు అడుగునుండి కాలాల ద్వారా మళ్లీ తిరిగి ప్రారంభమౌతాయి. ఏ విద్వాంసుడికైనా ఆ సంగతి తెలుసు, అవి మనము చదువుతున్నప్పుడు వాటిని గమనించండి లేఖనాలలో ఒక స్థానము నుండి లేఖనాలు ఏ విధంగా దానంతటే అదే తిరిగి ఎలా ప్రారంభమౌతాయో, అవి ఆ విధంగా వృత్తాకారంలో తిరిగి ప్రారంభమౌతుంటాయి. అది ఆ విధంగా జరుగుతుంది అంతే.
17
ఇప్పుడు, యోసేపు సోదరులు అతనిని కారణము లేకుండానే ద్వేషించారు, కారణం అతడు ఆధ్యాత్మికంగా వున్నాడు, అది చర్చి యొక్క ఒక మాదిరిగా వున్నది, నామమాత్రపు, ఈ రోజు, అన్నీ వివిధ రకాల సంఘశాఖలు, మెధడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బేటేరియస్, పెంతెకోస్తు, హెలీనెస్, మరియు అందరూ కలసి, వ్యతిరేకిస్తున్నారు, సంప్రదాయ నులివెచ్చని సభ్యులు ఈ సంఘములలో ఉన్నారు. వారిలో అందరూ కాదు, వారిలోని ప్రతి ఒక్కరిలోనుండి చాలా మంది తిరిగి క్రైస్తవులుగా జన్మించారు. కాని ఆ కొద్దిమంది వారే నామమాత్రపు వారు, నామ మాత్రపు క్రైస్తవులు, కేవలం తెలియజేయబడిన క్రైస్తవులు వారు ఎల్లప్పుడూ నిందారహితులుగానే దేవుని చేత ఆత్మీయ ప్రత్యక్షత చేత..
శక్తి యొక్క నిజమైన అర్ధం ఎప్పటికీ కేవలం ఆ ఒక్క విధంగానే తెలుస్తుంది, స్వస్థత ద్వారా, మరియు రక్షణ అంటే నిజమైన అర్ధం, అది ఒక మనసు యొక్క ఆత్మీయ ప్రత్యక్షత మరియు దేవుని యొక్క వాక్యము. దానిని నీవు ఎక్కడినుండి నేర్చుకొనలేవు, కేవలం ప్రత్యక్షత ద్వారానే అది సాధ్యం.
18
దీనిని కొద్దిసేపు గమనించండి, నేను ఈ రాయబడినదానిని వదిలివేసినట్లయితే, తిరిగి ఆదికాండములోకి వెళదాం, ఎప్పుడైతే హేబేలు మరియు కయీను ఇద్దరూ త్యాగాన్ని తీసుకొనివచ్చారో, వారిద్దరూ విశ్వాసులైయున్నారు. హేబెలు మరియు కయీను ఇద్దరునూ విశ్వాసులైయున్నారు. వారిద్దరూ అవిశ్వాసులై యుండలేదు. కయీను ఒక అవిశ్వాసియై యుండలేదు, ఒక కమ్యూనిస్టుగా వుండలేదు. అతడు ఒక విశ్వాసిగా యున్నాడు.
ఇప్పుడు మంచిది, ఒకవేళ ప్రభువు మీద నమ్మకము ఉంచాలని దేవునికి అవసరమైతే, ఆయన కయీనుని కొట్టివేసేవాడు కాడు, ఆయనయందు హేబేలు కూడా అదే విశ్వాసము కలిగియున్నాడు. విశ్వాసముతో ప్రార్ధించుట, విశ్వాసముతో అర్పించుట, విశ్వాసముతో నమ్ముట.
అందుకని ప్రజలు ఈ విధంగా అన్నారు, “మీరు చేయవలసినదంతా నమ్ముటయే.” అది మాత్రమే మీరు చేయవలసినది, కాని తరువాత దేవుడు ఏమైనా చేయవలసియున్నది.
19
గమనించండి, ఒక ఋజువు యొక్క.. కయీను ప్రార్థించాడు. కయీను ఆయన కొరకు ఒక చర్చిని నిర్మించాడు, ఒక బలిపీఠం, కయీను ఆ బలిపీఠం వద్ద ప్రార్థించాడు. కయీను బలి అర్పి౦చాడు. హేబెలు వలె మతపరముగానే కయీను కూడా ఉన్నాడు. కాని కయీను కొద్ది కార్యాలు తెచ్చాడు, పొలము నుండి ఫలాలు తెచ్చాడు, వాటిని బలిపీఠంపై ఉంచాడు.
20
ఇప్పుడు, ఖచ్ఛితంగా కయీను అనుకున్నాడు మనకొరకు ఏవైతే తెచ్చాడో అవి ఏదేను తోట బయటి నుంచి తెచ్చాడు, ఫలాలు, అది ఏదో పని చేసి దానిని నేను తీసుకొని రావలసియున్నది. మరియు ఇప్పుడు, అది అతను సహజ చూపుతో చేసాడు, అది నిషేధించబడిన చెట్టు యొక్క ఫలమైయున్నదని తెలిసే తెచ్చాడు, కాబట్టి ఫలముని తిరిగి తెచ్చి బలిపీఠం మీద ఉంచాడు. కాని హేబెలు, ఆత్మీయ ప్రత్యక్షతతో, అతని విశ్వాసము ద్వారా అతనికి దేవుడు బయలుపరిచాడు, అది ఒక ఫలము కాదు; అది రక్తమైయున్నది. కాబట్టి ఆత్మీయ ప్రత్యక్షత ద్వారా, మొట్ట మొదటి సంఘము కట్టబడింది, మొదటి బలిపీఠం ఉద్దేశించబడింది, అందులో మంచి చెడుల కలయికయున్నది.
హేబెలు, ఆత్మీయ ప్రత్యక్షత, అక్కడ ఎక్కడా రాయబడిన వాక్యము లేదు, దేవుడే అతనికి ఫలముల వలన కాదని బయలుపరచాడు, లేక మీ యొక్క చేతి పనులు కావని. అతను రక్తమును తీసుకుని వచ్చాడు మరియు రక్తాన్నే అర్పి౦చాడు, మరియు పరీక్షించగా అది అతనికి నీతకరమైనదిగా అనిపించింది, ఎందుకనగా అతనేమైయున్నాడో — అది ఆత్మీయమైనది, బయలుపరచబడింది.
21
యేసు ఇలా చెప్పారు, రూపాంతర కొండ మీదికి ఆయన వచ్చినప్పుడు, ఇలా అన్నారు, “మనుష్యులు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను మనుష్య కుమారుడననా?”
“కొందరు నిన్ను మోషే అనుకుంటున్నారు, మరి కొందరు నిన్ను ఏలియా అనుకుంటున్నారు, ఇంకొందరు ప్రవక్త అనుకుంటున్నారు.”
ఆయన అన్నారు, అయితే నేను ఎవరని మీరనుకుంటున్నారు?
వినండి, మరియు పేతురు, అడుగు ముందుకు వేసి, ఇలా అన్నాడు, “నీవు క్రీస్తువి, జీవము గల దేవుని కుమారుడవు.”
గమనించండి, వెంటనే, యేసు ఇలా అన్నారు, నీవు ధన్యుడవు, సీమోను బరియోనా, రక్త మాంసములు నీకీ సంగతి బయలుపరచలేదు.“ ఆమేన్, పరిశీలించండి. ”నీవు ఎన్నటికీ దీనిని తరగతులలో నేర్చుకొనలేవు. నీవు మనిషి నుండి ఎన్నటికీ నేర్చుకొనలేవు.“
మనుష్యుని జ్ఞానము చేత ప్రకటించుటకు రాలేదని పౌలు అంటున్నాడు. కాని అతను యేసు శక్తి వలన ప్రకటించుటకు వచ్చాడు, నీ విశ్వాసము మనిషి యొక్క విజ్ఞానము మీద విశ్రాంతి మీద ఆధారపడకపోవచ్చును, కాని యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి మీద ఆధారపడును.
22
“నీవు ధన్యుడవు, సీమోను బరియోనా, రక్త మాంసములు నీకు ఈ సంగతి బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రియే నీకు ఈ సంగతి బయలుపరచెను.” గమనించండి. “మరియు ఈ బండ మీద, నేను నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను”
మతపెద్దలారా, నా సహోదరులారా, ఇక్కడ ఉన్న క్యాథలిక్కులు, మీరు అందురు, “ఆయన దానిని పేతురు అనే బండ మీద కట్టును.” ఆయన అలా చేసినట్లయితే, ఆయన కొద్ది దినాలలో జారిపోవును.
గమనించండి, వారిలో ఒకరు నీవు క్రీస్తువని చెప్పారు. లేదు. క్రీస్తు వాక్యమైయున్నాడు. క్రీస్తే దేవుని యొక్క ప్రత్యక్షత. కాని ఆయన చెప్పారు, “రక్త మాంసములు నీకు ఈ సంగతి బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రియే నీకు ఈ సంగతి బయలుపరచెను.” క్రీస్తు యొక్క ఆత్మీయ ప్రత్యక్షత మీద, దేవుని యొక్క కుమారుడైయుండి, అక్కడే ఆయన తన సంఘమును కట్టుదునన్నాడో, మరియు పాతాళలోకపు ద్వారములు దాని యెదుటన నిలువజాలవన్నాడు.
క్రీస్తే ఆ బండ కాదా. మంచిది, ఒక విధంగా క్రీస్తే ఆ బండ, కాని ఆయన పేతురుతో ఏమి మాట్లాడాడు, ఇది ఆత్మీయంగా బయలుపరచబడిన సత్యము, దేవుని యొక్క సాక్ష్యమేమిటంటే అది దేవుని యొక్క కుమారుడే, “రక్త మాంసములు నీకు ఈ సంగతి బయలుపరచలేదు, కాని పరలోకమందున్న నా తండ్రియే నీకు ఈ సంగతి బయలుపరచెను” - ఇది ఆత్మీయ బయలుపాటు.“ దేవుడు దానిని అనుమతి ఇస్తేనే నీవు దానిని పొందుకోగలవు. ”రక్త మాంసములు నీకు ఈ సంగతి బయలుపరచలేదు, కాని పరలోకమందున్న నా తండ్రియే నీకు ఈ సంగతి బయలుపరచెను.“ ఆత్మీయ బయలుపాటు.
23
కాని నీవు తరువాత చూసినట్లయితే, యేసేపు, ప్రవక్త చనిపోయిన తరువాత ఆ క్రింద ఉన్న సంతానం. వారికి ఎక్కడా విడుదల లేదు. మరియు ఆ సంఘము, బహుశా, అది కేవలం సంప్రదాయబద్దమైనది మాత్రమే.
మోషే కాలములో, నాలుగు వందల సంవత్సరముల తరువాత, వారి పెద్దలు, మరియు వారి యొక్క అనుచరులు, వారు ముందుకు వచ్చి నిలబడ్డారు. కేవలము మత సంబంధమైన దాని వలె, కాని ఏమి లేదు. కాని ఆ కాలములో సంఘములో ఎటువంటి చలనం లేదు. అటువంటి కాలములో మనము చాలా సంవత్సరములు నివసించాము (మంచిది), చలనము లేదు, అక్కడ స్థానాన్ని ఏది ఆక్రమించలేదు.
24
కాని అకస్మాత్తుగా, ఎప్పుడైతే వాగ్దాన సమయం దగ్గర పడిందో, దేవుడు నిర్ణయించబడిన జీవిని క్రిందకు పంపాడు. ముందుగానే అభిషేకించి, ఎన్నుకోబడిన జీవి, ప్రపంచంలో జన్మించాడు మరియు ఆయన జన్మించినప్పుడు ఏదో జరిగింది. అతని తల్లి తండ్రులకు అతనొక పిల్లవాడని, ఒక క్రమములో వచ్చిన దేవుని సంతానమని తెలుసును, అందుకనే వారు ఫరో యొక్క అవమానమునకు భయపడలేదు. అతని బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ప్రజలను దర్శించాడని వారి తల్లితండ్రులకు తెలుసు. నా భావము ఏమైయున్నదో చూచారా? అన్నిటిని క్రమములో ఉంచుట, అందరినీ ఒక దగ్గరకి చేర్చుట, మనకున్న అన్ని కార్యక్రమాల మాదిరిగా, కాగితం మీద అన్నీ వ్రాసి ఉంచినట్లు కాదు, ఆ శక్తివంతమైన దేవుడు ప్రారంభించకుండా చేయగలమా, ఆయన ఒక్కరు మాత్రమే దానిని చేయగలరు. ఆయనొక్కడు మాత్రమే అది చేయుటకు తాళం కలిగియున్నాడు.
25
దేవుడు కేవలం మనిషికి మార్గము చివర వరకు పరుగెత్తుటకు అనుమతించియున్నాడు, ఇప్పుడైతే దేశాలలో, మనము చాలా పెద్ద పెద్దవి కలిగియున్నాము. మరియు ఐదు వైపులా ముఖాలు కలిగినది, మరియు మిగిలనవన్నియూ. కాని అవి అన్నియూ లెక్కకు సరిపోవు. దేవుడు తీర్పు తీర్చుటకు లోకానికి సమయాన్ని నిర్ణయించియున్నాడు. మరియు ప్రతి ఒక్కటి ఆ సమయములో ప్రారంభించబడిన దాని దగ్గరకు రావలసియున్నది. పైనున్న పరలోకములో ఆయన పలుకబడిన దాని ప్రకారం వాటికై ఉద్దేశించబడిన పనిని చేయవలసియున్నది. అవునయ్యా.
26
మరియు ఇప్పుడు, ఎప్పుడైతే మోషే దృశ్యములోకి వచ్చాడో, ఆయన మోషేకు సహాయం చేయలేదు. అతను కేవలం ఒక ప్రవక్తలాగా జన్మించియున్నాడు. దేవుడు అతనిని క్రిందకు పంపియున్నాడు మరియు భూమి మీద అతనికి జన్మను ఇచ్చాడు, మరియు ఫరో యొక్క సమస్తము అతనిని చంపలేకపోయింది. అతను దేవుని ప్రవక్తయై ఉన్నాడు.
అటు తరువాత మోషే ఎప్పుడైతే దృశ్యము మీదకి వచ్చాడో, అత్యద్భుత కార్యాలు చోటు చేసుకున్నాయి. అతను దేవుని చేత విమోచన కొరకు పంపబడ్డ ప్రవక్త. ఎప్పుడైతే దేవుడు ఒక మనిషిని పంపియున్నాడో, సహజతీమైన కార్యాలు ప్రారంభమగుట మరియు చోటు చేసుకొనుట జరిగింది.
27
మరియు ఎప్పుడైతే సంఘము చాలా కాలము కదలిక లేకుండా చచ్చిన దానివలే పడివుంటుందో, ఎప్పుడైతే సంఘములో ఉజ్జీవం లేదో, ఎప్పుడైతే సంఘ కాపరి చల్లబడి నుంచుని ఉంటాడో, జారిపోయే ప్రసంగముతో, ఎప్పుడైతే కొంతమంది “ఆమేన్” అంటుంటారో, సంఘ పెద్దలు ఆ సంఘ కాపరిని చర్చి భవనం బయటకు పంపించివేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎప్పుడైతే నీవు అటువంటి సంఘమును కలిగివుంటావో, అది చలనం లేకుండా పడివుంటుంది.
తరువాత, ఓహ్, దేవుడు తన మనుష్యుడను ఒక్కసారి అక్కడికి పంపనీయండి. అక్కడ అది దేనిని ఆక్రమించుకొంటుందో పరిశీలించండి. అక్కడ ఉజ్జీవపు మంట వేదిక దగ్గరికి తిరిగి వస్తుంది. జనం వారి ఆత్మల కరుణ కోసం ఏడుస్తారు. జీవితాలు సరిచేయబడతాయి. స్వస్థతలు సంఘములో స్థానమును ఆక్రమిస్తాయి. సూచక క్రియలు మరియు అద్భుతాలు జరుగుట ప్రారంభమౌతాయి. ఎక్కడైతే సృష్టికర్తయైన దేవుడు వుంటాడో, నూతన సృష్టి వస్తుంది, నూతన జీవం వస్తుంది, నూతన ఆశలు చిగురిస్తాయి. యేసు వచ్చినట్లయితే ప్రతి ఒక్కటి వస్తుంది — ఎల్లప్పుడూ అలాగే ఉన్నది.
28
ఇప్పుడు, తిరిగి మనం గమనించుదాము, త్వరగా ప్రయాణములో ఉన్నప్పుడు... ఖచ్చితమైన సంఘము ఈ రోజు ప్రయాణములో ఉన్నది, దేవుడు తను ఏ విధంగా వెళ్ళాడో అదే విధంగా వారి కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత వారి సంఘము ఎప్పుడైతే చల్లబడిపోయిందో ఆ సమయంలో వచ్చి సాతానుతో పాటు దేవునికి మరియు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు, ఫిర్యాదులు చేశారు. మరియు వారు ఎప్పుడైతే చల్లబడుట ప్రారంభించారో, గుడారములోనికి బలహీనత ప్రవేశించినది. తాపకరమైన సర్పాలు లోపలికి వచ్చాయి. ప్రజలను కాటువేయుట ప్రారంభి౦చాయి. మరియు చాలా బలహీనత ఇశ్రాయేలులోకి వచ్చింది మరియు వారిలో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు, వారు తమ తప్పుని తెలుసుకొన్నారో అప్పుడు మోషే వారి తరుపున మధ్యవర్తిత్వం చేశాడు.
ఈ రాత్రి మనకు ఏమి కావాలి, ఈ అమెరికా దేశం ఒక గొప్ప పాత తరానికి చెందిన తప్పువలె ఉన్నది (మంచిది), నీ తప్పుని నీవు ఒప్పుకుంటున్నావా, దేవుడి దయ కొరకు అడుగుము, కేవలం సంఘముతో కలిసియుండుట కాదు, కేవలం కాలక్షేప ప్రసంగాలు ప్రారంభించుట కాదు, కాని ప్రతిచోట ఆ పాత తరం వారివలే పశ్చాతాపం కలిగియుండండి. “ప్రభువా, మేము తప్పు చేశామని.”
29
అక్రమముగా అమ్మువాటిని మూసివేయండి, చెడ్డ పేరొందిన గృహముల మూసివేయండి. మేజా బల్లమీద నుండి సిగరెట్లు తీసివేయండి. విస్కీ ఎక్కడా అమ్మనివ్వకండి. మన కొరకు మనము క్షమించమని దేవునికి ఋజువు చేద్దాం. నైటు క్లబ్బులను మూసివేయండి. మోకాళ్ల మీద వంగి ప్రార్ధన చేద్దాం. ఆ విధంగా ఉజ్జీవాన్ని ప్రారంభించవలసియున్నది. అది మంచిది. అది సత్యము. దాని గురించి ఆలోచించుము.
నీవు వెచ్చిస్తున్న శ్రమనంతా చూడుము. అదంతా వృధాయే. నీవు నిజముగా దానిని గురించి దేవుని యెదుట నిజాయితీగా ఉన్నావని ఋజువు చేసేంతవరకు అదంతయూ వృధాయే. అదియే మార్గము. అదే విధంగా నీ స్వస్థత కూడా వుంటుంది.
30
నీవు ఈ ప్రార్ధనా వరుసలో పరుగెత్తవచ్చును, వేరొక ప్రార్ధనా వరుసలోకి పరుగెత్తవచ్చును, దీనిని ముట్టుకొనవచ్చును, దానిని ముట్టుకొనవచ్చును, ఈలాగు చెప్పవచ్చును. నీవు క్రిందకు వంగి నీవు నిజాయితీగా వున్నావని దేవుని యెదుట రుజువు చేసేంతవరకు, నీ వెనుక ఉన్న వంతెనలను కాల్చివేసి, మరియు ఇలా చెప్పుము, “ప్రభువా, ఇదుగో ఇక్కడ ఉన్నాను,” తరువాత అక్కడ ఏదో కార్యం జరుగవలసి ఉంటుంది.
పరిశుద్ధాత్మ విషయం కూడా అలాగునే ఉ౦టుంది. నీవనవచ్చును, “నేను చాలా సంవత్సరముల నుండి పరిశుద్ధాత్మ కొరకు ఎదురుచూస్తున్నాను.” నేను నిన్ను నిందించుట లేదు. నీవేదో తప్పుగా అర్ధం చేసుకొన్నావు, లేక అక్కడ ఏదో భేధమున్నది, లేదా అది నీకు అర్ధమవ్వలేదు.
31
దేవుడు తన వాక్యమునకు కట్టుబడి ఉంటాడు. పెంతెకోస్తు దినాన పేతురు ఈ విధంగా అన్నాడు, “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.” అది లేఖనము, నేను చదవగాలిగినంత తేటగా అది వున్నది.
నీవు మారుమనస్సు పొంది బాప్తిస్మము పొందినట్లయితే, అప్పుడు దేవుడు బద్దుడైయున్నాడు, నీ విశ్వాసము దేవుని వైపున్నట్లయితే నీవు ఆయన వాక్యమునకు విధేయుడిగా ఉన్నట్లయితే అదే నిముషములో పరిశుద్ధాత్మని నీ మీదకు పంపుతాడు. దానియందు నమ్మకముంచుము. దేవుడు దానిని నీకు రుజువు చేస్తాడు.
నీ హృదయము దేవుని యెదుట సత్యముగా ఉన్నట్లయితే, నీ ఆలోచన ఖచ్ఛితమైనదైతే, మరియు దానిని నమ్ముచున్నట్లయితే, మరియు దాని కొరకు నమ్మకముగా నడువుము, ఏదో కార్యము జరుగబోతుంది, ఎందుకనగా నీవు పరిశుద్ధాత్మను అంగీకరించే దానికన్నా దేవుడు నీకు పరిశుద్ధాత్మను ఇచ్చుటకు ఎక్కువగా సమ్మతిస్తాడు.
32
ఇప్పుడు, మనము దీనిలో కొద్దిగా ముందుకు వెళదాము, మరియు ఇప్పుడు, ఎప్పుడైతే మోషే దేవునితో మాట్లాడుటకు వెళ్లాడో... ఇలా అన్నాడు, “దేవా, మరి దీనిని చేయుటనేది ఏమౌతుంది?”
పరిశుద్ధాత్మను గమనించండి, త్వరగా. ఇలా అన్నారు, “వెళ్లి ఇత్తడితో సర్పాన్ని తయారు చేయుము, మరియు దానిని ఒక స్తంభము మీద ఉంచుము, దానిని ఇశ్రాయేలియుల మధ్యన పైకెత్తుము. మరియు దాని దగ్గరకు వచ్చి, ఎవరైతే ఈ సర్పాన్ని చూస్తారో, విశ్వసిస్తారో, వారు వారి యొక్క వ్యాధి నుండి స్వస్థతను పొందుకుంటారు.”
33
ఇప్పుడు మొదటి సంగతి, ఇత్తడి మరియు స్తంభము, ఆ సర్పము, అంతయూ యేసుక్రీస్తుకి మాదిరిగా మాట్లాడుతుంది, యేసు నికోదేముతో మాట్లాడునప్పుడు, ఇలా అన్నారు, “మోషే అరణ్యములో ఇత్తడి సర్పాని ఎలాగు ఎత్తెనో, అలాగున మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.”
ఇప్పుడు, వారు చేసిన మొదటి కార్యమేది? ఆ ప్రజలు చేసిన మొదటి కార్యము, దేవుడితో వాదించుట. వారు పాపము చేసారు. ఆ కారణముచేతనే వారిని ఆ సర్పము కాటువేసినది, మరియు జ్ఞానముగల ఐగుప్తు వైద్యులు, వారితో పాటు ఉన్నారు, ఆ సర్పకాటు నుండి వారిని కాపాడలేకపోయారు, ఎందుకనగా అది దైవిక కార్యము. కాని ఇప్పుడు, దేవుడు, పాపము నుండి ఆయనే విడుదలను కలుగచేస్తాడని తెలియుటకు, బలహీనతను నుండి ఆయన విడుదల చేస్తాడు. అందుచేతనే ఆయన సర్పాన్ని తయారు చేశాడు.
34
ఆ సర్పము, మొదట స్థానము, ఏదేను తోటలోని జరిగిన పాపము యొక్క తీరు మాదిరిగా వున్నది, ఆ సర్పము యొక్క కాళ్ళు తీసివేయబడినవి.
ఇత్తడి అనేది దైవత్వము యొక్క తీరుగా ఉన్నది, ఇత్తడి బలిపీఠం, మరియు ఆహబు ఆ దేశాన్ని చాలా కాలము పరిపాలించుచున్నప్పుడు, ఏలియా యొక్క కాలములోని ఇత్తడి ఆకాశము.
ఆ స్తంభము శిలువను సూచిస్తుంది. ప్రతి ఒక్కటి క్రీస్తుని సూచిస్తున్నాయి. ఆయన ఎందుకని వాటిని ముందుగా చూపించాడు? దేవుడు, ఆది కాలములో, ఇశ్రాయేలియుల సంతతికి తాను చేయబోయే కార్యముల గురించి ఆసక్తి కలిగించుటకు.
చూశారా, దేవుని మనస్సులో, క్రీస్తు అప్పటికే శిలువ వేయబడ్డాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన గొర్రేపిల్లగా వదింపబడ్డాడు. ఏదేనులో, దేవుని ఆలోచనల్లో క్రీస్తు ఉన్నాడు, అదే ఆయన వాక్యముగా మారింది, అది ఇంకా పదార్ధముగా లేదు, కాని ఆయనకు తెలుసు అది వున్నదని, అందుకే ఆయన దానిని వాగ్దానము చేసాడు. మరియు ఆయన వారికి ఆ దాచిపెట్టినది ఇచ్చుట కొరకే ఇశ్రాయేలియుల సంతతికి దానిని గురించి ముందుగానే ఆసక్తిని కలుగజేశాడు. దానిని ఆయన తెలియజేయవలసియున్నది, జరుగనైయున్నది ఆయనకు ముందుగానే తెలిసియున్నది, ఆయన ముందుగానే ఒక సాదృశ్యమును తయారు చేసాడు. ఆ సర్పము ద్వారా, జరగబోయే దానిని వారు ముందుగానే చూస్తారు, మరియు దాని ద్వారా, స్వస్థతను పొందుకుంటారు.
35
వారు ఎప్పుడైతే పాపములో పడిపోయారో, నీవు స్వస్థతను పొందుకోవాలి. ఓ మై. అది మెథడిస్టులను ఆనందపరుస్తుంది, అట్లు చేయదా? చూడండి. కారణమును దాటుటకు, మరియు నీవు స్వస్థతను ముందే పొందియున్నావు. ఆసక్తిని పెంపొందించుటకు...
మరియు ఒకవేళ దేవుడు తన అనంతమైన ఆలోచనలలో ఉన్నట్లయితే, వందల సంవత్సరాల తరువాత యేసు ఒక శిలువ మీద మరణిస్తాడని తెలుసు, మరియు మన కొరకు పాపము తయారుచేయబడి ఉన్నది, శిలువ పై మరణించాలి, మరియు యేసుని శిలువ వేయకముందే ఇశ్రాయేలియేలు వారు అద్భుతమైన స్వస్థత పొందుకోవాలి, మరియు యేసు శిలువ వేయబడిన తరువాత ఆయనెంత ఎక్కువగా చేస్తాడు? అదే గనుక ఒక విధమైనదైతే, మరి వ్యతిరేకమైనది ఎంత ఎక్కువగా ఉంటుంది? మోషే కలిగియున్న దానికంటే నేటి దినమున మనము ఎంత గొప్ప కార్యక్రమమును కలిగియున్నాము?
మరియు మోషే ఇంకా అడవిలో నుండి బయటకు రాక ముందు, 40 సంవత్సరాలు. వారిలో ఏ ఒక్కరు వ్యాధుల బారిన పడలేదు. వైద్యుడైన మోషే. నేను ఉహిస్తున్నాను ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా వైద్యుడునట్లయితే, ఆయన యొక్క మందుల చీటీని నీవు కలిగియుండాలి.
36
ఇరువది లక్షల మందికి నాయకత్వం వహించాడు. ప్రతి రాత్రి ఆ ఇరువది లక్షల మంది ప్రజలలో ఎంత మందికి నూతనంగా శిశువులు జన్మించియుంటారు? వారిలో ఎంత మంది ముసలి వారుంటారు? కాలు, చేయి కదపలేని వారెంతమంది ఉంటారు మరియు వారి మధ్యలో ఎంత మంది బలహీనులుంటారు మరియు వారిలో ప్రతి ఒక్కరి మీద వైద్యుడైన మోషే శ్రద్ధ తీసుకొనియున్నాడు, వారందరిని ఎటువంటి శారీరక బలహీనతలు కలుగకుండా తీసుకొనివచ్చాడు. ఎందుకు, వైద్యుడా, నీవు కేవలం ఒక కుటుంబాన్ని కూడా అంత మంచిగా తీసుకొని రాలేవు. దాని గురించి ఆలోచించుము.
ఎందుకు? వైద్యుడైన మోషే మందుల చీటీని కలిగియున్నాడు. ఆ మందుల చీటీ కొరకు అతను ఏమి కలిగియున్నాడో మీరందరూ చూడాలని అనుకుంటున్నారా? నేను మీకు చూపిస్తాను, అతని యొక్క పెట్టి లోపలికి చూడండి. “నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.” అతనికి కావలసిన మందుల చీటీ అంతా అదియే. వైద్యులారా, మీ పెట్టెలో కూడా దానిని ఉంచుకొనండి. నేను మీకు చెబుతున్నాను, మీ దగ్గరకొచ్చే రోగులు స్వస్థత పొందుకుంటారు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే
37
ఒకవేళ ఒక తల్లి తన యొక్క బిడ్డ బలహీనంగా వుంటే,“నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.” సర్పము కాటు వేసినట్లయితే, “నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.” ఎవరో ఒకరి కాలు విరిగినట్లయితే, “నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.”
ఆ నిబంధన క్రింద అతను దానిని చేసి ఉన్నట్లయితే, నేటి దినమున ఉన్న నిబంధన ఎంత గొప్పది? ఆ విధమైనదాని క్రింద ఆయన దానిని చేసినట్లయితే, మరి వ్యతిరేకమైన దాని క్రింద ఆయనే విధముగా చేస్తాడు?
క్రైస్తవ స్నేహితుడా, నేను నమ్ముట అనేది దేనితో ప్రారంభి౦చానో మీకు తెలుసా? అది ఏమిటంటే ప్రపంచం సాక్ష్యమివ్వబోయే ఆ గోప్ప సమయంలో మనము జీవిస్తున్నామని, అన్నీ దారులు సరిచేయబడతాయని నేను నమ్ముతాను. మీకు తెలుసా, అన్ని రకాల వేదాంత (థియాలజీలు) మరియు బోధలు సరి చేయబడతాయి, మరియు అన్ని రకాల పూర్తిగా తయారుచేయబడని పదార్దములు, అవిశ్వాసము, అది ఒక తరము నుండి తరువాత తరమునకు అప్పచెప్పబడియున్నది. “ఓ, అక్కడ స్వస్థత అనేటువంటిదే లేదు. అద్భుతాలు జరుగు రోజులు అయిపోయాయి.” మనము దానిని మనకు తెలియకుండానే నమ్ముతాము.
కాని అది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మనిషి దగ్గరికి కాదు... మనము ఆ పాత పురాతనమైన దారిలో వెనుకకు వెళ్లివలసియున్నది.
38
చూడండి గడిచిన 150 సంవత్సరములలో విజ్ఞాన శాస్త్రము అనేది ఏ విధంగా అభివృద్ధి చెందినదో, దానిని గురించి ఆలోచించండి. ఒక వంద సంవత్సరముల క్రితం, ఒక ఉత్తరం ద్వారా మాత్రమే ఒక వర్తమానము అనేది పంపేవారు లేక పెదవుల నుండి చెవికి మాత్రమే. మరియు ఈ రోజు దానిని టెలిఫోను ద్వారా, టెలిగ్రాము ద్వారా, తీగెలు లేని టెలిగ్రాము (వైరలెస్ టెలిగ్రాము). దూరదర్శిని (టెలివిజన్) ద్వారా పంపవచ్చును. వారు దానిని పంపు విధానము గురించి ఆలోచించండి. వారు ఎంతగా అభివృద్ధి చెందారు.
39
150 సంవత్సరముల క్రితం దాని గురించి ఆలోచించండి, ఒక ఫ్రెంచి శాస్త్రవేత్త (అతని పేరుని నేను ఇప్పుడు చెప్పలేను, దానిని చదివి చాలా ఎక్కువ కాలము అవ్వలేదు). నిరూపించాడు, లేక నిరూపించగలనని చెప్పాడు, అది ఏమిటంటే, తిరుగుతున్న ప్రపంచపు దారిని ఒకవేళ వారు తెలుసుకున్నట్లయితే (మరియు అది సుమారుగా 25 వేల మైళ్ల వుండవచ్చు, అయివుండవచ్చును ... అది సుమారుగా గంటకు వెయ్యి మైళ్ళు అనుకుందాం.), మరియు ఒక వ్యక్తి అత్యంత వేగవంతంగా గంటకు 30 మైళ్ల వేగంతో గానీ వెళితే, భూమ్యాకర్షణ శక్తి అతనిని భూమి నుండి పైకి తీసుకుని వెళ్తుంది. విజ్ఞాన శాస్త్రం దానిని నిరూపించింది. నేను, ఆశ్చర్యపడ్డాను అతను ఎగిరాడా అని? ఒక గాలిబుడగ వలె?
గమనించండి, దాని గురించి నేటి దినాన ఆసక్తి చూపిస్తున్నారా? మీరు మీ కారులోకి దూకి మరియు మీ కారుతో గంటకు 100 మైళ్ల వేగంతో ప్రయాణం చేయండి మరియు ఆలోచించండి మరియు అక్కడ ఏమి జరుగదు. ఖచ్చితంగా.
40
నేను కొద్దిగా చూశాను, ఒక రకమైన చిన్న ఫోర్డు కారు మరొక దినాన గంటకు 150 మైళ్ళ వెళ్తుందని వారు చెప్పారు. వారు దాని గురించి ఎటువంటి ఆసక్తి చూపించలేదని విజ్ఞాన శాస్త్రం చెప్పింది, ఎందుకనగా వారు దానిని దాటి అభివృద్ధి చెందారు. వారు ఒక అణుబాంబు విస్ఫోటనం చేశారు. మరియు మీకు తెలుసా, విజ్ఞాన శాస్త్రం అణుబాంబుల ద్వారా గాలికి ముఖ్యముగా కావలసినవాటిని పాడుచేయుట ప్రారంభిస్తుందని? అణు బాంబులు చుట్టు తిరిగి వెనుకకు మరియు విరగగొట్టబడి దేవుని దగ్గరకు వచ్చేంతవరకు. వెలుగు తిరిగి దేవుని దగ్గరకు వచ్చింది. విజ్ఞాన శాస్త్రం ప్రస్తుతం నిరూపిస్తున్న సంగతులు వారు తిరిగి దేవుని మీద ఆధారపడతారని రుజువు చేస్తుంది. వారు దానిని కనుగొంటున్నారు, అది ఏమిటంటే అది తిరిగి మొదటికి వెళ్లవలసియున్నది.
41
కొద్దికాలం క్రితం నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ వేదిక నుండి ఒక బలమైన శాస్త్రవేత్త గురించి మాట్లాడాను. మరియు అతను ఒక గదిలో నన్ను ఆ వెలుగు గురించి ప్రశ్నించాడు. ఆ దూత యొక్క వెలుగు ప్రత్యక్షమైన దానిని గురించి. అది ఒక కాగితం మీద ఉన్నది, అది ఒక దృశ్యముగా ఉన్నది.
ఎందుకు, అతను అన్నాడు, “రెవరెండ్ బ్రెన్హాం, వారు ఒక మీటరుని చనిపోతున్న పరిశుద్దుని మీద ఉంచారు, అది ఎప్పుడైతే చనిపోబోతుందో మరియు అది ఆ గదిలో నుండి జారిపోతుంది, మరియు ఆమెకు దానిని గురించి ఏమియూ తెలియదు. మరియు ఆమెను మరణం ఎప్పుడైతే గుచ్చినదో, ఆమె భయపడలేదు. ఆమె తన కన్నులెత్తి మరియు దేవుడిని తనకున్న శత్రువులందరినీ క్షమించమని అడిగింది, మరియు ఆమె తను ఇంతకాలం జీవించిన జీవితం కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించింది. మరియు ఎప్పుడైతే ఆ మీటరు సున్నాను చూపించినదో, ఆ స్త్రీ నుండి తగినంత శక్తి పైకి వచ్చింది, మానవాతీత శక్తి వంటిది ఆమె నుండి బయటకు వచ్చింది, దానిని ఆ మీటరు పట్టుకుంది, అసత్య శోధిని (లై డిటెక్టరు) చేసిన మాదిరిగానే దానిని కూడా చేశారు. అది మీ నరములను..”
42
మీరు అసత్యాలు చెప్పుటకు సృష్టించబడలేదు. నీవు నీ చేయి మణికట్టు చూట్టూత ఒక దానిని పెట్టుకొనవచ్చును, మరియు నీవు దానిని అక్కడనే ఉంచుము, మరియు నీవు ఏదైనా చెప్పటానికి ప్రయత్నించుము. మరియు నీవు దానిని గురించి నిజము మాట్లడకుండా ఉన్నట్లయితే, అది నీవు అసత్య౦ చెప్పుచున్నావని చూపిస్తుంది, అక్కడ వెలుగు మీద ఒత్తిడి కలుగుట వలన అది నీ నరములలో నుండి వెళ్లును, శక్తి, మనిషి యొక్క ఆత్మ అసత్యము పలుకుటకు కొరకు సృష్టించబడలేదు, కాని సత్యము కొరకు ఉద్దేశించబడినది.
విజ్ఞాన శాస్త్రం దానిని హక్కుగా లేదా స్థానంగా చేసింది. అలాగునే సత్యము మీద కూడా... ఎందుకు, దేవుని యొక్క పరిశుద్ధులు, చనిపోతూ, ఆమె తన సొంత గృహము నుండి పరుగెత్తింది, ఎందుకనగా ఆమె దేవుని నమ్మినది కనుక. ఆమె ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినందుకు మరియు ఆయన యందు విశ్వాసము ఉంచినందున వారు ఆమెకు మతి చలించింది అన్నారు.
మరియు కావలసినంత శక్తి ఆ స్త్రీ నుండి వచ్చి రేడియో ద్వారా ఐదు మార్లు వర్తమానము పంపినది, అది జరిగినది అని నేను నమ్ముతాను, చనిపోబోతున్న ఆ స్త్రీ నుండి శక్తి వచ్చినదని నేను నమ్ముతాను. చంద్రుని దాటి ఉన్న నక్షత్రములను దాటి దేవుని యొక్క సింహాసనము వద్దకు వెళ్లును, ఆమె యొక్క మృత్యు ఘడియల్లో ఆ యొక్క ప్రార్థనతో పాపి యొక్క బలహీన హృదయానికి.
43
తరువాత ఆయన ఒక అవిశ్వాసియైన మనిషిలోకి పారిపోయాడు, లైంగిక వ్యాధి వలన చనిపోతున్నవాడు. యవ్వనస్తురాలైన ఒక స్త్రీని హృదయాన్ని తాకు అన్ని విధములైన కార్యాలు చేయుటకు అతనిని తీసుకొని వచ్చుటకు అక్కడకు పంపియున్నాడు. మరియు ఆ తరువాత ఎప్పుడైతే ఆమె ఆయనకు కోపం తెప్పి౦చినదో, శాపానికి ప్రారంభము మరియు దేవుని నామమును వ్యర్ధముగా తీసుకొనుట జరిగింది, మరియు ఆ మీటరు క్రైస్తవుల మార్గములో వెళ్లినదానికంటే వేరే మార్గములోకి వెళ్ళినది.
మరియు తరువాత ఆ శాస్త్రవేత్తలు మారి ఇలా అన్నారు, “ఒకవేళ దేవుడు ప్రజలను గౌరవించినట్లయితే అంత ఎక్కువగా దేవుడిని నమ్ముతారు మరియు ఆయన నామమును మహిమకరముగా ఎవరు ఉపయోగించుతారు, ఇప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నమ్ముతాను మరియు ఆయనను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను.”
తరువాత అతను చెప్పాడు, “ రెవరెండ్ బ్రెన్హాం, ఆ రక్షకుని చుట్టూ ఉన్న ఆ వెలుగు, మరియు పరిశుద్ధుల చుట్టూ ఉన్న వెలుగు, అదేదో ఒక మానసికమైన అనుభూతి కాదు. అది ఇత్తడి సర్పమున్న దినములలో మాదిరిగా దేవుడు వున్నాడు.”
అది సాంకేతికంగా కూడా రుజువు చేయబడిన సత్యము. హల్లెలూయ. అది వారు కెమెరాతో ఫోటో తీయకముందున్నది. అక్కడ విశ్వాసి చుట్టూ ఒక శక్తి ఉంటుంది. [టేపు మీద ఖాళీ ఉన్నది.]
44
నీ వాక్యమే సత్యము. మరియు ప్రభువా, మేము ప్రార్థన చేయుచుండగా మీరు మాతో ఉండండి కొద్ది మాటలతో ప్రభువైన యేసుక్రీస్తుని మహిమపరుద్దాం, మీ ఏకైక కుమారుడు, ఆయన ఇలా చెప్పాడు, “నేను పైకెత్తబడితే, నేను మనుషులందరిని నాలోకి తీసుకుంటాను.” ఓ దేవా, మాకు ఆయనను ఈ ప్రజలముందు పైకెత్తుటకు సహాయం చేయుము. ఆయనను అత్యధికంగా మహిమపరచుటకు సహాయం చేయుము మరియు ఇలా అనుము, “ఆయనేమైయున్నాడో అలానే ఉన్నాడు - తండ్రి చేత ఆయన మహిమపరచబడ్డాడు.” ప్రధాన దూతలందరి పైన, పరలోక రాజ్యములో రాయబడిన ప్రతి ఒక్క నామము కన్నా పైనా, అన్నీటికన్నా పైన ఆయన నామమున్నది.
ఎప్పుడైతే ఆయన మృతులలో నుండి లేచాడో, ఆయన ఇలా అన్నారు, “అన్ని శక్తులు, భూమి మరియు పరలోకము నా చేతికి ఇవ్వబడ్డాయి. వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించండి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను.”
45
మరియు పరలోకపు తండ్రి, ఈ లేమి సమయంలో, నాకున్న వినయపు మార్గములో, ఇప్పుడు దీవించబడ్డాము, నేను సంతోషంగా మరియు ... ఆ రాత్రి నన్ను కలిసిన ఆ గొప్ప దేవుని యొక్క దూతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, మరియు ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక మీద నిలబడి, నాకు హెచ్చరిక చేస్తున్నాడు, “ఒక ప్రార్ధన వరుసను పిలువుము.” ఈ రాత్రికి ఇక్కడ ఏదో జరుగనైయుండవచ్చును, తండ్రి, అది చాలామంది విశ్వసించటానికి కారణమవ్వచ్చును. ఎప్పుడైతే ఆరాధన ముగుస్తుందో తరువాత, నేను ప్రార్ధిస్తాను, దేవా, ప్రతి ఒక్క అవిశ్వాసి వేదిక దగ్గరకు వచ్చి ఇలా చెప్పాలి, “ఇప్పుడు నేను నమ్ముతున్నాను.” ఎవరైతే పరిశుద్ధాత్మతో లేరో, ఈ రాత్రికి వారు వారి కుర్చీలలో కూర్చుని ఉండగానే దానిని పొందుకుంటారు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో, దేవుని సన్నిధి ఇక్కడ వున్నది కాబట్టి ఇది మహిమకరమైన రాత్రియై ఉన్నది. దీనిని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
46
క్రైస్తవుల మధ్యలో వింతైన కార్యములు జరుగుతుంటాయి. [సోదరుడు బ్రానహాం మరొక సోదరునితో మాట్లాడుతున్నారు: మీరు ప్రార్ధన కార్డులు ఇచ్చారో లేదో నాకు తెలియదు. వారు ఎంతమంది, “జె” గత రాత్రి? జే, తరువాత వారిలోని మొదటి భాగమును పిలుద్దాం? పిలుపునకు సంబంధించి.. మనకు ఎంత మంది ఉన్నారు. గత రాత్రి 20 మంది ఉన్నారా? వారందరూ రాలేదా? మంచిది, చివరి నుండి పిలుద్దాం... దాదాపు చివరి 15 మందిని.] అంతా మంచిది, ఈ రాత్రి చివరి 15 మందిని పిలిచి ప్రారంభించుదాము. అయితే మనము జే-85, 85 నుండి 100 వరకు.
47
జే-85 ఎవరు? మీ చేతిని పైకెత్తండి, మీరు స్త్రీయేనా? ఇక్కడకు పైకీ రండి, ఇక్కడికి రండి. జే-86 ఎవరు? ప్రార్ధనా కార్డు 86, మీరు మీ చేతిని ఎత్తగలరా ? 86? 86? అంతా మంచిది. స్త్రీయేనా. 87? 87 ఎవరు? అంతా మంచిది. 88? అంతా మంచిది. 89, ప్రార్ధనా కార్డు 89 ఎవరి దగ్గర ఉన్నది? మీరిక్కడ ఉన్నారా? మీ చేతిని పైకెత్తండి. 89? వారు దానిని కలివున్నారా? 90, ప్రార్ధనా కార్డు 90 ఎవరు కలిగియున్నారు? 91, 92, 93 94 95? 95, నేను దీనిని చూస్తున్నానా? అంతా మంచిది, 96, 97, 98, 99, 100? కొద్ది నిముషాలలో వీటిని ప్రయత్నిద్దాం.
ఎందుకు అనేది నాకు తెలియదు. బహుశా ఆ ప్రార్ధనా వరుసలోని వారిలో ఎవరో రేపు ఉదయంలోపు చనిపోతారు. అది నాకు తెలియదు. నేను చెప్పుటలేదు... ఏదో చెప్పింది ఒక ప్రార్ధనా వరుస కలిగియుండాలని. ఇదిగో మనము దానిని చేయుటకు సిద్ధంగా ఉన్నాము.
48
ఇక్కడ ఉన్నవారిలో ఎంతమంది దానిని నమ్ముతున్నారు, బలహీనంగా ఉండి దేవుడు ఈ రాత్రి స్వస్థపరచాలని ఎంత మంది కోరుకుంటున్నారు? మనము సిద్ధపడే లోపు మీరు మీ చేతులను పైకెత్తగలరా... అది చాలు. మీరందరూ ఎక్కడ ఉన్నారో చూద్దామని. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఎందుకు అనేది నాకు తెలియదు, కాని ఇక్కడ సంగీతము లేక మరేదో ప్రారంభించక ముందే ఆయన ఇక్కడ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అరుదుగా ఇలా జరుగుతూ వుంటుంది.
మీరు ఈ రాత్రి మీ హృదయమంతటితో నమ్మాలని నేను కోరుకుంటున్నాను. దేవుని మహిమ కొరకు మీరందరూ నమ్మాలని నేను కోరుకుంటున్నాను. ఒక ప్రార్ధనా వరుస కావాలని నేను ఆశించలేదు. అది ఇక్కడకు వినుటకు వచ్చిన వారి మీద కదులుట నేను చూశాను, నేను ఒక ప్రార్ధనా వరుస కలిగియుండక ముందే. నేను ప్రభువైన యేసుక్రీస్తుకి చాలా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
49
ఓ, ఇప్పుడు, నేను ఆశిస్తున్నాను ఈ సంఘము యొక్క కదలిక ఒక గొప్ప రాజ్యము దగ్గరకు వచ్చినది నేను చూస్తానని, ఇక్కడ ఉన్న ప్రతి హృదయం దానిలోపల పడిపోవాలి. నేను చెపుతున్నాను, రేపు ఉదయానికి ఈ వార్తతో పేపర్లు అన్నీ నిండిపోతాయి. అక్కడ ఏమి చోటు చేసుకుంటుందని చెప్పుట చాలా కష్టము. న్యూ-ఓర్లిన్స్ లోపలి నుండి మరియు అన్ని చోట్లనుండి ప్రజలు రేపు వస్తారు. ప్రపంచంలో ఆకలిగొన్న క్రైస్తవులందరూ, ప్రతి చోటు నుండి, రాబోయే కొద్ది రోజులలో వచ్చి ఇక్కడ ఎగురుతుంటారు. ప్రతి ఒక్కరూ దీని లోపలికి చొచ్చుకొని వచ్చినట్లయితే, ఓ, దానిని వ్యక్తపరుచుటకు నా దగ్గర కొన్ని మాటలున్నవని నేను ఆశిస్తున్నాను.
ఇప్పుడు, ఇది నేను కాదు, ఇప్పుడు, నేను ఒక మనిషిని, చూశారా. నేను కేవలం ఒక మనిషిని మాత్రమే, కాని ఆయన దేవుడు. ఎంత మధురం, ఎంత అద్భుతం, ఎంత మహిమకరం, ఆయనను మనము ఎలా ప్రేమించగలం. ఆయన ఎంత ప్రత్యేకమైనవాడు.
50
నాకు పాత పాటలు పాడు అలవాటున్నది “ ఆయన నాకెంతో ప్రత్యేకమైనవాడు.” స్త్రీ నీవు దానిని నమ్ముతావా, నీవు నమ్ముటలేదా? మరి నీవు? ఒకవేళ నీకున్న కీళ్ళనొప్పులు పోయిందని నేను చెపితే, నీ హృదయమంతటితో నీవు దానిని నమ్ముతావా? నీవు దానిని నమ్ముతావా? హుహ్? ఆయన నిన్ను స్వస్థపరచాడని నీవు నమ్ముతావా? ఆయన చేశాడు. నీవు స్వస్థ పరచబడ్డావు. దేవునికి స్తోత్రం. ఆయనె౦త మహిమగలవాడు.
స్త్రీ, నీవు పట్టణం బయటినుండి వచ్చావు, నీవు రాలేదా? నీవు మిచిగాన్లోని గ్రాండ్ రాపిడ్ నుంచి వచ్చావు. నీవిక్కడ కూర్చొని దేని గురించో ఆలోచిస్తున్నావు. అది ఏమిటంటే, నీవు నీ యొక్క జ్ఞాపకశక్తిని కోల్పోతున్నావు. కాని నీవు ఇప్పుడు దానిని గురించి ఆలోచించుటలేదు. అది నిజము కాదా?
నీ తరువాత కూర్చున్న స్త్రీ కూడా మిచిగాన్ నుండే వచ్చినది. అది నిజము. ఎందుకొరకు వచ్చారు దేవునితో అతి దగ్గరగా నడవాలనా, మీరు దానిని పొందుకోబోతున్నారు, చింతించవద్దు. నీ జ్ఞాపకాలు తిరిగి నీ దగ్గరకు వస్తాయి. వాటివలన నీకు కలుగు సమస్య మరెన్నడు నీకుండదు.
51
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. దేవునియందు విశ్వాసము కలిగియుండండి. నీ హృదయమంతటితో దానిని నమ్ముము, నీవు తప్పక దేవుని మహిమను చూస్తావు.
అక్కడ కూర్చున స్త్రీ, నీకున్న బాధను ఆపాలని అనుకుంటున్నావా? నీకు మూత్రాశయ సమస్య ఉన్నది. అది నిజము, కాదా? నీవు స్వస్థపరచబడ్డావు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. నీకున్న నెప్పులన్నీ ఇప్పుడే పోయాయి. నీకు తెలుసా అది నిజము. ఆమేన్.
మనము మనంతట మనకుగా ప్రార్ధనా వరుస కలిగిలేము. అది మనకు అవసరం లేదు. నీకు ఉండవలసిన ఒకే ఒక లక్షణమేమిటంటే దేవుని యందు కొద్దిగా విశ్వాసము కలిగియుండుటయే. నీవు దేవుడిని నమ్మినట్లయితే, మిగిలిన కార్యాన్ని దేవుడు నీ కొరకు చేస్తాడు, ఆయనెంత అద్భుతమైనవాడు.
52
అక్కడ వెనుక ఒక వృద్ధుడు కూర్చునియున్నాడు, ప్రోస్టేట్ గ్రంధితో బాధపడుతూ అంతా తిరుగుతున్నాడు. శస్త్రచికిత్స చేయించుకున్నాడు, నాన్నా, నీవు చేయించుకోలేదా? అయిననూ ఇబ్బంది పడుతున్నావా. చింతించవద్దు, అది నిన్ను వదిలివేసింది. దేవుడు నిన్ను దీవించును. కేవలం విశ్వాసము, నమ్మకము కలిగియుండుము.
బయట ఉన్న యవ్వన స్త్రీ వెన్ను నొప్పితో బాధపడుతుంది, దాని వలన ఆమెకు ఏం జరగబోతున్నదని ఆమె కూడా తిరుగుతున్నది యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్.
వెనుక కూర్చున్న స్త్రీ శ్వాసకు లేదా ముక్కుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది. స్త్రీ నీవు దానిని అధిగమించాలని కోరుకుంటున్నావా, అలాగని నీవు అనుకోవట్లేదా? అంతా మంచిది. నీవు ఇప్పుడే స్వస్థపరచబడ్డావు. నీవు ఇంక ఇంటికి వెళ్ళవచ్చును. హల్లెలూయ. ఆయనిక్కడే ఉన్నాడు - వేకువ చుక్క.
53
స్త్రీ, ఇక్కడకు రమ్ము. నీవు యేసు మృతులలో నుండి లేచాడని నమ్ముచున్నావా? మనము ఒకరికి ఒకరము పరిచయంలేనివారము. నాకు నీవు తెలియదు. కాని దేవుడికి నీవు తెలుసు. నీవు తప్పక ఆయన నుండి సహాయం పొందుకోవాలి. నీవు వైద్యుని దగ్గరకు వెళ్లావు. వైద్యుడు నిన్ను పరీక్షించాడు. నీ ఛాతిని పరీక్షించారు, నీ కుడి ప్రక్కన ఛాతిని. అది క్యాన్సరు. మరియు నీకు ఎటువంటి ఆశ లేదు. అదే నీకు వైద్యుడు చెప్పాడు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచటానికే చనిపోయాడు. దానిని నమ్ముతావా? యేసుక్రీస్తు నామములో, సోదరికి సాతాను నుండి విడుదలివ్వమని గద్దిస్తున్నాను. ఆమేన్. స్త్రీ, దేవుడు నిన్ను దీవించును.
54
స్త్రీ, ఇక్కడకు రమ్ము. మనము ఖచ్ఛితంగా ఒకరికి ఒకరము పరిచయంలేనివారము. నాకు తెలిసినంత వరకు. అది నిజమేనా? మనకు ఒకరికి ఒకరము తెలియదు. నేను నా జీవితంలో నిన్ను ఎన్నడూ చూడలేదు, నీకు కొద్ది కాలం క్రిందట చాలా బాధ కలిగినది. నీకు కలుగలేదా? ప్రేమించినవారు ఒకరు లేదా స్నేహితుడు చనిపోవటం లేదా మరేదో ఒకటి, ఒక సంఘ పెద్ద. నీవు ఎదుగుదల కోరుకుంటున్నావు. అది నిజమేనా? నీవు స్వస్థపడతావని నీవు నమ్ముతున్నావా? శక్తివంతమైన దేవా, నేను ఈ స్త్రీని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను, ప్రభువా. నీవే ఆమెను స్వస్థపరుచుము. ఆమేన్, స్త్రీ, నిన్ను దేవుడు దీవించును గాక.
ఇక్కడ ఎవరినో నేను మరచిపోతున్నాను. అది బిల్లీ పాల్. అతనెక్కడికి వెళ్లాడో నాకు తెలియదు, కానీ నాకు అతని ఆత్మ తెలుసు. అతనిలో లోపమేదో నాకు తెలుసు. మరియు నేను అతని ఆత్మను కోల్పోయాను. ఇతనేనా ఆ అనారోగ్యముతో ఉన్నాడా?
55
స్త్రీ, నేను నీకు పరిచయంలేని వాడను. నేను నీకు తెలియదు, మరియు నాకు నీవు తెలియదు, కాని యేసుక్రీస్తుకి మనిద్దరం తెలుసు. అది నిజమేనా? నీవు నమ్ముతావా? నీవు ఇక్కడ ఎవరికోసమో నిలబడియున్నావు. ఆమె ఒక సోదరి లేక అన్య సహోదరి, ఆమె పూర్ణ సహోదరి కాదు. ఆమె అన్య సహోదరి, ఆమె కొద్దికాలం క్రితమే జబ్బు బారినపడి అనారోగ్యముతో ఉన్నది. అది ఒక అతను చెప్పుట నేను విన్నాను... నేను దానిని అర్థం చేసుకోలేకపోయాను. నేను నమ్ముతాను అతను చెప్పినది రుమాటిక్ ఫీవర్ (చిన్న పిల్లలలో వచ్చే భయంకరమైన జ్వరము మరియు ఎముకల నెప్పులు - అనువాదకుడు). అది నిజమేనా? వైద్యుడా... నీ కుమార్తెకు కూడా ఆ వ్యాధి వచ్చింది. ఆమెకు జ్వరం కూడా ఉన్నది. నీకు బలహీనమైన కుమారుడు ఉన్నాడు. నీకు నేను నీ దంతాల గురించి ప్రార్ధన చేయాలని అనుకుంటున్నావు, అది నీవు అనుకోవట్లేదా? ఇక్కడకు రమ్ము, ప్రియమైన దేవా, భూమి ఆకాశములను సృజించినవాడా, నీ పరిశుద్ధ దీవెనలు ఈ స్త్రీ మీదకు పంపుము, ఆమెను నేను యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను. ఆమేన్. నీవు నీ హృదయమంతటితో నమ్ముతున్నావా?
56
నేను ఇంకా ఎవరినైనా చూడాలని నీవు అనుకుంటున్నావా, అది అదా? మతిస్థిమితం లేని ఒక సహోదరుని కొరకు నేను ప్రార్థన చేయాలని నన్ను కోరాలని అనుకుంటున్నావా, అది నిజము కాదా? నీతో పాటు ఉన్న ఒక పెద్ద స్త్రీ నీకు నేను ప్రార్ధన చేయాలని కోరుకుంటున్నావా, ఆమె నీ తల్లి. ఆమెకు మధుమేహ వ్యాధి ఉన్నది. అది నిజము కాదా? నీవు దేవునితో దగ్గరగా నడవాలని కోరుకుంటున్నావు. నీవు దానిని ఎల్లప్పుడూ కోరుకుంటావు. ఇప్పటివరకు నీవు అటువంటి స్థలమునకు రాలేదు, ఇప్పుడు నీవు చేస్తున్నట్లుగా ఇంతకముందెన్నడూ చేయలేదు, అది ఖచ్చితంగా ఆయన చిత్తము మాత్రమే. ఇప్పుడు నీ జీవితమంతా ఆయనకు అప్పగించుకునుటకు సిద్దంగా ఉన్నావా, నీవు ఇంటికి వెళ్లి నీవేమి అడిగియున్నావో దానిని పొందుకో? నీవు నమ్ముతావా, నీవు దానిని చేయగలిగితే, నీవు నీ పూర్ణ మనస్సుతో చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నేను కూడా చేస్తాను. శక్తివంతమైన దేవా, నీ కుమారుని నామములో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ఈ స్త్రీని దీవించుము, నేనవరినైతే నీ నామములో దీవించానో వారిని. ఆమేన్.
57
మీరు ఎలా ఉన్నారు? నా హృదయమంతటితో అతనిని ప్రేమిస్తున్నాను. నీకు నీ స్నేహితుడితో అవసరం లేదు. కేవలం.. ఇది కేవలం... నేను దీనిని మీకు అర్థమగునట్లు చెప్పలేకపోతున్నాను. ఓ, నీకు ఏమి కావలయును? అంత కన్నా పరిశుద్ధాత్మ ఏమి చేయాలి? అక్కడ కేవలం... ఓహ్, ఈ సమయం ఏమి జరుగబోతున్నది.
స్త్రీ, నీవు ఎలాగున్నావు? మనకు ఒకరికి ఒకరము పరిచయంలేనివారము, మనము అలాంటి వారిని కాదా? నేను నిన్ను కలవటానికి దేవుడేర్పర్చిన మార్గమే తప్ప మరేదిలేదు. కేవలం దేవుని కృప మార్గము వలన మాత్రమే నేను నీకు సేవకుడిగా ఉన్నాను. నేను కేవలం మనిషిని మాత్రమే. నీవు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతావా, నీవు నమ్మవా? నీవు క్రైస్తవురాలివైతే. నీలో కొద్దికాలము క్రితపు ఒక బాధకరమైన వార్త ఉన్నది. నీవు బాగుపడవని వైద్యుడు నీకు చెప్పాడు. నీకు క్యాన్సరున్నది. అది నిజము. నీవు ఈ నగరానికి చెందినదానివి కాదు. నీవు చాలా చెరువులు మరియు విషయాలు కలిగిన ప్రాంతానికి చెందినదానవు. విస్కాన్సిన్, ఓవెన్, విస్కాన్సిన్. నీ పేరు అసలు పేరు రీగల్. మీ ఇంటి పేరు హెచ్.ఎఫ్. ఇప్పుడు ఇంటికి వెళ్లుము. నీ స్వస్థతని నీవు పొందుకో, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు.
దానిని తిరిగి పంపకుము. యేసు పేతురుతో ఈ విధంగా చెప్పారు, “నీవు, పేతురువు, నీవు కేఫా అని పిలువబడతావు.”
58
స్త్రీ, నీవు నమ్ముతావా? నీకు స్త్రీ సమస్య ఉన్నది, నీకు లేదా? అక్కడ కూర్చున్న ఆ స్త్రీకి కూడా ఆ సమస్య ఉన్నది. ఆ స్త్రీకి గోయిటర్ కూడా ఉన్నది. మీ ఇద్దరూ స్వస్థపరచబడ్డారు. నీవు నమ్ముతావా? ఒక్క నిముషము నిలబడండి. మీ పాదాల మీద నిలబడండి. మీలో ఏ సమస్య ఉన్నా సరే నేను పట్టించుకోను. మీ పాదాల మీద నుంచొనండి. ఇలా అనండి, “నేను ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముతున్నాను నన్ను స్వస్థపరుచువానిగా ఆయనను అంగీకరిస్తున్నాను.” శక్తివంతమైన దేవా, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని యేసుక్రీస్తు నామములో నేను గద్దిస్తున్నాను, ప్రతి సాతానుని నేను గద్ధిస్తున్నాను. యేసుక్రీస్తు ద్వారా పరలోకపు కుమారుని శక్తి ద్వారా ఈ ప్రజల నుండి విడిచి వెళ్ళును గాక.